తమిళనాట విజయ్ సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. ఈ విజయంపై తారా లోకం మొత్తం ఆయనకు అభినందనలు తెలియజేస్తోంది. ఈ క్రమంలో నెట్టింట కొన్ని ఫొటోలు వైరల్ అవుతున్నాయి. అందునా తారలంతా ఆయనతో కలిసి సెల్ఫీలు దిగినట్లు చక్కర్లు కొడుతున్నాయి.
బాలీవుడ్ బాద్‌షా షారూఖ్‌తో పాటు కోలీవుడ్ తారలు అజిత్, విజయ్ సేతుపతి, జయం రవి, కార్తీ, విక్రమ్, శింబు, ధనుష్, సూర్య.. ఇలా వాళ్లందరితో సెల్ఫీని విజయే స్వయంగా తీసినట్లు ఉంది. ఏఐ చేసిన మాయే అయినప్పటికీ.. సోషల్ మీడియా ఈ ఫొటోలతో షేక్ అయిపోతోంది.
Photo Courtesy: Threads


