SPSR Nellore
-
‘మా ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక లోకేష్ అబద్ధాలు’
నెల్లూరు: శాసనమండలిలో తమకు సమాధానం చెప్పలేక మంత్రులు తోకముడిచారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి విమర్శించారు. నెల్లూరులో మీడియాతో మాట్లాడిన చంద్రశేఖర్‌రెడ్డి.. ‘ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. కూటమి ప్రభుత్వం వైఫల్యాలను మండలిలో అడుడగడునా ఎండగట్టాం. మా ప్రశ్నలకు సమాధానం చెప్పలేక మంత్రి లోకేష్ అబద్ధాలు చెప్పారు. బీసీల బలవంతపు రాజీనామాలపై సుదీర్ఘంగా చర్చించకుండా లోకేష్ తోకముడిచారు. గత ప్రభుత్వంలో లక్షల ఉద్యోగాలు ఇస్తే.. కూటమి ప్రభుత్వం ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేకపోయింది. డీఎస్సీ నోటిఫికేషన్‌పై సంతకం పెట్టి.. ఇప్పటివరకూ దానిపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదు. గత ప్రభుత్వం లక్షల్లో ఉద్యోగాలు ఇస్తే కూటమి ప్రభుత్వం ఉన్న ఉద్యోగాలను తీసేస్తోంది.వైఎస్సార్సీపీలో ఉండే ఏ ఒక్కరికి రాజకీయ స్వార్థం లేదు. మా నాయకుడు వైఎస్ జగన్‌ను మళ్లీ సీఎం చేసుకోవడమే మా అందరి లక్ష్యం. నన్ను వ్యక్తిగతంగా ఇబ్బంది పెట్టాలని చూసినా.. ఎక్కడా వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు. పేద ప్రజలకు వైఎస్ జగన్ ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తే.. కూటమి ప్రభుత్వం ఒక్క పథకాన్ని కూడా సరిగ్గా అమలు చేయడం లేదు’ అని ధ్వజమెత్తారు. -
ఐసీడీఎస్‌లోనూ అదే తీరు
పెద్ద మొత్తంలో స్వాహా జిల్లాలో ఐసీడీఎస్, విద్యాశాఖలు అవినీతి మయంగా మారాయి. క్షేత్రస్థాయిలో పనిచేసే అంగన్వాడీల విధులను పర్యవేక్షించే అధికారుల నుంచి ప్రాజెక్ట్ కార్యాలయం వరకు అడుగడుగునా ప్రతి బిల్లులో కమీషన్లు కొట్టేస్తున్నారు. ప్రాజెక్ట్ స్థాయి సమావేశాలకు వెళ్లినా.. సెక్టార్ స్థాయి సమావేశాలకు వెళ్లినా కనీసం టీఏ బిల్లులు ఇవ్వకుండానే ఇచ్చేసినట్లు కాజేస్తున్న పరిస్థితి. ఇటీవల అంగన్వాడీలకు విద్యాశాఖ ఆధ్వర్యంలో ‘జ్ఞానజ్యోతి’, ఐడీసీఎస్ ఆధ్వర్యంలో పోషణ్ భీ, పఢాయి భీ ట్రైనింగ్ ప్రొగ్రామ్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా వీరికి ఏర్పాటు చేసిన భోజనం, స్నాక్స్ నిధుల్లో ఎంఈఓలు కుక్కుర్తి చూపించినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ శిక్షణకు హాజరైన కొన్ని ప్రాజెక్ట్‌ల అంగన్వాడీలకు ఇంత వరకు టీఏ బిల్లులు చెల్లించలేదని తెలుస్తోంది. నేను తిన్న బిల్లులు అరగడం లేదు ● గత నెలలో అంగన్వాడీలకు ‘జ్ఞానజ్యోతి’ ట్రైనింగ్ ● ఈ నెలలో పోషణ్ భీ, పఢాయి భీ కార్యక్రమం ● భోజనం, స్నాక్స్‌లో కక్కుర్తి ● టీఏ బిల్లులూ అందరికీ చెల్లించని వైనం టీఏ బిల్లులుఉదయగిరి: ఐసీడీఎస్, విద్యా శాఖల్లోని కొందరు అధికారులు అవినీతిలో మునిగి తేలుతున్నారు. గత నెలలో విద్యాశాఖ ఆధ్వర్యంలో ‘జ్ఞాన జ్యోతి, ఈ నెలలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో పోషణ్ భీ, పఢాయి భీ శిక్షణా కార్యక్రమాల నిర్వహణకు మంజూరు చేసిన భోజనం, స్నాక్స్, టీఏ, స్టేషనరీ నిధులను భారీగా మెక్కినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులకు మెరుగైన విద్యాబోధన కోసం జిల్లా వ్యాప్తంగా సెక్టార్ స్థాయిలో కార్యకర్తలకు శిక్షణ ఇచ్చారు. ఇందులో అంగన్వాడీలకు అందించిన భోజనం, స్టేషనరీ సామగ్రి కొనుగోలు, రవాణా ఖర్చులు (టీఏ), స్నాక్స్ తదితరాల్లో కొంత మంది నిర్వాహకులు చేతివాటం ప్రదర్శించి నిధులు స్వాహా చేశారు. రోజంతా కష్టపడితే అంతంత మాత్రం వేతనాలు వచ్చే చిరుద్యోగుల కడుపు కొట్టడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాలో 12 ఐసీడీఎస్ ప్రాజెక్ట్‌ల పరిఽధిలో 2,934 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి పెట్టి ప్రీ ప్రైమరీ స్కూళ్లుగా మార్చుతోంది. 3 నుంచి 6 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న చిన్నారులకు ఆట, పాటతో కూడిన చదువులు అందించేలా ‘జ్ఞానజ్యోతి’ పేరిట ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల ఎంఈఓల ఆధ్వర్యంలో అంగన్వాడీ కార్యకర్తలకు రెండు విడతలుగా గత నెల 18వ తేదీ నుంచి ఆరు రోజుల పాటు శిక్షణ ఇచ్చారు. ఇందు కోసం ప్రభుత్వం ప్రతి కార్యకర్తకు రోజుకు భోజనం, స్నాక్స్ కోసం రూ.300 కేటాయించింది. టీఏ కింద రూ.50, స్టేషనరీ మెటీరియల్ కోసం మరో రూ.100 కేటాయించారు. అయితే భోజనం, స్నాక్స్ కోసం కేవలం రూ.80 నుంచి రూ.100 వరకే ఖర్చు చేసినట్లు సమాచారం. కొన్ని కేంద్రాల్లో కనీసం మంచినీరు, స్నాక్స్ కూడా ఇవ్వలేదు. మధ్యాహ్న భోజనం అత్యంత నాసిరకంగా అందించారు. అప్పటికప్పుడే చెల్లించాల్సిన టీఏలు ఇంత వరకు ఇవ్వలేదని కొందరు అంగన్వాడీలు ఆరోపిస్తున్నారు. ఇక స్టేషనరీ సామగ్రి కొనుగోలు విషయంలోనూ అదే తంతు. ఈ నెలలో మూడు రోజుల పాటు ఐడీసీఎస్ ఆధ్వర్యంలో పోషణ్ భీ, పఢాయి భీ కార్యక్రమాలపై అంగన్వాడీలకు శిక్షణ ఇచ్చారు. ఐసీడీఎస్ సీడీపీఓలు, సూపర్వైజర్లు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమం కోసం ప్రతి కార్యకర్తలకు రూ.450 ప్రభుత్వం కేటాయించింది. ఇందులో భోజనం, స్నాక్స్ కోసం రూ.250, సామగ్రి కొనుగోలుకు రూ.50, టీఏ కోసం రూ.150 ఖర్చు చేయాలి. ఈ కార్యక్రమంలో కూడా అధికారులు చేతివాటం ప్రదర్శించారు. భోజనం, స్నాక్స్ కోసం రూ.80 నుంచి రూ.100 వరకు ఖర్చు చేశారు. టీఏ రూ.150 ఇవ్వలేదు. అంగన్వాడీ కేంద్రంఅయినా భోజనం బిల్లులు కూడా వదలరా మీరు..! ఊరకే వచ్చిన భోజనం బిల్లులు, టీఏ బిల్లులు అంత అతిగా తింటే ఇలానే ఉంటుంది. జిల్లా వ్యాప్తంగా ఉన్న అంగన్వాడీ కార్యకర్తలు రెండు శాఖల ఆధ్వర్యంలో 2,900 మంది శిక్షణ తీసుకున్నారు. విద్యాశాఖ పర్యవేక్షణలో జరిగిన శిక్షణలో ప్రతి కార్యకర్త నుంచి ఒక్క భోజనం కోసమే కేటాయించిన నిధుల్లో రోజుకు రూ.200 లెక్కన స్వాహా చేశారు. ప్రతి రోజు రూ.5.80 లక్షలు, ఆరు రోజులకు రూ.34.80 లక్షలు మింగేశారు. టీఏ కోసం రూ.8.70 లక్షలు కేటాయించగా, ఇంత వరకు చాలా మందికి అందలేదు. కొంతమంది ఎంఈఓలు టీఏలు ఇవ్వగా, మరి కొంతమంది ఆలస్యమైతే మర్చిపోతారులే అని జాప్యం చేస్తూ ఇంకా బడ్జెట్ రాలేందటూ దాటవేస్తున్నారు. ఈ శాఖ ఆధ్వర్యంలో కూడా అదే దందా కొనసాగింది. భోజనం, స్నాక్స్ కోసం రూ.100 ఖర్చు చేసి రూ.150 స్వాహా చేశారు. వింజమూరు ప్రాజెక్ట్‌లో అయితే కనీసం మంచినీరు, స్నాక్స్ కూడా ఇవ్వలేదు. ఇందులో కూడా భోజనంలో రూ.13 లక్షలు స్వాహా చేశారు. టీఏ రూపంలో ప్రతి కార్యకర్తకు రోజుకు రూ.150 లెక్కన రూ.450 ఇవ్వాల్సి ఉంది. ఇంత వరకు పైసా కూడా ఇవ్వలేదు. ఎవరైనా అడిగితే వేధింపులు తప్పువని ఎవరూ సాహసం చేసి సీడీపీఓలను టీఏ అడగలేకపోతున్నామని పలువురు కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా అధికారులు సమగ్ర దర్యాప్తు చేసి ఇందులో ప్రమేయం ఉన్న వారిపై చర్యలు తీసుకొని కార్యకర్తలకు రావాల్సిన టీఏలు ఇప్పించాల్సిన అవససరం ఉంది. ఈ విషయమై అధికారులను వివరణ కోరగా నిబంధనల మేరకే వ్యవహరించామని తెలిపారు. టీఏ విషయంలోనూ, భోజనం ఖర్చు విషయం గురించి సమగ్ర సమాచారం ఇవ్వకుండా దాటవేశారు. -
ప్రాణాలు తీసిన అతివేగం
● ఆటోను బైక్ ఢీకొని ముగ్గురి దుర్మరణం ● మృతుల్లో ఇద్దరు ఐటీఐ విద్యార్థులు, ఆటో డ్రైవర్ మనుబోలు: నిర్లక్ష్యంగా అతి వేగంతో బైక్ నడుపుతూ ఎదురుగా వస్తున్న ఆటోను ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు దుర్మరణం చెందారు. ఈ ఘటన మనుబోలు మండలంలోని గొట్లపాళెం వద్ద శనివారం జరిగింది. మూడు కుటుంబాల్లో విషాదాన్ని మిగిల్చిన ఈ ఘటన ఆటోడ్రైవర్ కుటుంబాన్ని రోడ్డున పడేసింది. సైదాపురం మండలం ఊటుకూరు దళితవాడుకు చెందిన నోసిన వెంకటేశ్వర్లు కుమారుడు వరుణ్‌కుమార్ (18), అర్తనపల్లి శంకరయ్య కుమారుడు నందకిశోర్ (18), మరో కుమారుడు అర్తనపల్లి ఈశ్వర్ ముగ్గురు మిత్రులు. వీరిలో వరుణ్‌కుమార్, నందకిశోర్ గూడూరులోని కళ్యాణ్ చక్రవర్తి కళాశాలలో ఐటీఐ చదువుతున్నారు. ఈ ముగ్గురు కలిసి బైక్‌పై నెల్లూరుకు పనిమీద వెళ్లారు. తిరుగు ప్రయాణంలో గొట్లపాళెంలో ఉంటున్న వరుణ్ అమ్మమ్మ ఇంటికి వెళ్లేందుకు నెల్లూరు నుంచి కసుమూరు, వడ్లపూడి మీదుగా వేగంగా వస్తున్నారు. అదే సమయంలో పొదలకూరు నుంచి ప్రయాణికులతో వడ్లపూడి వెళుతున్న ఆటోను ఎదురుగా వచ్చిన బైక్ అదుపు తప్పి ఢీకొంది. ఈ ప్రమాదంలో బైక్ నడుపుతున్న వరుణ్‌కుమార్, నందకిషోర్ అక్కడికక్కడే మృతి చెందగా, ఆటో డ్రైవర్ తురకా సురేంద్ర (38) తీవ్రంగా గాయపడ్డాడు. బైక్‌పై వెనుక ఉన్న ఈశ్వర్‌తోపాటు ఆటోలో ప్రయాణిస్తున్న మరో ఇద్దరికి కూడా గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం క్షతగాత్రులను పొదలకూరు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సురేంద్ర మృతి చెందాడు. మృతులు ముగ్గురివి పేద కుటుంబాలే. అతి వేగం, నిర్లక్ష్యం మూడు కుటుంబాలను రోడ్డుపాల్జేసింది. సమాచారం అందుకున్న నెల్లూరు రూరల్ డీఎస్పీ శ్రీనివాసరావు, మనుబోలు ఎస్సై శివరాకేష్ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మూడు కుటుంబాల్లో విషాదం ఈ ఘటన మూడు కుటుంబాల్లో విషాదం మిగిల్చింది. ఊటుకూరుకు చెందిన ఇద్దరు యువకులు ప్రమాదంలో దుర్మరణం చెందడంతో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. చేతికంది వచ్చిన కుమారులు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో వారి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. రోడ్డున పడిన ఆటో డ్రైవర్ కుటుంబం ఆటో డ్రైవర్ సురేంద్రది పొదలకూరు కాగా అతను వడ్లపూడిలో పెళ్లి చేసుకుని ఇల్లరికం వచ్చి ఇక్కడే ఉంటూ ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. సురేంద్రకు భార్య, ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు. సురేంద్ర మృతి చెందడంతో ఆ కుటుంబం జీవనాధారం కోల్పోయి రోడ్డున పడినట్లు అయింది. ముగ్గురు యువకుల అతివేగం ముగ్గురి ప్రాణాలు బలిగొంది. ఒకే బైక్‌పై మితిమీరిన వేగంతో వెళ్తూ ఎదురుగా వస్తున్న ఆటోను ఢీకొనడంతో ఇద్దరు యువకులతోపాటు ఆటో డ్రైవర్ కూడా దుర్మరణం పాలయ్యాడు. ఈ ఘటన మూడు కుటుంబాల్లో తీరని విషాదాన్ని మిగిల్చింది. పనిమీద నెల్లూరుకు వెళ్లి.. తిరుగు ప్రయాణంలో యువకుల్లో ఒకరి అమ్మమ్మ ఇంటికి వెళ్తూ ఈ దుర్ఘటనలో మృత్యువాత పడ్డారు. -
ధాన్యం కొను‘గోల్’ తంతు
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: జిల్లాలో రైతులకు ప్రభుత్వం అండగా ఉందని చెప్పడానికి సివిల్ సప్లయీస్, కో–ఆపరేటివ్ మార్కెటింగ్ శాఖల ద్వారా 300 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు అధికార యంత్రాంగం ఆర్భాటంగా ప్రకటించింది. అధికార యంత్రాంగం, మిల్లర్లు మిలాఖత్ అయి నిత్యం పీపీసీల ద్వారా ధాన్యం కొనుగోలు లక్ష్యం ఒక తంతుగా మార్చేశారు. దళారుల ద్వారా మిల్లర్ కొనుగోలు చేసిన ధాన్యాన్ని సైతం పీపీసీల లెక్కల్లో వేసి రైతులను దగా చేస్తున్నారు. పీపీసీల ద్వారా ధాన్యం విక్రయించినట్లు నమోదైన రైతులకు మద్దతు ధర ప్రకారం పుట్టికి రూ.19,600 అందించామని అధికారులు నిజాయితీగా గుండెలపై చేయి వేసుకుని చెప్పగలరా?. నిరూపించగలరా?. అంటే ఏదీ చెప్పలేరు. దిగుబడి ఎంత.. కొన్నది ఎంత.. జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ ముమ్మరం చేశామని నిత్యం ఆర్భాటంగా అధికారులు ప్రకటనలు చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా రబీ సీజన్‌కు సంబంధించి సుమారు 10 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా వేశామని వీరే చెబుతున్నారు. కానీ శనివారం నాటికి 33,275 మెట్రిక్ టన్నుల ధాన్యం పీపీసీల ద్వారా కొనుగోలు చేసినట్లు అధికారులు ప్రకటించారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే 60 శాతం వరి కోతలు పూర్తయ్యాయి. అంటే దాదాపు 6 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడులు వచ్చాయి. ఇందులో పీసీసీల ద్వారా కొనుగోలు చేసిన ధాన్యం 5 శాతం కూడా లేదని అధికారుల ప్రకటన ద్వారానే అర్థమవుతోంది. దిగుబడి వచ్చిన 95 శాతం ధాన్యం నేరుగా మిల్లర్లకు దళారుల ద్వారా విక్రయిస్తున్నారనేది వాస్తవం. అధికార యంత్రాంగం 300 పీపీసీలు ఏర్పాటు చేసినట్లు ఆర్భాటంగా చెబుతున్నా.. జిల్లాలో ఒక్క రైతుకు కూడా న్యాయం జరగడం లేదనేది ఈ లెక్కలే చెబుతున్నాయి. పీపీసీల ద్వారా దళారులే విక్రయాలు ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా ఇప్పటి వరకు 33,275 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసినట్లు చెబుతున్నా, ఇందులో 90 శాతం దళారుల ద్వారానే జరిగాయని తెలుస్తోంది. వాస్తవానికి రైతులు పీపీసీలను సంప్రదించినా మిల్లరు ధాన్యం కొనడానికి సంసిద్ధత వ్యక్తం చేస్తేనే గన్నీ బ్యాగ్‌లు ఇస్తారు. ఈ ప్రక్రియ అస్సలు జరగడం లేదు. పీపీసీల ద్వారా ధాన్యం కొనుగోలుకు మిల్లరు సిద్ధపడితే ధాన్యం పట్టుబడి నుంచి మిల్లు వరకు చేర్చే బాధ్యత ఆ రైతుదే. ధాన్యం పట్టుబడి చేయడానికి బస్తాకు రూ.30 కూలి ఇవ్వాల్సి ఉంటుంది. ఇది రైతులే భరించుకోవాలి. 99 శాతం మంది మిల్లర్లు పీపీసీల ద్వారా ధాన్యం విక్రయించుకునే రైతులకు గన్నీ బ్యాగ్‌లు ఇవ్వడం లేదు. రైతులే బస్తాలు, ట్రానన్స్పోర్టు వాహనాన్ని ఏర్పాటు చేసుకోవాలి. తీరా మిల్లరు దగ్గరకు ధాన్యం తీసుకెళ్లితే నాణ్యత లేదని, గడ్డి ముక్క ఉందని, తేమ శాతం అధికంగా ఉందని తరుగు పేరుతో పేచీ పెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్న పరిస్థితి. ఇన్ని ఖర్చులు, ఇన్ని ఇబ్బందులు భరించినా.. చివరకు ఆ రైతుకు పుట్టి ధాన్యానికి దక్కే ధర రూ.15 వేలు కూడా రావడం లేదు. దీంతో రైతులు ఈ తలనొప్పులు ఎందుకుని దళారులనే ఆశ్రయించి అమ్ముకుంటున్నారు. వీరు సదరు రైతుల దగ్గర ధాన్యం కొనుగోలు చేసి వారి పొలం తాలూకా పాస్‌బుక్, బ్యాంక్ అకౌంట్ తీసుకెళ్లి పీపీసీలో నమోదు చేయించుకుంటున్న విషయం బహిరంగ విషయం. బ్యాంక్ గ్యారెంటీలు అరకొరే జిల్లాలో సీఎంఆర్ (కస్టమ్ రైస్ మిల్లింగ్) చేసే మిల్లులు 103 ఉన్నప్పటికీ వీటిలో కేవలం 50 నుంచి 60 మిల్లులు మొక్కుబడిగా బ్యాంక్ గ్యారెంటీలు ఇచ్చాయి. మిగతా మిల్లర్లు బ్యాంక్ గ్యారెంటీలు ఇవ్వకపోయినా.. అధికారులు ఎందుకు మౌనంగా ఉన్నారో వారికే తెలియాలి. పీపీసీ ద్వారా ధాన్యాన్ని మిల్లుకు ట్యాగ్ చేయాలంటే.. సదరు మిల్లరు బ్యాంక్ గ్యారెంటీ ఇచ్చి ఉండాలి. బ్యాంక్ గ్యారెంటీ లేని మిల్లుకు ఎట్టి పరిస్థితుల్లో ధాన్యాన్ని పీపీసీ ద్వారా పంపించడం అసాధ్యం. మిల్లర్లు ప్రభుత్వానికి బ్యాంక్ గ్యారెంటీ ఇవ్వకపోవడంతో పీపీసీలు ఆ మిల్లులకు ధాన్యాన్ని ట్యాగ్ చేయడం లేదు. దీంతో రోజుల తరబడి రైతులు ధాన్యాన్ని నిలబెట్టుకోలేక నేరుగా మిల్లర్లకు దళారుల ద్వారా విక్రయించుకుంటున్నారు.రైతు నష్టపోతున్నదిలా.. జిల్లాలో 10 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి అంచనా ఇప్పటికే 60 శాతం కోతలు పూర్తి పీపీసీల ద్వారా 33,275 మెట్రిక్ టన్నులే కొనుగోలు 103 రైస్ మిల్లులకు సీఎంఆర్ అనుమతి 50 మిల్లులే రూ.30 కోట్ల బ్యాంక్ గ్యారెంటీ కల్లాల్లో ధాన్యం కొనడం ఒక ప్రహసనం జిల్లాలో పీపీసీల ద్వారా ధాన్యం కొనుగోలు ఒక తంతుగా సాగుతోంది. దిగుబడికి.. కొనుగోలుకు మధ్య తేడానే ఇందుకు అద్దం పడుతోంది. సీఎంఆర్ అనుమతి ఉన్న రైస్ మిల్లుల్లో సగం మిల్లులు కూడా బ్యాంక్ గ్యారెంటీ ఇవ్వలేదంటే ప్రభుత్వం, రైస్ మిల్లర్లు కలిసి ‘దోపిడీ డ్రామా’ ఆడుతున్నట్లు విస్పష్టమవుతోంది. కల్లాల్లోనే ధాన్యం కొనడం ఒక ప్రహసనంగా సాగుతోంది. ఏ రోజుకు ఆ రోజు పీపీసీల ద్వారా కొంటున్న ధాన్యం లెక్కలు అధికార యంత్రాంగం ప్రకటిస్తున్నా.. ఏ రైతు నేరుగా ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా విక్రయాలు చేసుకోవడం లేదు. నేరుగా దళారులకే అమ్ముకుంటున్నారనేది నిజం. కొడవలూరు మండలానికి చెందిన ఓ రైతుకు 8 ఎకరాల పొలం ఉంది. ఆయన బీపీటీ 5204 వరి సాగు చేశాడు. పంట కోతకు రావడంతో ఒక దళారీని సంప్రదించాడు. పుట్టికి రూ.17 వేలు మాత్రమే ధర ఉందని చెప్పాడు. దీంతో ఆ రైతు స్థానిక పీపీసీ ద్వారా ధాన్యం విక్రయించడానికి విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్‌ను సంప్రదించాడు. దిగుబడి అంచనాను బట్టి గన్నీ బ్యాగ్స్ ఆ రైతుకు అందజేశారు. వరి కోత కోసి ధాన్యం రాసి పోశాడు. సదరు రైతు ధాన్యం సరఫరా చేయడానికి ట్యాగ్ చేసిన మిల్లర్ అంత ధాన్యం తాము తీసుకోమని, మార్కెట్లో పుట్టి రూ.17 వేలే ఉంటే.. పీపీసీ ద్వారా రూ.19,700 పెట్టి ఎందుకు కొనాలని రైతును ప్రశ్నించాడు. ఇక కూలీలు, రవాణా ఖర్చులు పెట్టుకుని, మిల్లర్ అడిగినంత తరుగు ఇచ్చుకుంటే.. పుట్టికి రూ.16 వేలు కూడా వచ్చేటట్లు లేదని లెక్కలు వేసుకున్న ఆ రైతు ఆలోచనలో పడ్డాడు. అప్పటికే రెండు రోజులు గడిచిపోవడంతో ధాన్యం తడారిపోతుండడంతో నేరుగా మిల్లర్కే దళారీ ద్వారా విక్రయించాడు. కానీ ఈ ధాన్యం పీపీసీ ద్వారా విక్రయించినట్లు ఇటు అధికారులు, అటు మిల్లర్ నమోదు చేసుకున్నారు. -
కీలకమైన రికార్డులు.. అధికారి ఇంటికా..?
కొడవలూరు: డీసీఎమ్మెస్లోని కీలకమైన మినిట్స్ బుక్, డే బుక్, లెడ్జర్లు.. డివిజనల్ కోఆపరేటివ్ అధికారి సుధాభారతి ఇంటికి మార్కెటింగ్ మేనేజర్ ద్వారా బుధవారం వెళ్లాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి వీరి చలపతిరావు ఆరోపించారు. నార్తురాజుపాళెంలోని తన అతిథిగృహ ప్రాంగణంలో విలేకరులతో శనివారం ఆయన మాట్లాడారు. రికార్డులను అధికారి ఇంటికి తీసుకెళ్తుండగా, మార్కెటింగ్ మేనేజర్ రవికుమార్‌ను ఓ విలేకరి ప్రశ్నించారని, దీంతో ఆయన తడుముకుంటూ తాను కొత్తగా వచ్చానని, అధికారి సూచనల మేరకే తీసుకెళ్లానని చెప్పారన్నారు. సీసీ పుటేజీల్లో చూసినా ఇదే విషయం బహిర్గతమవుతుందని చెప్పారు. డీసీఎమ్మెస్‌కు పర్సన్ ఇన్చార్జిగా జేసీ ఉన్నారని, ఆయనకు తెలియకుండా రికార్డులను అధికారి ఇంటికి తీసుకెళ్లడం దారుణమని చెప్పారు. అందులో దేన్ని మార్చేందుకు తీసుకెళ్లారో తెలుసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. సదరు అధికారిపై గతంలోనూ అనేక అవినీతి ఆరోపణలున్నాయని చెప్పారు. డీసీఎమ్మెస్ మార్కెటింగ్ మేనేజర్‌గా ఆమె ఉన్న సమయంలో సంస్థ రైస్ మిల్లును తన భర్తకు అప్పగించిన అంశాన్ని ప్రస్తావించారు. మిల్లులో అవకతవకలు జరిగి మెషినరీ పనికిరాకుండా పోయిందని చెప్పారు. డీసీఎమ్మెస్‌కు చెందిన బాణసంచా, పుస్తకాలు, వేప పిండి వ్యాపారంలోనూ రూ.నాలుగు లక్షలను స్వాహా చేశారని ఆరోపించారు. ఐసీడీఎస్ పీడీగా నియమించగా, అందులోనూ భారీ అవకతవకలకు పాల్పడ్డారని చెప్పారు. ఆమె తీరే ఇంతని, మరో రెండు నెలల్లో రిటైరవ్వనున్నారని తెలిపారు. ఆమె అవినీతి బాగోతంపై విచారణ జరిపాలని డిమాండ్ చేశారు. ఎంపీపీ జ్యోతి, సర్పంచ్ సుప్రియ, పార్టీ మండలాధ్యక్షుడు చిమటా శేషగిరిరావు, నేతలు కొండా శ్రీనివాసులురెడ్డి, మాణిక్యరావు, అనపల్లి ఉదయ్‌భాస్కర్, జడ్డా సాయికుమార్, గాలి సునీల్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
గిట్టుబాటు ధర కల్పనలో విఫలం
● మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి నెల్లూరు(బారకాసు): రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి ధ్వజమెత్తారు. డైకస్‌రోడ్డులోని పార్టీ జిల్లా కార్యాలయంలో వెంకటాచలం మండల పార్టీ నేతలు, కార్యకర్తలతో శనివారం సమావేశమైన ఆయన మాట్లాడారు. ప్రజా ప్రతినిధులు క్షేత్రస్థాయిలో పర్యటించి రైతులకు గిటుబాటు ధర కల్పించకుండా ప్రకటనలనే పరిమితమవుతున్నారని విమర్శించారు. సోమిరెడ్డి మొక్కుబడిగా జరిపిన గొలగమూడి పర్యటనను చూసి రైతులు ఆవేదనకు గురయ్యారని చెప్పారు. డ్రామాలను ఆపి, రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు చిత్తశుద్ధితో పనిచేయాలని హితవు పలికారు. తమ ప్రభుత్వ హయాంలో గతేడాది పుట్టి ధాన్యం రూ.25 వేలు పలకగా, ప్రస్తుతం రూ.16 వేలకు పతనమైందని తెలిపారు. రైతుల కు కనీస గిట్టుబాటు ధరగా రూ.19720 కల్పించాల్సి ఉండగా, దళారులు రూ.16 వేలకే దోచుకుంటున్నారని ఆరోపించారు. ఇంత జరుగుతున్నా, అధికారులు, ప్రజాప్రతినిధులు చోద్యం చూస్తున్నారే తప్ప, రైతులను ఆదుకునేందుకు యత్నించడంలేదన్నారు. బాధ్యత కలిగిన ప్రతిపక్ష పార్టీగా సమస్యను ఎప్పటికప్పుడు అధికారుల దృష్టికి తీసుకెళ్లి, మద్దతు ధర కల్పించేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. తమ పార్టీ నేతలు, కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్న పోలీస్ అధికారులను విడిచిపెట్టేది లేదని స్పష్టం చేశారు. పోలీసులు అనుచితంగా ప్రవర్తించారనే అంశాన్ని తన దృష్టికి తీసుకొస్తే న్యాయస్థానాలను ఆశ్రయించి ప్రైవేట్ కేసులేస్తామని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వంలో అవినీతి విధానాలను ప్రజలు అసహ్యించుకుంటున్నారని చెప్పారు. ప్రజలకు ఏ సమస్యొచ్చినా అండగా నిలిచి పోరాటాలకు సిద్ధంగా ఉంటామని తెలిపారు. -
సీఐఎస్ఎఫ్ సైకిల్ ర్యాలీ
కావలి: పశ్చిమ బెంగాల్‌లోని దక్షిణ 24 పరగణాల జిల్లా బక్కాలి నుంచి తమిళనాడులోని కన్యాకుమారి వరకు సీఐఎస్ఎఫ్ సిబ్బంది చేపట్టిన సైకిల్ యాత్ర కావలికి శనివారం చేరుకుంది. దేశంలోకి అక్రమ చొరబాట్లు, స్మగ్లింగ్ కట్టడి, తీర ప్రాంత రక్షణ తదితరాలపై అవగాహన కల్పించాలనే లక్ష్యంతో యాత్రను ఈ నెల ఏడున ప్రారంభించారు. మొత్తం 60 మంది సభ్యులు పాలుపంచుకున్న ఈ యాత్ర కన్యాకుమారిలోని వివేకానంద మెమోరియల్ వద్ద ముగియనుంది. ఈ – కేవైసీని నూరు శాతం పూర్తి చేయాలి నెల్లూరు (పొగతోట): రేషన్‌కార్డుదారులకు సంబంధించిన సభ్యులందరితో ఈ – కేవైసీని పూర్తి చేయించాలని డీఎస్ఓ అంకయ్య ఆదేశించారు. నగరంలోని జిల్లా పౌరసరఫరాల అధికారి కార్యాలయంలో డీలర్లతో శనివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో 7.21 లక్షలకుపైగా రేషన్ కార్డులకు గానూ 20 లక్షలకుపైగా సభ్యులున్నారని చెప్పారు. ఇప్పటి వరకు 18 లక్షల మంది ఈ – కేవైసీని పూర్తి చేశారని, మిగిలిన వాటిని త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. ఐదేళ్లలోపు పిల్లలకు మినహాయింపు ఉందని, ఈ నెల 31లోపు ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు. బైక్‌ల ఢీ: నలుగురికి గాయాలు ఉదయగిరి: బైక్‌లు ఢీకొనడంతో నలుగురు తీవ్రంగా గాయపడిన ఘటన మండలంలోని గడ్డంవారిపల్లె సమీపంలో శనివారం చోటుచేసుకుంది. వివరాలు.. ఉదయగిరికి చెందిన చాంద్‌బాషా, మస్తాన్, కాలేషా బైక్‌పై కృష్ణంపల్లెలోని పొలం వద్దకు బయల్దేరారు. వీరి వెనుకనే బైక్‌పై వస్తున్న పట్టణానికి చెందిన మస్తాన్.. గడ్డంవారిపల్లె సమీపంలోకి వచ్చేసరికి అదుపుతప్పి ఢీకొన్నారు. ఘటనలో నలుగురూ గాయపడ్డారు. వీరిని 108లో ఉదయగిరి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. దుత్తలూరులో పట్టపగలే దొంగతనం ● 11 సవర్ల బంగారు ఆభరణాల అపహరణ దుత్తలూరు: దుత్తలూరు సెంటర్లో శనివారం పట్టపగలే దొంగతనం జరిగింది. వివరాలు.. సెంటర్ సమీపంలోని వెంకయ్యస్వామి మందిర పక్కన చింతనబోయిన నరేష్ నివసిస్తున్నారు. మధ్యాహ్న వేళ ఎవరూ లేని సమయంలో గేట్ తాళాన్ని పగలగొట్టి.. ప్రధాన ద్వార తలుపు, తాళాన్ని ధ్వంసం చేసి లోపలికి గుర్తుతెలియని వ్యక్తులు ప్రవేశించారు. బీరువాను పగలగొట్టి అందులోని 11 సవర్ల బంగారు ఆభరణాలను దోచుకెళ్లారు. ఇంటికొచ్చిన అనంతరం చోరీ విషయాన్ని నిర్ధారించుకున్న బాధితుడు.. పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలాన్ని ఎస్సై ఆదిలక్ష్మి పరిశీలించారు. వేలిముద్రలను క్లూస్‌టీమ్ సేకరించింది. కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
బ్లాక్ ఫిల్మ్‌పై తనిఖీలు
నెల్లూరు (టౌన్): రవాణా నిబంధనలకు విరుద్ధంగా కార్లు, బైక్‌లకు ఉన్న నంబర్ ప్లేట్లు, బ్లాక్ ఫిల్మ్‌పై ఇన్చార్జి ఆర్టీఓ బాలమురళి ఆధ్వర్యంలో రవాణా శాఖ అధికారులు విస్తృత తనిఖీలను శనివారం నిర్వహించారు. ముత్తుకూరు గేట్ సెంటర్లో జరిపిన తనిఖీల్లో నిబంధనలకు విరుద్ధంగా నంబర్ ప్లేట్లు ఉన్న 38, బ్లాక్‌ఫిల్మ్ బిగించిన ఐదు, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా నడుపుతున్న నాలుగు, సరైన పత్రాల్లేకుండా తిరుగుతున్న మూడు.. మొత్తం 50 వాహనాలపై కేసులు నమోదు చేశారు. ఎమ్వీఐలు రఫీ, పవన్ కార్తీక్, ఏఎమ్వీఐలు పూర్ణచంద్రరావు, స్వప్నిల్రెడ్డి, రఘువర్ధన్‌రెడ్డి, మల్లికార్జున్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదం.. ముగ్గురు దుర్మరణం
నెల్లూరు: జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మనుబోలు మండలం గోట్లపాలెం సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం చెందారు. ఒక ఆటోను ద్విచక్ర వాహనం డీకొనడంతో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో తుదిశ్వాస విడిచాడు. మృతులు ఊటుకూరుకు చెందిన మృతులు వరుణ్ కుమార్(17), నందకిషోర్(18), సురేంద్ర(40)లుగా గుర్తించారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
రక్షించుకుంటున్నాం
సోమశిల/ఆత్మకూరు: నాలుగునెలల పాటు ఎరువులు, పిండి వేసి ఏపుగా పెంచుకున్న వరి పైరును కంకి దశలో దుప్పులు, అడవి పందులు, కొన్ని గ్రామాల్లో ఎలుగుబంట్లు రాత్రి వేళల్లో తొక్కి నాశనం చేస్తుంటాయి. అవి తిరిగిన మేర పొలంలో పైరు నేలవాలడం, వడ్ల గింజలు రాలిపోవడం జరుగుతుంది. దీంతో రైతులు ఆర్థికంగా నష్టపోతుంటారు. రాత్రి వేళల్లో జంతువుల బారి నుంచి పైర్లను కాపాడుకునేందుకు కాపలా కాయడం కష్టమైన పని. ఆ సమయంలో విష పురుగుల బారిన పడి మృతిచెందిన అన్నదాతలు ఎందరో ఉన్నారు. ఈ పరిస్థితుల నుంచి పైర్లను రక్షించుకునేందుకు అనంతసాగరం మండలంలోని పెన్నాతీరం, కొండ, అటవీ ప్రాంతాల గ్రామాలైన గార్లదిన్నెపాడు, చిలకలమర్రి, పాతదేవరాయపల్లి, శంకరనగరం గ్రామాల రైతులు వినూత్నంగా ఆలోచించారు. ఏం చేస్తున్నారంటే.. రైతులు మైక్‌లను వినియోగిస్తున్నారు. ముందుగానే జంతువులను తరుముతున్నట్లుగా అరవడం, పళ్లెం లేదా డప్పు మోగించడం తదితర శబ్దాలను రికార్డు చేసి ఉంచుతారు. దీనిని ఆన్ చేసి తమకు కావాల్సిన ప్రాంతంలో పెట్టి ఇళ్లకు వెళ్లిపోతున్నారు. చిన్న రైతులు ఎకరాకు ఒకటి పెడుతుండగా, ఎక్కువ పొలం ఉన్న వారు 4, 5 సెట్లను ఏర్పాటు చేస్తున్నారు. దీని నుంచి వచ్చే శబ్దాలతో జంతువులు పొలాల్లోకి వచ్చేందుకు భయపడుతున్నాయి. ఆ నాలుగు గ్రామాల్లో రైతులు ఈ పద్ధతిని అనుసరిస్తుండటంతో వారికి అడవి జంతువుల బాధలు తప్పాయి. అదే విధంగా పగటి వేళల్లో పక్షుల నుంచి పైర్లను రక్షించుకునేందుకు మెరిసే రిబ్బన్లను (అగ్ని రిబ్బన్లు) పొలాల్లో అక్కడక్కడా ఏర్పాటు చేస్తున్నారు. సూర్యరస్మి రిబ్బన్లపై పడినప్పుడు పక్షుల కళ్లు భ్రమిస్తాయి. దీంతో అవి పైరుపై వాలకుండా వెళ్లిపోతాయి. ఇలా ఓ వైపు తమ పైరును రక్షించుకోవడంతోపాటు మూగ జీవాల ప్రాణాలను రక్షించేలా రైతులు అనుసరిస్తున్న ఈ విధానాలు ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్నాయి. ఆరుగాలం కష్టించి పండించే పైరు అడవి జంతువుల పాలవుతుంటుంది. రక్షణ కోసం కఠిన పద్ధతుల వల్ల అవి మృతిచెందడమో, గాయపడటమో జరుగుతుంది. ఈ సమయంలో కేసులతో పోలీసుల చుట్టూ తిరగాల్సి వస్తుంది. కొందరు రైతులు తమ వరి పైరును కాపాడుకునేందుకు.. మూగజీవాలకు హాని కలగకుండా వినూత్న పద్ధతులను అవలంబిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. వరి పైరు రక్షణకు రైతుల చర్యలు అడవి జంతువులకు హాని చేయకుండా.. మైక్‌లను పెడుతున్న వైనం జంతువుల వల్ల పైరు దెబ్బతింటుండేది. నాలుగేళ్ల క్రితం మైక్‌లను పెట్టాం. జంతువులు పొలాల వద్దకు రావడం లేదు. వాటి బారి నుంచి పైర్లను రక్షించుకుంటున్నాం. ఎండ, వాన, మంచు నుంచి మైకులు పాడవకుండా ప్లాస్టిక్ కవర్లు చుట్టి కర్రలకు కట్టి పెడుతున్నాం. – నరేంద్ర, రైతు -
యుద్ధప్రాతిపదికన బకాయిల వసూలు
నెల్లూరు(వీఆర్సీసెంటర్): ఆర్థిక సంవత్సరం ముగుస్తున్న నేపథ్యంలో యుద్ధప్రాతిపదికన విద్యుత్ బకాయిలను వసూలు చేయాలని ఏపీఎస్పీడీసీఎల్ జిల్లా సర్కిల్ ఎస్ఈ విజయన్ ఆదేశించారు. నెల్లూరులోని కోటమిట్టలో ఉన్న విద్యుత్ రెవెన్యూ కార్యాలయంలో శుక్రవారం ఆ శాఖ నెల్లూరు టౌన్ డివిజన్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఈ మాట్లాడుతూ అదనపు విద్యుత్ లోడును క్రమబద్ధీకరించేందుకు విద్యుత్ శాఖ కల్పించిన 50 శాతం రాయితీని వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. దీని గడువు జూన్ 30వ తేదీతో ముగుస్తుందన్నారు. శనివారం రాత్రి 8.30 నుంచి 9.30 గంటల వరకు వినియోగదారులు స్వచ్ఛందంగా లైట్లు ఆపివేసి ఎర్త్‌అవర్‌ను పాటించాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ కార్యాలయాలకు విద్యుత్ సర్‌చార్జ్ రద్దును వినియోగిం చుకోవాలని ఈ అవకాశం ఏప్రిల్ 17వ తేదీ వరకు ఉంటుందన్నారు. పీఎం సూర్యఘర్ సోలార్ పథకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. నగరంలోని అన్ని సబ్స్టేషన్లలో సాయంత్రం 6 నుంచి రాత్రి 10 గంటల వరకు (పీక్ అవర్స్)లో సిబ్బంది అందుబాటులో ఉండాలని ఆదేశించారు. సైబర్ నేరగాళ్ల నుంచి విద్యుత్ సిబ్బందికి ఫోన్‌కాల్స్ వస్తున్నాయని వారి వలలో పడకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సమావేశంలో సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్ మురళి, నెల్లూరు టౌన్ ఈఈ శ్రీధర్, డీఈఈలు కిరణ్, అశోక్, సునీల్, అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్స్ సురేఖ, ఆశాలత, ఏఈలు కృష్ణవేణి, విజయ్‌కుమార్, దామోదర్‌రెడ్డి, విజయ్, లక్ష్మీనారాయణ, సుధాకర్, నస్రూల్లా, సూర్య గాంధీ, మునిశేఖర్, గోపాలకృష్ణ, జేఏఓ పద్మజ తదితరులు, పాల్గొన్నారు. నేటి రాత్రి గంటసేపు ఎర్త్‌అవర్‌ను పాటిద్దాం సబ్స్టేషన్లలో సిబ్బంది అందుబాటులో ఉండాలి ఎస్ఈ విజయన్ -
చెట్లు ఉండడంతో హద్దులు చూపించలేదు
ఎల్పీ స్కీమ్‌లో ఇచ్చిన భూముల్లో కంప చెట్లు ఉండడంతో వాటికి హద్దులు చూపించలేకపోతున్నాం. ఆ భూముల్లో ఉన్న చెట్లు తొలగించుకుని వస్తే అప్పుడు సర్వే చేసి హద్దులు చూపిస్తాం. – పీ చంద్రశేఖర్, తహసీల్దార్ విడవలూరు హద్దులు చూపించకుంటే ఎలా 2018లో మాకు ఒక్క ఎకరా చొప్పున ప్రభుత్వం మొత్తం 91 ఎకరాల విస్తీర్ణంలో పొలాన్ని ఇచ్చారు. అయితే 91 ఎకరాలకు నాలుగు వైపులా హద్దు రాళ్లను ఏర్పాటు చేయకుండా జంగిల్ క్లియరెన్స్ చేసుకోమంటే ఎలా చేసుకోవాలి. – చనుమూరి సరోజనమ్మ పొలం చూపించలేదు.. లోన్ కట్టాలంట!మాకు మంజూరైన పొలం 8 ఏళ్లుగా ఎక్కడ ఉందో ఇంత వరకు తెలియదు. అధికారులకు ఎన్నిసార్లు మొర పెట్టుకున్నా.. మమ్మల్ని పట్టించుకోలేదు, ఇప్పుడేమో లోన్ కట్టాలంటూ మాకు ఎస్సీ కార్పొరేషన్ నుంచి నోటీసులు వచ్చాయి. అసలు మా పొలం ఎక్కడుందో మాకు తెలియదంటే లోను కట్టాలంటూ నోటీసులు పంపడం హాస్యాస్పందంగా ఉంది. – కర్లగుంట శీనమ్మ ● -
పచ్చనేతల ‘బరి’ తెగింపు
సాక్షి, టాస్క్‌ఫోర్స్: కావలి మండలం చెన్నాయపాళెంలో అధికార పార్టీ నేతలు పక్కాగా కోడి పందేల బరిని, పేకాట శిబిరాన్ని ఏర్పాటు చేయడమే కాకుండా, బెట్టింగ్‌లు నిర్వహించారు. కోడి పందేలు వీక్షించేందుకు రెండు వరుసల్లో గ్యాలరీలు పెట్టి, టికెట్లు కూడా ఏర్పాటు చేయడం విశేషం. బరికి ఆనుకుని ఉండే వరుసలో రూ.1,000 కాగా, ఆ తర్వాత వరుసకు రూ.700 టికెట్ ధరలుగా నిర్ణయించారు. బిర్యానీలు, ఇతరాలు అమ్మకాలు చేసేందుకు కొంత నగదు తీసుకుని అనుమతులిచ్చా రు. బరికి సమీపంలోనే మద్యం విక్రయాలు సిద్ధం చేశారు. చెన్నాయపాళెం ఎస్సీ కాలనీ సమీపంలో పుచ్చ తోటల్లో ఈ ఏర్పాట్లు చేసి మూడు రోజుల పాటు నిర్వహించారు. నిర్వాహ కుల మధ్య వివాదాలు రావడం, పోలీసులు హడావుడి చేయడంతో నిలిపి వేశారు. చెన్నాయపాళెం నుంచి పెద్దపట్టపుపాళెం రోడ్డు మీదుగా కోడి పందేల బరికి చేరుకునే విధంగా రోడ్డు వసతి ఉండే విధంగా సిద్ధం చేశారు. పెద్ద ఎత్తున ఇక్కడ జూద క్రీడల హడావుడి జరిగినా కనీసం పోలీసులకు సమాచారం లేదంటే నమ్మశక్యంగా కూడా లేదు. కోడి పందేలు బరి.. ప్రచారం మాత్రం క్యాసినో నిర్వాహకులు జూదగాళ్ల జేబులు ఖాళీ చేసి, తమ జేబులు నింపుకోవడానికి విస్తృత ప్రచారం చేశారు. కోడి పందేల కోసమే ఒక బరిని సిద్ధం చేశారు. దీంతో పాటు పేక ముక్కలతో ఆడే వివిధ రకాల ఆటల్లో పాల్గొనే జూదగాళ్ల కోసం‘క్యాసినో’ నిర్వహిస్తున్నట్లు అంతర్గత ప్రచార సాధనాల ద్వారా ప్రచారం చేశారు. ఈ క్రమంలో ఉమ్మడి నెల్లూరు, ప్రకాశం జిల్లాల నుంచి వందల సంఖ్యలో కార్లు చెన్నాయపాళెంకు చేరు కున్నాయి. కోడి పందేలు చూసేందుకు ప్రేక్షకులు బరి వద్దకు భారీగా తరలి వచ్చారు. ఈ విధంగా మూడు రోజులు ఈ జూద క్రీడలు నిర్వహించారు. పోలీసుల రాకతో నిలిపేశారు. రాబడి పంపకాల్లో విభేదాలు నిర్వాహకులకు భారీగానే రాబడి కూడా వచ్చింది. దీంతో పంపకాల విషయంలో వారి మధ్య గురువారం విభేదాలు తలెత్తాయి. ఈ క్రమంలో ఈ వ్యవహారాన్ని నిర్వాహకుల్లో వారిలో వారే గ్రామంలోని వాట్సాప్ గ్రూపులో ఉదయం 8.30 గంటలకు ఒక పోస్టు పెట్టారు. ఈ సమాచారం పోలీసులకు చేరింది. కావలిరూరల్ ఎస్ఐ బాజీబాబు ఆధ్వర్యంలో సిబ్బంది ఉదయం 9 గంటలకు అక్కడికి చేరుకున్నారు. దీంతో అక్కడున్న నిర్వాహకులు, జూదగాళ్లు పొలాల్లో ఎటు పడితే అటు పరుగులెత్తి తప్పించుకున్నారు. పుచ్చ రైతులు అభ్యంతరం చెప్పినా.. ఇదిలా ఉండగా కోడి పందేలు వేయడానికి సిద్ధం చేసిన బరి పుచ్చ తోటలో ఉండడంతో ఆ పంట సాగు చేసిన రైతులు అభ్యంతరం చెప్పారు. పెద్ద సంఖ్యలో తమ పుచ్చ తోటలోకి జనాలు రాకపోకలు సాగిస్తే పుచ్చతోట ధ్వంసం అవుతుందని రైతులు కోడి పందేల నిర్వాహకులకు చెప్పారు. అయినా వారు ఖాతరు చేయలేదు. పంట కాలువపై సెంట్రింగ్ రేకులతో కాలిబాట వేసి జూదగాళ్లు రాకపోకలకు ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేశారు. పెద్ద ఎత్తున జనాలు రావడంతో పుచ్చతోటలు ధ్వంసం అయ్యాయి. బాధితులపైనే పోలీసులకు ఫిర్యాదు కోడి పందేలు బరి, పేక ముక్కలతో వివిధ రకాల ఆటలు కోసం సర్వం సిద్ధం చేసిన నిర్వాహకులపై పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. మూడు రోజులు అక్కడ జూద క్రీడలు జరిగినా పోలీసులు అటు వైపు కన్నెత్తి కూడా చూడలేదంటే అధికార పార్టీల ప్రాపకం కోసమే అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రచ్చకెక్కినా నిర్వాహకులపై కేసు నమోదు చేయకపోగా, నిర్వాహకుల చేతిలో దాడికి గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులపైనే పోలీసులకు ఫిర్యాదు అందజేసినట్లుగా తెలిసింది. ఆస్పత్రిలో ఉన్న బాధితుల కేసు మెడికో లీగల్ కేసు అవుతుంది కాబట్టి, కౌంటర్ కేసుగా ముందస్తుగానే పోలీసులకు నిర్వాహకులు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. టీడీపీ నేతలు ‘బరి’ తెగించారు. జిల్లాలోని కావలి మండలం చెన్నాయపాళెం వద్ద చట్ట విరుద్ధంగా పక్కాగా కోడి పందేలు, పేకాట బరులు ఏర్పాటు చేయడమే కాకుండా ప్రేక్షకుల కోసం రెండు వరుసల్లో గ్యాలరీలు ఏర్పాటు చేసి టికెట్లు వసూలు చేశారు. సుమారు వెయ్యి మంది వీక్షకులు కూర్చొని చూసే విధంగా సీటింగ్ ఏర్పాటు చేశారు. అక్కడే బిర్యానీలు, ఇతర తినుబండారాలు అమ్ముకునేందుకు ‘వేలం’ పెట్టారు. గత మూడు రోజుల పాటు జరిగినా.. ఒక్క పోలీస్ కూడా అటు వైపు కన్నెత్తి చూడలేదంటే ఇక్కడి పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. నిర్వాహకుల మధ్య తలెత్తిన పంపకాల్లో విభేదాల నేపథ్యంలో వారిలో వారే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో విధిలేని పరిస్థితుల్లో అక్కడికి వెళ్లి హడావుడి చేశారనే విమర్శలు వినిపిస్తున్నాయి. పోలీసులకు ఓ కుటుంబం సమాచారం అందించినట్లు అనుమానించి వారిపై దాడికి తెగబడ్డారు. పక్కాగా కోడి పందేలు, పేకాట బరులు నిర్వాహకుల మధ్య పంపకాల్లో విభేదాలు వారిలో వారే పోలీసులకు సమాచారం ఖాకీల రాకతో నిర్వాహకులు, పందెం రాయుళ్లు పలాయనం అనుమానంతో ఒక కుటుంబంపై దాడి -
ఆశ వర్కర్లను రెగ్యులర్ చేయాలని డిమాండ్
నెల్లూరు(వీఆర్సీసెంటర్): జిల్లాలోని ఆశ వర్కర్లను రెగ్యులర్ చేయాలని, కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని ఏపీ ఆశ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి దుగ్గిరాల అన్నపూర్ణమ్మ డిమాండ్ చేశారు. శుక్రవారం నెల్లూరు డీఎంహెచ్ఓ కార్యాలయంలో డీఎంహెచ్ఓ సుజాతకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా అన్నపూర్ణమ్మ మాట్లాడుతూ పేద ప్రజలకు ఆరోగ్య సేవలందిస్తున్న ఆశ వర్కర్లను ప్రభుత్వ కార్మికులుగా గుర్తించాలన్నారు. ఎన్హెచ్ఎం స్కీం ఏర్పడి 20 సంవత్సరాలు పూర్తయినా వారికి కనీస వేతనం ఇవ్వడం లేదన్నారు. విధినిర్వహణలో మృతిచెందిన వారికి బీమా సౌకర్యం కల్పించాలన్నారు. ఆశాలను రెగ్యులర్‌చేసి హెల్త్ వర్కర్స్‌గా గుర్తించాలన్నారు. పింఛన్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో యూనియన్ జిల్లా కోశాధికారి మధుసూదన, కల్యాణి, వాణి, జీవా, సునీత, గీత, సురేఖ తదితరులు పాల్గొన్నారు. -
మెడికల్ షాపులపై ఆకస్మిక దాడులు
నెల్లూరు(క్రైమ్): ఆపరేషన్ గరుడకు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు శ్రీకారం చుట్టారు. శుక్రవారం జిల్లా విజిలెన్స్ ఎస్పీ రాజేంద్రకుమార్ పర్యవేక్షణలో విజిలెన్స్, ఔషధ నియంత్రణ అధికారులు, స్థానిక పోలీసులతో కూడిన ప్రత్యేక బృందాలు ఆత్మకూరు పట్టణంలోని రామలక్ష్మణ మెడికల్స్, ఎంఆర్ మెడికల్ అండ్ ఫ్యాన్సీ, నెల్లూరు స్టోన్‌హౌస్‌పేటలోని సాయిరేఖ మెడికల్స్, శ్రీనివాస అగ్రహారంలోని అనంత సంజీవిని జనరిక్ మెడికల్ షాప్, ఆచారివీధిలోని గణేష్ మెడికల్స్, బోసుబొమ్మ సమీపంలోని రత్న మెడికల్స్‌లో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. క్లోనాజెపామ్, అల్పాజోలం తదితర డ్రగ్స్‌కు సంబంధించిన క్రయ, విక్రయాలపై లోతుగా పరిశీలిస్తున్నారు. ఎంత మొత్తంలో మాత్రలు కొనుగోలు చేశారు?, ఎవరికి విక్రయించారు?, వాటికి సంబంధించిన బిల్లులు, వైద్యుడి ప్రిస్క్రిప్షన్ల మేరకే విక్రయించారా? లేదా? తదితర వివరాలు సేకరిస్తున్నారు. తనిఖీల నివేదికను ప్రభుత్వానికి అందించనున్నట్లు అధికారులు తెలిపారు. తాళాలు వేసి.. తనిఖీల నేపథ్యంలో నెల్లూరు నగరంలోని కొందరు వ్యక్తులు తమ దుకాణాలకు తాళాలు వేసేశారు. ఈ సందర్భంగా ఔషధ నియంత్రణ శాఖ ఏడీ వీరకుమార్ మాట్లాడుతూ డాక్టర్ల ప్రిస్క్రిప్షన్ల లేకుండా మత్తుమాత్రలను విక్రయించరాదన్నారు. యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని సూచించారు. ఈ తనిఖీల్లో విజిలెన్స్ ఇన్స్పెక్టర్లు కె.నరసింహారావు, ఎ.శ్రీహరి, షేక్ సుభానీ, డీసీటీఓ విష్ణురావు, ఏఓ పి.వేణుగోపాల్‌రావు, ఏఈఈ బి.వెంకటరెడ్డి, ఔషధ నియంత్రణ శాఖ ఇన్స్పెక్టర్లు కీర్తి పవిత్ర, టి.వెంకటకృష్ణ, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మత్తుమాత్రల క్రయ, విక్రయాలపై పరిశీలన -
షుగర్ ఫ్యాక్టరీ మూతకు కారణం టీడీపీనే..
● వైఎస్సార్సీపీ నేతలు కోవూరు: ‘కోవూరు చక్కెర కర్మాగారం మూసివేతకు కారణం టీడీపీ అనే విషయాన్ని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి తెలుసుకోవాలి. దీనిపై అసెంబ్లీలో అసత్యాలు చెప్పడం దారుణం’ అని డీఏఏబీ మాజీ చైర్మన్ నిరంజన్‌బాబురెడ్డి అన్నారు. కోవూరు వైఎస్సార్సీపీ కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు నాటి ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి కలిసి ఫ్యాక్టరీని తిరిగి ప్రారంభించాలని కోరారన్నారు. దాని స్థితిగతులు తెలుసుకోవాలని నిపుణులతో కూడిన బృందాన్ని జగన్ పంపారన్నారు. వారు పరిశీలించి ఈ కర్మాగారం తిరిగి ప్రారంభించేందుకు అవకాశం లేదని, పూర్తిగా శిథిలావస్థకు చేరుకుందని చెప్పారన్నారు. 2013 వరకు ఉద్యోగులు, కార్మికులకు ఉన్న బకాయిలను అప్పటి ప్రభుత్వం చెల్లించిందన్నారు. 2014 – 19 వరకు టీడీపీ హయాంలో బకాయిలు ఒక్క రూపాయి కూడా ఇవ్వని విషయాన్ని ప్రశాంతిరెడ్డి తెలుసుకోవాలన్నారు. ఆ మొత్తం రూ.20 కోట్లని అసెంబ్లీ సాక్షిగా ఆమె చెప్పారని, కానీ ప్రస్తుతం రూ.22.30 కోట్లకు చేరుకుందన్నారు. ప్రసన్నకుమార్‌రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పలుమార్లు కార్మికుల బకాయిల గురించి లేఖలు రాశారన్నారు. కొన్ని ఫ్యాక్టరీలకు గత ప్రభుత్వం బకాయిలను చెల్లించిందని తెలిపారు. కోవూరు ఫ్యాక్టరీ విషయానికి వచ్చేసరికి ఎన్నికల కోడ్ రావడంతో బకాయిల చెల్లింపు ఆగిందన్నారు. కార్మికులకు న్యాయం చేయాలని చూస్తారే తప్ప కమీషన్ల కోసం ఎదురు చూడరని తెలుసుకోకుండా అసెంబ్లీలో అసత్యాలు చెప్పడాన్ని ఖండిస్తున్నామన్నారు. వైఎస్సార్ సీపీ మండలాధ్యక్షుడు అనూప్‌రెడ్డి మాట్లాడుతూ కార్మికుల పక్షాన ప్రసన్నకుమార్‌రెడ్డి పోరాటం చేశారన్నారు. సమావేశంలో జెడ్పీటీసీ సభ్యురాలు శ్రీలత, మండల పరిషత్ ఉపాధ్యక్షుడు నరసింహులురెడ్డి, కవరగిరి ప్రసాద్, శ్రీను తదితరులు పాల్గొన్నారు. -
అటవీ భూమి కబ్జాకు యత్నం
సాక్షి టాస్క్‌ఫోర్స్: వెంకటగిరి నియోజకవర్గం కలువాయి మండలంలోని తోపుగుంట సమీపంలోని పది ఎకరాల అటవీ భూమిని ఓ వ్యక్తి ఆక్రమించుకునేందుకు రంగం సిద్ధం చేశాడు. ఆ భూమి సోమశిల అనుసంధానమైన చైన్నె కాలువ సమీపంలో ఉండటం గమనార్హం. రూ.కోట్లు విలువ చేసే భూమిని కలువాయికి చెందిన ఓ వ్యక్తి చదును చేసి సాగు చేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేశాడు. అలాగే ఆ భూమి సమీపంలోనే మరో 4.88 సెంట్లు ఓ వ్యక్తికి అసైన్మెంట్ పట్టా ఇవ్వగా.. దానిని కూడా ఆ వ్యక్తి కొనుగోలు చేసి మొత్తంగా సాగులోకి తీసుకొచ్చేందుకు సిద్ధమయ్యాడు. ఈ తంతు సంబంధిత అధికారులకు తెలిసినా పట్టీపట్టనట్టు వ్యవహరిస్తున్నారని విమర్శలున్నాయి. -
జాప్యం లేకుండా పరిశ్రమలకు అనుమతులు
నెల్లూరు రూరల్: జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు ఎలాంటి జాప్యం లేకుండా అనుమతులను మంజూరు చేయాలని కలెక్టర్ ఆనంద్ సూచించారు. కలెక్టరేట్లోని శంకరన్ హాల్లో గురువారం నిర్వహించిన జిల్లా పరిశ్రమల ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. పరిశ్రమల ఏర్పాటుకు గానూ వచ్చిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి నిర్ణీత గడువులోపే అనుమతులను మంజూరు చేయాలని ఆదేశించారు. పెండింగ్‌లో ఉన్న మ్యుటేషన్లను వెంటనే పూర్తి చేయాలని కందుకూరు సబ్ కలెక్టర్, ఆత్మకూరు ఆర్డీఓను ఆదేశించారు. అవసరమైన సందర్భాల్లో రెవెన్యూ, ఇరిగేషన్, పంచాయతీ శాఖలు తనిఖీలు చేపట్టాలన్నారు. ప్రింటింగ్ క్లస్టర్ ఏర్పాటుకు సంబంధించి ఆమంచర్ల వద్ద కేటాయించిన భూమికి బదులు కేకేగుంట, అనంతరం వద్ద ఏపీఐఐసీ ఆధ్వర్యంలో ఉన్న భూమిని పరిశీలించి అప్పగించాలని సూచించారు. చిన్న, మధ్య తరగతి పరిశ్రమలను ప్రోత్సహించేందుకు పీఎంఈజీపీ రుణాలను విరివిగా మంజూరు చేయాలని చెప్పారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెస్సెమ్‌ఈ పార్కుల ఏర్పాటుకు అనువైన స్థలాలను ఎంపిక చేసి నివేదిక పంపాలని ఏపీఐఐసీ అధికారులను సూచించారు. నారంపేట మెగా ఇండస్ట్రియల్ పార్కు వద్ద విద్యుత్, తాగునీటి ఏర్పాటుకు సత్వర చర్యలు చేపట్టాలని ఆదేశించారు. జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు వచ్చిన దరఖాస్తుల పురోగతి, పీఎంఈజీపీ రుణాల మంజూరు తదితర అంశాలను జిల్లా పరిశ్రమల శాఖ జీఎం మారుతిప్రసాద్ వివరించారు. జేసీ కార్తీక్, ఏపీఐఐసీ జెడ్ఎం శివకుమార్, డ్వామా పీడీ గంగాభవాని, డీపీఓ శ్రీధర్‌రెడ్డి, ఎల్డీఎం శ్రీకాంత్ ప్రదీప్, ఇరిగేషన్ ఎస్ఈ దేశ్‌నాయక్, డీటీసీ చందర్, కమిటీ సభ్యులు ఏపీకే రెడ్డి, సతీష్, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. మాట్లాడుతున్న ఆనంద్ -
సంక్షోభంలో కూరుకుపోతున్న రంగం
యార్డులో నిలిచిన లారీలు మూలిగే నక్కపై తాటికాయ పడిన చందంగా మారింది లారీ రవాణా రంగ పరిస్థితి. డీజిల్, ఇన్సురెన్స్, టోల్ట్యాక్స్లు, స్పేర్‌పార్ట్స్ మోతతో ఇప్పటికే చుక్కలు చూస్తుండగా.. తాజాగా కిరాయిలు దొరక్క.. ఏమి చేయాలో పాలుపోక ఆందోళనకు గురవడం లారీ యజమానుల వంతవుతోంది. ఒకవేళ అరకొరగా దొరికినా ఐదేళ్ల క్రితం నాటి ధరలే లభిస్తుండటం వీరిని ఆవేదనకు గురిచేస్తోంది. లీటర్ డీజిల్ ధర రూ.98కి చేరువలో 25 శాతానికి పైగా పెరిగిన టైర్లు, విడిభాగాల ధరలు ఐదేళ్ల క్రితం నాటి కిరాయిలే నేటికీ లోడింగ్ అంతా రైలు వైపే నాడు 30 వేల లారీలు.. నేడు పది వేల్లోపే -
మద్యం మత్తులో వీరంగం
● సచివాలయ అద్దాలు ధ్వంసం అనుమసముద్రంపేట: మద్యం మత్తులో ఓ వ్యక్తి వీరంగం సృష్టించి సచివాలయ అద్దాలను ధ్వంసం చేశాడు. ఈ ఘటన ఏఎస్‌పేటలో చోటుచేసుకుంది. ఎంపీడీఓ ప్రసన్నకుమారి, ఎస్సై సైదులు తెలిపిన వివరాల మేరకు.. ఏఎస్‌పేట దర్గా ప్రాంతంలో షరీఫ్ అనే వ్యక్తి మానసిక రోగులకు ఆశ్రయ కేంద్రం నిర్వహిస్తున్నాడు. ఇతను బుధవారం రాత్రి పూటుగా మద్యం తాగి ముగ్గురు వ్యక్తులతో కలిసి సచివాలయ అద్దాలను పగులగొట్టాడు. గురువారం పంచాయతీ కార్యదర్శి ఎంపీడీఓకు తెలపడంతో పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఎస్సై విచారణ చేపట్టి నిందితుడిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. -
అటవీ పనుల వేతనాల పెంపు
● జోన్ – 4 పరిధిలోని జిల్లాల అధికారుల సమావేశంలో నిర్ణయం నెల్లూరు(అర్బన్): అటవీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే అన్ని రకాల పనులకు ఈ ఏడాది 4.36 శాతాన్ని అదనంగా పెంచి వేతనాలివ్వాలని కమిటీ నిర్ణయించిందని కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్, గుంటూరు కాశీవిశ్వనాథరాజు పేర్కొన్నారు. వేతనాల పెంపుపై జోన్ – 4 పరిధిలోని జిల్లాల అధికారులతో సమీక్ష సమావేశాన్ని వేదాయపాళెంలోని అటవీ శాఖ కార్యాలయంలో ఫారె్స్ట్స్ ఆఫ్ షెడ్యూల్ రేట్స్ కమిటీ చైర్మన్ కాశీవిశ్వనాథరాజు అధ్యక్షతన గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. గతేడాదితో పోలిస్తే ఈ సంవత్సరం డీజిల్ ధర తగ్గిందని, ఇవన్నీ పరిగణనలోకి తీసుకొని అటవీ శాఖ నిబంధనలకు అనుగుణంగా ఈ ఏడాది ఏప్రిల్ నుంచి జరగనున్న పనులకు 4.36 శాతం అదనంగా వేతనాలను ఇవ్వనున్నామన్నారు. అడవుల్లో చేపట్టే జంగిల్ క్లియరెన్స్, మొక్కలు నాటడం, కాపలా ఉండే వారికి, ట్రెంచ్‌లను ఏర్పాటు చేసే కాంట్రాక్టర్లు, రవాణా.. ఇలా అన్ని రకాల వాటికి ఇది వర్తించనుందని వెల్లడించారు. వేసవిలో వన్యప్రాణుల సంరక్షణకు ఏర్పాటు చేయాల్సిన నీటి వనరులపై చర్చించారు. డీఎఫ్ఓ మహబూబ్‌బాషా, అనంతపురం డీఎఫ్ఓ, కర్నూలు ఎఫ్ఏసీ డీఎఫ్ఓ యశోదబాయి, నంద్యాల ప్రాజెక్ట్ టైగర్ సర్కిల్ నుంచి కృష్ణమూర్తి, తిరుపతి అధికారి సెల్వం, రాష్ట్ర సిల్వి కల్చరిస్ట్, బయోట్రిమ్ తిరుపతి అధికారి నరేంద్రన్, ఆత్మకూరు టైగర్ ప్రాజెక్ట్ డిప్యూటీ డైరెక్టర్ సాయిబాబా, తిరుపతి సోషల్ ఫారెస్ట్ ఆఫీసర్ఽ ధర్మరాజు, నెల్లూరు సోషల్ ఫారెస్ట్ డివిజనల్ అధికారి నాగార్జునరెడ్డి, సూళ్లూరుపేట వైల్డ్ లైఫ్ డివిజనల్ ఫారెస్ట్ అధికారి హారిక తదితరులు పాల్గొన్నారు. -
మూల్యాంకనం ప్రారంభం
నెల్లూరు (టౌన్): ఇంటర్‌కు సంబంధించిన ఫిజిక్స్, ఎకనమిక్స్ సబ్జెక్టుల మూల్యాంకనాన్ని స్టోన్‌హౌస్‌పేటలోని కేఏసీ జూనియర్ కళాశాలలో గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయా సబ్జెక్టుల అధ్యాపకులతో నిర్వహించిన సమావేశంలో ఆర్ఐఓ ఆదూరు శ్రీనివాసులు మాట్లాడారు. మూల్యాంకనంలో 750 మంది అధ్యాపకులు పాల్గొంటున్నారని తెలిపారు. కెమిస్ట్రీ, హిస్టరీకి సంబంధించిన మూల్యాంకనాన్ని ఈ నెల 24 నుంచి.. బాటనీ, జువాలజీ, కామర్స్ ప్రక్రియను 26 నుంచి ప్రారంభించేలా అన్ని ఏర్పాట్లు చేశామని వెల్లడించారు. వచ్చే నెల మొదటి వారానికి పూర్తి చేయనున్నామని ప్రకటించారు. మీటర్ రీడర్ల నిరసన నెల్లూరు(వీఆర్సీసెంటర్): నగరంలోని విద్యుత్ భవన్ వద్ద మీటర్ రీడర్లు నిరసనను గురువారం చేపట్టారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి శంకర్ కిశోర్, మీటర్ రీడర్ల ప్రధాన కార్యదర్శి హజరత్‌వలీ మాట్లాడారు. తమ శ్రమను కాంట్రాక్టర్లు దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. ఎస్క్రో ద్వారా వేతనాలివ్వాలని ఆదేశాలు జారీ చేసినా, జిల్లా అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపించారు. స్మార్ట్ మీటర్లను ఏర్పాటు చేస్తున్న తరుణంలో పనికరువై మీటర్ రీడర్లు రోడ్డున పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. వీరికి ప్రత్యామ్నాయం చూపాలని డిమాండ్ చేశారు. అనంతరం సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్ మురళికి వినతిపత్రాన్ని అందజేశారు. మీటర్ రీడర్ల కోశాధికారి బాలకృష్ణ, వర్కింగ్ ప్రెసిడెంట్ వెంకటసుబ్బయ్య, ఫిరోజ్, చెంచురామయ్య, సుబ్బయ్య, రవిచంద్ర పాల్గొన్నారు. డీసీపల్లిలో 245 పొగాకు బేళ్ల విక్రయం మర్రిపాడు: మండలంలోని డీసీపల్లి పొగాకు బోర్డు వేలం కేంద్రంలో 245 బేళ్లను గురువారం విక్రయించారని నిర్వహణాధికారి రాజశేఖర్ తెలిపారు. వేలానికి 269 బేళ్లు రాగా, వీటిలో 245ను విక్రయించగా, మిగిలిన వాటిని వివిధ కారణాలతో తిరస్కరించామని చెప్పారు. గరిష్ట ధర కిలో ఒక్కింటికి రూ.280.. కనిష్ట ధర రూ.270.. మొత్తమ్మీద సగటు ధర రూ.277.19గా నమోదైందని వివరించారు. వేలంలో 32,510 కిలోల పొగాకును విక్రయించగా, రూ.90,11,680 వ్యాపారం జరిగిందని, ఎనిమిది కంపెనీల ప్రతినిధులు హాజరయ్యారన్నారు. రేషన్ బియ్యం లారీ పట్టివేత కావలి: రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న లారీని దగదర్తి మండల పరిధిలోని జాతీయ రహదారిపై తహసీల్దార్ కృష్ణ ఆధ్వర్యంలో గురువారం పట్టుకున్నారు. లారీలో 520 బస్తాలున్నాయని, గుడ్లూరు మండలం పెద్దపవని నుంచి చైన్నెలోని రెడ్‌హిల్స్‌కు వెళ్తుండగా పట్టుకున్నామన్నారు. అనంతరం లారీని దగదర్తి పోలీసులకు అప్పగించారు. ఖజానా శాఖలో పలువురికి ఉద్యోగోన్నతి నెల్లూరు(అర్బన్): ఉమ్మడి జిల్లాలో ఖజానా శా ఖలో పనిచేస్తున్న పలువురు సీనియర్ అసిస్టెంట్లకు సబ్ ట్రెజరీ ఆఫీసర్లుగా పదోన్నతి కల్పించి బదిలీ చేశారు. ఈ మేరకు డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ మోహన్‌రావు ఉత్తర్వులను గురువారం జారీ చేశారు. ఉద్యోగోన్నతులు పొందిన వారిలో ఉస్మాన్, రామారావు, విజయలక్ష్మి, నిజాముద్దీన్, శ్యామల, నాగేశ్వరరావు, నాగరాజు ఉన్నారు. -
టైర్లు కొనలేక బెంబేలు..
అన్నింట్లో మోతే.. ●టైరు ధర మూడేళ్ల క్రితం రూ.16 వేలుంటే, ప్రస్తుతం అది రూ.21,500కు చేరింది. రేడియల్ టైర్లు ఒక్కొక్కటి రూ.22 వేలు ఉంటే, రూ.26 వేలకు ఎగబాకాయి. ఇంజిన్ ఆయిల్‌తో పాటు విడిభాగాల ధరలను 20 శాతం మేర పెంచారు. లారీని బట్టి నిర్వహణ రూ.20 వేల నుంచి రూ.30 వేల వరకు ఉంటుంది. అన్ని పత్రాలున్నా పోలీస్, రవాణా అధికారులకు ఎంతో కొంత ముట్టజెప్పందే అక్కడి నుంచి పంపే పరిస్థితి లేదు. ● పెరిగిన ఇన్సురెన్స్, టైర్లు, విడి భాగాల ధరలు ఈ రంగాన్ని కకావికలం చేస్తున్నాయి. ● లారీ, దాని విలువ బట్టి థర్ట్ పార్టీ ఇన్సురెన్స్ రెండేళ్ల క్రితం రూ.20 వేల నుంచి రూ.50 వేల వరకు ఉండేది. ప్రస్తుతం ఇది రూ.40 వేల నుంచి రూ.80 వేల వరకు ఎగబాకింది. ● 22 చక్రాల కొత్త లారీకి ఇన్సురెన్స్ రూ.1.25 లక్షల వరకు ఉంది. ● లారీని బట్టి త్రైమాసిక పన్ను రూ.8 వేల నుంచి రూ.14 వేల వరకు ఉంది. ● నేషనల్ పర్మిట్‌కు రూ.17 వేలు అదనం. ● ఏడేళ్లు దాటిన రవాణా వాహనానికి ఏటా గ్రీన్ ట్యాక్స్‌ను చెల్లించాల్సి ఉంటుంది. నెల్లూరు(టౌన్): లారీ ఉందంటేనే అదో ఠీవి. అబ్బో యజమానా.. ఇంకేమిలే అనే మాట తరచూ వినిపించేది. అయితే ఇదంతా గతం. రవాణాలో కీలక పాత్ర పోషించే ఈ రంగం ప్రస్తుతం కకావికలమవుతోంది. డీజిల్ ధర లీటర్ రూ.98కి చేరువలో ఉండటం.. జాతీయ రహదారిపై ప్రతి 50 కిలోమీటర్లకో టోల్గేట్.. జీఎస్టీ మోతతో ఆదాయం సంగతి దేవుడెరుగు.. కనీస ఖర్చులొస్తే చాలు మహాప్రభో అనే స్థితికి యజమానులు వస్తున్నారు. అప్పటికీ.. ఇప్పటికీ ఎంతో వ్యత్యాసం గతంలో ఉమ్మడి జిల్లాలో 30 వేలకుపైగా లారీలు ఉండేవి. ప్రధానంగా కృష్ణపట్నం పోర్టుకు ఎగుమతులు, దిగుమతులు అధిక సంఖ్యలో జరిగేవి. దీంతో పాటు ఇసుక, సిలికా, క్వార్ట్జ్, ధాన్యం, బియ్యం తదితరాల్లో వీటి పాత్ర కీలకం. లాభాలెక్కువగా ఉండటంతో వీటిని కొనుగోలు చేసేందుకు ఎంతో మంది ఉత్సాహం చూపేవారు. అయితే కాలక్రమంలో ఇది పతనావస్థకు చేరుతోంది. కొత్తగా కొనుగోలు చేసే వారి సంగతి అటుంచితే.. ఉన్నవి కాపాడుకోవడమే గగనంగా మారింది. ప్రస్తుతం జిల్లాలో లారీల సంఖ్య పది వేల్లోపే ఉంటాయని సమాచారం. కాలం మారింది.. కిరాయే మారలేదు రవాణా రంగంలో నెలకొన్న తీవ్రమైన పోటీ కారణంగా ఐదేళ్లుగా ఉన్న కిరాయే నేటికీ కొనసాగుతోంది. లోడింగూ అంతంతమాత్రంగానే ఉంది. మరోవైపు సరుకుల రవాణాకు ఇటీవలి కాలంలో రైళ్లను ఎక్కువ మంది ఆశ్రయిస్తున్నారు. రాబడి తగ్గి.. ఖర్చులు అమాంతం పెరగడంతో కొందరు యజమానులు తమ లారీలను విక్రయానికి పెట్టారంటే సమస్య తీవ్రత ఏమిటో అర్థం చేసుకోవచ్చు. మరికొందరు బయటకొచ్చి ఏ వ్యాపారం చేయలేక అందులోనే కాలం వెళ్లదీస్తున్నారు. డ్రైవర్లేరీ..? రవాణా రంగ సంక్షోభానికి డ్రైవర్ల కొరతా ఓ కారణమవుతోంది. కొత్తగా ఇందులోకి వచ్చేందుకు ఎవరూ ఆసక్తి చూపడంలేదు. పైగా వీరికిచ్చే కమీషన్‌ను పది శాతానికి పెంచారు. ఉదాహరణకు కిరాయి రూ.లక్ష ఉంటే అందులో రూ.పది వేలను డ్రైవర్‌కు ఇవ్వాల్సిందే. లోడింగ్, అన్ లోడింగ్ బాధ్యతను యజమానే భరించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ మేరకు కిరాయి వస్తే అన్ని ఖర్చులు పోనూ రూ.20 వేలు కూడా మిగలని పరిస్థితి నెలకొంది. -
ఇన్సురెన్స్, గ్రీన్ ట్యాక్స్ తగ్గించాలి
లారీ తిప్పడం ప్రస్తు తం కష్టంగా మారింది. ఇన్సురెన్స్, గ్రీన్‌ట్యాక్స్‌ను అమాంతంగా పెంచేశారు. ఈ రంగంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు శీతకన్ను వేశాయి. జీఎస్టీతో యజమానులపై పెనుభారం పడింది. టోల్గేట్ల సంఖ్యను తగ్గించడంతో పాటు కొత్తగా వచ్చే ఆటోమేటెడ్ ఫిట్నెస్ స్టేషన్లను నిలిపేయాలి. రవాణా రంగాన్ని ఆదుకోకపోతే పూర్తిగా విక్రయించే పరిస్థితి వస్తుంది. – గోపాలనాయుడు, లారీ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు డీజిల్‌పై వ్యాట్‌ను తగ్గించాలి డీజిల్‌పై రాష్ట్ర ప్రభుత్వం విధిస్తున్న నాలుగు శాతం వ్యాట్‌ను తగ్గించాలి. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే దీని ధర ఇక్కడే ఎక్కువగా ఉంది. కిరాయిలూ అంతంతమాత్రంగానే ఉన్నాయి. డ్రైవర్లు దొరకని పరిస్థితి. విడిభాగాల ఖరీదులు బాగా పెరిగాయి. ప్రస్తుత రోజుల్లో పాత లారీని తిప్పే పరిస్థితే లేదు. – దయాకర్‌రెడ్డి, యజమాని -
గ్రావెల్.. అన్‌స్టాపబుల్
కూటమి ప్రభుత్వం కొలువుదీరాక పచ్చ నేతల ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండాపోతోంది. నిన్నామొన్నటి వరకు ఇసుకను కొల్లగొట్టి భారీగా వెనుకేసుకున్న వీరి కళ్లు గ్రావెల్‌పై పడ్డాయి. అనుకున్నదే తడవుగా దగదర్తి మండలంలో దీన్ని యథేచ్ఛగా తవ్వుతూ లారీల్లో నిత్యం తరలిస్తున్నారు. విసిగివేసారిన గ్రామస్తులు ప్రశ్నిస్తే తట్టుకోలేకపోతున్నారు. వాహనాలతో తొక్కించి చంపేస్తామంటూ బెదిరింపులకు దిగుతున్నారు. ఈ వ్యవహారంలో అధికారుల పరోక్ష సహకారం ఉండటంతో వీరు మరింత చెలరేగిపోతూ సవాల్ విసురుతున్నారు. ప్రమాదాలు జరుగుతాయనే ఆందోళన కాలనీ వెనుక వైపు దాదాపు 40 అడుగుల మేర గోతులు తవ్వారు. వర్షాకాలంలో నీరు నిలిచి పిల్లలు ప్రమాదాల బారిన పడే అవకాశం ఉందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ ఫిర్యాదులు బుట్టదాఖలవుతుండటంతో ఇక తమకు దిక్కెవరని వారు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు దగదర్తి ప్రాంతంలోని కేకేగుంట, ఉలవపాళ్ల తదితర గ్రామాల్లోని గ్రావెల్‌కు డిమాండ్ అధికంగా ఉండటంతో కూటమి నేతలు కుమ్మకై ్క తమ పనిని కానిచ్చేస్తున్నారు. జిల్లా అధికారులకు ఫిర్యాదు చేసినా అక్రమ రవాణా ఆగలేదంటే ప్రజాప్రతినిధులు ఇందులో భాగస్వాములయ్యారనే అంశం స్పష్టంగా అర్థమవుతోంది. సాక్షి ప్రతినిధి, నెల్లూరు: టీడీపీ నేతల ధనదాహం పరాకాష్టకు చేరుతోంది. ఇసుక.. మద్యం.. ఇలా ప్రతి అంశంలో తమ మాటే చెల్లుబాటయ్యేలా వ్యవహరిస్తూ వచ్చిన వీరు.. తాజాగా గ్రావెల్‌ను కొల్లగొట్టడంలో నిమగ్నమయ్యారు. వీరి చేష్టలతో దగదర్తి మండలంలోని ఉలవపాళ్ల, కేకేగుంట, సున్నపుబట్టి తదితర ప్రాంతాల్లో గ్రావెల్ అక్రమ రవాణా రెండు నెలలుగా నిరాటంకంగా జరుగుతోంది. రాత్రయితే హడలే.. ఉలవపాళ్లలో రాత్రి వేళ ఈ వ్యవహారం జోరుగా సాగుతోంది. రెండు పొక్లయిన్లు ఏర్పాటు చేసి రాత్రి ఏడు నుంచి ఉదయం ఏడు వరకు 20 లారీల్లో గ్రావెల్‌ను యథేచ్ఛగా తరలిస్తున్నారు. మండలంలోని చోటా.. నియోజకవర్గ స్థాయి నేతల కనుసన్నల్లో ఈ వ్యవహారం జరుగుతోంది. గ్రామస్తులెవరైనా అడ్డుకుంటే తొక్కి చంపేస్తామంటూ పరుష పదజాలంతో దూషిస్తున్నారు. ఈ క్రమంలో రాత్రి వేళ వాహన శబ్దాలతో బిక్కుబిక్కుమంటూ కాలం గడపాల్సి వస్తోంది. ఫిర్యాదు చేస్తే కన్నెర్రే..! కాలనీకి వెనుక వైపు ఉన్న ప్రభుత్వ భూముల్లో గ్రావెల్ అక్రమ రవాణా మూడు పువ్వులు.. ఆరు కాయలు అనే చందంగా సాగుతోంది. ఒకవేళ ఎవరైనా ఫిర్యాదు చేస్తే, వారిపై దౌర్జన్యానికి పాల్పడుతున్నారని సమాచారం. ఒకరిద్దరు సాహసం చేసి వీడియోలు, ఫొటోలు తీసి జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో స్పందించిన ఆయన.. స్థానిక తహసీల్దార్‌కు ఫోన్ చేసి చర్యలు చేపట్టాలని హెచ్చరించారు. ఫలితంగా లారీని స్వాధీనం చేసుకున్నారు. అయితే కూటమి నేతల ఒత్తిళ్లతో దీన్ని వదిలేశారు. అదే రోజు రాత్రి నుంచి అక్రమ రవాణా మళ్లీ మొదటికొచ్చింది. ఉలవపాళ్ల, కేకేగుంట, సున్నపుబట్టీలో యథేచ్ఛగా తవ్వకాలు కొల్లగొడుతున్న టీడీపీ నేతలు అడ్డుకున్న గ్రామస్తులపై దౌర్జన్యాలు లారీలతో తొక్కిస్తామంటూ హెచ్చరికలు అధికారుల పరోక్ష సహకారం దగదర్తి మండలంలో ఇదీ తంతు రోడ్లు.. పైప్లైన్లు ధ్వంసమై భారీ వాహనాల పుణ్యమానని గ్రామంలోని రోడ్లు.. తాగునీటి పైప్లైన్లు దెబ్బతిన్నాయి. ఫలితంగా గ్రామస్తుల పాట్లు వర్ణనాతీతమవుతున్నాయి. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి దీనిపై దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. -
కొడుకు చేతిలో తండ్రి హతం
● మద్యం మత్తులో ఘాతుకం ● ఆత్మహత్యగా చిత్రీకరించే యత్నం మర్రిపాడు: మద్యం మత్తులో తండ్రిని కుమారుడు హత్య చేసిన ఘటన మండలంలోని చుంచులూరు గ్రామ ఎస్సీ కాలనీలో బుధవారం అర్ధరాత్రి జరిగింది. పోలీసుల కథనం మేరకు.. ఎస్సీ కాలనీలో చిలపోగు చిన్నయ్య (45) నివాసం ఉంటున్నాడు. అతనికి శివకుమార్ అలియాస్ సూరి అనే కుమారుడు, ముగ్గురు కుమార్తెలున్నారు. చిన్నయ్య కూలి పనులకు వెళ్తుంటాడు. సూరి మద్యానికి అలవాటు పడి జులాయిగా తిరుగుతుంటాడు. బుధవారం రాత్రి చిన్నయ్య ఇంట్లో ఉండగా సూరి మద్యం తాగొచ్చి తండ్రితో గొడవపడి దాడి చేసి హతమార్చాడు. దీనిని ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు సబ్బు నీళ్లను చిన్నయ్య నోట్లో పోసి నురగ వచ్చేలా చేశాడు. గురువారం తెల్లవారుజామున ఇంటి పక్కన వారికి తన తండ్రి పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడని నమ్మించే ప్రయత్నం చేశాడు. అయితే చిన్నయ్య శరీరంపై గాయాలుండటాన్ని గమనించిన కొందరు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సూరి సమీప అటవీ ప్రాంతంలోకి పారిపోయాడు. ఆత్మకూరు సీఐ గంగాధర్, మర్రిపాడు ఎస్సై శ్రీనివాసరావు తమ సిబ్బందితో ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆత్మకూరు ఆస్పత్రికి తరలించారు. కాలనీకి చెందిన కొందరు అటవీ ప్రాంతానికి వెళ్లి సూరి ని వెతికి పట్టుకుని పోలీసులకు అప్పగించారు. -
కబడ్డీ రెఫరీగా శ్రీనివాసరావు
ఉలవపాడు: మండల పరిధిలోని కరేడు గ్రామానికి చెందిన కబడ్డీ కోచ్ సాదం శ్రీనివాసరావు నేషనల్ రెఫరీగా ఎంపికైనట్లు ఆంధ్రా కబడ్డీ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ శ్రీకాంత్ గురువారం తెలిపారు. బిహార్‌లోని బుద్ధగయలో ఈనెల 27 నుంచి 30వ తేదీ వరకు నిర్వహించనున్న సబ్ జూనియర్ నేషనల్ కబడ్డీ చాంపియన్‌షిప్‌కు ఆంధ్రప్రదేశ్ రెఫరీ బోర్డు నుంచి శ్రీనివాసరావును ఎంపిక చేశారు. వ్యవసాయ కుటుంబంలో పుట్టిన తనకు సహ కరించిన వ్యాయామ అధ్యాపకులు, బోర్డు కన్వీనర్ రవీంద్రబాబు, అసోసియేషన్‌కు శ్రీనివాసరావు కృతజ్ఞతలు తెలిపారు.నెల్లూరుతో ప్రత్యేక అనుబంధం ఉంది ● సినీ నటుడు తనికెళ్ల భరణి సంగం: నెల్లూరు జిల్లాతో తనకు ప్రత్యేక అనుబంధం ఉందని ప్రముఖ సినీ నటుడు తనికెళ్ల భరణి తెలిపారు. అసుర సంహారం అనే సినిమా షూటింగ్ గురువారం మండలంలో జరిగింది. పలు సన్నివేశాలను తెలుగు ఉపాధ్యాయుడు ప్రవీణ్‌కుమార్ నివాసంలో, సంగమేశ్వరాలయంలో చిత్రీకరించారు. తనికెళ్ల భరణిని చూసేందుకు స్థానికులు తరలివచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెల్లూరులో 40 ఏళ్ల క్రితం నాటికను ప్రదర్శించానన్నారు. ఇక్కడ అమరావతి కృష్ణారెడ్డి, నందు, హరివిల్లు ఆర్గనైజేషన్ నిర్వాహకులు, పలువురు మిత్రులున్నారని తెలిపారు. నెల్లూరుకు చెందిన దివంగత గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, తాను పలు సినిమాల్లో నటించామన్నారు. ప్రతిభ ఉన్నవారిని సినిమా ఇండస్ట్రి ఎప్పుడూ స్వాగతిస్తుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ తల్లిదండ్రులు, గురువులను గౌరవించాలన్నారు. భారతీయ సంస్కృతిని కాపాడాలన్నారు. కండలేరులో 49.983 టీఎంసీలు రాపూరు: కండలేరు జలాశయంలో గురువారం నాటికి 49.983 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు ఈఈ విజయకుమార్‌రెడ్డి తెలిపారు. సత్యసాయి గంగ కాలువకు 580, లోలెవల్ కాలువకు 10, హైలెవల్ కాలువకు 80, మొదటి బ్రాంచ్ కాలువకు 25 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు తెలిపారు. -
రైతులను ఆదుకోకపోతే పోరాటం చేస్తాం
నెల్లూరు(బారకాసు): ‘పంటకు గిట్టుబాటు ధర లేక వరి రైతులు ఆందోళన చెందుతున్నారు. వారిని ఆదుకోకపోతే పోరాటం చేస్తాం’ అని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి తెలిపారు. గురువారం నెల్లూరు నగరంలోని ఆ పార్టీ జిల్లా కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ధాన్యాన్ని ప్రభుత్వం సక్రమంగా కొనుగోలు చేయకపోవడంతో రైతులు దళారులకు విక్రయించుకుంటున్నారని చెప్పారు. ఇటువంటి పరిస్థితుల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు అమరావతిలో సమీక్షలు, సమావేశాలు నిర్వహించుకుంటున్నారే తప్ప ధాన్యం కొనుగోలుకు సంబంధించి స్పష్టమైన నిర్ణయాలు ప్రకటించడం లేదన్నారు. జిల్లాలో పుట్టి ధాన్యం రూ.19,720లకు అమ్మాల్సి ఉండగా ప్రస్తుతం రూ.15,500 విక్రయించుకునే పరిస్థితి రైతులకు ఏర్పడిందన్నారు. ధాన్యం కొనుగోలుకు ప్రభుత్వం ముందుకురాక, మరోవైపు దళారులు తక్కువ రేటుకు కొనుగోలు చేస్తుండటంతో అన్నదాతలు దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నారన్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఇదే సీజన్లో పుట్టి ధాన్యం రూ.22 వేలకు కల్లాలోనే కొనుగోలు చేయడం జరిగిందని గుర్తు చేశారు. అదేవిధంగా ఆరబెట్టిన ధాన్యాన్ని రూ.25 వేల నుంచి రూ.26 వేల వరకు కొనుగోలు చేశారన్నారు. కూటమి ప్రభుత్వంలో ధాన్యాన్ని కొనుగోలు చేయడం ఆపేశారని దీంతో రైస్‌మిల్లర్లు, దళారులు విజృంభిస్తున్నారని చెప్పారు. దీంతో రైతు ఎకరాకు రూ.40 వేలు నష్టపోయే పరిస్థితి నెలకొందన్నారు. ప్రస్తుతం గన్నీబ్యాగ్‌లు లేవని, రవాణా సౌకర్యం లేదని, కూలీలు లేరని రైతులు వాపోతున్నారన్నారు. ఏప్రిల్ మూడో వారం వరకు ధాన్యం కోతలు ఉంటాయని కాబట్టి, ప్రభుత్వం కళ్లు తెరిచి గిట్టుబాటు ధర కల్పించి అన్నదాతలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో గిట్టుబాటు ధర ఇచ్చేంత వరకు రైతుల పక్షాన వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో పోరాటం చేస్తామని హెచ్చరించారు. బ్లాక్మెయిల్ కోసమే.. మిల్లర్లు, దళారులు రైతుల వద్ద ధాన్యాన్ని తక్కువ రేటుకు కొనుగోలు చేయడానికి వీలు లేదంటూ ఎమ్మెల్యే సోమిరెడ్డి వాట్సాప్‌లో పోస్టు చేశారని కాకాణి అన్నారు. దీనికి కారణం రైతుల మీద ప్రేమ కాదని కేవలం రైస్‌మిల్లర్లు, దళారులను బ్లాక్మెయిల్ చేసేందుకేనన్నారు. అమరావతిలో కలెక్టర్లు, శాసనసభ్యులతో మాట్లాడటం, ఇక్కడకు వచ్చి రైస్‌మిల్లర్లు, దళారులతో డీల్ కదుర్చుకోవడం చేస్తున్నారన్నారు. గతంలో క్వార్ట్జ్ మైనింగ్ దగ్గరికి కొంతమంది ఎమ్మెల్యేలను తీసుకెళ్లి హడావుడి చేశారని.. ఆ తర్వాత వాటి యజమానులను బెదిరించి వాటాలు తీసుకున్న ఘనత సోమిరెడ్డిదన్నారు. వరికి గిట్టుబాటు ధర లేక ఆందోళన పెట్టుబడి కూడా రాక ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి -
దివ్యాంగులను ఇబ్బంది పెడితే చర్యలు
● కలెక్టర్ ఆనంద్ నెల్లూరు(అర్బన్): సదరం క్యాంపునకు వచ్చే దివ్యాంగులను ఇబ్బంది పెడితే చర్యలు తీసుకుంటామని కలెక్టర్ ఆనంద్ తెలిపారు. నెల్లూరులోని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి (పెద్దాస్పత్రి)లో జరుగుతున్న దివ్యాంగుల సర్టిఫికెట్ల రీవెరిఫికేషన్ సదరం క్యాంపును కలెక్టర్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. రిజిస్ట్రేషన్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రిజిస్ట్రేషన్‌ను త్వరగా చేసి అదేరోజు వైద్యపరీక్షలు పూర్తి చేసి పంపాలని సూచించారు. సమయం చాల్లేదంటూ దివ్యాంగులను మరోరోజు పిలిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దివ్యాంగులకు ఐడీ నంబర్ ఇచ్చే ప్రక్రియను ఆన్లైన్ చేయడంలో ఆలస్యం చేస్తున్నారంటూ సంబంధిత సిబ్బందిపై కలెక్టర్ అసహనం వ్యక్తం చేశారు. పలువురు దివ్యాంగులు మాట్లాడుతూ తాము దూరప్రాంతాల నుంచి అనేక ఇబ్బందులు పడి ఇక్కడికి వస్తున్నామని, వెరిఫికేషన్ ప్రక్రియను ఆత్మకూరు, కావలి, ఉదయగిరి తదితర ప్రాంతాల్లో కూడా ఏర్పాటు చేయాలని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. పరిశీలిస్తామని ఆయన తెలిపారు. కార్యక్రమంలో డిప్యూటీ కలెక్టర్ మహేశ్వరరెడ్డి, ఆస్పత్రి ఇన్చార్జి సూపరింటెండెంట్ డాక్టర్ నరేంద్ర, డాక్టర్ గంగాధర్, డాక్టర్ మస్తాన్‌బాషా, అడ్మిని స్ట్రేషన్ అధికారులు డాక్టర్ కళారాణి, డా.సుశీల్, ఏడీ ఏడుకొండలు పాల్గొన్నారు. -
డీకేడబ్ల్యూ కళాశాలకు రాష్ట్ర స్థాయిలో గుర్తింపు
నెల్లూరు(టౌన్): మహిళా విద్యకు ప్రాధాన్యమిస్తున్న డీకేడబ్ల్యూ కళాశాలకు రాష్ట్ర స్థాయిలో గుర్తింపు ఉందని విక్రమ సింహపురి యూనివర్సిటీ రిజిస్ట్రార్ సునీత అన్నారు. కళాశాల ఏర్పడి 60 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వజ్రోత్సవ సంబరం గురువారంతో ముగిసింది. ఈ సందర్భంగా విద్యార్థులు, అధ్యాపకులు, పూర్వ విద్యార్థులు కళాశాల నుంచి కేవీఆర్ సెంటర్ వరకు వజ్రోత్సవ ర్యాలీని నిర్వహించారు. అనంతరం పూర్వ, ప్రస్తుత అధ్యాపకులను ఘనంగా సన్మానించారు. పూర్వ విద్యార్థులు ఎన్నో ఏళ్ల తర్వాత ఒకరినొకరు కలుసుకోవడంతో సెల్ఫీలు తీసుకున్నారు. రిజిస్ట్రార్ సునీత మాట్లాడుతూ రానున్న రోజుల్లో కళాశాల మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి మాట్లాడుతూ చదువుకున్న పాఠశాల, కళాశాలను అభివృద్ధి చేయాల్సిన బాధ్యత పూర్వ విద్యార్థులపై ఉందన్నారు. దొడ్ల కౌసల్యమ్మ మేనల్లుడు సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ డీకేడబ్ల్యూలో చదివిన ఎందరో నేడు ఉన్నత స్థానాల్లో ఉన్నారని కొనియాడారు. సినిమా హీరో చిరంజీవి సోదరి విజయదుర్గ మాట్లాడుతూ వజ్రోత్సవ సంబరాలకు హాజరుకావడం ఆనందంగా ఉందన్నారు. ఎంతోమంది స్నేహితులను కలిసినట్లు చెప్పారు. ఇంకా పూర్వ ప్రిన్సిపల్ మస్తానయ్య, పూర్వ ప్రిన్సిపల్ శైలజ, మాజీ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి సతీమణి, పూర్వ విద్యార్థిని హేమావతి మాట్లాడారు. సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. వివిధ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో పూర్వ అధ్యాపకులు గంగాధర్‌రెడ్డి, వైస్ ప్రిన్సిపల్ ఏవీ రమణారావు పాల్గొన్నారు. వీఎస్‌యూ రిజిస్ట్రార్ సునీత ముగిసిన వజ్రోత్సవ సంబరంచాలా ఆనందంగా ఉంది డీకేడబ్ల్యూ కళాశాల వజ్రోత్సవాన్ని నిర్వహించడం చాలా ఆనందంగా ఉంది. ఆశించిన స్థాయిలో పూర్వ విద్యార్థులు ఈ వేడుకలను తరలివచ్చారు. డీకేడబ్ల్యూ డిగ్రీ కళాశాలలో చదువుకున్న ఎందరో నేడు ఉన్నత స్థానాల్లో ఉన్నారు. డీకేడబ్ల్యూ కళాశాలలో చదువుకున్నందుకు గర్వ పడుతున్నా. – జ్యోతిరెడ్డి, అధ్యక్షురాలు, పూర్వ విద్యార్థుల సంఘం విజయవంతానికి కృషి చేశాం డీకేడబ్ల్యూ వజ్రోత్సవానికి విచ్చేసిన వారికి కృతజ్ఞతలు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ఎన్నోరోజులు కృషి చేశాం. ఎంతో దూరం నుంచి పూర్వ విద్యార్థులు హాజరయ్యారు. సంవత్సరాల తర్వాత అందరం ఒకచోట నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకోవడం ఆనందంగా ఉంది. – కుసుమకుమారి, కార్యదర్శి, పూర్వ విద్యార్థుల సంఘం -
లైంగికదాడికి యత్నించిన కేసులో నిందితుడి అరెస్ట్
వరికుంటపాడు: మండలంలోని వరికుంటపాడులో ఈనెల 16వ తేదీ అర్ధరాత్రి వృద్ధురాలిపై లైంగికదాడికి యత్నించిన కేసులో గొలపల్లి గురవయ్య అనే వ్యక్తిని గురువారం అరెస్ట్ చేశామని ఎస్సై రఘునాథ్ తెలిపారు. అతడిని ఉదయగిరి జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో హాజరుపరిచామన్నారు. రైలు ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి మృతి నెల్లూరు(క్రైమ్): రైలు ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి మృతిచెందిన ఘటన గురువారం జరిగింది. రైల్వే పోలీసుల కథనం మేరకు.. నెల్లూరులోని ఆత్మకూరు బస్టాండ్ సమీపంలోని పట్టాలపై గుర్తుతెలియని వ్యక్తిని రైలు ఢీకొనడంతో తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడి వయసు 40 నుంచి 45 సంవత్సరాల్లోపు ఉండొచ్చని భావిస్తున్నారు. ఆకుపచ్చ రంగు హాఫ్ హ్యాండ్ టీ షర్ట్, బులుగు రంగు షాట్ ధరించి ఉన్నాడు. రైల్వే ఎస్సై మాలకొండయ్య ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఉపాధి కోసం వచ్చి కానరాని లోకాలకు.. ● గుర్తుతెలియని వాహనం ఢీకొని మృతి మనుబోలు: ఉపాధి కోసం వచ్చి గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో ఓ వ్యక్తి మృతిచెందాడు. ఈ ఘటన మండలంలోని మనుబోలు – పొదలకూరు రోడ్డు మార్గంలో రాజోలుపాడు వద్ద బుధవారం అర్ధరాత్రి జరిగింది. గురువారం పోలీ సులు వివరాలు వెల్లడించారు. హరియాణా రాష్ట్రానికి చెందిన బల్వీందర్ సింగ్ (30) వరికోత మెషీన్ ఆపరేటర్‌గా ఉన్నాడు. రాజోలుపాడు గ్రామ పొలాల్లో పనిలు చేస్తున్నాడు. సమీపంలోని పెట్రోలు బంక్ వద్ద ఉంటున్నాడు. బుధవారం అర్ధరాత్రి మూత్రవిసర్జన కోసం అతను రోడ్డు దాటుతుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొని అక్కడికక్కడే మృతిచెందాడు. ఎస్సై శివరాకేష్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 24,289 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు ● జాయింట్ కలెక్టర్ కార్తీక్ నెల్లూరు రూరల్: జిల్లాలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల ద్వారా ఇప్పటి వరకు 24,289 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు జేసీ కార్తీక్ తెలిపారు. గురువారం 3,582 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారని ప్రకటన విడుదల చేశారు. రూ.52.10 కోట్లను రైతులకు చెల్లించినట్లు వెల్లడించారు. రైతులు దళారుల మాటలు విని తక్కువ ధరకు అమ్ముకోవద్దని సూచించారు. కొనుగోలు కేంద్రాల్లో విక్రయించి మద్దతు ధర పొందాలని తెలియజేశారు. -
వృద్ధుడికి ఎంత కష్టం వచ్చిందో..
● ఉరేసుకుని బలవన్మరణం మర్రిపాడు: ఓ వ్యక్తి పిల్లల్ని పెంచి ప్రయోజకుల్ని చేశాడు. వారిప్పుడు దూరంగా వేరే ప్రాంతంలో ఉంటున్నారు. భార్య అనారోగ్యంతో మంచాన పడింది. వృద్ధాప్యంలో ఉన్న అతను ఆమె బాధ చూడలేక బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ విషాదకర ఘటన మండలంలోని రాజులపాడు గ్రామంలో జరిగింది. పోలీసుల కథనం మేరకు.. బక్కిరెడ్డి (70)కి భార్య, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. పిల్లలకు వివాహాలై బెంగళూరులో ఉంటున్నారు. మూడేళ్ల క్రితం బక్కిరెడ్డి భార్య పక్షవాతంతో మంచాన పడింది. సంతానం దగ్గర లేకపోవడం.. ఎవరూ పట్టించుకోకపోవడంతో భార్యకు సపర్యలు చేయడం బక్కిరెడ్డికి కష్టంగా మారింది. ఈ నేపథ్యంలో ఆమె పడుతున్న బాధ చూడలేక ఆయన ఎంతగానో ఆవేదన చెందేవాడు. గురువారం బక్కిరెడ్డి గ్రామానికి సమీపంలోని అడవిలోకి వెళ్లి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
బైక్‌ను ఢీకొట్టిన లారీ
● యువకుడి మృతి ఆత్మకూరు: మోటార్‌బైక్‌ను లారీ ఢీకొనడంతో ఓ యువకుడు మృతిచెందిన ఘటన ఆత్మకూరు మున్సిపల్ పరిధిలోని నెల్లూరు – ముంబై జాతీయ రహదారిపై ఆంధ్రా ఇంజినీరింగ్ కళాశాల సమీపంలో గురువారం జరిగింది. ఎస్సై ఎస్కే జిలానీ కథనం మేరకు.. తెల్లపాడు ముస్తాపురం గ్రామానికి చెందిన తాటిపర్తి ఈశ్వర్ (19) కూలి పనులు చేస్తుంటాడు. ఈ క్రమంలో కరటంపాడుకు బైక్‌పై వెళ్లి తిరిగి ముస్తాపురానికి వస్తున్నాడు. ఆంధ్రా ఇంజనీరింగ్ కళాశాల సమీపంలో లారీ బైక్‌ను ఢీకొనడంతో తలకు తీవ్ర గాయాలై ఈశ్వర్ అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న ఎస్సై ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు నమోదు చేసుకున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆత్మకూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. -
అన్నదాన క్షేత్రంలో అరాచక పర్వం!
కాశినాయన క్షేత్రం నుంచి ‘సాక్షి’ప్రత్యేక ప్రతినిధి: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ పెద్దలు తొలుత తిరుమల లడ్డూ నాణ్యతపై లేనిపోని విమర్శలు చేసి హిందువుల మనోభావాలను దెబ్బతీశారు. ఆపై అదే తిరుమలలో ఎలాంటి జాగ్రత్త తీసుకోకపోవడంతో చరిత్రలో ఎన్నడూ లేని విధంగా తొక్కిసలాట జరిగి పలువురు భక్తులు మరణించారు. ఇవి చాలవన్నట్లు ఇప్పుడు మరో హిందూ వ్యతిరేక చర్యకు నడుం బిగించారు. ఇందుకు కాశీనాయన క్షేత్రం వేదికైంది. దీనులకు దేవాలయం.. అన్నార్తులను ఆదరించి అక్కున చేర్చుకునే అపర అన్నపూర్ణ నిలయంగా భాసిల్లుతున్న ఈ క్షేత్రంలో కనిపించేదల్లా.. నిత్యాన్నదానం, స్వచ్ఛంద విరాళాల తత్వం, లాభాపేక్షలేని సేవా భావం! పచ్చటి నేలలోని ఆ ప్రశాంత క్షేత్రంలో ఒక్కసారిగా కల్లోలం చెలరేగింది. కూటమి సర్కారు వరుసగా కూల్చివేతలు కొనసాగించింది. కాశీనాయన క్షేత్రంలో పలు నిర్మాణాలను కూల్చివేస్తుండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాషాయ వ్రస్తాలు ధరించి దక్షిణాది రాష్ట్రాలలో పర్యటిస్తూ పలు ఆలయాలు దర్శించిన, సనాతన ధర్మానికి పరిరక్షకునిగా చెప్పుకుంటున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పరిధిలోని అటవీశాఖ కాశీనాయన క్షేత్రంలో కూల్చివేతలు చేపట్టడం గమనార్హం. ఆయన మాత్రం దీనిపై నోరుమెదపడంలేదు. ఎన్నో ఏళ్లుగా పేదల కడుపునింపుతున్న ఓ ధార్మీక క్షేత్రంపై కూటమి ప్రభుత్వం ఇలా కత్తిగట్టినట్టు ఎందుకు వ్యవహరిస్తున్నదో ఎవరికీ అంతుబట్టడం లేదు. నిత్యాన్నదానం, గో సంరక్షణ నెల్లూరు జిల్లా సీతారామపురం మండలం బెడుసు పల్లి గ్రామానికి చెందిన మున్నెల్లి సుబ్బారెడ్డి, కాశమ్మల రెండో సంతానమైన కాశిరెడ్డి యవ్వనంలోనే ఇంటిని వదిలి ఆథ్యాత్మికత వైపు అడుగులు వేశారు. వివిధ ప్రాంతాల్లో సంచరిస్తూ గరుడాద్రి వద్ద తపస్సులో నిమగ్నమయ్యారని, ఆయనకు జ్యోతిలక్ష్మీనరసింహస్వామి ప్రత్యక్షమై మార్గ నిర్దేశం చేశారని ప్రతీతి. తన గురువు అతిరాస గురవయ్య ఉపదేశం మేరకు ఆలయాల జీర్ణోద్ధరణకు పూనుకున్నారు. నిత్యాన్నదానం, గో సంరక్షణకు అత్యంత ప్రాధాన్యమిచ్చారు. 1995 డిసెంబరు ఆరో తేదీ దత్తపౌర్ణమి రోజు మహాసమాధి అయ్యారు. ఆయన సేవలకు గుర్తుగా 1999లో కలసపాడు, బి.కోడూరు పరిధిలోని పలు పంచాయతీలతో శ్రీ అవధూత కాశినాయన (ఎస్‌ఎకేఎన్) మండలం ఏర్పాటైంది. ఎంతో పవిత్రమైన కాశినాయన క్షేత్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చాక కూల్చివేతలు మొదలయ్యాయి. గతేడాది డిసెంబరు, ఈ ఏడాది జనవరి, మార్చి 7వతేదీన జ్యోతి క్షేత్రంలోని కుమ్మరి అన్నదాన సత్రం, విశ్వ బ్రాహ్మణ అన్నదాన సత్రం, గోవుల దాణా షెడ్డు, గోశాల షెడ్డు, మరుగుదొడ్లను కూల్చి వేశారు. జ్యోతిలక్ష్మీనరసింహస్వామి ఆలయానికి కొద్దిదూరంలో శివరంగారెడ్డి నిర్మించిన గెస్ట్‌హౌస్‌ను కూలగొట్టారు. ఓ వర్గానికి చెందిన వారు ఉప ముఖ్యమంత్రి, అటవీశాఖ మంత్రి పవన్‌కళ్యాణ్ ద్వారా ఈ పని చేయించారనే అనుమానాలు కాశినాయన భక్తుల్లో వ్యక్తమవుతున్నాయి. ఎండలో అలమటిస్తున్న గోవులు వందకు పైగా అన్నదాన సత్రాలురాయలసీమతో పాటు నెల్లూరు, ప్రకాశం తదితర జిల్లాల్లో విస్తృతంగా పర్యటించిన కాశిరెడ్డి అవధూత కాశీనాయనగా పూజలు అందుకున్నారు. స్థానిక ప్రజలు ఆయనకు నిత్యం పూజలు నిర్వహిస్తూ 13 హెక్టార్ల పరి«ధిలో గుడి, గోశాల, అన్నదాన సత్రాలు, వసతి గృహాలు నిర్మించారు. పలు నిర్మాణాలు పురోగతిలో ఉన్నాయి. కాశీనాయన క్షేత్రాన్ని నిత్యం పెద్ద సంఖ్యలో భక్తులు సందర్శిస్తుంటారు. రాయలసీమతో పాటు వివిధ ప్రాంతాల్లో కాశీనాయన పేరిట వందకు పైగా అన్నదాన సత్రాలు కొనసాగుతున్నాయి. అటవీశాఖకు 50 ఎకరాలు..నల్లమల అటవీ ప్రాంతంలో వందల ఏళ్లుగా జ్యోతిలక్ష్మీనరసింహస్వామి ఆలయం ఉంది. ఆ గుడి వద్ద అన్నదానం ఏర్పాటుకు చేరుకున్న కాశీనాయన అక్కడే శివైక్యం చెందారు. 1997 నుంచి క్షేత్రం దినదిన ప్రవర్థమానంగా వెలుగొందుతోంది. అటవీశాఖ తొలుత అటవీప్రాంతంగా, ఆ తరువాత రిజర్వు ఫారెస్టుగా 2000–2003 నుంచి చెబుతోంది. దీనికి ప్రత్యామ్నాయంగా అన్నమయ్య జిల్లా పెనగలూరు మండలంలోని 50 ఎకరాలను క్షేత్రం నిర్వాహకులు అటవీశాఖకు కేటాయింపజేశారు. గతంలో రాష్ట్ర, కేంద్ర అటవీశాఖ ఉన్నతాధికారుల మధ్య చర్చలు జరిగాయి. విషయం కోర్టు వరకు కూడా వెళ్లింది. దానిపై అటవీశాఖ సానుకూల దృక్పథంతో ఉన్నట్లు అప్పట్లో వార్తలొచ్చాయి.అన్నదానసత్రంలో భోజనం చేస్తున్న భక్తులు కొసమెరుపేమిటంటే.. తిరుమల తొక్కిసలాటఘటనపై పవన్ కళ్యాణ్ హడావిడి చేయగా ఇపుడు కాశీనాయన క్షేత్రం కూల్చివేతలపై నారాలోకేష్ తాపీగా రంగంలోకి దిగారు. క్షమాపణలు చెబుతున్నానని, కూల్చిన నిర్మాణాలను పునరి్నర్మీస్తామని చెబుతుండడం ఏదో డ్రామాలా కనిపిస్తున్నదని పలు హిందూ ధార్మీక సంస్థలు విమర్శిస్తున్నాయి.దాతల సహకారం అపూర్వంఎక్కడి నుంచి వస్తాయో.. ఎలా వస్తాయో మాకే అంతుబట్టదు. దాతల సహకారం మేం ఊహించిన దానికన్నా ఎప్పుడూ ఎక్కువే ఉంటుంది. వెయ్యి మందికి అన్నదానం చేస్తున్నామంటే పదివేల మందికి సరిపడా సరుకులు స్వచ్ఛందంగా క్షేత్రానికి చేరుతుంటాయి. ఆలయ నిర్మాణానికి కూడా అదేవిధంగా సాయం అందుతోంది. వారి తోడ్పాటుతోనే మహత్తర క్షేత్రం నిర్మితమవుతోంది. ప్రభుత్వం సానుకూలంగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని భక్త కోటి కోరుకుంటోంది. – బి.చెన్నారెడ్డి, ఆలయ ప్రధాన నిర్వాహకులుధర్మానికి అండగా నిలవండి ధర్మ పరిరక్షణకు కృషి చేస్తున్న ధార్మిక ఆశ్రమాలను సాకులు చెబుతూ కూల్చడం అభ్యంతరకరం. ఇలాంటి వందలాది ఆశ్రమాలను, ధార్మికవేత్తలను కాపాడాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. భక్తుల మనోభావాలకు అనుగుణంగా ప్రభుత్వ చర్యలుండాలి. ధర్మ ప్రచారానికి అండగా నిలవాలి.– శ్రీనివాసానందస్వామి, కాశీనాయన క్షేత్రం50 ఎకరాలు ఇచ్చాం..కాశీనాయన క్షేత్రం సుమారు 13 హెక్టార్లలో విస్తరించింది. అభివృద్ధి పనులు కొన్నేళ్లుగా ఆగిపోయాయి. ఇంకా చేయాల్సినవి ఉన్నాయి. అటవీభూమికి ప్రత్యామ్నాయంగా ఇప్పటికే 50 ఎకరాలను పెనగలూరు మండలంలో ఇచ్చాం. ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందనే ఆశిస్తున్నాం.– జీరయ్య, ఆలయ ప్రధాన అర్చకుడు -
సోమశిల ఈఈ బాధ్యతల స్వీకరణ
సోమశిల: సోమశిల ప్రాజెక్ట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్‌గా శ్రీనివాస్‌కుమార్ బాధ్యతలను బుధవారం చేపట్టారు. ఆయన్ను డీఈఈ రవీంద్రప్రసాద్, జేఈలు గురుప్రసాద్, పెద్దిరాజు, నిఖిల్, శరత్చంద్ర, రామ్మోహన్‌రెడ్డి ఘనంగా సత్కరించి శుభాకాంక్షలను తెలియజేశారు. రొయ్యల ఫ్యాక్టరీలో తనిఖీలు కొడవలూరు : మండలంలోని పెయ్యలపాళెం రోడ్డులో గల అల్ఫా మైరెన్ రొయ్యల ఫ్యాక్టరీలో బాల కార్మికులతో పని చేయిస్తున్నారనే ఫిర్యాదుల నేపథ్యంలో తనిఖీలను అధికారులు బుధవారం నిర్వహించారు. కొడవలూరు ఎస్సై కోటిరెడ్డి, వైద్యాధికారి బాలచంద్రబాబు, కార్మిక శాఖ, సీడబ్ల్యూసీ, ఐసీపీఎస్, ఐసీడీఎస్ అధికారులు తనిఖీలను జరిపారు. 18 ఏళ్లలోపు వయస్సున్నట్లు అనుమానం ఉన్న పలువుర్ని గుర్తించారు. వయస్సు నిర్ధారణ నిమిత్తం నెల్లూరులోని ప్రభుత్వ వైద్యశాలకు పంపారు. 18 ఏళ్లలోపు ఉందని నిర్ధారణ అయితే యాజమాన్యంపై కేసులు నమోదు చేస్తామని అధికారులు తెలిపారు. -
రుణాల మంజూరులో భాగస్వాములవ్వాలి
నెల్లూరు రూరల్: ఎమ్మెస్సెమ్‌ఈ రుణాలతో అన్ని రంగాల ఆర్థిక పరిపుష్టి సాధ్యమని, వీటి మంజూరులో ప్రైవేట్ బ్యాంకర్లు భాగస్వాములు కావాలని జేసీ కార్తీక్ కోరారు. కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో బుధవారం నిర్వహించిన జిల్లా స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. లబ్ధిదారులకు రుణాల మంజూరులో ప్రైవేట్ బ్యాంకర్లు వెనుకబడి ఉన్నారని చెప్పారు. ప్రభుత్వ కార్యక్రమాల అమలుకు సహకారాన్ని అందించి జిల్లా అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ముద్ర యోజన, పీఎంఈజీపీ, ఎమ్మెస్సెమ్‌ఈ రుణాల మంజూరుపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని కోరారు. వ్యవసాయ అనుబంధ రంగాలకు రుణాలను విరివిగా ఇవ్వాలన్నారు. గ్రామాల్లో లబ్ధిదారులతో నిర్వహించే అవగాహన సదస్సులకు బ్యాంక్ అధికారులు హాజరుకావాలని సూచించారు. జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు జరుగుతున్న తరుణంలో రైస్ మిల్లర్లకు బ్యాంక్ గ్యారెంటీలను త్వరగా మంజూరు చేయాలని కోరారు. అనంతరం లీడ్ డిస్ట్రిక్ట్ బ్యాంక్ మేనేజర్ శ్రీకాంత్ ప్రదీప్ మాట్లాడారు. ఈ త్రైమాసికానికి సంబంధించిన రుణాల మంజూరులో మంచి ఫలితాలను సాధించామని చెప్పారు. నాబార్డు డీడీఎం బాబు, మేనేజర్ రాజేష్, పశుసంవర్థక, మత్స్యశాఖ జేడీలు రమేష్‌నాయక్, నాగేశ్వరరావు, ఏపీఎంఐపీ పీడీ శ్రీనివాసులు, బీసీ కార్పొరేషన్ ఈడీ నిర్మలాదేవి తదితరులు పాల్గొన్నారు. -
3537 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు
నెల్లూరు రూరల్: జిల్లాలో 3537 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మంగళవారం కొనుగోలు చేశామని జేసీ కార్తీక్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటి వరకు 20 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామని చెప్పారు. రైతుల ఖాతాల్లో రూ.43.3 కోట్లను జమ చేశామని వివరించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో విక్రయించి మద్దతు ధర పొందాలని కోరారు. దళారులను నమ్మి మోసపోవద్దు నెల్లూరు రూరల్: ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యాన్ని విక్రయించి మద్దతు ధర పొందాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ సూచించారు. అసెంబ్లీలోని తన చాంబర్లో జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులతో సమావేశాన్ని మంత్రి బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రైతులకు అందుబాటులో ఐదు లక్షల గోతాలున్నాయని చెప్పారు. దళారులను నమ్మి తక్కువ ధరకు విక్రయించి మోసపోవద్దని కోరారు. ధాన్యం కొనుగోలు విషయమై జిల్లాలో కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశామని, ప్రజాప్రతినిధులు క్షేత్రస్థాయిలో పర్యటించి ఏమైనా ఇబ్బందులుంటే పరిష్కరించేందుకు చొరవ చూపాలని సూచించారు. మిల్లు వద్ద రెవెన్యూ సిబ్బంది ఉండేలా చర్యలు చేపట్టామని, కొనుగోలు చేసిన 24 గంటల్లోనే రైతు ఖాతాల్లో నగదు జమవుతుందని తెలిపారు. అవసరమైతే ప్రకాశం, బాపట్ల, కందుకూరు తదితర ప్రాంతాలకు తరలించేలా ఏర్పాటు చేయాలని సూచించారు. మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, ఎమ్మెల్యేలు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, ప్రశాంతిరెడ్డి, కృష్ణారెడ్డి, కాకర్ల సురేష్, కలెక్టర్ ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. శ్రీచైతన్య పాఠశాలకు తాళాలు ● జీఎస్టీ వివాదంలో భవన యజమాని చర్య ● స్కూల్మూతతో వెనుదిరిగిన విద్యార్థులు కోవూరు: పట్టణంలోని శ్రీచైతన్య ఇంగ్లిష్ మీడియం పాఠశాలకు భవన యజమాని బుధవారం తాళాలేశారు. యజమాని వినీత్‌రెడ్డికి చెల్లిస్తున్న అద్దెకు సంబంధించిన 18 శాతం జీఎస్టీని పాఠశాల యాజమాన్యం జమచేయాలని అగ్రిమెంట్ చేసుకున్నారు. అయితే దీన్ని చెల్లించకపోవడంతో వడ్డీ, జరిమానాతో కలిసి ఇది రూ.36.83 లక్షలకు చేరింది. ఈ తరుణంలో జీఎస్టీ, అసిస్టెంట్ కమిషనర్ కార్యాలయం, నెల్లూరు నుంచి యజమానికి నోటీస్ జారీ అయింది. దీనిపై పలుమార్లు కోరినా స్పందించలేదని, దీంతో తాళాలేయాల్సి వచ్చిందని ఆయన చెప్పారు. కాగా ఈ పరిణామంతో విద్యార్థులు వెనుదిరిగారు. అధిక ఫీజులు వసూలు చేస్తున్న యాజమాన్యం ఇలా వ్యవహరించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విషయం తెలుసుకున్న ఎస్సై రంగనాథ్గౌడ్ పాఠశాల వద్దకు చేరుకొని సిబ్బందిని విచారించారు. పది పరీక్షలకు 309 మంది గైర్హాజరు నెల్లూరు (టౌన్): పదో తరగతి పరీక్షల్లో భాగంగా బుధవారం నిర్వహించిన హిందీ టెస్ట్‌కు జిల్లాలో 309 మంది విద్యార్ధులు గైర్హాజరయ్యారు. 28,485 మందికి గానూ 28,176 మంది హాజరయ్యారు. ఆరు కేంద్రాల్లో స్టేట్ అబ్జర్వర్, ఎనిమిది కేంద్రాల్లో డీఈఓ, 56 కేంద్రాల్లో ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు తనిఖీలు చేపట్టారు. ● ఏపీ ఓపెన్ స్కూల్ పది పరీక్షలకు జిల్లా వ్యాప్తంగా 392 మంది అభ్యాసకులకు గానూ 344 మంది హాజరయ్యారు. -
త్యాగరాజ స్మరణోత్సవాల్లో పాల్గొనడం అదృష్టం
●ప్రముఖ గాయని ఎస్పీ శైలజ నెల్లూరు(బృందావనం): నగరంలో నిర్వహిస్తున్న త్యాగరాజ స్మరణోత్సవాల్లో పాల్గొనడాన్ని అదృష్టంగా భావిస్తున్నానని ప్రముఖ గాయని ఎస్పీ శైలజ పేర్కొన్నారు. నగరంలోని పురమందిర ప్రాంగణంలో భిక్షాటన పూర్వక త్యాగరాజ స్మరణోత్సవ సభ ఆధ్వర్యంలో బుధవారం ప్రారంభమైన స్మరణోత్సవాలకు ఆమె హాజరయ్యారు. గాత్రకచేరి నిర్వహించిన హైదరాబాద్‌కు చెందిన గాయని చాగంటి రమ్య కిరణ్మయి, త్యాగరాజస్వామి, శ్రీదేవీ, భూదేవీ సమేత వెంకటేశ్వరస్వామి నిలువెత్తు రూపాలను త్రీడీ కార్డు బోర్డుతో తీర్చిదిద్దిన కళాకారుడు కిడాంబి నరసింహాచార్యులును సత్కరించారు. అనంతరం ఆమె మాట్లాడారు. తన తల్లిదండ్రులు శ్రీపతి పండితారాధ్యుల సాంబమూర్తి, శకుంతలమ్మ, తన తండ్రి ఆప్తమిత్రుడు డాక్టర్ యనమండ్ర వెంకటేశ్వరశాస్త్రి కుటుంబసభ్యులతో కలిసి ఆరు దశాబ్దాల క్రితం ప్రారంభించిన స్మరణోత్సవాలను కొనసాగించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. వీటిని తన సోదరుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కొన్నేళ్ల పాటు నిర్వహించారన్నారు. ఉ త్సవాల ముగింపు సందర్భంగా ఈ నెల 26న నిర్వ హించనున్న సీతారాములు, శివపార్వతుల కల్యా ణోత్సవాల్లో పాల్గొంటానన్నారు. యనమండ్ర నాగ దేవీప్రసాద్, కమిటీ సభ్యులను అభినందించారు. -
ధాన్యం.. చిత్తశుద్ధి శూన్యం
గోతాలకూ కటకటే సిబ్బంది కొరతా సమస్యే ధాన్యం కొనుగోళ్లలో అధికారులకు చిత్తశుద్ధి కరువవడం.. ముందస్తు ప్రణాళిక లేకపోవడం రైతుల పాలిట శాపంలా పరిణమించింది. ధరల్లేక.. కొనేవారు కానరాక అన్నదాతలకు ఇబ్బంది తప్పడంలేదు. ధాన్యాన్ని ఆరబెట్టుకునేందుకు.. నిల్వ చేసేందుకూ సౌకర్యాల్లేవంటే సమస్య తీవ్రత ఏమిటో అర్థం చేసుకోవచ్చు. ఫలితంగా కోసిన అనంతరం కల్లాల్లోనే విక్రయించాల్సిన పరిస్థితి ఉత్పన్నమైంది. దీన్ని ఆసరాగా చేసుకొని ధరలను మిల్లర్లు తగ్గించి వారిని దోచుకుంటున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినా, కర్షకులకు మద్దతు ధర లభించడం గగనమవుతోంది. నెల్లూరు (పొగతోట): అనాలోచిత చర్యలు.. ముందస్తు ప్రణాళికల్లేకపోవడం.. పక్క జిల్లాల మిల్లర్లను రప్పించడంలో అధికార యంత్రాంగం విఫలం కావడం రైతుల పాలిట శాపంలా మారింది. ధాన్యం కొనుగోళ్లలో మిల్లర్ల మధ్య పోటీతత్వం లేకపోవడం.. ధాన్యాన్ని ఆరబెట్టుకోవడం.. నిల్వ చేసేందుకు రైతులకు సౌకర్యాల్లేకపోవడాన్ని ఆసరాగా చేసుకొని దోపిడీ పర్వానికి తెరలేపారు. గతేడాదితో పోలిస్తే పుట్టికి రూ.పది వేలు తగ్గించి కొంటున్నా చేష్టలుడిగి చూడటం అధికారుల వంతవుతోంది. మద్దతు ధరకు విక్రయించేందుకు కొనుగోలు కేంద్రాలను సంప్రదించాలని ప్రచారం చేస్తున్నారే తప్ప, మిల్లర్లను కట్టడి చేసి ధరలు పెరిగేలా చూడటంలో విఫలమవుతున్నారు. బ్యాంక్ గ్యారెంటీల సేకరణలో వైఫల్యం వాస్తవానికి జిల్లాలో 120 రైస్‌మిల్లులుండగా, నెల్లూరులోనే 80 ఉన్నాయి. కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎమ్మార్)ను ఆడించేందుకు 103 మిల్లులను గుర్తించారు. వీటికి ధాన్యాన్ని సరఫరా చేయాలంటే బ్యాంక్ గ్యారెంటీలను తప్పక ఇవ్వాల్సి ఉంటుంది. అయితే వీటి సేకరణలోనూ అధికార యంత్రాంగం పూర్తిగా విఫలమైంది. ఎంపిక చేసిన వాటిలో కేవలం 50 నుంచి 60 మిల్లులే రూ.30 కోట్లకు గ్యారెంటీలను సమర్పించడం విశేషం. వాస్తవానికి వరికోతలు ప్రారంభం కాక ముందే రైస్ మిల్లర్లతో ఆయా ప్రాంతాల సీఎస్డీటీలు సమన్వయం చేసుకొని.. సమావేశాలను నిర్వహించి వీటిని సేకరించాల్సి ఉంది. అయితే ఇవేవీ జరగకపోవడం రైతులకు అశనిపాతంలా పరిణమించాయి. ఒకే అధికారి.. మూడు విధులు జిల్లాలో ధాన్యం కొనుగోళ్లలో కీలకంగా వ్యవహరించే డీఎస్ఓ పోస్ట్ ఖాళీగా ఉంది. నెల్లూరు ఏఎస్ఓ, ఆఫీస్ ఏఎస్ఓ, డీఎస్ఓ.. ఇలా మూడు పోస్ట్‌లను ప్రస్తుత ఇన్చార్జి డీఎస్ఓ అంకయ్య నిర్వహిస్తున్నారు. డీఎస్ఓ లేని సమయాల్లో డిప్యూటీ కలెక్టర్ హోదా స్థాయి అధికారులను ఇన్చార్జిగా నియమించాల్సి ఉన్నా, ఆ యత్నాన్నే చేయకపోవడం గమనార్హం. ప్రతి అంశంలోనూ ఇంతే.. గోతాల్లేక.. బ్యాంక్ గ్యారెంటీలు అందక.. రవాణాకు లారీలు సక్రమంగా పంపక రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు. గతంలో వీటిని సహాయ పౌరసరఫరాల అధికారులు, సీఎస్డీటీలు పర్యవేక్షించేవారు. అయితే ప్రస్తుతం ఈ పరిస్థితే లేదు. ధాన్యం బస్తాలను దించుకుకోవడంలో మిల్లర్లు జాప్యం చేస్తున్నారు. కొద్దో గొప్పో సేకరించిన లారీల నుంచి సకాలంలో అన్లోడ్ కావడంలేదు. పుట్టి ధరలు ప్రస్తుతం రూ.15 వేల నుంచి రూ.16 వేల వరకే ఉన్నాయి. కోతలు ముమ్మరం కావడంతో ధరలు మరింత తగ్గే అవకాశం ఉంది. తాజాగా ప్రకాశం జిల్లా రైస్ మిల్లర్లను పిలిపించి వారితో జేసీ కార్తీక్ సమావేశమై.. ధాన్యాన్ని కొనుగోలు చేయాలని సూచించారు. బ్యాంక్ గ్యారెంటీలిచ్చేందుకు ముందుకు రాని మిల్లర్లు కొనుగోళ్లలో అధికారుల తీరిదీ..జిల్లాలో 103 సీఎమ్మార్ మిల్లులు అన్నదాతల అగచాట్లు సకాలంలో జరగని సమన్వయ సమావేశాలు మద్దతు ధరకు కొనుగోలు చేసేలా చర్యలు రైతులు నష్టపోకుండా చర్యలు చేపడుతున్నాం. ప్రకాశంతో పాటు సమీప జిల్లాల రైస్ మిల్లర్లను సంప్రదించాం. వీరితో ధాన్యాన్ని కొనుగోలు చేయించేలా చర్యలు చేపట్టాం. రైతులు నష్టపోకుండా మద్దతు ధర కల్పించేలా చూస్తున్నాం. – అంకయ్య, ఇన్చార్జి డీఎస్ఓ జిల్లా వ్యాప్తంగా సీఎస్‌డీటీ పోస్టులు 11 ఉండగా, అందులో ఆరు ఖాళీగా ఉన్నాయి. కలిగిరి, వింజమూరు, ఉదయగిరి, ఇందుకూరుపేట, రాపూరు, నెల్లూరు రూరల్, అర్బన్‌లో ఈ పరిస్థితి నెలకొంది. నెల్లూరు రూరల్, అర్బన్‌లో ఎలక్షన్ డీటీలను ఇన్చార్జి సీఎస్డీటీలను నియమించారు. ఇందుకూరుపేట జీపీఏ, సీఎస్‌డీటీ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కోవూరు, బుచ్చిరెడ్డిపాళెంలో వరిని అధికంగా పండిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఇక్కడి సీఎస్డీటీలను ఆయా ప్రాంతాల ఎమ్మెల్‌ఎస్ పాయింట్లకు ఇన్చార్జిలుగా నియమించారు. -
కామధేనులో మూగరోదన
కలవరపెడుతున్న బ్రూసెల్లోస్ వ్యాధి అధికారిక లెక్కల మేరకు 120 గోవులు, గేదెలకు బ్రూసెల్లోస్ వ్యాఽధి సోకింది. వీటిని వేరు చేసి ప్రత్యేకంగా ఉంచారు. ఇది సోకితే నయమయ్యే అవకాశం లేకపోవడంతో ఆహారం, దాణాను తగ్గిస్తున్నారు. దీంతో అనేక మూగజీవాలు చిక్కిశల్యమవుతున్నాయి. ప్రత్యేక షెడ్లో ఉండాల్సిన వీటిలో ప్రస్తుతం 47 మాత్రమే ఉన్నాయి. మిగిలిన వాటి సంగతి ఏమిటని ప్రశ్నిస్తే అధికారుల నుంచి సమాధానం లేదు. మరణిస్తే రికార్డుల్లో నమోదు చేయాలి, అయితే గుట్టుచప్పుడు కాకుండా వీటిని విక్రయించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. జేసీ కార్తీక్ ఇటీవల పర్యటించి ఈ అంశమై అఽధికారుల నుంచి నివేదిక కోరారు. అవసరం లేకపోయినా కొన్ని సాహివాల్ ఆవులు, ముర్రాజాతి గేదెలను కొనుగోలు చేసి కమీషన్లు కోసం నిధులు వెచ్చించారనే ఆరోపణలున్నాయి. ఏళ్ల తరబడి అధికారులు ఇక్కడే తిష్ట వేయడంతో పలు అక్రమాలకు పాల్పడుతున్నారని సిబ్బందే పేర్కొంటున్నారు. సమగ్ర విచారణ జరిపితే వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. కాగా ఈ విషయమై కామధేను ప్రాజెక్ట్ జేడీ, వెంకటేష్ ను సంప్రదించగా, ప్రాజెక్ట్ సీఈఓ, గుంటూ రు, శ్రీనివాసరావు ఆదేశాల మేరకు నడు చుకుంటున్నామని చెప్పారు. అనుమానాలు ఉంటే ఆయన్నే సంప్రదించాలని సూచించారు. మరికొన్ని ప్రశ్నలు అడగ్గా, మౌనం వహించారు.ఉదయగిరి / కొండాపురం: కొండాపురం మండలంలోని చింతలదేవి క్షేత్రంలో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన జాతీయ కామధేను పునరుత్పత్తి కేంద్రంలో పశువులు మూగవేదనను అనుభవిస్తున్నాయి. సరైన ఆహారం అందక బక్కచిక్కిపోతున్నాయి. దేశంలో ఉన్న వివిధ రకాల ఆవులు, గేదెల పిండోత్పత్తి చేసి రైతులకు మేలు జాతి సంపదను అందించాలనేది ఈ కేంద్ర ఆశయం. ఇంతటి ప్రాధాన్యమైన ఈ ప్రాజెక్ట్ నిర్వహణను ప్రభుత్వం గాలికొదిలేసింది. ఇక్కడి పశువులకు అహారం, నీళ్లు, తగిన వసతులు, మెరుగైన వైద్యం అందక మూగరోదనను అనుభవిస్తున్నాయి. విడుదలకు నోచుకోని వాటా.. 2015లో రూ.36.12 కోట్ల అంచనా వ్యయంతో కామధేను ప్రాజెక్ట్ మంజూరైంది. దీనికి కేంద్ర ప్రభుత్వం తన వాటాగా రూ.25 కోట్లను మంజూరు చేయగా, రాష్ట్ర వాటాగా రూ.11.12 కోట్లను విడుదల చేయలేదు. ఈ పరిణామంతో కేంద్రమిచ్చిన నిధులతోనే పనులు జరుగుతున్నాయి. చింతలదేవి పశుగణాభివృద్ధి క్షేత్రంలో 2448 ఎకరాలుండగా, ఇందులో 510 ఎకరాలను దీని కోసం కేటాయించారు. ఇందులో పదెకరాల్లో పశువులు, గోవులకు అవసరమైన నిర్మాణాలు, పరిపాలన భవనాలను నిర్మించారు. పశుగ్రాసానికి 500 ఎకరాలను కేటాయించారు. అయితే ఇక్కడ నీటి పారుదలకు సదుపాయం లేకపోవడంతో వేసవిలో పశుగ్రాస కొరత వెంటాడుతోంది. రాళ్లపాడు ప్రాజెక్ట్ నుంచి నీటి సరఫరా కోసం నిధులు మంజూరై కొంతమేర పనులూ జరిగాయి. అయితే అక్కడి నుంచి నీటిని తీసుకునేందుకు ప్రకాశం జిల్లా ప్రజాప్రతినిధులు అభ్యంతరం తెలపడంతో నిలిచిపోయాయి. ఇదీ ప్రాజెక్ట్ నేపథ్యం.. ఇక్కడి ప్రాజెక్ట్‌లో దేశంలోని 14 రకాల దేశవాళీ ఆవులు, ఆరు రకాల గేదెలున్నాయి. వీటి ద్వారా మేలు జాతి ఆవులు, గేదెలను పునరుత్పత్తి చేసి రైతులకు అందించాలని, తద్వారా పాల దిగుబడి పెరిగి పశుపోషకుల జీవన ప్రమాణాలు వృద్ధి చెందుతాయనేది లక్ష్యం. దీని కోసం ప్రత్యేకమైన ల్యాబ్‌నూ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఇక్కడ 14 రకాలకు చెందిన 317 ఆవులు, ఆరు రకాలకు చెందిన 138 గేదెలున్నాయి. వీటికి తోడు మరో 70 వరకు దూడలూ ఉన్నాయి. నిర్లక్ష్యానికి పరాకాష్ట అభివృద్ధి చేసిన పిండాన్ని ఆవు గర్భంలో ప్రవేశపెట్టి వాటి ద్వారా మేలుజాతి సంతతిని రైతులకు అందించాల్సి ఉంది. అయితే ఈ విధానంలో 11 మాత్రమే జన్మించాయి. వాస్తవానికి వందలాది మంది రైతులకు ఈ ప్రయోజనం చేకూరాలి. అయితే అధికారుల నిర్లక్ష్య ధోరణితో ఇది జరగడంలేదు. ఐవీఎఫ్ – వీటీటీ ల్యాబ్‌కు చెందిన డాక్టర్ ఇక్కడ జీతం తీసుకుంటూ చుట్టపు చూపుగా వస్తుండటంతో ఆశించిన ప్రగతి లేదు. అర్థాకలి.. ఈ ప్రాజెక్ట్ మారుమూల ప్రాంతంలో ఉండటంతో అధికారులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. ఫలితంగా మూగజీవాలకు అర్థాకలి తప్పడం లేదు. ఎండుగడ్డి, దాణా కోసం రూ.లక్షల్లో ఖర్చు చేస్తున్నట్లు లెక్కల్లో చూపుతున్నా, లభించేది అరకొరే. దీంతో లేగ దూడలు బక్కచిక్కుతున్నాయి. ఇక్కడి గేదెలు, ఆవుల ద్వారా పాల ఉత్పత్తులను విక్రయిస్తున్నా, రికార్డుల్లో మాత్రం కాకి లెక్కలు చూపుతున్నారు. గోవుల కోసం దాతలు ఉచితంగా ఇచ్చే ఎండు గడ్డిని సైతం కొనుగోలు చేసినట్లు లెక్కలు చూపి నిధులను కాజేస్తున్నారనే విమర్శలూ లేకపోలేదు. వేసవిలో సరిపడా నీరు లేక దాహంతో జీవాలు అల్లాడుతున్నాయి. పశుగ్రాసానికి కొరత తాగునీటికీ కటకట బ్రూసెల్లోస్ వ్యాధితో విలవిల్లాడుతున్న మూగజీవాలు రూ.లక్షలు వెచ్చిస్తున్నా, వాటి ఆరోగ్యంపై నిర్లక్ష్యం ఇదీ చింతలదేవిలోని కేంద్ర దుస్థితి -
విద్యుత్ చార్జీలు తగ్గించాలంటూ..
నెల్లూరు(వీఆర్సీసెంటర్): పెంచిన విద్యుత్ చార్జీలకు వ్యతిరేకంగా బుధవారం సీపీఎం ఆధ్వర్యంలో నెల్లూరులోని మినీబైపాస్ రోడ్డులో రాస్తారోకో జరిగింది. అనంతరం రామ్మూర్తి నగర్ విద్యుత్ సెక్షన్ కార్యాలయం ఎదుట కరెంట్ బిల్లులను నేతలు దహనం చేశారు. ఈ సందర్భంగా ఆ పార్టీ జిల్లా, నగర కార్యదర్శులు మూలం రమేష్, కత్తి శ్రీనివాసులు మాట్లాడుతూ ట్రూఅప్ చార్జీలు రద్దు చేస్తామని, ఇంధన సర్దుబాటు చార్జీల పేరుతో ఎలాంటి అదనపు చార్జీలు వేయమని చంద్రబాబు, లోకేశ్, పవన్ కళ్యాణ్ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారన్నారు. వీరు అధికారంలో లేనప్పుడు ఒకమాట, అధికారంలోకి వచ్చాక ఒకమాట చెప్పారన్నారు. విద్యుత్ చార్జీలు తగ్గించకపోతే టీడీపీకి ప్రజలు గుణపాఠం చెప్పడం ఖాయమన్నారు. నెల్లూరు నగరంలోని 53వ డివిజన్లో ఒకరు 53 విద్యుత్ యూనిట్లు వాడినందుకు రూ.126 బిల్లు రావాల్సి ఉండగా అదనపు చార్జీలు, ట్రూఅప్ చార్జీలు, ఇంధన సర్దుబాటు చార్జీల పేరుతో రూ.687 బిల్లు వచ్చిందన్నారు. ఒక్క యూనిట్ విద్యుత్‌కు వినియోగదాడికి రూ.14 వేస్తున్నారని ఇది ఎంతవరకు సబబని ప్రశ్నించారు. విద్యుత్ స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేస్తే పగులగొట్టాలని గతంలో లోకేశ్ పిలుపునిచ్చారన్నారు. నేడు కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న స్మార్ట్ మీటర్లను పగులగొట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. కార్యక్రమంలో ఆ పార్టీ నగర కార్యదర్శి వర్గ సభ్యులు నాగేశ్వరరావు, సూర్యనారాయణ, నగర కమిటీ సభ్యులు నరసింహ, మూలం ప్రసాద్, ఎన్వీ సుబ్బమ్మ, జాఫర్, ఫయాజ్, రమణారెడ్డి, చెంగయ్య, శాఖా కార్యదర్శులు సంపూర్ణమ్మ, రాజ్యలక్ష్మి, గడ్డం శ్రీనివాసులురెడ్డి, మురళి, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. సీపీఎం ఆధ్వర్యంలో రాస్తారోకో సబ్‌స్టేషన్ ఎదుట కరెంట్ బిల్లుల దగ్ధం -
డెలివరీ బాయ్‌గా..
పోలయ్య బేల్దారి పనికి వెళ్తూ కుటుంబాన్ని పోషిస్తుండేవాడు. అతని ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో పనికి వెళ్లలేకపోయాడు. దీంతో కుటుంబానికి అండగా ఉండాల్సిన బాధ్యత సురేష్‌పై పడింది. అతను క్రీడలను పక్కనపెట్టాడు. 2022లో పోలయ్య మృతిచెందడంతో అప్పటి నుంచి సురేష్ చిన్నపాటి పనులు చేస్తున్నాడు. అన్నకు వివాహమైంది. తమ్ముడు ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. సురేష్ కొంతకాలం సచివాలయ వలంటీర్‌గా పనిచేశాడు. ప్రస్తుతం ఓ కంపెనీలో డెలివరీ బాయ్‌గా ఉన్నాడు. మొండి చేతులతో స్కూటీ నడుపుతూ రోజుకు 20కి పైగా అడ్రసుల్లో వస్తువులను డెలివరీ చేస్తుంటాడు. శారీరకంగా కష్టంగా ఉన్నా కుటుంబం కోసం నిత్యం సుమారు వంద కిలోమీటర్ల మేర రాకపోకలు చేస్తున్నాడు. ఉదయం ఆరు గంటలకు బయలుదేరి సాయంత్రం నాలుగు గంటల వరకు పనిచేస్తూనే ఉంటాడు. ఒక్కో డెలివరీకి ఇంత మొత్తంలో అని ఇస్తుండటంతో ఎక్కువగా పనిచేసేందుకు ప్రయత్నిస్తున్నాడు. మరోవైపు ఎంకామ్ ఫైనలియర్ చదువుతున్నాడు. -
కారుణ్య నియామక పత్రాల అందజేత
నెల్లూరు(అర్బన్): ఐదుగురికి కారుణ్య నియామకాల కింద కలెక్టర్ ఆనంద్ ఉద్యోగాలు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అందుకు సంబంధించిన నియామక ఉత్తర్వులను బుధవారం కలెక్టరేట్లో డీఆర్వో ఉదయభాస్కర్‌రావు, కలెక్టరేట్ పరిపాలనాధికారి విజయకుమార్‌లు లబ్ధిదారులకు అందించారు. సీహెచ్ రాము హెడ్‌కానిస్టేబుల్‌గా పనిచేస్తూ మృతిచెందగా అతడి కుమారుడు భార్గవ్‌కు రెవెన్యూ డిపార్ట్మెంట్లో జూనియర్ అసిస్టెంట్‌గా, కె.జోసఫ్ ఆర్టీసీలో పనిచేస్తూ చనిపోగా అతని కుమారుడు కుష్వంత్ కల్యాణ్‌కుమార్‌కు పంచాయతీరాజ్ సర్కిల్లో సబార్డినేట్‌గా, గురవయ్య ఆర్టీసీలో కండక్టర్‌గా పనిచేస్తూ మృతిచెందగా ఆయన కుమారుడు గురుకిషోర్కు పశుసంవర్థక శాఖలో ఆఫీస్ సబార్డినేట్‌గా, పి.ఆదినారాయణ ఆర్టీసీలో డ్రైవర్‌గా పనిచేస్తూ చనిపోగా అతడి కుమారుడు నవీన్‌కుమార్‌కు రెవెన్యూ డిపార్ట్మెంట్లో గ్రేడ్–2 వీఆర్వోగా, యు.శ్రీనివాసులు ఎన్ఫోర్స్మెంట్ హెడ్‌కానిస్టేబుల్‌గా పనిచేస్తూ మృతిచెందగా ఆయన కుమారుడు సాయిని రెవెన్యూ డిపార్ట్మెంట్లో జూనియర్ అసిస్టెంట్‌గా నియమించారు. ఈ సందర్భంగా డీఆర్వో ఉదయభాస్కర్‌రావు మాట్లాడుతూ ఉద్యోగాలు పొందిన వారు సర్వీస్‌లో మంచి పేరు తెచ్చు కోవాలని ఆకాంక్షించారు. -
కండలేరులో 50.025 టీఎంసీలు
రాపూరు: కండలేరు జలాశయంలో బుధవారం నాటికి 50.025 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు ఈఈ విజయకుమార్‌రెడ్డి తెలిపారు. సత్యసాయి గంగ కాలువకు 580, లోలెవల్ కాలువకు 110, హైలెవల్ కాలువకు 80, మొదటి బ్రాంచ్ కాలువకు 25 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన బైక్● వ్యక్తి మృతి దుత్తలూరు: ఆగి ఉన్న లారీని మోటార్‌బైక్ ఢీకొనడంతో ఓ వ్యక్తి తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతిచెందిన ఘటన మంగళవారం రాత్రి నర్రవాడ – తెడ్డుపాడు దారిలో 565వ జాతీయ రహదారిపై జరిగింది. బుధవారం పోలీసులు వివరాలు వెల్లడించారు. తెడ్డుపాడు ఎస్సీ కాలనీకి చెందిన మేలింగి సురేష్ (35) నర్రవాడ నుంచి తెడ్డుపాడు ఎస్సీ కాలనీలోని తన ఇంటికి బైక్‌పై బయలుదేరాడు. ఈక్రమంలో రోడ్డుపై ఆగి ఉన్న లారీని గమనించలేదు. ఒక్కసారిగా బైక్ అదుపుతప్పి లారీని ఢీకొట్టడంతో సురేష్ అక్కడికక్కడే మృతిచెందాడు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో ఎస్సై పి.ఆదిలక్ష్మి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. వివరాలు నమోదు చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉదయగిరి వైద్యశాలకు తరలించారు. సురేష్‌కు భార్య ఉంది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు. ఇంటర్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానంనెల్లూరు(టౌన్): జిల్లాలోని ఆదర్శ పాఠశాలల్లో 2025 – 26 విద్యాసంవత్సరానికి ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాలకు మే 22వ తేదీలోపు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని డీఈఓ ఆర్.బాలాజీరావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇంటర్ ప్రథమ సంవత్సరంలో ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సీఈసీ గ్రూపుల్లో అడ్మిషన్లు ఉన్నాయన్నారు. ఇంగ్లిష్ మీడియంలో బోధన ఉంటుందన్నారు. జిల్లాలో వలేటివారిపాళెం మండలంలోని చుండి, ఉలవపాడు మండలంలోని వీరేపల్లి, లింగసముద్రం మండలంలోని తిమ్మారెడ్డిపాళెం, కందుకూరు మండలంలోని జి.మేకపాడు, కలిగిరి, కావలి మండలంలోని ఒట్టూరు, కొండాపురం, సీతారామపురం, ఏఎస్‌పేట, దుత్తలూరు ప్రాంతాల్లో ఆదర్శ పాఠశాలలు ఉన్నాయన్నారు. ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన బడుల్లో పదో తరగతిలో ఉత్తీర్ణులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలన్నారు. దరఖాస్తు ఫీజు ఓసీ, బీసీ, ఈబీసీలకు రూ.200లు, ఎస్సీ, ఎస్టీలకు రూ.150లు ఉంటుందన్నారు. పదో తరగతిలో మెరిట్, రిజర్వేషన్ రూల్స్ ప్రకారం అవకాశం కల్పిస్తామని తెలియజేశారు. చేపలు పట్టేందుకు వెళ్లి..● పెన్నానదిలో పడి యువకుడి మృతి ఆత్మకూరు: పెన్నా నదిలో చేపలు పట్టేందుకు వెళ్లిన ఏలూరు రవీంద్ర అనే గిరిజన యువకుడు నీళ్లలో పడి మృతిచెందిన ఘటన ఆత్మకూరు మండలంలోని బండారుపల్లి గ్రామంలో బుధవారం జరిగింది. ఎస్సై ఎస్కే జిలానీ కథనం మేరకు.. గిరిజన కాలనీకి చెందిన ఏలూరు రవీంద్ర (27) చేపలు పట్టేందుకు గ్రామ సమీపంలోని పెన్నానదికి వెళ్లాడు. ప్రమాదవశాత్తు నీళ్లలో పడి మృతిచెందాడు. స్థానికులు రవీంద్ర బంధువులకు తెలియజేశారు. వారొచ్చి పరిశీలించగా నదిలో రవీంద్ర మృతదేహం కనిపించింది. పోలీసులకు సమాచారం తెలియడంతో ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించి కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆత్మకూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. -
పొగాకు వేలం ప్రారంభం
● గరిష్ట ధర రూ.280కలిగిరి: మండలంలోని కలిగిరి పొగాకు వేలం కేంద్రంలో బుధవారం వేలం ప్రారంభమైంది. తొలుత వేలం నిర్వహణాధికారి వి.మహేష్ కుమార్, రైతులు కేంద్రంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. రైతులు 36 పొగాకు బేళ్లకు తీసుకొచ్చారు. మహేష్ కుమార్ కిలో పొగాకుకు రూ.306తో వేలం ప్రారంభించారు. ఆ ధరతో కంపెనీల ప్రతినిధులు కొనుగోలుకు ముందుకు రాకపోవడంతో తగ్గిస్తూ వచ్చారు. కిలోకు గరిష్టంగా రూ.280 నుంచి కంపెనీల ప్రతినిధులు కొనుగోలు ప్రారంభించారు. మొత్తం 36 బేళ్లను కిలో ఆ మొత్తానికి కొనుగోలు చేశారు. 6 కంపెనీల ప్రతినిధులు వేలంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహేష్ కుమార్ మాట్లాడుతూ ఈ ఏడాది పొగాకు పంట దిగుబడులు ఆశాజనంగా ఉన్నట్లు తెలిపారు. దిగుబడుల్లో 80 శాతం బ్రైట్ (హైగ్రేడ్), మీడియం గ్రేడ్ ఉత్పత్తి వచ్చిందన్నారు. పొగాకుకు మంచి ధరలు లభించే అవకాశం ఉందన్నారు. రైతులు గ్రేడ్ల వారీగా బేళ్లను తయారు చేసుకుని అమ్మకాలకు తీసుకురావాలని సూచించారు. కార్యక్రమంలో పొగాకు బోర్డు అధికారులు, సిబ్బంది, రైతు సంఘం అధ్యక్షుడు రావూరి శ్రీకాంత్‌బాబు, అన్నదాతలు పాల్గొన్నారు. డీసీపల్లిలో.. మర్రిపాడు: మండలంలోని డీసీపల్లి పొగాకు బోర్డు వేలం కేంద్రంలో బుధవారం వేలం ప్రారంభించారు. తొలిరోజు 18 బేళ్లు రాగా అన్నింటిని విక్రయించామని వేలం నిర్వహణాధికారి జి.రాజశేఖర్ తెలిపారు. గరిష్ట ధర రూ.280 లభించింది. 2,439 కిలోల పొగాకును విక్రయించగా రూ.6,83,144ల వ్యాపారం జరిగింది. 7 కంపెనీలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు. -
25న పోలేరమ్మ జాతర తొలి చాటింపు
● మే 6, 7 తేదీల్లో జాతర నాయుడుపేటటౌన్: నాయుడుపేట గ్రామదేవత పోలేరమ్మ జాతరకు సంబంధించిన తొలి చాటింపును ఈనెల 25న వేయనున్నట్లు దేవదాయ శాఖ ఈఓ రవికృష్ణ తెలిపారు. ఆ శాఖ అధికారులు, జాతర నిర్వహణ కమిటీ సభ్యులు నానాబాల సుబ్బారావు, ఆకుల కుబేరు మణి, నల్లబోతుల రామారావు, రాగి శేషగిరి బుధవారం విన్నమాలలో ఉన్న ఆలయ పెదకాపు ఆర్వభూమి శ్రీనివాసులురెడ్డి ఇంటికి వెళ్లి సంప్రదాయబద్ధంగా తాంబూలం అందజేశారు. అనంతరం జాతర వేడుకలకు శ్రీకారం చుట్టారు. 25న పోలేరమ్మ మొదటి చాటింపు వేసి జాతర వేడుకలను వేదపండితుల సూచనల మేరకు మే 6, 7, తేదీల్లో నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. అనంతరం పెదకాపు శ్రీనివాసులురెడ్డి చేతుల మీదుగా విన్నమాల గ్రామస్తులకు అమ్మవారి తాంబూలం అందజేశారు. కార్యక్రమంలో దేవదాయ శాఖ సిబ్బంది యుగంధర్, నాయకులు దేవత కిశోర్‌శెట్టి, బిరదవాడ నారాయణ, మహేష్‌రెడ్డి, గుంటూరు లక్ష్మయ్య, మదిరి జలంధర్, చిట్టిబాబు, ఆలయ పూజారి రాయపూడి మునిసురేష్, విన్నమాల గ్రామపెద్దలు, యువత తదితరులు పాల్గొన్నారు. -
క్రీడల్లో శిక్షణ
సురేష్ నెల్లూరులోని కేఎన్ఆర్ పాఠశాలలో పదో తరగతి వరకు చదివాడు. అతడికి మొదటి నుంచి క్రీడలపై ఆసక్తి ఉంది. దీనిని గమనించిన పీఈటీ అజయ్‌కుమార్ శిక్షణ ఇచ్చి ప్రోత్సహించాడు. సురేష్ ఏసీ సుబ్బారెడ్డి స్టేడియానికి నిత్యం వెళ్లేవాడు. కోచ్‌లు అతడి ఆసక్తిని గమనించి అథ్లెటిక్స్‌లో శిక్షణ ఇచ్చారు. ఫుట్‌బాల్, కబడ్డీ, ఖోఖో, క్రికెట్, వాలీబాల్ ప్రావీణ్యం సంపాదించాడు. దివ్యాంగులకు నిర్వహించే అనేక క్రీడా పోటీల్లో పాల్గొని ప్రతిభ చూపాడు. 2018లో విశాఖపట్నంలో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీలు తదితర వాటిల్లో ప్రతిభ చూపాడు. 2021 వరకు క్రీడల్లో రాణించినా పలు కారణాలతో దూరం కావాల్సి వచ్చింది. -
అందొచ్చిన కొడుకు అమ్మ మందులకోసం వెళ్లి.. ఆగం!
వలేటివారిపాలెం: రోడ్డు ప్రమాదంలో సాఫ్ట్వేర్ ఇంజినీర్ మృతిచెందిన ఘటన మండలంలోని పోకూరు ఆక్స్ఫర్డ్ స్కూల్ వద్ద వే బ్రిడ్జి సమీపంలో 167–బీ జాతీయ రహదారిపై మంగళవారం జరిగింది. పోలీసుల కథనం మేరకు.. మండలంలోని శింగమనేనిపల్లి గ్రామానికి చెందిన బాశం వెంకటేశ్వర్లు – మాధవి దంపతుల కుమారుడు బాశం దినేష్ (25) వర్క్ ఫ్రం హోం చేస్తున్నాడు. అంతేకాకుండా తల్లిదండ్రుల వ్యవసాయ పనుల్లో చేదోడువాదోడుగా ఉన్నాడు. బడేవారిపాళెం నుంచి పొలం అరక దున్నే కూలీని తీసుకురావాలని తండ్రి వెంకటేశ్వర్లు కుమారుడికి చెప్పాడు. దీంతో తన బుల్లెట్‌పై బయలుదేరిన దినేష్‌కు ఊరు దాటగానే తండ్రి ఫోన్ చేసి అమ్మకి ఆరోగ్యం బాగోలేదు.. ముందు పోకూరు వెళ్లి మందులు తీసుకొని అక్కడి నుంచి బడేవారిపాళెం వెళ్లమని చెప్పాడు. దినేష్ మందులు తీసుకుని బడేవారిపాళెం వెళ్తున్నాడు. హైవేపై ముందు వెళ్తున్న కారును ఓవర్ టేక్ చేయబోయి ఎదురుగా కందుకూరు వైపు వస్తు న్న ఆటోను ఢీకొట్టాడు. రోడ్డుపై పడిపోయిన దినేష్ తలకు బలమైన గాయమై అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న ఎస్సై మరిడి నాయుడు ఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కందుకూ రు ఏరియా వైద్యశాలకు తరలించారు. అప్పటి వరకు గ్రామంలో ఉత్సాహంగా తిరిగిన దినేష్ మృతితో శింగమనేనిపల్లిలో విషాదం నెలకొంది. వెంకటేశ్వర్లుకు ఒక అబ్బాయి, అమ్మాయి సంతానం. మరో ఆరునెలల్లో దినేష్ అక్కకు వివాహం చేయాల్సి ఉంది. అన్ని తానై చూసుకుంటున్న యువకుడి మృతితో తల్లిదండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు. -
లవ్వర్ పిలుస్తోందంటూ.. యువకుని హత్య
నెల్లూరు(క్రైమ్): రౌడీషీటర్ చింటూ హత్య కేసులో పరారీలో ఉన్న ఆరుగురు నిందితులను పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. వారి నుంచి హత్యకు ఉపయోగించిన మారణాయుధాలను స్వాధీనం చేసుకున్నారు. నెల్లూరు వేదాయపాళెం పోలీస్‌స్టేషన్‌లో నగర డీఎస్పీ పి.సింధుప్రియ, స్థానిక ఇన్స్పెక్టర్ వి.శ్రీనివాసులురెడ్డితో కలిసి హత్యకు దారితీసిన పరిస్థితులు, నిందితుల వివరాలను వెల్లడించారు. పాత వేదాయపాళేనికి చెందిన అరవభూమి సుజన్ కృష్ణారెడ్డి అలియాస్ చింటూ (28) రౌడీషీటర్. అతడిపై వివిధ పోలీస్స్టేషన్లలో కేసులున్నాయి. చింటూకు ఇందిరాగాంధీనగర్‌కు చెందిన కృష్ణసాయి అలియాస్ కిట్టు స్నేహితుడు. వీరి మధ్య విభేదాలున్నాయి. చింటూ గతంలో కిట్టు ఇంటికి వెళ్లి గొడవపడి చంపుతానని అందరిముందు బెదిరించాడు. అవమానంగా భావించిన కిట్టు ఈ విషయాన్ని తన స్నేహితులైన కొత్తూరు రామకోటయ్యనగర్‌కు చెందిన కరిముల్లా, ఇందిరాగాంధీనగర్‌కు చెందిన షేక్ మహ్మద్‌బాబా, వెంగళరావ్‌నగర్‌కు చెందిన జి.పవన్, ఫ్రాన్సిన్ అనిక్రాజ్ అలియాస్ అనిక్రాజ్, మనుబోలు మండలం కోదండరామపురానికి చెందిన కె.సాయితేజకు జరిగిన విషయాన్ని చెప్పాడు. అందరూ కలిసి చింటూ హత్యకు పథక రచన చేశారు.మాట్లాడాలని పిలిచి..చింటూ ఇందిరాగాంధీనగర్లోని ఓ యువతితో ప్రేమలో ఉన్నాడు. ఆమెను కొందరు ఇబ్బందులు పెడుతుండగా ఆ విషయమై మాట్లాడదామని కిట్టు ఈనెల 14వ తేదీ రాత్రి చింటూను ఇందిరాగాంధీనగర్ రెండో వీధికి పిలిచాడు. అక్కడే కాపుకాసిన నిందితులు చింటూ రాగానే కత్తులతో విచక్షణారహితంగా నరికి హత్య చేసి పరారయ్యారు. మృతుడి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు ఇన్స్పెక్టర్ వి.శ్రీనివాసులురెడ్డి కేసు నమోదు చేశారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి సాంకేతికత ఆధారంగా నిందితులను గుర్తించారు. మంగళవారం వెంగళరావ్‌నగర్‌లో ఆరుగురిని అరెస్ట్ చేశారు. నిందితులపై త్వరలో రౌడీషీట్లు తెరుస్తామని డీఎస్పీ చెప్పారు. -
రథం ఘటనలో కేసు నమోదుపై సందిగ్ధం?
బిట్రగుంట: కొండబిట్రగుంట బిలకూట క్షేత్రం రథోత్సవం అపశృతి వెనుక కుట్రకోణం ఉందంటూ ఆలయ ఈఓ రాధాకృష్ణ చేసిన ఫిర్యాదుపై సందిగ్ధత నెలకొంది. ఆలయ అధికారుల నిర్లక్ష్యం, బాధ్యతారాహిత్యం కారణంగా రథోత్సవం నిలిచిపోయిన విషయం తెలిసిందే. రథాన్ని ముందుగా పరిశీలించకుండా, ట్రయల్ రన్ నిర్వహించకుండా రథోత్సవం ప్రారంభించడంతో 20 అడుగులు కూడా ముందుకు కదలకముందే చక్రాల బేరింగ్ సిస్టంలో సమస్యలు తలెత్తి రథం ఆగిపోయింది. దీంతో భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈఓకు, ఆయన సోదరుడికి వ్యతిరేకంగా నినాదాలు చేయడం, జిల్లా వ్యాప్తంగా భక్తుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవడంతో దేవదాయశాఖ తమ తప్పిదాలను కప్పిపుచ్చుకునేందుకు కుట్ర కోణాన్ని తెర మీదకు తీసుకువచ్చింది. ఈ మేరకు ఈఓ రాధాకృష్ణ ఆదివారమే బిట్రగుంట పోలీస్‌స్టేషన్‌లో కుట్ర కోణంపై అనుమానాలు వ్యక్తం చేస్తూ ఫిర్యాదు చేశారు. సరైన ఆధారాలు లేకపోవడంతోపాటు భక్తులను అలజడికి గురిచేసే సున్నితమైన అంశం కావడంతో మంగళవారం సాయంత్రం వరకు పోలీసులు కేసు నమోదు చేయలేదు. ఉన్నతాధికారుల అనుమతితో కేసు నమోదు చేసే విషయాన్ని పరిశీలిస్తున్నారు. మరో వైపు ఈఓకు, ఆయన సోదరుడికి వ్యతిరేకంగా పాతబిట్రగుంట, కొండబిట్రగుంట గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఈఓపైన, కొండపై తిష్టవేసిన అతని సోదరుడిపై దేవదాయశాఖ ఏసీకి ఫిర్యాదు చేశారు. అధికారులు స్పందించకపోతే శనివారం నుంచి కలెక్టరేట్ వద్ద నిరవధిక ధర్నా నిర్వహించేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్లు తెలిసింది. 31 వరకు అఫిలియేషన్ల రెన్యూవల్ నెల్లూరు (టౌన్): 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రైవేట్ జూనియర్ కళాశాలల ప్రొవిజనల్ అఫిలియేషన్ రెన్యూవల్ గడువును ఈ నెల 31వ తేదీ వరకు గడువు పెంచినట్లు ఆర్ఐఓ ఆదూరు శ్రీనివాసులు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. కోర్సులు మార్పిడి, కొత్త కోర్సులు, అదనపు సెక్షన్లు మంజూరు, ద్వితీయ భాష, మీడియం మార్పు అనుమతి, ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి కళాశాల తరలింపు, కళాశాల మూసివేత, మూసివేసిన కళాశాల పునః ప్రారంభం, కళాశాలల పేర్లు మార్పు తదితర వాటిని చేసుకోవచ్చన్నారు. ప్రైవేట్ జూనియర్ కళాశాలల యాజమాన్యాలు నిర్ణీత గడువు లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఎంఈఓ వ్యవహారంపై డిప్యూటీ డీఈఓ విచారణ ● ఆయన్ను కాపాడే యోచనలో అధికారులు ● విచారణకు వచ్చి ఎంఈఓ పెట్టిన భోజనాన్ని ఆరగించి వెళ్లిన వైనం ఉలవపాడు: ఉలవపాడు ప్రభుత్వ ఉన్నత పాఠశాల హెచ్ఎం, ఎంఈఓ శివనాగేశ్వరరావు మద్యం మత్తులో తూగుతున్న వైనంపై కందుకూరు డిప్యూటీ డీఈఓ పీపీ నరసింహారావు మంగళవారం విచారణ చేపట్టారు. సాక్షిలో మంగళవారం ‘మద్యం మత్తులో ఎంఈఓ’ శీర్షికన ప్రచురితమైన కథనానికి విద్యాశాఖ స్పందించింది. డిప్యూటీ డీఈఓ పాఠశాలకు వచ్చి శివనాగేశ్వరరావుతో మాట్లాడారు. ఆయన వివరణ, ఉపాధ్యాయుల వివరణ తీసుకున్నారు. విచారణ నివేదికను డీఈఓకు అందజేస్తామన్నారు. అయితే మరో ఎంఈఓ, ఉపాధ్యాయులు శివనాగేశ్వరరావుపై మద్యం తీసుకుంటాడని లిఖిత పూర్వకంగా ఇవ్వలేమని స్పష్టం చేసిన్నట్లు తెలిసింది. దీంతో డిప్యూటీ డీఈఓ కూడా సదరు ఎంఈఓను మందలించారని సమాచారం. మద్యం తాగుతున్నట్లు కచ్చితమైన ఆధారాలు ఉన్నా ఎంఈఓను కాపాడే పనిలో విద్యాశాఖ విచారణ జరిగిందని తెలుస్తోంది. విచారణకు వచ్చిన అధికారి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంఈఓతో భోజనం తెప్పించుకుని అక్కడే తిని వెళ్లడం చూస్తే.. ఈ విచారణ ఎంత పారదర్శకంగా జరిగిందో అర్థమవుతుంది. -
రైతుల్ని దోచేస్తున్న దళారులు, మిల్లర్లు
ముత్తుకూరు: కూటమి ప్రభుత్వంలో అటు మిల్లర్లు, ఇటు దళారులు రైతుల్ని దోచేస్తున్నారని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి మండిపడ్డారు. మండలంలోని డమ్మాయపాళెంలో మంగళవారం వరి ధాన్యం రాసులను పరిశీలించారు. రైతులతో సమావేశమై వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఆయన మాట్లాడుతూ వైఎస్సార్సీపీ ప్రభుత్వ పాలనలో పుట్టి (850 కిలోలు) ధాన్యాన్ని రైతులు రూ.25,000లకు అమ్మకం చేసుకోగా, కూటమి ప్రభుత్వంలో రూ.15,000లకు పడిపోయిందని విచారం వ్యక్తం చేశారు. ఎకరాకు రూ.40,000 నష్టపోతున్నారన్నారు. వరి కోతలు ముమ్మరమైతే ధరలు మరింత దిగజారే ప్రమాదం ఉందన్నారు. రైతులు ఈ స్థాయిలో నష్టపోతుంటే.. కారణాలు అన్వేషించి చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వం చోద్యం చూస్తుందని దుయ్యబట్టారు. దీన్ని బట్టి రైతులపై కూటమి ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి తెలుస్తోందన్నారు. మిల్లర్లు పుట్టి ధాన్యానికి ధర ఇస్తూ రైతు నుంచి తరుగు పేరుతో అదనంగా 150 కిలోల ధాన్యాన్ని దోచేస్తున్నారని విమర్శించారు. పేరుకు 300 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తే, ఒక్క చోట కూడా ధాన్యం కొనుగోలు చేసే పరిస్థితి లేదన్నారు. జిల్లా అధికారుల ప్రకటనలకు, వాస్తవాలకు పొంతన లేదన్నారు. ఉత్తుత్తి ప్రకటనలు కట్టి పెట్టి క్షేత్రస్థాయిలో రైతుల కష్టాలు పరిశీలించి, సమస్యలు పరిష్కరించాలన్నారు. సోమిరెడ్డికి కమీషన్లపైనే దృష్టి సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ముడుపులు, కమీషన్లు, వసూళ్లపై దృష్టి పెట్టారని, రైతుల కష్టాలు పట్టించుకునే స్థితిలో లేడని కాకాణి ఆగ్రహం వెలిబుచ్చారు. రైతుల పక్షాన ఉంటూ న్యాయం జరిగే వరకు పోరాడుతామన్నారు. పార్టీ కన్వీనర్ మెట్ట విష్ణువర్ధన్‌రెడ్డి, ఎంపీపీ గండవరం సుగుణ, నాయకులు దువ్వూరు చంద్రశేఖర్‌రెడ్డి, పోచారెడ్డి చెంగారెడ్డి, సన్నారెడ్డి దయాకర్‌రెడ్డి, సర్పంచ్ సన్నారెడ్డి హారతి, ఎంపీటీసీ సభ్యులు మూగ కీర్తి, పాముల శ్రీనివాసులు, దువ్వూరు కోదండరామరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అధికారుల ప్రకటనలకు.. వాస్తవాలకు పొంతనలేదు మా ప్రభుత్వ హయాంలో పుట్టి రూ.25 వేలు కూటమి ప్రభుత్వంలో రూ.15 వేలు మాజీ మంత్రి కాకాణి ధ్వజం -
ధాన్యం కొనుగోళ్లపై చర్చ
● మంత్రి నాదెండ్లతో మంత్రులు, ఎమ్మెల్యేల భేటీ నెల్లూరు రూరల్: పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలతో అసెంబ్లీలోని తన చాంబర్లో మంగళవారం సమావేశమయ్యారు. జిల్లాలో ధాన్యం కొనుగోలు పరిస్థితి, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, పరిష్కార మార్గాలపై చర్చించారు. మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ ఇప్పటి వరకు జిల్లాలో 15 వేల టన్నుల పైగా ధాన్యం కొనుగోలు చేసామని తెలిపారు. ధాన్యం కొనుగోలు జరిగిన 24 గంటల్లోపే రైతుల ఖాతాల్లో నగదు జమ అవుతుందని తెలిపారు. రైతు సేవా కేంద్రాల ద్వారా కొనుగోలు కొనసాగుతుందని, గన్నీ బ్యాగులు, ట్రాన్స్పోర్ట్ సౌకర్యాలు అందుబాటులో ఉంచామని తెలిపారు. మిల్లర్స్‌తో చర్చించి ధాన్యం కొనుగోలు పకడ్బందీగా జరిగేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. తేమ శాతం 17–20 ఉన్న ధాన్యాన్ని సైతం రైతులకు ఇబ్బంది లేకుండా కొనుగోలు చేస్తామన్నారు. ఏఐ ద్వారా ధాన్యం అమ్మకం మరింత సులభతరం చేసేందుకు 7337359375 నెంబరుకు హాయ్ మెసేజ్ పంపితే రైతులు ధాన్యం అమ్మకం వివరాలు తెలుసుకోవచ్చనని వెల్లడించారు. ఈ సమావేశంలో మున్సిపల్ శాఖ మంత్రి పి నారాయణ, దేవదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, జిల్లా ఇన్చార్జి మంత్రి మహమ్మద్ ఫరూక్, ఎమ్మెల్యేలు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, కె రామకృష్ణ, దగుమాటి వెంకట కృష్ణారెడ్డి, పౌరసరఫరాల సంస్థ ఎండీ మన్సూర్ పాల్గొన్నారు. -
ట్రాక్టర్‌ను ఢీకొన్న ట్రావెల్స్ బస్సు
● ఇద్దరికి గాయాలు మర్రిపాడు: మండలంలోని డీసీపల్లి పెట్రోల్ బంకు సమీపంలో నెల్లూరు–ముంబై జాతీయ రహదారిపై ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ట్రాక్టర్‌ను ఢీకొన్న ఘటన మంగళవారం ఉదయం జరిగింది. పోలీసుల కథనం మేరకు.. బెంగళూరు నుంచి ఏఎస్‌పేటకు వెళ్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు డీసీపల్లి పెట్రోల్ బంకు సమీపంలో ట్రాక్టర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్‌లోని ఇద్దరు వ్యక్తులకు స్వల్ప గాయాలయ్యాయి. బస్సు ముందు భాగం దెబ్బతింది. క్షతగాత్రులను ఆత్మకూరు జిల్లా వైద్యశాలకు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
నాణ్యతకు మారుపేరు భారతి సిమెంట్
సంగం: భారతి సిమెంట్ నాణ్యతకు మారుపేరని ఆ సంస్థ సేల్స్ ఆఫీసర్ బాబ్జాన్, సీనియర్ టెక్నికల్ అధికారి ఎన్.భవానీశంకర్ తెలిపారు. మండల కేంద్రమైన సంగంలోని భారతి ట్రేడర్స్ భవన నిర్మాణ మేసీ్త్రలు, కార్మికులకు సోమవారం రాత్రి అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అధునాతన పరిజ్ఞానంతో భారతి సిమెంట్ తయారవుతుందన్నారు. కట్టడాలు దీర్ఘకాలం ఉండేందుకు దోహద పడుతుందన్నారు. సిమెంట్ తయారీకి నాణ్యమైన ముడి పదార్థాలను తమ కంపెనీ ఎంచుకుంటుందన్నారు. ఈ సిమెంట్‌తో వేసిన శ్లాబులను ఏడురోజుల అనంతరం కంపెనీ ప్రతినిధులు పరీక్షించి నాణ్యతను మేసీ్త్రలు, యజమానులకు వివరిస్తారన్నారు. ఇందుకు సంబంధిత డీలర్ ద్వారా వివరాలు తెలుసుకుని సమాచారం అందిస్తే సరిపోతుందన్నారు. సదస్సుకు హాజరైన మేసీ్త్రలు, కార్మికులకు రూ.లక్ష చొప్పున ఉచిత బీమా సదుపాయం కల్పించి బాండ్లను అందజేశారు. కార్యక్రమంలో భారతి ట్రేడర్స్ అధినేత రమేష్ తదితరులు పాల్గొన్నారు. -
చంద్రబాబూ.. మహిళలకు పథకాలెప్పుడిస్తారు
నెల్లూరు(బారకాసు): మహిళల కోసం ఎప్పటి నుంచి పథకాలను అమలు చేస్తారో సీఎం చంద్రబాబు చెప్పాలని వైఎస్సార్సీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు లక్ష్మీసునంద డిమాండ్ చేశారు. నెల్లూరు నగరంలోని డైకస్‌రోడ్డులో ఉన్న పార్టీ జిల్లా కార్యాలయంలో మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. అసెంబ్లీ వేదికగా మహిళా సాధికారత గురించి చంద్రబాబు మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని మండిపడ్డారు. వైఎస్ జగన్ సీఎంగా ఉన్నప్పుడు అనేక సంక్షేమ పథకాలతో మహిళలకు అండగా నిలిచారన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పదినెలలవుతున్నా మహిళలకు ఉచిత బస్సు ఊసే ఎత్తడం లేదన్నారు. తల్లికి వందనం పథకాన్ని అమ లు చేయకుండా నీరుగారుస్తున్నారన్నారు. అలాగే ఆడబిడ్డ నిధికి బడ్జెట్లో ఒక్క రూపాయి కేటాయించలేదన్నారు. సున్నావడ్డీ రుణాలు ఎప్పుడిస్తారో ప్రకటన చేయాలన్నారు. ఆశావర్కర్లకు జీతాలు పెంచుతామని, పనిభారం తగ్గిస్తామని చెప్పి నిలువునా మోసం చేశారని చెప్పారు. ఎన్నికల సమయంలో వలంటీర్లకు నెలకు రూ.10 వేలు ఇస్తామన్నారని, ఇప్పుడు ఆ ఉద్యోగమే లేకుండా చేసి వారి కడుపుకొట్టడం న్యాయమా అని కూటమి నేతల్ని ప్రశ్నించారు. 2014 – 19 మధ్య కూడా చంద్రబాబు మహిళలను మోసం చేశారన్నారు. జగన్ దిశ యాప్‌ను తీసుకొస్తే, దానిని నేడు శక్తి యాప్ అంటూ హంగామా చేస్తున్నారన్నారు. జగన్ ప్రవేశపెట్టిన వ్యవస్థలను కాపీ కొడుతున్నారని తెలిపారు. వైఎస్సార్సీపీ అధికారంలో ఉన్నప్పుడు మహిళల పేరు మీద ఇళ్ల పట్టాలిచ్చిందన్నారు. నామినేటెడ్ పదవులు, పనుల్లో మహిళలకు 50 శాతం కేటాయించారని చెప్పారు. స్థానిక సంస్థల పదవులను కూడా 50 శాతం వారికే ఇచ్చారన్నారు. చంద్రబాబు హామీలను నెరవేర్చాలని లేనిపక్షంలో వైఎస్సార్సీపీ మహిళా విభాగం పోరాటం చేస్తామన్నారు. సమావేశంలో ఆ పార్టీ రూరల్ నియోజకవర్గ మహిళా, అంగన్వాడీ, సాంస్కృతిక విభాగాల అధ్యక్షులు బషీర, శాలిని, శారద, కార్యవర్గ సభ్యురాలు ఫరీదా తదితరులు పాల్గొన్నారు. ప్రతి మహిళకు అండగా నిలిచిన వైఎస్ జగన్మోహన్రెడ్డి వైఎస్సార్సీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు లక్ష్మీసునంద -
రైతుల్ని దోచేస్తున్న దళారులు, మిల్లర్లు
ముత్తుకూరు: కూటమి ప్రభుత్వంలో అటు మిల్లర్లు, ఇటు దళారులు రైతుల్ని దోచేస్తున్నారని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి మండిపడ్డారు. మండలంలోని డమ్మాయపాళెంలో మంగళవారం వరి ధాన్యం రాసులను పరిశీలించారు. రైతులతో సమావేశమై వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఆయన మాట్లాడుతూ వైఎస్సార్సీపీ ప్రభుత్వ పాలనలో పుట్టి (850 కిలోలు) ధాన్యాన్ని రైతులు రూ.25,000లకు అమ్మకం చేసుకోగా, కూటమి ప్రభుత్వంలో రూ.15,000లకు పడిపోయిందని విచారం వ్యక్తం చేశారు. ఎకరాకు రూ.40,000 నష్టపోతున్నారన్నారు. వరి కోతలు ముమ్మరమైతే ధరలు మరింత దిగజారే ప్రమాదం ఉందన్నారు. రైతులు ఈ స్థాయిలో నష్టపోతుంటే.. కారణాలు అన్వేషించి చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వం చోద్యం చూస్తుందని దుయ్యబట్టారు. దీన్ని బట్టి రైతులపై కూటమి ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి తెలుస్తోందన్నారు. మిల్లర్లు పుట్టి ధాన్యానికి ధర ఇస్తూ రైతు నుంచి తరుగు పేరుతో అదనంగా 150 కిలోల ధాన్యాన్ని దోచేస్తున్నారని విమర్శించారు. పేరుకు 300 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తే, ఒక్క చోట కూడా ధాన్యం కొనుగోలు చేసే పరిస్థితి లేదన్నారు. జిల్లా అధికారుల ప్రకటనలకు, వాస్తవాలకు పొంతన లేదన్నారు. ఉత్తుత్తి ప్రకటనలు కట్టి పెట్టి క్షేత్రస్థాయిలో రైతుల కష్టాలు పరిశీలించి, సమస్యలు పరిష్కరించాలన్నారు. సోమిరెడ్డికి కమీషన్లపైనే దృష్టి సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ముడుపులు, కమీషన్లు, వసూళ్లపై దృష్టి పెట్టారని, రైతుల కష్టాలు పట్టించుకునే స్థితిలో లేడని కాకాణి ఆగ్రహం వెలిబుచ్చారు. రైతుల పక్షాన ఉంటూ న్యాయం జరిగే వరకు పోరాడుతామన్నారు. పార్టీ కన్వీనర్ మెట్ట విష్ణువర్ధన్‌రెడ్డి, ఎంపీపీ గండవరం సుగుణ, నాయకులు దువ్వూరు చంద్రశేఖర్‌రెడ్డి, పోచారెడ్డి చెంగారెడ్డి, సన్నారెడ్డి దయాకర్‌రెడ్డి, సర్పంచ్ సన్నారెడ్డి హారతి, ఎంపీటీసీ సభ్యులు మూగ కీర్తి, పాముల శ్రీనివాసులు, దువ్వూరు కోదండరామరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అధికారుల ప్రకటనలకు.. వాస్తవాలకు పొంతనలేదు మా ప్రభుత్వ హయాంలో పుట్టి రూ.25 వేలు కూటమి ప్రభుత్వంలో రూ.15 వేలు మాజీ మంత్రి కాకాణి ధ్వజం -
కలిగిరి, డీసీపల్లి వేలం కేంద్రాల పరిధిలో..
కలిగిరి: జిల్లాలోని కలిగిరి, మర్రిపాడు మండలంలోని డీసీపల్లి పొగాకు వేలం కేంద్రాల్లో బుధవారం నుంచి వేలం ప్రారంభమవుతుంది. వాటి పరిధిలో 2,963 బ్యారెన్ల ద్వారా 3,469 మంది రైతులు పొగాకు సాగు చేపట్టారు. 2025 – 26 సీజన్‌కు సంబంధించి 12.65 మిలియన్ కేజీల పొగాకును అధికారికంగా అమ్ముకోవడానికి బోర్డు అనుమతి ఉంది. పెరిగిన సాగు విస్తీర్ణం, అధిక దిగుబడుల దృష్ట్యా 18.30 మిలియన్ కేజీల వరకు ఈ సీజన్లో అమ్మకాలు జరగొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. జాగ్రత్తలు తప్పనిసరి పొగాకు గ్రేడింగ్ సమయంలో రైతులు తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలని బోర్డు అధికారులు సూచిస్తున్నారు. ఈ ఏడాది పొగాకు నాణ్యత ఆశాజనకంగా ఉంది. మొత్తం ఉత్పత్తిలో 50 శాతం వరకు మొదటి రకం (బ్రైట్ గ్రేడ్) వచ్చినట్లు రైతులు, అధికారులు చెబుతున్నారు. మిగిలిన గ్రేడ్ ఉత్పత్తులు కూడా బాగున్నట్టు తెలుస్తోంది. భారీగా పెరిగిన పెట్టుబడులు ఈ ఏడాది పొగాకు సాగుకు పెట్టుబడులు భారీగా పెరిగాయి. గత రెండు సంవత్సరాలుగా మంచి ధరలు లభిస్తుండటంతో ఈసారి సాగు చేయడానికి రైతులు అమితంగా ఆసక్తి చూపారు. దీంతో ఈ ప్రాంతంలో పొలాలు, బ్యారెన్ల కౌలు ధరలు అమాంతం పెరిగిపోయాయి. గతేడాది రూ.లక్ష ఉన్న బ్యారెన్ కౌలు ఈసారి రూ.2.50 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు పలికింది. పొలం కౌలు, కూలీల రేట్లు కూడా దాదాపు రెట్టింపయ్యాయి. గతంతో పోలిస్తే ఈ ఏడాది ఒక్కో బ్యారెన్‌కు రూ.4 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు ఖర్చులు పెరిగాయి. ప్రస్తుతం కందుకూరు–1లో వేలం జరుగుతుండగా గరిష్ట ధర కిలోకు రూ.280 పలికింది. పెరిగిన పెట్టుబడుల నేపథ్యంలో ఈ ఏడాది రూ.300 లభించేలా చూడా లని కలిగిరి, డీసీపల్లి వేలం కేంద్రాల పరిధిలోని రైతు లు డిమాండ్ చేస్తున్నారు. రైతులు : 3,469 బ్యారెన్లు : 2,963 బోర్డు అనుమతించిన సాగు విస్తీర్ణం : 9,931 హెక్టార్లు రైతులు సాగు చేసిన విస్తీర్ణం : 9,973 హెక్టార్లు బోర్డు అనుమతించిన ఉత్పత్తి : 12.65 మిలియన్ కేజీలు రైతులు పండించిన ఉత్పత్తి (అంచనా) : 18.30 మిలియన్ కేజీలు సూచనలు పాటించాలి ఈ ఏడాది పొగాకు పంట దిగుబడులు ఆశాజనకంగా ఉన్నాయి. రైతు లు అవశేషాలు లేని, హీట్ లేకుండా గ్రేడ్ల ఆధారంగా బేళ్లను తయారు చేసుకోవాలి. పొగాకు బోర్డు అధికారుల సూచనలు పాటిస్తే మంచి ధరలు లభించే అవకాశం ఉంది. – మహేష్ కుమార్, వేలం నిర్వహణాధికారి, కలిగిరి పొగాకు బోర్డు పెట్టుబడులు పెరిగాయి ఈ ఏడాది పెట్టుబడులు భారీగా పెరిగాయి. సీజన్ ప్రారంభం నుంచే మంచి ధరలు లభిస్తాయని ఎదురు చూస్తున్నాం. సరాసరిన కిలో రూ.300 తగ్గకుండా ఉంటేనే రైతులు గట్టున పడతారు. – పూసాల అక్కపునాయుడు, రావులకొల్లు, కలిగిరి మండలం నేటి నుంచి కలిగిరి, డీసీపల్లి కేంద్రాల్లో పొగాకు వేలం ప్రక్రియ ప్రారంభం సాగు సమయంలో పెరిగిన పెట్టుబడులు సరాసరిన రూ.300 ఇవ్వాలని రైతుల డిమాండ్ -
తెలుగు అధ్యాపకుల నిరసన
నెల్లూరు(టౌన్): ‘ఇంటర్ బోర్డు చేపట్టిన సంస్కరణల్లో భాగంగా ఎప్పటి నుంచో ద్వితీయ భాషగా ఉన్న తెలుగును ఆప్షనల్ చేయడం దారుణం. ఇది ఆ భాషను అవమానించడమే’ అని తెలుగు అధ్యాపకులు ఆవేదన వ్యక్తం చేశారు. నెల్లూరు స్టోన్‌హౌస్‌పేటలోని కేఏసీ జూనియర్ కళాశాలలో జరుగుతున్న మాల్యాంకనం వద్ద మంగళవారం నల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపారు. అనంతరం క్యాంప్ ఆఫీసర్ ఎ.శ్రీనివాసులుకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో అధ్యాపకులు రమేష్, వెంకట్రావు, పులి చెంచయ్య, శ్రీనివాసులు, ఆశ్వీరాదం, సోమశేఖర్, వనజ, సరళ, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.ధాన్యం లారీ బోల్తా ఆత్మకూరు: ధాన్యం లోడ్‌తో వెళ్తున్న లారీ అదుపుతప్పి పొలాల్లో బోల్తా పడిన ఘటన మంగళవారం జరిగింది. స్థానికుల కథనం మేరకు.. మున్సిపల్ పరిధిలోని 9వ వార్డు అనంతరాయనియేని గిరిజన కాలనీ వద్ద పొలాల్లో లారీలో ధాన్యం బస్తాలు లోడ్ చేయగా నెల్లూరుకు బయలుదేరింది. ఈ క్రమంలో డొంకరోడ్డు కొంతమేర కుంగి ఉండటంతో లారీ అదుపుతప్పి పొలాల్లో బోల్తా పడింది. ఈ ఘటనలో డ్రైవర్, క్లీనర్ గాయపడగా వారిని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ధాన్యం బస్తాలు అన్ని పొలాల్లో చెల్లాచెదురుగా పడిపోయాయి. దీంతో మరో లారీలో లోడ్ చేసి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. తల్లిదండ్రులకు కన్నీరు మిగిల్చి..● రోడ్డు ప్రమాదంలో సాఫ్ట్వేర్ ఇంజినీర్ మృతి వలేటివారిపాలెం: రోడ్డు ప్రమాదంలో సాఫ్ట్వేర్ ఇంజినీర్ మృతిచెందిన ఘటన మండలంలోని పోకూరు ఆక్స్ఫర్డ్ స్కూల్ వద్ద వే బ్రిడ్జి సమీపంలో 167–బీ జాతీయ రహదారిపై మంగళవారం జరిగింది. పోలీసుల కథనం మేరకు.. మండలంలోని శింగమనేనిపల్లి గ్రామానికి చెందిన బాశం వెంకటేశ్వర్లు – మాధవి దంపతుల కుమారుడు బాశం దినేష్ (25) వర్క్ ఫ్రం హోం చేస్తున్నాడు. అంతేకాకుండా తల్లిదండ్రుల వ్యవసాయ పనుల్లో చేదోడువాదోడుగా ఉన్నాడు. బడేవారిపాళెం నుంచి పొలం అరక దున్నే కూలీని తీసుకురావాలని తండ్రి వెంకటేశ్వర్లు కుమారుడికి చెప్పాడు. దీంతో తన బుల్లెట్‌పై బయలుదేరిన దినేష్‌కు ఊరు దాటగానే తండ్రి ఫోన్ చేసి అమ్మకి ఆరోగ్యం బాగోలేదు.. ముందు పోకూరు వెళ్లి మందులు తీసుకొని అక్కడి నుంచి బడేవారిపాళెం వెళ్లమని చెప్పాడు. దినేష్ మందులు తీసుకుని బడేవారిపాళెం వెళ్తున్నాడు. హైవేపై ముందు వెళ్తున్న కారును ఓవర్ టేక్ చేయబోయి ఎదురుగా కందుకూరు వైపు వస్తు న్న ఆటోను ఢీకొట్టాడు. రోడ్డుపై పడిపోయిన దినేష్ తలకు బలమైన గాయమై అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న ఎస్సై మరిడి నాయుడు ఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కందుకూ రు ఏరియా వైద్యశాలకు తరలించారు. అప్పటి వరకు గ్రామంలో ఉత్సాహంగా తిరిగిన దినేష్ మృతితో శింగమనేనిపల్లిలో విషాదం నెలకొంది. వెంకటేశ్వర్లుకు ఒక అబ్బాయి, అమ్మాయి సంతానం. మరో ఆరునెలల్లో దినేష్ అక్కకు వివాహం చేయాల్సి ఉంది. అన్ని తానై చూసుకుంటున్న యువకుడి మృతితో తల్లిదండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఆటోలో వెళ్తుండగా.. ● కింద పడి చికిత్స పొందుతూ వ్యక్తి మృతి ఉదయగిరి: మండలంలోని సున్నంవారిచింతల సమీపంలో మంగళవారం మధ్యాహ్నం ఆటోలో వెళ్తున్న తిరుమలాపురం ఎస్టీ కాలనీకి చెందిన కొండయ్య (48) అనే వ్యక్తి ప్రమాదవశాత్తు జారి కిందపడ్డాడు. తీవ్రంగా గాయపడిన అతడిని స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం నెల్లూరుకు తీసుకెళ్లారు. అక్కడ ఓ ప్రైవేట్ వైద్యశాలలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఇంద్రసేనారెడ్డి తెలిపారు. -
రథం ఘటనలో కేసు నమోదుపై సందిగ్ధం?
బిట్రగుంట: కొండబిట్రగుంట బిలకూట క్షేత్రం రథోత్సవం అపశృతి వెనుక కుట్రకోణం ఉందంటూ ఆలయ ఈఓ రాధాకృష్ణ చేసిన ఫిర్యాదుపై సందిగ్ధత నెలకొంది. ఆలయ అధికారుల నిర్లక్ష్యం, బాధ్యతారాహిత్యం కారణంగా రథోత్సవం నిలిచిపోయిన విషయం తెలిసిందే. రథాన్ని ముందుగా పరిశీలించకుండా, ట్రయల్ రన్ నిర్వహించకుండా రథోత్సవం ప్రారంభించడంతో 20 అడుగులు కూడా ముందుకు కదలకముందే చక్రాల బేరింగ్ సిస్టంలో సమస్యలు తలెత్తి రథం ఆగిపోయింది. దీంతో భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈఓకు, ఆయన సోదరుడికి వ్యతిరేకంగా నినాదాలు చేయడం, జిల్లా వ్యాప్తంగా భక్తుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవడంతో దేవదాయశాఖ తమ తప్పిదాలను కప్పిపుచ్చుకునేందుకు కుట్ర కోణాన్ని తెర మీదకు తీసుకువచ్చింది. ఈ మేరకు ఈఓ రాధాకృష్ణ ఆదివారమే బిట్రగుంట పోలీస్‌స్టేషన్‌లో కుట్ర కోణంపై అనుమానాలు వ్యక్తం చేస్తూ ఫిర్యాదు చేశారు. సరైన ఆధారాలు లేకపోవడంతోపాటు భక్తులను అలజడికి గురిచేసే సున్నితమైన అంశం కావడంతో మంగళవారం సాయంత్రం వరకు పోలీసులు కేసు నమోదు చేయలేదు. ఉన్నతాధికారుల అనుమతితో కేసు నమోదు చేసే విషయాన్ని పరిశీలిస్తున్నారు. మరో వైపు ఈఓకు, ఆయన సోదరుడికి వ్యతిరేకంగా పాతబిట్రగుంట, కొండబిట్రగుంట గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఈఓపైన, కొండపై తిష్టవేసిన అతని సోదరుడిపై దేవదాయశాఖ ఏసీకి ఫిర్యాదు చేశారు. అధికారులు స్పందించకపోతే శనివారం నుంచి కలెక్టరేట్ వద్ద నిరవధిక ధర్నా నిర్వహించేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్లు తెలిసింది. 31 వరకు అఫిలియేషన్ల రెన్యూవల్ నెల్లూరు (టౌన్): 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రైవేట్ జూనియర్ కళాశాలల ప్రొవిజనల్ అఫిలియేషన్ రెన్యూవల్ గడువును ఈ నెల 31వ తేదీ వరకు గడువు పెంచినట్లు ఆర్ఐఓ ఆదూరు శ్రీనివాసులు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. కోర్సులు మార్పిడి, కొత్త కోర్సులు, అదనపు సెక్షన్లు మంజూరు, ద్వితీయ భాష, మీడియం మార్పు అనుమతి, ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి కళాశాల తరలింపు, కళాశాల మూసివేత, మూసివేసిన కళాశాల పునః ప్రారంభం, కళాశాలల పేర్లు మార్పు తదితర వాటిని చేసుకోవచ్చన్నారు. ప్రైవేట్ జూనియర్ కళాశాలల యాజమాన్యాలు నిర్ణీత గడువు లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఎంఈఓ వ్యవహారంపై డిప్యూటీ డీఈఓ విచారణ ● ఆయన్ను కాపాడే యోచనలో అధికారులు ● విచారణకు వచ్చి ఎంఈఓ పెట్టిన భోజనాన్ని ఆరగించి వెళ్లిన వైనం ఉలవపాడు: ఉలవపాడు ప్రభుత్వ ఉన్నత పాఠశాల హెచ్ఎం, ఎంఈఓ శివనాగేశ్వరరావు మద్యం మత్తులో తూగుతున్న వైనంపై కందుకూరు డిప్యూటీ డీఈఓ పీపీ నరసింహారావు మంగళవారం విచారణ చేపట్టారు. సాక్షిలో మంగళవారం ‘మద్యం మత్తులో ఎంఈఓ’ శీర్షికన ప్రచురితమైన కథనానికి విద్యాశాఖ స్పందించింది. డిప్యూటీ డీఈఓ పాఠశాలకు వచ్చి శివనాగేశ్వరరావుతో మాట్లాడారు. ఆయన వివరణ, ఉపాధ్యాయుల వివరణ తీసుకున్నారు. విచారణ నివేదికను డీఈఓకు అందజేస్తామన్నారు. అయితే మరో ఎంఈఓ, ఉపాధ్యాయులు శివనాగేశ్వరరావుపై మద్యం తీసుకుంటాడని లిఖిత పూర్వకంగా ఇవ్వలేమని స్పష్టం చేసిన్నట్లు తెలిసింది. దీంతో డిప్యూటీ డీఈఓ కూడా సదరు ఎంఈఓను మందలించారని సమాచారం. మద్యం తాగుతున్నట్లు కచ్చితమైన ఆధారాలు ఉన్నా ఎంఈఓను కాపాడే పనిలో విద్యాశాఖ విచారణ జరిగిందని తెలుస్తోంది. విచారణకు వచ్చిన అధికారి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంఈఓతో భోజనం తెప్పించుకుని అక్కడే తిని వెళ్లడం చూస్తే.. ఈ విచారణ ఎంత పారదర్శకంగా జరిగిందో అర్థమవుతుంది. -
ధాన్యం కొనుగోళ్లపై చర్చ
● మంత్రి నాదెండ్లతో మంత్రులు, ఎమ్మెల్యేల భేటీ నెల్లూరు రూరల్: పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలతో అసెంబ్లీలోని తన చాంబర్లో మంగళవారం సమావేశమయ్యారు. జిల్లాలో ధాన్యం కొనుగోలు పరిస్థితి, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, పరిష్కార మార్గాలపై చర్చించారు. మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ ఇప్పటి వరకు జిల్లాలో 15 వేల టన్నుల పైగా ధాన్యం కొనుగోలు చేసామని తెలిపారు. ధాన్యం కొనుగోలు జరిగిన 24 గంటల్లోపే రైతుల ఖాతాల్లో నగదు జమ అవుతుందని తెలిపారు. రైతు సేవా కేంద్రాల ద్వారా కొనుగోలు కొనసాగుతుందని, గన్నీ బ్యాగులు, ట్రాన్స్పోర్ట్ సౌకర్యాలు అందుబాటులో ఉంచామని తెలిపారు. మిల్లర్స్‌తో చర్చించి ధాన్యం కొనుగోలు పకడ్బందీగా జరిగేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. తేమ శాతం 17–20 ఉన్న ధాన్యాన్ని సైతం రైతులకు ఇబ్బంది లేకుండా కొనుగోలు చేస్తామన్నారు. ఏఐ ద్వారా ధాన్యం అమ్మకం మరింత సులభతరం చేసేందుకు 7337359375 నెంబరుకు హాయ్ మెసేజ్ పంపితే రైతులు ధాన్యం అమ్మకం వివరాలు తెలుసుకోవచ్చనని వెల్లడించారు. ఈ సమావేశంలో మున్సిపల్ శాఖ మంత్రి పి నారాయణ, దేవదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, జిల్లా ఇన్చార్జి మంత్రి మహమ్మద్ ఫరూక్, ఎమ్మెల్యేలు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, కె రామకృష్ణ, దగుమాటి వెంకట కృష్ణారెడ్డి, పౌరసరఫరాల సంస్థ ఎండీ మన్సూర్ పాల్గొన్నారు. -
ఉపాధి పనుల్లో రూ.3.70 కోట్ల అవినీతి
ఉదయగిరి: మండలంలో జరిగిన ఉపాధి పనుల్లో భారీగా అవినీతి జరిగిందని సోషల్ ఆడిట్ తనిఖీల్లో నిగ్గు తేల్చితే.. చివరకు అధికారులు ఈ మొత్తాన్ని కుదించి పది శాతానికి తగ్గించారు. ఆయా పనుల్లో అవినీతి, అక్రమాలకు పాల్పడిన 16 మంది అధికారులు, సిబ్బందిపై సస్పెన్షన్ వేటు పడిదంటే.. ఏ స్థాయిలో అవినీతి జరిగిందో ఈ చర్యలే అద్దం పడుతున్నాయి. ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో మంగళవారం 17వ విడత సామాజిక తనిఖీ ప్రజావేదిక నిర్వహించారు. 2023 ఏప్రిల్ నుంచి 2024 మార్చి వరకు మండలంలో ఉపాధి హామీ పథకం కింద రూ.14.08 కోట్ల పనులు చేపట్టారు. వాటికి సంబంధించి క్షేత్రస్థాయిలో సామాజిక తనిఖీ బృందాలు తనిఖీ చేయగా బినామీ మస్తర్లు, చనిపోయిన వారి పేర్లతో నగదు స్వాహా, పనుల్లో కొలతల్లో తేడా, డబుల్ జాబ్‌కార్డులు, అవెన్యూ ప్లాంటేషన్‌లో అవినీతి, రికార్డులు మాయం చేయడం, ఉద్యోగులు, వలంటీర్ల పేరుతో మస్తర్లు, ఒకే కుటుంబంలో వివిధ జాబ్‌కార్డులు సృష్టించడం, నేమ్‌బోర్డు లేకుండానే నిధులు స్వాహా, తదితర అవినీతి అక్రమాలు గుర్తించారు. మండలంలోని 17 పంచాయతీల్లో రూ.3.70 కోట్ల మేర అవినీతి జరిగినట్లుగా లెక్క తేల్చారు. డ్వామా పీడీ గంగాభవాని సమక్షంలో జరిగిన ప్రజా వేదికలో సామాజిక తనిఖీ బృందం పంచాయతీల వారీగా జరిగిన అవినీతి, అక్రమాలను బయటపెట్టారు. అయితే అటు చేసి.. ఇటు చేసి రూ.37.80 లక్షల అవినీతి జరిగినట్లుగా లెక్క తేల్చారు. మరో రూ.98 లక్షలకు సంబంధించి రికార్డులు మాయం కావడంతో అందుకు బాధ్యులైన వారిపై కేసులు నమోదు చేయాల్సిందిగా ఎంపీడీఓ అప్పాజీని డ్వామా పీడీ ఆదేశించారు. ఈ అవినీతి, అక్రమాల్లో ప్రమేయమున్న ఏపీఓ శ్రీనివాసులు, ఈసీలు వెలుగోటి శ్రీనివాసులు, మురళీకృష్ణ, కంప్యూటర్ ఆపరేటర్లు సుహాసిని, రిఫీ, టెక్నికల్ అసిస్టెంట్లు మనోజ్, రామకృష్ణ, కాలె శ్రీనివాసులుతోపాటు 9 మంది క్షేత్ర సహాయకులను సస్పెండ్ చేస్తూ పీడీ ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అంబుడ్స్‌మెన్ వెంకటరెడ్డి, జిల్లా విజిలెన్స్ అధికారిణి విజయలక్ష్మి, జిల్లా క్వాలిటీ కంట్రోల్ అధికారి సతీష్‌బాబు, ఇన్చార్జి ఏపీడీ శంకరనారాయణ, ఎంపీడీఓ అప్పాజీ తదితరులు పాల్గొన్నారు. రికవరీకి ఆదేశించిన మొత్తాలు ఉదయగిరిలో రూ.2,98,788, కొండాయపాళెం రూ.2,61,763, పుల్లాయపల్లి రూ.9,28,320, ఆర్లపడియ రూ.4,14,074, బండగానిపల్లి రూ.1,53,811, దాసరపల్లి రూ.17,200, శకునాలపల్లి రూ.41,147, నేలటూరు రూ.29,400, తిరుమలాపురం రూ.2,71,774, వెంగళరావునగర్ రూ.2,31,071, జి.అయ్యవారిపల్లి రూ.2,42,066, జి.చెరువుపల్లి రూ.78,011, గండిపాళెం రూ.61,427, జి.చెర్లోపల్లి రూ.2,252, అప్పసముద్రం రూ.5,40,000, కృష్ణంపల్లి రూ.2,72,064, గన్నేపల్లి రూ.2,500 అవినీతి జరిగినట్లుగా తేల్చి రికవరీకి ఆదేశించారు. రికవరీకి ఆదేశించిన మొత్తం రూ.37.80 లక్షలే 16 మంది ఉపాధి సిబ్బంది, అధికారులపై సస్పెన్షన్ వేటు -
రాయలసీమ ఎత్తిపోతలకు చంద్రబాబు సమాధి
నెల్లూరు(బారకాసు): రాయలసీమ లిఫ్ట్‌కు సీఎంగా వైఎస్ జగన్ శ్రీకారం చుడితే, చంద్రబాబు సమాధి కడుతున్నారని వైఎస్సార్సీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి విమర్శించారు. నెల్లూరులో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. సీమ రైతుల కన్నీటి కష్టాలకు బాబు స్వార్థ రాజకీయాలే కారణమని.. నీటి పంపకాలలో అన్యాయం జరుగుతున్నా తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశి్నంచలేని అసమర్థుడు అని ధ్వజమెత్తారు. తానూ రాయలసీమకు చెందినవాడినేనని, 15 ఏళ్లు సీఎంగా చేశానని చెప్పుకోవడమే తప్ప, రైతాంగానికి చంద్రబాబు ఒక్క మేలు కూడా తలపెట్టలేదన్నారు. శ్రీశైలంలో 800 అడుగుల నుంచి రోజుకు 3 టీఎంసీల చొప్పున పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ దిగువన కుడి ప్రధాన కాల్వలోకి ఎత్తిపోసేందుకు గత ప్రభుత్వం నిర్ణయించిందని.. హక్కుగా దక్కిన నీటిని వాడుకోవడానికి రూ.3,825 కోట్లతో 2020 మే 5న రాయలసీమ లిఫ్ట్ నిరి్మంచేందుకు ఆమోదం తెలిపిందన్నారు. తద్వారా చెన్నైకి 15 టీఎంసీలు, ప్రాజెక్టుల కింద 9.6 లక్షల ఎకరాలకు నీరివ్వాలనేది లక్ష్యంగా చెప్పారు.సీమ లిఫ్ట్‌ను అడ్డుకునేందుకు చంద్రబాబు అడుగడుగునా కుట్రలకు పాల్పడ్డారని, ఎన్జీటీ (చెన్నై) బెంచ్‌లో తెలంగాణ టీడీపీ నేతలతో పిటిషన్ వేయించారని తెలిపారు. హక్కుగా కేటాయించిన 44 వేల క్యూసెక్కులను వాడుకుంటున్నామని ఈఏసీ ఎదుట సమర్థంగా వాదించలేక కూటమి ప్రభుత్వం చేతులెత్తేసిందని కాకాణి మండిపడ్డారు. శ్రీశైలం ప్రాజెక్టు నీటి మట్టం 798 అడుగుల్లోనే తెలంగాణ ప్రభుత్వం విద్యుదుత్పత్తి పేరుతో నీటిని తోడేస్తోందని.. 800 అడుగులకు చేరగానే సాగుకు విడుదల చేసుకుంటున్నారని, అయినా చంద్రబాబు ప్రభుత్వం చోద్యం చూస్తోందని విమర్శించారు. వైఎస్ జగన్‌కు పేరొస్తుందనే.. రాయలసీమ లిఫ్ట్ పూర్తయితే వైఎస్ జగన్‌కు పేరొస్తుందనే కుట్రతో, రైతుల జీవితాలను చంద్రబాబు పణంగా పెట్టారని కాకాణి మండిపడ్డారు. తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ ట్రైబ్యునల్ ఆదేశాలను బేఖాతరు చేస్తూ పాలమూరు–రంగారెడ్డి లిఫ్ట్ పనులను కొనసాగించినా బాబు కిమ్మనలేదని విమర్శించారు. స్వార్థ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రాజెక్టులను తాకట్టు పెడుతున్న చంద్రబాబు.. రైతుల దృష్టి మళ్లించేందుకు బనకచర్ల పేరతో కొత్త డ్రామాకు తెరతీశారని కాకాణి పేర్కొన్నారు.ఓవైపు పోలవరం నీటిని బనకచర్లకు తీసుకెళ్తామని, సముద్రంలోకి వృథాగా పోయే బదులు సీమకు తీసుకెళ్తామంటే అభ్యంతరం చెప్పొద్దని తెలంగాణకు సూచిస్తున్నారని తెలిపారు. మరోవైపు తన శిష్యుడు, తెలంగాణ సీఎం రేవంత్ ద్వారా అభ్యంతరాలు లేవనెత్తేలా కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ప్రచారం కోసమే చంద్రబాబు ఈ ప్రాజెక్టును వాడుకుంటున్నారని, అంతే తప్ప.. ప్రాజెక్ట్‌ల విషయంలో ఆయనకు మొదటి నుంచి చిత్తశుద్ధి లేదని కాకాణి ధ్వజమెత్తారు. -
భూమి మా ప్రాణం.. జీవనాధారం
కావలి: మూడు పంటలు పండే మా భూములు మా ప్రాణం, మా జీవనాధారం. అటువంటి భూములను బలవంతంగా లాక్కుంటామంటే ఊరుకునేది లేదని, అధికారులు మొండిగా వ్యవహరిస్తే.. సామూహిక ఆత్మహత్యలకు కూడా వెనుకాడేది లేదని మండలంలోని తీర ప్రాంతాల రైతులు తెగేసి చెప్పారు. మండలంలోని ఆనెమడుగు, మొండిదిన్నెపాళెం కట్టకిందపాళెం, బైనేటివారిపాళెం, ఆకుతోట గ్రామాల్లో రైతులు, వ్యవసాయ కార్మికులు, గీత కార్మికులు, గ్రామాల్లో ప్రజలు తమ అభిప్రాయాలు తీసుకోకుండా భూము లు లాక్కోవాలని 91 డిక్లరేషన్ ప్రకటించడంపై రైతులు నిరసన నినాదాలతో హోరెత్తించారు. రైతుల అభిప్రాయాలు పరిగణలోకి తీసుకోకుండా, ఏడాదికి మూడు పంటలు పండే భూములను పరిశ్రమలకు ఎలా కేటాయిస్తారంటూ వందలాది మంది రైతులు సోమవారం వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఆర్డీఓ కార్యాలయాన్ని ముట్టడించారు. ఆర్డీఓకు, అధి కారులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశా రు. రైతులు, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు అధికారుల వైఖరిని తీవ్రంగా తప్పు పట్టారు. కాకినాడకు చెందిన పారిశ్రామికవేత్తల కోసం కావలి తీరంలో భూములు సేకరించడం దారుణమన్నారు. ఈ భూములపై ఆధారపడి ఐదు గ్రామాల ప్రజలు జీవ నం సాగిస్తున్నారని తెలిపారు. అధికారులు వెంటనే తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకుంటే ఈ నెల 25 నుంచి ఆర్డీఓ కార్యాలయం ఎదుట నిరవధిక నిరాహార దీక్షలు ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. సామూహికంగా ఆత్మహత్యలకై నా సిద్ధమే కానీ ఒక్క సెంటు భూమి కూడా వదులుకోమని తెలిపారు. దీంతో ఆర్డీఓ వంశీకృష్ణ బయటకు వచ్చి రైతులతో మాట్లాడారు. ఉన్నతాధికారులకు, కలెక్టర్‌కు తెలియజేసి సమస్యను పరిష్కరిస్తామన్నారు. వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి. వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కావలికి కూతవేటు దూరంలో ఉన్న గ్రామాల్లో సంవత్సరానికి మూడు పంటలు పండే భూముల మీద 1,200 కుటుంబాలు, 400 కల్లుగీత కుటుంబాలు, 300 పాడి రైతు కుటుంబాలు ఉన్నాయని తెలిపారు. 2013 భూసేకరణ చట్టప్రకారం బహుళ పంటలు పండే భూములు తీసుకోకూడదని చెప్పారు. గ్రామ సభలో పెట్టి ప్రజాభిప్రాయ సేకరణ తీసుకోవాలని, 80 శాతం ఆమోదం పొందాలని చట్టంలో ఉన్నా అధికారులు ఆ చట్టాన్ని తుంగలో తొక్కారని తెలిపారు. ప్రజలు చూడని పత్రికల్లో ప్రకటనలు ఇచ్చి భూములు లాక్కోవాలని చూడడం బాధాకరమన్నారు. కార్యక్రమంలో వ్యవసా య కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మంగళ పుల్లయ్య, జిల్లా అధ్యక్షుడు జొన్నలగడ్డ వెంకమ్మరాజు, రాష్ట్ర కమిటీ సభ్యులు తాళ్లూరు మాల్యాద్రి, మండల కార్యదర్శి రాధాకృష్ణయ్య, రైతు సంఘం నాయకులు గడ్డం మాల్యాద్రి, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు తుమ్మల వెంకయ్య తదితరులు పాల్గొన్నారు. భూములు లాక్కుంటే ఆత్మహత్యలే మూడు పంటలు పండే భూములు పరిశ్రమలకు ఇవ్వం ఈ నెల 25 నుంచి నిరవధిక నిరాహార దీక్షలు -
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల జీవితాలు కష్టాలమయంగా మారాయి. ప్రజల దైనందిన జీవితంలో రెవెన్యూ, సర్వే, పోలీసు, పంచాయతీరాజ్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, పౌరసరఫరాలు, విద్యుత్, హౌసింగ్, నీటి పారుదల శాఖల పరంగా సమస్యలు ఎదుర్కొంటున్నారు. వాటి
8 నెలల్లో రిజిస్టర్ అయిన అర్జీలు 32,754 ఆన్లైన్లో నమోదు కానివి 3 వేల పైమాటే పరిష్కరించినట్లు చెబుతున్న అర్జీలు 28,913 పరిష్కారానికి నోచుకోని అర్జీలు 3,841 ప్రతి వారం వస్తున్న అర్జీల సంఖ్య 400 పైమాటే నెల్లూరు (అర్బన్): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజాసమస్యల పరిష్కార వేదిక.. ఒక ప్రహసన కార్యక్రమంగా మిగిలిపోతోంది. ప్రతి సోమవారం కలెక్టర్ నుంచి అన్ని శాఖల జిల్లా స్థాయి అధికారులు పాల్గొంటున్న ఈ వేదిక సామాన్య ప్రజలకు పరిష్కారం చూపించి భరోసా కల్పించలేకపోతోంది. క్షేత్రస్థాయిలో ప్రజలు పడుతున్న ఇబ్బందులకు ప్రతి సోమవారం కలెక్టరేట్‌కు వచ్చే అర్జీలే నిదర్శనంగా ఉంది. ప్రతి వారం జిల్లా నలుమూలల నుంచి 400 నుంచి 450 అర్జీలు వస్తున్నాయంటే మండల కేంద్రాల్లో ఆయా శాఖల అధికారుల పనితీరుకు అద్దం పడుతోంది. పేదలమైన తమ భూములను పెద్దలు గుంజుకుంటున్నారు. రైతులకు పాస్‌బుక్‌లు సకాలంలో ఇవ్వడం లేదు. రోడ్డు, బాటలను కబ్జా చేస్తున్నారు. శ్మశాన స్థలాలను ఆక్రమిస్తున్నారు. ఉన్న ఇంటి స్థలాన్ని కబ్జాచేయాలని చూస్తున్నారు.. అంటూ ఇలాంటి సమస్యలు మండల కేంద్రాల్లో పరిష్కారం కాకపోవడంతో ఎంతో ఆశతో జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో సోమవారం జరిగే ప్రజాసమస్యల పరిష్కార వేదిక వద్దకు బాధితులు క్యూ కడుతున్నారు. కొన్ని చోట్ల ఆక్రమణదారులకు ప్రజాప్రతినిధులు అండగా నిలుస్తున్నారు. దీంతో సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదు. ఫలితంగా బాధితులు కలెక్టరేట్ చుట్టూ, మండల కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. మండలాల్లో పరిష్కారం కాలేదని కలెక్టరేట్‌కు వస్తే... మండల కేంద్రాల్లో ఎన్నిసార్లు అర్జీలు ఇచ్చినప్పటికీ తహసీల్దార్గాని, ఎంపీడీఓ గాని, ఇతర అధికారులు సమస్యలను పరిష్కరించకుండా తిప్పుకుంటున్నారు. దీంతో జిల్లా నలుమూలల నుంచి ఒక రోజు కూలీ వదులుకుని, ఛార్జీలు పెట్టుకుని, తినీ తినక కలెక్టరేట్‌కు వచ్చి అర్జీలు ఇస్తున్నారు. అయితే కలెక్టరేట్లో అర్జీలు తీసుకుని అధికారులు సంబంధిత అధికారులకు ఫోన్ చేసి సమస్యను పరిష్కరించాలని ఆదేశిస్తున్నారు. మళ్లీ మండల కేంద్రాలకే అర్జీదారులను పంపుతున్నారు. ఇక సమస్య పరిష్కరించేసినట్టేనంటూ ఆన్లైన్లో అర్జీలను క్లోజ్ చేస్తున్నారు. వాస్తవానికి క్షేత్రస్థాయిలో సమస్యలు పరిష్కారం కావడం లేదు. అర్జీదారుల సంఖ్య ఎందుకు తగ్గడం లేదు అధికారులు చెబుతున్నట్లు సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ ఉంటే ప్రతి సోమవారం కలెక్టరేట్లో సుమారు 400 వరకు అర్జీదారులు ఎందుకు వస్తున్నారంటూ బాధితులు ఆవేదన చెందుతున్నారు. ఒకే సమస్యపై మళ్లీ మళ్లీ రావాల్సి వస్తుందని బాధ పడుతున్నారు. సోమవారం కలెక్టరేట్లో జరిగిన గ్రీవెన్స్‌ను పరిశీలించగా ఆన్లైన్ చేసిన అర్జీలు 303 రాగా, మరో 70కి పైగా ఆన్లైన్ కాకుండా అర్జీలు వచ్చాయి. -
పొలాన్ని చూపాలని కాళ్లరిగేలా తిరుగుతున్నా..
మా తండ్రి సుబ్బరాయుడు మిలిటరీలో జీపు డ్రైవర్. ఆయనకు నెల్లూరు పడారుపల్లిలో 5 ఎకరాలు ప్రభుత్వం ఇచ్చింది. అయితే అది ప్రభుత్వ అవసరాలకు జానకమ్మ కలెక్టర్‌గా ఉన్నప్పుడు తీసుకుని పొదలకూరు తహసీల్దార్ వద్దకు పంపారు. అక్కడి తహసీల్దార్ మండలంలోని ఆల్తుర్తి వద్ద తనకు 5 ఎకరాలు కండలేరు కాలువ కింద కేటాయించి పట్టా ఇచ్చారు. పాస్ బుక్స్ ఇవ్వాలని 2016 నుంచి తహసీల్దార్ చుట్టూ, కలెక్టరేట్ చుట్టూ తిరుగుతున్నా ఇప్పటి వరకు ఇవ్వలేదు. న్యాయం కోసం కాళ్లరిగేలా తిరుగుతున్నాను. – తడకలూరు సోమశేఖరయ్య, ప్రశాంతినగర్, మైపాడురోడ్డు ● -
నా భూమిని కాపాడమని తిరుగుతున్నా
నాకు నలుగురు ఆడ పిల్లలు. అనంతపురంలో సుమారు 6 ఎకరాల వరకు బిట్లు, బిట్లు గా పొలం ఉంది. కొంత మంది నా పొలాన్ని, ఇంటిని ఆక్రమించాలని చూస్తున్నా రు. కిష్టమ్మ, రఘురామిరెడ్డి 1.70 ఎకరాలు ఆక్రమించారు. బావి దగ్గరకు పోనివ్వడం లేదు. పొలానికి వెళ్లే కాలువను తెగ్గొట్టారు. పోలా సురేష్, దశయ్య, మరికొంత భూమిని ఆక్రమించారు. నేను వయోభారంతో ఉండడంతో ఇబ్బంది పెడుతున్నా రు. నా బాధ కలెక్టర్‌కు మొర పెట్టుకున్నాను. తహసీల్దార్‌కు ఫోన్ చేశారు. అయితే మా గ్రామంలో కొంత మంది ఒత్తిడి వల్ల స్థానిక అధికారులు పట్టించుకోలేదు. నాలుగో దఫా కలెక్టరేట్‌కు వచ్చాను. – కాకు మాలకొండారెడ్డి, అనంతపురం, కలిగిరి మండలం ● -
ఇంటర్ మూల్యాంకనం ప్రారంభం
నెల్లూరు (టౌన్): నగరంలోని స్టోన్‌హౌస్‌పేటలో ఉన్న కేఏసీ జూనియర్ కళాశాలలో సోమవారం నుంచి ఇంటర్ పబ్లిక్ పరీక్షల జవా బు పత్రాల మూల్యాంకనం ప్రారంభమైంది. సంస్కృతం, ఇంగ్లిష్, తెలుగు, హిందీ, మ్యాథ్‌మ్యాటిక్స్, సివిక్స్ సబ్జెక్ట్‌ల మూల్యాంకనం చేస్తున్నారు. దాదాపు 480 మంది అధ్యాపకులు పాల్గొంటున్నారని ఆర్ఐఓ ఆదూరు శ్రీనివాసులు తెలిపారు. వచ్చే నెల మొదటి వారానికి మూల్యాంకనం పూర్తి కావచ్చన్నారు. ఈ నెల 22 నుంచి 26వ తేదీ వరకు మిగిలిన సబ్జెక్ట్‌ల మూల్యాంకనం జరుగుతుందన్నారు. తొలివిడతలో జరుగుతున్న మూల్యాంకనానికి హాజరుకాని అధ్యాపకులు మూల్యాంకనం కేంద్రంలో రిపోర్ట్ చేయాలన్నారు. గైర్హాజరైన అధ్యాపకులు, సంబంధిత కళాశాలల యాజమాన్యాలపైన ఇంటర్ బోర్డు నిబంధనల మేరకు చర్యలు ఉంటాయన్నారు. యోగి వేమన వర్సిటీ ఇన్చార్జి వీసీగా అల్లం వెంకటాచలం: వైఎస్సార్ జిల్లాలోని యోగివేమన విశ్వవిద్యాలయం ఇన్చార్జి వీసీగా విక్రమసింహపురి యూనివర్సిటీ వీసీ అల్లం శ్రీనివాసరావును నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. గవర్నర్ ఆదేశాల మేరకు విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ ఉత్తర్వులు జారీ చేశారు. వీఆర్‌కు ఏఆర్ ఏఎస్పీ నెల్లూరు (క్రైమ్): ఏఆర్ ఏఎస్పీ జి. మునిరాజాను వీఆర్‌కు బదిలీ చేస్తూ ఉన్నతాధికారులు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. మునిరాజా గతేడాది అక్టోబర్‌లో ఏఎస్పీగా బాధ్యతలు చేపట్టారు. కొంత కాలంగా విధుల్లో నిర్లక్ష్యం, వివిధ ఆరోపణల నేపథ్యంలో ఆయన్ను వీఆర్‌కు బదిలీ చేశారు. దీంతో ఆయన విధుల నుంచి రిలీవ్ అయి పోలీసు ప్రధాన కార్యాలయంలో రిపోర్టు చేసేందుకు వెళ్లారు. ధాన్యం కొనుగోళ్లు మరింత వేగవంతం ● రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి ● కంట్రోల్ రూమ్ నంబర్ 85208 79979 ఏర్పాటు ● జేసీ కార్తీక్ నెల్లూరు (అర్బన్): ప్రభుత్వ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోళ్లు మరింత వేగంగా జరపనున్నామని జేసీ కార్తీక్ తెలిపారు. సోమవారం సాయంత్రం కలెక్టరేట్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో ఏర్పాటు చేసిన 300 కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యాన్ని కొనుగోలు చేసి ఒకటి, రెండు రోజుల్లోనే రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తున్నామన్నారు. ఇప్పటి వరకు జిల్లాలో 11 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామన్నారు. జిల్లాలో 3.50 లక్షల గన్నీ బ్యాగులు అందుబాటులో ఉన్నాయన్నారు. 250 లారీలను కొనుగోలు కేంద్రాలకు పంపేందుకు సిద్ధం చేశామన్నారు. లారీలు జిల్లా దాటి వెళ్లకుండా చర్యలు చేపట్టామన్నారు. ప్రతి రోజు 5 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసేలా చర్యలు చేపట్టామన్నారు. మద్దతు ధరకన్నా తక్కువకు కొనుగోలు చేసే రెండు మిల్లులపై కూ డా కేసులు నమోదు చేశామన్నారు. రైతులు విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్‌ను సంప్రదించి కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యాన్ని అమ్ముకోవాలన్నారు. కొనుగోలు కేంద్రాల్లో ఏమైనా ఇబ్బందులుంటే జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూం నంబర్ 85208 79979 నంబర్‌కు ఫోన్ చేయాలని కోరారు. -
అస్తవ్యస్తంగా పది పరీక్షలు
నెల్లూరు (టౌన్): పదో తరగతి పబ్లిక్ పరీక్షలు తొలి రోజు సోమవారం అస్తవ్యస్తంగా నిర్వహించారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొన్ని సెంటర్లలో ఆలస్యంగా పరీక్షలు జరిగినట్లు తెలిసింది. కొన్ని సెంటర్లలో వసతులపై పేరెంట్స్, సెంటరు అధికారుల మధ్య వాగ్వాదం జరిగింది. విడవలూరు మండలం వావిళ్లలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలోని ఓ గది తాళాన్ని పగుల కొట్టి విద్యార్థులు లోపలికి పంపించిన పరిస్థితి ఏర్పడింది. నగరంలోని మాగుంట లేవుట్లోని కేకేఆర్ గౌతమ్ స్కూల్లో 15 నిమిషాలు ఆలస్యంగా పరీక్ష ప్రారంభమైనట్లు విద్యార్థులు చెప్పారు. నగరంలోని ఆర్ఎస్ఆర్ స్కూల్లో వసతులపై పేరెంట్స్, సెంటర్ నిర్వాహకులు, అధికారుల మధ్య వాగ్వాదం చోటు చేసుకున్నట్లు సమాచారం. చాలా సెంటర్లలో సరైన గాలి, వెలుతురు లేకపోవడంతో ఉక్కపోతతో పరీక్ష రాసేందుకు విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. తాగునీటి ఏర్పాట్లు కూడా చేయలేదని చెబుతున్నారు. ఎండ తీవ్రత ఓ వైపు, ఇరుకు గదుల్లో పరీక్ష నిర్వహించినట్లు సమాచారం. పలు కేంద్రాల్లో హాల్ టికెట్ల నంబర్ల డిస్ప్లే బోర్డు ఏర్పాటు చేయకపోవడంతో గదులు ఎక్కడో తెలియక విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. కొన్ని సెంటర్ల అడ్రసు సరిగా లేకపోవడంతో వెతకడానికే సమయం సరిపోయిందంటున్నారు. విద్యార్థులతో వచ్చిన తల్లిదండ్రులు పరీక్ష కేంద్రం బయటే పడిగాపులు కాఽశారు. వారికి తాగేందుకు నీరు ఏర్పాటు చేయకపోవడంతో అవస్థలు పడ్డారు. ఈ విషయంపై డీఈఓకు ఫోన్ చేయగా సరైన కారణాలతో ఆలస్యంగా ప్రారంభమైన సెంటర్లలో అదనంగా సమయం కేటాయించమని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు. 384 మంది గైర్హాజరు తొలి రోజు తెలుగు పరీక్షకు 28,496 మంది రెగ్యులర్, 734 మంది ప్రైవేట్ విద్యార్థులు హాజరుకావాల్సి ఉంది. రెగ్యులర్ 28,492 మంది, ప్రైవేట్ విభాగంలో 354 మంది హాజరయ్యారు. మొత్తంగా 380 మంది గైర్హాజరయ్యారు. కొన్ని సెంటర్లలో ఆలస్యంగా పరీక్ష ప్రారంభం వావిళ్ల సెంటరులో తాళాలు పగులకొట్టి తలుపులు తీసిన పేరెంట్స్ వసతులు లేక ఇబ్బందులు పడిన విద్యార్థులు -
కలెక్టర్ చెప్పినా తహసీల్దార్ ఇబ్బంది పెడుతున్నాడు
కోవూరు నందలగుంట గిరిజనులకు ఆ సమీపంలో 15 సెంట్ల శ్మశాన స్థలం ఉంది. శ్మశానం పక్కనే ఒక వ్యక్తి ప్రైవేట్ ఆస్పత్రి నిర్మిస్తూ శ్మశాన స్థలాన్ని ఆక్రమించాడు. ఈ విషయమై మూడు నెలలుగా ప్రతి వారం కలెక్టరేట్ చుట్టూ తిరుగుతున్నాం. కలెక్టర్ ఆనంద్ స్పందించి తహసీల్దార్‌కు ఫోన్ చేశారు. తహసీల్దార్, వీఆర్వో సర్వే చేసి శ్మశాన స్థలాన్ని గత నెల 11వ తేదీన గిరిజనులకు అప్పగించారు. హద్దులు కూడా వేయించారు. అయితే ఏమి జరిగిందో ఏమో నెల తిరిగే లోపు కలెక్టర్ రాతపూర్వకంగా తనకు ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేదని తహసీల్దార్ చెప్పారు. అందువల్ల కలెక్టర్ వద్దకు వెళ్లి ఉత్తర్వులు తెచ్చుకోవాలని ఇప్పుడు మెలిక పెట్టారు. ఇది గిరిజనుల శ్మశాన వాటిక కాదని చెబుతున్నారు. దీని వెనుక ఏ పెద్దలు ఉన్నారో తమకు అర్థం కావడంలేదు. కలెక్టర్ ఈ రోజు కూడా ఆ శ్మశాన స్థలం గిరిజనులదేనని చెప్పారు. ఆచరణలో మాత్రం ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. కలెక్టర్ ఆదేశాలు ఇస్తు న్నా.. క్షేత్రస్థాయిలో కూటమి ప్రభుత్వ పెద్దలు ఒత్తిడి తో అధికారులు అన్యాయంగా వ్యవహరిస్తున్నారు. – నందిపోగు రమణయ్య, వ్యవసాయ సంఘం జిల్లా కార్యదర్శి విజయమ్మ, జ్యోతి, నందలగుంట గిరిజనులు -
మాయమాటలు చెప్పడంలో సిద్ధహస్తులు
● చంద్రబాబుపై మండిపడిన కాకాణి గోవర్ధన్‌రెడ్డి నెల్లూరు(బారకాసు): మాయమాటలు చెప్పడంలో సీఎం చంద్రబాబు సిద్ధహస్తులని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి విమర్శించారు. డైకస్‌రోడ్డులోని పార్టీ జిల్లా కార్యాలయంలో విలేకరులతో సోమవారం ఆయన మాట్లాడారు. పొట్టి శ్రీరాములు జయంతిని పురస్కరించుకొని నిర్వహించిన కార్యక్రమంలో జిల్లాకు పొట్టి శ్రీరాములు జిల్లాగా నామకరణం చేసింది తానేనని ఆయన ప్రకటించడమే దీనికి నిదర్శనమని వ్యాఖ్యానించారు. ఇదే విషయాన్ని పచ్చ పత్రికలో ప్రచురించడం మరో విడ్డూరమని విమర్శించారు. వాస్తవానికి పొట్టి శ్రీరాములు జిల్లాగా 2008 జూన్‌లో దివంగత సీఎం వైఎస్సార్ హయాంలో ప్రకటించిన అంశం అందరికీ తెలుసునన్నారు. దీనికి సంబంధించి అదే ఏడాది మే 25న జీఓ విడుదలైన అంశాన్ని ప్రస్తావించారు. ప్రజలు నవ్వుకుంటారనే కనీస ఆలోచన లేకుండా చంద్రబాబు ఇలా అబద్ధాలు చెప్పడం విడ్డూరమని ఎద్దేవా చేశారు. మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెండ్ల విషయంలోనూ ఆయన గతంలో ఇదే తరహాలో విచిత్ర వ్యాఖ్యలు చేసిన అంశాన్ని గుర్తుచేశారు. ప్రతి గొప్ప పనినీ తన ఖాతాలో వేసుకోవడం చంద్రబాబుకు మొదట్నుంచి అలవాటని విమర్శించారు. అమరజీవి 56 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నామని చంద్రబాబు ప్రకటించారని, గతంలో అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తానని ప్రకటించి, దాన్ని విస్మరించారని ఆరోపించారు. ఆయన మాటలు వింటే పొట్టి శ్రీరాములు ఆత్మ క్షోభిస్తుందని చెప్పారు. రైతుల బాధలు వర్ణనాతీతం పంటలకు గిట్టుబాటు ధర కల్పించడంలేదని, దీంతో అన్నదాతల ఆవేదన వర్ణనాతీతంగా మారిందని కాకాణి చెప్పారు. అధికారుల లెక్కలు తప్పడం.. వాస్తవాలు ప్రభుత్వ దృష్టికి రాకపోవడంతో రైతులకు మేలు జరగడంలేదని టీడీపీ అనుకూల పత్రికల్లో ప్రచురించారన్నారు. తాను చేస్తున్న తప్పులను వదిలేసి అధికారులపై నింద వేసి తప్పించుకునే ధోరణిని ఆయన అవలంబిస్తున్నారనే అంశాన్ని అందులో పేర్కొన్నారని తెలిపారు. టీడీపీ అధికారంలోకి రాగానే సదరు మీడియా సంస్థ స్వరం మారిందని పేర్కొన్నారు. తమ ప్రభుత్వ హయాంలో పుట్టి ధాన్యానికి రూ.19,720 గిట్టుబాటు ధర కల్పిస్తే, అది ప్రస్తుతం రూ.15,500కు పడిపోయిందని వివరించారు. -
ఐదు కిలోల కణితి తొలగింపు
● పెద్దాస్పత్రి వైద్యుల ఘనత నెల్లూరు(అర్బన్): తిరుపతి జిల్లా వెంకటగిరికి చెందిన 35 ఏళ్ల తాటిపర్తి శశికళకు నగరంలోని ప్రభుత్వ పెద్దాస్పత్రిలో ఆపరేషన్ చేసి ఆమె తొడ భాగం నుంచి ఐదు కిలోల కణితిని తొలగించారు. దీనికి సంబంధించిన వివరాలను ఆస్పత్రి జనరల్ సర్జన్ కాలేషాబాషా సోమవారం వెల్లడించారు. ఎడమ తొడ భాగంలో కణితి ఏర్పడి క్రమేపీ పెరుగుతూ వచ్చిందని, నొప్పి ఎక్కువ కావడంతో పలు ప్రైవేట్ ఆస్పత్రులను ఆమె ఆశ్రయించారని చెప్పారు. రూ.లక్షల్లో ఖర్చవుతుందని చెప్పడంతో పెద్దాస్పత్రికి ఆమె వచ్చారన్నారు. రూపాయి ఖర్చు లేకుండా.. లోపలి రక్తనాళాలకు ఇబ్బంది లేకుండా ఆపరేషన్ ద్వారా కణితిని తొలగించామని తెలిపారు. తనతో పాటు డాక్టర్లు సుహాసిని, ఉమామహేష్, మత్తు వైద్యులు శారదతో కూడిన వైద్య బృందం ఆపరేషన్‌లో పాల్గొందని తెలిపారు. ఆపరేషన్‌ను విజయవంతంగా చేసిన డాక్టర్లను ఆస్పత్రి సూపరింటెండెంట్ సిద్ధానాయక్ అభినందించారు. -
తలకు తీవ్రగాయమై యువకుడి మృతి
నెల్లూరు(క్రైమ్): పక్కనున్న మిద్దైపె పడి తలకు తీవ్ర గాయమై యువకుడు మృతి చెందిన ఘటన నగరంలోని కొరడావీధిలో సోమవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. పశ్చిమ బెంగాల్‌కు చెందిన సుబ్రత సమంత ఉపాధి నిమిత్తం నగరానికి పదేళ్ల క్రితం వచ్చి కోటమిట్టకు చెందిన అన్వర్‌బాషా వద్ద బంగారు ఆభరణాల తయారీ పనులు చేసుకుంటూ కొరడావీధిలో నివసిస్తున్నారు. ఈయన చిన్నాన్న కుమారుడు సునీల్ సమంత (27) నెల్లూరుకు ఎనిమిదేళ్ల క్రితం వచ్చి కొరడావీధిలోని మొహిద్దీన్ వద్ద బంగారు పనులు చేస్తున్నారు. సమీపంలో ఉన్న సురేంద్ర కాంప్లెక్స్‌లోని నాలుగో అంతస్తులో గల పెంట్‌హౌస్‌లో స్నేహితులు జయంత్, జయంత్గైన్తో కలిసి ఉంటున్నారు. ఈ ముగ్గురూ ఆదివారం అర్ధరాత్రి వరకు మద్యం సేవించారు. అనంతరం భోజనం చేసేందుకు లోపలికి వీరు వెళ్లగా, సునీల్ సమంత బయటే ఉన్నారు. ఈ తరుణంలో పక్కనే ఉన్న మిద్దైపె సునీల్సమంత పడ్డారు. శబ్దం రావడంతో బయటకు పరుగులు తీసిన స్నేహితులు జరిగిన విషయాన్ని స్థానికంగా ఉన్న దస్తగిరి ద్వారా సుబ్రత సమంతకు తెలియజేశారు. ఘటన స్థలానికి హుటాహుటిన ఆయన చేరుకున్నారు. తలకు తీవ్రగాయమై అపస్మారక స్థితిలో ఉండటంతో 108కు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న వారు పరిశీలించి అప్పటికే మృతి చెందారని నిర్ధారించారు. ఈ మేరకు సంతపేట పోలీసులకు మృతుడి సోదరుడు ఫిర్యాదు చేశారు. ఎస్సై సుల్తాన్‌బాషా ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. పోస్ట్‌మార్టం నిమిత్తం జీజీహెచ్ మార్చురీకి తరలించి కేసు నమోదు చేశారు. అనంతరం కుటుంబసభ్యులకు మృతదేహాన్ని అప్పగించడంతో తమ స్వస్థలానికి తరలించారు. -
వ్యక్తి అనుమానాస్పద మృతి
కలిగిరి: వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెంది ఘటన స్థానిక సబ్‌స్టేషన్ సమీపంలోని ప్రధాన రహదారి పక్కన సోమవారం వెలుగులోకి వచ్చింది. విషయాన్ని గుర్తించిన స్థానికులు.. పోలీసులకు సమాచారమిచ్చారు. ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని ఎస్సై ఉమాశంకర్ పరిశీలించారు. మృతుడి జేబులో ఉన్న సెల్‌ఫోన్ ఆధారంగా నెల్లూరుకు చెందిన రాఘవరెడ్డి (60)గా గుర్తించారు. కలిగిరికి చెందిన రాఘవరెడ్డి 20 ఏళ్లుగా నెల్లూరులో ఉంటూ, అక్కడే కార్ల షోరూమ్ వద్ద వాచ్‌మెన్‌గా పనిచేస్తూ ఒంటరిగా జీవిస్తున్నారు. కలిగిరి, వింజమూరులో ఉన్న బంధువుల వద్దకొచ్చి ఇలా విగతజీవిగా మారారు. కాగా మరణ వార్తపై బంధువులకు సమాచారమిచ్చారు. ఘటన స్థలానికి వారు చేరుకొని ఎలాంటి కేసు అవసరం లేదని చెప్పి రాఘవరెడ్డి మృతదేహన్ని తీసుకెళ్లారు. మద్యం సేవించి మృతి చెంది ఉండొచ్చని బంధువులు, పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. -
మోసపోయాం.. న్యాయం చేయండయ్యా
బాధితుల సమస్యలు వింటున్న ఎస్పీ కృష్ణకాంత్● ఎస్పీకి బాధితుల వినతి నెల్లూరు(క్రైమ్): ఉద్యోగాలు.. మెడికల్ సీట్లు.. వీసాల పేరిట రూ.లక్షల్లో దోచేసిన మోసగాళ్లపై చర్యలు చేపట్టాలని పలువురు బాధితులు కోరారు. ఈ మేరకు నగరంలోని ఉమేష్‌చంద్ర కాన్ఫరెన్స్ హాల్లో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో ఎస్పీకి కృష్ణకాంత్‌కు 75 మంది తమ సమస్యలను అర్జీల రూపంలో అందజేశారు. వీటిని పరిశీలించిన ఆయన త్వరితగతిన పరిష్కరించి బాధితులకు న్యాయం చేయాలని ఆయా ప్రాంత పోలీస్ అధికారులను ఆదేశించారు. మోసగాళ్లతో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నగర, కావలి డీఎస్పీలు సింధుప్రియ, శ్రీధర్, లీగల్ అడ్వైజర్ శ్రీనివాసులురెడ్డి, ఎస్బీ ఇన్స్పెక్టర్లు వెంకటేశ్వరరావు, శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఫిర్యాదుల్లో కొన్ని.. ● వాట్సాప్‌లో జ్యోతిర్నాథ్ పరిచయమై సాఫ్ట్వేర్ జాబ్ ఇప్పిస్తానని నమ్మించి రూ.2.1 లక్షలను తీసుకున్నారు. నెలలు గడుస్తున్నా, ఉద్యోగమిప్పించకపోవడంతో గట్టిగా ప్రశ్నించగా ఫోన్ స్విచ్ఛాఫ్ చేశారు. అతనిపై చర్యలు చేపట్టాలని వేదాయపాళేనికి చెందిన ఓ యువకుడు ఫిర్యాదు చేశారు. ● తమిళనాడుకు చెందిన లక్ష్మీనారాయణ, సెల్వం అదే రాష్ట్రంలోని ఓ ప్రముఖ యూనివర్సిటీలో పీజీ మెడికల్ సీటు ఇప్పిస్తానని రూ.20 లక్షలు వసూలు చేశారు. ఇప్పించకపోవడంతో నిలదీయగా, దౌర్జన్యం చేస్తున్నారు. వీరిపై చర్యలు చేపట్టాలని వేదాయపాళేనికి చెందిన ఓ వ్యక్తి కోరారు. ● వేదాయపాళేనికి చెందిన వెంకట్రావు బీవీనగర్‌లోని స్టీల్ కంపెనీలో డీజిల్ మోటార్లను ఇప్పిస్తానని రూ.4.2 లక్షలు తీసుకున్నారు. వీటిని ఇప్పించకుండా కాలయాపన చేస్తుండటంతో ఇటీవల గట్టిగా నిలదీయగా, బెదిరింపు చర్యలకు పాల్పడుతున్నారని అదే ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి విన్నవించారు. ● అబుదాబీలో పనిచేసేందుకు వర్కింగ్ వీసా ఇప్పిస్తామని, నెలకు రూ.80 వేల జీతమొస్తుందని నమ్మించి రూ 2.7 లక్షలను విజయవాడకు చెందిన రామకృష్ణ, దివ్య, జగిత్యాలకు చెందిన శ్రీనివాస్, రిజ్వానా, ఆస్సు తీసుకున్నారు. విజిటింగ్ వీసా ఇచ్చి మోసం చేయడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నానని, వీరిపై చర్యలు చేపట్టాలని బుచ్చిరెడ్డిపాళేనికి చెందిన ఓ వ్యక్తి విజ్ఞప్తి చేశారు. ● ప్రభుత్వ కార్యాలయాల్లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఉద్యోగాలిప్పిస్తామంటూ మా వద్ద రూ.5.62 లక్షలను అనంతసాగరానికి చెందిన ఖాజామొహిద్దీన్ తీసుకున్నారు. నెలలు గడుస్తున్నా ప్రయోజనం లేకపోవడంతో, నిలదీయగా దౌర్జన్యం చేస్తున్నారు. విచారణ జరిపి న్యాయం చేయాలని అదే ప్రాంతానికి చెందిన చెందిన ఇద్దరు యవకులు కోరారు. ● తన పేరుపై ఉన్న ఆస్తిని రాసివ్వాలని కొడుకు, కోడలు చిత్రహింసలకు గురిచేస్తూ, తన వస్తువులను ధ్వంసం చేసి దుస్తులను కాల్చేశారు. వీరిపై చర్యలు చేపట్టాలని తోటపల్లిగూడూరుకు చెందిన ఓ వృద్ధుడు విన్నవించారు. ● అల్లూరుకు చెందిన సుమంత్, అతని తండ్రి నాపై దాడి చేయడంతో తీవ్రగాయాలయ్యాయి. స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. దాడి చేసిన వారిపై చర్యలు చేపట్టాలని అల్లూరుకు చెందిన ఓ వృద్ధుడు వేడుకున్నారు. -
ఎండల తీవ్రతతో జాగ్రత్తలు పాటించాలి
నెల్లూరు రూరల్: ఎండలు తీవ్రమవుతున్న తరుణంలో వివిధ రంగాల్లో పనిచేసే కార్మికుల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని అవసరమైన చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆనంద్ ఆదేశించారు. కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో ఇంజినీరింగ్ శాఖలు, డ్వామా అధికారులతో సోమవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కూలీలు పనిచేసే ప్రదేశంలో తాగునీటి సౌకర్యాన్ని కల్పించడంతో పాటు నీటి కియోస్క్‌లను ఏర్పాటు చేయాలన్నారు. కూలీలు, నిర్మాణ కార్మికులు మధ్యాహ్న సమయంలో పనిచేయకుండా చూడాలని సూచించారు. పని ప్రదేశాల్లో తాత్కాలిక షెడ్లను ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. వడదెబ్బకు గురైతే చికిత్స కోసం ప్రభుత్వాస్పత్రులు, ఆరోగ్య కేంద్రాల్లో ప్రత్యేక వార్డులను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. మూగజీవాలను రక్షించేందుకు పశుసంవర్థక అధికారులు కృషి చేయాలన్నారు. ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ వెంకటరమణ, డీఆర్వో ఉదయభాస్కర్‌రావు, డ్వామా పీడీ గంగాభవాని తదితరులు పాల్గొన్నారు. -
వెల్లువెత్తిన అర్జీలు
అర్జీలను స్వీకరిస్తున్న కలెక్టర్ ఆనంద్ నెల్లూరు రూరల్: ప్రజా సమస్యల పరిష్కార వేదికకు అర్జీదారులు పోటెత్తారు. కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో అధికారులకు అర్జీలను అందజేసి తమ సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. వీటిని కలెక్టర్ ఆనంద్, డీఆర్వో ఉదయభాస్కర్‌రావు, డ్వామా పీడీ గంగా భవానీ, డీపీఓ శ్రీధర్‌రెడ్డి, జెడ్పీ డిప్యూటీ సీఈఒ మోహన్‌రావు తదితరులు స్వీకరించారు. కాగా వివిధ సమస్యలపై మొత్తం 303 అర్జీలు అందాయి. మెడికల్ వేస్ట్ సేకరణకు అనుమతించాలి గ్రామీణ ప్రాంతాల్లో బయో మెడికల్ వేస్ట్‌ను సేకరించే కార్మికుల్లేకపోవడంతో దాన్ని ఇష్టమొచ్చినట్లు పారేస్తున్నారని ఏవీఐ బయోకేర్ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు. వీటిని సేకరించే అవకాశాన్ని తమకు ఇవ్వాలని కోరారు. జిల్లా వైద్య శాఖ సూచన మేరకు పర్యావరణాన్ని పరిరక్షించేందుకు కృషి చేస్తామన్నారు. కోటేశ్వరరావు, రాజేష్, శీను తదితరులు పాల్గొన్నారు. -
ధాన్యం ధరలు పతనమయ్యాయి
జిల్లాలో ధాన్యం ధరలు రోజురోజుకూ పతనమవుతున్నాయని అఖిల భారత రైతు సంఘ నేతలు కోటిరెడ్డి, రాపూరు రాధాకృష్ణనాయుడు, శ్రీనివాసులురెడ్డి, షానవాజ్, నెల్లూరు రమణయ్య తెలిపారు. పుట్టికి రూ.16,500 మేరే మిలర్లు, దళారులు ఇస్తున్నారని, నెమ్ము పేరుతో 70 కిలోలను అదనంగా తీసుకుంటున్నారని వాపోయారు. జిల్లాలో ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు నామమాత్రంగా మారాయని, వంద కేంద్రాల ద్వారా 11 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్నే సేకరించారని చెప్పారు. గోతాల్లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. బ్యాంక్ గ్యారెంటీలను మిల్లర్లు ఇవ్వడంలేదని చెప్పారు. -
నిరుద్యోగ భృతి ఇవ్వాలంటూ ధర్నా
నెల్లూరు రూరల్: యువతకు ఉద్యోగాలు కల్పించాలని, లేకపోతే నిరుద్యోగ భృతినైనా ఇవ్వాలని ఏఐవైఎఫ్ నేతలు డిమాండ్ చేశారు. ఈ మేరకు కలెక్టరేట్ ఎదుట సోమవారం చేపట్టిన ధర్నాలో వారు మాట్లాడారు. నిరుద్యోగ భృతికి బడ్జెట్లో నిధులు కేటాయించకపోవడం దారుణమన్నారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేష్ ఎన్నో హామీలిచ్చారని, అధికారంలోకి వచ్చాక వీటిని విస్మరించారని ఆరోపించారు. మెగా డీఎస్సీ కాగితాలకే పరిమితమైందని విమర్శించారు. వేలాది మంది నిరుద్యోగులు అప్పులు చేసి కోచింగ్ తీసుకుంటున్నారని, నోటిఫికేషన్ ఎప్పుడొస్తుందో తెలియని పరిస్థితి నెలకొందన్నారు. సమస్యలపై స్పందించకపోతే సీఎం ఇంటిని ముట్టడిస్తామని స్పష్టం చేశారు. -
అంబరాన్నంటిన రంగడి సంబరం
రంగడి రథోత్సవం నెల్లూరు(బృందావనం): నెల్లూరులో పవిత్ర పినాకినీ తీరాన రంగనాయకులపేటలో శ్రీదేవి, భూదేవి సమేత తల్పగిరి రంగనాథస్వామి రథోత్సవం ఆదివారం అంగరంగ వైభవంగా జరిగింది. ఉభయదేవేరులతో సర్వాలంకార శోభితంగా తీర్చిదిద్దిన తిరుత్తేరు (రథం)పై కొలువైన రంగనాథుడిని దర్శించుకునేందుకు తరలివచ్చిన అశేష భక్తజనంతో మాడవీధులు పోటెత్తాయి. దాదాపు ఐదున్నర గంటలకు పైగా ఉత్సవం నేత్రపర్వంగా సాగింది. తొలుత ఆలయంలో వేద పండితులు, అర్చకులు శాస్త్రోక్తంగా పూజలు చేశారు. అనంతరం స్వామి ఉభయ దేవేరులతో తూర్పు రాజగోపురం సమీపంలో ఉన్న రథమండపం వద్ద తిరుత్తేరులోకి వేంచేపు చేశారు. వివిధ పూజల తర్వాత మండం నుంచి రథం పినాకినీ తీరం వైపు ఉన్న ఉత్తర మాడవీధి వైపునకు అనంతరం తూర్పున ఉన్న గోపురం వీధి రైల్వేగేట్ వరకు అక్కడి నుంచి తిరిగి గోపురం వీధి, రంగనాయకులపేట, సంతపేట, నాలుగుకాళ్ల మండపం వరకు, అక్కడి నుంచి వెనుదిరిగి మండపం వరకు జరిగింది. ● బ్రహ్మోత్సవాల్లో భాగంగా సంప్రదాయంగా నాలుగు కాళ్ల మండపం వద్ద లక్ష్మీదేవి, చెంచులక్ష్మి సమేత వేదగిరి లక్ష్మీనృసింహస్వామి వారు శ్రీదేవి, భూదేవి సమేత తల్పగిరి రంగనాథస్వామికి పట్టువస్త్రాలు సమర్పించారు. వైభవంగా రథోత్సవం తరలివచ్చిన అశేష భక్తజనం వేడుకగా ఎదురుకోలోత్సవం -
ఇదేనా ప్రశాంతమ్మ పాలన?
పచ్చనాయకుడు చెప్పినట్లు విని వైఎస్సార్సీపీ నాయకులపై కేసులు పెడితే పోలాసాక్షి, టాస్క్‌ఫోర్స్: బసవారెడ్డి శంకయ్య నుంచి రేబాల దశరథరామిరెడ్డి, వెంకురెడ్డి, పెళ్లకూరు రామచంద్రారెడ్డి, నల్లపరెడ్డి శ్రీనివాసులురెడ్డి, నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి వంటి రాజకీయ ఉద్దండులు కోవూరు నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించారు. వర్గ రాజకీయాలకు దూరంగా పాలన సాగించి.. ప్రజాదరణ పొందారు. ఇటువంటి రాజకీయ చైతన్యంతోపాటు ప్రశాంత వాతావరణం ఉండే కోవూరులో వేమిరెడ్డి ప్రశాంతమ్మ పాలనలో రెడ్‌బుక్ రాజ్యాంగం, రౌడీ రాజకీయాలు చోటు చేసుకుంటున్నాయి. వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి సతీమణిగా రాజకీయాల్లోకి వచ్చిన ప్రశాంతిరెడ్డి తన తొమ్మిది నెలల పాలనలో అశాంతి వాతావరణాన్ని ప్రేరేపిస్తున్నారనే విమర్శలు రాజకీయంగా దూమారం రేపుతున్నాయి. వైఎస్సార్సీపీ నాయకులు అధికార పార్టీ నేతల రెడ్‌బుక్ రాజ్యాంగం అక్రమాలు ఎత్తిచూపితే కేసులతో వేధింపులు వైఎస్సార్సీపీ నేత వీరి చలపతిరావు, అనుచరులపై కేసులు బూతు పురాణాలతో రెచ్చిపోతున్న పచ్చనేతలు రాజకీయ చైతన్యానికి, విలువలకు కోవూరు నియోజకవర్గం మారు పేరు. ఇక్కడి నుంచి ఎన్నికై దేశ రాజకీయాల్లో ప్రాతినిధ్యం వహించిన గొప్ప రాజనీతిజ్ఞులున్నారు. దాదాపు ఏడు దశాబ్దాలుగా రాజకీయ విద్వేషాలకు, రాగద్వేషాలకు తావులేని గడ్డపై రెడ్‌బుక్ రాజ్యమేలుతోంది. జిల్లాలో చరిత్ర కలిగిన కుటుంబం నుంచి మహిళా నేతగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అనతి కాలంలోనే వర్గ రాజకీయాలు, కక్షలకు పురిగొల్పుతూ తెర వెనుక నుంచి ఆజ్యం పోస్తూ కొత్త సంప్రదాయానికి తెరతీస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. -
మా బతుకుదెరువు పోతుంది
కావలి: బీపీసీఎల్‌కు భూమిలిచ్చేది లేదని గుమ్మడి బొందల గ్రామస్తులు తెగేసి చెప్పారు. సీపీఎం, వ్యవసాయ కార్మిక సంఘం నేతలు కావలి రూరల్ మండలం రుద్రకోట పంచాయతీలోని ఆ గ్రామంలో రైతులు, స్థానికులతో ఆదివారం సమావేశం నిర్వహించారు. బీపీసీఎల్ ఆయిల్ కంపెనీకి గ్రామంలోని పొలాలు పూర్తిగా అప్పగించాలని అధికారులు చేస్తున్న కుట్రలపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రామాయపట్నం పోర్టు అనుసంధానంగా ఏర్పాటు చేయబోతున్న ఆయిల్ కంపెనీకి పొలాలను అప్పగిస్తే, తమ బతుకుదెరువు ఏమైపోవాలని, ఎలా బతకాలని ప్రశ్నించారు. పొలాలు పోతే కల్లుగీత వృత్తి కనుమరుగైపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే పశువులు మేతకు తిరిగేదానికి కూడా అవకాశం లేకుండా పోతుందన్నారు. ప్రభుత్వం భూసేకరణను రద్దు చేసుకోవాలని, లేకపోతే పూర్తి స్థాయిలో ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సీపీఎం సీనియర్ నాయకుడు తాళ్లూరు మాల్యాద్రి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ సభ్యులు మారుపూడి రాధాకృష్ణయ్య, వలపర్ల వెంకయ్య, తుళ్లూరు వెంకయ్య, రామకృష్ణ, జమ్ముల శివశంకర్‌రావు, వెంకటస్వామి, ఉప్పాల ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు. బీపీసీఎల్‌కు భూములివ్వం గుమ్మడిబొందల గ్రామస్తుల అల్టిమేటంనిమ్మ ధరలు (కిలో) పెద్దవి : రూ.90 సన్నవి : రూ.60 పండ్లు : రూ.40 -
నెలరోజులు.. రూ.5 కోట్లు
నెల్లూరు(క్రైమ్): సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. నయామోసాలతో క్షణాల్లో జనాలను దోచేస్తున్నారు. ఇళ్లలో దొంగతనాలు.. దారిదోపిడీల కన్నా ప్రస్తుతం సైబర్ నేరాలే అందరిని హడలెత్తిస్తున్నాయి. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో విధులు నిర్వహిస్తున్న కొందరు ఇతర ఆదాయాల కోసం ఆన్లైన్లో అన్వేషిస్తున్నారు. ఇది గమనించిన సైబర్ నేరగాళ్లు వలవేసి రూ.లక్షలు కొట్టేస్తున్నారు. చదువుకున్నవారే ఎక్కువగా మోసపోతున్నారు. నెలరోజుల వ్యవధిలో జిల్లాకు చెందిన డాక్టర్లు, ఆడిటర్లు, విశ్రాంత ఉద్యోగి తదితరుల నుంచి రూ.5 కోట్ల వరకు సైబర్ నేరగాళ్లు దోచేశారు. ఏడాదికేడాది మోసాలు పెరుగుతూ ఉండటం ఆందోళన కలిగిస్తోంది. సీబీఐ పేరుతో.. ప్రస్తుతం సైబర్ నేరగాళ్లు కొత్తపంథాలో నేరాలకు పాల్పడుతన్నారు. డిజిటల్ అరెస్ట్‌లు ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. సైబర్ నేరాల్లో ప్రస్తుతం ఈ తరహా మోసాలే అధికంగా జరుగుతున్నాయి. సీబీఐ, ఈడీ, నార్కోటిక్స్ అధికారుల పేరిట సమాజంలో సంపన్నవర్గాలు, విద్యావంతులు, ఉద్యోగులు, వైద్యులు, పిల్లలకు దూరంగా ఉంటున్న తల్లిదండ్రులకు ఫోన్ చేసి నమ్మేలా ప్రవర్తిస్తారు. అనంతరం విదేశాల నుంచి వచ్చిన కొరియర్లో డ్రగ్స్, ఇతర మాదకద్రవ్యాలు ఉన్నాయని, మీపేరుపై అరెస్ట్ వారెంట్ జారీ అయ్యిందంటూ నకిలీ పత్రాలను వాట్సాప్‌లో పంపుతున్నారు. విచారణ పూర్తయ్యే వరకూ ఇంట్లో నుంచి కదలనివ్వకుండా నిర్బంధిస్తున్నారు. వివరాలు సేకరిస్తున్నట్లు నటిస్తూ కేసు నుంచి బయటపడాలంటే తాము చెప్పినంత మొత్తాన్ని చెల్లించాలని లేదంటే అరెస్ట్ తప్పదని కంగారుపెట్టి వారు అడిగినంత ఖాతాలో జమయ్యాక వదిలేస్తున్నారు. మనీ ల్యాండరింగ్ చేస్తున్నారంటూ మరికొందర్ని బెదిరించి డబ్బులు కాజేస్తున్నారు. ట్రేడ్ మార్కెట్లో పెట్టుబడి పెడితే అధిక లాభాలు వస్తాయని, వర్క్ ఫ్రం హోమ్ పేరిట నమ్మించి ఇంకొందరిని మోసగిస్తున్నారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలు మోసగాళ్లు చెప్పేవి నిజమని భావించొద్దు. అసలు డిజిటల్ అరెస్ట్‌లు లేవు. నిజంగా ఏదైనా కేసు ఉంటే సంబంధిత పోలీస్ అధికారి నేరుగా వచ్చి మాట్లాడతారు. దేశంలో ఏ దర్యాప్తు సంస్థ కూడా వీడియోకాల్‌లో విచారణ చేయదు. అలా చేస్తే వారు సైబర్ నేరగాళ్లని అర్థం చేసుకోవాలి. మోసపూరిత ఫోన్ కాల్ వస్తే సమీప పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలి. సైబర్ మోసాలకు గురైతే వెంటనే టోల్‌ఫ్రీ నంబర్ 1930 లేదా డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.సైబర్‌క్రైమ్.జీఓవీ.ఇన్ వెబ్సైట్లో ఫిర్యాదు చేయాలి. తక్షణ ఫిర్యాదుతో బాధితులు కోల్పోయిన డబ్బులు తిరిగి పొందే అవకాశాలుంటాయని పోలీస్ అధికారులు పేర్కొంటున్నారు.డిజిటల్ అరెస్ట్ ద్వారా కాజేసిన సైబర్ నేరగాళ్లు రోజురోజుకూ పెరుగుతున్న బాధితులు ఇటీవల మోసపోయిన విశ్రాంత ఉద్యోగి అప్రమత్తంగా ఉండాలంటున్న పోలీసులు నెల్లూరు చైతన్యపురి కాలనీకి చెందిన విశ్రాంత ఉద్యోగిని సైబర్ నేరగాళ్లు డిజిటల్ అరెస్ట్ చేశారు. ఫిబ్రవరి 27 నుంచి మార్చి 5వ తేదీ వరకు అతడి వద్ద నుంచి రూ.1.02 కోట్ల నగదును వివిధ బ్యాంక్ ఖాతాలకు జమ చేయించుకున్నారు. బెయిల్ కావాలంటే రూ.3 కోట్లు ఇవ్వాలని చెప్పడంతో మోసపోయానని గ్రహించిన బాధితుడు వేదాయపాళెం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. జిల్లాకు చెందిన ఇద్దరు డాక్టర్లను సైతం ఇదే తరహాలో మోసగించారు. ఈ విషయంపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. పొగతోటకు చెందిన ఓ మహిళకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఆన్లైన్ ట్రేడింగ్‌పై లింక్ వచ్చింది. ఆమె దానిపై క్లిక్ చేయగా వాట్సాప్ నంబర్‌కు నిషాబాసు అనే మహిళ మెసేజ్ పంపింది. ఆన్లైన్ మార్కెటింగ్‌లో లాభాలు వచ్చేందుకు సలహాలు, సూచనలిస్తామని నమ్మబలికి తమ కంపెనీ యాప్‌ను మహిళ ఫో్న్లో ఇన్స్టాల్ చేయించి నగదు డిపాజిట్ చేయించింది. ట్రేడింగ్‌లో ఆదాయం వచ్చేలా చేసి ఆమెను నమ్మించింది. అనంతరం మహిళ చేత రూ.2.46 కోట్లు పెట్టించి మోసగించింది. బాధితురాలు చిన్నబజారు పోలీసులకు ఫిర్యాదు చేసింది.డిజిటల్ అరెస్ట్‌లు ఉండవు సైబర్ నేరగాళ్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. పోలీస్ అధికారులు వీడియోకాల్ చేసి కేసుల విచారణ చేయరు. అలా చేశారంటే మోసం చేస్తున్నారని గుర్తించాలి. డిజిటల్ అరెస్ట్ల్లేవు. సైబర్ మోసాలపై జిల్లాలో విస్తృ తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఎవరైనా మోసాలకు గురైతే 1930, స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయండి. – జి.కృష్ణకాంత్, ఎస్పీ -
రైలు ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి మృతి
నెల్లూరు(క్రైమ్): పట్టాలు దాటుతుండగానో? లేక బహిర్భూమికెళ్లినప్పుడు ప్రమాదవశాత్తు జరిగిందో.. స్పష్టమైన కారణం తెలియదు గానీ రైలు ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి మృతిచెందాడు. ఈ ఘటన ఆదివారం తెల్లవారుజామున నెల్లూరు వేదాయపాళెం రైల్వేస్టేషన్ సమీప నెల్లూరు వైపు వచ్చే పట్టాలపై చోటుచేసుకుంది. మృతుడి వయసు 40 నుంచి 45 ఏళ్లలోపు ఉండొచ్చని భావిస్తున్నారు. మృతదేహం గుర్తుపట్టలేని విధంగా తయారైంది. నెల్లూరు రైల్వే ఎస్సై జి.మాలకొండయ్య ప్రమాద స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని జీజీహెచ్ మార్చురీకి తరలించి కేసు నమోదు చేశారు.రోడ్డు దాటుతుండగా.. ● కారు ఢీకొని మహిళ మృతి బుచ్చిరెడ్డిపాళెం: ఓ మహిళ రోడ్డు దాటుతుండగా కారు వేగంగా ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందిన ఘటన ఆదివారం బుచ్చిరెడ్డిపాళెం నగర పంచాయతీలో జరిగింది. స్థానికులు, పోలీసుల కథనం మేరకు.. సంగం మండలం జెండాదిబ్బకు చెందిన షేక్ రహమత్ (55) బుచ్చిరెడ్డిపాళెం నగర పంచాయతీ పరిధిలోని ముంబై జాతీయ రహదారిపై ఉన్న వే బ్రిడ్జి వద్ద రోడ్డు దాటుతోంది. నెల్లూరు వైపు అతివేగంగా వస్తున్న కారు ఆమెను ఢీకొట్టడంతో మృతిచెందింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఆగని చికెన్ వ్యర్థాల అక్రమ రవాణా ● తాజాగా పడుగుపాడు వద్ద పట్టుకున్న పోలీసులు కోవూరు: కొందరు వ్యక్తులు చికెన్ వ్యర్థాల అక్రమ రవాణాను యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు. ఆదివారం తెల్లవారుజామున చైన్నె నుంచి జాతీయ రహదారి మీదుగా మినీ వ్యాన్‌లో వ్యర్థాలు వెళ్తున్న విషయాన్ని ఎఫ్డీఓ శ్రీనివాసులు కోవూరు పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే పోలీసులు పడుగుపాడు వద్ద వాహనాన్ని ఆపి పరిశీలించగా అందులో 17 చికెన్ వేస్ట్ డ్రమ్ములున్నాయి. వెంటనే డ్రైవర్ ఈగ నాగరాజు, క్లీనర్ దాసరి గణేష్‌పై కేసు నమోదు చేసి వాహనాన్ని సీజ్ చేశారు. అనంతరం వ్యర్థాలను సమీపంలోని పెన్నానదిలో పూడ్చిపెట్టారు. ఈ సందర్భంగా శ్రీనివాసులు మాట్లాడుతూ కోవూరు నియోజకవర్గంలో ఎక్కడైనా చికెన్ వ్యర్థాలను రవాణా చేస్తుంటే తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. -
ఈత కొట్టేందుకు పెన్నా నదిలో దిగి..
● బాలుడి మృతి నెల్లూరు(క్రైమ్): స్నేహితులతో కలిసి పెన్నానదికి వెళ్లిన బాలుడు ప్రమాదవశాత్తు నీటిలో గల్లంతై మృతిచెందాడు. పోలీసుల కథనం మేరకు.. తడికలబజారు ప్రాంతంలో శ్రీదేవి కుటుంబం నివాసం ఉంటోంది. ఆమె పెద్ద కుమారుడు నందకిశోర్ తొమ్మిదో తరగతి, చిన్నకుమారుడు మహీధర్ (14) ఆర్ఎస్ఆర్ స్కూల్లో ఏడో తరగతి చదువుతున్నారు. ఆదివారం సెలవు కావడంతో మహీధర్ తన స్నేహితులైన కిరణ్‌కుమార్, రోహన్‌కుమార్, సాయి, చరణ్ తదితరులతో కలిసి పెన్నానదికి వెళ్లాడు. అందరూ కలిసి తిక్కన పార్కు సమీపంలో నదిలో చేపలు పట్టారు. తర్వాత ఈతకొట్టేందుకు నదిలో దిగే క్రమంలో మహీధర్ ప్రవాహంలో చిక్కుకుపోగా ఇంతలో అక్కడకు చేరుకున్న నందకిశోర్ రక్షించే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండాపోయింది. మహీధర్ నీటిలో గల్లంతయ్యాడు. స్థానికుల సమాచారం మేరకు సంతపేట ఎస్సై బాలకృష్ణ ఘటనా స్థలానికి చేరుకున్నారు. కుమారుడు గల్లంతైన విషయం తెలుసుకున్న శ్రీదేవి తన భర్త వంశీ, బంధువులతో కలిసి పెన్నానదికి చేరుకున్నారు. అందరూ కలిసి బాలుడి కోసం గాలించారు. కొద్దిసేపటికి మహీధర్‌ను గుర్తించి బయటకు తీసుకొచ్చి పరిశీలించగా అప్పటికే మృతిచెందాడు. బాధిత తల్లి ఫిర్యాదు మేరకు ఎస్సై కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం జీజీహెచ్ మార్చురీకి తరలించారు. -
మిల్లర్ల మాయాజాలంతో నష్టపోతున్నాం
● బ్రహ్మదేవి రైతుల ఆందోళన ముత్తుకూరు: ‘బీపీటీ రకం ధాన్యానికి ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర దక్కడం లేదు. మిల్లర్ల మాయాజాలంతో తీవ్రంగా నష్టపోతున్నాం’ అని మండలంలోని బ్రహ్మదేవి గ్రామానికి చెందిన రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. వారు శనివారం విలేకరులతో మాట్లాడారు. కొనుగోలు కేంద్రాల్లో నిబంధనల వల్ల ధాన్యం అమ్మకం చేసే పరిస్థితి కరువైపోయిందని వాపోయారు. మూడు రోజులు ఎండలో ధాన్యం ఆరబెట్టి మిల్లర్ల వద్దకు తీసుకెళ్తే 18 శాతం తేమ ఉన్నట్టు సాకులు చూపి, నాలుగు కిలోల మేర దోచేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వమే ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. రెండో పంటకు తాము సిద్ధంగా లేమంటూ ప్రకటించారు. ఎన్నికలకు ముందు పాత ధాన్యం పుట్టి రూ.27,000లకు పైగా అమ్మకం చేశామని, కూటమి ప్రభుత్వంలో ధర క్రమంగా తగ్గిపోయిందన్నారు. ఈ మాయాజాలం వెనుక ఎవరి హస్తం ఉందని రైతులు ప్రశ్నించారు. ప్రస్తుతం పాత వాటి ధర రూ.20,000లకు పడిపోయిందని విచారం వ్యక్తం చేశారు. -
ఈఓ నిర్లక్ష్యానికి పరాకాష్ట
బిట్రగుంట: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం బిలకూట క్షేత్రంలో కొలువైన శ్రీప్రసన్న వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల నిర్వహణలో దేవదాయశాఖ అధికారుల నిర్లక్ష్య వైఖరిపై భక్తులు భగ్గుమంటున్నారు. బ్రహ్మోత్సవాల్లో ప్రతిష్టాత్మకమైన రథోత్సవం ప్రారంభమైన వెంటనే నిలిచిపోవడం ఈఓ నిర్లక్ష్యానికి పరాకాష్ట అని అంటున్నారు. ఆలయ కార్యనిర్వహణాధికారి అరవ రాధాకృష్ణ, అతని సోదరుడు రాంబాబులు కొండపై తిష్టవేసి క్షేత్ర వైభవాన్ని, ప్రాశస్త్యాన్ని మంటగలుపుతున్నారని పాతబిట్రగుంట, కొండబిట్రగుంట గ్రామస్తులు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. స్వామివారి కల్యాణోత్సవం అనంతరం నిర్వహించే రథోత్సవం అధికారుల తప్పిదం కారణంగా నిలిచిపోయిన విషయం తెలిసిందే. రథం చక్రాల వద్ద సమస్యలు తలెత్తి రథోత్సవం ప్రారంభమైన ఐదు నిమిషాల్లోనే రథం కదలకుండా నిలిచిపోవడంతో భక్తుల్లో ఆగ్రహం వ్యక్తమైంది. 2023లో రథోత్సవం సందర్భంగా రథం ఒక పక్కకు ఒరిగిపోవడం, ఈ దఫా అసలు కదలకపోవడంతో భక్తులు కలత చెందారు. ఫిట్నెస్ పరిశీలించకుండా, ట్రయల్ రన్ నిర్వహించకుండా రథాన్ని ఒకేసారి రథోత్సవానికి సిద్ధం చేయడంలో అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుందని విమర్శిస్తున్నారు. ఆలయ అధికారుల నిర్లక్ష్యం కారణంగా స్వామివారి సేవల్లో వరుసగా ఆటంకాలు ఏర్పడుతున్నాయంటూ రథం వద్దే అధికారులతో వాగ్వాదానికి దిగారు. ఈఓ రాధాకృష్ణ డౌన్‌డౌన్, రాంబాబు డౌన్‌డౌన్ అంటూ భక్తులు నినాదాలు చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. భక్తులకు, పాతబిట్రగుంట, కొండబిట్రగుంట గ్రామస్తులకు సర్దిచెప్పి శాంతింపచేసేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. పోలీసుల జోక్యంతో అప్పటికి భక్తులు శాంతించినా, ఈఓని మాత్రం తక్షణమే బదిలీ చేయాలంటూ గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. ఉత్సవాల సందర్భంగా పెత్తనమంతా కావలికి చెందిన ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టారని, కొండపై స్వామివారి సేవకన్నా ప్రైవేట్ వ్యక్తుల అజమాయిషీ ఎక్కువగా ఉందని ఆరోపిస్తున్నారు. వీఐపీ పాస్‌లు ఇష్టారాజ్యంగా కేటాయించడంతో సామాన్య భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని విమర్శిస్తున్నారు. తక్షణమే ఈఓని బదిలీ చేసి రథోత్సవం వైఫల్యంపై విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నారు. అంతా ఇష్టారాజ్యమే బిలకూట క్షేత్రంలో రెండేళ్లుగా అధికారుల ఇష్టారాజ్యంగా మారిపోయింది. ఈఓ సోదరుడు కొండపైనే తిష్టవేయడం, స్వామివారి సన్నిధిలో పెళ్లి చేసుకోవాలనుకునే పేదలు, భక్తులు ఈఓ సోదరుడి దయాదాక్షిణ్యాలపైన ఆధారపడాల్సి రావడంతో పాటు అంతా వ్యాపారంగా మారిపోవడంతో తరచుగా విమర్శలు వినిపిస్తున్నాయి. వీటితోపాటు బిలకూట క్షేత్రంలో జరుగుతున్న అభివృద్ధి పనులు, దాతల విరాళాలను కూడా గోప్యంగా ఉంచడం, బ్రహ్మోత్సవాల సమయంలో కూడా ఇదే నిర్లక్ష్యాన్ని, గోప్యతను పాటించడంపై పాత బిట్రగుంట, కొండబిట్రగుంట గ్రామస్తుల్లో తీవ్ర ఆగ్రహాన్ని కలిగించింది. ఉత్సవాల్లో స్వామి వారిని తమ భుజాలపై మోసే మోతగాళ్లు కూడా ఈఓ వైఖరిపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. వివాదం మరింత ముదిరి బిలకూట క్షేత్రం ప్రతిష్టకు మచ్చ రాకముందే అధికారులు ఈఓని బదిలీ చేసి ఆలయ వ్యవహారాలను చక్కదిద్దాలని కోరుతున్నారు. రథోత్సవం నిలిచిపోవడంపై భగ్గుమంటున్న భక్తులు ఈఓ, అతని సోదరుడికి వ్యతిరేకంగా నినాదాలు ఈఓని బదిలీ చేసి విచారణ చేపట్టాలని డిమాండ్ -
ప్రభుత్వ ఆదేశాల మేరకు నిలిపివేశాం
గత ప్రభుత్వంలో మెరుగైన సేవలు పాడి రైతుల క్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంచార పశు వైద్య అంబులెన్స్ వ్యవస్థ ప్రవేశ పెట్టారు. అత్యాధునికంగా హైడ్రాలిక్ సిస్టమ్‌తో పశువులను నేరుగా అంబులెన్స్‌లోకి ఎక్కించి ఆస్పత్రికి తరలించి మెరుగైన వైద్యసేవలు అందించి తిరిగి తీసుకువచ్చి దించే విధంగా వీటికి రూపకల్పన చేశారు. వీటి ద్వారా రైతులకు పైసా ఖర్చు లేకుండా ఇంటి వద్దనే వైద్యం అందేది. ఒక్కొక్క నియోజక వర్గానికి 2 చొప్పున కేటాయించారు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో మొదటి దఫా 9 వాహనాలు, రెండో దఫా మరో 10 వాహనాలను కేటాయించారు. దీంతో వేలాది మంది పశుపోషకులకు మేలు జరిగింది. ఈ సర్వీసు ప్రజాదరణ పొందింది. అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న ఈ సర్వీసులను నిర్వీర్యం చేయడంతో పాడిపై ఆధారపడే రైతులు ప్రభుత్వ తీరుపై ఆగ్రహంతో ఉన్నారు. నేనేమి చేశాను పాపం!గ్రామీణ ప్రాంత ప్రజల ప్రధాన ఆదాయ వనరు వ్యవసాయం తర్వాత పాడిపరిశ్రమే. పల్లెలో రైతుల జీవన ప్రమాణాలు మెరుగు పడాలంటే పాడి, పంటలు ఎంతో ముఖ్యం. వ్యవసాయం కలిసి రాక పోయినా పాడి ద్వారా కుటుంబ పోషణకు ఇబ్బంది ఉండదు. అటువంటి పాడి పశువులకు అత్యవసర వైద్య సేవలను గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. ఇందు కోసం సంచార అంబులెన్స్‌లను నియోజకవర్గానికి రెండు చొప్పున ఏర్పాటు చేసింది. వీలైతే ఇంటి వద్దనే వైద్యం, మెరుగైన వైద్యం అవసరమైతే ఆస్పత్రికి తరలించేందుకు వీలుగా అంబులెన్స్ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. ప్రస్తుతం ఈ సేవలను కూటమి ప్రభుత్వం నిలిపివేసింది. ఉదయగిరి: పశువుల అత్యవసర వైద్య సేవలకు కూటమి ప్రభుత్వం మంగళం పాడుతోంది. గత ప్రభుత్వంలో ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన ఒక్కొక్క పథకాన్ని అటకెక్కిస్తొంది. ఆయా కార్యక్రమాల ప్రయోజనాన్ని పరిగణలోకి తీసుకోకుండా కక్ష పూరితంగా పథకాలను నిర్వీర్యం చేస్తోంది. అందులో భాగంగా మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో ఇంటి వద్దనే పశువులకు అత్యవసర వైద్య సేవలు అందించే సంచార పశువైద్య అంబులెన్స్‌ల సర్వీసులకు స్వస్తి పలుకుతోంది. తాజాగా ఈ నెల మొదటి నుంచి ఉమ్మడి జిల్లాలో 9 అంబులెన్స్ సర్వీసులు ఆగిపోయాయి. అందులో పని చేసే వైద్యులు, టెక్నీషియన్, ఫార్మసిస్టులు, పైలట్లను ఇంటికి పంపింది. కూటమి సర్కార్ కక్ష ధోరణి చంద్రబాబు సర్కార్ పాడిపై ఆధారపడే పశుపోషకులను వదలడం లేదు. వైఎస్సార్‌ీసీపీ ప్రభుత్వం ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 2021లో మొదటి విడతలో 9, రెండో విడతలో 10 వాహనాలు మంజూరు చేసింది. ఒక్కొక్క వాహనంలో వైద్యులు, టెక్నీషియన్, ఫార్మసిస్టులు, పైలట్ కలిపి నలుగురు ఉంటారు. మారుమూల గ్రామాల్లోనూ పశువులకు అత్యవసర వైద్య సేవలు అవసరమైతే 1962 టోల్ ఫ్రీ నంబరుకు ఫోన్ చేస్తే అంబులెన్స్‌లు నేరుగా ఇంటికి వెళ్లి వైద్య సేవలందిస్తాయి. వీటి నిర్వహణ రాష్ట్ర వ్యాప్తంగా జీవీకే ఫౌండేషన్‌కు అప్పగించింది. దీనికి గత నెలలో గడుపు ముగిసింది. దీంతో మార్చి 1వ తేదీ నుంచి మొదటి ఫేజ్‌లో మంజూరైన 9 అంబులెన్స్‌లు నిలిపి వేసి అందులో పనిచేసే వారిని ఇంటికి పంపారు. కారణంగా పశు వైద్యసేవలు ఆగిపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సర్కార్ వైఖరిపై మండి పడుతున్నారు. సంచార అంబులెన్స్‌ల నిలిపివేత పాడి రైతులకు శాపంగా పరిణమించిన ప్రభుత్వ నిర్ణయం వైద్యులు, టెక్నీషియన్, ఫార్మసిస్టులు, పైలట్ కొలువులు గోవిందా గత ప్రభుత్వ పథకాలపై కూటమి సర్కార్ కక్ష ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రస్తుతం మొదటి ఫేజ్‌లో ఉన్న 9 వాహనాలను నిలిపివేశాం. వీటికి నిర్వహణ ఏజెన్సీ కాల పరిమితి పూర్తి కావడంతో ఫిట్నెస్ పరిశీలన చేయమన్నారు. అది కూడా చేస్తున్నాం. తదిపరి ప్రభుత్వ అదేశాల మేరకు తగిన చర్యలు తీసుకుంటాం. – రమేష్‌నాయక్, జేడీ పశుసంవర్థక శాఖ -
గుర్తుతెలియని వ్యక్తి మృతి
నెల్లూరు(క్రైమ్): నెల్లూరు జీజీహెచ్‌లో చికిత్స పొందుతూ శనివారం గుర్తుతెలియని వ్యక్తి మృతిచెందాడు. పోలీసుల కథనం మేరకు.. సుమారు 40 ఏళ్ల వయసున్న గుర్తుతెలియని వ్యక్తి ఈనెల 13వ తేదీ సాయంత్రం పప్పులవీధి పార్కు వద్ద అపస్మారకస్థితిలో ఉండగా స్థానికులు 108కు సమాచారం అందించారు. అంబులెన్స్ సిబ్బంది అతడిని చికిత్స నిమిత్తం జీజీహెచ్‌లో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందాడు. వీఆర్వో నాగేశ్వరమ్మ ఫిర్యాదు మేరకు నవాబుపేట పోలీసులు కేసు నమోదు చేశారు. మృతుడి వివరాలు తెలిసిన వారు 94407 96306 ఫోన్ నంబర్‌కు సమాచారం అందించాలని ఇన్స్పెక్టర్ అన్వర్‌బాషా కోరారు. యువతి అదృశ్యం నెల్లూరు(క్రైమ్): యువతి అదృశ్యమైన ఘటనపై నెల్లూరు దర్గామిట్ట పోలీసులు శనివారం కేసు నమోదు చేశారు. వారి కథనం మేరకు.. మాగుంట లేఅవుట్‌కు చెందిన ఓ యువతి ఫ్యాషన్ డిజైనింగ్ పూర్తి చేసి ఇంట్లో ఉంటోంది. ఈనెల 14వ తేదీన ఆమె ఇంటి నుంచి అదృశ్యమైంది. బాధిత కుటుంబసభ్యులు గాలించారు. జాడ తెలియకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు దర్యాప్తు చేస్తున్నారు.పూరిల్లు దగ్ధం నెల్లూరు(వీఆర్సీసెంటర్): నగరంలోని 53వ డివిజ న్ గాంధీ గిరిజన కాలనీలో శనివారం పూరిల్లు దగ్ధమైంది. వివరాలు.. గాంధీ గిరిజన కాలనీలోని పూరింట్లో కట్టా నాగయ్య కుటుంబం నివాసం ఉంటోంది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఇంటికి నిప్పంటుకుని దగ్ధమైంది. ఈ ప్రమాదంలో వస్తువులు కాలిపోయాయి. ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటల్ని ఆర్పివేశారు. -
అగ్రిగోల్డ్ సంపద దొంగలను వదలం
ఉదయగిరి: వైఎస్సార్సీసీ అధికారంలోకి వచ్చిన వెంటనే అగ్రిగోల్డ్ జామాయిల్, ఎర్రచందనం సంపద దోచేసిన దొంగలను వదలమని, వారి నుంచి ప్రతి పైసా వసూలు చేసి అగ్రిగోల్డ్ బాధితులకు అందజేస్తామని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీమంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి చెప్పారు. ఆయన శనివారం ఉదయగిరి నియోజవర్గ సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్సీలు పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి, మేరిగ మురళీతో కలిసి వరికుంటపాడు మండలం కనియంపాడు, భాస్కరాపురంలో ఉన్న అగ్రిగోల్డ్ భూముల్లో కొట్టేసిన వృక్ష సంపదను పరిశీలించారు. అనంతరం తహసీల్దార్ హేమంత్‌కుమార్‌ను కలిసి అగ్రిగోల్డ్ భూముల్లో పట్టపగలే వృక్ష సంపదను దోపిడీ చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వినతిపత్రం అందజేశారు. కాకాణి మాట్లాడుతూ 2014 చంద్రబాబు పాలనలో అగ్రిగోల్డ్ కుంభకోణం వెలుగు చూసిందని, దీనికి బాధ్యులైన యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్మోహన్రెడ్డి పోరాడినా పట్టించుకోకుండా కంపెనీ యాజమాన్యంపై వల్లమాలిన ప్రేమ చూపించారన్నారు. కోర్టుల జోక్యంతో సీఐడీకి అప్పగించారన్నారు. తమకు న్యాయం జరుగుతుందని బాధితులు భావిస్తున్న తరణంలో 15 ఏళ్లుగా 70 ఎకరాల్లో పెరిగిన రూ.3.5 కోట్ల విలువ చేసే సంపదను టీడీపీ నేతలు నరికి సొమ్ము చేసుకున్నారన్నారు. ప్రభుత్వ అధీనంలోని సీఐడీ జప్తు చేసిన సొమ్మును పట్టపగలు దోచేస్తే చర్యలు తీసుకోకుండా పేద ప్రజలకు ఈ ప్రభుత్వం ద్రోహం చేస్తుందన్నారు. అధికారులు, పోలీసులు దొంగలను పట్టుకోవడం మానేసి మమ్మల్ని నివారించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రతిపక్ష పార్టీ కార్యకర్తలపై ఎప్పుడూ ఇంతగా వేధించిన పరిస్థితులు లేవు. జిల్లాలో కలెక్టర్, ఎస్పీలు ఉత్సవ విగ్రహాలుగా మారారన్నారు. అధికారం ఎవరికి శాశ్వతం కాదని పోలీసులు, రెవెన్యూ అఽధికారులు గుర్తించుకోవాలన్నారు. మాకు అధికారం వచ్చిన తర్వాత ఎక్కడ ఉన్నా ఎవరినీ వదిలే ప్రసక్తే లేదన్నారు. ఉద్యోగ విరమణ చేసినా జైలుకు పంపించడం ఖాయమన్నారు. సంపద సృష్టించడం అంటే దోపిడీనా? సంపద సృష్టించడం అంటే దోపిడీనా అని ఎమ్మెల్సీలు పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి, మేరిగ మురళీధర్, ఉదయగిరి సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్‌రెడ్డి నిలదీశారు. పట్టపగలే అగ్రిగోల్డ్ భూముల్లో జామాయిల్ నరికి తీసుకెళ్తుంటే వ్యవస్థలు చేష్టలుడిగి చూస్తున్నాయని విమర్శించారు. అధికారులు తప్పులు చేసి బలికావద్దు. తిరిగి వైఎస్సార్సీపీ అధికారంలోకి రావడం ఖాయమని, భవిష్యత్‌లో కార్యకర్తల మాటే జగన్ చర్యగా ఉంటుందని గ్రహించాలన్నారు. ప్రతి కార్యకర్తకు న్యాయం జరుగుతుందన్నారు. అగ్రిగోల్డ్ ఆస్తులు దిగమింగినదంతా కక్కించి బాధితులకు అందజేస్తామన్నారు. వైఎస్సార్సీపీ నేతలను అడ్డుకున్న పోలీసులు అగ్రిగోల్డ్ భూములు పరిశీలించేందుకు వచ్చిన వైఎస్సార్సీపీ నేతలను పోలీసుల ద్వారా అడ్డుకునేందుకు అధికార పార్టీ నేతలు ప్రయత్నించారు. పోలీసులు సివిల్ డ్రెస్‌లో పహారా కాశారు. పోలీసులు అడ్డుంకులు, ఆంక్షలు విధించినా లెక్క చేయకుండా క్షేత్ర పర్యటన చేసి, జామాయిల్ కర్రను నరికి సొమ్ము చేసుకున్న టీడీపీ నేతల వివరాలను స్థానికులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు షేక్ అలీ అహ్మద్, ఎం. తిరుపతినాయుడు, సిద్ధయ్య, గుర్రం భాస్కర్‌రెడ్డి, ఎం.మురళీకృష్ట, ఆంజనేయులు, చెన్నారాయుడు, మున్నంగి శ్రీనివాసులు, బొడ్డు వెంకటేశ్వర్లు తదితరులు ఉన్నారు. అవినీతి అధికారులకు అరదండాలు తప్పవు వరికుంటపాడులో అగ్రిగోల్డ్ భూముల పరిశీలన మాజీ మంత్రి కాకాణి, మేకపాటి, ఎమ్మెల్సీలు పర్వతరెడ్డి, మేరిగ -
18న కోవూరు, ఆత్మకూరులో జాబ్‌మేళా
నెల్లూరు (పొగతోట): ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఎంప్లాయీమెంట్ ఆఫీస్, సీడాప్ సంయుక్తంగా ఈ నెల 18న కోవూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ఆత్మకూరు ఎస్వీ డిగ్రీ కళాశాలలో జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి అబ్ధుల్ ఖయ్యూమ్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఈ జాబ్‌మేళా నిర్వహిస్తామన్నారు. ప్రముఖ కంపెనీల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేస్తామని తెలిపారు. పదో తరగతి, ఐటీఐ, డిప్లొమా, ఇంటర్, డిగ్రీ పూర్తి చేసిన నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పూర్తి వివరాలకు 73823 91116, 9491284199 నంబర్లలో సంప్రదించాలని తెలిపారు. రెండు కొత్త బస్సు సర్వీస్‌లు ప్రారంభం నెల్లూరు సిటీ: నెల్లూరు ప్రధాన ఆర్టీసీ బస్టాండ్‌లో రెండు కొత్త బస్సు సర్వీసులను శనివారం ఏపీఎస్ఆర్టీసీ జోనల్ చైర్మన్ సన్నపురెడ్డి సురే ష్‌రెడ్డి ప్రారంభించారు. నెల్లూరు నుంచి పొదిలికి వయా పామూరు మీదుగా ఎక్స్‌ప్రెస్ సర్వీసు, అంబాపురం టిడ్కో నుంచి రాజుపాళెం వరకు పల్లె వెలుగు సర్వీస్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రజా రవాణా అధికారి మురళీబాబు, డిపో మేనేజర్ మురళీకృష్ణ, శివకేశవ్‌యాదవ్ పాల్గొన్నారు. 14 మంది ఉపాధి సిబ్బందిపై సస్పెన్షన్ వేటు ● అవకతవకలకు పాల్పడితే చర్యలు తప్పవు : డ్వామా పీడీ గంగాభవాని ● రూ.30,52,734 రికవరీకి ఆదేశాలు ● ఇందులో పీఆర్ శాఖ నుంచి రూ.3,71,832 సీతారామపురం: ఉపాధి హామీ పథకంలో అవినీతికి పాల్పడిన 14 మంది సిబ్బందిపై సామాజిక తనిఖీ బహిరంగ ప్రజావేదికలోనే శనివారం సస్పెన్షన్ వేటు వేస్తూ డ్వామా పీడీ గంగాభవాని చర్యలు తీసుకున్నారు. సిబ్బంది అవినీతి, అక్రమాలకు పాల్పడితే చర్యలు తప్పవని పీడీ హెచ్చరించారు. స్థానిక సీ్త్ర శక్తి భవనం వద్ద శనివారం నిర్వహించిన 14వ విడత సామాజిక తనిఖీ బహిరంగ ప్రజావేదికలో ఆమె పాల్గొని మాట్లాడారు. 2023–24 ఆర్థిక సంవత్సరంలో మండలంలో రూ.8,35,69,875తో 649 రకాల ఉపాధి పనులు చేయగా వాటిపై సోషల్ ఆడిట్ బృంద సభ్యులు క్షేత్రస్థాయిలో గ్రామాల్లో పర్యటించి విచారణ చేపట్టి తుది నివేదికను పంచాయతీల వారీగా వెల్లడించారు. చాలా గ్రామాల్లో ఒకే కుటుంబంలో రెండు, మూడు జాబ్‌కార్డులు ఉన్నాయని, ఉపాధి హామీ పనుల్లో చాలా తేడాలు ఉన్నాయని, పని తక్కువగా ఉందని, రికార్డుల నిర్వహణ సక్రమంగా లేదని, కొలతల ప్రకారం పనులు జరగలేదన్న వంటి విషయాలను సామాజిక తనిఖీ బృంద సభ్యులు అధికార యంత్రాంగం దృష్టికి తీసుకు వచ్చారు. వాస్తవాలను పరిశీలించిన డ్వామా పీడీ విధి నిర్వహణలో బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన ఏపీఓ సుభాషిని, ఈసీ సువార్తయ్య, ముగ్గురు టీఏలు, ఇద్దరు కంప్యూటర్ ఆపరేటర్లతోపాటు ఆరుగురు ఫీల్డ్ అసిస్టెంట్లు, ఒక సీనియర్ మేట్ ను సస్పెండ్ చేస్తున్నట్లు వెల్లడించారు. 14 పంచాయతీల్లో రూ.30,52,734 రికవరీకి ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆమెతోపాటు జిల్లా విజిలెన్స్ అధికారిణి విజయలక్ష్మి, ఏపీడీ శంకర్‌నారాయణ, అంబుడ్స్‌మెన్ వెంకటరెడ్డి, ఎంపీపీ పద్మావతి, ఎంపీడీఓ భాస్కర్, ఈఓపీఆర్డీ భార్గవి తదితరులు పాల్గొన్నారు -
ప్రజలందరి సహకారంతో స్వచ్ఛాంధ్ర లక్ష్యం
నెల్లూరు (బారకాసు): ప్రజలందరి సంపూర్ణ సహకారంతోనే స్వచ్ఛ ఆంధ్ర లక్ష్యం నెరవేరుతుందని కలెక్టర్ ఆనంద్ అన్నారు. శనివారం నగరంలోని తడికల బజార్ సెంటర్లో స్వచ్ఛాంధ్ర కార్యక్రమాల్లో కలెక్టర్ ఆనంద్, మున్సిపల్ కమిషనర్ సూర్యతేజ పాల్గొన్నారు. సింగిల్ యూస్ ప్లాస్టిక్ వల్ల కలిగే అనర్థాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. కలెక్టర్ ఆనంద్ మాట్లాడుతూ ప్రతి నెల మూడో శనివారం స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలు నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు. జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలు, పంచాయతీల్లో ప్రజలను భాగస్వామ్యం చేస్తూ ప్లాస్టిక్ వాడకం నిషేధంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ప్లాస్టిక్ రహిత సమాజం కోసం ప్రజలందరూ కంకణ బద్ధులు కావాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. జిల్లాలో రోడ్ల నిర్మాణంలో కూడా ప్రయోగాత్మకంగా ప్లాస్టిక్ వినియోగించనున్నట్లు చెప్పారు. ప్లాస్టిక్ వాడకం కేన్సర్‌కు కారణం : కమిషనర్ సూర్యతేజ ప్లాస్టిక్ వాడకం మన ఆరోగ్యంతో పాటు పర్యావరణానికి కూడా అత్యంత హానికరమని, కేన్సర్‌కు కారణమని మున్సిపల్ కమిషనర్ సూర్యతేజ అన్నారు. నగరంలోని 54 డివిజన్లలో ప్రజలను భాగస్వామ్యం చేస్తూ ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన కల్పించినట్లు చెప్పారు. ప్లాస్టిక్ కవర్లు, డిస్పోజబుల్ గ్లాసులు భూమిలో కరగవని, వీటిని కాల్చితే ఆ గాలి పీలిస్తే క్యాన్సర్ ప్రబలుతుందని అవగాహన కల్పించారు. ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయంగా బయోడి గ్రేడ్ కవర్లు, జూట్ బ్యాగులు, క్లాత్ బ్యాగులను వినియోగించాలని ప్రజలకు సూచించారు. అనంతరం స్థానికులకు క్లాత్ బ్యాగులను కలెక్టర్, కమిషనర్ పంపిణీ చేశారు. స్టోన్‌హౌస్‌పేటలో పర్యటిస్తూ ప్రజలకు, దుకాణదారులకు ప్లాస్టిక్ వాడకం వల్ల కలిగే అనర్థాలను కలెక్టర్, కమిషనర్ వివరించారు. ప్రజలందరితో స్వచ్ఛ ఆంధ్ర ప్రతిజ్ఞ చేయించారు. తొలుత ప్లాస్టిక్‌తో కలిగే అనర్థాలను వివరిస్తూ దోర్నాల హరిబాబు, శంకర్ స్కిట్ ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ కామాక్షి, మున్సిపల్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ప్లాస్టిక్ రహిత సమాజం కోసం కృషి చేయాలి కలెక్టర్ ఆనంద్ ప్రజలకు క్లాత్ బ్యాగ్‌లు పంపిణీ చేసిన కలెక్టర్, కమిషనర్ -
పది సవర్ల బంగారం చోరీ
నెల్లూరు(క్రైమ్): ఇంట్లో ఎవరూ లేని సమయంలో గుర్తుతెలియని దుండగులు నగదు, బంగారు ఆభరణాలు దోచుకెళ్లారు. ఈ ఘటన బుజబుజనెల్లూరు ఆర్టీసీ కాలనీలో జరిగింది. పోలీసుల కథనం మేరకు.. ఆర్టీసీ కాలనీలో రాజ్కిశోర్రెడ్డి కుటుంబం నివాసం ఉంటోంది. అతను ఈనెల 14వ తేదీన తన కుటుంబంతో తిరుమలకు వెళ్లారు. శనివారం తెల్లవారుజామున గుర్తుతెలియని దుండగులు ఇంటి తలుపులు పగులగొట్టి బీరువాలో ఉన్న కొంత నగదు, సుమారు పది సవర్ల బంగారు ఆభరణాలు అపహరించారు. స్థాని కుల ద్వారా విషయం తెలుసుకున్న బాధి తులు నెల్లూరుకు చేరుకుని వేదాయపాళెం పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
‘పది’ పరీక్షలకు సర్వం సిద్ధం
జిల్లాలో ఇలా.. రేపటి నుంచి ప్రారంభం ● ఏర్పాట్లు చేసిన జిల్లా విద్యాశాఖ అధికారులు ● జంబ్లింగ్ పద్ధతిలో నిర్వహణ ● పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు ● సమస్యల పరిష్కారం కోసం కంట్రోలురూమ్ ఏర్పాటుపరీక్ష కేంద్రాలు : 174 విద్యార్థుల సంఖ్య : 33,434 సమస్మాత్మక కేంద్రాలు : 16 సీసీ కెమెరాల ఏర్పాటు : 7 కేంద్రాల్లో.. ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు : 9 సిట్టింగ్ స్క్వాడ్ బృందాలు : 24 ఇన్విజిలేటర్లు : 1,968 మంది నెల్లూరు(టౌన్): పదో తరగతి పబ్లిక్ పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈనెల 31వ తేదీ వరకు ఇవి జరుగుతాయి. దీనికి సంబంధించి జిల్లా విద్యాశాఖాధికారులు ఏర్పాట్లను పూర్తి చేశారు. కేంద్రాల్లో విద్యార్థులకు ఇబ్బందుల్లేకుండా గాలి, వెలుతురు, పూర్తిస్థాయిలో బెంచీలుండేలా చర్యలు తీసుకున్నారు. ఇప్పటికే హాల్ టికెట్లను ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయుల లాగిన్‌లో అందుబాటు ఉంచారు. దీంతోపాటు ప్రభుత్వ వాట్సాప్ నంబర్ 95523 00009కు విద్యార్థి వివరాలు పంపి హాల్ టికెట్‌ను డౌన్లోడ్ చేసుకునేలా అవకాశం కల్పించారు. ఎగ్జామ్స్‌ను జంబ్లింగ్ పద్ధతిలో నిర్వహించనున్నారు. అలాగే విద్యార్థులు హాల్‌టికెట్ చూపించి ఉచితంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణించవచ్చు. బాలికలే అధికం జిల్లా వ్యాప్తంగా 33,434 మంది (బాలురు 16,250 మంది, బాలికలు 17,184 మంది) విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. మొత్తం 174 కేంద్రాలను ఏర్పాటు చేశారు. 16 కేంద్రాలను సమస్యాత్మక, వాటిల్లో ఏడింటిని అతి సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించారు. ఇక్కడ సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ అధికారులు ఆదేశించారు. పరీక్ష సమయానికి అరగంట ముందు విద్యార్థులను కేంద్రంలోకి అనుమతించనున్నారు. గంట ముందు చేరుకోవాలని విద్యాశాఖాధికారులు సూచిస్తున్నారు. రెండు సెట్ల ప్రశ్నపత్రాలను జిల్లా వ్యాప్తంగా 48 స్టోరేజ్ పాయింట్లలో భద్రపరిచారు. పోలీస్ బందోబస్తు నడుమ ఏరోజుకారోజు ప్రశ్నపత్రాలను సమీపంలోని పరీక్ష కేంద్రాల్లోకి తీసుకెళ్లనున్నారు. సిబ్బంది నియామకం ఇలా.. పరీక్షల నిర్వహణకు 1,968 మంది ఇన్విజిలేటర్లను, 174 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 174 మంది డిపార్ట్మెంట్ అధికారులను నియమించారు. మాస్ కాపీయింగ్‌కు తావులేకుండా 9 ఫ్లయింగ్ స్క్వాడ్, 24 సిట్టింగ్ స్క్వాడ్ బృందాలను ఏర్పాటు చేశారు. రాష్ట్ర పరిశీలకుడిగా సమగ్రశిక్ష ఏఎస్పీడీ రవీంద్రనాథ్‌రెడ్డిని నియమించారు. ఎగ్జామ్స్ సమయంలో కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుంది. సమీప ప్రాంతాల్లో ఉండే జెరాక్స్ సెంటర్లు, ఆన్లైన్ సెంటర్లను మూసివేయించనున్నారు. కేంద్రంలోకి స్మార్ట్ వాచ్‌లు, కాలుక్యులేటర్లు, సెల్ఫోన్లను నిషేధించారు. చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంట్ అధికారులు సైతం సెల్ఫోన్లను తీసుకెళ్లకూడదు. అధికారులతో సమావేశం రాష్ట్ర పరిశీలకుడు రవీంద్రనాఽథ్‌రెడ్డి శనివారం దర్గామిట్టలోని జిల్లా పరిషత్ హైస్కూల్లో చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంట్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరీక్షలను సజావుగా నిర్వహించాలని తెలిపారు. మాస్ కాపీయింగ్‌కు తావు లేకుండా పక్కాగా చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో డీఈఓ బాలాజీరావు, ఏపీ ఓపెన్ స్కూల్ కో–ఆర్డినేటర్ అనుముల్లాఖాన్ తదితరులు పాల్గొన్నారు.పరీక్ష జరిగే సమయం : ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు కంట్రోల్‌రూమ్ నంబర్ : 83414 08109 హాల్ టికెట్ డౌన్‌లోడ్‌కు పెట్టిన వాట్సాప్ నంబర్ : 95523 00009 కంట్రోల్‌రూమ్ ఏర్పాటు విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం విద్యాశాఖ అధికారులు కంట్రోల్‌రూమ్‌ను ఏర్పాటు చేశారు. ఫోన్ చేసి ఇబ్బందులు చెబితే వెంటనే స్పందిస్తారు. కేంద్రాల్లో మెడికల్ కిట్లతో ఏఎన్ఎంలు అందుబాటులో ఉంటారు. విద్యార్థులకు తాగునీటిని ఏర్పాటు చేస్తున్నారు. ఎగ్జామ్ టైంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా ఆ శాఖ అధికారులు చర్యలు చేపట్టారు.పరీక్షలు సజావుగా జరిగేలా చర్యలు పదో తరగతి పరీక్షలను సజావుగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశాం. విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో రాసేలా చర్యలు తీసుకున్నాం. మాస్ కాపీయింగ్‌కు తావులేకుండా జాగ్రత్తలు తీసుకున్నాం. ఎవరైనా మాస్ కాపీయింగ్‌ను ప్రోత్సహిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. విద్యార్థులు ఒత్తిడికి లోనుకాకుండా ఎగ్జామ్స్ రాయాలి. గంట మందుగానే కేంద్రానికి చేరుకోవాలి. – ఆర్.బాలాజీరావు, డీఈఓ -
అలవి వలలతో వేట సాగిస్తే చర్యలు
సోమశిల: సోమశిల జలాశయంలో అలవి వలలతో వేట సాగిస్తే కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని మత్స్యశాఖ జేడీ నాగేశ్వరరావు మత్స్యవేటకారులను హెచ్చరించారు. జలాశయం వెనుక భాగంలో నిషేధిత అలవి వలలతో వేట సాగుతుందని స్థానిక మత్స్యకారులు ఫిర్యాదు చేయడంతో శనివారం జేడీ నాగేశ్వరరావు తనిఖీ చేశారు. అధికారులతో కలిసి జేడీ జలాశయం నుంచి పడవలో వెనుక భాగం వరకు వెళ్లి పరిశీలించారు. అలవి వలలతో వేట సాగించే ప్రదేశానికి వెళ్లగా అక్కడ వాటికి సంబంధించిన ఎటువంటి ఆనవాళ్లు లేకపోవడంతో వెనుదిరిగి వచ్చారు. అనంతరం ఫిర్యాదు చేసిన మత్స్యకారులతో జేడీ మాట్లాడుతుండగా మత్స్యకారుల్లోని ఇరువర్గాలు వాగ్వాదానికి దిగారు. జేడీ వెంట మండల మత్స్యశాఖ అధికారి చందన తదితరులు ఉన్నారు. మత్స్యశాఖ జేడీ నాగేశ్వరరావు అధికారుల ముందే ఇరువర్గాల మత్స్యకారుల వాగ్వాదం -
సహజ వనరుల దోపిడీకి ఖాకీ కవచం!
సాక్షి టాస్క్‌పోర్స్: సర్వేపల్లి, నెల్లూరు రూరల్ నియోజకవర్గాలలో సహజ వనరుల దోపిడీ మూడు ఇసుక లారీలు.. ఆరు గ్రావెల్ వాహనాలు అనే రీతిలో విచ్చలవిడిగా సాగుతోంది. దీన్ని అరికట్టాల్సిన పోలీసులు అధికార పార్టీ ప్రజాప్రతినిధుల ఒత్తిళ్లకు తలొగ్గి అక్రమాలకు సహకారం అందిస్తున్నారు. పొదలకూరు మండలం ఇరువూరు రీచ్ నుంచి రాత్రి వేళ ఇసుక అక్రమ రవాణా యధేచ్చగా సాగుతోంది. నిశిరాత్రి భారీ యంత్రాలు ఉపయోగించి పెన్నా నదిలో తవ్వకాలు జరుగుతున్నాయి. నిత్యం పదుల సంఖ్యలో భారీ వాహనాల్లో ఇసుక తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. గ్రావెల్, ఇసుక అక్రమ రవాణాకు స్థానిక షాడో ఎమ్మెల్యే సహకారంతోపాటు పోలీస్ శాఖ అండగా ఉండడంతో అక్రమార్కులు బరి తెగించి వ్యవహరిస్తున్నారు.కోర్టు స్టేలో ఉన్న రీచ్ నుంచి..పొదలకూరు మండలం ఇరువూరు రీచ్ కోర్టు స్టే పరిధిలో ఉంది. అక్కడ ఇసుక తవ్వకాలు చేపట్టవద్దన్న న్యాయస్థానం ఆదేశాలను లెక్క చేయకుండా స్థానిక ప్రజాప్రతినిధి ఈ రీచ్‌ను ఓ ఇసుకాసురుడికి అ«నధికారికంగా అప్పగించారు. పగలు రాత్రి తేడా లేకుండా నదిలో భారీ యంత్రాలు ఉంచి లోడింగ్ చేస్తున్నారు. 30 టన్నుల సామర్థ్యం ఉన్న 50 టిప్పర్ల ద్వారా నిత్యం ఇసుకను తరలిస్తున్నారు. ఒక్కో వాహనానికి రూ.10 వేలు వంతున వసూలు చేస్తున్నారు. కోర్టు స్టే పరిధిలో ఉన్న రీచ్‌లో ఇసుక లూటీ జరుగుతున్నా మైనింగ్, రెవెన్యూ, పోలీస్ యంత్రాంగం చేష్టలుడిగి చూస్తోంది.ఇతర రాష్ట్రాలకు తరలింపు..ఇరువూరు రీచ్ నుంచి ఇసుకను రాత్రి వేళ ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారు. పెన్నా నది ఇసుకకు తమిళనాడు, బెంగళూరుతోపాటు తిరుపతి జిల్లాలో ఉన్న శ్రీసిటీ డిమాండ్ ఉంది. అక్కడ ఇసుక టన్ను రూ.3 వేలు వరకు పలుకుతోంది. హైవే పోలీస్స్టేషన్లు, రవాణా శాఖ, విజిలెన్స్, మైనింగ్ శాఖ అధికారులకు నెలవారీ మామూళ్లు చెల్లిస్తూ అక్రమ రవాణా చేస్తున్నారు. ఇరువూరు రీచ్ నుంచి అక్రమంగా రవాణా చేస్తున్న ఇసుక వాహనాలను జిల్లా మైనింగ్ అధికారి బాలాజీ నాయక్ ఇటీవల పట్టుకున్నారు.దాదాపు 20 వాహనాల్లో ఇసుక లోడింగ్ చేసి తరలిస్తుండగా స్థానిక పోలీసులు సహకారం అందించపోవడంతో రెండు టిప్పర్లు మాత్రమే స్వాధీనం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి స్వయంగా ఫోన్ చేసి ఆయనపై తీవ్ర ఒత్తిడి తెచ్చిన ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. వారం వరకు అక్రమ రవాణాకు తాత్కాలికంగా తెరపడినా మళ్లీ ఇసుక మాఫియా రెచ్చిపోతోంది.నెల్లూరు రూరల్‌లో గ్రావెల్..నెల్లూరు రూరల్ నియోజకవర్గం గొల్లకందుకూరు తిప్పను గ్రావెల్ మాఫియా పీల్చి పిప్పి చేస్తోంది. రాత్రి వేళ భారీ యంత్రాలు ఉపయోగించి నిత్యం పదుల సంఖ్యలో పొదలకూరు, నెల్లూరు రూరల్ పరిధిలోని లే అవుట్లకు గ్రావెల్ తరలిస్తున్నారు. గ్రావెల్‌కు డిమాండ్ ఉండడంతో స్థానిక ప్రజాప్రతినిధుల అండతో అధికార పార్టీ నేతలు బరి తెగిస్తున్నారు. రోజూ దాదాపు 40 టిప్పర్లతో అక్రమ రవాణా సాగిస్తున్నారు.ట్రాఫిక్ క్లియర్ చేసి లారీలను పంపేసిన ఎస్సై..కోర్టు స్టే పరిధిలో ఉన్న ఇరువూరు రీచ్, గొల్లకందుకూరు తిప్ప నుంచి అక్రమంగా ఇసుక, గ్రావెల్ తరలిస్తున్న లారీలు గురువారం రాత్రి పొదలకూరు మండలం తాటిపర్తిలో శ్రీరుక్మిణి సమేత పాండురంగస్వామి బ్రహ్మోత్సవాల వేడుకలు జరుగుతున్న ప్రాంతానికి భారీగా చేరుకున్నాయి. ఈ సమయంలో అక్కడ బందోబస్తు విధుల్లో ఉన్న ఎస్సై హనీఫ్ వాటిని నిలువరించగా స్థానిక ప్రజాప్రతినిధి నుంచి ఫోన్ కాల్ రావడంతో చేసేది లేక అప్పటికప్పుడు రోడ్డుపై ట్రాఫిక్‌ను క్లియర్ చేసి లారీలను పొదలకూరు వైపు పంపారు. ఈ ఘటనను కొందరు సెల్ ఫోన్లలో చిత్రీకరించి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. అక్రమ రవాణాను అరికట్టాల్సిన పోలీసులే ఇసుక, గ్రావెల్ అక్రమ రవాణాకు కొమ్ముకాస్తూ దగ్గరుండి ట్రాఫిక్‌ను క్లియర్ చేసి పంపటంపై తీవ్ర విస్మయం వ్యక్తమవుతోంది. -
కమనీయం.. శ్రీవారి కల్యాణ వైభోగం
బిట్రగుంట ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండబిట్రగుంట బిలకూటక్షేత్రం బ్రహ్మోత్సవాల్లో కీలక ఘట్టమైన ప్రసన్నుడి కల్యాణం శుక్రవారం కమనీయంగా సాగింది. వేలాదిగా తరలివచ్చిన భక్తుల గోవింద నామస్మరణలు, వేదపండితుల దివ్యమంత్రోచ్ఛరణలు, శుభకర మేళతాళాల మధ్య స్వామివారి కల్యాణం వైకుంఠ వైభవాన్ని తలపించింది. పాతబిట్రగుంట, కొండబిట్రగుంట వీధుల్లో గజవాహనంపై పెండ్లి కుమారుడిగా విహరించిన స్వామి వారు ఉదయం శుభముహూర్తంలో కల్యాణవేదిక వద్దకు చేరుకున్నారు. పలు రాష్ట్రాల నుంచి తెప్పించిన పుష్పాలు, తులసీ మాలలతో శోభాయమానంగా అలంకరించిన కల్యాణ వేదికపై ఉభయ దేవేరులతో స్వామివారు అలంకార భూషితులయ్యే సమయానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున దేవదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర, కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట కృష్ణారెడ్డి పట్టువస్త్రాలు, ముత్యాల తలంభ్రాలు తీసుకురాగా, కల్యా ణోత్సవం ఉభయకర్తలు పట్టువస్త్రాలు, కల్యాణ ద్రవ్యాలు తీసుకువచ్చారు. వేదికపై స్వామివారు సర్వాలంకారణ భూషితులైన తర్వాత అర్చక బృందం వైఖానస ఆగమోక్తంగా కల్యాణ వేడుకను ప్రారంభించారు. తొలుత విశ్వక్సేనుని పూజతో ప్రారంభించి యజ్ఞోపవీత ధారణ, కంకణ ధారణ, వేదమంత్రోక్తంగా కల్యాణ ద్రవ్యాలను శుద్ధిచేసే పుణ్యహవచనం, తదితర కార్యక్రమాలను నిర్వహించారు. మధుపర్కం, దృశ్య, స్పర్శ, శ్రవణ వంటి షోడశోపచార పూజలను శాస్త్రోక్తంగా పూర్తి చేసి కల్యాణ ఘట్టాన్ని ప్రారంభించారు. అధిక సంఖ్యలో హాజరైన భక్తులు భక్తిపారవశ్యంతో గోవిందనామ స్మరణలు చేస్తుండగా, భాజాభజంత్రీలు ఉచ్ఛ స్థాయిలో మోగుతుండగా మాంగళ్యధారణ నేత్రపర్వంగా సాగింది. ఇదే సమయానికి మరో 10 జంటలకు పైగా స్వామివారి సన్నిధిలో ఒక్కటయ్యాయి. రథోత్సవంలో సమస్యలు వైకుంఠాన్ని తలపించిన బిలకూటక్షేత్రం గోవింద నామస్మరణలతో మారుమోగిన కొండబిట్రగుంట ప్రసన్నుడి కళ్యా ణోత్సవం అనంతరం స్వామివారి రథోత్సవంలో సమస్యలు ఎదురయ్యాయి. ఆలయ అధికారుల నిర్లక్ష్యం, నిర్వహణా లోపం కారణంగా రథం చక్రాలు పట్టేసి ముందుకు కదిలేందుకు మొరాయించడంతో ఆగమేఘాల మీద మరమ్మతులు చేపట్టారు. కల్యాణం తర్వాత శ్రీదేవి, భూదేవితో కలిసి కొండ దిగువన ఉన్న రథంపై స్వామివారు కొలువుదీరారు. భక్తుల గోవింద నామస్మరణల మధ్య రథం కదిలిన కొద్ది నిమిషాల్లోనే చక్రాలు పట్టేశాయి. రథం ముందుకు కదలకపోవడంతో హుటాహుటిన మరమ్మతులు చేయిస్తున్నారు. రాత్రి ఏడు గంటల వరకు కూడా మరమ్మతులు పూర్తి కాలేదు. దీంతో ట్రాక్టర్‌పై స్వామివారి ఊరేగింపు నిర్వహించాలని దేవదాయశాఖ అధికారులు, పాలకవర్గం చర్చలు జరుపుతోంది. బ్రహ్మోత్సవాల నిర్వహణలో దేవదాయశాఖ అధికారులు మొదటి నుంచి నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఉత్సవాలకు సరైన ప్రచారం కల్పించకపోవడం, వీఐపీ పాస్‌లు, వెహికల్ పాస్‌ల్లో మితిమీరిన రాజకీయ జోక్యం కారణంగా భక్తులు తీవ్ర అసహనానికి గురయ్యారు. ఈఓ కూడా ఇష్టారీతిగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు సైతం వినిపించాయి. ఉభయకర్తలు, దాతలతోనూ ఆలయ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారనే ఆరోపణలు వ్యక్తమయ్యాయి. కనీసం రథోత్సవం ముందుగా ఏర్పాట్లు సరిచూసుకుని ఉంటే స్వామివారి రథోత్సవం మధ్యలో నిలిచిపోయేది కాదని భక్తులు మండి పడుతున్నారు. -
తోపుడు బండ్లపై మోసం
రోడ్లపై తోపుడు బండ్లలో కూడా కాటాలు పెట్టి వినియోగదారుల నడ్డి విరుస్తున్నారు. సాక్షి విజిట్ సందర్భంగా వేదాయపాళేనికి చెందిన సుబ్బారావు అనే వినియోగదారుడు కేజీ దానిమ్మ కాయలు కొనుగోలు చేశాడు. సాక్షి కెమెరాను చూడడంతో ఆ వ్యాపారస్తుడు కేజీ రాయితో పాటు 400 గ్రాములు అదనంగా తూచి వినియోగదారుడికి ఇచ్చాడు. మొత్తం 1,400 గ్రాములు తూగాల్సి ఉంది. దానిమ్మ కాయలను మార్కెట్లో మరో వేయింగ్ మిషన్‌లో పరిశీలించగా 1,135 గ్రాములు వచ్చింది. కాటాల్లో టెక్నిక్లను ఉపయోగించి వినియోగదారుల జేబులకు చిల్లులు పెడుతున్నారు. -
నాణ్యతా ప్రమాణాలు పాటించడం లేదు
నాణ్యత లేని వస్తువులు ఇస్తున్నారుప్రొవిజన్స్ దుకాణాలు, మార్ట్‌లలో పప్పుదినుసులు, నూనె, ఇతర నిత్యావసర వస్తువుల్లో నిర్వాహకులు నాణ్యతా ప్రమాణాలను పాటించడం లేదు. తక్కువ నాణ్యత కల్గిన వస్తువులను విక్రయాలు చేస్తున్నారు. అధికారులు ఆయా వస్తువులను పరిశీలిస్తే వారి అవకతవకలు బయటపడుతాయి. – రంజిత్, కిసాన్‌నగర్ మార్కెట్లో కూరగాయలు కొనుగోలు చేస్తే వినియోగదారుడు నష్టపోతున్నాడు. వినియోగదారులకు అవసరమైనవి ఏరుకునే పరిస్థితి లేదు. వ్యాపారులు ఇచ్చినవే తీసుకోవాల్సి వస్తుంది. కుళ్లినవి, వాడిపోయినవి కలిపి వినియోగదారులకు అంటగడుతున్నారు. అధికారులు తనిఖీలు నిర్వహించి వినియోగదారులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలి. – వెంకటరెడ్డి, వినియోగదారుడు ●వినియోగదారులుకు అండగా ఉంటాం తూనికలు, కొలతల శాఖ వినియోగదారులకు అండగా ఉంటుంది. మార్కెట్లో ఎవరైనా వ్యాపారులు మోసం చేసినట్టు తెలిస్తే వెంటనే తమకు సమాచారమివ్వాలి. తక్షణమే తాము వచ్చి అలాంటి వారిమీద కేసులు నమోదు చేస్తాం. జిల్లాలో ఇప్పటి వరకు 290 మందిపై కేసులు నమోదు చేశాం. తూకాల్లో మోసం చేసేవారిపై భారీగా అపరాద రుసుం వసూలు చేస్తాం. – ఐజాక్, కంట్రోలర్, తూనికలు, కొలతలశాఖ -
బియ్యం బ్యాగ్‌లో ఒకటిన్నర కిలోల తరుగు
హోల్‌సేల్ అంగడి నుంచి 25 కిలోల బియ్యం బ్యాగ్ కొనుగోలు చేశాం. వాటిని తెలిసిన వారి దగ్గర కాటా పెడితే ఒకటిన్నర కిలోలు తగ్గాయి. అంటే ఒక బస్తా మీద కనీసం రూ.80 నష్టపోయాం. బియ్యం తగ్గాయని వ్యాపారులను అడిగితే వారు తాము తయారు చేయలేదని పైనుంచి అన్ని బస్తాలు అలాగే వస్తున్నాయి. ఏమీ చేయలేమని బుకాయిస్తున్నారు. చేసేదేమి లేక మౌనంగా ఉండాల్సిన పరిస్థితి. ఇలా అన్ని రకాల నిత్యావసర సరుకుల్లో మోసం జరుగుతోంది. అధికారులు నిత్యం దాడులు చేస్తే ఇలాంటివి జరగవు. – రీహానా, బుజబుజనెల్లూరు -
నేడు వినియోగదారుల హక్కుల దినోత్సవం
● వినియోగదారుల జేబులకు చిల్లు ● అడుగడుగునా అవకతవకలు ● నాణ్యతలేని సరుకుల విక్రయాలు ● కూరగాయలు, చేపల మార్కెట్లలో ఇదీ పరిస్థితి ● అందుబాటులో లేని ధర్మకాటా మోసాలు జరుగుతున్నాయి నెల్లూరు (పొగతోట)/ నెల్లూరు అర్బన్/ నెల్లూరు (క్రైమ్)/ నెల్లూరు సిటీ: వస్తు కొనుగోలు సమయంలో వినియోగదారుల జేబులకు నిత్యం చిల్లు పడుతోంది. వ్యాపారుల స్వార్థం, అధికారుల పర్యవేక్షణ లేమి కారణంగా వినియోగదారులు అడుగడుగునా మోసపోతున్నారు. కూరగాయల మార్కెట్, పెట్రోలు బంకులు, నిత్యావసర సరుకుల దుకాణాలు, రోడ్లపై పండ్ల షాపులు ఇలా ప్రతిచోట వినియోగదారులు నష్టపోతున్నారు. తూకాలు, కొలతల్లో మోసాలకు పాల్పడుతున్నారు. సాక్షి బృందం శుక్రవారం పట్టణంలో పలుచోట్ల విజిట్ చేయగా అనేక విషయాలు బట్టబయలు అయ్యాయి. వినియోగదారులను నిత్యం మోసం చేయడమే పనిగా వ్యాపారులు కొత్త కొత్త ఆలోచనలకు రూపకల్పనలు చేస్తున్నారు. పెట్రోలు బంకుల్లో చిప్‌లు వాడడం, కూరగాయల మార్కెట్లలో ఎలక్ట్రానిక్ కాటాల్లో మోసాలకు పాల్పడడం నిత్యం తంతుగా మారిపోయింది. ప్రశ్నించిన వినియోగదారులపై దాడులకు దిగడం, బెదిరించడం పరిపాటి. నగరంలోని ఏసీ కూరగాయల మార్కెట్లో అడుగడుగునా మోసాల మయం అయిపోయింది. తనిఖీలు నిర్వహించి పర్యవేక్షించి వినియోగదారులు నష్టపోకుండా చూడాల్సిన అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. మార్కెట్లో నెల మామూళ్లకు అలవాటుపడ్డ అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ఫిర్యాదులు వచ్చిన సమయంలో మినహా అధికారులు అటువైపుగా చూడడం లేదు. తూకాల్లో మోసపోకుండా ఉండేందుకు వినియోగదారుల కోసం ధర్మకాటాను ఏర్పాటు చేశారు. ఉదయం నుంచి రాత్రి వరకు అక్కడ సిబ్బంది అందుబాటులో ఉండాలి. వేయింగ్ మెషన్ అందుబాటులో ఉండాలి. ప్రస్తుతం సిబ్బంది ఎవరూ లేక పోవడంతో వేయింగ్ మెషన్‌ను కిందపడేశారు. ధరల పట్టికలో వ్యత్యాసాలున్నాయి. నిత్యం కూరగాయల ధరలను పట్టికపై మార్పులు చేయాల్సి ఉంది. మార్కెటింగ్ అధికారులు పట్టించుకోక పోవడంతో బోర్డుపై ఒక ధర, వ్యాపారులు విక్రయించేది మరో ధరగా ఉంది. కుళ్లిన సరుకుల మిక్సింగ్.. కూరగాయల మార్కెట్లో కుళ్లిన, పాడైపోయిన కూరగాయలను వినియోగదారులకు అంటగడుతున్నారు. ఇదేమని ప్రశ్నిస్తే వినియోగదారులను చులకనగా మాట్లాడడం పరిపాటి అయిపోయింది. కేజీకి 100 గ్రాముల నుంచి 150 గ్రాములు తూకం తక్కువ, నాణ్యత లేని కూరగాయలను వినియోగదారులకు అంటగడుతున్నారు. నెల్లూరు నగరంలో పదిలక్షల జనాభా ఉంది. నగర ప్రజలతో పాటు గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు పనులు ముగించుకుని తిరుగు ప్రయాణంలో కూరగాయల మార్కెట్‌ను సందర్శిస్తారు. వారికి అవసరమైన కూరగాయలను కొనుగోలు చేసి తీసుకెళ్తుంటారు. కుళ్లినవి, వాడిపోయినవి తూకం తక్కువగా అంటగడుతున్నారంటూ వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూరగాయ మార్కెట్లో వినియోగదారులు నష్టపోకుండా చూడాల్సిన అధికారులు ఫిర్యాదులు వస్తేనే స్పందిస్తున్నారు. ఏమార్చి కవర్లు మార్చేస్తున్నారు కొన్ని పండ్ల దుకాణాల్లో పండ్లు కొనుగోలు చేస్తే నిర్వాహకుడు, పనిచేసే వ్యక్తి చేతివాటం ప్రదర్శిస్తున్నారు. తాము కొన్న కవర్‌ను పక్కన పెట్టి ముందుగా ఏర్పాటు చేసుకున్న కవర్‌ను ఏమాత్రం అనుమానం రాకుండా వినియోగదారునికి ఇస్తున్నారు. ఓ వినియోగదారుడు నగరంలోని ఓ పండ్ల దుకాణంలో నాణ్యత కల్గిన రెండు కేజీల యాపిల్ పండ్లు, కేజీ ద్రాక్ష, ఒక కేజీ దానిమ్మలు కొనుగోలు చేశారు. కస్టమర్ కొనుగోలు చేసే క్రమంలో దుకాణదారుడు యాపిల్ పండ్ల కవర్‌ను మార్చేశారు. నాణ్యతలేని పండ్లను కవర్లో ముందుగా ఉంచి కస్టమర్‌ను బోల్తా కొట్టించారు. వినియోగదారుడు కొనుగోలు చేసే సమయంలో అప్రమత్తంగా ఉండాల్సి ఉంది. ఆదమరిస్తే జేబులకు చిల్లే మార్కెట్లో ఏదైనా వస్తువు కొనుగోలు చేసే సమయంలో జాగ్రత్తలు అవసరం. ఆదమరిస్తే కవర్లు మార్చడం, తక్కువ తూకం వస్తువులు ఇస్తుంటారు. వినియోగదారుడు కూడా ఎప్పటికప్పుడు జాగ్రత్తగా ఉండాలి. –ఎస్కే సమీర్, బుజబుజనెల్లూరు వ్యాపారులు వినియోగదారులను నష్టపరుస్తున్నారు. తూకాల్లో మోసాలకు పాల్పడుతున్నారు. ప్రశ్నిస్తే చులకనగా మాట్లాడుతున్నారు. అధికారులు తనిఖీలు నిర్వహించి వినియోగదారులు నష్టపోకుండా చర్యలు తీసుకోవాలి – రమణారెడ్డి, వినియోగదారుడు -
30 శాతం ఐఆర్ ప్రకటించాలి
● అపస్ రాష్ట్ర అధ్యక్షుడు బాలాజీ నెల్లూరు (టౌన్): ఉపాధ్యాయులకు 30 శాతం ఐఆర్‌ను వెంటనే ప్రకటించాలని అపస్ రాష్ట్ర అధ్యక్షుడు బాలాజీ డిమాండ్ చేశారు. శుక్రవారం స్థానిక ఐఎంఏ హాల్లో అపస్ జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సంస్థాగత నిర్మాణం, భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. అనంతరం బాలాజీ మాట్లాడుతూ ఉపాధ్యాయుల ఆర్థిక విషయాల పట్ల ప్రభుత్వం శీతకన్ను వేసిందని, జీతాలు తప్ప ఏ ఆర్థిక ప్రయోజనాలు లేవన్నారు. ఆర్థిక బకాయిలు, సరెండర్ లీవ్స్, పీఎఫ్ లోన్స్, ఏపీజీఎల్ఐ లోన్లు వెంటనే విడుదల చేయాలన్నారు. రాష్ట్ర సంఘటన కార్యదర్శి శ్రావణ్‌కుమార్ మాట్లాడుతూ పీఆర్సీ వెంటనే ప్రకటించాలన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర నాయకులు చక్రపాణి, పుట్టాశేషు, జిల్లా అధ్యక్షుడు రాజగోపాలాచార్యులు, ప్రధాన కార్యదర్శి అనిల్‌కుమార్, నాయకులు మణికందరాచారి, చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు. జాతీయ రహదారిపై స్పిరిట్ ట్యాంకర్ బోల్తా వెంకటాచలం: మండలంలోని గొలగమూడి క్రాస్‌రోడ్డు వద్ద స్పిరిట్లోడు లారీ ట్యాంకర్ అదుపుతప్పి శుక్రవారం బోల్తాపడింది. నెల్లూరు వైపు నుంచి గూడూరు వైపు వెళుతూ గొలగమూడి క్రాస్ రోడ్డు సమీపానికి చేరుకోగానే డ్రైవర్ నిద్రలోకి జారుకోవడంతో అదుపుతప్పి బోల్తా పడింది. ట్యాంకర్‌లోని స్పిరిట్ రోడ్డుపై పొర్లింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని ఎలాంటి ప్రమాదం జరగకుండా చర్యలు చేపట్టారు. క్రేన్ల సహాయంతో ట్యాంకర్‌ను పక్కకు తొలగించి ట్రాఫిక్ సమస్యను పరిష్కరించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బిలకూట క్షేత్రం అభివృద్ధికి కృషి ● దేవదాయశాఖ మంత్రి ఆనం బిట్రగుంట: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొండబిట్రగుంట బిలకూట క్షేత్రం అభివృద్ధికి దేవదాయశాఖ నుంచి సంపూర్ణ సహకారం అందించనున్నట్లు రాష్ట్ర దేవదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. ప్రసన్న వేంకటేశ్వరస్వామికి ప్రభుత్వం తరుపున మంత్రి శుక్రవారం పట్టు వస్త్రాలు సమర్పించి కల్యాణోత్సవంలో పాల్గొన్నారు. కల్యాణ వేడుక పూర్తయిన అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి ఆనం మాట్లాడుతూ బిలకూట క్షేత్రం అభివృద్ధికి ఎమ్మెల్సీ బీద రవిచంద్ర, కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట కృష్ణారెడ్డి కృషి చేస్తున్నారని, వారి కృషికి దేవదాయశాఖ తరపున సహకారం అందించి ఆలయ అభివృద్ధిని వేగవంతం చేస్తామని తెలిపారు. ప్రస్తుతం రూ.12.5 కోట్లతో ఆలయంలో అభివృద్ధి పనులకు రంగం సిద్ధం చేశారని, టెండర్లు కూడా దాదాపుగా పూర్తయ్యాయని వివరించారు. త్వరలోనే పనులు ప్రారంభమవుతాయని తెలిపారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ రూ.1.85 కోట్లతో ఆలయం చుట్టూ ప్రహరీ, టీటీడీ నిధులు రూ.2.65 కోట్లతో గాలిగోపురం నిర్మాణ పనులు త్వరలోనే ప్రారంభించనున్నట్లు తెలిపారు. కల్యాణ కట్ట, కళ్యాణ మండపం, అన్నదాన సత్రం పనులు కూడా ప్రారంభించనున్నట్లు వివరించారు. -
రెండిళ్లల్లో చోరీకి యత్నం
కోవూరు: నెల రోజులుగా ఇళ్లకు తాళాలు వేసి ఉన్న రెండిళ్లలో గుర్తు తెలియని దుండగలు గురువారం రాత్రి చోరీకి యత్నించారు. ఈ ఘటన స్థానిక ప్రభుత్వాస్పత్రి సమీపంలో జరిగింది. బాధితులు, పోలీసుల సమాచారం మేరకు విశ్రాంత ఉపాధ్యాయుడు వరప్రసాద్, బ్రహ్మదేవి లక్ష్మి ఇళ్లు పక్క పక్కనే ఉంటాయి. వీరు నెల రోజుల క్రితం ఇళ్లకు తాళాలు వేసి విజయవాడ, హైదరాబాద్‌లో ఉంటున్న తమ కుటుంబ సభ్యుల వద్దకు వెళ్లారు. ఈ విషయాన్ని గమనించిన దుండగులు గురువారం అర్ధరాత్రి తర్వాత ఆ రెండిళ్ల తాళాలు పగులకొట్టి బెడ్రూమ్లోకి చొరబడి గాలించారు. బీరువాలు, అల్మరాలు ప్రతి చోట వెతికి అక్కడ ఉన్న వస్తువులను చిందరవందరగా పడేశారు. అయితే వరప్రసాద్ ఇంట్లో మాత్రం రూ.5 వేలు నగదు చోరీకి గురైంది. పెద్ద మొత్తంలో నగదు, నగలు దొరకకపోవడంతో దుండగులు ఇళ్లల్లో ప్రతి చోటా గాలించినట్లు అక్కడ పడేసిన వస్తువులను బట్టి తెలుస్తోంది. దుండగులు ఇద్దరుగా గుర్తించారు. వీరు స్కూటీలో వచ్చినట్లు సీసీ కెమెరాలో రికార్డుయింది. వీరు వెళ్తూ ఆ ప్రాంతంలో పార్క్ చేసి ఉన్న మోటార్ బైక్ హ్యాండిల్ లాక్ పగులగొట్టి అపహరించుకుని పోయారు. ఈ మేరకు బాధితులు శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలాన్ని ట్రెయినీ డీఎస్పీ శివప్రియ పరిశీలన చేపట్టారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. వేసవి కాలంలో ఆరుబయట, మిద్దెల మీద నిద్రపోయే వాళ్లు అప్రమత్తంగా ఉండాలని, బయట ఊర్లకు వెళ్లేవారు ముందుగా పోలీసులకు సమాచారం ఇవ్వాలని డీఎస్పీ శివప్రియ తెలిపారు. ఆమె వెంట ఎస్ఐ రంగనాథ్గౌడ్, సిబ్బంది ఉన్నారు. -
గవర్నర్ అబ్దుల్ నజీర్‌ను కలిసిన వీఎస్‌యూ వీసీ
వెంకటాచలం: రాష్ట్ర గవర్నర్ సయ్యద్ అబ్దుల్ నజీర్‌ను విక్రమసింహపురి యూనివర్సిటీ(వీఎస్‌యూ) వీసీ అల్లం శ్రీనివాసరరావు, ఇన్చార్జి రిజిస్ట్రార్ డాక్టర్ కె.సునీత గురువారం మర్యాద పూర్వకంగా కలిశారు. వీఎస్‌యూ అభివృద్ధికి సంబంధించిన పలు విషయాలను వివరించారు. అనంతరం ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ కె.మధుమూర్తిని కూడా మర్యాద పూర్వకంగా కలిశారు. వైఎస్సార్సీపీలో పలువురి నియామకం నెల్లూరు (బారకాసు): వైఎస్సార్సీపీ రాష్ట్ర అనుబంధ విభాగ కమిటీల్లో వివిధ హోదాల్లో జిల్లాకు చెందిన పలువురిని నియమించారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది. మైనార్టీ సెల్ వైస్ ప్రెసిడెంట్‌గా సయ్యద్ హంజాహుస్సేని, మైనార్టీ సెల్ సెక్రటరీలుగా షేక్ అలిఅహ్మద్, ఎస్కే షాహుల్హమీద్ నియమితులయ్యారు. మైనార్టీ సెల్ జాయింట్ సెక్రటరీలు గా షేక్ మొయినుద్దీన్, షేక్ అహ్మద్, మైనార్టీ సెల్ అధికార ప్రతినిధిగా సయ్యద్ అబ్దుల్ సలీం, రాష్ట్ర ఐటీ వింగ్ అధికార ప్రతినిధిగా పూసపాటి జగన్మోహన్రెడ్డి నియమితులయ్యారు. మూడు యూనిట్లలో విద్యుదుత్పత్తి ముత్తుకూరు: మండలంలోని నేలటూరులో ఉన్న శ్రీదామోదరం సంజీవయ్య ఏపీజెన్కో ప్రాజెక్ట్‌లో మూడు యూనిట్ల నుంచి విద్యుదుత్పత్తి జరుగుతోందని ప్రాజెక్ట్ ఇంజినీర్లు శుక్రవారం తెలిపారు. 1వ యూనిట్లో 250, 2వ యూనిట్లో 310, 3వ యూనిట్లో 410 మెగావాట్ల వంతున విద్యుదుత్పత్తి జరుగుతోందని వివరించారు. -
అయ్యో కూలీలు.. ఆకలి కేకలు
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ‘ఉపాధి’కి గండి పడింది. కూలీలకు ఇప్పటికే రెండు నెలలుగా వేతనాలు జమకాకపోవడంతో ఆకలితో అలమటిస్తున్నారు. మార్చి ఆఖరి కావడంతో ఆలస్యమవుతుందంటూ అధికారులు బుకాయిస్తున్నారు. ఇప్పటికే కూటమి నేతలు బినామీ మస్తర్లతో అసలైన కూలీలకు పనులు కల్పించడంలేదు. గతంలో రోజుకు లక్షల మందికిపై పనిచేస్తే.. ఇప్పుడు ఆ కూలీల సంఖ్య సగానికి తగ్గిపోయింది. నెల్లూరు(పొగతోట): ఉపాధి హామీ కూలీలకు రెండు నెలలుగా వేతనాలు అందలేదు. జనవరి నెలలో సంక్రాంతి పండగ తర్వాత నుంచి వారి బ్యాంక్ ఖాతాల్లో చిల్లిగవ్వ కూడా జమ కాలేదు. దీంతో ఉపాధి పనులకు హాజరయ్యే వారి సంఖ్య గణనీయంగా తగ్గుతోంది. జిల్లాలో 4 లక్షలకు పైగా జాబ్‌కార్డులు కలిగిన కూలీలున్నారు. 37 మండలాల పరిధిలో గత ప్రభుత్వంలో నిత్యం 1.20 లక్షల నుంచి 1.40 లక్షల మంది వరకు పనులకు హాజరవుతుండేవారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఆయా పార్టీల నేతలు యంత్రాలు పెట్టి బినామీ మస్తర్లు వేసి పనులకు గండి కొట్టారు. దీంతో ప్రస్తుతం సుమారు 70 వేల నుంచి 80 వేల మంది కూలీలు పనులకు హాజరవుతున్నారు. గతంలో ఇలా.. గతంలో ఉపాధి కూలీలకు వారం వారం వారి బ్యాంక్ ఖాతాల్లో వేతనాలు జమయ్యేవి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం సిబ్బందిపై వేధింపులు, టీడీపీకి అనుకూల వర్గాల వారికే పనులు కల్పించాలంటూ ఆదేశాలు జారీ చేయడంతో లక్ష్యం నీరుగారుతోంది. కూలీలకు పేమెంట్లు అందకపోవడం ఒక పరిస్థితి అయితే, అధికార పార్టీ నాయకుల కనుసన్నల్లో పనులు జరగాలంటూ ఆదేశాలివ్వడంతో పనులు కుంటుపడుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో వైఎస్సార్సీపీ పాలనలో కూలీలు అధిక సంఖ్యలో హాజరయ్యారు. ప్రస్తుతం అటువంటి వాతావరణం లేదు. టీడీపీకి అనుకూలంగా ఉన్న వారికే పనులు కల్పిస్తున్నారు. బడ్జెట్ ఆఖరి నెలకు, ఉపాధి కూలీల వేతనాలకు ఏం సంబంధం అనే ప్రశ్నకు అధికారుల వద్ద సమాధానం లేదు. ఈ ఏడాదికి కేటాయించిన నిధులు ఏమయ్యాయో చెప్పడానికి సందేహిస్తున్నారు. ఏప్రిల్ మొదటి వారంలో పేమెంట్లు అందుతాయని అధికారులు అంటున్నారు. అయితే నమ్మకం లేదని కూలీలు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. రెండు నెలలుగా వేతనాలు పడక అవస్థలు జిల్లా వ్యాప్తంగా రూ.22 కోట్లకు పైగా బకాయిలు గతంలో వారానికొకసారి జమ చేస్తున్న పరిస్థితి ఏప్రిల్ మొదటి వారంలో వస్తాయంటున్న అధికారులు పేమెంట్లు అందకపోవడంతో తగ్గుతున్న కూలీల సంఖ్య -
ఉత్తమ పంచాయతీగా ఎంపిక
నెల్లూరు సిటీ: నెల్లూరు రూరల్ మండలంలోని పాతవెల్లంటి గ్రామం... మద్య పానానికి దూరం. నేటి కాలంలో కూడా ఇలాంటి ఆదర్శ గ్రామం ఉండడం అందరిని ఆశ్చర్య పరుస్తోంది. ఎప్పుడో ముపై ఏళ్ల క్రితం విధించుకున్న స్వీయకట్టుబాటును ఇప్పటికీ అమలు చేస్తోంది. ఈ విషయంలో అందరూ రాజకీయ పార్టీలకు అతీతంగా వ్యవహరిస్తారు. 1994 నుంచి ఇప్పటి వరకు దాదాపు 30 ఏళ్లుగా గ్రామంలోకి మద్యం ప్రవేశించకుండా గ్రామ పెద్దలు కట్టుబాట్లు ఏర్పాటు చేసుకున్నారు. ఆ కట్టుబాటును ఇప్పటికీ ఆనవాయితీగా కొనసాగుతోంది. ప్రస్తుతం యువత కూడా పెద్దల కట్టుబాటును కొనసాగిస్తూ.. వారి అడుగుజాడల్లో నడుస్తున్నారు. పాతవెల్లంటి గ్రామంలో మొత్తం 650 కుటుంబాలు ఉన్నాయి. 1200 ఓటర్లు ఉండగా, 3 వేల మంది వరకు జనాభా ఉన్నారు. ఈ గ్రామంలో 1994 నుంచి సీపీఎంకు చెందిన అభ్యర్థులే సర్పంచులుగా గెలుస్తున్నారు. ప్రభుత్వాలు మారినా గ్రామ కట్టుబాటు మాత్రం మారకుండా పెద్దలు కాపాడుకుంటూ వస్తున్నారు. గ్రామంలోకి ఎవరైనా మద్యం బాటిల్లు తీసుకొచ్చినా, మద్యం సేవించినా వారికి రూ.10 వేలు జరిమానా విధిస్తారు. మద్యం సేవించాలంటే పక్క గ్రామాలకు వెళ్లాల్సిందే. 30 ఏళ్లుగా పాతవెల్లంటిలో వైన్ షాపు ఏర్పాటు చేసేందుకు ఏ పార్టీకి చెందిన పెద్దలు కూడా సాహసం చేయలేదు. ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో ఒక్కొక్క గ్రామంలో దాదాపు 10 బెల్టు దుకాణాలు నిర్వహిస్తున్నారు. అయితే పాత వెల్లంటిలో మాత్రం బెల్టు దుకాణం నిర్వహిస్తే బెండు తీస్తారు. బెల్టు నిర్వహిస్తున్నట్లు తెలిస్తే గ్రామస్తులే పోలీసులకు అప్పగిస్తారు. కల్లు దుకాణాలు కూడా ఊరి బయట పెట్టుకోవాలని పెద్దలు నిర్ణయించారు. పాత వెల్లంటి గ్రామానికి సమీపంలో పెన్నా పరీవాహక ప్రాంతం ఉంది. ఇక్కడి ఇసుకను గ్రామస్తులు మాత్రమే వినియోగించుకునేలా నిర్ణయించుకున్నారు. బయటకు ప్రాంతాలకు ఇసుకను తరలిస్తే రూ.10 వేలు జరిమానా విధించేలా నిబంధనలు విధించారు. ఈ క్రమంలో గ్రామంలోని పెన్నా నుంచి ఇసుకను బయటకు తరలించేందుకు ఎవరూ ప్రయత్నం కూడా చేయరు. గ్రామంలోని కట్టుబాట్లను అతిక్రమించిన వారి నుంచి వసూళ్లు చేసిన జరిమానాలు గ్రామాభివృద్ధి, ఆలయాభివృద్ధికి ఖర్చు చేయడం గమనార్హం. పారిశుధ్య నిర్వహణ, గ్రామ సభల నిర్వహణలో కేంద్రం 2021 సంవత్సరానికి పాత వెల్లంటి ఉత్తమ పంచాయతీగా ఎంపికైంది. నానాజీ దేశ్‌ముఖ్ రాష్ట్రీయ గ్రామ సభ కేటగిరీ కింద ఉత్తమ పంచాయతీగా ఎంపిక చేసి గ్రామానికి కేంద్రం రూ.10 లక్షలు నిధులు కేటాయించింది. ఆ నిధులతో గ్రామానికి సీసీరోడ్డును నిర్మించుకున్నారు. ఇసుక తరలిస్తే రూ.10 వేలు జరిమానా ఆ ఊరులో మూడు దశాబ్దాలుగా సంపూర్ణ మద్య నిషేధం కొనసాగుతోంది. స్థానికులు ఈ ఊరులోనే కాదు.. బయట ప్రాంతాలకు వెళ్లినా మద్యం ముట్టరు. మద్యం తాగడం ఈ తరం యువతకు ఒక ఫ్యాషన్. నగరాలు, పట్టణాల నుంచి పల్లెల వరకు ఊర్లలో ఏ పండగొచ్చినా.. చావొచ్చినా.. ఎన్నికలొచ్చినా.. మందు బాటిల్ ఓపెన్ కావాల్సిందే. కానీ ఆ పల్లె అందుకు ఆమడ దూరంలో ఉంటుంది. ఆ ఊరు ఈ కట్టుబాటును విధించుకుంది. ఈ విషయంలో అక్కడి జనం రాజకీయ పార్టీలకు అతీతంగా వ్యవహరిస్తారు. ఎవరైనా మద్యం తాగితే జరిమానా కట్టాల్సిందే. ఇప్పటి వరకు ప్రతి ఒక్కరూ మద్యానికి దూరంగా ఉంటున్నారు. 30 ఏళ్లుగా ప్రత్యేక కట్టుబాటును కొనసాగిస్తున్న గ్రామస్తులు నిబంధనలు అతిక్రమిస్తే రూ.10 వేల జరిమానా పెన్నా నుంచి ఇసుక బయట ప్రాంతాలకు తరలించకుండా ఆంక్షలు బెల్టు దుకాణాలు ఏర్పాటు చేస్తే.. ఆ వ్యక్తిని పోలీసులకు అప్పగింత 2021లో ఉత్తమ పంచాయతీగా పాతవెల్లంటి గ్రామం అదృష్టంగా భావిస్తున్నా.. ఈ గ్రామంలో తాను కూడా ఉండడం అదృష్టంగా భావిస్తున్నాను. గ్రామస్తులు మద్యాన్ని గ్రామంలోకి రానివ్వకుండా నిబంధనలు పెట్టడం సంతోషంగా ఉంటుంది. పెద్దల కట్టుబాట్లను ఎవరూ అతిక్రమించకుండా కొనసాగిస్తున్నాం. – వనం, సుబ్బమ్మ, గ్రామస్తురాలు యువత కూడా బాధ్యతగా తీసుకుంది గ్రామంలోకి మద్యం అనుమతి లేకుండా పెద్దలు తీసుకున్న నిర్ణయాన్ని గ్రామంలోని యువత కూడా బాధ్యతగా తీసుకుని నడుచుకుంటుంది. రానున్న రోజుల్లో కూడా తాము కట్టుబాట్లను ఏ మాత్రం చెదరకుండా కొనసాగిస్తాం. – గుడి ఆనంద్, రైతు -
కట్టుబాట్లను కొనసాగిస్తున్నాం
పెద్దలు పెట్టిన కట్టుబాట్లను మేము కూడా కొనసాగిస్తున్నాం. గ్రామ ప్రజలు కూడా కట్టుబాట్లకు అనుగుణంగా నడుచుకుంటున్నారు. గ్రామాభివృద్ధిలో ప్రజలందరినీ భాగస్వామ్యం చేస్తుంటాం. – పాదర్తి రాధ, పాతవెల్లంటి గ్రామ సర్పంచ్గ్రామస్తులందరి సహకారంతోనే... గ్రామంలో అన్ని కులాల వారు ఉన్నారు. గ్రామంలోని ప్రతి ఒక్కరి సహకారంతోనే 30 ఏళ్లుగా కట్టుబాట్లను ఇప్పటికీ కొనసాగించ గలుగుతున్నాం. భవిష్యత్‌లో కూడా ఇలానే కొనసాగుతుందని ఆశిస్తున్నాను. – పల్లవరపు చెంచయ్య, మాజీ సర్పంచ్ సమస్యలపై కూడా కలిసికట్టుగా పరిష్కారం గ్రామంలో ఏ సమస్య వచ్చినా గ్రామస్తులందరు ఒకే తాటిమీదకు వచ్చి సమస్యను పరిష్కరించుకుంటాం. గ్రామస్తులందరం కలిసి కట్టుగా ఉండడంతోనే 30 ఏళ్లుగా అన్ని కట్టుబాట్లు కొనసాగుతున్నాయి. – గంపల వెంకటరమణయ్య, గ్రామస్తుడు ● -
నేత్రపర్వం.. తెప్పోత్సవం
నేత్రపర్వంగా సాగుతున్న ప్రసన్న వేంకటేశ్వరస్వామి తెప్పోత్సవం బిట్రగుంట: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొండబిట్రగుంట బిలకూట క్షేత్రం గురువారం భక్తజన సంద్రంగా మారింది. క్షేత్రవాసి ప్రసన్న వేంకటేశ్వరస్వామిని బ్రహ్మోత్సవాల్లో భాగంగా గరుడవాహనసేవలో దర్శించుకునేందుకు జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చిన భక్తులతో బుధవారం సాయంత్రం నుంచే బిలకూట క్షేత్రం కిటకిటలాడింది. ఉత్సవాలు, ఆపద సమయాల్లో స్వామికి వరపడిన భక్తులంతా బ్రహ్మోత్సవాల్లో సమారాధనల పేరిట మొక్కుబడులు చెల్లించుకోవడం ఆనవాయితీ. ఉత్సవాలు, వాహన సేవల్లో అర్చకులు, ఆగమ పండితులు ప్రధాన పాత్ర పోషిస్తే మొక్కుబడుల రోజు మాత్రం భక్తులే నేరుగా స్వామిని కొలుస్తారు. సంప్రదాయానికి కొనసాగింపుగా జలదంకి, కావలి, అల్లూరు, దగదర్తి తదితర మండలాలకు చెందిన భక్తులు ఎడ్లబండ్లు, ట్రాక్టర్లపై అధిక సంఖ్యలో తరలివచ్చారు. గరుడవాహనంపై స్వావిని దర్శించుకుని, పుష్కరిణిలో పుణ్యస్నానాలు చేశారు. భక్తితో తలనీలాలు సమర్పించుకుని మొక్కుబడులు చెల్లించుకున్నారు. ఆలయ ఆవరణలో, కొండదిగువన సామూహికంగా పొంగళ్లు పొంగించి భక్తితో ప్రసన్నునికి నివేదించారు. అనంతరం ఎవరికి వారు శక్తిమేర అన్నదానం చేశారు. పుష్కరిణిలో జలవిహారం ప్రసన్న వేంకటేశ్వరస్వామి గురువారం రాత్రి పుష్కరిణిలో జలవిహారం చేశారు. కలాణోత్సవానికి సిద్ధమయ్యే ప్రక్రియలో భాగంగా శ్రీదేవి, భూదేవి సమేతంగా పెండ్లికుమారుడైన స్వామివారు కొండపై కొలువుదీరగా అర్చకులు వైఖానస ఆగమోక్తంగా తెప్పోత్సవానికి సిద్ధం చేశారు. ఉభయదేవేరులను, స్వామిని కొండ దిగువన ఉన్న పుష్కరిణి వద్దకు తీసుకొచ్చారు. అప్పటికే వివిధ రకాల ఫుష్ఫాలు, పట్టుపీతాంబరాలతో సిద్ధం చేసిన తెప్పపై స్వామివారిని ఉభయదేవేరులతో కొలువుదీర్చి జలవిహారం చేశారు. ● తెప్పోత్సవం పూర్తి చేసుకున్న ప్రసన్న వేంకటేశ్వరస్వామి గజవాహనంపై ఊరేగారు. దర్శించి... తరించిన భక్తులు -
రీసర్వేలో అటవీ అధికారులు భాగస్వాములు కావాలి
నెల్లూరు రూరల్: ప్రస్తుతం జరుగుతున్న రీసర్వేలో అటవీ అధికారులు భాగస్వాములై భూముల వివాదాల పరిష్కారానికి కృషి చేయాలని కలెక్టర్ ఒ.ఆనంద్ కోరారు. గురువారం కలెక్టరేట్లోని ఎస్ఆర్ శంకరన్ హాల్లో అటవీ, వన్యప్రాణుల రక్షణపై సమీక్ష కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించారు. తొలుత జిల్లా అటవీశాఖ అధికారి మహబూబ్‌బాషా పలు విషయాలను వివరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ భూ వివాదాల విషయమై రెవెన్యూ, అటవీ శాఖ అధికారులు సంయుక్తంగా తనిఖీలు చేపట్టాలన్నారు. ప్రస్తుతం జరుగుతున్న రీసర్వేలో అవసరమైన గ్రామాల్లో అధికారులు హాజరై భూ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ కార్తీక్, కందుకూరు సబ్ కలెక్టర్ తిరుమణి శ్రీపూజ, ఆర్డీఓలు అనూష, పావని, వంశీకృష్ణ, జిల్లా గిరిజన సంక్షేమ అధికారిణి పరిమళ, ఇతర అధికారులు పాల్గొన్నారు. 17 నుంచి టెన్త్ పరీక్షలు ● హాజరుకానున్న 33,434 మంది విద్యార్థులు నెల్లూరు(టౌన్): జిల్లాలో పదో తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు డీఈఓ ఆర్.బాలాజీరావు తెలిపారు. ఈ నెల 17 నుంచి 31వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు చెప్పారు. మొత్తం 174 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామని, జిల్లా వ్యాప్తంగా 33,434 మంది విద్యార్థులు హాజరుకానున్నట్లు వెల్లడించారు. పరీక్షలు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు జరుగుతాయన్నారు. మాస్ కాపీయింగ్‌కు పాల్పడకుండా 9 ఫ్లయింగ్, 24 సిట్టింగ్ స్క్వాడ్ బృందాలను నియమించామన్నారు. విద్యార్థులు వారి హాల్ టికెట్లు చూపించి ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చన్నారు. సమస్యల పరిష్కారం కోసం 83414 08109 ఫోన్ నంబర్‌తో కంట్రోలు రూంను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. పెద్దాస్పత్రిలో డీఎంఈ ఆకస్మిక తనిఖీలు ● విధుల్లో లేని వారికి షోకాజ్ నోటీసులివ్వాలని ఆదేశం నెల్లూరు(అర్బన్): డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (అడ్మిన్) వెంకటేష్ గురువారం విజయవాడ నుంచి వచ్చి నెల్లూరులోని సర్వజన ఆస్పత్రిలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఓపీలు, క్యాజువాలిటీ, వార్డులు పరిశీలించారు. పలు ఓపీల్లో డాక్టర్లు లేక ఖాళీ కుర్చీలు దర్శనమిచ్చాయి. జూనియర్ డాక్టర్లు రోగులను పరిశీలిస్తున్నారు. విషయాన్ని అర్థం చేసుకున్న డీఎంఈ సంతకాలు చేసి విధుల్లో లేని డాక్టర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విధుల్లో లేని డాక్టర్లకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సిద్ధానాయక్‌ను ఆదేశించారు. అనంతరం ఆస్పత్రి సూపరింటెండెంట్, మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ నాగరాజమన్నార్, డిప్యూటీ కలెక్టర్ మహేశ్వరరెడ్డి, అధికారులు, హెచ్ఓడీలు, నర్సింగ్ సూపరింటెండెంట్లు, ఏపీఎంఎస్ఐడీసీ అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంఈ వెంకటేష్ మాట్లాడుతూ డాక్టర్లు సమయపాలన పాటించేలా చర్యలు చేపట్టాలన్నారు. ఆరోగ్యశ్రీ ద్వారా జమ అయిన నిధులను హెచ్‌డీఎస్ కమిటీకి నిబంధనల మేరకు తరలించి వాటిని కనీస సౌకర్యాల కోసం ఖర్చు చేసుకోవాలని సూచించారు. అనంతరం తమ, తమ విభాగాలకు కొరత ఉన్న పరికరాల గురించి డాక్టర్లు నివేదిక అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్లు డాక్టర్ నరేంద్ర, డాక్టర్ మస్తాన్‌బాషా తదితరులు పాల్గొన్నారు. -
వాడీవేడిగా సర్వసభ్య సమావేశం
ఎవరేమన్నారంటే..నెల్లూరు(బారకాసు): నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ సర్వసభ్య సమావేశం గురువారం వాడీవేడిగా జరిగింది. పలువురు కార్పొరేటర్ల మధ్య మాటల యుద్ధం చోటు చేసుకుంది. వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు సమస్యలపై అడిగిన ప్రశ్నలకు అధికారుల నుంచి సమాధానాల్లేవు. ఏపీజే అబ్దుల్ కాలం సమావేశ మందిరంలో మేయర్ స్రవంతి అధ్యక్షతన జరిగిన సమావేశంలో సమస్యల కంటే అంజెండా ఆమోదమే మిన్న అంటూ అధికార సభ్యులు వ్యవహరించడంపై వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు మండిపడుతున్నారు. అజెండాలో పొందుపరిచినవి ఆర్థిక అంశాలేనని.. నిబంధనలకు విరుద్ధంగా ఇన్యాంటిసిపేషన్ ఆర్డర్లకు సంబంధించిన అజెండాను తయరు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార కార్పొరేటర్లు.. వైఎస్సార్సీపీ వారిని మాట్లాడనివ్వకుండా అడుగడుగునా అడ్డు తగులుతూ సమావేశాన్ని సజావుగా జరగనివ్వలేదు. చివరకు అజెండాలోని 91 అంశాలను ఆల్‌పాస్ చేసి ముగించారు. వివిధ సమస్యలపై వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు మేయర్‌కు వినతిపత్రం అందించారు. రెచ్చిపోయి.. ముందుగా డిప్యూటీ మేయర్ రూప్‌కుమార్ యాదవ్ అజెండాలోని అంశాలను చదివి వినిపించి ఆమోదింపజేసే ప్రక్రియను పూర్తి చేయాలన్నారు. దీంతో 37వ డివిజన్ వైఎస్సార్సీపీ కార్పొరేటర్ బొబ్బల శ్రీనివాస యాదవ్ ముందుగా సమస్యలను చెప్పేందుకు అవకాశం ఇవ్వాలని అడగ్గా అందుకు డిప్యూటీ మేయర్ తాను చెప్పిందే జరగాలంటూ అజెండా అంశాలను పూర్తి చేయాలన్నారు. దీంతో ఇరువురి మధ్య కొంతసేపు వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో 13వ డివిజన్‌కు చెందిన వైఎస్సార్సీపీ కార్పొరేటర్ ఊటుకూరు నాగార్జున తన సహచరుడు అడిగినట్లుగా తొలుత సమస్యలపై చర్చింకునేందుకు అవకాశం కల్పి ంచాలన్నారు. అయితే 9వ డివిజన్‌కు చెందిన టీడీపీ కార్పొరేటర్ దామవరపు రాజశేఖర్ నీవేంటి మాట్లాడేదంటూ నాగార్జున మీద రెచ్చిపోయాడు. కొందరు కలుగజేసుకుని సర్దిచెప్పారు. అనంతరం 14వ డివిజన్ కార్పొరేటర్ కర్తం ప్రతాప్‌రెడ్డి సమస్యలు చెప్పి కమిషనర్ సమాధానం ఇవ్వాలని పట్టుబట్టారు. 46వ డివిజన్‌కు చెందిన వైఎస్సార్సీపీ కార్పొరేటర్ వేలూరు ఉమామహేష్ ప్రతి విషయానికి కమిషనర్ సమాధానం చెబుతుంటే సమయం సరిపోదని, మిగిలిన వారికి అవకాశం ఇవ్వాలన్నారు. ప్రతాప్‌రెడ్డి నీకెందుకంటూ మొదలుపెట్టగా ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. మేయర్ వారికి సర్ది చెప్పారు. అడ్డుపడుతూ.. వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు పలు సమస్యలకు సంబంధించిన అంశాలపై మాట్లాడుతుంటే అధికార పార్టీ కార్పొరేటర్లు అకారణంగా అడ్డుపడుతూ వచ్చారు. అధికశాతం మంది తమ డివిజన్లలో అనేక సమస్యలున్నాయని, వాటిని పరిష్కరించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మేయర్ స్పందించి కార్పొరేటర్లు తెలియజేసిన సమస్యలను పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. సమావేశంలో డిప్యూటీ మేయర్ తహసిన్, కో–ఆప్షన్ సభ్యులు, కమిషనర్ సూర్యతేజ, అదనపు కమిషనర్ నందన్, డిప్యూటీ కమిషనర్ చెన్నుడు, ఎస్ఈ రామ్మోహన్రావు, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ చైతన్య, మేనేజర్ ఇనాయతుల్లా, అన్ని విభాగాలకు చెందిన అధికారులు పాల్గొన్నారు. సోలార్ ప్రాజెక్ట్ మేయర్ స్రవంతి మాట్లాడుతూ ప్రధాన అజెండాలోని 68 అంశాలు, సప్లిమెంటరీలోని 15 అంశాలు, టేబుల్ అజెండాలోని 8 అంశాలకు కార్పొరేటర్ల ఆమోదం తెలపడం జరిగిందన్నారు. రూ.60 కోట్లతో నూతనంగా సోలార్ ప్రాజెక్ట్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. ఎన్ఎంసీకి సంబంధించిన ఖాళీ స్థలాలకు ప్రహరీ ఏర్పాటు చేసేందుకు రూ.25 కోట్ల నిధులు కేటాయించి ప్రతిపాదించారన్నారు. కార్పొరేషన్లో రెచ్చిపోయిన అధికార పార్టీ కార్పొరేటర్లు సమస్యలు తర్వాత.. ఆర్థిక అంశాలే ముఖ్యం పలువురు సభ్యుల మధ్య మాటల యుద్ధం వైఎస్సార్సీపీ సభ్యులు అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాల్లేవు అజెండాలోని 91 అంశాలు ఆల్ పాస్ 37వ డివిజన్ కార్పొరేటర్ బొబ్బల శ్రీనివాస యాదవ్ ఇలా మాట్లాడారు. ప్రధాన అజెండాలోని అంశాల్లో మొత్తం 68 ఉండగా ఇందులో 60 అంశాలకు ముందస్తు అనుమతులున్నాయి. రూ.10 లక్షలకు నిధులు పైగా ఖర్చు చేయాలంటే కౌన్సిల్ అనుమతి తీసుకోవాలి. అలా చేయకుండానే రూ.200 కోట్లకు ముందస్తు అనుమతులిచ్చేశారు. ఇది సరైన పద్ధతి కాదు. ఎన్ఎంసీలో అధికారులు కొన్ని బదిలీలను నిబంధనలకు విరుద్ధంగా చేశారు. మేనేజర్, ఇద్దరు ఆర్వోలను బదిలీ చేసి ఆ ముగ్గురి స్థానాల్లో సూపరింటెండెంట్ కేడర్ ఉన్న అధికారిని ఇన్చార్జిగా నియమించారు. సచివాలయ ఉద్యోగులకు ఇచ్చిన షోకాజ్ నోటీసులపై కూడా చర్చించారు. 13వ డివిజన్ కార్పొరేటర్ ఊటుకూరు నాగార్జున మాట్లాడుతూ నగర పాలక కమిషనర్ అధికారులతో కలిసి నా డివిజన్ పర్యటనకు వచ్చినప్పుడు కనీసం సమాచారం కూడా ఇవ్వడం లేదు. అదే టీడీపీలో చేరిన కార్పొరేటర్లకు మాత్రం సమాచారం ఇస్తున్నారు. ఇదెక్కడి న్యాయం?, కమిషనర్‌కు ఫోన్ చేస్తే కనీసం స్పందించడం లేదని ఇది ఎంతవరకు సబబని మేయర్ దృష్టికి తీసుకెళ్లారు. 37వ డివిజన్ కార్పొరేటర్ వేలూరు ఉమామహేష్ ఇలా స్పందించారు. ట్రేడ్ లైసెన్స్‌లు, ఇంటి పన్నులను వసూలు చేసే విషయంలో అధికారులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. ప్రజలకు అవగాహన కల్పించి వారిని చైతన్యవంతుల్ని చేయాలి. అప్పుడే ఇబ్బందులుండవు. నగరంలో దోమలు విపరీతంగా ఉన్నాయని వీటి నియంత్రణకు సరైన చర్యలు చేపట్టాలి. 21వ డివిజన్ కార్పొరేటర్ మొయిళ్ల గౌరీ ఇలా మాట్లాడారు. వైఎస్సార్సీపీ పాలనలో నిధుల డైవర్షన్ జరిగిందని మున్సిపల్ శాఖ మంత్రి అంటున్నారు. 2019 నుంచి 2024 వరకు ఎన్ఎంసీకి వచ్చిన అన్ని రకాల నిధులు, జరిగిన అభివృద్ధి పనులకు సంబంధించి విషయాలను ప్రజలకు తెలియజేయాలి. అజెండాలోని అంశాలు అధిక శాతం ఇన్యాంటిసిపేషన్ (ముందస్తు అనుమతులు)కు సంబంధించినవే పొందుపరిచారు. ఇది సరైన పద్ధతి కాదు. 21వ డివిజన్లో ప్రధాన డ్రెయిన్‌ను నిర్మాణం చేపట్టాలి. మాగుంట లేఅవుట్లో వాకింగ్ ట్రాక్, సైన్స్ పార్కు పక్కన ఉన్న రైల్వే లైన్ వెంబడి స్థలాన్ని బ్యూటిఫికేషన్ చేయాలి. -
కాలువలో దూకి వివాహిత ఆత్మహత్య
నెల్లూరు(క్రైమ్): ఓ వివాహిత నెల్లూరులోని జాఫర్‌సాహెబ్ కాలువలో దూకి ఆత్మహత్య చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. మనుమసిద్దినగర్లో ఎం.వెంకటేశ్వర్లు, సుహాసిని (54) దంపతులు నివాసం ఉంటున్నారు. వారికి ఇద్దరు కుమారులున్నారు. వెంకటేశ్వర్లు ఆర్ఆర్ స్ట్రీట్‌లోని కేఏసీ ప్లాజాలో ఫ్యాన్సీ షాపు నిర్వహిస్తున్నాడు. అతడి తల్లి రంగమ్మ ఈనెల నాలుగో తేదీన మృతిచెందారు. అప్పటి నుంచి సుహాసిని మానసికంగా కుంగిపోయింది. ఈ నేపథ్యంలో గురువారం భర్త దుకాణానికి వెళ్లగా సుహాసిని ఇంట్లో నుంచి ఎటో వెళ్లిపోయింది. ఆమె కనిపించడం లేదని కుటుంబ సభ్యులు వెంకటేశ్వర్లుకు ఫోన్ చేసి తెలియజేశారు. దీంతో ఆయన తన చిన్న కుమారుడు అజయ్‌తో కలిసి గాలింపు చేపట్టారు. పెన్నానది సమీపంలో వెతుకుతుండగా అక్కడున్న వారు కొద్దిసేపటి క్రితం జాఫర్‌సాహెబ్ కాలువలో ఓ మహిళ దూకడంతో స్థానికులు ఆమెను బయటకు తీసి ఒడ్డున పెట్టారని చెప్పారు. దీంతో వెంకటేశ్వర్లు అక్కడికి వెళ్లి చూడగా సదరు మహిళను సుహాసినిగా గుర్తించి చికిత్స నిమిత్తం నగరంలోని రామచంద్రారెడ్డి హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే సుహాసిని మృతిచెందినట్లు నిర్ధారించారు. బాధితులు సంతపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్సై బాలకృష్ణ మృతదేహాన్ని జీజీహెచ్ మార్చురీకి తరలించి కేసు నమోదు చేశారు. -
డీసీపల్లిలో అగ్నిప్రమాదం
మర్రిపాడు: మండలంలోని డీసీపల్లి గ్రామంలో గురువారం అగ్నిప్రమాదం జరిగింది. ఓ బ్యారెన్ సమీపంలో తాత్కాలికంగా వలస కూలీలు ఏర్పాటు చేసుకున్న పది గుడిసెలు దగ్ధమయ్యాయి. స్థానికులు, అధికారుల కథనం మేరకు.. డీసీపల్లిలో ఓ పొగాకు బ్యారెన్‌లో పని చేసుకునే కూలీలు సమీపంలోనే తాత్కాలికంగా గుడిసెలు ఏర్పాటు చేసుకున్నారు. గురువారం ఉదయం పనికి వెళ్లగా 9.45 గంటల సమయంలో ఒక్కసారిగా గుడిసెల్లో మంటలు వ్యాపించాయి. పదిగుడిసెలు పూర్తిగా కాలిపోయాయి. నాలుగు గ్యాస్ సిలిండర్లు పేలిపోయాయి. అంతేకాక ఒక ఆటో, ఒక మోటార్‌బైక్, నాలుగు మొబైల్ ఫోన్లు, సామగ్రి దగ్ధమవడంతో బాధితులు కట్టుబట్టలతో మిగిలారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. మర్రిపాడు ఇన్చార్జి తహసీల్దార్ అనిల్‌కుమార్, ఆత్మకూరు సీఐ గంగాధర్, ఎస్సై శ్రీనివాసరావు, అగ్నిమాపక కేంద్రం అధికారి ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదం చోటు చేసుకుని ఉంటుందని కేసు నమోదు చేసుకున్నారు. రూ.4 లక్షలకు పైగా ఆస్తి నష్టం జరిగినట్లు చెబుతున్నారు. ● సర్వం కోల్పోయిన కుటుంబాలకు ఇన్చార్జి తహసీల్దార్ అనిల్‌కుమార్ అండగా నిలిచారు. సొంత నిధులతో దుస్తులను అందజేశారు. పది కిలోల వంతున బియ్యం పంపిణీ చేశారు. ఈ ఘటనపై ప్రభుత్వానికి నివేదిక అందజేసి బాధితులకు నష్ట పరిహారం అందేలా కృషి చేస్తామని తెలిపారు. పది గుడిసెలు, ఆటో, బైక్ దగ్ధం రూ.4 లక్షలకు పైగా ఆస్తి నష్టం -
మహిళ కుటుంబానికి చేయూత
నెల్లూరు(వీఆర్సీసెంటర్): గుండె, మెదడు సంబంధిత సమస్యలతో బాధపడుతూ పూటగడవక ఇబ్బందులు పడుతున్న సుభాషిణి అనే మహిళకు దాతలు సాయం చేశారు. గురువారం సాక్షిలో ‘ఆమె జీవితం కష్టాలమయం’ అనే శీర్షికన కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. దీంతో 54వ డివిజన్ జనార్దనరెడ్డికాలనీ ప్రాంతానికి చెందిన మల్లికార్జున బియ్యం, కూరగాయలు, నిత్యావసర వస్తువులు అందజేశారు. నకిలీ ఎస్సై అరెస్ట్ సంగం: మండలంలోని సంగంలో నకిలీ ఎస్సైగా చెలామణి అవుతున్న హరీష్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. సంగం పోలీస్‌స్టేషన్‌లో గురువారం ఆత్మకూరు డీఎస్పీ వేణుగోపాల్ వివరాలు వెల్లడించారు. హరీష్ నకిలీ ఎస్సై అవతారమెత్తి వాహనాలు ఆపి రికార్డులు పరిశీలిస్తున్నాడు. దీనిపై సమాచారం అందడంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి నుంచి కారు, నకిలీ యూనిఫాం, బెల్ట్, బూట్లు, నంబర్ ప్లేట్, టోపీ, స్టార్స్ తదితరాలను స్వాధీనం చేసుకున్నారు. 2023లో వచ్చిన ఎస్సై ఫలితాల్లో ఎంపికయ్యానని సిద్ధీపురానికి చెందిన హరీష్ అందరినీ నమ్మించాడు. ఎస్సై యూనిఫాం ధరించి పలు ప్రాంతాల్లో వాహనాలు నిలిపి నగదు వసూళ్లకు పాల్పడుతున్నాడని డీఎస్పీ వెల్లడించారు. నిందితుడిని రిమాండ్‌కు తరలిస్తామని చెప్పారు. కేసును ఛేదించిన సీఐ వేమారెడ్డి, ఎస్సై రాజేష్, సిబ్బందిని అభినందించారు. 15 నుంచి అందుబాటులోకి మ్యూజియం నెల్లూరు రూరల్: నెల్లూరు సరస్వతి నగర్లో ఉన్న పురావస్తు శాఖ మ్యూజియం ఈనెల 15వ తేదీ నుంచి అందుబాటులోకి వస్తుందని సహాయ సంచాలకుడు జి.గంగాధర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. కలెక్టర్ ఆదేశాలతో మున్సిపల్ శాఖ నిధులతో ఆధునికీకరణ పనులు చేపట్టినట్లు తెలియజేశారు. పురాతన వస్తువులు, రాజుల కాలం నాటి నాణేలు, అరుదైన శిల్పాలు ఉన్నాయన్నారు. ట్రాక్టర్‌ను ఢీకొట్టిన కారు ● ఒకరికి తీవ్రగాయాలు దగదర్తి(బిట్రగుంట): దగదర్తి మండలం ఉలవపాళ్ల కూడలి వద్ద ట్రాక్టర్‌ను కారు ఢీకొట్టిన ఘటన గురువారం జరిగింది. స్థానికులు, పోలీసుల కథనం మేరకు.. ఉలవపాళ్ల కూడలి వద్ద మలుపు తిరుగుతున్న ట్రాక్టర్‌ను ఒంగోలు నుంచి నెల్లూరుకు వెళ్తున్న కారు ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు ట్రాక్టర్ ఇంజిన్ రెండుగా విడిపోయింది. ట్రాక్టర్ విడిభాగాలు రోడ్డుపైన చెల్లాచెదురుగా పడిపోయాయి. డ్రైవర్ రోడ్డుపై పడిపోవడంతో తీవ్రంగా గాయపడ్డాడు. కారులోని ప్రయాణికులు స్వల్పగాయాలతో బయటపడ్డారు. క్షతగాత్రులను 108 అంబులెన్స్‌లో కావలి ఏరియా ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్ స్తంభించకుండా చర్యలు చేపట్టారు. -
విద్యార్థుల్లో ఫుల్ జోష్
నెల్లూరు(టౌన్): ఇంటర్ ప్రథమ సంవత్సర పరీక్షలు గురువారంతో ముగిశాయి. ఈనెల ఒకటో తేదీన పరీక్షలు మొదలయ్యాయి. చివరిరోజు కెమిస్ట్రీ, కామర్స్ పరీక్షలు జరిగాయి. వీటికి జనరల్‌కు సంబంధించి 27,753 మందికి గానూ 26,961 మంది హాజరయ్యారు. 792 మంది గైర్హాజరయ్యారు. ఒకేషనల్ విభాగంలో 738 మందికి గానూ 634 మంది హాజరయ్యారు.104 మంది గైర్హాజరయ్యారు. ఆర్ఐఓ ఆదూరు శ్రీనివాసులు ఆత్మకూరులోని ప్రభుత్వ, ప్రియదర్శిని, బీఎస్ఆర్, వింజమూరులోని వైఆర్ వికాస్ జూనియర్ కళాశాలలను తనిఖీ చేశారు. పరీక్ష కేంద్రాల నుంచి బయటకు వచ్చిన విద్యార్థులు కాగితాలను చింపి కేకలు వేశారు. హాస్టళ్లలో ఉంటున్న వారు ఆర్టీసీ బస్టాండ్, రైల్వే స్టేషన్‌కు చేరుకుని సొంతూర్లకు బయలుదేరారు. -
డిగ్రీ పరీక్షల్లో ఇద్దరు డిబార్
వెంకటాచలం: విక్రమసింహపురి యూనివర్సిటీ (వీఎస్‌యూ) అనుబంధ కళాశాలల్లో బుధవారం నిర్వహించిన డిగ్రీ ఆరో, నాలుగో సెమిస్టర్ల పరీక్షలకు 449 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని ఎగ్జామ్స్ అధికారి డాక్టర్ ఆర్.మధుమతి తెలిపారు. ఉదయం నిర్వహించిన ఆరో సెమిస్టర్‌కు 55 మందికి 47 మంది హాజరు కాగా, మధ్యాహ్నం నిర్వహించిన నాలుగో సెమిస్టర్‌కు 7,573 మందికి 7,132 మంది హాజరయ్యారనితెలిపారు. బుచ్చిరెడ్డిపాళెంలోని సెయింట్ మేరీ డిగ్రీ కళాశాలలో ఇద్దరు విద్యార్థులు డిబార్ అయ్యారని తెలిపారు. -
నమ్మక ద్రోహంపై... గర్జన గళమై..
విద్యార్థులను చదువుకు దూరం చేసే కుట్ర ఫీజు రీయింబర్స్మెంట్, వసతిదీవెన విడుదల చేయకుండా విద్యార్థులకు, ఉద్యోగాలు కల్పించకుండా కూటమి ప్రభుత్వం నిరుద్యోగులకు నమ్మకం ద్రోహం చేసింది. నిరుద్యోగ భృతి ఇస్తామంటూ నయవంచనకు పాల్పడింది. తమ భవిష్యత్‌ను కాలరాస్తున్న కూటమి ప్రభుత్వాన్ని కూకటి వేళ్లతో సహా పెకలిస్తామంటూ యువత గర్జించింది. సర్కార్ మెడలు వంచి హామీలు అమలయ్యే వరకు విశ్రమించబోమని శపథం చేశారు. మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు బుధవారం జిల్లా కేంద్రంలో ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని కోరుతూ యువత పోరు కార్యక్రమాన్ని నిర్వహించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీమంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి ఆధ్వర్యంలో వీఆర్సీ సెంటర్ నుంచి కలెక్టరేట్ వరకు మండు టెండను సైతం లెక్క చేయకుండా భారీ ర్యాలీ నిర్వహించారు. ఫీజు రీయింబర్స్మెంట్, వసతి దీవెన విడుదల చేయాలని, ఉద్యోగాలు కల్పించాలని, లేదంటే నిరుద్యోగ భృతి ఇవ్వాలంటూ నినాదాలు మార్మోగాయి. కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం కలెక్టర్ ఎ. ఆనంద్‌కు మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ ఇన్చార్జిలతో కలిసి వినతిపత్రం అందజేశారు. – నెల్లూరు (అర్బన్) – కాకాణి గోవర్ధన్‌రెడ్డి, మాజీ మంత్రి ● వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో కదం తొక్కిన యువత ● ఫీజు రీయింబర్స్మెంట్, ఉద్యోగాలు కల్పించాలని నినాదాలు ● కలెక్టరేట్ వద్ద ధర్నాకు భారీగా తరలివచ్చిన విద్యార్థులు, నిరుద్యోగులు ● ప్రభుత్వ మెడలు వంచి హామీలు అమలు చేయిస్తాం ● వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి కూటమి ప్రభుత్వం విద్యార్థులను, నిరుద్యోగులను నయవంచనకు గురి చేసింది. రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్మెంట్, వసతి దీవెన బకాయిలు రూ.7,100 కోట్లు ఉండగా బడ్జెట్లో కేవలం రూ.2,600 కోట్లు మాత్రమే కేటాయించారు. దీన్ని బట్టి పేద విద్యార్థులను చదువుకు దూరం చేసేందుకు కూటమి ప్రభుత్వం కుట్రలు చేస్తోంది. రూ.8,900 కోట్లతో రాష్ట్రంలో మెడికల్ కళాశాలలను జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ప్రారంభించగా, వాటిని కూటమి ప్రభుత్వం ప్రైవేట్ పరం చేసేందుకు పూనుకోవడం దుర్మార్గ చర్య. 2024–25 ఏడాదికి తల్లికి వందనం ఇవ్వకుండా మోసం చేశారు. 2025–26 సంవత్సరానికి రూ.12 వేల కోట్లు అవసరం కాగా, బడ్జెట్లో కేవలం రూ.7,600 కోట్లు పెట్టి తల్లికి టోకరా పెట్టబోతున్నారు. సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని, లేదంటే నిరుద్యోగ భృతి ఇస్తామని ఊదరగొట్టిన చంద్రబాబు ఒక్క ఉద్యోగం కల్పించలేదు. నిరుద్యోగ భృతి రెండేళ్లకు కలిపి రూ.72,000 కోట్లు అవసరం కాగా బడ్జెట్లో ఆ ఊసే లేదు. ప్రజలను మోసం చేస్తున్న కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు నిలదీస్తున్నారు. పోరాటాలతో ప్రభుత్వ మెడలు వంచి తీరుతాం.నిరుద్యోగులకు శాపం చంద్రబాబు – పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి, ఎమ్మెల్సీ రాష్ట్రంలో 2 లక్షల మంది వలంటీర్లను తొలగించిన ఘనుడు చంద్రబాబు. అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులను తొలగిస్తూ యువతను నడిరోడ్డులో నిలబెడుతున్నాడు. ఎన్నికల సందర్భంగా 25 వేల పోస్టులతో మెగా డీఎస్సీ అని చెప్పాడు. గెలిచాక 16 వేల పోస్టులతో డీఎస్సీ అంటూ తొలి సంతకం చేశాడు. ఆ తొలి సంతకానికి నేటికీ దిక్కులేదు. ఇంట్లో ఎంత మంది ఉంటే అంత మందికి తల్లికి వందనం అని చెప్పి బాబు మోసం చేశారు. గతంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పేద విద్యార్దులకు అండగా పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ పెట్టారు. మనస్సు లేని పాలన బాబుది – మేరిగ మురళీధర్, ఎమ్మెల్సీ బాబుది మోసపూరిత పాలన – బుర్రా మధుసూదన్‌యాదవ్, మాజీ ఎమ్మెల్యే, కందుకూరు ఇన్చార్జి -
వైఎస్సార్సీపీ ఆవిర్భావమే చారిత్రాత్మకం
నెల్లూరు (బారకాసు): దేశ రాజకీయ యవనికపై వైఎస్సార్సీపీ ఆవిర్భావమే ఒక చారిత్రాత్మకం, ఉప ఎన్నికల నుంచి సార్వత్రిక ఎన్నికల వరకు వైఎస్సార్సీపీ విజయాలు అప్రతిహతంగా కొనసాగాయని మాజీమంత్రి, పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి అన్నారు. బుధవారం నెల్లూరు నగరంలోని డైకస్‌రోడ్డులో ఉన్న పార్టీ జిల్లా కార్యాలయంలో వైఎస్సార్సీపీ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. తొలుత పార్టీ జెండాను కాకాణి గోవర్ధన్‌రెడ్డి ఎగురవేశారు. కార్యాలయ ఆవరణలో ఉన్న దివంగత సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం భారీ కేక్‌కట్ చేసి అందరికి పంచి పెట్టారు. కాకాణి మాట్లాడుతూ వైఎస్సార్సీపీకి ఆశీస్సులు, ఆదరణ అందించిన ప్రజానీకానికి, నాయకులు, కార్యకర్తలకు, సానుభూతిపరులు, వైఎస్సార్, వైఎస్ జగన్ అభిమానులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. 14 వసంతాలు పూర్తి చేసుకుని 15వ వత్సరంలోకి అడుగు పెట్టిందన్నారు. ఈ 14 ఏళ్ల పాటు పార్టీ అనేక ఒడిదొడుకులను ఎదుర్కొందన్నారు. ఇడుపులపాయలో 2011న మార్చి 12న మహానేత డాక్టర్ వైఎస్సార్ సమాధి వద్ద పార్టీ జెండాను ఆవిష్కరించినట్లు గుర్తు చేశారు. ఒక్క ఎమ్మెల్యే, ఒక్క ఎంపీతో ప్రారంభమైన పార్టీ ప్రస్థానం ప్రతిపక్ష పార్టీగా, అధికార పార్టీగా నిలిచి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజలకు మరింత చేరువయ్యారన్నారు. కోట్లాది మంది ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తూ, విలువలు, విశ్వసనీయత ఐదేళ్లు జగన్ పరిపాలన కొనసాగించారన్నారు. పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా వాడవాడల వైఎస్సార్సీపీ జెండా ఎగరడానికి కారణం వైఎస్ జగన్మోహన్రెడ్డి మీద ప్రజల్లో ఉండే నమ్మకమేనని చెప్పారు. గడిచిన 9 నెలల్లోనే వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఓటు వేయకుండా చంద్రబాబుకు ఓటు వేసి అధికారం ఇచ్చి తప్పు చేశామనే భావన ప్రజల్లో ఉందన్నారు. బాబు పాలన కంటే వైఎస్ జగన్ పాలన వెయ్యి రెట్లు మేలని వైఎస్సార్సీపీ వాళ్లే కాకుండా కరుడు కట్టిన టీడీపీ వాళ్లు మాట్లాడుతున్న పరిస్థితి నెలకొందన్నారు. రాబోయే రోజుల్లో జగన్ 2.0 పార్టీ కార్యకర్తలకు ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని, అన్ని వర్గాల వారికి అభివృద్ధి, సంక్షేమ పథకాలు అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ వెంకటగిరి, ఉదయగిరి ఇన్చార్జిలు నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి, మేకపాటి రాజగోపాల్‌రెడ్డి, ఎమ్మెల్సీ మేరిగ మురళి, సూళ్లూరుపేట మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, పార్టీ రాష్ట్ర మహిళా విభాగం నాయకురాలు మల్లి నిర్మల, కార్పొరేటర్ మొయిళ్ల గౌరి, నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి ఘనంగా ఆవిర్భావ దినోత్సవ సంబరాలు పార్టీ జెండా ఎగుర వేసిన నేతలు -
యువత పాల్గొనాలి : కలెక్టర్
నెల్లూరు రూరల్: యూత్ పార్లమెంట్ – 2025లో 18 నుంచి 25 సంవత్సరాల మధ్య వయసున్న యువతీ, యువకులు పాల్గొనాలని కలెక్టర్ ఆనంద్ కోరారు. కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను తన కార్యాలయంలో బుధవారం కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశాభివృద్ధికి యువత తమ ప్రణాళికలను పంచుకోవడానికి యూత్ పార్లమెంట్ – 2025 మంచి వేదిక అన్నారు. ఆసక్తి గల వారు వన్ నేషన్ – వన్ ఎలక్షన్‌పై మై భారత్ పోర్టల్‌లో రిజిస్టర్ చేసుకుని వికసిత భారత్‌పై ఒక నిమిషం వీడియోను చిత్రీకరించి నెల్లూరు నోడల్ డిస్ట్రిక్ పోర్టల్‌లో అప్లోడ్ చేయాలని సూచించారు. పూర్తి వివరాలకు ఎన్ఎస్ఎస్ సమన్వయకర్త డాక్టర్ ఉదయ్‌శంకర్ అల్లం (81878 14140) నెహ్రూ యువ కేంద్రం అధికారి డాక్టర్ ఎ.మహేంద్రరెడ్డి (99635 33440)ను సంప్రదించాలన్నారు. -
విజయసాయిరెడ్డి వ్యాఖ్యలకు కాకాణి కౌంటర్
సాక్షి, నెల్లూరు: విజయసాయిరెడ్డి వ్యాఖ్యలకు మాజీ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఆయన వ్యాఖ్యలు చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగమేనన్నారు. ‘‘విజయసాయిరెడ్డి, రఘురామ కృష్ణంరాజుల మధ్య స్నేహం ఉంది. స్నేహం లేకపోతే విజయసాయిరెడ్డి ఎందుకు ఇల్లు అద్దెకు ఇచ్చారు’’ అని కాకాణి ప్రశ్నించారు.‘‘వ్యవసాయం చేసుకుంటానని చెప్పిన సాయిరెడ్డి చంద్రబాబుకు సాయం చేస్తున్నారు. జగన్ వద్ద ఎలాంటి కోటరీలు లేవు’’ అని కాకాణి స్పష్టం చేశారు. రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తే ఆ స్థానం కూటమికి దక్కుతుంది. తెలిసే ఇదంతా చేశారు.. ఇందులో గూడుపుఠాణి ఉందన్న అనుమానం కలుగుతోంది’’ అని కాకాణి అన్నారు. -
ఆరుగురు ‘తెలుగు తమ్ముళ్ల’పై కేసు●
● స్కూల్ వార్షికోత్సవంలో బీభత్సం చేసిన ఘటనలో.. తోటపల్లిగూడూరు: ఓ పాఠశాల వార్షికోత్సవంలో పచ్చమూక సృష్టించిన బీభత్సంపై బాధితులు మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆరుగురిపై కేసు నమోదైంది. వివరాలు.. మండలంలోని చెన్నపల్లిపాళెం ఉన్నత పాఠశాలలో సోమవారం సరస్వతి పూజ, వార్షికోత్సవం జరిగింది. దీనికి వెంకటేశ్వరపట్టపుపాళెం, ముత్యాలతోపు పట్టపుపాళెం గ్రామాల్లోని అధికార పార్టీకి చెందిన కొందరు యువకులు మద్యం తాగొచ్చి బీభత్సం చేసిన సంగతి తెలిసిందే. డీజే సిస్టం నిర్వాహకులైన వంశీ (పల్లిపాడు), విక్రమ్ (విలుకానుపల్లి)పై తెలుగు తమ్ముళ్లు దాడి చేశారు. అంతే కాకుండా డీజే సిస్టంకు సంబంధించిన మిక్సర్, ల్యాప్‌టాప్‌లను ధ్వంసం చేశారు. ఈ క్రమంలో బాధితులైన వంశీ, విక్రమ్‌లు మంగళవారం పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. టీడీపీకి చెందిన ఆవుల గణేష్, ముత్యాల హరి, మహేష్, చందు, విజయ్, కిరణ్‌తో పాటు మరికొందరు అకారణంగా దాడి చేసి, డీజే సిస్టం సామగ్రిని ధ్వంసం చేశారని, సుమారు రూ.లక్ష ఆస్తి నష్టం వాటిల్లినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు దాడికి పాల్పడిన ఆరుగురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన్నట్లు స్థానిక ఎస్సై వీరేంద్రబాబు తెలిపారు. -
దంపతుల ఆత్మహత్యాయత్నం
కావలి: కోర్టు వివాదంలో ఉన్న పొలంలో వరి పంట కోత పనులను అడ్డుకుంటుండటంతో కౌలు రైతు దంపతులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన కావలి రూరల్ మండలం తాళ్లపాళెం గ్రామంలో మంగళవారం జరిగింది. కోత పనుల కోసం కౌలు రైతు ప్రసాద్‌రెడ్డి వరికోత మెషీన్‌ను తీసుకెళ్లగా కొందరు అడ్డుకున్నారు. దీంతో అతను, భార్య లక్ష్మీకాంతమ్మ పొలంలోనే పురుగు మందు తాగగా స్థానికులు వారిని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఇద్దరికీ ప్రాణహాని లేదని తెలిసింది. సమాచారం అందుకున్న కావలి రూరల్ పోలీసులు విచారణ చేస్తున్నారు. అడవుల్లో ట్రాప్ కెమెరాల ఏర్పాటు సీతారామపురం: మండలంలోని సీతారామపురం, పండ్రంగి, దేవమ్మచెరువు, చిన్నాగంపల్లి బీట్ల పరిధిలోని అటవీ ప్రాంతాల్లో 35 ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు డీఆర్వో కేవీ ప్రసాద్ తెలిపారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ ఇటీవల వెలుగొండ అడవుల్లో పెద్దపులి సంచరిస్తున్నందున దానిని గుర్తించేందుకు అడవిలో కెమెరాలు అమర్చామన్నారు. పశువుల కాపరులు అడవిలో సంచరించే సమయంలో అప్రమత్తంగా ఉండాలన్నారు. అలాగే అడవికి నిప్పు పెడితే శిక్షార్హులవుతారన్నారు. -
బీపీటీ రకాన్ని కేంద్రాల్లోనే విక్రయించుకోండి
● డీఏఓ పి.సత్యవాణి సూచన కొడవలూరు: బీపీటీ రకం ధాన్యాన్ని మార్కెట్లో తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నందున, దానిని రైతులు విధిగా కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించుకోవాలని జిల్లా వ్యవసాయాధికారిని పి.సత్యవాణి సూచించారు. మండలంలోని గుండాలమ్మపాళెం, వెంకన్నపురం కొనుగోలు కేంద్రాలను మంగళవారం ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బీపీటీ రకానికి ప్రభుత్వం పుట్టికి రూ.19,720 మద్దతు ధర ప్రకటించిందని, మార్కెట్లో రూ.17,500లకే కొంటున్న నేపథ్యంలో కొనుగోలు కేంద్రంలో విక్రయించుకుని అధిక ధర పొందాలన్నారు. తేమ శాతంలోనూ మినహాయింపు ఉన్నందున రైతులు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. తేమ శాతం అధికంగా ఉంటే అదనంగా ఉన్న ఒక్కో శాతానికి క్వింటాకు కిలో ధాన్యం వంతున అదనంగా కేంద్రాలకు ఇవ్వడం ద్వారా విక్రయించుకునే వెసులుబాటు ఉందన్నారు. ప్రధానంగా వరికోత కోసే రైతులు వారం ముందుగానే వీఏఏను సంప్రదించి షెడ్యూలింగ్ నమోదు చేసుకోవాలన్నారు. దీంతో కేంద్రాల్లో గన్నీ బ్యాగులు, మిల్లుల కేటాయింపు, వాహనాలు సిద్ధం చేసుకునే వెసులుబాటు ఉంటుందన్నారు. ఆమె పంట నమోదైన రైతుల వివరాలను కేంద్రాల వద్ద ప్రచురించారు. కార్యక్రమంలో ఏడీఏలు నర్సోజీ, శేషగిరిరావు, ఏఓ లక్ష్మి, ఏఈఓ పి.వెంకట్రావు, వీఏఏలు కె.విష్ణుప్రియ, బి.లిఖిత తదితరులు పాల్గొన్నారు. -
మితిమీరిన టీడీపీ అరాచకాలు
నెల్లూరు(బారకాసు): కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత టీడీపీ నేతల అరాచకాలు మితిమీరడమే కాదు.. హద్దు కూడా మీరాయని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి అన్నారు. మంగళవారం నెల్లూరు నగరంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో కాకాణి మీడియాతో మాట్లాడుతూ తోటపల్లిగూడూరు మండలం కోడూరు మజరా చెన్నపల్లిలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, సౌండ్ టెక్నీషియన్‌పై దాడి చేయడంతోపాటు వారి సెల్ఫోన్లు, ల్యాప్‌టాప్‌ను ధ్వంసం చేశారన్నారు. పవిత్రమైన సరస్వతి విద్యాలయంలో టీడీపీకి చెందిన ఆవుల గణేష్, ముత్యాల హరి, పామంచి వాసు, మహేష్, చందు, విజయ్ మరో పది మంది మద్యం తాగి పాఠశాలల్లోకి వెళ్లి గందరగోళాన్ని సృష్టించారన్నారు. విద్యార్థులు సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహిస్తుంటే.. అసభ్యకరమైన పాటలు పెట్టి వాటికి డ్యాన్సులు వేయాలని చెప్పడం సిగ్గుచేటన్నారు. అడ్డుకున్న పాఠశాల హెడ్మాస్టర్ను దుర్భాషలాడి, దాడి చేయడంతోపాటు సెల్‌ఫోన్ పగులగొట్టారన్నారు. సాంస్కృతిక కార్యక్రమాలకు ఏర్పాటు చేసిన సౌండ్ టెక్నీషియన్ ల్యాప్‌టాప్‌ను పగులగొట్టారన్నారు. ఇంత జరిగితే విద్యాశాఖ, పోలీస్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. తాను డీఈఓను అడిగితే తనకేమి తెలియనట్లు చెప్పడం చూస్తే అధికార యంత్రాంగం పచ్చమూకలకు ఏ విధంగా సాగిలపడుతున్నారో అర్థమవుతుందన్నారు. తమ పార్టీ తరఫున అక్కడికి వెళ్లితే పాఠశాల ఉపాధ్యాయులను టీడీపీ నాయకులు ఇబ్బందులు పెడతారన్న ఉద్దేశంతో తాము వెళ్లలేదనన్నారు. వైఎస్సార్సీపీ హయాంలో ఇటువంటి ఘటనలు జరిగాయా అని ప్రశ్నించారు. కొత్త సంప్రదాయాలు, సంస్కృతికి తెరలేపి విచ్చలవిడి తనానికి కేరాఫ్‌గా సర్వేపల్లి తయారైందన్నారు. సంబంధిత అధికారులు నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో తాము విడిచి పెట్టేది లేదన్నారు. సోమిరెడ్డి.. నీది తప్పుడు బతుకు సోమిరెడ్డి అసెంబ్లీలో మాట్లాడడం చూస్తే ఆయన నిజాయితీతో కూడిన బతుకు బతుకుతున్నాడని తాను అనుకోవడం లేదని కాకాణి అన్నారు. ఆయనపైన అక్రమంగా 18 కేసులు పెట్టినట్టుగా అసెంబ్లీ సాక్షిగా చెప్పాడని, ఆ కేసుల వివరాలు చెప్పాలని కాకాణి డిమాండ్ చేశారు. రేయింబవుళ్లు ఆయన్ను పోలీస్‌స్టేషన్‌లో ఉంచినట్లుగా కూడా సోమిరెడ్డి చెప్పాడని, ఈ విషయాల్లో ఒక్కటైనా రుజువు చేయాలని ఛాలెంజ్ విసిరారు. హిజ్రాలతోపాటు మరి కొంతమంది కలిసి దాదాపు 400 మంది తనపై దాడి చేయడానికి వచ్చారని సోమిరెడ్డి చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఓ వ్యక్తికి చెందిన 2.30 ఎకరాల స్థలాన్ని సోమిరెడ్డి దొంగతనంగా అమ్మేశాడని, దీనిపై సదరు యజమాని సోమిరెడ్డిపై కేసు పెట్టారన్నారు. తన ఆత్మహత్యకు సోమిరెడ్డి కారణమని రాసిన లేఖలను సైతం మాయం చేసినటు వంటి వ్యక్తివి నువ్వు.. నీది ఒక బతుకేనా అని కాకాణి ఎద్దేవా చేశారు. సోమిరెడ్డి చెప్పిన విషయాలపై సీబీఐతో విచారణ జరిపిస్తే వాస్తవాలు బయట పడుతాయన్నారు. అక్రమంగా గ్రావెల్, బూడిద, ఇసుక, మట్టి దోచుకునే వ్యక్తి, అబద్ధాలు చెప్పే వ్యక్తి సోమిరెడ్డి అని చెప్పారు. సర్వేపల్లిలో 6 ఎకరాలను వైఎస్సార్సీపీకి చెందిన వ్యక్తులు రూ.35 లక్షలకు విక్రయించడం జరిగిందని సోమిరెడ్డి చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఇందులో ఎవరి పాత్ర ఉందో నిగ్గు తేల్చాలని కొందరు సోమిరెడ్డికి ఛాలెంజ్ విసిరారన్నారు. పొదలకూరు పోలీస్‌స్టేషన్‌లో ఆర్డీఓ సంతకాన్ని ఫోర్జరీ చేశారన్న విషయంపై నమోదైన కేసులో సోమిరెడ్డి కుమారుడు ఉన్నాడని, ఈ కేసుపై ఇప్పటికీ విచారణ జరగడం లేదన్నారు. ఈ కేసును తొక్కిపెట్టారని కాకాణి ఆరోపించారు. వైఎస్సార్సీపీ గురించి విమర్శించే అర్హత, కానీ, స్థాయి కానీ నీకు లేదన్న విషయాన్ని సోమిరెడ్డి గుర్తుపెట్టుకోవాలన్నారు. మద్యం తాగి వచ్చి పాఠశాలలో రచ్చ రచ్చ విద్యార్థులు, హెడ్మాస్టర్పై దాడి చేయడం దారుణం వారిపై కేసులు నమోదు చేసి కఠినంగా శిక్షించాలి 18 అక్రమ కేసులు పెట్టినట్లు అసెంబ్లీలో చెప్పిన సోమిరెడ్డి మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి -
దంపతుల ఆత్మహత్యాయత్నం
కావలి: కోర్టు వివాదంలో ఉన్న పొలంలో వరి పంట కోత పనులను అడ్డుకుంటుండటంతో కౌలు రైతు దంపతులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన కావలి రూరల్ మండలం తాళ్లపాళెం గ్రామంలో మంగళవారం జరిగింది. కోత పనుల కోసం కౌలు రైతు ప్రసాద్‌రెడ్డి వరికోత మెషీన్‌ను తీసుకెళ్లగా కొందరు అడ్డుకున్నారు. దీంతో అతను, భార్య లక్ష్మీకాంతమ్మ పొలంలోనే పురుగు మందు తాగగా స్థానికులు వారిని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఇద్దరికీ ప్రాణహాని లేదని తెలిసింది. సమాచారం అందుకున్న కావలి రూరల్ పోలీసులు విచారణ చేస్తున్నారు. అడవుల్లో ట్రాప్ కెమెరాల ఏర్పాటు సీతారామపురం: మండలంలోని సీతారామపురం, పండ్రంగి, దేవమ్మచెరువు, చిన్నాగంపల్లి బీట్ల పరిధిలోని అటవీ ప్రాంతాల్లో 35 ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు డీఆర్వో కేవీ ప్రసాద్ తెలిపారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ ఇటీవల వెలుగొండ అడవుల్లో పెద్దపులి సంచరిస్తున్నందున దానిని గుర్తించేందుకు అడవిలో కెమెరాలు అమర్చామన్నారు. పశువుల కాపరులు అడవిలో సంచరించే సమయంలో అప్రమత్తంగా ఉండాలన్నారు. అలాగే అడవికి నిప్పు పెడితే శిక్షార్హులవుతారన్నారు. -
వందలాది మందికి ఉపాధి
రంజాన్ మాసంలో చాలామందికి ఇష్టమైన వంటకం హలీం. ముస్లింలే కాకుండా ఇతరులు చాలామంది దీని రుచిని ఆస్వాదించేందుకు ఇష్టపడుతుంటారు. ఇప్పటికే నెల్లూరు నగరంలో హలీం తయారీ కేంద్రాలు ప్రధాన రహదారుల వెంట ఏర్పాటయ్యాయి. ఒకప్పుడు పెద్ద నగరాలకే పరిమితమైన హలీం ప్రస్తుతం ప్రధాన పట్టణాల్లోనూ లభ్యమవుతోంది.ఇష్టంగా తింటున్నారు నెల్లూరు ప్రజలకు కొన్ని ఏళ్లుగా హలీంను విక్రయిస్తున్నాం. అప్పట్లో చాలా తక్కువ మంది మాత్రమే తినేవారు. ముస్లింలు ఉపవాస దీక్ష అనంతరం పౌష్టికాహారంగా ఈ వంటకాన్ని స్వీకరించేవారు. ఇప్పుడు చాలామంది ఇష్టంగా తింటున్నారు. – రబ్బానీ, రియాజ్ హోటల్, నెల్లూరునెల్లూరు సిటీ: రంజాన్ మాసం వచ్చిందంటే.. అందరికీ గుర్తుకొచ్చేది హలీం. ఇది పోషక విలువలతో కూడిన రుచికరమైన ప్రత్యేక మాంసాహార వంటకం. రంజాన్ నెల ఎప్పుడొస్తుందా అని వేచిచూసే హలీం అభిమానులు పట్టణాలు, నగరాల్లో ఉన్నారంటే దీని ప్రత్యేకత ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు. నెల్లూరు నగరంలోని ప్రధాన ప్రాంతాల్లో పదుల సంఖ్యలో మటన్, చికెన్ హలీం బట్టీలున్నాయి. 30కి పైగా కేంద్రాలు నెల్లూరు నగరంలో కొన్నేళ్ల క్రితం వీఆర్సీ సెంటర్లో మాత్రమే మూడు హలీం కేంద్రాలుండేవి. అప్పట్లో ఈ వంటకం హైదరాబాద్, చైన్నె, బెంగళూరు సిటీలకు మాత్రమే పరిమితం. నగరవాసులకు హలీం నుంచి రూచి చూపించేందుకు నాడు రియాజ్, రేష్మా, శ్రావణ్య హోటల్స్ నిర్వాహకులు ముందుకొచ్చారు. క్రమేణా నగరంలోని పలు హోటళ్ల నిర్వాహకులు రంజాన్ సమయంలో హలీం తయారు చేసే మాస్టర్లను సిటీల నుంచి పిలిపిస్తున్నారు. దీంతో నేడు 30కి పైగా కేంద్రాలు ఏర్పాటయ్యాయి. వీఆర్సీ సెంటర్, వేదాయపాళెం, ట్రంకు రోడ్డు, పొదలకూరు రోడ్డు, అన్నమయ్య సర్కిల్, కిసాన్ నగర్ తదితర ప్రాంతాల్లో విక్రయ కేంద్రాలున్నాయి. ఆస్వాదిస్తూ.. రంజాన్ ఉపవాస దీక్షల అనంతరం పోషక విలువలతో కూడిన మటన్, చికెన్ హలీం తినేందుకు ముస్లింలు ఇష్టపడతారు. దీని తయారీలో మటన్, చికెన్, గోధుమలు, పప్పులు, నెయ్యి, ఎండు ఫలాలు, ఆరోగ్యానికి మేలు చేసే అనేక రకాల మసాలా దినుసులు వినియోగిస్తారు. అదే విధంగా ఇతర వర్గాలు వాళ్లు కూడా హలీం రుచిని ఎంతో ఇష్టంగా ఆస్వాదిస్తున్నారు. రూ.3.5 కోట్లకు పైగా వ్యాపారం ఏటా రంజాన్ మాసంలో నెల్లూరు నగరంలో రూ.3.5 కోట్లకు పైగా హలీం వ్యాపారం సాగుతుంది. నగరంలో తయారు చేసే బట్టీలు పది ఉన్నాయి. వాటి నుంచి 30కి పైగా విక్రయ కేంద్రాలకు సరఫరా చేస్తారు. ప్లేట్ చికెన్ హలీం రూ.80 నుంచి రూ.150 ఉండగా, మటన్ రూ.220 నుంచి రూ.260ల మధ్య ఉంది. హలీంను సిద్ధం చేస్తూ.. హలీంను తినేందుకు జనం ఆసక్తి చూపుతుండటంతో విక్రయ కేంద్రాలు పదుల సంఖ్యలో వెలిశాయి. చిన్న హోటళ్ల నిర్వాహకులు సైతం ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కో మాస్టర్‌కు నెలకు రూ.40 వేల నుంచి రూ.50 వేలు వరకు చెల్లించాల్సి ఉంది. అదే విధంగా సహాయకులు, విక్రయదారులు ఇలా అనేకమంది ఉపాధి పొందుతున్నారు.రంజాన్ మాసంలో దొరికే ప్రత్యేక వంటకం ఒకప్పుడు పెద్ద నగరాల్లో లభ్యం నేడు నగరం, పట్టణాల్లో అందుబాటులో.. నెల్లూరులో 30కి పైగా హలీం కేంద్రాల ఏర్పాటు రుచి చూసేందుకు జనం ఆసక్తిఏటా విక్రయ కేంద్రం ఏర్పాటు చేస్తా రంజాన్ మాసం వచ్చిందంటే హలీం కేంద్రాన్ని ఏర్పాటు చేస్తాం. ఈ వంటకాన్ని చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు తింటున్నారు. ఆరోగ్యవంతమైన ఆహారం కావడంతో విక్రయ కేంద్రాలు విస్తృతంగా ఏర్పాటవుతున్నాయి. – కొవ్వూరి మదన్ తేజ, హలీం పాయింట్ నిర్వాహకుడు, ఎన్టీఆర్ పార్క్ -
గ్లకోమా.. చాలా డేంజర్
లక్షణాలిలా..బీపీ, షుగర్ ఉండే వారిలో రావొచ్చు. ఇంట్లో ఎవరికై నా ఉంటే వారి బిడ్డలకు వంశపారంపర్యంగా వచ్చే అవకాశం ఉంది. ఎప్పుడైనా కంటికి గాయమైతే అది కాలక్రమంలో గ్లకోమాకు దారితీయొచ్చు. పిగ్మెంటరీ డిస్పర్షన్ సిండ్రోమ్ సోకినా, కొన్ని రకాల కార్టికో స్టెరాయిడ్స్ వాడినా గ్లకోమాకు గురికావొచ్చు. కంటి నొప్పి, తలనొప్పి, వికారం, వాంతులు, చూపు అస్పష్టంగా ఉండటం, ప్రకాశవంతమైన లైట్ల చుట్టూ ఇంద్రధనస్సు – రంగుల వృత్తాలు కనిపించడం, కన్ను ఎరుపెక్కడం, కంటి నుంచి నీరు రావడం, ఇరుకై న దృష్టి లాంటి లక్షణాలుంటే గ్లకోమాగా అనుమానించి నేత్ర వైద్యుని సంప్రదించాలి.నెల్లూరు(అర్బన్): కాలుష్యం, స్క్రీన్కు అతుక్కుని పోవడం, కంటి సమస్యల పట్ల నిర్లక్ష్యం, ఎప్పుడైనా పురుగు పడటం, కన్నును ఎప్పుడో రుద్దడం, వంశపారంపర్యం తదితర వాటివల్ల మనుషులకు నీటి కాసులు (గ్లకోమా) వ్యాధి వస్తుంది. ఫలితంగా తెలియకుండానే క్రమేపీ చూపు కోల్పోవడం జరుగుతుంది. దృష్టిని దొంగిలించే వ్యాధిగా పేరున్న గ్లకోమా పట్ల ప్రజలు అవగాహన పెంచుకోవాలని నేత్ర డాక్టర్లు పేర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈనెల 9 నుంచి 15వ తేదీ వరకు గ్లకోమా వారోత్సవాలు నిర్వహిస్తోంది. ప్రతి ఏడాది మార్చి 12వ తేదీని ప్రపంచ గ్లకోమా డేగా ప్రకటించింది. జిల్లాలో అంధత్వ నివారణ శాఖ అధికారులు ప్రజలను చైతన్యం చేస్తున్నారు. దెబ్బతింటూ.. గ్లకోమా అనేది ఒక్కసారిగా బయటపడదు. కొంచెం, కొంచెంగా చూపు దెబ్బతింటూ వస్తుంది. ఈలోపు డాక్టర్లను సంప్రదించి వైద్యం చేయించుకుంటే సరే. లేకుంటే చూపును కోల్పోతారు. అప్పటి వరకు పోయిన చూపును తిరిగి తీసుకునిరాలేం. మిగిలిన చూపును మందులతో కాపాడుకోవచ్చు. గ్లకోమాతో ఒక కంటి చూపు పూర్తిగా పోయినవారు జిల్లాలో అనేకమంది ఉన్నారు. మరొక కన్ను చూపు కూడా తగ్గిపోయిన వారున్నారు. ఇలా పాక్షికంగా, పూర్తిస్థా యిలో చూపును కోల్పోయిన బాధితులు సుమారు 2.70 లక్షల మంది వరకు ఉన్నారని వైద్యుల అంచనా. వైద్యరీక్షలు తప్పనిసరి గ్లకోమాకు గురైన వారిలో ప్రధానంగా కంటి లోపల ఒత్తిడి పెరుగుతుంది. దీంతో కన్ను వెనుక వైపు ఉండే ఆప్టిక్ నాడిని దెబ్బతింటుంది. కంటి నుంచి మెదడుకు దృశ్య సమాచారాన్ని ప్రసారం చేసే వ్యవస్థకు ఆటంకం కలిగి చూపును కోల్పోవడం జరుగుతుంది. 40 సంవత్సరాల వయసు పైబడిన వారు ప్రతి ఆరునెలలకు ఒకోసారి తప్పనిసరిగా కంటి వైద్యపరీక్షలు చేయించుకోవాలి. బీపీ, షుగర్ ఉన్న వారు క్రమం తప్పకుండా చేయించుకుంటే మంచిది. కన్ను ఎరుపెక్కినా, నీరు కారుతున్నా తక్షణమే సంబంధిత డాక్టర్‌ను సంప్రదించాలి. కొన్ని సందర్భాల్లో లేజర్ చికిత్సతో చూపును కాపాడతారు. మందులు, లేజర్ చికిత్సలు కూడా సరిగా పని చేయని సందర్భంలో డాక్టర్లు గ్లకోమా సర్జరీలు చూడా చేస్తున్నారు.కంటి లోపల అధిక ఒత్తిడితో ఈ వ్యాధి ఆప్టిక్ నరం దెబ్బతిని చూపును కోల్పోయే ప్రమాదం జిల్లాలో పదిశాతం మంది రోగులు నేడు ప్రపంచ గ్లకోమా డేఅవగాహన పెంచుకోవాలి గ్లకోమాపై ప్రజలు అవగాహన పెంచుకోవాలి. అప్పుడప్పుడు నేత్ర వైద్య పరీక్షలు చేయించుకోవాలి. ముందుగా గ్లకోమాను గుర్తిస్తే వైద్యం చేయడం ద్వారా అరికట్టగలం. ప్రస్తుతం ఆధునిక మందులు వచ్చాయి. ఇవి చూపును పరిరక్షించడంలో సమర్థవంతంగా పని చేస్తున్నాయి. జిల్లా అంధత్వనివారణ సంస్థ తరఫున తాము అన్ని ఆస్పత్రుల్లో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాం. – డాక్టర్ శార్వాణి, జిల్లా అంధత్వ నివారణ అధికారిణి -
జూపూడి పేరుతో నకిలీ ఫిర్యాదు
కోవూరు: కోవూరు మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో కీలక అధికారి లంచాల కోసం అడ్డదారులు తొక్కుతున్నారు. తన పరిధిలో ఉన్న పంచాయతీల్లోని కార్యదర్శులను బెదిరించి లంచాలు తీసుకునేందుకు ఆకాశ రామన్న ఉత్తరాలు రాయిస్తూ.. విచారణ పేరు తో ముడుపులు గుంజుతున్నాడని ఆరోపణలు ఉన్నా యి. తాజాగా మాజీ ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్, నెల్లూరు అడ్రస్‌తో కోవూరు మండలం పడుగుపాడు పంచాయతీ కార్యదర్శి అవినీతికి పాల్పడినట్లు కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినట్లు ఆ లేఖ కాపీలు కలకలం రేపుతున్నాయి. అందులో కనీసం తేదీని కూడా కనబరచకపోవడం గమనార్హం. ఫిర్యాదు కాపీ ఒకటే.. కానీ రెండు రకాలుగా ఉన్నాయి. 2025 ఫిబ్రవరి 10వ తేదీతో కలెక్టర్ కార్యాలయం, 2025 ఫిబ్రవరి 20వ తేదీతో జిల్లా పంచాయతీ కార్యాలయ ముద్రలు ఉన్న ఫిర్యాదు కాపీపై సదరు జూపూడి ప్రభాకర్ సంతకం లేదు. బయటపడిన మరో కాపీలో జూపూడి సంతకం చేసినట్లు ఉంది. ఈ రెండు కాపీలు చూస్తే ఫేక్ ఫిర్యా దులతోపాటు కలెక్టర్, డీపీఓ కార్యాలయాల సీళ్లను ఉపయోగించి సదరు అధికారి ఈ దారుణానికి పాల్ప డుతున్నట్లు సమాచారం. కలెక్టర్, డీపీఓలు విచారణకు ఆదేశించారంటూ ఆగమేఘాలపై సదరు అవినీతి అధికారే విచారణ పేరుతో పంచాయతీ కార్యదర్శిని వేధించినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒక వేళ సంబంధిత అధికారులు విచారణకు ఆదేశిస్తే.. ముందుగా ఆ ఫిర్యాదుల కాపీలు మండల పరిషత్ అధికారి కి రావాలి. ఎంపీడీఓకు కూడా తెలియకుండా సదరు అధికారి చేతికి వచ్చాయంటే.. ఇవి నకిలీ ఫిర్యాదులే అని అర్థమవుతోంది. సదరు అధికారి కలెక్టర్, డీపీఓ కార్యాలయాల సీళ్లను దుర్వినియోగం చేస్తున్నట్లు స్పష్టమవుతోంది. మాజీ ఎమ్మెల్సీ జూపూడి పేరుతో వచ్చిన ఫిర్యాదులపై ఆయన దృష్టికి తీసుకెళ్లడంతో తాను ఆ లేఖ రాయలేదని తన పేరు ఉపయోగించి ఫేక్ ఫిర్యాదులు సృష్టించిన వారిపై చర్యల నిమిత్తం పోలీసులకు ఫిర్యాదు చేస్తానని చెప్పారు. కోవూరు ఎంపీడీఓ కార్యాలయ అధికారి ప్రమేయం ఉన్నట్లు అనుమానం ఒకే ఫిర్యాదు కాపీ.. సంతకం లేకుండా.. సంతకంతో మరొకటి సంతకం లేని కాపీపై కలెక్టర్ కార్యాలయ ముద్ర కలెక్టర్, డీపీఓ కార్యాలయాల సీళ్లు తయారు చేసుకుని దుర్వినియోగం పోలీసులకు ఫిర్యాదు చేయనున్న జూపూడి -
ఆరుగురు ‘తెలుగు తమ్ముళ్ల’పై కేసు●
● స్కూల్ వార్షికోత్సవంలో బీభత్సం చేసిన ఘటనలో.. తోటపల్లిగూడూరు: ఓ పాఠశాల వార్షికోత్సవంలో పచ్చమూక సృష్టించిన బీభత్సంపై బాధితులు మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆరుగురిపై కేసు నమోదైంది. వివరాలు.. మండలంలోని చెన్నపల్లిపాళెం ఉన్నత పాఠశాలలో సోమవారం సరస్వతి పూజ, వార్షికోత్సవం జరిగింది. దీనికి వెంకటేశ్వరపట్టపుపాళెం, ముత్యాలతోపు పట్టపుపాళెం గ్రామాల్లోని అధికార పార్టీకి చెందిన కొందరు యువకులు మద్యం తాగొచ్చి బీభత్సం చేసిన సంగతి తెలిసిందే. డీజే సిస్టం నిర్వాహకులైన వంశీ (పల్లిపాడు), విక్రమ్ (విలుకానుపల్లి)పై తెలుగు తమ్ముళ్లు దాడి చేశారు. అంతే కాకుండా డీజే సిస్టంకు సంబంధించిన మిక్సర్, ల్యాప్‌టాప్‌లను ధ్వంసం చేశారు. ఈ క్రమంలో బాధితులైన వంశీ, విక్రమ్‌లు మంగళవారం పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. టీడీపీకి చెందిన ఆవుల గణేష్, ముత్యాల హరి, మహేష్, చందు, విజయ్, కిరణ్‌తో పాటు మరికొందరు అకారణంగా దాడి చేసి, డీజే సిస్టం సామగ్రిని ధ్వంసం చేశారని, సుమారు రూ.లక్ష ఆస్తి నష్టం వాటిల్లినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు దాడికి పాల్పడిన ఆరుగురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన్నట్లు స్థానిక ఎస్సై వీరేంద్రబాబు తెలిపారు. -
బీపీటీ రకాన్ని కేంద్రాల్లోనే విక్రయించుకోండి
● డీఏఓ పి.సత్యవాణి సూచన కొడవలూరు: బీపీటీ రకం ధాన్యాన్ని మార్కెట్లో తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నందున, దానిని రైతులు విధిగా కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించుకోవాలని జిల్లా వ్యవసాయాధికారిని పి.సత్యవాణి సూచించారు. మండలంలోని గుండాలమ్మపాళెం, వెంకన్నపురం కొనుగోలు కేంద్రాలను మంగళవారం ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బీపీటీ రకానికి ప్రభుత్వం పుట్టికి రూ.19,720 మద్దతు ధర ప్రకటించిందని, మార్కెట్లో రూ.17,500లకే కొంటున్న నేపథ్యంలో కొనుగోలు కేంద్రంలో విక్రయించుకుని అధిక ధర పొందాలన్నారు. తేమ శాతంలోనూ మినహాయింపు ఉన్నందున రైతులు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. తేమ శాతం అధికంగా ఉంటే అదనంగా ఉన్న ఒక్కో శాతానికి క్వింటాకు కిలో ధాన్యం వంతున అదనంగా కేంద్రాలకు ఇవ్వడం ద్వారా విక్రయించుకునే వెసులుబాటు ఉందన్నారు. ప్రధానంగా వరికోత కోసే రైతులు వారం ముందుగానే వీఏఏను సంప్రదించి షెడ్యూలింగ్ నమోదు చేసుకోవాలన్నారు. దీంతో కేంద్రాల్లో గన్నీ బ్యాగులు, మిల్లుల కేటాయింపు, వాహనాలు సిద్ధం చేసుకునే వెసులుబాటు ఉంటుందన్నారు. ఆమె పంట నమోదైన రైతుల వివరాలను కేంద్రాల వద్ద ప్రచురించారు. కార్యక్రమంలో ఏడీఏలు నర్సోజీ, శేషగిరిరావు, ఏఓ లక్ష్మి, ఏఈఓ పి.వెంకట్రావు, వీఏఏలు కె.విష్ణుప్రియ, బి.లిఖిత తదితరులు పాల్గొన్నారు. -
డిజిటల్ అరెస్ట్ చేసి.. రూ.1.02 కోట్లు దోచేసి..
● సైబర్ నేరగాళ్ల నిర్వాకం ● రూ.23 లక్షలు ఫ్రీజ్ చేసిన పోలీసులు ● లబోదిబోమంటున్న విశ్రాంత ఉద్యోగినెల్లూరు(క్రైమ్): సీబీఐ అధికారులమంటూ సైబర్ నేరగాళ్లు ఓ విశ్రాంత ఉద్యోగిని డిజిటల్ అరెస్ట్ చేసి రూ.1.02 కోట్ల నగదును దోచేశారు. మంగళవారం వెలుగులోకి వచ్చిన ఈ ఘటనపై నెల్లూరు వేదాయపాళెం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వారి కథనం మేరకు.. నెల్లూరు నగరానికి చెందిన ఓ విశ్రాంత ఉద్యోగికి గతనెల 25వ తేదీన ట్రాయ్ అఽధికారినంటూ ఓ వ్యక్తి ఫోన్ చేసి ఢిల్లీలో మీరు కొనుగోలు చేసిన సిమ్‌పై 85 ఫిర్యాదులు అందాయని, వాటిపై కేసు నమోదైందని చెప్పారు. మీ పేరుపై ఉన్న బ్యాంక్ ఖాతాను మనీల్యాండరింగ్‌కు వినియోగించారని, జాతీయ భద్రతా చట్టాన్ని దుర్వినియోగం చేశారని చెప్పగా తనకు ఎలాంటి సంబంధం లేదని విశ్రాంత ఉద్యోగి తెలియజేశాడు. ఈ విషయాన్ని సీబీఐ అధికారులకు ఫిర్యాదు చేయాలని చెప్పి ట్రాయ్ అధికారి ఫోన్ కాల్ కట్ చేశారు. తర్వాత సీబీఐ అధికారినంటూ శర్మ అనే వ్యక్తి ఫోన్ చేసి మీపై కేసు నమోదైందని చెప్పాడు. అనంతరం మోహిత్ కందా అనే మరో వ్యక్తి ఫోన్ చేసి తానూ సీబీఐ అధికారినేనని ఈ కేసును దర్యాప్తు చేస్తున్న రాకేష్‌కుమార్‌తో మాట్లాడి కేసు నుంచి తప్పిస్తానని చెప్పాడు. అందరూ కలిసి ఫిబ్రవరి 27 నుంచి మార్చి 5వ తేదీ వరకు విశ్రాంత ఉద్యోగిని డిజిటల్ అరెస్ట్ చేశారు. అతడి నుంచి రూ.1,02,47,680ల నగదును వివిధ బ్యాంక్ ఖాతాల్లో డిపాజిట్ చేయించుకున్నారు. అనంతరం వారు కేసు నుంచి తప్పించేందుకు వీలుకావడం లేదని బెయిల్ పొందేందుకు మరో రూ.3 కోట్లు డిపాజిట్ చేయాలని చెప్పడంతో విశ్రాంత ఉద్యోగికి అనుమానం వచ్చింది. మోసపోయానని గ్రహించిన బాధితుడు 1930కు ఫిర్యాదు చేశాడు. వేదాయపాళెం పోలీసులకు సోమవారం రాత్రి ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి రూ.23 లక్షలను ఫ్రీజ్ చేసినట్లు మంగళవారం పోలీసులు తెలిపారు. ఎన్నికల ప్రక్రియ బలోపేతానికి చర్చలకు ఆహ్వానం నెల్లూరు(అర్బన్): ఎన్నికల ప్రక్రియను బలోపేతం చేసేందుకు భారత ఎన్నికల సంఘం చర్యలు చేపట్టిందని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఒ.ఆనంద్ తెలిపారు. ఈ మేరకు మంగళవారం కమిషన్ చేసిన సూచనల్ని ఆయన వివరించారు. అన్ని జాతీయ, రాష్ట్ర పార్టీల నాయకులు, సీనియర్ రాజకీయ ప్రతినిధులతో చర్చలు జరిపి వారి నుంచి సూచనలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసిందన్నారు. ఎటువంటి పరిష్కారం లభించని సమస్యలపై ఏప్రిల్ 30వ తేదీ నాటికి రాజకీయ పార్టీల నుంచి ఎన్నికల సంఘం సూచనలు కోరిందన్నారు. ఈ మేరకు వాటికి వ్యక్తిగతంగా లేఖలు పంపిందన్నారు. పార్టీల అధ్యక్షులు, పార్టీల సీనియర్ సభ్యులతో పరస్పర అనుకూల సమయానికి సమావేశం ఏర్పాటు చేసి ఎన్నికల ప్రక్రియలను మరింత బలోపేతం చేసేందుకు ఈ చర్యలు చేపట్టిందని వివరించారు. -
వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో కొలువులు
ఈ దంపతుల పేర్లు గడ్డం శీను, సరసమ్మ. సర్వేపల్లి నియోజకవర్గం ముత్తుకూరు మండలం పంటపాళెం గ్రామానికి చెందిన వారు. వీరి కుమార్తె గడ్డం సుమిత్ర ఓ కాలేజీలో రెండో సంవత్సరం ఇంజినీరింగ్ చదువుతోంది. కూటమి ప్రభుత్వంలో ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించకపోవడంతో నానా ఇబ్బందులు పడుతున్నారు. కళాశాల యాజమాన్యం మాత్రం వెంటనే ప్రభుత్వం ఫీజులు చెల్లించాలని ఒత్తిడి చేస్తున్నాయి. నిరుపేదలైన తాము చెల్లించే పరిస్థితిలో లేమని ఆ తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. – పొదలకూరు ● జిల్లాలో 5 లక్షల మందికిపైగా నిరుద్యోగులు ● ఏడాదిగా కొత్త పరిశ్రమల ప్రతిపాదనలు లేవు ● కూటమి ప్రభుత్వం రాకతో గతంలో మంజూరైన పరిశ్రమల పురోగతి లేదు ● మెగా డీఎస్సీ పేరుతో దగా ● ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాల భర్తీకి విడుదల కాని ఒక్క నోటిఫికేషన్ ● రెండు బడ్జెట్లలోనూ నిరుద్యోగ భృతి ఊసేలేదు ● జిల్లాలో 50 వేల మందికి అందని ఫీజు రీయింబర్స్మెంట్, వసతి దీవెన ● నేడు జిల్లాలో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ‘యువత పోరు’ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలు గడిచిపోయాయి. చదువుకునేందుకు విద్యార్థులు, చదువు పూర్తి చేసుకున్నా ఉద్యోగాలు రాక నిరుద్యోగుల కుటుంబాలు రోజు రోజుకు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నాయి. మరో వైపు నిరుద్యోగులు వయస్సు మీద పడిపోతున్నా.. కొత్త ఉద్యోగాలకు సంబంధించి ఒక్క నోటిఫికేషన్ కూడా విడుదల కాలేదు. ప్రతి జనవరిలో జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామంటూ హామీలు గుప్పించిన ప్రభుత్వ పెద్దలు ఆ ఊసే లేకుండా చేశారు. ఉద్యోగం కల్పించలేకపోతే నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పినా.. ఈ పథకానికి పైసా కూడా కేటాయించలేదు. ఇంటర్ నుంచి డిగ్రీ, ఇంజినీరింగ్ తదితర కోర్సులు చదివే విద్యార్థులకు ఐదు త్రైమాసికాలుగా ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు విడుదల చేయకపోవడంతో తల్లిదండ్రులు అప్పులు చేసి మరీ ఫీజులు చెల్లిస్తున్నారు. జిల్లాలో గత ప్రభుత్వ ఐదేళ్లలో భారీగా పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. ఆయా పరిశ్రమల్లో జిల్లాకు చెందిన నిరుద్యోగుల్లో టెక్నికల్, లేబర్ విభాగాల్లో సుమారు 50 వేల మందికిపైగా కొలువులు సాధించారు. ఇక సాఫ్ట్వేర్ రంగంలో అయితే లక్షల మందికి కొలువులు సాధించారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కొత్త కొలువులు సాధించడం కష్టంగా మారింది. గత ప్రభుత్వం హయాంలో చివరిలో మంజూరైన చాలా పరిశ్రమలకు కూటమి ప్రభుత్వం నుంచి ప్రోత్సాహకాలు లేకపోవడంతో గ్రౌండింగ్ ప్రక్రియలో కాలయాపన జరుగుతోంది. ఇక ఈ ప్రభుత్వంలో కొత్త పరిశ్రమల ప్రతిపాదన కూడా ఒక్కటీ లేదు. ప్రభుత్వ రంగంలో ఉద్యోగాల మాట అటు ఉంచితే.. ప్రైవ్రేట్రంగంలో కూడా ఉద్యోగాలు రావడం నిరుద్యోగులకు కలగా మిగిలిపోతోంది. సాక్షి ప్రతినిధి, నెల్లూరు: ఎన్నికల్లో గెలవడానికి అడ్డమైన హామీలన్నీ ఇచ్చిన చంద్రబాబు అండ్ కూటమి నేతలు అధికారంలోకి వచ్చాక నాలుక మడతేస్తున్నారు. అధికారం చేపట్టి తొమ్మిది నెలలు దాటిపోయినా.. ఒక్క పోస్టు భర్తీకి కూడా నోటిఫికేషన్ ఇవ్వలేదు. నిరుద్యోగ భృతి ఊసే లేకపోవడంతో ఉద్యోగార్థులు అష్టకష్టాలు పడుతున్నారు. విద్యాదీవెన, వసతి దీవెన, ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వకపోవడంతో పేద విద్యార్థులకు చదువులు భారంగా మారాయి. జిల్లాలో ప్రభుత్వ అంచనా ప్రకారం సుమారు 5 లక్షల మందికిపైగా నిరుద్యోగులు ఉన్నారు. డిగ్రీ, ఇంటర్మీడియట్, పదో తరగతి అర్హతతో జిల్లాలో ఎంతో మంది ఉద్యోగావకాశాల కోసం ఎదురు చూస్తున్నారు. ఓ వైపు ప్రభుత్వ కొలువులు కోసం కష్టపడుతూనే.. మరో వైపు కనీసం ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగాల కోసం వెంపర్లాడుతున్నారు. ఎన్నికల ముందు రాష్ట్రంలో ప్రతి నిరుద్యోగికి ఉద్యోగం వచ్చే వరకు నిరుద్యోగ భృతి కింద ప్రతి నెలా రూ.3,000 వంతున ఇస్తామని చంద్రబాబు చెబితే.. ప్రతి జనవరిలో జాబ్ క్యాలెండర్ ప్రకటించి ఉద్యోగాలు కల్పిస్తామంటూ లోకేశ్ హామీలు గుప్పించారు. అధికారంలోకి రాగానే మెగా డీఎస్సీ పేరుతో తొలి సంతకం చేసినా.. తొమ్మిది నెలలుగా నోటిఫికేషన్ విడుదల చేయలేదు. ఇదిగో అదిగో అంటూ ఊరిస్తున్నారు. ఈ నోటిఫికేషన్ వస్తే కనీసం జిల్లాలో 650 మందికి ఉపాధ్యాయులుగా ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ శాఖల్లో వేలల్లో పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇప్పటికే గ్రామ, వార్డు సచివాలయాలు, ఆర్బీకేలను కుదించడంతోపాటు అందులో ఉద్యోగుల సంఖ్యను సైతం కుదించారు. నిరుద్యోగ భృతి.. భ్రాంతి అధికారంలోకి వచ్చిన మొదటి నెల నుంచే ఉద్యోగాల కల్పనపై దృష్టి సారిస్తామని, లేదంటే నిరుద్యోగ భృతి కల్పిస్తామని హామీలు గుప్పించిన కూటమి పాలకులు తొమ్మిది నెలలుగా ఆ ఉసే ఎత్తడం లేదు. కూటమి ప్రభుత్వం రెండు బడ్జెట్లు ప్రవేశ పెట్టినా నిరుద్యోగుల భృతికి సంబంధించి రూపాయి నిధులు కేటాయించలేదు. దీన్ని బట్టి ఈ ఏడాదికి కూడా భృతి భ్రాంతియే అని స్పష్టమవుతోంది. డీఎస్సీ అభ్యర్థులతోపాటు పోలీస్ కానిస్టేబుల్స్ రిక్రూట్మెంట్ ఉంటుందని పోలీస్ ఉన్నతాధికారులు చెప్పడంతో ఆ కొలువులు కోసం యువత శిక్షణ తీసుకునేందుకు రూ.వేలల్లో ఫీజులు కట్టి కోచింగ్‌లు తీసుకుంటున్నారు. కుటుంబానికి ఆర్థిక భారం ఉన్నప్పటికి ప్రభుత్వ కొలువులు కోసం అప్పులు చేసి కోచింగ్‌లకు కట్టే ఫీజులు కాకుండా, ప్రైవేట్ వసతిగృహాల్లో ఉండేందుకు నెలకు రూ.6 వేల వరకు ఖర్చులు పెట్టుకుంటున్నారు. ఇటువంటి వారికి కనీసం నిరుద్యోగ భృతి కొంత మేర ఉపయోగపడుతుంది. ఫీజు రీయింబర్స్మెంట్, వసతి దీవెనకు పంగనామాలు జిల్లాలో టెన్త్, ఇంటర్ విద్యార్థులకు ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. ఇప్పటికే డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు పూర్తయ్యాయి. ఇక ఇంజినీరింగ్ పూర్తి చేసుకునే విద్యార్థులు అనేక మంది ఉన్నారు. వీరిలో ఫీజు రీయింబర్స్మెంట్, వసతి దీవెనకు అర్హులైన 40,299 మంది ఉన్నారు. గతేడాది జనవరి నెల నుంచి ఇప్పటి వరకు ఆయా పథకాలకు నిధులు మంజూరు చేయలేదు. గత ప్రభుత్వంలో ప్రతి మూడు నెలలకు ఈ పథకాల ద్వారా తల్లుల ఖాతాల్లో నిధులు జమ చేసింది. ఇప్పటికి నాలుగు త్రైమాసికాలు పూర్తికాగా, ఈ నెలతో మరో త్రైమాసికం కూడా పూర్తి కానుంది. మరో నెల రోజుల్లోనే ఈ విద్యా సంవత్సరం ముగియనుంది. కానీ కూటమి ప్రభుత్వం ఐదు త్రైమాీసికాలుగా బకాయిలు చెల్లించకపోవడంతో విద్యార్థులపై కళాశాలలు ఒత్తిడి పెంచడంతో విద్యార్థులు తల్లిదండ్రులు అప్పులు చేసి ఫీజులు చెల్లించుకుని పరీక్షలకు హాజరు అయ్యేలా చేసుకున్నారు. జిల్లాలో కుటుంబాల సంఖ్య 7.2 లక్షలు (అంచనా) ప్రభుత్వంలో అవుట్ సోర్సింగ్ ద్వారా 6,150 శాశ్వత ఉద్యోగులు 6,323 వలంటీర్లు 12,793 ప్రైవేట్ రంగాల్లో 8,600 వివిధ పరిశ్రమల్లో 50 వేల మందికిపైగా.. నిరుద్యోగ యువత5 లక్షల మంది పైగా.. 40,299 మంది ‘యువత పోరు’ నేడు జిల్లాలో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో నిరుద్యోగులకు కూటమి ప్రభుత్వం చేసిన మోసం, దగాపై ‘యువత పోరు’ కార్యక్రమం బుధవారం నిర్వహించనున్నారు. జిల్లా వ్యాప్తంగా విద్యార్థులు, నిరుద్యోగులు, వారి తల్లిదండ్రులు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. నెల్లూరు నగరంలోని ఉదయం 10 గంటలకు వీఆర్సీ సెంటర్ నుంచి అంబేడ్కర్ విగ్రహం నుంచి ర్యాలీ వెళ్లి కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం అందజేయనున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వం వంచనపై నిరసన గళాన్ని వినిపించనున్నారు. అదే విధంగా పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జిల్లా కార్యాలయంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరుగుతుంది. -
అసంపూర్తి గృహాలకు అదనపు ఆర్థిక సాయం
నెల్లూరురూరల్: 2019–24 మధ్య కాలంలో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు గృహాలు మంజూరై ఇంకా వివిధ దశల్లో అసంపూర్తిగా నిర్మాణంలో ఉన్న ఇళ్లను పూర్తి చేసేందుకు ప్రభుత్వం అందజేసే యూనిట్ విలువ రూ.1.80 లక్షలకు అదనంగా ఆర్థిక సహాయం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు కలెక్టర్ ఆనంద్ మంగళవారం తెలిపారు. ఈ మేరకు గృహ నిర్మాణశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఉత్తర్వులు జారీ చేశారని చెప్పారు. ఎస్సీ, బీసీ లబ్ధిదారులకు రూ.50 వేలు, ఎస్టీ లబ్ధిదారులకు రూ.75 వేలు, అత్యంత వెనుకబడిన గిరిజనులకు రూ.లక్ష అదనపు ఆర్థిక సహాయం అందజేస్తున్నామన్నారు. పీఎంఏవై 1.0 ఇల్లు మంజూరై నిర్మాణంలో ఉన్న గృహాలకు అదనంగా ఆర్థిక సహాయం అందించి ఆ ఇళ్లను పూర్తి చేసేందుకు ప్రభుత్వం సంకల్పించినట్లు చెప్పారు. పీఎంఏవై (అర్బన్) బీఎల్సీ–1.0, పీఎంఏవై (గ్రామీణ్)–1.0, పీఎం జన్మన్ పథకాల కింద ఇప్పటికే గృహాలను మంజూరు చేసిన లబ్ధిదారులకు ఈ అదనపు ఆర్థిక సహాయం వర్తిస్తుందన్నారు. ఈ మేరకు లబ్ధిదారుడు ఇంటి నిర్మాణం పూర్తి చేసుకోవడానికి తక్షణమే అవసరమైన చర్యలు తీసుకోవాలని హౌసింగ్ అధికారులను ఆదేశించారు. ఇంజినీరింగ్ అసిస్టెంట్లు, వార్డు అడ్మిన్లు, ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు ఈ విషయాన్ని విస్తృతంగా ప్రచారం చేసి లబ్ధిదారులు త్వరగా ఇళ్ల నిర్మాణం పూర్తి చేసుకునేలా సమన్వయంతో కృషి చేయాలని సూచించారు. జిల్లాలో 75,344 మందికి రూ.1,199.85 కోట్ల మంజూరు జిల్లాలో 75,344 మంది లబ్ధిదారులకు ప్రయో జనం చేకూరనుంది. ఆత్మకూరులో 8,467, కందుకూరు 6,159, కావలి 10,779, కోవూరు 8,696, నెల్లూరు సిటీ 6,690, నెల్లూరు రూరల్ 8,400, సర్వేపల్లి 19,267, ఉదయగిరి 6,886 ఇళ్లకు సంబంధించి రూ.119.85 కోట్లు మంజూరయినట్లు కలెక్టర్ తెలిపారు. పీఎంఏవై (అర్బన్) బీఎల్సీ–2.0, పీఎంఏవై (గ్రామీణ్) –2.0, పీఎం జన్మన్ తదితర పథకాల కింద యూనిట్ విలువ రూ.2.50 లక్షల ఆర్థిక సహాయాన్ని అందజేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఎస్టీలకు రూ.75 వేలు, ఎస్సీ, బీసీలకు రూ.50వేలు ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలో 75,334 మంది లబ్ధిదారులకు ప్రయోజనం కలెక్టర్ ఆనంద్ -
శనగల కొనుగోలుకు నేటి నుంచి రిజిస్ట్రేషన్లు
ఉదయగిరి: జిల్లాలో శనగ పంట ఉత్పత్తులను ప్రభు త్వ మద్దతు ధరకు విక్రయించేందుకు రైతులు మంగళవారం నుంచి మార్చి 20వ తేదీ వరకు రైతు సేవా కేంద్రాల్లో పేర్లు నమోదు చేసుకోవాలని జేసీ కార్తీక్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 7వ తేదీన ‘శనగ రైతు.. దైన్యం’ శీర్షికతో సాక్షిలో కథనం ప్రచు రితమైన విషయం తెలిసిందే. అధికారులు స్పందించి రిజిస్ట్రేషన్ పక్రియ పూర్తయ్యాక రైతుల నుంచి మద్దతు ధర రూ.5,650కు కొనుగోలు చేస్తామని తెలిపారు. కలెక్టరేట్ వద్ద వీహెచ్‌పీ ధర్నా నెల్లూరు రూరల్: అన్నమయ్య జిల్లా రాయచోటిలో వీరభద్రస్వామి ఆలయ పార్వేట ఉత్సవం సందర్భంగా భక్తుల ఊరేగింపుపై అన్యమతస్తుల దాడిని నిరసిస్తూ విశ్వహిందూ పరిషత్ నాయకులు సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం కలెక్టర్ ఆనంద్‌కు వినతిపత్రం సమర్పించారు. ప్రశాంతంగా ఉత్సవా న్ని నిర్వహించుకునే హిందువులపై అన్యమతస్తులు దాడి చేస్తే.. అందుకు హిందూ సంస్థలను బాధ్యుల్ని చేస్తూ కేసులు పెట్టడం దారుణ మన్నారు. హిందువులను, ఆ సంస్థలను కించపరిచే విధంగా పోలీసులు ప్రవర్తించడం, దేశభక్త సంస్థలైన ఆర్ఎస్ఎస్, వీహెచ్‌పీలపై కేసు పెట్ట డాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. నాగులవెల్లటూరు చెరువుకు గండి చేజర్ల: మండలంలోని నాగులవెల్లటూరు గ్రామ చెరువుకు సోమవారం గండి పడింది. సోమశిల దక్షిణ కాలువ నీటితో చెరువు నిండి కట్ట తెగింది. సమాచారం అందుకున్న సోమశిల ప్రాజెక్ట్ చైర్మన్ వేలూరు కేశవచౌదరి సోమవారం సాయంత్రం చెరువు దగ్గరకు చేరుకుని పరిశీలించారు. సోమశిల దక్షిణ కాలువ 5ఎన్ నుంచి విడుదలయ్యే నీటిని తాత్కాలికంగా నిలుపుదల చేయాలని అధికారులను ఆదేశించారు. నీటి ప్రవాహం తగ్గిన వెంటనే మరమ్మతులు చేపడతామని, రాష్ట్ర మంత్రి ఆనం రామనారాయణరెడ్డి నిరంతరం పరిస్థితిని సమీక్షిస్తూ చర్యలు తీసుకుంటున్నారని ఆయన తెలిపారు. అయితే ఇరిగేషన్ అధికారులతో ఈ విషయమై మాట్లాడేందుకు ఫోన్ ద్వారా సంప్రదించగా సరిగా స్పందించలేదు. వాడింది 5 యూనిట్లు.. వచ్చిన బిల్లు రూ.945నెల్లూరు(వీఆర్సీసెంటర్): ఓ వినియోగదారుడు తన దుకాణానికి నెలరోజులపాటు తాళం వేసి ఒక జీరో బల్బు వేసి ఉంచితే నెలకు అయిన విద్యుత్ వినియోగం 5 యూనిట్లు మాత్రమే. అయితే వచ్చిన బిల్లు మాత్రం రూ.945. నెల్లూరు నగరానికి చెందిన న్యాయవాది బసిరెడ్డి నారాయణరెడ్డికి రామ్మూర్తినగర్ విద్యుత్ సెక్షన్ పరిధిలో ఓ దుకాణం ఉంది. 3321214186941 నంబరుతో విద్యుత్ సర్వీస్ కనెక్షన్ ఉంది. దీనిని బాడుగకు తీసుకున్నవారు గత నెల ఖాళీ చేశారు. అందులో ఒక జీరో బల్బు మాత్రమే వేసి ఉండటంతో ఫిబ్రవరి నెల మొత్తానికి 5 యూనిట్లు విద్యుత్ మాత్రమే ఖర్చు అయ్యింది. దీనికి చెల్లించాల్సింది రూ.65 మాత్రమే. కానీ బిల్లులో వివిధ చార్జీలతో కలిపి మొత్తం రూ.945 బిల్లు వచ్చింది. -
కంచే చేను మేస్తోంది
ఉదయగిరి: వరికుంటపాడు మండలంలోని నక్కలగండి రిజర్వాయర్ కట్టపైన ఉన్న విలువైన వేప, తుమ్మ, చిల్లకర్రను అక్రమార్కులు నరికి స్వాహా చేస్తున్నారు. ఇరిగేషన్ పరిధిలో ఉండే ఈ రిజర్వాయర్‌లో గత 20 రోజుల నుంచి యథేచ్ఛగా ప్రభుత్వ సంపద తరలివెళుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. ఆ శాఖలో పనిచేసే ఓ అధికారి కనుసన్నల్లోనే ఈ వ్యవహారం జరుగుతోందనే విమర్శలున్నాయి. నక్కలగండి రిజర్వాయర్ ప్రధానమైన సాగునీటి వనరు. దీని కట్టకు ఇరువైపులా ఏళ్ల తరబడి రూ.లక్షల విలువచేసే వేప, తుమ్మ, చిల్లకర్ర పెద్దమొత్తంలో ఉంది. దీనిపై కన్నేసిన అక్రమార్కులు ఇరిగేషన్ శాఖలోని ఓ అధికారి సహకారంతో దోపిడీ మొదలుపెట్టారు. కట్ట దిగువ భాగంలో జేసీబీలు, ఇతర యంత్రాలు ఉపయోగించి వేళ్లతో సహా పెకిలించి కూలీలచేత సైజుల్లో ముక్కలుగా నరికించి వాహనాల ద్వారా బయటకు తరలిస్తున్నారు. ఇప్పటికే సుమారు రూ.25 లక్షలకు పైగా విలువచేసే కలప సంపదను తరలించినట్లు స్థానికులు చర్చించుకుంటున్నారు. మరో రూ.50 లక్షలు విలువైన కర్ర ఇంకా మిగిలిఉందని ఆయకట్టు రైతులు చెబుతున్నారు. ఈ విషయంపై ఇరిగేషన్ ఏఈ అంకులయ్యను ప్రశ్నించగా తానే ఈ చెట్లు నరకమని చెప్పానని, దీనికోసం ప్రత్యేకంగా ప్రభుత్వం రూ.3 లక్షల నిధులు కేటాయించిందని తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా కలపను ఎలా నరికిస్తున్నారని ప్రశ్నించగా తగిన జవాబు రాలేదు. వింజమూరు ఇరిగేషన్ డీఈ రమణరావును ప్రశ్నించగా స్పందించిన ఆయన వరికుంటపాడు ఎస్సై రఘునాథ్‌కు ఫోన్లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకోగా అక్కడ కలప లోడ్ చేసిన వాహనాలు ఉన్నప్పటికీ అదుపులోకి తీసుకోకుండా వదిలేసినట్లుగా సమాచారం. నక్కలగండి రిజర్వాయర్‌లో కలప అక్రమంగా నరికివేత ఇరిగేషన్ అధికారి కనుసన్నల్లో నిరాటంకంగా దోపిడీ చోద్యం చూస్తున్న అధికార యంత్రాంగం -
రైతన్నకు అండగా ఉంటాం
విడవలూరు: ధాన్యానికి గిట్టుబాటు ధరను కల్పించి, రైతులను ఆదుకోవాలని కోవూరు మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అన్నదాతలకు అండ.. వైఎస్సార్సీపీ అజెండా అనే నినాదంతో విడవలూరులోని అంకమ్మతల్లి దేవస్థానం వద్ద సోమవారం ఆయన ఆధ్వర్యంలో రైతులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా దివంగత నేత వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం అక్కడకు చేరుకున్న వైఎస్సార్సీపీ నాయకులు, రైతులతో కలిసి ర్యాలీగా వెళ్లి తహసీల్దార్ చంద్రశేఖర్‌కు వినతిపత్రం అందజేశారు. తర్వాత వైఎస్సార్సీపీ జిల్లా రైతు విభాగం అధ్యక్షుడు పూండ్ల అచ్యుత్‌రెడ్డి, డీసీఎమ్మెస్ మాజీ చైర్మన్ వీరి చలపతిరావు, డీఏఏబీ మాజీ చైర్మన్ దొడ్డంరెడ్డి నిరంజన్‌బాబు రెడ్డి మాట్లాడుతూ గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో జగన్మోహన్రెడ్డి ప్రతి ఒక్క రైతును ఆదుకున్నాడన్నారు. రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసి, విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్లను అందుబాటులో ఉంచారని తెలిపారు. రైతు భరోసా సొమ్ము జమ చేశాడని గుర్తు చేశారు. అయితే ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను గాలికి వదిలేసి రైతన్నలను రోడ్డుపాలు చేసిందని విమర్శించారు. సూపర్ సిక్స్ పథకాలను చూస్తే భయమేస్తుందన్న వ్యక్తి 2029లో సూపర్ 10 పథకాలతో మళ్లీ మనముందుకు వస్తాడని, అప్పుడు రైతులే తగిన బుద్ధి చెప్పాలన్నారు. కోవూరు నియోజకవర్గంలో రైతులు పండించిన పంటను అమ్ముకునేందుకు అనేక ఇబ్బందులు పడుతున్నారని వారు అన్నారు. ఇకనైనా రెవెన్యూ, వ్యవసాయ, సివిల్ సప్లయ్స్ విభాగాల అధికారులు రైస్ మిల్లర్లతో సమన్వయం చేసుకుంటూ మద్దతు ధరకు ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని కోరారు. కార్యక్రమంలో మండల కన్వీనర్ కాటంరెడ్డి నవీన్‌రెడ్డి, ఇందుకూరుపేట మండల కన్వీనర్ మావులూరు శ్రీనివాసులురెడ్డి, పార్టీ సీనియర్ నాయకుడు కొండూరు వెంకటసుబ్బారెడ్డి, బుచ్చిరెడ్డిపాళెం నగర కన్వీనర్ షేక్ షాహుల్, కౌన్సిలర్లు షకీలా బేగం, ప్రమీలమ్మ, జయంతి, అనంతలక్ష్మి, యానాదిరెడ్డి, వైఎస్సార్సీపీ సర్పంచ్‌లు తదితరులు పాల్గొన్నారు. మద్దతు ధరకు ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయాలి హామీలను విస్మరించిన చంద్రబాబుది మోసపూరిత వైఖరి ధ్వజమెత్తిన మాజీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్‌రెడ్డి విడవలూరులో రైతులతో ర్యాలీ, ధర్నా -
తెలుగు తమ్ముళ్ల అధికార గర్వం
తోటపల్లిగూడూరు: అధికారంలో ఉన్నామని తెలుగు తమ్ముళ్తు రెచ్చిపోతున్నారు. సోమవారం ఓ స్కూల్ వార్షికోత్సవంలో బీభత్సం సృష్టించారు. వివరాలు.. చెన్నపల్లిపాళెం ఉన్నత పాఠశాలలో సోమవారం ఉదయం సరస్వతి పూజ, పాఠశాల వార్షికోత్సవం జరిగింది. పూజ అనంతరం మధ్యాహ్నం విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. కోడూరు పంచాయతీ వెంకటేశ్వరపట్టపుపాళెం, ముత్యాలతోపు పట్టపుపాళెం గ్రామాల్లోని టీడీపీకి చెందిన యువకులు మద్యం తాగి స్కూల్‌కు చేరుకుని విద్యార్థులు నృత్యాలు చేస్తుండగా కేకలు, అరుపులతో గంతులేశారు. తాము కోరిన పాటలు పెట్టాలంటూ ఆర్కెస్ట్రా నిర్వాహకులతో గొడవకు దిగారు. అంతటితో ఆగకుండా ల్యాప్‌టాప్‌ను ధ్వంసం చేశారు. ఇదేంటని అడిగిన సౌండ్ సిస్టం ఆపరేటర్‌పై దాడికి దిగారు. టీచర్లు సర్దిచెప్పేందుకు ప్రయత్నించారు. మద్యం మత్తులో ఉన్న యువకులు ఓ టీచర్‌పై దాడి చేసి అతడి సెల్‌ఫోన్‌ను పగులగొట్టారు. దీంతో భయాందోళనకు గురైన విద్యార్థులు, టీచర్లు బయటకు పరుగులు తీశారు. ఈ ఘటనపై హెచ్ఎం సాయిప్రసాద్ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. మద్యం తాగొచ్చి స్కూల్ వార్షికోత్సవంలో బీభత్సం టీచర్, మరో వ్యక్తిపై దాడి -
భార్య ఆత్మహత్య కేసులో భర్త అరెస్ట్
నెల్లూరు(క్రైమ్): భార్య ఆత్మహత్యకు కారణమైన భర్తను నెల్లూరు సంతపేట పోలీసులు సోమవా రం అరెస్ట్ చేశారు. వారి కథనం మేరకు.. పొర్లుకట్టకు చెందిన రహంతుల్లా అలియాస్ మున్నా, సమీనా (37)లు దంపతులు. భర్త వేధింపులు తాళలేక సమీనా ఆదివారం తన ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి తల్లి బీబీజాన్ ఫిర్యాదు మేరకు సంతపేట పోలీసులు మున్నాపై కేసు నమోదు చేశారు. సోమవారం రాత్రి పొర్లుకట్ట సుందరయ్యనగర్ వద్ద అతడిని అరెస్ట్ చేశారు.నిమ్మ ధరలు (కిలో) పెద్దవి : రూ.90 సన్నవి : రూ.60 పండ్లు : రూ.40 నెల్లూరు పౌల్ట్రీ అసోసియేషన్ ధరలు బ్రాయిలర్ (లైవ్) : 92 లేయర్ (లైవ్) : 90 బ్రాయిలర్ చికెన్ : 170 బ్రాయిలర్ స్కిన్లెస్ : 190 లేయర్ చికెన్ : 153 -
మోసగించారు..న్యాయం చేయండి
నెల్లూరు(క్రైమ్): ఐటీ లావాదేవీలు చూస్తానని, జాబ్ ఇప్పిస్తానని, బ్యాంక్ లోన్ ఇప్పిస్తానని, ప్లాట్ల పేరిట మోసాలకు పాల్పడ్డారు. వారిపై చర్యలు తీసుకోవాలని పలువురు ఎస్పీ జి.కృష్ణకాంత్‌ను కోరారు. సోమవారం నెల్లూరులోని ఉమేష్‌చంద్ర కాన్ఫరెన్స్ హాల్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. వివిధ ప్రాంతాలకు చెందిన 73 మంది తమ సమస్యలను వినతుల రూపంలో ఎస్పీకి అందజేశారు. వాటిని పరిశీలించిన ఆయన ఆయా ప్రాంతాల పోలీస్ అధికారులతో మాట్లాడారు. చట్టపరిధిలో సత్వరమే సమస్యల్ని పరిష్కరించి బాధితులకు న్యాయం చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో నగర డీఎస్పీ పి.సింధుప్రియ, లీగల్ అడ్వైజర్ శ్రీనివాసులురెడ్డి, ఎస్బీ – 2 ఇన్స్పెక్టర్ బి.శ్రీనివాసరెడ్డి, ఫిర్యాదుల సెల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఫిర్యాదుల్లో కొన్ని.. ● నా భర్తకు కన్స్ట్రక్షన్ కంపెనీ ఉంది. కోవూరుకు చెందిన సురేష్ చార్టెడ్ అకౌంటెంట్‌నని పరిచయమయ్యాడు. కంపెనీకి సంబంధించిన ఆర్థిక లావాదేవీలు చూస్తానని నమ్మించాడు. ఐటీ చెల్లిస్తానని రూ.1.27 కోట్లు తీసుకున్నాడు. ఇటీవల ఐటీ కట్టలేదని నోటీసులొచ్చాయి. విచారించగా సురేష్ సీఏ కాదని తేలింది. అతడిని ప్రశ్నించగా దౌర్జన్యం చేస్తున్నాడని నెల్లూరు వేదాయపాళేనికి చెందిన ఓ మహిళ ఫిర్యాదు చేశారు. ● నెల్లూరుకు చెందిన డానియల్ ద్వారా ప్రమీల అనే మహిళ పరిచయమైంది. వారిద్దరూ తిరుపతి గోశాలలో ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి రూ.3 లక్షలు తీసుకున్నారు. నెలలు గడుస్తున్నా జాబ్ రాకపోవడంతో నిలదీయగా నానా దుర్భాషలాడుతున్నారు. వారిపై చర్యలు తీసుకోవాలని జువ్వలదిన్నెకు చెందిన వ్యక్తి కోరారు. ● నెల్లూరు బాలాజీనగర్‌కు చెందిన శశిధర్, ఈశ్వరయ్యలు నా వ్యాపారానికి తోడ్పాటునందించేందుకు బ్యాంక్‌లో లోన్ ఇప్పిస్తానని నమ్మించి వివిధ పత్రాలు తీసుకున్నారు. నాకు తెలియకుండా రూ.10 లక్షల లోన్ తీసుకుని వారు వాడుకున్నారు. నేను ప్రశ్నించగా దిక్కున్నచోట చెప్పుకోమంటున్నారని నవాబుపేటకు చెందిన ఓ మహిళ వినతిపత్రం ఇచ్చారు. ● బుచ్చికి చెందిన శ్రీధర్‌రెడ్డి, మోహన్‌లు నా స్థలానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ పత్రాన్ని తీసుకెళ్లి నాకు తెలియకుండా అమ్మేశారు. వారిని అడిగితే బెదిరిస్తున్నారని బుచ్చికి చెందిన ఓ మహిళ ఫిర్యాదు చేశారు. ● వెంకటాచలం మండలం పాలిచర్లపాడులో లేఅవుట్లోని స్థలాలను నెల్లూరుకు చెందిన శ్రీనివాసరావు మాకు విక్రయించాడు. ఇటీవల ఆ స్థలాన్ని కొందరు చదును చేసి వ్యవసాయం చేసుకుంటుండగా మేం అడ్డుకున్నాం. శ్రీనివాసరావు స్థలం తాలూకా డబ్బులు ఇంకా ఇవ్వకపోవడంతో సాగు చేసుకుంటున్నామని వారు చెప్పారు. రెవెన్యూ అధికారులను సంప్రదించగా వ్యవసాయేతర భూమిగా మార్చకుండా, నుడా అప్రూవల్ పొందకుండానే శ్రీనివాసరావు లేఅవుట్ వేసి ప్లాట్లు విక్రయించినట్లు తేలింది. తమను మోసగించిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని పలువురు కోరారు. ● నా పెద్ద కుమారుడు బాగోగులు చూసుకుంటానని నమ్మించి ఆస్తి మొత్తం రాయించుకున్నాడు. కొంతకాలంగా పట్టించుకోకుండా ఇబ్బందులు పెడుతున్నాడు. విచారించి న్యాయం చేయాలని సంతపేటకు చెందిన వృద్ధుడు ఫిర్యాదు చేశాడు. నెల్లూరులో ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ ఎస్పీకి వినతులు అందజేసిన బాధితులు -
వినతులిచ్చి.. దయ చూపమని కోరి..
● కలెక్టరేట్లో ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ ● అధికారులకు అందిన 309 విన్నపాలు నెల్లూరు రూరల్: జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన జనం తమ సమస్యలపై ఉన్నతాధికారులకు అర్జీలిచ్చి దయ చూపాలని కోరారు. సోమవారం నెల్లూరు కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. కలెక్టర్ ఆనంద్, జేసీ కార్తీక్, డీఆర్వో ఉదయభాస్కర్‌రావు, డ్వామా పీడీ గంగాభవాని, డీఆర్డీఏ పీడీ నాగరాజకుమారి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. మొత్తం 308 అర్జీలను ప్రజలు అందజేశారు. వీటిలో ఎక్కువగా రెవెన్యూ శాఖవి 133, మున్సిపల్ శాఖవి 30, సర్వేవి 13, పంచాయతీరాజ్ శాఖవి 16, పోలీస్ శాఖవి 43, సివిల్ సప్లయ్స్‌వి 9 తదితర శాఖలవి 309 ఉన్నాయి. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అర్జీలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు. నిర్ణీత గడువులోగా సమస్యలను పరిష్కరించాలన్నారు. కాగా అర్జీదారులకు భోజనం అందజేశారు. అన్న క్యాంటీన్లకు సరఫరా చేసే వారు కలెక్టరేట్ వ్యాన్‌లో భోజనం తీసుకొచ్చి వడ్డించారు. కాలువ నిర్మించండి 25వ డివిజన్ బుజబుజ నెల్లూరు భగత్‌సింగ్ కాలనీలో డ్రెయినేజీలు నిర్మించాలని స్థానికులు కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాలనీలో ఒకటో వీధి నుంచి మసీదు వరకు 11 వీధులున్నాయని, అక్కడ కాలువల్లేక ఇబ్బంది పడుతున్నామని తెలిపారు. అధికారంలో ఉన్న కొందరు కొన్ని ప్రాంతాల్లో మాత్రమే కాలువలు నిర్మిస్తున్నారని తెలిపారు. 300 కుటుంబాలు ఉన్న ఏరియాలో నిర్మించట్లేదని వాపోయారు. ఉయ్యాల శ్రీనివాసులు, కె.కృష్ణమూర్తి, నాగూర్‌బాబు, వెంకటస్వామి, వెంకయ్య తదితరులు పాల్గొన్నారు. -
వృద్ధుడి బలవన్మరణం
బిట్రగుంట: బోగోలు మండలం చెంచులక్ష్మీపురం గ్రామానికి చెందిన బిజ్జం వెంకారెడ్డి (75) తన ఇంట్లోనే ఉరేసుకుని సోమవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు, స్థానికుల కథనం మేరకు.. వెంకారెడ్డి కుటుంబ సభ్యులంతా వేర్వేరు ప్రాంతాల్లో స్థిరపడ్డారు. ఆయన ఒక్కడే స్థానికంగా నివాసం ఉంటున్నాడు. ఆ ఇంట్లో తిరుపతికి చెందిన శాంతమ్మ అనే మహిళ ఏడాది నుంచి పనిమనిషిగా ఉంది. ఈనెల 4వ తేదీన యజమాని మందలించాడనే కారణంతో శాంతమ్మ ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ క్రమంలో ఏం జరిగిందో గానీ వారం తిరిగేసరికి వెంకారెడ్డి కూడా ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కావలి ఏరియా వైద్యశాలకు తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. -
అంబేడ్కర్ విశ్వవిద్యాలయ ఏర్పాటు కోసం..
ఆంధ్రప్రదేశ్‌లో అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం లేకపోవడంతో దూర విద్య విద్యార్థులు, సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారని రీజినల్ కో–ఆర్డినేటర్ సెంటర్లలో పనిచేసే సిబ్బంది ధర్నా నిర్వహించారు. అనంతరం కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. వారు మాట్లాడుతూ అంబేడ్కర్ విశ్వవిద్యాలయం హైదరాబాద్‌కు చెందినందున ఈ సంవత్సరం ఏపీలో అడ్మిషన్లు నిలిపివేస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. గడిచిన మూడేళ్లుగా మన రాష్ట్రంలోని సెంటర్లలో పనిచేస్తున్న పార్ట్‌టైం లెక్చరర్లకు, సిబ్బందికి జీతాలు కూడా నిలిపివేసినట్లు చెప్పారు. అడ్మిషన్లను చేపట్టాలన్నారు. -
పీహెచ్‌సీలకు చేరిన ఇన్సులిన్ వైల్స్
ఆత్మకూరు: షుగర్ వ్యాధిగ్రస్తులకు అందజేసే ఇన్సులిన్ వైల్స్ రెండు రకాలను ప్రభుత్వం సరఫరా చేసింది. సోమవారం ఉదయం నాటికి అన్ని పీహెచ్‌సీలకు జిల్లా సెంట్రల్ డ్రగ్ స్టోర్ నుంచి సరఫరా అయ్యాయి. గత నెల 20వ తేదీన సాక్షిలో ‘ఇన్సులిన్‌కూ కటకటే’ అనే శీర్షికతో కథనం వచ్చిన విషయం తెలిసిందే. ప్రభుత్వం కేరళ రాష్ట్రం నుంచి ఇన్సులిన్‌ను తెప్పించింది. 70 శాతం అందుబాటులోకి వచ్చిందని సిబ్బంది పేర్కొన్నారు. మద్యం మత్తులో వీరంగం సృష్టిస్తూ..సోమశిల: మండల కేంద్రమైన అనంతసాగరం గ్రామానికి చెందిన ఓ యువకుడు మద్యం మత్తులో వీరంగం సృష్టిస్తూ చోరీలకు పాల్పడుతుండటంతో సోమవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎస్సై సూర్యప్రకాష్‌రెడ్డి కథనం మేరకు.. ఎస్సీ కాలనీకి చెందిన పెనగలూరి రాజేంద్ర (బళ్లారి) గతంలో ఐస్ ఫ్యాక్టరీలో పనిచేసేవాడు. ఇతడికి మద్యం అలవాటు ఉంది. డబ్బుల్లేనప్పుడు వృద్ధులు, ఒంటరిగా వెళ్తున్న వారిపై దాడి చేసి నగదు, సెల్ఫోన్లు లాక్కొని పరారవుతుంటాడు. దుకాణాల్లో సామగ్రి, ఇళ్ల ముందు ఉండే బైక్‌లు, సైకిళ్ల తీసుకెళ్లి విక్రయించి మద్యం తాగుతుంటాడు. గ్రామస్తుల ఫిర్యాదు మేరకు పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. శనివారం రాత్రి పాతదేవరాయపల్లి దర్గాలో జరిగిన చోరీకి ఇతడే బాధ్యుడని తెలిసింది. ఇంకా ఓ ఇంట్లో వస్తువులు, బైక్ చోరీ చేశాడని గుర్తించారు. రాజేంద్రపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించామని ఎస్సై తెలిపారు. -
వైఎస్సార్సీపీలో భారీగా చేరికలు
నెల్లూరు(బారకాసు): నెల్లూరు రూరల్ పరిధిలోని 35వ డివిజన్‌కు చెందిన పలువురు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీ నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇన్చార్జి ఆనం విజయకుమార్‌రెడ్డి సమక్షంలో యాకసిరి రంజిత్ కిరణ్, 200 మంది పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. చింతారెడ్డిపాళెంలోని తన నివాసంలో నిర్వహించిన కార్యక్రమంలో వీరికి పార్టీ కండువాలను కప్పి ఆయన సాదరంగా ఆహ్వానించారు. కార్పొరేటర్ బొబ్బల శ్రీనివాస్‌యాదవ్, మాజీ కార్పొరేటర్ నెల్లూరు మదన్‌మోహన్‌రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి రావు శ్రీనివాసరావు, ఐరెడ్డి సుబ్బారెడ్డి, నారాయణరెడ్డి, మస్తాన్‌రెడ్డి, మల్లికార్జున్‌రెడ్డి, ఆదిరెడ్డి, నవీన్‌కుమార్‌రెడ్డి, మురళీయాదవ్, తదితరులు పాల్గొన్నారు. -
శోభాయమానంగా గిరిపరిక్రమణ
● గోవింద నామస్మరణతో మార్మోగిన బిలకూట క్షేత్రం బిట్రగుంట: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండబిట్రగుంట బిలకూట క్షేత్రంలో ప్రసన్న వేంకటేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల ప్రారంభ సూచికగా గిరిప్రదక్షణ ఆదివారం శాస్త్రోక్తంగా నిర్వహించారు. భగవంతుడికి భక్తుడిని చేరువ చేసేందుకు రమణమహర్షి సూచించిన గిరిప్రదక్షణను అరుణాచలంలో ఘనంగా నిర్వహిస్తారు. ఆ సంప్రదాయాన్ని ఇక్కడ కూడా అమలు చేయాలనే సంకల్పంతో ఎనిమిదేళ్ల నుంచి కొండ చుట్టూ గిరిపరిక్రమణ నిర్వహిస్తున్నారు. వేకువనే ఆలయ అర్చకులు, వేదపండితులు ప్రసన్నుడికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. సుముహూర్తంలో ప్రసన్న వేంకటేశ్వరస్వామి, ఉభయదేవేరుల ఉత్సవ మూర్తులతో వేదపండితులు వేదనాదం చేస్తుండగా, మంగళవాయిద్యాలు, గోవింద నామస్మరణ మధ్య స్వామివారు కొండ దిగి కిందకు వచ్చారు. అలంకార ప్రియుడైన స్వామి వారు ఉభయ దేవేరులతో కలిసి కొండ దిగగా గోవింద నామాలు కీర్తిస్తూ భక్తులు సవ్య దిశలో కొండ చుట్టూ ప్రదక్షణ చేశారు. గోవింద నామస్మరణలు, అన్నమయ్య కీర్తనలు, కోలాట ప్రదర్శనల నడుమ కొండ చుట్టూ భక్తులు చేసిన పరిక్రమణ ఆద్యంతం భక్తి పారవశ్యంతో సాగింది. భగవంతుడి సత్సంగంలో భాగమైన స్మరణ, స్తోత్రం, దర్శనం, సన్నిధి నివాసం, తదితర క్రియల్లో గిరి ప్రదక్షణే అత్యంత శక్తి వంతమైనదని ఈ సందర్భంగా అర్చకులు తెలిపారు. కావలి ఎమ్మెల్యే డీవీ కృష్ణారెడ్డి దంపతులు, ఆర్డీఓ వంశీకృష్ణ దంపతులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. తొలిసారి ఉత్సవ మూర్తులతో.. బిలకూట క్షేత్రంలో ఎనిమిదేళ్ల క్రితం నుంచి గిరి ప్రదక్షిణ ప్రారంభించగా గతేడాది వరకు స్వామివారి నిలువెత్తు చిత్రపటంతోనే భక్తులు కొండ చుట్టూ సవ్య దిశలో ప్రదక్షిణ నిర్వహించేవారు. ఈ దఫా మాత్రం స్వామివారు, దేవేరుల ఉత్సవమూర్తులతో గిరిపరిక్రమణ నిర్వహించగా భక్తులు భారీగా తరలివచ్చారు. -
ఇటీవల జరిగిన ప్రమాదాలు
అభివృద్ధికి చిహ్నాలైన రహదారులు నెత్తురోడుతున్నాయి. సవ్యంగా లేని రోడ్లు.. వాహనాలను నిర్లక్ష్యంగా నడిపే చోదకులు.. భద్రత నిబంధనలపై అవగాహలేమి.. కారణాలేమైతేనేం రుధిరదారులుగా మారుతున్నాయి. ఆనందంగా సాగిపోతున్న ప్రయాణాల్లో అంతలోనే అంతులేని విషాదం కమ్మేస్తోంది. కన్నవారిని, కడుపున పుట్టిన వారిని కోల్పోయిన కుటుంబాలు కుమిలిపోతున్నాయి. ఎంతోమంది శాశ్వత వైకల్యం బారిన పడి జీవితాంతం బాధపడుతున్నారు. 68 రోజుల వ్యవధిలో 44 మందికిపైగా మృతి చెందారంటే సమస్య తీవ్రత ఏమిటో అర్థం చేసుకోవచ్చు. నెల్లూరు(క్రైమ్): రోడ్లెక్కాక ఇంటికి క్షేమంగా చేరుతామో.. లేమోననే మీమాంసలో వాహనచోదకులున్నారు. జిల్లా పరిధిలోని రోడ్లపై నిరంతరం ప్రమాదాలు చోటుచేసుకుంటూ.. ఎంతో మంది ప్రాణాలు కోల్పోతుండగా, పదుల సంఖ్యలో క్షతగాత్రులవుతున్నారు. మితిమీరిన వేగం.. ఓవర్‌టేకింగ్.. అకస్మాత్తుగా వాహనాలను నిలపడం.. నిద్ర లేమి.. మద్యం మత్తు.. సెల్‌ఫోన్ డ్రైవింగ్.. ట్రాఫిక్ నిబంధనల అతిక్రమణ.. పరిమితికి మించి ప్రయాణం.. రాంగ్రూట్లో రాకపోకలు.. ఇలా ప్రమాదాలకు కారణాలెన్నో. కొన్ని సందర్భాల్లో గమ్యస్థానానికి సకాలంలో చేరాలనో.. అందరి కంటే ముందుగా వాహనాన్ని చేర్చాలనో.. అత్యవసర పనో.. మరో బాడుగ ఉందనో వాహనాలను వేగంగా నడుపుతూ ప్రమాదాలకు గురవుతున్నారు. అంతా అస్తవ్యస్తం.. జాతీయ, రాష్ట్ర రహదారులు కొంతవరకు బాగానే ఉన్నా.. జిల్లా, మండల, గ్రామీణ రహదారులు గుంతలు పడి దుర్భరంగా మారాయి. రోడ్లపై నిర్దిష్ట పార్కింగ్ ప్రాంతాల్లో కాకుండా ఎక్కడపడితే అక్కడ వాహనాలను ఇష్టారాజ్యంగా నిలుపుతున్నారు. అప్రమత్తం చేసేలా ఇండికేటర్లు, స్టిక్కరింగ్తో కూడిన ట్రయాంగిల్ గుర్తులనూ వాడకపోవడంతో వెనుకొచ్చే వారికి కనిపించక వేగంగా ఢీకొని ప్రాణాలు కోల్పోతున్నారు. వాహనాల ముందు, వెనుకా పసుపు, ఎరుపు రంగులతో రేడియం స్టిక్కర్లున్నా, అధిక శాతం నాసిరకంగా మారాయి. దుమ్మూ, ధూళితో ఉండటంతో చీకట్లో వాహనం ఉందో లేదో తెలుసుకోలేని పరిస్థితి నెలకొంటోంది. స్టీరింగ్ పడుతున్న క్లీనర్లు క్లీనర్లు అరకొరా డ్రైవింగ్‌తో వాహనాలను అప్పుడప్పుడూ నడుపుతూ పట్టు కోల్పోయి ప్రమాదాలకు కారణమవుతున్నారు. సుదూర ప్రాంతాల నుంచి రోజుల తరబడి వాహనాలను నడుపుతూ నిద్రమత్తుకు గురై ప్రమాదాలకు కారకులవుతున్నారు. వీరు ప్రాణాలను కోల్పోవడమే కాకుండా ఎదుటి వారి ప్రాణాలనూ బలిగొంటున్నారు. మొక్కుబడి చర్యలు జిల్లాలో ప్రమాదాలు అధికంగా జరిగే 54 బ్లాక్స్పాట్లను అధికారులు గుర్తించారు. ఇందులో ఉలవనాడు – మనుబోలు (ఎన్‌హెచ్ – 16)పై 45.. కృష్ణపట్నం – బద్వేల్ (ఎన్‌హెచ్ – 67)పై ఏడు.. ఇతర రహదారుల్లో మరికొన్నింటిని కనుగొన్నారు. ఆయా ప్రాంతాల్లో ఇసుక డ్రమ్ములు, బ్యారికేడ్లు, మలుపుల వద్ద రేడియం స్టిక్కర్లు, సోలార్ విద్యుద్దీపాలు, సూచిక బోర్డులను ఏర్పాటు చేయాలని రోడ్డు భద్రత సమావేశాల్లో అధికారులు తీర్మానించారు. కొన్ని ప్రాంతాల్లో మినహా అవి మరెక్కడా కానరావడంలేదు. వేగ నియంత్రణ, బ్లాక్ స్పాట్ల వద్ద నిర్దిష్ట చర్యలు, రోడ్డు సేఫ్టీ కమిటీ నిర్ణయాల అమలుపై పోలీస్, రవాణా శాఖ అధికారులు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఫేస్‌వాష్‌కు బ్రేక్.. నిద్రమత్తులో ప్రమాదాలు అధికంగా జరుగుతున్నాయని గుర్తించిన అధికారులు వాహన డ్రైవర్లకు ఫేస్‌వాష్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అప్పట్లో ప్రమాదాలు తగ్గుముఖం పట్టగా, కాలక్రమంలో ఆ ప్రక్రియకు బ్రేక్‌పడింది. ప్రమాదంలో దెబ్బతిన్న వాహనం ఇలా చేస్తే.. కొంత మేలు జాతీయ రహదారిపై ఎక్కడపడితే అక్కడ వాహనాలను నిలపకుండా చూడాలి. రాత్రి వేళ వాహనచోదకుడికి ముందు వాహనం ఉందనే విషయాన్ని స్పష్టంగా కనిపించేలా చేయాలి. వేగ నియంత్రణ, మద్యం మత్తులో వాహనాలు నడపకుండా చూడాలి. అతివేగంతో దూసుకెళ్లే వాహనాలను నిఘా కెమెరాలతో గుర్తించి వెంటనే కళ్లెం వేయాలి. సంబంధిత వాహన యాజమాని సెల్‌ఫోన్‌కు సందేశం పంపి అప్రమత్తం చేయాలి. డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలను నిర్వహించాలి. అనుభవం లేని వారు వాహనాలను నడుపుతుంటే కేసులు నమోదు చేయాలి. ద్విచక్రవాహనచోదకుడైతే హెల్మెట్.. కారులోని వారు సీట్ బెల్టును విధిగా ధరించేలా చూడాలి. నిబంధనల ఉల్లంఘనలపై కొరడా ఝళిపించాలి. ఫేస్ వాష్ కార్యక్రమాన్ని పునరుద్ధరించాలి. హైవే పెట్రోలింగ్ సిబ్బంది నిరంతరం గస్తీ నిర్వహించేలా చూడాలి. జిల్లా పరిధిలోని రోడ్లపై నిత్యం ప్రమాదాలు గాల్లో కలుస్తున్న ప్రాణాలు వీడని నిర్లక్ష్యం.. భద్రతలో అలక్ష్యం 68 రోజుల్లో 44 మందికిపైగా మృత్యువాత సుందరయ్య కాలనీ సమీపంలోని జాతీయ రహదారిపై కారు మితిమీరిన వేగంతో వస్తూ ముందు వెళ్తున్న ఆటోను ఢీకొంది. ఘటనలో ఆటోలోని ఇద్దరు మృతి చెందగా, ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఇన్నోవా డ్రైవర్ నిద్రమత్తులో వాహనాన్ని నడుపుతూ భగత్‌సింగ్‌కాలనీ సమీపంలో డివైడర్‌ను శనివారం తెల్లవారుజామున ఢీకొని.. గూడూరు వైపు వెళ్లే లారీని ఢీకొట్టారు. ఈ ఘటనలో అక్కాతమ్ముడు మృతి చెందగా, వారి తల్లిదండ్రులు, డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డారు. సంగం మండలంలో ఆటోను పల్లెవెలుగు బస్సు జనవరిలో ఢీకొనడంతో వెంకటశేషయ్య, వరలక్ష్మి దంపతులు మృతి చెందారు. -
యువతకు అండగా వైఎస్సార్సీపీ ఉద్యమ బాట
● 12న ర్యాలీ, కలెక్టరేట్ ఎదుట ధర్నా ● ‘యువత పోరు’ పోస్టర్ ఆవిష్కరణలో మాజీమంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి నెల్లూరు(బారకాసు): ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించకుండా, ఉద్యోగావకాశాలు కల్పించకుండా టీడీపీ కూటమి ప్రభుత్వం విద్యార్థులను చదువులకు దూరం చేయడంతోపాటు నిరుద్యోగులను దగా చేస్తోందని మాజీమంత్రి, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి ధ్వజమెత్తారు. అందుకు నిరసనగా ఈ నెల 12న విద్యార్థులు, తల్లిదండ్రులు, నిరుద్యోగులతో కలిసి పోరుబాట చేపడుతున్నామని తెలిపారు. వైఎస్సార్సీపీ తలపెట్టిన ‘యువత పోరు’కు సంబంధించిన పోస్టర్‌ను పలు నియోజకవర్గాల ఇన్చార్జిలు, విద్యార్థి సంఘ నాయకులు, పార్టీ నాయకులతో కలిసి ఆదివారం కాకాణి నగరంలోని డైకస్‌రోడ్డులో ఉన్న పార్టీ జిల్లా కార్యాలయంలో ఆవిష్కరించారు. కాకాణి మాట్లాడుతూ చంద్రబాబు అన్ని రంగాల వారిని మోసం చేసినట్లుగానే విద్యార్థులను, యువతను కూడా మోసం చేస్తున్నారన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించకపోవడంతో కళాశాల యాజమాన్యాలు విద్యార్థులకు హాల్ టికెట్లు ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టారన్నారు. విద్యార్థుల భవిష్యత్ బాగుండాలన్న ఉద్దేశంతో దివంగత సీఎం డాక్టర్ వైఎస్సార్ ఫీజు రీయింబర్స్మెంట్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని గుర్తు చేశారు. ఈ పథకాన్ని వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎక్కడా ఇబ్బంది లేకుండా కొనసాగించారన్నారు. చంద్రబాబు నాడు–నేడు ఈ పథకాలను నీరు గార్చారని, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించకుండా అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పిస్తానని, లేకపోతే నెలకు రూ.3 వేలు నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పి మోసం చేశారన్నారు. కూటమి ప్రభుత్వం మెడలు వంచి నిధులు విడుదల చేయించే విధంగా పోరాడేందుకు వైఎస్సార్సీపీ నడుం బిగించిందన్నారు. ఈ నెల 12న నిర్వహించే యువత పోరుకు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, యువకులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని కోరారు. వైస్సార్సీపీ వెంకటగిరి, నెల్లూరు రూరల్ నియోజకవర్గాల ఇన్చార్జిలు నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి, ఆనం విజయకుమార్‌రెడ్డి, సూళ్లూరుపేట మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, ఎమ్మెల్సీ మేరిగ మురళి, పార్టీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు ఊటుకూరు నాగార్జున, విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు అశ్రిత్‌రెడ్డి, నాయకులు వెంకటశేషయ్య తదితరులు పాల్గొన్నారు. -
ఏకపక్షంగా ఆ సంస్థ వైఖరి
హైదరాబాద్ భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ దుర్మార్గ వైఖరి.. వరి రైతులకు శరాఘాతంగా మారింది. కృష్ణపట్నం పోర్టు నుంచి హైదరాబాద్ వరకు బీపీసీఎల్ సంస్థ ఆయిల్ సరఫరాకు పైప్‌లైన్ నిర్మిస్తోంది. పచ్చని పంటలను ధ్వంసం చేసి తమ పైప్‌లైన్ ఏర్పాటు చేయడానికి దుందుడుకుతనంగా వ్యవహరిస్తోంది. ఇప్పటికే ఈ సంస్థ తీరుపై పైప్‌లైన్ వెళ్లే మార్గంలోని రైతులు కస్సుబుస్సులాడుతున్నారు. ఈ సమస్యపై రైతు సంఘాలు, వామపక్ష పార్టీలు సైతం కలెక్టర్‌ను కలిసి పంట కాలం పూర్తయ్యే వరకు ఈ పనులు నిలిపివేయాలని విజ్ఞప్తి చేశాయి. రైతులకు జరిగే నష్టాన్ని అంచనా వేయకుండా బీపీసీఎల్ ఏకపక్షంగా వ్యవహరిస్తుంటే ఇందుకు పోలీసులు, అధికారులు వత్తాసు పలకడంపై సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. పచ్చటి పొలాల వద్దకు చేరిన పైప్‌లైన్ కావలి: వ్యవసాయ భూముల్లో బీపీసీఎల్ సంస్థ ఏర్పాటు చేస్తున్న పైప్‌లైన్ పల్లెల్లో రగడ సృష్టిస్తోంది. పంట చివరి దశలో ఉండగా ఆ భూములను ధ్వంసం చేసి పైప్‌లైన్ వేయడాన్ని రైతులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయా భూముల్లో వరి పంట సాగులో ఉంది. కనీసం 20 రోజులు సమయం ఇస్తే పంట కోత పూర్తవుతుందని నచ్చ జెప్పినా బీపీసీఎల్ సిబ్బంది ఖాతరు చేయడం లేదు. మండలంలోని సర్వాయపాళెం, ఆనెమడుగు పంచాయతీల పరిధిలో పలు గ్రామాల మీదుగా ఈ నెల 11వ తేదీ నుంచి వరి సాగులో ఉన్న భూముల్లో పైప్‌లైన్ వేసి తీరుతామని బీపీసీఎల్ ప్రతినిధులు మంకుపట్టు పడుతున్నారు. మా భూముల్లో మాకు తెలియకుండా దౌర్జన్యంగా పైప్‌లైన్ వేయడమేంటని రైతులు ఆగ్రహిస్తున్నారు. వరి పైరు పాడైపోతే నష్ట పరిహారం ఇస్తామని బీపీసీఎల్ సిబ్బంది చులకన భావంతో చెబుతున్న మాటలు రైతుల్లో ఆగ్రహం రగిలిస్తోంది. గ్రామాల్లో పోలీసులు పహారా నడుమ పొలాల్లో పైప్‌లైన్ వేయడానికి అధికారులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్న తీరుపై రైతులు కలత చెందుతున్నారు. సన్నకారు రైతులు భూముల్లో నడి మధ్యన పైప్‌లైన్ వేసి పొలాలను ధ్వంసం చేసి రైతుల జీవనాధారం కోల్పోయే దుర్మార్గమైన వాతావరణాన్ని అధికారులు సృష్టిస్తున్నారని రైతులు ఆవేదన చెందుతున్నారు. నిర్మాణం ఎలాగంటే.. పైపులైన్ వేసేందుకు రూ.451 కి.మీ. పొడవునా 16 మీటర్ల వెడల్పున భూమిని స్వాధీనం చేసుకుంటారు. అందులో రెండు మీటర్ల వెడల్పులో ఆరు అడుగుల లోతు తవ్వుతారు. పైపులైన్‌కు ఒక వైపున మూడు మీటర్లు, మరో వైపు 11 మీటర్ల మేర ఖాళీ ఉంచుతారు. లైన్ కోసం తవ్విన మట్టిని ఒక వైపు పోసి, మెటీరియల్‌ను మరో వైపు నుంచి తీసుకెళ్తారు. 16 అంగుళాల పైపు వేసి తిరిగి ఆ మట్టిని పూడ్చేస్తారు. అనంతరం ఆ భూమిని రైతులకు అప్పగిస్తారు. ప్రతి 10 కి.మీ.కు ఒక చోట చెకింగ్ పాయింట్‌తో పాటు లైన్ పొడవునా సెన్సార్లు ఏర్పాటు చేయనున్నారు. పనులు పూర్తయిన తర్వాత రైతులు ఎప్పటిలా పంటలు సాగు చేసుకోవచ్చు. అయితే సాధారణ వ్యవసాయ పంటలు తప్ప వేర్లు బాగా లోపలికి వెళ్లి పైపును డ్యామేజీ చేసే మామిడి, జామాయిల్ వంటివి సాగు చేసే అవకాశం లేదు. పైపులైన్ నిర్మాణం తర్వాత ఆ ప్రాంతంలో పంటలు వేసుకోవచ్చు. అయితే పైపులైన్న్దెబ్బతినే స్థాయిలో పెద్దపెద్ద వృక్షాలు పెంచకూడదు. పొలాల్లో చివరి దశలో వరి పైరు ఈ నెల 11 నుంచి పైప్‌లైన్ ఏర్పాటుకు యత్నాలు పంట దెబ్బతింటే సహించమంటున్న రైతులు -
రైతులంటే అలుసైపోయారు
రైతులంటే అలుసైపోయారు. కోతకు వచ్చిన పైరును ఇంటికి చేర్చుకోనే వరకు కూడా ఓపిక పట్టలేమంటే ఎలా. పైప్‌లైన్ నిర్మాణ పనులు జరిగితే వారు పనులు చేసే చోటనే కాకుండా పైరంతా కూడా గింజ చేతికి రాదు. పైగా పైరుకు నష్ట పరిహారం ఇస్తామంటూ హేళన చేయడం దారుణం. బీపీసీఎల్ తేదీలు పెట్టి అదే చివరి గడువని హెచ్చరించే ధోరణిలో బెదిరిస్తే ఎవరూ బెదిరిపోరు. పంట ఇంటికి చేరే వరకు పొలాల్లో పైప్‌లైన్ పనులు జరగనివ్వం. – రేమాల లిగారెడ్డి, రైతు, ఆనెమడుగు, కావలి మండలం ● -
ధీమానా?.. ధిక్కారమా!
● ప్రభుత్వ ఆదేశాలు.. చిత్తు కాగితాలతో సమానం ● మైపాడు రోడ్డు పనులు రద్దు చేసినా.. కొనసాగిస్తున్న కాంట్రాక్టర్ ● 5 శాతం ఎక్సెస్‌తో టెండర్ దక్కించుకున్న కాంట్రాక్టర్ ● షాడో ఎమ్మెల్యేకు ముడుపులు ఇచ్చుకుని యథేచ్ఛగా పనులు ● అనుమతి లేకుండా పనులు జరుగుతున్నా అధికారులు మౌనం ● అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో నాసిరకంగా నిర్మాణం జిల్లాలో అధికార పార్టీ ఎమ్మెల్యేల అండ ఉంటే ప్రభుత్వ ఉత్తర్వులు సైతం చిత్తు కాగితాలుగా మారిపోతున్నాయి. ప్రభుత్వ ఆదేశాలకే దిక్కు లేకుండా పోవడం చూసి అధికార యంత్రాంగమే విస్తుపోతోంది. గత ప్రభుత్వంలో మంజూరైన రోడ్ల నిర్మాణ పనులు 25 శాతం పూర్తి కాని వాటిని రద్దు చేస్తూ కూటమి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ ఉత్తర్వులు నెల్లూరు– మైపాడు రహదారికీ వర్తిస్తాయి. సదరు కాంట్రాక్టర్ ఇద్దరు అధికార పార్టీ ఎమ్మెల్యేల అండతో ప్రభుత్వ ఆదేశాలను తుంగలో తొక్కి ఎంచక్కా రోడ్డు వర్క్ చేస్తున్నాడు. షాడో ఎమ్మెల్యేలకు ముడుపులు ఇవ్వడంతో అధికార యంత్రాంగం కాంట్రాక్టర్ ముందు మోకరిల్లింది.సాక్షి ప్రతినిధి, నెల్లూరు: నెల్లూరు– మైపాడు రోడ్డు పనులను దక్కించుకున్న కాంట్రాక్టర్ రద్దయిన పనులను ఎంచక్కా కానిచ్చేస్తున్నాడు. గతంలో ఆ వర్కుకు టెండర్లు వేసిన సమయంలో కాంట్రాక్టర్లు సిండికేట్‌గా మారి ముగ్గురు కలిసి 5 శాతం ఎక్సెస్ ధరకు పనులు దక్కించుకున్నారు. రూ.48 కోట్ల (సీఆర్ఐఎఫ్) నిధులతో నెల్లూరు – మైపాడు రోడ్డును అభివృద్ధి చేసేందుకు రెండేళ్ల క్రితం టెండర్లు పిలిచి కాంట్రాక్టర్‌కు అప్పగించారు. రెండేళ్లలో పూర్తి చేయాలని గడువు విధించారు. ప్రభుత్వం మారడంతో ఆ వర్క్ నెల్లూరు డివిజన్ పరిధిలో జరుగుతున్నా.. కోవూరు డివిజన్ పరిధిలోకి మార్పు చేసుకున్నారు. తర్వాత కూటమి ప్రభుత్వం 25 శాతం కంటే తక్కువ పని చేసిన వర్క్‌లను రద్దు చేయాలని ఆదేశించింది. ప్రభుత్వం ఈ ఆదేశాలిచ్చే సరికి దాదాపు 10 శాతం కూడా ఆ రోడ్డు పని పూర్తి కాలేదు. రద్దయిన పనుల జాబితాలోకి ఆ పని కూడా వచ్చింది. కానీ సదరు కాంట్రాక్టర్ ఇద్దరు అధికార పార్టీ ఎమ్మెల్యేల ద్వారా రాజకీయ ఒత్తిడి తెచ్చి రద్దయిన పనిని కూడా చేస్తున్నాడు. షాడో ఎమ్మెల్యే పాత్ర కీలకం మైపాడు రోడ్డు అభివృద్ధి పనులు గతంలో చేపట్టిన సిండికేట్‌లోని ముగ్గురిలో ఒకరు మిగతా ఇద్దరు కాంట్రాక్టర్ల వద్ద ఎక్సెస్ ధర మేర ముడుపులు తీసుకుని రద్దయిన పనిని పూర్తి చేయించేలా కోవూరు షాడో ఎమ్మెల్యేతో ఒప్పందం చేసుకున్నారు. ఈ రోడ్డు నిర్మాణ పరిధిలోకి వచ్చే ఇద్దరు ఎమ్మెల్యేల ద్వారా ఆ శాఖ మంత్రికి చెప్పించుకుని రోడ్డు పనిని అనధికారికంగా పూర్తి చేయిస్తున్నారని తెలిసింది. ప్రభుత్వ ఉత్తర్వులకే దిక్కులేకపోవడంతో మిగిలిన కాంట్రాక్టర్లు విస్తుపోతున్నారు. అడ్డదారుల్లోనైనా.. నెల్లూరు–మైపాడు రోడ్డు 10 శాతం పనులు మేర జరిగిన నేపథ్యంలో రద్దు చేస్తూ ప్రభుత్వం ఆదేశాలివ్వడంతో.. అనధికారికంగా మరో 15 శాతం పనులు పూర్తి చేస్తున్నారు. 10 శాతం పనుల జాబితాలో ఈ రోడ్డు ఉండడంతో.. అడ్డదారుల్లో వెళ్లి ఆ పనిని ఆ జాబితా నుంచి తప్పించారని సమాచారం. ఇటీవల జిల్లాకు వచ్చిన సదరు శాఖ మంత్రిని ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు కలిసి ఆ పని రద్దు కాకుండా పనులు సజావుగా జరిగేలా చూడాలని కోరినట్లు తెలిసింది. అధికారికంగా ప్రభుత్వం రద్దు చేసిన నేపథ్యంలో 25 శాతం పనులు జరిగినట్లు ధ్రువీకరించి కోర్టు ద్వారా అయినా కాంట్రాక్ట్‌ను చేజార్చుకోకుండా చూసుకునేందుకు ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నారు. నాణ్యతకు నీళ్లు మైపాడ్ రోడ్డు విస్తరణ పనుల్లో నాణ్యతకు నీళ్లోదిరారు. సంబంధిత శాఖ ఇంజినీర్లు రద్దయిన రోడ్డు నిర్మాణ పనుల జోలికి వెళ్లకపోవడంతో కాంట్రాక్టర్ ఇష్టానుసారంగా చేస్తున్నారు. ఇప్పటికే రోడ్డు మార్జిన్లో ఉన్న గ్రావెల్‌ను రియల్ వెంచర్లకు తోలి రూ.కోట్లు కొల్లగొట్టారు. పనులు కూడా కాంట్రాక్టర్ ఇష్టానుసారంగా చేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. సంబంధిత ఆర్అండ్బీ అధికారులు మాత్రం మైపాడు రోడ్డు పనులు రద్దయింది వాస్తవమేనని ఒప్పుకుంటున్నారు. కానీ అధికార పార్టీ ఎమ్మెల్యేల ప్రమేయం ఉండడంతో తామేమి చేయలేమని చేతులెత్తేస్తున్నారు. రోడ్డు పనులు ఆపే శక్తి తమకు లేదని అధికారులు చెప్పడం చూస్తుంటే కాంట్రాక్టర్ పవర్ ఏమిటో ఇట్టే తెలిసిపోతుంది. -
అందుబాటులో హాల్ టికెట్లు
నెల్లూరు (టౌన్): ఏపీ ఓపెన్ స్కూల్ పదో తరగతి అభ్యాసకుల హాల్‌టికెట్లు సంబంధిత స్టడీ సెంటర్లలో అందుబాటులో ఉన్నట్లు డీఈ ఓ ఆర్.బాలాజీరావు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్షలు ఈ నెల 17 నుంచి 28వ తేదీ వరకు జరుగుతాయన్నారు. హాల్ టికెట్లను వాట్సాప్–మనమిత్ర ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చన్నారు. కనువిందు చేసిన నృత్య ప్రదర్శన నెల్లూరు (బృందావనం): నగరంలోని ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో నగరపాలక సంస్థ, జిల్లా ప్రజాపరిషత్ పాఠశాలలకు చెందిన 1,116 మంది విద్యార్థులు నారాయణమూర్తి ఆధ్వర్యంలో ఆదివారం సామూహిక నృత్య ప్రదర్శన నిర్వహించారు. ‘మొక్కజొన్న తోటలో’ జానపద గేయానికి అనుగుణంగా సాగిన నృత్య ప్రదర్శన ప్రేక్షకులకు కనువిందు చేసింది. ఈ కార్యక్రమానికి వండర్బుక్ ఆఫ్ రికార్డు, తెలుగు బుక్ ఆఫ్ రికార్డు, భారత్ రికార్డు, జీనియస్ బుక్ ఆఫ్ రికార్డు తదితర సంస్థల ప్రతినిధులు హాజరై వీక్షించారు. విద్యార్థులు, నిర్వాహకులకు ఆయా సంస్థల ప్రతినిధులు సర్టిఫికెట్లు, పతకాలు అందజేశారు. కార్యక్రమంలో వివిధ రంగాలకు చెందిన పలువురు పాల్గొన్నారు. -
మహిళా సాధికారతే ప్రభుత్వ లక్ష్యం
● జిల్లా ఇన్చార్జి మంత్రి మహ్మద్ ఫరూక్ ● కస్తూర్బాలో ఘనంగా మహిళా దినోత్సవం నెల్లూరు(అర్బన్): మహిళలు ఆర్థికంగా పరిపుష్టి సాధించి అన్ని రంగాల్లో ముందంజలో ఉంటూ మహిళా సాధికారత సాధించడమే లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తుందని జిల్లా ఇన్చార్జి మంత్రి మహ్మద్ ఫరూక్ అన్నారు. శనివారం నగరంలోని కస్తూర్బా కళాక్షేత్రంలో కలెక్టర్ ఆనంద్ ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహించారు. తొలుత సెల్ఫీ బూత్‌ను కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ప్రారంభించారు. మంత్రి ఫరూక్ మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా, సామాజికంగా ఎదిగేందుకు సంక్షేమ పథకాలతో పాటు సబ్సిడీ రుణాలు, స్వయం ఉపాధి పథకాలు అందిస్తున్నామన్నారు. మహిళలకు రూ.440 కోట్ల రుణాలు మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని పలు రకాల పథకాల ద్వారా రూ.440 కోట్ల మేర రుణాల పంపిణీకి సంబంధించి మంత్రి మహ్మద్ ఫరూక్, కలెక్టర్ ఆనంద్ మెగా చెక్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ కృష్ణకాంత్, రాష్ట్ర వక్ఫ్ బోర్డు ఛైర్మన్ అబ్దుల్ అజీజ్, నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, ట్రైకార్ డైరెక్టర్ అనూరాధ, డీఆర్డీఏ, మెప్మా, ఐసీడీఎస్ శాఖల పీడీలు నాగరాజకుమారి, రాధమ్మ, సుశీల, డీఎంహెచ్ఓ సుజాత, పరిశ్రమల శాఖ జీఎం మారుతీప్రసాద్, లీడ్ బ్యాంకు మేనేజర్ శ్రీకాంత్ ప్రదీప్‌కుమార్, హ్యాండ్లూమ్స్ ఏడీ వరప్రసాద్, పలువురు జిల్లా అధికారులు, పొదుపు మహిళలు పాల్గొన్నారు.