
PC: BCCI/IPL.com
ఐపీఎల్-2025లో ముల్లాన్‌పూర్ వేదికగా పంజాబ్ కింగ్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ మధ్య జరిగిన మ్యాచ్ సస్పెన్స్ థ్రిల్లర్‌ను తలపించింది. ఉత్కంఠగా సాగిన లో-స్కోరింగ్ గేమ్‌లో పంజాబ్ కింగ్స్ 16 పరుగుల తేడాతో విజయం సాధించింది. 112 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్ 15.1 ఓవర్లలో కేవలం 95 పరుగులకే కుప్పకూలింది.
పంజాబ్ బౌలర్లలో చాహల్ నాలుగు వికెట్లు పడగొట్టి కేకేఆర్‌ను దెబ్బతీశాడు. రహానే, రింకూ సింగ్, రమణ్‌దీప్, రఘువన్షి వంటి కీలక వికెట్లను చాహల్ తన ఖాతాలో వేసుకున్నాడు. అతడితో పాటు మార్కో జానెసన్ కూడా సంచలన ప్రదర్శన చేశాడు.
జానెసన్ క్రీజులో ఉన్న విధ్వంసకర బ్యాటర్ రస్సెల్‌ను ఔట్ చేసి తన జట్టుకు చారిత్రత్మక విజయాన్ని అందించాడు. 3.1 ఓవర్లు బౌలింగ్ చేసిన జానెసన్.. కేవలం 17 పరుగులు ఇచ్చి 3 వికెట్లను పడగొట్టాడు. వీరిద్దిరితో పాటు పంజాబ్ విజయంలో అర్ష్‌దీప్ సింగ్ కీలక పాత్ర పోషించాడు. 19వ ఓవర్ వేసిన అర్ష్‌దీప్ సింగ్ పరుగులేమి ఇవ్వకుండా ఓ వికెట్ పడగొట్టాడు. కేకేఆర్ బ్యాటర్లలో కేకేఆర్ బ్యాటర్లలో రఘువన్షి(37) టాప్ స్కోరర్‌గా నిలవగా.. మిగితా బ్యాటర్లంతా చేతులేత్తేశారు.
పంజాబ్ కింగ్స్ సరికొత్త చరిత్ర..
112 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని డిఫెండ్ చేసుకున్న పంజాబ్ కింగ్స్ సరికొత్త చరిత్ర సృష్టించింది. 18 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలోనే అత్యల్ప టార్గెట్‌ను కాపాడుకున్న తొలి జట్టుగా పంజాబ్ కింగ్స్ రికార్డులకెక్కింది. ఇంతకుముందు ఈ రికార్డు చెన్నై సూపర్ కింగ్స్ పేరిట ఉండేది. 2009 సీజన్‌లో సీఎస్‌కే 116 పరుగుల స్కోర్‌ను డిఫెండ్ చేసుకుంది. తాజా మ్యాచ్‌తో సీఎస్‌కే ఆల్‌టైమ్ రికార్డును పంజాబ్ బ్రేక్ చేసింది.
ఐపీఎల్లో డిఫెండ్ చేసుకున్న అత్యల్ప స్కోర్లు..
111 - పంజాబ్ కింగ్స్ vs కేకేఆర్, ముల్లన్‌పూర్, 2025
116/9 - సీఎస్‌కే vs పంజాబ్ కింగ్స్, డర్బన్, 2009
118 - ఎస్‌ఆర్‌హెచ్ vs ముంబై ఇండియన్స్, ముంబై , 2018
119/8 - పంజాబ్ vs ముంబై ఇండియన్స్, డర్బన్, 2009
119/8 - ఎస్‌ఆర్‌హెచ్ vs పుణే వారియర్స్, పూణే, 2013
చదవండి: IPL 2025: కోల్‌కతాకు షాకిచ్చిన పంజాబ్.. ఉత్కంఠ పోరులో రికార్డు విజయం