ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు | - | Sakshi
Sakshi News home page

ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు

Apr 3 2026 7:44 AM | Updated on Apr 3 2026 7:44 AM

నెల్లూరురూరల్‌: ప్రశ్నించే వారిపై కూటమి ప్రభు త్వం అక్రమ కేసులు పెడుతూ ఇబ్బందులకు గురిచేస్తోందని వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి, కందుకూరు నియోజకవర్గ ఇన్‌చార్జి బుర్రా మధుసూదన్‌ యాదవ్‌ అన్నా రు. అక్రమ కేసులో అరెస్ట్‌ అయ్యి నెల్లూరు సెంట్రల్‌ జైల్లో ఉన్న రాష్ట్ర కార్యదర్శి, జిల్లా సెంట్రల్‌ బ్యాంక్‌ మాజీ చైర్మన్‌ కామిరెడ్డి సత్యనారాయణరెడ్డితో గురువారం వారు, నేతలు ములాఖత్‌ అయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజా సమస్యలను వెలుగులోకి తెస్తున్న నాయకులపై కేసులు పెట్టడం దారుణమన్నారు. కేసులతో భయపెట్టే ప్రయత్నాలు చేసినా వెనక్కి తగ్గేది లేదని, న్యాయం కోసం పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement