breaking news
MAruthi
-
ప్రభాస్-మారుతి మరో సినిమా ప్లాన్.. టీమ్ క్లారిటీ ఇదే
ప్రభాస్-దర్శకుడు మారుతి కాంబినేషన్లో తాజాగా తెరకెక్కిన మూవీ ది రాజాసాబ్.. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం ఆశించినంత రేంజ్లో మెప్పించలేదు. దీంతో ఫ్యాన్స్ దర్శకుడిపై ట్రోల్స్‌కు దిగారు. అయితే, మరోసారి మారుతితో ప్రభాస్ సినిమా చేయనున్నట్లు సోషల్‌మీడియాలో వార్తలు వచ్చాయి. ప్రముఖ నిర్మాణ సంస్థ ఈ ప్రాజెక్ట్ కోసం భారీ బడ్జెట్ పెట్టనుందని నెట్టింట వైరల్ అయింది. దీంతో ప్రభాస్ టీమ్ స్పందించింది.రాజాసాబ్ తర్వాత ప్రభాస్ మూడు సినిమాలతో బిజీగా ఉన్నారు. ఫౌజీ, స్పిరిట్, కల్కి మూవీలతోనే ఉన్నారని చెప్పుకొచ్చారు. ప్రభాస్ సినిమాల గురించి సోషల్‌మీడియాలో వస్తున్న వార్తలు ఫేక్ అని పేర్కొంది. దీంతో మారుతితో ప్రభాస్ మరోసారి ప్రభాస్ నటించడం లేదని క్లారిటీ వచ్చేసింది. హోంబలే ఫిల్మ్స్ ఎలాంటి పెట్టుబడులు పెట్టడం లేదని తేలిపోయింది. అయితే, మారుతి దర్శకుడిగా ఒక మిడ్ రేంజ్ హీరోతో హోంబలే ఫిల్మ్స్ ఒక మూవీ తీస్తుందని ప్రచారం జరుగుతుంది. -
మారుతికి అండగా ప్రభాస్.. పెద్ద సంస్థతో సినిమా
దర్శకుడు మారుతి ఇటీవల ప్రభాస్‌తో తెరకెక్కించిన హారర్-కామెడీ చిత్రం 'ది రాజాసాబ్' పెద్దగా ప్రేక్షకులను మెప్పించలేదు. దీంతో డార్లింగ్ ఫ్యాన్స్ మారుతిపై విరుచుకుపడుతున్నారు. సినిమా విడుదలకు ముందు మారుతిని నెత్తిన పెట్టుకున్న వారే ఇప్పడు ట్రోలింగ్‌కు దిగారు. ఒక సినిమా ఫలితంలో దర్శకుడి పాత్ర కాస్త ఎక్కువగానే ఉన్నప్పటికీ మరీ ఇంతలా టార్గెట్ చేయడం ఏంటి అంటూ సోషల్‌మీడియాలో కొందరు అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలోనే మారుతి కోసం ఏదైనా చేయాలనే ప్రభాస్ ప్లాన్ ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో తన ఫ్యాన్స్‌తో ఉన్న వైరాన్ని కాస్త తగ్గించాలని ఆయన ఉన్నారట.రాజాసాబ్ ఫలితం తర్వాత తన వంతు బాధ్యతగా మారుతి కోసం అండగా నిలవాలని ప్రభాస్ అనుకున్నారట. అందుకు సంబంధించిన పనులు కూడా ప్రభాస్ పూర్తి చేశారు. మారుతి కొత్త సినిమాకి తనవంతుగా ప్రభాస్ సాయం చేసేందుకు ముందుకొచ్చాడు. హోంబలే ఫిల్మ్స్ బ్యానర్లో మారుతి తర్వాతి సినిమాకు లైన్ క్లియర్ చేశాడు. కథ, సరైన హీరోను ఎంపిక చేసుకోవాలని అడ్వాన్స్ కూడా ఇప్పించడం జరిగిపోయింది. ఒక మిడ్ రేంజ్ హీరో ఎంపిక కోసం మారుతి వేట మొదలైంది. స్క్రిప్ట్ రెడీ అయితే.. మారుతి అనుకున్న హీరోతో మాట్లాడేందుకు కూడా ప్రభాస్ సాయం చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ విధంగా తన దర్శకుడికి అండగా నిలివాలని ప్రభాస్ ఉన్నారు. ఇప్పటికే రాజాసాబ్ నిర్మాత నుంచి 40 శాతం రెమ్యునరేషన్ తీసుకోలేదని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.ఏర్పాట్లు అన్ని పూర్తి అయితే, మారుతి ప్రాజెక్ట్ ఓపెనింగ్స్‌కు కూడా ప్రభాస్ వచ్చే ఛాన్స్ ఉంది. దీంతోనైనా డార్లింగ్ ఫ్యాన్స్‌తో మారుతి వివాదం ఫుల్ స్టాప్ పడుతుందని చెప్పొచ్చు. మారుతి తర్వాత సినిమా గురించి ఇప్పటికే వార్తలు వస్తున్నాయి. మెగా హీరో వరుణ్ తేజ్‌తో తన తదుపరి ప్రాజెక్ట్‌ను ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. -
మారుతి ఇంటికి 'క్యాష్ ఆన్ డెలివరీ' ఆర్డర్స్
దర్శకుడు మారుతికి ప్రభాస్ ఫ్యాన్స్ నుంచి గట్టిగానే ఎదురుదెబ్బ తగులుతుంది. ఇటీవలే ఆయన తెరకెక్కించిన ‘ది రాజాసాబ్’ ఫలితం మిశ్రమంగా రావడంతో ఫ్యాన్స్ భగ్గుమంటున్నారు. సోషల్‌మీడియాలో వారి ఎదురుదాడి ఎక్కవకావడంతో నిర్మాత ఎస్కేఎన్ పోలీస్‌స్టేషన్ మెట్లు ఎక్కాడు. తమపై ట్రోలింగ్ పెద్ద తలనొప్పిగా తయారైందని ఆయన వాపోయాడు. సినిమా విడుదల సమయంలో దర్శకుడు మారుతి మాట్లాడుతూ.. ‘ది రాజా సాబ్’ నచ్చకుంటే కొండాపూర్‌లోని కొల్ల లగ్జరీలో ఉన్న తన ఫ్లాట్‌కు వచ్చేయండి.. అక్కడే మాట్లాడుకుందామని సరదాగా మాట్లాడారు. ఇప్పుడు అదే పెద్ద తలనొప్పిగా మారింది.దర్శకుడి మాటలను ప్రభాస్ ఫ్యాన్స్ చాలా సీరియస్‌గా తీసుకున్నట్లు ఉన్నారు. సినిమా నచ్చకపోవడంతో మారుతిని కలిసేందుకు నేరుగా ఇంటికి వెళ్లినట్లు సోషల్‌మీడియాలో పోస్టులు పెడుతున్నారు. కానీ, వారిని సెక్యూరిటీ సిబ్బంది అనుమతించకపోవడంతో వారందరూ తీవ్ర అసహనానికి లోనైనట్లు తెలుస్తోంది. దీంతో మారుతి ఇంటి అడ్రస్‌కు పార్శిల్ రూపంలో కొన్ని గిఫ్ట్‌లు పంపుతున్నారు. కాకపోతే ఇవి ప్రేమతో పంపుతున్న పార్సిల్స్ కావు. జొమాటో, స్విగ్గీ వంటి ఫుడ్ డెలివరీ యాప్స్‌తో పాటు పలు ఈ క్విక్ కామర్స్ ప్లాట్‌ఫామ్స్ నుంచి వందలాది ఆర్డర్లు ఆయన ఇంటికి పంపారు. కానీ, వాటన్నింటినీ ‘క్యాష్ ఆన్ డెలివరీ’ (COD) ఆప్షన్‌తో బుక్ చేయడం విశేషం. దీంతో మారుతి ఫ్లాట్ వద్ద ఉన్న సిబ్బందికి పెద్ద సమస్యగా మారింది. అక్కడికి వచ్చిన డెలివరీ బాయ్స్‌ను వెనక్కి పంపడం సెక్యూరిటీ సిబ్బందికి పెద్ద తలనొప్పిగా మారింది. వింతగా ఉన్న ఈ నిరసన ఇప్పడు సోషల్‌మీడియాలో వైరల్ అవుతుంది. -
ఫ్యాన్స్‌ను మెప్పించిన 'రెబల్ సాబ్' వచ్చేశాడు
ప్రభాస్ హీరోగా నటించిన పాన్ ఇండియా సినిమా 'ది రాజా సాబ్' నుంచి మరో వీడియో సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా విడుదలైన విషయం తెలిసిందే..అయితే, అనుకున్నంత రేంజ్లో ప్రేక్షకులను మెప్పించలేదు. ఫ్యాన్స్‌ను బాగా ఆకట్టుకున్న 'రెబల్ సాబ్' సాంగ్ వీడియో వర్షన్‌ను విడుదల చేశారు. ఈ సాంగ్ ఆడియో వర్షన్ విడుదలైన తొలి 24 గంటల్లో ఈ పాటకు దాదాపు 14.92 మిలియన్ వ్యూస్, 335.4K లైక్స్ వచ్చాయి. రామజోగయ్య శాస్త్రి రచించిన ఈ సాంగ్‌ను సంజిత్ హెగ్డే, బ్లేజ్ ఆలపించారు. తమన్ సంగీతం అందించారు. -
'రాజే యువరాజే' వీడియో సాంగ్ విడుదల
రెబల్ స్టార్ ప్రభాస్ 'ది రాజాసాబ్' నుంచి 'రాజే యువరాజే' వీడియో సాంగ్ తాజాగా విడుదలైంది. సినిమాలో నిధి అగర్వాల్‌తో పరిచయం అయిన సమయంలో ఈ పాట ఉంటుంది. తమన్ సంగీతం అందించిన ఈ పాటను అద్వితీయ వొజ్జల, బేబీ రియా సీపన ఆలపించారు. కృష్ణకాంత్ లిరిక్స్ సమకూర్చారు. మారుతి దర్శకత్వం వహించిన ఈ హారర్ మూవీ జనవరి 9న విడుదల అయింది. అయితే, డార్లింగ్ ఫ్యాన్స్ ఆశించినంత రేంజ్లో మూవీ మెప్పించలేదు. -
'రాజాసాబ్' హిట్ సాంగ్ వీడియో విడుదల
ప్రభాస్- మారుతి మూవీ ది రాజాసాబ్ నుంచి హిట్ సాంగ్ వీడియో వర్షన్‌ను తాజాగా విడుదల చేశారు. ప్రభాస్, నిధి అగర్వాల్ జోడీగా 'సహనా సహనా..' అంటూ మెప్పించిన ఈ పాట థియేటర్స్‌లో ప్రేక్షకులను బాగా మెప్పించింది. కృష్ణకాంత్ రాసిన ఈ పాటను విశాల్ మిశ్రా పాడారు. రొమాంటిక్ కామెడీ హారర్ మూవీగా తెరకెక్కిన ఈ మూవీకి తమన్ సంగీతం అందించారు. ఈ సినిమాలో ప్రభాస్ సరసన మాళవికా మోహనన్, రిద్ధి కుమార్ కూడా నటించిన విషయం తెలిసిందే. జనవరి 9న విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ. 250 కోట్లకు పైగానే రాబట్టింది. అయితే, సినిమా ఫస్ట్ ఆటతోనే భారీగా ట్రోలింగ్‌కు గురికావడంతో కలెక్షన్స్‌పై భారీ ప్రభావం చూపింది. -
'ప్రభాస్'ను ఒంటరిని చేశారా..? వాళ్లందరూ ఎస్కేప్
ప్రభాస్- మారుతి కాంబినేషన్ సినిమా 'ది రాజా సాబ్'.. జనవరి 9న అందరికంటే ముందే సంక్రాంతి బరిలో నిలిచింది. అయితే, సినిమాలో కొన్ని సీన్స్ తొలగించి ప్రభాస్ ఓల్డ్ గెటప్ సన్నివేశాలు ఉంటే బాగుండేది అని ఫ్యాన్స్ కూడా అన్నారు. దీంతో మారుతి వెంటనే సరిచేసి రెండోరోజే రీవర్షన్ చేశారు. దీంతో సినిమాపై మళ్లీ పాజిటీవ్ టాక్ వచ్చింది. ఇంతలో పండగ సినిమాలన్ని వరుసగా వస్తున్నాయి. దీంతో రాజాసాబ్ కొన్ని స్క్రీన్స్ కోల్పోతూ వచ్చింది. అయితే, అడ్వాంటేజ్ ఉన్నప్పుడు సినిమాకు ప్రమోషన్ కరువైంది. సినిమా విడుదల ముందురోజు వరకు గట్టిగానే ప్రచారం చేశారు. కానీ, పోస్ట్-రిలీజ్ ప్రమోషన్ లేకపోవడంతో కలెక్షన్స్‌పై భారీ దెబ్బ పడింది. సినిమాకు ఎటూ పాజిటీవ్ వస్తుంది కాబట్టి.. కనీసం ఈ వీకెండ్ వరకు అయినా కాస్త ప్రమోషన్స్ జోష్ పెంచితే బెటర్ అంటూ ఫ్యాన్స్ అంటున్నారు.ప్రభాస్ దర్శకుల స్పందన కరువురాజా సాబ్ రిలీజ్ తర్వాత కేవలం ఓ ప్రెస్ మీట్ పెట్టి చిత్ర యూనిట్ మమ అనిపించింది. ఆ తర్వాత కేవలం సోషల్‌మీడియాకే పరిమితం అయ్యారు. ప్రభాస్ అందుబాటులో లేడు కాబట్టి కనీసం తన పాత దర్శకులతో వీడియో బైట్స్, కామెంట్స్ అయినా చేపించుకోలేకపోయారు. పాన్ ఇండియా రేంజ్లో పేరున్న దర్శకులు రాజమౌళి, నాగ్ అశ్విన్, ప్రశాంత్ నీల్, సుజీత్ వంటి వారందరికి ప్రభాస్‌తో మంచి స్నేహమే ఉంది. వాళ్లతో కలిసి ఆయన పనిచేశారు కూడా.. కానీ, వాళ్లు కూడా రాజా సాబ్ గురించి ఎలాంటి పోస్ట్ చేయలేదు. ఇదే విషయాన్ని డార్లింగ్ ఫ్యాన్స్ సోషల్‌మీడియాలో పెద్ద ఎత్తున చర్చలకు తెరలేపారు. రాజా సాబ్ సినిమాను రీకట్ చేసిన తర్వాత చాలా బాగుందని టాక్ వస్తుంది. కామన్ ఆడియన్స్ కూడా ఇదే మాట అంటున్నారు. కానీ, సరైన ప్రమోషన్‌తో పాటు ఇండస్ట్రీకి సంబంధించిన వారు ఎవరూ సినిమా గురించి మాట్లాడకపోవడం కాస్త డ్యామేజ్‌ను పెంచాయని ఎక్కువగా వినిపిస్తుంది.ఎస్కేఎన్.. ఎస్కేప్రాజా సాబ్ విడుదలకు నిర్మాత ఎస్కేఎన్ భారీ డైలాగ్స్ పేల్చాడు. సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుందని తనదైన స్టైల్లో పండగ..పండగ..రాజాసాబ్ పండగ అంటూ హైప్ పెంచాడు. అంతటితో ఆయన ఆగలేదు తన చొక్కా చించి మరీ రాజాసాబ్ పోస్టర్‌ను ఫ్యాన్స్‌కు చూపించి తన భక్తిని చూపించాడు. సినిమా విడుదల తర్వాత కనీసం ఆయన కూడా రాజాసాబ్‌కు దూరంగానే ఉన్నాడు. అయితే, సంగీత దర్శకులు తమన్ గతంలో రాధేశ్యామ్ ఫ్లాప్ అయినప్పుడు మూవీ ప్రమోషన్‌కు ఎవరూ రాలేదు. అప్పుడు స్వయంగా తమన్ రంగంలోకి దిగాడు. సినిమాకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను చెబుతూ కాస్త ప్రమోషన్ చేశాడు. ఇప్పుడు కనీసం తమన్‌ను మరోసారి రంగంలోకి దింపినా బాగుండు అనే కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఈ వీకెండ్ వరకు అయినా సరే మారుతి, తమన్, ఎస్కేఎన్‌లతో పాటు ముగ్గురు హీరోయిన్లను రంగంలోకి దింపి ప్రమోషన్స్ చేస్తే కాస్త కలెక్షన్స్ పెరిగే ఛాన్స్ ఉంది. ప్రస్తుతం రాజా సాబ్ రూ. 220 కోట్లకు దగ్గరలో ఉన్నాడు. -
ఆ సీన్స్‌లో ప్రభాస్ నటన అద్భుతం అంటున్నారు: దర్శకుడు మారుతి
‘‘ది రాజా సాబ్’ వంటి సినిమా చేయడం అంత సులువు కాదు. ఒక వ్యక్తి ట్రాన్స్‌లోకి వెళ్లాడనే విషయాన్ని విజువల్‌గా స్క్రీన్‌పై చూపించడం చాలా కష్టం. ‘ప్రతిరోజూ పండగే’ సినిమాను 40 రోజుల్లోనే రాసిన నేను, ‘ది రాజా సాబ్’ క్లైమాక్స్ సీక్వెన్స్ కోసం రెండు నెలలు స్క్రిప్ట్ రాశాను. ఈ సీన్స్ గురించి నేను, ప్రభాస్‌గారు మాట్లాడుకున్నాం... ‘పెన్‌తో రాస్తున్నావా? లేదా గన్‌తో రాస్తున్నావా? డార్లింగ్’ అన్నారు ప్రభాస్‌గారు.ఇంకా సంక్రాంతి ఫెస్టివల్ మూడ్ స్టార్ట్ కాకముందే నాలుగు రోజుల్లోనే రూ. 200 కోట్ల వసూళ్లు సాధించింది. మా ‘రాజా సాబ్’ ప్రేక్షకులకు నచ్చింది కాబట్టే ఈ స్థాయి కలెక్షన్స్ వచ్చాయి’’ అని దర్శకుడు మారుతి అన్నారు. ప్రభాస్ హీరోగా రూపొందిన చిత్రం ‘ది రాజా సాబ్’. నిధీ అగర్వాల్, మాళవికా మోహనన్, రిద్దీ కుమార్ హీరోయిన్లుగా నటించగా, సంజయ్ దత్, బొమన్ ఇరానీ కీలక పాత్రల్లో నటించారు. టీజీ విశ్వప్రసాద్, కృతీప్రసాద్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 9న విడుదలైంది. ఈ సందర్భంగా దర్శకుడు మారుతి పంచుకున్న విశేషాలు. ⇒ ‘ది రాజాసాబ్’లో సైకలాజికల్ ఎలిమెంట్స్‌తో ఓ కొత్త పాయింట్ చూపించాం కాబట్టి ప్రేక్షకులకు రీచ్ కావడానికి కొంత సమయం పడుతుందని ముందే ఊహించాం. ‘కొత్త ప్రయత్నం చేశాం డార్లింగ్... ప్రేక్షకులకు చేరువ కావడానికి కొంత టైమ్ పడుతుంది.. నువ్వు ప్రశాంతంగా ఉండు’ అని ప్రభాస్‌గారు చెప్పారు. అయితే సినిమా విడుదలైన తర్వాత మేం ట్రైలర్లో చూపించిన ప్రభాస్‌గారి ఓల్డ్ గెటప్ సీన్స్ లేవని కొందరు ఫ్యాన్స్ అన్నారు. దీంతో ఈ సీన్స్‌ను యాడ్ చేశాం. కొత్త సీన్స్ యాడ్ చేశాక, సీన్స్ అన్నీ పర్ఫెక్ట్గా సెట్ అయ్యాయని ప్రభాస్‌గారు అన్నారు.⇒ ప్రభాస్గారిలాంటి పాన్ ఇండియా హీరోతో సాదా సీదా హారర్ కామెడీ సినిమా చేయకూడదనే ఈ సినిమాలో సైకలాజికల్, మైండ్ గేమ్ ఎలిమెంట్స్ యాడ్ చేశాను. తొలిసారి చూసినప్పుడు ఈ సినిమా నచ్చుతుంది. రెండోసారి కూడా చూస్తే ఈ సినిమాలోని కాన్సెప్ట్ లోతుగా అర్థం అవుతుంది. మానసికంగా స్ట్రాంగ్‌గా ఉంటే అనుకున్నది సాధించవచ్చనే సందేశాన్ని కూడా ఈ సినిమాలో చూపించాం.హాస్పిటల్ సీన్లో రాజా సాబ్ పాత్ర తనకు బుర్ర తిరిగిపోతుందని ఇబ్బంది పడుతుంటాడు. అప్పుడు నానమ్మపై ప్రేమతో దెయ్యంపై గెలుస్తాడు. వేదికపై నేను చాలెంజ్ చేయలేదు. హాస్పిటల్ ఎపిసోడ్లో ప్రభాస్‌గారి నటన అద్భుతంగా ఉంటుందనే కాన్ఫిడెన్స్‌తో మాట్లాడాను. నేను చెప్పినట్లుగానే రిలీజ్ తర్వాత ఆ సీన్లో ప్రభాస్‌గారి నటన అద్భుతం అని అందరూ అంటున్నారు. ⇒ నేను చిరంజీవిగారి ఫ్యాన్‌ని. ఆయనతో సినిమా చేసే చాన్స్ వస్తే నా లైఫ్ సర్కిల్ ఫుల్ అయిపోయినట్లుగా భావిస్తాను. -
సినిమా రిజల్ట్ ఒక్కరోజులోనే డిసైడ్ చేయడం కరెక్ట్ కాదు
-
ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. కొత్తగా ఆ సీన్స్..!
ది రాజాసాబ్ మూవీతో తీవ్ర నిరాశలో ఫ్యాన్స్‌కు డైరెక్టర్ మారుతి గుడ్ న్యూస్ చెప్పారు. ఈ చిత్రంలో కొత్తగా ఎనిమిది నిమిషాల పాటు సీన్స్ యాడ్ చేస్తున్నట్లు తెలిపారు. ఈ సీన్స్‌లో ప్రభాస్ ఓల్డ్ లుక్ కూడా ఉంటుందని అభిమానులకు శుభవార్త చెప్పారు. దీంతో రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. తాజాగా నిర్వహించిన బ్లాక్‌బస్టర్ మీట్లో మారుతి క్లారిటీ ఇచ్చారు. ది రాజాసాబ్‌లో ప్రభాస్‌ను కొత్తగా చూపించామని మారుతి అన్నారు.మారుతి మాట్లాడుతూ..' హైదరాబాద్‌లో షో సరైన టైమ్‌లో పడలేదు. అందుకు నన్ను క్షమించండి. ఏది ఏమైనా ఈ అవకాశం ఇచ్చిన ప్రభాస్‌కు జీవితాంతం రుణపడి ఉంటా. ఒక మిడ్ రేంజ్ దర్శకుడు ప్రభాస్ సినిమా తీశాడనిపించేలా చేశారు. ప్రభాస్‌ను ప్రేక్షకులు ఎలా చూడాలనుకుంటున్నారో అలానే చూపించా. ఈ ప్రక్రియలో కాస్త కొత్తగా చూపించాలనుకున్నా. మైండ్ గేమ్‌గా సాగే క్లైమాక్స్ ఇప్పటివరకూ రాలేదని అందరూ అంటున్నారు. చివరి 40 నిమిషాలు ప్రేక్షకులకు నచ్చేసింది. ఇండియన్ స్క్రీన్‌పై ఇలాంటి నేపథ్యంతో మూవీ రాలేదంటున్నారు. ప్రభాస్‌తో నేను సింపుల్‌గా కమర్షియల్ సినిమా తీయొచ్చు కానీ.. ఇలాంటి కొత్త కథలను పెద్ద హీరోలు చేయాలని ఆయన ప్రయత్నించారు. కామన్ ఆడియన్స్‌కు చాలా మందికి ఈ సినిమా రీచ్ అయింది. ఒక్క షో, ఒక్కరోజులోనే సినిమాను నిర్ణయించకూడదు' అన్నారు.పదిరోజులు ఆగితేనే సినిమా ఏంటనేది తెలుస్తుందని డైరెక్టర్ మారుతి అన్నారు. ఈ మూవీలోని కొత్త పాయింట్ గురించి అందరూ మాట్లాడుకుంటున్నారని.. అర్థం కానీ వాళ్లే తిడుతున్నారని అన్నారు. ఓల్డ్ గెటప్‌లో ఉన్న ప్రభాస్‌ను టీజర్, పోస్టర్స్‌లో చూపించాం.. కానీ సినిమాలో కనిపించలేదని అభిమానులు చాలా మంది ఎంజాయ్ చేయలేకపోయారు. వాళ్ల కోసమే ఈరోజు సాయంత్రం నుంచి ఆ లుక్ ఉన్న సన్నివేశాలు యాడ్ చేస్తున్నామని తెలిపారు. సెకండ్ హాఫ్‌లో కొన్ని సన్నివేశాలు తగ్గించి వీటిని యాడ్ చేస్తున్నాం.. వాటికి సెన్సార్ కూడా పూర్తయిందన్నారు. కొత్తగా మొత్తం 8 నిమిషాల సీన్స్ యాడ్ అవుతాయని మారుతి వెల్లడించారు. THE ONE YOU ALL HAVE BEEN WAITING FOR 🔥🔥OLD GETUP SEQUENCE is finally adding from today’s evening shows onwards 🤙🏻🤙🏻#TheRajaSaab#BlockbusterTheRajaSaab #Prabhas @directormaruthi @musicthaman @peoplemediafcy @rajasaabmovie pic.twitter.com/aOz3n9XsqE— The RajaSaab (@rajasaabmovie) January 10, 2026 -
ఇలా జరుగుతుందనుకోలేదు, సారీ..: మారుతి
'రాజాసాబ్ సినిమా చూసి ప్రభాస్ అభిమానులు డిసప్పాయింట్ అవలేదు, అలా అని సంతృప్తి చెందలేదు. ట్రైలర్లో ప్రభాస్‌ను ఓల్డ్ గెటప్‌లో చూపించాం. థియేర్లో ఆ సీన్స్ ఎక్కడ? అని వెతికే క్రమంలో కథ ఎవరికీ ఎక్కలేదు' అన్నాడు దర్శకుడు మారుతి. ప్రభాస్ తొలిసారి హారర్ జానర్లో నటించిన చిత్రం ది రాజాసాబ్. ఈ సినిమా జనవరి 9న ప్రేక్షకుల ముందుకొచ్చింది. వింటేజ్ ప్రభాస్‌ను చూసి కొందరు ఖుషీ అవుతుంటే మరికొంతమంది మాత్రం కథ అంతా గందరగోళంగా ఉందని నిరాశకు లోనవుతున్నారు. బ్లాక్‌బస్టర్ సక్సెస్ మీట్థియేటర్లలో మిక్స్డ్ టాక్ అందుకుంటున్న ఈ సినిమా.. బ్లాక్‌బస్టర్ అంటూ సెలబ్రేషన్స్ మొదలుపెట్టింది చిత్రయూనిట్. 'రాజాసాబ్.. కింగ్ సైజ్ బ్లాక్‌బస్టర్' అంటూ శనివారం (జనవరి 10న) సక్సెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి దర్శకుడు మారుతి, నిర్మాత టీజీ విశ్వప్రసాద్, హీరోయిన్లు నిధి అగర్వాల్, రిద్ధి కుమార్, మాళవిక మోహనన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మారుతి.. విమల్ థియేటర్లో ప్రీమియర్స్ సమయంలో జరిగిన గందరగోళాన్ని ప్రస్తావించాడు. సారీమారుతి మాట్లాడుతూ.. విమల్ థియేటర్ వద్ద మీడియా మిత్రులు చాలా అసౌకర్యానికి గురయ్యారు. అర్ధరాత్రి 1.30 వరకు కూడా ప్రెస్ షోలు పడకపోయేసరికి చలిలో నిలబడ్డారు. మిమ్మల్ని ఇబ్బందిపెట్టినందుకు చాలా చాలా సారీ.. అసలు ఇలా జరుగుతుందని నాకు తెలియదు. హాయిగా నిద్రపోయే సమయానికి సినిమా చూపించాం. అయినా అర్ధరాత్రి సినిమా చూసి ఉదయం నాలుగు గంటలకు రివ్యూ ఇచ్చారు. థాంక్యూ సోమచ్.మూడేళ్ల కష్టంనెక్స్ట్.. నాకు అవకాశాన్నిచ్చిన ప్రభాస్‌కు జన్మంతా రుణపడి ఉంటాను. తొమ్మిది నెలలకే సినిమా పూర్తి చేసే నేను రాజాసాబ్‌ను మూడేళ్లపాటు కష్టపడి, ఇష్టపడి తీశాను. ప్రభాస్‌కు నచ్చేవిధంగా, అభిమానులు మెచ్చేవిధంగా తెరకెక్కించాను. క్లైమాక్స్ కొత్తగా ఉందని ప్రపంచవ్యాప్తంగా మంచి ప్రశంసలు లభిస్తున్నాయి.ఒక్కరోజులో డిసైడ్ చేయొద్దుఇకపోతే సినిమా రిజల్ట్ అనేది ఒక్కరోజునే తేల్చలేం.. పది రోజులు ఆగితే దాని ఫలితమేంటో తెలుస్తుంది. ఎందుకంటే కొత్త పాయింట్‌తో వచ్చిన సినిమా వెంటనే ఎక్కదు. కాస్త సమయం పడుతుంది. సినిమాలో కొన్ని సీన్స్ అర్థమైనవాళ్లు పొగుడుతున్నారు, అర్థం కానివాళ్లు తిడుతున్నారు. పండగ సమయంలో అందరూ సినిమాలు చూస్తారు. కాబట్టి.. అప్పుడే సినిమా ఫలితాన్ని నిర్ణయించకండి.రియల్ రాజాసాబ్ట్రైలర్లో ప్రభాస్ ఓల్డ్ గెటప్ చూపించాం. సినిమాలో ఆ సీన్స్ లేకపోయేసరికి చాలామంది నిరాశపడ్డారు. అందుకనే సెకండాఫ్‌లో ఆ సీన్స్ జత చేస్తున్నాం. ఎక్కడైతే కొన్ని సన్నివేశాలు సాగదీతగా ఉన్నాయన్నారో వాటిని షార్ప్ చేశాం. ఈ రోజు సాయంత్రం నుంచి రియల్ రాజాసాబ్‌ను చూపించబోతున్నాం అని మారుతి అన్నాడు.చదవండి: మాట మీద నిలబడ్డ మెగాస్టార్ చిరంజీవి -
‘ది రాజాసాబ్ 2’ కూడా ఉంది.. టైటిల్ ఇదే!
పాన్ ఇండియా సినిమాలకు సీక్వెల్స్ ప్రకటించడం ఇప్పుడు ట్రెండింగ్‌గా మారింది. ముఖ్యంగా ప్రభాస్ చిత్రాలన్నింటికి పార్ట్ 2 ప్రకటిస్తున్నారు. ఇప్పటికే 'సలార్', 'కల్కి 2898 ఏడీ' చిత్రాలకు సీక్వెల్ కథలు సిద్ధంగా ఉన్నాయి. తాజాగా ఆ లిస్ట్‌లోకి ‘ది రాజాసాబ్’ కూడా చేరింది. ప్రభాస్ హీరోగా నటించిన పాన్ ఇండియా చిత్రం 'ది రాజాసాబ్' ఈరోజు(జనవరి 9) ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ అయింది. మారుతి దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టి.జి. విశ్వప్రసాద్ నిర్మించిన ఈ చిత్రానికి కొనసాగింపు కూడా ఉంది. ( చదవండి: ది రాజాసాబ్ మూవీ రివ్యూ)పార్ట్ 2కి ‘రాజాసాబ్ సర్కస్: 1935’గా టైటిల్‌ని ఫిక్స్ చేశారు. ఇందులో ప్రభాస్ జోకర్ లుక్‌లో కనిపించబోతున్నాడు. రాజాసాబ్ సినిమా ఎండింగ్లో సీక్వెల్‌కి లీడ్ ఇస్తూ ప్రభాస్ లుక్‌ని పరిచయం చేశారు. ఇది సీక్వెల్ లేదా ప్రీక్వెల్ కావచ్చనే చర్చ నడుస్తోంది. ట్రైలర్లో చూపించిన చాలా సన్నివేశాలు రాజాసాబ్‌లో చూపించలేదు. అవన్నీ పార్ట్ 2లో చూపించే అవకాశం ఉంది. 'ది రాజాసాబ్'లో ప్రభాస్‌తో పాటు మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటించగా, సంజయ్ దత్, బొమన్ ఇరానీ కీలక పాత్రల్లో కనిపించారు. సినిమా ప్రీమియర్ షోల నుంచి మిక్స్డ్ టాక్ వస్తున్న నేపథ్యంలో సీక్వెల్ ప్రకటన ఫ్యాన్స్‌కు ఊరట కలిగించింది.సీక్వెల్ వివరాలు, షూటింగ్ షెడ్యూల్ గురించి త్వరలో అధికారిక ప్రకటన రానుంది. -
‘రాజాసాబ్’కు రూ.1000 కోట్లు సాధ్యమేనా?
జనవరి 9... ప్రభాస్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్న డేట్ ఇది. ఆ రోజే ‘ది రాజాసాబ్’ థియేటర్స్‌లోకి రాబోతున్నాడు. రిలీజ్‌కి ఒక్క రోజు ముందే అంటే జనవరి 8న ప్రీమియర్స్‌తో ప్రభాస్ అబిమానుల సందడి ప్రారంభం కానుంది. ప్రభాస్ నటిస్తున్న తొలి హారర్ ఫాంటసీ మూవీ కావడంతో రాజాసాబ్(The Raja Saab)పై ముందు నుంచే భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఇటీవల విడుదలైన ట్రైలర్, పాటలు ఆ అంచనాలను మరింత పెంచేశాయి. బొమ్మ బ్లాక్ బస్టర్ అని ప్రభాస్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అయితే ఈ చిత్రం రూ. 1000 కోట్ల వసూళ్లను రాబడుతుందా లేదా అనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.పట్టుమని పది కూడా లేవు.. ఇండియన్ సినీ చరిత్రలో ఇప్పటికే వేల సంఖ్యలో సినిమాలు రిలీజ్ అయ్యాయి. అందులో చాలావరకు బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచాయి. కానీ రూ. 1000 కోట్ల కలెక్షన్స్ రాబట్టిన చిత్రాలు మాత్రం పట్టుమని పది కూడా లేవు. పాన్ ఇండియా సినిమాల్లో ఇప్పటివకు దంగల్, బాహుబలి 2, ఆర్ఆర్ఆర్, కేజీయఫ్ 2, పఠాన్, జవాన్, పుష్ప 2, కల్కి 2898 ఏడీ, దురంధర్ చిత్రాలు మాత్రమే రూ. 1000 కోట్లకు పైగా వసూళ్లను సాధించాయి. అయితే ఇవన్నీ భారీ యాక్షన్ సినిమాలే. పాన్ ఇండియా ప్రేక్షుకులు మెచ్చే కంటెంట్‌తో విజువల్ వండర్స్‌గా వాటిని తెరకెక్కించారు. కానీ ది రాజాసాబ్ హారర్ కామెడి ఫాంటసీ. ఈ జోనర్ చిత్రాలు ఇప్పటివరకు రూ. 1000 కోట్లు వసూలు చేసిన దాఖలాలు లేవు. ఒకవేళ రాజాసాబ్ రూ. 1000 కోట్ల కలెక్షన్స్ సాధిస్తే.. ఆ ఘనత సాధించిన తొలి హారర్-రొమాంటిక్ ఎంటర్టైనర్గా చరిత్రకెక్కుతుంది.ఆశలన్నీ ప్రభాస్‌పైనే.. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌కు దేశ వ్యాప్తంగా ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి తెలిసిందే. ఆయన ఫ్లాప్ సినిమాలకు కూడా రూ. వందల కోట్ల కలెక్షన్స్ వస్తాయి. ఇక సినిమాకు హిట్ టాక్ వస్తే..బాక్సాఫీస్ షేక్ అవ్వాలిసందే. ఇప్పటికే ఆయన నటించిన రెండు సినిమాలు(బాహుబలి 2: రూ.1800 కోట్లు, కల్కి: రూ.1100 కోట్ల) రూ. 1000 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టాయి. యావరేజ్ టాక్ వచ్చిన సలార్, సాహో వంటి సినిమాలు కూడా ₹400-700 కోట్ల రేంజ్ లో నిలిచాయి. రాధేశ్యామ్ లాంటి ఫ్లాప్ చిత్రానికి కూడా రూ. 200 కోట్లకు పైగా వసూళ్ల వచ్చాయి. ప్రభాస్ సినిమా అంటే కనీసం రెండు, మూడు వందల కోట్లు గ్యారెంటీ అనే నమ్మకం ట్రేడ్ వర్గాల్లో ఉంది. ఇప్పుడు ‘రాజా సాబ్’ ఆయన కెరీర్లో మరో రూ.1000 కోట్ల శిఖరాన్ని చేరుతుందా అన్నదే అసలు ప్రశ్న.రూ. 100 కోట్లు అంత ఈజీకాదు..అయితే రాజాసాబ్ రూ. 1000 కోట్ల క్లబ్ చేరడం మాత్రం అంత ఈజీకాదు. సంక్రాంతికి ఈ సినిమాతో పాటు తెలుగులో మరో ఆరు చిత్రాలు రిలీజ్ అవుతున్నాయి. వాటిల్లో మెగాస్టార్ చిరంజీవి ‘మనశంకర్ వరప్రసాద్ గారు’, విజయ్ ‘జన నాయగన్’ చిత్రాలు కూడా ఉన్నాయి. ఇలాంటి బడాస్టార్ల పోటీని తట్టుకొని రాజాసాబ్ ప్రేక్షకులను ఎంతవరకు ఆకర్షిస్తాడనేదానిపై సినిమా ఫలితం ఆదారపడి ఉంటుంది. ప్రభాస్(Prabhas)కు కలిసొచ్చే అంశాలు ఏంటంటే.. పండగ సీజన్, మిగతా హీరోలతో పోలిస్తే.. పాన్ ఇండియాలో ఆయనకే ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండడం. అయితే రాజాసాబ్‌కి హిట్ టాక్ వచ్చినా.. పుష్ప 2 లాగా కేవలం వారం రోజుల్లో రూ. 1000 కోట్లు కొల్లగొట్టడం కష్టమే. ‘ధురంధర్’ లాగా లాంగ్ రన్ సాధిస్తే మాత్రం ఈజీగా రూ. 1000 కోట్ల మార్కుని అందుకుంటుంది. (ఈ కథనంలో పేర్కొన్న గణాంకాలను GrabOn టీమ్ పరిశీలించి, క్రాస్-వెరిఫై చేసి, ధృవీకరించింది) -
‘ది రాజాసాబ్’ నుంచి ఆ రెండు సీన్లు కట్.. రన్‌టైమ్ ఎంతంటే?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన తొలి హారర్ కామెడీ థ్రిల్లర్ ‘ది రాజాసాబ్’. మారుతి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. విలన్ పాత్రలో సంజయ్‌దత్ కనిపించబోతున్నాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 9న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. (చదవండి: దిలీప్ కుమార్.. ఏఆర్ రెహమాన్‌గా ఎలా మారాడు?)ఫ్యాన్స్ కోసం ఒకరోజు ముందే..అనగా జనవరి 8న సాయంత్రమే ప్రీమియర్స్ వేయబోతున్నారు. ఇటీవల ఈ మూవీ సెన్సార్ పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ మూవీ రన్ టైమ్ బయటకు వచ్చింది. ఈ సినిమా రన్‌టైమ్ 189 నిమిషాలు. అంటే 3 గంటల 9 నిమిషాల నిడివితో ప్రేక్షకులను అలరించబోతుంది. ఇక ఈ సినిమాకు యూ/ఏ సర్టిఫికేట్ ఇచ్చిన సెన్సార్ సభ్యులు.. సినిమా మొత్తంలో రెండు కట్స్ మాత్రమే చెప్పారట. సినిమాలో తల నరికే సీన్‌తో పాటు నేలపై ఎక్కువ రక్తం కనిపించే సన్నివేశాన్ని తొలగించాలని సూచించారు. దీంతో ఆ రెండు సీన్స్ సినిమాలో నుంచి తొలగించిన 189 నిమిషాల నిడివితో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారట. (చదవండి: ‘మన శంకరవరప్రసాద్ గారు’ సీక్వెల్‌పై క్లారిటీ!)బాహుబలి తర్వాత పాన్ ఇండియా సినిమాలన్నీ దాదాపు మూడు గంటల నిడివితోనే రిలీజ్ అవుతున్నాయి. బాహుబలి తర్వాత ప్రభాస్ నుంచి వచ్చిన చిత్రాలన్నీ దాదాపు ఎక్కువ రన్టైమ్నే కలిగి ఉన్నాయి. ఇప్పుడు ది రాజాసాబ్(The Raja Saab ) కూడా అత్యధిక నిడివితో విడుదల కాబోతుంది. హారర్ కామెడీతో ప్రేక్షకులను మూడు గంటలు కూర్చోబెట్టడం కాస్త రిస్కే. ఏమాత్రం తేడా వచ్చిన ఫలితం తారుమారు అవుతుంది. ‘రాజాసాబ్’ మాత్రం రిస్క్ చేసి మరీ పెద్ద నిడివితో వస్తున్నాడు. ఫలితం ఎలా ఉంటుందో చూడాలి. -
'ఆ 15 నిమిషాల పాత్ర.. మిమ్మల్ని మెస్మరైజ్ చేస్తుంది'.. ది రాజాసాబ్ డైరెక్టర్
ప్రభాస్ ది రాజా సాబ్ రిలీజ్‌కు ఇంకా వారం రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. వచ్చే శుక్రవారమే రెబల్ స్టార్ థియేటర్లలో సందడి చేయనున్నాడు రాజాసాబ్. ఇప్పటికే రిలీజైన ట్రైలర్, పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. రిలీజ్‌కు సమయం తక్కువగా ఉండడంతో ప్రమోషన్స్‌తో బిజీ అయిపోయారు మేకర్స్. ఈ మూవీకి సంబంధించిన విశేషాలను డైరెక్టర్ మారుతి పంచుకున్నారు. ఈ మూవీ క్రేజీ రోల్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.ఈ మూవీలో అత్తారింటికి దారేది నటుడు బోమన్ ఇరానీ పాత్రలో రివీల్ చేశారు మారుతి. ఆయన వచ్చాక మూవీ టోన్ మారుతుందని అన్నారు. ట్రైలర్లో చూస్తే ఆయన మేకప్ కూడా చాలా వెరైటీగా ఉంటుందని.. ఆయన రోల్ ఎక్కువగా లైబ్రరీలో షూట్ చేశామని తెలిపారు. ఇందులో ఆయన ఒక సైక్రియాటిస్ట్‌గా కనిపిస్తారని వెల్లడించారు. బోమన్ ఇరానీ ఎంట్రీ ఇచ్చాకే హారర్ కామెడీ నుంచి అస్సలు ఎవరూ ఊహించని విధంగా మలుపు తీసుకుంటుందన్నారు. ఆడియన్స్‌ను మెస్మరైజ్ చేసే యాక్టర్స్‌లో బోమన్ ఇరానీ ఒకరు.. 3 ఇడియట్స్‌లో వైరస్ అనే క్యారెక్టర్ ఎప్పటికీ గుర్తుండిపోతుందన్నారు. ఈ చిత్రంలో బోమన్ దాదాపు 15 నిమిషాల పాటు ఉంటారని తెలిపారు. ఆయన ఉన్నంత సేపు అలా ఒక స్పెషల్ జోన్లో వెళ్లిపోతామన్నారు. నేను చెప్పడం కంటే.. మీరు తెరపై చూసినప్పుడే ఈ విషయం అర్థమవుతుందని మారుతి అన్నారు. ఈ వీడియోను ది రాజాసాబ్ టీమ్ తన ట్విటర్లో పోస్ట్ చేసింది. కాగా.. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 9న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది. 𝐓𝐡𝐞 𝐋𝐞𝐠𝐚𝐜𝐲 𝐨𝐟 𝐓𝐡𝐞𝐑𝐚𝐣𝐚𝐒𝐚𝐚𝐛 - 𝐄𝐩𝐢𝐬𝐨𝐝𝐞 𝟒 ❤️🔥This one’s all about the impact @BomanIrani is going to create 🔥#TheRajaSaab#TheRajaSaabOnJan9th #Prabhas pic.twitter.com/3kWJddv1qd— The RajaSaab (@rajasaabmovie) January 2, 2026 -
ప్రభాస్ ది రాజాసాబ్.. ఎవరికెంత రెమ్యునరేషన్..!
ప్రభాస్- మారుతి కాంబోలో వస్తోన్న రొమాంటిక్ హారర్ కామెడీ మూవీ ది రాజాసాబ్. ఈ మూవీ సంక్రాంతికి కానుకగా సందడి చేసేందుకు వస్తోంది. ఇప్పటికే రిలీజైన ట్రైలర్, సాంగ్స్ రెబల్ స్టార్ ఫ్యాన్స్‌ను అలరిస్తున్నాయి. తొలిసారి వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో ఆడియన్స్‌లో అంచనాలు పెరిగాయి. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్లో టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు.ఈ మూవీ రిలీజ్‌కు కేవలం వారం రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. ఇప్పటికే ప్రమోషన్స్‌తో ఫుల్ బిజీగా ఉన్నారు మేకర్స్. ఇటీవలే హైదరాబాద్‌లో గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు హాజరైన మారుతి ఫుల్ ఎమోషనల్ స్పీచ్ ఇచ్చారు. ఈ మూవీ కోసం మూడేళ్లు కష్టపడ్డామని స్టేజీపైనే భావోద్వేగానికి గురయ్యారు. ఈ క్రమంలోనే ప్రభాస్‌పై ప్రశంసలు కురిపించాడు డైరెక్టర్ మారుతి.అయితే ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొనడంతో.. తాజాగా ఈ మూవీ స్టార్స్ రెమ్యునరేషన్‌పై కూడా చర్చ మొదలైంది. ఈ సినిమాకు ప్రభాస్‌తో పాటు సంజయ్ దత్, హీరోయిన్స్ పారితోషికాలపై నెట్టింట టాక్ నడుస్తోంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ సినిమాకు ప్రభాస్ తన రెగ్యులర్ రెమ్యునరేషన్ కంటే తక్కువగానే తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీకి రెబల్ స్టార్ రూ.100 కోట్లు తీసుకున్నారని టాక్.ఎవరికి ఎంతంటే?మరోవైపు బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ది రాజాసాబ్ కోసం భారీగానే పారితోషికం అందుకున్నట్లు తెలుస్తోంది. దాదాపు రూ.5 నుంచి రూ.6 కోట్ల వరకు తీసుకున్నారని టాక్. హీరోయిన్ల విషయానికొస్తే కోలీవుడ్ భామ మాళవిక మోహనన్ రూ.2 కోట్లు, నిధి అగర్వాల్ రూ.1.5 కోట్లు, రిద్ధి కుమార్ రూ.3 కోట్ల వరకు రెమ్యునరేషన్ అందుకున్నట్లు సమాచారం. వీరితో పాటు బ్రహ్మనందం రూ.80 లక్షల వరకు తీసుకున్నట్లు తెలుస్తోంది.కాగా.. ఈ చిత్రానికి డైరెక్టర్ మారుతి సైతం భారీగానే తీసుకున్నట్లు టాక్. ఈ మూవీకి దాదాపు రూ.18 కోట్ల పారితోషికం అందుకోనున్నారని తెలుస్తోంది. ఈ మూవీని నిర్మాత టీజీ విశ్వప్రసాద్ దాదాపు రూ.450 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించారు. -
అందుకే ‘రాజాసాబ్’ ఫ్లాప్ అవ్వాలని కోరుకుంటున్నారు: మారుతి
ప్రభాస్ నటించిన తొలి హారర్ కామెడీ సినిమా ‘ది రాజాసాబ్’ మరో వారం రోజుల్లో(జనవరి 9) ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ప్రభాస్ ఫ్యాన్స్‌కి పక్కా బ్లాక్ బస్టర్ హిట్ ఇస్తానని దర్శకుడు మారుతి ముందే హామీ ఇచ్చారు. తేడా వస్తే..ఇంటికొచ్చి అడగొచ్చు అంటూ అడ్రస్ కూడా చెప్పాడు. మారుతి(Director Maruthi) ఇలాంటి ప్రకటనలు చేయడం వెనక ఓ కారణం ఉంది. ఆయన ప్రభాస్‌తో సినిమా ప్రకటించినప్పుడు ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో ట్రోల్ కూడా చేశారు. వారికి భరోసా ఇచ్చేందుకు మారుతి అలాంటి ప్రకటనలు చేశాడు. అయినా కూడా ఇండస్ట్రీలో కొంతమంది ది రాజాసాబ్(The Raja Saab) ఫ్లాప్ అవ్వాలని కోరుకుంటున్నారట. తాజాగా ఓ ఇంటర్వ్యూలో యాంకర్ ఇదే విషయాన్ని మారుతి దగ్గర ప్రస్తావిస్తూ.. వాళ్లు అలా ఎందుకు ఆలోచిస్తున్నారు’ అని ప్రశ్నించారు. దీనికి మారుతి ఆసక్తికరమైన సమాధానం ఇచ్చారు. కొంతమంది జెలసీతోనే అలా కోరుకుంటున్నారని.. వారికి తన సినిమాతోనే సరైన సమాధానం చెబుతానన్నారు.‘ఈర్ష్య, అసూయ మానవ నైజం. నాకు భారీ హిట్ పడితే.. ఎక్కడ బిజీ అయిపోతాడేమోననే భయంతో కొంతమంది అలా కోరుకుంటున్నారు. నేను ఇప్పుడు చిన్న చిన్న సినిమాల ఈవెంట్స్‌కి కూడా వెళ్తున్నాను. రాజాసాబ్ హిట్ అయితే.. ఇలాంటి ఈవెంట్లకు రానేమో అని వాళ్లు భయపడుతున్నారు. నాకు ఫెయిల్యూర్ వస్తే.. వాళ్లకు అది ఫుడ్ పెట్టదు. కానీ జెలసీతో అలా కోరుకుంటున్నారు. ఈసారి కిందపడితే కొన్నాళ్ల పాటు కోలుకోలేడని వాళ్లు అనుకుంటున్నారు. కానీ నేను అలాంటి వ్యక్తిని కాదు. హిట్ వచ్చినా..ఫ్లాప్ వచ్చిన మరో సినిమా తీస్తా. ప్రభాస్‌తో సినిమా తీశా కదా అని ఇకపై పెద్ద సినిమాలు మాత్రమే తీయాలనే కోరికలు నాకు లేదు. రాజాసాబ్ తర్వాత చిన్న సినిమా తీయాలనుకుంటే తీసేస్తా. నా కథకి ఏ హీరో సెట్ అయితే ఆ హీరోతో వెళ్లిపోతా. బిజీగా ఉండాలని మాత్రమే కోరుకుంటా’ అని మారుతి చెప్పుకొచ్చాడు. -
తిరుమల శ్రీవారి సేవలో టాలీవుడ్ సెలబ్రిటీలు (ఫొటోలు)
-
కన్నీళ్లు ఆపుకోలేకపోయిన ది రాజా సాబ్ డైెరెక్టర్ కూతురు.. వీడియో వైరల్!
ప్రభాస్ -మారుతి డైరెక్షన్లో వస్తోన్న రొమాంటిక్ హారర్ కామెడీ చిత్రం ది రాజా సాబ్. ఈ సినిమా కోసం రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సినిమాలో నిధీ అగర్వాల్, మాళవికా మోహనన్, రిద్దీ కుమార్ హీరోయిన్లుగా నటించారు. ఈ మూవీని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్లో టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. రిలీజ్ తేదీ దగ్గర పడడంతో హైదరాబాద్‌లో భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు మేకర్స్.ఈ సందర్భంగా ఈవెంట్‌కు హాజరైన డైరెక్టర్ మారుతి ఫుల్ ఎమోషనల్ అయ్యారు. ప్రభాస్‌ను చూసి కన్నీళ్లు పెట్టుకున్నారు. మూడేళ్లుగా ది రాజాసాబ్ కోసం పడ్డ కష్టాన్ని గుర్తు చేసుకుని భావోద్వేగానికి గురయ్యారు. రెబల్ స్టార్‌ను తీసుకొచ్చిన ఆయన రేంజ్‌కు తగినట్లుగానే ఈ సినిమాను తీసుకొస్తున్నామని తెలిపారు. ఈ సినిమా కోసం ప్రభాస్ తన లైఫ్ పెట్టేశారని కొనియాడారు. సినిమాతోనే ఏకమైపోయిన తీరును మాటల్లో చెప్పలేనన్నారు. ఆ ప్రతి రూపమే ఈ రోజు మన ఎదురుగా కూర్చుందని డైరెక్టర్ ప్రశంసలు కురిపించారు. ఈ సినిమా కోసం ప్రాణం పెట్టిన ప్రభాస్‌ను చూస్తుంటే నా కన్నీళ్లు ఆగడం లేదంటూ వేదికపైనే ఏడ్చేశారు. ఈ సందర్భంగా వేదికపైనే చిన్నపిల్లాడిలా దర్శకుడు మారుతి ఏడ్చిన తీరు ఆడియన్స్‌ను సైతం కన్నీళ్లు పెట్టించింది.మారుతి కూతురు ఎమోషనల్ఈ వీడియో చూసిన ఆయన కూతురు ఈవెంట్లోనే కన్నీళ్లు పెట్టుకుంది. తండ్రి కష్టాన్ని చూసిన కూతురు కన్నీళ్లు ఆపుకోలేకపోయింది. తండ్రి కంటే ఎక్కువగా ఎమోషనలైంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్స్ ఒక తండ్రి కష్టం విలువ.. కుమార్తెకే తెలుస్తుందని కామెంట్స్ చేస్తున్నారు..@DirectorMaruthi Emotional avvadam tho valla Daughter of kuda challa Emotional ayindhi 🥲❤️#TheRajaSaab pic.twitter.com/ZkGVGBp4bU— Rebel Star (@Pranay___Varma) December 28, 2025 -
మారిపోయిన ప్రభాస్.. ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ!
ప్రభాస్.. పాన్ ఇండియా నెంబర్ వన్ స్టార్. కోట్లాది మంది అభిమానులు ఆయన సొంతం. ఆయన ఫ్లాపు సినిమాలకు కూడా వందల కోట్ల కలెక్షన్స్ వచ్చేస్తాయి. అలాంటి హీరో బయటకు వస్తే ఎంత హడావుడి చేయాలి? కానీ ప్రభాస్ చాలా సింపుల్‌గా ఉంటాడు. స్టార్ హీరో అనే బిల్డప్ ఆయన ముఖంలో ఎప్పుడూ కనిపించదు. తన సినిమాల గురించి కూడా పెద్దగా గొప్పలు చెప్పుకోడు. సినిమా ఈవెంట్లో ఇచ్చే స్పీచులు కూడా ఒకటి, రెండు నిమిషాలకు మించి ఉండదు. కానీ ‘ది రాజాసాబ్’ ప్రీరిలీజ్ ఈవెంట్లో కొత్త ప్రభాస్ కనిపించాడు. ఎప్పుడూ లేనంతగా చాలా ఎక్కువ సేపు స్పీచ్ ఇచ్చాడు.అందుకే పిలకరాజాసాబ్ ప్రీరిలీజ్ ఈవెంట్లో ప్రభాస్ దాదాపు 10 నిమిషాల వరకు మాట్లాడితే..అందులో ఎక్కువసేపు ఫ్యాన్స్ ప్రస్తావనే తెచ్చాడు. అభిమానుల కోసమే ది రాజాసాబ్ సినిమా చేశామని చెప్పాడు. అంతేకాదు ‘మీ కోసమే పిలక వేసుకొని వచ్చా’ అంటూ తన పిలక చూపించి..నవ్వించాడు. ఇక ఆయన స్పీచ్ మధ్యలో ఫ్యాన్స్ అంతా ‘బాహుబలి జయహో’ అంటుంటే.. ‘నా స్పీచ్ బోరింగ్‌గా ఉంటుందని మీరు అలా అంటున్నారు కదా.. ఏదో ఒకరోజు స్టేజ్‌పై ఎంటర్టైన్ చేస్తా..మీరంతా షాకైపోతారు’ అంటూ చిన్నపిల్లాడిలా ప్రభాస్ మాట్లాడిన తీరు అందరిని ఆకట్టుకుంది. ఇక తన పెళ్లిపై కూడా ఆయన ఫన్నీగా స్పందించారు. ‘ప్రభాస్‌ని పెళ్లి చేసుకోవాలంటే ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటి?’ అని సుమ ప్రశ్నించగా.. ‘అది తెలియకనే ఇప్పటివరకు పెళ్లి చేసుకోలేదు’ అంటూ నవ్వేశాడు. ఫ్యాన్స్: ప్రభాస్ పెళ్లి చేసుకునే అమ్మాయికి ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి..?హీరో ప్రభాస్: అది తెలియకే ఇంతవరకూ పెళ్లి చేసుకోలేదు pic.twitter.com/VI5FzMAvFc— PulseNewsBreaking (@pulsenewsbreak) December 27, 2025ఇక సూట్లో వచ్చిన తమన్‌పై కూడా ప్రభాస్ పంచులు వేశాడు. ‘అంత ధైర్యం ఏంటి డార్లింగ్. సీరియస్‌గా చెబుతున్నా.. నేను కూడా ఇలా సూట్ వేసుకోని రావాలని అన్నీ రెడీ చేసుకుంటా. కబోర్డులో దాదాపు 200 వరకు డ్రెస్సులు ఉంటాయి. బాగా రెడీ అయి రావాలనుకుంటాను. కానీ ఓవర్‌గా ఉంటుందిలే అనుకొని సింపుల్‌గా వచ్చేస్తా. తమన్ లాంటి ధైర్యం నాకెప్పుడు వస్తుందో’ అని చెప్పడంతో అక్కడ ఉన్న ఫ్యాన్స్ అంతా ఫుల్‌గా నవ్వేశారు. ఆ ఒక్క మాటతో..ప్రభాస్ ఎప్పుడూ తన సినిమాల గురించి డబ్బా కొట్టుకోరు. ‘మా సినిమా అదిరిపోయింది..బ్లాక్ బస్టర్ హిట్ పక్కా’ అని ఎక్కడా చెప్పలేడు. కామ్‌గా సినిమా చేసుకొని పోతాడు.హిట్ అయినా, ఫ్లాప్ అయినా పెద్దగా మాట్లాడడు. ఈ సారి కూడా అలానే మాట్లాడారు. ‘ఈ పండక్కి అన్ని సినిమాలు బ్లాక్ బస్టర్లు అవ్వాలి. అందులో మాది కూడా ఉంటే బాగుంటుంది’ అని మాత్రమే అన్నాడు. ఈ ఒక్క మాట చాలు.. మిగిలిన సినిమాలకు ప్రభాస్ ఎంత గౌరవం ఇస్తున్నాడో చెప్పడానికి. అంతేకాదు సీనియర్ హీరోలను కూడా ఆయన ఎంతో గౌరవిస్తాడు. ‘సీనియర్లు సీనియర్లే. వాళ్ల నుంచి మేమంతా నేర్చుకొన్నాం. వాళ్ల సినిమాలు బాగా ఆడాలి’ అంటూ సంక్రాంతి పోటీలో ఉన్న చిరంజీవి, రవితేజ లాంటి సీనియర్ హీరోలకు తన తరపున ఆల్ ది బెస్ట్ చెప్పాడంతే.. ఆయన సీనియర్లకు ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నాడో అర్థం చేసుకోవచ్చు. ఇక మారుతి ఎమోషల్ అయితే..దగ్గరకు వచ్చి ఓదార్చడమే కాదు.. `మూడేళ్ల కష్టం కన్నీళ్ల రూపంలో వచ్చింది` అంటూ తనదైన శైలీలో కవర్ చేశాడు. ఇక ఈ సినిమా క్లైమాక్స్ గురించి మాట్లాడుతూ.. ‘డార్లింగ్ పెన్నుతో రాశావా… మిషన్ గన్నుతో రాశావా’ అంటూ మారుతిపై ప్రశంసలు కురిపించడంతో ఫ్యాన్స్ ఫుల్ అవుతున్నారు. They Call him 'Lottery Star' 💔#prabhas #RajaSaab pic.twitter.com/hS3uvAO2ao— Naa_istam 🚩 (@Grookk12) December 28, 2025మొత్తంగా ప్రభాస్ ఎప్పుడూ లేని విధంగా చాలా హుషారుగా, సరదాగా ఎక్కువ స్పీచ్ ఇచ్చాడు. తమ అభిమాన హీరో ఇలా ఓపెన్‌గా మాట్లాడడం చూసి ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. -
ప్రభాస్ ది రాజాసాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఫ్యాన్స్ సందడి.. ఫోటోలు
-
ప్రభాస్‌ను చూసి చిన్న పిల్లాడిలా ఏడ్చేసిన డైరెక్టర్.. వీడియో వైరల్
ది రాజాసాబ్ డైరెక్టర్ మారుతి ఆసక్తికర కామెంట్స్ చేశారు. హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు హాజరైన మారుతి దర్శకధీరుడిపై ప్రశంసలు కురిపించారు. రాజమౌళికి ప్రతి డైరెక్టర్ రుణపడి ఉన్నామని తెలిపారు. ఇవాళ చాలామంది పాన్ ఇండియా అని కాల్ ఎగరేసుకుని తిరుగుతున్నామంటే కారణం ఆయనే అన్నారు. నిజంగా టాలీవుడ్‌కు ఇది స్వర్ణయుగమని తెలిపారు.నా లాంటి మిడ్ రేంజ్ సినిమాలు తీసే నన్ను ఈ రోజు ఇక్కడ నిలబెట్టారని మారుతి తెలిపారు. ఒక మిడ్ రేంజ్ హీరోని పాన్ ఇండియా హీరోగా చేసి ఒక పెద్ద కటౌట్ అందించారని అన్నారు. ఒక సుకుమార్, సందీప్ రెడ్డి వంగా, ప్రభాస్, అల్లు అర్జున్, ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇలా ఎంతోమంది స్టార్స్‌ను తయారు చేసిన ఘనత ఆయనదేనన్నారు. అంతేకాకుండా హీరో ప్రభాస్‌పై ప్రశంసలు కురిపించారు డైరెక్టర్ మారుతి. ఆయన ఒక శక్తి అని కొనియాడారు. నా వెనకాల ఉన్నది మామూలు శక్తి కాదు.. ఆయన కేవలం యాక్టింగ్ చేసి వెళ్లిపోవడం కాదు.. తన లైఫ్ పెట్టేశారని అన్నారు. సినిమాతో ఏకమైపోయిన తీరును మాటల్లో చెప్పలేమన్నారు. ఆ ప్రతి రూపమే ఇవాళ మన ఎదురుగా కూర్చుందని ఎమోషనల్ అయ్యారు. ప్రభాస్‌ను చూసి కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రభాస్ హీరోగా వస్తోన్న రొమాంటిక్ హారర్ కామెడీ చిత్రం ది రాజాసాబ్. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ చేయగా.. అభిమానుల్లో అంచనాలు మరింత పెంచేసింది.ఈ సినిమాలో నిధీ అగర్వాల్, మాళవికా మోహనన్, రిద్దీ కుమార్ హీరోయిన్లుగా నటించారు. ఈ మూవీ సంక్రాంతి పోటీలో నిలిచింది. ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్లో టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. Emotional Moment ♥️😭#Prabhas𓃵 #Maruthi pic.twitter.com/HcS6TB1Gmc— Addicted To Memes (@Addictedtomemez) December 27, 2025 టాలీవుడ్‌కు ఇది స్వర్ణయుగం.టాలీవుడ్ డైరెక్టర్లంతా @ssrajamouli కి రుణపడి ఉన్నాము.. ఒక మిడ్ రేంజ్ హీరోని పాన్ ఇండియా హీరోగా చేసి మాకు ఇచ్చినందుకు – డైరెక్టర్ #Maruthi #Prabhas𓃵 #RajaSaab pic.twitter.com/0HPAVKG6CZ— greatandhra (@greatandhranews) December 27, 2025 -
మూడేళ్ల తర్వాత ఫ్యాన్స్ కోసం ప్రభాస్.. 'రాజా సాబ్' ప్రీ రిలీజ్ వేడుక ఎక్కడంటే..
ప్రభాస్-దర్శకుడు మారుతి కాంబినేషన్ సినిమా ‘ది రాజా సాబ్’.. సంక్రాంతి కానుకగా జనవరి 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. అమెరికాలో టికెట్ బుకింగ్స్ కూడా ఇప్పటికే ఓపెన్ అయ్యాయి. ఈ క్రమంలో హైదరాబాద్‌లో నేడు (డిసెంబర్ 27)న సాయంత్రం 5 గంటలకు ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. కూకట్‌పల్లిలోని కైత్లాపూర్ గ్రౌండ్లో జరగనున్న ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు భారీగా ఫ్యాన్స్ రానున్నారు. ప్రభాస్ బర్త్‌డే సందర్బంగా ఇదే గ్రౌండ్లో 220 ఫీట్ల భారీ కటౌట్‌ను ఏర్పాటు చేసి రికార్డ్ క్రియేట్ చేశారు.మీడియాకు పూర్తిగా దూరంగా ఉండే ప్రభాస్.. ఫ్యాన్స్ కోసం చాలా కాలం తర్వాత వేదికపైకి రానున్నారు. 'సలార్' సినిమాకు ఎలాంటి ఈవెంట్ లేకుండానే రిలీజ్ అయింది. ఆ తర్వాత ‘కల్కి’ సినిమాకు మాత్రం బుజ్జిని పరిచయం చేస్తూ సందడిగా డార్లింగ్ కనిపించారు. కానీ, మరే ఈవెంట్లో ప్రభాస్ కనిపించలేదు. బహిరంగ వేదికలపై కనిపించడం తనకు పెద్దగా ఇష్టం ఉండదు. తమ హీరోను చూసి చాలా ఏళ్లు అవుతుందని అభిమానులు కోరుతూ ఉండటంతో రాజా సాబ్ ఈవెంట్లో ఆయన పాల్గొనున్నారు. ఇదే విషయాన్ని నిర్మాత ఎస్కేఎన్ కూడా తెలిపారు. ఈ లెక్కన సుమారు 3ఏళ్ల తర్వాత ప్రభాస్ పబ్లిక్ వేదికపైకి రానున్నారు. -
‘బ్యాడ్ గాళ్స్’ లాంటి సినిమాలు తప్పక ఆడాలి: మారుతి
‘‘సినిమా టైటిల్ మాత్రమే ‘బ్యాడ్ గాళ్స్’. కానీ, మూవీ అంతా పాజిటివ్‌గా ఉంటుంది. నేటితరం అమ్మాయిలు ఎలా ఉన్నారు? వాళ్ల ఆలోచనా విధానం ఏంటి? వాళ్లు ఏమి కోరుకుంటున్నారు? వంటి మంచి కాన్సెప్ట్‌తో, మహిళలకు ప్రాధాన్యం ఇచ్చేలా రూపొందిన ‘బ్యాడ్ గాళ్స్’తప్పక ఆడాలి’’ అని డైరెక్టర్ మారుతి ఆకాంక్షించారు. ఆంచల్ గౌడ, పాయల్ చెంగప్ప, రోషిణి, యష్ణ, మోయిన్, రోహన్ సూర్య ముఖ్య తారలుగా రూపొందిన చిత్రం ‘బ్యాడ్ గాళ్స్’. ‘కానీ చాలా మంచోళ్లు’ అనేది ట్యాగ్ లైన్. ఫణి ప్రదీప్ ధూళిపూడి(మున్నా) దర్శకత్వం వహించారు. ప్రశ్విత ఎంటర్టైన్ మెంట్, నీలి నీలి ఆకాశం క్రియేషన్స్ ఎన్వీఎల్ క్రియేషన్స్ బ్యానర్స్‌పై శశిధర్ నల్ల, ఇమ్మడి సోమ నర్సయ్య, రామిశెట్టి రాంబాబు, రావుల రమేష్ నిర్మించిన ఈ సినిమా నెల 25న విడుదల కానుంది. ఈ మూవీ ట్రైలర్‌ను మారుతి విడుదల చేసి, ‘‘ఫణి ప్రదీప్ నాకు మిత్రుడు. ‘బ్యాడ్ గాళ్స్’ చిత్రం విజయం సాధించాలి’’ అని పేర్కొన్నారు. -
ప్రభాస్ ది రాజాసాబ్.. రొమాంటిక్ సాంగ్ వచ్చేసింది
రెబల్ స్టార్ డార్లింగ్ ప్రభాస్ -మారుతి డైరెక్షన్లో వస్తోన్న రొమాంటిక్ హారర్ కామెడీ థ్రిల్లర్ ది రాజాసాబ్. ఈచిత్రంలో నిధి అగర్వాల్, మాళవికా మోహన్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన టీజర్, ట్రైలర్‌కు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ మూవీ నుంచి మరో క్రేజీ సాంగ్ రిలీజ్ చేశారు. సహనా సహనా అంటూ సాంగే రొమాంటిక్ లవ్ సాంగ్‌ను విడుదల చేశారు.తాజాగా రిలీజైన ఈ పాట ప్రభాస్ ఫ్యాన్స్ విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ పాటకు కృష్ణకాంత్ లిరిక్స్ అందించగా.. విశాల్ మిశ్రా, తమన్ ఎస్, శృతి రంజనీ ఆలపించారు. ఈ పాటను తమన్ కంపోజ్ చేశారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ది రాజాసాబ్ వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా థియేటర్లలో సందడి చేయనుంది. జనవరి 9న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ మూవీని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్, కృతీ ప్రసాద్ నిర్మించారు. -
'త్రీ రోజెస్' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
‘మారుతి’ కార్లు అంటేనే ఇక్కడ అపశకునమట!
దేశంలో ఒక్కో ప్రాంతానికి ఒక్కో నమ్మకం ఆచారాలు ఉంటాయి. కానీ మారుతీ కార్లను బ్యాన్ చేసిన గ్రామం గురించి తెలుసా? మహారాష్ట్రలోనే ఈ ప్రత్యేకమైన గ్రామం ఉంది. ఇక్కడ మారుతి కార్లపై నిషేధం ఎందుకు? ఆ కార్ల నాణ్యత నచ్చలేదా? లేక ధరలు ఎక్కువని భావించారా? పదండి తెలుసుకుందాం. మనీ కంట్రోల్ కథనం ప్రకారం రాష్ట్రంలోని అహ్మద్ నగర్ జిల్లాలో ఆ గ్రామం సాధారణ భారతీయ గ్రామం కాదు. ఆధునిక జీవితం పురాతన నమ్మకాలతో మిళితమైన గ్రామం అని చెప్పవచ్చు. ఈ నిషేధం వెనుక కారణం కారు నాణ్యత కారు, అధిక ధరలూ కాదు. స్థానిక పురాణాల గాథ ప్రకారం సంరక్షక దేవత నింబ దైత్య పట్ల భక్తితో లోతుగా ముడిపడి ఉంది.ధైర్యాన్నిచ్చి, కష్టాలను తొలగించి, కోరుకున్న కోరికలు నెరవేరుస్తాడని భక్తులు బాగా విశ్వసించే శ్రీరాముడికి గొప్ప సేవకుడు భక్తుడు హనుమంతుడి దేవాలయాలు ఉండవు. మారుతిని ఇక్కడ పూజించరు. ముంబైకి 350 కిలోమీటర్ల దూరంలో ఉందీ గ్రామం. ఇక్కడ రాక్షస రాజైన నింబ దైత్యుడిని పూజిస్తారు. ఇక్కడి ప్రజలు దైత్య నింబ రాక్షసుడుని తమ మూలపురుషుడిగా భావిస్తారు. చిన్నా పెద్దా అందరికీ నింబ దైత్య అంటే బలమైన నమ్మకం. తరతరాలుగా చెప్పుకుంటున్న స్థానిక పురాణం ప్రకారం, హనుమంతుడు , నింబ దైత్య మధ్య ఒకప్పుడు వివాదం జరిగింది. చివరికి రాముడు స్వయంగా జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. ఈ సంఘటన తర్వాత, రాముడు నింబ దైత్యుడికి ఈ గ్రామానికి ఏకైక దైవ సంరక్షకుడిగా ఉండే హక్కును ఇచ్చాడని నమ్ముతారు, హనుమంతుడిని ఈ పాత్ర నుండి తప్పుకోవాలని కోరాడట శ్రీరాముడు. దీని కారణంగా, హనుమంతుడి ఉనికి ఏ రూపంలోనైనా ఉండటం గ్రామానికి దురదృష్టాన్ని తెస్తుందనే నమ్మకం పెరిగింది. ఈ నమ్మకం దేవాలయాలు, పేర్లకు కూడా విస్తరించింది. అలా "మారుతి" అనేది హనుమంతుడికి మరొక పేరు కాబట్టి, ఈ బ్రాండ్ కార్లను అపశకునంగా భావిస్తారట. ఇక్కడ మారుతి కారు బిగ్గరగా హారన్ వినడం కూడా చెడ్డ శకునంగా భావిస్తారు. మూఢనమ్మకం అని అందరూ పిలుస్తున్నప్పటికీ, శతాబ్దాలుగా తమను రక్షిస్తున్న పవిత్ర సంప్రదాయం అంటారు ఈ గ్రామ ప్రజలు. ఇదీ చదవండి: స్మృతి మంధాన పెళ్లి వాయిదా : మరో వార్త వైరల్గ్రామంలోని ప్రజలు తరచుగా పంచుకునే ఒక ప్రసిద్ధ కథ ఉంది. సంవత్సరాల క్రితం, ఒక స్థానిక వైద్యుడు మారుతి 800 కారును కొన్నాడట. ఆ తరువాత క్లినిక్‌కు వచ్చే రోగుల సంఖ్య అకస్మాత్తుగా తగ్గిపోయింది. దీంతో ఆందోళన పడిన అతగాడు,మారుతి కారుని విక్రయించి, దానిని వేరే బ్రాండ్, టాటా సుమోతో భర్తీ చేశాడు. మారిన తర్వాత, అతని ప్రాక్టీస్ సాధారణ స్థితికి వచ్చిందట. (రూ. 80 లక్షల తల్లి పెన్షన్ కోసం ఏ కొడుకూ చేయని పని!) -
ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు దర్శకుడు మారుతి క్షమాపణలు
డార్లింగ్ ప్రభాస్ (Prabhas) లేటెస్ట్ మూవీ రాజాసాబ్. ఈ హారర్ కామెడీ మూవీని మారుతి తెరకెక్కిస్తున్నాడు. జనవరి 9న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలోనే ప్రమోషన్స్ షురూ చేశారు. రాజా సాబ్ నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేశారు. అయితే ఈ వేదికపై దర్శకుడు మారుతి కొన్ని అనవసరమైన డైలాగులు కొట్టాడు.మారుతిపై ట్రోలింగ్సినిమా అద్భుతంగా ఉంటుందని చెప్పిన మారుతి.. పండక్కి ప్రభాస్ అభిమానులు కాలర్ ఎగరేసుకుంటారు అని నేను చెప్పలేను. ఎందుకంటే ప్రభాస్ కటౌట్‌కు అవన్నీ చిన్నమాటలైపోతాయి అన్నాడు. ఈ కామెంట్స్‌పై జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు హర్టయ్యారు. ఎందుకంటే ఇటీవలే తారక్ వార్ 2 రిలీజ్ సమయంలో తన రెండు కాలర్స్ పైకి ఎగరేసి చూపించారు.క్షమాపణలు చెప్పిన మారుతిఇప్పుడు మారుతి.. ప్రభాస్ కటౌట్‌కి కాలర్ ఎగరేయడం చిన్న విషయం అనడంతో తారక్ ఫ్యాన్స్ అతడిని ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. దీంతో మారుతి సోషల్ మీడియా వేదికగా క్షమాపణలు చెప్పాడు. ఎన్టీఆర్ అభిమానులందర్నీ క్షమించమని కోరుతూ ట్వీట్ చేశాడు.నా ఉద్దేశం అది కాదుముందుగా అభిమానులకు క్షమాపణలు. నేను ఎవరినీ కించపరిచే ఉద్దేశంతో ఆ కామెంట్స్ చేయలేదు. నేనేదో ఫ్లోలో మాట్లాడాను. దాన్ని మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు. నాకు ఎన్టీఆర్‌గారంటే ఎనలేని గౌరవం. నేను ఆయన గురించి తప్పుగా మాట్లాడలేదు. అది మీరందరూ అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను అని మారుతి రాసుకొచ్చాడు. Dear Venky…Felt like clarifying this personally.First I sincerely apologise to every fan. It was never my intention to hurt or disrespect anyone. Sometimes in the flow of words things come out differently from what we truly mean and I regret that it was received in the wrong…— Director Maruthi (@DirectorMaruthi) November 24, 2025 చదవండి: అందంగా రెడీ అయిన ఖుష్బూ.. ముఖం కడుక్కోమన్న కమల్ -
ప్రభాస్ 'ది రాజా సాబ్'.. రెబల్ సాబ్ సాంగ్ రిలీజ్
రెబల్ స్టార్, డార్లింగ్ ప్రభాస్ (Prabhas)- మారుతి డైరెక్షన్లో వస్తోన్న రొమాంటిక్ హారర్ కామెడీ థ్రిల్లర్ ది రాజాసాబ్. ఈచిత్రంలో నిధి అగర్వాల్, మాళవికా మోహన్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన టీజర్, ట్రైలర్‌కు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ప్రభాస్ ఫ్యాన్స్ అయితే ఫుల్ ఖుషీ అయ్యారు. ఇక రిలీజ్ తేదీ దగ్గర పడడంతో ప్రమోషన్స్ జోరు పెంచారు. ఈ నేపథ్యంలోనే ది రాజాసాబ్ ఫస్ట్ సింగిల్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. రెబల్సాబ్ పేరుతో ఈ ఫుల్ సాంగ్‌ను(The Raja Saab First Single) విడుదల చేశారు. ఈ పాట రెబల్ స్టార్ ఫ్యాన్స్ తెగ ఊపేస్తోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ మూవీ సంక్రాంతి సందర్భంగా జనవరి 9న విడుదల కానుంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్, కృతీ ప్రసాద్ నిర్మించగా.. తమన్ సంగీతం అందిస్తున్నారు. -
'రాజాసాబ్' వాయిదా రూమర్స్.. క్లారిటీ ఇచ్చిన నిర్మాత
గతేడాది 'కల్కి'తో ప్రేక్షకుల ముందుకొచ్చిన ప్రభాస్.. ఈ ఏడాది 'కన్నప్ప'లో అతిథి పాత్రలో మెరిశాడు. బాహుబలి రీ రిలీజ్ వల్ల మరోసారి థియేటర్లలోకి వచ్చాడు. కానీ స్ట్రెయిట్ మూవీ మాత్రం రాలేదు. లెక్క ప్రకారం డిసెంబరు 5న 'రాజాసాబ్' రావాల్సింది. కానీ సంక్రాంతికి వాయిదా వేశాడు. జనవరి 9న రిలీజ్ అని అధికారికంగానే ప్రకటించారు. గత రెండు మూడు రోజులుగా మళ్లీ వాయిదా అనే రూమర్స్ వస్తున్నాయి. ఇప్పుడు వాటిపై నిర్మాణ సంస్థ క్లారిటీ ఇచ్చింది.'రాజాసాబ్' సినిమా నుంచి ఇప్పటికే టీజర్, ట్రైలర్ రిలీజయ్యాయి. ఇవి చూసుంటే ఇందులో వీఎఫ్ఎక్స్ ఎక్కువగానే ఉండబోతుందని అర్థమవుతుంది. అందుకు తగ్గట్లే పని జరుగుతోంది. అయితే వీఎఫ్ఎక్స్ పనులు ఈసారి కూడా ఆలస్యమయ్యేలా ఉన్నాయనే రూమర్స్ వచ్చాయి. ఇప్పుడు వాటిని ఖండించిన నిర్మాత.. చెప్పినట్లుగానే జనవరి 9న మూవీ రిలీజ్ అవుతుందని మరోసారి స్పష్టం చేశారు.(ఇదీ చదవండి: ఈ జనరేషన్ ఆడపిల్లల మనసు ఆవిష్కరించిన సినిమా.. ఓటీటీ రివ్యూ)డిసెంబరు 25వ తేదీ కల్లా సినిమా తొలి కాపీ రెడీ అయిపోతుందని, అమెరికాలో గ్రాండ్‌గా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించబోతున్నామని.. పనిలోపనిగా నిర్మాత చెప్పుకొచ్చారు. ఈ మేరకు నోట్ రిలీజ్ చేశారు. దీంతో వాయిదా ఏం లేదులే అని ప్రభాస్ అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.మారుతి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని హారర్ ఫాంటసీ కథతో తీశారు. భయపెట్టే అంశాలతో పాటు కమర్షియల్ సినిమాల్లో ఉండే పాటలు, ఫైట్స్, రొమాన్స్ లాంటివి కూడా ఉండబోతున్నాయి. ప్రభాస్ సరసన నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్ అని ముగ్గురు హీరోయిన్స్ నటిస్తున్నారు. సంజయ్ దత్ కీలక పాత్రధారి. తమన్ సంగీతమందిస్తున్నాడు.(ఇదీ చదవండి: తెలుగు సీరియల్ నటికి అసభ్య వీడియోలు.. వ్యక్తి అరెస్ట్) -
మరో సీక్వెల్లో ప్రభాస్.. రెండేళ్లు ఆగాల్సిందే?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) షెడ్యూల్ ఇప్పుడు చాలా బిజీగా ఉంది. ఆయన నటించిన ది రాజాసాబ్ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. మరోవైపు హను రాఘవపూడి దర్శకత్వంలో ‘పౌజీ’(Fauzi) సినిమా చేస్తున్నాదు. దీంతో పాటు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో స్పిరిట్ చేయబోతున్నాడు. మరోవైపు సలార్, కల్కి చిత్రాలకు సీక్వెల్స్ కూడా చేయబోతున్నాడు. ఇంత బిజీగా ఉన్న ప్రభాస్.. తాజాగా మరో సీక్వెల్‌కి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. అదే ది రాజాసాబ్ 2.మారుతి స్టైల్ నచ్చి..మారుతి దర్శకత్వంలో ప్రభాస్ ‘ది రాజాసాబ్’(The Raja Saab) సినిమా చేశాడు. ఇప్పటికే షూటింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది. పోస్ట్ ప్రొడక్షన్స్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 9న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే ఈ చిత్రానికి సీక్వెల్ ఉంటుందని గతంలో వార్తలు వచ్చాయి. నిర్మాత టీజీ విశ్వప్రసాద్ కూడా సీక్వెల్‌పై స్పష్టత ఇచ్చాడు. ‘రాజాసాబ్ 2’ ఉంటుందని.. కాకపోతే ఇది తొలి భాగానికి కొనసాగింపులా ఉండదని.. థీమ్, సెటప్ ఒకే తరహాలో ఉంటాయని ఓ ప్రెస్మీట్లో ఆయన చెప్పారు. అయితే అప్పటికీ మారుతి కథ సిద్ధం చేయలేదు. కానీ ప్రభాస్ మాత్రం మారుతితో మరోసారి పని చేయడానికి ఆసక్తి చూపించాడట. దీంతో మారుతి ఇటీవల రాజాసాబ్ 2 స్టోరీకి సంబంధించిన లైన్‌ని ప్రభాస్‌కి చెప్పాడట. అది బాగా నచ్చడంతో ‘చేసేద్దాం డార్లింగ్’అని ప్రభాస్ చెప్పినట్లు సమాచారం.రెండేళ్ల వరకు ఆగాల్సిందే..ప్రభాస్ ఇప్పుడు పౌజీ షూటింగ్లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ కాగానే..వెంటనే ‘స్పిరిట్’చిత్రాన్ని సెట్స్‌పైకి తీసుకెళ్లబోతున్నాడు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుందట. ఆ తర్వాత సలార్ 2 లేదా కల్కి 2 చిత్రాన్ని సెట్స్‌పైకి తీసుకెళ్లాలి. ఇవన్నీ పూర్తయ్యేవరకు దాదాపు రెండేళ్లు పడుతుంది. ఆ తర్వాతే ప్రభాస్ మరో కొత్త సినిమాని ప్రారంభించాల్సి ఉంటుంది. ఒకవేళ నిజంగానే రాజాసాబ్ సీక్వెల్ ఉన్నా.. రెండేళ్ల తర్వాత దాన్ని సెట్స్‌పైకి తీసుకెళ్లాల్సి ఉంటుంది. ప్రభాస్‌తో సినిమా కాబట్టి మారుతి కచ్చితంగా ఆగుతాడు. అందులో నో డౌట్. ది రాజాసాబ్ రిలీజ్ తర్వాత రిజల్ట్‌ని బట్టి పార్ట్ 2 ఉంటుందా లేదా అనేది క్లారిటీ వస్తుంది. -
ఆస్కార్‌లో సందడిగా కనిపించిన రాజ్.. కొత్త మూవీ కోసం శిక్షణ
ఈరోజు మన తెలుగు చిత్రసీమను టాలీవుడ్ అంటున్నామన్నా... హిందీ ఇండస్ట్రీని "బాలీవుడ్", కన్నడ పరిశ్రమను "శాండల్ వుడ్", మలయాళంను "మల్లువుడ్", తమిళ ఫిల్మ్ ఇండస్ట్రీని "కోలీవుడ్"గా పిలుచుకుంటున్నామంటే... దానికి ప్రేరణ "హాలీవుడ్" అన్న విషయం అందరికీ తెలిసిందే. తెలుగు సినిమా పతాక గత కొన్ని సంవత్సరాలుగా అంతర్జాతీయ స్థాయిలో రెపరెపలాడుతున్నా.... మన దేశంలో రూపొందిన ఏదైనా సినిమా అత్యున్నత ప్రమాణాలతో తెరకెక్కితే... దానిని "హాలీవుడ్ స్థాయిలో రూపొందిన చిత్రంగా అభివర్ణించడం ఇప్పటికీ సర్వసాధారణం. అంతేకాదు... సినిమాలకు సంబంధించి ప్రపంచవ్యాప్తంగా అత్యున్నత పురస్కారం "ఆస్కార్"ను అందించేది కూడా హాలివుడ్డే. అందుకే "RRR" చిత్రం ఆస్కార్ అందుకోవడాన్ని మన దేశం మొత్తం గర్వాతిశయంతో సెలబ్రేట్ చేసుకుంది.ఈ ఉపోద్ఘాతం అంతా ఎందుకంటే... ఇంతటి ప్రతిష్టాత్మక ఆస్కార్ సంబరాల్లో (97వ అకాడమీ అవార్డ్స్ లో) ఈ ఏడాది మన తెలుగు హీరో సందడి చేశాడు. చాలా అరుదుగా మాత్రమే లభించే ఈ అద్భుత అవకాశాన్ని అందుకున్న ఆ తెలుగు నటుడి పేరు "రాజ్ దాసిరెడ్డి".. డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో "భద్రం బి కేర్ ఫుల్ బ్రదరు" చిత్రంతో హీరోగా అరంగేట్రం చేసిన రాజ్ దాసిరెడ్డి... ఆస్కార్ - 2025 వేడుకల్లో పాల్గొనేందుకు ఆహ్వానం అందుకొని, అక్కడకు వెళ్లడంతోపాటు, "హాలీవుడ్ వాక్ ఆఫ్ ఫేమ్" "న్యూయార్క్ ఫ్యాషన్ వీక్ - 2025"లోనూ సందడి చేశాడు. యాక్షన్ ఎంటర్టైర్గా తెరకెక్కనున్న తన తదుపరి చిత్రం కోసం ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నారు. . అందుకు సంబంధించిన వివరాలు త్వరలో ప్రకటించనున్నాడు. -
'ది రాజా సాబ్' ట్రైలర్.. ప్రభాస్ పోస్ట్ వైరల్
కల్కి సినిమా తర్వాత ప్రభాస్ (Prabhas) కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘ది రాజా సాబ్’ (The Raja Saab). మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న రొమాంటిక్ కామెడీ హారర్ చిత్రం కోసం అభిమానులు భారీగానే ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్ గురించి ప్రకటన చేశారు. ప్రభాస్ రాయల్ ఎంట్రీ కోసం ఎదురుచూస్తున్నవారందరికీ శుభవార్త అంటూ ఒక పోస్టర్‌ను విడుదల చేశారు. ఇప్పటికే విడుదలైన టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇందులో ప్రభాస్ వింటేజ్ లుక్‌లో కనిపించారంటూ ప్రశంసలు దక్కాయి.‘ది రాజా సాబ్’ (The Raja Saab) ట్రైలర్ సెప్టెంబర్ 29న సాయింత్రం ఆరు గంటలకు విడుదల కానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇదే విషయాన్ని ప్రభాస్ కూడా ప్రకటించారు. ఒక అభిమానిగా నా హీరోని ఎలా చూడాలనుకున్నానో ఆ విధంగానే ప్రభాస్‌ను చూపించానని మారుతి అన్నారు. దీంతో డార్లింగ్ ఫ్యాన్స్‌లో ఫుల్ జోష్ పెరిగింది. ఈ మూవీలో వచ్చే 40 నిమిషాల క్లైమాక్స్ అద్భుతంగా ఉంటుందని కూడా దర్శకుడు చెప్పారు. ఈ చిత్రం సుమారు 3గంటల పాటు రన్ టైమ్ ఉంటుందన్నారు.దర్శకుడు మారుతి. ప్రభాస్ తొలిసారి ఈ సినిమా కోసం కలిసి పనిచేస్తున్నారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీతో టీజీ విశ్వప్రసాద్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. సంజయ్ దత్ (Sanjay Dutt) కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా డిసెంబరు 5న థియేటర్లలోకి రానుంది. The wait of millions finally comes to an end 💥💥#TheRajaSaabTRAILER will be out on September 29th at 6PM.A ROYAL entry into a world of FUN, FEAR and a whole lot of Majestic Experiences ❤️🔥#TheRajaSaab #Prabhas @DuttSanjay @DirectorMaruthi @AgerwalNidhhi @MalavikaM_… pic.twitter.com/9q8WcHXSj2— Director Maruthi (@DirectorMaruthi) September 28, 2025 -
‘బ్యూటీ’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
డబుల్ మీనింగ్ డైలాగ్స్ నాకంటే గొప్పగా ఎవడూ రాయలేడు: మారుతి
హారర్ జానర్లో ప్రభాస్ నటిస్తున్న తొలి చిత్రం ది రాజా సాబ్. నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సంజయ్ దత్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. మారుతి దర్శకత్వం వహిస్తుండగా టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ మూవీ తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో రిలీజ్ కానుంది. ది రాజాసాబ్‌ను డిసెంబర్ 5న రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ ఈ మూవీ వాయిదా పడేట్లు కనిపిస్తోంది. వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేద్దామా? అన్న ఆలోచనలో ఉన్నారు. పిచ్చిమాటలు, బూతులుతాజాగా రాజాసాబ్ డైరెక్టర్ మారుతి (Director Maruthi) బ్యూటీ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌కు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ మధ్య ఓ డైరెక్టర్ తన సినిమాకు జనాలు రాలేదని చెప్పుతో కొట్టుకున్నాడు. పది మంది కళాకారులను తయారు చేసే దర్శకుడు అలాంటి పిచ్చిపనులు చేయొద్దు. ఎందుకంటే.. ఆడియన్స్‌ను రప్పించడానికి పిచ్చిమాటలు, బూతులు మాట్లాడుతున్నారు. నాకంటే గొప్పగా ఎవరూ రాయలేడుచొక్కా తీసేస్తామంటున్నారు, సినిమాలు మానేస్తామంటున్నారు. ఒక సినిమా ఆడకపోతే ఇంత దిగజారిపోతారా? ఏంటిది? ఏదైనా వివాదాస్పదంగా మాట్లాడితే సినిమాకు హైప్ వస్తుంది, బూతులు మాట్లాడితే సినిమా చూస్తారు. నేను ఎన్నో డబుల్ మీనింగ్ డైలాగులు రాశాను. ఒక్కసారి నేను కూర్చుని రాయడం మొదలుపెడితే నాకంటే గొప్పగా ఎవడూ రాయలేడు. కానీ బస్టాప్ సినిమాతోనే డబుల్ మీనింగ్ డైలాగ్స్ రాయడం ఆపేశాను. రూ.400 కోట్లతో రాజాసాబ్బూతు డైలాగులు ఎందుకని రాయడం లేదు? డబ్బులు సంపాదించడం నాకు రాదా? బ్యూటీ లాంటి సినిమాకు వంద డైలాగులు ఇస్తాను. కుటుంబంతో కలిసి ప్రేక్షకులు థియేటర్‌కు రావాలి. వారికి క్వాలిటీ సినిమా ఇవ్వాలి. ఈ రోజుల్లో, బస్టాప్ సినిమాల్లో డబుల్ మీనింగ్ డైలాగులు రాసిన బూతు డైరెక్టర్ని.. రూ.400 కోట్లతో రాజాసాబ్ తీస్తున్నా.. నా ఎదుగుదల, గ్రాఫ్, కెరీర్ చూడండి. చిల్లర పనులు చేయొద్దుఅందరూ ఊరికనే డైరెక్టర్లు అయిపోరు. పాన్ ఇండియా స్టార్స్.. ఊరికనే ఫ్లాప్ డైరెక్టర్ని పిలిచి సినిమా అవకాశాలివ్వరు. ఊరికనే సినిమాలిచ్చారంటే ప్రభాస్ మనసులో నేనున్నా! మేమిద్దరం ఎంత ప్రేమతో ఉంటామో మాకు తెలుసు. సినిమా ఆడించేందుకు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారు. జనమెప్పుడూ మంచి సినిమా చూస్తారు. అంతేకానీ చిల్లరపనులు చేయకండి అని మారుతి చెప్పుకొచ్చాడు.చదవండి: ఏళ్ల తరబడి డిప్రెషన్లో.. ఆ బాధతోనే బిగ్‌బాస్‌కు.. ఎవరీ మాస్క్ మ్యాన్ -
ఆ టైమ్‌లో నాకు ప్రభాస్ ఒక్కడే సపోర్ట్‌గా నిలిచాడు: మారుతి
‘‘నేను దర్శకత్వం వహించిన ‘పక్కా కమర్షియల్’ సినిమా అంతగా ప్రేక్షకాదరణ పొందలేదు. దీంతో మా కాంబినేషన్లో(ప్రభాస్–మారుతి) మూవీ అనుకున్న ప్రొడ్యూసర్ డ్రాప్ అయ్యారు. కానీ, అలాంటి టైమ్‌లో నాకు సపోర్ట్‌గా నిలిచిన ఒకే ఒక వ్యక్తి ప్రభాస్‌గారు. అందుకే ‘ది రాజా సాబ్’ ను ఒక సవాల్‌గా తీసుకుని సినిమా చేయాలని నిర్ణయించుకున్నాను’’ అని డైరెక్టర్ మారుతి తెలిపారు. ప్రభాస్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘ది రాజా సాబ్’. మారుతి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నిధీ అగర్వాల్, మాళవికా మోహనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమా డిసెంబరు 5న విడుదలకానుంది. (చదవండి: 'ఓ నిర్మాత నెగెటివ్ క్యాంపెయిన్ చేశారు'.. ఎస్కేఎన్ కామెంట్స్ వైరల్!)హైదరాబాద్‌లో సోమవారం నిర్వహించిన ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్లో మారుతి మాట్లాడుతూ–‘‘ప్రభాస్‌గారిని ‘బుజ్జిగాడు’ సినిమా స్టైల్లో ‘ది రాజా సాబ్’ ద్వారా వింటేజ్ లుక్‌లో చూపిస్తున్నాం. కొంత షూటింగ్, సాంగ్స్ బ్యాలెన్స్ ఉన్నాయి’’ అన్నారు. టీజీ విశ్వప్రసాద్ మాట్లాడుతూ– ‘‘మా సంస్థ నుంచి వస్తున్న బిగ్గెస్ట్ ఫిల్మ్ ‘ది రాజా సాబ్’. ఈ సినిమా కోసం బిగ్గెస్ట్ ఇండోర్ సెట్ వేశాం. 40 నిమిషాల క్లైమాక్స్ ఎపిసోడ్ ఈ చిత్రానికి హైలైట్‌గా నిలుస్తుంది. ఈ మూవీకి సీక్వెల్ పాన్ వరల్డ్ స్థాయిలో ఉంటుంది’’ అన్నారు. ఈ వేడుకలో ‘ది రాజా సాబ్’ క్రియేటివ్ ప్రొడ్యూసర్ ఎస్కేఎన్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కృతి, కెమేరామేన్ కార్తీక్ పళని, ప్రొడక్షన్ డిజైనర్ రాజీవన్ మాట్లాడారు. -
ప్రభాస్.. ఇద్దరు హీరోయిన్లు కావాలన్నాడు: మారుతి
లవ్, యాక్షన్, ఫాంటసీ, మైథాలజీ.. ఇలా అన్ని రకాల సినిమాలు చేశాడు డార్లింగ్ ప్రభాస్ (Prabhas). అయితే హారర్ జానర్‌ను మాత్రం టచ్ చేయలేదు. ప్రేమకథా చిత్రం మూవీ చూసిన ప్రభాస్‌కు అలాంటి హారర్ మూవీ ఒకటి చేయాలని కోరిక పుట్టింది. ఆ సమయంలో మారుతి కలవడం, కథ చెప్పడం, అది నచ్చడంతో ది రాజా సాబ్ సెట్స్ మీదకు వెళ్లింది. అయితే మారుతి డైరెక్ట్ చేసిన చివరి చిత్రం పక్కా కమర్షియల్ బాక్సాఫీస్ వద్ద ఫెయిల్యూర్‌గా నిలిచింది. అభయమిచ్చిన ప్రభాస్అలాంటి సమయంలో పాన్ ఇండియా హీరోతో సాహసం చేయడం దేనికని దర్శకుడు వెనకడుగు వేశాడు. తర్వాతెప్పుడైనా చూద్దామని వాయిదా వేయాలనుకున్నాడు. కానీ, ప్రభాస్ ఒప్పుకోలేదు. కథ నచ్చిందని.. ముందుకు వెళ్దామని అభయం ఇవ్వడంతో మారుతి (Director Maruthi) రెట్టింపు జోష్‌తో రాజా సాబ్ (The Raja Saab Movie) తెరకెక్కించాడు. పలుమార్లు వాయిదా పడ్డ ఈ చిత్రం డిసెంబర్ 5న విడుదల కానుంది.ఇద్దరు హీరోయిన్లు కావాలిసోమవారం (జూన్ 16న) రాజాసాబ్ టీజర్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా మారుతి ఓ ఆసక్తికర విషయాన్ని బయటపెట్టాడు. ప్రభాస్ సరదాగా మాట్లాడుతూ.. సినిమాలో ఇద్దరు హీరోయిన్లను పెట్టగలవా? అని అడిగాడు. సలార్‌లో ఉన్న కథానాయిక ఎప్పుడో ఒకసారి వస్తుంది. కల్కి 2898 ఏడీలో కూడా ఒకమ్మాయి వచ్చినట్లే వచ్చి వెళ్లిపోతుంది. ఆదిపురుష్లోనేమో సీతాదేవి ఎక్కడో ఉంటుంది. ఇద్దరేం ఖర్మ.. ముగ్గురిని తీసుకొచ్చిన డైరెక్టర్నా దగ్గర, నా ఇంట్లో ఎవరూ లేరు డార్లింగ్.. ఇద్దరు హీరోయిన్లను పెడతావా? అన్నాడు. అప్పుడు ఆయన్ను ఎగాదిగా చూసి మీ రేంజ్‌కు ఇద్దరేంటి? ముగ్గుర్ని పెడతానన్నాను. అలా ముగ్గురు హీరోయిన్లను తీసుకెళ్లి హారర్ కొంపలో పెట్టాను. ఇది రొమాంటిక్ హారర్ ఫాంటసీగా తెరకెక్కించాను అని మారుతి చెప్పుకొచ్చాడు. ఇది చూసిన నెటిజన్లు పాపం.. ప్రభాస్ రొమాంటిక్ లవ్‌స్టోరీలను చాలా మిస్సవుతున్నట్లున్నాడు అని కామెంట్లు చేస్తున్నారు. రాజాసాబ్ సినిమాలో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటించారు.చదవండి: సీక్రెట్ చెప్పిన శోభిత.. ట్రోలర్స్‌కు కౌంటర్? -
ప్రభాస్ 'ది రాజాసాబ్' HD మూవీ స్టిల్స్
-
'ది రాజాసాబ్'.. భయపెట్టడమే కాదు... (టీజర్)
ప్రభాస్ పాన్ ఇండియా మూవీ 'ది రాజాసాబ్' (The RajaSaab) టీజర్ వచ్చేసింది. రొమాంటిక్ హారర్ కాన్సెప్ట్‌తో దర్శకుడు మారుతి తెరకెక్కించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నిధి అగర్వాల్, రిద్ధి కుమార్, మాళవిక మోహన్ కథానాయికలుగా నటిస్తున్నారు. సలార్, కల్కి 2898 ఏడీ వంటి వరుస హిట్ సినిమాల తర్వాత ప్రభాస్ నటిస్తున్న సినిమా కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా విడుదలైన టీజర్‌ను చూస్తే వారి అంచనాలకు మించే ఈ చిత్రం ఉండొచ్చని చెప్పవచ్చు. సంగీతం తమన్ అందించారు. డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా ఇది విడుదల కానుంది. -
ఈరోజు మా నాన్న ఉండుంటే.. ఆ థియేటర్‌తో 'మారుతి' అనుబంధం
ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'ది రాజాసాబ్' (The RajaSaab). సోమవారం టీజర్ విడుదల కానుంది. ఈ క్రమంలో పలు థియేటర్స్ వద్ద ప్రభాస్, మారుతి కటౌట్స్ ఫ్యాన్స్ ఏర్పాటు చేశారు. వాటిని చూసిన దర్శకుడు ఎమోషనల్ అయ్యారు. గతంలో తన తండ్రి అరటిపళ్లు అమ్మినచోట ఇప్పడు తన కటౌన్ చూస్తుంటే చాలా సంతోషంగా ఉందంటూ మారుతి తెలిపారు. ఇండస్ట్రీకి రాకముందు ఎన్నో పనులు చేసిన మారుతి.. టాలీవుడ్లో అడుగుపెట్టాక కూడా సహ నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్‌గా పని చేశాడు. మచిలీపట్నం, వైజాగ్‌లో మారుతి పెరిగారు. ఆ ప్రాంతాలతో ఆయనకు మంచి అనుబంధం ఉన్న విషయం తెలిసిందే.'మచిలీపట్నం - సిరి కాంప్లెక్స్ (గతంలో కృష్ణ కిషోర్)తో నాకు ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి. ఇక్కడ మా నాన్నగారికి ఒకప్పుడు చిన్న అరటిపళ్లు దుకాణం ఉండేది. ఎప్పటికైనా ఇండస్ట్రీలో అడుగుపెట్టాలని ఈ థియేటర్లో విడుదలైన అందరి హీరోల సినిమాల బ్యానర్స్ నేను ఎంతో ఆశతో కట్టేవాడిని. ఒక్కసారైనా నా పేరు ఇక్కడ చూడాలని కలలు కనేవాడిని. ఇప్పుడు ఇదే థియేటర్ వద్ద నిలబడి చూస్తుంటే.. నా ప్రయాణం ఎక్కడ ప్రారంభమైందో అన్ని గుర్తుకు వస్తున్నాయి. ఇప్పుడు జీవితం పరిపూర్ణమైందనిపిస్తుంది. పాన్ ఇండియా స్టార్ పక్కన నా కటౌట్ చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉంది. ఎవరికైనా ఇంతకు మించి ఇంకేం కావాలి. కానీ, ఈరోజు మా నాన్న ఉండుంటే చాలా గర్వపడేవారు. ఆయన్ని మిస్ అవుతున్నాననే బాధ ఉంది. ఏదైనా ఉన్న సమయంలోనే మన బాధ్యతలను పూర్తి చేయాలి. మన డార్లింగ్‌ను వెండితెరపై నేను ఎలా చూపించాలని ఆశ పడ్డానో మీ అందరికీ చూపించనున్నాను. మా పట్ల మీరు చూపుతున్న ప్రేమకు ధన్యవాదాలు చెప్పడం చాలా చిన్న పదం అవుతుంది.' అని ఆయన అన్నారు.MACHILIPATNAM - Siri complex (krishna Kishore in past)This is the place where my father once had a small banana stall…Where I used to write for banners of all heroes films released in this theater dreaming with hope :) I was one of those who wished “okkasaraina mana peru… pic.twitter.com/Wnu3cCUoOz— Director Maruthi (@DirectorMaruthi) June 16, 2025 -
అరటిపండ్లు అమ్మా, నెంబర్ ప్లేట్లు తయారు చేశా.. మారుతి
సాక్షి, మచిలీపట్నం: జీవితం అందరికీ పూలపాన్పు కాదు. ఎన్నో కష్టాలు చూసిన తర్వాత కానీ విజయాలు సొంతం కావు. దర్శకుడు మారుతి (Maruthi) జీవితం కూడా అంతే! ఇండస్ట్రీకి రాకముందు ఎన్నో పనులు చేశాడు. టాలీవుడ్లో అడుగుపెట్టాక కూడా సహ నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్‌గా పని చేశాడు. తనకు కట్నంగా వచ్చిన డబ్బుతో ఆర్య సినిమా కొని డిస్ట్రిబ్యూటర్‌గా హిట్టందుకున్నాడు. తర్వాతి కాలంలో దర్శకుడిగా, నిర్మాతగా ఎన్నో హిట్లు, ఫ్లాపులు అన్నీ చూశాడు. హారర్ జానర్అంతెందుకు, 2022లో ఆయన చివరగా తీసిన పక్కా కమర్షియల్ మూవీ బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయం అందుకుంది. అయినా సరే తనకు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో సినిమా చేసే అవకాశం దక్కింది. ప్రభాస్ (Prabhas)తో ద రాజా సాబ్ (The Raja Saab Movie) అనే హారర్ కామెడీ మూవీ చేస్తున్నాడు. తాజాగా మారుతి.. మచిలీపట్నంలో నిర్వహిస్తున్న మసులా బీచ్ ఫెస్టివల్‌కు హాజరయ్యాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 1999లో హైదరాబాద్‌కు వెళ్లాను. అంతకుముందు వైజాగ్‌లో అరటిపండ్లు అమ్మేవాడిని. ఇక్కడ రాధికా థియేటర్ ఎదురుగా నాన్నకు అరటిపండ్ల బండి ఉండేది. బొమ్మలు గీసుకునేవాడినినేను కూడా అక్కడ పండ్లు అమ్ముతూ.. సినిమాలు రిలీజైనప్పుడు వాటిని చూసి నా నోట్‌బుక్‌లో బొమ్మలు గీసుకుంటూ ఉండేవాడిని. తర్వాత 1999లో హైదరాబాద్‌కు వచ్చాను. అప్పుడు నాకు స్టిక్కరింగ్ షాపు ఉండేది. నెంబర్ ప్లేట్లు తయారు చేసేవాడిని. హిందూ కాలేజీలో చదువుకుంటూనే నెంబర్ ప్లేట్లు రెడీ చేసేవాడిని. ఇప్పుడిదంతా ఎందుకు చెప్తున్నానంటే ఒక మనిషి కష్టపడితే ఎంత దూరమైనా వెళ్తాడనడానికి ప్రత్యక్ష ఉదాహరణ నేనే! రూ.400 కోట్ల బడ్జెట్‌తో పాన్ ఇండియా మూవీ తీస్తున్నా.. అంచనాలు పెంచేసిన మారుతిరాజా సాబ్ మీరు ఊహించినదానికంటే ఒకశాతం ఎక్కువే ఉంటుంది. జూన్ 16న టీజర్ రిలీజ్ చేస్తున్నాం అని రాజాసాబ్‌పై అంచనాలు పెంచేశాడు మారుతి. అటు ఎక్స్ (ట్విటర్)లోనూ ఒట్టేసి చెబుతున్నా.. రాజా సాబ్ మూవీ ఓ వేడుకలా ఉంటుందని ట్వీట్ చేశాడు. మారుతి దర్శకుడిగా ఈ రోజుల్లో, బస్‌స్టాప్, ప్రేమకథా చిత్రం, భలే భలే మగాడివోయ్, ప్రతిరోజు పండగే, బాబు బంగారం, మంచి రోజులొచ్చాయ్.. ఇలా పలు సినిమాలు చేశాడు. Still feels like yesterday :)#PremaKathaChitram Memories are fresh in my mind….♥️ And now even more excited for this anniversary… because after a long time stepping back into that zone again…..But this time it’s a horror fantasy.I promise #TheRajaSaab will be a celebration… https://t.co/naoZekmCBH— Director Maruthi (@DirectorMaruthi) June 7, 2025 చదవండి: ప్రభాస్ సినిమా.. 70 ఏళ్ల వయసులో గోడ దూకిన నటుడు -
'ది రాజాసాబ్' నుంచి బిగ్ అప్డేట్.. రిలీజ్ ఎప్పుడంటే?
ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'ది రాజాసాబ్' (The RajaSaab). తాజాగా ఈ చిత్రం నుంచి వరుస అప్డేట్స్ ప్రకటించారు. సినిమా విడుదల తేదీతో పాటు టీజర్ రిలీజ్ వంటి అంశాలను ఒక పోస్టర్‌తో చిత్ర యూనిట్ తెలిపింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ మూవీ పాన్ ఇండియా రేంజ్లో భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతుంది. ఇందులో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు.రాజా సాబ్ చిత్రం డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తామని తాజాగా చిత్ర యూనిట్ ప్రకటించింది. జూన్ 16న ఉదయం 10:52గంటలకు మూవీ టీజర్ రిలీజ్ ఉంటుందని మేకర్స్ తెలిపారు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ జోష్‌లో ఉన్నారు. ప్రభాస్ తన కెరీర్లో చేస్తున్న తొలి రొమాంటిక్ హారర్ చిత్రమిదే కావడంతో ఫ్యాన్స్‌లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ టీజర్‌కు సంబంధించిన గ్రాఫిక్స్ పనులు పూర్తయ్యాయని తెలుస్తోంది. రీసెంట్గా విదేశాల నుంచి తిరిగొచ్చిన ప్రభాస్ టీజర్ డబ్బింగ్ వర్క్ కూడా పూర్తిచేశారట. ఈ సినిమాలో ప్రభాస్ రెండు విభిన్న పాత్రల్లో సందడి చేయనున్నారని సమాచారం.తాతా మనవళ్ళుగా ప్రభాస్‘రాజా డీలక్స్’ అనే థియేటర్లో జరిగే హారర్ సీన్స్ ఈ సినిమాకు కీలకమని ఫిల్మ్‌నగర్ భోగట్టా. వాస్తవంగా ఈ సినిమా విడుదల ఏప్రిల్ 10న రావాల్సి ఉంది. అందుకు సంబంధించిన ప్రకటన కూడా వచ్చేసింది. అయితే, ఈ సినిమాకు చాలా సీజీ వర్క్ చేయాల్సి ఉండటంతో వాయిదా పడింది. ఇంకా కొంత భాగం షూటింగ్ పనులు కూడా ఉన్నాయట. హారర్ తరహా జానర్లో ప్రభాస్ ఇప్పటివరకు సినిమా చేయలేదు. దీంతో ‘రాజా సాబ్’ సినిమా ఎలా ఉండబోతుంది? అనే క్యూరియాసిటీ ప్రభాస్ అభిమానులతో పాటు ఆడియన్స్‌లోను నెలకొంది.ఈ చిత్రంలో ప్రభాస్ ద్విపాత్రాభినయం చేస్తున్నారని, తాతా మనవళ్ళుగా ప్రభాస్ కనిపిస్తారని, ఈ సినిమాలోని ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్స్‌లో సీరియస్ హారర్ సీన్స్ ఉన్నాయని సమాచారం. A day that promises a festival on the big screens just like we all dreamt of seeing our dearest darling #Prabhas ❤️❤️❤️A lot more exciting days ahead…#TheRajaSaab pic.twitter.com/PFdV1mcqDJ— Director Maruthi (@DirectorMaruthi) June 3, 2025 -
ప్రభాస్ ది రాజాసాబ్.. టీజర్ రిలీజ్‌పై హింట్ ఇచ్చిన డైరెక్టర్!
రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ది రాజాసాబ్ మూవీతో బిజీగా ఉన్నారు. మారుతి డైరెక్షన్లో వస్తోన్న ఈ పాన్ ఇండియా సినిమాను రొమాంటిక్ కామెడీ హారర్ థ్రిల్లర్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఇప్పటికే రిలీజైన ఫస్ట్ లుక్ పోస్టర్ రెబల్ స్టార్ అభిమానులను ఆకట్టుకున్నాయి. ఈ మూవీలో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. అయితే ఈ మూవీ అప్డేట్స్ కోసం ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా టీజర్ కోసం అభిమానులు ఎప్పుడొస్తుందా అని వెయిట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో టీజర్‌కు సంబంధించిన ఓ హింట్ ఇచ్చారు డైరెక్టర్ మారుతి. ఈ విషయాన్ని ట్విటర్ ద్వారా పోస్ట్ చేశారు.హై అలర్ట్.. హీట్ వేవ్స్ మరింత పెరగనున్నాయి అని ఓ ఆసక్తికర ట్వీట్ చేశారు.దీంతో వచ్చేనెలలోనే ది రాజాసాబ్ టీజర్ విడుదల కానుందని హింట్ ఇచ్చారని తెలుస్తోంది. ఈ టీజర్‌కు సంబంధించిన గ్రాఫిక్స్ పనులు పూర్తయ్యాయని.. విదేశాల నుంచి ప్రభాస్ తిరిగి రాగానే తనతో డబ్బింగ్ పూర్తి చేసి టీజర్ విడుదల తేదీని రివీల్ చేస్తారని సమాచారం. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ సినిమా ఈ ఏడాది చివర్లో థియేటర్లలోకి సందడి చేయనుంది.HIGH ALERT…‼️HEAT WAVES gonna rise even higher from mid May! 🔥🔥🔥 pic.twitter.com/EdEdtMCq6E— Director Maruthi (@DirectorMaruthi) April 23, 2025 -
తత్వం ఏంటి?
పెళ్లి చూపుల కోసం ఓ గ్రామానికి వెళ్లిన ఓ యువకుడు, ఆ ఊరిలో జరిగిన హత్యల కేసులో ఇరుక్కుంటాడు? ఆ కేసుల నుంచి ఎలా బయటపడ్డాడు? అతను తెలుసుకున్న తత్వం ఏమిటి? అనే కథాంశంతో రూపొందుతున్న చిత్రం ‘తత్వం’(Tatvam). దినేష్ తేజ్, దష్విక .కె హీరో హీరోయిన్లుగా రూపొందుతున్న చిత్రం ఇది. అర్జున్ కోల దర్శకత్వంలో త్రయతి ఇషాని క్రియేషన్స్, ఎస్.కె. ప్రోడక్షన్స్ సంయుక్త నిర్మాణంలో వంశీ సీమకుర్తి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఫస్ట్ లుక్‌ని దర్శకుడు మారుతి, నిర్మాత ఎస్కేఎన్ సోషల్ మీడియా ద్వారా విడుదల చేశారు. ‘‘ఆద్యంతం ఉత్కంఠగా సాగే ఈ మర్డర్ మిస్టరీ మూవీలో స్క్రీన్‌ప్లే హైలైట్‌గా ఉంటుంది’’ అని వంశీ సీమకుర్తి అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: చేతన్ భరద్వాజ్, కెమేరా: భరత్ పట్టి. -
ప్రభాస్ ఫ్యాన్స్ ఫ్రస్టేషన్.. సందేహాలు తీర్చిన మారుతి
పాన్ ఇండియా హీరో అయిన తర్వాత ప్రభాస్ సినిమాలన్నీ ఆలస్యమవుతూనే ఉన్నాయి. ప్రతిదీ చెప్పిన సమయానికి అస్సలు రిలీజ్ కావట్లేదు. లెక్క ప్రకారం 'రాజాసాబ్' ఈ 10వ తేదీన రిలీజ్ కావాలి. కానీ వాయిదా గురించి నిర్మాణ సంస్థ నుంచి ఎలాంటి అప్డేట్ లేదు. దీంతో అభిమానులు ఫుల్ ఫ్రస్టేషన్ లో ఉన్నారు. (ఇదీ చదవండి: పాత కేసు.. హీరోయిన్ కి మళ్లీ అరెస్ట్ వారెంట్)చాన్నాళ్ల క్రితం రాజాసాబ్ మూవీ సెట్స్ పైకి వెళ్లింది. కానీ ఇప్పటికీ షూటింగ్ పూర్తవలేదు. దీంతో ఈ ఏడాది రిలీజ్ అవుతుందా వచ్చే ఏడాది థియేటర్లలోకి వస్తుందా అని ఫ్యాన్స్ తెగ టెన్షన్ పడుతున్నారు. తాజాగా డైరెక్టర్ మారుతిని ట్విటర్ లో అదే ప్రశ్న అడిగారు.తాజాగా తిరుపతి, శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రాల్ని దర్శకుడు మారుతి దర్శించుకున్నాడు. ఆ ఫొటోలు పోస్ట్ చేయగా 'రాజాసాబ్' రిలీజ్ ఎప్పుడని ఫ్యాన్స్ అడిగారు. దీంతో మారుతి సమాధానమివ్వాల్సి వచ్చింది. 'రిలీజ్ అనేది నా ఒక్కడి చేతుల్లో లేదు. ఎలాంటి అప్డేట్ అయినా పీపుల్స్ మీడియా నిర్మాణ సంస్థ ఇస్తుంది' అని మారుతి చెప్పుకొచ్చాడు.(ఇదీ చదవండి: సింగపూర్‌లో అగ్ని ప్రమాదం.. పవన్ కుమారుడికి గాయాలు)షూటింగ్ అప్డేట్ గురించి మరో అభిమాని అడగ్గా.. 'కొంత టాకీ, పాటల షూటింగ్ ఇంకా పెండింగ్ లో ఉంది. చాలా గ్రాఫిక్స్ సంస్థలు ఈ సినిమా కోసం పనిచేస్తున్నాయి. కొన్ని సంస్థలు ఇచ్చిన ఔట్ పుట్ బాగుంది. చిత్రీకరణ పూర్తవగానే పాటలు రిలీజ్ చేస్తాం. మా కష్టాన్ని చూపించేందుకు మేం కూడా ఎదురుచూస్తున్నాం' అని డైరెక్టర్ మారుతి చెప్పుకొచ్చాడు.డైరెక్టర్ చెప్పిన దానిబట్టి చూస్తే ఈ ఏడాదిలో రాజాసాబ్ రిలీజ్ కష్టమే అనిపిస్తుంది. చూడాలి మరి ఏం జరుగుతుందో?(ఇదీ చదవండి: దర్శకుడి భార్య బర్త్ డే పార్టీలో ఎన్టీఆర్) -
యూరప్ వెళ్లనున్న ప్రభాస్.. ఎందుకో తెలుసా..?
ప్రభాస్ యూరప్ వెళ్లనున్నాడు. రాజాసాబ్ సాంగ్ చిత్రీకరణలో భాగంగా ఆయన అక్కడకు వెల్లేందుకు సిద్ధం అవుతున్నాడు.మారుతి దర్శకత్వలో తెరకెక్కుతున్న రాజాసాబ్ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. సలార్, కల్కి చిత్రాల తర్వాత ప్రభాస్ నుంచి వస్తున్న చిత్రం కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో నిధి అగర్వాల్ , మాళవిక మోహనన్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు.ఇప్పటికే రాజాసాబ్ షూటింగ్ పనులు పూర్తి అయ్యాయి. అయితే, సాంగ్స్ చిత్రీకరణ పెండింగ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో ఆరు పాటలు ఉన్నట్లు సంగీత దర్శకుడు థమన్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. దీనిలో భాగంగా వచ్చే నెలలో యూరప్‌లో ఒక సాంగ్‌ను చిత్రీకరించేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ పాట కూడా ప్రభాస్, మాళవిక మోహనన్‌ల మధ్య ఉంటుందట. అదిరిపోయే లొకేషన్స్‌లో చాలా గ్లామరస్‌గా ఈ సాంగ్ ఉండనున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది జనవరి నుంచే రాజాసాబ్ ప్రమోషన్స్ కార్యక్రమాలు ప్రారంభమవుతాయని తెలుస్తోంది. ఈ క్రమంలో సంక్రాంతి కానుకగా తొలి సాంగ్‌ను విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారట.పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ రాజాసాబ్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నిధి అగర్వాల్, రిద్ధి కుమార్, మాళవిక మోహన్ కథానాయికలుగా నటిస్తున్నారు. ఇందులో సంజయ్‌దత్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ప్రభాస్ తన కెరీర్లో చేస్తున్న తొలి రొమాంటిక్ హారర్ చిత్రమిదే కావడంతో ఫ్యాన్స్‌లో భారీ అంచనాలు ఉన్నాయి. ఏప్రిల్ 10న పాన్ ఇండియా రేంజ్లో ఈ చిత్రం విడుదల కానుంది. -
'రాజాసాబ్' కోసం సెన్సేషనల్ సాంగ్ రీమిక్స్
మారుతి - ప్రభాస్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం రాజాసాబ్. ప్రభాస్ తన కెరీర్లో చేస్తున్న తొలి రొమాంటిక్ హారర్ చిత్రమిదే కావడంతో ఫ్యాన్స్‌లో భారీ అంచనాలు ఉన్నాయి. అయితే, ఈ చిత్ర సంగీత దర్శకుడు థమన్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. రాజాసాబ్‌లో ఆరు పాటలు ఉంటాయని అందులో ఒకటి పాపులర్ రీమిక్స్ సాంగ్ ఉంటుందని తెలిపారు. దీంతో ఆ హిట్ సాంగ్ ఏదై ఉంటుందని నెట్టింట చర్చ జరుగుతుంది.భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ప్రకటించారు. రెండేళ్ల క్రితమే ఈ ప్రాజెక్ట్ ప్రారంభించామని ఆయన పేర్కొన్నారు. బడ్జెట్ విషయంలో ఎలాంటి కాంప్రమైజ్ కాలేదని ఆయన అన్నారు. ఈ చిత్రం స్కేల్‌ను కూడా ఎవరూ ఊహించలేరని ఆయన అన్నారు. అయితే, రాజాసాబ్ స్పెషల్ సాంగ్ కోసం బాలీవుడ్ హిట్ సినిమా నుంచి ఒక పాటను రీమిక్స్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దానికి సంబంధించిన రైట్స్ కోసం కూడా ఆయన సుమారుగానే ఖర్చు చేసినట్లు టాక్. సంజయ్‌దత్ హీరోగా నటించిన 'ఇన్సాఫ్ అప్నే లాహూ సే' సినిమా నుంచి 'హవా హవా..' అనే సాంగ్‌ను డైరెక్టర్ మారుతి ఎంపిక చేసుకున్నారట. 1994లో వచ్చిన ఈ సాంగ్ అప్పట్లో బాలీవుడ్ ప్రేక్షకులను షేక్ చేసింది. ఇప్పుడు ‘రాజా సాబ్’ కోసం థమన్ ఆ పాటనే రీమిక్స్ చేయబోతున్నారని ప్రచారం జరుగుతుంది.పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ రాజాసాబ్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నిధి అగర్వాల్, రిద్ధి కుమార్, మాళవిక మోహన్ కథానాయికలుగా నటిస్తున్నారు. ఇందులో సంజయ్‌దత్ కీలక పాత్రలో కనిపించనున్నారు. సలార్, కల్కి 2898 ఏడీ వంటి వరుస హిట్ సినిమాల తర్వాత ప్రభాస్ నటిస్తున్న సినిమా కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రం నుంచి తాజాగా విడుదలైన ప్రభాస్ లుక్‌పై మంచి టాక్ వస్తుంది. 2025 సమ్మర్లో ఈ చిత్రం విడుదల కానుంది. -
టీజర్లోనే ఇన్ని బూతులు ఉంటే.. ఇక సినిమా పరిస్థితి ఏంటో..?
ఈ మధ్యకాలంలో వస్తున్న సినిమాల్లో బూతు డైలాగ్స్‌కు ఎలాంటి కొదవ లేదని చెప్పవచ్చు. ముఖ్యంగా టీజర్,ట్రైలర్లోనే కొన్ని డైలాగ్స్‌తో సినిమాపై బజ్ క్రియేట్ అయ్యేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా వచ్చిన 'డ్రింకర్ సాయి' సినిమా టీజర్ కూడా అదే కోవకు చెందినట్లు కనిపిస్తుంది. ధర్మ, ఐశ్వర్య శర్మ జంటగా కిరణ్ తిరుమలశెట్టి దర్శకత్వంలో బసవరాజు శ్రీనివాస్, ఇస్మాయిల్ షేక్, బసవరాజు లహరిధర్లు ‘డ్రింకర్ సాయి’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బ్రాండ్ ఆఫ్ బ్యాడ్ బాయ్స్ అనేది ఈ చిత్రానికి ట్యాగ్‌లైన్ కూడా ఉంచారు. ఈ మూవీ ఫస్ట్ లుక్, టైటిల్‌ను డైరెక్టర్ మారుతి లాంచ్ చేసిన విషయం తెలిసిందే.యూత్‌ను ప్రధానంగా టార్గెట్ చేస్తూ డ్రింకర్ సాయి చిత్రాన్ని తెరకెక్కించినట్లు తెలుస్తోంది. టీజర్లో ఎక్కువగా బోల్డ్ డైలాగ్స్‌తో పాటు ధర్మ , ఐశ్వర్య శర్మ లవ్ స్టోరీ హైలెట్‌గా కనిపిస్తుంది. వారిద్దరి మధ్య వచ్చే రొమాంటిక్ సీన్స్ యూత్‌ను ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా హీరోయిన్ ఐశ్వర్య శర్మకు యూత్ ఫిదా అవుతున్నారు. షోషల్ మీడియాలో ఆమె డైలాగ్స్ తెగ షేర్ చేస్తున్నారు. ఈ సినిమాలో పోసాని కృష్ణ మురళి, శ్రీకాంత్ అయ్యంగార్, సమీర్, ఎస్ఎస్ కాంచి, భద్రమ్, బిగ్ బాస్ ఫేమ్ కిర్రాక్ సీత, రీతూ చౌదరి, ఫన్ బకెట్ రాజేష్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. -
‘ది రాజాసాబ్’ అప్డేట్ .. ప్రభాస్ కొత్త లుక్ అదిరింది!
‘ది రాజాసాబ్’ అప్డేట్ వచ్చేసింది. ప్రభాస్ హీరోగా దర్శకుడు మారుతి తెరకెక్కించిన చిత్రం ‘ది రాజాసాబ్’. మాళవికా మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటించారు. నేడు(అక్టోబర్ 23) ప్రభాస్ బర్త్‌డే సందర్భంగా ఈ సినిమా నుంచి వీడియోతో కూడిన స్పెషల్ మోషన్ పోస్టర్ని విడుదల చేశారు. అందులో ప్రభాస్ సింహాసనంపై కూర్చొని చేతిలో సిగార్ పటుకొని మహారాజులా కూర్చున్నాడు. మొత్తంగా ఈ సినిమాలో ప్రభాస్‌ని ఓ డిఫరెంట్ లుక్‌లో చూపించబోతున్నట్లు మోషన్ పోస్టర్‌తో చెప్పేశాడు డైరెక్టర్ మారుతి. (చదవండి: ఒకే ఒక మాటతో ట్రెండింగ్‌లోకి వచ్చేసిన ‘స్పిరిట్’)ప్రభాస్ ఇప్పటి వరకు చేయని రొమాంటిక్ హారర్ జానర్లో ఈ సినిమాను తెరకెక్కుతోంది. ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్ 10న తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. -
ప్రభాస్ 'ది రాజాసాబ్'.. బర్త్ డే రోజే వచ్చేస్తున్నాడు!
రెబల్ స్టార్ ప్రభాస్- మారుతి కాంబోలో వస్తోన్న చిత్రం ది రాజాసాబ్. కల్కి తర్వాత ప్రభాస్ నటిస్తున్న చిత్రం కావడంతో అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మూవీ అప్డేట్స్ కోసం ఎప్పుడెప్పుడా అని తెగ ఆరా తీస్తున్నారు. దీంతో ఫ్యాన్స్ కోసం ది రాజాసాబ్ టీమ్ అప్డేట్తో ముందుకొచ్చింది. మరో రెండు రోజుల్లో డార్లింగ్ బర్త్ డే కావడంతో డైరెక్టర్ మారుతి స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు.ఈనెల 23న డార్లింగ్ ప్రభాస్ పుట్టినరోజు బ్లాస్టింగ్ ఖాయమని పోస్ట్ చేశారు. దీన్ని బట్టి చూస్తే అదే రోజున టీజర్ రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. బర్త్ డే రోజు ఫ్యాన్స్‌కు ది రాజాసాబ్ టీమ్ రాయల్ ట్రీట్ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్లో రెబల్ స్టార్ న్యూ లుక్‌లో అదిరిపోయేలా కనిపించాడు.(ఇది చదవండి: ప్రభాస్ 'ది రాజాసాబ్' గ్లింప్స్.. అది రెబల్ స్టార్ క్రేజ్!)ఇప్పటికే ది రాజాసాబ్ గ్లింప్స్ రిలీజ్ చేయగా.. ఆడియన్స్ అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. విడుదలైన 24 గంటల్లోనే 20 మిలియన్స్‌కు పైగా వ్యూస్ సొంతం చేసుకుంది. కాగా.. ప్రభాస్ ఇప్పటి వరకు చేయని రొమాంటిక్ హారర్ జానర్లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్ 10న తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. Swag turned up to the MAX 😎&Now….your Celebrations will go off in STYLE 😉 A ROYAL TREAT AWAITS on 23rd Oct 💥💥#Prabhas #TheRajaSaab pic.twitter.com/wEu31XSGFW— The RajaSaab (@rajasaabmovie) October 21, 2024 -
‘రాజా సాబ్’ మేకింగ్ వీడియో చూశారా?
మారుతి దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా ‘రాజాసాబ్’ అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌ఫై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. నేడు డైరెక్టర్ మారుతి బర్త్‌డే(అక్టోబర్ 8). ఈ సందర్భంగా రాజాసాబ్ మూవీ మేకింగ్ వీడియోని విడుదల చేశారు మేకర్స్. (చదవండి: 'పుష్ప 2'.. ఫస్ట్ హాఫ్ అంతా రెడీ)ఈ చిత్రంలో ప్రభాస్ సరసన నిధి అగార్వాల్, మాళవిక మోహన్, రిద్ది కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. రొమాంటిక్ హారర్ జానర్లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రభాస్ సరికొత్త లుక్‌లో సందడి చేయబోతున్నాడు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ 10న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. -
ప్రభాస్ 'రాజాసాబ్' గ్లింప్స్ వచ్చేసింది
ప్రభాస్- మారుతి కాంబినేషన్లో తెరకెక్కుతున్న రాజాసాబ్ ఫ్యాన్ ఇండియా అభిమానులకు తీపి కబురు వచ్చేసింది. తాజాగా ఈ సినిమా గ్లింప్స్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఆపై సినిమా రిలీజ్ తేదీని కూడా ప్రకటించారు. రాజాసాబ్ ఫ్యాన్ ఇండియా గ్లింప్స్ చూసిన అభిమానులు ఫిదా అవుతున్నారు. కామెడీ హారర్ థ్రిల్లర్ కాన్సెప్ట్‌తో ఈ చిత్రం తెరకెక్కుతున్నట్లు రివీల్ చేశారు.తాజాగా విడుదలైన రాజాసాబ్ గ్లింప్స్‌లో ప్రభాస్ లుక్ చూసిన అభిమానులు అందరూ డార్లింగ్ ఈజ్ రిటర్న్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నుంచి పాన్ ఇండియా రేంజ్లో ఈ సినిమా తెరకెక్కుతుంది. తెలుగు,హిందీ,తమిళ్,కన్నడ, మలయాళం భాషలలో 2025 ఏప్రిల్ 10న రాజాసాబ్ విడుదల అవుతుందని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. -
'రాజాసాబ్' వచ్చేస్తున్నాడని ప్రకటించిన మేకర్స్
ప్రభాస్ ఫ్యాన్స్‌కు ఎట్టకేలకు శుభవార్త చెప్పారు డైరక్టర్ మారుతి. వీరిద్దరి కాంబినేషన్లో తెరకెక్కుతున్న'రాజాసాబ్' గురించి కీలక అప్డేట్ వచ్చేసింది. ఈ సినిమా నుంచి ఫ్యాన్ ఇండియా గ్లింప్స్ విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈమేరకు వారు టైమ్ సెట్ చేశారు. రేపు (జులై 29) సాయింత్రం 5.03 నిమిషాలకు రాజాసాబ్ వచ్చేస్తాడని ప్రకటించారు.రాజా సాబ్ మూవీ కోసం పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ సుమారు రూ. 200 కోట్లు ఖర్చు చేసినట్లు తెలుస్తుంది. కామెడీ హారర్ థ్రిల్లర్ కాన్సెప్ట్‌తో ఈ చిత్రం తెరకెక్కుతున్నట్లు సమాచారం. తమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాదిలో విడుదల కానుంది. తెలుగు, హిందీ,తమిళ్,కన్నడ,మలయాలం భాషల్లో ఈ మూవీ విడుదల కానుంది.తాజాగా విడుదలైన రాజాసాబ్ పోస్టర్ చాలా బాగుందంటూ కామెంట్లు వస్తున్నాయి. డార్లింగ్ ఈజ్ బ్యాక్ అంటూ నెట్టింట ట్రెండ్ అవుతుంది. అయితే, ఈ చిత్రంలో నటిస్తున్న హీరోయిన్లు ఎవరనే విషయం అధికారికంగా వెలువడలేదు. మాళవికా మోహనన్, నిధి అగర్వాల్ హీరోయిన్లుగా నటించనున్నట్లు ఓ రూమర్ అయితే ఉంది. రేపు విడుదల కానున్న గ్లింప్స్‌తో పూర్తి వివరాలు వస్తాయిని అభిమానులు ఆశిస్తున్నారు. View this post on Instagram A post shared by People Media Factory (@peoplemediafactory) -
ప్రభాస్ 'రాజాసాబ్'... ఆ వార్తలు నమ్మొద్దని టీమ్ ప్రకటన
ప్రభాస్.. ఇప్పుడు దేశవ్యాప్తంగా మరోసారి ఈ పేరు మార్మోగిపోతోంది. ఎందుకంటే రీసెంట్గా 'కల్కి' మూవీతో వచ్చాడు. హిట్ టాక్ తెచ్చుకుని వందల కోట్ల వసూళ్లు సాధిస్తున్నాడు. ఇప్పటికే రూ.700 కోట్ల మార్క్ దాటేసింది. సరికొత్త రికార్డులు కూడా నమోదవుతున్నాయి. ఇది ఇలా ఉండగా ప్రభాస్ తర్వాత మూవీ గురించి టీమ్ కీలక ప్రకటన చేసింది. ఓ విషయంలో మోసపోవద్దని హెచ్చరించింది.(ఇదీ చదవండి: రష్మిక 'కుబేర' వీడియో.. ఆ సూట్ కేసులో ఏముంది?)'బాహుబలి' తర్వాత డిఫరెంట్ స్టోరీలతో సినిమాలు చేస్తున్న ప్రభాస్.. 'రాజాసాబ్'గా త్వరలో ప్రేక్షకుల్ని పలకరించనున్నాడు. మారుతి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీని హారర్ కామెడీ కథతో తీస్తున్నారని టాక్. ఇందులో నిజమెంతనేది పక్కనబెడితే ఇప్పుడు ఈ మూవీ పేరుచెప్పి కొందరు ఫేక్ ఆడిషన్స్ చేస్తున్నారట. ఇది నిర్మాతలకు తెలిసి అలెర్ట్ చేశారు.'రాజాసాబ్ మూవీ ఆడిషన్స్ గురించి కొన్ని వార్తలు సర్క్యూలేట్ అవుతున్నట్లు మా దృష్టికి వచ్చింది. అయితే అదంతా ఫేక్. ఒకవేళ నిజంగా ఉంటే మేమే ప్రకటిస్తాం' అని నిర్మాతలు ఇన్ స్టాలో పోస్ట్ పెట్టారు. ఇకపోతే 'రాజాసాబ్'లో ప్రభాస్ సరసన నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. బహుశా వచ్చే ఏడాది వేసవిలో రిలీజ్ కావొచ్చని టాక్ వినిపిస్తుంది. (ఇదీ చదవండి: Mirzapur 3: ‘మీర్జాపూర్ 3’ వెబ్‌సిరీస్ రివ్యూ) View this post on Instagram A post shared by People Media Factory (@peoplemediafactory) -
‘భలే ఉన్నాడే!’ మూవీ ప్రెస్‌మీట్ (ఫొటోలు)
-
ఆ దర్శకునికి ఫ్రీగా డేట్స్ ఇచ్చిన 200 Cr స్టార్ ప్రభాస్.. కారణం..!
-
అలాంటి వారి బాధే ఈ సినిమా: మారుతి
మణికందన్, శ్రీ గౌరి ప్రియ, కన్న రవి కీలక పాత్రల్లో నటిస్తున్న కోలీవుడ్ చిత్రం ‘ట్రూ లవర్’. ఈ చిత్రానికి ప్రభురామ్ వ్యాస్ దర్శకత్వంలో తెరకెక్కించారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ ఫిబ్రవరి 10న తమిళంతో పాటు తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుత రోజుల్లో ప్రేమికుల మధ్య మోడరన్ డే రిలేషన్స్ నేపథ్యంలో ఈ సినిమాను రూపొందించినట్లు తెలుస్తోంది. అయితే ఈ మూవీ టాలీవుడ్ హక్కులను బేబీ నిర్మాత ఎస్కేఎన్, డైరెక్టర్ మారుతి దక్కించుకున్నారు. వీరిద్దరు సంయుక్తంగా ట్రూ లవర్‌ను తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. తాజాగా ఈ మూవీ ప్రమోషన్లలో పాల్గొన్న డైరెక్టర్ మారుతి ఆసక్తికర కామెంట్స్ చేశారు. డైరెక్టర్ మారుతి మాట్లాడుతూ.. 'ఈ సినిమాకు ఎందుకు చూడమని చెబుతానంటే. ఒక మగాడి బాధ ఎలా ఉంటుందో చూపించాడు. అమ్మాయి చాలా ఈజీగా తీసుకుంటారు. ఇక్కడ అమ్మాయిల తప్పుకాదు. తన ప్రియురాలిని ఎవరైనా ట్రాప్ చేస్తాడేమో అని ఆమె లవర్ భయపడుతూ ఉంటాడు. అతని బాధను తెరపై చూపించే ప్రయత్నమే ఈ సినిమా. సిన్సియర్‌గా లవ్ చేసే వారి బాధ వర్ణనాతీతం. అలాంటి వ్యక్తి తన ప్రేమ కోసం ఏం చేస్తాడనేదే కథ. ఈ కథను డైరెక్టర్ దాదాపు ఆరేళ్లు కష్టపడి రాశాడు. బేబీ సినిమా చూసేటప్పుడు ప్రతి సీన్ అలానే రాసుకున్నారు. ఇలాంటి కంటెంట్ ఉన్న ఈ సినిమాను ఎవరు మిస్సవరనేది నా నమ్మకం.' అని అన్నారు. కాగా.. మారుతి ప్రస్తుతం రెబల్ స్టార్ ప్రభాస్‌తో రాజాసాబ్ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. -
ప్రేమిస్తే తర్వాత అలాంటి అనుభూతి కలిగింది
‘‘ప్రేమిస్తే’ అనే డబ్బింగ్ మూవీతో నా కెరీర్ ఆరంభమైంది. ‘ప్రేమిస్తే’ చూసి బాగుందనిపించి రిలీజ్ చేసి, హిట్ సాధించాం. ఇన్నాళ్లకు ‘ట్రూ లవర్’ చిత్రం చూడగానే మళ్లీ అలాంటి అనుభూతి కలిగింది. ఈ సినిమాను ప్రేమలో ఉన్నవాళ్లు, లేనివాళ్లు, ప్రేమలో పడాలనుకుంటున్న వాళ్లు.. ఇలా అందరూ చూడొచ్చు’’ అని డైరెక్టర్ మారుతి అన్నారు. మణికందన్, శ్రీ గౌరీప్రియ, కన్న రవి ప్రధాన పాత్రల్లో ప్రభురామ్ వ్యాస్ దర్శకత్వం వహించిన చిత్రం ‘ట్రూ లవర్’. నజేరత్ పసీలియన్, మగేష్ రాజ్ పసీలియన్, యువరాజ్ గణేశన్ నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 9న విడుదలవుతోంది. ఈ చిత్రాన్ని నిర్మాత ఎస్కేఎన్ సమర్పణలో దర్శకుడు మారుతి విడుదల చేస్తున్నారు. సోమవారం ఈ సినిమా టీజర్‌ని విడుదల చేశారు. ప్రభురామ్ వ్యాస్ మాట్లాడుతూ– ‘‘ప్రేమికుల మధ్య ఉంటున్న మోడ్రన్ డే రిలేషన్స్ నేపథ్యంలో ‘ట్రూ లవర్’ ఉంటుంది’’ అన్నారు. ‘‘ఫిబ్రవరి 9న వస్తున్న పెద్ద సినిమాలతో మేము పోటీలో లేము. ‘ట్రూ లవర్’ చిన్న క్యూట్ సినిమా.. మా సినిమాని విడుదల చేస్తే ఎవరికీ అభ్యంతరం ఉండదని భావిస్తున్నాం’’ అన్నారు ఎస్కేఎన్. ‘‘మా సినిమాలోని భావోద్వేగాలు ప్రేక్షకులకు కనెక్ట్ అవుతాయని ఆశిస్తున్నాం’’ అన్నారు మణికందన్. -
అరెరె... ఇది తెలీక వేరే కథతో సినిమా తీస్తున్నానే..: మారుతి
గత కొంతకాలంగా హిట్లు లేక సతమతమైన ప్రభాస్‌కు సలార్ రూపంలో సంజీవని దొరికినట్లైంది. ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.611 కోట్లకు పైగా రాబట్టింది. ఈ జోష్‌లో వరుస సినిమాలు చేస్తున్నాడు ప్రభాస్. దర్శకుడు మారుతితో ఓ సినిమా ఉంటుందని గతంలోనే ప్రభాస్ ప్రకటించాడు. కామెడీ హర్రర్ థ్రిల్లర్ జానర్లో ఈ ప్రాజెక్ట్ తెరకెక్కనున్నట్లు సమాచారం. సంక్రాంతి సందర్భంగా ఈ మూవీకి ది రాజాసాబ్ అనే టైటిల్ ఖరారు చేసినట్లు ప్రకటించారు. కథ ఇదేనా? ఇకపోతే సినిమా కథ ఇదేనంటూ కొన్ని వార్తలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ఆఖరికి ఐఎమ్‌డీబీ కూడా.. ఇద్దరు వ్యక్తులు ప్రేమలో పడుతారు. కానీ నెగెటివ్ ఎనర్జీ వల్ల ఆ ప్రేమజంట తమ గమ్యాన్ని మార్చుకోవాల్సి వస్తుంది.. ఇదే సినిమా కథ అని రాసుకొచ్చింది. ఇది చూసిన మారుతి ట్విటర్(ఎక్స్) మీడియాలో సెటైర్లు వేశాడు. అరెరె... ఈ విషయం నాకు తెలియక నేను వేరే స్క్రిప్ట్‌తో షూటింగ్ చేస్తున్నాను! ఇప్పుడు ఐఎమ్‌డీబీ సమాజం నన్ను యాక్సెప్ట్ చేస్తదా? అంటూ నవ్వుతున్న ఎమోజీ జత చేశాడు. దాని జోలికి మాత్రం వెళ్లకండి ఇది చూసిన అభిమానులు భిన్నరకాలుగా స్పందిస్తున్నారు. అన్నా, దయచేసి ప్రభాస్ లుక్ ఎడిట్ చేసి ఇవ్వకండి, సహజంగా తీసినవే పోస్టర్లు వదలండి.. ఈ విధిరాతల జోలికి పోకండి.. హారర్ స్క్రిప్ట్ చాలు, మమ్మల్ని నిరాశపరచవని ఆశిస్తున్నాము అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ సినిమాలో మాళవిక మోహనన్ హీరోయిన్గా నటిస్తోంది. మరోవైపు ప్రభాస్.. కల్కి 2898ఏడీ అనే సైన్స్ ఫిక్షన్ మూవీలోనూ నటిస్తున్నాడు. దీనికి నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నాడు. Ararare I don't know this plot So shooting with different script Ippudu IMDB Samajam accept chestada mari 😁 pic.twitter.com/gCr2gNEybV — Director Maruthi (@DirectorMaruthi) January 17, 2024 -
ముఖ్య గమనిక మంచి థ్రిల్లర్ అనిపిస్తోంది
‘‘ముఖ్య గమనిక’ టీజర్ చూశాను. మంచి థ్రిల్లర్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన సినిమా అనిపిస్తోంది. కానిస్టేబుల్‌గా విరాన్ క్యారెక్టర్ చాలా ఆసక్తికరంగా ఉంది. ఈ సినిమా టీమ్ మొత్తానికి బూస్టప్ ఇస్తుందని ఆశిస్తున్నాను’’ అని దర్శకుడు మారుతి అన్నారు. హీరో అల్లు అర్జున్ కజిన్ విరాన్ ముత్తం శెట్టి హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘ముఖ్య గమనిక’. సీనియర్ సినిమాటోగ్రాఫర్ వేణు మురళీధర్ని దర్శకుడిగా పరిచయం చేస్తూ శివిన్ప్రోడక్షన్స్ పతాకంపై రాజశేఖర్, సాయికృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రంలో లావణ్య హీరోయిన్. ఈ చిత్రం టీజర్‌ను దర్శకుడు మారుతి రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా విరాన్ ముత్తంశెట్టి మాట్లాడుతూ– ‘‘ఫిబ్రవరిలో ఈ సినిమాని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం’’ అన్నారు. ‘‘థ్రిల్లింగ్ అంశాలతో ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామాగా ఈ సినిమాను రూపొందించాం. విరాన్ చక్కగా నటించారు’’ అన్నారు వేణు మురళీధర్. ‘‘మా బేనర్ నుంచి వస్తున్న తొలి చిత్రమిది’’ అన్నారు రాజశేఖర్. -
ప్రభాస్ కొత్త సినిమా ప్రకటన.. రెమ్యునరేషన్ వద్దని చెప్పిన డార్లింగ్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్- ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో వచ్చిన సలార్ ఇండియన్ బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతుంది. విడుదలైన వారంలోపే రూ. 500 కోట్ల క్లబ్లో సలార్ చేరిపోయంది. ప్రభాస్ గత సినిమాలు రాధేశ్యామ్,ఆదిపురుష్‌తో పాటు సలార్ అన్నీ కూడా విభిన్నమైన కథాంశాలతోనే తెరకెక్కాయి. ముఖ్యంగా సాహో, సలార్ సినిమాలతో ప్రభాస్‌కు మాస్ ఇమేజ్ క్రియేట్ అయింది. దీంతో ఆయన నుంచి తర్వాత వచ్చే సినిమాలు ఎలా ఉండబోతున్నాయని అందరిలో ఆసక్తి నెలకొంది. మారుతితో ఒక సినిమాను ఇదివరకే ప్రభాస్ ప్రకటించిన విషయం తెలిసిందే.. తాజాగా ఈ సినిమా నుంచి ఫ్యాన్స్‌కు అదిరిపోయే అప్డేట్ వచ్చింది. సంక్రాంతి పండుగ రోజు మారుతి- ప్రభాస్ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేస్తున్నట్లు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ తెలిపింది. ఇప్పటి వరకు మీరందరూ డైనోసార్ ప్రభాస్‌ను చూశారు.. ఇక త్వరలో మళ్లీ డార్లింగ్ ప్రభాస్‌ను చూసేందుకు రెడీగా ఉండండి అంటూ ఒక పోస్ట్‌ర్ విడుదల చేసి చిత్ర యూనిట్ తెలపింది. ప్రభాస్‌ను మాస్‌తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఆయన్ను ఇష్టపడుతారు.. చాలా ఏళ్ల తర్వాత ప్రభాస్‌ను మళ్లీ వింటేజ్ లుక్‌లో చూడొచ్చని ఫ్యాన్స్ సంబర పడుతున్నారు. సినిమా జోనర్ ఏంటి మారుతి- ప్రభాస్ కాంబినేషన్లో వస్తున్న సినిమా గురించి గతంలోనే ఎన్నో వార్తలు వచ్చాయి. కామెడీ హర్రర్ థ్రిల్లర్ జోనర్లో ఈ ప్రాజెక్ట్ తెరకెక్కనున్నట్లు సమాచారం. ఒక బంగ్లా చుట్టూ ఈ సినిమా కథ నడుస్తుందని టాక్ ఉంది. ఈ చిత్రానికి రాజా డీలక్స్ అని చాలా రోజుల నుంచి ప్రచారం జరుగుతోంది. పాన్ ఇండియా రేంజ్లో విడుదల కానున్న ఈ సినిమాలో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిధి కుమార్‌కు ఛాన్స్ దక్కినట్లు వార్తలు వస్తున్నాయి. రూ. 150 కోట్ల లోపే ఈ సినిమాకు బడ్జెట్ అని సమాచారం. ఈ సినిమా కోసం ప్రభాస్ రెమ్యునరేషన్ లేకుండానే చేస్తున్నారని టాక్.. కానీ సినిమా విడుదలయ్యాక బడ్జెట్ పోను మిగిలిన ఆదాయంలో వాటా తీసుకునేలా ప్రభాస్ డీల్ సెట్ చేసుకున్నారని ఇండస్ట్రీలో టాక్ ఉంది. మరోవైపు 'కల్కి 2898 ఏడి' సైన్స్ ఫిక్షన్ చిత్రం కూడా వేగంగా తెరకెక్కుతుంది. ఈ చిత్రానికి నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నారు. People Media Factory proudly unveils the Dinosaur transformed into an absolute DARLING 😍 First Look and Title will be unveiled on Pongal 🔥#Prabhas #PrabhasPongalFeast ❤️🔥 A @DirectorMaruthi film. @vishwaprasadtg @peoplemediafcy @vivekkuchibotla pic.twitter.com/vGErsqcv1z — People Media Factory (@peoplemediafcy) December 29, 2023 -
ఆ రోజు వెంకటేష్ అన్న మాట నాకు ఇప్పటికీ గుర్తుంది
-
Director Maruthi: "తనే నా ఆల్‌టైమ్ ఫేవరెట్ హీరో"
-
ఆ సినిమాకి నా పేరు పెట్టలేదు ఎందుకంటే..?
-
మూవీ ఇండస్ట్రీలోకి రాకముందు చాలా కష్టపడ్డాను
-
లవ్ లో ఉన్నప్పుడు మేము చాలా దొంగగా కలుసుకునేవాళ్ళం
-
ఆ హీరో తో నా డ్రీమ్ ప్రాజెక్ట్ ఇదే..!
-
ఈ కాలమే.. మంచి ఫీల్ గుడ్ పాటలాగా ఉంది: మారుతి
లక్ష్మణ్ చిన్నా హీరోగా నటిస్తూ స్వీయ దర్శకత్వం వహించిన చిత్రం ‘నచ్చినవాడు’. కావ్య రమేష్, కె. దర్శన్, నాగేంద్ర అరుసు, లలిత నాయక్ తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం 'ఈ కాలమే' పాటను దర్శకుడు మారుతి విడుదల చేశారు. ఈ చిత్రానికి యువ రచయిత హర్షవర్ధన్ రెడ్డి లిరిక్స్ అందించగా, ప్రముఖ గాయకుడు జావేద్ అలీ అద్భుతంగా ఆలపించాడు. పాట విడుదల సందర్భంగా దర్శకుడు మారుతి మాట్లాడుతూ "మలయాళ సంగీత దర్శకుడు మిజో జోసెఫ్ స్వరపరిచిన 'ఈ కాలమే' పాటను ఇప్పుడు విన్నాను, పాట మంచి ఫీల్ గుడ్ పాటలాగా చాలా బాగుంది. ఈ చిత్రం ట్రైలర్ కూడా చూశాను, చాలా బాగుంది. హీరో, దర్శకుడు, నిర్మాత అయిన లక్ష్మణ్ చిన్న గారికి ఈ చిత్రం మంచి విజయం సాధిస్తుంది అని భావిస్తున్నాను’ అన్నారు. ‘ఈ పాట మా చిత్రానికి ప్రాణం లాంటిది. మిజో జోసెఫ్ చాలా అద్భుతమైన స్వరాలు అందించాడు. త్వరలోనే ఈ చిత్రం విడుదల తేదిని ప్రకటిస్తాం’అని హీరో, దర్శక నిర్మాత లక్ష్మణ్ చిన్నా అన్నారు. -
ప్రభాస్-అనుష్క ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్
ప్రభాస్- అనుష్క టాలీవుడ్ సినీ హిస్టరీలో వారిది హిట్ పెయిర్ అనే చెప్పవచ్చు. మిర్చి,బిల్లా,బాహుబలి సీరిస్‌లతో మెప్పించిన ఈ జోడి తెలుగు ప్రేక్షలపై చెరగని ముద్ర వేసింది. బాహుబలి తర్వాత ప్రభాస్ పాన్ ఇండియా నుంచి హాలీవుడ్ రేంజ్‌కు చేరుకున్నాడు. అనుష్క మాత్రం జీరో సైజ్ సినిమా దెబ్బతో ఇండస్ట్రీలో అవకాశాలు తగ్గాయి. తాజాగా అనుష్క.. నవీన్ పొలిశెట్టితో ఓ సినిమాలో నటిస్తుంది. త్వరలో ఆ సినిమా కూడా విడుదల కానుంది. ఈ సినిమాతో సినీ కెరీయర్‌కు ఫుల్స్టాప్ పెడుతుందనే వార్తలు కూడా వస్తున్నాయి. ఇలాంటి సమయంలోనే మరోక అదిరిపోయే వార్త ఒకటి ఇండస్ట్రీలో నడుస్తోంది. (ఇదీ చదవండి: ‘స్లమ్ డాగ్ హజ్బెండ్’మూవీ రివ్యూ) ప్రభాస్- అనుష్క కాంబోలో ఒక సినిమా రాబోతున్నుట్లు చాలా రోజుల నుంచి జరుగుతున్న ప్రచారమే మళ్లీ జోరందుకుంది. కానీ ఈసారి కొంచెం బలంగానే ఈ టాపిక్ వైరల్ అవుతుంది. ఎందుకంటే అనుష్క సినిమాలకు గుడ్‌బై చెప్పాలనుకుందట. ఇదే విషయాన్ని తెలుసుకున్న డైరెక్టర్ మారుతి.. ప్రభాస్‌తో తను తెరకెక్కిస్తున్న సినిమాలో నటించాలని అనుష్కను కోరారట. అందులో ఆమెను హీరోయిన్గా కాకుండా సినిమాకు ఎంతో ప్రాముఖ్యత ఉన్న పాత్ర కోసం మారుతి అడిగారట. అందుకు ఆమె కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. కానీ అధికారికంగా ఇంకా ప్రకటన రాలేదు. కల్కి తర్వాత ప్రభాస్ నుంచి వచ్చే సినిమా మారుతీదే కావడం విశేషం. (ఇదీ చదవండి: ఇంట్లో వాళ్లను కాదని యంగ్ డైరెక్టర్‌తో డేర్ చేస్తున్న నిహారిక ) ఇదిలా ఉంటే.. అనుష్క- ప్రభాస్ కాంబోలో మరో పిరియాడికల్ సినిమా తీసేందుకు డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి ఓ కథను రెడీ చేశారట. ఇదే స్టోరీని బాహుబలి నిర్మాతలైన శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేనిలకు కూడా ఆయన కథను వినిపించారట. వారికి స్టోరీ నచ్చడంతో ఈ ప్రాజెక్టు నిర్మించడానికి ముందుకొచ్చినట్టుగా బలమైన ప్రచారం జరుగుతుంది. అటు ప్రభాస్ నుంచి కూడా దీనికి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లు చెబుతున్నారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే మళ్లీ ప్రభాస్- అనుష్క జంటను బిగ్ స్క్రీన్‌పై వారిద్దరి ఫ్యాన్స్ చూడవచ్చు. ఒక విధంగా ప్రభాస్,అనుష్క ఫ్యాన్స్‌కు ఇది గుడ్ న్యూస్ అనే చెప్పవచ్చు. -
మారుతిపై ప్రభాస్ ఫ్యాన్స్ ఫైర్
ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే! అయితే ఈ సినిమా పాతబడ్డ రాజా డీలక్స్ అనే థియేటర్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే తాతామనవళ్ల కథ అని ఫిలింనగర్లో వినిపిస్తోంది. ఈ చిత్రం షూటింగ్ ఇప్పటికే 50 శాతం పూర్తి అయినట్లు తెలుస్తోంది. చిన్న సినిమాగానే మొదట్లో ప్రారంభించినా ప్రభాస్ రేంజ్ పెరగడంతో బడ్జెట్ కూడా రూ. 200 కోట్లకు చేరిందని సమాచారం. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతం సలార్, కల్కి ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్న డార్లింగ్.. మారుతి సినిమా షూటింగ్ కు కొద్దిగా గ్యాప్ ఇచ్చాడు. త్వరలోనే మళ్లీ షూటింగ్ ప్రారంభం కానుంది కూడా. (ఇదీ చదవండి: సూర్య 'కంగువ' ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్) ఇది ఇలా ఉంటే తాజాగా కల్కి టైటిల్ గ్లింప్స్‌ను వైజయంతి మేకర్స్ రిలీజ్ చేశారు. దానిని చూసిన వారంతా హాలీవుడ్ రేంజ్లో ఉందని ప్రశంసలు కూడా డార్లింగ్ అందుకున్నాడు. ఇప్పటికి కూడా అది యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో ఉంది. ఇందులో ప్రభాస్ లుక్ అదిరిపోయిందంటూ.. డార్లింగ్ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. అయితే ప్రభాస్‌తో సినిమా చేస్తున్న దర్శకుడు మారుతి మాత్రం ఈ గ్లింప్స్ గురించి ఒక్క ట్వీట్ కూడా చేయలేదు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ బాగా హర్ట్ అయ్యారు. దీంతో వాళ్లు మారుతిపై ఇలా ఫైర్ అవుతున్నారు. (ఇదీ చదవండి: Oppenheimer Movie Review: ఓపెన్‌హైమర్ సినిమా రివ్యూ) 'బేబీ సినిమా గురించి బన్నీ మాట్లాడిన మాటలు ట్విటర్లో షేర్ చేశావ్ అందులో ఎలాంటి తప్పు లేదు.. కానీ నీకు సినిమా అవకాశం ఇచ్చిన ప్రభాస్ గురించి ఒక్క ట్వీట్ అయినా చేశావా.. ? కల్కి మూవీకి సంబంధించిన గ్లింప్స్‌పై ఒక్క ట్వీట్ అయినా చేశావా..? ఎటువంటి సంబంధం లేకపోయినా నీతో రూ.200 కోట్ల భారీ బడ్జెట్ సినిమాను మా ప్రభాస్ చేస్తున్నారు. అంకిత భావం, కృతజ్ఞత భావం లాంటివి నీకులేవు' అంటూ మారుతిపై ప్రభాస్ ఫ్యాన్స్‌తో పాటు పలువురు నెటిజన్లు కూడా కామెంట్లతో విరుచుకుపడుతున్నారు. మరికొందరేమో షూటింగ్లో బిజీ కారణంగా ట్వీట్ పెట్టలేకపోవచ్చు కానీ.. ప్రభాస్‌పై మారుతికి ఎనలేని ప్రేమ, కృతజ్ఞత ఉందని అంటున్నారు. ఇకపోతే రాజా డీలక్స్ గురించి అధికారికంగా ప్రకటించలేదు. కానీ ప్రభాస్,మారుతి షూటింటిగ్ స్పాట్ ఫోటోలు కొన్ని ఇప్పటికే బయటకు వచ్చాయి. Every word from our Icon Star and pillar of support @alluarjun garu about our film #BabyTheMovie Appreciation Meet moved our entire team to tears.❤️🔥 Thanks for this Iconic Appreciation sir, it's a big boost. We are overwhelmed with your unconditional love on #Baby… — Director Maruthi (@DirectorMaruthi) July 21, 2023 -
నిధి అగర్వాల్‌కు కొత్త కష్టాలు.. అన్నీ ఉన్నాసరే!
కొందరు హీరోయిన్లని చూడగానే 'అబ్బా.. ఏముందిరా బాబు' అని అనుకుంటాం. నిధి అగర్వాల్ ఆ కేటగిరీలోకే వస్తుంది. ఈమెని చూడగానే సరిగ్గా ఇలానే అనిపిస్తుంది. ఎందుకంటే ఫిజిక్ సూపర్, గ్లామర్ అంతకంటే సూపర్. డ్యాన్సులు బాగా చేస్తుంది. అయినాసరే ఈమెని ఆ కష్టాలు వదలట్లేదు. 'అన్నీ ఉన్నా అల్లుడి నోటిలో శని' అన్నట్లు ఈమె లైఫ్ తయారైంది. కొన్ని సమస్యలు ఈమెని శనిలా వెంటాడుతున్నాయా అనిపిస్తోంది. అభిమానుల మధ్య ఇప్పుడు ఇదే టాపిక్ చర్చనీయాంశంగా మారిపోయింది. సినిమా కష్టాలు! చాలామంది హీరోయిన్లకు అందం ఉన్నా.. స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు రావు. ఒకవేళ వస్తే మాత్రం హిట్ ఫ్లాప్ తో సంబంధం లేకుండా క్రేజ్ సొంతం చేసుకుంటారు. 'ఇస్మార్ట్ శంకర్' బ్యూటీ నిధి అగర్వాల్ కూడా ప్రస్తుతం తెలుగులో ఇద్దరు స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తోంది. ఒకటి 'హరిహర వీరమల్లు', మరొకటి ప్రభాస్-మారుతి కలిసి చేస్తున్న మూవీ. వీటిలో 'హరిహర..' 2020లోనే ప్రారంభమైంది. ఇప్పటికి సగం షూటింగే జరిగింది. మిగిలిన పార్ట్ ఎప్పుడు మొదలవుతుందో, అసలు జరుగుతుందో లేదా అనేది డౌటే! (ఇదీ చదవండి: 'విరూపాక్ష' డైరెక్టర్‌కి కాస్ట్లీ కారు గిఫ్ట్.. ఎన్ని లక్షలో తెలుసా?) ఉంచుతారో.. తీసేస్తారో? ప్రభాస్, మారుతి దర్శకత్వంలో ఓ సినిమాలో చేస్తున్నాడు. హారర్ కామెడీ స్టోరీతో తీస్తున్న ఈ చిత్రంలో నిధి అగర్వాల్, మాళవిక మోహన్ హీరోయిన్లు అని అన్నారు. ప్రభాస్ ప్రస్తుతం 'సలార్', 'ప్రాజెక్ట్ K' చిత్రాలతో బిజీగా ఉన్నాడు. ఈ రెండు పూర్తయిన తర్వాతే మారుతి మూవీ కోసం పనిచేస్తాడు. ఇదంతా జరగడానికి వచ్చే ఏడాది పట్టొచ్చు! అంతలో చిత్రబృందం మనసు మారకపోతే ఓకే. ఒకవేళ ఏమైనా జరిగి హీరోయిన్లు మార్చే ఆలోచన వస్తే మాత్రం నిధికి మూడినట్లే! ఎందుకంటే మహేశ్-త్రివిక్రమ్ కలిసి ఓ సినిమా చేస్తున్నారు. లాంచ్ అయినప్పుడు ఇందులో లీడ్ హీరోయిన్ గా ఉన్న పూజా హెగ్డేని ఎంపిక చేశారు. కానీ ఇప్పుడు ఆమెని పక్కనబెట్టేశారని, సెకండ్ హీరోయిన్ శ్రీలీలని మెయిన్ లీడ్ గా చేశారని వార్తలొస్తున్నాయి. ఒకవేళ ఇదే ఫార్ములా ప్రభాస్-మారుతి సినిమాకు అప్లై చేస్తే మాత్రం నిధిని పీకేయడం గ్యారంటీ. ఒకవేళ ఇలా జరిగితే టాలీవుడ్ లో నిధి కెరీరే సందిగ్ధంలో పడిపోతుంది! View this post on Instagram A post shared by Nidhhi Agerwal 🌟 (@nidhhiagerwal) (ఇదీ చదవండి: ఆ రోజు గొడవలో అమ్మాయిదే తప్పు: హీరో నాగశౌర్య) -
ఆమెను ఇంప్రెస్ చేయడానికి ఎన్నో చిల్లర పనులు చేశా: మారుతి
సినీ ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం అంత ఈజీ కాదు. ఒక్కసారి హిట్ వచ్చిందంటే నెక్స్ట్ అంతకు మించిన సినిమా తీయాలి. తేడా కొట్టి ఫ్లాప్ అయిందంటే విమర్శలను ఎదుర్కొనేంత సత్తా ఉండాలి. అదే వరుసగా ఫ్లాపులు పడితే మనుగడను కాపాడుకునేందుకు కష్టపడాలి. ఇలా చిత్రపరిశ్రమలో నానాసమస్యలను దాటుకుని స్టార్ డైరెక్టర్ స్థాయికి ఎదిగాడు మారుతి. కేవలం రెండు రూపాయల జిలేబీ తిని కడుపు నింపుకున్న రోజుల నుంచి అరటి పండ్లు అమ్మిన రోడ్డుపై జాగ్వార్ కారులో తిరిగే స్థాయికి ఎదిగాడు. సహ నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్‌గా కెరీర్ ప్రారంభించిన మారుతి ఈ రోజుల్లో చిత్రంతో దర్శకుడిగా మారారు. దర్శకుడిగా, రచయితగా, నిర్మాతగా సత్తా చాటుతున్న అతడు ప్రస్తుతం ప్రభాస్‌తో సినిమా తీస్తున్నాడు. తాజాగా అతడు తన భార్య వీరనాగ స్పందనతో కలిసి ఓ ఇంటర్వ్యూకు హాజరయ్యాడు. ఈ సందర్భంగా వీరిద్దరూ తమ ప్రేమ విశేషాలను పంచుకున్నారు. స్పందన మాట్లాడుతూ.. 'మేమిద్దరం ఒకే స్కూల్లో చదువుకున్నాం. అతడు నా సీనియర్. నేను 8వ తరగతి చదువుతున్నప్పుడు ఆయన ముఖం నచ్చింది. 9వ తరగతిలో టాలెంట్ నచ్చింది. పదవ తరగతికి వచ్చేసరికి తను వెళ్లిపోయాడు. ఆ తర్వాత కూడా మా ప్రేమ కొనసాగింది. ఆయన నన్ను కలుసుకునేందుకు ఆర్టీసీ బస్సులో వచ్చేవాడు, నేను స్కూటీపై వెళ్లేదాన్ని. ఇద్దరం దొంగతనంగా కలుసుకుని నా స్కూటీపై తిరిగేవాళ్లం' అని చెప్పుకొచ్చింది. మారుతి మాట్లాడుతూ.. 'స్పందనకు డైరీ రాయడం అలవాటు. ఈ రోజు వచ్చాడు, ఇది జరిగిందని అన్నీ రాస్తుంది. తనను ఇంప్రెస్ చేయడానికి చేసిన వెధవ పనులన్నీ అందులో ఉంటాయి' అని పేర్కొన్నాడు. కాగా మారుతి జీవితంలో సెటిలయ్యాక ప్రేమించిన అమ్మాయి ఇంటికి వెళ్లి పెద్దలను ఒప్పించి మరీ పెళ్లి చేసుకున్నాడు. చదవండి: మెసేజ్ చేసినందుకు నేరుగా ఇంటికి వెళ్లిన డైరెక్టర్ గ్రాండ్‌గా బాలీవుడ్ నటి సీమంతం -
షాకివ్వబోతున్న ప్రభాస్..
-
ప్రభాస్ కీలక నిర్ణయం.. ఆ సినిమాకు నో రెమ్యూనరేషన్..!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో ఓ సినిమా రాబోతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు ఇప్పటికే రాజా డీలక్స్ అనే టైటిల్ ఖరారు చేసినట్లు తెలుస్తోంది. రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా చిత్రాలు చేస్తుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఓ వార్త వైరలవుతోంది. ప్రభాస్ ఈ చిత్రానికి ఎలాంటి రెమ్యూనరేషన్ తీసుకోవడం లేదని సమాచారం. ప్రభాస్ వరసగా ఆదిపురుష్, ప్రాజెక్ట్ కె, సాలార్ లాంటి భారీ బడ్జెట్ ప్రాజెక్ట్‌ల్లో నటించనున్నారు. ఆ తర్వాత మారుతీ దర్శకత్వంలో రాజా డీలక్స్‌లో కనిపించనున్నారు. తాజా నివేదికల ప్రకారం ఈ సినిమా కోసం ఆయన ఒక్క పైసా కూడా తీసుకోవడం లేదట. కొన్ని కథనాల ప్రకారం సినిమా బడ్జెట్ పరిమితికి మించి పెరగకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. పరిమిత బడ్జెట్‌తో తెలుగు ప్రేక్షకులకు మంచి సినిమా అందించాలని ప్రభాస్ కోరుకుంటున్నట్లు చెబుతున్నారు. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో సాలార్ షూటింగ్లో బిజీగా ఉన్నాడు. ఆ తర్వాత అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొణె, దిశా పటానీలతో నాగ్ అశ్విన్ ప్రాజెక్ట్ కె కూడా నటించనున్నారు. నటుడు సందీప్ రెడ్డి వంగాతో స్పిరిట్ కూడా ప్రకటించారు. -
ప్రభాస్ లంబోర్గిని కారు తీసుకొని చక్కర్లు కొట్టిన డైరెక్టర్
ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఆదిపురుష్, సలార్ సినిమాలతో పాటు మారుతి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. రాజా డీలక్స్ అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది. ఇప్పటికే షూట్‌కి సంబంధించిన కొన్ని స్టిల్స్ కూడా లీక్ అయ్యాయి. ఇదిలా ఉంటే ప్రభాస్ గ్యారేజీలు పలు ఖరీదైన కార్లు ఉన్న సంగతి తెలిసిందే. గతేడాది ఆ జాబితాలోకి లంబోర్గిని కూడా వచ్చి చేసింది. ప్రభాస్ కూడా ఈ కారులోనే షూటింగ్స్‌కి హాజరువుతున్నాడు. తాజాగా డైరెక్టర్ మారుతి ప్రభాస్ లంబోర్గినిని డ్రైవ్ చేస్తూ కనిపించాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పడుఉ నెట్టింట చక్కర్లు కొడుతుంది. #Prabhas anna Lamborghini driving by @DirectorMaruthi 🤩👌 pic.twitter.com/RjoAFdFdrQ — ᴠɪꜱʜᴀʟ 🏹 (@vishal_x_x_7) January 29, 2023 -
జూబ్లీహిల్స్‌లో ప్రభాస్‌కు 84 ఎకరాల ఫామ్‌హౌస్? నిజమనుకుంటున్నారా?
సెలబ్రిటీల గురించి ఎప్పుడూ ఏదో ఒక రూమర్స్ వినిపిస్తూనే ఉంటాయి. కొందరు వాటిని చూసీచూడనట్లు ఊరుకుంటే మరికొందరు మాత్రం ఘాటుగా స్పందిస్తుంటారు. తాజాగా ప్రభాస్ గురించి ఓ వెబ్సైట్ వార్తను వండివార్చింది. ప్రభాస్‌కు ఓ ఫామ్‌హౌస్ ఉందని, అది జూబ్లీహిల్స్‌లో 84 ఎకరాల్లో విస్తరించి ఉందని పేర్కొంది. అక్కడితో ఆగకుండా కేవలం రూ.1.05 కోట్లకే ఈ ఫామ్‌హౌస్‌ను సొంతం చేసుకున్నట్లు పేర్కొనడం గమనార్హం. అయితే ప్రస్తుతానికి మాత్రం ఈ 84 ఎకరాల ఫామ్‌హౌస్ విలువ దాదాపు రూ.60 కోట్లు ఉండొచ్చని రాసుకొచ్చింది. దీనికి రాధేశ్యామ్లోని ఓ ఫొటోను వాడేసింది. పాష్ ఏరియా అయిన జూబ్లీహిల్స్‌లో 84 ఎకరాలు, అది కూడా కేవలం కోటి రూపాయలతో దక్కించుకోవడమేంటని నెటిజన్లు షాకవుతున్నారు. ఈ వార్తపై బాహుబలి నిర్మాత శోభు యార్లగడ్డ స్పందిస్తూ.. 'ఏంటి, నిజమా? అసలు జూబ్లీహిల్స్‌లో 84 ఎకరాలు అంటే దాని విలువెంతుంటుందో మీకేమైనా తెలుసా? ఏదో ఒక చెత్త రాసేసి దానికి ఓ సెలబ్రిటీ పేరును జోడించడం బాగా అలవాటైపోయింది' అని చురకలంటించాడు. అటు డైరెక్టర్ మారుతి సైతం 'ప్రభాస్ విల్లాకు ఇంకా రాధేశ్యామ్ ఇంటీరియర్ డిజైనే వాడుతున్నట్లున్నారే?' అంటూ సెటైర్లు వేశాడు. చదవండి: ఈ సీజన్లో అన్నింటికన్నా పరమ చెత్త నిర్ణయం ఇదే ఓటీటీలో ఊర్వశివో రాక్షసివో -
‘అలిపిరికి అల్లంత దూరంలో'.. టీజర్ విడుదల
రావణ్ నిట్టూరు, శ్రీ నిఖిత హీరో హీరోయిన్లుగా నటించిన రాబరీ థ్రిల్లర్ ‘అలిపిరికి అల్లంత దూరంలో..’. జె. ఆనంద్ దర్శకత్వంలో రమేష్ డబ్బుగొట్టు, రెడ్డి రాజేంద్ర పి. నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 18న విడుదలకానుంది. శనివారం దర్శకుడు మారుతి ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా రావణ్ మాట్లాడుతూ– ‘‘నాటక రంగంలో అనుభవం ఉన్న నాకు యాక్టర్‌గా వెండితెరపై ఇది తొలి చిత్రం’’ అన్నారు. ‘‘తిరుమలలో షాపు సంపాదించుకోవాలనుకునే ఓ యువకుడి జీవితంలో జరిగిన సంఘటనల సవహారమే ఈ చిత్రం. ఈ చిత్రంలోని ప్రతి సీన్లో వెంకటేశ్వరస్వామి రిఫరెన్స్ ఉంటుంది’’ అన్నారు ఆనంద్. జె. ‘‘డివైన్ ఎలిమెంట్స్‌తో థ్రిల్లింగ్‌గా సాగే రాబరీ డ్రామా ఈ చిత్రం’’ అన్నారు నిర్మాతలు రమేష్, రాజేంద్ర. -
నన్నీ స్థాయికి తెచ్చింది చిన్న సినిమానే
‘‘చిన్న సినిమా సూపర్ హిట్టవ్వాలని కోరుకునే వ్యక్తుల్లో నేను ఒకణ్ణి. నన్ను ఈ స్థాయికి తెచ్చింది చిన్న సినిమానే’’ అని డైరెక్టర్ మారుతి అన్నారు. అజయ్, వీర్తి వఘాని జంటగా హనుమాన్ వాసంశెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కొత్త కొత్తగా’. బీజీ గోవింద రాజు సమర్పణలో మురళీధర్ రెడ్డి ముక్కర నిర్మించిన ఈ సినిమా ఈ నెల 9న విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో డైరెక్టర్ మారుతి మాట్లాడుతూ– ‘‘చిన్న సినిమా మధ్యతరగతి కుటుంబం లాంటింది.. మధ్య తరగతి బాగుంటేనే మిగతా తరగతులు బాగుంటాయి’’ అన్నారు. ‘‘అబ్బాయికి షేక్ హ్యాండ్ కూడా ఇవ్వడానికి ఇష్టపడని ఒక అమ్మాయి.. ఆ అమ్మాయిని ప్రాణంగా ప్రేమించే అబ్బాయి మధ్య జరిగే కథే ఈ సినిమా’’ అన్నారు హనుమాన్ వాసంశెట్టి. ‘‘భోజనం ఎంత పెట్టినా చివర్లో స్వీట్ ఇస్తారు.. మా సినిమా కూడా స్వీట్ లాంటింది’’ అన్నారు గోవింద రాజు. ‘‘మా సినిమాని థియేటర్లో చూసి మంచి విజయం అందించాలి’’ అన్నారు అజయ్, వీర్తి వఘాని. -
మారుతితో ప్రభాస్ మూవీ, ఇంతకీ కథేంటో తెలుసా?
ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే! అయితే ఈ సినిమా పాతబడ్డ రాజా డీలక్స్ అనే థియేటర్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే తాతామనవళ్ల కథ అని ఫిలింనగర్లో వినిపిస్తోంది. ఈ చిత్రం షూటింగ్ కోసం ఆల్రెడీ హైదరాబాద్‌లోని ఓ స్టూడియోలో థియేటర్ సెట్‌ను రెడీ చేస్తున్నారట చిత్రయూనిట్. అలాగే వీలైనంత త్వరగా రెండు షెడ్యూల్స్‌లోనే షూటింగ్‌ను పూర్తి చేయాలనే ఆలోచనలో ఉన్నారట మారుతి. హారర్ కామెడీ జానర్లో రూపొందనున్న ఈ సినిమా షూటింగ్లో ప్రభాస్ త్వరలోనే జాయిన్ కానున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. కాగా ప్రభాస్ ప్రస్తుతం సలార్, ప్రాజెక్ట్ కె సినిమాల షూటింగ్స్‌లో పాల్గొంటున్నారు. అలాగే అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్‌రెడ్డి వంగా దర్శకత్వంలో స్పిరిట్ అనే చిత్రానికి కూడా ప్రభాస్ పచ్చజెండా ఊపిన సంగతి తెలిసిందే! కాగా ఓం రౌత్ దర్శకత్వంలో ప్రభాస్ నటించిన ఆదిపురుష్ సినిమా సంక్రాంతికి విడుదల కానుంది. చదవండి: పబ్లిక్‌గా నటికి ముద్దులు.. అమ్మ చూస్తే ఏమంటుందోనంటున్న నటుడు హీరోతో సహజీవనం వార్తలపై ఇస్మార్ట్ బ్యూటీ గప్‌చుప్! -
మారుతి, ప్రభాస్ సినిమా షురూ.. టైటిల్ ఇదేనా?
ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో ఓ సినిమా రూపుదిద్దుకోనుందని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ వార్తలు నిజమే. ప్రభాస్, మారుతి కాంబినేషన్లోని సినిమా ప్రారంభోత్సవం బుధవారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ చిత్ర నిర్మాణసంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కార్యాలయంలో పూజా కార్యక్రమాల జరిగాయి. ఇటలీలో ఉండటంవల్ల ప్రభాస్ ఈ ప్రారంభోత్సవంలో పాల్గొనలేదు. హారర్–కామెడీ జానర్లో తెరకెక్కనున్న ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు నటించ నున్నారని, ‘రాజా డీలక్స్’ అనే టైటిల్ అనుకుంటున్నారనే ప్రచారం వినిపిస్తోంది. మరోవైపు ఇప్పటికే ‘సలార్’, ‘ప్రాజెక్ట్ కె’ చిత్రాలు చేస్తున్నారు ప్రభాస్. అలాగే ప్రభాస్ నటించిన ‘ఆదిపురుష్’ చిత్రం వచ్చే సంక్రాంతికి రిలీజ్ కానుంది. ఇక ‘అర్జున్ రెడ్డి’ ఫేమ్ సందీప్‌రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రభాస్ ‘స్పిరిట్’ చిత్రం చేయనున్న సంగతి తెలిసిందే. -
మారుతితో ప్రభాస్ మూవీ, చుక్కలు చూపిస్తున్న ఫ్యాన్స్!
బాయ్‌కాట్.. ట్విటర్లో ఎక్కువ ట్రెండ్ అయ్యే హ్యాష్‌ట్యాగ్ ఇది. సినిమాల విషయానికి వస్తే బాలీవుడ్‌ను టార్గెట్ చేస్తూ బాయ్‌కాట్‌ను ట్రెండ్ చేస్తుంటారు నెటిజన్లు. కానీ ఈసారి ఏకంగా టాలీవుడ్లో ఓ దర్శకుడిని బాయ్‌కాట్ చేయాలంటూ పిలుపునివ్వడం అందరినీ షాక్‌కు గురి చేస్తోంది. ప్రస్తుతం ట్విటర్లో #BoycottMaruthiFromTFI అన్న హ్యాష్‌ట్యాగ్ వరుస ట్వీట్లతో ట్రెండింగ్‌లో ఉంది. ఇంతకీ డైరెక్టర్ మారుతిని అసలు తెలుగు ఇండస్ట్రీలో నుంచే పంపించేయాలని డిమాండ్ చేయడానికి కారణమేంటో తెలుసుకుందాం.. మారుతి దర్శకత్వం వహించిన తొలి సినిమా ఈ రోజుల్లో. ఈ చిత్రంతో అందరి కంట పడ్డ ఆయన తర్వాత బస్ స్టాప్ తెరకెక్కించాడు. ఆ తర్వాత కొంత గ్యాప్ తీసుకుని కొత్త జంట, భలే భలే మగాడివోయ్ సినిమాలతో సక్సెస్ అందుకున్నాడు. అయితే ఇటీవల ఆయన తెరకెక్కించిన పక్కా కమర్షియల్ బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడింది. అది కమర్షియల్‌గా హిట్ కాకపోవడంతో ప్రభాస్ ఫ్యాన్స్‌లో భయం మొదలైంది. రేపు ప్రభాస్- మారుతి సినిమా లాంఛ్ అవుతుండటంతో అభిమానులు రంగంలోకి దూకారు. ఇప్పుడీ సినిమా అవసరమా? వద్దేవద్దంటూ వరుస ట్వీట్లతో సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు. పైగా ప్రభాస్‌కు ప్రస్తుతం బ్యాడ్ టైం నడుస్తోంది. ఇప్పటికే కొందరు దర్శకులకు ఛాన్స్ ఇచ్చి చేతులు కాల్చుకున్నాడు ప్రభాస్. రన్ రాజా రన్‌తో టాలీవుడ్‌కు దర్శకుడిగా పరిచయమైన సుజిత్ రెండో సినిమా ప్రభాస్‌తో తీశాడు. అలా వీరి కాంబినేషన్లో వచ్చిన సాహో ఘోర పరాజయం పాలైంది. ప్రయాణం, సాహసం చిత్రాలకు డైలాగ్స్ రాసిన రాధాకృష్ణకుమార్ జిల్ మూవీతో దర్శకుడిగా మారాడు. ఆయన సెకండ్ మూవీ రాధేశ్యామ్ ప్రభాస్‌తో తీయగా అది కూడా ఫ్లాప్ అయింది. వరుసగా రెండు ఫ్లాప్‌లతో డీలా పడిన ప్రభాస్ ఇటీవలే ఫ్లాప్ అందుకున్న డైరెక్టర్ మారుతితో జత కట్టకూడదని అభిమానులు ఫిక్సయ్యారు. అందుకే నెట్టింట ఈ రచ్చ! Tag is going #BoycottMaruthiFromTFI And #Prabhas is trending national wide now pic.twitter.com/ZKUECuZs9m — A★🤘 (@masscrime_mb) August 24, 2022 Fans situation right now 🥲#BoycottMaruthiFromTFI pic.twitter.com/O766VvA2Mb — SALAAR 🏹 (@bhanurockz45) August 24, 2022 Our cofan @ThePavanVarma18 beating himself because of your project @DirectorMaruthi 🙏🙏#BoycottMaruthiFromTFIpic.twitter.com/pL9jgLIiLo — The Punisher💀 (@PuneethRebel9) August 24, 2022 Prabhas anna fans situation 🥺🥲#BoycottMaruthiFromTFI pic.twitter.com/TSbb2vcAJD — Team #SSMB28 (@RoHiT____dhfm) August 24, 2022 I’m supporting this trend 🙂 Ah maruti vaddu ra babu 🙏 Smash that rt button Rebels #BoycottMaruthiFromTFI pic.twitter.com/kmFKG3nLHD — NANI || DHFPB || 3 (@nanidhfpb3) August 24, 2022 For the first time in the HISTORY of the Indian Cinema prabhas fans Boycotting their own movie & the director vere level hype🔥 #BoycottMaruthiFromTFI — UDAY 🔔 (@UDAyVarma1882) August 24, 2022 చదవండి: మేఘనా సర్జా రెండో పెళ్లి? ఆమె ఏమందంటే? సింపుల్‌గా కనిపిస్తున్న ఈ డ్రెస్ ధర ఎంతో తెలిస్తే అవాక్కవ్వాల్సిందే! -
ప్రభాస్ విషయంలో ఆ నిర్మాత వెనుకడుగు.. కారణం అదేనా?
Producer Is Change To Prabhas Maruthi Raja Deluxe Movie: 'బాహుబలి'తో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగాడు ప్రభాస్. అప్పటి నుంచి ప్రభాస్‌కు విపరీతమైన క్రేజ్ పెరిగింది. ప్రభాస్ డేట్లు దొరికితే చాలు అని అనుకుంటున్నారు నిర్మాతలు. అలాంటి ప్రభాస్‌తో సినిమా అంటే వద్దనుకుంటున్నాడట ఓ నిర్మాత. కొన్నేళ్ల క్రితం ఓ సినిమా కోసం అడ్వాన్స్ ఇచ్చిన నిర్మాత ప్రస్తుతం ఆ డబ్బు ఇస్తే చాలు, సినిమా అవసరం లేదని భావిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. అయితే ప్రభాస్, మారుతి కాంబినేషన్లో 'రాజా డీలక్స్' అనే సినిమా రానున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలసిందే. ఈ సినిమా గురించి ఎక్కడా కన్ఫర్మ్గా చెప్పలేదు కానీ, కథ, హీరోయిన్లు, చిత్రం కోసం సెట్ వంటి తదితర పుకార్లు షికార్లు చేశాయి. ఇప్పుడు తాజాగా ఈ సినిమాకు నిర్మాత మారే అవకాశం ఉందని టాలీవుడ్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాను నిర్మిద్దామనుకున్న నిర్మాత డీవీవీ దానయ్య రెమ్యునరేషన్ కింద ప్రభాస్‌కు రూ. 50 కోట్లు ఇచ్చారని ఆ మధ్య టాక్ నడిచింది. అందుకు తగినట్లుగానే మారుతి బృందం పని చేసినట్లు సమాచారం. చదవండి: Hyderabad AMB థియేటర్లో దళపతి విజయ్.. ఏ సినిమా చూశారంటే? నేను పెళ్లి చేసుకునే సమయానికే ఆమెకు ఒక బాబు: బ్రహ్మాజీ అయితే ఆ మూవీ ఎప్పటికీ సెట్స్‌పైకి వెళ్లకపోయేసరికి, మరి ఎప్పుడు స్టార్ట్ అవుతుందన్న క్లారిటీ లేకపోవడంతో డీవీవీ దానయ్య వెనక్కి తగ్గుతున్నారని టాలీవుడ్ వర్గాల నుంచి సమాచారం. ఎవరైనా నిర్మాత ముందుకొస్తే ఆ రెమ్యునరేషన్ డబ్బు తీసుకుని ప్రభాస్ డేట్స్‌ను ఇచ్చేందుకు ఫిక్స్ అయ్యారను భోగట్టా. అయితే ఇందులో ఎంత నిజం ఉందనేది క్లారిటీ లేదు. కాగా ఈ విషయంపై ఒకట్రెండు రోజుల్లో స్పష్టత వస్తుందని సమాచారం. చదవండి: రానున్న 'ది డర్టీ పిక్చర్' సీక్వెల్ ! సిల్క్ స్మితగా విద్యా బాలన్ డౌటే ? -
వరుస ఫ్లాప్స్.. ప్రభాస్ ‘రాజా డీలక్స్’ అనుమానాలు!
పక్కా కమర్షియల్ మూవీ ప్రమోషన్స్ లో మారుతి నెక్ట్స్ తాను చేయబోతున్న సినిమాల లిస్ట్ ప్రకటించాడు.అందులో ఒకటి ప్రభాస్ తో ఉంటుందని తెలిపాడు.ప్రభాస్ ఫ్యాన్ గా వింటేజ్ యంగ్ రెబల్ స్టార్ ను తెరపై చూపిస్తానని అభిమానులకు మాట కూడా ఇచ్చాడు. పక్కా కమర్షియల్ రిలీజైన 20 రోజులకు ఈ ప్రాజెక్ట్ పై ఫోకస్ పెడతానన్నాడు.అయితే ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ డౌట్స్ రైజ్ అయ్యాయి. గతేడాది మారుతి తెరకెక్కించిన ‘మంచి రోజులు వచ్చాయి’బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది.ఇక ఇటీవల గోపిచంద్‌తో తీసిన ‘పక్కా కమర్షియల్’చిత్రం కూడా కాసుల వర్షం కురిపించలేకపోయింది. దీంతో మారుతికి ప్రభాస్ సినిమా మిస్ అయిందనే వార్తలు టాలీవుడ్లో చక్కర్లు కొడుతున్నాయి. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో సినిమా తీయడం అంత ఈజీకాదు. ఆయనకున్న స్టార్‌డమ్‌ని దృష్టిపెట్టుకొని పకడ్బంధీగా కథను తీర్చిదిద్దాలి. దాన్ని యంగ్ డైరెక్టర్ మారుతి హ్యాండిల్ చేయగలడా అనుమానాలు ఇండస్ట్రీ వర్గాలు నుంచి వ్యక్తమవుతున్నాయి. గతంలో ప్రభాస్ ఇలాంటి యంగ్ డైరెక్టర్స్‌కి అవకాశాలు ఇచ్చి వరుస అపజయాలను మూటగట్టుకున్నాడు. బాహుబలి తర్వాత సుజిత్‌తో తీసిన సాహో, రాధాకృష్ణ తెరకెక్కించిన ‘రాధేశ్యామ్’ చిత్రాలు బక్సాఫీస్ వద్ద బోల్తాపడ్డాయి. ఈ దశలో మారుతికి కొత్త సినిమాను చేసే ఛాన్స్ ఇస్తాడా లేదా అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. అయితే స్టోరీతో కనుక ఇంప్రెస్ చేస్తే, మారుతితో సినిమా చేస్తానని ప్రభాస్ మాట ఇస్తే కనుకగా రాజా డీలక్స్ ఇప్పటికిప్పుడు కాకపోయినా భవిష్యత్ లో పట్టాలెక్కడం ఖాయం. -
'పక్కా కమర్షియల్'గా హిట్టు.. మొదటి వారంలోనే బ్రేక్ ఈవెన్ మార్కు !
Gopichand Pakka Commercial 1St Week Collections: మ్యాచో హీరో గోపీచంద్, విలక్షణ దర్శకుడు మారుతి కాంబినేషన్లో వచ్చిన 'పక్కా కమర్షియల్' సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తుంది. మొదటి రోజు మిక్స్డ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమాకు కలెక్షన్స్ మాత్రం అద్భుతంగా ఉన్నాయి. మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ అయిపోయింది. ఇందులో గోపీచంద్ చాలా స్టైలిష్ గా ఉన్నాడు. రాశీ ఖన్నా క్యారెక్టర్ అద్భుతంగా డిజైన్ చేసాడు మారుతి. ఈ సినిమా కోసం పబ్లిసిటీతో కలుపుకొని దాదాపు రూ. 35 కోట్లకు పైగా ఖర్చు పెట్టారు నిర్మాతలు. అందులో 32 కోట్లు కేవలం నాన్ థియేట్రికల్ రైట్స్ (డిజిటల్, శాటిలైట్, హిందీ రీమేక్, డబ్బింగ్ అన్ని) రూపంలోనే వచ్చాయి. ఇక సినిమాను చాలా చోట్ల ఓన్ రిలీజ్ చేసుకున్నారు నిర్మాతలు. అందుకే ఇంత త్వరగా బ్రేక్ ఈవెన్ మార్క్ చేరుకుంది 'పక్కా కమర్షియల్' సినిమా. ఇంత ప్లానింగ్ ఉంటుంది కాబట్టే మారుతి మోస్ట్ బ్యాంకబుల్ డైరెక్టర్ అయ్యాడు. మొదటి రోజు రూ. 6.3 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసిన ఈ చిత్రం.. ఆ తర్వాత రెండు రోజులు బాగానే క్యాష్ చేసుకుంది. ఓవరాల్‌గా 'పక్కా కమర్షియల్' మూడు రోజుల్లోనే సేఫ్ అయిపోయింది. చదవండి: మిస్ ఇండియా కిరీటం.. 21 ఏళ్ల అందం సొంతం హీరో విశాల్‌కు మరోసారి గాయాలు.. షూటింగ్ నిలిపివేత.. #PakkaCommercial collects over 𝟏𝟓.𝟐 𝐂𝐑 Worldwide in 3 Days! 🔥💥 This Week, catch the ACTION - FUN Family Entertainer at cinemas near you! 🤩 🎟️: https://t.co/BcOUguIiyK @YoursGopichand @DirectorMaruthi @RaashiiKhanna_ #BunnyVas @SKNonline @UV_Creations @adityamusic pic.twitter.com/vQpCrMOUQd — GA2 Pictures (@GA2Official) July 4, 2022 -
కమర్షియల్ హిట్ అందించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు: మారుతి
‘పక్కా కమర్షియల్’ చిత్రం మేము అనుకున్నట్లే అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటూ విజయవంతంగా దూసుకెళ్తోంది. నా సినిమాకు వచ్చే అడియన్స్ ఏం ఆశిస్తారో అవన్ని ఇందులో ఉన్నాయి. ఇలాంటి ఆన్ సీజన్ టైమ్ లో కూడా ప్రేక్షకులు మా సినిమాను ఆదరిస్తున్నారు. వారందరికి నా ధన్యవాదాలు’అన్నారు ప్రముఖ దర్శకుడు మారుతి. ఆయన దర్శకత్వం వహించిన తాజా చిత్రం ‘పక్కా కమర్షియల్’. గోపీచంద్, రాశి ఖన్నా జంటగా నటించిన ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ – యూవీ క్రియేషన్స్ పతకాలపై బన్నీ వాస్ నిరించారు. జులై 1న ఈ చిత్రం విడుదలై పాజిటివ్ టాక్ని సంపాదించుకుంది. (చదవండి: అలాంటివారిని దూరం పెడతాను: రాశీ ఖన్నా) ఈ నేపథ్యంలో తాజాగా చిత్రయూనిట్ పాత్రికేయుల సమక్షంలో సక్సెస్ సంబరాలను జరుపుకుంది. అనంతరం మారుతి మాట్లాడుతూ.. ‘మా సినిమాకు అన్ని చోట్ల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ రావడం హ్యాపీగా ఉంది. కలెక్షన్స్ రోజు రోజుకి పెరుగుతున్నాయి. చాలా రోజుల తర్వాత గోపీచంద్‌ని స్టైలీష్‌గా చూపించారని, రాశీఖన్నా ట్రాక్ బాగుందని చెబుతున్నారు. ఇంతటి ఘన విజయాన్ని అందించిన తెలుగు ప్రేక్షకులకు ధన్యవాదాలు. మళ్లీ ఇంకా బెటర్ కంటెంట్‌తో మీ ముందుకు వస్తాను’ అని అన్నారు. చిత్ర నిర్మాత బన్నీ వాసు మాట్లాడుతూ.. ఆడియన్స్ మంచి మాస్ ఎంటర్ టైనర్ సినిమా ఇస్తే బాగుంటుందని ఈ సినిమా తీశాం. మేము అనుకున్నట్లే అది ఈ రోజు అందరికీ రీచ్ అయ్యింది. తొలి రోజే రూ.6 కోట్లు కలెక్ట్ చేసింది. దీన్ని బట్టి చూస్తే మా సినిమా క్లియర్ కమర్సియల్ హిట్ కింద పరిగణించవచ్చు. ఇప్పటి వరకు వచ్చిన గోపీచంద్ సినిమాలలో ద బెస్ట్ ఓపెనింగ్ అనుకుంటున్నాను. మారుతి సినిమా అంటే ఎంటర్ టైన్మెంట్ కు మార్క్. ఇందులోని సన్నివేశాలు చూసి ప్రేక్షకులు చాలా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ సినిమాలో పనిచేసిన గోపి చంద్, రాశి ఖన్నా లకు మరియు మిగిలిన నటీ నటులందరికీ ధన్యవాదాలు ’అన్నారు. ఇలాంటి మంచి సినిమాలో నాకు క్యారెక్టర్ ఇచ్చినందుకు దర్శకనిర్మాతలకు ధన్యవాదాలు తెలిపాడు నటుడు సప్తగిరి. ‘ఎంటర్ టైన్మెంట్ కోరుకునే వారికీఈ సినిమా కచ్చితంగా నచ్చుతుంది. ప్రస్తుతం మేము టికెట్స్ రేట్ తగ్గించాం. ఇప్పట్లో ఈ సినిమా ఓటిటి లో రాదు. కాబట్టి అందరూ వచ్చి సినిమా చూసి ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను ’అన్నారు సహ నిర్మాత ఎస్కేఎన్. ఈ చిత్రంలో రావు రమేశ్, సత్యరాజ్ ఇతర కీలక పాత్రల్లో నటించారు. -
‘పక్కా కమర్షియల్’మూవీ (ఫొటోలు)
-
‘పక్కా కమర్షియల్’మూవీ రివ్యూ
టైటిల్ :పక్కా కమర్షియల్ నటీనటులు : గోపిచంద్, రాశీ ఖన్నా, రావు రమేష్, సత్యరాజ్, తదితరులు నిర్మాణ సంస్థలు : జీఏ2పిక్చర్స్, యూవీక్రియేషన్స్ నిర్మాత: బన్నీ వాసు రచన,దర్శకత్వం: మారుతి సంగీతం : జేక్స్ బిజాయ్ సినిమాటోగ్రఫీ: కరమ్ చావ్లా ఎడిటర్: ఎన్ పి ఉద్భవ్ విడుదల తేది: జులై 1, 2022 వరస విజయాలతో జోరు మీదున్న విలక్షణ దర్శకుడు మారుతి తెరకెక్కించిన సినిమా 'పక్కా కమర్షియల్'. మ్యాచో హీరో గోపీచంద్, అందాల బ్యూటీ రాశీఖన్నా జంటగా నటించిన ఈ చిత్రానికి బన్నీ వాసు నిర్మాతగా వ్యవహరించారు. టైటిల్ అనౌన్స్మెంట్ నుంచి ఈ చిత్రంపై సినీ ప్రియులకు ఆసక్తి పెరిగింది. ఇటీవల విడుదలైన టీజర్, ట్రైలర్, పాటలకు పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో పాటు మూవీ ప్రమోషన్స్ గ్రాండ్‌గా చేయడం ఈ సినిమాపై అంచనాలు పెంచాయి. పక్కా కమర్షియల్ ఫార్మాట్లో ఈ శుక్రవారం(జులై 1) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈచిత్రం ఎలా ఉంది ? కమర్షియల్ హిట్ కొట్టేసిందా లేదా రివ్యూలో చూద్దాం. కథేంటంటే... సూర్య నారాయణ (సత్య రాజ్) ఓ సిన్సియర్ న్యాయమూర్తి. వ్యాపారవేత్త వివేక్ (రావు రమేశ్) చేతిలో మోససోయిన యువతికి న్యాయం చేయలేకపోయానని బాధపడుతూ న్యాయవాద వృత్తికి రాజీనామా చేసి కిరాణ దుకాణం పెట్టుకొని జీవనం సాగిస్తాడు. అతని కొడుకు లక్కీ(గోపిచంద్) కూడా లాయర్ అవుతాడు. కానీ తండ్రిలా నిజాయతీగా కాకుండా మార్కెట్లో అవలీలగా న్యాయాన్ని అమ్మెస్తుంటాడు. తప్పు ఒప్పు చూడకుండా పక్కా కమర్షియల్‌గా వ్యవహరిస్తూ డబ్బులు సంపాదిస్తాడు. ఓ కేసు విషయంలో వివేక్ తరఫున వాదించి.. అతనికి దగ్గరవుతాడు. అయితే వివేక్ వల్ల బాధింపబడిన యువకుడి కోసం, అతని భార్య కోసం మళ్లీ నల్లకోర్టు వేసి కోర్టుమెట్లు ఎక్కుతాడు సూర్య నారాయణ. వివేక్ తరఫున కొడుకు లక్కి రంగంలోకి దిగుతాడు. ఈ న్యాయ పోరాటంలో ఎవరు గెలిచారు? సొంత తండ్రిని కాదని వివేక్ తరఫున లక్కీ ఎందుకు వాదిస్తాడు ? లక్కీ మరీ అంత కమర్షియల్‌గా ఎందుకు మారాడు ? చివరకు సూర్యనారాయణ కోరుకున్నట్లుగా వివేక్కి శిక్ష పడిందా లేదా? తండ్రికొడుకుల న్యాయపోరాటంలో సీరియల్ హీరోయిన్ ‘లాయర్ ఝాన్సీ’ ఎలాంటి పాత్ర పోషించింది? అనేదే మిగతా కథ. ఎలా ఉదంటే.. మారుతి సినిమాలన్నీ ఎంటర్టైన్మెంట్కు కేరాఫ్‌గా ఉంటాయి. కామెడీతో కడుపుబ్బా నవ్విస్తూనే మరోవైపు బలమైక కథను ముందుకు తీసుకెళ్తాడు. పక్కా కమర్షియల్‌లో కథను పక్కకు పెట్టి కామెడీతో లాక్కోచ్చాడు. హీరోయిజం మీదనే ఎక్కువ దృష్టిపెట్డాడు. టైటిల్‌కి దగ్గట్టుగా పక్కా కమర్షియల్ అంశాలు ఉండేలా జాగ్రత్త పడ్డాడు. ఓ ఎమోషనల్ సీన్‌తో సినిమా మొదలవుతుంది. లాయర్ లక్కీగా గోపిచంద్ ఎంట్రీతోనే టైటిల్ దగ్గట్టుగా పక్కా కమర్షియల్‌గా సినిమా సాగుతుంది. సీరియల్ నటి ‘లాయర్ ఝాన్సీ’ ఎంట్రీతో కామెడీ డబుల్ అవుతుంది. ఆమె క్యారెక్టరైజేషన్స్ విషయంలో మారుతి మరోసారి తన మార్క్ చూపించాడు. సీరియల్లో తన క్యారెక్టర్ని చంపారంటూ ‘లాయర్ ఝాన్సీ’ కోర్టు ఆశ్రయించే సీన్ నవ్వులు పూయిస్తుంది. రొటీన్ కామెడీ సీన్స్‌తో ఫస్టాఫ్ అంతా సోసోగా సాగుతుంది. ఇక సెకండాఫ్ నుంచి అసలు కథ మొదలవుతుంది. వివేక్కి దగ్గరైన లక్కీ చివరకు అతన్ని ఎలా జైలు పాలు చేశాడనేది వినోదాత్మకంగా చూపించాడు. సెకండాఫ్‌లో చాలా ఫ్రెష్ కామెడీతో నవ్వించాడు మారుతి. సినిమాల్లో వచ్చే ఫైట్ సీన్స్‌పై వేసిన సెటైర్, రావు రమేశ్, అజయ్ ఘోష్‌ల మధ్య వచ్చే సీన్స్ నవ్వులు పూయిస్తాయి. క్లైమాక్స్ ప్రేక్షకుడి ఊహకి అందేట్లుగా ఉంటుంది. కథని, లాజిక్స్‌ని పక్కకు పెట్టి చూస్తే.. ‘పక్కా కమర్షియల్’ పక్కా నవ్విస్తుంది. ఎవరెలా చేశారంటే.. డబ్బు కోసం అన్యాయాన్ని కూడా న్యాయంగా మార్చే పక్కా కమర్షియల్ లాయర్ లక్కీ పాత్రలో గోపిచంద్ ఒదిగిపోయాడు. తెరపై చాలా స్టైలీష్‌గా కనిపించాడు. ఇక చాలా గ్యాప్ తర్వాత తనదైన కామెడీతో నవ్వించాడు.ఫైట్ సీన్స్‌లో కూడా అద్భుతంగా నటించాడు. ఒక సీరియల్ హీరోయిన్ ‘లాయర్ ఝాన్సీ’గా రాశీఖన్నా ఇరగదీసింది. స్క్రీన్‌పై చాలా బ్యూటిఫుల్‌గా కనిపించింది. సీరియల్ భాషలో ఆమె చెప్పే డైలాగ్స్ నవ్వులు పూయిస్తాయి. ఇక హీరో తండ్రి సూర్యనారాయణ పాత్రలో సత్యరాజ్ జీవించేశాడు. ఇలాంటి పాత్రలు చేయడం ఆయనకు కొత్తేమి కాదు. మారుతి గత సినిమాల మాదిరే ఇందులో కూడా రావు రమేశ్ పాత్రకి చాలా ప్రాధాన్యత ఇచ్చాడు. విలన్ వివేక్‌గా తనదైన నటనతో మెప్పించాడు. సప్తగిరి, వైవా హర్ష, ప్రవీణ్, వరలక్ష్మీ శరత్ కుమార్ తదితరులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఇక సాంకేతిక విషయానికొస్తే.. జేక్స్ బిజాయ్ సంగీతం బాగుంది. 'పక్కా కమర్షియల్' టైటిల్ సాంగ్‌తో పాటు 'అందాల రాశి..'పాట కూడా ఆకట్టుకుంటుంది. నేపథ్య సంగీతం కూడా ఫ్రెష్‌గా ఉంది. కరమ్ చావ్లా సినిమాటోగ్రఫీ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా చాలా ఉన్నతంగా ఉన్నాయి. -
అలాంటి పాత్రలు దొరికితే మళ్లీ విలన్‌గా చేస్తా: గోపిచంద్
మాచో స్టార్ గోపిచంద్-రాశీ ఖన్నా హీరోహీరోయిన్లుగా మారుతి దర్శకత్వంతో తెరకెక్కిన తాజా చిత్రం పక్కా కమర్షియల్. అల్లు అరవింద్ సమర్పణలో జీఏ 2 పిక్చర్స్, యూవీ క్రియేషన్స్ పతాకాలపై బన్నీ వాసు నిర్మించిన ఈ చిత్రం జూలై 1న విడుదలకు సిద్ధమవుతుంది. ఈ క్రమంలో మూవీ ప్రమోషనల్లో భాగంగా గోపిచంద్, డైరెక్టర్ మారుతి ఓ టీవీ షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిత్ర విశేషాలతో పాటు వ్యక్తిగత విషయాలపై గోపిచంద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. చదవండి: నాకు అలాంటి సీన్స్‌లో నటించడమే ఈజీ: రాశీ ఖన్నా ఈ సందర్భంగా షో హోస్ట్.. పక్కా కమర్షియల్ అనే పదాన్ని ఎక్కువగా నెగెటివ్ సెన్స్ వాడతాం.. మరి అసలు ఎలా ఉండనుందనే ప్రశ్నకు గోపిచంద్ ఇలా స్పందించాడు. ‘ఈ మూవీ చాలా వినోదభరితంగా ఉంటుంది. రణం, లౌక్యం చిత్రాల తర్వాత నేను ఫుల్ లెన్త్ కామెడీ చేసింది ఈ సినిమాలోనే. పక్కా కమర్షిల్లో ఆడియన్స్ ఎంటర్టైన్ చేసే అన్ని అంశాలు ఉంటాయి’ అని సమాధానం ఇచ్చాడు. ఇప్పుడు హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న మీరు మళ్లీ విలన్‌గా చేస్తారా? అని అడగ్గా.. తప్పకుండ చేస్తానని చెప్పాడు గోపిచంద్. చదవండి: సినిమాలకు గుడ్‌బై చెప్పబోతున్న నాజర్!, కారణం ఇదేనా? అయితే తాను ఇప్పటి వరకు చేసిన విలన్ రోల్స్ అన్ని కూడా హీరోలకు ధీటుగా ఉన్నవేనని, మళ్లీ అలాంటి వైవిధ్యమైన పాత్రలు ఉంటేనే చేస్తానని తెలిపాడు. అనంతరం దర్శకుడు మారుతి మాట్లాడుతూ.. ఈ సినిమాలో మీరు అసలైన గోపిచంద్‌ని చూస్తారంటూ ఆసక్తకర కామెంట్స్ చేశాడు. గోపిచంద్ సెట్లో చాలా ప్రశాంతంగా ఉటాడని, సీన్లలోనే నటించేటప్పుడు ఆయనలోని నటుడిని చూసి ఆశ్చర్యం వేసేదన్నాడు. ఇక బయట ఉండే క్యాజువల్ గోపిచంద్‌ని మీరు ఈ సినిమాలో చూస్తారని మారుతి చెప్పుకొచ్చాడు. -
పక్కా కమర్షియల్.. బ్లాక్‌లో టికెట్స్ అమ్ముతు దొరికిపోయిన కమెడియన్!
గోపీచంద్, రాశీఖన్నా హీరో హీరోయిన్లుగా మారుతి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘పక్కా కమర్షియల్’. అల్లు అరవింద్ సమర్పణలో జీఏ 2 పిక్చర్స్, యూవీ క్రియేషన్స్ పతాకాలపై బన్నీ వాసు నిర్మించిన ఈ చిత్రం జూలై 1న విడుదల కానుంది. ఈ క్రమంలో ఈ మూవీ టికెట్స్‌ను బ్లాక్‌లో అమ్ముతూ దొరికిపోయాడు కమెడియన్ సప్తగిరి. సప్తగిరి ఈ చిత్రంలో తన కమెడియన్గతో నవ్వించబోతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సప్తగిరి బ్లాక్‌లో టికెట్స్ అమ్ముతూ డైరెక్టర్ మారుతికి అడ్డంగా దొరికిపోయాడు. అనంతరం సప్తగిరి మారుతి చివాట్లు పెట్టిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది. అయితే ఇదంత నిజం కాదండోయ్. చదవండి: ఆ జాబితాలో ‘ఆర్ఆర్ఆర్’ మూవీని వెనక్కి నెట్టిన కన్నడ చిత్రాలు జూలై 1న ఈ మూవీ విడుదల కానున్న నేపథ్యంలో టికెట్ రేట్స్‌పై ప్రేక్షకుల్లో సందేహం నెలకొంది. పక్కా కమరయల్ టికెట్ రేట్స్ ఎలా ఉండబోతున్నాయనా అని ప్రతి ఒక్కరు సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ మూవీ టికెట్ రేట్స్‌పై క్లారిటీ ఇచ్చేందుకు చిత్ర బృందం ఇలా కొత్తగా ప్లాన్ చేసింది. గీతా ఆర్ట్స్ వారు తమ యూట్యూబ్ చానల్లో షేర్ చేసినీ ఈ వీడియోలో సప్తగిరి బ్లాక్ టికెట్స్ అమ్ముతూ డైరెక్టర్ మారుతికి దొరికపోయాడు. ఏంటి.. టికెట్స్ బ్లాక్‌లో అమ్ముతున్నావా? అని మారుతి అడగ్గా... అవును సర్.. సినిమాల్లోకి రాకముందే చిరంజీవి సినిమాలకు ఇదే పని చేసేవాడిని అని బదులిస్తాడు. అయితే ఒక టికెట్‌ను ఎంతకు అమ్ముతున్నావని అడగ్గా.. 150 రూపాయలకు అంటాడు. దీనికి కౌంటర్లో కూడా ఇదే రేట్‌కు ఇస్తున్నారు కదా! అంటాడు మారుతి. అది విని షాక్ అయిన సప్తగిరి అంటే పాత రేట్స్‌కే సినిమాను ప్రదర్శిస్తున్నారా? అని ప్రశ్నిస్తాడు. చదవండి: మాధవన్‌ను చూసి ఒక్కసారిగా షాకైన సూర్య, వీడియో వైరల్ దీంతో మారుతి అవునయ్యా.. ఈ సినిమాను నాన్ కమర్షియల్ రెట్స్‌కే అందుబాటులో ఉంచుతున్నట్లు నిర్మాత బన్నీ వాసు మూవీ ప్రమోషన్లో చెబుతున్నాడు కదా! అది వినలేదా? అని చెప్పగా. అవునా సర్ అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తాడు సప్తగిరి. ఇక మూవీ టికెట్ రేట్స్‌పై వివరణ ఇస్తూ మరుతి.. ‘మా పక్కా కమర్షియల్ సినిమా మిమ్మిల్ని మళ్లీ పాత థియేటర్ల వైభవం రోజులకు తీసుకెళ్లడానికి సందడిగా హ్యాపీగా నవ్వుతూ మూవీని ఎంజాయ్ చేసేందుకు పాత రెట్స్‌కే() ఈ సినిమాను మీ ముందుకు తీసుకువస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు సినిమాను థియేటర్లోనే చూడండి. గ్రూపులు వచ్చి మా సినిమాను ఎంజాయ్ చేయండి. పాత టికెట్స్ రెట్స్‌కే మా సినిమాను థియేటర్లో ప్రదర్శించబోతున్నాం’ అంటూ డైరెక్టర్ మారుతి చెప్పుకొచ్చాడు. చదవండి: అది చెత్త సినిమా.. దానివల్ల ఏడాది పాటు ఆఫర్స్ రాలేదు: పూజా హెగ్డే -
నా ముక్కు కోసేశాడు, ప్లేటంతా రక్తం: గోపీచంద్
గోపీచంద్, రాశీ ఖన్నా జంటగా నటించిన చిత్రం పక్కా కమర్షియల్. మారుతి దర్శకత్వం వహించిన ఈ మూవీ అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2– యూవీ క్రియేషన్స్ పతాకాలపై బన్నీ వాసు నిర్మించారు. ఈ సినిమా జూలై 1న విడుదల కానున్న తరుణంలో ప్రమోషన్స్‌తో బిజీ అయ్యాడు గోపీచంద్. తాజాగా అతడు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 'నేను ఇండస్ట్రీకి రావడానికి కారణమైన వారిలో నిర్మాత నాగేశ్వరరావు ఒకరు. ఆయన నన్ను హీరోగా పెట్టి తొలి వలపు సినిమా చేశారు. అది ఫస్ట్ మూవీ కావడంతో నేనెలా చేస్తానో అని చాలామందికి అనుమానపడ్డారు. చివరకు ఆ సినిమా అంతగా విజయం సాధించలేదు. ఆరునెలల వరకు ఏ సినిమా రాలేదు. ఆ తర్వాత పరిస్థితుల వల్ల విలన్‌గా చేశాను. నేను చేసినవాటిలో కొన్ని ఆడవని ముందే అనిపించాయి. ఎందుకు ఒప్పుకున్నాన్రా బాబు అని మనసులో అనుకున్నాను. చిన్నప్పుడు నా అన్న ప్రేమ్‌చంద్ బ్లేడు తీసుకుని నా దగ్గరకు వచ్చాడు. ముక్కు కోసి పప్పులో పెడతారా? ఎలా పెడతారు? అంటూ బ్లేడు తీసుకుని నా ముక్కు కోసేశాడు. అప్పుడు నేను పెరుగన్నం తింటున్నా.. రక్తం కారి నా పళ్లెంలో నిండిపోయింది. ఇక నా చిన్నతనంలో అంటే దాదాపు నేను ఎనిమిదేళ్ల వయసులో ఉన్నప్పుడు నాన్న చనిపోయారు. చిన్నప్పుడే జీవితం చాలా నేర్పించింది' అని ఎమోషనలయ్యాడు గోపీచంద్. ఆ తర్వాత మారుతి తనకెదురైన చేదు అనుభవాన్ని పంచుకున్నాడు. 'ఒకసారి ల్యాబ్‌కు వెళ్లినప్పుడు.. సినిమా ఫస్ట్ కాపీ చూసి తక్కువ నిడివిలో తీయాలి, ఇలా తీయకూడదు అని సూచించాను. దానికాయన నువ్వు డైరెక్టర్ అయి సినిమా తీయు, తెలుస్తుంది. అప్పుడు ఎలా తీయాలో మాకు చెప్పండి, నేర్చుకుంటాం అంటూ నానామాటలు అన్నారు' అని గుర్తు చేసుకున్నాడు. చదవండి: బికినీ ఫొటోలు నాన్న చూడకూడదని అలా చేస్తా.. బుల్లితెర నటి టాలీవుడ్లో సినీ కార్మికుల సమ్మె సైరన్, షూటింగ్స్ బంద్! -
పక్కా కమర్షియల్ ట్రైలర్: నేను హీరోను కాదు, విలన్..
'ప్రతిరోజు పండగే' లాంటి బ్లాక్ బస్టర్ సక్సెస్ తర్వాత విలక్షణ దర్శకుడు మారుతి చేస్తున్న సినిమా పక్కా కమర్షియల్. గోపీచంద్ హీరోగా రాశీ ఖన్నా కథానాయికగా నటించింది. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ గారి సమర్పణలో జీఏ2 పిక్చర్స్, యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై బన్నీ వాసు నిర్మించారు. ఇప్పటికే విడుదలైన పక్కా కమర్షియల్ టీజర్, పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఆదివారం నాడు సినిమా ట్రైలర్ విడుదల చేసారు దర్శక నిర్మాతలు. ‘మీతో సెల్యూట్ కొట్టించుకోడానికి నేను హీరో కాదురా.. విలన్’ అంటూ గోపీచంద్ చెప్పిన డైలాగ్ అదిరిపోయింది. ట్రైలర్ అంతా పక్కా కమర్షియల్ కోణంలో ఉంది. రాశీ ఖన్నా డైలాగ్స్ కూడా ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకున్నాయి. సత్యరాజ్, రావు రమేష్ పాత్రలు విభిన్నంగా డిజైన్ చేసారు మారుతి. దివంగత గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు రాసిన టైటిల్ సాంగ్‌కు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. జూలై 1న పక్కా కమర్షియల్ ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ చిత్రానికి జకేస్ బీజాయ్ సంగీతాన్ని అందిస్తున్నారు. చదవండి: చిరు ఇంట్లో విక్రమ్ టీంకు గ్రాండ్ పార్టీ, సల్మాన్ ఖాన్ సందడి ఏమో, చనిపోతామేమో.. అని వీడియో, కొద్ది గంటలకే మృతి -
Prabhas: అందుకే మారుతితో మూవీ చేస్తున్నా.. ప్రభాస్ క్లారిటీ!
పాన్ ఇండియా ట్రెండ్ లోకి ఎంత మంది హీరోలు వచ్చినప్పటికీ,ప్రభాస్ స్టార్ డమ్ కు మాత్రం తిరుగులేదు.ఆ విధంగా తాను ప్రాజెక్ట్స్ కమిట్ అయ్యాడు. వచ్చే ఏడాదిలో ఆదిపురుష్, సలార్ లాంటి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ చిత్రాలతో బాహుబలి 2 రిలీజైనప్పటి రోజులను,ఇంకా చెప్పాలంటే కేజీయఫ్ 2 రిలీజ్ హంగామాను మరోసారి రిపీట్ చేస్తానంటున్నాడు.మరో వైపు ప్రాజెక్ట్ కే , స్పిరిట్ లాంటి చిత్రాలు కూడా చేతిలో ఉన్నాయి. అయినా డైరెక్టర్ మారుతి సినిమాకు ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం అందరికి ఆశ్చర్యం కలిగించింది. అయితే దానికి ఓ కారణం ఉంది అంటున్నాడు ప్రభాస్. పాన్ ఇండియా చిత్రాల మధ్య రాధేశ్యామ్ లాంటి లవ్‌స్టోరీ, మారుతితో మరో డిఫరెంట్ మూవీని ఎందుకు చేస్తున్నాడో క్లారిటీ ఇచ్చాడు. ప్రస్తుతం తన చేతిలో ఉన్న ప్రాజెక్ట్స్ లో ఎక్కువ భాగం యాక్షన్ మూవీస్ ఉన్నాయని, వీటి మధ్య తాను విభిన్నంగా కనిపించేందుకు రాధేశ్యామ్ లాంటి చిత్రాలు చేస్తున్నట్లు చెప్పాడు ప్రభాస్. మారుతితో కూడా అలాంటి డిఫరెంట్ మూవీ ప్లాన్ చేస్తున్నాడట. పక్కా ప్లాన్ ప్రకారమే ప్రభాస్ మారుతికి ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. ఇక ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘సలార్’ వచ్చే ఏడాది సమ్మర్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.సినిమా రిలీజ్ డేట్ తో సహా సలార్ టీజర్ ను మేలో రిలీజ్ చేయబోతున్నారు. -
'పక్కా కమర్షియల్'గా ఆ ఓటీటీకి డిజిటల్ రైట్స్..
Gopichand Pakka Commercial Movie Digital Rights Acquires Aha OTT: హీరో గోపీచంద్, బొద్దుగుమ్మ రాశీ ఖన్నా ముచ్చటగా మూడోసారి జంటగా నటిస్తున్న చిత్రం 'పక్కా కమర్షియల్'. డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్, యూవీ క్రియేషన్స్‌లో నిర్మాత బన్నీ వాసు నిర్మిస్తున్నారు. ఇంతకుముందు ఈ సినిమా నుంచి వచ్చిన ట్రైలర్లు, పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ఔట్ అండ్ ఔట్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ మూవీ జులై 1న ప్రేక్షకుల మందుకు వస్తున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. చదవండి: సిరివెన్నెల చివరి అక్షరమాల.. డైరెక్టర్ మారుతి ఎమోషనల్ తాజాగా ఈ సినిమా గురించి ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ మూవీ విడుదలకు ముందే పోస్ట్ థియేట్రికల్ హక్కులను మంచి మొత్తానికి ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ ఆహా సొంతం చేసుకుంది. ఈ సినిమా థియేటర్లలో విడుదల కొన్ని వారాల తర్వాత డిజిటల్ రైట్స్‌ను 'పక్కా కమర్షియల్'గా సొంతం చేసుకున్న ఆహా ప్లాట్ఫామ్లో ప్రసారం కానుంది. జేక్స్ బిజోయ్ మ్యూజిక్ అందించిన ఈ చిత్రానికి దివంగత గేయ రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి చివరిసారిగా పాటలు రాశారు. ఈ సినిమాలో సత్యరాజ్, రావు రమేష్, అనసూయ భరద్వాజ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. చదవండి: జన్మించినా మరణించినా ఖర్చే ఖర్చు.. ఫిబ్రవరి 2 సిరివెన్నెల చివరి పాట -
వరుస ఫెయిల్యూర్స్.. అయినా వారికే చాన్స్ ఇస్తున్న ప్రభాస్!
బాహుబలి సిరీస్‌తో బ్లాక్ బస్టర్స్ అందుకున్నాడు ప్రభాస్.పాన్ ఇండియా స్టార్ గా మారాడు.అదే స్పీడ్ లో వరుసగా ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్స్ చేస్తున్నాడు.కాని యంగ్ డైరెక్టర్స్ వరుసగా అవకాశాలు ఇస్తుండటం హాట్ టాపిక్ గా మారింది.వారు ఫెయిల్యూర్స్ ఇస్తున్నా సరే,యంగ్ టాలెంట్ ను మాత్రం ప్రభాస్ ఎంకరేజ్ చేస్తూనే ఉన్నాడు. బాహుబలి తర్వాత ప్రభాస్ ఏరికోరి రన్ రాజా రన్ దర్శకుడు సుజిత్ కు సాహో తీసే అవకాశం ఇచ్చాడు.సీన్ కట్ చేస్తే ఈ సినిమా బాలీవుడ్ లో తప్పితే ఎక్కడ విజయం సాధించలేకపోయింది.జిల్ తీసిన రాధాకృష్ణకు పిలిచి రాధేశ్యామ్ తెరకెక్కించాల్సిందిగా కోరాడు ప్రభాస్.సాహో కంటే పెద్ద బడ్జెట్‌తో అంతకంటే ఎక్కువ రోజుల షూటింగ్ తో తెరకెక్కింది రాధేశ్యామ్.భారీ అంచనాల మద్య ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి డిజాస్టర్ గా నిలిచింది. సాహో, రాధేశ్యామ్ ఫెయిల్యూర్స్ చూసిన తర్వాత కూడా ప్రభాస్ ఇప్పుడు మరో యంగ్ డైరెక్టర్ కు అవకాశం ఇవ్వాలనుకోవడం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. ఆ డైరెక్టర్ మరెవరో కాదు మారుతి. కెరీర్ లో చాలా వరకు యంగ్ హీరోస్ తో సినిమాలు చేస్తూ వచ్చాడు. బాబు బంగారంతో వెంకీని డైరెక్ట్ చేసాడు. అయితే ఈ సినిమా పెద్దగా అలరించలేకపోయింది. ప్రస్తుతం ప్రభాస్ ఫ్రెండ్ గోపీచంద్ తో పక్కా కమర్షియల్ చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత ప్రభాస్ తో పాన్ ఇండియా మూవీ లాక్ చేసుకున్నాడు మారుతి. సాహోతో సుజిత్ అందిచలేకపోయిన సక్సెస్ ను, రాధేశ్యామ్ తో రాధాకృష్ణ అందిచలేకపోయిన విజయాన్ని ప్రభాస్ కు తాను అందిస్తాను అంటున్నాడు మారుతి.యంగ్ రెబల్ స్టార్ కోసం పవర్ స్టోరీ రెడీ చేశాడట. ముగ్గురు హీరోయిన్స్ కు స్కోప్ ఉన్న ఈ స్టోరీలో అనుష్కకు కూడా ఒక హీరోయిన్ గా కనిపించనుందట. మిర్చి, బాహుబలి సిరీస్ తర్వాత ప్రభాస్, అనుష్క జోడి మారుతి మూవీలో మరో మారు కనిపించబోతున్నారనే వార్త టీటౌన్ ను షేక్ చేస్తోంది. -
గోపీచంద్ ‘పక్కా కమర్షియల్’ రిలీజ్ డేట్ వచ్చేసింది
మ్యాచో హీరో గోపీచంద్‌తో దర్శకుడు మారుతి చేస్తున్న తాజా చిత్రం ‘పక్కా కమర్షియల్’. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ - యూవీ క్రియేషన్స్‌లో ప్రొడ్యూసర్ బన్నీ వాసు నిర్మిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ టీజర్, ట్రైలర్లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే ఈ మూవీ టైటిల్‌కు అనూహ్యమైన స్పందన వచ్చింది. ఇదిలా ఉంటే తాజాగా ఈమూవీ రిలీజ్ డేట్ ప్రకటించారు మేకర్స్. చదవండి: మెగా కోడలు ఉపాసనకు ప్రతిష్టాత్మక అవార్డు జులై 1, 2022న పక్కా ఎంటర్టైన్మెంట్తో వస్తున్నామంటూ మేకర్స్ అధికారిక ప్రకటన ఇచ్చారు. మారుతి డైరెక్షన్లో ఔట్ అండ్ ఔట్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ మూవీలో రాశీ ఖాన్నా హీరోయిన్గా నటిస్తుంది. ఈ మూవీలో సత్యరాజ్, జగపతి బాబులు కీలక పాత్రలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి జేకేస్ బీజాయ్ సంగీతాన్ని అందిస్తున్నాడు. చదవండి: తెలుగు సినిమాల్లో అసలు నటించను: బాలీవుడ్ హీరో షాకింగ్ కామెంట్స్ Get ready for 100% Pakka Entertainment! 🤙 Macho star @YoursGopichand & @DirectorMaruthi 's #PakkaCommercial in theatres from 𝐉𝐔𝐋𝐘 𝟏𝐬𝐭, 2022.#PakkaCommercialOnJuly1st #AlluAravind @RaashiiKhanna_ #BunnyVas @JxBe #KarmChawla @SKNonline @UV_Creations @GA2Official pic.twitter.com/Rxg217DIqc — BA Raju's Team (@baraju_SuperHit) March 30, 2022 -
క్రేజీ అప్డేట్: మరోసారి ప్రభాస్‌తో అనుష్క..!
హీరో ప్రభాస్‌తో అనుష్కది సూపర్ హిట్ కాంబినేషన్ అన్న సంగతి తెలిసిందే. దర్శకదిగ్గజం రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి 2 వంటి బ్లాక్ బస్టర్ హిట్ తరువాత మరోసారి ప్రభాస్, అనుష్క జంట కలిసి సినిమా చేయబోతున్నట్టు వార్తలొస్తున్నాయి. మారుతి దర్శకత్వంలో ప్రభాస్ ఇటీవల ఓ సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నెల్ ఇచ్చినట్టు జోరుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఇక పక్కా మాస్ ఎంటర్టైనర్గా రానున్న ఈ చిత్రాన్ని డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై డివివి దానయ్య నిర్మించబోతున్నట్టు సమాచారం. పాన్ ఇండియా లెవల్లో రానున్న ఈ చిత్రంలో ముగ్గురు హీరోయిన్లు ఉన్నట్టు తెలుస్తోంది. అయితే అందులో మెయిన్ హీరోయిన్ పాత్ర కోసం అనుష్కను సెలెక్ట్ చేసినట్టు సమాచారం. ఇక తన పాత్రకు మంచి ప్రాధాన్యత ఉండటంతో జేజమ్మ ఈ చిత్రానికి ఓకే చెప్పినట్టు సోషల్ మీడియాలో ప్రస్తుతం ప్రచారం జరుగుతోంది. ఇక రెండో హీరోయిన్గా కృతి శెట్టిని దాదాపుగా కన్ ఫార్మ్ చేసినట్టు తెలుస్తోంది. మరో హీరోయిన్గా మాళవిక పేరుని పరిశీలిస్తున్నట్టు సమాచారం. ఇక ఇదిలా ఉంటే కొంతకాలంగా అనుష్క సినిమాలకి దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. అయితే ప్రభాస్‌తో అనుష్క కాంబినేషన్‌పై అధికారిక సమాచారం రావాల్సి ఉంది. -
శ్రీవారి సేవలో సినీ దర్శకుడు మారుతి
Director Maruthi Visits Tirumala With His Family: ద్వారకాతిరుమల చినవెంకన్న ఆలయాన్ని సినీ దర్శకుడు దాసరి మారుతి మంగళవారం సందర్శించారు. 108 ప్రదక్షిణలు చేసి మొక్కు తీర్చుకున్నారు. సతీసమేతంగా స్వామి, అమ్మవార్లను దర్శించి ప్రత్యేక పూ జలు చేయించారు. పండితులు ఆయనకు శేషవస్త్రాన్ని కప్పి వేద ఆశీర్వచనాన్ని పలి కారు. శ్రీవారి జ్ఞాపిక, ప్రసాదాలను అందజేశారు. చదవండి: (రామారావు ఆన్ డ్యూటీ రిలీజ్ డేట్ వచ్చేసింది, ఎప్పుడంటే?) -
మారుతి డైరెక్షన్లో ప్రభాస్ మూవీ, హాటాటాపిక్గా ‘డార్లింగ్’ రెమ్యునరేషన్
‘బాహుబలి’, ‘సాహె’ చిత్రాల తర్వాత ప్రభాస్ ఒక్కసారిగా గ్లోబల్ స్టార్‌గా మారిపోయాడు. అప్పటి వరకు సౌత్ ఇండియాకు మాత్రమే పరిమితమైన ప్రభాస్ క్రేజ్ ప్రపంచ వ్యాప్తంగా వ్యాపించింది. దీంతో ప్రభాస్ నటించే ప్రతీ సినిమా దేశం దృష్టిని ఆకర్షిస్తోంది. ఇదిలా ఉంటే చాలా గ్యాప్ తర్వాత ప్రభాస్ రాధేశ్యామ్‌తో ఇటీవల ఫ్యాన్స్‌ను పలకరించాడు. ఆ తర్వాత వరుసగా ఆదిపురుష్, సలార్, స్పిరిట్ చిత్రాలు లైన్లో ఉన్నాయి. వీటితో పాటు ప్రభాస్ డైరెక్టర్ మారుతీ కాంబినేషన్లో ఓ పాన్ ఇండియా చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. కామెడీ, హార్రర్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ చిత్రం ఉంటుందని సమాచారం. చదవండి: Dhanush-Aishwarya: విడాకుల తర్వాత ఐశ్యర్యపై ధనుష్ తొలి ట్వీట్, నెటిజన్ల అసహనం అయితే ఈ సినిమాకు ప్రుభాస్ తీసుకుంటున్న పారితోషికం ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారింది. ఈ సినిమా కోసం ప్రభాస్ కేవలం 60 రోజుల కాల్షీట్లు మాత్రమే ఇచ్చాడట. దీనికి గాను ఏకంగా రూ. 75 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడని తెలుస్తోంది. అంటే ప్రభాస్ రోజుకు ఏకంగా రూ. 1.25 కోట్ల వరకు తీసుకోనున్నాడన్నమాట. ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ పనులను జరుపుకుంటోన్న ఈ మూవీలో ‘డార్లింగ్’కు జోడిగా ముగ్గురు హీరోయిన్లు నటించనున్నారటి టాక్. వీరిలో ఉప్పెన ఫేమ్ కృతీ శెట్టి ఒకరని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే ప్రస్తుతం ప్రాజెక్ట్ కే, ఆదిపురుష్, సలార్ చిత్రాలతో బిజీగా ఉన్న ప్రభాస్ ఆ సినిమాలను పూర్తి చేసి మారుతి సినిమాను సెట్స్‌పైకి తీసుకువస్తాడని సమాచారం. చదవండి: Ram Gopal Varma: ‘రాధేశ్యామ్’ మూవీపై వర్మ షాకింగ్ కామెంట్స్ -
ప్రభాస్‌తో మారుతి చిత్రం.. 'రాజా డీలక్స్' కాదా..!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రాధేశ్యామ్ సినిమాతో ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఆ తర్వాత వరుసగా ఆదిపురుష్, సలార్, స్పిరిట్ చిత్రాలు లైన్లో ఉన్నాయి. వీటితో పాటు ప్రభాస్ డైరెక్టర్ మారుతీ కాంబినేషన్లో ఓ పాన్ ఇండియా చిత్రం తెరకెక్కనుంది. కామెడీ, హార్రర్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ చిత్రం ఉంటుందని సమాచారం. అయితే ఈ చిత్రానికి ఇప్పటికే 'రాజా డీలక్స్' అనే టైటిల్ ప్రచారంలో ఉంది. ఇక తాజా విషయం ఏంటంటే ఈ సినిమాకు మొదట రాజా డీలక్స్ అనే టైటిల్ వినిపించినా ఆ టైటిల్ ప్రభాస్ కోసం కాదని మరో హీరో కోసమని సమాచారం. మారుతి మాస్ రాజా రవితేజతో కూడా ఓ సినిమాను తెరకెక్కించడానికి సిద్ధమయ్యారని తెలుస్తోంది. అయితే ఆ చిత్రం కోసం మారుతీ 'రాజా డీలక్స్' అనే టైటిల్ ఫిక్స్ చేసినట్టు సమాచారం. ఇక దీంతో ప్రభాస్ చిత్రానికి సరైన టైటిల్ ఖరారు చేసే పనిలో మారుతీతో పాటు అతని బృందం బిజీగా ఉన్నారు. అయితే ఈ చిత్రానికి సరైన టైటిల్‌ను త్వరలోనే మేకర్స్ అధికారికంగా ప్రకటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇక ఈ ప్రాజక్టుకు సంబందించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో బేబమ్మ రొమాన్స్..
Prabhas And Krithi Shetty In Raja Deluxe Movie: ఉప్పెన సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది కృతిశెట్టి. చూడడానికి అచ్చం తెలుగు అమ్మాయిలా ఉండే ఈ కన్నడ భామ.. ఒకే ఒక్క సినిమాతో స్టార్ హీరోయిన్స్ జాబితాలో చేరిపోయింది. ‘ఉప్పెన’తర్వాత వరుస ఆఫర్లతో దూసుకుపోతుంది ఈ భామ. ఆకర్షించే ఆందంతో పాటు, ఆకట్టుకునే నటనతో తక్కువ కాలంలోనే తెలుగు ప్రేక్షకులకు ఎంతగానో దగ్గరైంది. ఇప్పటికే హ్యాట్రిక్ హిట్ కొట్టిన కృతి ఇప్పుడు మరో మూడు సినిమాల్లో నటిస్తుంది. సుధీర్‌బాబుతో 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి', రామ్‌తో 'ది వారియర్', నితిన్‌తో 'మాచర్ల నియోజక వర్గం' సినిమాలు చేస్తుంది. తాజాగా ఈ భామ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో జతకట్టే ఛాన్స్ కొట్టేసినట్లు తెలుస్తుంది. రీసెంట్గా రాధేశ్యామ్‌తో ప్రేక్షకులను పలకరించిన ప్రభాస్ ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్స్ కాగా, ఇప్పటికే కృతిశెట్టి ఎంపికయినట్లు సమాచారం. దీనిపై త్వరలోనే అఫీషియల్ అనౌన్స్మెంట్ రానుంది. -
ప్రభాస్ సినిమాకి టైటిల్ మారనుందా? త్వరలోనే అప్డేట్
పాన్ ఇండియ స్టార్ ప్రభాస్ రాధేశ్యామ్ సినిమాలో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఆ తర్వాత వరుసగా ఆదిపురుష్, సలార్, ప్రాజెక్ట్, స్పిరిట్ చిత్రాలు లైన్లో ఉన్నాయి. వీటితో పాటు ప్రభాస్ డైరెక్టర్ మారుతీ కాంబినేషన్లో ఓ పాన్ ఇండియా చిత్రం తెరకెక్కనుంది. కామెడీ, హార్రర్ బ్యాక్‌డ్రాప్‌లో సాలిడ్ ఎంటర్టైన్మెంట్గా రూపొందుతున్న ఈ సినిమా గురించి తాజాగా క్రేజీ రూమర్ చక్కర్లు కొడుతుంది. ఇప్పటికే ఈ చిత్రానికి రాజా డీలక్స్ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. అయితే తాజాగా ఆ టైటిల్‌ను మార్చేందుకు సన్నాహాలు చేస్తున్నారట. ఆ టైటిల్‌కి పెద్దగా రెస్పాన్స్ లేకపోవడంతో దాన్ని మార్చాలని చూస్తున్నారట. పాన్ఇండియా స్థాయిలో తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుందట. త్వరలోనే దీనికి సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్ రానుంది. చదవండి: 'రాధేశ్యామ్'పై క్రేజీ అప్డేట్ ఇచ్చిన తమన్ -
స్పిరిట్ కంటే ముందు ‘రాజా డీలక్స్’ను సెట్స్‌పై తీసుకొచ్చే ప్లాన్‌లో ప్రభాస్?
ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చేతిలో దాదాపు అరజడజను చిత్రాలు ఉన్నాయి. రాధేశ్యామ్, సలార్, ఆదిపురుష్, ప్రాజెక్ట్ కె, స్పిరిట్‌తో పాటు మరిన్న ప్రాజెక్ట్స్ చర్చల దశలో ఉన్నాయి. అయితే ఇప్పటికే రాధేశ్యామ్, ఆదిపురుష్ చిత్రాలు షూటింగ్‌ను పూర్తి చేసుకోగా మార్చిలో రాధేశ్యామ్ విడుదలకు సిద్ధమైంది. సలార్ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ప్రస్తుతం నాగ్ అశ్విన్ ప్రాజెక్ట్ K షూటింగ్‌ను జరుపుకుంటోంది. వీటి తర్వాత ప్రభాస్ సందీప్ వంగతో స్పిరిట్ మూవీని సెట్స్‌పై తీసుకువస్తాడని అంతా అనుకున్నారు. కానీ దీని కంటే ముందు ప్రభాస్ మారుతి సినిమాను పట్టాలెక్కించేలా కనిపిస్తున్నాడట. కాగా డైరెక్టర్ మరుతితో ప్రభాస్ ఓ సినిమా చేయబోతున్నాడని, ఇప్పటికే చర్చలు, స్క్రిప్ట్ కూడా పూర్తయ్యాయంటూ వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అంతేకాదు ఈ ప్రాజెక్ట్‌కు 'రాజా డీలక్స్'గా టైటిల్ ఖరారు చేసినట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఇప్పటి వరకు ఈ వార్తలను మారుతి ఖండించలేదు. దీంతో ఇది నిజమే అని అంతా భావిస్తున్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం ఈ మూవీ సెట్స్ నిర్మాణ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయంటూ ఫిలిం దునియాలో గుసగుసలు వినిపిస్తున్నాయి. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన చేసి, గ్యాప్ లేకుండానే రెగ్యులర్ షూటింగును మొదలుపెట్టే ఆలోచనలో ఉన్నారని చెప్పుకుంటున్నారు. దీని బట్టి చూస్తుంటే 'స్పిరిట్' కాస్త ఆలస్యమయ్యేలాగే కనిపస్తుంది. -
ప్రభాస్ సరసన పెళ్లి సందD హీరోయిన్!
Sri Leela To Share Screen With Prabhas: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా గడుపుతున్నాడు. ప్రస్తుతం ఆయన నటించిన రాధేశ్యామ్ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ఇక ఆదిపురుష్, సలార్ సినిమాలు సైతం షూటింగ్ దశలో ఉన్నాయి. ఇక ప్రభాస్ మారుతీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ‘రాజా డీలక్స్’ టైటిల్ ప్రచారంలో ఉన్న ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఓ వార్త సర్క్యులేట్ అవుతుంది. ఈ సినిమాలో పెళ్లి సందD హీరోయిన్ శ్రీలీల.. ప్రభాస్‌తో స్క్రీన్ షేర్ చేసుకోనున్నట్లు టాక్ వినిపిస్తుంది. ఇందులో మొత్తం ముగ్గురు హీరోయిన్లు నటించనుండగా అందులో శ్రీలీల ఒక హీరోయిన్గా ఎంపికైనట్లు తెలుస్తుంది. -
పక్కా కమర్షియల్ నుంచి ఫస్ట్ సింగిల్, ఆకట్టుకుంటున్న లిరిక్స్..
మ్యాచో హీరో గోపీచంద్‌తో విలక్షణ దర్శకుడు మారుతి చేస్తున్న తాజా చిత్రం ‘పక్కా కమర్షియల్’. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ గారి సమర్పణలో జీఏ2 పిక్చర్స్ - యూవీ క్రియేషన్స్‌లో ప్రొడ్యూసర్ బన్నీ వాసు నిర్మిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ టీజర్, ట్రైలర్లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపథ్యంలో నేడు మూవీ విడుదల తేదీని ప్రకటించిన ప్రకటించిన చిత్రం బృందం, తాజాగా ఫస్ట్ సింగిల్‌ను విడుదల చేసింది. పాటలోని లిరిక్స్ అందరిని ఆకట్టుకుంటున్నాయి. ఈ పాట ఓ ప్రత్యేకత ఉంది. దివంగత గేయ రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి కలం నుంచి జాలువారిన స్ఫూర్తిదాయక గీతం ఇదికావడం విశేషం. సిరివెన్నెల గారు చివరిగా రాసిన జీవిత సారాంశం ఈ పాటలో కనిపిస్తుంది. పూజలు పునస్కారాలు నమస్కారాలు అన్నీ పక్కా కమర్షియల్.. దేవుడు జీవుడు భక్తులు అగత్తులు అన్నీ పక్కా కమర్షియల్.. ఎయిర్ ఫ్రీయా.. నో.. నీరు ఫ్రీయా.. నో.. ఫైర్ ఫ్రీయా.. నో.. నువ్ నుంచున్న జాగా ఫ్రీయా.. అన్నీ పక్కా పక్కా పక్కా కమర్షియల్.. జన్మించినా మరణించినా అవదా ఖర్చు.. జీవించడం అడుగడుగునా ఖర్చే ఖర్చు.. ఈ పాటలోని లిరిక్స్ తలుచుకొని దర్శకుడు మారుతి ఎమోషనల్ అయ్యారు. మరణం గురించి ముందే తెలిసినట్టు ఆయన కొన్ని పదాలు ఈ పాటలో సమకూర్చారు అంటూ.. సిరివెన్నెల గారిని గుర్తు చేసుకున్నారు మారుతి. ఈ పాటలో ఇంకా ఎన్నో అద్భుతమైన పదాలు వున్నాయని.. జీవితం గురించి, పుట్టుక చావు గురించి అద్భుతమైన సాహిత్యం పక్కా కమర్షియల్ టైటిల్ సాంగ్‌లో ఉంటాయని మారుతి చెప్పారు. -
సిరివెన్నెల చివరి అక్షరమాల.. డైరెక్టర్ మారుతి ఎమోషనల్
Maruthi Emotional On Pakka Commercial Title Song Lyricist Sirivennela: మాచో స్టార్ గోపిచంద్ సినిమాలపై జోరు పెంచాడు. సీటిమార్ సినిమా తర్వాత వెంటనే మారుతి దర్శకత్వంలో పక్కా కమర్షియల్ సినిమా చేస్తున్నాడు. యూవీ క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ 2 సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీ నుంచి మొదటి సింగిల్ అయిన 'పక్కా కమర్షియల్' టైటిల్ సాంగ్ ను ఫిబ్రవరి 2న సాయంత్రం 4 గంటలకు విడుదల చేయనున్నారు. దీనికి సంబంధించిన సాంగ్ టీజర్‌ను రిలీజ్ చేశారు నిర్మాతలు. ఈ టీజర్లో గోపిచంద్ చాలా స్టైలిష్‌గా కనిపిస్తున్నాడు. 'పక్కా.. పక్కా.. పక్కా కమర్షియలే' అంటూ సాగుతున్న ఈ టీజర్‌కు మంచి స్పందన వస్తుంది. అయితే ఈ పాటకు మరో ప్రత్యేకత ఉంది. దివంగత గేయ రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి కలం నుంచి జాలువారిన స్ఫూర్తిదాయక గీతం ఇది. సిరివెన్నెల చివరిసారిగా రాసిన ఈ పాటలో జీవిత సారాంశం ఉండనుందట. దీంతో డెరెక్టర్ మారుతి బాగా ఎమోషనల్ అవుతున్నారు. జన్మించిన మరణించినా ఖర్చే ఖర్చు అంటూ సాగే అందమైన పాట రాశారని మారుతి పేర్కొన్నారు. మరణం గురించి ముందే తెలిసినట్లు ఆయన కొన్ని పదాలు ఈ పాటలో సమకూర్చారు అంటూ సిరివెన్నెలను గుర్తు చేసుకున్నారు మారుతి. జీవితం గురించి, పుట్టుక చావు గురించి అద్భుతమైన సాహిత్యంతోపాటు ఈ సాంగ్‌లో మరెన్నో అద్భుతాలు ఉన్నాయని మారుతి తెలిపారు. -
ప్రభాస్‌తో సినిమా? కాలమే సమాధానం చెబుతుందన్న డైరెక్టర్
Director Maruthi New Movie Updates: ‘సలార్’, ‘ఆదిపురుష్’, ‘ప్రాజెక్ట్ కె’, ‘స్పిరిట్’.. ఇలా వరుసగా పాన్ ఇండియన్ సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తోన్న ప్రభాస్ తర్వాతి చిత్రం గురించి ఫిల్మ్‌నగర్‌లో ఓ హాట్ టాపిక్ వినిపిస్తోంది. ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనుందని, ఈ సినిమాకు ‘రాజా డీలక్స్’ అనే టైటిల్ అనుకుంటున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఇది పాన్ ఇండియన్ ఫిల్మ్ కాదని, కేవలం తెలుగులో మాత్రమే రానుందనే టాక్ కూడా వినిపిస్తోంది. ఈ చిత్రంలో ప్రభాస్ హీరోగా చేయడం లేదని, దాదాపు 30 నిమిషాల నిడివి ఉండే ఓ లీడ్ క్యారెక్టర్ చేయనున్నారన్నది మరో టాక్. ఈ వార్తలు ఇలా ప్రచారం అవుతున్న నేపథ్యంలో మారుతి చేసిన ఓ ట్వీట్ ఈ చిత్రానికి సంబంధించినదే అయ్యుంటుందనే ఊహాగానాలు కూడా నెలకొన్నాయి. ‘‘నా భవిష్యత్ ప్రాజెక్ట్స్ గురించిన కొన్ని టైటిల్స్, సినిమాల జానర్స్, మ్యూజిక్ డైరెక్టర్స్, నటీనటుల గురించి కొన్ని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కానీ కాలమే అన్నీ చెబుతుంది’’ అని మారుతి ట్వీట్ చేశారు. మరి.. ‘రాజా డీలక్స్’ ఉంటుందా? కాలమే చెబుతుంది. There are too many speculations about my future projects, titles, genres, music directors and crew etc. But Time will reveal everything. Thank you to everyone for your support and encouragement Take care and stay safe 😷 — Director Maruthi (@DirectorMaruthi) January 22, 2022 -
Pakka Commercial: ఎవరికి చూపిస్తున్నారు సార్ మీ విలనిజమ్..ఎప్పుడో వదిలేశా!
‘ఎవరికి చూపిస్తున్నారు సార్ మీ విలనిజమ్, మీరు ఇప్పుడు చేస్తున్నారు.. నేను ఎప్పుడో చూసి, చేసి వదిలేశాను’ అంటూ గోపీచంద్ చెప్పిన డైలాగ్‌తో ‘పక్కా కమర్షియల్’ టీజర్ విడుదలైంది. గోపీచంద్, రాశీఖన్నా జంటగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘పక్కా కమర్షియల్’. అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్–యూవీ క్రియేషన్స్ పతాకాలపై బన్నీ వాసు నిర్మిస్తున్నారు. ‘‘ఔట్ అండ్ ఔట్ ఎంటర్టైనర్గా రూపొందుతోన్న చిత్రమిది. మా సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది’’ అన్నారు దర్శక–నిర్మాతలు. ఈ చిత్రానికి సహనిర్మాత: ఎస్కేఎన్, లైన్ ప్రొడ్యూసర్: బాబు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సత్యగమిడి, సంగీతం: జేక్స్ బిజాయ్, కెమెరా: కమర్ చావ్ల. -
20 రోజుల్లో కథ రాసుకుని..30 రోజుల్లో సినిమా తీశా..
ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం రూరల్): కరోనా సమయంలో సరదాగా 20 రోజుల్లో కథను రాసుకుని, 30రోజుల్లో మంచిరోజులు వచ్చాయి సినిమాను తీశానని ఆ సినిమా దర్శకుడు మారుతి పేర్కొన్నారు. ఆదివారం అనుశ్రీ సినిమా థియేటర్ మ్యాట్నీషోకు ఆయన, హీరో సంతోష్ శోభన్, నటులు సుదర్శన్, శ్రీనివాసరావు, నిర్మాత ఎస్కేఎన్ సందడి చేశారు. ఈ సందర్భంగా హీరో సంతోష్ శోభన్ మాట్లాడుతూ సినిమాను సక్సెస్ చేసినందుకు ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. కమెడియన్ సుదర్శన్ మాట్లాడుతూ అందరూ థియేటర్లకు ఫ్యామిలీతో వచ్చి చూస్తున్నందుకు చాలా ఆనందంగా ఉందన్నారు. ముందుగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దర్శకుడు మారుతి మాట్లాడుతూ కరోనా కాలంలో ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకుని భయం అనే కాన్సెప్ట్‌తో ‘మంచిరోజులు వచ్చాయి’ సినిమా తీశామన్నారు. తమ సినిమా ఓటీటీ ద్వారా విడుదల చేసినా నష్టం లేకపోయినప్పటికీ థియేటర్లకు ప్రేక్షకులను తీసుకురావాలన్న లక్ష్యంతో విడుదల చేశామన్నారు. సినిమా మంచి విజయాన్ని సాధించిందన్నారు. ఒకవైపు పెద్ద హీరోలతో కమర్షియల్ సినిమాలు చేస్తూనే మధ్యలో తనకు నచ్చిన కాన్సెప్ట్‌తో చిన్న చిన్న సినిమాలు తీస్తుంటానన్నారు. గోపీచంద్ హీరోగా ప్రతిరోజు పండగ నిర్మాణ టీమ్‌తో కమర్షియల్ సినిమా తీస్తామన్నారు. వచ్చే ఏడాదిలో సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నానని మారుతి తెలిపారు. హీరో సంతోష్ శోభన్ మాట్లాడుతూ యూవీ క్రియేషన్స్, వైజయంతి మూవీస్ బ్యానర్లో సినిమాలు చేస్తున్నానన్నారు. పాలసీమూర్తి శ్రీనివాసరావు మాట్లాడుతూ మహానుభావుడు సినిమా ద్వారా ప్రభుత్వ ఉద్యోగి అయిన తాను నటునిగా వచ్చానని, దర్శకుడు మారుతి ఈ సినిమా ద్వారా మంచి క్యారెక్టర్ ఇచ్చి బ్రేక్ ఇచ్చారన్నారు. అనుశ్రీ డిస్ట్రిబ్యూటర్స్ మేనేజర్ హరిబాబు, అనుశ్రీ థియేటర్ మేనేజర్ శంకర్, విష్ణు, రాజేష్ పాల్గొన్నారు. -
యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతున్న ‘పక్కా కమర్షియల్’ ఫస్ట్ గ్లింప్స్
గోపిచంద్, రాశీఖన్నా జంట మారుతి దర్శకత్వంలో తెరకెక్కబోతోన్న చిత్రం ‘పక్కా కమర్షియల్’. అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్-యూవీ క్రియేషన్స్ బ్యానర్లపై బన్నీవాసు ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌ను ఇటీవల అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. మారుతి డైరెక్షన్లో గోపిచంద్ సినిమా అనగానే అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో దీపావళి సందర్భంగా ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ గ్లింప్స్‌ను వదిలారు మేకర్స్. ఈ సందర్భంగా నవంబర్ 8న టీజర్ విడుదల చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఇదిలా ఉంటే రెండు రోజుల క్రితం విడుదల పక్కా కమర్షియల్ ఫస్ట్ గ్లీంప్స్కు యూట్యూబ్‌లో ట్రెండింగ్ అవుతోంది. 2 మిలియన్ల వ్యూస్‌ను ఈ ఫస్ట్ గ్లింప్స్ దూసుకుపోతోంది. కాగా ఈ సినిమాకు జేక్స్ బిజాయ్ సంగీతం అందిస్తుండగా.. కరమ్ చావ్లా సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు. త్వరలోనే ఈ మూవీని సెట్స్‌పై తీసుకెళ్లనున్నట్లు ఇటీవల చిత్ర బృందం పేర్కొంది. -
‘రామ్ వర్సెస్ రావణ్’ షూటింగ్ షురూ
సొలమన్ జడ్సన్, రాజ్ బాలా, మనో చిత్ర, అనన్య మణి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా "రామ్ వర్సెస్ రావణ్". ఈ చిత్రంలో సప్తగిరి మరో కీలక పాత్రలో నటిస్తున్నారు. కె శుక్రన్ దర్శకత్వం వహిస్తున్నారు. షాన ప్రొడక్షన్స్ పతాకంపై డాక్టర్ ఏఎస్ జడ్సన్ "రామ్ వర్సెస్ రావణ్" చిత్రాన్ని నిర్మిస్తున్నారు. "రామ్ వర్సెస్ రావణ్" సినిమా షూటింగ్ ప్రారంభోత్సవం హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో జరిగింది. దర్శకుడు మారుతి, ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్, నిర్మాత సింధూర పువ్వు కృష్ణారెడ్డి అతిథులుగా హాజరై చిత్ర బృందానికి బెస్ట్ విషెస్ తెలిపారు. ఈ సందర్భంగా దర్శకుడు కె.శుక్రన్ మాట్లాడుతూ.. రామ్ వర్సెస్ రావణ్.. ఒక పల్లెటూరిలో జరిగే కథ. ఆ ఊరి మంచి కోసం ఇద్దరు యువకులు ఎలా పోరాటం చేశారు అనేది సినిమాలో చూపిస్తున్నాం. యాక్షన్ తో పాటు ఎంటర్ టైన్ మెంట్ కథలో కలిసి ఉంటుంది. కథ మీద పూర్తి నమ్మకంతో సినిమా ప్రారంభించాం. కపటధారి లాంటి పెద్ద చిత్రాలకు సినిమాటోగ్రాఫర్ గా పనిచేసిన నా మిత్రుడు రాజామతి ఈ కథ విని బాగా నచ్చి ముందు ఈ సినిమా కంప్లీట్ చేద్దామన్నారు. ఏంజెల్ సినిమాను మించిన విజయం రామ్ వర్సెస్ రావణ్ సాధిస్తుందని పూర్తి నమ్మకంతో ఉన్నాం. అన్నారు. ఈ సినిమాలో ఎమోషనల్ ఎలిమెంట్స్‌తో పాటు మంచి కామెడీ కూడా ఉంటుంది అన్నారు హీరో సొలమన్ జడ్సన్. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ : రాజామతి, సంగీతం : వికాస్ బాడిశ, స్టంట్స్ : రామ్ లక్ష్మణ్, బి జె శ్రీధర్. -
అబ్బాయి నుంచి అమ్మాయిగా.. ‘లైఫ్.. ఎ ట్రూ బ్లెస్సింగ్’
‘‘లైఫ్.. ఎ ట్రూ బ్లెస్సింగ్’ షార్ట్ ఫిలిం చూసి దర్శకుడు నాగ్ అశ్విన్‌గారు ‘చాలా బాగుంది. అమ్మాయి పాత్ర పెద్ద బోనస్’ అన్నారు. అలాగే డైరెక్టర్ మారుతిగారు కూడా ‘మంచి ప్రయత్నం... బాగుంది’ అన్నారు. ఆ ఇద్దరి ప్రశంసలను మరచిపోలేను’’ అని రుత్విక్ రెడ్డి అన్నారు. విజయ్ దాస్ దర్శకత్వంలో రుత్విక్ రెడ్డి స్త్రీ పురుష పాత్రల్లో నటించిన షార్ట్ ఫిలిం ‘లైఫ్.. ఎ ట్రూ బ్లెస్సింగ్’. శ్రీలతా రెడ్డి నిర్మించిన ఈ షార్ట్ ఫిలింని డైరెక్టర్ మారుతి విడుదల చేశారు. రుత్విక్ రెడ్డి మాట్లాడుతూ– ‘‘నాకు నటన అంటే ఇష్టం. న్యూయార్క్‌లో రెండేళ్లు నటనలో శిక్షణ తీసుకున్నాను. తొలి ప్రయత్నంగా ‘లైఫ్.. ఎ ట్రూ బ్లెస్సింగ్’ షార్ట్ ఫిలిం చేశా. మహిళలపై జరుగుతున్న లైంగిక దాడులతో పాటు లింగ మార్పిడి అనేది ప్రకృతికి విరుద్ధం అనీ, చిన్న విషయాలకే భయపడి ఆత్మహత్యలు చేసుకోవడం కరెక్ట్ కాదనే విషయాలను చూపించాం. నా షార్ట్ ఫిలిం బాగుందని ఫోన్లు చేయడంతో పాటు కామెంట్లు పెడుతుండటం హ్యాపీ. ఇటీవల కొన్ని సినిమా కథలు విన్నాను. నా నటనతో ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోవాలన్నదే నా లక్ష్యం’’ అన్నారు. చదవండి : విజయ్ను కలిసి షణ్ముక ప్రియ, లైగర్ ఓ పాట పాడే అవకాశం ఆ ట్విస్ట్ తెలిసి వావ్ అనుకున్నా! -
ఎవరూ మిస్ కారని అనుకుంటున్నా : మారుతి
హర్షా నర్రా, నికీషా రంగ్వాలా, మిషా నారంగ్ హీరో హీరోయిన్లుగా శ్రీని జోస్యుల దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘మిస్సింగ్’. భాస్కర్ జోస్యుల, లక్ష్మీ శేషగిరి రావు నిర్మించిన ఈ చిత్రం ట్రైలర్ విడుదల కార్యక్రమంలో పాల్గొన్న దర్శకుడు మారుతి మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా బడ్జెట్ చిన్నదా? పెద్దదా? అని కాదు. ఓ క్వాలిటీ ఫిల్మ్ చేశారని చెప్పగలను. టైటిల్ ‘మిస్సింగ్’. కానీ ఈ చిత్రాన్ని ఎవరూ మిస్ కారని అనుకుంటున్నాను’’ అన్నారు. ‘‘మిస్సింగ్’ ట్రైలర్ చూసి ఇంప్రెస్ అయ్యాను’’ అన్నారు ‘బన్నీ’ వాసు. ‘‘మా కలను నిజం చేసిన మా నాన్న భాస్కర్, హీరో ఫాదర్ శేషగిరి రావులకు రుణపడి ఉంటాను’’ అన్నారు శ్రీని. ‘‘యాక్షన్.. లవ్.. ఎమోషన్ అన్నీ ఉన్న సినిమా ఇది’’ అన్నారు హీరో హర్ష. -
మెహ్రీన్‌కు ‘మంచి రోజులు వచ్చాయి’..త్వరలోనే అనౌన్స్మెంట్
హీరోయిన్ మెహ్రీన్‌కు మంచి రోజులు వచ్చాయి. ఆమెకు మంచి రోజులు రావడం ఏంటి అనే కదా మీ సందేహం. మరేం లేదండి..రీసెంట్గా మెహ్రీన్ నటిస్తున్న సినిమాకు ఖరారు చేసిన టైటిల్ అది. ప్రస్తుతం ఎఫ్3 సినిమాతో పాటు మారుతి దర్శకత్వంలో మెహ్రీన్ ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. 'ఏక్ మినీ కథ' సినిమాతో యూత్‌లో మంచి క్రేజ్ సంపాదిచుకున్న కుర్ర హీరో సంతోష్ శోభన్‌తో మెహ్రీన్ జతకట్టింది. తాజాగా ఈ చిత్రానికి ‘మంచి రోజులు వచ్చాయి’ అనే టైటిట్‌ను ఖరారు చేశారు. ఈ మేరకు మూవీ ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. త్వరలోనే ఈ సినిమా థియేటర్స్‌లో సందడి చేయనుంది. విడుదల తేదీపై త్వరలోనే ప్రకటన రానుంది. నిజజీవిత పాత్రలను స్పూర్తిగా తీసుకుని యూత్‌ఫుల్ ఎంటర్ టైనర్‌గా ఈ చిత్రం రూపొందించినట్లు తెలుస్తుంది. ఎస్కేఎన్-వీ సెల్యూలాయిడ్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు. ప్రస్తుతం మెహ్రీన్ చేతిలో ఎఫ్3 తప్పా పెద్ద సినిమాలు లేవు. మరోవైపు 'ఏక్ మినీ కథ' సినిమాతో హిట్ కొట్టిన సంతోష్ చేతిలో నందినీరెడ్డి సినిమాతో పాటు మరో రెండు సినిమాలు ఉన్నట్లు సమాచారం. View this post on Instagram A post shared by MEHREEN 🌟🧿 (@mehreenpirzadaa) -
30 రోజుల్లో సినిమా..'ఏక్ మినీ కథ' హీరోతో మెహ్రీన్
'ఏక్ మినీ కథ' సినిమాతో యూత్‌లో మంచి క్రేజ్ సంపాదిచుకున్న కుర్ర హీరో సంతోష్ శోభన్. ఇటీవలే అమెజాన్ ప్రైమ్ లో విడుదలైన ఏక్ మినీ కథ సంతోష్ కెరీర్‌ను మార్చేసింది. ఇప్పటికే పలు అవకాశాలు ఈయన్ని వరిస్తున్నాయి. తాజాగా మారుతి దర్శకత్వంలో ఓ సినిమా ఫైనలైజ్ అయ్యిందని టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రంలో సంతోష్‌కు జోడీగా మెహ్రీన్ కనిపించనుందట. ప్రస్తుతం ఈ అమ్మడి చేతిలో ఎఫ్3 తప్పా పెద్దగా అవకాశాలు లేదు. దీంతో ఈ కుర్ర హీరోతో జత కట్టేందుకు రెడీ అయ్యిందట ఈ భామ. అంతేకాకుండా పెళ్లి కూడా వాయిదా పడటంతో వచ్చిన అవకాశాల్ని సద్వినియోగం చేసుకోవాలని భావిస్తుందట. కేవలం 30 రోజుల్లోనే షూటింగ్ కంప్లీట్ అయ్యేలా డైరెక్టర్ మారుతి ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి అల్యూమినియం ఫ్యాక్టరీలో ఇప్పటికే షూటింగ్ ప్రారంభించినట్లు సమాచారం. లవ్ అండ్ కామెడీ జోనర్లో తెరకెక్కతున్న ఈ సినిమాకు ‘మంచిరోజులు వచ్చాయి’ అనే టైటిల్ ఖరారు చేసినట్లు నెట్టింట వైరలవుతుంది. ఈ సినిమా అనంతరం డైరెక్టర్ నందినీ రెడ్డితోనూ సంతోష్ శోభన్ ఓ ప్రాజెక్టుకు సైన్ చేసినట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనికి సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్ రావాల్సి ఉంది. చూస్తుంటే సంతోష్ శోభన్ వరుస ఆఫర్లతో బిజీ బిజీగా మారినట్లు కనిపిస్తుంది. చదవండి : ఇష్టం లేకపోయినా చేశా.. నటిగా అన్నీ చెయ్యాల్సిందే : శ్రద్దా దాస్ పెళ్లి గురించి చర్చించడం లేదు: మెహ్రీన్ -
TNR కుటుంబానికి ఆర్థిక సాయం చేసిన డైరెక్టర్ మారుతి
ప్రముఖ యాంకర్, నటుడు టీఎన్ఆర్ ఇటీవలె కరోనాతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఫ్రాంక్లీ విత్ టీఎన్ఆర్ అనే షోతో ఎంతో పాపులారిటీ సంపాదించుకున్న టీఎన్ఆర్కు ఇటీవలె కరోనా సోకింది. మొదట హోం ఐసోలేషన్‌లో ఉన్న టీఎన్ఆర్ శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతుండటంతో కుటుంబసభ్యులు ఆయన్ను హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. అయితే చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. టీఎన్ఆర్ మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సినీ ప్రముఖులు కొందరు టీఎన్ఆర్ కుటుంబానికి ఆర్థిక సాయం చేసి ఆయన కుటుంబానికి అండగా నిలిచారు. మెగాస్టార్ చిరంజీవి లక్ష రూపాయలతో పాటు బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు యాభై వేల రూపాయలను టీఎన్నార్ కుటుంబానికి ఆర్థిక సాయంగా ప్రకటించిన విషయం తెలిసిందే. నిర్మాణ సంస్థ ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ సైతం లక్ష రూపాయల ఆర్థిక సాయాన్ని అందజేసింది. తాజాగా డైరెక్టర్ మారుతి టీఎన్ఆర్ కుటుంబానికి అండగా నిలిచేందుకు ముందుకు వచ్చారు. తన వంతు సాయంగా 50 వేల రూపాయలను అందించారు. ఈ మేరకు టీఎన్ఆర్ భార్య జ్యోతి బ్యాంక్ అకౌంట్‌కు నగదును పంపించారు. అదే విధంగా ప్రతి ఒక్కరు తమకు తోచినంత సహాయం చేయాల్సిందిగా మారుతి సూచించారు. It's time to show our solidarity for our friend in media TNR we miss you, but we are with your family. Let's support #TNR's family pic.twitter.com/rLUfavz9EX — Director Maruthi (@DirectorMaruthi) May 13, 2021 చదవండి : TNR : కన్నీళ్లు తెప్పిస్తున్న టీఎన్ఆర్ చివరి పాట TNR : ఆ కోరిక తీరకుండానే కన్నుమూసిన టీఎన్ఆర్ -
'వేశ్య'గా యాంకర్ అనసూయ!
టాలీవుడ్ యాంకర్ అనసూయ భరద్వాజ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందంతో పాటు అభినయం ఈ బ్యూటీ సొంతం. తనదైన శైలిలో యాంకరింగ్ చేస్తూ బుల్లితెరను మెప్పిస్తున్న అనసూయ వీలు చిక్కినప్పుడల్లా వెండితెరపై మెరుస్తోంది. అక్కడ విభిన్న పాత్రలను పోషిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటోంది. ఇక రంగస్థలం సినిమాలోని రంగమ్మత్త పాత్ర అనసూయ కెరీర్‌ని మలుపు తిప్పిందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ సినిమాతో ఆమె క్రేజీ అమాంతం పెరిగిపోయింది. దీంతో ఆమెకు వరుస ఆఫర్లు వచ్చిపడుతున్నాయి. తాజాగా హీరో గోపీచంద్, మారుతి కాంబినేషన్లో రూపొందుతున్న ఓ సినిమాలో అనసూయ నటించనుంది. ఈ సినిమాలో ఆమె వేశ్య పాత్రలో కనిపించనుంది. ఈ విషయాన్ని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో రాబోతున్న ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్, జీఏ2 పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. 'పక్కా కమర్షియల్' అనే ఆసక్తికర టైటిల్‌తో ఈ సినిమా రూపొందనుందని మూవీ టీం వెల్లడించింది. మారుతి పదవ సినిమాగా రాబోతున్న ఈ మూవీ అక్టోబర్ 1న విడుదల కానున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. రాశి ఖన్నా, ఈషా రెబ్బా కథానాయుకలుగా నటించున్నట్లు సమాచారం. చదవండి : (అవసరమని వేడుకుంటారు.. అవసరానికి వాడుకుంటారు..!) (వైరల్ అవుతున్న దీపికా పదుకొనె డ్యాన్స్ వీడియో) -
గోపీచంద్- మారుతి సినిమా టైటిల్ ఇదే
మ్యాచో హీరో గోపీచంద్, మారుతి కాంబినేషన్లో ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో రాబోతున్న ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్, జీఏ2 పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. తాజాగా ప్రేమికుల రోజు సందర్భంగా (ఫిబ్రవరి 14) ఈ సినిమా టైటిల్‌ని ప్రకటించింది చిత్ర యూనిట్. 'పక్కా కమర్షియల్' అనే ఆసక్తికర టైటిల్‌తో ఈ సినిమా రూపొందనుందని తెలిపారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మార్చి 5నుంచి ప్రారంభించనున్నట్లు తెలియజేశారు. ఇక ఈ చిత్రంలో గోపీచంద్ సరసన నటించబోయే హీరోయిన్ ఎవరనే విషయాన్ని త్వరలోనే వెల్లడిస్తామని చెప్పారు. మారుతి పదవ సినిమాగా రాబోతున్న ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ కాక ముందే అక్టోబర్ 1న విడుదల చేయబోతున్నట్లు ప్రకటించి అందరిని ఆశ్చర్యపరిచారు. Bless us my next with Macho star @YoursGopichand garu#PakkaCommercial It is..👌#AlluAravind #BunnyVas @JxBe #KarmChawla #Raveendar @SKNonline @UV_Creations @GA2Official pic.twitter.com/SsAM9brNJ3 — Director Maruthi (@DirectorMaruthi) February 14, 2021 -
మారుతి కొత్త సినిమా ప్రకటన.. హ్యూమరస్ వీడియో
‘భలే భలే మగాడివోయ్, ప్రతిరోజూ పండగే’ వంటి బ్లాక్ బస్టర్స్ తర్వాత మళ్లీ మారుతి దర్శకత్వంలో జీఏ2 పిక్చర్స్–యూవీ క్రియేషన్స్–బన్నీ వాసు నిర్మించనున్న మూడో చిత్రానికి శ్రీకారం జరిగింది. అల్లు అరవింద్ సమర్పణలో రూపొందనున్న ఈ చిత్రంలో గోపీచంద్ హీరో. ‘‘సూపర్ డూపర్ కమర్షియల్ ఎంటర్టైనర్గా ఈ సినిమాని తెరకెక్కించడానికి మారుతి రంగం సిద్ధం చేశారు. గోపీచంద్–మారుతి కాంబినేషన్లో సినిమా రాబోతుందనే ప్రకటన కూడా వైవిధ్యంగా ఉండేలా ప్లాన్ చేశాం. ‘ప్రతిరోజూ పండగే’ తర్వాత మారుతి చేయబోయే సినిమాపై వచ్చిన పుకార్లకు సెటైర్లు వేస్తూ, మారుతి మార్క్ స్టైల్లో ఓ హ్యూమరస్ వీడియోను విడుదల చేశాం. ఈ వీడియోకి రావు రమేశ్‌గారి వాయిస్ ఓవర్ బాగా కుదిరింది’’ అని చిత్రబృందం పేర్కొంది. -
కూతురు Vs బాబాయి
-
మిర్యాలగూడలో ఉద్రిక్త వతావరణం
-
ప్రేమ పండగ
-
ప్రతిరోజూ పండుగే : మూవీ రివ్యూ
టైటిల్: ప్రతిరోజూ పండుగే జానర్: ఫ్యామిలీ ఎంటర్టైనర్ నటీనటులు: సాయి ధరమ్ తేజ్, రాశీ ఖన్నా, సత్యరాజ్, రావు రమేశ్, విజయ్‌కుమార్, నరేశ్, ప్రభ తదితరులు సంగీతం: థమన్ ఎస్ సినిమాటోగ్రఫీ: జయకుమార్ నిర్మాత: బన్నీ వాస్ దర్శకత్వం: మారుతి బ్యానర్లు: యూవీ క్రియేషన్స్, జీఏ2 పిక్చర్స్ మెగా మేనల్లుడు, సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కిన తాజా సినిమా ‘ప్రతిరోజూ పండుగే’. వినూత్న కాన్సెప్ట్‌లతో కమర్షియల్ సినిమాలు తెరకెక్కించే దర్శకుడు మారుతీ ఒక ఫీల్‌గుడ్ టైటిల్‌తో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తెచ్చారు. అడపాదడపా హిట్లతో నెట్టుకొస్తున్న సాయి ‘చిత్రలహరి’ సినిమాతో సూపర్‌హిట్ అందుకున్నారు. అటు మారుతీ కూడా భలేభలే మగాడివోయ్, మహానుభావుడు సినిమాల తర్వాత మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన ‘ప్రతిరోజూ పండుగే’ సినిమాపై భారీ అంచనాలే ఏర్పడ్డాయి. ఇంతకూ ‘ప్రతిరోజూ పండుగే’ అంటూ తాత-మనవళ్లు ప్రేక్షకులకు ఏం చెప్పారు? సంక్రాంతికి ముందే తెర నిండుగా పండుగ తీసుకొచ్చారా? కథ: రాజమండ్రికి చెందిన పసుపులేటి రఘురామయ్య వయస్సు మీదపడిన పెద్దాయన. ఆయన పిల్లలు దూరంగా సెటిలయ్యారు. ఈ దశలో ఆయనకు లంగ్ క్యాన్సర్ తీవ్రమవుతుంది. ఇంకా కొన్ని వారాలే బతుకుతారని డాక్టర్ చెప్తారు. కానీ ఎక్కడో దూరంగా సెటిలైన పిల్లలు తండ్రికి వచ్చిన కష్టం కన్నా.. ఎన్ని రోజులు ఆయనతో ఉండి.. ఎంత తర్వగా ఆయన చావు తతంగం పూర్తి చేసి.. చేతులు దులుపుకొని వెళ్లిపోవాలా? అని చూస్తారు. కానీ, ఆయన మానవడు మాత్రం తాత చివరి రోజులు సంతోషంగా చూడాలనుకుంటాడు. ఆయన నెరవేరని కోరికలు తీర్చాలనుకుంటాడు. కానీ, అతని తల్లిదండ్రులు, బాబాయి-పిన్నిలు, అత్త-మామల ధోరణి అందుకు భిన్నంగా ఉంటుంది. చివరి రోజుల్లో తండ్రిని సుఖంగా చూసుకోవడం కంటే తమ జాబ్‌లు, జీవితాలు ఇవే ముఖ్యమనుకుంటారు. పెద్దాయన మనస్సు నొప్పించేలా ప్రవర్తిస్తుంటారు. ఈ నేపథ్యంలో తాత కోసం తపించే సాయి ఏం చేస్తాడు? తమ పిల్లల కోసం సర్వస్వాన్ని త్యాగం చేసే వాళ్లు కూడా యాంత్రిక జీవితంలో పడి.. వృద్ధాప్యంలోని తల్లిదండ్రులను చూసుకోవడంలో నిర్లిప్తంగా ఉంటారు. ఏదోలే పోతేపోయారు అనుకుంటారు. అలాంటి వారిని ఈ మనవడు ఎలా మారుస్తాడు? అన్నది మిగతా కథ. విశ్లేషణ: ‘ప్రతిరోజూ పండుగే’ అనే ఫీల్ గుడ్ టైటిల్‌తో బీటలు వారుతున్న కుటుంబ సంబధాల నేపథ్యంగా దర్శకుడు ఈ సినిమాను తెరకెక్కించాడు. ఫస్టాప్ కథ ఒకింత ఫ్లాటుగా ప్రారంభమవుతుంది. తాతకు లంగ్‌క్యాన్సర్ అని తెలియడం, మనవడు సాయి పరిగెత్తుకురావడం, తాత కోరికలు తీర్చడం, తాత కోసం ఏంజిల్ అరుణను పెళ్లి చేసుకునేందుకు సిద్ధపడటం, సత్యరాజ్ పిల్లలంతా ఇంటికి చేరడం ఇలా కథ.. ఒకింత సాగదీసినట్టు అనిపిస్తుంది. కానీ, ఫస్టాఫ్‌లో వచ్చే కామెడీ సీన్లు ప్రేక్షకులను అలరిస్తాయి. పలుచోట్ల గిలిగింతలు పెడుతాయి. కామెడీ సీన్లతో సాగుతూ ఇంటర్వెల్ వరకు వచ్చేసరికి కథ ప్రధాన మలుపు తిరుగుతుంది. సెకండాప్లోనూ కథ పెద్దగా కనిపించదు. తండ్రి ఇచ్చే రిటర్న్ గిఫ్ట్ కోసం ఆరాటపడుతూ.. బతికుండే తండ్రి చావు కోసం పిల్లలు చేసే ఆరాట ఆర్భాటాలు... సమాజంలోని అసంబద్ధతను చూపిస్తూనే కడుపుబ్బా నవ్విస్తాయి. ప్రీక్లైమాక్స్, క్లైమాక్స్ సీన్లు భావోద్వేగంగా సాగుతూ ప్రేక్షకుల హృదయాలను కదిలిస్తాయి. క్లైమాక్స్ ఒకింత లెంగ్తీగా అనిపించినా సినిమాకు ఇదే ప్రధాన బలమని చెప్పవచ్చు. వృద్ధాప్యంలోని తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసే వారిని వారిని కడిగిపారేసేలా క్లైమాక్స్ సీన్లు సాగుతాయి. ఇక, తాతమనవళ్లుగా సత్యరాజ్-సాయి సెంటిమెంట్‌ను పండించారు. సినిమాలో ప్రధానపాత్ర సత్యరాజ్దే. చావుకు చేరువగా ఉన్న తన పట్ల కుటుంబసభ్యుల అనుచిత ప్రవర్తన, ఎప్పుడెప్పుడు వెళ్లిపోదామా అనుకునే వారి తీరుతో ఆయన పడే మానసిక క్షోభ.. సత్యరాజ్ అద్భుతంగా పండిచారు. మనవడిగా, పెద్దలకు బుద్ధిచెప్పే కొడుకుగా సాయి కూడా తన నటనతో మెప్పించాడు. ఒక ఫైట్ సీన్లో తొలిసారి తెరమీద సాయి సిక్స్‌ప్యాక్ బాడీని ఎక్స్పోజ్ చేశాడు. సాయి తండ్రిగా రావు రమేశ్ పాత్ర సెటిల్డ్ యాక్టింగ్‌తో ఆద్యంతం నవ్వులు కురిపిస్తుంది. అందంగా కనిపించడమే కాదు.. టిక్‌టాక్ పిచ్చిలో మునిగిపోయిన ఏంజిల్ అరుణగా రాశీ ఖన్నా తన పరిధి మేరకు పాత్రను పండించారు. పాటలు, కొన్ని కామెడీ సీన్లు మినహాగా హీరోయిన్ పాత్రకు అంతగా స్కోప్ లేదు. మిగతా నటులూ తమ పాత్ర పరిధి మేరకు మెప్పించారు. థమన్ పాటలు బావున్నాయి. క్యాచీ వర్డ్స్‌తో సాగే ‘ఓ బావా’ పాటను తెరకెక్కించిన విధానమూ బాగుంది. నేపథ్య సంగీతం సినిమాకు ప్లస్‌గా నిలిచింది. సినిమా స్థాయి తగ్గట్టుగా నిర్మాణ విలువలు రిచ్‌గా ఉన్నాయి. ఎడిటింగ్‌లో సినిమాకు మరింత పదును పెట్టాల్సింది. కథ ఒకింత రొటీన్‌గా అనిపించడం, కామెడీ సీన్లు, క్లైమాక్స్ బాగున్నా.. స్క్రీన్‌ప్లే అంతగా నవ్యత లేకపోవడం, సాగదీసినట్టు అనిపించడం, ఇలాంటి కథతో ఇప్పటికే శతమానం భవతి లాంటి సినిమాలు రావడం.. ఈ సినిమాను ప్రేక్షకులు మేరకు ఆదరిస్తాన్నది చూడాలి బలాలు తాత-మనవళ్ల సెంటిమెంట్ కామెడీ సీన్లు క్లైమాక్స్ సీన్లు బలహీనతలు రొటీన్ కథ, కథనాలు సాగదీసినట్టు అనిపించడం - శ్రీకాంత్ కాంటేకర్ -
‘ప్రతిరోజూ పండగే’ మూవీ స్టిల్స్
-
పండగలా వచ్చారు
-
ప్రతి రోజూ పుట్టినరోజే
‘‘ఈ రోజుల్లో’ సినిమా ముందు వరకూ సినిమా తీయడమే నా లక్ష్యం. ఆ సినిమాతో నా లక్ష్యం నెరవేరింది. ఆ తర్వాత నుంచి వచ్చిన అవకాశాలను నా శక్తి మేరకు సద్వినియోగం చేసుకుంటున్నాను’’ అని దర్శకుడు మారుతి అన్నారు. నేడు ఆయన పుట్టినరోజు. ఈ సందర్భంగా సినిమాల్లో తన ప్రయాణం గురించి మారుతి పంచుకున్న విశేషాలు... ► ‘ఈరోజుల్లో’ సమయంలో నా స్కిల్‌ని నమ్మడానికి ఒక డీవీడీలా అయినా ఆ సినిమా ఉంటుంది అనుకున్నాను. ఆ తర్వాత మనల్ని నమ్మి నిర్మాతలు డబ్బులు పెడితే చాలనిపించింది. ఆ తర్వాత కొంచెం ఎక్కువ పారితోషికం వస్తే బావుండు అనిపించింది. ఇప్పుడు నేను ఏ హీరోతో సినిమా చేసినా అతనికి కెరీర్ బెస్ట్ సినిమా ఇవ్వాలి అనుకుంటున్నాను. ► ప్రస్తుతం సాయిధరమ్ తేజ్ హీరోగా నేను చేస్తున్న ‘ప్రతి రోజూ పండగే’ సినిమా విషయానికి వస్తే చాలా తక్కువ రోజుల్లో రాసిన కథ ఇది. చాలా నిజాయతీ ఉన్న ఎమోషనల్ ఫ్యామిలీ కథ. కుటుంబ ప్రేక్షకులకు 100 శాతం కనెక్ట్ అవుతుంది. కథ వినగానే తేజు చాలా ఎగ్జయిట్ అయ్యాడు. సమాజానికి అద్దం పట్టేలా కథ ఉంటుంది. మనల్ని మనం నిలదీసుకునేలా ఉంటుంది. కెరీర్ స్టార్టింగ్‌లో ‘ఈరోజుల్లో, బస్‌స్టాప్’ సినిమాల్లో కూడా సొసైటీలో ఏం జరుగుతుందో అదే చూపించాను. ► మనం పుట్టినప్పటి నుంచి ప్రతి సందర్భాన్ని సెలబ్రేట్ చేసుకుంటూనే ఉంటాం. మరి చావుని ఎందుకు సెలబ్రేట్ చేసుకోం? జీవితంలో వచ్చే చివరి వేడుక చావు. దాన్ని కూడా సెలబ్రేట్ చేసుకోవాలి.. వయసు పైబడుతున్న వాళ్లకు బెస్ట్ సెండాఫ్ ఇవ్వాలి అనే కాన్సెప్ట్ చుట్టూ ‘ప్రతి రోజూ పండగే’ సినిమా ఉంటుంది. ఇండియన్ స్క్రీన్ మీద ఇలాంటి కాన్సెప్ట్‌తో సినిమా రాలేదు. ఈ సినిమా మొదలైనప్పటి నుంచి ప్రతిరోజూ పుట్టినరోజులానే అనిపించింది. సెట్లో ప్రతి రోజూ 18–20 మంది ఆర్టిస్ట్‌లు ఉండేవారు. ప్రతిరోజూ పండగలానే గడిచిపోయింది. ► ప్రస్తుతం వస్తున్న చిన్న సినిమాల్లో ఎక్కువ శాతం వల్గారిటీనే టార్గెట్ చేసి ఆడియన్స్‌ను రప్పించాలనుకుంటున్నారు. నా తొలి సినిమాల్లో నేనూ డబుల్ మీనింగ్ డైలాగ్స్ పెట్టాను. అదే సినిమాను నడిపించదు. ► మారుతి టాకీస్ బ్యానర్లో చిన్న సినిమాలు ఆపేశాను. సినిమా తీస్తున్నప్పుడు మన పూర్తి శ్రద్ధ అందులోనే పెట్టాలి. అలా వీలు కానప్పుడు సినిమా చేయకూడదు. అందుకే జీఏ2, యూవీ బ్యానర్లతో కలిసి సినిమాలు చేయాలనుకుంటున్నాను. ‘మహానుభావుడు’ సినిమా హిందీ రీమేక్ చర్చలు జరుగుతున్నాయి. నేనే దర్శకత్వం వహించవచ్చు. -
పిల్లలతో ఆడుకుంటోన్న సుప్రీం హీరో
చిత్రలహరి సినిమాతో సక్సెస్ చూసిన మెగా హీరో సాయిధరమ్ తేజ్ ఆచితూచి కథలను ఎంచుకుంటున్నాడు. మునుపటిలా మాస్ ఫార్ములా అంటూ చూడకుండా కథకు ప్రాధాన్యమున్న చిత్రాలను సెలెక్ట్ చేసుకుంటోన్నట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ హీరో ‘ప్రతిరోజూ పండుగే’ అనే చిత్రాన్ని చేస్తున్న సంగతి తెలిసిందే. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ ఫ్యామిలీ ఓరియెంటెడ్ మూవీ అని తెలుస్తోంది. ఈ మూవీ షూటింగ్లో ఉన్నప్పుడు.. పిల్లలతో కలిసి ఆడుకుంటూ ఉన్న వీడియోను సాయి ధరమ్ తేజ్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. పిల్లలతో కలిసి ఆడుకోవడం ఎంతో ఆనందంగా ఉందంటూ వీడియోను పోస్ట్ చేశాడు. రాశీఖన్నా హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో సత్యరాజ్ ఓ కీలకపాత్రను పోషించనున్నాడు. -
పిల్లలతో ఆడుకుంటోన్న సుప్రీం హీరో
-
హైదరాబాద్‌కు 48 రోజులే నీళ్లు అందించగలరా?
సాక్షి, హైదరాబాద్ : ప్రముఖ దర్శకుడు మారుతి అడిగిన ఓ ప్రశ్నకు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ట్విటర్ వేదికగా సమాధానమిచ్చారు. హైదరాబాద్ నగరాన్ని తాగునీటి కష్టాలు వెంటాడనున్నాయా అని మారుతి అడగ్గా అలాంటేదేమీ జరగదని కేటీఆర్ స్పష్టం చేశారు. కాళేశ్వరం ప్రాజక్టు ద్వారా నగరానికి కావాల్సినంత నీరు అందుబాటులో ఉండనుందని పేర్కొన్నారు. వివరాల్లోకి వెళ్తే.. కేటీఆర్ బుధవారం ఉదయం కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ట్విటర్లో పలు అంశాలను ప్రస్తావించారు. కాళేశ్వరం జలాలతో హైదరాబాద్ నీటి అవసరాలు కూడా తీరతాయని పేర్కొన్నారు. అయితే ఈ ట్వీట్‌కు రిప్లైగా మారుతి ఓ పత్రికలో వచ్చిన కథనాన్ని ప్రస్తావించారు. హైదరాబాద్‌కు కేవలం 48 రోజులకు సరిపడే తాగునీరు మాత్రమే అందుబాటులో ఉందా అని కేటీఆర్‌ను ప్రశ్నించారు. దీనిపై స్పందించిన కేటీఆర్.. ‘ఆ రిపోర్ట్ కచ్చితమైనది కాదు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ప్రాణహిత నుంచి నీరు ఎత్తిపోయడం ప్రారంభమైంది. కొద్ది వారాల్లోనే నీరు ఎల్లంపల్లి ప్రాజెక్టుకు చేరుకోనుంది. దీంతో హైదరాబాద్‌కు 175 ఎంజీడీల నీరు అందనుంది. అందువల్ల తాగునీటి సమస్య అనేది చోటుచేసుకోదు. అలాగే నీటి పొదుపుకు సంబంధించిన ప్రాధాన్యతను కూడా నగరవాసులు గుర్తించార’ని సమాధానమిచ్చారు. అనంతరం మారుతి శుభావార్త చెప్పారంటూ కేటీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. That report is not accurate. Once water from #KaleshwaramProject reaches Yellampalli reservoir (next few weeks), it will ensure that 172 MGD supply to Hyderabad will continue unabated At the same time, it’s time all citizens realise importance of water conservation & Harvesting https://t.co/Vf9wWXf6lw — KTR (@KTRTRS) 17 July 2019 ఇది ప్రారంభం మాత్రమే.. అంతకుముందు ట్వీట్లో.. ‘ ఇంత తక్కువ వర్షాలు పడుతున్న కాలంలో, గోదావరికి ఏ మాత్రం వరద రాకున్న కూడా.. ప్రాణహిత నదిలో వస్తున్న వరదనీటిని 10 రోజుల్లో 5 మోటార్ల ద్వారా ఎత్తిపోసి 11 టీఎంసీలు ఒడిసిపట్టాం. గోదావరిలో తక్కువ వరద ఉన్నప్పుడే 11 టీఎంసీలు నిల్వచేయడం జరిగింది. ఈ నీటితో కనీసం లక్షన్నర ఎకరాలకు నీరు ఇవ్వొచ్చు. ఇది ప్రారంభం మాత్రమే.. వర్షాలు పడి, వరద పెరిగితే అన్ని మోటార్లు మొదలవుతాయి. అన్ని మోటార్లు ప్రారంభమైతే తెలంగాణలో బీడు భూములు సస్యశ్యామలం కానున్నాయి. సీఎం కేసీఆర్ దార్శనికత వల్లే కాళేశ్వరం ప్రాజెక్టు మూడేళ్లలోనే సాకారమైంది. ఉద్యమ నాయకుడే ముఖ్యమంత్రి కావడం వల్ల తెలంగాణకు చేకూరిన లబ్ధి ఇది. కాళేశ్వరం జలాలతో హైదరాబాద్ నీటి అవసరాలు కూడా తీరుతాయి. చెన్నై కానీ, ఇతర మెట్రోపాలిటన్ ప్రాంతాల్లో మాదిరి నీటి కష్టాలు హైదరాబాద్‌కు ఎప్పుడూ రాకుండా చూసుకోవచ్చ'ని కేటీఆర్ పేర్కొన్నారు. -
మారుతీరావు లెజండ్ ఎలా అవుతారు? : అమృత
మిర్యాలగూడ టౌన్ : పేరుమళ్ల ప్రణయ్ హత్య కేసులో నిందితులకు బెయిల్ రద్దు చేయాలని కుల నిర్మూలన పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు బండారు లక్ష్మయ్య, కుల నిర్మూలన ఉద్యమ రాష్ట్ర కన్వీనర్ గడ్డం సదానందం, బహుజన ప్రతిఘటన వేదిక రాష్ట్ర కోఆర్డినేటర్ సాంబశివరావు డిమాండ్ చేశారు.బుధవారం పట్టణంలోని ముత్తిరెడ్డికుంటలోని పేరుమళ్ల ప్రణయ్ కుటుంబ సభ్యులను పరమార్శించారు. అనంతరం ప్రణయ్ కుటుంబ సభ్యులతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ పీడీ యాక్టు కేసులో బెయిల్‌పై విడుదల కావడం వలన బాధితులు అయిన అమృత వర్షిణి, బాలస్వామి, ప్రణయ్ కుమారుడు నిహాన్ ప్రణయ్‌లకు ప్రమాదం పొంచి ఉందన్నారు. మారుతిరావును ఎస్సీ, ఎస్టీ చట్టం ప్రకారం ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి బహిష్కరించాలన్నారు. ప్రత్యేక స్పెషల్ కోర్టును ఏర్పాటు చేసి న్యాయ విచారణ ప్రారంభించాలన్నారు. నింధితులకు శిక్ష పడేందుకు స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూషన్‌ను ఏర్పాటు చేయాలన్నారు. నిందితులు విడుదల కావడంతో నేర విచారణ, న్యాయ విచారణలు ప్రభావితం అయ్యే ప్రమాదం ఉందని, సాక్షాల బాధితులకు రక్షణ లేకుండా పోతుందన్నా రు. నిందితులు నేరం నుంచి తప్పించుకోకుండా పోలీసులు వెంటనే చార్జీషీట్‌ను వేయాలన్నారు. నిందితులకు కోర్టు ఇచ్చిన బెయిల్‌పై ఆలోచించాలని, నిందితులు కేవలం పీడీ యాక్టు కేసులో మాత్రమే బెయిల్‌పై వచ్చారని, హత్య కేసు, ఎస్సీ, ఎస్టీ కేసు ఉందన్నారు. ఎస్సీ, ఎస్టీ చట్టం ప్రకారం ఏ కేసు అయినా కూడా 90రోజుల్లో చార్జిషీట్‌ను పోలీసులు వేయాల్సి ఉంటుందన్నారు. అమృత విషయంలో సోషల్ మీడియాలో కొంత మంది ఆసభ్యకర పోస్టులు పెట్టుతున్నందున వారిపై చర్యలను తీసుకోవాలన్నారు. అమృత వర్షిణి మాట్లాడుతూ చాల మంది మారుతిరావు గురించి తెలియక మాట్లాడుతున్నారని అన్నారు. కొంతమంది మారుతీరావు లెజండ్ తదితర పేర్లతో పోస్టులు చేస్తున్నారని, మారుతిరావు గత చరిత్ర తెలియకనే మాట్లాడుతున్నారని అన్నారు. ప్రణయ్ తండ్రి బాలస్వామి మాట్లాడుతూ మా ప్రాణం ఉన్నంత వరకు నిందితులకు శిక్షపడేంత వరకు పోరాడుతామని అన్నారు. సమావేశంలో సామాజిక కార్యకర్తలు డాక్టర్ రాజు, శ్రీరాములు తదితరులున్నారు. -
కాంబినేషన్ కుదిరింది
యూత్‌ఫుల్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైన్ సినిమాలు చేస్తూ ఆడియన్స్‌కు మరింత చేరువ అవుతున్నారు హీరో సాయిధరమ్ తేజ్. డిఫరెంట్ కాన్సెప్ట్స్‌తో మంచి వినోదాత్మక సినిమాలను ప్రేక్షకులకు అందిస్తుంటారు దర్శకుడు మారుతి. వీరిద్దరి కాంబినేషన్లో ఓ సినిమా కుదిరింది. గీతా ఆర్ట్స్, యూవీ క్రియేషన్స్ ఈ సినిమాను నిర్మించనున్నాయని తెలిసింది. ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ జూన్‌లో ప్రారంభం కానుంది. మారుతి దర్శకత్వంలో వచ్చిన ‘భలే భలే మగాడివోయ్’ సినిమా యూవీ క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ బ్యానర్లోనే రూపొందిన సంగతి తెలిసిందే. -
మారుతి కొత్త ఇంట్రూడర్ లాంచ్
సాక్షి, న్యూఢిల్లీ: మారుతి సుజుకి మోటార్ సైకిల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఇంట్రూడర్‌లో కొత్త వెర్షన్‌ను లాంచ్ చేసింది. ఇంట్రూడర్ 2019 ఎడిషన్ బైక్‌ను భారతీయ మార్కెట్లొ విడుదల చేసింది. గేర్ షిప్ట్ డిజైన్, అధునాతన బ్రేక్ పెడల్ కొత్త డిజైన్‌తో న్యూ లుక్‌ని తీసుకొచ్చింది. దీని ధరను రూ. 1,08,162 (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ) గా నిర్ణయించింది. ఆధునిక డిజైన్, ప్రీమియమ్ అప్పీల్‌తో క్రూయిజర్ ప్రేమికులను ఆకట్టుకుంటుందని మారుతి వైస్ ప్రెసిడెంట్ దేవాషిష్ హాండా తెలిపారు. రోజు ప్రయాణంతో పాటు, వీకెండ్ రైడ్స్‌కు కూడా కొత్త మారుతి ఇంట్రూడర్ మంచి అనుభవాన్నిస్తుందని చెప్పారు. 155 సిసి ఇంజీన్, ప్రామాణికే ఏబీఎస్, పుల్లీ-డిజిటల్ ఇన్స్ట్రుమెంటేషన్ లాంటి కీలక ఫీచర్లు ఇందులో ఉన్నాయి. -
సరికొత్తగా మారుతి ఈకో
దేశీయ కారు మేకర్ మారుతి తనపాపులర్ మోడల్ ఈకో క్యాబ్ ఆరును కొత్తగా తీర్చి దిద్దింది. రానున్న భద్రతా నిబంధనలకనుగుణంగా బేసిక్ భద్రతా ఫీచర్లతో సరికొత్తగా లాంచ్ చేసింది. ఈ అప్డేటెడ్ మోడల్ వాహనం ధరను రూ. 3.55 లక్షలుగా (ఎక్స్ షో రూం ఢిల్లీ) గతంకంటే రూ.23వేల దర పెంచింది. 1.2 పెట్రోల్ ఇంజీన్, సీఎన్జీ వేరియంట్లలో ఈ కారు లభ్యం కానుంది. 73 పవర్, 101 గరిష్ట టార్క్ ఫీచర్లకు తోడు డ్రైవర్ సైడ్ ఎయిర్‌బ్యాగ్, ఫ్రంట్, రియర్ పార్కింగ్ సెన్సర్లు, స్పీడ్ అలర్ట్ తదితర ఫీచర్లను అదనంగా జోడించింది. -
భావోద్వేగాలతో సాగే చిత్రం యాత్ర : మారుతి
దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి చేపట్టిన పాదయాత్ర ఆధారంగా తెరకెక్కిన సినిమా ‘యాత్ర’. ఈ చిత్రాన్ని చూసిన తర్వాత ప్రముఖ డైరెక్టర్ మారుతి తన అభిప్రాయాన్ని ట్విట్టర్లో పోస్ట్ చేశారు. యాత్ర నిజాయితీతో కూడిన భావోద్వేగాలతో సాగే చిత్రమని, హృదయాన్ని హత్తుకునే క్లైమాక్స్ ఉందని పేర్కొన్నారు. దివంగత మహానాయకుడు వైఎస్ రాజశేఖరరెడ్డిలా మమ్ముట్టి నటించిన తీరు, మహి వీ రాఘవ పనితీరు అద్భుతమని కొనియాడారు. మిగతా నటులు, చిత్రానికి పని చేసిన సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు. మమ్ముట్టి, రాజశేఖర్ రెడ్డి పాత్రలో నటించిన యాత్ర సినిమాకు మహి వీ రాఘవ దర్శకుడు. 70 ఎమ్ఎమ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై విజయ్ చిల్లా, దేవిరెడ్డి శశి, శివ మేకలు నిర్మించారు. ప్రజా ప్రస్థానం పాదయాత్ర నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాకు తొలి షో నుంచే సూపర్ హిట్ టాక్‌తో దూసుకుపోతోంది. -
‘కలెక్షన్లు చెప్పినప్పుడు నమ్మలేకపోయాను’
సాక్షి, హైదరాబాద్: అక్కినేని యంగ్ హీరో నాగ చైతన్య, అను ఇమ్మాన్యూల్ జంటగా డైరక్టర్ మారుతి తెరకెక్కించిన శైలజా రెడ్డి అల్లుడు బాక్సాఫీస్ వద్ద కలక్షన్ల వర్షం కురిపిస్తోంది. వినాయక చవితికి ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మూడు రోజుల్లో దాదాపు 23 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇందుకు సంబంధించి చిత్ర బృందం పీపుల్స్ బ్లాక్‌బస్టర్ పేరిట పోస్టర్‌ను రిలీజ్ చేశారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ చిత్రం విడుదలైన తొలి రోజు నుంచే పాజిటివ్ టాక్‌తో దూసుకెళుతోంది. చిత్ర విజయాన్ని పురస్కరించుకుని చిత్ర యూనిట్ శనివారం థ్యాంక్స్ మీట్ ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో నాగ చైతన్య మాట్లాడుతూ.. శైలజా రెడ్డి చిత్రాన్ని ఘనవిజయం చేసినందుకు ప్రేక్షకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. మొదట సినిమా కలెక్షన్లు చెప్పినప్పుడు నమ్మలేకపోయానని అన్నారు. ఈ సినిమాకు నాకు చాలా కాంప్లిమెంట్స్ వచ్చాయని.. అందుకు మారుతికి థ్యాంక్యూ చెప్పాలని అన్నారు. ఈ సినిమాలో పృథ్వీరాజ్ నటనకు చాలా మంచి కామెంట్స్ వస్తున్నాయని పేర్కొన్నారు. దర్శకుడు మారుతి మాట్లాడుతూ.. శైలజా రెడ్డి చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులు వాళ్ల సొంతింటి అల్లుడిలా ఆదరిస్తున్నారని తెలిపారు. ఈ సినిమా కలెక్షన్లు మాకు చాలా ఆనందాన్ని ఇచ్చాయని.. అక్కినేని ఫ్యాన్స్ తనకు సూపర్ ఎనర్జీ ఇచ్చారని వెల్లడించారు. నాగ చైతన్య, అను, రమ్యకృష్ణ లకు స్పెషల్ థ్యాంక్స్ తెలిపారు. ఈ సినిమా బాగుందని ఫ్యామిలీల నుంచి ఫోన్లు వస్తున్నాయని అన్నారు. చిత్రంలో నటించిన ప్రతి ఒక్కరికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అను మాట్లాడుతూ.. ముందు ప్రేక్షకులకు థ్యాంక్స్ చెప్పాలని అన్నారు. మారుతికి, నాగచైతన్యకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. సినిమా చూడని వాళ్లు థియేటర్ వెళ్లి తప్పక సినిమా చూడండి అని కోరారు. ఇంకా ఈ కార్యక్రమంలో నరేష్, పృథ్వీ, సినిమాటోగ్రాఫర్ నిజార్ షఫీ, నాగవంశీ పాల్గొన్నారు. -
నా బలం అదే - మారుతి
‘‘స్టార్ హీరోలతో సినిమాలు చేయాలనే ఇంట్రెస్ట్ నాకు ఉంది. నేను అనుకున్న కాన్సెప్ట్ వారికి నచ్చాలి. కాలం కలిసి రావాలి. కొన్ని విషయాల ప్రభావం నా మీద పడకుండా నేను నాలా ఉండాలని ప్రయత్నించే వ్యక్తిని నేను. నేను తీసే సినిమాల కథలు దేనికదే డిఫరెంట్. డైరెక్టర్స్ ఎగై్జట్ అయ్యేదే సినిమా. కొందరికి బాగా నచ్చుతుంది. మరికొందరికి అది నార్మల్‌గా ఉండొచ్చు. నాకు ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఏమీ లేదు’’ అన్నారు మారుతి. సుమంత్ శైలేంద్ర కథానాయకుడిగా పార్కీ ప్రభాకర్ దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘బ్రాండ్ బాబు’. ఇందులో ఈషా రెబ్బా కథానాయికగా నటించారు. ఎస్. శైలేంద్ర నిర్మించిన ఈ చిత్రానికి దర్శకుడు మారుతి కథ అందించడంతోపాటు సమర్పకులుగా వ్యవహరించారు. ‘బ్రాండ్ బాబు’ చిత్రం ఆగస్టు 3న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా గురించి మారుతి చెప్పిన సంగతులు... ∙భావోద్వేగాలకు, ప్రేమలకు విలువ ఇవ్వకుండా కేవలం బ్రాండ్స్‌ని మాత్రమే ఫాలో అవుతుంటాడు హీరో. హోమ్మినిస్టర్ కూతుర్ని పెళ్లి చేసుకోవాలనుకునే ప్రయత్నంలో కొన్ని పరిస్థితుల కారణంగా ఆ ఇంట్లో ఉన్న పని మనిషికి కనెక్ట్ అవుతాడు. ఆ తర్వాత నిజం తెలుసుకుంటాడు. బ్రాండ్స్‌ను బట్టే ఇతరులను అంచనా వేసే హీరో ఫ్యామిలీ అతని లవ్‌ని ఒప్పుకుంటారా? ఆ తర్వాత హీరో పరిస్థితి ఏంటి? అన్నదే స్టోరీలైన్. ఏ టాపిక్ తీసుకున్నా మారుతి నవ్వించడగలడు అనుకునే ప్రేక్షకుల అంచనాలు ‘బ్రాండ్ బాబు’ సినిమాలో కూడా మిస్ కావన్న హామీ ఇవ్వగలను. ∙ఏదో కాసేపు బ్రాండ్స్‌పై ప్రేక్షకులను నవ్విద్దామని చేసిన కథ కాదు ఇది. మంచి సందేశం కూడా ఉంటుంది. సినిమాలో జెన్యూనిటీ ఉంటుంది. ఫస్ట్ టైమ్ నేను పూర్తి స్థాయిలో కథ, మాటలు ఇచ్చిన చిత్రమిది. ఆడియన్స్‌కు ఎక్కడా బోర్ కొట్టదు. బ్రాండ్స్‌ను ఫాలో అవుతూ ఎమోషన్స్‌కు, ప్రేమకు విలువ ఇవ్వనివారికి ఈ సినిమా వాటిని గుర్తు చేస్తుంది. ∙శైలేంద్రబాబుగారు నాకు ఎప్పటి నుంచో స్నేహితులు. ఆయన తన అబ్బాయిని ఇండస్ట్రీకి పరిచయం చేయాలి అనుకుంటున్నప్పుడు నా దగ్గర ఈ పాయింట్ ఒకటి ఉందని చెప్పాను. హీరోగా పర్ఫెక్ట్గా న్యాయం చేశాడు. బ్రాండ్‌ను ఫాలో అయ్యేవారి క్యారెక్టర్లో ఓ యారగెంట్ యాంగిల్ ఉంటుంది. సుమంత్ శైలేంద్ర ఆ యారగెన్సీని వెండితెరపై ఫర్ఫెక్ట్గా మ్యాచ్ చేశాడు. మ్యూజిక్ బాగా కుదరింది. ఎప్పుడైనా సినిమా గురించి సినిమానే మాట్లాడాలి. మనం చెప్పినంత మాత్రాన ఆడియన్స్ రారు. సినిమా హిట్ అవుతుందన్న నమ్మకం ఉంది. ∙నేను పద్ధతిగా రాసుకున్న కథను నా విజన్‌కు తగ్గట్లుగా ప్రభాకర్ చక్కగా తెరకెక్కించాడు. ప్రభాకర్‌కు సీరియల్స్ చేసిన అనుభవం ఈ సినిమాకు హెల్ప్ అయింది. స్క్రిప్ట్‌లో ఎమోషన్‌ను ఈజీగా పట్టేశాడు. ఈ సినిమా అవుట్‌పుట్ చూసి రైటర్‌గా నేను శాటిస్ఫై అయ్యాను. ∙ఒక కాన్సెప్ట్ తీసుకుని రెండు గంటల పాటు థియేటర్స్‌లో ఆడియన్స్‌ను ఎలా కూర్చోబెట్టగలరు అన్న ప్రశ్నను మారుతిని అడిగినప్పుడు...‘‘ నా బలం అదే. మతిమరుపు కాన్సెప్ట్ పై ‘భలే భలే మగాడివోయ్’ సినిమా తీశాం. మెదడకు సమస్య ఉంటే ప్రేమించే హృదయం ఏం చేస్తుంది? అనే పాయింట్‌ను ఆడియన్స్ యాక్సెప్ట్ చేశారు. నా సినిమా కథలన్నీ చిన్న చిన్న పాయింట్సే. రన్నింగ్ ఎంజాయ్మెంట్ గురించి ఆలోచిస్తుంటాను. ‘భలే మంచి చౌక బేరం’ సినిమాకు కాన్సెప్ట్ ఇచ్చాను. నిర్మాత రాధామోహన్‌గారు చూశారు. సెప్టెంబర్‌లో రిలీజ్ అనుకుంటున్నాం. నా దర్శకత్వంలో రూపొందుతోన్న నాగచైతన్య ‘శైలజారెడ్డి అల్లుడు’ సినిమా గురించి ఆ సినిమా రిలీజ్ సమయంలో తప్పకుండా మాట్లాడతాను. -
ఆ రెండిటికీ లింకు పెట్టకూడదు – మారుతి
‘‘నేను తొలిసారి పూర్తిగా మాటలు, స్క్రిప్ట్ అందించిన సినిమా ఇది. శైలేంద్రబాబుగారికి న్యారేట్ చేశా. డైరెక్టర్‌గా చాలా మందిని అనుకున్నా ప్రభాకర్‌గారే కరెక్ట్ అనిపించింది. ఒక సినిమా ఫెయిల్ అయితే కథ ఫెయిల్ అయినట్లే తప్ప.. టెక్నీషియన్ ఫెయిల్ అయినట్లు కాదని నేను నమ్ముతాను. ఫెయిల్యూర్‌కి, టెక్నీషియన్‌కి లింకు పెట్టకూడదు. ఈ సినిమాని అందరూ ప్రేమించి చేశారు’’ అని దర్శకుడు మారుతి అన్నారు. సుమంత్ శైలేంద్ర, ఈషా రెబ్బా, పూజిత పొన్నాడ, మురళీశర్మ ముఖ్య తారలుగా ప్రభాకర్.పి దర్శకత్వంలో మారుతి సమర్పణలో ఎస్.శైలేంద్రబాబు నిర్మించిన చిత్రం ‘బ్రాండ్ బాబు’. ఈ సినిమా టీజర్‌ను డైరెక్టర్ హరీశ్ శంకర్ విడుదల చేసి, మాట్లాడుతూ– ‘‘మారుతి చాలా సార్లు తన ఫంక్షన్లకు పిలిచినా రాలేకపోయాను. ఈ సినిమాకు రాకపోతే ఇంకోసారి పిలవనన్నాడు. నాకు చాలా థాట్స్ ఉంటాయి. కానీ, రాయడానికి చాలా సమయం పడుతుంది. మారుతి సింపుల్‌గా కథ రాస్తాడు. అందుకే తనంటే విపరీతమైన గౌరవం’’ అన్నారు. ‘‘సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు’ తర్వాత తెలుగులో నేను నిర్మించిన చిత్రం ‘బ్రాండ్ బాబు’. ఈ సినిమా ద్వారా నా తనయుడు సుమంత్‌ని హీరోగా పరిచయం చేస్తున్నాను’’ అన్నారు ఎస్.శైలేంద్రబాబు. ‘‘సినిమా సక్సెస్ అయితే ఎవరైనా అవకాశం ఇస్తారు. అంతంత మాత్రమే ఆడిన నా సినిమా (నెక్ట్స్ నువ్వే) చూసి నువ్వు బాగానే డైరెక్ట్ చేశావ్ అని మారుతిగారు మెచ్చుకుని నాకు ఈ సినిమాకి చాన్స్ ఇచ్చారు’’ అన్నారు ప్రభాకర్. సుమంత్ శైలేంద్ర, ఈషా రెబ్బా, పూజిత పొన్నాడ, రాజా రవీంద్ర, పూర్ణాచారి తదితరులు పాల్గొన్నారు. -
‘ఆ ఫస్ట్ లుక్ ఫేక్’
అక్కినేని యువ కథానాయకుడు నాగచైతన్య హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం శైలజా రెడ్డి అల్లుడు. వరుస విజయాలతో మంచి ఫాంలో ఉన్న మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అత్త పాత్రలో సీనియర్ నటి రమ్యకృష్ణ నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ ఇదే నంటూ ఓ ఫ్యాన్ మేడ్ పోస్టర్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఈ పోస్టర్ పై దర్శకుడు మారుతి స్పందించారు. సోషల్ మీడియాలో సర్క్యూలేట్ అవుతున్న ఫోటో ఓరిజినల్ కాదంటూ క్లారిటీ ఇచ్చారు. మరో వారం రోజుల్లో అఫీషియల్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తామంటూ తెలిపారు. నాగచైతన్య సరసన అనూ ఇమ్మాన్యూల్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. To all the fans of @chay_akkineni we would like to clarify that the image that is being circulated as #SailajaReddyAlludu first look is fake. We will be releasing the original one in a week. Please do not share the fake one, original will be worth your wait!👍 — Maruthi dasari (@DirectorMaruthi) 1 July 2018 -
సూపర్ ఎనర్జీ
డ్యాన్స్ ఇరగదీస్తున్నారు అల్లుడు. వరుసగా రెండు సాంగ్స్‌లో అదిరిపోయే స్టెప్పులు వేశారట ఆయన. నాగచైతన్య, అనూ ఇమ్మాన్యుయేల్ జంటగా మారుతి దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ‘శైలజారెడ్డి అల్లుడు’ అనే టైటిల్ అనుకుంటున్నారు. అల్లుడుగా నటిస్తున్న నాగచైతన్యకు అత్త పాత్రలో రమ్యకృష్ణ కనిపించనున్నారు. ఈ సినిమాలోని రెండు సాంగ్స్‌ను వెంట వెంటనే కంప్లీట్ చేశారట. ‘‘రెండు పాటలను కంప్లీట్ చేశాం. డ్యాన్స్‌లో నాగచైతన్య ఎనర్జీ లెవల్స్ సూపర్. ఈ సాంగ్స్‌కు శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ వహించారు’’ అని పేర్కొన్నారు డైరెక్టర్ మారుతి. అంతేకాకుండా హీరోయిన్ అనూ ఇమ్మాన్యుయేల్, డ్యాన్స్ మాస్టర్ శేఖర్లతో ఉన్న ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. -
ఆస్తులకూ ఆధార్
సాక్షి,ఆదిలాబాద్: ప్రభుత్వం ఏ పథకం తీసుకొచ్చిన దానికి లబ్ధి పొందాలంటే ఆధార్ కార్డు ఉండాలి. ప్రతీ దానికి ఆధార్‌ను అనుసంధానం చేస్తున్న ప్రభుత్వం మున్సిపాలిటీల్లోని ఆస్తులకూ ఆధార్ తప్పనిసరి చేసింది. గతంలోనే ఈ ప్రక్రియ ప్రారంభించినా మధ్యలోనే నిలిచిపోయింది. దీంతో రెండు రోజుల క్రితం దీనిపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన సీడీఎంఏ శ్రీదేవి పన్ను చెల్లించే ప్రతీ ఆస్తికి ఆధార్ అనుసంధానం పూర్తి చేయాలని ఆదేశించారు. బల్దియాలో ఆస్తులకు ఆధార్ అనుసంధానం చేయాలని ఏడాది కిందటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆదేశాలున్నాయి. ఇందులో భాగంగానే ఆదిలాబాద్ మున్సిపాలిటీలో గతేడాది జూన్‌లో ఈ ప్రక్రియ ప్రారంభించారు. మధ్యలోనే ఈ కార్యక్రమం ఆగిపోయింది. మొదట్లో ఇంటింటి సర్వే నిర్వహించిన అధికారులు ఇతర పన్నుల వసూళ్లకే ప్రాధాన్యత ఇవ్వడంతో ఈ లక్ష్యం నెరవేరలేదు. బల్దియాలో 9 వేలు పూర్తి.. జిల్లాలో ఆదిలాబాద్ ఒక్కటే మున్సిపాలిటీ ఉంది. ఆదిలాబాద్ బల్దియాలో 36 వార్డులు ఉన్నాయి. 2011 జనాభాల లెక్కల ప్రకారం 1.17 లక్షల జనాభా ఉంది. 20.65 చదరపు కిలోమీటర్లు విస్తరించింది. మొత్తం 26 వేల ఆస్తులు ఉన్నాయి. గతేడాది ప్రారంభించిన ఆస్తులకు ఆధార్ అనుసంధానం ప్రక్రియలో ఇప్పటి వరకు 9 వేల ఆస్తులకు ఆధార్ పూర్తి చేశారు. సీడీఎంఏ ఆదేశాలతో ఈ ఆధార్ నమోదు కసరత్తు ప్రారంభించారు. యుద్ధ ప్రాతిపాదికన క్షేత్రస్థాయిలో ప్రత్యేకంగా 8 బృందాలతో ఇంటింటికీ సర్వే నిర్వహిస్తున్నారు. ఆస్తి పన్నుకు ఆధార్‌తో పాటు సెల్‌ఫోన్ నెంబర్లు తీసుకుంటున్నారు. దీని ద్వారా బల్దియా అధికారులకు పన్నుకు సంబంధించిన ఏదైనా సమాచారం అవసరం ఉంటే నేరుగా వారికే ఫోన్ చేసి తెలుసుకునే వెసులు బాటు ఉంటుంది. అక్రమాలకు అడ్డుకట్ట.. బల్దియాలో ఆస్తిపన్నును ఆధార్ అనుసంధానం చేయడం ద్వారా అక్రమాలకు అడ్డుకట్ట పడే అవకాశం ఉంది. సెల్‌ఫోన్ నెంబర్లు సైతం తీసుకుంటుండడంతో ఏదైనా సమాచారాన్ని వెంటనే యజమానికి చేరవేసేలా వీలు కలుగుతుంది. పన్నుల మదింపు సమయంలో వ్యత్యాసాలను గుర్తించేందుకు ఉన్నత స్థాయిలో విచారణ చేపట్టవచ్చు. సదరు యజమానికి సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకోవచ్చు. ఆధార్ అనుసంధానం పూర్తి అయిన తర్వాత ఎవరి పేరు మీద ఎన్ని ఆస్తులు ఉన్నాయి అనేది తెలుస్తుంది. దీని ద్వారా అక్రమంగా సంపాధించిన ఆస్తులు బయట పడే అవకాశం ఉంటుంది. అనుంధానం కొనసాగుతోంది.. ఆదిలాబాద్‌లో ఆస్తులకు ఆధార్ అనుసంధానం ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటి వరకు 9 వేలు పూర్తిచేయడం జరిగింది. ఈ నెలాఖరులో మొత్తం ఆస్తులకు అనుసంధానం చేస్తాం. ప్రత్యేక బృందాలు ఇంటింటి సర్వే చేపడుతున్నారు. ఆధార్‌తోపాటు సెల్‌ఫోన్ నెంబర్లు అనుసంధానించాలని మున్సిపల్ శాఖ నిర్ణయించింది. ఇది పారదర్శకంగా ఉండేందుకు ఉపయోగపడుతుంది. – మారుతి ప్రసాద్, మున్సిపల్ కమిషనర్ -
అల్లుడు వెయిటింగ్
అల్లుడు ప్రస్తుతం న్యూయార్క్‌లో ఉన్నాడు. ఫారిన్ నుంచి వచ్చిన తర్వాత కూడా అల్లుడిని అత్తయ్య పలకరించదట. వచ్చే నెలలోనే అత్తా–అల్లుడి మీట్ అవుతారు. నాగచైతన్య హీరోగా మారుతి దర్శకత్వంలో సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇందులో అనూ ఇమ్మాన్యుయేల్ కథానాయిక. ఈ సినిమాకు ‘శైలజారెడ్డిగారి అల్లుడు’ అనే టైటిల్ అనుకుంటున్నారు. నాగచైతన్యకు అత్త పాత్రలో రమ్యకృష్ణ నటించనున్నారు. ప్రస్తతం ‘సవ్యసాచి’ షెడ్యూల్æకోసం న్యూ యార్క్‌లో ఉన్నారు నాగచైతన్య. ఈ షూట్‌ను కంప్లీట్ చేసుకుని ఈ నెల 18 నుంచి హైదరాబాద్‌లో జరగనున్న ‘శైలజా రెడ్డి’ షూట్లో జాయిన్ అవుతారు. మరి... అత్త శైలజా రెడ్డి ఎంట్రీ ఎప్పుడు? అంటే.. జూన్ 15న అని తెలిసింది. -
భారత్‌కు ఎస్‌యూవీల కాన్వాయ్
సాక్షి, బిజినెస్ విభాగం : చిన్న కారు సోకు తగ్గిపోతోంది. ఆదాయాలు పెరుగుతుండటంతో ప్రజల చూపు ఎస్‌యూవీలు, మరింత గ్లామరస్‌గా ఉండే ఖరీదైన కార్ల వైపు మళ్లుతోంది. ధర, నిర్వహణ వ్యయాలు.. ఈ రెండూ కీలకంగా గతంలో వినియోగదారులు కార్లను కొనుగోళ్లు చేసేవాళ్లు. ఇదిప్పుడు మారుతోంది. ఇంజిన్ కెపాసిటీ, సౌకర్యం, సొగసులకు ప్రాధాన్యం పెరుగుతోంది. దీంతో చిరకాలంగా చిన్న కార్లకు మంచి మార్కెట్‌గా ఉన్న భారత్.. ఎస్యూవీ సెగ్మెంట్‌కు మంచి మార్కెట్‌గా ఎదగటం మొదలెట్టింది. భారత్‌లో వాహన మార్కెట్ మెచ్యూర్ అవుతోందనడానికి ఇది మంచి సూచననేది నిపుణుల మాట. ఏడాదికి దాదాపు 40 లక్షల వాహన విక్రయాలతో ప్రపంచంలోనే అయిదవ అతి పెద్ద వాహన మార్కెట్‌గా అవతరించిన భారత్‌లో మూడో తరం కొత్త కంపెనీలు రానున్నాయి. 90లలో హ్యుందాయ్, టొయోటా, హోండా మోటార్స్ తొలి తరం కంపెనీలుగా రాగా, 2000లలో ఫోక్స్‌వ్యాగన్, రెనో, నిస్సాన్ తదితర కంపెనీలొచ్చాయి. ఇప్పుడు మూడో తరం కొత్త కంపెనీలు.. కియా, పీఎస్ఏ, ఎమ్జీ.. ఇలా ఆరు కొత్త విదేశీ కంపెనీలు వస్తున్నాయి. ఇవన్నీ ఎక్కువగా ఎస్యూవీలపైననే దృష్టి పెడుతుండడం విశేషం. కియా, ఎమ్జీలు భారత్‌లో వచ్చే 3–4 ఏళ్లలో రూ.13,000 కోట్లు, పీఎస్ఏ గ్రూప్ రూ.700 కోట్ల మేర పెట్టుబడులు పెట్టనున్నాయి. చిన్న కార్ల సెగ్మెంట్‌పై కాకుండా ఈ విదేశీ కంపెనీలు ప్రీమియమ్ ఎస్‌యూవీలు, హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్లపై కన్నేశాయి. ఎస్‌యూవీల స్పీడ్... అమెరికాను అధిగమిస్తాం ఎస్‌యూవీల అమ్మకాలు జోరుగా పెరుగుతున్నాయి. మినీ కార్లు, కాంపాక్ట్ సెడాన్ల తర్వాత ఇప్పుడు కాంపాక్ట్ ఎస్‌యూవీలు భారత్‌లో బాగా అమ్ముడవుతున్నాయి. 4.2 మీటర్ల పొడవు, రూ.15 లక్షల రేంజ్ ఉండే ఈ ఎస్‌యూవీల విక్రయాల్లో గత ఏడాది మన దేశం జపాన్ను తోసిరాజని మూడోస్థానంలోకి వచ్చింది. త్వరలో రెండో స్థానంలో ఉన్న అమెరికాను కూడా అధిగమిస్తామని, చైనా తర్వాతి స్థానం మనదే అవుతుందనేది నిపుణుల అంచనా. గత ఐదేళ్లలో మన దేశంలో ఎస్‌యూవీల విక్రయాలు దాదాపు రెట్టింపయ్యాయి. స్పోర్ట్స్, మల్టీ యుటిలిటి వెహికల్స్ కలిపి గతేడాది 7.6 లక్షల వరకూ అమ్ముడయ్యాయి. మొత్తం అమ్ముడైన కార్లలో వీటి వాటా నాలుగో వంతు. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి 11 నెలల్లో మొత్తం 8.3 లక్షల యుటిలిటీ వెహికల్స్ అమ్ముడయ్యాయి. మొత్తం 30 లక్షల అమ్మకాల్లో ఇది 28 శాతం. నాలుగేళ్లలో 35 కొత్త ఎస్‌యూవీలు.. వచ్చే నెల నుంచి ఆరంభమయ్యే కొత్త ఆర్థిక సంవత్సరంలో ప్రయాణికుల వాహన విక్రయాలు 7–9 శాతం రేంజ్‌లోనే పెరుగుతాయని... ఎస్‌యూవీల అమ్మకాలు మాత్రం 14–15 శాతం వృద్ధితో పది లక్షల మార్క్‌కు చేరతాయని భావిస్తున్నారు. 2020 కల్లా ఈ కేటగిరీ అమ్మకాలు 15 శాతం చొప్పున చక్రగతిన వృద్దితో 14 నుంచి 15 లక్షల రేంజ్‌కు చేరొచ్చనే అంచనాలున్నాయి. దీంతో విదేశీ కంపెనీలు మన ఎస్యూవీ మార్కెట్‌పై కన్నేశాయి. ప్రస్తుతమున్న కంపెనీలూ కొత్త ఎస్‌యూవీలతో పాటు ప్రస్తుతమున్న మోడళ్లలో కొత్త వేరియంట్లను మార్కెట్లోకి తేనున్నాయి. మొత్తం మీద నాలుగేళ్లలో 35 కొత్త ఎస్‌యూవీలు మన మార్కెట్‌ను ముంచెత్తనున్నాయి. దాదాపు ఆరు విదేశీ కంపెనీలు తమ యుటిలిటీ వాహనాలను మన మార్కెట్లోకి తేవడానికి సిద్ధమవుతున్నాయి. ఎస్ఏఐసీ కియా, పీఎస్ఏ, బెల్కి ఫోటన్,, ఛంగన్ కంపెనీలు తమ మోడళ్లను ముఖ్యంగా ఎస్‌యూవీలను భారత రోడ్లపైకి తెస్తున్నాయి. ఎంపిక ఎంతో కష్టం... విదేశీ కంపెనీలు పోలోమని భారత మార్కెట్లోకి వస్తుండడంతో ఇప్పుడు కారు కొనాలనే భారతీయ వినియోగదారులకు గట్టి చిక్కే ఎదురు కానుంది. ఎంచుకోవడానికి ఎన్నెన్నో మోడళ్లు అందుబాటులోకి రానున్నాయి మరి. కొరియాకు చెందిన కియా మోటార్ కార్పొరేషన్, చైనాకు చెందిన ఎస్ఏఐసీ, పీఎస్ఏ గ్రూప్ తదితర విదేశీ కంపెనీలు వచ్చే ఏడాది కనీసం ఆరు ఎస్యూవీ మోడళ్లను అందుబాటులోకి తేనున్నాయి. ఎమ్జీ మోటార్ ఇండియా: చైనాకు చెందిన షాంగై ఆటోమోటివ్(ఎస్ఏఐసీ) అనుబంధ సంస్థ ఎమ్జీ మోటార్... ఇతర విదేశీ కంపెనీలతో పోలిస్తే ఇదే మొదట భారత్‌లోకి ఎస్యూవీ తేనుంది. ఇటీవలే మార్కెట్లోకి వచ్చిన జీప్ కాంపాస్కు పోటీగా ఈ కంపెనీ కొత్త ఎస్‌యూవీని తెస్తోంది. ఆ తర్వాత క్రెటాకు పోటీగా మరో ఎస్‌యూవీని అందుబాటులోకి తేనుంది. మోరిస్ గ్యారేజెస్ (ఎమ్జీ) బ్రాండ్ ఎస్‌యూవీలను వచ్చే ఏడాది జూన్ కల్లా భారత మార్కెట్లోకి తెస్తామని, ఇప్పుడు భారత్‌లో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న సెగ్మెంట్ ఎస్యూవీ సెగ్మెంటేనని ఎమ్జీ మోటార్ ఇండియా ఎమ్డీ రాజీవ్ చబా చెప్పారు. తమ కంపెనీ తొలి ఎస్‌యూవీకి కావలసిన విడిభాగాలను ఇప్పటికే 80–85 శాతం మేర సమీకరించామన్నారు. మరింతగా స్థానిక విడిభాగాలనే వినియోగించుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నామని, దీంతో తమ ఎస్‌యూవీని ఆకర్షణీయమైన ధరకు అందించగలమని చెప్పారాయన. చాలా విదేశీ కంపెనీలు ఎంట్రీ లెవల్ ఎస్యూవీలపైననే దృష్టి పెడుతుండగా, ఎమ్జీ మోటార్ మాత్రం ప్రీమియమ్ ఎస్యూవీలపైనే దృష్టి కేంద్రీకరిస్తోంది. బెల్కి ఫోటన్: భాతర్‌లో ఎస్‌యూవీల జోరును చూసిన చైనా అతి పెద్ద వాణిజ్య వాహన కంపెనీ బెల్కి ఫోటన్.. భారత మార్కెట్ పట్ల తన ప్రణాళికలను పూర్తిగా మార్చుకుంది. భారత్‌లో ట్రక్కులతో అరంగేట్రం చేయాలనుకున్న ఈ కంపెనీ, ఆ ఆలోచనకు స్వస్తి చెప్పి బోర్గ్‌వార్డ్ బ్రాండ్ కింద ఎస్‌యూవీలను, వ్యాన్లను తేవాలనుకుంటోంది. ఫోర్స్ మోటార్స్ టెంపో ట్రావెలర్, జీప్ కాంపాస్, మహీంద్రా ఎక్స్‌యూవీలకు పోటీగా వాహనాలను అందించాలనుకుంటోంది. కియా: దక్షిణ కొరియాకు చెందిన కంపెనీ ‘కాన్సెప్ట్ ఎస్పీ’ని ఇటీవల ఢిల్లీలో జరిగిన ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శించింది. ఈ కాన్సెప్ట్ కారు ఆధారంగా ఈ కంపెనీ అందించనున్న ఎస్యూవీ.. హ్యుందాయ్ క్రెటా, రెనో డస్టర్‌కు గట్టిపోటీనిస్తుందని పరిశ్రమ వర్గాలంటున్నాయి. పోటీ ఎక్కువగా ఉన్న చిన్న కార్ల సెగ్మెంట్లోకి కాకుండా ఎస్‌యూవీతో భారత మార్కెట్లోకి అరంగేట్రం చేయాలనుకుంటున్నట్లు ఇటీవలే కియా మోటార్స్ ప్రెసిడెంట్ హాన్‌వూ పార్క్ చెప్పారు. మొదటగా కాన్సెప్ట్ ఎస్పీ ఆధారిత ఎస్‌యూవీని వచ్చే ఏడాది మార్కెట్లోకి తెస్తామని, ఈ తర్వాత మరో చిన్న ఎస్‌యూవీని కూడా అందుబాటులోకి తెస్తామని ఆయన వివరించారు. భారత ఎస్యూవీ సెగ్మెంట్లో పోటీ తీవ్రంగానే ఉన్నా, అవకాశాలు కూడా అపారంగా ఉన్నాయని కియా మోటార్స్ ఇండియా హెడ్ (మార్కెటింగ్ అండ్ సేల్స్) మనోహర్ భట్ వెల్లడించారు. మిడ్ సెగ్మెంట్ ఎస్‌యూవీలు గత ఏడాది మూడున్నర లక్షలు అమ్ముడయ్యాయని 2021 కల్లా ఈ అమ్మకాలు ఆరున్నర లక్షలకు చేరతాయని వివరించారు. పీఎస్ఏ: ఫ్రాన్స్‌కు చెందిన ఈ కంపెనీ ముందుగా ఎంట్రీ లెవల్ ఎస్‌యూవీని తేవాలనుకుంటోంది. భారత్‌లో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడం ఈ కంపెనీకి ఇది మూడోసారి. ఒక కాంపాక్ట్ ఎస్‌యూవీని కూడా తేనున్నట్లు సమాచారం. మరోవైపు మారుతీ విటారా బ్రెజాకు పోటీగా ఒక ఎస్‌యూవీని రంగంలోకి దించనున్నట్లు సంబంధిత వర్గాలంటున్నాయి. చెన్నైలోని హిందుస్తాన్ మోటార్స్ ప్లాంట్‌ను తన ఉత్పత్తి కార్యకలాపాలకు ఈ కంపెనీ వినియోగించుకోనుంది. మారుతీ సుజుకీ: ప్రస్తుతం ఎస్యూవీ సెగ్మెంట్లో విటారా బ్రెజా ఒక్కటే ఈ కంపెనీకి ఉంది. మరిన్ని ఎస్‌యూవీలను మార్కెట్లోకి తేనుంది. హ్యుందాయ్ క్రెటాకు పోటీగా మిడ్‌సైజ్ ఎస్‌యూవీని తేవాలనునుకుంటోంది. ప్రసుత్తం ఎంట్రీ లెవల్ ఎస్యూవీ సెగ్మెంట్లో మహీంద్రాకు చెందిన కేయూవీ100 బాగా అమ్ముడవుతున్నాయి. దీనికి పోటీగా మరో ఎస్‌యూవీని తేవాలని మారుతీ ప్రయత్నిస్తోంది. క్రెటాతో మంచి విజయం దక్కించుకున్న హ్యుందాయ్ మరిన్ని ఎస్‌యూవీలపై దృష్టి సారిస్తోంది. ఫోక్స్‌వ్యాగన్: కాంపాక్ట్ ఎస్యూవీ సెగ్మెంట్లో ఫోక్స్‌వ్యాగన్ ‘టీ–క్రాస్’ని తెస్తోంది. ఇక రెనో కంపెనీ క్యాప్చర్ ఎస్‌యూవీని తేనుంది. రూ.8–15 లక్షల రేంజ్లో ఉన్న క్రెటా ఎస్‌యూవీకి పోటీగానే ఛంగన్, పీఎస్ఏలు ఎస్‌యూవీలను తేవాలనుకుంటున్నాయి. -
నవ్వుల థ్రిల్లర్
మారుతి, శ్రావణి, అశ్వినీ, ప్రియ ముఖ్య పాత్రల్లో రూపొందిన చిత్రం ‘యమ్ 6’. జైరామ్ వర్మ దర్శకత్వంలో విశ్వనాథ్ ఫిలిం ఫ్యాక్టరీ, శ్రీలక్ష్మీ వెంకటాద్రి క్రియేషన్స్ పతాకంపై విశ్వనాథ్ తన్నీరు, సురేష్. ఎస్ నిర్మించిన ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ఈ సందర్భంగా జైరామ్ వర్మ మాట్లాడుతూ– ‘‘సస్పెన్స్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రమిది. కడుపుబ్బా నవ్వించే సన్నివేశాలూ ఉంటాయి. అంతర్లీనంగా చిన్న సందేశమిచ్చే ప్రయత్నం చేశాం. సంగీతం, సినిమాటోగ్రఫీ బాగా కుదిరాయి. ఇటీవల షూటింగ్ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి’’ అన్నారు. ‘‘దర్శకుడు చెప్పిన కథ నచ్చి ఈ సినిమా నిర్మించా. మా హీరో మారుతికి ఇది తొలి సినిమా అయినా అనుభవం ఉన్న హీరోలా నటించాడు’’ అన్నారు విశ్వనాథ్ తన్నీరు. ‘‘నేను నటనలో శిక్షణ తీసుకోలేదు. దర్శకుడు చెప్పినట్లు చేశా’’ అన్నారు మారుతి. గోవింద, హరిత, వంశీ, ఇంద్రతేజ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: విజయ్ బాలాజి, కెమెరా: మహ్మద్ రియాజ్, సమర్పణ: పార్వతి. -
కొత్త ప్రయాణం మొదలు
వైవిధ్యమైన చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు కథానాయకుడు నాగచైతన్య. వరుస హిట్లతో జోరు మీదున్నారు దర్శకుడు మారుతి. ఈ ఇద్దరూ జోరుగా కొత్త సినిమా మొదలుపెట్టారు. మారుతి దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ సినిమా శుక్రవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఇందులో అనూ ఇమ్మాన్యుయేల్ కథానాయిక. ‘‘కొత్త ప్రయాణం మొదలైంది. మీ అందరి ఆశీర్వాదాలు కావాలి’’ అని మారుతి పేర్కొన్నారు. లవ్, యూత్‌ఫుల్ ఎంటర్టైనర్గా ఈ సినిమా తెరకెక్కనుందని సమాచారం. ఈ చిత్రానికి ‘శైలజారెడ్డి అల్లుడు’ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. రమ్యకృష్ణ, ‘వెన్నెల’ కిశోర్, కల్యాణీ నటరాజన్, శరణ్య, పృథ్వీ, రఘుబాబు, రాహుల్ రామకృష్ణ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: నిజర్ షఫీ, సంగీతం: గోపీసుందర్, సమర్పణ: పీడీవీ ప్రసాద్. -
నాగచైతన్య కొత్త సినిమా ప్రారంభం
-
నంది అవార్డులు... విమర్శలు–వివాదాలు!
వడ్డించేవాడు మనవాడయితే బంతిలో ఎక్కడ కూర్చున్నా పర్వాలేదని తెలుగులో ఓ సామెత! ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన నంది అవార్డుల జాబితా విషయంలో కొందరు ఈ సామెతనే గుర్తు చేసుకుంటున్నారు. ‘అవార్డులు ఇచ్చేవాడు మనవాడయితే ఎలాంటి సినిమా తీసినా పర్వాలేదేమో!’ అంటున్నారు కొందరు నెటిజన్లు. సోమవారం ఏపీ ప్రభుత్వం ప్రకటించిన నంది అవార్డులపై పలు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఫిల్మ్ ఇండస్ట్రీలో కొందరు బాహాటంగానే విమర్శించారు. ‘రుద్రమదేవి’ తీసినందుకు క్షమించండి: గుణశేఖర్ ‘మా సిన్మాకి పన్ను మినహాయింపు ఎందుకివ్వలేదని ప్రశ్నించడమే నేను చేసిన తప్పా?’ అనడుగుతున్నారు ‘రుద్రమదేవి’ దర్శక–నిర్మాత గుణశేఖర్. ‘‘మహిళా సాధికారతను చాటి చెబుతూ తీసిన ‘రుద్రమదేవి’ మూడు ఉత్తమ చిత్రాల్లో ఏదో ఒకదానికి ఎందుకు ఎంపిక కాలేకపోయింది? కనీసం జ్యూరీ గుర్తింపుకి కూడా నోచుకోలేకపోయింది. మరచి పోయిన తెలుగు జాతి చరిత్రని వీడెవడో వెతికి, సినిమా తీసి గుర్తు చేశాడు. మళ్లీ ఇప్పుడు అవార్డులు ఇచ్చి గుర్తు చేయడం ఎందుకు అనుకున్నారా? ఇలాంటి చిత్రాన్ని ప్రోత్సహిస్తే సమాజానికి తప్పుడు సంకేతాలు వెళతాయని భావించారా? అదే అయితే... ‘రుద్రమదేవి’ లాంటి చిత్రాన్ని నిర్మించినందుకు నన్ను క్షమించండి’’ అని గుణశేఖర్ పేర్కొన్నారు. మెగా హీరోలందరూ నటన నేర్చుకోవాలి: ‘బన్నీ’ వాసు మెగా ఫ్యామిలీ సన్నిహితుడు, గీతా ఆర్ట్స్‌లో పలు చిత్రాలకు సహనిర్మాతగా వ్యవహరించిన ‘బన్నీ’ వాసు నంది అవార్డులు ప్రకటన వచ్చిన తర్వాత ‘ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పురస్కారాలు సాధించడానికి, మెగా హీరోలందరూ టీడీపీ ప్రభుత్వం దగ్గర నటనలో మెళకువలు నేర్చుకోవాలి’ అని ఫేస్బుక్లో కామెంట్ చేశారు. అనంతరం ‘‘ఏదో సినిమాకు అవార్డు వచ్చిందనో? మాకు రాలేదనో? కామెంట్ చేయలేదు. 2014లో ‘రేసుగుర్రం’ ఎంత ప్రజాదరణ పొందిందో... అందరికీ తెలిసిందే. ఉత్తమ చిత్రంతో పాటు చాలా కేటగిరీలు ఉన్నాయి. ‘రేసుగుర్రం’ను దేనికీ కన్సిడర్ చేయకపోవడంతో అప్సెట్ అయ్యా. 2012లో ‘గబ్బర్‌సింగ్’ విషయంలోనూ ఇలాంటి అన్యాయమే చేశారు. ఒకవేళ... ఈ రెండూ కమర్షియల్ సినిమాలని పక్కన పెడితే, ఇప్పుడు అవార్డులకు ఎంపిక చేసినవాటిలో 75 శాతం కమర్షియల్ సినిమాలే ఉన్నాయి కదా? వాటికి ఏ ప్రాతిపదికన ఇచ్చారు? మా రెండు సినిమాలను ఎందుకు పక్కన పెట్టారు? తెలియడం లేదు’’ అని ‘బన్నీ’ వాసు పేర్కొన్నారు. మారుతి కామెడీ దర్శకుడు మారుతి మంగళవారం ట్విట్టర్లో ఓ వీడియో పోస్ట్ చేశారు. అందులో నటుడు ఉత్తేజ్ ‘ఉత్తమ అత్త, మేనత్త, అమ్మ, అక్క, చెల్లి, అత్యుత్తమ చెల్లి’ అవార్డులను ప్రకటిస్తుంటారు. ఉత్తమ సవతుల్లో అయితే వన్, టు, త్రీ అవార్డులు ఉంటాయి. ఇదంతా చూస్తున్న వ్యక్తి (నటుడు– రచయిత హర్షవర్ధన్) ‘ఒరేయ్! ఈ అవార్డ్స్ మన కోసం ఎరేంజ్ చేసినవేనా!’ అనడిగితే? పక్కన ఉన్న వ్యక్తి (నటుడు గుండు హనుమంతురావు) ‘ఇండస్ట్రీలో బాలాజీకి ఉన్న పరిచయస్తులకు ఏర్పాటు చేసినవి’ అంటాడు. ఈ వీడియో ఓ సీరియల్‌కి సంబంధించినది. నంది అవార్డులను ఉద్దేశించే సెటైరికల్‌గా మారుతి పోస్ట్ చేశారని పలువురి నెటిజన్ల ఫీలింగ్! లెజెండ్‌కు ఎక్కువ అవార్డులు రావడం ఆనందాన్నిచ్చింది : బాలకృష్ణ ‘లెజెండ్’ సినిమాకు ఎక్కువ అవార్డులు రావడం తనకు ఎంతో ఆనందాన్నిచ్చిందని సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. బుధవారం అమరావతి అసెంబ్లీ లాబీలో ఆయన మీడియాతో మాట్లాడారు. 2014, 2015, 2016 సంవత్సరాలకు అవార్డులు గెలుచుకున్నవారికి అభినందనలు తెలిపారు. ఎన్టీఆర్, రఘుపతి వెంకయ్య, బీఎన్‌రెడ్డి, నాగిరెడ్డి–చక్రపాణి అవార్డుల ఎంపికకు మంచి స్పందన వచ్చిందన్నారు. -
చైతూ, మారుతి.. ఇంట్రస్టింగ్ టైటిల్
వరుస విజయాలతో ఆకట్టుకుంటున్న యంగ్ హీరో నాగచైతన్య, మరో ఆసక్తికర చిత్రంతో రెడీ అవుతున్నాడు. ఇప్పటికే చందూ మొండేటి దర్శకత్వంలో సవ్యసాచి సినిమాను ఎనౌన్స్ చేసిన చైతూ, మారుతి దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నాడు. శర్వానంద్ హీరోగా తెరకెక్కిన మహానుభావుడు సినిమాతో మరోసారి ఆకట్టుకున్న మారుతి, చైతన్యతో ఎలాంటి సినిమా తెరకెక్కిస్తాడో అన్న ఆసక్తి నెలకొంది. తాజాగా ఈ కాంబినేషన్‌కు సంబందించిన ఆసక్తికరమైన వార్త ఒకటి టాలీవుడ్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. తాజాగా సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై ‘శైలజా రెడ్డి అల్లుడు’ అనే టైటిల్‌ను రిజిస్టర్ చేయించారు. దీంతో ఈ టైటిల్ చైతూ, మారుతిల కాంబినేసన్లో తెరకెక్కబోయే సినిమా కోసమే అన్న టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతానికి చిత్రయూనిట్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన లేకపోయినా.. టైటిల్ మాత్రం హాట్ టాపిక్‌గా మారింది. -
బాబు లండన్ వెళతాడా?
‘‘ఆండవన్ కట్టలై’ అనే తమిళ సినిమాను ‘లండన్ బాబులు’గా రీమేక్ చేశాం. చాలా రోజుల క్రితమే సినిమా పూర్తయ్యింది. అయితే, మంచి రిలీజ్ డేట్ కోసం వెయిట్ చేశాం. నవంబర్ 10న సినిమాను రిలీజ్ చేస్తున్నాం’’ అన్నారు దర్శక–నిర్మాత మారుతి. రక్షిత్, స్వాతి జంటగా చిన్నికృష్ణ దర్శకత్వంలో ఏవీఎస్ స్టూడియో సమర్పణలో మారుతి నిర్మించిన సినిమా ‘లండన్ బాబులు’. మారుతి మాట్లాడుతూ– ‘‘చక్కని వినోదంతో రూపొందిన సినిమా ఇది. చూసిన వారందరూ బాగుందని ప్రశంసిస్తున్నారు. ఈ సినిమా నచ్చి, ఓ ప్రముఖ టీవీ వారు శాటిలైట్ హక్కులు సొంతం చేసుకున్నారు. అన్ని వర్గాలవారూ చూసేలా తీసిన ఈ సినిమాని ప్రేక్షకులు ఆదరించాలి’’ అన్నారు. ‘‘సినిమాలకు దూరంగా వైజాగ్‌లో ఉన్న నన్ను పిలిచి మరీ మారుతిగారు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్. లండన్ వెళ్లాలనుకున్న ఓ యువకుడి కథే ఈ సినిమా. అతడు లండన్ వెళతాడా? లేదా? అనేది సినిమాలో చూడాల్సిందే. నవంబర్ 4న ప్రీ–రిలీజ్ వేడుక నిర్వహిస్తాం’’ అన్నారు చిన్నికృష్ణ. ఈ చిత్రానికి కెమెరా: శ్యామ్ కె. నాయుడు, సంగీతం: కె, ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు: కిరణ్ తలసిల, దాసరి వెంకట సతీష్. -
తారామణి చూశా... చాలా బాగుంది – మారుతి
నెలకు ఎనభై వేలు సంపాదించే సాఫ్ట్వేర్ అమ్మాయి పనీపాటా లేని అబ్బాయితో ప్రేమలో పడుతుంది. ప్రేయసిని ఆ ప్రేమికుడు అడిగే ప్రశ్నలు, సందేహాలు విచిత్రంగా ఉంటాయి. ఆ సాఫ్ట్వేర్ అమ్మాయి, ఈ నిరుద్యోగి కుర్రాడి లవ్‌స్టోరీలో మలుపులు ఏంటి? ఆ కుర్రాడికి ఉద్యోగం దొరుకుతుందా? తదితర అంశాలతో రూపొందిన చిత్రం ‘తారామణి’. తెలుగమ్మాయి అంజలి, ఆండ్రియా, వసంత్ రవి ప్రధానపాత్రల్లో రామ్ దర్శకత్వంలో తమిళంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని యశ్వంత్ మూవీస్ సమర్పణలో డి. వెంకటేశ్ అదే పేరుతో తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఈ సినిమా టీజర్‌ని దర్శకుడు మారుతి విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ– ‘‘మహానుభావుడు’ రీ రికార్డింగ్ సమయంలో ‘తారామణి’ చూశా. మంచి సినిమా. చాలా బాగుంది. ఇప్పుడు సొసైటీలో జరుగుతున్న సిచ్యువేషన్స్‌ను బేస్ చేసుకుని స్ట్రాంగ్ కంటెంట్‌తో రామ్ ఈ సినిమా అద్భుతంగా రూపొందించాడు. ఈ సినిమా అందరికీ నచ్చుతుంది’’ అన్నారు. ‘‘ప్రతి కుటుంబాన్ని డిస్ట్రబ్ చేయడానికి ఎవడో ఒకడు వస్తుంటాడు. అలాంటి వ్యక్తి బారిన పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో మా సినిమా అవగాహన కల్పిస్తుంది. పెద్ద హిట్ అవుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు డి. వెంకటేశ్. నిర్మాతలు బి.ఎ. రాజు, సురేశ్ కొండేటి, సంగీత దర్శకుడు ఆర్.పి.పట్నాయక్ తదితరులు పాల్గొన్నారు. -
అలా అనుకున్న రోజు దుకాణం కట్టేయాల్సిందే!
‘‘త్రివిక్రమ్‌గారి సినిమా చూసినప్పుడు ఎలా అనిపిస్తుందో? శేఖర్ కమ్ములగారి సినిమా చూసినప్పుడు ఎలా అనిపిస్తుందో? నేను తీసిన సినిమాను ప్రేక్షకులు చూసి ‘ఇది మారుతి సినిమా’ అన్నప్పుడు హ్యాపీగా ఫీలవుతాను. ఎందుకంటే... అదే మనకు గుర్తింపు. వంద మంది డైరెక్టర్లలో మనల్ని ప్రేక్షకులు గుర్తించగలిగితే అంతకు మించిన అదృష్టం ఉండదు’’ అన్నారు దర్శకుడు మారుతి. ‘భలే భలే మగాడివోయ్’, ‘మహానుభావుడు’... ఇలా వరుస విజయాలతో ‘క్లీన్ చిట్’ తెచ్చుకున్న మారుతి బర్త్‌డే ఈ రోజు. ఈ సందర్భంగా ఆయన చెప్పిన విశేషాలు.. ► ఈ బర్త్‌డే స్పెషల్ ‘మహానుభావుడు’ సక్సెస్. ఈ సినిమాతో నా బాధ్యత మరింత పెరిగింది. ఒక మనిషిలో ఉన్న రెండు క్యారెక్టర్ల సంఘర్షణే ఈ సినిమా. ‘‘భలే భలే మగాడివోయ్’లో నానికి మతిమరుపు. ‘మహానుభావుడు’లో శర్వానంద్‌కి ఓసీడీ (అతిశుభ్రత). సినిమాల్లో మీ హీరోలకు ఏదో ఒక డిసార్డర్ పెట్టారు కదా.. రియల్ లైఫ్‌లో మీకేదైనా డిసార్డర్ ఉందా? అనడిగితే– ‘‘లేదు. ఆ రెండు సినిమాల్లో హీరోల క్యారెక్టర్స్ రియల్ లైఫ్‌లో నేను చూసినవే. నాకు ఒక్క ఐడియా వస్తే నా సన్నిహితులతో షేర్ చేసుకుంటా. వాళ్లందరూ బాగుందంటే... ప్రేక్షకులకు కూడా బాగుంటుందనిపించి తీస్తా’’ అన్నారు నవ్వుతూ. ► మారుతి అంటే... కొత్త కాన్సెప్ట్‌కు ఎంటర్టైన్మెంట్ జోడించి ఒక మంచి మాట చెబుతాడని నమ్మవచ్చు. కొంతమంది మాఫియా మూవీస్, కొందరు హారర్ మూవీస్ చేస్తారు. నేను నా జోనర్ (ఎంటర్టైన్మెంట్)లోనే వెళ్లాలనుకుంటున్నా. అయితే, వాటిని నెక్ట్స్ లెవల్లో తెరకెక్కించాలని ఉంది. ► నాకు కొత్తా పాతా, చిన్నా పెద్దా అనే తేడాలు లేవు. కథ కుదిరితే ఎవరితోనైనా సినిమా చేస్తాను. ముఖ్యంగా స్టార్స్ అందరితో సినిమాలు చేయాలని ఉంది. సీక్వెల్స్, రీమేక్ మూవీస్ చేయడానికి ఇష్టపడను. ► క్లీన్‌గా సినిమా తీయాలనుకుంటే తీయలేం. స్వతహాగా మనసులో ఉండాలి. నాలో ఒరిజనల్‌గా ఆ డైరెక్టరే ఉన్నాడు. వాడు ఇప్పుడు బయటకు వచ్చాడు... అంతే. ► టెక్నాలజీతో ఇవాళ లైఫ్ చాలా షార్ట్ అయిపోయింది. టీ20 మ్యాచ్‌లు, షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సిరీస్‌లు వచ్చిన తర్వాత రెండున్నర గంటలు థియేటర్లో కూర్చోడానికి ఆడియన్స్ ఇంట్రస్ట్ చూపించకపోవచ్చు. వాళ్లను థియేటర్లో కూర్చోబెట్టగలిగే డైరెక్టర్లే సక్సెస్ అవుతున్నారు ► ప్రేక్షకుడు ఎక్కడో ఉండడు నాలోనే ఉంటాడని అనుకుంటాను. ప్రతి శుక్రవారం ఒక కామన్ ఆడియన్లానే నేను సినిమాలను ఎంజాయ్ చేస్తాను. నచ్చితే... బాగున్నాయని ట్వీట్ చేస్తా. సినిమాను సినిమాలానే చూస్తా. ‘అరే.. ఆ సీన్ బాగా తీశారు. మనం కూడా ఇంత బాగా తీయా’లని ఎగై్జట్ అవుతుంటా. ఆ ఎగై్జట్‌మెంట్ పోయి, మనం తీసిందే సినిమా అనుకున్న రోజు... దుకాణం కట్టేసుకుని, పార్కుల్లో కాలక్షేపం చేసుకోవాలి. ► నాగచైతన్యతో తీయబోయేది టీనేజ్ యంగ్ లవ్‌స్టోరీ మూవీ. ఇందులో అనూ ఇమ్మాన్యుయేల్ కథానాయిక. ప్రభాస్, బన్నీగార్లతో సినిమాలు చేయడం ఇష్టం. కథ కుదిరి, వారికి నచ్చితే తప్పకుండా చేస్తాను. ► ప్రొడక్షన్ విషయానికొస్తే... ప్రస్తుతం నిర్మిస్తున్న ‘లండన్‌బాబులు’ను నవంబర్‌లో రిలీజ్ చేస్తాం. ఆ తర్వాత రెండు సినిమాలు మొదలుపెడతాం. ఒక సినిమాకు కథ ఇచ్చాను. ఇంకో సినిమాకు కాన్సెప్ట్ ఇచ్చాను. -
నాగచైతన్య మనసు మార్చుకున్నాడా..?
యుద్ధం శరణం సినిమా రిజల్ట్ తో నాగచైతన్య మనసు మార్చుకున్నాడు. ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే చందూ మొండేటి దర్శకత్వంలో మరో సినిమాను ఎనౌన్స్ చేశాడు. సవ్యసాఛి పేరుతో తెరకెక్కబోయే ఈ సినిమానే తన నెక్ట్స్ సినిమా అంటూ కన్ఫామ్ చేశాడు. అయితే యుద్ధం శరణం సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోవటంతో చైతూ మనసు మార్చుకున్నాడట. సవ్యసాఛి కూడా యాక్షన్ జానర్ సినిమా కావటంతో మరో సారి రిస్క్ చేయటం ఇష్టం లేని అక్కినేని హీరో ఓ కామెడీ ఎంటర్టైనర్ కు రెడీ అవుతున్నాడు. ఇప్పటికే చర్చల్లో ఉన్న మారుతి సినిమాను సవ్యసాఛితో పాటు సెట్స్ మీదకు తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నాడు. అయితే ముందుగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమానే రిలీజ్ చేయాలని భావిస్తున్నాడట. శర్వానంద్ హీరోగా మారుతి తెరకెక్కించిన మహానుభావుడు ఈ నెలాఖరున రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ సినిమా రిజల్ట్ ను బట్టి నాగచైతన్య నిర్ణయం తీసుకోనున్నాడు.


