లీటర్‌ పెట్రోల్‌.. 914 కిలోమీటర్ల మైలేజీ.. | A super-mileage car designed by Brigham Young University students | Sakshi
Sakshi News home page

లీటర్‌ పెట్రోల్‌.. 914 కిలోమీటర్ల మైలేజీ..

Jun 14 2026 8:54 AM | Updated on Jun 14 2026 12:06 PM

A super-mileage car designed by Brigham Young University students

కారుకు పేరు ‘సూపర్‌ మైలేజ్‌’

బ్రిగ్‌హామ్‌ యంగ్‌ యూనివర్సిటీ

అసలే చమురు ధరలు మండిపోతున్నాయి. కారు రోడ్డు మీదకు వస్తే 15–20 కిలోమీటర్ల దూరానికే లీటరు చమురు ఆవిరైపోతుంది. ఎలక్ట్రిక్‌ వాహనాలు అందుబాటులోకి వచ్చినా, వాటితో ఇబ్బందులు ఉండనే ఉంటున్నాయి.

ఇలాంటి పరిస్థితుల్లో అతి తక్కువ చమురుతోనే సుదూరాలకు పరుగు తీయగల కారును అమెరికాలోని ఉటా రాష్ట్రానికి చెందిన బ్రిగ్‌హామ్‌ యంగ్‌ యూనివర్సిటీ విద్యార్థులు రూపొందించారు. ఈ కారు లీటరు పెట్రోలుకు ఏకంగా 914 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుంది. మామూలు కార్లతో పోల్చుకుంటే, దీని బరువు కూడా చాలా తక్కువ. ఈ సూపర్‌ మైలేజీ కారు బరువు కేవలం 49 కిలోలు మాత్రమే! ఈ కారుకు దాని పనితీరుకు తగినట్లే ‘సూపర్‌ మైలేజ్‌’ అని పేరు పెట్టారు. అయితే, దీనిని రేసు ట్రాక్‌లపై పరుగులు తీయించడానికి ప్రయోగాత్మకంగా తయారు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement