చంద్రయాన్ (Chandrayaan) సినిమా ప్రీ-రిలీజ్ వేడుక నవంబర్ 11, 2026న హైదరాబాద్లోని మాధాపూర్ రెట్రో డ్రైవ్-ఇన్లో ఘనంగా నిర్వహించారు.
ఈ వేడుకకు హీరో శ్రీవిష్ణు, కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు, నిర్మాత బెక్కెం వేణుగోపాల్ తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
వేణు ఊడుగుల ఈ సినిమాను సమర్ధిస్తున్నారు. శ్రీనాథ్ చంద్రశేఖర్ దర్శకత్వం వహించారు.
శివకుమార్ దీకొండ, స్వప్న ప్రియదర్శిని ప్రధాన పాత్రల్లో నటించగా.. రవి శివతేజ, వంశీధర్, లోకేష్, బలగం సత్యనారాయణ తదితరులు కీలక పాత్రలు పోషించారు.
ఈ సినిమా నవంబర్ 13, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలవుతోంది.


