breaking news
SPSR Nellore District News
-
తెలుగుభాష పరిరక్షణ అందరి బాధ్యత
● మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ● సింహపురిలో తెలుగు భాషోత్సవాలు ప్రారంభంనెల్లూరు(బృందావనం): తెలుగుభాష పరిరక్షణ అందరి బాధ్యత కావాలని భారత మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు అన్నారు. గిడుగు రామమూర్తి పంతులు జయంతి సందర్భంగా సేవ తెలుగుభాష, సాహితి, సాంస్కృతిక సంస్థ ఆధ్వర్యంలో మూడు రోజులు జరిగే తెలుగుభాషోత్సవాలను శుక్రవారం నెల్లూరు పురమందిరంలో ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పలు రంగాల్లో బహుముఖ ప్రజ్ఞ చూపిన గిడుగువారు తెలుగువారందరికీ ఆదర్శనీయులన్నారు. ఆయన్ను ఆదర్శంగా తీసుకుని మాతృభాష పరిరక్షణలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. తిక్కన మహాకవి మొదలుకుని తన గురువు పోలూరు హనుమజ్జానకీరామ శర్మ వరకు ఎందరో మహనీయులు తెలుగు సాహిత్య సేద్యం చేశారన్నారు. తెలుగు మన చిరునామా అన్నారు. మన జీవితాలకు వెలుగునిచ్చేది మాతృభాషేనన్నారు. ● ప్రసార భారతి విశ్రాంత అదనపు డైరెక్టర్ జనరల్ డాక్టర్ రేవూరు అనంత పద్మనాభరావు అధ్యక్షతన జరిగిన తొలిరోజు సభలో శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం (తిరుపతి) పూర్వ ఉపకులపతి ఆచార్య కొలకలూరి ఇనాక్, శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం (అనంతపురం) విశ్రాంత ఆచార్యులు రాచపాళెం చంద్రశేఖర్‌రెడ్డి, విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ అల్లం శ్రీనివాసరావు, గిడుగు రామమూర్తి పంతులు వారసులు, పెద్దకోడలు గిడుగు సరస్వతి తదితరులు పాల్గొని ప్రసంగించారు. వ్యాఖ్యాతలుగా డాక్టర్ పత్తిపాక మోహన్, డాక్టర్ శోభ కొణిదెల వ్యవహరించారు. ఆత్మీయ అతిథులుగా ప్రముఖ గాయకుడు గజల్ శ్రీనివాస్‌రావు తదితరులు పాల్గొన్నారు. తొలుత సంస్థ అధ్యక్షుడు కంచర్ల సుబ్బానాయుడు స్వాగతోపన్యాసం చేశారు. ● మధ్యాహ్నం నిర్వహించిన ప్రాచీన సాహిత్య సదస్సుకు సభాధ్యక్షుడిగా తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం సంచాలకులు ఆచార్య మాడభూషి సంపత్ కుమార్ వ్యవహరించారు. ప్రముఖ సాహితీవేత్తలు అప్పాజోస్యుల సత్యనారాయణ, ఆచార్య పాపినేని శివశంకర్, ఆచార్య టి.గౌరీశంకర్, అల్లు భాస్కరరెడ్డి ప్రాచీన సాహిత్య విలువలను వివరించారు. కవి, విమర్శకులు డాక్టర్ పెరుగు రామకృష్ణ అధ్యక్షతన జరిగిన ఆధునిక సాహిత్య సదస్సులో ఆచార్య శిఖామణి మాట్లాడారు. కందిమళ్ల సాంబశివరావు బాలనాటక రంగం ప్రాధాన్యతను వివరించారు. కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత డాక్టర్ గంగిశెట్టి శివకుమార్ అధ్యక్షతన జరిగిన బాలసాహిత్య సదస్సులో విశిష్ట అతిథులుగా డాక్టర్ డీకే చదువులబాబు, డాక్టర్ కందిమళ్ల సాంబశివరావు, చంద్రలత, డాక్టర్ కందేపి రాణీప్రసాద్, దార్ల బుజ్జిబాబు, టీవీ రామకృష్ణ పాల్గొన్నారు. కవితోత్సవాలను నిర్వహించారు. కార్యక్రమ సమన్వయకర్తలుగా బోర భారతీదేవి, డాక్టర్ శోభ కొణిదెల, గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, డాక్టర్ కె.కరుణశ్రీ తదితరులు వ్యవహరించారు. -
గుర్తుతెలియని వాహనాన్ని ఢీకొట్టి..
● తండ్రీకొడుకులకు తీవ్రగాయాలు ● పరిస్థితి విషమం ఉలవపాడు: గుర్తుతెలియని వాహనాన్ని వెనుక నుంచి కారు ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న తండ్రీకొడుకులకు తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన జాతీయ రహదారిపై చాగల్లు సమీపంలో శుక్రవారం జరిగింది. పోలీసులు, స్థానికుల కథనం మేరకు.. చైన్నెకు చెందిన రత్నవేలు, గాంధీ తండ్రీకుమారులు. కొంతకాలంగా హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నారు. వీరు స్వస్తిక్ ఎంటర్‌ప్రైజెస్‌లో పనిచేస్తున్నారు. ఆఫీస్ పని నిమిత్తం చైన్నెకు సొంత కారులో బయలుదేరారు. ఉలవపాడు దాటి చాగల్లు సమీపంలోకి వచ్చేసరికి ముందు వెళుతున్న గుర్తుతెలి యని వాహనాన్ని కారు బలంగా ఢీకొట్టి రోడ్డు మా ర్జిన్లోకి దూసుకెళ్లింది. ఇద్దరికీ తీవ్రగాయాలై స్పృహ కోల్పోయారు. డ్రైవింగ్ చేస్తున్న గాంధీ లోపల ఇరుక్కుపోయాడు. హైవే అంబులెన్స్ సిబ్బంది శ్రమించి బయటకు తీశారు. క్షతగాత్రులను కావలి ఏరియా వైద్యశాలకు తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స నిమిత్తం నెల్లూరులోని ఓ ప్రైవేటు వైద్యశాలకు తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
అధికారుల చుట్టూ తిరుగుతూ..
నెల్లూరు(టౌన్): డీఎస్సీ ఆరంభం నుంచి గందరగోళం నెలకొంది. కాల్‌లెటర్లు రాని అభ్యర్థులు అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. గతంలో అభ్యర్థుల మార్కులను జిల్లా విద్యాశాఖ కార్యాలయ నోటీసు బోర్డులో ఉంచేవారు. అభ్యంతరాలు స్వీకరించి తుదిజాబితాను రూపొందించేవారు. ఆ తర్వాత జాబితా ప్రకారం సర్టిఫికెట్ల వెరిఫికేషన్ జరిగేది. అయితే ఈసారి అంతా విరుద్ధంగా ఉంది. తొలినుంచి వ్యవహారమంతా రాష్ట్ర విద్యాశాఖ కార్యాలయం నుంచే జరుగుతోంది. ఎంపికై న అభ్యర్థులు వెబ్సైట్ ద్వారా కాల్‌లెటర్లు డౌన్లోడ్ చేసుకుని సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు హాజరుకావాలని ఆదేశించారు. దీంతో ఎవరికెన్ని మార్కులు వచ్చాయి?, రిజిర్వేషన్ కేటగిరీలో ఏ పోస్టులు పోయాయో తెలియని పరిస్థితి. పారదర్శకంగా చేయాల్సిన ప్రక్రియ గోప్యంగా చేయడమేమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. మెరిట్ జాబితాలో పేరుండి కాల్‌లెటర్లు రాని అభ్యర్థుల సందేహాలను నివృత్తి చేయలేని స్థితిలో జిల్లా విద్యాశాఖాధికారులున్నారు. శుక్రవారం ఏడుగురు అభ్యర్థులకు మెసేజ్ రాలేదు. వివరాలను రాష్ట్ర విద్యాశాఖ కార్యాలయం నుంచి జిల్లాకు పంపించడంతో వారి సూచనలతో కాల్‌లెటర్లు డౌన్లోడ్ చేసుకుని సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేయించుకున్నారు. ఎప్పుడొస్తాయో.. జిల్లాలో మొత్తం 673 పోస్టులున్నాయి. ఈ పోస్టులకు సంబంధించి రోస్టర్ కమ్ రిజర్వేషన్ ఆధారంగా 673 మందికి కాల్‌లెటర్లు పంపించాల్సి ఉంది. అయితే గురువారం నాటికి 585 మంది, అదేరోజు రాత్రి 56 మందికి పంపించారు. గురువారం 585 మందికి సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేపట్టగా ఏడుగురు అభ్యర్థులు గైర్హాజరయ్యారు. శుక్రవారం 56 మందికి వెరిఫికేషన్ నిర్వహించాల్సి ఉండగా ఒకరు రాలేదు. మొత్తంగా రెండు రోజులకు కలిపి 641 మందికి కాల్‌లెటర్లు రాగా 633 మంది సర్టిఫికెట్లను పరిశీలించారు. 8 మంది గైర్హాజరయ్యారు. ఇంకా 32 మందికి కాల్‌లెటర్లు రాలేదు. ఎప్పుడొస్తాయో అనే దానిపై జిల్లా విద్యాశాఖాధికారులకు సమాచారం లేదు. అయితే మెరిట్ లిస్టులో పేర్లు ఉండి దూరప్రాంతాల నుంచి వచ్చిన అభ్యర్థులు రెండు రోజులుగా జిల్లా కేంద్రంలోనే పడిగాపులు కాస్తున్న పరిస్థితి ఉంది. రోస్టర్ కమ్ రిజర్వేషన్‌పై కూడా అంతగా అవగాహన లేకపోవడంతో లెటర్లు అందని అభ్యర్థుల సందేహాలకు సమాధానం చెప్పే వారు కరవయ్యారు. ఇప్పుడు లెటర్ రాకపోతే ఎప్పుడు వస్తుందోనన్న ఆందోళన నెలకొంది. డీఎస్సీలో అంతా గందరగోళమే.. 673 మందికి గానూ 641 మందికే కాల్‌లెటర్లు ఎప్పుడు వస్తాయన్న దానిపై సమాధానం కరువు రాష్ట్ర స్థాయిలోనే రోస్టర్ కమ్ రిజర్వేషన్ -
అన్నదాతలపై కనికరం లేదా?
● కలెక్టరేట్ ఎదుట కౌలు రైతు సంఘం నిరసన నెల్లూరు రూరల్: అన్నదాతలపై కనికరం లేదా అని కూటమి ప్రభుత్వాన్ని ఏపీ కౌలు రైతు సంఘం నాయకులు ప్రశ్నించారు. శుక్రవారం నెల్లూరులోని కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు ఐఏబీ సమావేశం ఏర్పాటు చేసి జిల్లాలో 3.50 లక్షల ఎకరాల సాగు నీరిస్తామని చెప్పడంతో రైతులు వరి పంట వేశారన్నారు. ధాన్యం మార్కెట్లోకి రాబోతుండగా కొనుగోలు కేంద్రాల ఆలోచన చేయకపోవడం దారుణమన్నారు. మిల్లర్ల కోసమే ఈ ప్రభుత్వం, అధికారులు పనిచేస్తోందని ఆరోపించారు. ఇదే కొనసాగితే రైతుల ఆత్మహత్యలు చూడాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. త్వరగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి పంటకు మద్దతు ధర దక్కేలా చర్యలు తీసుకోవాలన్నారు. లేనిపక్షంలో ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఆ సంఘం నెల్లూరు జిల్లా కమిటీ అధ్యక్షుడు ముత్యాల గురునాథం, కార్యదర్శి తుళ్లూరు గోపాల్ తదితరులు పాల్గొన్నారు. -
పక్కాగృహాల్లో తనిఖీ
నెల్లూరు(అర్బన్): జిల్లాలో పక్కాగృహాల నిర్మాణంలో అవినీతి జరిగిందని ఫిర్యాదులు అందిన నేపథ్యంలో రాష్ట్ర విజిలెన్స్ అధికారి చంద్రశేఖర్‌రాజు శుక్రవారం నెల్లూరు వచ్చి పరిశీలించారు. వెంకటేశ్వరపురంలోని గృహాలతోపా టు రూరల్ మండల పరిధిలోని కొండ్లపూడి లేఅవుట్లో లబ్ధిదారులకు నిర్మించిన ఇళ్లను తనిఖీ చేశారు. ఆయన మాట్లాడుతూ పూర్తిస్థాయిలో పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామన్నారు. హౌసింగ్ కార్పొరేషన్ ఈఈ మోహన్‌రావు, డీఈ షంషుద్దీన్, ఏఈలు పాల్గొన్నారు. ● జిల్లాలో కాంట్రాక్టర్లు, హౌసింగ్ కార్పొరేషన్ అధికారులు కుమ్మకై ్క నివాసం ఉండేందుకు వీల్లేకుండా తూతూమంత్రంగా నిర్మాణాలు చేపట్టారంటూ బీజేపీ నాయకుడు మిడతల రమేష్ విజిలెన్స్, హౌసింగ్ అధికారులకు బంతిపూలు ఇచ్చి నిరసన తెలిపారు. -
8 ఏళ్లుగా అద్దె కట్టని దుకాణం సీజ్
నెల్లూరు(బారకాసు): సుబేదారుపేటలోని మున్సిపల్ ఎన్సీ బిల్డింగ్‌లో ఓ దుకాణానికి సంబంధించి యజమాని 8 ఏళ్లుగా అద్దె కట్టని కారణంగా రెవెన్యూ అధికారులు శుక్రవారం సీజ్ చేశారు. ఆ కాంప్లెక్స్‌లో షాప్ నంబర్ పదికి సంబంధించి అద్దెకు ఉంటున్న యజమాని 2017 డిసెంబర్ నుంచి ఈ ఏడాది జూలై వరకు బాడుగ రూ.17,84,754లు ఎన్ఎంసీకి కట్టలేదు. కమిషనర్ ఆదేశాల మేరకు రెవెన్యూ ఇన్స్పెక్టర్ కిరణ్ ఆధ్వర్యంలో సచివాలయ అడ్మిన్ దొరబాబుతోపాటు మున్సిపల్ సిబ్బంది సమక్షంలో దుకాణాన్ని సీజ్ చేశారు. ఈ సందర్భంగా ఆర్ఐ కిరణ్ మాట్లాడుతూ తాము అందజేసిన నోటీసుకు మూడు రోజుల్లోపు అద్దె బకాయిలు మొత్తాన్ని చెల్లించాలని, లేనిపక్షంలో చట్ట పరంగా చర్యలు తీసుకుంటామన్నారు. -
ప్రభుత్వ స్థలాలు ఆక్రమిస్తే చర్యలు
● మంత్రి నారాయణ నెల్లూరు(బారకాసు): ప్రభుత్వ స్థలాలు ఆక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ అన్నారు. నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో శుక్రవారం ఎమ్మెల్యేలు, నుడా, కార్పొరేషన్ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎల్ఆర్ఎస్ ద్వారా వచ్చిన మొత్తాన్ని ఆ నియోజకవర్గ ఆభివృద్ధికి ఖర్చు చేయాలన్నారు. కొత్త లేఅవుట్లలో పది శాతం స్థలం పార్క్, దేవాలయాలకు వదిలేయాలని చెప్పారు. అనంతరం సర్వేపల్లి, కావలి, కందుకూరు ఎమ్మెల్యేలు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, కావ్య కృష్ణారెడ్డి, ఇంటూరు నాగేశ్వరరావు, నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి మాట్లాడారు. సమీక్షలో కలెక్టర్ ఆనంద్, జేసీ కార్తీక్, ఆర్డీఓ అనూష, కమిషనర్ నందన్, కందుకూరు సబ్ కలెక్టర్ దామెర హిమవంశీ, రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ తదితరులు పాల్గొన్నారు. -
కాల్‌లెటర్ రాలేదు
నాకు స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ కేటగిరీలో 89వ ర్యాంక్ వచ్చింది. మెరిట్ లిస్టులో 8వ పేరు ఉంది. ఈ కేటగిరీకి సంబంధించి పురుషులు – 4, మహిళలు – 2 కలిపి 6 పోస్టులున్నాయి. అయితే నా కంటే ముందున్న ఇద్దరు అభ్యర్థులు పీజీటీ, టీజీటీ పోస్టులకు వెళ్లారు. ఆరుగురు అభ్యర్థులకు పోస్టులు రావాలి. అయితే నాకు ముందున్న ఐదుగురు అభ్యర్థులకు కాల్‌లెటర్లు పంపించారు. నాకు పంపించలేదు. రెండు రోజులుగా స ర్టిఫికెట్ వెరిఫికేషన్ కేంద్రం చుట్టూ తిరుగుతున్నా. – సీహెచ్ సుధీర్, కోవూరు రెండురోజుల నుంచి ఇక్కడే ఉన్నా నాకు స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్స్ కేటగిరీలో 36వ ర్యాంక్ వచ్చింది. ఈ కేటగిరీలో 4 పోస్టులున్నాయి. ముగ్గురికి కాల్‌లెటర్లు పంపించారు. ఇంకా ఈ కేటగిరీలో ఒక పోస్టు ఖాళీగా ఉంది. మాది బీసీ డీ. ఇంకా కాల్‌లెటర్ అందలేదు. దాని కోసం రెండు రోజులుగా నెల్లూరులోనే ఉంటున్నా. జిల్లా అధికారులను అడిగితే మా చేతుల్లో ఏమీ లేదని, లెటర్ వచ్చిన వారి సర్టిఫికెట్లను వెరిఫికేషన్ చేస్తామన్నారు. – జి.చంద్రశేఖర్, సూళ్లూరుపేట -
చవితి వేడుకల్లో అపశ్రుతి
● బాణసంచా ప్రమాదంలో పదిమందికి గాయాలు ఉదయగిరి: వినాయక నిమజ్జన వేడుకల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. అప్పసముద్రం, నడింపల్లి గ్రామాల్లో ఏర్పాటు చేసిన విగ్రహాలను మూడోరోజైన శుక్రవారం నిమజ్జనం కోసం తరలించారు. అప్పసముద్రంలో రెండు విగ్రహ ఊరేగింపులు ఒక ప్రదేశానికి చేరుకున్నాయి. నడింపల్లి ఊరేగింపులో మద్యం తాగిన వ్యక్తి బాణసంచా కాల్చే క్రమంలో నిప్పురవ్వలు అప్పసముద్రం ఊరేగింపు వాహనంలో పడ్డాయి. అందులో ఉన్న బాణసంచా పేలింది. దీంతో పదిమంది బాలబాలికలకు గాయాలయ్యాయి. వారిని వెంటనే దుత్తలూరులోని ఓ ప్రైవేట్ వైద్యశాలకు తీసుకెళ్లారు. అనంతరం వింజమూరులోని వైద్యశాలకు తరలించారు. ఐదుగురు ప్రైవేట్ ఆస్పత్రిలో చిక్సిత్స పొందుతున్నారు. మరో నలుగురు పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో ఆత్మకూరు ప్రభుత్వ వైద్యశాల తరలించారు. ఓ చిన్నారికి స్వల్ప గాయాలయ్యాయి. దీంతో బాధిత తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
నిరంకుశ పాలనలో ప్రజాస్వామ్యం అపహాస్యం
● ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి నెల్లూరు (స్టోన్‌హౌస్‌పేట): కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో నిరంకుశ పాలనతో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోందని ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి విమర్శించారు. శుక్రవారం తన కార్యాలయం నుంచి కావలికి వెళ్లేందుకు సిద్ధమవుతుండగా బాలాజీనగర్ పోలీసులు అడ్డుకుంటూ నోటీసులు ఇవ్వడాన్ని దుయ్యబట్టారు. ప్రజాస్వామ్యంలో ఉన్నామా? లేక రెడ్‌బుక్ రాజ్యాంగంలో ఉన్నామంటూ మండిపడ్డారు. తమ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే ప్రతాప్‌కుమార్‌రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు వెళ్లడాన్ని అడ్డుకోవడం ఏమిటని నిలదీశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రతిపక్ష వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తూ రాక్షస ఆనందాన్ని పొందుతుందన్నారు. కూటమి నేతల అరాచకాలకు పోలీసులు వంత పాడడం దారుణమన్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం బతికుందా అనే సందేహం ప్రతి ఒక్కరిలో కలుగుతుందన్నారు. కావలిలో అధికార పార్టీ చేస్తున్న అక్రమాలను బయటపెడతానని మాజీ ఎమ్మెల్యే ప్రతాప్‌కుమార్‌రెడ్డి హెచ్చరించడంతో ఆయనపై ఏకంగా హత్యాయత్నం కేసు నమోదు చేయడం దారుణమన్నారు. ప్రతాప్‌కుమార్‌రెడ్డి కుటుంబానికి సంఘీభావం తెలిపేందుకు కావలి వెళ్లే ప్రయత్నం చేస్తున్న తమను పోలీసులు అడ్డుకోవడం దుర్మార్గమన్నారు. జిల్లాలో ఎప్పుడూ చూడని వికృతాలు చూడాల్సిన వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. కావలికి వెళ్తే నరుకుతామని చెబుతున్న వారిని పోలీసులు వదిలేసి తమను నిర్బంఽధించడం చూస్తుంటే కూటమి ప్రభుత్వ దుర్మార్గాలు ప్రజలకు ఇట్టే అర్థమవుతున్నాయన్నారు. పోలీసులు ఎన్ని అడ్డంకులు సృష్టించినా కావలికి వెళ్లి ప్రతాప్‌కుమార్‌రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శిస్తామని తెలిపారు. ఎన్ని అక్రమ కేసులు పెట్టినా వైఎస్సార్సీపీ బెదిరేది లేదన్నారు. -
అడవిలో సొరంగ మార్గానికి శ్రీకారం
● రూ.857.75 కోట్ల వ్యయంతో టన్నెల్ పనులు ● గ్రీన్ ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వేలో భాగంగా నిర్మాణం సీతారామపురం: విజయవాడ–బెంగళూరు గ్రీన్ ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వేలో భాగంగా జిల్లా సరిహద్దు ప్రాంతమైన మండలంలోని సీతారామపురం–పోరుమామిళ్ల ఘాట్‌రోడ్డు సమీపంలో మ్యాక్స్ ఇన్ఫ్రా కంపెనీ రూ.857.75 కోట్ల వ్యయంతో సొరంగ మార్గం (టన్నెల్) తవ్వకాల పనులకు శ్రీకారం చుట్టింది. ఆరు లేన్ల జాతీయ రహదారి నిర్మాణంలో భాగంగా వాహనాలు వెళ్లేందుకు, వచ్చేందుకు వేరువేరుగా సొరంగ మార్గాలు నిర్మించనున్నారు. ఒక్కో సొరంగం 16.7 మీటర్ల వెడల్పు, 9.8 మీటర్ల ఎత్తుతో 3.68 కిలో మీటర్ల పొడవు ఉంటుంది. సీతారామపురం అటవీ ప్రాంతంలో ప్రారంభమయ్యే ఈ సొరంగ మార్గం వైఎస్సార్ కడప జిల్లాలో తెరుచుకుంటుంది. ప్రస్తుతం ఒక సొరంగం మార్గానికి రెండు వైపులా తవ్వకం పనులు ప్రారంభమైనట్లు నిర్మాణ పనులు చేపట్టిన మ్యాక్స్ ఇన్ఫ్రా కంపెనీ బృందం తెలిపింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రారంభించిన పనులను 2027 ఫిబ్రవరిలోపు పూర్తి చేయడమే గాక 15 ఏళ్ల పాటు అదే కంపెనీ నిర్వహణ బాధ్యతలను చూడనుంది. సుమారు 520 కిలో మీటర్ల పొడవున నిర్మిస్తున్న విజయవాడ బెంగళూరు గ్రీన్ ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వేలో భాగంగా ఈ టన్నెల్ తవ్వుతున్నారు. ఈ సొరంగం అందుబాటులోకి వస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని హైవేల్లో ఉన్న టన్నెల్స్‌లో ఇదే పొడవైనదిగా రికార్డులకెక్కుతుందని జాతీయ రహదారి సంస్థ అధికారులు అంటున్నారు. -
అరుణ వెనుక టీడీపీ గోతులు
కోవూరు: రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తున్న జీవిత ఖైదీ శ్రీకాంత్, అతని స్నేహితురాలు నిడిగుంట అరుణ వ్యవహారం కూటమి ప్రభుత్వం మెడకు చుట్టుకోవడంతో బయట పడేందుకు నానా పాట్లు పడుతోంది. వీరిద్దరి వెనుక టీడీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు ఉన్న విషయం పెరోల్తో వెలుగు చూసిన విషయం విదితమే. అరుణ ఇటీవల సోషల్ మీడియాలో శ్రీకాంత్‌ను వాడుకున్న టీడీపీ నేతలు ఇప్పుడు మౌనంగా ఉండడంపై ప్రశ్నిస్తూనే అందరి బాగోతాలు బయట పెడుతానంటూ పెట్టిన పోస్టు అధికార పార్టీలో ప్రకంపనలు సృష్టించిన విషయం తెలిసిందే. ఈ పోస్టు పెట్టిన మరుసటి రోజే అరుణను, ఆమె అనుచరులను ఎప్పటి కేసునో బయటకు తీసి హడావుడిగా అరెస్ట్ చేయడం, పోలీస్ కస్టడీ పేరుతో విచారణ చేపట్టడం తెలిసిందే. అరుణ కేసుతో తమకు సంబంధం లేదంటూనే.. మరో వైపు అరుణను విచారణ నిమిత్తం జిల్లా జైలు నుంచి కోవూరు పోలీస్‌స్టేషన్‌కు, అనంతరం జిల్లా జైలుకు తరలిస్తున్న కారు (ఏపీ 40 డీటీ 3388) టీడీపీ స్థానిక నేత ఇంతా మల్లారెడ్డికి సంబంధించింది కావడం గుసగుసలకు తావిస్తోంది. దీన్ని బట్టి చూస్తే ఆమె వెనుక టీడీపీ నేతలు ఉన్నారా? లేక ఆమె వెనుక గోతులు తవ్వుతున్నారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. టీడీపీ నేత కారు వినియోగంపై పోలీసులు ఎలాంటి వివరణ ఇవ్వకుండా మౌనం దాల్చుతున్నారు. టీడీపీ నేతలతో కలిసి పక్కా అవగాహనతోనే జరుగుతోందనే చర్చ జోరుగా సాగుతోంది. ప్రభుత్వం ఈ వ్యవహారం నుంచి బయట పడటానికి మాత్రమే ప్రయత్నిస్తోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. కేసు విచారణలో పారదర్శకత చూపకుండా, కథలు చెప్పడంపై ప్రజల్లో అనుమానాలకు మరింత బలం చేకూరుతోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఆమె వ్యవహారం ఆ పార్టీ మెడకు చుట్టుకున్న వైనం తమకు సంబంధం లేదంటూ హడావుడి అరెస్ట్‌లు, పోలీస్ కస్టడీ విచారణలు టీడీపీ నేత వాహనంలోనే ఆమె తరలింపు -
ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న పోలీసులు
● మా మాజీ ఎమ్మెల్యే ఇంటికి వెళ్లడానికి ఎందుకీ ఆంక్షలు ● పార్టీ నేతలుగా ప్రతి కార్యకర్తకు ధైర్యం ఇవ్వడం మా బాధ్యత ● వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి నెల్లూరు (స్టోన్‌హౌస్‌పేట): చట్టాన్ని గౌరవించాల్సిన పోలీసులు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి దుయ్యబట్టారు. వాస్తవాలతో సంబంధం లేకుండా అధికార పార్టీ ఎమ్మెల్యే ఏం చెబితే.. అది చేస్తున్నారంటూ విమర్శించారు. కావలిలోని తమ నేత, మాజీ ఎమ్మెల్యే ఇంటికి వెళ్లడానికి ఎందుకీ ఆంక్షలు పెడుతున్నారంటూ మండిపడ్డారు. కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించేందుకు శుక్రవారం వెళ్తున్న కాకాణితోపాటు సూళ్లూరుపేట మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్యను నగరంలోని కాకాణి నివాసంలో పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా కాకాణి మీడియాతో మాట్లాడారు. కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి అవినీతికి పాల్పడుతుంటే విమర్శిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డిపై అక్రమంగా హత్యాయత్నం కేసు పెట్టారన్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యే అన్నవరంలో విచ్చలవిడిగా సహజ వనరులను కొల్లగొడుతుంటే ఆ ఫొటోలు తీసేందుకు వెళ్లిన సోషల్ మీడియా యాక్టివిస్టులను నిర్బంధించి వారిని భయపెట్టి బెదిరించి రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డిని ఈ కేసులో జత చేశారన్నారు. హైకోర్టును ఆశ్రయించిన రామిరెడ్డికి బెయిల్ రాకూడదనే ఉద్దేశంతో నాపై ఏ విధంగా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారో ఆ విధానాన్నే రామిరెడ్డిపై అవలంబిస్తూ తప్పుడు కేసులు, తప్పుడు సెక్షన్లు పెట్టారన్నారు. కావలిలోని వైఎస్సార్సీపీ కార్యకర్తలతో మాట్లాడి ధైర్యమిచ్చామన్నారు. అయితే తనను, పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డిని అభ్యంతరకరంగా మాటలు మాట్లాడారని తెలిపారు. పోలీసులు అధికార పార్టీ నాయకులకు కొమ్ము కాస్తున్నారని, అవినీతి ప్రజావ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెట్టడం, నిర్బంధించడం ఎన్నడూ చూడలేదని, ఇప్పుడు పరిస్థితులు చూడాల్సి వస్తుందన్నారు. ప్రజాస్వామ్యం అపహాస్యం పాలవుతుందని, రాజ్యాంగ విలువలు దిగజారి పోతున్నాయన్నారు. ప్రతాప్‌కుమార్‌రెడ్డి వంటి సౌమ్యుడిపై హత్యాయత్నం కేసు పెట్టడంతో ప్రజలు అసహ్యంచుకుంటున్నారన్నారు. ఎన్నికలు ఏ రోజు జరిగినా జగన్మోహన్రెడ్డిని తిరిగి ముఖ్యమంత్రిని చేయాలని ప్రజలు భావిస్తున్నారన్నారు. వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు జైళ్లకు, అక్రమ కేసులకు భయపడరని తెలిపారు. ఎంత మంది పోలీసులు వచ్చినా, మిలటరీ బలగాలను దింపినా కూటమి ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై తమ పోరాటం ఆగదన్నారు. -
కూటమి అరాచకాలకు వంత
● కావలికి వస్తే ఖబడ్దార్ అంటూ ఎమ్మెల్యే రౌడీయిజం వ్యాఖ్యలు ● ఎమ్మెల్సీ చంద్రశేఖర్‌రెడ్డిపై అనుచిత భాషతో దూషణలు ● భగ్గుమన్న వైఎస్సార్సీపీ శ్రేణులు ● ప్రతాప్‌కుమార్‌రెడ్డి నివాసానికి వెళ్లకుండా అడ్డగింత ● మాజీ మంత్రి కాకాణి, ఎమ్మెల్సీ చంద్రశేఖర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కిలివేటి హౌస్ అరెస్ట్ ● అందరి ఇళ్ల వద్ద భారీగా పోలీసుల మోహరింపు ● టోల్‌ప్లాజా వద్దే మాజీ మంత్రి కారుమూరిని అడ్డగింపుఎమ్మెల్సీ నివాసం వద్ద భారీగా చేరుకున్న పోలీసులువైఎస్సార్‌సీపీ జిల్లా కార్యాలయం వద్ద పోలీసుల మోహరింపుసాక్షి ప్రతినిధి,నెల్లూరు: కూటమి ప్రభుత్వం అరాచకాలకు అంతుపంతు లేకుండా పోయింది. ఇందుకు పోలీస్ యంత్రాంగం తోడైంది. కూటమి ఎమ్మెల్యేల ఆదేశాలే శిరోధార్యంగా భావించి వైఎస్సార్సీపీ నేతలను టార్గెట్ చేసి అక్రమ కేసులు పెడుతూ పోలీసులు పైశాచిక ఆనందం పొందుతున్నారు. కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట కృష్ణారెడ్డి ఉదయగిరి నియోజకవర్గం జలదంకి మండలం అన్నవరంలో సాగిస్తున్న అక్రమ మైనింగ్ వ్యవహారం, ముసునూరులో జరిగిన మనీ స్కీమ్ స్కామ్‌ను బయట పెడతానని కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి హెచ్చరికలను జీర్ణించుకోలేకపోయారు. ఇదే సమయంలో సోషల్ మీడియా యాక్టివిస్టులు కావ్య అక్రమ మైనింగ్ గుట్టు రట్టు చేసేందుకు ప్రయత్నించారు. వారిని అడ్డం పెట్టుకుని ప్రతాప్‌కుమార్‌రెడ్డిపై హత్యాయత్నం కేసుతో పాటు అట్రాసిటీ కేసు నమోదు చేయించడం తెలిసిందే. వాస్తవాలను పరిగణలోకి తీసుకోకుండా పోలీసులు సైతం అధికార ఎమ్మెల్యేకు సాష్టాంగం పడుతూ చట్టాలను తుంగలో తొక్కి తప్పుడు కేసులు బనాయించారు. ఈ క్రమంలో వైఎస్సార్సీపీ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి, ఎమ్మెల్సీ చంద్రశేఖర్‌రెడ్డి మాజీ ఎమ్మెల్యే కుటుంబాన్ని పరామర్శించారు. ఎమ్మెల్యే అవినీతిని బహిర్గతం చేస్తామని హెచ్చరించడంతో కలవర పడిన కావ్య ప్రెస్‌మీట్ పెట్టి వీధిరౌడీలా మాట్లాడారు. ఎమ్మెల్యేనని స్థాయి మరిచిపోయి, పక్కనే మహిళ ఉందనే విచక్షణ కోల్పోయి అసభ్యకంగా, అనుచితంగా మాట్లాడుతూ ఊగిపోయారు. కాకాణి గోవర్ధన్‌రెడ్డి కావలి వస్తే.. ఖబడ్దార్ అంటూ రెచ్చిపోయారు. ఎమ్మెల్సీ చంద్రశేఖరరెడ్డిని అయితే పత్రికల్లో రాయలేని భాషతో అనుచితంగా మాట్లాడారు. ఎమ్మెల్యే వ్యవహారిక భాషపై, అనుచిత వ్యాఖ్యలపై వైఎస్సార్సీపీ శ్రేణులు మండి పడ్డారు. పోలీసుల రెడ్‌బుక్ రాజ్యాంగం పోలీసులు చట్టాన్ని గౌరవించడం మానేశారు. న్యాయవ్యవస్థను తప్పుదోవ పట్టిస్తూ రాజ్యాంగాన్ని వదిలేసి రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు. ఒక ప్రజాప్రతినిధిని, మాజీ మంత్రిని దారుణంగా దుర్భాలాషడిన ఎమ్మెల్యేను వదిలేసిన పోలీసులు ప్రతిపక్షాన్ని కట్టడి చేసే ప్రయత్నం చేశారు. శుక్రవారం వైఎస్సార్సీపీ రీజినల్ కోఆర్డినేటర్, మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి, ఎమ్మెల్సీ చంద్రశేఖర్‌రెడ్డి, సూళ్లూరుపేట మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్యతో కలిసి కావలిలోని రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి నివాసానికి వెళ్లి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు సిద్ధమైన నేపథ్యంలో పోలీసులు కాకాణి, పర్వతరెడ్డి ఇళ్ల వద్దకు నెల్లూరు వేదాయపాళెం సీఐ శ్రీనివాసరావు, బాలాజీనగర్ సీఐ సాంబశివరావు ఆధ్వర్యంలో భారీగా చేరుకున్న పోలీసులు వారిని బయటకు కదలనీయకుండా అడ్డుకున్నారు. తమ పార్టీ నేతలను పరామర్శ చేయడమే నేరంగా భావించిన పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. కాకాణితోపాటు ఉన్న మాజీ ఎమ్మెల్యే కిలివేటిని ఆయన నివాసంలో, ఎమ్మెల్సీ చంద్రశేఖర్‌రెడ్డిని ఆయన నివాసంలో హౌస్ అరెస్ట్ చేశారు. నోటీసులిచ్చి హౌస్ అరెస్ట్ చేశారు. కారుమూరిని వెంబడించి.. కావలిలోని ప్రతాప్‌కుమార్‌రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు విజయవాడ నుంచి వస్తున్న మాజీమంత్రి కారుమూరి నాగేశ్వరరావును పోలీసులు వెంబడించారు. ఆయన్ను కావలికి చేరుకోనివ్వకుండా జాతీయ రహదారి పైనే నిలిపివేశారు. తాను పరామర్శ కోసమే వెళ్తున్నానని చెప్పినా వినిపించుకోకుండా తిరిగి విజయవాడకు పంపించారు. ఆయన వాహనాన్ని జిల్లా సరిహద్దులు దాటించే వరకు పోలీసులు వాహనాలు వెంబడించి పంపించారు. జిల్లాలో పోలీసులు కూటమి పాలకులకు సాష్టాంగం చేస్తూ సాగిలపడుతున్నారు. చట్టాన్ని పచ్చ నేతలకు చుట్టాలుగా తయారు చేస్తున్నారు. రాజ్యాంగం అంటే గౌరవం లేదు. న్యాయవ్యవస్థ అంటే భయమూ లేదు. కూటమి నేతల అరాచకాలకు వంత పాడుతూ జీ హుజూర్ అంటున్నారు. ప్రతిపక్ష నేతలను బయటకు అడుగు పెట్టనీయకుండా అడ్డుకుంటూ, నోరు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ నెల్లూరులో ఎమర్జెన్సీ పరిస్థితులు సృష్టిస్తున్నారు. కావలి ఎమ్మెల్యే వీధి రౌడీలా కారు కూతలు కూస్తే స్పందించని పోలీసులు, ప్రతిపక్ష నేతలను మాత్రం హౌస్ అరెస్ట్ చేసి అధికార పార్టీ నేతలకు అండగా అడ్డదారులు తొక్కుతున్నారు. -
పోలీసుల అత్యుత్సాహం
● ప్రతాప్‌కుమార్‌రెడ్డి ఇంటి వద్దకు ఎవరినీ వెళ్లకుండా అడ్డగింత ● కావలికి వచ్చే అన్నిదారుల్లో పోలీసుల మోహరింపు, వాహనాల తనిఖీ కావలి (జలదంకి): కావలిలో మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి నివాసానికి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఎవరూ వెళ్లకుండా పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. నెల్లూరు నుంచి మాజీ మంత్రులు కాకాణి గోవర్ధన్‌రెడ్డి, కారుమూరి నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి, నెల్లూరు రూరల్ ఇన్చార్జి ఆనం విజయ్‌కుమార్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య తదితరులు కావలికి వస్తున్నట్లు సమాచారం ఉండడంతో పోలీసులు అత్యుత్సాహం చూపి మాజీ ఎమ్మెల్యే ఇంటి వద్దకు ఎవరినీ వెళ్లనీయకుండా అడ్డుకున్నారు. ఆయన ఇంటికి వచ్చే అన్ని దారుల వద్ద పోలీసులు భారీగా మోహరించారు. కావలిలోని బృందావనం వద్ద, ముసునూరు టోల్‌ప్లాజా, బైపాస్ క్రాస్‌రోడ్డు, ముసునూరు లింక్ రోడ్డుతోపాటు ప్రతాప్‌కుమార్‌రెడ్డి నివాసం వద్ద ఎస్సైలు సుమన్, బాజీబాబు, తిరుమలరెడ్డితోపాటు పోలీసులు వెళ్తున్న ప్రతి వాహనాన్ని తనిఖీలు చేసి ప్రతాప్‌కుమార్‌రెడ్డి నివాసానికి వెళ్లకుండా అడ్డుకున్నారు. పలువురు వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు మా నాయకుడి ఇంటికి కూడా వెళ్లకూడదా అంటూ పోలీసులను ప్రశ్నించారు. కావలిలో ప్రజాస్వామ్యం ఉందా లేక కావలి ఎమ్మెల్యే కృష్ణారెడ్డి చేతుల్లో ఉందా అంటూ పోలీసులను నిలదీయడంతో పైఅధికారుల ఆదేశాలంటూ సమాధానమిచ్చారు. -
శిక్షణ, ఉద్యోగావకాశాలు
నెల్లూరు (పొగతోట): డీఆర్డీఏ, సీడాప్ ఆధ్వర్యంలో గ్రామీణ ప్రాంతాల్లోని నిరుద్యోగు యువతకు వివిద రంగాల్లో శిక్షణ ఇచ్చి ఉద్యోగావకాశాలు కల్పించేలా చర్యలు తీసుకుంటున్నామని డీఆర్డీఏ పీడీ నాగరాజకుమారి శుక్రవారం ఒక ప్రటకనలో తెలిపారు. బోగోలు, కోవూరులో ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నామన్నారు. ఎలక్ట్రానిక్స్, ఫీల్డ్ టెక్నీషియన్, సర్వీస్ ఇంజినీర్, ఐటీ హార్డ్‌వేర్ తదితర వాటిపై శిక్షణ ఇస్తామన్నారు. శిక్షణ కాలంలో ఉచిత వసతి, భోజన సౌకర్యం కల్పించడం జరుగుతుందన్నారు. ఇంటర్ పాస్, డిగ్రీ చదివిన నిరుద్యోగులైన యువతి, యువకులు డీఆర్డిఏ కార్యాలయంలోని జాబ్స్ విభాగంలో దరఖాస్తులు చేసుకోవాలన్నారు. పూర్తి వివరాలకు 9493513896, 9553491047, 9032693233 నంబర్లలో సంప్రదించాలని తెలిపారు. ఎన్‌ఎల్‌ఆర్ 3648 నూతన వరి రకం నెల్లూరు (పొగతోట): ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం (వ్యవసాయ పరిశోధన క్షేత్రం)లో ఎన్‌ఎల్‌ఆర్ 3648 నూతన వరి రకం విత్తనాలను అధికారులు సిద్ధం చేశారు. పరిశోధన క్షేత్రంలో వరి పంటను రైతులకు శుక్రవారం పరిచయం చేశారు. పరిశోధన క్షేత్రం అధికారులు శ్రీలక్ష్మి మాట్లాడుతూ ఈ రకం వరి వంగడం అన్ని రకాల వాతావరణాలను తట్టుకుని అధిక దిగుబడులను ఇస్తుందని తెలిపారు. ఈ వరి దిగుబడులపై రైతులకు శుక్రవారం అవగాహన కల్పించారు. జిల్లాలోని రైతులందరికీ ఎన్‌ఎల్‌ఆర్ 3648 రకం విత్తనాలను అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పరిశోధన క్షేత్రం అధికారి వినిత, రైతులు పాల్గొన్నారు. 18 బార్లకు దరఖాస్తుల దాఖలు నెల్లూరు (క్రైమ్): బార్లకు దరఖాస్తులు దాఖలు చేసేందుకు ప్రభుత్వం గడువు పెంచినప్పటికీ వ్యాపారుల స్పందన నామ మాత్రంగానే ఉంది. జిల్లాలోని ఓపెన్ కేటగిరీలో 50, గౌడ కులాలకు 5 బార్లకు సంబంధించి శుక్రవారంతో గడువు ముగిసింది. 55 బార్లకు 18 బార్లకు మాత్రమే దరఖాస్తులు దాఖలయ్యాయి. అయితే గడువు ముగిసే సమయానికి కొందరు ఆఫ్ లైన్లో దరఖాస్తులు వేసేందుకు క్యూలైన్లలో ఉండడంతో వారి నుంచి అధికారులు దరఖాస్తులు తీసుకోనున్నారు. నెల్లూరు నగరంలో 38 బార్లకు 10, కావలిలో రెండు బార్లకు, కందుకూరులో మూడు బార్లకు దరఖాస్తులు అందాయి. గీత కులాలకు సంబంధించి నెల్లూరు నగరంలోని రెండు బార్లకు, కావలిలో ఒక బారుకు దరఖాస్తులు అందాయి. కందుకూరులోని ఒక బారుకు మూడు దరఖాస్తులు, అల్లూరులోని ఒక బారుకు ఒక దరఖాస్తు మాత్రమే అందాయి. అయితే ఒక్కో బారుకు నాలుగు దరఖాస్తులు అందాలనీ, ఒక్కరే నాలుగు దరఖాస్తులు వేయకూడదనే నిబంధన ఉండడంతో 18 బార్లకు వచ్చిన దరఖాస్తులను అధికారులు పరిశీలిస్తున్నారు. శనివారం నగరంలోని న్యూ జెడ్పీ కార్యాలయ సమావేశ మందిరంలో డ్రా నిర్వహించనున్నారు. పింఛన్ బాధితులు దరఖాస్తులు చేసుకోండి నెల్లూరు(పొగతోట): పింఛన్లు తొలగించిన దివ్యాంగులు ఎంపీడీఓ, మునిసిపల్ కమిషనర్లకు దరఖాస్తులు చేసుకోవాలని డీఆర్డీఏ పీడీ నాగరాజకుమారి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. గతంలో వైద్యాధికారులు అంగవైకల్యాన్ని పరిశీలించి సర్టిఫికెట్లు మంజూరు చేశారు. వాటి ఆధారంగా దివ్యాంగుల పింఛన్లు రద్దు చేయడం, మార్పులు చేయడం జరిగిందన్నారు. రద్దు చేసిన, మార్పులు చేసిన పింఛన్ల లబ్ధిదారులు అర్హులని భావిస్తే ఎంపీడీఓ, మునిసిపల్ కమిషనర్లకు దరఖాస్తులు చేసుకోవాలన్నారు. పాత పింఛన్ కార్డు, సర్టిఫికెట్లు, బయోమెట్రిక్ ద్వారా అందుకున్న నోటీసు, ఆధార్ కార్డుతో దరఖాస్తులు చేసుకోవాలన్నారు. వచ్చిన దరఖాస్తులను పునః పరిశీలించి చర్యలు చేపడుతామన్నారు. పోలీసుల అదుపులో నిందితులు? నెల్లూరు (క్రైమ్): నెల్లూరురూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిని చంపేస్తే డబ్బేడబ్బుని కొందరు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన వీడియో సోషల్ మీడియాల్లో వైరల్ అయింది. దీన్ని పోలీసులు సీరియస్‌గా తీసుకుని అన్నీ కోణాల్లో విచారిస్తున్నారు. వీడియో తీసిన సమయంలో అక్కడ ఎనిమిది మంది ఉన్నట్లు పోలీసులు గుర్తించినట్లు సమాచారం. వారిలో రౌడీషీటర్ జగదీష్ ఇప్పటికే జైల్లో ఉండగా మిగిలిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. వీడియో తీసిన సమయంలో వారు అక్కడ ఎందుకు ఉన్నారు? ఏం మాట్లాడుకున్నారు? ఇలా అన్నీ కోణాల్లో లోతుగా విచారిస్తున్నట్లు తెలిసింది. -
స్వస్థలానికి వస్తుండగా..
పూతలపట్టు(యాదమరి): రోడ్డు ప్రమాదంలో తండ్రీకుమారులు మృతిచెందిన ఘటన పూతలపట్టులో చోటుచేసుకుంది. సీఐ కృష్ణమోహన్ కథనం మేరకు.. నెల్లూరుకు చెందిన సుబ్బారాయుడు (60) కుటుంబం చాలా సంవత్సరాల క్రితమే వ్యాపారరీత్యా బెంగళూరులో స్థిరపడింది. ఆయన తన కుమారుడు నాగేంద్ర (30)కు వివాహం చేయాలని సంబంధాలు చూసే ప్రయత్నం మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో తమ స్వస్థలానికి సుబ్బరాయుడితోపాటు ఆయన భార్య మంగమ్మ, నాగేంద్ర, కుమార్తె సుభాషిణి, మనవడు లక్కీతో కలిసి గురువారం ఉదయం బెంగళూరు నుంచి కారులో బయలుదేరారు. నాగేంద్ర కారు నడుపుతున్నాడు. అతను నిద్రమత్తులోకి జారుకోవడవంతో బెంగళూరు – తిరుపతి హైవేలోని పూతలపట్టు మండలం గోపాలపురం సమీపంలో ఉన్న ఓ ప్రైవేట్ పాల డెయిరీ వద్ద కల్వర్టును ఢీకొట్టింది. దీంతో నాగేంద్ర కారులోనే మృతిచెందాడు. పక్కసీటులో ఉన్న సుబ్బారాయుడు కల్వర్టు కింద పడి మరణించాడు. వెనుక కూర్చొన్న మంగమ్మ, సుభాషిణి, లక్కీకి తీవ్రగాయాలయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను బయటకు తీసి 108 అంబులెన్స్‌లో పి.కొత్తకోట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. బాధిత కుటుంబానికి సమాచారం ఇవ్వడంతో వారు అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం వేలూరు సీఎంసీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. సుభాషిణి ఆస్పత్రిలో తన తండ్రి, తమ్ముడికి ఏమైంది.. వారెక్కడ అని రోదిస్తూ అడగడం పలువురిని కంటతడి పెట్టించింది. మృతులను పోస్టుమార్టం నిమిత్తం చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తామని సీఐ తెలిపారు. డివైడర్‌ను ఢీకొట్టిన కారు తండ్రీకుమారుల మృతి మరో ముగ్గురికి తీవ్రగాయాలు -
మూడు కార్లకు నిప్పు
కందుకూరు: ఇంటి బయట పార్క్ చేసిన మూడు కార్లకు గుర్తుతెలియని వ్యక్తులు నిప్పుపెట్టిన ఘటన గురువారం ఉదయం పట్టణంలోని సాలిపాళెంలో వెలుగు చూసింది. స్థానికులు, పోలీసుల కథనం మేరకు.. తూర్పుసాలిపాళేనికి చెందిన నరేష్ అనే యువకుడు ఎలక్ట్రీషియన్ పని చేస్తుంటాడు. బుధవారం విధుల అనంతరం సొంత కారును బయట పార్క్ చేసి ఇంట్లో నిద్రపోయాడు. గుర్తుతెలియని వ్యక్తులు గురువారం వేకువజామున వాహనానికి నిప్పు అంటించారు. అలికిడికి నిద్ర లేచిన నరేష్ బయటకు వచ్చి నీళ్లు చల్లి మంటలు ఆర్పేశాడు. అప్పటికే కారు సగభాగం కాలిపోయింది. అదే సందర్భంలో నరేష్ ఇంటి పక్కనే పార్కు చేసిన మరో రెండు కార్లకు కూడా నిప్పు అంటుకుని స్వల్పంగా కాలిపోయాయి. దీనిపై ఫిర్యాదు అందుకున్న పట్టణ ఎస్సై శివనాగరాజు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఊరూవాడా గణపయ్య సంబరం
● భక్తిశ్రద్ధలతో వినాయకచవితి ● వివిధ రూపాల్లో కొలువుదీరి.. నెల్లూరు(బృందావనం): వినాయకచవితి పండగను ప్రజలు బుధవారం భక్తిశ్రద్ధలతో జరుపుకొన్నారు. నెల్లూరులో విక్రమ సింహపురి గణేష్ ఉత్సవ సమితి, వివిధ మిత్రమండళ్లు, యువత ఆధ్వర్యంలో భారీ మండపా ల్లో తాత్కాలికంగా ప్రతిష్టించిన గణపతిని ప్రజలు దర్శించుకున్నారు. ఆనందోత్సాహాలతో ఉట్టి కొడుతూ సంబరాలు చేసుకున్నారు. బాలాజీనగర్, ట్రంకురోడ్డు శివాజీ సెంటర్, పెద్దబజారు, చిన్నబజారు, రాణాప్రతాప్ సెంటర్, కాపువీధి, వేదాయపాళెం, చిన్న బజారు, శెట్టిగుంటరోడ్డు తదితర ప్రాంతాల్లో గణనాథులను దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. నిర్వాహకులు దాతల సహకారంతో తీర్థ, ప్రసాదాలు అందజేశారు. నెల్లూరు స్వర్ణాల చెరువు గణేష్ ఘాట్, పెన్నా బ్యారేజీల వద్ద తొలిరోజు నిమజ్జన వేడుకలు భక్తిశ్రద్ధలతో జరిగాయి. – ఫొటోలు : సాక్షి ఫొటోగ్రాఫర్, నెల్లూరు -
డిజిటల్ అసిస్టెంట్లకు ఉద్యోగోన్నతులు
నెల్లూరు(పొగతోట): గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న 82 మంది డిజిటల్ అసిస్టెంట్లకు గ్రేడ్ – 5 పంచాయతీ కార్యదర్శులుగా ఉద్యోగోన్నతులను కల్పిస్తూ ఉత్తర్వులను కలెక్టర్ ఆనంద్ జారీ చేశారు. ఈ క్రమంలో ఉద్యోగోన్నతులు పొందిన పంచాయతీ కార్యదర్శులకు నగరంలోని జెడ్పీ సమావేశ మందిరంలో కౌన్సెలింగ్‌ను డీపీఓ శ్రీధర్‌రెడ్డి గురువారం నిర్వహించారు. అనంతరం పంచాయతీలను కేటాయించి ఉత్తర్వులను అందజేశారు. డీపీఓ కార్యాలయాధికారులు మాలకొండయ్య, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. విద్యుత్ కోతలపై ముందస్తు సమాచారమివ్వండి నెల్లూరు రూరల్: పారిశ్రామికవాడలు, ఇండస్ట్రియల్ పార్కుల వద్ద విద్యుత్ కోతలు విధించే సమయంలో ముందస్తు సమాచారాన్ని తప్పక ఇవ్వాలని కలెక్టర్ ఆనంద్ పేర్కొన్నారు. కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో గురువారం నిర్వహించిన జిల్లా పరిశ్రమలు, ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో సింగిల్ డెస్క్ పోర్టల్‌లో 2723 దరఖాస్తులు రాగా, అందులో 2432ను ఆమోదించగా, 21ని తిరస్కరించామని, మిగిలినవి పెండింగ్‌లో ఉన్నాయని వివరించారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, లీగల్ మెట్రాలజీ శాఖల్లో పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను మంజూరు చేసేలా చూడాలన్నారు. మెగా ప్రాజెక్టుల ద్వారా 13599.. పెద్ద పరిశ్రమల ద్వారా 5557 మందికి ఉద్యోగావకాశాలను కల్పించామని వెల్లడించారు. అనంతరం వివిధ కంపెనీల ఏర్పాటుకు సంబంధించిన పురోగతిని పరిశీలించి అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. జేసీ కార్తీక్, జిల్లా పరిశ్రమల శాఖ జీఎం మారుతిప్రసాద్, ఏపీఐఐసీ జెడ్ఎం శివకుమార్, ఆర్డీఓలు పావని, అనూష, వంశీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. హోరాహోరీగా ఎడ్ల బండలాగుడు పోటీలు జలదంకి: వినాయక చవితి ఉత్సవాలను పురస్కరించుకొని స్థానిక జానకీ రామలింగేశ్వరస్వామి ఆలయం వద్ద జిల్లా స్థాయి ఎడ్ల బండలాగుడు పోటీలను బుధవారం నిర్వహించారు. గమళ్లపాళెం రోడ్డు వద్ద ఏర్పాటు చేసిన పోటీలకు 15 జతల ఎడ్లు హాజరయ్యాయి. నెల్లూరు రూరల్ మండలం పొట్టేపాళేనికి చెందిన లెనిన్ ఎంటర్ప్రైజెస్ తరఫున ఎడ్లు 20 నిమిషాల వ్యవధిలో 4652 అడుగుల దూరం బండ లాగి ప్రథమ స్థానంలో నిలిచాయి. అల్లూరు మండలం తూర్పుగోగులపల్లికి చెందిన కృష్ణతేజారెడ్డి ఎడ్లు 4642.. ఆత్మకూరు మండలం గోళ్లపల్లికి చెందిన శ్రీనివాసులురెడ్డి ఎడ్లు 4302.. పొట్టేపాళేనికి చెందిన కేవీఆర్ బుల్స్ తరఫున ఎడ్లు 4263.. లెనిన్ ఎంటర్ప్రైజెస్ తరఫున ఎడ్లు 4218 అడుగుల దూరం లాగి తర్వాతి స్థానాల్లో నిలిచాయి. వీరికి వరుసగా రూ.25 వేలు, రూ.20 వేలు, రూ.15 వేలు, రూ.పది వేలు, రూ.ఐదు వేలను అందజేశారు. పాల్గొన్న ఎడ్లకు ప్రోత్సాహక బహుమతిగా రూ.రెండు వేలను ఇచ్చారు. అన్నదానాన్ని నిర్వహించారు. ఎస్సై లతీఫున్నీసా ఆధ్వర్యంలో బందోబస్తును ఏర్పాటు చేశారు. వైఎస్సార్సీపీలో పలువురికి పదవులు నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట): వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రైతు విభాగ జిల్లా అధ్యక్షుడిగా కోవూరు నియోజకవర్గానికి చెందిన శివుని నరసింహులురెడ్డిని నియమించారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులను గురువారం విడుదల చేసింది. ● వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వలంటీర్ల విభాగ రాష్ట్ర కార్యదర్శిగా కోవూరు నియోజకవర్గానికి చెందిన కాటంరెడ్డి దినేష్‌రెడ్డిని నియమించారు. -
సోమశిల @ 60 టీఎంసీలు
ఆత్మకూరు: సోమశిల జలాశయంలో నీటి నిల్వ గురువారం అర్థరాత్రికి 60 టీఎంసీలకు చేరింది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలు, కృష్ణా నదికి వరద కొనసాగుతోంది. ఈ క్రమంలో కుందూ నదిలో 20 వేల క్యూసెక్కులకుపైగా ప్రవాహం నమోదైంది. ఆదినిమ్మాయిపల్లి మీదుగా 30 వేల క్యూసెక్కుల నీరు సోమశిలవైపు ప్రవహిస్తోంది. 18,400 క్యూసెక్కులకుపైగా వరదొస్తోందని అధికారులు తెలిపారు. డెల్టా, ఉత్తర, దక్షిణ కాలువలకు కలిపి 12,740.. కండలేరు జలాశయానికి 10,200 క్యూసెక్కులను విడుదల చేస్తున్నామని అధికారులు తెలిపారు. పోక్సో కేసులో సంచలన తీర్పు ● నిందితుడికి 20 ఏళ్ల జైలు, రూ.20 వేల జరిమానా నెల్లూరు (లీగల్): బాలికను ఇంటి నుంచి బలవంతంగా తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డారని నమోదైన కేసులో నేరం రుజువు కావడంతో తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం తీపనూరుకు చెందిన నిందితుడు కన్నా శ్రీనివాసులుకు 20 ఏళ్ల జైలుతో పాటు రూ.20 వేల జరిమానా విధిస్తూ నెల్లూరు ప్రత్యేక పోక్సో కోర్టు న్యాయమూర్తి సిరిపిరెడ్డి సుమ గురువారం తీర్పుచెప్పారు. ప్రాసిక్యూషన్ కథనం మేరకు.. చిల్లకూరు మండలం తీపనూరుకు చెందిన 17 ఏళ్ల బాలిక తన తల్లిదండ్రులతో ఉంటూ చదువుకొనేది. నాయుడుపేటలోని తెల్వయిపాడులో తెలిసిన వారి ఇంటికి 2021 జూలై 14న బాలిక తల్లిదండ్రులు వెళ్లారు. తిరిగి అదే రోజు సాయంత్రం ఇంటికొచ్చి చూడగా, బాలిక కనపడలేదు. చుట్టుపక్కల విచారించిన అనంతరం జూలై 17న చిల్లకూరు పోలీసులకు బాలిక తల్లి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు అనంతరం శ్రీనివాసులుపై కోర్టులో చార్జిషీట్‌ను దాఖలు చేశారు. విచారణలో నేరం రుజువు కావడంతో పైమేరకు శిక్ష, జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు ప్రాసిక్యూషన్ తరఫున స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ దూబిశెట్టి చంద్రశేఖర్ వాదించారు. ● కొనసాగుతున్న ప్రవాహం● ఆగస్ట్‌లోనే ఈ స్థాయికి చేరడంపై హర్షం -
పర్వతరెడ్డి కాలి గోటికి కూడా సరిపోరు
నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట): వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్చార్జి, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి కాలి గోటికి కూడా కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి సరిపోరని పార్టీ యువజన విభాగ జిల్లా అధ్యక్షుడు, కార్పొరేటర్ ఊటుకూరు నాగార్జున విమర్శించారు. ఈ మేరకు నగరంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో విలేకరులతో గురువారం ఆయన మాట్లాడారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం ఆయన దిగజారుడుతనానికి నిదర్శనమని చెప్పారు. అవహేళనగా చవకబారు మాటలు మాట్లాడితే అది మగతనం కాదని హితవు పలికారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే కృష్ణారెడ్డి అవినీతిని బయటపెట్టి చట్టం ముందు దోషిగా నిలబెడతామని స్పష్టం చేశారు. పార్టీ యువజన విభాగ కావలి నియోజకవర్గ అధ్యక్షుడు చైతన్య పాల్గొన్నారు. -
వినాయక ప్రతిమ ఏర్పాటులోనూ రాజకీయం
● ఎంతో కాలంగా ప్రతిష్టిస్తున్న స్థలాన్ని కాదన్న పోలీసులు ● టీడీపీ ఒత్తిడికి తలొగ్గి ఊరి చివర పెట్టించిన వైనం ఆత్మకూరు: కూటమి పాలనలో దేవుడి విగ్రహాల ఏర్పాటుకు సైతం రాజకీయాలు చేస్తున్న పరిస్థితి నెలకొంటోంది. స్థానిక టీడీపీ నేతలతో పాటు ‘పై’ నాయకుడి ఒత్తిడితో గ్రామ శివార్లలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వారు విగ్రహం పెట్టేలా పోలీసులు నిర్ణయించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వివరాలు.. మర్రిపాడు మండలం తిక్కవరంలో వినాయక చవితి ఉత్సవాలను ఉత్తరపువీధి యువత ఆధ్వర్యంలో 12 ఏళ్లుగా నిర్వహిస్తున్నారు. అయితే ఈ ఏడాది వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేసే క్రమంలో స్థానిక టీడీపీ నేతలు రంగప్రవేశం చేశారు. ఏటా ప్రతిష్టించే స్థలంలో విగ్రహాన్ని ఏర్పాటు చేయకూడదంటూ టీడీపీ నేతల ప్రమేయంతో పోలీసులు ఆదేశించారు. తాము ఏటా ఏర్పాటు చేస్తున్న స్థలం గ్రామకంఠమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, సీపీఎం నేతలు పేర్కొన్నా, పోలీసులు ససేమిరా అన్నారు. సదరు స్థలంలో విగ్రహాన్ని టీడీపీ నేతలు ఏర్పాటు చేయనున్నారని తెలిపారు. దీంతో గ్రామంలోని మరోచోట ఉన్న తమ సొంత సెటిల్మెంట్ పట్టా స్థలంలో విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుంటామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్పినా, ఆత్మకూరు ఇన్చార్జి సీఐ, మర్రిపాడు ఎస్సై అంగీకరించలేదు. ఊరికి దూరంగా ఉండే స్థలంలోనే ఏర్పాటు చేసుకోవాలని ఖరాఖండీగా చెప్పారు. గ్రామకంఠ స్థలంలో బీసీ కాలనీకి వెళ్లే దారిని మూసేస్తూ పందిరి వేసి విగ్రహాన్ని పచ్చ పార్టీ నేతలు నెలకొల్పారు. దీంతో విధిలేక ఊరికి దూరంగా ఖాళీ స్థలంలో విగ్రహాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు ఏర్పాటు చేసుకోవాల్సి వచ్చింది. చివరికి నిమజ్జన విషయంలోనూ ఇలానే వ్యవహరించారు. టీడీపీ వారు ఏర్పాటు చేసిన విగ్రహ ఊరేగింపు, నిమజ్జనం అనంతరం రాత్రి 12 గంటల తర్వాతే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వారు జరుపుకోవాలని సూచించారు. -
వెరిఫికేషన్.. పెద్ద వర్రీ
నెల్లూరు (టౌన్): డీఎస్సీ వ్యవహారం లోపభూయిష్టంగా మారింది. నోటిఫికేషన్ వెలువడిన నాటి నుంచి కాల్ లెటర్లు అందుకునే వరకు అభ్యర్థుల్లో నెలకొన్న ఆందోళన కొనసాగుతూనే ఉంది. కాల్ లెటర్లు అందుకున్న వారికి సంబంధించిన సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ను నగరంలోని వైఎమ్‌సీఏ మైదానంలో గల వీఆర్ ఐపీఎస్ కళాశాలలో గురువారం నిర్వహించారు. మొత్తం 673 మందికి గానూ 17 డెస్క్‌లను ఏర్పాటు చేశారు. తొలుత 585 మందికే.. తొలుత 585 మందికే కాల్ లెటర్లు రావడంతో 13 డెస్క్‌లతో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ నిర్వహించారు. స్టేట్ అబ్జర్వర్‌గా సమగ్రశిక్ష ఏఎస్పీడీ రవీంద్రనాథ్‌రెడ్డిని నియమించారు. ప్రక్రియను డీఈఓ బాలాజీరావు పర్యవేక్షించారు. సమగ్రశిక్ష ఏపీసీ వెంకటసుబ్బయ్య, డిప్యూటీ డీఈఓలు, ఎంఈఓలు హాజరయ్యారు. ప్రక్రియను పొద్దుపోయే వరకు నిర్వహించనున్నారని సమాచారం. అప్పటికీ ఎవరైనా మిగిలి ఉంటే వారికి శుక్రవారం నిర్వహించనున్నారు. అన్నీ అనుమానాలే.. డీఎస్సీ నోటిఫికేషన్‌పై అనేక అనుమానాలు నెలకొన్నాయి. జిల్లాలో 673 పోస్టులకు సబ్జెక్టుల వారీగా పరీక్షను నిర్వహించారు. 585 మందికి బుధవారం.. 50 మందికి గురువారం రాత్రికి కాల్ లెటర్లు పంపారు. మిగిలిన 38 మందికి ఇవి ఎప్పుడొస్తాయో ఎవరికీ తెలియదు. మరోవైపు శుక్రవారం ఉదయానికి వస్తాయని విద్యాశాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఉపాధ్యాయ సంఘాల నేతల హల్చల్ సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కేంద్రం వద్ద పలు ఉపాధ్యాయ సంఘాల నేతలు హల్చల్ చేశారు. వృత్తిలోకి కొత్తగా అడుగిడనున్న వారిని ప్రసన్నం చేసుకొని తమ యూనియన్‌లో చేర్చుకునేందుకు పోటీపడ్డారు. ఇబ్బందులున్నాయని ఎవరైనా చెప్తే, వారిని జిల్లా విద్యాశాఖాధికారులు వద్దకు తీసుకెళ్లి మాట్లాడిస్తున్న పరిస్థితీ నెలకొంది. మరోవైపు అభ్యర్థుల కంటే ఉపాధ్యాయ సంఘాల నేతలే ఎక్కువగా ఉన్నారని పలువురు గుసగుసలాడుకున్నారు. దివ్యాంగ అభ్యర్థులకు నేడు.. కాల్ లెటర్లను అందుకొని సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేయించుకున్న పీడబ్ల్యూడీ – వీహెచ్, ఓహెచ్, ఎంఐ దివ్యాంగ అభ్యర్థులు జిల్లా ప్రభుత్వాస్పత్రిలోని మెడికల్ సూపరింటెండెంట్‌తో ధ్రువీకరించుకొని సదరు పత్రాన్ని అందజేయాలని డీఈఓ బాలాజీరావు కోరారు. కొత్తగా కాల్ లెటర్లు అందుకున్న వారు వీఆర్ ఐపీఎస్ కళాశాలలో సర్టిఫికెట్లను శుక్రవారం వైరిఫై చేయించుకోవాలని సూచించారు. ఆపై మెడికల్ సూపరింటెండెంట్‌తో వెరిఫికేషన్ చేయించుకొని తమకు అందజేయాలని పేర్కొన్నారు. పోస్టులు 673.. కాల్ లెటర్లు 635 మందికే మిగిలిన వారికి నేడొస్తాయంటున్న అధికారులు అందరికీ పంపకపోవడంపై అనుమానాలు డీఎస్సీలో ఇదీ కథ మరో మెలిక డీఎస్సీ పరీక్ష రాసిన అభ్యర్థులు రెండు లేదా మూడు కేటగిరీల్లో మెరిట్ ర్యాంకులను సాధించినా, నోటిఫికేషన్ సమయంలో ఇచ్చిన ప్రాధాన్యత మేరకే పోస్ట్‌ను ఇస్తామని రాష్ట్ర విద్యాశాఖాఽధికారులు మెలిక పెడుతున్నారు. నోటిఫికేషన్ సమయంలో అభ్యర్థులకు సరైన అవగాహన ఉండదని, ఈ విషయాన్ని ఉపాధ్యాయ సంఘాల నేతలు సైతం తప్పుబడుతున్నారు. కేటగిరీల ఎంపికలో మెరిట్ అభ్యర్థులకు అన్యాయం జరిగిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మెరిట్ లిస్ట్‌లో పేరుండి కాల్ లెటర్ రాని వారు సైతం వెరిఫికేషన్ కేంద్రం వద్దకొచ్చారు. -
ఈ విధానాన్ని తొలగించాలి
అసెస్మెంట్ విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే తొలగించాలి. ఈ ప్రక్రియ కారణంగా ఉపాధ్యాయుల బోధనకు ఆటంకం ఏర్పడుతోంది. బోధనేతర పనుల భారాన్ని మోపడంతో ఉపాధ్యాయులు ఇబ్బంది పడుతున్నారు. సిలబస్‌ను సకాలంలో పూర్తి చేయలేకపోతుండటంతో విద్యార్థులు నష్టపోతున్నారు. మూల్యాంకనంలో పాత విధానాన్నే కొనసాగించాలి. – సురేంద్రరెడ్డి, జిల్లా అధ్యక్షుడు, ఏపీటీఎఫ్ అనాలోచిత నిర్ణయం ప్రభుత్వ ఆనాలోచిత నిర్ణయంతో అసెస్మెంట్ విధానం పిల్లలనే కాకుండా ఉపాధ్యాయులనూ పరీక్షించే విధంగా మారింది. దీని వల్ల బోధనకు వారం పాటు దూరంగా ఉండాల్సి వస్తోంది. ప్రాజెక్టుల పేరుతో విద్యార్థులను గందరగోళానికి గురిచేస్తున్నారు. తరగతికి మించిన స్థాయిలో ప్రశ్నపత్రం ఉంటోంది. ఈ పనులతో ఉపాధ్యాయులు బోధనకు దూరంగా ఉంటున్నారు. – చలపతిశర్మ, జిల్లా ప్రధాన కార్యదర్శి, యూటీఎఫ్ -
శివలింగం చోరీ కేసులో నిందితుల అరెస్ట్
అల్లూరు: శివలింగం చోరీ చేసిన ఘటనలో నలుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. అల్లూరు ఎస్సై శ్రీనివాసులురెడ్డి మంగళవారం వివరాలు వెల్లడించారు. అల్లూరు మండలం నార్త్ ఆములూరు గొల్లపాళెం సమీపంలోని పాత శివాలయం వద్దకు ఈనెల 15వ తేదీ అర్ధరాత్రి కోవూరుకు చెందిన ఉమ్మడిశెట్టి హరికృష్ణ, షేక్ వాజిద్అహ్మద్, పాండిచేరి కుమార్, పడుగుపాడుకు చెందిన యాటగిరి శ్రీనివాసులు, అనంతపురానికి చెందిన శ్రీనివాసులు మినీవ్యాన్‌లో వెళ్లారు. శివలింగాన్ని గడ్డపారతో తవ్వి వాహనంలో తీసుకెళ్లారు. పక్కరోజు రాత్రి కోవూరు గ్రామ శివారు ప్రాంతంలో శివలింగాన్ని పగులగొట్టగా అది 52 ముక్కలైంది. అందులో నాలుగు రాగి నాణేలు దొరకడంతో వాటిని పంచుకుని వెళ్లిపోయారు. గ్రామస్తుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను పట్టుకున్నారు. వారిని రిమాండ్‌కు పంపడం జరిగిందని ఎస్సై తెలిపారు.గంజాయి కేసులో మరో వ్యక్తి అరెస్ట్● ఆరు కేజీల స్వాధీనం నెల్లూరు(క్రైమ్): గంజాయి విక్రయ కేసులో మరో వ్యక్తిని మంగళవారం సంతపేట పోలీసులు అరెస్ట్ చేశారు. ఆరు కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం మేరకు.. కపాడిపాళేనికి చెందిన సుభానీ, సిరాజ్ దంపతులు విశాఖ ఏజెన్సీ ప్రాంతం నుంచి గంజాయిని కొనుగోలు చేసి నెల్లూరులో అధిక ధరలకు విక్రయించి సొమ్ము చేసుకోసాగారు. వారి కదలికలపై నిఘా ఉంచిన సంతపేట పోలీసులు ఈనెల 24వ తేదీన దాడి చేశారు. సుభాని, సిరాజ్, గంజాయి విక్రయాలకు తరలిస్తున్న జ్యోతి, మీరాను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. పోలీసులు సుభానీ దంపతులను విచారించగా ఉస్మాన్‌సాహెబ్‌పేట రామ్‌నగర్‌కు చెందిన రామకృష్ణ సైతం తమవద్ద గంజాయి తీసుకుని విక్రయిస్తుంటాడని వెల్లడించారు. దీంతో అతడిని అరెస్ట్ చేశారు. -
పండగ రోజు జేబులకు చిల్లు
● పెరిగిన పండ్లు, పూల ధరలు నెల్లూరు(పొగతోట): పండగను అడ్డం పెట్టుకుని వ్యాపారులు పండ్లు, పూలు, కూరగాయల ధరలు పెంచి ప్రజలను దోచుకుంటున్నారు. సాధారణ రోజుల్లో రోజా, చామంతి పూలు కేజీ రూ.150 నుంచి రూ.200ల వరకు ఉంటాయి. వినాయకచవితి నేపథ్యంలో కేజీ రూ.600కు విక్రయిస్తున్నారు. పండగ వచ్చిందంటే ఆత్మకూరు బస్టాండ్ వద్ద ఉన్న పూల మార్కెట్లో వ్యాపారులకు దోపిడీకి అడ్డు లేకుండా పోతోంది. అధికారులు సైతం పట్టించుకోకపోవడంతో వ్యాపారులు చెప్పిందే రేటుగా ఉంది. ఎవరైనా ప్రశ్నిస్తే పండగ సమయంలో పూల డిమాండ్ అధికంగా ఉంటుంది, అవి దొరకవు దూర ప్రాంతాల నుంచి తీసుకురావాలని వ్యాపారులు చెబుతున్నారు. ● సాధారణ రోజుల్లో ఆపిల్ కేజీ రూ.100 నుంచి రూ.150, దానిమ్మ కేజీ రూ.150 నుంచి రూ.200లు ఉంటుంది. పండగ సందర్భంగా ఆపిల్, దానిమ్మ కేజీ రూ.250 నుంచి రూ.300కు విక్రయిస్తున్నారు. అధిక ధరల్ని చూసి ప్రజలు అవాక్కవుతున్నారు. -
అడిగేదెవరు.. ఆపేదెవరు!
నెల్లూరు(టౌన్): జిల్లాలో రోజుకోచోట సెకండ్ హ్యాండ్ వాహనాల విక్రయ సంస్థలు పుట్టుకొస్తున్నాయి. ఈ నేపథ్యంలో సోమవారం ఎలాంటి పన్నులు చెల్లించకుండా తిరుగుతున్న ఇతర రాష్ట్రాల వాహనాలపై రవాణా శాఖ అధికారులు ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. ఇందులో పన్ను చెల్లించని ఇతర రాష్ట్రాలకు చెందిన 6 బండ్లను పట్టుకున్నారు. ఒక స్కార్పియోకు అయితే ఎలాంటి పత్రాల్లేవు. రిజిస్ట్రేషన్ లేకుండానే.. సెకండ్ హ్యాండ్ వాహనాల అమ్మకాలు, కొనుగోలు వ్యాపారం చేయాలంటే రవాణా శాఖ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. జిల్లాలో 100కు పైగా సంస్థలు బోర్డులు పెట్టి వ్యాపారం చేస్తున్నాయి. అయితే దేనికి కూడా రిజిస్ట్రేషన్ లేకపోవడం గమనార్హం. ఇటీవల ఢిల్లీతోపాటు కొన్ని రాష్ట్రాల్లో పది సంవత్సరాల పైబడిన వాహనాలను తిరగకుండా నిషేధించారు. దీంతో పెద్ద కంపెనీలకు చెందిన వాటిని కూడా తక్కువ ధరకే అమ్మేస్తున్నారు. దీనిని ఆసరాగా చేసుకున్న సెకండ్ హ్యాండ్ వ్యాపారులు ఢిల్లీతోపాటు గుజరాత్, హరియాణా, మహారాష్ట్ర, తదితర రాష్ట్రాల్లో వాహనాలు కొనుగోలు చేసి ఇక్కడికి తీసుకొస్తున్న పరిస్థితి ఉంది. కాగా వీటిలో కొన్ని చోరీకి గురైన బండ్లు ఉన్నట్లు సమాచారం. నిబంధనలు పట్టించుకోకుండా.. ఇతర రాష్ట్రాల వాహనాలు ఏపీలో ఏ ప్రాంతంలోనైనా నెలరోజుల కంటే ఎక్కువ రోజులు తిప్పకూడదనే నిబంధన ఉంది. ఇతర రాష్ట్రాల్లో కొనుగోలు చేసి ఇక్కడ తిప్పుకోవాలంటే వాహన మోడల్‌ను బట్టి 8 నుంచి 14 శాతం పన్ను చెల్లించాలి. ఏపీ నంబర్‌పై రీ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. అలా చేస్తేనే అన్ని పత్రాలు ఫోర్స్‌లో ఉంటాయి. రీ రిజిస్ట్రేషన్‌కు వాహనం ఆధారంగా రూ.40 వేల నుంచి రూ.1.50 లక్షల వరకు పన్ను చెల్లించాల్సి ఉంది. అయితే తక్కువగా కొనుగోలు చేసిన వ్యాపారులు ఎవరికో ఒకరికి అంటగడుతున్నారు. ఈ రీతిలో ఎలాంటి పత్రాల్లేని వాటిని తీసుకొచ్చి జిల్లాలో అమ్మకాలు సాగిస్తున్నారని రవాణా శాఖ అధికారులు చెబుతున్నారు. రోజుకు 10 నుంచి 20 వరకు బండ్లను అమ్ముతున్నట్లు తెలిసింది. చోద్యం చూస్తూ.. జిల్లాలో ఇతర రాష్ట్రాలకు చెందిన వాహనాలు పెద్దఎత్తున యథేచ్ఛగా తిరుగుతున్నా రవాణా శాఖ చోద్యం చూస్తోందనే ఆరోపణలున్నాయి. ఇతర రాష్ట్రాల్లో కొనుగోలు చేసి పన్ను చెల్లించని వాహనాలపై పోలీస్, ప్రెస్, రాజకీయ నేతల పేర్లు రాసి తిప్పుతున్నారని అధికారులే చెబుతున్నారు. పైగా పూర్తి స్థాయిలో బ్లాక్ ఫిల్మ్ వేస్తున్నారు. ఇక్కడ ఆ బండ్లు నెలల తరబడి ఎందుకు తిరుగుతున్నాయి?, వాటిలో ఎవరు తిరుగుతున్నారన్న దానిపై విచారణ కూడా ఉండటం లేదు. ఇటీవల నేర సంస్కృతి బాగా పెరిగింది. వేరే స్టేట్ల వాహనాలు ఇక్కడ తిప్పుతున్నా రవాణా అధికారులు కన్నెత్తి చూడటం లేదు. కొంతమందికి సెకండ్ హ్యాండ్ వ్యాపారులతో సంబంధాలు ఉన్నాయన్న ప్రచారం ఉంది. పోలీసు, రవాణా ఉన్నతాధికారులు స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.జిల్లాలో సెకండ్ హ్యాండ్ వాహనాల వ్యాపారం మూడు కార్లు ఆరు బస్సులుగా వెలుగొందుతోంది. ఇతర రాష్ట్రాల్లో కొనుగోలు చేసి ఇక్కడికి తీసుకొచ్చిన వాహనాలకు ఎలాంటి పన్నులు చెల్లించకుండా యథేచ్ఛగా అమ్మకాలు సాగిస్తున్నారు. తనిఖీలు లేకపోవడంతో తక్కువ ధరకు వస్తుందని కొందరు వాహనాన్ని కొనుగోలు చేసి దర్జాగా తిరుగుతున్నారు. పన్ను చెల్లించకుండా ప్రభుత్వాదాయానికి గండి కొడుతున్నారు. రిజిస్ట్రేషన్లు చేసుకోకుండానే సెకండ్ హ్యాండ్ వాహనాల అమ్మకాలు జిల్లా వ్యాప్తంగా 100కు పైగా సంస్థల ఏర్పాటు ఇతర రాష్ట్రాల నుంచి కార్లు తీసుకొస్తున్న వైనం ఒరిజినల్ పత్రాల్లేకుండానే కొన్ని జిల్లాకు.. పన్ను చెల్లించకుండానే తిప్పుతూ.. చోద్యం చూస్తున్న రవాణా అధికారులునిఘా పెట్టాం పన్ను చెల్లించకుండా జిల్లాలో తిరుగుతున్న ఇతర రాష్ట్రాలకు చెందిన వాహనాలపై ప్రత్యేక నిఘా పెట్టాం. తనిఖీలు చేసి పన్ను చెల్లించని, పత్రాల్లేని వాహనాలను సీజ్ చేయాలని చెప్పాం. ఏపీలో నెలకంటే ఎక్కువ రోజులు ఇతర రాష్ట్రాలకు చెందిన వాహనాలు తిరగకూడదు. అదే విధంగా తెల్ల నంబర్ ప్లేట్ బోర్డు ఉన్న వాహనాలను అద్దెకు తిప్పుకూడదు. ప్యాసింజర్లను ఎక్కించకూడదు. వీటిపై కూడా తనిఖీలు చేపట్టి సీజ్ చేస్తాం. – ఎండీ మదానీ, ఇన్చార్జి డీటీసీ -
చందన, సీఎంఆర్‌లో మట్టి ప్రతిమల పంపిణీ
నెల్లూరు(బృందావనం): కనకమహల్ సెంటర్లోని చందన, సీఎంఆర్‌లో మంగళవారం మట్టి వినాయక ప్రతిమలను ఉచితంగా పంపిణీ చేశారు. అధినేత మావూరి శ్రీనివాసరావు, డైరెక్టర్లు సంతోష్ రామమోహన్, వెంకటగణేష్లు మాట్లాడారు. చందన, సీఎంఆర్, కంచి కామాక్షి షోరూంలలో సుమారు 10 వేల ప్రతిమల పంపిణీ చేపట్టామన్నారు. సీఎంఆర్ షోరూం వద్ద 10 అడుగుల గణేష్ విగ్రహాన్ని రుద్రాక్షలతో తయారు చేయించినట్లు తెలిపారు. కాలుష్య రహిత వినాయక ప్రతిమలను తయారు చేసి వాటిని షోరూంలో ప్రదర్శనగా ఉంచి ఉత్తమంగా ఎన్నికై న వాటికి ప్రోత్సాహక బహుమతులు అందజేస్తామన్నారు. పర్యవేక్షకులు మోపూరు పెంచలయ్య, శైలేష్, మేనేజర్ కిశోర్ తదితరులు పాల్గొన్నారు. -
పర్యావరణహితంగా వినాయకచవితిని జరుపుకోండి
నెల్లూరురూరల్: వినాయకచవితి పర్వదినాన్ని ప్రజలందరూ ప్లాస్టర్ అఫ్ పారిస్ విగ్రహాలు మాని మట్టి వినాయక ప్రతిమలను పూజించి పర్యావరణాన్ని కాపాడాలని ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి ప్రాంతీయ అధికారి, పర్యావరణ ఇంజినీర్ ఎన్.అశోక్‌కుమార్ తెలిపారు. 3000 మట్టి ప్రతిమలను తయారు చేయించి ఉచితంగా ప్రజలకు అందించేందుకు మంగళవారం ఫత్తేఖాన్‌పేట రైతుబజారు దగ్గర స్టాల్‌ను ఏర్పాటు చేశారు. నెల్లూరు ఆర్డీఓ అనూష మట్టి వినాయక ప్రతిమలను పంపిణీని ప్రారంభించారు. ఆర్డీఓ మాట్లాడుతూ రసాయనాలు, రంగులు, పర్యావరణనాన్ని కలుషితం చేస్తాయన్నారు. వీటి వల్ల మనుషులకే జలచరాలకు కూడా హాని కలుగుతుందన్నారు. వినాయక విగ్రహాల అలంకరణకు పూజ సామగ్రిలోనూ ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించాలని కోరారు. కాలుష్య నియంత్రణ మండలి ఏర్పాటు చేసిన కళాజాత కార్యక్రమం అందరిని ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి సిబ్బంది, ప్రజలు, డీకేడబ్ల్యూ కళాశాలకు చెందిన రజని ఆధ్వర్యంలో ఏపీ కలైమెట్ యాక్షన్ గ్రూపు వలంటీర్లు, కళాజాత బృంద సభ్యులు పాల్గొన్నారు. -
దేశ సేవలో ‘ఉదయగిరి’ యుద్ధనౌక
ఉదయగిరి: జిల్లాలో చారిత్రాత్మక రాచరిక కేంద్రంగా విరాజిల్లిన ‘ఉదయగిరి’ పేరు మీద ఐఎన్ఎస్ యుద్ధనౌకను మంగళవారం నావికాదళంలో భారత ప్రభుత్వం ప్రవేశ పెట్టింది. దేశ సేవకు అంకితమైంది. బ్రహ్మోస్ సూపర్సోనిక్ ప్రెసిషన్ స్ట్రైక్ క్షిపణులు అమర్చబడ్డాయి అధునాతన సెన్సార్లు, ఆయుధాలతో కూడిన స్టెల్త్ టెక్నాలజీతో ఇది నింగి, నీటిలోనూ సమర్థవంతంగా పనిచేస్తోంది. జలాంతర్గామి ముప్పును ఎదుర్కొంటుంది. 2025 జూలై 1న దీనిని భారత నౌకాదళానికి అప్పగించారు. అధికారికంగా మంగళవారం ప్రవేశ పెట్టారు. ఇది భారత్, రష్యా సహకారంతో నిర్మితమైన 51వ యుద్ధనౌక. -
‘మహా గణపతిం మనసా స్మరామి’
విఘ్ననాశకుడైన మహా గణపతి ఆవాహనకు సమయం ఆసన్నమైంది. వేదోక్త మంత్ర ధ్వనులతో పులకరించే గడియలు సమీపించాయి. ప్రతి వీధి, ప్రతి ఇంట్లో గణనాథుని విగ్రహ ప్రతిష్టతో పవిత్రత విరజల్లుతోంది. బుధవారం వినాయక చవితి పర్వదినం సందర్భంగా ఉత్సవాల వాతావరణంతో ఆధ్యాత్మిక వైభవం ఉట్టిపడుతోంది. ‘మహా గణపతిం మనసా స్మరామి’ అంటూ గృహాలు, వీధులు భక్తి హారతులు, వేదోక్త మంత్రోచ్ఛారణలతో శోభితంగా మారుతోంది. కుంకుమ, గంధం, పుష్పాలతో ప్రతి ఇంట్లో గణనాథుడిని పూజించేందుకు చిన్నా, పెద్దా తేడా లేకుండా అందరూ సిద్ధమవుతున్నారు. నగరంలోని ప్రధాన ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన గణనాథుడి విగ్రహాలు, పూజా పత్రిని కొనుగోలు చేసేందుకు వచ్చిన భక్తులతో కిటకిటలాడుతోంది. ప్రధాన వీధుల్లో ఏర్పాటు చేసిన మండపాల్లో కొలువైన గణనాథుడు విభిన్న రూపాల్లో భక్తులకు దర్శనమివ్వనున్నారు. భక్త మండళ్లు ప్రతిష్టాత్మకంగా మండపాలను న భూతో న భవిష్యతి రీతిలో విద్యుద్దీపాలు, ఆధ్యాత్మిక, ప్రకృతి ఒడిలో గణనాథుడి కొలువైనట్లుగా అలంకరించారు. -
కాకాణీ.. కావలిలో అడుగు పెట్టావో ఖబడ్దార్
ఆ రోజు అసలేం జరిగింది..● త్వరలో ప్రతాప్‌కుమార్‌రెడ్డిని కూడా జైలుకు పంపుతాము ● ఎమ్మెల్సీ చంద్రశేఖర్‌రెడ్డి పైనా అనుచిత వ్యాఖ్యలు ● టీడీపీ కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి సాక్షి టాస్క్‌ఫోర్స్: రాజకీయ ప్రత్యర్థిని ధైర్యంగా ఎదుర్కోలేకపోతున్న కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట కృష్ణారెడ్డి ఫ్రస్ట్రేషన్ పతాక స్థాయికి చేరింది. శాసనసభ్యుడిననే స్థాయి మరిచిపోయి వీధిరౌడీలా బహిరంగ వేదికలపై పదేళ్లు ఎమ్మెల్యేగా పనిచేసిన రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డిపై అసభ్య పదజాలంతో దూషణలకు దిగారు. నీ ఇంటికి వస్తా.. నీ అంతు చూస్తా అంటూ చెలరేగిపోయారు. జలదంకి మండలం అన్నవరంలో అక్రమ మైనింగ్‌తోపాటు కావలిలో జరిగిన మనీ స్కీమ్ స్కామ్‌లో ఎమ్మెల్యే కృష్ణారెడ్డి పాత్రను వెలికి తీస్తానని ప్రతిగా స్పందించిన ప్రతాప్‌కుమార్‌రెడ్డిపై ‘కత్తి’ కుట్రలు, ‘కుల’ కుతంత్రాలకు తెరతీశారు. క్వారీలో జరుగుతున్న అక్రమ మైనింగ్‌ను బహిర్గతం చేయడానికి సోషల్ మీడియా యాక్టివిస్టులు వేణు, శ్రావణ్‌కుమార్, వినోద్ వీడియోలు, ఫొటోలు తీసేందుకు వెళ్లిన ఉదంతాన్ని అడ్డు పెట్టుకుని కక్ష సాధింపు చర్యలు పరాకాష్టకు తీసుకెళ్లారు. తనను హత్య చేయడానికే వచ్చారంటూ.. ఈ ఘటన జరిగిన వెంటనే ఎమ్మెల్యే కృష్ణారెడ్డి సినిమా కథను తలపించే రీతిలో కొత్త కథను అల్లారు. సోషల్ మీడియా యాక్టివిస్టులను రౌడీలుగా చిత్రీకరించారు. వారిని చెట్టుకు కట్టేసి, చిత్రహింసలు పెట్టించారు. వారి చేతుల్లోని కెమెరాలను పక్కన పెట్టించి.. కత్తులు చేతుల్లో పెట్టి తనను హత్య చేయించడానికి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి పంపించారంటూ కట్టు కథ చెప్పించారు. ఈ మేరకు ఆయనపై హత్యాయత్నం కేసు పెట్టించారు. తాజాగా హత్యాయత్నం కేసులో ఎస్సీ, ఎస్టీ సెక్షన్లను చేర్చేందుకు పోలీసులు కోర్టులో మెమో దాఖలు చేయడం చూస్తే కక్ష సాధింపు చర్యలు తీవ్ర రూపం దాల్చాయని స్పష్టమవుతోంది. ఎమ్మెల్యే కృష్ణారెడ్డి దాష్టీకాలపై వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీమంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి మాజీ ఎమ్మెల్యే ప్రతాప్‌కుమార్‌రెడ్డికి మద్దతుగా కావలిలోని ఆయన నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే క్వారీలో అక్రమ మైనింగ్ బట్టబయలు చేసేందుకు ‘చలో అన్నవరం’ కార్యక్రమాన్ని చేపడుతామని ప్రకటించిన తెలిసిందే. ఈ పరిణామాల నేపథ్యంలో కృష్ణారెడ్డి మరింత ఫ్రస్ట్రేషన్‌తో కాకాణి గోవర్ధన్‌రెడ్డిపై విరుచుకుపడ్డారు. కావలిలో అడుగు పెడితే ఖబడ్దార్ అంటూ ఊగిపోయారు. ఎమ్మెల్సీ చంద్రశేఖరరెడ్డిని అవమానించే రీతిలో మాట్లాడారు. మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డిని త్వరలోనే జైలుకు పంపిస్తానంటూ శపథం చేస్తూ రెచ్చిపోయిన తీరు చూసి ఆ పార్టీ నేతలే ముక్కున వేలేసుకున్నారు. పోలీసులపై ఎమ్మెల్యే ఒత్తిళ్లు మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డిపై కక్ష సాధింపు తీవ్రరూపం తాజాగా కావలి ఎమ్మెల్యే కృష్ణారెడ్డి వ్యాఖ్యలతో స్పష్టమైన వైనం ఎనిమిది రోజుల కిందట హత్యాయత్నం ఎస్సీ, ఎస్టీ సెక్షన్ చేర్చాలంటూ కోర్టులో మెమో దాఖలు కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట కృష్ణారెడ్డి జలదంకి మండలం అన్నవరంలో అక్రమంగా క్వారీ నిర్వహిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. క్వారీలో అక్రమ మైనింగ్ దందాను బయట పెట్టేందుకు ఈ నెల 19న కావలికి చెందిన సోషల్ మీడియా యాక్టివిస్టు వేణు, అన్నవరానికి చెందిన శ్రావణ్‌కుమార్, అల్లూరు మండలం ఇస్కపల్లికి చెందిన వినోద్ వీడియోలు, ఫొటోలు తీస్తుండగా క్వారీ సిబ్బంది పట్టుకునేందుకు ప్రయత్నించారు. శ్రావణ్‌కుమార్ పరారీ కాగా, మిగతా ఇద్దరు చిక్కారు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే దగుమాటి వెంకట కృష్ణారెడ్డి క్వారీ సూపర్వైజర్ ఏడుకొండల ద్వారా ఆ ముగ్గురు కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి ముఖ్య అనుచరులని, ఆయన సూచనల మేరకే తమను, ఎమ్మెల్యే కృష్ణారెడ్డిని చంపేందుకు వచ్చారంటూ జలదంకి పోలీసులకు ఫిర్యాదు చేయించారు. ఎమ్మెల్యే మీడియా ముందుకు వచ్చి తనపై మాజీ ఎమ్మెల్యే హత్యకు కుట్ర చేశారంటూ మాట్లాడారు. నెల్లూరు సిటీ: కాకాణి గోవర్ధన్‌రెడ్డి ఇంకోసారి కావలిలో అడుగు పెట్టావో ఖబడ్దార్ అంటూ టీడీపీ కావలి ఎమ్మెల్యే దగుమాటి కృష్ణారెడ్డి రెచ్చిపోయారు. నగరంలోని వీపీఆర్ విల్లాస్‌లో మంగళవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డిని ఉద్దేశించి ఆడంగి లక్షణాలు ఉండే నువ్వా మాట్లాడేది.. కావ్య అంటే పౌరు షం.. గుర్తుపెట్టుకో చంద్రశేఖర్‌రెడ్డి.. మీరేంటి నన్ను పీకేది’ అంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. కాకాణి గోవర్ధన్‌రెడ్డి కావలి ప్రజలిచ్చిన తీర్పును అవమానించారన్నారు. 2007 నుంచే చిన్న కుటీర పరిశ్రమగా క్వారీని నిర్వహిస్తున్నామన్నారు. తనకు కావలి టికెట్ ఇచ్చిన క్రమంలో టీడీపీకి రూ.కోట్ల చందా ఇచ్చానంటూ వైఎస్సార్సీపీ నాయకులు ఆరోపణలు చేశారని తెలిపారు. వైఎస్సార్సీపీ అధికారంలో ఉండగా ఇతర జిల్లాల నుంచి అధికారులతో క్వారీలో తనిఖీలు చేయించారన్నారు. రూ.143 కోట్లు పెనాల్టీ వేశారన్నారు. తాను అవినీతి, అక్రమాలు చేసి ఉంటే ఏ గుడికై నా, ఎక్కడికై నా వస్తానని తెలిపారు. ఇద్దరు రౌడీషీటర్లను కత్తులతో క్వారీలోకి పంపించి డ్రోన్ కెమెరాలతో చిత్రీకరించేందుకు ప్రయత్నించారన్నారు. తాను అడ్డొస్తే హతమార్చమని ప్రతాప్‌కుమార్‌రెడ్డి రౌడీ షీటర్లకు ప్రతి రెండు నిమిషాలకు ఒకసారి ఫోన్ చేశారని ఆరోపించారు. త్వరలో ప్రతాప్‌కుమార్‌రెడ్డిని కూడా జైలుకు పంపడం ఖాయమన్నారు.వాస్తవాలు పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాల్సిన పోలీసులు అందుకు భిన్నంగా ఎమ్మెల్యే ఒత్తిళ్లకు తలొగ్గి వేణు, శ్రావణ్‌కుమార్, వినోద్‌తోపాటు మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి, రాజేష్‌పై ఆగమేఘాల మీద హత్యాయత్నం కేసు నమోదు చేశారు. ఇంకొందరి ప్రమేయం ఉందని కేసులో పొందుపరిచారు. ఆ కేసులో మరుసటి రోజు వేణు, వినోద్‌లను అరెస్ట్ చేశారు. ఫిర్యాదుదారుడు ఏడుకొండలు ఎస్సీ కావడంతో ఈ కేసులో ఎస్సీ, ఎస్టీ సెక్షన్‌ను చేర్చాలంటూ ఈ నెల 23న జలదంకి పోలీసులు కావలిలోని అడిషనల్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్‌క్లాస్ కోర్టులో మెమో దాఖలు చేశారు. కోర్టు అనుమతితో ఎస్సీ, ఎస్టీ యాక్ట్‌ను చేరుస్తున్నారు. వాస్తవాలను పరిశీలించి చర్యలు తీసుకోవాల్సిన కొందరు పోలీసు అధికారులు ఎమ్మెల్యేల ఒత్తిళ్లతో ప్రతిపక్ష నేతలపై అక్రమ కేసులు బనాయించడంపై ప్రజల్లో సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
శ్రీకాంత్, అరుణ కేసుల్లో లోతైన విచారణ
సాక్షి టాస్క్‌ఫోర్స్: రౌడీషీటర్ శ్రీకాంత్, అరుణ విషయంలో పోలీసులు విభిన్న కోణాల్లో లోతైన విచారణ చేపడుతున్నారు. జైల్లో జీవితఖైదు అనుభవిస్తున్న శ్రీకాంత్‌కు అసలు అరుణ ఎలా పరిచయమైంది? ఆమె ఎన్నిసార్లు ములాఖత్ ద్వారా శ్రీకాంత్‌ను ఒంటరిగా, ఎవరెవరితో ఏఏ తేదీల్లో కలిసింది?.. ఆ తర్వాత జిల్లాలో ఏమైనా నేరాలు జరిగాయా? ఆ కేసుల్లోని నిందితులు ములాఖత్‌లో శ్రీకాంత్‌ను కలిసిన వారిలో ఉన్నారా? ఇలా అన్నీ కోణాల్లో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. శ్రీకాంత్ పెరోల్ వ్యవహారం రాష్ట్ర ప్రభుత్వానికి, ఎమ్మెల్యేలు, హోంమంత్రి మెడకు చుట్టుకుంటున్న నేపథ్యంలో ఎక్కడ ప్రభుత్వ పెద్దల విషయాలు బయటకు వస్తాయోనని రాష్ట్ర ప్రభుత్వంతోపాటు పోలీస్‌బాస్‌లు రంగంలోకి దిగారు. ఈ క్రమంలో గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠి నేరుగా రంగంలోకి దిగడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇప్పటికే దర్యాప్తును ప్రారంభించిన పోలీసులు కొంత సమాచారాన్ని రాబట్టినట్లు తెలుస్తోంది. సుమారు 16 నెలల కిందట ఆమె శ్రీకాంత్‌ను కలిసినట్లు పోలీసులు గుర్తించినట్లు తెలిసింది. అప్పటి నుంచి జిల్లాలో జరిగిన పలు హత్యల కేసుల్లోని నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని మరోమారు విచారిస్తున్నట్లు తెలిసింది. నిందితులకు వారితో ఏమైనా సంబంధాలు ఉన్నాయా? అనే వివరాలను రాబట్టుతున్నారు. మరో వైపు జిల్లాలో ఉన్న టాప్ 10 రౌడీషీటర్లను స్టేషన్లకు పిలిచి విచారిస్తున్నారు. ఇప్పటికే ముగ్గురు రౌడీషీటర్లను గంజాయి కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు. మరి కొంతమంది పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలిసింది. వారిని సైతం నేడో, రేపో అరెస్ట్ చూపించే అవకాశం ఉంది. పోలీసుల చర్యలతో అనేక మంది ఊర్లు విడిచి పారిపోయారు. కొంత కాలంగా జిల్లాలో చోటు చేసుకుంటున్న పరిణామాలపై రేంజ్ ఐజీ మంగళవారం రాత్రి ఎస్పీ కృష్ణకాంత్‌తో కలిసి పోలీసు అధికారులతో సమావేశం నిర్వహించినటు్ల్ తెలిసింది. శ్రీకాంత్, అరుణ వ్యవహారానికి సంబంధించిన అన్నీ వివరాలతోపాటు, రౌడీషీటర్లు ఎంత మంది ఉన్నారు? వారిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారనే తదితర వివరాలను అడిగి తెలుసుకున్నట్లు సమాచారం. -
క్రికెట్ అసోసియేషన్‌లో కేటుగాళ్లు
నెల్లూరు (స్టోన్‌హౌస్‌పేట): క్రికెట్ మైదానంలో ప్రతిభ చూపి ఉన్నత స్థాయికి ఎదగడానికి ఉపయోగపడే క్రికెట్ అసోసియేషన్‌లో కేటుగాళ్ల చర్యలతో క్రీడాకారులు బలైపోతున్నారు. నెల్లూరు జిల్లా క్రీడా అసోసియేషన్ తీరుపై సోమవారం ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలోని జిల్లా క్రికెట్ క్రీడా ప్రాంగణంలో క్రీడాకారుల తల్లిదండ్రులు అసోసియేషన్ నాయకుల మధ్య వాగ్వాదంతో అనేక విషయాలు బయటకు వచ్చాయి. క్రికెట్ అసోసియేషన్ నేతలు చెప్పే సమాధానాలపై సంతృప్తి చెందకపోవడంతో గందరగోళం నెలకొంది.నెల్లూరుకు చెందిన అల్లారెడ్డి సుధాకర్ కుమార్తె సాత్వికారెడ్డి క్రికెట్ అండర్–19 టీంలో వైజాగ్‌లో జరిగిన సౌత్‌జోన్‌కు సెలెక్ట్ అయింది. జిల్లా అండర్–19 టీంలో సెకండ్ ప్లేస్‌లో ఉన్న తన కుమార్తెను ఆడనివ్వకుండా బయట జిల్లాల నుంచి వచ్చిన అల్లా సహారా అనే ఇద్దరు అమ్మాయిలను టీం తరఫున సౌత్‌జోన్ టీంలో ఆడించారని, మన జిల్లా అసోసియేషన్‌లో ఉన్న సాత్వికారెడ్డిని ఆడించకుండా వారిద్దరిని ఆడించడం ఏమిటని ప్రశ్నించారు. దీంతో డిస్ట్రిక్ క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ శ్రీనివాసులురెడ్డి ఇష్టముంటే ఆడండి లేకపోతే వెళ్లండనంతో గొడవ ప్రారంభమైంది. ఈ క్రమంలో శ్రీనివాసులురెడ్డి జిల్లా క్రికెట్ అసోసియేషన్ జనరల్ మేనేజర్ భానుప్రకాష్‌రెడ్డిని అడగమని తప్పించుకున్నారు. భానుప్రకాష్‌రెడ్డి రెచ్చిపోయి మీ అమ్మాయి ఆడలేదా, రికార్డ్స్ మీకు తెలియదా అంటూ వారిపై ఎదురు మాటల దాడి చేశారు. దీంతో క్రీడాకారుల తల్లిదండ్రులు అసలు అసోసియేషన్‌కు, నీకు ఏం సంబంధం, నువ్వెలా మమ్మల్ని ప్రశ్నిస్తావు, సమాధానాలు చెప్పాల్సింది సెక్రటరీ కదా అంటూ వాగ్వాదానికి దిగారు. పోలీసులు రావడంతో వివాదం సద్దుమణిగింది.వెల్లువెత్తుతున్న ఆరోపణలుజిల్లా క్రికెట్ అసోసియేషన్ మీద క్రికెట్ ఆడుతున్న తల్లిదండ్రులు పలు ఆరోపణలు చేశారు. క్రికెట్ అసోసియేషన్ బైలాస్‌లో లేని జనరల్ మేనేజర్ పదవిని భానుప్రకాష్‌రెడ్డికి ఇవ్వడం వల్లే అనేక అక్రమాలు జరుగుతున్నాయన్నారు. జట్ల ఎంపికలో ఇతర జిల్లాల బాయ్స్ అండ్ గర్ల్స్ క్రీడాకారులను ఎంపిక చేయడం, టోర్నమెంట్లకు వెళ్లేటప్పుడు భానుప్రకాష్‌రెడ్డికి ఇష్టమైన కోచ్‌లు, మేనేజర్లను పంపడం, అక్కడ ఎవరితో ఫస్ట్ జోన్, సెకండ్ జోన్, ఎవరెవరిని ఆడించాలో ఆయన ఫోన్ ద్వారా చెప్పడం, అక్కడ ప్రతిభ గల క్రీడాకారులను ఆడించకపోవడం చూస్తే అనేక అనుమానాలు వస్తున్నాయన్నారు. ఆయన ఏ లాభం చూసుకుని ఇతర జిల్లాల క్రీడాకారులను జిల్లా జట్టుకు ఎంపిక చేసి ఆడిస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. అండర్–19, అండర్–16, అండర్–23 ఇలా ఏ జట్టులోనైనా 15 మంది సభ్యులను కాకుండా 20 మందిని ఎంపిక చేసి పంపిస్తున్నారని ఆరోపించారు. అసోసియేషన్‌లో ఏసీఏ ఆమోదం లేకుండానే కోశాధికారిగా హైదరాబాద్‌కు చెందిన కంప్యూటర్ కంపెనీ యజమానిని పెట్టడం, డబ్బులు స్వాహా చేయడమే లక్ష్యంగా నాయకులు వ్యవహరిస్తున్నారని క్రీడాకారుల తల్లిదండ్రలు విమర్శలు చేశారు. -
జగన్‌ను కలిసిన కాకాణి
నెల్లూరు (స్టోన్సౌస్పేట): మాజీమంత్రి, నెల్లూరు ఉమ్మడి జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి, ఆయన కుమార్తె రాష్ట్ర మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజితారెడ్డి తాడేపల్లిలో సోమవారం వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా పుష్పగుచ్ఛం అందజేసి కృతజ్ఞతలు తెలిపారు. జగన్‌ను కలిసిన ఎమ్మెల్సీ నెల్లూరు (స్టోన్‌హౌస్‌పేట): ఎమ్మెల్సీ, వైఎస్సార్సీపీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి తాడేపల్లిలో సోమవారం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిశారు. జిల్లాలో రాజకీయ పరిస్థితులు, పార్టీని బలోపేతం చేసే అంశాలపై చర్చించారు. ఈ మేరకు ఎమ్మెల్సీ చంద్రశేఖరరెడ్డికి భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికలపై వైఎస్ జగన్ కొన్ని సూచనలు చేశారు. మూడు శాఖల అధికారులకు మెమోలు నెల్లూరు(అర్బన్): ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చే అర్జీల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ సకాలంలో పరిష్కరించకుండా ఎక్కువ పెండింగ్‌లో ఉంచారంటూ మూడు ప్రభుత్వ శాఖల అధికారులకు మెమోలు జారీ చేయాలని కలెక్టరేట్ అధికారులను కలెక్టర్ ఆనంద్ ఆదేశించారు. సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చిన అర్జీలపై శాఖల వారీగా కలెక్టర్ ఆనంద్ సమీక్షించారు. దేవదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్, విద్యాశాఖ, వక్ఫ్‌బోర్డు శాఖలు వారి పరిధిలోని అర్జీలను పరిష్కరించడం లేదంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు. వీరికి మెమోలు జారీ చేస్తున్నట్టు తెలిపారు. మిగతా శాఖల అధికారులు కూడా అర్జీల విషయంలో నిర్లక్ష్యం చేస్తే వారిపైనా కూడా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అదనపు విధులపై సచివాలయ ఉద్యోగుల రివర్స్ వింజమూరు (ఉదయగిరి): ప్రభుత్వం నిర్దేశించిన ఉత్తర్వులకు విరుద్ధంగా తమను అదనపు విధులు నిర్వర్తించమంటే చేయబోమంటూ గ్రామ సచివాలయ ఉద్యోగులు ఎదురుతిరిగారు. వింజమూరు తహసీల్దార్ హమీద్‌తో వాగ్వాదానికి దిగారు. వింజమూరు మండలంలోని వివిధ సచివాలయాల్లో పనిచేస్తున్న సచివాలయ సిబ్బందికి స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ విధులు నిర్వహించాలంటూ తహసీల్దార్ ఆదేశాలిచ్చిన నేపథ్యంలో సోమవారం సచివాలయ సిబ్బంది తహసీల్దార్ హమీద్‌ను ప్రశ్నించారు. ప్రభుత్వ జీఓలో వీఆర్వోలు, వీఆర్ఏలు, సచివాలయ సర్వేయర్లు మాత్రమే కార్డులు పంపిణీ చేయాలని ఉత్తర్వులు ఉన్నప్పటికీ సచివాలయ సిబ్బందికి ఈ విధులు కేటాయించడం ఏమిటని తహసీల్దార్‌ను నిలదీశారు. ఇప్పటికే అనేక సర్వేలతోపాటు విధుల భారాన్ని మోస్తున్నామని, వెంటనే ఈ విధుల నుంచి తమను తొలగించాలని కోరారు. దీనికి తహసీల్దార్ స్పంది స్తూ ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి ఉద్యోగి కేటాయించిన విధులు నిర్వహించాల్సిందేనని స్పష్టం చేశారు. దీంతో తహసీల్దార్, సిబ్బంది మధ్య కొద్దిసేపు వాగ్వాదం జరిగింది. ఈ విషయమై ఉన్నతాధికారులకు ఫిర్యా దు చేస్తానని తహసీల్దార్ హెచ్చరించడంతో సచివాలయ సిబ్బంది వెనుదిరిగారు. -
గంజాయి విక్రయాలపై దాడులు
● నలుగురి అరెస్ట్ ● 6 కేజీల గంజాయి, ఆటో, నగదు స్వాధీనం నెల్లూరు(క్రైమ్): గంజాయి విక్రయాలపై నెల్లూరు సంతపేట పోలీసులు దాడులు చేశారు. నలుగురిని అరెస్ట్ చేశారు. సోమవారం సంతపేట పోలీస్‌స్టేషన్‌లో ఇన్స్పెక్టర్ జి.దశరథరామారావు వివరాలను వెల్లడించారు. కపాడిపాళెం రాయపువారి వీధికి చెందిన షేక్ సుభానీ, షేక్ సిరాజ్ దంపతులు కొంతకాలంగా విశాఖ ఏజెన్సీ ప్రాంతాల్లో గంజాయి కొనుగోలు చేసి నెల్లూరు నగరంలో విక్రయించి సొమ్ము చేసుకోసాగారు. పలుమార్లు పోలీసులకు చిక్కి జైలుపాలయ్యారు. 2023 మే నెలలో పోలీసులు సుభానీపై పీడీ యాక్ట్ ప్రయోగించారు. ఆమె భర్తపై సుమారు ఎనిమిది కేసులున్నాయి. అయినా వారు మారలేదు. విశాఖ ఏజెన్సీ నుంచి కేజీ గంజాయి రూ.1,000 చొప్పున కొనుగోలు చేసి నెల్లూరుకు తీసుకొస్తున్నారు. వాటిని 5, 10 గ్రాముల ప్యాకెట్లుగా చేసి రూ.150, రూ.300 చొప్పున విక్రయిస్తున్నారు. కొందరికి హోల్‌సేల్‌గా సైతం అమ్ముతున్నారు. వీరి కదలికలపై సంతపేట పోలీసులు నిఘా ఉంచారు. ఆదివారం గంజాయి విక్రయిస్తున్నారన్న పక్కా సమాచారం ఇన్స్పెక్టర్కు అందింది. ఆయన పర్యవేక్షణలో ఎస్సైలు బాలకృష్ణ, సుల్తాన్‌బాషా తమ సిబ్బందితో కలిసి వారి ఇంటివద్ద దాడులు చేశారు. దంపతులిద్దరితోపాటు గంజాయిని విక్రయాలకు తరలిస్తున్న అదే ప్రాంతానికి చెందిన కె.జ్యోతి, నెల్లూరు రూరల్ మండం కోడూరుపాడు గ్రామం కల్తీకాలనీకి చెందిన ఆటో డ్రైవర్ షేక్ మీరాను అదుపులోకి తీసుకున్నారు. వారినుంచి 6.350 కేజీల గంజాయి, రూ.22,500 నగదు, ఆటో స్వాధీనం చేసుకున్నారు. స్టేషన్‌కు తరలించి విచారించగా నెల్లూరు నగరంలో విక్రయాలకు పాల్పడుతున్నట్లు వెల్లడించడంతో అరెస్ట్ చేశారు. నిందితులు చెడు వ్యసనాలకు బానిసై నగదు కోసం గంజాయి విక్రయిస్తున్నట్లుగా ఇన్స్పెక్టర్ తెలిపారు. నిందితులను అరెస్ట్ చేయడంలో ప్రతిభ చూపిన ఇన్స్పెక్టర్, ఎస్సైలు, సిబ్బంది జి.శ్రీహరి, జి.సుబ్బారావు, షేక్ అల్లాభక్షు, ఎస్.సురేంద్రబాబు, గోపీ, శ్రీకాంత్, పి.కుమారి, సీహెచ్ అనూషను ఎస్పీ కృష్ణకాంత్ అభినందించారు. -
మమ్మల్ని అడిగేదెవరు..!
● ఆరాధనోత్సవాల చివరిరోజు విచ్చలవిడిగా డైమండ్ డబ్బా నిర్వహణ ● యథేచ్ఛగా మద్యం విక్రయాలు వెంకటాచలం: మండలంలోని గొలగమూడి గ్రామంలో భగవాన్ శ్రీవెంకయ్యస్వామి ఆరాధనోత్సవాల్లో చివరిరోజు విచ్చలవిడిగా డైమండ్ డబ్బా (జూదం) నిర్వహించారు. ఉత్సవాలకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా, తమిళనాడు, కర్ణాటక నుంచి వేలాది సంఖ్యలో భక్తులు విచ్చేశారు. ఆదివారం సాయంత్రం 6 గంటల తర్వాత ఆశ్రమానికి కూతవేటు దూరంలో, తిక్కవరప్పాడు వెళ్లే రోడ్డు పక్కన కొందరు డైమండ్ డబ్బా నిర్వహించారు. సోమవారం తెల్లవారుజామున వరకు ఇది కొనసాగింది. నిర్వాహకులు భక్తుల నుంచి భారీగా సొమ్ము చేసుకున్నారు. ఏటా నిర్వహించే ఆరాధనోత్సవాల సందర్భంగా గొలగమూడిలో డైమండ్ డబ్బా నిర్వహించకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టేవారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించేవారు. కానీ ఈసారి పట్టించుకోకపోవడంతో నిర్వాహకులు ఇష్టారాజ్యంగా వ్యవహరించారని ఆరోపణలున్నాయి. మద్యం అమ్మకాలు ఆరాధనోత్సవాలకు వచ్చే వేలాది మంది భక్తులను దృష్టిలో ఉంచుకుని గొలగమూడి గ్రామ నలుదిక్కులా మద్యం విక్రయాలు బహిరంగంగానే సాగాయి. గ్రామ పరిధిలో బెల్టుషాపులకు దుకాణాల నిర్వాహకులు కార్లు, ఆటోల్లో మద్యం బాటిళ్లు తీసుకొచ్చి అమ్మకాలు చేయించారు. ఎమ్మార్పీ కంటే రూ.50 అదనంగా అమ్మకాలు చేసి సొమ్ము చేసుకున్నారు. ఉత్సవాల్లో చివరి రెండు రోజులు శని, ఆదివారాల్లో పట్టపగలు బహిరంగంగానే మద్యం అమ్మకాలు చేపట్టినా ఎకై ్సజ్ అధికారులు పట్టించుకోలేదనే విమర్శలున్నాయి. -
అన్నవరం క్వారీలోని అవినీతిని వెలికితీస్తాం
కావలి (జలదంకి): కావలి ఎమ్మెల్యే దగుమాటి కృష్ణారెడ్డి అవినీతి సామ్రాజ్యం అన్నవరం క్వారీలో అక్రమాలను వెలికితీస్తాం, మనీ స్కీమ్ స్కామ్‌లో పోలీసులతో సహా అందరి పాత్రను బయటకు తీసేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపించే విధంగా అవసరమైతే న్యాయస్థానం ద్వారా పోరాటం చేస్తామని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి చెప్పారు. కావలి మాజీ ఎమ్మెల్యే ప్రతాప్‌కుమార్‌రెడ్డిపై అక్రమ కేసులకు టీడీపీ పన్నాగం పన్నిందని, అవినీతిని ప్రశ్నిస్తే పోలీసులతో అక్రమ కేసులు నమోదు చేయిస్తున్నారని, కేసులకు భయపడే వ్యక్తులం కాదన్నారు. దీనికి కారణమైన ప్రతి ఒక్కరి తాట తీస్తామని హెచ్చరించారు. సోమవారం కావలిలోని ప్రతాప్‌కుమార్‌రెడ్డి నివాసంలో ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డితో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ముందుగా ప్రతాప్‌కుమార్‌రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. కాకాణి మాట్లాడుతూ ప్రతాప్‌కుమార్‌రెడ్డిపై పెట్టిన అక్రమ కేసు విషయం తెలుసుకున్న తమ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎంతో బాధపడ్డారని, అన్నిటికి ధైర్యంగా ఉండాలని నామాటగా చెప్పమన్నారని చెప్పారు. నిరంతరం ప్రజల పక్షాన నిలబడి ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయమని, ప్రజల గొంతుకై పోరాడాలని జగన్మోహన్రెడ్డి ఆదేశాలే లక్ష్యంగా కూటమి అవినీతి, అక్రమాలను ఎండగడుతున్నామన్నారు. కావలిలో ప్రతాప్‌కుమార్‌రెడ్డి కూడా ప్రస్తుత ఎమ్మెల్యే అరాచకాలు, అవినీతిని ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారన్నారు. అన్నవరం క్వారీలో అక్రమ మైనింగ్ జరుగుతున్న విషయం జిల్లా ఎమ్మెల్యేలు, మంత్రులకు కూడా తెలుసన్నారు. దీనిపై కలెక్టర్‌తో పాటు అధికారులు కూడా ఎందుకు మౌనం వహిస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. అన్నవరం అక్రమ మైనింగ్ విషయాన్ని వెలుగులోకి తెచ్చేందుకు రాష్ట్రంలోని మా నాయకులు, కార్యకర్తలతో కలిసి త్వరలో ‘చలో అన్నవరం’ కార్యక్రమానికి శ్రీకారం చుడుతామన్నారు. కావలిలో జరిగిన మనీ స్కామ్‌లో ఎవరు ఎంత దోచుకున్నారో వెలికితీసి ప్రజలకు వివరిస్తామన్నారు. అక్రమ కేసులపై న్యాయంగా పోరాటాలు చేస్తామన్నారు. జిల్లాలో పోలీసు యంత్రాంగం నిర్వీర్యం అయిందని, టీడీపీ ఎమ్మెల్యేలు చెప్పిందే వేదమన్నట్లు అక్రమ కేసులు పెడుతూ, చివరకు కుటుంబ సభ్యులను కూడా వేధిస్తున్నారన్నారు. ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే ప్రతాప్‌కుమార్‌రెడ్డి ఎలాంటి వారో ప్రస్తుత ఎమ్మెల్యే కృష్ణారెడ్డికి బాగా తెలుసన్నారు. కావలి ఎంతో ప్రశాంతంగా ఉంటుందని, ఇక్కడ ఎంతో మంది వ్యాపారస్తులు, ఉద్యోగులు స్నేహపూరితంగా ఉంటారన్నారు. అలాంటి కావలిలో అరాచకాలు పెరిగాయన్నారు. అక్రమంగా కేసులు పెడుతున్నారని, దీనికి ఫలితం అనుభవించక తప్పదన్నారు. పోలీసులు కూడా అత్యుత్సాహం చూపుతున్నారని. శాంతి భద్రతలను గాలికొదిలేసి కూటమి నాయకులు తప్పుడు కేసులకు జీవం పోస్తున్నారని మండిపడ్డారు. అమావాస్య తరువాత పౌర్ణమి వస్తుందని, అలాగే ప్రతాప్‌కుమార్‌రెడ్డిపై పెట్టిన అక్రమ కేసులు పటా పంచలు అవుతాయన్నారు. డ్రోన్‌తో అక్రమ మైనింగ్‌ను వీడియోలు తీస్తే పోలీసులు హత్యాయత్నం, అట్రాసిటీ కేసులు పెట్టడం ఏమిటని ప్రశ్నించారు. ఈ సమావేశంలో కాకాణి కుమార్తె పూజిత, వైఎస్సార్సీపీ జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు పందింటి కామరాజు, పట్టణ అధ్యక్షుడు కేతిరెడ్డి శివకుమార్‌రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి గంధం ప్రసన్నాంజనేయులు, జిల్లా ఉపాధ్యక్షుడు కనమర్లపూడి వెంకటనారాయణ, నాయకులు మద్దిబోయిన వీరరఘు, నెల్లూరు వెంకటేశ్వరరెడ్డి, జంపాని రాఘవులు, కుందుర్తి కామయ్య, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. అక్రమ కేసులకు భయపడం ‘చలో అన్నవరం’ కార్యక్రమానికి శ్రీకారం పోలీసులే శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్నారు ప్రతాప్‌కుమార్‌రెడ్డికి అండగా ఉంటానని జగన్ నా మాటగా చెప్పమన్నారు మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి -
అర్జీలిచ్చి.. కనికరించాలని కోరి..
● కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక ● 486 వినతుల అందజేతనెల్లూరు రూరల్: ‘చాలా దూరం నుంచి వచ్చామయ్యా. మాపై కనికరం చూపి సమస్యల్ని పరిష్కరించండి’ అని ప్రజలు కోరారు. నెల్లూరు కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. కలెక్టర్ ఆనంద్, జేసీ కె.కార్తీక్, డీఆర్వో హుస్సేన్ సాహెబ్, జెడ్పీ సీఈఓ మోహన్‌రావు, జిల్లా పంచాయతీ అధికారి శ్రీధర్‌రెడ్డి అర్జీలను స్వీకరించారు. మొత్తం 426 అర్జీలందాయి. వీటిలో ఎక్కువగా రెవెన్యూ శాఖకు సంబంధించి 166, మున్సిపల్ శాఖవి 41, సర్వేవి 46, పంచాయతీరాజ్ శాఖవి 66, పోలీస్ శాఖవి 67, సెర్ప్ శాఖవి 12 తదితరాలున్నాయి. సానుకూలంగా స్పందించిన కలెక్టర్ నిర్దిష్ట గడువులోగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారులకు ఉచిత భోజన సదుపాయం ఏర్పాటు చేశారు. వైద్యారోగ్య శాఖ మెడికల్ క్యాంపు నిర్వహించింది. విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు దగదర్తి గ్రామంలో భీమా ధాబాలో మద్యం అమ్మకాలు ఇష్టారాజ్యంగా జరుగుతున్నాయని, దీంతో రక్షణ లేకుండా పోయిందని దళితవాడకు చెందిన ప్రజలు వినతిపత్రం సమర్పించారు. వారు మాట్లాడుతూ మద్యం తాగిన వారు మహిళలను ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆరోపించారు. దీనిపై యజమానిని ప్రశ్నిస్తే రౌడీషీటర్ ద్వారా బెదిరిస్తున్నట్లు చెప్పారు. పోలీసులు తమకేం పట్టనట్టు ఉన్నారన్నారు. దళితులమైన తమపై దాడి చేయడం సరికాదన్నారు. యజమాని వినయ్, రౌడీషీటర్ కడియాల సురేష్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. పంచాయతీ స్థలం ఆక్రమించారు పంచాయతీ స్థలాన్ని ఆక్రమించి అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని కొండాపురం మండలం గుడవల్లూరు టీడీపీకి చెందిన సర్పంచ్ బద్దెపూడి మాచర్ల వినతిపత్రం సమర్పించారు. ఆయన మాట్లాడుతూ సదరు భూమిలో బోరు వేసి గ్రామ ప్రజలకు తాగునీరు అందిస్తున్నట్లు చెప్పారు. టీడీపీకి చెందిన చిమ్మిలి శ్రీనివాసులు, చెంచురామయ్య అనే వ్యక్తులు ఆక్రమించి గదుల నిర్మాణానికి ప్రయ త్నిస్తున్నారని తెలిపారు. మండల సర్వేయర్‌కు ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసిన పట్టించుకోవడం లేదన్నారు. ఉప సర్పంచ్ వేములపాటి మణికుమార్ పాల్గొన్నారు. విద్యార్థులకు నాసిరకం భోజనం జిల్లాలో సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో కాంట్రాక్ట్ పద్ధతి కారణంగా విద్యార్థులకు నాసిరకం భోజనం పెడుతున్నారని పీడీఎస్‌యూ నేతలు వినతిపత్రం అందజేశారు. జిల్లా అధ్యక్షుడు ఎం.సునీల్ మాట్లాడుతూ ఫుడ్ పాయిజన్ వల్ల విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నట్లు ఆరోపించారు. అధికారులు స్పందించి వెంటనే ఈ పద్ధతి మార్చాలని, లేనిపక్షంలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. కూటమి ప్రభుత్వం గురుకుల పాఠశాలల్లో సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నేతలు షేక్ షారుఖ్, కె.ఆశిర్, షేక్ మస్తాన్, నవీన్, హర్ష, హుస్సేన్ పాల్గొన్నారు. -
మద్యం అలవాటును ప్రశ్నించారని..
నెల్లూరు(క్రైమ్): ఉరేసుకుని వాచ్మెన్ ఆత్మహత్య చేసు కున్న ఘటన నెల్లూరులోని ఆచారివీధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. నేపాల్ రాజధాని ఖాట్మాండ్కు చెందిన బికాష్ (25), శిర్జన కోలి ఏడాది క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. ఐదునెలల క్రితం వారు ఉపాధి నిమిత్తం నెల్లూరుకు వచ్చారు. ఆచారివీధిలోని ఓ అపార్ట్మెంట్లో బికాష్ వాచ్‌మెన్‌గా, భార్య చిన్న పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈనెల 24వ తేదీ సాయంత్రం బికాష్ స్నేహితులతో కలిసి మద్యం తాగి అర్ధరాత్రి ఇంటికొచ్చాడు. అనంతరం తన తల్లిదండ్రులకు ఫోన్ చేసి మాట్లాడుతుండగా వారు ఎందుకు మద్యం తాగావని మందలించారు. భార్య సైతం ఈ అలవాటు ఎందుకు చేసుకున్నావని ప్రశ్నించి భోజనం చేసేందుకు లోనికి వెళ్లింది. ఈక్రమంలో బికాష్ సీలింగ్ ఫ్యాన్‌కు చున్నీతో ఉరేసుకున్నాడు. భోజనం ముగించుకుని హాల్లోకి వచ్చిన ఆమె భర్త ఉరేసుకుని ఉండటాన్ని గమనించింది. పక్కవీధిలో ఉంటున్న తన అన్నయ్యకు జరిగిన విషయాన్ని తెలియజేసింది. అందరూ కలిసి బికాష్ను చికిత్స నిమిత్తం రామచంద్రారెడ్డి హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. శిర్జన సోమవారం చిన్నబజారు పోలీసులకు ఫిర్యాదు చేసింది. మృతదేహాన్ని జీజీహెచ్ మార్చురీకి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
మోసపోయాం.. న్యాయం చేయండి
● పోలీసుల ఆధ్వర్యంలో ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ ● 93 ఫిర్యాదుల అందజేతనెల్లూరు(క్రైమ్): ఉద్యోగాలిప్పిస్తామని కొందరు.. రుణాలు ఇప్పిస్తామని మరికొందరు.. పెళ్లి పేరిట ఇంకొందరు మోసగించారు. వారిపై చర్యలు తీసుకోవాలని పలువురు కోరారు. నెల్లూరులోని ఉమేష్‌చంద్ర కాన్ఫరెన్స్ హాల్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని ఆత్మకూరు డీఎస్పీ కె.వేణుగోపాల్, చిన్నబజారు ఇన్స్పెక్టర్ చిట్టెం కోటేశ్వరరావు నిర్వహించారు. 93 మంది తమ సమస్యలను పోలీసు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. కార్యక్రమంలో లీగల్ అడ్వైజర్ టి.శ్రీనివాసులురెడ్డి, ఎస్బీ – 2 ఇన్స్పెక్టర్ బి.శ్రీనివాసరెడ్డి, ఫిర్యాదుల విభాగం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. పలు ఫిర్యాదులు ● ఆస్తి రాసివ్వాలంటూ మూడో కుమారుడైన వెంకటేశ్వర్లు, అతని భార్య నన్ను చిత్రహింసలకు గురిచేయడమే కాకండా ఇంటి నుంచి తరిమేశారు. నా ఇంటికి తాళం వేశారు. నేను బంధువుల వద్ద ఉంటున్నాను. విచారించి న్యాయం చేయాలని కలువాయికి చెందిన ఓ వృద్ధురాలు కోరారు. ● చెడు వ్యసనాలకు బానిసైన నా భర్త నన్ను మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నాడు. భర్త, అత్తమామలు ఇటీవల నన్ను తీవ్రంగా కొట్టి గాయపరిచారు. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బుచ్చిరెడ్డిపాళేనికి చెందిన ఓ మహిళ ఫిర్యాదు చేశారు. ● విజయవాడకు చెందిన శివయ్య, హరితేజ. అరవింద్‌లు రైల్వే ఉద్యోగులు. నా కుమారుడికి రైల్వే శాఖలో అటెండర్ ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి రూ.6 లక్షలు తీసుకుని మోసగించారని దర్గామిట్టకు చెందిన ఓ వ్యక్తి అర్జీ ఇచ్చాడు. ● నగరానికి చెందిన వినోద్ దంపతులు ప్రభుత్వ హాస్పిటల్లో పనిచేస్తున్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగం ఇప్పిస్తానని రూ.లక్ష నగదు, ఒరిజినల్ సర్టిఫికెట్లు తీసుకున్నారు. ఉద్యోగం ఇప్పించకుండా నగదు, సర్టిఫికెట్లు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారు. విచారించి చర్యలు తీసుకోవాలని వేదాయపాళేనికి చెందిన ఓ మహిళ కోరారు. ● నాకు ఓ మ్యాట్రిమోనియల్ వెబ్సైట్లో గాయత్రి పరిచయమైంది. తాను మలేసియాలోని సీఐఎంబీ బ్యాంక్‌లో పనిచేస్తున్నాని నమ్మించింది. ఆగస్టులో వైజాగ్‌కు వస్తున్నానని అక్కడ పెళ్లి చేసుకుందామని చెప్పింది. నా చేత గ్లోబల్ ట్రేడ్ అనే సైట్లో రూ.12 లక్షల పెట్టుబడులు పెట్టించింది. అనంతరం ఫోన్ స్విచ్ఛాఫ్ చేసిందని లింగసముద్రానికి చెందిన ఓ వ్యక్తి ఫిర్యాదు చేశాడు. ● బాలాజీ నగర్‌కు చెందిన రమేష్ బ్యాంక్ లోన్ ఇప్పిస్తానని నమ్మించి రూ.5.67 లక్షలు తీసుకున్నాడు. లోన్ ఇప్పించకుండా నగదు తిరిగి ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నాడని వేదాయపాళేనికి చెందిన ఓ వ్యక్తి వినతిపత్రం ఇచ్చాడు. -
నెల్లూరులో కార్డన్ సెర్చ్
● 120 వాహనాల స్వాధీనం నెల్లూరు(క్రైమ్): ఎస్పీ జి.కృష్ణకాంత్ ఆదేశాలతో ఏఎస్పీ సీహెచ్ సౌజన్య, నగర డీఎస్పీ పి.సింధుప్రియ పర్యవేక్షణలో పోలీసు అధికారులు తమ సిబ్బందితో కలిసి ఆదివారం తెల్లవారుజామున కార్డన్ సెర్చ్ చేపట్టారు. చిన్నబజారు పోలీసుస్టేషన్ పరిధిలోని రాజీవ్‌గృహకల్ప, నవాబుపేట పరిధిలోని ఉడ్‌హౌస్ సంఘం, సంతపేట పరిధిలోని కపాడిపాళెం, దర్గామిట్ట పరిధిలోని ప్రగతినగర్, వేదాయపాళెం పరిధిలోని వైఎస్సార్ నగర్, బాలాజీనగర్ పరిధిలోని వెలగచెట్టు సంఘంలో ఏకకాలంలో తనిఖీలు జరిగాయి. అనుమానాస్పద వ్యక్తులు, అసాంఘిక కార్యకలాపాలపై ఆరాతీశారు. వాహనాలను తనిఖీ చేశారు. రికార్డులు సక్రమంగా లేని 113 మోటార్‌బైక్‌లు, ఏడు ఆటోలను స్వాధీనం చేసుకుని పోలీస్స్టేషన్లకు తరలించారు. రౌడీషీటర్ల ఆగడాలు, ఈవ్‌టీజింగ్ తదితరాలను గుర్తిస్తే స్థానిక పోలీసులకు, డయల్ 112కు సమాచారం అందిస్తే చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా ఏఎస్పీ ప్రజలకు సూచించారు. సమాచారం అందించే వ్యక్తుల వివరాలను గోప్యంగా ఉంచుతామని చెప్పారు. నేరనియంత్రణలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని ఆమె కోరారు. తనిఖీల్లో నగర ఇన్స్పెక్టర్లు చిట్టెం కోటేశ్వరరావు, జి.వేణుగోపాల్‌రెడ్డి, జి.దశరథరామారావు, ఎం.రోశయ్య, కె.శ్రీనివాసరావు, కె.సాంబశివరావు, ఎస్సైలు, సిబ్బంది, స్పెషల్ పార్టీ పోలీసులు తదితరులు పాల్గొన్నారు. -
ముగిసిన రాష్ట్ర స్థాయి ఫుట్‌బాల్ పోటీలు
● ప్రథమ స్థానంలో అనంతపురం జట్టు నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట): నగరంలోని ఏసీ సుబ్బారెడ్డి స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో రెండు రోజులుగా జరుగుతున్న రాష్ట్ర స్థాయి సీనియర్ మహిళా ఫుట్‌బాల్ పోటీలు ఆదివారం ముగిశాయి. ప్రథమ స్థానంలో అనంతపురం జట్టు, ద్వితీయ స్థానంలో వైఎస్సార్ కడప జిల్లా జట్టు, తృతీయ స్థానంలో నెల్లూరు జిల్లా జట్టు నిలిచాయి. బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమానికి రంజీ మాజీ క్రికెటర్, జిల్లా సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు, వైఎస్సార్సీపీ నాయకుడు మలిరెడ్డి కోటారెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ క్రీడల్లో రాణించాలంటే క్రమశిక్షణ ఎంతో ముఖ్యమన్నారు. సీనియర్ క్రీడాకారుడు, జిల్లా ఫుట్‌బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు మలిరెడ్డి శ్రీనివాసులు నేతృత్వంలో సీనియర్ ఫుట్‌బాల్ క్రీడాకారులు ఆనంద్, చిట్టి, చలపతి, ప్రభాకర్, అనిల్, శిరీష్, రవి విజేతలకు జ్ఞాపికలు, మెడల్స్, సర్టిఫికెట్లను అందజేశారు. కార్యక్రమంలో అసోసియేషన్ కార్యదర్శి పి.చంద్రశేఖర్, కోచ్‌లు పాండు, సాయి పాల్గొన్నారు. -
ఇబ్బందులు తలెత్తకుండా..
రబీ సీజన్‌కు రైతుల ఆశలు తీరనున్నాయి. నాన్‌డెల్టా ప్రాంత రైతులు రబీ సీజన్లో పంటలు పండించుకునే అవకాశం ఏర్పడింది. రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు సాగునీటిని సరఫరా చేయాల్సి ఉంది. – రాంగోపాల్‌రెడ్డి, గులించెర్ల, సైదాపురం మండలం కై వల్యా నదికి గంగనీరు ఈ ఏడాది సాగునీటి కోసం పడరాని పాట్లు పడ్డాం. కానీ ఎగువ ప్రాంతాల్లో వర్షాలు కురవడంతో కండలేరు జలాశయంలో 30 టీఎంసీలు నీరు నిల్వ ఉంది. కండలేరు నుంచి కై వల్యానదికి నీరును విడుదల చేయడంతో ఈ ప్రాంత రైతులకు సాగునీటి ఇబ్బందుల్లేవు. – శివకుమార్, సైదాపురం ● -
పైసలిస్తేనే పరుగు
● ప్రభుత్వాస్పత్రుల్లో కాన్పులకు వచ్చేది పూటగడవని మహిళలే ● ఉచితంగా ఇంటి వద్ద దించాల్సిన సిబ్బంది నగదు డిమాండ్ ● దూరాన్ని బట్టి రూ.2 వేల నుంచి 3 వేల వరకు గుంజుతున్న డ్రైవర్లు ● అధికారుల పర్యవేక్షణ శూన్యం.. పక్కదారి పట్టిన పథకం పట్టుబడిన నిందితులతో ఎన్ఫోర్స్మెంట్ ఇన్స్పెక్టర్, సిబ్బంది డబ్బు తీసుకున్న వారిపై కఠిన చర్యలు 102 తల్లీ బిడ్డ ఎక్స్‌ప్రెస్ ద్వారా కాన్పు జరిగిన మహిళలను ఉచితంగా ఇంటి వద్ద వదిలి రావాలి. డబ్బులు తీసుకుంటున్నట్లు తెలిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. ఇటీవల రూ. 2,500 వసూలు చేసిన డ్రైవర్‌ను విధుల నుంచి తొలగించాం. ఈ మేరకు నోటీసుకూడా ఇచ్చాం. ఎవరై నా డ్రైవర్లు లంచం అడిగితే మా దృష్టికి తీసుకుని వస్తే తక్షణమే చర్యలు తీసుకుంటాం. – డాక్టర్ సుజాత, డీఎంహెచ్ఓ నెల్లూరు (అర్బన్): ప్రభుత్వ ఆస్పత్రుల్లో కాన్పు జరిగిన తల్లి, బిడ్డతోపాటు సహాయకులను క్షేమంగా ఉచితంగా ఇంటికి చేర్చేందుకు 102 తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహనాలను ఏర్పాటు చేసింది. జిల్లాలో అరబిందో ఏజెన్సీ ప్రభుత్వం ద్వారా కాంట్రాక్ట్ పొందింది. ఈ ఏజెన్సీ నియమించిన డ్రైవర్లు తల్లి,బిడ్డను వాహనం ద్వారా ఇంటి వద్ద దించి రావాలి. జిల్లాలో నెల్లూరు నగరంలోని పెద్దాస్పత్రి ఎంసీహెచ్ బ్లాక్ వద్ద 8 వాహనాలు, ఆత్మకూరు జిల్లా ఆస్పత్రిలో 3 వాహనాలు, కావలి ఏరి యా ఆస్పత్రిలో 2, కోవూరులో 2, ఉలవపాడులో 1, కందుకూరులో 1, పొదలకూరులో 1, ఉదయగిరిలో 1 వాహనాలున్నాయి. వీటి ద్వారా కాన్పు జరిగిన తల్లి బిడ్డలను ఇంటికి చేర్చుతున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో పెరిగిన వాహనాలు టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు జిల్లాలో 10 వాహనాలు మాత్రమే ఉండేవి. దీంతో వాహనాలు చాలక కాన్పు జరిగిన మహిళలు ఇబ్బంది పడేవారు. కాన్పు జరిగిన వేర్వేరు ప్రాంతాలకు చెందిన ఇద్దరు డిశ్చార్జి అయ్యాక ఆ ఇద్దరు మహిళలు, ఇద్దరు చంటి బిడ్డలు, సహాయకులు వాహనంలో ఎక్కేందుకు స్థలం ఉండేది కాదు. ఇరుకుగా తీవ్ర ఇబ్బందులు పడుతూ ప్రయాణం చేసేవారు. ఒకరిని ఒక గ్రామంలో వదిలి పెట్టాక మరొకరు తమ గ్రామం వచ్చే వరకు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి అయితే వైఎస్సార్సీపీ ప్రభుత్వం 2019లో అధికారంలోకి వచ్చాక ఈ ఇబ్బందులను గమనించి వాహనాల సంఖ్యను 19 వరకు పెంచింది. తల్లీబిడ్డతోపాటు సహాయకురాలిని మాత్రమే వాహనంలో ఎక్కించుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఇబ్బందులు తగ్గాయి. పర్యవేక్షణ లేక లంచాలు తల్లీ బిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహనాలు డీఎంహెచ్ఓ పరిధిలో ఉంటాయి. అరబిందో ఏజెన్సీ ప్రతినిధి, డీఎంహెచ్ఓ కంట్రోల్లో పని చేయాలి. డీఎంహెచ్ఓ వివిధ ఆస్పత్రులకు వాహనాలు కేటాయించాక ఆయా ఆస్పత్రిల సూపరింటెండెంట్లు అక్కడ పర్యవేక్షించాలి. అయితే ఇక్కడ పర్యవేక్షణ కరువైంది. ఉదాహరణకు పెద్దాస్పత్రిలో 8 వాహనాలుండగా అక్కడి అడ్మినిస్ట్రేషన్ అధి కారిని 102 వాహనాల గురించి అడగగా డీఎంహెచ్ఓ కంట్రోల్లో ఉన్నాయి. తమకు సంబంధం లేదన్నట్లు సమాధానం ఇచ్చారు. డీఎంహెచ్ఓ కూడా ఇప్పటి వరకు వీటి గురించి పట్టించుకోలేదు. ఏ రోజు ఏ వాహనం ఎక్కడికి వెళ్లింది.. సమయం, కాన్పు జరిగిన మహిళ పేరు, డ్రైవర్ పేరు ఇలాంటి వివరాలు నమోదు చేసే రికార్డులు పెద్దాస్పత్రిలో కూడా లేవు. ఇంత నిర్లక్ష్యం ఉండటంతో డ్రైవర్లు ఇష్టారాజ్యంగా పేద రోగుల నుంచి లంచాలు వసూలు చేస్తున్నారు. అడిగే నాథుడే లేకపోవడంతో డ్రైవర్లు ఆడిందే ఆటగా, పాడిందే పాటగా తయారైంది. రోజుకు ఒక్కో డ్రైవర్ కనీసం రూ.1000 సంపాదిస్తారు. ఈలెక్కన నెలకు రూ.30 వేలు అదనంగా రోగుల వద్ద నుంచి లాక్కుంటున్నారు.ప్రభుత్వ ఆస్పత్రులకు కాన్పు కోసం వచ్చే నిరుపేద మహిళల కోసం ప్రవేశ పెట్టిన ఉచిత 102 తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ లంచాలిస్తేనే పరుగులు పెడుతోంది. అడిగినంత ఇస్తేనే ఇంటి వద్దకు చేరుస్తున్నారు. ఇవ్వలేమంటే వాహనం మరమ్మతులకు గురైందని, రాలేమంటూ తప్పించుకుంటున్నారు. పర్యవేక్షణ చేయాల్సిన ఏజెన్సీ ప్రతినిధులు, జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి, ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి అధికారులు పట్టించుకోకపోవడంతో డ్రైవర్లు ఆడిండే ఆట, పాడిందే పాటగా సాగిపోతోంది. -
విచారణాధికారి ఎదుట కాకాణి హాజరు
నెల్లూరు (క్రైమ్): మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి ఆదివారం పొదలకూరు మైనింగ్ కేసులో విచారణాధికారి నెల్లూరు రూరల్ డీఎస్పీ ఘట్టమనేని శ్రీనివాసరావు ఎదుట హాజరయ్యారు. పొదలకూరు పోలీసులు నమోదు చేసిన అక్రమ కేసులో ప్రతి ఆదివారం ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల్లోగా విచారణాధికారి ఎదుట హాజరు కావాలని కాకాణికి హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఈ మేరకు కాకాణి డీఎస్పీ ఎదుట హాజరయ్యారు. కేసులు కోర్టు పరిధిలో ఉన్న దృష్ట్యా వాటి గురించి తానేమి మాట్లాడలేనని విలేకరులు అడిగిన ప్రశ్నకు కాకాణి సమాధానమిచ్చారు. ఆయన వెంట పలువురు వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు ఉన్నారు. -
రూ.200 దొంగనోటు కలకలం
ఆత్మకూరు: పట్టణంలోని మున్సిపల్ మార్కెట్లో ఆదివారం రూ.200 దొంగనోటు కలకలం సృష్టించింది. ఓ వ్యక్తి కూరగాయలు కొనుగోలు చేసి రూ.200 నోటు ఇచ్చాడని, ఆ దుకాణాదారుడు మామూలుగానే తీసుకుని అతనికి మిగిలిన చిల్లరను ఇచ్చి పంపించాడు. మధ్యాహ్నం తన దగ్గర ఉన్న నగదును మరొకరికి ఇచ్చే క్రమంలో ఈ రూ.200 నోటు దొంగనోటుగా అవతల వ్యక్తి గుర్తించాడు. దీంతో పలువురికి చూపించగా దొంగనోటు అని నిర్ధారణ అయింది. ఈ విషయం పోలీసుల దృష్టికి రాగా, ఇకపై దుకాణాదారులు అప్రమత్తంగా ఉండాలని, అనుమానం వచ్చిన వారిని గుర్తించి తమకు తెలియజేయాలని ఆత్మకూరు పోలీసులు చెబుతున్నారు. ఇటీవల మర్రిపాడు మండలంలో మద్యం దుకాణానికి సైతం రూ.200 నకిలీ నోటు వెలుగులోకి రావడంతో కలకలం రేగిన విషయం విదితమే. తాజాగా ఆత్మకూరులోనూ ఆ తరహాలో రూ.200 నకిలీ నోటు రావడంతో రూ.200 నోట్లు తీసుకోవడానికి వ్యాపారులే కాకుండా.. ప్రజలు సైతం భయపడుతున్నారు. దీన్ని బట్టి ఆత్మకూరు పరిసరాల్లోనే రూ.200 నకిలీ నోట్ల తయారు చేసి చెలామణి చేస్తున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
కండలేరుపైనే ఆశలు
● సోమశిల నుంచి జోరుగా వరద నీరు ● ఈ సీజన్‌కు ఢోకా లేదు●సైదాపురం: నెల్లూరు, తిరుపతి జిల్లాలకు వరప్రదాయినిగా ఉన్న కండలేరు జలాశయంలోకి రోజురోజుకూ నీటి మట్టం పెరుగుతోంది. దీంతో నాన్ డెల్టా రైతుల్లో ఆశలు మరింత చిగురిస్తున్నాయి. కండలేరులో ఇప్పటికే 30 టీఎంసీల నీటి నిల్వలు ఉండటంతో ఈ సీజన్ సాగుకు ఢోకా లేదని భావిస్తున్నారు. నెల్లూరు జిల్లాతోపాటు తిరుపతి జిల్లాలోని కొన్ని మండలాలకు ఈ జలాశయం ద్వారా సాగునీరును విడుదల చేశారు. పెరుగుతున్న వరద కండలేరు 30 టీఎంసీలకు చేరింది. దీనికితోడు రోజూ సోమశిల జలాశయం నుంచి 9400 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. దీంతో సెప్టెంబర్ నెలాఖరుకు 50 టీఎంసీలు నీరు చేరు అవకాశం ఉందని అధికారులతోపాటు రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కండలేరులో పుష్కలంగా నీరు ఉండటంతో ఆయకట్టు రైతులకు రబీపై మరింత భరోసా కలిగింది. ఆగస్టులో డెడ్ స్టోరేజ్ ఆగస్టు నెలలో కండలేరు డెడ్ స్టోరేజీకి చేరుకుంది. సోమశిల జలాశయం నుంచి వరద నీరు వచ్చి చేరుతుండటంతో ప్రస్తుతం నీటి నిల్వ పెరుగుతోంది. ప్రధానంగా సర్వేపల్లి, వెంకటగిరి, శ్రీకాళహస్తి, సత్యవేడు, గూడూరు నియోజకవర్గాలకు చెందిన రైతులు కండలేరు నుంచి వచ్చే నీటిని ఆధారం చేసుకుని రబీ పంటలు సాగు చేస్తున్నారు. చెరువులకు సాగునీరు కండలేరు నుంచి సత్యసాయి గంగ కాలువకు 1,600 క్యూసెక్కులు, పిన్నేరు కాలువకు 30, లోలెవల్ కాలువకు 20 క్యూసెక్కులు, మొదటి బ్రాంచ్ కాలువకు 85 క్యూసెక్కుల వంతున నీరు విడుదల చేస్తున్నారు. దీంతో చెరువులకు సాగునీరందే అవకాశం ఉంది. ఈ జలాశయం పరిధిలో సుమారు 3 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. నెల్లూరు, తిరుపతి జిల్లాలో ప్రస్తుతం రబీ సీజన్లో సాగునీటి అవసరాలకు విడతల వారీగా నీటిని విడుదల చేస్తున్నారు. -
ముగిసిన రాష్ట్రస్థాయి బ్యాడ్మింటన్ పోటీలు
నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట): నగరంలోని ఏసీ సుబ్బారెడ్డి స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో మూడు రోజుల పాటు జరిగిన రాష్ట్రస్థాయి అండర్–15 బ్యాడ్మింటన్ పోటీలు ఆదివారం ముగిశాయి. విజేతలకు బహుమతి ప్రదానోత్సవంలో ఆంధ్రప్రదేశ్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షుడు ముక్కాల ద్వారకనాథ్ మాట్లాడుతూ జాతీయ స్థాయిలో ప్రతిభ చూపి రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలన్నారు. ప్రతి రాష్ట్రస్థాయి పోటీలో క్రీడాకారులకు ప్రతిభను పెంచుకునేందుకు మెరుగైన అవకాశాలు లభిస్తాయన్నారు. జాతీయ స్థాయిలో రాణించే క్రీడాకారులకు సైతం రాష్ట్ర బ్యాడ్మింటన్ అసోసియేషన్ ప్రోత్సాహాన్ని అందిస్తుందన్నారు. అనంతరం విజేతలకు జ్ఞాపికలను, మెడల్స్‌ను, సర్టిఫికెట్లను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో చౌదరి జ్యూవెలర్స్ ఎండీ రాకేష్ చౌదరి, నెల్లూరు జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ మద్దిపాటి ప్రసాద్‌రావు, ట్రెజరర్ గాదంశెట్టి శ్రీకాంత్, రాష్ట్ర వ్యాప్తంగా అసోసియేషన్ ప్రతినిధులు, అంపైర్లు పాల్గొన్నారు. విజేతలు దర్గామిట్ట ఎస్ఐకు సీఐగా పదోన్నతి నెల్లూరు (క్రైమ్): గుంటూరు రేంజ్ పరిధిలో ఆరుగురు ఎస్ఐలకు సీఐలుగా పదోన్నతి కల్పి స్తూ గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠి ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. పదోన్నతి పొందిన వారిలో నెల్లూరు దర్గామిట్ట ఎస్ఐ బి. రమేష్‌బాబు ఉన్నారు. నేత్రపర్వం.. తెప్పోత్సవం వెంకటాచలం: భగవాన్ శ్రీవెంకయ్యస్వామి 43వ ఆరాధన మహోత్సవాల్లో భాగంగా ఆదివారం రాత్రి తెప్పోత్సవం నేత్రపర్వంగా సాగింది. తెప్పోత్సవాన్ని వీక్షించేందుకు వేలా ది సంఖ్యలో భక్తులు కోనేటి కట్టపై చేరడంతో పోలీసులు నలువైపులా పటిష్ట బందోబస్తు నిర్వహించారు. భక్తులు కట్టపై నుంచి కిందకు దిగకుండా కట్టడి చేశారు. తెప్పోత్సవంతో ఆరాధన మహోత్సవాలు ముగిశాయి. -
ఘనంగా ‘ఓనం’ పండగ
● పదేళ్ల తర్వాత కేరళీయులతో మమేకం కావడం ఆనందంగా ఉంది ● కళాశాల రోజులు గుర్తుకొచ్చాయి ● కలెక్టర్ ఆనంద్నెల్లూరు(బృందావనం): మలయాళీస్ వెల్ఫేర్ అసోసియేషన్స్ ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా శాఖ ఆధ్వర్యంలో పురమందిరంలో ఆదివారం ఓనం మహోత్సవాలు – 2025 ఘనంగా జరిగాయి. కలెక్టర్ ఒ.ఆనంద్ ముఖ్యఅతిథిగా విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేసి ఉత్సవాలను ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ ఐఏఎస్ అయిన తాను 10 సంవత్సరాల క్రితం కేరళను వీడానన్నారు. వృత్తి బాధ్యతల నడుమ కేరళీయులైన మలయాళీయులతో జరిగిన ఏ పండగల్లో, సమావేశాల్లో పాల్గొనే అవకాశం కలగలేదన్నారు. నేడు ఓనం వేడుకల్లో పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. కళాశాల రోజులు గుర్తుకొస్తున్నాయంటూ సంతోషం వ్యక్తం చేశారు. మాతృభూమిలో ఉన్నట్లు ఉందన్నారు. అసోసియేషన్ ఆధ్వర్యంలో గొలగమూడిలో నిర్మించనున్న ఆయుర్వేదిక్ హాస్పిటల్‌కు తనవంతు సహకారం అందజేస్తానని తెలిపారు. ● నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి మాట్లాడుతూ గొలగమూడి దగ్గర నిర్మితమయ్యే ఆయుర్వేదిక్ హాస్పిటల్‌కు రూ.2 లక్షలు విరాళంగా అందజేస్తానని ప్రకటించారు. ● 25 కళా సంఘాల అధ్యక్షుడు, రాష్ట్ర హోటల్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు అమరావతి కృష్ణారెడ్డి మాట్లాడుతూ జిల్లాలోని సుమారు మూడు వేలకు మందికి పైగా మలయాళీయులు 23 సంవత్సరాలుగా ‘ఓనం’ వేడుకలను జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. అసోసియేషన్ జిల్లా శాఖ అధ్యక్షుడు పీజీ గోపి అధ్యక్షతన జరిగిన వేడుకల్లో జాతీయ, రాష్ట్ర, జిల్లా స్థాయి నేతలు బిందు దివాకరన్, ఎంకే నందకుమార్, ఎ.మురుగన్, మధు పులియత్, వినోదిని ప్రమోద్, పి.సిద్దోష్, పచ్చప్పన్, సీఎస్.శివరామ, సాదికా అన్సారి తదితరులు పాల్గొని ప్రసంగించారు. అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబిస్తూ మలయాళీయులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. 10వ తరగతి, ఇంటర్మీడియెట్ పరీక్షల్లో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు జ్యోతి శ్రీధర్ ఆర్థిక సహాయంతో ప్రోత్సాహక బహుమతులను కలెక్టర్ అందజేశారు. జిల్లాలో వివిధ రంగాల్లో సుప్రసిద్ధులైన 10 మంది సీనియర్ సిటిజన్స్‌ను ఘనంగా సత్కరించారు. దోర్నాల హరిబాబు పాల్గొన్నారు. -
ట్రూఅప్ చార్జీలు, ఇంధన సర్దుబాటు పేరుతో కూటమి దోపిడీ
కూటమి ప్రభుత్వం ట్రూఅప్, ఇంధన సర్దుబాటు పేరుతో చార్జీల మోత మోగిస్తోంది. తాము అధికారంలోకి వస్తే విద్యుత్ చార్జీలు పెంచబోమని, అవసరమైతే చార్జీల భారాన్ని తగ్గిస్తామంటూ కోతలు కోసిన చంద్రబాబు తన అసలు రూపాన్ని బయట పెట్టుకున్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం చార్జీలు పెంచలేదని, ఆ భారాన్ని ఇప్పుడు వేయకతప్పడం లేదని చెబుతున్న కూటమి ప్రభుత్వం గృహ వినియోగదారులపై ఎడాపెడా బిల్లులతో బాదేస్తోంది. నెలకు రూ.50 కోట్లపై మాటే భారం నెల్లూరు (వీఆర్సీసెంటర్): ‘ఓడ ఎక్కేదాకా ఓడ మల్లన్న.. ఓడ దిగిన తర్వాత బోడి మల్లన్న’ అన్నట్టు చంద్రబాబు తీరు ఉంది. గత ఎన్నికల సమయంలో తాము అధికారంలోకి వస్తే విద్యుత్ చార్జీలు ఒక్క రూపాయి కూడా పెంచబోమని, విద్యుత్ చార్జీలు తగ్గిస్తామని హామీలు గుప్పించిన చంద్రబాబు కూటమి అధికారంలోకి వచ్చిన మూడు నెలల నుంచే రాష్ట్ర ప్రజలపై విద్యుత్ చార్జీల బాదుడు మొదలు పెట్టాడు. దీంతో ప్రజలకు విద్యుత్ బిల్లులను చూస్తేనే షాక్ కొడుతున్నాయి. గతంలో వైఎస్సార్సీపీ విద్యుత్ చార్జీలు పెంచలేదని దీంతో ఇంధన సర్దుబాటు చార్జీలు, ట్రూఅప్ చార్జీల పేరుతో కూటమి ప్రభుత్వం విద్యుత్ చార్జీలు అమాంతంగా పెంచేసింది. 2022, 2023, 2024 సంవత్సరాల్లో రాష్ట్ర ప్రజలు వాడుకున్న విద్యుత్‌కు బిల్లులు చెల్లించారు. అయితే అప్పుడు వాడుకుని బిల్లులు సైతం కట్టిన వాటికి ప్రస్తుతం ఇంధన సర్దుబాటు చార్జీలు, ట్రూ అప్ చార్జీలు కట్టాలని విద్యుత్ బిల్లుల్లో అదనంగా వేస్తున్నారు. దీంతో ప్రతి కరెంట్ బిల్లు చేతికి వస్తుందంటే సామాన్య ప్రజలు వణికిపోతున్నారు. తాజాగా 2025 సంవత్సరానికి కూడా ఇందన సర్దుబాటు, ట్రూఅప్ చార్జీలు వేస్తుండడంతో సామాన్య, మధ్య తరగతి ప్రజలకు విద్యుత్ బిల్లులు చెల్లించటం పెను భారంగా మారుతోందని పలువురు అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. కరెంట్ బిల్లుల పాపం చంద్రబాబుదే వాస్తవానికి కరెంట్ బిల్లులు పెరగడానికి చంద్రబాబు 2014 నుంచి 2019 మధ్య తీసుకున్న అసంబద్ధ నిర్ణయాలు, అనవసరంగా అధిక ధరలకు విద్యుత్ కొనుగోలు చేశారు. దీనికి తోడు విద్యుత్ డిస్కంలకు రూ.వేల కోట్ల బకాయిలు పాపాల వల్లే గతం వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రజలపై అధిక భారం పడకుండా ట్రూఅప్, ఇందన సర్దుబాటు పేరు అరకొరగా పెంచింది. అయితే అప్పటి ప్రతిపక్షంలోని చంద్రబాబు అండ్ కో, పచ్చమీడియా వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేశాయి. తిరిగి ప్రజలపై బిల్లుల భారం పడకుండా అప్పట్లోనే అన్ని సర్దుబాటు చేశారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇష్టారీతిన విద్యుత్ చార్జీలు పెంచుతూ వచ్చింది. దీనికి తోడు అవసరం లేకపోయినా, డిమాండ్ లేకపోయినా అత్యధిక ధరలకు ప్రైవేట్ విద్యుత్ ఉత్పత్తిదారుల నుంచి కొనుగోళ్లు చేసింది. తాజాగా గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం 2022, 2023, 2024 సంవత్సరాల్లో వాడుకున్న కరెంట్‌కు ట్రూఅప్, ఇందన సర్దుబాటు పేరుతో రూ.వేల కోట్ల బాదుడు బాదేస్తోంది. విద్యుత్ చార్జీలు పెరగడానికి చంద్రబాబు చేసిన పాపాలే.. విద్యుత్ వినియోగదారులకు శాపాలుగా మారాయి. యూనిట్లు సర్ చార్జీలు కస్టమర్ మొత్తం చార్జీలు 0–30 రూ.10 రూ.25 రూ.92 31–75 రూ.10 రూ.30 రూ.340 76–125 రూ.10 రూ.45 రూ.617 126–225 రూ.10 రూ.50 రూ.1,410 226–400 రూ.10 రూ.65 రూ.3,575 401–500 రూ.10 రూ.65 రూ.4,950 501–600 రూ.10 రూ.65 రూ.5,925 30 యూనిట్లలోపు వినియోగంపై రూ.100 600 యూనిట్లలోపు వాడకంపై రూ.1,000 వైఎస్సార్సీపీ ప్రభుత్వం పెంచని విద్యుత్ చార్జీలు ఆ ప్రభుత్వం పెంచలేదని కూటమి పెంచేసిన వైనం జిల్లా ప్రజలపై నెలకు రూ.50 కోట్లపైగా అదనపు భారం యూనిట్ సర్‌చార్జీలు కస్టమర్ సర్దుబాటు చార్జీలు చార్జీలు 0–30 రూ.10 రూ.25 రూ.192 పైగా 31–75 రూ.10 రూ.30 రూ.440 పైగా 76–125 రూ.10 రూ.45 రూ.850 పైగా 126–225 రూ.10 రూ.50 రూ.1,800 పైగా 226–400 రూ. 10 రూ.65 రూ.4,200 పైగా 401–500 రూ.10 రూ.65 రూ.5,800 పైగా 501–600 రూ.10 రూ.65 రూ.6,800 పైగా జిల్లాలోని ప్రతి వినియోగదారుడికి విద్యుత్ బిల్లులతోపాటు వాడకాన్ని బట్టి గత ప్రభుత్వంతో పోల్చుకుంటే కూటమి ప్రభుత్వంలో అదనంగా రూ.100 నుంచి రూ.1,000 అదనంగా ఇంధన సర్దుబాటు, ట్రూఅప్ చార్జీల రూపంలో వసూలు చేస్తోంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో మినిమం 30 యూనిట్లలోపు వినియోగంలోపు వాడకానికి అన్ని చార్జీలు కలుపుకుని రూ.92 ఉంటే.. కూటమి ప్రభుత్వంలో రూ.192లకుపైగా బిల్లు వస్తోంది. అదే 600 యూనిట్ల లోపు విద్యుత్ వినియోగానికి వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అన్ని చార్జీలు కలుపుకుని రూ.5,925 వస్తే.. కూటమి ప్రభుత్వంలో రూ.6,800 పైగా బిల్లు వస్తోంది. జిల్లాలో మొత్తం గృహవిద్యుత్ కనెక్షన్లు 9,63,379 ఉన్నాయి. ఈ లెక్కన ప్రతి నెలా ట్రూఅప్ చార్జీలు, ఇందన సర్దుబాటు చార్జీల రూపంలో దాదాపుగా రూ.50 కోట్ల వరకు అదనపు చార్జీల రూపంలో ప్రజలపై అదనపు భారం వేసి వసూలు చేస్తున్నారు. -
29న ఏటీఎస్ ప్రారంభం
నెల్లూరు (టౌన్): జిల్లాలోని ముత్తుకూరు మండలం కప్పలదొరువులో ఏర్పాటు చేస్తున్న ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్ (ఏటీఎస్)ను ఈ నెల 29న ప్రారంభించనున్నారు. ఈ ఏటీఎస్ కేంద్రాన్ని ప్రణీత్ ఆథరైజ్డ్ టెస్టింగ్ సెంటర్స్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్మాణం చేపడుతోంది. ఇది ప్రారంభమైతే జిల్లాలోని నెల్లూరుతోపాటు ఆత్మకూరు, కావలి, కందుకూరు రవాణా కార్యాలయ పరిధిలోని అన్ని రవాణా వాహనాలకు ఇక్కడే ఫిట్నెస్ పరీక్ష చేయించుకుని సర్టిఫికెట్‌ను పొందాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు రవాణా వాహనాలకు జిల్లా రవాణాశాఖాధికారులే ఫిట్నెస్ సర్టిఫికెట్‌ను జారీ చేస్తున్నారు. కానిస్టేబుళ్ల సర్టిఫికెట్ల పరిశీలన ● 243 మందికి 235 మంది హాజరు నెల్లూరు (క్రైమ్): ఏపీ స్టేట్ లెవల్ పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు నిర్వహించిన కానిస్టేబుల్ పరీక్షల్లో ఉత్తీర్ణత పొంది ఉద్యోగం సాధించిన అభ్యర్థులకు శనివారం స్థానిక ఉమేష్‌చంద్ర కాన్ఫరెన్స్ హాల్లో సర్టిఫికెట్ల పరిశీలన జరిగింది. 243 మంది హాజరుకావాల్సి ఉండగా 235 మంది హాజరయ్యారు. ఎనిమిది మంది గైర్హాజరయ్యారు. సివిల్‌లో 142 మందికి 137 మంది, ఏపీఎస్పీలో 101 మందికి 98 మంది హాజరయ్యారు. వారి విద్యార్హతలు, క్రీడా సర్టిఫికెట్లు, కేటగిరీకి సంబంధించిన ధ్రువపత్రాలను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు. ఎస్పీ జి.కృష్ణకాంత్ మాట్లాడుతూ కానిస్టేబుల్ ఉద్యోగాలు సాధించిన వారు భవిష్యత్‌లో క్రమశిక్షణ, నిబద్ధతతో ప్రజాసేవ చేయాని సూచించారు. సర్టిఫికెట్ల పరిశీలనలో ఏఓ చంద్రమౌళి, సూపరింటెండెంట్ సురేష్, డీపీఓ సిబ్బంది పాల్గొన్నారు. డీఎస్సీ మెరిట్ జాబితా విడుదల నెల్లూరు (టౌన్): డీఎస్సీ మెరిట్ జాబితా విడుదల చేసినట్లు డీఈఓ బాలాజీరావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. డీఎస్సీలో ఎంపికై న అభ్యర్థులకు ఈ నెల 25న మద్రా సు బస్టాండ్ సమీపంలోని వీఆర్ ఐపీఎస్ (వీఆర్ పీజీ కళాశాల)లో సర్టిఫికెట్లు వెరిఫికేషన్ ప్రారంభమవుతుందన్నారు. ఇతర వివరాల కోసం గిరీష్‌చంద్ర 7680009933, అజమ్‌తుల్లా 7075538818 నంబర్లలో సంప్రదించాలన్నారు. -
సింహ వాహనంపై ఊరేగిన వెంకయ్యస్వామి
వెంకటాచలం: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం గొలగమూడి వెంకయ్యస్వామి 43వ ఆరాధనోత్సవాల్లో భాగంగా శనివారం సింహవాహన సేవ నిర్వహించారు. ఆలయంలో నిత్య పూజలు అనంతరం వెంకయ్యస్వామిని సింహవాహనంపై ఆశీనులను చేసి పూలతో అలంకరించారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ గ్రామోత్సవం నిర్వహించారు. ఈ ఉత్సవం ముందు వెంకయ్యస్వామి ఆశ్రమ భజన బృందం కోలాట ప్రదర్శనలు చేశారు. సింహవాహన సేవకు వేమూరు కిషోర్‌కుమార్, నాగవెంకట అరుణలత, వెవెంకటసాయి సాత్విక్ ఉభయకర్తలుగా వ్యవహరించారు. కనుల పండువగా గరుడ వాహనసేవ ఆరాధనోత్సవాల్లో భాగంగా శనివారం రాత్రి గరుడ వాహన సేవ నిర్వహించారు. గొలగమూడి వీధుల్లో కనుల పండుగా సాగింది. గరుడవాహన సేవకు నెల్లూరుకు చెందిన బీవీ లక్ష్మి, హేమంత్‌రెడ్డి ఉభయకర్తలుగా వ్యవహరించారు. అనంతరం పలు సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించారు. ఉత్సవాలను ఆశ్రమ ఈఓ పి.బాలసుబ్రహ్మణ్యం పర్యవేక్షించారు. నేడు వెంకయ్యస్వామి ఆరాధనోత్సవం భగవాన్ శ్రీ వెంకయ్యస్వామి 43వ ఆరాధన మహోత్సవాలు ఆదివారంతో ముగియనున్నాయి. ఉదయం 10 గంటలకు రథోత్సవం జరగనుంది. రాత్రి 8 గంటలకు కోనేరులో తెప్పోత్సవం కనుల పండువగా సాగనుంది. ఆరాధనోత్సవాల్లో చివరి రోజు కావడంతో భక్తులు వేలాది సంఖ్యలో హాజరు కానుండడంతో ఏర్పాట్లు పూర్తి చేశారు. -
ట్రాఫిక్ నరకం
జానా బెత్తెడు రోడ్లు.. మధ్యలో బారికేడ్లు నెల్లూరులో ‘ట్రాఫిక్’ ప్రజలకు నరకం చూపిస్తోంది. ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించాలని తీసుకుంటున్న అనాలోచిత చర్యలు బూమ్రాంగ్ అవుతున్నాయి. మినీబైపాస్ రోడ్డు, విజయమహల్ గేటు రోడ్డు, గేటు నుంచి పొగతోటకు వెళ్లే మార్గాలు జానాబెత్తెడుగా ఉంటాయి. ఈ మార్గాల్లోనే ట్రాఫిక్ కూడా అధికంగా ఉంటుంది. దీనికి తోడు ఆయా రోడ్లల్లో కార్లు పార్కింగ్ చేస్తున్నా.. పట్టించుకోని ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరిస్తున్నామనే బిల్డప్ కోసం సర్కిల్స్ల్లో డివైడర్లు, రోడ్డు మధ్యలో బారికేడ్లు పెట్టడంతో ఈ సమస్య మరింత జఠిలంగా మారుతోంది. పూలే సెంటర్ పరిస్థితి చూస్తే ఒక పక్క రోడ్డు మీదనే ఆటోలను నిలిపేస్తున్నారు. మరో వైపు దుకాణాలు పెట్టి వ్యాపారాలు చేస్తున్నారు. మరో వైపు ఏకంగా కార్లు, బైక్‌లు రోడ్డు మీదకు పార్కింగ్ చేస్తున్నారు. అడ్డదిడ్డంగా దూసుకువచ్చే ఆటోలు, బైకర్లతో ప్రధాన రహదారులు ట్రాఫిక్ స్తంభించిపోయి పద్మవ్యూహాన్ని తలపిస్తున్నాయి. పూలే సెంటర్ కూడలి ఉన్నప్పటికీ డివైడర్ రాళ్లు పెట్టడంతో బాలాజీనగర్ నుంచి ఆత్మకూరు బస్టాండ్ వైపు వెళ్లాంటే అర కి.మీ. దూరం ముందుకెళ్లి.. తిరిగి అంతే దూరం వెనక్కి రావాల్సిన దుస్థితి ఉంది. ఇక విజయమహల్ గేటు వైపు వెళ్లాలన్నా.. అదే పరిస్థితి. విజయమహల్ రోడ్డు అసలే రద్దీగా ఉంటుంది. విజయమహల్ గేటు రోడ్డు మీదకే తోపుడు బండ్లు ఉండడం, మరో వైపు దుకాణాలకు వచ్చే వాహనాలు పార్కింగ్తో కుచించుకుపోయింది. దీంతో ఒక కారు, ఒక బైక్ ఎదురెదురుగా కూడా వెళ్లలేని పరిస్థితి. తాజాగా రామలింగాపురం అండర్ బ్రిడ్జి వద్ద పనులు జరుగుతున్న నేపథ్యంలో ట్రాఫిక్ మొత్తం విజయమహల్ గేటు రోడ్డులోకి మళ్లింది. నిత్యం అత్యంత రద్దీగా ఉండే విజయమహల్ గేటు రోడ్డులో అండర్ బ్రిడ్జిని దాటుకుని పోయే సరికి వాహనచోదకులకు చుక్కలు కనిపిస్తున్నాయి. అసలే జానా బెత్తెడు రోడ్డులో ఇటీవల ట్రాఫిక్ పోలీసులు బారికేడ్లు పెట్టడడంతో పూర్తిగా స్తంభించిపోతోంది. విధులు వదిలేసి కేసులు రాయ డంలో బిజీబిజీగా ఉంటున్నారు. ప్రధానంగా మినీబైపాస్‌లో పూలేబొమ్మ సెంటర్, విజయమహల్ గేటు సెంటర్లలో విధులు నిర్వర్తించే సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఈ రెండు ప్రాంతాల్లో వాహనాలు అడ్డదిడ్డంగా నడిపేస్తూ ట్రాఫిక్‌కు అంతరాయం కలిగిస్తున్నా.. కళ్ల ముందే ట్రాఫిక్ నిలిచిపోయినా తాఫీగా చూస్తున్న పరిస్థితులు కళ్లకు కట్టినట్లు కనిపిస్తున్నాయి. – సాక్షి ఫొటోగ్రాఫర్, నెల్లూరు -
ప్రభుత్వంపై అలుపెరగని పోరాటం
నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట): కూటమి ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎన్ని అక్రమ కేసులు పెట్టినా, జైళ్లకు పంపించినా భయపడేది లేదని, దుర్మార్గ పాలన, ఆగడాలపై అలుపెరగని పోరాటం చేస్తామని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులతో దాదాపు 86 రోజులు జిల్లా జైల్లో రిమాండ్‌లో ఉన్న కాకాణికి ఇటీవల బెయిల్ మంజూరైన తర్వాత హైకోర్టు విధించిన షరతులు సడలించడంతో శనివారం నెల్లూరు నగరానికి విచ్చేశారు. ఈ సందర్భంగా జిల్లా వైఎస్సార్సీపీ కార్యాలయంలో కాకాణి విలేకరులతో మాట్లాడారు. తనకు బెయిల్ వచ్చిన తరువాత అధికారులు చార్జిషీటు ఫైల్ చేసేంత వరకు జిల్లా పరిధిలోకి రావద్దని షరతులు విధించారని, అయితే ప్రతి ఆదివారం పోలీసు కార్యాలయంలో హాజరు కావాలన్న నిబంధన ఉండడంతో హైకోర్టును ఆశ్రయించడంతో తనకు సడలింపునివ్వడంతో ఒక్క రోజు ముందుగానే నెల్లూరుకు వచ్చే అవకాశం కలిగిందన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 14 నెలల్లో తనపై 14 కేసులు పెట్టారని, నెలకు ఒక్క కేసు నమోదైందన్నారు. తర్వాత ఎన్ని అవుతాయో తెలియదన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తనకు, తన కుటుంబానికి అండగా ఉన్నారని కృతజ్ఞతలు తెలిపారు. అధికారులు సూచించిన హెలిప్యాడ్ ప్రాంతం ప్రమాదకరమని తెలిసినా లెక్క చేయకుండా ఆ హెలిప్యాడ్‌లోనే దిగి తనను, ప్రసన్నను, కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం నింపిన జగన్మోహన్రెడ్డిని మళ్లీ సీఎంను చేసేలా అందరం కష్టపడుతామన్నారు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఉన్న 10 సీట్లతోపాటు కందుకూరు నియోజకవర్గంతో కలిపి 11 సీట్లు రెండు పార్లమెంట్ స్థానాల్లో వైఎస్‌స్రా్‌సీపీ విజయం సాధించేలా చేస్తామన్నారు. తమను జైల్లో ఉంచిన రోజులే తమ గళం ఆపగలరు తప్ప.. బయట ఉంటే ఆ గళాన్ని ఆపలేరన్నారు. కష్టకాలంలో తన బిడ్డ పూజిత అందరికి ధైర్యంగా నిలిచిందని, ఆ బిడ్డకు అందరి ఆశీస్సు లు ఎల్లవేళలా ఉండాలన్నారు. కష్టకాలంలో ఉన్నటువంటి తమ కుటుంబానికి ఒక జోనల్ మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని పూజితకు ఇవ్వడం తమ నాయకుడు జగన్మోహన్రెడ్డి తమ వారికి ఇచ్చే ప్రాధాన్యతను తెలియజేస్తుందన్నారు. విశ్వాసానికి, విలువలకు ప్రతిరూపం జగన్మోహన్రెడ్డి అయితే అక్రమాలకు బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు అన్నారు. వైఎస్సార్సీపీ శ్రేణులకు, కార్యకర్తలకు 2029 ఎన్నికల్లో మళ్లీ జగనన్న చెప్పినట్లుగా జగన్ 2.0లో అందరం భుజాలకు ఎత్తుకుని మోయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. తనకున్న ఆస్తి సర్వేపల్లి, జిల్లా ప్రజల ప్రేమాభిమానాలేనని, తనపై అక్రమ కేసులు పెట్టి జైల్లో ఉంచినప్పుడు తనకు, తన కుటుంబ సభ్యులకు జిల్లా ప్రజానీకం, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు తమ నాయకుడు జగన్మోహన్రెడ్డి అండగా ఉన్నారని, అందరికి కృతజ్ఞతలు తెలిపారు. మళ్లీ జగన్‌ను సీఎం చేస్తాం కష్టకాలంలో తోడుగా నిలిచిన వారందరికి ధన్యవాదాలు వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి -
ఒకే డీఎస్సీలో మూడు పోస్టులు
స్కూల్ అసిస్టెంట్ విభాగంలో మూడో ర్యాంక్ పొదలకూరు : మండలంలోని బి.చెర్లోపల్లి గ్రామానికి చెందిన తిరుమూరు స్వప్న 2025 డీఎస్సీ పోటీ పరీక్షల్లో ఒకే పర్యాయం మూడు పోస్టులను సాధించి తన ప్రతిభను కనపరిచారు. స్కూల్ అసిస్టెంట్ హిందీలో జిల్లా స్థాయిలో మూడో ర్యాంకు, పీజీటీలో జిల్లా స్థాయిలో రెండో ర్యాంకు, టీజీటీలో జిల్లా స్థాయిలో ఐదో ర్యాంకు సాధించారు. 2018లో డీఎస్సీలో అర్హత సాధించలేకపోయిన స్వప్న 2025 డీఎస్సీలో మూడు పోస్టులను సాధించడంతోపాటు ర్యాంకర్‌గా నిలిచారు. పట్టుదల, కృషితో ఆమె ఈ విజయాన్ని అందుకున్నారు. -
డీఎస్సీలో మూడు పోస్టులకు అర్హత
ఉదయగిరి : డీఎస్సీ పరీక్ష ఫలితాల్లో ఉదయగిరి మండలం సున్నంవారిచింతల గ్రామానికి చెందిన పులిమి శ్రీతేజ మూడు ఉద్యోగాలు సాధించింది. ఈమె ఎస్ఏ సోషల్ సబ్జెక్ట్‌లో జిల్లా స్థాయిలో 82.11 మార్కులు సాధించి 4వ ర్యాంక్‌లో, టీజీటీ జోనల్– 3 స్థాయిలో 73.20 మార్కులు సాధించి 17వ ర్యాంక్, ఎస్జీటీ చిత్తూరు జిల్లాలో నాన్ లోకల్లో 86.92 మార్కులతో 33వ ర్యాంక్ సాధించి తన ప్రతిభ చాటారు. ● ఉదయగిరికి చెందిన ఒకే కుటుంబానికి చెందిన అన్నదమ్ములు షేక్ నసృల్లా ఇంగ్లిష్ ఎస్ఏ సబ్జెక్ట్‌లో 57వ ర్యాంక్, షేక్ సిగ్భతుల్లా జోన్–3 పీఈటీ విభాగంలో 1వ ర్యాంక్, జనరల్ కేటగిరీలో 179వ ర్యాంకులు సాధించి ఉద్యోగం తెచ్చుకున్నారు. బంగారు హారం బహూకరణ సంగం: సంగం ఆంజనేయస్వామి ఆలయానికి ఓ దాత సుమారు రూ.6 లక్షల విలువైన బంగారు హారాన్ని శనివారం బహూకరించారు. ముందుగా స్వామి వారికి విశేష పుష్పాలంకరణ చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. హారాన్ని సమర్పించారు. స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. -
రాష్ట్రస్థాయి ఫుట్‌బాల్ పోటీలు ప్రారంభం
నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట): నగరంలోని ఏసీ సుబ్బారెడ్డి స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో రాష్ట్రస్థాయి సీనియర్ మహిళా ఫుట్‌బాల్ పోటీలను శనివారం ప్రారంభించారు. జిల్లా ఫుట్‌బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో సీనియర్ క్రీడాకారుడు, బరోడా బ్యాంకు రిటైర్డ్ జీఎం అనిల్‌కుమార్ పోటీలను ప్రారంభించారు. సీనియర్ క్రీడాకారులు ప్రతాప్, చిట్టి, చలపతి, సురేష్, సీనియర్ ఫుట్‌బాల్ ప్లేయర్, జిల్లా ఫుట్‌బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు మలిరెడ్డి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. తొలిరోజు ఫలితాలు వైఎస్సార్ కడప జట్టుపై అనంతపురం జట్టు 2–1 గోల్స్‌తో గెలుపొందగా, ఎన్టీఆర్ జిల్లా– వైఎస్సార్ జిల్లాపై 5–0 గోల్స్‌తో, నెల్లూరు జిల్లా జట్టు – ఎన్టీఆర్ జిల్లాపై 2–0 గోల్స్‌తో, అనంతపురం జట్టు –పల్నాడుపై 10–0 గోల్స్‌తో, నెల్లూరు–వైఎస్సార్ జిల్లాపై 5–0 గోల్స్‌తో, వైఎస్సార్ కడప–పల్నాడు జిల్లా జట్టుపై 7–0 గోల్స్‌తో విజయం సాధించాయి. ఆదివారం ఉదయం సెమీఫైనల్స్, మధ్యాహ్నం ఫైనల్స్, బహుమతు ప్రదానోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని ఫుట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి బి.చంద్రశేఖర్ తెలిపారు. -
ఎరువు.. మరింత బరువు
● యూరియా కొరత సాకుతో అదనపు వసూలు ● ఆందోళనలో అన్నదాతలు ఏడాది కాలంలో పెరిగిన ధరలు ఎరువు రకం గతేడాది ధర ప్రస్తుత ధర 20ః20ః0ః13 రూ.1,300 రూ.1,400 10ః26ః26 రూ.1,470 రూ.1,800 14ః35ః14 రూ.1,700 రూ.1,800 పొటాష్ రూ.1,535 రూ.1,900 సింగిల్ సూపర్ పాస్పేట్ రూ.580 రూ.640 ప్రైవేటు డీలర్ల దందా ప్రస్తుతం రైతులు సాగు చేస్తున్న వివిధ పైర్లకు యూరియాతో పాటు పలు రకాల కాంప్లెక్స్ ఎరువులు వేస్తున్నారు. కానీ రైతు సేవా కేంద్రాల్లో ఎరువులు అందుబాటులో లేకపోవడంతో ప్రైవేటు డీలర్లను ఆశ్రయిస్తున్నారు. ఈ క్రమంలో కొందరు వ్యాపారులు యూరియా కావాలంటే ఇతర కాంప్లెక్స్ ఎరువులు, కాల్షియం, పొటాషియం, నానో డీఏపీ, నానో యూరియా కొనాలంటూ షరతులు పెడుతున్నారు. అలాగే జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో డీఏపీ ఎరువుకు కూడా అదనపు వసూలు చేస్తున్నారు. వీటిపై ప్రశ్నిస్తే యూరియా, డీఏపీ సరఫరా చేసే డిస్ట్రిబ్యూటర్లు నిబంధనలు పెడుతూ అదనంగా ఇతర ఎరువులు తమకు అంటగడుతున్నారని డీలర్లు వాపోతున్నారు. దీంతో డిమాండ్ ఉన్న ఎరువులను ధరలు పెంచి అమ్మాల్సి వస్తోందని, లేదా ఇతర రకాల ఎరువులు కొనాలి అని షరతులు పెడుతున్న మాట వాస్తవమే అని కొందరు వ్యాపారులు ఒప్పుకుంటున్నారు. పెరిగిన కాంప్లెక్స్ ఎరువుల ధరలు ప్రస్తుతం జిల్లాలో వరితో పాటు మిరప, బొప్పాయి, అరటి, ఇతర ఉద్యాన వన తోటలు సాగులో ఉన్నాయి. మెట్ట ప్రాంతంలో కూడా ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు కంది, అలసంద, మినుము తదితర అపరాల సాగు చేస్తున్నారు. ఈ పైర్ల సాగు కోసం యూరియా డీఏపీ ఎక్కువగా వాడుతున్నారు. దీనికి తోడు జిల్లాలో విస్తారంగా సాగులో ఉన్న జామాయిల్‌కు ధర తక్కువగా ఉన్నందున యూరియా వాడుతున్నారు. కానీ వ్యవసాయాధికారులు జామాయిల్ సాగు చేసే రైతులకు యూరియా ఇవ్వడం లేదని, వారు కాంప్లెక్స్ ఎరువులు మాత్రమే వాడాలని చెబుతున్నా అమలు కావడం లేదు. డీఏపీ కొంతమేర అందుబాటులో ఉంది. అయితే ప్రైవేటు డీలర్లు అదనపు ధర వసూలు చేస్తున్నారు. కాంప్లెక్స్ ఎరువుల ధరలు ఎక్కువగా ఉండటంతో సాగు ఖర్చులు పెరుగుతున్నాయి. దీనికి అనుగుణంగా దిగుబడులు ఆశాజనకంగా లేకపోవడంతో నష్టాలు వస్తాయని రైతులు అందోళన చెందుతున్నారు. పచ్చిరొట్ట ఎరువులు విస్తారంగా సాగు చేసి భూమిలో కలియదున్నితే చాలా వరకు రసాయన ఎరువుల వినియోగం తగ్గించే అవకాశం ఉంది. కానీ పచ్చిరొట్టగా సాగు చేసే పిల్లి పెసర, జనుము, జీలగలు ప్రభుత్వం రాయితీపై నామమాత్రంగా సరఫరా చేసింది. దీంతో చాలా మంది రైతులు బహిరంగ మార్కెట్లో ఎక్కువ ధరలు చెల్లించి పచ్చిరొట్ట విత్తనాలను కొనుగోలు చేయలేకపోతున్నారు. ఫలితంగా పైరు సాగు చేసినప్పటి నుంచి కోత వరకు రసాయన ఎరువుల వినియోగంపై ఆధారపడుతున్నారు. దీంతో ఎరువుల వినియోగం పెరిగి రైతులపై భారం పడుతోంది. కూటమి ప్రభుత్వంలో అన్నదాతల పరిస్థితి దయనీయంగా మారింది. పెరిగిన సాగు ఖర్చులకు తోడు ఎరువుల ధరలు కూడా అమాంతం పెరిగిపోవడంతో రైతులు దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారు. యూరియా కొరత పేరుతో వ్యాపారులు ఎరువుల ధరలు పెంచి రైతులపై మరింత భారం మోపుతున్నారు. పంటలకు ప్రధానంగా అవసరమైన కాంప్లెక్స్ ఎరువుల ధరలు ప్రతి ఏడాది క్రమేణా పెరుగుతుండడం అన్నదాతలపై అదనపు భారంగా మారింది. – ఉదయగిరి -
సంపూర్ణ అక్షరాస్యతకు కృషి
కొడవలూరు: సంపూర్ణ అక్షరాస్యతకు కృషి చేద్దామని అక్షరాంధ్ర జిల్లా నోడల్ అధికారి మస్తాన్‌రెడ్డి పిలుపునిచ్చారు. కొడవలూరు జెడ్పీ హైస్కూల్లో అక్షరాస్యత వలంటీర్లకు శిక్షణా కార్యక్రమం శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోవూరు నియోజకవర్గాన్ని సంపూర్ణ అక్షరాస్యతతో తీర్చిదిద్దాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. గ్రామస్థాయిలోని అక్షరాస్యత వలంటీర్లు సాయంత్రం రెండు గంటల సమయం కేటాయించి చదువు చెప్పాలన్నారు. ప్రజలు వేలిముద్రలు వేయకుండా చదువు నేర్చుకుని చైతన్యవంతులుగా ఉండాలని ఆకాంక్షించారు. ఎంపీడీఓ ఎ.వెంకట సుబ్బారావు మాట్లాడుతూ మండలాన్ని వంద శాతం అక్షరాస్యతగా తీర్చిదిద్దుదామని కోరారు. కార్యక్రమంలో అక్షరాంధ్ర సూపర్వైజర్ శిరీష, ఎంఈఓలు జి.వసంతకుమారి, ఎన్.అంకయ్య, ఏపీఎం కృష్ణవేణి, హెచ్ఎం సత్యనారాయణ పాల్గొన్నారు. -
శాస్త్రోక్తంగా ఊంజల్‌సేవ
రాపూరు: మండలంలోని పెంచలకోనలో కొలువైన ఆదిలక్ష్మి, చెంచులక్ష్మీదేవి సమేత పెనుశిల లక్ష్మీనరసింహస్వామికి ఊంజల్‌సేవ శనివారం సాయంత్రం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఉత్సవమూర్తులను అలంకార మండపంలోకి తీసుకొచ్చి అక్కడ తిరుచ్చిపై కొలువుదీర్చారు. ఆభరణాలు, వివిధ రకాల పుష్పాలతో శోభాయమానంగా అలంకరించారు. అనంతరం సహస్రదీపాలంకరణ మండపంలో ఊంజల్‌సేవను నేత్రపర్వంగా నిర్వహించారు. ఉదయం నిత్య కల్యాణ మండపంలో స్వామి, అమ్మవార్ల కల్యాణం ఆగమోక్తంగా సాగింది. భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేసి స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. రైలు కింద పడి వ్యక్తి ఆత్మహత్య నెల్లూరు(క్రైమ్): ఏం కష్టమొచ్చిందో తెలియదు కానీ రైలు కింద పడి గుర్తుతెలియని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన విజయమహల్ గేటు సమీపంలో నెల్లూరు వైపు వచ్చే రైలు పట్టాలపై శనివారం చోటుచేసుకుంది. మృతుడు సుమారు 45 నుంచి 50 ఏళ్లలోపు వయస్సు కలిగి లేత పసుపురంగు ఫుల్ హ్యాండ్స్ చొక్కా, నలుపు రంగు ప్యాంట్ ధరించి ఉన్నాడు. ప్రమాద ఘటనపై సమాచారం అందుకున్న రైల్వే ఎస్సై ఎన్.హరిచందన ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని జీజీహెచ్ మార్చురీకి తరలించి కేసు నమోదు చేశారు. -
చోరీ కేసులో నిందితుడి అరెస్ట్
నెల్లూరు(క్రైమ్): ఇంట్లో చోరీకి పాల్పడి తప్పించుకు తిరుగుతున్న ఓ దొంగను నవాబుపేట పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. నవాబుపేట పోలీస్‌స్టేషన్‌లో ఇన్స్పెక్టర్ జి.వేణుగోపాల్‌రెడ్డి నిందితుడి వివరాలను వెల్లడించారు. వెంకటేశ్వరపురం రైలువీధిలో సయ్యద్ షబ్బీర్ కుటుంబం నివాసం ఉంటోంది. ఆయన ఈనెల 20వ తేదీన కుటుంబంతో కలిసి ఉదయగిరిలో గంధ మహోత్సవ కార్యక్రమానికి వెళ్లారు. ఈ క్రమంలో గుర్తుతెలియని దుండగుడు ఆయన ఇంటి తాళాలు పగులగొట్టి బీరువాలోని పది సవర్ల బంగారు ఆభరణాలను దోచుకెళ్లారు. బాధితుడి ఫిర్యాదు మేరకు నవాబుపేట పోలీసులు కేసు నమోదు చేశారు. సాంకేతికత ఆధారంగా నిందితుడు అదే ప్రాంతానికి చెందిన అరవ సుబ్రహ్మణ్యంగా గుర్తించారు. పరారీలో ఉన్న నిందితుడిని శనివారం అరెస్ట్ చేసి చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. వ్యసనాలకు బానిసైన నిందితుడు దొంగతనాలకు పాల్పడుతున్నాడని ఇన్స్పెక్టర్ తెలిపారు. నిందితుడిని అరెస్ట్ చేయడంలో ప్రతిభ కనపరిచిన సిబ్బందిని ఎస్పీ అభినందించారు. సమావేశంలో ఎస్సై కె.భోజ్యానాయక్, సిబ్బంది పాల్గొన్నారు. -
లోపాలు తలెత్తితే చర్యలు తప్పవు
● 38.4 శాతం మంది అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ● ఏపీఎస్పీడీసీఎల్ డైరెక్టర్ గురవయ్య నెల్లూరు(వీఆర్సీసెంటర్): వినియోగదారులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయడం మనందరి బాధ్యత అని, ఎక్కడైనా లోపాలు తలెత్తితే చర్యలు తప్పవని ఏపీఎస్పీడీసీఎల్ డైరెక్టర్ (టెక్నికల్) గురవయ్య అన్నారు. నగరంలోని విద్యుత్‌భవన్‌లో శనివారం ఆయన టౌన్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యుత్ సరఫరాలో అంతరాయాలు లేకుండా విద్యుత్ సంస్థలోని అన్ని విభాగాల సిబ్బంది బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. విద్యుత్ సరఫరాలో అంతరాయాలపై వచ్చిన ఫిర్యాదులు, లో–ఓల్టేజీ సమస్య, విద్యుత్ ఫీడర్స్‌లో తరచూ తలెత్తే అంతరాయాలకు సంబంధించిన గణాంకాలు తన వద్ద ఉన్నాయని, నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. విద్యుత్ అధికారులు తరచూ క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ విద్యుత్ లైన్ల లోపాలు ముందుగా గుర్తించి పునరుద్ధరణ చేపట్టాలని, ఫ్యూజ్ ఆఫ్ కాల్ ఫోన్లకు వచ్చే ఫిర్యాదులను నమోదు చేసి సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు. విద్యుత్ అధికారులు, సిబ్బంది హెడ్ క్వాటర్స్‌లోనే ఉండాలని, పీఎం సూర్యఘర్‌పై అవగాహన కలిగించాలని, పెండింగ్ బిల్లులను త్వరితగతిన వసూలు చేయాలని సూచించారు. విద్యుత్ సరఫరాలో తలెత్తిన సమస్యలపై 1912, వాట్సాప్ నంబర్ 91333 31912లకు ఫిర్యాదు చేయాలని కోరారు. పలు సబ్స్టేషన్ల తనిఖీ నగరంలోని డీఎస్సార్ సబ్‌స్టేషన్, కోవూరు తాలూకా ఆఫీసు వద్ద ఉన్న సబ్స్టేషన్లను ఏపీఎస్పీడీసీఎల్ డైరెక్టర్ గురవయ్య పరిశీలించి రికార్డులు తనిఖీ చేశారు. అనంతరం కోవూరు డివిజన్ కార్యాలయంలో విద్యుత్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. నిరంతర విద్యుత్ సరఫరాపై 38.4 శాతం మంది వినియోగదారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. ప్రజలకు మంచి సేవలు అందేలా అధికారులు, సిబ్బంది పనిచేయాలని సూచించారు. అధికారులు తరచూ సబ్స్టేషన్లను తనిఖీ చేస్తూ ఉండాలని ఆదేశించారు. విద్యుత్ చౌర్యం, అడిషనల్ లోడ్లను గుర్తించి చర్యలు తీసుకోవాలన్నారు. ట్రాన్స్ఫార్మర్ల నిర్వహణ సక్రమంగా లేకపోవడంతో తరచూ ఫెయిల్ అవుతున్నాయని మండిపడ్డారు. అనంతరం సబ్‌స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో జిల్లా ఎస్ఈ విజయన్, నోడల్ అధికారి శేషాద్రి బాలచంద్ర, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు శ్రీధర్, రమేష్‌చౌదరి, డీఈఈలు అశోక్, సునీల్, కిరణ్, మధుసూదన్‌రెడ్డి, సతీష్, సురేంద్ర, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. -
రాష్ట్ర స్థాయి బ్యాడ్మింటన్ పోటీలు ప్రారంభం
నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట): నగరంలోని ఏసీ సుబ్బారెడ్డి ఇండోర్ స్టేడియంలో యూనెక్స్ సన్‌రైజ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బ్యాడ్మింటన్ అండర్ – 15 పోటీలను శుక్రవారం ప్రారంభించారు. నారాయణ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఎండీ వేమిరెడ్డి భాస్కర్‌రెడ్డి, టీడీపీ నాయకుడు కోటంరెడ్డి గిరిధర్‌రెడ్డి, చౌదరి జ్యూవెలర్స్ ఎండీ రాజేష్ చౌదరి, 27వ డివిజన్ కార్పొరేటర్ మురహరి అతిథులుగా హాజరయ్యారు. రాష్ట్ర బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షుడు ముక్కాల ద్వారకానాథ్, జాయింట్ సెక్రటరీ డాక్టర్ పి.అంకమ్మ చౌదరి మాట్లాడుతూ 238 మంది క్రీడాకారులు పోటీ పడుతున్నారని తెలిపారు. ప్రతిభ చూపిన వారిని జాతీయ స్థాయికి ఎంపికవుతారన్నారు. కార్యక్రమంలో అసోసియేన్ జాయింట్ సెక్రటరీ మద్దిపాటి ప్రసాద్‌రావు, ట్రెజరర్ గాధంశెట్టి శ్రీకాంత్, కోచ్‌లు, అంపైర్లు పాల్గొన్నారు. -
ఎన్‌ఐఓటీతో ఒప్పందం విద్యార్థులకు వరం
● వీఎస్‌యూ వీసీ అల్లం శ్రీనివాసరావు వెంకటాచలం: విక్రమ సింహపురి యూనివర్సిటీ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ సంస్థ (ఎన్ఐఓటీ) మధ్య కుదిరిన ఒప్పందం విద్యార్థులకు వరమని వర్సిటీ వీసీ అల్లం శ్రీనివాసరావు పేర్కొన్నారు. మండలంలోని వీఎస్‌యూలో వీసీ ఇతర అధికారులతో కలిసి ఒప్పందానికి సంబంధించిన పత్రాలను శుక్రవారం ప్రదర్శించారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వీఎస్‌యూ, ఎన్ఐఓటీ మధ్య ఈనెల 20వ తేదీన ఒప్పందం కుదిరిందని చెప్పారు. మనిషి సముద్రంపై అవగాహన పెంచుకోవడంలో విఫలం చెందాడన్నారు. ఎన్నో ఖనిజాలకు నెలవైన సముద్రాన్ని అన్వేషించడం దేశ ఆర్థిక ప్రగతి మరింత పెరిగే అవకాశాలున్నాయని తెలియజేశారు. గుజరాత్ రాష్ట్రం అత్యధిక తీర ప్రాంతంతో మొదటి స్థానంలో ఉంటే, మన రాష్ట్రం రెండో స్థానంలో ఉందన్నారు. పరిశోధనలు ముమ్మరం చేయాలని ప్రధాని నరేంద్రమోదీ రూ.4,500 కోట్లతో సముద్రయాన్ పథకాన్ని రూపొందించారని, ఇది మైరెన్ బయాలజీ విభాగం విద్యార్థులకు ఎంతో ప్రయోజనంగా మారుతుందన్నారు. ఒప్పందం కింద మైరెన్ బయాలజీ విభాగానికి రూ.4.12 కోట్ల నిధులు మంజూరు చేశారని వివరించారు. సమావేశంలో ఇన్చార్జి రిజిస్ట్రార్ డాక్టర్ కె.సునీత, మైరెన్ బయాలజీ విభాగం హెడ్ డాక్టర్ హనుమారెడ్డి, సీహెచ్ వెంకట్రాయులు తదితరులు పాల్గొన్నారు. -
‘కూటమి’ నిర్లక్ష్యం
● నిలిచిన రిటైనింగ్ వాల్ పనులు ● పైసా ఇవ్వని ప్రభుత్వం ● పేరుకుపోతున్న చెత్తాచెదారంనెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట): కూటమి ప్రభుత్వం ప్రజలకు ఉపయోగపడే పనులకు నిధులు ఇవ్వడం లేదు. అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నామని ప్రజాప్రతినిధులు మైకు ముందు చెబుతున్నారు. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు మరోలా ఉన్నాయి. గత ప్రభుత్వం చేపట్టిన పనులు పూర్తి చేసేందుకు కనీస చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలున్నాయి. నాడు ఇలా.. పెన్నానది నుంచి నెల్లూరు సిటీ గుండా 20 కిలోమీటర్ల మేర సర్వేపల్లి కాలువ ఉంది. దీని ద్వారా 47 వేల ఎకరాల్లో పంటలకు సాగునీరు అందుతుంది. ఎక్కువగా నీరు, వరదలు వచ్చినప్పుడు కాలువ పొంగడం, గట్టుపై ఉన్న ఇళ్లకు ప్రమాదాలను నివారించేందుకు 2021 సంవత్సరంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం రూ.99 కోట్ల అంచనాలతో రెండు వైపులా రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులను చేపట్టింది. 0.6 కిలోమీటర్ శెట్టిగుంటరోడ్డు నుంచి 0.30 కి.మీ ముత్తుకూరు రోడ్డు బ్రిడ్జి వరకు కాలువకు రెండు వైపులా రిటైనింగ్ వాల్ నిర్మాణాన్ని చేపట్టారు. ఇంత వరకు రూ.54.19 కోట్లు బిల్లులు చెల్లించగా 56 శాతం మేర పనులు పూర్తయ్యాయి. వైఎస్సార్సీపీ ప్రభుత్వం దీనిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. ఇంకా 1.5 కి.మీ పని మిగిలి ఉంది. నిధులివ్వకుండా.. కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఈ కాలువ నిర్మాణానికి నయాపైసా విదల్చలేదు. దీంతో కాంట్రాక్టర్లు పనులు ఆపేశారు. పనులు పూర్తి కాకుండానే పంట కాలువకు నీరు వదలడంతో సిటీ పరిధిలో కాలువలో కొన్నిచోట్ల గండ్లు పడి ప్రజలు ఇబ్బంది పడాల్సి వచ్చింది. పంటలకు నీరు వదిలినా మధ్యలో ఉన్న ఖాళీల్లో చెత్తాచెదారం విపరీతంగా చేరిపోవడంతో దుర్గంధం వెదజల్లుతోంది. కాలువపై ఆక్రమణలు పెరిగిపోతున్నాయి. పనులు, ఆక్రమణలపై ఏఈ డి.మహేశ్వర్ స్పందిస్తూ కొత్తగా బాధ్యతలు చేపట్టాననని, ఉన్నతాధికారులతో మాట్లాడి చర్యలు తీసుకుంటామని తెలిపారు. -
నేటి నుంచి రాష్ట్ర స్థాయి ఫుట్‌బాల్ పోటీలు
నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట): రాష్ట్ర ఫుట్‌బాల్ క్రీడా సంఘం ఆదేశాల ప్రకారం రాష్ట్రస్థాయి సీనియర్ మహిళా ఫుట్‌బాల్ టోర్నమెంట్‌ను శనివారం నుంచి రెండురోజులపాటు నిర్వహిస్తున్నట్లు జిల్లా అసోసియేషన్ కార్యదర్శి చంద్రశేఖర్ శుక్రవారం తెలిపారు. రాష్ట్ర స్థాయి పోటీలకు ఏసీ సుబ్బారెడ్డి స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో అన్ని ఏర్పాట్లను పూర్తి చేశామన్నారు. ప్రతిభ చూపిన వారిని జాతీయ స్థాయి జట్టుకు ఎంపిక చేస్తామన్నారు. శనివారం ఉదయం ప్రారంభోత్సవం, ఆదివారం సాయంత్రం బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమాలను నిర్వహిస్తామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మహిళా క్రీడాకారులతోపాటు అధికారులు, అంపైర్లు హాజరవుతారని తెలిపారు. కావలిలో చైన్నె వాసి మృతికావలి(జలదంకి): చైన్నెకు చెందిన కమలనాథన్ అనే వ్యక్తి కావలి మండలం మద్దూరుపాడులో చనిపోయాడు. కావలి రూరల్ పోలీసుల కథనం మేరకు.. కమలనాథన్‌కు మతిస్థిమితం లేదు. కొంతకాలంగా మద్దూరుపాడు సమీపంలో ఉంటున్నాడు. ఎవరైనా ఆహారం అందిస్తే తింటూ జీవిస్తున్నాడు. శుక్రవారం ఉదయం ఎన్‌హెచ్ – 16 పక్కన సర్వీసు రోడ్డులో పెట్రోల్ బంకు ముందు చనిపోయి ఉన్నాడు. మృతుడికి సుమారు 40 సంవత్సరాల వయసు ఉంటుందని భావిస్తున్నారు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా వారు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కావలి ఏరియా వైద్యశాలకు తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. రైల్లోంచి పడి..● గుర్తుతెలియని వ్యక్తి మృత్యువాత కొడవలూరు: రైల్లోంచి పడి గుర్తుతెలియని వ్యక్తి మృతిచెందిన ఘటన కొడవలూరు – పడుగుపాడు రైల్వేస్టేషన్ల మధ్య శుక్రవారం చోటుచేసుకుంది. రైల్వే ఎస్సై కె.వెంకటేశ్వరరావు కథనం మేరకు.. ఓ వ్యక్తి హౌరా నుంచి బెంగళూరు వెళ్తున్న రైల్లో నుంచి 184 – 3 – 5 పోస్టుల మధ్య ఎగువ లైన్ వద్ద ప్రమాదవశాత్తు జారి పడి చనిపోయాడని భావిస్తున్నారు. అతని వయసు 60 నుంచి 65 సంవత్సరాల మధ్య ఉంటుందని చెబుతున్నారు. ఎరుపు రంగు టీషర్టు, నలుపు, తెలుపు రంగుల డిజైన్ కలిగిన షార్ట్ ధరించి ఉన్నాడు. -
ప్రయోగశాలకు గుర్తింపు
నెల్లూరు(పొగతోట): నెల్లూరు ఆర్డీఓ కార్యాలయం ఆవరణలో ఉన్న ఎరువులు, సేంద్రియ ఎరువుల నాణ్యత నిర్ధారణ ప్రయోగశాలకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. రైతులకు ఎరువుల నాణ్యత, నేల సారవంతంపై మెరుగైన సలహాలు, సూచనలు అందించినందుకు నేషనల్ బోర్డు ఫర్ అక్రిడిటేషన్ ఆఫ్ టెస్టింగ్ అండ్ కాలిబ్రేషన్ లాబొరేటరీస్ గుర్తింపు దక్కింది. రాష్ట్రంలోనే మొదటిసారిగా నెల్లూరు అగ్రికల్చర్ ల్యాబ్‌కు జాతీయ స్థాయి గుర్తింపు రావడంతో వ్యవసాయ శాఖ అధికారులు, శాస్త్రవేత్తలు, సాంకేతిక నిపుణులు, సిబ్బందికి జిల్లా కలెక్టర్ ఆనంద్ అభినందించారు. -
హామీలెప్పుడు నెరవేరుస్తారు?
● కలెక్టరేట్ ఎదుట ఎస్ఎఫ్ఐ నిరసన నెల్లూరు రూరల్: ‘కూటమి ప్రభుత్వం ఏర్పాటై సంవత్సరం దాటిపోయింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఎప్పుడు నెరవేరుస్తారు’ అని ఎస్ఎఫ్ఐ నేతలు ప్రశ్నించారు. విద్యారంగంలో నెలకొన్న సమస్యల్ని వెంటనే పరిష్కరించాలంటూ ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ నాయకులు శుక్రవారం నెల్లూరులోని కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపారు. అనంతరం జాయింట్ కలెక్టర్ కార్తీక్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ రూ.6,400 కోట్లను విడుదల చేయాలన్నారు. హాస్టల్ విద్యార్థులకు మెస్ బిల్లును పెంచాలన్నారు. అర్హులైన వారికి తల్లికి వందనం రూ.15 వేలు ఎటువంటి షరతులు లేకుండా ఇవ్వాలని డిమాండ్ చేశారు. వీఆర్ డిగ్రీ కళాశాలను పునఃప్రారంభించాలని, ఎయిడెడ్ కొనసాగించాలన్నారు. యూనివర్సిటీలో అధ్యాపక పోస్టులు భర్తీ చేయాలన్నారు. ఎయిడెడ్ విద్యాసంస్థలను నిర్వీర్యం చేసే జీఓలను రద్దు చేయాలన్నారు. -
29 మంది ఎంఈఓలకు షోకాజు నోటీసుల జారీ
నెల్లూరు (టౌన్): జిల్లాలో 29 మంది ఎంఈఓలకు జిల్లా విద్యాశాఖాధికారులు షోకాజు నోటీసులు జారీ చేశారు. ఈ విషయం విద్యాశాఖలో చర్చనీయాంశంగా మారింది. ఎంఈఓలు ప్రతి రోజు ఉదయం 9 గంటల్లోపు ఫేస్ రికగ్నిషన్ యాప్‌లో హాజరు నమోదు చేసుకోవాల్సి ఉంది. అయితే గురువారం జిల్లాలో 29 మంది సమయానికి రికగ్నిషన్ యాప్‌లో హాజరు నమోదు చేసుకోకపోవడం డీఈఓ ఆర్.బాలాజీరావు షోకాజు నోటీసులు జారీ చేశారు. రెండో రోజుల్లో వివరణ పంపాలని ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 38 మంది ఎంఈఓలు ఉన్నారు. వీరిలో 29 మంది సకాలంలో యాప్‌లో హాజరు నమోదు చేసుకోకపోవడం చూస్తే విధుల్లో వారికున్న చిత్తశుద్ధికి అద్దపడుతోంది. పాఠశాలలను పర్యవేక్షించాల్సిన అధికారులే అలసత్వం ప్రదర్శించడంపై పలువురు మండి పడుతున్నారు. హెల్త్ కేర్ డిప్లొమా కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం నెల్లూరు (అర్బన్): నగరంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలలో 2025–26 సంవత్సరంలో రెండేళ్ల హెల్త్ కేర్ డిప్లొమా కోర్సులు చదివేందుకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రాజేశ్వరి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. నెల్లూరుతోపాటు ఇతర జిల్లాలకు చెందిన వారు కూడా దరఖాస్తులు చేసుకోవచ్చన్నారు. అయితే లోకల్ అభ్యర్థులకు 85 శాతం, నాన్‌లోకల్ అభ్యర్థులకు 15 శాతం సీట్లు కేటాయిస్తామన్నారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు సెప్టెంబర్ 8వ తేదీలోపు కళాశాల పనిదినాల్లో తమ దరఖాస్తులను అందజేయాలని కోరారు. దరఖాస్తు రుసుం రూ.100 ఉంటుందన్నారు. దరఖాస్తులు, ఇతర వివరాలకోసం ఎస్పీఎస్నెల్లూరు.ఏపీ.జీఓవీ.ఇన్/నోటీసు/రిక్రూట్మెంట్ అనే వెబ్సైట్లో పరిశీలించుకోవాలన్నారు. సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు వ్యక్తిగతంగా హాజరుకావాలి నెల్లూరు (టౌన్): డీఎస్సీ–2025కు సంబంధించి వివిధ కేటగిరీల పోస్టుల నియామక ప్రక్రియలో భాగంగా జోన్ ఆఫ్ కన్సిడరేషన్లోకి వచ్చిన అభ్యర్థులకు తమ వ్యక్తిగత లాగిన్ ద్వారా కాల్ లెటర్‌ను అందించనున్నట్లు డీఈఓ బాలాజీరావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. సదరు అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లతో పాటు ఇటీవల తీసుకున్న కుల ధ్రువీకరణ పత్రం గెజిటెడ్ అధికారితో ధ్రువీకరించిన మూడు సెట్లు జెరాక్స్ కాపీలు, 5 పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోలతో సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు హాజరుకావాల్సి ఉంటుందన్నారు. వెరిఫికేషన్ సంబంధించిన సర్టిఫికెట్ల వివరాలతో కూడిన చెక్ లిస్టును డీఎస్సీ వెబ్సైట్లో అందుబాటులో ఉంచనున్నట్లు చెప్పారు. ఉపాధ్యాయ ఉద్యోగం ఇప్పిస్తామని దళారులు చెప్పే మాటలు, సోషల్ మీడియాలో వచ్చే అసత్య వదంతులు, దుష్ప్రచారాలను నమ్మొద్దన్నారు. వదంతులు సృష్టించి వ్యాప్తి చేసే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అభ్యర్థులు వ్యక్తిగత స్కోర్లు, మెరిట్ లిస్టు, ఎంపిక జాబితాలు, నియామక ఉత్తర్వులు మెగా డీఎస్సీ అధికారిక వెబ్సైట్, జిల్లా విద్యాశాఖాధికారి వెబ్సైట్, క్యాండిడెట్ లాగిన్‌లో విడుదల చేస్తారన్నారు. అక్రమ గ్రావెల్ రవాణాపై మైనింగ్ ఏడీ తనిఖీ దగదర్తి: మండలంలోని తిరువీధిపాడు గ్రామానికి చెందిన ఓ రైతు తమ పట్టా భూముల్లో అక్రమంగా గ్రావెల్ తరలిస్తున్నారని కలెక్టర్‌కు ఇచ్చిన ఫిర్యాదుతో శుక్రవారం గ్రావెల్ తరలింపు ప్రదేశాన్ని మైనింగ్ ఏడీ వాణిశ్రీ స్థానిక రెవెన్యూ అధికారులతో కలిసి తనిఖీ చేశారు. తిరువీధిపాడులో సర్వే నంబర్ 118లో స్థానిక రైతు మోపూరు భక్తవత్సలరెడ్డి చెందిన పట్టా భూమి ఉంది. తన భూమిలో కొందరు వ్యక్తులు అక్రమంగా గ్రావెల్ తరలిస్తున్నారని ఇటీవల స్థానిక పోలీసులకు, తహసీల్దార్, మైనింగ్ ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేశారు. అధికారులు గ్రావెల్ తరలింపును నిలిపివేయాలన్న ఆదేశాలిచ్చినా అక్రమార్కులు బేఖాతరు చేస్తూ యథేచ్ఛగా గ్రావెల్ తరలిస్తున్నారని, అడిగితే దౌర్జన్యం చేస్తున్నారని ఆ రైతు ఆవేదన వ్యక్తం చేస్తూ చేసేదేమీ లేక ఆ రైతు కలెక్టర్‌ను ఆశ్రయించారు. కలెక్టర్ ఆదేశాలతో మైనింగ్ ఏడీ గ్రావెల్ తరలింపు ప్రదేశాన్ని తనిఖీ చేసి ఎవరైనా ఈ భూమిలో గ్రావెల్ తరలిస్తే కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
అశ్వవాహనంపై ఊరేగిన వెంకయ్యస్వామి
వెంకటాచలం: మండలంలోని గొలగమూడిలో కొలువైన భగవాన్ వెంకయ్యస్వామి 43వ ఆరాధనోత్సవాల్లో భాగంగా శుక్రవారం అశ్వవాహన సేవ నిర్వహించారు. ఉదయం వెంకయ్యస్వామి ఆలయంలో నిత్య పూజలనంతరం స్వామి వారిని అశ్వవాహనంపై ఆశీనులను చేసి ప్రత్యేక పూలాలంకరణ చేశారు. భక్తులు భుజాలపై స్వామి వారిని ఆలయం చుట్టూ తిప్పారు. ఆ తర్వాత ట్రాక్టర్‌పై స్వామి వారిని ఆశీనులను చేసి అర్చకులు ప్రత్యేక పూజలు చేసి భక్తులకు హారతినిచ్చి గ్రామోత్సవాన్ని ప్రారంభించారు. ఈ గ్రామోత్సవం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ సాగింది. ఉత్సవం ముందు మహిళల కోలాట ప్రదర్శనలు, చిన్నారుల నృత్యాలు ఆకట్టుకున్నాయి. భక్తులు భారీగా పాల్గొని స్వామి వారిని దర్శించుకున్నారు. అశ్వవాహనసేవకు నెల్లూరుకు చెందిన గుదె శ్రీధర్, అరుణమ్మ దంపతులు ఉభయకర్తలుగా వ్యవహరించారు. కనుల పండవగా పెదశేష వాహన సేవ వెంకయ్యస్వామి ఆరాధనోత్సవాల్లో భాగంగా శుక్రవారం రాత్రి పెద శేష వాహనసేవ నిర్వహించారు. స్వామివారిని పెద శేషవాహనంపై ఆశీనులను చేసి విద్యుద్దీపాలంకరణ చేశారు. పెదశేష వాహనసేవ గొలగమూడి వీధుల్లో వేడుకగా సాగింది. ఉత్సవం వెంట భక్తులు వేలాది సంఖ్యలో పాల్గొని స్వామి వారిని దర్శించుకున్నారు. ఉత్సవాల్లో నేడు వెంకయ్యస్వామి ఆరాధనోత్సవాల్లో భాగంగా శనివారం ఉదయం సింహ వాహనసేవ, రాత్రి గరుడ వాహన సేవ నిర్వహించనున్నారు. రాత్రి 9 గంటలకు పలు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించనున్నారు. -
మీటర్ పెట్టినా షాకే
నెల్లూరు (వీఆర్సీసెంటర్): తాము అధికారంలోకి వస్తే ఒక్క రూపాయి విద్యుత్ చార్జీలు పెంచబోమని, అవసరమైతే చార్జీలు తగ్గిస్తామని, విద్యుత్ స్మార్ట్ మీటర్ల ఏర్పాటును వ్యతిరేకరిస్తున్నామని, స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేస్తే పగుల కొట్టండని గతంలో చంద్రబాబు, లోకేశ్‌లు రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు. అయితే రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చాక సర్ చార్జీలు, టూఅప్ చార్జీలు (ఇంధన సర్దుబాటు చార్జీలు) పేరుతో మూడేళ్ల క్రితం వాడుకుని చెల్లించిన విద్యుత్ ల్లులకు తాజాగా విద్యుత్ చార్జీలు అమాంతం పెంచి రూ. వేల కోట్లు భారం వేసి ప్రజల నడ్డి విరుస్తోంది. వాడుకున్న విద్యుత్ కంటే ట్రూ అప్ చార్జీలు, సర్ చార్జీల పేరుతో వచ్చే బిల్లులే ఎక్కువ కావడంతో ప్రజలు షాక్‌కు గురవుతున్నారు. గతంలో చెప్పిన మాట తప్పిన కూటమి ప్రభుత్వం స్మార్ట్ విద్యుత్ మీటర్ల ఏర్పాటును వేగవంతం చేస్తోంది. ఈ మీటర్లు పెట్టుకుంటే రోజులో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఒక టారిఫ్, మధ్యాహ్నం నుంచి ఒక టారిఫ్, సాయంత్రం నుంచి మరో టారిఫ్‌లతో బిల్లుల మోత మోగుతున్నాయి. ఈ స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేసుకున్న వారు కరెంట్ కావాలంటే ముందుగానే రీచార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. కొత్త మీటర్లకు చార్జీలు భారీగా పెంపు ఈ షాక్‌లు ప్రజలకు సరిపోవన్నట్లుగా ప్రభుత్వం ప్రజలపై మరో పెద్ద షాక్ వేసింది. కొత్తగా విద్యుత్ సర్వీసు కనెక్షన్ కావాలనుకునే ప్రజలకు ఇది నిజంగా పెద్ద షాకే అని చెప్పాలి. నూతనంగా విద్యుత్ సర్వీసు కావాలనుకుంటే గృహ వినియోగదారులు కేటగిరీ–1లో ఒక కిలో వాట్ విద్యుత్ కనెక్షన్‌కు గతంలో రూ.1,850 ఉంటే ఇప్పుడు రూ.4150లకు పెంచారు. రెండు కిలో వాట్‌కు అయితే రూ.3,750 నుంచి రూ.7,800 వరకు పెంచేసింది. వ్యాపార, వాణిజ్య వినియోగదారులు కేటగిరీ–2లో ఒక కిలో వాట్‌కు రూ.2,250 ఉంటే.. ఇప్పుడు రూ.5,300 వరకు పెంచటం జరిగింది. అదే రెండు కిలో వాట్‌కు రూ.4,500 నుంచి రూ.9,800 వరకు పెంచారు. గతంలో నూతన విద్యుత్ సర్వీసు కనెక్షన్ కోసం ప్రజలు విద్యుత్ సంస్థకు చెల్లించే రుసుం కంటే ప్రస్తుతం వంద రెట్లకు పైగా వసూలు చేస్తుండడంతో ప్రజలు హడలెత్తిపోతున్నారు. ఈ పరిణామాలు సామాన్య, మధ్య తరగతి ప్రజలకు పెనుభారంగా మారింది. సామాన్యులపై కూటమి ప్రభుత్వం మరో భారం ట్రూఅప్ చార్జీలు, స్మార్ట్ మీటర్లతో ఇప్పటికే దోపిడీ తాజాగా కొత్త మీటర్లకు వంద శాతం పైగా పెంపు -
వీరందరూ అనర్హులంట..
కాలు, చేయి విరిగిన వారు.. శరీరం కాలినా.. మానసిక వికలత్వం కలిగినా.. బధిరులు.. ఇతర వైకల్యం ఉన్న వారిని పింఛన్లకు అనర్హులుగా ప్రకటించారు. వీరెవర్ని కదిలించినా ఆవేదనే కనిపిస్తోంది. అనర్హుల ఏరివేత పేరిట తమకు తీవ్ర నష్టాన్ని మిగిల్చారనే వేదన వీరి నుంచి వ్యక్తమవుతోంది. పరిశీలన వివరాలు గోప్యం జిల్లాలో 3.16 లక్షల మంది పింఛన్లు పొందుతుండగా, వీరికి ప్రతి నెలా రూ.130 కోట్లకుపైగా అందిస్తున్నారు. ఇందులో దివ్యాంగులు 33 వేల మంది ఉండగా, వీరందరికీ నోటీసులను ప్రభుత్వం జారీ చేసింది. పరిశీలన అనంతరం వివరాలను గోప్యంగా ఉంచారు. చివరికి ప్రభుత్వం ఆదేశించడంతో అనర్హుల జాబితాను విడుదల చేశారు. పది నుంచి 20 ఏళ్లుగా పింఛన్లు పొందుతున్న వారికి మొండిచేయి చూపారు. ● సర్వేపల్లి నియోజకవర్గంలోని ఐదు మండలాలకు సంబంధించి సుమారు 832 మంది దివ్యాంగులకు రీ వెరిఫికేషన్ నోటీసులను జారీ చేశారు. ● ఉదయగరి నియోజకవర్గంలో దివ్యాంగ పింఛన్లు 4672 ఉండగా, ఇందులో 996ను తొలగించారు. -
కమిషనర్ x శానిటరీ ఇన్స్పెక్టర్
టేస్ట్ అదుర్స్ కూల్‌డ్రింక్స్‌కు డిమాండ్ ఎక్కువ. పిల్లల నుంచి పెద్దల వరకు వివిధ బ్రాండ్ల రుచిని ఆస్వాదిస్తుంటారు. నెల్లూరు సెంట్రల్ జైల్ రహదారి సమీపంలో జనం పడేసిన బాటిళ్లను వానరాలు తీసుకుని ఆఖరిబొట్లు ఆస్వాదిస్తుండగా తీసిన చిత్రాలు. – సాక్షి ఫొటోగ్రాఫర్, నెల్లూరు కందుకూరు: కందుకూరు మున్సిపాలిటీలో కమిషనర్ కె.అనూష, శానిటరీ ఇన్స్పెక్టర్ కొండయ్యల మధ్య విభేదాలు బజారుకెక్కాయి. ఈ విషయం పట్టణంలో చర్చనీయాంశంగా మారింది. దళితుడినని కమిషనర్ కక్ష కట్టి వేధిస్తున్నారని, నాలుగు నెలల నుంచి విధుల్లో ఉన్నా.. లేనట్లు ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చినట్లు కొండయ్య ఆరోపిస్తున్నారు. ఆయన ఏమంటున్నారంటే.. ‘రోజూ పారిశుధ్య కార్మికుల హాజరు కూడా తీసుకుంటున్నా. ఇంకా పట్టణంలో పారిశుధ్య పనులు కూడా చేయిస్తున్నాను. అయితే కమిషనర్ చెప్పినట్లు తలాడించడం లేదనే కారణంతో ఇబ్బందులు పెడుతున్నారు. మేనేజర్ చంద్రమౌళి రోజువారి హాజరుపట్టీలో నేను సంతకాలు చేయకుండా అడ్డుకుంటున్నారు. రిజిస్టర్ ఇచ్చే ప్రసక్తే లేదని, దిక్కున్నచోట చెప్పుకోమని బెదిరిస్తున్నారు. విధుల్లో లేకపోతే రోజూ కార్మికుల వద్ద హాజరు ఎలా తీసుకుంటున్నా?. నా వద్ద ఉండే రిజిస్టర్లో సంతకాలు ఎలా చేస్తా’ అని కొండయ్య ప్రశ్నిస్తున్నారు. ఇదీ వివాదం మున్సిపాలిటీలో గతేడాది సెప్టెంబర్ నుంచి శానిటరీ ఇన్స్పెక్టర్గా దారా కొండయ్య పనిచేస్తున్నారు. మే నెలలో ఆయన్ను గుడూరు మున్సిపాలిటీకి డిప్యుటేషన్ వేశారు. ఉత్తర్వులను తీసుకునేందుకు కొండయ్య నిరాకరించడంతో తన గదికి అంటించారు. అయితే డిప్యుటేషన్ తనకు తెలియకుండా వేశారని, కమిషనర్ ప్రోద్బలంతోనే ఇది జరిగిందని భావించిన హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు డిప్యుటేషన్‌ను రద్దు చేస్తూ ఉత్తర్వులిచ్చింది. ఆయన తిరిగి కందుకూరు మున్సిపాలిటీలోనే కొనసాగించే విధంగా మున్సిపల్ శాఖ డీఎంఏ ఆదేశాలిచ్చింది. ఈ మేరకు కమిషనర్ కూడా రీ జాయిన్ ఆర్డర్ ఇచ్చారు. కానీ ఆయన్ను శాఖాపరమైన వాట్సప్ గ్రూపుల నుంచి తొలగించారు. అలా చేయడంతో రోజూ ఫొటోలు అప్లోడ్ చేసే అవకాశం లేదని కొండయ్య చెబుతున్నారు. ఉన్నతాధికారుల వద్ద తేల్చుకుంటా.. కమిషనర్, మేనేజర్ తీరు వల్ల ఏప్రిల్ నెల నుంచి జీతాలు రావడం లేదని, దీనిపై ఇప్పటికే మున్సిపల్ శాఖ డీఎంఏకి, ఆర్డీకి ఫిర్యాదు చేశానని కొండయ్య చెబుతున్నారు. వారు ప్రశ్నించడంతో విధుల్లో లేనట్లు రెండు రోజుల క్రితం తన చేతిలో కాగితం పెట్టారంటున్నారు. వాస్తవాలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానని స్పష్టం చేశారు. పారిశుధ్య పనులకు సంబంధించిన వస్తువులు వంటి తాను ఇవ్వాల్సి ఉందని, కానీ సంబంధం లేకుండా అనధికారికంగా ఇంజినీరింగ్ సెక్షన్లో అడ్మిన్ సెక్రటరీగా పనిచేసే బాలాజీ అనే ఉద్యోగితో చేయిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఇది పూర్తిగా నిబంధనలకు విరుద్ధమని, ఇటువంటి పనులు చేయనందుకే తనను వేధిస్తున్నారని చెప్పారు. తీవ్ర ఇబ్బందులు నాలుగు నెలలుగా జీతం రాకపోవడంతో కుటుంబ పరంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కొండయ్య ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం తన భార్య అనారోగ్యంతో బాధపడుతోందని, ఆమె చికిత్స కూడా డబ్బుల్లేని పరిస్థితి ఉందన్నారు. కందుకూరులో ఉంటున్న గదికి అద్దె చెల్లించకపోవడంతో ఖాళీ చేయాల్సి వచ్చిందన్నారు. ప్రస్తుతం కార్మికుల హాజరు తీసుకుని భవనంలోని ఓ గదిలో ఉంటున్నట్లు వాపోయారు.మున్సిపల్ కార్యాలయం మున్సిపాలిటీలో అంతర్గత పోరు ఇన్స్పెక్టర్ కొండయ్యపై కక్ష సాధింపునకు దిగిన కమిషనర్ నాలుగు నెలలుగా జీతం రాకుండా కొర్రీలు ఉన్నతాధికారులకు ఫిర్యాదు దళితుడైనందునే ఇలా చేస్తున్నారని బాధితుడి ఆరోపణ -
సుస్థిరాభివృద్ధే ధ్యేయం
నెల్లూరు(పొగతోట): గ్రామీణ ప్రాంతాల అభివృద్ధే లక్ష్యంగా అవసరమైన చర్యలు చేపట్టాలని జెడ్పీ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ సూచించారు. నగరంలోని జెడ్పీ సమావేశ మందిరంలో ఎంపీడీఓలు, డిప్యూటీ ఎంపీడీఓలు, ఎమ్సీఓలు, లైన్ డిపార్ట్మెంట్ అధికారులకు గురువారం నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. దేశ పరిస్థితులకు అనుగుణంగా సీడీజీఎస్ను విభజించారని, దీనికి తగిన విధంగా పంచాయతీ అభివృద్ధి ప్రణాళికలను సిద్ధం చేసి అమలు చేస్తున్నారని వెల్లడించారు. పంచాయతీల పనితీరును కేంద్ర ప్రభుత్వం అంచనా వేసేందుకు వీలుగా ఆన్లైన్ పోర్టల్‌ను రూపొందించారని, సమాచారాన్ని ఇందులో అప్లోడ్ చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. దీని ఆధారంగా పంచాయతీలను అవార్డులకు ఎంపిక చేయనున్నారని తెలిపారు. జెడ్పీ సీఈఓ మోహన్‌రావు, డీపీఓ శ్రీధర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
సక్రమంగా పనిచేయకుంటే సస్పెండ్ చేస్తాం
● నెల్లూరు, ప్రకాశం డీసీహెచ్‌ఎస్‌లు ● ఉలవపాడు సీహెచ్‌సీ వైద్యశాల పరిశీలన ● సమయపాలన పాటించడం లేదని ఆగ్రహంఉలవపాడు: వైద్యులు, సిబ్బంది సక్రమంగా పనిచేయకుంటే సస్పెండ్ చేస్తామని నెల్లూరు, ప్రకాశం జిల్లాల వైద్యవిధాన పరిషత్ కో–ఆర్డినేటర్లు పరిమళ, శ్రీనివాస నాయక్ హెచ్చరించారు. ఉలవపాడు సీహెచ్‌సీ వైద్యశాలను గురువారం వారు ఆకస్మికంగా తనిఖీ చేశారు. సిబ్బంది పనితీరుపై వారు అసహనం వ్యక్తం చేశారు. వైద్యులు, వైద్య సిబ్బంది సమయపాలన పాటించడం లేదని ఆగ్రహించారు. రికార్డులను పరిశీలించారు. వైద్యశాల పనితీరు ఎలా ఉందని స్థానికులు, రోగులను అడిగి తెలుసుకున్నారు. పరిస్థితి దారుణంగా ఉందని వారు డీసీహెచ్‌ఎస్‌లకు తెలియజేశారు. 8 మంది వైద్యులున్నా అధిక శాతం మంది సెలవులోనే వెళ్లారని, కేవలం ఇద్దరు మాత్రమే ఉన్నారని తెలిపారు. సెలవులు ఒకేసారి ఇంతమందికి ఎలా ఇస్తారని అడిగారు. రోగుల పట్ల వైద్య సిబ్బంది ప్రవర్తన చాలా దారుణంగా ఉందన్నారు. రాత్రివేళ సిబ్బంది కనిపించడం లేదు రాత్రివేళ విధులు నిర్వహించాల్సిన సిబ్బంది వార్డులో ఉండకుండా వెళ్లి రూమ్‌లో పడుకుంటున్నారని.. వారిని లేపే సరికి దాదాపు 15 నిమిషాలు పడుతుందని రోగులు తెలియజేశారు. రాత్రి వేళల్లో డాక్టర్లు అందుబాటులో ఉండటం లేదని వాపోయారు. గైనకాలజిస్ట్ లేకపోవడంతో గర్భిణులు చాలా ఇబ్బందులు పడుతున్నారని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. గతంలో వైద్యాధికారులుగా శోభారాణి, సతీష్‌లు ఉన్నప్పుడు వైద్యశాల బాగుంది. తర్వాత నుంచి పరిస్థితి దారుణంగా తయారైందని పలువురు స్థానికులు తెలియజేశారు. ఇక్కడ పనిచేస్తున్న గైనకాలజిస్ట్ మెటర్నటీ లీవ్ పెట్టి వెళ్లారు.. కానీ కందుకూరులోని ప్రైవేట్ వైద్యశాలలో మాత్రం పనిచేస్తున్నట్లు తెలిపారు. వీటిపై అధికారులు డాక్టర్లను ప్రశ్నించగా వారు మౌనం వహించారు. దీంతో డీసీహెచ్‌ఎస్‌లు వైద్యులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మళ్లీ ఇలాంటి పొరపాట్లు జరిగితే సహించేది లేదని సస్పెండ్ చేస్తామన్నారు. వారంరోజుల్లో మళ్లీ తనిఖీకి వస్తామని, ఇలాంటి ఘటనలు పునరావృతమైతే ఊరు కోమని హెచ్చరించారు. కార్యక్రమంలో వైద్యులు హరీష్, చిన్నపిల్లల వైద్యనిపుణులు ప్రదీప్‌కుమార్‌తోపాటు సిబ్బంది పాల్గొన్నారు. -
పాలనను గాలికొదిలి.. కక్షసాధింపులకే పరిమితం
● వైఎస్సార్సీపీ రీజినల్ కోఆర్డినేటర్ కారుమూరి నాగేశ్వరరావు ● అక్రమ కేసులపై డీఎస్పీకి వినతిపత్రం అందజేత నెల్లూరు(క్రైమ్): పాలనను కూటమి ప్రభుత్వం గాలికొదిలి.. తమ పార్టీ నేతలపై అక్రమ కేసులు బనాయించి జైళ్లకు పంపుతోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రీజినల్ కోఆర్డినేటర్ కారుమూరి నాగేశ్వరరావు ఆరోపించారు. పార్టీ నేతలపై జిల్లాలో అక్రమ కేసులు బనాయిస్తున్న విషయమై ఎస్పీకి ఫిర్యాదు చేసేందుకు గానూ జిల్లా పోలీస్ కార్యాలయానికి కారుమూరితో పాటు పార్టీ నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్చార్జి, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి, వెంకటగిరి, నెల్లూరు రూరల్, సూళ్లూరుపేట నియోజకవర్గ సమన్వయకర్తలు నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి, ఆనం విజయకుమార్‌రెడ్డి, కిలివేటి సంజీవయ్య గురువారం వచ్చారు. ఎస్పీ అందుబాటులో లేకపోవడంతో డీటీసీ డీఎస్పీ గిరిధర్‌రావుకు వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా కారుమూరి మాట్లాడారు. తమ పార్టీ నేతలే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని, ఇందులో భాగంగానే అక్రమ కేసులు, అరెస్ట్‌లను కొనసాగిస్తోందని ఆరోపించారు. తమ పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి ఇటీవల చేపట్టిన జిల్లా పర్యటనలో పార్టీ నేతలను ఇబ్బంది పెట్టేందుకు పన్నిన కుట్రలు అందరికీ తెలిసినవేనన్నారు. ఆయన్ను కలిసేందుకు వేలాదిగా తరలివచ్చిన పార్టీ శ్రేణులపై అక్రమ కేసులను బనాయించారని మండిపడ్డారు. ప్రశాంతమైన జిల్లాలో కక్షపూరిత రాజకీయాలకు టీడీపీ పాల్పడుతోందని ధ్వజమెత్తారు. టీడీపీ నేతల చేతుల్లో కీలుబొమ్మలు కూటమి పెద్దలు సూచించిన తమ పార్టీ నేతల పేర్లను ఎఫ్ఐఆర్లో నమోదు చేసి జైళ్లకు పంపుతున్నారని చంద్రశేఖర్‌రెడ్డి ఆరోపించారు. టీడీపీ నేతల చేతుల్లో పోలీస్ శాఖ కీలుబొమ్మలా మారిందని విమర్శించారు. జగన్మోహన్రెడ్డి నెల్లూరు పర్యటన సందర్భంగా తమ పార్టీ నేతలపై పోలీసులు లాఠీచార్జి చేసి కిందపడేసి.. తిరిగి వారిపైనే కేసులు బనాయించడం సిగ్గుచేటని విమర్శించారు. కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డిపై హత్యాయత్నం కేసును నమోదు చేయడం దారుణమన్నారు. మాజీ మంత్రులు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి, అనిల్‌కుమార్‌యాదవ్ ఇలా ప్రతి ఒక్కరిపై అక్రమ కేసులు నమోదు చేస్తున్నారని మండిపడ్డారు. తమపైనా ఎక్కడ కేసులు పెడతారోనని ప్రజలు భయపడుతున్నారని తెలిపారు. ఇప్పటికై నా కూటమి ప్రభుత్వం, పోలీసులు తమ తీరును మార్చుకోవాలని హితవు పలికారు. -
‘మా పొట్ట కొట్టొద్దు’
సోమశిల: కూటమి ప్రభుత్వం ఆటో కార్మికుల పొట్ట కొట్టిందని నేతలు అన్నారు. అనంతసాగరం మండల కేంద్రంలోని యూటీఎఫ్ కార్యాలయంలో గురువారం ఆటో కార్మికుల సంఘం జనరల్ బాడీ సమావేశం జరిగింది. అనంతరం బస్టాండ్ సెంటర్ నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ చేశారు. అనంతరం డిప్యూటీ తహసీల్దార్ నాగలక్ష్మికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆటో కార్మిక సంఘం (సీఐటీయూ) జిల్లా కార్యదర్శి రాజా మాట్లాడుతూ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఆటోల్లో ప్రయాణించే వారు తగ్గిపోయారన్నారు. కార్మికులు కుటుంబాలను ఏ విధంగా పోషించాలని ప్రశ్నించారు. వాహనమిత్ర ద్వారా ప్రతి ఆటో కార్మికుడికి సంవత్సరానికి రూ.25,000 ఇవ్వాలని డిమాండ్ చేశారు. లోకేశ్ పాదయాత్ర సమయంలో ఆటో కార్మికులతో నడిచి కూటమి ప్రభుత్వం రాగానే సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని చెప్పారని, ఇంతవరకు అమలు చేయలేదని అన్నారు. పాత పద్ధతిలోనే డ్రైవింగ్ లైసెన్స్‌లు ఇవ్వాలన్నారు. ఆ సంఘం గౌరవాధ్యక్షుడిగా అన్వర్‌బాషా, అధ్యక్షుడిగా నాయబ్ జానీ, కార్యదర్శిగా మస్తాన్ నియమితులయ్యారు. -
నాడొకమాట.. నేడు మరోమాట
నెల్లూరు(వీఆర్సీసెంటర్): ‘విద్యుత్ స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేస్తే పగలగొట్టాలని నాడు టీడీపీ నాయకులు పిలుపునిచ్చారు. తీరా అధికారంలోకి వచ్చాక వాటిని ఏర్పాటు చేస్తున్నారు. నాడొకలా.. నేడు మరోలా వ్యవహరిస్తున్నారు’ అని ప్రజా సంఘాల నాయకులు మండిపడ్డారు. నెల్లూరులోని జెట్టి శేషారెడ్డి విజ్ఞాన భవన్లో గురువారం వామపక్షాలు, పలు ప్రజాసంఘాల నాయకులు విద్యుత్ స్మార్ట్ మీటర్లను రద్దు చేయాలనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శి మూలం రమేష్, సీపీఐ జిల్లా కార్యదర్శి అరిగెల నాగేంద్రసాయి, సీపీఐ ఎంఎల్ నాయకుడు రాంబాబు, ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి మూలి వెంగయ్య మాట్లాడారు. కూటమి ప్రభుత్వం రూ.15,500 కోట్ల భారాన్ని ప్రజలపై వేసిందన్నారు. ప్రజలు వ్యతిరేకిస్తే స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేయొద్దని విద్యుత్ శాఖ మంత్రి ఆదేశాలిచ్చినా అదానీ, విద్యుత్ సిబ్బంది దొంగచాటుగా మీటర్లు ఏర్పాటు చేస్తున్నారని ఆరోపించారు. గత ప్రభుత్వంలో యూనిట్ విద్యుత్ ధర రూ.2.40లకు కొంటే టీడీపీ గగ్గోలు పెట్టారన్నారు. నేడు అదే యూనిట్ విద్యుత్‌ను రూ.3.60లకు కొంటున్నారన్నారు. టీడీపీకి రూ.40 కోట్లు కరేడు గ్రామంలో షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్‌కు చెందిన ఇండోల్సోల్ సోలార్ కంపెనీకి 8,400 ఎకరాల భూమిని అప్పగించేందుకు వారు బాండ్స్ రూపంలో టీడీపీకి రూ.40 కోట్లు అందజేసినట్లు నేతలు ఆరోపించారు. స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేసి సింగిల్‌ఫేజ్ విద్యుత్ వినియోగదారుల నుంచి రూ.9 వేలు, త్రీఫేజ్ వినియోగదారుల నుంచి రూ.14 వేలు వసూలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధపడిందన్నారు. కూటమి ప్రభుత్వం దోపిడీకి పాల్పడుతోందని ఆరోపించారు. ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ చేసే పోరాటాలకు పలు రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు మద్దతు ఇస్తున్నాయన్నారు. రాబోయే కాలంలో ప్రజల నుంచి సంతకాల సేకరణ, సదస్సులు, సభలు నిర్వహిస్తామన్నారు. నాయకులు మాదాల వెంకటేశ్వర్లు, ప్రసాద్, పుల్లయ్య, శ్రీరాములు, వెంకమరాజు, షాన్వాజ్ పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వంపై మండిపడిన నేతలు ప్రజా సంఘాల రౌండ్ టేబుల్ సమావేశం -
అభిమానాన్ని అడ్డుకోలేని ఆంక్షలు
● జిల్లా సెంట్రల్ జైలు నుంచి మాజీ మంత్రి కాకాణి విడుదల ● బయటకు వచ్చాక అడుగడుగునా అభిమానుల కోలాహలం వెంకటాచలం: కూటమి ప్రభుత్వం మోపిన అక్రమ కేసులతో జైలుకు వెళ్లిన మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి 86 రోజుల తర్వాత బుధవారం నెల్లూరు సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు. హైకోర్టు సోమవారమే బెయిల్ మంజూరు చేసినప్పటికీ గూడూరు కోర్టు నుంచి బెయిల్ మంజూరు పత్రాలు ఇవ్వడంలో ఆలస్యం కావడంతో మంగళవారం జైలు నుంచి విడుదల కాలేకపోయారు. మంగళవారం కాకాణి జైలు నుంచి విడుదలవుతారని తెలియడంతో జిల్లాలోని వైఎస్సార్సీపీ ముఖ్య నేతలు, సర్వేపల్లి నియోజకవర్గ వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు వస్తారని పోలీసులు అడుగడుగున ఆంక్షలు విధించారు. ఆయనకు స్వాగతం పలుకుతూ అభిమానులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగించారు. అయినప్పటికీ ముఖ్యనేతలతోపాటు అభిమానులు జైలు పరిసర ప్రాంతాలకు చేరుకుని సాయంత్రం 6.30 గంటల వరకు ఎదురు చూశారు. అయితే సాంకేతిక కారణాలతో విడుదల జాప్యం జరగడంతో కాకాణి బుధవారం విడుదలవుతారని తెలియయడంతో నిరాశగా వెనుతిరిగారు. అయితే బుధవారం ఉదయం 8 గంటల అభిమానులు, కార్యకర్తలు, నాయకులు, జెడ్పీ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, వైఎస్సార్సీపీ నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇన్చార్జి ఆనం విజయకుమార్‌రెడ్డి, మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత తదితరులు వేలాది మంది జిల్లా సెంట్రల్ వద్దకు చేరుకున్నారు. జైలుకు వెళ్లే రోడ్డు మార్గాల్లో వేలాది మంది వైఎస్సార్సీపీ నాయకులు, అభిమానులు చేరుకోవడాన్ని చూసి పోలీసులు ముఖ్య నేతలను మినహా, మిగతా అందరిని జైలు పరిసర ప్రాంతాల్లో లేకుండా తరిమేశారు. కాకాణి బయటకు రావడంతో.. కాకాణి గోవర్ధన్ రెడ్డి ఉదయం 10.20 గంటలకు జైల్లో నుంచి బయటకు రావడంతో అంత వరకు ఓపిగ్గా ఎదురుచూసిన అభిమానులు పోలీసుల ఆంక్షలను దాటుకుని జయహో గోవర్ధనన్న, జై జగన్, జై కాకాణి అంటూ నినాదాలు హోరెత్తించారు. కాకాణిని నాయకుల భుజాలపైకి ఎత్తుకుని తమ అభిమానాన్ని చాటుకున్నారు. కాకాణి గోవర్ధన్ రెడ్డి జైల్లో ఉన్నంత సేపు అనేక ఆంక్షలు విధించిన పోలీసులు, ఒక్కసారిగా వచ్చిన అభిమానాలను చూసి అడ్డుకోలేకపోయారు. కాకాణి గోవర్ధన్‌రెడ్డి తన కుమార్తె పూజిత, మనుమడు, ఇతర కుటుంబ సభ్యులతోపాటుగా, వైఎస్సార్సీపీ నాయకులను ఆప్యాయంగా పలకరించారు. జైలు వద్ద నుంచి కారులో బయలుదేరిన కాకాణి గోవర్ధన్ రెడ్డికి దారిపొడవునా వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానాలు ఆత్మీయ స్వాగతం చేశారు. కొందరు శాలువాలతో సన్మానించారు. జైలు వద్ద నుంచి నక్కలకాలనీ, మీదుగా, జాతీయ రహదారిపై కారులో వెళుతూ ప్రతి ఒక్క నాయకుడిని పేరు పేరునా పలకరిస్తూ వెళ్లారు. -
నిధుల గోల్‌మాల్‌పై డీఎల్పీఓ విచారణ
సీతారామపురం: మండలంలో విధులు నిర్వహిస్తూ దీర్ఘకాలిక సెలవుపై వెళ్లిన ఓ ఎంపీడీఓ రూ.11 లక్షలకు పైగా నిధులను స్వాహా చేశారనే ఆరోపణల నేపథ్యంలో ఈ నెల 2న ‘సాక్షి’లో ‘నిధుల గోల్మాల్’ అనే శీర్షికన కథనం ప్రచురితమైంది. దీనికి స్పందించిన జెడ్పీ సీఈఓ మోహన్‌రావు ఆత్మకూరు డీఎల్పీఓ టి.రమణయ్యను విచారణ అధికారిగా నియమించారు. ఆయన బుధవారం సీతారామపురం ఎంపీడీఓ కార్యాలయాన్ని సందర్శించి నిధుల గోల్‌మాల్‌పై విచారణ చేపట్టారు. నిధులకు సంబంధించి జరిపిన బ్యాంకు లావాదేవీల స్టేట్మెంట్ను పరిశీలించారు. బిల్లులు, ఓచర్లు, ఎవరితో నగదు డ్రా చేయించారు తదితర విషయాలతోపాటు, కార్యాలయ సిబ్బంది సహాయ సహకారాలపై కూడా ఆరా తీసి సమగ్ర వివరాలు సేకరించారు. తుది నివేదికను జెడ్పీ సీఈఓకు అందిస్తామన్నారు. అనంతరం అయ్యవారిపల్లి, బసినేనిపల్లి సచివాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. సచివాలయ సిబ్బంది ప్రజలకు మెరుగైన సేవలు అందించాలన్నారు. ఆయనతోపాటు ఎంపీడీఓ సాయిప్రసాద్, కార్యాలయ సిబ్బంది ఉన్నారు. -
డ్రోన్‌తో విజువల్స్.. ఐదుగురిపై కేసు నమోదు
కావలి (జలదంకి): జలదంకి మండలం అన్నవరం క్వారీ వద్ద డ్రోన్‌తో విజువల్స్ తీస్తూ కావలి ఎమ్మెల్యేపై హత్యాయత్నం చేసేందుకు ప్రయత్నించారనే కేసులో ఐదుగురిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు కావలి డీఎస్పీ శ్రీధర్ వెల్లడించారు. బుధవారం స్థానిక డీఎస్పీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఇస్కారపు వేణు, గోళ్ల వినోద్‌కుమార్, దామెర్ల శ్రావణ్‌కుమార్, ఆత్మకూరు రాజేష్, కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ కేసులో ఏ5 నిందితుడిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే ప్రతాప్‌కుమార్‌రెడ్డికి ఎమ్మెల్యే డీవీ కృష్ణారెడ్డికి రాజకీయ శత్రుత్వం ఉంది. దీంతో కృష్ణారెడ్డిని హతమార్చాలని ఏ5 ప్రతాప్‌కుమార్‌రెడ్డి ఆదేశాల మేరకు ఏ1, ఏ2, ఏ3, ఏ4 నిందితులు అన్నవరం క్వారీ వద్ద ఎమ్మెల్యే రాకను గమనించి అంతమొందించాలని డ్రోన్‌తో పరిశీలిస్తుండగా క్రషర్లో పని చేసే ఏడుకొండలతో పాటు సిబ్బంది డ్రోన్‌ను పసిగట్టి అడ్డుకున్నారు. దీంతో నలుగురు నిందితులు క్రషర్ సిబ్బందిపై కత్తులు, రాళ్లతో దాడులు చేసి అక్కడి నుంచి పారిపోయారు. దీంతో ఐదుగురిపై కేసు నమోదు చేశామన్నారు. జలదంకి ఎస్సై లతీపున్నీసా ఏ1, ఏ2 నిందితులైన వేణు, వినోద్‌లను బుధవారం ఉదయం 10 గంటల సమయంలో జమ్మలపాళెం వద్ద అరెస్ట్ చేసినట్లు తెలిపారు.29 నుంచి ఐటీఐల్లో మూడో విడత కౌన్సెలింగ్ నెల్లూరు (టౌన్): జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఐటీఐల్లో 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఈ నెల 29న ప్రభుత్వ, 30న ప్రైవేట్ ఐటీఐల్లో కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు ఐటీఐ కళాశాలల కన్వీనర్ శ్రీధర్‌రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఐటీఐలో చేరేందుకు ఆసక్తి ఉన్న వారు ఈ నెల 26వ తేదీలోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. అడ్మిషన్లకు హాజరయ్యే వారు ఒరిజినల్ సర్టిఫికెట్లతో ఈ నెల 27వ తేదీలోపు ఏదైనా ఐటీఐలో సర్టిఫికెట్లు ధ్రువీకరణ చేయించుకోవాలన్నారు. వివరాలకు సమీపంలోని ప్రభుత్వ ఐటీఐని సంప్రదించాలన్నారు.విద్యార్థిని మృతిపై ఫోర్ మెన్ కమిటీ నియామకం● విచారించి వారంలో నివేదిక ఇవ్వాలన్న కలెక్టర్నెల్లూరు (టౌన్): నగరంలోని అన్నమయ్య సర్కిల్లో ఉన్న ఆర్ఎన్ఆర్ జూనియర్ కళాశాల విద్యార్థిని హేమశ్రీ ఆత్మహత్య ఘటనపై ఎట్టకేలకు జిల్లా యంత్రాంగం స్పందించింది. విద్యార్థిని మృతిపై విచారించి నివేదిక అందించాలని కలెక్టర్ ఆనంద్ బుధవారం ఫోర్‌మెన్ కమిటీని నియమించారు. ఏపీ మైక్రో ఇరిగేషన్ కార్పొరేషన్ (ఎంఐసీ) పీడీ, బీసీ కార్పొరేషన్ జిల్లా అధికారి, డీఈఓ, జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారులను కమిటీలో సభ్యులుగా నియమించారు. విద్యార్థినీ హేమశ్రీ మృతిపై సమగ్ర విచారణ చేపట్టి వారంలోగా పూర్తిస్థాయి నివేదిక అందించాలని ఆదేశాలు జారీ చేశారు.‘సాక్షి’ కథనంపై సుమోటోగా తీసుకున్న హైకోర్టుఆర్ఎన్ఆర్ జూనియర్ కళాశాల విద్యార్థినీ హేమశ్రీ మృతిపై ‘సాక్షి’లో వచ్చిన కథనాన్ని రాష్ట్ర హైకోర్టు సుమోటోగా తీసుకున్నట్లు తెలిసింది. విద్యార్థినీ మృతిపై రాష్ట్ర ఇంటర్ బోర్డు, జిల్లా శిశు సంక్షేమ శాఖ, లోక్ అదాలత్, డైరెక్టర్ ఆఫ్ పోలీస్ శాఖల అధికారులకు నోటీసులు జారీ చేశారు. అన్ని కోణాల్లో పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి వీడియోల సాక్ష్యాలను అందజేయాలని ఆదేశించినట్లు సమాచారం.సీతారామపురం తహసీల్దార్ సస్పెన్షన్సీతారామపురం : సీతారామపురం తహసీల్దార్ పీవీ కృష్ణారెడ్డి సస్పెండ్ చేస్తూ జిల్లా అధికారులు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. సీతారామపురం రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 68–5లోని సమస్యాత్మకమైన 0.40 సెంట్ల భూమిని నిబంధనలకు విరుద్ధంగా మ్యుటేషన్ చేశారనే ఆరోపణపై కలెక్టర్ విచారణ జరిపి తహసీల్దార్‌ను సస్పెండ్ చేసినట్లు సమాచారం. సదరు సర్వే నంబర్ 68–5లో తోట నరసింహులుకు చెందిన 0.81 సెంట్ల భూమి కోసం అతని సంబంధీకులైన ఇరువర్గాల వారి మధ్య కొంత కాలం నుంచి విభేదాలున్నాయి. ఈ నేపథ్యంలో తహసీల్దార్ నిబంధనలకు విరుద్ధంగా మ్యుటేషన్ చేశారని ఆరోపిస్తూ కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. -
రాజకీయంగా ఎదుర్కోలేక కుట్ర కేసు
కావలి (జలదంకి): కావలి నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డిని రాజకీయంగా ఎదుర్కోలేక ప్రస్తుత ఎమ్మెల్యే డీవీ కృష్ణారెడ్డి కుటిల రాజకీయాలకు పాల్పడుతున్నాడని, అటువంటి నీచ సంస్కృతిని విడనాడకపోతే అధికార మదంతో చేసే ప్రతి పనికీ బుద్ధి చెబుతామని కావలి నియోజకవర్గ వైఎస్సార్సీపీ నేతలు హెచ్చరించారు. బుధవారం స్థానిక వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఆ పార్టీ జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు పందిటి కామరాజు మాట్లాడుతూ అక్రమ మైనింగ్ జరుగుతుండడంతో విజువల్స్ తీసేందుకు వెళ్లిన సోషల్ మీడియా యాక్టివిస్టులను పట్టుకుని, దారుణంగా హింసించడమే కాకుండా వారిని హంతుకులుగా చిత్రీకరించేందుకు ఎమ్మెల్యే కృష్ణారెడ్డి బరి తెగింపునకు త్వరలోనే బుద్ధి చెబుతామన్నారు. సౌమ్యుడు, మితభాషి అయిన మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి నీచ సంస్కృతి, రౌడీ రాజకీయం చేసే నీలాంటి వాడిని చంపించే ప్రయత్నం చేశారంటూ నువ్వు చేస్తున్న ప్రచారం చూసి నియోజకవర్గ ప్రజలు నివ్వెరపోతున్నారన్నారు. కుట్రలకు, కుతంత్రాలతో ప్రతాప్‌కుమార్‌రెడ్డిపై అక్రమ కేసులు పెట్టడానికి, నీ అవినీతి సామ్రాజ్యాన్ని బయట పెట్టాలకున్న సోషల్ మీడియా సభ్యులను కొట్టి, వారి చేతుల్లో కత్తులు పెట్టించి బెదిరించి ప్రతాప్‌కుమార్‌రెడ్డి పంపిస్తే కృష్ణారెడ్డిని చంపడానికి వచ్చామని వీడియో రికార్డు చేయించారన్నారు. పట్టణ అధ్యక్షుడు కేతిరెడ్డి శివకుమార్‌రెడ్డి మాట్లాడుతూ కావలిలో ఏదో జరిగిపోయింది, ఎమ్మెల్యేపై హత్యాయత్నం అంటూ అంబేడ్కర్ విగ్రహం వద్ద కొంత మంది ఏడుపులు, పెడబొబ్బలు పెట్టారని, అసలు జరిగింది తెలుసుకోకుండా, పోలీసులు విషయాన్ని తెలపకుండానే నలుగురు చిడతల విలేకరులు స్క్రోలింగ్ పెడితే అదే వాస్తవమని ఇలా దౌర్భాగ్యపు రాజకీయాలు చేస్తున్నా రో తెలుసుకోవాలన్నారు. ముసునూరు మనీ స్కాంలో ఎమ్మెల్యేకు ఎంత ముడుపులు అందాయో నియోజకవర్గ ప్రజలకు తెలుసన్నారు. నియోజకవర్గంలో అక్రమ గ్రావెల్ తవ్వకాలు, ఇసుక దందా, రేషన్ దందా ఎలా నిర్వహిస్తున్నారో ప్రజలు గమనిస్తున్నారన్నారు. ఇలాంటి అవినీతి దందాలను మాజీ ఎమ్మెల్యే ప్రతాప్‌కుమార్‌రెడ్డి నిత్యం ఎండగడుతుండడంతో ఎమ్మెల్యే అసహనంతో ఊగిపోతూ వీధి రౌడీలా మాట్లాడిన మాటలను ప్రజలను తెలుసుకున్నారన్నారు. జలదంకిలో డ్రోన్ సాయంతో అక్రమ మైనింగ్‌పై విజువల్స్ తీసిన అమాయకులపై అక్రమ కేసులు పెట్టడం చూస్తుంటే రక్తచరిత్ర సినిమాను మించి దర్శకత్వం చేసినట్లు ఉందన్నారు. మాజీ ఎంపీపీ మహేశ్వరమ్మ మాట్లాడుతూ అధికారం నీటి బుడగతో సమానం అని, కక్ష రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు. పార్టీ నాయకులు గంధం ప్రసన్నాంజనేయులు, కనమర్లపూడి వెంకటనారాయణ, మద్దిబోయిన వీరరఘు, వాయిల తిరుపతి, నెల్లూరు వెంకటేశ్వర్లురెడ్డి, పరుసు మాల్యాద్రి, కుందుర్తి కామయ్య, కనపర్తి రాజశేఖర్, చైతన్య, మహేష్‌నాయుడు, దండే కృష్ణారెడ్డి, బీద రమేష్, కొమారి రాజు, చెన్ను ప్రసాద్‌రెడ్డి, నాగాచారి, ఏగూరి పుల్ల య్య, గుడ్లూరి మాల్యాద్రి, ఏసుదాస్, శశిధర్, జీవీ, గిరి, చల్లా శ్రీనివాసులరెడ్డి, కళ్యాణి పాల్గొన్నారు. ప్రతాప్‌కుమార్‌రెడ్డి వ్యక్తిత్వం, కృష్ణారెడ్డి వైఖరి ఏమిటో అందరికీ తెలుసు దాడులు, అక్రమ కేసులే టీడీపీ పాలనా విధానం అధికార మదంతో చేసే ప్రతి పనికీ బుద్ధి చెబుతాం అక్రమ కేసులకు వైఎస్సార్సీపీ నేతలు సిద్ధం -
కల్వర్టును ఢీకొన్న బొలెరో
లింగాలఘణపురం: బొలెరో అదుపుతప్పి కల్వర్టును ఢీకొనడంతో దంపతులు మృతి చెందగా, ఇద్దరు పిల్లలు ప్రాణాలతో బయటపడిన ఘటన జనగామ – సూర్యాపేట జాతీయ రహదారి 365పై జనగామ జిల్లా లింగాలఘణపురం మండలం వడిచర్ల సమీపంలో బుధవారం చోటుచేసుకుంది. ఎస్సై శ్రావణ్‌కుమార్ వివరాల మేరకు.. నెల్లూరు జిల్లాలోని మనుబోలు మండలం వడ్లపూడికి చెందిన దద్దోజు సురేశ్ (35), దివ్య దంపతులు (32), కుమారుడు మోక్షజ్ఞ, కుమార్తె లోక్షణతో కలిసి స్వగ్రామం నుంచి బొలెరోలో తాను పని చేసే కరీంనగర్‌కు బయల్దేరారు. ఈ క్రమంలో నిద్రమత్తులో సురేశ్ డ్రైవింగ్ చేయడంతో వాహనం అదుపు తప్పి వడిచర్ల సమీపంలో కల్వర్టును ఢీకొంది. ఘటనలో దంపతులు అక్కడికక్కడే మృతి చెందారు. పిల్లలు స్వల్పంగా గాయపడటంతో 108లో జనగామ ఏరియా ఆస్పత్రికి పోలీసులు తరలించారు. కరీంనగర్‌లోని ఓ గ్రానైట్ కంపెనీలో సురేశ్ పనిచేస్తున్నారని సమాచారం. కేసు దర్యాప్తు చేస్తున్నారు. కాగా ప్రమాదంలో తల్లిదండ్రులు మరణించగా, ఏమి జరిగిందో తెలియని స్థితిలో ఉన్న ఆ చిన్నారులను చూసి స్థానికులు కన్నీరుమున్నీరయ్యారు. విషయాన్ని చెప్పలేక ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్సను అందిస్తున్నారు. -
సహకార సంఘ సభ్యులకు శిక్షణ
నెల్లూరు(వీఆర్సీసెంటర్): నెల్లూరు రూరల్ వ్యవసాయ, అనుబంధ రైతు ఉత్పత్తిదారుల సహకార సంఘ సభ్యులకు ఒక రోజు శిక్షణ కార్యక్రమాన్ని నగరంలోని డీసీఓ కార్యాలయంలో బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా డీసీఓ గుర్రప్ప మాట్లాడారు. అంతర్జాతీయ సహకార సంవత్సరాన్ని పురస్కరించుకొని వ్యవసాయంలో సాంకేతికత, సేంద్రియ, ప్రకృతి వ్యవసాయ పద్ధతులపై శిక్షణ ఇచ్చామని వివరించారు. అనంతరం సంఘ సభ్యులకు రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు, నిబంధనావళి ప్రతలను అందజేశారు. డీసీఓ కార్యాలయ అసిస్టెంట్ రిజిస్ట్రార్ ఉమామహేశ్వరి, సీనియర్ ఇన్స్పెక్టర్ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
అక్రమంగా హౌసింగ్ స్టీల్ తరలింపు
దుత్తలూరు: దుత్తలూరు హౌసింగ్ బోర్డు గోదాము వద్ద ఉన్న హౌసింగ్‌కు సంబంధించిన స్టీల్‌ను సొంత శాఖ వారే అక్రమంగా తరలిస్తూ బుధవారం పట్టుబడ్డారు. వివరాలు.. గృహ నిర్మాణాలకు ఉపయోగించే స్టీల్‌ను స్థానిక ఏసీ కాలనీ సమీపంలోని హౌసింగ్ గోదాము వద్ద ఓ వాహనంలో లోడ్ చేస్తుండగా, అనుమానమొచ్చిన స్థానికులు వారిని ప్రశ్నించారు. పొంతన లేని సమాధానాలు చెప్పడంతో ఫొటోలు తీసి హౌసింగ్ అధికారులకు సమాచారం అందించారు. దీంతో వెంటనే స్థానిక పోలీసులకు వారు సమాచారమివ్వడంతో పరిసర మండలాల పీఎస్‌లకు తెలియజేశారు. సీతారామపురం మండలం పోలంగారిపల్లి వద్ద వాహనాన్ని గుర్తించి డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. స్టీల్‌తో పాటు వాహనాన్ని దుత్తలూరు పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. దీనిపై హౌసింగ్ ఏఈ ఫిర్యాదు చేశారు. ఉదయగిరి మండలానికి చెందిన హౌసింగ్ అధికారి తన వాహనాన్ని బాడుగకు పిలిచారని, ఈ కారణంగానే వచ్చానని విచారణలో డ్రైవర్ తెలిపారు. సుమారు 900 కిలోల బరువుండి.. రూ.55 వేల విలువజేసే స్టీల్‌ను తరలించేందుకు యత్నించారు. విషయం తెలుసుకున్న హౌసింగ్ ఈఈ నారాయణరెడ్డి, డీఈ పీరాన్ దుత్తలూరుకు వచ్చి ఘటన స్థలాన్ని పరిశీలించి స్థానిక అధికారులను అడిగి వివరాలను తెలుసుకున్నారు. కాగా ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో వారిపై శాఖాపరంగా విచారణ చేపట్టి నివేదికను ఉన్నతాధికారులకు పంపుతామని ఈఈ తెలిపారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
పెళ్లి రోజే చివరి రోజు
మనుబోలు: వివాహ వేడుక నిమిత్తం స్వగ్రామానికి వచ్చి వారం పాటు సరదాగా గడిపారు. సెకండ్ షో సినిమాకు వెళ్లి సేదదీరారు. తమ పెళ్లి రోజు సందర్భంగా తిరిగి ఉద్యోగం చేస్తున్న ప్రాంతానికి వెళ్తున్న ఓ కుటుంబంపై విధి పగబట్టింది. మృత్యువు రోడ్డు ప్రమాద రూపంలో కబళించింది. ఈ ఘటనతో మండలంలోని వడ్లపూడిలో విషాదఛాయలు అలుముకున్నాయి. గ్రామానికి చెందిన దద్దోలు పెంచలయ్య, జయమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. చిన్న కుమారుడు సురేశ్ కరీంనగర్‌లోని ఓ గ్రానైట్ కంపెనీలో మార్కర్‌గా పనిచేస్తూ కుటుంబంతో కలిసి అక్కడే నివాసముంటున్నారు. వారం క్రితం బంధువుల పెళ్లి ఉండటంతో సురేశ్ దివ్య (32) దంపతులు తమ ఇద్దరు పిల్లలతో కలిసి వడ్లపూడికి వచ్చారు. కుటుంబసభ్యులు, బంధువులతో సరదాగా గడిపి.. పొదలకూరులో సెకండ్ షో సినిమాకు మంగళవారం వెళ్లారు. బుధవారం వారి పెళ్లి రోజు కావడంతో వేకువజామునే కారులో బయల్దేరారు. నిద్రమత్తులో కల్వర్టును వాహనం ఢీకొనడంతో తెలంగాణలోని జనగామ జిల్లా లింగాలఘణపురం మండలం వడిచర్ల వద్ద వీరు మృత్యువాత పడ్డారు. ఘటనతో వడ్లపూడి విషాదంలో మునిగిపోయింది. తమ ముందు సంతోషంగా తిరిగిన జంట ఇక లేరని తెలిసి ప్రతి ఒక్కరూ కన్నీటి పర్యంతమవుతున్నారు. -
పెరోల్ రచ్చ.. అరుణ అరెస్ట్
కోవూరు: రాష్ట్ర ప్రభుత్వం, హోంశాఖ, అధికార పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులను కుదిపేస్తున్న నెల్లూరు జిల్లా జైల్లో జీవిత ఖైదు అనుభవిస్తున్న శ్రీకాంత్ పెరోల్ వ్యవహారం నేపథ్యంలో డైవర్షన్ రాజకీయాలకు తెరతీశారు. ఈ కేసులో సంచలనానికి కేంద్రబిందువైన శ్రీకాంత్ స్నేహితురాలు నిడిగంటి అరుణ మంగళవారం టీడీపీ నేతల బాగోతాలన్ని బయటపెడతానంటూ సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు తెగ వైరలైంది. ఇది జరిగిన 24 గంటలు గడవక ముందే అరుణను కట్టడి చేసేందుకు ఈ కేసుకు సంబంధించి కాకుండా ఎప్పటిదో వేరే కేసును తిరగదోడి బుధవారం అరెస్ట్ చేయడం సంచలనం సృష్టిస్తోంది. బిల్డర్ నుంచి బలవంతంగా ఫ్లాట్ రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు యత్నించింటూ అరుణతో పాటు మరో ముగ్గుర్ని కోవూరు పోలీసులు బుధవారం అదుపులోకి తీసుకున్నారు.ఇదీ కేసు..బిల్డర్ మునగ వెంకట మురళీకృష్ణమోహన్ 2010లో పెద్దపడుగుపాడులో సాయి ఎన్క్లేవ్ పేరుతో 15 ఫ్లాట్లతో కూడిన అపార్ట్మెంట్ నిర్మించారు. అందులో 14 ప్లాట్లు విక్రయించగా, 503 ఫ్లాట్‌ను తన ఆధీనంలో ఉంచుకున్నారు. 2020 డిసెంబర్లో నిడిగుంట అరుణ ఆ ఫ్లాట్‌ను అద్దెకు తీసుకుంది. అనంతరం ఆ ఫ్లాట్ తన తండ్రి పేరిట రిజిస్టర్ చేసుకోవాలని 2022 అక్టోబర్‌లో ఒప్పందం చేసుకుని రూ.3 లక్షలు అడ్వాన్స్ ఇచ్చింది. మిగిలిన రూ.25 లక్షలు 2023 ఫిబ్రవరి నాటికి చెల్లిస్తానని అంగీకారం చేసుకున్నారు. అయితే అప్పటి నుంచి ఒక్క రూపాయి కూడా చెల్లించకపోగా అద్దెను కూడా నిలిపివేసింది. ఈ వ్యవహారమై కోర్టులో కేసు కొనసాగుతుండగా అరుణ తన అనుచరులు పల్లం వేణు, అంకెం రాజా, శీరం ఎలీషాతో కలిసి వెంకట మురళీకృష్ణమోహన్ను బెదిరించి పెళ్లకూరు కాలనీలోకి తీసుకెళ్లి తాను రూ.25 లక్షలు చెల్లించినట్లు పత్రంపై సంతకం చేయించుకున్నారు. ఆపై తరచూ ఫ్లాట్ రిజిస్టర్ చేయాలని ఒత్తిడి పెంచారు. మాట వినకపోతే ప్రాణాలతో ఉండవని హెచ్చరించారు.పెరోల్ వ్యవహారాన్ని పక్కదోవ పట్టించేందుకు..అరుణ స్నేహితుడు శ్రీకాంత్ పెరోల్ వ్యవహారం రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తున్న నేపథ్యంలో దీన్ని డైవర్ట్ చేయడానికి అరుణపై ఉన్న ఈ కేసును బయటకు తోడారు. అరుణతోపాటు పల్లం వేణు, అంకెం రాజా, శీరం ఎలీషాను అరెస్ట్ చేసేందుకు ఎస్పీ కృష్ణకాంత్ ఆదేశాల మేరకు అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) సౌజన్య, రూరల్ డీఎస్పీ శ్రీనివాసులు పర్యవేక్షణలో కోవూరు సీఐ సుధాకర్‌రెడ్డి, ఎస్సై రంగనాథ్గౌడ్ ప్రత్యేక బృందాలతో నిఘాను ఏర్పాటు చేశారు అరుణ మంగళవారం రాత్రి నెల్లూరు నుంచి హైదరాబాద్ వెళ్తుండగా, అద్దంకి టోల్ ప్లాజా వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులలో అరుణతో పాటు వేణు, రాజా, అన్సర్, ముసబీర్, గణేష్, ఎలీషా ఉన్నారు. అయితే అస్సర్, ముసబీర్, గణేష్ పరారీలో ఉన్నారు. అరెస్ట్ చేసిన వారిని నెల్లూరు కోర్టులో హాజరుపర్చారుఒంగోలు జిల్లా జైలుకు..ఒంగోలు టౌన్: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన రౌడీషీటర్ శ్రీకాంత్ పెరోల్ వ్యవహారంలో అతడి సన్నిహితురాలు అరుణను నెల్లూరు పోలీసులు అరెస్ట్ చేసిన విషయం విదితమే. కావలి కోర్టులో హాజరుపర్చగా, 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో ఆమెను ఒంగోలు జిల్లా జైలుకు రాత్రి పది గంటలకు నెల్లూరు పోలీసులు తరలించారు. -
పోర్టు ఆధారిత పరిశ్రమలతో ఉపాధి
● కలెక్టర్ ఆనంద్ కందుకూరు: రామాయపట్నం పోర్టు ఆధారంగా ఏర్పడుతున్న పరిశ్రమలతో యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయని కలెక్టర్ ఆనంద్ పేర్కొన్నారు. గుడ్లూరు మండలం చేవూరు పరిధిలో ఏర్పాటైన ఇండోసోల్ కంపెనీలో స్థానిక యువతకు ఉద్యోగాలు కల్పిస్తూ నియామక పత్రాలను బుధవారం అందజేసిన అనంతరం ఆయన మాట్లాడారు. రామాయపట్నం పోర్టు ఆధారిత పరిశ్రమలకు భూములిచ్చిన రైతు కుటుంబాల్లోని యువతకు ఉద్యోగాలు కల్పించి వారికి అండగా ఉంటున్నామని తెలిపారు. ఇండోసోల్, బీపీసీఎల్ కంపెనీల ఏర్పాటుతో స్థానికులకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు లభించనున్నాయని వెల్లడించారు. ఇండోసోల్ కంపెనీలో 68 మందికి ఉద్యోగాలను ప్రస్తుతం కల్పిస్తున్నారని తెలిపారు. ఇతరులకు సైతం వారి విద్యార్హత ఆధారంగా శిక్షణ ఇచ్చి ఉద్యోగాలను కల్పించనున్నామని తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు మాట్లాడారు. కాకినాడ, విశాఖపట్నం పోర్టుల తరహాలో రామాయపట్నం పోర్టూ అభివృద్ధి చెందుతుందని చెప్పారు. ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి ఇండోసోల్ కంపెనీలో ఉద్యోగాల కోసం అర్హత గల యువత దరఖాస్తు చేసుకోవాలని, వీటిని కంపెనీ కార్యాలయం లేదా ఈ మెయిల్‌కు పంపొచ్చని సంస్థ హెచ్ఆర్ ప్రతినిధి, కంపెనీ స్కిల్ డెవలప్మెంట్ అధికారి భారతి పేర్కొన్నారు. అభ్యర్థుల అర్హతల మేరకు శిక్షణ ఇచ్చి ఉద్యోగాలను కల్పిస్తామని, శిక్షణ కార్యక్రమాలను సెప్టెంబర్ ఒకటి నుంచి ప్రారంభించనున్నామని పేర్కొన్నారు. సబ్ కలెక్టర్ దామెర హిమవంశీ, ఇండోసోల్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ బాలచందర్కృష్ణన్, బైరెడ్డి రంగారెడ్డి, స్కిల్ డెవలప్మెంట్ జిల్లా అధికారి అబ్దుల్ ఖయ్యూం తదితరులు పాల్గొన్నారు. -
స్టాఫ్ నర్సుల విధుల బహిష్కరణ
నెల్లూరు(అర్బన్): మేల్ నర్సు వెంకటప్పయ్యపై దాడి చేసిన జూనియర్ డాక్టర్ శ్రీతేజ తదితరులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని పలువురు స్టాఫ్ నర్సులు డిమాండ్ చేశారు. మంగళవారం వారు విధులను బహిష్కరించారు. నగరంలోని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి వద్ద ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సింగ్ అసోసియేషన్ సమన్వయకర్త మాధురి మాట్లాడుతూ నాలుగు రోజుల క్రితం క్యాజువాలిటీలో రద్దీగా ఉండటంతో రోగికి వైద్యం త్వరగా చేయాలని శ్రీతేజను వెంకటప్పయ్య కోరాడన్నారు. ఈ క్రమంలో వచ్చిన స్పల్ప విభేదాలను దృష్టిలో ఉంచుకుని వెంకటప్పయ్య డాక్టర్‌కు క్షమాపణ చెప్పాడన్నారు. అయినా శిక్షణలో ఉన్న 15 మంది జూనియర్ డాక్టర్లను వెంట బెట్టుకుని మద్యం మత్తులో శ్రీతేజ సోమవారం రాత్రి విధుల్లో ఉన్న వెంకటప్పయ్యను తిడుతూ దాడి చేశాడన్నారు. అడ్డుపడిన కల్యాణ్ అనే మరో నర్సుపై దాడి చేశారన్నారు. సీనియర్ స్టాఫ్ నర్సు శాంతిని తోసేసి బెదిరించారన్నారు. సూపరింటెండెంట్ డాక్టర్ మాధవికి ఫిర్యాదు చేసినా న్యాయం జరగలేదన్నారు. ఎమర్జెన్సీ మినహా మిగిలిన చోట్ల విధులు బహిష్కరించి న్యాయం జరిగే వరకు ఆందోళన చేస్తామన్నారు. కేసు నమోదు స్టాఫ్ నర్సులు నాలుగో నగర పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు శ్రీతేజ, సందీప్, దినేష్, గగన్, భార్గవ్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కాగా క్రిమినల్ కేసులు నమోదు చేయాలని నర్సులు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో స్టాఫ్ నర్సులు శాంతి, శ్రీలత, లావణ్య, వసుంధర తదితరులు పాల్గొన్నారు. -
సకాలంలో వ్యవసాయ సర్వీసుల మంజూరు
● నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు ● ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ సంతోషరావు నెల్లూరు(వీఆర్సీసెంటర్): ‘పెండింగ్‌లో ఉన్న వ్యవసాయ విద్యుత్ సర్వీసులను వెంటనే మంజూరు చేయాలి. రైతులు, వినియోగదారులను కార్యాలయాల చుట్టూ తిప్పుకునే పద్ధతికి స్వస్తి పలకాలి’ అని ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ సంతోషరావు అన్నారు. జిల్లాలోని కావలి పట్టణంలో స్పందన ఫంక్షన్ హాల్లో మంగళవారం కావలి డివిజన్ విద్యుత్ అధికారులు, సిబ్బందితో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఐవీఆర్ఎస్ ద్వారా విద్యుత్ శాఖ వినియోగదారుల నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకోవడంలో కావలి డివిజన్లోని బోగోలు, కావలి రూరల్ సెక్షన్ల పనితీరు బాగోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్ సరఫరా నిరంతరాయంగా జరుగుతుందా?, లోఓల్టేజీ సమస్యలు ఉన్నాయా?, సిబ్బంది అందుబాటులో ఉంటున్నారా? అనే మూడు ప్రధాన అంశాలపై ప్రభుత్వం వినియోగదారుల నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకుంటుందన్నారు. అయితే బోగోలు, కావలి రూరల్ సెక్షన్ల నుంచి వినియోగదారులకు సంతృప్తికర సేవలు అందడంలేదన్న ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. ఈ విషయంలో పురోగతి లేకపోతే సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అదేవిధంగా పీఎం సూర్యఘర్‌కు సంబంధించి ఎస్సీ, ఎస్టీ వినియోగదారులకు యుద్ధప్రాతిపదికన అంగీకారపత్రాలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లాలో ఆర్టీఎస్ఎస్ స్కీమ్ ద్వారా గ్రామీణ విద్యుత్ మౌలిక వసతుల అభివృద్ధి, పారిశ్రామికీకరణ కోసం రూ.400 కోట్ల వ్యయంతో పనులు జరుగుతున్నాయన్నారు. నూతనంగా 336 వ్యవసాయ ఫీడర్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. అధికారులు, సిబ్బంది హెడ్‌క్వార్టర్స్‌లోనే నివాసం ఉండాలని, లేకపోతే హెచ్ఆర్ఏ కట్ చేస్తామని హెచ్చరించారు. సమావేశంలో ఏపీఎస్పీడీసీఎల్ చీఫ్ జనరల్ మేనేజర్ వరకుమార్, జిల్లా సర్కిల్ ఎస్ఈ విజయన్, కావలి ఈఈ బెనర్జీ, డీఈఈ, ఏఈలు, సిబ్బంది పాల్గొన్నారు. -
ప్రాణం చిన్నది.. ప్రమాదం పెద్దది
అవగాహన పెంచాలి దోమలు నివారణ జరగాలంటే ప్రజల్లో అవగాహన పెంచాలి. వాటి ద్వారా వచ్చే డెంగీ లాంటి జబ్బుల్లో కొన్ని రకాలు ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది. చికిత్సకే రూ.లక్షలు ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అందువల్ల ప్రజలు ఇంట్లో, బయట నీరు నిల్వ లేకుండా చూసుకోవాలి. దోమలు రాకుండా మెస్‌లు ఏర్పాటు చేయించుకోవాలి. – డాక్టర్ ఎంవీ రమణయ్య, ప్రజారోగ్యవేదిక రాష్ట్రాధ్యక్షుడు చర్యలు తీసుకున్నాం జిల్లాలో దోమల నిర్మూలనకు పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపట్టాం. అన్ని హాస్టళ్లలో మలాథియాన్ స్ప్రే చేశాం. నీటి గుంతల్లో దోమ లార్వాలను తినే గంబూసియా చేపలను వదిలిపెడుతున్నాం. ఫ్రైడే డ్రైడే కార్యక్రమంలో భాగంగా ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంలు, హెల్త్ అసిస్టెంట్లు ప్రజల వద్దకు అవగాహన కల్పిస్తున్నారు. ఎక్కడైనా మలేరియా, డెంగీ కేసులు నమోదైనట్టు తెలిస్నే ఆ ప్రాంతానికి చుట్టుపక్కల కిలోమీటర్ పరిధిలో పారిశుధ్య కార్యక్రమాలు చేపడుతున్నాం. – హుస్సేనమ్మ, జిల్లా మలేరియా నివారణాధికారిణి నెల్లూరు(అర్బన్): డెంగీ, మలేరియా, ఫైలేరియా, చికున్‌గున్యా.. ఇవి రావడానికి ప్రధాన కారణం దోమ కాటు. వర్షాకాలంలో వీటి బెడద విపరీతంగా ఉంటూ సమాజాన్ని వణికిస్తాయి. లక్షల మంది అనారోగ్యానికి గురవుతుంటారు. చికిత్స నిమిత్తం పెద్ద మొత్తంలో నగదు ఖర్చయి ఆర్థికంగా నష్టపోతున్న వారు కూడా ఉన్నారు. మరికొందరికి డెంగీ ప్రాణాంతకంగా మారుతోంది. ఇలాంటి సమయంలో ఆరోగ్యపరంగా అప్రమత్తంగా ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచిస్తోంది. బుధవారం దోమల నివారణ దినం సందర్భంగా జిల్లాలో కూడా వైద్యశాఖ ఆధ్వర్యంలో అధికారులు, సిబ్బంది అవగాహన ర్యాలీలు నిర్వహిస్తూ సదస్సులు నిర్వహించనున్నారు. మలేరియా నిర్మూలన కోసం పోరాటాన్ని వేగవంతం చేయడం, మరింత సమానమైన ప్రపంచం కోసం అనే థీమ్‌ను ఈ ఏడాది ప్రకటించారు. విజృంభిస్తున్న వ్యాధులు జిల్లాలో దోమలు ప్రజలను కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. సీజనల్ వ్యాధులతోపాటు ప్రమాదకరమైన జపనీస్ ఎన్సెఫలైటిస్, పసుపు జ్వరం, జికా వైరస్లు అప్పుడప్పుడూ ప్రజలపై దాడి చేస్తున్నాయి. ఈ జబ్బులకు గురైన పలువురు చికిత్సకు స్పందించక చనిపోతున్నారు. కొద్దిరోజులుగా చిరుజల్లులు కురుస్తూనే ఉన్నాయి. వర్షపునీరు ఖాళీ ప్రదేశాల్లో నిల్వ చేరింది. నెల్లూరు నగరంలో ఖాళీ ప్లాట్లు, మురుగు కాలువలు దోమలకు ఆవాసాలుగా మారాయి. ప్రభుత్వ, ప్రైవేట్ హాస్పిటళ్లలో జ్వరపీడితుల సంఖ్య పెరిగింది. అలా వస్తేనే.. జిల్లాలో 52 పీహెచ్‌సీలు, 10 సీహెచ్‌సీలు, 28 పట్టణ ఆరోగ్య కేంద్రాలు, ఒక జిల్లా ఆస్పత్రి, రెండు ఏరియా ఆస్పత్రులు, నగరంలో మెడికల్ కళాశాలకు అనుబంధంగా సర్వజన ఆస్పత్రి ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. 450 వరకు కార్పొరేట్, ప్రైవేట్ ఆస్పత్రులు, క్లినిక్‌లు నడుస్తున్నాయి. అన్నిచోట్లా రోగులు పెరుగుతున్నారు. రామచంద్రారెడ్డి, జయభారత్, నారాయణ, మెడికవర్ ఇలా పలు హాస్పిటళ్లలో డెంగీ కేసులు క్రమేపీ పెరుగుతున్నాయి. అయితే ప్రైవేట్‌లో చేసే పరీక్షలను వైద్యశాఖ అంగీకరించడం లేదు. ప్రభుత్వాస్పత్రిలో చేసే ఎలీసా టెస్ట్‌ల్లో పాజిటివ్ వస్తేనే డెంగీ లాంటి జబ్బులను అంగీకరిస్తున్నారు. దీంతో వైద్యశాఖలో డెంగీ, మలేరియా కేసులు లేనట్టు.. ఒకటో రెండో వచ్చినట్టు కాకి లెక్కలు రాస్తున్నారు. గత సంవత్సరంలో డెంగీ 130, మలేరియా 6, చికున్‌గున్యా 2 కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాదిలో జూలై నెల వరకు డెంగీ 19, మలేరియా 3, చికున్‌గున్యా 2 కేసులు వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. తీసుకోవాల్సిన చర్యలు ఇంట్లో, ఆవరణలో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. పాత టైర్లు, పూలకుండీలు, డ్రమ్ములు వంటి వాటిలో నీరు ఉంటే పారబోయాలి. మురికి కూపాలు, చెత్తాచెదారం లేకుండా చూసుకోవాలి. ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి. ఇంట్లోకి దోమలు రాకుండా కిటికీలకు జాలీలు ఏర్పాటు చేసుకోవాలి. దోమతెరలు వాడాలి. దోమల నియంత్రణకు స్ప్రేలు వినియోగించాలి. అలాగే తులసి, వేప లాంటి మొక్కలను పెంచడం ద్వారా కొంతమేరకు దోమలను తగ్గించుకోవచ్చు.సమాజాన్ని వణికిస్తున్న దోమలు ఒక్కోదఫా ప్రాణాంతకంగా మారుతున్న జబ్బులు అవగాహన, జాగ్రత్తలతోనే నివారణ నేడు ప్రపంచ దోమల నివారణ దినం జిల్లాలో అవగాహన కార్యక్రమాలు -
ఉదయగిరిలో ఈదురుగాలుల బీభత్సం
ఉదయగిరి: ఉదయగిరి పట్టణంలో వారంరోజులుగా ఈదురుగాలులు బీభత్సం సృష్టిస్తున్నాయి. దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. గాలికి మంగళవారం పట్టణ సమీపంలోని స్టీట్పేటలో విద్యుత్ తీగ తెగి పడిపోగా త్రుటిలో ప్రమాదం తప్పింది. స్థానికులు గమనించి విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో వారు దానిని తొలగించి లైను సరిచేశారు. చెట్లకొమ్మలు, హోర్డింగులు నేల వాలిపోతున్నాయి. గాలులకు ఎలాంటి ప్రమాదాలు సంభవిస్తాయోనని ప్రజలు భయాందోళన చెందుతున్నారు. 29న శ్రీవారికి చందనాలంకారంరాపూరు: మండలంలోని పెంచలకోలనలో పెనుశిల లక్ష్మీనరసింహస్వామి 29వ తేదీన చందనాలంకరణలో దర్శనమివ్వనున్నట్లు దేవస్థాన అధికారులు మంగళవారం తెలిపారు. ఆరోజు స్వాతి నక్షత్రం స్వామి జన్మ నక్షత్రం కావడంతో ఉదయం 4 గంటలకు సుప్రభాతం, 9 గంటలకు శాంతి హోమం, 10 గంటలకు కల్యాణం, రాత్రి 7 గంటలకు బంగారు గరుడసేవ నిర్వహించనున్నట్లు వెల్లడించారు.చేప పిల్లల ఉత్పత్తి కేంద్రం పరిశీలనసోమశిల: అనంతసాగరం మండల పరిధిలోని సోమశిల గ్రామంలో ఉన్న జాతీయ చేప పిల్లల ఉత్పత్తి కేంద్రాన్ని మత్స్యశాఖాధికారి సురేష్ మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుపయోగంలో ఉన్న ఈ కేంద్రాన్ని ప్రారంభించేందుకు జంగిల్ క్లియరెన్స్‌కు ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందన్నారు. ఈ ఏడాది చివరన ఉత్పత్తి చేసిన చేప పిల్లలను సోమశిల జలాశయంలో వదులుతామన్నారు. ఆయన వెంట మత్స్యశాఖ సిబ్బంది ఖలీల్, లోకేశ్ ఉన్నారు. -
కూటమి నేతలకు 30 యాక్ట్ వర్తించదా?
● కరేడు రైతుల మండిపాటు ఉలవపాడు: కూటమి నేతలకు, కార్యకర్తలకు పోలీస్ 30 యాక్ట్, 144 సెక్షన్లు వర్తించవా? అని కరేడు రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కరేడు ర్యాంపు నుంచి కరేడు మీదుగా చేవూరు వరకు రూ.2.45 కోట్లతో నిర్మించనున్న బీటీ రోడ్డుకు మంగళవారం ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు శంకుస్థాపన చేశారు. సాధారణంగా శంకుస్థాపనను రోడ్డు మొదలయ్యే చోట ఏర్పాటు చేస్తారు. అలా కాకుండా కరేడు వద్ద చేశారు. ఊరిలో ఈనెల 31 వరకు పోలీస్ 30 యాక్ట్ ఉందని, బయట వ్యక్తులు రాకూడదని, 144 సెక్షన్ అమల్లో ఉందని పోలీసులు చ ఎప్పారు. అయితే ఈ కార్యక్రమానికి బయటి నుంచి వ్యక్తులు వచ్చినా చూస్తూ ఉండటంతో ఆంతర్యమేమిటని రైతులు ప్రశ్నిస్తున్నారు. భూములు కోల్పోతున్న వారికి అండగా వివిధ పా ర్టీల నాయకులు వస్తుంటే పోలీస్ శాఖ అడ్డుకుని అరెస్టు చేస్తూ నిర్బంధించింది. టీడీపీ కార్యకర్తలకు ఒక న్యాయం, రైతులకు ఒక న్యాయమా అని ఉద్యమ నాయకుడు, 139 బీసీ కులాల జెఏసీ చైర్మన్ మిరియం శ్రీనివాసులు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కాగా ఎమ్మెల్యే కరేడు, అలగాయపాళెం సచివాయాలను తనిఖీ చేసిన సమయంలో టీడీపీ కార్యకర్తలకే పనిచేయాలని సిబ్బందికి చెప్పినట్లు సమాచారం. -
టూరిజం భవనాల పరిశీలన
ఉదయగిరి: పట్టణంలోని ఆనకట్ట సమీపంలో నిర్మించిన ఏపీ టూరిజం శాఖ భవనాలను జిల్లా పర్యాటక శాఖ మేనేజర్ ఉషశ్రీ మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పర్యాటక శాఖకు సంబంధించిన భవనాలను ఇటీవల టెండర్ ద్వారా అద్దె ప్రాతిపదికన ఎన్.తులసీరామ్ అనే వ్యక్తికి అప్పగించామన్నారు. దీంతో భవనాల మరమ్మతు పనులు ఎంతమేర జరిగాయో క్షేత్రస్థాయిలో పరిశీలన చేసేందుకు వచ్చినట్లు వివరించారు. పనులు పూర్తయిన వెంటనే ఆయా భవనాల్లో అతిథి గృహం, రెస్టారెంట్ అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ అప్పాజీ, ఎకై ్సజ్ ఎస్సై శ్రీనివాసులు పాల్గొన్నారు. -
అంగన్వాడీ సరుకులు తరలిస్తుండగా..
● పట్టుకున్న గ్రామస్తులు ● వేరేచోట భద్రపరిచేందుకన్న కార్యకర్త పొదలకూరు: పట్టణానికి సమీపంలోని తెలుగుగంగ పునరావాస కేంద్రం(వెంకటేశ్వరనగర్) అంగన్వాడీ కేంద్రంలోని పిల్లలకు చెందిన సరుకులను మంగళవారం కార్యకర్త తరలిస్తుండగా గ్రామస్తులు పట్టుకుని సీడీపీఓ దృష్టికి తీసుకెళ్లారు. గ్రామస్తుల కథనం మేరకు.. కార్యకర్తగా పనిచేస్తున్న సునీత పిల్లలకు అందజేయాల్సిన కోడిగుడ్లు, బాలామృతం తదితర సుమారు రూ.15 వేలు విలువైన సరుకులను తరలిస్తుండగా అటకాయించారు. ఆటోతో సహా నిలిపివేసి పోలీసులకు అప్పగించాలని ప్రయత్నించినట్టు తెలిసింది. అయితే సరుకులను అక్కడే ఉంచి వెంకటాచలం సీడీపీఓకు సమాచారం అందించారు. అంగన్వాడీ టీచర్ మాత్రం సరుకులను వేరే ఇంట్లో భద్రపరిచేందుకు తరలిస్తుండగా పట్టుకున్నట్టు చెప్పుకొస్తున్నారు. సీడీపీఓ విచారణలో వాస్తవాలు తెలియాల్సి ఉంది. -
భూముల ఆక్రమణపై విజిలెన్స్
బుచ్చిరెడ్డిపాళెం రూరల్: పట్టణంలోని వవ్వేరులో గల కనిగిరి చెరువు వద్ద గ్రావెల్ అక్రమ తవ్వకాలు, భూముల ఆక్రమణపై విజిలెన్స్ అధికారులు మంగళవారం తనిఖీ చేశారు. కనిగిరి రిజర్వాయర్‌ను ఆనుకొని ఉన్న భూముల్లో గ్రావెల్ మాఫియా కొన్ని రోజులుగా ఇష్టారాజ్యంగా తవ్వేసింది. వీటిని విక్రయించి రూ.కోట్లు గడించడమే కాకుండా ఆయా భూములను చదును చేసి ఆక్రమించారు. ఈ విషయమై స్థానిక రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు పట్టించుకున్న దాఖలాల్లేవు. వ్యవహారం జిల్లా విజిలెన్స్ అధికారుల దృష్టికి వెళ్లడంతో.. కనిగిరి రిజర్వాయర్ వద్ద గ్రావెల్ తవ్విన ప్రదేశాలు, ఆక్రమణకు గురైన స్థలాలను పరిశీలించారు. 920 సర్వే నంబర్లో వందలాది ఎకరాలు అక్రమార్కుల చెరలో ఉన్నాయనే అంశాన్ని గుర్తించారు. గ్రామస్తులను అడిగి పలు వివరాలను సేకరించారు. ఈ సందర్భంగా విజిలెన్స్ అధికారులు మాట్లాడారు. భూముల ఆక్రమణ, గ్రావెల్ తవ్వకాలపై సమగ్ర నివేదికను రూపొందించి ఉన్నతాధికారులకు అందజేయనున్నామని చెప్పారు. సంబంధమున్న వారిపై చర్యలు తప్పవని పేర్కొన్నారు. -
కాకాణి విడుదల్లో జాప్యం
వెంకటాచలం: మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డికి హైకోర్టు బెయిలిచ్చినా, మంజూరు పత్రాలను ఇవ్వడంలో ఆలస్యం చోటుచేసుకుంది. దీంతో జైలు నుంచి మంగళవారం ఆయన విడుదల కాలేకపోయారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కాకాణిపై ఎనిమిది అక్రమ కేసులను బనాయించి జైలుకు పంపారు. ఏడు కేసుల్లో ఇప్పటికే బెయిల్ లభించగా, తాజాగా మిగిలిన దాంట్లో సోమవారం మంజూరైంది. దీంతో నెల్లూరు కేంద్ర కారాగారం నుంచి మంగళవారం విడుదలవుతారని భావించారు. అయితే బెయిల్ మంజూరు పత్రాలను ఆలస్యంగా ఇవ్వడంతో అవి అధికారులకు సకాలంలో అందలేదు. దీంతో బుధవారం విడుదలయ్యే అవకాశం ఉంది. అడుగడుగునా పోలీసుల ఆంక్షలు తమ అభిమాన నేత కాకాణి గోవర్ధన్‌రెడ్డి విడుదలవుతారని తెలిసి సర్వేపల్లి నియోజకవర్గంలోని పార్టీ శ్రేణులు, అభిమానులే కాకుండా జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున నేతలు జిల్లా కేంద్ర కారాగారం వద్దకు చేరుకున్నారు. కొందరు తమ అభిమానాన్ని చాటుతూ జైలుకెళ్లే మార్గంలో కాకాణికి స్వాగతం పలుకుతూ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. అయితే వీటిని తొలగించడమే కాకుండా జైలు వద్ద ఉన్న శ్రేణులను పోలీసులు చెదరగొట్టారు. కొందరు ఏదో మార్గంలో వెళ్తుంటే, ఖాకీలు అత్యుత్సాహంతో బైక్‌లను ఆపి తాళాలను లాక్కొన్నారు. నిరాశగా వెనుదిరిగి.. చెముడుగుంట పంచాయతీ పవన్‌కాలనీ నుంచి బుజబుజనెల్లూరు వరకు నెల్లూరు వైపు వెళ్లే మార్గంలో వేలాది మంది పార్టీ శ్రేణులు కాకాణి రాక కోసం గంటల తరబడి వేచి చూశారు. చివరికి ఆయన విడుదల కావడంలేదని తెలిసి నిరాశగా వెనుదిరిగారు. జాప్యం బాధాకరం మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి మంగళవారం విడుదల కాకపోవడం బాధాకరమని ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి పేర్కొన్నారు. జిల్లా కేంద్ర కారాగారం వద్ద విలేకరులతో ఆయన మాట్లాడారు. ఆయనకు స్వాగతం పలికేందుకు ఎంతో సంతోషంగా జైలు వద్దకొచ్చామని, అయితే గూడూరు కోర్టు నుంచి 5.30 తర్వాత బెయిల్ మంజూరు పత్రాలివ్వడంతో విడుదల ఆలస్యమైందని చెప్పా రు. అనంతరం కాకాణి కుమార్తె, పార్టీ మహిళా విభాగ వర్కింగ్ ప్రెసిడెంట్ పూజిత మాట్లాడారు. తన తండ్రి జైలుకెళ్లాక, ఏనాడూ ఇక్కడికి రాలేదని, ఈ రోజు విడుదలవుతున్నారనే సంతోషంతో రాగా, జాప్యం కావడం బాధగా ఉందని తెలిపారు. బెయిల్ మంజూరు పత్రాలను సకాలంలో కోర్టు వద్దకు చేర్చడంలో మా తప్పు లేకపోయినా, ఎప్పుడు విడుదలవుతారనే విషయమై స్పష్టత ఇవ్వడంలేదని తెలిపారు. బుధవారం ఏ సమయంలో విడుదల చేస్తారనే విషయమై సమాధానం చెప్పేవారే లేరని అసంతృప్తి వ్యక్తం చేశారు. బెయిల్ మంజూరు పత్రాలివ్వడంలో ఆలస్యం కలిసేందుకు వేలాదిగా తరలివచ్చిన వైఎస్సార్సీపీ శ్రేణులు జైలు వద్దకు వెళ్లనీయకుండా పోలీసుల ఆంక్షలు నేడు బయటకు.. నెల్లూరు (లీగల్): జిల్లా కేంద్ర కారాగారం నుంచి మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి బుధవారం ఉదయం విడుదల కానున్నారు. హైకోర్టు ఉత్తర్వుల మేరకు ఆయన విడుదల కోసం రూ.రెండు లక్షల ఆస్తి కలిగిన ఇద్దరు జామీన్దార్లతో పత్రాలను గూడూరు ఇన్చార్జి అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో సీనియర్ న్యాయవాదులు రామిరెడ్డి రోజారెడ్డి, ఉమామహేశ్వర్‌రెడ్డి దాఖలు చేశారు. అయితే సాంకేతిక కారణాలతో కోర్టులో రిలీజ్ ఆర్డర్స్ ఆలస్యమయ్యాయి. జిల్లా కేంద్ర కారాగార నిబంధనల మేరకు రిలీజింగ్ ఆర్డర్స్‌కు సమయం మించిపోవడంతో మంగళవారం విడుదల కాలేకపోయారు. -
సూర్యప్రభ వాహనంపై వెంకయ్యస్వామి విహారం
వెంకటాచలం: ఆరాధనోత్సవాల్లో భాగంగా గొలగమూడిలోని భగవాన్ వెంకయ్యస్వామి సూర్యప్రభ వాహనంపై మంగళవారం దర్శనమిచ్చారు. సుప్రభాతసేవ, అభిషేకాలను జరిపారు. చంద్రప్రభ వాహనసేవను రాత్రి నిర్వహించారు. స్వామివారిని పుష్పాలతో అలంకరించి గ్రామోత్సవాన్ని జరిపారు. ఉత్సవాల్లో నేడు ఉత్సవాల్లో భాగంగా హనుమంత, హంసవాహన సేవను బుధవారం నిర్వహించనున్నారు. పొగాకు సగటు ధర రూ.196.62 మర్రిపాడు: మండలంలోని డీసీపల్లి పొగాకు బోర్డు వేలం కేంద్రంలో 184 బేళ్లను మంగళవారం విక్రయించామని వేలం నిర్వహణాధికారి రాజశేఖర్ తెలిపారు. సగటున రూ.196.62 ధర లభించింది. వేలానికి 336 బేళ్లు రాగా 184ను విక్రయించామని, మిగిలిన వాటిని వివిధ కారణాలతో తిరస్కరించామని తెలిపారు. వేలంలో 21,528.3 కిలోల పొగాకును విక్రయించారు. గరిష్టంగా రూ.280, కనిష్టంగా రూ.140 ధర లభించింది. ఉన్నత విద్యకు ఉపకార వేతనాలు నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట): ఉన్నత విద్యనభ్యసించాలనే గిరిజన విద్యార్థులకు ఉపకార వేతనాలను నేషనల్ ఫెలోషిప్, నేషనల్ స్కాలప్షి ప్ పథకాల ద్వారా అందజేస్తున్నారని ఐటీడీఏ పీఓ మల్లికార్జున మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. పీజీలో 55 శాతం మార్కులతో ఉత్తీర్ణులైన గిరిజన విద్యార్థులు ఎంఫిల్, పీహెచ్డీ కోర్సులు చేసేందుకు ఎంపిక చేసిన యూనివర్సిటీల్లో ప్రవేశం పొందిన వారు నేషనల్ ఫెలోషిప్ స్కాలర్షిప్కు అర్హులని చెప్పారు. ● డిగ్రీ, పీజీ కోర్సులు చేసేందుకు ఎంపిక చేసిన కళాశాలలు, యూనివర్సిటీల్లో ప్రవేశం పొందిన వారు నేషనల్ స్కాలర్షిప్ పథకానికి అర్హులని వివరించారు. వీరి వార్షికాదాయం రూ.ఆరు లక్షలకు మించరాదన్నారు. ఆన్లైన్లో వచ్చే నెలాఖరులోపు దరఖాస్తు చేసుకోవాలని, వివరాలకు ఐటీడీఏ కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించారు. ఓపెన్ స్కూల్ ఫీజు గడువు పొడిగింపు నెల్లూరు (టౌన్): ఓపెన్ స్కూల్లో పదో తరగతి, ఇంటర్లో ప్రవేశానికి రూ.200 అపరాధ రుసుముతో ఫీజు గడువును వచ్చే నెల 15 వరకు పొడిగించారని డీఈఓ బాలాజీరావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల వారు ఫీజును ఆన్లైన్లో చెల్లించాలని, వివరాలకు 89194 28319 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు. యథేచ్ఛగా గ్రావెల్ దందా కావలి (జలదంకి): కావలి మండలంలోని చలంచర్లలో గ్రావెల్ అక్రమ దందా కొనసాగుతోంది. చెరువులో రెండు జేసీబీలతో తవ్వుతూ ట్రాక్టర్లలో తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. వివిధ ప్రాంతాలకు మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు తరలించారు. ఎలాంటి అనుమతుల్లేకుండా తెలుగు తమ్ముళ్లు ఇలా వ్యవహరిస్తున్నా.. ఇరిగేషన్ అధికారులు ఏ మాత్రం పట్టించుకోకపోవడం గమనార్హం. -
యూరియాకు కృత్రిమ కొరత సృష్టిస్తే చర్యలు
దుత్తలూరు: జిల్లాకు ఈ సీజన్లో 40 వేల మెట్రిక్ టన్నుల యూరియా వచ్చిందని, ఎవరైనా కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా వ్యవసాయాధికారి సత్యవాణి పేర్కొన్నారు. దుత్తలూరు బిట్ – 1 సచివాలయంలో మంగళవారం నిర్వహించిన పొలం పిలుస్తోంది కార్యక్రమంలో భాగంగా రైతులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. జామాయిల్ తోటలు సాగుచేసే వారికి యూరియాను ఇవ్వడంలేదని, వీరు కాంప్లెక్స్ ఎరువులను వినియోగించాలని సూచించారు. పంటలను పరిశీలించి అవసరమైన వారికి యూరియాను అందిచాలని కోరారు. ఈ – పంట నమోదు చేయించుకోవాలని, అన్నదాత సుఖీభవ పథకం అందని వారికి ఏమైనా సమస్యలుంటే రైతు సేవా కేంద్రంలో గ్రామ వ్యవసాయ సహాయకులను సంప్రదించాలని సూచించారు. ఉదయగిరి నియోజకవర్గానికి కందులు అందుబాటులో ఉన్నాయని, అవసరమైన రైతులు తమ సమీప కార్యాలయాలను సంప్రదించాలని పేర్కొన్నారు. మున్ముందు మినుములూ అందుబాటులోకి రానున్నాయని వెల్లడించారు. జిల్లా వ్యవసాయ కార్యాలయ ఏడీఏ నర్సోజీరావు, వ్యవసాయ శాస్త్రవేత్త కిరణ్‌కుమార్‌రెడ్డి, ఉదయగిరి ఏడీఏ లక్ష్మీమాధవి, వ్యవసాయాధికారులు వెంకటసుబ్బారెడ్డి, మదన్మోహన్, చెన్నారెడ్డి, సునీల్ తదితరులు పాల్గొన్నారు. -
ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదు
●అనుమతుల్లేని స్కూళ్లపై చర్యలు చేపట్టాలంటూ జిల్లా విద్యాశాఖాధికారులకు పలుమార్లు వినతిపత్రాలను అందజేసినా ప్రయోజనం లేదు. కార్పొరేట్ యాజమాన్యాల నుంచి మామూళ్లను భారీగా పుచ్చుకొని పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నారు. అధిక ఫీజులు, పుస్తకాల పేరిట దోపిడీ జరుగుతున్నా, మిన్నకుండిపోతున్నారు. దీనిపై కలెక్టర్ జోక్యం చేసుకోవాలి. – ఆదిత్యసాయి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఏపీ విద్యార్థి జేఏసీ నోటీసులను మరోసారి జారీ చేస్తాం అనుమతుల్లేకుండా పాఠశాలలను నిర్వహిస్తున్న యాజ మాన్యాలకు గతంలో నోటీసులను జారీ చేసి వివరణ కోరాం. మరికొందరు పంపాల్సి ఉంది. మరోసారి నోటీసులను జారీ చేస్తాం. పాఠశాలలకు అనుమతి ఉండాల్సిందే. – బాలాజీరావు, డీఈఓ -
అక్టోబర్ నాటికి ప్లాంటేషన్లు పూర్తి
ఉదయగిరి: జిల్లాలో ప్లాంటేషన్ ప్రక్రియను ఈ ఏడాది అక్టోబర్ నాటికి పూర్తి చేస్తామని జిల్లా అటవీ శాఖ అధికారి మహబూబ్‌బాషా పేర్కొన్నారు. పట్టణంలోని చెక్క నగిషీ కేంద్రాన్ని మంగళవారం పరిశీలించిన అనంతరం అక్కడి మహిళలు, నిర్వాహకులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. జిల్లాలో ఐదు అటవీ రేంజ్‌ల పరిధిలో 960.48 హెక్టార్లలో మొక్కల పెంపకం లక్ష్యమన్నారు. నర్సరీల్లో 20.65 లక్షల మొక్కలను పెంచుతున్నామని వివరించారు. వర్షాల నేపథ్యంలో ఐదు అటవీ రేంజ్‌ల పరిధిలో మొక్కలు నాటేందుకు ప్లాంటేషన్లను సిద్ధం చేస్తున్నారని వివరించారు. ఇప్పటికే 60 హెక్టార్లలో మొక్కలు నాటడాన్ని పూర్తి చేశామన్నారు. చెక్క నగిషీ కేంద్రంలో వస్తువుల తయారీకి ఉపయోగించే వివిధ రకాల దేవదారు, కలివి, నెర్ది, బల్లనెర్ది కలప అందుబాటులో లేవని, వీటిని అటవీ శాఖ ప్లాంటేషన్లలో పెంచి తయారీదారులకు సరఫరా చేసేలా చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు. ఈ వస్తువులకు మార్కెటింగ్ సౌకర్యాన్ని కల్పించనున్నామని, ఇందులో భాగంగా జిల్లాలోని నగరవనంలో స్టాళ్ల ఏర్పాటుకు కృషి చేస్తామని వెల్లడించారు. అనంతరం దుర్గంపల్లె నర్సరీ, సర్వరాబాద్ ప్లాంటేషన్‌ను పరిశీలించారు. రేంజ్ అధికారి కుమార్‌రాజా, ఎఫ్ఎస్ఓ చిన్న వెంకటయ్య, ఏబీఓ బచ్చల వెంకటేశ్వర్లు, కేంద్ర నిర్వాహకుడు జాకీర్‌హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు. -
‘బార్ టెండర్లలో పాల్గొనబోం’
● నెలకు రూ.పది లక్షల నష్టం తప్పదు ● బార్ యజమానుల అసహనం నెల్లూరు సిటీ: కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన మద్యం పాలసీపై బార్ల యజమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ విధానంతో నెలకు రూ.పది లక్షల నష్టం వస్తుందని, ఈ తరుణంలో టెండర్లలో తాము పాల్గొనబోమంటూ ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్‌కు లిఖితపూర్వకంగా మంగళవారం తెలిపారు. ఎన్నో ఏళ్లుగా ఈ రంగంలో ఉంటున్న తమకు నూతన లాటరీ విధానంతో నష్టం వాటిల్లుతుందని చెప్పారు. ప్రస్తుతం యజమానులుగా ఉన్న తాము లైసెన్స్‌లను పోగొట్టుకునే ప్రమాదం ఉందన్నారు. ఎంత తేడా.. హైదరాబాద్ లాంటి నగరాల్లో ఏడాదికి రూ.40 లక్షల బార్ లైసెన్స్ ఫీజు, 22 శాతం మార్జిన్ ఉంటుందన్నారు. అయితే రాష్ట్రంలో ఏడాదికి రూ.75 లక్షల ఫీజుతో పాటు మూడేళ్ల కాలపరిమితి ఇవ్వడంతో తమకు వ్యాపార భద్రత కరువవుతుందని తెలిపారు. రూ.99 బ్రాండ్ ఇవ్వకపోతే తాము నష్టపోతామని, మద్యం దుకాణాలకు పర్మిట్ రూములను ఇవ్వడంతో కోలుకోలేని దెబ్బ తగులుతుందని చెప్పారు. గడిచిన ఏడాదే నగరంలో ఒక్కో బార్ యజమాని దాదాపు రూ.50 లక్షల నుంచి రూ.కోటి వరకు నష్టపోయిన అంశాన్ని ప్రస్తావించారు. -
పోటెత్తి.. వినతులందించి..
● కలెక్టరేట్లో ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ ● 426 అర్జీల అందజేత నెల్లూరు రూరల్: నెల్లూరు కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి అర్జీదారులు పోటెత్తారు. కలెక్టర్ ఆనంద్, డీఆర్వో హుస్సేన్ సాహెబ్, జెడ్పీ సీఈఓ మోహన్‌రావు, డ్వామా పీడీ గంగా భవాని, జిల్లా పంచాయతీ అధికారి శ్రీధర్‌రెడ్డి సమస్యలు తెలుసుకున్నారు. అధికంగా రెవెన్యూ శాఖవి 129, మున్సిపల్ శాఖవి 31, సర్వేవి 34, పంచాయతీరాజ్ శాఖవి 57, పోలీసు శాఖవి 79, సివిల్ సప్లయ్స్‌వి 7, ఇతర శాఖలకు సంబంధించి 426 అర్జీలను ప్రజలు అందజేశారు. రిజర్వేషన్ల అమలు కోసం.. చంద్రబాబు గతంలో ఇచ్చిన బీసీ డిక్లరేషన్ హామీ మేరకు స్థానిక సంస్థల ఎన్నికల్లో శాతం రిజర్వేషన్ అమలు చేయాలటూ బీఎస్పీ నాయకులు కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపారు. వారు మాట్లాడుతూ రిజర్వేషన్లు అమలు చేయకపోతే కూటమి ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతామన్నారు. అనంతరం కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. రాష్ట్ర ఉపాధ్యక్షుడు జానకి ప్రసాద్, నాయకులు పాల్గొన్నారు. పింఛన్ల తొలగింపు దారుణం రాష్ట్రవ్యాప్తంగా 1.5 లక్షల మందికి పైగా దివ్యాంగుల పెన్షన్లను కూటమి ప్రభుత్వం తొలగించిందని, ఇది దారుణమని ఆ సంఘం జిల్లా నాయకుడు ఆవుల నాగేంద్ర అన్నారు. కలెక్టర్‌కు వినతిపత్రం అందజేసిన అనంతరం మాట్లాడుతూ ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే పింఛన్లను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ధైర్యముంటే ఫేక్ సర్టిఫికెట్ ఇచ్చిన డాక్టర్లను అరెస్ట్ చేయాలన్నారు. అన్ని అర్హతలున్న వారిని కూడా పెన్షన్ రాకుండా చేయడం దారుణమన్నారు. ఈ–క్రాప్‌పై చర్యలకు.. మరో వారం, పదిరోజుల్లో వరి కోతలు ప్రారంభం కానున్నాయని, ఇంత వరకు ఈ–క్రాప్ నమోదు ప్రక్రియ పూర్తి కాకపోవడం రైతులకు ఇబ్బందిగా మారుతుందని, వెంటనే చర్యలు తీసుకోవాలని బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు వినయ్ నారాయణ కోరారు. అధికారులకు వినతిపత్రం అందజేశారు. ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు. కక్షతో జీతం ఆపేసిన వైద్యాధికారి కక్ష కట్టి జలదంకి వైద్యాధికారి శ్రీనివాసులు రెండు సంవత్సరాల నుంచి జీతం ఆపేశారని కావలికి చెందిన ల్యాబ్ టెక్నీషియన్ రసూల్ కలెక్టర్‌కు వినతిపత్రమిచ్చారు. ఆయన మాట్లాడుతూ శ్రీనివాసులు, ఆయన భార్య డాక్టర్ లక్ష్మి వేధిస్తున్నట్లు ఆరోపించారు. జీతాలు చెల్లించాలని డీఎంహెచ్ఓ ఆర్డర్ ఇస్తే పెడచెవిన పెట్టి నువ్వు ఎలా తెచ్చుకుంటావో చూస్తానని ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. లేబర్ కమిషన్ ఆర్డర్‌ను కూడా పట్టించుకోలేదన్నారు. హెల్త్ డైరెక్టర్ విచారణ రిపోర్ట్‌లో జీతం జలదంకిలోనే చెల్లించాలని చెప్పిందన్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగి అయిన తనకు రెండేళ్లుగా జీతం లేదని, ఎలా బతకాలని ఆవేదన వ్యక్తం చేశారు. పోస్టులు భర్తీ చేయాలంటూ.. మున్సిపల్ కార్పొరేషన్ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న 203 పోస్టులను 2025 డీఎస్సీలోనే భర్తీ చేయాలని అభ్యర్థులు వినతిపత్రం సమర్పించారు. వారు మాట్లాడుతూ నోటిఫికేషన్లో నెల్లూరు కార్పొరేషన్లో 16 ఖాళీలను మాత్రమే చూపించారన్నారు. అయితే 203 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు చెప్పారు. కార్యక్రమంలో జి.కృష్ణప్రసాద్, పి.నాగరాజు, కిశోర్, మస్తాన్, కె.స్వాతి తదితరులు పాల్గొన్నారు. -
ఆస్తి రాయించుకుని గెంటేశాడు
● కుమారుడిపై తండ్రి ఫిర్యాదు ● సమస్యలు తెలుసుకున్న ఎస్పీ కృష్ణకాంత్ ● న్యాయం చేస్తామని భరోసానెల్లూరు(క్రైమ్): ‘నా చిన్న కుమారుడు ఆస్తి రాయించుకుని నన్ను ఇంటి నుంచి గెంటేశాడు. విచారించి న్యాయం చేయాలి’ అని నెల్లూరు సంతపేటకు చెందిన ఓ వృద్ధుడు కోరాడు. ఉద్యోగం పేరిట నగదు తీసుకుని మోసగించాడు.. పెళ్లి చేసుకుంటానని నమ్మించి నిరాకరించాడు.. కుమారుడు అనుమానాస్పదంగా మృతిచెందాడు.. ఇలా ఒక్కొక్కరిది ఒక్కో కన్నీటి గాథ. సోమవారం నెల్లూరులోని ఉమేష్‌చంద్ర కాన్ఫరెన్స్ హాల్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. జిల్లా నలుమూలల నుంచి 78 మంది విచ్చేసి తమ సమస్యలపై ఎస్పీ జి.కృష్ణకాంత్‌కు వినతిపత్రాలు అందజేశారు. వాటిని పరిశీలించిన ఆయన చట్టపరిధిలో విచారించి న్యాయం చేస్తామని బాధితులకు భరోసా ఇచ్చారు. వినతుల పరిష్కారంలో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో నగర డీఎస్పీ పి.సింధుప్రియ, వేదాయపాళెం ఇన్స్పెక్టర్ కె.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. వినతుల్లో కొన్ని.. ● నా కొడుకు, కోడలు ఇంటి నుంచి గెంటేశారు. రాత్రిపూట బస్టాండ్‌లో ఉంటున్నాను. విచారించి న్యాయం చేయాలని కావలికి చెందిన ఓ వృద్ధురాలు కోరారు. ● లింక్డిన్ ద్వారా మాధురి, వెంకటరమణ, చేతన్‌లు పరిచయమయ్యారు. బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి రూ.34 లక్షలు నగదు తీసుకున్నారు. ఉద్యోగం ఇప్పించకుడా, నగదు తిరిగివ్వకుండా మోసగించారని పొదలకూరుకు చెందిన దంపతులు ఫిర్యాదు చేశారు. ● హైదరాబాద్‌కు చెందిన సుదర్శన్ క్రిప్టో ట్రేడింగ్‌లో అధిక లాభాలు వస్తాయని నమ్మించి రూ.8 లక్షలు పెట్టుబడి పెట్టించాడు. ఆరునెలల నుంచి ప్రాఫిట్ ఇవ్వకుండా, నగదు తిరిగివ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని నెల్లూరు రూరల్‌కు చెందిన ఓ వ్యక్తి వినతిపత్రమిచ్చాడు. ● నా కుమారుడికి 15 సంవత్సరాలు. అతడితో ఆత్మకూరుకు చెందిన ఓ యువతి ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం చేసుకుంది. పదిరోజుల క్రితం కుమారుడిని తీసుకెళ్లి బలవంతంగా పెళ్లిచేసుకుని దాచిపెట్టింది. ఆచూకీ కనుక్కోవాలని వేదాయపాళేనికి చెందిన ఓ మహిళ కోరారు. ● ఉదయగిరికి చెందిన వెంకటకుమార్ ప్రేమించానని, పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. ఇప్పుడు పెళ్లికి నిరాకరించాడు. ఇదేమని అడిగితే సోషల్ మీడియాలో ఫొటోలు ఆప్‌లోడ్ చేసి ఇబ్బందులు పెడుతున్నాడు. విచారించి న్యాయం చేయాలని అదే ప్రాంతానికి చెందిన ఓ యువతి విజ్ఞప్తి చేశారు. ● నా కుమారుడు అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి, కారకులపై చర్యలు తీసుకోవాలని ముత్తుకూరుకు చెందిన ఓ మహిళ ఫిర్యాదు చేశారు. -
ప్రభుత్వ భూమిలో జామాయిల్ నరికివేత
● విలువ సుమారు రూ.15 లక్షలు ● రెవెన్యూ అధికారుల పాత్రపై ప్రచారం ● అధికార పార్టీ అండతోనే..వింజమూరు(ఉదయగిరి): వింజమూరు – ఉదయగిరి హైవే మార్గంలో వింజమూరు గ్రామ రెవెన్యూ పరిధిలో సర్వే నంబర్ 839లో 12 ఎకరాల ప్రభుత్వ భూమిలో సాగులో ఉన్న జామాయిల్‌ను అక్రమార్కులు నరికి సొమ్ము చేసుకున్నారు. మూడురోజుల క్రితం వింజమూరుకు చెందిన ఓ వ్యాపారి జామాయిల్ కర్రను పట్టపగలే నరికించి వాహనాల్లో తరలించినట్లుగా తెలిసింది. దీని విలువ సుమారు రూ.15 లక్షలని చెబుతున్నారు. ఈ తంతు వెనుక రెవెన్యూ సిబ్బంది పాత్ర ఉన్నట్లు ప్రచారం ఉంది. తహసీల్దార్ కార్యాలయానికి కేవలం రెండు కిలోమీటర్ల దూరంలోనే జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న భూమిలో జామాయిల్ నరికి తరలిస్తున్నా అధికారులు మాకు తెలియదని చెప్పడంపై స్థానికులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఇందులో అధికార పార్టీ వారి పాత్ర ఉందనే ఆరోపణలున్నాయి. తహసీల్దార్ ఎస్కే హమీద్‌ను వివరణ కోరగా విషయం తెలిసిన వెంటనే రెవెన్యూ సిబ్బందిని పంపామన్నారు. జామాయిల్ నరికిన మాట వాస్తవమేనన్నారు. పోలీసులకు ఫిర్యాదు చేసి, సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకుంటామన్నారు. కాగా ఆ భూముల్లోనే సోమవారం పొట్టును వాహనంలో తరలిస్తున్నా రెవెన్యూ సిబ్బంది వదిలేసినట్లుగా ప్రచారం జరుగుతోంది. -
పెళ్లికెళ్లొస్తూ కానరాని లోకాలకు..
● ఆగి ఉన్న టిప్పర్‌ను ఢీకొన్న టాటా ఏస్ ● ఇద్దరి మృతి, ఒకరికి తీవ్రగాయాలు ● బాధితులంతా చైన్నె వాసులుకొడవలూరు: టాటా ఏస్‌లో పెళ్లికెళ్లి.. తిరిగి సొంతూరికి వెళ్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతిచెందగా ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన మండలంలోని నాయుడుపాళెం వద్ద జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. చైన్నెకి చెందిన వారు కావలిలో ఆదివారం రాత్రి జరిగిన పెళ్లికి టాటా ఏస్ వాహనంలో వెళ్లారు. కార్యక్రమం పూర్తయ్యాక అదే వాహనంలో సోమవారం తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో చైన్నెకి బయలుదేరారు. కొడవలూరు మండలం నాయుడుపాళెం వద్దకు రాగా ఇక్కడ ఆగిఉన్న టిప్పర్‌ను టాటాఏస్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో టాటా ఏస్ నడుపుతున్న హుస్సేన్ (38), పక్క సీట్లో కూర్చున మాధవరావు (55)లు అక్కడికక్కడే మృతిచెందారు. ట్రక్కులో కూర్చున్న సుందరం అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. వీరంతా చైన్నె వాసులే. సుందరాన్ని నెల్లూరులోని కిమ్స్ వైద్యశాలకు తరలించారు. సమాచారం అందుకున్న ఎస్సై సీహెచ్ కోటిరెడ్డి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం నెల్లూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. -
రైల్లోంచి జారిపడి..
● హెల్త్ అసిస్టెంట్ మృతి కొడవలూరు: ప్రమాదవశాత్తు రైల్లోంచి జారిపడి హెల్త్ అసిస్టెంట్ మృతిచెందిన ఘటన మండలంలోని తలమంచి – కొడవలూరు రైల్వేస్టేషన్ల మధ్య సోమవారం చోటుచేసుకుంది. రైల్వే హెడ్ కానిస్టేబుల్ కె.వెంకటేశ్వరరావు కథనం మేరకు.. బోగోలు మండలం కోవూరుపల్లి పీహెచ్సీలో హెచ్ఏగా పనిచేసే ఎన్.రామ్‌కుమార్ ఒంగోలు కొత్తపట్నం బస్టాండ్ సమీపంలో నివాసముంటున్నాడు. రోజూ అక్కడి నుంచే విధులకు వస్తుంటాడు. సోమవారం కూడా రైల్లో బయలుదేరాడు. తలమంచి సమీపంలో 188 – 9 – 7 పోస్టుల మధ్య ఎగువలైన్లో రైల్లో నుంచి జారిపడి మృతిచెందాడు. మృతుడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. చెక్‌పోస్ట్ పాయింట్‌ను ఢీకొన్న లారీమర్రిపాడు: మండలంలోని జిల్లా సరిహద్దు వద్ద సోమవారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. నెల్లూరు – ముంబై జాతీయ రహదారిపై సరిహద్దు వద్దనున్న చెక్‌పోస్ట్ పాయింట్‌ను లారీ ఢీకొనడంతో అది పూర్తిగా నేలమట్టమైంది. డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. నంద్యాల నుంచి తడకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. -
మేల్ నర్సులపై జూనియర్ డాక్టర్ దాడి
● సర్వజన ఆస్పత్రిలో ఉద్రిక్తత నెల్లూరు(అర్బన్): నగరంలోని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో పనిచేస్తున్న మేల్ నర్సు వెంకటప్ప అలియాస్ వెంకట్‌పై సోమవారం రాత్రి ఇంటర్నషిప్ (జూనియర్) డాక్టర్ ఒకరు దాడి చేశాడు. మరో మేల్ నర్సు కల్యాణ్ అడ్డుపడగా అతడిపై కూడా దాడి చేశాడు. ఆ డాక్టర్‌కు మరో జూనియర్ అండగా ఉండి దాడి చేశారని సమాచారం. ఈ విషయమై పలువురు మేల్, ఫిమేల్ నర్సులు ఆస్పత్రి వద్ద బైఠాయించారు. దాడికి గురైన మేల్ నర్సులిద్దరూ తాము అడ్మిట్ అవుతామని, దాడికి కారణమైన వారిపై మెడికల్ లీగల్ కేసు నమోదు చేయాలని కోరగా క్యాజువాలిటీలో ఉన్న డ్యూటీ డాక్టర్ కిరణ్ తిరస్కరించాడు. దీంతో చాలాసేపు ఆందోళన జరిగింది. కొంతసేపు ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. దర్గామిట్ట పోలీసుస్టేషన్లో దాడి చేసిన జూనియర్ డాక్టర్‌పై కేసు పెట్టేందుకు మేల్ నర్సులు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. విషయం తెలిసిన హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ మాధవి గొడవకు కారణాలపై ఆరాతీశారు. -
గిరిజనులకు రాజకీయ నమ్మక ద్రోహం
కోవూరు: ‘రాణి తలుచుకుంటే.. గంటల వ్యవధిలో జీఓలే మారిపోతాయి’. అధికార యంత్రాంగం సైతం రిజర్వేషన్ నిబంధనలకు పాతరేస్తూ ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగ హక్కులను కాలరాస్తున్నారు. అత్యధిక గిరిజన జనాభా ఉన్న కోవూరు నియోజకవర్గంలో రాజ్యాంగం నిర్దేశించిన రొటేషన్ విధానంలో వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ పదవి ఈ దఫా గిరిజనులకు కేటాయించాల్సి ఉంది. ఈ మేరకు ఈ పదవిని ఎస్టీ జనరల్‌కు రిజర్వేషన్ ఖరారు చేస్తూ కలెక్టర్ ఆనంద్ ఆర్సీ నంబరు 168/ఎస్ఎంఏ/2024 ప్రకారం ఈ నెల 14వ తేదీ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వులు బయటకు వచ్చిన కొద్ది సేపటికే అదే ఉత్తర్వును సవరిస్తూ కోవూరు వ్యవసాయ మార్కెటింగ్ చైర్మన్ పదవిని ఓసీ జనరల్‌కు కేటాయిస్తూ ఉత్తర్వులు బయటకు వచ్చాయి. దీని వెనుక ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి మంత్రాంగం నడిపారని కలెక్టరేట్లోని విశ్వసనీయ వర్గాల తెలిసింది. రాజకీయంగా ఎదగడం ఇష్టంలేకే.. అనేక సంవత్సరాల తర్వాత రొటేషన్ విధానంలో మొదటగా గిరిజనులకు వచ్చిన అవకాశాన్ని చివరి నిమిషంలో రద్దు చేయడంపై రాజకీయ వర్గాల్లో ఆగ్రహం రేకెత్తిస్తోంది. మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి కేవలం ఒక రాజకీయ పదవి మాత్రమే కాదు. రైతుల జీవితాలతో ముడిపడి ఉండే ఈ పదవి ఎంతో ప్రభావవంతమైంది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు బలం చేకూర్చే ఈ పదవి గిరిజన నేతలకు దక్కి ఉంటే రాజకీయాల్లో వారి ప్రాతినిథ్యం పెరిగేది. కానీ దాన్ని అడ్డుకుని మళ్లీ సంపన్న వర్గాలకే కట్టబెట్టడం ద్వారా గిరిజనుల ఎదుగుదలకు సమాధి కట్టినట్టే అయిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఓట్ల కోసం గిరిజనులపై ప్రేమ చూపించే ప్రభుత్వానికి, పదవులు మాత్రం పెత్తందార్లకే కట్టబెట్టడంపై స్థానిక గిరిజన నేతలు తీవ్ర స్థాయిలో ప్రశ్నిస్తున్నారు. గిరిజనులు ఓటు వేయడానికి మాత్రమేనా? అధికారంలో భాగస్వామ్యం కోసం కాదా? అంటూ నిలదీస్తున్నారు. మాటల్లో గిరిజన సంక్షేమం అంటూ నినదించే అధికార కూటమి, ఆచరణలో మాత్రం నమ్మక ద్రోహం చేస్తోందని వాస్తవం మరోసారి బయటపడింది. విడవలూరు టీడీపీ నేతకు కట్టబెట్టేందుకే.. కోవూరు వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ పదవిపై టీడీపీలోని అగ్రకుల నేతలు కన్నేశారు. జిల్లాలో అత్యధికంగా గిరిజన జనాభా ఉన్న నియోజకవర్గాల్లో కోవూరు ఒకటి. వాస్తవంగా కోవూరు ఏఎంసీ పదవి రొటేషన్ పద్ధతిలో ఈ దఫా గిరిజనులకు కేటాయించాల్సి ఉంది. ఈ పదవిని దక్కించుకునేందుకు రాజకీయ కుతంత్రాలకు తెరతీశారు. ఈ పదవికి ఎంతో మంది పోటీపడుతున్నారు. అయితే గత ఎన్నికల సమయంలో వైఎస్సార్సీపీ నుంచి టీడీపీలో చేరిన విడవలూరు మండలానికి చెందిన ఓ నేతకు ఈ పట్టం కట్టబెట్టేందుకు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి చక్రం తిప్పారని స్థానిక రాజకీయ వర్గాల్లో హాట్‌టాపిక్ చర్చ జరుగుతోంది. కోవూరు ఏఎంసీ చైర్మన్ పదవి ఎస్టీ జనరల్‌కు కేటాయిస్తూ సాక్షాత్తు కలెక్టర్ జారీ చేసిన ఉత్తర్వులు.. మరి కొద్ది సేపటికే మార్చేస్తూ ఈ పదవిని ఓసీ జనరల్‌కు కేటాయించడం వెనుక రాజకీయ ఒత్తిడి కనిపిస్తోందని స్పష్టమవుతోంది. ఎమ్మెల్యే ఆదేశాలతో రిజర్వేషన్‌కు పాతర గంట వ్యవధిలోనే ఓసీ జనరల్ చేస్తూ మరో ఉత్తర్వు గిరిజన హక్కులను కాలరాస్తూ చక్రం తిప్పిన వైనం ఓట్ల కోసమే వారిపై ప్రేమ.. పదవులు మాత్రం పెత్తందార్లకు ఏఎంసీ రిజర్వేషన్ మార్పుపై గిరిజన సంఘాల మండిపాటు కూటమి నేతల కుట్ర రాజకీయాలపై ఉద్యమించాలని నిర్ణయం ఏఎంసీ పీఠం కోసం తమ్ముళ్ల మధ్య పోటీ కోవూరు వ్యవసాయ మార్కెటింగ్ పదవిపై ఆశలు పెట్టుకున్న ఎంతో మంది ఆశావహులు ఈ దఫా గిరిజనులకే దక్కుతుందని భావించి సైలెంట్ అయిపోయారు. తాజాగా ఏఎంసీ పీఠం ఓసీ జనరల్‌కు కేటాయిస్తూ ఉత్తర్వులు వెలువడడంతో నియోజకవర్గంలోని ఆశావహులు ఆ పదవిని దక్కించుకునేందుకు పైరవీలు చేసుకుంటున్నారనే సమాచారం. కోవూరు, కొడవలూరు, విడవలూరు మండలాలకు చెందిన ముఖ్య నేతలు ఇప్పుడు ఎమ్మెల్యే ఇంటి ముందు క్యూకడుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరికి పదవి కట్టబెట్టినా మరొకరు అలకబూనే అవకాశం ఉండడంతో ఈ పరిణామాలు ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డికి తలనొప్పిగా పరిణమించాయి. కోవూరు ఏఎంసీ గిరిజనులకు కేటాయిస్తూ తొలుత ఉత్తర్వులు అధికార పీఠం కోసం గిరిజన జపం చేసే పాలకులు అధికారం దక్కగానే తమ స్వప్రయోజనాల కోసం అగ్రకుల సంపన్నులకు కట్టబెట్టేందుకు గిరిజనులకు నమ్మక ద్రోహం చేస్తున్నారనే ఆరోపణలకు కోవూరు వ్యవసాయం మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి రిజర్వేషన్ ఉదాహరణగా నిలుస్తోంది. చరిత్రాత్మకంగా గిరిజనులకిచ్చే అవకాశాన్ని అడ్డుకోవడం, వారిని మరోసారి పక్కన పెట్టడం మాత్రమే కాకుండా, వారి భవిష్యత్‌కు సమాధి చేయడమే అని గిరిజనులు, ఆ సంఘ నాయకులు మండిపడుతున్నారు. కూటమి నేతల స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం గిరిజనలకు చేస్తున్న రాజకీయ ద్రోహంపై ప్రజాక్షేత్రంలో ఉద్యమించడానికి గిరిజన సంఘాలు ఉద్యుక్తమవుతున్నాయి. -
ఘనంగా వెంకయ్యస్వామి ఆరాధనోత్సవాలు
వెంకటాచలం: గొలగమూడిలో కొలువైన భగవాన్ వెంకయ్యస్వామి ఆరాధనోత్సవాలు సోమవారం ప్రారంభమయ్యాయి. సుప్రభాతసేవ, అభిషేకం, రక్షాబంధన పూజ, దీక్ష వస్త్ర సమర్పణ తదితర పూజా కార్యక్రమాలను నిర్వహించారు. సర్వభూపాల, కల్పవృక్ష వాహనసేవలను నిర్వహించారు. స్వామివారిని పుష్పాలతో అలంకరించి గ్రామోత్సవాన్ని జరిపారు. గొలగమూడి గ్రామస్తుల ఆధ్వర్యంలో భక్తులకు అన్నసంతర్పణ చేశారు. ఉత్సవాల్లో నేడు ఉత్సవాల్లో భాగంగా సూర్యప్రభ, చంద్రప్రభ వాహనసేవలను మంగళవారం నిర్వహించనున్నారు. కాకాణికి హైకోర్టులో ఊరట ● రుస్తుం మైనింగ్ కేసులో బెయిల్ నెల్లూరు (లీగల్): మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తూ ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎల్.లక్ష్మణరావు సోమవారం ఉత్తర్వులిచ్చారు. రుస్తుం మైన్‌లో జిలెటిన్ స్టిక్స్ పేలుడు పదార్థాలను ఉపయోగించి ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టారని నెల్లూరు రూరల్ డీఎస్పీ విచారణాధికారిగా పొదలకూరు పోలీసులు నమోదు చేసిన అట్రాసిటీ (ఎస్సీ, ఎస్టీ) కేసులో కాకాణి 4వ నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. కాకాణి బెయిల్ కోసం ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసుకొన్నారు. కాకాణి తరఫున సీనియర్ న్యాయవాదులు ఓ మనోహర్ రెడ్డి, చేజర్ల శుబోద్ తమ వాదనలు వినిపించారు. పోలీసుల తరఫున ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి బెయిల్ మంజూరు చేస్తూ ఒక్కొక్కరు రూ. 2 లక్షలు ఆస్తి విలువ కలిగిన ఇద్దరు జామీన్‌దారులు పూచీకత్తు సమర్పించాలని, పోలీసుల విచారణకు సహకరించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కాకాణి నెల్లూరు జిల్లాలో ఉండకూడని, పాస్ పోర్టు సరెండర్ చేయాలని, ప్రతి ఆదివారం ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల్లోపు విచారణాధికారి వద్ద హాజరు కావాలని, ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు దాటి వెళ్లడానికి వీల్లేదని, కేసు విషయాలపై మీడియాతో మాట్లాడకూడదని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. -
బార్ల ఏర్పాటుకు గెజిట్ విడుదల
నెల్లూరు (క్రైమ్): నూతన పాలసీకి అనుగుణంగా జిల్లాలో 2025 – 28 సంవత్సరానికి గానూ ఓపెన్ కేటగిరీ కింద 50 బార్ల ఏర్పాటుకు గెజిట్‌ను కలెక్టర్ ఆనంద్ సోమవారం విడుదల చేశారు. ఆన్లైన్ / ఆఫ్‌లైన్ / హెబ్రిడ్ విధానాల్లో సోమవారం నుంచి 26వ తేదీ సాయంత్రం ఐదు వరకు దరఖాస్తుల స్వీకరణ.. కలెక్టర్ సమక్షంలో 28న లాటరీ తీసి ప్రొవిజనల్ లైసెన్స్‌లను మంజూరు చేయనున్నారు. దీనికి సంబంధించిన వివరాలను జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్ శంకరయ్య తన కార్యాలయంలో డీపీఈఓ శ్రీనివాసులునాయుడితో కలిసి వెల్లడించారు. జిల్లాలో ఇలా.. మూడేళ్ల కాలపరిమితితో నగరంలో 38.. కావలిలో ఏడు.. కందుకూరులో మూడు.. ఆత్మకూరు, బుచ్చిరెడ్డిపాళెంలో ఒకటి చొప్పున 50 బార్లు ఏర్పాటు కానున్నాయి. జనాభా ప్రాతిపదికన మూడు శ్లాబుల్లో లైసెన్స్ ఫీజులను ఖరారు చేశారు. నగరంలో రూ.75 లక్షలు.. కావలి, కందుకూరులో రూ.55 లక్షలు.. ఆత్మకూరు, బుచ్చిరెడ్డిపాళెం నగర పంచాయతీల్లో రూ.35 లక్షలుగా నిర్ణయించారు. ఏటా పది శాతం లైసెన్స్ ఫీజును అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. దీని రూపేణా తొలి ఏడాది రూ.36.17 కోట్ల ఆదాయం ప్రభుత్వానికి సమకూరనుంది. దరఖాస్తు ప్రక్రియ.. ● నూతన బార్ పాలసీలో దరఖాస్తు ఫీజుగా రూ.ఐదు లక్షలు (నాన్ రీఫండబుల్)ను ఖరారు చేశారు. ● ఆన్లైన్లో oc. hpfsproject. com ద్వారా ఎక్కడి నుంచైనా ఫారం – బీ (ఆర్)లోని వివరాలను నింపి దరఖాస్తును సమర్పించొచ్చు. దరఖాస్తు రుసుము, ప్రొసెసింగ్ ఫీజును డెబిట్, క్రెడిట్ కార్డు, నెట్‌బ్యాంకింగ్ ద్వారా చెల్లించొచ్చు. ● ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునేవారు జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ కార్యాలయంలో సమర్పి ంచాలి. దరఖాస్తు రుసుము, ప్రాసెసింగ్ ఫీజు రూ.ఐదు లక్షలను జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ అధికారి పేరుపై, రూ.పది వేలు కమిషనర్ ఆఫ్ ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ పేరుపై సమర్పించాలి. దీనికి గానూ జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ అధికారి కార్యాలయంలో ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. ● ఇతర రాష్ట్రాలకు చెందిన వారు సైతం దరఖాస్తు చేసుకునే వెసులుబాటును కల్పించారు. ఒక వ్యక్తి ఎన్ని బార్లకై నా దరఖాస్తు చేసుకోవచ్చు. నూతన బార్లు సెప్టెంబర్ ఒకటి నుంచి అందుబాటులోకి రానున్నాయి. గీత కులాలకు ఐదు బార్లు జిల్లాలో గీత కులాల కోసం ఐదు బార్లను ప్రత్యేకంగా కేటాయించారు. నెల్లూరు నగరపాలక సంస్థలో గౌడ కులస్తులకు రెండు బార్లను కేటాయించగా, లైసెన్స్ ఫీజుగా రూ.37.50 లక్షలను నిర్ణయించారు. కావలి మున్సిపాల్టీలో గమళ్ల.. కందుకూరులో గౌడ కులస్తులకు కేటాయించి.. లైసెన్స్ ఫీజుగా రూ 27.5 లక్షలను ఖరారు చేశారు. అల్లూరు నగర పంచాయతీలో గౌడ కులస్తులకు ఒక బార్‌ను కేటాయించి.. లైసెన్స్ ఫీజుగా రూ 17.5 లక్షలను నిర్ణయించారు. ఈ నోటిఫికేషన్ 20న విడుదల కానుంది. అదే రోజు నుంచి 29వ తేది సాయంత్రం ఐదు వరకు దరఖాస్తులను స్వీకరించనున్నారు. 30న లాటరీ విధానంలో బార్లను కేటాయించనున్నామని డీసీ తెలిపారు. సమావేశంలో ఇన్స్పెక్టర్లు రమేష్, కిశోర్, శ్రీనివాసరావు, ఎస్సై ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో ఓపెన్ కేటగిరీలో 50కు అనుమతులు ఆన్లైన్ / ఆఫ్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ 26తో ముగియనున్న గడువు 28న కలెక్టర్ సమక్షంలో లాటరీ -
గౌతు లచ్చన్న జీవితం ఆచరణీయం
నెల్లూరు రూరల్: స్వాతంత్య్ర సమరయోధుడు సర్దార్ గౌతు లచ్చన్న జీవితం నేటి తరానికి ఆచరణీయమని జేసీ కార్తీక్ పేర్కొన్నారు. కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో గౌతు లచ్చన్న జయంతిని శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. బీసీ సంక్షేమాధికారి వెంకటలక్ష్మమ్మ, బీసీ కార్పొరేషన్ ఈడీ నిర్మలాదేవి, జిల్లా టూరిజం అధికారి ఉషశ్రీ, మత్స్యశాఖ జేడీ శాంతి, బీసీ నేతలు జనార్దన్‌రాజు, జనార్దన్‌గౌడ్, ఉప్పు భాస్కర్, పద్మజాయాదవ్, శ్రీనివాసులు, శేషయ్య తదితరులు పాల్గొన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో.. నెల్లూరు(క్రైమ్): నగరంలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో గౌతు లచ్చన్న జయంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఎస్పీ కృష్ణకాంత్ నివాళులర్పించారు. -
ఇస్కాన్‌లో వేడుకగా కృష్ణాష్టమి
నెల్లూరు(బృందావనం): ఇస్కాన్ సిటీలోని ఇస్కాన్ మందిరంలో కృష్ణాష్టమి వేడుకలను భక్తిశ్రద్ధలతో శనివారం నిర్వహించారు. మందిరంలో కొలువైన రాధాకృష్ణులకు ప్రత్యేక పూజలు, అభిషేకాలను విశేషంగా జరిపారు. జగన్నాథ, సుభద్ర, బలరాములు విశేషాలంకారంలో దర్శనమిచ్చారు. కృష్ణ భగవానుడికి ఊంజల్‌సేవను నిర్వహించారు. కృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఇటీవల నిర్వహించిన వివిధ పోటీల్లో విజేతలకు బహుమతులను అందజేశారు. ఇస్కాన్ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ముద్రించిన సావనీర్‌ను మందిరాధ్యక్షుడు శుఖదేవస్వామి ఆవిష్కరించి, భక్తులకు అందజేశారు. కృష్ణ భగవానుడికి అభిషేక మహోత్సవాన్ని నిర్వహించి 108 వంటకాలతో నివేదన చేసి మహా హారతినిచ్చారు. శ్రీలప్రభుపాద వ్యాసపూజ నేడు ఇస్కాన్ వ్యవస్థాపకుడు శ్రీలప్రభుపాద వ్యాస పూజను ఆదివారం నిర్వహించనున్నామని శుఖదేవస్వామి తెలిపారు. హారతి, 56 వంటకాలతో నివేదన తదితర కార్యక్రమాలను నిర్వహించనున్నామని, భక్తులు తరలిరావాలని కోరారు. ● పూజా కార్యక్రమాలకు ఎస్పీ కృష్ణకాంత్ దంపతులు హాజరయ్యారు. -
రైల్లోంచి జారిపడి ముగ్గురి దుర్మరణం
గుర్తుతెలియని వ్యక్తి.. కావలి (జలదంకి): రైల్లోంచి జారిపడటంతో గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందిన ఘటన కావలి రైల్వేస్టేషన్ పరిధిలోని ముసునూరు సమీపంలో దిగువ లైన్లో చోటుచేసుకుంది. కావలి రైల్వే ఎస్సై వెంకట్రావ్ వివరాల మేరకు.. మృతుడు తెలుపు చొక్కా, తెలుపు రంగు కట్ బనియన్, బ్లూ ప్యాంట్‌ను ధరించి ఉన్నారు. మృతుడి వయస్సు 35 నుంచి 40 ఏళ్లలోపు ఉండొచ్చని భావిస్తున్నారు. మృతదేహాన్ని కావలి మార్చురీకి తరలించారు. వివరాలు తెలిసిన వారు 94406 27648 నంబర్‌ను సంప్రదించాలని కోరారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. జిల్లాలో చోటుచేసుకున్న రెండు వేర్వేరు ప్రమాదాల్లో రైల్లోంచి జారి పడి ముగ్గురు మృత్యువాత పడిన ఘటన శనివారం వెలుగులోకి వచ్చింది. నెల్లూరులో జరిగిన ప్రమాదంలో ఇద్దరు, కావలి సమీపంలో జరిగిన ఘటనలో గుర్తుతెలియని వ్యక్తి మరణించారు. తలుపు వద్ద మాట్లాడుకుంటూ.. నెల్లూరు(క్రైమ్): రైల్లోంచి ప్రమాదవశాత్తూ జారిపడటంతో ఇద్దరు యువకులు మృతి చెందిన ఘటన శనివారం వెలుగులోకి వచ్చింది. రైల్వే పోలీసుల సమాచారం మేరకు.. తిరుపతి జిల్లా గూడూరు మండలం చెన్నూరుకు చెందిన పోలయ్య (24), అర్షద్ (19), వెంకటేష్ స్నేహితులు. ప్రైవేట్ స్కూల్ వ్యాన్ క్లీనర్‌గా పోలయ్య.. మెకానిక్‌గా అర్షద్ పనిచేస్తున్నారు. స్నేహితుడి తమ్ముడి కుమార్తె ఫంక్షన్ నిమిత్తం విజయవాడకు ఈ నెల 14న రైల్లో వీరు బయల్దేరారు. బోగీ తలుపు వద్ద పోలయ్య, అర్షద్ కూర్చొని మాట్లాడుకోసాగారు. ఈ క్రమంలో కొండాయపాలెం గేట్ సమీపంలో వీరి జారిపడ్డారు. కొద్దిసేపటికి వీరు కనిపించకపోవడంతో నెల్లూరులో రైలు దిగి చుట్టుపక్కల వెంకటేష్ గాలించారు. అనంతరం చెన్నూరెళ్లి జరిగిన విషయాన్ని స్నేహితుల కుటుంబసభ్యులకు తెలియజేశారు. అందరూ కలిసి గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో రైల్వే పోలీసులకు ఓ మృతదేహం శుక్రవారం లభ్యం కాగా, జీజీహెచ్ మార్చురీకి తరలించారు. కొండాయపాళెం గేట్ సమీపంలోని చెట్లలో దుర్గంధం వస్తుండటాన్ని రైల్వే సిబ్బంది శనివారం గమనించారు. పరిశీలించగా మృతదేహం కనిపించింది. ఇదే క్రమంలో అక్కడికి చేరుకున్న కుటుంబసభ్యులు.. అర్షద్‌గా గుర్తించారు. ఘటన స్థలానికి రైల్వే పోలీసులు చేరుకొని మృతదేహాన్ని జీజీహెచ్ మార్చురీకి తరలించారు. అక్కడే ఉన్న మరో మృతదేహాన్ని బాధిత కుటుంబసభ్యులకు చూపించగా అది పోలయ్యదని గుర్తించారు. రైల్వే ఎస్సై హరిచందన దర్యాప్తు చేస్తున్నారు. కాగా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అర్షద్, పోలయ్య (ఫైల్) -
తేలుకాటుతో బాలుడి మృతి
కావలి (జలదంకి): తేలుకాటుతో బాలుడు మృతి చెందిన ఘటన శనివారం వెలుగులోకి వచ్చింది. వివరాలు.. కావలి రూరల్ మండలం గౌరవరం ఎస్టీ కాలనీకి చెందిన చౌటూరి చిన్నయ్య పట్టణంలోని పుల్లారెడ్డినగర్‌లో గల వాటర్ ప్లాంట్‌లో వాచ్‌మెన్‌గా పనిచేస్తున్నారు. ఆయన రెండో కుమారుడు శ్రీనివాసుడు (11) స్థానికంగా ఉన్న పాఠశాలలో ఐదో తరగతి చదువుతూ కొంతకాలంగా స్కూల్‌కు వెళ్లడంలేదు. ఈ క్రమంలో ఇంటి వెనుక ఉన్న తాటి చెటెక్కి పండ్లు కోస్తుండగా, తేలు కుట్టింది. దీంతో జరిగిన విషయాన్ని కుటుంబసభ్యులకు తెలపడంతో చికిత్స నిమిత్తం కావలి ఏరియా వైద్యశాలకు తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం నిమిత్తం నెల్లూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ శనివారం మృతి చెందారు. కావలి రూరల్ ఎస్సై బాలకృష్ణ కేసు దర్యాప్తు చేస్తున్నారు. లారీని ఢీకొన్న బస్సు ● క్లీనర్ దుర్మరణం గుడ్లూరు: లారీని ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొనడంతో క్లీనర్ మృతి చెందిన ఘటన తెట్టు ఫ్లయ్‌ఓవర్ వద్ద శనివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. వివరాలు.. ఒంగోలు నుంచి నెల్లూరు వైపు వెళ్తున్న కావేరి ట్రావెల్స్ బస్సు ముందు వెళ్తున్న లారీని ఢీకొంది. ఘటనలో బస్సు క్లీనర్ ఉండ్రరాశి సంతోష్ (27) మృతి చెందారు. మృతుడ్ని కృష్ణా జిల్లా ఉయ్యూరు మండలం పెద ఓగిరాలకు చెందిన వారిగా గుర్తించారు. పోస్ట్‌మార్టం నిమిత్తం కందుకూరు ఏరియా ఆస్పత్రికి తరలిచారు. బస్సు డ్రైవర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నామని ఎస్సై వెంకట్రావు తెలిపారు. -
వైఎస్సార్సీపీలో 20 కుటుంబాల చేరిక
నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట): టీడీపీని 20 కుటుంబాలు వీడి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నాయి. పార్టీ పదో డివిజన్ నేత వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో వీరు పార్టీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ వర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. రామ్‌జీనగర్‌లోని పార్టీ నగర నియోజకవర్గ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో వీరికి కండువాలను కప్పి సాదరంగా ఆహ్వానించిన అనంతరం చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడారు. పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొని బలోపేతానికి పనిచేయాలని సూచించారు. జగనన్నను మరోసారి సీఎం చేయడమే లక్ష్యంగా వ్యవహరించాలని కోరారు. కష్టపడిన ప్రతి ఒక్కరికీ భవిష్యత్తులో తగిన ప్రాధాన్యమిస్తామని చెప్పారు. -
విద్యార్థులకు అభినందన
నెల్లూరు (టౌన్): పార్థసారథినగర్లోని జెనెక్స్ బీ స్కూల్లో క్యాంపస్ డ్రైవ్‌ను బెంగళూరుకు చెందిన ఐటీ సంస్ధ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఎంపికై న విద్యార్థులను స్కూల్లో శనివారం అభినందించిన అనంతరం చైర్మన్ వెంగళ్‌రెడ్డి, డైరెక్టర్ కొండలరావు మాట్లాడారు. ఇప్పటి వరకు అనేక డ్రైవ్‌లను నిర్వహించి 150 మందికిపైగా విద్యార్థులకు ఉద్యోగాలను కల్పించామని వెల్లడించారు. కంపెనీ హెచ్ఆర్ శ్రీకన్య, పీజీ కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాస్‌తేజ, డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ అనిల్, ప్లేస్మెంట్ హెడ్ చరణ్‌తేజ తదితరులు పాల్గొన్నారు. హత్య కేసులో నిందితుల అరెస్ట్ నెల్లూరు(క్రైమ్): అలంకార్ సెంటర్లో ఇటీవల దారుణ హత్యకు గురైన లైఖ్ కేసులో నిందితులను చిన్నబజార్ పోలీసులు అరెస్ట్ చేశారు. స్థానిక పోలీస్‌స్టేషన్‌లో శనివారం నిర్వహించిన సమావేశంలో నిందితుల వివరాలను ఇన్స్పెక్టర్ చిట్టెం కోటేశ్వరరావు వెల్లడించారు. కేటరింగ్ పనులు చేసుకొని జీవనం సాగిస్తున్న కసాయివీధికి చెందిన లైఖ్ (36) వద్ద కోటమిట్ట మెక్లిన్స్ రోడ్డుకు చెందిన నూరుద్దీన్ అలియాస్ నూర్ పనిచేస్తున్నారు. తన భార్యతో చనువుగా ఉండేందుకు లైఖ్ యత్నించడంతో పాటుగా ఆర్థికంగా ఇబ్బందులకు గురిచేయడాన్ని నూర్ జీర్ణించుకోలేకపోయారు. లైఖ్ను ఎలాగైనా అంతమొందించాలని నిర్ణయించుకొని విషయాన్ని వైఎస్సార్‌నగర్‌కు చెందిన తన స్నేహితుడు ఉస్మాన్ అలియాస్ దావూకు చెప్పారు. నిందితులిద్దరూ కలిసి విక్టోరియా గార్డెన్స్ వద్ద లైఖ్ను ఈ నెల 13న హత్య చేసి పరారయ్యారు. మృతుడి అన్న రఫీ ఫిర్యాదు మేరకు హత్య కేసును పోలీసులు నమోదు చేశారు. ప్రత్యేక బృందాలను ఇన్స్పెక్టర్ ఏర్పాటు చేసి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. భగత్‌సింగ్ కాలనీలోని టిడ్కో ఇళ్ల సమీపంలో నిందితులను అరెస్ట్ చేసి, వారి నుంచి రెండు కత్తులు, బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఎస్సై అయ్యప్ప తదితరులు పాల్గొన్నారు. -
తమిళ బోట్లను తరిమికొడుదాం
● జువ్వలదిన్నెలో నాలుగు జిల్లాల్లోని 134 మత్స్యకార గ్రామాల కాపుల సమావేశం ● పట్టుబడిన కడలూరు, కారైకల్ బోట్లను గస్తీకి వినియోగించాలని నిర్ణయం బిట్రగుంట: రాష్ట్ర సరిహద్దు సముద్ర జలాల్లో మత్స్య సంపదను కొల్లగొడుతూ తీరప్రాంత గ్రామాలకు ఉపాధి లేకుండా చేస్తున్న తమిళనాడు బోట్లను సమష్టిగా అడ్డుకోవాలని నాలుగు జిల్లాల మత్స్యకార గ్రామాల కాపులు ఐక్యంగా నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే తమకు పట్టుబడి జువ్వలదిన్నె హార్బర్లో ఉన్న కడలూరు, కారైకల్ బోట్లను గస్తీకి వినియోగించాలని నిర్ణయించారు. మత్స్యకార గ్రామకాపుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో నెల్లూరు, తిరుపతి, ప్రకాశం, బాపట్ల జిల్లాలోని మత్స్యకార కాపులు జువ్వలదిన్నెలో శనివారం రెండో విడత సమావేశమయ్యారు. పెద్దబోట్లు, వలలతో వేట సాగిస్తూ స్థానిక మత్స్యకారుల ఉపాధికి గండికొడుతున్న తమిళనాడు బోట్లను అడ్డుకునే విషయంలో ప్రభుత్వం, అధికార యంత్రాంగం, మైరెన్ పోలీస్‌లు ఎవరూ చొరవ తీసుకోవడం లేదని, ఫలితంగా స్థానిక మత్స్యకారులపై దాడులు చేయడం, వలలు ధ్వంసం చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై చర్చించి పలు నిర్ణయాలు తీసుకున్నారు. వారు మాట్లాడుతూ పదేళ్ల నుంచి తమిళనాడు బోట్లు (పెద్ద బోట్లు) రాష్ట్రంలోని నెల్లూరు, తిరుపతి, ప్రకాశం, బాపట్ల జిల్లాలోని తీరంలో వేట సాగిస్తూ స్థానిక మత్స్యకారులకు జీవనోపాధి లేకుండా చేస్తున్నాయన్నారు. పెద్ద వలలు, నిషేధిత వలలతో వేట సాగిస్తూ చిన్నచిన్న చేపలను కూడా పట్టుబడి చేస్తుండడంతో పునరుత్పత్తి గణనీయంగా తగ్గిపోయి మత్స్యసంపద లభించడం కష్టంగా మారిందన్నారు. వీరు వేట సాగించే సమయంలో స్థానిక మత్స్యకారుల వలలు, పడవలు కూడా తీవ్రంగా దెబ్బతింటున్నాయని తెలిపారు. మత్స్య సంపదకు చేటు తెస్తున్న తమిళనాడు బోట్లను అడ్డుకోవాలని పదేపదే అధికారులకు విజ్ఞప్తి చేసినా పట్టించుకోకపోవడంతో 2023లో సుమా రు వంద గ్రామాల కాపులతో ఇస్కపల్లిలో సమావేశం నిర్వహించి పలు నిర్ణయాలు తీసుకోవడం జరిగిందన్నారు. ఈ క్రమంలో జూలై 31న ఇందుకూరుపేట మండలం కృష్ణాపురం సమీపంలో తీరానికి చొచ్చుకు వచ్చి వేట సాగిస్తున్న కడలూరు, కారైకల్ బోట్లను స్థానిక మత్స్యకారులు ప్రాణాలకు తెగించి అడ్డుకున్నారని వివరించారు. ఈ బోట్లను స్వాధీనం చేసుకుని జువ్వలదిన్నె హార్బర్‌కు చేర్చడం జరిగిందన్నారు. పట్టుబడిన ఈ బోట్లనే గస్తీకి వినియోగించి తమిళనాడు బోట్లను పూర్తిగా అడ్డుకోవాలని తాజా సమావేశంలో నిర్ణయించుకున్నట్లు వివరించారు. ఈ సమావేశానికి, రాజకీయ పార్టీలకు, రాజకీయ నాయకులకు ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశా రు. తమ సమస్యను తామే పరిష్కరించుకోవాలని లక్ష్యంతో ఈనిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. -
వేమిరెడ్డితో బెడిసిందా!
● రూప్‌కుమార్ ఫ్లెక్సీల్లో వీపీఆర్ ఫొటో లేకపోవడంపై చర్చ సాక్షి టాస్క్‌ఫోర్స్: జిల్లా పాలిటిక్స్‌లో ప్రధానంగా టీడీపీలో ఒక చర్చ నడుస్తోంది. ఇది ప్రస్తుత తరుణంలో హాట్‌టాపిక్‌గా మారింది. వైఎస్సార్సీపీ నుంచి టీడీపీలోకి నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డిని తీసుకెళ్లడంలో కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ పోలుబోయిన రూప్‌కుమార్ మంత్రాంగం నడిపించారనే చర్చ జరుగుతోంది. జిల్లాలో మైనింగ్ వ్యవహారంలో కూడా రూప్‌కుమార్ పార్టీ అధిష్టానం వద్ద ఎంపీ వేమిరెడ్డిని ముందు పెట్టి వెనుక నుంచి వ్యాపారాన్ని నడిపిస్తున్నారు. ఏడాది కాలంగా జిల్లాలో అక్రమ మైనింగ్ వ్యవహారంపై పెద్ద దుమారమే రేగుతోంది. జిల్లాలోని మొత్తం మైన్లను తన గుప్పెట్లో పెట్టుకుని రూప్‌కుమార్ ద్వారా వ్యవహారాన్ని నడిపిస్తున్నారనే విషయం అందరికీ తెలిసిందే. ఈ క్రమంలో ఉన్నట్టు ఉండి.. ఇటీవల వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి తాను మైనింగ్ వ్యాపారం నుంచి వైదొలుగుతున్టన్లు ప్రెస్‌మీట్ పెట్టి బహిరంగంగా ప్రకటించారు. వేమిరెడ్డి కోటరీలో కీలక నేతగా ఉన్న రూప్‌కుమార్ కొద్ది రోజులుగా మరో కోటరీతో రాసుకునిపూసుకుని తిరుగుతున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ క్రమంలోనే రెండు రోజుల క్రితం రూప్‌కుమార్ పుట్టిన రోజు వేడుకలకు సంబంధించి ఆయన అభిమానులు నగరంలో ఫ్లెకీలను నింపేశారు. అందులో పార్టీ పెద్దలు చంద్రబాబు, లోకేశ్, డీసీఎం పవన్‌కళ్యాణ్, మంత్రి నారాయణ, రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డి, ఎన్టీఆర్ ఫొటోలు ఉన్నాయి. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి ఫొటో లేకపోవడంపై టీడీపీలో తీవ్ర చర్చ జరుగుతోంది. తాజాగా రెండు రోజులుగా రూప్‌కుమార్ మంత్రి నారాయణ వెంటనే కార్యక్రమాల్లో పాల్గొంటుండడం కూడా ఈ చర్చకు అద్దం పడుతోంది. వేమిరెడ్డి, రూప్‌కుమార్ మధ్య ఏమన్నా బెడిసిందా ఏమిటి అనే చర్చ సొంత పార్టీ లోనే హాట్‌టాపిక్‌గా మారింది. -
తెలుగు రాష్ట్రాల్లో మనమే వ్యాపారం చేయాలి
● ఏపీ ఎడిబుల్ ఆయిల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ముత్తుకూరు (పొదలకూరు) : రెండు తెలుగు రాష్ట్రాల్లో మనమే వ్యాపారం చేసుకుంటే తద్వారా ప్రభుత్వాలతోపాటు, వ్యాపారులకు ఆదాయం వస్తుందని ఏపీ ఎడిబుల్ ఆయిల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సన్నపురెడ్డి పెంచలరెడ్డి అన్నారు. ముత్తుకూరు మండలం పంటపాళెంలో శనివారం అసోసియేషన్ నేతలతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల వ్యాపారుల వల్ల ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలకు నష్టం వాటిల్లుతున్నట్టు అభిప్రాయపడ్డారు. పంటపాళెంలోని పామాయిల్ ఫ్యాక్టరీల నుంచి కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల వ్యాపారులు బల్క్‌గా 5 వేలు, 10 వేల టన్నుల పామాయిల్‌ను కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు. ధరల్లో తేడాలు వచ్చిన సమయంలో వారే మనకు విక్రయిస్తున్నందున వ్యాపారులు నష్టపోతున్నారని వెల్లడించారు. ఈ అంశంపై తమ అసోసియేషన్ సుదీర్ఘంగా చర్చలు జరిపి ఎలా అధిగమించాలనే ఆలోచనలతో కొన్ని నిర్ణయాలను తీసుకోవడం జరిగిందన్నారు. గత నెల 29న కడపలో వ్యాపారులతో సమావేశం నిర్వహించామన్నారు. ఈ నెల 1 నుంచి ఏపీ బ్రోకర్స్ ద్వారా వర్తకులు రీ–సేల్ చేయాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల బిల్స్ ఉంటేనే పామాయిల్ కొనుగోలు చేసే విధంగా వ్యాపారులకు తెలియజేశామన్నారు. లోకల్ ట్రేడ్ సర్వీస్ వల్ల అందరికీ ఉపయోగం ఉంటుందన్నారు. సమావేశంలో అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి వెంకటహరినాథ్, ట్రెజరర్ చక్రపాణి తదితరులు మాట్లాడారు. ‘చలో కరేడు’ పోస్టర్లు తొలగించడం దారుణం ● ఇది ఎమ్మెల్యే, పోలీసుల దుశ్చర్య ● ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తోన్న కూటమి ప్రభుత్వం నెల్లూరు (వీఆర్సీసెంటర్): ఉలవపాడు మండలం కరేడు రైతులకు మద్దతుగా ఈ నెల 18న ‘చలో కరేడు’ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు ఎమ్మెల్యేతో కలిసి పోలీసులు దుర్చశ్యకు పాల్పడ్డారని సీపీఎం జిల్లా కార్యదర్శి మూలం రమేష్ ఆరోపించారు. శనివారం రాత్రి ఆయన సాక్షితో మాట్లాడారు. నిబంధనలకు విరుద్ధంగా రైతుల నుంచి బలవంతంగా భూములు స్వాధీనం చేసుకుని ప్రైవేట్ సోలార్ కంపెనీకి అప్పగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పావులు కదుపుతోందని ఈ చర్యను నిరసిస్తూ వామపక్షాలు, పలు రైతు సంఘ నాయకులు పిలుపు ఇచ్చిన నేపథ్యంలో ‘చలో కరేడు’ కార్యక్రమ ప్రచార పోస్టర్లను ఆ గ్రామంతోపాటు సమీప ప్రాంతాల్లోనూ గోడల కు అంటించామన్నారు. అయితే స్థానిక ఎమ్మెల్యే ఆదేశాలతో పోలీసులు కరేడులో ఏర్పాటు చేసిన పోస్టర్స్‌ను శనివారం రాత్రి తొలగించారన్నారు. శనివారం రాత్రి ‘చలో కరేడు’ కార్యక్రమ నిర్వహణ ఏర్పాట్లు చేస్తున్న స్థానికుడైన అంకమరావును పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారన్నారు. విజయ్‌కుమార్ అనే మరో వ్యక్తిని అరెస్ట్ చేసేందుకు యత్నించారన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజల నిరసన తెలిపే హక్కులను కాలరాసే దుశ్చర్యలను ప్రభుత్వ పెద్దలు, పోలీసులు మానుకోకపోతే ప్రజలు, రైతులు, వ్యవసాయ కూలీలు ప్రతిఘటన మరో స్థాయిలో చూడాల్సి వస్తుందని రమేష్ హెచ్చరించారు. పోస్టర్లు తొలగించినంత మాత్రాన ఉద్యమాన్ని అణిచి వేయలేరని, రైతులను, ప్రజలను రెచ్చగొట్టితే ఉద్యమం తీవ్ర రూపం దాల్చుతుందని స్పష్టం చేశారు. శ్రీకృష్ణుడిగా లక్ష్మీ నరసింహుడు రాపూరు: మండలంలోని పెంచలకోనలో కొలువైన పెనుశిల లక్ష్మీనరసింహస్వామి శనివారం రాత్రి భక్తులకు శ్రీకృష్ణుడిగా దర్శనమిచ్చారు. కృష్ణాష్టమిని పురస్కరించుకుని స్వామివారి అలంకార మండపంలో శేషవాహనంపై పెనుశిల లక్ష్మీ నరసింహస్వామి, ఆదిలక్ష్మి, చెంచులక్ష్మీ ఉత్సవర్లను కొలువుదీర్చారు. స్వామివారిని శ్రీకృష్ణుడిగా అలంకరించారు. మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ కోన మాఢవీధుల్లో క్షేత్రోత్సవం నిర్వహించారు. అనంతరం గోవులకు ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు తరలివచ్చి స్వామి వారిని దర్శించుకున్నారు. ఉదయం స్వామి, అమ్మవార్ల ఉత్సవి గ్రహాలకు పాలు, తేనే, పెరుగు, చందనం, వివిధ రకాల పండ్ల రసాలతో స్నపన తిరుమంజనం, హోమం, కల్యాణం నిర్వహించారు. సా యంత్రం ఉట్టి మహోత్సవం నిర్వహించారు. -
అంతా అయోమయం
ఉచిత బస్సు ప్రయాణం కొందరికే.. నెల్లూరు సిటీ: ఏడాదికిపైగా ఊరించిన ఉచిత బస్సు పథకం ఉస్సూరుమనిపిస్తోంది. జిల్లాలో పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చు అంటూనే కొర్రీలు, మెలికలు పెట్టి షరతులు విధించింది. కూటమి ప్రభుత్వం ఏ పథకాన్ని అమలు చేయదు. ఒక వేళ చేస్తే మాత్రం ప్రచారం ఆర్భాటంగా ఉంటుంది. ఉపయోగం మాత్రం ఉండదు అనేదానికి సీ్త్రశక్తి (ఉచిత బస్సు పథకం) ఉదాహరణగా నిలుస్తోంది. పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు బస్సుల్లో ప్రయాణం ఉచితం అంటూనే ఆయా రూట్లలో తొలి రోజునే సర్వీసులు కుదించేసింది. ఇక ఒక ఎక్స్‌ప్రెస్‌లో ఉచితం, మరో ఎక్స్‌ప్రెస్‌లో సీ్త్రశక్తి పథకం వర్తించదంటూ బోర్డులు పెట్టడం చూసి ప్రయాణికులు నివ్వెరపోతున్నారు. ప్రస్తుతానికి రద్దీ లేకపోవడంతో పరిస్థితి ఏమిటనేదా ఇంకా అర్థం కాలేదు. రెండు.. మూడు రోజులు గడిస్తే కానీ ఎలా ఉంటుందో చెప్పలేమంటూ ఆర్టీసీ సిబ్బంది చెబుతున్నారు. ఘాట్ రూట్ బస్సుల్లో టికెట్ కొనాల్సిందే.. జిల్లా కేంద్రం నెల్లూరు నుంచి రాజంపేట మధ్య ప్రతి రోజు 10 ఎక్స్‌ప్రెస్ సర్వీసులు నడుస్తున్నాయి. నెల్లూరు డిపో–1 నుంచి 5 బస్సులు, రాజంపేట డిపో నుంచి 5 బస్సులు తిరుగుతున్నాయి. అయితే ఘాట్ రూట్లో నడిచే ఈ బస్సు సర్వీసుల్లో సీ్త్రశక్తి పథకం వర్తించదంటూ బోర్డులు పెట్టేసింది. ఇంటర్ స్టేట్ బస్సుల్లోనూ అంతే.. నెల్లూరు, ఆత్మకూరు, ఉదయగిరి, కావలి, కందుకూరు డిపోల నుంచి చైన్నె, బెంగళూరు, హైదరాబాద్ వంటి నగరాలకు కొన్ని ఎక్స్‌ప్రెస్ సర్వీసులు నడుపుతున్నారు. ఇవి ఎక్స్‌ప్రెస్ కేటగిరీ బస్సులే అయినా.. వీటిల్లో ఉచిత ప్రయాణం లేదని చెబుతున్నారు. నెల్లూరు నుంచి చైన్నె వెళ్లే బస్సులు గూడూరు, నాయుడుపేట, సూళ్లూరుపేట, తడ ప్రధాన స్టాపింగ్‌లు ఉన్నాయి. కనీసం నెల్లూరులో ఎక్కి గూడూరులో దిగాలన్నా.. గూడూరులో ఎక్కి నాయుడుపేటలో దిగాలన్నా.. సీ్త్రశక్తి పథకం వర్తించదంటూ చెబుతున్నారు. ఈ బస్సుల్లో కనీసం జిల్లా పరిధిలోనూ ప్రయాణించేందుకు అవకాశం లేకపోవడంతో మహిళా ప్రయాణికులు పెదవి విరుస్తున్నారు. అన్ని డిపోల నుంచి తిరిగే బస్సుల్లోనూ ఇవే నిబంధనలు వర్తించడంతో మహిళల ప్రయాణానికి ఉపయోగపడడం లేదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గూడూరు వరకే ఆర్డినరీలు.. నెల్లూరు నుంచి నాయుడుపేట, శ్రీకాళహస్తి, తిరుపతి, సూళ్లూరుపేట, తడ వరకు వెళ్లే ప్రయాణికులకు ఆర్డినరీ బస్సులే లేవు. నెల్లూరు నుంచి గూడూరు వరకు పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు బస్సులు ఉన్నాయి. అక్కడి నుంచి నాయుడుపేట వైపు ఆర్డి నరీ బస్సులే లేవు. ఇటు దొరవారిసత్రం, సూళ్లూరుపేట, తడ, అటు పెళ్లకూరు, శ్రీకాళహస్తి, తిరుపతికి వెళ్లాంటే ఉచిత ప్రయాణం దుర్లభమే. రాష్ట్రంలో ఎక్కడి నుంచి అయినా ఎక్కడికై నా మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చంటూ చంద్రబాబు అండ్ కూటమి కో చేస్తున్న ఆర్భాటంగా చేసిన ప్రచారానికి వాస్తవ పరిస్థితికి భిన్నంగా ఉంది. ఉచిత బస్సు అంటూనే షరతులు వర్తిస్తాయంటూ ‘కూటమి’ మార్కుకు నిదర్శనంగా నిలుస్తోంది. ఒరిజినల్ కార్డు లేకపోతే టికెట్ కొనాల్సిందే.. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించిన ప్రభుత్వం ఆంక్షలతో మహిళలకు ఉచిత ప్రయాణం లేకుండా కొత్త ఎత్తులు వేస్తోంది. ఉచిత బస్సు ప్రయాణానికి మహిళలు తమ ఓటర్ కార్డు, ఆధార్ కార్డు, రేషన్ కార్డులను చూపించాలని తెలిపిన విషయం తెలిసిందే. అయితే ఆయా కార్డులు తప్పనిసరిగా ఒరిజనల్ కార్డు చేత పట్టుకుని రావాలని కండక్టర్లు హెచ్చరిస్తున్నారు. జెరాక్స్‌లు, ఫోన్లో కార్డులను చూపిస్తే చెల్లుబాటు కావని అధికారులు తెలుపుతున్నారు. ఉదయగిరి: ఉదయగిరి డిపో పరిధిలో ఉన్న 57 బస్సుల్లో 39 సర్వీస్ల్లోనే సీ్త్ర శక్తి పథకం వర్తిస్తోంది. రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికై నా ఉచితంగా ప్రయాణించవచ్చు అని చెప్పిన చంద్రబాబు అమల్లోకి వచ్చే సరికి కేవలం కొన్ని సర్వీసులకు మాత్రమే వర్తింప చేస్తూ మోసం చేశారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఉదయగిరి డిపో నుంచి 5 సర్వీసులు చైన్నెకు వెళ్తున్నా.. వీటిల్లో ఉచిత ప్రయాణం అమలు చేయడం లేదు. ఎక్స్‌ప్రెస్ కేటగిరీ బస్సులే అయినా.. కనీసం జిల్లా, రాష్ట్ర పరిధిలోనూ ఉచితంగా ప్రయాణించే వీలు లేదనడం విడ్డూరమని మహిళలు మండి పడుతున్నారు. ఉదయగిరి డిపో నుంచి నెల్లూరుకు ఉదయం 7.30 గంటల తర్వాత 9 గంటల వరకు ఉచితంగా ప్రయాణించేందుకు పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు సర్వీసులే లేవు. ఈ సమయంలో చైన్నె సర్వీ సు ఉన్నప్పటికీ టికెట్ కొని ప్రయాణించాల్సిందే. ఉన్న బస్సులు కుదించి ఉచిత ప్రయాణం అంటే ఎలా అని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉదయగిరి డిపో నుంచి సాయంత్రం 7 గంటల తర్వాత నెల్లూరు వైపు వెళ్లే సర్వీసులు చైన్నెకు వెళ్లేవి కావడంతో టికెట్లు కొని ప్రయాణించాల్సిందే. అదే విధంగా ఉదయగిరి నియోజకవర్గంలోని 90 శాతం పల్లెలకు బస్సులు లేవు. మరి పల్లెల్లో ఉండే మహిళలకు ఉపయోగం ఏమిటో ప్రభుత్వ పెద్దలకే ఎరుక. ఉదయగిరి నుంచి సాయంత్రం 6 గంటల తర్వాత ఒక ఉచిత సర్వీసు కూడా లేదు. మరి ఆ సమయం తర్వాత వెళ్లే మహిళలు తిరిగే బస్సుల్లో టికెట్లు కొని ప్రయాణించాల్సిందే. ఉదయగిరి నుంచి నెల్లూరు, కావలి, బద్వేల్, పామూరు వైపు వెళ్లే ఫ్రీ సర్వీసులు పరిమితంగా ఉండడంతో ఉదయగిరిలోనే బస్సులు నిండే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత స్టేజీల్లో ఎక్కే ప్రయాణికులు నిలబడి ప్రయాణం చేయాల్సిందే. ఉచిత సర్వీసులు పెంచితే ఈ సమస్య ఉండదు. ఆత్మకూరురూరల్: కూటమి ఆర్భాటంగా ప్రచారం చేసుకొని ప్రారంభించిన సీ్త్రశక్తి ఉచిత బస్సు పథకంపై మహిళల్లో నిరాశ, నిస్పృహలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాలో పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో మహిళలు ఉచిత ప్రయాణించవచ్చని ఇటీవల ప్రభుత్వం విధి విధానాలు ప్రకటిస్తూ ఆర్భాటంగా చెప్పింది. అనంతపురం నుంచి శ్రీకాకుళం వయా అన్నవరం వరకు మహిళలు ఉచిత బస్సుల్లో వెళ్లి తీర్థయాత్రలు చేసుకోవచ్చని చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా మహిళలు గుర్తు చేసుకున్నారు. వాస్తవంలోకి వస్తే అనేక ఆంక్షలు, కొర్రీలతో ప్రయాణానికి అడ్డంకులు సృష్టించిందని మహిళలు ఆరోపిస్తున్నారు. ఆత్మకూరు ఆర్టీసీ డిపో పరిధిలో మొత్తం 67 బస్సులు ప్రయాణికులకు అందుబాటులో ఉన్నాయి. ఆత్మకూరు డిపో నుంచి చైన్నె, బెంగళూరుకు వెళ్లే బస్సుల్లో జిల్లా పరిధిలో కానీ, రాష్ట్ర పరిధిలోని ప్రాంతాలకు ప్రయాణించడానికి సీ్త్రశక్తి పథకం వర్తించదంటూ నిబంధనలు విధించారు. ఇక పల్లెవెలుగు బస్సుల్లోనూ కొన్ని కండీషన్లు పెడుతున్నట్లు ప్రయాణికులు చెబుతున్నారు. బస్సుల్లో షరతులు వర్తిస్తున్నాయి కూటమి ప్రభుత్వం ఆర్భాటంగా ప్రారంభించిన ఆర్టీసీ ఫ్రీ బస్సుల్లో షరతులు వర్తిస్తున్నాయి. రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికై నా మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చు అంటూనే మెలికలు పెట్టింది. ఎక్స్‌ప్రెస్ బస్సుల్లోనూ ప్రయాణించకుండా ఆంక్షలు విధించింది. ఆర్టీసీ బస్సుల్లో పెట్టిన నిబంధనలతో డిపో నుంచి డిపో వరకు కూడా ఉచితంగా ప్రయాణించే అవకాశాలు కూడా తక్కువగానే ఉన్నాయి. ప్రధానంగా నెల్లూరు–కావలి, నెల్లూరు– గూడూరు మధ్య నడిచే బస్సులన్నీ ఎక్స్‌ప్రెస్‌లే అయినా నాన్‌స్టాప్ సర్వీస్‌లో ఉచితం లేదంటూ షరతులు అమలు చేస్తోంది. జిల్లాలోని డిపోల నుంచి చైన్నె, బెంగళూరు, హైదరాబాద్‌కు వెళ్లే ఎక్స్‌ప్రెస్ సర్వీసుల్లోనూ రాష్ట్ర పరిధి వరకు కాదు కనీసం జిల్లా పరిధిలోనూ సీ్త్రశక్తి పథకం వర్తించదంటూ బోర్డులు పెట్టేసింది. ప్రధానంగా నెల్లూరు నుంచి రాపూరు మీదుగా రాజంపేటకు వెళ్లే ఎక్స్‌ప్రెస్ బస్సుల్లోనూ ఉచితం లేదంటూ నిబంధనలు పెట్టింది. ఎక్స్‌ప్రెస్‌ల్లోనూ ఎక్కలేరు నెల్లూరు టు రాజంపేట బస్సులో సీ్త్రశక్తి వర్తించదు జిల్లా నుంచి వెళ్లే ఇంటర్ స్టేట్ బస్సుల్లోనే ఇదే రూల్ నాన్‌స్టాప్ సర్వీస్‌ల్లోనూ అంతే అన్నీ నాన్స్టాప్లే.. వీటిల్లోనూ ఇదే రూల్ నెల్లూరు– కావలి, నెల్లూరు–గూడూరు మధ్య ఎక్స్‌ప్రెస్ బస్సులను నాన్‌స్టాప్ చేశారు. ఎక్స్‌ప్రెస్ కేటగిరీ బస్సులే అయినా.. వీటిల్లోనూ ఉచిత ప్రయాణం వర్తించదంటూ ఆంక్షలు పెట్టారు. ఇక నెల్లూరు నుంచి తిరుపతికి కూడా అన్నీ నాన్స్టాప్లే వీటిల్లోనూ ఎక్కి వీలులేకపోవడంతో మహిళలు ఉస్సూరుమంటున్నారు. ఉన్న అరకొర బస్సుల్లో ఎక్స్‌ప్రెస్‌లోనూ ఉచిత ప్రయాణానికి కొర్రీలు, మెలికలు పెడుతోంది. ఫ్రీ టికెట్ .. కొన్ని బస్సుల్లోనే..కూటమి ప్రభుత్వం ఈ నెల 15న సాయంత్రం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన మహిళలకు ఉచిత ఆర్టీసీ ప్రయాణం శనివారం నుంచి పూర్తి స్థాయిలో అమల్లోకి వచ్చింది. అయితే ఆంక్షలు మహిళా ప్రయాణికులకు అయోమయం, గందగోళంగా మారింది. జిల్లాలోని 7 ఆర్టీసీ డిపోల్లో మహిళల ఉచిత బస్సు ప్రయాణానికి 492 బస్సులను కేటాయించినట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఆత్మకూరు డిపో పరిధిలో పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సులు కలిపి 61 బస్సులు, కందుకూరు డిపో పరిధిలో 60, కావలిలో 90, నెల్లూరు–1 డిపో పరిధిలో 91, నెల్లూరు–2 డిపో పరిధిలో 90, రాపూరు డిపో పరిధిలో 49, ఉదయగిరి డిపో పరిధిలో 51 బస్సులను మహిళల ప్రయాణానికి ఏర్పాటు చేశారు. ఏ బస్సుల్లో ఫీ ఉందో.. ఏ బస్సులో లేదో తెలియక అయోమయానికి గురవుతున్నారు. శనివారం నెల్లూరు ప్రధాన ఆర్టీసీ బస్టాండ్ మహిళలకు చాలా అనుభవాలు ఎదురయ్యాయి. చాలా మంది మహిళలు ఆయా బస్సుల్లోకి ఎక్కాక.. ఈ బస్సులో టికెట్లు తీసుకోవాలంటూ కండక్టర్లు చెప్పడంతో దిగేస్తూ.. కూటమి ప్రభుత్వంపై చిర్రుబుర్రులాడడం కనిపించింది. శనివారం నెల్లూరు నుంచి వాకాడుకు వెళ్లేందుకు వాకాడు డిపోకు చెందిన ఓ ఎక్స్‌ప్రెస్ బస్సు ప్లాట్‌ఫాం మీదకు వచ్చింది. అందులో ప్రయాణికులు ఎక్కాక కదిలి వెళ్లిపోయింది. వెంటనే అదే రూట్లో నడిచే మరో ఎక్స్‌ప్రెస్ బస్సును ప్లాట్‌ఫాం మీదకు తెచ్చారు. ప్రయాణికులు అందులోకి ఎక్కేందుకు ప్రయత్నించగా ఈ బస్సులో మహిళలు టికెట్లు తీసుకోవాలంటూ కండక్టర్ చెప్పడంతో ప్రయాణికులు ఆశ్చర్యపోయారు. అదేంటి ఇదీ ఎక్స్‌ప్రెస్.. అదీ ఎక్స్‌ప్రెస్సే కదా అని బస్సు సిబ్బందిని అడిగితే మాకు తెలియదంటూ సమాధానం ఇస్తున్నారు. ప్రచారమే తప్ప ప్రయోజనం శూన్యం మహిళలకు ఉచిత బస్సు అనేది ప్రచారం తప్ప.. ఆచరణ, ప్రయోజనం శూన్యం. ప్రభుత్వం ప్రకటించిన నిబంధనల ప్రకారం అయితే ఎటువెళ్లిన పాతిక, ముప్పై కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం ప్రయాణించే అవకాశమే లేదు. పల్లెవెలుగుల్లోనే ప్రయాణించాలంటే.. డీసీపల్లి నుంచి నెల్లూరుకు రెండు బస్సులు మారి పోవాల్సిందే. రాష్ట్ర పరిధి దాటి ఇతర ప్రాంతాలకు వెళ్లే బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం వర్తించదని చెప్పడం మహిళలను మోసం చేయడమే. కనీసం ఆ బస్సుల్లో రాష్ట్ర పరిధిలోని ప్రాంతాలకు కూడా వెళ్లకూడదని పేర్కొనడం మరీ విడ్డూరం. – రెడ్డి శాంతమ్మ, డీసీపల్లి, మర్రిపాడు -
తిరంగా.. మదినిండా..
నెల్లూరు(అర్బన్): స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా శుక్రవారం పరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. పెహల్గాం ఘటనపై కోవూరు జెడ్పీ బాలికల ఉన్నత పాఠశాలకు చెందిన 70 మంది విద్యార్థినులు ప్రదర్శన ఇచ్చారు. కావలి ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాల బాలికల జయహో.. జయహో, నగరంలోని ఎస్ఆర్కే నెక్ట్స్ జనరేషన్ ఇస్కాన్ సిటీ ఉన్నత పాఠశాల విద్యార్థుల హమ్ ఇండియా వాలా ప్రదర్శనలు దేశ గొప్పతనాన్ని చాటాయి. ● విద్యాశాఖ శకటం ప్రథమ బహుమతి, నెల్లూరు నగరపాలక సంస్థ శకటం రెండో స్థానం, వ్యవసాయ అనుబంధ శాఖ శకటం తృతీయ స్థానంలో నిలిచాయి. ● ఆత్మకూరు, కావలి, కందుకూరు డివిజన్లకు సంబంధించిన 55 మంది మాజీ సైనికులకు 180 ఎకరాల అసైన్డ్ భూములను పట్టాలుగా అందజేశారు. ● వివిధ ప్రభుత్వ శాఖలు ఏర్పాటు చేసిన స్టాళ్లను మంత్రి నారాయణ, కలెక్టర్ ఆనంద్, జేసీ కార్తీక్, ఎస్పీ కృష్ణకాంత్ తదితరులు పరిశీలించారు. ● డీఆర్డీఏ ఆధ్వర్యంలో 10 మంది చిరు వ్యాపారులకు చేయూతనిచ్చారు. అలాగే ఐటీడీఏ ఆధ్వర్యంలో కుట్టుమెషీన్లు, జ్యూట్ బ్యాగ్ కుట్టుమెషీన్లు, చేపలు పట్టేవారికి సైకిళ్లు, వలలు పంపిణీ చేశారు. -
పోలీస్ శాఖలో..
నెల్లూరు(క్రైమ్): విధి నిర్వహణలో విశిష్ట సేవలు, ధైర్య సాహసాలు ప్రదర్శించిన పోలీసు అధికారులు, సిబ్బందికి మంత్రి పొంగూరు నారాయణ, కలెక్టర్ ఆనంద్, ఎస్పీ కృష్ణకాంత్‌లు ప్రశంసాపత్రాలను అందజేశారు. సేవా పతకం అందుకున్న హోంగార్డ్స్ ఆర్ఐ మంత్రి పొంగూరు నారాయణ చేతుల మీదుగా జిల్లా హోంగార్డ్స్ ఆర్ఐ వై.పౌల్‌రాజు సేవా పతకం అందుకున్నారు. ఆయనకు పోలీసు అధికారులు, సిబ్బంది అభినందనలు తెలిపారు. -
విశిష్ట సేవలకు ప్రశంసలు
నెల్లూరు(అర్బన్): వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, సిబ్బంది మంత్రి పొంగూరు నారాయణ, కలెక్టర్ ఆనంద్ చేతుల మీదుగా ప్రశంసాపత్రాలను అందజేశారు. ఆద్విక రమ్య, రోలర్ స్కేటింగ్ ప్లేయర్ శ్రీదేవి, బీసీ సంక్షేమ శాఖ, నెల్లూరు సుదేష్ణ, డీఈ, నెల్లూరు నగరపాలక సంస్థ వేణుగోపాల్, పీఎంపీ జిల్లా అధ్యక్షుడురామనిర్మల, అకౌంటెంట్, కార్పొరేషన్అలేఖ్య, బీసీ కార్పొరేషన్ ఆర్.ప్రదీప్ కుమార్, డీఆర్వో సీసీ -
పోలీసుల స్పెషల్ డ్రైవ్
● నిబంధనల ఉల్లంఘనులకు భారీగా జరిమానాలు నెల్లూరు(క్రైమ్): రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా జిల్లా వ్యాప్తంగా పోలీసు అధికారులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. గురువారం రాత్రి 9 గంటల నుంచి 11 గంటల వరకు వాహన తనిఖీలు చేపట్టారు. నిబంధనల ఉల్లంఘనులపై కొరడా ఝళిపించారు. మితిమీరిన వేగంతో వాహనాలు నడుపుతున్న 100 మందిపై కేసులు నమోదు చేసి రూ.1,06,500లు జరిమానా విధించారు. అదేక్రమంలో నేర నియంత్రణ చర్యల్లో భాగంగా జిల్లాలోని 54 లాడ్జీలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. బస చేసిన వారిని ఎక్కడి నుంచి వచ్చారు?, ఎందుకు వచ్చారు?, ఏం చేస్తున్నారు తదితర వివరాలను సేకరించారు. ఈ సందర్భంగా ఎస్పీ జి.కృష్ణకాంత్ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టామన్నారు. అందులో భాగంగా వాహన తనిఖీలు ముమ్మరం చేశామన్నారు. మితిమిరీన వేగం, ట్రిపుల్, మైనర్ రైడింగ్, ఓవర్‌లోడ్, డ్రంక్ అండ్ డ్రైవ్, సెల్‌ఫోన్ డ్రైవింగ్‌కు పాల్పడుతున్న వాహనచోదకులపై కేసులు నమోదుచేసి భారీగా జరిమానాలు విధిస్తున్నామన్నారు. వాహనచోదకులు విధిగా రోడ్డు భద్రతా నియమాలను పాటించాన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. స్పెషల్ డ్రైవ్‌లో జిల్లాలోని పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
సీఎం చేతుల మీదుగా ఐపీఎం స్వీకరణ
నెల్లూరు(క్రైమ్): విజయవాడ మున్సిపల్ స్టేడియంలో శుక్రవారం జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో నెల్లూరు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఇన్స్పెక్టర్ అక్కిశెట్టి శ్రీహరిరావు సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ఇండియన్ పోలీసు మెడల్ (ఐపీఎం) స్వీకరించారు. గతేడాది గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఈ అవార్డును ఆయనకు ప్రకటించింది శ్రీహరిరావును పలువురు పోలీసు అధికారులు అభినందించారు. అసిస్టెంట్ కమిషనర్‌కు అవార్డునెల్లూరు(క్రైమ్): నెల్లూరు ఏసీ (అసిస్టెంట్ కమిషనర్) పి.దయాసాగర్, హెడ్‌కానిస్టేబుల్ ఎం.కిరణ్సింగ్కు అవార్డులు వరించాయి. ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ శాఖ ఆధ్వర్యంలో విజయవాడలో శుక్రవారం జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ఆ శాఖ కమిషనర్ నిషాంత్ కుమార్, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ రాహుల్‌దేవ్ శర్మ చేతుల మీదుగా అవార్డులను అందుకున్నారు. 50 మద్యం బాటిళ్ల స్వాధీనంవెంకటాచలం: అక్రమంగా మద్యం రవాణా చేస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు అదుపులో తీసుకుని 50 బాటిళ్లను స్వాధీనం చేసుకున్న ఘటన మండలంలోని చవటపాళెంలో శుక్రవారం జరిగింది. పోలీసుల కథనం మేరకు.. గ్రామంలో అక్రమంగా మద్యం సరఫరా చేస్తున్నారని వెంకటాచలం పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఎస్సై ఆంజనేయులు తన సిబ్బందితో గ్రామానికి వెళ్లి రామాలయం వద్ద ఉన్న రావుల ఉదయ్‌కుమార్ అనే వ్యక్తిని విచారించారు. అతని వద్ద సుమారు రూ.6,500 విలువైన 50 క్వార్టర్ బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. విచారణలో వాటిని నెల్లూరు నగరంలోని మందాకిని షాప్ నుంచి తీసుకొస్తున్నానని చెప్పడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
‘నాన్నా.. నేనిక బతకను’
● రోడ్డు ప్రమాదంలో గాయపడిన కుమారుడు ● తండ్రి 108 పైలట్ ● అంబులెన్స్‌లో తీసుకెళ్తుండగా మృతి ● మైనర్ బాలుడి నిర్వాకం పొదలకూరు: ఆ యువకుడు కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉన్నాడు. ఇంతలో రోడ్డు ప్రమాదం జరిగింది. 108 పైలట్‌గా వెళ్తున్న తండ్రి కుమారుడిని తన అంబులెన్స్‌లో తరలిస్తుండగా తుదిశ్వాస విడిచిన హృదయ విషాదరక ఘటన గురువారం రాత్రి మరుపూరు వద్ద జరిగింది. పోలీసులు, స్థానికుల కథనం మేరకు.. పొదలకూరు శింగయ్య చేనువీధికి చెందిన మందాటి సురేష్ ఆదూరుపల్లి 108 అంబులెన్స్ పైలట్. ఎంతో మంది ప్రాణాలను కాపాడాడు. ఆయన పెద్ద కుమారుడు మందాటి బాలసు బ్రహ్మణ్యం (20) సొంతంగా కారు నడుపుతూ కుటుంబానికి అండగా ఉన్నాడు. చిన్న కుమారుడు చదువుకుంటున్నాడు. గురువారం రాత్రి బాలసుబ్రహ్మణ్యం తన కారులో నెల్లూరుకు డ్రాపింగ్‌కు వెళ్లి తిరిగి వస్తున్నాడు. సురేష్ ఒకరిని నెల్లూరు ఆస్పత్రిలో చేర్చి వస్తూ కుమారుడి కారును చూశాడు. అంబులెన్స్, కారు పొదలకూరుకు బయలుదేరాయి. డక్కిలి మండలం వెలికల్లు గ్రామానికి చెందిన ఓ మైనర్ బాలుడు నెల్లూరు వైపు అతి వేగంగా కారులో వెళ్తున్నాడు. సురేష్ అంబులెన్స్‌ను బాలుడి కారు ఢీకొనే క్రమంలో ప్రమాదం తప్పింది. తన కుమారుడి కారు వెనుక వస్తున్నందున సురేష్ వెంటనే ఫోన్ చేశాడు. అతను లిఫ్ట్ చేయకపోవడంతో మళ్లీ చేశాడు. మరో యువకుడు ఫోన్ లిఫ్ట్ చేసి కారు ప్రమాదం జరిగినట్లు చెప్పాడు. సురేష్ వెంటనే అంబులెన్స్‌ను వెనక్కు తిప్పి ఘటనా స్థలానికి వెళ్లాడు. మరుపూరుకు సమీపంలో మద్యం తాగి అతివేగంగా వెళుతున్న బాలుడు బాలసుబ్రహ్మణ్యం కారును ఢీకొనడంతో దెబ్బతింది. తీవ్రంగా గాయపడిన కుమారుడిని సురేష్ నెల్లూరుకు తరలిస్తూ డైకస్ రోడ్డు వద్దకు చేరుకున్నారు. బాలసుబ్రహ్మణ్యం తన తండ్రితో ‘నాన్నా నేను ఇక బతకను’ అంటూ తుదిశ్వాస విడిచాడు. మైనర్‌కు ప్రమాదంలో రెండు కాళ్లు విరిగిపోయాయి. క్షతగాత్రుడిని పొదలకూరు పోలీసులు జీజీహెచ్‌కు తరలించారు. ఎస్సై హనీఫ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో దుకాణం దగ్ధం
● రూ.20 లక్షల ఆస్తి నష్టం ● లబోదిబోమంటున్న బాధితులు వింజమూరు(ఉదయగిరి): విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో ఆటో స్పేర్స్ దుకాణం దగ్ధమైంది. ఈ ఘటన వింజమూరు పట్టణంలోని జెడ్పీహెచ్ఎస్ సమీపంలో జరిగింది. స్థానికులు, బాధితుల కథనం మేరకు.. బుజ్జమ్మ కొన్ని సంవత్సరాలుగా ఆటో స్పేర్స్, వివిధ రకాల వాహనాలకు సీటు కవర్లు, ఆయిల్ విక్రయిన్నారు. ఇటీవల భారీగా సరుకు నిల్వ ఉంచారు. శుక్రవారం ఉదయం దుకాణంలో ఉన్న ఒక గదిలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరిగి మంటలు వ్యాపించాయి. మొత్తం సామగ్రి కాలిపోయింది. స్థానికులు గమనించి ఫైర్ స్టేషన్‌కు సమాచారం ఇవ్వగా వారొచ్చి మంటలు ఆర్పారు. దీంతో చుట్టుపక్కల దుకాణాలకు మంటలు వ్యాపించలేదు. సుమారు రూ.20 లక్షల ఆస్తి నష్టం వాటిల్లినట్లు బాధితులు వాపోతున్నారు. రైలు కిందపడి వ్యక్తి ఆత్మహత్యనెల్లూరు(క్రైమ్): ఏం కష్టమొచ్చిందో తెలియదు గానీ రైలు కిందపడి గుర్తుతెలియని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతదేహాన్ని రైలు కొద్దిదూరం లాక్కెళ్లడంతో ఛిద్రమై గుర్తుపట్టలేని విధంగా తయారైంది. ఈ ఘటన శుక్రవారం తెల్లవారుజామున మాగుంట లేఅవుట్ అండర్‌బ్రిడ్జి సమీపంలో నెల్లూరు వైపు వచ్చే పట్టాలపై చోటుచేసుకుంది. మృతుడి వయసు సుమారు 40 నుంచి 45 ఏళ్లలోపు ఉండొచ్చు. తెలుపు, గులాబీ రంగులు మిళితమైన హాఫ్ హ్యాండ్స్ చొక్కా, నలుపు రంగు జీన్స్ ప్యాంట్ ధరించి ఉన్నాడు. సమాచారం అందుకున్న నెల్లూరు రైల్వే ఎస్సై ఎన్.హరిచందన ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని జీజీహెచ్ మార్చురీకి తరలించారు. ఎస్సై కేసు దర్యాప్తు చేస్తున్నారు.● జారిపడి.. గుర్తుతెలియని వ్యక్తి ప్రమాదవశాత్తు రైల్లో నుంచి జారిపడిన ఘటన శుక్రవారం బుజబుజనెల్లూరు సమీపంలో నెల్లూరువైపు వచ్చే పట్టాలపై చోటుచేసుకుంది. అతడిని రైల్వే ట్రాక్‌మెన్ జి.భార్గవ్బాబు 108 అంబులెన్స్‌లో చికిత్స నిమిత్తం జీజీహెచ్‌కు తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందాడని నిర్ధారించారు. మృతుడు నలుపు రంగు ఫుల్‌హ్యాండ్స్ టీషర్టు, నలుపు రంగు నైట్ ప్యాంట్ ధరించి ఉన్నాడు. సమాచారం అందుకున్న రైల్వే ఎస్సై ఎన్.హరిచందన హాస్పిటల్‌కు చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేశారు. -
టీడీపీ నేత దర్జాగా కబ్జా
వింజమూరు (ఉదయగిరి): ప్రభుత్వ భూమి కనిపిస్తే అక్రమార్కులు వాలిపోతున్నారు. వాగు, వంక, శ్మశాన భూమి, పోరంబోకా, అనాధీనమా? అనేది కూడా చూడడం లేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అధికారాన్ని అడ్డం పెట్టుకొని, రెవెన్యూ అధికారులను లోబర్చుకుని ఆక్రమిస్తున్నారు. సామాన్య ప్రజలు ప్రశ్నస్తే దౌర్జన్యం చేస్తూ అక్రమ కేసులు పెడతామని బెదిరిస్తున్నారు. ఇలాంటి ఘటననే వింజమూరు మండలం శంఖవరం పంచాయతీ వెంకట్రాదిపాళెంలో జరుగుతోంది. మండలంలోని వెంకట్రాదిపాళెం గ్రామ సర్వే నంబరు 253లో సుమారు 5 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఈ భూమి గ్రామ ఎస్సీ కాలనీకి అనుకుని తారు రోడ్డుకు పక్కనే ఉంది. ఈ భూమి ఎన్నో ఏళ్ల నుంచి ఎస్సీ కాలనీ వాసులు తమ ఉమ్మడి అవసరాల కోసం వినియోగించుకుంటున్నారు. ఇళ్ల స్థలాల పట్టాల కోసం గతంలో ప్రభుత్వ అధికారులకు అర్జీలు కూడా ఇచ్చారు. ఈ క్రమంలో గ్రామానికి చెందిన ఓ అధికార పార్టీ నేత విలువైన ఈ భూమిపై కన్నేశారు. తన పలుకుబడితో నిబంధనలకు వ్యతిరేకంగా రెవెన్యూ అధికారులను ప్రసన్నం చేసుకుని పాత మ్యానువల్ అడంగళ్లలో సదరు నేతకు అనుకూలమైన పేరు రాయించుకున్నారు. దీనిని ఆసరా చేసుకుని పట్టదారు పాస్‌పుస్తకాలు తీసుకున్నారు. గ్రామ రెవెన్యూ రికార్డుల్లో నమోదు చేసుకున్నారు. ఈ వ్యవహరంలో పెద్ద మొత్తంలో మడుపులు చేతులు మారినట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. కొంత కాలంగా గుంభనంగా ఉన్న సదరు నేత ఇటీవల ఆ భూమి కబ్జా చేసే ప్రక్రియ మొదలు పెట్టి చెట్లు తొలగించారు. దీంతో ఎస్సీ కాలనీ వాసులు తీవ్రంగా ప్రతిఘటించారు. అయినా ఆ నేత పనులు ఆపకుండా బెదిరింపులకు దిగారు. దీంతో కాలనీ వాసులు స్థానిక వీఆర్వో, తహసీల్దార్‌కు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. ఈ క్రమంలో శుక్రవారం సదరు నేత ట్రాక్టర్ ద్వారా నాగలి తెచ్చి దున్నకం చేశశారు. జేసీబీని ఉపయోగించి నేలను చదును చేసే పనులు చేపట్టారు. దీంతో స్థానికులు మరోసారి అడ్డుకునే ప్రయత్నం చేయగా వారిపై దూషణకు దిగారు. దీంతో వారు తహసీల్దార్‌కు ఫోన్ ద్వారా సమాచారం అందజేశారు. ఆయన వీఆర్వోకు తెలిపమని చెప్పి పెట్టేశారని ఎస్సీ కాలనీ వాసులు అవేదన వ్యక్తం చేశారు. ఐదెకరాల భూమిని గుట్టుచప్పుడు కాకుండా కాజేస్తున్న వైనం రెవెన్యూ అధికారులను లోబర్చుకుని రికార్డుల తారుమారు ఎస్సీ కాలనీ వాసులు అడ్డుకున్నా.. లెక్కచేయని వైనం పట్టించుకోని రెవెన్యూ అధికారులు రికార్డులు పరిశీలించి చర్యలు తీసుకుంటాం గ్రామ 253 సర్వే నంబరుకు సంబంధించి మాన్యువల్, ఆన్లైన్ అడంగళ్‌లో పేర్లు ఉన్నాయి. గతంలో ఉన్న అధికారులు పట్టాదారుపాస్ పుస్తకాలు ఇచ్చారు. వీటిని లోతుగా పరిశీలించి ఫేక్, లేక ఒరినల్ అనే విషయాలు తేల్చాలి. అప్పటి వరకు ఎవరు ఈ భూమిలో ప్రవేశించకుండా తగిన చర్యలు తీసుకుంటాం. – రవితేజ, వీఆర్వో మాకు సెంట్ వ్యవసాయ భూమి లేదు మా కాలనీలో చాలా మందికి సెంటు భూమి కూడా లేదు. ఈ భూమి కబ్జా చేస్తున్న వ్యక్తికి 150 ఎకరాల భూమి ఉంది. ఇదే కాకుండా గ్రామంలో చాలా చోట్ల ప్రభుత్వ భూములు కబ్జా చేసి స్వాధీనం చేసుకున్నారు. మా లాంటి పేదలకు మాత్రం సెంట్ భూమి లేదు. మేము అడిగితే బెదిరింపులు తప్పుడం లేదు. అధికారం మాది అంటూ దౌర్జన్యం చేస్తున్నారు. – వెంకటమ్మ ఆక్రమణదారుడిపై చర్యలు తీసుకోవాలి మా గ్రామ సర్వే నంబరు 253లో సుమారు 5 ఎకరాలు ప్రభుత్వ భూమి మా కాలనీ అనుకొని ఉంది. అనాదిగా కాలనీ అవసరాల కోసం వాడుకుంటున్నాం. ఈ స్థలాన్ని నివేశాలకు పట్టాలు ఇవ్వాల్సిందిగా అధికారులను కోరుతున్నాం. ఈ భూమి విలువైనది కావడంతో మా గ్రామానికి చెందిన టీడీపీ నేత నకిలీ రికార్డులు సృష్టించి కబ్జా చేస్తున్నారు. ఈ భూమి పోతే మేము ఇక్కడ ఉంటే పరిిస్థిది లేదు. – వడ్లపల్లి చిన్నహజరత్, ఎస్సీ కాలనీ -
విద్యార్థుల ఆకలి కేకలు
● ఎమ్మెల్యే రాక ఆలస్యం కావడంతో.. సాక్షి టాస్క్‌ఫోర్స్: పట్టణంలో డీఎల్‌ఎన్నార్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఆలస్యంగా మొదలయ్యాయి. దీంతో విద్యార్థులు ఉదయం నుంచి కనీసం అల్పాహారం కూడా లేక అలమటించారు. ఉదయం 8.30 గంటలకు ప్రారంభం కావాల్సి ఉండడంతో విద్యార్థులందరూ అల్పాహారం కూడా తినకుండా ఉదయం 7 గంటలకే వివిధ కార్యక్రమాలు నిర్వహించడానికి విద్యార్థులు గ్రౌండ్‌కు చేరుకున్నారు. అయితే ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి రావడం ఆలస్యం కావడంతో ఆమె కోసం ఎదురు చూసి చూసి అసహనానికి గురయ్యారు. దాదాపు 10 గంటలకు మొదలైన కార్యక్రమం 1.10 గంటల వరకు సాగింది. నియోజకవర్గంలోని ఐదు మండలాల నుంచి హాజరైన విద్యార్థులకు మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేయలేదు. ఇంకేం చేయలేక ఆకలి కేకలతోనే విద్యార్థులు వెనుదిరిగారు. సాంస్కతిక కార్యక్రమాలు, అవార్డుల ప్రదానం మిగిలి ఉండగానే ఎమ్మెల్యే వెళ్లిపోయారు. నగర పంచాయతీ చైర్పర్సన్ మోర్ల సుప్రజ, కమిషనర్, కౌన్సిలర్లు విద్యార్థులు, ఉద్యోగులకు అవార్డులు అందజేశారు. సీ్త్ర శక్తి పథకం ప్రారంభం నెల్లూరు సిటీ: ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణానికి సంబంధించి నగరంలోని ప్రధాన ఆర్టీసీ బస్టాండ్‌లో సీ్త్ర శక్తి పథకాన్ని మంత్రి నారాయణ, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి శుక్రవారం జెండా ఊపి ప్రారంభించారు. ఆర్టీసీ బస్టాండ్ నుంచి నవాబుపేట వరకు ర్యాలీగా ప్రారంభమైన బస్సుల్లో మంత్రి నారాయణ, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, కలెక్టర్ ఆనంద్, జేసీ కార్తీక్, ఆర్టీసీ రీజియన్ చైర్మన్ సన్నపరెడ్డి సురేష్‌రెడ్డి, నుడా చైర్మన్ శ్రీనివాసులరెడ్డి, నాయకులు గిరిధర్‌రెడ్డి, మున్సిపల్ కమిషనర్ నందన్, డిప్యూటీ మేయర్ రూప్‌కుమార్, ఆర్టీసీ ఈడీ నాగేంద్రప్రసాద్, జిల్లా ప్రజా రవాణా అధికారి షమీమ్ ప్రయాణించారు. కాగా ఈ పథకానికి సంబంధించి మహిళల నుంచి పెద్దగా స్పందన కనిపించలేదు. సాంఘిక సంక్షేమ శాఖకు దక్కని ప్రశంసలునెల్లూరు (స్టోన్‌హౌస్‌పేట): జిల్లాలోని 71 ప్రభుత్వ శాఖల్లో విశిష్ట సేవలు అందించిన 332 మందికి స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ప్రశంసా పత్రాలను అందజేశారు. అయితే జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ, సోషల్ వెల్ఫేర్ రెండింటికి ఒక్కటంటే ఒక్క ప్రసాంశ పత్రం కూడా రాలేదు. ఆ శాఖలోని అధికారులు, ఉద్యోగుల నిర్లక్ష్యం తాండవిస్తున్న నేపథ్యంలో ఈ దఫా ఈ శాఖలో ఏ ఉద్యోగికి కూడా ప్రశంసలు లేవంటే, విశిష్ట సేవలు దేవుడు ఎరుగు కనీస సేవలు కూడా అందించలేదని స్పష్టమవుతోంది. సాంఘిక సంక్షేమ శాఖ డీడీగా, కార్పొరేషన్ ఈడీగా ఒకరే విధులు నిర్వహిస్తున్నారు. జిల్లాలోని సంక్షేమ శాఖలో 71 హాస్టళ్లల్లో 71 వార్డెన్లు, నలుగురు ఏఎస్‌డబ్ల్యూఓలు, కార్యాలయంలో 15 మందికి పైగా, కార్పొరేషన్ కార్యాలయంలో 10 మంది సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారు. మొత్తం 150 మంది సిబ్బంది పని చేస్తున్నారు. అయినా ఒక్కరికీ కూడా స్వాతంత్య్ర దినోత్సవ ప్రశంస అందలేదంటే ఆ శాఖ పనిచేస్తున్న తీరుపై పలు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఉన్నతాధికారి వద్ద నుంచి వార్డెన్ల పనితీరు, ఇటీవల ట్రాన్స్‌ఫర్‌పై వచ్చిన ఆరోపణలు, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులపై వ్యవహరిస్తున్న తీరు ఇందుకు కారణమై ఉండొచ్చు అని శాఖలో పనిచేస్తున్న వారే అంటున్నారు. ఈ విషయమై సోషల్ వెల్ఫేర్ డీడీకి ఫోన్ చేసినా స్పందించలేదు. భారీగా గ్రావెల్ అక్రమ తవ్వకాలు బిట్రగుంట: దగదర్తి, బోగోలు మండలాల పరిధిలోని అటవీ ప్రాంతం, కప్పరాళ్లతిప్ప సమీపంలోని పలు ప్రాంతాల్లో గ్రావెల్ అక్రమ తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. భారీ యంత్రాలు, టిప్పర్ల సాయంతో గ్రావెల్ తరలిస్తుండడంపై స్థానికులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ నాయకులు సిండికేట్‌గా మారి రాత్రిళ్లు గ్రావెల్ తవ్వకాలు నిర్వహిస్తున్నారని స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అక్రమ గ్రావెల్ తవ్వకాలపై చర్యలు చేపట్టాల్సిన రెవెన్యూ, మైనింగ్, పోలీసుల అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తుండడంతోపాటు ఫిర్యాదులు వచ్చినా పట్టించుకోవడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అధికారులతోపాటు మీడియాకు ముడుపులు ముట్టచెబుతున్నామని చెబుతూ అక్రమార్కులు యథేచ్ఛగా తవ్వకాలు సాగిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఉన్నతాధికారులైనా స్పందించి అక్రమ తవ్వకాలకు అడ్డుకట్ట వేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. -
కలెక్టరేట్లో పంద్రాగస్టు వేడుకలు
నెల్లూరు రూరల్ : 79వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని నెల్లూరు కలెక్టరేట్లో పంద్రాగస్టు వేడుకలు ఘనంగా నిర్వహించారు. కలెక్టరేట్లోని జాతిపిత విగ్రహానికి కలెక్టర్ ఆనంద్, జేసీ కార్తీక్, డీఆర్ఓ హుస్సేన్‌సాహెబ్, పలువురు అధికారులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం 100 అడుగుల స్థూపం వద్ద జాతీయ పతాకాన్ని కలెక్టర్ ఆవిష్కరించారు. అనంతరం చిన్నారులకు కలెక్టర్ మిఠాయిలు పంచి పెట్టారు. కలెక్టరేట్ ఏఓ విజయకుమార్, డీఆర్డీఏ పీడీ నాగరాజకుమారి, డీసీఓ గుర్రప్ప, సమాచార పౌరసంబంధాల అధికారి ఎ.శివశంకర్‌రావు, పౌర సరఫరాలశాఖ అధికారి విజయ్‌కుమార్, కలెక్టరేట్ కార్యాలయ అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు. -
సగర్వంగా.. త్రివర్ణ వీచికలు
నెల్లూరు (అర్బన్): సంక్షేమంతోపాటు అభివృద్ధే ధ్యేయంగా జిల్లా సమగ్రాభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ అన్నారు. 79వ స్వాతంత్య్ర వేడుకలు జిల్లా వ్యాప్తంగా శుక్రవారం ఘనంగా జరిగాయి. పోలీసు పరేడ్ గ్రౌండ్లో మంత్రి నారాయణ, కలెక్టర్ ఆనంద్, ఎస్పీ కృష్ణకాంత్‌తో కలిసి జాతీయ జెండాను ఆవిష్కరించారు. పోలీసుల గౌరవ వందనాన్ని మంత్రి స్వీకరించారు. అనంతరం శాంతికపోతాలను, బెలూన్లను ఎగుర వేశారు. మంత్రి నారాయణ మాట్లాడుతూ వికసిత్ భారత్‌లో భాగంగా స్వర్ణాంధ్ర సాధన కోసం జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో విజన్ యాక్షన్ ప్లాన్ డాక్యుమెంట్లను తయారు చేశామన్నారు. ఈ ప్రణాళికలో ప్రథమ లక్ష్యమైన పీ4 విధానం ద్వారా జిల్లాలో 38,465 బంగారు కుటుంబాలను దత్తత తీసుకుని సమాజంలో అట్టడుగున ఉన్న 20 శాతం మంది ప్రజలను పేదరికం నుంచి బయటకు తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నామన్నారు. సమగ్రాభివృద్ధికి కృషి జిల్లాలోని రైతులకు అండగా అన్నదాత సుఖీభవ పథకం కింద 1.96 లక్షల మందికి రూ.132 కోట్లు వారి ఖాతాల్లో జమ చేశామన్నారు. వ్యవసాయ యాంత్రీకరణ పథకం ద్వారా 1,454 రైతులకు రూ.6.8 కోట్ల విలువైన యంత్రపరికరాలను రూ 2.83 కోట్ల సబ్సిడీతో అందించామన్నారు. 80 శాతం సబ్సిడీతో 33 వ్యవసాయ డ్రోన్లను సరఫరా చేశామన్నారు. నేషనల్ మిషన్ ఫర్ ఎడిబుల్ ఆయిల్– ఆయిల్ పామ్ పథకం కింద రూ.7.62 కోట్ల రాయితీని 3,685 మంది రైతుల ఖాతాల్లో జమ చేశామన్నారు. 14,820 ఎకరాల్లో బిందు, తుంపర్ల సేద్య పరికరాలను అమర్చేందుకు చర్యలు చేపట్టామన్నారు. మెట్ట ప్రాంత వరప్రదాయిని ఆనం సంజీవరెడ్డి సోమశిల ఎత్తిపోతల పథకం ఫేజ్–1 కింద రూ.854 కోట్ల అగ్రిమెంట్‌కు రూ.533 కోట్ల పనులు పూర్తి చేశామన్నారు. మేజర్, మైనర్ ఇరిగేషన్ ద్వారా రూ.15 కోట్లతో చేపట్టిన 244 పనులు పురోగతిలో ఉన్నాయన్నారు. 30 వేల మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు కల్పించేందుకు 850 ఎకరాల విస్తీర్ణంలో రామాయపట్నంపోర్టు రూ.3,700 కోట్లతో నిర్మాణంలో ఉందన్నారు. ఆరు వేల మంది ఆక్వా రైతులకు యూనిట్ విద్యుత్‌ను రూ.1.50లకే సరఫరా చేస్తున్నట్లు వివరించారు. రూ.37.26 కోట్లతో 1.62 లక్షల విద్యార్థులకు స్టూడెంట్ కిట్స్ అందిస్తున్నామన్నారు. తల్లికి వందనం కింద ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లోని 2.90 లక్షల మందికి రూ.434.56 కోట్లు వారి ఖాతాల్లో జమ చేశామన్నారు. పరిశ్రమల స్థాపనకు చేయూత జిల్లాలో 42 భారీ పరిశ్రమలు, రూ.41 వేల కోట్ల పెట్టుబడితో 19 వేల మందికి ఉపాధి కల్పిస్తూ స్థాపించామన్నారు. 53 వేల సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రలు ఉన్నాయన్నారు. వీటన్నింటికి ప్రభుత్వం పరంగా చేయూతనిస్తున్నామన్నారు. ఆత్మకూరు నారంపేట వద్ద 173.67 ఎకరాల్లో ఎంఎస్ఎంఈ పార్కు అభివృద్ధి పరిచి ఔత్సాహిక పారిశ్రామిక వేత్తల కోసం 789 ప్లాట్లు అందుబాటులోకి తీసుకురావడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ, రాజ్యసభ సభ్యుడు బీద మస్తాన్‌రావు, నగరపాలక సంస్థ మేయర్ స్రవంతి, రాష్ట్ర వక్ఫ్‌బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్, ఆర్టీసీ జోనల్ చైర్మన్ సన్నపురెడ్డి సురేష్‌రెడ్డి, నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, జేసీ కార్తీక్, డీఆర్వో హుస్సేన్‌సాహెబ్, నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ నందన్, నెల్లూరు, ఆత్మకూరు ఆర్డీఓలు అనూష, పావని తదతరులు పాల్గొన్నారు. మహనీయుల త్యాగఫలమే స్వాతంత్య్రం ఘనంగా 79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు స్వాతంత్య్ర స్ఫూర్తిని చాటిన ప్రదర్శనలు విశిష్ట సేవలందించిన 332 మందికి అవార్డుల ప్రదానం జిల్లా సమగ్రాభివృద్ధికి కృషి: మంత్రి నారాయణ గర్వగాథలతో స్వాతంత్య్ర స్ఫూర్తిని చాటుతూ జిల్లా వ్యాప్తంగా వేడుకలు ఉత్సాహభరితంగా సాగాయి. ఆకాశ వీధుల్లో మువ్వన్నెల వీచికలు దేశపు గర్వ ధ్వజమై రెపరెపలాడాయి. త్రివర్ణ తరంగం తరం తరం గౌరవానికి ప్రతీకగా.. వీధివీధిన అలరారగా, పట్టణం నుంచి పల్లె వరకు ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో దేశభక్తి గర్వగీతమై ఉప్పొంగింది. పోలీస్ పరేడ్ మైదానంలో మంత్రి నారాయణ, కలెక్టర్, ఆనంద్, ఎస్పీ కృష్ణకాంత్, జిల్లా కోర్టులో ప్రధాన న్యాయమూర్తి శ్రీనివాస్ జాతీయ పతకాన్ని ఎగురవేశారు. విశిష్ట సేవలు అందించిన ఉద్యోగులకు ప్రశంసాపత్రాలు అందించారు. చిన్నారులు మహనీయుల వేషధారణలు, సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు. ఎస్పీ కృష్ణకాంత్ నెల్లూరు (క్రైమ్): దేశ స్వాతంత్య్రం కోసం ఎందరో మహనీయులు ప్రాణాలను తృణప్రాయంగా అర్పించారని, వారి త్యాగ ఫలితంగానే మనకు స్వాతంత్య్రం సిద్ధించిందని ఎస్పీ జి.కృష్ణకాంత్ అన్నారు. శుక్రవారం79వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎస్పీ క్యాంపు, జిల్లా పోలీసు కార్యాలయాల్లో ఆయన జాతీయ జెండాను ఎగురవేసి వందన సమర్పణ చేశారు. స్వాతంత్య్ర సమర స్ఫూర్తితో సిబ్బంది విధులకు పునరంకితం కావాలని ఎస్పీ పిలుపునిచ్చారు. ప్రజలకు మెరుగైన శాంతిభద్రతలు అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ కుటుంబ సభ్యులు, ఏఎస్పీ సీహెచ్ సౌజన్య, ఎస్బీ డీఎస్పీ ఎ. శ్రీనివాసరావు, ఎస్బీ ఇన్స్పెక్టర్లు, ఆర్ఐలు, ఆర్ఎస్ఐలు, మినిస్టీరియల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. వెంకటాచలం మండలం చెముడుగుంటలోని డీటీసీలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఏఎస్పీ సీహెచ్ సౌజన్య జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ గిరిధర్‌రావు, ఇన్స్పెక్టర్ మిద్దె నాగేశ్వరమ్మ, ఆర్ఐ డి. శ్రీనివాసరెడ్డి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
జాతీయ పతాకానికి అవమానం
● జనార్ధనపురం పాఠశాలలో ఉల్టాగా కట్టి ఎగురవేసిన వైనం వింజమూరు (ఉదయగిరి): వింజమూరు మండలం జనార్ధనపురం ప్రాథమిక పాఠశాలలో శుక్రవారం 79వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాకు తీవ్ర అవమానం జరిగింది. జాతీయ పతాకాన్ని ఉల్టాగా కట్టి ఎగువ వేయడంతో కషాయం కిందకు, ఆకు పచ్చ పైకి ఉండేలా ఎగురుతూ కనిపించింది. బాధ్యత కలిగిన ఉపాధ్యాయుడు ఆవుల రాజు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. జాతీయ పతాకం ఎగురవేసిన సమయంలో అయినా తప్పును గుర్తించి తిరిగి ఎగురవేయాల్సిన సదరు ఉపాధ్యాయుడు బాధ్యతారాహిత్యంగా జెండా వందనం చేయడం గమనార్హం. జాతీయ పతాకం ఎగురవేసే సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. చినిగిపోయినా, రంగు వెలిసిన జెండాలను వినియోగించకూడదనే తెలిసినా.. చివరన చినిగిపోయిన జెండానే ఎగురవేయడంతో ఉపాధ్యాయుడి నిర్లక్ష్యానికి అద్దం పడుతుందని విద్యార్థులు, తల్లిదండ్రులు అభిప్రాయపడ్డారు. జాతీయ జెండాకు అవమానం జరిగిన తీరును గ్రామస్తులు వీడియో తీసి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. వింజమూరు ఎంఈఓ రమేష్ దృష్టికి గ్రామస్తులు తీసుకెళ్లారు. ఈ విషయమై ఎంఈఓను వివరణ కోరగా, జెండా తిరగేసి కట్టిన మాట వాస్తవమే అని తెలిపారు. ఉన్నతాధికారులు అదేశాలు ఇస్తే విచారణ చేస్తామని తెలిపారు. -
ఘనంగా జెండా పండగ
నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట): వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో 79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను శుక్రవారం ఆ పార్టీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి, రాష్ట్ర మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత జాతీయ జెండాను ఎగురవేసి జెండా వందనం చేశారు. పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ స్వేచ్ఛ, స్వతంత్రానికి పూజ్య బాపూజీ దేశానికి స్వాతంత్య్రం తీసుకువస్తే.. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ పాలకులు ఆంగ్లేయులను తలదన్నే రీతిలో నియంతల్లా పాలిస్తున్నారన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు గొప్ప పాలన అందించారని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో పరిస్థితులు అటవీక రాజ్యాన్ని తలపిస్తున్నాయన్నారు. టీడీపీ అకృత్యాలను చూసి ప్రజలు అసహ్యించుకునే పరిస్థితి ఏర్పడిందన్నారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌తోపాటు కొంతమంది మహనీయులు కృషితో భారతదేశానికి గొప్ప రాజ్యాంగం తీసుకు వచ్చి ప్రజాస్వామ్య విలువలను సంరక్షించేలా విధానాలు రూపొందిస్తే ఈ రోజు ఆ రాజ్యాంగ విలువలను కాలరాస్తూ దుర్మార్గంగా వ్యవహరిస్తుందన్నారు. పులివెందుల ఎలక్షన్లో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన తీరు దుర్మార్గమన్నారు. పోలీసు వ్యవస్థను అడ్డం పెట్టుకొని మీడియా గొంతు నొక్కి పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో చేసిన అరాచకం ప్రజలందరూ చూశారన్నారు. -
ఆరు లేన్లున్నా.. ఆర్తనాదాలే
ప్రమాద ఘంటికలు దారుణ వైఫల్యం ● 11 నెలల్లో 15 మంది మృతి.. 54 మందికి గాయాలు ● ఇటీవల ఏడుగురి దుర్మరణం ● అతివేగం, నిద్రమత్తే కారణం ● ప్రమాదాల నివారణకు చర్యలు శూన్యం ● ఉలవపాడులోని జాతీయ రహదారిపై ఇదీ పరిస్థితిఅటు.. ఇటు మూడు వరుసలు.. వాహనాలు వెళ్లేందుకు వీలుగా తీర్చిదిద్దిన జాతీయ రహదారి ప్రమాదాలకు నిలయంగా మారింది. ఆరు లేన్లుగా ఉన్నా.. ప్రయాణికుల ఆర్తనాదాలు వినిపిస్తూనే ఉన్నాయి. అతివేగం, నిద్రమత్తు తదితర కారణాలతో హైవేపై జరుగుతున్న యాక్సిడెంట్లతో ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. ప్రయాణమంటేనే భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. సింగరాయకొండ నుంచి తెట్టు వరకు ప్రమాదాలు నిత్యకృత్యమవుతున్నాయి. – ఉలవపాడు ఇటీవల జరిగిన ప్రమాదాలు -
బలవంతపు భూసేకరణ దారుణం
మాట్లాడుతున్న అజయ్‌కుమార్ ఉదయగిరి: పరిశ్రమల పేరిట రాష్ట్రంలోని రైతుల నుంచి భూములను బలవంతంగా సేకరించేందుకు ప్రభుత్వం యత్నిస్తుండటం దారుణమని సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు అజయ్‌కుమార్ పేర్కొన్నారు. స్థానిక పుచ్చలపల్లి సుందరయ్య భవన్లో కార్యకర్తలతో సమావేశాన్ని గురువారం నిర్వహించిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో రైతులు, ప్రజల పొట్టగొట్టడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని ఆరోపించారు. కరేడులో ఇండోసోల్ కంపెనీకి ఎనిమిది వేల ఎకరాలను కట్టబెట్టేందుకు యత్నించడం సిగ్గుచేటని విమర్శించారు. తమ భూములను ఇవ్వబోమంటూ నెల రోజులుగా రైతులు, ప్రజలు పోరాటాలు చేస్తున్నా, ప్రభుత్వంలో కనీస స్పందన లేకపోవడం దారుణమన్నారు. లింగసముద్రం మండలం మాలకొండ ఆలయం చుట్టూ ఉన్న నాలుగు గ్రామాల పరిసర భూముల్లో 19 చదరపు కిలోమీటర్ల మేర ఇనుప ఖనిజం ఉందని, వీటిని జిందాల్ కంపెనీకి కట్టబెట్టేందుకు యత్నిస్తోందని ఆరోపించారు. వరికుంటపాడు పంచాయతీ జంగంరెడ్డిపల్లె తిప్పపై ఇచ్చిన మైనింగ్ అనుమతులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని అన్ని సంఘాలతో కలిసి చలో కరేడు కార్యక్రమాన్ని ఈ నెల 18న నిర్వహించనున్నామని వెల్లడించారు. సీపీఎం నేతలు కాకు వెంకటయ్య, కోడె రమణయ్య, ఫరిద్దీన్బాషా, వెంకటేశ్వర్లు, కామాక్షమ్మ తదితరులు పాల్గొన్నారు. -
స్వాతంత్య్ర వేడుకలకు ముస్తాబు
పరేడ్ గ్రౌండ్లో చేసిన ఏర్పాట్లుకవాతు నిర్వహిస్తున్న పోలీసు సిబ్బంది గౌరవ వందనం స్వీకరిస్తున్న ఎస్పీ కృష్ణకాంత్ నెల్లూరు(క్రైమ్): స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు నెల్లూరు నగరంలోని పోలీసు కవాతు మైదానం సిద్ధమైంది. పోలీస్ వందనం స్వీకరణ, శకటాల ప్రదర్శన, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. గురువారం ఎస్పీ జి.కృష్ణకాంత్ సన్నాహక ఏర్పాట్లను పరిశీలించారు. కవాతు రిహార్సల్స్‌ను పరిశీలించారు. భద్రతా పరంగా తీసుకోవాల్సిన చర్యలపై సిబ్బందికి సూచనలిచ్చారు. శుక్రవారం జెండా వందనానికి విచ్చేసే ముఖ్యఅతిథులకు గౌరవార్థం ఇచ్చే వందన సమర్పణ విషయంలో అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, విద్యార్థులు, ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలన్నారు. ప్రతి ఒక్కరిని డీఎంఎఫ్డీ ద్వారా తనిఖీ చేయాలన్నారు. ట్రాఫిక్‌కు ఎలాంటి అంతరాయం కలగకుండా చూడాలన్నారు. ఏఎస్పీ సీహెచ్ సౌజన్య, ఎస్బీ, ఏఆర్ డీఎస్పీలు ఎ.శ్రీనివాసరావు, ఎస్.చంద్రమోహన్, ఆర్ఐలు అంకమరావు, రాజారావు, హరిబాబు, పౌల్‌రాజు, శ్రీనివాసులురెడ్డి, ఎస్బీ ఇన్స్పెక్టర్ డి.వెంకటేశ్వరరావు, ఆర్ఎస్సైలు తదితరులు పాల్గొన్నారు. -
విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో ఇల్లు దగ్ధం
● రూ.8 లక్షల ఆస్తి నష్టం ● లబోదిబోమంటున్న బాధితులు కొడవలూరు: విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో రేకుల ఇల్లు దగ్ధమవడంతో ఓ కుటుంబం సర్వం కోల్పోయింది. ఈ ఘటన మండలంలోని గండవరం పూలతోట గాడికయ్యల్లో గురువారం జరిగింది. స్థానికుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన గోళ్ల ప్రసాద్, లక్ష్మి దంపతులు కూలీ పనులకు వెళ్తుంటారు. రోజూలాగే గురువారం ఉదయం పనికెళ్లారు. వారింట్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరిగింది. వస్తువులు పూర్తిగా తగులబడే వరకూ చుట్టుపక్కల వారు గుర్తించలేకపోయారు. కొంతసేపటి తర్వాత వాసన రావడం, కిటికీలో నుంచి పొగ వస్తుండటంతో గుర్తించి బాధితులకు సమాచారం అందించారు. వారు ఇంటికి చేరుకోగా అప్పటికే బీరువా, రిఫ్రిజిరేటర్, మంచం, ఇతర సామగ్రి పూర్తిగా కాలిపోయింది. పనికెళ్లి పొదుపు చేసి బీరువాలో దాచిన రూ.3 లక్షల నగదు, రూ.3 లక్షల విలువైన బంగారు నగలు, రూ.2 లక్షల విలువైన సామగ్రి తగులబడిపోవడంతో బాధితులు లబోదిబోమంటున్నారు. గ్రామానికి చెందిన రాష్ట్ర పౌరసరఫరాల శాఖ డైరెక్టర్ వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి వారిని పరామర్శించి రూ.10 వేల ఆర్థిక సాయం అందించారు. -
18న చలో కరేడు
నెల్లూరు(వీఆర్సీసెంటర్): రైతు సంఘాల ఆధ్వర్యంలో ఈనెల 18వ తేదీన తలపెట్టిన చలో కరేడు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి మూలం రమేష్ పిలుపునిచ్చారు. నెల్లూరులోని బాలాజీనగర్‌లో ఉన్న ఆ పార్టీ జిల్లా కార్యాలయంలో గురువారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. భూములు ఇచ్చేది లేదని గ్రామసభలో రైతులు తే ల్చిచెప్పారన్నారు. అయితే ఎమ్మెల్యే, కలెక్టర్ గ్రామ రైతుల మధ్య చీలిక తెచ్చి భూములను స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. చలో కరేడు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలిన కోరారు. అనంతరం పోస్టర్ విడుదల చేశారు. సమావేశంలో నాయకులు రాంబాబు, చండ్ర రాజగోపాల్, దామా అంకయ్య, షాన్వాజ్, మాదాల వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు. ఎర్రచందనం కేసులో ఒకరికి ఏడాది జైలుతిరుపతి లీగల్: ఎర్రచందనం దుంగలను అక్రమంగా తరలిస్తున్న కేసులో శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా రాపూరు మండలం పంగిలి గ్రామానికి చెందిన కె.నరసింహులుకు ఏడాది జైలు శిక్ష, రూ.10 వేల జరిమానా విధిస్తూ తిరుపతి రాష్ట్ర ఎర్రచందనం కేసుల విచారణ జూనియర్ సివిల్ జడ్జి ఎస్.శ్రీకాంత్ గురువారం తీర్పు చెప్పారు. కోర్టు లైజనింగ్ ఆఫీసర్లు బాబు ప్రసాద్, రఘు, ఫారెస్ట్ అధికారి చక్రపాణి తెలిపిన వివరాల మేరకు.. 2014 మార్చి 5వ తేదీ నెల్లూరు డివిజన్, రాపూర్ ఫ్లైయింగ్ స్క్వాడ్ ఫారెస్ట్ సిబ్బంది సైదురాజులపల్లి రోడ్డు వద్ద వాహనాలను తనిఖీ చేశారు. ఆ సమయంలో గూడ్స్ క్యారియర్ వాహనం ఫారెస్ట్ సిబ్బందిని చూసి వారికి దూరంగా ఆగింది. ఆ వాహనంలోని ముగ్గురు పరారయ్యారు. అయితే వారిలో నిందితుడు నరసింహులును మాత్రం ఫారెస్ట్ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. 436 కిలోల 17 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. నరసింహులును విచారించగా మరో ఇద్దరి పేర్లను తెలిపాడు. దీంతో ఫారెస్ట్ సిబ్బంది వారిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరిచారు. నేరం నరసింహులుపై మాత్రం రుజువు కావడంతో న్యాయమూర్తి అతడికి శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు. మరో ఇద్దరిపై కేసును కొట్టేస్తూ తీర్పులో పేర్కొన్నారు. ప్రాసిక్యూషన్ తరఫున ఏపీసీ నిర్మల వాదించారు. నెల్లూరు జైలుకు తరలింపు నెల్లూరు(అర్బన్): కోర్టు శిక్ష విధించిన నరసింహులును నెల్లూరు జైలుకు తరలిస్తున్నట్లు ఫారెస్ట్ రాపూరు రేంజర్ రవీంద్ర తెలిపారు. ఎర్రచందనాన్ని అక్రమంగా తరలించినా, రవాణాకు సహకరించినా కేసులు తప్పవని ఆయన హెచ్చరించారు. -
అధికారులు అప్రమత్తంగా ఉండాలి
మైనింగ్‌తో నాకెలాంటి సంబంధం లేదు నెల్లూరు రూరల్: భారీ వర్షాలు కురుస్తాయనే హెచ్చరికల నేపథ్యంలో అన్ని శాఖల అధికారుల అప్రమత్తంగా ఉండాలని జేసీ కార్తీక్ ఆదేశించారు. కలెక్టరేట్లోని శంకరన్ సమావేశ మందిరంలో డిజాస్టర్ మేనేజ్మెంట్ కమిటీతో గురువారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు అధికారులు సిద్ధంగా ఉండాలని సూచించారు. ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా 1077, 79955 76699, 0861 – 2331261 కంట్రోల్ రూమ్ నంబర్లు, డివిజన్, మండల కేంద్రాల్లోని కాల్ సెంటర్లు, స్థానిక సచివాలయాలను సంప్రదించాలని కోరారు. డీఆర్వో హుస్సేన్న్సాహెబ్, జెడ్పీ సీఈఓ మోహన్‌రావు, మత్స్యశాఖ జేడీ శాంతి, విద్యుత్ శాఖ ఎస్ఈ విజయన్, ఇరిగేషన్, సోమశిల, తెలుగుగంగ ప్రాజెక్ట్ ఎస్ఈలు దేశ్‌నాయక్, వెంకటరమణారెడ్డి, రాధాకృష్ణారెడ్డి, డీపీఓ శ్రీధర్‌రెడ్డి, జిల్లా ఉద్యానాధికారి సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు. పోలీసుల విచారణలో బిరదవోలు వెల్లడి సాక్షిప్రతినిధి, నెల్లూరు: రాజకీయ కక్షతోనే తనపై అక్రమ కేసును కూటమి నేతలు బనాయించారని, మైనింగ్‌తో తనకెలాంటి సంబంధం లేదంటూ పోలీసుల కస్టడీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత బిరదవోలు శ్రీకాంత్‌రెడ్డి వెల్లడించారని సమాచారం. పొదలకూరు మండలం తాటిపర్తి మైనింగ్ కేసులో మూడు రోజుల పోలీస్ కస్టడీ గురువారంతో ముగిసింది. చివరి రోజున డీటీసీలో పోలీస్ అధికారులు ఆయనకు 23 ప్రశ్నలేయగా, లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు. తనది మనుబోలు మండలం మడమనూరు అని.. రాజకీయంగా మాజీ మంత్రులు అనిల్‌కుమార్‌యాదవ్, కాకాణి గోవర్ధన్‌రెడ్డితో పరిచయమని.. తమ ఊరి సమస్యలపై వీరితో మాట్లాడేవాడినని.. రుస్తుం మైన్స్‌తో పాటూ క్వార్ట్జ్ వ్యాపారాలతో ఎలాంటి సంబంధం లేదని.. రాజకీయ కక్షసాధింపు చర్యల్లో భాగంగానే అక్రమ కేసని బిరదవోలు వెల్లడించారని తెలిసింది. -
ఇచ్చేదే అరకొర.. అందులోనూ కోతే
జిల్లా క్రీడాప్రాధికార సంస్థలో పనిచేస్తున్న కోచ్‌లు, నాలుగో తరగతి ఉద్యోగులు ఏడాదిగా జీతాల్లేక అవస్థ పడుతున్నారు. వీరి కష్టాన్ని గుర్తించి ప్రతి నెలా అందజేయాల్సిన ప్రభుత్వం అందుకు భిన్నంగా వ్యవహరిస్తూ ఇబ్బందులకు గురిచేసింది. తాజాగా వీరికి మరో షాక్ ఇచ్చింది. ఏడాదికి సంబంధించిన జీతాల్లో సగాన్నే జమ చేసి గందరగోళానికి గురిచేసింది. అసలు ఇలా ఎందుకు వ్యవహరించారనే అంశంపై ఎవరి వద్దా స్పష్టత లేకపోవడం గమనార్హం. ● డీఎస్ఏ ఉద్యోగులపై ప్రభుత్వం చిన్నచూపు ● ఏడాదిగా జీతాల్లేక ఆర్తనాదాలు ● ఎట్టకేలకు జమచేసినా.. అదీ సగమే ● క్రీడారంగ అభివృద్ధెలా..? నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట): క్రీడాప్రాధికార సంస్థ నిర్వహణ తీరు లోపభూయిష్టంగా మారింది. వాస్తవానికి ఇక్కడ పనిచేసే కాంట్రాక్ట్ కోచ్‌లు, నాలుగో తరగతి ఉద్యోగులకు ఇచ్చే జీతమే స్వల్పం. ఈ మొత్తాన్నీ ఏడాది పాటు నిలిపి వారిని తీవ్ర ఇబ్బందులకు గురిచేశారు. దీనిపై కలెక్టర్ మొదలుకొని ప్రజాప్రతినిధులు, రాష్ట క్రీడా ప్రాధికార సంస్థ అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరిగినా ఎలాంటి ప్రయోజనం లభించలేదు. ఈ అంశమై ‘జీతాల్లేవ్.. క్రీడల్లో శిక్షణ ఇచ్చేదెలా’ అనే శీర్షికన సాక్షిలో జూన్ 29న కథనం ప్రచురితమైంది. దీంతో రాష్ట్ర క్రీడాప్రాధికార సంస్థ అధికారులు రెండు నెలల తర్వాత సమావేశాన్ని ఏర్పాటు చేసి జీతాలిస్తామని ప్రకటించారు. అకౌంట్ చూసి.. నిర్ఘాంతపోయి..! ఎట్టకేలకు వారి బ్యాంక్ ఖాతాల్లో జీతాలు బుధవారం రాత్రి జమయ్యాయి. అయితే సగమే పడటంతో నిర్ఘాంతపోవడం వారి వంతైంది. ఇలా ఎందుకు వ్యవహరించారనే విషయమై రాష్ట్ర, జిల్లా క్రీడాప్రాఽధికార సంస్థ అధికారులు నోరు మెదపడంలేదు. జమైంది ఇలా.. డీఎస్‌ఏలో పనిచేసే కోచ్‌లకు జీతం రూ.21,500 కాగా, జమైంది రూ.12 వేలు. డేటా ఎంట్రీ ఆపరేటర్, ఆకౌంటెంట్లకు రూ.20 వేల జీతం కాగా, వచ్చింది రూ.15 వేలే. ఆఫీస్ సబార్డినేట్, గ్రౌండ్స్ మార్కర్, స్వీపర్, వాచ్మెన్, ఇండోర్ స్టేడియం అటెండర్లు, క్లీనర్లకు రూ.15 వేలు ఇవ్వాల్సి ఉండగా, రూ.ఎనిమిది వేలను అందజేశారు. స్విమ్మింగ్ పూల్ స్వీపర్లు, వాచ్మెన్లు, ఎలక్ట్రీషియన్, వెంకటగిరి, గూడూరు సబ్ సెంటర్ల కేర్ టేకర్లు, ఓజిలి సబ్ సెంటర్ వాచ్‌మెన్‌కు ఇచ్చే జీతం రూ.15 వేలు కాగా, రూ.ఎనిమిది వేలనే జమ చేశారు. అప్పులను ఎలా తీర్చాలో..? వీరికిచ్చే జీతాలు అంతంతమాత్రమే. ఏడాది పాటు వేతనాలను నిలిపి అందులోనూ సగమే జమచేయడంతో ఉద్యోగులు కన్నీటిపర్యంతమయ్యారు. అప్పులను ఎలా తీర్చాలో పాలుపోక వీరు సతమతమవుతున్నారు. ఈ పరిణామాలతో జిల్లాలో క్రీడా రంగం అస్తవ్యస్థంగా మారే ప్రమాదం ఉంది. జీవితాలు బాగుండాలంటే క్రీడల్లో పాల్గొనాలని చెప్పే అధికారులు, ప్రజాప్రతినిధులు వీరిని విస్మరిస్తున్నారు. ఈ ఏడాది క్రీడా పరికరాలు, మైదానాల అభివృద్ధికి ఎలాంటి ఆర్థిక సాయం చేయని కూటమి ప్రభుత్వం ఉద్యోగులనూ విస్మరించి తన మార్కును ప్రదర్శించింది. ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం శాప్ అధికారులకు తెలియజేశాం సగం జీతాలే జమయ్యాయనే అంశాన్ని రాష్ట్ర క్రీడాప్రాధికార సంస్థ అధికారులకు తెలియజేశాం. పూర్తిగా జీతాలొచ్చేందుకు అధికారులతో కలిసి యత్నిస్తాం. – యతిరాజ్, డీఎస్డీఓ -
భలే కేటుగాళ్లు
తిరుపతి క్రైమ్: సెల్ఫోన్లు చోరీ చేసి అందులోని బ్యాంక్ ఖాతా నగదు హాంఫట్ చేస్తున్న కేటుగాళ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. గురువారం తిరుపతి డీఎస్పీ భక్తవత్సలం ఈస్ట్ పోలీస్ స్టేషన్లో విలేకరులకు వివరాలు వెల్లడించారు. హైదరాబాద్‌కు చెందిన హరికృష్ణ, అన్నమయ్య జిల్లాకు చెందిన అశోక్, నెల్లూరు జిల్లాకు చెందిన గడ్డం కాసిరెడ్డి ముఠాగా ఏర్పడి నగరంలో సెల్ఫోన్ల చోరీకి పాల్పడేవారు. వాటిలో ఫోన్ పే, గూగుల్ పేను పరిశీలించి అందులో నగదును సరికొత్త ఎత్తుగడలతో కొట్టేసేశారు. ఏటీఎం సెంటర్ వద్ద కాపు కాసి, అక్కడ వచ్చే వారికి తమ వారు హాస్పిటల్లో ఉన్నారని, డబ్బులు చాలా అవసరమని ఫోన్ పే చేస్తామని, కావాలంటే కమీషన్ కూడా ఇస్తామని నమ్మిస్తారు. ఇలా చెప్పి వీరంతా రూ.3.6 లక్షలు కాజేసినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. హరికృష్ణ నుంచి రూ.లక్ష, 40 సెల్ఫోన్లు, అశోక్ నుంచి రూ.90 వేలు, 6 ఫోన్లు, కసిరెడ్డి నుంచి రూ.90 వేలు, మూడు ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసు ఛేదనలో ప్రతిభ చూపిన ఈస్ట్ సీఐ శ్రీనివాసులు, ఎస్సై హేమాద్రి, సిబ్బందిని డీఎస్పీ అభినందించారు. సెల్ఫోన్లు చోరీ చేసి బ్యాంక్ ఖాతాల్లో నగదు హాంఫట్ ముగ్గురి అరెస్ట్ నిందితులు హైదరాబాద్, అన్నమయ్య జిల్లా, నెల్లూరు వాసులు -
డివిజన్లు విద్యుత్ సర్వీసులు స్మార్ట్ మీటర్లు
● ఇప్పటికే పలు ప్రభుత్వ, వాణిజ్య సంస్థల్లో మీటర్ల ఏర్పాటు ● మాకొద్దు మహాప్రభో అంటున్నా పట్టించుకోని సర్కార్ ● పూటపూటకూ మారనున్న టారిఫ్‌తో ప్రజల బెంబేలు ● రీచార్జి చేస్తేనే ఇంట్లో కరెంట్ నెల్లూరు (వీఆర్సీసెంటర్): సీఎం చంద్రబాబు మార్కు మోసాల్లో తాజాగా మరొకటి చేరింది. స్మా ర్ట్ మీటర్లను బిగించబోమంటూ గతంలో కల్లబొల్లి కబుర్లు చెప్పిన ఆయన తాజాగా వీటి ఏర్పాటు దిశగా అడుగులేస్తున్నారు. ఈ పరిణామం ప్రజలను కలవరపాటుకు గురిచేస్తోంది. అసలీ స్మార్ట్ మీటర్ల గోల ఏమిటానని వారు ఆందోళనకు గురవుతున్నారు. గుడ్లు తేలేస్తున్నారు.. కూటమి ప్రభుత్వం కొలువుదీరిన నాటి నుంచి స్మార్ట్ మీటర్ల ఏర్పాటు దిశగా అడుగులేస్తోంది. ఇందులో భాగంగా జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాలు, వాణిజ్య సంస్థల్లో వీటిని ఏర్పాటు చేశారు. తదనంతరం 200 యూనిట్లు వాడే ప్రతి గృహంలోనూ బిగించే దిశగా చర్యలు చేపడుతున్నారు. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో నెలకొల్పారు. పాత మీటర్ల స్థానంలో వీటిని ఏర్పాటు చేశాక, విద్యుత్ బిల్లులు అధికంగా వస్తున్నాయి. దీనిపై వినియోగదారులతో పాటు వామపక్ష పార్టీల నేతలు వ్యతిరేకిస్తున్నారు. సబ్స్టేషన్ల వద్ద ధర్నాలనూ చేపడుతున్నారు. నాలుగింతలు అధికంగా.. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో విద్యుత్ సర్వీసులు 9,64,379 ఉండగా, ఇందులో వ్యవసాయ సర్వీసులు 1,46,185. ప్రస్తుతానికి వీటిని మాత్రం స్మార్ట్ మీటర్ల నుంచి మినహాయించారు. నగరంలోని ఓ పిండిమిల్లు యజమానికి గతంలో నెలకు రూ.ఆరు బిల్లొచ్చేది. అయితే స్మార్ట్ మీటర్‌ను ఏర్పాటు చేశాక, ఏకంగా రూ.26 వేలొచ్చింది. మరో దుకాణ యజమానికి నెలకు రూ.మూడు వేల బిల్లు వస్తుండగా, ఆపై ఇది రూ.ఐదు వేలకు పెరిగింది. టారిఫ్ తంటాలు ఈ విధానంతో టారిఫ్ సైతం మారనుంది. గతంలో పాత మీటర్లు ఉన్న సమయంలో రోజంతా ఒకే టారిఫ్‌తో నెల బిల్లొచ్చేది. అయితే వినియోగించే యూనిట్లు అధికమయ్యే కొద్దీ ఇది మారుతూ ఉండేది. 0 – 30 యూనిట్ల వరకు ఒక టారిఫ్.. 31 – 75.. 76 – 125.. 126 – 225.. 226 – 400.. 400 –500 యూనిట్ల వరకు ఉండేది. అయితే స్మార్ట్ మీటర్ల ఏర్పాటుతో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఒకలా.. మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు మరోలా.. సాయంత్రం నుంచి తెల్లవారు వరకు మరో టారిఫ్‌లో బిల్లులొచ్చే ప్రమాదం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది. మరోవైపు ఈ మీటర్ ధర రూ.20 వేలకుపైగా ఉంటుంది. ఏర్పాటు సమయంలో ప్రజల నుంచి ఎలాంటి నగదును కట్టించుకోకుండా, మీటర్ ధర మొత్తాన్ని బిల్లులో కలుపుతారేమోననే అనుమానం తలెత్తుతోంది. ఇక అంతా ప్రీపెయిడే.. వాస్తవానికి గతంలో నెలంతా వాడుకున్న యూనిట్లకు లెక్క కట్టి రీడింగ్ తీసి బిల్లులిచ్చేవారు. దీన్ని 15 రోజుల్లో చెల్లించే వెసులుబాటు ఉండేది. అయితే ఇక నుంచి ఈ అవకాశం ఉండదు. మొబైల్ ఫోన్లలో ప్రీపెయిడ్ తరహాలో ఇక ముందే రీచార్జి చేసుకోవాలి. ఒకవేళ ఇది పూర్తయితే విద్యుత్ సరఫరా నిలిచిపోయే ప్రమాదమూ ఉంది. ఇది సామాన్యులను తీవ్ర ఇబ్బందులకు గురిచేయడమేనని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. మోత మోగుతున్న విద్యుత్ బిల్లులు ‘విద్యుత్ స్మార్ట్ మీటర్లకు తాము వ్యతిరేకం.. వీటిని ఏర్పాటు చేస్తే పగలగొట్టండి’ అంటూ గతంలో టీడీపీ నేతలు సృష్టించిన హడావుడి అంతా ఇంతా కాదు. తాము అధికారంలోకి వస్తే ఈ ప్రక్రియను ఉపసంహరిస్తామంటూ ఎన్నికల సమయంలో హామీలనూ గుప్పించారు. తీరా కొలువుదీరాక, వీటిని బిగించే ప్రక్రియను ముమ్మరం చేయడం ప్రజలను విస్మయానికి గురిచేస్తోంది. జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాలు, వాణిజ్య సంస్థలకు వీటిని ఏర్పాటు చేశారు. ఆపై గృహాల్లోనూ బిగించేందుకు ఉపక్రమించడంపై ప్రజలు మండిపడుతున్నారు. -
అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్ నియామకం
నెల్లూరు (లీగల్): నెల్లూరు బార్ అసోసియేషన్ సభ్యుడు, న్యాయవాది అన్వర్‌బాషాను నెల్లూరు ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టు అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్‌గా నియమిస్తూ ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వం బుధవారం జారీ చేసింది. ప్రభుత్వం తరఫున సివిల్ కేసులను వాదించనున్నారు. పదవిలో మూడేళ్ల పాటు కొనసాగనున్నారు. కిలో పొగాకు గరిష్ట ధర రూ.280 కలిగిరి: కలిగిరిలోని పొగాకు వేలం కేంద్రంలో కిలో పొగాకుకు గరిష్ట ధర రూ.280 బుధవారం లభించింది. జనరల్ క్లస్టర్‌కు చెందిన రైతులు 379 బేళ్లను తీసుకురాగా, 200 బేళ్లను కొనుగోలు చేయగా, వివిధ కారణాలతో 179ను తిరస్కరించారు. కిలో పొగాకుకు గరిష్ట ధర రూ.280.. కనిష్ట ధర రూ.140.. సరాసరిగా రూ.197.69 లభించిందని వేలం నిర్వహణాధికారి శివకుమార్ వివరించారు. 19 కంపెనీలు పాల్గొన్నాయన్నారు. డీసీపల్లిలో 125 బేళ్ల విక్రయం మర్రిపాడు: మండలంలోని డీసీపల్లి పొగాకు బోర్డు వేలం కేంద్రంలో 125 బేళ్లను బుధవారం విక్రయించామని నిర్వహణాధికారి రాజశేఖర్ తెలిపారు. వేలానికి 263 బేళ్లు రాగా, వీటిలో 125ను విక్రయించగా, మిగిలిన వాటిని వివిధ కారణాలతో తిరస్కరించామని చెప్పారు. 14287.1 కిలోల పొగాకును విక్రయించగా, రూ.31,67,732.60 వ్యాపారం జరిగిందన్నారు. గరిష్ట ధర కిలో రూ.280.. కనిష్ట ధర రూ.140.. సగటు ధర రూ.221.72గా నమోదైందని వివరించారు. వేలానికి పది కంపెనీలకు చెందిన ప్రతినిధులు హాజరయ్యారని పేర్కొన్నారు. మైనింగ్ అనుమతులపై ఆందోళన వరికుంటపాడు: వరికుంటపాడు పంచాయతీలోని జంగంరెడ్డిపల్లి భాస్కరాపురం కొండ తిప్పను మైనింగ్ కోసం ప్రైవేట్ కంపెనీకి కట్టబెట్టడాన్ని రైతు కూలీ, అఖిల భారత కార్మిక సంఘాల సమాఖ్య నేతలు ఖండించారు. వరికుంటపాడు, జంగంరెడ్డిపల్లిలో ప్రజాభిప్రాయ సేకరణను బుధవారం నిర్వహించారు. తిప్పను మైనింగ్‌కు ఇస్తే నివాస ప్రాంతం ప్రమాదంలో పడుతుందని.. మేకలు, పశువులు తిరగలేకపోతాయని.. పేలుళ్లకు ఇళ్లు దెబ్బతినడంతో పాటు పంటలు నాశనమవుతాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఏఐఎఫ్టీయూ నేత లక్ష్మీరెడ్డి మాట్లాడారు. అభివృద్ధి పేరుతో గ్రామాలను నాశనం చేయడాన్ని మానుకోవాలని, మైనింగ్ అనుమతులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రైతు కూలీ సంఘ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రమణయ్య తదితరులు పాల్గొన్నారు. ● రాష్ట్ర పర్యావరణ ప్రభావ అంచనా సంస్థ చైర్మన్ ప్రసాద్‌ను వరికుంటపాడు పంచాయతీ మేధావుల ఫోరం ప్రతినిధులు విజయవాడలో కలిసి అర్జీని అందజేశారు. అనుమతులను తక్షణమే నిలిపేయాలని కోరారు. రైతులకు విరివిగా రుణాల మంజూరు ఉదయగిరి: ఉదయగిరిలోని వివిధ బ్యాంకులు రైతులకు విరివిగా రుణాలను మంజూరు చేయాలని లీడ్ బ్యాంక్ మేనేజర్ మణిశేఖర్ పేర్కొన్నారు. స్థానిక సీ్త్ర శక్తి భవనంలో బ్యాంకర్లతో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. బ్యాంకర్లు వారికి కేటాయించిన లక్ష్యాలను నిర్దేశించిన గడువులోపు నూరు శాతం సాధించాలని సూచించారు. డెయిరీ ఫామ్‌ను ప్రోత్సహించేందుకు ఎక్కువ సంఖ్యలో రుణాలివ్వాలన్నారు. రికవరీ శాతాన్ని పెంచాలని పేర్కొన్నారు. జన సురక్ష పథకంపై అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలన్నారు. బ్యాంకర్లు ఇతర శాఖల అధికారులు తన దృష్టికి తెచ్చిన సమస్యలను పరిష్కరిస్తానన్నారు. ఖాతాదారుల నుంచి ఫిర్యాదులు రాకుండా చూసుకోవాలని కోరారు. మెరుగైన సేవలందించాలని సూచించారు. ఖాతాదారులతో స్నేహపూర్వకంగా మెలగాలని పేర్కొన్నారు. స్వయం సహాయక సంఘాల సభ్యులు తీసుకున్న రుణాలను సద్వినియోగం చేసుకుని ఆర్థిక పరిపుష్టి సాధించేలా అధికారులు చూడాలని కోరారు. సమావేశంలో అధికారులు కాశయ్య, రవిశంకర్ జయదేవ్, ఎంపీడీఓలు అప్పాజీ, గోపి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
ఏంటిది అధ్యక్షా..
బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు మాధవ్ బుధవారం నెల్లూరుకు విచ్చేశారు. ఆ పార్టీ సమావేశం కస్తూర్బా కళాక్షేత్రంలో జరిగింది. ఈ సందర్భంగా వీఆర్సీ నుంచి కస్తూర్బా వరకు ర్యాలీ నిర్వహించారు. దీంతో ఆయా ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ సమస్య ఏర్పడింది. నేతలు, కార్యకర్తల అత్యుత్సాహం వల్ల ఓ ప్రైవేట్ అంబులెన్స్ చిక్కుకుపోయింది. అలాగే వీఆర్సీ వద్ద నడిరోడ్డుపై బాణసంచా కాల్చడంతో అటుగా వెళ్లే వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, నెల్లూరు ట్రాఫిక్‌లో చిక్కుకున్న అంబులెన్స్ -
చీకటి జీఓలు రద్దు చేయాలంటూ..
నెల్లూరు(టౌన్): ప్రభుత్వ విద్యాసంస్థల్లోకి విద్యార్థి సంఘాల నాయకులు రాకుండా రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన చీకటి జీఓలను రద్దు చేయాలని పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షుడు సునీల్ డిమాండ్ చేశారు. బుధవారం వీఆర్సీ సెంటర్లో జీఓలను రద్దు చేయాలంటూ పత్రాలను దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యారంగ సమస్యలపై ఏడాదిగా విద్యార్థి సంఘాల నాయకులు ఉద్యమాలు చేస్తున్నా కూటమి ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. జీఓను వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు షారూఖ్, ఆశిర్, ఖాదర్ మస్తాన్, నవీన్, చరణ్, వంశీ పాల్గొన్నారు. -
మహాసభల జయప్రదానికి పిలుపు
నెల్లూరు(వీఆర్సీసెంటర్): నెల్లూరు నగరంలో ఈనెల 17 నుంచి 19వ తేదీ వరకు జరిగే సీపీఐ జిల్లా మహాసభలు, 20 నుంచి 25వ తేదీ వరకు ఒంగోలులో నిర్వహించే రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి దామా అంకయ్య పిలుపునిచ్చారు. నగరంలోని పార్టీ కార్యాలయంలో బుధవారం మాట్లాడారు. కోటమిట్ట షాదీమంజిల్‌లో జిల్లా సభలు జరుగుతాయన్నారు. పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు సిరాజ్, మధు, షాన్వాజ్, మహిళా సంఘం నాయకురాలు శిరీషా, సుబ్బరాయుడు తదితరులు పాల్గొన్నారు. డివైడర్‌ను ఢీకొట్టి కారు బోల్తానెల్లూరు సిటీ: రూరల్ పరిధిలోని ధనలక్ష్మీపురం వద్ద డివైడర్‌ను ఢీకొట్టి కారు బోల్తాపడి ఘటన బుధవారం జరిగింది. స్థానికుల కథనం మేరకు.. కారు ముత్తుకూరు వైపు వేగంగా వెళ్తోంది. డ్రైవర్ దానిని అదుపు చేయలేకపోవడంతో డివైడర్‌ను ఢీకొట్టి బోల్తా పడింది. వాహనంలోని నలుగురు వ్యక్తులకు స్వల్పగాయాలయ్యాయి. స్థానికులు వారిని ప్రైవేట్ హాస్పిటల్‌కు తరలించారు. కారు బోల్తా పడిన సమయంలో ఎదురు నుంచి వాహనాలు రాకపోవడంతో త్రుటిలో ప్రమాదం తప్పింది. ఈ ఘటనపై రూరల్ పోలీసులకు ఫిర్యాదు అందలేదు. చుండి మోడల్ స్కూల్ ఎంపికవలేటివారిపాలెం: ఉత్తమ పాఠశాలగా మండలంలోని చుండి మోడల్ స్కూల్ ఎంపికై నట్లు ప్రిన్సిపల్ పడమటి వెంకటేశ్వరరావు బుధవారం తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా పది పాఠశాలలను ఎంపిక చేయగా అందులో చుండి స్కూల్ ఉందన్నారు. యాజమాన్యాల వారీగా పదో తరగతిలో వంద శాతం ఉత్తీర్ణత, అత్యధిక సరాసరి మార్కులు సాధించిన స్కూళ్లను ఎంపిక చేసినట్లు వెల్లడించారు. ఈనెల 15వ తేదీన విజయవాడలో జరిగే స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో సీఎం అవార్డు ప్రదానం చేస్తారన్నారు.కండలేరులో 26.8 టీఎంసీలురాపూరు: కండలేరు జలాశయంలో బుధవారం నాటికి 26.8 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు గజేంద్రరెడ్డి తెలిపారు. సోమశిల జలాశయం నుంచి కండలేరుకు 5,900 క్యూసెక్కుల నీరు చేరుతోందన్నారు. కండలేరు నుంచి సత్యసాయి గంగ కాలువకు 1,800, పిన్నేరు కాలువకు 20, లోలెవల్ కాలువకు 40, మొదటి బ్రాంచ్ కాలువకు 80 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. -
సర్వేపల్లి కాలువలో మృతదేహం
నెల్లూరు(క్రైమ్): నెల్లూరు ఆత్మకూరు బస్టాండ్ (పీఎస్ఆర్ బస్టాండ్) సమీప సర్వేపల్లి కాలువలో బుధవారం గుర్తుతెలియని ఓ వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు గుర్తించి నవాబుపేట పోలీసులకు సమాచారం అందించారు. వారు ఘటనా స్థలానికి చేరుకుని స్థానికుల సహాయంతో మృతదేహాన్ని కాలువలో నుంచి బయటకు తీశారు. మృతుడి వయసు సుమారు 30 నుంచి 35 ఏళ్లలోపు ఉండొచ్చని భావిస్తున్నారు. ఎరుపు రంగు హాఫ్‌హ్యాండ్స్ టీషర్ట్, బ్లాక్ లోయర్ ధరించి ఉన్నాడు. మృతదేహం ఉబ్చి దుర్ఘంధం వెదజల్లుతోంది. దీంతో చనిపోయి రెండు రోజులై ఉండొచ్చని తెలుస్తోంది. మృతదేహాన్ని జీజీహెచ్ మార్చురీకి తరలించి నవాబుపేట పోలీసులు కేసు నమోదు చేశారు. మృతుడు ప్రమాదవశాత్తు నీటిలో పడ్డాడా?, ఆత్మహత్య చేసుకున్నాడా?, ఇతర కారణం ఉందా? అనేది పోస్టుమార్టంలో తెలియాల్సి ఉంది. మృతుడి వివరాలు తెలిసిన వారు 94407 96306 ఫోన్ నంబర్‌కు తెలియజేయాలని నవాబుపేట ఇన్స్పెక్టర్ జి.వేణుగోపాల్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు.