ఇంత దుష్ప్రచారమా..? | - | Sakshi
Sakshi News home page

ఇంత దుష్ప్రచారమా..?

Feb 1 2026 3:06 AM | Updated on Feb 1 2026 3:06 AM

ఇంత దుష్ప్రచారమా..?

ఇంత దుష్ప్రచారమా..?

బుచ్చిరెడ్డిపాళెం రూరల్‌: తిరుమల లడ్డూ కల్తీ విషయంలో సీబీఐ క్లీన్‌చిట్‌ ఇచ్చినా, తమ పార్టీపై సీఎం చంద్రబాబు బురదజల్లడం అన్యాయమని మాజీ మంత్రి, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ పీఏసీ సభ్యుడు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి ధ్వజమెత్తారు. పట్టణంలోని రామకృష్ణనగర్‌లో కొలువైన వెంకటేశ్వరాలయంలో పూజలను శనివారం నిర్వహించిన అనంతరం ఆయన మాట్లాడారు. తమ ప్రభుత్వ హయాంలో తిరుమల లడ్డూ తయారీలో కల్తీ జరిగిందంటూ టీడీపీ నిరాధారమైన ఆరోపణలు చేసిందని మండిపడ్డారు. తిరుమల వెంకన్నతో పెట్టుకుంటే ఆయనే తగిన బుద్ధి చెప్తారని, ఇందులో ఎలాంటి సందేహం లేదన్నారు. ఇప్పటికై నా సీఎం చంద్రబాబు దుష్ప్రచారాలు మానకపోతే వెంకటేశ్వరస్వామి ఆగ్రహానికి గురికాక తప్పదని స్పష్టం చేశారు. పార్టీ పార్లమెంట్‌ ని యోజకవర్గ పరిశీలకుడు వెంకటరెడ్డి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి చలపతిరావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement