కేరళ గవర్నర్ శాకాహార కిచెన్ ఆదేశాలపై దుమారం | Keralam Governor's Vegetarian Kitchen Order Sparks Row | Sakshi
Sakshi News home page

కేరళ గవర్నర్ శాకాహార కిచెన్ ఆదేశాలపై దుమారం

Oct 24 2026 12:14 PM | Updated on Oct 24 2026 12:34 PM

Keralam Governor's Vegetarian Kitchen Order Sparks Row

తిరువనంతపురం: కేరళ నూతన గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టిన ఓం ప్రకాష్ మాథుర్ పదవి చేపట్టిన మొదటి రోజే వివాదంలో చిక్కుకున్నారు. రాజ్ భవన్ వంటగదిలో కేవలం శాకాహారం మాత్రమే తయారు చేయాలని ఆయన ఆదేశించినట్లు వార్తలు రావడంతో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష సీపీఎం పార్టీలు తీవ్రంగా మండిపడ్డాయి. ఇది సంఘ్ పరివార్ ‘కాషాయ అజెండా’ అమలులో భాగమని ఆరోపించాయి.

రాజ్ భవన్ వర్గాల సమాచారం ప్రకారం.. ఓం ప్రకాష్ మాథుర్ శాకాహారి కావడంతో, తన వ్యక్తిగత ఆహారపు అలవాట్ల కారణంగానే ఈ మార్పులు చేయాలని ఆదేశించారు. అయితే రాజ్ భవన్ ఉద్యోగుల ఆహార ఎంపికలపై ఎలాంటి ఆంక్షలు విధించలేదని, ఈ కిచెన్‌లో తయారైన ఆహారం గవర్నర్‌కు, ఆయన వ్యక్తిగత సిబ్బందిలో కొద్ది మందికి మాత్రమే వడ్డించబడుతుందని స్పష్టం చేశాయి.

ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ఈ నిర్ణయాన్ని తీవ్రంగా విమర్శించారు. కేరళ తీరప్రాంత రాష్ట్రం కావడంతో ఇక్కడ చేపలు, విభిన్న ఆహార సంస్కృతికి ప్రాధాన్యత ఉందని గుర్తుచేశారు. ప్రజలు ఏం తినాలనే దానిని శాసించే ప్రయత్నం రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులను ఉల్లంఘించడమేనని అన్నారు.
వ్యక్తిగత ఆహారపు అలవాట్లను ఇతరులపై రుద్దడం ఆమోదయోగ్యం కాదని, రాజ్యాంగ పదవిలో ఉన్నవారు ప్రజల స్వేచ్ఛను కాపాడాలని ఆయన పేర్కొన్నారు.

ఈ నిర్ణయాన్ని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి ఎంవీ గోవిందన్ కూడా తప్పుపట్టారు. భారతదేశంలో ఏ ఆహారం తినాలో ఎన్నుకునే ప్రజాస్వామ్య హక్కు ప్రజలకు ఉందని, దానిని లాక్కునే ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు. దీని వెనుక మతపరమైన ధ్రువీకరణ కోసం ఆహారాన్ని ఆయుధంగా మార్చే సంఘ్ పరివార్ అజెండా ఉందని ఆరోపించారు. హోంమంత్రి రమేష్ చెన్నితల కూడా స్పందిస్తూ.. దుస్తులు, భాష, ఆహారం అన్నీ వ్యక్తిగత స్వేచ్ఛ పరిధిలోకి వస్తాయని, ఎవరికి నచ్చిన ఆహారాన్ని వారు తినే స్వేచ్ఛ ఉండాలని అన్నారు.

ఇదీ చదవండి: హర్యానా గ్యాంగ్‌స్టర్ హిమాన్షు అమెరికాలో అరెస్ట్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement