punjab kings
-
పోరాడి ఓడిన పంజాబ్.. గుజరాత్‌ను గెలిపించిన సుందర్
ఐపీఎల్ 2026లో భాగంగా ఇవాళ (మే 3) రాత్రి జరిగిన మ్యాచ్‌లో పంజాబ్‌పై గుజరాత్ 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో మరో బంతి మాత్రమే మిగిలుండగా వాషింగ్టన్ సుందర్ (40 నాటౌట్) సిక్సర్ బాది గుజరాత్‌ను గెలిపించాడు. అంతకుముందు సాయి సుదర్శన్ (57) అర్ద సెంచరీతో రాణించి, గెలుపుకు పునాది వేశాడు. అయితే గుజరాత్ వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయి ఒత్తిడికి లోనైంది. దీంతో సునాయాసంగా గెలవాల్సిన మ్యాచ్ చివరి ఓవర్ వరకు సాగింది. ఈ మధ్యలో పంజాబ్ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. బార్ట్లెట్ (4-0-38-2), అర్షదీప్ సింగ్ (4-0-24-2), జన్సెన్ (4-0-33-1), విజయ్ కుమార్ (4-0-31-2) తమ పాత్రలకు న్యాయం చేశారు. ఆఖరి ఓవర్ వేసిన స్టోయినిస్ (2.5-0-26-1) లక్ష్యాన్ని కాపాడలేకపోయాడు. ఈ ఓవర్లో ఓ ఫోర్, ఓ సిక్సర్ వచ్చింది. గుజరాత్ ఇన్నింగ్స్‌లో శుభ్‌మన్ గిల్ (5), నిషాంత్ సంధు (15), తెవాతియా (2), హోల్డర్ (2) తక్కువ స్కోర్లకే ఔట్ కాగా.. బట్లర్ (26) ఓ మోస్తరు స్కోర్ చేశాడు. ఆఖరి ఓవర్ తొలి బంతికి అర్షద్ ఖాన్ (8 నాటౌట్) బౌండరీ బాది లక్ష్యానికి చేరువ చేశాడు.అంతకుముందు పంజాబ్ పడుతూ లేస్తూ చివరికి గౌరవప్రదమైన స్కోర్ చేయగలిగింది. సూర్యాంశ్ షేడ్గే (57), మార్కస్ స్టోయినిస్ (40), ఆఖర్లో మార్కో జన్సెన్ రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. గుజరాత్ బౌలర్లలో జేసన్ హోల్డర్ (4-0-24-4) పంజాబ్‌ను భారీ దెబ్బకొట్టాడు. తొలుత సిరాజ్ (4-0-28-2), రబాడ (4-1-22-2) కూడా పంజాబ్‌ను కష్టాల్లోకి నెట్టారు. మిగతా బౌలర్లలో రషీద్ ఖాన్ (4-0-32-1) పర్వాలేదనిపించగా.. మానవ్ సుతార్ (1-0-27-0), అర్షద్ ఖాన్ (3-0-29-0) ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. పంజాబ్ ఇన్నింగ్స్‌లో ప్రియాంశ్ ఆర్మ 2, ప్రభ్‌సిమ్రన్ 15, కూపర్ కన్నోల్లీ డకౌట్, శ్రేయస్ అయ్యర్ 19, నేహల్ వధేరా, జేవియర్ బార్ట్లెట్ డకౌటయ్యారు. విజయ్ కుమార్, అర్షదీప్ తలో పరుగుతో అజేయంగా నిలిచారు. -
పంజాబ్‌పై గుజరాత్ గెలుపు
పంజాబ్‌పై గుజరాత్ గెలుపుఐపీఎల్ 2026లో భాగంగా ఇవాళ (మే 3) రాత్రి జరిగిన మ్యాచ్‌లో పంజాబ్‌పై గుజరాత్ 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో మరో బంతి మాత్రమే మిగిలుండగా వాషింగ్టన్ సుందర్ (40 నాటౌట్) సిక్సర్ బాది గుజరాత్‌ను గెలిపించాడు. అంతకుముందు సాయి సుదర్శన్ (57) అర్ద సెంచరీతో రాణించి, గెలుపుకు పునాది వేశాడు. అయితే గుజరాత్ వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయి ఒత్తిడికి లోనైంది. దీంతో సునాయాసంగా గెలవాల్సిన మ్యాచ్ చివరి ఓవర్ వరకు సాగింది. ఈ మధ్యలో పంజాబ్ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. బార్ట్లెట్ (4-0-38-2), అర్షదీప్ సింగ్ (4-0-24-2), జన్సెన్ (4-0-33-1), విజయ్ కుమార్ (4-0-31-2) తమ పాత్రలకు న్యాయం చేశారు. ఆఖరి ఓవర్ వేసిన స్టోయినిస్ (2.5-0-26-1) లక్ష్యాన్ని కాపాడలేకపోయాడు. ఈ ఓవర్లో ఓ ఫోర్, ఓ సిక్సర్ వచ్చింది. గుజరాత్ ఇన్నింగ్స్‌లో శుభ్‌మన్ గిల్ (5), నిషాంత్ సంధు (15), తెవాతియా (2), హోల్డర్ (2) తక్కువ స్కోర్లకే ఔట్ కాగా.. బట్లర్ (26) ఓ మోస్తరు స్కోర్ చేశాడు. ఆఖరి ఓవర్ తొలి బంతికి అర్షద్ ఖాన్ (8 నాటౌట్) బౌండరీ బాది లక్ష్యానికి చేరువ చేశాడు.నాలుగో వికెట్ కోల్పోయిన గుజరాత్14.5వ ఓవర్- 124 పరుగుల వద్ద గుజరాత్ నాలుగో వికెట్ కోల్పోయింది. విజయ్ కుమార్ బౌలింగ్‌లో బార్ట్లెట్కు క్యాచ్ ఇచ్చి సాయి సుదర్శన్ (57) ఔటయ్యాడు.మూడో వికెట్ కోల్పోయిన గుజరాత్11.3వ ఓవర్- 94 పరుగుల వద్ద గుజరాత్ మూడో వికెట్ కోల్పోయింది. స్టోయినిస్ బౌలింగ్‌లో విజయ్ కుమార్‌కు క్యాచ్ ఇచ్చి నిషాంత్ సింధు (15) ఔటయ్యాడు.రెండో వికెట్ కోల్పోయిన గుజరాత్8.1వ ఓవర్- 69 పరుగుల వద్ద గుజరాత్ రెండో వికెట్ కోల్పోయింది. విజయ్ కుమార్ బౌలింగ్‌లో శ్రేయస్ అయ్యర్‌కు క్యాచ్ ఇచ్చి బట్లర్ (26) ఔటయ్యాడు. ఆదిలోనే గుజరాత్‌కు షాక్1.3వ ఓవర్: 164 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనలో గుజరాత్‌కు ఆదిలోనే షాక్ తగిలింది. ఆ జట్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (5) రెండో ఓవర్లోనే అర్షదీప్ బౌలింగ్‌లో కూపర్ కన్నోల్లీకి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. పంజాబ్ స్కోర్ 163-9టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ పడుతూ లేస్తూ చివరికి గౌరవప్రదమైన స్కోర్ చేయగలిగింది. సూర్యాంశ్ షేడ్గే (57), మార్కస్ స్టోయినిస్ (40), ఆఖర్లో మార్కో జన్సెన్ రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. గుజరాత్ బౌలర్లలో జేసన్ హోల్డర్ (4-0-24-4) పంజాబ్‌ను భారీ దెబ్బకొట్టాడు. తొలుత సిరాజ్ (4-0-28-2), రబాడ (4-1-22-2) కూడా పంజాబ్‌ను కష్టాల్లోకి నెట్టారు. మిగతా బౌలర్లలో రషీద్ ఖాన్ (4-0-32-1) పర్వాలేదనిపించగా.. మానవ్ సుతార్ (1-0-27-0), అర్షద్ ఖాన్ (3-0-29-0) ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. పంజాబ్ ఇన్నింగ్స్‌లో ప్రియాంశ్ ఆర్మ 2, ప్రభ్‌సిమ్రన్ 15, కూపర్ కన్నోల్లీ డకౌట్, శ్రేయస్ అయ్యర్ 19, నేహల్ వధేరా, జేవియర్ బార్ట్లెట్ డకౌటయ్యారు. విజయ్ కుమార్, అర్షదీప్ తలో పరుగుతో అజేయంగా నిలిచారు. పతనం అంచుల్లో పంజాబ్పంజాబ్ కింగ్స్ మరోసారి వరుస బంతుల్లో వికెట్లు కోల్పోయింది. తొలి ఓవర్లో సిరాజ్, 18వ ఓవర్లో హోల్డర్ ఈ ఘనత సాధించారు. తాజాగా హోల్డర్ స్టోయినిస్ (40), బార్ట్లెట్ (0)ను వరుస బంతుల్లో ఔట్ చేశాడు. ఆరో వికెట్ కోల్పోయిన పంజాబ్15.6వ ఓవర్- 126 పరుగుల వద్ద పంజాబ్ ఆరో వికెట్ కోల్పోయింది. రబాడ బౌలింగ్‌లో సూర్యాంశ్ షేడ్గే (57) ఔటయ్యాడు. పీకల్లోతు కష్టాల్లో పంజాబ్8.4వ ఓవర్- 47 పరుగుల వద్ద పంజాబ్ ఐదో వికెట్ కోల్పోయింది. హోల్డర్ బౌలింగ్‌లో శ్రేయస్ అయ్యర్ (19) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. కష్టాల్లో పంజాబ్6.3వ ఓవర్- పంజాబ్ జట్టు కష్టాల్లో పడింది. 36 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. తాజాగా నేహల్ వధేరాను (0) హోల్డర్ ఔట్ చేశాడు. బట్లర్ అద్భుతమైన క్యాచ్ పట్టాడు. మూడో వికెట్ కోల్పోయిన పంజాబ్5.2వ ఓవర్- 35 పరుగుల వద్ద పంజాబ్ మూడో వికెట్ కోల్పోయింది. రబాడ బౌలింగ్‌లో మానవ్ సుతార్‌కు క్యాచ్ ఇచ్చి ప్రభ్‌సిమ్రన్ సింగ్ (15) ఔటయ్యాడు. తొలి ఓవర్లోనే 2 వికెట్లు కోల్పోయిన పంజాబ్పంజాబ్ తొలి ఓవర్లోనే 2 వికెట్లు కోల్పోయింది. సిరాజ్ వరుస బంతుల్లో ప్రియాంశ్ ఆర్య (2), కన్నోల్లీ (0)ని ఔట్ చేశాడు.తొలి వికెట్ కోల్పోయిన పంజాబ్0.2వ ఓవర్- ఇన్నింగ్స్ రెండో బంతికే పంజాబ్ తొలి వికెట్ కోల్పోయింది. సిరాజ్ బౌలింగ్‌లో నిషాంత్ సంధుకు క్యాచ్ ఇచ్చి ప్రియాంశ్ ఆర్మ (2) ఔటయ్యాడు.టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నగుజరాత్ఐపీఎల్ 2026లో భాగంగా ఇవాళ (మే 3) జరుగుతున్న 46వ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్ తలపడుతున్నాయి. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరిగే ఈ మ్యాచ్‌లో గుజరాత్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ప్రస్తుతం పంజాబ్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉండగా.. గుజరాత్ ఐదో స్థానంలో ఉంది. పంజాబ్ 8 మ్యాచ్‌ల్లో 6 విజయాలు సాధించి, ఓ మ్యాచ్‌లో ఓడగా.. గుజరాత్ 9 మ్యాచ్‌ల్లో 5 విజయాలు, 4 అపజయాలు ఎదుర్కొంది.తుది జట్లు..పంజాబ్ కింగ్స్ (ప్లేయింగ్ XI): ప్రభ్సిమ్రాన్ సింగ్ (w), ప్రియాంష్ ఆర్య, కూపర్ కొన్నోలీ, శ్రేయాస్ అయ్యర్ (సి), మార్కస్ స్టోయినిస్, సూర్యాంశ్ షెడ్జ్, నెహాల్ వధేరా, మార్కో జాన్సెన్, జేవియర్ బార్ట్లెట్, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్ గుజరాత్ టైటాన్స్ (ప్లేయింగ్ XI): శుభమన్ గిల్(సి), సాయి సుదర్శన్, జోస్ బట్లర్(w), వాషింగ్టన్ సుందర్, నిశాంత్ సింధు, జాసన్ హోల్డర్, రషీద్ ఖాన్, అర్షద్ ఖాన్, కగిసో రబడ, మహ్మద్ సిరాజ్, మానవ్ సుతార్ -
IPLలో నేడు డబుల్ ధమాకా
-
సంజూ, కిషన్‌లకు పోటీ.. టీమిండియా వైపు దూసుకొస్తున్న సరికొత్త ప్లేయర్
ప్రస్తుత భారత టీ20 జట్టులో సంజూ శాంసన్, ఇషాన్ కిషన్ రూపంలో అద్బుతమైన ఇద్దరు వికెట్ కీపర్లు ఉన్నారు. ఇటీవల ముగిసిన టీ20 ప్రపంచకప్‌లోనూ వీరిద్దరూ సత్తాచాటారు. అయితే వీరికి పోటీగా ఇప్పుడు మరో వికెట్ కీపర్ బ్యాటర్ టీమిండియా వైపు దూసుకొస్తున్నాడు. అతడే పంజాబ్ కింగ్స్ ఆటగాడు ప్రభ్సిమ్రాన్ సింగ్. ఐపీఎల్-2026లో ప్రభ్సిమ్రాన్ అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తున్నాడు. ఓపెనర్‌గా పంజాబ్ కింగ్స్‌కు అతడు మెరుపు ఆరంభాలను అందిస్తున్నాడు. ప్రభ్సిమ్రాన్ ఇప్పటివరకు ఆడిన 8 మ్యాచ్‌ల్లో 57.67 సగటుతో 346 పరుగులు సాధించాడు. ఇందులో 4 అర్ధసెంచరీలు ఉన్నాయి. మంగళవారం రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ అతడు హాఫ్ సెంచరీతో మెరిశాడు. ప్రభుసిమ్రాన్ తన ప్రదర్శనలతో నిలకడగా మారుపేరుగా మారాడు. గత సీజన్లోనూ అతడు సత్తాచాటాడు. ఐపీఎల్లో మాత్రమే కాకుండా దేశవాళీ టోర్నీల్లోనూ ప్రభుసిమ్రాన్ అదరగొట్టాడు. విజయ్ హజారే ట్రోఫీ 2025-26లో పంజాబ్ తరపున 9 వన్డే మ్యాచ్‌ల్లో 55.38 సగటుతో 443 పరుగులు చేశాడు. అదేవిధంగా ఆస్ట్రేలియా-ఏతో జరిగిన వన్డే సిరీస్‌లో భారత్-ఎ తరపున 102 (68 బంతుల్లో) మెరుపు సెంచరీతో చెలరేగాడు. అప్పటిలోనే అతడిని సీనియర్ జట్టులోకి తీసుకోవాలని డిమాండ్లు వినిపించాయి.సంజూ, కిషన్ స్ధానాలకు ఎసరు!ప్రభుసిమ్రాన్ తన సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తుండడంతో అతడిని భారత జట్టు ఎంపిక చేయాలన్న వాదన మరోసారి వినిపిస్తోంది. అయితే టీ20 జట్టులో సంజూ శాంసన్, కిషన్ ఉండడంతో అతడికి చోటు దక్కే అవకాశం లేదు. కానీ వీరిద్దరిలో ఎవరైన విఫలమైతే కచ్చితంగా బ్యాకప్‌గా ప్రభ్సిమ్రాన్ ఉంటాడు. కాబట్టి వారిద్దరూ ప్రభ్సిమ్రాన్ను దృష్టిలో పెట్టుకుని ఆడాల్సి ఉంటుంది. ఏ మాత్రం తేడా వచ్చినా వారు జట్టులో చోటు కోల్పోక తప్పదు. అయితే ఈ ఏడాది జూన్‌లో అఫ్గానిస్తాన్‌తో జరిగే వన్డే సిరీస్‌కు ప్రభ్సిమ్రాన్ ఎంపికయ్యే అవకాశముంది. ఈ సిరీస్‌కు రెగ్యులర్ వికెట్ కీపర్లు కేఎల్ రాహుల్, ధ్రువ్ జురెల్ వంటి వికెట్ కీపర్ బ్యాటర్లకు సెలక్టర్లు విశ్రాంతి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. దీంతో ప్రభ్సిమ్రాన్ను వికెట్ కీపర్‌గా ఎంపిక చేయాలని బీసీసీఐ సెలక్షన్ కమిటీ భావిస్తున్నట్లు సమాచారం. అతడితో యశస్వి జైశ్వాల్, రుతురాజ్ గైక్వాడ్‌లు కూడా అఫ్గాన్‌తో వన్డేల్లో ఆడనున్నట్లు సమాచారం.చదవండి: IND vs AFG: టీమిండియా కెప్టెన్‌గా రిషబ్ పంత్.. ? వారికి లక్కీ ఛాన్స్? -
తొలి ఓటమితో తడబడిన పంజాబ్ కింగ్స్.. దంచికొట్టిన రాజస్థాన్ రాయల్స్..
-
అదే మా కొంపముంచింది.. అతడు మాత్రం అద్భుతం: శ్రేయస్
ఐపీఎల్-2026లో పంజాబ్ కింగ్స్‌కు తొలి ఓటమి ఎదురైంది. మంగళవారం ముల్లాన్‌పూర్ వేదికగా రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో పంజాబ్ పరాజయం పాలైంది. 223 పరుగుల భారీ లక్ష్యాన్ని పంజాబ్ బౌలర్లు కాపాడుకోలేకపోయారు. ఈ కొండంత లక్ష్యాన్ని రాజస్తాన్ కేవలం 4 వికెట్లు మాత్రమే కోల్పోయి 19.2 ఓవర్లలో ఊదిపడేసింది.రాయల్స్ బ్యాటర్లలో యశస్వి జైస్వాల్ (51), డోనోవన్ ఫెరీరా ( 26 బంతుల్లో 52*), వైభవ్ సూర్యవంశీ(43), శుభమ్ దూబే(12 బంతుల్లో 31) అద్భుత ఇన్నింగ్స్‌లు ఆడారు. తమకు ఎదురైన తొలి పరాజయంపై మ్యాచ్ అనంతరం పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ స్పందించాడు. బౌలింగ్ వైఫల్యం కారణంగానే తాము ఓడిపోయామని అయ్యర్ చెప్పుకొచ్చాడు."ఈ వికెట్‌పై 222 పరుగులు చేయడం చాలా గొప్ప విషయం. పిచ్ కాస్త నెమ్మదిగా ఉన్నప్పటికి మా బ్యాటర్లు అద్భుతమైన ప్రదర్శన కనబరిచారు. కచ్చితంగా వారికి క్రెడిట్ ఇవ్వాల్సిందే. అయినప్పటికి ఈ భారీ స్కోర్‌ను డిఫెండ్ చేసుకోలేకపోవడం నిరాశ కలిగించింది. బౌలింగ్‌లో మా ప్రణాళికలను సరిగ్గా అమలు చేయలేకపోయాము. మేము ఎక్కువగా స్లో బాల్స్, యార్కర్లు వేయాలని ప్లాన్ చేసుకున్నాం.కానీ మేము అనుకున్నది చేయలేకపోయాము. మిడిల్ ఓవర్లలో రాజస్తాన్ బ్యాటర్లు అద్భుతమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ముఖ్యంగా ఫెరీరా, శుభమ్ దుబే చివరి ఓవర్లలో కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. వారిద్దరి మధ్య నెలకొన్ని భాగస్వామ్యమే మ్యాచ్‌ను మా నుంచి దూరం చేసింది. ప్రస్తుతం టీ20 ఫార్మాట్లో బ్యాటర్లు మొదటి బంతి నుంచే విరుచుకుపడుతున్నారు.కాబట్టి బౌలర్లు పక్కా ప్లాన్‌తో రావడం కష్టమైన పని. ఈ రోజు మాకు బౌలింగ్‌లో కలిసిరాలేదు అంతే. ఇక నిరంతర ప్రయాణాలు, మ్యాచ్‌ల వల్ల మేము కాస్త అలిసిపోయాము. కానీ దాన్ని సాకుగా చెప్పలేము. మా తదుపరి మ్యాచ్‌కు కాస్త విరామం దొరికింది. మళ్లీ మా ప్రణాళికలు సిద్దం చేసుకుని బలంగా తిరిగి వస్తాం.ఈ సీజన్లో మాకు ఇది తొలి ఓటమి. ఈ ఓటమి నుచి చాలా పాఠాలు నేర్చుకున్నాము. మేము ఇప్పటికే 200 పరుగులకు పైగా ఛేజ్ చేశాం, అదే టార్గెట్‌ను డిఫెండ్ కూడా చేశాం. కాబట్టి ఈ మ్యాచ్ ఫలితం గురుంచి పెద్దగా ఆలోచించం. అదేవిధంగా ఈ మ్యాచ్‌లో మా స్పిన్నర్లు హర్‌ప్రీత్ బ్రార్, చాహల్ అద్భుతంగా రాణించారు. ముఖ్యంగా హర్‌ప్రీత్‌కు ఈ సీజన్లో ఇదే తొలి మ్యాచ్. అయినప్పటికి అతడు తన 4 ఓవర్లలో కేవలం 25 పరుగులు ఇచ్చి మా టీమ్‌లో బెస్ట్ బౌలర్‌గా నిలిచాడు"అని పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్‌లో అయ్యర్ పేర్కొన్నాడు. పంజాబ్ తమ తదుపరి మ్యాచ్‌లో మే 3న అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో తలపడనుంది.చదవండి: IPL 2026: జైలుకు రియాన్ పరాగ్? -
ఫెరియెరా ఊచకోత.. పంజాబ్‌కు ఓటమి రుచి చూపించిన రాజస్థాన్
ఐపీఎల్ 2026లో వరుస విజయాలతో దూసుకుపోతూ, ఏకైక అజేయ జట్టుగా చలామణి అవుతున్న పంజాబ్ కింగ్స్‌కు రాజస్థాన్ రాయల్స్ ఓటమి రుచి చూపించింది. సొంతగడ్డ ముల్లాన్‌పూర్ వేదికగా ఇవాళ జరిగిన మ్యాచ్‌లో పంజాబ్‌పై రాజస్థాన్ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 222 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఆఖర్లో స్టోయినిస్ (22 బంతుల్లో 62 నాటౌట్; 4 ఫోర్లు, 6 సిక్సర్లు) ప్రత్యర్ది బౌలర్లను ఊచకోత కోశాడు. ముఖ్యంగా బ్రిజేష్ శర్మ వేసిన చివరి ఓవర్లో స్టోయినిస్ పూనకం వచ్చినట్లు ఊగిపోయాడు. ఆ ఓవర్లో వరుసగా 4, 6, 6, 4, 4 సాధించాడు. అంతకుముందు ప్రభ్‌సిమ్రన్ (59) అర్ద సెంచరీతో రాణించాడు. మిగతా పంజాబ్ ఆటగాళ్లలో ప్రియాంశ్ ఆర్య (29), కూపర్ కన్నోల్లీ (30), శ్రేయస్ అయ్యర్ (30) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. రాయల్స్ బౌలర్లలో యశ్ రాజ్ పుంజా 2, ఆర్చర్, బర్గర్ తలో వికెట్ తీశారు.అనంతరం 223 పరుగుల లక్ష్యాన్ని రాజస్థాన్ 19.2 ఓవర్లలో 4 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయవంతంగా ఛేదించింది. డొనోవన్ ఫెరియెరా (52 నాటౌట్), షుభమ్ దూబే (31 నాటౌట్) ఊచకోత కోసి రాయల్స్‌ను విజయతీరాలకు చేర్చారు. అంతకుముందు యశస్వి జైస్వాల్ (51), వైభవ్ సూర్యవంశీ (43) తమ సహజశైలిలో రెచ్చిపోయి రాయల్స్ గెలుపుకు గట్టి పునాది వేశారు. ఆతర్వాత వచ్చిన ధృవ్ జురెల్ (16) కాస్త తడబడినప్పటికీ.. అతని తర్వాత వచ్చిన రియాన్ పరాగ్ (29) ఓ మోస్తరు ఇన్నింగ్స్ ఆడాడు. ఇతని తర్వాత క్రీజ్‌లో కుదురుకున్న ఫెరియెరా, షుభమ్ మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడి తమ జట్టును విజయతీరాలకు చేర్చారు. పంజాబ్ బౌలర్లలో చహల్ 3, అర్షదీప్ ఓ వికెట్ తీశారు. -
పంజాబ్ ఆటగాళ్లు నల్ల బ్యాండ్ ధరించడం వెనుక హృదయ విదారక కారణం
ఐపీఎల్ 2026లో భాగంగా ఇవాళ (ఏప్రిల్ 28) రాజస్థాన్ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ ఆటగాళ్లు నల్లటి ఆర్మ్ బ్యాండ్స్ ధరించి కనిపించారు. దీని వెనుక హృదయ విదారక కారణం ఉంది. ఆ జట్టు స్టార్ ఆల్‌రౌండర్ అజ్మతుల్లా ఒమర్జాయ్ నిన్న తన తల్లిని కోల్పోయారు.ఇందుకు సంతాపంగా పంజాబ్ కింగ్స్ బృంద సభ్యులు మొత్తం నల్ల బ్యాండ్లు ధరించారు. ఈ మ్యాచ్ టాస్ సందర్భంగా పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఈ విషయాన్ని ప్రస్తావించారు. ఒమర్జాయ్ తల్లి మరణం పట్ల ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఇదే విషయాన్ని పంజాబ్ కింగ్స్ తమ సోషల్‌మీడియా ఖాతాల్లో కూడా పోస్ట్ చేసింది."అజ్మతుల్లా ఒమర్జాయ్ తల్లి మరణం పట్ల మా ప్రగాఢ సానుభూతి. ఈ క్లిష్ట సమయంలో పంజాబ్ కింగ్స్ కుటుంబం మొత్తం అతనితో పాటు అతని కుటుంబ సభ్యులకు అండగా ఉంటుంది" అని పేర్కొంది.ఒమర్జాయ్ తన తల్లి అంత్యక్రియల నిమిత్తం స్వదేశానికి వెళ్లాడు. జట్టు కూర్పు సమస్యల కారణంగా ఒమర్జాయ్కు ఈ సీజన్లో ఒక్క మ్యాచ్ ఆడే అవకాశం కూడా రాలేదు. గత సీజన్లో పంజాబ్ తరఫున అతడు కొన్ని కీలక ప్రదర్శనలు చేశాడు. ముఖ్యంగా బౌలింగ్‌లో తనదైన ముద్ర వేశాడు.ఒమర్జాయ్ ఐపీఎల్ ప్రయాణం ఇప్పటివరకు ఆశించిన స్థాయిలో సాగలేదు. 2024లో గుజరాత్ టైటాన్స్ తరఫున అరంగేట్రం చేసిన అతడు, ఆ తర్వాత పంజాబ్ కింగ్స్‌లో చేరాడు.ఇదిలా ఉంటే, ముల్లాన్‌పూర్ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేస్తున్న పంజాబ్ 18 ఓవర్ల తర్వాత 4 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. ప్రభ్‌సిమ్రన్ (59), ప్రియాంశ్ ఆర్య (29), కూపర్ కన్నోల్లీ (30), శ్రేయస్ అయ్యర్ (30) ఔట్ కాగా.. స్టోయినిస్ (24), సూర్యంశ్ (0) క్రీజ్‌లో ఉన్నారు. ఈ సీజన్లో పంజాబ్ అజేయ జట్టుగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. -
ప్రీతి జింటా దిమ్మతిరిగే కౌంటర్.. షాక్‌లో చాహల్!
ఐపీఎల్ 2026 సీజన్లో పంజాబ్ కింగ్స్ తిరుగులేని విజయాలతో దూసుకుపోతోంది. ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో 6 విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతున్న పంజాబ్ కింగ్స్ క్యాంపులో ప్రస్తుతం సందడి నెలకొంది. ఈ క్రమంలో ఆ జట్టు స్పిన్నర్ యజ్వేంద్ర చాహల్, ఫ్రాంచైజీ ఓనర్ ప్రీతి జింటాల మధ్య జరిగిన ఓ సరదా సంభాషణ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.అయితే పంజాబ్ కింగ్స్ వరుస విజయాలతో ఫుల్ జోష్‌లో ఉండటంతో, యజ్వేంద్ర చాహల్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ప్రీతి జింటాను ఉద్దేశించి సరదాగా పోస్టు పెట్టాడు. ‘మేడమ్.. నాకు ఒక మ్యాచ్‌లో ఓపెనర్‌గా బ్యాటింగ్ చేసే అవకాశం ఇస్తారా?’ అని సరదాగా అడిగాడు. దీనికి ప్రీతి జింటా తనదైన శైలిలో స్పందిస్తూ.. ‘తప్పకుండా చాహల్.. నీ కోసం ఏదైనా చేస్తాను. ఐపీఎల్ ముగిసిన తర్వాత నీకు నచ్చిన మ్యాచ్‌లో ఓపెనింగ్ చేయొచ్చు. అప్పుడు ప్రబ్‌సిమ్రన్, ప్రియాన్ష్ ఆర్య కూడా ఏమీ అనుకోరని నాకు తెలుసు’ అంటూ లాఫింగ్ ఎమోజీ జత చేస్తూనే తనదైన శైలిలో దిమ్మతిరిగే కౌంటర్ ఇవ్వడంతో చాహల్ షాక్ తినక తప్పలేదు.ఇక ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ భారీ విజయాన్ని అందుకుంది. ఐపీఎల్ చరిత్రలో ఏ జట్టుకు సాధ్యం కాని రీతిలో 265 పరుగుల లక్ష్యాన్ని ఉఫ్ అని ఊదేసిన పంజాబ్ పలు రికార్డులు తన పేరిట లిఖించింది. ఇప్పటికే పట్టికలో టాప్ స్థానంలో కొనసా గుతున్న పంజాబ్ ఇదే తరహా ఆటతీరు ప్రదర్శిస్తే ప్లేఆఫ్స్‌కు చేరే తొలి జట్టుగా కూడా నిలవనుంది. గతేడాది ఆర్సీబీ చేతిలో ఓడి రన్నరప్‌కే పరిమితమైన పంజాబ్ ఈసారి టైటిల్ కొట్టాలనే దృడ సంకల్పంతో ఉంది.Mam ek match mein open batting karne ka chance mil jaaye toh 🥹🤣🤣😁 #pzchat— Yuzvendra Chahal (@yuzi_chahal) April 27, 2026చదవండి: వైరల్‌గా మారిన జితేశ్ శర్మ చర్య! -
పంజాబ్‌పై రాజస్థాన్ గెలుపు
పంజాబ్‌పై రాజస్థాన్ గెలుపుఅనంతరం 223 పరుగుల లక్ష్యాన్ని రాజస్థాన్ 19.2 ఓవర్లలో 4 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయవంతంగా ఛేదించింది. డొనోవన్ ఫెరియెరా (52 నాటౌట్), షుభమ్ దూబే (31 నాటౌట్) ఊచకోత కోసి రాయల్స్‌ను విజయతీరాలకు చేర్చారు. నాలుగో వికెట్ కోల్పోయిన రాజస్థాన్13.6వ ఓవర్- 151 పరుగుల వద్ద రాజస్థాన్ నాలుగో వికెట్ కోల్పోయింది. చహల్ బౌలింగ్‌లో షెడ్గేకు క్యాచ్ ఇచ్చి రియాన్ పరాగ్ (29) ఔటయ్యాడు.మూడో వికెట్ కోల్పోయిన రాజస్థాన్11.2వ ఓవర్- 123 పరుగుల వద్ద రాజస్థాన్ మూడో వికెట్ కోల్పోయింది. చహల్ బౌలింగ్‌లో షెడ్గేకు క్యాచ్ ఇచ్చి జైస్వాల్ (51) ఔటయ్యాడు. రెండో వికెట్ కోల్పోయిన రాజస్థాన్9.4వ ఓవర్- 105 పరుగుల వద్ద రాజస్థాన్ రాయల్స్ రెండో వికెట్ కోల్పోయింది. చహల్ బౌలింగ్‌లో జన్సెన్కు క్యాచ్ ఇచ్చి జురెల్ (16) ఔటయ్యాడు. వైభవ్ సూర్యవంశీ ఔట్3.2వ ఓవర్- 51 పరుగుల వద్ద రాజస్థాన్ తొలి వికెట్ కోల్పోయింది. అర్షదీప్ బౌలింగ్‌లో శ్రేయస్ అయ్యర్ క్యాచ్ పట్టడంతో వైభవ్ సూర్యవంశీ (43) ఔటయ్యాడు.పంజాబ్ భారీ స్కోర్‌టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ భారీ స్కోర్ (222-4) చేసింది. ఆఖర్లో స్టోయినిస్ (22 బంతుల్లో 62 నాటౌట్; 4 ఫోర్లు, 6 సిక్సర్లు) ప్రత్యర్ది బౌలర్లను ఊచకోత కోశాడు. ముఖ్యంగా బ్రిజేష్ శర్మ వేసిన చివరి ఓవర్లో స్టోయినిస్ పూనకం వచ్చినట్లు ఊగిపోయాడు. ఆ ఓవర్లో వరుసగా 4, 6, 6, 4, 4 సాధించాడు. అంతకుముందు ప్రభ్‌సిమ్రన్ (59) అర్ద సెంచరీతో రాణించాడు. మిగతా పంజాబ్ ఆటగాళ్లలో ప్రియాంశ్ ఆర్య (29), కూపర్ కన్నోల్లీ (30), శ్రేయస్ అయ్యర్ (30) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. రాయల్స్ బౌలర్లలో యశ్ రాజ్ పుంజా 2, ఆర్చర్, బర్గర్ తలో వికెట్ తీశారు. నాలుగో వికెట్ కోల్పోయిన పంజాబ్17.6వ ఓవర్- 181 పరుగుల వద్ద పంజాబ్ నాలుగో వికెట్ కోల్పోయింది. బర్గర్ బౌలింగ్‌లో జురెల్‌కు క్యాచ్ ఇచ్చి శ్రేయస్ అయ్యర్ (30) ఔటయ్యాడు. మూడో వికెట్ కోల్పోయిన పంజాబ్13.6వ ఓవర్- 144 పరుగుల వద్ద పంజాబ్ మూడో వికెట్ కోల్పోయింది. రాజ్ పుంజా బౌలింగ్‌లో రియాన్ పరాగ్‌కు క్యాచ్ ఇచ్చి ప్రభ్‌సిమ్రన్ (59) ఔటయ్యాడు.రెండో వికెట్ కోల్పోయిన పంజాబ్8.2వ ఓవర్- 96 పరుగుల వద్ద పంజాబ్ రెండో వికెట్ కోల్పోయింది. యశ్ పుంజా బౌలింగ్‌లో ఫెరియెరాకు క్యాచ్ ఇచ్చి కూపర్ కన్నోల్లీ (30) ఔటయ్యాడు. 7 ఓవర్ల తర్వాత 80-17 ఓవర్ల తర్వాత పంజాబ్ స్కోర్ 80-1గా ఉంది. ప్రభ్‌సిమ్రన్ 27, కూపర్ కన్నోల్లీ 19 పరుగులతో అజేయంగా ఉన్నారు. తొలి వికెట్ కోల్పోయిన పంజాబ్2.5వ ఓవర్- క్రీజ్‌లో ఉన్నంతసేపు మెరుపులు మెరిపించిన ప్రియాంశ్ ఆర్మ (29) ఆర్చర్ బౌలింగ్‌లో బర్గర్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న రాజస్థాన్‌ఐపీఎల్ 2026లో భాగంగా ఇవాళ (ఏప్రిల్ 28) జరుగనున్న 40వ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ తలపడుతున్నాయి. పంజాబ్ హోం గ్రౌండ్ అయిన ముల్లాన్‌పూర్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.ప్రస్తుత ఎడిషన్‌లో ఏకైక అజేయ జట్టుగా కొనసాగుతున్న పంజాబ్ (7 మ్యాచ్‌ల్లో 6 విజయాలు, వర్షం కారణంగా ఓ మ్యాచ్ రద్దు) పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. రాజస్థాన్ 8 మ్యాచ్‌ల్లో 5 విజయాలతో నాలుగో స్థానంలో ఉంది. ఈ మ్యాచ్ కోసం రాజస్థాన్ రెండు మార్పులు చేసింది. హెట్‌మైర్ స్థానంలో షనక, రవి బిష్ణోయ్ స్థానంలో యశ్ రాజ్ తుది జట్టులోకి వచ్చారు. మరోవైపు పంజాబ్ కూడా ఈ మ్యాచ్ కోసం రెండు మార్పులు చేసింది. సూర్యంశ్ షెడ్గే, లోకీ ఫెర్గూసన్ తుది జట్టులోకి వచ్చారు.తుది జట్లు..రాజస్థాన్ రాయల్స్ (ప్లేయింగ్ XI): వైభవ్ సూర్యవంశీ, యశస్వి జైస్వాల్, ధ్రువ్ జురెల్(w), రియాన్ పరాగ్(c), డోనోవన్ ఫెరీరా, రవీంద్ర జడేజా, దసున్ షనక, జోఫ్రా ఆర్చర్, నాంద్రే బర్గర్, బ్రిజేష్ శర్మ, యశ్ రాజ్ పుంజాపంజాబ్ కింగ్స్ (ప్లేయింగ్ XI): ప్రభ్సిమ్రాన్ సింగ్ (w), ప్రియాంష్ ఆర్య, శ్రేయాస్ అయ్యర్ (సి), కూపర్ కొన్నోలీ, సూర్యాంశ్ షెడ్జ్, నెహాల్ వధేరా, మార్కస్ స్టోయినిస్, మార్కో జాన్సెన్, లోకీ ఫెర్గూసన్, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్ -
‘నన్ను రెచ్చగొట్టారు’.. శ్రేయస్ అయ్యర్ కీలక వ్యాఖ్యలు!
పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఐపీఎల్ 2026 సీజన్లో దుమ్మురేపుతున్నాడు. పరిమిత ఓవర్ల క్రికెట్లో వైవిధ్యమైన ఆటతో శ్రేయస్ తన ముద్ర ఎప్పుడో వేశాడు. టీమిండియా తరఫున వన్డేల్లో నిలకడగా మారుపేరుగా నిలిచిన శ్రేయస్ టీ20ల్లో మాత్రం ఆ స్థాయి ఆటను ప్రదర్శించడంలో విఫలమయ్యాడు. కానీ ఇప్పుడు ఐపీఎల్లో మాత్రం అదే టీ20ల్లో తన కెరీర్ బెస్ట్ ఫామ్ కనబరుస్తున్నాడు. ఇప్పుడు పంజాబ్ కింగ్స్‌కు అతనొక కెప్టెన్ మాత్రమే కాదు.. బ్యాటర్‌గా, ఫినిషర్‌గానూ సత్తా చాటుతూ అన్ని పాత్రలను సమర్థంగా పోషిస్తున్నాడు. అయితే ఈ మార్పు వెనుక తనను చికాకు పెట్టేలా కొంతమంది చేసిన వ్యాఖ్యలు ఇప్పటికీ తన మైండ్‌లో ఉన్నట్లు శ్రేయస్ అయ్యర్ వెల్లడించాడు. ఆ వ్యాఖ్యలతో తనను రెచ్చగొట్టారని, జనాలు అనుకుంటున్నది తప్పు అని నిరూపించాలని నిర్ణయించుకున్నట్లు అయ్యర్ తెలిపాడు. జియో హాట్‌స్టార్ నిర్వహించిన బిలీవ్ కార్యక్రమానికి హాజరైన అయ్యర్ మాట్లాడాడు. ముఖ్యంగా షార్ట్ బాల్స్ ఎదుర్కోవడంలో తనకు బలహీనత ఉందన్న విమర్శలపై ఘాటుగా స్పందించాడు. ఆ కసి ఎంతలా ఉందంటే, ప్రపంచ అత్యుత్తమ బౌలర్ జస్రీత్ బుమ్రా వేసిన బౌన్సర్ ను అద్భుతమైన సిక్సర్‌గా మలచి తన విమర్శకుల నోళ్లు మూయించాడు.అయ్యర్ మాట్లాడుతూ.. ‘నీ వల్ల కాదు, ఈ పరిస్థితిలో నువ్వు రాణించలేవు అని ఎవరైనా అంటే నేను అస్సలు తట్టుకోలేను. అత్యున్నత స్థాయిలో ఆడుతున్న ఒక క్రికెటర్‌గా దానిని ఏమాత్రం అంగీకరించలేను. అందుకే నన్ను విమర్శించే వారు తప్పు అని నిరూపించాలని బలంగా నిర్ణయించుకున్నా’ అని తెలిపాడు.ఇక వెన్ను గాయం కారణంగా జట్టుకు దూరమైనప్పుడు కూడా తనపై వచ్చిన ప్రతికూల వ్యాఖ్యలపై కూడా అయ్యర్ స్పందించాడు. ‘గాయం తర్వాత అయ్యర్ మునుపటిలా ఆడలేడు అన్న మాటలు బాగా వినిపించాయి. అయితే గాయం తర్వాత మన ఆలోచనా విధానం ఎలా ఉంది అనేదే ముఖ్యమని, దేనికి ప్రాధాన్యత ఇవ్వాలి, వేటిని విస్మరించాలి అనే విషయంలో నాకు స్పష్టత ఉంది. షార్ట్ బాల్ సమస్యను పరిష్కరించుకోవడానికి ప్రవీణ్ ఆమ్రే, అభిషేక్ నాయర్ వంటి కోచ్‌ల సలహాలు తీసుకుంటూ కఠోరంగా శ్రమించాను. గతంలో షార్ట్ బాల్ వస్తే సింగిల్ తీయడానికో లేదా డిఫెన్స్ ఆడడానికో ప్రయత్నించేవాడిని. కానీ ఇప్పుడు నా మైండ్‌సెట్ పూర్తిగా మారింది. నా జోన్లోకి షార్ట్ బాల్ వస్తే కచ్చితంగా సిక్సర్ కొట్టాలనే లక్ష్యంతో ఆడుతున్నా. దాదాపు 300లకు పైగా బంతులను ఎదుర్కొంటాను. సైడ్ ఆర్మ్ త్రోల కంటే కూడా అసలైన బౌలర్లను ఎదుర్కోవడానికే మొగ్గు చూపుతాను. బౌలర్ బంతిని వదిలే ముందే సరైన పొజిషన్లోకి రావడం (రిథమ్‌ను) నేర్చుకున్నాను. ఏబీ డివిలియర్స్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలలో కనిపించే ఆ రిథమ్‌ను నేను కూడా అలవర్చుకున్నాను’ అని అయ్యర్ తన నిలకడైన ఆటతీరు వెనుక ఉన్న రహస్యాలను వివరించాడు. ఇక పంజాబ్ కింగ్స్ ఐపీఎల్ 2026 సీజన్లో ఒక్క ఓటమి కూడా చవిచూడలేదు. ఇప్పటివరకు ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో ఒక మ్యాచ్ వర్షంతో రద్దు కాగా, మిగిలిన ఆరు మ్యాచ్‌ల్లో నెగ్గి 13 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. అన్ని అనుకున్నట్లు జరిగితే పంజాబ్ కింగ్స్ మొదట ప్లేఆఫ్ బెర్తు దక్కించుకోనుంది. ఇక అయ్యర్ ఏడు మ్యాచ్‌ల్లో 186 స్ట్రైక్‌రేట్‌తో 279 పరుగులు సాధించాడు.చదవండి: చెత్త ఆటలోనూ మిల్లర్ అరుదైన రికార్డు -
పంజాబ్ కింగ్స్ ప్లేయర్‌కు మాతృవియోగం
ఐపీఎల్ 2026లో వరుస విజయాలతో దూసుకుపోతూ, ఏకైక అజేయ జట్టుగా కొనసాగుతున్న పంజాబ్ కింగ్స్ టీమ్‌లో ఊహించని విషాదం చోటు చేసుకుంది. ఆ జట్టు స్టార్ ఆల్‌రౌండర్, ఆఫ్ఘనిస్తాన్ ప్లేయర్ అజ్మతుల్లా ఒమర్జాయ్ తల్లి ఇవాళ (ఏప్రిల్ 27) కన్నుమూశారు. ఈ వార్త పంజాబ్ కింగ్స్ శిబిరాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది.ఒమర్జాయ్కు అతని జాతీయ జట్టు సహచరులు, పంజాబ్ కింగ్స్ బృంద సభ్యులు ప్రగాఢ సానూభూతి తెలుపుతున్నారు. ఈ విషాద వార్తను ఆఫ్ఘనిస్తాన్ మాజీ కెప్టెన్ అస్గర్ అఫ్గాన్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఒమర్జాయ్కు గురువుగా భావించే అస్గర్, అతని కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. "అల్లాహ్ ఆమెకు జన్నత్ ప్రసాదించాలని, కుటుంబ సభ్యులకు ధైర్యం ఇవ్వాలని ప్రార్థిస్తున్నాను" అని ఎక్స్‌లో రాసుకొచ్చారు.ఈ హఠాత్పరిణామంతో ఒమర్జాయ్ ఐపీఎల్‌ను మధ్యలో వీడే అవకాశాలు కనిపిస్తున్నాయి. కుటుంబ సభ్యులతో ఉండేందుకు అతడు త్వరలోనే ఆఫ్ఘనిస్తాన్‌కు వెళ్లే అవకాశం ఉంది. అయితే మిగిలిన సీజన్‌కు అందుబాటులో ఉంటాడా లేదా అన్నదానిపై కొద్ది రోజుల్లో స్పష్టత రానుంది.ఇదిలా ఉంటే, ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో పంజాబ్ అద్భుత ప్రదర్శన చేస్తోంది. శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలో జట్టు ఇప్పటివరకు అపరాజితంగా కొనసాగుతోంది. బలమైన జట్టు కూర్పు కారణంగా ఒమర్జాయ్కు ఈ సీజన్లో ఇంకా ఒక్క అవకాశం కూడా రాలేదు.గత సీజన్లో పంజాబ్ తరఫున అతడు కొన్ని కీలక ప్రదర్శనలు చేశాడు. ముఖ్యంగా బౌలింగ్‌లో తనదైన ముద్ర వేశాడు. ఒమర్జాయ్ ఐపీఎల్ ప్రయాణం ఇప్పటివరకు ఆశించిన స్థాయిలో సాగలేదు. 2024లో గుజరాత్ టైటాన్స్ తరఫున అరంగేట్రం చేసిన అతడు, ఆ తర్వాత పంజాబ్ కింగ్స్‌లో చేరాడు. ఒమర్జాయ్కు ప్రతిభకు తగ్గ అవకాశాలు రావడం లేదు. కాగా, పంజాబ్ రేపు సొంత మైదానం ముల్లాన్‌పూర్‌లో రాజస్థాన్ రాయల్స్‌తో తలపడనుంది. -
ఆంధ్ర నెట్ బౌలర్‌కు తీవ్ర గాయం.. సారీ చెప్పిన స్టొయినిస్
ఐపీఎల్ ఫ్రాంచైజీ ఢిల్లీ క్యాపిటల్స్‌కు నెట్ బౌలర్‌గా వ్యవహరిస్తున్న ఆంధ్రప్రదేశ్ కుర్రాడు గిరి ప్రసాద్‌కు గాయమైంది. న్యూఢిల్లీలో శనివారం ప్రాక్టీస్ సెషన్ సందర్భంగా పంజాబ్ కింగ్స్ బ్యాటర్, ఆస్ట్రేలియా క్రికెటర్ స్టొయినిస్ కొట్టిన షాట్ నెట్స్ వద్ద ఉన్న గిరి ప్రసాద్ ముఖానికి బలంగా తాకింది. పరామర్శఫలితంగా తీవ్రంగా గాయపడ్డ గిరి ప్రసాద్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యం ఆస్పత్రికి తరలించి శస్త్ర చికిత్స చేయించింది. ఢిల్లీ క్యాపిటల్స్ యజమాని గ్రంధి కిరణ్ కుమార్ ఆస్పత్రికి వచ్చి గిరి ప్రసాద్‌ను పరామర్శించారు. సారీ చెప్పిన స్టొయినిస్తన షాట్‌తో గాయపడ్డ గిరి ప్రసాద్‌ను పంజాబ్ కింగ్స్ ఆల్‌రౌండర్ స్టొయినిస్ కూడా వచ్చి పరామర్శించాడు. పొరపాటుగా జరిగిన దానికి క్షమించాలని కోరాడు. యువ క్రికెటర్ ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నాడు. అనంతరం గిరి ప్రసాద్‌తో సెల్ఫీ దిగిన స్టొయినిస్ టోపీపై తన ఆటోగ్రాఫ్ చేసి ఇచ్చాడు. కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం మన్యంవారిపాలెం గ్రామానికి చెందిన గిరి ప్రసాద్ గత సీజన్లోనూ ఢిల్లీ క్యాపిటల్స్‌కు నెట్ బౌలర్‌గా ఉన్నాడు.చదవండి: నరాలు తెగే ఉత్కంఠ!.. ఫామ్‌లో లేకున్నా అందుకే అతడిని పంపించాం -
పంజాబ్ కింగ్స్ మరో చరిత్ర
ఐపీఎల్ 2026లో పంజాబ్ కింగ్స్ ఢిల్లీ క్యాపిటల్స్‌పై 265 పరుగుల రికార్డు లక్ష్యాన్ని ఛేదించిన విషయం తెలిసిందే. ఈ లక్ష్య ఛేదన ఐపీఎల్‌లోనే కాకుండా యావత్ పొట్టి క్రికెట్లోనే అత్యధికం. ఈ మ్యాచ్‌కు ముందు వరకు కూడా ఈ రికార్డు పంజాబ్ పేరిటే ఉండేది. 2024 ఎడిషన్‌లో ఈ జట్టు కేకేఆర్‌పై 262 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది.టీ20 చరిత్రలో అత్యధిక రన్ ఛేజ్‌లు ఇవేపంజాబ్ కింగ్స్- 265/4- ప్రత్యర్ధి- ఢిల్లీ క్యాపిటల్స్‌పంజాబ్ కింగ్స్-262/2- ప్రత్యర్ధి-కేకేఆర్‌సౌతాఫ్రికా- 259/4- ప్రత్యర్ధి- వెస్టిండీస్‌బ్రిస్బేన్ హీట్-258/2- ప్రత్యర్ధి- పెర్త్ స్కార్చర్స్ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్‌లో పంజాబ్ మరో భారీ రికార్డు కూడా నెలకొల్పింది. ఇప్పటివరకు తలో ఐదు సార్లు ఛాంపియన్లైన సీఎస్కే, ముంబై ఇండియన్స్ కూడా సాధించలేని ఘనతను సాధించింది.శ్రేయస్ అయ్యర్ నేతృత్వంలో ఈ సీజన్లో అద్భుత ప్రదర్శనలతో దూసుకుపోతున్న ఈ జట్టు.. తొలి ఏడు మ్యాచ్‌లలో ఆరు విజయాలు నమోదు చేయగా, మరో మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. దీంతో ఏడు లీగ్ మ్యాచ్‌ల అనంతరం 13 పాయింట్లు ఖాతాలో కలిగి ఉంది. ఈ గణాంకాల ద్వారానే పంజాబ్ సరికొత్త చరిత్ర సృష్టించింది.ఐపీఎల్లో ఇప్పటివరకు ఏ జట్టూ తొలి ఏడు మ్యాచ్‌ల తర్వాత 13 పాయింట్లు సాధించలేదు. 12 పాయింట్లు మాత్రమే గరిష్టంగా ఉండేది. ఆ ఘనతను ముంబై, చెన్నై, గుజరాత్, రాజస్థాన్ వంటి పలు జట్లు సాధించాయి. ఇప్పుడు పంజాబ్ ఆ రికార్డును చెరిపేసి సరికొత్త రికార్డు నెలకొల్పింది.Most points in an #ipl after 7 games13 - PBKS (2026)12 - MI (2010), CSK (2014), PBKS (2014), CSK (2015), GL (2016), MI (2017), CSK (2019), GT (2022), RR (2024) pic.twitter.com/8EK78fGVzR— Erika Morris (@ErikaMorris79) April 25, 2026కాగా, నిన్నటి మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసి ఢిల్లీ.. కేఎల్ రాహుల్ (152 నాటౌట్), నితీశ్ రాణా (91) విధ్వంసం సృష్టించడంతో నిర్ణీత ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 264 పరుగులు చేసింది. అనంతరం కష్టసాధ్యమైన లక్ష్యాన్ని పంజాబ్ ఆది నుంచే కరిగించుకుంటూ వచ్చింది. ఓపెనర్లు ప్రియాంశ్ ఆర్య (43), ప్రభ్‌సిమ్రన్ (76) తమ సహజ శైలిలో మెరుపు ఆరంభాన్ని ఇవ్వగా.. శ్రేయస్ అయ్యర్ (71 నాటౌట్) నమ్మశక్యం కాని బ్యాటింగ్‌తో మ్యాచ్‌ను ముగించాడు. ఫలితంగా పంజాబ్ ఈ సీజన్లో తమ జైత్రయాత్రను కొనసాగించింది. -
వాళ్లు కొట్టినప్పుడు, మేమూ కొడతామనుకున్నా: శ్రేయస్
ఐపీఎల్ 2026లో భాగంగా నిన్న (ఏప్రిల్ 25) మధ్యాహ్నం జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ నిర్దేశించిన 265 పరుగుల అతి భారీ లక్ష్యాన్ని పంజాబ్ కింగ్స్ మరో ఏడు బంతులు మిగిలుండగానే సునాయాసంగా ఊదేసింది. ఈ గెలుపు అనంతరం పంజాబ్ కింగ్స్ సారధి శ్రేయస్ అయ్యర్ సంతోషం వ్యక్తం చేశాడు. ఈ విజయం జట్టు ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచుతుందని అన్నాడు. శ్రేయస్ మాటల్లో..నిజంగా చెప్పాలంటే, మాటలు రావడం లేదు. మైదానంలో తీవ్ర ఎండ, మరోవైపు బౌలర్లు వరుసగా బౌండరీలు, సిక్సర్లు ఇస్తుంటే ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. కానీ పిచ్ ఎలా ప్రవర్తిస్తుందో మాకు తెలుసు.పిచ్ స్పిన్‌కు సహకరిస్తుందని ముందుగా భావించినప్పటికీ, ఆశించినంత మలుపు లభించలేదు. చహల్ బౌలింగ్‌కు వచ్చిన తర్వాత మాత్రమే బంతి కొద్దిగా ఆగినట్లు అనిపించింది.కేఎల్ రాహుల్ ఆడిన తీరు అద్భుతం. అతని షాట్లు కళ్లకు పండుగలా అనిపించాయి. అతను ఎలాంటి ఒత్తిడిలోనూ లేనట్లు కనిపించాడు.భారీ లక్ష్యాన్ని ఛేదించే ముందు నా ఆలోచన ఒక్కటే. వాళ్లు ఎంత చేసినా, మనం ఒక్క పరుగు ఎక్కువ చేయాలి. వాళ్లు కొట్టగలిగినప్పుడు, మేమూ కొడతామనుకున్నా. ఆ సమయంలో అదే నా మైండ్‌సెట్.డ్రెస్సింగ్‌రూమ్‌లో కూడా ఇదే చర్చ జరిగింది. గత మ్యాచ్‌ల్లో 220కి పైగా లక్ష్యాలను విజయవంతంగా ఛేదించిన అనుభవం మాకు ధైర్యాన్నిచ్చింది.ప్రభ్‌సిమ్రన్, ప్రియాంశ్ పవర్‌ప్లేలోనే దూకుడుగా ఆడి బలమైన పునాది వేశారు. వారి ఆరంభాన్ని మిగతా బ్యాటర్లు కొనసాగించారు.బౌలింగ్, ఫీల్డింగ్ విషయాల్లో ఇంకా మెరుగుదల అవసరమని అంగీకరించిన అయ్యర్, ప్రస్తుతం విజయాన్ని ఆస్వాదిస్తున్నామని అన్నాడు.కాగా, చారిత్రక గెలుపు తర్వాత పంజాబ్‌ను చూసి మిగతా జట్లంతా వణికిపోతున్నాయి. వీరికి ఎంత లక్ష్యమైతే సరిపోతుందని లెక్కలు వేసుకుంటున్నాయి. ఈ సీజన్లో పంజాబ్ మునుపెన్నడూ లేనంత ప్రమాదకరంగా కనిపిస్తుంది. వరుస విజయాలతో దూసుకుపోతే ఏకైక అజేయ జట్టుగా చలామణి అవుతుంది. మున్ముందు కూడా పంజాబ్ ఇదే జోరును కొనసాగిస్తే, ఈసారి టైటిల్ గెలవకుండా ఆపడం ఎవరి వల్ల కాదు. గత సీజన్లో ఇదే శ్రేయస్ నేతృత్వంలో పంజాబ్ రన్నరప్‌తో సరిపెట్టుకున్న విషయం తెలిసిందే. -
ప్రపంచ రికార్డుపై ‘పంజా’బ్
ఆహా ఏమా మ్యాచ్... ఏమా కొట్టుడు! ఒకరిని మించి ఒకరు వంతులు వేసుకున్నట్లు... ప్రత్యర్థి బౌలర్లపై ఏదో పగ పట్టినట్లు... బంతిమీద ఆజన్మ శత్రుత్వం ఉన్నట్లు... ఫోర్లు, సిక్స్‌లు ఒకటే మోత! మొదట కేఎల్ రాహుల్, నితీశ్ రాణా దంచి కొట్టడంతో ఢిల్లీ క్యాపిటల్స్ ఐపీఎల్ చరిత్రలో తమ అత్యధిక స్కోరు నమోదు చేసుకుంటే... పంజాబ్ కింగ్స్ మరో 7 బంతులు మిగిలుండగానే దాన్నిఊదేసింది.ఐపీఎల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన భారత ప్లేయర్‌గా కేఎల్ రాహుల్ రికార్డు సృష్టిస్తే... మేమేం తక్కువా అన్నట్లు ప్రియాన్ష్ ఆర్య, ప్రభ్‌సిమ్రన్ సింగ్, శ్రేయస్ అయ్యర్ విశ్వరూపం చూపారు. దీంతో ఐపీఎల్లో అత్యధిక పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన జట్టుగా పంజాబ్ తమ పేరిటే ఉన్న రికార్డును మరింత మెరుగు పరుచుకుంది. రెండు జట్లు కలిపి 49 ఫోర్లు, 33 సిక్స్‌లు బాదిన ఈ మ్యాచ్‌లో మొత్తం 529 పరుగులు నమోదు కాగా... శనివారం అభిమానులు పైసా వసూల్ పరుగుల పండగను వీక్షించారు.న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ సీజన్లో పంజాబ్ కింగ్స్ జైత్రయాత్ర కొనసాగుతోంది. వరుస విజయాలతో దూసుకెళ్తున్న శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని పంజాబ్ ఖాతాలో ఆరో విజయం చేరింది. శనివారం జరిగిన పోరులో పంజాబ్ 6 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌ను చిత్తుచేసింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 264 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ కేఎల్ రాహుల్ (67 బంతుల్లో 152 నాటౌట్; 16 ఫోర్లు, 9 సిక్స్‌లు) భారీ సెంచరీతో కదం తొక్కగా... నితీశ్ రాణా (44 బంతుల్లో 91; 11 ఫోర్లు, 4 సిక్స్‌లు) మెరుపులు మెరిపించాడు.వీరిద్దరు రెండో వికెట్‌కు 220 పరుగులు జోడించడంతో... ఢిల్లీ కొండంత స్కోరు చేయగలిగింది. ఐపీఎల్ చరిత్రలో ఢిల్లీకి ఇదే అత్యధిక స్కోరు. ఈ క్రమంలో ఐపీఎల్లో మూడో అత్యధిక స్కోరు చేసిన బ్యాటర్‌గా రాహుల్ నిలిచాడు. అనంతరం లక్ష్యఛేదనలో పంజాబ్ 18.5 ఓవర్లలో 4 వికెట్లకు 265 పరుగులు చేసింది. ప్రభ్‌సిమ్రన్ సింగ్ (26 బంతుల్లో 76; 9 ఫోర్లు, 5 సిక్స్‌లు), శ్రేయస్ అయ్యర్ (36 బంతుల్లో 71 నాటౌట్; 3 ఫోర్లు, 7 సిక్స్‌లు) హాఫ్‌సెంచరీలతో విజృంభించగా... ప్రియాన్ష్ ఆర్య (17 బంతుల్లో 43; 2 ఫోర్లు, 5 సిక్స్‌లు) దంచికొట్టాడు. రాహుల్ రాక్స్... ఈ సీజన్లో తొలిసారి మొదట బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ ఆరంభం నుంచే... దూకుడుగా ఆడింది. మూడో ఓవర్లో నిసాంక (11) వెనుదిరగగా... అక్కడి నుంచి రాహుల్, రాణా మోత మొదలైంది. ఈ జంట వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు బాదడంతో పవర్ ప్లే ముగిసేసరికి ఢిల్లీ 68/1తో నిలిచింది. ఈ క్రమంలో రాహుల్ 26 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసుకోగా... బార్ట్లెట్ వేసిన 12వ ఓవర్లో రాణా వరుసగా 6, 4, 4, 4, 4, 6తో 28 పరుగులు రాబట్టాడు. అర్‡్షదీప్ ఓవర్లో 4, 6, 4, 4 కొట్టిన రాహుల్ యాన్సెన్ ఓవర్లో మరో రెండు ఫోర్లతో 47 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. వైశాక్ వేసిన 16వ ఓవర్లో రాహుల్ 6, 6, 6, 4తో విజృంభించాడు. సెంచరీకి సమీపించిన నితీశ్ రాణా భారీ షాట్‌కు ప్రయత్నించి అవుట్ కాగా... రాహుల్ ఐపీఎల్లో అత్యధిక వ్యక్తిగత పరుగులు చేసిన భారత బ్యాటర్‌గా నిలిచాడు. 6 ఓవర్లలో 116 పరుగులు కొండంత లక్ష్యం ముందున్నా పంజాబ్ ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. ఓపెనర్లు ప్రియాన్ష్ , ప్రభ్‌సిమ్రన్ పోటీపడి బౌండరీలు బాదడంతో స్కోరు బోర్డు రాకెట్‌ను తలపించింది. అక్షర్ వేసిన మూడో ఓవర్లో రెండు సిక్స్‌లు ఒక ఫోర్‌తో ఆర్య 20 పరుగులు రాబట్టుకోగా... అఖీబ్ ఓవర్లో ప్రభ్‌సిమ్రన్ 3 సిక్స్‌లు బాదాడు. ఐదో ఓవర్లో నటరాజన్ 9 పరుగులే ఇవ్వగా... ముకేశ్ వేసిన ఆరో ఓవర్లో ప్రభ్‌సిమ్రన్ 6 ఫోర్లు కొట్టాడు. దీంతో పవర్ ప్లే ముగిసే సరికి పంజాబ్ 116 పరుగులు చేసింది. ఆ తర్వాత వీరిద్దరూ స్వల్ప వ్యవధిలో అవుటైనా... శ్రేయస్ మిగిలిన పని పూర్తిచేశాడు. శ్రేయస్ క్యాచ్ మిస్ ఈ మ్యాచ్‌లో ఢిల్లీ ఫీల్డింగ్ పేలవంగా సాగింది. విప్రాజ్ నిగమ్ వేసిన 15వ ఓవర్ చివరి బంతికి శ్రేయస్ ఇచ్చిన క్యాచ్‌ను కరుణ్ నాయర్ వదిలేశాడు. అదే ఓవర్లో నేహల్ వధేరా (25; 3 ఫోర్లు, 1 సిక్స్) క్యాచ్‌ను ఒడిసి పట్టిన కరుణ్... శ్రేయస్ ఇచ్చిన సులువైన క్యాచ్‌ను నేలపాలు చేశాడు. అప్పటికి పంజాబ్ విజయానికి 31 బంతుల్లో 63 పరుగులు అవసరం కాగా... శ్రేయస్ 29 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద బ్యాటింగ్ చేస్తున్నాడు. తదుపరి ఓవర్ రెండో బంతికి సైతం శ్రేయస్ ఇచ్చిన సులువైన క్యాచ్‌ను మరోసారి కరుణ్ నాయర్ జారవిడిచాడు. దీన్ని సది్వనియోగ పరుచుకున్న అయ్యర్... అదే ఓవర్లో 6, 4, 6, 6 కొట్టి సమీకరణాన్ని సులభతరం చేశాడు. నటరాజన్ ఓవర్లోనూ 6, 4 బాదిన శ్రేయస్ 26 బంతుల్లో పిఫ్టీ మార్క్ దాటడంతో పాటు... శశాంక్ సింగ్ (19 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్) అండతో జట్టును విజయ తీరాలకు చేర్చాడు.152 ఈ మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ చేసిన స్కోరు. ఐపీఎల్లో ఓ భారత బ్యాటర్ చేసిన అత్యధిక వ్యక్తిగత స్కోరు ఇదే. అభిõÙక్ శర్మ (141) రెండో స్థానంలో ఉన్నాడు. ఓవరాల్‌గా క్రిస్ గేల్ (175; 2013లో), మెక్కల్లమ్ (158; 2008లో) తర్వాత లీగ్‌లో అత్యధిక పరుగులు చేసిన మూడో బ్యాటర్ రాహుల్.ఎన్గిడికి గాయం... పంజాబ్ ఇన్నింగ్స్ మూడో ఓవర్లో ప్రియాన్ష్ ఆర్య కొట్టిన బంతిని అందుకునే క్రమంలో ఢిల్లీ ప్లేయర్ ఎన్గిడి గాయపడ్డాడు. మిడాఫ్ ప్రాంతంలో బంతిని క్యాచ్ పట్టే క్రమంలో ఎన్గిడి కిందపడ్డాడు. దీంతో తల బలంగా నేలకు తాకి అక్కడే కుప్పకూలిపోయాడు. వెంటనే వైద్య బృందం అతడిని పరీక్షించి మెరుగైన చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. అతడి స్థానంలో విప్రాజ్ నిగమ్ ‘కన్కషన్ సబ్‌స్టిట్యూట్’గా మైదానంలోకి వచ్చాడు. కాగా మ్యాచ్ అనంతరం ఎన్గిడి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు ఫ్రాంచైజీ తెలిపింది.⇒ 1 ఐపీఎల్లో ఇదే (265) అత్యధిక పరుగుల ఛేదన. 2024 సీజన్లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై 262 పరుగుల లక్ష్యాన్ని చేధించిన పంజాబ్ కింగ్స్... ఇప్పుడు దానికంటే కాస్త ఎక్కువ స్కోరును ఛేదించింది.⇒ 220 రెండో వికెట్‌కు రాహుల్, నితీశ్ రాణా జోడించిన పరుగులు. ఐపీఎల్లో ఏ వికెట్‌కైనా ఇది రెండో అత్యధిక భాగస్వామ్యం. 2016లో విరాట్ కోహ్లి–ఏబీ డివిలియర్స్ జోడీంచిన 229 పరుగుల భాగస్వామ్యం ‘టాప్’లో ఉంది.⇒ 2 ఈ మ్యాచ్‌లో పంజాబ్ 5.2 ఓవర్లలో 100 పరుగుల మార్క్ అందుకుంది. ఐపీఎల్లో ఇది రెండో వేగవంతమైంది. 2024లో ఢిల్లీపైనే సన్‌రైజర్స్ హైదరాబాద్ 5 ఓవర్లలోనే వంద పరుగులు చేసింది. ఓవరాల్‌గా పవర్‌ప్లే (6 ఓవర్లలో) పంజాబ్ 116 పరుగులు చేసి రెండో స్థానంలో ఉంది. సన్‌రైజర్స్ 125తో అగ్ర స్థానంలో ఉంది.స్కోరు వివరాలు పంజాబ్ కింగ్స్ ఇన్నింగ్స్: నిసాంక (సి) ప్రభ్‌సిమ్రన్ (బి) అర్‡్షదీప్ 11; రాహుల్ (నాటౌట్) 152; నితీశ్ (సి) శ్రేయస్ (బి) బార్ట్లెట్ 91; మిల్లర్ (నాటౌట్) 3; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (20 ఓవర్లలో 2 వికెట్లకు) 264. వికెట్ల పతనం: 1–28, 2–248. బౌలింగ్: అర్‡్షదీప్ 4–0–49–1; బార్ట్లెట్ 4–0–69–1; యాన్సెన్ 4–0–45–0; వైశాక్ 3–0–48–0; చాహల్ 4–0–42–0; స్టొయినిస్ 1–0–11–0. పంజాబ్ కింగ్స్ ఇన్నింగ్స్: ప్రియాన్ష్ ఆర్య (సి) రిజ్వీ 43; ప్రభ్‌సిమ్రన్ (ఎల్బీ) (బి) కుల్దీప్ 76; కూపర్ (బి) కుల్దీప్ 17; శ్రేయస్ (నాటౌట్) 71; నేహల్ (సి) (సబ్) కరుణ్ (బి) విప్రాజ్ 25; శశాంక్ (నాటౌట్) 19; ఎక్స్‌ట్రాలు 14; మొత్తం (18.5 ఓవర్లలో 4 వికెట్లకు) 265. వికెట్ల పతనం: 1–126, 2–132, 3–145, 4–201. బౌలింగ్: అఖీబ్ 2–0–41–0; ముకేశ్ 3–0–55–0; అక్షర్ 4–0–44–1; నటరాజన్ 3.5–0–54–0; కుల్దీప్ 4–0–46–2; విప్రాజ్ నిగమ్ 2–0–24–1. -
ఒకే మ్యాచ్‌లో 529 పరుగులు.. 33 సిక్స్‌లు, 49 ఫోర్లతో
ఐపీఎల్-2026లో భాగంగా శనివారం అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన మ్యాచ్ అభిమానులను ఎప్పటికీ మర్చిపోలేరు. కేవలం కొన్ని గంటల వ్యవధిలో మైదానంలో సంతోషం, ఉత్కంఠ, భయం అన్నీ కన్పించాయి.తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి ఏకంగా 264 పరుగులు చేసింది. ఓపెనర్ కేఎల్ రాహుల్ (152 నాటౌట్; 67 బంతుల్లో 16 ఫోర్లు, 9 సిక్స్‌లు) భారీ సెంచరీతో చెలరేగాడు. ఐపీఎల్లో ఢిల్లీకి ఇదే అత్యధిక స్కోర్. దీంతో ఢిల్లీ విజయం ఖాయమని అంతా భావించారు. కానీ యువ ఆటగాళ్లు ప్రభ్‌సిమ్రన్ సింగ్ (76; 26 బంతుల్లో 9 ఫోర్లు, 5 సిక్స్‌లు), ప్రియాంశ్ ఆర్య (43; 17 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్స్‌లు) దూకుడుగా ఆడుతూ ఢిల్లీపై ఒత్తిడి పెంచారు. అయితే ఓ వైపు పంజాబ్ ఓపెనర్లు విధ్వంసం కొనసాగుతుండగా.. మరోవైపు మైదానం మొత్తం ఒక్కసారిగా సైలెంట్ అయిపోయింది. ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ బౌలర్ లుంగి ఎంగిడీ తీవ్రంగా గాయపడ్డాడు. బంతిని అందుకునే క్రమంలో ఎంగిడీ తలకు బలమైన గాయమైంది. అంబులెన్స్‌లో అతడిని ఆస్పత్రికి తరలించారు.దీంతో మైదానంలో కాసేపు టెన్షన్ వాతావరణం నెలకొంది. మళ్లీ మ్యాచ్ ప్రారంభమయ్యాక పంజాబ్ విధ్వంసం కొనసాగింది. ఓపెనర్లు ఔటయ్యాక శ్రేయస్ అయ్యర్ (71 నాటౌట్; 36 బంతుల్లో 3 ఫోర్లు, 7 సిక్స్‌లు) ప్రత్యర్ధి బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఫలితంగా ఢిల్లీ నిర్ధేశించిన 265 పరుగుల లక్ష్యాన్ని పంజాబ్ కేవలం 4 వికెట్లు మాత్రమే కోల్పోయి 18.5 ఓవర్లలో ఊదిపడేసింది. టీ20 క్రికెట్లో అత్యధిక లక్ష్యాన్ని చేధించిన జట్టుగా పంజాబ్ తమ రికార్డును తామే బ్రేక్ చేసింది.49 ఫోర్లు.. 33 సిక్సర్లు.. 529 రన్స్మొత్తంగా ఈ మ్యాచ్‌లో పరుగుల వర్షం కురిసింది. ఇరు జట్లు కలిపి మొత్తంగా 529 పరుగులు చేశాయి. అదేవిధంగా పంజాబ్, ఢిల్లీ బ్యాటర్లు కలిసి 49 ఫోర్లు, 33 సిక్సర్లు బాదారు. కాగా లెక్కలేనన్ని డ్రాప్ క్యాచ్‌లు ఈ మ్యాచ్ ఫలితాన్ని నిర్ణయించాయి. తొలుత కేఎల్ రాహుల్ క్యాచ్‌ను 12 పరుగుల వద్ద శశాంక్ సింగ్ విడిచిపెట్టాడు.ఫలితంగా రాహుల్ భారీ సెంచరీతో కదం తొక్కాడు. ఆ తర్వాత పంజాబ్ ఇన్నింగ్స్‌లో శ్రేయస్ అయ్యర్ ఇచ్చిన రెండు ఈజీ క్యాచ్‌లను కరుణ్ నాయర్ జారవిడిచాడు. దీంతో అయ్యర్ అజేయంగా నిలిచి మ్యాచ్‌ను ఫినిష్ చేశాడు.చదవండి: IPL 2026: లుంగీ ఎంగిడీ ఆరోగ్య పరిస్థితిపై బిగ్ అప్డేట్ -
చరిత్ర సృష్టించిన పంజాబ్ కింగ్స్.. ప్రపంచంలోనే తొలి జట్టుగా
ఐపీఎల్-2026లో పంజాబ్ కింగ్స్ అద్భుతం చేసింది. అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో పంజాబ్ రికార్డు విజయం సాధించింది. ఢిల్లీ నిర్ధేశించిన 265 పరుగుల లక్ష్యాన్ని పంజాబ్ కేవలం 4 వికెట్లు మాత్రమే కోల్పోయి 18.5 ఓవర్లలో ఊదిపడేసింది.తద్వారా టీ20 క్రికెట్లో అత్యధిక లక్ష్యాన్ని చేధించిన జట్టుగా పంజాబ్ తమ రికార్డును తామే బ్రేక్ చేసింది. అంతకముందు ఐపీఎల్-2024 సీజన్లో కేకేఆర్ నిర్ధేశించిన 262 రన్స్ టార్గెట్‌ని పంజాబ్ ఛేజ్ చేసింది.దంచి కొట్టిన పంజాబ్ ఓపెనర్లు265 పరుగుల భారీ లక్ష్య చేధనలో పంజాబ్‌కు ఓపెనర్లు ప్రభ్‌సిమ్రన్ సింగ్ (76; 26 బంతుల్లో 9 ఫోర్లు, 5 సిక్స్‌లు), ప్రియాంశ్ ఆర్య (43; 17 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్స్‌లు) అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చారు. వీరిద్దరి ధాటికి పంజాబ్ పవర్‌ప్లేలోనే ఏకంగా 116 పరుగులు చేసింది.అనంతరం క్రీజులోకి వచ్చిన కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (71 నాటౌట్; 36 బంతుల్లో 3 ఫోర్లు, 7 సిక్స్‌లు) విధ్వంసం సృష్టించాడు. నేహల్ వధేరా (25), శశాంక్ సింగ్ (19 నాటౌట్) దూకుడుగా ఆడారు. ఫలితంగా ఈ చారిత్రత్మక విజయాన్ని పంజాబ్ విజయాన్ని అందించాడు. అయితే ఈమ్యాచ్‌లో శ్రేయస్ అయ్యర్ ఇచ్చిన ఈజీ క్యాచ్‌లను ఢిల్లీ ఫీల్డర్ కరుణ్ నాయర్ విడిచిపెట్టాడు. దీంతో ఢిల్లీ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది.రాహుల్ సూపర్ సెంచరీతొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి ఏకంగా 264 పరుగులు చేసింది. ఓపెనర్ కేఎల్ రాహుల్ (152 నాటౌట్; 67 బంతుల్లో 16 ఫోర్లు, 9 సిక్స్‌లు) అజేయ సెంచరీతో చెలరేగాడు. అతడితో పాటు నితీష్ రాణా(44 బంతుల్లో 91) కూడా మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు.టీ20 చరిత్రలో అత్యధిక రన్ ఛేజ్‌లు ఇవేపంజాబ్ కింగ్స్- 265/4- ప్రత్యర్ధి- ఢిల్లీ క్యాపిటల్స్‌పంజాబ్ కింగ్స్-262/2- ప్రత్యర్ధి-కేకేఆర్‌సౌతాఫ్రికా- 259/4- ప్రత్యర్ధి- వెస్టిండీస్‌బ్రిస్బేన్ హీట్-258/2- ప్రత్యర్ధి- పెర్త్ స్కార్చర్స్ -
ఈజీ క్యాచ్ వదిలేశాడు.. కట్ చేస్తే! సెంచరీతో చుక్కలు చూపించాడు
ఐపీఎల్-2026లో పంజాబ్ కింగ్స్ ఆటగాడు శశాంక్ సింగ్ మరోసారి ఫీల్డింగ్‌లో తీవ్రనిరాశపరిచాడు. లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మూడు క్యాచ్‌లను జారవిడిచిన శశాంక్.. ఇప్పుడు అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌పై అదే తీరును కనబరిచాడు. కేఎల్ రాహుల్ ఇచ్చిన ఈజీ క్యాచ్‌ను శశాంక్ విడిచిపెట్టాడు.ఢిల్లీ ఇన్నింగ్స్ మూడో ఓవర్ వేసిన అర్ష్‌దీప్ సింగ్ బౌలింగ్‌లో రాహుల్ ఫుల్ షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు. షాట్ సరిగ్గా కనక్ట్ అయినప్పటికి బంతి నేరుగా డీప్ స్వ్కెర్ లెగ్‌లో ఉన్న శశాంక్ సింగ్ చేతికి వెళ్లింది. కానీ అతడు సులువైన క్యాచ్‌ను జారవిడిచాడు. ఇందుకు పంజాబ్ కింగ్స్ భారీ మూల్యం చెల్లించుకుంది. 12 పరుగుల వద్ద ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న రాహుల్.. భారీ సెంచరీతో కదం తొక్కాడు. రాహుల్ కేవలం 67 బంతుల్లో16 ఫోర్లు, 9 సిక్స్‌లతో 152 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అతడితో పాటు నితీష్ రాణా (44 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్స్‌లతో 91) అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు.ఫలితంగా టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 264 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఇక రాహుల్ క్యాచ్ విడిచిపెట్టిన శశాంక్‌ను నెటిజన్లు దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ఇంత చెత్త ఫీల్డర్‌ను ఇప్పటివరకు చూడలేదు అంటూ పోస్ట్‌లు పెడుతున్నారు. శశాంక్ ఫీల్డింగ్ పంజాబ్ కింగ్స్ ఓనర్ ప్రీతి జింటా, హెడ్‌కోచ్ రికీ పాంటింగ్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.pic.twitter.com/PUqbiGtTB8— crictalk (@crictalk7) April 25, 2026 -
ఢిల్లీ క్యాపిటల్స్ అరుదైన ఘనత
పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్ సందర్భంగా ఢిల్లీ క్యాపిటల్స్ అరుదైన ఘనత సాధించింది. సన్‌రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ పేరిట ఉన్న ఆల్‌టైమ్ రికార్డును సమం చేసింది. ఐపీఎల్-2026లో ఢిల్లీ క్యాపిటల్స్ ఇప్పటికి ఆరు మ్యాచ్‌లు పూర్తి చేసుకుంది.ఆరింట మూడు గెలిచి..వీటిలో మూడు గెలిచిన ఢిల్లీ.. మూడు ఓడిపోయింది. తొలి మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌పై విజయం సాధించిన అక్షర్ సేన.. ఆ తర్వాత ముంబై ఇండియన్స్‌నూ ఓడించింది. అనంతరం గుజరాత్ టైటాన్స్ చేతిలో ఒక్క పరుగు తేడాతో ఓడిన ఢిల్లీ.. చెన్నై సూపర్ కింగ్స్ చేతిలోనూ ఓటమి పాలైంది.ఆ తర్వాత ఆర్సీబీపై ఆరు వికెట్ల తేడాతో గెలిచిన ఢిల్లీ చివరగా సన్‌రైజర్స్ చేతిలో ఓటమిపాలైంది. తాజాగా సొంతమైదానం అరుణ్ జైట్లీ స్టేడియంలో పంజాబ్ కింగ్స్‌ను ఢీకొట్టింది. ఇందులో భాగంగా ఢిల్లీ సారథి అక్షర్ పటేల్ టాస్ గెలిచాడు. తద్వారా ఐపీఎల్లో వరుసగా తొమ్మిదిసార్లు టాస్ గెలిచిన జట్టుగా ఢిల్లీ క్యాపిటల్స్.. సీఎస్కే, సన్‌రైజర్స్ రికార్డును సమం చేసింది.ఐపీఎల్లో వరుసగా అత్యధికసార్లు టాస్ గెలిచిన జట్లు ఇవేసన్రైజర్స్ హైదరాబాద్- 9 సార్లు (2015-16 సీజన్) చెన్నై సూపర్ కింగ్స్- 9 సార్లు (2019)ఢిల్లీ క్యాపిటల్స్- 9 సార్లు (2025-26 సీజన్)చెన్నై సూపర్ కింగ్స్- 8 సార్లు (2018-19)రాజస్తాన్ రాయల్స్- 8 సార్లు (2023).🚨 TOSS 🚨@DelhiCapitals have won the toss & will bat first against @PunjabKingsIPL in New Delhi.Updates ▶️ https://t.co/0oSkMZgNAV#TATAIPL | #KhelBindaas | #DCvPBKS pic.twitter.com/jKNpfCh1lo— IndianPremierLeague (@IPL) April 25, 2026 -
DC vs PBKS: ఢిల్లీపై పంజాబ్ కింగ్స్ రికార్డు విజయం
Delhi Capitals vs Punjab kings Updates: అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ సంచలన విజయం సాధించింది. 265 పరుగుల లక్ష్యాన్ని పంజాబ్ 18.5 ఓవర్లలో కేవలం 4 వికెట్లు మాత్రమే కోల్పోయి చేధించింది. తద్వారా ఐపీఎల్ చరిత్రలో అత్యధిక లక్ష్యాన్ని చేధించిన జట్టుగా పంజాబ్ తమ రికార్డును తామే తిరగరాసింది. పంజాబ్ బ్యాటర్లలో ప్రభ్సిమ్రాన్ సింగ్(76), శ్రేయస్ అయ్యర్(71), ప్రియాన్ష్ ఆర్య(43) అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడారు.శ్రేయస్ అయ్యర్ హాఫ్ సెంచరీ16 ఓవర్లు ముగిసేసరికి పంజాబ్ కింగ్స్ 4 వికెట్ల నష్టానికి 226 పరుగులు చేసింది. క్రీజులో శ్రేయస్ అయ్యర్(51), శశాంక్ సింగ్(1) ఉన్నారు. పంజాబ్ విజయానికి 34 బంతుల్లో 65 పరుగులు కావాలి.పంజాబ్ మూడో వికెట్ డౌన్పంజాబ్ మూడో వికెట్ కోల్పోయింది. 17 పరుగులు చేసిన కూపర్ కానలీ.. కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు. 10 ఓవర్లకు పంజాబ్ స్కోర్: 147/3పంజాబ్ రెండో వికెట్ డౌన్పంజాబ్ రెండో వికెట్ కోల్పోయింది. కేవలం 26 బంతుల్లో 76 పరుగులు చేసిన ప్రబ్సిమ్రాన్ సింగ్.. కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు.పంజాబ్ తొలి వికెట్ డౌన్126 పరుగుల వద్ద పంజాబ్ తొలి వికెట్ కోల్పోయింది. 43 పరుగులు చేసిన ప్రియాన్ష్ ఆర్య.. అక్షర్ పటేల్ బౌలింగ్‌లో ఔటయ్యాడు.6 ఓవర్లకు పంజాబ్ స్కోరు ఎంతంటే?265 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్‌కు ఓపెనర్లు ప్రియాంశ్ ఆర్య (38 నాటౌట్), ప్రభ్ సిమ్రన్ (71 నాటౌట్) అద్బుతమైన ఆరంభాన్ని అందించారు. వీరిద్దరి బ్యాటింగ్ ధాటికి పంజాబ్ స్కోర్ కేవలం 6 ఓవర్లలో ఏకంగా 116 పరుగులు దాటేసింది.ఢిల్లీ రికార్డు స్కోరుఐపీఎల్ చరిత్రలో తమ అత్యధిక స్కోరును ఢిల్లీ నమోదు చేసింది. పంజాబ్‌తో మ్యాచ్‌లో నిర్ణీత 20 ఓవర్లలో కేవలం రెండు వికెట్లు నష్టపోయి ఏకంగా 264 పరుగులు సాధించింది. సెంచరీ మిస్18.3: బార్ట్లెట్ బౌలింగ్‌లో శ్రేయస్ అయ్యర్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరిన నితీశ్ రాణా. 44 బంతుల్లో 91 పరుగులు చేసిన రాణా. స్కోరు: 248-2(18.3). క్రీజులోకి మిల్లర్. సూపర్ ట్విస్టు16.6: చహల్ బౌలింగ్‌లో మార్కస్ స్టొయినిస్‌కు క్యాచ్ ఇచ్చి అవుటైన నితీశ్ రాణా. 39 బంతుల్లో 74 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రెండో వికెట్‌గా వెనుదిరిగిన వన్‌డౌన్ బ్యాటర్. అయితే, ఇక్కడ ఊహించని ట్విస్టు చోటుచేసుకుంది. ఈ క్రమంలో ఢిల్లీ రివ్యూకు వెళ్లగా అది సిక్సర్‌గా తేలింది. దీంతో నితీశ్ రాణాకు లైఫ్ లభించింది. అయితే, స్కోరు: 226-1(17). కేఎల్ రాహుల్ 129 పరుగులతో ఉన్నాడు.కేఎల్ రాహుల్ సెంచరీ47 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్న కేఎల్ రాహుల్. 12 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో వంద పరుగులు మార్కు అందుకున్న ఓపెనింగ్ బ్యాటర్. స్కోరు: 189-1(15). నితీశ్ రాణా 36 బంతుల్లో 72 పరుగులతో రాహుల్‌కు తోడుగా ఉన్నాడు.దుమ్ములేపిన నితీశ్ రాణా11.3: జేవియర్ బార్ట్లెట్ బౌలింగ్‌లో ఫోర్ బాది యాభై పరుగులు పూర్తి చేసుకున్న నితీశ్ రాణా. బార్ట్లెట్ ఓవర్లో 6,4,4,4,4,6 బాదిన నితీశ్. ఢిల్లీ స్కోరు: 142-1(12)పది ఓవర్లలో ఢిల్లీ స్కోరు: 102-1రాహుల్ 56, నితీశ్ రాణా 35 పరుగులతో ఉన్నారు.రాహుల్ హాఫ్ సెంచరీ9.1: విజయ్ కుమార్ వైశాఖ్ బౌలింగ్‌లో రెండు పరుగులు తీసి హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న కేఎల్ రాహుల్. 26 బంతుల్లో రాహుల్ ఫిఫ్టీ.A loud cheer at Arun Jaitley Stadium as #KLRahul completes a fine fifty off 26 balls! 🤌Will he keep going & guide #DC to a huge total? 💙#TATAIPL 2026 | #DCvPBKS | LIVE NOW 👉https://t.co/iY4R1ZY1Yn pic.twitter.com/IsGMZ1NN4g— Star Sports (@StarSportsIndia) April 25, 2026పవర్ ప్లేలో ఢిల్లీ క్యాపిటల్స్ స్కోరు: 68-1(6)కేఎల్ రాహుల్ 16 బంతుల్లో 35 పరుగులతో, నితీశ్ రాణా 13 బంతుల్లో 22 పరుగులతో ఉన్నారు.ఢిల్లీ తొలి వికెట్ డౌన్28 పరుగుల వద్ద ఢిల్లీ క్యాపిటల్స్ తొలి వికెట్ కోల్పోయింది. 11 పరుగులు చేసిన నిస్సాంక.. అర్ష్‌దీప్ సింగ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు.2 ఓవర్లకు ఢిల్లీ స్కోరెంతంటే?2 ఓవర్లు ముగిసే సరికి ఢిల్లీ క్యాపిటల్స్ వికెట్ నష్టపోకుండా 23 పరుగులు చేసింది. క్రీజులో కేఎల్ రాహుల్(12), నిస్సాంక(11) ఉన్నారు.బ్యాటింగ్ ఎంచుకున్న ఢిల్లీఐపీఎల్-2026లో అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ తలపడతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి ఢిల్లీ క్యాపిటల్స్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఇరు జట్లు గత మ్యాచ్‌లో ఆడిన జట్లునే కొనసాగించాయి.తుది జట్లుపంజాబ్ కింగ్స్: ప్రభ్సిమ్రాన్ సింగ్ (వికెట్‌కీపర్), ప్రియాంష్ ఆర్య, కూపర్ కొన్నోలీ, శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), శశాంక్ సింగ్, మార్కస్ స్టోయినిస్, మార్కో జాన్సెన్, జేవియర్ బార్ట్లెట్, విజయ్‌కుమార్ వైషాక్, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్ఢిల్లీ క్యాపిటల్స్ : కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), పాతుమ్ నిస్సాంక, సమీర్ రిజ్వీ, అక్షర్ పటేల్(కెప్టెన్), నితీష్ రాణా, ట్రిస్టన్ స్టబ్స్, డేవిడ్ మిల్లర్, లుంగి ఎన్గిడి, కులదీప్ యాదవ్, టి నటరాజన్, ముఖేష్ కుమార్ -
‘అందుకే శ్రేయస్ అయ్యర్‌ను వదులుకున్నాం’
భారత దేశీ క్రికెట్లో కోచ్‌గా చంద్రకాంత్ పండిట్‌కు మంచి పేరుంది. అతడి మార్గదర్శనంలోనే మధ్యప్రదేశ్ తొలి రంజీ టైటిల్ అందుకుంది. రంజీ 2021-22 సీజన్లో చాంపియన్‌గా నిలిచింది. ఈ క్రమంలోనే ఐపీఎల్ ఫ్రాంఛైజీ కోల్‌కతా నైట్ రైడర్స్ హెడ్‌కోచ్‌గా చంద్రకాంత్ పండిట్ బాధ్యతలు చేపట్టాడు.చంద్రకాంత్ మార్గ నిర్దేశనం, శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) కెప్టెన్సీలో కేకేఆర్ 2024లో చాంపియన్‌గా అవతరించింది. అయితే, వీరి కంటే నాటి మెంటార్ గౌతం గంభీర్‌కే క్రెడిట్ ఎక్కువగా వచ్చింది. ఇక 2024 తర్వాత కేకేఆర్ శ్రేయస్‌ను వదిలేసుకుంది. ఈ క్రమంలో 2025 మెగా వేలంలో పంజాబ్ కింగ్స్ అతడిని ఏకంగా రూ. 26.75 కోట్ల రికార్డు ధరకు కొనుగోలు చేసింది.ఏకంగా ఫైనల్కుఅందుకు తగినట్లుగానే శ్రేయస్ అయ్యర్ బ్యాటర్‌గా, కెప్టెన్‌గా రాణించి పంజాబ్‌ను గతేడాది ఫైనల్‌కు చేర్చాడు. ఈ ఏడాది కూడా అతడి సారథ్యంలో పంజాబ్ ప్లే ఆఫ్స్ దిశగా దూసుకుపోతోంది. మరోవైపు.. శ్రేయస్‌ను వదులుకున్న కేకేఆర్ వరుస పరాజయాలతో డీలా పడి.. విమర్శలు మూటగట్టుకుంటోంది.ఈ నేపథ్యంలో కేకేఆర్ మాజీ హెడ్‌కోచ్ చంద్రకాంత్ పండిట్ శ్రేయస్ అయ్యర్‌ను వదులుకోవడంపై తాజాగా స్పందించాడు. ‘‘దురదృష్టవశాత్తూ ఆరోజు మేము అతడి సేవలు కోల్పోయాము. శ్రేయస్ అద్భుతమైన ఆటగాడు. కెప్టెన్‌గా కేకేఆర్‌కు ట్రోఫీ అందించాడు.అతడు జట్టును నడిపించే విధానానికి నేను అభిమానిని. అయితే, కొన్నిసార్లు దీర్ఘకాల ప్రయోజనాలు, వ్యూహాల దృష్ట్యా కొంతమంది ప్లేయర్లను వదులుకోవాల్సి వస్తుంది. నిజానికి ఆరోజు కేకేఆర్ కోచ్‌గా నేను ఈ విషయంలో చాలా బాధపడ్డాను.అందుకే అతడిని వదులుకున్నాముఅయితే, కావాలని మేము అతడిని వదులుకోలేదు. అప్పటి పరిస్థితులు అలా ఉన్నాయి. శ్రేయస్ ఒక్కడినే కాదు.. ఫిల్ సాల్ట్ వంటి ఆటగాళ్లను కూడా మేము వదిలేశాము. ఏదేమైనా కోచ్‌గా ఉన్న సమయంలో కేకేఆర్ యజమానులు షారుఖ్ ఖాన్, జూహీ చావ్లా, జై మెహతా, సీఈఓ వెంకీ మైసూర్ నాకు అండగా ఉన్నారు’’ అని చంద్రకాంత్ పండిట్ రెవ్‌స్పోర్ట్స్‌తో పేర్కొన్నాడు.కాగా 2025 సీజన్ తర్వాత చంద్రకాంత్ పండిట్‌కు ఉద్వాసన పలికిన కేకేఆర్.. 2026కు గానూ అభిషేక్ నాయర్‌ను హెడ్‌కోచ్‌గా ప్రకటించింది. గతేడాది అజింక్య రహానే కెప్టెన్సీలో పద్నాలుగింట కేవలం ఐదు గెలిచిన కేకేఆర్ పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానంలో నిలిచింది. ఈ ఏడాది ఇప్పటికి ఏడింట ఒక్కటి మాత్రమే గెలిచి అట్టడుగున పదో స్థానంలో కొట్టుమిట్టాడుతోంది. చదవండి: ఆకాశ్ అంబానీ ఆగ్రహం.. ఇంకేం చూస్తారు? -
ఆ టీమ్‌కు భారీ షాక్.. ఉన్నపళంగా ఇంటికి వెళ్లిపోయిన విధ్వంసకర ప్లేయర్
ఐపీఎల్-2026లో అజేయంగా దూసుకుపోతున్న పంజాబ్ కింగ్స్‌కు భారీ షాక్ తగిలింది. ఈ ధనాధన్ లీగ్‌లో పంజాబ్ తమ తదుపరి మ్యాచ్‌లో ఏప్రిల్ 25న అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడనుంది. అయితే ఈ మ్యాచ్‌కు ఆ జట్టు స్టార్ ఆల్‌రౌండర్ కూపర్ కనోలీ దూరమయ్యే సూచనలు కన్పిస్తున్నాయి.కనోలీ ప్రస్తుతం పంజాబ్ క్యాంప్‌ను వీడి ఫిట్నెస్ పరీక్షల కోసం ఆస్ట్రేలియాకు వెళ్లినట్లు తెలుస్తోంది. ఆల్‌రౌండర్ అయిన కనోలీకి ఐపీఎల్లో వెన్ను గాయం కారణంగా కేవలం బ్యాటింగ్ చేసేందుకు మాత్రమే క్రికెట్ ఆస్ట్రేలియా అనుమతి ఇచ్చింది. ఏప్రిల్ చివరి నాటికి బౌలింగ్ చేయడానికి అనుమతి లభించే అవకాశమున్నట్లు ఈ ఏడాది సీజన్ ఆరంభానికే ముందు పలు రిపోర్ట్లు పేర్కొన్నాయి. ఈ క్రమంలోనే ఫిట్నెస్ పరీక్షలను నిర్వహించేందుకు అతడిని క్రికెట్ ఆస్ట్రేలియా వెనక్కి పిలిపించింది. ఇందులో అతడు ఉత్తీర్ణత సాధిస్తే బౌలింగ్ చేసేందుకు క్రికెట్ ఆస్ట్రేలియా క్లియరెన్స్ ఇవ్వనుంది. కనోలీ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. తన తొలి ఐపీఎల్ మ్యాచ్‌లోనే గుజరాత్ టైటాన్స్‌పై 72 పరుగులతో సంచలన ఇన్నింగ్స్ ఆడాడు.చివరగా లక్నో సూపర్ జెయింట్స్‌పై కూడా కేవలం 46 బంతుల్లో 87 పరుగులు చేసి అందరిని ఆకట్టుకున్నాడు. కనోలీ ప్రస్తుతం 6 మ్యాచ్‌లలో 223 పరుగులు చేసి పంజాబ్ కింగ్స్ లీడింగ్ రన్ స్కోరర్‌గా కొనసాగుతున్నాడు. ఇక శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని పంజాబ్ కింగ్స్ వరుస విజయాలతో దూసుకుపోతుంది. ఇప్పటివరకు ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో ఐదింట విజయం సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్ధానంలో ఉంది.చదవండి: IPL 2026: సన్‌రైజర్స్ కెప్టెన్సీ నుంచి ఇషాన్ కిషన్ అవుట్? -
‘రూ. 32 కోట్లు అయినా.. దయచేసి మీరే కొనుక్కోండి’
లక్నో సూపర్ జెయింట్స్ యజమాని సంజీవ్ గోయెంకాకు ఇబ్బందికర పరిస్థితి ఎదురైంది. పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్ సందర్భంగా ఆ జట్టు అభిమానులు గోయెంకాకు కృతజ్ఞతలు చెప్పిన తీరు వైరల్‌గా మారింది. కాగా ఐపీఎల్లో 2022లో చేరిన లక్నో జట్టు కేఎల్ రాహుల్ సారథ్యంలో ప్లే ఆఫ్స్ చేరింది.రూ. 27 కోట్ల భారీ ధరకుఅయితే, సంజీవ్ గోయెంకా వైఖరితో విసిగిపోయిన కేఎల్ రాహుల్ (KL Rahul).. 2025 వేలానికి ముందు లక్నోను వీడాడు. గౌరవం లేని చోట తాను ఉండలేనని వెళ్లిపోయాడు. ఈ క్రమంలో మెగా వేలంలో రూ. 27 కోట్ల భారీ ధరకు లక్నో టీమిండియా మరో స్టార్ రిషభ్ పంత్‌ను కొనుగోలు చేసింది.రూ. 26.75 కోట్లకు పంజాబ్ సొంతంమరోవైపు.. 2024లో తమ జట్టుకు టైటిల్ అందించిన శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer)ను కోల్‌కతా నైట్ రైడర్స్ వదిలేసింది. ఈ క్రమంలో అయ్యర్ కోసం కూడా ఫ్రాంఛైజీలు ఎగబడగా.. పంజాబ్ రూ. 26.75 కోట్లకు సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో పంత్, శ్రేయస్ ఖరీదైన ఆటగాళ్లుగా నిలవగా.. ఇద్దరికీ తమ ఫ్రాంఛైజీలు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించాయి.కెప్టెన్‌గా.. బ్యాటర్‌గా సూపర్ హిట్.. పంత్ విఫలంఅయితే, శ్రేయస్ ఇటు కెప్టెన్‌గా.. అటు బ్యాటర్‌గా సూపర్ హిట్ అయ్యాడు. గతేడాది 604 పరుగులు చేసిన ఈ ముంబైకర్ జట్టును ఫైనల్‌కు చేర్చాడు. మరోవైపు.. పంత్ మాత్రం దారుణంగా విఫలమై విమర్శలు మూటగట్టుకున్నాడు. గతేడాది కేవలం 269 పరుగులు చేసిన పంత్.. కెప్టెన్‌గానూ ఫెయిలై జట్టును ఏడోస్థానంలో నిలిపాడు.ఇక తాజాగా ఐపీఎల్-2026లోనూ పంజాబ్ జైత్రయాత్ర కొనసాగిస్తుండగా.. లక్నో వరుస వైఫల్యాలతో సతమతమవుతూ ఉంది. ముల్లన్‌పూర్‌లో ఆదివారం ఇరుజట్లు తలపడగా.. పంజాబ్ లక్నోను 54 పరుగుల తేడాతో చిత్తు చేసింది. ఈ క్రమంలో స్టాండ్స్‌లో ఉన్న సంజీవ్ గోయెంకాకు పంజాబ్ అభిమాని దిమ్మతిరిగేలా కౌంటర్ ఇచ్చాడు.రూ. 32 కోట్లు అయినా.. దయచేసి మీరే కొనుక్కోండి‘‘గోయెంకా సాబ్! పంత్‌ను మీ జట్టులోకి తీసుకున్నందు వేలవేల దండాలు భాయ్.. అతడు పంజాబ్ కెప్టెన్‌గా రానందుకు మాకెంతో సంతోషంగా ఉంది. ఒకవేళ తదుపరి వేలంలో రూ. 32 కోట్లు ఖర్చు చేయాల్సి వచ్చినా దయచేసి పంత్‌ను మీతోనే ఉంచుకోండి’’ అని సదరు అభిమాని గట్టిగా అరిచాడు.అయితే, ఇందుకు గోయెంకా మాత్రం థాంక్యూ అన్నట్లుగా నవ్వుతూ అభివాదం చేశారు. ఈ దృశ్యాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. కాగా ఐపీఎల్-2025 మెగా వేలం ముగిసిన తర్వాత రిషభ్ పంత్ చేసిన వ్యాఖ్యలే.. ఇప్పుడు ఒక రకంగా గోయెంకాకు ఎదురైన అవమానానికి కారణం.PBKS fan: Goenka sahab! Thank you for taking Pant, paaji many, many thanks! Shukar hai captain saadi Punjab team ch nahi aaya!Paaji, even if you have to give 32 crores, don't let Pant go, keep him with you!😭Meanwhile,blud Sanjeev Goenka laughing and giving a thumbs up🤣🙏 pic.twitter.com/dKB7s8ouIt— Rohan💫 (@rohann__45) April 20, 2026ఆరోజు పంత్ అన్న మాటనే తిప్పి కొట్టి..వేలం సందర్భంగా.. ‘‘నాకు ఒకటే టెన్షన్.. పంజాబ్‌కు మాత్రం అస్సలు వెళ్లకూడదు అని మొక్కుకున్నా.. నేను ఆడకూడదనుకునే ఒకే ఒక్క టీమ్ అది’’ అని పంత్ వ్యాఖ్యానించాడు. దీంతో అప్పటి నుంచి పంజాబ్ జట్టు ఫ్యాన్స్ అతడిపై గుర్రుగా ఉన్నారు. అందుకే ఇప్పుడు పంజాబ్‌లో పంజాబ్ చేతిలో పంత్ సేన ఓడిన తర్వాత గోయెంకాకు ఇలా పంత్ గురించి సలహా ఇచ్చారు.చదవండి: BCCI: వైభవ్ సూర్యవంశీకి బిగ్ ప్రమోషన్! -
పంజాబ్ విజయ రహస్యం 'సర్పంచ్ సాబ్'
పంజాబ్ కింగ్స్ కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఆ జట్టు ఫేట్ మారిపోయింది. గత సీజన్లో పగ్గాలు చేపట్టిన అతను.. తొలి ప్రయత్నంలోనే పంజాబ్‌ను ఫైనల్‌కు చేర్చాడు. దురదృషవశాత్తు ఫైనల్లో ఓడింది కానీ, టైటిల్‌కు పూర్తిగా అర్హమైన జట్టు అని అందరిచే ప్రశంసలందుకుంది.గత సీజన్లో తృటిలో చేజారిన టైటిల్‌ను పంజాబ్ ఈ సీజన్లో ఎలాగైనా సాధించాలని పట్టుదలగా ఉంది. మరోసారి శ్రేయస్ అయ్యర్ నేతృత్వంలో తమ తొలి టైటిల్ దిశగా దూసుకుపోతుంది. ఈ సీజన్లో ఇప్పటివరకు ఆడిన 6 మ్యాచ్‌ల్లో ఐదు విజయాలతో (ఓ మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది) పాయింట్ల పట్టకలో అగ్రస్థానంలో కొనసాగుతుంది.ఇప్పటివరకు జరిగిన మ్యాచ్‌ల్లో ఓటమెరుగని జట్టు ఏదైనా ఉందా అంటే అది పంజాబ్ మాత్రమే. తాజాగా లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ జట్టు భారీ విజయాన్ని సాధించింది. తొలుత బ్యాటింగ్‌లో 254 పరుగులు చేసి, ఆతర్వాత ఆ స్కోర్‌ను విజయవంతంగా కాపాడుకుంది. ఈ మ్యాచ్‌లో పంజాబ్ చేసిన స్కోర్ సీజన్లోనే అత్యధికం.వరుస విజయాలతో దూసుకుపోతున్న పంజాబ్ విజయ రహస్యం ఏంటా అని పరిశీలిస్తే, అది వారి కెప్టెనేనని తెలుస్తుంది. శ్రేయస్ ఈ సీజన్లో మునుపెన్నడూ లేనంత పట్టుదలగా ఉన్నాడు. కెప్టెన్‌గా ఎంతో పరిణితి ప్రదర్శిస్తూ జట్టు విజయాలకు ప్రధాన కారకుడిగా నిలుస్తున్నాడు.శ్రేయస్ కెప్టెన్సీ శైలి ఇతర నాయకులతో పోలిస్తే భిన్నంగా ఉంది. ఆటగాళ్లపై ఒత్తిడి లేకుండా, వారికి స్వేచ్ఛ ఇచ్చి ఆడేలా చేయడం అతని ప్రత్యేకత. ప్రతి ఆటగాడి వ్యక్తిగత శైలి, రొటీన్‌ను గౌరవించడం ద్వారా జట్టులో విశ్వాసాన్ని పెంచాడు. ఈ విధానం కారణంగా బ్యాటర్లు నిర్భయంగా ఆడుతూ, మ్యాచ్ పరిస్థితులకు అనుగుణంగా వేగాన్ని పెంచగలుగుతున్నారు.పంజాబ్ విజయాల్లో బ్యాటింగ్ విభాగం వారి ప్రధాన బలం. టాపార్డర్ నుంచి మిడిలార్డర్ వరకు దూకుడైన ఆట కనిపిస్తోంది. ముఖ్యంగా సిక్సర్లు కొట్టడంపై ఆ జట్టు ప్రత్యేక దృష్టి పెట్టింది. శ్రేయస్ ఆటగాళ్ల మధ్య సిక్సర్ల పోటీ పెట్టి, జట్టులో ఉత్సాహాన్ని నింపాడు. ఇది కేవలం వినోదాత్మక అంశంగా కాకుండా, మ్యాచ్‌లలో స్కోరింగ్ రేట్ పెంచడానికి దోహదపడుతోంది. ఫలితంగా, పంజాబ్ జట్టు భారీ స్కోర్లు చేస్తూ ప్రత్యర్థులపై ఒత్తిడి పెంచుతోంది.బౌలింగ్ విభాగంలోనూ పంజాబ్ సమతుల్యంగా ఉంది. అంతర్జాతీయ స్థాయి అనుభవం కలిగిన బౌలర్లు జట్టుకు బలం చేకూరుస్తున్నారు. మ్యాచ్‌కు ముందు ప్రత్యర్థి ఆటగాళ్లపై ప్రత్యేక వ్యూహాలు రూపొందించి, వాటిని కచ్చితంగా అమలు చేయడంలో బౌలర్లు విజయవంతమవుతున్నారు. ముఖ్యంగా మధ్య ఓవర్లలో వికెట్లు తీసి మ్యాచ్‌ను తమ వైపు తిప్పుకోవడం పంజాబ్ ప్రత్యేకతగా మారింది.ఫీల్డింగ్‌లో కూడా జట్టు మెరుగైన ప్రదర్శన కనబరుస్తోంది. కీలక సమయాల్లో క్యాచ్‌లు పట్టడం, రనౌట్ అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం వంటి అంశాలు మ్యాచ్ ఫలితాలను ప్రభావితం చేస్తున్నాయి. ఈ సమగ్ర ప్రదర్శన వల్లే పంజాబ్ కింగ్స్ ఓటమి లేకుండా ముందుకు సాగుతోంది.శ్రేయస్ కేవలం కెప్టెన్‌గానే కాకుండా, బ్యాటింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో సత్తా చాటుతూ తన సహచరులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. పంజాబ్ అభిమానులు ముద్దుగా 'సర్పంచ్ సాబ్' అని పిలుచుకునే శ్రేయస్.. ఈ సీజన్లో బ్యాటింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో అద్బుత ప్రదర్శనలు కనబరుస్తున్నాడు. ఇటీవల శ్రేయస్ పట్టిన ఓ క్యాచ్ క్రికెట్ చరిత్రలోనే అత్యుత్తమమైన క్యాచ్లలో ఒకటిగా చెప్పవచ్చు. మొత్తంగా, శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలో పంజాబ్ కింగ్స్ ఈ సీజన్లో టైటిల్ ఫేవరెట్‌గా దూసుకుపోతుంది. ఇప్పటివరకు ప్రదర్శించిన జోరును ఇకపై కూడా కొనసాగిస్తే, పంజాబ్ తమ తొలి టైటిల్ సొంతం చేసుకోవడం ఖాయం. -
శశాంక్ సింగ్ పరువు తీసిన శ్రేయస్ అయ్యర్!
ఐపీఎల్-2026లో పంజాబ్ కింగ్స్ జైత్రయాత్ర కొనసాగుతోంది. శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో గతేడాది ఫైనల్ చేరిన పంజాబ్.. ఈసారి కూడా ప్లే ఆఫ్స్ దిశగా అడుగులు వేస్తోంది. తాజాగా పంజాబ్ కింగ్స్‌తో ఆదివారం నాటి మ్యాచ్‌లోనూ శ్రేయస్ సేన దుమ్ములేపింది.సొంత వేదిక ముల్లన్‌పూర్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్.. నిర్ణీత 20 ఓవర్లలో రికార్డు స్థాయిలో 254 పరుగులు సాధించింది. ప్రియాన్ష్ ఆర్య (37 బంతుల్లో 93) విధ్వంసకర ఇన్నింగ్స్‌తో విరుచుకుపడగా.. కూపర్ కన్నోలి (46 బంతుల్లో 87) మరోసారి ఆకట్టుకున్నాడు.రాణించిన బౌలర్లుఇక లక్ష్య ఛేదనలో లక్నోను పంజాబ్ 200 పరుగులకే పరిమితం చేసింది. మార్కో యాన్సెన్ రెండు, అర్ష్‌దీప్ సింగ్, విజయ్ కుమార్ వైశాఖ్, యజువేంద్ర చహల్ తలా ఒక వికెట్ తీసి పంత్ సేనను కట్టడి చేశారు. ఫలితంగా పంజాబ్ 54 పరుగుల తేడాతో జయభేరి మోగించింది.మూడు క్యాచ్‌లు జారవిడిచాడుఅయితే, పంజాబ్ స్టార్ శశాంక్ సింగ్ లక్నోతో మ్యాచ్‌లో ఫీల్డింగ్‌లో దారుణంగా విఫలమయ్యాడు. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా మూడు క్యాచ్‌లు జారవిడిచాడు. ముఖ్యంగా లక్నో ఇన్నింగ్స్‌లో 18వ ఓవర్లో పంజాబ్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ బంతితో రంగంలోకి దిగగా.. ఐడెన్ మార్క్రమ్ భారీ షాట్ ఆడాడు.A brainfade moment for Shashank Singh. 😄 pic.twitter.com/AxJEiBOie7— Mufaddal Vohra (@mufaddal_vohra) April 19, 2026ఈ క్రమంలో స్వీపర్ కవర్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న శశాంక్ సింగ్ బంతిని అందుకునేందుకు పరిగెత్తుకు వచ్చాడు. ఆల్మోస్ట్ క్యాచ్ పడతాడని భావించగా.. అక్కడే అలా నిలుచుండిపోయాడు. దీంతో మార్క్రమ్ ఖాతాలో సిక్సర్ చేరగా.. అర్ష్‌దీప్ సింగ్‌తో పాటు డగౌట్లో ఉన్న హెడ్‌కోచ్ రిక్కీ పాంటింగ్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.మార్క్రమ్తో పాటు ముకుల్ చౌదరీతో పాటు నికోలస్ పూరన్‌ల క్యాచ్‌లను శశాంక్ జారవిడిచాడు. ఈ ముగ్గరూ డేంజరస్ ప్లేయర్లే. అయితే, పంజాబ్ బౌలర్లను వాళ్లను సరిగ్గా కుదురుకోనివ్వలేదు కాబట్టి సరిపోయింది లేదంటే ఫలితంపై ప్రభావం పడేది. ఈ నేపథ్యంలో శశాంక్ సింగ్‌పై విమర్శల వర్షం కురుస్తుండగా.. మ్యాచ్ తర్వాత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ చేసిన పని నెటిజన్లను ఆకర్షిస్తోంది.ఇదిగో ఈ క్యాప్ అడ్డుపెట్టుకోవిజయం తర్వాత ఇరుజట్ల ఆటగాళ్లు కరచాలనం చేసుకునే సమయంలోశ్రేయస్ శశాంక్‌ను ఆటపట్టించాడు. సరదాగా శశాంక్ భుజంపై చెయ్యి వేసిన శ్రేయస్ అయ్యర్... ‘‘మన జట్టు సభ్యులకు నీ ముఖం చూపించలేవులే.. మనోళ్లను కదిలించేంత దమ్ము ఇపుడు లేకపోవచ్చు... ఇదిగో ఈ క్యాప్ అడ్డుపెట్టుకో’’ అన్నట్లుగా క్యాప్ అతడి ముఖానికి అడ్డుపెట్టి నడిపించాడు. పాంటింగ్ సైతం శశాంక్ భుజం తట్టి నవ్వులు చిందించాడు. ఈ నేపథ్యంలో.. ‘‘శ్రేయస్ భయ్యా పాపం శశాంక్ పరువు తీసేశావుగా!.. ఏదేమైనా ఈరోజు శశాంక్ అదృష్టం బాగుంది’’ అంటూ అభిమానులు సరదాగా కామెంట్లు చేస్తున్నారు. కాగా శశాంక్ ఈ మ్యాచ్‌లో ఆరు బంతుల్లో 17 పరుగులు చేశాడు. ఇదిలా ఉంటే.. పంజాబ్ ఇప్పటికి ఆడిన ఆరు మ్యాచ్‌లలో ఒకటి వర్షం వల్ల రద్దుకాగా.. మిగిలిన ఐదూ గెలిచి పట్టికలో అగ్రస్థానంలో ఉంది.చదవండి: PSL: పిరికిపందలు.. ఎక్స్‌ట్రాలు వద్దు.. పాక్ బోర్డుకు ఘాటు కౌంటర్𝘼𝙡𝙡'𝙨 𝙬𝙚𝙡𝙡 𝙩𝙝𝙖𝙩 𝙚𝙣𝙙𝙨 𝙬𝙚𝙡𝙡 😃Only smiles on the faces of skipper Shreyas Iyer, coach Ricky Ponting and.. Shashank Singh! #TATAIPL | #KhelBindaas | #PBKSvLSG | @PunjabKingsIPL pic.twitter.com/SQU5z3zNdy— IndianPremierLeague (@IPL) April 19, 2026 -
లక్నోను మట్టికరిపించిన అనంతరం శ్రేయస్ వ్యాఖ్యలివే..!
శ్రేయస్ అయ్యర్ నేతృత్వంలో పంజాబ్ కింగ్స్ ఈ సీజన్లోనూ అద్భుత ప్రదర్శన కొనసాగిస్తోంది. గత సీజన్లో రన్నరప్‌తో సరిపెట్టుకున్న ఈ జట్టు ఈ సీజన్లో ఎలాగైనా టైటిల్ సాధించాలని పట్టుదలగా ఉంది. వరుస విజయాలతో దూసుకుపోతూ పాయింట్ల పట్టికలో అగ్రపీఠంపై తిష్ట వేసింది. ఇప్పటివరకు ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో ఐదింట విజయాలు సాధించింది. ఓ మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది.తాజాగా లక్నో సూపర్ జెయింట్స్‌పై 54 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసి.. ప్రియాంశ్ ఆర్య (93), కూపర్ కన్నోల్లీ (87) ఆకాశమే హద్దుగా చెలరేగడంతో 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 254 పరుగుల భారీ స్కోర్ చేసింది.అనంతరం కష్ట సాధ్యమైన లక్ష్య ఛేదనలో లక్నో చేతులెత్తేసింది. ఆ జట్టు 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 200 పరుగుల వద్ద ఆగిపోయింది. మార్ష్ (40), బదోని (35), పంత్ (43), మార్క్రమ్ (42) మంచి ఆరంభాలు లభించినా భారీ స్కోర్లుగా మలచలేకపోయారు. జన్సెన్ (4-0-37-2), విజయ్‌కుమార్ వైశాఖ్ (4-0-30-1), చహల్ (4-0-36-1) లక్నో బ్యాటర్లకు పగ్గాలు వేశారు.మ్యాచ్ అనంతరం పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తన జట్టు ప్రదర్శనపై సంతృప్తి వ్యక్తం చేశాడు. తమ బ్యాటర్లు, బౌలర్లపై ప్రశంసల వర్షం కురిపించాడు.అతని మాటల్లోనే.. ఆ భాగస్వామ్యం అసాధారణంగా ఉంది. కొన్ని షాట్లు చూసినప్పుడు ఆశ్చర్యపోయాను. ఫాస్ట్ బౌలర్లను బ్యాక్ ఫుట్‌పై స్ట్రైట్‌గా ఆడటం, స్పిన్నర్లపై కూడా అదే ధైర్యంతో దాడి చేయడం గొప్ప నైపుణ్యం. ముఖ్యంగా మధ్య ఓవర్లలో ఆ భాగస్వామ్యం జట్టుకు బలమైన పునాది వేసింది. ఆ సమయంలో ఒత్తిడి ఉన్నప్పటికీ ఆటగాళ్లు చూపిన ధైర్యం, స్థిరత్వం ప్రశంసనీయం.జట్టులో ఆత్మవిశ్వాసాన్ని పెంచేందుకు ఒక సరదా పోటీ పెట్టుకున్నాం. జట్టులో ఎవరు ఎక్కువ సిక్సర్లు కొడితే వారికి నా బ్యాట్ బహుమతిగా ఇస్తానని చెప్పాను. ఇది పెద్ద బహుమతి కాకపోయినా, ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసం పెంచి, స్వేచ్ఛగా ఆడేలా చేస్తుంది. ఆటగాళ్లను ఎక్కువగా నియంత్రించకుండా స్వేచ్ఛ ఇస్తే వారు తమ ప్రతిభను మెరుగ్గా ప్రదర్శిస్తారన్నది నా అభిప్రాయం.బౌలింగ్ విభాగంపై కూడా అయ్యర్ ప్రశంసలు కురిపించాడు. జట్టులోని బౌలర్లు అంతర్జాతీయ స్థాయి అనుభవం కలిగిన వారని, వారు ఇప్పటికే తమ దేశాల తరఫున అద్భుత ప్రదర్శనలు ఇచ్చారని గుర్తుచేశారు. మ్యాచ్‌కు ముందు వ్యూహాలు చర్చించి, వాటిని అమలు చేయడమే ముఖ్యమని అన్నారు. ఈ సీజన్ మొత్తం బౌలర్లు స్థిరంగా రాణిస్తున్నారని, అదే ఫామ్‌ను కొనసాగించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.ఇక న్యూ చండీగఢ్ మైదానాన్ని “కంచుకోట”గా మార్చడంపై కూడా ఆయన సంతోషం వ్యక్తం చేశారు. గత సీజన్లో ఎదురైన సవాళ్లను దృష్టిలో పెట్టుకుని, ఈసారి పిచ్ తయారీపై ప్రత్యేక దృష్టి పెట్టామని చెప్పారు. బ్యాటర్లు, బౌలర్లకు సమానంగా సహకరించేలా మైదానాన్ని రూపొందించామని, ఇప్పటివరకు ఫలితాలు అనుకూలంగా ఉన్నాయని అన్నారు. -
పంజాబ్ చేతిలో ఓటమి అనంతరం పంత్ ఆసక్తికర వ్యాఖ్యలు
ఐపీఎల్ 2026లో భాగంగా నిన్న (ఏప్రిల్ 19) రాత్రి జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ చేతిలో లక్నో సూపర్ జెయింట్స్ 54 పరుగుల తేడాతో పరాజయంపాలైంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ అతి భారీ స్కోర్ (254-7) చేసింది. ప్రియాంశ్ ఆర్య (93), కూపర్ కన్నోల్లీ (87) ఆకాశమే హద్దుగా చెలరేగారు.అనంతరం కష్ట సాధ్యమైన లక్ష్య ఛేదనలో లక్నో చేతులెత్తేసింది. ఒక్కరు కూడా భారీ స్కోర్ చేయలేకపోవడంతో 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 200 పరుగుల వద్ద ఆగిపోయింది. మార్ష్ (40), బదోని (35), పంత్ (43), మార్క్రమ్ (42) మంచి ఆరంభాలు లభించినా భారీ స్కోర్లుగా మలచలేకపోయారు.జన్సెన్ (4-0-37-2), విజయ్‌కుమార్ వైశాఖ్ (4-0-30-1), చహల్ (4-0-36-1) లక్నో బ్యాటర్లను కట్టడి వేశారు. ఈ ఓటమి లక్నోకు వరుసగా మూడవది. 6 మ్యాచ్‌ల్లో రెండే విజయాలు సాధించిన ఈ జట్టు పాయింట్ల పట్టికలో 8వ స్థానానికి పడిపోయింది. మరోవైపు పంజాబ్ ఓటమనేదే ఎరుగక, వరుస విజయాలతో దూసుకుపోతూ పాయింట్ల పట్టికలో అగ్రపీఠంపై తిష్ట వేసింది. ఈ జట్టు ఆరింట ఐదు విజయాలు సాధించింది.మ్యాచ్ అనంతరం లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ రిషబ్ పంత్ జట్టు ప్రదర్శన, తన గాయం, బ్యాటింగ్ ప్లాన్స్ గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. గాయం గురించి మాట్లాడతూ.. పాత గాయం (Left elbow) మానుతుంది. ఈ లోపే కొత్త గాయం (right hand) జతకలిసింది. అయినా పాజిటివ్‌గా తీసుకుంటాను (నవ్వుతూ).ఓటమిపై విశ్లేషిస్తూ.. ఒక్కటని చెప్పలేము. బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నారు. బ్యాటింగ్‌లో మాత్రం కొన్ని సమస్యలు ఉన్నాయి. నెగిటివ్స్ మాత్రమే కాకుండా పాజిటివ్స్‌కు ఉన్నాయి. వాటిని బిల్డ్ చేసుకోవాలి. పంజాబ్ కింగ్స్ చాలా బాగా ఆడింది. వారికి క్రెడిట్ ఇవ్వాలి. బదోనిని ఓపెనర్‌గా పంపడంపై మాట్లాడుతూ.. ఇది ఈ మ్యాచ్‌కు ముందు తీసుకున్న నిర్ణయం కాదు. చాలా రోజుల క్రితమే అనుకున్నాము. టాపార్డర్‌కు ఫ్రీడం ఇవ్వాలని, మిడిలార్డర్ వారికి మద్దతుగా ఉండాలన్నదే మా ప్లాన్.జట్టు ప్రదర్శన గురించి మాట్లాడుతూ.. మా జట్టుపై నమ్మకం ఉంది. ప్రతి మ్యాచ్‌లో పాజిటివ్‌గా ఆడి, మెరుగుపడాలనుకుంటున్నాము.పంత్ వ్యాఖ్యలను బట్టి చూస్తే.. వరుస ఓటములు ఎదురైనా పాజిటివ్‌గా ఉండాలని అనుకున్నట్లు తెలుస్తుంది. ఈ సందర్భంగా అతని గాయంపై కూడా అప్డేట్ ఇచ్చాడు. బౌలింగ్ బాగానే ఉందని చెబుతూ, బ్యాటింగ్‌లో లోపాలను ప్రస్తావించాడు. బదోనిని ఓపెనర్‌గా పంపడాన్ని సమర్దించుకున్నాడు. ప్రతి మ్యాచ్‌లో మెరుగుపడాలని ఆకాంక్షిస్తున్నాడు. -
పంజాబ్ పరుగుల పండగ
గత నాలుగు మ్యాచ్‌ల్లో లక్ష్యఛేదనలో సత్తా చాటిన పంజాబ్ కింగ్స్... ఈసారి మొదట బ్యాటింగ్‌లో దుమ్మురేపింది. లక్నో బౌలింగ్‌ను చీల్చిచెండాడుతూ ఈ సీజన్లో అత్యధిక స్కోరును తమ పేరిట లిఖించుకుంది. ప్రియాన్ష్ ఆర్య, కూపర్ కనొలీ పోటీపడి సిక్స్‌లు కొట్టడంతో పంజాబ్ కొండంత స్కోరు చేయగా... ఛేదనలో పలు ప్రయోగాలు చేసిన లక్నో విజయానికి 54 పరుగుల దూరంలో నిలిచిపోయింది. న్యూ చండీగఢ్: ఐపీఎల్ 19వ సీజన్లో పంజాబ్ కింగ్స్ జోరు సాగుతోంది. ఎదురైన ప్రత్యర్థినల్లా చిత్తుచేస్తూ ముందుకు సాగుతున్న శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని పంజాబ్ తమ ఖాతాలో ఐదో విజయం వేసుకుంది. ఆదివారం జరిగిన పోరులో పంజాబ్ 54 పరుగుల తేడాతో లక్నో సూపర్ జెయింట్స్‌ను మట్టికరిపించింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ కింగ్స్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 254 పరుగులు చేసింది. ప్రియాన్ష్ ఆర్య (37 బంతుల్లో 93; 4 ఫోర్లు, 9 సిక్స్‌లు), కూపర్ కనోలీ (46 బంతుల్లో 87; 8 ఫోర్లు, 7 సిక్స్‌లు) ఆకాశమే హద్దుగా చెలరేగారు. ఈ జోడీ రెండో వికెట్‌కు 80 బంతుల్లోనే 182 పరుగులు జోడించడం విశేషం. లక్నో బౌలర్లలో ప్రిన్స్ యాదవ్, సిద్ధార్థ్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో లక్నో సూపర్ జెయింట్స్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 200 పరుగులకు పరిమితమైంది. మిచెల్ మార్ష్ (28 బంతుల్లో 40; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), ఆయుశ్ బదోనీ (21 బంతుల్లో 35; 5 ఫోర్లు, 1 సిక్స్), కెపె్టన్ రిషభ్ పంత్ (23 బంతుల్లో 43; 1 ఫోర్, 4 సిక్స్‌లు), మార్క్రమ్ (22 బంతుల్లో 42; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) తలా కొన్ని పరుగులు చేశారు. సాధించాల్సిన లక్ష్యం మరీ ఎక్కువగా ఉండగా... లక్నో ఏ దశలోనూ ఆ వేగం అందుకలోకపోయింది. పంజాబ్ బౌలర్లలో యాన్సెన్ 2 వికెట్లు తీశాడు. ధనాధన్.. ఈ సీజన్లో తొలిసారి మొదట బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్... లక్నో బౌలర్లపై తమ ప్రతాపం చూపింది. ఓపెనర్ ప్రభ్‌సిమ్రన్ సింగ్ (0)ను షమీ తొలి ఓవర్లోనే అవుట్ చేయగా... అక్కడి నుంచి పంజాబ్ ఊచకోత మొదలైంది. మరో ఓపెనర్ ప్రియాన్ష్ ఆర్య, కూపర్ కలిసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. వీలుచిక్కినప్పుడల్లా భారీ షాట్లతో విరుచుకుపడ్డారు. ఆరో ఓవర్లో ఆర్య 4, 6, 6 బాదగా... పవర్‌ప్లే ముగిసేసరికి పంజాబ్ 63/1తో నిలిచింది. బదోనీ ఓవర్లో కూపర్ 4, 6 కొట్టగా... ఆర్య 19 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. షమీ ఓవర్లో రెండు సిక్స్‌లతో కూపర్ కూడా హాఫ్‌సెంచరీ మార్క్ దాటాడు. బౌలర్‌తో సంబంధం లేకుండా ఈ జోడీ దంచి కొట్టడంతో పంజాబ్ స్కోరు రాకెట్ వేగంతో దూసుకెళ్లింది. మార్క్రమ్ వేసిన 13వ ఓవర్లో అయితే ఈ ఇద్దరు పండగ చేసుకున్నారు. తొలి మూడు బంతులను కూపర్ సిక్స్‌లుగా మలిస్తే... చివరి రెండు బంతులకు ఆర్య సిక్స్‌లు కొట్టాడు. దీంతో 32 పరుగులు వచ్చాయి. ఫలితంగా 13 ఓవర్లు ముగిసేసరికి పంజాబ్ 179/1తో మరింత భారీ స్కోరు చేసేలా కనిపించింది. ఆఖర్లో కాస్త తేరుకున్న లక్నో బౌలర్లు ఈ ఇద్దరితో పాటు శ్రేయస్ అయ్యర్ (5), నేహల్ వధేరా (13) వికెట్లు తీసి పరుగుల వేగాన్ని నియంత్రించారు. స్టొయినిస్ (16 బంతుల్లో 29; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), శశాంక్ సింగ్ (6 బంతుల్లో 17; 1 ఫోర్, 2 సిక్స్‌లు) చివర్లో ధాటిగా ఆడారు. స్కోరు వివరాలు పంజాబ్ కింగ్స్ ఇన్నింగ్స్: ప్రియాన్ష్ ఆర్య (సి) మార్ష్ (బి) సిద్ధార్థ్ 93; ప్రభ్‌సిమ్రన్ (సి) మార్ష్ (బి) షమీ 0; కూపర్ (సి) సిద్ధార్థ్ (బి) ప్రిన్స్ 87; శ్రేయస్ (సి) షమీ (బి) మొహసిన్ 5; స్టొయినిస్ (రనౌట్) 29; వధేరా (సి) పూరన్ (బి) సిద్ధార్థ్ 13; శశాంక్ (సి) మార్క్రమ్ (బి) ప్రిన్స్ 17; యాన్సెన్ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 254. వికెట్ల పతనం: 1–3, 2–185, 3–187, 4–193, 5–208, 6–252, 7–254. బౌలింగ్: షమీ 4–0–56–1; మొహసిన్ 4–0–43–1; ప్రిన్స్4–0–25–2; బదోనీ 1–0–14–0; అవేశ్ 3–0–46–0; సిద్ధార్థ్ 3–0–35–2; మార్క్రమ్ 1–0–32–0. లక్నో సూపర్ జెయింట్స్ ఇన్నింగ్స్: మార్ష్ (సి) బార్ట్లెట్ (బి) చాహల్ 40; బదోనీ (సి) బార్ట్లెట్ (బి) వైశాక్ 35; పంత్ (సి) ప్రభ్‌సిమ్రన్ (బి) అర్ష్ దీప్ 43; పూరన్ (సి) శ్రేయస్ (బి) యాన్సెన్ 9; మార్క్రమ్ (సి) స్టొయినిస్ (బి) యాన్సెన్ 42; ముకుల్ (నాటౌట్) 21; హిమ్మత్ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 200. వికెట్ల పతనం: 1–61, 2–109, 3–128, 4–139, 5–199. బౌలింగ్: అర్ష్ దీప్ 4–0–41–1; బార్ట్లెట్ 4–0–54–0; యాన్సెన్ 4–0–37–2; వైశాక్ 4–0–30–1; చాహల్ 4–0–36–1. ఐపీఎల్లో నేడుగుజరాత్ X ముంబై వేదిక: అహ్మదాబాద్‌రాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం -
ప్రియాన్ష్, కూపర్ విధ్వంసం.. పంజాబ్‌కు ఐదో విజయం
ఐపీఎల్ 2026 సీజన్లో పంజాబ్ కింగ్స్ ఐదో విజయాన్ని నమోదు చేసింది. ఆదివారం ముల్లన్పూర్ వేదికగా లక్నో సూపర్‌జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ 54 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. 255 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 200 పరుగులకే పరిమితమైంది. మార్కరమ్ (42 ), రిషబ్ పంత్ (43), మార్ష్ (40) పరుగులు సాధించారు. అయితే ఛేదించాల్సిన లక్ష్యం ఎక్కువగా ఉండడంతో లక్నో చేతులెత్తేసింది. పంజాబ్‌బౌలర్లలో మార్కో యాన్సెన్ 2 వికెట్లు తీశాడు. అంతకముందు పంజాబ్ యువ బ్యాటర్లు ప్రియాన్ష్ ఆర్య, కూపర్ కన్నోలీ విధ్వంసంతో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 254 పరుగుల భారీ స్కోరు చేసింది. ప్రియాన్ష్ (93), కన్నోలి (87) తమ కెరీర్లో గుర్తుండిపోయే ఇన్నింగ్స్ ఆడారు. చివర్లో స్టోయినిస్ 29 పరుగుల మెరుపు ఇన్నింగ్స్ ఆడి పంజాబ్ భారీ స్కోరుకు బాటలు వేశాడు. లక్నో బౌలర్లలో ప్రిన్స్ యాదవ్,మణిమరన్ సిద్ధార్థ్ చెరో 2 వికెట్లు తీశాడు. లక్నోతో మ్యాచ్ ద్వారా ఈ సీజన్లో అత్యధిక స్కోరు చేసిన పంజాబ్ ఇప్పటివరకు ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో ఐదింట గెలిచి (వర్షంతో ఒక మ్యాచ్ రద్దు) 11 పాయింట్లతో పాయింట్ల పట్టికలో తన అగ్రస్థానాన్ని మరింత పటిష్టం చేసుకుంది.𝘼𝙡𝙡'𝙨 𝙬𝙚𝙡𝙡 𝙩𝙝𝙖𝙩 𝙚𝙣𝙙𝙨 𝙬𝙚𝙡𝙡 😃Only smiles on the faces of skipper Shreyas Iyer, coach Ricky Ponting and.. Shashank Singh! #TATAIPL | #KhelBindaas | #PBKSvLSG | @PunjabKingsIPL pic.twitter.com/SQU5z3zNdy— IndianPremierLeague (@IPL) April 19, 2026 -
ఒకే ఓవర్లో 32 పరుగులు.. లక్నో బౌలర్‌కు చుక్కలు
ఐపీఎల్ 2026 సీజన్లో లక్నో సూపర్‌జెయింట్స్‌తో మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ విధ్వంసకర బ్యాటింగ్‌తో రెచ్చిపోయింది. ఓపెనర్ ప్రియాన్ష్ ఆర్య, వన్‌డౌన్ బ్యాటర్ కూపర్ కన్నోలి లక్నో బౌలర్లకు చుక్కలు చూపించారు. ప్రియాన్ష్ ఆర్య 37 బంతుల్లో 93 పరుగులు చేయగా, కూపర్ 47 బంతుల్లో 87 పరుగులు చేశాడు. అయితే ఇన్నింగ్స్ 13వ ఓవర్ వేసిన మార్కరమ్కు ఈ ఇద్దరు పీడకలను మిగిల్చారు. 13వ ఓవర్ స్ట్రైకింగ్ తీసుకున్న కూపర్ కన్నోలి మార్కరమ్ మొదటి బంతిని సిక్సర్‌గా మలిచాడు. రెండో బంతిని ఈసారి లాంగాన్ దిశగా సిక్సర్ కొట్టిన కన్నోలి మూడో బంతిని కూడా సిక్సర్‌గా మలిచాడు. ఆ తర్వాతి బంతిని వైడ్ వేయగా, నాలుగో బంతికి కూపర్ సింగిల్ తీయడంతో ప్రియాన్ష్ స్ట్రైక్‌లోకి వచ్చాడు. ఇక ప్రియాన్ష్ కూడా చివరి రెండు బంతులకు సిక్సర్లు కొట్టాడు. దీంతో ఆ ఓవర్లో మొత్తం 5 సిక్సర్లు, వైడ్ సహా సింగిల్ మొత్తం 32 పరుగులు వచ్చాయి. ఈ నేపథ్యంలో మార్కరమ్ ఒక చెత్త రికార్డును తన పేరిట మూటగట్టుకున్నాడు. లక్నో తరఫున ఒకే ఓవర్లో అత్యధిక పరుగులు సమర్పించుకున్న బౌలర్‌గా మార్కరమ్ నిలిచాడు. గతంలో ఈ రికార్డు రవి బిష్ణోయ్ పేరిట ఉంది. 2022లో ఆర్సీబీతో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో రవి బిష్ణోయ్ 27 పరుగులు సమర్పించుకున్నాడు.ఇక 2026 సీజన్లో ఒకే ఓవర్లో అత్యధిక పరుగులు సమర్పించుకున్న బౌలర్ కూడా మార్కరమ్ మాత్రమే. ఈ సీజన్లోనూ ఇదే మోస్ట్ ఎక్స్పెన్సివ్ ఓవర్ అని చెప్పొచ్చు. 2025 సీజన్లో ఖలీల్ అహ్మద్ (సీఎస్కే) ఆర్సీబీతో మ్యాచ్‌లో 33 పరుగులు, మొయిన్ అలీ (కేకేఆర్) రాజస్తాన్‌తో మ్యాచ్‌లో 32 పరుగులు సమర్పించుకున్నారు.3️⃣2️⃣ runs of pure destruction 💥🎥 Relive this carnage 👉 https://t.co/EpOcpY1lLb#TATAIPL | #KhelBindaas | #PBKSvLSG | @PunjabKingsIPL pic.twitter.com/eI5tuleNYM— IndianPremierLeague (@IPL) April 19, 2026చదవండి: 'క్యాచ్‌లు జారవిడవడం మా కొంపముంచింది’ -
IPL 2026: లక్నోపై పంజాబ్ ఘన విజయం
ఐపీఎల్ 2026 సీజన్లో పంజాబ్ కింగ్స్ ఐదో విజయాన్ని నమోదు చేసింది. ఆదివారం ముల్లన్పూర్ వేదికగా లక్నో సూపర్‌జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ 54 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. 255 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 200 పరుగులకే పరిమితమైంది. మార్కరమ్ (42 ), రిషబ్ పంత్ (43), మార్ష్ (40) పరుగులు సాధించారు. అంతకముందు పంజాబ్ కింగ్స్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 254 పరుగులు చేసింది. ప్రియాన్ష్ (93), కూపర్ (87) పరుగులు చేశారు. 18 ఓవర్లలో లక్నో 179/418 ఓవర్లు ముగిసేసరికి లక్నో సూపర్‌జెయింట్స్ 4 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. మార్కరమ్ 28, ముకుల్ 16 పరుగులతో ఆడుతున్నారు.పంత్ (43) ఔట్.. మూడో వికెట్ కోల్పోయిన లక్నోపంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో లక్నో సూపర్‌జెయింట్స్ 128 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది. 43 పరుగులు చేసిన పంత్ అర్ష్‌దీప్ బౌలింగ్‌లో ప్రబ్‌సిమ్రన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. 8 ఓవర్లలో లక్నో 89/18 ఓవర్లు ముగిసేసరికి లక్నో వికెట్ నష్టానికి 89 పరుగులు చేసింది. మార్ష్ (35), పంత్ (18) క్రీజులో ఉన్నారు.తొలి వికెట్ కోల్పోయిన లక్నోపంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో లక్నో సూపర్‌జెయింట్స్ తొలి వికెట్ కోల్పోయింది. 35 పరుగులు చేసిన ఆయుశ్ బదోని విజయ్ కుమార్ బౌలింగ్‌లో బార్ట్లెట్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం లక్నో వికెట్ నష్టానికి 63 పరుగులు చేసింది.255 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో ఛేదనను ధాటిగానే ఆరంభించింది. 4 ఓవర్లు ముగిసేసరికి లక్నో వికెట్ నష్టపోకుండా 44 పరుగులు చేసింది. మార్ష్ 23, ఆయుశ్ బదోని 20 పరుగులతో క్రీజులో ఉన్నారు.లక్నో ముంగిట 255 పరుగుల లక్ష్యంఐపీఎల్ 2026 సీజన్లో పంజాబ్ కింగ్స్ అత్యధిక స్కోరు సాధించింది. లక్నో సూపర్‌జెయింట్స్‌తో మ్యాచ్‌లో 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 254 పరుగులు చేసింది. ప్రియాన్ష్ ఆర్య (93), కూపర్ కన్నోలి (87) విధ్వంసం సృష్టించారు. చివర్లో స్టోయినిస్ (29) కీలక ఇన్నింగ్స్ ఆడి పంజాబ్ భారీ స్కోరుకు బాటలు వేశాడు. పంజాబ్ బ్యాటర్ల ధాటికి లక్నో బౌలర్లు దారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. ప్రిన్స్ యాదవ్, మనిమరన్ సిద్దార్థ్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. ఈ సీజన్లో పంజాబ్‌దే అత్యధిక స్కోరు. ఇంతకముందు ఇదే సీజన్లో సీఎస్కేతో మ్యాచ్‌లో ఆర్సీబీ 250 పరుగులు చేసింది.18 ఓవర్లలో పంజాబ్ 230/518 ఓవర్లు ముగిసేసరికి పంజాబ్ కింగ్స్ 5 వికెట్ల నష్టానికి 230 పరుగులు చేసింది. స్టోయినిస్ 19 పరుగులు, శశాంక్ సింగ్ 6 పరుగులతో క్రీజులో ఉన్నారు.శ్రేయస్ అయ్యర్ (5) రూపంలో పంజాబ్ నాలుగో వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం 15 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసింది. అంతకముందు 93 పరుగులు చేసిన ప్రియాన్ష్ ఆర్య సిద్దార్థ్ బౌలింగ్‌లో మిచెల్ మార్ష్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరగాడు. దీంతో పంజాబ్ 187 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది. కూపర్ (87) ఔట్పంజాబ్ కింగ్స్ 185 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది. ధాటిగా ఆడుతున్న కూపర్ 46 బంతుల్లో 7 సిక్సులు 8 ఫోర్ల సాయంతో 87 పరుగులు చేసి ప్రిన్స్ యాదవ్ బౌలింగ్‌లో మణిమరన్ సిర్థార్థ్కు క్యాచ్ ఇచ్చుకున్నాడు.9 ఓవర్లు ముగిసేసరికి పంజాబ్ కింగ్స్ వికెట్ నష్టానికి 101 పరుగులు చేసింది. ప్రియాన్ష్ ఆర్య 19 బంతుల్లో ఫిఫ్టీ మార్క్‌ను అందుకున్నాడు. కన్నోలి 40 పరుగులతో ఆడుతున్నాడు.ప్రియాన్ష్ మెరుపులు.. పంజాబ్ 63/1పంజాబ్ కింగ్స్ ఓపెనర్ ప్రియాన్ష్ ఆర్య విధ్వంసం సృష్టిస్తున్నాడు. ఆరు ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 63 పరుగులు చేసింది. ప్రియాన్ష్ 40, కూపర్ కన్నోలి 23 పరుగులతో ఆడుతున్నారు.5 ఓవర్లలో పంజాబ్ 43/15 ఓవర్లు ముగిసేసరికి పంజాబ్ కింగ్స్ వికెట్ నష్టానికి 43 పరుగులు చేసింది. కూపర్ కన్నోలి 15, ప్రియాన్ష్ ఆర్య 21 పరుగులతో క్రీజులో ఉన్నారు.ప్రబ్‌సిమ్రన్ డకౌట్.. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ కింగ్స్‌కు ఆదిలోనే షాక్ తగిలింది. మహ్మద్ షమీ బౌలింగ్‌లో ఓపెనర్ ప్రబ్‌సిమ్రన్ సింగ్ డకౌట్‌గా వెనుదిరిగాడు.టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న లక్నోఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా ఆదివారం ముల్లన్పూర్ వేదికగా 29వ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్, లక్నో సూపర్‌జెయింట్స్ తలపడుతున్నాయి. టాస్ గెలిచిన లక్నో సూపర్‌జెయింట్స్ బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌కు పంజాబ్ ఏ మార్పులు లేకుండా బరిలోకి దిగింది. మరోవైపు లక్నో ఒక మార్పు చేసింది. దిగ్వేశ్ రాఠీ స్థానంలో సిద్దార్థ్ మణిరమన్ జట్టులోకి వచ్చాడు.పంజాబ్ కింగ్స్: ప్రభ్సిమ్రాన్ సింగ్ (వికెట్ కీపర్), ప్రియాన్ష్ ఆర్య, కూపర్ కొన్నోలీ, శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), శశాంక్ సింగ్, నెహాల్ వధేరా, మార్కస్ స్టోయినిస్, మార్కో జాన్సెన్, జేవియర్ బార్ట్లెట్, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్.లక్నో సూపర్‌జెయింట్స్: ఐడెన్ మార్క్రామ్, మిచెల్ మార్ష్, రిషబ్ పంత్(కెప్టెన్), నికోలస్ పూరన్, ఆయుష్ బదోని, ముకుల్ చౌదరి, మహ్మద్ షమీ, అవేష్ ఖాన్, ప్రిన్స్ యాదవ్, మణిమారన్ సిద్ధార్థ్, మొహ్సిన్ ఖాన్ -
సర్పంచ్ సాబ్!.. అర్థమేంటో తెలియదు: శ్రేయస్ అయ్యర్
శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో పంజాబ్ కింగ్స్ విజయవంతమైన జట్టుగా పేరు తెచ్చుకుంటోంది. ఐపీఎల్-2025లో ఫైనల్‌కు చేరిన పంజాబ్.. ఈ ఏడాది వరుస విజయాలతో జోరు మీద ఉంది. ఇప్పటికి ఐదు మ్యాచ్‌లు పూర్తి చేసుకోగా.. ఇందులో ఒకటి వర్షం వల్ల రద్దు కాగా.. మిగిలిన నాలుగూ గెలిచింది.అగ్రస్థానంలోతద్వారా తొమ్మిది పాయింట్లు సాధించి.. ప్రస్తుతానికి పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. ఇక ఐపీఎల్లో గత కొన్నేళ్లుగా శ్రేయస్ అయ్యర్ జోరు కొనసాగుతున్న విషయం తెలిసిందే. కోల్‌కతా నైట్ రైడర్స్‌కు 2024లో టైటిల్ అందించిన శ్రేయస్.. 2025లో పంజాబ్‌ను ఫైనల్‌కు చేర్చాడు.కేవలం కెప్టెన్‌గానే కాకుండా బ్యాటర్‌గానూ అలరిస్తూ ముందుకు సాగుతున్నాడు శ్రేయస్ అయ్యర్. గతేడాది 604 పరుగులు సాధించిన ఈ ముంబైకర్.. ఈ ఏడాది ఇప్పటికి నాలుగు ఇన్నింగ్స్‌లో కలిపి 203 పరుగులు చేశాడు. ఇదిలా ఉంటే.. శ్రేయస్ పంజాబ్ ఫ్రాంఛైజీతో చేరిననాటి నుంచి ఆ జట్టు అభిమానులు తమ కెప్టెన్‌ను ముద్దుగా సర్పంచ్ సాబ్ అని పిలుచుకుంటున్నారు.అర్థం ఏమిటో తెలియదుఅయితే, ఫ్యాన్స్ తనను అలా ఎందుకు పిలిచేవారో ముందుగా అర్థం కాలేదన్నాడు శ్రేయస్ అయ్యర్. ఆ తర్వాత జట్టు సభ్యులను అడిగితే అసలు విషయం తెలిసిందన్నాడు. జియోస్టార్ షోలో మాట్లాడుతూ.. ‘‘ఆ పిలుపు నాకెంతగానో నచ్చింది. అయితే, పంజాబ్ కింగ్స్‌తో ప్రయాణం మొదలుపెట్టినపుడు సర్పంచ్ సాబ్ అంటే అర్థం ఏమిటో నాకు తెలియదు.అప్పడు నా సహచర ఆటగాళ్లను అడుగగా.. ‘సర్పంచ్ అంటే.. ఇంటి పెద్ద లేదంటే ఓ సమూహానికి పెద్ద అని అర్థం.. జిల్లా పెద్దను ఇలాగే పిలుస్తారు’ అని చెప్పారు. అప్పటి నుంచి ఈ బిరుదును మరింత ఎక్కువగా ఆస్వాదిస్తున్నాను’’ అని శ్రేయస్ అయ్యర్ చెప్పుకొచ్చాడు. చదవండి: ‘విరాట్ కోహ్లిని చూస్తే బాధగా ఉంది’ -
స్టేడియంలో కనిపించని ప్రీతిజింటా.. అసలేమైంది?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఎస్ఆర్హెచ్ ఫ్రాంచైజీ ఓనర్ కావ్యా మారన్.. పంజాబ్ కింగ్స్ సహ యజమాని ప్రీతిజింటా.. ముంబై ఇండియన్స్ యజమాని నీతా అంబానీ.. కేకేఆర్ సహ భాగస్వామి జూహీ చావ్లా, ఆమె కూతురు జాన్వి మెహతా వీరంతా క్యాష్‌రిచ్ లీగ్‌కు అదనపు ఆకర్షణ. వీరంతా తమ జట్లు ఆడే ప్రతీ మ్యాచ్‌కు హాజరయ్యి ఆటగాళ్లను ఉత్సాహపరుస్తూనే తమ అందంతో అభిమానుల హృదయాలను కట్టిపడేస్తుంటారు. అయితే వీరందరిలో పంజాబ్ కింగ్స్ కో-ఓనర్ ప్రీతిజింటాది ప్రత్యేక శైలి. యువరాజ్ సింగ్, మ్యాక్స్‌వెల్ సహా చాలా మంది పంజాబ్ ఆటగాళ్లకు ఫ్లైయింగ్ కిస్‌లు ఇస్తూ ఉత్సాహపరుస్తుండేది. ఇలా ఐపీఎల్ ఆరంభం నుంచి ప్రతీ సీజన్లో పంజాబ్‌ను ప్రోత్సహిస్తూ మ్యాచ్‌లకు హాజరయ్యే ప్రీతి జింటా ఐపీఎల్ 19వ సీజన్లో మాత్రం ఎక్కడా కనిపించడం లేదు. మరోవైపు ఈ సీజన్లో పంజాబ్ కింగ్స్ వరుస విజయాలతో టైటిల్ రేసులో దూసుకెళ్తోంది. సీజన్లో ఇప్పటివరకు ఆడిన 5 మ్యాచ్‌ల్లో 4 విజయాలు (ఒక మ్యాచ్ రద్దు) సాదించిన పంజాబ్ 9 పాయింట్లతో పట్టికలో అగ్రస్థానంలో కూడా కొనసాగుతుంది. పంజాబ్ కింగ్స్ ఇంతలా రెచ్చిపోతున్న సమయంలో ప్రీతి జింటా మైదానంలో కనబడకపోయేసరికి పంజాబ్ అభిమానులు చిన్న బోతున్నారు. తాజాగా ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో పంజాబ్ విజయం సాధించిన అనంతరం ప్రీతిజింటా తన సామాజిక మాధ్యమంలో జట్టును అభినందిస్తూ పోస్ట్ చేసిందే తప్ప బయటకు రాలేదు. మరి ప్రీతిజింటాకు ఏమైనట్లు అని అభిమానులు ఆరా తీస్తున్న సమయంలో ఆమెనే స్వయంగా స్పష్టత ఇచ్చింది. ‘చాలా కాలంగా నా పిల్లలకు దూరంగా ఉండి షూటింగ్‌లు, ఇతర పనులతో బిజీగా గడిపాను. ప్రస్తుతం వాళ్లకు సెలవులు ఉన్నాయి. అందుకే ఈ విలువైన సమయాన్ని నా పిల్లలతో గడపాలని నిర్ణయించుకున్నాను. తల్లిగా వాళ్లతో ఉండటం నా బాధ్యత, అందుకే మ్యాచ్‌లకు హాజరు కాలేకపోతున్నాను. అయితే పిల్లలతో సెలవులు ముగియగానే మళ్లీ స్టేడియానికి వచ్చి జట్టుతో పాటు మిమ్మల్ని ఉత్సాహపరుస్తాను’ అని చెప్పుకొచ్చారు.పంజాబ్ జట్టు ఈసారి పాయింట్ల పట్టికలో టాప్‌లో ఉండటం, దీనికి తోడు త్వరలోనే ప్రీతి జింటా ఎంట్రీ ఇవ్వనుండటంతో అభిమానుల జోష్ డబుల్ కానుంది. పంజాబ్ కింగ్స్ తన తర్వాతి మ్యాచ్ ఆదివారం లక్నో సూపర్‌జెయింట్స్‌తో తలపడనుంది.Yes Yes Yessss !!!! Congratulations @PunjabKingsIPL for this win 👊So much maturity from @prabhsimran01 & wow @arshdeepsinghh Happy to see you shine 🤩 Amazing team work under the capable leadership of Sadda Sarpanch @ShreyasIyer15 & @RickyPonting 🔥 That was an awesome catch… pic.twitter.com/MNPsG1U1qU— Preity G Zinta (@realpreityzinta) April 16, 2026చదవండి: చెన్నై జట్టులోకి చిచ్చరపిడుగు! -
ముఖం చాటేసిన పాండ్యా.. ఏడుపొక్కటే తక్కువ!
ఐపీఎల్ 2026 సీజన్లో ముంబై ఇండియన్స్ వైఫల్యం కొనసాగుతుంది. ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో ఒక్క విజయం మాత్రమే సాధించిన ముంబై గురువారం పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ దారుణ ఓటమిని చవిచూసింది. ప్రబ్‌సిమ్రన్, శ్రేయస్ అయ్యర్ల విధ్వంసంతో ముంబై బౌలర్లు పూర్తిగా తేలిపోయారు. మ్యాచ్‌లో ఓటమితో ముంబై ఇండియన్స్ పట్టికలో తొమ్మిదో స్థానానికి పడిపోయింది. ముంబై ఓటమి తర్వాత ఢీలా పడిన ఆ జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యా బస్సులో హోటల్ రూమ్‌కు బయల్దేరిన సమయంలో మీడియా కంట పడ్డాడు. మీడియాను చూసి ముఖం చాటేసిన పాండ్యా తన చేతులు అడ్డుపెట్టుకొని ఏడ్చినంత పని చేశాడు. తన పక్కనే కూర్చున్న సూర్యకుమార్ యాదవ్ కూడా డల్‌గా కనిపించాడు. పక్కనే కూర్చున్న సూర్యతో కూడా ఏం మాట్లాడకుండా బస్ అద్దంవైపు తిరిగిన పాండ్యా బయటకు చూస్తూ కంటతడి పెట్టినట్లు కెమెరాలకు చిక్కింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక కెప్టెన్‌గానే గాక ఆటగాడిగానూ పాండ్యా విఫలమవుతున్నాడు. నాలుగు మ్యాచ్‌లు కలిపి 27 సగటుతో కేవలం 81 పరుగులు మాత్రమే చేశాడు. బౌలింగ్‌లో రెండు వికెట్లు మాత్రమే తీసిన పాండ్యా ఇచ్చుకున్న పరుగులుఎకానమీ రేటు 11.16గా ఉండడం గమనార్హం. పంజాబ్‌తో మ్యాచ్‌లోనూ టాస్ ఓడిపోవడం దగ్గరి నుంచి పాండ్యాకు ఏదీ కలిసిరాలేదు. బ్యాటింగ్‌లో 14 పరుగులు మాత్రమే చేసిన ఈ ఆల్‌రౌండర్ మూడు ఓవర్లు వేసి 39 పరుగులిచ్చి ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. ఇక మ్యాచ్ విషయానికొస్తే తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. క్వింటన్ డికాక్ సెంచరీతో మెరవగా, నమన్ ధిర్ అర్థసెంచరీతో రాణించాడు. అనంతరం పంజాబ్ ప్రబ్‌సిమ్రన్, అయ్యర్ విధ్వంసంతో 16.3 ఓవర్లలో మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి 198 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. ఇప్పటికే నాలుగు ఓటములతో పట్టికలో 9వ స్థానంలో ఉన్న ముంబై ఇండియన్స్‌కు గుజరాత్ టైటాన్స్‌తో ఏప్రిల్ 20న జరగబోయే మ్యాచ్ కీలకం కానుంది. ఈ మ్యాచ్‌కు అహ్మదాబాద్ వేదిక కానుంది.Hardik Pandya was hiding his face while going hotel in the team bus. He looked quite upset and emotional. After the match last night pic.twitter.com/X0Gdcltzpr— 𝐑𝐮𝐬𝐡𝐢𝐢𝐢⁴⁵ (@rushiii_12) April 17, 2026చదవండి: ఐపీఎల్ చరిత్రలో అరుదైన దృశ్యం.. -
పంజాబ్ చేతిలో ఓటమిపై హార్దిక్ కీలక వ్యాఖ్యలు
పంజాబ్ కింగ్స్ చేతిలో ఓటమిపై ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా స్పందించాడు. పరాజయాలపై సమీక్ష నిర్వహిస్తామని.. కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పదేమోనని వ్యాఖ్యానించాడు. మాజీ చాంపియన్ ముంబై ఇండియన్స్‌కు ఐపీఎల్-2026లో వరుసగా చేదు అనుభవాలు ఎదురవుతున్న సంగతి తెలిసిందే.కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పదుసొంతమైదానం వాంఖడేలో గురువారం పంజాబ్ కింగ్స్ (MI vs PBKS)తో మ్యాచ్‌లో ముంబై ఏడు వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఈ నేపథ్యంలో హార్దిక్ పాండ్యా మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘‘మేము ఎక్కడ పొరపాటు చేస్తున్నామో తెలుసుకునేందుకు సమీక్ష నిర్వహిస్తాము.వ్యక్తిగత వైఫల్యమా? సమిష్టి వైఫల్యమా? మా ప్రణాళికల్లోనే లోపాలున్నాయా? అన్న అంశాలపై చర్చించాల్సి ఉంది. కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పదు. లేదంటే ఇలాగే కొనసాగుతూ పరిస్థితులు చక్కదిద్దాలా అన్న విషయం గురించి ఆలోచిస్తాము. కొన్ని కఠినమైన ప్రశ్నలకు జవాబులు వెదకక తప్పదు. వైఫల్యాలకు బాధ్యత వహించాల్సి ఉంటుంది’’ అని హార్దిక్ పాండ్యా పేర్కొన్నాడు.ఆ ముగ్గురే టార్గెట్?ఈ నేపథ్యంలో ముంబై ఇండియన్స్ సీనియర్లు పేసర్ జస్ప్రీత్ బుమ్రాతో పాటు సూర్యకుమార్ యాదవ్.. మరో ప్లేయర్ తిలక్ వర్మ (Tilak Varma)ను ఉద్దేశించే హార్దిక్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. కాగా ప్రపంచస్థాయి బౌలర్ అయిన బుమ్రా ఇప్పటి వరకు ఐదు మ్యాచ్‌లలో కలిపి ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు.మరోవైపు.. సూర్య చేసిన పరుగులు వరుసగా 16, 51, 6, 33, 0. ఇక తిలక్ వర్మ రాబట్టిన రన్స్ 20, 0, 14, 1, 8. ఇదిలా ఉంటే.. పంజాబ్ జట్టుకు ఈ సందర్భంగా హార్దిక్ పాండ్యా క్రెడిట్ ఇచ్చాడు. ‘‘వాళ్లు మాకంటే మెరుగ్గా బౌలింగ్ చేశారు. మెరుగ్గా బ్యాటింగ్ చేశారు. ఫీల్డింగ్ అద్భుతం. వారి ప్రదర్శనకు మేము మూల్యం చెల్లించాల్సి వచ్చింది’’ అని హార్దిక్ పాండ్యా పేర్కొన్నాడు. ఈ మ్యాచ్‌లో పాండ్యా 14 పరుగులు చేశాడు. మూడు ఓవర్ల బౌలింగ్‌లో 39 రన్స్ ఇచ్చి వికెట్ తీయలేకపోయాడు.ముంబై వర్సెస్ పంజాబ్ స్కోర్లుముంబై- 195/6(20)పంజాబ్- 198/3(16.3)ముంబైపై ఏడు వికెట్ల తేడాతో పంజాబ్ గెలుపు.The winning momentum refuses to stop 🌪️A flawless record remains perfectly intact 🛡️Punjab Kings conquer the Wankhede to climb up to the top spot in the table! ❤️Updates ▶️ https://t.co/Fn2dxJ429j#TATAIPL | #KhelBindaas | #MIvPBKS | @PunjabKingsIPL pic.twitter.com/LUuZx5nlbf— IndianPremierLeague (@IPL) April 16, 2026చదవండి: T20 WC 2026: మ్యాచ్ ఫిక్సింగ్!.. రంగంలోకి ఐసీసీ -
‘ఓటములకు అతడిని బాధ్యుడిని చేయలేము’
ఐపీఎల్-2026లో ముంబై ఇండియన్స్ వైఫల్యాలు కొనసాగుతున్నాయి. పంజాబ్ కింగ్స్‌తో గురువారం నాటి మ్యాచ్‌లో హార్దిక్ సేన ఏడు వికెట్ల తేడాతో చిత్తుగా ఓడింది. తద్వారా ఈ సీజన్లో ఐదింట నాలుగో పరాజయం నమోదు చేసింది.హార్దిక్ పాండ్యాపై విమర్శలుఈ నేపథ్యంలో ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా (Hardik Pandya)పై విమర్శల వర్షం కురుస్తోంది. ముఖ్యంగా పంజాబ్‌తో మ్యాచ్‌లో అతడు బ్యాటింగ్‌లో, బౌలింగ్‌లో తేలిపోవడంతో జట్టుపై ప్రభావం పడింది. ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన పాండ్యా 12 బంతుల్లో 14 పరుగులే చేసి మార్కో యాన్సెన్ బౌలింగ్‌లో అవుటయ్యాడు.ఇక బౌలింగ్‌లో మూడు ఓవర్లు వేసిన పాండ్యా.. 39 పరుగులు ఇచ్చుకుని ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. ఈ నేపథ్యంలో హార్దిక్ పాండ్యాపై విమర్శల దాడి పెరగగా.. హెడ్‌కోచ్ మహేళ జయవర్దనె మాత్రం భిన్నంగా స్పందించాడు. ఈ సీజన్లో ముంబై ఓటములకు కేవలం హార్దిక్‌ను మాత్రమే బాధ్యుడిని చేయడం సరికాదన్నాడు.ఆ ఒక్కడినే బాధ్యుడిని చేయలేముపంజాబ్ చేతిలో ఓటమి అనంతరం మాట్లాడుతూ.. ‘‘ఇది కేవలం హార్దిక్ పాండ్యా వైఫల్యం మాత్రమే కాదు. మా సమిష్టి వైఫల్యం. జట్టుగా విఫలమైనపుడు అందరూ బాధ్యత వహించాల్సి ఉంటుంది. ముఖ్యంగా నేను... నాయకత్వ బృందంలో ఉన్న ప్రతి ఒక్కరు, యాజమాన్యం మొత్తం ఇందుకు బాధ్యత వహిస్తుంది.వ్యక్తిగతంగా ఎవరినీ బాధ్యులను చేయలేము. ఇకపై ఆటను మెరుగు పరచుకోవడం ఎలా అన్న అంశం మీద మాత్రమే మేము ప్రస్తుతం దృష్టి సారించాము’’ అని మహేళ జయవర్దనె హార్దిక్ పాండ్యాకు అండగా నిలిచాడు.తమ జట్టు బాగానే ఆడుతోందని.. అయితే, పూర్తి స్థాయిలో రాణించి ఫలితాన్ని రాబట్టలేకపోతుందని ఈ సందర్భంగా జయవర్దనె కాస్త అసంతృప్తి వ్యక్తం చేశాడు. మిగిలిన జట్లు మాత్రం అత్యద్భుతంగా ఆడుతూ ముందుకు సాగుతున్నాయని పేర్కొన్నాడు.ప్రభ్‌సిమ్రన్,శ్రేయస్ మెరుపులుకాగా వాంఖడే వేదికగా టాస్ గెలిచిన పంజాబ్ తొలుత బౌలింగ్ చేయగా.. ముంబై బ్యాటింగ్‌కు దిగింది. నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. ఓపెనింగ్ బ్యాటర్ క్వింటన్ డికాక్ అజేయ సెంచరీ (60 బంతుల్లో 112)తో చెలరేగగా.. నమన్ ధిర్ అర్ధ శతకం (50) బాదాడు.లక్ష్య ఛేదనకు దిగిన పంజాబ్ 16.3 ఓవర్లలో కేవలం మూడు వికెట్లు కోల్పోయి 198 పరుగులు సాధించింది. ఓపెనర్ ప్రభ్‌సిమ్రన్ సింగ్ (39 బంతుల్లో 80 నాటౌట్) దుమ్ములేపగా.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మరోసారి మెరుపు ఇన్నింగ్స్ (35 బంతుల్లో 66) ఆడాడు. వీరిద్దరి అద్భుత ఇన్నింగ్స్ కారణంగా ముంబై విధించిన లక్ష్యాన్ని పంజాబ్ ఆడుతూపాడుతూ ఛేదించింది.చదవండి: శ్రేయస్ స్టన్నింగ్ క్యాచ్.. షాకైన రోహిత్, సూర్య!The winning momentum refuses to stop 🌪️A flawless record remains perfectly intact 🛡️Punjab Kings conquer the Wankhede to climb up to the top spot in the table! ❤️Updates ▶️ https://t.co/Fn2dxJ429j#TATAIPL | #KhelBindaas | #MIvPBKS | @PunjabKingsIPL pic.twitter.com/LUuZx5nlbf— IndianPremierLeague (@IPL) April 16, 2026 -
పంజాబ్ ‘టాప్’ షో
ముంబై: బౌలర్ల క్రమశిక్షణకు బ్యాటర్ల జోరు తోడవడంతో... ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ సీజన్లో పంజాబ్ కింగ్స్ అజేయంగా సాగుతోంది. గురువారం జరిగిన పోరులో పంజాబ్ కింగ్స్ 7 వికెట్ల తేడాతో ఐదుసార్లు చాంపియన్ ముంబై ఇండియన్స్‌ను చిత్తుచేసింది. నాలుగో విజయంతో పంజాబ్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరగా... ముంబై వరుసగా నాలుగో పరాజయం మూటగట్టుకుంది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. ఓపెనర్ క్వింటన్ డికాక్ (60 బంతుల్లో 112 నాటౌట్; 8 ఫోర్లు, 7 సిక్స్‌లు) అజేయ సెంచరీతో కదంతొక్కాడు. ఈ సీజన్లో ఆడిన తొలి మ్యాచ్‌లోనే డికాక్ దుమ్మురేపాడు. నమన్ ధీర్ (31 బంతుల్లో 50; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) హాఫ్‌సెంచరీతో రాణించాడు. వీరిద్దరూ మూడో వికెట్‌కు 68 బంతుల్లోనే 122 పరుగులు జోడించారు. గాయం కారణంగా రోహిత్ శర్మ ఈ మ్యాచ్‌కు దూరం కాగా... రికెల్టన్ (2), సూర్యకుమార్ యాదవ్ (0), కెప్టెన్ హార్దిక్ పాండ్యా (14), రూథర్‌ఫోర్డ్ (1) విఫలమయ్యారు. పంజాబ్ బౌలర్లలో ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అర్ష్ దీప్ సింగ్ 22 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. అనంతరం లక్ష్యఛేదనలో పంజాబ్ కింగ్స్ 16.3 ఓవర్లలో 3 వికెట్లకు 198 పరుగులు చేసింది. ఓపెనర్ ప్రభ్‌సిమ్రన్ సింగ్ (39 బంతుల్లో 80; 11 ఫోర్లు, 2 సిక్స్‌లు), కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (35 బంతుల్లో 66; 5 ఫోర్లు, 4 సిక్స్‌లు) దంచి కొట్టడంతో లక్ష్యం చిన్నబోయింది. బాదుడే... బాదుడు బ్యాటింగ్‌కు అనుకూలిస్తున్న పిచ్‌పై పంజాబ్ బ్యాటర్లు తొలి ఓవర్ నుంచే ముంబై బౌలర్లపై చెలరేగారు. దీపక్ చహర్ వేసిన ఇన్నింగ్స్ మొదటి ఓవర్లో ప్రభ్‌సిమ్రన్ 2 ఫోర్లు కొడితే, ప్రియాన్ష్ ఆర్య (15; 2 ఫోర్లు, 1 సిక్స్) 6, 4 బాదాడు. దీంతో 21 పరుగులు వచ్చాయి. ఆర్యతో పాటు కూపర్ కనోలి (17; 1 ఫోర్, 2 సిక్స్‌లు)ని గజన్ఫర్ వరుస ఓవర్లలో అవుట్ చేయగా... ఎదుర్కొన్న తొలి బంతికే బౌండరీ బాది శ్రేయస్ తన ఉద్దేశం చాటాడు. పవర్‌ప్లే ముగిసేసరికి పంజాబ్ 61/2తో నిలిచింది. ఆ తర్వాత శ్రేయస్, ప్రభ్‌సిమ్రన్ జోరు కనబర్చడంతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. దీపక్ ఓవర్లో 6, 4 కొట్టిన ప్రభ్‌సిమ్రన్... హార్దిక్ ఓవర్లో రెండు, శార్దుల్ ఓవర్లో రెండు ఫోర్లతో 23 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. మరో ఎండ్ నుంచి శ్రేయస్ కూడా దూకుడు పెంచాడు. బుమ్రా బౌలింగ్‌లో భారీ షాట్లతో అలరించిన శ్రేయస్ 31 బంతుల్లో పిఫ్టీ మార్క్ అందుకున్నాడు. శార్దుల్ ఓవర్లో వరుసగా రెండు సిక్స్‌లు కొట్టిన శ్రేయస్ మరో భారీ షాట్ కొట్టే యత్నంలో అవుటైనా... అప్పటికే పంజాబ్ గెలుపు ఖాయమైంది. స్కోరు వివరాలు ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: రికెల్టన్ (సి) శశాంక్ (బి) అర్ష్ దీప్ 2; డికాక్ (నాటౌట్) 112; సూర్యకుమార్ (సి) చాహల్ (బి) అర్ష్ దీప్ 0; నమన్ (సి) బార్ట్లెట్ (బి) శశాంక్ 50; హార్దిక్ (సి) బార్ట్లెట్ (బి) యాన్సెన్ 14; రూథర్‌ఫోర్డ్ (బి) అర్ష్ దీప్ 1; తిల్ (రనౌట్) 8; మయాంక్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 195. వికెట్ల పతనం: 1–12, 2–12, 3–134, 4–175, 5–182, 6–193. బౌలింగ్: అర్ష్ దీప్ సింగ్ 4–0–22–3; యాన్సెన్ 4–0–30–1; బార్ట్లెట్ 4–0–39–0; వైశాక్ 3–0–36–0; యుజ్వేంద్ర చాహల్ 3–0– 45–0; శశాంక్ సింగ్ 2–0–19–1. పంజాబ్ కింగ్స్ ఇన్నింగ్స్: ప్రియాన్ష్ (సి) దీపక్ (బి) గజన్ఫర్ 15; ప్రభ్‌సిమ్రన్ (నాటౌట్) 80; కూపర్ (సి) డికాక్ (బి) గజన్ఫర్ 17; శ్రేయస్ (సి) నమన్ (బి) శార్దుల్ 66; స్టొయినిస్ (నాటౌట్) 10; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (16.3 ఓవర్లలో 3 వికెట్లకు) 198. వికెట్ల పతనం: 1–27, 2–45, 3–184. బౌలింగ్: దీపక్ 2.3–0–45–0; బుమ్రా 4–0–41–0; గజన్ఫర్ 4–0–31–2; హార్దిక్ 3–0–39–0; శార్దుల్ 3–0–42–1. ఐపీఎల్లో నేడుగుజరాత్ X కోల్‌కతా వేదిక: అహ్మదాబాద్‌రాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం -
గర్జించిన శ్రేయస్, ప్రబ్‌సిమ్రన్.. పంజాబ్ విజయం
ఐపీఎల్ 2026 సీజన్లో పంజాబ్ కింగ్స్ వరుస విజయాలతో జోరు కనబరుస్తోంది. గురువారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ 7 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. ఓపెనర్ ప్రబ్‌సిమ్రన్ (80 నాటౌట్), శ్రేయస్ అయ్యర్ (65) వీరవిహారం చేయడంతో 196 పరుగుల లక్ష్యాన్ని మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి 16.3 ఓవర్లలోనే ఛేదించడం విశేషం. ముంబై బౌలర్లలో గజన్ఫర్ 2 వికెట్లు తీయగా, శార్దూల్ ఠాకూర్ ఒక వికెట్ తీశాడు. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. క్వింటన్ డికాక్ (112 నాటౌట్) అజేయ శతకంతో అదరగొట్టగా.. నమన్ ధిర్ అర్థశతకంతో రాణించాడు. ఒక దశలో డికాక్, నమన్ ధిర్‌ల జోరుతో ముంబై ఇండియన్స్ 200 ప్లస్ పరుగులు చేస్తుందనిపించింది. కానీ నమన్ ధిర్ ఔటైన తర్వాత వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయిన ముంబై 195 పరుగుల వద్దే ఆగిపోయింది. పంజాబ్ బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్ 3 వికెట్లు తీయగా, యాన్సెన్, శశాంక్ సింగ్ చెరొక వికెట్ పడగొట్టారు. ఇక ఛేదనలో పంజాబ్ బ్యాటర్లు ప్రబ్‌సిమ్రన్, శ్రేయస్ అయ్యర్ పోటీపడి మరీ బౌండరీలు, సిక్సర్ల వర్షం కురిపించారు. పంజాబ్ దూకుడు ముందు ముంబై బౌలర్లు పూర్తిగా తేలిపోయారు. ముంబై బౌలర్లలో బుమ్రా సహా అందరూ దారాళంగా పరుగు లిచ్చుకున్నారు. సీజన్లో పంజాబ్ వరుసగా నాలుగో విజయం సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. మరోవైపు ముంబై ఇండియన్స్ 5 మ్యాచ్‌ల్లో 4 పరాజయాలతో 9వ స్థానంలో కొనసాగుతోంది.The winning momentum refuses to stop 🌪️A flawless record remains perfectly intact 🛡️Punjab Kings conquer the Wankhede to climb up to the top spot in the table! ❤️Updates ▶️ https://t.co/Fn2dxJ429j#TATAIPL | #KhelBindaas | #MIvPBKS | @PunjabKingsIPL pic.twitter.com/LUuZx5nlbf— IndianPremierLeague (@IPL) April 16, 2026 -
శ్రేయస్ స్టన్నింగ్ క్యాచ్.. షాకైన రోహిత్, సూర్య!
ఐపీఎల్ 2026 సీజన్లో పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ స్టన్నింగ్ క్యాచ్‌తో మెరిశాడు. గురువారం ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్ సందర్భంగా బౌండరీ లైన్ వద్ద అయ్యర్ అదిరిపోయే క్యాచ్ అందుకున్నాడు. అతని స్టన్నింగ్ క్యాచ్‌ను కళ్లారా చూసిన ముంబై ఇండియన్స్ స్టార్ బ్యాటర్లు రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ ఆశ్చర్యపోయారు. మార్కో యాన్సెన్ వేసిన 18వ ఓవర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్ తొలి బంతిని భారీ సిక్సర్ బాదిన హార్దిక్ రెండో బంతిని డాట్ చేశాడు. మూడో బంతిని లాంగాన్ దిశగా భారీ షాట్ ఆడగా.. సిక్సర్‌గా దూసుకొచ్చిన బంతిని బౌండరీ లైన్‌పై అయ్యర్ అద్భుతంగా అందుకొని చాకచక్యంగా లోపలికి విసిరేసాడు. అక్కడే ఉన్న బార్ట్లెట్ ఏ తప్పిదం చేయకుండా అందుకున్నాడు. ఎడమవైపు గాల్లోకి ఎగురుతూ బంతిని అందుకోవడంతో పాటు అంతే సమర్థవంతంగా అయ్యర్ లోపలికి విసిరేయడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. క్యాచ్ పూర్తయిన వెంటనే శ్రేయస్ అయ్యర్.. ఇప్పుడు అరవండంటూ ప్రేక్షకులను ఉద్దేశించి సైగలు చేశాడు. అప్పటి వరకు అరిచిన ముంబై ఫ్యాన్స్.. ఈ క్యాచ్‌తో మౌనం వహించారు. దాంతో వారిని ఇంకా గట్టిగా అరవాలంటూ అయ్యర్ కోరాడు. అయితే అయ్యర్ పట్టిన క్యాచ్‌కు డగౌట్లో ఉన్న రోహిత్, సూర్యకుమార్‌లు ఫిదా అయ్యారు. వాట్ ఏ క్యాచ్ అని రోహిత్ సూర్యతో చెబుతున్నట్లు కెమెరాల్లో కనిపించింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.SHREYAS IYER, WHAT HAVE YOU DONE!! 🤯🎥 One of the best catches you would see in the #TATAIPL history 🔥🔥Updates ▶️ https://t.co/Fn2dxJ4zYR#KhelBindaas | #MIvPBKS | @PunjabKingsIPL pic.twitter.com/6EKgHR82cL— IndianPremierLeague (@IPL) April 16, 2026SKY & ROHIT COULDN'T BELIEVE IT - SHREYAS IYER YOU BEAUTY 😍 pic.twitter.com/lo0McmMaJh— Johns. (@CricCrazyJohns) April 16, 2026 -
డికాక్ కొత్త చరిత్ర.. ఒక్క సెంచరీతో ఇన్ని రికార్డులా?
ఐపీఎల్ 2026 సీజన్లో పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఓపెనర్ క్వింటన్ డికాక్ సెంచరీతో చెలరేగాడు. ఈ సీజన్లో డికాక్‌కు ఇదే తొలి మ్యాచ్ కాగా, ఆడిన తొలి మ్యాచ్‌లోనే శతక్కొట్టడం విశేషం. ఈ నేపథ్యంలో డికాక్ ఒక్క సెంచరీతో పలు రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు.టీ20 క్రికెట్లో డికాక్‌కు ఇది 9వ సెంచరీ. టీ20ల్లో అత్యధిక సెంచరీలు బాదిన క్రికెటర్ల జాబితాలో నాలుగో స్థానంలో ఉన్నాడు. కోహ్లి, రిలీ రోసౌ, సాహిబ్జదా ఫర్హాన్‌లు కూడా 9 శతకాలతో నాలుగో స్థానంలోనే ఉన్నారు. ఇక విండీస్ వీరుడు క్రిస్ గేల్ 22 శతకాలతో తొలి స్థానంలో ఉండగా, బాబర్ ఆజమ్ (11), డేవిడ్ వార్నర్ (10) శతకాలతో రెండు, మూడు స్థానాల్లో కొనసాగుతున్నారు.ఐపీఎల్లో మూడు వేర్వేరు జట్లు తరఫున సెంచరీలు బాదిన మూడో బ్యాటర్‌గా డికాక్ నిలిచాడు. 2016లో ఢిల్లీ డేర్‌డెవిల్స్ తరఫున ఆర్సీబీతో మ్యాచ్‌లో 108 పరుగులు, 2022లో లక్నో సూపర్‌జెయింట్స్ తరఫున కేకేఆర్‌తో మ్యాచ్‌లో 140 నాటౌట్, తాజాగా పంజాబ్‌తో మ్యాచ్‌లో అజేయ శతకంతో మెరిశాడు. గతంలో సంజూ శాంసన్ (ఢిల్లీ, రాజస్తాన్, సీఎస్కే), కేఎల్ రాహుల్ (పంజాబ్, ఢిల్లీ, లక్నో) ఈ ఫీట్ సాధించారు. మరో విశేషమేమిటంటే ఈ ముగ్గురు కూడా వికెట్ కీపర్లే కావడం గమనించాల్సిన అంశం.ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ తరఫున పంజాబ్‌పై సెంచరీ సాధించిన రెండో బ్యాటర్‌గా డికాక్ నిలిచాడు. 2014లో లెండిల్ సిమ్మ న్స్ (100 నాటౌట్) పంజాబ్‌పై తొలి సెంచరీ సాధించాడు.ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ తరఫున అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేసిన ఆటగాళ్ల జాబితాలో డికాక్ చోటు సంపాదించాడు. సనత్ జయసూర్య (114 నాటౌట్) తొలి స్థానంలో ఉంటే డికాక్ రెండో స్థానంలో ఉన్నాడు. ఇక రోహిత్ శర్మ (109 నాటౌట్, 105 నాటౌట్) ముంబై తరపున రెండుసార్లు తన బెస్ట్ స్కోర్లు నమోదు చేశాడు.ఐపీఎల్ 2026 సీజన్లో డికాక్‌ది రెండో సెంచరీ. సీఎస్కే ఓపెనర్ సంజూ శాంసన్ ఈ సీజన్లో తొలి సెంచరీ సాధించాడు.మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. క్వింటన్ డికాక్ (112 నాటౌట్) అజేయ శతకంతో అదరగొట్టగా.. నమన్ ధిర్ అర్థశతకంతో రాణించాడు.పంజాబ్ బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్ 3 వికెట్లు తీయగా, యాన్సెన్, శశాంక్ సింగ్ చెరొక వికెట్ పడగొట్టారు.𝑸𝒖𝒊𝒕𝒆 𝒅𝒆 𝑲𝒏𝒐𝒄𝒌! 👏#MIvPBKSpic.twitter.com/ZmfClFOpm8— Mumbai Indians (@mipaltan) April 16, 2026What a player, what a knock, and what a way to start the season! 💯Quinton de Kock, take a bow for a truly special Wankhede hundred! 👏Updates ▶️ https://t.co/Fn2dxJ4zYR#TATAIPL | #KhelBindaas | #MIvPBKS | @mipaltan pic.twitter.com/jEhH1ofb1z— IndianPremierLeague (@IPL) April 16, 2026చదవండి: ఐపీఎల్లో సెంచరీ కొట్టిన అర్ష్‌దీప్ -
ఐపీఎల్లో సెంచరీ కొట్టిన అర్ష్‌దీప్
ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ సెంచరీ నమోదు చేశాడు. అయితే అర్ష్‌దీప్ సెంచరీ నమోదు చేసింది బ్యాటింగ్‌లో అనుకుంటే పొరపాటే. ఎందుకంటే బౌలింగ్‌లో అర్ష్‌దీప్ ఈ ఫీట్‌ను సాధించాడు. ఐపీఎల్ 2026 సీజన్లో ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో ఓపెనర్ రికెల్టన్ను ఔట్ చేయడం ద్వారా అర్ష్‌దీప్ ఐపీఎల్లో వంద వికెట్ల మార్క్‌ను చేరుకున్నాడు. ఐపీఎల్లో వంద వికెట్లు సాధించి ఐదో లెఫ్టార్మ్ పేసర్‌గా, నాలుగో భారత బౌలర్‌గా నిలిచాడు. ఇంతకముందు ట్రెంట్ బౌల్ట్ (144 వికెట్లు), ఉనాద్కట్ (114 వికెట్లు), ఆశిష్ నెహ్రా (106 వికెట్లు), జహీర్ ఖాన్ (102 వికెట్లు) ముందున్నారు. ఇక పవర్ ప్లేలో అర్ష్‌దీప్ వికెట్ తీసుకోవడం 11 ఇన్నింగ్స్‌ల తర్వాత ఇదే తొలిసారి కావడం గమనార్హం.Back-to-back breakthroughs 🎯A century of #TATAIPL wickets 🌟Arshdeep Singh becomes the first @PunjabKingsIPL bowler to reach the milestone 👏Updates ▶️ https://t.co/Fn2dxJ4zYR#TATAIPL | #KhelBindaas | #MIvPBKS | @arshdeepsinghh pic.twitter.com/ioOXVqbfWX— IndianPremierLeague (@IPL) April 16, 2026 #MI in 𝗱𝗲𝗲𝗽 trouble 😯🎥 Arshdeep Singh with 2️⃣ wickets in his second over 👊Updates ▶️ https://t.co/Fn2dxJ4zYR#TATAIPL | #KhelBindaas | #MIvPBKS | @PunjabKingsIPL pic.twitter.com/6zPnONpClJ— IndianPremierLeague (@IPL) April 16, 2026 -
ఐపీఎల్ చరిత్రలో అరుదైన దృశ్యం..
ఐపీఎల్ 2026 సీజన్లో ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్‌లో అరుదైన దృశ్యం చోటుచేసుకుంది. టాస్ గెలిచిన పంజాబ్ ముంబైని బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఈ మ్యాచ్‌కు రోహిత్ శర్మ దూరం కావడంతో అతడి స్థానంలో క్వింటన్ డికాక్ జట్టులోకి వచ్చాడు. డికాక్‌తో కలిసి రియాల్ రికెల్టన్ ముంబై ఇన్నింగ్స్‌ను ఆరంభించాడు. గమనించాల్సిన అంశం ఏంటంటే ఈ ఇద్దరు సౌతాఫ్రికాకు చెందిన వారే కావడం విశేషం. ఐపీఎల్లో ఇలాంటి ఘటనలు అరుదుగా జరుగుతుంటాయి. ముంబై ఇండియన్స్ తరఫున ఇద్దరు సౌతాఫ్రికా బ్యాటర్లు ఓపెనింగ్ చేయడం ఐపీఎల్లో ఇదే తొలిసారి. ఇక ఇన్నింగ్స్ రెండో ఓవర్ మార్కో యాన్సెన్ వేశాడు. ఈ సమయంలో స్ట్రైకింగ్‌లో, నాన్ స్ట్రైకింగ్ ఎండ్‌తో పాటు బౌలర్ కూడా సౌతాఫ్రికాకు చెందిన వారే ఉండడం మరో గమనించదగ్గ అంశం. -
IPL 2026: పంజాబ్ కింగ్స్ ఘన విజయం
ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ 7 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. సీజన్లో పంజాబ్‌కు ఇది నాలుగో విజయం. ఓపెనర్ ప్రబ్‌సిమ్రన్ (80 నాటౌట్), శ్రేయస్ అయ్యర్ (65) వీరవిహారంతో 196 పరుగుల లక్ష్యాన్ని కేవలం 16.3 ఓవర్లలోనే మూడు వికెట్లు కోల్పోయి ఛేదించడం విశేషం. ముంబై బౌలర్లలో గజన్ఫర్ 2 వికెట్లు తీయగా, శార్దూల్ ఠాకూర్ ఒక వికెట్ తీశాడు. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. క్వింటన్ డికాక్ (112 నాటౌట్) అజేయ శతకంతో అదరగొట్టగా.. నమన్ ధిర్ అర్థశతకంతో రాణించాడు. ప్రబ్‌సిమ్రన్ హాఫ్ సెంచరీముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ విజయం దిశగా సాగుతుంది. ఓపెనర్ ప్రబ్‌సిమ్రన్ అర్థసెంచరీతో చెలరేగగా, అయ్యర్ (34) దూకుడుగా ఆడుతున్నాడు. ప్రస్తుతం పంజాబ్ 12 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 132 పరుగులు చేసింది. ఆరు ఓవర్లు ముగిసేసరికి పంజాబ్ కింగ్స్ 2 వికెట్ల నష్టానికి 62 పరుగులు చేసింది. శ్రేయస్ (12), ప్రబ్‌సిమ్రన్ (16) క్రీజులో ఉన్నారు. అంతకముందు కూపర్ కన్నోలి (17) రెండో వికెట్‌గా వెనుదిరిగాడు.తొలి వికెట్ కోల్పోయిన పంజాబ్197 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్ తొలి వికెట్ కోల్పోయింది. 15 పరుగులు చేసిన ప్రియాన్ష్ ఆర్య గజన్ఫర్ బౌలింగ్‌లో దీపక్ చాహర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం పంజాబ్ వికెట్ నష్టానికి 27 పరుగులు చేసింది. అంతకముందు ఇన్నింగ్స్ తొలి ఓవర్లో పంజాబ్ 21 పరుగులు పిండుకోవడం విశేషం.పంజాబ్ టార్గెట్ 196 పరుగులుపంజాబ్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. క్వింటన్ డికాక్ (112 నాటౌట్) అజేయ శతకంతో అదరగొట్టగా.. నమన్ ధిర్ అర్థశతకంతో రాణించాడు. ఒక దశలో డికాక్, నమన్ ధిర్‌ల జోరుతో ముంబై ఇండియన్స్ 200 ప్లస్ పరుగులు చేస్తుందనిపించింది. కానీ నమన్ ధిర్ ఔటైన తర్వాత వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయిన ముంబై 195 పరుగుల వద్దే ఆగిపోయింది. పంజాబ్ బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్ 3 వికెట్లు తీయగా, యాన్సెన్, శశాంక్ సింగ్ చెరొక వికెట్ పడగొట్టారు.బార్ట్లెట్ కళ్లు చెదిరే క్యాచ్.. పాండ్యా (14)ఔట్14 పరుగులు చేసిన పాండ్యా మార్కో యాన్సెస్ బౌలింగ్‌లో గ్జేవియర్ బార్ట్లెట్ అద్భుత క్యాచ్‌కు వెనుదిరిగాడు. డికాక్ సెంచరీపంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఓపెనర్ క్వింటన్ డికాక్ సెంచరీ బాదాడు. 53 బంతుల్లో సెంచరీ మార్క్ అందుకున్న డికాక్‌కు ఐపీఎల్లో ఇది మూడో సెంచరీ. ప్రస్తుతం ముంబై ఇండియన్స్ 4 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది.నమన్ ధిర్ ఔట్.. మూడో వికెట్ డౌన్పంజాబ్తో మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ మూడో వికెట్ కోల్పోయింది. అర్థసెంచరీ సాధించిన నమన్ ధిర్ శశాంక్ సింగ్ బౌలింగ్‌లో బార్ట్లెట్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం ముంబై 15 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 145 పరుగులు చేసింది. డికాక్ (82), పాండ్యా (3) క్రీజులో ఉన్నారు.7 ఓవర్లలో ముంబై 67/2ఏడు ఓవర్లు ముగిసేసరికి ముంబై ఇండియన్స్ రెండు వికెట్ల నష్టానికి 67 పరుగులు చేసింది. నమన్ ధిర్ (34), డికాక్ (25) క్రీజులో ఉన్నారు.సూర్యకుమార్ గోల్డెన్ డక్.. పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ రెండో వికెట్ కోల్పోయింది. అర్షదీప్ సింగ్ వరుస బంతుల్లో రెండు వికెట్లు తీశాడు. సూర్యకుమార్ యాదవ్‌ను గోల్డెన్ డక్‌గా పెవిలియన్ చేర్చిన అర్షదీప్ సింగ్ అంతకముందు రియాన్ రికెల్టన్ను ఔట్ చేశాడు. ప్రస్తుతం ముంబై ఇండియన్స్ 3 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 15 పరుగులు చేసింది.బౌలింగ్ ఎంచుకున్న పంజాబ్ఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా గురువారం వాంఖడే వేదికగా 24వ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ తలపడుతున్నాయి. టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ బౌలింగ్ ఎంచుకుంది. ముంబై జట్టు రెండు మార్పులతో బరిలోకి దిగింది. రోహిత్ శర్మ, మిచెల్ సాంట్నర్ స్థానం డికాక్, మయాంక్ రావత్ తుది జట్టులోకి వచ్చారు. పంజాబ్ మాత్రం తమ జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదు.ముఖాముఖి పోరులో ఇరుజట్లు 35 సార్లు తలపడగా.. ముంబై ఇండియన్స్ 17 సార్లు, పంజాబ్ కింగ్స్ 17 సార్లు నెగ్గాయి. ఒక మ్యాచ్‌లో ఫలితం రాలేదు. ఇక వాంఖడే స్టేడియంలో మాత్రం పంజాబ్ కింగ్స్ రికార్డు మెరుగ్గా ఉంది. వాంఖడేలో పంజాబ్ ముంబై పై 5 సార్లు గెలిచింది. గత ఐదు మ్యాచ్‌ల్లో ముంబై మూడింటింలో, పంజాబ్ రెండు మ్యాచ్‌ల్లో గెలిచాయి.ముంబై ఇండియన్స్ తుదిజట్టు: క్వింటన్ డికాక్(వికెట్ కీపర్), ర్యాన్ రికెల్టన్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా( కెప్టెన్), రూథర్‌ఫోర్డ్, నమన్ ధీర్, మయాంక్ రావత్, శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్, జస్ప్రీత్ బుమ్రా.పంజాబ్ కింగ్స్ తుదిజట్టు: ప్రభ్సిమ్రాన్ సింగ్(వికెట్ కీపర్), ప్రియాన్ష్ ఆర్య, శ్రేయాస్ అయ్యర్(కెప్టెన్), కూపర్ కొన్నోలీ, శశాంక్ సింగ్, మార్కస్ స్టోయినిస్, మార్కో యాన్సెన్, జేవియర్ బార్ట్లెట్, విజయ్‌కుమార్ వైశాక్, అర్ష్‌దీప్ సింగ్, యజ్వేంద్ర చాహల్. -
ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్
ఐపీఎల్ 2026లో భాగంగా ఇవాళ (ఏప్రిల్ 16) పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ మధ్య బిగ్ ఫైట్ జరుగనుంది. వాంఖడే వేదికగా జరుగబోయే ఈ మ్యాచ్‌కు ముందు ముంబై ఇండియన్స్‌కు భారీ షాక్ తగిలింది. స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ ఈ మ్యాచ్‌కు దూరం కానున్నాడని తెలుస్తుంది.రోహిత్ ఆర్సీబీతో మ్యాచ్ సందర్భంగా గాయపడిన (Hamstring Injury) విషయం తెలిసిందే. స్కాన్లలో గాయం ఉందా లేదా అన్న విషయం స్పష్టంగా తెలియడం లేదు. దీంతో ఎంఐ మేనేజ్మెంట్ ముందు జాగ్రత్త చర్యగా హిట్‌మ్యాన్‌కు కొద్ది రోజుల పాటు విశ్రాంతి ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. గుజరాత్‌తో మ్యాచ్ (ఏప్రిల్ 20) సమయానికి రోహిత్ పూర్తిగా కోలుకునే అవకాశం ఉంది. కాగా, ఆర్సీబీ మ్యాచ్‌లో రోహిత్ బ్యాటింగ్ చేస్తూ మధ్యలోనే వైదొలిగిన విషయం తెలిసిందే.పంజాబ్‌తో మ్యాచ్‌కు రోహిత్ దూరమైతే, ఇప్పటికే కష్టాల్లో ఉన్న ముంబై ఇండియన్స్ మరింత ఇబ్బంది పడనుంది. ఈ సీజన్లో ముంబై తొలి మ్యాచ్ విజయం తర్వాత హ్యాట్రిక్ పరాజయాలు ఎదుర్కొని పాయింట్ల పట్టికలో చివరి నుంచి రెండో స్థానంలో ఉంది. రోహిత్ విషయానికొస్తే.. ఈ సీజన్లో అతను ఓ మోస్తరు ఫామ్‌లో ఉన్నాడు. ఇప్పటివరకు ఆడిన 4 మ్యాచ్‌ల్లో 137 పరుగులు చేశాడు. పంజాబ్ మ్యాచ్‌కు రోహిత్ మిస్ అయితే అతని స్థానంలో నమన్ ధీర్‌కు ఓపెనర్‌గా అవకాశం దక్కవచ్చు.మరోపక్క నేటి పంజాబ్ మ్యాచ్‌కు స్టార్ ఆల్‌రౌండర్ విల్ జాక్స్ అందుబాటులో ఉంటాడు. జాక్స్ బుధవారమే జట్టుతో చేరాడు. అతను తుది జట్టులో ఉంటాడా లేదా అన్నదానిపై క్లారిటీ లేదు.పంజాబ్ విషయానికొస్తే.. ఈ జట్టు ప్రస్తుత సీజన్లో వరుస విజయాలతో దూసుకుపోతుంది. ఈ సీజన్లో ఇప్పటివరకు ఓటమి ఎరుగని జట్టు ఏదైనా ఉందా అంటే అది పంజాబే. ఈ సీజన్లో పంజాబ్ 4 మ్యాచ్‌ల్లో 3 విజయాలు సొంతం చేసుకొని పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది. కేకేఆర్‌తో జరగాల్సిన ఓ మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది.పంజాబ్‌తో మ్యాచ్‌కు ముంబై ఇండియన్స్ తుది జట్టు (అంచనా)..ర్యాన్ రికెల్టన్, నమన్ ధీర్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్, మిచెల్ సాంట్నర్, శార్దూల్ ఠాకూర్, ట్రెంట్ బౌల్ట్, మయాంక్ మార్కండే, జస్ప్రీత్ బుమ్రా -
‘టీమిండియాకు ఎంపిక చేయకపోతే నిరసనకు దిగుతా’
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో శ్రేయస్ అయ్యర్ హవా కొనసాగుతోంది. పంజాబ్ కింగ్స్ కెప్టెన్, బ్యాటర్‌గా ఈ టీమిండియా మిడిలార్డర్ ఆటగాడు అదరగొడుతున్నాడు. ఐపీఎల్-2024లో కోల్‌కతా నైట్ రైడర్స్‌కు సారథిగా టైటిల్ అందించిన శ్రేయస్ అయ్యర్.. గతేడాది పంజాబ్‌ను ఫైనల్‌కు చేర్చాడు.అంతేకాదు 2025లో 17 మ్యాచ్‌లలో కలిపి 604 పరుగులు సాధించాడు అయ్యర్. తద్వారా అత్యధిక పరుగుల వీరుల జాబితాలో ఆరో స్థానంలో నిలిచాడు. ఇక ఈ ఏడాది ఇప్పటికి పంజాబ్ ఆడిన నాలుగు మ్యాచ్‌లలో మూడు గెలిచింది. మరోవైపు.. శ్రేయస్ అయ్యర్ నాలుగు మ్యాచ్‌లలో కలిపి 137 పరుగులు చేశాడు.శ్రేయస్ అయ్యర్ దుమ్ములేపుతున్నా..ఇదిలా ఉంటే.. దేశీ టీ20 ఫార్మాట్, ఐపీఎల్లో శ్రేయస్ అయ్యర్ దుమ్ములేపుతున్నా.. భారత టీ20 జట్టులో మాత్రం అతడికి చోటు దక్కడం లేదు. ప్రస్తుతం జట్టులో ఖాళీ లేనందునే ఈ ముంబైకర్‌ను పక్కనపెట్టాల్సి వస్తోందని చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ గతంలో పేర్కొన్నాడు.ఈ పరిణామాల నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ మనోజ్ తివారి శ్రేయస్ అయ్యర్‌ను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇంత చేసినా అయ్యర్‌ను భారత టీ20 జట్టుకు ఎంపిక చేయకపోతే తాను నిరసనకు దిగుతానన్నాడు. ‘‘అతడు గొప్పగా బ్యాటింగ్ చేస్తున్నాడు.టీమిండియాకు ఎంపిక చేయకపోతే నిరసనకు దిగుతాఅయినా సరే సెలక్టర్లు గనుక అతడిని జాతీయ టీ20 జట్టుకు ఎంపిక చేయకపోతే.. నాతో పాటు మిగిలిన వాళ్లు కూడా వచ్చి నిరసనకు దిగాలి. అతడి కోసం మనం ఫైట్ చేయాలి. జట్టులో చోటుకు అతడు అర్హుడు. ఇప్పటికే విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించారు.ఇలాంటి సమయంలో శ్రేయస్ అయ్యర్ లాంటి ఆటగాడు జట్టులోకి వస్తే ఉపయోగకరం. అతడు జట్టులో ఉంటే టీమిండియా ఐసీసీ ట్రోఫీలు గెలవగలదు’’ అని మనోజ్ తివారి పేర్కొన్నాడు. శ్రేయస్ అయ్యర్ విషయంలో సెలక్టర్లతో మాటల యుద్ధం చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు తెలిపాడు.చదవండి: Vaibhav Suryavanshi: వైభవ్ సూర్యవంశీ కూడబెట్టిన ఆస్తులు తెలిస్తే షాకవ్వాల్సిందే? -
మరో వివాదంలో చహల్
పంజాబ్ కింగ్స్ స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్ వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్‌గా మారాడు. భార్యతో విడాకులు, ఆతర్వాత పలువురు అమ్మాయిలతో డేటింగ్ పుకార్లు.. కొద్ది రోజుల కిందట సిగరెట్ వివాదం, తాజాగా ఓ నటితో అసభ్య వ్యవహారం. ఇలా చహల్ అనునిత్యం ఏదో వివాదంలో చిక్కుకుంటూ వార్తల్లో నిలుస్తున్నాడు.తాజా వివాదం ఏంటంటే..?చహల్.. కోల్‌కతాకు చెందిన నటి, మోడల్, సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ అయిన తానియా చటర్జీకి ఓ మెసేజ్ పెట్టాడు. దీన్ని ఆమె సోషల్‌మీడియా వేదికగా బహిర్గతం చేసింది. చహల్ తన వీడియో క్లిప్‌లను షేర్ చేస్తూ 'cute' అని కామెంట్ చేసినట్లు ఓ వీడియో ద్వారా వెల్లడించింది. Dude wtf, Taniya chatterjee exposing yuzvendra chahal.She showing her instagram dm to paps where yuzi replied to her story and said her cute. If this is real shame on yuzvendra. pic.twitter.com/E4sYyc1uk2— Aditya. (@Adityaverce) April 12, 2026సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ వీడియోలో చహల్ పంపిన Instagram DM చూపించింది. ఈ వీడియోలో మాట్లాడుతూ.. నేను వ్యక్తిగతంగా చహల్‌ను ఎప్పుడూ కలవలేదు. ఆయన మెసేజ్ రావడం ఆశ్చర్యంగా అనిపించింది. నేను ఆ మెసేజ్‌కు పెద్దగా స్పందించలేదు. ఆలస్యంగా చూసినందున సంభాషణ కొనసాగలేదని తెలిపింది. ఈ వీడియోను చూసిన అనంతరం నెటిజన్లు చహల్‌ను తిట్టిపోస్తున్నారు. దేశానికి ప్రాతినిథ్యం వహించిన వ్యక్తి ఇలాగేనా ప్రవర్తించేదంటూ ఫైరవుతున్నారు. బుద్ది మార్చుకోకపోతే ఐపీఎల్ అవకాశాలు కూడా ఉండవని హెచ్చరిస్తున్నారు.కాగా, కొద్ది రోజుల కిందట చహల్‌కు సంబంధించిన మరో వీడియో కూడా సోషల్‌మీడియాలో రచ్చ చేసింది. చహల్గా భావిస్తున్న వ్యక్తి లగ్జరీ కారులో కూర్చొని సిగరెట్ తాగుతూ కనిపిస్తాడు. ఇంతవరకు ఎలాంటి అభ్యంతరం లేకపోయినా కాల్చిన సిగరేట్‌ను ఆర్పకపోవడం విమర్శలకు కారణమైంది. బహిరంగ ప్రదేశాల్లో సిగరెట్ కాల్చడమే నేరం. అలాంటిది దాన్ని ఆర్పాలన్న సోయి కూడా లేకుండా రోడ్డుపై పడేయటాన్ని నెటిజన్లు తప్పుబట్టారు.ఇంతకీ ఎవరీ తానియా చటర్జీ..? - తానియా చటర్జీ కోల్‌కతాకు చెందిన నటి, మోడల్, సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్. - ఆమె గాంది బాత్సీజన్ 4, క్లాస్ ఆఫ్ 2020 సీజన్ 2 వంటి వెబ్ సిరీస్‌లలో నటించింది. - Ullu యాప్‌లో పలు సిరీస్‌లలోనూ కనిపించింది. ఇదిలా ఉంటే, ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ సీజన్లో చహల్ పెద్దగా ఆకట్టుకోలేకపోతున్నాడు. వాస్తవానికి గత కొద్ది సీజన్లుగా అతని ప్రదర్శన ఏమంత ఆశాజనకంగా లేదు. అందుకే జాతీయ జట్టు అవకాశాలను సైతం కోల్పోయాడు. ఈ సీజన్లో చహల్ ఇప్పటివరకు ఆడిన 4 మ్యాచ్‌ల్లో 3 వికెట్లు మాత్రమే తీశాడు. అతని ఎకానమీ రేట్ కూడా చాలా ఎక్కువగా (8.20) ఉంది. -
పంజాబ్ ప్రతాపం
న్యూ చండీగఢ్: ఐపీఎల్ 19వ సీజన్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ వరుసగా రెండో పరాజయం మూట గట్టుకుంది. బ్యాటింగ్‌లో ఆశించిన స్కోరు చేయలేకపోయిన రైజర్స్... పేలవ బౌలింగ్‌తో మూల్యం చెల్లించుకుంది. శనివారం ‘డబుల్ హెడర్’లో భాగంగా జరిగిన తొలి పోరులో సన్‌రైజర్స్ 6 వికెట్ల తేడాతో పంజాబ్ కింగ్స్ చేతిలో ఓడింది. మొదట హైదరాబాద్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 219 పరుగులు చేసింది. అభిషేక్ శర్మ (28 బంతుల్లో 74; 5 ఫోర్లు, 8 సిక్స్‌లు) దంచికొట్టగా... ట్రావిస్ హెడ్ (23 బంతుల్లో 38; 5 ఫోర్లు, 1 సిక్స్), క్లాసెన్ (33 బంతుల్లో 39; 1 ఫోర్, 1 సిక్స్) ఫర్వాలేదనిపించారు. లక్ష్యఛేదనలో పంజాబ్ కింగ్స్ 18.5 ఓవర్లలో 4 వికెట్లకు 223 పరుగులు చేసి గెలిచింది. ఓపెనర్లు ప్రియాన్ష్ ఆర్య (20 బంతుల్లో 57; 5 ఫోర్లు, 5 సిక్స్‌లు), ప్రభ్‌సిమ్రన్ (25 బంతుల్లో 51; 4 ఫోర్లు, 4 సిక్స్‌లు) మెరుపు హాఫ్ సెంచరీలు సాధించగా... ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ శ్రేయస్ అయ్యర్ (33 బంతుల్లో 69 నాటౌట్; 5 ఫోర్లు, 5 సిక్స్‌లు) అజేయ అర్ధశతకంతో జట్టును గెలిపించాడు. పవర్‌ప్లేలో 105 పరుగులు రైజర్స్ ఇన్నింగ్స్ ప్రారంభమైన తీరు చూస్తే ఈ మ్యాచ్‌లో 300 పరుగుల రికార్డు స్కోరు ఖాయనిపించింది. తొలి రెండు ఓవర్లలో మూడు ఫోర్లు కొట్టిన అభిషేక్.. అర్ష్ దీప్ వేసిన మూడో ఓవర్లో 4, 4, 6, 6తో మొత్తం 24 పరుగులు రాబట్టాడు. యాన్సెన్ వేసిన తదుపరి ఓవర్లో హెడ్ 4, 6, 4 కొట్టగా... వైశాక్ వేసిన ఐదో ఓవర్లో అభిషేక్ నాలుగు సిక్స్‌లతో విజృంభించాడు. ఈ క్రమంలో అభిషేక్ 18 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. తదుపరి ఓవర్లో హెడ్ ‘హ్యాట్రిక్’ ఫోర్లు బాదగా... అభిషేక్ ఓ సిక్స్ కొట్టాడు. దీంతో ఆరు ఓవర్ల పవర్ ప్లే ముగిసేసరికి రైజర్స్ వికెట్ కోల్పోకుండా 105 పరుగులతో నిలిచింది. ఆ తర్వాత ఇన్నింగ్స్ గాడితప్పింది. శశాంక్ ఒకే ఓవర్లో హెడ్, అభిషేక్‌లను పెవిలియన్‌కు చేర్చగా... కెప్టెన్ ఇషాన్ కిషన్ (17 బంతుల్లో 27; 3 ఫోర్లు, 1 సిక్స్) ఓ మాదిరిగా ఆడినా... మరో ఎండ్‌లో క్లాసెన్ ధాటి కనబర్చలేకపోయాడు. అనికేత్ (18) అనూహ్యంగా రనౌట్ కాగా... నితీశ్ రెడ్డికి (0 నాటౌట్)ఒక్క బంతి మాత్రమే ఆడే అవకాశం దక్కింది. పవర్‌ప్లే తర్వాత 14 ఓవర్లలో హైదరాబాద్ 114 పరుగులే చేసి 6 వికెట్లు కోల్పోయింది. ధనాధన్ ఆరంభం సన్‌రైజర్స్ ఓపెనర్లను మరిపించే స్థాయిలో పంజాబ్ ఇన్నింగ్స్ ఆరంభమైంది. ప్రియాన్ష్ ఆర్య, ప్రభ్‌సిమ్రన్ సింగ్ ప్రతి బంతిని బాదడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు కనిపించారు. ఆర్య తొలి ఓవర్లో 4, 6, 4 కొట్టగా... తర్వాతి రెండు ఓవర్లలో ప్రభ్‌సిమ్రన్ రెండేసి ఫోర్లు, రెండేసి సిక్స్‌లు బాదాడు. ఈ జంట ఏ బౌలర్‌ను వదలకుండా విరుచుకుపడటంతో... పవర్‌ప్లే ముగిసేసరికి పంజాబ్ వికెట్ కోల్పోకుండా 93 పరుగులు చేసింది. ఈ క్రమంలో హర్షల్ పటేల్ ఓవర్లో వరుసగా 6, 6, 4, 4 కొట్టిన ఆర్య 16 బంతుల్లోనే హాఫ్‌సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కాసేపటికి ప్రభ్‌సిమ్రన్ 24 బంతుల్లో ఈ ఫీట్ అందుకున్నాడు. వీరిద్దరు అవుటయ్యాక ఇన్నింగ్స్‌ను నడిపించే బాధ్యత శ్రేయస్ తీసుకున్నాడు. ఆచితూచి ఆడుతూ ముందుకు సాగిన అయ్యర్ 24 బంతుల్లో ‘ఫిఫ్టీ’ కొట్టడంతో పాటు జట్టును విజయతీరాలకు చేర్చాడు.స్కోరు వివరాలు సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: అభిషేక్ శర్మ (సి) అర్ష్ దీప్ (బి) శశాంక్ 74; హెడ్ (సి) బార్ట్లెట్ (బి) శశాంక్ 38; ఇషాన్ (సి) యాన్సెన్ (బి) అర్ష్ దీప్ 27; క్లాసెన్ (సి) కూపర్ (బి) బార్ట్లెట్ 39; అనికేత్ (రనౌట్) 18; సలీల్ (సి) బార్ట్లెట్ (బి) అర్ష్ దీప్ 9; నితీశ్ రెడ్డి (నాటౌట్) 0; హర్ష్ దూబే (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 13; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 219. వికెట్ల పతనం: 1–120, 2–122, 3–169, 4–195, 5–214, 6–218. బౌలింగ్: అర్ష్ దీప్ 4–0–50–2; బార్ట్లెట్ 4–0–42–1; యాన్సెన్ 4–0–40–0; వైశాక్ 2–0–33–0; శశాంక్ 3–0–20–2; చాహల్ 3–0–33–0. పంజాబ్ కింగ్స్ ఇన్నింగ్స్: ఆర్య (సి) నితీశ్ రెడ్డి (బి) శివాంగ్ 57; ప్రభ్‌సిమ్రన్ (సి) క్లాసెన్ (బి) శివాంగ్ 51; కూపర్ (సి) అభిషేక్ (బి) శివాంగ్ 11; శ్రేయస్ అయ్యర్ (నాటౌట్) 69; నేహల్ వధేరా (బి) హర్ష్ 14; శశాంక్ (నాటౌట్) 16; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (18.5 ఓవర్లలో 4 వికెట్లకు) 223. వికెట్ల పతనం: 1–99, 2–117, 3–128, 4–197. బౌలింగ్: హర్ష్ దూబే 4–0– 38–1; జైదేవ్ ఉనాద్కట్ 3–0–40–0; ఇషాన్ మలింగ 3–0–46–0; హర్షల్ 2–0–39–0; శివాంగ్ కుమార్ 4–0–33–3; నితీశ్ రెడ్డి 2–0–20–0; అభిషేక్ 0.5–0–7–0. -
అభిషేక్ మెరుపులు వృధా.. భారీ లక్ష్యాన్ని ఊదేసిన పంజాబ్
ఐపీఎల్ 2026లో భాగంగా ఇవాళ (ఏప్రిల్ 11) మధ్యాహ్నం జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై పంజాబ్ కింగ్స్ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 218 పరుగులు చేసింది. అభిషేక్ 28 బంతుల్లో 5 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో 74 పరుగులు చేశాడు. ట్రవిస్ హెడ్ 23 బంతుల్లో 5 ఫోర్లు, సిక్సర్ సాయంతో 38 పరుగులు చేశాడు. ఇషాన్ కిషన్ 17 బంతుల్లో 3 ఫోర్లు, సిక్సర్ సాయంతో 27, క్లాసెన్ 33 బంతుల్లో ఫోర్, సిక్సర్ సాయంతో 39 పరుగులు చేశాడు.మిగతా ఆటగాళ్లలో అనికేత్ వర్మ 18, సలీల్ అరోరా 9 పరుగులు చేయగా.. నితీశ్ 0, హర్ష్ దూబే ఒక్క పరుగుతో అజేయంగా నిలిచారు. పంజాబ్ బౌలర్లలో అర్షదీప్ సింగ్, శాశాంక్ సింగ్ తలో 2, జేవియర్ బార్ట్లెట్ ఓ వికెట్ తీశారు.అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన పంజాబ్ సన్‌రైజర్స్‌కు ధీటుగా జవాబిచ్చింది. తొలి బంతి నుంచి పంజాబ్ ఓపెనర్లు ఎస్ఆర్హెచ్ బౌలర్లపై ఎదురుదాడి చేశారు. ప్రియాంశ్ ఆర్య (20 బంతుల్లో 57; 5 ఫోర్లు, 5 సిక్సర్లు), ప్రభ్‌సిమ్రన్ (25 బంతుల్లో 51; 4 ఫోర్లు, 4 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగారు. ఆతర్వాత శ్రేయస్ అయ్యర్ (33 బంతుల్లో 69 నాటౌట్; 5 ఫోర్లు, 5 సిక్సర్లు) విధ్వంసం కొనసాగించారు. ఫలితంగా పంజాబ్ 18.5 ఓవర్లలో 4 వికెట్లు మాత్రమే కోల్పోయి భారీ లక్ష్యాన్ని ఊదేసింది. సన్‌రైజర్స్ బౌలర్లలో శివాంగ్ కుమార్ (4-0-33-3) రాణించాడు. -
సన్‌రైజర్స్‌పై పంజాబ్ గెలుపు
సన్‌రైజర్స్‌పై పంజాబ్ గెలుపుసన్రైజర్స్పై 6 వికెట్ల తేడాతో గెలుపొందిన పంజాబ్ కింగ్స్.మూడో వికెట్ కోల్పోయిన పంజాబ్10.2వ ఓవర్- 128 పరుగుల వద్ద పంజాబ్ మూడో వికెట్ కోల్పోయింది. శివాంగ్ కుమార్ బౌలింగ్‌లో అనికేత్ వర్మ (11)కు క్యాచ్ ఇచ్చి కూపర్ కన్నోల్లీ (11) ఔటయ్యాడు.తొలి వికెట్ కోల్పోయిన పంజాబ్6.2వ ఓవర్- 99 పరుగుల వద్ద పంజాబ్ తొలి వికెట్ కోల్పోయింది. శివాంగ్ కుమార్ బౌలింగ్‌లో నితీశ్ కుమార్ రెడ్డికి క్యాచ్ ఇచ్చి ప్రియాంశ్ ఆర్య (57) ఔటయ్యాడు. ధీటుగా బదులిస్తున్న పంజాబ్220 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో పంజాబ్ ధీటుగా బదులిస్తుంది. ఓపెనర్లు ప్రియాంశ్ ఆర్య (51), ప్రభ్‌సిమ్రన్ (41) చెలరేగి ఆడుతున్నారు. 6 ఓవర్ల తర్వాత పంజాబ్ స్కోర్ 93-0గా ఉంది. ఎస్ఆర్హెచ్ భారీ స్కోర్20 ఓవర్లలో 218-6 (అభిషేక్ శర్మ (74), ట్రవిస్ హెడ్ (38), ఇషాన్ కిషన్ (27), క్లాసెన్ (39), అనికేత్ వర్మ (18)).మూడో వికెట్ కోల్పోయిన ఎస్ఆర్హెచ్13.6వ ఓవర్-169 పరుగుల వద్ద ఎస్ఆర్హెచ్ మూడో వికెట్ కోల్పోయింది. అర్షదీప్ సింగ్ బౌలింగ్‌లో జన్సెన్కు క్యాచ్ ఇచ్చి ఇషాన్ కిషన్ (27) ఔటయ్యాడు. ఒకే ఓవర్లో రెండు వికెట్లు కోల్పోయిన ఎస్ఆర్హెచ్అప్పటిదాకా పరుగుల వరద పారించిన ఎస్ఆర్హెచ్ ఓపెనర్లు ఒకే ఓవర్లో ఔటైపోయారు.ఎస్ఆర్హెచ్ ఓపెనర్ల ఊచకోతటాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేస్తున్న సన్‌రైజర్స్ తొలి 5 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా ఏకంగా 84 పరుగులు చేసింది. ఓపెనర్లు అభిషేక్ శర్మ (59), ట్రవిస్ హెడ్ (18) శివాలెత్తిపోతున్నారు. ముఖ్యంగా అభిషేక్ పట్టపగ్గాల్లేకుండా చెలరేగిపోతున్నాడు. కేవలం18 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. హెడ్ కూడా తానేమీ తక్కువ కాదన్నట్లు రఫ్ఫాడిస్తున్నాడు. ఐపీఎల్ 2026లో భాగంగా ఇవాళ (ఏప్రిల్ 11) డబుల్ హెడర్ మ్యాచ్‌లు జరుగుతున్నాయి. మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రారంభమయ్యే మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్-సన్‌రైజర్స్ హైదరాబాద్ తలపడుతున్నాయి. ముల్లాన్‌పూర్ వేదికగా జరిగే ఈ మ్యాచ్‌లో పంజాబ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.ఈ మ్యాచ్ కోసం ఎస్ఆర్హెచ్ రెండు మార్పులు చేయగా.. పంజాబ్ ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగుతుంది. ఎస్ఆర్హెచ్ తరఫున లివింగ్‌స్టోన్ స్థానంలో సలీల్ అరోరా బరిలోకి దిగుతున్నాడు. అలాగే ప్రఫుల్ హింజ్ (ఉనద్కత్ స్థానంలో) అరంగేట్రానికి సిద్దమయ్యాడు.తుది జట్లు..పంజాబ్ కింగ్స్: ప్రియాంష్ ఆర్య, ప్రభ్సిమ్రాన్ సింగ్(w), కూపర్ కొన్నోలీ, శ్రేయాస్ అయ్యర్(c), శశాంక్ సింగ్, మార్కస్ స్టోయినిస్, మార్కో జాన్సెన్, జేవియర్ బార్ట్లెట్, విజయ్‌కుమార్ వైషాక్, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్ఇంపాక్ట్ సబ్స్: నేహాల్ వధేరా, విష్ణు వినోద్, సూర్యాంశ్ షెడ్గే, యష్ ఠాకూర్, హర్‌ప్రీత్ బ్రార్సన్రైజర్స్ హైదరాబాద్: ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ (w/c), హెన్రిచ్ క్లాసెన్, సలీల్ అరోరా, అనికేత్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి, హర్ష్ దూబే, శివంగ్ కుమార్, హర్షల్ పటేల్, ఎషాన్ మలింగఇంపాక్ట్ సబ్స్: జయదేవ్ ఉనద్కత్, లియామ్ లివింగ్‌స్టోన్, శివమ్ మావి, ప్రఫుల్ హింగే, కమిందు మెండిస్ -
నడిరోడ్డుపై చాహల్ హల్చల్!
పంజాబ్ కింగ్స్ బౌలర్ యజ్వేంద్ర చాహల్ చిక్కుల్లో పడ్డాడు. పబ్లిక్ ప్లేస్‌లో అతడు ప్రవర్తించిన తీరును తప్పుబట్టిన క్రికెట్ అభిమానులు సామాజిక మాధ్యమం వేదికగా ట్రోల్స్‌కు దిగారు. నడిరోడ్డుపై లగ్జరీ కారులో రయ్యిమని దూసుకెళ్లడం తప్పుకాకపోవచ్చు కానీ కాల్చిన సిగరేట్‌ను కనీసం ఆర్పాలనే సోయి లేకుండా దానిని రోడ్డు మీద పడేయడమేంటని ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ చర్య వల్ల ఎవరికైనా ప్రమాదం జరిగి ఉంటే దానికి చాహల్ బాధ్యత వహించేవాడా అని మండిపడ్డారు. తాజాగా దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ‘సివిక్ సెన్స్ లేని క్రికెటర్‌ను ఇప్పుడు మీకు పరిచయం చేస్తున్నాం.. అతడే యజ్వేంద్ర చాహల్. బహిరంగ ప్రదేశాల్లో కాల్చిన సిగరేట్‌ను ఆర్పి పడేయాలన్న సోయి అతడికి లేదు.’అని ఒక వ్యక్తి కామెంట్ చేశాడు. ‘డబ్బులు సంపాదించడం కాదు ముందు బహిరంగ ప్రదేశాల్లో ఎలా ప్రవర్తించాలనే బేసిక్ సెన్స్ నేర్చుకో’ అంటూ మరొక వ్యక్తి కామెంట్ చేశాడు. అయితే ఇటీవలే డివిలియర్స్‌తో జరిగిన ఇంటర్వ్యూలో తాను మందు మానేసి ఆరు నెలలకు పైనే అయినట్లు పేర్కొన్నాడు. ఫిట్నెస్, ఎక్కువకాలం ఆరోగ్యంగా ఉండడం కోసమే ఈ చర్యకు పూనుకున్నట్లు తెలిపాడు. ఇక ఐపీఎల్ 2026 సీజన్లో పంజాబ్ కింగ్స్ తరఫున ఆడుతున్న చాహల్ మూడు మ్యాచ్‌లు కలిపి 3 వికెట్లు పడగొట్టాడు. ఇక పంజాబ్ కింగ్స్ ఈ సీజన్లో వరుసగా రెండు విజయాలతో దూకుడు మీద ఉంది. కేకేఆర్‌తో జరిగిన మూడో మ్యాచ్ వర్షార్పణం కావడంతో 5 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. ఇవాళ డబుల్ హెడర్ మ్యాచ్‌లు జరగనున్నాయి. ముల్లన్పూర్ వేదికగా జరగనున్న తొలి మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌తో సన్‌రైజర్స్ హైదరాబాద్ తలపడనుంది.Yuzvendra Chahal spotted smoking and throwing a lit cigarette on the road while driving on highways in Chandigarh 🤯 pic.twitter.com/V3gcYTK5n0— Deepu (@deepu_drops) April 11, 2026🚨 YUZVENDRA CHAHAL EXPOSED 🚨Yuzvendra Chahal recently went on a podcast claiming he’s “quit everything” for his body and career longevity at 35. Fast forward to today: a viral video shows him smoking while driving. 🚭🏎️ pic.twitter.com/jgngkg5Wdd— Cricket Central (@CricketCentrl) April 10, 2026చదవండి: సాకర్ సంగ్రామం ముంగిట అభిమానులకు షాక్! -
ఎస్ఆర్హెచ్ కీలక నిర్ణయం! రూ.13 కోట్ల ఆటగాడిపై వేటు?
ఐపీఎల్-2026లో సన్‌రైజర్స్ హైదరాబాద్ కీలక పోరుకు సిద్దమైంది. ఈ ధనధాన్ లీగ్‌లో భాగంగా శనివారం ముల్లాన్‌పూర్ వేదికగా పంజాబ్ కింగ్స్‌తో ఎస్ఆర్హెచ్ తలపడనుంది. లక్నోతో జరిగిన చివరి మ్యాచ్‌లో ఓటమి పాలైన సన్‌రైజర్స్.. ఇప్పుడు పంజాబ్‌పై ఎలాగైనా గెలవాలని పట్టుదలతో ఉంది.అయితే ఈ మ్యాచ్‌లో ఎస్ఆర్హెచ్ ఓ కీలక మార్పుతో బరిలోకి దిగే అవకాశముంది. గత మ్యాచ్‌లో విఫలమైన స్టార్ ఆల్‌రౌండర్ లియామ్ లివింగ్‌స్టోన్‌పై వేటు వేసేందుకు ఎస్ఆర్హెచ్ సిద్దమైంది. గతేడాది జరిగిన మినీ వేలంలో రూ.13 కోట్ల భారీ ధరకు లివింగ్‌స్టోన్‌ను ఎస్ఆర్హెచ్ కొనుగోలు చేసింది.కానీ తొలి రెండు మ్యాచ్‌లలో అతడికి ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు దక్కలేదు. అయితే లక్నో జరిగిన మ్యాచ్‌కు మాత్రం లివింగ్‌స్టోన్‌కు తుది జట్టులో చోటు దక్కింది. కానీ తనకు దక్కిన అవకాశాన్ని ఈ ఇంగ్లీష్ ఆల్‌రౌండర్ సద్వినియోగపరుచుకోలేకపోయాడు. దీంతో పంజాబ్‌తో మ్యాచ్‌కు అతడిని పక్కన పెట్టేందుకు ఎస్ఆర్హెచ్ సిద్దమైంది.అతడి స్ధానంలో మరో ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ బ్రైడన్ కార్స్‌కు తుది జట్టులో చోటు దక్కే సూచనలు కన్పిస్తున్నాయి. తొలి మూడు మ్యాచ్‌లకు స్వల్ప గాయం కారణంగా బెంచ్‌కే పరిమితమైన కార్స్.. ఇప్పుడు పూర్తి ఫిట్నెస్ సాధించినట్లు తెలుస్తోంది. అతడు నెట్స్‌లో కూడా తీవ్రంగా శ్రమిస్తున్నాడు.దీంతో బ్రైడన్ కార్స్ ఐపీఎల్ అరంగేట్రం దాదాపు ఖాయమైనట్లే. ఇదొక్కటి మినహా ఎస్ఆర్హెచ్ జట్టులో పెద్దగా మార్పులు చోటు చేసుకోపోవచ్చు. మరోవైపు పంజాబ్ కింగ్స్ వరుస విజయాలతో మంచి జోష్‌లో ఉంది. అన్ని విభాగాల్లో పటిష్టంగా ఉన్న పంజాబ్‌ను ఎస్ఆర్హెచ్ ఎలా ఎదుర్కొంటుందో ఎదురు చూడాలి.చదవండి: ఐసీసీ సంచలన నిర్ణయం.. ఇకపై 12 జట్లతో! -
IPL 2026: ఈసారి ట్రోఫీ ఆ జట్టుదే!
పద్దెమినిదేళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) గతేడాది తొలి ఐపీఎల్ టైటిల్ సాధించింది. ఆద్యంతం మెరుగైన ప్రదర్శన కనబరిచిన పాటిదార్ బృందం.. ఫైనల్లో పంజాబ్ కింగ్స్‌పై ఆరు పరుగుల స్వల్ప తేడాతో గెలిచి చిరకాల కోరిక నెరవేర్చుకుంది.రెండూ గెలిచిందిఇక ఇదే జోరులో ఐపీఎల్-2026ను విజయంతో ఆరంభించిన ఆర్సీబీ.. ఇప్పటికి ఆడిన రెండు మ్యాచ్‌లలో రెండూ గెలిచింది. ఈ నేపథ్యంలో భారత మహిళా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ అంజుమ్ చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన ఆర్సీబీ.. ఈసారి కూడా విజేతగా నిలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయని అభిప్రాయపడింది.ANIతో మాట్లాడుతూ.. ‘‘ఆర్సీబీ కచ్చితంగా టైటిల్ నిలబెట్టుకోగలదు. గతంలో ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ ఈ పని చేశాయి. ఆర్సీబీ కూడా అదే బాటలో పయనిస్తోంది. ఈసారి కూడా నిలకడైన ఆటతో ముందుకు సాగుతోంది.మరోసారి విజేతగాప్లే ఆఫ్స్ చేరడం వారి తొలి లక్ష్యం. అన్ని జట్లు ఇందుకోసం కృషి చేస్తాయి. ఈసారి కొత్త చాంపియన్ రావడం కాస్త కష్టమే. అయితే, ఆర్సీబీ మాత్రం కచ్చితంగా మరోసారి విజేతగా నిలిచే అవకాశాలను కొట్టిపారేయలేము. ఈసారి కూడా ఆ జట్టు కూర్పు ఎంతో బాగుంది’’ అని అంజుమ్ చోప్రా అభిప్రాయపడింది.అదే విధంగా పంజాబ్ కింగ్స్ జట్టు కూడా బాగుందని.. వారికి కూడా గెలుపు అవకాశాలు ఉన్నాయని అంజుమ్ చోప్రా పేర్కొంది. కాగా పంజాబ్ ఈ సీజన్లో మూడు మ్యాచ్‌లు ఆడి రెండింట గెలవగా.. ఒక మ్యాచ్ వర్షం వల్ల రద్దైపోయింది.చదవండి: చారిత్రక ద్వైపాక్షిక సిరీస్‌ను ప్రకటించిన పాకిస్తాన్ -
కేకేఆర్ ఫ్యాన్స్ ఫైర్.. స్పందించిన అయ్యర్ సోదరి
-
పంజాబ్ నటితో భారత క్రికెటర్ ప్రేమాయణం!
టీమిండియా స్టార్ పేసర్ అర్షదీప్ సింగ్ ప్రేమలో మునిగి తేలుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అర్షదీప్ ఇటీవలే తన స్నాప్‌చాట్ అకౌంట్లో ఒక అమ్మాయితో చేతులు పట్టుకుని ఉన్న ఫోటోను షేర్ చేయడం సోషల్‌మీడియాను ఊపేసింది. ఈ టీమిండియా స్టార్ షేర్ చేసిన ఫోటోలో అమ్మాయి ముఖం కనిపించకపోయినప్పటికీ, నెట్టిజన్లు ఒక చిన్న క్లూ ద్వారా ఆమె ఎవరో కనిపెట్టేశారు. అర్షదీప్ పట్టుకున్న ఆ అమ్మాయి చేతిపై ఒక స్పెషల్ టాటూ ఉంది. పంజాబ్‌కు చెందిన మోడల్, నటి అయిన సమ్రీన్ కౌర్ చేతిపై కూడా సరిగ్గా అదే టాటూ ఉండటంతో, ఆమె అర్షదీప్‌తో లవ్‌లో ఉన్నట్లు అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఇటీవల ముల్లన్‌పూర్‌లో జరిగిన మ్యాచ్ సందర్భంగా సమ్రీన్ పంజాబ్ కింగ్స్ జెర్సీ ధరించి ఉన్న ఫోటోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసుకోవడంతో అనుమానాలకు మరింత బలాన్ని చేకూర్చినట్లయింది. పంజాబ్‌కు చెందిన సమ్రీన్ (26), పూణేలోని సింబయాసిస్ కాలేజీలో చదువుకుంది. ప్రస్తుతం మోడల్, నటిగా రాణిస్తున్న ఆమె 2018 మిస్ ఇండియా పోటీల్లో ఫైనలిస్ట్‌గా నిలిచింది. అనేక పంజాబీ మ్యూజిక్ వీడియోలు, ఓటీటీ చిత్రాలలో నటించిన ఆమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో 4 మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. ప్రస్తుతం వీరిద్దరి మధ్య ఉన్న సంబంధంపై ఇటు అర్షదీప్ కానీ, అటు సమ్రీన్ కానీ అధికారికంగా స్పందించలేదు. అయినప్పటికీ వీరిద్దరి మధ్య ఏదో విషయం ఉందన్న వార్త మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఐపీఎల్ 2026 సీజన్లో అర్షదీప్ పంజాబ్ కింగ్స్‌కు ఆడుతున్న సంగతి తెలిసిందే.చదవండి: 18 కోట్ల క్రికెటర్ ఆగమనం.. కేకేఆర్ భవిష్యత్తు మారేనా! View this post on Instagram A post shared by NAUGHTYWORLD (@naughtyworld) View this post on Instagram A post shared by Samreen (@samreenkaur__) -
కేకేఆర్ ప్లాఫ్ షో.. షారుక్ ఖాన్ అసంతృప్తి
ఐపీఎల్లో మూడుసార్లు చాంపియన్ అయిన కోల్‌కతా నైట్‌రైడర్స్ (కేకేఆర్) 2026 సీజన్లో మాత్రం ఇంకా బోణీ చేయలేదు. సోమవారం పంజాబ్‌తో మ్యాచ్ వర్షార్పణం కావడంతో ఒక పాయింట్ సాధించినప్పటికీ విజయం మాత్రం ఇంకా ఆ జట్టు దరి చేరలేదు. ఆడిన రెండు మ్యాచ్‌ల్లో బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్ వైఫల్యం కూడా కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో కేకేఆర్ సహ యజమాని, బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ జట్టుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. వర్షం కారణంగా మ్యాచ్ ఆగిపోయిన సమయంలో కెమెరాలు ఒక్కసారిగా డ్రెసింగ్ రూమ్‌వైపు తిరిగాయి. అప్పటికే అక్కడ షారుక్ ఖాన్ కేకేఆర్ సీఈవో వైంకీ మైసూర్‌తో సుదీర్ఘ చర్చలో మునిగినట్లు కనిపించింది. ముఖ్యంగా సీజన్లో కేకేఆర్ ఆటతీరుపై, కామెరున్ గ్రీన్ వైఫల్యంపై చర్చించినట్లు తెలుస్తోంది. అంతేకాదు పంజాబ్‌తో మ్యాచ్‌లో ఆదిలోనే రెండు వికెట్లు కోల్పోవడంపై కూడా షారుక్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు అనిపిస్తోంది. మ్యాచ్ జరిగి ఉంటే కేకేఆర్ తక్కువ స్కోరుకే వెనుదిరిగేదేమో అని భావించినట్లు తెలుస్తోంది.ఇక తొలి రెండు మ్యాచ్‌ల్లో కేకేఆర్ ఓటములపై కూడా విశ్లేషించినట్లుగా అర్థమవుతోంది. మొత్తంగా కేకేఆర్ ప్లాఫ్ షోపై షారుక్ ఖాన్ అసం తృప్తిగా ఉన్నట్లు తేలింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ముంబై ఇండియన్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో 220 పరుగుల భారీ స్కోరు చేసినప్పటికీ కేకేఆర్ ఓడిపోయింది. బౌలింగ్ వైఫల్యంతో పరాజయాన్ని మూటగ ట్టుకుంది. ఇక సొంత మైదానంలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్ ఈసారి బ్యాటింగ్ వైఫల్యంతో ఓటమి చవిచూసింది. 227 పరుగుల లక్ష్య ఛేదనలో కేకేఆర్ 161 పరుగులకే ఆలౌటైంది. కనీసం మూడో మ్యాచ్ ద్వారానైనా సీజన్లో బోణీ కొట్టాలని భావించిన కేకేఆర్ ఆశలపై వరుణుడు నీళ్లు చల్లాడు. మ్యాచ్ రద్దుతో ఒక పాయింట్ లభించినప్పటికీ ఉపయోగం లేదు. కనీసం ఏప్రిల్ 9న లక్నో సూపర్‌జెయింట్స్‌తో జరగనున్న మ్యాచ్‌లోనైనా కేకేఆర్ విజయం సాధించి సీజన్లో ఖాతా తెరవడంతో పాటు షారుక్ ఖాన్ శాంతించేలా చేస్తుందేమో చూడాలి. pic.twitter.com/HaBuw3lHz8— Nihari Korma (@NihariVsKorma) April 6, 2026చదవండి: హ్యాట్రిక్ కొట్టాడు.. ఇంకెన్ని దారుణాలు చూడాలో! -
వరుణుడి ఖాతాలో...
కోల్‌కతా: ఐపీఎల్ 19వ సీజన్లో భాగంగా కోల్‌కతా నైట్‌రైడర్స్, పంజాబ్ కింగ్స్ మధ్య సోమవారం జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయింది. ఆట ప్రారంభమైన 15 నిమిషాలకే వర్షం ముంచెత్తింది. మైదానం మొత్తాన్ని కవర్స్‌తో కప్పినా... ఎంతకూ వరుణుడు తెరిపినివ్వకపోవడంతో ఆట సాధ్యపడలేదు. పలుమార్లు పిచ్‌ను పరిశీలించిన అనంతరం రాత్రి 11 గంటల సమయంలో అంపైర్లు ఆటను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. దేశంలో అత్యుత్తమ డ్రైనేజీ వ్యవస్ధ ఉన్న ఈడెన్ గార్డెన్స్‌లో కటాఫ్ సమయానికి ముందే వరుణుడు శాంతించాడు. అయితే బౌండరీకి దగ్గర నీరు ఎక్కువగా నిలిచింది. దాంతో ఐదు ఓవర్ల మ్యాచ్ నిర్వహించేందుకు కటాఫ్ సమయానికల్లా మైదానం సిద్ధమయ్యే పరిస్థితి కనిపించలేదు. ఈ ఐపీఎల్ సీజన్లో మ్యాచ్ రద్దు కావడం ఇదే తొలిసారి కాగా... ఇరు జట్లకు చెరో పాయింట్ కేటాయించారు. గతేడాది కూడా ఈడెన్ గార్డెన్స్ వేదికగా పంజాబ్, కోల్‌కతా జట్ల మధ్య జరిగిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడం గమనార్హం. సొంతగడ్డపై టాస్ గెలిచిన కోల్‌కతా మొదట బ్యాటింగ్ ఎంచుకోగా... వర్షం వల్ల ఆట నిలిచిపోయే సమయానికి 3.4 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 25 పరుగులు చేసింది. ఫిన్ అలెన్ (6), కామెరాన్ గ్రీన్ (4) విఫలం కాగా... కెప్టెన్ అజింక్య రహానే (8 నాటౌట్), అంగ్క్రిష్ రఘువంశీ (7) అజేయంగా నిలిచారు. ఇన్నింగ్స్ రెండో ఓవర్లో పంజాబ్ పేసర్ జేవియర్ బార్ట్లెట్ ఈ ఇద్దరినీ కీపర్ క్యాచ్‌ల ద్వారా వెనక్కి పంపాడు. -
కేకేఆర్-పంజాబ్ మ్యాచ్ వర్షార్పణం
ఐపీఎల్-2026లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్, పంజాబ్ కింగ్స్ మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షార్పణమైంది. మ్యాచ్ ఆరంభమైన కాసేపటికే వర్షం ప్రారంభమైంది. దీంతో కేకేఆర్ ఇన్నింగ్స్ 3.4 ఓవర్ వద్ద ఆట నిలిచిపోయింది. మ్యాచ్ ఆగిపోయే సమయానికి కేకేఆర్ 25 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అయితే తొలుత తేలికపాటి వర్షం పడడంతో తగ్గముఖం పడుతుందని అభిమానులు భావించారు. కానీ తర్వాత నెమ్మదిగా వర్షం తీవ్రత పెరిగింది. దాదాపు రెండు గంటల తర్వాత వర్షం తగ్గుముఖం పట్టింది. అయితే అప్పటికే ఔట్ ఫీల్డ్ చిత్తడిగా మారడంతో పాటు కట్-ఆఫ్ టైమ్ కూడా దగ్గరపడడం కాణంగా అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేశారు. దీంతో ఇరు జట్లకు చెరో పాయింట్ లభించింది. పాయింట్ల పట్టికలో పంజాబ్ కింగ్స్(5) అగ్రస్థానానికి చేరుకుంది. కేకేఆర్ ఖాతాలో తొలిపాయింట్ వచ్చి చేరింది. -
ఈ చెత్త ఆటకేనా? రూ. 25 కోట్లు
ఐపీఎల్-2026లో కోల్‌కతా నైట్‌రైడర్స్ ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్ పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ధర పలికిన విదేశీ ఆటగాడిగా నిలిచిన గ్రీన్.. తన ఆట పరంగా ఏ మాత్రం ప్రభావం చూపలేకపోతున్నాడు. ఈ ఆసీస్ ఆల్‌రౌండర్ వరుసగా మూడో మ్యాచ్‌లో విఫలమయ్యాడు.ఈడెన్‌గార్డెన్స్ వేదికగా పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో గ్రీన్ కేవలం 4 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. బార్ట్లెట్ బౌలింగ్‌లో తను ఎదుర్కొన్న తొలి బంతికి ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న గ్రీన్.. ఆ తర్వాత బంతికి మాత్రం వికెట్ల వెనక దొరికిపోయాడు. అంతకుముందు ఎస్ఆర్హెచ్తో జరిగిన మ్యాచ్‌లో అతడు కేవలం రెండు పరుగులు చేశాడు. ముంబైతో జరిగిన తొలి మ్యాచ్‌లో కూడా గ్రీన్ 18 పరుగులు చేశాడు. మొత్తంగా మూడు మ్యాచ్‌లు కలిపి గ్రీన్ కేవలం 24 పరుగులు చేశాడు. దీంతో అతడిని సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. ఈ మాత్రం ఆటకు రూ.25.2 కోట్ల దండగ అని పోస్టులు పెడుతున్నారు. కాగా గతేడాది జరిగిన మినీ వేలంలో అతడిని కేకేఆర్ రూ.25.2 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. కానీ అతడు ప్రస్తుతం కేవలం బ్యాటర్‌గా మాత్రమే తన సేవలను అందిస్తున్నాడు. గాయం కారణంగా అతడికి బౌలింగ్ చేసేందుకు క్రికెట్ ఆస్ట్రేలియా నుంచి ఇంకా అనుమతి లభించలేదు.చదవండి: IPL 2026: అవేశ్ అత్యుత్సాహం.. బీసీసీఐకి సన్‌రైజర్స్ ఫిర్యాదు? -
వర్షం కారణంగా పంజాబ్-కేకేఆర్ మ్యాచ్ రద్దు
IPL 2026 KKR vs PBKS Live Updates: ఐపీఎల్-2026లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్, పంజాబ్ కింగ్స్ మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షార్పణమైంది. మ్యాచ్ ఆరంభమైన కాసేపటికే వర్షం ప్రారంభమైంది. దీంతో కేకేఆర్ ఇన్నింగ్స్ 3.4 ఓవర్ వద్ద ఆట నిలిచిపోయింది. ఆ తర్వాత వర్షం తగ్గుముఖం పట్టినప్పటికి ఔట్ ఫీల్డ్ చిత్తడిగా మారడంతో మ్యాచ్‌ను అంపైర్లు రద్దు చేశారు. ఇరు జట్లకు చెరో పాయింట్ లభించింది.ఈడెన్ గార్డెన్స్‌లో భారీ వర్షంఈడెన్ గార్డెన్స్‌లో ప్రస్తుతం భారీ వర్షం కురుస్తోంది. మ్యాచ్ ఇప్పటిలో తిరిగి ప్రారంభమయ్యే సూచనలు కన్పించడం లేదు. మైదానం మొత్తం కవర్లతో కప్పి ఉంచారు.వర్షం అంతరాయంఈడెన్ గార్డెన్స్ వేదికగా కేకేఆర్, పంజాబ్ కింగ్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌కు వరుణుడు అంతరాయం కలిగించాడు. ఆట నిలిచిపోయే సమయానికి కేకేఆర్ స్కోర్:25-2కేకేఆర్‌కు భారీ షాక్టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు ఆరంభంలోనే భారీ షాక్ తగిలింది. జేవియర్ బార్టలెట్ వేసిన రెండో ఓవర్లో డేంజరస్ బ్యాటర్లు ఫిన్ అలెన్(6),కామెరూన్ గ్రీన్(4) వికెట్లను కేకేఆర్ కోల్పోయింది. ఐపీఎల్-2026లో ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్, పంజాబ్ కింగ్స్ జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన కేకేఆర్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌కు కేకేఆర్ స్టార్ ప్లేయర్లు వరుణ్ చక్రవర్తి, సునీల్ నరైన్ దూరమయ్యారు.వారిద్దరి స్ధానంలో నవ్‌దీప్ సైనీ, పావెల్ తుది జట్టులోకి వచ్చారు. మరోవైపు పంజాబ్ మాత్రం గత మ్యాచ్‌లో ఆడిన జట్టునే కొనసాగించింది. కాగా పంజాబ్ వరుసగా రెండు మ్యాచ్‌లు గెలిచి మంచి జోష్‌లో ఉండగా.. కేకేఆర్ మాత్రం ఎలాగైనా బోణీ కొట్టాలని పట్టుదలతో ఉంది.తుది జట్లు:పంజాబ్ కింగ్స్ : ప్రభ్సిమ్రాన్ సింగ్ (వికెట్ కీపర్), శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), కూపర్ కొన్నోలీ, నెహాల్ వధేరా, శశాంక్ సింగ్, మార్కస్ స్టోయినిస్, మార్కో జాన్సెన్, జేవియర్ బార్ట్లెట్, విజయ్‌కుమార్ వైషాక్, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్ఇంపాక్ట్ సబ్‌లు: ప్రియాంష్ ఆర్య, సూర్యాంశ్ షెడ్గే, విష్ణు వినోద్, ప్రవీణ్ దూబే, హర్‌ప్రీత్ బ్రార్కోల్కతా నైట్ రైడర్స్ : ఫిన్ అలెన్, అజింక్యా రహానే(కెప్టెన్), కామెరాన్ గ్రీన్, అంగ్క్రిష్ రఘువంశీ(వికెట్ కీపర్), రోవ్‌మన్ పావెల్, రింకు సింగ్, రమణదీప్ సింగ్, అనుకుల్ రాయ్, నవదీప్ సైనీ, వైభవ్ అరోరా, కార్తీక్ త్యాగిఇంపాక్ట్ సబ్‌లు: బ్లెస్సింగ్ ముజారబానీ, మనీష్ పాండే, తేజస్వి సింగ్, రాహుల్ త్రిపాఠి, సౌరభ్ దూబే -
‘త్వరలోనే టీమిండియా టీ20 కెప్టెన్ అవుతాడు’
టీ20 ఫార్మాట్లో గత కొంతకాలంగా పరుగుల వరద పారిస్తున్నాడు శ్రేయస్ అయ్యర్. ఐపీఎల్-2024లో కోల్‌కతా నైట్ రైడర్స్ సారథిగా వ్యవహరించిన ఈ ముంబైకర్.. జట్టును చాంపియన్‌గా నిలిపాడు. ఇక గతేడాది వేలంలో రూ. 26.75 కోట్లు పైగా వెచ్చించి పంజాబ్ కింగ్స్ అతడిని కొనుగోలు చేసి కెప్టెన్సీ పగ్గాలు అప్పగించింది.పైసా వసూల్ ప్రదర్శనఈ క్రమంలో ఐపీఎల్-2025లో బ్యాటర్‌గా, కెప్టెన్‌గా పంజాబ్‌కు పైసా వసూల్ ప్రదర్శన ఇచ్చాడు శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer). మొత్తంగా 17 మ్యాచ్‌లలో 604 పరుగులు సాధించిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. సారథిగా పంజాబ్‌ను ఫైనల్‌కు చేర్చాడు.ఇక ఐపీఎల్-2026 టోర్నీని కూడా శ్రేయస్ అయ్యర్ ఘనంగా ఆరంభించాడు. ఇప్పటికి ఆడిన రెండు మ్యాచ్‌లలో జట్టును గెలిపించుకున్నాడు. బ్యాటర్‌గా రెండు మ్యాచ్‌లలో కలిపి 68 పరుగులు రాబట్టాడు. ఇదిలా ఉంటే.. గతేడాది దేశీ క్రికెట్లోనూ ముంబై తరఫున అయ్యర్ అదరగొట్టాడు.అయినప్పటికీ భారత టీ20 జట్టుకు సెలక్టర్లు అతడి పేరును పరిగణనలోకి తీసుకోనే లేదు. అయితే, పంజాబ్ కింగ్స్ పేసర్ వైశాఖ్ విజయ్‌కుమార్ మాత్రం శ్రేయస్ అయ్యర్ తప్పక టీమిండియా టీ20 కెప్టెన్ అవుతాడని అంచనా వేశాడు. సారథి అయ్యేందుకు అతడికి అన్ని అర్హతలు ఉన్నాయని కొనియాడాడు.త్వరలోనే టీమిండియా కెప్టెన్ అవుతాడుఇండియా టుడేతో మాట్లాడుతూ.. ‘‘జట్టులోని ప్రతి బౌలర్, ప్రతి ఆటగాడికి అతడు ఎల్లవేళలా మద్దతుగా నిలుస్తాడు. బాగా ఆడినా.. ఆడకపోయినా వారికి అండగానే ఉంటాడు. ఆటగాళ్లకు కావాల్సింది ఇలాంటి కెప్టెనే.టీ20 ఫార్మాట్లో గత కొంతకాలంగా అతడు అత్యద్భుతంగా ఆడుతున్నాడు. కచ్చితంగా అతడు త్వరలోనే టీమిండియా కెప్టెన్ అవుతాడు’’ అని వైశాఖ్ విజయ్‌కుమార్ పేర్కొన్నాడు. కాగా వైశాఖ్ పంజాబ్ తరపున ఇప్పటికి రెండు మ్యాచ్‌లలో కలిపి ఐదు వికెట్లు తీశాడు. ఇదిలా ఉంటే.. ఇటీవల సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలో టీమిండియా టీ20 ప్రపంచకప్-2026 టైటిల్ గెలిచిన సంగతి తెలిసిందే. కాగా శ్రేయస్ అయ్యర్ 2023, డిసెంబరులో చివరగా టీమిండియా తరఫున టీ20 మ్యాచ్ ఆడాడు.చదవండి: CSKకు గుడ్‌న్యూస్.. విధ్వంసకర వీరుడు వచ్చేస్తున్నాడు! -
అయ్యర్ కు మ్యాచ్ గెలిచిన ఆ సంతోషం దక్కలేదు..!
-
IPL 2026: చరిత్ర సృష్టించిన సర్పంచ్ సాబ్
పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఓ భారీ ఐపీఎల్ రికార్డును సొంతం చేసుకున్నాడు. లీగ్ చరిత్రలో హేమాహేమీలను కాదని అత్యధిక విజయాల శాతం (59.80) నమోదు చేసిన కెప్టెన్‌గా చరిత్ర సృష్టించాడు. 2026 ఎడిషన్‌లో భాగంగా నిన్న (ఏప్రిల్ 3) సీఎస్కేపై గెలుపుతో ఈ ఫీట్‌ను సాధించాడు. ఈ గెలుపుతో శ్రేయస్ హార్దిక్ పాండ్యాను (59.01) అధిగమించి టాప్ ప్లేస్‌కు చేరాడు. ఈ విభాగంలో శ్రేయస్, హార్దిక్ తర్వాతి స్థానాల్లో సచిన్ టెండూల్కర్ (58.82), ఎంఎస్ ధోని (58.36), షేన్ వార్న్ (56.36), రోహిత్ శర్మ (56.32) ఉన్నారు.ధోని, రోహిత్ కూడా సాధించలేని ఘనత ఐపీఎల్ చరిత్ర అత్యంత విజయవంతమైన కెప్టెన్లు ఎంఎస్ ధోని, రోహిత్ శర్మ కూడా సాధించిన లేని ఘనతను శ్రేయస్ అయ్యర్ సాధించాడు. ధోని, రోహిత్ తలో 5 ఐపీఎల్ ట్రోఫీలు సాధించినా నమోదు చేయలేని అత్యధిక విజయాల శాతాన్ని శ్రేయస్ కేవలం ఒకే ఒక ట్రోఫీ ద్వారానే సాధించాడు. ఐపీఎల్ కెప్టెన్‌గా శ్రేయస్‌కు మరో ప్రత్యేక గుర్తింపు కూడా ఉంది. మూడు వేర్వేరు ఫ్రాంచైజీలను ఫైనల్‌కు చేర్చిన ఏకైక కెప్టెన్ అతను మాత్రమే. 2024లో కేకేఆర్‌ను ఛాంపియన్‌గా నిలిపిన శ్రేయస్.. 2020లో ఢిల్లీని, 2025లో పంజాబ్‌ను రన్నరప్‌గా నిలిపాడు.శ్రేయస్ సారథ్యంలో పంజాబ్ ఈ సీజన్లో వరుస విజయాలతో దూసుకుపోతుంది. రన్నరప్ హోదాలో బరిలోకి దిగిన ఈ జట్టు వరుసగా రెండు మ్యాచ్‌ల్లో విజయాలు నమోదు చేసి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కూర్చుంది. తొలి మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌పై 3 వికెట్ల తేడాతో గెలుపొందిన పంజాబ్.. తాజాగా సీఎస్కేను 5 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. సీఎస్కేపై గెలుపులో శ్రేయస్ వ్యక్తిగతంగానూ కీలకపాత్ర పోషించాడు. 210 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో బాధ్యతాయుతమైన అర్ద సెంచరీ చేసి గెలుపుకు ప్రధాన కారకుడయ్యాడు. -
పంజాబ్ సిక్సర్ల మోత వెనుక రహస్యమిదే!
ఐపీఎల్ 2026 సీజన్లో పంజాబ్ కింగ్స్ దూకుడు మీద ఉంది. బలమైన బ్యాటింగ్ శక్తితో లీగ్‌లో వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. గత సీజన్లో రన్నరప్‌గా నిలిచిన పంజాబ్ కింగ్స్ ఈ సీజన్లోనూ అదే జోరును ప్రదర్శిస్తోంది. తొలి మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌ను చిత్తు చేసిన పంజాబ్ శుక్రవారం చెన్నై సూపర్‌కింగ్స్‌ను మట్టికరిపించింది. రెండు మ్యాచ్‌లు కలిపి పంజాబ్ మొత్తం 23 సిక్సర్లు బాదింది. ఇందులో గుజరాత్‌పై 14, చెన్నైపై 9 సిక్సర్లు ఉన్నాయి. ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్ ఇప్పటివరకు అన్ని సీజన్లు కలిపి 1,686 సిక్సర్లు బాదింది. దూకుడైన బ్యాటింగ్‌తో ప్రత్యర్థి జట్లను భయపెడుతున్న పంజాబ్ ఇంత బలంగా తయారవ్వడం వెనుక దాగున్న రహస్యాన్ని భారత మాజీ క్రికెటర్ అంబటి రాయుడు బయటపెట్టాడు. పంజాబ్ వరుస విజయాల్లో జట్టు హెడ్‌కోచ్ రికీ పాంటింగ్‌కు క్రెడిట్ ఇవ్వాల్సిందేనన్నాడు. పవర్ హిట్టింగ్ కోసం పాంటింగ్ ఉపయోగించిన స్క్వాష్ బాల్ టెక్నిక్ ఇప్పుడు పంజాబ్ బ్యాటర్లకు వరంగా మారిందని తెలిపాడు. పాంటింగ్ కోచ్‌గా వచ్చిన తర్వాత పంజాబ్ బ్యాటింగ్‌లో బలం పెరిగింది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, ప్రబ్‌సిమ్రన్ సింగ్‌లు సిక్సర్లు కొట్టడంలో మరింత రాటుదేలారు. ఈఎస్పీఎన్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అంబటి రాయుడు మాట్లాడుతూ.. ‘పాంటింగ్‌తో ఉన్న అనుబంధం గురించి ఒక విషయం పంచుకోవాలనుకుంటున్నా. నేను ముంబై ఇండియన్స్‌కు ఆడినప్పుడు అతడు మా కోచ్‌గా ఉన్నాడు. నా హిట్టింగ్ స్పీడ్‌ను పెంచేందుకు పాంటింగ్ కొత్త పద్దతిని ఉపయోగించాడు. ప్రాక్టీస్ సమయంలో పాంటింగ్ నా చేతి గ్లోవ్స్ మధ్యలో స్క్వాష్బాల్ను ఉంచేవాడు. దీనివల్ల చేతి కింది భాగంలో బ్యాట్‌ను గట్టిగా పట్టుకోవడానికి ఆస్కారముండదు. దీంతో మన హిట్టింగ్‌లో స్పీడ్ పెరుగుతుంది. ఈ టెక్నిక్ వల్లే అప్పట్లో నేను చాలా మ్యాచ్‌ల్లో సులువుగా సిక్సర్లు కొట్టేవాడిని. తాజాగా పంజాబ్ కింగ్స్ బ్యాటర్లు ఈజీగా సిక్సర్లు కొట్టడం నాకు పెద్దగా ఆశ్చర్యం కలిగించలేదు. ఎందుకంటే అక్కడ పాంటింగ్ హెడ్‌కోచ్‌గా ఉన్నాడు. వాస్తవానికి ఎవరైనా సిక్సర్లు కొడతారు. కానీ స్వ్కాష్బాల్ టెక్నిక్ వల్ల బ్యాట్ స్పీడ్ పెరిగి బంతి ఎంత వేగంగా వచ్చినా సులువుగా సిక్సర్లు బాదేందుకు ఇది ఉపయోగపడుతుంది.’ అని చెప్పుకొచ్చాడు.ఏమిటీ స్క్వాష్‌బాల్ టెక్నిక్?పాంటింగ్ ఉపయోగించే స్క్వాష్‌బాల్ టెక్నిక్‌లో స్వ్కాష్ బంతిని బ్యాటర్ చేతి గ్లోవ్స్ మధ్య ఉంచుతారు. దీనివల్ల చేతి కింది బాగంలో ఖాళీ ఏర్పడి బ్యాట్ గట్టిగా పట్టుకోలేము. దీనివల్ల బ్యాట్‌కు గ్రిప్ రావడంతో పాటు హిట్టింగ్ స్పీడ్ పెరుగుతుంది. 2007 వన్డే ప్రపంచకప్ సమయంలో అప్పటి ఆస్ట్రేలియా కెప్టెన్ రికీ పాంటింగ్ సహా ఓపెనర్ ఆడమ్ గిల్‌క్రిస్ట్‌లు వారి కోచ్ బాబ్ మ్యూల్మన్ సలహా మేరకు ఇలాంటి టెక్నిక్‌ను ఉపయోగించే అలవోకగా సిక్సర్లు బాదడం నేర్చుకున్నారు. ఇప్పుడదే టెక్నిక్‌ను పాంటింగ్ పంజాబ్ బ్యాటర్లపై ప్రయోగించి విజయవంతమయ్యాడు.చదవండి: ‘ఏదీ కలిసిరావడం లేదు.. ఓటమికి అదే కారణం’ -
చరిత్ర సృష్టించిన పంజాబ్ కింగ్స్.. ప్రపంచ రికార్డు
పంజాబ్ కింగ్స్ సరికొత్త చరిత్ర సృష్టించింది. టీ20 క్రికెట్లో ఇంత వరకు ఏ జట్టుకు సాధ్యం కాని ఘనత సాధించింది. పొట్టి ఫార్మాట్లో అత్యధికసార్లు 200 పరుగులకు పైగా స్కోరు ఛేదించిన జట్టుగా నిలిచింది. ఈ క్రమంలో తన పేరిట ఉన్న ప్రపంచ రికార్డును పంజాబ్ తానే బద్దలు కొట్టింది.ఐపీఎల్-2026 టోర్నీలో తమ తొలి మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌ను ఓడించిన పంజాబ్ కింగ్స్.. రెండో మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌పై విజయం సాధించింది. చెన్నైలోని చెపాక్ స్టేడియంలో శుక్రవారం జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పంజాబ్ తొలుత బౌలింగ్ చేసింది.209 పరుగులుఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 209 పరుగులు సాధించింది. ఆయుశ్ మాత్రే (73), శివం దూబే (45 నాటౌట్), సర్ఫరాజ్ ఖాన్ (32) రాణించారు. పంజాబ్ బౌలర్లలో విజయ్‌కుమార్ వైశాఖ్ రెండు వికెట్లు తీయగా.. జేవియర్ బార్ట్లెట్, మార్కో యాన్సెన్, యజువేంద్ర చహల్ తలా ఒక వికెట్ పడగొట్టారు.పంజాబ్ బ్యాటర్ల ధనాధన్‌ఇక లక్ష్య ఛేదనకు దిగిన పంజాబ్ 18.4 ఓవర్లలో కేవలం ఐదు వికెట్లు కోల్పోయి 210 పరుగులు సాధించింది. తద్వారా ఐదు వికెట్లతేడాతో జయకేతనం ఎగురవేసింది. ప్రియాన్ష్ ఆర్య (11 బంతుల్లో 39), ప్రభ్‌సిమ్రన్ సింగ్ (43), కూపర్ కన్నోలి (36), కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (29 బంతుల్లో 50) మెరుపు ఇన్నింగ్స్‌తో అలరించారు.ప్రపంచంలోనే తొలి జట్టుగా పంజాబ్పంజాబ్ కింగ్స్ 200కు పైగా పరుగుల స్కోరును ఛేదించడం ఇది తొమ్మిదోసారి. పొట్టి క్రికెట్లో ఈ ఘనత సాధించిన తొలి జట్టుగా పంజాబ్ నిలిచింది. టీ20 క్రికెట్లో అత్యధికసార్లు 200కు పైగా పరుగుల స్కోరు ఛేదించిన జట్లు ఇవే🏏పంజాబ్ కింగ్స్ (ఐపీఎల్)-తొమ్మిది సార్లు🏏ఆస్ట్రేలియా- ఏడుసార్లు🏏ముంబై ఇండియిన్స్ (ఐపీఎల్)- ఆరు సార్లు🏏టీమిండియా- ఆరు సార్లు🏏రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఐపీఎల్)- ఆరు సార్లు🏏సౌతాఫ్రికా- ఆరుసార్లు చదవండి: IPL 2026: అంపైర్ తప్పిదం.. కసితీరా బాదిన ఆయుశ్!🔙 to 🔙 victories ✌️@PunjabKingsIPL complete the chase in an authoritative fashion ❤️A win by 5⃣ wickets in Chennai 🥳Updates ▶️ https://t.co/riWrE2EZiF#TATAIPL | #KhelBindaas | #CSKvPBKS pic.twitter.com/S9EEawsaZk— IndianPremierLeague (@IPL) April 3, 2026 -
‘ఏదీ కలిసిరావడం లేదు.. ఓటమికి అదే కారణం’
ఐపీఎల్ 2026లో చెన్నై సూపర్ కింగ్స్‌కు ఏదీ కలిసి రావడం లేదు. వరుసగా రెండో మ్యాచ్‌లోనూ ఆ జట్టు ఓడిపోయింది. బౌలర్ల వైఫల్యం కారణంగానే పంజాబ్‌తో మ్యాచ్‌లో ఓడిపోయామని చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ తెలిపాడు. మ్యాచ్ ఓటమి అనంతరం రుతురాజ్ మాట్లాడాడు.‘ఇది చాలా కఠినమైన మ్యాచ్. అయినప్పటికి కూడా ఈ మ్యాచ్ నుంచి ఎన్నో సానుకూల అంశాలు ఉన్నాయి. మా బ్యాటర్లు చాలా బాగా ఆడారు. ముఖ్యంగా ఆయుష్ మాత్రే అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. అలాగే శివమ్ దూబే కూడా చాలా బాగా బ్యాటింగ్ చేశాడు. మొత్తంగా బ్యాటింగ్ విభాగం బాగా ఆడింది. మా బౌలింగ్ విభాగం మెరుగుపడాల్సి ఉంది. జట్టుకు ఏది అవసరమో, ఆ పాత్రకు అనుగుణంగా మారడమే ముఖ్యం. ఈరోజు వికెట్ కొంచెం గ్రిప్ అవుతున్నందున, బహుశా మరికొంత సేపు క్రీజులో నిలదొక్కుకోవాలని నాకు అనిపించింది. ఆ తరువాత వేగంగా ఆడాలని అనుకున్నాను. అయితే.. దురదృష్టవశాత్తు తప్పుడు సమయంలో ఔట్ అయ్యాను. నిజానికి 209 అనేది చాలా మంచి స్కోరు. పిచ్ నుంచి పేసర్లకు మంచి సహకారం అందింది. రాహుల్ చాహర్‌ను ఇంపాక్ట్‌గా తీసుకోవడంపై నేను ఒక్కటే ఆలోచించాను. ముగ్గురు సీమర్లు ఇద్దరు రిస్ట్ స్పిన్నర్లతో ఆడాలని అనుకున్నాము. ఈ కాంబినేషన్ జట్టుకు ఉపయోగపడుతుందనుకున్నా. కానీ మా స్పిన్నర్లకు ఈ రోజు అసలు కలిసిరాలేదు. మధ్య ఓవర్లలో ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచలేకపోయాము. అయితే మాది యువ జట్టు. అనవసరమైన అంచనాలతో ఒత్తిడి పెంచుకోకూడదని భావిస్తున్నాం’ అని రుతురాజ్ చెప్పుకొచ్చాడు.చదవండి: ఎంతపని చేశావ్ అయ్యర్.. పంజాబ్ జట్టుకు షాక్! -
ఎంతపని చేశావ్ అయ్యర్.. పంజాబ్ జట్టుకు షాక్!
ఐపీఎల్ 19వ సీజన్లో సీఎస్కేతో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. వరుసగా రెండు విజయాలతో జోష్ మీదున్న పంజాబ్‌కు ఊహించని షాక్ తగిలింది. ఇప్పటికే గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్ నమోదు చేసినందుకు పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌కు ఐపీఎల్ నిర్వాహకులు జరిమానా విధించారు. తాజాగా చెన్నైతో మ్యాచ్‌లో మరోసారి స్లో ఓవర్ రేట్ నమోదు చేయడంతో ఈసారి కెప్టెన్‌తో పాటు జట్టు ఆటగాళ్లు సహా ఇంపాక్ట్ ప్లేయర్ మ్యాచ్ ఫీజులో కోత విధిస్తున్నట్లు ఐపీఎల్ నిర్వాహకులు తెలిపారు. ఐపీఎల్ కౌన్సిల్ మాట్లాడుతూ..‘చెన్నై సూపర్‌కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ స్లో ఓవర్ రేట్ నమోదు చేసింది. ఐపీఎల్ ప్రవర్తనా నియమావళి (కోడ్ ఆఫ్ కండక్ట్) ఆర్టికల్ 2.22 ప్రకారం స్లో ఓవర్ రేట్ నమోదు చేసి నిబంధనలు ఉల్లంఘించిన పంజాబ్ జట్టుపై చర్యలు తీసుకుంటున్నాం. అయితే కెప్టెన్ అయ్యర్‌కు ఇది0 రెండో స్లో ఓవర్‌రేట్ కావడంతో అతని మ్యాచ్ ఫీజులో రూ. 24 లక్షలు కోత విధిస్తున్నాం. అంతేకాదు జట్టులోని 11 మంది ఆటగాళ్లు సహా ఇంపాక్ట్ ప్లేయర్ నుంచి ఆరు లక్షలు లేదా వారి మ్యాచ్ ఫీజుల్లో 25 శాతం జరిమానా విధిస్తున్నాం.’ అని ఐపీఎల్ కౌన్సిల్ తన ప్రకటనలో వెల్లడించింది.మళ్ళీ తప్పు చేస్తే నిషేధం!ఈ సీజన్లో పంజాబ్ జట్టు మూడోసారి కూడా స్లో ఓవర్ రేటును నమోదు చేస్తే అప్పుడు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. అప్పుడు కెప్టెన్ కు 30లక్షల జరిమానా విధించబడుతుంది. ఇంపాక్ట్ ప్లేయర్ సహా తుది జట్టులోని ఆటగాళ్లకు తలా 12 లక్షలు లేదంటే మ్యాచ్ ఫీజులో 50 శాతం రెండింటిలో ఏది తక్కువ అయితే అది జరిమానా విధించబడుతుంది. అంతేకాదు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఒక మ్యాచ్ నిషేధాన్ని ఎదుర్కొనే అవకాశముంది.మ్యాచ్ విషయానికి వస్తే తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్‌కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. ఆయుశ్ మాత్రే 73 పరుగులతో రాణించాడు. అనంతరం పంజాబ్ కింగ్స్ 18.4 ఓవర్లలోనే 5 వికెట్లు కోల్పోయి 210 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది.చదవండి: అంపైర్ తప్పిదం.. కసితీరా బాదిన ఆయుశ్! -
దూసుకెళ్తున్న పంజాబ్
-
అంపైర్ తప్పిదం.. కసితీరా బాదిన ఆయుశ్!
గెలిచినోడి కంటే ఓడిపోయినవాడి మీదే సానుభూతి ఎక్కువగా ఉంటుంది. జట్టును గెలిపించినోడు హీరో అవుతాడన్నది కాదనలేని మాట. కానీ అదే సమయంలో ఓడిపోయిన జట్టు నుంచి మంచి ఇన్నింగ్స్ ఆడిన ఆటగాడు అభిమానుల మనసులు గెలుచుకుంటాడు. ఇది ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయుశ్ మాత్రేకు సరిగ్గా నప్పుతుందని చెప్పొచ్చు. పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో సీఎస్కే ఇన్నింగ్స్ సమయంలో ఆయుశ్ మాత్రే వాడిన బ్యాట్ విషయంలో అంపైర్ అడ్డుపడడం, ఆ తర్వాత అదే బ్యాట్‌తో విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడి అందరిని మెప్పించడం విశేషం. గతేడాది అనుకోకుండా వచ్చిన అవకాశాన్ని ఒడిసిపట్టిన ఆయుశ్ మాత్రే ఈ సీజన్‌కు వచ్చేసరికి జట్టులో కీలక ఆటగాడిగా మారిపోయాడు. చెన్నైకి ఓటమి ఎదురైనా ఆయుశ్ మాత్రే రూపంలో సక్సెస్ లభించిందని చెప్పొచ్చు.ఐపీఎల్ 2026 సీజన్లో చెన్నై సూపర్‌కింగ్స్ వరుసగా రెండో పరాభవాన్ని మూటగట్టుకుంది. పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సీఎస్కే 5 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. అయితే చెన్నై ఓటమి చవిచూసినప్పటికీ ఆ జట్టు ఆటగాడు ఆయుశ్ మాత్రే మాత్రం సూపర్‌సక్సెస్ అయ్యాడు. ఆయుశ్ మాత్రే గతేడాది చెన్నై జట్టు తరఫున ఐపీఎల్లో అరంగేట్రం చేశాడు. ముందుగా టీమ్‌లో లేకపోయినా...రుతురాజ్ గాయంతో తప్పుకోవడంతో జట్టుకు ఎంపికయ్యాడు. ముంబైకి చెందిన మాత్రే ముంబైలోనే ముంబై ఇండియన్స్‌తో తొలి మ్యాచ్ ఆడి 15 బంతుల్లోనే 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 32 పరుగులు చేసి అదరగొట్టాడు. ఆ తర్వాత బెంగళూరుపై కూడా 48 బంతుల్లోనే 9 ఫోర్లు, 5 సిక్స్‌లతో 94 పరుగులు సాధించి సత్తా చాటాడు. గత సీజన్‌ను ఘనంగా ముగించిన మాత్రే 2026 ఐపీఎల్ సీజన్‌ను ఘనంగా ఆరంభించాలని భావించాడు. కానీ ఈ సీజన్ తొలి పోరులో మొదటి బంతికే వెనుదిరిగి నిరాశపర్చిన అతను ఈ మ్యాచ్‌లో తన కసిని ప్రదర్శించాడు. బార్ట్లెట్ ఓవర్లో వరుసగా 3 ఫోర్లతో అతను తన పరుగుల ఖాతా తెరిచిన అతను యాన్సెన్ ఓవర్లో 2 సిక్స్‌లు బాదాడు. ఆపై స్టొయినిస్ ఓవర్లో సిక్స్‌తో 29 బంతుల్లోనే హాఫ్ సెంచరీని అందుకున్న అతను తర్వాతి బంతినీ సిక్స్‌గా మలిచాడు. 59, 67 పరుగుల వద్ద చహల్ బౌలింగ్‌లో వైశాక్, శశాంక్ క్యాచ్‌లు వదిలేయడం అతనికి కలిసొచ్చింది.అంపైర్ పొరపాటు..సీఎస్కే ఇన్నింగ్స్ సమయంలో ఒక విచిత్రమైన సంఘటన చోటుచేసుకుంది. గ్జేవియర్ బార్ట్లెట్ బౌలింగ్‌లో సంజూ శాంసన్ ఔటయ్యాకా మూడో స్థానంలో ఆయుశ్ మాత్రే క్రీజులోకి వచ్చాడు. అయితే మొదట తీసుకొచ్చిన బ్యాట్ కాస్త అనుమానంగా ఉండడంతో అంపైర్ దానిని పరిశీలించాడు. కానీ బ్యాట్ గేజ్ నుంచి పాస్ కాకపోవడంతో వేరే బ్యాట్‌ను తీసుకొని వచ్చాడు. కానీ ఈసారి కూడా బ్యాట్ గేజ్‌ను దాటకపోవడంతో టెస్టులో మరోసారి ఫెయిల్ అయ్యాడు. అయితే మాత్రే తొలుత తీసుకొచ్చి బ్యాట్‌ను అంపైర్ మరోసారి చెక్ చేశాడు. అయితే ఇక్కడ అంపైర్ తన పొరపాటు వల్లే బ్యాట్‌కు గేజ్‌ను సరిగ్గా పెట్టడంలో విఫలమైనట్లు గుర్తించాడు. ఆ తర్వాత మాత్రే తన ఫస్ట్ బ్యాట్‌తోనే ఇన్నింగ్స్ కొనసాగించాడు.ఎవరీ ఆయుశ్ మాత్రే?జూలై 16, 2007లో మహారాష్ట్రలోని నల్లసొపారా జిల్లాలో ఆయుశ్ మాత్రే జన్మించాడు. ఆరేళ్ల వయసులో క్రికెట్ ఆడడం మొదలుపెట్టిన ఆయుశ్ మాత్రేకు టీమిండియా మాజీ ఆటగాడు ఎంఎస్ ధోని ఆరాధ్య క్రికెటర్. అతని ఆటను చూస్తూ పెరిగిన ఆయుశ్ మాత్రే పదిహేనేళ్ల వయసులో ప్రొఫెషనల్ క్రికెట్లోకి అడుగుపెట్టాడు. తన కలను నెరవేర్చుకునేందుకు ముంబైలోని విరార్ నుంచి చర్చ్‌గేట్ వరకు రోజు 80 కిలోమీట్లరు ప్రయాణం చేసి ప్రాక్టీస్ కొనసాగించాడు. ఆయుష్ 2024-25 లో ఇరాని ట్రోఫీలో ముంబై తరఫున ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పటివరకు 13 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లాడిన ఆయుష్ 660 పరుగులు చేశాడు. దేశవాళీ క్రికెట్లో ఇటీవల సంచలనం చేశాడు. లిస్ట్-ఏ క్రికెట్లో భారత క్రికెటర్ యశస్వి జైస్వాల్ పేరిట ఉన్న ప్రపంచ రికార్డును ముంబై బ్యాటర్ ఆయుష్ మాత్రే బద్దలు కొట్టాడు. లిస్ట్-ఏ క్రికెట్లో అత్యంత పిన్న వయసులో (17 ఏళ్ల 168 రోజులు)లో 150 అంతకంటే ఎక్కువ పరుగులు చేసిన బ్యాటర్‌గా మాత్రే రికార్డులకెక్కాడు. 2024 అండర్-19 టీ 20 ప్రపంచకప్ గెలిచిన యంగ్ ఇండియా జట్టులో ఆయుశ్ మాత్రే సభ్యుడిగా ఉన్నాడు. ఇక 2025లో అండర్-19 జట్టుకు కెప్టెన్‌గా ఎంపికైన ఆయుశ్మాత్రే ఆసియాకప్‌లో భారత్‌ను రన్నరప్‌గా నిలిపాడు. ఈ ఏడాది జరిగిన అండర్-19 టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టుకు నాయకత్వం వహించిన ఆయుశ్ మాత్రే టీమిండియా టైటిల్ కొట్టడంలో కీలకపాత్ర పోషించాడు. టోర్నీలో ఏడు మ్యాచ్‌ల్లో 214 పరుగులు సాధించాడు. అంతేకాదు ఆయుశ్ మాత్రే సారథ్యంలోనే యంగ్ ఇండియా ఇంగ్లండ్, ఆస్ట్రేలియా జట్లను వారి సొంతగడ్డపైనే ఓడించి సిరీస్‌లు కైవసం చేసుకోవడం విశేషం. View this post on Instagram A post shared by IPL (@iplt20)చదవండి: చెస్‌లో అద్భుతాలు సృష్టిస్తోన్న చిచ్చరపిడుగు -
పంజాబ్ బల్లే బల్లే...
చెన్నై సూపర్‌కింగ్స్‌కి కోట లాంటి చెపాక్ మైదానంలో ఒక్క పంజాబ్‌కు మాత్రమే చెన్నైని ఎక్కువ సార్లు ఓడించిన ఘనమైన రికార్డు ఉంది. గత మూడు సీజన్లలో ఇక్కడ సూపర్ కింగ్స్‌ను మట్టికరిపించిన పంజాబ్ ఈసారీ దానిని కొనసాగించింది. ముందుగా చెన్నై 209 పరుగుల భారీ స్కోరు చేసినా... మరో 8 బంతులు మిగిలి ఉండగానే పంజాబ్ గెలుపు సొంతం చేసుకుంది. స్పిన్నర్ చహల్ పదునైన బౌలింగ్‌తో ప్రత్యర్థి స్కోరును నియంత్రించగా, ఛేదనలో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అర్ధ సెంచరీతో పంజాబ్ కింగ్స్ జట్టును విజయం దిశగా నడిపించాడు. చెన్నై: గత ఏడాది ఐపీఎల్ రన్నరప్ పంజాబ్ కింగ్స్ ఈ సీజన్లో వరుసగా రెండో విజయాన్ని అందుకుంది. శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ 5 వికెట్ల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్‌ను ఓడించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన చెన్నై 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. ఆయుశ్ మాత్రే (43 బంతుల్లో 73; 6 ఫోర్లు, 5 సిక్స్‌లు) అర్ధసెంచరీ సాధించగా...శివమ్ దూబే (22 బంతుల్లో 33 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్) సర్ఫరాజ్ ఖాన్ (12 బంతుల్లో 32; 6 ఫోర్లు, 1 సిక్స్) ధాటిగా ఆడారు. అనంతరం పంజాబ్ 18.4 ఓవర్లలో 5 వికెట్లకు 210 పరుగులు సాధించి గెలిచింది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (29 బంతుల్లో 50; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధసెంచరీ చేయగా... ప్రభ్‌సిమ్రన్ సింగ్ (34 బంతుల్లో 43; 6 ఫోర్లు, 1 సిక్స్), ప్రియాన్ష్ ఆర్య (11 బంతుల్లో 39; 3 ఫోర్లు, 4 సిక్స్‌లు), కూపర్ కనోలీ (22 బంతుల్లో 36; 6 ఫోర్లు) మెరిపించారు. సర్ఫరాజ్ జోరు... వరల్డ్ కప్ హీరో సామ్సన్ (7) వరుసగా రెండో మ్యాచ్‌లోనూ ప్రభావం చూపకపోగా... కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (22 బంతుల్లో 28; 2 ఫోర్లు) విఫలమయ్యాడు. అయితే మరోవైపు ఆయుశ్ మాత్రే జోరుతో స్కోరు దూసుకుపోయింది. పవర్‌ప్లేలో జట్టు 57 పరుగులు చేసింది. మాత్రేతో రెండో వికెట్‌కు రుతురాజ్ గైక్వాడ్ 55 బంతుల్లో 96 పరుగులు జోడించగా... అతని వాటా 22 పరుగులు మాత్రమే! ఆ తర్వాత తక్కువ వ్యవధిలో మాత్రే, కార్తీక్ (1) అవుట్ కాగా, అర్ష్ దీప్ ఓవర్లో వరుసగా మూడు ఫోర్లతోసర్ఫరాజ్ చెలరేగాడు. ఆ తర్వాత వైశాక్ ఓవర్లో వరుసగా 4, 4, 4 కొట్టిన అతను తర్వాతి బంతికి వెనుదిరిగాడు. అర్ష్ దీప్ వేసిన ఆఖరి ఓవర్లో మూడు ఫోర్లు కొట్టి దూబే జట్టు స్కోరును 200 దాటించాడు. సమష్టి ప్రదర్శన... ఛేదనలో పంజాబ్ టాప్–4 తమ వంతు పాత్ర పోషించారు. తాను ఆడిన తొలి 6 బంతుల్లో 3 ఫోర్లు 2 సిక్స్‌లతో ప్రియాన్ష్ దూకుడుగా మొదలుపెట్టగా, కంబోజ్ ఓవర్లో ప్రభ్‌సిమ్రన్ 3 ఫోర్లు బాదాడు. పవర్‌ప్లేలో స్కోరు 68 పరుగులకు చేరింది. ఓపెనర్లు వెనుదిరిగిన తర్వాత కనోలీ, శ్రేయస్ అదే ధాటిని కొనసాగించారు. చహర్ ఓవర్లో 2 సిక్స్‌లు కొట్టిన శ్రేయస్... హెన్రీ ఓవర్లో వరుసగా 4, 6 బాదాడు. 26 బంతుల్లో అతని హాఫ్ సెంచరీ పూర్తయింది. విజయానికి 24 పరుగుల దూరంలో అతను అవుటైనా, ఇతర బ్యాటర్లు లాంఛనం పూర్తి చేశారు. ప్రశాంత్ వీర్ అరంగేట్రం... గత మ్యాచ్‌లో రూ.14.20 కోట్ల విలువైన ఆటగాడు కార్తీక్ శర్మతో అరంగేట్రం చేయించిన చెన్నై... ఈ మ్యాచ్‌లో మరో రూ.14.20 కోట్ల ప్లేయర్ ప్రశాంత్ వీర్‌కు తొలి ఐపీఎల్ మ్యాచ్ ఆడే అవకాశం ఇచ్చింది. ప్రధానంగా లెఫ్టార్మ్ స్పిన్నర్ అయిన 20 ఏళ్ల ప్రశాంత్ లోయర్ ఆర్డర్లో భారీ షాట్లు ఆడగల సమర్థుడు. బీసీసీఐ అండర్–23 టోర్నీతో పాటు సీఎస్కే ట్రయల్స్‌లో ఆకట్టుకోవడంతో రవీంద్ర జడేజా తరహా ఆటగాడైన వీర్‌ను జట్టు ఎంచుకుంది. యూపీ టి20 లీగ్‌లో 155 స్ట్రయిక్‌రేట్‌లో 320 పరుగులు చేయడంతో పాటు 8 వికెట్లు తీసి ప్రశాంత్ అందరి దృష్టినీ ఆకర్షించాడు.6-చెపాక్ మైదానంలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టును అత్యధికసార్లు (6) ఓడించిన జట్టుగా పంజాబ్ కింగ్స్ గుర్తింపు పొందింది. ముంబై ఇండియన్స్ (21 సార్లు) తర్వాత ఐపీఎల్లో చెన్నై జట్టుపై అత్యధిక విజయాలు సాధించిన రెండో జట్టు పంజాబ్ (17 సార్లు). బెంగళూరు (16 సార్లు) మూడో స్థానానికి వెళ్లింది. 36-ఐపీఎల్ టోర్నీ చరిత్రలో అత్యధికసార్లు 200 పరుగులకు పైగా స్కోరు చేసిన జట్టుగా చెన్నై సూపర్ కింగ్స్ అవతరించింది. ఇప్పటి వరకు చెన్నై జట్టు 36 సార్లు 200 మార్క్‌ను దాటింది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు 35 సార్లు... పంజాబ్ కింగ్స్ 33 సార్లు, ముంబై ఇండియన్స్ 32 సార్లు, కోల్‌కతా నైట్‌రైడర్స్ 30 సార్లు ఈ ఘనత సాధించాయి. స్కోరు వివరాలుచెన్నై సూపర్ కింగ్స్ ఇన్నింగ్స్: సామ్సన్ (సి) ప్రభ్‌సిమ్రన్ (బి) బార్ట్లెట్ 7; రుతురాజ్ (సి) వధేరా (బి) చహల్ 28; ఆయుశ్ (సి) మాత్రమే (బి) వైశాక్ 73; దూబే (నాటౌట్) 45; కార్తీక్ (ఎల్బీ) (బి) యాన్సెన్ 1; సర్ఫరాజ్ (సి) వధేరా (బి) వైశాక్ 32; ప్రశాంత్ (నాటౌట్) 6; ఎక్స్‌ట్రాలు 17; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 209. వికెట్ల పతనం: 1–14, 2–110, 3–123, 4–130, 5–168. బౌలింగ్: అర్ష్ దీప్ 4–0–41–0, బార్ట్లెట్ 4–0–48–1, యాన్సెన్ 4–0–43–1, వైశాక్ 4–0–38–2, చహల్ 3–0–21–1, స్టొయినిస్ 1–0–17–0. పంజాబ్ కింగ్స్ ఇన్నింగ్స్: ప్రియాన్ష్ (బి) హెన్రీ 39; ప్రభ్‌సిమ్రన్ (రనౌట్) 43; కనోలీ (సి) హెన్రీ (బి) కంబోజ్ 36; శ్రేయస్ (సి) చహర్ (బి) కంబోజ్ 50; వధేరా (సి) నూర్ (బి) హెన్రీ 10; శశాంక్ (నాటౌట్) 14; స్టొయినిస్ (నాటౌట్) 9; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (18.4 ఓవర్లలో 5 వికెట్లకు) 210. వికెట్ల పతనం: 1–61, 2–95, 3–127, 4–186, 5–186. బౌలింగ్: ఖలీల్ 3–0–28–0, హెన్రీ 4–0–54–2, కంబోజ్ 3.4–0–43–2, నూర్ 4–0–38–0, రాహుల్ చహర్ 4–0–46–0. -
సత్తా చాటిన శ్రేయస్.. పంజాబ్ ఖాతాలో వరుసగా రెండో విజయం
ఐపీఎల్ 2026లో భాగంగా ఇవాళ (ఏప్రిల్ 3) జరిగిన మ్యాచ్‌లో సీఎస్కేపై పంజాబ్ కింగ్స్ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. తద్వారా ప్రస్తుత ఎడిషన్‌లో వరుసగా రెండు మ్యాచ్‌ల్లో విజయాలు నమోదు చేసింది. సీఎస్కే విషయానికొస్తే.. ఈ జట్టుకు ఇది వరుసగా రెండో ఓటమి. తొలి మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ చేతిలో ఓడి, తాజాగా పంజాబ్ చేతిలో పరాజయంపాలైంది.టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్కే నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. ఆయుశ్ మాత్రే (73) అర్ద సెంచరీతో సత్తా చాటగా.. శివమ్ దూబే (45 నాటౌట్), సర్ఫరాజ్ ఖాన్ (32) రాణించారు. రుతురాజ్ గైక్వాడ్ (28) పర్వాలేదనిపించగా.. సంజూ శాంసన్ (7), కార్తీక్ శర్మ (1) నిరాశపరిచారు. పంజాబ్ బౌలర్లలో విజయ్ కుమార్ 2, చహల్, జన్సెన్, బార్ట్లెట్ తలో వికెట్ తీశారు.అనంతరం భారీ లక్ష్య ఛేదనను ధాటిగా ప్రారంభించిన పంజాబ్ మరో 8 బంతులు మిగిలుండగానే (18.4 ఓవర్లు) 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఆదిలో ప్రియాంశ్ ఆర్య (39) విధ్వంసం సృష్టించి ఔట్ కాగా.. ప్రభ్‌సిమ్రన్ (43), కూపర్ కన్నోల్లీ (36), శ్రేయస్ అయ్యర్ (50) బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్‌లు ఆడి గెలుపుకు పునాది వేశారు. ఆఖర్లో శశాంక్ సింగ్ (14 నాటౌట్), స్టోయినిస్ (9 నాటౌట్) ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా పంజాబ్‌ను గెలుపు తీరాలు దాటించారు. సీఎస్కే బౌలర్లలో మ్యాట్ హెన్రీ, అన్షుల్ కంబోజ్ తలో 2 వికెట్లు తీశారు. సీఎస్కే సొంతగడ్డపై భారీ స్కోర్ చేసినా, దాన్ని కాపాడుకోలేకపోయింది. -
IPL 2026: సీఎస్కే చరిత్రలో అరుదైన సందర్భం
చెన్నై సూపర్ కింగ్స్ చరిత్రలో అత్యంత అరుదైన సందర్భం చోటు చేసుకుంది. ఐపీఎల్ 2026లో భాగంగా పంజాబ్ కింగ్స్‌తో ఇవాళ (ఏప్రిల్ 3) జరుగుతున్న మ్యాచ్‌లో ఆ జట్టు నలుగురు 21 లేదా అంతకంటే తక్కువ వయసున్న ఆటగాళ్లను బరిలోకి దించింది. ఆ జట్టు చరిత్రలో ఇలా జరగడం ఇది రెండో సారి మాత్రమే. గత ఎడిషన్ ఆరంభంలో తొలిసారి ఇలా జరిగింది. సాధారణంగా సీఎస్కేను ముసలివాళ్ల జట్టుగా పరిగణిస్తారు. ఆ జట్టు చరిత్ర చూస్తే 30 ఏళ్ల పైబడిన వారే అధికంగా ఉన్నారు. గత రెండు సీజన్లుగా సీఎస్కే ఆ ముద్రను చెరిపివేసే ప్రయత్నం చేస్తుంది.పంజాబ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఆయుశ్ మాత్రే, కార్తీక్ శర్మ, ప్రశాంత్ వీర్, నూర్ అహ్మద్ లాంటి యువకులను సీఎస్కే బరిలోకి దించింది. వీరంతా 21 లేదా అంతకంటే తక్కువ వయసున్న వారు.ఆయుశ్ మాత్రే (18 ఏళ్ల 261 రోజులు)కార్తీక్ శర్మ (19 ఏళ్ల 342 రోజులు)ప్రశాంత్ వీర్ (20 ఏళ్ల 130 రోజులు)నూర్ అహ్మద్ (21 ఏళ్ల 90 రోజులు)ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్‌లో సీఎస్కే టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగింది. ఆ జట్టుకు ఆదిలోనే భారీ ఎదురుదెబ్బ తగిలింది. రెండో ఓవర్ చివరి బంతికి సంజూ శాంసన్ (7) ఔటయ్యాడు. సీఎస్కేకు మారిన తర్వాత సంజూ వరుసగా రెండో మ్యాచ్‌లోనూ విఫలమై నిరాశపరిచాడు. ఈ మ్యాచ్‌లో సంజూ బార్ట్లెట్ బౌలింగ్‌లో ప్రభ్‌సిమ్రన్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. 3 ఓవర్ల తర్వాత సీఎస్కే స్కోర్ 24-1గా ఉంది. ఆయుశ్ మాత్రే (0), రుతురాజ్ గైక్వాడ్ (11) క్రీజ్‌లో ఉన్నారు. -
సీఎస్కేపై పంజాబ్ గెలుపు
ఐపీఎల్ 2026లో భాగంగా ఇవాళ (ఏప్రిల్ 3) జరిగిన మ్యాచ్‌లో సీఎస్కేపై పంజాబ్ కింగ్స్ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్కే నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేయగా.. పంజాబ్ మరో 8 బంతులు మిగిలుండగానే (18.4 ఓవర్లు) 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. రెండో వికెట్ కోల్పోయిన పంజాబ్8.5వ ఓవర్-95 పరుగుల వద్ద పంజాబ్ రెండో వికెట్ కోల్పోయింది. లేని రెండో పరుగుకు ప్రయత్నించి ప్రభ్‌సిమ్రన్ (43) రనౌటయ్యాడు. తొలి వికెట్ కోల్పోయిన పంజాబ్210 పరుగుల భారీ లక్ష్య ఛేదనను ధాటిగా ఆరంభించిన తర్వాత పంజాబ్ 61 పరుగుల వద్ద (4.2వ ఓవర్) తొలి వికెట్ కోల్పోయింది. విధ్వంసం సృష్టించిన ప్రియాంశ్ ఆర్యను (39) మ్యాట్ హెన్రీ క్లీన్ బౌల్డ్ చేశాడు. సీఎస్కే భారీ స్కోర్‌టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్కే నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 209 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఆయుశ్ మాత్రే (73) అర్ద సెంచరీతో సత్తా చాటగా.. శివమ్ దూబే (45 నాటౌట్), సర్ఫరాజ్ ఖాన్ (32) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. రుతురాజ్ గైక్వాడ్ (28) పర్వాలేదనిపించగా.. సంజూ శాంసన్ (7), కార్తీక్ శర్మ (1) నిరాశపరిచారు. పంజాబ్ బౌలర్లలో విజయ్ కుమార్ 2, చహల్, జన్సెన్, బార్ట్లెట్ తలో వికెట్ తీశారు. ఐదో వికెట్ కోల్పోయిన సీఎస్కే16.4వ ఓవర్- 168 పరుగుల వద్ద సీఎస్కే ఐదో వికెట్ కోల్పోయింది. బార్ట్లెట్ బౌలింగ్‌లో హ్యాట్రిక్ బౌండరీలు బాదిన తర్వాత సర్ఫరాజ్ ఖాన్ (32) ఔటయ్యాడు.మాత్రే (73) ఔట్12.3వ ఓవర్-123 పరుగుల వద్ద సీఎస్కే మూడో వికెట్ కోల్పోయింది. విజయ్ కుమార్ బౌలింగ్‌లో చహల్‌కు క్యాచ్ ఇచ్చి ఆయుశ్ మాత్రే ఔటయ్యాడు.రెండో వికెట్ కోల్పోయిన సీఎస్కే11.1వ ఓవర్- 110 పరుగుల వద్ద సీఎస్కే రెండో వికెట్ కోల్పోయింది. చహల్ బౌలింగ్‌లో నేహల్ వధేరాకు క్యాచ్ ఇచ్చి రుతురాజ్ గైక్వాడ్ (28) ఔటయ్యాడు. భారీ స్కోర్ దిశగా సాగుతున్న సీఎస్కేటాస్ ఓడి తొలుత బ్యాటంగ్ చేస్తున్న సీఎస్కే భారీ స్కోర్ దిశగా సాగుతోంది. ఆదిలోనే సంజూ వికెట్ కోల్పోయినా.. ఆయుశ్ మాత్రే (62) ధాటిగా ఆడుతుండటంతో 10 ఓవర్లలో వికెట్ నష్టానికి 101 పరుగులు చేసింది. మాత్రే తన సహజ శైలికి భిన్నంగా భారీ షాట్లతో విరుచుకుపడుతున్నాడు. అతనికి రుతురాజ్ (25) సహకరిస్తున్నాడు. సంజూ మరోసారి విఫలంసీఎస్కే మారిన తర్వాత సంజూ శాంసన్ వరుసగా రెండో మ్యాచ్‌లో విఫలమయ్యాడు. తొలి మ్యాచ్‌లో 6 పరుగులకు ఔటైన అతను.. ఇవాల్టి మ్యాచ్‌లో మరో పరుగు అదనంగా చేసి 7 పరుగుల వద్ద పెవిలియన్‌కు చేరాడు. బార్ట్లెట్ బౌలింగ్‌లో ప్రభ్‌సిమ్రన్‌కు క్యాచ్ ఇచ్చి సంజూ వెనుదిరిగాడు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పంజాబ్ఐపీఎల్ 2026లో భాగంగా ఇవాళ (ఏప్రిల్ 3) జరుగుతున్న ఏడో మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్, పంజాబ్ కింగ్స్ తలపడుతున్నాయి. చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా జరుగనున్న ఈ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ కోసం పంజాబ్ కింగ్స్ ఎలాంటి మార్పులు చేయకపోగా.. సీఎస్కే ఓ మార్పు చేసింది. మాథ్యూ షార్ట్ స్థానంలో ప్రశాంత్ వీర్ తుది జట్టులోకి వచ్చాడు.తుది జట్లు..పంజాబ్ కింగ్స్: ప్రభ్సిమ్రాన్ సింగ్(w), కూపర్ కొన్నోలీ, శ్రేయాస్ అయ్యర్(c), శశాంక్ సింగ్, నెహాల్ వధేరా, మార్కస్ స్టోయినిస్, మార్కో జాన్సెన్, జేవియర్ బార్ట్లెట్, విజయ్‌కుమార్ వైషాక్, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్ఇంపాక్ట్ సబ్స్: సూర్యాంశ్ షెడ్గే, ప్రియాంష్ ఆర్య, విష్ణు వినోద్, ప్రవీణ్ దూబే, హేమంత్ బ్రార్చెన్నై సూపర్ కింగ్స్: సంజు శాంసన్(w), రుతురాజ్ గైక్వాడ్(c), ఆయుష్ మ్హత్రే, సర్ఫరాజ్ ఖాన్, శివమ్ దూబే, కార్తీక్ శర్మ, ప్రశాంత్ వీర్, నూర్ అహ్మద్, అన్షుల్ కాంబోజ్, మాట్ హెన్రీ, ఖలీల్ అహ్మద్ఇంపాక్ట్ సబ్స్: జామీ ఓవర్టన్, రాహుల్ చాహర్, మాథ్యూ షార్ట్, రామకృష్ణ ఘోష్, గుర్జప్నీత్ సింగ్ -
సొంతగడ్డపై సత్తా చాటేనా!
చెన్నై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ సీజన్లో భాగంగా శుక్రవారం పంజాబ్ కింగ్స్‌తో మాజీ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ తలపడనుంది. గువాహటిలో ఆడిన గత మ్యాచ్‌లో ఓడిన చెన్నై... సొంతగడ్డపై పాయింట్ల ఖాతా తెరవాలని భావిస్తోంది. రాజస్తాన్ రాయల్స్‌తో పోరులో బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ఇలా అన్ని రంగాల్లో పేలవ ప్రదర్శనతో ఘోర పరాజయం చవిచూసిన సూపర్ కింగ్స్... ఆ ఓటమిని పక్కనపెట్టి సమష్టిగా సత్తా చాటేందుకు సిద్ధమైంది. గాయం కారణంగా ధోనీ ఈ మ్యాచ్‌లో కూడా బరిలోకి దిగడం లేదు. అయితే అతడు డగౌట్ నుంచి సూచనలు ఇవ్వనుండటం జట్టు ఆత్మవిశ్వాసాన్ని పెంచే అంశం. టి20 వరల్డ్‌కప్ హీరో సంజూ సామ్సన్‌పై భారీ అంచనాలు ఉండగా... కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్, ఆయుశ్ మాత్రే, షార్ట్, శివమ్ దూబే, కార్తీక్ శర్మ కలిసి కట్టుగా కదంతొక్కాల్సిన అవసరముంది. బౌలింగ్‌లో ఖలీల్, అన్షుల్ కంబోజ్, నూర్ అహ్మద్, హెన్రీ కీలకం కానున్నారు. మరోవైపు గత మ్యాచ్‌లో గుజరాత్‌పై కష్టపడి గెలిచిన పంజాబ్ కింగ్స్ అదే జోరు కొనసాగించాలని భావిస్తోంది. ఆసీస్ ప్లేయర్ కూపర్ చక్కటి ఫామ్‌లో ఉండగా... కెప్టెన్ శ్రేయస్, ప్రియాన్ష్ ఆర్య, ప్రభ్‌సిమ్రన్, నేహల్, శశాంక్, స్టొయినిస్, యాన్సెన్ రాణించాల్సి ఉంది. అర్ష్‌దీప్, జేవియర్, యాన్సెన్, వైశాఖ్, చాహల్ బౌలింగ్ భారం మోయనున్నారు. చెన్నై పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలించే అవకాశం ఉంది. మ్యాచ్‌కు వర్ష సూచనలేదు. ఐపీఎల్లో ఇప్పటి వరకు చెన్నై, పంజాబ్ మధ్య 32 మ్యాచ్‌లు జరిగాయి. ఇరు జట్లు చెరో 16 మ్యాచ్‌ల్లో గెలిచి సమంగా ఉన్నాయి. పంజాబ్‌పై చెన్నై అత్యధిక స్కోరు 240 కాగా... అత్యల్ప స్కోరు 120. చెన్నైపై పంజాబ్ అత్యధిక స్కోరు 231 కాగా, అత్యల్ప స్కోరు 92గా ఉంది. -
అర్ష్‌దీప్ సింగ్ చెత్త రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే
ఐపీఎల్-2026 సీజన్లో పంజాబ్ కింగ్స్ బోణీ కొట్టింది. మంగళవారం చండీగఢ్ వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 3 వికెట్ల తేడాతో పంజాబ్ విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్‌లో పంజాబ్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ దారుణ ప్రదర్శన కనబరిచాడు. టీ20ల్లో టీమిండియా లీడింగ్ వికెట్ టేకర్ ఉన్న అర్ష్‌దీప్.. గుజరాత్‌తో మ్యాచ్‌లో ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయాడు.తన 4 ఓవర్ల కోటాలో 42 పరుగులు సమర్పించుకుని వికెట్ లెస్‌గా వెనుదిరిగాడు. అతడి ఎకానమీ రేటు 10.50గా ఉంది. వైశాఖ్ విజయ్‌కుమార్ వంటి యువ బౌలర్ మూడు వికెట్లు పడగొట్టి తన సత్తాచాటితే, అర్ష్‌దీప్ వంటి స్టార్ పేసర్ తేలిపోవడం పంజాబ్ ఫ్యాన్స్‌ను నిరాశపరిచింది.కాగా గుజరాత్ ఇన్నింగ్స్ చివరి ఓవర్ వేసే బాధ్యతను అర్ష్‌దీప్ సింగ్‌కు కెప్టెన్ అప్పగించాడు. అయితే ఆ ఓవర్‌ను పూర్తి చేసేందుకు అర్ష్‌దీప్ ఏకంగా 11 బంతులు వేయాల్సి వచ్చింది. ఇందులో 5 వైడ్లు, 1 నో-బాల్ ఉన్నాయి. ఈ పంజాబీ స్పీడ్ స్టార్ తన చెత్త బౌలింగ్‌తో అందరిని విసిగించాడు. ఈ క్రమంలో అర్ష్‌దీప్ ఓ చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.ఐపీఎల్ చరిత్రలో లాంగెస్ట్ ఓవర్ వేసిన బౌలర్‌గా మహ్మద్ సిరాజ్, తుషార్ దేశ్‌పాండే, శార్దూల్ ఠాకూర్, సందీప్ శర్మ, హార్దిక్ పాండ్యాల సరసన అర్ష్‌దీప్ చేరాడు. వీరంతా అర్ష్‌దీప్ కంటే ముందు 11 బంతుల ఓవర్లు వేశారు. కాగా ఈ మ్యాచ్‌లో గుజరాత్ నిర్దేశించిన 163 పరుగుల లక్ష్యాన్ని పంజాబ్ 19.1 ఓవర్లలో 7 వికెట్ల కోల్పోయి చేధించింది. కూపర్ కొన్నోలీ అజేయంగా నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చాడు.చదవండి: IND vs ZIM: టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్..! ఓపెనర్‌గా వైభవ్ సూర్యవంశీ? -
మ్యాచ్ హీరో అతడే.. ప్రత్యర్థి కెప్టెన్‌పై ప్రశంసలు
ఐపీఎల్ 2026 సీజన్లో పంజాబ్ కింగ్స్ శుభారంభం చేసింది. మంగళవారం గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ నేపథ్యంలో మ్యాచ్ ముగిసిన అనంతరం పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ స్పందించాడు. మ్యాచ్ హీరో కచ్చితంగా కూపర్ కనోలీనేనని, అతడి వల్లే ఈ గెలుపు సాధ్యమైందన్నాడు. అయితే గుజరాత్ కెప్టెన్ గిల్‌పై శ్రేయస్ ప్రశంసలు కురిపించడం ఆసక్తిగా మారింది. శ్రేయస్ మాట్లాడుతూ..‘నా చేతికి స్పల్ప గాయమైంది. పెద్దది అవ్వొద్దని గట్టిగా కోరుకున్నా. ప్రస్తుతం అంతా బాగుంది. గాయం తీవ్రత కూడా పెద్దగా లేదు. అయితే ఈ మ్యాచ్‌లో హీరో మాత్రం కూపర్ కనోలీనే. అద్భుతమైన టెక్నిక్‌తో మ్యాచ్ ఆడాడు. కనోలీ బాదిన కొన్ని షాట్లు మాత్రం అద్భుతం. డ్రెస్సింగ్ రూమ్‌కి వెళ్లి చేతి గాయానికి ఐస్ పెట్టుకునే లోపే టపాటపా వికెట్లు పడిపోయాయి. క్రికెట్లో ఇలాంటి పరిస్థితులు సహజం. ఏం జరిగినా పోరాటం ఆపొద్దు. కనోలీ అదే చేశాడు. ప్రశాంతంగా ఆడుతూ జట్టుకు విజయాన్ని అందించాడు. అర్ష్‌దీప్ సింగ్ వచ్చి బంతి కాస్త ఆగి వస్తోందని చెప్పాడు. అందుకే మేం బంతిని వీలైనంత త్వరగా పాతబడేలా చేయడానికి ప్రయత్నించాం. విజయ్ కుమార్ వైశాఖ్ గత సీజన్ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. అతడు బిగ్ మ్యాచ్ ప్లేయర్. అయితే నేను బ్యాటింగ్ చేసే సమయంలో షార్ట్ లెగ్ ఫీల్డర్‌ను చూసి షాకయ్యాను. ఇంతకుముందు ఏ కెప్టెన్ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం నేను చూడలేదు. ఈ విషయాన్ని గిల్‌తో కూడా చెప్పాను. శుభ్‌మన్ గిల్ ఇలాంటి అటాకింగ్ ఫీల్డింగ్ సెట్ చేయడం బాగుంది’ అని అయ్యర్ చెప్పుకొచ్చాడు.చదవండి: ఇటలీకి షాక్.. ఫిపా ప్రపంచకప్‌కు అనర్హత -
అరంగేట్రంలోనే అదరగొట్టాడు.. ఎవరీ కూపర్!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఎందరో అనామక ఆటగాళ్లను వెలుగులోకి తీసుకొచ్చింది. ప్రతీ సీజన్లో తమ అరంగేట్రం మ్యాచ్‌ల్లో అదరగొట్టే ప్రదర్శన నమోదు చేసే ఆటగాళ్లు అరుదుగా ఉంటారు. ఆ జాబితాలో చేరిపోయాడు పంజాబ్ కింగ్స్ ప్లేయర్ కూపర్ కనోలీ. తాను ఆడుతుంది తొలి ఐపీఎల్ మ్యాచ్ అయినప్పటికీ ఎలాంటి బెరుకు లేకుండా కడదాకా నిలిచి 72 పరుగుల అజేయ ఇన్నింగ్స్‌తో పంజాబ్‌ను గెలిపించాడు. ఆడిన తొలి మ్యాచ్‌లోనే అందరూ మెచ్చే ఇన్నింగ్స్ ఆడిన కనోలీ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా’ నిలిచాడు. తద్వారా ఐపీఎల్లో అరంగేట్రం మ్యాచ్‌లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్ల జాబితాలో కూపర్ ఐదో స్థానంలో ఉన్నాడు. కూపర్ కంటే ముందు మెక్కల్లమ్ (158 నాటౌట్), మైక్ హస్సీ (116 నాటౌట్), షాన్ మార్ష్ (84 నాటౌట్), కైల్ మిల్స్ (73) వరుసగా తొలి నాలుగు స్థానాల్లో ఉన్నారు.ఇక మంగళవారం గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ ఒక దశలోఈజీగా గెలవాల్సిందే. కానీ ప్రసిధ్ క్రిష్ణ సూపర్ స్పెల్ వేసి శ్రేయస్, స్టోయినిస్, శశాంక్ సింగ్‌లను ఔట్ చేసి పంజాబ్‌కు షాక్ ఇచ్చాడు. ఈ దశలో వన్‌డౌన్‌లో వచ్చిన కూపర్ కనోలీ కడదాకా నిలిచి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. 44 బంతుల్లో 72 పరుగులు చేసిన కూపర్ ఇన్నింగ్స్‌లో 5 ఫోర్లు, 5 సిక్సర్లు ఉన్నాయి. ఆల్‌రౌండర్‌గా గుర్తింపు ఉన్నా వెన్ను గాయం కారణంగా లీగ్‌లో అతను బౌలింగ్ చేయడని, స్పెషలిస్ట్ బ్యాటర్‌గానే ఆడతాడని పంజాబ్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో కనోలీ కీలక ఇన్నింగ్స్ ఆడి పంజాబ్ నమ్మకాన్ని నిలబెట్టాడు.ఎవరీ కూపర్ కనోలీ?ఆస్ట్రేలియాకు చెందని కూపర్ కనోలీ 2003, ఆగస్టు 22న పెర్త్‌లో జన్మించాడు. 22 ఏళ్ల కూపర్ ఆస్ట్రేలియా తరఫున 2024 సెప్టెంబర్‌లో తొలి అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు. అరంగేట్రం చేసిన నాలుగు నెలల్లోనే అన్ని అంతర్జాతీయ ఫార్మాట్లలో మ్యాచ్‌లు ఆడిన క్రికెటర్‌గా కూపర్ అరుదైన ఘనత సాధించాడు. 2022-23 బీబీఎల్ ఫైనల్లో కూపర్ ప్రదర్శన అతడికి గుర్తింపునిచ్చింది. కూపర్ ఆస్ట్రేలియా తరఫున ఒక టెస్టు, 8 వన్డేలు, 11 టీ20 మ్యాచ్‌లు ఆడాడు.The debutant seals it in style! 💪@PunjabKingsIPL clinch a thriller in New Chandigarh to get their campaign going with a win ❤️Scorecard ▶️ https://t.co/75rCxTCOL1#TATAIPL | #KhelBindaas | #PBKSvGT pic.twitter.com/WqBQNjuvA1— IndianPremierLeague (@IPL) March 31, 2026చదవండి: మూగబోయిన బ్యాట్.. విధ్వంస వీరుడికి ఏమైంది? -
కూపర్... సూపర్
గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో 163 పరుగుల విజయలక్ష్యం.... పంజాబ్ ఒకదశలో 11 ఓవర్లలో 110/2... మిగిలిన 48 బంతుల్లో మరో 53 పరుగులు అంటే అలవోకగా ఛేదించవచ్చు... కానీ ఇక్కడ జట్టు అనూహ్యంగా తడబడింది. 16 బంతుల వ్యవధిలో జట్టు 4 వికెట్లు కోల్పోవడంతో ఒక్కసారిగా ఉత్కంఠ పెరిగింది. అయితే ఈ మ్యాచ్‌తోనే ఐపీఎల్లో అరంగేట్రం చేసిన ఆ్రస్టేలియన్ కూపర్ కనోలీ పట్టుదలగా నిలబడ్డాడు. ఒత్తిడిని అధిగమిస్తూ చివరి వరకు నిలబడి ఒంటి చేత్తో గెలిపించాడు. అంతకుముందు పంజాబ్ పదునైన బౌలింగ్ ముందు నిలవలేక గుజరాత్ సాధారణ స్కోరుకే పరిమితమైంది. న్యూ చండీగఢ్: ఐపీఎల్లో మూడు ఏకపక్ష మ్యాచ్‌ల తర్వాత ఉత్కంఠభరిత పోరు జరిగింది. మంగళవారం చివరి వరకు ఆసక్తికరంగా సాగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ 3 వికెట్ల తేడాతో గుజరాత్ టైటాన్స్‌పై విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. శుబ్‌మన్ గిల్ (27 బంతుల్లో 39; 6 ఫోర్లు), జోస్ బట్లర్ (33 బంతుల్లో 38; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఫర్వాలేదనిపించారు. అనంతరం పంజాబ్ 19.1 ఓవర్లలో 7 వికెట్లకు 165 పరుగులు సాధించింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ కూపర్ కనోలీ (44 బంతుల్లో 72 నాటౌట్; 5 ఫోర్లు, 5 సిక్స్‌లు) చెలరేగగా, ప్రభ్‌సిమ్రన్ సింగ్ (24 బంతుల్లో 37; 1 ఫోర్, 4 సిక్స్‌లు) రాణించాడు. బ్యాటింగ్ వైఫల్యం! బార్ట్లెట్ ఓవర్లో గిల్ మూడు ఫోర్లు కొట్టి ధాటిని ప్రదర్శించగా, మరో ఓపెనర్ సాయిసుదర్శన్ (13) ఎక్కువసేపు నిలవలేకపోయాడు. బట్లర్ కూడా ఆశించిన స్థాయిలో దూకుడుగా ఆడకపోవడంతో పవర్‌ప్లేలో గుజరాత్ 54 పరుగులే చేయగలిగింది. ఇందులో ఒక్క సిక్స్ కూడా లేకపోవడం విశేషం. ఆ తర్వాత చహల్ బౌలింగ్‌లో స్లాగ్ స్వీప్‌కు ప్రయత్నించి గిల్ వెనుదిరగ్గా, గ్లెన్ ఫిలిప్స్ (17 బంతుల్లో 25; 1 ఫోర్, 1 సిక్స్) కూడా ఎక్కువసేపు నిలవలేదు. 16వ ఓవర్ వరకు క్రీజ్‌లో ఉన్నా బట్లర్ ప్రభావం కనిపించలేదు. చివరి 4 ఓవర్లలో టైటాన్స్ కేవలం 2 ఫోర్లతో 31 పరుగులే రాబట్టగలిగిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. మిడిలార్డర్లో వాషింగ్టన్ సుందర్ (18), షారుఖ్ ఖాన్ (4) కూడా విఫలమయ్యారు. రాణించిన ప్రభ్‌సిమ్రన్... ఛేదనలో ఆరంభంలోనే ప్రియాన్‡్ష ఆర్య (7) వెనుదిరిగినా... ప్రభ్ సిమ్రన్ సిక్సర్లతో చెలరేగాడు. రబాడ ఓవర్లో వరుసగా రెండు సిక్స్‌లు కొట్టిన అతను, సుందర్ బౌలింగ్‌లో మరో రెండు భారీ సిక్స్‌లు బాదాడు. అయితే కీలక సమయంలో గుజరాత్ కట్టుదిట్టమైన బౌలింగ్‌తో వరుస వికెట్లు తీసి పంజాబ్‌పై ఒత్తిడి పెంచింది. కానీ కనోలీ పోరాటంతో మ్యాచ్ పంజాబ్ వశమైంది. అశోక్ అరంగేట్రం... రాజస్తాన్‌కు చెందిన 23 ఏళ్ల అశోక్ శర్మ ఈ మ్యాచ్‌తోనే ఐపీఎల్లో అడుగు పెట్టాడు. దేశవాళీ క్రికెట్లో నిలకడగా గంటకు 150 కిలోమీటర్లకు పైగా వేగంతో బౌలింగ్ చేసే ఫాస్ట్ బౌలర్‌గా గుర్తింపు పొందాడు. ఇటీవల సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో కేవలం 15.63 సగటుతో 22 వికెట్లు పడగొట్టి టోర్నీ టాపర్‌గా నిలిచాడు. ఐపీఎల్లో 2022లో కోల్‌కతా, 2025లో రాజస్తాన్ జట్లలో ఉన్నా ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం రాలేదు. స్కోరు వివరాలు గుజరాత్ టైటాన్స్ ఇన్నింగ్స్: సుదర్శన్ (సి) అయ్యర్ (బి) యాన్సెన్ 13; గిల్ (సి) కనోలీ (బి) చహల్ 39; బట్లర్ (సి) బార్ట్లెట్ (బి) చహల్ 38; ఫిలిప్స్ (సి) యాన్సెన్ (బి) వైశాక్ 25; సుందర్ (సి) అర్ష్‌దీప్ (బి) వైశాక్ 18, షారుఖ్ (సి) అర్ష్‌దీప్ (బి) వైశాక్ 4; తెవాటియా (నాటౌట్) 11; రషీద్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 14; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 162. వికెట్ల పతనం: 1–37, 2–83, 3–119, 4–129, 5–144, 6–150.బౌలింగ్: అర్ష్‌దీప్ 4–0–42–0, బార్ట్లెట్ 4–0–36–0, యాన్సెన్ 4–0–20–1, వైశాక్ 4–0–34–3, చహల్ 4–0–28–2, పంజాబ్ కింగ్స్ ఇన్నింగ్స్: ప్రియాన్‡్ష (సి) అశోక్ (బి) రబాడ 7; ప్రభ్‌సిమ్రన్ (సి) ప్రసిధ్ (బి) రషీద్ 37; కనోలీ (నాటౌట్) 72; శ్రేయస్ (సి) సుందర్ (బి) ప్రసిధ్ 18; వధేరా (సి) గిల్ (బి) సుందర్ 3; శశాంక్ (సి) బట్లర్ (బి) ప్రసిధ్ 4; స్టొయినిస్ (సి) రషీద్ (బి) ప్రసిధ్ 0; యాన్సెన్ (సి) గిల్ (బి) అశోక్ 9; బార్ట్లెట్ (నాటౌట్) 11; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (19.1 ఓవర్లలో 7 వికెట్లకు) 165. వికెట్ల పతనం: 1–7, 2–83, 3–110, 4–113, 5–118, 6–118, 7–144. బౌలింగ్: సిరాజ్ 2–0–15–0 రబాడ 3–0–34–1, అశోక్ శర్మ 3–0–31–1, రషీద్ 4–0–29–1, సుందర్ 3.1–0–27–1, ప్రసిధ్ 4–0–29–3. -
IPL 2026: పంజాబ్‌ను గెలిపించిన కన్నోల్లీ
ఐపీఎల్ 2026లో భాగంగా ఇవాళ (మార్చి 31) జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌పై పంజాబ్ కింగ్స్ 3 వికెట్ల తేడాతో గెలుపొందింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేయగా.. పంజాబ్ మరో 5 బంతులు (19.1 ఓవర్లలో) మిగిలుండగానే 7 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. అరంగేట్రం ఆటగాడు కూపర్ కన్నోల్లీ (44 బంతుల్లో 72 నాటౌట్; 5 ఫోర్లు, 5 సిక్సర్లు) అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి పంజాబ్‌ను గెలిపించాడు.తొలుత సునాయాసంగా గెలుస్తుందనుకున్న పంజాబ్ ఓ దశలో తడబడింది. 8 పరుగుల వ్యవధిలో 4 వికెట్లు కోల్పోయి ఒత్తిడికి లోనైంది. ఈ దశలో కన్నోల్లీ సంయమనంతో ఆడి పంజాబ్‌ను విజయతీరాలకు చేర్చాడు. అతనికి జేవియర్ బార్ట్లెట్ (11 నాటౌట్) సహకరించాడు. పంజాబ్ ఇన్నింగ్స్‌లో ప్రభ్‌సిమ్రన్ సింగ్ (37) ఓ మోస్తరు స్కోర్ చేయగా.. శ్రేయస్ అయ్యర్ (18), ప్రియాంశ్ ఆర్య (7), నేహల్ వధేరా (3), శశాంక్ సింగ్ (4), స్టోయినిస్ (0), జన్సెన్ (9) నిరాశపరిచారు. గుజరాత్ బౌలర్లలో ప్రసిద్ద్ కృష్ణ (4-0-29-3) అద్భుతమైన స్పెల్‌తో పంజాబ్ బ్యాటర్లపై ఒత్తిడి పెంచగా.. రషీద్ ఖాన్ (4-0-29-1) పర్వాలేదనిపించాడు. మిగతా బౌలర్లలో రబాడ, అశోక్ శర్మ, వాషింగ్టన్ సుందర్ తలో వికెట్ తీశారు.అంతకుముందు గుజరాత్ సైతం ఓ దశలో భారీ స్కోర్ చేసేలా కనిపించినప్పటికీ.. పంజాబ్ బౌలర్లు ఒక్కసారిగా పుంజుకోవడంతో నామమాత్రపు స్కోర్‌కే పరిమితమైంది. విజయ్‌కుమార్ వైశాక్ (4-0-34-3), యుజ్వేంద్ర చహల్ (4-0-28-2), మార్కో జన్సెన్ (4-0-20-1), బార్ట్లెట్ (4-0-36-0) అద్భుతంగా బౌలింగ్ చేసి గుజరాత్ బ్యాటర్లను కట్టడి చేశారు. ఒక్క అర్షదీప్ సింగ్ (4-0-42-0) మినహా పంజాబ్ బౌలర్లంతా అద్బుతంగా బౌలింగ్ చేశారు.గుజరాత్ ఇన్నింగ్స్‌లో శుభ్‌మన్ గిల్ (27 బంతుల్లో 39; 6 ఫోర్లు), జోస్ బట్లర్ (33 బంతుల్లో 38; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), గ్లెన్ ఫిలిప్స్ (17 బంతుల్లో 25; 2 ఫోర్లు) ఓ మోస్తరు స్కోర్లు చేయగా.. సాయి సుదర్శన్ (13), వాషింగ్టన్ సుందర్ (18), షారుక్ ఖాన్ (4) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. రాహుల్ తెవాతియా (11), రషీద్ ఖాన్ (0) అజేయంగా నిలిచారు. -
చెలరేగిన పంజాబ్ బౌలర్లు.. స్వల్ప స్కోర్‌కే పరిమితమైన గుజరాత్
ఐపీఎల్ 2026లో భాగంగా పంజాబ్ కింగ్స్‌తో ఇవాళ (మార్చి 31) జరుగుతున్న మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ స్వల్ప స్కోర్‌కే పరిమితమైంది. పంజాబ్ హోం గ్రౌండ్ అయిన మహారాజా యాదవీంద్ర సింగ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో (ముల్లాన్‌పూర్) జరుగుతున్న ఈ మ్యాచ్‌లో పంజాబ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.వారి బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేయడంతో గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 162 పరుగులకే పరిమితమైంది. విజయ్‌కుమార్ వైశాక్ (4-0-34-3), యుజ్వేంద్ర చహల్ (4-0-28-2), మార్కో జన్సెన్ (4-0-20-1), బార్ట్లెట్ (4-0-36-0) అద్భుతంగా బౌలింగ్ చేసి గుజరాత్ బ్యాటర్లను కట్టడి చేశారు. ఒక్క అర్షదీప్ సింగ్ (4-0-42-0) మినహా పంజాబ్ బౌలర్లంతా అద్బుతంగా బౌలింగ్ చేశారు.గుజరాత్ ఇన్నింగ్స్‌లో శుభ్‌మన్ గిల్ (27 బంతుల్లో 39; 6 ఫోర్లు), జోస్ బట్లర్ (33 బంతుల్లో 38; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), గ్లెన్ ఫిలిప్స్ (17 బంతుల్లో 25; 2 ఫోర్లు) ఓ మోస్తరు స్కోర్లు చేయగా.. సాయి సుదర్శన్ (13), వాషింగ్టన్ సుందర్ (18), షారుక్ ఖాన్ (4) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. రాహుల్ తెవాతియా (11), రషీద్ ఖాన్ (0) అజేయంగా నిలిచారు. -
గుజరాత్‌పై పంజాబ్ గెలుపు
ఐపీఎల్ 2026లో భాగంగా ఇవాళ (మార్చి 31) జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌పై పంజాబ్ కింగ్స్ 3 వికెట్ల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేయగా.. పంజాబ్ మరో 5 బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని ఛేదించింది. అరంగేట్రం ఆటగాడు కూపర్ కన్నోల్లీ (44 బంతుల్లో 72 నాటౌట్; 5 ఫోర్లు, 5 సిక్సర్లు) అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి పంజాబ్‌ను గెలిపించాడు.శ్రేయస్ ఔట్12.1వ ఓవర్- 110 పరుగుల వద్ద పంజాబ్ మూడో వికెట్ కోల్పోయింది. ప్రసిద్ద్ కృష్ణ బౌలింగ్‌లో వాషింగ్టన్ సుందర్‌కు క్యాచ్ ఇచ్చి శ్రేయస్ అయ్యర్ (18) ఔటయ్యాడు.రెండో వికెట్ కోల్పోయిన పంజాబ్9.3వ ఓవర్- 83 పరుగుల వద్ద పంజాబ్ రెండో వికెట్ కోల్పోయింది. రషీద్ ఖాన్ బౌలింగ్‌లో ప్రసిద్ద్ కృష్ణకు క్యాచ్ ఇచ్చి ప్రభ్‌సిమ్రన్ సింగ్ (37) ఔటయ్యాడు. ఆదిలోనే పంజాబ్‌కు ఎదురుదెబ్బ1.2వ ఓవర్- 163 పరుగుల లక్ష్య ఛేదనలో పంజాబ్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది.రబాడ బౌలింగ్‌లో ప్రియాంశ్ ఆర్య (7) ఔటయ్యాడు. స్వల్ప స్కోర్‌కే పరిమితమైన గుజరాత్టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. నాలుగో వికెట్ కోల్పోయిన గుజరాత్15.4వ ఓవర్- 129 పరుగుల వద్ద గుజరాత్ నాలుగో వికెట్ కోల్పోయింది. చహల్ బౌలింగ్‌లో బార్ట్లెట్కు క్యాచ్ ఇచ్చి జోస్ బట్లర్ (38) పెవిలియన్ బాట పట్టాడు.మూడో వికెట్ కోల్పోయిన గుజరాత్13.6వ ఓవర్- 119 పరుగుల వద్ద గుజరాత్ మూడో వికెట్ కోల్పోయింది. విజయ్‌కుమార్ వైశాక్ బౌలింగ్‌లో జన్సెన్కు క్యాచ్ ఇచ్చి గ్లెన్ ఫిలిప్స్ (25) ఔటయ్యాడు. గిల్ ఔట్9.3వ ఓవర్- 83 పరుగుల వద్ద గుజరాత్ రెండో వికెట్ కోల్పోయింది. చహల్ బౌలింగ్‌లో కన్నోల్లీకి క్యాచ్ ఇచ్చి శుభ్‌మన్ గిల్ (39) ఔటయ్యాడు. తొలి వికెట్ కోల్పోయిన గుజరాత్.. సుదర్శన్ (13) ఔట్3.4వ ఓవర్- 37 పరుగుల వద్ద గుజరాత్ తొలి వికెట్ కోల్పోయింది. జన్సెన్ బౌలింగ్‌లో శ్రేయస్ అయ్యర్‌కు క్యాచ్ ఇచ్చి సాయి సుదర్శన్ ఔటయ్యాడు. ఐపీఎల్ 2026లో భాగంగా ఇవాళ (మార్చి 31) జరుగుతున్న నాలుగో మ్యాచ్‌లో గత ఎడిషన్ రన్నరప్ పంజాబ్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ పంజాబ్ హోం గ్రౌండ్ అయిన మహారాజా యాదవీంద్ర సింగ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో (ముల్లాన్‌పూర్) జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో పంజాబ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.ఇరు జట్లు చివరి సారి తలపడినప్పుడు పరుగుల వరద పారింది. అహ్మదాబాద్ వేదికగా గత ఎడిషన్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ 243 పరుగుల భారీ స్కోర్ చేయగా.. గుజరాత్ సైతం అద్భుతంగా పోరాడినప్పటికీ, లక్ష్యానికి 12 పరుగుల దూరంలో (232) నిలిచిపోయింది. ఈ గెలుపుతో శ్రేయస్ అయ్యర్ పంజాబ్ కెప్టెన్‌గా గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చాడు.తుది జట్లు..పంజాబ్: ప్రభ్సిమ్రాన్ సింగ్(w), కూపర్ కొన్నోలీ, శ్రేయాస్ అయ్యర్(c), నేహాల్ వధేరా, శశాంక్ సింగ్, మార్కస్ స్టోయినిస్, మార్కో జాన్సెన్, జేవియర్ బార్ట్లెట్, విజయ్‌కుమార్ వైషాక్, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్పంజాబ్ కింగ్స్ ఇంపాక్ట్ సబ్‌లు: ప్రియాంష్ ఆర్య, హర్‌ప్రీత్ బ్రార్, ప్రవీణ్ దూబే, విష్ణు వినోద్, సూర్యాంశ్ షెడ్గేగుజరాత్: సాయి సుదర్శన్, శుభమన్ గిల్(c), జోస్ బట్లర్(w), వాషింగ్టన్ సుందర్, గ్లెన్ ఫిలిప్స్, M షారుక్ ఖాన్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, కగిసో రబడ, అశోక్ శర్మ, మహ్మద్ సిరాజ్గుజరాత్ టైటాన్స్ ఇంపాక్ట్ సబ్‌లు: ప్రసిద్ధ్ కృష్ణ, జాసన్ హోల్డర్, జయంత్ యాదవ్, మానవ్ సుతార్, కుమార్ కుశాగ్రా -
టైటాన్స్‌తో పంజాబ్ ఢీ.. పంజా విసిరేదెవరు?
మాజీ చాంపియన్ గుజరాత్ టైటాన్స్, గతేడాది రన్నరప్ పంజాబ్ కింగ్స్ ఈ ఐపీఎల్ సీజన్లో శుభారంభంపై దృష్టి పెట్టాయి. నేడు జరిగే పోరులో శుబ్‌మన్ గిల్ నాయకత్వంలోని టైటాన్స్‌తో శ్రేయస్ అయ్యర్ సారథిగా ఉన్న పంజాబ్ కింగ్స్ తలపడుతుంది. భారత టి20 జట్టులో స్థానంలేని ఇరు జట్ల కెప్టెన్లు అటు తమ బ్యాటింగ్‌తో, ఇటు నాయకత్వంతో తమను తాము నిరూపించుకోవాలని పట్టుదలగా ఉన్నారు. ప్రతీ సీజన్లో నిలకడగా పరుగులు సాధిస్తున్నా... గిల్ స్ట్రయిక్‌రేట్‌పై ఇటీవల చర్చ పెరిగింది. ఈ నేపథ్యంలో తనలో దూకుడు పెంచాలని అతను భావిస్తున్నాడు. మరోవైపు శ్రేయస్ గత ఏడాది అద్భుత బ్యాటింగ్‌తో 604 పరుగులు చేసి జట్టును ముందుండి నడిపించాడు. ఈసారి కూడా అదే ఫామ్‌ను కొనసాగిస్తే జట్టు ముందంజ వేయవచ్చు. ఐపీఎల్ టోర్నీలో ఇప్పటి వరకు ఈ రెండు జట్లు ఆరుసార్లు ముఖాముఖిగా తలపడ్డాయి. మూడుసార్లు గుజరాత్, మూడుసార్లు పంజాబ్ గెలిచి సమఉజ్జీగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. చదవండి: సినెర్దే మయామి మాస్టర్స్ -
ఈసారి ఐపీఎల్ టైటిల్ సాధిస్తాం!
న్యూఢిల్లీ: ఐపీఎల్లో గత ఏడాది టైటిల్ సాధించేందుకు చేరువగా వచ్చి పంజాబ్ కింగ్స్ జట్టు ఫైనల్లో ఓటమి పాలైంది. లీగ్ దశలో 14 మ్యాచ్‌లలో 9 విజయాలు సాధించి దూసుకొచ్చిన పంజాబ్‌ను తుది పోరులో ఓడించి రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) తొలిసారి విజేతగా నిలిచింది. అయితే ఈసారి అలాంటి పొరపాటుకు తావు ఇవ్వమని, కచ్చితంగా ట్రోఫీని అందుకుంటామని పంజాబ్ కింగ్స్ బ్యాటర్ శశాంక్ సింగ్ విశ్వాసం వ్యక్తం చేశాడు. డిఫెండింగ్ చాంపియన్ అయిన బెంగళూరు హోం గ్రౌండ్ చిన్నస్వామి స్టేడియంలో మే 31న ఫైనల్ మ్యాచ్ జరిగే అవకాశం ఉంది. ‘మే 31న చిన్నస్వామి మైదానంలో మేం ఫైనల్ ఆడి కప్‌ను సొంతం చేసుకోబోతున్నాం. ఇది నా ఆశ మాత్రమే కాదు. కచ్చితంగా జరిగి తీరుతుందనే నమ్మకం ఉంది. టీమ్ సభ్యులందరిలో ఆత్మవిశ్వాసం మెండుగా కనిపిస్తోంది కాబట్టి జట్టు మొత్తం కూడా ఇదే నమ్ముతోంది’ అని శశాంక్ వ్యాఖ్యానించాడు. అయితే గత ఏడాది ఫైనల్ గురించి ఆలోచిస్తూ తాము ఒత్తిడి పెంచుకోమని, ఒక్కో మ్యాచ్‌లో గెలుస్తూ ముందుకు వెళ్లడమే లక్ష్యమని అతను పేర్కొన్నాడు. 2025 సీజన్లో ఆడిన జట్టు నుంచి 21 మంది పంజాబ్ కింగ్స్ కొనసాగిస్తోంది. ‘గత ఏడాది చేసిన చిన్న చిన్న తప్పులను కూడా సరిదిద్దుకుంటూ ఒక్కో మ్యాచ్‌లో విజయం సాధించడం ముఖ్యం. దాదాపు అదే జట్టు ఉండటం కూడా అందరిలో ప్రేరణ కలిగించే అంశం. ఈ సీజన్‌కు మేం మరింత బాగా సన్నద్ధమై వచ్చాం’ అని శశాంక్ వెల్లడించాడు. సాధారణంగా టాపార్డర్ బ్యాటర్ అయిన తాను పంజాబ్ కింగ్స్ జట్టు అవసరాల కోసం ఆర్డర్లో దిగువకు మారానని...అయితే ఈ పాత్రను, బాధ్యతను పూర్తిగా ఆస్వాదిస్తున్నట్లు చెప్పాడు. ఫిట్నెస్ టెస్టులో తుషారా విఫలంఐపీఎల్కు అనుమతించని శ్రీలంక బోర్డుకొలంబో: ఐపీఎల్లో ఇప్పటికే హాజల్‌వుడ్ అందుబాటులో లేక పేస్ బౌలింగ్‌లో డీలాగా మారిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)కి మరో సమస్య తోడైంది. హాజల్‌వుడ్ స్థానంలో తుది జట్టులో ఆడే అవకాశం ఉన్న శ్రీలంక పేసర్ నువాన్ తుషారా ఇప్పట్లో జట్టుతో చేరే అవకాశాలు కనిపించడం లేదు. శ్రీలంక క్రికెట్ బోర్డు నిర్వహించిన ఫిట్నెస్ టెస్టులో తుషారా విఫలమయ్యాడు. దాంతో అతనికి ఐపీఎల్ కోసం ఎన్ఓసీ ఇచ్చేందుకు లంక బోర్డు తిరస్కరించింది. ఫిట్నెస్ టెస్టులో వేర్వేరు ప్రమాణాల ద్వారా అందుబాటులో ఉన్న 29 పాయింట్లలో కనీసం 17 పాయింట్లు సాధించాల్సి ఉండగా... తుషారా వాటిని అందుకోలేకపోయాడు. -
’అతడు టీమిండియాలో అరంగేట్రానికి అర్హుడు’
ఆరంభ సీజన్ 2008 నుంచి ఐపీఎల్ టైటిల్ కోసం ఎదురుచూస్తున్న జట్లలో పంజాబ్ కింగ్స్ ఒకటి. అత్యుత్తమంగా 2014లో తొలిసారి ఫైనల్ చేరిన ఈ జట్టు.. సుదీర్ఘ విరామం తర్వాత గతేడాది మరోసారి టైటిల్ పోరుకు అర్హత సాధించింది. అయితే, ఆర్సీబీ చేతిలో ఆరు పరుగుల స్వల్ప తేడాతో ఓడి చాంపియన్‌గా నిలిచే సువర్ణావకాశాన్ని చేజార్చుకుంది.మరోవైపు.. ఆర్సీబీ తొలిసారి ట్రోఫీని ముద్దాడి తమ ఖాతాలో తొలి టైటిల్ జమచేసుకుంది. ఇదిలా ఉంటే.. ఐపీఎల్-2026లో పంజాబ్ మార్చి 31న తమ తొలి మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌తో తలపడనుంది.పటిష్టంగా మిడిలార్డర్ఈ నేపథ్యంలో పంజాబ్ కింగ్స్ మిడిలార్డర్ గురించి టీమిండియా స్పిన్ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, శశాంక్ సింగ్, నేహాల్ వధేరాలతో పంజాబ్ మిడిలార్డర్ పటిష్టంగా ఉందన్నాడు. వీరిలో శశాంక్ సింగ్ టీమిండియాలో చోటుకు అర్హుడని పేర్కొన్నాడు.టీమిండియాలో అరంగేట్రానికి అతడు అర్హుడు‘‘పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్ విభాగంలో శశాంక్ సింగ్ కూడా ముఖ్య ఆటగాడు. కానీ అతడి గురించి అంతగా చర్చ జరగడం లేదు. నిజానికి టీమిండియాలో అరంగేట్రానికి అతడు అర్హుడు. ఎన్నోసార్లు అద్భుతమైన ప్రదర్శనలు కనబరిచాడు.PC: PBKSపంజాబ్ కింగ్స్ అతడిని ఎంచుకుని మంచి పనిచేసింది. రిటెన్షన్ జాబితాలో కూడా అతడు ఉన్నాడు. అతడు మంచి ఫినిషర్. శ్రేయస్ అయ్యర్, నేహాల్ వధేరాలతో కలిసి మిడిలార్డర్‌ను పటిష్టంగా మార్చాడు. పంజాబ్ కింగ్స్ ఈ ముగ్గురు ప్రధాన బలం’’ అని అశూ అభిప్రాయపడ్డాడు.ముగ్గురూ ముగ్గురేకాగా శశాంక్ సింగ్ గతేడాది 17 మ్యాచ్‌లలో కలిపి 350 పరుగులు చేయగా.. నేహాల్ వధేరా 16 మ్యాచ్‌లలో భాగమై 369 పరుగులు సాధించాడు. ఇక కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 17 మ్యాచ్‌లలో కలిపి ఏకంగా 604 పరుగులతో దుమ్ములేపాడు. తొలి ప్రయత్నంలోనే పంజాబ్ కెప్టెన్‌గా జట్టును ఫైనల్‌కు చేర్చి సత్తా చాటాడు.ఫామ్‌లేమి.. మరేం పర్లేదుఇదిలా ఉంటే.. శశాంక్ సింగ్ ఇటీవల ముగిసిన దేశీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో తీవ్రంగా నిరాశపరిచాడు. 34 ఏళ్ల ఈ ఛత్తీస్‌గఢ్ ఆటగాడు ఏడు ఇన్నింగ్స్‌లో కలిపి కేవలం 101 పరుగులే చేశాడు. అయితే, హెడ్‌కోచ్ రిక్కీ పాంటింగ్ మార్గదర్శనంలో శశాంక్ ఐపీఎల్-2026లో ఫామ్ అందుకుని.. అదరగొట్టగలడని అశూ ధీమా వ్యక్తం చేశాడు.చదవండి: IPL 2026: ఎస్ఆర్హెచ్ జట్టులోకి 300 వికెట్ల వీరుడు -
పంజాబ్ కింగ్స్‌లో లుకలుకలు!
ఐపీఎల్ చరిత్రలో పంజాబ్ కింగ్స్‌ది ‘పేరు గొప్ప ఊరు దిబ్బ’ అన్నట్లుగా ఉంటుంది. ఐపీఎల్ ప్రారంభ సీజన్ నుంచి కొనసాగుతున్న ఫ్రాంచైజీల్లో పంజాబ్ కూడా ఒకటి. అయితే 18 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో పంజాబ్ ప్లేఆఫ్స్ చేరుకున్న సందర్భాలు మూడుసార్లు మాత్రమే. అయితే గత సీజన్లో జట్టును మొత్తం ప్రక్షాళన చేసిన పంజాబ్ కింగ్స్ ఐపీఎల్ 18వ సీజన్లో మాత్రం శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో ఫైనల్లో అడుగుపెట్టింది. అయితే తుది పోరులో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు చేతిలో ఓటమిపాలై రన్నరప్‌కే పరిమితమైంది. అయితే గతంలో పంజాబ్ కింగ్స్ ఫ్రాంచైజీ యాజమాన్యంలో తలెత్తిన వివాదాల కారణంగానే ఇన్నేళ్లుగా వెనుకబడిపోయిందని టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ పేర్కొన్నాడు. పంజాబ్ కింగ్స్‌లో తెరవెనుక పరిస్థితులు ఎప్పుడూ సాఫీగా సాగలేదని, ఏదో ఒక విషయంలో లుకలుకలు తలెత్తేవని తెలిపాడు. పఠాన్ మాట్లాడుతూ.. ‘2008 తొలి సీజన్లో యువరాజ్ సింగ్ నేతృత్వంలోని పంజాబ్ (అప్పటిక కింగ్స్ ఎలెవెన్ పంజాబ్)ప్లేఆఫ్స్‌కు చేరింది. తొలి సీజన్ తర్వాత పంజాబ్ క్రమంగా తమ పట్టును కోల్పోయింది. తొలి సీజన్ తర్వాత కెప్టెన్సీ కొనసాగాల్సింది. కానీ మూడో ఏడాదికే కెప్టెన్సీ మారిపోయింది. అదే వివాదాలకు దారి తీసింది. యాజమానులు, కోచ్‌లు ఇద్దరూ క్రికెట్‌పై కనీస అవగాహన లేనివారు కావడంతో నిర్ణయాల్లో తేడాలు వచ్చాయి. ఒక యజమాని ఒక టీమ్ కాంబినేషన్ కోరుకుంటే, మరొకరు ఇంకో ప్లాన్ చెప్పడంతో జట్టులో గందరగోళం ఏర్పడేది. నిజానికి పంజాబ్ కింగ్స్ యాజమాన్యంలో ప్రీతిజింటా ఎక్కువ వాటా ఉన్నప్పటికీ, మోహిత్ బర్మన్, నెస్ వాడియా, కరణ్ పాల్ కూడా జట్టులో భాగస్వాములుగా కొనసాగుతున్నారు. ఈ పార్టనర్ల మధ్య సమన్వయం లేకపోవడంతో అది ప్రదర్శనపై తీవ్ర ప్రభావాన్ని చూపించింది. 18 ఏళ్లలో పంజాబ్ కింగ్స్‌కు 12 మంది కెప్టెన్లు మారడంతో జట్టుపై నమ్మకం తగ్గిపోయింది. ఇప్పుడు అది జట్టుపైనే ప్రభావం చూపిస్తుంది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో మాత్రం మార్పు కనిపిస్తున్నట్లుగా ఉంది. శ్రేయస్ అయ్యర్ పంజాబ్‌ను సరైన దిశలో నడిపిస్తాడనే నమ్మకం కలుగుతున్నది. కాగా పఠాన్ ఐపీఎల్లో తొలి మూడు సీజన్ల పాటు పంజాబ్ కింగ్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు. 42 మ్యాచ్‌ల్లో 47 వికెట్లు పడగొట్టడంతో పాటు 603 పరుగులు సాధించాడు. చదవండి: '250 స్కోర్ కొట్టినా.. సన్‌రైజర్స్ ఓడిపోతుంది' -
అంచనాలు అందుకుంటాం!
ఐపీఎల్ 2026 సీజన్లో టైటిల్ ఫేవరెట్లలో ఒకటిగా పంజాబ్ కింగ్స్ బరిలోకి దిగుతోంది. పంజాబ్ కింగ్స్‌కు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ప్రధాన బలం. గతేడాది సీజన్లో కెప్టెన్‌ా అయ్యర్ పంజాబ్‌ను ఫైనల్ చేర్చాడు. కానీ తుది పోరులో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు చేతిలో ఓడిపోయి రన్నరప్‌కే పరిమితమయింది. కానీ ఈసారి మాత్రం అభిమానులు తమపై పెట్టుకున్న అంచనాలను నిజం చేస్తూ ఐపీఎల్ కప్పు కొల్లగొడతామని శ్రేయస్ అయ్యర్ ధీమా వ్యక్తం చేశాడు. ఐపీఎల్ 19వ సీజన్‌కు సిద్ధమవుతున్న తరుణంలో అయ్యర్ పలు ఆసక్తికర అంశాలను పంచుకున్నాడు.‘గాయం వల్ల నేను దాదాపు ఏడు కేజీలు బరువు తగ్గాను. దాని నుంచి కోలుకొని రావడం పెద్ద సవాల్‌గా నిలిచింది. నాకైన గాయం చాలా ప్రమాదకరమైనది. అయితే రెండు నెలల తీవ్రంగా కష్టపడిన తర్వాత ఇప్పుడు శరీరాకృతి బాగుంది. కానీ ఫిట్‌గా ఉంటూనే ఏడు కేజీల బరువు పెరగాలంటే చాలా శ్రమించాలి. నాకు సవాళ్లు అంటే చాలా ఇష్టం. తప్పకుండా పరిస్థితిని అధిగమిస్తా. ఇలాంటివి ఎన్నోసార్లు అనుభవించా. కమ్‌బ్యాక్ చేసి భారత జట్టుకు ఆడిన రోజులు ఉన్నాయి. గతేడాది మేం ఫైనల్‌కు వచ్చాం. రన్నరప్‌గా నిలిచాం.దీంతో ఈసారి మాపై అంచనాలు భారీగా ఉంటాయి. ఆ అంచనాలు అందుకోవడానికి కష్టపడతాం. విజయాలు సాధించి ట్రోఫీని అందుకుంటాం. ప్రతి మ్యాచ్‌కు మూడు రోజుల ముందే ప్రణాళికలు సిద్ధం చేసుకుంటాం. మైదానం ఆవల ఉండే బాండింగ్‌తోనే మ్యాచ్‌లో మెరుగ్గా రాణించేందుకు ఎక్కువ అవకాశం ఉంటుంది’ అని శ్రేయస్ తెలిపాడు. ఇక పంజాబ్ కింగ్స్ ఈ సీజన్లో తమ తొలి మ్యాచ్‌ను మార్చి 31న గుజరాత్ టైటాన్స్‌తో ఆడనుంది.చదవండి: అయోధ్య రాముడి సేవలో లక్నో జట్టు -
IPL 2026: పంజాబ్ ‘కింగ్స్’ అయ్యేనా?
ఐపీఎల్ చరిత్రలో ఒక్కసారి కూడా టైటిల్ గెలవలేకపోవడం పంజాబ్ కింగ్స్ నిలకడలేని ఫామ్‌ను ఎత్తి చూపుతోంది. ఐపీఎల్ ప్రారంభ సీజన్ ప్లేఆఫ్స్‌కు చేరిన పంజాబ్ కింగ్స్ (అప్పటి కింగ్స్ ఎలెవెన్ పంజాబ్) మళ్లీ 2014 ఐపీఎల్ సీజన్లో ఫైనల్ ఆడింది. ఆ సీజన్లో కేకేఆర్ చేతిలో ఓడిన పంజాబ్ రన్నరప్‌కే పరిమితమైంది. ఆ తర్వాత మళ్లీ 11 ఏళ్లకు కానీ ఆ జట్టు ఫైనల్లో అడుగుపెట్టలేకపోయింది. అప్పుడు కేకేఆర్ అడ్డు తగిలితే ఈసారి ఆర్సీబీ పంజాబ్‌ను అడ్డుకుంది. అయితే, గత సంవత్సరం జట్టును సమూలంగా ప్రక్షాళించడం పంజాబ్‌కు కలిసి వచ్చింది. ముఖ్యంగా శ్రేయాస్ అయ్యర్‌ను భారీ ధరకు దక్కించుకుంది. అంతేకాదు అతడికి జట్టు పగ్గాలు అప్పగించింది. తనపై వెచ్చించిన మొత్తానికి, ఫ్రాంచైజీ యాజమాన్యం ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా శ్రేయాస్ అయ్యర్ జట్టును నిరుడు తుదిపోరుకు తీసుకొచ్చాడు. ఈనేపథ్యంలో ప్రధాన ఆటగాళ్లను రిటైన్ చేసుకున్న పంజాబ్ రన్నరప్‌గా నిలిచిన ఆత్మవిశ్వాసంతో ఈ సీజన్‌కు సై అంటోంది. శ్రేయాస్ అయ్యర్ సారథ్యంలో పంజాబ్ ఈసారైనా ‘కింగ్స్’ అవుతుందా? అనేది చూడాలి.అయితే పంజాబ్‌కు విదేశీ ఆల్‌రౌండర్లు ప్రధాన బలం. మార్కస్ స్టొయినిస్, మార్కో యాన్సెన్, అజ్మతుల్లా ఒమర్జాయ్, మిచెల్ ఒవెన్, కూపర్ కానొలీ బంతిని ఎంత బలంగా బాది భారీ షాట్లు సాధించగలరో..అదే బంతితో ప్రత్యర్థి బ్యాటర్లను ముప్పు తిప్పలు పెట్టగలరు. పైగా ప్రపంచ వ్యాప్తంగా పలు అంతర్జాతీయ ఫ్రాంచైజీ లీగ్‌లలో ఆడుతున్న అపార అనుభవం ఆ ఐదుగురు ఆల్‌రౌండర్ల సొంతం. ప్రియాన్ష్ ఆర్యా, ప్రభ్‌సిమ్రన్ సింగ్ దూకుడైన బ్యాటింగ్‌తో స్కోరుబోర్డును పరుగులు పెట్టించగలరు. నిరుడు 400కుపైగా రన్స్ చేసిన ఆర్యా రెండో బెస్ట్ స్ట్రయిక్ రేట్ బ్యాటర్‌గా నిలిచాడు. ఓపెనర్లు ఇచ్చిన శుభారంభాలను కొనసాగించేందుకు శ్రేయాస్ ఎలాగూ ఉంటాడు. అర్ష్‌దీప్, ఫెర్గూసన్, యాన్సెన్, చాహల్‌తో పేస్, స్పిన్ బౌలింగ్‌లో వైవిధ్యం పంజాబ్‌కు కలిసి వచ్చే అంశం. పటిష్టమైన రిజర్వ్ బెంచ్ అదనపు బలం.పెద్దగా అనుభవంలేని భారత ఆటగాళ్లు జట్టులో ఉండడం పంజాబ్ కింగ్స్ బలహీనత. కెప్టెన్ అయ్యర్ మినహా ప్రియాన్ష్, శశాంక్ సింగ్, వధేరా, హర్‌ప్రీత్ బ్రార్, ముషీర్ ఖాన్, వైశాఖ్‌లకు అత్యున్నత స్థాయి ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడింది తక్కువ. వీరందరిలో ప్రతిభకు కొదవ లేకపోయినా నిలకడగా రాణించలేకపోవడం, ఒత్తిడి సమయాల్లో ఆడిన అనుభవం పెద్దగా లేకపోవడం కీలక సమయాల్లో జట్టును దెబ్బతీస్తోంది. అలాగే చాహల్ మినహా పేరు కలిగిన మరో స్పిన్నర్ లేకపోవడం లోటు.పంజాబ్ కింగ్స్ జట్టు:స్వదేశీ ఆటగాళ్లు: శ్రేయాస్ (కెప్టెన్), ప్రియాన్ష్ ఆర్యా, ప్రభ్ సిమ్రన్ సింగ్ (కీపర్), నేహల్ వధేరా, శశాంక్ సింగ్, విజయ్ కుమార్ వైశాఖ్, అర్ష్‌దీప్ సింగ్, యజువేంద్ర చాహల్, హర్‌ప్రీత్ బ్రార్, సూర్యాన్ష్ షెగ్డే, విష్ణు వినోద్ (కీపర్), యశ్ ఠాకూర్, ముషీర్ ఖాన్, హర్నూర్ సింగ్, పైలా అవినాశ్, ప్రవీణ్ దూబే, విశాల్ నిషాద్.విదేశీ ఆటగాళ్లు: స్టొయినిస్, అజ్మతుల్లా ఒమర్జాయ్, జేవియర్ బార్ట్లెట్, మిచెల్ ఒవెన్, ఫెర్గూసన్, కూపర్ కానొలీ, బెన్ డ్వార్షూయిస్.చదవండి: జట్లకు వార్నింగ్.. కేకేఆర్ బ్యాటర్ విధ్వంసకర సెంచరీ -
తొలి టైటిల్ వేటలో...
పేర్లు మారినా... ప్లేయర్లు మారినా.. ఆ రెండు జట్ల రాత మాత్రం మారడం లేదు. ఐపీఎల్ ఆరంభం నుంచి పోటీ పడుతున్నా... ఇప్పటి వరకు ఆ రెండు జట్లకు ట్రోఫీ అందని ద్రాక్షలా ఊరిస్తూనే ఉంది. అందులో ఒకటి శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని పంజాబ్ కింగ్స్... మరొకటి అక్షర్ పటేల్ నాయకత్వంలోని ఢిల్లీ క్యాపిటల్స్. గత సీజన్లో జట్లను ప్రక్షాళన చేసుకొని కొత్తగా దర్శనమిచ్చిన ఈ రెండు టీమ్‌లు మెరుగైన ప్రదర్శనే చేశాయి. బెంగళూరుతో జరిగిన ఫైనల్లో తడబడిన పంజాబ్ కింగ్స్ రన్నరప్‌తో సరిపెట్టుకోగా... ఢిల్లీ క్యాపిటల్స్ ఐదో స్థానానికి పరిమితమైంది. చరిత్రను పక్కనపెట్టి ఇరు జట్లు ఈసారి ఎలాంటి ప్రదర్శన కనబరుస్తాయో చూడాలి!సాక్షి, క్రీడావిభాగం : ఏళ్లకు ఏళ్లుగా తొలి టైటిల్ సాధించాలనే తపనతో సాగుతున్న పంజాబ్ కింగ్స్ జట్టు గత ఏడాది మెరుగైన ఆటతీరు కనబర్చింది. లీగ్ దశలో తొమ్మిది మ్యాచ్‌ల్లో గెలిచి పాయింట్ల పట్టికలో అగ్రస్థానం దక్కించుకుంది. శ్రేయస్ అయ్యర్ సారథ్యానికి సహచరుల సహకారం తోడవడంతో... పంజాబ్ తొలి టైటిల్ గెలిచేలా కనిపించింది. అయితే బెంగళూరుతో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో సారథి విఫలమవడం ఫలితంపై ప్రభావం చూపింది. గత సీజన్లో ఆడిన జట్టులో పెద్దగా మార్పులు చేయని పంజాబ్... ఈసారి ఎలాగైనా తమ చిరకాల కోరిక తీర్చుకోవాలని భావిస్తోంది. గత సీజన్‌లాగే బలంగా కనిపిస్తున్న కింగ్స్... మైదానంలో మళ్లీ మ్యాజిక్ చేసేందుకు రెడీ అవుతోంది. హెడ్ కోచ్ రికీ పాంటింగ్ పంజాబ్‌కు ప్రధాన బలం కాగా... జట్టు ఆల్‌రౌండర్లతో కిక్కిరిసి ఉంది. ప్రియాన్‡్ష ఆర్య, ప్రభ్‌సిమ్రన్ సింగ్ ఇన్నింగ్స్ ప్రారంభించనుండగా... శ్రేయస్ అయ్యర్ నాలుగో స్థానంలో ఇన్నింగ్స్‌కు స్థిరత్వం తేనున్నాడు. విదేశీ ప్లేయర్ల కోటాలో... స్టొయినిస్, యాన్సెన్, అజ్మతుల్లా, ఫెర్గూసన్ కీలకం కానున్నారు. సీజన్ మొత్తం ఈ నలుగురినే కొనసాగించే అవకాశాలున్నాయి. నేహల్ వధేరా, శశాంక్ సింగ్, ముషీర్ ఖాన్ రూపంలో మిడిలార్డర్లో ధాటిగా ఆడగల భారత ఆటగాళ్లు అందుబాటులో ఉండటం పంజాబ్‌కు కలిసి రానుంది. బౌలింగ్‌లో అర్‡్షదీప్ సింగ్ జట్టు ప్రధాన బలం కాగా... యుజ్వేంద్ర చహల్, స్టొయినిస్, యాన్సెన్, అజ్మతుల్లా మిగతా భారం మోయనున్నారు. ఆంధ్ర ఆటగాడు పైలా అవినాశ్‌కు తుది జట్టులో అవకాశం దక్కుతుందా చూడాలి. పంజాబ్ కింగ్స్ జట్టు: శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్ ), నేహల్ వధేరా, విష్ణు వినోద్, హర్నూర్ పన్ను, పైల అవినాశ్, ప్రభ్‌సిమ్రన్ సింగ్, శశాంక్ సింగ్, స్టొయినిస్, హర్‌ప్రీత్ బ్రార్, యాన్సెన్, అజ్మతుల్లా, ప్రియాన్ష్ ఆర్య, ముషీర్ ఖాన్, సూర్యాన్ష్, ఓవెన్, కొనొల్లీ, డ్వార్షుయ్, అర్ష్ దీప్, చహల్, వైశాక్, యశ్ ఠాకూర్, జేవియర్, ప్రవీణ్ దూబే, విశాల్ నిషాద్, ఫెర్గూసన్.అత్యుత్తమ ప్రదర్శన: రన్నరప్ (2014, 2025)‘మద్యం మానేశా’ప్రస్తుతం నా వయసు 35 ఏళ్లు. సీనియర్ ఆటగాడిగా చహల్‌ను చూసి ఎవరైనా ఏదైనా నేర్చుకోవాలని అనుకోవాలి. మైదానంలో మరింత చురుగ్గా ఉంటూ జట్టు కోసం 150 శాతం శ్రమించాలని పట్టుదలగా ఉన్నా. అందుకే నా శరీరంపై మరింత దృష్టి పెట్టా. గత ఆరు నెలలుగా మద్యం మానేశాననే శుభవార్త మీతో పంచుకుంటున్నా. – చహల్, పంజాబ్ఢిల్లీ రాత మారేనా! ఐపీఎల్ చరిత్రలో ఒకే ఒక్కసారి (2020 సీజన్లో) ఫైనల్‌కు చేరిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు... గతేడాది టీమ్‌లో సమూల మార్పులు చేసింది. టీమిండియా స్టార్ కేఎల్ రాహుల్ సారథ్యానికి మొగ్గు చూపకపోవడంతో... అక్షర్ పటేల్‌కు ఆ బాధ్యతలు అప్పగించింది. అందుకు తగ్గట్లే అక్షర్ అటు బ్యాట్‌తో, ఇటు బంతితో మెరుగైన ప్రదర్శనే కనబర్చాడు. అయితే లీగ్ దశలో ఏడు మ్యాచ్‌ల్లో గెలిచిన క్యాపిటల్స్.. ప్లే ఆఫ్స్‌కు చేరడంలో విఫలమైంది. తొలి నాలుగు మ్యాచ్‌ల్లో నెగ్గి ప్రత్యర్థులను భయపెట్టిన ఢిల్లీ... ఆ తర్వాత అదే జోరు కొనసాగించడంలో విఫలమైంది. కేఎల్ రాహుల్, కరుణ్ నాయర్, డేవిడ్ మిల్లర్, స్టబ్స్, పృథ్వీ షా వంటి ప్లేయర్లతో టాపార్డర్ బలంగా ఉండగా... మిడిలార్డర్లో అశుతోష్ రాణా, సమీర్ రిజ్వీ, అక్షర్ పటేల్, విప్రాజ్ నిగమ్ కీలకం కానున్నారు. పేరున్న స్టార్లకన్నా... సమయానుకూలంగా రెచ్చిపోగల ప్లేయర్లు ఉండటం క్యాపిటల్స్‌కు అదనపు బలం కానుంది. ఆంధ్ర ప్లేయర్ త్రిపురాన విజయ్ను ఆడిస్తారా అనేది ఆసక్తికరం. విదేశీ ప్లేయర్ల కోటాలో మిచెల్ స్టార్క్, మిల్లర్, స్టబ్స్, డకెట్, ఎంగిడి, జెమీసన్ అందుబాటులో ఉన్నారు. అయితే అంతర్జాతీయ స్థాయిలో మెరుగైన ప్రదర్శన కనబర్చిన పేస్ ఆల్‌రౌండర్ లేకపోవడం కాస్త లోటే. బౌలింగ్‌లో ముకేశ్ కుమార్, నటరాజన్, కుల్దీప్ యాదవ్ కీలకం కానున్నారు. దేశవాళీ సెన్సేషన్ పేసర్ ఆఖిబ్ నబీ ఈ సారి అదనపు బలం కానున్నాడు. గత సీజన్ మాదిరిగానే సమష్టి ప్రదర్శనను నమ్ముకుంటే ఈ సారి క్యాపిటల్స్ ప్లే ఆఫ్స్‌కు చేరొచ్చు. హేమాంగ్ బదానీ కోచింగ్, అక్షర్ పటేల్ కెప్టెన్సీ జట్టును ఎలా నడిపిస్తాయనేది కీలకం. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు: అక్షర్ పటేల్ (కెప్టెన్ ), కేఎల్ రాహుల్, కరుణ్ నాయర్, మిల్లర్, డకెట్, నిశాంక, సాహిల్, పృథ్వీ షా, అభిషేక్ పొరెల్, స్టబ్స్, సమీర్ రిజ్వి, అశుతోష్ రాణా, విప్రాజ్ నిగమ్, అజయ్ మండల్, త్రిపురాన విజయ్, మాధవ్ తివారి, ఆఖిబ్ నబీ, నితీశ్ రాణా, స్టార్క్, నటరాజన్, ముకేశ్ కుమార్, చమీర, ఎంగిడి. జెమీసన్, కుల్దీప్ యాదవ్. అత్యుత్తమ ప్రదర్శన: రన్నరప్ (2020) -
మందు మానేశా...ఇక సత్తా చూపిస్తా!
గొప్పగొప్ప లక్ష్యాలు కూడా సమాధి కావడానికి చిన్న చిన్న వ్యసనాలు చాలు. కొండంత బలం వృధా కావడానికి గోరంత బలహీనత చాలు. మరీ ముఖ్యంగా అత్యంత క్రమశిక్షణ, ఏకాగ్రత అవసరమైన క్రీడా రంగంలో బలహీనతలు, దురలవాట్లు ఉండడం అంటే అది చేజేతులా భవిష్యత్తును పాడె ఎక్కించడమే అనాలి. మాజీ టాప్ క్రికెటర్ వినోద్ కాంబ్లి లాంటి వాళ్ల జీవితాలు దీనికో నిదర్శనంగా నిలుస్తున్నాయి కూడా!!ఈ నేపథ్యంలో తాను మద్యం అలవాటును మానుకున్నానని, ఇకపై తన పూర్తి సమయం క్రికెట్‌కే కేటాయిస్తానని ప్రముఖ భారత క్రికెటర్, స్పిన్నర్ ఐపీఎల్ లో పంజాబ్ టీమ్ ప్లేయర్ అయిన యజ్వేంద్ర చహల్ చెబుతున్నాడు.ఇటీవల తన మాజీ ఐపీఎల్ సహచరుడు ఏబీ డివిలియర్స్ ఆధ్వర్యంలోని యూట్యూబ్ షోలో చహల్ ఈ విషయం గురించి మాట్లాడాడు. ఒకనాటి తన బలహీనతని, అది తనకు కలిగించిన నష్టాన్ని నిస్సంకోచంగా వెల్లడించాడు.తరచూ ఆరోగ్య సమస్యలుగతంలో తాను తరచుగా ఆరోగ్య సమస్యలు ఎదుర్కున్నానని చహల్ చెప్పాడు. మరీ ముఖ్యంగా గాయాల కారణంగా తన క్రీడా నైపుణ్యాలను తగిన విధంగా ప్రదర్శించలేకపోయానని పేర్కొన్నాడు. ‘‘కొన్ని సార్లు నా మీద నాకే నిరాశ కలిగిన మాట వాస్తవం. కేకేఆర్ మ్యాచ్ తర్వాత నా పక్కటెముక విరిగింది, ఆ తర్వాత నా కాలి వేలి కీలు కూడా విరిగింది. అందుకే సెమీఫైనల్, ఫైనల్లో నేను నా సరైన లెగ్–స్పిన్ బౌలింగ్ చేయలేకపోయాను’’ అని చహల్ గుర్తు చేసుకున్నాడు.‘‘ఈ ఏడాది నేను ముందుగా నా శరీరం గురించి జాగ్రత్త పడాలనుకుంటున్నాను. రాబోయే సీజన్ లో నా ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడంపైనే దృష్టి పెట్టా’’ అని చహల్ వెల్లడించాడు. మద్యం మానేశానుదీనికి అనుగుణంగా తీసుకున్న తన నిర్ణయాలను గురించి చెబుతూ... తాను మద్యం మానేసినట్లు తెలిపాడు. దానికి కారణం తన వయస్సు తో పాటు పంజాబ్ కింగ్స్ కోసం మరింత బాగా రాణించాలనే తన ఆలోచనే అని చహల్ ఈ సందర్భంగా చెప్పాడు.‘ఇప్పుడు కాదు.. నిజానికి నేను మద్యం తాగడం మానేసి ఆరు నెలలకు పైగా అయింది. నాకు ఇప్పుడు 35 ఏళ్లు, కాబట్టి నా చురుకుతనాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే నా జట్టు కోసం నూటికి నూట యాభై శాతం ఇవ్వాలనుకుంటున్నాను. ఒక సీనియర్ ఆటగాడిగా, ఐపీఎల్‌లోని యువ ఆటగాళ్లు నా నుంచి ఏదైనా మంచి విషయం నేర్చుకోవాలని కోరుకుంటున్నాను’ అని చహల్ తన ఆలోచనల్ని ఏకరవు పెట్టాడు.ఈ సందర్భంగా గత సీజన్ లో పంజాబ్ కింగ్స్ (PBKS) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మధ్య జరిగిన ఫైనల్‌పై కూడా చహల్ తన అభిప్రాయాలను పంచుకున్నాడు. ఆ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ ఆరు పరుగుల తేడాతో ఓడిపోయింది. యాన్సెన్ లేకపోవడం వల్లేఆ ఓటమికి గల కారణాలలో తమ బౌలింగ్ ఆల్–రౌండర్ మార్కో యాన్సెన్ లేకపోవడం కూడా ఒకటని అతను విశ్లేషించాడు. జాన్సెన్ 14 మ్యాచ్‌లలో 16 వికెట్లు పడగొట్టినప్పటికీ, జాతీయ జట్టు బాధ్యతల కారణంగా ప్లేఆఫ్స్‌కు దూరమయ్యాడు.సరిహద్దు ఉద్రిక్తతల కారణంగా షెడ్యూల్లో స్వల్ప మార్పులు చోటు చేసుకుని ఐపీఎల్ జూన్ నెలకు వాయిదా పడటంతో, యాన్సెన్ క్యాంప్ విడిచిపెట్టి, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ కోసం సన్నద్ధమయ్యేందుకు దక్షిణాఫ్రికాతో చేరవలసి వచ్చింది.‘ఫైనల్లో మార్కో యాన్సెన్ గనక ఉండి ఉంటే, ఖచ్చితంగా టైటిల్ గెలిచి ఉండేవాళ్ళం. టోర్నమెంట్ అంతటా అతను బౌలింగ్ చేసిన తీరు అద్భుతం, బ్యాటింగ్‌లో కూడా చివరిలో రెండు మూడు సిక్సర్లు కొట్టగల సత్తా అతనికి ఉంది. అతను బౌలింగ్ చేస్తున్న తీరు వల్ల ఇప్పుడు మాలో మరింత ఆత్మవిశ్వాసం పెరిగింది’’ అని చహల్ చెప్పాడు.చదవండి: IPL 2026: సీఎస్కేకు భారీ షాక్!.. మాకు నిజంగా ఎదురుదెబ్బే! -
గోల్డెన్ డక్!.. మరోసారి శ్రేయస్ అయ్యర్ ఫెయిల్
టీమిండియా తరఫున చివరగా న్యూజిలాండ్‌తో వన్డేతో బరిలోకి దిగాడు శ్రేయస్ అయ్యర్. ఈ ఏడాది జనవరిలో జరిగిన ఈ మ్యాచ్‌లో ఈ మిడిలార్డర్ బ్యాటర్ పది బంతులు ఎదుర్కొని కేవలం మూడు పరుగులే చేసి నిష్క్రమించాడు.మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా శ్రేయస్ (Shreyas Iyer) చేసిన పరుగులు వరుసగా.. 49, 8, 3. ఈ సిరీస్‌లో న్యూజిలాండ్ 2-1తో టీమిండియాను ఓడించి.. తొలిసారి భారత గడ్డపై వన్డే సిరీస్‌ను కైవసం చేసుకుంది.ఇదిలా ఉంటే.. కివీస్‌తో వన్డే సిరీస్ తర్వాత టీ20 ప్రపంచకప్-2026తో టీమిండియా బిజీగా మారగా.. శ్రేయస్ అయ్యర్ లోకల్ టీ20 టోర్నీలో భాగమయ్యాడు. నవీ ముంబై వేదికగా డీవై పాటిల్ టీ20 కప్‌లో ఈ ముంబైకర్ BPCL జట్టుకు ఆడుతున్నాడు. తొలి మ్యాచ్‌లో గోల్డెన్ డకౌట్ఇందులో భాగంగా మంగళవారం నాటి మ్యాచ్‌లో బ్యాంక్ ఆఫ్ బరోడాతో BPCL తలపడగా.. శ్రేయస్ అయ్యర్ గోల్డెన్ డకౌట్‌గా వెనుదిరిగాడు. ఈ మ్యాచ్‌లో BPCL ఎనిమిది పరుగుల తేడాతో ఓటమిపాలైంది.Shreyas Iyer ( Sarpanch Sahab ) Punjab Kings Captain Performances In Random DY Patil Tournament Against Club Level Bowlers - 1st Match 0(1) - 2nd Match 5(13) while chasing 200 Few Days Back , People Were Doing His Paid PR That He Deserves To Be In The T20 World Cup Squad 😂 pic.twitter.com/03yuOVEQXX— Stubbsy (@spideypant_) February 25, 2026మరోసారి ఫెయిల్ఇక రెండో మ్యాచ్‌లోనూ శ్రేయస్ అయ్యర్ విఫలమయ్యాడు. రిలయన్స్‌తో మ్యాచ్ సందర్భంగా ఈ ముంబైకర్ పదమూడు బంతులు ఎదుర్కొని కేవలం ఐదు పరుగులే చేసి నిష్క్రమించాడు. ఈ మ్యాచ్‌లో BPCL 65 పరుగుల భారీ తేడాతో ఓడిపోయింది.ఈ నేపథ్యంలో శ్రేయస్ అయ్యర్ వరుస వైఫల్యాలపై విమర్శలు వస్తున్నాయి. కాగా ఐపీఎల్-2025లో పంజాబ్ కింగ్స్ తరఫున పరుగుల వరద పారించిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. కెప్టెన్‌గానూ రాణించి జట్టును ఫైనల్‌కు చేర్చాడు. అయినప్పటికీ టీమిండియా సెలక్టర్లు అతడిని కరుణించలేదు.అగార్కర్ నిర్ణయం సరైందేనంటూ సెటైర్లుఆసియా టీ20 కప్-2025 ఆడిన జట్టుకు చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ శ్రేయస్ పేరును పరిగణనలోకి తీసుకోలేదు. ఇక టీ20 ప్రపంచకప్-2026 టోర్నీకి ముందు కూడా శ్రేయస్ పేరు వినిపించగా.. అతడిని సెలక్టర్లు పట్టించుకోలేదు.ఇలాంటి తరుణంలో.. ఐపీఎల్-2026 టోర్నీకి ముందు లోకల్ టోర్నమెంట్లో శ్రేయస్ అయ్యర్ ఇలా విఫలం కావడం విమర్శలకు దారితీసింది. శ్రేయస్‌ను భారత టీ20 జట్టుకు ఎంపిక చేయకుండా అగార్కర్ మంచి నిర్ణయమే తీసుకున్నాడంటూ కొంతమంది ట్రోల్ చేస్తున్నారు. అయితే, అతడి అభిమానులు మాత్రం త్వరలోనే మునుపటి శ్రేయస్ అయ్యర్‌ను చూడబోతున్నారంటూ మద్దతుగా నిలుస్తున్నారు.చదవండి: వైభవ్ సూర్యవంశీ విధ్వంసం.. దంచికొట్టిన అర్జున్ టెండుల్కర్ -
విరాట్ కోహ్లి వికెట్ తీస్తే.. ఏం చేస్తానంటే?
ఐపీఎల్-2026లో ఉత్తరప్రదేశ్‌కు చెందిన యువ స్పిన్నర్ విశాల్ నిషాద్ సత్తాచాటేందుకు ఉవ్విళ్ళూరుతున్నాడు. గతేడాది డిసెంబర్లో జరిగిన ఐపీఎల్ మెగా వేలంలో నిషాద్‌ను రూ. 30 లక్షల కనీస ధరకు పంజాబ్ కింగ్స్ సొంతం చేసుకుంది. ఒక్క ఫస్ట్‌క్లాస్ మ్యాచ్ ఆడిన అనుభవం లేనప్పటికి అతడిపై పంజాబ్ యాజమాన్యం అతడిపై నమ్మకం ఉంచింది.అతి సాధారణ కుటుంబం నుంచి వచ్చిన నిషాద్.. తన స్పిన్ మయాజాలంతో అందరిని ఆకట్టుకున్నాడు. 2024 యూపీ టీ20 ప్రిమియర్ లీగ్ విశాల్ కెరీర్‌ను మలుపు తిప్పింది. ఈ టోర్నీలో గోరఖ్‌పూర్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన అతడు.. అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు.గతేడాది సీజన్లో అతడు ఐపీఎల్లో ఆడుతాడని అంతా భావించారు. కానీ దురుదృష్టవశాత్తూ అప్పుడు అవకాశం లభించలేదు. అయితే ఇప్పుడు మాత్రం పంజాబ్ కింగ్స్ సువర్ణ అవకాశం కల్పించింది. తాజాగా ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నిషాద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి తనకు రోల్‌మోడల్ అని అతడు చెప్పుకొచ్చాడు.విరాట్ కోహ్లి నాకు ఆదర్శం. అతడు ఆడే ఫియర్ లెస్ క్రికెట్, కవర్ డ్రైవ్ షాట్లు నాకెంతో ఇష్టం. ఒకవేళ నేను కోహ్లి వికెట్ తీస్తే, సెలబ్రేషన్స్ చేసుకోను. అతడు నా రోల్ మోడల్ కాబట్టి నేరుగా వెళ్లి తన పాదాలకు నమస్కరిస్తాను. నేను ఎన్నో కష్టాలు పడి ఈ స్దాయికి చేరుకున్నాను. మా నాన్నతో పాటు పనికి వెళ్లేవాడిని. ఒకనొక సమయంలో క్రికెట్ వదిలేయాలని కూడా అనుకున్నాను. క్రికెటర్ కావడం చాలా కష్టమని, వేరే ఏదైనా వర్క్ చేసుకోమని మా అమ్మ సూచించింది. కానీ నేను మాత్రం నా ఆశయాన్ని వదులుకోలేదు. ఏదో ఒక రోజు కచ్చితంగా విజయం సాధిస్తాను అని మా అమ్మతో అన్నాను. ఆ తర్వాత నా కుటంబం కూడా సపోర్ట్ చేసింది. అందరి సహకరంతో ఇప్పుడు నా కలను నేరవేర్చుకున్నా అని 20 ఏళ్ల నిషాద్ పేర్కొన్నాడు. -
'పెళ్లి, హానీమూన్ అన్నాడు.. అందుకే అతడిని వదిలేశాము'
ఐపీఎల్-2026 మినీ వేలంలో ఆస్ట్రేలియా వికెట్ కీపర్ బ్యాటర్ జోష్ ఇంగ్లిష్‌పై కాసుల వర్షం కురిసింది. కేవలం నాలుగు మ్యాచ్‌లకు మాత్రమే అందుబాటులో ఉంటాడని తెలిసినప్పటికీ.. లక్నో సూపర్ జెయింట్స్ అతడిని రూ. 8.6 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసి అందరిని ఆశ్చర్యపరిచింది.ఇంగ్లిష్ కోసం లక్నోతో పాటు సన్‌రైజర్స్ హైదరాబాద్ కూడా తీవ్రంగా శ్రమించింది. కాగా ఇంగ్లిస్ వచ్చే ఏడాది ఏప్రిల్‌లో వివాహం చేసుకోబోతున్నాడు. ఈ కారణంగా అతను ఐపీఎల్ సీజన్ మొత్తానికి అందుబాటులో ఉండనని, కేవలం 4 మ్యాచ్‌లు మాత్రమే ఆడుతానని ముందుగానే ప్రకటించాడు. దీంతో పంజాబ్ కింగ్స్ అతడిని రిటైన్ చేసుకోకుండా వేలంలోకి విడిచిపెట్టింది.హనీమూన్ వాయిదా?అయితే ఇప్పుడు భారీ ధరకు అమ్ముడుపోవడంతో కేవలం నాలుగు మ్యాచ్‌ల ఆడాలన్న తన నిర్ణయాన్ని ఇంగ్లిష్ మార్చుకున్నట్లు తెలుస్తోంది. ఏప్రిల్ 18న వివాహం తర్వాత వెంటనే హనీమూన్‌కు వెళ్లాలనుకున్న ప్లాన్‌ను వాయిదా వేసి..నేరుగా లక్నో క్యాంప్‌లో చేరాలని అతను భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.అయినప్పటికి అతడు ఐపీఎల్ ఆరంభ మ్యాచ్‌లకు దూరమయ్యే అవకాశముంది. ఇదే విషయంపై పంజాబ్ కింగ్స్ కో-ఓనర్ నెస్ వాడియా స్పందించారు. ఇంగ్లిష్ తీరును అతడు తప్పుబట్టాడు."మేము జోష్ ఇంగ్లిష్‌ను రిటైన్ చేసుకోవాలనుకున్నాము. కానీ అతడు రిటెన్షన్ గడువు ముగియడానికి కేవలం 45 నిమిషాల ముందు తన వ్యక్తిగత కారణాల గురించి తెలియజేశాడు. తన పెళ్లి, హానీమూన్ కారణంగా కేవలం మూడు మ్యాచ్‌లకే మాత్రమే అందుబాటులో ఉంటానని చెప్పాడు. అందుకే అతడిని వదులుకోవాల్సి వచ్చింది. ఇది ఏమాత్రం ప్రొఫెషన్లిజం కాదు. కానీ నేను అతడికి శుభాకాంక్షలు తెలుపుతున్నాను. అతడు అద్భుతమైన ఆటగాడు. ఆస్ట్రేలియా తరపున కూడా మెరుగ్గా రాణిస్తున్నాడు. మరి ఇప్పుడు ఐపీఎల్లో అన్ని మ్యాచ్‌లు ఆడుతాడో లేదో చూద్దం" అని వాడియా ఓ ప్రకటనలో పేర్కొన్నారు.కాగా ఐపీఎల్-2025 మెగా వేలంలో ఇంగ్లిష్‌ను రూ. 2.60 కోట్లకు పంజాబ్ కింగ్స్ కొనుగొలు చేసింది. తన ధరకు తగ్గ న్యాయం అతడు చేశాడు. 11 మ్యాచ్‌లు ఆడి 162.57 స్ట్రైక్ రేట్‌తో 278 పరుగులు చేశాడు. అయితే ఇప్పుడు అతడు ఏకంగా రూ.8.60 కోట్లు అందుకోనున్నాడు. అంటే దాదాపు 230.77% పెరుగుదల అనే చెప్పాలి.చదవండి: ఐపీఎల్ వేలంలో అన్‌సోల్డ్.. కట్ చేస్తే! అక్కడ డబుల్ సెంచరీతో -
IPL 2026: శ్రేయస్ అయ్యర్ టీమ్‌లో కీలక చేరిక
ఐపీఎల్ 2026 (IPL 2026) సీజన్‌కు ముందు గత సీజన్ రన్నరప్ పంజాబ్ కింగ్స్ (Punjab Kings) కీలక నిర్ణయం తీసుకుంది. సునీల్ జోషి (2023-2025) స్థానంలో భారత మాజీ లెగ్ స్పిన్నర్ సాయిరాజ్ బహుతులేను (Sairaj Bahutule) కొత్త స్పిన్ బౌలింగ్ కోచ్‌గా నియమించింది. బహుతులే ఇటీవలే రాజస్థాన్ రాయల్స్ స్పిన్ బౌలింగ్ కోచ్ పదని నుంచి వైదొలిగాడు. తదుపరి సీజన్లో బహుతులే రికీ పాంటింగ్ (హెడ్ కోచ్) నేతృత్వంలోని కోచింగ్ బృందంలో చేరతాడు. ఈ టీమ్‌లో బ్రాడ్ హడ్డిన్, జేమ్స్ హోప్స్ అసిస్టెంట్ కోచ్‌లుగా ఉన్నారు. బహుతులే చేరిక శ్రేయస్ (Shreyas Iyer) బృందానికి అదనపు బలాన్ని ఇస్తుందని పంజాబ్ మేనేజ్మెంట్ భావిస్తుంది. 51 ఏళ్ల బహుతులేకు దేశవాలీ క్రికెట్లో ఘనమైన ట్రాక్ రికార్డు ఉంది. అతను బెంగాల్, కేరళ, విదర్భ, గుజరాత్ జట్లకు కోచింగ్‌ను అందించాడు. భారత యువ బౌలర్లను తీర్చిదిద్దడంలో సాయిరాజ్‌ది అందవేసిన చెయ్యిగా చెబుతారు.సాయిరాజ్ చేరికపై పంజాబ్ కింగ్స్ సీఈవో సతీష్ మీనన్ స్పందించాడు. అతని మాటల్లో.. "ముందుగా సునీల్ జోషికి కృతజ్ఞతలు. ఇప్పుడు బహుతులే చేరడం మాకు గర్వకారణం. అతని అనుభవం, వ్యూహాత్మక దృష్టి మా జట్టుకు ఎంతో ఉపయోగపడుతుంది".పంజాబ్ కింగ్స్‌తో డీల్ ఖరారయ్యాక సాయిరాజ్ కూడా స్పందించాడు. పంజాబ్ కింగ్స్‌లో చేరడం ఎంతో ఆనందంగా ఉంది. ఈ జట్టు ప్రత్యేకమైన క్రికెట్ ఆడుతుంది. యువ ప్రతిభను మెరుగుపరచడంలో నా పాత్ర కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని అన్నాడు. కాగా, పంజాబ్ కింగ్స్ గత సీజన్ ఫైనల్లో ఆర్సీబీ చేతిలో ఓటమిపాలై తృటిలో టైటిల్‌ను చేజార్చుకుంది. శ్రేయస్ అయ్యర్ గత సీజన్లోనే పంజాబ్ కింగ్స్ పగ్గాలు చేపట్టి అద్భుతంగా ముందుండి నడిపించాడు. వ్యక్తిగతంగానూ రాణించాడు. శ్రేయస్ అంతకుముందు సీజన్లో (2024) కేకేఆర్‌కు విజేతగా నిలిపిన విషయం తెలిసిందే. గత సీజన్ వేలంలో శ్రేయస్‌ను పంజాబ్ యాజమాన్యం రికార్డు ధర వెచ్చించి సొంతం చేసుకుంది.చదవండి: NZ VS ENG: సిరీస్ ఇంగ్లండ్ వశం.. ప్లేయర్ ఆఫ్ ద సిరీస్‌గా బ్రూక్ -
ఆసీస్ భారీ స్కోర్.. ఛేదనలో విశ్వరూపం ప్రదర్శించిన టీమిండియా బ్యాటర్
భారత్-ఏ, ఆస్ట్రేలియా-ఏ జట్ల (India A vs Australia A) మధ్య మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా ఇవాళ (అక్టోబర్ 5) నిర్ణయాత్మక మూడో వన్డే జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా (Australia) 49.1 ఓవర్లలో 316 పరుగుల భారీ స్కోర్ చేసి ఆలౌటైంది. కూపర్ కన్నోలీ (64), లియామ్ స్కాట్ (73), కెప్టెన్ జాక్ ఎడ్వర్డ్స్ (89) అర్ద సెంచరీలతో సత్తా చాటి ఆసీస్ భారీ స్కోర్ చేసేందుకు దోహదపడ్డారు.44 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన దశలో కన్నోలీ.. లిచ్లన్ షా (32) సాయంతో ఆసీస్ ఇన్నింగ్స్‌కు జీవం పోశాడు. ఆతర్వాత లియామ్ స్కాట్, ఎడ్వర్డ్స్ సంచలన ఇన్నింగ్స్‌లతో భారీ స్కోర్ అందించారు. స్కాట్, ఎడ్వర్డ్స్ ఏడో వికెట్‌కు 152 పరుగులు జోడించి, భారత్‌కు కఠిన సవాల్ విసిరారు.భారత బౌలర్లలో అర్షదీప్ సింగ్, హర్షిత్ రాణా చెరో 3 వికెట్లు తీయగా.. పార్ట్ టైమ్ బౌలర్ ఆయుశ్ బదోని 2, గుర్జప్నీత్ సింగ్, నిషాంత్ సంధు తలో వికెట్ దక్కించుకున్నారు.ప్రభ్‌సిమ్రన్ విశ్వరూపంఅనంతరం 317 భారీ లక్ష్య ఛేదనకు దిగిన భారత్ (Team India).. ఓపెనర్ ప్రభ్‌సిమ్రన్ సింగ్ (Prabhsimran Singh) విధ్వంసకర శతకంతో విరుచుకుపడటంతో 24 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 172 పరుగులు చేసింది. ప్రభ్‌సిమ్రన్ కేవలం 68 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో మెరుపు శతకం బాదాడు. మరో ఓపెనర్ అభిషేక్ శర్మ తన శైలికి విరుద్దంగా నిదానంగా ఆడి 25 బంతుల్లో కేవలం రెండే ఫోర్ల సాయంతో 22 పరుగులు చేసి ఔటయ్యాడు. గత వన్డేలో సత్తా చాటిన తిలక్ వర్మ (3) ఈ మ్యాచ్‌లో నిరాశపరిచాడు. ప్రస్తుతం కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (17), రియాన్ పరాగ్ (22) క్రీజ్‌లో ఉన్నారు. ఈ మ్యాచ్‌లో భారత్ గెలవాలంటే 26 ఓవర్లలో మరో 145 పరుగులు చేయాలి. చేతిలో 7 వికెట్లు ఉన్నాయి.కాగా, ఈ మ్యాచ్ మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా జరుగుతుంది. ఈ సిరీస్‌లోని తొలి రెండు మ్యాచ్‌ల్లో ఇరు జట్లు చెరో మ్యాచ్ గెలిచాయి. ఈ మ్యాచ్ గెలిచిన జట్టు సిరీస్‌ను కైవసం చేసుకుంటుంది.వన్డే సిరీస్‌కు ముందు ఇరు జట్ల మధ్య రెండు మ్యాచ్‌ల అనధికారిక టెస్ట్ సిరీస్ కూడా జరిగింది. ఆ సిరీస్‌కు భారత్ 1-0 తేడాతో కైవసం చేసుకుంది. ఈ సిరీస్‌ల కోసం ఆస్ట్రేలియా-ఏ జట్టు భారత్‌లో పర్యటిస్తుంది. చదవండి: పాకిస్తాన్‌తో మ్యాచ్.. నామమాత్రపు స్కోర్‌కే పరిమితమైన టీమిండియా -
చరిత్ర సృష్టించిన రాహుల్ చాహర్.. 166 ఏళ్ల పురాతన రికార్డు బద్దలు
భారత ఔట్ డేటెడ్ స్పిన్నర్ రాహుల్ చాహర్ (Rahul Chahar) ఇంగ్లండ్ కౌంటీ క్రికెట్లో తన తొలి మ్యాచ్‌లోనే చరిత్ర సృష్టించాడు. కౌంటీ ఛాంపియన్షిప్ 2025లో (County Championship) సర్రే (Surrey) తరఫున అరంగేట్రంలోనే 10 వికెట్లు (హ్యాంప్‌షైర్‌పై) తీసి, 1859లో నమోదైన 166 ఏళ్ల పురాతన రికార్డును బద్దలు కొట్టాడు. ఈ మ్యాచ్ చాహర్ తొలి ఇన్నింగ్స్‌లో 2, రెండో ఇన్నింగ్స్‌లో 8 వికెట్లు తీశాడు.119 ఏళ్ల సర్రే కౌంటీ చరిత్రలో తొలి మ్యాచ్‌లోనే 8 వికెట్ల ఘనత సాధించిన తొలి ప్లేయర్‌గానూ సరికొత్త చరిత్ర సృష్టించాడు. 1859లో విలియన్ ముడీ నార్త్పై తన తొలి మ్యాచ్‌లో 7 వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు. హ్యాంప్‌షైర్‌తో మ్యాచ్‌లో 118 పరుగులిచ్చి 10 వికెట్లు తీసిన చాహర్.. తన ఫస్ట్ క్లాస్ కెరీర్లో తొలిసారి 10 వికెట్ల ఘనత సాధించడంతో పాటు అత్యుత్తమ గణాంకాలను కూడా నమోదు చేశాడు.చాహర్ అద్భుత ప్రదర్శనతో చెలరేగడంతో హ్యాంప్‌షైర్‌పై సర్రే 20 పరుగుల తేడాతో గెలుపొందింది. 181 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకునే క్రమంలో చాహర్ (24-7-51-8) రెచ్చిపోయాడు. రెండు వికెట్లు మినహా హ్యాంప్‌షైర్ మొత్తాన్ని కూల్చేశాడు. ఈ మ్యాచ్‌లో చాహర్ రెండు ఇన్నింగ్స్‌ల్లో సహచర భారత ఆటగాడు వాషింగ్టన్ సుందర్‌ను ఔట్ చేయడం విశేషం. ఈ సీజన్లో సుందర్ హ్యాంప్‌షైర్‌కు ఆడుతున్నాడు.2021 టీ20 వరల్డ్ కప్‌లో చివరిసారి టీమిండియాకు ఆడిన చాహర్.. భారత్ తరఫున ఓ వన్డే, 6 టీ20లు ఆడాడు. గత కొన్నేళ్లుగా ఐపీఎల్లో రెగ్యులర్‌గా ఆడుతున్న చాహర్.. 2019, 2020 సీజన్లలో ముంబై ఇండియన్స్ టైటిల్ విన్నింగ్ జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ సహా పంజాబ్ కింగ్స్, రైజింగ్ పూణే సూపర్ జెయింట్స్‌కు ఆడిన చాహర్.. ప్రస్తుతం సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఆడుతున్నాడు. చదవండి: అనూహ్య నిర్ణయం.. కెప్టెన్‌గా ఇషాన్ కిషన్ -
కేకేఆర్‌పై శ్రేయస్ అయ్యర్ సంచలన వ్యాఖ్యలు
ఆసియా కప్ కోసం ఎంపిక చేసిన భారత జట్టులో చోటు దక్కకపోవడం, ఆతర్వాత అర్హుడైన అభిమన్యు ఈశ్వరన్ ఉన్నా ఆస్ట్రేలియా-ఏతో సిరీస్‌కు ఇండియా-ఏ కెప్టెన్‌గా ఎంపిక కావడం వంటి అంశాల ద్వారా టీమిండియా మిడిలార్డర్ ఆటగాడు శ్రేయస్ అయ్యర్ ఇటీవల వార్తల్లో నిలిచాడు.అయ్యర్‌ను ఆసియా కప్‌కు ఎంపిక చేయకపోవడంపై సోషల్‌మీడియాలో పెద్ద రచ్చే జరిగింది. తాజా ఐపీఎల్ సీజన్లో అద్భుతమైన ఫామ్‌లో ఉన్నా అయ్యర్‌ను ఎందుకు ఎంపిక చేయలేదని చాలామంది సెలెక్టర్లను నిలదీశారు. ఈ రచ్చ కొనసాగుతుండగానే శ్రేయస్‌ను ఆస్ట్రేలియా-ఏ సిరీస్‌కు భారత-ఏ కెప్టెన్‌గా నియమించడం, ఆతర్వాత అతను దులీప్ ట్రోఫీ మ్యాచ్‌లో విఫలం (2 ఇన్నింగ్స్‌ల్లో 37 పరుగులు) కావడం జరిగిపోయాయి.తాజాగా అయ్యర్ మరో అంశానికి సంబంధించి వార్తల్లోకెక్కాడు. తన మాజీ ఐపీఎల్ జట్టు కేకేఆర్‌పై సంచలన వ్యాఖ్యలు చేసి ఐపీఎల్ అభిమానులకు కావాల్సిన మసాలా అందించాడు. 2024 సీజన్లో కేకేఆర్‌ను ఛాంపియన్‌గా నిలబెట్టిన అయ్యర్.. 2025 సీజన్‌కు ముందు పంజాబ్ కింగ్స్‌కు మారాడు. వేలంలో పంజాబ్ అయ్యర్‌కు రికార్దు ధర ( ₹26.75 కోట్లు) చెల్లించి సొంతం చేసుకుంది.తాజా సీజన్లో కెప్టెన్‌గా, ఆటగాడిగా అద్బుతంగా రాణించి పంజాబ్ కింగ్స్‌ను కూడా ఫైనల్‌కు చేర్చిన అయ్యర్.. ఐపీఎల్లో విజయవంతమైన కెప్టెన్లలో ఒకడిగా కీర్తించబడుతున్నాడు. ఇంత వరకు అంతా బాగానే ఉంది. అయ్యర్ పెద్ద కారణాలేమీ లేకుండానే కేకేఆర్‌ను వీడాడని అంతా అనుకున్నారు.అయితే అయ్యర్ కేకేఆర్‌ను వీడటం వెనుక పెద్ద మతలబే ఉందని అతని తాజా వ్యాఖ్యల ద్వారా బయటపడింది. ఓ ఇంటర్వ్యూలో అయ్యర్ కేకేఆర్‌పై చాన్నాళ్లుగా మనసులో పెట్టుకున్న అసంతృప్తిని వెల్లగక్కాడు.GQ ఇంటర్వ్యూలో అయ్యర్ మాట్లాడుతూ.. నేను ఒక ఆటగాడిగా, నాయకుడిగా చాలా ఇవ్వగలను. కానీ గౌరవం లభిస్తేనే అది సాధ్యమవుతుంది. పంజాబ్ జట్టులో నాకు పూర్తి మద్దతు, నిర్ణయాల్లో భాగస్వామ్యం లభించింది. కోచ్‌లు, మేనేజ్మెంట్, ఆటగాళ్లు నా మాట వినేందుకు సిద్ధంగా ఉంటారు అంటూ కేకేఆర్‌లో తనకు గౌరవం లభించలేదన్న విషయాన్ని తేటతెల్లం చేశాడు.పంజాబ్‌లో నేను ప్రతి మీటింగ్‌లో, నిర్ణయాల్లో, స్ట్రాటజీలో భాగమయ్యాను. ఇది నాకు చాలా ఇష్టం. కేకేఆర్‌లో నేను చర్చల్లో ఉన్నా, పూర్తిగా మిక్స్‌లో లేను. నేను ఈ స్థాయికి రావడానికి చాలా కష్టపడ్డాను అంటూ కేకేఆర్‌లో తనకు పూర్తి స్వేచ్ఛ లేకుండిదన్న విషయాన్ని బయటపెట్టాడు.అయ్యర్ మాటల్ని బట్టి చూస్తే.. కేకేఆర్‌లో నాయకత్వ హక్కులపై పరిమితి, నిర్ణయాల్లో భాగస్వామ్యం లేకుండిదన్న విషయం స్పష్టంగా తెలుస్తోంది. అయ్యర్ మాటల్లో గంభీర్ కారణంగా తనకు స్వేచ్చ లేకుండా పోయిందన్న విషయం కూడా తెలుస్తుంది. శ్రేయస్ కేకేఆర్‌ను ఛాంపియన్‌గా నిలిపిన సీజన్లో గంభీర్ ఆ ఫ్రాంచైజీ మెంటార్‌గా ఉన్నాడు. కేకేఆర్‌లో గంభీర్ మాటకు తిరుగుండేది కాదు. గంభీర్ అతి జోక్యం వల్ల అయ్యర్ తప్పక ఇబ్బంది పడి ఉంటాడన్నది చాలామంది భావన. మొత్తంగా అయ్యర్ కేకేఆర్‌ను ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలు ఐపీఎల్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. -
కుంబ్లేకి చెప్పి ఏడ్చాను.. అయినా పట్టించుకోలేదు.. అతడేమో...: గేల్
వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం క్రిస్ గేల్ (Chris Gayle) ఐపీఎల్ ఫ్రాంఛైజీ పంజాబ్ కింగ్స్ (Punjab Kings) గురించి సంచలన వ్యాఖ్యలు చేశాడు. తనను అగౌరవపరిచారని.. యాజమాన్యం వ్యవహారశైలి కారణంగా తాను డిప్రెషన్లో కూరుకుపోయే పరిస్థితి తలెత్తిందని తెలిపాడు. యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ 2008లో కోల్‌కతా నైట్ రైడర్స్ తరఫున ఐపీఎల్లో అరంగేట్రం చేశాడు.2021లో ఐపీఎల్‌కు వీడ్కోలు..క్యాష్ రిచ్ లీగ్‌లో మొత్తంగా 142 మ్యాచ్‌లు ఆడిన క్రిస్ గేల్.. ఆరు శతకాల సాయంతో 4965 పరుగులు సాధించాడు. పంజాబ్ కింగ్స్ తరఫున తన చివరి మ్యాచ్ ఆడిన ఈ ఎడమచేతి వాటం బ్యాటర్.. 2021లో ఐపీఎల్‌కు వీడ్కోలు పలికాడు. పంజాబ్ ఫ్రాంఛైజీ (అప్పడు కింగ్స్ ఎలెవన్ పంజాబ్)కి 2018- 2021 వరకు ప్రాతినిథ్యం వహించిన గేల్.. మొత్తంగా ఆ జట్టు తరఫున 41 మ్యాచ్‌లు ఆడి 1304 పరుగులు చేశాడు.ఇందులో ఓ సెంచరీ, పదకొండు అర్ధ శతకాలు కూడా ఉండటం విశేషం. ఇక పంజాబ్ తరఫున గేల్ అత్యధిక వ్యక్తిగత స్కోరు 104. అయితే, జట్టు కోసం ఇంతచేసినా.. ఫ్రాంఛైజీ మాత్రం తనకు కనీస మర్యాద ఇవ్వలేదని గేల్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు.గౌరవం, మర్యాద ఇవ్వలేదు‘‘పంజాబ్ ఫ్రాంఛైజీ కారణంగా నా ఐపీఎల్ కెరీర్ ముందుగానే ముగిసిపోయింది. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టులో నన్ను అగౌరవపరిచారు. ఓ సీనియర్ ఆటగాడిగా నాకు ఇవ్వాల్సిన గౌరవం, మర్యాద ఇవ్వలేదు.జట్టుతో పాటు లీగ్‌కు కూడా విలువ తెచ్చిన నాలాంటి ఆటగాడి పట్ల అలా ఎవరూ వ్యవహరించరు. నన్నో చిన్నపిల్లాడిలా చూశారు. వారి వైఖరి వల్ల.. జీవితంలో తొలిసారి నేను డిప్రెషన్లోకి వెళ్లిపోయే పరిస్థితి వచ్చింది.కుంబ్లేకి చెప్పి ఏడ్చాను.. అయినా పట్టించుకోలేదునా మనసు బాగా గాయపడింది. ఇదే విషయాన్ని అనిల్ కుంబ్లేకు చెప్పాను. అతడితో మాట్లాడుతూ గట్టిగా ఏడ్చేశాను. కానీ అతడు కూడా నన్ను పూర్తిగా నిరాశపరిచాడు. ఫ్రాంఛైజీని యాజమాన్యం నడిపిస్తున్న తీరు నన్ను నిరాశకు గురిచేసింది.కేఎల్ రాహుల్ ఫోన్ చేసి..అప్పటి కెప్టెన్ కేఎల్ రాహుల్ నాకు ఫోన్ చేసి.. ‘క్రిస్.. నువ్వు తదుపరి మ్యాచ్ ఆడబోతున్నావు’ అని చెప్పాడు. నేను మాత్రం.. ‘మీకు ఆల్ ది బెస్ట్’ అని చెప్పేసి బ్యాగ్ సర్దేసుకున్నాను. ఫ్రాంఛైజీ నుంచి బయటకు వచ్చేశాను’’ అని శుభంకర్ మిశ్రా పాడ్‌కాస్ట్‌లో గేల్ తనకు ఎదురైన చేదు అనుభవాల గురించి వెల్లడించాడు.కాగా కేకేఆర్, పంజాబ్ జట్లతో పాటు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు కూడా గేల్ ప్రాతినిథ్యం వహించాడు. ఇటీవల ఫైనల్లో పంజాబ్ కింగ్స్‌ను ఓడించి ఆర్సీబీ ట్రోఫీ గెలిచినప్పుడు విరాట్ కోహ్లి, ఏబీ డివిలియర్స్‌తో కలిసి మైదానమంతా కలియదిరుగుతూ సందడి చేశాడు. ఇదిలా ఉంటే.. పంజాబ్‌పైన గేల్ 16 ఇన్నింగ్స్ ఆడి 797 పరుగులు చేయడం గమనార్హం.చదవండి: సెలెక్టర్లకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన పాకిస్తాన్ కెప్టెన్ -
పంజాబ్ కింగ్స్ ఆటగాడి విధ్వంసం.. 10 సిక్సర్లతో వీరంగం
కేరళ టీ20 లీగ్‌లో నిన్న (ఆగస్ట్ 24) రసవత్తర మ్యాచ్ జరిగింది. ఏరీస్ కొల్లమ్ సైలర్స్, కొచ్చి బ్లూ టైగర్స్ మధ్య జరిగిన ఈ మ్యాచ్ ప్రేక్షకులకు అసలుసిసలు టీ20 మజాను అందించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సైలర్స్ 236 పరుగుల భారీ స్కోర్ చేయగా.. టైగర్స్ చివరి బంతికి లక్ష్యాన్ని ఛేదించి అద్బుత విజయం సొంతం చేసుకుంది.టీమిండియా ఆటగాడు సంజూ శాంసన్ విధ్వంసకర శతకంతో (51 బంతుల్లో 121; 14 ఫోర్లు, 7 సిక్సర్లు) టైగర్స్‌ను విజయతీరాలకు చేర్చగా.. ఆషిక్ అనే ఆటగాడు ఆఖరి బంతికి సిక్సర్ బాది తన జట్టును గెలిపించాడు.ఈ మ్యాచ్‌కు సంబంధించి అందరూ సంజూ శాంసన్, అషిక్ హీరోయిక్స్ గురించే మాట్లాడుకుంటున్నారు. సోషల్‌మీడియా మొత్తం సంజూ నామస్మరణతో మార్మోగిపోతుంది.అయితే సంజూ విధ్వంసకర శతకం నీడలో కొల్లమ్ సైలర్స్ ఆటగాడు, పంజాబ్ కింగ్స్ వికెట్‌కీపర్ బ్యాటర్ విష్ణు వినోద్ సుడిగాలి ఇన్నింగ్స్ మరుగున పడింది. ఈ మ్యాచ్‌లో కొల్లమ్ సైలర్స్ అంత భారీ స్కోర్ చేయడంలో విష్ణు వినోద్ కీలకపాత్రధారి.వినోద్ 41 బంతుల్లో 10 భారీ సిక్సర్లు, 3 బౌండరీల సాయంతో 94 పరుగులు చేశాడు. వినోద్ సిక్సర్ల సునామీ ధాటికి గ్రీన్ ఫీల్డ్ స్టేడియం తడిసి ముద్దైంది. వినోద్ 229.28 స్ట్రయిక్‌రేట్‌తో మెరుపులు మెరిపించాడు. శతకానికి మరో సిక్సర్ దూరంలో ఔటయ్యాడు.వినోద్‌కు అతని కెప్టెన్ సచిన్ బేబి కూడా జతకలిశాడు. సచిన్ బేబి కూడా ఇంచుమించు విష్ణు తరహాలోనే విధ్వంసం సృష్టించాడు. 44 బంతుల్లో 6 సిక్సర్లు, 6 బౌండరీల సాయంతో 91 పరుగులు చేశాడు.ఈ మ్యాచ్‌లో సైలర్స్ ఓడినా విష్ణు వినోద్ భారత టీ20 సారధి సూర్యకుమార్ యాదవ్‌ను గుర్తు చేశాడు. విష్ణు అచ్చం స్కై లాగే 360 డిగ్రీస్‌లో షాట్లు ఆడి అలరించాడు. గత ఐపీఎల్ సీజన్లో విష్ణును పంజాబ్ కింగ్స్ ఎంపిక చేసుకున్నప్పటీకీ అతనికి ఒక్క అవకాశం కూడా రాలేదు. విష్ణు 2017, 2023 ఐపీఎల్ సీజన్లలో ఆర్సీబీ, ముంబై ఇండియన్స్ తరఫున అవకాశాలు దక్కించుకున్నా పెద్దగా రాణించలేకపోయాడు.తాజా ప్రదర్శనతో విష్ణు ఐపీఎల్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్ అయ్యాడు. ఒకవేళ పంజాబ్ విష్ణును వేలానికి వదిలేస్తే అతడికి మంచి గిరాకీ ఉండవచ్చు. కొన్ని ఫ్రాంచైజీలు స్థానిక విధ్వంసకర వికెట్‌కీపర్ బ్యాటర్ కోసం అన్వేషిస్తున్నాయి. ఈ పాత్రకు విష్ణు లాంటి టాలెంటెడ్ బ్యాటర్ న్యాయం చేయవచ్చు. -
ప్రీతి జింటా జట్టుకు కొత్త కెప్టెన్
కరీబియన్ ప్రీమియర్ లీగ్-2025 సీజన్ ప్రారంభానికి ముందు సెయింట్ లూసియా కింగ్స్ కొత్త కెప్టెన్‌ను ఎంపిక చేసుకుంది. గత సీజన్లో కింగ్స్‌ను ఛాంపియన్‌గా నిలిపిన ఫాఫ్ డుప్లెసిస్ వ్యక్తిగత కారణాలతో ఈ సీజన్ నుంచి తప్పుకున్నాడు. దీంతో కింగ్స్ మేనేజ్మెంట్ నమీబియా వెటరన్ ఆల్‌రౌండర్ డేవిడ్ వీస్‌ను కొత్త కెప్టెన్‌గా ప్రకటించింది. వీస్ 2021 ఎడిషన్ నుంచి కింగ్స్‌లో సభ్యుడిగా ఉన్నాడు. అతను ఈ ఫ్రాంచైజీ తరఫున 26 మ్యాచ్‌ల్లో 36 వికెట్లు తీసి, 338 పరుగులు చేశాడు.ఈ సీజన్‌కు ముందు కింగ్స్ టిమ్ డేవిడ్, తబ్రేజ్ షంషి లాంటి స్టార్ ప్లేయర్లను రీటైన్ చేసుకుంది. అలాగే మీకా మెకెంజీ, జావెల్ గ్లెన్ లాంటి కొత్త ముఖాలను జట్టులో చేర్చుకుంది. గత సీజన్ ఫైనల్లో కింగ్స్ నాటి డిఫెండింగ్ ఛాంపియన్ గయనా అమెజాన్ వారియర్స్‌ను మట్టికరిపించి ఛాంపియన్‌గా అవతరించింది.ఈ సీజన్ సీపీఎల్ ఆగస్ట్ 14 నుంచి ప్రారంభం కానుంది. లూసియా కింగ్స్ ఆగస్ట్ 17న తమ తొలి మ్యాచ్ ఆడనుంది. ఆ మ్యాచ్‌లో కింగ్స్ ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్‌తో తలపడనుంది.కాగా, సెయింట్ లూసియా కింగ్స్ ఐపీఎల్ ఫ్రాంచైజీ అయిన పంజాబ్ కింగ్స్ యాజమాన్యం అండర్లో నడుస్తుంది. లూసియా కింగ్స్‌కు బాలీవుడ్ నటి ప్రీతి జింటా సహ యజమానిగా వ్యవహరిస్తుంది.సెయింట్ లూసియా కింగ్స్ స్క్వాడ్ : టిమ్ డేవిడ్, అల్జరి జోసఫ్, జాన్సన్ చార్లెస్, టిమ్ సీఫెర్ట్, రోస్టన్ చేజ్, తబ్రైజ్ షంషి, డేవిడ్ వీస్ (కెప్టెన్), డెలానో పోట్గీటర్, మాథ్యూ ఫోర్డ్, ఆరోన్ జోన్స్, ఖారీ పియరీ, జావెల్లె గ్లెన్, మికా మెకెంజీ, షడ్రక్ డెస్కార్టే, జోహన్ జెరెమియా, కియోన్ గాస్టన్, అకీమ్ అగస్టే -
అమ్మ చేతిలో శ్రేయస్ అయ్యర్ క్లీన్ బౌల్డ్.. వీడియో వైరల్
ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌కు టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్, పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఎంపిక కాకపోయిన సంగతి తెలిసిందే. దీంతో అయ్యర్ తనకు లభించిన ఈ ఖాళీ సమయాన్ని కుటుంబానికి కేటాయించాడు. ప్రస్తుతం ఇంట్లోనే ఉన్న శ్రేయస్ తన ఫ్యామిలీతో సరదగా గడుపుతున్నాడు. తాజాగా శ్రేయస్ అయ్యర్ తన ఇంట్లో తల్లితో కలిసి క్రికెట్ ఆడాడు. అయ్యర్ బ్యాటింగ్ చేయగా.. అతడి తల్లి బౌలింగ్ చేసింది. అయితే ఆమె విసిరిన ఓ బంతిని శ్రేయస్ కొట్టలేకపోయాడు. దీంతో ఆమె అయ్యర్‌ను క్లీన్ బౌల్డ్ చేసినట్లు సెలబ్రేషన్స్ చేసుకుంది. ఈ వీడియోను పంజాబ్ కింగ్స్ ఎక్స్‌లో షేర్ చేసింది.మా సర్పాంచ్ సాబ్ ఇప్పుడు మాత్రం బౌల్డ్ అయినా పట్టించుకోడని పంజాబ్ క్యాప్షన్‌గా జోడించింది. ప్రస్తుతం ఈ వీడియో సొషల్ మీడియాలో వైరలవుతోంది. కాగా ఐపీఎల్-2025 సీజన్లో పంజాబ్ కింగ్స్‌ను అయ్యర్ రన్నరప్‌గా నిలిచాడు.అద్బుతమైన ప్రదర్శనలతో ఫైనల్ చేరినప్పటికి.. తుది మెట్టుపై ఆర్సీబీ చేతిలో పంజాబ్ బోల్తా పడింది. ప్రస్తుతం క్రికెట్ దూరంగా ఉన్న అయ్యర్ వచ్చే నెలలో బంగ్లాదేశ్‌తో జరిగే వన్డే సిరీస్‌కు తిరిగి జట్టులోకి వచ్చే అవకాశముంది.చదవండి: ఇంగ్లండ్‌కు టీమిండియా స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వాలి.. లేదంటే కష్టమే: రవిశాస్త్రిOnly time SARPANCH won't mind getting bowled! 😂♥️ pic.twitter.com/jYUDd7DkD7— Punjab Kings (@PunjabKingsIPL) June 30, 2025 -
పంజాబ్ కింగ్స్ బ్యాటర్ విధ్వంసం.. చరిత్ర సృష్టించిన మ్యాక్స్‌వెల్ సేన
మేజర్ లీగ్ క్రికెట్ 2025 ఎడిషన్‌లో భాగంగా టెక్సాస్ కింగ్స్‌తో ఇవాళ (జూన్ 23) జరిగిన మ్యాచ్‌లో వాషింగ్టన్ ఫ్రీడం ఆటగాడు, పంజాబ్ కింగ్స్ ఆల్‌రౌండర్ మిచెల్ ఓవెన్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. తొలుత బౌలింగ్‌లో (3-0-33-3) రెచ్చిపోయిన ఓవెన్.. ఆతర్వాత బ్యాటింగ్‌లో విధ్వంసం సృష్టించాడు (52 బంతుల్లో 89; 8 ఫోర్లు, 5 సిక్సర్లు). ఫలితంగా ఓవెన్ ప్రాతినిథ్యం వహించిన వాషింగ్టన్ ఫ్రీడం మేజర్ లీగ్ క్రికెట్ చరిత్రలోనే అతి భారీ లక్ష్య ఛేదనను (223/3) నమోదు చేసింది. ఈ మ్యాచ్‌లో ఓవెన్ ఆండ్రియస్ గౌస్‌తో (45 బంతుల్లో 80 నాటౌట్; 6 ఫోర్లు, 4 సిక్సర్లు) కలిసి రెండో వికెట్‌కు 121 పరుగుల మ్యాచ్ విన్నింగ్ భాగస్వామ్యాన్ని నమోదు చేశాడు. ఓవెన్, గౌస్ కలిసి వాషింగ్టన్ ఫ్రీడంకు చారిత్రక విజయాన్ని అందించారు.పూర్తి వివరాల్లోకి వెళితే.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టెక్సాస్ సూపర్ కింగ్స్.. ఫాఫ్ డుప్లెసిస్ (31 బంతుల్లో 69; 8 ఫోర్లు, 4 సిక్సర్లు) అర్ద సెంచరీతో చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 220 పరుగులు చేసింది. సూపర్ కింగ్స్ ఇన్నింగ్స్‌లో స్టోయినిస్ (32), మిలింద్ కుమార్ (31), షుభమ్ రంజనే (26 నాటౌట్), స్మిత్ పటేల్ (24) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. సాయితేజ ముక్కామల (6), డొనోవన్ ఫెరియెరా (9) విఫలమయ్యారు. వాషింగ్టన్ బౌలర్లలో మిచెల్ ఓవెన్ 3, మ్యాక్స్‌వెల్ 2, రచిన్ రవీంద్ర ఓ వికెట్ పడగొట్టారు.అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన వాషింగ్టన్.. ఓవెన్, గౌస్ చెలరేగిపోవడంతో 19.4 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. వాషింగ్టన్ ఇన్నింగ్స్‌లో రచిన్ రవీంద్ర 11, మ్యాక్స్‌వెల్ 20 పరుగులు చేసి ఔట్ కాగా.. గౌస్‌తో కలిసి గ్లెన్ ఫిలిప్స్ (4 బంతుల్లో 12 నాటౌట్) వాషింగ్టన్‌ను విజయతీరాలకు చేర్చాడు. వాషింగ్టన్ కోల్పోయిన మూడు వికెట్లు ఆడమ్ మిల్నే ఖాతాలో పడ్డాయి. ఈ మ్యాచ్‌కు ముందు ఎంఎల్‌సీలో అత్యధిక లక్ష్య ఛేదన రికార్డు నికోలస్ పూరన్ నేతృత్వంలోని ఎంఐ న్యూయార్క్ పేరిట ఉండింది. ఇదే సీజన్లో ఆ జట్టు సియాటిల్ ఓర్కాస్‌పై 201 పరుగుల లక్ష్యాన్ని విజయవంతంగా ఛేదించింది (7 వికెట్లు కోల్పోయి). ఈ మ్యాచ్‌కు ముందు వరకు ఎంఎల్‌సీలో ఇదే భారీ లక్ష్య ఛేదనగా ఉండింది. -
ఎంత మోసమయ్యా మ్యాక్స్‌వెల్.. ఐపీఎల్‌లోనేమో అలా, ఎంఎల్‌సీలో ఇలా..!
మేజర్ లీగ్ క్రికెట్లో భాగంగా నిన్న (జూన్ 18) జరిగిన మ్యాచ్‌లో ఆసీస్ విధ్వంసకర ఆటగాడు గ్లెన్ మ్యాక్స్‌వెల్ సుడిగాలి శతకంతో (49 బంతుల్లో 13 సిక్సర్లు, 2 ఫోర్ల సాయంతో అజేయమైన 106 పరుగులు) విరుచుకుపడ్డాడు. ఈ లీగ్‌లో వాషింగ్టన్ ఫ్రీడంకు సారథ్యం వహిస్తున్న మ్యాక్సీ.. లాస్ ఏంజెలెస్ నైట్‌రైడర్స్‌తో నిన్న జరిగిన మ్యాచ్‌లో తన బ్యాటింగ్ విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. ఈ మ్యాచ్‌లో మ్యాక్సీ తన జట్టును ఒంటిచేత్తో గెలిపించాడు.ఈ ఇన్నింగ్స్ అనంతరం మ్యాక్సీ ఆటతీరుపై వాషింగ్టన్ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తుండగా.. భారత క్రికెట్ అభిమానులకు మాత్రం రగిలిపోతున్నారు. మ్యాక్స్‌వెల్ తన సొంత దేశానికి (ఆస్ట్రేలియా) ఆడేటప్పుడు కాని, ఇతరత్రా లీగ్‌ల్లో ఆడేటప్పుడు కాని చెలరేగిపోతాడు. ఐపీఎల్‌కు వచ్చే సరికి మాత్రం తేలిపోతాడని మండిపడుతున్నారు. మ్యాక్స్‌వెల్ ఐపీఎల్ ప్రదర్శనలను, ఇతర మ్యాచ్‌ల్లో ప్రదర్శనలతో పోలుస్తూ దుమ్మెత్తిపోస్తున్నారు. మ్యాక్స్‌వెల్ ఐపీఎల్లో లభించే భారీ మొత్తాన్ని దిగమింగుతూ, తనలోని అత్యుత్తమ ప్రదర్శనలను మాత్రం ఇతర లీగ్‌ల్లో ఇస్తాడంటూ చీవాట్లు పెడుతున్నారు. మ్యాక్సీ ఓ మోసగాడంటూ తీవ్రమైన పదజాలాన్ని ఉపయోగిస్తున్నారు. మ్యాక్స్‌వెల్‌ను ఐపీఎల్ 2025లో పంజాబ్ కింగ్స్ రూ. 4.2 కోట్ల భారీ మొత్తం వెచ్చించి కొనుగోలు చేసింది. అయితే ఈ మొత్తంలో కనిపించే సంఖ్యలకు సరిపడా పరుగులు కూడా చేయలేకపోయాడతను. మ్యాక్సీ తాజాగా ముగిసిన ఐపీఎల్ సీజన్లో 5 మ్యాచ్‌లు ఆడి కేవలం 48 పరుగులు మాత్రమే చేశాడు. అదే మేజర్ లీగ్ క్రికెట్ విషయానికొస్తే.. ఈ అమెరికన్ లీగ్‌లో అతను ఇప్పటివరకు ఆడిన 3 ఇన్నింగ్స్‌ల్లోనే సెంచరీ సాయంతో 204 స్ట్రయిక్‌రేట్‌తో 149 పరుగులు చేశాడు. ఈ వ్యత్యాసాన్ని చూపించే భారత క్రికెట్ అభిమానులు మ్యాక్స్‌వెల్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.వాస్తవానికి భారత క్రికెట్ అభిమానులు మ్యాక్సీ ఆటతీరుపై గత రెండేళ్లుగా గుర్రుగానే ఉన్నారు. 2024 ఐపీఎల్ సీజన్లో మ్యాక్సీ ఆర్సీబీకి ఆడుతూ 10 మ్యాచ్‌ల్లో 52 పరుగులు మాత్రమే చేశాడు. ఆ సీజన్లోనే భారత అభిమానులు అతనిపై తీవ్రస్థాయి ఆగ్రహ అందోళనలు వ్యక్తం చేశారు. ఆ సీజన్లో ఆర్సీబీ అతనికి రికార్డు స్థాయిలో రూ. 11 కోట్ల మొత్తం చెల్లించింది. ఇంత డబ్బు తీసుకొని కనీస న్యాయం చేయకపోవడం అతనికి కూడా ధర్మం కాదు. మ్యాక్సీ ఐపీఎల్లో ఆడేటప్పుడు చాలా ఉదాసీనంగా కనిపిస్తాడు. ఏదో హాలిడే ఎంజాయ్ చేసేందుకు వచ్చానన్నట్లు ఫీలవుతాడు. వరుస అవకాశాలు ఇచ్చినా సక్సెస్ కాకపోతే గాయం పేరు చెప్పి మధ్యలోనే ఇంటికి చెక్కేస్తాడు. గత రెండు ఐపీఎల్ సీజన్లలో ఇదే జరిగింది. -
శ్రేయస్ అయ్యర్‌కు మరో చేదు అనుభవం
కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్‌కు ఒకే నెలలో వరుసగా రెండు చేదు అనుభవాలు ఎదురయ్యాయి. జూన్ 3న అతని సారథ్యంలోని పంజాబ్ కింగ్స్ ఐపీఎల్ 2025 ఫైనల్లో ఆర్సీబీ చేతిలో పరాజయం పాలైంది. పది రోజులు తిరక్కుండానే జూన్ 12న అతని కెప్టెన్సీలోని మరో జట్టు ఫైనల్లో ఓటమిని ఎదుర్కొంది.నిన్న జరిగిన ముంబై టీ20 లీగ్ ఫైనల్లో శ్రేయస్ నేతృత్వం వహించిన సోబో ముంబై ఫాల్కన్స్.. ముంబై సౌత్ సెంట్రల్ మరాఠా రాయల్స్ చేతిలో 5 వికెట్ల తేడాతో పరాజయంపాలైంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రేయస్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేయగా.. ప్రత్యర్ధి టీమ్ మరో నాలుగు బంతులు మిగిలుండగానే 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.ఈ మ్యాచ్‌లో శ్రేయస్ ఆటగాడిగానూ విఫలమయ్యాడు. 17 బంతులు ఆడి బౌండరీలు, సిక్సర్లు లేకుండా 12 పరుగులు మాత్రమే చేశాడు. అతని జట్టులో మయూరేశ్ తండేల్ (50) అజేయ అర్ద సెంచరీతో రాణించగా.. హర్ష్ గర్వ్ (28 బంతుల్లో 45 నాటౌట్; ఫోర్, 4 సిక్సర్లు) ఆఖర్లో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. అంగ్క్రిష్ రఘువంశీ 7, ఇషాన్ ముల్చందని 20, అమోఘ్ భత్కల్ 16 పరుగులు చేశారు. రాయల్స్ బౌలర్లలో వైభవ్ మాలీ 2, ఆదిత్య ధుమాల్, మ్యాక్స్‌వెల్ స్వామినాథన్ తలో వికెట్ పడగొట్టారు.రాయల్స్ ఇన్నింగ్స్‌లో చిన్మయ్ రాజేశ్ సుతార్ (53) అర్ద సెంచరీతో రాణించగా.. అవైస్ ఖాన్ నౌషద్ 38, సాహిల్ భగవంతా జాదవ్ 22, సిద్దేశ్ లాడ్ 15, సచిన్ యాదవ్ 19, రోహన్ రాజే 8 (నాటౌట్) పరుగులు చేశారు. శ్రేయస్ జట్టు బౌలర్లలో కార్తీక్ మిశ్రా, యశ్ దిచోల్కర్ తలో రెండు వికెట్లు తీశారు. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా చిన్మయ్ రాజేశ్ సుతార్ ఎంపిక కాగా.. ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డును సాయిరాజ్ పాటిల్ గెలుచుకున్నాడు. కెప్టెన్‌గా శ్రేయస్ రికార్డుఐపీఎల్ 2024లో కేకేఆర్‌ను విజేతగా నిలిపాడు2024లో ముంబైకి సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ అందించాడుఐపీఎల్ 2019లో ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఫైనల్స్‌కు చేర్చాడు (రన్నరప్)ఐపీఎల్ 2024లో పంజాబ్ కింగ్స్‌ను ఫైనల్స్‌కు చేర్చాడు (రన్నరప్)ముంబై టీ20 లీగ్ 2025లో సోబో ముంబై ఫాల్కన్స్‌ను ఫైనల్స్‌కు చేర్చాడు (రన్నరప్) -
పది రోజులు తిరక్కుండానే మరో జట్టును ఫైనల్‌కు చేర్చిన శ్రేయస్ అయ్యర్
టీమిండియా స్టార్ క్రికెటర్ శ్రేయస్ అయ్యర్‌కు తాను కెప్టెన్సీ వహించే జట్లను అలవోకగా ఫైనల్‌కు చేర్చడం అలవాటుగా మారింది. జూన్ 1న ఐపీఎల్ 2025లో పంజాబ్ కింగ్స్‌ను ఫైనల్స్‌కు చేర్చిన శ్రేయస్.. పది రోజులు కూడా తిరక్కుండానే మరో జట్టును ఫైనల్‌కు చేర్చాడు. ముంబై టీ20 లీగ్ 2025లో నిన్న (జూన్ 10) జరిగిన రెండో సెమీఫైనల్లో శ్రేయస్ సారథ్యం వహించిన సోబో ముంబై ఫాల్కన్స్ నమో బాంద్రా బ్లాస్టర్స్‌ను మట్టికరిపించి ఫైనల్‌కు చేరింది.ఏడాది కాలంలో శ్రేయస్ తాను సారథ్యం వహించిన జట్లను ఫైనల్స్‌కు చేర్చడం ఇది నాలుగో సారి. 2024 ఐపీఎల్‌తో మొదలైన శ్రేయస్ కెప్టెన్సీ జైత్రయాత్ర ప్రస్తుతం జరుగుతున్న ముంబై టీ20 లీగ్ వరకు కొనసాగింది. 2024 ఐపీఎల్లో కేకేఆర్‌ను ఛాంపియన్‌గా నిలిపిన శ్రేయస్.. ఆతర్వాత ముంబైకు సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీని అందించాడు. తాజాగా ముగిసిన ఐపీఎల్ సీజన్లో పంజాబ్‌ను ఫైనల్స్‌కు చేర్చిన శ్రేయస్ తృటిలో టైటిల్ మిస్ కావడంతో రన్నరప్‌తో సరిపెట్టుకున్నాడు. ఈ ఐపీఎల్ సీజన్లోనే పంజాబ్ కింగ్స్ సారథ్య బాధ్యతలు చేపట్టిన శ్రేయస్ ఆ జట్టును 11 ఏళ్ల తర్వాత ఫైనల్‌కు చేర్చాడు.శ్రేయస్ తన జట్లను ఫైనల్స్‌కు చేర్చిన గత నాలుగు సందర్భాల్లో వ్యక్తిగతంగానూ రాణించాడు. ఐపీఎల్ 2024లో కేకేఆర్‌ను ఛాంపియన్‌గా నిలిపిన సందర్భంలో 15 మ్యాచ్‌ల్లో 39 సగటున, 146.86 స్ట్రయిక్‌రేట్‌తో 2 హాఫ్ సెంచరీల సాయంతో 351 పరుగులు చేశాడు.అనంతరం ముంబైకు ముస్తాక్ అలీ ట్రోఫీ అందించిన సందర్భంలో 188.52 స్ట్రయిక్‌రేట్‌తో 345 పరుగులు సాధించాడు. తాజాగా ముగిసిన ఐపీఎల్ 2025 సీజన్లో 175.07 స్ట్రయిక్‌రేట్‌తో 604 పరుగులు సాధించాడు. ముంబై టీ20 లీగ్‌లోకి ఆలస్యంగా అడుగుపెట్టిన శ్రేయస్ ఈ లీగ్‌లో ఫామ్‌ను ప్రదర్శించాల్సి ఉంది.చరిత్ర సృష్టించాడుతాజాగా ముగిసిన ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్‌ను ఫైనల్స్‌కు చేర్చడం ద్వారా శ్రేయస్ అయ్యర్ చరిత్ర సృష్టించాడు. 18 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో మూడు వేర్వేరు జట్లను ఫైనల్స్‌కు చేర్చిన తొలి కెప్టెన్‌గా రికార్డు నెలకొల్పాడు. శ్రేయస్ తన సారథ్యంలో 2019లో ఢిల్లీని, 2024లో కేకేఆర్‌ను, 2025లో పంజాబ్‌ను ఫైనల్స్‌కు చేర్చాడు.ముంబై టీ20 లీగ్ సెమీఫైనల్ విషయానికొస్తే.. నిన్న జరిగిన మ్యాచ్‌లో శ్రేయస్ సారథ్యంలోని సోబో ముంబై ఫాల్కన్స్ నమో బాంద్రా బ్లాస్టర్స్‌పై 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బ్లాస్టర్స్ 130 పరుగులకు ఆలౌట్ కాగా.. శ్రేయస్ జట్టు 14.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. ఈ మ్యాచ్‌లో శ్రేయస్ వ్యక్తిగతంగా రాణించనప్పటికీ (1) తన జట్టును విజయవంతంగా ఫైనల్స్‌కు చేర్చాడు. రేపు జరుగబోయే ఫైనల్స్‌లో శ్రేయస్ జట్టు సిద్దేశ్ లాడ్ నేతృత్వంలోని ముంబై సౌత్ సెంట్రల్ మరాఠా రాయల్స్‌తో అమీతుమీ తేల్చుకుంటుంది. శ్రేయస్ ఈ టైటిల్‌ను కూడా సాధిస్తే కెప్టెన్‌గా అతనికి తిరుగే ఉండదు. -
IPL 2025: 'ఈ లెక్కన' పంజాబ్‌దే టైటిల్.. రన్నరప్ ముంబై ఇండియన్స్..!
తాజాగా ముగిసిన ఐపీఎల్ 2025 సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఛాంపియన్‌గా అవతరించింది. ఫైనల్లో ఆ జట్టు పంజాబ్ కింగ్స్‌పై 6 పరుగుల స్వల్ప తేడాతో గెలుపొంది, 18 ఏళ్ల ఐపీఎల్ ప్రస్తానంలో తొలి టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఈ సీజన్లో ఆర్సీబీ, పంజాబ్ ఆది నుంచి పోటాపోటీ పడుతూ ఫైనల్ వరకు చేరాయి. ఇరు జట్లు పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో నిలిచి ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించాయి. అయితే తుది సమరంలో ఆర్సీబీ అనుభవం ముందు పంజాబ్ తలవంచక తప్పలేదు.ఈ సీజన్లో ఆర్సీబీ టైటిల్ గెలిచినప్పటికీ.. ఓ రకంగా చూస్తే పంజాబ్‌దే విజయం అని చెప్పవచ్చు. అదెలా అనుకుంటున్నారా..? ఈ సీజన్లో అత్యధిక పరుగులు (అన్ని మ్యాచ్‌ల్లో) చేసిన జట్టుగా పంజాబ్ నిలిచింది. ఈ జట్టు ఈ సీజన్ మొత్తంలో 3000 పరుగులు చేసింది. ఐపీఎల్ చరిత్రలో ఓ జట్టు ఓ సీజన్లో 3000 పరుగుల మార్కును తాకడం ఇదే మొదటిసారి.ఈ సీజన్లో పంజాబ్ తర్వాత అత్యధిక పరుగులు చేసిన జట్టు ముంబై ఇండియన్స్. ఈ సీజన్లో ఆ జట్టు 2802 పరుగులు చేసింది. పంజాబ్, ముంబై తర్వాత గుజరాత్ (2766), లక్నో (2598), ఆర్సీబీ2539), రాజస్థాన్ (2496),ఢిల్లీ (2386), సన్‌రైజర్స్ (2378), సీఎస్కే (2315), కేకేఆర్ (1886) అత్యధిక పరుగులు చేసిన జట్ల జాబితాలో వరుస స్థానాల్లో ఉన్నాయి. పరుగుల సంఖ్య ప్రకారం చూస్తే.. అత్యధిక పరగులు చేసిన పంజాబ్‌ను విజేత అనుకోవచ్చు. పంజాబ్ తర్వాతి స్థానంలో ఉన్న ముంబై ఇండియన్స్‌ను రన్నరప్‌గా చెప్పుకోవచ్చు.ఈ లెక్క చూసిన తర్వాత ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. గత మూడు సీజన్లలో అత్యధిక పరుగులు చేసిన జట్లు రన్నరప్‌తోనే సరిపెట్టుకున్నాయి. 2023 సీజన్లో గుజరాత్ (2906) అత్యధిక పరుగులు చేయగా.. ఆ సీజన్ ఫైనల్లో ఆ జట్టు సీఎస్కే చేతిలో ఓటమిపాలై రన్నరప్‌తో సరిపెట్టుకుంది. 2024 సీజన్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (2906) అత్యధిక పరుగులు చేయగా.. ఫైనల్లో ఆ జట్టు కేకేఆర్ చేతిలో ఓటమిపాలై రన్నరప్‌గా నిలిచింది. ఈ సీజన్లో ఇదే సెంటిమెంట్ రిపీటైంది.ఫోర్లలో ముంబై ఇండియన్స్, సిక్సర్లలో పంజాబ్ఈ సీజన్ మొత్తంలో అత్యధిక బౌండరీలు బాదిన జట్టుగా ముంబై ఇండియన్స్ నిలువగా.. అత్యధిక సిక్సర్లు కొట్టిన జట్టుగా పంజాబ్ కింగ్స్ నిలిచింది. ముంబై ఇండియన్స్ ఈ సీజన్లో అన్ని జట్లకంటే ఎక్కువగా 259 బౌండరీలు బాదగా.. పంజాబ్ అన్ని జట్లకంటే ఎక్కువగా 173 సిక్సర్లు కొట్టింది.ఈ సీజన్లో అత్యధిక ఫోర్లు కొట్టిన జట్లు..ముంబై ఇండియన్స్- 259గుజరాత్- 256పంజాబ్- 255ఆర్సీబీ- 238ఢిల్లీ- 219సన్‌రైజర్స్- 219లక్నో- 218రాజస్థాన్- 209సీఎస్కే- 199కేకేఆర్- 173ఈ సీజన్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన జట్లు..పంజాబ్- 173లక్నో- 152రాజస్థాన్- 146ముంబై ఇండియన్స్- 142ఆర్సీబీ- 125గుజరాత్- 124సన్‌రైజర్స్- 120ఢిల్లీ- 109సీఎస్కే- 102కేకేఆర్- 101 -
దారుణంగా విఫలమైన పంజాబ్ కింగ్స్ బ్యాటర్
తాజాగా ముగిసిన ఐపీఎల్ 2025 సీజన్లో పంజాబ్ కింగ్స్‌కు ప్రాతినిథ్యం వహించిన ముషీర్ ఖాన్.. ప్రస్తుతం జరుగుతున్న ముంబై టీ20 లీగ్‌లో దారుణంగా విఫలమవుతున్నారు. ఐపీఎల్ తర్వాత మొదలైన ఈ లీగ్‌లో ఇప్పటివరకు 5 ఇన్నింగ్స్‌లు ఆడిన ముషీర్ 16.50 సగటున కేవలం 66 పరుగులే చేశాడు. ముంబై టీ20 లీగ్‌లో అంధేరికి ప్రాతినిథ్యం వహిస్తున్న ముషీర్.. ఇవాళ (జూన్ 8) థానే స్ట్రయికర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఓపెనర్‌గా బరిలోకి దిగి 7 బంతుల్లో 4 పరగులు మాత్రమే చేసి ఔటయ్యారు. ఐపీఎల్ 2025 ఒకే ఒక మ్యాచ్ ఆడిన ముషీర్.. ఆ మ్యాచ్‌లో (ఆర్సీబీ) డకౌటయ్యాడు. అయితే ఆ మ్యాచ్‌లో ముషీర్ బంతితో ఆకట్టుకున్నాడు. 2 ఓవర్లలో 27 పరుగులిచ్చి ఓ వికెట్ తీశాడు.20 ఏళ్ల ముషీర్ ఖాన్‌పై ముంబై టీ20 లీగ్‌లో భారీ అంచనాలు ఉండేవి. అయితే అతను 5 ఇన్నింగ్స్‌ల్లో ఏమాత్రం ప్రభావం చూపలేకపోయాడు. టీమిండియా బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ సోదరుడైన ముషీర్‌కు ఫస్ట్ క్లాస్ క్రికెట్లో మంచి ట్రాక్ రికార్డు ఉంది. ఈ ఫార్మాట్లో అతను 9 మ్యాచ్‌లు ఆడి 3 సెంచరీలు, ఓ హాఫ్ సెంచరీ సాయంతో 51.14 సగటున 716 పరుగులు చేశాడు.మ్యాచ్ విషయానికొస్తే.. థానే స్ట్రయికర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన అంధేరి నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 134 పరుగులు చేసింది. ఓపెనర్‌గా వచ్చిన ముషీర్ ఖాన్ విఫలం కాగా.. మరో ఓపెనర్ హర్వాద్కర్ 40 పరుగులతో రాణించాడు. హర్కాద్కర్.. వన్‌డౌన్‌లో వచ్చిన ప్రసాద్ పవార్‌తో (57) కలిసి జట్టుకు గౌరవప్రదమైన స్కోర్ అందించాడు. వీరిద్దరు ఆడకపోయుంటే అంధేరి ఈ మాత్రం స్కోర్ కూడా చేయలేకపోయేది. మోనిల్ సోని, నౌషద్ అహ్మద్ డకౌట్ కాగా.. ప్రజ్ఞేశ్ 10, తివారి 14 (నాటౌట్), ఓంకార్ జాదవ్ 3 (నాటౌట్) పరుగులు చేశారు. థానే బౌలర్లలో శశాంక్ అట్టర్డే 3, అంకుర్ సింగ్ ఓ వికెట్ తీశారు.అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన థానే.. 2.5 ఓవర్ల తర్వాత వికెట్ నష్టానికి 22 పరుగులు చేసింది. వరున్ లవండే 6 పరుగులకు ఔట్ కాగా.. అనిశ్ ముకుంద్ 15, అజిత్ యాదవ్ (0) క్రీజ్‌లో ఉన్నారు. మోనిల్ సోనికి ఓ వికెట్ దక్కింది. -
శ్రేయస్ నన్ను చెంపదెబ్బ కొట్టాల్సింది: పంజాబ్ స్టార్ ప్లేయర్
ఐపీఎల్-2025 సీజన్ క్వాలిఫయర్-2లో పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్.. తన సహచర ఆటగాడు శశాంక్ సింగ్‌పై సీరియస్ అయిన సంగతి తెలిసిందే. కీలక సమయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించి రనౌట్ కావడంతో శశాంక్‌పై అయ్యర్ అసహనం వ్యక్తం చేశాడు.మ్యాచ్ అనంతరం శశాంక్ షేక్ హ్యాండ్ వచ్చిన కూడా అయ్యర్ పట్టించుకోలేదు. తాజాగా ఈ విషయపై శశాంక్ సింగ్ స్పందించాడు. ఆ మ్యాచ్‌లో తను ఘోర తప్పిదం చేశానని అతడు అంగీకరించాడు. అంతేకాకుండా ఆ సమయంలో అయ్యర్ తనను చెంప దెబ్బ కొట్టిండాల్సిందని శశాంక్ అభిప్రాయపడ్డాడు."నిర్లక్ష్యంగా పరిగెత్తి నేను తప్పు చేశాను. అయ్యర్ నన్ను చెంపదెబ్బ కొట్టి ఉండాల్సింది. మా నాన్న కూడా నాపై సీరియస్ అయ్యారు. ఫైనల్ వరకు నాతో మాట్లాడలేదు. నేను చాలా క్యాజువల్‌గా పరిగెత్తాను. ఏదో బీచ్‌లో నడుస్తున్నట్లు పరుగుకు వెళ్లాను.ఇది చాలా కీలకమైన సమయం, ఇది అస్సలు నీ నుంచి ఊహించలేదని అయ్యర్ నాతో అన్నాడు. అయితే గెలిచిన తర్వాత నన్ను అతడు డిన్నర్‌కు తీసుకువెళ్లాడని" తాజా ఇంటర్వ్యూలో శశాంక్ సింగ్ పేర్కొన్నాడు. కాగా 11 ఏళ్ల తర్వాత ఫైనల్‌కు చేరిన పంజాబ్ జట్టు ఆఖరి మెట్టుపై బోల్తా పడింది. తుది పోరులో ఆర్సీబీ చేతిలో ఓటమిపాలై రన్నరప్‌గా పంజాబ్ నిలిచింది.Shreyas Iyer ANGRY On Shashank Singh After Run Out 😡 | KKR vs PBKS 2025 Heated MomentShreyas Iyer lost his cool on Shashank Singh after a shocking run out during the intense KKR vs PBKS 2025 IPL match! 🔥Watch the full drama as tensions rise in the middle and see how this… pic.twitter.com/OhCcdwH1NV— Junoon Ki Jersey (@paramjit3092) June 3, 2025 -
ఐపీఎల్ 2025 ఫైనల్లో ఓడినా భారీగా పెరిగిన శ్రేయస్ అయ్యర్ బ్రాండ్ విలువ
ఐపీఎల్ 2025 సీజన్ ఫైనల్లో ఆర్సీబీ చేతిలో ఓటమిపాలైన పంజాబ్ కింగ్స్ రన్నరప్‌తో సరిపెట్టుకుంది. ఈ సీజన్ ఆధ్యాంతం విశేషంగా రాణించిన ఆ జట్టు, తుది సమరంలో ఒత్తిడిలోనై ఆర్సీబీకి తలవంచింది. ఈ సీజన్లోనే పంజాబ్ పగ్గాలు చేపట్టిన శ్రేయస్.. ఆ జట్టును అద్బుతంగా ముందుండి నడిపించాడు. వ్యక్తిగంతానూ రాణించి, సహచరులకు మార్గదర్శకంగా నిలిచాడు.ఈ సీజన్లో పంజాబ్ టైటిల్ గెలవకపోయినప్పటికీ శ్రేయస్ అయ్యర్ కెప్టెన్‌గా 100కు 100 శాతం మార్కులు సాధించాడు. ఈ సీజన్‌తో కెప్టెన్‌గా శ్రేయస్ ఇమేజ్ నింగికెగిసింది. ఐపీఎల్ చరిత్రలో మూడు సార్లు, మూడు వేర్వేరు ఫ్రాంచైజీలను ఫైనల్‌కు చేర్చిన తొలి కెప్టెన్‌గా చరిత్ర సృష్టించాడు. ఫైనల్లో ఓడినా శ్రేయస్ బ్రాండ్ విలువ కూడా భారీగా పెరగడం మరో విశేషం. శ్రేయస్ ప్రస్తుతం ఒక రోజు యాడ్‌లో నటిస్తే రూ.1.5 కోట్లు వసూలు చేస్తున్నాడు.శ్రేయస్ ఫీజు త్వరలోనే మరింత పెరుగుతుందని అతని ఎండార్స్మెంట్ వ్యవహారాలు చూసే నిఖిల్ బార్డియా తెలిపారు. నిఖిల్ రిలయన్స్ ఇండస్ట్రీస్ యాజమాన్యంలోని RISE వరల్డ్‌వైడ్‌కు అధిపతిగా ఉన్నాడు. ఐపీఎల్-2025లో విజయవంతమైన కెప్టెన్సీ శ్రేయస్‌కు నాలుగైదు భారీ ఒప్పందాలు తెచ్చిపెడుతుందని నిఖిల్ అన్నారు. దీంతో శ్రేయస్ బ్రాండ్ విలువ 20-25 శాతం పెరుగుతుందని అంచనా వేశారు.అయ్యర్ ప్రస్తుతం నైక్, డ్రీమ్11, ఇన్‌క్రెడ్ ఫైనాన్స్ వంటి బ్రాండ్లతో స్వల్పకాలిక నాన్-ఎక్స్‌క్లూజివ్ కాంట్రాక్ట్ కలిగి ఉన్నాడు. ఐపీఎల్ 2025 ప్రదర్శన తర్వాత శ్రేయస్‌కు ఆడియో, పురుషుల గ్రూమింగ్ బ్రాండ్లు, ప్రోటీన్ సప్లిమెంట్ బ్రాండ్లు, సువాసన సంస్థల నుండి విచారణలు వస్తున్నాయి. శ్రేయస్‌తో ఎండార్స్మెంట్ ఒప్పందాలకు డిమాండ్ పెరిగినప్పటికీ, ఏజెన్సీ ఫీజులు పెంచాలని యోచించడం లేదని నిఖిల్ తెలిపారు.కాగా, శ్రేయస్ తాజాగా ముగిసిన ఐపీఎల్ సీజన్లో 17 మ్యాచ్‌ల్లో 50.33 సగటుతో 604 పరుగులు చేసి, పంజాబ్ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. క్వాలిఫయర్-2లో ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 204 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో శ్రేయస్ ఒత్తిడిని తట్టుకుని 41 బంతుల్లో 8 సిక్సర్లు, 5 ఫోర్ల సాయంతో 87 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. తద్వారా పంజాబ్ ఆ మ్యాచ్‌లో విజయం సాధించి 11 ఏళ్ల తర్వాత ఫైనల్‌కు చేరింది.వ్యక్తితంగా శ్రేయస్‌కు ఇది వరుసగా రెండో ఫైనల్. గత సీజన్లో శ్రేయస్ కేకేఆర్‌ను ఫైనల్‌కు చేర్చడమే కాకుండా ఛాంపియన్‌గా నిలబెట్టాడు. గతేడాది జరిగిన మెగా వేలంలో శ్రేయస్‌ను పంజాబ్ కింగ్స్ రూ.26.75 కోట్ల ధర వెచ్చింది సొంతం చేసుకుంది. తద్వారా శ్రేయస్ ఐపీఎల్ చరిత్రలో రెండో అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచాడు. అదే మెగా వేలంలో లక్నో సూపర్ జెయింట్స్ రిషబ్ పంత్‌ను రూ.27 కోట్లకు దక్కించుకుంది. పంత్ ఐపీఎల్ చరిత్రలో అత్యంత ఖరీదైన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. -
శ్రేయస్ అయ్యర్... సారథిగా సూపర్
ధోనీ మాదిరిగా వ్యూహరచనలో మేటి... కోహ్లి తరహాలో దూకుడులో ఘనాపాటి... రోహిత్‌ను అనుకరిస్తున్నట్లు అనిపించినా... అతడికి అతడే సాటి! ‘అతడి చేయి పడితే రాయి కూడా రత్నంలా మెరుస్తుంది’... అన్న రీతిలో దశాబ్ద కాలానికి పైగా ‘ప్లే ఆఫ్స్’ మొఖం చూడని జట్టును తుదిపోరుకు చేర్చిన ఘనుడతడు! ఐపీఎల్ చరిత్రలో మరే సారథికి సాధ్యం కాని విధంగా మూడు వేర్వేరు జట్లను తుదిపోరుకు తీసుకెళ్లిన మొనగాడతడు! అందుబాటులో ఉన్న వనరులను సమర్థవంతంగా వినియోగించుకుంటూ జట్టును నడిపించడంలో నేర్పరి అతడు! మనం ఇంతసేపు చెప్పుకున్నది... ఈసారి ఐపీఎల్ ట్రోఫీ గెలవకపోయినా తన నాయకత్వ చతురతతో అందరి మనసులు గెలిచిన పంజాబ్ కింగ్స్ సారథి శ్రేయస్ అయ్యర్ గురించే!! ధోనీ, రోహిత్ కూడా కెప్టెన్లుగా మూడు కంటే ఎక్కువ ఐపీఎల్ ఫైనల్స్ ఆడినా... ఆ ఇద్దరూ ఒకే జట్టును నడిపించారు. కానీ గత ఐదేళ్లలో అయ్యర్ మూడు వేర్వేరు ఫ్రాంఛైజీలకు తుదిపోరు మజా చూపాడు. ఢిల్లీ క్యాపిటల్స్ ఇప్పటి వరకు ఆడిన ఏకైక ఫైనల్ శ్రేయస్ సారథ్యంలోనే కాగా... పదేళ్ల విరామం అనంతరం గతేడాది కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు ముచ్చటగా మూడో కప్పు అందించింది కూడా అయ్యరే. పంజాబ్‌కు ట్రోఫీ కట్టబెట్టలేకపోయినా... సారథిగా మాత్రం సూపర్ సక్సెస్ అయ్యాడు. ‘బాధ్యత సగం మాత్రమే పూర్తయింది. వచ్చే ఏడాది తప్పక కప్పు గెలుస్తాం’ అని ఫైనల్ అనంతరం ధీమా వ్యక్తం చేసిన అయ్యర్... భారత జట్టు భవిష్యత్తు నాయకత్వంపై భరోసా పెంచుతున్నాడు!!సాక్షి, క్రీడావిభాగం : 2024 ఐపీఎల్ ఫైనల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను చిత్తుచేసి... కోల్‌కతా నైట్‌రైడర్స్ (కేకేఆర్) జట్టు మూడోసారి కప్పు కైవసం చేసుకుంది. కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ ట్రోఫీ అందుకున్నా... ఆ సమయంలో భారత మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ కేకేఆర్ జట్టు మెంటార్‌గా ఉండటంతో క్రెడిట్ అంతా అతడికే దక్కింది. తదనంతర పరిణామాల్లో గంభీర్ టీమిండియా హెడ్‌కోచ్‌గా ఎదగగా... సమర్థ నాయకుడిని కేకేఆర్ వేలానికి వదిలేసింది. డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన కోల్‌కతా జట్టు... ఈసారి లీగ్ దశ దాటలేకపోవడమే గాక... పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానంతో సరిపెట్టుకుంటే... వేలంలో భారీ ధర పెట్టి శ్రేయస్‌ను దక్కించుకున్న పంజాబ్ రెండోసారి రన్నరప్‌గా నిలిచింది. ఈ ఒక్క ఉదాహరణ చాలు శ్రేయస్ సారథ్య సామర్థ్యాన్ని వివరించేందుకు.దేశవాళీ మ్యాచ్‌లు ఆడకుండా నిర్లక్ష్యం వహించినందుకు బీసీసీఐ కాంట్రాక్టు కోల్పోవడం... అపార ప్రతిభ ఉన్నా ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌కు ఎంపిక కాకపోవడం ఇవన్నీ పక్కన పెడితే... అతడిలో గొప్ప నాయకుడు ఉన్నాడని తాజా ఐపీఎల్ నిరూపించిందింది. ఆటగాడిగా అదుర్స్... ఈ సీజన్లో 17 మ్యాచ్‌లాడిన శ్రేయస్ 50.33 సగటుతో 604 పరుగులతో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో ఆరో స్థానంలో నిలిచాడు. మిడిలార్డర్లో బ్యాటింగ్‌కు దిగి 175.07 స్ట్రయిక్‌రేట్‌తో పరుగులు రాబట్టాడు. అతడి గణాంకాలను అంకెల్లో కొలవడం కష్టమే! సీజన్ ఆరంభంలో గుజరాత్‌తో జరిగిన పోరులో సెంచరీకి సమీపించినా... జట్టు ప్రయోజనాలకే పెద్దపీట వేయడంతోనే అయ్యర్ తీరు అందరినీ ఆకట్టుకుంది. అహ్మదాబాద్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ 19 ఓవర్లు ముగిసేసరికి 220 పరుగులు చేసింది. అయ్యర్ 42 బంతుల్లో 97 పరుగులు చేసి సెంచరీకి సమీపించాడు. చివరి ఓవర్లో స్ట్రయికింగ్‌లో ఉన్న శశాంక్ సింగ్ దగ్గరకు వెళ్లి ‘నా శతకం గురించి ఆలోచించకు. జట్టు కోసం వీలైనన్ని ఎక్కువ పరుగులు చేయి’ అని దిశానిర్దేశం చేశాడు. ఆ ఓవర్ మొత్తం ఆడిన శశాంక్ 23 పరుగులు రాబట్టగా... అయ్యర్ అజేయంగా నిలిచాడు. స్పిన్‌ను సమర్థవంతంగా ఆడతాడనే గుర్తింపును మరింత పెంచుకుంటూ... ఈసారి మిడిల్ ఓవర్స్‌లో భారీ షాట్లతో విరుచుకుపడి పరుగులు రాబట్టాడు. అందుకే సీజన్ మొత్తంలో 43 ఫోర్లే కొట్టిన అయ్యర్... 39 సిక్స్‌లతో అత్యధిక సిక్స్‌లు కొట్టిన వారి జాబితాలో నికోలస్ పూరన్ (40) తర్వాత రెండో స్థానంలో నిలిచాడు. ముంబైపై అసమాన పోరాటం ఇక క్వాలిఫయర్–2లో ముంబై ఇండియన్స్‌పై శ్రేయస్ ఆడిన ఇన్నింగ్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే. బుమ్రా యార్కర్లను ఎదుర్కొనేందుకు మహామహులు ఇబ్బంది పడుతున్న తరుణంలో అతడు దాన్ని షార్ట్‌థర్డ్ మ్యాన్ దిశగా తరలించిన తీరు చూసి తీరాల్సిందే. ఆశలే లేని స్థితిలో అద్భుత పోరాటం కనబర్చిన ఈ ముంబైకర్... జట్టును ఒంటిచేత్తో ఫైనల్‌కు చేర్చాడు.‘అయ్యర్ అవుట్ అయినప్పుడే... పంజాబ్ పరాజయం ఖాయమైంది’ బెంగళూరుతో ఐపీఎల్ ఫైనల్ సందర్భంగా ప్రతి ఒక్కరి నోట వినిపించిన మాట ఇదే. అంతలా అభిమానుల నమ్మకాన్ని సంపాదించుకున్న శ్రేయస్... చేతి వరకు వచ్చిన కప్పు చేజారుతున్నా కాస్త కూడా చలించలేదు. చిరకాల కల నెరవేరడంతో ప్రపంచ మేటి ఆటగాడు విరాట్ కోహ్లి చిన్నపిల్లాడిలా వెక్కివెక్కి ఏడుస్తుంటే... సుదీర్ఘ కాలం ఫ్రాంఛైజీకి ప్రాతినిధ్యం వహించినా.. జట్టును విజేతగా నిలపలేకపోయిన ఏబీ డివిలియన్స్, క్రిస్ గేల్ వంటి దిగ్గజ ప్లేయర్లు సంబరాల్లో భాగమైపోయారు. ఇక ఆర్సీబీ అభిమానుల ఆనందానికైతే అవధులే లేవు! తన చుట్టూ ఇంత జరుగుతున్నా కనీసం ముఖ కవలికల్లో సైతం మార్పు కనబడని అయ్యర్ నింపాదిగా వచ్చే ఏడాది చూసుకుందాం అన్నట్లు ముందుకు సాగిపోయాడు. భవిష్యత్తు వన్డే కెప్టెన్! మైదానం బయట నుంచి పాంటింగ్ జట్టును తీర్చిదిద్దితే... ఆ వ్యూహాలను గ్రౌండ్లో ఆచరణలో పెట్టడంలో అయ్యర్ విజయవంతమయ్యాడు. బౌన్సీ పిచ్‌పై కైల్ జెమీసన్‌తో బ్యాక్ ఆఫ్ ది లెంత్ బంతులు వేయించడం... ముంబైతో మ్యాచ్‌లో వైడ్ యార్కర్లు వేసే విధంగా విజయ్ కుమార్ వైశాఖ్‌కు దిశానిర్దేశం చేయడం... అవసరమైనప్పుడు ‘నకల్ బాల్స్’ వేసే విధంగా ప్రోత్సహించడం ఇలా... ఒకటా రెండా సీజన్ ఆసాంతం శ్రేయస్ కెప్టెన్సీలో తనదైన పదును చూపాడు. క్వాలిఫయర్–2లో శశాంక్ సింగ్ నిర్లక్ష్యంతో రనౌట్ అయన సందర్భంలో సారథిగా అతడిపై ఆగ్రహం వ్యక్తం చేసిన అయ్యర్... ప్రియాన్‡్ష, ప్రభ్‌సిమ్రన్ వంటి యువ ఆటగాళ్లను పెద్దన్నలా వెన్నుతట్టి ప్రోత్సహించాడు. ఐపీఎల్ జరుగుతున్న సమయంలోనే ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్ కోసం భారత జట్టును ఎంపిక చేయగా... అందులో అయ్యర్ పేరు లేకపోవడం చూసి పంజాబ్ కోచ్ పాంటింగ్ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. అయినా దాన్ని పెద్దగా పట్టించుకోని శ్రేయస్... గీతలో శ్రీకృష్ణుడు చెప్పినట్లు ‘నీ కర్తవ్యాన్ని నువ్వు నిర్వర్తించు... ఫలితం గురించి ఆలోచించకు’ అన్న రీతిలో ఐపీఎల్‌పైనే దృష్టి పెట్టాడు. ప్రస్తుతం టెస్టు, టి20 జట్లలో రెగ్యులర్ ఆటగాడు కాని 30 ఏళ్ల అయ్యర్... వన్డేల్లో మాత్రం రోహిత్ శర్మ రిటైర్మెంట్ తర్వాత నాయకత్వ రేసులో ముందు నిలవడం ఖాయమే! -
IPL 2025: అన్ లక్కీ చహల్.. చరిత్రలో తొలి ఆటగాడు
టాలెంట్ ఎంతున్నా ఆవగింజంతైనా అదృష్టం ఉండాలన్న నానుడు స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్ విషయంలో మరోసారి నిరూపితమైంది. ఇతగాడు ఐపీఎల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా చలామణి అవుతున్నా (174 మ్యాచ్‌ల్లో 221 వికెట్లు).. ఇప్పటివరకు తాను ప్రాతినిథ్యం వహించిన ఒక్క ఫ్రాంచైజీకి కూడా టైటిల్ అందించలేకపోయాడు.2013 సీజన్లో ఆర్సీబీ తరఫున ఐపీఎల్ అరంగేట్రం చేసిన యుజీ.. ఇప్పటివరకు మూడు వేర్వేరు ఫ్రాంచైజీల తరఫున ఫైనల్స్ ఆడాడు. మూడింటిలో అతన్ని అదృష్టం వెక్కిరించింది. తొలిసారి యుజీ 2016 సీజన్లో ఫైనల్ ఆడగా.. ఆ మ్యాచ్‌లో అతను ప్రాతినిథ్యం వహించిన ఆర్సీబీకి సన్‌రైజర్స్ చేతిలో భంగపాటు ఎదురైంది. రెండో సారి 2022 సీజన్లో ఫైనల్ ఆడగా.. ఆ మ్యాచ్‌లో అతని జట్టు రాజస్థాన్ రాయల్స్ గుజరాత్ టైటాన్స్ చేతిలో పరాజయంపాలైంది. తాజాగా యుజీ ఆడిన మూడో ఫైనల్లో అతని కొత్త జట్టు పంజాబ్.. అతని మాజీ జట్టు ఆర్సీబీ చేతిలో ఓటమిని ఎదుర్కొంది. ఈ లెక్కన ఐపీఎల్ చరిత్రలో మూడు వేర్వేరు ఫ్రాంచైజీల తరఫున ఫైనల్స్ ఆడి ఒక్కసారి కూడా టైటిల్ గెలవలేకపోయిన ఏకైక ఆటగాడిగా చహల్ చరిత్రకెక్కాడు. ఇది తెలిసి క్రికెట్ అభిమానులు అతన్ని అన్ లక్కీ ఛార్మ్ అని అంటున్నారు. మూడు ఫైనల్స్‌లో అతను ఆటగాడిగా రాణించినా అతని జట్లను మాత్రం గెలిపించుకోలేకపోయాడు. మూడు ఫైనల్స్‌లో చహల్ పొదుపుగానే బౌలింగ్ చేసి ఒక్కో వికెట్ తీశాడు.ఇదిలా ఉంటే, ఐపీఎల్ 2025 సీజన్లో ఆర్సీబీ ఛాంపియన్‌గా అవతరించింది. నిన్న (జూన్ 3) జరిగిన ఫైనల్లో పంజాబ్ కింగ్స్‌పై 6 పరుగుల తేడాతో విజయం సాధించి తొలి టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఈ సీజన్లో పంజాబ్, ఆర్సీబీ పోటీపోటీగా రాణించి ఫైనల్ వరకు చేరాయి. అయితే తుది సమరంలో ఆటగాళ్ల అనుభవం ఆర్సీబీని గట్టెక్కించింది. ఫైనల్లో ఓడినా శ్రేయస్ సేన శభాష్ అనిపించుకుంది. సీజన్ ఆధ్యాంతం ఆ జట్టు ఛాంపియన్ గేమ్ ఆడింది. అనుభవలేమి ఆటగాళ్లతో శ్రేయస్ జట్టును నడిపించిన తీరు అత్యద్భుతమని విమర్శకులు సైతం ప్రశంసిస్తున్నారు. నిన్నటి ఫైనల్లో సైతం ఆ జట్టు అంత ఈజీగా ఆర్సీబీకి తలొగ్గలేదు. తొలుత అద్భుతంగా బౌలింగ్ చేసి ఆర్సీబీ ఊహించిన దానికంటే తక్కువ స్కోర్‌కే కట్టడి చేసింది. ఆతర్వాత బ్యాటింగ్‌లో సైతం మంచి ఆరంభాన్నే పొందినప్పటికీ మధ్యలో ఒత్తిడికి లోనై వికెట్లు చేజార్చుకుంది. అయినా ఆర్సీబీకి అంత ఈజీగా గెలుపును దక్కనివ్వలేదు. చివరి ఓవర్ వరుకు ఆ జట్టు బ్యాటర్ శశాంక్ సింగ్ పోరాడాడు. ఓటమి ఖాయమైనా శశాంక్ తగ్గేదేలేదన్నాడు. హాజిల్‌వుడ్ వేసిన చివరి ఓవర్లో 2 సిక్సర్లు, 2 ఫోర్లు సహా 22 పరుగులు రాబట్టాడు. అయినా పంజాబ్ గెలుపుకు ఏడు పరుగులు తక్కువయ్యాయి. ఈ ఓటమితో పంజాబ్ గుండె ముక్కలైంది. ఈ యేడు శ్రేయస్ నేతృత్వంలో టైటిల్ ఖాయమని ఆ జట్టు అభిమానులు అనుకున్నారు. కానీ తుది మెట్టుపై ఆర్సీబీ అనుభవం గెలిచింది. ఆ జట్టుకు ఇదివరకే మూడు ఫైనల్స్ ఆడిన అనుభవం ఉండటంతో కీలక సమయంలో పరిస్థితులను బాగా హ్యాండిల్ చేసింది. ఫలితంగా 18 ఏళ్ల తమ టైటిల్ కలను సాకారం చేసుకుంది. -
Preity Zinta PBKSలో కేవలం రూ 35 కోట్ల పెట్టుబడి : లాభం ఎంతో తెలుసా?
ఐపీఎల్ 2025లో ఉత్కంఠగా సాగిన ఫైనల్ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ (PBKS) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) చేతిలో 6 పరుగుల తేడాతో ఓడిపోయింది. క్వాలిఫైయర్-2 మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ను 5 వికెట్ల తేడాతో ఓడించి ఫైనల్‌కు దూసుకెళ్లిన పీబీకేఎస్, అదే తరహాలో టైటిల్ గెలుస్తుందని ఊహించిన అభిమానులకు తీరని నిరాశ మిగిలింది. 18 ఏళ్ల నిరీక్షణ తరువాత ఆసీబీ టైటిల్‌ను దక్కించుకుంది. పీబీకేఎస్ విలువ 925 మిలియన్ డాలర్లుఐపీఎల్ ఫైనల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు గట్టి పోటీ ఇచ్చిన పంజాబ్ కింగ్స్ యజమాని బాలీవుడ్ నటి, ప్రీతి జింటా (Preity Zinta) ఆస్తి ఎంత, PBKS నెట్‌వర్త్ ఎంత అనే చర్చ నెట్టింట సందడిగా మారింది. ప్రీతి జింటా ఐపీఎల్ టీం పీబీకేఎస్ విలువ 925 మిలియన్ డాలర్లుగా తెలుస్తోంది.బాలీవుడ్ హీరో షారూఖ్ ఖాన్ సరసన ‘దిల్ సే’ మూవీతో ఆకట్టుకున్న ఈ సొట్ట బుగ్గల సుందరి రెండు దశాబ్దాలకు పైగాబాలీవుడ్ను ఏలింది. కెరీర్లో, ప్రీతి కల్ హో నా హో, వీర్ జారా, లక్ష్య, సలాం నమస్తే, సంఘర్ష్, కోయి... మిల్ గయా, క్యా కెహ్నా, కభీ అల్విదా నా కెహ్నా, చోరి చోరి చుప్కే చుప్కే, ది లాస్ట్ లియర్, సోల్జర్ , అనేక ఇతర చిత్రాలలో అద్భుతమైన పాత్రలు పోషించింది.ప్రీతి జీన్ గూడెనఫ్‌ను వివాహం తరువాత అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌లో సిర్థపడింది. నటనకు దూరంగా ఉంది. ప్రీతి-జీన్ దంపతులకు కవల పిల్లలున్నారు. అయితే, గ్లామర్ ప్రపంచానికి దూరంగా ఉన్నప్పటికీ, ఐపీఎల్ జట్టు ఓనర్షిప్ ఇతర వ్యాపారాలు, ఎండార్స్మెంట్ల ద్వారా భారీ ఆస్తులను సంపాదించింది. 2008లో, ప్రీతి జింటా ఐపీఎల్ జట్టు పంజాబ్ కింగ్స్‌కు సహ యజమానిగా, వ్యాపారవేత్తగా అవతరించింది.మనీ కంట్రోల్ సమాచారం ప్రకారం, 2008లో ఐపీఎల్ జట్టు పంజాబ్ కింగ్స్‌కు సహ యజమానిగా ప్రీతి ఆ సమయంలో రూ. 35 కోట్లు పెట్టుబడి పెట్టగా, అది ఇప్పుడు 350 కోట్ల రూపాయలకు పెరిగింది. 2008లో పంజాబ్ కింగ్స్ ప్రారంభించినప్పుడు, దానిని విలువ 76 మిలియన్ డాలర్లుగా ఉంది. 2022 నాటికి 925 మిలియన్ డాలర్లకు పెరిగింది.ప్రీతి జింటా ఆస్తి రూ. 183 కోట్లు ప్రీతి జింటా నికర ఆస్తుల విలువ రూ. 183 కోట్లు, ఇందులో ఆమె బ్రాండ్ ప్రమోషన్లు, వ్యాపార సంస్థలు, ఐపీఎల్ జట్టులో వాటా కూడా ఉన్నాయి. ముంబైలోని పాలి హిల్స్‌లో రూ. 17 కోట్ల విలువైన అపార్ట్మెంట్ ప్రీతి సొంతం. జీన్ గూడెనఫ్‌తో వివాహం తర్వాత ఆమె అమెరికాకు వెళ్లి బెవర్లీ హిల్స్‌లో నివసిస్తున్నప్పటికీ సిమ్లాలో రూ. 7 కోట్ల విలువైన ఇంటిని కూడా కొనుగోలు చేసింది.బ్రాండ్ ఎండార్స్మెంట్ల ఆదాయం కూడా భారీగానే ఉంటుంది. ప్రీతి జింటా ప్రచారం చేసే ప్రతి బ్రాండ్ నుండి దాదాపు రూ. 1.5 కోట్ల నుండి రూ. 2 కోట్ల వరకు సంపాదిస్తుంది. ప్రీతి జింటా కార్ల విషయానికి వస్తే లగ్జరీ కార్లు ఆమె గ్యారేజీలో ఉన్నాయి. వీటిలో రూ. 132 లక్షల విలువైన లెక్సస్ 400 క్రాస్ఓవర్, రూ. 58 లక్షల విలువైన మెర్సిడెస్ బెంజ్ E క్లాస్, పోర్స్చే , BMW ఉన్నాయి. -
చాలా బాధగా ఉంది.. అతడే మ్యాచ్‌ను టర్న్ చేశాడు: శ్రేయస్ అయ్యర్
తొలి ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడాలని కలలు కన్న పంజాబ్ కింగ్స్‌కు మరోసారి నిరాశే ఎదురైంది. ఐపీఎల్-2025 సీజన్లో ఆఖరి మొట్టుపై పంజాబ్ బోల్తా పడింది. మంగళవారం అహ్మదాబాద్ వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన ఫైనల్ పోరులో 6 పరుగుల తేడాతో పంజాబ్ ఓటమి పాలైంది.ఆర్సీబీ నిర్ధేశించిన 191 పరుగుల లక్ష్యాన్ని శ్రేయస్ సేన చేధించలేకపోయింది. లక్ష్య చేధనలో పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 184 పరుగులకే పరిమితమైంది. పంజాబ్ బ్యాటర్లలో శశాంక్ సింగ్(61), జోష్ ఇంగ్లిష్(39) మినహా మిగితా అందరూ తీవ్ర నిరాశపరిచారు.ఆర్సీబీ బౌలర్లలో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్ తలా రెండు వికెట్లు పడగొట్టారు. ఇక ఈ హార్ట్‌బ్రేకింగ్ ఓటమిపై మ్యాచ్ అనంతరం పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ స్పందించాడు. ఫైనల్లో ఓటమి పాలైనప్పటికి.. ఈ టోర్నీ ఆసాంతం తమ కుర్రాళ్లు అద్బుతమైన ప్రదర్శన కనబరిచారని అయ్యర్ కొనియాడాడు."ఈ మ్యాచ్‌లో ఓటమి మమ్మల్ని తీవ్ర నిరాశపరిచింది. ఫైనల్లో ఓడినా మా కుర్రాళ్ళు ఆ సందర్భానికి తగ్గట్టు ఆడారు. ఈ మ్యాచ్‌లో ఆశించిన ఫలితం మాకు దక్కలేదు. కానీ మాకు మద్దతుగా నిలిచిన సపోర్ట్ స్టాఫ్, టీమ్ మేనేజ్మెంట్, ప్రతీ ఒక్కరికి క్రెడిట్ ఇవ్వాలి.మా యాజమాన్యం కూడా చాలా సపోర్ట్ చేశారు. మా గత మ్యాచ్ దృష్ట్యా 200 పరుగుల లక్ష్యం సులువు అనుకున్నాం. కానీ ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ బౌలర్లు అద్బుతంగా బౌలింగ్ చేశారు. ముఖ్యంగా కృనాల్ తన బౌలింగ్‌తో మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు. అతడికి చాలా అనుభవం ఉంది.తన ఎక్స్‌పీరియన్స్‌ను మరోసారి చూపించాడు. జట్టులోని ప్రతీ ఒక్కరూ బాగా రాణించారు. వారి ప్రదర్శన పట్ల చాలా గర్వంగా ఉంది. మా జట్టులోని చాలా మంది కుర్రాళ్లకు ఇదే తొలి సీజన్. అయిప్పటికి వారు ఫియర్లెస్ క్రికెట్ ఆడారు. వారందరికి అభినందనలు. వారు లేకపోయింటే మేము ఇక్కడివరకు వచ్చేవాళ్లం కాదు. మా పని ఇంకా పూర్తి కాలేదు. వచ్చే ఏడాది ట్రోఫీ గెలవడమే మా లక్ష్యం. ఈ టోర్నీలో మాకు చాలా సానుకూల అంశాలు ఉన్నాయి. యువ ఆటగాళ్లు ఈ సీజన్ నుంచి చాలా అనుభవాన్ని పొందారు. వచ్చే ఏడాది మరింత మెరుగైన ప్రదర్శన చేస్తారని అశిస్తున్నాను. కొత్త వ్యూహాలు, ప్రణాళికలతో మళ్లీ తిరిగివస్తామని" పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్‌లో అయ్యర్ పేర్కొన్నాడు. కాగా ఈ మ్యాచ్‌లో అయ్యర్ కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి ఔటయ్యాడు.చదవండి: IPL 2025: చరిత్ర సృష్టించిన కృనాల్ పాండ్యా.. 18 ఏళ్లలో ఒకే ఒక్కడు -
IPL 2025: ఛాంపియన్‌గా ఆర్సీబీ.. ప్రైజ్ మనీ ఎన్ని కోట్లంటే?
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సుదీర్ఘ నిరీక్షణ ముగిసింది. గత 17 ఏళ్ల నుంచి ఊరిస్తున్న ఐపీఎల్ కప్ ఎట్టకేలకు ఆర్సీబీ సొంతమైంది. ఐపీఎల్-2025 విజేతగా ఆర్సీబీ అవతరించింది. మంగళవారం అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఫైనల్లో 7 వికెట్ల తేడాతో పంజాబ్ కింగ్స్‌ను ఓడించిన బెంగళూరు జట్టు.. తమ కలల ట్రోఫీని ముద్దాడింది. ఆర్సీబీ గెలుపుతో అభిమానుల సంబరాలు అంబరాన్ని అంటాయి. ‘‘ఈసాలా కప్ నమ్దు’’ నినాదాలతో స్టేడియం హోరెత్తి పోయింది. ఈ క్రమంలో విజేతగా నిలిచిన ఆర్సీబీ ఎంత ప్రైజ్‌మనీని గెల్చుకుంది, రన్నరప్‌గా నిలిచిన పంజాబ్ కింగ్స్ టీమ్ ఎంత మొత్తం దక్కించుకుంది అనే వివరాలను తెలుసుకుందాం.విజేతకు ఎన్ని కోట్లంటే?👉ఛాంపియన్స్‌గా నిలిచిన ఆర్సీబీకి ప్రైజ్‌మనీ రూపంలో రూ.20 కోట్లు లభించాయి. అదేవిధంగా రన్నరప్‌తో సరిపెట్టుకున్న పంజాబ్‌కు రూ.12.5 కోట్లు ప్రైజ్‌మనీ దక్కింది. ఇక క్వాలిఫయర్-2లో ఓటమి పాలైన ముంబై ఇండియన్స్‌కు రూ.7 కోట్లు, ఎలిమినేటర్‌లో టోర్నీ నుంచి ఇంటిముఖం పట్టిన గుజరాత్ టైటాన్స్ జట్టుకు రూ.6.5 కోట్లు లభించాయి.👉ఆరెంజ్ క్యాప్ హోల్డర్‌గా నిలిచిన సాయిసుదర్శన్కు రూ.15లక్షల నగదు బహుమతి లభించింది. ఈ ఏడాది సీజన్లో 15 మ్యాచ్‌లు ఆడిన సుదర్శన్.. 54.21 సగటుతో 759 పరుగులు చేశాడు.👉పర్పుల్ క్యాప్ విజేతగా నిలిచిన ప్రసిద్ద్ కృష్ణకు రూ.15లక్షల నగదు బహుమతి లభించింది. ఈ ఏడాది సీజన్లో 15 మ్యాచ్‌లు ఆడిన ప్రసిద్ద్.. 25 వికెట్లు పడగొట్టాడు.👉జితేశ్ శర్మ (సూపర్ స్ట్రయికర్ ఆఫ్ ది మ్యాచ్) రూ.లక్ష ప్రైజ్‌మనీ👉శశాంక్ సింగ్ (ఫాంటసీ కింగ్ ఆఫ్ ది మ్యాచ్) రూ.లక్ష ప్రైజ్‌మనీ👉శశాంక్ సింగ్ (సూపర్ సిక్సర్స్ ఆఫ్ ది మ్యాచ్) రూ.లక్ష ప్రైజ్‌మనీ👉ప్రియాన్ష్ ఆర్యా (మ్యాచ్‌లో అత్యధిక ఫోర్లు) రూ.లక్ష ప్రైజ్‌మనీ👉కృనాల్ పాండ్యా (గ్రీన్ డాట్ బాల్స్ ఆఫ్ ది మ్యాచ్) రూ.లక్ష ప్రైజ్‌మనీ👉కృనాల్ పాండ్యా (మ్యాన్ ఆఫ్‌ది మ్యాచ్) రూ.5లక్షల ప్రైజ్‌మనీ👉సాయి సుదర్శన్ (ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్) రూ. 10 లక్షల ప్రైజ్‌మనీ👉వైభవ్ సూర్యవంశి (సూపర్ స్ట్రయికర్ ఆఫ్ ది సీజన్) టాటా కర్వ్ కారు విజేత👉సాయి సుదర్శన్ ( ఫాంటసీ కింగ్ ఆఫ్ ది సీజన్) రూ.10 లక్షల ప్రైజ్‌మనీ👉నికోలస్ పూర్ (సూపర్ సిక్సెస్ ఆఫ్ ది సీజన్) రూ.10 లక్షల ప్రైజ్‌మనీ👉సాయి సుదర్శన్ (ది గో ఫోర్స్ ఆఫ్ ది సీజన్) రూ.10 లక్షల ప్రైజ్‌మనీ👉మొహ్మద్ సిరాజ్ (గ్రీన్ డాట్ బాల్స్ ఆఫ్ ది సీజన్) రూ. 10 లక్షల ప్రైజ్‌మనీ👉కమిండు మెండిస్ (క్యాచ్ ఆఫ్ ది సీజన్) రూ. 10 లక్షల క్యాష్ ప్రైజ్👉ఫెయిర్ ప్లే అవార్డు (చెన్నై సూపర్ కింగ్స్) రూ.10లక్షల ప్రైజ్‌మనీ👉ప్రసిద్ధ్ కృష్ణ (పర్పుల్ క్యాప్) రూ.10లక్షల ప్రైజ్‌మనీ👉సాయి సుదర్శన్ (ఆరెంజ్ క్యాప్) రూ.10లక్ష ప్రైజ్‌మనీ👉సూర్యకుమార్ యాదవ్ (మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్) రూ.15లక్షల ప్రైజ్‌మనీ👉డీడీసీఏ (పిచ్ అండ్ గ్రౌండ్) రూ.50లక్షల ప్రైజ్‌మనీThis wasn’t luck. This was loyalty paying rent after 18 years. 🤌pic.twitter.com/kOfZ7aX7RF— Royal Challengers Bengaluru (@RCBTweets) June 3, 2025 -
ఆర్సీబీకి అందిన ద్రాక్ష
విరాట్ కోహ్లి 17 సీజన్లలో కలిపి 8 వేల పరుగులు చేసినా... క్రిస్ గేల్ విధ్వంసక బ్యాటింగ్‌తో 7 సీజన్లలో రికార్డులు బద్దలు కొట్టినా... డివిలియర్స్ 11 సీజన్లలో మరచిపోలేని మెరుపు ప్రదర్శనలు చూపించినా సాధ్యం కాలేదు... ఈ ముగ్గురు కలిసి 7 సీజన్లలో టి20 క్రికెట్ మజా ఏమిటో చూపిస్తూ అభిమానులకు అంతులేని వినోదాన్ని పంచినా... అసలు లక్ష్యం మాత్రం అందనంత దూరంలో నిలిచిపోయింది... గేల్ ఎప్పుడో టీమ్‌కు దూరమయ్యాడు...డివిలియర్స్ ఇక నా వల్ల కాదంటూ మూడు సీజన్ల క్రితం తప్పుకున్నాడు...వీరిద్దరితో కలిసి ఐపీఎల్లో ఓవరాల్‌గా టాప్–2 భాగస్వామ్యాలు నెలకొల్పిన కోహ్లి... ఆ తర్వాత డుప్లెసిస్‌తో కలిసి మరో మూడు సీజన్లు బ్యాటింగ్ భారం మోశాడు. కానీ ఎన్ని గొప్ప ఇన్నింగ్స్‌లు వచ్చినా ఐపీఎల్ ట్రోఫీ మాత్రం దక్కలేదు! అయితే ఎట్టకేలకు బెంగళూరు ఇప్పుడు తమ కలను నెరవేర్చుకుంది. కోహ్లి ఆనందభాష్పాలు చూస్తే ఈ విజయం విలువేమిటో తెలుస్తుంది! స్టార్లు కాకపోయినా.... పెద్ద పెద్ద పేర్లు ముఖ్యం కాదు... చిన్న ఆటగాళ్లే అయినా వారు చూపించే ప్రభావం ముఖ్యమని ఆర్సీబీ నిరూపించింది. టోర్నీలో పది మంది బ్యాటర్లు కనీసం అర్ధ సెంచరీలు సాధించారు. ఫైనల్‌కు ముందు జట్టు 10 మ్యాచ్‌లు గెలిస్తే 9 మంది వేర్వేరు ఆటగాళ్లు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’లుగా నిలిచారు. ‘బిగ్ త్రీ’పై మాత్రమే ఆధారపడిన గెలుపును ఆశించిన జట్టులా ఈసారి బెంగళూరు ఏమాత్రం కనిపించలేదు.వైవిధ్యంతో పాటు బ్యాటింగ్ లోతును కూడా టీమ్ చూపించింది. జట్టు కష్టాల్లో ఉన్న ప్రతీ సారి నేనున్నానంటూ ఎవరో ఒకరు ముందుకొచ్చి ఆదుకున్నారు. లీగ్ దశలో పంజాబ్‌పై టిమ్ డేవిడ్, చెన్నైపై షెఫర్డ్, లక్నోపై జితేశ్ ఆడిన ఇన్నింగ్స్‌లు అసాధారణ ప్రదర్శనలుగా నిలిచాయి. ఐపీఎల్ చరిత్రలో ప్రత్యర్థి వేదికపై ఆడిన 7 మ్యాచ్‌లూ గెలిచిన తొలి జట్టుగా ఆర్సీబీ నిలిచింది. సాల్ట్‌ను ఎంచుకొని... ఐపీఎల్ వేలం సమయంలో టీమ్ డైరెక్టర్ బొబాట్ ఒక ఆసక్తికర వ్యాఖ్య చేశారు. ‘వారు ఎలా ఆడతారన్నది మేం ఆలోచించడం లేదు. మేం ఎలా ఆడించాలనే ఆలోచనే అన్నింటికంటే ముఖ్యం. దాని ప్రకారమే మేం ఆటగాళ్లను ఎంచుకున్నాం’ అని ఆయన చెప్పారు. హెడ్ కోచ్ ఆండీ ఫ్లవర్, మెంటార్ దినేశ్ కార్తీక్‌లతో పాటు పన్నిన వ్యూహాలు, ప్రణాళికలు బెంగళూరుకు అద్భుతంగా పని చేశాయి. కోహ్లికి జోడీగా విధ్వంసకర ఓపెనర్ కావాలంటూ కార్తీక్ పట్టుబట్టి మరీ సాల్ట్‌ను రూ. 11.25 కోట్లకు తీసుకునేలా చేశాడు. ఏకంగా 175 స్ట్రయిక్‌రేట్‌తో అతను 403 పరుగులు చేసి నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. కెప్టెన్ సూపర్... కెప్టెన్‌గా కూడా రజత పాటీదార్‌ను ఎంచుకోవడంలో ఆర్సీబీ ఎంతో ఆలోచించి నిర్ణయం తీసుకుంది. భారత్ క్రికెట్లో స్టార్ ఆటగాడు కాకపోయినా... ముస్తాక్‌అలీ ట్రోఫీలో అతని నాయకత్వ లక్షణాలు చూసి ఎంచుకుంది. ఇది ఎంత గొప్పగా పని చేసిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కోల్‌కతా, చెన్నై, ముంబైలపై వారి వేదికల్లో ఎన్నో ఏళ్ల తర్వాత విజయాలు సాధించడంలో బ్యాటర్‌గా పాటీదార్ పాత్ర ఎంతో ఉంది. 312 పరుగులతో అతను రాణించాడు. సుయాశ్ శర్మ, యశ్ దయాళ్‌లను సరైన సమయంలో సమర్థంగా వాడుకోవడంలో అతని కెప్టెన్సీ ప్రతిభ కనిపించింది. ఇప్పుడు 17 సీజన్లలో సాధ్యం కాని ఘనతను కెపె్టన్‌గా తన తొలి సీజన్లోనే అందుకొని పాటీదార్ ఐపీఎల్ చరిత్రలో తన పేరును ఘనంగా లిఖించుకున్నాడు. అంతా కోహ్లిమయం... బెంగళూరు టీమ్ సభ్యులలో గతంలో కృనాల్ పాండ్యా, హాజల్‌వుడ్, భువనేశ్వర్, సాల్ట్ ఐపీఎల్ గెలిచిన జట్లలో సభ్యులుగా ఉన్నారు. ఇతర యువ ఆటగాళ్ల కెరీర్ ఇంకా పూర్తిగా ఊపందుకోలేదు. ఇప్పటికిప్పుడు టైటిల్ గెలిచినా, ఓడినా వారికి పెద్ద తేడా ఉండకపోవచ్చు. కానీ విరాట్ కోహ్లి పరిస్థితి అందరికంటే భిన్నం. అతను 18 సీజన్లుగా ఒకే జట్టుకు తన సర్వం ధారబోశాడు. ఎన్నో గొప్ప విజయాలను అందించాడు. కానీ టైటిల్ మాత్రం గెలవలేని లోటు ప్రతీసారి వెంటాడేది. గతంలో మూడు ఫైనల్ మ్యాచ్‌లో ఓడిన బాధ ఇంకా వెంటాడుతూనే ఉంది. ముఖ్యంగా 2016 సీజన్లో ఏకంగా 973 పరుగులతో చెలరేగినా ఫైనల్లో పరాజయం అతడికి తీవ్ర వేదనను కలిగించింది. నాటినుంచి ఇప్పటి వరకు మళ్లీ జట్టు ట్రోఫీకి చేరువగా రాలేకపోయింది. కెరీర్ చరమాంకంలో ఉన్న అతను ఈసారి గెలవలేకపోతే మరింత ఆవేదన కలిగేది. ఇలాంటి స్థితిలో దక్కిన విజయం కోహ్లి కోసమే వచ్చినట్లుగా ఉంది. అందుకే మైదానమంతా కోహ్లి చుట్టే సంబరాలు. గతంలో జట్టులో భాగంగా ఉండి ట్రోఫీ గెలవలేని డివిలియర్స్, గేల్ కూడా కోహ్లి పక్కన ఉండి అతని సంతోషంలో భాగం కావడం విశేషం. -సాక్షి క్రీడా విభాగం ‘పసి పాపలా ప్రశాంతంగా నిద్రపోతా’ 18 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ ముగిసింది. ఈ విజయం జట్టు సభ్యులది మాత్రమే కాదు అభిమానులది కూడా. నేను యువకుడిగా, ఆ తర్వాత కెరీర్ అత్యుత్తమ దశలో, ఇప్పుడు అనుభవజ్ఞుడిలా ఈ టీమ్‌తో ఉన్నాను. ప్రతీ సీజన్లోనూ ఇదే తరహాలో విజయం కోసం తీవ్రంగా శ్రమించాను. నేను చేయగలిగిందంతా చేశాను. చివరకు ఇప్పుడు దక్కిన భావన గొప్పగా ఉంది. ఈ రోజు వస్తుందని అనుకోలేదు. ఆఖరి బంతి తర్వాత భావోద్వేగాలను నియంత్రించుకున్నాను. ఏం జరిగినా ఇదే జట్టుతో ఉన్నాను. టీమ్ మేనేజ్మెంట్ కూడా నాతో నిలబడింది. ఇదే జట్టుతో టైటిల్ గెలవాలని కలగన్నాను. మరో టీమ్‌తో గెలిచి ఉంటే ఇంత ఆనందం దక్కకపోయేదేమో. నా హృదయం, ఆత్మ బెంగళూరుతోనే ఉన్నాయి. గతంలో చెప్పినట్లుగా నేను ఐపీఎల్ ఆడినంత వరకు ఇదే జట్టుతో ఉంటా. ఎంతో పోటీ, తీవ్రత ఉండే ఈ టోర్నీలో టైటిల్ విజయాన్ని ఎంతో ప్రాధాన్యత ఉంది. నేను ఇలాంటి పెద్ద టోర్నీలను గెలవాలని, చిరస్మరణీయ క్షణాలను కోరుకుంటా. కెరీర్లో అత్యుత్తమ విజయాల్లో ఇదొకటి. ఈ రోజు నేను ప్రశాంతంగా పసిపాపలా నిద్రపోతా. వేలంలో మా ఎంపికను చాలా మంది ప్రశ్నించారు. కానీ వాటిని తప్పని నిరూపించాం. –విరాట్ కోహ్లి -
RCB Vs PBKS: కల నిజమాయెగా.. కప్పు సొంతమాయెగా
ఎన్నిసార్లు గుండెకోతలు... ఎన్ని అవమానాల పర్వాలు... ఆర్సీబీ అభిమాని అంటే అదో చిన్నచూపుతో చూసిన ఎన్నో సందర్భాలు... ఎప్పటికీ విజేతగా నిలవదనే వ్యాఖ్యలు... గొప్ప గొప్ప ప్లేయర్లు ఉన్నప్పుడే సాధ్యం కాలేదు ఇప్పుడేమవుతుందిలే అనే జోస్యాలు... కొన్నిసార్లు లీగ్ దశకే పరిమితమైతే మరికొన్ని సార్లు ‘ప్లే ఆఫ్స్’కు చేరినా ముందంజ వేయని రోజులు... మూడు ఫైనల్స్‌లలో ఓడిన వేదన దీనికి అదనం. ఒకదశలో ఆర్సీబీ అభిమానుల నినాదం ‘ఈ సాల కప్ నమ్దే’ (ఈ ఏడాది కప్ మనదే) జోక్‌గా మారిపోయిన పరిస్థితి... కానీ 2008 నుంచి గెలుపోటములతో నిమిత్తం లేకుండా ఆర్సీబీ జెండాను తమ మనసులో నింపుకున్న ఫ్యాన్స్ గర్వపడే క్షణం వచ్చేసింది...తమ టీమ్‌లోని 18వ నంబర్ జెర్సీకి కానుక ఇస్తున్నట్లుగా ఐపీఎల్ 18వ సీజన్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) చాంపియన్‌గా నిలిచింది. లీగ్ దశలోనే అసాధారణ ప్రదర్శనలతో ‘ప్లే ఆఫ్స్’కు చేరి తొలి క్వాలిఫయర్లోనే గెలుపుతో ఫైనల్ చేరిన టీమ్ తుది పోరులోనూ అదే జోరును కొనసాగించింది... ఒకరు కాదు ఇద్దరు కాదు జట్టులోని సమష్టితత్వం ఈ చిరస్మరణీయ విజయాన్ని అందించింది. ఎన్నో చాలెంజ్‌లను అధిగమించి రాయల్‌గా సాధించిన ఈ ట్రోఫీని బెంగళూరులో సగర్వంగా ప్రదర్శించే సమయమిది... ఘనవిజయాలు, వైఫల్యాలు అన్నింటినీ చూస్తూ ఆర్సీబీ పట్ల విధేయత వీడకుండా జట్టుతోనే కొనసాగిన విరాట్ కోహ్లి కెరీర్లో మిగిలిన ఈ ఒక్క లోటు ఈ రోజుతో తీరిపోయింది. అహ్మదాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నీ చరిత్రలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టు కొత్త చాంపియన్‌గా అవతరించింది. గతంలో మూడుసార్లు ఫైనల్ మ్యాచ్‌లలో (2009, 2011, 2016) ఓటమి పాలైన జట్టు ఎట్టకేలకు 18వ సీజన్లో ‘ఈ సాల కప్ నమ్దు’ (ఈ ఏడాది కప్ మనది) అంటూ ట్రోఫీని ముద్దాడింది. నరేంద్ర మోదీ స్టేడియంలో మంగళవారం జరిగిన ఫైనల్లో రజత్ పాటీదార్ సారథ్యంలోని ఆర్సీబీ జట్టు 6 పరుగుల తేడాతో పంజాబ్ కింగ్స్‌పై విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది. విరాట్ కోహ్లి (35 బంతుల్లో 43; 3 ఫోర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అనంతరం పంజాబ్ కింగ్స్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 184 పరుగులే చేయగలిగింది. శశాంక్ సింగ్ (30 బంతుల్లో 61 నాటౌట్; 3 ఫోర్లు, 6 సిక్స్‌లు) అర్ధ సెంచరీ చేయగా, జోష్ ఇన్‌గ్లిస్ (23 బంతుల్లో 39; 1 ఫోర్, 4 సిక్స్‌లు) రాణించాడు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ కృనాల్ పాండ్యా (2/17) అద్భుత బౌలింగ్‌తో మ్యాచ్‌ను బెంగళూరు వైపు తిప్పగా, ఒత్తిడిలో పంజాబ్ పూర్తిగా చిత్తయింది. ఫలితంగా రెండోసారి పంజాబ్ కింగ్స్ జట్టు రన్నరప్‌ట్రోఫీతో సరిపెట్టుకుంది. 2014లో తొలిసారి ఫైనల్ చేరిన పంజాబ్ జట్టు తుది పోరులో కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు చేతిలో ఓడిపోయింది. ఐపీఎల్ టోర్నీ విజేతగా నిలిచిన బెంగళూరు జట్టుకు రూ. 20 కోట్లు... రన్నరప్ పంజాబ్ కింగ్స్ జట్టుకు రూ. 12 కోట్ల 50 లక్షలు ప్రైజ్‌మనీగా లభించాయి. మూడో స్థానంలో నిలిచిన ముంబై ఇండియన్స్ జట్టుకు రూ. 7 కోట్లు, నాలుగో స్థానంలో నిలిచిన గుజరాత్ టైటాన్స్‌కు రూ. 6 కోట్ల 50 లక్షలు దక్కాయి. సమష్టి బ్యాటింగ్ ప్రదర్శన... ఆర్సీబీ ఇన్నింగ్స్‌లో విధ్వంసక ప్రదర్శనలు లేకపోయినా... ప్రధాన బ్యాటర్లంతా తలా ఓ చేయి వేయడంతో జట్టు మెరుగైన స్కోరు సాధించగలిగింది. దూకుడుగా మొదలు పెట్టిన ఫిల్ సాల్ట్ (9 బంతుల్లో 16; 2 ఫోర్లు, 1 సిక్స్) ఎక్కువసేపు నిలవలేకపోగా, కోహ్లి జాగ్రత్తగా ఆడాడు. పవర్‌ప్లేలో జట్టు 55 పరుగులు చేసింది. తొలి వికెట్ పడ్డాక తర్వాతి నలుగురు బ్యాటర్లు తలా ఓ చేయి వేయడంలో జట్టు మెరుగైన స్కోరు సాధించగలిగింది. మయాంక్ అగర్వాల్ (18 బంతుల్లో 24; 2 ఫోర్లు, 1 సిక్స్), కెప్టెన్ రజత్ పాటీదార్ (16 బంతుల్లో 26; 1 ఫోర్, 2 సిక్స్‌లు), లివింగ్‌స్టోన్ (15 బంతుల్లో 25; 2 సిక్స్‌లు), జితేశ్ శర్మ (10 బంతుల్లో 24; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) కీలక పరుగులు సాధించారు. పంజాబ్ కట్టుదిట్టమైన బౌలింగ్‌తో పరుగులు ఆశించినంత వేగంగా రాకపోయినా... జేమీసన్ వేసిన 17వ ఓవర్లో 3 సిక్స్‌లతో 23 పరుగులు రాబట్టడంతో స్కోరు దాదాపు 200 వరకు వెళ్లింది. అర్ష్ దీప్ సింగ్ వేసిన ఆఖరి ఓవర్లో ఆర్సీబీ 3 వికెట్లు కోల్పోయింది. టపటపా... సీజన్ ఆసాంతం అద్భుత ఆరంభాలతో పంజాబ్ గెలుపులో కీలక పాత్ర పోషించిన ఓపెనర్లు ప్రియాన్ష్ ఆర్య (19 బంతుల్లో 24; 4 ఫోర్లు), ప్రభ్‌సిమ్రన్ సింగ్ (22 బంతుల్లో 26; 2 సిక్స్‌లు) అసలు పోరులో ఆ ధాటిని చూపించలేకపోయారు. తడబడుతూనే ఆడిన వీరిద్దరు తక్కువ వ్యవధిలో వెనుదిరగ్గా, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (1) పేలవ షాట్‌కు వెనుదిరగడంతో జట్టు విజయావకాశాలపై దెబ్బ పడింది. మరో ఎండ్‌లో దూకుడు ప్రదర్శించిన ఇన్‌గ్లిస్‌ను కృనాల్ పాండ్యా వెనక్కి పంపడంతో కింగ్స్ గెలుపు ఆశలు ఆవిరయ్యాయి. చివర్లో శశాంక్ పోరాడినా అప్పటికే ఆలస్యమైపోయింది. స్కోరు వివరాలు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: సాల్ట్ (సి) అయ్యర్ (బి) జేమీసన్ 16; కోహ్లి (సి అండ్ బి) అజ్మతుల్లా 43; మయాంక్ అగర్వాల్ (సి) అర్ష్ దీప్ (బి) చహల్ 24; పాటీదార్ (ఎల్బీ) (బి) జేమీసన్ 26; లివింగ్‌స్టోన్ (ఎల్బీ) (బి) జేమీసన్ 25; జితేశ్ శర్మ (బి) వైశాక్ 24; షెఫర్డ్ (ఎల్బీ) (బి) అర్ష్ దీప్ 17; కృనాల్ (సి) అయ్యర్ (బి) అర్ష్ దీప్ 4; భువనేశ్వర్ (సి) ప్రియాన్ష్ ఆర్య (బి) అర్ష్ దీప్ 1; యశ్ దయాళ్ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 190. వికెట్ల పతనం: 1–18, 2–56, 3–96, 4–131, 5–167, 6–171, 7–188, 8–189, 9–190. బౌలింగ్: అర్ష్ దీప్ సింగ్ 4–0–40–3, జేమీసన్ 4–0–48–3, అజ్మతుల్లా 4–0–35–1, వైశాక్ 4–0–30–1, యుజువేంద్ర చహల్ 4–0–37–1. పంజాబ్ కింగ్స్ ఇన్నింగ్స్: ప్రియాన్ష్ ఆర్య (సి) సాల్ట్ (బి) హాజల్‌వుడ్ 24; ప్రభ్‌సిమ్రన్ (సి) భువనేశ్వర్ (బి) కృనాల్ 26; ఇన్‌గ్లిస్ (సి) లివింగ్‌స్టోన్ (బి) కృనాల్ 39; అయ్యర్ (సి) జితేశ్ (బి) షెఫర్డ్ 1; నేహల్ వధేరా (సి) కృనాల్ (బి) భువనేశ్వర్ 15; శశాంక్ సింగ్ (నాటౌట్) 61; స్టొయినిస్ (సి) యశ్ దయాళ్ (బి) భువనేశ్వర్ 6; అజ్మతుల్లా (సి) (సబ్) భందగే (బి) యశ్ దయాళ్ 1; జేమీసన్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 184. వికెట్ల పతనం: 1–43, 2–72, 3–79, 4–98, 5–136, 6–142, 7–145. బౌలింగ్: భువనేశ్వర్ 4–0–38–2, యశ్ దయాళ్ 3–0–18–1, హాజల్‌వుడ్ 4–0–54–1, కృనాల్ పాండ్యా 4–0–17–2, సుయాశ్ శర్మ 2–0–19–0, షెఫర్డ్ 3–0–30–1. 6 ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) టైటిల్ గెలిచిన ఆరో భారతీయ కెపె్టన్‌గా రజత్ పాటీదార్ గుర్తింపు పొందాడు. గతంలో ధోని (చెన్నై సూపర్ కింగ్స్; 5 సార్లు), రోహిత్ శర్మ (ముంబై ఇండియన్స్; 5 సార్లు), గౌతమ్ గంభీర్ (కోల్‌కతా నైట్‌రైడర్స్; 2 సార్లు), శ్రేయస్ అయ్యర్ (కోల్‌కతా నైట్‌రైడర్స్; ఒకసారి), హార్దిక్ పాండ్యా (గుజరాత్ టైటాన్స్; ఒకసారి) ఈ ఘనత సాధించారు.10 ఇప్పటి వరకు జరిగిన 18 ఐపీఎల్ ఫైనల్స్‌లో 10 సార్లు తొలుత బ్యాటింగ్ చేసిన జట్టు విజేతగా నిలిచింది. ఎనిమిది సార్లు ఛేజింగ్ చేసిన జట్టుకు టైటిల్ లభించింది. 9 ఐపీఎల్–2025లో నమోదైన సెంచరీలు. మొత్తం 18 ఐపీఎల్ సీజన్లలో రెండుసార్లు మాత్రమే (2023లో 12 సెంచరీలు; 2024లో 14 సెంచరీలు) పది అంతకంటే ఎక్కువ సెంచరీలు వచ్చాయి.2 ముంబై ఇండియన్స్ తర్వాత ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)తోపాటు ఉమెన్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) టైటిల్ సాధించిన రెండో జట్టుగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు గుర్తింపు పొందింది. స్మృతి మంధాన కెప్టెన్సీలో బెంగళూరు జట్టు 2024లో డబ్ల్యూపీఎల్ టైటిల్ గెలిచింది.1 ఐపీఎల్ ఫైనల్లో రెండుసార్లు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచిన తొలి ఆటగాడిగా కృనాల్ పాండ్యా రికార్డుల్లోకెక్కాడు. 2017లో రైజింగ్ పుణే సూపర్ జెయింట్స్‌పై ముంబై ఇండియన్స్ విజయం సాధించిన సందర్భంలోనూ కృనాల్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. -
IPL 2025: ఈ సాలా కప్ ఆర్సీబీదే.. ఫైనల్లో పంజాబ్‌పై ఘన విజయం
ఎట్టకేలకు 18వ ప్రయత్నంలో ఆర్సీబీ ఐపీఎల్ టైటిల్ కల సాకారమైంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా పంజాబ్ కింగ్స్‌తో ఇవాళ (జూన్ 3) జరిగిన ఐపీఎల్ 2025 ఫైనల్లో ఆర్సీబీ విజయం సాధించింది. ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది. చివరి ఓవర్‌ను అర్షదీప్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. కేవలం 3 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు తీశాడు. ఇతర బౌలర్లలో జేమీసన్ 3, ఒమర్జాయ్, విజయ్‌కుమార్ వైశాక్, చహల్ తలో వికెట్ తీశారు. ఆర్సీబీ ఇన్నింగ్స్‌లో 35 బంతుల్లో 43 పరుగులు చేసిన విరాట్ కోహ్లినే టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మిగతా బ్యాటర్లలో సాల్ట్16, లివింగ్‌స్టోన్ 25, జితేశ్ శర్మ 24, మయాంక్ అగర్వాల్ 24, రజత్ పాటిదార్ 26, రొమారియో షెపర్డ్ 17, కృనాల్ పాండ్యా 4, భువనేశ్వర్ కుమార్ 1 పరుగు చేసి ఔటయ్యారు.అనంతరం 191 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన పంజాబ్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 184 పరుగులకే పరిమితమై 6 పరుగుల తేడాతో పరాజయంపాలైంది. ఇన్నింగ్స్ మధ్యలో ఒత్తిడికి లోనైన పంజాబ్ వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయి ఓటమి దిశగా సాగింది. ఆఖర్లో శశాంక్ సింగ్ (30 బంతుల్లో 61 నాటౌట్; 3 ఫోర్లు, 6 సిక్సర్లు) పంజాబ్‌ను గెలిపించేందుకు విశ్వ ప్రయత్నం చేశాడు. అయితే అప్పటకే మ్యాచ్ పంజాబ్ చేతుల్లో నుంచి జారి పోయింది. పంజాబ్ ఇన్నింగ్స్‌లో ప్రియాంశ్ ఆర్మ 24, ప్రభ్‌సిమ్రన్ సింగ్ 26, జోస్ ఇంగ్లిస్ 39, శ్రేయస్ అయ్యర్ 1, నేహల్ వధేరా 15, స్టోయినిస్ 6, ఒమర్జాయ్ 1 పరుగు చేసి ఔటయ్యారు.ఆర్సీబీ బౌలర్లులో కృనాల్ పాండ్యా (4-0-17-2) అద్బుతంగా బౌలింగ్ చేసి పంజాబ్ చేతుల్లో నుంచి మ్యాచ్‌ను లాగేసుకున్నాడు. భువనేశ్వర్ కుమార్ 2, యశ్ దయాల్, హాజిల్‌వుడ్, షెపర్డ్ తలో వికెట్ తీసుకున్నారు. VIRAT KOHLI IN TEARS - THE DREAM MOMENT FOR THE GOAT ❤️ pic.twitter.com/jPxUsccRUL— Johns. (@CricCrazyJohns) June 3, 2025ఈ గెలుపుతో ఆర్సీబీతో పాటు ఆ జట్టు స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి కల కూడా సాకారమైంది. ఐపీఎల్ ప్రారంభం నుంచి ఆర్సీబీకే ఆడుతున్న విరాట్ ఎట్టకేలకు 18వ సీజన్లో టైటిల్ కలను సాకారం చేసుకున్నాడు. విరాట్‌కు 18 నంబర్ మరోసారి కలిసొచ్చింది. విరాట్ జెర్సీ నంబర్ కూడా 18 అన్న విషయం తెలిసిందే. టైటిల్ గెలిచాక విరాట్ తీవ్రమైన భావోద్వేగానికి లోనయ్యాడు. -
IPL 2025 Final: పంజాబ్‌పై ఆర్సీబీ విజయం
పంజాబ్‌పై ఆర్సీబీ విజయంఅహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా పంజాబ్ కింగ్స్‌తో ఇవాళ (జూన్ 3) జరిగిన ఐపీఎల్ 2025 ఫైనల్లో ఆర్సీబీ విజయం సాధించింది. ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది. అనంతరం 191 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన పంజాబ్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 184 పరుగులకే పరిమితమై 6 పరుగుల తేడాతో పరాజయంపాలైంది.ఓటమి దిశగా పంజాబ్16.4వ ఓవర్- పంజాబ్ ఓటమి దిశగా సాగుతుంది. 142 పరుగుల వద్ద ఆ జట్టు ఆరో వికెట్ కోల్పోయింది. భువనేశ్వర్ కుమార్ బౌలింగ్‌లో సిక్సర్ బాదిన మరుసటి బంతికే స్టోయినిస్ (6) ఔటయ్యాడు. ఉత్కంఠగా సాగుతున్న మ్యాచ్పంజాబ్ గెలుపుకు 24 బంతుల్లో 55 పరుగులు చేయాలి. చేతిలో 6 వికెట్లు ఉన్నాయి. నేహల్ వధేరా (15), శశాంక్ సింగ్ (22) క్రీజ్‌లో ఉన్నారు. కష్టాల్లో పంజాబ్12.1వ ఓవర్- 98 పరుగుల వద్ద పంజాబ్ నాలుగో వికెట్ కోల్పోయింది. కృనాల్ పాండ్యా బౌలింగ్‌లో బౌండరీ లైన్ వద్ద లివింగ్‌స్టోన్ అద్భుతమైన క్యాచ్ పట్టడంతో జోష్ ఇంగ్లిస్ (39) ఔటయ్యాడు. మూడో వికెట్ కోల్పోయిన పంజాబ్9.4వ ఓవర్- 79 పరుగుల వద్ద పంజాబ్ మూడో వికెట్ కోల్పోయింది. రొమారియో షెపర్డ్ బౌలింగ్‌లో జితేశ్ శర్మ క్యాచ్ పట్టడంతో ఇన్ ఫామ్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ (1) ఔటయ్యాడు. రెండో వికెట్ కోల్పోయిన పంజాబ్8.3వ ఓవర్- 72 పరుగుల వద్ద పంజాబ్ రెండో వికెట్ కోల్పోయింది. కృనాల్ పాండ్యా బౌలింగ్‌లో భువనేశ్వర్ కుమార్‌కు క్యాచ్ ఇచ్చి ప్రభ్‌సిమ్రన్ సింగ్ (26) ఔటయ్యాడు. 8 ఓవర్ల తర్వాత పంజాబ్ స్కోర్ 70/1ప్రభ్‌సిమ్రన్ సింగ్ 25, జోష్ ఇంగ్లిస్ 16తొలి వికెట్ కోల్పోయిన పంజాబ్4.6వ ఓవర్- 43 పరుగుల వద్ద పంజాబ్ తొలి వికెట్ కోల్పోయింది. హాజిల్‌వుడ్ బౌలింగ్‌లో ఫిల్ సాల్ట్ అద్బుతమైన క్యాచ్ పట్టడంతో ప్రియాంశ్ ఆర్మ (24) ఔటయ్యాడు. టార్గెట్ 191.. 3 ఓవర్ల తర్వాత పంజాబ్ స్కోర్ 28/0ప్రభ్‌సిమ్రన్ 10, ప్రియాంశ్ ఆర్య 14200లోపు స్కోర్‌కే పరిమితమైన ఆర్సీబీటాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 200లోపు స్కోర్‌కే పరిమితమైంది. ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేయగలిగింది. చివరి ఓవర్‌ను అర్షదీప్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. కేవలం 3 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు తీశాడు. ఇతర బౌలర్లలో జేమీసన్ 3, ఒమర్జాయ్, విజయ్‌కుమార్ వైశాక్, చహల్ తలో వికెట్ తీశారు. ఆర్సీబీ ఇన్నింగ్స్‌లో ఎవరూ చెప్పుకోదగ్గ స్కోర్ చేయలేదు. 35 బంతుల్లో 43 పరుగులు చేసిన విరాట్ కోహ్లినే టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మిగతా బ్యాటర్లలో సాల్ట్16, లివింగ్‌స్టోన్ 25, జితేశ్ శర్మ 24, మయాంక్ అగర్వాల్ 24, రజత్ పాటిదార్ 26, రొమారియో షెపర్డ్ 17, కృనాల్ పాండ్యా 4, భువనేశ్వర్ కుమార్ 1 పరుగు చేసి ఔటయ్యారు. ఆరో వికెట్ కోల్పోయిన ఆర్సీబీ17.4వ ఓవర్-171 పరుగుల వద్ద ఆర్సీబీ ఆరో వికెట్ కోల్పోయింది. విజయ్‌కుమార్ వైశాక్ బౌలింగ్‌లో జితేశ్ శర్మ (24) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఐదో వికెట్ కోల్పోయిన ఆర్సీబీ16.5వ ఓవర్- 167 పరుగుల వద్ద ఆర్సీబీ ఐదో వికెట్ కోల్పోయింది. జేమీసన్ బౌలింగ్‌లో లివింగ్‌స్టోన్ ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. విరాట్ కోహ్లి ఔట్14.5వ ఓవర్- 131 పరుగుల వద్ద ఆర్సీబీకి భారీ షాక్ తగిలింది. స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి 35 బంతుల్లో 43 పరుగులు చేసి ఔటయ్యాడు. అజ్మతుల్లా ఒమర్జాయ్ విరాట్‌ను క్యాచ్ అండ్ బౌల్డ్ చేశాడు. 12 ఓవర్ల తర్వాత ఆర్సీబీ స్కోర్ 103/3విరాట్ కోహ్లి 32, లివింగ్‌స్టోన్ 3మూడో వికెట్ కోల్పోయిన ఆర్సీబీఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌లో ఆర్సీబీ మూడో వికెట్ కోల్పోయింది. కెప్టెన్ రజత్ పటిదార్ 26(16) పరుగుల వద్ద జెమీసన్ బౌలింగ్‌లో ఔటయ్యారు.పది ఓవర్లలో ఆర్సీబీ స్కోర్ 87/2పది ఓవర్లలో ఆర్సీబీ రెండు వికెట్లు కోల్పోయి 87 పరుగులు సాధించింది. 9 ఓవర్లలో ఆర్సీబీ స్కోర్ 80/2ఫైనల్ మ్యాచ్‌లో ఆర్సీబీ 9 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 80 పరుగులు సాధించింది. కోహ్లీ 21(18), రజత్ పటిదార్ 17(9) క్రీజులో ఉన్నారు.రెండో వికెట్ కోల్పోయిన ఆర్సీబీ6.2వ ఓవర్- 56 పరుగుల వద్ద ఆర్సీబీ రెండో వికెట్ కోల్పోయింది. చహల్ బౌలింగ్‌లో అర్షదీప్‌కు క్యాచ్ ఇచ్చి మయాంక్ అగర్వాల్ (24) ఔటయ్యాడు. 6 ఓవర్ల తర్వాత ఆర్సీబీ స్కోర్ 55/1మయాంక్ అగర్వాల్ 24, విరాట్ కోహ్లి 13తొలి వికెట్ కోల్పోయిన ఆర్సీబీ1.4వ ఓవర్- 18 పరుగుల వద్ద ఆర్సీబీ తొలి వికెట్ కోల్పోయింది. జేమీసన్ బౌలింగ్‌లో శ్రేయస్ అయ్యర్‌కు క్యాచ్ ఇచ్చి సాల్ట్ (16) ఔటయ్యాడు. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఇవాళ (జూన్ 3) జరుగుతున్న ఐపీఎల్ 2025 ఫైనల్లో పంజాబ్ కింగ్స్ టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో పంజాబ్, ఆర్సీబీ ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగుతున్నాయి.ఈ సీజన్లో ఐపీఎల్‌కు కొత్త ఛాంపియన్ రావడం ఖరారైపోయింది. ఆర్సీబీ, పంజాబ్ జట్లలో ఏ జట్టు గెలిచినా చరిత్రే అవుతుంది. ఇప్పటివరకు ఈ రెండు జట్లు ఒక్కసారి కూడా టైటిల్ సాధించలేకపోయాయి. ఆర్సీబీ 3 సార్లు, పంజాబ్ ఓసారి ఫైనల్‌కు చేరినా రన్నరప్‌తో సరిపెట్టుకున్నాయి. ఈ సీజన్లో ఇరు జట్లు పోటీపోటీగా రాణించి ఫైనల్ వరకు చేరాయి. లీగ్ దశలో పంజాబ్, ఆర్సీబీ సమంగా మ్యాచ్‌లు గెలిచి (14లో 9) పాయింట్ల పట్టికలో మొదటి రెండు స్థానాల్లో నిలిచాయి. లీగ్ దశలో ఇరు జట్ల మధ్య జరిగిన రెండు మ్యాచ్‌ల్లో తలో మ్యాచ్ గెలిచాయి. క్వాలిఫయర్-1లో పంజాబ్‌పై ఆర్సీబీ పైచేయి సాధించింది. జట్ల వివరాలు..రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ప్లేయింగ్ XI): ఫిలిప్ సాల్ట్, విరాట్ కోహ్లి, మయాంక్ అగర్వాల్, రజత్ పాటిదార్(సి), లియామ్ లివింగ్‌స్టోన్, జితేష్ శర్మ(w), రొమారియో షెపర్డ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, యశ్ దయాల్, జోష్ హాజిల్వుడ్ఇంపాక్ట్ సబ్స్: రసిఖ్ సలామ్, మనోజ్ భాండాగే, టిమ్ సీఫెర్ట్, స్వప్నిల్ సింగ్, సుయాష్ శర్మ.పంజాబ్ కింగ్స్ (ప్లేయింగ్ XI): ప్రియాంష్ ఆర్య, జోష్ ఇంగ్లిస్(w), శ్రేయాస్ అయ్యర్(c), నెహాల్ వధేరా, శశాంక్ సింగ్, మార్కస్ స్టోయినిస్, అజ్మతుల్లా ఒమర్జాయ్, కైల్ జామీసన్, విజయ్‌కుమార్ వైషాక్, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్ఇంపాక్ట్ సబ్స్: ప్రభ్సిమ్రాన్ సింగ్, ప్రవీణ్ దూబే, సూర్యాంశ్ షెడ్గే, జేవియర్ బార్ట్లెట్, హర్‌ప్రీత్ బ్రార్ -
IPL 2025 Final: అన్ని ఏఐ ప్లాట్‌ఫామ్‌లు 'ఆ జట్టే' ఛాంపియన్ అని అంటున్నాయి..!
ఆర్సీబీ, పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య ఐపీఎల్ 2025 సీజన్ ఫైనల్ ఇవాళ (జూన్ 3) రాత్రి అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్‌లో విజేతపై ఎవరి అంచనాలు వారికున్నాయి. ప్రదర్శనల ప్రకారం ఈ సీజన్లో ఇరు జట్లు సమవుజ్జీలుగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో పలానా జట్టు గెలుస్తుందని అంచనా వేయలేని పరిస్థితి ఉంది. ఈ సీజన్లో ఇరు జట్ల మధ్య జరిగిన 3 మ్యాచ్‌లు జరగగా.. ఆర్సీబీ 2, పంజాబ్ ఓ మ్యాచ్‌లో గెలిచాయి. దీని ఆధారంగా ఆర్సీబీకే స్వల్ప ఎడ్జ్ ఉందని చెప్పవచ్చు.మానవమాత్రుల అంచనాలను పక్కన పెడితే.. కృత్రిమ మేధ (Artificial Intelligence, AI) ఏం చెబుతుందో చూద్దాం. ప్రచుర్యంలో ఉన్న టాప్ ఏఐ ప్లాట్‌ఫామ్‌లను ఐపీఎల్ 2025 విజేత ఎవరని అడగగా.. దాదాపు అన్ని ఏఐ ప్లాట్‌ఫామ్‌లు (గ్రోక్, జెమిని, ఛాట్‌జీపీటీ) ముక్తకంఠంతో ఆర్సీబీని విజేతగా తేల్చాయి.X GROK: అందుబాటులో ఉన్న డేటా ప్రకారం, RCB ఆధిక్యంలో ఉన్నట్లు కనిపిస్తోంది. క్వాలిఫయర్ 1లో ఆర్సీబీ పంజాబ్‌పై ఎనిమిది వికెట్ల తేడాతో ఏకపక్ష విజయం సాధించింది. ఆ మ్యాచ్‌లో పంజాబ్‌ను 101 పరుగులకే ఆలౌట్ చేసి, 60 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించడం ద్వారా ఆర్సీబీ ఫైనల్లో తమ స్థానాన్ని ఖాయం చేసుకుంది. జోష్ హాజిల్‌వుడ్ (11 మ్యాచ్‌ల్లో 21 వికెట్లు), సుయాష్ శర్మ నేతృత్వంలోని RCB బౌలింగ్ అద్భుతంగా ఉంది. విరాట్ కోహ్లీ (55.81 సగటుతో 614 పరుగులు), ఫిల్ సాల్ట్ విస్ఫోటకమైన ఫామ్‌లో ఉన్నారు.అహ్మదాబాద్‌లో RCB యొక్క చారిత్రక ప్రదర్శన (మొదట బ్యాటింగ్ చేసిన ఎనిమిది మ్యాచ్‌ల్లో ఆరు మ్యాచ్‌లు గెలిచింది) మరియు ఒత్తిడిలో సామర్థ్యం వారికే స్వల్ప ఎడ్జ్‌ను ఇస్తాయి. డేవిడ్ వార్నర్, షేన్ వాట్సన్ వంటి నిపుణులు కూడా RCBకి మద్దతు ఇచ్చారు. వార్నర్ హాజిల్‌వుడ్‌ను ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా అంచనా వేశారు.అయితే, క్వాలిఫయర్ 2లో పంజాబ్ ముంబై ఇండియన్స్ నిర్దేశించిన 204 పరుగుల లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించి తమను తక్కువ అంచనా వేయొద్దని అలర్ట్ చేస్తుంది. ఆ మ్యాచ్‌లో శ్రేయస్ అయ్యర్ (87 నాటౌట్) అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి ఒంటిచేత్తో పంజాబ్‌ను గెలిపించాడు. కైల్ జేమిసన్, యుజ్వేంద్ర చహల్ వంటి బౌలర్లతో పంజాబ్ బౌలింగ్ కూడా పటిష్టంగా ఉంది. అయితే క్వాలిఫయర్-1లో ఆర్సీబీ చేతిలో పతనం ఒత్తిడిలో పంజాబ్ బలహీనతను సూచిస్తుంది.ప్రస్తుత ఫామ్, సమతుల్య జట్టు, ఈ సీజన్లో వారి జోరును పరిగణనలోకి తీసుకుంటే, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు IPL 2025 ఫైనల్‌ను గెలుస్తుందని అంచనా. ఆర్సీబీ బ్యాటింగ్ లోతు మరియు పెద్ద మ్యాచ్‌లలో అనుభవం వారిని ఛాంపియన్లుగా చేస్తాయి. -
'అతడితో పంజాబ్ జాగ్రత్తగా ఉండాలి.. లేదంటే వార్ వన్ సైడే'
ఐపీఎల్-2025 ఫైనల్లో అహ్మదాబాద్ వేదికగా తలపడేందుకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ సిద్దమయ్యాయి. ఈ తుది పోరుకు ఇరు జట్లు ఆస్త్రశస్త్రాలను సిద్దం చేసుకున్నాయి. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి తొలి ఐపీఎల్ టైటిల్‌ను సొంతం చేసుకోవాలని ఇరు జట్లు పట్టుదలతో ఉన్నాయి.ఈ హైవోల్జేజ్ మ్యాచ్‌కు ముందు భారత మాజీ క్రికెటర్ యోగరాజ్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. విరాట్ కోహ్లితో జాగ్రత్తగా ఉండాలని, పవర్ ప్లేలో ఔట్ కాకపోతే 250 పరుగులకు పైనా లక్ష్యమున్నా అతడు చేజ్ చేసేస్తాడని యోగరాజ్ పంజాబ్‌ను హెచ్చరించాడు."ఆరంభంలో విరాట్ కోహ్లిని ఔట్ చేయకపోతే పంజాబ్ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. అతడు పవర్‌ప్లేలో ఔట్ కాకపోతే 250 నుంచి 300 పరుగుల టార్గెట్‌నైనా కరిగించేగలడు. అయితే పంజాబ్ జట్టు అత్యుత్తమంగా ఉంది. వారు ఈ ఏడాది సీజన్లో అద్బుతంగా ఆడారు. ఈ మ్యాచ్‌లో పంజాబ్ గెలుస్తుందని నేను అనుకుంటున్నాను. కానీ మొదటి పది ఓవర్లలో కోహ్లి ఔట్ కాకపోతే మ్యాచ్ వన్‌సైడ్ అయినట్లే. పంజాబ్ జట్టుకు అద్భుతమైన కెప్టెన్ ఉన్నాడు. శ్రేయస్ అయ్యర్ ఒక టాలెంటెడ్ ప్లేయర్. ఈ మ్యాచ్ శ్రేయస్ అయ్యర్, కోహ్లి మధ్య పోటీ అనే చెప్పుకోవాలి.ఆర్సీబీని గెలిపించేందుకు కోహ్లి ఉంటే, పంజాబ్‌లో అయ్యర్ ఉన్నాడు. పంజాబ్ గెలవాలని నేను మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అని ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో యోగరాజ్ పేర్కొన్నాడు.తుది జట్ల వివరాలు (అంచనా) బెంగళూరు: రజత్ పాటీదార్ (కెప్టెన్), కోహ్లి, సాల్ట్, మయాంక్ అగర్వాల్, లివింగ్‌స్టోన్, జితేశ్ శర్మ, షెఫర్డ్, భువనేశ్వర్, కృనాల్ పాండ్యా, యశ్ దయాళ్, హాజల్‌వుడ్.పంజాబ్: శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), ప్రియాన్ష్ఆర్య, ప్రభ్‌సిమ్రన్, ఇన్‌గ్లిస్, నేహల్ వధేరా, స్టొయినిస్, శశాంక్ సింగ్, అజ్మతుల్లా, చహల్, జేమీసన్, అర్ష్‌దీప్ సింగ్. -
ఆర్సీబీకి మరో బిగ్ షాక్.. ఇంటికి వెళ్లిపోయిన డెంజరస్ ప్లేయర్?
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తమ 18 ఏళ్ల ఐపీఎల్ ట్రోఫీ కలను నేరవేర్చుకునేందుకు అడుగు దూరంలో ఉంది. ఐపీఎల్-2025 ఫైనల్లో మంగళవారం అహ్మదాబాద్ వేదికగా పంజాబ్ కింగ్స్‌తో ఆర్సీమీ తాడోపేడో తెల్చుకోనుంది. తొలి ఐపీఎల్ టైటిల్‌ను ముద్దాడాలని భావిస్తున్న బెంగళూరు జట్టుకు గట్టి ఎదురు దెబ్బ తగిలినట్లు తెలుస్తోంది. ఆ జట్టు విధ్వంసకర ఓపెనర్ ఫిల్ సాల్ట్ ఫైనల్ మ్యాచ్‌కు దూరం కానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అతడి భార్య మొదటి బిడ్డకు జన్మనివ్వనుంది. ఈ క్రమంలో సాల్ట్ తన ఫ్యామిలీతో ఉండాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఫైనల్‌కు ముందు రోజు ఆర్సీబీ నిర్వహించిన ప్రాక్టీస్ సెషన్లో అతడు పాల్గొనలేదు. దీంతో అతడు ఆఖరి మ్యాచ్‌లో ఆడేది అనుమానంగా మారింది."పంజాబ్‌తో మ్యాచ్ కోసం ఫిల్ సాల్ట్ ఆర్సీబీ జట్టుతో పాటు అహ్మదాబాద్‌కు చేరుకోలేదు. తన భార్య మొదటి బిడ్డకు జన్మనివ్వనుండడంతో ఇంగ్లండ్‌కు వెళ్లాలని సాల్ట్ ప్లాన్ చేసుకున్నాడు. ఈ విషయాన్ని ఇదివరకే ఆర్సీబీ మెనెజ్‌మెంట్‌కు తెలియజేశాడు" అని ఈఎస్సీఎన్ క్రిక్ ఇన్ ఫో తమ కథనంలో పేర్కొంది.అయితే ప్రీ మ్యాచ్ కాన్ఫరెన్స్‌లో ఈ విషయంపై కెప్టెన్ రజత్ పాటిదార్, ప్రధాన కోచ్ అండీ ఫ్లవర్ కనీసం స్పందించలేదు. కీలక మ్యాచ్‌కు ముందు ఈ విషయాన్ని రహస్యంగా ఉంచాలని కోరుకుంటున్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. ఒకవేళ తుది పోరుకు సాల్ట్ దూరమైతే ఆర్సీబీకి నిజంగా అది గట్టి ఎదురు దెబ్బే అవుతోంది. ఎందుకంటే ఈ ఏడాది సీజన్లో సాల్ట్ తన విధ్వంసకర బ్యాటింగ్‌తో ఆర్సీబీకి ఆదిరిపోయే ఆరంభాలను అందిస్తున్నాడు. . ఈ సీజన్లో ఇప్పటి వరకు 12 మ్యాచ్‌ల్లో 175.90 స్ట్రైక్‌రేటుతో 35.18 సగటుతో 387 పరుగులు చేశాడు. సాల్ట్ అందుబాటులో లేకపోతే అతడి స్ధానంలో కివీస్ ఆటగాడు టిమ్ సీఫర్ట్ తుది జట్టులోకి వచ్చే అవకాశముంది. -
వర్షం వల్ల ఫైనల్ రద్దు అయితే.. ఐపీఎల్ విజేత ఎవరంటే?
ఐపీఎల్-2025 తుది సమరానికి సమయం అసన్నమైంది. మంగళవారం అహ్మదాబాద్ వేదికగా జరగనున్న ఫైనల్ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ అమీతుమీ తెల్చుకోవడానికి సిద్దమయ్యాయి. ఈ తుది పోరులో ఎలాగైనా గెలిచి తొలి ఐపీఎల్ టైటిల్‌ను ముద్దాడాలని ఇరు జట్లు ఉవ్విళ్లూరుతోన్నాయి.ఇరు జట్లు సమవుజ్జీలగా ఉండడంతో విజేత ఎవరన్నది క్రికెట్ నిపుణులు అంచనా వేయలేకపోతున్నారు. ఈ ఆఖరి పోరు కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. కాగా క్వాలిఫయర్-2 లానే ఫైనల్‌కు కూడా వరుణుడు ఆటంకం కలిగించే అవకాశముంది. ఆదివారం ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ మధ్య జరిగిన సెకెండ్ క్వాలిఫయర్ మ్యాచ్ వర్షం కారణంగా దాదాపు రెండు గంటల ఆలస్యంగా ప్రారంభమైంది.ఇప్పుడు ఆక్యూవెధర్ రిపోర్ట్ ప్రకారం.. మంగళవారం కూడా ఆహ్మదాబాద్‌లో తేలికపాటి వర్షం కురిసే ఛాన్స్ ఉంది. ఈ క్రమంలో వర్షం వల్ల కానీ మరీ ఏ ఇతర కారణాల చేత ఫైనల్ మ్యాచ్ రద్దు అయితే ఏంటి పరిస్థితి అని అభిమానుల తెగ చర్చించుకుంటున్నారు.మ్యాచ్ రద్దయితే..?ఫైనల్‌కు వర్షం ఆటంకం కలిగిస్తే.. మిగిలిన నాకౌట్ మ్యాచ్‌ల మాదిరిగానే ఈ మ్యాచ్‌కు కూడా 120 నిమిషాల అదనపు సమయం ఇవ్వబడుతుంది. అయితే ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌కు మాత్రం బీసీసీఐ రిజర్వ్ డే కేటాయించింది. మంగళవారం(జూన్ 3) నాడు వర్షం కారణంగా పూర్తిగా మ్యాచ్ మొదులు కాకపోతే రిజర్వ్ డే అయిన బుధవారం మ్యాచ్‌ను నిర్వహిస్తారు. ఒకవేళ మ్యాచ్ ప్రారంభమై ఆగిపోతే.. ఆదివారం ఎక్కడైతే మ్యాచ్ ఆగిందో అక్కడి నుంచే ఆటను కొనసాగిస్తారు.ఒకవేళ బుధవారం(జూన్ 4) కూడా మ్యాచ్‌ను నిర్వహించేందుకు అవకాశం లేకుంటే.. పాయింట్ల పట్టికలో టాపర్‌గా ఉన్న పంజాబ్ కింగ్స్‌ను విజేతగా ప్రకటిస్తారు. కాగా కనీసం సూపర్ ఓవర్ నిర్వహించేందుకు భారత కాలమానం ప్రకారం రాత్రి 1:20 వరకు సమయం ఉంటుంది. కాగా ఐపీఎల్-2023 సీజన్ ఫైనల్ మ్యాచ్ ఫలితం రిజర్వ్ డే రోజునే తేలింది.చదవండి: మొదటి ట్రోఫీని ముద్దాడేందుకు... -
మొదటి ట్రోఫీని ముద్దాడేందుకు...
ఐపీఎల్ 2008లో మొదలైంది... తొలి సీజన్... రెండు.... మూడు... నాలుగు... ఇలా చూస్తూ చూస్తూ 17 సీజన్లు గడిచిపోయాయి. కానీ ఒక్కసారైనా విజేతగా నిలవాలనే ఆ రెండు జట్ల కోరిక మాత్రం నెరవేరలేదు. ఇన్నేళ్లలో ఎంతో మంది ఆటగాళ్లు మారారు... కోచ్‌లు కొత్తగా వచ్చారు, వ్యూహాలూ మారాయి... వైఫల్యాలతో నిష్క్రమించిన ప్రతీసారి వచ్చే ఏడు మనదే అవుతుందనే ఆశతో మళ్లీ సున్నా నుంచి మొదలు పెట్టడం, ఆపై కీలక దశలో కుప్పకూలడం సాధారణంగా మారిపోయాయి తప్ప ఐపీఎల్ టైటిల్ ద్రాక్ష అందనే లేదు... ఒక టీమ్ ఈ ప్రయత్నంలో మూడుసార్లు తుది పోరుకు చేరి నిరాశతో వెనుదిరగ్గా... మరో జట్టు ఒకే ఒక్కసారి ఆఖరి మెట్టుకు చేరి చతికిలపడింది... ఇప్పుడు ఆ రెండు టీమ్‌లలో ఒకరికి ఉపశమనం దక్కే సమయం వచ్చింది. ఐపీఎల్ 18వ సీజన్లో కొత్త జట్టు చాంపియన్‌గా నిలవడం ఖరారైన నేపథ్యంలో తొలిసారి ఈ టైటిల్‌ను ఎవరు అందుకుంటారనేది ఆసక్తికరం. మొదటి ట్రోఫీ వేటలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ), పంజాబ్ కింగ్స్ జట్లు నేడు జరిగే ఫైనల్ మ్యాచ్‌లో సర్వశక్తులూ ఒడ్డనున్నాయి. రాత్రి 7:30 నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం అహ్మదాబాద్: ఐపీఎల్–18 సీజన్లో 73 హోరాహోరీ మ్యాచ్‌ల తర్వాత ఈ ఏడాది విజేతను తేల్చే అసలు సమరానికి అంతా సిద్ధమైంది. నరేంద్ర మోదీ స్టేడియంలో నేడు జరిగే ఫైనల్ మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ), పంజాబ్ కింగ్స్ జట్లు తలపడనున్నాయి. లీగ్ దశలో ప్రదర్శనను చూస్తే ఇరు జట్లు సమ ఉజ్జీలుగా కనిపించాయి. రన్‌రేట్ కారణంగా పంజాబ్ మొదటి స్థానంలో, బెంగళూరు రెండో స్థానంలో నిలిచినా... రెండు టీమ్‌లూ సమంగా తొమ్మిదేసి విజయాలు సాధించి 19 పాయింట్లతో నిలిచాయి.‘ప్లే ఆఫ్స్’కు ముందు ప్రత్యర్థులుగా తలపడిన మ్యాచ్‌లలో ఇరు జట్లు ఒక్కో విజయాన్ని అందుకోగా... క్వాలిఫయర్–1లో పంజాబ్‌ను చిత్తు చేసి బెంగళూరు పైచేయి సాధించింది. ఈ నేపథ్యంలో ఆఖరి పోరులో గెలిచి పంజాబ్ లెక్క సరి చేస్తుందా లేదా ఆర్సీబీ ఆధిత్యం కొనసాగుతుందా చూడాలి. మొత్తంగా ఎవరు గెలిచినా తొలి ట్రోఫీతో సంబరాలు అంబరాన్ని తాకడం ఖాయం. సమష్టి ప్రదర్శనతో... ఐపీఎల్లో ఆర్సీబీ 2016లో ఆఖరిసారిగా ఫైనల్ చేరింది. ఆ మ్యాచ్‌లో ఓటమి తర్వాత ఆడిన ఎనిమిది సీజన్లలో జట్టు ప్రదర్శన అంతంత మాత్రమే. ముఖ్యంగా ఎవరో ఒక ఆటగాడి ప్రదర్శనపైనే ఆధారపడటం, అతను విఫలమైతే జట్టు కుప్పకూలడం తరచుగా సాగాయి. కానీ ఈ సీజన్ పూర్తి భిన్నంగా కనిపించింది. జట్టు పది మ్యాచ్‌లు గెలిస్తే తొమ్మిది మంది వేర్వేరు ఆటగాళ్లు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’లుగా నిలిచారు. ఒకరు విఫలమైతే మరొకరు ఆదుకోవడంతో కీలక సమయాల్లో కూడా జట్టు పట్టు వీడలేదు. ఇప్పుడు అదే శైలి, పోరాటతత్వం బెంగళూరును ఫైనల్‌కు చేర్చాయి. ఎప్పటిలాగే స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లి 600కు పైగా పరుగులు, 8 అర్ధసెంచరీలతో జట్టుకు చుక్కానిలా నిలిచాడు. అతని ఓపెనింగ్‌లో సరైన జోడీగా ఫిల్ సాల్ట్ 387 పరుగులతో శుభారంభాలు అందించాడు.మిగతా బ్యాటర్లలో షెఫర్డ్, జితేశ్, కృనాల్ పాండ్యా కూడా ప్రభావవంతమైన ఇన్నింగ్స్‌లు ఆడారు. కెపె్టన్ పాటీదార్ గత ప్రదర్శనలతో పోలిస్తే ఈసారి అంత అద్భుతంగా ఆడకపోయినా... కెపె్టన్‌గా తొలి సీజన్లో జట్టును ఫైనల్ చేర్చిన ఘనత అతనికి దక్కింది. మైదానంలో కోహ్లి అనుభవం, సూచనలు అండగా ఉన్న పాటీదార్ నాయకత్వంలో టీమ్ టైటిల్ గెలిస్తే ఆర్సీబీ అభిమానుల కోరిన నెరవేర్చిన ప్రత్యేక వ్యక్తిగా చరిత్రలో నిలిచిపోతాడు.బౌలింగ్‌లో కూడా టీమ్ పటిష్టంగా కనిపిస్తోంది. జట్టు బౌలింగ్ సత్తా తొలి క్వాలిఫయర్‌లో పంజాబ్‌పైనే కనిపించింది. ముఖ్యంగా హాజల్‌వుడ్ ఆ్రస్టేలియా నుంచి తిరిగి రావడం ఒక్కసారిగా జట్టు బలాన్ని పెంచింది. 21 వికెట్లతో అతను టీమ్ విజయాల్లో కీలకపాత్ర పోషించగా... భువనేశ్వర్, యశ్ దయాళ్ సహకరించారు. లెగ్ స్పిన్నర్ సుయాశ్ శర్మ కూడా పదునైన బౌలింగ్‌తో ప్రత్యర్థిని కట్టిపడేయగలడు. ఆ నలుగురితో కలిసి... తొలి క్వాలిఫయర్ మ్యాచ్‌ను మినహాయిస్తే సీజన్ ఆసాంతం పంజాబ్ ప్రదర్శన అద్భుతంగా సాగింది. ముఖ్యంగా రెండో క్వాలిఫయర్‌లో ముంబైని చిత్తు చేసిన తీరు ఆ జట్టు సామర్థ్యాన్ని చూపించింది. కెపె్టన్ శ్రేయస్ అయ్యర్ తన అసాధారణ బ్యాటింగ్‌తో 600కు పైగా పరుగులు చేయడంతో పాటు సమర్థ నాయకత్వంతో జట్టును ముందుండి నడిపిస్తున్నాడు. ఇద్దరు విదేశీ బ్యాటర్లు ఇన్‌గ్లిస్, స్టొయినిస్లకు కీలక సమయాల్లో ఒత్తిడిని దాటి చెలరేగిపోగల నైపుణ్యం ఉంది. అయితే పంజాబ్ విజయాల్లో కీలక పాత్ర మరో నలుగురు బ్యాటర్లు పోషిస్తున్నారు.వీరంతా జాతీయ జట్టుకు ఆడని ‘అన్క్యాప్డ్’ ఆటగాళ్లే కావడం విశేషం. ఓపెనర్లు ప్రియాన్ష్ఆర్య, ప్రభ్‌సిమ్రన్‌తో పాటు నేహల్ వధేరా, శశాంక్ సింగ్ ఈ మ్యాచ్‌లో రాణిస్తే కింగ్స్‌కు తిరుగుండదు. పంజాబ్ బౌలింగ్‌లో కాస్త తడబాటు కనిపిస్తోంది. అర్ష్‌దీప్ ఆశించిన స్థాయిలో సరైన ఆరంభాలు ఇవ్వడం లేదు. జేమీసన్ మెరుగ్గా ఉన్నా, మూడో పేసర్ అజ్మతుల్లా బౌలింగ్ కూడా సాధారణంగానే ఉంది. చహల్ స్పిన్ మరోసారి కీలకం కానుంది. ఫైనల్ ఒత్తిడిని అధిగమిస్తే పంజాబ్‌కు గెలుపు కష్టం కాబోదు. తుది జట్ల వివరాలు (అంచనా) బెంగళూరు: రజత్ పాటీదార్ (కెపె్టన్), కోహ్లి, సాల్ట్, మయాంక్ అగర్వాల్, లివింగ్‌స్టోన్, జితేశ్ శర్మ, షెఫర్డ్, భువనేశ్వర్, కృనాల్ పాండ్యా, యశ్ దయాళ్, హాజల్‌వుడ్. పంజాబ్: శ్రేయస్ అయ్యర్ (కెపె్టన్), ప్రియాన్ష్ఆర్య, ప్రభ్‌సిమ్రన్, ఇన్‌గ్లిస్, నేహల్ వధేరా, స్టొయినిస్, శశాంక్ సింగ్, అజ్మతుల్లా, చహల్, జేమీసన్, అర్ష్‌దీప్ సింగ్. పిచ్, వాతావరణం సీజన్ ఆరంభం నుంచి భారీ స్కోర్లు నమోదయ్యాయి. రెండో క్వాలిఫయర్ తర హాలోనే టాస్ గెలిచిన జట్టు ఛేదనకే మొగ్గు చూపవచ్చు. వర్ష సూచన ప్రస్తుతానికి లేదు కానీ వాన వస్తే అదనపు సమయంతో పాటు బుధవారం ‘రిజర్వ్ డే’ కూడా ఉంది. -
ఇదేంటి అయ్యర్.. సహచర ఆటగాడిని అలా తిడతావా? వీడియో వైరల్
తొలి ఐపీఎల్ టైటిల్‌ను ముద్దాడేందుకు పంజాబ్ కింగ్స్ అడుగు దూరంలో నిలిచింది. ఐపీఎల్ 18వ సీజన్ ఫైనల్లో పంజాబ్ కింగ్స్ అడుగుపెట్టింది. ఆదివారం జరిగిన క్వాలిఫయర్-2లో ముంబై ఇండియన్స్‌ను 5 వికెట్ల తేడాతో ఓడించిన పంజాబ్ కింగ్స్.. 11 ఏళ్ల తర్వాత తుది పోరుకు ఆర్హత సాధించింది. ఈ విజయంలో పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌ది కీలక పాత్ర. 204 పరుగుల భారీ లక్ష్య చేధనలో అయ్యర్ అద్బుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. సెకెండ్ డౌన్లో బ్యాటింగ్‌కు వచ్చిన శ్రేయస్.. ఆఖరి వరకు క్రీజులో ఉండి మ్యాచ్‌ను ముగించాడు. అయ్యర్ 41 బంతుల్లో 5 ఫోర్లు, 8 సిక్స్‌లతో 87 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్‌గా నిలిచాడు. మంగళవారం జరగనున్న ఫైనల్ మ్యాచ్‌లో ఆర్సీబీ, పంజాబ్ జట్లు తలపడనున్నాయి. ఇక ఇది ఇలా ఉండగా.. ఎప్పుడూ ప్రశాంతంగా కన్పించే శ్రేయస్ అయ్యర్ ఈ మ్యాచ్‌లో తన సహనాన్ని కోల్పోయాడు. తన సహచర ఆటగాడు శశాంక్ సింగ్‌ను ఆసభ్యపదజాలంతో దూషించాడు. మ్యాచ్ అనంతరం శ్రేయస్ అయ్యర్ తన టీమ్ మేట్స్‌కు, ప్రత్యర్ధి జట్టు ఆటగాళ్లకు కరచాలనం చేస్తూ ముందుకు సాగాడు. ఈ క్రమంలో శశాంక్ సింగ్‌కు షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు నిరాకరించాడు. అంతేకాకుండా పరుష పదజాలం వాడి అతడిని తిట్టాడు కూడా. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. అయితే శ్రేయస్ కోపానికి వెనక ఓ కారణం ఉంది.అసలేమి జరిగిదంటే?నేహాల్ వధేరా ఔటయ్యాక శశాంక్ సింగ్ క్రీజులోకి వచ్చాడు. అయితే కీలక సమయంలో బ్యాటింగ్‌కు వచ్చిన శశాంక్ కేవలం మూడు బంతులు మాత్రమే ఆడి రనౌటయ్యాడు. 17వ ఓవర్లో శశాంక్ (2) మిడ్ ఆన్ దిశగా షాట్ ఆడాడు. రన్ కోసం పరిగెత్తాడు. ఈ క్రమంలో అక్కడే ఉన్న ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా నాన్‌స్ట్రైక్ ఎండ్‌లో స్టంప్స్‌ను గిరాటేశాడు. థర్డ్ అంపైర్‌కు రిఫర్ చేయగా రిప్లేలో శశాంక్ బ్యాట్ క్రీజుకు వెలుపుల ఉన్నట్లు కన్పించింది.దీంతో థర్డ్ అంపైర్ ఔట్‌గా ప్రకటించాడు. అయితే శశాంక్ నిర్లక్ష్యంగా పరిగెత్తడంతోనే ఔటయ్యాడు. కనీసం డైవ్ చేసి ఉన్నా ఔటయ్యే ప్రమాదం నుంచి ఈ పంజాబ్ ఆటగాడు తప్పించుకుని ఉండేవాడు. కీలకమైన సమయంలో శశాంక్ నిర్లక్ష్యంగా రనౌట్ కావడమే అయ్యర్ అగ్రహానికి కారణమైంది.చదవండి: IPL 2025: శ్రేయస్ అయ్యర్‌కు భారీ షాకిచ్చిన బీసీసీఐAfter the match is over, Shreyas Iyer is saying something angrily to Shashank Singh, tell me what is he saying?#shreyashiyar |#ShashankSingh #IPLPlayoffs |#PBKSvsMI pic.twitter.com/Eo7s7YHSgn— Irfan isak shaikh (@irfan_speak786) June 1, 2025 -
శ్రేయస్ అయ్యర్‌కు భారీ షాకిచ్చిన బీసీసీఐ..
ఐపీఎల్-2025 సీజన్ ఫైనల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడే జట్టు ఏదో తేలిపోయింది. ఆదివారం అహ్మదాబాద్ వేదికగా జరిగిన క్వాలిఫయర్-2లో ముంబై ఇండియన్స్‌ను 5 వికెట్ల తేడాతో చిత్తు చేసిన పంజాబ్ కింగ్స్.. తుది పోరుకు ఆర్హత సాధించింది.మంగళవారం(జూన్ 3)న జరగనున్న ఫైనల్లో ఆర్సీబీ, పంజాబ్ తొలి టైటిల్ కోసం అమీతుమీ తెల్చుకోనున్నాయి. ఇక ఇది ఇలా ఉండగా.. గెలుపు జోష్‌లో ఉన్న పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌కు భారీ షాక్ తగిలింది. ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో స్లో ఓవర్ రేటు మెయింటిన్ చేసినందుకుగానూ అయ్యర్‌కు బీసీసీఐ జరిమానా విధించింది. ఈ ఏడాది సీజన్లో పంజాబ్ స్లో ఓవర్ రేట్‌ను నమోదు చేయడం ఇది రెండోసారి. దీంతో ఐపీఎల్ ప్రవర్తనా నియమావళి ప్రకారం అయ్యర్‌కు రూ.24 లక్షల ఫైన్ విధించారు. "శ్రేయస్ అయ్యర్‌కు జరిమానా విధించాం. నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్‌ను కొనసాగించినందుకు ఈ నిర్ణయం తీసుకున్నాము. ఇది రెండో సారి అయినందున ఆర్టికల్ 2.22 ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రకారం శ్రేయస్‌కు రూ. 24 లక్షలు ఫైన్ వేశాము.మిగిలిన సభ్యులకు ఒక్కొక్కరికి వ్యక్తిగతంగా రూ. 6 లక్షలు లేదా వారి మ్యాచ్ ఫీజులో 25 శాతం, ఇందులో ఏది తక్కువైతే అది జరిమానా విధించడం జరిగింది’ అని ఐపీఎల్ అధికారులు వెల్లడించారు. కాగా ఈ మ్యాచ్‌లో శ్రేయస్ అయ్యర్ అద్బుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. అయ్యర్ 41 బంతుల్లో 5 ఫోర్లు, 8 సిక్స్‌లతో 87 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. అతడి విధ్వంసకర ఇన్నింగ్స్ ఫలితంగా 204 పరుగుల లక్ష్యాన్ని పంజాబ్ కేవలం 19 ఓవర్లలోనే చేధించింది.చదవండి: అతడొక అత్యద్భుతం.. మేము అనుకున్నది జరగలేదు: హార్దిక్ -
చరిత్ర సృష్టించిన శ్రేయస్ అయ్యర్..
ఐపీఎల్-2025లో పంజాబ్ కింగ్స్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఆదివారం జరిగిన క్వాలిఫయర్ 2లో ముంబై ఇండియన్స్‌ను 5 వికెట్ల తేడాతో చిత్తు చేసిన పంజాబ్.. 11 ఏళ్ల తర్వాత ఈ క్యాష్ రిచ్ లీగ్ ఫైనల్లో అడుగుపెట్టింది. ముంబై ఇండియన్స్ నిర్ధేశించిన 204 పరుగుల లక్ష్యాన్ని పంజాబ్ కింగ్స్ కేవలం 5 వికెట్లు మాత్రమే కోల్పోయి 19 ఓవర్లలో చేధించింది. పంజాబ్ బ్యాటర్లలో శ్రేయస్ అయ్యర్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. శ్రేయస్ అయ్యర్ (41 బంతుల్లో 87 నాటౌట్; 5 ఫోర్లు, 8 సిక్స్‌లు) ఆజేయంగా నిలిచి తన జట్టును ఫైనల్‌కు చేర్చాడు. ఈ విజయంతో శ్రేయస్ అయ్యర్ ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు.18 ఏళ్లలో ఒకే ఒక్కడు..18 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలోనే మూడు వేర్వేరు జట్లను ఫైనల్ చేర్చిన తొలి కెప్టెన్‌గా శ్రేయస్ రికార్డులకెక్కాడు. 2018లో ఢిల్లీ క్యాపిటల్స్ (DC)తో తన ఐపీఎల్ కెరీర్‌ను ప్రారంభించిన శ్రేయస్.. 2020 సీజన్లో కెప్టెన్‌గా ఢిల్లీ జట్టును ఫైనల్‌కు చేర్చాడు. దురుదృష్టవశాత్తూ ఆఖరి మెట్టుపై ఢిల్లీ బోల్తా పడింది. అనంతరం ఐపీఎల్-2024 సీజన్లో శ్రేయస్ కెప్టెన్‌గా కోల్‌కతా నైట్‌రైడర్స్‌ను ఫైనల్‌కు తీసుకెళ్లడమే కాకుండా టైటిల్ కూడా అందించాడు. ఇప్పుడు పంజాబ్‌ను ఫైనల్‌కు చేర్చి ఈ ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. ఇక మంగళవారం అహ్మదాబాద్ వేదికగా జరగనున్న తుది పోరులో పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడనున్నాయి.చదవండి:అతడొక అత్యుద్భుతం.. మేము అనుకున్నది జరగలేదు: హార్దిక్ -
క్వాలిఫయర్-2లో ముంబైపై పంజాబ్ ఘనవిజయం
-
PBKS VS MI, Qualifier 2: ఫైనల్లో పంజాబ్ కింగ్స్
అహ్మదాబాద్: ఐపీఎల్లో ఫైవ్‌స్టార్ చాంపియన్లు (ముంబై, చెన్నై), మూడుసార్లు విజేత (కోల్‌కతా)ను చూసిన ఫ్యాన్స్ ఈ సీజన్లో కొత్త చాంపియన్‌ను చూడబోతున్నారు. తొలి క్వాలిఫయర్‌లో తేలిపోయిన పంజాబ్ కింగ్స్ రెండో క్వాలిఫయర్‌లో జూలు విదిల్చింది. 11 ఏళ్ల తర్వాత (2014) ఐపీఎల్లో ఫైనల్‌కు చేరింది. ఆదివారం శ్రేయస్ అయ్యర్ నేతృత్వంలోని పంజాబ్ కింగ్స్ 5 వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్‌ను ఇంటికి పంపింది. రేపు జరిగే ఫైనల్లో బెంగళూరు, పంజాబ్ తొలి ఐపీఎల్ టైటిల్ కోసం తలపడతాయి. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ముంబై నిరీ్ణత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది. సూర్యకుమార్ యాదవ్ (26 బంతుల్లో 44; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు), ఠాకూర్ తిలక్ వర్మ (29 బంతుల్లో 44; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), నమన్ ధీర్ (18 బంతుల్లో 37; 7 ఫోర్లు) దంచేశారు. అజ్మ తుల్లా ఒమర్జాయ్ 2 వికెట్లు తీశాడు. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన పంజాబ్ 19 ఓవర్లలో 5 వికెట్లకు 207 పరుగులు చేసి గెలిచింది. నాయకుడు శ్రేయస్ అయ్యర్ (41 బంతుల్లో 87 నాటౌట్; 5 ఫోర్లు, 8 సిక్స్‌లు) జట్టు గెలిచేదాకా నడిపించాడు. నేహల్ వధేరా (29 బంతుల్లో 48; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించాడు. గెలిపించిన అయ్యర్ పంజాబ్‌కు అంతపెద్ద లక్ష్యం ఛేదించడానికి అవసరమైన శుభారంభం దక్కలేదు. మూడో ఓవర్లో ప్రభ్‌సిమ్రన్ (6), కాసేపటికే ప్రియాన్ష్ ఆర్య (10 బంతుల్లో 20; 2 ఫోర్లు, 1 సిక్స్) దూకుడుకు చుక్కెదురైంది. దీంతో పవర్‌ప్లేలోనే ఓపెనర్ల వికెట్లను కోల్పోయిన 64/2 స్కోరు చేసింది. ఇన్‌గ్లిస్ (21 బంతుల్లో 38; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) దంచేసే ఆటను పాండ్యా అడ్డుకున్నాడు. దీంతో 72 పరుగులకే టాపార్డర్ వికెట్లను కోల్పోయింది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, నేహల్ వాధేరా జట్టు స్కోరును వంద దాటించారు. 12 ఓవర్లలో 109/3 స్కోరు చేసిన పంజాబ్... విజయానికి 48 బంతుల్లో 95 పరుగులు కష్టమనిపించింది. టాప్లీ 13వ ఓవర్లో అయ్యర్ కొట్టిన వరుస 3 సిక్స్‌లు, ఆ వెంటనే బౌల్ట్ బౌలింగ్‌లో వాధేరా కొట్టిన బౌండరీలతో ఈ రెండు ఓవర్లలోనే 33 పరుగులు సాధించడంతో కింగ్స్ రేసులో పడింది. నాలుగో వికెట్‌కు 84 పరుగులు జోడించాక వాధేర అవుటయ్యాడు. శశాంక్ (2) రనౌటైనా... 27 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్న అయ్యర్ భారీ సిక్స్‌లతో కింగ్స్‌ను గెలిపించాడు. దంచేసిన తిలక్, సూర్య రోహిత్ (8), బెయిర్‌స్టో (38)ల తర్వాత తిలక్, సూర్యకుమార్ అడపాదడపా మెరుపులతో జట్టు స్కోరు 10 ఓవర్లలో 100 పరుగులు దాటింది. ఈ జోడీ నిలబడి దూకుడు పెంచడంతో పరుగులు వేగంగా వచ్చాయి. చహల్ ఓవర్లో సిక్సర్ బాదిన సూర్యకుమార్... జేమీసన్ ఓవర్లో రెండు బౌండరీలు కొట్టాడు. ఇదే జోరుతో 4, 6 కొట్టిన అతన్ని చహల్ అవుట్ చేయడంతో మూడో వికెట్‌కు 72 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. మరుసటి ఓవర్లోనే తిలక్‌ను జేమీసన్ పెవిలియన్ చేర్చాడు. అయితే నమన్ ధీర్ ధనాధన్ బౌండరీలతో ఓవర్‌కు సగటున 10 రన్‌రేట్‌తో ముంబై స్కోరు దూసుకెళ్లింది. ఆఖరి ఓవర్లో నమన్ అవుట్ కాగా జట్టు 200 మార్క్ దాటింది. స్కోరు వివరాలు ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: రోహిత్ శర్మ (సి) వైశాక్ (బి) స్టొయినిస్ 8; బెయిర్‌స్టో (సి) ఇన్‌గ్లిస్ (బి) వైశాక్ 38; తిలక్ వర్మ (సి) ప్రియాన్ష్ (బి) జేమీసన్ 44; సూర్యకుమార్ (సి) వధేరా (బి) చహల్ 44; హార్దిక్ పాండ్యా (సి) ఇన్‌గ్లిస్ (బి) అజ్మతుల్లా 15; నమన్ (సి) స్టొయినిస్ (బి) అజ్మతుల్లా 37; రాజ్ (నాటౌట్) 8; సాంట్నర్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 203. వికెట్ల పతనం: 1–19, 2–70, 3–142, 4–142, 5–180, 6–197. బౌలింగ్: అర్‡్షదీప్ సింగ్ 4–0–44–0, జేమీసన్ 4–0–30–1, స్టొయినిస్ 1–0–14–1, అజ్మతుల్లా 4–0–43–2, వైశాక్ 3–0–30–1, చహల్ 4–0–39–1. పంజాబ్ కింగ్స్ ఇన్నింగ్స్: ప్రియాన్ష్ (సి) హార్దిక్ (బి) అశ్వని 20; ప్రభ్‌సిమ్రన్ (సి) టాప్లీ (బి) బౌల్ట్ 6; ఇన్‌గ్లిస్ (సి) బెయిర్‌స్టో (బి) హార్దిక్ 38; శ్రేయస్ అయ్యర్ (నాటౌట్) 87; వధేరా (సి) సాంట్నర్ (బి) అశ్వని 48; శశాంక్ (రనౌట్) 2; స్టొయినిస్ (నాటౌట్) 2; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (19 ఓవర్లలో 5 వికెట్లకు) 207. వికెట్ల పతనం: 1–13, 2–55, 3–72, 4–156, 5–173. బౌలింగ్: బౌల్ట్ 4–0–38–1, టాప్లీ 3–0– 40–0, బుమ్రా 4–0–40–0, అశ్వని 4–0–55–2, సాంట్నర్ 2–0–15–0, పాండ్యా 2–0–19–1. -
IPL 2025 Qualifier 2, PBKS VS MI: మ్యాచ్ రద్దైతే పరిస్థితి ఏంటి..?
ఐపీఎల్ 2025లో భాగంగా ఇవాళ (జూన్ 1) పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ మధ్య క్వాలిఫయర్-2 మ్యాచ్ జరగాల్సి ఉంది. అయితే ఈ మ్యాచ్‌కు వరుణుడు వరుస విరామాల్లో అడ్డుపడుతున్నాడు. షెడ్యూల్ ప్రకారం రాత్రి 7:30 గంటలకు ప్రారంభం కావాల్సి మ్యాచ్ 9 గంటల వరకు ప్రారంభం కాలేదు. 9 గంటల ప్రాంతంలో వర్షం జోరుగా కురుస్తుంది. 9:30 గంటల లోపు మ్యాచ్ ప్రారంభమైతేనే ఎలాంటి ఓవర్ల కోత లేకుండా మ్యాచ్ జరుగుతుంది. అయితే ప్రస్తుత పరిస్థితి చూస్తే ఓవర్ల కోత లేకుండా మ్యాచ్ జరిగేలా లేదు. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరుగనున్న ఈ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. టాస్ సమయంలో లేని వర్షం మ్యాచ్ ప్రారంభ సమయానికి జోరందుకుంది.మ్యాచ్ రద్దైతే ఏంటి పరిస్థితి..?ఒకవేళ ఈ మ్యాచ్ పూర్తిగా రద్దైతే పాయింట్ల పట్టికలో మెరుగైన స్థానంలో ఉండటం చేత పంజాబ్ కింగ్స్ ఫైనల్‌కు చేరుతుంది. ప్లే ఆఫ్స్‌లో మ్యాచ్‌లకు రిజర్వ్ డే లేదు. కనీసం 5 ఓవర్ల మ్యాచ్ అయినా జరుగుతుందేమో చూడాలి.ఈ మ్యాచ్ కోసం ఇరు జట్లు చెరో మార్పు చేశాయి. ముంబై తరఫున గ్లీసన్ స్థానంలో రీస్ టాప్లే.. పంజాబ్ తరఫున హర్‌ప్రీత్ బ్రార్ స్థానంలో చహల్ తుది జట్టులోకి వచ్చారు. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు జూన్ 3న జరిగే ఫైనల్లో ఆర్సీబీతో తలపడనుంది.జట్ల వివరాలు..పంజాబ్ కింగ్స్ (ప్లేయింగ్ XI): ప్రియాంష్ ఆర్య, జోష్ ఇంగ్లిస్(w), శ్రేయాస్ అయ్యర్(c), నెహాల్ వధేరా, మార్కస్ స్టోయినిస్, శశాంక్ సింగ్, అజ్మతుల్లా ఒమర్జాయ్, కైల్ జామీసన్, విజయ్‌కుమార్ వైషాక్, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్ఇంపాక్ట్ సబ్స్: ప్రభ్సిమ్రాన్ సింగ్, ప్రవీణ్ దూబే, సూర్యాంశ్ షెడ్గే, జేవియర్ బార్ట్లెట్, హర్‌ప్రీత్ బ్రార్ముంబై ఇండియన్స్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ, జానీ బెయిర్‌స్టో(w), సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా(c), నమన్ ధీర్, మిచెల్ సాంట్నర్, రాజ్ బావా, ట్రెంట్ బౌల్ట్, జస్ప్రీత్ బుమ్రా, రీస్ టాప్లీఇంపాక్ట్ సబ్స్: అశ్వని కుమార్, కృష్ణన్ శ్రీజిత్, రఘు శర్మ, రాబిన్ మింజ్, బెవోన్ జాకబ్స్ -
PBKS VS MI, Qualifier 2 Updates: ముంబైపై పంజాబ్ విజయం
ఫైనల్లో పంజాబ్19 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేదించి ఫైనల్‌కు చేరిన పంజాబ్ కింగ్స్.ఐదో వికెట్ కోల్పోయిన పంజాబ్169 పరుగుల వద్ద పంజాబ్ తన 5వ వికెట్ (షశాంక్) కోల్పోయింది.నాలుగో వికెట్ కోల్పోయిన పంజాబ్ 156 పరుగుల వద్ద పంజాబ్ తన 4వ వికెట్ (నెహాల్) కోల్పోయింది.మూడో వికెట్ కోల్పోయిన పంజాబ్ 72 పరుగుల వద్ద పంజాబ్ తన 3వ వికెట్ (జోష్) కోల్పోయింది.రెండో వికెట్ కోల్పోయిన పంజాబ్55 పరుగుల వద్ద పంజాబ్ తన 2వ వికెట్ (ప్రియాన్ష్) కోల్పోయింది.మొదటి వికెట్ కోల్పోయిన పంజాబ్3వ ఓవర్లో పంజాబ్ కింగ్స్ తన మొదటి వికెట్ కోల్పోయింది.పంజాబ్ టార్గెట్ 204 పరుగులుముంబై ఇండియన్స్ తమ నిర్ణీత 20 ఓవర్లలో 203 పరుగులు చేశారు. దాంతో పంజాబ్‌కు 204 పరుగులు టార్గెట్‌గా నిర్దేశించారు.ఆరో వికెట్ కోల్పోయిన ముంబైచివరి ఓవర్లో ముంబై ఇండియన్స్ 6వ వికెట్ కోల్పోయింది. నిర్ణీత 20 ఓవర్లలో 203 పరుగులు చేశారుఐదో వికెట్ కోల్పోయిన ముంబై17.6వ ఓవర్- 180 పరుగుల వద్ద ముంబై ఇండియన్స్ ఐదో వికెట్ కోల్పోయింది. అజ్మతుల్లా బౌలింగ్‌లో హార్దిక్ పాండ్యా (15) ఔటయ్యాడు. నాలుగో వికెట్ కోల్పోయిన ముంబై14.1వ ఓవర్- 142 పరుగుల వద్ద ముంబై ఇండియన్స్ నాలుగో వికెట్ కోల్పోయింది. జేమీసన్ బౌలింగ్‌లో తిలక్ వర్మ (44) ఔటయ్యాడు. ధాటిగా ఆడుతున్న తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్తిలక్ వర్మ (43), సూర్యకుమార్ యాదవ్ (26) ధాటిగా ఆడుతున్నారు. ఫలితంగా ముంబై 12 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 123 పరుగులు చేసింది. రెండో వికెట్ కోల్పోయిన ముంబై6.6వ ఓవర్- 70 పరుగుల వద్ద ముంబై ఇండియన్స్ రెండో వికెట్ కోల్పోయింది. విజయ్ కుమార్ వైశాఖ్ బౌలింగ్‌లో జోస్ ఇంగ్లిస్‌కు క్యాచ్ ఇచ్చి జానీ బెయిర్‌స్టో (38) ఔటయ్యాడు. 5 ఓవర్ల తర్వాత ముంబై స్కోర్ /1జానీ బెయిర్‌స్టో 24, తిలక్ వర్మ 13 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు.తొలి వికెట్ కోల్పోయిన ముంబై.. రోహిత్ ఔట్2.2వ ఓవర్- 19 పరుగుల వద్ద ముంబై తొలి వికెట్ కోల్పోయింది. స్టోయినిస్ బౌలింగ్‌లో వైశాఖ్‌కు క్యాచ్ ఇచ్చి రోహిత్ శర్మ (8) ఔటయ్యాడు.రోహిత్ శర్మకు లైఫ్1.5వ ఓవర్- రోహిత్ శర్మకు రెండో ఓవర్లోనే లైఫ్ లభించింది. జేమీసన్ బౌలింగ్‌లో ఒమర్జాయ్ కాస్త కష్టతరమైన క్యాచ్ డ్రాప్ చేశాడు. 9:45 గంటలకు ప్రారంభమైన మ్యాచ్.. ఎలాంటి ఓవర్ల కోత లేదువర్షం కారణంగా 2 గంటల 15 నిమిషాలు ఆలస్యమైన మ్యాచ్ ఎట్టకేలకు 9:45 గంటలకు ప్రారంభమైంది. ఆలస్యంగా ప్రారంభమైనా ఓవర్లలో ఎలాంటి కోత లేదు. తొలి ఇన్నింగ్స్ 11:15 గంటల వరకు జరుగుతుంది. ఇన్నింగ్స్ విరామ సమయాన్ని 10 నిమిషాలకే కుదించారు. 11:25 గంటలకు సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభమవుతుంది. 12:55 గంటల వరకు కొనసాగే అవకాశం ఉంది. ఐపీఎల్ 2025లో ఇవాళ (జూన్ 1) క్వాలిఫయర్-2 మ్యాచ్ జరుగుతుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ కోసం ఇరు జట్లు చెరో మార్పు చేశాయి. ముంబై తరఫున గ్లీసన్ స్థానంలో రీస్ టాప్లే.. పంజాబ్ తరఫున చహల్ తుది జట్టులోకి వచ్చారు. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు జూన్ 3న జరిగే ఫైనల్లో ఆర్సీబీతో తలపడనుంది.జట్ల వివరాలు..పంజాబ్ కింగ్స్ (ప్లేయింగ్ XI): ప్రియాంష్ ఆర్య, జోష్ ఇంగ్లిస్(w), శ్రేయాస్ అయ్యర్(c), నెహాల్ వధేరా, మార్కస్ స్టోయినిస్, శశాంక్ సింగ్, అజ్మతుల్లా ఒమర్జాయ్, కైల్ జామీసన్, విజయ్‌కుమార్ వైషాక్, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్ఇంపాక్ట్ సబ్స్: ప్రభ్సిమ్రాన్ సింగ్, ప్రవీణ్ దూబే, సూర్యాంశ్ షెడ్గే, జేవియర్ బార్ట్లెట్, హర్‌ప్రీత్ బ్రార్ముంబై ఇండియన్స్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ, జానీ బెయిర్‌స్టో(w), సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా(c), నమన్ ధీర్, మిచెల్ సాంట్నర్, రాజ్ బావా, ట్రెంట్ బౌల్ట్, జస్ప్రీత్ బుమ్రా, రీస్ టాప్లీఇంపాక్ట్ సబ్స్: అశ్వని కుమార్, కృష్ణన్ శ్రీజిత్, రఘు శర్మ, రాబిన్ మింజ్, బెవోన్ జాకబ్స్ -
ఫైనల్స్ కి చేరేదెవరు?
-
నేడు IPL 18వ సీజన్ లో మరో ఆసక్తికర పోరు
-
IPL 2025 Qualifier 2: పంజాబ్‌కు గుడ్ న్యూస్.. ముంబైకి బ్యాడ్ న్యూస్?
ఐపీఎల్-2025లో క్వాలిఫయర్-2కు సమయం అసన్నమైంది. ఆదివారం సెకెండ్ క్వాలిఫయర్‌లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్లు తాడోపేడో తెల్చుకోనున్నాయి. ఈ కీలక మ్యాచ్‌కు పంజాబ్ కింగ్స్‌కు గుడ్ న్యూస్ అందింది. గాయం కారణంగా గత కొన్ని మ్యాచ్‌లకు దూరమైన యుజ్వేంద్ర చాహల్.. ఇప్పుడు పూర్తి ఫిట్నెస్ సాధించినట్లు తెలుస్తోంది. దీంతో క్వాలిఫయర్-2కు చాహల్ అందుబాటులో ఉండనున్నాడని రేవ్‌స్పోర్ట్స్ తమ రిపోర్ట్‌లో పేర్కొంది. కాగా చాహల్ గాయం నుంచి కోలుకుపోవడం పంజాబ్‌కు కలిసొచ్చే ఆంశంగా చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ సీజన్లో చాహల్ పంజాబ్ జట్టుకు ప్రధాన స్పిన్నర్‌గా ఉన్నాడు. ఓ హ్యాటిక్ కూడా అతడి ఖాతాలో ఉంది. ఈ ఏడాది సీజన్లో ఇప్పటివరకు 12 మ్యాచ్‌లు ఆడిన చాహల్.. 9.56 ఏకానమితో 14 వికెట్లు పడగొట్టాడు.చాహర్ డౌటే..మరోవైపు ఈ మ్యాచ్‌కు కూడా ముంబై ఇండియన్స్ స్టార్ పేసర్ దీపక్ చాహర్ అందుబాటులో ఉండేది అనుమానమే. తొడ కండరాల గాయంతో బాధపడుతున్న చాహర్.. ఇంకా పూర్తి ఫిట్నెస్ సాధించనట్లు తెలుస్తోంది. ఈ రైట్ ఆర్మ్ పేసర్ కోచింగ్ స్టాప్, కోచ్ మహేల జయవర్ధనేతో కలిసి ఫిట్నెస్ కసరత్తులు చేస్తున్నట్లు రేవ్‌స్పోర్ట్స్ తమ కథనంలో రాసుకొచ్చింది. కానీ అతడు ఇంకా కుంటుతున్నట్లు సదరు వెబ్సైట్ రాసుకొచ్చింది. ఒకవేళ ఈ మ్యాచ్‌కు చాహర్ దూరమైతే.. యువ పేసర్ అశ్వినీ కుమార్‌కు మరోసారి అవకాశం లభించనుంది.తుది జట్లు(అంచనా)పంజాబ్ కింగ్స్ప్రభ్సిమ్రాన్ సింగ్, ప్రియాంష్ ఆర్య, శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), జోష్ ఇంగ్లిస్ (వికెట్ కీపర్), నెహాల్ వధేరా, శశాంక్ సింగ్, మార్కస్ స్టోయినిస్, అజ్మతుల్లా ఒమర్జాయ్, హర్‌ప్రీత్ బ్రార్, అర్ష్‌దీప్ సింగ్, కైల్ జామీసన్, చాహల్ముంబై ఇండియన్స్రోహిత్ శర్మ, జానీ బెయిర్‌స్టో (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), నమన్ ధీర్, రాజ్ బావా, మిచెల్ సాంట్నర్, ట్రెంట్ బౌల్ట్, జస్ప్రీత్ బుమ్రా, రిచర్డ్ గ్లీసన్ -
MI Vs PBKS: ఫైనల్ చేరేదెవరో!
అహ్మదాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) టి20 టోర్నమెంట్ 18వ సీజన్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఇప్పటికే ఫైనల్ చేరగా... రెండో ఫైనలిస్ట్‌ను తేల్చే సమరానికి సమయం ఆసన్నమైంది. ఆదివారం క్వాలిఫయర్–2లో ముంబై ఇండియన్స్‌తో పంజాబ్ కింగ్స్ తలపడనుంది. క్వాలిఫయర్–1లో బెంగళూరు చేతిలో ఘోర పరాజయం ఎదుర్కొన్న పంజాబ్... ఈ పోరులో సత్తా చాటి ఫైనల్లో మరోసారి బెంగళూరును ఎదుర్కోవాలని భావిస్తోంది. మరో వైపు పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో నిలిచి... ఎలిమినేటర్‌లో గుజరాత్ టైటాన్స్‌ను చిత్తుచేసిన ముంబై ఇదే జోరులో పంజాబ్‌పై గెలిచి ఫైనల్ చేరాలని పట్టుదలగా ఉంది. క్వాలిఫయర్–1లో టాపార్డర్ విఫలమవడంతో పంజాబ్ 101 పరుగులకే పరిమితమై ఘోర ఓటమి మూటగట్టుకోగా... ఎలిమినేటర్‌లో గుజరాత్ బౌలింగ్‌ను ఓ ఆటాడుకుంటూ ముంబై భారీ స్కోరు చేసింది. ఈ సీజన్లో ఇరు జట్ల మధ్య జరిగిన పోరులో పంజాబ్ విజయం సాధించింది. ఐదుసార్లు చాంపియన్‌గా నిలిచిన ముంబై ఇండియన్స్ సమష్టి ప్రదర్శన ముందు... ఒక్కసారి కూడా టైటిల్ గెలవలేకపోయిన పంజాబ్ కింగ్స్ ఏమాత్రం నిలుస్తుందో చూడాలి! టాపార్డర్ రాణిస్తేనే... ఈ సీజన్లో ఆడిన 15 మ్యాచ్‌ల్లో ఏడింట రెండొందల పైచిలుకు స్కోర్లు చేసిన పంజాబ్ జట్టు... టాపార్డర్ ప్రదర్శనపై అతిగా ఆధారపడుతోంది. అన్క్యాప్డ్ ఓపెనర్లు ప్రభ్‌సిమ్రన్ సింగ్, ప్రియాన్ష్ ఆర్య నిలకడకు ఇన్‌గ్లిస్, శ్రేయస్ మెరుపులు తోడవడంతో పంజాబ్ వరస విజయాలు సాధించగలిగింది. అయితే సొంతగడ్డపై జరిగిన క్వాలిఫయర్–1లో మాత్రం ఈ నలుగురు మూకుమ్మడిగా విఫలమవడంతో... జట్టు మూల్యం చెల్లించుకోక తప్పలేదు. ఐపీఎల్లో మూడు వేర్వేరు జట్లను ‘ప్లే ఆఫ్స్’కు చేర్చిన శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీకి... రికీ పాంటింగ్ వ్యూహాలు తోడవడంతో ఈ సీజన్లో పంజాబ్ పట్టికలో అగ్ర స్థానం దక్కించుకోగలిగింది. దీంతోనే క్వాలిఫయర్–1లో ఓడినా... ఫైనల్ చేరేందుకు మరో అవకాశం దక్కింది. ఈ సీజన్లో ప్రభ్‌సిమ్రన్ 517 పరుగులతో పంజాబ్ తరఫున అత్యధిక పరుగులు సాధించగా... శ్రేయస్ 516, ప్రియాన్ష్ 431 పరుగులు చేశారు. ఈ ముగ్గురితో పాటు ఇన్‌గ్లిస్, నేహల్, శశాంక్, స్టొయినిస్ సత్తాచాటాలని జట్టు యాజమాన్యం ఆశిస్తోంది. గాయం కారణంగా గత మూడు మ్యాచ్‌ల్లో బరిలోకి దిగని స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్ ఈ మ్యాచ్ ఆడటం ఖాయమే. బౌలింగ్‌లో అర్ష్ దీప్ సింగ్, అజ్మతుల్లా, జెమీసన్, హర్‌ప్రీత్ బ్రార్ కీలకం కానున్నారు. గత మ్యాచ్ తప్పిదాలను సరిదిద్దుకోకపోతే... 11 ఏళ్ల తర్వాత ‘ప్లే ఆఫ్స్’కు చేరిన పంజాబ్ ఇక్కడితోనే ప్రయాణాన్ని ముగించాల్సి ఉంటుంది. బుమ్రానే ప్రధాన తేడా! ఐపీఎల్ నాకౌట్స్‌లో అపార అనుభవం ఉన్న ముంబై ఇండియన్స్ జట్టు మరోసారి కలిసికట్టుగా కదంతొక్కి ఆరో టైటిల్ వేటకు చేరాలని చూస్తోంది. పలువురు ఆటగాళ్ల సేవలు కోల్పోయినా... వారి స్థానాలను భర్తిచేసే ఆటగాళ్లు ఉండటం ముంబైకి కలిసి రానుంది. లీగ్ దశ ముగిసిన తర్వాత రికెల్టన్, విల్ జాక్స్ జట్టును వీడినా... గత మ్యాచ్‌లో తొలిసారి ముంబై జట్టుకు ప్రాతనిధ్యం వహించిన జానీ బెయిర్‌స్టో తన ఆగమనాన్ని ఘనంగా చాటాడు.హైదరాబాద్ ఆటగాడు తిలక్ వర్మ కూడా టచ్‌లోకి రావడం ముంబై బ్యాటింగ్ బలాన్ని మరింత పెంచింది. రోహిత్, బెయిర్‌స్టో జట్టుకు శుభారంభం అందిస్తుంటే... సూర్యకుమార్ యాదవ్ ఇన్నింగ్స్‌కు వెన్నెముకలా నిలుస్తున్నాడు. ఈ సీజన్లో 673 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ రేసులో ఉన్నాడు. ఆలస్యంగా వేగం పుంజుకున్న రోహిత్ 410 పరుగులు చేయగా... హార్దిక్ పాండ్యా, నమన్ ధీర్ ఫినిషర్ల పాత్ర పోషిస్తున్నారు. గాయం కారణంగా ఈ మ్యాచ్‌కు కూడా దీపక్ చహర్ అందుబాటులో ఉండటం కష్టమే కాగా... గత మ్యాచ్ చివర్లో కండరాలు పట్టేసిన గ్లీసన్ బరిలోకి దిగుతాడా లేదా చూడాలి. ఇరు జట్ల మధ్య ప్రధాన తేడా బుమ్రా కానున్నాడు. ఆశలే లేని స్థితిలో సైతం తన అద్భుత బౌలింగ్‌తో మ్యాచ్‌ను మలుపుతిప్పగల సామర్థ్యం ఉన్న బుమ్రాను... పంజాబ్ బ్యాటర్లు ఎలా ఎదుర్కొంటారనేది ఆసక్తికరం. తుది జట్లు (అంచనా) పంజాబ్ కింగ్స్: శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), ప్రభ్‌సిమ్రన్, ప్రియాన్ష్ ఆర్య, జోస్ ఇన్‌గ్లిస్, నేహల్, శశాంక్, స్టొయినిస్, అజ్మతుల్లా, హర్‌ప్రీత్ బ్రార్, జెమీసన్, చాహల్, అర్ష్ దీప్. ముంబై ఇండియన్స్: హార్దిక్ (కెప్టెన్), రోహిత్ శర్మ, బెయిర్‌స్టో, సూర్యకుమార్, తిలక్ వర్మ, నమన్, సాంట్నర్, రాజ్ బావా, గ్లీసన్, బుమ్రా, బౌల్ట్, అశ్వని కుమార్. పిచ్, వాతావరణం ఈ సీజన్లో అహ్మదాబాద్‌లో ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో ఆరింట మొదట బ్యాటింగ్ చేసిన జట్లు విజయం సాధించాయి. ఈ నేపథ్యంలో టాస్ కీలక పాత్ర పోషించవచ్చు. మ్యాచ్‌కు వర్షం ముప్పులేదు. ఐపీఎల్లో నేడు (క్వాలిఫయర్–2)పంజాబ్ X ముంబైవేదిక: అహ్మదాబాద్‌రాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో -
Qualifier 2 PBKS vs MI: అలా జరిగితే ముంబై ఇండియన్స్ ఇంటికే?
ఐపీఎల్-2025లో క్వాలిఫయర్-2కు రంగం సిద్దమైంది. జూన్ 1(ఆదివారం) జరగనున్న సెకెండ్ క్వాలిఫయర్‌లో పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్లు అమీతుమీ తెల్చుకోనున్నాయి. 2014 తర్వాత తొలిసారి ఫైనల్‌కు చేరుకునేందుకు పంజాబ్ ప్రయత్నిస్తుండగా.. ముంబై ఇండియన్స్ ఆరో ఐపీఎల్ టైటిల్ లక్ష్యంగా పెట్టుకుంది.క్వాలిఫయర్-1, ఎలిమినేటర్ మ్యాచ్‌లకు మొహాలీలోని ముల్లాన్‌పూర్ స్టేడియం ఆతిథ్యమివ్వగా.. ఇప్పుడు క్వాలిఫయర్-2, ఫైనల్ మ్యాచ్‌లు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరగనున్నాయి.క్వాలిఫయర్-2 రద్దు అయితే?ఇక క్వాలిఫయర్-2 మ్యాచ్ వర్షం లేదా ఏదైనా కారణం వల్ల రద్దు అయితే ఏంటి పరిస్థితి అని ఇరు జట్ల అభిమానులు తెగ టెన్షన్ పడుతున్నారు. ఈ మ్యాచ్‌కు బీసీసీఐ రిజర్వ్ డే కేటాయించలేదు. దీంతో వర్షం లేదా వేరే ఇతర కారణం చేత మ్యాచ్ రద్దు అయితే.. పాయింట్ల పట్టికలో మెరుగైన స్థానంలో ఉన్న జట్టు ఫైనల్‌కు ఆర్హత సాధిస్తోంది. అంటే పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్‌లో ఉన్న పంజాబ్ కింగ్స్ ఫైనల్లో అడుగుపెడుతోంది. ముంబై పాయింట్ల టేబుల్లో నాలుగో స్ధానంలో ఉంది. అయితే వర్షం ముప్పు పొంచిలేదు. వెధర్.కామ్ ప్రకారం.. 24 శాతం మాత్రమే వర్షం పడేందుకు ఆస్కారం ఉంది. దీంతో మ్యాచ్ సజావుగా జరిగనుంది. కాగా ఫైనల్ మ్యాచ్ మాత్రం బీసీసీఐ రిజర్వ్ డే కేటాయించింది. జూన్ 3న ఫైనల్ మ్యాచ్ జరగనుంది.తుది జట్లు(అంచనా)ముంబై ఇండియన్స్: రోహిత్ శర్మ, జానీ బెయిర్‌స్టో (వికెట్‌కీపర్), సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), నమన్ ధీర్, రాజ్ బావా, మిచెల్ సాంట్నర్, ట్రెంట్ బౌల్ట్, జస్ప్రీత్ బుమ్రా, రిచర్డ్ గ్లీసన్ఆర్సీబీ: విరాట్ కోహ్లి, ఫిలిప్ సాల్ట్, రజత్ పాటిదార్ (కెప్టెన్), లియామ్ లివింగ్‌స్టోన్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), రొమారియో షెపర్డ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, యశ్ దయాల్, జోష్ హేజిల్‌వుడ్, సుయాష్ శర్మచదవండి: రిలాక్స్.. నా పని నాకు బాగా తెలుసు: కోచ్ మాట వినని బుమ్రా -
పంజాబ్ ఓటమి.. పాపం.. చాహల్ గర్ల్‌ఫ్రెండ్ రియాక్షన్ చూశారా?
ఇటీవల ఆర్జే మహ్వశ్ పేరు ఎక్కువగా వినిపిస్తోంది. దుబాయ్‌లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ నుంచే ఆమె పేరు తెగ వైరలవుతోంది. ఎందుకంటే టీమిండియా క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్‌తో ఆమె కనిపించడమే ప్రధాన కారణం. దుబాయ్‌లో వీరిద్దరు జంటగా మెరవడంతో ఒక్కసారిగా అందరి దృష్టి ఆర్జే మహ్వశ్పైనే పడింది. ఇంతకీ చాహల్‌తో ఉన్న ఆమె ఎవరు? అంటూ నెటిజన్స్ తెగ ఆరా తీశారు. వీరిద్దరు డేటింగ్లో ఉన్నారేమో అంటూ కామెంట్స్ చేశారు. ఆ తర్వాత పంజాబ్ కింగ్స్ ఐపీఎల్ మ్యాచ్‌లకు హాజరు కావడంతో డేటింగ్ రూమర్స్ మరింత ఎక్కువయ్యాయి.అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ గురువారం ఐపీఎల్ క్వాలిఫయర్-1 మ్యాచ్‌కు కూడా హాజరైంది. మొదటి నుంచి ఈ సీజన్లో చాహల్ ప్రాతినిథ్యం వహిస్తోన్న పంజాబ్ కింగ్స్ జట్టుకు ఆర్జే మహ్వశ్ మద్దతుగా నిలుస్తున్నారు. అయితే ఈ మ్యాచ్‌లో తుది జట్టులో చాహల్ లేకపోయినప్పటికీ ఆమె స్టేడియంలో సందడి చేసింది. ఈ మ్యాచ్‌లో పంజాబ్ ఓటమి పాలవ్వడంచో ఆర్జే మహ్వశ్ తీవ్ర నిరాశకు గురైంది. ఆనందంగా మ్యాచ్ ఎంజాయ్ చేద్దామని వచ్చిన ఆమెకు పంజాబ్ ఓడిపోవడంతో అప్సెట్ అయినట్లు కనిపించింది. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా.. యుజ్వేంద్ర చాహల్ వేలు గాయం కారణంగా పంజాబ్ చివరి రెండు మ్యాచ్‌లకు దూరమయ్యాడు.ఆర్జే మహ్వశ్- చాహల్ డేటింగ్ రూమర్స్..యుజ్వేంద్ర చాహల్ తన భార్య కొరియోగ్రాఫర్ ధనశ్రీ వర్మ నుంచి మార్చిలో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత చాహల్ -ఆర్జే మహ్వశ్ జంటగా కనిపించడంతో డేటింగ్ వార్తలొచ్చాయి. అయితే ఆర్జే మహవాష్ తాము కేవలం స్నేహితులమని స్పష్టం చేసింది. చాహల్ తన భార్యతో విడాకుల తర్వాత ఆర్జే మహ్వశ్తో అనేక సందర్భాల్లో జంటగా కనిపించారు. आज #RCBvsPBKS मैच का दो फोटो सबसे ज्यादा सुर्खियों में है।First Virat Kohli and Anushka Sharma Second Shubhankar mishra and Rj mahvashRCB INTO THE FINALS Congratulations RCB#IPLPlayoffs #Qualifier1 pic.twitter.com/T1agohOxUG— Chandan Yadav (@ChandankryadavN) May 29, 2025 -
'నీ ఈగోను జేబులో పెట్టుకో శ్రేయస్'.. పంజాబ్ కెప్టెన్‌పై మూడీ ఫైర్
ఐపీఎల్-2025 క్వాలిఫయర్-1లో పంజాబ్ కింగ్స్‌కు ఘోర పరాభవం ఎదురైంది. గురువారం ముల్లాన్‌పూర్ వేదికగా ఆర్సీబీతో జరిగిన తొలి క్వాలిఫయర్ మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో పంజాబ్ ఓటమి పాలైంది. ఈ మ్యాచ్‌లో పంజాబ్ బ్యాటర్లు తీవ్ర నిరాశపరిచారు. ఆర్సీబీ బౌలర్ల ధాటికి పంజాబ్ బ్యాటర్లు విల్లవిల్లాడారు.దీంతో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ కేవలం 101 పరుగులకే ఆలౌటైంది. ఆ లక్ష్యాన్ని ఆర్సీబీ పది ఓవర్లలోనే ఛేదించి విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్‌లో దారుణ ప్రదర్శన కనబరిచిన పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌పై ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ టామ్ మూడీ విమర్శల వర్షం కురిపించారు.పరిస్థితులకు తగ్గట్టు బ్యాటింగ్ చేయడం నేర్చుకో అయ్యర్ అంటూ ఆయన మండిపడ్డారు. కాగా కీలక సమయంలో క్రీజులోకి వచ్చిన అయ్యర్ ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయాడు. బాధ్యతాయుతంగా ఆడాల్సిన శ్రేయస్.. హాజిల్‌వుడ్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి వికెట్ కీపర్‌కు దొరికిపోయాడు. శ్రేయస్ కేవలం రెండు 2 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్‌కు చేరాడు.అదేవిధంగా టీ20ల్లో అయ్యర్‌పై హాజిల్‌వుడ్‌కు మంచి రికార్డు ఉంది. ఈ ఆసీస్ స్పీడ్ స్టార్ అయ్యర్‌ను నాలుగు సార్లు టీ20ల్లో ఔట్ చేశాడు. అయినప్పటికి అతడి బౌలింగ్‌లో నిర్లక్ష్యంగా షాట్ ఆడి అయ్యర్ ఔటయ్యాడని మూడీ వంటి దిగ్గజాలు విమర్శలు గుప్పిస్తున్నారు."శ్రేయస్ అయ్యర్ పరిస్థితులకు తగ్గట్టు ఏ మాత్రం ఆడలేదు. కెప్టెన్‌గా తన బాధ్యతను కూడా మర్చిపోయాడు. గతంలో చాలా సార్లు తనను హాజిల్‌వుడ్ ఔట్ చేశాడని అయ్యర్‌కు బాగా తెలుసు. అయినప్పటికి జాగ్రత్తగా ఆడకుండా ఈగోకి పోయి తన వికెట్‌ను సమర్పించుకున్నాడు. కొన్నిసార్లు మన అహాన్ని జేబులో పెట్టుకుని ముందుకు సాగాలి. అప్పుడే విజయాలు సాధించగలము" అని మూడీ పేర్కొన్నారు. కాగా ఈ ఏడాది సీజన్ అసాంతం తన కెప్టెన్సీ, బ్యాటింగ్‌తో ఆకట్టుకున్న శ్రేయస్.. కీలకమైన మ్యాచ్‌లో మాత్రం విఫలమై విమర్శలను ఎదుర్కొంటున్నాడు. -
నేను సాకులు చెప్పను.. యుద్దం ఇంకా ముగియలేదు: శ్రేయస్ అయ్యర్
ఐపీఎల్-2025లో గురువారం ముల్లాన్‌పుర్ వేదికగా ఆర్సీబీతో జరిగిన క్వాలిఫయర్ 1లో పంజాబ్ కింగ్స్ దారుణ ప్రదర్శన కనబరిచింది. బ్యాటింగ్, బౌలింగ్‌లో విఫలమైన పంజాబ్.. 8 వికెట్ల తేడాతో ఘోర ఓటమి చవిచూసింది. దీంతో ఫైనల్ చేరేందుకు ఇప్పుడు క్వాలిఫయర్-2లో తలపడాల్సి వచ్చింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ పంజాబ్ కింగ్స్.. ఆర్సీబీ బౌలర్ల ధాటికి 14.1 ఓవర్లలోనే కేవలం 101 పరుగులకే కుప్పకూలింది.స్టోయినిష్(26) టాప్ స్కోరర్‌గా నిలవగా.. మిగితా ప్లేయర్లంతా దారుణంగా విఫలమయ్యారు. ఈ ఘోర ఓటమిపై మ్యాచ్ అనంతరం పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ స్పందించాడు. బ్యాటింగ్ వైఫల్యం కారణంగానే ఓటమిపాలైమని అయ్యర్ అంగీకరించాడు. ఈ ఓటమిపై మ్యాచ్ అనంతరం పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ స్పందించాడు."ఈ రోజును అంతవేగంగా మర్చిపోలేము. డ్రెస్సింగ్ రూమ్‌కు తిరిగి వెళ్లి తప్పు ఎక్కడ జరిగిందో చర్చిస్తాము. ఏదేమైనప్పటికీ ఒక బ్యాటింగ్ యూనిట్‌గా తీవ్ర నిరాశపరిచాము. వరుస క్రమంలో వికెట్లు కోల్పోయాయు. అయితే కెప్టెన్‌గా నేను తీసుకున్న నిర్ణయాలపై నాకు ఎటువంటి సందేహం లేదు. మైదానంలో గానీ, మైదానం వెలుపల గానీ మేము అన్ని ఆలోచించాకే ఏ నిర్ణయమైనా తీసుకుంటాము. ఈ మ్యాచ్‌లో మాత్రం మా ప్రణాళికలను సరిగ్గా అమలు చేయలేకపోయాము. అలా అని బౌలర్లను కూడా తప్పుబట్టలేము. ఎందుకంటే మా బౌలర్లు డిఫెండ్ చేసుకోవడానికి ఈ టోటల్ సరిపోదు. ముల్లాన్‌పూర్ పిచ్‌ను మేము సరిగ్గా అంచనా వేయలేకపోయాము. ఈ వికెట్‌పై బ్యాటింగ్ పరంగా మరింత ప్రాక్టీస్ చేసి ఉంటే బాగుండేది. ఈ మైదానంలో మేము ఆడిన మూడు మ్యాచ్‌లలోనూ బౌన్స్ ఎక్కువగా ఉంది. అయితే మేము ప్రొఫెషనల్ క్రికెటర్లు కాబట్టి, ఇటువంటి సాకులు చెప్పాలని అనుకోవడం లేదు. పరిస్థితులు ఎలా ఉన్న అందుకు తగ్గట్టు బ్యాటింగ్ చేయాలి. ఇది చిన్న ఓటమి మాత్రమే.. యుద్దం ఇంకా పూర్తిగా ముగియలేదు" అని పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్‌లో అయ్యర్ పేర్కొన్నాడు.చదవండి: IPL 2025: ఏంటి కోహ్లి ఇది.. నీ స్దాయికి ఇది తగునా? ఫ్యాన్స్ కౌంటర్ -
చరిత్ర సృష్టించిన ఆర్సీబీ.. తొలి జట్టుగా రికార్డు
తొలి ఐపీఎల్ టైటిల్‌ను ముద్దాడేందుకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అడుగు దూరంలో నిలిచింది. ఐపీఎల్-2025లో ఫైనల్ బెర్త్‌ను ఆర్సీబీ ఖారారు చేసుకుంది. గురువారం ముల్లాన్‌పూర్ వేదికగా జరిగిన తొలి క్వాలిఫయర్‌లో పంజాబ్ కింగ్స్‌ను 8 వికెట్ల తేడాతో చిత్తు చేసిన ఆర్సీబీ.. నాలుగోసారి ఈ క్యాష్‌రిచ్ లీగ్ ఫైనల్లో అడుగుపెట్టింది. ఈ మ్యాచ్‌లో బౌలింగ్, బ్యాటింగ్‌లో అద్బుతంగా రాణించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్.. ఆర్సీబీ బౌలర్లు చెలరేగడంతో కేవలం 14.1 ఓవర్లలో 101 పరుగులకే కుప్పకూలింది. పంజాబ్ ఇన్నింగ్స్‌లో మార్కస్ స్టోయినిస్ (17 బంతుల్లో 26 పరుగులు; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) టాప్ స్కోరర్‌గా నిలవగా.. మిగితా ప్లేయర్లంతా దారుణంగా విఫలమయ్యారు. అనంతరం 102 పరుగుల లక్ష్యాన్ని ఆర్సీబీ కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి చేధించింది. ఇక ఈ మ్యాచ్‌లో అద్బుత విజయం సాధించిన బెంగళూరు టీమ్ పలు అరుదైన రికార్డులను తమ ఖాతాలో వేసుకుంది.ఆర్సీబీ సాధించిన రికార్డులు ఇవే..👉ఐపీఎల్ ప్లే ఆఫ్స్ చరిత్రలో ప్రత్యర్ధిని 15 ఓవర్లలోపే ఆలౌట్ చేసిన తొలి జట్టుగా ఆర్సీబీ రికార్డులెక్కింది. ఇప్పటివరకు ఏ జట్టు కూడా ఈ ఫీట్ సాధించలేదు.👉అదేవిధంగా ఐపీఎల్ ప్లే ఆఫ్ మ్యాచ్(20 ఓవర్ల ఫుల్ గేమ్)లో బంతులపరంగా అతిపెద్ద విజయాన్ని సాధించిన జట్టుగా బెంగళూరు నిలిచింది. ఈ మ్యాచ్‌ను ఆర్సీబీ 60 బంతులు మిగిలూండగానే ముగించింది. ఇంతకుముందు ఈ రికార్డు కోల్‌కతా నైట్‌రైడర్స్ పేరిట ఉండేది. ఐపీఎల్-2024 ఫైనల్లో ఎస్ఆర్హెచ్పై 57 బంతులు మిగిలూండగానే కేకేఆర్ విజయం సాధించింది. తాజా మ్యాచ్‌తో కేకేఆర్ నైట్‌రైడర్స్ రికార్డును ఆర్సీబీ బ్రేక్ చేసింది.👉అయితే 2017 సీజన్లో ఎలిమినేటర్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై కేకేఆర్ కేవలం 5.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. కానీ ఆ మ్యాచ్‌ను వర్షం కారణంగా ఆరు ఓవర్లకు కుదించారు. -
RCB Vs PBKS: నేను అతడికి పెద్ద అభిమానిని.. ఇంకా ఒకే ఒక మ్యాచ్: ఆర్సీబీ కెప్టెన్
ఐపీఎల్-2025 ఫైనల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అడుగుపెట్టింది. గురువారం ముల్లాన్‌పూర్ వేదికగా పంజాబ్ కింగ్స్‌తో జరిగిన తొలి క్వాలిఫయర్‌లో 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన ఆర్సీబీ.. తొమ్మిదేళ్ల తర్వాత ఈ క్యాష్ రిచ్ లీగ్ ఫైనల్ బెర్త్‌ను ఖారారు చేసుకుంది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్.. ఆర్సీబీ బౌలర్ల ధాటికి 101 పరుగులకే ఆలౌటైంది.బెంగళూరు బౌలర్లలో సుయాష్ శర్మ, హాజిల్‌వుడ్ తలా మూడు వికెట్లు పడగొట్టి పంజాబ్ పతనాన్ని శాసించగా.. యశ్‌దయాల్ రెండు, షెఫర్డ్, భువనేశ్వర్ కుమార్ తలా వికెట్ సాధించారు. పంజాబ్ బ్యాటర్లలో స్టోయినిష్(26) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అనంతరం 102 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఆర్సీబీ కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి చేధించింది.ఆర్సీబీ బ్యాటర్లలో ఫిల్ సాల్ట్ (27 బంతుల్లో 56 నాటౌట్; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) మెరుపు హాఫ్ సెంచరీతో చెలరేగగా..మయాంక్(19), కోహ్లి(12) పర్వాలేదన్పించారు. ఇక ఈ విజయంపై మ్యాచ్ అనంతరం బెంగళూరు కెప్టెన్ రజత్ పాటిదార్ స్పందించాడు. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ సుయాష్ శర్మపై రజత్ ప్రశంసల వర్షం కురిపించాడు."ఈ మ్యాచ్‌లో స్పష్టమైన బౌలింగ్ ప్రణాళికలతో బరిలోకి దిగాము. మా ఫాస్ట్ బౌలర్లు పిచ్ కండీషన్స్‌ను బాగా ఉపయోగించుకున్నారు. ఇక సుయాష్ శర్మ గురుంచి ఎంత చెప్పుకున్న తక్కువే. అతడు బౌలింగ్ చేసిన విధానం ఒక అద్బుతం. చక్కటి లైన్ అండ్ లెంగ్త్‌లతో బౌలింగ్ చేసి ప్రత్యర్ధి బ్యాటర్లను కట్టడి చేశాడు. కెప్టెన్‌గా అతడి బౌలింగ్‌పై నాకు ఒక క్లారిటీ ఉంది. స్టంప్స్ లక్ష్యంగా చేసుకుని బౌలింగ్ చేయడమే అతడి బలం. సూయూష్ బౌలింగ్‌ను ఆర్దం చేసుకోవడం బ్యాటర్లకు చాలా కష్టం. నేనెప్పుడూ అతడిని కన్ఫ్యూజ్ చేయలేదు. ప్రతీ మ్యాచ్‌లోనూ అతడికి సపోర్ట్‌గా ఉన్నాము. ఈ క్రమంలో అతను కొన్ని పరుగులు ఇచ్చినా నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. ఈ టోర్నీ అసాంతం మేము చాలా మేము చాలా ప్రాక్టీస్ సెషన్స్‌లో పాల్గోన్నాము. కాబట్టి ఒక రోజు ప్రాక్టీస్ చేయకపోవడం వల్ల ఎలాంటి నష్టం లేదు. ఇక ఫిల్ సాల్ట్ ప్రతీ మ్యాచ్‌లోనూ మాకు అద్బుతమైన ఆరంభాలను అందించాడు. ఈ మ్యాచ్‌లో మరోసారి తనదైన శైలిలో బ్యాటింగ్ చేశాడు. అతడికి నేను పెద్ద అభిమానిని. డగౌట్ నుంచి అతడి ఆటను చూసేందుకు రెండు కళ్లు సరిపోవు. చిన్నస్వామిలోనే కాదు మేము ఎక్కడికి వెళ్లినా మాకు సపోర్ట్‌గా నిలుస్తున్న ఆర్సీబీ అభిమానులకు ధన్యవాదాలు. మిమ్మల్ని మేము ప్రేమిస్తునే ఉంటాము, మీరు కూడా మాకు మద్దతు ఇస్తూ ఉండండి. మరో మ్యాచ్ మిగిలి ఉంది. ఆ తర్వాత కలిసి సెలబ్రేట్ చేసుకుందాం" అని పోస్ట్ మ్యాచ్ ప్రేజెంటేషన్‌లో పాటిదార్ పేర్కొన్నాడు.చదవండి: తొమ్మిదేళ్ల తర్వాత తుది పోరుకు... -
పంజాబ్‌ను మట్టికరిపించిన పాటీదార్ సేన.. ఫైనల్‌కు దూసుకెళ్లిన ఆర్సీబీ (ఫొటోలు)
-
తొమ్మిదేళ్ల తర్వాత తుది పోరుకు...
ఐపీఎల్ ప్రారంభమైన నాటినుంచి తొలి టైటిల్ కోసం పోరాడుతూనే ఉన్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు... ఈ సీజన్లో ట్రోఫీ దిశగా మరో ముందడుగు వేసింది. బౌలర్లు విజృంభించడంతో క్వాలిఫయర్–1లో పంజాబ్‌పై ఏకపక్ష విజయం సాధించిన బెంగళూరు... తొమ్మిదేళ్ల తర్వాత నాలుగోసారి ఐపీఎల్ ఫైనల్‌కు చేరింది. హాజల్‌వుడ్ పేస్‌తో బెంబేలెత్తిస్తే... సుయాశ్ శర్మ గూగ్లీలతో పంజాబ్ పనిపట్టాడు. ఈ సీజన్లో ప్రధానంగా టాప్–3 ఆటగాళ్లపైనే ఎక్కువ ఆధారపడ్డ పంజాబ్.. ఆ ముగ్గురు మూకుమ్మడిగా చేతులెత్తేయడంతో ఓటమి పాలైంది. ముల్లాన్‌పూర్: సీజన్ ఆసాంతం నిలకడగా రాణించిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) క్వాలిఫయర్–1లోనూ సంపూర్ణ ఆధిపత్యం కనబరుస్తూ ఐపీఎల్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. గురువారం జరిగిన పోరులో బెంగళూరు 8 వికెట్ల తేడాతో పంజాబ్ కింగ్స్‌ను చిత్తుచేసి తుదిపోరుకు చేరింది. బౌలర్లు సమష్టిగా సత్తా చాటడంతో ఆర్సీబీ ఐపీఎల్ ఫైనల్లో అడుగుపెట్టగా... 11 ఏళ్ల తర్వాత ‘ప్లే ఆఫ్స్’కు చేరిన పంజాబ్ బ్యాటర్ల వైఫల్యంతో పరాజయం వైపు నిలిచింది. మొదట పంజాబ్ 14.1 ఓవర్లలో 101 పరుగులకు ఆలౌటైంది. మార్కస్ స్టొయినిస్ (17 బంతుల్లో 26; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) టాప్ స్కోరర్ కాగా... ప్రభ్‌సిమ్రన్ సింగ్ (18), అజ్మతుల్లా ఓమర్జాయ్ (18) మాత్రమే రెండంకెల స్కోరు చేయగలిగారు. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (2)తో పాటు ప్రియాన్ష్ ఆర్య (7), జోష్ ఇన్‌గ్లిస్ (4), నేహల్ వధేరా (8), శశాంక్ సింగ్ (3), ముషీర్ ఖాన్ (0) విఫలమయ్యారు. బెంగళూరు బౌలర్లలో ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ సుయాశ్ శర్మ, హాజల్‌వుడ్ చెరో 3 వికెట్లు పడగొట్టగా... యశ్ దయాళ్ రెండు వికెట్లు తీశాడు. అనంతరం స్వల్ప లక్ష్యఛేదనలో బెంగళూరు 10 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 106 పరుగులు చేసింది. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి (12; 2 ఫోర్లు) త్వరగానే అవుట్ అయినా... ఫిల్ సాల్ట్ (27 బంతుల్లో 56 నాటౌట్; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) అజేయ అర్ధశతకంతో ఆకట్టుకున్నాడు. మంగళవారం అహ్మదాబాద్ వేదికగా జరగనున్న తుదిపోరులో క్వాలిఫయర్–2 విజేతతో బెంగళూరు ట్రోఫీ కోసం తలపడనుంది. ఒకరి వెంట ఒకరు... టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ కింగ్స్‌కు శుభారంభం దక్కలేదు. ఈ సీజన్లో మెరుగైన ఆరంభాలతో జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించిన ఓపెనర్లు ప్రియాన్ష్ ప్రభ్‌సిమ్రన్ కీలక పోరులో ఆకట్టుకోలేకపోయారు. యశ్ దయాళ్ వేసిన రెండో ఓవర్ రెండో బంతికి ప్రియాన్ష్ సులువైన క్యాచ్ ఇచ్చి వెనుదిరగగా... భువనేశ్వర్ వేసిన మరుసటి ఓవర్లో రెండు ఫోర్లతో టచ్‌లోకి వచ్చిన ప్రభ్‌సిమ్రన్ అదే జోరులో మరో షాటే ఆడేందుకు ప్రయత్నించి పెవిలియన్ బాట పట్టాడు. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 3 బంతులే ఆడి అవుట్ అయ్యాడు. హాజల్‌వుడ్ బంతిని కట్ చేసే ప్రయత్నంలో కీపర్‌కు క్యాచ్ ఇచ్చాడు. హాజల్‌వుడ్ తన మరుసటి ఓవర్లో ఇన్‌గ్లిస్‌ను కూడా బుట్టలో వేసుకోగా... నేహల్ వధేరా ఇలా వచ్చి అలా వెళ్లాడు. స్టొయినిస్ కొన్ని షాట్లతో ఇన్నింగ్స్‌ను నడిపించే ప్రయత్నం చేసినా అతడికి సహాకారం అందించేవాళ్లే కరువయ్యారు. సుయాశ్ గూగ్లీని అర్థం చేసుకోలేక శశాంక్ క్లీన్ బౌల్డ్ కాగా... ఇంపాక్ట్ ప్లేయర్‌గా అనూహ్య అవకాశం దక్కించుకున్న ముషీర్ ఖాన్ ఐపీఎల్ అరంగేట్రంలో డకౌట్‌గా వెనుదిరిగాడు. బ్యాటర్లు వరసగా విఫలమవుతుండటంతో... ముషీర్‌కు తుది జట్టులో చోటు దక్కగా... ఆడిన తొలి ఐపీఎల్ మ్యాచ్‌లో ఒక్క పరుగు కూడా చేయకుండానే అతడు అవుట్అయ్యాడు. తన తదుపరి ఓవర్లో స్టొయినిస్‌ను కూడా సుయాశ్ పెవిలియన్‌కు పంపడంతో పంజాబ్ పనైపోయింది. ఆఖర్లో అజ్మతుల్లా విలువైన పరుగులు చేసి జట్టు స్కోరును వంద పరుగుల మార్క్ దాటించాడు. ఆడుతూ పాడుతూ.. బెంగళూరు బ్యాటింగ్ ప్రారంభానికి ముందే పంజాబ్ పరాజయం ఖాయమైపోగా... నాలుగో ఓవర్లో కోహ్లిని ఔట్ చేసి జెమీసన్ కాస్త ఆసక్తి రేపినా... సాల్ట్ విజృంభణతో ఎలాంటి సంచలనానికి అవకాశం లేకుండా పోయింది. మూడో ఓవర్లో 4, 6 కొట్టిన సాల్ట్... ఐదో ఓవర్లో రెండు ఫోర్లు బాదాడు. జెమీసన్ ఓవర్లో వరసగా 4, 4, 6 కొట్టడంతో పవర్‌ప్లే ముగిసేసరికి ఆర్సీబీ 61/1తో నిలిచింది. మయాంక్ అగర్వాల్ (19; 2 ఫోర్లు, 1 సిక్స్), కెప్టెన్ రజత్ పాటీదార్ (15 నాటౌట్; 1 ఫోర్, 1 సిక్స్) రాణించారు. 23 బంతుల్లో సాల్ట్ హాఫ్‌సెంచరీ పూర్తి చేసుకోగా... భారీ సిక్స్‌తో పాటీదార్ మ్యాచ్‌ను ముగించాడు. స్కోరు వివరాలు పంజాబ్ కింగ్స్ ఇన్నింగ్స్: ప్రియాన్ష్ (సి) కృనాల్ (బి) దయాళ్ 7; ప్రభ్‌సిమ్రన్ (సి) జితేశ్ (బి) భువనేశ్వర్ 18; ఇన్‌గ్లిస్ (సి) భువనేశ్వర్ (బి) హాజల్‌వుడ్ 4; శ్రేయస్ (సి) జితేశ్ (బి) హాజల్‌వుడ్ 2; నేహల్ (బి) దయాళ్ 8; స్టొయినిస్ (బి) సుయాశ్ 26; శశాంక్ (బి) సుయాశ్ 3; ముషీర్ (ఎల్బీ) (బి) సుయాశ్ 0; అజ్మతుల్లా (సి) జితేశ్ (బి) హాజల్‌వుడ్ 18; హర్‌ప్రీత్ (బి) షెఫర్డ్ 4; జెమీసన్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (14.1 ఓవర్లలో ఆలౌట్) 101. వికెట్ల పతనం: 1–9, 2–27, 3–30, 4–38, 5–50, 6–60, 7–60, 8–78, 9–97, 10–101. బౌలింగ్: భువనేశ్వర్ 2–0–17–1; యశ్ దయాళ్ 4–0–26–2; హాజల్‌వుడ్ 3.1–0–21–3; సుయాశ్ శర్మ 3–0–17–3; కృనాల్ పాండ్యా 1–0–10–0, రొమారియో షెఫర్డ్ 1–0–5–1. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: సాల్ట్ (నాటౌట్) 56; కోహ్లి (సి) ఇన్‌గ్లిస్ (బి) జెమీసన్ 12; మయాంక్ (సి) శ్రేయస్ (బి) ముషీర్ 19; రజత్ పాటీదార్ (నాటౌట్) 15; ఎక్స్‌ట్రాలు: 4; మొత్తం (10 ఓవర్లలో 2 వికెట్లకు) 106. వికెట్ల పతనం: 1–30, 2–84. బౌలింగ్: అర్ష్ దీప్ సింగ్ 2–0–20–0; జెమీసన్ 3–1–27–1; అజ్మతుల్లా 1–0–10–0; హర్‌ప్రీత్ బ్రార్ 2–0–18–0; ముషీర్ ఖాన్ 2–0–27–1. -
IPL 2025: పంజాబ్‌ను చిత్తు చేసిన ఆర్సీబీ.. తొమ్మిదేళ్ల తర్వాత ఫైనల్లోకి ఎంట్రీ
ఐపీఎల్ 2025లో భాగంగా పంజాబ్ కింగ్స్‌తో ఇవాళ (మే 29) జరిగిన క్వాలిఫయర్-1 మ్యాచ్‌లో ఆర్సీబీ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో ఆర్సీబీ తొమ్మిదేళ్ల తర్వాత ఫైనల్లోకి ఎంట్రీ ఇచ్చింది. పంజాబ్ జూన్ 1న జరిగే క్వాలిఫయర్-2లో రేపు (మే 30) జరుగబోయే ఎలిమినేటర్ మ్యాచ్‌లో (గుజరాత్ వర్సెస్ ముంబై) విజేతతో తలపడుతుంది.ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ ఆర్సీబీ బౌలర్లు ఆకాశమే హద్దుగా చెలరేగడంతో 14.1 ఓవర్లలో 101 పరుగులకే కుప్పకూలింది. హాజిల్‌వుడ్, సుయాశ్ శర్మ తలో 3, యశ్ దయాల్ 2, రొమారియో షెపర్డ్, భువనేశ్వర్ కుమార్ తలో వికెట్ తీశారు.పంజాబ్ ఇన్నింగ్స్‌లో ప్రభ్‌సిమ్రన్ సింగ్ (18), మార్కస్ స్టోయినిస్ (26), అజ్మతుల్లా ఒమర్జాయ్ (18) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు. ప్రియాంశ్ ఆర్య 7, జోస్ ఇంగ్లిస్ 4, శ్రేయస్ అయ్యర్ 2, నేహల్ వధేరా 8, శశాంక్ సింగ్ 3, ముషీర్ ఖాన్ 0, హర్‌ప్రీత్ బ్రార్ 4 పరుగులకే ఔటయ్యారు. అనంతరం 102 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆర్సీబీ.. 10 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి దర్జాగా విజయతీరాలకు చేరింది. ఫిల్ సాల్ట్ (27 బంతుల్లో 56 నాటౌట్; 6 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు అర్ద శతకంతో చెలరేగగా.. విరాట్ కోహ్లి 12, మయాంక్ అగర్వాల్ 19, రజత్ పాటిదార్ 15 (నాటౌట్) పరుగులు చేశారు. పంజాబ్ బౌలర్లలో జేమీసన్, ముషీర్ ఖాన్ తలో వికెట్ తీశారు.అతి పెద్ద విజయంఐపీఎల్ ప్లే ఆఫ్స్ చరిత్రలో బంతుల పరంగా ఆర్సీబీ అతి పెద్ద విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ మరో 60 బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని ఛేదించింది. గతంలో ఈ రికార్డు కేకేఆర్ పేరిట ఉండేది. 2024 సీజన్ ఫైనల్లో కేకేఆర్ ఎస్ఆర్హెచ్పై 57 బంతులు మిగిలుండగానే విజయతీరాలకు చేరింది.నాలుగోసారి..తొమ్మిదేళ్ల తర్వాత ఫైనల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఆర్సీబీకి ఇది నాలుగో ఫైనల్ అవుతుంది. ఆర్సీబీ 2009, 2011, 2016 సీజన్లలో కూడా ఫైనల్‌కు చేరింది. అయితే మూడు సందర్భాల్లో ఈ జట్టుకు ఓటమే ఎదురైంది. -
IPL 2025, Qualifier 1: ప్లే ఆఫ్స్ చరిత్రలో అత్యంత చెత్త రికార్డు మూటగట్టుకున్న పంజాబ్
ఐపీఎల్ ప్లే ఆఫ్స్ చరిత్రలో పంజాబ్ కింగ్స్ అత్యంత చెత్త రికార్డును మూటగట్టుకుంది. ఐపీఎల్ 2025లో భాగంగా ఆర్సీబీతో ఇవాళ (మే 29) జరుగుతున్న క్వాలిఫయర్-1 మ్యాచ్‌లో 14.1 ఓవర్లలో 101 పరుగులకే కుప్పకూలిన పంజాబ్.. ఐపీఎల్ ప్లే ఆఫ్స్ చరిత్రలో అతి తక్కువ ఓవర్లు ఆడిన జట్టుగా చెత్త రికార్డును నమోదు చేసింది. గతంలో ఈ రికార్డు ఢిల్లీ క్యాపిటల్స్ పేరిట ఉండేది. 2008 సీజన్లో ఢిల్లీ 16.1 ఓవర్లు మాత్రమే బ్యాటింగ్ చేసింది. ఈ మ్యాచ్‌లో పంజాబ్ చేసిన 101 పరుగుల స్కోర్ ఐపీఎల్ ప్లే ఆఫ్స్ చరిత్రలో నాలుగో అత్యల్ప స్కోర్‌గానూ రికార్డైంది.ఐపీఎల్ ప్లే ఆఫ్స్‌లో అత్యల్ప స్కోర్లు..82 - డెక్కన్ ఛార్జర్స్ vs RCB, DY పాటిల్, 2010 (3వ స్థానం ప్లేఆఫ్)87 - DC vs RR, ముంబై, 2008 SF101 - LSG vs MI, చెన్నై, 2023 ఎలిమినేటర్101 - PBKS vs RCB, ముల్లన్పూర్, క్వాలిఫైయర్ 1*104 - డెక్కన్ ఛార్జర్స్ vs CSK, DY పాటిల్, 2010 SFకాగా, ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ ఆర్సీబీ బౌలర్లు ఆకాశమే హద్దుగా చెలరేగడంతో 14.1 ఓవర్లలో 101 పరుగులకే కుప్పకూలింది. హాజిల్‌వుడ్, సుయాశ్ శర్మ తలో 3, యశ్ దయాల్ 2, రొమారియో షెపర్డ్, భువనేశ్వర్ కుమార్ తలో వికెట్ తీశారు. పంజాబ్ ఇన్నింగ్స్‌లో ప్రభ్‌సిమ్రన్ సింగ్ (18), మార్కస్ స్టోయినిస్ (26), అజ్మతుల్లా ఒమర్జాయ్ (18) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు. ప్రియాంశ్ ఆర్య 7, జోస్ ఇంగ్లిస్ 4, శ్రేయస్ అయ్యర్ 2, నేహల్ వధేరా 8, శశాంక్ సింగ్ 3, ముషీర్ ఖాన్ 0, హర్‌ప్రీత్ బ్రార్ 4 పరుగులకే ఔటయ్యారు. 102 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆర్సీబీ.. 30 పరుగుల వద్ద కోహ్లి (12) వికెట్ కోల్పోయింది. 4 ఓవర్ల అనంతరం ఆ జట్టు స్కోర్ 30/1గా ఉంది. సాల్ట్ (14), మయాంక్ అగర్వాల్ (0) క్రీజ్‌లో ఉన్నారు. -
IPL 2025, Qualifier 1: అరుదైన రికార్డు సాధించిన పంజాబ్ కింగ్స్ బ్యాటర్
ఐపీఎల్ 2025లో భాగంగా ఆర్సీబీతో ఇవాళ (మే 29) జరుగుతున్న క్వాలిఫయర్-1 మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ బ్యాటర్ ప్రభ్‌సిమ్రన్ సింగ్ ఓ అరుదైన రికార్డు సాధించాడు. ఈ మ్యాచ్‌లో 18 పరుగులకే ఔటైన ప్రభ్‌సిమ్రన్.. ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో 500 పరుగులు పూర్తి చేసుకున్నాడు. తద్వారా ఓ ఐపీఎల్ సీజన్లో 500 పరుగులు పూర్తి చేసిన ఆరో అన్క్యాప్డ్ ప్లేయర్‌గా రికార్డుల్లోకెక్కాడు.ఐపీఎల్ తొలి సీజన్లో పంజాబ్‌కే చెందిన షాన్ మార్ష్ ఈ ఘనత సాధించిన తొలి ఆటగాడు కాగా.. 2018లో సూర్యకుమార్ యాదవ్ (ఎంఐ), 2020 సీజన్లో ఇషాన్ కిషన్ (ఎంఐ), 2023 సీజన్లో యశస్వి జైస్వాల్ (రాజస్థాన్ రాయల్స్), 2024 సీజన్లో రియాన్ పరాగ్ (రాజస్థాన్ రాయల్స్) ఈ ఘనత సాధించిన అన్క్యాప్డ్ ప్లేయర్లుగా రికార్డుల్లో ఉన్నారు. ఈ సీజన్లో 15 మ్యాచ్‌లు ఆడిన ప్రభ్‌సిమ్రన్ 517 పరుగులు చేశాడు. ఈ సీజన్లో పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కూడా 500 పరుగుల మార్కును దాటాడు (15 మ్యాచ్‌ల్లో 516 పరుగులు).ఇదిలా ఉంటే, ఆర్సీబీతో జరుగుతున్న క్వాలిఫయర్-1 మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ దాదాపుగా చేతులెత్తేసింది. ఈ జట్టు 13 ఓవర్లలో కేవలం 92 పరుగులు మాత్రమే చేసి 8 వికెట్లు కోల్పోయింది. ఆర్సీబీ బౌలర్లు ఆకాశమే హద్దుగా చెలరేగి పంజాబ్ బ్యాటింగ్ ఆర్డర్‌ను కకావికలం చేశారు. సుయాశ్ శర్మ 3, జోష్ హాజిల్‌వుడ్, యశ్ దయాల్ తలో 2, భువనేశ్వర్ కుమార్ ఓ వికెట్ పడగొట్టారు. పంజాబ్ బ్యాటర్లలో ప్రియాంశ్ ఆర్య 7, ప్రభ్‌సిమ్రన్ సింగ్ 18, జోస్ ఇంగ్లిస్ 4, శ్రేయస్ అయ్యర్ 2, నేహల్ వధేరా 8, మార్కస్ స్టోయినిస్ 26, శశాంక్ సింగ్ 3, ముషీర్ ఖాన్ 0 పరుగులకు ఔట్ కాగా.. అజ్మతుల్లా ఒమర్జాయ్ 13, హర్‌ప్రీత్ బ్రార్ 4 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ గెలిస్తే నేరుగా ఫైనల్‌కు చేరుతుంది. ఈ మ్యాచ్‌లో పంజాబ్ ఓడినా మరో అవకాశం (క్వాలిఫయర్-2) ఉంటుంది. -
IPL 2025, Qualifier 1: పంజాబ్‌పై ఆర్సీబీ ఘన విజయం
పంజాబ్‌పై ఆర్సీబీ ఘన విజయంఐపీఎల్ 2025లో భాగంగా పంజాబ్ కింగ్స్‌తో ఇవాళ (మే 29) జరిగిన క్వాలిఫయర్-1 మ్యాచ్‌లో ఆర్సీబీ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో ఆర్సీబీ ఫైనల్‌కు చేరింది. పంజాబ్ జూన్ 1న జరిగే క్వాలిఫయర్-2లో రేపు జరుగబోయే ఎలిమినేటర్ మ్యాచ్‌లో (గుజరాత్ వర్సెస్ ముంబై) విజేతతో తలపడుతుంది.ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్.. ఆర్సీబీ బౌలర్లు ఆకాశమే హద్దుగా చెలరేగడంతో 14.1 ఓవర్లలో 101 పరుగులకే కుప్పకూలింది. హాజిల్‌వుడ్, సుయాశ్ శర్మ తలో 3, యశ్ దయాల్ 2, రొమారియో షెపర్డ్, భువనేశ్వర్ కుమార్ తలో వికెట్ తీశారు.పంజాబ్ ఇన్నింగ్స్‌లో ప్రభ్‌సిమ్రన్ సింగ్ (18), మార్కస్ స్టోయినిస్ (26), అజ్మతుల్లా ఒమర్జాయ్ (18) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు. ప్రియాంశ్ ఆర్య 7, జోస్ ఇంగ్లిస్ 4, శ్రేయస్ అయ్యర్ 2, నేహల్ వధేరా 8, శశాంక్ సింగ్ 3, ముషీర్ ఖాన్ 0, హర్‌ప్రీత్ బ్రార్ 4 పరుగులకే ఔటయ్యారు. అనంతరం 102 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆర్సీబీ.. 10 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి దర్జాగా విజయతీరాలకు చేరింది. ఫిల్ సాల్ట్ (27 బంతుల్లో 56 నాటౌట్; 6 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు అర్ద శతకంతో చెలరేగగా.. విరాట్ కోహ్లి 12, మయాంక్ అగర్వాల్ 19, రజత్ పాటిదార్ 15 (నాటౌట్) పరుగులు చేశారు. పంజాబ్ బౌలర్లలో జేమీసన్, ముషీర్ ఖాన్ తలో వికెట్ తీశారు.రెండో వికెట్ కోల్పోయిన ఆర్సీబీ7.5వ ఓవర్- 84 పరుగుల వద్ద ఆర్సీబీ రెండో వికెట్ కోల్పోయింది. ముషీర్ ఖాన్ బౌలింగ్‌లో మయాంక్ అగర్వాల్ (19) ఔటయ్యాడు. టార్గెట్ 102.. 30 పరుగుల వద్ద కోహ్లి ఔట్3.2వ ఓవర్- 102 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనలో ఆర్సీబీ 30 పరుగుల వద్ద విరాట్ కోహ్లి (12) వికెట్ కోల్పోయింది. జేమీసన్ బౌలింగ్‌లో జోస్ ఇంగ్లిస్‌కు క్యాచ్ ఇచ్చి విరాట్ ఔటయ్యాడు. రెచ్చిపోయిన ఆర్సీబీ బౌలర్లు.. 101 పరుగులకే కుప్పకూలిన పంజాబ్టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ ఆర్సీబీ బౌలర్లు ఆకాశమే హద్దుగా చెలరేగడంతో 14.1 ఓవర్లలో 101 పరుగులకే కుప్పకూలింది. హాజిల్‌వుడ్, సుయాశ్ శర్మ తలో 3, యశ్ దయాల్ 2, రొమారియో షెపర్డ్, భువనేశ్వర్ కుమార్ తలో వికెట్ తీశారు. పంజాబ్ ఇన్నింగ్స్‌లో ప్రభ్‌సిమ్రన్ సింగ్ (18), మార్కస్ స్టోయినిస్ (26), అజ్మతుల్లా ఒమర్జాయ్ (18) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు. ప్రియాంశ్ ఆర్య 7, జోస్ ఇంగ్లిస్ 4, శ్రేయస్ అయ్యర్ 2, నేహల్ వధేరా 8, శశాంక్ సింగ్ 3, ముషీర్ ఖాన్ 0, హర్‌ప్రీత్ బ్రార్ 4 పరుగులకే ఔటయ్యారు. 78 పరుగుల వద్ద ఎనిమిదో వికెట్ కోల్పోయిన పంజాబ్10.3వ ఓవర్- 78 పరుగుల వద్ద పంజాబ్ ఎనిమిదో వికెట్ కోల్పోయింది. సుయాశ్ శర్మ బౌలింగ్‌లో ప్రమాదకరంగా కనిపిస్తున్న మార్కస్ స్టోయినిస్ (26) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఏడో వికెట్ కోల్పోయిన పంజాబ్8.5వ ఓవర్- 60 పరుగుల వద్ద పంజాబ్ ఏడో వికెట్ కోల్పోయింది. సుయాశ్ బౌలింగ్‌లో ముషీర్ ఖాన్ (0) ఎల్బీడబ్ల్యూగా ఔటయ్యాడు. ఆరో వికెట్ కోల్పోయిన పంజాబ్8.2వ ఓవర్- 60 పరుగుల వద్ద పంజాబ్ ఆరో వికెట్ కోల్పోయింది. సుయాశ్ శర్మ బౌలింగ్‌లో శశాంక్ సింగ్ (3) క్లీన్ బౌల్డయ్యాడు. 50 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన పంజాబ్టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. ఆ జట్టు 50 పరుగులకే సగం వికెట్లు కోల్పోయింది. 6.3వ ఓవర్లో యశ్ దయాల్ బౌలింగ్‌లో నేహల్ వధేరా (8) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దయాల్, హాజిల్‌వుడ్ తలో 2, భువీ ఓ వికెట్ తీశారు. 38 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయిన పంజాబ్5.1వ ఓవర్- 38 పరుగుల వద్ద పంజాబ్ నాలుగో వికెట్ కోల్పోయింది. హాజిల్‌వుడ్ బౌలింగ్‌లో భువనేశ్వర్ కుమార్‌కు క్యాచ్ ఇచ్చి జోష్ ఇంగ్లిస్ (4) ఔటయ్యాడు. పీకల్లోతు కష్టాల్లో పంజాబ్3.4వ ఓవర్- 30 పరుగుల వద్ద పంజాబ్ మూడో వికెట్ కోల్పోయింది. హాజిల్‌వుడ్ బౌలింగ్‌లో జితేశ్ శర్మకు క్యాచ్ ఇచ్చి శ్రేయస్ అయ్యర్ (2) ఔటయ్యాడు. ఇన్ ఫామ్ బ్యాటర్లు ప్రియాంశ్, ప్రభ్‌సిమ్రన్, శ్రేయస్ ఔట్ కావడంతో పంజాబ్ పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. 27 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన పంజాబ్2.6వ ఓవర్- టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేస్తున్న పంజాబ్ 27 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. భువనేశ్వర్ కుమార్ బౌలింగ్‌లో జితేశ్ శర్మకు క్యాచ్ ఇచ్చి ఇన్ ఫామ్ బ్యాటర్ ప్రభ్‌సిమ్రన్ సింగ్ (18) ఔటయ్యాడు. తొలి వికెట్ కోల్పోయిన పంజాబ్1.2వ ఓవర్- 9 పరుగుల వద్ద పంజాబ్ తొలి వికెట్ కోల్పోయింది. యశ్ దయాల్ బౌలింగ్‌లో కృనాల్ పాండ్యాకు క్యాచ్ ఇచ్చి ప్రియాంశ్ ఆర్య (7) ఔటయ్యాడు. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆర్సీబీ, స్టార్ బౌలర్ వచ్చేశాడుఐపీఎల్ 2025లో భాగంగా ఇవాళ (మే 29) జరుగుతున్న క్వాలిఫయర్-1 మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్, ఆర్సీబీ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ కోసం ఇరు జట్లు చెరో మార్పు చేశాయి. పంజాబ్ తరఫున మార్కో జన్సెన్ స్థానంలో అజ్మతుల్లా ఒమర్జాయ్ తుది జట్టులోకి వచ్చాడు. ఆర్సీబీ తరఫున స్టార్ పేసర్ జోష్ హాజిల్‌వుడ్ బరిలోకి దిగనున్నాడు. నువాన్ తుషార స్థానాన్ని జోష్ భర్తీ చేశాడు.జట్ల వివరాలు..పంజాబ్ కింగ్స్ (ప్లేయింగ్ XI): ప్రియాంష్ ఆర్య, ప్రభ్సిమ్రాన్ సింగ్, జోష్ ఇంగ్లిస్(w), శ్రేయాస్ అయ్యర్(c), నెహాల్ వధేరా, శశాంక్ సింగ్, మార్కస్ స్టోయినిస్, అజ్మతుల్లా ఒమర్జాయ్, హర్‌ప్రీత్ బ్రార్, అర్ష్‌దీప్ సింగ్, కైల్ జామీసన్ఇంపాక్ట్ సబ్‌లు: విజయ్‌కుమార్ వైషాక్, ప్రవీణ్ దూబే, సూర్యాంశ్ షెడ్గే, ముషీర్ ఖాన్, జేవియర్ బార్ట్లెట్.రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ప్లేయింగ్ XI): విరాట్ కోహ్లీ, ఫిలిప్ సాల్ట్, రజత్ పాటిదార్(సి), లియామ్ లివింగ్‌స్టోన్, జితేష్ శర్మ(w), రొమారియో షెపర్డ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, యశ్ దయాల్, జోష్ హేజిల్‌వుడ్, సుయాష్ శర్మఇంపాక్ట్ సబ్స్: మయాంక్ అగర్వాల్, రసిఖ్ సలామ్, మనోజ్ భాండాగే, టిమ్ సీఫెర్ట్, స్వప్నిల్ సింగ్. -
Qualifier 1: స్టార్ బౌలర్ దూరం.. బలహీనంగా కనిపిస్తున్న పంజాబ్ బౌలింగ్ విభాగం
ఐపీఎల్ 2025లో భాగంగా ఆర్సీబీతో ఇవాళ (మే 29) జరుగబోయే క్వాలిఫయర్-1కు ముందు పంజాబ్ కింగ్స్ బౌలింగ్ విభాగం బలహీనంగా కనిపిస్తుంది. ఈ మ్యాచ్‌కు ఆ జట్టు స్టార్ పేసర్ మార్కో జన్సెన్ దూరమయ్యాడు. డబ్ల్యూటీసీ ఫైనల్ దృష్ట్యా అతను స్వదేశానికి వెళ్లిపోయాడు. జన్సెన్ స్థానాన్ని అజ్మతుల్లా ఒమర్జాయ్ భర్తీ చేసే అవకాశం ఉంది. కీలకమైన ఈ మ్యాచ్‌లో జన్సెన్ లేకపోవడం పంజాబ్ విజయావకాశాలను తప్పక ప్రభావితం చేస్తుంది.చహల్ ఆడేది కూడా అనుమానమే..!నేటి మ్యాచ్‌లో పంజాబ్ స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్ ఆడేది కూడా అనుమానమే అని తెలుస్తుంది. చహల్ కొద్ది రోజుల కిందట గాయపడ్డాడు (చేతి వేలికి). ఈ కారణంగా అతను గత రెండు మ్యాచ్‌లకు దూరంగా ఉన్నాడు. కీలక మ్యాచ్ కావడంతో పంజాబ్ యాజమాన్యం చహల్‌ను బరిలోకి దించే సాహసం చేయవచ్చు.జన్సెన్, చహల్ లాంటి నాణ్యమైన బౌలర్లు నేటి మ్యాచ్‌లో ఆడకపోతే పంజాబ్‌కు ఇబ్బందులు తప్పకపోవచ్చు. వీరిద్దరు మ్యాచ్ స్వరూపాన్ని మార్చేయగల బౌలర్లు. వీరి గైర్హాజరీలో పంజాబ్ బౌలింగ్ విభాగం బలహీనంగా కనిపిస్తుంది. నంబర్ వన్ టీ20 బౌలర్ అర్షదీప్ ఉన్నా ఒక్కడు ఏ మేరకు ప్రభావం చూపగలడో చూడాలి. జేమీసన్, ఒమర్జాయ్ లాంటి పేసర్లు ఉన్నా వారి నుంచి అతిగా ఆశించలేని పరిస్థితి. స్పిన్ విభాగంలో హర్‌ప్రీత్ బ్రార్‌పై కొద్దొగొప్పో నమ్మకాలు పెట్టుకోవచ్చు. ఒకవేళ చహల్ దూరమైతే అతని స్థానంలో విజయ్‌కుమార్ వైశాక్ ఆడవచ్చు. అయితే వైశాక్ చహల్ లేని లోటును భర్తీ చేయలేడు. వైశాక్ తుది జట్టులోకి వస్తే పంజాబ్ స్పిన్ విభాగాన్ని హర్‌ప్రీత్ బ్రార్ ఒక్కడే మోయాల్సి వస్తుంది. కాబట్టి గాయం తగ్గకపోయినా నేటి మ్యాచ్‌లో పంజాబ్ యాజమాన్యం చహల్‌ను బరిలోకి దించవచ్చు. భీకర ఫామ్‌లో ఉన్న విరాట్ కోహ్లిని బలహీనంగా కనిపిస్తున్న ఈ పంజాబ్ బౌలింగ్ యూనిట్ ఏ మేరకు నిలువరించగలదో చూడాలి.బౌలింగ్ విషయాన్ని పక్కన పెడితే.. పంజాబ్ బ్యాటింగ్ విభాగం అత్యంత పటిష్టంగా ఉంది. ఈ జట్టులో దాదాపు అందరు బ్యాటర్లు మంచి ఫామ్‌లో ఉన్నారు. ఓపెనర్లు ప్రభ్‌సిమ్రన్, ప్రియాంశ్ ఆర్య ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నారు. ఇంగ్లిస్ గత మ్యాచ్‌లో తడాకా చాటాడు. శ్రేయస్ సీజన్ ఆరంభం నుంచి మంచి టచ్‌లో ఉన్నాడు. నేహల్ వధేరా, శశాంక్ సింగ్ ఇన్నింగ్స్ చివర్లో అద్భుతాలు చేయడం చూశాం. పంజాబ్ బ్యాటింగ్ విభాగాన్ని స్టోయినిస్ ఫామ్ ఒక్కటే కలవరపెడుతుంది. ఇతను కూడా నేటి మ్యాచ్‌లో టచ్‌లోకి వస్తే ఆర్సీబీ బౌలర్లకు చుక్కలు కనిపిస్తాయి.నేటి మ్యాచ్‌లో పంజాబ్ తుది జట్టు (అంచనా)..ప్రియాంష్ ఆర్య, జోష్ ఇంగ్లిస్ (WK), శ్రేయస్ అయ్యర్ (C), నేహాల్ వధేరా, శశాంక్ సింగ్, మార్కస్ స్టోయినిస్, అజ్మతుల్లా ఒమర్జాయ్, హర్‌ప్రీత్ బ్రార్, కైల్ జామీసన్, అర్ష్‌దీప్ సింగ్, వైషాక్ విజయ్‌కుమార్/యుజ్వేంద్ర చాహల్ఇంపాక్ట్ ప్లేయర్: ప్రభ్సిమ్రాన్ సింగ్ -
IPL 2025 Qualifier 1: చరిత్రకు అడుగు దూరంలో విరాట్ కోహ్లి
ఐపీఎల్-2025 సీజన్ తొలి క్వాలిఫయర్‌లో గురువారం ముల్లాన్‌పూర్ వేదికగా పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడనున్నాయి. సమ ఉజ్జీలగా ఉన్న ఈ రెండు జట్ల మధ్య పోరు మరోసారి రసవత్తరంగా సాగే అవకాశం ఉంది. ఇప్పటికే లీగ్ స్టేజిలో ఇరు జట్ల మధ్య జరిగిన రెండు మ్యాచ్‌లు కూడా అభిమానులను మునివేళ్లపై నిలబెట్టాయి. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్‌కు ఆర్హత సాధిస్తోంది. ఇక హైవోల్టేజ్ మ్యాచ్‌కు ముందు ఆర్సీబీ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లిని పలు అరుదైన రికార్డులు ఊరిస్తున్నాయి.చరిత్రకు అడుగు దూరంలో..ఈ మ్యాచ్‌లో కోహ్లి మరో 30 పరుగులు చేస్తే పంజాబ్ కింగ్స్‌పై అత్యధిక రన్స్ చేసిన ఆటగాడిగా రికార్డులకెక్కుతాడు. ఇప్పటివరకు పంజాబ్‌పై కోహ్లి 1104 పరుగులు చేశాడు. ప్రస్తుతం ఈ రికార్డు ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ డేవిడ్ వార్నర్ పేరిట ఉంది. వార్నర్ పంజాబ్ కింగ్స్‌పై 1034 పరుగులు చేశాడు.ఒకే ఒక ఫిప్టీ..ఒక ఐపీఎల్ సీజన్లో అత్యధిక ఆర్ధశతకాలు నమోదు చేసిన డేవిడ్ వార్నర్ రికార్డును సమం చేసేందుకు కోహ్లి అడుగుదూరంలో నిలిచాడు. ఈ మ్యాచ్‌లో విరాట్ హాఫ్ సెంచరీ సాధిస్తే వార్నర్ సరసన చేరుతాడు. కోహ్లి ఈ ఏడాది సీజన్లో ఇప్పటివరకు ఎనిమిది ఆర్ధ శతకాలు నమోదు చేశాడు. 2016 ఐపీఎల్ సీజన్లో వార్నర్ 9 ఫిప్టీలు సాధించాడు. కాగా ఈ ఏడాది సీజన్లో విరాట్ సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. తన అద్బుత ఇన్నింగ్స్‌లతో ఆర్సీబీ విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. కింగ్ కోహ్లి ఇప్పటివరకు 13 మ్యాచ్‌లు ఆడి 602 పరుగులు చేశాడు.పంజాబ్‌తో మ్యాచ్‌కు ఆర్సీబీ తుది జట్టు(అంచనా)ఫిల్ సాల్ట్, విరాట్ కోహ్లి, మయాంక్ అగర్వాల్, రజిత్ పాటిదార్(కెప్టెన్), లివింగ్‌స్టోన్, జితేష్ శర్మ(వికెట్ కీపర్), కృనాల్ పాండ్యా, యశ్ దయాల్, జోష్ హాజిల్‌వుడ్, భువనేశ్వర్ కుమార్, నువాన్ తుషారాచదవండి: ENG vs IND: 'శ్రేయస్ ఏమి తప్పు చేశాడు.. కావాలనే ఎంపిక చేయలేదు' -
క్వాలిఫయర్-1.. ఆర్సీబీకి అదిరిపోయే న్యూస్
ఐపీఎల్-2025 క్వాలిఫయర్-1కు సర్వసిద్దమైంది. చంఢీగడ్‌లోని ముల్లాన్ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అమీతుమీ తెల్చుకోనున్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిచి ఫైనల్లో అడుగుపెట్టాలని ఇరు జట్లు ఉవ్విళ్లూరుతున్నాయి. ఇరు జట్లు సమ ఉజ్జీలగా ఉండడంతో గెలుపు ఎవరిదో క్రికెట్ నిపుణులు సైతం అంచనా వేయలేకపోతున్నారు. ఈ మ్యాచ్‌కు ముందు ఆర్సీబీకి గుడ్‌న్యూస్ అందినట్లు తెలుస్తోంది.హాజిల్ వుడ్ రీ ఎంట్రీ?గాయం కారణంగా గత కొన్ని మ్యాచ్‌లకు దూరంగా ఉన్న జోష్ హాజిల్‌వుడ్ తిరిగి ఆర్సీబీ తుది జట్టులోకి రావడం దాదాపు ఖాయమైంది. భుజం నొప్పితో బాధపడుతున్న ఈ ఆసీస్ స్పీడ్ స్టార్ ఇప్పుడు పూర్తి ఫిట్నెస్ సాధించాడు. రొమిరియో షెఫర్డ్ స్దానంలో ప్లేయింగ్ ఎలెవన్‌లోకి హాజిల్‌వుడ్ రానున్నట్లు ఆర్సీబీ వర్గాలు వెల్లడించాయి.హాజిల్‌వుడ్ తిరిగొస్తే బెంగళూరు బౌలింగ్ విభాగం మరింత పటిష్టం కానుంది. ఇప్పటికే భువనేశ్వర్ కుమార్, నువాన్ తుషారా వంటి స్పీడ్ స్టార్లు ఆర్సీబీ జట్టులో ఉన్నారు. మరోవైపు గత రెండు మ్యాచ్‌లలో ఇంప్టాక్ ప్లేయర్‌గా బరిలోకి దిగిన ఆర్సీబీ కెప్టెన్ రజిత్ పాటిదార్ సైతం ఈ మ్యాచ్‌కు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉన్నాడు. అయితే విధ్వంసకర ఆటగాడు టిమ్ డేవిడ్ మాత్రం ఈ మ్యాచ్‌లో కూడా ఆడేది అనుమానమే. డేవిడ్ ప్రస్తుతం తొడ కండరాల గాయంతో బాధపడుతున్నాడు. అతడు కోలుకోవడానికి మరి కొంత సమయం పడుతోంది.పంజాబ్‌తో మ్యాచ్‌కు ఆర్సీబీ తుది జట్టు(అంచనా)ఫిల్ సాల్ట్, విరాట్ కోహ్లి, మయాంక్ అగర్వాల్, రజిత్ పాటిదార్(కెప్టెన్), లివింగ్‌స్టోన్, జితేష్ శర్మ(వికెట్ కీపర్), కృనాల్ పాండ్యా, యశ్ దయాల్, జోష్ హాజిల్‌వుడ్, భువనేశ్వర్ కుమార్, నువాన్ తుషారాచదవండి: ENG vs IND: 'శ్రేయస్ ఏమి తప్పు చేశాడు.. కావాలనే ఎంపిక చేయలేదు' -
ఇవాల్టి నుంచి ఐపీఎల్ క్వాలిఫయర్ మ్యాచ్ లు
-
PBKS Vs RCB: ఫైనల్ వేటలో...
ముల్లాన్‌పూర్: ఐపీఎల్ ప్రారంభమైనప్పటి నుంచి ట్రోఫీ కోసం చకోర పక్షుల్లా ఎదురుచూస్తున్న రెండు జట్లు... 18వ సీజన్ ఫైనల్ చేరేందుకు పోటీపడుతున్నాయి. పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో నిలిచిన పంజాబ్ కింగ్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) గురువారం క్వాలిఫయర్–1లో అమీతుమీ తేల్చుకోనున్నాయి. లీగ్ ఆరంభం నుంచి ఆడుతున్న ఇప్పటివరకు ఒక్కసారి కూడా విజేతగా నిలవలేకపోయిన ఇరు జట్లు... ఈ సారి నిలకడైన ప్రదర్శనతో ‘ప్లే ఆఫ్స్’కు చేరాయి. లీగ్ దశలో 14 మ్యాచ్‌లాడిన పంజాబ్ కింగ్స్ 9 విజయాలు, 4 పరాజయాలు, ఒక ఫలితం తేలని మ్యాచ్‌తో 19 పాయింట్లు ఖాతాలో వేసుకొని పట్టికలో అగ్రస్థానం దక్కించుకుంది. 2014 తర్వాత పంజాబ్ జట్టు ‘ప్లే ఆఫ్స్’కు చేరడం ఇదే తొలిసారి కాగా... అప్పుడు కూడా పట్టికలో అగ్ర స్థానంలో నిలిచిన పంజాబ్... తుదిపోరులో కోల్‌కతా నైట్ రైడర్స్ చేతిలో ఓడి రన్నరప్‌గా నిలిచింది. ఇక మరోవైపు 14 మ్యాచ్‌ల్లో 9 విజయాలు, 4 పరాజయాలు ఒక ఫలితం తేలని మ్యాచ్‌తో 19 పాయింట్లు సాధించిన బెంగళూరు రన్‌రేట్‌లో కాస్త వెనుకబడి రెండో స్థానంలో నిలిచింది. ఇరు జట్ల మధ్య ఈ సీజన్లో రెండు మ్యాచ్‌లు జరగగా... చెరొకటి గెలిచాయి. బెంగళూరులో జరిగిన పోరులో పంజాబ్ గెలవగా... ముల్లాన్‌పూర్‌లో జరిగిన పోరులో బెంగళూరు పైచేయి సాధించింది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్‌కు చేరనుండగా... ఓడిన జట్టుకు క్వాలిఫయర్–2 రూపంలో మరో అవకాశం ఉండనుంది. టాప్–3పైనే ఆశలు... ఇప్పటికే మూడు వేర్వేరు జట్లను ఐపీఎల్ ‘ప్లే ఆఫ్స్’కు చేర్చిన కెప్టెన్‌గా ఘనత సాధించిన శ్రేయస్ అయ్యర్... పంజాబ్‌కు ప్రధాన బలం కానున్నాడు. మైదానం బయటి నుంచి రికీ పాంటింగ్ సలహాలు... లోపల శ్రేయస్ వ్యూహాలతో ఇప్పటికే పంజాబ్ కింగ్స్ అభిమానుల మనసులు గెలుచుకుంది. ముందుండి నడిపించే వాడే నాయకుడు అనే విధంగా శ్రేయస్ బ్యాట్‌తోనూ దుమ్మురేపుతున్నాడు. 14 మ్యాచ్‌ల్లో 51.40 సగటుతో అతడు 514 పరుగులు చేసి జట్టు తరఫున టాప్ స్కోరర్‌గా కొనసాగుతున్నాడు. మిడిలార్డర్లో బ్యాటింగ్ వస్తున్న శ్రేయస్ 171.90 స్ట్రయిక్‌రేట్‌తో ఈ పరుగులు చేయడం విశేషం. ఇక యువ ఓపెనర్లు ప్రభ్ సిమ్రన్ సింగ్ 499 పరుగులు, ప్రియాన్ష్ ఆర్య 424 పరుగులతో సత్తా చాటారు. ఈ ఇద్దరు అందిస్తున్న శుభారంభాలతోనే పంజాబ్ భారీ స్కోర్లు చేయగలిగింది. ఈ సీజన్లో పంజాబ్ నిలకడైన విజయాలకు ఈ ముగ్గురి ఫామే ప్రధాన కారణం. ఇన్‌గ్లిస్ మంచి టచ్‌లో ఉండగా... నేహల్ వధేరా, శశాంక్, స్టొయినిస్ అవసరమైన సమయంలో సత్తా చాటుతున్నారు. బౌలింగ్‌లో అర్ష్ దీప్ సింగ్, కైల్ జేమీసన్, అజు్మతుల్లా కీలకం కానున్నారు. జాతీయ జట్టు అవసరాల నేపథ్యంలో దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్ మార్కో యాన్సెన్ స్వదేశానికి తిరిగి వెళ్లడం జట్టుకు కాస్త ఇబ్బంది కాగా... గాయం కారణంగా గత రెండు మ్యాచ్‌లకు అందుబాటులో లేని చాహల్ రాకతో స్పిన్ విభాగం పటిష్టమైంది. విరాట్‌పై పెను భారం లీగ్ ఆరంభమైనప్పటి నుంచి ఒకే ఫ్రాంచైజీకి ఆడుతున్న ఏకైక ఆటగాడిగా రికార్డుల్లోకి ఎక్కిన విరాట్ కోహ్లి... 18వ సీజన్లో అయినా ట్రోఫీని ముద్దాడాలని తహతహలాడుతున్నాడు. సారథ్య బాధ్యతల నుంచి తప్పుకున్నా... అనధికారిక కెపె్టన్‌గా కోహ్లిపైనే జట్టు అధికంగా ఆధారపడుతోంది. అందుకు తగ్గట్లే ఈ సీజన్లో మెరుగైన ప్రదర్శన కనబర్చిన విరాట్... 13 మ్యాచ్‌ల్లో 60.20 సగటుతో 602 పరుగులు చేశాడు. 147.91 స్ట్రయిక్‌రేట్‌తో పరుగులు రాబట్టిన కోహ్లి... 8 అర్ధ శతకాలు తన ఖాతాలో వేసుకున్నాడు. తన వికెట్ విలువ అర్థం చేసుకొని ఆడుతున్న కోహ్లి... ఈ సీజన్లో అత్యధిక స్కోరు ముల్లాన్‌పూర్‌లోనే పంజాబ్‌పై నమోదు చేసుకోవడం అతడి ఆత్మవిశ్వాసాన్ని పెంచే అంశం. కోహ్లి, సాల్ట్ జట్టుకు శుభారంభాలు అందిస్తుండగా... మయాంక్ అగర్వాల్, రజత్ పాటీదార్, జితేశ్ శర్మ చక్కటి ఫామ్‌లో ఉన్నారు. గత మ్యాచ్‌లో ఆశలే లేని స్థితిలో అద్భుత ప్రదర్శన చేసిన జితేశ్ శర్మ నుంచి ఫ్రాంఛైజీ అలాంటి ప్రదర్శనే ఆశిస్తోంది. గాయం కారణంగా టిమ్ డేవిడ్ అందుబాటులో లేకపోవడం జట్టుకు ఇబ్బందికరంగా మారగా... అతడి స్థానంలో లియామ్ లివింగ్‌స్టోన్ ఫినిషర్ పాత్ర పోషించనున్నాడు. ఫిట్నెస్ సాధించిన జోష్ హాజల్‌వుడ్ తిరిగి రావడం జట్టుకు కొండంత బలాన్నిస్తోంది. తన వైవిధ్యమైన బౌలింగ్‌తో ఎలాంటి బ్యాటర్‌నైనా ఇబ్బంది పెట్టగల హాజల్‌వుడ్ ఈ మ్యాచ్‌లో కీలకం కానున్నాడు. భువనేశ్వర్, యశ్ దయాళ్‌తో కలిసి అతడు పేస్ భారాన్ని మోయనుండగా... సుయాశ్ శర్మ, కృనాల్ పాండ్యా స్పిన్ బాధ్యతలు పంచుకోనున్నారు. తుది జట్లు (అంచనా) పంజాబ్ కింగ్స్: శ్రేయస్ (కెప్టెన్ ), ప్రియాన్ష్ ఆర్య, ప్రభ్‌సిమ్రన్ సింగ్, ఇన్‌గ్లిస్, నేహల్ వధేరా, శశాంక్, స్టొయినిస్, అజ్మతుల్లా, జెమీసన్, హర్‌ప్రీత్, అర్ష్ దీప్, చాహల్. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు: రజత్ పాటీదార్ (కెప్టెన్ ), కోహ్లి, సాల్ట్, మయాంక్ అగర్వాల్, జితేశ్, కృనాల్ పాండ్యా, లివింగ్‌స్టోన్, షెఫర్డ్, భువనేశ్వర్, యశ్ దయాళ్, హజల్‌వుడ్, సుయాశ్ శర్మ. పిచ్, వాతావరణం ముల్లాన్‌పూర్ మైదానంలో ఈ సీజన్లో నాలుగు మ్యాచ్‌లు జరగగా... అందులో మూడు ఇన్నింగ్స్‌ల్లో స్కోర్లు 200 దాటాయి. మిగిలిన ఐదు ఇన్నింగ్స్‌ల్లో స్వల్ప స్కోర్లు నమోదయ్యాయి. బుధవారం పిచ్ ఎలా స్పందిస్తుందనేది కీలకం. మ్యాచ్‌కు వర్షం ముప్పు లేదు. ఐపీఎల్లో నేడు (క్వాలిఫయర్ –1)పంజాబ్ X బెంగళూరువేదిక: ముల్లాన్‌పూర్‌రాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో


