టీఎంసీ కీలక నేతలపై మార్కండే కట్జూ షాకింగ్‌ వ్యాఖ్యలు | Won't Be Surprised If Mahua Moitra, Sagarika, Sayoni Join BJP Markandey Katju | Sakshi
Sakshi News home page

టీఎంసీ కీలక నేతలపై మార్కండే కట్జూ షాకింగ్‌ వ్యాఖ్యలు

May 6 2026 1:42 PM | Updated on May 6 2026 2:28 PM

Won't Be Surprised If Mahua Moitra, Sagarika, Sayoni Join BJP Markandey Katju

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 207 స్థానాలను కైవసం చేసుకొని అఖండ విజయాన్ని సాధించింది. మరోవైపు అధికార TMC మాత్రం కేవలం 80 స్థానాలతో సరిపోట్టుకోవాల్సి వచ్చింది. ఈ విజయం తర్వాత భారత సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి మార్కండే కట్జూ  చేసిన వ్యాఖ్యలు చర్చకు దారి తీశాయి.

ముఖ్యంగా మమతా  బెనర్జీకి స్ట్రాంగ్‌ సపోర్ట్‌గా ఉన్న మహిళానేతలపై ఆయన  అనూహ్య విమర్శలు చేశారు. రాబోయే రోజుల్లో  టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా, మరో ఎంపీ,  ప్రముఖ జర్నలిస్ట్‌ సాగరిక ఘోష్, సయోని ఘోష్  లాంటి నాయకులు BJPలో చేరినా తాను ఆశ్చర్యపోనని అన్నారు. ఈ జాబితాలో కునాల్ ఘోష్‌ను కూడా చేర్చారు. మరొక పోస్ట్‌లో ఆయన ఇలా  అన్నారు. "TMC నాయకులారా, మేము ఎన్నికల్లో గెలిచామని మీరు ప్రకటించుకోండి, హరి ఓం." అంటూ వారిని ఎద్దేవా చేశారు.

ఇదీ చదవండి: 'దళపతి' 10th మార్క్స్‌ వైరల్‌, విజయ్‌ విద్యార్హత ఏంటి?

కాగా పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ గెలుపు తరువాత మమత తాను సీఎం పదవికిరాజీనామా చేయనని ప్రకటించారు. అలాగే ఎన్నికల అనంతరం బెంగాల్‌లో హింసాకాండ చెలరేగింది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లోని TMC కార్యాలయాల వద్ద విధ్వంసానికి సంబంధించిన అనేక ఘటనలు హింసకు సంబంధించిన పలు కేసులు నమోదయ్యాయి. మరోవైపు రాష్ట్రంలో హింసను ప్రేరేపించే, విధ్వంసానికి పాల్పడే వారిపైనా కఠిన చర్యలు తీసుకుంటామని ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ బుధవారం తీవ్ర హెచ్చరిక జారీ చేశారు. అలాంటి వారిని తక్షణమే అరెస్టు చేస్తామని కూడా ఆయన హెచ్చరించారు. 

మరోవైపు కోల్‌కతాలోని 'న్యూ మార్కెట్' వద్ద బుల్డోజర్లు అంటూ TMC రాజ్యసభ సభ్యురాలు సుష్మిత దేవ్ ఒక వీడియోను పంచుకున్నారు. మాంసం దుకాణాలను, చివరకు పార్టీ కార్యాలయాలను కూడా అవికూల్చివేస్తున్నాయని ఆమె వ్యాఖ్యానించారు.

ఇదీ చదవండి: ముస్లిం ఓట్లన్నీ టీఎంసీకే : కాబోయే సీఎం సంచలన వ్యాఖ్యలు

Advertisement
 
Advertisement
Advertisement