ప్రస్తుత కాలంలో యువత ఒత్తిడి, ఆర్థిక భద్రత మధ్య నలిగిపోతున్నారు. ముఖ్యంగా కార్పొరేట్ లైఫ్ శారీరక, మానసిక ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేసి ఒత్తిడిలో కూరుకుపోయేలో చేసిందో ఓ ఉద్యోగి సోషల్ మీడియా వేదికగా వాపోయాడు. అంతేగాదు ఆ కారణంగా ఆ లైఫ్‌కి స్వస్తి పలుకుతున్నా అంటూ..తన చివరి రోజుని సెలబ్రేట్ చేసుకుంటూ..ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నాడో వెల్లడించాడు. ఇంతకీ అంత పెద్ద నిర్ణయం ఎందుకు తీసుకున్నాడంటే..
బిస్వజిత్ మొహంతి 35 ఏళ్ల వయసులో కార్పొరేట్ కెరీర్‌కు విరమణ పలుకుతున్నా అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో షేర్ చేశారు. ఆ వీడియోలో మొహంతి కార్పొరేట్ ప్రపంచంలో తన లాస్ట్ వర్కిగ్ డేని జరుపుకున్నట్లు ప్రకటించారు. ఈ క్షణం వరకు కార్పొరేట్ లైఫ్‌లో సాగిన తన సుదీర్ఘ ప్రయాణాన్ని గుర్తుచేసుకున్నారు.
ఇందులో సవంత్సరాల పాఠశాల విద్య, లోన్ తీసుకుని మరి చదువుకున్న ఉన్నత విద్య, దాదాపు 11 ఏళ్ల వృత్తిపరమైన అనుభవం తదితరాలు ఉన్నాయి. ఇవన్నీ చివరకు కార్పొరేట్ లైఫ్ నుంచి నిష్క్రమించాలనే నిర్ణయానికి దారితీశాయి. పదవీవిరమణ వరకు అదే వృత్తిలో కొనసాగకూడదని సుమారు మూడేళ్ల క్రితం అనుకున్నట్లు తెలిపారు. ఉద్యోగంలో ఉన్నప్పుడే ఈ నిర్ణయం తన మనసులోకి వచ్చిందని, అన్నారు. అయితే ఆర్థిక భద్రత నేపథ్యంలో కొనసాగించాలా వద్దా అన్న మీమాంసలో ఉండిపోయాన్నారు.
ఇక్కడ నుంచి బయటపడ్డాక..నెక్స్ట్ ఏంటీ అన్న భయం కారణంగా కార్యరూపంలోకి తీసుకురాలేకపోయానన్నారు. గత మూడేళ్లలో ఏం కోల్పోయానో గ్రహించా, పాతవాటిని మర్చిపోవడం, తన బలాలను గుర్తించడం వంటివే అసలైన సంపదలుగా గ్రహించా, దాంతో తన శక్తిని, సమయం వంటి వాటిని సరైన దానిపై పెట్టబడి పెట్టడంపై ఫోకస్ పెట్టాలనే ఉద్దేశ్యంతోనే ధైర్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఆ తర్వాత ఏం చేయాలనే దానిపై సైతం స్పష్టత ఉందన్నారు.
ఈ కార్పొరేట్ లైఫ్‌ని వదిలేసే ముందు వరకు కష్టంగా అనిపించింది. కానీ వైదొలగడం మాత్రం చాలా ప్రశాంతతనిచ్చిందన్నారు. అంతేగాదు సాంప్రదాయ వృత్తి మార్గం కంటే వ్యక్తిగత సంతృప్తికి ప్రాధాన్యత ఇవ్వాలని తెలసుకున్నా అంటూ తన పోస్ట్‌ని ముగించారు. నెటిజన్లు సైతం ఆయన పోస్ట్‌కి మద్దతు పలుకుతూ..నిజంగానే "కార్పొరేట్ ఉద్యోగం ఒక పెద్ద ఉచ్చు..! ఉద్యోగం మిమ్మల్ని ఎప్పటికీ ధనవంతులను చేయదు. అది ఎల్లప్పుడూ మన కంటే 10 రెట్లు ఎక్కువ సంపాదించే వారి కింద మనల్ని ఉంచుతుందంటూ తమ అనుభవాన్ని షేర్ చేస్తూ పోస్టులు పెట్టడం గమనార్హం.
(చదవండి: శాకాహార బాడీబిల్డర్‌గా విదేశీయుడు..! ఏకంగా డబ్ల్యూహెచ్‌ఓ..)


