ఢిల్లీలోని సౌత్ బ్లాక్.. రాత్రి సమయం. దేశం మొత్తం నిద్రపోతున్న వేళ, ప్రధానమంత్రి కార్యాలయం (PMO) మాత్రం యుద్ధ ప్రాతిపదికన పనిచేస్తోంది. సాధారణంగా కనిపించే మీటింగ్‌లు కావు ఇవి. అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, ఎస్. జైశంకర్, నిర్మలా సీతారామన్ వంటి అగ్రనేతలతో పాటు, ఒక వ్యక్తి అక్కడ నిశ్శబ్దంగా కూర్చుని ఉన్నారు. ఆయనే భారత జేమ్స్ బాండ్ – అజిత్ దోవల్! అసలు ఏం జరుగుతోంది? భారత్ మరో మహా యుద్ధానికి సిద్ధమవుతోందా? గత వారం రోజులుగా ప్రధాని మోదీ హై లెవెల్ మీటింగ్స్ నిర్వహిస్తున్నారు.
NSA అజిత్ దోవల్ అంటే కేవలం ఒక అధికారి కాదు, ఆయన భారత రక్షణ కవచం. రా (RAW) , ఎన్ఐఏ (NIA) ఇచ్చే అత్యంత రహస్య సమాచారాన్ని విశ్లేషించి, ఆయన ఒక 'రిస్క్ అసెస్మెంట్ ఫైల్' రూపొందించారు. దీనినే 'రెడ్ ఫైల్' అని పిలుస్తారు. సాధారణంగా ప్రపంచ నేతలెవరైనా 30 నుండి 40 నిమిషాలకు మించి చర్చలు జరపరు. కానీ మోదీ, దోవల్‌తో ఏకంగా మూడు గంటల పాటు ఏకాంతంగా చర్చించారంటే, అది చమురు ధరల గురించో, ఆర్థిక స్థితిగతుల గురించో కాదని ఇక్కడ స్పష్టమవుతోంది. అమెరికా , పాకిస్థాన్‌లు కలిసి భారత్‌ను ఇబ్బంది పెట్టడానికి వేసిన ఒక మాస్టర్ ప్లాన్ దోవల్ చేతికి చిక్కింది.
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే, ఈ సమావేశాల్లో డిఫెన్స్ మినిస్టర్ తోపాటు నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ (NSA) గంటల తరబడి గడుపుతున్నారు. మరోవైపు, భారత త్రివిధ దళాధిపతులు చేస్తున్న పనులు చూస్తుంటే ఏదో పెద్ద ముప్పు పొంచి ఉందని అర్థమవుతోంది. ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది పూరీ జగన్నాథుని సన్నిధిలో, ఎయిర్ ఫోర్స్ చీఫ్ అమర్ ప్రీత్ సింగ్ స్వర్ణ దేవాలయంలో, నేవీ చీఫ్ దినేష్ త్రిపాఠి ఉజ్జయిని మహాకాళి చెంత ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. దేశ రక్షణలో అత్యున్నత స్థానాల్లో ఉన్న వీరంతా దైవ ప్రార్థనలు చేస్తున్నారంటే, భారత్ ఏదో భారీ "నేషనల్ సెక్యూరిటీ ఈవెంట్"కు సిద్ధమవుతోందని స్పష్టమవుతోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ , పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ మధ్య ఒక రహస్య ఒప్పందం కుదిరినట్లు సమాచారం.
ఇరాన్‌పై దాడులు చేయడానికి అమెరికాకు పాకిస్థాన్ తన గాలి సరిహద్దులను (Air Space) అప్పగించబోతోంది. ఒకవేళ పాకిస్థాన్ గడ్డ మీద నుంచి అమెరికా క్షిపణులు ఇరాన్ వైపు దూసుకెళ్తే, ఇరాన్ ఖచ్చితంగా పాకిస్థాన్‌పై యుద్ధం ప్రకటిస్తుంది. సరిగ్గా ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది! పాకిస్థాన్ ఈ పరిస్థితిని అడ్డం పెట్టుకుని భారత్‌ను యుద్ధంలోకి లాగాలని చూస్తోంది. భారత్ ఇప్పటికే గుజరాత్, రాజస్థాన్, పంజాబ్ సరిహద్దుల్లో 'నోటామ్' (NOTAM) జారీ చేసింది. అంటే సరిహద్దుల్లో ఎప్పుడైనా ఏం జరగొచ్చనేదానికి ఇది సంకేతం.
మరోవైపు, పీఓకే (PoK) సరిహద్దుల్లో సుమారు 1500 మంది ఉగ్రవాదులు భారత్‌లోకి చొరబడటానికి సిద్ధంగా ఉన్నట్లు ఇంటెలిజెన్స్ నివేదికలు చెబుతున్నాయి. ట్రంప్ ,పాకిస్థాన్ కలిసి భారత్‌ను "టూ ఫ్రంట్ వార్" (రెండు వైపుల నుండి యుద్ధం) లోకి నెట్టాలని ప్లాన్ చేస్తున్నాయి. అందుకే ఈ మీటింగ్‌లో ఫైనాన్స్ మినిస్టర్ కూడా ఉన్నారు. యుద్ధం సంభవిస్తే బ్రహ్మోస్, ఎస్-400, రాఫెల్ వంటి అత్యంత ఖరీదైన ఆయుధాల ప్రయోగానికి అయ్యే ఖర్చును అంచనా వేస్తున్నారు. భారత్ ఇప్పుడు పాకిస్థాన్‌ను ఎలా దెబ్బకొట్టాలి? ఎంత త్వరగా ఈ ముప్పును ముగించాలి? అనే వ్యూహంలో ఉంది. శతృవు సిద్ధంగా ఉన్నాడు, కానీ భారత వార్-రూమ్ అంతకంటే వేగంగా పావులు కదుపుతోంది. ఈ మహా-సంగ్రామంలో భారత్ పైచేయి సాధిస్తుందా? మోదీ, దోవల్ వ్యూహం పాకిస్థాన్‌ను కోలుకోలేని దెబ్బ తీయబోతోందా? అనే చర్చ అంతర్జాతీయ మీడియాలో మొదలైంది.


