ఇరాన్‌కు భారీ షాక్‌ : రెండు రోజుల్లో ముగ్గురు | Iran Intelligence Minister Esmail Khatib dies In Strikes Israel | Sakshi
Sakshi News home page

ఇరాన్‌కు భారీ షాక్‌ : రెండు రోజుల్లో ముగ్గురు

Mar 18 2026 4:42 PM | Updated on Mar 18 2026 4:53 PM

Iran Intelligence Minister Esmail Khatib dies In Strikes Israel

రెండు రోజుల్లో  ముగ్గురు కీలక అధికారులు మృతి

ఇరాన్‌ ఇంటిలిజెన్స్‌ మంత్రిని హతమార్చాం : ఇజ్రాయెల్‌

గత 19 రోజులుగా భీకరంగా సాగుతున్న ఇరాన్‌ యుద్ధంలో ఇరాన్‌కు వరుసగా ఎదురు దెబ్బలు తగులు తున్నాయి.  తాజా దాడుల్లో  ఇరాన్ గూఢచార మంత్రిఇ స్మాయిల్ ఖతీబ్ మరణించారని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి  కాట్జ్ ప్రకటించారు. అయితే, ఖతీబ్ మరణాన్ని ఇరాన్ ఇంకా ధృవీకరించలేదు.

అదనపు అనుమతులు తీసుకోకుండా,  ఏఇతర సీనియర్ ఇరాన్ అధికారినైనా చంపేందుకు ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చారని కాట్జ్ ప్రకటించారు. రెండు రోజుల్లో ఇరాన్‌  ముగ్గురు కీలక  వ్యక్తులను కోల్పోయింది. మంగళవారం ఇరాన్ భద్రతా దళాల అధిపతి అలీ లారిజానీ, ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ స్వచ్ఛంద బసిజ్ దళాధిపతి ఘోలమ్రెజా సోలేమానీని హత మార్చింది.   

ఇదీ చదవండి: రూ. 4 కోట్లు : హరీష్‌ పరిస్థితి వద్దు, దంపతుల కన్నీరు మున్నీరు

కాగా ఫిబ్రవరి 28న  ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్‌ మొదలు పెట్టిన దాడుల్లో ఇరాన్‌ సుప్రీం అయతుల్లా  అలీ ఖమేనీ మృతి చెందారు. ఆయన స్థానంలో, ఆయన కుమారుడు 56 ఏళ్ల మోజ్తాబా ఖమేనీ అత్యున్నత లీడర్‌గా ఎంపికయ్యారు. మరోవైపు ఈ దాడిలో మోజ్తబా కూడా తృటిలో ప్రమాదంనుంచి తప్పించుకున్నారని వార్తలు వెలువడిన సంగతి తెలిసిందే. 
(బిడ్డల కోసం...గుండెల్ని పిండేసే అమ్మ కథ!)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement