నెల్లూరు(లీగల్): జూనియర్ సివిల్ జడ్జిలుగా నెల్లూరుకు చెందిన ఇద్దరు యువ మహిళా న్యాయవాదులు ఎంపికయ్యారు. ఈమేరకు రాష్ట్ర హైకోర్టు ఫలితాలు విడుదల చేసింది. నెల్లూరు వాసి పెళ్లకూరు చెంచుకృష్ణ ప్రియాంక దేవి, దామరమడుగు దివ్యశ్రీ ఎంపికయ్యారు. ప్రియాంకదేవి సీనియర్ న్యాయవాది పీసీ కృష్ణయ్య చిన్న కుమార్తె. దివ్య సీనియర్ న్యాయవాది శ్రీనివాసమూర్తి వద్ద జూనియర్‌గా పనిచేస్తున్నారు. తండ్రి నేవీ ఉద్యోగి. వీరి ఎంపికపై నెల్లూరు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పులిమి అయ్యప్పరెడ్డి, వైఎస్సార్‌సీపీ లీగల్ సెల్ నాయకుడు రోజా రెడ్డి, ఐక్యవేదిక నాయకుడు కుడుముల రవికుమార్ తదితరులు గురువారం హర్షం వ్యక్తం చేశారు.


