Cricket
-
బీసీసీఐ విషయంలో కీలక తీర్పు.. ఇకపై..
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)కి భారీ ఊరట లభించింది. సమాచార హక్కు చట్టం (RTIA) పరిధి నుంచి బోర్డును తొలగిస్తూ కేంద్ర సమాచార కమిషన్ (CIC) తీర్పు వెలువరించింది. బీసీసీఐ ‘పబ్లిక్ అథారిటీ’ కాదని స్పష్టం చేసింది.గతంలో అలా..కాగా 2018లో సమాచార కమిషనర్‌గా ఉన్న ఎం. శ్రీధర్ ఆచార్యులు.. ఆర్టీఐ చట్టంలోని సెక్షన్ 2(h)ను అనుసరించి బీసీసీఐని పబ్లిక్ అథారిటీగా డిక్లేర్ చేశారు. బోర్డులో పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్లను నియమించాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో బీసీసీఐ మద్రాస్ హైకోర్డును ఆశ్రయించగా.. CIC వద్దకు చేరింది.ప్రభుత్వ నియంత్రణలో లేదుగీతా రాణి అనే వ్యక్తి గతంలో బీసీసీఐ విషయంలో వేసిన పిటిషన్‌ను తాజాగా కొట్టివేస్తూ.. ‘‘చట్టపరమైన తీర్పులు గానీ.. శాసనాల ద్వారా రాతపూర్వకంగా జరిగిన చట్టంగా మారినట్లుగా గానీ.. బీసీసీఐ ప్రత్యక్షంగా లేదంటే పరోక్షంగా ప్రభుత్వానికి చెందినట్లుగా లేదంటే ప్రభుత్వ నియంత్రణలో ఉన్నట్లుగా ఎలాంటి ఆధారాలు లేవు. అదే విధంగా ప్రభుత్వం నుంచి ఎలాంటి నిధులు కూడా పొందడం లేదు’’ అని CIC తన తీర్పులో పేర్కొంది.ప్రభుత్వ ఫండింగ్‌గా భావించకూడదుబీసీసీఐ ఆర్థికంగా స్వతంత్ర వ్యవస్థ అని.. మీడియా హక్కులు, స్పాన్సర్షిపులు, ఐపీఎల్ ఒప్పందాలు, టికెట్ల అమ్మకాలు.. తదితరాల నుంచి ఆదాయం పొందుతోందని CIC ఈ సందర్భంగా మరోసారి గుర్తు చేసింది. అయితే, ఇందుకు సంబంధించిన పన్ను ప్రయోజనాలు పొందుతోంది కాబట్టి.. దీనిని ప్రభుత్వ ఫండింగ్‌గా భావించడం ఎంతమాత్రం సరికాదని స్పష్టం చేసింది.అదే విధంగా.. క్రికెట్ పరిపాలనా అంశాలకు సంబంధించి అంతా పారదర్శకంగా ఉండాలని మాత్రమే సుప్రీంకోర్టు ఆదేశించిందని CIC పేర్కొంది. అంతేతప్ప.. ఆర్టీఐ చట్టం కింద బీసీసీఐని ఎన్నడూ పబ్లిక్ అథారిటీగా ప్రకటించలేదని స్పష్టం చేసింది. ప్రైవేటు సంస్థగాకాగా తమిళనాడు సొసైటీస్ రిజిస్ట్రేషన్ యాక్ట్ కింద ప్రైవేటు సంస్థగా బీసీసీఐ నమోదైంది. పార్లమెంట్ ద్వారా చేయబడిన చట్టం లేదంటే రాజ్యంగబద్ధంగా బోర్డు రూపొందలేదు. కాగా ప్రపంచంలోనే అత్యంత సంపన్న క్రికెట్ బోర్డుగా బీసీసీఐ వెలుగొందుతున్న సంగతి తెలిసిందే.చదవండి: ఐపీఎల్ ఎక్కువైందా?.. ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ ఫైర్ -
‘సత్తా చాటినా.. టీమిండియాకు అతడి ఎంపిక కష్టమే’
ఐపీఎల్-2026 ముగిసిన వారం వ్యవధిలోపే టీమిండియా అంతర్జాతీయ క్రికెట్ బరిలో దిగనుంది. స్వదేశంలో అఫ్గనిస్తాన్‌తో ఒక టెస్టు, మూడు వన్డేలు ఆడేందుకు షెడ్యూల్ ఖరారైంది. ఈ నేపథ్యంలో భారత జట్టు ఎంపిక ఎలా ఉండబోతుందన్న అంశం ఆసక్తికరంగా మారింది.బుమ్రాకు విశ్రాంతిప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు విశ్రాంతినివ్వడం ఖాయంగానే కనిపిస్తోంది. ఇక సొంతగడ్డపై స్పిన్నర్ల ప్రభావమే ఎక్కువ కాబట్టి.. రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్‌లకు బౌలింగ్ విభాగంలో చోటు ఖాయం.ఇక బుమ్రా లేకపోయినా మహ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణ పేస్ దళంలో ఉండనే ఉన్నారు. అయితే, అఫ్గన్ బలహీన జట్టు కాబట్టి ఈసారి ప్రయోగాలు చేయాలని టీమిండియా యాజమాన్యం భావిస్తున్నట్లు వినికిడి.ఆకిబ్ నబీ ఎంపికపై చర్చఈ నేపథ్యంలో గత ఏడాది రంజీల్లో అత్యధిక వికెట్లతో సత్తా చాటిన జమ్మూ కశ్మీర్ ఎక్స్‌ప్రెస్ ఆకిబ్ నబీ ఎంపికపై చర్చ నడుస్తోంది. అతడిని తప్పక ఈ సిరీస్‌కు ఎంపిక చేస్తారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, తాజాగా ఓ జర్నలిస్టు సోషల్ మీడియా వేదికగా నబీ అరంగేట్రం ఇప్పట్లో కష్టమనే సంకేతాలు ఇచ్చారు.పేస్ లేదు‘‘అఫ్గనిస్తాన్‌తో టెస్టుకు రిషబ్ పంత్ వైస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు. ఆకిబ్ నబీ 60 వికెట్లు తీసినా.. అతడి బౌలింగ్‌లో పెద్దగా పేస్ లేదనే చర్చ జరిగింది. అతడు అందరినీ ఆకట్టుకోలేకపోయాడు.ఒకవేళ అతడికి పదిహేను మంది సభ్యుల టెస్టు జట్టులో చోటు దక్కినా.. ఇప్పట్లో అరంగేట్రం చేయడం కష్టమే. అంతేకాదు ఈసారి కూడా అతడిని ఎంపిక చేసే అవకాశాలు చాలా తక్కువ’’ అని కుశన్ సర్కార్ అనే జర్నలిస్టు ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ప్రిన్స్ యాదవ్‌కు అవకాశం!ఇదిలా ఉంటే.. అఫ్గనిస్తాన్ వన్డే సిరీస్‌కు మాత్రం బీసీసీఐ కొత్త ఆటగాళ్లను ఎంపిక చేసే అవకాశం లేకపోలేదు. దేశీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో 17 వికెట్లు పడగొట్టడంతో పాటు ప్రస్తుత ఐపీఎల్లో కూడా చెలరేగుతున్న ప్రిన్స్ యాదవ్ పేరు తెరమీదకు వచ్చింది.హర్షిత్ రాణా ఇంకా ఫిట్నెస్ సాధించకపోవడంతో ప్రిన్స్‌ను ఎంపిక చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. కాగా మే 31న ఫైనల్‌తో ఐపీఎల్ తాజా సీజన్ ముగియనున్న సంగతి తెలిసిందే.భారత్ వర్సెస్ అఫ్గనిస్తాన్ సిరీస్‌ల షెడ్యూల్👉ఏకైక టెస్టు: జూన్ 6 నుంచి ఆరంభం, న్యూ చండీగఢ్👉తొలి వన్డే: జూన్ 14, ధర్మశాల👉రెండో వన్డే: జూన్ 17, లక్నో👉మూడో వన్డే: జూన్ 20, చెన్నై.చదవండి: రిటైర్మెంట్పై స్పష్టమైన సంకేతాన్నిచ్చిన ధోని -
చరిత్ర సృష్టించిన కేఎల్ రాహుల్
ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ ఆటగాడు కేఎల్ రాహుల్ ఎవరికీ సాధ్యం కాని ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. నిన్న (మే 17) రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మ్యాచ్ విన్నింగ్ హాఫ్ సెంచరీ (56) చేసిన అతడు.. ఈ ఐపీఎల్ ఎడిషన్‌లో 500 పరుగుల మార్కును (533) దాటాడు.తద్వారా ఐపీఎల్ చరిత్రలో వరుసగా మూడు లేదా అంతకంటే ఎక్కువ ఎడిషన్లలో 500 ప్లస్ పరుగుల ఫీట్‌ను రెండు సార్లు నమోదు చేసిన మొదటి ప్లేయర్‌గా రికార్డు నెలకొల్పాడు. తొలిసారి 2018 ఎడిషన్‌లో 500 పరుగుల మార్కును తాకిన రాహుల్.. ఆతర్వాత వరుసగా 2019 (593), 2020 (670), 2021 (626), 2022 (616) ఎడిషన్లలో ఈ ఫీట్‌ను నమోదు చేశాడు.మధ్యలో 2023 ఎడిషన్‌లో గ్యాప్ ఇచ్చి తిరిగి 2024 (520), 2025 (539), 2026 (533) ఎడిషన్లలో ఈ ఘనత సాధించాడు. ఐపీఎల్ చరిత్రలో ఇలాంటి ఫీట్ ఎవరూ నమోదు చేయలేదు. 19 ఎడిషన్ల చరిత్రలో రాహుల్ తొలి ఆటగాడిగా నిలిచాడు. మొత్తంగా రాహుల్ ఐపీఎల్లో ఎనిమిదో సారి 500 ప్లస్ మార్కును తాకి విరాట్ కోహ్లి (9) తర్వాతి స్థానంలో నిలిచాడు.ఇదే మ్యాచ్‌లో రాహుల్ మరో ఘనత కూడా సాధించాడు. ఐపీఎల్లో తన 50వ ఫిఫ్టీ ప్లస్ స్కోర్‌ను నమోదు చేశాడు. తద్వారా విరాట్ కోహ్లి (76), డేవిడ్ వార్నర్ (66), శిఖర్ ధవన్ (53), రోహిత్ శర్మ (51) తర్వాత ఈ ఘనత సాధించిన ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. ప్రతి సీజన్‌లాగే ఈ సీజన్లోనూ భీకర ఫామ్‌లో ఉన్న రాహుల్.. ఇప్పటికే ఒక సెంచరీ, నాలుగు హాఫ్ సెంచరీలు నమోదు చేసి, ఆరెంజ్ క్యాప్ కోసం ప్రధాన పోటీదారుగా నిలిచాడు.మ్యాచ్ విషయానికి వస్తే.. రాజస్థాన్ రాయల్స్ నిర్దేశించిన 194 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీ క్యాపిటల్స్ ఐదు వికెట్లు కోల్పోయి ఛేదించింది. రాహుల్.. అభిషేక్ పోరెల్‌తో కలిసి తొలి వికెట్‌కు 105 పరుగుల భాగస్వామ్యం నమోదు చేసి ఢిల్లీని గెలిపించాడు. ఈ గెలుపుతో ఢిల్లీ ప్లే ఆఫ్స్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. -
ఒంటరిగా డగౌట్లో రిక్కీ పాంటింగ్.. ఫొటో వైరల్
ఐపీఎల్-2026 టోర్నీ ఆరంభంలో వరుస విజయాలతో అదరగొట్టిన పంజాబ్ కింగ్స్ ఆ తర్వాత డీలా పడింది. డిఫెండింగ్ చాంపియన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)తో ఆదివారం నాటి మ్యాచ్‌లో ఓటమి పాలై.. వరుసగా ఆరో పరాజయం నమోదు చేసింది. తద్వారా ‘ప్లే ఆఫ్స్’ అవకాశాలను మరింత సంక్లిష్టం చేసుకుంది. ఇక పంజాబ్ టాప్-4 చేరాలంటే మిగిలి ఉన్న ఒక్క మ్యాచ్‌లో తప్పక గెలవడంతో పాటు ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడి ఉంటుంది.‘ప్లే ఆఫ్స్’లో ఆర్సీబీమరోవైపు.. ధర్మశాలలో పంజాబ్‌తో మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన బెంగళూరు ఐపీఎల్ 19వ సీజన్లో ‘ప్లే ఆఫ్స్’కు దూసుకెళ్లింది. ఇరు జట్లకు ఎంతో కీలకమైన ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 222 పరుగులు చేసింది.‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ వెంకటేశ్ అయ్యర్ (40 బంతుల్లో 73 నాటౌట్; 8 ఫోర్లు, 4 సిక్స్‌లు), విరాట్ కోహ్లి (37 బంతుల్లో 58; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధశతకాలతో ఆకట్టుకున్నారు. దేవదత్ పడిక్కల్ (25 బంతుల్లో 45; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు), టిమ్ డేవిడ్ (12 బంతుల్లో 28; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) విలువైన పరుగులు చేశారు.పంజాబ్ ఆరో‘సారీ’అనంతరం లక్ష్యఛేదనకు దిగిన శ్రేయస్ అయ్యర్ బృందం నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 199 పరుగులకే పరిమితమైంది. తొలి ఏడు మ్యాచ్‌ల్లో ఆరింట గెలిచి అంచనాలు పెంచిన పంజాబ్‌కిది వరుసగా ఆరో ఓటమి కావడం గమనార్హం.శశాంక్ సింగ్ (27 బంతుల్లో 56; 4 ఫోర్లు, 4 సిక్స్‌లు) మెరుపు అర్ధశతకం సాధించగా... కూపర్ కనోలి (22 బంతుల్లో 37; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు), స్టొయినిస్ (25 బంతుల్లో 37; 5 ఫోర్లు), సూర్యాంశ్ షెడ్గే (22 బంతుల్లో 35; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) కాస్త పోరాడారు. ఓపెనర్లు ప్రియాన్ష్ ఆర్య (0), ప్రభ్‌సిమ్రన్ సింగ్ (2)తో పాటు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (1) విఫలమవడంతో పంజాబ్‌కు పరాజయం తప్పలేదు. భువనేశ్వర్ 2 వికెట్లు పడగొట్టగా... రసిఖ్ సలామ్‌కు మూడు వికెట్లు దక్కాయి. ఫొటో వైరల్ఇక ఈ ఓటమితో పంజాబ్ కింగ్స్ హెడ్‌కోచ్ రిక్కీ పాంటింగ్ తీవ్ర నిరాశలో కూరుకుపోయినట్లు కనిపించింది. ఒంటరిగా.. డగౌట్లో ముందు కుర్చీపై తలవాల్చి ఉన్న పాంటింగ్ ఫొటో వైరల్‌గా మారింది. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ కీలక వ్యాఖ్యలు చేశాడు.అశూ ఏమన్నాడంటే...‘‘ఈరోజు టీవీలో ఓ శక్తిమంతమైన ఫొటో చూశాను. రిక్కీ పాంటింగ్ డగౌట్లో ఒక్కడే కూర్చుని కుర్చీ మీద ఒరిగిపోయాడు. తన మనసులో ఆందోళన చెలరేగుతూ ఉంటుంది. ఆరంభంలో వాళ్లు టేబుల్ టాపర్‌గా ఉన్నారు. కానీ ఆ తర్వాత సీన్ మొత్తంగా మారిపోయింది. అసలు తప్పు ఎక్కడ జరిగింది? సొంతమైదానం ముల్లన్‌పూర్‌లో వరుసగా మ్యాచ్‌లు గెలిచిన పంజాబ్.. సెకండ్ హోం గ్రౌండ్ ధర్మశాలలో మాత్రం వరుసగా మూడు మ్యాచ్‌లు ఓడిపోయింది.చిన్న తప్పిదాల వల్ల కూడా భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది. రిక్కీ పాంటింగ్, శ్రేయస్ అయ్యర్ తీవ్రమైన బాధలో ఉండి ఉంటారు. నాకూ బాధగానే ఉంది. అయినా నిజాన్ని అంగీకరించకతప్పదు’’ అని అశూ పేర్కొన్నాడు. కాగా పంజాబ్ లీగ్ దశలో తమ చివరి మ్యాచ్‌లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్‌తో మే 23న ఏకనా స్టేడియంలో తలపడనుంది. ఇదిలా ఉంటే.. గతేడాది పాంటింగ్ మార్గనిర్దేశనం.. శ్రేయస్ సారథ్యంలో పంజాబ్ ఫైనల్ చేరిన సంగతి తెలిసిందే.చదవండి: రిటైర్మెంట్పై స్పష్టమైన సంకేతాన్నిచ్చిన ధోని -
‘ఫిక్సింగ్ గురించి.. సచిన్, ద్రవిడ్‌లను పదే పదే అడిగాను’
భారత క్రికెట్ సంధి దశలో ఉన్న వేళ కెప్టెన్‌గా పగ్గాలు చేపట్టాడు సౌరవ్ గంగూలీ. సచిన్ టెండుల్కర్, రాహుల్ ద్రవిడ్, అజారుద్దీన్ వంటి సీనియర్లు ఉన్న జట్టుకు నాయకత్వం వహించి.. విజయపథంలో నడిపించాడు. ముఖ్యంగా విదేశీ గడ్డపై సారథిగా సత్తా చాటి తనను తాను నిరూపించుకున్నాడు.అయితే, కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన తొలినాళ్లలో డ్రెసింగ్‌రూమ్‌లో సీనియర్లకు దిశానిర్దేశం చేసే విషయంలో గంగూలీ ఇబ్బందిపడ్డాడు. అదే విధంగా.. తాను సారథిగా వచ్చే ముందు చోటు చేసుకున్న ఫిక్సింగ్, బెట్టింగ్ ఆరోపణల గురించి తీవ్రంగా ఆందోళన చెందాడు. ఈ విషయాల గురించి దాదా తాజాగా గుర్తుచేసుకున్నాడు.మిమ్మల్ని ఎవరైనా సంప్రదించారా?రాజ్ షమానీ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ.. ‘‘నేను కెప్టెన్ అయ్యేకంటే ముందు భారత క్రికెట్ జట్టు చాలా సమస్యల్లో ఉంది. బెట్టింగ్, మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు వచ్చాయి. అసలు అవేంటో కూడా నాకు తెలియదు. నేను తరచూ సచిన్, రాహుల్ ద్రవిడ్ దగ్గరికి వెళ్లి వీటి గురించి అడిగేవాడిని.‘అసలేం జరిగింది? మిమ్మల్ని ఎవరైనా సంప్రదించారా?’ అనే పదే పదే అడిగేవాడిని. ఎందుకంటే నన్నైతే ఎవరూ సంప్రదించలేదు. అందుకే ఇతరుల విషయంలో ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేశాను. సచిన్ దగ్గరికి వెళ్లి.. ‘నిన్ను ఎవరైనా (బుకీలు) అడిగారా’ అని ప్రశ్నించాను.‘నో’ అనే సమాధానమే..అందుకు ‘నో’ అనే సమాధానం వచ్చింది. ద్రవిడ్, అనిల్ కుంబ్లే సైతం ఇదే మాట చెప్పారు. అప్పట్లో మేము టెస్టు, వన్డే ఫార్మాట్ మాత్రమే ఆడేవాళ్లము. కెప్టెన్‌గా నేను అప్పుడప్పుడే (2000) బాధ్యతలు చేపట్టాను. వీటితో పాటు మరో సమస్య కూడా ఉండేది.అప్పుడు భయపడ్డాసారథిగా నేను తొలి మ్యాచ్ కొచ్చిలో ఆడినట్లు గుర్తు. మ్యాచ్ ఆరంభానికి ముందు డ్రెసింగ్‌రూమ్‌లో జట్టును ఉద్దేశించి మాట్లాడాల్సి ఉంది. ఆ సమయంలో నా భార్య డోనాతో- ‘అజర్, సచిన్ కెప్టెన్సీలో ఆడినవాడిని. ఇప్పుడు వాళ్లకు ఏం చేయాలో.. ఏం చేయకూడదో చెప్పాలంటే నాకు కాస్త ఇబ్బందిగా ఉంది’ అని చెప్పేవాడిని.అందుకే ఆరోజు కేవలం 15 నిమిషాల్లోనే ప్రసంగం ముగించేశా. ఎక్కువగా మాట్లాడలేదు. ఆ మ్యాచ్‌లో మేము గెలిచాము. ఆ తర్వాత కెప్టెన్‌గా ఎలా ఉండాలో నాకు అలవాటైంది. అంతా సర్దుకుంది’’ అని గంగూలీ చెప్పుకొచ్చాడు. చదవండి: అప్పటి నుంచి ధోని అస్సలు నచ్చలేదు: గంగూలీ -
అరుదైన ఘనత సాధించిన జైస్వాల్
రాజస్థాన్ రాయల్స్ యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ అరుదైన ఘనత సాధించాడు. టీ20 ఫార్మాట్లో 4000 పరుగులను పూర్తి చేసుకున్నాడు. కేవలం 129 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ మైలురాయిని తాకి.. అత్యంత వేగంగా ఈ ఘనత సాధించిన భారత బ్యాటర్ల జాబితాలో సంయుక్తంగా నాలుగో స్థానంలో నిలిచాడు.ఈ జాబితాలో సీఎస్కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (116 ఇన్నింగ్స్‌లు) అగ్రస్థానంలో ఉండగా.. కేఎల్ రాహుల్ (117), తిలక్ వర్మ (125) ఆతర్వాతి స్థానాల్లో ఉన్నారు. జైస్వాల్‌తో పాటు శుభ్‌మన్ గిల్ కూడా 129 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ మార్క్‌ను అందుకున్నాడు.ఓవరాల్‌గా ఈ రికార్డు విండీస్ విధ్వంసకర వీరుడు క్రిస్ గేల్ పేరిట ఉంది. గేల్ కేవలం 107 ఇన్నింగ్స్‌ల్లోనే 4000 టీ20 పరుగులు పూర్తి చేశాడు. గేల్ తర్వాతి స్థానాల్లో షాన్ మార్ష్ (113), బాబర్ ఆజం (115), డెవాన్ కాన్వే, రుతురాజ్ (116) ఉన్నారు.ఇటీవలే గుజరాత్ యువ ఓపెనర్ సాయి సుదర్శన్ టీ20ల్లో అత్యంత వేగంగా 3000 పరుగులు చేసిన ఆటగాడిగా ప్రపంచ రికార్డు నెలకొల్పగా.. ఇప్పుడు జైస్వాల్ ఈ అరుదైన మైలురాయిని అందుకోవడం భారత యువ బ్యాటర్ల దూకుడుకు నిదర్శనంగా నిలుస్తుంది.ఐపీఎల్ 2026లో భాగంగా నిన్న (మే 17) ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో జైస్వాల్ ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌లో జైస్వాల్ 12 పరుగులకే ఔటైనా ఈ భారీ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ ఢిల్లీ చేతిలో ఓడి ప్లే ఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. మరోపక్క ఢిల్లీ ఈ గెలుపుతో ప్లే ఆఫ్స్ అశలను సజీవంగా ఉంచుకుంది. పంజాబ్‌పై గెలిచి ఆర్సీబీ ఈ సీజన్ తొలి ప్లే ఆఫ్స్ బెర్త్‌ను కన్ఫర్మ్ చేసుకుంది. మిగిలిన మూడు బెర్త్‌ల కోసం ఏడు జట్లు అధికారికంగా రేసులో ఉన్నాయి. లక్నో, ముంబై రేసు నుంచి నిష్క్రమించిన విషయం తెలిసిందే. -
రిటైర్మెంట్పై స్పష్టమైన సంకేతాన్నిచ్చిన ధోని
ఐపీఎల్ 2026 సీజన్ ముగింపు దశకు చేరుకున్న వేళ చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని రిటైర్మెంట్పై మరోసారి చర్చ మొదలైంది. చెన్నైలోని చెపాక్ స్టేడియంలో ఇవాళ (మే 18) సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరగనున్న మ్యాచ్ ఈ సీజన్లో సీఎస్కేకు చివరి హోం మ్యాచ్ కావడంతో అభిమానుల్లో భావోద్వేగ వాతావరణం నెలకొంది. గాయం కారణంగా ఈ సీజన్ ప్రారంభం నుంచి బెంచ్‌కే పరిమితమైన ధోని.. ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగుతాడా..? ఇదే అతని చివరి ఐపీఎల్ మ్యాచ్ అవుతుందా..? అన్న ప్రశ్నలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి.ఈ ప్రచారంపై ధోని తాజాగా చేసిన కొన్ని వ్యాఖ్యలు అభిమానులను తీవ్ర భావోద్వేగానికి గురి చేస్తున్నాయి. ప్రస్తుత కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్‌కు జట్టును తనదైన శైలిలో నడిపించాలని చెప్పినట్లు ధోని స్వయంగా వెల్లడించాడు. "సీఎస్కేను నువ్వు ఎలా నడపాలనుకుంటే అలా నడుపు. కెప్టెన్ నిర్ణయాలే జట్టును ముందుకు తీసుకెళ్తాయి. కోచ్‌లు, సపోర్ట్ స్టాఫ్ ఉన్నా చివరి నిర్ణయం కెప్టెన్‌దే" అంటూ ధోని చేసిన వ్యాఖ్యలు అతని రిటైర్మెంట్పై పూర్తి క్లారిటీ ఇస్తున్నాయి.ధోని ఇవాళ తన చివరి ఐపీఎల్ మ్యాచ్ ఆడనున్నాడని ఫ్యాన్స్ నిర్దారణకు వచ్చేశారు. అయితే ఈ కథలో మరో ట్విస్ట్ కూడా కనిపిస్తోంది. కొన్ని మీడియా కథనాల ప్రకారం, ధోని తాజాగా మరో గాయానికి గురైనట్లు తెలుస్తోంది. ఈ కారణంగా ఎస్ఆర్హెచ్తో ఇవాళ జరిగే మ్యాచ్‌కూ అతను దూరమయ్యే అవకాశం ఉందని సమాచారం. ధోని రిటైర్మెంట్పై ఉత్కంఠ మరి కొద్ది గంటల్లో వీడనుంది.మరోవైపు ప్రస్తుత సీజన్ సీఎస్కే పరిస్థితి కూడా ఆసక్తికరంగానే ఉంది. రుతురాజ్ గైక్వాడ్ నేతృత్వంలో ఆ జట్టు ప్లేఆఫ్స్ రేసులో నిలబడేందుకు ప్రయత్నిస్తోంది. ఇలాంటి సమయంలో ధోని మైదానంలో కనిపిస్తే ఆ జట్టుకు అదనపు ఉత్సాహం లభించే అవకాశం ఉంది. అభిమానులు సైతం "తలా"ను మరోసారి చెపాక్‌లో బ్యాటింగ్ చేస్తూ చూడాలని కోరుకుంటున్నారు. -
ఐపీఎల్ ఎక్కువైందా?.. ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ ఫైర్
ఇంగ్లండ్ స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్ ఐపీఎల్-2026లో అదరగొడుతున్నాడు. రాజస్తాన్ రాయల్స్ తరఫున ఇప్పటికి పన్నెండు మ్యాచ్‌లలో కలిపి 17 వికెట్లు కూల్చాడు. తద్వారా అత్యధిక వికెట్ల వీరుల జాబితాలో టాప్-5లో కొనసాగుతున్నాడు.ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ ఫైర్ఇక ఈ సీజన్ లీగ్ దశలో భాగంగా రాజస్తాన్‌కు ఇంకో రెండు మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. న్యూజిలాండ్‌తో తొలి టెస్టుకు ఆర్చర్‌ను ఎంపిక చేయకపోవడాన్ని తప్పుబట్టాడు.ప్రధాన పేసర్‌ను కీలక టెస్టులో ఆడించకుండా.. ఐపీఎల్లో కొనసాగేందుకు అనుమతించిన ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ECB) బోర్డు తీరును తప్పుబట్టాడు. తానేమీ ఫ్రాంఛైజీ క్రికెట్‌కు వ్యతిరేకం కాదని.. అయితే, అంతర్జాతీయ క్రికెట్‌కే తొలి ప్రాధాన్యం దక్కాలని మైకేల్ వాన్ ఈ సందర్భంగా పేర్కొన్నాడు.ఈసీబీ-బీసీసీఐ ఒప్పందం వల్లక్రిక్బజ్ షోలో మాట్లాడుతూ.. ‘‘న్యూజిలాండ్‌తో రెండో టెస్టుకు ఆర్చర్ తప్పకుండా అందుబాటులోకి వస్తాడని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే జూన్ రెండో వారంలో ఈ మ్యాచ్ ఉండబోతుంది. ఈసీబీ బీసీసీఐతో చేసుకున్న ఒప్పందం ప్రకారం.. ఐపీఎల్ పూర్తయ్యేంత వరకు తమ ప్రధాన ఆటగాళ్లు ఇండియాలో ఉండేందుకు అనుమతినిస్తోంది.సమస్యంతా ఇంగ్లండ్ బోర్డులోనే ఉంది. నిజానికి జోఫ్రా ఆర్చర్ అరుదైన ఫాస్ట్ బౌలర్. అతడి పనిభారాన్ని తగ్గించే క్రమంలో కీలక మ్యాచ్‌లకు సైతం విశ్రాంతినిస్తూ ఈసీబీ కాపాడుకుంటూ వస్తోంది. కానీ ఈ కాంట్రాక్టు వల్ల ఇప్పుడిలా అతడి సేవలు కోల్పోవాల్సి వచ్చింది.నేనే కోచ్ అయి ఉంటే..అంతర్జాతీయ క్రికెట్ కంటే ఫ్రాంఛైజీ క్రికెట్ గొప్పది కాదు. నేనే ఒకవేళ ఇంగ్లండ్ క్రికెటర్ డైరెక్టర్ రాబ్ కీ.. హెడ్‌కోచ్ బ్రెండన్ మెకల్లమ్ అయి ఉంటే.. జట్టులోని అత్యుత్తమ బౌలర్‌ను.. ఐపీఎల్లో కాకుండా.. న్యూజిలాండ్‌తో ప్రఖ్యాత లార్డ్స్ వేదికగా తొలి టెస్టులో ఆడించేవాడిని.అలాగని నేనేమీ ఫ్రాంఛైజీ క్రికెట్‌కు వ్యతిరేకం కాదు. ఇవన్నీ అద్భుతమైన లీగ్‌లు. మా ఆటగాళ్లు ఈ లీగ్‌లో సత్తా చాటడం చూస్తుంటే ఆనందంగా ఉంది. అయితే, టెస్టుల కంటే ఇతర ఫార్మాట్లకు ఎక్కువగా ప్రాధాన్యం ఇవ్వడం భవిష్యత్తులో తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంటుంది.ఆస్ట్రేలియా ఆటగాళ్లు సైతంఒకవేళ ఐపీఎల్లో కీలక ఆటగాళ్లను కొనసాగించాలని అనుకుంటే.. ఈసీబీ తమ టెస్టు సమ్మర్ క్యాలెండర్లో మార్పులు చేయాల్సింది’’ అని మైకేల్ వాన్ అభిప్రాయపడ్డాడు. కాగా ఆస్ట్రేలియా ఆటగాళ్లు సైతం ఐపీఎల్-2026లో కొనసాగుతూ.. బంగ్లాదేశ్, పాకిస్తాన్‌తో పరిమిత ఓవర్ల సిరీస్‌లకు దూరమైన సంగతి తెలిసిందే.ప్యాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, జోష్ హాజిల్‌వుడ్, మార్కస్ స్టొయినిస్ తదితరులకు క్రికెట్ ఆస్ట్రేలియా ఐపీఎల్లో కొనసాగేందుకు అనుమతినిచ్చింది. ఈ నేపథ్యంలో మైకేల్ వాన్ లేవనెత్తిన ప్రశ్న క్రీడా వర్గాల్లో చర్చకు దారితీసింది.ఇది సరైందేనా?తమపై కోట్లు కుమ్మరించిన ఐపీఎల్ ఫ్రాంఛైజీల కోసం విదేశీ ఆటగాళ్లు అంతర్జాతీయ క్రికెట్ విధులకు డుమ్మా కొట్టడం సరైందా? కాదా? అన్న అంశంపై క్రీడా విశ్లేషకులు భిన్న స్వరాలు వినిపిస్తున్నారు. కాగా న్యూజిలాండ్ స్టార్ రచిన్ రవీంద్ర ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌కు సన్నద్ధమయ్యే క్రమంలో కోల్‌కతా నైట్ రైడర్స్‌ను వీడి స్వదేశానికి వెళ్లిపోయాడు. ఇదిలా ఉంటే.. ఆర్చర్‌ను రాజస్తాన్ రూ. 12.5 కోట్లకు అట్టిపెట్టుకున్న సంగతి తెలిసిందే. కాగా ఇంగ్లండ్-న్యూజిలాండ్ మధ్య జూన్ 4 నుంచి తొలి టెస్టు మొదలుకానుంది. ఇక ఐపీఎల్-2026 మే 31న ఫైనల్‌తో ముగియనుంది.చదవండి: మరో టీ20 టోర్నీని ప్లాన్ చేస్తున్న బీసీసీఐ -
మా స్థాయి ఇది కాదు.. రియాన్ పరాగ్ ఆసక్తికర వ్యాఖ్యలు
ఐపీఎల్ 2026లో భాగంగా నిన్న (మే 17) రాత్రి జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్.. ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో ఓడి, ప్లే ఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. ఈ ఓటమి అనంతరం జట్టు ప్రదర్శనపై కెప్టెన్ రియాన్ పరాగ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఈ ఓటమికి అన్ని విభాగాల వైఫల్యాలే కారణమని అంగీకరించాడు. బ్యాటింగ్‌లో 14 ఓవర్ల వరకు మంచి స్థితిలో ఉన్నప్పటికీ, తాను ఔటైన తర్వాత సీన్ మొత్తం రివర్స్ అయ్యిందని అన్నాడు. స్కోరు కనీసం 220-230 మధ్య ఉండాల్సిందని అభిప్రాయపడ్డాడు.బౌలింగ్ పరంగా కూడా జట్టు స్థాయికి తగ్గ ప్రదర్శన ఇవ్వలేదని తెలిపాడు. డోనోవన్ ఫెరియెరాకు బౌలింగ్ ఇవ్వడం జూదం కాదని, ఇద్దరు ఎడమచేతి బ్యాటర్లు ఉండటంతో రిస్క్ తీసుకున్నామని వివరించాడు. అయితే ఆ ప్రణాళిక పని చేయలేదని అంగీకరించాడు. ఫీల్డింగ్‌పై కూడా తీవ్ర అసహనం వ్యక్తం చేసిన పరాగ్, ట్రోఫీ కోసం పోటీ పడాలంటే ఇలాంటి ప్రదర్శనలు అస్సలు సరిపోవని అసంతృప్తి వ్యక్తం చేశాడు.గత నాలుగైదు మ్యాచ్‌లుగా జట్టు తమ అసలు స్థాయిని చూపలేకపోతోందని, ముఖ్యంగా విరామం తర్వాత జట్టులో ఎనర్జీ, నైపుణ్యం తగ్గిపోయాయని అభిప్రాయపడ్డాడు. ఇలాగే ఆడితే టాప్-4 కోసం పోటీ పడే అర్హత కూడా ఉండదని స్పష్టం చేశాడు.ప్లే ఆఫ్స్ అవకాశాలపై స్పందిస్తూ.. అది ఇతర జట్ల ఫలితాలపై చాలా వరకు ఆధారపడి ఉంటుంది. నేను జట్టును నడిపించాలనుకున్న విధానం ఇది కాదు. నా జట్టుతో నేను మాట్లాడే తీరు కూడా ఇది కాదు. అవకాశం లభించింది, కానీ మేము దానిని సద్వినియోగం చేసుకోలేకపోయాము. ఒకవేళ ప్లే ఆఫ్స్‌కు ఆర్హత సాధించలేకపోతే, అది పూర్తిగా మా తప్పే అవుతుంది. మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో మెరుగ్గా ఏమి చేయగలమో పరిశీలించి విజయాలు సాధించాలని ఆశిస్తున్నానని అన్నాడు.కాగా, నిన్నటి మ్యాచ్‌లో రాయల్స్ గెలిచే అవకాశాలు వచ్చినా గెలవలేకపోయింది. తొలుత బ్యాటింగ్ చేసి 8 వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసిన ఆ జట్టు.. ఆతర్వాత లక్ష్యాన్ని కాపాడుకోలేకపోయింది. అనూహ్యంగా బ్యాటింగ్ పతనం, ఫీల్డింగ్ వైఫల్యాలు, రియాన్ పరాగ్ సాహసోపేత నిర్ణయాలు ఆ జట్టు కొంపముంచాయి. ప్లే ఆఫ్స్‌కు చేరాలంటే రాయల్స్ మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో తప్పక గెలవాలి. -
మరో టీ20 టోర్నీని ప్లాన్ చేస్తున్న బీసీసీఐ
భారత క్రికెట్లో యువ ఆటగాళ్ల అభివృద్ధికి కీలకంగా భావించే అండర్-23 టోర్నీలో కీలక మార్పులకు బీసీసీఐ సిద్ధమవుతోంది. ప్రస్తుతం 50 ఓవర్ల ఫార్మాట్లో నిర్వహిస్తున్న అండర్-23 పురుషుల వన్డే టోర్నీని ఇకపై టీ20 ఫార్మాట్‌గా మార్చాలని భారత క్రికెట్ బోర్డు యోచిస్తోంది.యువ ఆటగాళ్లలో టీ20 నైపుణ్యాలను పెంపొందించేందుకు, ఆధునిక క్రికెట్ అవసరాలకు అనుగుణంగా వారిని తీర్చిదిద్దేందుకు బీసీసీఐ ఈ మార్పును పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.బీసీసీఐ వర్గాల సమాచారం మేరకు, ఈ మార్పు వచ్చే దేశీయ సీజన్ నుంచే అమల్లోకి వచ్చే అవకాశముంది. అయితే దీనిపై రాష్ట్ర క్రికెట్ సంఘాలకు ఇంకా అధికారిక సమాచారం అందలేదని తెలుస్తుంది.ప్రస్తుతం 50 ఓవర్ల ఫార్మాట్లో జరిగే అండర్-23 పురుషుల వన్డే టోర్నీ "స్టేట్ ఏ ఛాంపియన్షిప్" పేరిట జరుగుతోంది. ఇతర దేశీయ టోర్నీల మాదిరిగానే ఇందులో కూడా ఎలైట్, ప్లేట్ విభాగాలు ఉన్నాయి. 2025 సీజన్లో ఎలైట్ విభాగంలో తమిళనాడు జట్టు విజేతగా నిలిచింది. ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన ఫైనల్లో ఉత్తరప్రదేశ్‌ను ఓడించి టైటిల్ సొంతం చేసుకుంది.ఇక ప్లేట్ విభాగంలో మేఘాలయా జట్టు ఛాంపియన్‌గా నిలిచింది. మహారాజా యాదవీంద్ర సింగ్ స్టేడియం వేదికగా జరిగిన ఫైనల్లో మిజోరంను ఓడించి ట్రోఫీని అందుకుంది.అండర్-23 స్థాయిలో రెడ్‌బాల్ క్రికెట్‌కు సంబంధించిన మల్టీ డే టోర్నీ సీకే నాయుడు ట్రోఫీ పేరుతో కొనసాగుతోంది. ఈ ఏడాది ఎలైట్ విభాగంలో తమిళనాడు మరోసారి విజేతగా నిలిచి తన ఆధిపత్యాన్ని చాటుకుంది. దిండిగల్‌లో జరిగిన ఫైనల్లో మహారాష్ట్రపై గెలిచి ట్రోఫీని కైవసం చేసుకుంది. -
బాబర్ ఆజం ప్రపంచ రికార్డు
పాకిస్తాన్ స్టార్ బ్యాటర్ బాబర్ ఆజం మరో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. 2020 దశకంలో అంతర్జాతీయ క్రికెట్లో 9000 పరుగులు పూర్తి చేసిన తొలి బ్యాటర్‌గా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. సిల్హెట్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో 68 పరుగులు చేయడంతో ఈ ఘనత సాధించాడు.ఈ దశకంలో (2020 నుంచి) బాబర్ ఇప్పటివరకు 212 మ్యాచ్‌లు ఆడి 231 ఇన్నింగ్స్‌ల్లో 9060 పరుగులు చేశాడు. అతని సగటు 42.53 కాగా, 17 సెంచరీలు, 67 హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు. ఈ జాబితాలో రెండో స్థానంలో ఇంగ్లండ్ స్టార్ జో రూట్ ఉన్నాడు. రూట్ 120 మ్యాచ్‌ల్లో 8305 పరుగులు చేశాడు. రూట్ వన్డేలు, టీ20లు తక్కువగా ఆడటం వల్ల బాబర్ కంటే వెనుకబడ్డాడు.ఈ దశకంలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో పాకిస్తాన్ వికెట్‌కీపర్ మొహమ్మద్ రిజ్వాన్ మూడో స్థానంలో ఉన్నాడు. అతను 7779 పరుగులు చేశాడు. శ్రీలంక ఆటగాళ్లు కుసాల్ మెండిస్, పథుమ్ నిస్సంక వరుసగా నాలుగు, ఐదు స్థానాల్లో నిలిచారు.భారత్ తరఫున తొలి ఐదుగురిలో ఒక్క ఆటగాడు కూడా లేకపోవడం గమనార్హం. విరాట్ కోహ్లి 6771 పరుగులతో ఆరో స్థానంలో ఉండగా, శుభ్‌మన్ గిల్ 6649 పరుగులతో ఎనిమిదో స్థానంలో ఉన్నాడు. రోహిత్ శర్మ 6391 పరుగులతో టాప్-10లో (పదో స్థానం) చోటు దక్కించుకున్నాడు.ఇదిలా ఉంటే, బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్‌లో పాక్ తడబడుతోంది. ఇప్పటికే తొలి టెస్ట్ కోల్పోయిన ఆ జట్టు మరో ఓటమి దిశగా సాగుతోంది. ఈ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించిన బంగ్లాదేశ్.. రెండో ఇన్నింగ్స్‌లో నిలకడగా బ్యాటింగ్ చేస్తుంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆ జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 3 వికెట్ల నష్టానికి 110 పరుగులు చేసి 156 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 278 పరుగులకు ఆలౌట్ కాగా.. పాక్ తొలి ఇన్నింగ్స్‌లో 232 పరుగులకే కుప్పకూలింది. -
ఐపీఎల్‌ను తాకిన ఇళయదళపతి ఫీవర్
గత కొద్ది రోజులుగా పొలిటికల్ సర్కిల్స్‌ను పట్టుకున్న తమిళనాడు సీఎం జోసఫ్ విజయ్ ఫీవర్ ఇప్పుడు ఐపీఎల్‌కూ పాకింది. తాజాగా పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ ఆటగాడు వెంకటేశ్ అయ్యర్ ఇళయదళపతి స్టయిల్లో తన హాఫ్ సెంచరీ సెలబ్రేషన్స్ చేసుకొని వైరలయ్యాడు. ఈ మ్యాచ్‌లో 40 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో అజేయమైన 73 పరుగులు చేసి ఆర్సీబీ విజయంలో కీలకపాత్ర పోషించిన అయ్యర్, ఫిఫ్టీ పూర్తి చేసిన అనంతరం విజయ్ నటించిన Mersal సినిమాలో పాపులర్ పోజ్‌ను అనుకరించాడు. VENKATESH IYER RE-CREATED THALAPATHY VIJAY CELEBRATION 🥶 pic.twitter.com/GcOhrfqQQ2— Johns. (@CricCrazyJohns) May 17, 2026ఇది చూసి విజయ్ అభిమానులు సంబరపడిపోతున్నారు. తమ ఆరాధ్య నటుడు, నాయకుడి క్రేజ్ ఐపీఎల్‌కు కూడా పాకిందని హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయ్యర్ విజయ్ స్టయిల్ సెలబ్రేషన్స్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరలవుతోంది.ఇదిలా ఉంటే, నిన్నటి మ్యాచ్‌లో పంజాబ్‌పై విజయం సాధించడంతో ఆర్సీబీ ప్లే ఆఫ్స్ బెర్త్ ఖరారు చేసుకుంది. ఈ సీజన్లో ఫైనల్-4కు చేరిన తొలి జట్టుగా ఆర్సీబీ నిలిచింది. ధర్మశాల వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ 23 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో ఆ జట్టు కెప్టెన్ రజత్ పాటిదార్ స్థానంలో వెంకటేశ్ అయ్యర్ బరిలోకి దిగాడు. రజత్ గాయపడటంతో అయ్యర్‌కు ఈ అవకాశం వచ్చింది.తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ.. అయ్యర్‌తో పాటు విరాట్ కోహ్లి (58), పడిక్కల్ (45), టిమ్ డేవిడ్ (28) చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 222 పరుగులు చేసింది.అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన పంజాబ్ 8 వికెట్ల నష్టానికి 199 పరుగులకే పరిమితమై ఓటమిపాలైంది. ఈ ఓటమితో ఆ జట్టు ప్లే ఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. ఈ సీజన్ తొలి 7 మ్యాచ్‌ల్లో 6 విజయాలు సాధించిన పంజాబ్.. ఆతర్వాతి 6 మ్యాచ్‌ల్లో ఓటమిపాలై, నిష్క్రమణ అంచుల్లో నిలిచింది.ఈ మ్యాచ్‌లో పంజాబ్ ఆదిలోనే పట్టు కోల్పోయింది. భువనేశ్వర్ కుమార్ ధాటికి 19 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఓ దశలో శశాంక్ సింగ్ (56), స్టోయినిస్ (37) పంజాబ్ శిబిరంలో ఆశలు రేకెత్తించారు. వీరు కూడా ఔట్ కావడంతో పంజాబ్ ఓటమి ఖరారైంది. ఆర్సీబీ బౌలర్లలో రసిక్ సలాం దార్ 3, భువీ 2, హాజిల్‌వుడ్, సుయాశ్ శర్మ, షెపర్డ్ తలో వికెట్ తీశారు. -
ఐపీఎల్ 2026 ప్లే ఆఫ్స్ రేసుపై అనుమానాలు
ఐపీఎల్ 2026 ప్లే ఆఫ్స్ రేసు రసవత్తరంగా సాగుతోంది. భారీ అంచనాలు కలిగిన జట్లు అనూహ్యంగా వెనుకబడ్డాయి. అంతా అయిపోయిందనుకున్న జట్లు ఊహించని విజయాలు సాధిస్తూ ఆశలు సజీవంగా ఉంచుకున్నాయి. ఈ అనూహ్య పరిణామాల నేపథ్యంలో క్రికెట్ అభిమానులు గందరగోళానికి గురవుతున్నారు. తెరవెనుకు ఏదో జరుగుతుందన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ అనుమానాలు రావడానికి పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ ఉదంతాలే కారణం. సీజన్ ప్రారంభంలో 7 మ్యాచ్‌ల్లో 6 విజయాలతో అదరగొట్టిన పంజాబ్ కింగ్స్.. ఆతర్వాతి 6 మ్యాచ్‌ల్లో వరుసగా ఓడటాన్ని ఫ్యాన్స్ అసహజంగా భావిస్తున్నారు. సీజన్‌ను నాలుగు వరుస విజయాలతో ఘనంగా ప్రారంభించి, ఈసారి టైటిల్ పక్కా అనుకున్న రాజస్థాన్ రాయల్స్ జట్టు ప్లే ఆఫ్స్ రేసులో అనూహ్యంగా వెనుకపడిపోవడం అనుమానాలకు బలం చేకూరుస్తుంది.మరోవైపు అంతా అయిపోయిందనుకున్న సీఎస్కే, కేకేఆర్, ఢిల్లీ క్యాపిటల్స్ లాంటి జట్లు అనూహ్యంగా ప్లే ఆఫ్స్ రేసులో నిలబడటం.. ఈ జట్లు ప్లే ఆఫ్స్ బెర్త్ దాదాపుగా ఖరారైందనుకున్న జట్లకు ఊహించని షాకులివ్వడం ఏదో పథకం ప్రకారమే జరుగుతుందన్న సంకేతాన్నిస్తుంది. క్రీడల్లో అంచనాలకు విరుద్దంగా జరగడం సహజమే అయినప్పటికీ, మరీ ఇంతలా డ్రామా జరగడాన్ని ఫ్యాన్స్ అనుమానిస్తున్నారు.వరుస విజయాలతో దూసుకుపోయిన పంజాబ్, రాజస్థాన్ లాంటి జట్లు కీలక దశ వచ్చే సరికి ఒక్క విజయం కోసం ముఖం వాయడమేంటని ముక్కునవేళ్లేసుకుంటున్నారు. ఎంత లయ తప్పినా మరీ ఇంతలా విజయం కోసం కరువు పడటమేంటని చర్చించుకుంటున్నారు. పంజాబ్ వరుసగా డబుల్ హ్యాట్రిక్ పరాజయాలు, రాజస్థాన్ హ్యాట్రిక్ పరాజయాలు మూటగట్టుకొని ప్లే ఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టం చేసుకున్న వైనాన్ని ఆయా ఫ్రాంచైజీల అభిమానులు అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారు.బెట్టింగ్‌ల కోసం ఫ్రాంచైజీలు తమ మనోభావాలతో అడుకుంటున్నాయా అన్న సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. కొందరు ఆటగాళ్ల కదలికలు, వారి ఆటతీరులో అనూహ్య మార్పులను సూచిస్తూ ఏదో జరుగుతుందని నిర్దారించుకుంటున్నారు. WWE తరహాలా ఐపీఎల్ కూడా స్క్రిప్టెడ్‌గా మారిపోయిందా అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ ఈ పరిణామాలు యాధృచ్చికంగా జరిగినా వీటిని నమ్మే పరిస్థితుల్లో అస్సలు లేరు. వరుసగా ఆరు విజయాలు సాధించిన జట్టు.. ఆతర్వాతి 6 మ్యాచ్‌ల్లో ఒక్క విజయం కూడా సాధించలేకపోవడమేంటని ప్రశ్నిస్తున్నారు. మొత్తంగా ఐపీఎల్‌ను ఓ డ్రామాగా డిసైడ్ చేశారు. ఈ సీజన్లో మున్ముందు మరిన్ని సిత్రాలు చూడాల్సి ఉంటుందని ఫిక్స్ అయిపోయారు. నిష్క్రమణ అంచుల్లో ఉన్న ఢిల్లీ, కేకేఆర్ లాంటి జట్లు ప్లే ఆఫ్స్ చేరినా ఆశ్చర్యపోనక్కర్లేదని డిసైడయ్యారు. అంచనాలు తారుమారు చేస్తే చీకటి వ్యాపారం లక్షల కోట్లల్లో జరుగుతుందన్న విషయం అందరికీ తెలిసిందే.కాగా, ఈ సీజన్లో ప్లే ఆఫ్స్ బెర్త్ సాధించిన తొలి జట్టుగా ఆర్సీబీ నిలిచిన విషయం తెలిసిందే. మిగతా 3 బెర్త్‌ల కోసం అధికారికంగా ఏడు జట్లు పోటీపడుతున్నాయి. వీటిలో గుజరాత్, ఎస్ఆర్హెచ్కు అవకాశాలు మెరుగ్గా ఉన్నప్పటికీ.. ప్రస్తుత పరిణామాలు చూస్తే ఏమైనా జరగొచ్చన్న అనుమానాలు కలుగుతున్నాయి. మరో బెర్త్ కోసం పంజాబ్, రాజస్థాన్, సీఎస్కే మధ్య డూ ఆర్ డై ఫైట్ నడుస్తుంది. ఈ జట్లు ఇకపై ఒక్క మ్యాచ్ ఓడినా, ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమిస్తాయి. ఢిల్లీ, కేకేఆర్ సైతం ఏవైనా అద్భుతాలు జరిగితే ప్లే ఆఫ్స్ బెర్త్ దక్కించుకునే అవకాశం ఉంది. మొత్తంగా ఈ సీజన్ ఐపీఎల్ ప్లే ఆఫ్స్ రేసు సినిమా డ్రామాను మించిపోయింది. -
రాజస్తాన్‌పై గ్రాండ్ విక్టరీ.. ఢిల్లీ ప్లే ఆఫ్స్ ఆశలు సజీవం
ఐపీఎల్-2026లో ఢిల్లీ క్యాపిటల్స్ తమ ప్లే ఆఫ్స్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. ఆదివారం అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో ఢిల్లీ విజయం సాధించింది. రాజస్తాన్ విధించిన 194 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీ క్యాపిటల్స్ కేవలం 5 వికెట్లు మాత్రమే కోల్పోయి 19.2 ఓవర్లలో చేధించింది.ఢిల్లీ బ్యాటర్లలో కేఎల్ రాహుల్(56), అభిషేక్ పోరెల్(51) హాఫ్ సెంచరీలతో రాణించగా.. అక్షర్ పటేల్(34), అశుతోష్ శర్మ(18) ఆజేయంగా నిలిచి మ్యాచ్‌ను ఫినిష్ చేశారు. రాజస్తాన్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్, బ్రిజేష్ శర్మ రెండు వికెట్లు పడగొట్టగా.. షనక ఓ వికెట్ సాధించాడు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసింది. ఓ దశలో 200కు పైగా పరుగులు సాధించేలా కన్పించిన రాజస్తాన్.. ఆఖరిలో మాత్రం తడబడింది.రాజస్తాన్ ఇన్నింగ్స్‌లో ధ్రువ్ జురెల్(53), రియాన్ పరాగ్(51) హాఫ్ సెంచరీలతో సత్తాచాటగా.. వైభవ్ సూర్యవంశీ(21 బంతుల్లో 46) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఢిల్లీ బౌలర్లలో మిచెల్ స్టార్క్ నాలుగు వికెట్లు, ఎంగిడీ, మాధవ్ తివారీ తలా రెండు వికెట్లు సాధించారు. ఈ విజయంతో ఢిల్లీ క్యాపిటల్స్ పాయింట్ల పట్టికలో ఏడో స్ధానానికి చేరుకుంది. -
ఆ తప్పిదమే మా కొంపముంచింది: శ్రేయస్ అయ్యర్
ఐపీఎల్-2026లో పంజాబ్ కింగ్స్ ఓటముల పరంపర కొనసాగుతోంది. ఆదివారం ధర్మశాల వేదికగా రాయల్ ఛాలెంజర్ బెంగళూరుతో జరిగిన కీలక మ్యాచ్‌లో 23 పరుగుల తేడాతో పంజాబ్ పరాజయం పాలైంది. 222 భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ 8 వికెట్లు కోల్పోయి నిర్ణీత 199 పరుగులు చేసింది.శశాంక్ సింగ్(56), స్టోయినిష్(37), సూర్యాంశ్ షెడ్గే(35) కాస్త దూకుడుగా ఆడినప్పటికి జట్టును గెలిపించలేకపోయారు. ముఖ్యంగా ప్రియాన్ష్ ఆర్య(0), ప్రభ్సిమ్రాన్ సింగ్(2), శ్రేయస్ అయ్యర్(1) దారుణంగా విఫలమయ్యారు. ఈ ఓటమితో తమ పంజాబ్ కింగ్స్ తమ ప్లే ఆఫ్స్ అవకాశాలను మరింత సంక్లిష్టం చేసుకుంది.ఇక ఈ ఓటమిపై మ్యాచ్ అనంతరం పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ స్పందించాడు. పవర్‌ప్లేలో మూడు వికెట్లు కోల్పోవడం తమ ఓటమిని శాసించిందని అయ్యర్ చెప్పుకొచ్చాడు."ఆర్సీబీకి పవర్‌ప్లేలో అద్భుతమైన ఆరంభం లభించింది. ఆపై పవర్‌ప్లే ముగిసిన తర్వాత కూడా మా బౌలర్లపై ఎదురుదాడికి దిగారు. 222 పరుగులు సాధించడం నిజంగా ప్రశంసనీయమైన ప్రదర్శన. మేం బౌలింగ్‌లో ఆశించిన స్థాయిలో వికెట్లు తీయలేకపోయాం. మేము పవర్‌ప్లేలోనే మ్యాచ్‌ను చేజార్చుకున్నాము. అనంతరం బ్యాటింగ్‌లో కూడా మాకు మంచి ఆరంభం దక్కలేదు. మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డాము. ఈ సీజన్లో మా జట్టులో ఎక్కువ పరుగులు చేసేది ప్రభ్సిమ్రాన్ సింగ్, ప్రియాన్ష్ ఆర్ మాత్రమే. ప్రతి మ్యాచ్‌లో వారు పవర్‌ప్లేలో దూకుడుగా ఆడి ఒక రిథమ్ సెట్ చేసేవారు. కానీ ఈ మ్యాచ్‌లో వారు ఆరంభ ఇవ్వలేకపోయారు. నేను కూడా క్రీజులోకి వచ్చిన వెంటనే ఔటయ్యాను. ఇది నన్ను చాలా నిరాశ కలిగించింది. కానీ మిడిలార్డర్లో శశాంక్ సింగ్, మార్కస్ స్టోయినిస్ అద్భుత ప్రదర్శన కనబర్చారు. మేము ఓవర్‌కు దాదాపు 10 పరుగులు సాధిస్తూ లక్ష్యాన్ని చేధించాలనుకున్నాము. కానీ లక్ష్యాన్ని చేరుకోలేకపోయాము. భువీ, హాజిల్ అద్భుతంగా బౌలింగ్ చేశారు. మా తదుపరి గెలిచేందుకు అన్ని విధాలగా ప్రయత్నిస్తాం. ఫలితాలతో సంబంధం లేకుండా నేను ఎప్పుడూ పాజిటివ్‌గానే ఉంటాను. మ్యాచ్ ఫలితాలు నా వ్యక్తిత్వాన్ని మార్చలేవు. నేను గతం గురించి మరీ ఎక్కువగా ఆలోచించే వ్యక్తిని కాదు. జరగాల్సింది జరిగిపోయింది. రేపు ఉదయం నేను మళ్ళీ కొత్త సూర్యోదయాన్ని చూస్తాను. చీకటి తర్వాత ఎప్పుడూ వెలుగు ఉంటుందని నేను నమ్ముతాను" పోస్ట్ మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో శ్రేయస్ పేర్కొన్నాడు. -
వైభవ్ సూర్యవంశీ సరికొత్త చరిత్ర.. తొలి భారతీయుడిగా
ఐపీఎల్-2026లో అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో రాజస్తాన్ రాయల్స్ వండర్ కిడ్ వైభవ్ సూర్యవంశీ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 15 ఏళ్ల వైభవ్ తనదైన శైలిలో ఢిల్లీ బౌలర్లను ఉతికారేశాడు. ప్రపంచ స్ధాయి బౌలర్ అయిన మిచెల్ స్టార్క్‌ను సైతం సూర్యవంశీ విడిచిపెట్టలేదు.బౌండరీలు బాదుతూ స్టార్క్‌ను ఒత్తిడిలోకి నెట్టాడు. వైభవ్ కేవలం 21 బంతుల్లోనే 5 ఫోర్లు, 3 సిక్స్‌లతో 46 పరుగులు చేశాడు. ఈ క్రమంలో సూర్యవంశీ ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఒకే ఐపీఎల్ సీజన్లో అత్యధిక సిక్సర్లు బాదిన భారతీయ బ్యాటర్‌గా సూర్యవంశీ చరిత్ర సృష్టించాడు.ఈ ఏడాది సీజన్లో వైభవ్ ఇప్పటివరకు 44 సిక్స్‌లు బాదాడు. ఇంతకుముందు ఈ రికార్డు అభిషేక్ శర్మ పేరిట ఉండేది. ఐపీఎల్-2024లో అభిషేక్ 42 సిక్సర్లు బాదాడు. తాజా ఇన్నింగ్స్‌తో అభిషేక్‌ను సూర్యవంశీ దాటేశాడు. ఓవరాల్‌గా ఈ ఫీట్ సాధించిన జాబితాలో క్రిస్ గేల్ (ఒకే సీజన్లో 59 సిక్సర్లు) ఉన్నాడు. రాజస్తాన్ ప్లే ఆఫ్స్‌కు చేరితే గేల్ రికార్డును కూడా సూర్యవంశీ బ్రేక్ చేసే అవకాశముంది. వైభవ్ సూర్యవంశీ ఈ ఏడాది సీజన్లో ఇప్పటివరకు 12 మ్యాచ్‌లు ఆడి 486 పరుగులు చేశాడు.ఒకే ఐపీఎల్ సీజన్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన భారత ప్లేయర్లు వీరే:వైభవ్ సూర్యవంశీ: 44 సిక్సర్లు (2026) అభిషేక్ శర్మ: 42 సిక్సర్లు (2024) శ్రేయస్ అయ్యర్: 39 సిక్సర్లు (2025) విరాట్ కోహ్లి: 38 సిక్సర్లు (2016 & 2024) సూర్యకుమార్ యాదవ్: 38 సిక్సర్లు (2025) -
నిరీక్షణకు తెర.. ఎట్టకేలకు శ్రీకాకుళం కుర్రాడి ఐపీఎల్ అరంగేట్రం
ఐపీఎల్లో అరంగేట్రంలో చేసేందుకు గతేడాది నుంచి ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న శ్రీకాకుళం కుర్రాడు, ఆంధ్ర స్టార్ స్పిన్నర్ త్రిపురాన విజయ్ నిరీక్షణకు ఎట్టకేలకు తెరపడింది. ఐపీఎల్-2026లో భాగంగా అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా రాజస్తాన్ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ తరపున విజయ్ అరంగేట్రం చేశాడు. కాగా ఐపీఎల్-2025 మెగా వేలంలో విజయ్ను రూ.30 లక్షలకు ఢిల్లీ క్యాపిటల్స్ కొనుగొలు చేసింది. కానీ గత సీజన్లో అతడికి ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు దక్కలేదు. బెంచ్‌కే పరిమితమైనా ఏ మాత్రం నిరాశ చెందుకుండా నిత్యం నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తూ కన్పించాడు. ఇప్పుడు ఎట్టకేలకు అతడి కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కింది. స్పీడ్ స్టార్ అకిబ్ నబీ స్ధానంలో విజయ్ను తుది జట్టులోకి ఢిల్లీ తీసుకుంది. విజయ్‌కు రైట్- ఆర్మ్ ఆఫ్‌బ్రేక్‌తో పాటు బ్యాట్‌తో రాణించే సత్తా ఉంది.ఎవరీ విజయ్?24 ఏళ్ల త్రిపురాన విజయ్ శ్రీకాకుళం జిల్లా నుంచి ఐపీఎల్‌కు ఎంపికైన మొదటి క్రికెటర్‌గా ఇప్పటికే గుర్తింపు అందుకున్నాడు. టెక్కలిలోని అయ్యప్పనగర్‌లో నివాసం ఉంటున్న త్రిపురాణ వెంకటకృష్ణరాజు, లావణ్యలు విజయ్ తల్లిదండ్రులు. తండ్రి సమాచారశాఖలో ఉద్యోగిగా పనిచేస్తుండగా తల్లి గృహిణి. ప్రస్తుతం విజయ్ టెక్కలిలోని ఓ డిగ్రీ కళాశాలలో చదువుతున్నాడు. అండర్–19లో ఏసీఏ నార్త్‌జోన్ టోర్నీలో మెరుగైన ప్రదర్శన చేయడంతో ఆంధ్ర సీనియర్ జట్టు నుంచి 2021లో విజయ్‌కు తొలిసారి పిలుపు వచ్చింది. లిస్ట్-ఎ క్రికెట్లో జమ్మూ కాశ్మీర్‌పై అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత ఏడాదికే విజయ్ ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో అడుగుపెట్టాడు. రెడ్ బాల్ క్రికెట్లో విజయ్ ఇప్పటికే తన సత్తాను నిరూపించుకున్నాడు. విజయ్ ఇప్పటివరకు 16 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడి 52 వికెట్లు పడగొట్టాడు. అదేవిధంగా అతడు లిస్ట్-ఎలో 5, టీ20ల్లో 14 వికెట్లు పడగొట్టాడు. ఇప్పుడు ఐపీఎల్ వంటి ప్రతిష్టాత్మక టోర్నీలో తన మార్క్ చూపించేందుకు విజయ్ సిద్దమయ్యాడు.చదవండి: IPL 2026: చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లి.. ఎవరికీ సాధ్యం కాని రికార్డు -
కోహ్లి, అయ్యర్ మెరుపులు.. ప్లే ఆఫ్స్‌కు ఆర్సీబీ
ఐపీఎల్ 2026లో భాగంగా ఇవాళ (మే 17) మధ్యాహ్నం జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌పై ఆర్సీబీ 23 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ గెలుపుతో ఆ జట్టు ప్లే ఆఫ్స్ బెర్త్ ఖరారు చేసుకుంది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ భారీ స్కోర్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 222 పరుగులు చేసింది.విరాట్ కోహ్లి (58), వెంకటేశ్ అయ్యర్ (73 నాటౌట్) మెరుపు అర్ద శతకాలతో చెలరేగారు. పడిక్కల్ (45), టిమ్ డేవిడ్ (28) కూడా బ్యాట్ ఝులిపించారు. జేకబ్ బేతెల్ (11) పేలవ ఫామ్‌ను కొనసాగించాడు. పంజాబ్ బౌలర్లలో హర్‌ప్రీత్ బ్రార్ 2 వికెట్లు తీయగా.. అర్షదీప్ సింగ్, చహల్ చెరో వికెట్ దక్కించుకున్నారు.అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన పంజాబ్ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 199 పరుగులకే పరిమితమై ఓటమిపాలైంది. ఈ ఓటమితో ఆ జట్టు ప్లే ఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. ఈ సీజన్ తొలి 7 మ్యాచ్‌ల్లో 6 విజయాలు సాధించిన పంజాబ్.. ఆతర్వాతి 6 మ్యాచ్‌ల్లో ఓటమిపాలై, నిష్క్రమణ అంచుల్లో నిలిచింది. ఆర్సీబీతో మ్యాచ్‌లో పంజాబ్ ఆదిలోనే పట్టు కోల్పోయింది. భువనేశ్వర్ కుమార్ ధాటికి ఆ జట్టు 19 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆతర్వాత కూపర్ కన్నోల్లీ (37), సూర్యాంశ్ షేడ్గే (35) కాసేపు క్రీజ్‌లో నిలదొక్కుకున్నారు. అయితే షెపర్డ్, సుయాశ్ శర్మ దెబ్బకు వీరిద్దరు ఔటయ్యారు. ఈ దశలో శశాంక్ సింగ్ (56), స్టోయినిస్ (37) పంజాబ్ శిబిరంలో ఆశలు రేకెత్తించారు. వీరు కూడా ఔట్ కావడంతో పంజాబ్ ఓటమి ఖరారైంది. ఆర్సీబీ బౌలర్లలో రసిక్ సలాం దార్ 3, భువీ 2, హాజిల్‌వుడ్, సుయాశ్ శర్మ, షెపర్డ్ తలో వికెట్ తీశారు. పంజాబ్ బ్యాటర్లలో ప్రియాంశ్ ఆర్య 0, ప్రభ్‌సిమ్రన్ 2, శ్రేయస్ 1, ఒమర్జాయ్ 14 పరుగులకు ఔటయ్యారు. -
రాజస్తాన్ రాయల్స్‌పై ఢిల్లీ క్యాపిటల్స్ విజయం
Delhi capitals vs Rajasthan royals live updates and Highlights: అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. రాజస్తాన్ విధించిన 194 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీ క్యాపిటల్స్ కేవలం 5 వికెట్లు మాత్రమే కోల్పోయి 19.2 ఓవర్లలో చేధించింది. అక్షర్ పటేల్(34), అశుతోష్ శర్మ(18) ఆజేయంగా నిలిచి మ్యాచ్‌ను ఫినిష్ చేశారు. ఈ విజయంతో ఢిల్లీ తమ ప్లే ఆఫ్స్ ఆశలను సజీవంగా ఉంచుకుంది.ఢిల్లీ ఐదో వికెట్ డౌన్ఢిల్లీ ఐదో వికెట్ కోల్పోయింది. 9 పరుగులు చేసిన డేవిడ్ మిల్లర్ బ్రిజేష్ శర్మ బౌలింగ్‌లో ఔటయ్యాడు.ఢిల్లీ నాలుగో వికెట్ డౌన్ట్రిస్టన్ స్టబ్స్ రూపంలో ఢిల్లీ నాలుగో వికెట్ కోల్పోయింది. 4 పరుగులు చేసిన స్టబ్స్.. ఆర్చర్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. ఢిల్లీ విజయానికి 22 బంతుల్లో 41 పరుగులు కావాలి. క్రీజులో అక్షర్ పటేల్(23) ఉన్నాడు.కేఎల్ రాహుల్ అవుట్133 పరుగుల వద్ద ఢిల్లీ మూడో వికెట్ కోల్పోయింది. 56 పరుగులు చేసిన రాహుల్.. దసున్ షనక బౌలింగ్‌లో ఔటయ్యాడు. అంతకముందు అర్చర్ బౌలింగ్‌లో సాహిల్ ఫరాఖ్ ఔటయ్యాడు. ఢిల్లీ విజయానికి 32 బంతుల్లో 60 పరుగులు కావాలి.తొలి వికెట్ డౌన్ఢిల్లీ తొలి వికెట్ కోల్పోయింది. 51 పరుగులు చేసిన అభిషేక్ పోరెల్.. బ్రిజేష్ శర్మ బౌలింగ్‌లో ఔటయ్యాడు.పోరెల్ హాఫ్ సెంచరీ10 ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టపోకుండా 105 పరుగులు చేసింది. క్రీజులో అభిషేక్ పోరెల్(51), కేఎల్ రాహుల్(46) ఉన్నారు.దూకుడుగా ఆడుతున్న పోరెల్4 ఓవర్లు ముగిసే సరికి ఢిల్లీ క్యాపిటల్స్ వికెట్ నష్టపోకుండా 50 పరుగులు చేసింది. క్రీజులో అభిషేక్ పోరెల్(27), కేఎల్ రాహుల్(16) ఉన్నారు.రాణించిన పరాగ్, జురెల్.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ బ్యాటర్లు సత్తాచాటారు. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసింది. ఓ దశలో 200కు పైగా పరుగులు సాధించేలా కన్పించిన రాజస్తాన్.. ఆఖరిలో మాత్రం తడబడింది. రాజస్తాన్ ఇన్నింగ్స్‌లో ధ్రువ్ జురెల్(53), రియాన్ పరాగ్(51) హాఫ్ సెంచరీలతో సత్తాచాటగా.. వైభవ్ సూర్యవంశీ(21 బంతుల్లో 46) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఢిల్లీ బౌలర్లలో మిచెల్ స్టార్క్ నాలుగు వికెట్లు, ఎంగిడీ, మాధవ్ తివారీ తలా రెండు వికెట్లు సాధించారు.మిచెల్ మ్యాజిక్మిచెల్ స్టార్క్ దెబ్బకు రాజస్తాన్ రాయల్స్ ఒకే ఓవర్లో మూడు వికెట్లు కోల్పోయింది. 15వ ఓవర్ వేసిన స్టార్క్ బౌలింగ్‌లో రెండో బంతికి పరాగ్ ఔట్ కాగా.. మూడో బంతికి ఫెరీరా ఔటయ్యాడు. ఆ తర్వాత ఐదో బంతికి రవి సింగ్ వికెట్ల ముందు దొరికిపోయాడు. 15 ఓవర్లకు రాజస్తాన్ స్కోర్: 166/5పరాగ్ హాఫ్ సెంచరీరియాన్ పరాగ్ దూకుడుగా ఆడుతున్నాడు. పరాగ్ కేవలం 23 బంతుల్లోనే 3 ఫోర్లు, 5 సిక్స్‌లతో హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు.రాజస్తాన్ రెండో వికెట్ డౌన్వైభవ్ సూర్యవంశీ రూపంలో రాజస్తాన్ రెండో వికెట్ కోల్పోయింది. 46 పరుగులు చేసిన వైభవ్.. మాధవ్ తివారీ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 9 ఓవర్లకు రాజస్తాన్ స్కోర్: 98/2వైభవ్ మెరుపులువైభవ్ సూర్యవంశీ మెరుపులు మెరిపిస్తున్నాడు. కేవలం 16 బంతుల్లోనే 42 పరుగులతో తన బ్యాటింగ్‌ను కొనసాగిస్తున్నాడు. 6 ఓవర్లు ముగిసే సరికి రాజస్తాన్ వికెట్ నష్టానికి 75 పరుగులు చేసింది.రాజస్తాన్ తొలి వికెట్ డౌన్జైశ్వాల్ రూపంలో రాజస్తాన్ తొలి వికెట్ కోల్పోయింది. 12 పరుగులు చేసిన జైశ్వాల్.. లుంగి ఎంగిడీ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు.ఐపీఎల్-2026లో భాగంగా కీలక మ్యాచ్‌లో అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా రాజస్తాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో ఆంధ్ర క్రికెటర్ త్రిపురాన విజయ్ ఢిల్లీ క్యాపిటల్స్ తరపున అరంగేట్రం చేశాడు. అకిబ్ నబీ స్దానంలో విజయ్ జట్టులోకి వచ్చాడు. మరోవైపు ఈ మ్యాచ్‌కు రాజస్తాన్ రాయల్స్ స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాకు విశ్రాంతి ఇచ్చారు. అతడి స్ధానంలో రవి సింగ్ జట్టులోకి వచ్చాడు.తుది జట్లుఢిల్లీ క్యాపిటల్స్: కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), అభిషేక్ పోరెల్, సాహిల్ పరాఖ్, ట్రిస్టన్ స్టబ్స్, డేవిడ్ మిల్లర్, అక్షర్ పటేల్(కెప్టెన్), మాధవ్ తివారీ, త్రిపురాన విజయ్, లుంగీ ఎన్గిడి, మిచెల్ స్టార్క్, ముఖేష్ కుమార్రాజస్థాన్ రాయల్స్: యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ, ధ్రువ్ జురెల్(వికెట్ కీపర్), రియాన్ పరాగ్(కెప్టెన్), రవి సింగ్, డోనోవన్ ఫెరీరా, శుభమ్ దూబే, జోఫ్రా ఆర్చర్, ఆడమ్ మిల్నే, బ్రిజేష్ శర్మ, యశ్ రాజ్ పుంజా -
వచ్చే నెలలోనే టీమిండియాలోకి 15 ఏళ్ల వండర్ కిడ్?
రాజస్తాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీనికి భారత సీనియర్ జట్టులోకి తీసుకోవాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి. తాజాగా ఈ జాబితాలోకి టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి చేరారు. ఐపీఎల్-2026 తర్వాత ఐర్లాండ్‌తో జరగనున్న టీ20 సిరీస్‌కు వైభవ్‌ను ఎంపిక చేయాలని బీసీసీఐ సెలక్షన్ కమిటీని శాస్త్రి సూచించాడు. కాగా 15 ఏళ్ల వైభవ్ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఐపీఎల్-2026లో 15 ఏళ్ల సూర్యవంశీ దుమ్ములేపుతున్నాడు. ఈ ఏడాది సీజన్లో ఇప్పటివరకు 11 మ్యాచ్‌లు ఆడిన వైభవ్.. 236.56 స్ట్రైక్ రేట్‌తో 440 పరుగులు చేశాడు. ఈ బీహార్ చిచ్చర పిడుగు జస్ప్రీత్ బుమ్రా, జోష్ హాజిల్‌వుడ్, భువనేశ్వర్ కుమార్ వంటి వరల్డ్ క్లాస్ బౌలర్లను సైతం ఉతికారేశాడు. దీంతో వైభవ్ సీనియర్ జట్టు తరపున ఆడేందుకు సిద్దంగా ఉన్నాడని రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు.వైభవ్ సూర్యవంశీ కోసం భారత జట్టు తలుపులు ముప్పావు వంతు తెరిచే ఉన్నాయి. ఇది కచ్చితంగా నేను చెప్పగలను. ఎందుకంటే ఒక యువ ఆటగాడిని ప్రోత్సహించి, వీలైనంత త్వరగా ప్రధాన జట్టులో భాగం చేయాలనుకుంటే అందుకు అత్యంత అనువైనది టీ20 ఫార్మాటే.వైభవ్ టీ20ల్లో ఇప్పటికే తన సత్తాను నిరూపించుకున్నాడు. అతడికి భారత టీ20 జట్టులోకి వచ్చేందుకు అన్ని అర్హతలు ఉన్నాయి. అతడు ప్రపంచ క్రికెట్లోని ఎన్నో జట్లలోకి నేరుగా వెళ్లి ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు సంపాదించగలడు. యువతకు ఉండే ఆ ఉత్సాహం, తెగింపు అతడి బ్యాటింగ్‌లో స్పష్టంగా కనిపిస్తున్నాయి.చాలామంది అతడికి 15 ఏళ్ళా? 16 ఏళ్ళా? 14 ఏళ్ళా?’ అని అడుగుతున్నాను. అది నాకు అనవసరం. తనకంటే రెండు, రెండున్నర రెట్లు ఎక్కువ వయసున్న జస్ప్రీత్ బుమ్రా, జోష్ హేజిల్‌వుడ్ వంటి వరల్డ్ క్లాస్ బౌలర్లను అతడు ఎదుర్కొంటున్న తీరు అద్భుతం. వయసుతో అతడికి పనిలేదు. భారత జట్టు త్వరలోనే ఐర్లాండ్ పర్యటనకు వెళ్లనుంది. ఈ టూర్ కోసం వైభవ్‌ను భారత జట్టుకు ఎంపిక చేసే అవకాశముంది" అని శాస్త్రి ఐసీసీ రివ్యూలో పేర్కొన్నాడు. వైభవ్ సూర్యవంశీ ఇటీవలే జూన్‌లో శ్రీలంకలో జరగబోయే త్రైపాక్షిక సిరీస్ కోసం 'ఇండియా-ఏ' జట్టుకు ఎంపికయ్యాడు. వచ్చే నెలఖారులో భారత సీనియర్ జట్టు ఐర్లాండ్‌తో రెండు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో తలపడనుంది.చదవండి: IPL 2026: చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లి.. ఎవరికీ సాధ్యం కాని రికార్డు -
శతక్కొట్టిన శ్రేయస్ అయ్యర్
ఐపీఎల్లో కెప్టెన్సీ అంటే ఒత్తిడి, అంచనాలు, విమర్శలు కలగలిసిన బాధ్యత. ఒక్క తప్పిదం మ్యాచ్‌నే కాదు, కెప్టెన్ ప్రతిష్టనూ ప్రభావితం చేస్తుంది. ఇలాంటి హైప్రెషర్ లీగ్‌లో దీర్ఘకాలం జట్టును నడిపించడం చాలా కొద్దిమందికే సాధ్యమైంది. ఇప్పుడు ఈ అరుదైన జాబితాలో పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ చేరాడు. ఐపీఎల్లో 100 మ్యాచ్‌లకు కెప్టెన్‌గా వ్యవహరించిన ఆటగాళ్ల క్లబ్‌లోకి అడుగుపెట్టి, రోహిత్ శర్మ, ఎంఎస్ ధోని, విరాట్ కోహ్లి, గౌతమ్ గంభీర్ సరసన నిలిచాడు.ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నది ధోని. చెన్నై సూపర్ కింగ్స్‌ను తొలి సీజన్ నుంచే నడిపించిన అతను ఐపీఎల్లో మొత్తం 235 మ్యాచ్‌లకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. అతని నాయకత్వంలో సీఎస్కే ఐదు టైటిళ్లు గెలుచుకుని లీగ్‌లో అత్యంత విజయవంతమైన జట్టుగా నిలిచింది. కెప్టెన్‌గా 136 విజయాలు సాధించిన ధోనికి 57.87 విజయశాతం ఉంది.రెండో స్థానంలో రోహిత్ శర్మ ఉన్నాడు. 2013లో ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ చేపట్టిన రోహిత్, అదే ఏడాది జట్టుకు తొలి టైటిల్ అందించాడు. తర్వాత మరో నాలుగు సార్లు ట్రోఫీ గెలిపించి ఐపీఎల్ చరిత్రలో అత్యుత్తమ కెప్టెన్లలో ఒకరిగా గుర్తింపు పొందాడు. 158 మ్యాచ్‌ల్లో జట్టును నడిపిన అతను 87 విజయాలు సాధించాడు.మూడో స్థానంలో విరాట్ కోహ్లీ నిలిచాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు తొమ్మిదేళ్ల పాటు కెప్టెన్‌గా వ్యవహరించిన కోహ్లీ, టైటిల్ గెలవలేకపోయినా జట్టును పలుమార్లు ప్లేఆఫ్స్‌కు తీసుకెళ్లాడు. అతని నాయకత్వంలో ఆర్సీబీ 2016లో ఫైనల్ చేరింది. మొత్తం 143 మ్యాచ్‌లకు కెప్టెన్‌గా వ్యవహరించిన కోహ్లీ 66 విజయాలు సాధించాడు.కేకేఆర్‌కు రెండు టైటిళ్లు అందించిన గౌతమ్ గంభీర్ 129 మ్యాచ్‌లతో నాలుగో స్థానంలో ఉన్నాడు. అతని కెప్టెన్సీలో కోల్‌కతా నైట్‌రైడర్స్ బలమైన జట్టుగా మారి ఐపీఎల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.ఇప్పుడు ఈ ప్రతిష్టాత్మక జాబితాలోకి శ్రేయస్ అయ్యర్ కూడా చేరాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో కెప్టెన్సీ ప్రయాణం ప్రారంభించిన అయ్యర్, ఆ జట్టును 2020లో ఫైనల్‌కు తీసుకెళ్లాడు. అనంతరం కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు మారి ఆ జట్టుకు టైటిల్ అందించాడు. ప్రస్తుతం పంజాబ్ కింగ్స్‌ను నడిపిస్తున్న అతను 100 మ్యాచ్‌ల్లో కెప్టెన్‌గా వ్యవహరించి 54 విజయాలు నమోదు చేశాడు. ఐపీఎల్ 2026లో భాగంగా ఆర్సీబీతో ఇవాళ (మే 17) జరుగుతున్న మ్యాచ్‌లో శ్రేయస్ ఈ అరుదైన ఘనత సాధించాడు. -
చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లి.. ఎవరికీ సాధ్యం కాని రికార్డు
ఐపీఎల్-2026లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ ఓపెనర్ విరాట్ కోహ్లి తన సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ఆదివారం ధర్మశాల వేదికగా పంజాబ్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కోహ్లి అద్భుతమైన హాఫ్ సెంచరీతో మెరిశాడు. కింగ్ కోహ్లి 37 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 58 పరుగులు చేశాడు. ఈ క్రమంలో కోహ్లి పలు సరికొత్త రికార్డులను లిఖించుకున్నాడు. 19 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో ఒకే ఫ్రాంచైజీ తరపున ఓపెనర్‌గా 5500 పరుగులు పూర్తి చేసిన తొలి బ్యాటర్‌గా విరాట్ రికార్డు సృష్టించాడు. ఆర్సీబీ తరపున కోహ్లి ఓపెనర్‌గా 5500 పరుగులు సాధించాడు. 9 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద విరాట్ ఈ ఫీట్‌ను అందుకున్నాడు.అంతకముందు శిఖర్ ధావన్, డేవిడ్ వార్నర్ వంటి ఆటగాళ్లు ఐపీఎల్లో ఓపెనర్లుగా 5500 పరుగుల మార్కును దాటినప్పటికీ.. వారు వేర్వేరు ఫ్రాంచైజీలకు ప్రాతినిధ్యం వహించారు. కానీ కోహ్లి మాత్రం కేవలం ఆర్సీబీ తరుపున ఆడుతూ ఈ ఘనత సాధించాడు.అదేవిధంగా ఐపీఎల్లో ఒకే జట్టుపై అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా కోహ్లి తన రికార్డును తానే బ్రేక్ చేశాడు. పంజాబ్ కింగ్స్‌పై కోహ్లి ఇప్పటివరకు 1175కు పైగా పరుగులు చేశాడు. ఇంతకముందు కోహ్లి చెన్నై సూపర్ కింగ్స్‌పై 1174 పరుగులు చేశాడు.ఐపీఎల్లో ఒకే ప్రత్యర్థిపై అత్యధిక పరుగులు చేసిన టాప్-5 బ్యాటర్లు:1175 పరుగులు – విరాట్ కోహ్లి (vs పంజాబ్ కింగ్స్)1174 పరుగులు – విరాట్ కోహ్లి (vs చెన్నై సూపర్ కింగ్స్) 1172 పరుగులు – విరాట్ కోహ్లి (vs ఢిల్లీ క్యాపిటల్స్) 1161 పరుగులు – రోహిత్ శర్మ (vs కోల్‌కతా నైట్ రైడర్స్) 1134 పరుగులు – డేవిడ్ వార్నర్ (vs పంజాబ్ కింగ్స్) ఈ ఇన్నింగ్స్‌తో కోహ్లీ ఐపీఎల్ 2026 సీజన్లో తన 500 పరుగుల మార్కును కూడా దాటేశాడు. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధికంగా 9 సీజన్లలో 500 కంటే ఎక్కువ పరుగులు సాధించిన ఏకైక బ్యాటర్‌గా కోహ్లీ సరికొత్త చరిత్ర సృష్టించాడు.అత్యధిక సార్లు ఐపీఎల్ సీజన్లలో 500 ప్లస్ రన్స్ చేసిన ప్లేయర్లు వీరే9 సీజన్లు – విరాట్ కోహ్లీ 7 సీజన్లు – డేవిడ్ వార్నర్, కేఎల్ రాహుల్ 5 సీజన్లు – శిఖర్ ధావన్చదవండి: PAK vs BAN: బాబర్ ఆజం అరుదైన రికార్డు -
బాబర్ ఆజం అరుదైన రికార్డు
పాకిస్తాన్ స్టార్ బ్యాటర్ బాబర్ ఆజం తన పునరాగమనంలో సత్తాచాటాడు. బంగ్లాదేశ్‌తో తొలి టెస్టుకు గాయం కారణంగా దూరమైన బాబర్.. ఇప్పుడు రెండో టెస్టులో మాత్రం అద్భుతమైన నాక్ ఆడాడు. తొలి ఇన్నింగ్స్‌లో 23 పరుగులకే ఓపెనర్లు వికెట్లు కోల్పోయిన పాక్‌ను హాఫ్ సెంచరీతో బాబర్ ఆదుకున్నాడు.కెప్టెన్ షాన్ మసూద్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. 84 బంతుల్లో 10 ఫోర్ల సాయంతో అతడు 68 పరుగులు చేశాడు. బాబర్‌కు ఇది 31వ టెస్ట్ హాఫ్ సెంచరీ. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ మాత్రం అతడికి ఇది 20 ఆర్ధ శతకం కావడం గమనార్హం. ఈ క్రమంలో బాబర్ ఓ అరుదైన ఘనత సాధించాడు. డబ్ల్యూటీసీ చరిత్రలో అత్యధిక అర్ధశతకాల జాబితాలో స్మిత్, జాక్ క్రాలీలతో కలిసి బాబర్ మూడో స్ధానంలో నిలిచాడు. మరో హాఫ్ సెంచరీ సాధిస్తే వారిద్దరిని బాబర్ అధిగమిస్తాడు. బాబర్ కంటే ముందు మార్నస్ లబుషేన్(24), జో రూట్(22) ఉన్నారు. ఇక సిల్హాట్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్ 278 పరుగులకే ఆలౌట్ కాగా.. పాకిస్తాన్ 232 పరుగులకే కుప్పకూలింది. దీంతో బంగ్లాకు 46 పరుగుల ఆధిక్యం లభించింది. బంగ్లా వికెట్ కీపర్ బ్యాటర్ లిట్టన్ దాస్((126) వీరోచిత శకతం సాధించాడు. పాక్ బౌలర్లలో ఖుర్రమ్ షెహజాద్ నాలుగు వికెట్లు పడగొట్టగా.. అబ్బాస్ మూడు వికెట్లు, హసన్ అలీ రెండు వికెట్లు సాధించారు.చదవండి: ఐపీఎల్‌ను తక్షణమే నిలిపి వేయండి..! -
బాబర్ ఆజం పోరాటం వృధా.. స్వల్ప స్కోర్‌కే కుప్పకూలిన పాక్
బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో పాక్ వెనుకపడింది. సిల్హెట్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 278 పరుగులకే ఆలౌట్ కాగా.. పాక్ మరింత తీసికట్టుగా 232 పరుగులకే కుప్పకూలింది. ఫలితంగా బంగ్లాకు 46 పరుగుల కీలక ఆధిక్యం లభించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన బంగ్లాదేశ్ 8 ఓవర్ల తర్వాత వికెట్ నష్టానికి 42 పరుగులు చేసింది. తంజిద్ హసన్ (4) ఔట్ కాగా.. మహ్మదుల్ హసన్ జాయ్ (26), మొమినుల్ హక్ (2) క్రీజ్‌లో ఉన్నారు. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కలుపుకొని బంగ్లాదేశ్ 89 పరుగుల లీడ్‌లో కొనసాగుతుంది. ప్రస్తుతం రెండో రోజు ఆట మూడో సెషన్ కొనసాగుతుంది.బాబర్ పోరాటం వృధాబంగ్లాదేశ్ను స్వల్ప స్కోర్‌కే పరిమితం చేసిన ఆనందం పాక్‌కు ఎంతో సేపు నిలబడలేదు. ఆ జట్టు బంగ్లా కంటే తక్కువ స్కోర్‌కే ఆలౌటై ఉసూరుమనిపించింది. బాబర్ ఆజం అద్భుతైన అర్ద సెంచరీతో (68) పోరాడినా పాక్‌ను గట్టెక్కించలేకపోయాడు. ఆఖర్లో సాజిద్ ఖాన్ (38) బ్యాట్ ఝులిపించడంతో పాక్ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. పాక్ ఇన్నింగ్స్‌లో అజాన్ అవైస్ 13, అబ్దుల్లా ఫజల్ 9, కెప్టెన్ షాన్ మసూద్ 21, సౌద్ షకీల్ 8, సల్మాన్ అఘా 21, మొహమ్మద్ రిజ్వాన్ 13, హసన్ అలీ 18, ఖుర్రమ్ షెహజాద్ 10 పరుగులకు ఔటయ్యారు. బంగ్లా బౌలర్లలో నహిద్ రాణా, తైజుల్ ఇస్లాం తలో 3 వికెట్లు పడగొట్టగా.. తస్కిన్ అహ్మద్, మెహిది హసన్ మిరాజ్ చెరో 2 వికెట్లు తీశారు.దాస్ శతకంతొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ లిట్టన్ దాస్ (126) వీరోచిత శకతం సాధించడంతో గౌరవప్రదమైన స్కోర్ చేయగలిగింది. పాక్ బౌలర్లు అబ్బాస్ (3 వికెట్లు), ఖుర్రమ్ షెహజాద్ (4), హసన్ అలీ (2), సాజిద్ ఖాన్ (1) సత్తా చాటారు. వాస్తవానికి బంగ్లాదేశ్ ఈపాటి స్కోర్ చేయడం కూడా చాలా గొప్పే. దాస్‌కు మిగతా ఆటగాళ్ల నుంచి ఎలాంటి సహకారం లభించకపోయినా ఒంటరిపోరాటం చేశాడు.తంజిద్ హసన్ (26), మొమినుల్ హక్ (22), కెప్టెన్ నజ్ముల్ హసన్ షాంటో (23), తైజుల్ ఇస్లాం (16), ఫోరిఫుల్ ఇస్లాం (12 నాటౌట్) రెండంకెల స్కోర్లు చేయగలిగారు. మిగతా ఆటగాళ్లలో మెహిద్ హసన్ మిరాజ్ 4, తస్కిన్ అహ్మద్ 7 పరుగులు చేయగా.. మహ్మదుల్ హసన్ జాయ్, నహిద్ రాణా డకౌట్లయ్యారు.కాగా, రెండు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో బంగ్లాదేశ్ 1-0 ఆధిక్యంలో కొనసాగుతుంది. తొలి టెస్ట్‌లో బంగ్లాదేశ్ ఊహించని విధంగా 104 పరుగుల తేడాతో పాక్‌కు షాకిచ్చింది. -
పంజాబ్‌పై ఆర్సీబీ గెలుపు
పంజాబ్‌పై ఆర్సీబీ గెలుపుఐపీఎల్ 2026లో భాగంగా ఇవాళ (మే 17) మధ్యాహ్నం జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌పై ఆర్సీబీ 23 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ గెలుపుతో ఆ జట్టు ప్లే ఆఫ్స్ బెర్త్ ఖరారు చేసుకుంది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ భారీ స్కోర్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 222 పరుగులు చేసింది.విరాట్ కోహ్లి (58), వెంకటేశ్ అయ్యర్ (73 నాటౌట్) మెరుపు అర్ద శతకాలతో చెలరేగారు. పడిక్కల్ (45), టిమ్ డేవిడ్ (28) కూడా బ్యాట్ ఝులిపించారు. జేకబ్ బేతెల్ (11) పేలవ ఫామ్‌ను కొనసాగించాడు. పంజాబ్ బౌలర్లలో హర్‌ప్రీత్ బ్రార్ 2 వికెట్లు తీయగా.. అర్షదీప్ సింగ్, చహల్ చెరో వికెట్ దక్కించుకున్నారు.అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన పంజాబ్ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 199 పరుగులకే పరిమితమై ఓటమిపాలైంది. ఈ ఓటమితో ఆ జట్టు ప్లే ఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. ఈ సీజన్ తొలి 7 మ్యాచ్‌ల్లో 6 విజయాలు సాధించిన పంజాబ్.. ఆతర్వాతి 6 మ్యాచ్‌ల్లో ఓటమిపాలై, నిష్క్రమణ అంచుల్లో నిలిచింది. ఆర్సీబీతో మ్యాచ్‌లో పంజాబ్ ఆదిలోనే పట్టు కోల్పోయింది. భువనేశ్వర్ కుమార్ ధాటికి ఆ జట్టు 19 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆతర్వాత కూపర్ కన్నోల్లీ (37), సూర్యాంశ్ షేడ్గే (35) కాసేపు క్రీజ్‌లో నిలదొక్కుకున్నారు. అయితే షెపర్డ్, సుయాశ్ శర్మ దెబ్బకు వీరిద్దరు ఔటయ్యారు. ఈ దశలో శశాంక్ సింగ్ (56), స్టోయినిస్ (37) పంజాబ్ శిబిరంలో ఆశలు రేకెత్తించారు. వీరు కూడా ఔట్ కావడంతో పంజాబ్ ఓటమి ఖరారైంది. ఆర్సీబీ బౌలర్లలో రసిక్ సలాం దార్ 3, భువీ 2, హాజిల్‌వుడ్, సుయాశ్ శర్మ, షెపర్డ్ తలో వికెట్ తీశారు. పంజాబ్ బ్యాటర్లలో ప్రియాంశ్ ఆర్య 0, ప్రభ్‌సిమ్రన్ 2, శ్రేయస్ 1, ఒమర్జాయ్ 14 పరుగులకు ఔటయ్యారు. 93 పరుగులకే సగం వికెట్లు కోల్పోయిన పంజాబ్223 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో పంజాబ్ దాదాపుగా చేతులెత్తేసింది. 93 పరుగులకే ఆ జట్టు సగం వికెట్లు కోల్పోయి ఓటమి దిశగా సాగుతోంది. స్టోయినిస్ (14), శశాంక్సింగ్ (0) క్రీజ్‌లో ఉన్నారు. పీకల్లోతు కష్టాల్లో పంజాబ్223 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో పంజాబ్ తడబడుతోంది. 19 పరుగులకే 3 కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. భువనేశ్వర్ కుమార్ (2-0-8-2) అద్భుతమై స్వింగ్ బౌలింగ్‌తో పంజాబ్‌ను దారుణంగా దెబ్బకొట్టాడు. అతనికి రసిక్ సలామ్ దార్ (1-0-4-1) తోడయ్యాడు. పంజాబ్ బ్యాటర్లలో ప్రియాంశ్ ఆర్య డకౌట్ కాగా.. ప్రభ్‌సిమ్రన్ సింగ్ 2, శ్రేయస్ అయ్యర్ ఒక్క పరుగుకు వెనుదిరిగారు. కూపర్ కన్నోలీ (15), సూర్యంశ్ షేడ్గే (4) క్రీజ్‌లో ఉన్నారు. పంజాబ్ రెండో వికెట్ డౌన్పంజాబ్ కింగ్స్ రెండో వికెట్ కోల్పోయింది. 2 పరుగులు చేసిన ప్రభ్సిమ్రాన్ సింగ్.. భువనేశ్వర్ కుమార్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. రెండు ఓవర్లకు పంజాబ్ స్కోర్: 19/2పంజాబ్ తొలి వికెట్ డౌన్223 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్‌కు ఆదిలోనే భారీ షాక్ తగిలింది. ఓపెనర్ ప్రియాన్ష్ ఆర్య ఖాతా తెరవకుండానే భువనేశ్వర్ కుమార్ బౌలింగ్‌లో ఔటయ్యాడు.ఆర్సీబీ భారీ స్కోర్‌టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ భారీ స్కోర్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 222 పరుగులు చేసింది. విరాట్ కోహ్లి (58), వెంకటేశ్ అయ్యర్ (73 నాటౌట్) మెరుపు అర్ద శతకాలతో చెలరేగారు. పడిక్కల్ (45), టిమ్ డేవిడ్ (28) కూడా బ్యాట్ ఝులిపించారు. జేకబ్ బేతెల్ (11) పేలవ ఫామ్‌ను కొనసాగించాడు. పంజాబ్ బౌలర్లలో హర్‌ప్రీత్ బ్రార్ 2 వికెట్లు తీయగా.. అర్షదీప్ సింగ్, చహల్ చెరో వికెట్ దక్కించుకున్నారు. మూడో వికెట్ కోల్పోయిన ఆర్సీబీ14.6వ ఓవర్- 157 పరుగుల వద్ద ఆర్సీబీ మూడో వికెట్ కోల్పోయింది. చహల్ బౌలింగ్‌లో ప్రియాంశ్ ఆర్యకు క్యాచ్ ఇచ్చి విరాట్ కోహ్లి (58) ఔటయ్యాడు.రెండో వికెట్ కోల్పోయిన ఆర్సీబీ9.1వ ఓవర్- 97 పరుగుల వద్ద దేవ్‌దత్ పడిక్కల్ (45) ఔటయ్యాడు. హర్‌ప్రీత్ బ్రార్ బౌలింగ్‌లో విరాట్ కోహ్లికి క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. ధాటిగా ఆడుతున్న పడిక్కల్, కోహ్లివిరాట్ కోహ్లి (24), దేవ్‌దత్ పడిక్కల్ (23) ధాటిగా ఆడుతున్నారు. 6 ఓవర్ల తర్వాత ఆర్సీబీ స్కోర్ 61-1గా ఉంది.తొలి వికెట్ కోల్పోయిన ఆర్సీబీ2.2వ ఓవర్- 21 పరుగుల వద్ద ఆర్సీబీ తొలి వికెట్ కోల్పోయింది. హర్‌ప్రీత్ బ్రార్ బౌలింగ్‌లో జేకబ్ బేతెల్ (11) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పంజాబ్ఐపీఎల్ 2026లో ఇవాళ (మే 17) డబుల్ హెడర్ మ్యాచ్‌లు జరుగనున్నాయి. మధ్యాహ్నం జరిగే మ్యాచ్‌లో ఆర్సీబీ, పంజాబ్ తలపడుతున్నాయి. ధర్మశాల వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌కు ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ గాయం కారణంగా దూరమయ్యాడు. అతని స్థానంలో జితేశ్ శర్మ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాడు. తుది జట్లు..రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ప్లేయింగ్ XI): జాకబ్ బెథెల్, విరాట్ కోహ్లీ, దేవదత్ పడిక్కల్, వెంకటేష్ అయ్యర్, జితేష్ శర్మ(w/c), టిమ్ డేవిడ్, రొమారియో షెపర్డ్, క్రునాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, జోష్ హేజిల్‌వుడ్, సుయాష్ శర్మపంజాబ్ కింగ్స్ (ప్లేయింగ్ XI): ప్రియాంష్ ఆర్య, ప్రభ్సిమ్రాన్ సింగ్(w), కూపర్ కొన్నోలీ, శ్రేయాస్ అయ్యర్(c), సూర్యాంశ్ షెడ్గే, శశాంక్ సింగ్, అజ్మతుల్లా ఒమర్జాయ్, హర్‌ప్రీత్ బ్రార్, లాకీ ఫెర్గూసన్, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్ -
ఐపీఎల్‌ను తక్షణమే నిలిపి వేయండి..!
ఐపీఎల్ 2026 సీజన్‌ను తాత్కాలికంగా నిలిపివేయాలంటూ కేంద్ర ప్రభుత్వంపై రాజకీయ ఒత్తిళ్లు పెరుగుతున్నాయి. పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులు, ముఖ్యంగా అమెరికా-ఇరాన్ మధ్య పెరుగుతున్న ఘర్షణల నేపథ్యంలో ఇంధన సంక్షోభం తలెత్తే ప్రమాదం ఉందని పేర్కొంటూ కాంగ్రెస్ నేతలు ఈ డిమాండ్ చేస్తున్నారు.ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ పొదుపు మంత్రాన్ని జపించిన నేపథ్యంలో ఛత్తీస్‌గఢ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత భూపేశ్ బాఘేల్ తాజాగా స్పందించారు. సోషల్‌మీడియాలో ఓ పోస్ట్ చేస్తూ.. ఐపీఎల్‌ను వెంటనే నిలిపివేయాలని మోదీని కోరారు. స్టేడియాలకు వేలాది మంది అభిమానులు ప్రయాణించడం వల్ల భారీగా ఇంధనం వినియోగమవుతోందని, విదేశీ ఆటగాళ్లకు డాలర్లలో చెల్లింపులు జరుగుతున్నాయని, బెట్టింగ్ కార్యకలాపాలు కూడా పెరుగుతున్నాయని ఆయన ఆరోపించారు."ప్రధానమంత్రి గారు, వెంటనే ఐపీఎల్‌ను ఆపేయండి. దీంతో ఇంధనం ఆదా అవుతుంది. విదేశీ కరెన్సీ చెల్లింపులు తగ్గుతాయి. బెట్టింగ్ కూడా ఆగుతుంది" అంటూ బాఘేల్ తన పోస్టులో రాసుకొచ్చారు.బాఘేల్ చేసిన ఈ పోస్ట్ సోషల్‌మీడియాలో ట్రెండ్ అవుతుంది. నెటిజన్లు బాఘేల్ వర్షన్‌ను సమర్దిస్తూ ఐపీఎల్‌ను నిలిపివేయాలని డిమాండ్ చేస్తున్నారు. మోదీ కేవలం మాటలకే పరిమితం కాకుండా పొదుపు మంత్రాన్ని ఆచరించాలని వారు కోరుతున్నారు. ఈ విషయంపై నెట్టింట డిబేట్లు నడుస్తున్నా, కేంద్ర ప్రభుత్వం నుంచి గానీ, ఐపీఎల్ నిర్వహకులు నుండి గానీ ఎలాంటి స్పందన లేదు.కాగా, దేశంలో ఇటీవల పెట్రోల్, డీజిల్, సీఎన్జీ ధరలు భారీగా పెరిగిన విషయం తెలిసిందే. త్వరలో ఈ పెంపు మరింత ఎక్కువ కానుందన్న సంకేతాలు కూడా అందుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రతి విషయంలో ఇంధనంతో ముడిపడి ఉన్న ఐపీఎల్‌ను కొనసాగించడం సబబు కాదని సగటు భారతీయుడు అభిప్రాయపడుతున్నాడు.మరోపక్క ఇంకో వర్షన్ కూడా వినిపిస్తుంది. టోర్నీ ముగియడానికి కేవలం రెండు వారాల సమయం మాత్రమే ఉండటంతో ఈ దశలో సస్పెండ్ చేస్తే భారీ ఆర్థిక నష్టం వాటిల్లే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రసార హక్కులు, స్పాన్సర్‌షిప్‌లు, టికెట్ ఆదాయం, ఫ్రాంచైజీల వ్యాపార ప్రయోజనాలు దెబ్బతినే ప్రమాదం ఉందని అంచనా వేస్తున్నారు. -
భారత్‌కు పాక్ బోర్డు చీఫ్?.. ఊహించని ట్విస్ట్!
ఐపీఎల్-2026 ప్లే ఆఫ్స్ దశకు చేరుకుంది. మే 31న ఫైనల్ మ్యాచ్ నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది. ఇందుకు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదిక. ఇక ఈ మ్యాచ్ సందర్భంగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) చైర్మన్ మొహ్సిన్ నక్వీ భారత్‌కు రానున్నాడనే ప్రచారం జరిగింది. భారత్‌కు పాక్ బోర్డు చీఫ్?అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) బోర్డు సమావేశానికి హాజరవుతాడని వదంతులు వచ్చాయి. కాగా భారత్- పాక్ మధ్య ఉద్రిక్తతలు తారస్థాయికి చేరుకున్న సంగతి తెలిసిందే. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత దాయాది వ్యవహారశైలిని ఎండగట్టిన భారత్.. పాక్‌లో ఉన్న కొన్ని ఉగ్రస్థావరాలను నేలమట్టం చేసింది. ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో భారత సైన్యం ఈ పని పూర్తి చేయగా... ప్రతిగా పాక్ ఆర్మీ కూడా రంగంలోకి దిగి చేతులు కాల్చుకుంది. ఇలాంటి తరుణంలో భారత్- పాక్ తొలిసారి ఆసియా టీ20 కప్-2025 సందర్భంగా ముఖాముఖి తలపడ్డాయి. అయితే, ఈ మ్యాచ్‌లలో పాక్ ఆటగాళ్లతో కరచాలనానికి టీమిండియా నిరాకరించింది. దీనిని గురించి రచ్చ చేసిన పీసీబీకి ఆఖరికి నిరాశే మిగిలింది. ఫైనల్లో పాక్‌పై గెలిచి భారత్ టైటిల్ గెలిచింది.ట్రోఫీని ఎత్తుకెళ్లిన నక్వీఈ క్రమంలో ఆసియా క్రికెట్ మండలి (ACC) అధ్యక్షుడి హోదాలో నక్వీ తన చేతుల మీదుగా ట్రోఫీ ఇచ్చేందుకు సిద్ధం కాగా.. టీమిండియా తిరస్కరించింది. దీంతో ట్రోఫీని నక్వీ తనతో పాటు ఎత్తుకెళ్లి ఇప్పటి వరకు తిరిగి ఇవ్వలేదు. ఇక ఈ ఘటన తర్వాత టీ20 ప్రపంచకప్-2026 సమయంలో బంగ్లాదేశ్‌కు మద్దతుగా పాక్ నానాయాగీ చేసింది.భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI)కి అనుకూలంగా ఐసీసీ నిర్ణయం తీసుకుంటోందని ఆరోపించింది. బంగ్లా టోర్నీ నుంచి తప్పుకోవడంతో పాటు తాము కూడా తప్పుకొంటామని బెదిరింపు ధోరణి అవలంబించింది. అయితే, ఐసీసీ కఠిన చర్యలకు ఉపక్రమించగా.. పట్టువీడి టోర్నీలో పాల్గొంది.అతడిని ఎలా ఆహ్వానిస్తారు?చెత్త ప్రదర్శనతో సెమీస్ చేరుకుండానే పాక్ నిష్క్రమించగా.. భారత్ ముచ్చటగా మూడోసారి టైటిల్ గెలిచింది. ఈ పరిణామాల నేపథ్యంలో నక్వీ భారత్‌కు వస్తున్నాడనే వార్త కలకలం రేపింది. అతడిని ఎలా ఆహ్వానిస్తారని ప్రశ్నిస్తూనే.. వెంటనే నిర్ణయాన్ని మార్చుకోవాలని ఐసీసీ చైర్మన్ జై షాకు సోషల్ మీడియా వేదికగా అభిమానులు విజ్ఞప్తి చేశారు.ఆన్లైన్ వేదికగాఅయితే, అందరూ ఊహించినట్లుగా నక్వీ అహ్మదాబాద్‌కు రావడం లేదు. ఐసీసీ నిర్వహిస్తున్న ఈ సమావేశానికి అతడు వర్చువల్‌గా హాజరుకానున్నాడు. ఆన్లైన్ వేదికగా తన అభిప్రాయాలు పంచుకోనున్నాడు. నిజానికి ఐసీసీ ఈ సమావేశానికి వేదికగా దోహాను ఎంచుకుంది.అయితే, పశ్చిమాసియా యుద్ధం కారణంగా అక్కడి పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. ఈ నేపథ్యంలో అహ్మదాబాద్ వేదికగా ఐపీఎల్ ఫైనల్ నాడు సమావేశం నిర్వహించాలని ఐసీసీ నిర్ణయించినట్లు తెలుస్తోంది. కాగా ఐసీసీ నిబంధనలకు అనుగుణంగానే నక్వీ వర్చువల్‌గా ఈ మీటింగ్‌కు హాజరుకానున్నాడు. చదవండి: సెలక్టర్లు చెప్పినా నేను ద్రవిడ్‌ను జట్టు నుంచి తప్పించలేదు: గంగూలీ -
ఆఫ్ఘనిస్తాన్ స్టార్ క్రికెటర్ మృతి..?
ఆఫ్ఘనిస్తాన్ స్టార్ క్రికెటర్ రహ్మత్ షా చనిపోయాడంటూ సోషల్‌మీడియాలో ఓ వార్త వైరలైంది. ఈ ప్రచారంలో నిజమెంతో అని పరిశీలిస్తే.. పూర్తిగా అవాస్తవమని తేలింది. రహ్మత్ షా సురక్షితంగా, ఆరోగ్యంగా ఉన్నాడని ఆఫ్ఘన్ మీడియా వర్గాలు వెల్లడించాయి. అయితే ఈ ప్రచారానికి రహ్మత్ షా సహచర ఆఫ్ఘన్ క్రికెటర్ కరీమ్ జనత్ చేసిన ఓ సోషల్‌మీడియా పోస్ట్ కారణమైంది.ఇటీవలే రహ్మత్ షా తల్లి మరణించింది. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్దిస్తూ కరీమ్ జనత్ తన మాతృ భాష పాష్టోలో ఓ సంతాప పోస్ట్ పెట్టాడు. దీన్ని ఇన్స్టాగ్రామ్ ఆటోమేటిక్ ట్రాన్స్లేషన్ తప్పుగా అనువదించడంతో రహ్మత్ షా మరణించాడని నెటిజన్లు అపార్దం చేసుకున్నారు. క్రాస్ చెక్ చేసుకోని కొందరు ఈ వార్తను విస్తృతంగా షేర్ చేయడంతో వైరలైంది.ఇంతకీ కరీమ్ జనత్ తన పోస్ట్‌లో ఏం రాసుకొచ్చాడంటే.. రహ్మత్ షా తల్లి మరణ వార్త విని చాలా బాధపడ్డాను. అల్లా ఆమెకు స్వర్గం ప్రసాదించాలని కోరుకుంటున్నాను.కాగా, 32 ఏళ్ల రహ్మత్ షా ఆఫ్ఘనిస్తాన్ టెస్ట్, వన్డే జట్లలో కీలక మిడిలార్డర్ బ్యాటర్ కమ్ పార్ట్ టైమ్ లెగ్ స్పిన్నర్‌గా ఉన్నాడు. 2013లో అరంగేట్రం చేసిన ఈ కుడి చేతి వాటం ఆటగాడు.. 11 టెస్ట్‌లు, 125 వన్డేలు ఆడాడు. టెస్ట్‌ల్లో 3 శతకాలు (ఓ డబుల్ సెంచరీ), 5 అర్ద శతకాల సాయంతో 970 పరుగులు చేసిన షా.. వన్డేల్లో 5 సెంచరీలు, 32 అర్ద సెంచరీల సాయంతో 4034 పరుగులు చేశాడు. బౌలింగ్‌లో టెస్ట్‌ల్లో ఒకటి, వన్డేల్లో 15 వికెట్లు తీశాడు. షా ఓ టీ20 కూడా ఆడాడు.షా గతేడాది బంగ్లాదేశ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో చివరిసారిగా కనిపించాడు. ఆ సిరీస్‌లో గాయపడడంతో కొంతకాలంగా ఆటకు దూరంగా ఉన్నాడు. త్వరలో భారత్‌తో జరుగబోయే టెస్ట్, వన్డే సిరీస్‌తో షా పునరాగమనం చేయవచ్చు. -
చరిత్ర సృష్టించిన సాయి సుదర్శన్.. ప్రపంచ రికార్డు
గుజరాత్ టైటాన్స్ ఓపెనర్ సాయి సుదర్శన్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. టీ20 ఫార్మాట్లో మూడు వేల పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. ఈ క్రమంలో ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ షాన్ మార్ష్ పేరిట ఉన్న ఆల్‌టైమ్ రికార్డును సాయి బద్దలు కొట్టాడు.ఐపీఎల్-2026లో భాగంగా కోల్‌కతా నైట్ రైడర్స్- గుజరాత్ టైటాన్స్ మధ్య శనివారం మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈడెన్ గార్డెన్స్ వేదికగా టాస్ గెలిచిన గుజరాత్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా నిర్ణీత 20 ఓవర్లలో కేవలం రెండు వికెట్లు నష్టపోయి 247 పరుగుల మేర భారీ స్కోరు సాధించింది.మూడు అర్ధ శతకాలులక్ష్య ఛేదనలో గుజరాత్ ఓపెనర్లు సాయి సుదర్శన్, కెప్టెన్ శుబ్‌మన్ గిల్ మెరుగ్గా రాణించారు. సాయి 28 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 53 పరుగులతో అజేయంగా నిలవగా.. గిల్ 49 బంతుల్లో 85 పరుగులు చేశాడు. మిగతావారిలో జోస్ బట్లర్ 35 బంతుల్లో 57 పరుగులు రాబట్టగలిగాడు.The 𝗦 in Effortle𝘀𝘀 stands for 𝗦hubman Gill and 𝗦ai Sudharsan 🤌Updates ▶️ https://t.co/m8jevRTt29#TATAIPL | #KhelBindaas | #KKRvGT pic.twitter.com/pLTiOLMZUU— IndianPremierLeague (@IPL) May 16, 2026అయితే, ఈ ముగ్గురి హాఫ్ సెంచరీలు గుజరాత్‌ను నిలబెట్టలేకపోయాయి. 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 218 పరుగులకే పరిమితమైన గుజరాత్.. 29 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్ సందర్భంగా సాయి సుదర్శన్ పొట్టి క్రికెట్లో మూడు వేల పరుగులు పూర్తి చేసుకున్నాడు.అతి తక్కువ ఇన్నింగ్స్లోనేఈ క్రమంలో అత్యంత వేగంగా.. అంటే అతి తక్కువ ఇన్నింగ్స్‌లోనే టీ20 ఫార్మాట్లో ఈ మైలురాయిని చేరుకున్న క్రికెటర్ సాయి సుదర్శన్ చరిత్రకెక్కాడు. అంతకు ముందు ఆసీస్ స్టార్ షాన్ మార్ష్ 85 ఇన్నింగ్స్‌లో ఈ ఘనత సాధించగా.. సాయి సుదర్శన్ కేవలం 78 ఇన్నింగ్స్‌లోనే ఈ ఫీట్ అందుకోవడం విశేషం.టీ20 ఫార్మాట్లో ఫాస్టెస్ట్ 3000 రన్స్ సాధించిన టాప్-5 క్రికెటర్లు👉సాయి సుదర్శన్ (ఇండియా)- 78 ఇన్నింగ్స్‌లో👉షాన్ మార్ష్ (ఆస్ట్రేలియా)- 85 ఇన్నింగ్స్‌లో👉డిఆర్సీ షార్ట్ (ఆస్ట్రేలియా)- 86 ఇన్నింగ్స్‌లో👉డెవాన్ కాన్వే (న్యూజిలాండ్)- 86 ఇన్నింగ్స్‌లో👉క్రిస్ గేల్ (వెస్టిండీస్)- 87 ఇన్నింగ్స్లోసాయి సుదర్శన్ టీ20 ఫార్మాట్ రికార్డు ఇదీఐపీఎల్లో గుజరాత్ తరఫున ఇప్పటికి 53 మ్యాచ్‌లలో కలిపి సాయి సుదర్శన్ 2347 పరుగులు సాధించాడు. తమిళనాడు తరఫున దేశీ టీ20 టోర్నీలో 25 మ్యాచ్‌లలో 670 పరుగులు చేశాడు. ఇక టీమిండియా తరఫున ఒక మ్యాచ్ ఆడినప్పటికీ పరుగులేమీ రాబట్టలేకపోయాడు.చదవండి: సెలక్టర్లు చెప్పినా నేను ద్రవిడ్‌ను జట్టు నుంచి తప్పించలేదు: గంగూలీ -
తెగే దాకా తెచ్చుకున్న పంజాబ్.. అడుగు దూరంలో ఆర్సీబీ
ఐపీఎల్ 2026లో ఇవాళ (మే 17) మధ్యాహ్నం అత్యంత కీలక సమరం జరుగనుంది. టేబుల్ టాపర్‌గా ఉన్న ఆర్సీబీ.. ప్లే ఆఫ్స్ బెర్త్ కోసం కొట్టిమిట్టాడుతున్న పంజాబ్ కింగ్స్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్ ఆర్సీబీకి పెద్దగా కీలకం కాకపోయినా, పంజాబ్‌కు మాత్రం చాలా కీలకం. ఈ మ్యాచ్‌లో గెలిస్తేనే ఆ జట్టు ప్లే ఆఫ్స్ అవకాశాలు సజీవంగా ఉంటాయి. ఓడిందా ఖేల్ దాదాపు ఖతమైనట్లే. ఆర్సీబీ విషయానికొస్తే.. ఈ జట్టుకు ఈ మ్యాచ్ అంత ముఖ్యం కాకపోయినా, గెలిస్తే మాత్రం దర్జాగా ప్లే ఆఫ్స్ బెర్త్ ఖరారు చేసుకుంటుంది. ఓడినా ఈ జట్టుకు మరో ఛాన్స్ ఉంటుంది. చివరి మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌పై గెలిస్తే అప్పుడైన ప్లే ఆఫ్స్ బెర్త్ ఖరారవుతుంది. ఒకవేళ అది కూడా ఓడిందా.. ఇతర జట్ల గెలుపోటములపై భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ఇంతదాకా తెచ్చుకోకూడదంటే నేటి మ్యాచ్‌లో పంజాబ్‌పై గెలిస్తే సరిపోతుంది. ఈ లెక్కన ఆర్సీబీ ప్లే ఆఫ్స్ బెర్త్‌కు కేవలం అడుగుదూరంలో ఉంది.తెగే దాకా తెచ్చుకున్న పంజాబ్ఈ సీజన్లో పంజాబ్ పరిస్థితి చాలా విచిత్రంగా ఉంది. తొలి 7 మ్యాచ్‌ల్లో 6 గెలిచి జైత్రయాత్ర చేసిన ఈ జట్టు, అనూహ్యంగా పరాజయాల బాట పట్టింది. ఏమైందో ఏమో తెలీదు కానీ, చివరి 5 మ్యాచ్‌ల్లో వరుసగా ఓడి ప్లే ఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. ప్రస్తుతం ఈ జట్టు పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉన్నా, చివరికొచ్చే సరికి ప్లే ఆఫ్స్ బెర్త్ దక్కుతుందన్న గ్యారెంటీ లేదు. నేటి మ్యాచ్‌లో ఆర్సీబీపై, 23వ తేదీ జరిగే మ్యాచ్‌లో లక్నోపై గెలిస్తే ఎలాంటి టెన్షన్ లేకుండా ఉండవచ్చు. ఇప్పటికే తెగే దాకా తెచ్చుకున్న పంజాబ్, ఇకపై జాగ్రత్తగా వ్యవహరించకపోతే ఐపీఎల్ చరిత్రలో ఏ జట్టుకు ఎదురుకాని అనుభవాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆర్సీబీ, లక్నో మ్యాచ్‌లు ఈ జట్టుకు సెమీస్, ఫైనల్స్ లాంటివి.నేటి మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్ ధర్మశాల వేదికగా మధ్యాహ్నం 3:30 గంటలకు మొదలవుతుంది. ఇరు జట్లు ఈ సీజన్లో తలపడటం ఇదే మొదటిసారి. ఆర్సీబీ రెండు వరుస విజయాలతో దూకుడుమీదుంటే.. పంజాబ్ ఐదు వరుస పరాజయాలతో ఢీలా పడిపోయి ఉంది. -
ఇంగ్లండ్-న్యూజిలాండ్ సిరీస్ సమం
ఇంగ్లండ్-న్యూజిలాండ్ మహిళా క్రికెట్ జట్ల మధ్య జరిగిన మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ 1-1తో సమంగా ముగిసింది. ఇంగ్లండ్ వేదికగా జరిగిన ఈ సిరీస్‌లో తొలి వన్డే ఇంగ్లండ్, మూడో వన్డే న్యూజిలాండ్ గెలవగా.. రెండో వన్డే వర్షం కారణంగా పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది.కార్డిఫ్ వేదికగా తాజాగా జరిగిన మూడో వన్డేలో న్యూజిలాండ్ డక్‌వర్త్ లూయిస్ పద్దతిలో 17 పరుగుల తేడాతో విజయం సాధించింది. వరుణుడి ఆటంకాల నడుమ 33 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 7 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. అలిస్ క్యాప్సీ 45 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలువగా.. హీథర్ నైట్ 28, యామీ జోన్స్ 27, ఫ్రేయా కెంప్ 20, ఎమ్మా లాంబ్ 7, జోడీ గ్రూకాక్ 10, డానియెల్లా గిబ్సన్ 2, కెప్టెన్ ఛార్లెట్ డీన్ 16 (నాటౌట్), సోఫీ ఎక్లెస్టోన్ 7 (నాటౌట్) పరుగులు చేశారు. న్యూజిలాండ్ బౌలర్లలో బ్రీ ఇల్లింగ్, రోస్‌మేరీ మైర్ చెరో 2 వికెట్లు పడగొట్టగా.. జెస్ కెర్, అమేలియా కెర్, నెన్సీ పటేల్ తలో వికెట్ దక్కించుకున్నారు.అనంతరం ఛేదన సమయంలో వరుణుడు మళ్లీ ఆటంకాలు కలిగించడంతో న్యూజిలాండ్‌ను డక్‌వర్త్ లూయిస్ పద్దతి ప్రకారం విజేతగా ప్రకటించారు. 24.4 ఓవర్ల వద్ద భారీ వర్షం మొదలై ఎంతకీ తగ్గకపోవడంతో అంపైర్లు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆ సమయానికి న్యూజిలాండ్ 4 వికెట్ల నష్టానికి 141 పరుగులు చేసింది. బ్రూక్ హల్లీడే 42, ఇసబెల్లా గేజ్ 22 పరుగులతో అజేయంగా నిలిచారు. అంతకుముందు మ్యాడీ గ్రీన్ 37 పరుగులతో రాణించింది. మిగతా బ్యాటర్లలో సూజీ బేట్స్ 12, జార్జియా ప్లిమ్మర్ 7, అమేలియా కెర్ 1 పరుగు చేశారు. ఇంగ్లండ్ బౌలర్లలో లారెన్ బెల్ 3, డేనియెలా గిబ్సన్ ఓ వికెట్ తీసింది. మే 20 నుంచి ఇరు జట్ల మధ్య మూడు మ్యాచ్ టీ20 సిరీస్ మొదలవుతుంది. తొలి మ్యాచ్ డెర్బీ వేదికగా జరుగనుంది. -
వామ్మో ఒక్కటి రూ. 80 వేలా?.. దీన్నే ‘వెర్రి’ అంటారండీ!
భారత్‌లో క్రికెట్‌కు ఉన్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. క్రికెట్‌ను ఓ మతంలా భావిస్తూ.. క్రికెటర్లను దేవుళ్లలా ఆరాధించే అభిమానులు కోకొల్లలు. ఇక పొట్టి ఫార్మాట్లో సాగే దేశీ క్రేజీ టోర్నీ ఐపీఎల్‌కు ఉన్న వీరాభిమానుల గురించి కూడా తెలిసిందే.ఆటగాళ్ల పాదాలు తాకేందుకు మైదానంలోకి దూసుకువెళ్లి.. భద్రతా సిబ్బందితో గెంటేయించుకునేవాళ్లు కొందరైతే.. తమ ఫేవరెట్ ప్లేయర్‌ను ప్రత్యక్షంగా చూసేందుకు ఎంత డబ్బైనా ఖర్చు పెట్టేందుకు వెనుకాడని వెర్రి అభిమానం మరికొందరిది.రూ. 8 వేల టికెట్‌ను రూ. 80 వేలకు పెంచిఈ ‘పిచ్చి’నే క్యాష్ చేసుకుంటున్నారు బ్లాక్ టికెట్ల దందా నిర్వాహకులు. రూ. 8 వేల టికెట్‌ను ఏకంగా రూ. 80 వేలకు అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. ఢిల్లీ పోలీసులు ఇటీవలే ఈ విషయాన్ని గుర్తించి పలువురు నిందితులను అరెస్టు చేశారు.కంచే చేను మేసినట్లుగా!ఈ బ్లాక్ టికెట్ల దందాలో ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ (DDCA) అధికారిదే కీలక పాత్ర అని తేల్చినట్లు సమాచారం. ఈ విషయం గురించి డీడీసీఏ సన్నిహిత వర్గాలు ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌తో మాట్లాడుతూ.. ‘‘ఇదొక వ్యవస్థీకృత నేరం. ఇందులో డీడీసీఏ అధికారి ఒకరిది కీలక పాత్ర. ఆటగాళ్ల క్రేజ్‌ను బట్టి టికెట్ల ధరలు నిర్ణయిస్తారు.మ్యాచ్ ఆరంభమయ్యే కాసేపటికి ముందు ధరలు ఇష్టారీతిన పెంచి సొమ్ము చేసుకుంటారు. ఇటీవల ఢిల్లీ క్యాపిటల్స్- రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్ సమయంలో రేట్లు దారుణంగా పెంచారు.విరాట్ కోహ్లిని చూసేందుకుఆర్సీబీ స్టార్ విరాట్ కోహ్లిని చూసేందుకు అభిమానులు ఎగబడతారన్న సంగతి తెలిసిందే. అందుకే ఆరోజు బ్లాక్‌లో రూ. 8 వేల టికెట్‌ను ఏకంగా 80 వేల రూపాయలకు అమ్మారు’’ అని సదరు వర్గాలు పేర్కొన్నాయి. కాగా ఈ ఘటనలో ముకీమ్, గుఫ్రాన్, ఫైజల్ అనే వ్యక్తులతో పాటు పెట్రోల్ బంకు ఉద్యోగి పంకజ్ యాదవ్‌ను కూడా పోలీసులు అరెస్టు చేసినట్లు సమాచారం.ఇక ఢిల్లీ క్యాపిటల్స్‌కు అరుణ్‌జైట్లీ మైదానం హోంగ్రౌండ్ అన్న సంగతి తెలిసిందే. బీసీసీఐ నిబంధనల ప్రకారం.. ఆతిథ్య డీడీసీఏకు ప్రతీ మ్యాచ్‌కు సంబంధించి ఫ్రాంఛైజీ 10- 15 శాతం టికెట్లను కాంప్లిమెంటరీ పాసులుగా ఇస్తుంది. ఈ క్రమంలోనే దాదాపు వెయ్యి కాంప్లిమెంటరీ పాసులను డీడీసీఏ అధికారి అక్రమంగా అమ్ముకున్నట్లు తెలుస్తోంది.హైదరాబాద్‌లో అభిమానుల పాట్లు!మే 22న సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆర్సీబీతో తలపడనుంది. ఈ మ్యాచ్‌కు ఉన్న డిమాండ్‌ను క్యాష్ చేసుకుంటూ సన్ రైజర్స్ యాజమాన్యం మ్యాచ్ టికెట్ల ధరలు భారీగా పెంచినట్లు తెలుస్తోంది. డిస్ట్రిక్ట్ యాప్‌లో టికెట్స్ బుకింగ్ ఓపెన్ కాగా.. క్యూ లో 2.6 లక్షల మంది ఉన్నట్లు కనిపించింది. ఆ తర్వాత కాసేపట్లో సోల్డ్ ఔట్ అని పెట్టారు. ఈ నేపథ్యంలో టికెట్లను బ్లాక్ మార్కెట్ లోకి మళ్లిస్తున్నారని అభిమానులు పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్నారు.ఈ క్రమంలో రూ. 950 టికెట్ 2000లకు... 1500 ఉన్న టికెట్ 3000లకు.. 1910 ఉన్న టికెట్ 3500లకు.. 2500 ఉన్న టికెట్ 4500లకు.. 4500 ఉన్న టికెట్ 6000లకు.. 7000 ఉన్న టికెట్ ధర 10 వేల రూపాయలకు.. 23 వేలు ఉన్న బాక్స్ టికెట్ ధర 30 వేల రూపాయలకు.. 30 వేలు ఉన్న కార్పోరేట్ బాక్స్ టికెట్ ధర 45 వేలకు పెంచినట్లు సమాచారం.చదవండి: సెలక్టర్లు చెప్పినా నేను ద్రవిడ్‌ను జట్టు నుంచి తప్పించలేదు: గంగూలీ -
‘సెలక్టర్లు చెప్పినా వినలేదు.. లేదంటే నాడే ద్రవిడ్ కెరీర్ ఖతం’
టీమిండియా అత్యుత్తమ బ్యాటర్లలో ‘మిస్టర్ డిపెండబుల్’ రాహుల్ ద్రవిడ్‌కు ప్రత్యేక స్థానం ఉంటుంది. టెస్టు, వన్డే ఫార్మాట్లలో సత్తా చాటిన ఈ వికెట్ కీపర్ బ్యాటర్.. సారథిగానూ సేవలు అందించాడు. తన అంతర్జాతీయ కెరీర్లో 344 వన్డేలు ఆడిన ద్రవిడ్.. 10,889 పరుగులు సాధించాడు.వన్డే జట్టులో చోటు కరువయ్యే పరిస్థితిఅదే విధంగా టీమిండియా తరఫున 164 మ్యాచ్‌లలో 13288 పరుగులు రాబట్టాడు ద్రవిడ్ (Rahul Dravid). అయితే, 2000లలో ఒకానొక దశలో ద్రవిడ్‌కు వన్డే జట్టులో చోటు కరువయ్యే పరిస్థితి తలెత్తిందట. ఆ సమయంలో కెప్టెన్‌గా ఉన్న సౌరవ్ గంగూలీ ద్రవిడ్‌కు అండగా నిలిచి.. అతడి కెరీర్ కొనసాగేందుకు దోహదపడ్డాడట.గంగూలీనే స్వయంగా ఈ విషయాన్ని తాజాగా వెల్లడించాడు. రాజ్ షమానీ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ.. ‘‘రాహుల్ ద్రవిడ్.. చాలా మంది నా దగ్గరికి వచ్చి.. అతడి స్ట్రైక్ రేటు బాగా లేదని చెప్పేవారు. సెలక్టర్లు సైతం వన్డేల్లో ద్రవిడ్‌కు బదులు వేరొక ఆటగాడిని ప్రయత్నిద్దాం అనేవారు.ద్రవిడ్‌ను జట్టు నుంచి తప్పించలేదుఅవును హిట్టింగ్ ఆడాల్సిందే. కానీ ఏదైనా పరిస్థితులకు తగ్గట్లే ఉండాలి. నేను మాత్రం ద్రవిడ్‌ను జట్టు నుంచి తప్పించలేదు. ఎందుకంటే ఒక్కసారి వదిలేస్తే... అతడి కెరీరే సమాప్తమైపోతుంది. ఈ విషయం గురించి నేను అతడితో ఒంటరిగా మాట్లాడేవాడిని.జామ్ (ద్రవిడ్ ముద్దుపేరు).. నువ్వు కాస్త మారాలి అని చెప్పేవాడిని. అతడొక గొప్ప ఆటగాడు.. వన్డే ఫార్మాట్‌కు తొందరగానే అలవాటుపడిపోయాడు. టీమిండియా తరఫున ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు రావడంతో పాటు వికెట్ కీపర్‌గానూ సేవలు అందించాడు.ఆ జట్లకు వాళ్లు.. మాకు ద్రవిడ్నిజానికి ఆరోజుల్లో మాకు బ్యాటింగ్ చేసే వికెట్ కీపర్ లేడు. ఆ సమయంలో శ్రీలంకకు కుమార్ సంగక్కర, సౌతాఫ్రికాకు మార్క్ బౌచర్, ఆస్ట్రేలియాకు ఆడం గిల్‌క్రిస్ట్ వికెట్ కీపర్లుగా ఉన్నారు.వాళ్లంతా గొప్పగా బ్యాటింగ్ చేయగలరు కూడా!.. కానీ మా బ్యాటింగ్ ఆరో స్థానంతో ముగిసిపోయేది. అలాంటి సమయంలో ద్రవిడ్‌ను కీపర్‌గా నియమించాము. కైఫ్ ఏడో స్థానంలో వచ్చేవాడు. అలా మా బ్యాటింగ్ విభాగం మరింత పటిష్టంగా మారింది’’ అని గంగూలీ చెప్పుకొచ్చాడు. హెడ్‌కోచ్‌గానూ..కాగా 1996లో భారత్ తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన రాహుల్ ద్రవిడ్.. 2012లో తన చివరి ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడాడు. అనంతరం జాతీయ క్రికెట్ అకాడమీలో యువ ఆటగాళ్లను మెరికల్లా తీర్చిదిద్దిన ఈ కర్ణాటక దిగ్గజం.. ఆ తర్వాత టీమిండియా హెడ్‌కోచ్‌గా వచ్చాడు. అతడి మార్గదర్శనంలో 2023లో వన్డే వరల్డ్‌కప్ ఫైనల్ చేరిన టీమిండియా.. 2024లో టీ20 ప్రపంచకప్ గెలిచింది.చదవండి: అప్పటి నుంచి ధోని అస్సలు నచ్చలేదు: గంగూలీ -
మాకు గెలిచే అర్హత లేదు.. తప్పంతా వాళ్లదే: గిల్
ఐపీఎల్-2026 ప్లే ఆఫ్స్ బెర్త్‌ను ఖాయం చేసుకోవాలనే లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్‌కు కోల్‌కతా నైట్ రైడర్స్ షాకిచ్చింది. సొంతమైదానం ఈడెన్ గార్డెన్స్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగి.. గుజరాత్‌పై 29 పరుగుల తేడాతో జయభేరి మోగించింది. తద్వారా తమ ప్లే ఆఫ్స్ అవకాశాలను సజీవం చేసుకుంది.ఈ నేపథ్యంలో కోల్‌కతా చేతిలో ఓటమి అనంతరం గుజరాత్ కెప్టెన్ శుబ్‌మన్ గిల్ తమ జట్టు ప్రదర్శన పట్ల అసంతృప్తి వ్యక్తం చేశాడు. బ్యాటింగ్‌లో అదరగొట్టినా ఫీల్డింగ్‌లో తాము విఫలమయ్యామని.. క్యాచ్‌లు జారవిడిచి మ్యాచ్‌ను చేజార్చుకున్నామని పేర్కొన్నాడు.మాకు గెలిచే అర్హత లేదుఈ మేరకు.. ‘‘ఈ వికెట్ బాగుంది. ఇక్కడ 200- 210 పరుగులు స్కోరు చేయవచ్చు. మేము ఇక్కడ బాగా బ్యాటింగ్ చేశాము. ఈ విషయంలో ఆందోళన లేదు. అయితే, మా ఫీల్డింగ్ చెత్తగా సాగింది.మూడు సులువైన క్యాచ్‌లు వదిలేశాం. కాబట్టి ఈ మ్యాచ్‌లో గెలిచేందుకు మాకు అర్హత లేదనే చెప్తాను. ఏదేమైనా క్వాలిఫయర్స్‌కు చేరువవుతున్న సమయంలో ఇలాంటి ఉత్కంఠభరిత మ్యాచ్ మాకు మంచి ప్రాక్టీస్‌ను ఇచ్చింది.కాస్త విశ్రాంతి తీసుకున్న తర్వాత బలంగా తిరిగి వస్తాము. తదుపరి మ్యాచ్ మా సొంతమైదానంలో జరుగనుంది. అందుకోసం అహ్మదాబాద్ బయల్దేరుతాం. అక్కడి వికెట్‌కు అనుగుణంగా మా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటాము’’ అని గిల్ పేర్కొన్నాడు. ఓటమికి ప్రధాన కారణం అదేఫీల్డింగ్ తప్పిదాలే తమ కొంపముంచాయని.. తమ ఓటమికి ప్రధాన కారణం అదేనని గిల్ తెలిపాడు. కాగా కేకేఆర్ ఓపెనర్ ఫిన్ అలెన్ 34 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఉండగా.. జేసన్ హోల్డర్ బౌలింగ్‌లో ఇచ్చిన క్యాచ్‌ను గుజరాత్ వదిలేసింది. 200 games done, will there be 200 more? 😯Sunil Narine speaks about playing more and more for @kkriders 💜#TATAIPL | #KhelBindaas | #KKRvGT pic.twitter.com/m7m6Pj1isd— IndianPremierLeague (@IPL) May 16, 2026ఈ క్రమంలో అలెన్ తనకు లభించిన లైఫ్‌ను సద్వినియోగం చేసుకుని.. 35 బంతుల్లోనే 93 పరుగులు సాధించి జట్టు గెలుపునకు బాటలు వేశాడు.ఇక ఈ మ్యాచ్‌లో గుజరాత్ ఓపెనర్లు సాయి సుదర్శన్ (28 బంతుల్లో 53 నాటౌట్), గిల్ (49 బంతుల్లో 85).. వికెట్ కీపర్ బ్యాటర్ జోస్ బట్లర్ (35 బంతుల్లో 57) అర్ధ శతకాలతో రాణించారు.అయితే, కేకేఆర్ విధించిన 248 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో గుజరాత్ విఫలమైంది. నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 218 పరుగులు మాత్రమే చేసింది. ఫలితంగా విజయానికి 29 పరుగుల దూరంలో నిలిచిపోయింది.చదవండి: IPL 2026: చరిత్ర సృష్టించిన కేకేఆర్ ఓపెనర్ -
తుదిజట్టులో లేకున్నా.. జహీర్ ఖాన్ వల్లే ఇలా!
చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ పేస్ బౌలర్ ఆకాశ్ సింగ్ వికెట్ పడగొట్టినప్పుడల్లా జేబులోంచి ఒక కాగితాన్ని బయటకు తీసి చేసుకున్న సంబరం అందరినీ ఆకర్షించింది. అక్కీ ఆన్ ఫైర్చెన్నై ఇన్నింగ్స్‌లో టాప్–3 బ్యాటర్లు సంజూ సామ్సన్, రుతురాజ్ గైక్వాడ్, ఉర్విల్ పటేల్‌లను అవుట్ చేసినప్పుడు అతను తన ఆనందాన్ని ప్రదర్శించాడు. దానిపై ఇంగ్లిష్‌లో.. ‘అక్కీ ఆన్ ఫైర్–టీ20ల్లో వికెట్లు ఎలా తీయాలో ఆకాశ్‌కు తెలుసు’ అనే వాక్యాలు రాసి ఉన్నాయి.అది కాగితం మాత్రమే కాదు కెరీర్ ఆరంభ దశలోనే ఉన్న 24 ఏళ్ల ఆకాశ్ ఇలా చేయడంపై కొన్ని విమర్శలు వచ్చినా... వాటికి అతను వివరణ ఇచ్చాడు. అది కాగితం మాత్రమే కాదని, తనలో స్ఫూర్తి నింపే మాటలని స్పష్టం చేశాడు. ఆ చీటీని తాను ఈ మ్యాచ్ కోసమే తీసుకు రాలేదని, ఇలాంటివి రాసుకొని ప్రేరణ పొందడం తనకు మొదటి నుంచి అలవాటు ఉందని ఆకాశ్ అన్నాడు.‘వేర్వేరు వ్యక్తులు వేర్వేరు అంశాల నుంచి స్ఫూర్తి పొందుతారు. నేను అలాంటి కాగితాన్ని ఎప్పుడూ బయటకు తీసి చూపించకపోవచ్చు. కానీ నా మనసులో వాటి గురించి ఆలోచన ఉంటుంది. ఏదైనా ప్రేరణనిచ్చే విషయం రాసిన చీటీ జేబులో ఉంటే అది మీ ప్రదర్శనను గుర్తు చేస్తూ ఉంటుంది. ఏదైనా అనుకొని వచ్చి నిజంగా దానిని చేసి చూపించగలగడం ముఖ్యం.అలాంటి రాతలు ఈ ఒక్క మ్యాచ్‌కే పరిమితం కాదు. నేను ఒంటరిగా ఉన్నప్పుడు ఏదైనా ఆలోచన వస్తే దానిని వెంటనే రాసుకుంటాను. మ్యాచ్‌కు ముందు రోజు వచ్చిన ఆలోచననే కాగితంపై పెట్టి తీసుకొచ్చాను. నేను ఈ మ్యాచ్ ఆడబోతున్నానని రెండు రోజుల ముందు ప్రాక్టీస్ సెషన్లో తెలిసింది’ అని ఆకాశ్ వ్యాఖ్యానించాడు.తుదిజట్టులో లేకున్నా.. జహీర్ ఖాన్ వల్లే ఇలా!కాగా 2025 సీజన్లో కూడా లక్నో జట్టులో ఉన్న ఆకాశ్ 3 మ్యాచ్‌లు ఆడి 4 వికెట్లు పడగొట్టాడు. ఈ రెండు సీజన్లుగా లక్నో ఫ్రాంచైజీ తనను ప్రోత్సహిస్తూ అండగా నిలిచిందని, దాని వల్లే తన ఆట మరింత మెరుగైందని అతను పేర్కొన్నాడు. ‘నేను తుది జట్టులో లేని సమయంలో కూడా కోచ్‌లు నాకు సరైన మార్గనిర్దేశనం చేశారు. గత ఏడాది జహీర్ ఖాన్, ఈసారి భరత్ అరుణ్ నన్ను నడిపించారు. ఎప్పుడు అవకాశం లభించినా సత్తా చాటేలా నన్ను సిద్ధం చేశారు. కెపె్టన్ పంత్ కూడా మద్దతునివ్వడంతో ఆత్మవిశ్వాసం పెరిగింది.కొత్త బంతితో నేను మెరుగ్గా బౌలింగ్ చేయగలనని గుర్తింపు అవకాశం కల్పించారు. పిచ్‌పై మంచి బౌన్స్ కూడా ఉండటంతో చెన్నైపై మూడు వికెట్లు తీయగలిగాను’ అని ఆకాశ్ వివరించాడు.అండర్–19 స్థాయి నుంచి వచ్చి...ఆకాశ్ స్వస్థలం రాజస్తాన్‌లోని భరత్పూర్. జైపూర్ శివార్లలోని హథోడ్లో ఉన్న ఆరావళి క్రికెట్ క్లబ్లో శిక్షణ పొందాడు. ప్రస్తుతం ఆకాశ్‌తో పాటు ఐపీఎల్లో ఆడుతున్న అశోక్ శర్మ (గుజరాత్), ముకుల్ చౌదరి (లక్నో), కార్తీక్ శర్మ (చెన్నై) కూడా అక్కడి నుంచి వచ్చినవారే.ఇక 2019లో రాజస్తాన్ జట్టు తరఫున టీ20ల్లో అరంగేట్రం చేసిన ఆకాశ్ రెండేళ్ల తర్వాత అదే టీమ్ తరఫున వన్డేలు కూడా ఆడాడు. అయితే ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో అవకాశం రాకపోవడంతో నాగాలాండ్ జట్టుకు మారిన ఆకాశ్ 2022లో రంజీ ట్రోఫీలోకి అడుగు పెట్టాడు. గత సీజన్లో అతను మళ్లీ రాజస్తాన్‌కు తిరిగొచ్చి రంజీ మ్యాచ్‌లు ఆడాడు. 2020 అండర్–19 ప్రపంచ కప్‌లో రన్నరప్‌గా నిలిచిన భారత జట్టులో సభ్యుడైన ఆకాశ్... ఫైనల్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ ఆటగాళ్లతో జరిగిన గొడవలో భాగంగా ఉండటంతో ఐసీసీ శిక్షకు కూడా గురయ్యాడు.పడుతూ లేస్తూపోటీ క్రికెట్లోకి అడుగు పెట్టిన ఇన్నేళ్లయినా...ఆకాశ్ ఐపీఎల్ ప్రయాణం మాత్రం పడుతూ లేస్తూ సాగుతోంది. 2021లో తొలిసారి రాజస్తాన్ రాయల్స్ తరఫున ఐపీఎల్లో అరంగేట్రం చేసిన అతను ఒక్క మ్యాచ్‌కే పరిమితమయ్యాడు. ఆ మ్యాచ్‌లో ఒక్క వికెట్ కూడా దక్కలేదు! తర్వాతి సీజన్లో అవకాశం రాకపోగా... 2023లో ముకేశ్ చౌదరీ గాయపడటంతో అతని స్థానంలో ఆకాశ్‌ను చెన్నై సూపర్ కింగ్స్ తీసుకుంది. ఆరు మ్యాచ్‌లలో 5 వికెట్లు తీసిన అతను టైటిల్ గెలిచిన జట్టులో సభ్యుడిగా నిలవడం విశేషం. ఇక 2024లో మళ్లీ ఐపీఎల్ చాన్స్ దక్కలేదు కానీ గత సీజన్‌నుంచి లక్నో టీమ్‌తో ఉన్నాడు. చదవండి: IPL 2026: చరిత్ర సృష్టించిన కేకేఆర్ ఓపెనర్ -
ఫాతిమా ఫటాఫట్
కరాచీ: మహిళల అంతర్జాతీయ టి20ల్లో వేగవంతమైన అర్ధ సెంచరీ నమోదైంది. పాకిస్తాన్ కెప్టెన్ ఫాతిమా సనా ఈ కొత్త ఘనతను నమోదు చేసింది. శుక్రవారం జింబాబ్వేతో జరిగిన చివరి టి20లో ఫాతిమా 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించింది. ఇందులో 10 ఫోర్లు, 1 సిక్స్ ఉన్నాయి. ఇప్పటి వరకు ఈ రికార్డు 18 బంతులతో ముగ్గురి పేరిట ఉంది. సోఫీ డివైన్ (న్యూజిలాండ్), ఫోబ్ లిచ్‌ఫీల్డ్ (ఆస్ట్రేలియా), రిచా ఘోష్ (భారత్) గతంలో ఈ ఫీట్‌ను సాధించారు. ఓవరాల్‌గా మహిళల టి20ల్లో కూడా ఇదే వేగవంతమైన హాఫ్ సెంచరీ. మేరీ కేలీ, లారా హారీస్ కూడా దేశవాళీ టి20ల్లో 15 బంతుల్లోనే ఈ మైలురాయిని చేరారు. పాక్ తరఫున ఇప్పటి వరకు నిదా దార్ (20 బంతుల్లో) ఉన్న రికార్డును ఫాతిమా సవరించింది. జింబాబ్వేతో మ్యాచ్‌లో చిగోరా ఓవర్లో 4 ఫోర్లు కొట్టిన ఫాతిమా...నోమ్వెలో ఓవర్లో వరుసగా 4, 4, 6, 6, 4 బాదడం విశేషం. ఫాతిమా సనా (19 బంతుల్లో 62 నాటౌట్; 10 ఫోర్లు, 2 సిక్స్‌లు)తో పాటు సాయేరా జబీన్ (50 నాటౌట్), ఆయేషా జఫర్ (45) కూడా రాణించడంతో మూడో టి20లో పాక్ 223 పరుగులు చేయగా, జింబాబ్వే 90 పరుగులకే కుప్పకూలింది. 133 పరుగులతో నెగ్గిన పాక్ 3–0తో సిరీస్‌ను సొంతం చేసుకుంది. ఫాతిమా సనా సారథ్యంలోనే... టి20 ప్రపంచకప్‌లో పాల్గొనే పాకిస్తాన్ జట్టును శనివారం పీసీబీ ప్రకటించింది. ఐదుగురు ప్లేయర్లకు తొలిసారి వరల్డ్ కప్ టీమ్‌లో చోటు దక్కింది. 15 మంది సభ్యుల ఈ టీమ్‌కు ఫాతిమా సనా కెప్టెన్‌గా వ్యవహరిస్తుంది. 2024 టి20 వరల్డ్ కప్‌లో కూడా ఆమె సారథ్యంలోనే జట్టు బరిలోకి దిగింది. టి20 ప్రపంచకప్‌లో గ్రూప్ ‘ఎ’లో ఉన్న పాకిస్తాన్ తమ తొలి మ్యాచ్‌ను జూన్ 14న భారత జట్టుతో బరి్మంగ్‌హామ్‌లో తలపడుతుంది. ఆ తర్వాత జూన్ 17న దక్షిణాఫ్రికాతో, 20న బంగ్లాదేశ్‌తో, 23న ఆ్రస్టేలియాతో, 27న నెదర్లాండ్స్‌తో పాకిస్తాన్ ఆడుతుంది. పాకిస్తాన్ టి20 జట్టు వివరాలు: ఫాతిమా సనా (కెప్టెన్), ఆలియా రియాజ్, ఆయేషా జఫర్, దియానా బేగ్, ఈమాన్ ఫాతిమా, గుల్ ఫెరోజా, ఇరమ్ జావేద్, మునీబా అలీ, నష్రా సుంధు, నటాలియా పర్వేజ్, రమీన్ షమీమ్, సాదియా ఇక్బాల్, సాయేరా జబీన్, తస్మియా రుబాబ్, తుబా హసన్. -
బుమ్రాకు విశ్రాంతి!
న్యూఢిల్లీ: ఐపీఎల్ సందడి ముగిసిన తర్వాత వారం రోజుల్లోపే భారత జట్టు అంతర్జాతీయ క్రికెట్‌కు సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా సొంతగడ్డపై అఫ్గానిస్తాన్‌తో ఒక టెస్టు, మూడు వన్డేల్లో టీమిండియా తలపడుతుంది. జూన్ 6 నుంచి న్యూ చండీగఢ్‌లో ఏకైక టెస్టు జరగనుండగా... జూన్ 14, 17, 20 తేదీల్లో ధర్మశాల, లక్నో, చెన్నైలలో వన్డేలు ఉంటాయి. ఈ మ్యాచ్‌ల కోసం వేర్వేరు జట్లను ఎంపిక చేసేందుకు అజిత్ అగార్కర్ నాయకత్వంలోని సెలెక్షన్ కమిటీ మంగళవారం సమావేశం కానుంది. టెస్టు జట్టు విషయంలో ఎలాంటి ప్రయోగాలు చేయరాదని సెలక్టర్లు భావిస్తుండగా... వన్డేల విషయంలో మాత్రం కొందరు కొత్త ఆటగాళ్లకు అవకాశం ఇచ్చే ఆలోచనతో ఉన్నట్లు సమాచారం. టీమ్ టాప్ పేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాకు మాత్రం ఈ సిరీస్‌ల నుంచి విశ్రాంతినిచ్చే అవకాశం కనిపిస్తోంది. అఫ్గానిస్తాన్ బలహీన టెస్టు టీమ్ కావడంతో పాటు స్వదేశంలో జరిగే టెస్టులో సహజంగానే స్పిన్నర్ల ఆధిపత్యం సాగుతుంది. కాబట్టి బుమ్రా అవసరం పెద్దగా ఉండకపోవచ్చు. వన్డేల్లో కూడా యువ ఆటగాళ్లను పరీక్షించేందుకు ఇది తగిన అవకాశం. కాబట్టి మూడు ఫార్మాట్లలో కీలక బౌలరైన బుమ్రాకు విశ్రాంతినివ్వడానికి సరైన సమయంగా సెలక్షన్ కమిటీ భావిస్తోంది. ఒకవేళ టెస్టు ఆడాలనుకుంటే వన్డే సిరీస్ నుంచి, వన్డేలు ఆడాలనుకుంటే టెస్టు నుంచి బుమ్రాను పక్కన పెట్టవచ్చు. టెస్టులో హైదరాబాదీ సిరాజ్, ప్రసిధ్ కృష్ణ ప్రధాన పేసర్లు కాగా మూడో పేసర్ ఎంపికకు చాన్స్ తక్కువ. గత ఏడాది రంజీల్లో అత్యధిక వికెట్లతో సత్తా చాటిన ఆకిబ్ నబీ ఎంపికపై చర్చ జరుగుతున్నా... పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్, ఆంధ్ర ప్లేయర్ నితీశ్ కుమార్ రెడ్డి నుంచి అతను పోటీని ఎదుర్కొంటున్నాడు. స్పిన్నర్లుగా రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్ ఖాయం కాబట్టి అక్షర్ పటేల్‌కు కూడా చోటు దక్కడం అనుమానమే. టెస్టు జట్టులో మూడో స్థానానికి సాయి సుదర్శన్ స్థానంలో దేవదత్ పడిక్కల్ పేరు పరిశీలనలో ఉంది. టెస్టు వికెట్ కీపర్ల విషయంలో ఎలాంటి ప్రత్యామ్నాయ ఆలోచన లేకుండా రిషభ్ పంత్, ధ్రువ్ జురేల్ తమ స్థానాలు నిలబెట్టకోవడం స్పష్టం. ప్రిన్స్‌కు అవకాశం! భారత వన్డే జట్టులో మాత్రం పలు మార్పులకు ఆస్కారం కనిపిస్తోంది. విజయ్ హజారే టోరీ్నలో 17 వికెట్లు పడగొట్టడంతో పాటు ప్రస్తుత ఐపీఎల్లో కూడా చెలరేగుతున్న ప్రిన్స్ యాదవ్ పేరుపై చర్చ సాగుతోంది. హర్షిత్ రాణా ఇంకా ఫిట్‌గా లేకపోవడంతో ప్రిన్స్‌ను ఎంపిక చేసే అవకాశం ఉంది. నిజానికి ప్రస్తుత స్థితిలో భారత్–అఫ్గానిస్తాన్ మధ్య వన్డే సిరీస్‌కు పెద్దగా ప్రాధాన్యత లేకపోయినా... విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ ఆడుతుండటంతో సహజంగానే దీనిపై ఆసక్తి పెరిగింది. ప్రిన్స్‌కు అవకాశం! భారత వన్డే జట్టులో మాత్రం పలు మార్పులకు ఆస్కారం కనిపిస్తోంది. విజయ్ హజారే టోరీ్నలో 17 వికెట్లు పడగొట్టడంతో పాటు ప్రస్తుత ఐపీఎల్లో కూడా చెలరేగుతున్న ప్రిన్స్ యాదవ్ పేరుపై చర్చ సాగుతోంది. హర్షిత్ రాణా ఇంకా ఫిట్‌గా లేకపోవడంతో ప్రిన్స్‌ను ఎంపిక చేసే అవకాశం ఉంది. నిజానికి ప్రస్తుత స్థితిలో భారత్–అఫ్గానిస్తాన్ మధ్య వన్డే సిరీస్‌కు పెద్దగా ప్రాధాన్యత లేకపోయినా... విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ ఆడుతుండటంతో సహజంగానే దీనిపై ఆసక్తి పెరిగింది. -
గుజరాత్‌పై విజయం.. కేకేఆర్ ప్లేఆఫ్స్ ఆశలు సజీవం
ఐపీఎల్-2026లో కోల్‌కతా నైట్‌రైడర్స్ తమ ప్లే ఆఫ్స్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. శనివారం ఈడెన్ గార్డెన్స్ వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన డూ ఆర్ డై మ్యాచ్‌లో 29 పరుగుల తేడాతో కేకేఆర్ విజయం సాధించింది. 248 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 218 పరుగులు చేసింది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ క్రీజులో ఉన్నంతసేపు గుజరాత్ లక్ష్యాన్ని అందుకుంటుందని అంతా భావించారు. కానీ సునీల్ నరైన్ బౌలింగ్‌లో గిల్ భారీ షాట్‌కు ప్రయత్నించి అవుట్ కావడంతో మ్యాచ్ చేజారిపోయింది. చివరిలో సాయిసుదర్శన్, జోస్ బట్లర్ కాస్త దూకుడుగా ఆడినప్పటికి జట్టును గెలిపించలేకపోయారు. గుజరాత్ బ్యాటర్లలో శుభ్‌మన్ గిల్ (49 బంతుల్లో 5 ఫోర్లు, 7 సిక్స్‌లతో 85) టాప్ స్కోరర్‌గా నిలవగా.. బట్లర్(57), సాయిసుదర్శన్(53 నాటౌట్) రాణించారు.అంతకముందు బ్యాటింగ్ చేసిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 247 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఓపెనర్ ఫిన్ అలెన్ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 35 బంతుల్లో 10 సిక్సర్లు, 4 ఫోర్లుతో 93 పరుగులు చేశాడు. అతడితో పాటు అంగ్క్రిష్ రఘువంశీ(44 బంతుల్లో 4 ఫోర్లు, 7 సిక్స్‌లతో 82), కామెరూన్ గ్రీన్(52) హాఫ్ సెంచరీలతో సత్తాచాటారు. గుజరాత్ బౌలర్లలో సిరాజ్,సాయి కిషోర్ తలా వికెట్ సాధించారు. -
చరిత్ర సృష్టించిన కేకేఆర్ ఓపెనర్
ఐపీఎల్-2026లో ఈడెన్ గార్డెన్స్ వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) ఓపెనర్ ఫిన్ అలెన్ విధ్వంసం సృష్టించాడు.ఈ డూ ఆర్ డై మ్యాచ్‌లో అలెన్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఈడెన్ గార్డెన్స్‌లో బౌండరీల వర్షం కురిపించాడు.30 పరుగుల లోపు రెండు సార్లు ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న అలెన్.. ఆ తర్వాత మాత్రం గుజరాత్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. కేవలం 35 బంతుల్లో 10 సిక్సర్లు, 4 ఫోర్లుతో 93 పరుగులు చేశాడు. ఈ క్రమంలో అలెన్ పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. 👉ఒకే ఐపీఎల్ సీజన్లో కేకేఆర్ తరపున ఒకే ఇన్నింగ్స్‌లో రెండుసార్లు 10 లేదా అంతకంటే ఎక్కువ సిక్సర్లు కొట్టిన తొలి బ్యాటర్‌గా అతను రికార్డు సృష్టించాడు. అంతకుముందు మే 8న ఢిల్లీ క్యాపిటల్స్ జరిగిన మ్యాచ్‌లోనూ అతడు 10 సిక్సర్లు బాదాడు. 👉గుజరాత్ టైటాన్స్‌పై కేకేఆర్ తరపున అత్యధిక వ్యక్తిగత స్కోర్ సాధించిన ప్లేయర్‌గా అలెన్ నిలిచాడు. ఇంతకుముందు ఈ రికార్డు వెంకటేశ్ అయ్యర్(83) పేరిట ఉండేది. తాజా మ్యాచ్‌తో అయ్యర్‌ను అలెన్ అధిగమించాడు.ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 247 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఫిన్ అలెన్‌తో పాటు అంగ్క్రిష్ రఘువంశీ(44 బంతుల్లో 4 ఫోర్లు, 7 సిక్స్‌లతో 82), కామెరూన్ గ్రీన్(52) హాఫ్ సెంచరీలతో సత్తాచాటారు.గుజరాత్ బౌలర్లలో సిరాజ్,సాయి కిషోర్ తలా వికెట్ సాధించారు. కాగా ఐపీఎల్ చరిత్రలో గుజరాత్‌పై అత్యధిక స్కోర్ సాధించిన జట్టుగా కేకేఆర్ చరిత్ర సృష్టించింది.చదవండి: IND vs AFG: టీమిండియాలోకి ఎవరూ ఊహించని ప్లేయర్? -
మహమ్మద్ సిరాజ్ 'డబుల్ సెంచరీ'
టీమిండియా పేసర్, గుజరాత్ టైటాన్స్ స్టార్ బౌలర్ మహమ్మద్ సిరాజ్ తన టీ20 కెరీర్లో అరుదైన మైలు రాయిని అందుకున్నాడు. టీ20ల్లో 200 వికెట్లను సిరాజ్ పూర్తి చేసుకున్నాడు. ఐపీఎల్-2026లో భాగంగా కేకేఆర్‌తో మ్యాచ్‌లో అజింక్య రహానే అవుట్ చేయడం ద్వారా సిరాజ్ ఈ ఫీట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ ఘనత సాధించిన 21 భారత బౌలర్‌గా సిరాజ్ రికార్డు సృష్టించాడు. మొత్తంగా ఇప్పటివరకు 174 మ్యాచ్‌లు ఆడిన సిరాజ్ మియా.. 8.00కు పైగా ఏకానమితో రెండు వందల వికెట్లు పడగొట్టాడు. ఇందులో 6 ఫోర్ వికెట్ హాల్స్ ఉన్నాయి. అదేవిధంగా సిరాజ్ తన ఐపీఎల్ కెరీర్లో సన్‌రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. 2024, 2026 టీ20 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టులో కూడా సిరాజ్ మియా సభ్యునిగా ఉన్నాడు. సిరాజ్‌టెస్టు క్రికెట్లోనే కాకుండా వైట్‌బాల్‌తో కూడా తన మార్క్‌ను చూపిస్తున్నాడు. ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే... తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 247 పరుగులు చేసింది.ఓపెనర్ ఫిన్ అలెన్ విధ్వంసం సృష్టించాడు. అలెన్ కేవలం 35 బంతుల్లోనే 4 ఫోర్లు, 10 సిక్స్‌లతో 93 పరుగులు చేశాడు. అతడితో పాటు అంగ్క్రిష్ రఘువంశీ(44 బంతుల్లో 4 ఫోర్లు, 7 సిక్స్‌లతో 82), కామెరూన్ గ్రీన్(52) హాఫ్ సెంచరీలతో సత్తచాటారు. గుజరాత్ బౌలర్లలో సిరాజ్,సాయి కిషోర్ తలా వికెట్ సాధించారు. -
'సీఎస్కే ప్లే ఆఫ్స్ చేరడం కష్టమే'
ఐపీఎల్-2026లో శుక్రవారం లక్నో సూపర్ జెయింట్స్ చేతిలో 6 వికెట్ల తేడాతో ఘోర ఓటమి చవిచూసిన చెన్నై సూపర్ కింగ్స్.. తమ ప్లే ఆఫ్స్ ఆశలను సంక్లిష్టం చేసుకుంది. లక్నో సూపర్ జెయింట్స్ 188 పరుగుల లక్ష్యాన్ని కేవలం 16.4 ఓవర్లలోనే ఛేదించడం ద్వారా సీఎస్కే పాయింట్ల పట్టికలో ఆరో స్ధానానికి పడిపోయింది.ఇప్పటివరకు 12 మ్యాచ్‌లు ఆడిన సీఎస్కే.. ఆరింట గెలుపొందగా, మరో ఆరింట ఓటమి పాలైంది. చెన్నై జట్టుకు ఇంకా రెండు మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి.సీఎస్కే ప్లే ఆఫ్స్‌కు చేరాలంటే మిగిలిన రెండు మ్యాచ్‌లలో భారీ తేడాతో విజయం సాధించాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఇతర జట్ల మ్యాచ్‌ల ఫలితాలపై కూడా ఆధారపడాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో సీఎస్కే ప్లేఆఫ్ అవకాశాలపై భారత మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు. సీఎస్కేకు చివరి రెండు మ్యాచ్‌లలో కఠిన సవాల్ ఎదురుకానందని చోప్రా తెలిపాడు."చెన్నై సూపర్ కింగ్స్ గరిష్టంగా 16 పాయింట్లకు చేరుకునే అవకాశం ఉంది. కానీ ఆ మార్కును అందుకోవాలంటే వారు ఆడబోయే తదుపరి రెండు మ్యాచ్‌ల్లోనూ ఖచ్చితంగా గెలవాలి. ఏ ఒక్క మ్యాచ్‌లో ఓడినా టోర్నీ నుండి నిష్క్రమించాల్సి వస్తుంది. గత మ్యాచ్‌లో ఘోర ఓటమి కారణంగా నెట్ రన్ రేట్ కూడా పడిపోయింది. అయితే మిగిలిన రెండు మ్యాచ్‌లలో సీఎస్కేకు గెలవడం అంత సులువు కాదు. ఈ సీజన్లో ఇప్పటివరకు ఏ పై జట్లనైతే ఓడించలేకపోయారో, ఇప్పుడు ప్లేఆఫ్స్ చేరాలంటే ఖచ్చితంగా ఆ పై జట్లనే ఇప్పుడు తప్పక గెలవాల్సిన పరిస్థితి ఏర్పడంది. గుజరాత్, హైదరాబాద్‌ల నుంచి మరోసారి గట్టి పోటీ చెన్నైకి ఎదురు కావడం ఖాయమని" చోప్రా తన యూట్యూబ్ ఛానల్లో పేర్కొన్నాడు. సీఎస్కే మే 18న ఎస్ఆర్హెచ్, మే 21న గుజరాత్ టైటాన్స్‌తో తలపడనుంది. -
గిల్ మెరుపులు వృథా.. గుజరాత్‌పై కేకేఆర్ విజయం
Gujarat titans vs Kolkata knight riders Live updates: ఈడెన్‌గార్డెన్స్ వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 29 పరుగుల తేడాతో కేకేఆర్ విజయం సాధించింది. 249 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 218 పరుగులు చేయగల్గింది.గుజరాత్ బ్యాటర్లలో శుభ్‌మన్ గిల్ (49 బంతుల్లో 5 ఫోర్లు, 7 సిక్స్‌లతో 85) టాప్ స్కోరర్‌గా నిలవగా.. బట్లర్(57), సాయిసుదర్శన్(53 నాటౌట్) రాణించారు. కేకేఆర్ బౌలర్లలో సునీల్ నరైన్ రెండు, దూబే, గ్రీన్ తలా వికెట్ సాధించారు.కేకేఆర్ రెండో వికెట్ డౌన్177 పరుగుల వద్ద కేకేఆర్ రెండో వికెట్ కోల్పోయింది. 85 పరుగులు చేసిన గిల్.. సునీల్ నరైన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు.రసవత్తరంగా జీటీ-కేకేఆర్ మ్యాచ్16 ఓవర్లు ముగిసే సరికి గుజరాత్ వికెట్ నష్టానికి 177పరుగులు చేసింది. క్రీజులో గిల్(85), జోస్ బట్లర్(50) ఉన్నారు.గిల్ హాఫ్ సెంచరీ12 ఓవర్లు ముగిసే సరికి గుజరాత్ వికెట్ నష్టానికి 121 పరుగులు చేసింది. క్రీజులో గిల్(52), జోస్ బట్లర్(29) ఉన్నారు.దూకుడుగా ఆడుతున్న గిల్9 ఓవర్లు ముగిసే సరికి గుజరాత్ వికెట్ నష్టానికి 92 పరుగులు చేసింది. క్రీజులో శుభ్‌మన్ గిల్(46), జోస్ బట్లర్(6) ఉన్నారు.కేకేఆర్ తొలి వికెట్ డౌన్49 పరుగుల వద్ద కేకేఆర్ తొలి వికెట్ కోల్పోయింది. కేవలం ఒక్క పరుగు చేసిన సింధు.. నరైన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు.గుజరాత్ టైటాన్స్‌కు భారీ షాక్గుజరాత్ టైటాన్స్‌కు భారీ షాక్ తగిలింది. ఇన్ ఫామ్ బ్యాటర్ సాయిసుదర్శన్(23) గాయం కారణంగా రిటైర్డ్ హార్ట్‌గా వెనుదిరిగాడు. 4 ఓవర్లు ముగిసే సరికి గుజరాత్ 49 పరుగులు చేసింది.గుజరాత్ ముందు భారీ టార్గెట్ఈడెన్ గార్డెన్స్ వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కేకేఆర్ బ్యాటర్లు విధ్వంసం సృష్టించారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన నైట్‌రైడర్స్ 2 వికెట్ల నష్టానికి 247 పరుగులు చేసింది. ఓపెనర్ ఫిన్ అలెన్ తుపాన్ ఇన్నింగ్స్ ఆడాడు. అలెన్ కేవలం 35 బంతుల్లోనే 4 ఫోర్లు, 10 సిక్స్‌లతో 93 పరుగులు చేశాడు. అతడితో పాటు అంగ్క్రిష్ రఘువంశీ(44 బంతుల్లో 4 ఫోర్లు, 7 సిక్స్‌లతో 82), కామెరూన్ గ్రీన్(52) హాఫ్ సెంచరీలతో సత్తచాటారు. గుజరాత్ బౌలర్లలో సిరాజ్,సాయి కిషోర్ తలా వికెట్ సాధించారు.భారీ స్కోర్ దిశగా కేకేఆర్అలెన్ ఔటైనప్పటికి గ్రీన్(35), రఘువంశీ(45) దూకుడుగా ఆడుతున్నారు.16 ఓవర్లకు కేకేఆర్ స్కోర్: 192/2ఫిన్ అలెన్ఫిన్ అలెన్ రూపంలో కేకేఆర్ రెండో వికెట్ కోల్పోయింది. కేవలం 35 బంతుల్లో 4 ఫోర్లు, 10 సిక్స్‌లతో 93 పరుగులు చేసిన అలెన్.. సాయికిషోర్ బౌలింగ్‌లో ఔటయ్యాడు.ఫిన్ అలెన్ హాఫ్ సెంచరీఫిన్ అలెన్ 21 బంతుల్లో తన హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. 8 ఓవర్లకు కేకేఆర్ స్కోర్: 85/1తొలి వికెట్ కోల్పోయిన కేకేఆర్ రహానే రూపంలో కేకేఆర్ తొలి వికెట్ కోల్పోయింది. 14 పరుగులు చేసిన రహానే.. సిరాజ్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు. 5 ఓవర్లకు కేకేఆర్ స్కోర్: 47/1ఆచితూచి ఆడుతున్న ఓపెనర్లు2 ఓవర్లు ముగిసే సరికి కేకేఆర్ వికెట్ నష్టపోకుండా 13 పరుగులు చేసింది. క్రీజులో అజింక్య రహానే(9), ఫిన్ అలెన్(4) ఉన్నారు.ఐపీఎల్-2026లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్, గుజరాత్ టైటాన్స్ జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన గుజరాత్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఇరు జట్లు చెరో మార్పుతో బరిలోకి దిగాయి. కేకేఆర్ జట్టులోకి వరుణ్ చక్రవర్తి తిరిగి రాగా.. గుజరాత్ టీమ్‌లోకి సాయి కిషోర్ వచ్చాడు. తుది జట్లుకోల్‌కతా నైట్ రైడర్స్ : అజింక్యా రహానే(కెప్టెన్), ఫిన్ అలెన్, అంగ్క్రిష్ రఘువంశీ(వికెట్ కీపర్), కామెరాన్ గ్రీన్, మనీష్ పాండే, రింకూ సింగ్, సునీల్ నరైన్, అనుకుల్ రాయ్, వరుణ్ చక్రవర్తి, సౌరభ్ దూబే, కార్తీక్ త్యాగిగుజరాత్ టైటాన్స్: సాయి సుదర్శన్, శుబ్‌మన్ గిల్(కెప్టెన్), జోస్ బట్లర్(వికెట్ కీపర్), నిశాంత్ సింధు, వాషింగ్టన్ సుందర్, జాసన్ హోల్డర్, రషీద్ ఖాన్, అర్షద్ ఖాన్, కగిసో రబడ, రవిశ్రీనివాసన్ సాయి కిషోర్, మహ్మద్ సిరాజ్ -
టీమిండియాలోకి ఎవరూ ఊహించని ప్లేయర్?
అఫ్గానిస్తాన్‌తో జరిగే ఏకైక టెస్టు, మూడు వన్డేల సిరీస్ కోసం భారత జట్టును బీసీసీఐ సెలక్షన్ కమిటీ మే 19న ప్రకటించనుంది. ఈ సందర్భంగా అజిత్ అగార్కర్ అండ్ కో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా అఫ్గాన్‌తో టెస్టుకు స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు సెలక్టర్లు విశ్రాంతి ఇవ్వనున్నట్లు సమాచారం.వన్డేల్లో మాత్రం బుమ్రా ఆడనున్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. వన్డే వరల్డ్‌కప్-2027 సన్నాహాకాల్లో భాగంగా ఈ సిరీస్ జరగనుంది. ఈ నేపథ్యంలో విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, బుమ్రా, రాహుల్ వంటి శ్రేయస్ అయ్యర్, వంటి స్టార్ ప్లేయర్లు బరిలోకి దిగనున్నారు.భారత జట్టులోకి ఆకిబ్ నబీ!ఇక దేశవాళీ క్రికెట్లో దుమ్ములేపుతున్న జమ్మూ కాశ్మీర్ పేసర్ ఆకిబ్ నబీ భారత టెస్ట్ జట్టులోకి రావడం దాదాపు ఖాయమైంది. బుమ్రా గైర్హజారీలో మొహ్మద్ సిరాజ్ పేస్ బౌలింగ్ ఎటాక్‌ను లీడ్ చేసే అవకాశముంది. అదేవిధంగా ఆకాష్ దీప్, హర్షిత్ ఇద్దరూ గాయపడటంతో ప్రసిద్ద్ కృష్ణ కూడా తిరిగి టెస్ట్ స్క్వాడ్‌లోకి రానున్నాడు. వీరితో పాటు ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి బంతిని పంచుకోనున్నాడు.భారత్ ఇద్దరు ఫ్రంట్‌లైన్ పేసర్లతోనే బరిలోకి దిగే అవకాశముంది. ఎందుకంటే ఉపఖండ పిచ్‌లపై స్పిన్నర్ల ఆధిపత్యం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్ వంటి స్పిన్నర్లు తుది జట్టులో ఉండడానికి అస్కారం ఉంది.ఇక బ్యాటింగ్ విషయానికి వస్తే సౌతాఫ్రికా సిరీస్‌లో విఫలమైన దేవ్‌దత్త్ పడిక్కల్‌కు సెలక్టర్ల మరో అవకాశమివ్వనున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా తమిళనాడు స్టార్ సాయిసుదర్శన్‌ను కూడా అఫ్గాన్ టెస్టుకు ఎంపిక చేయనున్నట్లు సమాచారం.ప్రిన్స్‌కు పిలుపు!మరోవైపు అఫ్గాన్‌తో వన్డే సిరీస్‌కు ఢిల్లీ స్పీడ్‌స్టర్ ప్రిన్స్ యాదవ్ పేరును సెలక్టర్లు పరిశీలిస్తున్నట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. ప్రిన్స్ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఐపీఎల్-2026లో లక్నో సూపర్ జెయింట్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న అతడు.. ఇప్పటివరకు 16 వికెట్లు పడగొట్టాడు. అదేవిధంగా దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలోనూ ప్రిన్స్ సత్తాచాటాడు. హర్షిత్ రాణా గాయపడడంతో అతడి స్ధానంలో ప్రిన్స్ పరీక్షించాలని బీసీసీఐ భావిస్తుందంట.చదవండి: గిల్, పృథ్వీ షాతో కలిసి ఆడాడు.. కట్ చేస్తే! ఇప్పుడు ఓ జట్టునే కొనేశాడు -
దిగ్గజాల సరసన చేరిన పాక్ వెటరన్ పేసర్
పాక్ వెటరన్ పేసర్ మొహమ్మద్ అబ్బాస్ తన దేశ దిగ్గజ పేసర్లైన వసీం అక్రమ్, వకార్ యూనిస్ సరసన చేరాడు. బంగ్లాదేశ్‌తో ఇవాళ (మే 16) మొదలైన రెండో టెస్ట్‌లో 3 వికెట్లు తీసిన అతడు.. విదేశీ గడ్డపై 100 టెస్ట్ వికెట్లు పూర్తి చేసుకున్న ఆరో పాకిస్తాన్ పేసర్‌గా రికార్డుల్లోకెక్కాడు. ఈ జాబితాలో వసీం అక్రమ్ (260) టాప్ ప్లేస్‌లో ఉండగా.. వకార్ యూనిస్ (211), ఇమ్రాన్ ఖాన్ (199), మొహమ్మద్ ఆమిర్ (119), ఉమర్ గుల్ (111) మొహమ్మద్ అబ్బాస్ కంటే ముందున్నారు.2017లో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన అబ్బాస్ ఇప్పటివరకు కేవలం 28 టెస్టులే ఆడినా, 51 ఇన్నింగ్స్‌ల్లో 109 వికెట్లు పడగొట్టాడు. అతని బౌలింగ్ సగటు 22.84గా ఉండటం విశేషం. అందులో 100 వికెట్లు విదేశీ పిచ్‌లపైనే రావడం అతని విదేశీ ప్రదర్శన ఎంత ప్రభావవంతంగా ఉందో చూపిస్తోంది.మ్యాచ్ విషయానికొస్తే.. రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా సిల్హెట్ వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్‌లో పాక్ బౌలర్లు చెలరేగారు. అబ్బాస్‌తో (3 వికెట్లు) పాటు ఖుర్రమ్ షెహజాద్ (4), హసన్ అలీ (2), సాజిద్ ఖాన్ (1) సత్తా చాటారు. వీరి ధాటికి బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 278 పరుగులకే ఆలౌటైంది. వాస్తవానికి బంగ్లాదేశ్ ఈపాటి స్కోర్ చేయడం కూడా చాలా గొప్పే. మిడిలార్డర్ బ్యాటర్ లిట్టన్ దాస్ (126) వీరోచిత శతకంతో బంగ్లాకు గౌరవప్రదమైన స్కోర్ అందించాడు. అతనికి మిగతా ఆటగాళ్ల నుంచి ఎలాంటి సహకారం లభించకపోయినా ఒంటరిపోరాటం చేశాడు.తంజిద్ హసన్ (26), మొమినుల్ హక్ (22), కెప్టెన్ నజ్ముల్ హసన్ షాంటో (23), తైజుల్ ఇస్లాం (16), ఫోరిఫుల్ ఇస్లాం (12 నాటౌట్) రెండంకెల స్కోర్లు చేయగలిగారు. మిగతా ఆటగాళ్లలో మెహిద్ హసన్ మిరాజ్ 4, తస్కిన్ అహ్మద్ 7 పరుగులు చేయగా.. మహ్మదుల్ హసన్ జాయ్, నహిద్ రాణా డకౌట్లయ్యారు.అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన పాక్.. తొలి రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 21 పరుగులు చేసింది. అజాన్ అవైస్ 13, అబ్దుల్లా ఫజల్ 8 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. బంగ్లా తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు పాక్ ఇంకా 257 పరుగులు వెనుకపడి ఉంది. కాగా, ఈ సిరీస్‌లోని తొలి టెస్ట్‌లో బంగ్లాదేశ్ పాక్‌పై 104 పరుగుల తేడాతో సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. -
పాక్‌తో రెండో టెస్ట్.. లిట్టన్ దాస్ వీరోచిత శతకం
సిల్హెట్ వేదికగా పాకిస్తాన్‌తో ఇవాళ (మే 16) మొదలైన రెండో టెస్ట్‌లో బంగ్లాదేశ్ జట్టు తడబడి నిలబడింది. లిట్టన్ దాస్ వీరోచితమైన పోరాటం చేయడంతో తొలి ఇన్నింగ్స్‌లో గౌరవప్రదమైన స్కోర్ (278 పరుగులు) చేయగలిగింది. పాక్ బౌలర్ల ధాటికి బంగ్లా టాపార్డర్ కుప్పకూలగా.. దాస్ ఒంటరిపోరాటం చేసి సూపర్ శతకంతో మెరిశాడు. ఓ పక్క సహచరులు పెవిలియన్‌కు క్యూ కడుతున్నా, దాస్ బాధ్యతాయుతంగా ఆడి జట్టు పతనాన్ని అడ్డుకున్నాడు. దాస్ 159 బంతుల్లో 16 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 126 పరుగులు చేసి 9వ వికెట్‌గా వెనుదిరిగాడు. దాస్ మినహా బంగ్లా ఇన్నింగ్స్‌లో ఒక్కరు కూడా చెప్పుకోదగ్గ స్కోర్ చేయలేదు. తంజిద్ హసన్ (26), మొమినుల్ హక్ (22), కెప్టెన్ నజ్ముల్ హసన్ షాంటో (23), తైజుల్ ఇస్లాం (16), ఫోరిఫుల్ ఇస్లాం (12 నాటౌట్) రెండంకెల స్కోర్లు చేయగలిగారు. మిగతా ఆటగాళ్లలో మెహిద్ హసన్ మిరాజ్ 4, తస్కిన్ అహ్మద్ 7 పరుగులు చేయగా.. మహ్మదుల్ హసన్ జాయ్, నహిద్ రాణా డకౌట్లయ్యారు. పాక్ బౌలర్లలో ఖుర్రమ్ షెహజాద్ 4, మొహమ్మద్ అబ్బాస్ 2, హసన్ అలీ 2, సాజిద్ ఖాన్ ఓ వికెట్ తీశారు.అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన పాక్.. తొలి రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 21 పరుగులు చేసింది. అజాన్ అవైస్ 13, అబ్దుల్లా ఫజల్ 8 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. బంగ్లా తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు పాక్ ఇంకా 257 పరుగులు వెనుకపడి ఉంది. కాగా, రెండు మ్యాచ్‌ల ఈ టెస్ట్ సిరీస్‌లో భాగంగా జరిగిన తొలి టెస్ట్‌లో బంగ్లాదేశ్ పాక్‌పై 104 పరుగుల తేడాతో సంచలన విజయం సాధించింది. -
సన్‌రైజర్స్ అభిమానులకు భారీ షాక్
ఐపీఎల్-2026లో మే 22న ఉప్పల్ మైదానం వేదికగా జరగనున్న సన్‌రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్‌కు భారీ డిమాండ్ ఏర్పడింది. ఈ సీజన్లో హైదరాబాద్‌లో ఇదే చివరి లీగ్ మ్యాచ్ కావడం, దానికి తోడు కింగ్ విరాట్ కోహ్లి బరిలోకి దిగనుండడంతో ఫ్యాన్స్ ఎగబడుతున్నారు. దీనిని క్యాష్ చేసుకునేందుకు ఎస్ఆర్హెచ్ యాజమాన్యం టికెట్ ధరలను ఏకంగా 50% నుండి 110% వరకు పెంచేసింది. ధరలు భారీగా పెరిగినప్పటికీ బుకింగ్స్ ఓపెన్ అయిన కొద్ది నిమిషాల్లోనే టికెట్లన్నీ అమ్ముడైపోయాయి. సన్‌రైజర్స్ యాజమాన్యం ఈ మ్యాచ్‌కు కనిష్ట టికెట్ ధరను రూ.1,950గా.. గరిష్ట ధరను ఏకంగా రూ.45,000గా నిర్ణయించింది. సౌత్ రెండో అంతస్తులోని కార్పొరేట్ బాక్సు టికెట్ ధర రూ.45,000 పలకడం విశేషం. గతంలో ఈ టికెట్ ధర రూ. 30,000గా ఉండేది. అలాగే వెస్ట్ రెండో అంతస్తు కార్పొరేట్ బాక్సు ధర రూ.30,000గా, ఆరెంజ్ ఆర్మీ ఈస్ట్, వెస్ట్ లాంజ్‌ల ధరను రూ.20,000గా నిర్ణయించారు. ఇక టికెట్లు దొరకని అభిమానుల అవసరాన్ని ఆసరాగా చేసుకుని సోషల్ మీడియా వేల రూపాయలకు టికెట్లను బ్లాక్‌లో అమ్ముతున్నారు. దీనిపై హైదరాబాద్ పోలీసులు సీరియస్ యాక్షన్ తీసుకుంటున్నారు. బ్లాక్ టికెట్ దందా చేస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.కాగా ప్రస్తుతం పాయింట్ల పట్టికలో అగ్రస్ధానంలో ఉన్న ఆర్సీబీ మరో విజయం సాధిస్తే అధికారికంగా ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధిస్తోంది. మరోవైపు ఎస్ఆర్హెచ్ గత మ్యాచ్‌లో గుజరాత్ చేతిలో ఓడిపోయి గట్టి షాక్ తింది.ప్లేఆఫ్స్ రేసులో నిలవాలంటే ఈ మ్యాచ్ వాళ్లకు చావో రేవో లాంటిది.చదవండి: గిల్, పృథ్వీ షాతో కలిసి ఆడాడు.. కట్ చేస్తే! ఇప్పుడు ఓ జట్టునే కొనేశాడు -
గిల్, పృథ్వీ షాతో కలిసి ఆడాడు.. కట్ చేస్తే! ఇప్పుడు ఓ జట్టునే కొనేశాడు
మన్జోత్ కల్రా.. ఈ క్రికెటర్ గురుంచి చాలా మందికి తెలియకపోవచ్చు. కానీ 2018 అండర్-19 ప్రపంచకప్‌ను భారత్ సొంతం చేసుకోవడంలో అతడిది కీలక పాత్ర. ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్లో అద్భుతమైన సెంచరీ సాధించి టీమిండియాను మన్జోత్ ఛాంపియన్‌గా నిలిపాడు.ఆ టోర్నమెంట్ సమయంలో పృథ్వీ షా, శుభమన్ గిల్ వంటి స్టార్లతో సమానంగా మన్జోత్ కల్రా పేరు కూడా మారుమోగింది. భారత క్రికెట్‌కు మరో సూపర్ స్టార్ దొరికాడని అంతా భావించారు. ఆ టోర్నీ తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ (అప్పట్లో ఢిల్లీ డేర్‌డెవిల్స్) అతన్ని ఐపీఎల్ కోసం కొనుగోలు చేసింది. అయితే 2019లో ఢిల్లీ తరఫున అరంగేట్రం చేసిన కొద్దికాలానికే అతడి కెరీర్ ఊహించని మలుపులు తిరిగింది. వయస్సులో అవకతవకలు జరిగాయనే ఆరోపణలతో కల్రాపై ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్ ఏడాది పాటు నిషేధం విధించింది. ఆ తర్వాత పునరాగనమం చేసినప్పటికి అతడు రాణించలేకపోయాడు. మన్జోత్ కల్రా చివరగా ఢిల్లీ తరపున 2021లో లిస్ట్-ఏ క్రికెట్లో ఆడాడు.ఫ్రాంచైజీ ఓనర్‌గా కల్రాఅయితే మన్జోత్ కల్రా మళ్లీ ఇప్పుడు ఐదేళ్ల తర్వాత క్రికెట్ ప్రపంచంలో సరికొత్త పాత్రలో కన్పించేందుకు సిద్దమయ్యాడు. లంక ప్రీమియర్ లీగ్‌లో జాఫ్నా కింగ్స్ ఫ్రాంచైజీకి సహ-యజమానిగా అతడు మారాడు. మన్జోత్ .. ప్రముఖ పారిశ్రామికవేత్త మయాంక్ గోయెల్‌తో కలిసి 'స్పోర్ట్స్ కమ్యూన్' అనే సంస్థ ద్వారా జాఫ్నా కింగ్స్ జట్టులో వాటాలను కొనుగోలు చేశాడు.ఫ్రాంచైజీకి సంబంధించిన వ్యూహాలు, ఆటగాళ్ల ఎంపిక, ఆపరేషన్స్ బాధ్యతలను కల్రా పర్యవేక్షించనున్నాడు. లంక ప్రీమియర్ లీగ్-2026 సీజన్ జూలై 17 నుంచి ప్రారంభం కానుంది.చదవండి: అప్పటి నుంచి ధోని అస్సలు నచ్చలేదు: గంగూలీ -
ఇదంతా నాన్సెన్స్!.. సౌతాఫ్రికా దిగ్గజం ఫైర్
చెన్నై సూపర్ కింగ్స్‌తో మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ పేసర్ ఆకాశ్ మహరాజ్ సింగ్ అద్భుత ప్రదర్శన కనబరిచాడు. నాలుగు ఓవర్ల కోటా పూర్తి చేసిన ఈ లెఫ్టార్మ్ ఫాస్ట్ బౌలర్.. 26 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు కూల్చాడు.తన అద్భుత స్పెల్‌తో చెన్నై టాపార్డర్‌ను ఆకాశ్ సింగ్ కుదేలు చేశాడు. ఓపెనర్లు సంజూ శాంసన్ (20), రుతురాజ్ గైక్వాడ్ (13).. వన్‌డౌన్ బ్యాటర్ ఉర్విల్ పటేల్ (6)ను పెవిలియన్‌కు పంపి చెన్నైని నామమాత్రపు స్కోరు (187)కు పరిమితం చేయడంలో కీలక పాత్ర పోషించాడు.క్రీడా వర్గాల్లో చర్చఅయితే, కీలక వికెట్లు తీసిన సంతోషంలో ఆకాశ్ సింగ్ సెలబ్రేషన్స్ చేసుకున్న తీరు క్రీడా వర్గాల్లో చర్చకు దారితీసింది. ‘‘అక్కీ ఆన్ ఫైర్.. టీ20 మ్యాచ్‌లో వికెట్లు ఎలా తీయాలో ఆకాశ్‌కు తెలుసు’’ అని రాసి ఉన్న నోట్ చూపించాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు వైరల్ అయ్యాయి.అప్పటి నుంచి..ఈ నేపథ్యంలో ఆకాశ్ సింగ్ చర్యపై విమర్శల వర్షం కురుస్తోంది. ‘పేపర్ ట్రెండ్’ మానుకుంటే మంచిదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాగా 2025లో సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్ అభిషేక్ శర్మ.. ‘‘ఇది ఆరెంజ్ ఆర్మీ కోసం’’ అంటూ తన విధ్వంసకర ఇన్నింగ్స్‌ను అభిమానులకు అంకితమిస్తూ నోట్ చూపించాడు.అప్పటి నుంచి ఈ ట్రెండ్ మొదలైంది. ఇక ఇటీవల ముంబై ఇండియన్స్ బౌలర్ రఘు శర్మ సైతం ఇదే తరహాలో నోట్ చూపిస్తూ సెలబ్రేట్ చేసుకున్నాడు. గత మ్యాచ్‌లో చెన్నై స్టార్ ఉర్విల్ పటేల్ సైతం.. ‘‘ఈ ఇన్నింగ్స్ నీకోసమే నాన్నా’’ అని రాసి ఉన్న పేపర్ చూపించాడు. తాజాగా ఆకాశ్ ఇదే పనిచేశాడు.నిజం చెప్పాలంటేఈ నేపథ్యంలో సౌతాఫ్రికా దిగ్గజ పేసర్ డేల్ స్టెయిన్ ఘాటుగా స్పందించాడు. ‘‘ఈ పేపర్లను పక్కనపెట్టాల్సిన సమయం వచ్చింది. ఇకపై ఇదేమీ ట్రెండ్ కాబోదు. నిజం చెప్పాలంటే గతంలోనూ దీనిని ట్రెండ్‌గానూ ఎవరూ గుర్తించలేదు’’ అని ఎక్స్ వేదికగా తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు.ఇక భారత మాజీ క్రికెటర్ అంబటి రాయుడు ఈఎస్పీఎన్క్రిక్ఇన్ఫోతో మాట్లాడుతూ.. ‘‘అతడి అభివ్యక్తి అది. అయితే, చాలా మందికి ఇది నచ్చలేదు. ఇదొక రకంగా సరదాగా.. అదే సమయంలో చెత్తగా ఉంది.ఇదంతా నాన్సెన్స్ఈ చిట్టీల బిజినెస్‌ను నిషేధించాలి. ఇదంతా నాన్సెన్స్. వాళ్లు మైదానంలోకి ఇలా చిట్టీలు తీసుకురావడం నాకైతే నచ్చడం లేదు’’ అని పేర్కొన్నాడు. ఇదిలా ఉంటే.. విమర్శలపై ఆకాశ్ సింగ్ స్పందించాడు.‘‘నాకు ఇలా చేయడం స్ఫూర్తినిస్తుంది. అంతే తప్ప మైదానంలోకి నోట్ తీసుకురావడంలో వేరే ఉద్దేశం లేదు. మ్యాచ్ సమయంలో నాకు స్ఫూర్తినిచ్చే వాటిని నేను వదిలేయలేను’’ అని ఆకాశ్ సింగ్ పేర్కొన్నాడు. చదవండి: అప్పటి నుంచి ధోని అస్సలు నచ్చలేదు: గంగూలీ -
త్వరలో భారత్-పాక్ టెస్ట్ సిరీస్..?
క్రికెట్ అభిమానులకు శుభవార్త. భారత్-పాక్ మధ్య టెస్ట్ మ్యాచ్‌లు మళ్లీ మొదలుకానున్నాయని ప్రచారం జరుగుతుంది. ఈ దిశగా ఐసీసీ అడుగులు వేస్తున్నట్లు తెలుస్తుంది. త్వరలో ఐసీసీ నిర్వహించబోయే కీలక సమావేశాల్లో ఈ అంశంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ భవిష్యత్ నిర్మాణంపై చర్చించేందుకు ఐసీసీ ఈ నెలాఖర్లో (మే 30, 31) అహ్మదాబాద్‌లో బోర్డు సమావేశాలు నిర్వహించనుంది. ఈ సమావేశాల్లో టెస్టు క్రికెట్ విస్తరణతో పాటు భారత్, పాక్ మధ్య ద్వైపాక్షిక టెస్టు సిరీస్ పునరుద్ధరణ అంశం ప్రధాన చర్చగా మారే అవకాశముంది. ఈ సమావేశాలకు బీసీసీఐ, పీసీబీ అధ్యక్షులు హాజరవుతారు. పీసీబీ చీఫ్ నఖ్వీ ఈ మీటింగ్‌కు వర్చువల్‌గా అటెండ్ అవుతాడని తెలుస్తుంది.కాగా, భారత్, పాక్ మధ్య మళ్లీ టెస్టు సిరీస్ జరగొచ్చన్న చర్చ ఇరు దేశాల క్రికెట్ అభిమానుల్లో ఆసక్తి రేపుతోంది. ఇటీవల బంగ్లాదేశ్ పర్యటనలో నక్వీ మాట్లాడుతూ.. తదుపరి ఫ్యూచర్ టూర్స్ ప్రోగ్రామ్‌లో అన్ని దేశాలతో టెస్టులు ఆడేందుకు సిద్ధంగా ఉన్నామని వ్యాఖ్యానించారు. దీంతో భారత్‌తో టెస్టు సిరీస్‌పై ఊహాగానాలు మరింత పెరిగాయి.భారత్, పాక్ చివరిసారిగా 2007-08లో టెస్టు సిరీస్ ఆడాయి. ఆ తర్వాత రెండు దేశాల మధ్య రాజకీయ ఉద్రిక్తతల కారణంగా ద్వైపాక్షిక టెస్టు క్రికెట్ పూర్తిగా నిలిచిపోయింది. ప్రస్తుతం ఐసీసీ సమావేశాల్లో దీనిపై ప్రత్యక్ష నిర్ణయం వచ్చే అవకాశం లేకపోయినా, భవిష్యత్ చర్చలకు ఇది బాటలు వేయొచ్చని క్రికెట్ వర్గాలు భావిస్తున్నాయి.12 జట్లుటెస్టు క్రికెట్ భవిష్యత్‌పై అధ్యయనం చేసేందుకు ఐసీసీ గతేడాదే మాజీ న్యూజిలాండ్ క్రికెటర్ రోజర్ ట్వోస్ ఆధ్వర్యంలో ప్రత్యేక వర్కింగ్ గ్రూప్‌ను ఏర్పాటు చేసింది. ఈ కమిటీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌ను ప్రస్తుతం ఉన్న 9 జట్ల నుంచి 12 జట్లకు విస్తరించాలని సూచించినట్లు సమాచారం. ఈ ప్రతిపాదనకు ఆమోదం లభిస్తే ఆఫ్ఘనిస్తాన్, జింబాబ్వే, ఐర్లాండ్ వంటి జట్లకు కూడా డబ్ల్యూటీసీలో చోటు దక్కే అవకాశం ఉంటుంది.ఒకే టెస్ట్‌తో సిరీస్‌ఈ సమావేశాల్లో ఒకే టెస్టుతో సిరీస్ నిర్వహించే ప్రతిపాదన కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ప్రతి డబ్ల్యూటీసీ సిరీస్‌లో కనీసం రెండు టెస్టులు తప్పనిసరి. అయితే చిన్న క్రికెట్ బోర్డుల ఆర్థిక భారం తగ్గించేందుకు, మరిన్ని జట్లకు టెస్టు అవకాశాలు కల్పించేందుకు ఒకే టెస్టు సిరీస్ మోడల్‌పై ఐసీసీ ఆలోచిస్తున్నట్లు సమాచారం. -
సీఎస్కేకు షాకిచ్చింది.. రాజస్థాన్, పంజాబ్ లైన్లో ఉన్నాయి..!
ఐపీఎల్ 2026 ప్లే ఆఫ్స్ రేసు రసవత్తరంగా సాగుతోంది. సీజన్ ఆరంభంలో సునాయాసంగా బెర్త్‌లు దక్కించుకుంటాయని భావించిన పలు జట్లు అనూహ్యంగా రేసులో వెనుకపడిపోగా.. అడపాదడపా విజయాలతో సీజన్‌ను ప్రారంభించిన కొన్ని జట్లు అమాంతం రేసులో ముందుకొచ్చాయి.సీజన్ ప్రారంభంలో ఇరగదీసి, ఆతర్వాత చప్పపడిపోయిన జట్లుగా పంజాబ్, రాజస్థాన్ రాయల్స్ ఉండగా.. సీజన్‌ను గొప్పగా ప్రారంభించలేకపోయినా, ఆతర్వాత అనూహ్యంగా పుంజుకున్న జట్లుగా గుజరాత్, సన్‌రైజర్స్ ఉన్నాయి. మధ్యస్తంగా ప్లే రేసును కొనసాగిస్తున్న జట్టుగా ఆర్సీబీ నిలిచింది. ఈ ఐదు జట్లే కాకుండా ప్లే ఆఫ్స్ రేసులో బలంగా ఉన్న మరో జట్టు సీఎస్కే. ఈ జట్టు సీజన్‌ను వరుస పరాజయాలతో ప్రారంభించి, ఆతర్వాత అమాంత ప్లే ఆఫ్స్ రేసులోకి దూసుకొచ్చింది.అయితే తాజాగా లక్నోతో జరిగిన మ్యాచ్‌లో ఓడటం ద్వారా సీఎస్కే ప్లే ఆఫ్స్ అవకాశాలు సంక్లిష్టంగా మారాయి. ఈ జట్టు తదుపరి ఆడాల్సిన రెండు మ్యాచ్‌ల్లో (ఎస్ఆర్హెచ్, గుజరాత్) గెలిస్తేనే రేసులో ఉంటుంది. ఒక్క మ్యాచ్‌లో ఓడినా రేసు నుంచి నిష్క్రమిస్తుంది.ఇదిలా ఉంటే, ప్లే ఆఫ్స్ రేసు నుంచి ఇదివరకే నిష్క్రమించి పనిలేకుండా పోయిన లక్నో సూపర్ జెయింట్స్, ప్రస్తుతం రేసులో ఉన్న జట్లను ఇబ్బంది పెట్టడం పనిగా పెట్టుకుంది. ఇప్పటికే సీఎస్కేను ఓడించి ఓ దెబ్బేసిన ఆ జట్టు.. తదుపరి టార్గెట్లుగా రాజస్థాన్, పంజాబ్‌లను పెట్టుకుంది. ఈ రెండు జట్లతోనే లక్నో తమ చివరి ఐపీఎల్ 2026 మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది.ఈ మ్యాచ్‌ల వల్ల లక్నోకు ఒరిగేదేమీ లేకపోయినా పంజాబ్, రాజస్థాన్ జట్లకు మాత్రం ప్రాణసంకటంగా మారింది. తొలుత ప్లే ఆఫ్స్ రేసులో దూసుకొచ్చి, ఆతర్వాత అమాంతం పడిపోయిన పంజాబ్‌కు లక్నోతో మ్యాచ్ డు ఆర్ డై పరిస్థితి. ఈ మ్యాచ్‌తో పాటు ఆర్సీబీతో జరుగబోయే మ్యాచ్‌లో గెలిస్తేనే ఆ జట్టు ప్లే ఆఫ్స్ రేసులో ఉంటుంది. ఈ రెంటిలో ఒక్కటి ఓడినా ఖేల్ ఖతమైనట్లే. ఇప్పటికే సీఎస్కేకు ఝలక్ ఇచ్చిన లక్నోను చూసి పంజాబ్ జట్టు బిత్తరపోతుంది.ప్రస్తుతం లక్నోను చూసి జడుసుకుంటున్న మరో జట్టు రాజస్థాన్. ఈ జట్టు ప్లే ఆఫ్స్‌కు చేరాలంటే తదుపరి ఆడాల్సిన 3 మ్యాచ్‌ల్లో గెలవాల్సి ఉంటుంది. వీటిలో లక్నోతో ఆడబోయే మ్యాచ్ రాజస్థాన్‌కు కీలకం కానుంది. రాజస్థాన్.. లక్నోతో పాటు ఢిల్లీ, ముంబై ఇండియన్స్‌పై గెలిస్తే ఇతర జట్లతో సంబంధం లేకుండా ప్లే ఆఫ్స్ బెర్త్ సొంతం చేసుకుంటుంది.కాగా, ప్లే ఆఫ్స్ రేసు నుంచి ఇదివరకే నిష్క్రమించిన లక్నో ప్రస్తుతం పంజాబ్, రాజస్థాన్ జట్లకు సింహస్వప్నంగా మారింది. లక్నోను చూసి ఈ రెండు జట్లు జడుసుకుంటున్నాయి. ఇప్పటికే సీఎస్కేను ఇరకాటంలో పడేసని లక్నో.. తమతో పాటు పంజాబ్, రాజస్థాన్‌ను కూడా ఇంటికి తీసుకుపోదామని భావిస్తుంది. సీఎస్కే మ్యాచ్‌లో లక్నో ఆటగాళ్లు ఆడిన తీరు చూస్తే ఈ విషయం స్పష్టంగా అర్దమవుతుంది. -
టీ20 ప్రపంచకప్‌కు పాక్ జట్టు ప్రకటన
ఇంగ్లండ్ అండ్ వేల్స్ వేదికగా జూన్ 12 నుంచి జూలై 5 వరకు జరిగే మహిళల టీ20 ప్రపంచకప్ 2026 కోసం 15 సభ్యుల పాకిస్తాన్ జట్టును ఇవాళ (మే 16) ప్రకటించారు. ఈ జట్టుకు కెప్టెన్‌గా ఫాతిమా సనాను నియమించారు. వరుసగా రెండోసారి సనానే టీ20 ప్రపంచకప్‌లో పాక్ జట్టును నడిపించనుంది.ఈ పాక్ జట్టులో పలువురు ప్లేయర్లు తొలిసారి ప్రపంచకప్ ఆడుతున్నారు. ఎమాన్ ఫాతిమా, నతాలియా పర్వేజ్, రమీన్ షమీమ్, సైరా జబీన్, తస్మియా రుబాబ్కు ఇదే తొలి వరల్డ్‌కప్.మెగా టోర్నీలో పాక్ గుల్ ఫిరోజా, మునీబా అలీ, అయేషా జాఫర్‌పై భారీ ఆశలు (బ్యాటింగ్‌లో) పెట్టుకుంది. తాజాగా జింబాబ్వేతో జరిగిన సిరీస్‌లో ఆయేషా జాఫర్, ఫాతిమా సనా మంచి ఫామ్‌లో ఉండటం పాక్‌కు అదనంగా కలిసొచ్చే అంశం.స్పిన్ విభాగంలో సదియా ఇక్బాల్, నష్రా సంధు, తుబా హసన్ కీలక పాత్ర పోషించనుండగా.. పేస్ విభాగాన్ని ఫాతిమా సనా, డయానా బేగ్ ముందుండి నడిపించనున్నారు.ఈ ప్రపంచకప్‌లో పాక్ గ్రూప్-1లో ఉంది. ఈ గ్రూప్‌లో భారత్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, బంగ్లాదేశ్, నెదర్లాండ్స్ వంటి బలమైన జట్లు ఉన్నాయి.పాక్ జట్టు జూన్ 14న బర్మింగ్‌హామ్‌లో చిరకాల ప్రత్యర్థి భారత్‌తో జరిగే మ్యాచ్‌తో వరల్డ్‌కప్ ప్రయాణాన్ని ప్రారంభించనుంది. అనంతరం దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్, ఆస్ట్రేలియా, నెదర్లాండ్స్‌తో గ్రూప్ దశ మ్యాచ్‌లు ఆడనుంది.గ్రూప్ దశ మ్యాచ్‌లకు ముందు పాక్ రెండు వార్మప్ మ్యాచ్‌లు కూడా ఆడనుంది. జూన్ 6న శ్రీలంకతో, జూన్ 9న స్కాట్లాండ్తో తలపడనుంది. ఈ రెండు మ్యాచ్‌లు డెర్బీ వేదికగా జరుగనున్నాయి.ప్రపంచకప్‌కు ముందు పాక్..వెస్టిండీస్‌తో కలిసి ఐర్లాండ్‌లో జరిగే టీ20 ట్రై సిరీస్‌లో పాల్గొననుంది. ఈ టోర్నీలో మే 29న వెస్టిండీస్‌తో తొలి మ్యాచ్ ఆడనున్న పాక్, మే 31న ఐర్లాండ్‌ను ఎదుర్కొంటుంది. అనంతరం జూన్ 3న మళ్లీ వెస్టిండీస్‌తో, జూన్ 4న ఐర్లాండ్‌తో తలపడుతుంది. ప్రపంచకప్ కోసం ఎంపిక చేసిన జట్టే ఈ టోర్నీలోనూ కొనసాగనుంది. కాగా, తాజాగా జింబాబ్వేతో జరిగిన వన్డే, టీ20 సిరీస్‌ల్లో పాక్ ఘన విజయాలు సాధించింది. ఈ రెండు సిరీస్‌లను 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది.పాక్ జట్టు: ఫాతిమా సనా (సి), అలియా రియాజ్, అయేషా జాఫర్, డయానా బేగ్, ఈమాన్ ఫాతిమా, గుల్ ఫిరోజా, ఇరామ్ జావేద్, మునీబా అలీ (WK), నష్రా సంధు, నటాలియా పర్వైజ్, రమీన్ షమీ, సాదియా ఇక్బాల్, సైరా జబీన్, తస్మియా రుబాబ్, తస్మియా రుబాబ్రిజర్వ్లు: అంబర్ కైనాట్, మోమినా రియాసత్, సదాఫ్ షమాస్, సిద్రా అమీన్, సయ్యదా అరూబ్ షా మరియు ఉమ్-ఎ-హని -
అప్పటి నుంచి ధోని అస్సలు నచ్చలేదు: గంగూలీ
టీమిండియా దిగ్గజ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. జాతీయ జట్టులోకి వచ్చిన అనతికాలంలోనే సారథిగా ఎదిగిన ఈ ‘జార్ఖండ్ డైనమైట్’.. అద్భుతమైన విజయాలు సాధించాడు.అత్యధికంగా మూడు ఐసీసీ టైటిళ్లుధోని సారథ్యంలో 2007లో ఐసీసీ తొలిసారి ప్రవేశపెట్టిన టీ20 ప్రపంచకప్ ట్రోఫీని భారత్ గెలిచింది. అనంతరం 2011లో సొంతగడ్డపై టీమిండియాకు వన్డే వరల్డ్‌కప్ అందించాడు ధోని. ఆ తర్వాత అతడి కెప్టెన్సీలోనే భారత్ 2013 నాటి చాంపియన్స్ ట్రోఫీ గెలుచుకుంది.ఈ క్రమంలో భారత క్రికెట్ చరిత్రలో జట్టుకు అత్యధికంగా మూడు ఐసీసీ టైటిళ్లు అందించిన కెప్టెన్‌గా ధోనీ (MS Dhoni) నేటికీ కొనసాగుతున్నాడు. అయితే, 2019 వన్డే వరల్డ్‌కప్ టోర్నీలో తన ప్రదర్శనపై అసంతృప్తి చెందిన ధోని.. ఆ తర్వాత కెప్టెన్సీ వదిలేశాడు. ఆ మరుసటి ఏడాదే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు.అప్పుడు నేనే కెప్టెన్ఈ నేపథ్యంలో భారత జట్టు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ధోనిని ఉద్దేశించి తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రాజ్ షమానీ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ.. ‘‘ఎంఎస్ ధోని మాదిరి సిక్సర్లు బాదిన ఆటగాడిని అరుదుగా చూస్తుంటాం. అతడు టీమిండియాలోకి వచ్చినపుడు నేనే కెప్టెన్‌గా ఉన్నాను.అప్పటి నుంచి ధోని అస్సలు నచ్చలేదుఅప్పట్లో అతడు చాలా సిక్సర్లు బాదేవాడే. అయితే, ఆ తర్వాత ధోని ఆట తీరు నాకు నచ్చలేదు. అతడి కెరీర్లో ఆటగాడిగా మొదటి దశ మాత్రమే నాకు నచ్చింది. రెండో దశ అస్సలు నచ్చలేదు.మొదట్లో అయితే సరదా కోసం అలవోకగా సిక్సర్లు బాదేవాడు. బ్యాట్ పట్టుకుని మైదానంలోకి దిగాడంటే కనీసం ఒక్క సిక్స్ అయినా కొట్టేవాడు. కానీ ఆ తర్వాత సింగిల్స్, డబుల్స్‌కి ప్రాధాన్యం ఇచ్చాడు. ఏదేమైనా అతడు గొప్ప ఆటగాడిగా.. దిగ్గజ కెప్టెన్‌గా ఎదిగిన తీరు ప్రశంసనీయం’’ అని గంగూలీ చెప్పుకొచ్చాడు.44 ఏళ్ల వయసులోనూకాగా 44 ఏళ్ల వయసులోనూ క్రికెట్ కెరీర్ కొనసాగిస్తున్నాడు ధోని. ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్‌ను ఐదుసార్లు చాంపియన్‌గా నిలిపిన తలా.. ప్రస్తుతంగా ఆటగాడిగా కొనసాగుతున్నాడు. అయితే, ఈ ఏడాది మోకాలి గాయం ఇంత వరకు ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. లీగ్ దశలో చెన్నైకి ఇంకా రెండు మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. ఈ సీజన్లో ధోని ఆడటం కష్టమే.చదవండి: Ruturaj Gaikwad: మా ఓటమికి కారణం వాళ్లే -
నీ సంగతి చూసుకో!.. షాహిన్ ఆఫ్రిదిపై వేటు
బంగ్లాదేశ్ పర్యటనలో ఆదిలోనే పాకిస్తాన్ జట్టుకు చేదు అనుభవం ఎదురైంది. ఆతిథ్య జట్టుతో తొలి టెస్టులో షాన్ మసూద్ బృందం ఏకంగా 104 పరుగుల తేడాతో చిత్తుగా ఓడింది. మరోవైపు సొంతగడ్డపై బంగ్లాదేశ్ తొలిసారి పాక్‌పై టెస్టు గెలిచి చరిత్ర సృష్టించింది.ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య నిర్ణయాత్మక రెండో టెస్టు శనివారం మొదలైంది. ఈ మ్యాచ్‌లో గెలిచి వైట్‌వాష్‌తో రికార్డు విజయం సాధించాలని బంగ్లాదేశ్ ఉవ్విళ్లూరుతుండగా.. పరువు కోసం పాక్ పాకులాడుతోంది.అయితే, రెండో టెస్టు ఆరంభానికి ముందు పాక్ జట్టులో కలకలం రేగింది. కెప్టెన్ షాన్ మసూద్, ప్రధాన పేసర్ షాహిన్ ఆఫ్రిది మధ్య గొడవ జరిగినట్లు సమాచారం. బంగ్లాతో తొలి టెస్టులో ఆఫ్రిది 3.5 ఎకానమీతో మొత్తంగా ఐదు వికెట్లు కూల్చాడు.షాన్ మసూద్ అసంతృప్తిఅయితే, ఆఫ్రిది ప్రదర్శనపై షాన్ మసూద్ అసంతృప్తి వెళ్లగక్కినట్లు సమాచారం. ఇంకా మెరుగ్గా ఆడాలని డ్రెసింగ్‌రూమ్‌లోనే అతడికి క్లాస్ పీకినట్లు తెలుస్తోంది. ఇందుకు షాహిన్ ఆఫ్రిది కూడా గట్టిగానే బదులిచినట్లు సమాచారం.నీ సంగతి చూసుకో..‘‘ముందు నీ సంగతి చూసుకో.. ముందుండి జట్టును నడిపించు.. బ్యాటింగ్‌పై శ్రద్ధ పెట్టు’ అని ఆఫ్రిది మసూద్‌కు కౌంటర్ ఇచ్చినట్లు టెలికామ్ ఆసియా స్పోర్ట్ కథనం పేర్కొంది. కాగా షాహిన్ ఆఫ్రిది ప్రవర్తనను తీవ్రంగా పరిగణించిన జట్టు యాజమాన్యం అతడిపై వేటు వేసింది.మెరుగ్గా ఆడినప్పటికీ.. వేటుబంగ్లాదేశ్తో రెండో టెస్టు తుదిజట్టులో ఆఫ్రిదికి చోటే ఇవ్వలేదు. సెల్హైట్ వేదికగా శనివారం టాస్ గెలిచిన సందర్భంగా షాన్ మసూద్ మాట్లాడుతూ.. ‘‘మా తుదిజట్టులో మూడు మార్పులు చేశాము. ఇమామ్ స్థానంలో బాబర్, నొమన్కు బదులు సాజిద్ ఖాన్.. అదే విధంగా షాహిన్‌కు బదులు ఖుర్రం వచ్చారు’’ అని తెలిపాడు.అయితే, గత మ్యాచ్‌లో మెరుగ్గా ఆడినప్పటికీ.. షాహిన్ ఆఫ్రిదిని తప్పించడంపై మాత్రం మసూద్ ఎలాంటి వివరణా ఇవ్వలేదు. కాగా త్వరలోనే పాక్ బోర్డు సెంట్రల్ కాంట్రాక్టులు విడుదల చేయనుంది. ఇలాంటి తరుణంలో షాహిన్ ఆఫ్రిది కెప్టెన్‌తో గొడవపడి తుదిజట్టులో స్థానం కోల్పోయాడు. సెంట్రల్ కాంట్రాక్టు విషయంలోనూ అతడిపై వేటు పడే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.చదవండి: పాకిస్తాన్‌కు భారీ షాకిచ్చిన ఐసీసీ!.. ఇక కష్టమే.. -
భారత్, పాక్‌ను ఏకతాటిపైకి తెచ్చిన జై షా
ఐసీసీ అధ్యక్షుడు జై షా ఓ ప్రత్యేక మిషన్ కోసం భిన్న ధృవాలుగా ఉన్న భారత్, పాకిస్తాన్లను ఏకతాటిపైకి తెచ్చారు. శ్రీలంక క్రికెట్లో నెలకొన్న పరిపాలనా సంక్షోభాన్ని పరిష్కరించేందుకు ఇరు దేశాలకు చెందిన ఉన్నత స్థాయి అధికారులను శ్రీలంకకు పంపారు.ఇటీవల స్వదేశంలో జరిగిన టీ20 వరల్డ్‌కప్‌లో శ్రీలంక క్రికెట్ జట్టు ఘోర ప్రదర్శనలు చేసి, సూపర్-8 దశలోనే నిష్క్రమించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ జట్టుపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ వైఫల్యాలకు బాధ్యత వహిస్తూ హెడ్ కోచ్ సనత్ జయసూర్య తన పదవికి రాజీనామా చేశారు.దీంతో శ్రీలంక ప్రభుత్వం జోక్యం చేసుకుని క్రికెట్ వ్యవస్థపై విచారణ ప్రారంభించింది. అధ్యక్షుడు అనుర కుమార డిస్సనాయకేతో సమావేశమైన తర్వాత అప్పటి ఎస్ఎల్సీ అధ్యక్షుడు షమ్మీ సిల్వ రాజీనామా చేశారు. అనంతరం క్రీడాశాఖ మంత్రి సునీల్ కుమార గమగే తొమ్మిది మంది సభ్యులతో క్రికెట్ ట్రాన్స్ఫర్మేషన్ కమిటీని ఏర్పాటు చేశారు.ఈ కమిటీలో మాజీ కెప్టెన్లు కుమార సంగక్కర, రోషన్ మహానామా, సిదాత్ వెట్టిముని వంటి ప్రముఖులు సభ్యులుగా ఉన్నారు. ప్రతిపక్ష నేత ఎరన్ విక్రమరత్నే ఈ కమిటీకి నాయకత్వం వహిస్తున్నారు. శ్రీలంక క్రికెట్ పరిపాలనలో పారదర్శకత తీసుకురావడం, నిర్మాణాత్మక సంస్కరణలు అమలు చేయడం ఈ కమిటీ లక్ష్యంగా పెట్టుకుంది.ఈ పరిస్థితిని సమీక్షించేందుకు ఐసీసీ భారత్-పాక్ ప్రతినిధులతో కూడిన ప్రత్యేక బృందాన్ని శ్రీలంకకు పంపింది. ఇందులో పాకిస్తాన్ మూలాలున్న ఐసీసీ డిప్యూటీ ఛైర్మన్ ఇమ్రాన్ ఖ్వాజా, బీసీసీఐకి చెందిన సీనియర్ అధికారి ఉన్నారు. -
టీ20ల్లో ఫాస్టెస్ట్ ఫిఫ్టి.. పాక్ కెప్టెన్ ప్రపంచ రికార్డు
పాకిస్తాన్ మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ ఫాతిమా సనా టీ20 క్రికెట్లో సరికొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పింది. నిన్న (మే 15) జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో 15 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసిన ఆమె.. అంతర్జాతీయ మహిళల టీ20 క్రికెట్లో అత్యంత వేగవంతమైన అర్ద సెంచరీ నమోదు చేసిన ప్లేయర్‌గా రికార్డుల్లోకెక్కింది. గతంలో ఈ రికార్డు న్యూజిలాండ్‌కు చెందిన సోఫీ డివైన్, ఆస్ట్రేలియాకు చెందిన ఫోబ్ లిచ్‌ఫీల్డ్, భారత్‌కు చెందిన రిచా ఘోష్ పేరిట సంయుక్తంగా ఉండేది. ఈ ముగ్గురు 18 బంతుల్లో హాఫ్ సెంచరీలు పూర్తి చేశారు. తాజాగా ఫాతిమా సనా వీరి రికార్డును బద్దలు కొట్టి సింగిల్‌గా ప్రపంచ రికార్డు సెట్ చేసింది.మ్యాచ్ విషయానికొస్తే.. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా జింబాబ్వేతో జరిగిన మూడో టీ20లో పాక్ 133 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో పాక్ 3-0తో సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసింది. అంతకుముందు వన్డే సిరీస్‌ను కూడా పాక్ 3-0తో ఊడ్చేసింది. ఈ వైట్‌బాల్ సిరీస్‌ల కోసం జింబాబ్వే తొలిసారి పాక్‌లో పర్యటించింది.నిన్నటి మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 223 పరుగులు చేసింది. ఫాతిమా సనా 19 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో అజేయమైన 62 పరుగులు చేసి పాక్ భారీ స్కోర్ చేసేందుకు దోహదపడింది. ఫాతిమాకు ముందు సైరా జబీన్ (50 నాటౌట్), అయేషా జాఫర్ (45) కూడా సత్తా చాటారు. మిగతా బ్యాటర్లలో మునీబా అలీ 22, నతాలియా పర్వేజ్ 1, ఇరామ్ జావెద్ 29 పరుగులు చేశారు. ఈ సిరీస్‌లో జింబాబ్వే 200 పరుగుల మార్కు దాటడం ఇది రెండోసారి.224 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో జింబాబ్వే ఎప్పటిలాగే తడబడింది. 17.1 ఓవర్లలో 90 పరుగులకే చాపచుట్టేసింది. ఫలితంగా భారీ తేడాతో పరాజయంపాలైంది. సదియా ఇక్బాల్ 3, నష్రా సంధు 2, ఫాతిమా సనా, రమీన్ షమీమ్, తుబా హస్సన్ తలో వికెట్ తీసి జింబాబ్వే ఇన్నింగ్స్‌ను కుప్పకూల్చారు. జింబాబ్వే ఇన్నింగ్స్‌లో కెలిస్ (32), అదెల్ జిమును (18), మిచెల్ మవుంగా (13) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. -
గెలిచినా.. ‘దరిద్రం’ మాత్రం వదల్లేదు!
గతేడాది కాలంగా ఐపీఎల్లో రిషభ్ పంత్ వైఫల్యాలతో సతమతమవుతున్నాడు. మెగా వేలం -2025లో రూ. 27 కోట్ల రికార్డు ధరకు లక్నో సూపర్ జెయింట్స్ అతడిని కొనుగోలు చేసి.. కెప్టెన్సీ అప్పగించింది. అయితే, అప్పటి నుంచి ఆటగాడిగా, సారథిగా పంత్ విఫలమవుతూనే ఉన్నాడు.ప్లే ఆఫ్స్ రేసు నుంచి అవుట్‌ఈ ఏడాది లీగ్ దశలో తొలి పదకొండు మ్యాచ్‌లలో లక్నో కేవలం మూడే గెలిచి ప్లే ఆఫ్స్ రేసు నుంచి అధికారికంగా నిష్క్రమించింది. ఈ క్రమంలో సొంతమైదానం ఏకనాలో చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన నామమాత్రపు మ్యాచ్‌లో మాత్రం లక్నో అదరగొట్టింది.తొలుత చెన్నైని 187 పరుగులకే కట్టడి చేసిన లక్నో.. లక్ష్యాన్ని 16.4 ఓవర్లలోనే ఛేదించింది. తద్వారా సీజన్లో నాలుగో విజయం నమోదు చేయడంతో పాటు.. చెన్నై ప్లే ఆఫ్స్ అవకాశాలను దెబ్బకొట్టింది. ఇక ఈ మ్యాచ్‌లో కెప్టెన్ పంత్ (Rishabh Pant) అసలు బ్యాటింగ్‌కే రాలేదు.స్లో ఓవర్ రేటు.. జరిమానాఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్‌లో లక్నో స్లో ఓవర్ రేటు మెయింటెన్ చేసింది. నిర్ణీత సమయంలో తమ 20 ఓవర్ల బౌలింగ్ కోటా పూర్తి చేయలేదు. ఫలితంగా లక్నో కెప్టెన్ పంత్‌కు ఐపీఎల్ పాలక మండలి జరిమానా విధించింది. ఈ సీజన్లో లక్నో తొలిసారి ఈ తప్పిదానికి పాల్పడింది కాబట్టి.. రూ. 12 లక్షల జరిమానాతో సరిపెట్టినట్లు తెలిపింది.ఆ సారథుల సరసన పంత్కాగా ఐపీఎల్-2026లో స్లో ఓవర్ రేటు విషయంలో ఇప్పటి వరకు పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తొలి తప్పిదానికి రూ. 12 లక్షలు.. రెండో తప్పిదానికి రూ.24 లక్షలు మూల్యంగా చెల్లించుకున్నాడు.ఇక గుజరాత్ టైటాన్స్ సారథి శుబ్‌మన్ గిల్, చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్, ముంబై ఇండియన్స్ నాయకుడు హార్దిక్ పాండ్యా, కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్ అజింక్య రహానే, ఢిల్లీ క్యాపిటల్స్ సారథి అక్షర్ పటేల్, సన్‌రైజర్స్ హైదరాబాద్ నాయకుడు ప్యాట్ కమిన్స్ తమ తొలి తప్పిదానికి ప్రతిగా రూ. 12 లక్షల జరిమానా కట్టారు. తాజాగా పంత్ కూడా ఈ జాబితాలో చేరిపోయాడు.లక్నో వర్సెస్ చెన్నై సంక్షిప్త స్కోర్లుచెన్నై: 187/5(20)లక్నో: 188/3(16.4)ఫలితం: ఏడు వికెట్ల తేడాతో చెన్నైపై లక్నో గెలుపు.చదవండి: Ruturaj Gaikwad: మా ఓటమికి కారణం వాళ్లేStormed to 2️⃣ points in absolute style 😎@LucknowIPL wrap a blistering chase at home 🏡 Scorecard ▶️ https://t.co/v1R8RJXPe8#TATAIPL | #KhelBindaas | #LSGvCSK pic.twitter.com/EwqhdUW1L5— IndianPremierLeague (@IPL) May 15, 2026 -
చారిత్రక టూర్ ప్రకటించిన పాకిస్తాన్
పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) కీలక ప్రకటన చేసింది. తమ అండర్-19 జట్టును ఇంగ్లండ్ పర్యటనకు పంపనున్నట్లు వెల్లడించింది. ఇంగ్లండ్ అండర్-19 జట్టుతో ఒక ఫోర్ డే మ్యాచ్‌తో పాటు నాలుగు యూత్ వన్డేలు ఆడననున్నట్లు తెలిపింది.కాగా పాక్ అండర్-19 జట్టు చివరగా 2023లో ఇంగ్లండ్‌లో పర్యటించింది. నాడు రెండు యూత్ టెస్టులతో పాటు ఐదు యూత్ వన్డేలు ఆడింది. టెస్టు సిరీస్ డ్రా కాగా.. వన్డే సిరీస్‌ను ఆతిథ్య ఇంగ్లండ్ కైవసం చేసుకుంది.భవిష్య ఈవెంట్లకు సన్నాహకంగా..ఈ క్రమంలో దాదాపు మూడేళ్ల విరామం తర్వాత మరోసారి యంగ్ షాహిన్స్ జట్టు ఇంగ్లండ్ టూర్‌కు వెళ్లనుంది. కాగా పాక్ అండర్-19 టీమ్ గతేడాది కాలంగా మంచి ఫామ్‌లో ఉంది. ఏసీసీ అండర్-19 ఆసియా కప్ 2025 ఫైనల్లో భారత జట్టును ఓడించి టైటిల్ గెలిచింది.ఇటీవల జింబాబ్వేలో జరిగిన ముక్కోణపు సిరీస్‌లోనూ విజయం సాధించింది. జింబాబ్వే, అఫ్గనిస్తాన్‌లపై గెలుపొంది సిరీస్ కైవసం చేసుకుంది. అయితే, ఐసీసీ అండర్-19 వరల్డ్‌కప్-2025 టోర్నీలో మాత్రం పాక్ ఐదింట కేవలం మూడే గెలిచింది. ఇంగ్లండ్‌తో పాటు భారత్ చేతిలో ఓడి ఇంటిబాట పట్టింది.ఈ టోర్నీలో యువ భారత జట్టు గెలుపొంది.. ఆరోసారి ట్రోఫీని ముద్దాడింది. ఇదిలా ఉంటే.. రానున్న ఐసీసీ ఈవెంట్లకు సన్నాహకంగా పాక్ అండర్-19 జట్టుకు ఈ టోర్నీ ఉపయోగపడనుంది. ఇంగ్లండ్ పిచ్ పరిస్థితులపై పాక్ యువ ఆటగాళ్లు అవగాహన పెంపొందించుకునేలా ఈ టూర్ ఉపయోగపడనుంది. ఆసియా కప్‌తో పాటు భవిష్య ముక్కోణపు సిరీస్‌లకు ఈ పర్యటన ద్వారా మంచి ప్రాక్టీస్ దొరకనుంది.ఇంగ్లండ్ అండర్-19 వర్సెస్ పాక్ అండర్-19 సిరీస్ షెడ్యూల్👉యూత్ టెస్టు: సెప్టెంబరు 2-5- అరుండేల్👉తొలి యూత్ వన్డే: సెప్టెంబరు 9- అరుండేల్👉రెండో యూత్ వన్డే: సెప్టెంబరు 12- గిల్డ్‌ఫోర్డ్👉మూడో యూత్ వన్డే: సెప్టెంబరు 14- వార్మ్స్లే👉నాలుగో యూత్ వన్డే: సెప్టెంబరు 16- వార్మ్స్లే.చదవండి: నీకసలు సెన్స్ ఉందా రుతురాజ్?.. అతడిని ఆడించవా? -
మా ఓటమికి కారణం వాళ్లే: రుతురాజ్
లక్నో సూపర్ జెయింట్స్ చేతిలో ఓటమిపై చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ స్పందించాడు. ఫాస్ట్ బౌలర్ల నుంచి తాను మెరుగైన ప్రదర్శన ఆశించానని.. కానీ వారు స్థాయికి తగ్గట్లు ఆడలేకపోయారని అసంతృప్తి వ్యక్తం చేశాడు. తమ పరాజయానికి బౌలర్ల వైఫల్యమే ప్రధాన కారణమని పరోక్షంగా వ్యాఖ్యానించాడు.బౌలర్ల వైఫల్యంగత మూడు మ్యాచ్‌లలో గెలిచి ప్లే ఆఫ్స్ రేసులోకి వచ్చిన చెన్నై.. శుక్రవారం ఏకనా స్టేడియంలో లక్నోతో తలపడింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడిన చెన్నై తొలుత బ్యాటింగ్‌కు దిగి.. నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్లు నష్టపోయి 187 పరుగులు చేసింది.లక్ష్య ఛేదనకు దిగిన లక్నో కేవలం 16.4 ఓవర్లలోనే పని పూర్తి చేసింది. ఏడు వికెట్ల తేడాతో చెన్నైపై జయభేరి మోగించి.. రుతురాజ్ సేన ప్లే ఆఫ్స్ అవకాశాలు సంక్లిష్టం చేసింది. చెన్నై బౌలర్లలో అన్షుల్ కాంబోజ్ మరీ దారుణంగా కేవలం 2.4 ఓవర్లు వేసి ఏకంగా 63 పరుగులు ఇచ్చి.. ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. అతడి బౌలింగ్‌లో లక్నో బ్యాటర్లు చితక్కొట్టారు.వారికి క్రెడిట్ ఇవ్వాల్సిందేఈ నేపథ్యంలో ఓటమి అనంతరం చెన్నై సారథి రుతురాజ్ గైక్వాడ్ మాట్లాడుతూ.. ‘‘మేము బ్యాటింగ్ చేసినపుడు వికెట్ కఠినంగా ఉంది. ప్రత్యర్థి జట్టు బౌలర్లు ఈ పరిస్థితులను చక్కగా వినియోగించుకున్నారు. మేము 160- 170 పరుగులే చేస్తామనుకున్నా.అయితే, 180 స్కోరు దాటగలిగాము. బ్యాటింగ్ పరంగా మా తప్పేమీ లేదు. క్రెడిట్ ప్రత్యర్థి బౌలర్లకు ఇవ్వాల్సిందే. ఇక లక్నో బ్యాటర్లు కూడా గొప్పగా ఆడారు. ఈ వికెట్ మీద ఫాస్ట్ బౌలర్ల నుంచి మేమెంతో ఆశించాము. కానీ వారు స్థాయికి తగ్గట్లు ఆడలేదు. బౌలింగ్‌లో మా ప్రణాళికలు పక్కాగా అమలు చేయలేకపోయాము.వాళ్లు కూడా గొప్పగా షాట్లు ఆడారు. ముఖ్యంగా మిచెల్ మార్ష్ అద్భుతం చేశాడు. ఏదేమైనా ప్రత్యర్థి జట్టు మనకన్నా గొప్పగా ఆడినపుడు ఆ నిజాన్ని అంగీకరించాలి. మేము కూడా ఇంకాస్త పట్టుదలగా ఆడి ఉంటే ఫలితం వేరుగా ఉండేది’’ అని పేర్కొన్నాడు.చదవండి: నీకసలు సెన్స్ ఉందా రుతురాజ్?.. అతడిని ఆడించవా? -
నీకసలు సెన్స్ ఉందా రుతురాజ్?.. అతడిని ఆడించవా?
ఐపీఎల్-2026లో ఐదు రోజుల క్రితం ఆదివారం ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్లు ఐపీఎల్లో ‘ప్లే ఆఫ్స్’ అవకాశాలు కోల్పోయాయి. ఆ తర్వాత తాము ఆడిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌ను ముంబై చిత్తు చేయగా.. తాజాగా చెన్నై సూపర్ కింగ్స్‌కు లక్నో ఝలక్ ఇచ్చింది. గత మ్యాచ్‌లో చెన్నై చేతిలోనే ఓడి చాన్స్ కోల్పోయిన లక్నో... ఇప్పుడు తమ సొంతగడ్డపై ప్రత్యర్థిని చిత్తు చేసి లెక్క సరిచేసింది. బౌలింగ్‌లో ఆకాశ్, బ్యాటింగ్‌లో మిచెల్ మార్ష్ మెరుపులు లక్నోను గెలిపించగా... మూడు వరుస విజయాల తర్వాత మరింత పైకి చేరే స్థితిలో నిలిచిన చెన్నై ఈ ఓటమితో తమ పరిస్థితిని సంక్లిష్టంగా మార్చుకుంది.కార్తిక్ శర్మ ఒక్కడేఏకనా స్టేడియంలో శుక్రవారం నాటి మ్యాచ్‌లో టాస్ ఓడిన చెన్నై తొలుత బ్యాటింగ్‌కు దిగింది. నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 187 పరుగులే చేయగలిగింది. కార్తిక్ శర్మ 71 పరుగులతో రాణించగా.. మిగతా వారి నుంచి అతడికి పెద్దగా సహకారం లభించలేదు.మిచెల్ మార్ష్ విధ్వంసకర ఇన్నింగ్స్‌ఇక నామమాత్రపు లక్ష్యాన్ని లక్నో 16.4 ఓవర్లలోనే ఊదేసింది. ఓపెనర్ మిచెల్ మార్ష్ విధ్వంసకర ఇన్నింగ్స్ (38 బంతుల్లో 90)తో చెన్నై బౌలర్లకు చుక్కలు చూపించాడు. అతడు వేసిన పునాదిపై నికోలస్ పూరన్ (17 బంతుల్లో 32 నాటౌట్) బలంగా నిలబడి.. లక్నోను విజయతీరాలకు చేర్చాడు.The Bison goes berserk 6️⃣6️⃣6️⃣6️⃣⚪4️⃣❗#MitchellMarsh brings up his fifty in just 21 balls as he comes out all guns blazing for #LSG! 💥🏏#TATAIPL Race To Playoffs 2026 ➡️ #LSGvCSK | LIVE NOW 👉 https://t.co/5Mr0NV7vdi pic.twitter.com/v3sC0DqiHp— Star Sports (@StarSportsIndia) May 15, 2026అన్షుల్ కాంబోజ్ చెత్త ప్రదర్శనచెన్నై బౌలర్లలో అన్షుల్ కాంబోజ్ కేవలం 2.4 ఓవర్లలోనే ఏకంగా 63 పరుగులు ఇచ్చుకుని.. ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. అతడి ఓవర్లు చెన్నై కొంపముంచాయి. మిగతా వారిలో ముకేశ్ చౌదరి, స్పెన్సర్ జాన్సన్ ఒక్కో వికెట్ తీయగా.. నూర్ అహ్మద్ కాస్త పొదుపుగా బౌలింగ్ చేయగా.. గుర్జప్నీత్ సింగ్ ఫర్వాలేదనిపించాడు.లక్నో చేతిలో ఓటమితో చెన్నై ప్లే ఆఫ్స్ అవకాశాలు సంక్లిష్టం కావడంతో జట్టు ఆట తీరుపై విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా లక్నోతో మ్యాచ్‌లో కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ అనుసరించిన వ్యూహాలను మాజీ క్రికెటర్లు తప్పుబడుతున్నారు.నీకసలు సెన్స్ ఉందా రుతురాజ్?ఈ క్రమంలో చెన్నై మాజీ బ్యాటర్ సుబ్రమణ్యం బద్రీనాథ్ రుతురాజ్‌పై ఘాటు వ్యాఖ్యలు చేశాడు. ‘‘తుదిజట్టు ఎంపికలో తప్పుల కారణంగా ఈ సీజన్లో ఓడిపోవడం చెన్నైకి అలవాటుగా మారింది. ఇలాంటి వికెట్‌పై అకీల్ హొసేన్‌ను ఆడించకపోవడం అతిపెద్ద తప్పు.అస్సలు వీళ్లకు సెన్స్ ఉందా అనే సందేహం వస్తోంది. మరో మ్యాచ్.. చేజారిన మరో అవకాశం’’ అని బద్రీనాథ్ ఎక్స్ వేదికగా రుతురాజ్‌ను విమర్శించాడు. ఈ మ్యాచ్‌లో బ్యాటర్‌గానూ రుతు విఫలమయ్యాడు. తొమ్మిది బంతులు ఎదుర్కొని కేవలం 13 పరుగులే చేసి నిష్క్రమించాడు.చదవండి: IPL 2026: సీఎస్కేకు చుక్కలు చూపించాడు.. ఎవరీ ఆకాశ్ సింగ్? -
సామ్సన్ భారత కెప్టెన్ అవుతాడు!
దుబాయ్: వచ్చే రెండు, మూడేళ్లలో సంజూ సామ్సన్ భారత టి20 జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించడం ఖాయమని మాజీ క్రికెటర్, వ్యాఖ్యాత రవిశాస్త్రి అన్నాడు. 2026 టి20 వరల్డ్ కప్ గెలవడంలో కీలకపాత్ర పోషించిన సామ్సన్‌కు కెప్టెన్ అయ్యే స్థాయి, అర్హత ఉన్నాయని శాస్త్రి అభిప్రాయపడ్డాడు. ‘2028 టి20 వరల్డ్ కప్ సమయానికి సూర్యకుమార్ గురించి ఆలోచించే అవకాశం ఉండకపోవచ్చు. వచ్చే రెండేళ్లలో సూర్య ఎలా ఆడినా సరే... జట్టుకు మాత్రం కచ్చితంగా కొత్త కెప్టెన్ అవసరమే. సామ్సన్ అందుకు సరైనవాడు. ప్రాధాన్యతాక్రమంలో కూడా అతను అందరికంటే ముందున్నాడనేది నా అభిప్రాయం. ఐపీఎల్లో అతను రాజస్తాన్ రాయల్స్‌కు సుదీర్ఘ కాలం సారథిగా వ్యవహరించాడు. టాపార్డర్‌లో విధ్వంసక బ్యాటర్‌గా జట్టులో అతని స్థానం తిరుగులేనిది. కాబట్టి ఇది ఆరంభం మాత్రమే. మున్ముందు సామ్సన్‌పై పెద్ద బాధ్యత ఉంది. టి20 వరల్డ్ కప్‌లో చెలరేగిన తర్వాత ఇప్పుడు ఐపీఎల్లో అతను మరింత పరిణతి చెందినట్లుగా కనిపిస్తోంది. తనపై వచ్చిన అన్ని సందేహాలను సామ్సన్ జవాబిచ్చేశాడు. భవిష్యత్తులో అతడిని నాయకుడిగా గుర్తించేందుకు ఇది సరిపోతుంది’ అని రవిశాస్త్రి విశ్లేషించాడు. -
‘నా విలువను నిరూపించుకునే స్థితిలో లేను’
న్యూఢిల్లీ: స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి ప్రస్తుతం ఒక్క వన్డే ఫార్మాట్లోనే అంతర్జాతీయ క్రికెట్ ఆడుతున్నాడు. ఇటీవల పదేపదే 2027 వన్డే వరల్డ్ కప్‌లో అతని స్థానంపై చర్చ జరుగుతోంది. ఈ అంశంపై కోహ్లి తన ఆలోచనలేమిటో స్పష్టంగా చెప్పాడు. తన స్థాయి, విలువకు తగిన గౌరవం ఇస్తేనే ఆటలో కొనసాగుతానని, లేదంటే తప్పుకుంటానని అతను వ్యాఖ్యానించాడు. తాను ఇంకా ఏదో నిరూపించుకోవాల్సిన స్థితిలో లేనని కోహ్లి స్పష్టం చేశాడు.‘నన్ను ఇప్పటికి 2027 వరల్డ్ కప్‌లో ఆడటం గురించి చాలాసార్లు అడిగారు. నేను ఎప్పుడైనా ఆడేందుకు సిద్ధం. ఎందుకంటే అది నాకు నిత్యకృత్యం. నాకు క్రికెట్ ఆడటం అంటే చాలా ఇష్టం. ఇల్లు వదిలి నా కిట్‌తో బయటకు వెళ్లడం, ఎంతో కష్టపడటం కూడా దాని కోసమే కదా. భారత్ తరఫున మరో ప్రపంచకప్ ఆడటం గొప్ప గౌరవం. కానీ నాకు ఈ విషయంలో చాలా స్పష్టత ఉంది. జట్టుకు నా అవసరం ఉందని భావిస్తేనే ఆడతాను. అంతే కానీ నా విలువను, స్థాయిని నిరూపించుకుంటే ఆడాల్సిన పరిస్థితి వస్తే అందుకు సిద్ధంగా లేను. నన్ను నేను నిరూపించుకోవాల్సిన స్థితిలో ఇప్పుడు లేను’ అని కోహ్లి వెల్లడించాడు.గత ఏడాది ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌కు ముందు కోహ్లి అనూహ్యంగా రిటైర్మెంట్ ప్రకటించాడు. సిరీస్‌కు పూర్తిగా సన్నద్ధమై, ప్రత్యేకంగా సొంత ప్రాక్టీస్ సెషన్లలో పాల్గొని బోర్డు నిబంధనల ప్రకారం రంజీ ట్రోఫీలో ఆడిన తర్వాత కూడా అతను ఇలాంటి నిర్ణయం తీసుకోవడం తీవ్ర చర్చకు దారి తీసింది. కోహ్లిని తొలి రెండు టెస్టులకే ఎంపిక చేస్తామని, ఆ తర్వాత ప్రదర్శనను బట్టి కొనసాగిస్తామని సెలక్టర్లు చెప్పినట్లుగా వార్తలు వచ్చాయి.తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ...‘మనం పని చేసే చోట మన ప్రతిభ, సామర్థ్యంపై నమ్మకం ఉందని చెప్పి బాధ్యతలు అప్పగించిన తర్వాత వారం రోజులకే మన పనితీరును ప్రశ్నిస్తే ఎలా ఉంటుంది. నేను నిజాయితీగా పని చేస్తాను. ఆట కోసం ఎంతైనా కష్టపడతాను. వన్డేలో 40 ఓవర్ల పాటు బౌండరీ లైన్ల మధ్య ఆ మూల నుంచి ఈ మూలకు పరుగెత్తమని చెబితే కచ్చితంగా చేస్తా. ప్రతీ బంతిని నా కెరీర్ చివరి బంతిలా భావించి మైదానంలో పోరాడతా. దీనిపై ఫిర్యాదు చేయను. ఎందుకంటే దానికి అనుగుణంగానే నేను సాధన చేస్తా, సిద్ధమవుతా. కేవలం ఫలితాలు చూసి నిర్ణయం తీసుకోవద్దు. ఎందుకంటే వాటి గురించి ఎవరూ గ్యారంటీ ఇవ్వలేరు. కాబట్టి ఏదైనా సమస్య ఉంటే ముందే చెప్పేయండి. లేదా ఒకసారి అవకాశం ఇచ్చాక నన్ను పని చేసుకోనివ్వండి’ అని విరాట్ తన ఉద్దేశాన్ని చెప్పాడు. -
మిచెల్ మార్ష్ మెరుపులు... సీఎస్కేకు లక్నో షాక్
ఐపీఎల్-2026 సీజన్లో ప్లే ఆఫ్స్ బెర్త్ కోసం ప్రయత్నిస్తున్న చెన్నై సూపర్ కింగ్స్‌కు లక్నో సూపర్ జెయింట్స్ షాకిచ్చింది. శుక్రవారం ఏకానా స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో సీఎస్కేపై 7 వికెట్ల తేడాతో లక్నో ఘన విజయం సాధించింది. చెన్నై విధించిన 188 పరుగుల భారీ లక్ష్యాన్ని సూపర్ జెయింట్స్ కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి 16.4 ఓవర్లలో చేధించింది.లక్ష్య చేధనలో లక్నో ఓపెనర్ మిచెల్ మార్ష్ విధ్వంసం సృష్టించాడు. తన తుపాన్ బ్యాటింగ్‌తో సీఎస్కే బౌలర్లకు చుక్కలు చూపించాడు. మార్ష్ కేవలం 38 బంతుల్లో 9 ఫోర్లు, 7 సిక్స్‌లతో 90 పరుగులు చేసి ఔటయ్యాడు. ఈజీగా సెంచరీ మార్క్ అందుకునేలా కన్పించిన మార్ష్.. దురదృష్టశాత్తూ రనౌటయ్యాడు. అతడితో పాటు జోష్ ఇంగ్లిష్(36), పూరన్(32 నాటౌట్) రాణించాడు. సీఎస్కే బౌలర్లలో ముఖేష్ చౌదరి, జాన్సన్ తలా ఓ వికెట్ సాధించాడు.అంతకముందు బ్యాటింగ్ చేసిన సీఎస్కే నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. రుతురాజ్ గైక్వాడ్(13), సంజూ శాంసన్(20) ఆరంభంలోనే ఔటైనప్పటికి.. యువ ఆటగాడు కార్తీక్ శర్మ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. కార్తీక్ శర్మ 42 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్స్‌లతో 71 పరుగులు చేశాడు. అతడితో పాటు శివమ్ దూబే(32) ఆఖరిలో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు.లక్నో బౌలర్లలో ఆకాశ్ సింగ్ మూడు వికెట్లు పడగొట్టగా.. షాబాజ్, మహ్మద్ షమీ తలా వికెట్ సాధించారు. కాగా సీఎస్కే ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే తదుపరి రెండు మ్యాచ్‌లో భారీ విజయం సాధించాలి. అంతేకాకుండా మిగిలిన జట్లు ఫలితాలపై ఆధారపడాల్సింటుంది. -
సీఎస్కేకు చుక్కలు చూపించాడు.. ఎవరీ ఆకాశ్ సింగ్?
ఐపీఎల్ 2026లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ పేసర్ ఆకాశ్ మహారాజ్ సింగ్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. లక్నో ఇప్పటివరకు ఆడిన 11 మ్యాచ్‌లలో బెంచ్‌కే పరిమితమైన ఆకాశ్‌కు ఎట్టకేలకు ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు దక్కింది.అయితే తనకు లభించిన అవకాశాన్ని ఆకాశ్ రెండు చేతులా అందిపుచ్చుకున్నాడు. తన సూపర్ బౌలింగ్‌తో సీఎస్కే టాపర్డర్‌ను ఆకాశ్ కుప్పకూల్చాడు. ఆకాశ్ తన 4 ఓవర్ల కోటాలో కేవలం 26 పరుగులు మాత్రమే ఇచ్చి మూడు వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. అంతేకాకుండా వికెట్ తీసిన ప్రతీసారి తనదైన శైలిలో సెలబ్రేషన్స్ చేస్తూ అందరి దృష్టిని ఆకాశ్ ఆకర్షించాడు. ఈ అద్భుత ప్రదర్శనతో సీఎస్కేపై అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసిన లక్నో బౌలర్‌గా ఆకాశ్ నిలిచాడు. దీంతో ఎవరీ ఆకాశ్ సింగ్ అని నెటిజన్లు వెతుకుతున్నారు.ఎవరీ ఆకాశ్ సింగ్?ఈ లెఫ్ట్ ఆర్మ్పేసర్ దేశవాళీ క్రికెట్లో రాజస్తాన్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. కొత్త బంతిని రెండు వైపులా స్వింగ్ చేయడంలో ఆకాశ్ దిట్ట. 2020 అండర్-19 ప్రపంచకప్ రన్నరప్‌గా నిలిచిన భారత జట్టులో అతడు సభ్యుడిగా ఉన్నాడు.అండర్-19 ప్రపంచకప్ ఫైనల్ తర్వాత బంగ్లాదేశ్ ఆటగాళ్లతో జరిగిన ఘర్షణలో ఐసీసీ శిక్షించిన ఐదుగురు ఆటగాళ్లలో ఆకాశ్ సింగ్ ఒకరు. ఆకాశ్‌కు ఐపీఎల్లో ఆడిన అనుభవం కూడా ఉంది. లక్నో కంటే ముందు రాజస్తాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లకు ఆకాశ్ ప్రాతినిథ్యం వహించాడు. 2025 వేలంలో రూ.30 లక్షలకు దక్కించుకుంది.గత సీజన్లో 3 మ్యాచ్‌ల్లో 4 వికెట్లు తీయడంతో 2026 సీజన్‌కు కూడా జట్టు అతడిని లక్నో అట్టిపెట్టుకుంది. ఇప్పుడు మరోసారి అతడు సత్తాచాటాడు. ముందు మ్యాచ్‌లలో అతడికి అవకాశమిచ్చింటే పరిస్థితి ఇలా ఉండేది కాదేమో. ఆకాశ్ పేరిట ఓవరాల్‌గా 22 టీ20 వికెట్ల ఉన్నాయి. -
IPL 2026: పాపం అర్జున్ టెండూల్కర్.. జట్టు మారినా?
ఐపీఎల్-2026లో లక్నో సూపర్ జెయింట్స్ తరపున అరంగేట్రం కోసం ఎదురు చూస్తున్న సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్‌కు మరోసారి నిరాశే ఎదురైంది. లక్నో ఇప్పటికే ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించడంతో శుక్రవారం ఏకానా స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో అర్జున్ అవకాశం దక్కుతుందని అంతా భావించారు.కానీ లక్నో మేనెజెమెంట్ మరోసారి అతడిని బెంచ్‌కే పరిమితం చేసింది. ఆకాష్ మహారాజ్ సింగ్, యయాంక్ యాదవ్ వంటి యువ పేసర్లను ప్లేయింగ్ ఎలెవన్‌లోకి తీసుకొచ్చిన లక్నో.. అర్జున్ను మాత్రం పరిగణలోకి తీసుకోలేదు. గత సీజన్ వరకు ముంబై ఇండియన్స్‌లో ఉన్న అర్జున్.. ఐపీఎల్ 2026 కోసం జరిగిన ట్రేడింగ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ జట్టులోకి వచ్చాడు.కానీ ఇప్పటివరకు ఒక్క మ్యాచ్‌లో ఆడే అవకాశం దక్కలేదు. సీజన్ తుది దశకు చేరుకున్నప్పటికి అర్జున్‌కు అవకాశమివ్వకపోవడాన్ని నెటిజన్లు తప్పుపడుతున్నారు. ఈ ఏడాది సీజన్లో లక్నోకు ఇంకా రెండు మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. కనీసం ఆఖరి మ్యాచ్‌లలోనైనా అర్జున్ను ఆడిస్తారా లేదా వేచి చూడాలి.2023లో ముంబై ఇండియన్స్ తరపున ఐపీఎల్ అరంగేట్రం చేసిన అర్జున్.. ఇప్పటివరకు కేవలం మూడు వికెట్లు మాత్రమే పడగొట్టాడు. ముంబై జట్టులో ఉన్నప్పుడు కూడా అర్జున్ ఎక్కువగా బెంచ్‌కే పరిమితమయ్యాడు.చదవండి: టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్..! వైభవ్, భువీకి ఛాన్స్? -
ప్రపంచ కప్ హీరోకు రూ.కోటి బహుమతి
టీ20 వరల్డ్‌కప్-2026లో టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించిన వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్‌ను బీహార్ ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కిషన్‌కు కోటి రూపాయల చెక్‌ను ఆయన అందించారు. పాట్నాలో జన్మించిన ఇషాన్ కిషన్ తమ అద్భుత ప్రదర్శనలతో రాష్ట్ర ప్రతిష్టను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన పొట్టి ప్రపంచకప్‌లో కిషన్ దుమ్ములేపాడు. ఈ టోర్నమెంట్లో ఇషాన్ 9 ఇన్నింగ్స్‌ల్లో 317 పరుగులు సాధించాడు. అతడు ఏకంగా 193.29 స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేయడం విశేషం. ఇషాన్ కిషన్ 2024లో బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ కోల్పోయినప్పటికీ, పట్టుదలతో దేశవాళీ క్రికెట్లో సత్తాచాటి తిరిగి జాతీయ జట్టులో చోటు సంపాదించుకున్నాడు.తనకు లభించిన రెండో అవకాశాన్ని కిషన్ సద్వినియోగపరుచుకున్నాడు. ఇప్పుడు భారత టీ20 జట్టులో కీలక సభ్యునిగా మారాడు. ఇప్పుడు వన్డే జట్టులోకి పునరాగమనం చేసేందుకు కిషన్ సిద్దమయ్యాడు. ఇక సీఎం సామ్రాట్ చౌదరి కేవలం ఇషాన్ కిషన్‌నే కాకుండా, ఎస్ఆర్హెచ్ పేసర్ షకీబ్ హుస్సేన్ కూడా సత్కరించారు.షకీబ్ తన అరంగేట్ర మ్యాచ్‌లోనే రాజస్తాన్ రాయల్స్‌పై 4 వికెట్లు తీసి సంచలనం సృష్టించాడు. కాగా కిషన్ పాట్నాలో పుట్టినప్పటికి ఫస్ట్ క్రికెట్ మాత్రం జార్ఖండ్ తరపున ఆడుతున్నాడు.చదవండి: టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్..! వైభవ్, భువీకి ఛాన్స్? -
IPL 2026: సీఎస్కేపై లక్నో ఘన విజయం
IPL 2026 LSG vs CSK Live Updates: ఏకానా స్టేడియం వేదికగా సీఎస్కేతో జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో లక్నో సూపర్ జెయింట్స్ ఘన విజయం సాధించింది. చెన్నై విధించిన 188 పరుగుల భారీ లక్ష్యాన్ని సూపర్ జెయింట్స్ కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి 16.4 ఓవర్లలో చేధించింది. ఓపెనర్ మిచెల్ మార్ష్ కేవలం 38 బంతుల్లో 9 ఫోర్లు, 7 సిక్స్‌లతో 90 పరుగులు చేయగా.. ఇంగ్లిష్(36), పూరన్(32) రాణించారు.15 ఓవర్లకు లక్నో స్కోర్: 156/315 ఓవర్లు ముగిసే సరికి లక్నో 3 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. క్రీజులో ముకుల్ చౌదరి(6), నికోలస్ పూరన్(8) ఉన్నారు.లక్నో రెండో వికెట్ డౌన్మిచెల్ మార్ష్ రూపంలో లక్నో రెండో వికెట్ కోల్పోయింది. కేవలం 38 బంతుల్లో 90 పరుగులు చేసిన మార్ష్.. దురదృష్టవశాత్తూ రనౌటయ్యాడు.లక్నో తొలి వికెట్ డౌన్‌లక్నో తొలి వికెట్ కోల్పోయింది. 36 పరుగులు చేసిన ఇంగ్లిష్.. ముఖేష్ చౌదరి బౌలింగ్‌లో ఔటయ్యాడు. విజయం దిశగా లక్నోలక్నో ఓపెనర్లు(85), జోష్ ఇంగ్లిష్(36) దూకుడుగా ఆడుతున్నారు. 11 ఓవర్లకు లక్నో స్కోర్: 129-0దుమ్ములేపుతున్న మిచెల్ మార్ష్5 ఓవర్లు ముగిసే సరికి లక్నో వికెట్ నష్టపోకుండా 71 పరుగులు చేసింది. 5వ ఓవర్ వేసిన అన్షుల్ కాంబోజ్ బౌలింగ్‌లో మిచెల్ మార్ష్.. నాలుగు సిక్స్‌లు, ఒక ఫోర్‌తో 28 పరుగులు పిండుకున్నాడు.దూకుడుగా ఆడుతున్న లక్నో ఓపెనర్లు3 ఓవర్లు ముగిసే సరికి సీఎస్కే వికెట్ నష్టపోకుండా 31 పరుగులు చేసింది. క్రీజులో మిచెల్ మార్ష్(13), జోష్ ఇంగ్లిష్(9) ఉన్నారు.రాణించిన కార్తీక్, దూబే.. లక్నో టార్గెట్ ఎంతంటే?ఏకానా స్టేడియం వేదికగా లక్నో సూపర్ జెయింట్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటర్లు రాణించారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్కే నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. యువ ఆటగాడు కార్తీక్ శర్మ 71 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. శివమ్ దూబే)32), బ్రెవిస్(25) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. లక్నో బౌలర్లలో ఆకాష్ మూడు వికెట్లు పడగొట్టగా.. షాబాజ్, మహ్మద్ షమీ తలా వికెట్ సాధించారు.సీఎస్కే ఐదో వికెట్ డౌన్71 పరుగులు చేసిన కార్తీక్ శర్మ.. షాబాజ్ అహ్మద్ బౌలింగ్‌లో ఔటయ్యాడు.సీఎస్కే నాలుగో వికెట్ డౌన్డెవాల్డ్ బ్రెవిస్ రూపంలో సీఎస్కే నాలుగో వికెట్ కోల్పోయింది. 25 పరుగులు చేసిన బ్రెవిస్.. మహ్మద్ షమీ బౌలింగ్‌లో ఔటయ్యాడు.కార్తీక్ శర్మ హాఫ్ సెంచరీకార్తీక్ శర్మ 35 బంతుల్లో తన హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు.👉11 ఓవర్లకు సీఎస్కే స్కోర్: 86/3. క్రీజులో కార్తీక్ శర్మ(24), బ్రెవిస్(18) ఉన్నారు.సీఎస్కే మూడో వికెట్ డౌన్సీఎస్కే మూడో వికెట్ కోల్పోయింది. 6 పరుగులు చేసిన ఉర్విల్ పటేల్.. ఆకాష్ మహారాజ్ సింగ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు.సీఎస్కే రెండో వికెట్ డౌన్సీఎస్కే రెండో వికెట్ కోల్పోయింది. 20 పరుగులు చేసిన సంజూ శాంసన్.. ఆకాష్ మహారాజ్ సింగ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 6 ఓవర్లకు సీఎస్కే స్కోర్: 37/2సీఎస్కే తొలి వికెట్ డౌన్31 పరుగుల వద్ద సీఎస్కే తొలి వికెట్ కోల్పోయింది. 13 పరుగులు చేసిన రుతురాజ్ గైక్వాడ్.. ఆకాష్ సింగ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు.2 ఓవర్లకు సీఎస్కే స్కోర్: 20/02 ఓవర్లు ముగిసే సరికి సీఎస్కే వికెట్ నష్టపోకుండా 20 పరుగులు చేసింది. క్రీజులో సంజూ శాంసన్(13), రుతురాజ్ గైక్వాడ్(6) ఉన్నారు.ఐపీఎల్-2026లో ఏకానా స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన సూపర్ జెయింట్స్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో ఆసీస్ పేసర్ స్పెన్సర్ జాన్సన్ సీఎస్కే తరపున అరంగేట్రం చేశాడు. అదేవిధంగా లక్నో జట్టులోకి అబ్దుల్ సమద్, ముకుల్ చౌదరి వచ్చారు.తుది జట్లుచెన్నై సూపర్ కింగ్స్: సంజు శాంసన్ (వికెట్ కీపర్), రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), ఉర్విల్ పటేల్, కార్తీక్ శర్మ, డెవాల్డ్ బ్రెవిస్, శివమ్ దూబే, ప్రశాంత్ వీర్, అన్షుల్ కాంబోజ్, నూర్ అహ్మద్, స్పెన్సర్ జాన్సన్, ముఖేష్ చౌదరిలక్నో సూపర్ జెయింట్స్ : మిచెల్ మార్ష్, నికోలస్ పూరన్, ఐడెన్ మార్క్రామ్, రిషబ్ పంత్(కెప్టెన్), ముకుల్ చౌదరి, అబ్దుల్ సమద్, షాబాజ్ అహ్మద్, మహ్మద్ షమీ, మయాంక్ యాదవ్, ఆకాష్ మహరాజ్ సింగ్, ప్రిన్స్ యాదవ్ -
టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్..! వైభవ్, భువీకి ఛాన్స్?
ఐపీఎల్-2026లో సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వెటరన్ పేసర్ భువనేశ్వర్ కుమార్ అద్భుత ప్రదర్శన కనబరుస్తున్న సంగతి తెలిసిందే. భువీ 36 ఏళ్ల వయస్సులోనూ తన స్వింగ్ బౌలింగ్‌తో బ్యాటర్లను బెంబేలెత్తిస్తున్నాడు. భువనేశ్వర్ ప్రస్తుతం 22 వికెట్లతో పర్పుల్ క్యాప్ రేసులో అగ్రస్ధానంలో ఉన్నాడు. అతడి నిలకడైన ప్రదర్శన కారణంగానే ఆర్సీబీ పాయింట్ల పట్టికలో ప్రస్తుతం టాప్‌లో కొనసాగుతోంది. దీంతో అద్భుతమైన ఫామ్‌లో ఉన్న భువీని మళ్లీ భారత టీ20 జట్టులోకి తీసుకోవాలని మాజీలు సూచిస్తున్నారు. ఈ క్రమంలో టీమిండియా మాజీ ఆటగాడు, సీఎస్కే లెజెండ్ అంబటి రాయుడు తాజాగా తన భారత ప్రత్యామ్నాయ టీ20 జట్టును ఎంచుకున్నాడు. ఈ జట్టు కెప్టెన్‌గా స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్‌ను రాయుడు ఎంపిక చేశాడు. అదేవిధంగా అయ్యర్ డిప్యూటీగా కేఎల్ రాహుల్‌కు అతడు ఛాన్స్ ఇచ్చాడు. రాయుడు తన జట్టులో ఫ్రంట్‌లైన్ పేసర్‌గా భువనేశ్వర్ కుమార్‌కు అవకాశమిచ్చాడు. అదేవిధంగా యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీకి కూడా ఈ జట్టులో చోటు దక్కింది. వైభవ్, రాహుల్‌ను ఓపెనర్లగా రాయుడు ఎంచుకున్నాడు. అదేవిధంగా మిడిలార్డర్లో పడిక్కల్, పాటిదార్ వంటి వారు స్టార్ బ్యాటర్లకు చోటు దక్కింది. రిజర్వ్ ప్లేయర్‌గా సుదర్శన్, ధ్రువ్ జురెల్ వంటి వారు ఉన్నారు.కాగా వచ్చే నెలలో భారత జట్టు రెండు టీ20ల కోసం ఐర్లాండ్ పర్యటనకు వెళ్లనుంది. అయితే ఈ టూర్‌కు సీనియర్లకు విశ్రాంతి ఇచ్చే అవకాశముంది. దీంతో వైభవ్ సూర్యవంశీ, ప్రియాన్ష్ సూర్యవంశీ వంటి యువ సంచలనాలకు తొలిసారి భారత జట్టులో చోటు దక్కే సూచనలు కన్పిస్తున్నాయి. వీరిద్దరూ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నారు.అంబటి రాయుడు ఎంపిక చేసిన భారత ప్రత్యామ్నాయ టీ20 జట్టు:వైభవ్ సూర్యవంశీ, కేఎల్ రాహుల్, దేవదత్ పడిక్కల్, రజత్ పాటిదార్, శ్రేయాస్ అయ్యర్, కృనాల్ పాండ్యా, నితీష్ కుమార్ రెడ్డి, భువనేశ్వర్ కుమార్, అన్షుల్ కాంబోజ్, మొహ్సిన్ ఖాన్, యుజ్వేంద్ర చాహల్రిజర్వ్లు: సాయి సుదర్శన్, ధ్రువ్ జురెల్, శివంగ్ కుమార్, ప్రిన్స్ యాదవ్ -
ఆ జట్టుకు భారీ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ ప్లేయర్
ఐపీఎల్-2026 సీజన్ తుది దశలో చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. సీఎస్కే స్టార్ పేసర్ ఖలీల్ అహ్మద్ గాయం కారణంగా సీజన్ మధ్యలో వైదొలిగిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అతడి స్ధానాన్ని కుల్దీప్ యాదవ్‌తో సీఎస్కే భర్తీ చేసింది. రూ.30 లక్షల కనీస ధరకు అతడిని సీఎస్కే జట్టులో తీసుకుంది.29 ఏళ్ల కుల్దీప్ యాదవ్ గతంలో రాజస్తాన్ రాయల్స్‌కు ప్రాతినిథ్యం వహించాడు. అతడి పేరిట మూడు ఐపీఎల్ వికెట్లు ఉన్నాయి. అయితే దేశవాళీ క్రికెట్లో మెరుగైన ప్రదర్శన కనబరుస్తుండడంతో సీఎస్కే తమ జట్టులోకి తీసుకుంది. మరోవైపు గాయం కారణంగా ఈ ఏడాది సీజన్‌కు దూరమైన నువాన్ తుషారా స్ధానంలో ఇంగ్లీష్ పేసర్ రిచర్డ్ గ్లీసన్‌ను ఆర్సీబీ తీసుకుంది.గ్లీసన్‌కు టీ20ల్లో అపారమైన అనుభవం ఉంది. అతడు ఇటీవల పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో కూడా అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఇప్పటికే భువనేశ్వర్ కుమార్, హాజిల్‌వుడ్, డఫీ వంటి వంటి పేసర్లతో పటిష్టంగా ఉన్న ఆర్సీబీ బౌలింగ్ విభాగం.. ఇప్పుడు మరింత పటిష్టంగా మారనుంది.స్వదేశానికి వెళ్లిపోయిన రచిన్అదేవిధంగా కివీస్ ఆల్‌రౌండర్ రచిన్ రవీంద్ర కూడా కోల్‌కతా నైట్‌రైడర్స్ క్యాంప్‌ను విడిచిపెట్టి స్వదేశానికి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్ సన్నద్దం కోసం అతడు న్యూజిలాండ్‌కు వెళ్లిపోయినట్లు క్రిక్‌బజ్ తమ కథనంలో పేర్కొంది. గత డిసెంబర్లో జరిగిన వేలంలో రూ.2 కోట్ల భారీ ధరకు రవీంద్రను కేకేఆర్ కొనుగోలు చేసింది. కానీ ఇప్పటివరకు అతడికి ఒక్క మ్యాచ్‌లో కూడా ఆడే అవకాశం లభించలేదు. కాగా పాయింట్ల పట్టికలో 8వ స్ధానంలో ఉన్న కేకేఆర్.. ఇప్పటికే ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించింది.చదవండి: రాహుల్ ద్రవిడ్ సంచలన వ్యాఖ్యలు! -
పాకిస్తాన్‌కు భారీ షాకిచ్చిన ఐసీసీ!.. ఇక కష్టమే..
పాకిస్తాన్ టెస్టు జట్టుకు మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) షాన్ మసూద్ బృందానికి గట్టి షాకిచ్చింది. కాగా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2025-27లో భాగంగా రెండు మ్యాచ్‌లు ఆడేందుకు పాక్ జట్టు బంగ్లాదేశ్‌లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే.104 పరుగుల తేడాతో జయభేరిఇందులో భాగంగా ఇరుజట్ల మధ్య ఢాకా వేదికగా తొలి టెస్టు జరుగగా.. ఊహించని రీతిలో బంగ్లాదేశ్ జయభేరి మోగించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన బంగ్లా.. తొలి ఇన్నింగ్స్‌లో 413 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఇందుకు పాక్ ధీటుగా బదులివ్వలేకపోయింది.కేవలం 386 పరుగులు చేసి షాన్ మసూద్ బృందం ఆలౌట్ అయింది. ఈ క్రమంలో 27 పరుగుల స్వల్ప ఆధిక్యం సంపాదించిన బంగ్లాదేశ్.. తమ రెండో ఇన్నింగ్స్‌లో 240 పరుగులు చేసింది. ఫలితంగా 268 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాక్.. 163 పరుగులకే కుప్పకూలింది.దీంతో 104 పరుగుల తేడాతో బంగ్లాదేశ్ పాక్‌ను మట్టికరిపించి.. 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. బంగ్లాదేశ్ సొంతగడ్డపై పాక్ మీద టెస్టు మ్యాచ్ గెలవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఇలాంటి తరుణంలో మూలిగే నక్క మీద తాటిపండు పడినట్లు ఐసీసీ పాక్‌కు షాకిచ్చింది.భారీ జరిమానా, పాయింట్లలో కోతబంగ్లాదేశ్తో తొలి టెస్టు సందర్భంగా నిర్ణీత సమయంలో బౌలింగ్ కోటా పూర్తి చేయనందున.. భారీ జరిమానా విధించడంతో పాటు పాయింట్లలో కోత వేసింది. ఈ మేరకు.. ‘‘ఐసీసీ ప్రవర్తనా నియామవళిలోని ఆర్టికల్ 2.22 నిబంధన ప్రకారం.. స్లో ఓవర్ రేటు మెయింటెన్ చేసినందుకు గానూ.. ఆలస్యమైన ప్రతీ ఓవర్‌కు ఐదు శాతం చొప్పున ఆటగాళ్ల ఫీజులో కోత విధిస్తున్నాం.ఇక ఆర్టికల్ 16.11.2 నిబంధన ప్రకారం.. ప్రపంచ చాంపియన్‌షిప్ ఆడే జట్లు.. స్లో ఓవర్ రేటు మెయింటెన్ చేస్తే.. ప్రతీ ఓవర్‌కు ఒక పాయింట్ చొప్పున కట్ చేస్తాం. పాకిస్తాన్ తప్పిదానికి పాల్పడినందున డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో ఎనిమిది పాయింట్లు కోల్పోయింది’’ అని ఐసీసీ తమ ప్రకటనలో పేర్కొంది.ఇక కష్టమేకాగా బంగ్లాతో టెస్టులో పాక్ 8 ఓవర్లు వెనుకడింది. ఫలితంగా నిబంధనల ప్రకారం ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో ఐసీసీ 40 శాతం కోత విధించింది. అదే విధంగా ఎనిమిది పాయింట్లు కట్ చేసింది. దీంతో ప్రస్తుతం పాకిస్తాన్ ఖాతాలో కేవలం నాలుగు పాయింట్లే ఉన్నాయి. డబ్ల్యూటీసీ ఫైనల్ చేరాలంటే ఒక్క పాయింట్ కూడా కీలకమే. అలాంటిది పాక్ ఒకే మ్యాచ్‌లో స్వీయ తప్పిదంతో ఎనిమిది పాయింట్లు కోల్పోయి తమ దారులను దాదాపుగా మూసేసుకుంది.చదవండి: రాహుల్ ద్రవిడ్ సంచలన వ్యాఖ్యలు! -
వన్డే వరల్డ్‌కప్ ఆడటంపై కోహ్లి కీలక వ్యాఖ్యలు
భారత బ్యాటింగ్ దిగ్గజం విరాట్ కోహ్లి.. వన్డే వరల్డ్‌కప్-2027 టోర్నీలో ఆడతాడా? లేదా?.. చాన్నాళ్లుగా క్రికెట్ వర్గాల్లో ఈ చర్చ నడుస్తోంది. ‘సూపర్ స్టార్లు’ అయినా సరే తమను తాము ఎప్పటికప్పుడు నిరూపించుకోవాలని హెడ్‌కోచ్ గౌతం గంభీర్, చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ గట్టిగానే చెబుతున్నారు.తమ దృష్టిలో దిగ్గజాలు, యువ ఆటగాళ్లు సమానమనే సంకేతాలు ఇస్తున్నారు. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025లో భారత్‌ను విజేతగా నిలిపిన తర్వాత కెప్టెన్ పదవి నుంచి రోహిత్ శర్మను తప్పించడం ఇందుకు నిదర్శనం. అంతేకాదు రో-కోలను మేనేజ్మెంట్ దేశీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో తప్పక ఆడాలని ఆదేశించింది.మౌనం వీడిన కోహ్లిఈ ఇద్దరూ అక్కడా సత్తా చాటి తమను తాము నిరూపించుకున్నారు. అయినప్పటికీ వయసు రిత్యా రో-కోను వరల్డ్‌కప్ ఆడిస్తారా? లేదా? అనే సందేహాలు తలెత్తుతున్నాయి. ఇలాంటి తరుణంలో విరాట్ కోహ్లి (Virat Kohli) తన భవిష్యత్తుపై మౌనం వీడాడు.వన్డే వరల్డ్‌కప్-2027లో ఆడతారా? లేదా? అన్న అంశంపై స్పందిస్తూ.. ‘‘నా దృష్టి కోణం ఒక్కటే. నా జట్టు విలువ పెంచేలా నా శాయశక్తులా కృషి చేస్తా. అక్కడున్న వాళ్లు కూడా నా వల్ల జట్టుకు మేలు చేకూరుతుందని భావించాలి. అప్పుడే నేను జట్టులో ఉంటాను.పదే పదే నిరూపించుకోవాలనే ఒత్తిడి వస్తే..అయితే, పదే పదే నన్ను నేను నిరూపించుకోవాలనే ఒత్తిడి వస్తే.. అక్కడ నాకు స్థానం ఉండదని పరోక్షంగా నాకు నేను చెబుతున్నట్లు అర్థం. ఏదేమైనా నిజాయితీగా ఆట కోసం సన్నద్ధం కావడం అత్యంత ముఖ్యం. బ్యాటింగ్ చేయడానికి వెళ్లే ముందు ప్రతిసారి నా తల వంచుకుని.. కొత్తగా మైదానంలోకి దిగినట్లే వెళ్తాను.నా క్రికెట్ కెరీర్లో దేవుడు ఎన్నో అవకాశాలు ఇచ్చాడు. అందుకు నేను కృతజ్ఞుడిని. కఠినంగా శ్రమించడమే నాకు తెలుసు. సరైన రీతిలో ఆడటమే నా లక్ష్యం. అలాగే ఆడతాను కూడా. వన్డే మ్యాచ్‌లో నలభై ఓవర్ల పాటు.. వికెట్ల మధ్య పరుగులు తీయాల్సి వస్తే నేను కచ్చితంగా ఆ పనిని పూర్తి చేస్తా.As I said, if Kohli feels the team management or BCCI wants him to prove his worth, he’ll retire the next day and that’s exactly what he said.He added "Ofc I want to play 2027 WC " 😭♥️ pic.twitter.com/eOv07nN6fc— Gaurav (@Melbourne__82) May 15, 2026ప్రతి బాల్ నా కెరీర్లో ఆఖరిది అనే ఆలోచనతోనేనాకెలాంటి ఫిర్యాదులూ ఉండవు. ఎందుకంటే.. మ్యాచ్‌లో ఊహించని పరిస్థితులు ఎదురైనా.. అందుకు తగ్గట్లుగా జట్టు కోసం ఉపయోగపడేలా ముందే నేను సన్నద్ధమవుతా. మ్యాచ్‌లో ఎదుర్కొనే ప్రతి బాల్ నా కెరీర్లో ఆఖరి బంతి అనే ఆలోచనతోనే సిద్ధమవుతా.వికెట్ల మధ్య అలుపు లేకుండా పరిగెడతా. ఇంత చేసినా నా విలువ, స్థాయి ఏమిటో నిరూపించుకోవాలని అంటున్నారంటే.. అక్కడ నా అవసరం లేదు అని అర్థం. నాకు అది అక్కర్లేదు కూడా!’’ అని కోహ్లి నర్మగర్భ వ్యాఖ్యలు చేశాడు. ఆర్సీబీ పాడ్‌కాస్ట్‌లో కోహ్లి చేసిన ఈ కామెంట్లు వైరల్ అవుతున్నాయి. గంభీర్, అగార్కర్ వైఖరి నచ్చకే అతడు ఈ విధంగా స్పందించాడని అభిమానులు అంటున్నారు.కాగా 2024లో టీమిండియా టీ20 ప్రపంచకప్ గెలిచిన తర్వాత అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్‌కు వీడ్కోలు పలికిన రో-కో.. గతేడాది అనూహ్యంగా టెస్టులకూ గుడ్‌బై చెప్పారు. ఇప్పుడు ఇద్దరూ వన్డేలతో పాటు ఐపీఎల్లో కొనసాగుతున్నారు. ఆర్సీబీ తరఫున కోహ్లి ఐపీఎల్-2026 సీజన్లో ఇప్పటికి 12 మ్యాచ్‌లు ఆడి 484 పరుగులు సాధించాడు.చదవండి: రాహుల్ ద్రవిడ్ సంచలన వ్యాఖ్యలు! -
రాహుల్ ద్రవిడ్ సంచలన వ్యాఖ్యలు!
టీమిండియా మాజీ హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుత హెడ్‌కోచ్ గౌతం గంభీర్ ఆలోచనా విధానానికి తాను వ్యతిరేకమని చెప్పకనే చెప్పాడు. రవిశాస్త్రి తర్వాత భారత జట్టుకు మార్గనిర్దేశకుడిగా వచ్చిన ద్రవిడ్.. జట్టును విజయపథంలో నిలిపాడు.టైటిల్ గెలిచిన తర్వాతఆరంభంలో సవాళ్లు ఎదురైనా వాటిని అధిగమించి.. 2024లో టీమిండియా టీ20 ప్రపంచకప్ గెలిచిన తర్వాత ద్రవిడ్ తన పదవి నుంచి సగర్వంగా వైదొలిగాడు. అంతకుముందు ద్రవిడ్ మార్గనిర్దేశనంలోనే భారత్ వన్డే వరల్డ్‌కప్-2023 ఫైనల్‌కు చేరింది.ఇక ద్రవిడ్ నిష్క్రమణ తర్వాత గంభీర్ హెడ్‌కోచ్‌గా బాధ్యతలు చేపట్టాడు. అతడి కోచింగ్‌లో టీమిండియా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025, టీ20 ప్రపంచకప్-2026 టైటిళ్లు గెలిచింది. అయితే, చాంపియన్స్ ట్రోఫీ విజయంలో ద్రవిడ్‌దే కీలక పాత్ర అని.. అతడు నిర్మించిన జట్టే టైటిల్ గెలిచిందని నాటి కెప్టెన్ రోహిత్ శర్మ ద్రవిడ్‌కు క్రెడిట్ ఇచ్చాడు.కోహ్లి, రోహిత్ రిటైర్మెంట్కు కారణమా?ఇదిలా ఉంటే.. గంభీర్ టీమిండియాలో సూపర్‌స్టార్ సంస్కృతిని పారద్రోలి.. సూపర్ టీమ్‌గా ఎదిగేందుకు ప్రాధాన్యం ఇస్తాడని అతడి సన్నిహిత వర్గాలు ఇటీవల తెలిపాయి. టెస్టు ఫార్మాట్ నుంచి దిగ్గజాలు, సూపర్ స్టార్ బ్యాటర్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ వారం వ్యవధిలోనే వైదొలగడంతో గంభీర్‌తో విభేదాలే కారణమనే వార్తలు వచ్చాయి.ప్రతీ క్రీడకు ‘హీరో’ల అవసరం ఉందిఈ నేపథ్యంలో రాహుల్ ద్రవిడ్ తాజాగా టీమిండియాలో ‘సూపర్ స్టార్ కల్చర్’పై స్పందించాడు. స్కూప్ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ.. ‘‘ప్రతీ క్రీడకు ‘హీరో’ల అవసరం ఉంది. తమ ప్రదర్శనల ద్వారానే ప్లేయర్లు హీరోలుగా ఎదుగుతారు.మైదానంలో మన ప్రదర్శన బాగుంటునే జాతి మనల్ని గుర్తిస్తుంది. ముఖ్యంగా భారత్‌లో అద్భుతంగా ఆడితే ఓ రేంజ్లో ప్రశంసలు వస్తాయి. అదే సమయంలో విమర్శలు కూడా అదే స్థాయిలో ఉంటాయి. అందరి దృష్టి ఆటగాళ్ల మీదే ఉంటుంది. మన ప్రదర్శనలను ప్రజలు క్షుణ్ణంగా గమనిస్తారు.వారే స్ఫూర్తి దాతలుకాబట్టి ఈ దేశంలో ఎంతో గొప్పగా ఆడితే తప్ప సూపర్ స్టార్ లేదంటే దిగ్గజ ప్లేయర్ అనే హోదా రాదు. వ్యక్తిగత ప్రదర్శన బాగుంటే జట్టు విజయాలకూ మనం దోహదపడినవాళ్లము అవుతాము’’ అని రాహుల్ ద్రవిడ్ పేర్కొన్నాడు. సూపర్ స్టార్లు భావితరాలకు స్ఫూర్తినిస్తారని.. వారి అవసరం తప్పక ఉందని ద్రవిడ్ అభిప్రాయపడ్డాడు. కాగా గంభీర్ సూపర్ స్టార్ ట్యాగులు వద్దంటూ అందరినీ ఒకే గాటన కట్టాలని చూస్తుంటే.. ద్రవిడ్ మాత్రం ఈ మేరకు స్పందించడం గమనార్హం.చదవండి: టీమిండియా టీ20 కెప్టెన్‌గా అతడే! -
టీమిండియా టీ20 కెప్టెన్‌గా అతడే!
టీమిండియా టీ20 కెప్టెన్సీ త్వరలోనే చేతులు మారనుందనే సంకేతాలు కనిపిస్తున్నాయి. భారత్‌కు ఇటీవలే టీ20 ప్రపంచకప్ అందించినప్పటికీ సూర్యకుమార్ యాదవ్‌పై వేటు తప్పదనే వార్తలు వినిపిస్తున్నాయి. ఒకప్పుడు ప్రపంచ నంబర్ వన్ బ్యాటర్‌గా పేరొందిన ఈ ముంబైకర్.. ఇటీవల ఫామ్‌లేమితో ఇబ్బంది పడటం ఇందుకు కారణం.కొత్త సారథి రావడం పక్కా!అంతేకాదు 35 ఏళ్ల సూర్యకు వయసు కూడా అడ్డంకిగా మారింది. ఇంగ్లండ్ పర్యటన తర్వాత అతడిని తొలగించి.. కొత్త సారథిని నియమించేందుకు యాజమాన్యం సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో శ్రేయస్ అయ్యర్ పేరు ప్రముఖంగా తెరమీదకు వచ్చింది.ప్రస్తుతం భారత టీ20 జట్టులో అయ్యర్‌కు చోటు లేకపోయినా.. త్వరలోనే అతడు రీఎంట్రీ ఇచ్చి పగ్గాలు చేపడతాడనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అతడితో పాటు ఇషాన్ కిషన్, టెస్టు, వన్డే జట్ల కెప్టెన్ శుబ్‌మన్ గిల్ కూడా రేసులో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.సంజూకే ఆ అర్హతఈ నేపథ్యంలో టీమిండియా మాజీ హెడ్‌కోచ్, భారత మాజీ క్రికెటర్ రవిశాస్త్రి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘టీ20 ప్రపంచకప్-2028 టోర్నీకి సన్నద్ధమయ్యే క్రమంలో టీమిండియా కొత్త కెప్టెన్ కోసం ఎదురుచూస్తోంది. ఈ రెండేళ్లలో సూర్య ఏం చేస్తాడో చూడాలి.అయితే, సూర్య స్థానంలో కొత్త నాయకుడిగా సంజూ శాంసన్ ముందు వరుసలో ఉంటాడు. ఐపీఎల్లో రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్‌గా అతడు అదరగొట్టాడు. టాపార్డర్‌లో విధ్వంసకర బ్యాటర్‌గా అతడు పేరొందాడు. వచ్చే రెండు, మూడేళ్లలో సంజూ నుంచి మనం మరిన్ని గొప్ప ఇన్నింగ్స్ చూడబోతున్నామని అనిపిస్తోంది.నిజానికి సంజూ గొప్ప ప్రతిభ ఉన్న ఆటగాడు. అయితే, తనకున్న టాలెంట్‌ను సరిగ్గా ఉపయోగించుకోలేకపోతున్నాడనే విమర్శలు వచ్చేవి. టీ20 ప్రపంచకప్ సందర్భంగా వాటన్నింటికీ అతడు ఆటతోనే సమాధానం చెప్పాడు.ఒంటిచేత్తో టీమిండియాను గెలిపించాడుకీలక నాకౌట్ మ్యాచ్‌లలో అద్భుతంగా ఆడి ఒంటిచేత్తో టీమిండియాను గెలిపించాడు. భారత్ మరోసారి టీ20 వరల్డ్‌కప్ ట్రోఫీ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. క్వార్టర్స్, సెమీస్, ఫైనల్ మ్యాచ్‌లలో సంజూ గొప్ప పరిణతితో కూడిన ఇన్నింగ్స్ ఆడాడు.తాజా సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫునా రాణిస్తున్నాడు. టీమిండియా భవిష్య నాయకుడిగా సంజూ తనను తాను ముందు వరుసలో నిలుపుకొన్నాడు’’ అని రవిశాస్త్రి ‘ది ఐసీసీ రివ్యూ’లో పేర్కొన్నాడు.దుమ్ములేపిన సంజూకాగా టీ20 ప్రపంచకప్-2026లో నాకౌట్ మ్యాచ్‌లలో సంజూ 97*, 89, 89 పరుగులు సాధించాడు. ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ’ అవార్డు గెలుచుకున్నాడు.ఇక ఐపీఎల్-2026 ఆరంభానికి ముందు రాజస్తాన్ నుంచి చెన్నైకి ట్రేడ్ అయిన సంజూ.. ఆరంభంలో తడబడ్డాడు. ఆ తర్వాత సెంచరీతో అదరగొట్టి ఫామ్‌లోకి వచ్చాడు. ఇప్పటికి 11 మ్యాచ్‌లలో కలిపి 430 పరుగులు సాధించాడు. ఇందులో రెండు శతకాలు ఉన్నాయి.చదవండి: Hardik Pandya: మౌనం వీడిన ముంబై ఇండియన్స్ -
తిలక్ వర్మను అవమానించిన అర్ష్‌దీప్ సింగ్!
టీమిండియా స్టార్, పంజాబ్ కింగ్స్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ మరోసారి వివాదంలో చిక్కుకున్నాడు. అతడి వ్యవహారశైలిపై నెటిజన్లు మండిపడుతున్నారు. ఎంత ఎత్తుకు ఎదిగినా.. ఒదిగి ఉండాలని.. సహచర ఆటగాడి పట్ల సోదరభావం కలిగి ఉండాలే తప్ప.. అహంకారం పనికిరాదని చురకలు అంటిస్తున్నారు.కాగా ఐపీఎల్-2026లో భాగంగా ముంబై ఇండియన్స్- పంజాబ్ కింగ్స్ మధ్య గురువారం మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. ధర్మశాల వేదికగా మ్యాచ్ ఆరంభానికి ముందు అర్ష్‌దీప్ సింగ్ హోటల్ లాబీలో ఓ వ్లాగ్ చేశాడు. ఇందులో భాగంగా ముంబై బ్యాటర్, టీమిండియా స్టార్ తిలక్ వర్మను ఉద్దేశించి వివక్షపూరిత వ్యాఖ్యలు చేశాడు.ఓయ్.. నల్లోడాతిలక్ను.. ‘ఓయ్.. అంధేరే(నల్లోడా)’ అని సంబోధిస్తూ అతడిని ‘రంగు’ను ఉద్దేశించి హేళన చేశాడు. ఈ క్రమంలో తిలక్ కాస్త అసహనంగా కదులుతూ.. అర్ష్‌దీప్‌తో సంభాషణ ముగించి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియోను అర్ష్‌దీప్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు.నీకసలు బుద్ధి ఉందా?దీంతో అర్ష్‌దీప్ సింగ్‌పై విమర్శల వర్షం కురుస్తోంది. ‘‘నీకసలు బుద్ధి ఉందా? సహచర ఆటగాడి శరీర రంగును ప్రస్తావిస్తూ నీచంగా మాట్లాడుతావా? ఫన్ పేరిట నువ్వు తిలక్‌ను ఘోరంగా అవమానించావు. ఇది ఎంత మాత్రం సరికాదు’’ అని నెటిజన్లు చివాట్లు పెడుతున్నారు.అయితే, అర్ష్‌దీప్ అభిమానులు మాత్రం.. ‘‘తిలక్‌తో ఉన్న చనువు కారణంగా.. సరదాగా అలా అని ఉంటాడు’’ అని సమర్థించే ప్రయత్నం చేస్తున్నారు. కాగా అర్ష్‌దీప్ సింగ్ వ్లాగుల కారణంగా పంజాబ్ కింగ్స్ చిక్కుల్లో పడిన సంగతి తెలిసిందే.తరచూ వివాదాలుఆ జట్టు స్పిన్నర్ యజువేంద్ర చహల్ విమానంలో ‘వేపింగ్’ (ఇ- సిగరెట్ తాగడం) చేసినట్లుగా ఉన్న వీడియోను అర్ష్‌దీప్ పంచుకున్నాడు. కాగా భారత్‌లో దీనిపై నిషేధం ఉన్న సంగతి తెలిసిందే. ఈ వీడియో వైరల్ కావడంతో పంజాబ్ జట్టు చిక్కుల్లో పడే పరిస్థితి తలెత్తింది. అయితే, అతడు నిజంగా వేపింగ్ చేయలేదని.. అలా అభినయించాడని సన్నిహిత వర్గాలు తెలపడంతో వివాదం కాస్త సద్దుమణిగింది. ఇక బీసీసీఐ సైతం ఆటగాళ్లు జట్టుతో ఉన్న సమయంలో వ్లాగులు చేయడంపై గుర్రుగా ఉన్నట్లు వార్తలు వచ్చాయి.ఇక మ్యాచ్ విషయానికొస్తే.. ముంబై పంజాబ్‌ను ఆరు వికెట్ల తేడాతో ఓడించింది. ఈ మ్యాచ్‌లో తిలక్ వర్మ 33 బంతుల్లో 75 పరుగులతో నాటౌట్‌గా నిలిచి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. మరోవైపు పంజాబ్ తరఫున అర్ష్‌దీప్ సింగ్.. 4 ఓవర్లలో 29 పరుగులు ఇచ్చి ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు.చదవండి: కీరన్ పొలార్డ్‌కు భారీ షాక్!Honestly, this is ridiculous. Arshdeep singh is clearly mocking Tilak Varma in this video.One day this kind of behaviour on social media is going to put him in a really tough spot. Yuzi Chahal is the perfect example of how quickly things can backfire. 😬 pic.twitter.com/FxB4EADF4E— Vipin Tiwari (@Vipintiwari952) May 14, 2026 -
మౌనం వీడిన ముంబై ఇండియన్స్
ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాపై వేటు తప్పదంటూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సారథిగా, ఆల్‌రౌండర్‌గా విఫలమవుతున్న హార్దిక్‌ను వదిలించుకోవాలని ముంబై యాజమాన్యం భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.అదే సమయంలో హార్దిక్ (Hardik Pandya) సైతం మేనేజ్మెంట్ వైఖరి పట్ల గుర్రుగా ఉన్నాడని.. జట్టును వీడేందుకు సిద్ధపడ్డాడనే వదంతులు వ్యాపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో హార్దిక్ పాండ్యా వరుసగా నాలుగో మ్యాచ్‌కు దూరం కావడం వీటికి బలాన్నిచ్చింది.ఐపీఎల్-2026లో భాగంగా గురువారం పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌కు కూడా పాండ్యా అందుబాటులోకి రాలేదు. దీంతో అతడి స్థానంలో ఈసారి జస్ప్రీత్ బుమ్రా తాత్కాలిక కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఇక లీగ్ దశలో ముంబైకి మరో రెండు మ్యాచ్‌లు మాత్రమే మిగిలి ఉన్నాయి. అయితే, ఇప్పుడైనా హార్దిక్ జట్టుతో కలుస్తాడా? లేదా? అన్నది ప్రశ్నార్థంగా మారింది.స్పందించిన ముంబై స్టార్ఈ నేపథ్యంలో ముంబై ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్ హార్దిక్ పాండ్యా గురించి వస్తున్న వార్తలపై స్పందించాడు. ‘‘హార్దిక్ గాయపడ్డాడు. ఆర్సీబీతో మే 10 నాటి మ్యాచ్ కోసం అతడు రాయ్‌పూర్‌కి వచ్చాడు. కానీ వెన్నునొప్పి కారణంగా ఆడలేకపోయాడు.అతడు ముంబైలో ప్రాక్టీస్ చేస్తున్నాడు. కేకేఆర్‌తో బుధవారం నాటి మ్యాచ్ కోసం హార్దిక్ కోల్‌కతాకు వస్తాడని నేను విశ్వసిస్తున్నా. హార్దిక్ లాంటి ఆటగాళ్లు జట్టుకు దూరం కావడం ప్రభావం చూపుతుంది. ఇక సోషల్ మీడియాలో వదంతుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిందేమీ లేదు.యాజమాన్యానిదే అంతిమ నిర్ణయంఅందులో కొన్ని నిజాలు, మరికొన్ని అబద్ధాలు ఉంటాయి. జట్టు యాజమాన్యానిదే అంతిమ నిర్ణయం. అతడు గాయపడ్డాడు కాబట్టే జట్టుతో ప్రయాణించడం లేదు. అంతకు మించి ఏమీలేదు’’ అని శార్దూల్ ఠాకూర్ పేర్కొన్నాడు.కాగా పంజాబ్‌తో మ్యాచ్‌లో శార్దూల్ ఠాకూర్.. నాలుగు ఓవర్ల కోటా పూర్తి చేసి 39 పరుగులు ఇచ్చి నాలుగు వికెట్లు కూల్చాడు. తద్వారా ముంబై గెలుపులో తన వంతు పాత్ర పోషించాడు. మ్యాచ్ అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు. కాగా ధర్మశాల వేదికగా పంజాబ్‌పై ముంబై ఆరు వికెట్ల తేడాతో గెలిచి.. సీజన్లో నాలుగో విజయం అందుకుంది.A Tilak of victory for MI 💙 A stunning hit to cap off a truly stunning innings, and the #PunjabKings lose for the fifth time in a row! 😲 #TATAIPL | #PBKSvMI #TilakVarma #SherfaneRutherford #ShardulThakur pic.twitter.com/IPA7IpPqOG— Star Sports (@StarSportsIndia) May 14, 2026చదవండి: IPL 2026: తిలక్ వర్మ విధ్వంసం.. పంజాబ్‌పై ముంబై ఘన విజయం -
కీరన్ పొలార్డ్‌కు భారీ షాక్!
ఐపీఎల్-2026 ప్లే ఆఫ్స్ అవకాశాలు కోల్పోయిన తర్వాతి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ చెలరేగింది. పంజాబ్ కింగ్స్‌తో గురువారం నాటి మ్యాచ్‌లో ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. తద్వారా ముంబై ఈ సీజన్లో తమ నాలుగో గెలుపు నమోదు చేయడంతో పాటు.. పంజాబ్ ప్లే ఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టం చేసింది.అయితే, గెలుపు జోష్‌లో ఉన్న ముంబైకి ఊహించని షాక్ తగిలింది. ఆ జట్టు బ్యాటింగ్ కోచ్ కీరన్ పొలార్డ్‌కు ఐపీఎల్ పాలక మండలి జరిమానా విధించింది. మ్యాచ్ ఫీజులో 15 శాతం కోత వేయడంతో పాటు.. అతడి ఖాతాలో ఓ డిమెరిట్ పాయింట్ జత చేసింది.కారణం ఇదేముంబై ఇన్నింగ్స్ సందర్భంగా పందొమ్మిదో ఓవర్లో పొలార్డ్ ఫోర్త్ అంపైర్‌తో వాగ్వాదానికి దిగడమే ఇందుకు కారణమని ఐపీఎల్ పాలక మండలి తమ ప్రకటనలో పేర్కొంది. ఫోర్త్ అంపైర్‌తో దురుసుగా ప్రవర్తించిన కారణంగా ఈ మేరకు చర్యలు తీసుకున్నట్లు వెల్లడించింది.ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.3 నిబంధనను పోలార్డ్ ఉల్లంఘించాడని.. అంపైర్‌ను అసభ్య పదజాలంతో దూషించాడని పేర్కొంది. పొలార్డ్ తన తప్పిదాన్ని అంగీకరించినట్లు మ్యాచ్ రిఫరీ పంకజ్ ధర్మానీ ధ్రువీకరించినట్లు తెలిపింది.ముంబైని గెలిపించిన తిలక్ వర్మమ్యాచ్ విషయానికొస్తే.. ధర్మశాల వేదికగా టాస్ గెలిచిన ముంబై తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 200 పరుగులు స్కోరు చేసింది. లక్ష్య ఛేదనలో ముంబై ఓపెనర్లలో రియాన్ రికెల్టన్ (23 బంతుల్లో 48) వేగంగా ఆడగా.. రోహిత్ శర్మ (26 బంతుల్లో 25) నిరాశపరిచాడు.వన్‌డౌన్ బ్యాటర్ నమన్ ధిర్ (9) ఇలా వచ్చి అలా వెళ్లగా.. తిలక్ వర్మ ధనాధన్ దంచికొట్టాడు. 33 బంతుల్లో 75 పరుగులతో అజేయంగా నిలిచాడు. అతడికి తోడుగా విల్ జాక్స్ (10 బంతుల్లో 25 నాటౌట్) రాణించగా.. ముంబై 19.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. A Tilak of victory for MI 💙 A stunning hit to cap off a truly stunning innings, and the #PunjabKings lose for the fifth time in a row! 😲 #TATAIPL | #PBKSvMI #TilakVarma #SherfaneRutherford #ShardulThakur pic.twitter.com/IPA7IpPqOG— Star Sports (@StarSportsIndia) May 14, 2026చదవండి: IND vs AFG: పంత్‌కు షాక్.. కిషన్‌కు జాక్‌పాట్! -
భారత ‘ఎ’ జట్టులో వైభవ్ సూర్యవంశీ
న్యూఢిల్లీ: టీనేజ్ సంచలనం వైభవ్ సూర్యవంశీ తొలిసారి భారత సీనియర్ ‘ఎ’ జట్టులోకి ఎంపికయ్యాడు. బిహార్‌కు చెందిన 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ ప్రస్తుతం జరుగుతోన్న ఐపీఎల్ 19వ సీజన్లో రాజస్తాన్ రాయల్స్ తరఫున 11 మ్యాచ్‌లు ఆడి 440 పరుగులు చేశాడు. జూన్ 9 నుంచి 21 వరకు శ్రీలంకలోని దంబుల్లాలో జరిగే ముక్కోణపు వన్డే సిరీస్‌లో పాల్గొనే భారత ‘ఎ’ జట్టును గురువారం ప్రకటించారు. 15 మంది సభ్యులతో కూడిన భారత ‘ఎ’ జట్టుకు హైదరాబాద్ ప్లేయర్ తిలక్ వర్మ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు. ఈ సిరీస్‌లో భారత్‌తోపాటు అఫ్గానిస్తాన్, శ్రీలంక ‘ఎ’ జట్లు పాల్గొంటాయి. శ్రీలంక ‘ఎ’ జట్టుతో జూన్ 9న, 15న... అఫ్గానిస్తాన్ ‘ఎ’తో జూన్ 11న, 17న భారత్ ‘ఎ’ జట్టు ఆడుతుంది. జూన్ 21న ఫైనల్ జరుగుతుంది. భారత ‘ఎ’ జట్టు: తిలక్ వర్మ (కెప్టెన్), రియాన్ పరాగ్ (వైస్ కెప్టెన్), ప్రియాన్ష్ ఆర్య, వైభవ్ సూర్యవంశీ, ఆయుశ్ బదోని, నిశాంత్ సింధు, హర్ష్ దూబే, సుయాంశ్ షెడ్గే, ప్రభ్‌సిమ్రన్ సింగ్, కుమార్ కుశాగ్ర, విప్రాజ్ నిగమ్, యశ్ ఠాకూర్, యు«ద్వీర్ సింగ్, అన్షుల్ కంబోజ్, అర్షద్ ఖాన్. -
తిలక్ వర్మ విధ్వంసం.. పంజాబ్‌పై ముంబై ఘన విజయం
ఐపీఎల్-2026 సీజన్లో పంజాబ్ కింగ్స్ మరోసారి 200 పరుగులకు పైగా లక్ష్యాన్ని కాపాడుకోలేకపోయింది. గురువారం ధర్మశాల వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో పంజాబ్ ఓటమి పాలైంది. పంజాబ్ విధించిన 201 పరుగుల లక్ష్యాన్ని ముంబై కేవలం నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి 19.4 ఓవర్లలో చేధించింది. ఈ ఓటమితో పంజాబ్ తమ ప్లే ఆఫ్ ఆశలను సంక్లిష్టం చేసుకుంది. పంజాబ్‌కు ఇది వరుసగా ఐదో ఓటమి. ఇక ముంబై విజయంలో తిలక్ వర్మ కీలక పాత్ర పోషించాడు. ఈ హైదరాబాదీ కేవలం 33 బంతుల్లో 75 పరుగులు చేసి తమ జట్టును విజయ తీరాలకు చేర్చాడు. అతడి ఇన్నింగ్స్‌లో 6 ఫోర్లు, 6 సిక్స్‌లు ఉన్నాయి.ఆఖరిలో విల్ జాక్స్(10 బంతుల్లో 25) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. వీరిద్దరితో పాటు ర్యాన్ రికెల్టన్(48) కూడా కీలక ఇన్నింగ్స్ ఆడాడు. పంజాబ్ బౌలర్లలో అజ్మతుల్లా ఓమర్జాయ్ రెండు వికెట్లు పడగొట్టగా.. చాహల్, జాన్సన్ తలా వికెట్ సాధించారు. అంతకముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది. పంజాబ్ బ్యాటర్లలో ప్రభ్సిమ్రాన్ సింగ్(57) టాప్ స్కోరర్‌గా నిలవగా.. ఓమర్జాయ్(17 బంతుల్లో 38), బార్ట్లెట్(7 బంతుల్లో 18), ప్రియాన్ష్ ఆర్య(22) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడారు. ముంబై బౌలర్లలో శార్ధూల్ ఠాకూర్ నాలుగు వికెట్లు పడగొట్టగా.. దీపక్ చాహర్ రెండు, బాష్, బావా తలా వికెట్ సాధించారు. -
పంత్‌కు షాక్.. కిషన్‌కు జాక్‌పాట్!
ఐపీఎల్-2026 ముగిసిన వెంటనే టీమిండియా జాతీయ విధుల్లో బీజీ కానుంది. తొలుత స్వదేశంలో అఫ్గానిస్తాన్‌తో ఏకైక టెస్టు, మూడు వన్డేల సిరీస్‌లో భారత్ తలపడనుంది. అయితే ఈ సిరీస్‌ల కోసం అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ మే 19న భారత జట్టును ప్రకటించే అవకాశం ఉంది.ఈ సిరీస్‌లకు పలువురు సీనియర్లకు విశ్రాంతినిస్తూ, కొత్త ముఖాలకు అవకాశం కల్పించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా అఫ్గాన్‌తో జరిగే ఏకైక టెస్టుకు టీమిండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు విశ్రాంతి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అతడితో పాటు కెప్టెన్ శుభ్‌మన్ గిల్, కేఎల్ రాహుల్ వంటి స్టార్ బ్యాటర్లు సైతం అఫ్గాన్‌తో టెస్టుకు దూరమయ్యే సూచనలు కన్పిస్తున్నాయి. అయితే దేశవాళీ క్రికెట్లో అదరగొడుతున్న గుర్నూర్ బ్రార్, ఆకిబ్ నబీలకు తొలిసారి భారత జట్టులో చోటు దక్కనున్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. మరోవైపు న్‌రైజర్స్ హైదరాబాద్ తరపున మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడుతున్న ఇషాన్ కిషన్ కూడా సెలక్టర్ల దృష్టిలో ఉన్నాడు. రిజర్వ్ వికెట్ కీపర్‌గా పంత్ స్థానంలో ఇషాన్‌ను తీసుకునే అవకాశం ఉంది. పంత్ ప్రస్తుతం పేలవ ఫామ్‌తో సతమతమవుతున్నాడు. అదేవిధంగా వెన్నునొప్పి సమస్యతో ముంబై ఇండియన్స్‌కు దూరమైన హార్దిక్ పాండ్యా అఫ్గాన్‌తో వన్డేల్లో ఆడుతాడా లేదా అన్నది ఇంకా స్పష్టత లేదు. అతడు అందుబాటులో లేకపోతే నితీశ్ కుమార్ రెడ్డిని ఎంపిక చేసే ఛాన్స్ ఉంది. నితీశ్ ప్రస్తుతం బ్యాట్‌తో పాటు బంతితో కూడా రాణిస్తున్నాడు. ఇక అఫ్గాన్-భారత్ మధ్య ఏకైక టెస్ట్ మ్యాచ్ జూన్ 6న ముల్లాన్ పూర్ వేదికగా ప్రారంభం కానుంది.చదవండి: ముంబై ఇండియన్స్ అరుదైన రికార్డు.. 19 ఐపీఎల్ చరిత్రలోనే -
ముంబై ఇండియన్స్ అరుదైన రికార్డు.. 19 ఐపీఎల్ చరిత్రలోనే
ఐపీఎల్-2026లో ముంబై ఇండియన్స్‌కు మరో కొత్త కెప్టెన్ వచ్చాడు. ధర్మశాల వేదికగా పంజాబ్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ను స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా నడిపిస్తున్నాడు. రెగ్యులర్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా గాయంతో కొన్ని మ్యాచ్‌లకు దూరమైన సమయంలో సూర్యకుమార్ యాదవ్ సారథ్యం వహించాడు.ఇప్పుడు సూర్యకుమార్ కూడా అందుబాటులో లేకపోవడంతో జట్టు పగ్గాలను బుమ్రాకు అప్పగించారు. తద్వారా ముంబై ఇండియన్స్ ఓ అరుదైన ఘనతను తమ ఖాతాలో వేసుకుంది. ఒకే ఐపీఎల్ సీజన్లో ముగ్గురు ఇండియన్ కెప్టెన్ల సారథ్యంలో ఆడిన తొలి జట్టుగా ముంబై ఇండియన్స్ నిలిచింది. ఇప్పటివరకు ఒకే సీజన్లో ఏ జట్టుకు కూడా ముగ్గురు ఇండియన్స్ కెప్టెన్లగా వ్యవహరించలేదు. ఓవరాల్‌గా ఒకే ఐపీఎల్ సీజన్లో ముగ్గురు వేర్వేరు కెప్టెన్లను మార్చిన ఐదో జట్టుగా ముంబై ఇండియన్స్ నిలిచింది.ఒకే సీజన్లో ముగ్గురు కెప్టెన్ల సారథ్యంలో ఆడిన జట్లు ముంబై ఇండియన్స్ - 2008 (హర్భజన్, పొలాక్, టెండూల్కర్)పుణే వారియర్స్ - 2013 (మాథ్యూస్, రాస్ టేలర్, ఫించ్)ఎస్ఆర్హెచ్ - 2021 (వార్నర్, విలియమ్సన్, మనీష్ పాండే)పంజాబ్ కింగ్స్ - 2024 (శిఖర్, సామ్ కరన్, జితేష్)ముంబై ఇండియన్స్- 2026 (హార్దిక్, సూర్య, బుమ్రా)చదవండి: IND vs SL: భారత జట్టు ప్రకటన.. వైభవ్ సూర్యవంశీకి ఛాన్స్ -
సీఎస్కే జట్టులోకి సౌతాఫ్రికా యువ సంచలనం
ఐపీఎల్-2026 సీజన్లో ప్లే ఆఫ్స్ బెర్త్ దక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్న చెన్నై సూపర్ కింగ్స్‌కు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ ఆల్‌రౌండర్ జేమీ ఓవర్టన్ గాయం కారణంగా టోర్నీ నుంచి తప్పుకొన్నాడు. కుడి తొడ గాయంతో బాధపడుతున్న ఓవర్టన్.. తదుపరి చికిత్స కోసం యూకేకు తిరుగు ప్రయాణమయ్యాడు.ఈ విషయాన్ని సీఎస్కే మేనెజ్మెంట్ అధికారికంగా ధ్రువీకరించింది. అతడి స్ధానంలో దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్ డియన్ ఫారెస్టర్‌ను సీఎస్కే తమ జట్టులోకి తీసుకుంది. రూ.75 లక్షల కనీస ధరకు అతడితో చెన్నై సూపర్ కింగ్స్ ఒప్పందం కుదుర్చుకుంది."జేమీ ఓవర్టన్కు కుడి తొడకు గాయమైంది. అతడు తదుపరి చికిత్స కోసం యూకేకు తిరిగి వెళ్లిపోయాడు. ఓవర్టన్ లేకపోవడం జట్టు సమతుల్యతను దెబ్బతీస్తుంది. కానీ కొత్త ఆటగాళ్లు ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుంటారని ఆశిస్తున్నాం" సీఎస్కే యాజమాన్యం ఓ ప్రకటనలో పేర్కొంది. కాగా ఓవర్టన్ దూరం కావడం సీఎస్కే నిజంగా భారీ షాక్ అనే చెప్పాలి. ఎందుకంటే ఓవర్టన్ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఇప్పటివరకు ఆడిన 10 మ్యాచ్‌ల్లో 14 వికెట్లు తీసి జట్టులో అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా నిలిచారు.అటు బ్యాట్‌తోనూ లోయర్ ఆర్డర్లో కీలక పరుగులు చేస్తూ జట్టుకు కీలక ఆటగాడిగా నిలిచాడు. ఇక ఓవర్టన్ స్ధానంలో జట్టులోకి వచ్చిన ఫారెస్టర్‌కు అద్భుతమైన ఆల్‌రౌండ్ స్కిల్స్ ఉన్నాయి. ఇటీవల ముగిసిన పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో ఫారెస్టర్ అదరగొట్టాడు. సీఎస్కే తమ తదుపరి మ్యాచ్‌లో మే 15న లక్నో సూపర్ జెయింట్స్‌తో తలపడనుంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఐదో స్ధానంలో ఉన్న సీఎస్కేకు ప్లేఆఫ్స్ చేరాలంటే మిగిలిన మూడు మ్యాచ్‌లు అత్యంత కీలకం.చదవండి: IND vs SL: భారత జట్టు ప్రకటన.. వైభవ్ సూర్యవంశీకి ఛాన్స్ -
పంజాబ్ కింగ్స్‌ను చిత్తు చేసిన ముంబై ఇండియన్స్
Punjab Kings vs Mumbai Indians Live updates and Highlights: ధర్మశాల వేదికగా పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్ ఘన విజయం సాధించింది. 201 పరుగుల లక్ష్యాన్ని ముంబై కేవలం నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి 19.5 ఓవర్లలో చేధించింది.తిలక్ వర్మ (33 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్స్‌లతో 75 నాటౌట్) కీలక పాత్ర పోషించాడు. ఈ ఓటమితో పంజాబ్ తమ ప్లే ఆఫ్స్ ఆశలను సంక్లిష్టం చేసుకుంది. పంజాబ్ బౌలర్లలో ఓమర్జాయ్ రెండు వికెట్లు పడగొట్టగా.. జాన్సెన్, చాహల్ తలా వికెట్ సాధించారు.విజయానికి చేరువలో ముంబైతిలక్ వర్మ దూకుడుగా ఆడుతున్నాడు. కేవలం 25 బంతుల్లోనే తిలక్ తన హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. ముంబై విజయానికి 12 బంతుల్లో 28 పరుగులు కావాలి.ముంబై ఇండియన్స్ నాలుగో వికెట్ డట్ముంబై ఇండియన్స్ నాలుగో వికెట్ కోల్పోయింది. 20 పరుగులు చేసిన రూథర్ ఫర్డ్.. ఓమర్జాయ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. ముంబై విజయానికి 21 బంతుల్లో 52 పరుగులు కావాలి.దూకుడుగా ఆడుతున్న తిలక్15 ఓవర్లు ముగిసే సరికి ముంబై ఇండియన్స్ మూడు వికెట్ల నష్టానికి 135 పరుగులు చేసింది. ముంబై విజయానికి 30 బంతుల్లో 72 పరుగులు కావాలి. క్రీజులో తిలక్ వర్మ(37), షెర్పేన్ రూథర్ ఫర్డ్(13) ఉన్నారు.ముంబై ఇండియన్స్ మూడో వికెట్ డౌన్రోహిత్ శర్మ రూపంలో ముంబై ఇండియన్స్ మూడో వికెట్ కోల్పోయింది. 25 పరుగులు చేసిన రోహిత్.. చాహల్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు.ముంబై ఇండియన్స్ రెండో వికెట్ డౌన్‌ముంబై ఇండియన్స్ రెండో వికెట్ కోల్పోయింది. 9 పరుగులు చేసిన నమన్ ధీర్.. అర్ష్‌దీప్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 8.5 ఓవర్లకు ముంబై ఇండియన్స్ స్కోర్: 81/2ముంబై ఇండియన్స్ తొలి వికెట్ డౌన్‌ముంబై ఇండియన్స్ తొలి వికెట్ కోల్పోయింది. 48 పరుగులు చేసిన ర్యాన్ రికెల్టన్.. ఓమర్జాయ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 6.3 ఓవర్లకు ముంబై ఇండియన్స్ స్కోర్: 61/1దూకుడుగా ఆడుతున్న రికెల్టన్3 ఓవర్లు ముగిసే సరికి ముంబై ఇండియన్స్ వికెట్ నష్టపోకుండా 28 పరుగులు చేసింది. క్రీజులో ర్యాన్ రికెల్టన్(24), రోహిత్ శర్మ(4) పరుగులతో ఉన్నారు.చెలరేగిన పంజాబ్ బ్యాటర్లు.. ముంబై ముందు భారీ టార్గెట్ధర్మశాల వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్ బ్యాటర్లు సత్తాచాటారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది. పంజాబ్ బ్యాటర్లలో ప్రభ్సిమ్రాన్ సింగ్(57) టాప్ స్కోరర్‌గా నిలవగా.. ఓమర్జాయ్(17 బంతుల్లో 38), బార్ట్లెట్(7 బంతుల్లో 18), ప్రియాన్ష్ ఆర్య(22) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడారు. ముంబై బౌలర్లలో శార్ధూల్ ఠాకూర్ నాలుగు వికెట్లు పడగొట్టగా.. దీపక్ చాహర్ రెండు, బాష్, బావా తలా వికెట్ సాధించారు.దూకుడుగా ఆడిన ఓమర్జాయ్అజ్మతుల్లా ఓమర్జాయ్ దూకుడుగా ఆడాడు. 16 బంతుల్లో 38 పరుగులు చేసి ఎనిమిదో వికెట్‌గా వెనుదిరగాడు. అతడి కంటే ముందు జాన్సన్.. శార్ధూల్ ఠాకూర్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు.పంజాబ్ ఆరో వికెట్ డౌన్పంజాబ్ ఆరో వికెట్ కోల్పోయింది. 2 పరుగులు చేసిన శశాంక్ సింగ్.. కార్భిన్ బాష్ బౌలింగ్‌లో వికెట్ల ముందు దొరికిపోయాడు.పంజాబ్ ఐదో వికెట్ డౌన్సూర్యాంశ్ షెడ్గే రూపంలో పంజాబ్ ఐదో వికెట్ కోల్పోయింది. శార్ధూల్ ఠాకూర్ బౌలింగ్‌లో సూర్యాంశ్ ఔటయ్యాడు.పంజాబ్ నాలుగో వికెట్ డౌన్కూపర్ కొన్నోలీ రూపంలో పంజాబ్ నాలుగో వికెట్ కోల్పోయింది. 21 పరుగులు చేసిన కొన్నోలీ రాజ్ బావా బౌలింగ్‌లో ఔటయ్యాడు. 13 ఓవర్లకు పంజాబ్ స్కోర్: 122-4పంజాబ్ మూడో వికెట్ డౌన్పంజాబ్ మూడో వికెట్ కోల్పోయింది. 4 పరుగులు చేసిన శ్రేయస్ అయ్యర్.. శార్ధూల్ ఠాకూర్ బౌలింగ్‌లో ఔటయ్యాడు.పంజాబ్ రెండో వికెట్ డౌన్పంజాబ్ రెండో వికెట్ కోల్పోయింది. 57 పరుగులు చేసిన ప్రభ్సిమ్రాన్ సింగ్.. శార్ధూల్ ఠాకూర్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 11.2 ఓవర్లకు పంజాబ్ స్కోర్: 107/3పంజాబ్ తొలి వికెట్ డౌన్50 పరుగుల వద్ద పంజాబ్ కింగ్స్ తొలి వికెట్ కోల్పోయింది. 22 పరుగులు చేసిన ప్రియాన్ష్ ఆర్య.. దీపక్ చాహర్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు.దూకుడుగా ఆడుతున్న ప్రియాన్ష్5 ఓవర్లు ముగిసేసరికి పంజాబ్ కింగ్స్ వికెట్ నష్టపోకుండా 46 పరుగులు చేసింది. క్రీజులో ప్రియాన్ష్ ఆర్య(22), ప్రభ్సిమ్రాన్ సింగ్(23) ఉన్నారు.3 ఓవర్లకు పంజాబ్ స్కోరెంతంటే?3 ఓవర్లు ముగిసే సరికి పంజాబ్ కింగ్స్ వికెట్ నష్టపోకుండా 21 పరుగులు చేసింది. క్రీజులో ప్రభ్సిమ్రాన్ సింగ్(9), ప్రియాన్ష్ ఆర్య(12) ఉన్నారు.ఐపీఎల్-2026 సీజన్లో ధర్మశాల వేదికగా ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది.కాగా ఈ మ్యాచ్‌లో ముంబై కెప్టెన్‌గా జస్ప్రీత్ బుమ్రా వ్యవహరిస్తున్నాడు. కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఇప్పటికే గాయం కారణంగా దూరంగా కాగా.. ఇప్పుడు పంజాబ్‌తో మ్యాచ్ సూర్యకుమార్ యాదవ్ వ్యక్తిగత కారణాలతో దూరమయ్యాడు. ముంబై జట్టులోకి శార్ధూల్ ఠాకూర్‌తో పాటు రఘు శర్మ తిరిగొచ్చారు. మరోవైపు పంజాబ్ కింగ్స్ కూడా మూడు మార్పులు చేసిది. హర్‌ప్రీత్ బ్రాక్, జేవియర్ బార్ట్లెట్, ఓమర్జాయ్ తుది జట్టులోకి వచ్చారు.తుది జట్లుముంబై ఇండియన్స్: ర్యాన్ రికెల్టన్(వికెట్ కీపర్), నమన్ ధీర్, తిలక్ వర్మ, షెర్ఫానే రూథర్‌ఫోర్డ్, విల్ జాక్స్, రాజ్ బావా, కార్బిన్ బాష్, దీపక్ చాహర్, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా(కెప్టెన్), రఘు శర్మపంజాబ్ కింగ్స్: ప్రియాంష్ ఆర్య, ప్రభ్సిమ్రాన్ సింగ్(వికెట్ కీపర్), కూపర్ కొన్నోలీ, శ్రేయాస్ అయ్యర్(కెప్టెన్), సూర్యాంశ్ షెడ్జ్, శశాంక్ సింగ్, అజ్మతుల్లా ఒమర్జాయ్, మార్కో జాన్సెన్, జేవియర్ బార్ట్లెట్, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్ -
10,000 రన్స్.. 380 వికెట్లు! రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ క్రికెటర్
ఇంగ్లండ్ స్టార్ ఆల్‌రౌండర్ లియామ్ డాసన్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్ నుంచి తక్షణమే తప్పుకుంటున్నట్లు డాసన్ ప్రకటించాడు. 36 ఏళ్ల డాసన్.. తన వైట్ బాల్ కెరీర్‌ను మరింత కాలం పొడిగించుకోవాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. డాసన్ తన 19 ఏళ్ల ఫస్ట్ క్లాస్ కెరీర్లో 200 మ్యాచ్‌లు హాంప్‌షైర్ క్రికెట్ క్లబ్ తరపున ఆడాడు.2026 కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో భాగంగా హాంప్‌షైర్ ఆడిన మొదటి ఐదు మ్యాచ్‌ల్లో నాలుగింటిలో డాసన్ పాల్గోన్నాడు. కానీ టోర్నమెంట్ మధ్యలోనే అతడు తప్పుకోని అందరికి షాకిచ్చాడు. అయితే న్యూజిలాండ్‌తో తొలి టెస్టుకు ఇంగ్లండ్ జట్టు ప్రకటించిన కొద్ది గంటల్లోనే డాసన్ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.వైట్ బాల్ క్రికెట్‌పై దృష్టి సారించేందుకు ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు డాసన్ చెబుతున్నప్పటికి, టెస్టు జట్టులో చోటు దక్కకపోవడంతోనే రెడ్ బాల్ క్రికెట్‌కు అతడు వీడ్కోలు పలికాడని ఇంగ్లండ్ క్రికెట్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది."నేను ఫస్ట్-క్లాస్ క్రికెట్ నుండి వైదొలగాలని నిర్ణయించుకున్నాను. ఇది నేను తేలికగా తీసుకున్న నిర్ణయం కాదు.వైట్-బాల్ క్రికెట్లో నా కెరీర్‌ను మరింత కాలం కొనసాగించాలనే ఉద్దేశ్యంతో ఈ నిర్ణయం తీసుకున్నాను. హాంప్‌షైర్ తరపున 200కు పైగా మ్యాచ్‌లు ఆడటం నాకు ఎంతో గర్వకారణం. ఈ క్రికెట్ క్లబ్‌తో నాకు ఎన్నో అద్భుతమైన జ్ఞాపకాలు ఉన్నాయి. ఈ 19 ఏళ్ల ప్రయాణంలో నాకు మద్దతుగా నిలిచిన ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు అని డాసన్ ఓ ప్రకటనలో పేర్కొన్నాడు. తన ఫస్ట్‌క్లాస్ క్రికెట్ కెరీర్లో 218 మ్యాచ్‌లు ఆడిన డాసన్.. 10828 పరుగులతో పాటు 380 వికెట్లు పడగొట్టాడు. అతడి పేరిట 18 ఫస్ట్ క్లాస్ సెంచరీలు ఉన్నాయి. ఇంగ్లండ్ తరపున 4 టెస్టులు ఆడిన డాసన్.. కేవలం 8 వికెట్లు మాత్రమే పడగొట్టాడు. -
భారత జట్టు ప్రకటన.. వైభవ్ సూర్యవంశీకి ఛాన్స్
ఈ ఏడాది జూన్‌లో శ్రీలంకలో జరగనున్న వన్డే ట్రై-సిరీస్ కోసం 15 మంది సభ్యులతో కూడిన భారత 'ఎ' జట్టును బీసీసీఐ ప్రకటించింది. ఈ జట్టు కెప్టెన్‌గా హైదరాబాదీ తిలక్ వర్మ ఎంపికయ్యాడు. అతడి డిప్యూటీగా అస్సాం ఆటగాడు రియాన్ పరాగ్ వ్యవహరించనున్నాడు.ఇక ఈ జట్టులో రాజస్తాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి చోటు దక్కింది. వైభవ్ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఐపీఎల్-2026లో ఈ చిచ్చర పిడుగు దుమ్ములేపుతున్నాడు. ఇప్పటివరకు 11 ఇన్నింగ్స్‌లలో 236.56 స్ట్రైక్-రేట్‌తో 440 పరుగులు సాధించాడు.ఇందులో ఏకంగా 40 సిక్సర్లే ఉన్నాయి. ఈ ఏడాది ఆరంభంలో జరిగిన అండర్-19 ప్రపంచకప్‌లో కూడా వైభవ్ అదరగొట్టాడు. ఇంగ్లండ్‌తో జరిగిన ఫైనల్లో 175 పరుగులు సాధించి భారత్‌ను ఛాంపియన్‌గా నిలిపాడు. ఈ క్రమంలోనే అతడికి ఇండియా-ఎ జట్టులో చోటు లభించింది. అదేవిధంగా ఐపీఎల్లో రాణిస్తున్న ప్రియాన్ష్ ఆర్య, ప్రభ్‌సిమ్రన్ సింగ్, అన్షుల్ కంబోజ్, సూర్యాంశ్ షెడ్గే వంటి ఆటగాళ్లు కూడా ఈ జట్టులో ఉన్నారు. ఈ టోర్నమెంట్లో శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్ 'ఎ' జట్లతో ఇండియా-ఎ జట్టు తలపడనుంది. ఈ ట్రై-సిరీస్ జూన్ 9 నుంచి ప్రారంభం కానుంది.ఈ టోర్నీ డబుల్ రౌండ్-రాబిన్ ఫార్మాట్లో జరగనుంది. , జూన్ 21న జరిగే ఫైనల్లో అగ్రస్థానంలో నిలిచిన రెండు జట్లు తలపడనున్నాయి. ఆ తర్వాత ఇండియా 'ఎ' జట్టు శ్రీలంక 'ఎ'తో రెండు మల్టీ-డే మ్యాచ్‌లు కూడా ఆడనుంది. వైట్-బాల్ సిరీస్ దంబుల్లాలో, రెడ్-బాల్ మ్యాచ్‌లు గాలే వేదికగా జరగనున్నాయి.భారత-ఎ జట్టు: తిలక్ వర్మ (కెప్టెన్), ప్రియాంష్ ఆర్య, వైభవ్ సూర్యవంశీ, రియాన్ పరాగ్ (వైస్ కెప్టెన్), ఆయుష్ బదోని, నిశాంత్ సింధు, హర్ష్ దూబే, సూర్యాంశ్ షెడ్గే, ప్రభ్సిమ్రాన్ సింగ్, కుమార్ కుషాగ్రా (వికెట్ కీపర్), విప్రజ్ నిగమ్, యశ్ ఠాకూర్, యుధ్వీర్ సింగ్, అన్షుల్ కాంబోజ్, అర్షద్ ఖాన్చదవండి: హార్దిక్ కాదు!.. ఆ ముగ్గురు కెప్టెన్లపై వేటు! -
హార్దిక్ కాదు!.. ఆ ముగ్గురు కెప్టెన్లపై వేటు!
ఐపీఎల్-2026 లీగ్ దశ ముగింపునకు వచ్చింది. ఇంకో పది రోజుల్లో (మే 24) లీగ్ స్టేజీ పూర్తి కానుంది. ఇలాంటి తరుణంలో ఓ సంచలన నివేదిక తెరమీదకు వచ్చింది. ఈ సీజన్లో చెత్త ప్రదర్శన కనబరిచిన ముగ్గురు కెప్టెన్లపై వేటు పడనుందని దాని సారాంశం.ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఆటగాడు రిషభ్ పంత్. లక్నో సూపర్ జెయింట్స్ మెగా వేలం-2025లో అతడిని ఏకంగా రూ. 27 కోట్లకు కొనుగోలు చేసింది. అయితే, ఆటగాడిగా, కెప్టెన్‌గా ఈ వికెట్ కీపర్ బ్యాటర్ పూర్తిగా తేలిపోతున్నాడు.చెత్త ప్రదర్శనగతేడాది చెత్త ప్రదర్శనతో జట్టును ఏడో స్థానంలో నిలిపిన పంత్.. తాజా ఎడిషన్‌లోనూ వైఫల్యాలు కొనసాగిస్తున్నాడు. ఈ సీజన్లో ఇప్పటికి 11 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న లక్నో కేవలం మూడే గెలిచి పాయింట్ల పట్టికలో అట్టడుగున పదో స్థానంలో ఉంది.వ్యక్తిగతంగానూ పంత్ ప్రదర్శన బాగాలేదు. పదకొండు ఇన్నింగ్స్‌లో కలిప కేవలం 251 పరుగులు చేశాడు. ఇదిలా ఉంటే.. ఢిల్లీ క్యాపిటల్స్ సారథి అక్షర్ పటేల్ కూడా విమర్శల పాలవుతున్నాడు. పన్నెండు మ్యాచ్‌లలో కలిపి 100 పరుగులే చేసిన ఈ ఆల్‌రౌండర్.. కేవలం పది వికెట్లు మాత్రమే తీయగలిగాడు.అక్షర్ అంతంత మాత్రమేలీగ్ దశలో అక్షర్ సేన ఇప్పటికి 12 మ్యాచ్‌లు పూర్తి చేసుకుని ఐదు గెలిచి పట్టికలో ఏడో స్థానంలో కొట్టుమిట్టాడుతోంది. ఇక అజింక్య రహానే పరిస్థితి కూడా ఇలాగే ఉంది. జట్టుకు టైటిల్ అందించిన శ్రేయస్ అయ్యర్‌ను వదులుకుని మరీ.. రహానేకు పగ్గాలు ఇచ్చింది కోల్‌కతా నైట్ రైడర్స్.రహానేదీ అదే బాటగతేడాది డిఫెండింగ్ చాంపియన్ హోదాలో బరిలోకి దిగిన కేకేఆర్.. పద్నాలుగింట ఐదే గెలిచి ఎనిమిదో స్థానంతో సరిపెట్టుకుంది. ఈ ఏడాది ఇప్పటికి పదకొండింటిలో నాలుగు గెలిచి ఎనిమిదో స్థానంలో కొట్టుమిట్టాడుతోంది. ఇక రహానే 11 ఇన్నింగ్స్ ఆడి 237 పరుగులే చేశాడు.వేటుకు రంగం సిద్ధంఈ నేపథ్యంలో ఐపీఎల్ సన్నిహిత వర్గాలు పీటీతో మాట్లాడుతూ.. ‘‘ముగ్గురు ఐపీఎల్ కెప్టెన్లపై వేటుకు రంగం సిద్ధమైంది. ఈ సీజన్ ఆఖరి నాటికి వాళ్లు తమ పదవులు కోల్పోయే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇందకు సంబంధించిన ఫ్రాంఛైజీ వర్గాలు సంకేతాలు ఇచ్చాయి.అక్షర్ పటేల్, అజింక్య రహానే, రిషభ్ పంత్ గత రెండు సీజన్లలో సారథులుగా విఫలమవుతున్నారు. ఒక్కసారి కూడా జట్లను ప్లే ఆఫ్స్ దిశగా తీసుకువెళ్లలేకపోయారు’’ అని పేర్కొన్నాయి. ముఖ్యంగా పంత్ కెప్టెన్సీ చెత్తగా ఉందని.. అతడి వ్యూహాలు బెడిసికొట్టడం ఫ్రాంఛైజీకి తలనొప్పిగా మారిందని తెలిపాయి.మరి హార్దిక్ పరిస్థితి ఏంటి?పంత్, అక్షర్, రహానే సంగతి ఇలా ఉంటే.. ముంబై ఇండియన్స్ సారథి హార్దిక్ పాండ్యా గురించి మాత్రం సదరు వర్గాలు స్పందించలేదు. 2024లో ముంబై కెప్టెన్‌గా వచ్చిన హార్దిక్ తొలి ఏడాది అట్టడుగున పదో స్థానంలో నిలిపాడు. గతేడాది ప్లే ఆఫ్స్ చేర్చినా.. ఈ ఏడాది పదో స్థానం కోసం ముంబై లక్నోతో పోటీపడుతోంది. ఇప్పటికే గాయం సాకుతో హార్దిక్ జట్టుకు దూరమయ్యాడు. త్వరలోనే అతడిపై వేటు పడనుందనే వార్తలు వచ్చాయి. అయితే, తాజా నివేదికలో అతడి పేరు లేకపోవడం గమనార్హం.చదవండి: బ్లాక్మెయిల్ చేస్తున్నారు!.. స్పందించిన కమిన్స్ -
బ్లాక్మెయిల్ చేస్తున్నారు!.. స్పందించిన కమిన్స్
తనపై వస్తున్న వదంతులపై ఆస్ట్రేలియా టెస్టు, వన్డే కెప్టెన్ ప్యాట్ కమిన్స్ స్పందించాడు. తన గురించి రాస్తున్న దాంట్లో ఏమాత్రం నిజం లేదంటూ కొట్టిపారేశాడు. ఆసీస్ టెస్టు, వన్డే సారథిగా కమిన్స్‌కు గొప్ప రికార్డు ఉంది. మిచెల్ స్టార్క్‌తో పాటు పేస్ దళంలో బౌలర్‌గానూ కమిన్స్ కీలకం.అయితే, కమిన్స్‌తో పాటు మరికొందరు సీనియర్ క్రికెటర్లు క్రికెట్ ఆస్ట్రేలియాను (CA)ను బెదిరిస్తున్నారంటూ ‘ది ఏజ్’ కథనం పేర్కొంది. తమ జీతాలు పెంచకపోతే దేశీ టీ20 లీగ్ బిగ్‌బాష్ లీగ్ (BBL)ను బహిష్కరిస్తామని వాళ్లు బ్లాక్‌మెయల్ చేశారన్నది ఆ కథనం సారాంశం.దాదాపు రూ. 7 కోట్లు2027-28 సీజన్‌కు గానూ.. ఒకవేళ తాము కోరినట్లు 1 మిలియన్ ఆస్ట్రేలియన్ డాలర్లు (భారత కరెన్సీలో దాదాపు రూ. 7 కోట్లు) చెల్లించకపోతే.. ఈ సీజన్లో ఆడేది లేదని ఆటగాళ్లు తేల్చిచెప్పినట్లు సదరు కథనం పేర్కొంది. బీబీఎల్‌ను వదిలి సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో ఆడేందుకు వెళ్తామని హెచ్చరించినట్లు తెలిపింది.నువ్వు రాసినదంతా కల్పితంఇందుకు సంబంధించిన వార్తను ఓ నెటిజన్ ‘ఎక్స్’లో షేర్ చేయగా.. ప్యాట్ కమిన్స్ ఘాటుగా స్పందించాడు. ‘‘ది హండ్రెడ్ లీగ్‌లో నాకు ఆఫర్ వచ్చినట్లు.. సౌతాఫ్రికా టీ20 లీగ్ నిరభ్యంతర పత్రం విషయంలో నేనేదో డిమాండ్ చేసినట్లు.. నా గురించి నువ్వు రాసినదంతా కల్పితం మాత్రమే’’ అని కమిన్స్ బదులిచ్చాడు.కాగా వెన్నునొప్పి కారణంగా ఇంగ్లండ్‌తో ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌లో ఒకే ఒక్క మ్యాచ్ ఆడిన కమిన్స్.. ఆ తర్వాత ఆటకు దూరమయ్యాడు. దాదాపు నాలుగు నెలల పాటు విశ్రాంతి తీసుకున్న ఈ పేస్ బౌలర్.. ప్రస్తుతం సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్సీ విధులతో బిజీగా ఉన్నాడు.అయితే, ఐపీఎల్-2026లో సన్‌రైజర్స్ ఆరంభ మ్యాచ్‌లకు దూరమైన కమిన్స్... ఇటీవలే తిరిగి వచ్చి జట్టును విజయపథంలో తీసుకువెళ్తున్నాడు. ఈ సీజన్లో సన్‌రైజర్స్ ఇప్పటికి 12 మ్యాచ్‌లు పూర్తి చేసుకుని ఏడు గెలిచింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉన్న కమిన్స్ బృందం ప్లే ఆఫ్స్ బెర్తు లక్ష్యంగా ముందుకు సాగుతోంది.చదవండి: ప్రపంచ రికార్డు బద్దలు కొట్టిన కోహ్లి.. సరికొత్త చరిత్ర -
ఇదేం పద్ధతి?.. శ్రేయస్ అయ్యర్‌పై మాజీ కెప్టెన్ ఫైర్
ఐపీఎల్-2026 సీజన్‌ను ఘనంగా ఆరంభించింది పంజాబ్ కింగ్స్. వరుసగా ఆరు మ్యాచ్‌లలో గెలిచి టేబుల్ టాపర్‌గా చాన్నాళ్లపాటు కొనసాగింది. కానీ ఆ తర్వాత సీన్ రివర్స్ అయింది. వరుసగా నాలుగు ఓటములతో పంజాబ్ ప్రస్తుతం నాలుగో స్థానానికి పడిపోయింది.ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే మిగిలిన మూడు లీగ్ మ్యాచ్‌లలో పంజాబ్ సత్తా చాటాల్సిందే. చివరగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడి ఓడిపోయిన పంజాబ్.. గురువారం ముంబై ఇండియన్స్‌తో అమీతుమీ తేల్చుకోనుంది.ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ కెప్టెన్ క్రిష్ణమాచారి శ్రీకాంత్ పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తీరును విమర్శించాడు. ఢిల్లీతో మ్యాచ్‌లో తమ ప్రధాన స్పిన్నర్ యజువేంద్ర చహల్‌తో ఒక్క ఓవర్ కూడా వేయించకపోవడాన్ని తప్పుబట్టాడు.అతడితో ఒక్క ఓవర్ కూడా వేయించరా?ఈ మేరకు.. ‘‘పంజాబ్ తమ స్పిన్నర్లు చహల్, హర్‌ప్రీత్ బ్రార్‌లను తప్పనిసరిగా ఆడించాల్సింది. ఇలాంటి సమయంలోనే కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తమ బౌలర్లపై నమ్మకం ఉంచాలి. చహల్‌తో ఒక్క ఓవర్ కూడా వేయించకపోవడం ఏమిటి?ఇదేం ఆలోచనా విధానం? ఇదేం పద్ధతి?.. చెత్త కెప్టెన్సీ.. ధర్మశాలలో ఫ్లాట్ వికెట్‌పై ప్రధాన స్పిన్నర్‌తో కనీసం రెండు ఓవర్లు కూడా వేయించరా?.. చహల్ గతంలో ఆర్సీబీ తరఫున ఫ్లాట్ వికెట్ల మీద చక్కగా బౌలింగ్ చేసి ఆ జట్టును గెలిపించాడు’’ అని క్రిష్ణమాచారి శ్రీకాంత్ శ్రేయస్ అయ్యర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశాడు.ఢిల్లీతో మ్యాచ్‌లో పంజాబ్ బౌలర్ల ప్రదర్శన ఇలాకాగా ధర్మశాలలో ఢిల్లీతో మ్యాచ్‌లో పంజాబ్ 210 పరుగులు సాధించింది. కానీ ఈ భారీ లక్ష్యాన్ని కూడా కాపాడుకోలేకపోయి.. మూడు వికెట్ల తేడాతో ఓడిపోయింది. పంజాబ్ బౌలర్లలో అర్ష్‌దీప్ పొదుపుగా బౌలింగ్ చేసి రెండు వికెట్లు తీయగా.. యశ్ ఠాకూర్ నాలుగు ఓవర్ల కోటాలో ఏకంగా 55 పరుగులు ఇచ్చుకున్నాడు. అయితే, ఎట్టకేలకు రెండు వికెట్లు తీయగలిగాడు.ఇక మార్కో యాన్సెన్ 4 ఓవర్ల కోటాలో 45 పరుగులు ఇచ్చి వికెట్ తీయలేకపోయాడు. మిగిలిన వాళ్లలో బెన్ డ్వార్షుయిస్ నాలుగు ఓవర్లలో 51 రన్స్ ఇచ్చి ఒక వికెట్.. మార్కస్ స్టొయినిస్ 3 ఓవర్లలో 44 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీయగలిగారు. చహల్ తుదిజట్టులో ఉన్నా బౌలింగ్ చేసే అవకాశం రాలేదు. మరోవైపు హర్‌ప్రీత్ బ్రార్‌ను బెంచ్‌కు పరిమితం చేశారు.చదవండి: చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లి.. తొలి ప్లేయర్‌గా అరుదైన రికార్డు -
బంగారు గొలుసు పారేసుకున్నాడు.. అదే పాక్‌లో అయితే!
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)- కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) మ్యాచ్ సందర్భంగా ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఆర్సీబీ ఓపెనర్ జేకబ్ బెతెల్ బంగారు గొలుసు నేల మీద పడిపోయింది. అయితే, అతడు దానిని తీసుకోవడం మర్చిపోయి పెవిలియన్‌కు చేరుకున్నాడు.ఆ తర్వాత ఏం జరిగిందంటే.. ఐపీఎల్-2026లో భాగంగా ఆర్సీబీ- కేకేఆర్ బుధవారం రాయ్‌పూర్ వేదికగా తలపడ్డ సంగతి తెలిసిందే. టాస్ గెలిచిన ఆర్సీబీ.. కేకేఆర్‌ను తొలుత బ్యాటింగ్‌కు ఆహ్వానించింది.ఆరు వికెట్ల తేడాతో గెలుపుఅంగ్క్రిష్ రఘువంశీ (71), కామెరాన్ గ్రీన్ (32), రింకూ సింగ్ (49 నాటౌట్) రాణించారు. ఫలితంగా కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనకు దిగిన ఆర్సీబీకి ఆదిలోనే షాక్ తగిలింది. ఓపెనర్ జేకబ్ బెతెల్ కేవలం 15 పరుగులు చేసి.. కార్తిక్ త్యాగి బౌలింగ్‌లో అవుటయ్యాడు.అయితే, మరో ఓపెనర్ విరాట్ కోహ్లి అజేయం సెంచరీ (105)తో మెరిసి జట్టును విజయతీరాలకు చేర్చాడు. అతడికి తోడుగా వన్‌డౌన్ బ్యాటర్ దేవ్‌దత్ పడిక్కల్ (39) రాణించాడు. ఈ క్రమంలో 19.1 ఓవర్లలో ఆర్సీబీ నాలుగు వికెట్లు నష్టపోయి టార్గెట్ పూర్తి చేసింది. తద్వారా ఆరు వికెట్ల తేడాతో గెలిచింది.కిందపడిన బంగారు గొలుసుఇదిలా ఉంటే.. కార్తిక్ త్యాగి సంధించిన బౌన్సర్ జేకబ్ బెతెల్ హెల్మెట్‌కు బలంగా తాకింది. ఈ క్రమంలోనే అతడి మెడలో ఉన్న గోల్డ్ చెయిన్ కింద పడిపోయింది. అయితే, అవుటై పెవిలియన్‌కు వెళ్లిపోతున్న క్రమంలో బెతెల్.. బంగారు గొలుసు తీసుకోవడం మర్చిపోయాడు. అతడి స్థానంలో వచ్చిన పడిక్కల్.. ఈ విషయాన్ని గుర్తించాడు.PC: Xఅదే పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో ఇలా జరిగి ఉంటే..మైదానంలో పడిన బంగారు గొలుసు తీసి అంపైర్‌కు చూపించగా.. అది అక్కడి నుంచి బెతెల్‌కు చేరింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో నెటిజన్లు తమదైన శైలిలో సెటైర్లు పేలుస్తున్నారు.‘‘అసలే బంగారం ధర రోజురోజుకీ పెరిగిపోతోంది. ఇలాంటి సమయంలో గొలుసు దొరికితే ఎవరూ వదిలిపెట్టరు. ఇది ఐపీఎల్లో జరిగింది కాబట్టి సరిపోయింది. బెతెల్‌కు తన గొలుసు లభించింది. అదే పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో ఇలా జరిగి ఉంటే.. గొలుసు మళ్లీ కనిపించేదే కాదు’’ అని వ్యంగ్యరీతిలో కామెంట్లు చేస్తున్నారు.చదవండి: సీఎస్కేకు భారీ షాక్!.. ఇంటికి వెళ్లిపోయిన స్టార్ ప్లేయర్ -
అది నన్ను తీవ్రంగా వేధించింది: విరాట్ కోహ్లి
వరుస వైఫల్యాల తర్వాత రాయల్ చాలెంజర్స్ బెంళూరు (ఆర్సీబీ) దిగ్గజం విరాట్ కోహ్లి బుధవారం బ్యాట్ ఝులిపించాడు. ‘వింటేజ్ కింగ్’ను గుర్తుచేస్తూ కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్)పై శతక్కొట్టాడు. ప్రత్యర్థి విధించిన 193 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో నిలకడైన ఆట తీరుతో ఆకట్టుకుని జట్టును గెలిపించాడు.గెలుపులో కీలక పాత్రరాయ్పూర్ వేదికగా కేకేఆర్‌తో మ్యాచ్‌లో మొత్తంగా 60 బంతుల్లో.. 105 పరుగులతో కోహ్లి (Virat Kohli) అజేయంగా నిలిచాడు. అతడి ఇన్నింగ్స్‌లో 11 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి. ఆర్సీబీ గెలుపులో కీలక పాత్ర పోషించిన కోహ్లిని ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు వరించింది.అది నన్ను తీవ్రంగా వేధించిందిఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘‘గత రెండు మ్యాచ్‌లలో నేను పరుగులు చేయలేకపోయాను. అది నన్ను తీవ్రంగా వేధించింది. బాగా ఆడగలనని నాకు తెలుసు. ఈరోజు బంతిని బలంగా బాది అనుకున్నట్లుగా పని పూర్తి చేశాను.రోజురోజుకీ మరింత మెరుగ్గా ఆడటమే లక్ష్యం. అయితే, కొన్నిసార్లు వైఫల్యాలు ఎదురవుతాయి. వాటిని తేలికగా తీసుకోకూడదు. ఒత్తిడిని జయించి ముందుకు సాగాలి. ఒక్కోసారి ఒత్తిడిలో ఆడటం కూడా మంచిదే.Cometh the hour, cometh KING KOHLI! 👑The chase master. The run machine and we are running out of superlatives.Century No. 9️⃣ for #ViratKohli in TATA IPL! ❤️🌟[ #TATAIPL, #RCBvsKKR, #ManishPandey, #ViratKohli, #Narine, #RinkuSingh ] pic.twitter.com/BT9CGj4y7K— Star Sports (@StarSportsIndia) May 13, 2026కారణం అదేఅదే మనల్ని మరింత కఠినంగా శ్రమించేలా చేస్తుంది. అనుకున్న లక్ష్యాన్ని చేరుకునేందుకు తొలి అడుగు పడేలా ముందకు తోస్తుంది. గత రెండు మ్యాచ్‌లలో విఫలమైనప్పుడు నేను నిరాశ చెందిన మాట వాస్తవం. ఈరోజు సెంచరీ పూర్తైన తర్వాత గొప్పగా సంబరాలు చేసుకోకపోవడానికి కారణం అదే.కృతజ్ఞుడిగా ఉంటానునా దృష్టి మొత్తం వీలైనన్ని ఎక్కువగా పరుగులు రాబట్టి జట్టును గెలిపించడమే. బ్యాటింగ్ చేయడమంటే నాకు ఇష్టం. ఎన్ని రికార్డులు బద్దలు కొట్టినా నాలో పరుగుల దాహం తీరదు. మళ్లీ మొదటి నుంచి వచ్చినట్లుగానే ఉంటుంది. ఆట కోసం ప్రాణం పెడతా. దేవుడి దయ వల్ల ఎన్నో రికార్డులు సాధించగలిగాను. అందుకు నేను కృతజ్ఞుడిగా ఉంటాను’’ అని విరాట్ కోహ్లి ఉద్వేగపూరిత వ్యాఖ్యలు చేశాడు. కాగా ఐపీఎల్లో కోహ్లికి ఇది తొమ్మిదో సెంచరీ కాగా.. ఓవరాల్‌గా టీ20 ఫార్మాట్లో పదవ శతకం. ఇదిలా ఉంటే.. గత రెండు మ్యాచ్‌లలో కోహ్లి డకౌట్ అయిన సంగతి తెలిసిందే.చదవండి: ప్రపంచ రికార్డు బద్దలు కొట్టిన కోహ్లి.. సరికొత్త చరిత్ర -
IPL 2026: సీఎస్కేకు భారీ షాక్!
చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే)కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. మధ్య ఓవర్లలో జట్టుకు కీలకంగా మారిన.. ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ జేమీ ఓవర్టన్ స్వదేశానికి పయనమయ్యాడు. తొడ కండరాల గాయంతో బాధపడుతున్న అతడు.. ఐపీఎల్-2026 టోర్నీలో మిగిలిన మ్యాచ్‌లకు దూరమయ్యే అవకాశం ఉంది.స్పందించిన ఫ్రాంఛైజీఈ విషయంపై చెన్నై యాజమాన్యం స్పందిస్తూ.. ‘‘జేమీ ఓవర్టన్ (Jamie Overton) కుడి తొడకు గాయమైంది. అతడు యూకేకు వెళ్లిపోతున్నాడు. వైద్య పరీక్షల అనంతరం అతడి గాయంపై స్పష్టత వస్తుంది’’ అని పేర్కొంది. కాగా ఐపీఎల్-2026లో ఇప్పటికి పదకొండు మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న చెన్నై జట్టు.. ఆరింట గెలిచింది.కీలక ఆల్రౌండర్గాతద్వారా 12 పాయింట్లు సాధించి పట్టికలో ఐదో స్థానంలో కొనసాగుతోంది. ఇలాంటి తరుణంలో కీలక ఆల్‌రౌండర్ అయిన ఓవర్టన్ గాయం వల్ల జట్టుకు దూరం కావడం తీవ్ర ప్రభావం చూపనుంది. ఇప్పటికి 10 మ్యాచ్‌లు ఆడిన ఈ రైటార్మ్ ఫాస్ట్‌బౌలర్.. 14 వికెట్లు కూల్చాడు. అదే విధంగా.. 136 పరుగులు సాధించాడు.ఇదిలా ఉంటే.. సీజన్ ఆరంభం నుంచి చెన్నైని గాయాల బెడద వేధిస్తోంది. జట్టు దిగ్గజ సారథి, వికెట్ కీపర్ బ్యాటర్ మహేంద్ర సింగ్ ధోని ఫిట్నెస్ సమస్యల వల్ల ఇప్పటికి ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. ఇక పేసర్ రామకృష్ణ ఘోష్ కూడా గాయం వల్ల జట్టుకు దూరమయ్యాడు.ప్లే ఆఫ్స్ రేసులోకి వచ్చిన వేళ.. భారీ షాక్!అంతకు ముందే పేసర్ ఖలీల్ అహ్మద్, ఆయుశ్ మాత్రే, నాథన్ ఎల్లిస్.. అతడి స్థానంలో వచ్చిన స్పెన్సర్ జాన్సన్ కూడా గాయపడి జట్టుకు దూరమయ్యారు. కాగా టోర్నీ ఆరంభంలో వరుస పరాజయాలతో చతికిలపడ్డ చెన్నై.. అనూహ్య రీతిలో పుంజుకుని ప్లే ఆఫ్స్ రేసులోకి దూసుకువచ్చింది. ఇలాంటి కీలక సమయంలో ఓవర్టన్ జట్టుకు దూరం కావడంతో భారీ షాక్ తగిలినట్లయింది.ఇక ఇప్పటికి 11 మ్యాచ్‌లలో 430 పరుగులు సాధించి సంజూ శాంసన్ చెన్నై తరఫున టాప్ రన్ స్కోరర్‌గా ఉండగా.. పేసర్ అన్షుల్ కాంబోజ్ 19 వికెట్లు కూల్చి టాప్ వికెట్ టేకర్‌గా కొనసాగుతున్నాడు.చదవండి: చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లి.. తొలి ప్లేయర్‌గా అరుదైన రికార్డు -
ప్రపంచ రికార్డు బద్దలు కొట్టిన కోహ్లి.. సరికొత్త చరిత్ర
కోల్‌కతా నైట్ రైడర్స్‌తో మ్యాచ్ సందర్భంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) దిగ్గజం విరాట్ కోహ్లి అదరగొట్టాడు. ఐపీఎల్-2026లో గత రెండు మ్యాచ్‌ల్లో డకౌట్ అయిన ‘కింగ్’.. ఈసారి తన స్థాయికి తగ్గ ప్రదర్శనతో చెలరేగాడు.ఛేదనలో మొనగాడినని మరోసారి నిరూపిస్తూ ఐపీఎల్లో తన 9వ సెంచరీతో సత్తా చాటాడు. మొత్తంగా 60 బంతులు ఎదుర్కొని 11 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 105 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఈ క్రమంలో కోహ్లి సరికొత్త చరిత్ర సృష్టించాడు.ప్రపంచ రికార్డు బద్దలుటీ20 క్రికెట్లో అత్యంత వేగంగా 14 వేల పరుగుల మైలురాయిని చేరుకున్న క్రికెటర్‌గా కోహ్లి నిలిచాడు. తద్వారా వెస్టిండీస్ దిగ్గజం క్రిస్ గేల్ పేరిట ఉన్న ప్రపంచ రికార్డును బద్దలు కొట్టాడు. అదే విధంగా టీ20 ఫార్మాట్లో అత్యధిక సెంచరీల వీరుల జాబితాలో డేవిడ్ వార్నర్ రికార్డును కోహ్లి సమం చేశాడు.ఇక మ్యాచ్ విషయానికొస్తే.. రాయ్‌పూర్ వేదికగా టాస్ గెలిచిన ఆర్సీబీ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన కేకేఆర్.. నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది.ఈ లక్ష్యాన్ని ఆర్సీబీ 19.1 ఓవర్లలో కేవలం నాలుగు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ కోహ్లి (105 నాటౌట్) శతక్కొట్టగా.. దేవ్‌దత్ పడిక్కల్ (27 బంతుల్లో 39) మెరుగ్గా రాణించాడు.Cometh the hour, cometh KING KOHLI! 👑The chase master. The run machine and we are running out of superlatives.Century No. 9️⃣ for #ViratKohli in TATA IPL! ❤️🌟[ #TATAIPL, #RCBvsKKR, #ManishPandey, #ViratKohli, #Narine, #RinkuSingh ] pic.twitter.com/BT9CGj4y7K— Star Sports (@StarSportsIndia) May 13, 2026టీ20 క్రికెట్లో అత్యంత వేగంగా 14 వేల పరుగుల మైలురాయిని చేరుకున్న క్రికెటర్లు👉విరాట్ కోహ్లి- 409 ఇన్నింగ్స్‌లో👉క్రిస్ గేల్- 423 ఇన్నింగ్స్‌లో👉డేవిడ్ వార్నర్- 431 ఇన్నింగ్స్‌లో👉జోస్ బట్లర్- 468 ఇన్నింగ్స్‌లో👉అలెక్స్ హేల్స్- 505 ఇన్నింగ్స్‌లో👉కీరన్ పోలార్డ్- 633 ఇన్నింగ్స్లోటీ20 క్రికెట్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్లు👉క్రిస్ గేల్- 22👉బాబర్ ఆజం- 13👉డేవిడ్ వార్నర్- 10👉విరాట్ కోహ్లి- 10👉రీలీ రొసోవ్, సాహిబ్జాదా ఫర్హాన్- 9👉క్వింటన్ డికాక్, అభిషేక్ శర్మ- 9.చదవండి: చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లి.. తొలి ప్లేయర్‌గా అరుదైన రికార్డు -
‘టాప్’లోనే బుమ్రా.. కమిన్స్ సూపర్
దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) టెస్టు బౌలర్ల ర్యాంకింగ్స్‌లో భారత స్టార్ జస్ప్రీత్ బుమ్రా నంబర్‌వన్ ర్యాంక్‌ను నిలబెట్టుకున్నాడు. బుధవారం విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్‌లో బుమ్రా 879 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. మిచెల్ స్టార్క్ (ఆస్ట్రేలియా), మ్యాట్ హెన్రీ (న్యూజిలాండ్), ప్యాట్ కమిన్స్ (ఆస్ట్రేలియా) ఒక్కో ర్యాంక్‌ను మెరుగుపర్చుకొని వరుసగా రెండు, మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నారు. పాకిస్తాన్ బౌలర్ నోమన్ అలీ మూడు స్థానాలు పడిపోయి ఐదో ర్యాంక్‌కు చేరుకున్నాడు. బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో బంగ్లాదేశ్ కెప్టెన్ నజ్ముల్ హుస్సేన్ షాంటో ఏకంగా 16 స్థానాలు ఎగబాకి 24వ ర్యాంక్‌లో నిలిచాడు. పాకిస్తాన్‌తో జరిగిన తొలి టెస్టులో షంటో తొలి ఇన్నింగ్స్‌లో 101 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో 87 పరుగులు చేసి ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచాడు. బంగ్లాదేశ్‌కే చెందిన మోమినుల్ హక్ 12 స్థానాలు మెరుగుపర్చుకొని 35వ ర్యాంక్‌లో ఉన్నాడు. -
సారా టేలర్‌కు అరుదైన అవకాశం
లండన్: ఇంగ్లండ్ మహిళా క్రికెట్ దిగ్గజం, మాజీ వికెట్ కీపర్ సారా టేలర్అరుదైన అవకాశాన్ని దక్కించుకుంది. ఇంగ్లండ్ పురుషుల టెస్టు జట్టు ఫీల్డింగ్ కోచ్‌గా ఆమె ఎంపికైంది. న్యూజిలాండ్‌తో త్వరలో జరిగే టెస్టు సిరీస్‌లో ఆమె ఈ బాధ్యతలు నిర్వర్తిస్తుంది. అంతర్జాతీయ స్థాయిలో పురుషుల సీనియర్ క్రికెట్ జట్టుకు ఒక మహిళా కోచ్ పని చేయనుండటం ఇదే మొదటిసారి కావడం విశేషం. 37 ఏళ్ల సారా టేలర్ తన 13 ఏళ్ల కెరీర్లో 226 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడి అత్యుత్తమ వికెట్ కీపర్‌గా గుర్తింపు తెచ్చుకుంది. 2017లో వన్డే వరల్డ్ కప్ నెగ్గిన ఇంగ్లండ్ టీమ్‌లో ఆమె కీలక పాత్ర పోషించింది. రిటైర్మెంట్ అనంతరం కోచింగ్ వైపు మళ్లిన సారా...ఆండ్రూ ఫ్లింటాఫ్‌తో కలిసి ఇంగ్లండ్ యువ జట్టుకు పని చేసింది. -
కోల్‌కతాపై బెంగళూరు విజయం
ఐపీఎల్-2026 సీజన్లో కీలక పోరులో కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టుపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీం 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 193 పరుగుల లక్ష్యాన్ని నాలుగు వికెట్లు కోల్పోయి 19.1 ఓవర్లలో చేధించింది. రాయ్‌పూర్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడ్డాయి.ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆర్సీబీ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. దీంతో మొదట బ్యాటింగ్ చేసిన కోల్‌కతా 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఆర్సీబీ 19.1 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 194 పరుగులు చేసి విజయం అందుకుంది.విరాట్ కోహ్లీ సూపర్ సెంచరీతో ఆర్సీబీని విజయ తీరాలకు చేర్చాడు. ఈ విజయంతో సీజన్లో 8వ విజయంతో ప్లేఆఫ్స్ రేసుకి మరింత చేరువైంది ఆర్సీబీ. -
చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లి.. తొలి ప్లేయర్‌గా అరుదైన రికార్డు
టీమిండియా సూపర్ స్టార్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓపెనర్ విరాట్ కోహ్లి అరుదైన ఘనత సాధించాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ప్లేయర్‌గా కోహ్లి చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్-2026లో భాగంగా రాయ్‌పూర్ వేదికగా కేకేఆర్‌తో మ్యాచ్‌లో కోహ్లి ఈ ఫీట్‌ను అందుకున్నాడు.కింగ్ కోహ్లికి ఇది 279వ ఐపీఎల్ మ్యాచ్. ఈ మ్యాచ్‌కు ముందు విరాట్ కోహ్లి, ఎంఎస్ ధోనీ, రోహిత్ శర్మ ముగ్గురూ 278 మ్యాచ్‌లతో సమంగా ఉండేవారు. తాజా మ్యాచ్‌తో కోహ్లి వారిద్దరిని అధిగమించి అగ్రస్ధానానికి చేరుకున్నాడు. 2008లో ఐపీఎల్ ప్రారంభమైనప్పటి నుండి కోహ్లి ఆర్సీబీకే ప్రాతినిథ్యం వహిస్తున్నాడు.ఎంఎస్ ధోనీ సీఎస్కే ప్రాతినిథ్యం వహిస్తుండగా.. రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్ తరపున ఆడుతున్నాడు. మిస్టర్ కూల్ గాయం కారణంగా ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. ముంబై ఇండియన్స్ ఆడబోయే తదుపరి మ్యాచ్‌లో కోహ్లి రికార్డును రోహిత్ శర్మ సమం చేసే అవకాశముంది. కాగా విరాట్ కోహ్లి ఐపీఎల్లో 9,000 పరుగుల మైలురాయిని దాటిన ఏకైక బ్యాటర్‌గా కొనసాగుతున్న సంగతి తెలిసిందే.ఐపీఎల్లో అత్యధిక ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడిన ప్లేయర్లు వీరేవిరాట్ కోహ్లి-279ఎంఎస్ ధోని-278రోహిత్ శర్మ-278రవీంద్ర జడేజా-265చదవండి: టీమిండియాలోకి భువనేశ్వర్ కుమార్!? -
రఘువంశీ, రింకూ మెరుపులు.. ఆర్సీబీ ముందు భారీ టార్గెట్
ఐపీఎల్-2026లో రాయ్‌పూర్ వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్‌లో కేకేఆర్ బ్యాటర్లు దుమ్ములేపారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. పిచ్ కాస్త నెమ్మదిగా ఉన్నప్పటికి కోల్‌కతా బ్యాటర్లు అద్భుతమైన ప్రదర్శన కనబరిచారు. కేకేఆర్ ఇన్నింగ్స్‌లో యువ ఆటగాడు అంగక్రిష్ రఘువంశీ(71) టాప్ స్కోరర్‌గా నిలవగా.. రింకూ సింగ్( 29 బంతుల్లో 49), గ్రీన్(32) రాణించారు. ఆర్సీబీ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్, జోష్ హాజిల్‌వుడ్, రాసిఖ్ సలామ్ దార్ తలా వికెట్ సాధించారు. వర్షం కారణంగా ఈ మ్యాచ్ 8:45 గంటలకు ప్రారంభమైంది.తుది జట్లుకోల్‌కతా నైట్ రైడర్స్: అజింక్యా రహానే (కెప్టెన్), ఫిన్ అలెన్, కామెరాన్ గ్రీన్, అంగ్క్రిష్ రఘువంశీ (వికెట్ కీపర్), రోవ్‌మన్ పావెల్, మనీష్ పాండే, రింకు సింగ్, సునీల్ నరైన్, అనుకూల్ రాయ్, వైభవ్ అరోరా, కార్తీక్ త్యాగిరాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు : జాకబ్ బెథెల్, విరాట్ కోహ్లి, రజత్ పాటిదార్(కెప్టెన్), జితేష్ శర్మ(వికెట్ కీపర్), టిమ్ డేవిడ్, వెంకటేష్ అయ్యర్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, రసిఖ్ సలాం దార్, జాకబ్ డఫీ, జోష్ హాజిల్‌వుడ్ -
టీమిండియాలోకి భువనేశ్వర్ కుమార్!?
ఐపీఎల్-2026లో టీమిండియా వెటరన్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పేసర్ భువనేశ్వర్ కుమార్ అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తున్నాడు. భువీ 36 ఏళ్ల వయస్సులోనూ తన అద్భుత బౌలింగ్‌తో బ్యాటర్లను ముప్పు తిప్పలు పెడుతున్నాడు. బంతిని రెండు వైపులా స్వింగ్ చేస్తూ తనలో ఏమాత్రం పదను తగ్గలేదని నిరూపించుకుంటున్నాడు.సరైన లైన్ అండ్ లెంగ్త్ బౌలింగ్ చేస్తూ క్రమం తప్పుకుండా వికెట్లు పడగొడుతున్నాడు. ఇప్పటివరకు 11 మ్యాచ్‌లు ఆడిన భువనేశ్వర్ 21 వికెట్లు పడగొట్టాడు. పర్పుల్ క్యాప్ రేసులో భువీ అగ్రస్ధానంలో ఉన్నాడు. అయితే లేటు వయస్సులో ఇరగదీస్తున్న భువనేశ్వర్‌ను తిరిగి టీమిండియాలోకి తీసుకోవాలని పలువురు సూచిస్తున్నారు. వన్డే వరల్డ్‌కప్-2027లో అతడిని ఆడించాలన్న డిమాండ్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి. కాగా భువనేశ్వర్ చివరగా 2022 నవంబర్‌లో టీమ్ ఇండియా తరఫున బరిలోకి దిగాడు. ఆ తర్వాత పేలవ ఫామ్, యువ బౌలర్లు రాకతో భువీ జాతీయ జట్టులో చోటు కోల్పోయాడు. కానీ భారత జట్టుకు దూరమైనప్పటికి భువీ.. ఐపీఎల్‌తో పాటు యూపీ టీ20, సయ్యద్ ముస్తాక్ అలీ వంటి టోర్నీల్లో ఆడుతూ వస్తున్నాడు.ఈ యూపీ వెటరన్ పేసర్ ప్రస్తుతం ఫుల్ ఫిట్‌గా కన్పిస్తున్నాడు. అయితే భువీ మాత్రం టీమిండియా కమ్‌బ్యాక్ గురుంచి ఆలోచించడం లేదని తాజాగా స్పష్టం చేశాడు. చాలా ఏళ్ల క్రితమే లాంగ్ టెర్మ్ గోల్స్‌ను నిర్దేశించుకోవడం మానేశాను అతడు తెలిపాడు. ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత షమీ విషయంలో ఎలాగైతే చర్చ జరిగిందో, ఇప్పుడు భవీ విషయంలోనూ అదే పునరావృతమవుతోంది.చదవండి: వైభవ్ కాదు.. ముందు అతడిని టీమిండియాకు ఎంపిక చేయండి' -
టీ20 వరల్డ్‌కప్ వార్మప్ మ్యాచ్‌ల షెడ్యూల్ విడుదల
మహిళల టీ20 ప్రపంచకప్ 2026 వార్మప్ మ్యాచ్‌ల షెడ్యూల్‌ను ఐసీసీ బుధవారం విడుదల చేసింది. ప్రధాన టోర్నీ ప్రారంభానికి ముందు అన్ని జట్లు సన్నద్దం కావడానికి వీలుగా ఈ వార్మప్ మ్యాచ్‌లు జూన్ 6 నుండి 10 వరకు జరగనున్నాయి. ఈ టోర్నీలో పాల్గొనే మొత్తం 12 జట్లు తలో రెండు ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఆడుతాయి.మొత్తం నాలుగు వేదికల్లో ఈ వార్మాప్ మ్యాచ్‌లను నిర్వహించనున్నారు. తొలి మ్యాచ్ జూన్ 6న డెర్బీ వేదికగా నెదర్లాండ్స్, స్కాట్లాండ్ మధ్య జరగనుంది. భారత్ తమ మొదటి ప్రాక్టీస్ మ్యాచ్ జూన్ 8న వెస్టిండీస్‌తో, తర్వాత జూన్ 10న ఇంగ్లండ్‌తో తలపడనుంది. ఇక ప్రధాన టోర్నీ జూన్ 12న ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ప్రారంభం కానుంది. భారత జట్టు సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా, పాకిస్తాన్లతో పాటు గ్రూపు-ఎలో ఉంది.మహిళల టీ20 ప్రపంచ కప్ 2026 గ్రూప్స్గ్రూప్ 1: ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, భారత్, పాకిస్థాన్, బంగ్లాదేశ్, నెదర్లాండ్స్గ్రూప్ 2: వెస్టిండీస్, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, శ్రీలంక, ఐర్లాండ్, స్కాట్లాండ్మహిళల టీ20 ప్రపంచ కప్ 2026 వార్మప్ మ్యాచ్‌ల షెడ్యూల్6 జూన్ నెదర్లాండ్స్ vs స్కాట్లాండ్ (డెర్బీ) ఉదయం 10 గంటలకు6 జూన్ దక్షిణాఫ్రికా vs ఐర్లాండ్ (లౌబరో) ఉదయం 10 గంటలకు6 జూన్ శ్రీలంక vs పాకిస్తాన్ (డెర్బీ) మధ్యాహ్నం 3 గంటలకు6 జూన్ న్యూజిలాండ్ vs బంగ్లాదేశ్ (లౌబరో) మధ్యాహ్నం 3 గంటలకు8 జూన్ వెస్టిండీస్ vs ఇండియా (కార్డిఫ్) ఉదయం 10 గంటలకు8 జూన్ ఇంగ్లాండ్ vs ఆస్ట్రేలియా (కార్డిఫ్) మధ్యాహ్నం 3 గంటలకు9 జూన్ స్కాట్లాండ్ vs పాకిస్తాన్ (డెర్బీ) ఉదయం 10 గంటలకు9 జూన్ ఐర్లాండ్ vs బంగ్లాదేశ్ (లౌబరో) ఉదయం 10 గంటలకు9 జూన్ నెదర్లాండ్స్ vs శ్రీలంక (డెర్బీ) మధ్యాహ్నం 3 గంటలకు9 జూన్ దక్షిణాఫ్రికా vs న్యూజిలాండ్ (లౌబరో) మధ్యాహ్నం 3 గంటలకు10 జూన్ ఇండియా vs ఇంగ్లాండ్ (కార్డిఫ్) ఉదయం 10 గంటలకు10 జూన్ వెస్టిండీస్ vs ఆస్ట్రేలియా (కార్డిఫ్) మధ్యాహ్నం 3 గంటలకు -
కేకేఆర్‌తో మ్యాచ్.. ఆర్సీబీ జట్టులోకి డేంజరస్ ప్లేయర్
ఐపీఎల్-2026 సీజన్లో కీలక పోరుకు రంగం సిద్దమైంది. రాయ్‌పూర్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. ఇరు జట్లు కూడా చెరో మార్పుతో బరిలోకి దిగాయి. కేకేఆర్ స్టార్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి గాయం కారణంగా ఈ మ్యాచ్‌కు దూరమయ్యాడు. అతడి స్ధానంలో సౌరభ్ దూబే తుది జట్టులోకి వచ్చాడు. అదేవిధంగా ఆర్సీబీ జట్టులో వెంకటేశ్ అయ్యర్‌కు ఛాన్స్ లభించింది. కాగా వర్షం కారణంగా ఈ మ్యాచ్ రాత్రి 8:45 గంటలకు ప్రారంభం కానుంది. అలస్యంగా ప్రారంభమవుతున్నప్పటికి ఓవర్లను మాత్రం కుదించలేదు.తుది జట్లుకోల్‌కతా నైట్ రైడర్స్: అజింక్యా రహానే (కెప్టెన్), ఫిన్ అలెన్, కామెరాన్ గ్రీన్, అంగ్క్రిష్ రఘువంశీ (వికెట్ కీపర్), రోవ్‌మన్ పావెల్, మనీష్ పాండే, రింకు సింగ్, సునీల్ నరైన్, అనుకూల్ రాయ్, వైభవ్ అరోరా, కార్తీక్ త్యాగిరాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు : జాకబ్ బెథెల్, విరాట్ కోహ్లి, రజత్ పాటిదార్(కెప్టెన్), జితేష్ శర్మ(వికెట్ కీపర్), టిమ్ డేవిడ్, వెంకటేష్ అయ్యర్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, రసిఖ్ సలాం దార్, జాకబ్ డఫీ, జోష్ హాజిల్వుడ్చదవండి: NZ vs ENG: ఇంగ్లండ్ జట్టులో ఇటలీ క్రికెటర్ 'గే' -
ఇంగ్లండ్ జట్టులో ఇటలీ క్రికెటర్ 'గే'
న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్ సందర్భంగా ఇంగ్లండ్ క్రికెట్ జట్టులో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. గత కొంత కాలంగా పేలవ ఫామ్‌తో సతమతమవుతున్న స్టార్ ఓపెనర్ జాక్ క్రాలీపై ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు సెలక్షన్ కమిటీ వేటు వేసింది. అతడి స్ధానంలో యువ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ ఎమిలియో గేను రంగంలోకి దించాలని సెలక్టర్లు నిర్ణయించారు. జూన్ 4 నుంచి లార్డ్స్ వేదికగా కివీస్‌తో జరగనున్న తొలి టెస్టులో గే ఇంగ్లండ్ తరపున అరంగేట్రం చేయనున్నాడు.ఇటలీ నుంచి ఇంగ్లండ్కుఅయితే 26 ఏళ్ల ఎమిలియో గే ఇప్పటికే ఇటలీ తరపున అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. గే ఇంగ్లండ్‌లోని బెడ్ఫోర్డ్లో జన్మించినప్పటికీ.. అతడి తల్లి ఇటలీ దేశస్థురాలు కావడంతో ఆ దేశం తరఫున ఆడే అవకాశం లభించింది. 2025లో ఇటలీ తరపున మూడు టీ20 మ్యాచ్‌లు అతడు ఆడాడు. 2026 టీ20 ప్రపంచకప్ క్వాలిఫైయర్స్‌లో స్కాట్లాండ్పై అద్భుతమైన హాఫ్ సెంచరీ సాధించి గే అందరి దృష్టిని ఆకర్షించాడు.పొట్టి ప్రపంచకప్‌నకు ఇటలీ అర్హత సాధించడంలో అతడిది కీలక పాత్ర. అయితే ఆ తర్వాత ఇంగ్లండ్‌కు తన మకాంను మార్చిన గే.. ప్రస్తుతం కౌంటీ క్రికెట్లో డర్హామ్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. 2026 కౌంటీ సీజన్లో అతడు కేవలం మ్యాచ్‌ల్లోనే 92 సగటుతో 554 పరుగులు సాధించాడు. ఇందులో 3 సెంచరీలు ఉన్నాయి. దీంతో అతడికి ఇంగ్లండ్ టెస్టు జట్టులో తొలిసారి అతడికి చోటు దక్కింది. అంతకుముందు ఇయాన్ మోర్గాన్ కూడా ఐర్లాండ్ నుంచి వచ్చి ఇంగ్లండ్‌కు ప్రాతినిథ్యం వహించాడు. అతడి సారథ్యంలోనే ఇంగ్లండ్ 2019 ప్రపంచకప్‌ను గెలుచుకుంది. -
పాకిస్తాన్ కెప్టెన్‌గా ఎవరూ ఊహించని ప్లేయర్?
ఢాకా వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్టులో పాకిస్తాన్ 104 పరుగుల తేడాతో ఘోర పరాజయం పాలైన సంగతి తెలిసిందే. బ్యాటింగ్, బౌలింగ్‌లో విఫలమైన పాకిస్తాన్.. బంగ్లాదేశ్ చేతిలో వరుసగా మూడో టెస్టు మ్యాచ్ ఓటమిని చవిచూసింది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఓ సంచలన నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.ప్రస్తుత టెస్టు కెప్టెన్ షాన్ మసూద్‌ను తొలగించి, తిరిగి బాబర్ ఆజంకు పగ్గాలు అప్పగించాలని పీసీబీ యోచిస్తున్నట్లు సమాచారం. "బాబర్ ఆజం మళ్లీ టెస్టు జట్టు పగ్గాలు చేపట్టాలని జట్టులో కొంత మంది ఆటగాళ్లు కోరుకుంటున్నారు. అంతేకాకుండా బోర్డు అధికారుల మద్దతు కూడా అతడికి ఉంది. బాబర్ కూడా తిరిగి బాధ్యతలు చేపట్టడానికి ఆసక్తిగా ఉన్నట్లు పీసీబీ వర్గాలు వెల్లడించాయి. కాగా బాబర్ ఆజం మోకాలి గాయం కారణంగా బంగ్లాతో తొలి టెస్టుకు దూరమయ్యాడు. అయితే ఇప్పుడు అతడు పూర్తి ఫిట్నెస్ సాధించాడు. దీంతో మే 18 నుండి ప్రారంభం కానున్న రెండో టెస్టుకు అందుబాటులోకి రానున్నాడు. పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో దుమ్ములేపిన బాబర్.. ఇప్పుడు జాతీయ జట్టు తరపున కూడా అదే జోరును కొనసాగిస్తాడని పీసీబీ ఆశిస్తోంది. రెండో టెస్టు తర్వాత అతడిని తిరిగి టెస్టు కెప్టెన్‌గా పీసీబీ నియమించే అవకాశముంది. బాబర్‌ను టెస్ట్ కెప్టెన్‌గా నియమించడమే కాకుండా, వచ్చే ఏడాది జరగనున్న వన్డే ప్రపంచకప్ నాటికి అతడిని వన్డే కెప్టెన్‌గా కూడా సిద్ధం చేయాలని పీసీబీ భావిస్తోంది. 2019 నుండి 2023 వరకు మూడు ఫార్మాట్లలో కెప్టెన్‌గా ఉన్న బాబర్.. ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల తప్పుకోవాల్సి వచ్చింది. కానీ టీ20 ప్రపంచకప్-2024కు ముందు మళ్లీ పాక్ టీ20 కెప్టెన్‌గా బాబర్ బాధ్యతలు చేపట్టాడు. ఆ టోర్నీలో పాక్ దారుణ ప్రదర్శన కనబరచడంతో బాబర్ మళ్లీ కెప్టెన్సీ నుంచి తప్పుకోనున్నాడు. అయితే మళ్లీ ఇప్పుడు అనుహ్యంగా కెప్టెన్‌గా బాబర్ పేరును పీసీబీ పరిశీలిస్తోంది.ఇక 2023 డిసెంబర్ నుంచి షాన్ మసూద్ కెప్టెన్సీలో పాకిస్తాన్ ఆడిన 15 టెస్టుల్లో 11 మ్యాచ్‌లలో ఓటమి చవిచూసింది. కెప్టెన్‌గానే కాకుండా బ్యాటర్‌గా కూడా అతడు విఫలమవుతున్నాడు. దీంతో షాన్ మసూద్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించనున్నాడని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. -
'వైభవ్ కాదు.. ముందు అతడిని టీమిండియాకు ఎంపిక చేయండి'
ఐపీఎల్-2026 సీజన్లో గుజరాత్ టైటాన్స్ యువ ఆటగాడు సాయి సుదర్శన్ దుమ్ములేపుతున్నాడు. మంగళవారం అహ్మదాబాద్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో సుదర్శన్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఆరంభంలోనే శుభ్‌మన్ గిల్, జోస్ బట్లర్ వంటి కీలక వికెట్లను కోల్పోయిన గుజరాత్‌ను సుదర్శన్ తన హాఫ్ సెంచరీతో ఆదుకున్నాడు. కష్టతరమైన పిచ్‌పై సుదర్శన్ సంయమనంతో ఆడి గుజరాత్ జట్టు 168 పరుగుల స్కోరు సాధించేలా చేశాడు. మొత్తంగా 44 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 61 పరుగులు సాధించాడు. మొత్తంగా ఈ ఏడాది సీజన్లో 11 మ్యాచ్‌లు ఆడిన సుదర్శన్.. 41.75 సగటుతో 501 పరుగులు సాధించాడు. ఇందులో ఒక సెంచరీ, 5 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. సుదర్శన్ 500 పరుగులు దాటడం ఇది వరుసగా మూడో సీజన్ కావడం గమనార్హం. ఈ నేపథ్యంలో సుదర్శన్‌పై టీమిండియా మాజీ ఓపెనర్ వసీం జాఫర్ ప్రశంసల వర్షం కురిపించాడు. సుదర్శన్ ఆటతీరును కొనియాడుతూ, అతడిని భారత టీ20 జట్టులోకి తీసుకోవాలని సుదర్శన్ సూచించాడు.ఐపీఎల్-2026 సీజన్ ఆరంభంలో సుదర్శన్ ఆరెంజ్ క్యాప్ రేసులో దారుదాపుల్లో కూడా కన్పించలేదు. కానీ ఇప్పుడు తన అద్భుతమైన ఆట తీరుతో ఒక్కసారిగా ఆరెంజ్ క్యాప్ రేసులోకి దూసుకొచ్చాడు. గుజరాత్ టైటాన్స్ ఫ్రాంచైజీ అతడికి బాగా కలిసి వస్తోందని, అహ్మదాబాద్ పిచ్ కూడా అతడికి సహకరిస్తుందని నేను ఇప్పటికే చాలా సార్లు చెప్పాను.అతను సాంప్రదాయబద్ధమైన (Orthodox) క్రికెట్ షాట్లు ఆడతాడు. అలా అని ఎక్కడా స్లోగా ఆడడు. మైదానానికి రెండు వైపులా పరుగులు చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. గుజరాత్ ఫ్రాంచైజీ అతడిపై చాలా ఎక్కువగా ఆధారపడుతుంది. అయినప్పటికి ప్రతీ సీజన్లోనూ అతడు రాణిస్తున్నాడు. మనం సాధారణంగా భారత టీ20 జట్టు గురించి చర్చించేటప్పుడు సుదర్శన్ పేరును కనీసం పరిగణలోకి తీసుకోము. కానీ అతడు తన ప్రదర్శనలతో మన ఆలోచన తప్పు అని ప్రతీసారి నిరూపిస్తున్నాడు. ఇలాంటి నిలకడ ఉన్న ఆటగాడు జట్టులో ఉండాలి. కేవలం సిక్సర్లు కొట్టే ఆటగాళ్లు మాత్రమే కాదు, కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకునే ఆటగాళ్లు కూడా జట్టులో ఉండాలి.కాబట్టి టీమిండియా సెలక్టర్లు అతడిని కచ్చితంగా టీ20 జట్టులోకి తీసుకోవాలని జాఫర్ తన యూట్యూబ్ ఛానల్లో పేర్కొన్నాడు. కాగా ఇదే సీజన్లో అద్భుత ప్రదర్శన కనబరుస్తున్న వైభవ్ సూర్యవంశీ పేరును జాఫర్ పరిగణలోకి తీసుకోకపోవడం గమనార్హం. -
ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు సంచలన నిర్ణయం.. ఒకేసారి ముగ్గురికి
ఇంగ్లండ్ పురుషల క్రికెట్ జట్టు స్వదేశంలో న్యూజిలాండ్‌తో మూడు టెస్టుల సిరీస్‌లో తలపడేందుకు సిద్దమైంది. ఈ క్రమంలో జూన్ 4 నుంచి లార్డ్స్ వేదికగా ప్రారంభమయ్యే మొదటి టెస్టు కోసం 15 మంది సభ్యులతో కూడిన తమ జట్టును ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు బుధవారం ప్రకటించింది.ఈ జట్టులో ముగ్గురు కొత్త ఆటగాళ్లకు చోటు దక్కింది. బ్యాటర్ ఎమిలియో గే, ఫాస్ట్ బౌలర్ సోనీ బేకర్, వికెట్ కీపర్ బ్యాటర్ జేమ్స్ రూ తొలిసారి జాతీయ జట్టుకు ఎంపికయ్యారు. అయితే ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడుతున్న వైస్ కెప్టెన్ ఓలీ పోప్, ఓపెనర్ జాక్ క్రాలీలపై సెలక్టర్లు వేటు వేశారు.ఇక గాయం కారణంగా దాదాపు మూడు నెలలగా పోటీ క్రికెట్‌కు దూరమైన కెప్టెన్ బెన్ స్టోక్స్ జాతీయ జట్టులోకి తిరిగొచ్చాడు. ఫిబ్రవరిలో దుర్హం అకాడమీలో ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో బంతి బలంగా తగలడంతో స్టోక్స్ దవడ ఎముక విరిగిన సంగతి తెలిసిందే. స్టోక్సీ ఇటీవలే కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో దుర్హం తరపున బరిలోకి దిగి తన సత్తాచాటాడు. న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌లో స్టోక్స్ డిప్యూటీగా స్టార్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ వ్యహరించే అవకాశముంది.న్యూజిలాండ్‌తో మొదటి టెస్టుకు ఇంగ్లండ్ జట్టు:బెన్ స్టోక్స్ (కెప్టెన్), రెహాన్ అహ్మద్, గస్ అట్కిన్సన్, సోనీ బేకర్, షోయబ్ బషీర్, జాకబ్ బెథెల్, హ్యారీ బ్రూక్, బెన్ డకెట్, మాథ్యూ ఫిషర్, ఎమిలియో గే, జేమ్స్ రూ, ఓలీ రాబిన్సన్, జో రూట్, జేమీ స్మిత్, జోష్ టంగ్.షెడ్యూల్:మొదటి టెస్టు: జూన్ 4 – 8 (లార్డ్స్) రెండవ టెస్టు: జూన్ 17 – 21 (ది ఓవల్) మూడవ టెస్టు: జూన్ 25 – 29 (ట్రెంట్ బ్రిడ్జ్)చదవండి: కమిన్స్‌పై చర్యలు -
చారిత్రక రికార్డును సమం చేసిన రబాడ
ఐపీఎల్ 2026లో గుజరాత్ టైటాన్స్ స్పీడ్‌స్టర్ కగిసో రబాడ చెలరేగిపోతున్నాడు. ఈ సీజన్లో ఇప్పటివరకు ఆడిన 12 మ్యాచ్‌ల్లో 21 వికెట్లు తీసి ఆర్సీబీ భువనేశ్వర్ కుమార్‌తో పాటు లీడింగ్ వికెట్ టేకర్‌గా కొనసాగుతున్నాడు. తాజాగా ఎస్ఆర్హెచ్తో జరిగిన మ్యాచ్‌లో 4 ఓవర్లలో పరుగులిచ్చి 3 వికెట్లు తీసిన రబాడ.. తన జట్టు విజయంలో ప్రధానపాత్ర పోషించాడు. ఫలితంగా ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గెలుచుకోవడంతో పాటు ఓ చారిత్రక రికార్డును సమం చేశాడు.ఈ మ్యాచ్‌లో రబాడ తీసిన 3 వికెట్లు పవర్‌ప్లేలో (ఇన్నింగ్స్ తొలి 6 ఓవర్లు) వచ్చినవే. తద్వారా ఓ ఐపీఎల్ సీజన్ పవర్‌ప్లేల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో మిచెల్ జాన్సన్ (2013), ట్రెంట్ బౌల్ట్ (2020)తో కలిసి సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో 17 వికెట్లతో మహ్మద్ షమీ (2023) టాప్ ప్లేస్‌లో ఉన్నాడు. షమీ పేరిట ఉన్న ఈ రికార్డును రబాడ ఈ సీజన్లో తప్పక అధిగమించే అవకాశం ఉంది.అందనంత ఎత్తుకు..!తాజా ప్రదర్శనతో రబాడ ఈ సీజన్ పవర్‌ప్లేల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో ఎవరికీ అందనంత ఎత్తుకు ఎదిగిపోయాడు. రబాడ తర్వాత ఈ సీజన్ పవర్‌ప్లేల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా ఆర్సీబీ భువనేశ్వర్ కుమార్ (12) ఉన్నాడు. ఆతర్వాతి స్థానాల్లో జోఫ్రా ఆర్చర్ (9), సిరాజ్ (9) నిలిచారు.ఎస్ఆర్హెచ్ మ్యాచ్‌లో కొత్త బంతితో రబాడ వేసిన స్పెల్ ఈ సీజన్లోనే అత్యంత ప్రమాదకరమైందిగా నిలిచింది. పవర్‌ప్లేలోనే అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, స్మరణ్ రవిచంద్రన్ వంటి కీలక బ్యాటర్లను పెవిలియన్ పంపిన రబాడ.. ఎస్ఆర్హెచ్ను కోలుకోలేని దెబ్బ తీశాడు.కాగా, నిన్నటి మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌పై గుజరాత్ అన్ని విభాగాల్లో ఆధిపత్యం చలాయించింది. తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్.. ఆదిలోనే శుభ్‌మన్ గిల్ (5), జోస్ బట్లర్ (7) వికెట్లు కోల్పోయినా.. సాయి సుదర్శన్ (61), వాషింగ్టన్ సుందర్ (50) జట్టును ఆదుకున్నారు. ఫలితంగా గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది.అనంతరం ఓ మోస్తరు లక్ష్య ఛేదనలో సన్‌రైజర్స్ బ్యాటర్లు ఘోరంగా విఫలమయ్యారు. రబాడ (4-0-28-3), హోల్డర్ (4-0-20-3), ప్రసిద్ద్ కృష్ణ (3-0-23-2), సిరాజ్ (3-1-11-1), రషీద్ ఖాన్ (0.5-0-3-1) ధాటికి ఆ జట్టు 14.5 ఓవర్లలో 86 పరుగులకే కుప్పకూలింది. దీంతో భారీ తేడాతో పరాజయంపాలైంది. ఈ గెలుపుతో గుజరాత్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి ఎగబాకి, ప్లే ఆఫ్స్ బెర్త్‌ను దాదాపుగా ఖరారు చేసుకుంది. -
పాక్‌ను చిత్తుగా ఓడించిన బంగ్లా ప్లేయర్లకు భారీ లబ్ది
పాకిస్తాన్‌పై ఘన విజయం సాధించిన బంగ్లాదేశ్ ఆటగాళ్లకు ఐసీసీ గుడ్‌న్యూస్ చెప్పింది. మిర్పూర్ టెస్టులో 104 పరుగుల తేడాతో పాక్‌ను చిత్తు చేసిన తర్వాత విడుదల చేసిన టెస్ట్ ర్యాంకింగ్స్‌లో బంగ్లా ప్లేయర్లు భారీగా లాభపడ్డారు. ముఖ్యంగా కెప్టెన్ నజ్ముల్ హసన్ షాంటో కెరీర్ బెస్ట్ రేటింగ్ సాధించాడు. ఈ మ్యాచ్‌లో షాంటో విశేషంగా రాణించాడు.తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ (101), రెండో ఇన్నింగ్స్‌లో హాఫ్ సెంచరీ (87) (మొత్తం 188 పరుగులు) చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇందుకు ప్రతిఫలంగా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్న అతడు.. ర్యాంకింగ్స్‌లో ఏకంగా 16 స్థానాలు ఎగబాకి 23వ స్థానానికి చేరుకున్నాడు. ప్రస్తుతం ఇదే స్థానంలో పాక్ స్టార్ బ్యాటర్ బాబర్ ఆజమ్ కూడా కొనసాగుతున్నాడు.ఇదే మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు, తొలి ఇన్నింగ్స్‌లో వికెట్ తీసి జట్టు విజయంలో మరో కీలక పాత్రధారుడిగా నిలిచిన నహిద్ రాణా కూడా ర్యాంకింగ్స్‌లో భారీ జంప్ కొట్టాడు. ఒకేసారి ఐదు స్థానాలు ఎగబాకి 64వ స్థానానికి చేరుకున్నాడు.ఇదే మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో 91, రెండో ఇన్నింగ్స్‌లో 56 పరుగులు చేసిన మొమినుల్ హక్ 12 స్థానాలు ఎగబాకి 35వ ర్యాంక్‌కి చేరుకున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో 71, రెండో ఇన్నింగ్స్‌లో 22 పరుగులు చేసిన ముష్ఫికర్ రహీం రెండు స్థానాలు మెరుగుపరుచుకుని 26వ ర్యాంక్‌లో నిలిచాడు.నాలుగు వికెట్లతో సత్తా చాటిన తైజుల్ ఇస్లాం మూడు స్థానాలు ఎగబాకి 13వ ర్యాంక్ చేరుకోగా, తస్కిన్ అహ్మద్ 48వ స్థానంలో నిలిచాడు.ఇక పాకిస్తాన్ ఆటగాళ్లకు మాత్రం ఈ టెస్ట్ చేదు అనుభవాన్ని మిగిల్చింది. సౌద్ షకీల్, షాన్ మసూద్ ఇద్దరూ ఆరు స్థానాలు దిగజారారు. ఐదు వికెట్ల ప్రదర్శనతో సత్తా చాటిన మొహమ్మద్ అబ్బాస్ మాత్రం 28వ స్థానానికి ఎగబాకి కొంత ఊరటనిచ్చాడు. -
ప్రపంచకప్‌కు ఆస్ట్రేలియా జట్టు ప్రకటన
ఇంగ్లండ్ అండ్ వేల్స్ ఆతిథ్యమివ్వనున్న మహిళల టీ20 ప్రపంచకప్ 2026 కోసం క్రికెట్ ఆస్ట్రేలియా 15 మంది సభ్యుల పటిష్టమైన జట్టును ఇవాళ ప్రకటించింది. ఈ జట్టుకు కెప్టెన్‌గా స్టార్ ఆల్‌రౌండర్ సోఫీ మోలినెక్స్ ఎంపిక కాగా.. ఆష్లే గార్డ్నర్ ఆమెకు డిప్యూటీగా (వైస్ కెప్టెన్) వ్యవహరించనుంది.ఈ జట్టులో ఎల్లిస్ పెర్రీ, బెత్ మూనీ, తహ్లియా మెక్‌గ్రాత్ వంటి స్టార్ ప్లేయర్లు కూడా చోటు దక్కించుకున్నారు. ఈసారి సెలెక్టర్లు స్పిన్ బౌలింగ్‌పై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇంగ్లండ్ పరిస్థితులకు అనుగుణంగా జార్జియా వేర్హమ్, అలానా కింగ్ వంటి లెగ్ స్పిన్నర్లను ఎంపిక చేశారు. అయితే ఫాస్ట్ బౌలర్ డార్సీ బ్రౌన్కు ఈ జట్టులో చోటు దక్కకపోవడం ఆశ్చర్యం కలిగించింది. ఆమె స్థానంలో 20 ఏళ్ల యువ లెఫ్ట్ ఆర్మ్ సీమర్ లూసీ హ్యామిల్టన్‌కు అవకాశం దక్కింది.ఇక భారత అభిమానులకు ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. డబ్ల్యూపీఎల్ ఫ్రాంచైజీ ఆర్సీబీకి చెందిన ముగ్గురు కీలక ప్లేయర్లకు ఈ ఆసీస్ ప్రపంచకప్ జట్టులో చోటు దక్కింది. గ్రేస్ హ్యారిస్, ఎల్లిస్ పెర్రీ, సోఫీ మోలినెక్స్ డబ్ల్యూపీఎల్‌లో ఆర్సీబీ ఆడతారు. తమ ఫ్రాంచైజీకి చెందిన ముగ్గురు ప్లేయర్లకు ప్రపంచకప్ జట్టులో చోటు దక్కడం ఆర్సీబీ అభిమానుల్లో ఆనందం నింపింది.జూన్ 12 నుంచి జూలై 5 వరకు జరిగే ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా.. భారత్, సౌతాఫ్రికా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, నెదర్లాండ్స్ వంటి పటిష్టమైన జట్లతో కలిసి గ్రూప్-1లో ఉంది. ఆసీస్.. జూన్ 13న మాంచెస్టర్‌లో దక్షిణాఫ్రికాతో తమ తొలి మ్యాచ్ ఆడనుంది. అనంతరం బంగ్లాదేశ్, నెదర్లాండ్స్, పాకిస్తాన్, భారత్‌తో గ్రూప్ దశ పోరాటాలు ఉంటాయి. ముఖ్యంగా జూన్ 28న లార్డ్స్ మైదానంలో భారత్‌తో జరిగే మ్యాచ్‌పై ఇప్పటి నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి.ఆస్ట్రేలియా మహిళల T20 ప్రపంచ కప్ 2026 జట్టుసోఫీ మోలినెక్స్ (కెప్టెన్), ఆష్లే గార్డ్నర్ (వైస్ కెప్టెన్), తహ్లియా మెక్‌గ్రాత్ (వైస్ కెప్టెన్), నికోలా క్యారీ, కిమ్ గార్త్, లూసీ హామిల్టన్, గ్రేస్ హారిస్, అలనా కింగ్, ఫోబ్ లిచ్‌ఫీల్డ్, బెత్ మూనీ (వికెట్ కీపర్), ఎలిస్ పెర్రీ, మేగన్ షుట్, అన్నబెల్ సదర్లాండ్, జార్జియా వోల్, జార్జియా వేర్హామ్. రిజర్వ్: తాలియా విల్సన్ (వికెట్ కీపర్). -
కమిన్స్‌పై చర్యలు
ఐపీఎల్ 2026లో భాగంగా నిన్న (మే 12) గుజరాత్ టైటాన్స్ చేతిలో 82 పరుగుల తేడాతో ఘోర ఓటమి చవిచూసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు మరో షాక్ తగిలింది. స్లో ఓవర్‌రేట్ మెయిన్‌టెయిన్ చేసినందుకు ఆ జట్టు కెప్టెన్ ప్యాట్ కమిన్స్‌కు రూ.12 లక్షల జరిమానా పడింది. ఈ విషయాన్ని బీసీసీఐ ధృవీకరించింది. ఈ సీజన్లో ఎస్ఆర్హెచ్ ఇది తొలి స్లో ఓవర్‌రేట్ తప్పిదం కావడంతో ఫైన్‌తో సరిపెట్టినట్లు బీసీసీఐ ప్రకటించింది.ఈ సీజన్లో కెప్టెన్లు అక్షర్ పటేల్ (ఢిల్లీ), హార్దిక్ పాండ్యా (ముంబై), శ్రేయస్ అయ్యర్ (పంజాబ్), శుభ్‌మన్ గిల్ (గుజరాత్) కూడా స్లో ఓవర్‌రేట్ కారణంగా జరిమానాలు ఎదుర్కొన్నారు. ఇప్పుడు ఆ జాబితాలో ప్యాట్ కమిన్స్ చేరాడు.ప్రస్తుతం ఎస్ఆర్హెచ్ 12 మ్యాచ్‌ల్లో 14 పాయింట్లతో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది. ఈ జట్టు ప్లే ఆఫ్స్‌కు చేరాలంటే మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో కనీసం ఒక మ్యాచ్‌లో అయినా గెలవడం కీలకం. తదుపరి మ్యాచ్‌ల్లో ఎస్ఆర్హెచ్.. సీఎస్కే (మే 18న చెన్నైలో), ఆర్సీబీతో (మే 22న హైదరాబాద్‌లో) తలపడాల్సి ఉంది.నిన్నటి మ్యాచ్ విషయానికొస్తే.. సన్‌రైజర్స్‌పై గుజరాత్ అన్ని విభాగాల్లో ఆధిపత్యం చలాయించింది. తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్.. ఆదిలోనే శుభ్‌మన్ గిల్ (5), జోస్ బట్లర్ (7) వికెట్లు కోల్పోయినా.. సాయి సుదర్శన్ (61), వాషింగ్టన్ సుందర్ (50) జట్టును ఆదుకున్నారు. ఫలితంగా గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది.అనంతరం ఓ మోస్తరు లక్ష్య ఛేదనలో సన్‌రైజర్స్ బ్యాటర్లు ఘోరంగా విఫలమయ్యారు. రబాడ (4-0-28-3), హోల్డర్ (4-0-20-3), ప్రసిద్ద్ కృష్ణ (3-0-23-2), సిరాజ్ (3-1-11-1), రషీద్ ఖాన్ (0.5-0-3-1) ధాటికి ఆ జట్టు 14.5 ఓవర్లలో 86 పరుగులకే కుప్పకూలింది. దీంతో భారీ తేడాతో పరాజయంపాలైంది. ఈ గెలుపుతో గుజరాత్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి ఎగబాకి, ప్లే ఆఫ్స్ బెర్త్‌ను దాదాపుగా ఖరారు చేసుకుంది. -
సాయి సుదర్శన్ అరుదైన ఫీట్!
ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్ క్రికెటర్ సాయి సుదర్శన్‌ది ప్రత్యేకమైన స్థానం. 2022లో ఐపీఎల్ అరంగేట్రం చేసినప్పటి నుంచి ఒకే జట్టుకు ఆడుతూ స్థిరమైన ప్రదర్శన కొనసాగిస్తున్న అరుదైన క్రికెటర్లలో సాయి సుదర్శన్ కూడా ఒకడు. ఐపీఎల్ 2026 సీజన్లోనూ తన బ్యాటింగ్‌తో అలరిస్తున్న సాయి సుదర్శన్ మంగళవారం సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌లోనూ 61 పరుగులతో మెరిశాడు. తద్వారా ఐపీఎల్లో ఒక అరుదైన ఫీట్‌ను సాధించాడు. ఎస్ఆర్హెచ్తో మ్యాచ్‌లో అర్థశతకం సాధించడం ద్వారా ఐపీఎల్లో తాను ఎదుర్కొన్న అన్ని జట్లపై కనీసం ఒక ఫిఫ్టీ సాధించిన నాలుగో భారత ఆటగాడిగా, ఓవరాల్‌గా ఐదో ప్లేయర్‌గా సాయి సుదర్శన్ నిలిచాడు. గతంలో గుజరాత్ కెప్టెన్ శుబ్‌మన్ గిల్, సీఎస్కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్, ఆర్సీబీ కెప్టెన్ రజత్ పటీదార్‌తో పాటు ఎస్ఆర్హెచ్ హిట్టర్ హెన్రిచ్ క్లాసెన్ ఈ ఫీట్‌ను సాధించారు. తమిళనాడుకు చెందిన సాయి సుదర్శన్ సీఎస్కేపై నాలుగు అర్థశతకాలు, ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్, రాజస్తాన్‌లపై మూడు ఫిఫ్టీలు, కేకేఆర్, ముంబై, ఆర్సీబీలపై రెండు హాఫ్ సెంచరీలు, లక్నో, ఎస్‌ఆర్‌హెచ్‌లపై ఒక్కో అర్థశతకం సాధించాడు. ఇక ఐపీఎల్ ఆరంభం నుంచి కొనసాగుతున్న భారత సీనియర్ క్రికెటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు ఈ ఫీట్‌ను అందుకోవడంలో విఫలమయ్యారు. ఈ సీజన్లో పరుగుల వరద పారిస్తున్న సాయి సుదర్శన్ 500 పరుగుల మార్క్‌ను దాటాడు. తద్వారా వరుసగా మూడో సీజన్లోనూ ఐదొందల పరుగుల మార్క్‌ను దాటిగా ఆటగాడిగా సాయి సుదర్శన్ నిలిచాడు. ఆరెంజ్ క్యాప్ రేసులో ప్రస్తుతం సాయి సుదర్శన్ 12 మ్యాచ్‌ల్లో 501 పరుగులతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక మ్యాచ్ విషయానికొస్తే తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. సాయి సుదర్శన్ (61), వాషింగ్టన్ సుందర్ (50) అర్థసెంచరీలతో రాణించారు. అనంతరం ఎస్ఆర్హెచ్ 14.5 ఓవర్లలో 86 పరుగులకే కుప్పకూలింది. కెప్టెన్ కమిన్స్ (19) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. గుజరాత్ బౌలర్లలో రబాడ, జాసన్ హోల్డర్ చెరో 3 వికెట్లతో చెలరేగగా.. ప్రిసిధ్ క్రిష్ణ 2, సిరాస్ ఒక వికెట్ పడగొట్టాడు. వరుసగా ఐదో విజయంతో గుజరాత్ టైటాన్స్ పాయింట్ల పట్టికలో తొలి స్థానానికి చేరుకోగా, ఎస్ఆర్హెచ్ మూడో స్థానానికి పడిపోయింది.చదవండి: ‘మాటలు జాగ్రత్త.. ఏది పడితే అది వాగొద్దు’ -
సునామీ శతకం.. చరిత్ర సృష్టించిన పాక్
పాక్ మహిళల టీ20 జట్టు సరికొత్త చరిత్ర సృష్టించింది. పరుగుల పరంగా తమ అత్యంత భారీ విజయాన్ని నమోదు చేసింది. నిన్న (మే 12) జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో ఈ ఘనత సాధించింది. 153 పరుగుల భారీ తేడాతో జింబాబ్వేను మట్టికరిపించింది. తద్వారా మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో ఘనంగా బోణీ కొట్టింది. దీనికి ముందు ఇరు జట్ల మధ్య జరిగిన 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను పాక్ 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. జింబాబ్వే మహిళల జట్టు తొలిసారి పాక్‌లో పర్యటిస్తూ ఆడుతున్న చారిత్రక సిరీస్ ఇది.సునామీ శతకంకరాచీ వేదికగా జరిగిన తొలి టీ20లో తొలుత బ్యాటింగ్ చేసిన పాక్.. అయేషా జాఫర్ (47 బంతుల్లో 102 నాటౌట్; 15 ఫోర్లు, 2 సిక్సర్లు) సునామీ శతకంతో విరుచుకుపడటంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 237 పరుగుల భారీ స్కోర్ చేసింది. పాక్ మహిళల జట్టు అంతర్జాతీయ స్థాయిలో 200 పరుగుల మార్కు తాకడం ఇదే తొలిసారి.ఈ మ్యాచ్‌లో అయేషా జాఫర్ చేసిన సెంచరీ మహిళల అంతర్జాతీయ టీ20 క్రికెట్లో మూడో వేగవంతమైన సెంచరీగా రికార్డైంది. అలాగే మునీబా అలీ తర్వాత పాక్ తరఫున టీ20ల్లో సెంచరీ చేసిన రెండో ప్లేయర్‌గా అయేషా జాఫర్ నిలిచింది.అనంతరం భారీ లక్ష్య ఛేదనలో జింబాబ్వే జట్టు పూర్తిగా చేతులెత్తేసింది. 18.2 ఓవర్లలో 84 పరుగులకే కుప్పకూలింది. కెప్టెన్ ఫాతిమా సనా (3-0-7-3), సదియా ఇక్బాల్ (3.2-0-14-2), నతాలియా పర్వేజ్ (2-0-3-2), రమీన్ షమీమ్ (3-0-18-1) జింబాబ్వే ఇన్నింగ్స్‌ను నేలమట్టం చేశారు. ఇరు జట్ల మధ్య రెండో టీ20 కరాచీ వేదికగా మే 14న జరుగనుంది. -
రసవత్తరంగా మారిన ప్లే ఆఫ్స్ సమీకరణలు
ఐపీఎల్ 2026 కీలక దశకు చేరుకున్న వేళ, ప్లే ఆఫ్స్ సమీకరణలు ఆసక్తికరంగా మారాయి. సీజన్ ప్రారంభంలో చెలరేగి ఆడిన జట్లు ప్రస్తుతం మెత్తబడగా.. అడపాదడపా ప్రదర్శనలతో ప్రారంభించిన జట్లు వరుస విజయాలతో దూసుకుపోతున్నాయి.దశ తిరగబడి, అనూహ్యంగా పుంజుకున్న జట్ల జాబితాలో గుజరాత్ టైటాన్స్ ముందుంది. ఈ జట్టు రెండు వరుస పరాజయాలతో సీజన్ ప్రారంభించి, ఆతర్వాత హ్యాట్రిక్ విజయాలు, ఆతర్వాత మళ్లీ రెండు వరుస పరాజయాలు, వాటి తర్వాత వరుసగా ఐదు మ్యాచ్‌ల్లో విజయాలు సాధించి, ప్రస్తుతం పాయింట్ట పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. సీజన్ ప్రారంభంలో ఏమాత్రం అంచనాలు లేని గుజరాత్ ఒక్కసారిగా టైటిల్ ఫేవరెట్‌గా మారిపోయిన వైనం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఈ జట్టు తదుపరి ఆడాల్సిన 2 మ్యాచ్‌ల్లో (కేకేఆర్, సీఎస్కే) ఒక్కటి గెలిచినా ప్లే ఆఫ్స్ బెర్త్ ఖరారరవుతుంది. గుజరాత్ ఇప్పటివరకు ఆడిన 12 మ్యాచ్‌ల్లో 8 విజయాలు, 4 అపజయాలతో 16 పాయింట్లు కూడగట్టుకుంది. ఈ జట్టు రన్‌రేట్ (0.551) కూడా మెరుగ్గా ఉంది.అంచనాలు తల్లకిందులైన జట్లలో పంజాబ్, రాజస్థాన్ ముందువరుసలో ఉన్నాయి. ఈ రెండు జట్లు సీజన్ ప్రారంభంలో వరుస విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో టాప్-2 జట్లుగా చలామణి అయ్యాయి. అయితే అనూహ్యంగా ప్రస్తుతం ప్లే ఆఫ్స్ రేసులో వెనుకపడ్డాయి. వీటిలో పంజాబ్ పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఈ జట్టు తొలి ఏడు మ్యాచ్‌ల్లో ఒక్క అపజయం కూడా ఎదుర్కోలేదు. అయితే ఆతర్వాత అనూహ్యంగా వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో పరాజయంపాలై, నాలుగో స్థానానికి పడిపోయింది. తద్వారా ప్లే ఆఫ్స్ అవకాశాలను సంకటంలో పడేసుకుంది. ఇకపై ఆడబోయే 3 మ్యాచ్‌ల్లో (ముంబై, ఆర్సీబీ, లక్నో) కనీసం రెండైనా గెలవకపోతే పంజాబ్ ప్లే ఆఫ్స్ అశలను వదులుకోవాల్సిందే. పంజాబ్ ఇప్పటివరకు ఆడిన 11 మ్యాచ్‌ల్లో 6 విజయాలు, 4 అపజయాలతో 13 పాయింట్లు ఖాతాలో కలిగి ఉంది. కేకేఆర్‌తో జరగాల్సిన ఓ మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో ఓ పాయింట్ లభించింది. నాలుగు వరుస పరాజయాలు ఎదుర్కొన్నా, రన్‌రేట్ (0.428) ఇంకా మెరుగ్గానే ఉండటం పంజాబ్‌కు ఊరట కలిగించే విషయం.ఆరంభంలో అదరగొట్టి, ఆతర్వాత ఢిలా పడిపోయిన మరో జట్టు రాజస్థాన్. ఈ జట్టు సీజన్ ప్రారంభంలో నాలుగు వరుస విజయాలు సాధించి, ఆతర్వాత 7 మ్యాచ్‌ల్లో కేవలం రెండు విజయాలు మాత్రమే నమోదు చేసి, ప్లే ఆఫ్స్ రేసులో బాగా వెనుకపడిపోయింది. ఈ జట్టు ఇకపై ఆడాల్సిన 3 మ్యాచ్‌ల్లో (ఢిల్లీ, లక్నో, ముంబై) కనీసం రెండైనా గెలవకపోతే, ప్లే ఆఫ్స్ బెర్త్‌పై ఆశలు వదులుకోవాల్సిందే. ఇప్పటివరకు ఆడిన 11 మ్యాచ్‌ల్లో ఈ జట్టు 6 విజయాలు సాధించి, 5 అపజయాలు ఎదుర్కొని పట్టికలో ఆరో స్థానంలో కొనసాగుతుంది. ప్రస్తుతం ఈ జట్టు ఖాతాలో 12 పాయింట్లు ఉన్నాయి. రన్‌రేట్ (0.082) మెరుగ్గానే ఉంది.హ్యాట్రిక్ పరాజయాలు.. హ్యాట్రిక్ విజయాలుఈ సీజన్లో అనూహ్యంగా ప్లే ఆఫ్స్ రేసులోకి వచ్చిన జట్టు సీఎస్కే. ఈ జట్టు హ్యాట్రిక్ పరాజయాలతో సీజన్ ప్రారంభించినప్పటికీ.. ఆతర్వాత అనూహ్యంగా పుంజుకుంది. చివరి 8 మ్యాచ్‌ల్లో హ్యాట్రిక్ విజయాలు సహా 6 విజయాలు నమోదు చేసి పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో కొనసాగుతుంది. ఇకపై ఆడాల్సిన 3 మ్యాచ్‌ల్లో రెండు గెలిచినా ఈ జట్టు ప్లే ఆఫ్స్ బెర్త్ ఖరారవుతుంది. సీఎస్కేకు రన్‌రేట్ (0.185) కూడా మెరుగ్గా ఉండటం కలిసొచ్చే అంశం. ఈ జట్టు ఇప్పటివరకు ఆడిన 11 మ్యాచ్‌ల్లో 6 విజయాలు, 5 అపజయాలు నమోదు చేసి, ప్లే ఆఫ్స్ రేసులో బలంగా నిలబడింది.ప్లే ఆఫ్స్ రేసులో స్థిరంగా కొనసాగుతున్న మరో రెండు జట్లు ఆర్సీబీ, ఎస్ఆర్హెచ్. సీజన్ ప్రారంభం నుంచి స్థిరంగా రాణిస్తున్న ఆర్సీబీ ప్రస్తుతం పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతుంది. ఈ జట్టు ఇప్పటివరకు ఆడిన 11 మ్యాచ్‌ల్లో 7 విజయాలు, 4 అపజయాలు ఎదుర్కొని 14 పాయింట్లు ఖాతాలో కలిగి ఉంది. ఈ జట్టు రన్‌రేట్ అన్ని జట్లకంటే మెరుగ్గా (1.103) మెరుగ్గా ఉంది. ఆర్సీబీ తదుపరి ఆడాల్సిన 3 మ్యాచ్‌ల్లో (కేకేఆర్, పంజాబ్, ఎస్ఆర్హెచ్) రెండు గెలిస్తే సునాయాసంగా ప్లే ఆఫ్స్ బెర్త్ కన్ఫర్మ్ చేసుకుంటుంది.ఎస్ఆర్హెచ్ విషయానికొస్తే.. ఈ జట్టు 12 మ్యాచ్‌ల్లో 7 విజయాలు, 5 అపజయాలతో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో (14 పాయింట్లు, 0.331 రన్‌రేట్) కొనసాగుతోంది. ఈ జట్టు ఇకపై ఆడాల్సిన 2 మ్యాచ్‌లు (సీఎస్కే, ఆర్సీబీ) గెలిస్తే, మిగతా జట్లతో సంబంధం లేకుండా ప్లే ఆఫ్స్‌కు చేరుకుంటుంది. అధికారికంగా ప్లే ఆఫ్స్ అవకాశాలు ఉన్న మరో రెండు ఢిల్లీ క్యాపిటల్స్, కేకేఆర్. ఈ రెండు జట్లు టెక్నికల్‌గా ప్లే ఆఫ్స్ రేసులో ఉన్నా, అది జరిగే పని కాదు. ఢిల్లీతో పోలిస్తే కేకేఆర్‌కు కాస్త మెరుగైన అవకాశాలే ఉన్నా, అది కూడా అంత ఈజీ కాదు. ప్రస్తుతం కేకేఆర్ ఖాతాలో 9 పాయింట్లు ఉన్నాయి. ఆ జట్టు ఇకపై ఆడాల్సిన 4 మ్యాచ్‌ల్లో గెలిస్తే ప్లే ఆఫ్స్ రేసులో ఉంటుంది. ఢిల్లీ విషయానికొస్తే.. ఈ జట్టు ఇకపై ఆడాల్సిన 2 మ్యాచ్‌ల్లో ఒక్కదాంట్లో ఓడినా లీగ్ నుంచి ఎలిమినేట్ అవుతుంది. ఇప్పటివరకు లక్నో, ముంబై ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించిన విషయం తెలిసిందే. -
‘మాటలు జాగ్రత్త.. ఏది పడితే అది వాగొద్దు’
ఐపీఎల్ 2026 సీజన్‌ను ఘనంగా ప్రారంభించిన పంజాబ్ కింగ్స్ తొలి అంచె పోటీలు ముగిసేసరికి ఏడు మ్యాచ్‌ల్లో ఆరు విజయాలతో టేబుల్ టాపర్‌గా నిలిచింది. అయితే రెండో అంచె పోటీల్లో మాత్రం పంజాబ్ తడబడుతూ వస్తోంది. వరుసగా నాలుగు పరాజయాలతో పంజాబ్ పట్టికలో నాలుగో స్థానానికి పడిపోయింది. బౌలింగ్‌లో విఫలమవ్వడంతో పాటు పేలవమైన ఫీల్డింగ్ ఆ జట్టు ప్రమాణాలను దెబ్బ తీస్తున్నాయి. పంజాబ్ ఆటగాళ్లు క్యాచ్ డ్రాప్‌లు ఎక్కువగా చేయడం కూడా ఆ జట్టు కొంపముంచుతోంది. మైదానంలో పరిస్థితి ఇలా ఉంటే బయట కూడా పంజాబ్ జట్టు చిక్కుల్లో పడింది. ఇటీవలే విమానంలో పంజాబ్ స్పిన్నర్ యజ్వేంద్ర చాహల్ వేప్ (ఈ-సిగరేట్) పీల్చడం వివాదంగా మారింది. వేప్ను అందించిన అర్ష్‌దీప్‌తో పాటు చాహల్, మరికొంత మంది పంజాబ్ ఆటగాళ్లపై వేటు పడనున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి. అంతేకాదు పంజాబ్ ఓపెనర్ ప్రబ్‌సిమ్రన్ బరువు పెరిగాడన్న వార్తలతో పాటు జట్టు ఆటగాళ్ల ప్రవర్తనపై కూడా క్రమశిక్షణ చర్యలు తీసుకోనున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే తాజాగా పంజాబ్ కింగ్స్ సహ యజమాని ప్రీతి జింటా స్పందించింది. ఎక్స్ వేదికగా ప్రీతి జింటా మాట్లాడుతూ..'మాటలు జాగ్రత్త. నిజానిజాలు తెలుసుకోకుండా ఏది పడితే అది వాగొద్దని హెచ్చరించారు. ఇలాంటి తప్పుడు కథనాల వల్ల ఆటగాళ్లు, ఫ్రాంచైజీ ప్రతిష్టకు నష్టం కలుగుతోంది. విమర్శలకు, తప్పుడు కథనాలకు మధ్య చాలా తేడా ఉంటుంది. ఆటలో తప్పులకు సంబంధించి ఎలాంటి చర్చనైనా స్వాగతిస్తాం. కానీ వ్యక్తులకు, జట్టుకు, ఫ్రాంచైజీ బ్రాండ్‌కు నష్టం కలిగించేలా ఉద్దేశపూర్వకంగా తప్పుడు కథనాలు వ్యాప్తి చేస్తే ఎంతమాత్రం సహించము. వీటిని తేలికగా తీసుకోలేము. సమాచారాన్ని ప్రచారం చేసే ముందు వ్యక్తులు, మీడియా నిపుణులు, సోషల్ మీడియా ప్రతినిధులు వాస్తవాలు తెలుసుకొని బాధ్యతాయుతంగా వ్యవహరించాలని నేను కోరుతున్నా' అని పేర్కొంది. There’s a difference between criticism & calculated misinformation. Healthy debate around the game is welcome, but the deliberate spread of fake narratives to damage individuals, the team, or the brand should not & will not be taken lightly. I urge everyone including verified… https://t.co/yeqbsTwLBd— Preity G Zinta (@realpreityzinta) May 12, 2026ఇదే విషయమై పంజాబ్ కింగ్స్ ఫ్రాంచైజీ కూడా ఎక్స్ వేదికగా స్పందించిది. 'విమర్శలు, సరదా సంభాషణలు, అభిప్రాయాలు క్రీడలో భాగమే. కానీ టీఆర్పీ, వ్యూస్ కోసం నకిలీ వార్తలు, కథనాలు రాయడం సరికాదు. తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసే ముందు వాస్తవాలు ఏంటన్నది గ్రహించాలని మేము కోరుతున్నాము' అని తెలిపింది.Criticism, banter, and opinions are part of sport. Fake stories and made-up narratives for cheap engagement are not. We urge everyone to verify facts before spreading misinformation for attention or traction.— Punjab Kings (@PunjabKingsIPL) May 12, 2026చదవండి: హార్దిక్ నిజంగా గాయపడ్డాడా? -
హార్దిక్ నిజంగా గాయపడ్డాడా? కావాలని తప్పించారా?
ఐపీఎల్ 2026 సీజన్లో ముంబై ఇండియన్స్ ఖేల్ ఖతం అయిన సంగతి తెలిసిందే. ఐదుసార్లు చాంపియన్ అయిన ముంబై ఇండియన్స్ ఈ సీజన్లో దారుణ ఆటతీరుతో మరో రెండు మ్యాచ్‌లు మిగిలి ఉండగానే ఇంటిబాట పట్టింది. ఈ నేపథ్యంలో హార్దిక్ పాండ్యా కెప్టెన్సీపై తీవ్ర విమర్శలు వచ్చాయి. దీంతో ముంబై ఆడిన గత రెండు మ్యాచ్‌లకు వెన్నునొప్పి గాయంతో పాండ్యా దూరంగా ఉన్నాడు. అయితే తాజాగా మే 14న (గురువారం) పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌కు పాండ్యా అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు పాండ్యా తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తున్న వీడియోను పంచుకున్నాడు. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ పాండ్యా నిజంగా గాయపడ్డాడా లేక కావాలని అతడిని జట్టు నుంచి తప్పించారా అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే పాండ్యా తన ప్రాక్టీస్‌లో బౌలర్లను అవలీలగా ఎదుర్కొంటూ కసితీరా బ్యాటింగ్ చేశాడు. బ్యాటింగ్ చేస్తున్నంతసేపు పాండ్యాకు ఏమాత్రం అసౌకర్యంగా కనిపించలేదు. మరోవైపు ముంబై ఇండియన్స్ హెడ్‌కోచ్ మహేల జయవర్దనే మాత్రం పాండ్యా గాయం నుంచి పూర్తిగా కోలుకోలేదంటూ ఒక ప్రకటన విడుదల చేశాడు. అంతేకాదు పాండ్యా త్వరగా కోలుకునేందుకు తమ మెడికల్ టీం ప్రయత్నాలు చేస్తుందని తెలిపాడు. పాండ్యా పూర్తిగా కోలుకునేంతవరకు రిస్క్ చేయకూడదని భావిస్తున్నట్లు పేర్కొన్నాడు. పాండ్యా తాను ఫిట్‌గా ఉన్నట్లు ఒకవైపు వీడియో రిలీజ్ చేయడం, అదే సమయంలో జయవర్దనే పాండ్యా కోలుకోవడానికి సమయం పడుతుందని చెప్పడం చూస్తుంటే పాండ్యా నిజంగా గాయపడ్డాడా లేక కావాలనే జట్టు నుంచి తప్పించారా అనే ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. పాండ్యా కూడా తన అగ్రెసివ్ ప్రవర్తనతో జట్టులో పూర్తిగా నెగెటివిటీని మూటగట్టుకోవడం కూడా అతడికి ప్రతికూలంగా మారిందని చెప్పొచ్చు.ఇటీవలే పాండ్యా.. ముంబై ఇండియన్స్ ప్రాంచైజీని అన్‌ఫాలో చేయడం అనుమానాలకు మరింత బలాన్ని చేకూర్చినట్లయింది. ఇదే విషయమై ముంబై ఫ్యాన్స్ ఒక అడుగు ముందుకేసి 'ఈ సీజన్లో పాండ్యా ముంబై తరఫున ఆఖరి మ్యాచ్ ఆడేశాడని, వచ్చే సీజన్లో వేరే జట్టు తరఫున బరిలోకి దిగనున్నాడంటూ' కామెంట్లు చేస్తున్నారు. 'పాండ్యా జట్టులోకి రావడం వల్ల పెద్దగా ఒరిగేదేమీ లేదు. ఎందుకంటే ఇప్పటికే ఆ జట్టు ఐపీఎల్ 2026 సీజన్ నుంచి ఎలిమినేట్ అయింది. అతడి రాక వల్ల ఉపయోగం లేదు' అని మరికొందరు పేర్కొన్నారు. ఈ సీజన్లో 11 మ్యాచ్‌లాడిన ముంబై ఇండియన్స్ కేవలం ఆరు పాయింట్లతో పట్టికలో 9వ స్థానంలో ఉంది. ముంబై తన తర్వాతి మ్యాచ్‌లు పంజాబ్ కింగ్స్, కేకేఆర్, రాజస్తాన్ రాయల్స్‌తో ఆడనుంది.Hardik pandya practicing in the nets. He just put a stop on alll the rumours 🌚 pic.twitter.com/AjG8Fg9gW9— Gagan Choudhary (@trigguuuu) May 12, 2026చదవండి: ఓటమిలోనూ ఎస్ఆర్హెచ్ రికార్డుల వెల్లువ! -
సీఎస్కే కీలక నిర్ణయం
ఐపీఎల్ 2026 కీలక దశకు చేరుకున్న వేళ, ఫైవ్ టైమ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ కీలక నిర్ణయం తీసుకుంది. గాయంతో టోర్నీ మొత్తానికి దూరమైన పేసర్ రామకృష్ణ ఘోష్ స్థానంలో కర్ణాటక ఆల్‌రౌండర్ మెక్నీల్ హ్యాడ్లీ నొరొన్హాను జట్టులోకి తీసుకుంది. ఈ విషయాన్ని సీఎస్కే సీఈఓ కాశీ విశ్వనాథ్ ధృవీకరించారు. ప్రస్తుతం బీసీసీఐ ఆమోదం కోసం ఫ్రాంచైజీ ఎదురుచూస్తోంది.24 ఏళ్ల మాక్నీల్ గతేడాది మహారాజా ట్రోఫీలో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. మంగళూరు డ్రాగన్స్ టైటిల్ సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. 13 మ్యాచ్‌ల్లో 148.82 స్ట్రైక్‌రేట్‌తో 253 పరుగులు చేశాడు. ఇందులో ఏకంగా 19 సిక్సర్లు ఉండటం విశేషం.బ్యాటింగ్‌తో పాటు ఆఫ్ స్పిన్ బౌలింగ్ కూడా వేయగల మాక్నీల్.. ఆ టోర్నీలో 7.44 ఎకానమీతో 10 వికెట్లు తీశాడు. ముఖ్యంగా ఫైనల్లో హుబ్లీ టైగార్స్పై 2/25 గణాంకాలతో మెరిశాడు. ఈ ప్రదర్శనలతో అతడికి సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీ (కర్ణాటక తరఫున) ఆడే అవకాశం లభించింది. ఆ టోర్నీలో ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ అతడు ఆకట్టుకున్నాడు.ఇక రామకృష్ణ ఘోష్ విషయానికి వస్తే, అతడు ఈ సీజన్లో సీఎస్కే తరఫున ఐపీఎల్ అరంగేట్రం చేశాడు. అయితే మే 3న ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కాలికి తీవ్ర గాయం కావడంతో టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. అతడికి ఫుట్ ఫ్రాక్చర్ అయినట్లు సీఎస్కే ప్రకటించింది.ఈ సీజన్లో సీఎస్కే గాయాల సమస్యతో తీవ్రంగా ఇబ్బందులు పడుతోంది. ఇప్పటికే పేసర్ ఖలీల్ అహ్మద్, స్టార్ బ్యాటర్ ఆయుశ్ మాత్రే కూడా సీజన్ మొత్తానికి దూరమయ్యారు. అయుశ్ స్థానంలో ఆకాశ్ మధ్వాల్ జట్టులోకి రాగా.. ఖలీల్ అహ్మద్‌కు ఇంకా ప్రత్యామ్నాయాన్ని ప్రకటించలేదు.మరోవైపు విదేశీ పేసర్ నాథన్ ఇల్లిస్ కూడా గాయం కారణంగా సీజన్ ఆరంభం నుంచే జట్టుకు దూరంగా ఉంటున్నాడు. అతడి స్థానంలో వచ్చిన స్పెన్సర్ జాన్సన్ కూడా గాయంతో కొన్ని మ్యాచ్‌లకు అందుబాటులో ఉండలేదు.ఇక జట్టు మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని కూడా కాఫ్ స్ట్రెయిన్‌తో బాధపడుతూ ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. కీలక ఆటగాళ్లు అందుబాటులో లేకపోవడం వల్ల సీజన్ ప్రారంభంలో వరుస పరాజయాలు ఎదుర్కొన్న సీఎస్కే.. ఆతర్వాత అనూహ్యంగా పుంజుకొని ప్రస్తుతం ప్లే ఆఫ్స్ రేసులో బలంగా నిలబడింది. ఈ జట్టు ప్రస్తుతం ఐదో స్థానంలో ఉండి, ప్లే ఆఫ్స్ బెర్త్ కోసం తీవ్రంగా పోరాడుతుంది. ఇలాంటి సమయంలో మాక్నీల్ వంటి యువ ఆల్‌రౌండర్ రాక జట్టుకు అదనపు బలం ఇవ్వొచ్చని సీఎస్కే అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. -
ఓటమిలోనూ ఎస్ఆర్హెచ్ రికార్డుల వెల్లువ!
ఐపీఎల్ 2026 సీజన్లో గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) 82 పరుగుల తేడాతో దారుణ ఓటమిని చవిచూసింది. గుజరాత్ విధించిన 169 పరుగులను ఛేదించే క్రమంలో ఎస్ఆర్హెచ్ 86 పరుగులకే కుప్పకూలింది. ఈ నేపథ్యంలో ఎస్ఆర్హెచ్ పలు చెత్త రికార్డులను తన పేరిట లిఖించుకుంది. అవి ఏంటనేది ఒకసారి పరిశీలిద్దాం.👉గుజరాత్‌తో మ్యాచ్‌లో 89 పరుగులకే కుప్పకూలిన ఎస్ఆర్హెచ్కు ఐపీఎల్లో అత్యల్ప స్కోరు కావడం గమనార్హం. 2019లో ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో 96 పరుగులు, 2015లో ముంబైతో మ్యాచ్‌లో 113 పరుగులు, 2024లో కేకేఆర్‌తో మ్యాచ్‌లో 113 పరుగులు, 2020 సీజన్లో పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో 114 పరుగులకు ఆలౌటైంది.👉ఐపీఎల్లో పరుగుల పరంగా (గుజరాత్ చేతిలో 82 పరుగుల తేడాతో) చూసుకుంటే ఎస్ఆర్హెచ్కు ఇదే అతిపెద్ద ఓటమి. 2025లో కేకేఆర్ చేతిలో 80 పరుగులు, 2024లో సీఎస్కే చేతిలో 78 పరుగులు, 2013లో సీఎస్కే చేతిలో 77 పరుగులు, 2014లో పంజాబ్ చేతిలో 72 పరుగులు, 2023లో రాజస్తాన్ చేతిలో 72 పరుగులతో భారీ ఓటములు చవిచూసింది.👉అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌ల్లో ఎస్ఆర్హెచ్ చేసిన 86 పరుగులే అత్యల్ప స్కోరు. గతంలో గుజరాత్ టైటాన్స్ (2024లో ఢిల్లీతో మ్యాచ్‌లో 89 పరుగులు) ఇప్పటిదాకా అత్యల్పం. అంతకముందు ఇదే సీజన్లో ముంబైతో మ్యాచ్‌లో గుజరాత్ వంద పరుగులకు ఆలౌటైంది. 2014లో ఎస్ఆర్హెచ్తో మ్యాచ్‌లో రాజస్తాన్ 102 పరుగులకు ఆలౌటైంది.👉ఐపీఎల్లో పరుగుల పరంగా గుజరాత్ టైటాన్స్‌కు (82 పరుగులు) ఇదే అతిపెద్ద విజయం కావడం విశేషం. ఈ సీజన్లో రాజస్తాన్‌పై 77 పరుగులతో, 2023లో ముంబైపై 62 పరుగులతో, 2022లో లక్నోపై 62 పరుగులతో, 2025లో రాజస్తాన్‌పై 58 పరుగులతో భారీ విజయాలు అందుకుంది.👉ఈ విజయంతో గుజరాత్ టైటాన్స్ 16 పాయింట్లతో టేబుల్ టాపర్‌గా నిలిచి ప్లేఆఫ్స్‌కు మరింత చేరువైంది. ప్రస్తుతం 14 పాయింట్లతో ఉన్న ఎస్ఆర్హెచ్ మిగిలిన రెండు మ్యాచ్‌లను సీఎస్కే, ఆర్సీబీతో ఆడనుంది. ఇందులో ఆర్సీబీతో మ్యాచ్‌ను సొంత గ్రౌండ్లో ఆడనుండడం ఎస్ఆర్హెచ్కు కలిసొచ్చే అంశం. ఈ రెండు మ్యాచ్‌ల్లోనూ ఎస్ఆర్హెచ్ నెగ్గితే ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్లేఆఫ్స్‌కు చేరనుంది.చదవండి: ‘టైటిల్ మాదే.. రాసిపెట్టుకోండి’.. గిల్ హెచ్చరిక! -
‘టైటిల్ మాదే.. రాసిపెట్టుకోండి’.. గిల్ హెచ్చరిక!
ఐపీఎల్ 2026 సీజన్లో గుజరాత్ టైటాన్స్ వరుసగా ఐదో విజయాన్ని సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకొచ్చింది. మంగళవారం ఎస్ఆర్హెచ్తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ 82 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. 200 ప్లస్ స్కోర్లు కూడా ఈజీగా ఛేదిస్తున్న ఈ సీజన్లో 160 ప్లస్ స్కోరును కాపాడుకోవడం గుజరాత్‌కు మాత్రమే చెల్లింది. మ్యాచ్ విజయం అనంతరం గుజరాత్ కెప్టెన్ శుబ్‌మన్ గిల్ మాట్లాడాడు. ‘అహ్మదాబాద్ వికెట్ పై 170 పరుగులు చేయడం కూడా కష్టమే. మేం 160-170 పరుగులు చేస్తే.. మా బౌలింగ్ అటాక్ ముందు ఆ స్కోర్‌ను ఛేదించడం అంత సులువు కాదని ముందే అంచనా వేశాం. ఈ మ్యాచ్‌లో మా వ్యూహం కూడా అదే. సన్‌రైజర్స్ బ్యాటింగ్ లైనప్, ముఖ్యంగా టాపార్డర్‌ను పడగొట్టడానికి మేం వేసిన ప్రణాళికలు పక్కాగా పనిచేశాయి.సాయి సుదర్శన్, వాషింగ్టన్ సుందర్ ఈ స్లో పిచ్‌పై అద్భుతంగా రాణించారు. ఈ గెలుపు క్రెడిట్ వారికి ఇవ్వాల్సిందే. ఓ వైపు వికెట్లు పడిపోతున్నా.. వారిద్దరూ నిలబడి జట్టుకు ఆ స్కోర్‌ను అందించారు. మేము ఒక బ్రాండ్ క్రికెట్‌కు మాత్రమే పరిమితం అవ్వాలని అనుకోవడం లేదు. మేము ఒక నిర్దిష్ట శైలి లేదా బ్రాండ్ క్రికెట్ ఆడే జట్టు కాదని మీకు తెలుసు. వరుస విజయాలు ఊరికే రాలేదు. రాసిపెట్టుకోండి.. ఈసారి టైటిల్ కొట్టబోతున్నాం. పిచ్‌ను చూసి, పరిస్థితులను అంచనా వేసి ఆడి గెలిచే జట్టుగా ఉండాలని కోరుకుంటున్నాం. 240 పరుగులు చేసే వికెట్ అయితే కచ్చితంగా ఆ స్కోర్ కోసం ప్రయత్నిస్తాం. ముఖ్యంగా జాసన్ హోల్డర్.. మా టీమ్ గెలుపు సీక్రెట్. అతడు వేస్తున్న లెంగ్త్‌లు మా జట్టుకు చాలా ప్లస్ అవుతున్నాయి. దాదాపు ప్రతి మ్యాచ్‌లో హోల్డర్ వరుసగా నాలుగు ఓవర్లు వేస్తూ రాణిస్తూ మాకు గెలుపు మంత్రంగా మారిపోయాడు.’ అని గిల్ వెల్లడించాడు.చదవండి: ‘నన్ను పావుగా వాడుకొని కోహ్లీపై కుట్ర పన్నాగం’ -
‘నన్ను పావుగా వాడుకొని కోహ్లీపై కుట్ర పన్నాగం’
జర్మన్ మోడల్, ఇన్ఫ్లుయెన్సర్ లిజ్లాజ్ పెట్టిన పోస్టుకు టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ లైక్ కొట్టడం సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. ఆ తర్వాత ఆ లైక్ కనిపించకపోవడం వివాదంగా మారింది. ఈ నేపథ్యంలో లిజ్ లాజ్ మరోసారి బాంబు పేల్చింది. కోహ్లీపై తప్పుడు ఆరోపణలు చేయాలంటూ కొందరు జర్నలిస్టులు తనను సంప్రదించారని, అందుకు భారీగా డబ్బులు కూడా ఆఫర్ చేశారని లిజ్ లాజ్ వెల్లడించింది. తనను పావులా వాడుకొని కోహ్లీపై కుట్ర పన్నాలని భావించారని, కానీ డబ్బు కోసం లేదా పాపులర్ అవ్వడానికి కోహ్లీ పేరును వాడుకొని అతడి ప్రతిష్టను దెబ్బతీయాలన్న ఆసక్తి తనకు లేదని తెలిపింది. అందుకే వాళ్లు (జర్నలిస్టులు) ఇచ్చిన ఆఫర్‌ను సున్నితంగా తిరస్కరించినట్లు పేర్కొంది. ఇంటర్వ్యూలో లిజ్ లాజ్ మాట్లాడుతూ.. ‘మొదట విరాట్ కోహ్లీ నా ఫొటో లైక్ చేసినప్పుడు చాలా ఆనందంగా అనిపించింది. ప్రపంచస్థాయి క్రికెటర్ నా పోస్టును గమనించడం గర్వంగా అనిపించింది. కానీ తర్వాత ఆ విషయాన్ని సోషల్ మీడియాలో అతిగా చూపించడం బాధ కలిగించింది. ఒక సాధారణ సోషల్ మీడియా యాక్టివిటీని పెద్ద వివాదంగా మార్చడం సరికాదు. కోహ్లీపై వచ్చిన ట్రోలింగ్ చూసి ఆశ్చర్యపోయాను. అతను ఎప్పుడూ అనుచితంగా ప్రవర్తించలేదు. కోహ్లీకి ఉన్న క్రేజ్ గురించి మాట్లాడుతూ, అతడిని ఫుట్‌బాల్ దిగ్గజాలు మెస్సీ, రొనాల్డోలతో పోల్చింది. ‘కోహ్లీ ఆసియాలో అత్యంత ప్రభావవంతమైన క్రీడాకారుల్లో ఒకరు. ఆయనపై అనవసర ఆరోపణలు చేయడం సరైంది కాదు. ఒక చిన్న విషయాన్ని పెద్ద వివాదంగా మార్చి వ్యక్తిత్వాన్ని దెబ్బతీయాలని చూడటం బాధాకరం’ అని ఆమె పేర్కొంది. ఈ వివాదం తర్వాత భారత్‌లో లిజ్ లాజ్‌కు విపరీతమైన గుర్తింపు వచ్చినట్లు తెలుస్తోంది. సోషల్ మీడియాలో ఆమె ఫాలోవర్లు భారీగా పెరిగారు. పలు బ్రాండ్ ప్రమోషన్లు, రియాలిటీ షో అవకాశాలు కూడా వచ్చినట్లు సమాచారం. అయినప్పటికీ, తాను సంచలన ప్రచారం కోసం ఎవరి ప్రతిష్ఠతో ఆడుకోనని ఆమె స్పష్టం చేసింది. అంతేకాదు తాను ఐపీఎల్‌కు పెద్ద అభిమానినని, ముఖ్యంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టును క్రమం తప్పకుండా ఫాలో అవుతానని స్పష్టం చేసింది.ఎవరీ లిజ్లాజ్?లిజ్ లాజ్ దక్షిణాఫ్రికాలో జన్మించింది. ఆమె తండ్రిది సౌతాఫ్రికా కాగా.. తల్లిది జర్మనీ. దీంతో లిజ్ లాజ్ జర్మన్, ఆఫ్రికా, డచ్, ఫ్రెంచ్, రష్యన్ వంటి భాషలను అనర్గళంగా మాట్లాడగలదు. సైకాలజీ విభాగంలో ఎంఎస్సీ పట్టా పొందింది. లైఫ్‌సేవింగ్ స్విమ్మర్ కూడా లిజ్ లాజ్ గుర్తింపు పొందింది. ఫుడ్ వ్లాగింగ్, ట్రావెలింగ్, పాటల రచన లిజ్ లాజ్ హాబీలు.చదవండి: చీర్‌గర్ల్స్ చిందులు.. కళ్లప్పగించిన పోలీసులు! -
బంగ్లాదేశ్ చేతిలో పాక్ బోల్తా
మిర్పూర్: బంగ్లాదేశ్‌తో జరిగిన మొదటి 13 టెస్టుల్లో పాకిస్తాన్ 12 విజయాలు సాధించింది. ఒక మ్యాచ్‌ను ‘డ్రా’గా ముగించింది. ఆ తర్వాత పాకిస్తాన్ విజయపరంపరకు 2024లో రావల్పిండి వేదికగా బంగ్లాదేశ్ తెరదించింది. ఆనాడు రెండు వారాల్లో వరుసగా రెండు టెస్టుల్లో పాకిస్తాన్‌ను వారి సొంతగడ్డపైనే ఓడించి బంగ్లాదేశ్ భళా అనిపించింది. రెండేళ్ల విరామం తర్వాత మళ్లీ పాకిస్తాన్‌తో జరిగిన టెస్టులో వరుసగా మూడోసారి బంగ్లాదేశ్ జట్టే పైచేయి సాధించింది. ‘హ్యాట్రిక్’ విజయాన్ని అందుకుంది. రెండు టెస్టుల సిరీస్‌లో భాగంగా మిర్పూర్ వేదికగా జరిగిన తొలి టెస్టులో బంగ్లాదేశ్ 103 పరుగుల తేడాతో పాకిస్తాన్‌ను చిత్తు చేసింది. సిరీస్‌లో 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. రెండో టెస్టు ఈనెల 16 నుంచి సిల్హెట్లో జరుగుతుంది. ఆట చివరిరోజు ఓవర్‌నైట్ స్కోరు 152/3తో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన బంగ్లాదేశ్ 70.3 ఓవర్లలో 9 వికెట్లకు 240 పరుగులవద్ద డిక్లేర్ చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ చేసిన బంగ్లాదేశ్ కెపె్టన్ నజు్మల్ హుస్సేన్ షంటో (87; 7 ఫోర్లు) రెండో ఇన్నింగ్స్‌లోనూ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మోమినుల్ హక్ (56; 4 ఫోర్లు) అర్ధ సెంచరీ సాధించాడు. పాక్ బౌలర్లలో హసన్ అలీ, నోమన్ అలీ 3 వికెట్ల చొప్పున తీశారు.అనంతరం బంగ్లాదేశ్ నిర్దేశించిన 268 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుక బరిలోకి దిగిన పాకిస్తాన్ 52.5 ఓవర్లలో కేవలం 163 పరుగులకే కుప్పకూలింది. అబ్దుల్లా ఫజల్ (66; 11 ఫోర్లు) ఒక్కడే క్రీజులో నిలబడి అర్ధసెంచరీతో రాణించాడు. మిగతా పాక్ బ్యాటర్లు చేతులెత్తేశారు. బంగ్లాదేశ్ పేసర్ నహీద్ రాణా 40 పరుగులిచ్చి 5 వికెట్లు తీసి పాక్‌ను దెబ్బకొట్టాడు. తస్కిన్ అహ్మద్, తైజుల్ 2 వికెట్ల చొప్పున తీసుకున్నారు. ఆఖరి రోజు 16 వికెట్లు పడటం విశేషం. మ్యాచ్‌లో 188 పరుగులు చేసిన షంటోకు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 413 పరుగులు... పాకిస్తాన్ 386 పరుగులు చేశాయి. -
ఎస్ఆర్హెచ్ ఘోర ఓటమి.. 86 పరుగులకే ఆలౌట్
ఐపీఎల్-2026 సీజన్లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఐదో ఓటమి ఎదురైంది. మంగళవారం అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 82 పరుగుల తేడాతో ఎస్ఆర్హెచ్ ఓటమి పాలైంది. 168 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని చేధించలేక ఆరెంజ్ ఆర్మీ చతికిలబడింది. గుజరాత్ టైటాన్స్ ఫాస్ట్ బౌలర్ల ధాటికి హైదరాబాద్ జట్టు 14.5 ఓవర్లలో 86 పరుగులకే కుప్పకూలింది. ఎస్ఆర్హెచ్ బ్యాటర్లలో పాట్ కమ్మిన్స్(19) టాప్ స్కోరర్‌గా నిలవగా.. మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. గుజరాత్ బౌలర్లలో రబాడ, జాసన్ హోల్డర్ తలా మూడు వికెట్లతో సత్తాచాటగా.. ప్రసిద్ద్ రెండు, సిరాజ్, రషీద్ ఖాన్ ఓ వికెట్ సాధించారు. ఇక తొలుత బ్యాటింగ్ చేసినగుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది.గుజరాత్ బ్యాటర్లలో సాయిసుదర్శన్(61), వాషింగ్టన్ సుందర్(50) హాఫ్ సెంచరీలతో సత్తాచాటారు. ఎస్ఆర్హెచ్ బౌలర్లలో ప్రపుల్ హింగే, షకీబ్ తలా రెండు వికెట్లు సాధించారు. కెప్టెన్ శుభ్‌మన్ గిల్(5)తో పాటు జోస్ బట్లర్(7) విఫలమయ్యాడు. ఈ విజయంతో గుజరాత్ టైటాన్స్ పాయింట్ల పట్టికలో అగ్ర స్ధానానికి చేరుకుంది. -
చరిత్ర సృష్టించిన సాయి సుదర్శన్.. 19 ఏళ్లలో ఒకే ఒక్కడు
ఐపీఎల్ 2026లో గుజరాత్ టైటాన్స్ స్టార్ ప్లేయర్ సాయి సుదర్శన్ తన సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. అహ్మదాబాద్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో సుదర్శన్ హాఫ్ సెంచరీతో సత్తాచాటాడు. ఆరంభంలోనే శుభ్‌మన్ గిల్, జోస్ బట్లర్ వికెట్లను కోల్పోయిన గుజరాత్‌ను సుదర్శన్ ఆదుకున్నాడు.ఈ తమిళనాడు క్రికెటర్ 44 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 61 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్‌తో అతడు ఐపీఎల్-2026 సీజన్లో 500 పరుగులను పూర్తి చేసుకున్నాడు. తద్వారా సుదర్శన్ ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు.👉ఐపీఎల్ చరిత్రలో 24 ఏళ్ల వయసులోపు మూడు వేర్వేరు సీజన్లలో 500 కంటే ఎక్కువ పరుగులు సాధించిన మొదటి ఆటగాడిగా రికార్డులకెక్కాడు. ఇప్పటివరకు ఈ ఫీట్ ఎవరూ సాధించలేకపోయారు. ఇంతకుముందు ఆర్సీబీ సూపర్ స్టార్ విరాట్ కోహ్లి 24 ఏళ్ల వయసులోపు రెండు సీజన్లలో 500 పరుగుల మార్క్‌ను అందుకున్నాడు.👉అదేవిధంగా ఐపీఎల్ చరిత్రలో వరుసగా మూడు లేదా అంతకంటే ఎక్కువ సీజన్లలో 500కు పైగా పరుగులు సాధించిన నాల్గవ ఆటగాడిగా సుదర్శన్ నిలిచాడు. ఈ జాబితాలో డేవిడ్ వార్నర్ (2014-2017), కె.ఎల్. రాహుల్ (2018-2021), విరాట్ కోహ్లి (2023-2025), సాయి సుదర్శన్ (2024-2026) ఉన్నారు.👉గుజరాత్ టైటాన్స్ జట్టు తరఫున మూడుసార్లు 500+ పరుగులు చేసిన మొదటి ఆటగాడు కూడా సుదర్శనే కావడం గమనార్హం. -
ఆర్సీబీతో మ్యాచ్.. కేకేఆర్‌కు భారీ షాక్
ఐపీఎల్-2026 సీజన్లో కోల్‌కతా నైట్‌రైడర్స్ కీలక పోరుకు సిద్దమైంది. ఈ మెగా టోర్నీలో భాగంగా కేకేఆర్ బుధవారం రాయ్‌పూర్ వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడనుంది. ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే కేకేఆర్ ఈ మ్యాచ్‌లో కూడా కచ్చితంగా గెలవాల్సిందే. అయితే ఈ మ్యాచ్‌కు నైట్‌రైడర్స్‌కు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి.. ఆర్సీబీతో జరగనున్న మ్యాచ్‌లో ఆడేది అనుమానమే. చక్రవర్తి ప్రస్తుతం ఎడమ చేతి వేలి గాయంతో బాధపడుతున్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ అతడు గాయంతోనే బరిలోకి దిగాడు. అయితే ఢిల్లీ-ఆర్సీబీ మ్యాచ్‌కు మధ్యలో 6 రోజుల గ్యాప్ రావడంతో అతడు కోలుకుంటాని కేకేఆర్ మేనెజ్మెంట్ భావించింది. కానీ అతడు ఇంకా పూర్తిగా కోలుకోలేదు. దీంతో ఆర్సీబీతో మ్యాచ్‌కు చక్రవర్తి దూరమయ్యే సూచనలు కన్పిస్తున్నాయి. తాజాగా అతడి గాయంపై కేకేఆర్ సహాయ కోచ్ షేన్ వాట్సన్ అప్డేట్ ఇచ్చాడు."వైభవ్ గత రెండు మ్యాచ్‌లలోనూ చాలా నొప్పితో బాధపడ్డాడు. అయినప్పటికి అతడు అద్భుతంగా బౌలింగ్ చేశాడు. అయితే ఆర్సీబీతో మ్యాచ్‌కు అతడు అందుబాటులో ఉంటాడా? లేదా అన్నది కచ్చితంగా తెలియదు. కానీ అతడు టీమ్ సెలక్షన్ అందుబాటులో ఉండాలని మేము ఆశిస్తున్నాం" అని వాట్సన్ ప్రీ మ్యాచ్ కాన్ఫరెన్స్‌లో పేర్కొన్నాడు.కాగా క్రిక్‌బజ్ నివేదిక ప్రకారం.. వరుణ్ ప్రాక్టీస్ సెషన్లో పాల్గొన్నప్పటికీ, పూర్తి స్థాయిలో బౌలింగ్ చేయలేదు. అతను కొన్ని స్ట్రెచింగ్ వ్యాయామాలు చేస్తూ కన్పించాడు. ఇక ఈ ఏడాది సీజన్లో ఇప్పటివరకు 10 మ్యాచ్‌లు ఆడిన చక్రవర్తి.. 8 వికెట్లు పడగొట్టాడు.చదవండి: క్రికెట్ చరిత్రలో పెను సంచలనం.. 50 ఓవర్లలో 822 పరుగులు! -
'వైభవ్ సూర్యవంశీ కెరీర్‌కు ఆ రూల్ శాపం'
వైభవ్ సూర్యవంశీ... ఈ యువ క్రికెటర్ గురుంచి ప్రత్యేక పరిచయం అక్కర్లలేదు. కేవలం 14 ఏళ్ల వయస్సులోనే అద్భుత బ్యాటింగ్‌తో యావత్తు క్రికెట్ ప్రపంచాన్ని తన వైపు తిప్పుకున్నాడు. ఈ రాజస్తాన్ రాయల్స్ యువ సంచలనం ప్రస్తుతం ఐపీఎల్-2026లో కూడా దుమ్ములేపుతున్నాడు.వైభవ్ 440 పరుగులతో ఆరెంజ్ క్యాప్ రేసులో ఉన్నాడు. అయితే బ్యాటింగ్‌లో అదరగొడుతున్న వైభవ్‌ను కేవలం ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఆడించడాన్ని భారత మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ తప్పుబట్టాడు. 'ఇంపాక్ట్ సబ్' నిబంధన కారణంగా వైభవ్ ఒక ఆల్‌రౌండ్ క్రికెటర్‌గా ఎదగలేకపోతున్నాడని మంజ్రేకర్ అభిప్రాయపడ్డాడు. కాగా ఈ ఏడాది సీజన్లో వైభవ్‌ను రాజస్తాన్ రాయల్స్ ఎక్కువగా ఇంపాక్ట్ ప్లేయర్‌గానే వాడుకుంటోంది. రాజస్తాన్ రాయల్స్ ఫీల్డింగ్ చేసేటప్పుడు ఈ యంగ్ కిడ్ గ్రౌండ్లో కాకుండా బెంచ్‌పైనే కనిపిస్తున్నాడు."వైభవ్ సూర్యవంశీని కేవలం ఒక బ్యాటర్‌గా మాత్రమే చూడాలనుకుంటున్నారా? ఒక క్రికెటర్ అంటే బ్యాటింగ్ మాత్రమే కాదు, ఫీల్డింగ్ కూడా బాగా చేయాలి. ఒక 'కంప్లీట్ క్రికెటర్'గా ఎదగాలంటే కచ్చితంగా ఫీల్డింగ్ కూడా చేయాలి. ఇంజమామ్ హల్ హక్ గొప్ప బ్యాటర్ మనందరికి తెలుసు. కానీ అతడు ఫీల్డ్‌లో కాస్త నెమ్మదిగా ఉంటాడు. అయినప్పటికి అతడు మైదానంలో ఉండి ఫీల్డింగ్ చేసేవాడు.ఫీల్డ్‌లో ఉంటేనే వారి లోపాలు, బలాలు అన్నీ స్పష్టంగా తెలిసేవి. కానీ ఇప్పుడు 'ఇంపాక్ట్ సబ్' వల్ల ఫీల్డ్‌లో వారి సామర్థ్యాన్ని పరీక్షించుకునేందుకు అవకాశం లభించడం లేదు. కేవలం 6 బంతులు ఆడే హిట్టింగ్ సామర్థ్యం కోసం మాత్రమే ప్లేయర్లను వాడుకోవడం సరికాదు.ఆటగాడి నుంచి అన్ని కోణాలూ (బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్) ఆశించకపోయినా, కనీసం అతను మైదానంలో ఉండి గేమ్‌ను ఆస్వాదించాలి. ఒక క్యాచ్ డ్రాప్ చేసినప్పుడు కలిగే ఒత్తిడి, ఆ తర్వాత మళ్లీ బ్యాటింగ్‌లో రాణించాలనే కసి ఒక ఆటగాడి మానసిక దృఢత్వాన్ని పెంచుతాయి. ఇప్పుడు అవన్నీ లేవు. ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ ఆటగాళ్లను కష్టపడే స్వభావాన్ని కోల్పోయేలా చేస్తుంది.అందుకే ఇంపాక్ట్ రూల్‌ను బీసీసీఐ రద్దు చేయాలని కోరుకుటున్నాను" అని మంజ్రేకర్ స్పోర్ట్స్ స్టార్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మంజ్రేకర్ పేర్కొన్నాడు. -
సన్‌రైజర్స్‌ను చిత్తు చేసిన గుజరాత్
IPL 2026 SRH vs GT Live Updates: అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 82 పరుగుల తేడాతో ఎస్ఆర్హెచ్ ఓటమి పాలైంది. 168 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని చేధించలేక ఆరెంజ్ ఆర్మీ చతికిలబడింది. గుజరాత్ టైటాన్స్ ఫాస్ట్ బౌలర్ల ధాటికి హైదరాబాద్ జట్టు 14.5 ఓవర్లలో 86 పరుగులకే కుప్పకూలింది. గుజరాత్ బౌలర్లలో రబాడ, జాసన్ హోల్డర్ తలా మూడు వికెట్లతో సత్తాచాటగా.. ప్రసిద్ద్ రెండు, సిరాజ్, రషీద్ ఖాన్ ఓ వికెట్ సాధించారు.ఓటమి దిశగా ఎస్ఆర్హెచ్ఎస్ఆర్హెచ్ 72 పరుగులకే 8 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.పీకల్లోతు కష్టాల్లో సన్రైజర్స్ఎస్ఆర్హెచ్ ఆరో వికెట్ కోల్పోయింది. 14 పరుగులు చేసిన క్లాసెన్.. జాసన్ హోల్డర్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 10.1 ఓవర్లకు ఎస్ఆర్హెచ్ స్కోర్: 56/6ఎస్ఆర్హెచ్ ఐదో వికెట్ డౌన్ఎస్ఆర్హెచ్ ఐదో వికెట్ కోల్పోయింది. 16 పరుగులు చేసిన సైల్ ఆరోరా.. ప్రసిద్ద్ కృష్ణ బౌలింగ్‌లో ఔటయ్యాడు.ఎస్ఆర్హెచ్ నాలుగో వికెట్ డౌన్ఎస్ఆర్హెచ్ 34 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. 9 ఓవర్లకు ఎస్ఆర్హెచ్ స్కోర్: 54/4. క్రీజులో సైల్ ఆరోరా(16), హెన్రిచ్ క్లాసెన్(13) ఉన్నారు.ఎస్ఆర్హెచ్ మూడో వికెట్ డౌన్ఇషాన్ కిషన్ రూపంలో ఎస్ఆర్హెచ్ మూడో వికెట్ కోల్పోయింది. 11 పరుగులు చేసిన ఇషాన్ కిషన్.. రబాడ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 4 ఓవర్లకు ఎస్ఆర్హెచ్ స్కోర్: 29/3ఎస్ఆర్హెచ్ రెండో వికెట్ డౌన్అభిషేక్ శర్మ రూపంలో ఎస్ఆర్హెచ్ రెండో వికెట్ కోల్పోయింది. 6 పరుగులు చేసిన అభిషేక్.. రబాడ బౌలింగ్‌లో ఔటయ్యాడు.ఎస్ఆర్హెచ్ తొలి వికెట్ డౌన్169 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఎస్ఆర్హెచ్కు గట్టి ఎదురు దెబ్బ తగలింది. డేంజరస్ ఓపెనర్ ట్రావిస్ హెడ్.. మొహ్మద్ సిరాజ్ బౌలింగ్‌లో ఖాతా తెరవకుండానే పెవిలియన్‌కు చేరాడు.సాయి,వాషీ హాఫ్ సెంచరీలు.. ఎస్ఆర్హెచ్ టార్గెట్ ఎంతంటే?టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. గుజరాత్ బ్యాటర్లలో సాయిసుదర్శన్(61), వాషింగ్టన్ సుందర్(50) హాఫ్ సెంచరీలతో సత్తాచాటారు. ఎస్ఆర్హెచ్ బౌలర్లలో ప్రపుల్ హింగే, షకీబ్ తలా రెండు వికెట్లు సాధించారు. కెప్టెన్ శుభ్‌మన్ గిల్(5)తో పాటు జోస్ బట్లర్(7) విఫలమయ్యాడు.14 ఓవర్లకు గుజరాత్ స్కోర్: 107/314 ఓవర్లు ముగిసే సరికి గుజరాత్ టైటాన్స్ మూడు వికెట్ల నష్టానికి 107 పరుగులు చేసింది. క్రీజులో సాయిసుదర్శన్(55), వాషింగ్టన్ సుందర్(14) ఉన్నారు.గుజరాత్ రెండో వికెట్ డౌన్26 పరుగుల వద్ద గుజరాత్ టైటాన్స్ రెండో వికెట్ కోల్పోయింది. 7 పరుగులు చేసిన జోస్ బట్లర్.. ప్రపుల్ హింగే బౌలింగ్‌లో ఔటయ్యాడు. 6 ఓవర్లకు గుజరాత్ టైటాన్స్ స్కోర్: 34/2గుజరాత్ తొలి వికెట్ డౌన్15 పరుగుల వద్ద గుజరాత్ టైటాన్స్ తొలి వికెట్ కోల్పోయింది. 5 పరుగులు చేసిన శుభ్‌మన్ గిల్.. ప్రపుల్ హింగే బౌలింగ్‌లో ఔటయ్యాడు.ఐపీఎల్-2026లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటాన్స్ జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఎస్ఆర్హెచ్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఇరు జట్లు కూడా ఎటువంటి మార్పులు లేకుండా బరిలోకి దిగాయి.తుది జట్లుసన్‌రైజర్స్ హైదరాబాద్: అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), హెన్రిచ్ క్లాసెన్, సలీల్ అరోరా, నితీష్ కుమార్ రెడ్డి, స్మరణ్ రవిచంద్రన్, పాట్ కమిన్స్(కెప్టెన్), శివంగ్ కుమార్, ఈషాన్ మలింగ, సాకిబ్ హుస్సేన్, ప్రఫుల్ హింగేగుజరాత్ టైటాన్స్ : శుభ్‌మన్ గిల్(కెప్టెన్), సాయి సుదర్శన్, జోస్ బట్లర్(వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, జాసన్ హోల్డర్, నిశాంత్ సింధు, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, అర్షద్ ఖాన్, కగిసో రబడ, మహ్మద్ సిరాజ్ -
చీర్‌గర్ల్స్ చిందులు.. కళ్లప్పగించిన పోలీసులు!
ఐపీఎల్ 2026 సీజన్ దగ్గరపడుతున్న కొద్దీ రసవత్తరంగా మారుతోంది. ఇప్పటికీ ప్లేఆఫ్స్‌కు చేరే జట్లపై ఇంకా స్పష్టత రాలేదు. ముంబై, లక్నో ఎలిమినేట్ కాగా ప్లేఆఫ్స్ స్థానం కోసం ఎనిమిది జట్లు పోటీ పడుతున్నాయి. అయితే అందులో ఆర్సీబీ, ఎస్ఆర్హెచ్, పంజాబ్, గుజరాత్‌కు ప్లేఆఫ్స్ చేరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కానీ టీ20 మ్యాచ్‌లు కావడంతో ఏ క్షణంలో ఏం జరుగుతుందనేది ఊహించడం కష్టం. అందుకే సీజన్లో అన్ని లీగ్ మ్యాచ్‌లు పూర్త య్యాకే ప్లేఆఫ్స్ చేరే జట్లపై క్లారిటీ రానుంది. ఈ విషయం పక్కనబెడితే ఐపీఎల్ మ్యాచ్‌లను వీక్షించడానికి వచ్చే అభిమానులకు, ఆటగాళ్లకు చీర్‌గర్ల్స్ తమ నృత్యాలతో అలరించడం చూస్తూనే ఉంటాం. అయితే ఆదివారం రాయ్‌పూర్ వేదికగా ముంబై ఇండియన్స్, ఆర్సీబీ మధ్య మ్యాచ్ సమయంలో జరిగిన ఆసక్తికర ఘటన కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విషయంలోకి వెళితే ఆర్సీబీ బ్యాటింగ్ సమయంలో స్ట్రాటజిక్ టైమ్ అవుట్ ఇచ్చారు. ఈ సమయంలో ముంబై ఇండియన్స్‌కు చెందిన చీర్ గర్ల్స్ ఫోడియంపై చిందులు వేస్తున్నారు. అందులో ఒక చీర్‌గర్ల్ అక్కడే ఉన్న పోలీసులను చూస్తూ నృత్యం చేసింది. దీంతో అక్కడే డ్యూటీ చేస్తున్న పోలీసులు చీర్ గర్ల్స్ నృత్యాలను కళ్లప్పగించి అలా చూస్తూ ఉండిపోయారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ఇప్పుడు తెగ వైరలవుతోంది. ఇక మ్యాచ్ విషయానికొస్తే ఆద్యంతం ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో ఆర్సీబీ 2 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై 20 ఓవర్లలో 7 వికెట్ నష్టానికి 166 పరుగులు చేసింది. అనంతరం ఆర్సీబీ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 167 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. ఓటమితో ముంబై ఇండియన్స్ ఐపీఎల్ 19వ సీజన్ నుంచి ఎలిమినేట్ కాగా.. ఆర్సీబీ 14 పాయింట్లతో టేబుల్ టాపర్‌గా నిలిచింది. ఆర్సీబీ తన తర్వాతి మ్యాచ్‌లో కేకేఆర్‌ను ఎదుర్కోనుండగా, ముంబై ఇండియన్స్ పంజాబ్‌తో తలపడనుంది.Raipur police enjoying watching the Mumbai Indians cheerleaders during the MI vs RCB match.😅 pic.twitter.com/xichgo4HEw— 𝐑𝐮𝐬𝐡𝐢𝐢𝐢⁴⁵ (@rushiii_12) May 11, 2026చదవండి: అక్షర్ పటేల్‌కు భారీ జరిమానా! -
అక్షర్ పటేల్‌కు భారీ జరిమానా!
ఐపీఎల్ 2026 సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ అద్భుత విజయాన్ని నమోదు చేసినప్పటికీ, ఆ జట్టు కెప్టెన్ అక్షర్ పటేల్‌కు చేదు అనుభవం ఎదురైంది. పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్ కారణంగా అక్షర్ పటేల్‌పై బీసీసీఐ భారీ జరిమానా విధించింది. నిర్ణీత సమయంలోగా ఓవర్ల కోటాను పూర్తి చేయడంలో విఫలమైనందుకు అక్షర్ పటేల్‌కు రూ.12 లక్షల జరిమానా విధిస్తున్నట్లు ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ప్రకటించింది.పంజాబ్‌తో మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.22ను ఉల్లంఘించినట్లు అధికారులు నిర్ధారించారు. అయితే ఈ సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఇది తొలి తప్పిదం కావడంతో కేవలం కెప్టెన్‌కు మాత్రమే జరిమానా విధించారు. ఇదే తప్పు మళ్లీ పునరావృతమైతే కెప్టెన్‌తో పాటు జట్టు సభ్యులపై కూడా జరిమానాలు విధించే అవకాశం ఉందని తెలుస్తోంది. మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 210 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఓపెనర్ ప్రియాన్ష్ ఆర్య 56 పరుగులతో రాణించగా, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 59 పరుగులతో అజేయంగా నిలిచి జట్టుకు భారీ స్కోరు అందించాడు. ఢిల్లీ బౌలర్లలో మిచెల్ స్కార్ట్, మాధవ్ తివారీ రెండేసి వికెట్లు తీశారు. 211 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ ఆరంభంలోనే తడబడింది. 74 పరుగులకే నాలుగు కీలక వికెట్లు కోల్పోయి ఒత్తిడిలో పడింది. అయితే కెప్టెన్ అక్షర్ పటేల్ 56 పరుగులతో అర్ధసెంచరీ చేసి జట్టును ఆదుకోగా, డేవిడ్ మిల్లర్ 51 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. వీరిద్దరూ ఔటైన తర్వాత అశుతోష్ శర్మ, మాధవ్ తివారీ మెరుపు బ్యాటింగ్‌తో మ్యాచ్‌ను ఢిల్లీ వైపు తిప్పేశారు. కేవలం 19 ఓవర్లలోనే 216 పరుగులు చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ చారిత్రాత్మక విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ విజయంతో ఢిల్లీ క్యాపిటల్స్ తమ ప్లేఆఫ్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది.చదవండి: ‘బౌలర్లకు అన్యాయం.. ఆ నిబంధన సవరించాలి’ -
పాక్‌కు షాకిచ్చిన బంగ్లాదేశ్.. 24 ఏళ్లలో ఇదే తొలిసారి
ఢాకా వేదికగా పాకిస్తాన్‌తో జరిగిన తొలి టెస్టులో 104 పరుగుల తేడాతో బంగ్లాదేశ్ ఘన విజయం సాధించింది. 268 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పర్యాటక పాక్ జట్టు 52.5 ఓవర్లలో 163 రన్స్‌కే కుప్పకూలింది. బంగ్లా పేసర్ల ఉచ్చులో చిక్కుకుని పాక్ బ్యాటర్లు విలవిల్లాడారు.ముఖ్యంగా యువ ఫాస్ట్ బౌలర్ నహిద్ రాణా అద్భుత ప్రదర్శన చేశాడు. కేవలం 9.5 ఓవర్లలోనే 40 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టి పాక్ పతనాన్ని శాసించాడు. అతడితో పాటు టాస్కిన్ అహ్మద్, తైజుల్ ఇస్లాం తలా రెండు వికెట్లు సాధించారు. పాక్ బ్యాటర్లలో అబ్దుల్లా ఫజల్(66) హాఫ్ సెంచరీతో రాణించగా.. మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. ఇక ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ తమ మొదటి ఇన్నింగ్స్‌లో 413 పరుగుల భారీ స్కోర్ సాధించింది. కెప్టెన్ నజ్ముల్ హోస్సేన్ షాంటో(101) సెంచరీతో కదం తొక్కగా..మోమినల్ హక్(91), ముష్ఫికర్ రహీమ్(71) హాఫ్ సెంచరీలతో రాణించారు. పాక్ బౌలర్లలో మహ్మద్ అబ్బాస్ ఐదు వికెట్లు పడగొట్టాడు. ఆ తర్వాత పాకిస్తాన్ కూడా బంగ్లాదేశ్ కూడా ధీటుగా బదులిచ్చింది. అరంగేట్ర ఆటగాడు అజాన్ అవైస్(103) శతక్కొట్టగా.. అబ్దుల్లా ఫజల్(60), సల్మాన్ అలీ అఘా(58), మహ్మద్ రిజ్వాన్(59) రాణించారు. బంగ్లా స్పిన్నర్ మెహదీ హసన్ మిరాజ్ 5 వికెట్ల సత్తాచాటాడు. 17 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ మొదలు పెట్టిన బంగ్లాదేశ్ 9 వికెట్ల నష్టానికి 240 పరుగులు చేసింది. బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో లభించిన ఆధిక్యాన్ని జోడించి ప్రత్యర్ధి ముందు 268 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. ఈ స్వల్ప లక్ష్యాన్ని చేధించలేక పాకిస్తాన్ చతికిలబడింది. కాగా బంగ్లాదేశ్ తన టెస్ట్ క్రికెట్ చరిత్రలో స్వదేశంలో పాకిస్తాన్ ఓడించడం ఇదే తొలిసారి.బంగ్లా జట్టు స్వదేశంలో పాకిస్తాన్‌తో మొట్టమొదటి టెస్టు 2002లో ఆడింది. ఇప్పుడు 24 ఏళ్ల తర్వాత సొంతగడ్డపై పాక్‌పై తొలి టెస్టు విజయాన్ని అందుకుంది. ఈ విజయంతో రెండు టెస్టుల సిరీస్‌లో బంగ్లాదేశ్ 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. రెండో టెస్ట్ మ్యాచ్ మే 16 నుంచి సిల్హెట్ వేదికగా ప్రారంభం కానుంది.చదవండి: క్రికెట్ చరిత్రలో పెను సంచలనం.. 50 ఓవర్లలో 822 పరుగులు! -
క్రికెట్ చరిత్రలో పెను సంచలనం.. 50 ఓవర్లలో 822 పరుగులు!
సాధారణంగా 50 ఓవర్ల క్రికెట్లో ఓ జట్టు 400 పరుగులు సాధిస్తే అతి భారీ స్కోర్‌గా చెప్పుకుంటాం. అటువంటిది జింబాబ్వే వేదికగా జరుగుతున్న దేశవాళీ వన్డే టోర్నమెంట్లో ఓ జట్టు ఏకంగా 822 పరుగులు సాధించి క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది.మాస్వింగో 50 ఓవర్ల ఫస్ట్ లీగ్‌లో భాగంగా సోమవారం స్కోర్పియన్ క్రికెట్ క్లబ్, మీథేన్ లయన్స్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన స్కోర్పియన్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 822 పరుగుల భారీ స్కోర్ సాధించింది.ఓపెనర్లు విల్ఫ్రెడ్ మాటెండే, తకుండా మడెంబో ఆరంభం నుంచే బౌండరీల వర్షం కురిపించారు. ప్రత్యర్ధి బౌలర్లను ఉతికారేశారు. వారిని ఆపడం ఎవరి తరం కాలేదు. వారి విధ్వంసం ధాటికి ఫీల్డర్లు కేవలం ప్రేక్షక పాత్ర పోషించారు. తకుండా మడెంబో (143 బంతుల్లో 50 ఫోర్లు, 7 సిక్స్‌లతో 302) ట్రిపుల్ సెంచరీతో చెలరేగగా.. విల్ఫ్రెడ్ మాటెండే(75 బంతుల్లో 23 ఫోర్లు, 13 సిక్స్‌లతో 203) ద్విశతకం బాదాడు. వీరిద్దరితో పాటు గార్భియల్ జయ(49 బంతుల్లో 110) మెరుపు సెంచరీ సాధించాడు.కుప్పకూలిన మీథేన్అనంతరం 822 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన మీథేన్ లయన్స్ జట్టు, కేవలం 28 పరుగులకే కుప్పకూలింది. దీంతో స్కోర్పియన్ క్రికెట్ క్లబ్ ఏకంగా 794 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌కు సంబంధించిన స్కోర్ కార్డ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఒకవేళ ఇది అధికారిక 'లిస్ట్ ఏ' మ్యాచ్ అయ్యుంటే, ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే ఇది ఒక తిరుగులేని రికార్డుగా నిలిచిపోయేది.చదవండి: Shreyas Iyer: ‘అతి తెలివి కొంపముంచింది.. అందుకే ఓడిపోయాం’ -
‘బౌలర్లకు అన్యాయం.. ఆ నిబంధన సవరించాలి’
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)పై భారత దిగ్గజ క్రికెటర్ సునీల్ గావస్కర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. బ్యాటర్లతో పాటు బౌలర్లకు సమాన అవకాశాలు రావాలంటే బౌలర్లు నాలుగు ఓవర్లకు పరిమితం కాకుండా ఐదు ఓవర్లు వేసేలా నిబంధనలను సవరించాలని బీసీసీఐకి కీలక సూచన చేశారు. దీనివల్ల జట్టులోని బెస్ట్ బౌలర్ సేవలను మరింతగా ఉపయోగించుకునేందుకు అవకాశమంటుందని తెలిపారు.మిడ్-డే కాలమ్‌లో గావస్కర్ స్పందిస్తూ..'ఈ సీజన్ సగానికి పైగా పూర్తయింది. ఇప్పటికే 46 సార్లు 200-పైగా స్కోర్లు నమోదయ్యాయి, ఇందులో సన్‌రైజర్స్ హైదరాబాద్ 8 సార్లు ఈ ఘనతను సాధించింది. ఆశ్చర్యకరంగా 26 సార్లు కనీసం ఒక జట్టు 200 పరుగుల మార్కును దాటగా, 20 సందర్భాలలో ఇరు జట్లు 200 పరుగుల మార్కును దాటాయి. జట్టు అవసరమని భావిస్తే, ఒక మ్యాచ్‌లో బౌలర్‌ను ఐదు ఓవర్లు బౌలింగ్ చేయడానికి అనుమతించే నిబంధనను అమలు చేస్తే బాగుంటుంది. టీ20ల్లో బౌలర్లకు కేవలం 4 ఓవర్లు మాత్రమే వేసేందుకు అవకాశమున్నప్పటికీ, ఒక అదనపు ఓవర్‌ను వేయించడం ద్వారా ఉత్తమ ఫలితాలు సాధించవచ్చు. అయితే ఒక బ్యాటర్ మొత్తం 20 ఓవర్లు బ్యాటింగ్ చేసేందుకు అవకాశమున్నప్పుడు, బౌలర్‌కు మాత్రం ఒక ఓవర్ ఎక్కువగా వేసేందుకు ఎందుకు అనుమతించకూడదన్నది నా ప్రశ్న.ఈ మేరకు నిబంధనలు సవరించి బౌలర్లకు న్యాయం చేయాలి. దీనివల్ల ఆయా జట్లు కేవలం పరుగులు కాపాడుకోవడానికే కాకుండా, వికెట్లు తీసేందుకు కూడా ఆస్కారం ఉంటుంది. అంతేకాదు ఒక జట్టులో ముగ్గురు బెస్ట్ బౌలర్లు ఉన్నప్పుడు వారితో తలా ఐదు ఓవర్లు బౌలింగ్ చేయించేందుకు మార్గం సుగమం అవుతోంది' అంటూ తన కాలమ్‌లో రాసుకొచ్చారు. ఈ నిబంధనను ఐపీఎల్లో ప్రయత్నించడానికి ముందు దేశీయ స్థాయిలో అమలు చేస్తే బాగుంటుందని గావస్కర్ అభిప్రాయపడ్డారు. టీ20 ఫార్మాట్ అయిన ముస్తాక్ అలీ ట్రోఫీలో ప్రయత్నిచడం ద్వారా ఫలితాలు చూడవచ్చన్నారు. వచ్చే సీజన్ లేదా ఐపీఎల్ 2028 సీజన్ నుంచి ఈ నిబంధనను ఉపయోగిస్తే చూడాలని ఉందని గావస్కర్ తెలిపారు.చదవండి: పాక్ బౌలర్ ప్రపంచ రికార్డు! -
'చపాతీల కంటే బౌలర్లను ఉతకడం మేలు'
ఐపీఎల్ 2026 సీజన్లో రాజస్తాన్ రాయల్స్ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ సూపర్ ఫామ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. జట్టు వరుస ఓటములు చవిచూస్తున్నప్పటికీ వైభవ్ మాత్రం ప్రతీ మ్యాచ్‌లో దనాధన్ ఆటను ప్రదర్శిస్తూ ఇన్నింగ్స్ ఆరంభంలోనే గట్టి పునాది వేస్తున్నాడు. ప్రస్తుతం సూర్యవంశీ 11 మ్యాచ్‌ల్లో 440 పరుగులతో ఆరెంజ్ క్యాప్ రేసులో ఆరో స్థానంలో కొనసాగుతున్నాడు. సీజన్ ఆరంభంలో వరుస విజయాలతో టేబుల్ టాపర్‌గా నిలిచిన రాజస్తాన్ క్రమంగా ఓటములు ఎదుర్కొంది. 11 మ్యాచ్‌ల్లో 6 విజయాలు, 5 ఓటములతో రాజస్తాన్ పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో కొనసాగుతోంది. రాజస్తాన్ తన తర్వాతి మ్యాచ్ మే 17న ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఆడనుంది. మ్యాచ్‌కు వారం రోజులు గ్యాప్ రావడంతో రాజస్తాన్ ఆటగాళ్లు బ్రేక్ మోడ్‌లోకి వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలోనే రాజస్తాన్ యాజమాన్యం తాజాగా ఆటగాళ్లకు సంబంధించి ఫన్నీ వీడియోలను తమ ఎక్స్ ఖాతాలో పంచుకుంది. దీనిలో భాగంగా వైభవ్ సూర్యవంశీ చపాతీలు కాలుస్తున్న వీడియోనూ పంచుకుంది. ఆ వీడియోలో వైభవ్ మాస్టర్ చెఫ్ అవతారంలో చపాతీలు కాలుస్తూ కనిపించాడు.'నేను చేసే చపాతీలతో పోలిస్తే మా అమ్మ చేసే చపాతీలు భిన్నంగా ఉంటాయి. చపాతీలు కాల్చడం కంటే బౌలర్లను ఉతకడం మేలు' అని నవ్వుతూ పేర్కొన్నాడు. వైభవ్ చపాతీలు కాలుస్తున్న వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచింది.𝘔𝘶𝘮𝘮𝘺 𝘬𝘦 𝘳𝘰𝘵𝘪 𝘴𝘦 𝘻𝘺𝘢𝘥𝘢 𝘨𝘰𝘭 𝘳𝘰𝘵𝘪 𝘩𝘢𝘪 😂💗 pic.twitter.com/qOqthFPWXU— Rajasthan Royals (@rajasthanroyals) May 12, 2026చదవండి: ఆస్ట్రేలియన్ టెన్నిస్ దిగ్గజం కన్నుమూత! -
పాక్ బౌలర్ ప్రపంచ రికార్డు!
బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో పాకిస్తాన్ ఆటగాళ్లు రికార్డుల మీద రికార్డులు సాధిస్తున్నారు. ఇప్పటికే టెస్టుల్లో 400 వికెట్ల మార్క్‌తో షాహిన్ అఫ్రిది కొత్త రికార్డు నెలకొల్పగా.. తాజాగా పాకిస్తాన్ స్పిన్నర్ నోమన్ అలీ టెస్టులో వంద వికెట్ల మార్క్‌ను సాధించాడు. బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ 69.1 ఓవర్లో మెహదీ హసన్ మిరాజ్‌ను పెవిలియన్ చేర్చడం ద్వారా నోమన్ అలీ ఈ ఫీట్ సాధించాడు. తద్వారా టెస్టు క్రికెట్లో వంద వికెట్ల మార్క్ సాధించిన పెద్ద వయస్కుడిగా నోమన్ అలీ నిలిచాడు. 22 టెస్టుల్లో వంద వికెట్ల మార్క్ అందుకున్న నోమన్ అలీ ప్రస్తుత వయస్సు 39 ఏళ్ల 213 రోజులు. నోమన్ అలీ కంటే ముందు ఈ రికార్డు బాబీ పీల్ (39 ఏళ్ల 180 రోజులు) పేరిట ఉండేది. రే విల్లింగ్టన్ (39 ఏళ్ల 30 రోజులు), క్లారీ గ్రిమ్మెట్ (39 ఏళ్ల 22 రోజులు), సిడ్నీ బార్న్స్ (38 ఏళ్ల 310 రోజులు) కూడా పెద్ద వయసులోనే వంద వికెట్ల మార్క్ సాధించారు. అంతేకాదు పాక్ తరఫున తక్కువ టెస్టుల్లో వంద వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో చోటు దక్కించుకున్న నోమన్ అలీ ఆ జట్టు మాజీ ఆల్‌రౌండర్ అబ్దుల్ రజాక్ రికార్డును సవరించాడు. 2021లో పాకిస్తాన్ తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన నోమన్ అలీ 100 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడిన తర్వాత కానీ అతడికి తొలి మ్యాచ్ ఆడే అవకాశం లభించలేదు. 2024లో సొంతగడ్డపై ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌ను 1-0తో పాకిస్తాన్ గెలవడంలో నోమన్ అలీ పాత్ర కీలకం. 22 మ్యాచ్‌ల్లో 101 వికెట్లు సాధించిన నోమన్ అలీ 9 సార్లు ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు. ఇందులో మూడు మ్యాచ్‌ల్లో రెండు ఇన్నింగ్స్‌లు కలిపి పది వికెట్ల ఫీట్‌ను అందుకున్నాడు. మ్యాచ్ విషయానికొస్తే చివరి రోజు ఆటలో పాకిస్తాన్ విజయం కోసం కష్టపడుతోంది. బంగ్లా విధించిన 268 పరుగుల టార్గెట్‌ను ఛేదించే క్రమంలో తడబడుతున్న పాకిస్తాన్ ప్రస్తుతం 38 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 139 పరుగులతో ఆడుతోంది. సాద్ షకీల్ (10), రిజ్వాన్ (7) క్రీజులో ఉన్నారు. పాక్ విజయానికి మరో 128 పరుగులు అవసరం.చదవండి: ‘అతి తెలివి కొంపముంచింది.. అందుకే ఓడిపోయాం’ -
‘అతి తెలివి కొంపముంచింది.. అందుకే ఓడిపోయాం’
ఐపీఎల్ 2026 సీజన్లో పంజాబ్ కింగ్స్ వరుసగా నాలుగో ఓటమిని మూటగట్టుకుంది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ 3 వికెట్ల తేడాతో ఓటమిపాలయ్యింది. 200 పరుగులకు పైగా టార్గెట్ నిర్దేశించి కూడా పంజాబ్ ఓడిపోవడంపై విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా స్పిన్నర్లకు అనుకూలించే ధర్మశాల పిచ్‌పై పంజాబ్ కెప్టెన్ అయ్యర్ ఒక్క ఓవర్ కూడా స్పిన్నర్లతో వేయించకపోవడం ఆ జట్టును దెబ్బతీసిందని చెప్పొచ్చు. మరోవైపు ఢిల్లీ కూడా ఒక్క స్పిన్నర్తోనై బౌలింగ్ చేయించకపోవడం గమనార్హం. ఇక మ్యాచ్ ఓటమి అనంతరం శ్రేయస్ అయ్యర్ మాట్లాడాడు. ‘ధర్మశాల వంటి ఫ్లాట్ పిచ్‌పై 210 పరుగుల లక్ష్యం చాలా ఎక్కువ. కానీ సీమర్లకు అనుకూలిస్తున్న పిచ్‌పై మరో 20 నుంచి 30 పరుగులు చేసి ఉంటే బాగుండేదేమో. చాహల్‌తో ఒక్క ఓవర్ కూడా వేయించకపోవడం వెనుక ఒకటే కారణం. బంతి సీమర్లకు బాగా అనుకూలిస్తుందని భావించాను. కొత్త బ్యాటర్ క్రీజులోకి వచ్చినప్పుడు హార్డ్ లెంగ్త్‌లో బౌలింగ్ చేయడం ఉత్తమం. అక్కడ నిలకడగా బౌలింగ్ చేస్తే కనీసం ఒక్క బంతయినా మిస్-హిట్ అయ్యి వికెట్ వచ్చే అవకాశం ఉంటుంది. అయితే మా సీమర్లు లైన్ అండ్ లెంగ్త్‌తో బంతులు విసరడంలో విఫలమయ్యారు. మా బౌలర్లు భారీగా పరుగులు సమర్పించుకోవడంతో పాటు ఫీల్డింగ్‌లో లోపాలు మా కొంపముంచాయి. మా ప్రణాళికలన్నీ ఆచరణలో దారుణంగా విఫలమయ్యాయి.’ అని అయ్యర్ చెప్పుకొచ్చాడు. ఈ ఓటమితో పంజాబ్ పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి పడిపోగా, ఢిల్లీ క్యాపిటల్స్ విజయంతో ప్లేఆఫ్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది.చదవండి: ‘ఐసీసీ మాట వినలేదు.. మాకు ఇది జరగాల్సిందే’ -
ఢిల్లీ-పంజాబ్ మ్యాచ్ వివాదాస్పదం.. బీసీసీఐపై విమర్శలు
ఐపీఎల్ 2026లో భాగంగా నిన్న (మే 11) జరిగిన ఢిల్లీ క్యాపిటల్స్-పంజాబ్ కింగ్స్ మ్యాచ్ వివాదాస్సదమైంది. ఈ మ్యాచ్ అనంతరం జరిగిన అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమం వివాదానికి దారి తీసింది.ఈ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ యువ ఆల్‌రౌండర్ మాధవ్ తివారి అద్భుత ప్రదర్శనతో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు. మాధవ్‌కు ఈ అవార్డు అందజేసిన వ్యక్తి ఓ వివాదాస్పద కేసులో నిందితుడిగా ఉన్నాడు. అతని పేరు గౌతమ్ మల్హోత్రా. పంజాబ్‌కు చెందిన ఈ వ్యాపారవేత్త పేరు ఢిల్లీ లిక్కర్ కేసులో వినిపించింది. ఈ కేసులో అతను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణను కూడా ఎదుర్కొన్నారు.ఆయనపై ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ (PMLA) కింద కేసులు నమోదయ్యాయి. మాజీ ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాకు సంబంధించిన సీబీఐ ఎఫ్ఐఆర్లో కూడా ఆయన పేరు ప్రస్తావనకు వచ్చింది.లైవ్‌లా బిజ్ నివేదికల ప్రకారం, గౌతమ్ మల్హోత్రా రూ.2.5 కోట్ల లంచాల వ్యవహారంలో భాగమైనట్లు ఆరోపణలు వచ్చాయి. అలాగే లిక్కర్ వ్యాపారంలో అక్రమ లాభాలు పొందినట్లు కూడా దర్యాప్తు సంస్థలు పేర్కొన్నాయి. అయితే అనంతరం సరిపడా ఆధారాలు లేవన్న కారణంతో 2026 ఫిబ్రవరిలో ఢిల్లీ కోర్టు ఆయనకు ఉపశమనం కల్పించింది.అయినా సరే, ఇలాంటి వివాదాస్పద వ్యక్తిని ఐపీఎల్ అవార్డు కార్యక్రమానికి ఎంపిక చేయడం బీసీసీఐ నిర్లక్ష్యానికి నిదర్శనమని క్రికెట్ అభిమానులు మండిపడుతున్నారు. బీసీసీఐ చేసిన అతిపెద్ద తప్పిదం ఇది అంటూ సోషల్‌మీడియాలో పోస్టులు పెడుతున్నారు. మరికొందరు మాత్రం క్లియరెన్స్ లభించిన వ్యక్తిని ఆహ్వానించడం తప్పేమీ కాదని సమర్థిస్తున్నారు.మ్యాచ్ విషయానికొస్తే.. మాధవ్ తివారి అద్భుతమైన ఆటతీరుతో అందరి దృష్టిని ఆకర్షించాడు. కేవలం రెండో ఐపీఎల్ మ్యాచ్‌లోనే కీలక ఇన్నింగ్స్ ఆడి ఢిల్లీ విజయానికి ప్రధాన కారణంగా నిలిచాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ భారీ స్కోరు సాధించింది. 211 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ ఒక దశలో ఓటమి ఖాయమనే స్థితికి చేరింది.కానీ కెప్టెన్ అక్షర్ పటేల్, అనుభవజ్ఞుడు డేవిడ్ మిల్లర్ జట్టును పోటీలో నిలబెట్టారు. చివర్లో అశుతోష్ శర్మ, మాధవ్ తివారీ, ఆకిబ్ నబీ వేగంగా పరుగులు చేసి ఢిల్లీకి సంచలన విజయాన్ని అందించారు.ఈ మ్యాచ్‌లో మాధవ్ తివారీ రెండు కీలక వికెట్లు తీసుకోవడంతో పాటు కేవలం 8 బంతుల్లో 18 పరుగులు చేసి జట్టుకు విజయాన్ని అందించడంలో కీలక పాత్ర పోషించాడు. దీంతో అతనికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ప్రకటించారు. ఈ గెలుపుతో ఢిల్లీ ప్లే ఆఫ్స్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. -
‘ఐసీసీ మాట వినలేదు.. మాకు ఇది జరగాల్సిందే’
2026 టీ20 ప్రపంచకప్ నుంచి బంగ్లాదేశ్ వైదొలుగుతూ తీసుకున్న నిర్ణయం అప్పట్లో ప్రకంపనలు సృష్టించింది. తమ దేశంలో మతపరమైన ఉద్రిక్తతల కారణంగా ముస్తాఫిజుర్‌ను కేకేఆర్ తొలగించడంపై బీసీబీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆటగాళ్ల భద్రతకు సంబం ధించి కారణాలు ఎత్తిచూపుతూ ప్రపంచకప్‌లో తమ మ్యాచ్ వేదికలను భారత్ నుంచి శ్రీలంకకు మార్చాలని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) చేసిన అభ్యర్థనను అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) తోసిపుచ్చింది. అయితే ఆటగాళ్ల భద్రతపై ఆందోళన అవసరం లేదని పేర్కొన్న ఐసీసీ మ్యాచ్ వేదికలను మార్చే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. దీంతో బంగ్లాదేశ్ జట్టు ప్రపంచకప్ నుంచి వైదొలుగున్నట్లు బీసీబీ ప్రకటన విడుదల చేసింది. దీంతో బంగ్లాదేశ్ స్థానంలోకి స్కాట్లాండ్ రావడం, ఆ తర్వాత ప్రపంచకప్ సజావుగా సాగిపోయింది. తాజాగా ఈ అంశంపై బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) తాత్కాలిక అధ్యక్షుడు తమీమ్ ఇక్బాల్ స్పందించాడు. ఆనాడు ఐసీసీ మాటను వినకుండా బీసీబీ తప్పు చేసిందని, ఆ టోర్నీ ఆడకపోవడం వల్ల ఆర్థికంగా తాము చాలా నష్టపోవాల్సి వచ్చిందని పేర్కొన్నాడు. టీ20 ప్రపంచకప్ నుంచి బంగ్లాదేశ్ జట్టు వైదొలగడం వెనుక అప్పటి బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు తప్పుబట్టాడు. ‘టీ20 ప్రపంచకప్ వివాదం జరిగినప్పుడు మొదట నేనే గళం విప్పాను. నిజానికి గత బీసీబీ పరిపాలన విభాగం వ్యవహరించిన తీరు సరైనది కాదు. ఈ విషయంలో ఐసీసీ కూడా ఉదాసీనంగా వ్యవహరించింది. అప్పుడే బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుకు ఒక పరిష్కారం కనుగొనడానికి ఆస్కారం ఉండేది. కానీ బీసీబీ ఐసీసీ మాట వినకుండా తప్పు చేసింది. దీనివల్ల బంగ్లాదేశ్ జట్టు తీవ్రంగా నష్టపోయింది. ఇక 1996-97 వన్డే ప్రపంచకప్‌కు అర్హత సాధించడం కోసం కెన్యాపై ఐసీసీ ట్రోఫీని గెలిచినప్పుడు బంగ్లాదేశ్ అంతటా ప్రజలు సంబరాలు చేసుకున్నారు. ఆనాటి సంబరాలు మమ్మల్ని క్రికెట్‌వైపు ఆకర్షించాయి. ప్రతీ ఒక్కరు మిన్హాజుల్ అబెదిన్ నన్ను, ఖలీద్ మషూద్, అక్రమ్ ఖాన్ లాగా తయారవ్వాలనుకున్నారు. అప్పటి నుంచే బంగ్లా క్రికెట్ క్రమంగా ఎదుగుతూ వచ్చింది. సరైన చర్చ జరగకుండానే 2026 టీ20 ప్రపంచకప్ నుంచి వైదొలగడం బాధాకరం. ఆ జట్టులో ఉన్న కొందరు ఆటగాళ్ల వచ్చే ప్రపంచకప్‌లో ఆడకపోవచ్చు. అయితే ఇప్పుడు సమస్యలు అన్నీ సమసిపోయాయి. బీసీసీఐతో మంచి సంబంధాలు కొనసాగించడానికి ప్రయత్నిస్తున్నాం. ప్రస్తుత బీసీసీఐ అధ్యక్షుడు మిథున్ మన్హాస్‌తో నాకు మంచి అనుబంధముంది. ఇద్దరం కలిసి ఐపీఎల్లో ఒకే జట్టుకు ఆడాం. ఢాకా ప్రీమియర్ లీగ్ ఆడేందుకు ఆయన చాలాసార్లు బంగ్లాదేశ్‌కు వచ్చారు. నేను అధ్యక్ష హోదాలో ఇంకా ఆయన్ను కలవలేదు. బహుశా అది త్వరలో జరగవచ్చు. ఇక ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో భద్రత చాలా బాగుంది. త్వరలోనే బీసీసీఐతో సమావేశం జరిపి ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్ నిర్వహించేందుకు కసరత్తులు జరుగుతున్నాయి. త్వరలోనే భారత్, బంగ్లాదేశ్ మధ్య సిరీస్‌తో ఇరు దేశాల మధ్య క్రీడా బంధం బలపడుతుందని ఆశిస్తున్నా’ అంటూ చెప్పుకొచ్చాడు.చదవండి: ఆర్సీబీ, ముంబై మ్యాచ్ ఫిక్స్.. ఇదిగో సాక్ష్యం! -
వైభవ్ సరసన ప్రియాంశ్
పంజాబ్ కింగ్స్ విధ్వంసకర ఓపెనర్ ప్రియాంశ్ ఆర్య ఐపీఎల్ కెరీర్లో మరో ప్రత్యేక రికార్డు సాధించాడు. 2026 ఎడిషన్‌లో భాగంగా నిన్న (మే 11) ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పవర్‌ప్లేలోనే హాఫ్ సెంచరీ బాది రికార్డుపుటల్లో చోటు దక్కించుకున్నాడు. ఈ మ్యాచ్‌లో ప్రియాంశ్ తొలి బంతి నుంచే దూకుడు ప్రదర్శించాడు. మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో భారీ సిక్సర్ బాది ఖాతా ప్రారంభించాడు. ఆ తర్వాత ఏ బౌలర్నీ వదలకుండా కేవలం 24 బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేశాడు.ఈ ఇన్నింగ్స్‌తో ప్రియాంశ్ పవర్‌ప్లేలో అత్యధిక 50+ స్కోర్లు నమోదు చేసిన భారత ఆటగాళ్ల జాబితాలో రాజస్థాన్ రాయల్స్ చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ సరసన చేరాడు. ఐపీఎల్ పవర్‌ప్లేల్లో అత్యధిక 50+ స్కోర్లు (భారత ఆటగాళ్లు):* వైభవ్ సూర్యవంశీ – 4* ప్రియాంశ్ ఆర్య – 3అలాగే ఐపీఎల్లో తొలి బంతికే (ఇన్నింగ్స్) అత్యధిక సిక్సర్లు కొట్టిన భారత ఆటగాళ్ల జాబితాలో రెండో స్థానంలో నిలిచాడు.ఐపీఎల్ ఇన్నింగ్స్ తొలి బంతికి అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాళ్లు:* యశస్వి జైస్వాల్ – 4* ప్రియాంశ్ ఆర్య – 3విరాట్ కోహ్లి, ఫిల్ సాల్ట్, సంజూ శాంసన్ తదితరులు తలో సారి ఇన్నింగ్స్ తొలి బంతికే సిక్సర్లు కొట్టారు.ఇదిలా ఉంటే, ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో ప్రియాంశ్ ఆర్య రికార్డు ఇన్నింగ్స్‌తో చెలరేగినా పంజాబ్ కింగ్స్‌కు ఓటమి తప్పలేదు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్.. ప్రియాంశ్‌తో పాటు శ్రేయస్ అయ్యర్ (59 నాటౌట్) కూడా సత్తా చాటడంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 210 పరుగులు చేసింది.భారీ లక్ష్య ఛేదనలో ఢిల్లీ ఆదిలో తడబడినా, ఆతర్వాత అనూహ్యంగా పుంజుకుంది. అక్షర్ పటేల్ (56), డేవిడ్ మిల్లర్ (51) అద్భుత అర్ద సెంచరీలతో ఢిల్లీని గెలిపించారు. ఈ గెలుపుతో ఢిల్లీ ప్లే ఆఫ్స్ అవకాశాలను సజీవంగా ఉంచుకోగా.. పంజాబ్ ప్లే ఆఫ్స్ అవకాశాలను ఇరకాటంలో పడేసుకుంది. -
నంబర్ వన్‌గా టీమిండియా
ఐసీసీ తాజాగా విడుదల చేసిన వన్డే ర్యాంకింగ్స్‌లో భారత క్రికెట్ జట్టు అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. 118 రేటింగ్ పాయింట్లతో నంబర్‌వన్ జట్టుగా కొనసాగుతుంది. న్యూజిలాండ్, ఆస్ట్రేలియా వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి.గతేడాది ఛాంపియన్స్ ట్రోఫీ విజయంతో పాటు ద్వైపాక్షిక సిరీస్‌ల విజయాలు భారత జట్టు టాప్ ప్లేస్ నిలబెట్టడంలో కీలక పాత్ర పోషించాయి. అయితే గత ర్యాంకింగ్‌తో పోలిస్తే భారత్ ఒక రేటింగ్ పాయింట్ కోల్పోయింది. అయినా మిగతా జట్లపై మాత్రం స్పష్టమైన ఆధిక్యాన్ని కొనసాగిస్తోంది.తాజా ర్యాంకింగ్స్ ప్రకారం న్యూజిలాండ్ 113 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. కివీస్ జట్టు గత కొంతకాలంగా ఐసీసీ టోర్నీల్లో స్థిరమైన ప్రదర్శన కనబరుస్తూ వస్తుంది. ఇక ఆస్ట్రేలియా జట్టు 109 పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. ఆస్ట్రేలియా ఇటీవల జరిగిన సిరీస్‌లలో మంచి ఫలితాలు సాధించినప్పటికీ భారత్‌ను అధిగమించలేకపోయింది.ఈసారి ర్యాంకింగ్స్‌లో పెద్ద మార్పుగా సౌతాఫ్రికా జట్టు టాప్-4లోకి ఎంట్రీ ఇచ్చింది. 102 పాయింట్లతో దక్షిణాఫ్రికా నాలుగో స్థానానికి చేరగా, పాకిస్తాన్ 98 పాయింట్లతో ఐదో స్థానానికి పడిపోయింది. ప్రోటీస్ జట్టు ఇటీవల వన్డే ఫార్మాట్లో మెరుగైన ఫలితాలు నమోదు చేయడంతో నాలుగో స్థానానికి ఎగబాకింది.ఆ తర్వాతి స్థానాల్లో శ్రీలంక (96), ఆఫ్ఘనిస్తాన్ (93), ఇంగ్లండ్ (89), బంగ్లాదేశ్ (84), వెస్టిండీస్ (74) ఉన్నాయి.ఈ ర్యాంకింగ్స్‌కు మరో ప్రత్యేక ప్రాధాన్యత కూడా ఉంది. వరల్డ్‌కప్ 2027కు నేరుగా అర్హత సాధించే జట్లను నిర్ణయించడంలో ఇవి కీలకంగా మారనున్నాయి. 2027 మార్చి 31 నాటికి టాప్-8లో ఉన్న జట్లు నేరుగా ప్రపంచకప్‌కు అర్హత సాధిస్తాయి. ఆతిథ్య దేశాలైన సౌతాఫ్రికా, జింబాబ్వే ఇప్పటికే ఆటోమేటిక్ అర్హత పొందాయి.దీంతో ప్రస్తుతం టాప్-8లో కొనసాగుతున్న జట్ల మధ్య పోటీ మరింత ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా బంగ్లాదేశ్, వెస్టిండీస్, ఆఫ్ఘనిస్తాన్ వంటి జట్లు తమ స్థానాన్ని కాపాడుకునేందుకు కీలక సిరీస్‌లపై దృష్టి పెట్టనున్నాయి. భారత్ మాత్రం ప్రపంచ నంబర్‌వన్ జట్టుగా మరోసారి తన ఆధిపత్యాన్ని చాటింది. -
రిటైర్మెంట్ వెనక్కు తీసుకున్న సౌతాఫ్రికా దిగ్గజం
సౌతాఫ్రికా దిగ్గజ మహిళా క్రికెటర్ షబ్నిమ్ ఇస్మాయిల్ సంచలన నిర్ణయం తీసుకుంది. రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కు తీసుకొని అంతర్జాతీయ క్రికెట్లోకి పునరాగమనం చేయనుంది. వచ్చే నెల ప్రారంభమయ్యే ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ కోసం ఆమెను జట్టులోకి తీసుకునే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి.37 ఏళ్ల ఈ వెటరన్ ఫాస్ట్ బౌలర్ 2023లో అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించింది. అదే ఏడాది స్వదేశంలో జరిగిన టీ20 ప్రపంచకప్‌లో సౌతాఫ్రికా ఫైనల్‌కు చేరడంలో కీలక పాత్ర పోషించింది. అయితే ఆమె రిటైర్మెంట్ తర్వాత సౌతాఫ్రికా బౌలింగ్ విభాగంలో లోటు స్పష్టంగా కనిపించింది.క్రికెట్ సౌతాఫ్రికా డైరెక్టర్ ఈనాక్, హెడ్ కోచ్ మండ్ల మషింబితో జరిగిన చర్చల అనంతరం షబ్నిమ్ తిరిగి ఆడేందుకు అంగీకరించినట్లు తెలుస్తోంది. 2007లో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన షబ్నిమ్.. ఓ టెస్ట్, 127 వన్డేలు, 113 టీ20ల్లో 317 వికెట్లు తీసింది.షబ్నిమ్ అంతర్జాతీయ రిటైర్మెంట్ తర్వాత కూడా ఫ్రాంచైజీ క్రికెట్లో అదరగొడుతోంది. ఆమె భారత్‌లో జరిగే వుమెన్స్ ప్రీమియర్ లీగ్, హండ్రెడ్ లీగ్, బిగ్‌బాష్ లీగ్ తదితర టోర్నీల్లో అద్భుత ప్రదర్శనలు చేసింది. మహిళల క్రికెట్లో అత్యంత వేగవంతమైన బంతి వేసిన రికార్డు కూడా షబ్నిమ్ పేరిటే ఉంది. కాగా, సౌతాఫ్రికా మాజీ కెప్టెన్ డేన్ వాన్ నికెర్క్ కూడా గతేడాది రిటైర్మెంట్ వెనక్కి తీసుకుని తిరిగి జట్టులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే, టీ20 వరల్డ్‌కప్‌లో సౌతాఫ్రికా తమ తొలి మ్యాచ్‌ను జూన్ 13న ఆస్ట్రేలియాతో ఆడనుంది. ప్రపంచకప్ టైటిల్‌పై కన్నేసిన ప్రోటీస్ జట్టుకు షబ్నిమ్ ఇస్మాయిల్ రీఎంట్రీ భారీ ఊతమివ్వనుంది. -
చరిత్ర సృష్టించిన షాహీన్ అఫ్రిది
పాకిస్తాన్ స్టార్ బౌలర్ షాహీన్ అఫ్రిది చరిత్ర సృష్టించాడు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో 100 వికెట్లు తీసిన తొలి పాకిస్తాన్ బౌలర్‌గా రికార్డు నెలకొల్పాడు. ప్రస్తుతం బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్‌లో ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌లో షాహీన్ ఇప్పటికే 4 వికెట్లు పడగొట్టాడు. ఈ మ్యాచ్ ఇంకా జరుగుతుంది. ప్రస్తుతం డబ్ల్యూటీసీలో షాహీన్ వికెట్ల సంఖ్య 103కు చేరింది.పాకిస్తాన్ తరఫున WTCలో అత్యధిక వికెట్లు:* షాహీన్ అఫ్రిది – 103* నౌమన్ అలీ – 89* సాజిద్ ఖాన్ – 63* నసీం షా – 60ఇదే మ్యాచ్‌లో షాహీన్ మరో ఘనత కూడా సాధించాడు. అంతర్జాతీయ క్రికెట్లో 400 వికెట్ల చారిత్రక మైలురాయిని తాకాడు. మొమినుల్ హక్ వికెట్ షాహీన్‌కు 400వ వికెట్. కేవలం 26 ఏళ్ల వయసులోనే 211 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో షాహీన్ ఈ ఘనత సాధించడం విశేషం. ప్రస్తుతం షాహీన్ ఖాతాలో వన్డేల్లో 139, టీ20ల్లో 136, టెస్ట్‌ల్లో 125 వికెట్లు ఉన్నాయి.తొమ్మిదో బౌలర్షాహీన్ 400 వికెట్ల క్లబ్లో చేరిన తొమ్మిదో పాకిస్తాన్ బౌలర్‌గా నిలిచాడు. ఈ జాబితాలో వసీం అక్రమ్ 916 వికెట్లతో అగ్రస్థానంలో ఉండగా, వకార్ యూనిస్ 789 వికెట్లు, ఇమ్రాన్ ఖాన్ 544 వికెట్లతో తర్వాతి స్థానాల్లో ఉన్నారు.పాకిస్తాన్ తరఫున అత్యధిక అంతర్జాతీయ వికెట్లు:* వసీం అక్రమ్ – 916* వకార్ యూనిస్ – 789* ఇమ్రాన్ ఖాన్ – 544* షాహిద్ అఫ్రిది – 538* సక్లెయిన్ ముస్తాక్ – 496* సయీద్ అజ్మల్ – 447* షోయబ్ అక్తర్ – 438* ఉమర్ గుల్ – 427* షాహీన్ అఫ్రిది – 400*కాగా, బంగ్లాదేశ్‌తో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్‌లో పాక్ వెనుకపడింది. తొలి ఇన్నింగ్స్‌లో మెహిది హసన్ మిరాజ్ ఐదు వికెట్లు తీసి పాక్‌ను కట్టడి చేయగా, రెండో ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్ 152/3 స్కోరుతో 179 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ చేసిన బంగ్లా కెప్టెన్ షాంటో, రెండో ఇన్నింగ్స్‌లో 58 పరుగులతో క్రీజ్‌లో ఉన్నాడు. ప్రస్తుతం చివరి రోజు ఆట కొనసాగుతుంది. -
చరిత్రపుటల్లోకెక్కిన ఢిల్లీ-పంజాబ్ మ్యాచ్
ఐపీఎల్ 2026లో భాగంగా నిన్న (మే 11) జరిగిన ఢిల్లీ క్యాపిటల్స్-పంజాబ్ కింగ్స్ మ్యాచ్ చరిత్రపుటల్లోకెక్కింది. ఈ మ్యాచ్‌లో అన్నీ ఓవర్లను పేసర్లే వేశారు. ఐపీఎల్ చరిత్రలో ఇలా జరగడం ఇది 13వ సారి మాత్రమే. చివరిగా ఇలాంటి సందర్భం 2016 ఎడిషన్‌లో వచ్చింది. ఆ ఎడిషన్‌లో ఎస్ఆర్హెచ్, ఆర్సీబీ మధ్య జరిగిన ఓ మ్యాచ్‌లో అన్నీ ఓవర్లు పేసర్లే వేశారు. ఒక్క ఓవర్‌ను కూడా స్పిన్నర్ వేయలేదు.నిన్నటి ఢిల్లీ-పంజాబ్ మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ కలిపి 39 ఓవర్లను పేస్ బౌలర్లే వేశారు. ఈ రికార్డుకు సంబంధించి 2008 ఎడిషన్‌లో ఆర్సీబీ-సీఎస్కే మ్యాచ్ (39.4 ఓవర్లు) తొలి స్థానంలో ఉంది. తాజా మ్యాచ్‌లో పంజాబ్ నిర్దేశించిన 211 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీ 19 ఓవర్లలోనే ఛేదించింది. లేదంటే ఆర్సీబీ-సీఎస్కే మ్యాచ్ రికార్డు కూడా బద్దలయ్యేది.కాగా, నిన్నటి మ్యాచ్‌లో ఢిల్లీ పంజాబ్‌పై గెలిచి ప్లే ఆఫ్స్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. మరో వైపు ఈ ఓటమితో పంజాబ్ ప్లే ఆఫ్స్ అవకాశాలను ఇరకాటంలో పడేసుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 210 పరుగులు చేయగా.. ఢిల్లీ 19 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.అక్షర్, చహల్‌కు పని లేదు..!నిన్నటి మ్యాచ్‌లో పిచ్ పేసర్లకు అనుకూలంగా మారడంతో ఇరు జట్ల కెప్టెన్లు స్పిన్నర్లను పక్కన పెట్టారు. స్వయంగా స్పెషలిస్ట్ స్పిన్నర్ అయిన ఢిల్లీ కెప్టెన్ అక్షర్ పటేల్ బంతి తీసుకోలేదు. పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ చహల్‌ను జట్టులోకి తీసుకున్నా, అతనికి బంతినివ్వలేదు. అక్షర్ బౌలింగ్ వేయకపోయినా బ్యాటింగ్‌లో మెరిసి తన జట్టును గెలిపించుకున్నాడు. -
గెలిచి నిలిచింది.. అయినా అంత ఈజీ ఏమీ కాదు..!
ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో రెండు జట్ల పోరాటం అధికారికంగా ముగిసింది. లక్నో సూపర్ జెయింట్స్, ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్స్ రేసు నుంచి అధికారికంగా వైదొలిగాయి. నిన్నటితో ఢిల్లీ క్యాపిటల్స్ భవిష్యత్తు కూడా తేలిపోయేదే. అయితే ఆ జట్టు పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో అద్భుతమైన పోరాటాన్ని ప్రదర్శించి, ప్లే ఆఫ్స్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది.గెలిచి నిలిచినా ఢిల్లీ ప్లే ఆఫ్స్‌కు చేరడం అంత ఈజీ ఏమీ కాదు. మున్ముందు ఆ జట్టు మరిన్ని కఠినమైన సవాళ్లను ఎదుర్కోవాలి. ప్రస్తుతం ఢిల్లీ 12 మ్యాచ్‌ల్లో 5 విజయాలతో పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో ఉంది. ప్లే ఆఫ్స్ బెర్త్‌పై ఆశలు కలిగి ఉండాలంటే, ఆ జట్టు తదుపరి ఆడాల్సిన రెండు మ్యాచ్‌ల్లో భారీ విజయాలు సాధించాలి. అప్పుడు కూడా ఫైనల్-4కు చేరుతుందన్న గ్యారెంటీ లేదు.ఎందుకుంటే ఢిల్లీ కంటే ముందు ఆరు జట్లు ప్లే ఆఫ్స్ బెర్త్‌ల కోసం హోరాహోరీగా పోరాడుతున్నాయి. నిన్నటి ఓటమితో అప్పటిదాకా ప్లే ఆఫ్స్ బెర్త్‌పై ధీమాగా ఉండిన పంజాబ్ కూడా పోటీ పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. తొలి 7 మ్యాచ్‌ల్లో 6 విజయాలు సాధించిన పంజాబ్.. చివరిగా ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో పరాజయాలు ఎదుర్కొని ప్లే ఆఫ్స్ అవకాశాలను ఇరకాటంలో పడేసుకుంది. ప్రస్తుతం ఆ జట్టు 11 మ్యాచ్‌ల్లో 6 విజయాలతో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉంది. ప్రస్తుతం ఆర్సీబీ (14 పాయింట్లు), ఎస్ఆర్హెచ్ (14), గుజరాత్ (14).. పంజాబ్ కంటే (13) మెరుగైన స్థానాల్లో ఉన్నాయి.పంజాబ్ లాగే సీజన్ ప్రారంభంలో వరుస విజయాలు సాధించిన రాజస్థాన్ రాయల్స్ కూడా ప్లే ఆఫ్స్ రేసులో బలంగా ఉంది. ఆ జట్టు ఇప్పటివరకు 11 మ్యాచ్‌లు ఆడి 6 విజయాలతో ఆరో స్థానంలో ఉంది. సీజన్‌ను పరాజయాలతో ప్రారంభించి అనూహ్యంగా విజయాల బాట పట్టిన సీఎస్కే కూడా ప్లే ఆఫ్స్ రేసులో బలంగా నిలబడింది. ఇప్పటివరకు ఆ జట్టు కూడా 11 మ్యాచ్‌లు ఆడి 6 విజయాలతో (12 పాయింట్లు) ఐదో స్థానంలో ఉంది.ఆర్సీబీ (14 పాయింట్లు), ఎస్ఆర్హెచ్ (14), గుజరాత్ (14) పంజాబ్ (13), సీఎస్కే (12), రాజస్థాన్ (12)ను కాదని కేవలం 10 పాయింట్లు ఉన్న ఢిల్లీ ప్లే ఆఫ్స్‌కు చేరడం దాదాపుగా అసాధ్యమే. పైగా ఆ జట్టుకు మరో రెండు మ్యాచ్‌లు మాత్రమే ఆడే అవకాశం ఉంది. టాప్-6 జట్లకు తలో మూడు మ్యాచ్‌ల అవకాశం ఉంది. ప్రస్తుతానికి ఢిల్లీకి ప్లే ఆఫ్స్ అవకాశాలు లేనప్పటికీ.. పూర్తిగా లేకపోలేదని మాత్రం చెప్పలేము. ఎందుకంటే మన్ముందు ఏమైనా జరగవచ్చు. ఏ జట్లు ప్లే ఆఫ్స్‌కు చేరతాయని ఇప్పుడు అంచనా వేయడం కష్టం. -
ఫ్రాంచైజీని కొనేసిన రాహుల్ ద్రవిడ్
భారత దిగ్గజ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్ మరో కొత్త ఇన్నింగ్స్ మొదలుపెట్టాడు. ఇప్పటికే ఆటగాడిగా, కోచ్‌గా సక్సెస్ సాధించిన అతడు.. తాజాగా ఓ క్రికెట్ ఫ్రాంచైజీ యజమానిగా మారాడు. యూరోపియన్ టీ20 ప్రీమియర్ లీగ్ (ETPL)లో డబ్లిన్ ఫ్రాంచైజీ యాజమాన్య హక్కులను చేజిక్కించుకున్నాడు. ఈ విషయంపై నిన్న అధికారిక ప్రకటన వెలువడింది. ఈ జట్టుకు "Dublin Guardians" అని పేరు పెట్టారు.యూరప్‌లో తొలిసారి క్రాస్-బోర్డర్ ఫ్రాంచైజీ మోడల్‌తో ప్రారంభమవుతున్న ఈ లీగ్‌కు బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ ప్రమోటర్‌గా వ్యవహరిస్తున్నారు. తాజాగా డబ్లిన్‌లో జరిగిన కార్యక్రమంలో ద్రవిడ్, అభిషేక్ బచ్చన్ ఇద్దరూ పాల్గొన్నారు.ఈ టోర్నీని క్రికెట్ ఐర్లాండ్, క్రికెట్ స్కాట్లాండ్ మరియు రాయల్ డచ్ క్రికెట్ అసోసియేషన్ భాగస్వామ్యంతో నిర్వహిస్తున్నారు. డబ్లిన్, బెల్ఫాస్ట్, ఎడిన్బర్గ్, గ్లాస్గో, ఆమ్స్టర్డామ్, రోటర్‌డామ్ నగరాలకు చెందిన ఆరు ఫ్రాంచైజీ ఈ లీగ్‌లో పోటీ పడనున్నాయి.డబ్లిన్ యజమాన్య హక్కులను చేజిక్కించుకున్న సందర్భంగా ద్రవిడ్ మాట్లాడుతూ.. యూరప్‌లో క్రికెట్ అభివృద్ధి, యువ ఆటగాళ్లకు అవకాశాలు కల్పించడం అనే పెద్ద విజన్ తనను ఆకర్షించిందని తెలిపాడు.డబ్లిన్‌లో ఇప్పటికే మంచి క్రికెట్ కమ్యూనిటీ ఉంది. యువ ప్రతిభను ప్రోత్సహించడం నాకు ఎప్పుడూ ముఖ్యమే. ETPL ఆ దిశగా కీలక పాత్ర పోషించగలదని ఆశాభావం వ్యక్తం చేశాడు.కాగా, ETPLలో పలువురు అంతర్జాతీయ స్టార్ ఆటగాళ్లు పాల్గొనే అవకాశముంది. అందులో మిచెల్ మార్ష్, టిమ్ డేవిడ్, మిచెల్ సాంట్నర్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, ఫాఫ్ డుప్లెసిస్, హెన్రిచ్ క్లాసెన్ వంటి ప్రముఖులు ఉన్నారు. ఈ ఏడాది ఆగస్టు-సెప్టెంబర్ మధ్య ఈ టోర్నీ నిర్వహించనున్నారు. ఈ టోర్నీలో రాహుల్ ద్రవిడ్‌తో పాటు మరికొంతమంది మాజీ క్రికెటర్లు కూడా యాజమాన్య హక్కులను పొందారు. మ్యాక్స్‌వెల్ బెల్ఫాస్ట్, కైల్ మిల్స్, నాథన్ మెక్కల్లమ్ ఎడిన్బర్గ్, క్రిస్ గేల్ గ్లాస్గో, స్టీవ్ వా అమ్‌స్టర్‌డామ్, జాంటీ రోడ్స్, డుప్లెసిస్ రోటర్‌డామ్ ఫ్రాంచైజీలకు యాజమానులుగా ఉన్నారు.ETPL ఫ్రాంచైజీల యజమానులు:* డబ్లిన్ – రాహుల్ ద్రావిడ్* బెల్ఫాస్ట్ – గ్లెన్ మ్యాక్స్‌వెల్, రోహన్ లండ్* ఎడిన్బర్గ్ – కైల్ మిల్స్, నాథన్ మెక్కల్లమ్, రాచెల్ వైజ్మన్* గ్లాస్గో – విపుల్ అగర్వాల్, క్రిస్ గేల్* ఆమ్స్టర్డామ్ – స్టీవ్ వా తదితరులు* రోటర్‌డామ్ – జాంటీ రోడ్స్, ఫాఫ్ డుప్లెసిస్ తదితరులు. -
ఆటగాళ్ల ఎంపికపై ‘సెలక్షన్ షీట్’
సాక్షి, హైదరాబాద్: దేశవాళీ క్రికెట్లో పాల్గొనే హైదరాబాద్ జట్ల ఎంపికలో మరింత పారదర్శకత పాటిస్తామని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) ఆపరేషన్స్ హెడ్, మాజీ క్రికెటర్ అంబటి రాయుడు వెల్లడించాడు. ప్రతిభ గల ఆటగాళ్లను జట్టులోకి తీసుకునే ప్రక్రియలో భాగంగా దేశంలోనే తొలిసారిగా ‘సెలక్షన్ షీట్’ను తీసుకొస్తున్నామని అతను చెప్పాడు. దీని ప్రకారం ఇకపై ఎవరిని జట్టులోకి ఎంపిక చేసినా అందుకు తగిన కారణం, వారి ప్రదర్శన వివరాలతో పాటు ఎవరినైనా తప్పిస్తే అందుకు గల కారణాలను కూడా రాతపూర్వకంగా నమోదు చేస్తారు. కాబట్టి క్రికెటర్ల ఎంపిక ఎవరికీ అనుమానాలు లేని రీతిలో సాగుతుందని రాయుడు స్పష్టం చేశాడు. సోమవారం జరిగిన మీడియా సమావేశంలో హెచ్‌సీఏ కార్యదర్శి ఎం.జీవన్ రెడ్డితో కలిసి రాయుడు ఈ వివరాలు వెల్లడించాడు. త్వరలోనే ఓపెన్ సెలక్షన్స్ కూడా నిర్వహిస్తామని... హైదరాబాద్ జట్టుకు ప్రాతినిధ్యం వహించే విషయంలో కూడా మూడు అంచెల్లో ఎంపిక జరుగుతుందని అతను వివరించాడు. ఈ సందర్భంగా హైదరాబాద్ సీనియర్, జూనియర్ సెలక్షన్ కమిటీలను రాయుడు ప్రకటించాడు. సీనియర్ సెలక్షన్ కమిటీకి అక్షత్ రెడ్డి చైర్మన్‌గా వ్యవహరించనుండగా... తిరుమలశెట్టి సుమన్, మెహదీ హసన్, టి.పవన్ కుమార్, ఇంద్రశేఖర్ రెడ్డి సభ్యులుగా ఉన్నారు. పి.రమేశ్ కుమార్, షోయబ్, సర్వేశ్ కుమార్, టిమోతీ కుమార్ సభ్యులుగా ఉన్న జూనియర్ సెలక్షన్ కమిటీకి ఆకాశ్ భండారీని చైర్మన్‌గా ఎంపిక చేశారు. -
మిల్లర్, అక్షర్ మెరుపులు.. ఢిల్లీ క్యాపిటల్స్ విజయం
ఐపీఎల్ 2026లో కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జూలు విదిల్చింది. సోమవారం ధర్మశాల వేదికగా జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌పై ఢిల్లీ క్యాపిటల్స్ 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 211 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీ క్యాపిటల్స్ 19 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి ఛేదించింది.కెప్టెన్ అక్షర్ పటేల్ (56), డేవిడ్ మిల్లర్ (51) అర్థసెంచరీలతో ఢిల్లీ విజయంలో కీలకపాత్ర పోషించారు. ఆఖర్లో అశుతోశ్ శర్మ (24) , మాధవ్ తివారి (18 నాటౌట్), అకిబ్ నబీ (10 నాటౌట్) హిట్టింగ్తో ఢిల్లీకి విజయాన్ని అందించారు. పంజాబ్ బౌలర్లలో అర్ష్‌దీప్, యష్ ఠాకూర్ చెరో 2 వికెట్లు తీశారు. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 210 పరుగులు చేసింది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (36 బంతుల్లో 59 నాటౌట్) అజేయ అర్థసెంచరీ సాధించగా.. ఓపెనర్ ప్రియాన్ష్ ఆర్య (33 బంతుల్లో 56) మెరుపు ఇన్నింగ్స్‌తో అలరించాడు. కూపర్ కనోలి (38) కీలక ఇన్నింగ్స్ ఆడగా.. చివర్లో సూర్యాంశ్ షెగ్డె (8 బంతుల్లో 22 నాటౌట్) ఆకట్టుకున్నాడు. ఢిల్లీ బౌలర్లలో మిచెల్ స్టార్క్, మాధవ్ తివారి చెరో 2 వికెట్లు తీయగా, ముకేశ్ కుమార్ ఒక వికెట్ పడగొట్టాడు. ఢిల్లీ క్యాపిటల్స్ ఈ సీజన్లో ఇది ఐదో విజయం కాగా, పంజాబ్‌కు ఇది వరుసగా నాలుగో ఓటమి కావడం గమనార్హం.Ice in their veins and pure fire in their bats! 🧊🔥Madhav Tiwari & Ashutosh Sharma with match-winning clutch cameos to seal the deal for #DC 🫡Updates ▶️ https://t.co/wHhflKIvCR#TATAIPL | #KhelBindaas | #PBKSvDC | @DelhiCapitals pic.twitter.com/ZqwSxTCrhj— IndianPremierLeague (@IPL) May 11, 2026 -
కనోలి చర్యకు చాహల్ పిచ్చి చూపులు!
ఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ 210 పరుగుల భారీ స్కోరు చేసింది. మొదట ప్రియాన్ష్ ఆర్య మెరుపు హాఫ్ సెంచరీతో అదరగొట్టగా, చివర్లో శ్రేయస్, కన్నోలి, సూర్యాంశ్లు ఫినిషింగ్ టచ్ ఇచ్చారు. పంజాబ్ ఇన్నింగ్స్ సమయంలో కూపర్ కన్నోలి కొట్టిన ఒక భారీ సిక్స్ స్టేడియం అవతల పడింది. ఈ నేపథ్యంలో పంజాబ్ బౌలర్ యజ్వేంద్ర చాహల్ చర్య సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. విషయంలోకి వెళితే.. ఇన్నింగ్స్ 14.3 ఓవర్లో మిచెల్ స్టార్క్ వేసిన ఆఫ్ స్టంప్ బంతిని కనోలి ఫ్రంట్ ఫుట్ వచ్చి భారీ సిక్సర్ సంధించాడు. పవర్ స్ట్రోక్ ఉపయోగించడంతో బంతి స్టేడియం అవతల పడింది. ఇదే సమయంలో పంజాబ్ కింగ్స్ డగౌట్లో ఉన్న చాహల్.. కనోలి కొట్టిన భారీ సిక్స్‌ను కన్నార్పకుండా చూస్తూ.. ‘పోయింది.. బంతి పోయింది’ అన్న తరహాలో చేతితో సైగలు చేయడం కెమెరా కంటికి చిక్కింది. చాహల్ చర్య అభిమానులను ఎంతగానో ఆకర్షించింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచింది. చాహల్ వీడియోపై మీరు ఒక లుక్కేయండి. మ్యాచ్ విషయానికొస్తే పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 210 పరుగులు చేసింది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (36 బంతుల్లో 59 నాటౌట్) అజేయ అర్థసెంచరీ సాధించగా.. ఓపెనర్ ప్రియాన్ష్ ఆర్య (33 బంతుల్లో 56) మెరుపు ఇన్నింగ్స్‌తో అలరించాడు. కూపర్ కనోలి (38) కీలక ఇన్నింగ్స్ ఆడగా.. చివర్లో సూర్యాంశ్ షెగ్డె (8 బంతుల్లో 22 నాటౌట్) ఆకట్టుకున్నాడు. ఢిల్లీ బౌలర్లలో మిచెల్ స్టార్క్, మాధవ్ తివారి చెరో 2 వికెట్లు తీయగా, ముకేశ్ కుమార్ ఒక వికెట్ పడగొట్టాడు.చదవండి: ఆర్సీబీ, ముంబై మ్యాచ్ ఫిక్స్.. ఇదిగో సాక్ష్యం! -
తెలంగాణ క్రికెట్లో కొత్త శకం.. ఏఐతో ఆటగాళ్ల ఎంపిక!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ యువ క్రికెటర్లకు అంతర్జాతీయ స్థాయిలో రాణించే అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా తెలంగాణ ప్రీమియర్ లీగ్ (టీపీఎల్) నిర్వహిస్తున్నట్లు మాజీ క్రికెటర్ అంబటి రాయుడు తెలిపారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) సెక్రటరీ మన్నె జీవన్ రెడ్డి, ఆపరేషన్స్ హెడ్ అంబటి రాయుడు, సీఈఓ ఇంతియాజ్ అలీ తదితరులు పాల్గొన్నారు. సోమవారం ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో నిర్వహించిన ప్రెస్మీట్లో టీపీఎల్ వివరాలను వెల్లడించారు. హెచ్‌సీఏ సెక్రటరీ మన్నె జీవన్‌రెడ్డి మాట్లాడుతూ.. యువ ఆటగాళ్లకు సరైన వేదిక కల్పించడం ద్వారా భవిష్యత్తులో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఎదిగే అవకాశాలు పెరుగుతాయని పేర్కొన్నారు. ఎలాంటి రాజకీయ ప్రభావం లేకుండా పూర్తిగా పారదర్శక విధానంలో పది మంది మాజీ క్రికెటర్లతో సెలెక్షన్ కమిటీని ఏర్పాటు చేసినట్లు హెచ్‌సీఏ సెక్రటరీ మన్నె జీవన్ రెడ్డి వెల్లడించారు. వచ్చే నెలలో నిర్వహించనున్న తెలంగాణ ప్రీమియర్ లీగ్ కోసం రాష్ట్రవ్యాప్తంగా సుమారు మూడు వేల మంది ప్రతిభావంతులైన క్రికెటర్లను గుర్తించి ఎంపిక చేయడమే లక్ష్యంగా కృషి చేస్తున్నామని తెలిపారు. ఎంపిక ప్రక్రియలో ఎటువంటి అవకతవకలకు తావులేకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఆపరేషన్స్ హెడ్ అంబటి రాయుడు మాట్లాడుతూ.. ఆటగాళ్ల ఎంపికలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) విధానాన్ని ప్రవేశపెట్టామని తెలిపారు. దీని ద్వారా నిజమైన ప్రతిభ కలిగిన ఆటగాళ్లను గుర్తించే అవకాశం ఉంటుందని చెప్పారు. ప్రతి ఎంపిక ప్రక్రియను వీడియో రికార్డింగ్ ద్వారా పర్యవేక్షిస్తామని, సెలెక్షన్‌కు సంబంధించిన ఫిజికల్ రికార్డులను కూడా సిద్ధం చేస్తున్నామని వెల్లడించారు. యువ ఆటగాళ్లకు అవకాశాలు కల్పించడంలో ఐపీఎల్ కీలక పాత్ర పోషించిందని పేర్కొన్న అంబటి రాయుడు, అదే తరహాలో హెచ్.సీఏ ఆధ్వర్యంలో కూడా పారదర్శకంగా లీగ్ లు నిర్వహిస్తామని తెలిపారు. ఓపెన్ ట్రయల్స్, లీగ్ మ్యాచ్ ల నిర్వహణను మరింత విస్తృతంగా చేపడుతున్నామని, ప్రతి నిర్ణయం నిష్పక్షపాతంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. రాబోయే లీగ్ లకు సంబంధించిన తుది నిర్ణయాలను సెలెక్షన్ కమిటీ తీసుకుంటుందని, ఆటగాళ్లు, అంపైర్ల నియామక ప్రక్రియ కూడా ఇప్పటికే ప్రారంభించామని నిర్వాహకులు వెల్లడించారు. -
ఆర్సీబీ, ముంబై మ్యాచ్ ఫిక్స్.. ఇదిగో సాక్ష్యం!
ఐపీఎల్ 2026 సీజన్ చప్పగా సాగుతున్న వేళ ముంబై ఇండియన్స్, ఆర్సీబీ మధ్య జరిగిన మ్యాచ్ అభిమానులకు ఫుల్కిక్ ఇచ్చింది. ఆఖరి బంతి వరకు నువ్వానేనా అన్నట్లుగా సాగిన పోరు అభిమానులను మునివేళ్లపై నిలబెట్టింది. ఛేదించాల్సిన లక్ష్యం తక్కువే అయినప్పటికీ ఆద్యంతం ఆర్సీబీ, ముంబై మధ్య విజయం చేతులు మారుతూ వచ్చింది. చివరకు ముంబై తప్పిదాలు, పేలవ ఫీల్డింగ్‌తో ఓటమిని కొనితెచ్చుకుంది. అయితే తాజాగా సోషల్ మీడియా ఒక వార్త చక్కర్లు కొడుతుంది. అదేంటంటే ముంబై ఇండియన్స్, ఆర్సీబీ మధ్య మ్యాచ్ ఫిక్స్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. విషయంలోకి వెళితే.. ఆర్సీబీ విజయానికి ఆఖరి ఓవర్లో 15 పరుగుల కావాలి. ఇన్నింగ్స్ చివరి ఓవర్ వేసేందుకు రాజ్ బవా వచ్చాడు. ఓవర్లో మూడు వైడ్లు, ఒక నోబ్ వేశాడు. ఇది చాలదన్నట్లు భువనేశ్వర్ చేత సిక్సర్ కొట్టించాడు. ఇక ఆఖరి బంతికి రెండు పరుగుల అవసరమైన దశలో ఆర్సీబీ బ్యాటర్ రసిక్ సలామ్ స్ట్రెయిట్ డ్రైవ్ ఆడాడు. అయితే రాజ్ బవా తన వైపు వచ్చిన బంతిని కనీసం ఆపే ప్రయత్నం చేయకుండా అలాగే నిలబడి చూస్తూ ఉండిపోయాడు. దీనికి సంబంధించిన వీడియోనూ ఒక అభిమాని ఎక్స్‌లో పంచుకోవడంతో వైరల్‌గా మారింది. బంతి అతని కాలు తాకి మరో దిశలో వెళ్లింది. ఈ గ్యాప్‌లో ఆర్సీబీ రెండు పరుగులు తీసి విజయం సాధించింది. అయితే రాజ్ బవా బంతిని ఆపే ప్రయత్నం చేసి ఉంటే ముంబై గెలవడం లేదా సూపర్ ఓవర్‌కు దారి తీసి ఉండేదని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ‘రాజ్ బవా బంతిని కావాలనే ఆపలేదని, కచ్చితంగా మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందంటూ’ కొంతమంది ఫ్యాన్స్ తెలిపారు. ‘అప్పటికే ఆ ఓవర్లో తొమ్మిది బంతులు వేసి రాజ్ బవా అలసిపోయాడని, అందుకే బంతిని ఆపే ప్రయత్నం చేయలేకపోయి ఉండొచ్చని, మ్యాచ్ ఫిక్సింగ్ లాంటి వాటికి ఆస్కారం ఉండదని’ కొంతమంది కామెంట్లు చేశారు. ఇంకొందరు మాత్రం.. ‘ముంబై ఐదుసార్లు టైటిల్ గెలవడంతోనే ఆ జట్టు పూర్తిగా నీరుగారిపోయిందని.. మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందని, ఆర్సీబీతో ముంబై జట్టును కూడా ఐపీఎల్ నుంచి బ్యాన్ చేయాలని’ కొందరు ఆగ్రహంతో రెచ్చిపోయారు. ఏది ఏమైనా మ్యాచ్ ఫిక్సింగ్ సంగతి అటుంచితే చాన్నాళ్లుకు ఐపీఎల్లో ఒక థ్రిల్లర్ మ్యాచ్ మంచి అనుభూతి కలిగించిందని చెప్పొచ్చు. ఈ విజయంతో ఆర్సీబీ పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళ్లగా.. ఓటమితో ముంబై ఇండియన్స్ ఐపీఎల్ 2026 సీజన్ నుంచి ఎలిమినేట్ అయింది.RCB vs MI match is completely fixed. This mdc franchise needs to be banned from IPL forever pic.twitter.com/xCrf6JcHOc— Vishnu (@WorshipRohit) May 11, 2026🎥 𝙍𝙖𝙬 𝙍𝙚𝙖𝙘𝙩𝙞𝙤𝙣𝙨 from a thrilling night 🥳Down to the absolute wire in a contest of incredibly fine margins ⏳Watch the pure passion pour out from #RCB's unforgettable last-ball win ❤️ #TATAIPL | #KhelBindaas | #RCBvMI | @RCBTweets pic.twitter.com/H0PNbJSVY6— IndianPremierLeague (@IPL) May 11, 2026చదవండి: టిమ్ డేవిడ్ అనైతిక చర్య.. తగిన శాస్తి జరిగింది! -
టిమ్ డేవిడ్ అనైతిక చర్య.. తగిన శాస్తి జరిగింది!
ఐపీఎల్ 2026 సీజన్ వన్‌సైడ్ మ్యాచ్‌లో చప్పగా సాగుతున్న వేళ ఆదివారం ఆర్సీబీ, ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ థ్రిల్లర్‌ను తలపించింది. అసలు సిసలు టీ20 మజాను చాలా రోజుల తర్వాత రుచి చూపించింది. ఆఖరివరకు నువ్వా నేనా అన్నట్లుగా సాగిన పోరులో ఆర్సీబీ 2 వికెట్ల తేడాతో ఉత్కంఠ విజయాన్ని నమోదు చేసింది. ఈ నేపథ్యంలో ఆర్సీబీ ఆటగాళ్లు డగౌట్లో సంబరాల్లో మునిగితేలారు. కానీ ఆర్సీబీ స్టార్ టిమ్ డేవిడ్ మాత్రం అనైతిక చర్యకు పాల్పడ్డాడు. ముంబై ఇండియన్స్ ఓటమిని వెక్కిరిస్తూ టిమ్ డేవిడ్ ఆ జట్టుకు మిడిల్ ఫింగర్ చూపించడం కెమెరాలకు చిక్కింది. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తాజాగా టిమ్ డేవిడ్ చర్యను తీవ్రంగా పరిగణించిన బీసీసీఐ అతని మ్యాచ్ ఫీజులో 30 శాతం కోత విధించడంతో పాటు రెండు డీమెరిట్ పాయింట్లు కేటాయించింది. ‘ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఆర్టికల్ 2.6 ప్రకారం అనుమతి లేకుండా ఒక జట్టు లేదా వ్యక్తిని ఉద్దేశించి అసభ్యకరమైన సంజ్ఞ చేయడం నిబంధనలకు విరుద్ధం. ఉల్లంఘన చర్య కింద అతడిపై చర్యలు తీసుకుంటున్నాం. ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్ నిబంధనల కింద ఆ సంజ్ఞ అసభ్యకరంగా ఉండడంతో పాటు వ్యక్తి లేదా జట్టును ఉద్దేశపూర్వకంగా అవమా నించడం కిందకు వస్తుంది. అందుకే అతడి మ్యాచ్ ఫీజులో జరిమానా విధించడంతో పాటు డీమెరిట్ పాయింట్లు కేటాయించాం’ అని బీసీసీఐ ఒక ప్రకటనలో తెలిపింది.ఇక టిమ్ డేవిడ్ ఆర్సీబీలోకి రాకముందు ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు. 2022 నుంచి 2024 వరకు ముంబై తరఫున ఆడాడు. లోయర్ ఆర్డర్లో ధాటిగా బ్యాటింగ్ చేయగల సత్తా టిమ్ డేవిడ్ సొంతం. ముంబై ఇండియన్స్ తరఫున 37 మ్యాచ్‌లాడిన టిమ్ డేవిడ్ 171 స్ట్రైక్‌రేట్ 658 పరుగులు సాధించాడు. 2025 సీజన్‌కు ముందు ఆర్సీబీలోకి వచ్చిన టిమ్ డేవిడ్ ఆ సీజన్లో లోయర్ ఆర్డర్లో ఎక్కువగా బ్యాటింగ్‌కు వచ్చి 187 పరుగులు చేశాడు. తద్వారా ఆర్సీబీ తొలి ఐపీఎల్ టైటిల్ నెగ్గడంలో కీలకపాత్ర పోషించాడు. మ్యాచ్ విషయానికొస్తే ఆఖరి ఓవర్లో 15 పరుగులు అవసరమైన దశలో రొమారియో షెపర్డ్ ఔట్ అయ్యాడు. దీంతో సమీకరణం మూడు బంతుల్లో 10 పరుగులకు మారింది. ఈ దశలో భువనేశ్వర్ సిక్సర్ కొట్టడంతో ఒక్క బంతికి రెండు పరుగులు అవసరమయ్యాయి. ఈ నేపథ్యంలో రసిక్ సలామ్ ఆఖరి బంతికి రెండు పరుగులు సాధించి ఆర్సీబీకి థ్రిల్లింగ్ విజయాన్ని సాధించి పెట్టాడు. ఈ విజయంతో ఆర్సీబీ 14 పాయింట్లతో టేబుల్ టాపర్‌గా నిలిచింది.🚨👀🔥Former Mumbai Indians player Tim David was caught showing a middle finger during the match while playing for Royal Challengers Bengaluru 😳The clip instantly went viral, with fans debating💥#TimDavid #RCBvsMI #MumbaiIndians #RCB #IPL2026 #12BETIndia #KnowTheGame 🔥 pic.twitter.com/i7MNqTt3CT— 12BET India (@12B_India) May 11, 2026#breaking RCB's batter Tim David has been booked under Article 2.6 (showing an offensive gesture) during @RCBTweets match vs @mipaltan yesterday at Raipur. He will be penalized 30% of his match fees and given 2 demerit points..@IPL official media release will be out soon!— Gaurav Gupta (@toi_gauravG) May 11, 2026 -
IPL 2026: పంజాబ్ కింగ్స్‌పై ఢిల్లీ విజయం
ఐపీఎల్ 19వ సీజన్లో సోమవారం ధర్మశాల వేదికగా జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌పై ఢిల్లీ క్యాపిటల్స్ 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 211 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీ క్యాపిటల్స్ 19 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి ఛేదించింది. కెప్టెన్ అక్షర్ పటేల్ (56), డేవిడ్ మిల్లర్ (51) అర్థసెంచరీలతో ఢిల్లీ విజయంలో కీలకపాత్ర పోషించారు. ఆఖర్లో అశుతోశ్ శర్మ (24) , మాధవ్ తివారి (18 నాటౌట్), అకిబ్ నబీ (10 నాటౌట్) హిట్టింగ్తో విజయాన్ని అందించారు. అంతకముందు పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 210 పరుగులు చేసింది. ఐదో వికెట్ కోల్పోయిన ఢిల్లీఅర్థసెంచరీ సాధించిన అక్షర్ పటేల్ (56) మార్కస్ స్టోయినిస్ బౌలింగ్‌లో బెన్ ద్వార్సుస్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరగడంతో 138 పరుగుల వద్ద ఐదో వికెట్ కోల్పోయింది. 16 ఓవర్లు ముగిసేసరికి 5 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. డేవిడ్ మిల్లర్ (39), అశుతోశ్ శర్మ (7) పరుగులతో ఆడుతున్నారు.ఆశలు రేపుతున్న అక్షర్, మిల్లర్211 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ 13 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్ల నష్టానికి 124 పరుగులు చేసింది. అక్షర్ పటేల్ 44, డేవిడ్ మిల్లర్ 26 పరుగులతో ఆడుతున్నారు. ఈ ఇద్దరు 28 బంతుల్లోనే 50 పరుగులు జోడించి ఢిల్లీ శిబిరంలో ఆశలు పెంచుతున్నారు.నాలుగో వికెట్ కోల్పోయిన ఢిల్లీపంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ కష్టాల్లో పడింది. 12 పరుగులు చేసిన స్టబ్స్ రనౌట్ కావడంతో ఢిల్లీ 74 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయింది. అక్షర్ పటేల్ 25 పరుగులతో ఆడుతున్నాడు.తొలి వికెట్ కోల్పోయిన ఢిల్లీ211 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ అభిషేక్ పొరేల్ (5) రూపంలో తొలి వికెట్ కోల్పోయింది. యశ్ ఠాకూర్ బౌలింగ్‌లో పొరేల్ క్లీన్‌బౌల్డ్‌గా వెనుదిరిగాడు. 2 ఓవర్లలో ఢిల్లీ వికెట్ నష్టానికి 10 పరుగులు చేసింది.ఢిల్లీ లక్ష్యం 211 పరుగులుఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 210 పరుగులు చేసింది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (36 బంతుల్లో 59 నాటౌట్) అజేయ అర్థసెంచరీ సాధించగా.. ఓపెనర్ ప్రియాన్ష్ ఆర్య (33 బంతుల్లో 56) మెరుపు ఇన్నింగ్స్‌తో అలరించాడు. కూపర్ కన్నోలి (38) కీలక ఇన్నింగ్స్ ఆడగా.. చివర్లో సూర్యాంశ్ షెగ్డె (8 బంతుల్లో 22 నాటౌట్) ఆకట్టుకున్నాడు. ఢిల్లీ బౌలర్లలో మిచెల్ స్టార్క్, మాధవ్ తివారి చెరో 2 వికెట్లు తీయగా, ముకేశ్ కుమార్ ఒక వికెట్ పడగొట్టాడు.శ్రేయస్ అర్థశతకం17 ఓవర్లు ముగిసేసరికి పంజాబ్ కింగ్స్ 2 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. శ్రేయస్ అయ్యర్ (32 బంతుల్లో 50), కన్నోలి (34) పరుగులతో ఆడుతున్నారు. హాఫ్ సెంచరీ బాది ప్రియాన్ష్ ఔట్పంజాబ్ ఓపెనర్ ప్రియాన్ష్ ఆర్యా ఔటయ్యాడు. 33 బంతుల్లో 6 సిక్సులు, 2 ఫోర్ల సాయంతో 56 పరుగులు బాదిన ప్రియాన్ష్ ఆ తర్వాత మాధవ్ తివారీ బౌలింగ్‌లో సాహిల్ పరాఖ్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. క్రీజులో శ్రేయాస్ అయ్యర్ (13), కూపర్ (5) ఉన్నారు. స్కోరు107-2 (10 ఓవర్లకు)గా ఉంది.ప్రభ్సిమ్రాన్ సింగ్ ఔట్పంజాబ్ ఓపెనర్ ప్రభ్సిమ్రాన్ సింగ్ 18 పరుగులు చేసి ఔటయ్యాడు. ముకేశ్ కుమార్ బౌలింగ్‌లో ఔక్విబ్ నబీకి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం క్రీజులో ప్రియాన్ష్ ఆర్యా (51), శ్రేయాస్ అయ్యర్ (0) ఉన్నారు. స్కోరు 7 ఓవర్లకు 78-1గా ఉంది.ప్రియాన్ష్ ఫిఫ్టీ.. పంజాబ్ 72/0ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ ఓపెనర్ ప్రియాన్ష్ ఆర్య ఫిఫ్టీ మార్క్ సాధించాడు. 24 బంతుల్లో అర్థశతకం సాధించిన ప్రియాన్ష్ ఇన్నింగ్స్‌లో ఒక బౌండరీ సహా ఆరు సిక్సర్లు ఉండడం విశేషం. 6 ఓవర్లు ముగిసేసరికి పంజాబ్ వికెట్ నష్టపోకుండా 72 పరుగులు చేసింది. మరో ఓపెనర్ ప్రబ్‌సిమ్రన్ 15 పరుగులతో ఆడుతున్నాడు.దంచుతున్న ప్రియాన్ష్.. 3 ఓవర్లలో 51/0ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌ను పంజాబ్ కింగ్స్ దూకుడుగా ఆరంభించింది. ఓపెనర్ ప్రియాన్ష్ ఆర్య సిక్సర్లతో విధ్వంసం సృష్టిస్తున్నాడు. 3 ఓవర్లు ముగిసేసరికి పంజాబ్ కింగ్స్ వికెట్ నష్టోకుండా 51 పరుగులు చేసింది. ప్రబ్‌సిమ్రన్ (5) పరుగులతో ఆడుతున్నాడు.టాస్ ఓడిన పంజాబ్టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ బౌలింగ్ ఎంచుకుంది. పంజాబ్ తరఫున బెన్ ద్వార్షుయిస్ ఐపీఎల్లో అరంగేట్రం చేయనున్నాడు. మరోవైపు ఢిల్లీ క్యాపిటల్స్ ఐదు మార్పులతో బరిలోకి దిగింది. అభిషేక్ పొరేల్, సాహిల్ పరాక్, డేవిడ్ మిల్లర్, అకిబ్ నబీ, మాధవ్ తివారి తుది జట్టులోకి వచ్చారు.ఈ మ్యాచ్‌లో గెలిచి పంజాబ్ కింగ్స్ టాప్ ప్లేస్ అందుకోవాలని చూస్తోంది. మరోవైపు పంజాబ్‌తో మ్యాచ్ ఢిల్లీకి చావో రేవో లాంటిది. ప్రస్తుతం ఢిల్లీ 11 మ్యాచ్‌ల్లో 8 పాయింట్లతో 8వ స్థానంలో ఉంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తేనే ఢిల్లీకి ప్లేఆఫ్ అవకాశాలు మిగిలి ఉంటాయి. ఓడితే మాత్రం ముంబై, లక్నో తర్వాత ఎలిమినేట్ అవనున్న మూడో జట్టుగా ఢిల్లీ క్యాపిటల్స్ నిలవనుంది. ఈ సీజన్లో తొలి అంచె పోటీలో ఢిల్లీ క్యాపిటల్స్‌పై పంజాబ్ కింగ్స్ 6 వికెట్లతో విజయాన్ని అందుకుంది. మొదట ఢిల్లీ 264 పరుగుల భారీ స్కోరు చేసింది. ఆ తర్వాత పంజాబ్ 18.5 ఓవర్లలోనే 265 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. ముఖాముఖి పోరులో ఇరుజట్లు 35 సార్లు తలడిపతే 18 సార్లు పంజాబ్, 17 సార్లు ఢిల్లీ నెగ్గింది. 2023 నుంచి చూసుకుంటే ఈ రికార్డు 3-2గా ఉంది. ఇక ధర్మశాలలో ఇరుజట్లు చెరో 2 విజయాలతో సమానంగా ఉన్నాయి.తుది జట్లు:ఢిల్లీ క్యాపిటల్స్: కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), అభిషేక్ పోరెల్, సాహిల్ పరాఖ్, ట్రిస్టన్ స్టబ్స్, డేవిడ్ మిల్లర్, అక్షర్ పటేల్(కెప్టెన్), మాధవ్ తివారీ, ముఖేష్ కుమార్, ఔకిబ్ నబీ దార్, మిచెల్ స్టార్క్, లుంగి ఎన్గిడి.పంజాబ్ కింగ్స్: ప్రభ్సిమ్రాన్ సింగ్ (వికెట్ కీపర్), ప్రియాంష్ ఆర్య, కూపర్ కొన్నోలీ, శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), సూర్యాంశ్ షెడ్జ్, మార్కస్ స్టోయినిస్, శశాంక్ సింగ్, మార్కో జాన్సెన్, బెన్ ద్వార్షుయిస్, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్.ఢిల్లీ క్యాపిటల్స్ ఇంపాక్ట్ సబ్‌లు: పాతుమ్ నిస్సాంక, సమీర్ రిజ్వీ, అశుతోష్ శర్మ, విప్రజ్ నిగమ్, త్రిపురాన విజయ్పంజాబ్ కింగ్స్ ఇంపాక్ట్ సబ్స్: హర్‌ప్రీత్ బ్రార్, యష్ ఠాకూర్, జేవియర్ బార్ట్లెట్, విష్ణు వినోద్, ప్రవీణ్ దూబే🚨Toss update from Dharamshala 🚨@DelhiCapitals won the toss and elected to bowl first against @punjabkingsiplUpdates ▶️ https://t.co/wHhflKIvCR#TATAIPL | #KhelBindaas | #PBKSvDC pic.twitter.com/uia9sh01xL— IndianPremierLeague (@IPL) May 11, 2026 -
తిరోగమనంలో ముంబై ఇండియన్స్.. ఆ ముగ్గురిపై వేటు!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ముంబై ఇండియన్స్‌ది ఘన చరిత్ర. ఐదుసార్లు టైటిల్ గెలిచిన ముంబై ఇండియన్స్ ప్రస్తుతం తిరోగమనం దిశగా పయనిస్తోంది. రోహిత్ శర్మను కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించిన తర్వాత ఆ జట్టు పూర్తిగా గాడి తప్పింది. ఐపీఎల్ 2026 సీజన్లోనూ ప్లేఆఫ్స్ చేరడంలో విఫలమైన మాజీ చాంపియన్స్ అవమానకర రీతిలో నిష్క్రమించింది. ఆదివారం ఆర్సీబీతో ఈజీగా గెలవాల్సిన మ్యాచ్‌ను ముంబై చేజేతులా ఓడిపోయింది. ఆఖరి ఓవర్లో 15 పరుగులు అవసరమైన దశలో అనుభవం లేని రాజ్‌బవా చేతికి బంతిని అందించి కెప్టెన్ సూర్యకుమార్ మూల్యం చెల్లించుకున్నాడు. అనుభవలేమితో ఒత్తిడికి లోనైన రాజ్‌బవా వైడ్లు, నోబ్ వేసి ముంబై ఓటమికి కారణమయ్యాడు. ఈ ఓటమితో ముంబై 11 మ్యాచ్‌ల్లో కేవలం మూడు విజయాలు మాత్రమే సాధించడంతో లీగ్ దశలో మరో మూడు మ్యాచ్‌లు ఉన్నప్పటికీ రెండు వారాల ముందే ముంబై ఐపీఎల్ 19వ సీజన్లో ఎలిమినేట్ అయింది. అయితే ఐపీఎల్‌కు ముందు జరిగిన టీ20 ప్రపంచకప్‌లో విజేతగా నిలిచిన టీమిండియా జట్టులో సభ్యులుగా ఉన్న కెప్టెన్ సూర్యకుమార్ సహా తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, బుమ్రా ముంబై జట్టులో ఉండడం గమనార్హం. అయితే ఈ సీజన్లో ముంబై దారుణ వైఫల్యంతో వచ్చే సీజన్‌కు జట్టులో ప్రక్షాళన తప్పేలా లేదు. ఈ నేపథ్యంలో ముంబై జట్టులో ముగ్గురు ఆటగాళ్లను మాత్రం విడుదల చేయనుంది. వారే ప్రస్తుత ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్, ట్రెంట్ బౌల్ట్.సూర్యకుమార్35 ఏళ్ల వయసున్న సూర్యకుమార్ టీ20 క్రికెట్లో మిస్టర్ 360 ప్లేయర్‌గా గుర్తింపు ఉంది. కేవలం టీ20 స్పెషలిస్ట్‌గానే టీమిండియాకు ఆడిన సూర్యకుమార్ గత నాలుగేళ్లలో ముంబై ఇండియన్స్ తరఫున ఎన్నో కీలక ఇన్నింగ్స్‌లు ఆడాడు. కానీ ఈ సీజన్లో మాత్రం సూర్యకుమార్ దారుణ ప్రదర్శన కనబరుస్తున్నాడు. 11 మ్యాచ్‌లాడి కేవలం 195 పరుగులు మాత్రమే చేశాడు. ఇదే సీజన్లో రోహిత్ శర్మ గాయంతో చాలా మ్యాచ్‌లకు దూరం కావడంతో జట్టులో సీనియర్‌గా బ్యాటర్‌గా బాధ్యతగా ఆడాల్సిన సూర్యకుమార్ తన పాత్రకు న్యాయం చేయడంలో విఫలమయ్యాడు. పైగా పాండ్యా దూరమవ్వడంతో కెప్టెన్సీ బాధ్యతలు అతడిని మరింత ఒత్తిడిలోకి నెట్టేశాయి. దీంతో వచ్చే సీజన్లో సూర్యకు ముంబై టాటా చెప్పే అవకాశాలు మెండుగా ఉన్నాయి.హార్దిక్ పాండ్యాఒకప్పుడు ముంబై ఇండియన్స్‌లో ఆడిన హార్దిక్ పాండ్యా ఆ తర్వాత 2022 సీజన్లో కొత్తగా వచ్చిన గుజరాత్ టైటాన్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరించాడు. గుజరాత్ ఆడిన తొలి సీజన్లోనే పాండ్యా ఆ జట్టును చాంపియన్‌గా నిలబెట్టాడు. మరుసటి సీజన్లోనూ గుజరాత్‌ను రన్నరప్‌గా నిలపడంతో పాండ్యా పేరు మార్మోగిపోయింది. దీంతో ఉన్నపళంగా 2024సీజన్లో రోహిత్‌ను కెప్టెన్సీ నుంచి తప్పించి ఆ బాధ్యతలను పాండ్యాకు అప్పగించింది. కానీ ముంబైలోకి వచ్చినప్పటి నుంచి పాండ్యా అటు కెప్టెన్‌గా.. ఇటు ఆల్‌రౌండర్‌గా పూర్తిగా విఫలమవుతూ వచ్చాడు. 2025 సీజన్లో పాండ్యా సారథ్యంలో ముంబై ప్లేఆఫ్స్ చేరినప్పటికీ ఇతర జట్ల సమీకరణాల ఆధారంగా చేరడంతో ముంబై స్థాయికి ఇది తగదు. ఇక 2024 సీజన్‌తో పాటు ఈ సీజన్లో ప్లేఆఫ్స్ చేరడంలో విఫలమైంది. ఈ సీజన్లో పాండ్యా 8 మ్యాచ్‌లాడి 146 పరుగులు మాత్రమే చేశాడు. బౌలింగ్‌లోనూ విఫలమైన పాండ్యా కేవలం 4 వికెట్లు మాత్రమే పడగొట్టాడు. దీనికి తోడు తన అగ్రెసివ్ ప్రవర్తనతో విమర్శలు ఎదుర్కొన్నాడు. గాయంతో ఈ సీజన్‌కు దూరమైన పాండ్యా వచ్చే సీజన్లో వేరే జట్టుకు ఆడే అవకాశముంది.ట్రెంట్ బౌల్ట్అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ అయిన ట్రెంట్ బౌల్ట్‌ను ముంబై ఎంచుకోవడం కాస్త ఆశ్చర్యపరిచింది. ఈ సీజన్లో బౌల్ట్ దారుణ ప్రదర్శన కనబరిచాడు. ఐదు మ్యాచ్‌లాడిన బౌల్ట్ కేవలం రెండు వికెట్లు మాత్రమే తీశాడు.బుమ్రాతో కలిసి ప్రత్యర్థులను బెంబెలెత్తిస్తాడనుకుంటే బౌల్ట్ మాత్రం తన దారుణ ప్రదర్శనతో ముంబై ఫ్రాంచైజీకి తలనొప్పిగా మారాడు. వచ్చే సీజన్లో బౌల్ట్ స్థానంలో యంగ్ పేసర్‌ను తీసుకోవాలని ఇప్పటికే ముంబై భావిస్తోంది.చదవండి: పోటీ రసవత్తరం.. ప్లేఆఫ్స్ రేసులో 8 జట్లు! -
పోటీ రసవత్తరం.. ప్లేఆఫ్స్ రేసులో 8 జట్లు!
ఐపీఎల్ 2026 సీజన్‌కు సంబంధించి ప్లేఆఫ్స్ రేసు రసతవత్తరంగా మారింది. ఆదివారం ముంబై ఇండియన్స్‌పై ఉత్కంఠ విజయంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళ్లింది. ఈజీగా గెలవాల్సిన మ్యాచ్‌లో ముంబై చేజేతులా ఓటమి కొనితెచ్చుకుంది. ముంబై బౌలర్ రాజ్‌బవా ఒత్తిడికి తోడు వైడ్లు, నోబ్ వేయడంతో చివరి ఓవర్లో 15 పరుగులు చేసి ఆర్సీబీ హ్యాట్రిక్ ఓటమిని తప్పించుకోవడంతో పాటు టేబుల్ టాపర్‌గా నిలిచింది. ఇప్పటికే వరుస ఓటములతో ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్లు అధికారికంగా ప్లేఆఫ్స్ రేసు నుంచి తప్పుకున్నాయి. అయితే టాప్-4లో నిలిచేందుకు 8 జట్లు పోటీలో ఉండడం గమనార్హం.అగ్రస్థానంలో ఆర్సీబీ:ప్రస్తుతం టేబుల్ టాపర్‌గా ఉన్న ఆర్సీబీ 11 మ్యాచ్‌ల్లో 7 విజయాలతో 14 పాయింట్లు సాధించింది. (+1.103) నెట్ రన్‌రేట్‌తో ఇతర జట్ల కంటే మెరుగైన స్థితిలో నిలిచింది. అయితే అధికారికంగా ప్లేఆఫ్స్ బెర్త్ ఖరారు కావాలంటే ఇంకా రెండు విజయాలు అవసరం. సాధారణంగా 16 పాయింట్లు ప్లేఆఫ్స్‌కు సరిపోతాయి. కాబట్టి ఆర్సీబీ ఒక్క విజయం సాధించినా సరిపోతుంది. కానీ ఎస్ఆర్హెచ్, పంజాబ్‌ల నుంచి పోటీ వద్దనుకుంటే మిగిలిన అన్ని మ్యాచ్‌లు గెలిచి నేరుగా క్వాలిఫయర్-1కు అర్హత సాధించే అవకాశం ఉంది.హైదరాబాద్ రెండు గెలిస్తే:సన్‌రైజర్స్ హైదరాబాద్ కూడా 14 పాయింట్లతోనే ఉన్నప్పటికీ నెట్ రన్‌రేట్ (+0.737) విషయంలో ఆర్సీబీ కంటే వెనుకబడి ఉంది. చివరి మూడు మ్యాచ్‌ల్లో రెండు గెలిస్తే.. ప్లేఆఫ్స్ బెర్త్ ఖాయమవుతుంది. మే 22న ఆర్సీబీతో జరిగే మ్యాచ్ టాప్-2 స్థానాలపై కీలక ప్రభావం చూపే అవకాశముంది. గుజరాత్ టైటాన్స్ కూడా 14 పాయింట్లతో పోటీలో ఉంది. అయితే వారి నెట్ రన్ రేట్ (+0.228) తక్కువగా ఉండటంతో మరో రెండు విజయాలు అవసరం. మే 12న ఎస్ఆర్హెచ్తో మ్యాచ్ గుజరాత్‌కు కీలకంగా మారనుంది.అనుకూల స్థితిలో పంజాబ్:పంజాబ్ కింగ్స్ ప్రస్తుతం అత్యంత అనుకూల స్థితిలో ఉన్న జట్టుగా కనిపిస్తోంది. 10 మ్యాచ్‌ల్లోనే 13 పాయింట్లు సాధించిన పంజాబ్‌కు మరో నాలుగు మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. నాలుగులో కనీసం రెండు గెలిస్తే చాలు 17 పాయింట్లతో ప్లేఆఫ్స్ బెర్తును పంజాబ్ దాదాపు ఖాయం చేసుకుంటుంది.చెన్నైకి కనీసం రెండు విజయాలు:ఐదుసార్లు ఛాంపియన్ అయిన చెన్నై సూపర్ కింగ్స్ మాత్రం కఠిన పరిస్థితుల్లో ఉంది. సీఎస్కే ప్రస్తుతం 12 పాయింట్లతో ఉంది. మిగిలిన మూడు మ్యాచ్‌లో కనీసం రెండు గెలవాల్సిన అవసరముంది. అయితే వారి నెట్ రన్‌రేట్ (+0.185) పెద్దగా మెరుగ్గా లేకపోవడంతో అన్ని మ్యాచ్‌లు గెలిస్తేనే అవకాశం ఉంది.ఒత్తిడిలో రాజస్థాన్:రాజస్థాన్ రాయల్స్ కూడా 12 పాయింట్లతో సీఎస్కేతో సమానంగా ఉన్నప్పటికీ.. నెట్ రన్దేట్ (+0.082) తక్కువగా ఉంది. గత నాలుగు మ్యాచ్ ల్లో మూడు ఓటములు చవిచూడడంతో ఆ జట్టుపై ఒత్తిడి పెరిగింది. సీఎస్కేతో కలిసి నాలుగో ప్లేఆఫ్స్ స్థానం కోసం రాజస్థాన్ పోరాడే అవకాశం ఉంది. ఇక కోల్‌కతా నైట్ రైడర్స్ పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది. మిగిలిన నాలుగు మ్యాచ్‌లు కేకేఆర్ కచ్చితంగా గెలవాల్సిన అవసరముంది. అప్పుడు కేకేఆర్ 17 పాయింట్లతో ప్లేఆఫ్స్ చేరే అవకాశముంటుంది. అయితే మ్యాచ్‌లో ఒక్క ఓటమి ఎదురైనా కేకేఆర్ ఇంటిబాట పట్టాల్సిందే.ఢిల్లీ క్యాపిటల్స్‌కు కష్టమే..ఢిల్లీ క్యాపిటల్స్‌కు అవకాశాలు అంతంతమాత్రమే. ప్రస్తుతం వారి నెట్ రన్ రేట్ (-1.154) దారుణంగా ఉంది. మిగిలిన అన్ని మ్యాచ్‌ల్లో భారీ తేడాతో గెలవడంతో పాటు ఇతర జట్ల ఫలితాలు కూడా తమకు అనుకూలంగా రావాల్సిన అవసరముంటుంది.ముంబై, లక్నో అవుట్:ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్లు ఇప్పటికే ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించాయి. దీంతో ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్ పోరు ఇప్పుడు మరింత రసవత్తరంగా మారింది.చదవండి: ఆర్సీబీ థ్రిల్లింగ్ విక్టరీ.. ముంబై ఇండియన్స్ ఖేల్ ఖతం! -
లీకైన భారత టెస్ట్ జట్టు.. గుజరాత్ స్టార్ ప్లేయర్‌పై వేటు
ఐపీఎల్ 2026 తర్వాత స్వదేశంలో ఆఫ్ఘనిస్తాన్‌తో జరుగబోయే ఏకైక టెస్ట్ కోసం భారత జట్టును మరికొద్ది రోజుల్లో ప్రకటించే అవకాశం ఉంది. దీనిపై అధికారిక ప్రకటన వెలువడకముందే సోషల్‌మీడియా జట్టు వివరాలు లీకయ్యాయి.ఈ జట్టుకు కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్ కొనసాగనున్నాడు. సీనియర్లు కేఎల్ రాహుల్, పంత్, జడేజా, సిరాజ్, జైస్వాల్ కొనసాగనున్నారు. షమీ పునరాగమనం చేశాడు. ఐపీఎల్ ప్రదర్శనల ఆధారంగా అన్షుల్ కంబోజ్‌కు అవకాశం దొరికింది. రంజీ ప్రదర్శనల ఆధారంగా ఆకిబ్ నబీ, హర్ష్ దూబేకు చోటు కల్పించారు.ఆసక్తికరంగా గుజరాత్ టైటాన్స్ స్టార్ ఓపెనర్ సాయి సుదర్శన్‌పై వేటు పడింది. సాయి ఐపీఎల్ 2026లో మంచి ప్రదర్శనలు చేస్తున్నా, గత టెస్ట్ ప్రదర్శనల దృష్ట్యా అతనిని తప్పించినట్లు తెలుస్తోంది. సాయి స్థానంలో ఇటీవలికాలంలో ఫార్మాట్లకతీతంగా చెలరేగుతున్న దేవ్‌దత్ పడిక్కల్‌కు ఛాన్స్ ఇచ్చారు. స్టార్ పేసర్ బుమ్రాకు విశ్రాంతినిచ్చారు.వాస్తవానికి ఆఫ్ఘనిస్తాన్‌తో ఏకైక టెస్ట్‌కు సీనియర్లకంతా విశ్రాంతినిస్తారని ప్రచారం జరిగింది. లీకైన జట్టును బట్టి చూస్తే అలాంటిదేమీ లేదని తెలుస్తోంది. మరో పక్క ఇదే జట్టు కొనసాగుతుందన్న గ్యారెంటీ అయితే లేదు. కేవలం సోషల్‌మీడియాలో జరుగుతున్న ప్రచారం మాత్రమే ఇది. జట్టుపై త్వరలో అధికారిక ప్రకటన రావొచ్చు. ఒక్కటైతే గ్యారెంటీ జట్టు దాదాపుగా ఇలాగే ఉండవచ్చు. ఎందుకంటే సెలెక్టర్లు ఇప్పటికే జట్టును డిసైడ్ చేసినట్లు సమాచారం. ఆఫ్ఘనిస్తాన్‌తో టెస్ట్ మ్యాచ్ ఐపీఎల్ ముగిసిన తర్వాత జూన్ 6 నుంచి ముల్లాన్‌పూర్ వేదికగా ప్రారంభం కానుంది. ఈ పర్యటనలో ఆఫ్ఘనిస్తాన్ మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ కూడా ఆడనుంది. ఆ మ్యాచ్‌లు జూన్ 14, 17, 20 తేదీల్లో ధర్మశాల, లక్నో, చెన్నై వేదికలుగా జరుగనున్నాయి. సోషల్‌మీడియాలో ప్రచారం జరుగుతున్న భారత జట్టు:శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్, దేవదత్ పడిక్కల్, రిషభ్ పంత్, ధృవ్ జురెల్, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా,కుల్దీప్ యాదవ్, మొహమ్మద్ సిరాజ్, ఆకిబ్ నబీ, హర్ష్ దూబే, మహ్మద్ షమీ, అన్షుల్ కంబోజ్ -
ఇవాళ తేలిపోనున్న మరో జట్టు భవిష్యత్తు
ఐపీఎల్ 2026 ప్లే ఆఫ్స్ రేసు రసవత్తరంగా సాగుతుంది. నిన్నటితో (మే 10) రెండు జట్లు (లక్నో, ముంబై ఇండియన్స్) పోటీ నుంచియ అధికారికంగా నిష్క్రమించాయి. ఇక మిగిలింది ఎనిమిది జట్లు. వీటిలో నాలుగు జట్లకు మాత్రమే ప్లే ఆఫ్స్ బెర్త్ దక్కుతుంది.ఆ జట్లు ఏవో తేలాలంటే మరికొద్ది రోజుల ఆగాల్సిందే. అయితే ఒక్క జట్టు భవితవ్యం మాత్రమే ఇవాల్టితో తేలిపోయే అవకాశం ఉంది. ఆ జట్టే ఢిల్లీ క్యాపిటల్స్. ఢిల్లీ పాయింట్ల పట్టికలో చివరి నుంచి మూడో స్థానంలో ఉండి, నిష్క్రమణ అంచుల్లో నిలిచింది. ఇప్పటివరకు ఆ జట్టు 11 మ్యాచ్‌ల్లో కేవలం నాలుగే విజయాలు సాధించి 8 పాయింట్లు ఖాతాలో కలిగి ఉంది.ఇవాళ పంజాబ్ కింగ్స్‌తో జరుగబోయే మ్యాచ్ డీసీకి డూ ఆర్ డైగా పరిగణించబడుతుంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే, ఆ జట్టు ప్లే ఆఫ్స్ రేసులో ఉంటుంది. ఒకవేళ ఓడిందా.. ఈ మ్యాచ్‌తోనే ఇంటిముఖం పడుతుంది. ఒకవేళ గెలిచినా ఢిల్లీకి ప్లే ఆఫ్స్ బెర్త్ దక్కడం అంత ఈజీ కాదు. ఏదైనా మహాద్భుతం జరిగితే తప్ప ఆ జట్టు ప్లే ఆఫ్స్‌కు చేరలేదు.ఫైనల్-4కు చేరాలంటే ఆ జట్టు ఏడు జట్లను దాటుకొని వెళ్లాలి. ఇది అంత ఈజీగా జరిగే పని కాదు. కాబట్టి అనధికారికంగా డీసీ ప్లే ఆఫ్స్ ఆశలు ఆవిరైనట్టే. ఈ మ్యాచ్ ఢిల్లీకి అంత ప్రాధాన్యం కానప్పటికీ.. పంజాబ్‌కు మాత్రం కీలకం కానుంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే ఆ జట్టు ప్లే ఆఫ్స్ రేసులో మళ్లీ ముందుకెళ్తుంది. ప్రస్తుతం ఆ జట్టు 13 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది. ఢిల్లీపై గెలిచి రెండు పాయింట్లు సాధిస్తే.. 15 పాయింట్లతో మళ్లీ టేబుల్ టాపర్‌గా నిలుస్తుంది.ఓవరాల్‌గా చూస్తే.. ప్రస్తుతం ప్లే ఆఫ్స్ పోటీ ప్రధానంగా టాప్-4లో ఉన్న నాలుగు జట్ల మధ్యే ఉంది. ఏదైనా అనూహ్యం జరిగితే సీఎస్కే, రాజస్థాన్ కూడా లైన్లోకి వస్తాయి. అద్భుతం జరిగితే కేకేఆర్, డీసీ కూడా రేసులో ఉంటాయి.ప్లే ఆఫ్స్ రేసులో ఉన్న జట్లు ఆడాల్సిన మిగిలిన మ్యాచ్‌లు..ఆర్సీబీ- కేకేఆర్ (మే 13), పంజాబ్ (17), ఎస్ఆర్హెచ్ (22)ఎస్ఆర్హెచ్- గుజరాత్ (12), సీఎస్కే (18), ఆర్సీబీ (22)గుజరాత్- ఎస్ఆర్హెచ్ (12), కేకేఆర్ (16), సీఎస్కే (21)పంజాబ్- డీసీ (11), ముంబై (14), ఆర్సీబీ (17), లక్నో (23)సీఎస్కే- లక్నో (15), ఎస్ఆర్హెచ్ (18), గుజరాత్ (21)రాజస్థాన్- డీసీ (17), లక్నో (19), ముంబై (24)కేకేఆర్- ఆర్సీబీ (13), గుజరాత్ (16), ముంబై (20), డీసీ (24)డీసీ- పంజాబ్ (11), రాజస్థాన్ (17), కేకేఆర్ (24) -
ఆర్సీబీ కింగ్ మేకర్‌పై చర్యలు
ఆర్సీబీ కింగ్ మేకర్, ఆ జట్టు హెడ్ కోచ్ ఆండీ ఫ్లవర్‌పై బీసీసీఐ చర్యలు తీసుకుంది. ఐపీఎల్ 2026లో భాగంగా నిన్న (మే 11) రాత్రి ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అతడు ఫోర్త్ అంపైర్‌తో వాగ్వాదానికి దిగాడు. ఈ చర్య ఐపీఎల్ కోడ్ ఆఫ్ కాండక్ట్‌లో లెవెల్-1 ఉల్లంఘన కిందికి వస్తుంది. దీనికి శిక్షగా ఫ్లవర్‌కు మ్యాచ్ ఫీజ్‌లో 15 శాతం జరిమానా విధించారు. లెవెల్ 1 ఉల్లంఘనల కింద కోచ్‌లపై కూడా చర్యలు తీసుకునే అధికారం మ్యాచ్ రిఫరీకి ఉంటుంది.ఐపీఎల్లో ఇలాంటి ఉదంతాలు చాలా అరుదుగా జరిగాయి. గత సీజన్లో గుజరాత్ కోచ్ ఆశిష్ నెహ్రా కూడా ఇలాగే ప్రవర్తించి శిక్షించబడ్డాడు. అప్పట్లో అతని మ్యాచ్ ఫీజ్‌లో 25 శాతం కోత విధించారు. అదే సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ బౌలింగ్ కోచ్ మునాఫ్ పటేల్ కూడా లెవెల్-1 ఉల్లంఘనకు పాల్పడి బీసీసీఐ ఆగ్రహానికి (25 శాతం జరిమానా) గురయ్యాడు.దీనికి ముందు 2024 ఎడిషన్‌లో ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ కోచ్ కీరన్ పోలార్డ్.. 2022 ఎడిషన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ అసిస్టెంట్ కోచ్ ప్రవీణ్ ఆమ్రే కూడా అంపైర్లతో వాదించి శిక్షించబడ్డారు. వీరిలో ఆమ్రే ఏకంగా ఓ మ్యాచ్ నిషేధానికి కూడా గురయ్యాడు.మ్యాచ్ విషయానికొస్తే.. నరాలు తెగే ఉత్కంఠ నడుమ సాగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై ఆర్సీబీ 2 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఇన్నింగ్స్ చివరి బంతికి రెండు పరుగులు చేయాల్సిన తరుణంలో రసిక్ సలామ్ ఆర్సీబీని గెలిపించాడు. అంతకుముందు నాలుగో బంతికి భువనేశ్వర్ కుమార్ సిక్సర్ బాది గెలుపు ఖరారు చేశాడు.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ 7 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేయగా.. ఆర్సీబీ చివరి బంతికి లక్ష్యాన్ని ఛేదించింది. ఈ ఓటమితో ప్రస్తుత సీజన్లో ముంబై ఇండియన్స్ పోరాటం ముగిసింది. మరో 3 మ్యాచ్‌లు ఆడాల్సి ఉన్నా, ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించింది. ఎంఐతో పాటు లక్నో సూపర్ జెయింట్స్ కూడా ప్లే ఆఫ్స్ రేసు నుంచి ఎలిమినేట్ అయ్యింది.


