ఉదయం ఇలా.. మధ్యాహ్నం అలా..
మార్చినెల మొదలైపోయింది. ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. కానీ రాత్రి, ఉదయం వేళల్లో పొగమంచు ఇంకా వీడలేదు. దట్టంగా కమ్ముకుని ఉంటోంది. మధ్యాహ్నానికి ఎండ వేడిమి అధికమై వృద్ధులు, చిన్నారులు అల్లాడిపోతున్నారు. భానుడి భగభగల నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. కొందరు చెట్ల కింద సేద తీరుతుండగా.. మరికొందరు గొడుగులు వినియోగిస్తున్నారు. – సాక్షి ఫొటోగ్రాఫర్స్, నెల్లూరు
● సమస్యలు తాత్కాలికం
● ఆత్మహత్య పరిష్కారం కాదు
● రెండు నెలల వ్యవధిలో
40 మందికి పైగా బలవన్మరణం
రెవెన్యూ సమస్యలపై
ప్రత్యేక దృష్టి
● కలెక్టర్ హిమాన్షు శుక్లా
నెల్లూరు(వీఆర్సీసెంటర్): రెవెన్యూ సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి పరిష్కరించాలని కలెక్టర్ హిమాన్షు శుక్లా ఆదేశించారు. నెల్లూరులోని కలెక్టరేట్‌లో ఉన్న తిక్కన ప్రాంగణంలో శుక్రవారం జిల్లా రెవెన్యూ అధికారులతో ఆయన సమావేశం నిర్వ హించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ త్వరలో పీఓటీ, ఆర్‌ఓఆర్, ఇనామ్, స్టేట్ యాక్ట్స్, 22ఏ, రీ సర్వే లాంటి రెవెన్యూ అంశాలపై అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తామన్నారు. ఇకనుంచి ప్రతినెలా రెవెన్యూ అధికారులకు సమీక్షలు నిర్వహిస్తామన్నారు. డీటీలు, వీఆర్యోలు, ఆర్‌ఐలు బాధ్య తాయుతంగా పనిచేసి రెవెన్యూ సమస్యలను వేగవంతంగా పరిష్కరించాలని ఆదేశించారు. అనంతరం పీజీఆర్‌ఎస్, మ్యుటేషన్లు, చుక్కల భూ ములు, 22ఏ కేసులు, జీరో ఖాతాలు, రీసర్వే అంశాలపై చర్చించారు. ఎన్ని ఆర్జీలు వచ్చాయి?, ఎన్ని పరిష్కరించారు?, ఎన్ని పెండింగ్‌లో ఉన్నాయి?, ఎందుకు పరిష్కరించ లేదు తదితర వాటి గురించి ఆరాతీశారు. సమావేశంలో జేసీ మొగిలి వెంకటేశ్వర్లు, డీఆర్వో విజయ్‌కుమార్, ఆర్డీఓలు అనూష, పావని, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
రియల్ ఎస్టేట్ వ్యాపారి
ఇంట్లో భారీ చోరీ
నెల్లూరు(క్రైమ్): రియల్ ఎస్టేట్ వ్యాపారి ఇంట్లో చోరీ ఘటనపై నెల్లూరు వేదాయపాళెం పోలీసులు కేసు నమోదు చేశారు. వారి కథనం మేరకు.. కొండాయపాళెం నందవనం ప్రాంతంలో రియల్ ఎస్టేట్ వ్యాపారి శ్రీధర్‌రెడ్డి తన తల్లితో కలిసి నివాసం ఉంటున్నాడు. అతని వద్ద శ్రీనివాసులురెడ్డి అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు. శ్రీధర్‌రెడ్డి తల్లి నెలరోజులుగా హైదరాబాద్‌లో ఉంటున్నారు. ప్రస్తుతం ఇంటి వద్ద శ్రీధర్‌రెడ్డి, తన అసిస్టెంట్ మాత్ర మే ఉంటు న్నారు. గురువారం సాయంత్రం అతను వ్యాపారానికి సంబంధించి రూ.16.50 లక్షల నగదును అసిస్టెంట్‌కు ఇచ్చి బీరువాలో పెట్టాలని చెప్పాడు. శుక్రవారం ఉదయం శ్రీధర్‌రెడ్డికి అసిస్టెంట్ కాఫీ ఇవ్వడంతో తాగి మళ్లీ నిద్రపోయాడు. కొద్దిసేపటి అనంతరం లేచి చూడగా శ్రీనివాసులురెడ్డి కనిపించలేదు. ఫోన్ చేయగా స్విచ్ఛాఫ్ రావడంతో అనుమానం వచ్చి బీరువాలో చూడగా రూ.16.50 లక్షల నగదు, 55 గ్రాముల బంగారు ఆభరణాలతోపాటు, పార్కిగ్‌లో ఉంచిన ఎలక్ట్రిక్ బైక్ కనిపించలేదు. బాధితుడు చోరీ ఘటనపై వేదాయపాళెం పోలీసులకు ఫిర్యా దు చేశాడు. అసిస్టెంట్‌పై అనుమానం ఉందని ఫిర్యాదులో పేర్కొనడంతో ఆ దిశగా పోలీసులు విచారణ చేస్తున్నారు.
నెల్లూరు(క్రైమ్): జీవితంలో ఎదురయ్యే ఆటుపోట్లను తట్టుకోలేక చిన్నచిన్న సమస్యలకు కుంగిపోతూ పలువురు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయాలు ఎన్నో బంధాలను చిదిమేస్తున్నాయి. అయిన వారిని, నమ్ముకున్న వారిని పుట్టెడు బాధలోకి నెట్టేస్తున్నాయి. జిల్లాలో రెండు నెలల వ్యవధిలో సుమారు 40 మందికిపైగా ప్రాణాలను బలవంతంగా తీసుకున్నారు. పెరుగుతున్న ఆత్మహత్యలు ఆందోళన కలిగిస్తున్నాయి.
ఎన్నో కారణాలు
కుటుంబ కలహాలు, ఒంటరితనం, అనారోగ్య సమస్యలు, వరకట్న వేధింపులు, వ్యసనాలు, పరిపక్వత లేని ప్రేమలు, ప్రేమ వైఫల్యాలు, ఆర్థిక సమస్యలు, పరీక్షల్లో ఫెయిల్, వ్యాపారంలో నష్టాలు, జీవితంపై కొరవడిన అవగాహన తదితర కారణాలు ఎక్కువ శాతం మందిని ఆత్మహత్యలకు పురిగొల్పుతున్నాయి. నేనేం సాధించలేను.. జీవితంలో ఒడిపోయాను.. నా జీవితం వృథా.. నన్నెవరూ అర్థం చేసుకోరు.. దాదాపు ఆత్మహత్యలు చేసుకునే వాళ్లంతా ఇలాంటి నిరాశ, నిస్పృహలతోనే ఉంటారు. మానసికంగా కుమిలిపోతున్న ఇలాంటి వారిని సకాలంలో గుర్తించి కౌన్సెలింగ్ ఇప్పిస్తే చాలావరకు ఆత్మహత్యలను నిరోధించవచ్చని మానసిక వైద్యులు పేర్కొంటున్నారు.
ఇటీవల జరిగినవి
పరీక్షల్లో తక్కువ మార్కులు వచ్చాయని సంతపేటకు చెందిన ఓ విద్యార్థిని ఇటీవల ఆత్మహత్య చేసుకుంది. ఒంటరితనం, అనారోగ్య సమస్యలతో కల్లూరుపల్లి హౌసింగ్ బోర్డులో ఓ వృద్ధుడు, మద్యానికి బానిసై జీవితంపై విరక్తి చెంది ఓ కారు డ్రైవర్, చేజర్ల మండలానికి చెందిన ఓ వ్యక్తి మద్యానికి బానిసై, అప్పుల బాధలు తాళలేక డేవిస్‌పేటలో ఓ వ్యక్తి, భార్య కాపురానికి రాలేదని కల్తీ కాలనీలో భర్త బలవన్మరణానికి పాల్పడ్డారు.


