నెల్లూరు రూరల్: నగరంలోని గాంధీనగర్‌లో గల ఆరెస్సెన్ కల్యాణ మండపంలో మహిళా సదస్సును వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత ఆధ్వర్యంలో శనివారం మధ్యాహ్నం మూడు గంటలకు నిర్వహించనున్నారు. ముఖ్యఅతిథులుగా జెడ్పీ చైర్‌పర్సన్ ఆనం అరుణమ్మ, పార్టీ మహిళా విభాగ రాష్ట్ర అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి హాజరుకానున్నారు. జిల్లాలోని మహిళలందరూ పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని పూజిత కోరారు.
పది పరీక్షలు ముగిశాయి
నెల్లూరు (టౌన్): పదో తరగతి పరీక్షలు గురువారంతో ముగిశాయి. చివరి రోజు నిర్వహించిన ఇంగ్లిష్ పరీక్షకు 27,992 మందికి గానూ 27,748 మంది హాజరయ్యారు. పరీక్షలు ముగియడంతో విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు.


