భావోద్వేగాలతో సాగే చిత్రం యాత్ర : మారుతి | Yathra a sincere emotional journey tweets Director Maruthi | Sakshi
Sakshi News home page

భావోద్వేగాలతో సాగే చిత్రం యాత్ర : మారుతి

Feb 10 2019 11:55 AM | Updated on Feb 10 2019 2:20 PM

Yathra a sincere emotional journey tweets Director Maruthi - Sakshi

యాత్ర నిజాయితీతో కూడిన భావోద్వేగాలతో సాగే చిత్రం. హృదయాన్ని హత్తుకునే క్లైమాక్స్ ఉంది.

దివంగత మహానేత వైఎస్‌ రాజశేఖర రెడ్డి చేపట్టిన పాదయాత్ర ఆధారంగా తెరకెక్కిన సినిమా ‘యాత్ర’. ఈ చిత్రాన్ని చూసిన తర్వాత ప్రముఖ డైరెక్టర్‌ మారుతి తన అభిప్రాయాన్ని ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు. యాత్ర నిజాయితీతో కూడిన భావోద్వేగాలతో సాగే చిత్రమని, హృదయాన్ని హత్తుకునే క్లైమాక్స్ ఉందని పేర్కొన్నారు. దివంగత మహానాయకుడు వైఎస్‌ రాజశేఖరరెడ్డిలా మమ్ముట్టి నటించిన తీరు, మహి వీ రాఘవ పనితీరు అద్భుతమని కొనియాడారు. మిగతా నటులు, చిత్రానికి పని చేసిన సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు.

మమ్ముట్టి, రాజశేఖర్‌ రెడ్డి పాత్రలో నటించిన యాత్ర సినిమాకు మహి వీ రాఘవ దర్శకుడు. 70 ఎమ్‌ఎమ్‌ ఎంటర్‌టైన్మెంట్స్‌ బ్యానర్‌పై విజయ్‌ చిల్లా, దేవిరెడ్డి శశి, శివ మేకలు నిర్మించారు. ప్రజా ప్రస్థానం పాదయాత్ర
నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాకు తొలి షో నుంచే సూపర్‌ హిట్ టాక్‌తో దూసుకుపోతోంది.

Advertisement
 
Advertisement
Advertisement