మమతా బెనర్జీ, స్టాలిన్‌ ఓడింది దానివల్లే..? | Asaduddin sensational comments on Stalin and Mamata defeat | Sakshi
Sakshi News home page

మమతా బెనర్జీ, స్టాలిన్‌ ఓడింది దానివల్లే..?

May 5 2026 5:31 PM | Updated on May 5 2026 6:34 PM

Asaduddin sensational comments on Stalin and Mamata defeat

హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. పశ్చిమ బెంగాల్‌, తమిళనాడు ముఖ్యమంత్రులు ఓడిపోవడానికి కారణం కేంద్రం నిర్వహించిన ఎస్‌ఐఆర్‌ ప్రక్రియే అన్నారు. వారి నియోజకవర్గాల్లో ఎస్‌ఐఆర్ ద్వారా ఓట్లు తొలగించడం ద్వారే స్టాలిన్, మమతా బెనర్జీ ఓడిపోయారన్నారు.

ఏఐఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ మాట్లాడుతూ "మమతా బెనర్జీ, ఎంకే స్టాలిన్‌ల నియోజకవర్గాల్లో వరుసగా ఎస్ఐఆర్ నిర్వహించగా, ఇద్దరూ ఓడిపోయారు. పౌరసత్వాన్ని ఎస్ఐఆర్‌తో ముడిపెట్టడం తప్పు అని నేను పార్లమెంటులో కూడా ఇదే  చెప్పాను. పౌరసత్వానికి హోం మంత్రిత్వ శాఖకు నియమాలు ఉన్నాయి; ఎన్‌ఆర్‌సి, ఎన్‌పిఆర్ నియమాలు కూడా ఉన్నాయి. ఇది కేవలం ఓటు వేయడం గురించే కాదు, మీ పౌరసత్వాన్ని కాపాడుకోవడం గురించి కూడా. తెలంగాణ రేవంత్ రెడ్డి ప్రభుత్వం దీనిని సీరియస్‌గా తీసుకుంటుందని మేము ఆశిస్తున్నాము. ఇక్కడి రాష్ట్ర ప్రభుత్వం దీనిపై దృష్టి పెట్టాలి." అని అన్నారు.

SIR ద్వారా ఓక వ్యక్తికి రెండు మూడు చోట్ల ఓట్లు ఉంటే వాటిని తొలగించడం. మరణించిన వారి వివరాలను ఓట్లర్ల జాబితా నుండి తీసివేయడం వలస వెళ్ళిన వారు శాశ్వతంగా వేరే ప్రాంతాలకు వెళ్లిపోయిన వారిని గుర్తించి ఓట్ల తొలగింపు చేస్తారు. అదే విధంగా  18 ఏళ్లు నిండిన అర్హులైన ప్రతి ఒక్కరినీ ఓటర్ల జాబితాలో చేర్చుతారు. 

వివాదం  ఏంటంటే? 
పశ్చిమ బెంగాల్ (మమతా బెనర్జీ) మరియు తమిళనాడు (ఎం.కె. స్టాలిన్) ముఖ్యమంత్రులు ఈ SIR ప్రక్రియను తీవ్రంగా వ్యతిరేకించారు. ఎస్‌ఐఆర్ పేరుతో తమకు మద్దతు ఇచ్చే వర్గాల ఓట్లను (ముఖ్యంగా మైనారిటీలు, వలస కార్మికులు) కావాలనే తొలగిస్తున్నారని వారు ఆరోపించారు. బెంగాల్‌లో సుమారు 90 లక్షల మంది ఓటర్లను ఈ ప్రక్రియ ద్వారా తొలగించారని, ఇది ఫలితాలను తారుమారు చేసిందని మమతా బెనర్జీ అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement