IPL 2026: పంజాబ్‌ కింగ్స్‌పై ఢిల్లీ విజయం | IPL 2026 Punjab Kings Vs Delhi Capitals Match At Dharmashala Live Score Updates, Highlights And Viral Videos | Sakshi
Sakshi News home page

IPL 2026: పంజాబ్‌ కింగ్స్‌పై ఢిల్లీ విజయం

May 11 2026 7:12 PM | Updated on May 11 2026 11:29 PM

IPL 2026: Punjab Kings Vs Delhi Capitals Match Live Updates-Dharmashala

ఐపీఎల్‌ 19వ సీజన్‌లో సోమ‌వారం ధ‌ర్మ‌శాల వేదిక‌గా జ‌రిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌పై ఢిల్లీ క్యాపిట‌ల్స్ 3 వికెట్ల తేడాతో విజ‌యం సాధించింది.  211 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీ క్యాపిటల్స్ 19 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి ఛేదించింది. కెప్టెన్ అక్ష‌ర్ ప‌టేల్ (56), డేవిడ్ మిల్ల‌ర్ (51) అర్థ‌సెంచ‌రీల‌తో ఢిల్లీ విజ‌యంలో కీల‌క‌పాత్ర పోషించారు. ఆఖ‌ర్లో అశుతోశ్ శ‌ర్మ (24) , మాధ‌వ్ తివారి (18 నాటౌట్‌), అకిబ్ న‌బీ (10 నాటౌట్‌) హిట్టింగ్‌తో విజయాన్ని అందించారు. అంతకముందు పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 5 వికెట్ల న‌ష్టానికి 210 ప‌రుగులు చేసింది. 

ఐదో వికెట్ కోల్పోయిన ఢిల్లీ
అర్థ‌సెంచ‌రీ సాధించిన అక్ష‌ర్ ప‌టేల్ (56) మార్క‌స్ స్టోయినిస్ బౌలింగ్‌లో బెన్ ద్వార్‌సుస్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిర‌గ‌డంతో 138 ప‌రుగుల వ‌ద్ద ఐదో వికెట్ కోల్పోయింది. 16 ఓవ‌ర్లు ముగిసేసరికి 5 వికెట్ల న‌ష్టానికి 158 ప‌రుగులు చేసింది. డేవిడ్ మిల్ల‌ర్ (39), అశుతోశ్ శ‌ర్మ (7) ప‌రుగుల‌తో ఆడుతున్నారు.

ఆశ‌లు రేపుతున్న అక్ష‌ర్‌, మిల్ల‌ర్‌
211 ప‌రుగుల టార్గెట్‌తో బ‌రిలోకి దిగిన ఢిల్లీ క్యాపిట‌ల్స్ 13 ఓవర్లు ముగిసేస‌రికి 4 వికెట్ల న‌ష్టానికి 124 ప‌రుగులు చేసింది. అక్ష‌ర్ ప‌టేల్ 44, డేవిడ్ మిల్ల‌ర్ 26 ప‌రుగుల‌తో ఆడుతున్నారు. ఈ ఇద్ద‌రు 28 బంతుల్లోనే 50 ప‌రుగులు జోడించి ఢిల్లీ శిబిరంలో ఆశ‌లు పెంచుతున్నారు.

నాలుగో వికెట్ కోల్పోయిన ఢిల్లీ
పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిట‌ల్స్ క‌ష్టాల్లో ప‌డింది. 12 ప‌రుగులు చేసిన స్ట‌బ్స్ ర‌నౌట్ కావ‌డంతో ఢిల్లీ 74 ప‌రుగుల వ‌ద్ద నాలుగో వికెట్ కోల్పోయింది. అక్ష‌ర్ ప‌టేల్ 25 ప‌రుగుల‌తో ఆడుతున్నాడు.

తొలి వికెట్ కోల్పోయిన ఢిల్లీ
211 ప‌రుగుల టార్గెట్‌తో బ‌రిలోకి దిగిన ఢిల్లీ క్యాపిట‌ల్స్ అభిషేక్ పొరేల్ (5) రూపంలో తొలి వికెట్ కోల్పోయింది. య‌శ్ ఠాకూర్ బౌలింగ్‌లో పొరేల్ క్లీన్‌బౌల్డ్‌గా వెనుదిరిగాడు. 2 ఓవ‌ర్లలో ఢిల్లీ వికెట్ న‌ష్టానికి 10 ప‌రుగులు చేసింది.

ఢిల్లీ ల‌క్ష్యం 211 ప‌రుగులు
ఢిల్లీ క్యాపిట‌ల్స్‌తో జ‌రుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 5 వికెట్ల న‌ష్టానికి 210 ప‌రుగులు చేసింది. కెప్టెన్ శ్రేయ‌స్ అయ్య‌ర్ (36 బంతుల్లో 59 నాటౌట్‌) అజేయ అర్థ‌సెంచ‌రీ సాధించ‌గా.. ఓపెన‌ర్ ప్రియాన్ష్ ఆర్య (33 బంతుల్లో 56) మెరుపు ఇన్నింగ్స్‌తో అల‌రించాడు. కూప‌ర్ క‌న్నోలి (38) కీల‌క ఇన్నింగ్స్ ఆడ‌గా.. చివ‌ర్లో సూర్యాంశ్ షెగ్డె (8 బంతుల్లో 22 నాటౌట్‌) ఆక‌ట్టుకున్నాడు. ఢిల్లీ బౌల‌ర్ల‌లో మిచెల్ స్టార్క్, మాధ‌వ్ తివారి చెరో 2 వికెట్లు తీయ‌గా, ముకేశ్ కుమార్ ఒక వికెట్ ప‌డ‌గొట్టాడు.

శ్రేయస్ అర్థశతకం
17 ఓవర్లు ముగిసేసరికి పంజాబ్ కింగ్స్ 2 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. శ్రేయస్ అయ్యర్ (32 బంతుల్లో 50), కన్నోలి (34) పరుగులతో ఆడుతున్నారు. 

హాఫ్‌ సెంచరీ బాది ప్రియాన్ష్‌ ఔట్‌
పంజాబ్‌ ఓపెనర్‌ ప్రియాన్ష్‌ ఆర్యా ఔటయ్యాడు. 33 బంతుల్లో 6 సిక్సులు, 2 ఫోర్ల సాయంతో 56 పరుగులు బాదిన ప్రియాన్ష్‌ ఆ తర్వాత మాధవ్‌ తివారీ బౌలింగ్‌లో సాహిల్‌ పరాఖ్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. క్రీజులో శ్రేయాస్‌ అయ్యర్‌ (13), కూపర్‌ (5) ఉన్నారు. స్కోరు
107-2 (10 ఓవర్లకు)గా ఉంది.

ప్రభ్‌సిమ్రాన్‌ సింగ్‌ ఔట్‌
పంజాబ్‌ ఓపెనర్‌ ప్రభ్‌సిమ్రాన్‌ సింగ్‌ 18 పరుగులు చేసి ఔటయ్యాడు. ముకేశ్‌ కుమార్‌ బౌలింగ్‌లో ఔక్విబ్‌ నబీకి క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం క్రీజులో ప్రియాన్ష్‌ ఆర్యా (51), శ్రేయాస్‌ అయ్యర్‌ (0) ఉన్నారు. స్కోరు 7 ఓవర్లకు 78-1గా ఉంది.

ప్రియాన్ష్ ఫిఫ్టీ.. పంజాబ్ 72/0
ఢిల్లీ క్యాపిటల్స్‌తో  మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ ఓపెనర్ ప్రియాన్ష్ ఆర్య ఫిఫ్టీ మార్క్ సాధించాడు. 24 బంతుల్లో అర్థశతకం సాధించిన ప్రియాన్ష్ ఇన్నింగ్స్‌లో ఒక బౌండరీ సహా ఆరు సిక్సర్లు ఉండడం విశేషం. 6 ఓవర్లు ముగిసేసరికి పంజాబ్ వికెట్ నష్టపోకుండా 72 పరుగులు చేసింది. మరో ఓపెనర్ ప్రబ్‌సిమ్రన్ 15 పరుగులతో ఆడుతున్నాడు.

దంచుతున్న ప్రియాన్ష్‌.. 3 ఓవ‌ర్ల‌లో 51/0
ఢిల్లీ క్యాపిట‌ల్స్‌తో మ్యాచ్‌ను పంజాబ్ కింగ్స్ దూకుడుగా ఆరంభించింది. ఓపెన‌ర్ ప్రియాన్ష్ ఆర్య సిక్స‌ర్లతో విధ్వంసం సృష్టిస్తున్నాడు. 3 ఓవ‌ర్లు ముగిసేస‌రికి పంజాబ్ కింగ్స్ వికెట్ న‌ష్టోకుండా 51 ప‌రుగులు చేసింది. ప్ర‌బ్‌సిమ్ర‌న్ (5) ప‌రుగుల‌తో ఆడుతున్నాడు.

టాస్‌ ఓడిన పంజాబ్‌
టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిట‌ల్స్ బౌలింగ్ ఎంచుకుంది. పంజాబ్ త‌ర‌ఫున బెన్ ద్వార్షుయిస్ ఐపీఎల్‌లో అరంగేట్రం చేయ‌నున్నాడు. మ‌రోవైపు ఢిల్లీ క్యాపిట‌ల్స్ ఐదు మార్పుల‌తో బ‌రిలోకి దిగింది. అభిషేక్ పొరేల్‌, సాహిల్ ప‌రాక్‌, డేవిడ్ మిల్ల‌ర్‌, అకిబ్ నబీ, మాధ‌వ్ తివారి తుది జ‌ట్టులోకి వ‌చ్చారు.

ఈ మ్యాచ్‌లో గెలిచి పంజాబ్ కింగ్స్ టాప్ ప్లేస్ అందుకోవాల‌ని చూస్తోంది. మ‌రోవైపు పంజాబ్‌తో మ్యాచ్ ఢిల్లీకి చావో రేవో లాంటిది. ప్రస్తుతం ఢిల్లీ 11 మ్యాచ్‌ల్లో 8 పాయింట్లతో 8వ స్థానంలో ఉంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తేనే ఢిల్లీకి ప్లేఆఫ్‌ అవకాశాలు మిగిలి ఉంటాయి. ఓడితే మాత్రం ముంబై, లక్నో తర్వాత ఎలిమినేట్‌ అవనున్న మూడో జట్టుగా ఢిల్లీ క్యాపిటల్స్‌ నిలవనుంది. 

ఈ సీజ‌న్‌లో తొలి అంచె పోటీలో ఢిల్లీ క్యాపిట‌ల్స్‌పై పంజాబ్ కింగ్స్ 6 వికెట్లతో విజ‌యాన్ని అందుకుంది. మొద‌ట ఢిల్లీ 264 ప‌రుగుల భారీ స్కోరు చేసింది. ఆ త‌ర్వాత పంజాబ్ 18.5 ఓవ‌ర్ల‌లోనే 265 ప‌రుగులు చేసి విజ‌యాన్ని అందుకుంది. ముఖాముఖి పోరులో ఇరుజ‌ట్లు 35 సార్లు త‌ల‌డిప‌తే 18 సార్లు పంజాబ్‌, 17 సార్లు ఢిల్లీ నెగ్గింది. 2023 నుంచి చూసుకుంటే ఈ రికార్డు 3-2గా ఉంది. ఇక ధ‌ర్మ‌శాల‌లో ఇరుజ‌ట్లు చెరో 2 విజ‌యాల‌తో స‌మానంగా ఉన్నాయి.

తుది జట్లు:
ఢిల్లీ క్యాపిటల్స్: కేఎల్‌ రాహుల్(వికెట్‌ కీపర్‌), అభిషేక్ పోరెల్, సాహిల్ పరాఖ్, ట్రిస్టన్ స్టబ్స్, డేవిడ్ మిల్లర్, అక్షర్ పటేల్‌(కెప్టెన్‌), మాధవ్ తివారీ, ముఖేష్ కుమార్, ఔకిబ్ నబీ దార్, మిచెల్ స్టార్క్, లుంగి ఎన్గిడి.

పంజాబ్ కింగ్స్: ప్రభ్‌సిమ్రాన్ సింగ్ (వికెట్‌ కీపర్‌), ప్రియాంష్ ఆర్య, కూపర్ కొన్నోలీ, శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్‌), సూర్యాంశ్ షెడ్జ్, మార్కస్ స్టోయినిస్, శశాంక్ సింగ్, మార్కో జాన్సెన్, బెన్ ద్వార్షుయిస్, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్.

ఢిల్లీ క్యాపిటల్స్ ఇంపాక్ట్ సబ్‌లు: పాతుమ్ నిస్సాంక, సమీర్ రిజ్వీ, అశుతోష్ శర్మ, విప్రజ్ నిగమ్, త్రిపురాన విజయ్

పంజాబ్ కింగ్స్ ఇంపాక్ట్ సబ్స్: హర్‌ప్రీత్ బ్రార్, యష్ ఠాకూర్, జేవియర్ బార్ట్‌లెట్, విష్ణు వినోద్, ప్రవీణ్ దూబే

Advertisement
 
Advertisement
Advertisement