breaking news
Peddapalli
-
ఘనంగా ఫ్యామిలీ డే
యైటింక్లయిన్‌కాలనీ: సింగరేణి ఆర్జీ–2 ఆధ్వర్యంలో సీఈఆర్ క్లబ్లో మంగళవారం ఫ్యామిలీ డే ఘ నంగా నిర్వహించారు. జీఎం వెంకటయ్య జ్యోతి ప్రజ్వులన చేసి వేడుకలు ప్రాంభించారు. క్రీడాపోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. జీఎం మాట్లాడుతూ, క్లబ్ అభివృద్ధికి అన్నివిధాలా సహకరిస్తామన్నారు. అనంతరం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఎస్వోటూ జీఎం రాముడు, సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం నాయకులు, క్లబ్ నిర్వాహకులు వేణుగోపాల్, సాంబశివరావు, సింగరేణి అధికారులు, కార్మిక కుటుంబాలు తదితరులు పాల్గొన్నారు. -
జాతీయ వేదికపై కరీంనగర్ కెరటాలు
● నేషనల్ టేబుల్ టెన్నిస్ బరిలో జిల్లా క్రీడాకారులు ● ఆగస్టు 16 నుంచి 23 వరకు కాన్పూర్‌లో పోటీలుఢిల్లీ, డయ్యూడామన్, తమిళనాడులో జరిగిన ఎస్జీఎఫ్ జాతీయ పోటీల్లో మూడుసార్లు పాల్గొన్నాను. పతకం సాధించలేదు. ఈ సారి తప్పకుండా పతకం సాధిస్తా. టేబుల్ టెన్నిస్‌లో దేశానికి ప్రాతినిథ్యం వహించడమే నా లక్ష్యం. ఆ లక్ష్యాన్ని సాధించేందుకు ప్రతిరోజూ సాధన చేస్తున్నా. – ఎల్లా అవనిరెడ్డి రాష్ట్రస్థాయి పోటీల్లో జరిగిన టేబుల్ టెన్నిస్ పోటీల్లో మూడుసార్లు పాల్గొన్నాను. చీఫ్ మినిస్టర్స్ కప్‌లో 3వ స్థానం సాధించాను. జిల్లాస్థాయి పోటీల్లో 19 పతకాలు గెలుచుకున్నాను. ప్రస్తుతం జరుగనున్న పోటీల్లో పతకం సాధించడమే నా లక్ష్యం. – కటికిరెడ్డి అద్వికనాథ్ కరీంనగర్‌స్పోర్ట్స్: కరీంనగర్ క్రీడాకారులు జాతీయస్థాయిలో సత్తా చాటడానికి సిద్ధమయ్యారు. స్థానిక స్పోర్ట్స్ అకాడమీకి చెందిన టేబుల్ టెన్నిస్ ఆటగాళ్లు వచ్చే ఆగస్టులో ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో జరిగే నేషనల్ ర్యాంకింగ్ టేబుల్ టెన్నిస్ చాంపియన్‌షిప్–2026కు రాష్ట్ర జట్టు తరఫున ప్రాతినిథ్యం వహించేందుకు ఎంపికయ్యారు. ఆగస్టు 16 నుంచి 23వ తేదీ వరకు ఈ పోటీలు జరగనున్నాయి. ఇందుకోసం క్రీడాకారులు ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం సుమారు ఐదు గంటల పాటు కఠినమైన సాధన చేస్తున్నారు. -
ప్రతిపాదనల్లోనే ఈఎస్ఐ ఆస్పత్రి
రామగుండం: కార్మిక క్షేత్రంలో కార్మికులకు మెరుగైన వైద్యసేవలు అందించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి. రామగుండంలో ప్రతిపాదిత వంద పడకల ఈఎస్ఐ ఆస్పత్రి నిర్మాణానికి పది నెలల క్రితం టెండరు ప్రక్రియ ప్రారంభించినా ఇంకా ముందుకు సాగకపోవడం ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. దాదాపు పదేళ్లుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈఎస్ఐ ఆస్పత్రి ఏర్పాటుపై నాన్చుడు ధోరణి అవలబిస్తున్నాయి. 3.30 ఎకరాలు.. రూ.150.08 కోట్లు.. రామగుండం పట్టణంలోని ఈఎస్ఐ డిస్పెన్షరీ స్థలం 3.30 ఎకరాలు. కేటాయించిన బడ్జెట్ రూ.150.08 కోట్లు. కేంద్ర ప్రభుత్వం 2018, రాష్ట్ర ప్రభుత్వం 2025లో ఆస్పత్రి నిర్మాణానికి అనుమతి మంజూరు చేశాయి. బహుళ అంతస్తులతో మల్టీస్పెషాలిటీ వైద్యసేవలు అందించాలని నిర్ణయించాయి. అదేవిధంగ 2016 జూన్ 6న అప్పటి కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ రూ.వంద కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. 2018 డిసెంబర్ 25న ఈఎస్ఐ రీజినల్ డైరెక్టర్ల బృందం సందర్శించింది. పదివేల మంది కార్మికులకు ఆరు పడకలు, 30వేల మందికి 30 పడకల ఆస్పత్రిగా తీర్చిదిద్దుతామని ప్రకటించింది. 2022 జూన్ 17న ఈఎస్ఐ ప్రధాన కార్యాలయంలో రామగుండంలో ఈఎస్ఐ ఆస్పత్రి నిర్మాణాన్ని కార్పొరేట్ ఆస్పత్రి తరహాలో నిర్మించాలని నిర్ణయించారు. 2018 గణాంకాల ప్రకారం 54,260 మంది కార్మికులు ఈఎస్ఐలో నమోదైనటు్ల్ పేర్కొన్నారు. 2022 జూలై 5న ఈఎస్ఐ ఆస్పత్రి ఏర్పాటుపై నిపుణుల బృందం ఎస్టీ కాలనీ సమీపంలోని గురుకులం పక్కనున్న ప్రభుత్వ స్థల పరిశీలన, ఇతరత్రా అంశాలపై క్షేత్ర పరిశీలన చేశారు. ఆ తర్వాత కొద్ది రోజుల్లోనే ఆస్పత్రికి సదరు స్థలం అనుకూలంగా లేదని తేల్చారు. 2023 జనవరి 12న అప్పటి రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్, అప్పటి కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డిని కలిసి ఈఎస్ఐ ఆస్పత్రి పనులు వేగవంతం చేయాలని కోరారు. 2023 డిసెంబర్ 12న జరిగిన ఈఎస్ఐ కార్పొరేషన్ సమావేశంలో ఈఎస్ఐ ఆస్పత్రి నిర్మాణానికి ఆమోదముద్ర వేశారు. 2025 జనవరి 8న వంద పడకలతో ఆస్పత్రి నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు మంజూరు చేస్తూ తుది నిర్ణయం తీసుకుంది. -
సంప్రదాయానికి చిహ్నం
ఆషాడ మాసంలో గోరింటాకు పెట్టుకోవడం పూర్వీకుల నుంచి వస్తోంది. ఇది తెలుగువారి సంస్కృతి, సంప్రదాయాలకు నిలువుటద్దం. ఆషాఢమాసంలో ప్రకృతి సిద్ధంగా లభించే గోరింటాకే బాగుంటుంది. – పల్లా అపర్ణ చేతికి అందం గోరింటాకు పెట్టుకోవడమంటే నాకు చిన్నతనం నుంచే ఆసక్తి. ఈనెలలో త ప్పనిసరిగా గోరింటాకు పెట్టుకుంటాం. పోటీపడి మరీ ఎర్రగా పండేవరకూ వేచిచూస్తాం. గోరింటాకు చేతికి అందం, ఆరోగ్యం. – కొమురవెల్లి లక్ష్మి చర్మవాధులు దూరం వర్షాకాలంలో నీటిలో తడిస్తే కాళ్లు, చేతులకు వచ్చే చర్మవ్యాధుల నియంత్రణకు గోరింటాకు యాంటీబయాటిక్‌గా పనిచేస్తుంది. గోరింటాకుతో గోళ్లకు అందం వస్తుంది. గోళ్లకు వ్యాధులు రాకుండా గోరింటాకు కాపాడుతుంది. – బిరుదు సమత ఏటా సంబురాలు ఆషాడమాసం రావడంతోనే మా స్నేహితులు అందరం కలిసి ఒకచోట చేరుతాం. గోరింటాకు రుబ్బుకుని చేతులకు పెట్టుకుంటాం. సుమారు ఆరేళ్లుగా ఏటా ఇలా సంబురాలు ఘనంగా జరుపుకుంటున్నాం. – మల్యాల శైలజ సంబురాల్లో మహిళలుమైదాకు నూరుతున్న మహిళలు -
పంచాయతీలకు ఆర్థిక స్వేచ్ఛ
రామగిరి: గ్రామ పంచాయతీలకు ఆర్థిక స్వయం ప్రతిపత్తి కల్పించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణం తీసుకుంది. పంచాయతీరాజ్ చట్టం–2018లోని సెక్షన్ 70(3) సవరణకు ఇటీవల మంత్రివర్గ సమావేశంలో ఆమోదం లభించింది. ఈ నిర్ణయంతో జిల్లాలోని 263 గ్రామ పంచాయతీలకు ప్రత్యక్షంగా ప్రయోజనం చేకూరనుంది. ప్రస్తుతం గ్రామ పంచాయతీలు వసూలు చేసే సొంత ఆదాయం ట్రెజరీ ద్వారా వినియోగానికి వెళ్లాల్సి వస్తుండగా, కొత్త సవరణతో అమల్లోకి వచ్చిన తర్వాత ఆ ఆదాయం నేరుగా గ్రామ పంచాయతీల బ్యాంకు ఖాతాల్లోనే జమకానుంది. దీనికి సంబంధించిన ఆర్డినెన్స్‌ను త్వరలోనే జారీచేసే అవకాశం ఉంది. ఆస్తిపన్నులు.. ఆస్తిపన్నులు, ట్రేడ్ లైసెన్స్ ఫీజు, భవన నిర్మాణం అనుమతుల రుసుం, మార్కెట్ ఫీజు, ఇతర ఆదాయ వనరుల ద్వారా వచ్చే నిధులను గ్రామ పంచాయతీ నేరుగా వినియోగించుకునేందుకు అవకాశం ఉంది. తద్వారా తాగునీటి సరఫరా, పారిశుధ్య నిర్వహణ, వీధిదీపాల మరమ్మతు, సదుపాయాల కల్పన, అత్యవసరాలకు ఆలస్యం లేకుండా నిధులు వెచ్చించవచ్చు. చిన్న అభివృద్ధి పనులకే నిధుల కోసం వేచి చూడాల్సిన పరిస్థితి గతంలో ఉండేది. తాజా నిర్ణయం అమల్లోకి వస్తే స్థానికంగా సమకూరే ఆదాయాన్ని గ్రామావసరాలకు వెంటనే వినియోగించుకునే వీలు కలుగనుంది. తద్వారా గ్రామాభివృద్ధి పనులు వేగంగా జరిగే అవకాశాలు ఉన్నాయి. గ్రామాల్లో కూడా జవాబుదారీతనం, ఆర్థిక నిర్వహణలో పారదర్శకత పెరిగే అవకాశం ఉందని పలువురు చెబుతున్నారు. -
సేవలు బాగున్నాయ్
సర్కారు దవాఖానాలో సేవలు చాలాబాగా అందు తున్నాయ్. డాక్టర్లు ఓపికగా పరీక్షించి మందులు రాసిఇస్తున్నరు. ప్రైవేట్ దవాఖానా కన్నా సర్కారులోనే చాలామంచి వాతావరణంలో సేవలందుతున్నయి. – విజయ, పెద్దపల్లి వైద్యం ఉచితం జిల్లా ఆస్పత్రిలో సూపర్‌స్పెషాలిటీ వైద్యసేవలను ఉచితంగా అందిస్తున్నాం. 50 పడకలను 100 పడకలకు అప్‌గ్రేడ్ చేసి రూ.51లక్షలతో భవనం నిర్మిస్తున్నాం. సీటీ స్కాన్ కూడా అందుబాటులోకి తీసుకొస్తాం. – విజయరమణారావు, ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే, కలెక్టర్ సహకారం పేషెంట్లకు వైద్యం అందించేందుకు ఎమ్మెల్యే విజయరమణారావు, కలెక్టర్ శ్రీహ ర్ష అన్ని వసతులు కల్పించారు. వారి సహకారంతోనే నవజాతశిశువులు, ఆర్థో పేషెంట్లకు నాణ్యమైన సేవలు అందిస్తున్నాం. అందుకే రాష్ట్రస్థాయిలో పెద్దపల్లికి ప్రత్యేక గుర్తింపు దక్కింది. – శ్రీధర్, ఆస్పత్రి సూపరింటెండెంట్ -
నైపుణ్యాభివృద్ధికి ప్రత్యేక యాప్
రామగుండం: ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్(ఐటీఐ), నేషనల్ స్కిల్స్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్ (ఎన్ఎస్టీఐ) విద్యార్థుల్లో నైపుణ్యాభివృద్ధి పెంపొందించేందుకు భారత ప్రభుత్వం నైపుణ్యాభివృద్ధి, ఉద్యోగ మంత్రిత్వశాఖ(ఎంఎస్డీఈ), డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ట్రైనింగ్ ద్వారా భారత్ స్కిల్స్ పేరిట ప్రత్యేక యాప్ రూపొందించింది. ఇందు లోని కంటెంట్‌ను మొబైల్ ద్వారా సులభంగా యా క్సెస్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఫలితంగా విద్యార్థులకు ఇదదిఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. యాప్ ప్రధాన ఫీచర్లు.. ఎలా డౌన్లోడ్ చేసుకోవాలంటే.. ఆండ్రాయిడ్ మొబైల్లోని గూగుల్ ప్లే స్టోర్‌లో భారత్ స్కిల్స్ అని టైప్ చేసి డెవలపర్ పేరు, నేషనల్ ఇన్స్ట్రక్షనల్ మీడియా ఇనిస్టిట్యూట్ (ఎన్ఐఎంఐ) ఉందో పరిశీలించి ఇన్స్టాల్ చేసుకోవాలి. నైపుణ్యాభివృద్ధి కోసం జిల్లాయువత ఈ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలని జిల్లాస్థాయి ఉన్నతాధికారులు కోరుతున్నారు. అందుబాటులోకి ‘భారత్ స్కిల్స్’ ఐటీఐ, ఎన్ఎస్టీఐ విద్యార్థులకు మేలు -
పెద్దపల్లి.. ‘సూపర్ స్పెషాలిటీ’
పెద్దపల్లిరూరల్: పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో సూపర్ స్పెషాలిటీస్థాయి వైద్యసేవలు అందుబాటులోకి వచ్చాయి. జిల్లాలోని మండలాలు, గ్రామాల నుంచే కాదు.. పొరుగు జిల్లాలైన కరీంగనర్, జగిత్యాల, భూపాలపల్లి, మంచిర్యాల తదితర ప్రాంతాల నుంచి కూడా పెద్దపల్లి సర్కారు దవాఖానాకే వస్తున్నారు. రాష్ట్రస్థాయిలో 4 అవార్డులు అత్యుత్తమ అవార్డులు దక్కడం ఇక్కడి వైద్యసేవలకు నిదర్శనం. అవార్డులను ప్రధానం చేసిన వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ సేవలతీరుపై ఆరా తీశారు. విషయం సీఎం దృష్టికి వెళ్లడంతో రోజూవారీ వైద్యసేవల నివేదికను నెలరోజులుగా సీఎంవోకు పంపిస్తున్నారు. పెరిగిన ఔట్పేషెంట్లు జిల్లా ఆస్పత్రికి రోజూ 800 నుంచి 1,000 మందరకు ఔట్పేషెంట్లు వస్తున్నారు. ఆన్లైన్ పద్ధతిలోనే ఓపీ టోకెన్ జారీచేస్తున్నారు. సీజనల్ వ్యాధుల సమయంలో ఈ సంఖ్య మరింత పెరుగుతోంది. రికార్డుస్థాయిలో డెలివరీలు ఆస్పత్రిలో రికార్డుస్థాయిలో ప్రసవాలు జరిగాయి. గర్భం దాల్చినప్పటి నుంచి 102 వాహనంలో గర్భిణులను ఏఎన్ఎం వెంట తీసుకొచ్చి వైద్యపరీక్షలు చేసి మందులు ఇప్పించి, మళ్లీ ఇళ్లకు చేర్చుతున్నారు. గర్భిణులకు అవసరమయ్యే శ్రీటిఫాశ్రీ స్కానింగ్ యంత్రం ద్వారా ఉచితంగా సేవలు అందిస్తున్నారు. ఇలా రెండేళ్లలో 5,067 ప్రసవాలు జరిగాయి. నవజాతశిశువు కోసం ప్రత్యేకవార్డు.. కలెక్టర్ కోయ శ్రీహర్ష వైద్యసేవలను మెరుగుపర్చేందుకు ప్రత్యేక దృష్టి సారించారు. మందులు, వైద్యపరికరాల కోసం నిధులు కేటాయించారు. నవజాత శిశువుల జబ్బులను నయం చేసుకునేందుకు కుటుంబీకులు ఇబ్బంది పడకూడదనే ఆలోచనతో జిల్లా ఆస్పత్రిలోనే ప్రత్యేక వార్డు ఏర్పాటు చేశారు. ఇందుకోసం సిబ్బందిని నియమించి మూడు నెలలపాటు కరీంనగర్లో శిక్షణ ఇప్పించారు. ఇప్పటివరకు 991 మంది నవజాత శిశువులకు పలురకాల వైద్యసేవలను అందించారు. వారిలో 180 మంది శిశువులకు సీ –పాప్ (కంటిన్యూస్ పాసిటివ్ ఏర్‌వే ఫ్రెజర్) వైద్యం కూడా అందించారు. శ్వాస సంబంధమైన, బరువుతక్కువగా, పుట్టుకతో వచ్చే లోపాలతో ఉన్నవారికి సైతం వైద్యం అందింది. ఆధునిక పరికరాలతో కంటి వైద్యం కంటి వైద్యపరీక్షల కోసం అధునాతనమైన యంత్రాలను వినియోగిస్తున్నారు. సులువుగా శస్త్రచికిత్సలు పెద్దపల్లిలోనే జరుగుతుండడంతో వేలాదిమంది కంటి వైద్యం కోసం వస్తున్నారు. లేజర్ ట్రీట్మెంట్ కూడా అందిస్తున్నారు. కంటి ఆపరేషన్ చేయించుకున్న వారికి కళ్లద్దాలను కూడా ఉచితంగానే అందిస్తున్నారు. ఇప్పటివరకు 8వేల మందికి సేవలందించారు. పేషెంట్లకు వరం డయాలసిస్ కేంద్రం కిడ్ని సంబంధిత వ్యాధులతో బాధపడుతూ డయాలసిస్ అవసరమైన వారు గతంలో కరీంనగర్, హైదరాబాద్ లాంటి ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చేది. జిల్లా ఆస్పత్రిలోనే ఐదు యూనిట్లతో డయాలసిస్ కేంద్రం ఏర్పాటు చేయడం ద్వారా డయాలసిస్ పేషంట్లకు దూరభారం తప్పింది. ఇక్కడ 48 మంది పేషెంట్లు చికిత్సపొందుతున్నారు. రోజూ 20మందికి డయాలసిస్ చేస్తున్నారు. ఈ కేంద్రానికి ఓ టెక్నీషియన్ అవసరముంది. ఆర్థో, ఈఎన్టీ, స్కిన్ ఇలా.. అనేక సేవలు.. ఆర్దోపెడిక్, చెవి, ముక్కు, గొంతు, దంత, ఫిజియోథెరపీ, యురాలజీ, నెనటాలజీ, లేజర్ సర్జరీ ఫర్ పైల్స్ లాంటి అనేక సేవలను ప్రభుత్వ వైద్యులు అందిస్తున్నారు. టీహబ్‌లోనే ల్యాబ్ పరీక్షలు.. పేషెంట్ వ్యాధి నిర్ధారణ కోసం లాబొరేటరీ టెస్టులను కూడా ఉచితంగానే చేయిస్తున్నారు. ఇదేఆవరణలోని టీహబ్ కేంద్రంలో 57 రకాల పరీక్షలు చేస్తున్నారు. రెండుగంటల్లోపే ఫలితాలు వస్తున్నాయి. డిజిటల్ ఎక్స్‌రే, ఈసీజీ, అల్ట్రాసౌండ్, 2డీఎకో లాంటి సేవలు కూడా అందుబాటులో ఉన్నాయి. -
పూలు చల్లారు.. నిరసన తెలిపారు
కోల్‌సిటీ: రామగుండం నగరం గంగానగర్ సమీప గోదావరి తీరంలోని హిందూ శ్మశానవాటికలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలనే డిమాండ్‌తో స్వచ్ఛంద సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో మంగళవారం పూలుచల్లి నిరసన తెలిపారు. శ్మశానవాటికను సందర్శించిన ప్రతినిధులు.. సదుపాయాలు లేక బంధువులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. సంస్థ గౌరవాధ్యక్షుడు మద్దెల దినేశ్, అధ్యక్షుడు, మాజీ కార్పొరేటర్ అయిత శివకుమార్, ప్రధాన కార్యదర్శి దుర్గం నగేశ్, ఉపాధ్యక్షురాలు గోలివాడ చంద్రకళ మాట్లాడుతూ, మూడేళ్ల క్రితం నిలిపివేసిన రూపాయికే అంత్యక్రియల పథకాన్ని పునరుద్ధరించాలన్నారు. శ్మశానవాటిలో తాగునీరు, విద్యుత్, రహదారి, ప్రహరీ వంటి వసతులు లేవన్నారు. రాత్రివేళ అంత్యక్రియలు నిర్వహించే కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయని పేర్కొన్నారు. సుమారు పదేళ్ల క్రితం రూ.40 లక్షలతో కొనుగోలు చేసిన గ్యాస్ ఆధారిత దహన యంత్రం వినియోగంలోకి రాకపోగా, దానికోసం రూ.60 లక్షలు వెచ్చించి నిర్మించిన షెడ్డు నిరుపయోగంగా మారిందని ఆరోపించారు. శ్మశానవాటిక నిర్వహణ బాధ్యతలను సింగరేణికి అప్పగించాలని ఎమ్మెల్యే, కలెక్టర్‌ను కోరారు. ఈ కార్యక్రమంలో మండల శ్రీనివాస్, కంది సుజాత, సరిత లక్ష్మి, రామ, సుశీల, కొండూ రమాదేవి, ప్రతాప్ పాల్గొన్నారు. హిందూ శ్మశానవాటిలో అసౌకర్యాలపై ఆందోళన స్వచ్ఛంద సంస్థ ప్రతినిధుల వినూత్న నిరసన -
నేరాల నియంత్రణలో సీసీ కెమెరాలు కీలకం
పాలకుర్తి: నేరాలను నియంత్రించడంతో సీసీ కెమెరాలు కీలకమని, ప్రతీగ్రామం వీటిని ఏ ర్పాటు చేసుకోవాలని పెద్దపల్లి డీసీపీ రాంరెడ్డి అన్నారు. జీడీనగర్ గ్రామంలో మంగళవారం ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ప్రారంభ కా ర్యక్రమానికి డీసీపీ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రధాన కూడళ్లు, పాఠశాలలు, దే వాలయాలు, ప్రధాన రహదారులపై తప్పని సరిగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవా లని సూచించారు. తద్వారా నేరాలను నియంత్రించడమే కాకుండా నేరస్తులను పట్టుకునేందుకు దోహదపడుతాయని అన్నారు. గోదావరిఖని ఏసీపీ రమేశ్, సర్పంచ్ సూర రమ, సీఐ కృష్ణకుమార్, ఎస్సై శ్రీధర్, మాజీ సర్పంచ్ సూర సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు. గురుపౌర్ణమికి ఏర్పాట్లు ఫెర్టిలైజర్‌సిటీ: దాదాపు రెండుదశాబ్దాల క్రితం అందుబాటులోకి వచ్చిన గౌతమినగర్‌లోని షిర్డీసాయిబాబా ఆలయంలో బుధవారం గురుపౌర్ణమి నిర్వహించనున్నారు. ఇందుకోసం నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు. సేవలకు సత్కారం పెద్దపల్లిరూరల్: జిల్లా రైతులకు సాగు విధానంపై సూచనలిస్తూ, మెళకువలు పాటిస్తూ మంచి దిగుబడులు సాధించేలా ప్రోత్సహిస్తు న్న రైతు విజ్ఞాన కేంద్ర కో ఆర్డినేటర్, శాస్త్రవేత్త సంపత్‌ను మంగళవారం హైదరాబాద్‌లో జరి గిన రైతునేస్తం కార్యక్రమంలో సత్కరించారు. చీఫ్ సెక్రటరీ సంజయ్‌జాజు, డైరెక్టర్ గోపి తదితరులు సత్కరించగా, వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు అభినందించారు. వేగవంతంగా సర్ ప్రక్రియపెద్దపల్లి: రెవెన్యూ, భూ సమస్యల పరిష్కారం, ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియ వేగవంతంగా, పారదర్శకంగా పూర్తిచేయాలని అదనపు కలెక్టర్ శ్రీరాములు ఆదేశించారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయాన్ని ఆయన మంగళవారం తనిఖీ చేశారు. అనంతరం శాంతినగర్‌లో కొనసాగుతున్న సర్ ప్రక్రి య పరిశీలించి అధికారులకు కీలక సూచనలు చేశారు. తహసీల్దార్ రాజయ్య, అధికారులు, బీఎల్వోలు తదితరులు పాల్గొన్నారు. మంథనిలోనే కొనసాగించండి మంథని: వ్యవసాయ శాఖ కార్యాలయాన్ని సూరయ్యపల్లి గ్రామంలోని రైతు వేదికకు తరలించడం సరికాదని, తక్షణమే మంథనికి మా ర్చాలని వ్యవసాయ కార్మిక సంఘం నాయకు లు కోరారు. రెవెన్యూ డివిజనల్ అధికారి సురేశ్‌కు మంగళశారం వినతిపత్రాన్ని సమర్పించారు. అనంతరం వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి బూడిద గణేశ్ మాట్లాడుతూ, మంథనిలోని కార్యాలయం శిథిలావస్థకు చేరిందనే కారణంతో సమీప గ్రామానికి మార్చడం సమంజసం కాదన్నారు. ఇప్పటికే కొన్ని ప్రభుత్వ కార్యాలయాలను జిల్లా కేంద్రానికి తరలించే ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఇప్పుడు వ్యవసాయ శాఖ కార్యాలయాన్ని కూడా తరలించడం ద్వారా రైతులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తుందని ఆయన అన్నారు. ఈప్రయత్నాలను విరమించుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయక కార్యదర్శి ఏల్పుల సురేశ్, ఉపాధ్యక్షుడు బావు రవి, నాయకులు మంథని కిష్టస్వామి, ఉప్పు రమేశ్, ఇరుగురాల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
చెరువు నిండలే.. వాగు పారలే
మంథనిరూరల్: జూలై నెల చివరిదశలో ఉంది.. మరోమూడు రోజులైతే ఆగస్టు ప్రారంభమవుతుంది. సాధారణంగా చెరువులు, కుంటలు ఇప్పటికే అలుగు పడేవి. కానీ, ఈసారి ఎల్‌నినో ప్రభావంతో భారీవర్షాలు ఇంకా కురవడంలేదు. ఒక్క చెరువు మత్తడి కూడా పడలేదు. గతేఏడాది జూలై చివరి వారంలో కురిసిన వర్షాలతో చెరువులు నిండి అలుగు పారాయి. వరదలు సైతం ముంచేత్తాయి. ఈసారి అలాంటి పరిస్థితులు లేక వందల ఎకరాల ఆయకట్టు సాగుకు ప్రశ్నార్థకంగా మారింది. రెండు నెలల్లో ఒక్క చెరువు నిండలే.. జిల్లావ్యాప్తంగా 1,086 చెరువులు ఉండగా ఈవర్షాకాల సీజన్ప్రారంభమై రెండు నెలలు గడుస్తోంది. ఇప్పటివరకు ఒక్క చెరువులోకి కూడా నీళ్లు చేరక అలుగు పడిన దాఖలాలు లేవు. అనేకచెరువుల్లో గతేడాది ఉన్న నీళ్లు మినహా కొత్త నీరు రాలేదని గ్రామస్తులు చెబుతున్నారు. పరిస్థితులు ఇలాగే కొనసాగితే ఉన్ననీళ్లు కూడా ఆవిరైపోతాయనే అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రశ్నార్థకంగా వందల ఎకరాల ఆయకట్టు.. జిల్లాలోని అనేక గ్రామాల్లో చెరువుల కింద భూ ముల సాగు ప్రశ్నార్థకంగా మారింది. ఎల్‌నినో ప్ర భావంతో వర్షాలు కురవక చెరువులోకి నీళ్లు రాలే దు. చెరువులు నిండితేనే ఆయకట్టు సాగు అవుతుంది. ఈ క్రమంలో రైతులు దుక్కిలు దున్నినార్లు పో సుకుని సిద్ధం చేసుకున్నారు. కాలం వెళ్లిపోతున్నా సరైన వర్షాలు పడకపోవడం చెరువులోకి నీళ్లు చేరకపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చేపల కోసం నీళ్లు వదిలి.. అనేకగ్రామాల్లోని చెరువుల్లో సొసైటీల ద్వారా చేప ల పెంపకం చేపట్టారు. జనవరి నుంచి ఏప్రిల్ వ రకు చేపలు పడుతుంటారు. యాసంగి సీజన్లో వరి కోతలు ముగియగానే చెరువుల్లోని నీటిని వది లి చేపలు పడుతుంటారు. ఈసారి కూడా ఎల్‌నినో ప్రభావం ఉందని తెలిసినా అనేక చెరువుల్లో నీటిని వృథాగా దిగువకు వదిలివేశారు. దీంతో గతేడాది నీళ్లు వెళ్లిపోయి కొత్తనీరు రాక జిల్లావ్యాప్తంగా అనేక చెరువులు వెలవెలబోతున్నాయి. గతంలో కాలువల ద్వారా.. గతంలో అనేక చెరువులను ఎస్సారెస్పీ కాలువనీళ్ల ద్వారా నింపేవారు. గోదావరి నదిలో నీళ్లు ఉండటం, ఎస్సారెస్పీ కాలువల ద్వారా నీటిని విడుదల చేయడంతో ఆ నీటిని చెరువులకు మళ్లించి నింపేవారు. వర్షాలు కురవకుపోయినా చెరువులు నిండు గా ఉండేవి. ఈసారి గోదావరిలో సైతం నీళ్లు లేక, వర్షాలు కురవక సాగుపై ప్రభావం పడుతోంది. నిండని చెరువులు.. సాగుకు నోచుకోని ఆయకట్టు దుక్కులు దున్ని నాటుకు సిద్ధం చేసుకున్న అన్నదాత వానాకాలం సీజన్ సాగుపై ఎల్‌నినో తీవ్ర ప్రభావం -
చెత్తకుప్పల తొలగింపు
కోల్‌సిటీ: గోదావరిఖని విఠల్నగ ర్లోని సింగరేణి పార్క్ పక్కన నె లల తరబడి పేరుకుపోయిన చెత్తకుప్పలను మంగళవారం బల్దియా సిబ్బంది తొలగించారు. ‘జ్వరాల విజృంభణ’ శీర్షికన 26న ‘సాక్షి’ ప్ర చురించిన కథనం చర్చనీయాంశమైంది. చెత్త తొలగించాల్సిన బాధ్యత సింగరేణిదే అయినా.. అధికారులు స్పందించలేదు. బల్దియా పారిశుధ్య సూపర్వైజర్ శ్రీనివాస్ సిబ్బందితో చెత తొలగించారు. బ్లీచింగ్ పౌడర్ చల్లించి పరిసరాలను శుభ్రం చేశా రు. సింగరేణి కార్మికుల నివాసాల సమీపంలో నెల ల తరబడి చెత్త పేరుకుపోయి కుళ్లిపోయినా అధికారులు పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. ‘సాక్షి’ కథనంతో సమస్యకు పరిష్కారం లభించడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. -
‘అసంతృప్తి’ టూర్!
కోల్‌సిటీ: రామగుండంలోని పలువురు కార్పొరేటర్లలో అసంతృప్తి రగులుతోంది. అధికార, ప్రతిపక్ష పార్టీలు అనే తేడాలేకుండా అన్నింటా వ్యాపిస్తోంది. పార్టీలకు అతీతంగా అసంతృప్తితో రగులుతున్న పలువురు కార్పొరేటర్లు బుధవారం మేడారంలోని సమ్మక్క– సారలమ్మ వనదేవతల దర్శనం కోసం తరలివెళ్లడానికి వ్యూహం రచించారని, ఇదే ఇందు కు నిదర్శనంగా నిలుస్తోందనే చర్చ సాగుతోంది. టూర్ కోసం మంగళవారం బల్దియా కార్యాలయంలో కొందరు కార్పొరేటర్లు సమావేశం నిర్వహించ డం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ పర్యటన కేవలం ఆధ్యాత్మిక దర్శనానికే పరిమితం కాకుండా, భవిష్యత్ కార్యాచరణపై చర్చించేందుకూ వేదిక కానుందని సమాచారం. తమకు తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదని, కనీస ప్రొటోకాల్ పాటించడం లేదని, ప్రజాసమస్యలపై తాము ఇచ్చే వినతులను అధికారులు పట్టించుకోవడం లేదని కార్పొరేటర్లు అసంతృప్తితో ఉన్నారు. తమకు ప్రత్యేక వెయిటింగ్ హాల్ ఏర్పాటు చేయాలనే డిమాండ్‌తోపాటు పలు అంశాలపై ఇటీవల సుమారు 35 మంది కార్పొరేటర్లు బల్దియాలోనే నిరసన తెలిపిన విషయం తెలిసిందే. పురపాలక శాఖ ఇటీవల నిర్వహించిన శిక్షణకు 59 మందిలో ముగ్గురే హాజరుకాగా, మిగిలినవారు బహిష్కరించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ పరిణామాల నేపథ్యంలో పార్టీలకు అతీతంగా పెద్ద సంఖ్యలో కార్పొరేటర్లు మేడారం వెళ్లాలని నిర్ణయించుకోవడం రాజకీయ, స్థానిక వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కొందరు మంగళవారం మేడారానికి బయలుదేరినట్లు తెలిసింది. బుధవారం మిగిలినవారు వెళ్లనున్నట్లు సమాచారం. ఈ పరిణామాలు రామగుండం రాజకీయాల్లో ఆసక్తికర చర్చకు దారితీశాయి. రామగుండం కార్పొరేటర్ల మేడారం పర్యటన మూకుమ్మడిగా తరలివెళ్లేందుకు విస్తృత ఏర్పాట్లు ఒకరోజు ముందుగానే మేడారం చేరిన మరికొందరు నేడు భారీగా తరలివెళ్లనున్న ‘కార్పొరేషన్’ కార్పొరేటర్లు -
అంతర్జాతీయంగా రాణిస్తా
హైదరాబాద్‌లో జరిగిన రాష్ట్రస్థాయి టేబుల్ టెన్నిస్ పోటీల్లో మూడు సార్లు పాల్గొన్నా. పతకాలు సాధించలేదు. జాతీయ పోటీలకు ఎంపిక కావడం ఆనందంగా ఉంది. టేబుల్‌టెన్నిస్‌లో అంతర్జాతీయస్థాయిలో ప్రాతినిథ్యం వహించేలా ఎదగడం నా లక్ష్యం. – అన్విక్ష్ నందన్ జాతీయ పోటీలకు ఎంపిక కావడం ఆనందంగా ఉంది. తప్పకుండా పోటీల్లో రాణిస్తాను. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన రాష్ట్ర ర్యాంకింగ్ టోర్నమెంట్లో రాణించాను. భవిష్యత్‌లో గొప్ప క్రీడాకారిణిగా మారాలని ఉంది. – ఎ.అనన్య -
డ్రైవర్ సమయస్ఫూర్తితో తప్పిన ప్రమాదం
జ్యోతినగర్: ఎన్టీపీసీ ఎఫ్‌సీఐ క్రాస్‌రోడ్డు వద్ద లారీ బ్రేకులు ఫెయిల్ కావడంతో డ్రైవర్ ఆరిఫ్ సమయస్ఫూర్తితో వ్యవహరించి ప్రమాదాన్ని నివారించాడు. మంగళవారం రాత్రి మంచిర్యాల జిల్లా జైపూర్ పవర్ ప్లాంట్ నుంచి రిజక్ట్ కోల్ తీసుకొని గోదావరిఖని మీదుగా పెద్దపల్లి వైపు వెళ్తున్న క్రమంలో ఎన్టీపీసీ ఎఫ్‌సీఐ క్రాస్‌రోడ్డు వద్ద లారీ బ్రేకులు ఫెయిల్ అయ్యాయి. అయితే, ముందు వెళ్తున్న కార్లను తప్పిస్తూ లారీని డ్రైవర్ డివైడర్‌పైకి తీసుకెళ్లడంతో పెను ప్రమాదం తప్పింది. డ్రైవర్ ఆరిఫ్ అప్రమత్తత, సమయస్ఫూర్తితో వ్యవహరించడంతో పలువురి ప్రాణాలు కాపాడినట్లయింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు. డ్రైవర్‌ను ఎస్సై ఉదయ్ కిరణ్ అభినందించారు. -
యువతి ఆత్మహత్య
రామగిరి: పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం నవాబ్‌పేట్‌లోని బుడగజంగం కాలనీకి చెందిన బోడకుర్తి సుజాత(22) మంగళవారం ఇంట్లో ఉరివేసుకొని మృతి చెందింది. తల్లిదండ్రులు ఊరికివెళ్లారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో చున్నీతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. యువతి ఆత్మహత్య గల కారణా లు తెలియాల్సి ఉంది. రామగిరి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. చికిత్స పొందుతూ మృతి ఫెర్టిలైజర్‌సిటీ: మాతంగికాలనీకి చెందిన మహాత్మ పద్మ(48) రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందింది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. గత మార్చి 23న మంచిర్యాలకు వెళ్లే క్రమంలో ఇంటినుంచి నడుచుకుంటూ ఎఫ్‌సీఐ క్రాస్ రోడ్డు వద్దకు చేరుకుంది. ఇదేసమయంలో అతివేగంగా వచ్చిన ద్విచక్ర వాహనం ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన ఆమెను ఆస్పత్రిలో చేర్పించగా సోమవారం రాత్రి మృతి చెందింది. ఎన్టీపీసీ ఎస్సై ఉదయ్ కిరణ్ కేసు నమోదు చేసుకొన్నారు. విద్యుత్ భద్రత తనిఖీ గోదావరిఖని: ఆర్జీ–1 ఏరియాలోని జీడీకే–1,3 గనిని ఎలక్ట్రికల్ డీడీఎంఎస్ కోమల్చౌదరి మంగళవారం తనిఖీ చేశారు. విద్యుత్ భద్రత, పరికరాల నిర్వహణ, నాణ్యత ప్రమాణాలు, గని కార్యకలాపాలపై ఆరా తీశారు. అధికారులకు పలు సూచనలు చేశారు. ఫ్యాన్‌హౌస్, ఇండోర్ స్విచ్స్టేషన్, అవుట్డోర్ సబ్స్టేషన్లను సందర్శించారు. ఆయన వెంట గని ఏజెంట్ రమేశ్, మేనేజర్ సుధీర్, సేఫ్టీ ఆఫీసర్ మహేశ్ తదితరులు ఉన్నారు. ప్రైవేట్ పాఠశాల వాహనాన్ని ఢీకొన్న ఆర్టీసీ అద్దె బస్సు ● ఇద్దరు విద్యార్థులకు గాయాలు జగిత్యాలక్రైం: జిల్లాకేంద్రంలోని యావర్‌రోడ్‌లో.. అటవీశాఖ కార్యాలయం సమీపంలో కృష్ణానగర్ వైపు వెళ్తున్న ప్రైవేటు పాఠశాల వాహనాన్ని ఆర్టీసీ అద్దె బస్సు మంగళవారం ఉదయం ఢీకొంది. కృష్ణానగర్‌కు చెందిన ఓ ప్రైవేటు వాహనం 20 మంది విద్యార్థులతో కొత్తబస్టాండ్ నుంచి కృష్ణానగర్ వైపు వెళ్తోంది. అదే సమయంలో పాతబస్టాండ్ నుంచి కొత్తబస్టాండ్ వైపు వెళ్తున్న ఆర్టీసీ అద్దె బస్సు అతివేగంగా వెళ్లి ఢీకొంది. ఈ ఘటనలో వాహనంలో ఉన్న ఇద్దరు విద్యార్థులకు గాయాలయ్యాయి. నిత్యం రద్దీగా ఉండే యావర్‌లో సంఘటన జరగడంతో కొద్దిసేపు వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. అక్కడ ఉన్న వారంతా చిన్నారులను చేరదీశారు. ప్రైవేట్ వాహన డ్రైవర్, జగిత్యాల అర్బన్ మండలం తిప్పన్నపేటకు చెందిన చక్రాల సుదర్శన్ ఫిర్యాదు మేరకు బస్సు డ్రైవర్ మారంపల్లి నరేశ్‌పై కేసు నమోదు చేసినట్లు పట్టణ ఎస్సై సుప్రియ తెలిపారు. -
ప్రభుత్వ పాఠశాలల్లో చేరుతున్నారు
విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలల నుంచి ప్రభుత్వ పాఠశాలలకు వచ్చి చేరుతున్నారు. 2026లో అత్యధిక మంది చేరారు. గతేడాదితో పోలిస్తే రెట్టింపు. ప్రభుత్వం అందిస్తున్న సౌకర్యాలు, క్వాలిఫై టీచర్లు కావడంతో చేరేందుకు విద్యావంతులు సైతం పాఠశాలల్లో చేర్పిస్తున్నారు. – కొంతం అనిల్, ప్రభుత్వ బాలికల పాఠశాల ఉపాధ్యాయుడు, సుల్తానాబాద్ ప్రభుత్వ లక్ష్యాన్ని చేరేందుకు దగ్గరలో ఉన్నాం. అధిగమిస్తాం. ఇప్పటికే రాష్ట్రంలో నాలుగో స్థానంలో ఉన్నాం. ప్రభుత్వ అందజేస్తున్న సౌకర్యాలు విద్యార్థుల తల్లిదండ్రులు గమనించి ప్రైవేట్‌కు కాకుండా గవర్నమెంట్‌కు పంపేలా చొరవ తీసుకోవాలి. సౌకర్యాలు సద్వినియోగం చేసుకోవాలి. – శారద డీఈవో, పెద్దపల్లి -
పోషించమంటే.. చనిపొమ్మంటున్నారు
నాకు ఇద్దరు కొడుకులు, ఒక బిడ్డ, భర్త చనిపోగానే పెద్దకొడుకుకు ఉద్యోగం పెట్టించిన. చిన్న కొడుకుకు మూడు ఎకరాల భూమి ఇచ్చిన. ఇద్దరికి ఒక్కొక్కరికి రూ.5లక్షల చొప్పున పంచి ఇచ్చా. అన్నం పెట్టి పోషించమంటే ఇంకా బతుకుడు ఎందుకు చనిపొమ్మంటున్నారు. తనను పోషించేలా చూడాలి. – గుజ్జేటి ఈశ్వరవ్వ, కమ్మర్ఖాన్పేట్, ధర్మారం మండలం వారసులు ఉండగా కుటుంబ సభ్యుల పేర్లు లేకుండా ఫ్యామిలీమెంబర్ సర్టిఫికెట్ తీసుకొని ఫేక్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. దానికి చనిపోయిన కుమారుడి పిల్లల పేర్లు పెట్టకుండా తీసుకున్నారు. కరీంనగర్ ఆసుపత్రిలో చనిపోతే పెద్దపల్లి ఆస్పత్రిలో చనిపోయినట్లు డెత్ సర్టిఫికెట్ ఇచ్చిన వారిపై విచారణ చేసి చర్యలు తీసుకొని ఫేక్ రిజిస్ట్రేషన్‌ను రద్దు చేయాలి. – మారోటి మారుతి మారయ్య, పెద్దపల్లి జెండా చౌరస్తా రాజాపూర్ గ్రామంలో 2007లో అసైన్మెంట్ కమిటీ తీర్మానం ప్రకారం మాకు ఇచ్చిన ప్రభుత్వ భూమిలో ఒక్కొక్కరికి ఎకరం భూమిని పంపిణీ చేశారు. అసైన్డ్ భూమి హద్దులు చూపించి మా భూమి మాకు విప్పించేలా అధికారులు చొరవ తీసుకోవాలి. అక్రమం కాకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. హద్దులు చూపిస్తే సాగు చేసుకుంటాం. – మామిడి ఇందిర, లక్ష్మీ, స్వరూప, రాజాపూర్, కమాన్‌పూర్ మండలం -
ఆస్పత్రి ఆవరణలో వ్యర్థాల తొలగింపు
కోల్‌సిటీ: గోదావరిఖని ప్రభుత్వ జనర ల్ ఆస్పత్రి (జీజీహెచ్) ఆవరణలో పేరుకపోయిన వ్యర్థాలను తొలగించారు. ‘అస్తవ్యస్తంగా సర్కార్ ఆస్పత్రి’ శీర్షికన సోమవారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి ఆస్పత్రి యంత్రాంగం స్పందించింది. మెడికల్ సూపరింటెండెంట్ హిమబిందు సింగ్ ఆదేశాల మేరకు సోమవారం సీఎంవో డాక్టర్ అప్పారావు ఆధ్వర్యంలో ప్రత్యేక చర్యలు చేపట్టారు. వ్యర్థాలు, పాత పరుపులు, చెత్తను జేసీబీ, ట్రాక్టర్ సహాయంతో తొలగించారు. భవన ం పైభాగంలో డ్రెయినేజీ పైపుల లీకేజీ, ఎస్టీపీ గుంత సమస్యలపై సంబంధిత ఇంజినీర్లతో సూపరింటెండెంట్, ఆర్ఎంవో ఫోన్లో మాట్లాడి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జీజీహెచ్‌ను తనిఖీ చేసిన మేయర్ గోదావరిఖని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి (జీజీహెచ్)లో నెలకొన్న అపరిశుభ్ర పరిస్థితులపై ‘సాక్షి’లో సోమవారం ప్రచురితమైన కథనానికి స్పందించిన మేయర్ మహంకాళి స్వామి ఆకస్మికంగా ఆస్పత్రిని సందర్శించారు. ఆస్పత్రి ఆవరణలో నిల్వ ఉన్న మురుగు నీరు, చెత్తకుప్పలు, పెరిగిపోయి న పొదలను పరిశీలించి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎస్టీపీ నిర్మాణం కోసం మూడేళ్ల క్రితం తవ్విన గుంతను పూర్తి చేయకుండా ఎందుకు నిర్లక్ష్యంగా వదిలేశారని ప్రశ్నించారు. ఎస్టీపీ సమస్యపై ఎమ్మెల్యే ఎంఎస్. రాజ్‌ఠాకూర్‌తో చర్చించి పరిష్కారానికి కలెక్టర్ దృష్టికి తీసుకుపోతామని తెలిపారు. ఈ తనిఖీలో డిప్యూటీ మేయర్ పాతపల్లి ఎల్లయ్య, కార్పొరేటర్ సాగి సంతోష్‌రావు, ఆసుపత్రి ఆర్ఎంవో కృపాభాయ్, సీఎంవో అప్పారావు పాల్గొన్నారు. -
జలసిరులను కాపాడుకుందాం
పెద్దపల్లిరూరల్: ప్రతీఒక్కరు తమవంతుగా నీటి వృథాను నియంత్రించడంతో పాటు భూగర్భజలాలు పెంచేలా ఏర్పాట్లు చేసుకుంటే జలసిరులను కాపాడుకోవచ్చని జిల్లా గ్రామీణాభివృద్ది అధికారి కాళిందిని అన్నారు. సోమవారం పెద్దపల్లిలో మహిళా సంఘాల అధ్యక్షులు, సభ్యులకు జలసిరిపై అవగాహన కల్పించారు. పొలాలు, చేల వద్ద కుంటలు, ఇంటి ఆవరణలో ఇంకుడు, ఊట గుంతలు, బోర్వెల్ వద్ద రీచార్జ్ స్ట్రక్చర్స్ లాంటి నిర్మాణాలు చేపట్టాలని అన్నారు. ఎంపీడీవో శ్రీనివాస్, ఏపీవో రమేశ్‌బాబు, ఏవో నాగార్జున తదితరులున్నారు. నీటికుంట నిర్మాణ స్థ్థలం పరిశీలన ధర్మారం: బొమ్మారెడ్డిపల్లి గ్రామంలో నీటికుంట నిర్మాణ స్థలాన్ని డీఆర్డీవో కళిందిని పరిశీలించారు. జలసరిలో భాగంగా రైతులు వ్యవసాయ పొలాల్లో నీటికుంటలు నిర్మించుకోవాలని సూచించారు. సర్పంచ్ రాజ్‌కుమార్, ఎంపీడీవో సుమలత, జూనియర్ ఇంజినీర్ మల్లయ్య, టెక్నికల్ అసిస్టెంట్ భూలక్ష్మి, పంచాయితీ కార్యదర్శి మానసరెడ్డి, ఫీల్డ్ అసిస్టెంట్ భాగ్య తదితరులు పాల్గొన్నారు. -
చట్టపరిధిలో సమస్యలు పరిష్కారం
గోదావరిఖని: సమస్యలతో వచ్చే బాధితులకు చట్టపరిధిలో పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని రామగుండం పోలీసు కమిషనర్ అంబర్కిశోర్ ఝా అన్నారు. సోమవారం కమిషనరేట్ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్‌డేలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బాఽధితులు సమస్యలు విన్నవించారు. బాధితులతో మాట్లాడి ఆయా పోలీస్స్టేషన్ల పరిధిలోని అధికారులకు సమస్యలు పరిష్కరించాలని ఆదేశించారు. బాధితులు ఎవరైనా నిర్భయంగా పోలీసులను ఆశ్రయించి చట్టపరిధిలో సమస్యలను పరిష్కరించుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో అడ్మిన్ డీసీపీ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ‘సర్’ నమోదు పూర్తి చేయండియైటింక్లయిన్కాలనీ: ఎస్ఐఆర్ నమోదును త్వరగా పూర్తి చేయాలని అడిషనల్ కలెక్టర్ అరుణశ్రీ అన్నారు. సోమవారం రామగుండం కార్పొరేషన్ 14, 15, 16, 17, 18, 19, 20 డివిజన్లలో నిర్వహిస్తున్న ఓటర్ మ్యాపింగ్‌ను పరిశీలించారు. ఎస్ఐఆర్ నమోదు శాతాన్ని బీఎల్వోలను అడిగి తెలుసుకొని పలు సూచనలు చేశారు. ఆయా డివిజన్ కార్పొరేటర్లు, డివిజన్ ఇన్చార్జీలు బీఎల్వోలు, బీఎల్ఏలు, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. భూగర్భ జలాల పెంపునకు చర్యలు చేపట్టాలిరామగుండం/పాలకుర్తి: వర్షాభావ పరిస్థితుల్లో భూగర్భ జలాల పెంపునకు చర్యలు చేపట్టాలని జెడ్పీ సీఈవో నరేందర్ అన్నారు. సోమవారం రామగుండం, బసంత్‌నగర్‌లలో స్వశక్తి మహిళలకు జలసిరిపై అవగాహన కల్పించారు. ప్రతీ వర్షపు నీటిబొట్టును భూమిలో ఇంకే విధంగా జలసిరి కార్యక్రమం నిర్వహించాలని, ప్రతీగ్రామంలో రైతులను గుర్తించి వారికి జలసిరిపై అవగాహన కల్పించాలన్నారు. మండల సమైక్య అధ్యక్షురాళ్లు, ఎంపీడీవోలు, ఎంపీవోలు, ఏఈలు ఏపీవోలు తదితరులు పాల్గొన్నారు. స్థానికులకే ఉద్యోగాలు కల్పించాలి గోదావరిఖని: తాడిచర్ల్ల–2 బొగ్గు గని ప్రాజెక్టు పనులను వేగవంతం చేసి స్థానికులకే ఉద్యోగాలు కల్పించాలని పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ, రాష్ట్ర మంత్రి వివేక్ కోరారు. సోమవారం కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డిని కలిసి పలు సమస్యలు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. తాడిచెర్ల–2 ప్రాజెక్టు ప్రభావిత గ్రామాల యువతకు ఉద్యోగాల్లో ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. సింగరేణి సంస్థలో ఉద్యోగవిరమణ పొందిన కార్మికులకు కనీస నెలవారీ పెన్షన్ రూ.10వేలు ఉండేలా చూడాలని తెలిపారు. ప్రస్తుతం తక్కువ పెన్షన్‌తో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వేలాది మంది రిటైర్డ్ కార్మికుల సమస్యను పరిష్కరించాలని కోరారు. దీనిపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించినట్లు వెల్లడించారు. ఈఎస్ఐ ఆసుపత్రి ఏర్పాటు చేయాలి రామగుండంలో ఈఎస్ఐ ఆసుపత్రి ఏర్పాటు చే యాలని కోరుతూ కేంద్రమంత్రి మాండవీయను సోమవారం ఎంపీ వంశీకృష్ణ, మంత్రి వివేక్ కలిసి విన్నవించారు. రూ.150 కోట్లతో రామగుండం ఈఎస్ఐ ఆస్పత్రి ప్రాజెక్టుకు ఆ మోదం లభించి, టెండర్ దశ వరకు వెళ్లినప్పటికీ, పనులు నిలిచిపోయాయని వివరించారు. -
ప్రైవేట్‌కు గుడ్‌బై.. ప్రభుత్వ బడికి జై
పెద్దపల్లి: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు ప్రక్రియలో పెద్దపల్లి జిల్లా విశేష పురోగతి సాధించింది. 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించిన యూడైస్‌ప్లస్ నమోదులో రాష్ట్రంలో 4వ స్థానంలో నిలిచింది. ఈఏడాది 34,254 మంది విద్యార్థులను నమోదు చేయాలని లక్ష్యంగా నిర్ణయించగా ఇప్పటివరకు 32,234 మందితో 93.52శాతం నమోదు పూర్తయింది. గతేడాది జూన్ 15 నాటికి నమోదైన విద్యార్థుల సంఖ్యతో పోలిస్తే ఈసారి 7,791 మంది అదనంగా నమోదు కావడంతో 31.14 శాతం వృద్ధి చెందింది. జిల్లాలో మొత్తం 530 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా వాటిలో 199 పాఠశాలలు (37.55శాతం) లక్ష్యానికి కంటే ఎక్కువ నమోదు సాధించాయి. 141 పాఠశాలలు (26.60శాతం) లక్ష్యానికి కంటే తక్కువ నమోదు చేశాయి. ప్రభుత్వ బడిపై పెరుగుతున్న నమ్మకం ప్రభుత్వ పాఠశాలలపై తల్లిదండ్రుల్లో విశ్వాసం పెరుగుతోంది. సుల్తానాబాద్ మండల పరిషత్ బాలికల ప్రాథమిక పాఠశాలలో ఈవిద్యా సంవత్సరం విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగింది. గతేడాది కేవలం 23 మంది మాత్రమే ఉన్న విద్యార్థుల సంఖ్య, ప్రస్తుతం 67 మందికి చేరింది. ఒకే ఏడాదిలో 44 మంది కొత్త విద్యార్థులు చేరారు. దీనికి ప్రభుత్వం చేపట్టిన విద్యాసంస్కరణలు, ఇంగ్లిష్ మీడియం, డిజిటల్ తరగతులు, మౌలిక వసతుల మెరుగుదలే కారణంగా భావిస్తున్నారు. నలుగురు విద్యార్థులతోనే.. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నప్పటికీ సుల్తానాబాద్‌లోని సుగ్లాంపల్లి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో మాత్రం కేవలం నలుగురు విద్యార్థులతోనే కొనసాగుతోంది. ఒక ఉపాధ్యాయుడు ఈ నలుగురు చిన్నారులకు బోధన అందిస్తున్నారు. పాఠశాలలో విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గిపోవడం ఆందోళన కలిగిస్తోంది. -
అన్ని విధాలా పెద్దపల్లి అభివృద్ధి
పెద్దపల్లిరూరల్: పెద్దపల్లి పట్టణాన్ని అన్నివిధాలా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుదామని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. సోమవారం మున్సిపల్ చైర్మన్ మల్లయ్య అధ్యక్షతన జరిగిన పెద్దపల్లి మున్సిపల్ సర్వసభ్య సమావేశంలో మాట్లాడారు. పట్టణం నుంచి వెలువడ్డ వ్యర్థాలను శుద్ధి చేసేందుకు డంపింగ్‌యార్డులో ఎకరంన్నర స్థల కేటాయింపుపై తీర్మాణించారు. దీంతో పాటు 39 అంశాలతో కూడిన ఎజెండాను మున్సిపల్ సమావేశం ఏకగ్రీవంగా ఆమోదించిందని కమిషనర్ వెంకటేశ్ తెలిపారు. కలాంకు నివాళి భారత మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌కలాంకు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే విజయరమణారావు నివాళి అర్పించారు. మున్సిపల్ ఆఫీసులో కలాం చిత్రపటానికి పూలమాల వేసి కలాం సేవలను స్మరించుకున్నారు. దేశరక్షణ వ్యవస్థలో కీలక ఘట్టాలను ఆవిష్కరించిన మహానీయుడని, దేశ సేవకు అంకితమైన మహోన్నతుడని కొనియాడారు. ‘సర్’పై దృష్టి సారించాలి ఎస్ఐఆర్ ప్రక్రియపై ప్రత్యేక దృష్టి సారించి అర్హులైన వారందరికీ ఓటరు జాబితాలో పేరుండేలా చూడాలని ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. నిర్ణీత గడువులోగా ఓటర్ల నుంచి వివరాలను సేకరించి ఆన్లైన్ జరిగేలా చూడాలని అధికారులు, బిఎల్ఓలకు సూచించారు. వైస్‌చైర్మన్ మస్కాన్ నాజ్నయ్యర్అలీ, టౌన్‌ప్లానింగ్ అధికారులు, కౌన్సిలర్లు, సిబ్బంది పాల్గొన్నారు. మెయిన్‌రోడ్డు విస్తరణ పనులు పరిశీలన పెద్దపల్లి మెయిన్‌రోడ్డులో జరుగుతున్న విస్తరణ పనులను ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే విజయరమణా రావు సోమవారం పరిశీలించారు. పనులు ఎలా సా గుతున్నాయని కమిషనర్ వెంకటేశ్‌ను అడిగి తెలు సుకున్నారు. మెయిన్‌రోడ్డులో ఉన్న వ్యాపారులంతా 55అడుగుల విస్తరణ పనులకు సహకరించాలన్నారు. కూల్చివేతల తర్వాత అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ, సెంట్రల్ లైటింగ్ సిస్టం ఏర్పాటుతో పట్టణానికి కొత్తశోభ తెస్తామని తెలిపారు. ఆయన వెంట మున్సిపల్ చైర్మన్ మల్లయ్య, కౌన్సిలర్లు ఉన్నారు. -
మరో వారమే సర్
సాక్షి,పెద్దపల్లి: జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) ప్రక్రియ తుది దశకు చేరుకుంది. ఎన్యూమరేషన్ ఫారాల సమర్పణకు ఎన్నికల సంఘం నిర్దేశించిన గడువు ఆగస్టు 3తో ముగియనున్న నేపథ్యంలో మరో వారం రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఆశాజనకంగా కొనసాగుతున్నప్పటికీ, పట్టణ ప్రాంతాల్లో మందకొడిగా సాగుతుండటం అధికారుల్లో ఆందోళన కలిగిస్తోంది. జిల్లాలో మొత్తం 7,12,157 మంది ఓటర్లు ఉండగా, ఇప్పటివరకు 6,08,470 మంది వివరాల డిజిటలైజేషన్ (85.44శాతం) పూర్తయింది. నియోజకవర్గాల వారీగా పరిశీలిస్తే మంథని, పెద్దపల్లి ప్రాంతాలు ముందంజలో ఉండగా, రామగుండం నియోజకవర్గం వెనుకబాటులో ఉన్నట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. నిర్ధేశిత సమయంలోగా డిజిటలైజేషన్ ప్రక్రియ పూర్తమవుతుందా? లేదా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కాగా, మొత్తం ఓటర్లలో 50వేల నుంచి లక్ష వరకు ఓట్లు తగ్గే అవకాశాలు ఉన్నట్లు కనిపిస్తోంది. బోగస్ ఓట్లపై ప్రత్యేక దృష్టి జిల్లాలో 100శాతం ఎన్యూమరేషన్ ఫారాంల పంపిణీ పూర్తి కావటంతో డిజిటలైజేషన్ ప్రక్రియలో వేగం పెంచారు. ఇప్పటివరకు 13,074 మంది మృతుల పేర్లపై ఉన్న ఓట్లు, 28,166 మంది ఇతర ప్రాంతాలకు మారిన ఓటర్లు, 14,138 డబుల్ ఓట్లు, 396 మంది అందుబాటులో లేని ఓటర్లను గుర్తించారు. వీరి వివరాలను డిజిటలైజ్ చేస్తూ జాబితా ప్రక్షాళన చేపడుతున్నారు. దీంతో బోగస్ ఓట్లు, మరణించిన వారి పేర్లపై కొనసాగుతున్న ఓట్లు, ఒకే వ్యక్తికి రెండు లేదా అంతకంటే ఎక్కువ చోట్ల నమోదైన ఓట్లు పూర్తిస్థాయిలో వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. మృతులు, డబుల్ ఓట్ల తొలగింపుపై పెద్దగా అభ్యంతరాలు లేకపోయినా, నిజమైన అర్హుల ఓట్లు తొలగిపోతాయనే ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రతీ ఓటరు తమ ఓటు హక్కును కొనసాగించుకోవాలంటే ఎన్యూమరేషన్ ఫారం సమర్పించడం అత్యంత కీలకంగా మారింది. ఓటరు జాబితాలో నమోదైన చిరునామా ఆధారంగానే బీఎల్వోలు ఎన్యూమరేషన్ ఫారాలు పంపిణీ చేస్తున్నారు. అయితే ఇళ్లు మారిన వారు, వలస కార్మికులు, ఇతర ప్రాంతాలకు బదిలీ అయిన ఉద్యోగులు పాత చిరునామాలో అందుబాటులో లేకపోతే వారిని శ్రీషిఫ్టెడ్ఙ్గా నమోదు చేస్తున్నారు. అలాంటి వారు ఫారం సమర్పించకపోతే ముసాయిదా ఓటర్ల జాబితాలో పేరు లేకపోయే అవకాశం ఉంది. అనంతరం కొత్తగా ఓటరు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. మొత్తం ఓటర్లు: 7,12,157 డిజిటలైజేషన్: 6,08,470 మృతులు: 13,074 వేరే చోటుకు తరలించడం: 28,166 రెండు చోట్ల ఓట్లు: 14,138 అందుబాటులో లేనివారు: 396నియోజకవర్గం మొత్తం ఓట్లు డిజిటలైజేషన్ శాతం అయిన ఓట్లు రామగుండం 2,13,990 1,70,990 79.91 మంథని 2,38,765 2,10,776 88.28 పెద్దపల్లి 2,59,402 2,26,704 87.39 ఉపాధి కోసం హైదరాబాద్‌తో పాటు ఇతర రాష్ట్రాలకు వెళ్లిన వారిలో చాలామంది తమ సొంత గ్రామంలోనే ఓటు కొనసాగించేందుకు ఆసక్తి చూపుతున్నారు. సొంతూరిలో ఓటు ఉండడం సామాజికంగా, రాజకీయంగా ప్రాధాన్యమనే భావనతో అక్కడినే ఎన్యూమరేషన్ ఫారాలు సమర్పిస్తున్నారు. గతనెల 25న ప్రారంభమైన సర్ ప్రక్రియలో ఎన్యూమరేషన్ ఫారాల సమర్పణకు ఆగస్టు 3 వరకు అవకాశం ఉంది. అనంతరం ఆగస్టు 10న ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల చేయనున్నారు. అదే రోజు నుంచి సెప్టెంబర్ 9 వరకు అభ్యంతరాలు, సూచనలు స్వీకరించనున్నారు. అన్ని అభ్యంతరాల పరిశీలన అనంతరం అక్టోబర్ 12న తుది ఓటర్ల జాబితా విడుదల చేయనున్నట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. -
ధాన్యం డబ్బులు ఇప్పించండి
● 30 మంది రైతులు.. 3 గంటలపాటు ఆందోళన ● పది రోజుల్లో న్యాయం చేస్తామన్న అధికారులువేములవాడరూరల్: ధాన్యం డబ్బులు రావడం లేదని.. న్యాయం చేయండి అంటూ రైతులు నిర్మాణంలో ఉన్న ఇంటిపైకి ఎక్కి సోమవారం నిరసన తెలిపారు. మూడు గంటలపాటు ఆందోళన చేపట్టగా అధికారులు వచ్చి హామీ ఇవ్వడంతో శాంతించారు. రైతులు, అధికారులు తెలిపిన వివరాలు. రాజన్నసిరిసిల్ల జిల్లా వేములవాడరూరల్ మండలం మర్రిపల్లి, నూకలమర్రి, మల్లారం గ్రామాలకు చెందిన దాదాపు 46 మంది రైతులు వేములవాడ సొసైటీకి 7 లారీల ధాన్యం విక్రయించారు. ఈ ధాన్యానికి సంబంధించి దాదాపు రూ.52 లక్షలు రావాల్సి ఉంది. సొసైటీ ద్వారా జిల్లా కేంద్రంలోని ఓ గోదాంకు వెళ్లింది. అక్కడ విధులు నిర్వర్తిస్తున్న మధుకర్ ఆ ధాన్యాన్ని పక్కదోవ పట్టించాడు. ఈ విషయంలో సదరు వ్యక్తిపై కేసు నమోదుకావడంతోపాటు రిమాండ్‌కు తరలించారు. ఈక్రమంలోనే రైతుల డబ్బులు వారి ఖాతాల్లో జమకావడం లేదు. మధుకర్ వేములవాడలో నిర్మిస్తున్న ఇంటిపైకి ఎక్కిన రైతులు దాదాపు మూడు గంటలపాటు నిరసన తెలిపారు. వేములవాడ పట్టణ సీఐ వీరప్రసాద్, డీసీవో బుచ్చిబాబు, తహసీల్దార్లు జయంత్, అబుబాకర్లు అక్కడికి వెళ్లి 10 రోజుల్లో డబ్బులు జమయ్యేలా చూస్తామని హామీ ఇచ్చారు. దీంతో రైతులు శాంతించారు. రైతులకు మద్దతుగా కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి వకుళాభరణం శ్రీనివాస్, మల్లారం మాజీ ఎంపీటీసీ వీరారెడ్డి, మల్లారం ఉపసర్పంచ్ కొంపెల్లి శ్రీకాంత్, నూకలమర్రి ఉపసర్పంచ్ శంకరయ్యగౌడ్ ఉన్నారు. -
జోరుగా మానేరు రివర్ ఫ్రంట్ పనులు
సాక్షిప్రతినిధి,కరీంనగర్ ●: కరీంనగర్ జిల్లా కేంద్రానికి తలమాణికంగా మారుతుందని చెప్పుకుంటున్న మానేరు రివర్‌ఫ్రంట్ (ఎంఆర్ఎఫ్) కోసం మరింత భూమి అవసరమైంది. తాజాగా నదికి ఎడమవైపున 8.05 ఎకరాల భూసేకరణకు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తం రూ.410 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్టును నీటిపారుదల, పర్యాటక శాఖ సంయుక్తంగా చేపట్టాయి. ఇందులో రూ.300 కోట్ల వరకు నీటిపారుదల శాఖ భరించగా, మిగిలిన నిధులను పర్యాటకశాఖ వెచ్చించనుంది. గుజరాత్‌లోని సబర్మతీ నదీ తీరం స్ఫూర్తిగా గత ప్రభుత్వం మానేరు తీరాన్ని అభివృద్ధి చేయాలని ఈ ప్రాజెక్టును చేపట్టింది. నదికి రెండు వైపులా కాంక్రీట్ గోడలు నిర్మించి తీరాన్ని రెండువైపులా పర్యాటపరంగా అభివృద్ధి చేయాలన్న తలంపుతో చేపట్టిన మానేరు రివర్‌ఫ్రంట్ పురోగతి ప్రభుత్వం మారిన కొన్ని నెలల తర్వాత పర్యావరణ, ఇతర సాంకేతిక సమస్యల కారణంగా నెమ్మదించింది. ఇటీవల ఈ ప్రాజెక్టుకు జిల్లా ఇన్చార్జి మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు, మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ ప్రాధాన్యం ఇవ్వడంతో పనులు తిరిగి వేగం పుంజుకున్నాయి. రూ.40 కోట్ల చెల్లింపునకు సిద్ధం మానేరు రివర్ ఫ్రంట్‌లో భాగంగా ఎడమవైపు (నగరం వైపు) 8.05 ఎకరాల స్థలం అవసరం అయింది. నదీతీరం వైపు తవ్వేందుకు స్థలం కావాల్సి వచ్చింది. ఈ మేరకు తొలుత అధికారులు నోటిఫికేషన్ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. కానీ, ఎంత స్థలం కావాలి అన్న విషయంలో పలు సాంకేతిక సవాళ్లు ఎదురయ్యాయి. దీంతో తొలిదశలో నోటిఫికేషన్ ఇచ్చేందుకు అంతా సిద్ధమైనా.. ఆఖరు నిమిషంలో నోటిఫికేషన్ విడుదల కాకుండా నిలిచిపోయింది. చివరికి రెవెన్యూ డిపార్ట్మెంట్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ (భూసేకరణ)లు విషయాన్ని కొలిక్కి తీసుకురావడంతో 8.05 ఎకరాల భూసేకరణకు నోటిఫికేషన్ జారీ చేశారు. అలాగే.. ఈ మొత్తం భూమికి యజమానులకు దాదాపు రూ.40 కోట్ల వరకు వెచ్చించేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ఉమ్మడి జిల్లా మంత్రులంతా పనులపై నిరంతరం ఆరా తీస్తుండటంతో భూసేకరణకు అధికారులు అత్యంత ప్రాధాన్యం ఇవ్వడం గమనార్హం. తొలి దశలో 82శాతం పనులు పూర్తి.. రూ.410 కోట్లతో మానేరు రివర్ ఫ్రంట్ పనులను రెండు ప్యాకేజీలుగా విభజించారు. మొదటి దశలో 3.75 కిలోమీటర్ల వరకు, రెండో దశలో 6.25 కిలో మీటర్ల మేర ఇరువైపులా అభివృద్ధి చేయనున్నారు. మానేర్ రివర్ ఫ్రంట్‌లో 12 నుంచి 13 అడుగుల లోతు వరకు నీరు నిల్వ ఉంటుంది. స్పీడ్ బోట్లు, క్రూజ్ బోట్లు పర్యాటకులకు ఆకర్షణగా ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. ఢిల్లీకి చెందిన ఐఎన్ఎస్ కన్సల్టెన్సీ మానేర్ రివర్ ఫ్రంట్ పనులు చేపడుతోంది. తొలిదశ పనుల్లో ఇప్పటి వరకు 82 శాతం పూర్తయ్యాయి. 3.75 కి.మీ ప్రొటెక్షన్ వాల్లో ఎడమవైపు 3.5 కి.మీ మేర, కుడివైపు 3.25 కి.మీ మేర గోడ నిర్మాణం అయిపోయింది. మరో 250 మీటర్ల మేర పనులు పెండింగ్ ఉన్నాయి. ప్రొటెక్షన్ వాల్స్‌కు ఇరువైపులా మట్టితో నిర్మించిన కట్ట పనులు కూడా పూర్తయ్యాయి. మొత్తంగా రూ.277 కోట్లను నీటిపారుదల శాఖ పనులకోసం వెచ్చించింది. ఇందులో భాగంగా తీగల వంతెన పక్కన నిర్మించనున్న చెక్ డ్యాం పనులు దాదాపు పూర్తయ్యాయి. వీటికి బిగించేందుకు అధికారులు గేట్లు కూడా తీసుకువచ్చారు. ఈ గేట్లతోనే మానేరు రివర్‌ఫ్రంట్‌లో నీటిని నియంత్రించనున్నారు. ఇటీవల కలెక్టర్ చిత్రా మిశ్రా సైతం మానేరు రివర్ ఫ్రంట్ విషయంలో సమీక్ష నిర్వహించారు. భూ సేకరణ ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలని, బ్యూటిఫికేషన్ వర్క్స్, రైలింగ్, గార్డెనింగ్ వంటి అభివృద్ధి పనులపై ప్రత్యేక దష్టి సారించాలని సూచించారు. ఇరిగేషన్, టూరిజం కార్పొరేషన్, రెవెన్యూ శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేసి, ఎలాంటి ఆటంకాలు లేకుండా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. -
తండ్రి మృతి.. కూతుళ్లు అనాథలు
ముస్తాబాద్(సిరిసిల్ల): రెండేళ్ల క్రితం తల్లి.. నేడు తండ్రి మృతిచెందడంతో ముగ్గురు కూతుళ్లు అనాథలయ్యారు. రాజన్నసిరిసిల్ల జిల్లా పోతుగల్‌కు చెందిన జిల్లెల వెంకటేశ్(45) రైస్‌మిల్లులో కార్మికుడిగా పనిచేసేవాడు. భార్య వినోద రెండేళ్ల క్రితం క్యాన్సర్‌తో మృతిచెందింది. ముగ్గురు పిల్లలను అన్నీ తానై పోషించిన వెంకటేశ్ మూత్రపిండాల వ్యాధికి గురికావడంతో రూ.8లక్షల వరకు అప్పుచేసి చికిత్స అందించారు. అయినా వ్యాధి నయంకాక ఆదివారం రాత్రి మరణించాడు. తల్లిదండ్రులు ఇద్దరు మరణించడంతో ముగ్గురు కుమార్తెలు అనాథలయ్యారు. ఈ విషయాన్ని స్థానిక బీజేపీ నాయకులు కేంద్ర మంత్రి బండి సంజయ్‌కి సమాచారం ఇచ్చారు. ఆయన స్పందించి రూ.25 వేల నగదును పార్టీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి, మండల అధ్యక్షుడు క్రాంతి ద్వారా బాధిత కుటుంబానికి అందించారు. ఉపసర్పంచ్ కోల కృష్ణ, వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.కల్యాణకట్టలో అదనపు వసూళ్లపై ఫిర్యాదువేములవాడ: రాజన్న ఆలయ కల్యాణకట్టలో అదనపు వసూళ్లు చేస్తున్నారంటూ వరంగల్‌కు చెందిన భక్తురాలు హసీనా ఆలయ ఈవో రమాదేవికి సోమవారం ఫిర్యాదు చేశారు. యాకూబ్భాష, హసీనా కుటుంబ సభ్యులతో కలిసి తలనీలాలు సమర్పించుకునేందుకు కల్యాణకట్టకు వెళ్లారు. అక్కడ విధుల్లో ఉన్న వెంకటేశ్ అనే నాయీబ్రాహ్మణుడు అధికారిక రుసుంపై అదనంగా రూ.50 ఇవ్వాలని ఒత్తిడి చేసినట్లు పేర్కొన్నారు. నగదు లేదని చెప్పడంతో రూ.50 ఫోన్‌పే చేయాలని బలవంతం చేయడంతో పంపించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ సస్పెన్షన్పెద్దపల్లి: కమాన్‌పూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ సుధాకర్‌ను సస్పెన్షన్ చేస్తూ ఇంటర్మీడియట్ డైరెక్టర్ అభిలాష అభినవ్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. స్థానికుల ఫిర్యాదు మేరకు ఉన్నతాధికారులు విచారణ చేశారు. ప్రిన్సిపాల్‌గా విధులు నిర్వహించే సమయంలో అనుచిత ప్రవర్తన, కార్యాలయ క్రమశిక్షణ పాటించకపోవడం తదితర ఆరోపణలు రావడంతో క్రమశిక్షణా చర్యలు సిఫార్సు చేయడంతో సోమవారం మధ్యాహ్నం నుంచి విచారణ పూర్తయ్యే వరకు సస్పెన్షన్ అమలులో ఉంటుందని ఆ ఉత్తర్వులో పేర్కొన్నారు. సస్పెన్షన్ కాలంలో ముందస్తు అనుమతి లేకుండా ప్రధాన కార్యాలయం విడిచి వెళ్లకూడదని ఆదేశించారు. -
మీరాబాయి చాను
బంగారు స్ఫూర్తి...కరీంనగర్‌స్పోర్ట్స్: గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్–2026లో భారత వెయిట్‌లిఫ్టింగ్ స్టార్ మీరాబాయి చాను స్వర్ణ పతకం సాధించడం దేశవ్యాప్తంగా క్రీడాకారుల్లో నూతనోత్సాహం నింపింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి వెయిట్‌లిఫ్టింగ్‌లో రాణించాలని కలలు కంటున్న యువ క్రీడాకారుల్లో ఈ విజయం ఆత్మవిశ్వాసం నింపుతోంది. సరైన శిక్షణ, కఠోరసాధన, లక్ష్యంపై ఏకాగ్రత ఉంటే అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించడం సాధ్యమేనని ఆమె నిరూపించారు. ఆమె విజయం ఉమ్మడి జిల్లా వెయిట్ లిఫ్టర్లకు స్ఫూర్తిగా నిలుస్తోందని జిల్లా వెయిట్ లిఫ్టింగ్ సంఘం ప్రతినిధులు, క్రీడాకారులు పేర్కొన్నారు. కఠోర శ్రమ, క్రమశిక్షణ, లక్ష్యసాధనతో ప్రపంచ వేదికపై విజయాలు సాధించవచ్చని మీరాబాయి మరోసారి నిరూపించారని కొనియాడారు.జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొన్న శృతి (కరీంనగర్) కామన్వెల్త్ పతకంతో మీరాబాయి చాను మీరాబాయి చాను విజయం మహిళా క్రీడాకారిణులకు గొప్ప ప్రేరణ. కష్టపడి సాధన చేస్తే ఏ లక్ష్యాన్నైనా చేరుకోవచ్చని ఆమె నిరూపించారు. ఆమె విజయాన్ని ఆదర్శంగా తీసుకుని మరింత పట్టుదలతో శిక్షణ కొనసాగిస్తాను. ఒకరోజు భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించాలనేది నా కల. – ఎం సాయిదుర్గ, జాతీయ వెయిట్‌లిఫ్టర్ -
పేద విద్యార్థికి ఉచిత ఇంజినీరింగ్ సీటు
● ముందుకొచ్చిన జ్యోతిష్మతి కళాశాల యాజమాన్యంతిమ్మాపూర్/ముస్తాబాద్: ఆ తల్లి చివరి కోరిక నెరవేరింది. ఆర్థిక ఇబ్బందులతో కొడుకును ఇంజినీరింగ్ చదివించలేకపోతున్నానని ఆ మాతృమూర్తి ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటనకు ‘సాక్షి’ అక్షర రూపం ఇచ్చింది. ‘సాక్షి’లో వచ్చిన కథనానికి కరీంనగర్‌లోని జ్యోతిష్మతి కళాశాల యాజమాన్యం స్పందించింది. మానవత్వంతో ఆ తల్లి చివరి కోరికను నెరవేర్చింది. ముస్తాబాద్ మండలం ఆవునూరుకు చెందిన బండి లావణ్య పదిహేను రోజుల క్రితం కొడుకు ఇంజినీరింగ్ చదువుకు ఫీజు చెల్లించలేకపోతున్నానని మనోవేదనతో ఆత్మహత్యకు పాల్పడింది. లావణ్య భర్త రవీందర్ ఉపాధి కోసం దుబాయ్ వెళ్లాడు. ఈ సంఘటనపై సాక్షి ఈనెల 24న ‘చితికి పోతున్నారు’ శీర్షికన కథనాన్ని ప్రచురించింది. ఈ కథనానికి కరీంనగర్ జ్యోతిష్మతి ఇంజినీరింగ్ కళాశాల యజమాని జువ్వాడి సాగర్‌రావు స్పందించారు. వికాస్‌కు జ్యోతిష్మతి కళాశాలలో పూర్తి ఉచిత బీటెక్ ప్రవేశం కల్పిస్తున్నట్లు ప్రకటించారు. నాలుగేళ్లపాటు హాస్టల్ వసతి కూడా ఉచితంగా అందిస్తానని హామీ ఇచ్చారు. ఆర్థిక ఇబ్బందులు ఏ విద్యార్థి భవిష్యత్తుకు అడ్డంకి కాకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా వికాస్.. చైర్మన్ జువ్వాడి సాగర్‌రావు, సెక్రటరీ జువ్వాడి సుమిత్‌సాయిలకు కృతజ్ఞతలు తెలిపారు. గ్రామస్తులు బైరి శ్రీనివాస్‌గౌడ్, ఆశాగౌడ్, సావిత్రి తదితరులు సాగర్‌రావు, సుమిత్‌సాయిలకు, సాక్షికి కృతజ్ఞతలు తెలిపారు. -
లింగ నిర్ధారణకు పాల్పడితే చర్యలు
పెద్దపల్లి: గర్భంలోని శిశువు లింగాన్ని స్కానింగ్ ద్వారా వెల్లడించడం చట్టవిరుద్ధమని, అలాంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రీకన్సెప్షన్ అండ్ ప్రీనేటల్ డయాగ్నస్టిక్ టెక్నిక్స్ జిల్లా సలహా కమిటీ సమావేశంలో మాట్లాడారు. జిల్లాలో పీసీపీఎన్డీటీ చట్టాన్ని కచ్చితంగా అమలు చేయాలని అన్నారు. స్కానింగ్ కేంద్రాలపై నిరంతర పర్యవేక్షణ చేపట్టి చట్ట ఉల్లంఘనలకు అవకాశం లేకుండా చూడాలని ఆదేశించారు. జిల్లాలో సహజ ప్రసవాలను మరింతగా ప్రోత్సహించి, అనవసర సిజేరియన్ శస్త్రచికిత్సలను తగ్గించే దిశగా వైద్యశాఖ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించారు. సమావేశంలో జిల్లా వైద్యాధికారి పవిత్ర, ప్రోగ్రాం అధికారి లక్ష్మీభవాని, డిప్యూటీ డీఎంహెచ్‌వో శ్రీరాములు, సంబంధిత ఎస్సై, లయన్స్ క్లబ్ అధ్యక్షులు, వైద్యాధికారులు తదితరులు పాల్గొన్నారు. సాంకేతిక పరిజ్ఞానం వినియోగించుకోవాలి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు మెరుగుపర్చేందుకు ఆధునిక బోధన విధానాలు, సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలని కలెక్టర్ శ్రీహర్ష సూచించారు. సోమవారం జిల్లాకేంద్రంలోని జెడ్పీహెచ్ఎస్ బాలుర పాఠశాల (అమర్‌నగర్)లో నిర్వహిస్తున్న సమగ్ర సేవా శిక్షణను సందర్శించారు. శిక్షణ ద్వారా విద్యార్థుల అభ్యసన ఫలితాల మెరుగుదల, డిజిటల్ లిటరసీ, కృత్రిమ మేధస్సు, వినూత్న బోధన పద్ధతులపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీఈవో శారద, షేక్, మల్లేశం గౌడ్, ప్రతినిధులు, మాస్టర్ ట్రైనర్లు, ప్రధానోపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. -
చైన్‌స్నాచింగ్‌కు విఫలయత్నం
● మహిళ కేకలు వేయడంతో పరారైన ఆగంతకుడుబోయినపల్లి(చొప్పదండి): కిరాణ స్టోర్‌లో ఉన్న మహిళ మెడలోంచి బంగారు చైన్ లాగేందుకు ఓ ఆగంతకుడు యత్నించగా.. మహిళ కేకలు వేయడంతో పరారయ్యాడు. వేములవాడ రూరల్ సీఐ శ్రీనివాస్ తెలిపిన వివరాలు. రాజన్నసిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం కొదురుపాకలో కొండం విజయ తన కిరాణ దుకాణంలో ఒంటరిగా ఉంది. మొదట హెల్మెట్ ధరించిన ఓ గుర్తుతెలియని వ్యక్తి బైక్‌పై వచ్చి సిగరెట్ కొనుగోలు చేసి వెళ్లాడు. అనంతరం అదే వ్యక్తి మళ్లీ వచ్చి ఆమె మెడలో ఉన్న బంగారు గొలుసును లాగేందుకు ప్రయత్నించగా ఆమె ప్రతిఘటించింది. గట్టిగా కేకలు వేయడంతో ఆగంతకుడు పరారయ్యాడు. బాధితురాలు కొండం విజయ ఫిర్యాదుతో కేసు నమోదు చేసి, విచారణ చేపట్టారు. -
భద్రతా ప్రమాణాలు పటిష్టంగా అమలు చేయాలి
గోదావరిఖని: బొగ్గుగనుల్లో భద్రతా ప్రమాణాలు మరింత పటిష్టంగా అమలు చేయాలని ధన్‌బాద్‌కు చెందిన డైరెక్టర్ జనరల్ మైన్స్ సేఫ్టీ ఉజ్వల్తాహ్ అన్నారు. సోమవారం రాత్రి ఎన్టీపీసీ శ్రీమయి కన్వెన్షన్ హాల్లో జరిగిన 56వ వార్షిక భద్రతా పక్షోత్సవం బహుమతి ప్రదానోత్సవానికి ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడారు. ముందుగా గని ప్రమాదాల్లో మరణించిన ఉద్యోగుల ఆత్మకుశాంతి చేకూరాలని రెండు నిమిషాలు మౌనం పాటించారు. ప్రమాదాల్లేని సింగరేణిగా తీర్చిదిద్దేందుకు సమష్టిగా కృషి చేయాలన్నారు. సింగరేణి డైరెక్టర్ ఎల్వీ సూర్యనారాయణ మాట్లాడుతూ గనుల్లో పటిష్టమైన రక్షణ చర్యలు అమలు చేస్తున్నామని, రక్షణకు పెద్దపీట వే స్తున్నామన్నారు. డీవైడీజీఎంఎస్ అధికారులు క న్న న్, డైరెక్టర్లు వెంకటేశ్వర్లు, తిరుమల్‌రావు, వెంకన్న, ఇతర అధికారులు, యూనియన్ నాయకులు సీ తారామయ్య, జనక్‌ప్రసాద్ పాల్గొన్నారు. పలుగనులకు రక్షణ బహుమతులు అందజేశారు. -
ఆర్టీవో చలాన్ పేరుతో సైబర్ మోసాలు
● ఓపెన్ చేయొద్దని పోలీసుల సూచన వేములవాడ: సైబర్ మోసాలు రోజుకో తీరున జరుగుతున్నాయి. షాపింగ్‌పై డిస్కౌంట్లు, బంపర్‌డ్రా వచ్చిందంటూ ఇన్నాళ్లు మోసాలకు పాల్పడ్డ సైబర్ నేరస్తులు తాజాగా మీ వాహనంపై ట్రాఫిక్ చలాన్ పడిందంటూ వాట్సాప్‌లో ఆర్టీవో పేరట మెసేజ్‌లు పంపుతున్నారు. ఆ టెక్ట్స్ ఫైల్‌ను ఓపెన్ చేస్తే బ్యాంక్ ఖాతాలోని డబ్బులు ఖాళీ అవుతుండడంతో వేములవాడ పట్టణంలో సోమవారం వైరల్‌గా మారింది. పట్టణానికి చెందిన సురేష్‌కు ఆదివారం ఈ మెసేజ్ రాగా.. ఓపెన్ చేయడంతో ఖాతాలోని డబ్బులు ఖాళీ అయ్యాయి. తాను మోసపోయానని గ్రహించిన సురేష్ స్థానికంగా ఉన్న సోషల్‌మీడియా గ్రూప్‌లలో ఇలాంటి మెసేజ్ వస్తుందని అలర్ట్ చేశారు. సైబర్ మోసాలకు గురైతే వెంటనే 1930లో ఫిర్యాదు చేయాలని స్థానిక పోలీసులు సూచిస్తున్నారు. -
కనువిందు చేస్తున్న ఎల్ మడుగు అందాలు
ప్రకృతి ఒడిలో కొలువైన ఎల్ మడుగు అందాలు కనవిందు చేస్తున్నాయి. ఓవైపు దట్టమైన అడవి.. మరోవైపు గళగళపారేటి గోదావరినది. ఇంకోవైపు పచ్చటి పొలాలు.. ఇలా అనేక ప్రకృతి సోయగాలు ఆకట్టుకునేలా కనిపిస్తున్నాయి. పెద్దపల్లి జిల్లా మంథని మండలం ఖానాపూర్ శివారులోని ఎల్ మడుగు అందాలు ఒకవైపు కనువిందు చేస్తుంటే మరోవైపు మంచిర్యాల జిల్లా శివ్వారం అభయారణ్యంలోని మొసళ్ల పెంపక కేంద్రం మరింత ఆకర్షణగా నిలుస్తోంది. పచ్చని అడవులతో ఆహ్లదం పంచే ఈ ఎల్‌మడుగును పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని ఖానాపూర్ సర్పంచ్ సంగెం అరుణ గట్టయ్య కోరారు. – మంథనిరూరల్ -
నేడు నేరెళ్లకు కల్వకుంట్ల కవిత
● బాధితులకు తెలంగాణ రక్షణ సేన చీఫ్ పరామర్శ ● న్యాయపోరాటానికి అండగా ఆర్థికసాయంసాక్షిప్రతినిధి,కరీంనగర్: తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత నేరెళ్లలో పర్యటించనున్నారు. గత ప్రభుత్వ హయాంలో సంచలనం రేపిన నేరెళ్ల ఘటన బాధితులను పరామర్శించేందుకు ఆమె వస్తున్నారు. 2017లో పోలీసుల థర్డ్ డిగ్రీలో తీవ్రంగా గాయపడి 9 ఏళ్ల పాటు అనేక ఇబ్బందులు పడి ఇటీవల కన్నుమూసిన గంధం గోపాల్ కుటుంబ సభ్యులను కవిత మంగళవారం ఉదయం 10.30 గంటలకు పరామర్శిస్తారు. కొంతకాలం క్రితం నేరెళ్ల బాధితులు కవితను కలిసి తమ గోడు చెప్పుకోగా వారికి అన్నివిధాల అండగా నిలుస్తానని హామీ ఇచ్చారు. వారి న్యాయపోరాటానికి కొంత సాయం అందించారు. నేరెళ్ల దురాగతంలో భాగస్వాములుగా ఉన్న వారికి న్యాయపరంగా శిక్షపడే వరకు బాధితులకు వెన్నంటి ఉంటానని కవిత భరోసా ఇచ్చారు. అందులో భాగంగానే మంగళవారం ఆమె బాధితుల కుటుంబాలతో మాట్లాడుతారు. ఘటన నేపథ్యం మిడ్ మానేరు రిజర్వాయర్‌లో ముంపునకు గురయ్యే మానేరునదిలో ఇసుక తవ్వకాలకు 2017లో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అప్పటి నేతలు మానేరు నది నుంచి పెద్దఎత్తున ఇసుక తీసి లారీల్లో హైదరాబాద్ తరలించి పెద్ద ఎత్తున సొమ్ము చేసుకున్నారు. ఇసుక తరలిస్తున్న లారీలతో సిరిసిల్ల ప్రాంతంలో అనేక ప్రమాదాలు జరిగాయి. 2017 జూలై 2న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం జిల్లెల్ల వద్ద ఇసుక లారీ ఢీకొని నేరెళ్లకు చెందిన రైతు బదనపు భూమయ్య చనిపోయారు. భూమయ్య మరణంతో భగ్గుమన్న గ్రామస్తులు నేరెళ్లలో ఇసుక లారీలను తగులబెట్టారు. ఈ ఘటనకు బాధ్యులుగా గ్రామానికి చెందిన 8 మందిని పోలీసులు అరెస్ట్ చేసి వారిపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారు. కరీంనగర్ జైలుకు తరలించిన తర్వాత 8 మంది బాధితుల్లో నలుగురు తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో వారిని కరీంనగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ డాక్టర్ల పరిశీలనలో థర్డ్ డిగ్రీ విషయం వెలుగులోకి వచ్చింది. అప్పటి పోలీసుల చిత్ర హింసల నుంచి బాధితులు ఇప్పటికీ కోలుకోలేదు. నేరెళ్ల బాధితుల్లో ఒకరైన గంధం గోపాల్ ఇటీవల మృతిచెందారు. మరో బాధితుడు పెంట బాణయ్య కిడ్నీల సమస్యతో బాధ పడుతున్నాడు. మిగతా వారు తీవ్ర అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. -
రక్షణ వారోత్సవాలకు ఏర్పాట్లు
గోదావరిఖని: సింగరేణి అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన –2025 రక్షణ వార్షికోత్సవాల్లో సత్తాచాటిన గనులు, ఓసీపీలు, ఇతర విభాగాలకు బహుమతులు అందజేసేందుకు విస్తృత ఏర్పాట్లు చేసింది. మొత్తం 12 ఏరియాలకు చెందిన అన్నివిభాగాల పేర్లను యాజమాన్యం ఇప్పటికే ప్రకటించింది. ఓసీపీలు, భూగర్భ గనులు, సీహెచ్‌పీలు, వర్క్‌షాప్‌లు, స్టోర్స్ తదితర విభాగాల్లో రక్షణలో అత్యంత ప్రతిభ కనబర్చిన గనులకు బహుమతులను అందించేందుకు సిద్ధం చేశారు. సింగరేణి సీఎండీ బుద్ధ ప్రకాశ్‌జ్యోతి, డైరెక్టర్ జనరల్ ఆఫ్ మైన్స్ సేఫ్టీతోపాటు సింగరేణి డైరెక్టర్ల బహుమతులు అందజేస్తారు. ఓపెన్‌కాస్ట్ ప్రాజెక్టుల్లో.. ఓసీపీ గ్రూప్–వన్‌లో ఓవరాల్ ప్రథమ బహుమతి జేవీఆర్ ఓసీపీ, ద్వితీయ బహుమతి ఓసీపీ–3 సాధించాయి. గ్రూప్–2లో ప్రథమ స్థానం కేటీకే ఓసీపీ–2, మణుగూరు ఓసీపీ ద్వితీయస్థానం పొందాయి. గ్రూప్–3 ఓసీపీల్లో కొత్తగూడెం ఓసీపీ ప్రథమ, రెండోస్థానం కిష్టారం ఓసీపీ సాధించింది. భూగర్భ గనుల్లో.. గ్రూప్ వన్‌లో ప్రథమ స్థానం వకీల్‌పల్లి, రెండోస్థానంలో ఆర్కే–7, గ్రూప్–2లో కేటీకే–5,5ఏ మొద టి, ఆర్కే–5 రెండోస్థానం సాధించాయి. గ్రూప్– 3లో ఎస్ఆర్పీ–3,3ఏ మొదటి, కాసిపేట –2వ గని రెండోస్థానం పొందింది. సీహెచ్‌పీలు.. మొదటిస్థానం జేవీఆర్ సీహెచ్‌పీ, రెండోబహుమతి ఓసీపీ–1, శ్రీరాంపూర్ సీహెచ్‌పీ మూడో బహుమతి సాధించాయి. కార్పొరేట్ సెంట్రల్ వర్క్‌షాప్ మొదటి, సబ్‌స్టేషన్ విభాగంలో కార్పొరేట్ సబ్‌స్టేషన్ మొదటి బహుమతి పొందింది. వీటితోపాటు పలు విభాగాలకు మొదటి, రెండు, మూడో బహుమతులను ప్రకటించారు. ప్రమాదాల్లేని సూపర్వైజర్లు వీరే సింగరేణిలో ప్రమాదాలు లేని సూపర్వైజర్లను ఏరియాకు ఒక్కరి చొప్పున యాజమాన్యం ఎంపిక చేసింది. ఎంపికై న వారి వివరాలు: జీడీకే–1,2ఏకు చెందిన ఎ.స్వామి(మైనింగ్ సర్ధార్), వకీల్‌పల్లిగనికి చెందిన టి.బానయ్య(హెడ్ ఓవర్‌మెన్), ఓసీపీ–1కు చెందిన ఎం.ప్రభాకర్‌రెడ్డి(హెడ్ ఓవర్‌మెన్), ఏఎల్పీ గనికి చెందిన ఎన్.సాంబయ్య(హెడ్ ఓవర్‌మెన్), కేటీకే–5,5ఏకు చెందిన కె.తిరుపతిరెడ్డి(సీనియర్ మైనింగ్ సర్ధార్), పీవీకే–5వ గనికి చెందిన బి.గోవర్ధన్‌రావు(హెడ్ ఓవర్‌మెన్), జేవీఆర్ ఓసీపీకి చెందిన ఎస్.మహేందర్(హెడ్ ఓవర్‌మెన్), పీకే ఓసీపీకి చెందిన సుబ్బరాజు(హెడ్ ఓవర్‌మెన్), జేకే–5 ఓసీపీకి చెందిన కె.శ్రీనివాసరావు(హెడ్ ఓవర్‌మెన్), ఖైరిగూడ ఓసీపీ సీహెచ్ మల్లేశ్(హెడ్ ఓవర్‌మెన్), కేకే–5గనికి చెందిన రాహుల్ రాంచరణ్(సీనియర్ మైనింగ్ సర్ధార్), ఆర్కే న్యూ టెక్కు చెందిన బి.చంద్రమౌళి(హెడ్ ఓవర్‌మెన్). బహుమతుల పంపిణీకి చర్యలు ఎన్టీపీసీలో వేడుకలు -
పాము కాటుతో రైతు మృతి
మల్లాపూర్: పాముకాటుతో రైతు మృతిచెందిన ఘటన మండలంలోని రత్నాపూర్లో చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన యనం మల్ల య్య (62) ఈనెల 25న మధ్యాహ్నం తన మొక్కజొన్న చేనులోకి వెళ్లాడు. అక్కడ విషపాము కాలుపై కాటేసింది. వెంటనే ఇంటికి చేరిన ఆయనను కుటుంబ సభ్యులు మెట్‌పల్లిలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. మల్లయ్య కుమారుడు మనీష్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై అనిల్ తెలిపారు. పేకాట శిబిరంపై దాడిచిగురుమామిడి: చిగురుమామిడి మండలం రేకొండ గ్రామంలో పేకాట శిబిరంపై ఎస్సై జగదీశ్వర్ దాడిచేశారు. పేకాట ఆడుతున్న 12మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.26వేల నగదు, 11స్మార్ట్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. -
గోవంశ పరిరక్షణకు కోడెల సంరక్షణే మూలం
వేములవాడ: వేములవాడ రాజన్న ఆలయ అనుబంధం భీమేశ్వరాలయంలో విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర బృందం సభ్యులు ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించి, స్వామివారిని దర్శించుకున్నారు. కోడెదూడల సమర్పణను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. వీహెచ్‌పీ రాష్ట్ర ధర్మాచార్య సంపర్క ప్రముఖ్ పగుడాకుల బాలస్వామి మాట్లాడుతూ సనాతన సంప్రదాయంలో గోవుకు విశిష్ట స్థానం ఉందని, వాటి సంరక్షణ సమాజానికి అత్యంత అవసరమని వివరించారు. రాజన్నకు కోడెదూడల సమర్పణకు శతాబ్దాల చరిత్ర ఉందన్నారు. యువత ఈ పవిత్ర సేవకు ముందుకు రావాలని కోరారు. వీహెచ్‌పీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు సునీతరెడ్డి, కార్యాలయం కార్యదర్శి జగదీశ్వర్జి, మాతృశక్తి రాష్ట్ర కో–కన్వీనర్ శ్రీవాణి, దుర్గా వాహిని రాష్ట్ర కన్వీనర్ వాణి సక్కుబాయి, దుర్గావాహిని మహానగర కన్వీనర్ మాధవి, రాజు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ధర్మాచార్య సంపర్క ప్రముఖ్ పగుడాకుల బాలస్వామి -
నిర్వాసితులకు అందని పరిహారం
రామగుండం: తెలంగాణ పునర్విభజన చట్టంలో ఇప్పటికే స్థాపించిన యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించారు. ఫేజ్–2లో 800 మెగావాట్ల సామర్థ్యం కలిగిన మరో 3 యూనిట్ల స్థాపనకు అవసరమైన బూడిద చెరువు తవ్వకానికి మొగల్పహాడ్లోని మిగులు భూముల సేకరణకు ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం గతమే 11న ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టింది. భూములు 1,274 ఎకరాలు మొగల్‌పహాడ్‌లో మొత్తం 1,274 ఎకరాలు ఉండగా.. 1982లో ఎన్టీపీసీ తొలివిద్యుత్ కేంద్రం స్థాపన కోసం 553 ఎకరాలు సేకరించింది. 1950లో జమీందారీ వ్యవస్థ రద్దయింది. అయినా, అంతర్గాం మండలంలోని మొగల్పహాడ్లోని భూములు వెంకటమురళీ మనోహర్‌రావు పేరిట ఉన్నాయి. 1973లో వచ్చిన ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ప్రకారం మొత్తం భూమి ఒకే పేరుతో ఉండకూడదు. దీంతో స్థానిక రైతులకు ఆ భూములు విక్రయించినట్లు 1975లో రెవెన్యూ యంత్రాంగానికి డిక్లరేషన్ ఇచ్చారు. ఆనాటి అధికారుల నిర్లక్ష్యంతో కాస్తులో ఉన్న రైతుల పేర్లు రెవెన్యూ రికార్డుల్లో నమోదు కాలేదు. ఫలితంగా సేకరించిన భూములకు అసలైన వారసులెవరో గుర్తించలేదు. దీంతో ఇప్పటికీ తొలివిడత సేకరించిన నిర్వాసితులకు పరిహారం పంపిణీ కాలేదు. మిగులు భూములను గ్రామస్తులు సాగు చేసుకుంటున్నా.. ధరణి పోర్టల్‌లో రెండేళ్ల క్రితం వరకు భూస్వామి పేరు కొనసాగించిన అధికారులు.. తర్వాత తొలగించారు. మూడుతరాలు గడిచినా ఇప్పటికే తొలివిద్యుత్ కేంద్రానికి అప్పగించిన భూముల పరిహారం అందక నష్టపోయామని, ప్రస్తుత భూసేకరణలో అర్హులు తామేనని మొగల్పహాడ్ గ్రామస్తులు అంటున్నారు.అర్హులమంటున్న అనర్హులు! తొలివిడదలో ఎన్టీపీసీ సేకరించిన భూములు పోగా మిగులు భూముల్లోని సుమారు 200 ఎకరాల్లో 70 మంది గ్రామస్తులు సాగు చేసుకుంటున్నారు. ఇంకా మిగిలిన భూమిలో కొందరు దళారులు ఆనాటి భూస్వామి రాజావెంకట మురళీమనోహర్‌రావు కుటుంబసభ్యుల నుంచి కొనుగోలు చేసినట్లు సాదాబైనామా రాసుకున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఇలాంటి వారు సైతం ఆ భూముల హక్కుదారులమని ఇటీవల ప్రకటించిన రెవెన్యూ రికార్డుల్లో పేర్లు ప్రచురితం కావడంపై అసలైన అర్హుల్లో ఆందోళన నెలకొంది. ఈ విషయమై భూస్వామి కుటుంబసభ్యుల మధ్య కోర్టు వివాదం ఉండడంతో అందుకు అనుగుణంగా భూసేకరణ అధికారి నిర్ణయం మేరకు అసలైన అర్హులను ప్రకటించే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు.అర్హులుగా ప్రకటించాలి మా తాతలు, తండ్రులు, ఇప్పుడు మేము కాస్తులో ఉన్నా రెవెన్యూ రికార్డుల్లో నమోదు కాలేదు. నాలుగు దశాబ్దాల క్రితం అప్పగించి న భూములకు పరిహారం అందలేదు. జాబితాలో అనర్హుల పేర్లు ఎక్కువగా ఉన్నాయి. విచారణ జరిపి అర్హుల పేర్లు ప్రకటించాలి. – చిలుక ప్రసాద్, నిర్వాసితుడు అవార్డు ఎంక్వయిరీ కీలకం ఎన్టీపీసీ విద్యుత్ కేంద్రం స్థాపనకు మొగల్‌పహాడ్‌లో భూసేకరణ చేయనుంది. లబ్ధిదారుల ఎంపికకు ముందు ప్రిలిమినరీ డిక్లరేషన్ ఉంటుంది. అనంతరం ప్రకటించే అవార్డు ఎంక్వయిరీలో అర్హుల జాబితా వెల్లడిస్తారు. భూసేరణ అధికారి ఆర్డీవో పరిధిలో ఈ ప్రక్రియ ఉంటుంది. – ప్రసాదరావు, తహసీల్దార్, అంతర్గాం -
పునాదుల్లోనే అభివృద్ధి
పెద్దపల్లిరూరల్: ‘పెద్ద’పల్లి జెడ్పీ కార్యాలయంతో సాధారణ ప్రజలకు పెద్దగా పనేమీ ఉండదు. కానీ, ఇప్పటికీ పాలకమండలిలేదు. అందుకే కాబోలు రూ.1.60 కోట్ల అంచనాతో పక్కా భవన నిర్మాణం చేపట్టి దాదాపు ఏడాది కావొస్తున్నా పనులు పునాదులు దాటడంలేదు. నిర్మాణంలో వేగం పెంచేందుకు అధికారులు, కాంట్రాక్టర్లు ఎందుకు చొరవ చూపడం లేదనేది ప్రశ్నార్థకంగా మారుతోంది. అరకొరసౌకర్యాలతో అవస్థలు జెడ్పీ కార్యాలయాన్ని తొలుత తహసీల్దార్ ఆఫీసు ఆవరణలోని ఓ భవనంలో ఏర్పాటు చేశారు. జెడ్పీ చైర్మన్, సీఈవోల కోసం ప్రత్యేక చాంబర్లు కేటాయించారు. కార్యాలయ వ్యవహారాలను సమీప రిటైర్డ్ ఉద్యోగుల సంఘ భవనంలో నిర్వహించారు. తరచూ జరిగే జెడ్పీ సర్వసభ్య సమావేశాలను ఎన్టీపీసీలోని మిలీనియంహాల్తోపాటు ప్రైవేట్ ఫంక్షన్ హాళ్లలో నిర్వహిస్తూ వచ్చారు. జెడ్పీటీసీల పదవీకాలం ముగిశాక జెడ్పీ చైర్మన్, సీఈవో చాంబర్లను ఖాళీ చేయించి అందులోకి తహసీల్దార్ కార్యాలయాన్ని తరలించారు. జెడ్పీ చైర్మన్ ఎలాగూ లేరు. సీఈవోకు అదే రిటైర్డ్ ఉద్యోగుల భవనంలోని ఓ గదిని కేటాయించారు. జెడ్పీ కార్యాలయంలోని అరకొర సౌకర్యాల మధ్య ఉద్యోగులు విధులు నిర్వర్తిస్తున్నారు. ఇదేభవనంలో ఎంపీడీవో ఆఫీసు పెద్దపల్లి మండల పరిషత్ కార్యాలయాన్ని బస్టాండ్ సమీపంలో 50 ఏళ్లపాటు కొనసాగించారు. సొంతభవనంలో సుదీర్ఘకాలం సేవలు అందించిన ఆ భవనం, స్థలాన్ని ఆర్టీసీ బస్సు డిపోకు కేటాయించడంతో సమస్యలు మొదలయ్యాయి. అప్పట్నుంచి ఆ కార్యాలయం అటు, ఇటు తిరుగుతూ ఇప్పుడు ఐటీఐ ఆవరణలోకి చేరింది. ఎంపీడీవో కార్యాలయ భవనం కోసం జెడ్పీ భవనంలోనే ఓ అంతస్తులో నిర్మాణాలు చేపట్టారు. ఈ పనులు పూర్తయితేనే ఎంపీడీవో కార్యాలయానికి సొంత భవనం అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంటుంది. నిధులు రాక.. ఆగిన పనులు జెడ్పీ భవన నిర్మాణాన్ని రూ.కోటి60లక్షల వ్యయంతో చేపట్టారు. పనులు పొందిన కాంట్రాక్టర్ పునాదుల వరకు నిర్మాణం చేశారు. చేసిన పనుల కోసం జనరల్ ఫండ్ నుంచి అధికారులు రూ.40లక్షలు చెల్లించారు. కాంట్రాక్టర్ పొందిన చెక్కులను బ్యాంకు ఖాతాలో జమచేసి నెలలు గడుస్తున్నా ఇంకా నిధులు విడుదల కాడంలేదు. దీంతో కాంట్రాక్టర్ పనులు నిలిపివేసినట్లు సమాచారం. పేరుకే ‘పెద్ద’పల్లి జిల్లా పరిషత్ ముందుకు సాగని నిర్మాణ పనులు -
మెరుగైన రవాణా సౌకర్యం
ఎలిగేడు: ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం క ల్పించేందుకు రహదారుల నిర్మాణం చేపట్టామని ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అన్నారు. రాములపల్లి(ర్యాకల్‌దేవుపల్లి)లోని నాగలింగేశ్వరాలయం నుంచి ముప్పిరితోట మీదుగా ధూళికట్ట వరకు రూ.12కోట్లతో చేపట్టన డబుల్‌రోడ్డు పనులను ఆదివారం ఆయన పరిశీలించారు. పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించి త్వరతగతిన పూర్తిచేయాలని ఆయన సూచించారు. ఈకార్యక్రమంలో నాయకులు కోట లాలయ్య, ముత్యం శంకరయ్య పాల్గొన్నారు. ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు -
పెట్రోల్ పోస్తుండగా ఢీకొట్టిన కారు
పెద్దపల్లిరూరల్/జూలపల్లి:పెద్దపల్లి నుంచి వెంకట్రావుపల్లికి వెళ్తుండగా.. మార్గమధ్యంలో బైక్‌లో పెట్రోల్ అయిపోవడమే ఉప సర్పంచ్ రవికి ప్రాణగండంగా మారింది. మరోబైక్‌పై సమీపంలోని బంక్ నుంచి బాటిల్లో తెచ్చిన పెట్రోల్‌ను పోస్తుండగా పెద్దపల్లి వైపు(ఎదురుగా) వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పెద్దపల్లి జిల్లాలోని జూలపల్లి మండలం వెంకట్రావుపల్లి ఉపసర్పంచ్ పర్లపల్లి రవి (48) అక్కడికక్కడే మరణించాడు. పెద్దపల్లి మండలం నిట్టూరు గ్రామశివారులో ఆదివారం రాత్రి జరిగిన ఈ ప్రమాదంలో మరోముగ్గురికి గాయాల య్యాయి. ప్రమాదం జరిగిందనే సమాచారం అందుకున్న పెద్దపల్లిరూరల్ ఎస్సై మధుకర్, జూలపల్లి ఎస్సై మల్లేశ్ వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు. ఉపసర్పంచ్ రవి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పెద్దపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రమాదంలో గాయపడ్డ వేల్పుల సందీప్, కటికరెడ్డి నర్సయ్య, దాడి రాజయ్యకు అవసరమైన వైద్యసేవలందించారు. పెద్దపల్లి రూరల్ ఎస్సై కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
భూ వివాదాలతో రావొద్దు..!
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: పెద్దపల్లి జిల్లా కలెక్టర్.. పోలీసు విభాగానికి మధ్య దూరం రోజురోజుకూ పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. భూ సమస్యలకు సంబంధించిన ఎలాంటి వివాదాలూ తమ వద్దకు తీసుకురావద్దని జిల్లాలోని అన్ని పోలీస్స్టేషన్ల ఎదుట పోలీసులు బోర్డులు ఏర్పాటు చేశారు. ఈ బోర్డులు గమనించకుండా వెళ్లిన వారికి ప్రజావాణి లేదా రెవెన్యూ విభాగానికి వెళ్లాలని పోలీసులు సూచిస్తున్నారు. దీంతో చేసేది లేక బాధితులు ప్రజావాణి బాట పడుతున్నారు. వాస్తవానికి కోర్టు పరిధిలో ఉన్న అంశాలు, ఆస్తి పంపకాలు, అద్దె గొడవలు, సివిల్ వివాదాల విషయాల్లో పోలీసులు కలగజేసుకోరు. కానీ.. ఈ వివాదాల నేపథ్యంలో ఏవైనా గొడవలు, కొట్లాటలు, ఇతర హింసాత్మక చర్యలు తలెత్తితే మాత్రం వారి జోక్యం అనివార్యం. ఇటీవల పెద్దపల్లి డీసీపీ కూడా ఎలాంటి భూవివాదాల్లోనూ పోలీసులు జోక్యం చేసుకోకూడదని ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే జిల్లాలోని ఠాణాల ఎదుట ఈ బోర్డులు వెలిశాయి. నాటి వివాదమే కారణమా..? ఇటీవల రెవెన్యూ, పోలీసు శాఖలతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆ సందర్భంగా పలువురు పోలీసులు దారి తప్పుతున్నారని, ఎవరు ఏమేం చేస్తున్నారో తనకు అంతా తెలుసని, ప్రతీ ఒక్క పోలీసు అధికారి అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ డిపార్ట్మెంట్ అధికారులకు హెచ్చరికలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కలెక్టర్ పోలీస్ శాఖకు నేరుగా హెచ్చరికలు జారీ చేయడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కలెక్టర్ హెచ్చరికలను డిపార్ట్మెంట్లోని కొందరు స్వాగతించగా.. మరికొందరు విభేదించారు. విశ్వసనీయ సమాచారం మేరకు మెజారిటీ పోలీసులు కలెక్టర్ తీరుపై అసంతప్తిగానే ఉన్నా.. బయటకు వెల్లడించడం లేదు. ఈ నేపథ్యంలోనే పోలీసు శాఖలో రెవెన్యూ విభాగానికి చెందిన భూ సమస్యల ఫిర్యాదులు తీసుకోకూడదంటూ పెద్దపల్లి డీసీపీ ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. నిబంధనల ప్రకారం నడుచుకుంటున్నామే తప్ప.. ఇటీవలి పరిణామాల నేపథ్యంలో బోర్డులు ఏర్పాటు చేయలేదని పోలీసులు అధికారులు స్పష్టంచేస్తున్నారు. పోలీసు శిక్షణకు పరస్పర దూరం రెవెన్యూ, పోలీసు విభాగాల మధ్య దూరం లేదని పైకి చెబుతున్నా.. వారి చర్యలు మాత్రం మరోలా కనిపిస్తున్నాయి. ఇటీవల జిల్లాలో పోలీసు ఉద్యోగార్థుల కోసం ప్రభుత్వ ఆధ్వర్యంలో శిక్షణ ప్రారంభించారు. గోదావరిఖనిలో జరిగిన కార్యక్రమానికి రెవెన్యూ అధికారులు కనిపించలేదు. అదే పెద్దపల్లిలో జరిగిన పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమానికి పోలీసు విభాగం నుంచి ఎవరూ పాల్గొనలేదు. ఈ రెండు కార్యక్రమాల్లో సంబంధిత విభాగాలు పాల్గొనలేకపోవడానికి కారణం సమాచార లోపమా..? లేక రెండు విభాగాల మధ్య పెరుగుతున్న దూరమా..? అనే విషయంపై ఎవరూ స్పష్టతఇవ్వడం లేదు. మొత్తానికి రెండు విభాగాల మధ్య రోజురోజుకూ దూరం పెరుగుతోందని జిల్లా వ్యాప్తంగా ప్రజల్లో మాత్రం చర్చ మొదలైంది. పోలీస్స్టేషన్ల ఎదుట బోర్డులు పెట్టిన జిల్లా పోలీస్ యంత్రాంగం అలాంటి సమస్యలుంటే రెవెన్యూ విభాగానికి వెళ్లాలని సలహా ఇటీవల కలెక్టర్ ‘క్లాస్’తోనే ఫ్లెక్సీలు వెలిశాయన్న చర్చ అలాంటిదేమీ లేదని కొట్టిపారేస్తున్న పోలీసులు పోలీసు అభ్యర్థుల శిక్షణ కార్యక్రమాల్లో పరస్పర దూరం -
● ఎల్‌నినో ప్రభావం ఎదుర్కొనేందుకు మంచిమార్గాలు ● రైతులకు అవగాహన కల్పిస్తున్న రామగిరి వ్యవసాయ శాస్త్రవ్తేతలు
రామగిరి: ఈసారి ఎల్‌నినో ప్రభావం ఉంది. వర్షాలు ఆలస్యంగా కురుస్తాయని, దీర్ఘకాలిక పొడి విరామం, అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. ఈక్రమంలో పత్తిలో తేమకొరత, పూతరాలడం, కాయలు ఊడిపోవడం, రసంపీల్చే పురుగుల ఉధృతి పెరగడం వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. శాసీ్త్రయ యాజమాన్య పద్ధతులు అనుసరిస్తే దిగుబడి నష్టాన్ని తగ్గించుకోవచ్చని రామగిరి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త కిరణ్ పిల్లి సూచిస్తున్నారు. ఆయన సూచనలు.. నీటిచుక్కను పొలంలోనే నిల్వ చేయండి ఎల్‌నినోను అధికగమించేందుకు నీటి సంరక్షణే ముఖ్యమైన వ్యవసాయ చర్య. వర్షం కురిశాక వరుసల మధ్య అంతర కృషి చేసి నేలపై మట్టిపొర(డస్ట్మల్చ్) ఏర్పడేలా చేయాలి. దీంతో నేలలో తేమ ఆ విరి కాదు. ఎక్కువకాలం నిల్వ ఉంటుంది. పొలం చుట్టూ బలమైన కట్టలు వేయడం, బోదెలు ఏర్పా టు చేయడం అవసరం. పంట అవశేషాలు, వరిగడ్డి లేదా సేంద్రియ మల్చింగ్ ఉపయోగిస్తే నేల ఉష్ణోగ్రత 2–4 డిగ్రీల సెల్సియస్ వరకు తగ్గి తేమఎక్కువకాలం నిల్వ ఉంటుంది. మొక్కల ఎదుగుదల మెరుగుపడుతుంది. నీటిఅవసరం తగ్గుతుంది. పొడివాతావరణంలో ఎక్కువ మోతాదులో యూరియా వేస్తే మొక్కలకు ఉపయోగం తక్కువగా ఉంటంది. ఎరువుల నష్టం అధికంగా ఉంటుంది. భూసారం పరీక్ష ఫలితాల ఆధారంగానే ఎరువులు వేయాలి. నత్రజనిని విడతల వారీగా వేయాలి. తేమ లేనిసమయంలో యూరియా వేయొద్దు. వర్షం కురిసిన తర్వాత లేదా రక్షణాత్మక నీటిపారుదల తర్వాతే నత్రజని వేయాలి. సింగిల్‌సూపర్ ఫాస్ఫేట్ వాడితే భాస్వరంతోపాటు గంధకం, కాల్షియం కూడా లభించి పంట ఎదుగుదల మెరుగుపడుతుంది. కంపోస్ట్, వర్మీకంపోస్ట్, పశువుల ఎరువు వంటి సేంద్రియ పదార్థాలు వినిగిస్తే నేలలో సేంద్రియ కార్బన్ పెరిగి నీటినిల్వ సామర్థ్యం మెరుగవుతుంది. ఎల్‌నినో పరిస్థితుల్లో అధిక ఉష్ణోగ్రతలు, తక్కువ గాలి, తేమతో తెల్లదోమ, నల్ల తమర పురుగు, పచ్చదోమ, ఎర్రసాలీడు వంటి పీల్చేపురుగుల ఉధృతి పెరిగే అవకాశం ఉంది. రైతులు వారానికి కనీసం రెండుసార్లు పొలాన్ని పరిశీలించాలి. ఎకరాకు 8–10 పసుపు జిగురు అట్టలు ఏర్పాటు చేయాలి. ఆర్థిక నష్టం స్థాయికి చేరిన తర్వాతే శాస్త్రవేత్తల సూచన మేరకు పురుగుమందు పిచికారీ చేయాలి. రసాయనాలను మారుస్తూ వాడితే నిరోధకత సమస్య తగ్గుతుంది. కలుపు మొక్కలు పత్తితోపాటు నేలలోని తేమ, పోషకాలను వినియోగిస్తాయి. విత్తిన 20–25 రోజుల్లోపు తొలి అంతరకృషి, 40–45 రోజుల్లోపు రెండోఅంతరకృషి పూర్తిచేయాలి.అధిక ఉష్ణోగ్రతలు, తేమకొరతతో పత్తిలో పూత, చిన్న కాయలు రాలిపోవడం సాధారణంగా కనిపిస్తుంది. ఈ పరిస్థితుల్లో అనవసరంగా అధిక నత్రజని వేయకుండా, తగిన తేమ లభించినప్పుడే వేయాలి. అవసరమైతే శాస్త్రవేత్తల సిఫార్సు మేరకే ఫోలియర్ పోషక ద్రావణాలు పిచికారీ చేయాలి. నీటి ఒత్తిడిని తగ్గించే చర్యలకు ప్రాధాన్యం ఇవ్వాలి. 10–15 రోజుల పాటు వర్షం కురవకుంటే.. అందుబాటులో ఉన్ననీటితో రక్షణాత్మక నీటిపారుదల ఇవ్వాలి. బిందు సేద్యం ద్వారా 30–40 శాతం వరకు నీటిని ఆదా చేయవచ్చు. ఒకేసారి ఎక్కువ నీరు ఇవ్వకుండా అవసరానికి అనుగుణంగానే అందించాలి. -
ఒడిసి పడితేనే జల‘సిరి’
పెద్దపల్లి/రామగిరి: జిల్లాలో ఎల్‌నినో ప్రభావం తీవ్రంగా ఉంది. వానదేవుడు ముఖం చాటేయడంతో భూగర్భ జలాలు వేగంగా అడుగంటుతున్నా యి. ముంచుకొన్న నీటికొరతను అధిగమించేందు కు, నీటి అవసరాలు తీర్చేందుకు ప్రభుత్వం నీటి సంరక్షణపై ప్రత్యేక దృష్టి సారించింది. ప్రతీవర్షపునీటి బొట్టును ఒడిసిపడితే నీటిభద్రత సాధ్యమనే భావనతో జలసిరి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ప్రధానంగా గ్రామాల్లో జలసంరక్షణను అత్యంత ప్రాధాన్యాంశంగా చేపట్టేందుకు కార్యాచరణ సి ద్ధం చేస్తోంది. ఇందుకోసం ఇంటికో ఇంకుడుగుంత, పొలానికో పంటకుంట ఊరుకో ఊటకుంట నినాదంతో ముందుకు సాగుతోంది. వీబీజీ రామ్‌జీ ఉపాధిహామీ ద్వారా ప్రజలను ఇందులో భాగస్వామం చేసేలా ఆదేశాలు జారీచేసింది. ఇంటికో గుంత.. పొలానికో కుంట జిల్లాలో సంప్రదాయ పంటలకు బదులు తక్కువ నీటివినియోగం కలిగే ప్రత్యామ్నాయ పంటలపై జిల్లా వ్యవసాయ శాఖ ఇప్పటికే రైతులకు అవ గాహన కల్పిస్తోంది. విపత్కర పరిస్థితుల్లో కురిసే ప్రతీవర్షపు బొట్టును వృథాగా పోనివ్వకుండా నే లలో నిల్వ చేయడం ద్వారా భూగర్భజలాలను వృద్ధి చేయొచ్చని, సాగునీటి వనరులను బలోపేతం చేయొచ్చని భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఇంటికో ఇంకుడుగుంత నిర్మాణానికి రూ.6 వేల చొప్పున వెచ్చించనుంది. రైతు భూకమతంలో పంటకుంట పరిమాణం ప్రకారం రూ.2.50 లక్షల నుంచి రూ.4లక్షల వరకు సాయం అందించాలని అంచనా వేసింది. ఆవాస ప్రాంతాల్లో సామూహిక నీటి అవసరాలు తీర్చేందుకు ఊరకుంటల నిర్మాణానికి సైతం ప్రతిపాదిస్తోంది. ఊరకుంట నిర్మాణానికి రూ.10 లక్షలు వెచ్చించాలని నిర్ణయించింది. కూలీల వేతనాలతోపాటు మెటీరియల్ కాంపోనెంట్‌ను ప్రభుత్వం అందించనుంది. కూలీలకు ఉపాధి.. భూగర్భ జలాల పెంపు జలసిరి ద్వారా కూలీలకు ఉపాధి కల్పించడంతోపాటు భూగర్భజలాల వృద్ధి సాధ్యమని ప్రభుత్వం చెబుతోంది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం, కరువు ప్రభావం తగ్గించడానికి ఈప్రక్రియ కీలకమని గ్రామీణాభివృద్ధి అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. జలసంరక్షణ క్షేత్రస్థాయిలో విజయవంతం కావడానికి ప్రభుత్వంతోపాటు ప్రజల భాగస్వామ్యం కూడా ముఖ్యమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పనులకు ప్రాధాన్యం వర్షపు నీటిని సంరక్షించి, భూగర్భ జలాల పెంపు కోసం ప్రభుత్వం ‘తెలంగాణ జలసిరి’ రూపొందించింది. ఇంటికో ఇంకుడుగుంత, పొలానికో పంటకుంట, ఊరుకో ఊరకుంట నిర్మించడం దీని ఉద్దేశం. ప్రతీ వర్షపు నీటిచుక్కను ఒడిసి పట్టి నేలలో ఇంకించడం ద్వారా బోరుబావుల నీటిమట్టం పెరుగుతుంది. సాగునీటి సమస్య తీర్చడంతోపాటు మొక్కలు చెట్లుగా ఎదిగి పచ్చదనం పెరుగుతుంది. పర్యావరణం మెరుగుపడుతుంది. – కాళిందిని, డీఆర్డీవో వీబీజీ రామ్‌జీ ఉపాధిహామీలో ‘జలసిరి’ ఇంటికో ఇంకుడుగుంత తప్పనిసరి పొలానికో పంటకుంట.. ఊరికో ఊటకుంట -
ముగిసిన సీబీఎస్ఈ ఖోఖో పోటీలు
కరీంనగర్‌స్పోర్ట్స్: కరీంనగర్ వేదికగా మూడు రోజులు జరిగిన సీబీఎస్ఈ క్లస్టర్–7 ఖోఖో బాలికల టోర్నీ ఆదివారం ఘనంగా ముగిసింది. కరీంనగర్ కొత్తపల్లిలోని అల్పోర్స్ ఈ–టెక్నో స్కూల్ ఆతిథ్యంలో జరిగిన ఈ క్రీడా సమరంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి అండర్ 14,,17,19 విభాగంలో 104 జట్లు పోటీపడ్డాయి. హోరాహోరీగా సాగిన ఫైనల్లో అండర్–19 విభాగంలో శ్రీ ప్రకాశ్ విద్యానికేతన్, అండర్–17లో మాంటిస్సోరి ఎలైట్ స్కూల్, అండర్–14లో ఏకశిల హైస్కూల్ జట్లు విజేతలుగా నిలిచాయి. విజేత జట్లకు అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత వి.నరేందర్‌రెడ్డి ట్రోపీలు, మెడల్స్ ప్రదానం చేశారు. సీబీఎస్ఈ పరిశీలకుడు ఎం.భరత్ కుమార్, తెలంగాణ ఖోఖో సంఘం రెఫరీ బోర్డు కన్వీనర్ వంగపల్లి సూర్య ప్రకాశ్, భారత మహిళా ఖోఖో జట్టు కోచ్ కె.నరేశ్, అంతర్జాతీయ రెఫరీ ఎ.రవీందర్, షఫీ, ఎస్కె.మొయినోద్దీన్, వేల్పుల సురేందర్ పాల్గొన్నారు. విజేతలు వీరే అండర్–14లో ప్రథమ స్థానంలో ఏకశిల హైస్కూల్, వర్ధన్నపేట, ద్వితీయ స్థానంలో ఢిల్లీ పబ్లిక్ స్కూల్, నాచారం, మల్కాజ్గిరి,, తృతీయ స్థానంలో ఎస్ఆర్ విద్యానికేతన్, గద్వాల్, నాలుగో స్థానంలో అక్షర వాగ్దేవి స్కూల్, సికింద్రాబాద్ నిలిచాయి. అండర్–17లో ప్రథమ స్థానంలో మాంటిస్సోరి ఎలైట్ స్కూల్, రాఫాడు, అనంతపూర్, ద్వితీయస్థానంలో సూర్య అకాడమీ, బాచుపల్లి, తృతీయస్థానంలో బీవీ భువన్ రెసిడెన్సీ, తాడేపల్లిగూడెం, నాలుగోస్థానంలో పల్లవి స్కూల్, బండ్లగూడ నిలిచాయి. అండర్–19 ప్రథమ స్థానంలో శ్రీ ప్రకాశ్ విద్యానికేతన్, పాయాకరావ్పేట, అనకాపల్లి, ద్వితీయస్థానంలో పల్లవి స్కూల్ అల్వాల్, హైదరాబాద్, తృతీయస్థానంలో అక్షర విద్యాలయ, నెల్లూరు, నాలుగోస్థానంలో ది హైదరాబాద్ పబ్లిక్ స్కూల్, హన్మకొండ నిలిచాయి. చాంపియన్లుగా ఏకశిల, మాంటిస్సోరి, శ్రీ ప్రకాశ్ స్కూళ్లు ట్రోఫీలు ప్రదానం చేసిన అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత నరేందర్ రెడ్డి -
రైల్వేస్టేషన్లలో మద్యపానం నిషేధం
పెద్దపల్లిరూరల్: రైలు ప్రయాణం సురక్షితంగా సాగేలా ఆ శాఖ నిబంధనలను కఠినతరం చేసింది. రైల్వేస్టేషన్ ఆవరణతోపాటు బోగీల్లో ప్రయాణిస్తూ సిగరెట్ కాల్చడం, మద్యం తాగడాన్ని నిషేధించింది. ఈ మేరకు పెద్దపల్లి రైల్వేస్టేషన్లో ప్రయాణికులను అప్రమత్తం చేసేలా పెద్దఅక్షరాలతో కూడిన సైన్బోర్డులను ఏర్పాటు చేశారు. రైల్వే యాక్టు సెక్షన్ 167 ప్రకారం.. నిబంధనలను ఉల్లంఘిస్తే జరిమానాతోపాటు జైలు శిక్ష విధించేలా రైల్వేరక్షణదళం (ఆర్పీఎఫ్), ప్రభుత్వ రైల్వే పోలీసు (జీఆర్పీ)లు ప్రత్యేకంగా తనిఖీలు చేస్తున్నాయి. మద్యం మత్తులో ప్రయాణికులను ఇబ్బందులకు గురిచేసినా, సిగరెట్ కాల్చినా చర్యలు తప్పవని పేర్కొన్నారు. సీసీ కెమెరాల ద్వారా నిఘా పెంచామన్నారు. ఇలాంటి చర్యల గురించి తెలిస్తే రైల్వే హెల్ప్‌లైన్ 139నంబరుకు సమాచారం అందించాలని అందులో పొందుపర్చారు. ఉరిపోసుకుని ఆత్మహత్య పెద్దపల్లిరూరల్: పెద్దపల్లి పట్టణంలోని తిలక్‌నగర్‌కు చెందిన వినయ్‌సింగ్ (32) ఆదివారం ఉరిపోసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంట్లో భార్యాపిల్లలు, తల్లి ఉండగాపై అంతస్తుకు వెళ్లి ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడని ఎస్సై నరేశ్ తెలిపారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. ఇద్దరు యువకులపై బీరు సీసాతో దాడిరాయికల్: మద్యం మత్తులో ఇద్దరు యువకులపై.. ఓ యువకుడు బీరు సీసాతో దాడికి పాల్పడిన ఘటన పట్టణంలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. పట్టణంలోని ఓ బార్లో ముగ్గురు యువకులు మద్యం తాగేందుకు వచ్చారు. మాటల మధ్య గొడవ జరగడంతో హరీశ్ అనే యువకుడు బీరు సీసాతో రాజశేఖర్, సామ్రాట్ అనే యువకులపై దాడి చేయడంతో ఇద్దరికీ గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. బంగారు గొలుసు అప్పగింతకరీంనగర్క్రైం: ఓ మహిళ పోగొట్టుకున్న 2.5 తులాల బంగారు మంగళసూత్రాన్ని టూటౌన్ పోలీసులు 48 గంటల్లో గుర్తించి బాధితురాలికి అప్పగించారు. కరీంనగర్లో సీడీపీవోగా విధులు నిర్వహిస్తున్న సిగిరి శ్రీలత ఇటీవల షాపింగ్‌కు వెళ్లి 2.5 తులాల బంగారు మంగళసూత్రాన్ని రోడ్డుపై పోగొట్టుకుంది. బాధితురాలి ఫిర్యాదుతో టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సీసీటీవీ కెమెరాల ఫుటేజీలను నిశితంగా పరిశీలించారు. మంగళసూత్రాన్ని గుర్తించి బాధితురాలికి అప్పగించారు. -
● హెల్మెట్, సీట్‌బెల్ట్ ధరించడం వాహనదారులకు తప్పనిసరి ● హెచ్చరిస్తున్న పోలీసులు
గోదావరిఖని: ప్రమాదం జరిగాక బాధపడేకన్నా ముందుజాగ్రత్తలు పాటిస్తే సురక్షితంగా గమ్యస్థా నం చేరుకోవచ్చు. బయటకు వెళ్లేముందు వాహనం తాళంచెవి తీసుకున్నట్లే, హెల్మెట్, కారులో కూర్చున్నాక సీట్‌బెల్ట్ ధరించడం తప్పనిసరి. పోలీసుల సీరియర్ రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నాయి. హెల్మెట్‌లేక ద్విచక్రవాహనదారులు, సీట్‌బెల్ట్ ధరించక కార్లు, ఇతర భారీవాహనదారులు మృతి చెందుతున్నారు. ఇలాంటి ప్రమాదాల నియంత్రణపై పోలీసుశాఖ ప్రత్యేక దృష్టి సారించింది. నిబంధనలు అతిక్రమిస్తున్న వారికి పెద్దమొత్తంలో జరిమానా విధిస్తోంది. ఒక్క క్షణం నిర్లక్ష్యం.. జీవితాంతం విషాదం ఒక ప్రమాదంలో ఒకరేకాదు.. ఒకకుటుంబం మొత్తం నష్టపోతుంది. పిల్లలు తండ్రిని కోల్పోవచ్చు, తల్లిదండ్రులు బిడ్డను కోల్పోవచ్చు, భార్య జీవిత భాగస్వామిని కోల్పోవచ్చు. హెల్మెట్, సీట్‌బెల్ట్ ధరిస్తే ప్రాణాపాయం నుంచి తప్పించుకోవచ్చు. ఇవి పాటించండి -
అస్తవ్యస్తంగా సర్కార్ ఆస్పత్రి
ప్రమాదకరంగా గుంత నిలిచిపోయిన మురుగు కోల్‌సిటీ: ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాల్సిన గోదావరిఖని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి(జీజీహెచ్) ఆవరణ అస్తవ్యస్తంగా మారింది. అధికారుల నిర్లక్ష్యంతో పేషెంట్ల ఆరోగ్యానికి ముప్పు ఏర్పడుతోందని బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 85 పడకల కొత్త బ్లాక్ సమీపంలోని ప్రధాన ద్వారం పక్కన మూడేళ్ల క్రితం ఎస్టీపీ నిర్మాణం కోసం తవ్విన భారీగుంతను ఇప్పటికీ పూడ్చకలేదు. పనులు అర్ధంతరంగా నిలిచిపోవడంతో గుంతలో వర్షపు నీరు, మురుగునీరు చేరిదోమల ఉత్పత్తి కేంద్రంగా మారింది. ప్రమాదకరమైన గుంతను అధికారులు నిర్లక్ష్యంగా వదిలేయడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాత భవనం వెనకాల తొలగించిన పరుపులు, వ్యర్థాలు కుప్పలుగా పోసి వదిలేయడంతో పరిసరాల్లో పారిశుధ్యం లోపిస్తోంది. వార్డుల మధ్య వర్షపునీరు, మురుగు నిలిచి దుర్వాసన వెదజల్లుతోంది. మురుగునీరు భవనాల గోడల్లోకి చేరి దెబ్బతింటున్నాయనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఆస్పత్రి భవనాల గోడలపై రావి మొక్కలు పెరిగినా తొలగించే చర్యలు లేకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని అంటున్నారు. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాల్సిన ప్రభుత్వ ఆస్పత్రిని సమస్యలకు నిలయంగా మార్చడం తగదని, వెంటనే ఎస్టీపీ గుంతను పూడ్చి, మురుగునీటి లీకేజీలను అరికట్టి, చెత్తను తొలగించి, దోమల నివారణ చర్యలు చేపట్టాలని స్థానికులు, పేషెంట్లు కోరుతున్నారు. పారిశుధ్య లోపం.. చుట్టూ నీటిగుంతలు -
అద్దెకు షాపింగ్ గదులు
పెద్దపల్లిరూరల్: స్థానిక వ్యవసాయ మార్కెట్లోని షాపింగ్ కాంప్లెక్స్(రాజీవ్ రోడ్డును ఆనుకుని ఉన్న) గదులను ఓపెన్ టెండర్ పద్ధతిన అద్దెకు ఇవ్వనున్నట్టు మార్కెట్ కమిటీ చైర్మన్ కూర మల్లారెడ్డి, ఉన్నతశ్రేణి కార్యదర్శి ప్రవీణ్‌రెడ్డి తెలిపారు. ఆసక్తి గలవారు ఈనెల 31లోగా రూ.3వేలు చెల్లించి టెండర్ ఫారం పొంది రూ.50వేల ధరావత్తు చెల్లించాలని కోరారు. ఒక్కో గదికి అద్దెను ప్రభుత్వం రూ.15,472గా నిర్ణయించిందని పేర్కొన్నారు. టెండర్‌దారులతో ఆగస్టు 3న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు వేలం పాట నిర్వహించనున్నట్లు వివరించారు. బీజేపీ నేతలే కీలకం పెద్దపల్లి: ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో బీజేపీకి చెందిన బీఎల్నేలు కీలక బాధ్యతలు నిర్వహించాలని ఆ పార్టీ లీగల్ సెల్ రాష్ట్ర కన్వీనర్, సర్ కన్వీనర్ ఆంటోనిరెడ్డి కోరారు. సుల్తానాబాద్ ఎస్ఆర్ గార్డెన్స్‌లో ఆ పార్టీ మండల అధ్యక్షుడు కందుల శ్రీనివాస్ అధ్యక్షతన ఆదివారం నిర్వహించిన బీఎల్ఏల సమావేశంలో మాట్లాడారు. ఓటరు జాబితాను క్షుణ్ణంగా పరిశీలించి అర్హులైనవారి పేర్లు నమోదు చేయించడం, తప్పులను సరిచేయించడం, ప్రజలకు ఎన్నికల ప్రక్రియపై అవగాహన కల్పించడం వంటి బాధ్యతలను సమర్థంగా నిర్వహించాలన్నారు. సర్ అసెంబ్లీ కో ఆర్డినేటర్ గొట్టిముక్కుల సురేశ్‌రెడ్డి, నాయకులు బెజ్జంకి దిలీప్‌కుమార్, సౌదరి మహేందర్ యాదవ్, కాసాగోని నిర్మలగౌడ్, కామని రాజేంద్రప్రసాద్ పాల్గొన్నారు. నివేదిక తెప్పించాలి పెద్దపల్లి: పీఆర్సీ–2023 కమిటీ నివేదికను తెప్పించి అమలు చేయాలని డెమొక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్(డీటీఎఫ్) రాష్ట్ర ఉపాధ్యక్షుడు వైద్యుల రాజిరెడ్డి డిమాండ్ చేశారు. డీటీఎఫ్ జిల్లా శాఖ ఐదో వార్షిక కౌన్సిల్ సమావేశం ఆదివారం జిల్లా కేంద్రంలో జిల్లా అధ్యక్షుడు మల్కా రామకృష్ణారావు అధ్యక్షతన జరిగింది. డీటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి అప్పిడి సంతోష్‌రెడ్డి.. ఏడాదిలో చేపట్టిన కార్యక్రమాలు, సాధించిన విజయాలు, విద్యారంగ సమస్యలపై నివేదికను కౌన్సిల్ ముందుంచారు. రాజిరెడ్డి మాట్లాడుతూ, రెండో పీఆర్సీ అమలుకు కమిటీ ఏర్పాటు చేసి మూడేళ్లు గడుస్తున్నా ఇంకా తెప్పించలేదన్నారు. ప్రతినిధులు తిరుపతి, శంషోద్దీన్, ప్రసుమతి, కిరణ్‌కుమార్, రాజు, మల్లేశ్వర్రావు, రాజయ్య పాల్గొన్నారు. -
అశ్రునయనాల మధ్య అఖిల్‌రెడ్డి అంత్యక్రియలు
కాల్వశ్రీరాంపూర్: ఉన్నత వి ద్యాభ్యాసానికి స్పెయిన్ దేశం వెళ్లిన పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలం కూనారం గ్రామానికి చెందిన గీట్ల అఖిల్ రెడ్డి(30) అంత్యక్రియలు హైద రాబాద్‌లో ఆదివారం అశ్రునయనాల మధ్య నిర్వహించారు. ఆదేశంలోని తాను నివాసం ఉంటున్న భవనం పైనుంచిపడి గతనెల 27న అఖిల్‌రెడ్డి మృతి చెందిన విషయం తెలిసిందే. ఆయన తల్లిదండ్రులు గీట్ల సుభాషిణిరెడ్డి – గుణాకర్‌రెడ్డి హైదరాబాద్ బొల్లారంలో నివాసం ఉంటున్నారు. సుగుణాకర్‌రెడ్డి స్వగ్రామంలో వ్యవసాయ పనులు చూస్తూ హైదరాబాద్ వెళ్లి వస్తుండేవారు. కుమారుడి ఉన్నత చదువుల కోసం స్టడీలోన్ తీసు కుని హోటల్ మేనేజ్మెంట్ కోర్సు కోసం ఈ ఏడా ది జనవరి 24న స్పెయిన్ పంపించారు. ఆర్నెళ్లలో నే ఘటన చోటుచేసుకోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. కాల్వశ్రీరాంపూర్ మాజీ ఎంపీ పీ సారయ్యగౌడ్, మాజీ ఎమ్మెల్యే తనయుడు గీట్ల రాజేందర్‌రెడ్డి, మాజీ సర్పంచ్ డొంకెన మొగిలి, మాజీ ఎంపీటీసీ సాధనవేన కొమురయ్య, తదితరులు అంత్యక్రియలకు హాజరయ్యారు. -
పథకాలు దేశంలోనే నంబర్‌వన్
ఓదెల: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సర్కార్ ప్రవేశపెట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు దేశంలోనే నంబర్ వన్‌గా నిలిచాయని ప్రభుత్వ విప్, పెద్దపల్లి శాసనసభ్యుడు చింతకుంట విజయరమణారావు అన్నారు. ఓదెల మండల కేంరశ్రీదంలో రూ.70 లక్షల వ్యయంతో నిర్మించిన తహసీల్దార్ కొత్త భవనాన్ని కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలిసి శనివారం విప్ విజయరమణారావు ప్రారంభించారు. అనతరం విప్ మాట్లాడుతూ, ఓదెలలోని కోర్టుకు త్వరలోనే పక్కాభవనం నిర్మిస్తామన్నారు. ఎల్‌నినో ప్రభావం దృష్ట్యా రైతులు ఆరుతడి పంటలు సాగు చేయాలని సూచించారు. వర్షాభావం అధిగమించేందుకు ఇదే సరైన ప్రత్యామ్నాయమని ఆయన అన్నారు. ఈసందర్భంగా లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. సర్పంచ్ కనికిరెడ్డి సతీశ్, తహసీల్దార్ వనజ నాయక్, అడిషనల్ కలెక్టర్ శ్రీరాములు, ఎంపీడీవో అనిల్‌రెడ్డి పాల్గొన్నారు. అనంతరం ఓదెల మల్లికార్జునస్వామి ఆలయంలో చేపట్టిన అభివృద్ధి పనులను విప్ విజయరమణారావు పరిశీలించారు. -
గురుకులంలో ఏం జరుగుతోంది?
మంథని: పెద్దపల్లి జిల్లా మంథని సాంఘిక సంక్షేమ బాలుర పాఠశాల/కళాశాలలో ఏం జరుగుతోందనే ఆందోళన తల్లిదండ్రుల్లో వ్యక్తమవుతోంది. వరుసగా రెండు రోజుల వ్యవధిలో నలుగురు విద్యార్థులు డెటాల్ తాగి అస్వస్థతకు గురికావడం తీవ్ర ఆందోళనకు దారితీసింది. విద్యార్థుల భద్రత, హాస్టల్ నిర్వహణ, సౌకర్యాలపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రెండు రోజుల్లో నలుగురు.. గురుకులంలో ఐదు నుంచి ఇంటర్మీడియట్ వరకు సుమారు 540 మంది చదువుతున్నారు. ఇంతపెద్ద సంఖ్యలో విద్యార్థులుండే హాస్టల్లో రెండురోజులుగా విడతల వారీగా ఆరోతరగతిలోని నలుగురు విద్యార్థులు డెటాల్ తాగి అస్వస్థతకు గురవడం గ మనార్హం. గురువారం డెటాల్ తగిన ఇద్దరికి స్థానిక ఆస్పత్రిలో చికిత్స అందించగా.. క్షేమంగా ఉన్నారు. శనివారం సైతం మరోఇద్దరు డెటాల్ తాగడంతో వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వారిఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉన్నా.. ఈఘటన వెనుక ఉన్న అసలు కారణాలు తెలియరాలేదు. ఎందుకు డెటాల్ తాగారు? చదువుపై ఒత్తిడి కారణమా?హాస్టల్ పరిస్థితులు స రిగా లేకనా? ఉపాధ్యాయుల ప్రవర్తనతో ఒత్తిడి పె రిగి విద్యార్థులు డెటాల్ తాగారా? అనే ప్రశ్నలకు స్పష్టమైన సమాధానాలు బయటకు రాకపోవడం ఆందోళన కలిగిస్తోంది. హాస్టల్ పరిస్థితులపై అనుమానాలు ఉన్నాంటున్నారు. పర్యవేక్షణ లోపమా? ఆరోగ్య, భద్రతాత ప్రమాణాలు పాటిస్తున్నారా? విద్యార్థుల మానసిక ఆరోగ్యంపై శ్రద్ధ ఉందా?అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. హాస్టల్లోకి డెటాల్‌కు అనుమతి లేదు. విద్యార్థులకు అలర్జీ సమస్య తలెత్తడంతో చేతులకు రాసుకునేందుకు ఇంటి నుంచి తీ సుకొచ్చి ఉంటారని, లేదా తల్లిదండ్రులు విజిట్‌కు వచ్చినప్పుడు తెచ్చిన బాటిల్‌ను రహశస్యంగా దాచుకుంటున్నారని సమాచారం. మొదటి రోజు ఘటన జరిగిన తర్వాత విద్యార్థుల నుంచి డెటాల్, షాంపూ, ఇతరత్రా వస్తువులు స్వాధీనం చేసుకున్నా.. శనివారం మరోఇద్దరు తాగడం అనుమానాలకు తావిస్తోంది. హాస్టల్ నుంచి వెల్లిపోయేందుకు విద్యార్థులు ముందుగానే ప్రణాళిక సిద్ధం చేసుకొని డెటాల్ తాగడం లేదా చెవిలో యాసిడ్ పోసుకుకోవాలని అనుకున్నట్లు తెలుస్తోంది. ఇలా చేస్తే హాస్టల్ఉక సెలవులు వస్తాయని అనుకున్నట్లు సమాచారం. విద్యార్థులు ఇంత అసౌకర్యానికి ఎందుకు లోనవుతున్నారనేది తెలియాల్సి ఉంది. తల్లిదండ్రులు, ప్రజల ఆందోళన హాస్టల్లో జరిగిన ఈ ఘటనతో తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. తమ పిల్లలు సురక్షితంగా ఉన్నారా? అనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. స్థానికులు కూడా హాస్టల్ నిర్వహణపై విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నారు. పండుగకు ఇంటికి వెళ్లేందుకు డెటాల్ సిప్ చేశారని, విద్యార్థులకు వైద్యం అందించామని, ఎలాంటి ఇబ్బంది లేదని ప్రిన్సిపాల్, జిల్లా సాంఘిక సంక్షేమ గురుకులాల విద్యాలయాల సంస్థ సమన్వయ అధికారి ఉటూరి శ్రీనాథ్ తెలిపారు. -
సూపరింటెండెంట్ హైదరాబాద్‌లోనా?
కోల్‌సిటీ: గోదావరిఖని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి(జీజీహెచ్) సూపరింటెండెంట్ హైదరాబాద్‌లో ఉంటే.. ఇక్కడి సమస్యలు ఎలా పరిష్కారమవుతాయ ని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు ఎస్.వీరయ్య ప్ర శ్నించారు. శనివారం ఆయన జీజీహెచ్‌ను సందర్శించారు. ఆర్ఎంవో కృపాబాయితో సమావేశమయ్యారు. సదుపాయాలు, శానిటేషన్, భద్రత, పే షెంట్ల సంరక్షణ తదితర అంశాలపై చర్చించారు. వీ రయ్య మాట్లాడుతూ, మూడు జిల్లాల నుంచిరోజూ సుమారు 1,500 మంది పేషెంట్లు ఆస్పత్రికి వస్తు న్నా వసతులు లేవన్నారు. ఈ ప్రాంతంలో దుమ్ము, కాలుష్యంతో మూత్రపిండాల సమస్యలు అధికంగా ఉన్నా, నెఫ్రాలజిస్టు లేకపోవడం బాధాకరమన్నా రు. 250 మంది వైద్యులు అవసరమైన ఆస్పత్రిలో వైద్యుల కొరత వేధిస్తోందని, ఉన్నతాధికారుల పో స్టులు కూడా ఖాళీగా ఉండడంతో సేవలు అందడం లేదని తెలిపారు. పేషెంట్ కేర్, శానిటేషన్, సెక్యూరిటీ సిబ్బందికి తరచూ విధులు మార్చడం, రెండు, మూడు నెలలకోసారి కాకుండా ప్రతీనెల వేతనాలు చెల్లించడంతోపాటు సిబ్బంది సంఖ్య పెంచాలని డిమాండ్ చేశారు. సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ స భ్యులు ఎ.ముత్యంరావు, వేల్పుల కుమారస్వామి, ఎం.రామాచారి, సీనియర్ నాయకుడు టి.రాజారె డ్డి, జిల్లా కమిటీ సభ్యులు ఎన్.భిక్షపతి, మెండ శ్రీనివాస్, జి.జ్యోతి, శైలజ, శివరాంరెడ్డి పాల్గొన్నారు. ఆస్పత్రి సమస్యలు ఎవరు పరిష్కరించాలి? సీపీఎం కేంద్ర నేత ఎస్.వీరయ్య -
సేవలు వినియోగించుకోండి
పెద్దపల్లిరూరల్: ఉచిత న్యాయసేవలను ది వ్యాంగులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల సూచించారు. జిల్లా కోర్టులో న్యాయ సేవాధికార సంస్థ జిల్లా ప్రధాన కార్యదర్శి వంగర భవాని, సీనియర్ కన్సల్టెంట్ దేవకుమార్‌తో కలిసి శనివారం జడ్జి పోస్టర్ ఆవిష్కరించి మా ట్లాడారు. పబ్లిక్ రిడ్రెస్సల్ అసియేటెడ్ నెట్వర్క్స్, న్యాయ సేవాధికార సంస్థ సంయుక్తంగా ఈ ప్రాజెక్టు చేపట్టాయన్నారు. దివ్యాంగులు, మహిళలు, చిన్నారుల హక్కులను కాపాడడం, సంక్షేమం కోసమే పనిచేస్తున్నట్లు తెలిపారు. న్యాయ సాయం కోసం టోల్‌ఫ్రీ నంబరు 15100 లేదా 95550 627483 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. భూగర్భ జలాల వృద్ధి లక్ష్యం పెద్దపల్లిరూరల్: వర్షపునీటిని వృథా చేయకుండా ఇంకుడుగుంతల ద్వారా ఒడిసి పట్టుకుని భూగర్భజలాలను వృద్ధి చేసుకుందామని డీఆర్డీవో కాళిందిని అన్నారు. రాఘవాపూర్‌లో శనివారం సర్పంచ్ తాడిచెట్టి చామంతితో కలిసి ఇంకుడుగుంతలు, పల్లెప్రకృతివనంలో నర్సరీ, పాంపాండ్ పరిశీలించి సూచనలిచ్చారు. మొ క్కలను కాపాడి రోడ్ల వెంట, ఖాళీ స్థలాల్లో నాటించాలని తెలిపారు. ఏపీవో రమేశ్‌బాబు, టీఏ వెంకటేశ్, పంచాయతీ కార్యదర్శి భానుప్రసాద్, ఫీల్డ్ అసిస్టెంట్ సంపత్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం సబ్బితంలోని ఫారెస్ట్ నర్సరీని సర్పంచ్ సరోజన, కార్యదర్శి అఫ్జల్‌పాషా, ఎఫ్ఏ రమేశ్‌తో కలిసి పరిశీలించారు. సీపీఎస్ విధానం వద్దు పెద్దపల్లి: సీపీఎస్ విధానం రద్దు చేసి పాత పింఛన్ విధానం పునరుద్ధరించాలని, ఉద్యోగుల పెండింగ్ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ అ సోసియేషన్ జిల్లా శాఖ కోరింది. జిల్లా తొలి కా ర్యవర్గ సమావేశం స్థానిక ఐఎంఏ హాల్లో జి ల్లా అధ్యక్షుడు బొంకూరి శంకర్ అధ్యక్షతన శనివారం నిర్వహించారు. శంకర్ మాట్లాడుతూ, ప్రభుత్వ ఉద్యోగులకు ప్రమాద బీమా, ఈహెచ్ఎస్ వంటి సంక్షేమ చర్యలు అమలు చేయడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. ప్రతినిధులు అయిరెడ్డి సందీప్‌రెడ్డి, అనితరెడ్డి, కొమురయ్య తదితరులు పాల్గొన్నారు. అధికారికంగా ఏకలవ్య జయంతి పెద్దపల్లి: ఏకలవ్య జయంతిని అధికారికంగా నిర్వహించలని తెలంగాణ ఎరుకల ప్రజాసమితి నేతలు డిమాండ్ చేశారు. ఏకలవ్యుని జయంతిని జిల్లా కేంద్రంలో శనివారం ఘనంగా నిర్వహించారు. తమ సామాజికవర్గం అభివృద్ధి, సంక్షేమం కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కోరారు. తెలంగాణ ఎరుకల ప్రజా సమితి జిల్లా అధ్యక్షుడు మానుపాటి రవి, రాష్ట్ర ఉపాధ్యక్షులు మానుపాటి శ్రీను, రెవెల్లి తిరుపతి, జిల్లా ఉపాధ్యక్షులు అల్లెపు సదాశివ, రెవెల్లి శీనయ్య, లోకిని సమ్మయ్య, కార్యకర్తలు సంపత్, శ్రీకాంత్, కల్యాణ్, ప్రభాకర్, శివాజీ, శ్రీనాథ్, అంజి, సాయివర్ధన్ కుమార్ తదిరతులు పాల్గొన్నారు. రేపు రక్షణ వార్షికోత్సవాలు గోదావరిఖని: సింగరేణి సంస్థ 56వ రక్షణ వార్షికోత్సవాలను ఈనెల 27న ఎన్టీపీసీలోని శ్రీమ యి ఫంక్షన్హాల్లో నిర్వహించనుంది. డీజీఎంఎస్ ఉజ్వల్తాహ్, సింగరేణి సీఎండీ బుద్ధ ప్రకాశ్ జ్యోతి ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. సింగరేణి డైరెక్టర్లు ఎల్వీ సూర్యనారాయణ, కె.వెంకటేశ్వర్లు, గౌతం పొట్రూ, తిరుమల్‌రావు, ఏఐటీయూసీ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య, ఐఎన్టీయూసీ సెక్రటరీ జనరల్ జనక్‌ప్రసాద్, సింగరేణి అధికారుల సంఘం అధ్యక్షుడు లక్ష్మీపతిగౌడ్ హాజరుకానున్నారు. సింగరేణివ్యాప్తంగా ఇటీవల నిర్వహించిన రక్షణ వార్షికోత్సవాల్లో ప్రతిభ కనబర్చిన గనులు, ఓసీపీలు, డిపార్ట్మెంట్లకు ఈ సందర్భంగా సీఎండీ బహుమతులు అందజేయనున్నారు. -
ప్రజలు భాగస్వాములు కావాలి
కోల్‌సిటీ: నగరంలో చేపట్టే పరిశుభ్రత పనుల్లో ప్ర తీపౌరుడు భాగస్వామి కావాలని మేయర్ మహంకాళి స్వామి కోరారు. 10వ డివిజన్ రాంనగర్లో శనివారం మేయర్ వార్డుబాట చేపట్టారు. 2ఏ ఇంక్లయిన్ మోరీ వద్ద కాలువ పూడిక తొలగింపు, ఖాళీ స్థలాల్లో పిచ్చిమొక్కల తొలగింపు పనులు పరిశీలించారు. కమిషనర్ అరుణశ్రీ మాట్లాడారు. అలాగే 2, 32, 33, 34, 49వ డివిజన్లలో పర్యటించిన మేయర్.. రోడ్లు, కాలువలపై ఆక్రమణలు, అక్రమ నిర్మాణాలను తొలగించాలన్నారు. కార్పొరేటర్లు అడ్డాల గట్టయ్య, వెంగళ బాపు, తోట మమత, మెరుగు భూలక్ష్మి, స్వప్నప్రియ, నాయకులు పాల్గొన్నారు. -
ఒక గొప్ప వేదిక
ఖోఖో మాలో టీమ్ స్పిరిట్‌ను పెంచుతుంది. ఒకరికొకరు ఎలా సహకరించుకోవాలో నేర్పుతుంది. మేము ఎవరికీ తక్కువ కాదని నిరూపించుకోవడానికి ఒక గొప్ప వేదిక. గతంలో డిస్ట్రిక్ లెవల్ ఆడాను. ప్రస్తుతం క్లస్టర్లో ఆడుతున్నారు. ఫ్యూచర్లో ఇండియన్ టీం కు ఆడాలని ఉంది. – జ్యోషిత, అండర్– 14 విభాగం తెలంగాణలోని స్కూల్ జట్లతో పోటీ పడటం కొత్త అనుభూతిని ఇస్తోంది. మైదానంలో మేమంతా క్రీడాకారులమే, ఇక్కడ రాష్ట్రాల బేధం లేదు. మహిళలు ఏ రంగంలోనైనా దూసుకుపోగలరని చెప్పడానికి మా పరుగే నిదర్శనం. రెండు సార్లు రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొన్న. – పూజ్య, రాప్తాడు, అనంతపురం, అండర్– 14 విభాగం అండర్–19లో మా టీం పైనల్‌కు చేరింది. ఆడపిల్లలు ఆటల్లో రాణించలేరు అనే పాత ఆలోచనలను మార్చడానికే మేమంతా ఇక్కడికి వచ్చాం. మా తల్లిదండ్రులు నన్ను ఎంతో ప్రోత్సహించి పంపించారు. గెలిచి తీరుతాం. గతంలో ఒకసారి రాష్ట్ర, జాతీయ పోటీల్లో పాల్గొన్నా. ఖేలో ఇండియాలో పతకం సాధించాలని ఉంది. – కావ్యసుధ, పాయకరావుపేట, అనకాపల్లి అండర్– 19 విభాగం -
రోడ్డు విస్తరణ పనులు షురూ
పెద్దపల్లిరూరల్: ఎట్టకేలకు జిల్లా కేంద్రంలో మె యిన్ రోడ్డు విస్తరణ శనివారం ప్రారంభమైంది. తొలిఏకాదశి పండుగ సందర్భంగా పనులకు శ్రీకా రం చుట్టడంతో ఇరుకురోడ్డు ఇబ్బందులు తీరుతా యని పట్టణవాసుల్లో ఆశాభావం వ్యక్తమవుతోంది. జిల్లా కేంద్రంగా మారిన పెద్దపల్లిని ఆ హోదాకు త గ్గట్టుగా అభివృద్ధి చేసుకునేలా సహకరించాలని ప్రభుత్వ విప్ విజయరమణారావు, మున్సిపల్ చైర్మన్ మల్లయ్య, కమిషనర్ వెంకటేశ్ కోరారు. అభివృద్ధికి సహకరించాలి మెయిన్ రోడ్డును తొలుత 66 అడుగుల వరకు విస్తరించాలని నిర్ణయించగా వ్యాపారుల నుంచి విముఖత వ్యక్తమైంది. 50 అడుగుల వరకు విస్తరించేందుకు సహకరిస్తామని వారు సంకేతాలిచ్చారు. అంతేకాదు.. విప్‌ను కలిసి ఎక్కువ నష్టం కలుగకుండా సహకరించాలని అభ్యర్థించారు. ఇటీవల ఆయన సమక్షంలో సమావేశమై మెయిన్ రోడ్డు 55 అడుగులు ఉండేలా విస్తరించేందుకు అంగీకరించారు. భవిష్యత్‌లోనూ వ్యాపారులు సహకరించేలా చూడాలని చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు కమల్ కిశోర్ శారడకు పెద్దపల్లి మున్సిపల్ చైర్మన్ మల్లయ్య, కమిషనర్ వెంకటేశ్ తదితరులు సూచించారు. వ్యాపారులు స్వచ్ఛందంగా కట్టడాలను తొలగించుకుంటామని సంసిద్ధత వ్యక్తం చేశారని కమిషనర్ వెంకటేశ్ వివరించారు.జెండా చౌరస్తా నుంచే ప్రారంభం మెయిన్ రోడ్డును 55 అడుగుల వరకు విస్తరించేలా నిర్ణయించిన మున్సిపల్ అధికారులు.. ఆ మేరకు ఇరువైపులా భవనాలకు మా ర్కింగ్ ఇచ్చారు. 15 రోజుల్లోగా తొలగించుకు ని అభివృద్ధికి సహకరించాలని కోరారు. జెండా చౌరస్తాలోని మున్సిపల్ షాపింగ్ కాంప్లె క్స్ గదిని తొలుత కూల్చివేశారు. అదే ప్రాంతంలోని ప్రధాన పోస్టాఫీసు, బీఎస్ఎన్ఎల్ ప్రహరీలను సైతం తొలగించారు. కొందరు యజమానులు కట్టడాలను స్వచ్ఛందంగా తొలగించుకునేందుకు సిద్ధమవుతున్నారు. -
పట్టుదల..కృషి.. శ్యామ్‌ప్రసాద్‌లాల్
సిరిసిల్ల: పట్టుదలకు కృషి తోడైతే ఏదైనా సాధించవచ్చని ఐఏఎస్ అధికారి శ్యాంప్రసాద్‌లాల్ ప్రస్థానం సాక్ష్యం. సాధారణ మధ్యతరగతి పద్మశాలి కుటుంబంలో పుట్టి.. సర్కారు బడిలో అక్షరాలు దిద్దిన విద్యార్థి.. నేడు ఎంతో మంది విద్యార్థులకు స్ఫూర్తిగా నిలిచారు. దేశంలోనే అత్యున్నతమైన ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ సర్వీస్(ఐఏఎస్)కు ఎంపికవడం ఎంతో మంది కల. ఆ కలను కొంతమంది సాధిస్తారు. ఈ కోవాలోకి వస్తారు జి.వి.శ్యాంప్రసాద్‌లాల్. రెవెన్యూశాఖలో డిప్యూటీ తహసీల్దార్(డీటీ)గా ఉద్యోగంలో చేరి.. అంచెలంచెలుగా ఎదిగి ఐఏఎస్ సాధించిన గాజుల వెంకట శ్యాంప్రసాద్‌లాల్ నేటి యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. 1995లో డిప్యూటీ తహసీల్దార్‌గా.. 1995లో డిప్యూటీ తహసీల్దార్(డీటీ)గా గ్రూప్–2లో ప్రభుత్వ ఉద్యోగం సాధించారు. కరీంనగర్ కలెక్టరేట్లో ప్రొబేషనరీ డిప్యూటీ తహసీల్దార్‌గా 1995 జూలై 31న విధుల్లో చేరారు. 1996 ఆగస్ట్ 1న గంభీరావుపేటలో డిప్యూటీ తహసీల్దార్‌గా విధుల్లో చేరి 1998 డిసెంబరు వరకు పనిచేశారు. తహసీల్దార్‌గా పదోన్నతి పొంది 1998లో బోయినపల్లి, 2003లో సిరిసిల్ల, 2004లో పెద్దపల్లి, 2005లో హుజూరాబాద్, 2006లో కరీంనగర్, 2008లో కాటారం, కోరుట్ల తహసీల్దార్‌గా పనిచేశారు. 2009లో కొద్ది నెలలపాటు ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల తహసీల్దార్‌గా, ఆ తరువాత 2010లో కోరుట్ల తహసీల్దార్‌గా పనిచేశారు. 2011 మార్చిలో డిప్యూటీ కలెక్టర్‌గా పదోన్నతి పొందారు. వరంగల్‌లో భూసేకరణ విభాగం స్పెషల్ డిప్యూటీ కలెక్టర్‌గా, 2013లో రాజీవ్ విద్యామిషన్ ప్రాజెక్టు ఆఫీసర్‌గా పనిచేశారు. 2014లో వరంగల్‌లో ఆర్వీఎం ప్రాజెక్టు ఆఫీసర్‌గా పనిచేశారు. 2014లోనే నిజామాబాద్ జిల్లా బోధన్ ఆర్డీవోగా, 2016లో సిరిసిల్ల ఆర్డీవోగా పనిచేశారు. 2017లో స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్‌గా పదోన్నతి పొంది జిల్లా రెవెన్యూ అధికారి(డీఆర్వో)గా రాజన్న సిరిసిల్ల జిల్లాలో పనిచేశారు. 2019లో అదనపు కలెక్టర్‌గా పదోన్నతి పొంది కరీంనగర్లో పనిచేశారు. 2023లో పెద్దపల్లి అదనపు కలెక్టర్‌గా పనిచేశారు. 2024లో మహాత్మా జ్యోతిభాపూలే విద్యాసంస్థ జాయింట్ సెక్రటరీగా పనిచేసిన శ్యాంప్రసాద్ లాల్ 2026 జనవరిలో ఐఏఎస్‌గా కన్ఫార్మ్ అయి.. నాగర్‌కర్నూల్ జిల్లా అదనపు కలెక్టర్‌గా విధుల్లో చేరారు. ఇటీవల రాష్ట్ర పౌరసరఫరాల శాఖ డైరెక్టర్‌గా చేరి విధులు నిర్వహిస్తున్నారు.తల్లిదండ్రులు: సత్యవతి (బీడీ కార్మికురాలు), గాజుల రాజేశం(రజనిశ్రీ) ప్రభుత్వ ఉపాధ్యాయుడు, ప్రముఖ రంగస్థల నటుడు, నాట్యాచార్యుడు. భార్య, పిల్లలు: మాధవి కుమారి, మేఘాంశ్ ప్రసాద్, ప్రీతమ్ ప్రసాద్ పెళ్లి: 1995 మే 3న (సిరిసిల్ల అత్తగారి ఊరు) పేరులో ప్రత్యేకతలు: గాజుల వెంకట శ్యాంప్రసాద్‌లాల్(తాత వెంకటయ్య పేరు కలిసి వచ్చేలా వెంకట, నవంబరు 14న జన్మించిన నేపథ్యంలో జవహర్‘లాల్’ను పేరు చివర వాళ్ల నాన్న రజనిశ్రీ పెట్టడం విశేషం) హాబీలు: సాహిత్యం చదవడం, షటిల్ ఆడడం, పాటలు వినడం. జర్నలిస్ట్‌గా: ‘వాన కురిసింది.. పుడమి మురిసింది’ అంటూ.. ఉత్తమ శీర్షికలు ఇచ్చి శభాష్ అనిపించుకున్నారు. డిప్యూటీ తహసీల్దార్ నుంచి ఐఏఎస్ వరకు.. అంచెలంచెలుగా ఎదిగిన హుస్నాబాద్ కుర్రాడు యువతకు స్ఫూర్తి జి.వి.శ్యాంప్రసాద్‌లాల్ ప్రస్థానంహుస్నాబాద్ టు హైదరాబాద్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా హుస్నాబాద్‌లో 1969 నవంబరు 14న జన్మించారు. హుస్నాబాద్ ప్రభుత్వ పాఠశాలలో ప్రాథమిక విద్యాభ్యాసం, 1984లో పదో తరగతి, 1986లో ఇంటర్ పూర్తి చేశారు. 1989లో సిద్దిపేటలో బీఎస్సీ, 1991లో ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీలో ఎంఏ(తెలుగు) పూర్తి చేశారు. 1992లో జర్నలిజం చేసిన ఆయన 1992లో ఓ దినపత్రిలో సబ్ ఎడిటర్‌గా చేరారు. -
రాజన్నకు మరో రూ.99.40 కోట్లు
వేములవాడ: శ్రీరాజరాజేశ్వర స్వామి దేవస్థానం అభివృద్ధి, విస్తరణ పనులకు రాష్ట్ర ప్రభుత్వం మరో రూ.99.40 కోట్లు మంజూరు చేసినట్లు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ శనివారం తెలిపారు. ఇప్పటికే రూ.150కోట్లతో పనులు మొదలుకాగా.. మొత్త ప్రభుత్వం విడుదల చేసిన నిధులు రూ.249.40 కోట్లకు చేరుకున్నట్లు వివరించారు. రాజన్న ఆలయ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిన విషయాన్ని మరోసారి స్పష్టం చేశారు. ఇందులో భాగంగా 2023–24 ఆర్థిక సంవత్సరంలో రూ.50కోట్లు, 2024–25లో రూ.100 కోట్లు విడుదల చేయగా.. తాజాగా రూ.99.40 కోట్లు మంజూరు చేసింది. భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడం, ఆలయ పరిసరాలను ఆధునికీకరించడం లక్ష్యమన్నారు. ఇప్పటికే రాజన్న ఆలయంలో 45 శాతం పనులు పూర్తయ్యాయన్నారు. ఈ నిధులతో మిగిలిన నిర్మాణాలు, మౌలిక వసతుల అభివృద్ధి, ఆలయ పరిసరాల సుందరీకరణ పనులు వేగవంతం చేయనున్నట్లు తెలిపారు. ఆలయ విస్తరణ పూర్తయితే ఆధ్యాత్మిక కేంద్రంగానే కాకుండా పర్యాటక రంగంలోనూ వేములవాడ ప్రాధాన్యం సంతరించుకుంటుందన్నారు. నిధుల మంజూరుకు సహకరించిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ, జిల్లా మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌లకు కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పటికే రూ.150 కోట్లతో పనులు వివరాలు వెల్లడించిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ -
భీమన్న సన్నిధిలో నాగరాజు
వేములవాడ: తొలి ఏకాదశి శనివారం నాడు భీమన్న ఆలయం ఎదుట నాగుపాము కలకలం రేపింది. స్నేక్ క్యాచర్ జగదీశ్ పట్టుకొని అటవీప్రాంతంలో వదిలేశారు. భీమన్న ఆలయం ఎదుట తొలి ఏకాదశి సందర్భంగా భక్తుల రద్దీ నెలకొన్న వేళ నాగుపాము ప్రత్యక్షమైంది. పామును గమనించిన భక్తులు భయాందోళనకు గురికాగా.. సమాచారం అందుకున్న స్నేక్ క్యాచర్ జగదీశ్ వెంటనే అక్కడికి చేరుకొని చాకచక్యంగా పట్టుకున్నారు. జగదీశ్ సమయస్ఫూర్తితో స్పందించడంతో ఆలయానికి వచ్చిన భక్తులు ఊపిరి పీల్చుకున్నారు. పాములు కనిపిస్తే చంపకుండా వెంటనే అటవీశాఖ, శిక్షణ పొందిన స్నేక్ క్యాచర్లకు సమాచారం అందించాలని కోరారు. చిన్నారిని బలిగొన్న కేన్సర్జగిత్యాలరూరల్: సారంగాపూర్ మండలం పోచంపేట గ్రామానికి చెందిన మోటూరి తేజాన్ష్ (7) కేన్సర్‌తో బాధపడుతూ శుక్రవారం రాత్రి మృతిచెందాడు. గ్రామానికి చెందిన మాటూరి మహేశ్, రాధ దంపతులకు ఒక్కగానొక్క కుమారుడు తేజా న్ష్. మహేశ్ హైదరాబాద్‌లో సాఫ్ట్వేర్ ఉద్యో గం చేస్తున్నాడు. కొన్నాళ్ల క్రితం తేజాన్ష్ అనా రోగ్యం బారినపడడంతో తల్లిదండ్రులు ఆస్పత్రిలో చూపించారు. వారు కేన్సర్‌గా గుర్తించారు. తేజాన్స్కు నాలుగు నెలలుగా హైదరాబాద్‌లో చికిత్స చేయిస్తున్నారు. పరిస్థితి విషమించి మృతిచెందాడు. శనివారం స్వగ్రామంలో బాలుడికి అంత్యక్రియలు నిర్వహించారు. ● వెయిటర్, హెవీ డ్రైవర్ పోస్టులు ● ఈనెల 28న ఇంటర్వ్యూలు వేములవాడ: యూఏఈలోని ప్రముఖ ‘జీటీఎం కేటరింగ్’ సంస్థలో వెయిటర్లు, హెవీ డ్రైవర్ల ఖాళీల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు జీటీఎం ఇంటర్నేషనల్ రిక్రూట్మెంట్ సంస్థ ప్రతినిధి చీటి సతీశ్‌రావు శనివారం ప్రకటనలో తెలిపారు. ఈనెల 28వ తేదీ ఉదయం 10 గంటలకు జీటీఎం ఇంటర్నేషనల్‌కు చెందిన అన్ని శాఖల కార్యాలయాల్లో ఇంటర్వ్యూలు జరుగుతాయని తెలిపారు. ఉద్యోగాలు: వెయిటర్లు, హెవీ డ్రైవర్లు(చెల్లుబాటు అయ్యే యూఏఈ లైసెన్స్ తప్పనిసరి). వయోపరిమితి 21 నుంచి 40 ఏళ్లు. వేతనం : వెయిటర్లకు నెలకు ఏఈడీ 1,200(సుమారు రూ.32వేలు), హెవీ డ్రైవర్లకు ఏఈడీ 3,500(సుమారు రూ.93వేలు). ఇతర సౌకర్యాలు: ఉచిత భోజనం, వసతి, రవాణాతోపాటు ఉచిత వీసా, ఫ్లైట్ టికెట్(100 శాతం ఉచిత నియామకం, ఎలాంటి సర్వీస్ చార్జీలు ఉండవు) అందిస్తారు. అర్హతలు–నిబంధనలు : ఆంగ్లంలో మాట్లాడటం, వెయిటర్‌గా అనుభవం ఉన్నవారు అర్హులు. శరీరంలో బయటకు కనిపించే టాటూలు ఉండకూడదు. ఆసక్తి గల అభ్యర్థులు తమ ఒరిజినల్ పాస్‌పోర్ట్, అప్డేటెడ్ సీవీలతో ఇంటర్వ్యూకు హాజరుకావాలని చీటి సతీష్‌రావు కోరారు. మరిన్ని వివరాలకు.. సికింద్రాబాద్‌లో 8332052299, నిజామాబాద్‌లో 8686860999, ఆర్మూర్‌లో 8332062299, జగిత్యాలలో 8332042299, సిరిసిల్లలో 9391661522 నంబర్లలో సంప్రదించాలని కోరారు. -
జ్వరాల విజృంభణ
జ్వరపిడీతులతో రద్దీగా మారిన ఈ చిత్రం గోదావరిఖని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి(జీజీహెచ్)లోనిది. సీజనల్ వ్యాధులు, అనారోగ్య సమస్యలతో వచ్చిన పేషెంట్లతో వార్డులన్నీ ఇలా నిండిపోయాయి. సాక్షి, పెద్దపల్లి/కోల్‌సిటీ/పెద్దపల్లి/మంథని: వాతావరణంలో వచ్చిన మార్పులతో జిల్లాలో జ్వరాలు వేగంగా ప్రబలుతున్నాయి. ఓవైపు ఉక్కపోత.. మరోవైపు చిరుజల్లులు.. ఇలా భిన్నమైన వాతావరణానికి తోడు గ్రామాల్లో పారిశుధ్యం లోపించడంతో జ్వరాలు జనాలను కుదిపేస్తున్నాయి. పిల్లలు, పెద్దలు అనారోగ్యంతో వణికిపోతున్నారు. ఇళ్ల పరిసరాలు, నాలాల్లో నీరునిల్వ ఉండి దోమలు వ్యాప్తి చెందుతూ జనాలు వైరల్ జ్వరాల బారిన పడుతున్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జ నరల్ ఆస్పత్రితోపాటు గోదవరిఖని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి, మంథని, సుల్తానాబాద్ సీహెచ్‌సీలు, ప్రైమరీ హెల్త్, అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లు పేషేంట్లతో రద్దీగా మారుతున్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు, సింగరేణి ఆస్పత్రుల్లో వైద్యం పొందుతున్న వారిసంఖ్య గణనీయంగా పెరుగుతోంది. తీవ్రమైన జ్వరం, తల, ఒళ్లు నొప్పులు, వాంతులు, విరేచనాలు లాంటి లక్షణాలతో జిల్లావాసులు ఆస్పత్రుల పాలవుతున్నారు. పెరుగుతున్న ఓపీ.. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో రోజురోజుకూ ఓపీ పెరుగుతోంది. దగ్గు, జలుబు సమస్య పిల్లలను ఇబ్బందులకు గురిచేస్తోంది. వైరల్ జ్వరం నాలు గైదు రోజుల్లో తగ్గుముఖం పడుతున్నా.. దగ్గు, జ లుబు రెండు వారాలుపైగా తీవ్రత చూపిస్తోంది. ఈ క్రమంలో జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో కలిపి రోజూ 1,500 వరకు, ప్రైవేటు ఆస్పత్రుల్లో 1,500 నుంచి 2,000 వరకు ఓపీ కేసులు నమోదవుతున్నాయి. ఇందులో 150 నుంచి 200 వరకు జ్వరాలతో చిన్న పిల్లలు బాధపడుతున్నారు. నిత్యం 200 కుపైగా రక్తనమూనాలు సేకరించి వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. కొందరు ప్రైవేటు ఆస్పత్రుల నిర్వాహకులు ఇష్టానుసారంగా వైద్యపరీక్షలు చే స్తూ, అవసరం లేకున్నా అడ్మిట్ చేసుకుంటూ రూ. వేలల్లో వసూలు చేస్తున్నారనే విమర్శలున్నాయి. పారిశుధ్య లోపం.. ముసురుతో ముప్పు.. ఇటీవల కురిసిన ముసురుతో జిల్లాలో దోమల ఉధృతి పెరిగి సీజనల్ వ్యాధులు ప్రబలుతున్నాయి. ప్రధానంగా జలుబు, ముక్కునుంచి నీరు కారడం, దగ్గు, జ్వరం వంటివి జనాల్ని వేధిస్తున్నాయి. పల్లెలు, పట్టణాల్లో ఫాగింగ్ యంత్రాలు మూలనపడటంతో ఫాగింగ్ చేయక, డ్రైనేజీలు శుభ్రపరుచక దోమలు వృద్ధి చెందుతున్నాయని ప్రజలు వాపోతున్నారు. గ్రామాల్లో డ్రైనేజీలు లేక మురుగు నిలిచిపోతోంది. ప్రతీ శుక్ర, మంగళవారం డ్రైడే పాటించాలని అధికారులు చెబుతున్నా స్పందన అంతంతగానే ఉంటోంది. జిల్లాలో గత మూడేళ్లలో నమోదైన వ్యాధులు ఏడాది డెంగీ చికున్‌గున్యా డయేరియా 2024 151 12 451 2025 105 1 386 2026 00 0 50 ఈనెలలో జీజీహెచ్‌లో ఓపీ వివరాలు తేదీ ఓపీ 17 1,179 18 1,300 19 1,340 20 1,350 21 1,020 22 1,125 23 907 24 1,210 రామగుండం బల్దియా అధికారులు 15వ ఆర్థిక సంఘం నుంచి రూ.4.70 లక్షలు వెచ్చించి కొనుగోలు చేసిన 8 హ్యాండ్ ఫాగింగ్ యంత్రాలను గ తేడాది మార్చి 11న ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్ ప్రారంభించారు. అధికారులు వాటిని వినియో గించకుండా నిర్లక్ష్యంతో మూలన పడేశారు. ఈ చెత్తకుప్ప గోదావరిఖని విఠల్‌నగర్ సింగరేణి పార్క్ సమీపంలోని సింగరేణి క్వార్టర్స్ ఎదుట కొన్నినెలలుగా ఉంటోంది. సింగరేణి, నగరపాలక సంస్థ తొలగించడంలేదు. దుర్వాసన వెదజల్లడంతోపాటు దోమలకు ఆవాసంగా మారింది. -
క్యాథ్‌ల్యాబ్‌తో ప్రజల గుండెకు భరోసా
గోదావరిఖని: పారిశ్రామిక ప్రాంత ప్రజలు, గుండెపోటు బాధితుల కోసమే సింగరేణి ఏరియా ఆస్పత్రిలో ప్రత్యేకంగా క్యాథ్‌ల్యాబ్ ఏర్పాటు చేశారని రామగుండం మేయర్ మహకాంళి స్వామి అన్నారు. స్థానిక సింగరేణి ఏరియా ఆస్పత్రిలోని క్యాథ్‌ల్యాబ్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గుండెపోటు బాధితులు కరీంనగర్, హైదరాబాద్ లాంటి దూర ప్రాంతాలకు తరలించేలోపే చనిపోతున్నారని, రామగుండం ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్ మక్కాన్‌సింగ్ చొరవతో ఇక్కడే క్యాథ్‌ల్యాబ్ ఏర్పాటు చేసేలా చూశారని అన్నారు. త్వరలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్‌బాబు, ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్ దీనిని ప్రారంభిస్తారని తెలిపారు. డిప్యూటీ మేయర్ పాతిపెల్లి ఎల్లయ్య, సింగరేణి ఎస్వోటూ జీఎం చంద్రశేఖర్, డీవైసీఎంవో ప్రసన్నకుమార్, సింగరేణి శ్రీనివాస్, బొంతల రాజేశ్ తదితరులు పాల్గొన్నారు. అభివృద్ధి కనిపించడం లేదా? నగరంలో రూ.600 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులు బీఆర్ఎస్ నాయకులకు కనిపించం లేదా అని మేయర్ మహంకాళి స్వామి ప్రశ్నించారు. స్థానిక ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ తన పదవీకాలంలో చేసిన ఆర్థిక వ్యవహారాలపై ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అభివృద్ధిపై తాము చర్చకు సిద్ధంగా ఉన్నామని, ఆయన హయాంలో చేసిన అభివృద్ధి ప్రజలకు వివరించడానికి సిద్ధమైతే చర్చకు రావాలని ప్రతి సవాల్ విసిరారు. డిప్యూటీ మేయర్ పాతిపెల్లి ఎల్లయ్య, నాయకులు ముస్తఫా, అడ్డాల గట్టయ్య, తౌటం సతీశ్, కాల్వ లింగస్వామి, మారెల్లి రాజిరెడ్డి, గుండేటి రాజేశ్, బొమ్మక రాజేశ్, దాసరి విజయ్, కల్యాణి సింహాచలం, చెరుకు బుచ్చిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. రామగుండం మేయర్ మహంకాళి స్వామి -
సీ్త్ర‘నిధి’.. పెన్నిధి
పెద్దపల్లి: సీ్త్రనిధి పథకం మహిళల ఆర్థికాభివృద్ధికి కొండంత అండగా నిలుస్తోంది. వ్యక్తిగత రుణాలతోపాటు వ్యాపారాలు చేసుకుంటున్న స్వయం సహాయక సంఘాలకూ రుణాలు అందిస్తోంది. కూరగాయల సాగు, పాడి గేదెలు, పూలతోటలు, సోలార్ రూప్‌టాప్, మత్స్యకార్మికులకు ఉపాధి, గృహాల మరమ్మతు, ఎలక్ట్రిక్ ఆటోలు, బైక్‌లు, సాధారణ వ్యాపారం, రోజూవారీ ఆదాయం సమకూరే వ్యాపారాలకూ విరివిఆ రుణాలు అందిస్తు న్నారు. వీటితోపాటు పశుపోషణ, చిన్నపరిశ్రమ లు, రెడీమేడ్ వస్త్రాల తయారీ, కిరాణాలు, హో టల్, టీదుకాణాలు, టైలరింగ్, బ్యూటీపార్లర్లు తదితర వ్యాపారాలకు మహిళలు రుణ మొత్తం వెచ్చి స్తూ ఆర్థిక స్వావలంబన సాధిస్తున్నారు. విరివిగా రుణాలు మంజూరు.. సీ్త్రనిధి పథకం ద్వారా మహిళా సంఘాల సభ్యులకు విరివిగా రుణాలు అందజేస్తున్నారు. సాధారణంగా రూ.5,000 నుంచి రూ.50 వేల వరకు సువిధ, ప్రగతి స్కీం ద్వారా రూ.50 వేల నుంచి రూ.1,50,000, అక్షయ ద్వారా రూ.1,50,000, రూ.3 లక్షలు, సౌభాగ్య స్కీం ద్వారా రూ.3 లక్షల నుంచి రూ.4,50,000, ఐశ్వర్య పథకం ద్వారా రూ 5,00,000 వరకు రుణాలు అందిస్తున్నారు. ఏటికేడు పెరుగుతున్న నిధులు జిల్లావ్యాప్తంగా 1,770 స్వయం సహాయక సంఘాలు(ఎస్‌హెచ్‌జీలు), సుమారు 1,78,767 మంది మహిళా సభ్యులు ఉన్నారు. వీరిలో సుమారు 10 శాతం మంది వ్యాపారాలు నిర్వహిస్తూ సీ్త్రనిధి ద్వారా రుణాలు పొందుతున్నారు. సీ్త్రనిధి ద్వారా 2023–24లో రూ.19.47 కోట్లు, 2024– 2025–లో రూ.44.90 కోట్లు, 2025–26లో రూ.71.80 కోట్లు, 2026–27లో 89 కోట్లు లక్ష్యంగా నిర్దేశించగా.. ఇప్పటివరకు రూ.6.25 కోట్లు పంపిణీ చేశారు. సీ్త్రనిధి స్కీం ద్వారా రుణాలు సొంతంగా మహిళల వ్యాపారాలు మరోనలుగరికి ఉపాధి అవకాశాలు ఆదర్శంగా నిలుస్తున్న స్వయం సహాయ సంఘాలు -
ఓదెల మల్లన్నకు ఏసీ వితరణ
ఓదెల: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా మాజీ జెడ్పీటీసీ గంట రాముల యాదవ్ ఓదెల మల్లికార్జునస్వామి ఆలయానికి శుక్రఓవారం ఏసీ బహూకరించారు. స్వామివారి దర్శనం సందర్భంగా ఉక్కపోతతో భక్తులు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఏసీ వితరణ చేశారు. బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఐరెడ్డి వెంకటరెడ్డి, ఆలయ ఈవో సదయ్య, జూనియర్ అసిస్టెంట్ కుమారస్వామి, అర్చకులు వీరభద్రయ్య, ఆరుట్ల నర్సింహాచార్యులు, సర్పంచులు కనికిరెడ్డి సతీశ్, గ్యారవేని విజయ, జీల రాజు, మద్దెనవేని రవి, ఉపసర్పంచ్ మహేందర్, మాజీ సర్పంచ్ ఆళ్ల రాజిరెడ్డి, నాయకులు పోలోజు రమేశ్, శ్రీకాంత్‌గౌడ్ పాల్గొన్నారు. -
ఎలక్ట్రిక్ ఆటోతో ఉపాధి
సీ్త్రనిధి రుణం వచ్చింది. దానితో ఎలక్ట్రిక్ ఆటో కొని ఉపాధి పొందుతున్నాం. అధికారులు రుణం మంజూరు చేయడంతోపాటు వాహనం నడుపుకునేందుకు అన్నిరకాల అనుమతులు ఇప్పించారు. ఆటో నడపడం ద్వారా మంచి ఆదాయమే వస్తున్నది. కుటుంబ పోషణకు ఇబ్బంది లేకుండా ఉంది. – గడ్డం స్రవంతి, పెద్దంపేట, అంతర్గాండిపాజిట్లు పెంచుకోవాలి జిల్లాలోని స్వయం సహాయక సంఘాలు సీ్త్రనిధి ద్వారా మరిన్ని రుణాలు పొందాలంటే క్రమం తప్పకుండా డిపాజిట్లు సేకరించాలి. సంఘాల్లో పొదుపు ఇంకా పెరిగాలి. ఇలాఅయితే అధిక మొత్తంలో రుణాలు పొందే అవకాశం ఉంటుంది. ఈ దిశగా మహిళలు డిపాజిట్లు పెంచడం శ్రేయష్కరం. – దుర్గాప్రసాద్, ఆర్ఎం, సీ్త్రనిధి -
శిథిలం.. ప్రమాదకరం
శనివారం శ్రీ 25 శ్రీ జూలై శ్రీ 2026జిల్లాలో ముసురు వాన కురుస్తోంది. శిథిలావస్థకు చేరిన భవనాలు, ఇళ్లు నివాసయోగ్యానికి అనుకూలం కాదని అధికారులు సూచిస్తున్నారు. జిల్లా కేంద్రంలో శిథిలావస్థకు చేరిన ఇళ్లను ఇప్పటికే మున్సిపల్ అధికారులు వాటిని గుర్తించారు. పెద్దపల్లి తెనుగువాడ, సాగర్‌రోడ్డు, పాతబజార్, తిలక్‌నగర్‌లో గూనపెంకుల ఇళ్లు శిథిలమై ఉరుస్తుండగా.. కవర్లతో కొప్పుకుంటున్నారు యజమానులు. అవే ఈ చిత్రాలు. – సాక్షి ఫొటోగ్రాఫర్, పెద్దపల్లి -
బాధ్యత విస్మరించొద్దు
సుల్తానాబాద్‌రూరల్: పోలీసులు బాధ్యతతో వ్యవహరించాలని డీసీపీ రాంరెడ్డి సూచించా రు. సుల్తానాబాద్ సర్కిల్ కార్యాలయాన్ని శుక్రవారం డీసీపీ తనిఖీ చేశారు. గ్రేవ్ కేసులు, విచారణ కేసులు, పెండింగ్ ట్రయల్స్ ఫైళ్లు పరిశీలించారు. ప్రజల్లో పోలీస్‌శాఖపై విశ్వాసం పెరిగేలా పారదర్శకంగా సేవలు అందించాలని అన్నారు. ఏసీపీ గజ్జి కృష్ణ, సీఐ రంజిత్‌రావు, ఎస్సైలు చంద్రకుమార్, అశోక్‌రెడ్డి, మల్లేశ్, సనత్, మధుకర్, సుధాకర్ పాల్గొన్నారు. సమర్థవంతంగా విధులు కమాన్‌పూర్: పోలీసులు విధులను సమర్థవంతంగా నిర్వహించాలని గోదావరిఖని ఏసీపీ రమేశ్ సూచించారు. స్థానిక పోలీస్‌స్టేషన్‌ను శుక్రవారం ఏసీపీ తనిఖీ చేశారు. కేసుల వివరాల గురించి ఎస్సై ప్రసాద్‌ను అడిగి తెలుసుకొన్నారు. బాధితులనుంచి ఫిర్యాదులు స్వీకరించి తక్షణ పరిష్కార మార్గం చూపాలని సూ చించారు. గోదావరిఖని టూటౌన్ సీఐ ప్రసాదరావు, స్టేషన్ రైటర్ శ్రీనాథ్ ఉన్నారు. 31వరకు రైల్వేగేట్ మూసివేత పెద్దపల్లిరూరల్/పెద్దపల్లి: పెద్దపల్లి–కూనారం మధ్యలోని రైల్వే లెవల్ క్రాసింగ్ గేటును శనివా రం (ఈ నెల 25) నుంచి ఈనెల 31 వరకు మూసివేయనున్నారు. ట్రాక్ మరమ్మతుల కో సం ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మార్గంలో రాకపోకలు సాగించేవారు ప్రత్యామ్నాయ మా ర్గాలను ఎంచుకోవాలని అధికారులు సూచించారు. ప్రజాప్రతినిధులు ప్రజలకు సమాచా రం అందించాలన్నారు. శనివారం ఉదయం 6 గంటల నుంచి ఈనెల 31 రాత్రి 7గంటల వరకు గేట్‌ను మూసిఉంచుతామని, ప్రజలు సహకరించాలని రైల్వే అధికారులు కోరారు. హెచ్‌పీవీ టీకా కీలకం కోల్‌సిటీ: సర్వైకల్ క్యాన్సర్‌ను నివారించడంలో హెచ్‌పీవీ టీకా కీలకపాత్ర పోషిస్తుందని డీఎంహెచ్‌వో పవిత్ర అన్నారు. గోదావరిఖని అడ్డగుంటపల్లి అర్బన్ హెల్త్ సెంటర్లో ఎంజేపీటీబీసీడబ్ల్యూఆర్ పాఠశాలకు చెందిన 40 మంది విద్యార్థినులకు శుక్రవారం హెచ్‌పీవీ వ్యాక్సిన్ వేశారు. డీఎంహెచ్‌వో ఈ ప్రక్రియ పరిశీలించి మాట్లాడారు. చిన్న వయసులోనే టీకా తీసుకుంటే భవిష్యత్‌లో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ బారిన పడే ప్రమాదం గణనీయంగా తగ్గుతుందన్నారు. డిప్యూటీ డీఎంహెచ్‌వో శ్రీరాములు, ప్రోగ్రామ్ అధికారి కిరణ్, అకౌంటెంట్ సౌమ్య, వైద్యాధికారి స్నేహలత, కమ్యూనిటీ ఆర్గనైజర్ అనిత, నర్సింగ్ ఆఫీసర్ రజిత తదితరులు పాల్గొన్నారు. కేటీఆర్ పుట్టినరోజు వేడుకలు ఫెర్టిలైజర్‌సిటీ: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పుట్టినరోజు వేడుకలను శుక్రవారం ఘ నంగా నిర్వహించారు. స్థానిక ఈశ్వర కృప వృద్ధాశ్రమంలో రామగుండం మాజీ ఎమ్మెల్యే కో రుకంటి చందర్ ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి మిఠాయిలు, పండ్లు పంపిణీ చేశారు. అన్నదానం చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ రామగుండం కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్ మేకల సమ్మయ్య, నాయకులు దామోదర్‌రావు, మూల విజయారెడ్డి, పట్టణ అధ్యక్షుడు జక్కుల తిరుపతి, నాయకులు మారుతి నారాయణదాసు పాల్గొన్నారు. 30న జాబ్‌మేళా పెద్దపల్లి: స్థానిక టాస్క్ సెంటర్లో ఈనెల 30వ తేదీన ప్రత్యేక జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి రాజశేఖర్ శుక్రవారం తెలిపారు. హైదరాబాద్ సమీపంలోని ప్రముఖ ఎలక్ట్రానిక్స్ తయారీ సంస్థలో ఉద్యోగాల భర్తీ కోసం మేళా నిర్వహిస్తున్నామన్నారు. పదో తరగతి, ఇంటర్మీడియట్, డిప్లొమా, డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులకు హాజరు కావాలని ఆయన సూచించారు. -
విద్యార్థులకు న్యాయం చేయాలి
పెద్దపల్లి: నీట్ పరీక్షలు నష్టపోయే విద్యార్థులకు న్యాయం చేయాలని, ప్రశ్నపత్రాల లీకేజీకి బాధ్యుడిగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను బర్తరఫ్ చేయాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు శనిగరపు రజినీకాంత్ డిమాండ్ చేశారు. ఎస్ఎఫ్ఐ, వా మపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లాలో కళాశాలల బంద్ నిర్వహించారు. పెద్దపల్లిలో జరిగిన కార్యక్రమంలో రజినీకాంత్ మాట్లాడారు. జంతర్‌మంతర్ వద్ద శాంతియుతంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులపై టియర్ గ్యాస్, వాటర్ కేనన్లు, లాఠీచార్జీ వంటి చర్యలు చేపట్టడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని విమర్శించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి జిల్లాల ప్రశాంత్, సహాయ కార్యదర్శి మామిడిపల్లి అరవింద్, నా యకులు గంప నరేశ్, రాజ్‌కుమార్, బాలాజీ, అభిలాష్, నవీన్, రాజు, అనిల్, రాహుల్ పాల్గొన్నారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి మంథని: పట్టణంలో ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థ లు మూతపడ్డాయి. ఎస్ఎఫ్ఐ, ఎన్ఎస్యూఐ ఆ ధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి అంబేడ్కర్ చౌరస్తాలో రాస్తారోకో చేశారు. ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు ఆర్ల సందీప్, ఎన్ఎస్యూఐ నియోజకవర్గ ఇన్చార్జి కె క్కర్ల సందీప్ మాట్లాడుతూ, నీట్ పరీక్షల్లో లోపా లు, పేపర్ లీకేజీలతో విద్యార్థుల భవిష్యత్ ప్రమాదంలో పడిందన్నారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధ ర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చే శారు. మున్సిపల్ చైర్మన్ వొడ్నాల శ్రీనివాస్, వైస్ చైర్మన్ సహేందర్‌రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ కుడుదుల వెంకన్న, కౌన్సిలర్ నూకల కమల్, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సాదుల శ్రీకాంత్ మద్ద తు తెలిపారు. ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు బందెల రాజకుమార్, నాయకులు అఖిల్, మహేందర్, రణధీర్ తదితర నాయకులు, విద్యార్థులు ఉన్నారు. -
కదిలిన యంత్రాంగం
ఈనెల 23న ‘సాక్షి’ ప్రచురించిన కథనంవినియోగంలోకి వచ్చిన ఫాగింగ్ యంత్రాలు నిల్వ నీటిలో ఆయిల్ బాల్స్ వేస్తున్న శానిటేషన్ సూపర్వైజర్ కోల్‌సిటీ: రామగుండం నగరవాసుల కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న దోమలపై మొద్దునిద్రలో ఉన్న అధికారులను ‘సాక్షి’ తట్టిలేపింది. ఈనెల 23న ‘దోమల దండయాత్ర’ శీర్షికన ‘సాక్షి’ ప్రత్యేక కథనం ప్రచురించింది. మేయర్ మహంకాళి స్వామి స్పందించారు. ప్రజారోగ్యంపై నిర్లక్ష్యం వహిస్తున్న అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దోమల నియంత్రణకు యుద్ధప్రాతిపదికన ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించారు. దీంతో బల్దియా యంత్రాంగం స్పందించింది. మూలనపడేసిన ఫాగింగ్ యంత్రాలను శుక్రవారం మరమ్మతు చేయించి వినియోగంలోకి తీసుకొచ్చారు. వినియోగంలో లేని ఫాగింగ్ యంత్రాలను రంగంలోకి దింపారు. డివిజన్లలో ఫాగింగ్ను ముమ్మరం చేశారు. వర్షపు నీరు నిల్వ ఉన్న ప్రాంతాల్లో లార్వా నిర్మూలన కోసం ఆయిల్ బాల్స్ వేయించారు. దోమల నివారణకు ‘సాక్షి’ తీసుకున్న నిర్ణయాన్ని పలువురు అభినందించారు. దోమలపై యుద్ధానికి బల్దియా శ్రీకారం మేయర్ సూచనలతో రామగుండంలో ప్రారంభమైన ఫాగింగ్ నిల్వనీటిలో ఆయిల్ బాల్స్ వేస్తున్న పారిశుధ్య సిబ్బంది -
వరి వద్దు.. ఆరుతడి మేలు
● సాగుపై ఎల్‌నినో ఎఫెక్ట్ ● కంది సాగుతో మంచి దిగుబడి ● ఆగస్టులో నువ్వుల పంట కూడా బెటర్ ● రైతు విజ్ఞానకేంద్రం కో ఆర్డినేటర్ ఓదెల సంపత్పెద్దపల్లిరూరల్: జిల్లాలో వానాకాలం సాగుపై ఎల్‌నినో ప్రభావం తీవ్రంగా ఉంది. దీంతో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవడంలేదు. ఇలాంటి పరిస్థితుల్లో జిల్లా రైతాంగం వరి సాగు చేయవద్దని శాస్త్రవేత్త, రైతువిజ్ఞాన కేంద్రం జిల్లా కో ఆర్డినేటర్ ఓదెల సంపత్ కోరారు. వరి సాగుకు అవసరమైనంత సాగునీరందని పరిస్థితి ఉందని, ఈ పంట సాగుచేసి ఆర్థికంగా నష్టపోవద్దని సూచించారు. ప్రత్యామ్నాయంగా ఆరుతడి పంటలు వేసుకోవడం మేలని అన్నారు. కంది సాగు చేస్తే మంచి దిగుబడి వచ్చే అవకాశముందని స్పష్టం చేశారు. ఆగస్టు 10 తర్వాత నువ్వుల పంట వేసుకోవాలని సూచించారు. రాగులు, సజ్జలు, జొన్నలు, ఉలవ, అలసంద పంటలైనా మంచిదేనని ఆయన చెప్పారు. ఎల్‌నినో ప్రభావం తదితర అంశాలపై ఆయన ‘సాక్షి’ తో మాట్లాడారు. -
సర్‌పై అప్రమత్తంగా ఉండాలి
పెద్దపల్లి: సర్ ప్రక్రియలో అర్హులైన ఓటర్ల పేరు ఓటరు జాబితాలో ఉండేలా కౌన్సిలర్లు, కాంగ్రెస్ శ్రేణులు అప్రమత్తంగా వ్యవహరించాలని ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు సూచించారు. స్థానిక మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లతో శుక్రవారం నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఆయన మాట్లాడారు. వార్డుల్లో సర్ ప్రక్రియపై విస్తృతంగా అవగాహన కల్పించాలని సూచించారు. ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసేలా ఓటరు జాబితాలో గందరగోళం సృష్టించే ప్రయత్నాలకు తావు లేదని ఆయన అన్నారు. మున్సిపల్ చైర్మన్ నూగిల్ల మల్లయ్య, కౌన్సిలర్లు, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. సర్‌పై సమీక్ష కాల్వశ్రీరాంపూర్: గడువులోగా ‘సర్’ ప్రక్రియ పూర్తి చేయాలని ఆర్డీవో గంగయ్య ఆదేశించారు. స్థానిక తహాహల్దార్ కార్యాలయంలో సర్ ప్రక్రియపై ఆయన సమీక్షించారు. ఓటర్లు సందేహాల నివృత్తి కోసం పంచాయతీల్లోని హెల్ప్‌డెస్క్‌ల సాయం తీసుకోవాలని సూచించారు. తహసీల్దార్ రాముడు, ఆర్ఐ వినోద్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ విప్ విజయరమణారావు -
ఖోఖో క్రీడా సంరంభం
కరీంనగర్‌స్పోర్ట్స్: క్రీడాకారుల కేరింతలు, ఆకట్టుకు న్న మార్చ్ఫాస్ట్, సాంస్కృతిక ప్రదర్శనలు, క్రీడాస్ఫూర్తిని ప్రతిబింబించే ఉత్సాహభరిత వాతావరణం మధ్య కరీంనగర్ కొత్తపల్లిలోని అల్ఫోర్స్ ఈ–టెక్నో పాఠశాలలో సీబీఎస్ఈ క్లస్టర్–7 బాలికల ఖోఖో చాంంపియన్షిప్ పోటీలు శుక్రవారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి అండర్ –14 విభాగంలో 46, అండర్– 17లో 55, అండర్– 19 విభాగంలో 13 జట్లు పోటీల్లో పాల్గొన్నాయి. మొత్తం 104 జట్లు పోటీల్లో నువ్వా నేనా అన్నట్లు పోటీపడనున్నాయి. అంతకుముందు పోటీలను చొప్పదండి ఎమ్మెల్యే ఎమ్మెల్యే, కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మేడిపల్లి సత్యం, అదనపు కలెక్టర్ అశ్వినితానాజీ వాకాడే, అసిస్టెంట్ కలెక్టర్ పి.హరిప్రసాద్, సీబీఎస్ఈ రీజనల్ ఆఫీసర్ జంగం సునీల్‌కుమార్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, చదువుతో పాటు క్రీడల్లోనూ ప్రతిభ కనబరిచినప్పుడే విద్యార్థులకు సమగ్ర వ్యక్తిత్వ వికాసం సాధ్యమవుతుందన్నారు. అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకాడే మాట్లాడుతూ, క్రీడలు విద్యార్థుల్లో ఏకాగ్రత, ఆత్మవిశ్వాసాన్ని పెంచి ఒత్తిడిని తగ్గిస్తాయన్నారు. లక్ష్యాలను నిర్దేశించుకుని విద్యతో పాటు క్రీడల్లో రాణించాలని సూచించారు. అల్ఫోర్స్ అధినేత వి.నరేందర్‌రెడ్డి మాట్లాడుతూ, విద్యతో పాటు క్రీడలకు సమాన ప్రాధాన్యం ఇస్తూ అత్యాధునిక వసతులు, అనుభవజ్ఞులైన కోచ్‌లతో విద్యార్థులను తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. క్రీడాస్ఫూర్తితో నిబంధనలు పాటిస్తూ పోటీలను విజయవంతం చేయాలన్నారు. క్రీడాకారుల మార్చ్ఫాస్ట్, విద్యార్థుల సాంస్కతిక కార్యక్రమాలు అలరించాయి. పోటీల పరిశీలకులు భరత్‌కుమార్, జిల్లా ఒలింపిక్ సంఘం అధ్యక్ష కార్యదర్శులు నందెల్లి మహిపాల్, గసిరెడ్డి జనార్ధన్‌రెడ్డి, ఖోఖో సంఘం కార్యదర్శి వై.మహేందర్‌రావు, తెలంగాణ ఖోఖో అసోసియేషన్ రెఫరీస్ బోర్డ్ కన్వీనర్ వంగపల్లి సూ ర్యప్రకాష్, ప్రజాప్రతినిధులు వాసాల రమేశ్, వే ముల చంద్రశేఖర్, మధుసూదన్‌రెడ్డి పాల్గొన్నారు.తలపడుతున్న క్రీడాకారులుమార్చ్ఫాస్ట్లో క్రీడాకారులు అట్టహాసంగా ప్రారంభమైన సీబీఎస్ఈ క్లస్టర్–7 ఖోఖో పోటీలు తెలంగాణ, ఏపీ నుంచి 104 బాలికల జట్లు హాజరు పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం -
డామిట్ కథ అడ్డం తిరిగింది
సచిన్‌ను అరెస్ట్ చూపుతున్న పోలీసులు స్వాధీనం చేసుకున్న పిస్టల్, బుల్లెట్లుమెట్పల్లి: వదినను చంపి ఆస్తి దక్కించుకోవాలన్న పథకాన్ని పోలీసులు ఛేదించారు. హత్యకు ప్రణాళిక రచించిన మరిది, అతని భార్య, సమీప బంధువులను ఇప్పటికే రిమాండ్‌కు తరలించగా.. తాజాగా మరో నిందితుడు ఉత్తరప్రదేశ్‌కు చెందిన సచిన్‌వర్మను అరెస్ట్ చేశారు. మెట్పల్లి సర్కిల్ ఆఫీస్‌లో డీఎస్పీ రాములు శుక్రవారం వివరాలు వెల్లడించారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని పోచమ్మవాడకు చెందిన గోనెల శంకర్, రాజం అన్నదమ్ములు. పొత్తుల ఉన్న 58 గుంటల భూమిని శంకర్ తన అన్నకు తెలియకుండా విక్రయించడమే కాకుండా పొత్తులో ఉన్న ఇంటిని సైతం తన పేరిట రిజి స్ట్రేషన్ చేయించుకోవడం ఇరు కుటుంబాల మధ్య గొడవలకు దారితీసింది. ఈక్రమంలోనే రెండు సార్లు శంకర్ తన అన్నవదినలు రాజం, లక్ష్మిలపై దాడి చేయగా కేసులు నమోదయ్యాయి. ఆస్తిని దక్కించుకునేందుకు తన వదిన గోనెల లక్ష్మిని హత్య చేయాలని భార్య అనూష, బంధువు ముత్తన్నలతో కలిసి పథకం రచించాడు. తన వద్ద డ్రైవర్‌గా పనిచేస్తున్న ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌కు చెందిన సచిన్‌వర్మను సంప్రదించి డబ్బు ఆశ చూపాడు. దీనికి ఒప్పుకున్న సచిన్ గత మార్చిలో ప్రయాగ్‌రాజ్‌కు వెళ్లి అపరిచిత సాధువు వద్ద నాటు పిస్టల్, మూడు బుల్లెట్లు కొనుగోలు చేశాడు. దీని కోసం శంకర్ రూ.35వేలు ఫోన్‌పే ద్వారా సచిన్‌కు పంపించాడు. సచిన్‌వర్మ మెట్‌పల్లికి తిరిగి వచ్చిన తర్వాత గత నెల 13న లక్ష్మిని చంపడానికి వారి ఇంటికి వెళ్లిన సచిన్ భయాందోళనకు గురై కాల్పులు జరపకుండా వెళ్లిపోయాడు. తిరిగి 15న అర్ధరాత్రి దాటిన తర్వాత ముగ్గురి ప్రోద్బలంతో సచిన్ బైక్‌పై వెళ్లి ఇంటి ఆవరణలో నిద్రిస్తున్న లక్ష్మిపై కాల్పులు జరిపాడు. అయితే గురితప్పడంతో బుల్లెట్ ఎడమ చెంప భాగంలో తగిలింది.కాల్పులతో భారీ శబ్దం రావడం, లక్ష్మి కేకలు వేయడంతో సచిన్ పరారయ్యాడు. ఆ తర్వాత నిందితులు ఈ ఘటనను గుర్తుతెలియని వ్యక్తులు కర్రలు, రాళ్లతో దాడి చేసినట్లుగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. సచిన్‌ను ఉత్తరప్రదేశ్‌కు పంపించి కేసులో ఆధారాలు లభించకుండా జాగ్రత్తలు తీసుకున్నా రు. కానీ బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు ప్రాథమిక విచారణ చేపట్టి మరుసటి రోజు శంకర్, ముత్తన్న.. 28న అనూషలను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. బాధితురాలికి శస్త్ర చికిత్స చేసిన తర్వాత బుల్లెట్ బయటకు రావడంతో కేసు దర్యాప్తు కీలక మలుపు తిరిగింది. పలు కోణాల్లో విచారించిన పోలీసులు ఈనెల 20న ప్రయాగ్‌రాజ్‌కు వెళ్లి సచిన్‌ను అదుపులోకి తీసుకొని.. పిస్టల్, రెండు బుల్లెట్స్, బైక్, ఐ ఫోన్‌ను స్వా ధీనం చేసుకున్నారు. కేసును ఛేదించిన సీఐ సురేష్‌బాబు, ఎస్సై కిరణ్‌కుమార్‌తోపాటు సిబ్బందిని అభినందించారు. వదిన హత్యకు సుపారి పోలీసుల విచారణతో కుట్ర బట్టబయలు కటకటాల్లోకి కుట్రదారులు వివరాలు వెల్లడించిన డీఎస్పీ రాములు -
జాతీయ స్థాయి శిక్షణకు ఎంపిక
పెద్దపల్లి: ఆంగ్లభాష బోధనలో నైపుణ్యం పెంపు ల క్ష్యంగా ఈనెల 27 నుంచి 31వ తేదీ వరకు కర్ణాట కలోని మైసూరులో నిర్వహించే జాతీయ స్థాయి శిక్షణకు పెద్దపల్లి జిల్లా రా మగుండంలోని జెడ్పీ హైస్కూల్(పీఎంశ్రీ)కు చెందిన స్కూల్ అసిస్టెంట్ గడ్డం జగదీశ్వర్ ఎంపికయ్యారు. ఆంగ్ల భాష బోధన వ్యూహా లు, అభ్యసన ఫలితాల ఆధారిత బోధన, విద్యార్థి–కేంద్రిత అభ్యాసం, అక్షరాస్యత, భాషా వికాసం, సాంకేతికత వినియోగం వంటి అంశాలపై ఇందులో శిక్షణ అందించనున్నారు. డీఈవో శారద, జిల్లా అకడమిక్ మానిటరింగ్ ఆఫీసర్ పీం షేక్, ఈఎల్టీసీ మాజీ ఇన్చార్జి చెరుకు ప్రద్యుమ్న కుమార్, ఎల్టా జిల్లా ప్రధాన కార్యదర్శి డి.నాగరాజు తదితరులు జగదీశ్వర్‌ను అభినందించారు. కాల్వశ్రీరాంపూర్: ఇద్దరు గుడుంబా తయారీదారులు, విక్రేతలను తహీసీల్దార్ రాముడు ఎదుట ఎకై ్సజ్ అధికారులు శుక్రవారం బైండోవర్ చేశారు. గుడుంబా తయారీ, ముడిపదా ర్థాలు విక్రయిస్తుండగా పట్టుకున్నట్లు ఎకై ్సజ్ ఎస్సై చిరంజీవి తెలిపారు. నిందితుల నుంచి 25 కిలోల పటిక, 8 లీటర్ల గుడుంబా స్వాధీ నం చేసుకున్నట్లు వివరించారు. కానిస్టేబుళ్లు కోటేశ్వర్, అనిల్, కవిత పాల్గొన్నారు. పాముకాటుతో మహిళ మృతిరామగుండం: పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం పెద్దంపేట గ్రామానికి చెందిన రెవేల్ల సమ్మక్క(45) గురువారం రాత్రి ఇంట్లో పాముకాటుకు గురైంది. కుటుంబసభ్యులు గోదావరిఖని ప్రభుత్వాస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందింది. మృతురాలి కుమారుడు రేవెల్లి హన్మంతు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొన్నట్లు ఎస్సై వెంకటస్వామి తెలిపారు. గుండెపోటుతో అగ్నిమాపక వాహనం డ్రైవర్ మృతిజమ్మికుంట: పట్టణంలో ని అగ్ని మాపక కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న వాహనం డ్రైవర్(పోలీ సు) గుండెపోటుతో శుక్రవారం మృతిచెందాడు. సీఐ రామకృష్ణ వివరాల ప్రకారం.. వీణవంకకు చెందిన మోఠం అరవింద్(30) జమ్మికుంట అగ్నిమాపక కేంద్రం వాహన డ్రైవర్‌గా గురువారం విధులకు హాజ రయ్యాడు. శుక్రవారం చాతిలో నొప్పి రాగా.. అకస్మాత్తుగా కింద పడిపోయాడు. ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతిచెందాడు. గత సంవత్సరం ఇల్లందకుంట మండలం టేకుర్తి గ్రామానికి యువతితో వివాహం జరిగింది. 2 గ్రామాల్లో విషాదం అలుముకుంది. మృతుడి తండ్రి మోఠం సారయ్య ఫిర్యాదు చేశారు. 28న స్పాట్ అడ్మిషన్లు పెద్దపల్లి: సుల్తానాబాద్ మండలం భూపతిపూర్‌లోని మహాత్మా జ్యోతిబా పూలే బీసీ సంక్షేమ గురుకులం(బాలురు)లో ఈనెల 28న ఉద యం 10.00 గంటలకు స్పాట్ అడ్మిషన్లు నిర్వహించనున్నట్లు జిల్లా సమన్వయకర్త మానీదీప్తి తెలిపారు. ఇంటర్లో ప్రథమ సంవత్సరంలో ప్రవేశాల కోసం స్పాట్ అడ్మిషన్లు చేపట్టామన్నారు. వివరాల కోసం 95504 46246 నంబర్లో సంప్రదించాలని ఆయన కోరారు. -
జీజీహెచ్‌లో ఆధునిక వైద్యం
కోల్‌సిటీ: గోదావరిఖని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి(జీజీహెచ్)లో ఆధునిక వైద్య సేవలు అందిస్తున్నట్లు కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. ఇందులో ఉచితంగా అందుతున్న నాణ్యమైన వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. నిపుణులైన వైద్యులు, అత్యాధునిక వైద్యపరికరాలు, అధునాతన నిర్ధారణ సేవలు, ప్రత్యేక వైద్య విభాగాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. రెండు గంటల్లోనే ల్యాబ్ ఫలితాలు జీజీహెచ్‌లో ఆధునిక కంప్యూటర్ వ్యవస్థతో రక్తం తదితర పరీక్షల నివేదికలను రెండుగంటల్లోనే సి ద్ధం చేసి, పేషెంట్ల సెల్ఫోన్లకు పంపిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. తన ప్రత్యేక చొరవతో ఈ సౌకర్యం అందుబాటులోకి తీసుకొచ్చినట్లు పేర్కొన్నారు. గుండె పరీక్షలకు రెండు 2డీ ఇకో యంత్రాలు గుండె సంబంధిత వ్యాధుల నిర్ధారణ కోసం రెండు 2డీ ఇకో యంత్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. బాధితులు గుండె పరీక్షల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేదన్నారు. అందుబాటులో ఫిజియోథెరపీ ఫిజియోథెరపీలో ఆధునిక యంత్రాలను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. కీళ్ల నొప్పులు, ఎముకల సమస్యలు, ప్రమాదాల అనంతర పునరావాస చికిత్స అవసరమైన వారు ఈ సేవలను వినియోగించుకోవాలని సూచించారు. వేగంగా అభివద్ధి పనులు ఆస్పత్రిలో సదుపాయాల మెరుగుకు అభివృద్ధి పనులు చేపట్టామని కలెక్టర్ శ్రీహర్ష తెలిపారు. పాత భవనం గ్రౌండ్ ఫ్లోర్లో ఆపరేషన్ థియేటర్, ఎక్స్‌రేను పునరుద్ధరిస్తున్నట్లు పేర్కొన్నారు. ఎస్ఎన్సీయూ విభాగాన్ని కొత్త ఎయిర్ కండిషనర్లతో ఆధునికీకరిస్తుండగా, ఏఎన్సీ, పీఎన్సీ, పీఐసీయూ వార్డులను కూడా పునరుద్ధరిస్తున్నట్లు పేర్కొన్నారు. పాత భవనం చుట్టూ సీసీ రోడ్లు, కాంపౌండ్ గోడ ఎత్తు పెంపు పనులు కొనసాగుతున్నాయని, మొదటిఅంతస్తులోని ఆపరేషన్ థియేటర్లు, వార్డులతోపాటు కంటి ఆపరేషన్ థియేటర్‌ను ఆధునికీకరిస్తున్నట్లు వివరించారు. మార్చురీ పునరుద్ధరణ పనులు కూడా కొనసాగుతున్నట్లు పేర్కొన్నారు. వాటిని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు. -
కీ పాయింట్లతో సులభంగా రివిజన్
రెండు నెలల ముందు సాక్షి స్టడీ మెటీరియల్ అందించారు. పరీక్షల గడువు సమీక్షించడంతో కొంచెం టెన్షన్ పట్టుకుంది. బుక్స్, గైడ్స్ చదువకుండా సాక్షి స్టడీ మెటిరియల్లోని కీ పాయింట్స్‌ను చదువుకున్నా. అందులో ఉన్న చాలాప్రశ్నలు పరీక్షల్లో వచ్చాయి. కీ పాయింట్లతోనే సులభంగా రివిజన్ చేసుకోవడంతోనే అత్యధిక మార్కులు సాధించా. సమయానికి స్టడీ మెటీరియల్ అందించి అత్యధిక మార్కులు సాధించడానికి సహకరించిన ‘సాక్షి’కి కృతజ్ఞతలు. – పొయిల శ్రీవన్, కన్నాల, మంథని -
ప్రాణం తీసిన ఈత సరదా
● మానేరు చెక్‌డ్యాం గొయ్యిలో పడి బాలుడి మృతి ఓదెల: పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం రూపునారాయణపేట గ్రామానికి చెందిన చెలిక ఆదిత్య(15) అలియాస్ లక్కీ అనే పదో తరగతి విద్యార్థి మానేరులో ఈతకోసం వెళ్లి మృతి చెందాడు. పొత్కపల్లిలో పదో తరగతి చదువుతున్న ఆదిత్య.. శుక్రవారం ఒక్కపూట పాఠశాలకు వెళ్లి ఇంటికి వచ్చాడు. ఈతకోసం మరో విద్యార్థితో కలిసి మానేరుకు వెళ్లాడు. మానేరులో చెక్‌డ్యాం నిర్మాణానికి ఇటీవల తీసిన గొయ్యిలో పడి ఊపిరి ఆరాడక ఆదిత్య మృతి చెందాడు. శ్రీనివాస్ – రజిత దంపతులకు కుమారుడు ఆదిత్య, కూతురు ఉంది. ఒక్కాగానొక్క కుమారుడు మృతి చెందటంతో దంపతులు విషాదంలో మునిగారు. ఎస్సై సనత్‌కుమార్‌రెడ్డి కేసు నమోదు చేసుకొన్నారు. స్వగ్రామానికి వలసజీవి మృతదేహం ● ధర్మారంలో విషాదం కోనరావుపేట(వేములవాడ): సొంతూరిలో ఉపాధి లేక ఎన్నో ఆశలతో గల్ఫ్ దేశానికి వెళ్లిన ఓ యువకుడి జీవితం గుండెపోటుతో విషాదాంతమైంది. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం ధర్మారం గ్రామానికి చెందిన ఆసరి వెంకటేశ్వర్లు(40) ఒమన్ రాజధాని మస్కట్‌కు మూడేళ్ల క్రితం వెళ్లాడు. వీసా గడువు ముగిసినప్పటికీ అక్కడే పనిచేస్తు ఉన్నాడు. ఈక్రమంలో జూన్ 16న వీసా సంబంధిత కారణాలతో అక్కడి పోలీసులు అదుపులోకి తీసుకుని జైలుకు తరలించారు. జూన్ 25న గుండెపోటు రావడంతో ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ అదే రోజు మృతిచెందాడు. వెంకటేశ్వర్లు మృతదేహం బంధువుల ద్వారా స్వగ్రామానికి చేరడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. వెంకటేశ్వర్లుకు భార్య పుష్పలత, ఇద్దరు కుమారులు మనోజ్, అజయ్ ఉన్నారు. -
ఆధునికీకరణ పనుల పరిశీలన
పెద్దపల్లిరూరల్: స్థానిక రైల్వేస్టేషన్ ఆధునికీకరణ పనులను సికింద్రాబాద్ రైల్వే డివిజనల్ మేనేజర్ గోపాలకృష్ణన్ శుక్రవారం పరిశీలించారు. అధికారు లు, సిబ్బందికి పలు సూచనలిచ్చి పనుల్లో వేగం పెంచాలని ఆదేశించినట్లు అధికారవర్గాలు తెలిపాయి. రైల్వేస్టేషన్ సందర్శన రామగుండం: దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్ డివిజనల్ మేనేజర్ గోపాలకృష్ణన్ స్థానిక రైల్వేస్టేషన్‌ను సందర్శించారు. డీఆర్‌యూసీసీ ప్రతినిధి అనుమాస శ్రీనివాస్ డీఆర్ఎంను మర్యాదపూర్వకంగా కలిసి శాలువా కప్పి సన్మానించారు. పలు రైళ్ల హాల్టింగ్పై వినతిపత్రం అందజేశారు. లోకో పైలెట్ల రెస్ట్రూమ్ ప్రారంభం ఓదెల: కొలనూర్ రైల్వేస్టేషన్ సమీపంలో గార్డులు, లోకోపైలట్ల విశ్రాంతి గదిని డీఆర్ఎం గోపాలకృష్ణన్ ప్రారంభించారు. కొలనూర్‌లో సిర్పూర్కాగజ్నగర్ ఎక్స్‌ప్రెస్, అజ్నీ ప్యాసింజర్ రైళ్లను హల్టింగ్ సౌకర్యం కల్పించాలని సర్పంచులు పల్లె కనుకయ్య, గ్యారవేని విజయ, ఉపసర్పంచ్ పాకాల సంపత్‌రెడ్డి వినతిపత్రం సమర్పించారు. నాయకులు బైరి రవిగౌడ్, మహేందర్, ఢిల్లీ శంకర్, పాకాల కరుణాకర్‌రెడ్డి, నాగపూరి రవిగౌడ్, వార్డుసభ్యుడు రమేశ్ పాల్గొన్నారు. -
కలిసొచ్చిన కీ పాయింట్స్
మంథనిరూరల్: పదో తరగతి విద్యార్థుల కోసం సాక్షి దినపత్రిక అందజేసిన స్టడీ మెటీరియల్ విద్యార్థులకు వరంగా మారింది. ఇందులో పొందుపర్చిన కీ పాయింట్స్ ఆధారంగా అత్యధిక మార్కులు సాధించారు. పెద్దపల్లి జిల్లా మంథని మండలం కన్నాల ప్రభుత్వ జెడ్పీహెచ్ఎస్లో జనవరి 22న సాక్షి స్టడీ మెటీరియల్ పంపిణీ చేశారు. పరీక్షల సమయం సమీపించడంతో చాలామంది సాక్షి స్టడీ మెటీరియల్‌పై ఆధారపడి చదువుకున్నారు. అందులోని కీ పాయింట్స్‌ను చదువుకుని పరీక్షలు రాసి అత్యధిక మార్కులు సాధించారు. ఇందులో ఎస్కే తస్మీరా(545), పొయిల శ్రీవన్(534), బి.రామ్ చరణ్(524) మార్కులు సాధించిచారు. -
శిక్షణకు కార్పొరేటర్లు డుమ్మా!
బల్దియా ఎదుట పార్కింగ్ చేసి ఉన్న రెండు ఏసీ బస్సులుశిక్షణకు హాజరైన కార్పొరేటర్లుకోల్సిటీ: ప్రజాప్రతినిధుల సామర్థ్యాన్ని పెంచేందుకు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ మేనేజ్మెంట్ (ఎన్ఐయూఎం) ఆధ్వర్యంలో పురపాలక పరిపాలన శాఖ తరఫున శిక్షణా కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇటీవల రాష్ట్రంలోని నగర మేయర్లు, మున్సిపల్ చైర్మన్లకు శిక్షణ ఇవ్వగా.. కార్పొరేటర్లు, కౌన్సిలర్లకు బ్యాచ్‌ల వారీగా శిక్షణ ఇచ్చేందుకు మున్సిపాలిటీలను ఎంపిక చేశారు. అయితే గురువారం హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ఇంజినీరింగ్ స్టాఫ్ కాలేజి ఆఫ్ ఇండియా (ఈఎస్సీఐ) మెయిన్ ఆడిటోరియంలో నిర్వహించిన శిక్షణకు రామగుండం నగరపాలక సంస్థ కార్పొరేటర్లు అధిక సంఖ్యలో గైర్హాజరు కావడం చర్చనీయాంశమైంది. డిప్యూటీ మేయర్‌తోపాటు మరో ముగ్గురు కార్పొరేటర్లు మాత్రమే హాజరయ్యారు. అయితే, ఆహ్వానం అందినప్పటికీ అత్యధిక మంది కార్పొరేటర్లు శిక్షణకు హాజరుకాకపోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రజాప్రతినిధులకు ఉపయోగపడే శిక్షణా కార్యక్రమాన్ని ఎందుకు బహిష్కరించారనే దానిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇది అధికారుల సమన్వయ లోపమా? లేక నగరపాలక సంస్థలో నెలకొన్న అంతర్గత విభేదాల ప్రభావమా? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. హాజరుకాని కార్పొరేటర్ల నుంచి మాత్రం ఎలాంటి అధికారిక వివరణ వెలువడలేదు. అయితే మేయర్ మినహా మిగతా 59 కార్పొరేటర్లు సకాలంలో శిక్షణకు వెళ్లడానికి ప్రత్యేకంగా ఆర్టీసీ సంస్థకు చెందిన రెండు ఏసీ రాజధాని బస్సులు ఏర్పాటు చేశారు. గురువారం తెల్లవారుజామున 3 గంటలకే బల్దియా కార్యాలయానికి చేరుకున్నటికీ కార్పొరేటర్లు రాకపోవడంతో మధ్యాహ్నం వరకు కార్పొరేషన్ కార్యాలయం ఎదుటే ఉంచి తిరిగి వెనక్కి పంపించారు. రూ.86 వేల ప్రజాధనం వృథా? ఈ శిక్షణ కోసం రెండు ఆర్టీసీ ఏసీ రాజధాని బస్సులను ఏర్పాటు చేయగా ఒక్కో బస్సుకు రూ.43 వేల చొప్పున మొత్తం రూ.86 వేల మొత్తాన్ని కార్పొరేష న్ ఆర్టీసీకి చెల్లించినట్లు సమాచారం. చివరకు బ స్సులు వినియోగంలోకి రాకపోవడంతో ప్రజాధ నం వృథా అయిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. అసలు కారణమేంటి..? రామగుండం కార్పొరేషన్లో మొత్తం 60 డివిజన్లు ఉండగా, అధికార కాంగ్రెస్‌కు అత్యధికంగా 49 మంది కార్పొరేటర్లు ఉన్నారు. అయినప్పటికీ మెజారిటీ ప్రజాప్రతినిధులు శిక్షణకు హాజరుకాకపోవడం రాజకీయ, పరిపాలనా వర్గాల్లో చర్చకు దారితీసింది. శిక్షణపై నోటీసులు ఇచ్చినా, అనంతరం ఎలాంటి ఫాలోఅప్ లేకపోవడం వల్లే కార్పొరేటర్లు దూరంగా ఉన్నారనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. 59 మందిలో శిక్షణకు హాజరైంది నలుగురే బల్దియా ఆవరణలో నిలిచిన రెండు ఏసీ బస్సులు రూ.86 వేలతో ఏర్పాటు చేసిన బస్సులు వృథా అధికారుల సమన్వయ లోపమా? బల్దియాపై కార్పొరేటర్ల అసంతృప్తా?59 మందిలో పాల్గొన్నది నలుగురే..గురువారం నుంచి ఆగస్టు 4వ తేదీ వరకు నాలుగు బ్యాచ్‌లు విభజించిన ఈ శిక్షణకు తొలిరోజున ఎంపిక చేసిన మున్సిపాలిటీల నుంచి అందరూ పాల్గొనగా, రామగుండం నుంచి డిప్యూటీ మేయర్ పాతపల్లి ఎల్లయ్యతో పాటు కార్పొరేటర్లు దాసరి సాంబమూర్తి, వడ్లూరి రవి, నాగరాజు వారి స్వంత వాహనాల్లో శిక్షణకు హాజరయ్యారు. మరో ఆరుగురు కార్పొరేటర్లు హైదరాబాద్ వెళ్లేందుకు తెల్లవారుజామున బల్దియా కార్యాలయానికి రాగా తక్కువ సంఖ్యలో ఉండడంతో వారి కోసం బస్సును నడపడం సాధ్యం కాదనే సందిగ్ధంలో అధికారులు పడ్డారు. దీంతో వచ్చిన కార్పొరేటర్లు వెనుదిరి ఇంటికి వెళ్లిపోయారు. -
రచ్చ రంబోలా!
సాక్షి, పెద్దపల్లి: జిల్లాలో ఇటీవల రిసార్ట్స్, ఫామ్‌హౌస్‌ల సంస్కృతి వేగంగా విస్తరిస్తోంది. విశ్రాంతి, కుటుంబ వేడుకలు, వీకెండ్ పార్టీలు, పుట్టిన రోజులు, పెళ్లిళ్లు, కార్పొరేట్ ఈవెంట్ల కోసం ఏర్పాటు చేసిన ఈ ప్రాంగణాల్లో కొన్ని చోట్ల నిబంధనలకు విరుద్ధంగా కార్యకలాపాలు సాగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటీవల సుల్తానాబాద్ పరిధిలోని ఓ రిసార్ట్‌లో ఇరువర్గాల మధ్య జరిగిన గొడవ చీలికి చీలికి గాలివానగా మారి, ఏకంగా బౌన్సర్లు రంగ ప్రవేశం చేసి దాడులు చేసుకునే స్థాయికి చేరింది. పోలీసుల పర్యవేక్షణ లోపంతో కొన్ని రిసార్ట్స్, ఫామ్‌హౌస్‌లు అసాంఘిక కార్యకలాపాలకు వేదికగా మారుతున్నాయన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వ్యక్తిగత అవసరాల కోసం నిర్మించిన ఫామ్‌హౌస్‌లను వాణిజ్యపరంగా అద్దెకు ఇస్తుండటంతో పాటు, కొన్ని చోట్ల వ్యభిచారం, మద్యం, మాదకద్రవ్యాల వినియోగం వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలు జరుగుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. శివారు ప్రాంతాల్లో ఉన్న ఈ ఫామ్‌హౌస్‌లపై పర్యవేక్షణ మరింత అవసరమని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ఓపెన్ బార్లుగా మారుతున్న రిసార్ట్స్ పర్యాటకులు రిసార్ట్స్‌లో మద్యం సేవించడం వరకు అభ్యంతరం లేకపోయినా, కొన్ని చోట్ల బహిరంగంగా ఓపెన్ బార్ల తరహాలో మద్యం పార్టీలను నిర్వహిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. సాయంత్రం నుంచి తెల్లవారుజాము వరకు డీజే సౌండ్లు, హైమాస్ట్ లైట్లు, స్మోక్ ఎఫెక్ట్‌లతో పార్టీలు నిర్వహించడం వల్ల సమీప గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. బౌన్సర్ల హంగామా పెళ్లిళ్లు, ప్రైవేట్ ఈవెంట్లలో బౌన్సర్లను నియమించుకోవడం ఫ్యాషన్‌గా మారింది. వాస్తవానికి బౌన్స ర్లు భారీ కార్యక్రమాల్లో భద్రత, జనసందోహ నియ ంత్రణ కోసం నియమించబడతారు. అయితే కొందరు స్టేటస్ సింబల్‌గా వీరిని వినియోగిస్తున్నారు. సెక్యూరిటీ ఏజెన్సీ నిర్వహించాలంటే పీఎస్ఏఆర్ఏ లైసెన్స్ తప్పనిసరి. అయినప్పటికీ కొన్ని నకిలీ ఏజెన్సీలు సరైన ధ్రువీకరణ లేకుండానే బౌన్సర్లుగా నియమిస్తున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. విచ్చలవిడిగా మద్యం పార్టీలునిబంధనల ప్రకారం అనుమతులు పొందిన ఫంక్షన్ హాళ్లలో మాత్రమే నిర్ధిష్ట సమయాల్లో మద్యం వడ్డించేందుకు అవకాశం ఉంటుంది. అయితే కొన్ని ఫామ్‌హౌస్‌లలో ఎలాంటి అనుమతులు లేకుండానే మద్యం పార్టీలు నిర్వహిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. బహిరంగంగా మద్యం సేవించడం చట్టరీత్యా నేరమైనప్పటికీ, ఎకై ్సజ్ శాఖ పర్యవేక్షణ లోపించిందని విమర్శలు వినిపిస్తున్నాయి.వినోదం ముసుగులో వికృతం జిల్లాలో పెరిగిన రిసార్ట్స్, ఫామ్‌హౌస్‌ల కల్చర్ విచ్చలవిడిగా మద్యం పార్టీలు, ఓపెన్ బార్ల తరహా వేడుకలు వ్యవసాయ క్షేత్రాల పేరుతో వాణిజ్య కార్యకలాపాలు -
నేరాల నియంత్రణే లక్ష్యం
ధర్మారం: నేరాల నియంత్రణకు పోలీసు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని పెద్దపల్లి ఏసీపీ కృష్ణ అన్నారు. వార్షిక తనిఖీల్లో భాగంగా గురువారం ధర్మారం పోలీస్‌స్టేషన్‌ను తనిఖీ చేశారు. రికార్డులు, కేసుల నిర్వహణ, పరిపాలన విధానాలను పరిశీలించి తగు సూచనలు చేశారు. ప్రజలకు సత్వర సేవలు అందించడంతో పాటు నేరాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ నేరాల నియంత్రణలో ప్రజల సహకారం ఎంతో కీలకమని అన్నారు. అనుమానాస్పద వ్యక్తులు, ఘటనలపై పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. పెద్దపల్లి సీఐ ప్రవీణ్‌కుమార్, ఎస్సై ప్రవీణ్‌కుమార్, సిబ్బంది పాల్గొన్నారు. పీహెచ్సీ తనిఖీకమాన్పూర్(మంథని): మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా వైద్యాధికారి పవిత్ర గురువారం తనిఖీ చేశారు. ఓపీ, ఫార్మసీ రికార్డులు, గదులను పరిశీలించారు. సిబ్బంది వివరాలు తెలుసుకున్నారు. సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని, వైద్యం కోసం వచ్చే వారికి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. పీహెచ్సీలో సిబ్బంది లేక వైద్యం కోసం వచ్చే వారు ఇబ్బందులకు గురువుతున్నారని డీఎంహెచ్‌వోకు వివరించారు. డీఎంహెచ్‌వో వెంట డిప్యూటీ డీఎంహెచ్‌వో శ్రీరాములు, డాక్టర్ లక్ష్మిభవానీ, సీహెచ్‌వో శ్రీనివాసరెడ్డి, పీహెచ్సీ వైద్యాధికారి సల్మాబేగం, రమాదేవీలున్నారు. నీటి కుంటలు ఏర్పాటు చేసుకోవాలిసుల్తానాబాద్ రూరల్: ఉద్యాన పంటలు సాగు చేసే రైతులు నీటి కుంటలు చేసుకోవాలని జిల్లా ఉద్యాన శాఖ అధికారి శ్యాంప్రసాద్ అన్నారు. సుల్తానాబాద్ ఎంపీడీవో కార్యాయలంలో గురువారం జలసిరిపై నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. ఎల్‌నినో ప్రభావంతో రైతులు నీటి కుంటలు, ఇంకుడు గుంతలు, సామూహిక ఇంకుడు గుంతలు, ప్రతీ గ్రామానికి రెండు చొప్పున నీటి కుంటలు నిర్మించుకునేందుకు వందశాతం రాయితీపై ఉపాధి హామీ పథకంలో ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో ఎంపీడీవో దివ్యదర్శన్, మండల వ్యవసాయ అధికారి పైడి తల్లి, ఏపీవో రాజేశ్వరి, ఎంపీవో మౌనిక, పంచాయతీ కార్యదర్శులు, వ్యవసాయ విస్తరణ అధికారులు, ఉద్యాన విస్తరణ అధికారులు పాల్గొన్నారు. -
రూ.6.50 కోట్లతో మినీ ట్యాంక్‌బండ్
రామగుండం: పట్టణంలోని పెద్దచెరువులో పూడికతీత చేపట్టి రూ.6.50కోట్లతో మినీ ట్యాంక్‌బండ్ అభివృద్ధి చేయనున్నట్లు ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్‌ఠాకూర్ అన్నారు. గురువారం రామగుండంలో జరుగుతున్న అభివృద్ధి పనులను కమిషనర్ అరుణశ్రీ, మేయర్ మహంకాళి స్వామితో కలిసి క్షేత్ర పరిశీలన చేశారు. హౌసింగ్‌బోర్డులో శిథిలావస్థకు చేరి కూలిపోయిన సింగరేణి క్వార్టర్లను పూర్తిగా తొలగించి ఆ ప్రాంతంలో అర్హులైన లబ్ధిదారులకు డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణాలు చేపట్టేందుకు ప్రణాళికలు రూపొందిస్తామన్నారు. గోదావరినది వరకు రహదారి విస్తరణ పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు దీటి బాలరాజు, కార్పొరేటర్ ఇసంపెల్లి అంజులు, దారంగుల కుమార్, కాంగ్రెస్ కార్పొరేషన్ అధ్యక్షుడు బొంతల రాజేశ్, నాయకులు సలీంబేగ్, యూసుఫ్ తదితరులున్నారు. షాపింగ్ కాంప్లెక్స్ పనులు పూర్తి చేయాలి గోదావరిఖని: సింగరేణి షాపింగ్ కాంప్లెక్స్‌తో పాటు అంతర్గత రోడ్లను త్వరగా పూర్తి చేయాలని ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్‌ఠాకూర్ ఆదేశించారు. గురువారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సింగరేణి అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మాట్లాడారు. సింగరేణి ఖాళీ క్వార్టర్ల పరిసరాల్లో పెరిగిపోయిన చెట్ల పొదలు తొలగించి పరిశుభ్రత చర్యలు చేపట్టాలన్నారు. ఆర్జీ–1 జీఎం లలిత్‌కుమార్, సివిల్ డీజీఎం వరప్రసాద్, సింగరేణి శ్రీనివాస్, ఇతర అధికారులు పాల్గొన్నారు. రూ.40లక్షలతో పోచమ్మతల్లి ఆలయ నిర్మాణం దేవాదాయశాఖ ద్వారా రూ.40లక్షల నిధులతో పోచమ్మ తల్లి ఆలయాన్ని సర్వాంగసుందరంగా అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్‌ఠాకూర్ అన్నారు. గురువారం ఆలయాన్ని దర్శించుకొని పూజలు చేశారు. అనంతరం పోచమ్మ ఆలయ నూతన నిర్మాణానికి సంబంధించిన నమూనా చిత్రాన్ని (మోడల్ డిజైన్) ఆవిష్కరించారు. అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి రామగుండం ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ -
విష జ్వరంతో బాలుడి..
జగిత్యాలక్రైం: జగిత్యాల రూరల్ మండలం పొరండ్ల గ్రామానికి చెందిన కాముని వరుణ్‌తేజ (6) విష జ్వరంతో గురువారం మృతిచెందాడు. గ్రామానికి చెందిన కాముని అర్జయ్య, సరిత చిన్న కుమారుడు వరుణ్ తేజ యూకేజీ చదువుతున్నాడు. బుధవారం జ్వరం రావడంతో తల్లి ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లింది. జ్వరం తీవ్రత ఎక్కువగా ఉండటంతో వైద్యులు కరీంనగర్‌కు తీసుకెళ్లాలని సూచించారు. కరీంనగర్లో చికిత్స పొందుతూ మృతిచెందాడు. అదేకాలనీకి చెందిన మరో బాలిక విషజ్వరంతో అపస్మారకస్థితికి వెళ్లింది. జిల్లా వైద్యాధికారి సుజాత, డిప్యూటీ డీఎంహెచ్‌వో శ్రీనివాస్ గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేసి ఇంటింటి సర్వే చేపట్టారు. ఆటో పైనుంచి పడి కార్మికుడు..కరీంనగర్‌క్రైం: నగరంలో డిజిటల్ నేమ్‌బోర్డు ట్రాలీ ఆటోలో తరలిస్తుండగా ఓ కార్మికుడు కిందపడి చనిపోయాడు. వన్‌టౌన్ పోలీసుల వివరాల ప్రకారం సిద్దిపేట జిల్లా అక్కన్నపేటకు చెందిన కామారెడ్డి సురేందర్(45) కోతిరాంపూర్‌లో నివాసముంటూ స్క్రాప్షాపులో పనిచేస్తున్నాడు. గురువారం ఉదయం విధులకు వెళ్లాడు. 11గంటల సమయంలో ఆటోట్రాలీలో భారీ డిజిటల్ నేమ్‌బోర్డు తీసుకెళ్లే క్రమంలో కోతిరాంపూర్‌లో డ్రైవర్ చింతల సిద్దార్థ్ వాహనాన్ని నిర్లక్ష్యంగా, అతివేగంగా నడిపాడు. సురేందర్ ఆటోలోంచి కిందపడి తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు వెంటనే 108 అంబులెన్స్‌లో కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కరీంనగర్ వన్‌టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. పేకాటరాయుళ్ల అరెస్టుమంథని: మంథని మండలం గుంజపడుగు గ్రామంలో పేకాట స్థావరంపై టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడి చేసి నలుగురు వ్యక్తులతో పాటు రూ.43,540 నగదు, 3 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. మరో నిందితుడు అక్కడి నుంచి పరారైనట్లు పోలీసులు తెలిపారు. అతని కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయన్నారు.పట్టుబడిన నిందితులను, స్వాధీనం చేసుకున్న నగదు ఇతర వస్తువులను మంథని పోలీస్‌స్టేషన్ అధికారులకు అప్పగించి, తదుపరి చట్టపరమైన చర్యలు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు. -
‘సర్’ ప్రక్రియ గడువులోగా పూర్తిచేయాలి
జూలపల్లి: ఎన్నికల సంఘం చేపట్టిన ఓటరు ప్రక్రియ సర్‌ను గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. గురువారం మండల కేంద్రంలోని తహసీల్దారు కార్యాలయాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు. సర్ ప్రక్రియ, భూభారతి రీ సర్వే, రిజిస్ట్రేషన్ స్లాట్ బుకింగ్, పెండింగ్ దరఖాస్తులు, సాదాబైనామాలను పరిశీలించి గడువులోగా పూర్తి చేసేందుకు సమన్వయంతో పని చేయాలని సూచించారు. తహసీల్దార్ దత్తు ప్రసాదరావు, సిబ్బంది ఉన్నారు. భూముల రీసర్వే పారదర్శకంగా నిర్వహించాలి ధర్మారం: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూముల రీ సర్వేను ప్రజల భాగస్వామ్యంతో పారదర్శకంగా నిర్వహించాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. ధర్మారం మండలం పైడిచింతలపల్లిలో నిర్వహిస్తూన్న రీ సర్వేను గురువారం పరిశీలించారు. గ్రామసభల ద్వారా రీసర్వే ప్రయోజనాలకు రైతులకు వివరించాలని సూచించారు. అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ సర్వే అండ్ ల్యాండ్ రికార్డు సోమేశ్వర్, మండల సర్వేయర్ శ్రీనివాస్, కృష్ణకాంత్, తిరుపతి తదితరులు పాల్గొన్నారు. తాగునీటి సరఫరాకు ప్రాధాన్యం ఇవ్వాలి పెద్దపల్లి: ఎల్‌నినో పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని జిల్లాలో తాగునీటి సరఫరాను నిరంతరాయంగా కొనసాగించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. గురువారం కలెక్టరేట్లో మిషన్ భగీరథ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో పలు అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. మిషన్ భగీరథ గ్రిడ్‌కు సంబంధించిన పెండింగ్ పనులను ఆగస్టు నెలాఖరు నాటికి పూర్తిచేసి పూర్తిస్థాయిలో తాగునీటి సరఫరాకు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. మిషన్ భగీరథ గ్రిడ్ ఈఈ పూర్ణచందర్, ఇంట్రా ఎస్ఈ గంగాధర శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. బాధ్యతాయుతంగా పనిచేయాలి పారదర్శకమైన సేవలు అందేలా ప్రతీ అధికారి బాధ్యతాయుతంగా పనిచేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. గురువారం పెద్దపల్లిలోని ప్రగతినగర్ ఎంపీపీఎస్ పాఠశాల, ప్రభుత్వ సమీకృత సంక్షేమ బాలికల హాస్టల్ సముదాయం, పెద్దపల్లి ప్రాథమిక పాఠశాల ఆకస్మికంగా తనిఖీ చేసి అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు పెరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. విధులకు ఆటంకాలు కలిగిస్తే ఉపేక్షించం ప్రభుత్వ అధికారుల విధులకు ఆటంకాలు కల్పిస్తే ఉపేక్షించబోమని కలెక్టర్ కోయ శ్రీహర్ష గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. పెద్దపల్లి మండలం రంగాపూర్ గ్రామపంచాయతీ సర్పంచ్ గంట రమేశ్ ప్రభుత్వ అధికారిని విధుల నిర్వహణలో అడ్డుకోవడం, అసభ్యకర, అనుచిత పదజాలంతో దూషించడం, బెదిరింపులకు పాల్పడినట్లు సహాయ కార్యనిర్వహణ ఇంజినీర్, ఎంబీ ఇంట్రా అందజేసిన ఫిర్యాదు మేరకు షోకాజ్ నోటీసు జారీ చేసిశామన్నారు. షోకాజ్ నోటీసు అందిన ఏడు రోజులలోపు లిఖితపూర్వక సంజాయిషీని సమర్పించాలని ఆదేశించినట్లు తెలిపారు. కలెక్టర్ కోయ శ్రీహర్ష -
26న అరుణాచలం యాత్ర
విద్యానగర్(కరీంనగర్): ఆర్టీసీ తీర్థయాత్రల్లో భాగంగా కరీంనగర్ 1 డిపో నుంచి సూపర్ లగ్జరీ బస్సు ఈనెల 26న అరుణాచలం యాత్రకు బయలుదేరుతుందని కరీంనగర్ 1డిపో మేనేజర్ విజయమాధురి తెలిపారు. కరీంనగర్ బస్టాండ్ నుంచి సాయంత్రం 4 గంటలకు బస్సు బయలుదేరి కాణిపాకం, కంచి, అరుణాచలం, శ్రీరంగం, మదురై, రామేశ్వరం, జోగులాంబ దర్శనాలు చేసుకుని ఈనెల 31న సాయంత్రం వరకు కరీంనగర్ చేరుకుంటుందని ఆమె పేర్కొన్నారు. పెద్దలకు రూ.7,300, పిల్లలకు రూ.5,475గా టికెట్ ఉంటుందన్నారు. మరిన్ని వివరాలకు 7382849352, 9959225920 నంబర్లలో సంప్రదించాలని ఆమె పేర్కొన్నారు. ఏపీఏ గనిలో ప్రమాదం.. కాంట్రాక్ట్ కార్మికుడికి తీవ్ర గాయాలురామగిరి: ఏపీఏ గనిలో గురువారం ప్రమాదం చోటు చేసుకుంది. వెన్సర్ కాంట్రాక్ట్ కంపెనీకి చెందిన కాంట్రాక్ట్ కార్మికుడు గుంట మల్లేశ్ తీవ్రంగా గాయపడ్డాడు. గనిలో 3వ సిమ్‌లో రూఫ్ బోల్ట్ ఏర్పాటు చేస్తున్న సమయంలో యంత్రానికి సంబంధించిన బిట్ విరిగి మల్లేశ్ తలపై పడటంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మల్లేశ్‌ను ఆర్జీ–3 ఏరియా సెంటినరికాలనీ డీస్పెన్సరికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యచికిత్స కోసం కరీంనగర్‌లోని ప్రైవేట్ అసుపత్రికి తరలించగా చికిత్స పొందుతున్నాడు. ప్రస్తుతం మల్లేశ్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. ప్రమాదానికి గల కారణాలపై అదికారులు ఆరా తీస్తున్నారు. సినీగాయని జానకి సంతాప సభ గోదావరిఖనిటౌన్: స్థానిక సింగరేణి ఎస్సీ ఎస్టీ సంక్షేమ సంఘం స్ఫూర్తి భవన్లో గోదావరి కళా సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో గురువారం సినీగాయని జానకి సంతాప సభ నిర్వహించారు. ముందుగా జానకి చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. సమాఖ్య అధ్యక్షులు కనకం రమణయ్య, ప్రధాన కార్యదర్శి మాదరి శ్రీనివాస్, పానుగంటి అంజలి, మాధవి, వెంకటేశ్వరరావు, అంజిబాబు, లక్ష్మణ్, రాజేశ్వరరావు, మధునయ్య, లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. ఎస్సీ విద్యార్థులకు మెరుగైన వసతి పెద్దపల్లి: ఇంటర్ చదువుతున్న ఎస్సీ విద్యార్థులకు మెరుగైన వసతి సౌకర్యాలు కల్పిస్తున్నట్లు జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి ఎం.రవీందర్ తెలిపారు. గురువారం జిల్లా కేంద్రంలో ఎస్సీ బాలుర, బాలికల వసతి గృహాలను ప్రారంభించారు. పెద్దపల్లి పట్టణంలోని ప్రభుత్వ, ప్రభుత్వ అనుబంధ కళాశాలల్లో చదువుతున్న అర్హులైన ఎస్సీ విద్యార్థులు ప్రభుత్వం కల్పిస్తున్న వసతి సౌకర్యాలను సద్వినియోగం చేసుకుని ఉన్నత విద్యలో రాణించాలని సూచించారు. సహాయ సాంఘిక సంక్షేమ అధికారి శ్రావణ్ కుమార్, మంథని సహాయ సాంఘిక సంక్షేమ అధికారి వెంకటస్వామి, వసతి గృహ సంక్షేమ అధికారులు సంతోష్, శైలజ పాల్గొన్నారు. -
తహసీల్దార్‌కు రైతు సన్మానం
కాల్వశ్రీరాంపూర్: తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరిగి వేసారిపోయిన ఓ రైతు తన సమస్యను విన్న వెంటనే క్షేత్రస్థాయిలో విచారించి పరిష్కరించడంతో ఆ రైతు తహసీల్దార్ రాపెల్లి రాముడును సన్మానించాడు. మండలంలోని తారుపల్లికి చెందిన మార్త రాజయ్య గ్రామంలోని 401/ఏ సర్వే నంబరులో 1.05 గుంటల భూమి పదేళ్ల కిందట ధరణి పోర్టల్‌లో వేరే రైతు పేరున నమోదైంది. తన భూమి తనపేరున సరి చేయాలని అనేక మంది తహసీల్దార్లను కోరాడు. ఎవరూ తన సమస్య పరిష్కరించలేదు. ఇటీవల వచ్చిన తహసీల్దార్ రాపెల్లి రాముడుకు తన సమస్య విన్నవించాడు. సమస్య విన్న తహసీల్దార్.. ఆర్ఐ వినోద్, జీపీవో అన్వర్‌తో కలిసి గ్రామానికి వెళ్లి క్షేత్రస్థాయిలో పరిశీలించి విచారణ చేశారు. వెంటనే రాజయ్య పేరున భూమి తిరిగి పట్టా చేశాడు. దీంతో ఆ రైతు సంతోషం వ్యక్తం చేస్తూ తహసీల్దార్‌ను సన్మానించాడు. -
విదేశాల్లో ఉద్యోగం ఇప్పిస్తామని మోసం
ఇంద్రవెల్లి(ఆదిలాబాద్): విదేశాల్లో ఉద్యోగం ఇప్పిస్తామని మోసం చేసిన ఇద్దరిని రిమాండ్‌కు తరలించినట్లు ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి ఎస్సై సాయన్న తెలిపారు. గురువారం స్థానిక పోలీసుస్టేషన్లో వివరాలు వెల్లడించారు. ఇంద్రవెల్లి మండలం లాల్‌టెకిడి గ్రామానికి చెందిన జాదవ్ సురేందర్ విదేశాల్లో వెళ్లి ఉద్యోగం కోసం జగిత్యాల జిల్లా వాల్గొండకు చెందిన ఏజెంట్ శ్రీనివాస్‌గౌడ్‌ను సంప్రదించాడు. రూ.4.30 లక్షలు ఖర్చవుతుందని చెప్పి అదే గ్రామానికి చెందిన ఇస్లావత్ ప్రభాకర్‌ను పరిచయం చేశాడు. విదేశాల్లో ఉద్యోగం ఇప్పిస్తామని సురేందర్‌ను నమ్మించారు. గతేడాది జూన్ 11 నుంచి విడతల వారీగా ఇద్దరికి ఫోన్ పే ద్వారా రూ.4,31,800 పంపించాడు. వేర్వేరు కారణాలు చెప్పడంతో మళ్లీ ఫోన్ పే ద్వారా రూ.2.20 లక్షలతో మొత్తం రూ.6,51,800 చెల్లించాడు. డబ్బులు తీసుకుని విదేశాలకు పంపించకుండా తప్పించుకుని తిరుగుతున్నారని, ఫోన్ చేస్తే స్పందించడం లేదని జాదవ్ సురేందర్ ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఏజెంట్ శ్రీనివాస్‌గౌడ్, ఇస్లావత్ ప్రభాకర్‌ను అరెస్ట్ చేశారు. ఉట్నూర్ కోర్టులో హాజరుపర్చగా 14 రోజుల రిమాండ్ విధించినట్లు ఎస్సై తెలిపారు. ఇద్దరి రిమాండ్ -
అందుబాటులోకి మూడో రైల్వే లైన్
రామగుండం: కాజీపేట–బల్హర్షా గ్రాండ్ ట్రంక్ రూట్లో దశాబ్దకాలం వ్యవధిలో మూడో రైల్వేలైన్ నిర్మాణ పనులను ఈనెల 22వ తేదీన పూర్తి చేసి కమిషనర్ ఆఫ్ రైల్వే సెఫ్టీ మాధవి, డీఆర్ఎం గోపాలకృష్ణన్ సమక్షంలో ట్రయల్‌రన్ నిర్వహించిన మీదట పూర్తిస్థాయి అందుబాటులోకి తీసుకువచ్చినట్లు అధికారికంగా ప్రకటించారు. 2015–16 ఆర్థిక సంవత్సరంలో కాజీపేట–బల్హర్ష మధ్య 203 కి.మీ.దూరంలో ట్రిప్లింగ్, విద్యుద్దీకరణ పనులకు అనుమతులు మంజూరయ్యాయి. 203 కిలోమీటర్లు రూ.3,000 వేల కోట్ల వ్యయంతో నిర్మించే మూడో రైల్వేలైన్ రాష్ట్ర పరిధిలో 159 కి.మీ., మహారాష్ట్ర పరిధిలో 44 కి.మీ ఉంది. కాగా తొలుత 2016లో ట్రిప్లింగ్ పనులు ప్రారంభించి రాఘవపురం–మందమర్రి మధ్య 33 కిలోమీటర్ల వ్యవధిలో ట్రిప్లింగ్ పనులు అదే ఏడాది పూర్తి చేశారు. ఈ క్రమంలో దశల వారీగా విభాగాలుగా పనులు నిర్వహిస్తూ ఈనెల 22న చివరగా ఆసిఫాబాద్‌రోడ్–కాగజ్‌నగర్ మధ్యలో పెద్దవాగు బిబ్రానది వంతెన నిర్మాణ పనులు పూర్తి చేసి ట్రాక్ వేగ సామర్‌ాధ్యన్ని పరిశీలించిన మీదట రైల్వే ఉన్నతాధికారుల బృందం పచ్చ జెండా ఊపడంతో గ్రాంట్ రూట్లో మూడవ రైల్వే లైన్ ఓ మైలురాయిగా నిలిచిపోనుంది. కాజీపేట–బల్హార్ష రూట్లో రైల్వే ట్రాక్ రన్నింగ్ సామర్థ్యం 130 కిలోమీటర్లు -
యువకుడి ఆత్మహత్య.. ఉద్రిక్తం
ఎల్లారెడ్డిపేట/సిరిసిల్లటౌన్: ఎల్లారెడ్డిపేట మండలం రాచర్లగొల్లపల్లికి చెందిన యువకుడు పిట్ల వంశీ ఆత్మహత్యతో స్వగ్రామంతోపాటు సిరిసిల్లలో హై అలర్ట్ నెలకొంది. ప్రధాని మోదీ తన మృతికి కారకుడిగా పేర్కొంటూ సూసైడ్‌నోట్ రాయడంతో మృతుడి స్వగ్రామం గొల్లపల్లి, జిల్లా ఆస్పత్రి వద్ద ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల నాయకులు చేరుకోవడంతో పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. ● గొల్లపల్లిలో బీఆర్ఎస్ ర్యాలీ వంశీ ఆత్మహత్య చేసుకోగా.. వారి కుటుంబాన్ని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య పరామర్శించారు. ఆగయ్య మాట్లాడుతూ వంశీని కేంద్ర ప్రభుత్వమే హత్య చేసిందని ఆరోపించారు. పేయింటర్గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకునేవాడని, యువకుడి మృతితో ఆ కుటుంబం వీధిన పడిందన్నారు. యువకుడి కుటుంబానికి మద్దతుగా బీఆర్ఎస్ నాయకులు ఫ్లకార్డులతో ర్యాలీ తీశారు. సింగిల్‌విండో చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి, సెస్ డైరెక్టర్ కృష్ణహరి, సర్పంచ్ కొండ రమేశ్‌గౌడ్, అందె సుభాష్ ఉన్నారు. ● అండగా ఉంటాం వంశీ కుటుంబానికి అండగా ఉంటామని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దొమ్మాటి నర్సయ్య పేర్కొన్నారు. వారి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. గౌస్, శ్రీనివాసరెడ్డి, గుడ్ల శ్రీనివాస్ ఉన్నారు. ● సంగీతం పరామర్శ మృతుడు వంశీ కుటుంబ సభ్యులను జిల్లా ఆస్పత్రి వద్ద డీసీసీ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్ పరామర్శించారు. మృతికి గల కారణాలు తెలుసుకున్నారు. కాగా మార్చురీ గదిలో ఉన్న వంశీ మృతదేహాన్ని చూడటానికి ఆస్పత్రి సెక్యూరిటీ కొద్ది సేపు ఒప్పుకోకపోవడం చర్చనీయాంశమైంది. ● పోలీసుల మోహరింపు తన చావుకు ప్రధాని నరేంద్ర మోదీ కారణమంటూ సూసైడ్ నోట్ రాయడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గొల్లపల్లిలో పోలీసు బలగాలు మోహరించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని గ్రామంలో ఊరేగించాలని యువకులు భావించగా పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు, యువకులకు మధ్య వాగ్వాదం జరిగింది. అనంతరం సర్పంచ్ కొండ రమేశ్‌గౌడ్ జోక్యం చేసుకోవడంతో బస్టాండ్ నుంచి ఇంటి వరకు ర్యాలీగా తీసుకెళ్లారు. రాచర్లగొల్లపల్లి, సిరిసిల్లల్లో బందోబస్తు మృతుడి కుటుంబానికి కాంగ్రెస్, బీఆర్ఎస్ల మద్దతు -
భూగర్భ జలాల పెంపునకు కృషి చేయాలి
ఎలిగేడు: భూగర్భ జలాల పెంపునకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని ఏపీడి సత్యనారాయణ అన్నారు. గురువారం ఎంపీడీవో కార్యాలయంలో వీబీజీ రాంజీ పథకంపై నిర్వహించిన అవగాహన సదస్సులో మాట్లాడారు. డీఆర్పీ అనిల్, ఏపీవో సదానందం, ఎంపీడీవో భాస్కరరావు, ఏపీఎం గీత, వివిధ శాఖల అధికారులు, పంచాయతీ కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు. ఆర్వోబీ, ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణాలకు సహకరించాలిఓదెల: రైల్వేశాఖ మంజూరు చేసిన ఆర్వోబీ, ఫ్లైఓవర్బ్రిడ్జి నిర్మాణాలకు భూనిర్వాసితులు సహకరించాలని పెద్దపల్లి ఆర్డీవో గంగయ్య కోరారు. మండలంలోని శానగొండలో గురువారం సర్పంచు జీల రాజు అధ్యక్షతన గ్రామసభ జరిగింది. శానగొండ–గొల్లపల్లి గ్రామం వద్ద మంజూరైన ఫ్లైఓవర్బ్రిడ్జి, అండర్ బ్రిడ్జి నిర్మాణాలకు స్థల సేకరణ గురించి గ్రామసభ ఏర్పాటు చేసినట్లు ఆర్డీవో తెలిపారు. ప్రస్తుతం ఉన్న భూముల రేట్లకు అనుకూలంగా రేట్లు నిర్ణయించి తమకు న్యాయం చేయాలని పలువురు ఆర్డీవోకు విన్నవించారు. తహసీల్దార్ వనజనాయక్, మాజీ ఎంపీటీసీ జీల తిరుపతి పాల్గొన్నారు.హమాలీలు సిండికేట్ ఎత్తివేస్తేనే రేట్లు పెంచుతాం గోదావరిఖని: హమాలీలు సిండికేట్ ఎత్తివేస్తేనే రేట్లు పెంచుతామని హోల్‌సేల్ వ్యాపారులు అన్నారు. స్థానిక ప్రెస్‌క్లబ్‌లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. హమాలీల సిండికేట్ విధానం మూలంగా హోల్‌సేల్ వ్యాపారులు, రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. సిండికేట్ విధానంతో 30 గంపలు మోసినా, 3గంపలు మోసినా అదే చెల్లింపులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. మార్కెట్లో హమాలీల దౌర్జన్యాలు ఎక్కువయ్యాయని, హమాలీలు సిండికేట్ ఎత్తివేస్తే తప్ప రేట్లు పెంచే ప్రసక్తే లేదన్నారు. సమావేశంలో హోల్‌సేల్ వ్యాపారుల సంఘం నాయకులు పారుపల్లి సదానందం, కుసుమ రవి, నల్ల రవీందర్, జక్కుల లక్ష్మణ్, రవికుమార్, రాజు పాల్గొన్నారు. -
మహిళలకిచ్చిన హామీ మేరకు బస్సు
ఎలిగేడు: రెండున్నర ఏళ్ల క్రితం ఎన్నికల్లో మహిళలకు ఇచ్చిన హామీ మేరకు ముప్పిరితోట గ్రామానికి బస్సు సౌకర్యం కల్పిస్తున్నట్లు ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు అన్నారు. గురువారం ముప్పిరితోటలో డిపో మేనేజర్ కవితతో కలిసి గోదావరిఖని నుంచి ముప్పిరితోట మీదుగా గర్రెపల్లి వరకు నడిచే ఆర్టీసీ బస్సును ప్రారంభించారు. స్వాతంత్య్ర చరిత్రలో ఎన్నో ప్రభుత్వాలు, ఎందరో పాలకులు వచ్చినప్పటికీ పెద్దపల్లిలో ఆర్టీసీ డిపో ఏర్పాటుకు ప్రయత్నించిన దాఖలాలు లేవన్నారు. సీఎం రేవంత్‌రెడ్డిని ఒప్పించి 2024 డిసెంబర్లో పెద్దపల్లిలో నిర్వహించిన బహిరంగ సభలో బస్సు డిపో ఏర్పాటుకు ప్రకటన చేశారని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ అంతటి అన్నయ్యగౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రకాశ్‌రావు, తహసిల్దార్ యాకన్న, ఎంపీడీవో భాస్కర్ రావు, ఇన్చార్జి సర్పంచ్ రాయమల్లు, పలు గ్రామాల సర్పంచులు, మహిళలు, ఆర్టీసీ అధికారులు పాల్గొన్నారు. ప్రభుత్వ విప్ విజయరమణారావు -
వరినాట్లకు వలస కూలీలు
మంథనిరూరల్: ఖరీఫ్ సీజన్లో సరైన వర్షాలు లేక ఆలస్యమైన వరినాట్లు ఒకేసారి ముమ్మరం కావడంతో రైతులు వలస కూలీల వైపు మొగ్గు చూపుతున్నారు. ఒకప్పుడు పక్క గ్రామాల్లోని కూలీలను ఉపయోగించుకోగా రెండేళ్లుగా జిల్లాలోని అనేక గ్రామాల్లో ఇతర రాష్ట్రాలకు చెందిన కూలీలను తీసుకువచ్చి నాట్లు వేయిస్తున్నారు. దీంతో ఇటు సమయం, అటు డబ్బు ఆదా అవుతుందనే అభిప్రాయాలు రైతులు వ్యక్తం చేస్తున్నారు. కూలీల కొరతతో.. వర్షాకాలం ప్రారంభమై ఖరీఫ్ సీజన్ పంటల సాగు మొదలైన క్రమంలో కూలీల కొరత రైతులను వెంటాడుతోంది. నాట్లు వేయడం, కలుపు తీయడంలాంటి పనులకు ఎక్కువగా కూలీలనే వినియోగిస్తుంటారు. ఈసారి వర్షాలు ఆలస్యం కావడం, రెండు రోజులుగా సాగు చేసుకునేలా వర్షం పడటంతో ఒకేసారి నాట్లు మొదలయ్యాయి. ఈ క్రమంలో రైతులకు స్థానిక కూలీలు దొరకపోవడంతో వలస కూలీలతోనే నాట్లు వేయిస్తున్నారు. ఆంధ్రా, బీహార్ నుంచి వలస ఆంధ్రా, బీహార్, ఉత్తర్‌ప్రదేశ్ లాంటి రాష్ట్రాలకు చెందిన కూలీలను ఇక్కడకు తీసుకువచ్చి వరినాట్లు వేయిస్తున్నారు. జూన్, జూలై, ఆగస్టు మాసాల్లో ఆయా రాష్ట్రాల్లో వ్యవసాయ పనులు ప్రారంభం కావు. ఈక్రమంలో ఉపాధి కోసం రెండు మూడేళ్లుగా ఇతర రాష్ట్రాల కూలీలు వలస వచ్చి ఉపాధి పొందుతున్నారు. రెండు మాసాలు ఇక్కడ కూలీలు పని చేసి ఆగస్టు చివరి మాసంలో తమ ప్రాంతాలకు వెళ్లిపోతామని ఓ వలస కూలీ తెలిపారు. ఎకరాకు రూ.5వేలు చెల్లింపు సాధారణంగా వరినాట్ల సమయంలో ఒక్కో కూలీకి రూ.300 నుంచి రూ.400ల వరకు చెల్లించాల్సి ఉంటుంది. ఎకరం పొలాన్ని 10–15 ఒకపూటలో నాటు వేస్తారు. కానీ వలస కూలీలు మాత్రం గుత్తగా ఎకరాకు రూ.5వేలు తీసుకొని నాటు వేస్తారు. ఒకరోజులో వలస కూలీలు పది మంది బ్యాచ్ సుమారు ఐదు ఎకరాల్లో నాటు వేస్తారని చెబుతున్నారు. లోకల్ కూలీలకంటే వలస కూలీలు వేగంగా నాట్లు వేయడం పట్ల రైతులు వారివైపు మొగ్గు చూపుతున్నారు. పద్ధతి ప్రకారం నాటు వేయడంతోనే.. ఆంధ్రా, బీహార్, ఉత్తరప్రదేశ్‌లాంటి రాష్ట్రాల నుంచి వలస వచ్చే కూలీలు నాట్లు వేయడంతో శిక్షణ పొంది ఉంటారు. సాధారణంగా పంట దిగుబడి నాట్లు వేసే పద్ధతిపై కూడా ఆధారపడి ఉంటుందనే అభిప్రాయాలు రైతులు వ్యక్తం చేస్తున్నారు. లోకల్ కూలీల కంటే వలస కూలీలు ఒక్క పద్ధతితో నాట్లు వేస్తారని, దీంతో పంట దిగుబడిపై ప్రభావం ఉంటుందని చెబుతున్నారు. దీంతో ఎక్కువగా రైతులు వలస కూలీలతో నాట్లు వేయించుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. పది ఎకరాల్లో వరి పంట సాగు చేస్తున్న. నాటు వేసేందుకు పొలం జంబు కొట్టి సిద్దం చేసిన. రెండేళ్లుగా వలస కూలీలతోనే నాట్లు వేయిస్తున్న. వారు ఒక పద్ధతిలో నాటు పెడుతరు. దీంతో వరి పంటకు ఎలాంటి తెగుళ్లు రావు. పిలకలను పద్దతిగా నాటకపోతే దోమపోటు వస్తుంది. వలస కూలీలతో నాటు వేయిస్తే ఎలాంటి నష్టం ఉండదు. పంట దిగుబడి కూడా బాగా వస్తుంది. – గుమాసి వెంకటేశ్, రైతు, స్వర్ణపల్లి వ్యవసాయ పనులకు కూలీల కొరత ఆంధ్రా, బీహార్ కూలీలతో వరి నాట్లు ఎకరాకు రూ.5వేలు చెల్లింపు -
ట్రినిటీలో ఫ్రెషర్స్ డే వేడుకలు
కరీంనగర్‌కల్చరల్: ట్రినిటీ జూనియర్ కళాశాలలో 2026–28 విద్యా సంవత్సరానికి ఇంటర్ విద్యార్థులకు ఫ్రెషర్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. అమ్మాయిలు, అబ్బాయిలకు వేర్వేరుగా ఏర్పాటు చేసిన వేదికలపై నిర్వహించిన కార్యక్రమానికి కళాశాల ఫౌండర్, మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. జగిత్యాల డిప్యూటీ కలెక్టర్, ట్రినిటీ పూర్వ విద్యార్థిని కన్నం హరిణి, గ్రూప్–1లో విజయం సాధించిన సందవేణి ప్రియాంక, బింగి కీర్తన ప్రత్యేక అతిథులుగా పాల్గొన్నారు. మనోహర్‌రెడ్డి మాట్లాడుతూ నాణ్యమైన విద్యతో వేలాది మంది విద్యార్థులను ఇంజినీర్లు, వైద్యులు, ఉన్నతాధికారులుగా తీర్చిదిద్దామని తెలిపారు. ట్రినిటీలో చదివిన తన ప్రయాణమే నేటి విజయానికి పునాది అని కన్నం హరిణి పేర్కొన్నారు. అనంతరం గ్రూప్స్‌లో విజయం సాధించిన పూర్వ విద్యార్థులు, రాష్ట్రస్థాయిలో ప్రతిభ కనబర్చిన ఇంటర్ విద్యార్థులు, నీట్, జేఈఈ, ఐఐటీ, ఎన్ఐటీ ర్యాంకర్లు, అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను కళాశాల యాజమాన్యం సన్మానించింది. విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు వేడుకలకు ఆకర్షణగా నిలిచాయి. -
గుండెపోటుతో ఉప్పుమడుగు సీఈవో మృతి
రాయికల్: రాయికల్ మండలం ఉప్పుమడుగు సహకార సంఘం సీఈవో సుతారి తిరుపతి (56) గుండెపోటుతో మృతిచెందాడు. గ్రామానికి చెందిన తిరుపతి ఉదయం విధులకు వెళ్లేందుకు సిద్ధమవుతుండగా ఒక్కసారిగా గుండెపోటు వచ్చింది. గమనించిన కుటుంబ సభ్యులు జగిత్యాలకు తరలిస్తుండగా మార్గంమధ్యలో మృతిచెందాడు. తిరుపతి మృతిపై జిల్లా సహకార సంఘ అధికారి మనోజ్, డీజీఎం సత్యప్రసాద్, మాజీ మంత్రి జీవన్‌రెడ్డి, సహకార సంఘం సీఈవోలు సంతాపం వ్యక్తం చేశారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. -
ఓటరు ఫారం అందలేదా ‘సర్’
పెద్దపల్లిరూరల్: ఓటరు సమగ్ర సర్వే (ఎస్ఐఆర్) ఫారం మీకు అందలేదా? అయితే ఆందోళన పడొద్దు.. మీరు మీ సమీపంలోని తహసీల్దార్ కార్యాలయంలోని ఎన్నికల అధికారి వద్దకు వెళ్లి ఉచితంగానే పొందవచ్చు. జిల్లాలోని ప్రతీ పట్టణం, పల్లెల్లో ఇంటింటికీ తిరిగి బీఎల్వోలు ఎన్యూమరేటర్ దరఖాస్తు ఫారాలు అందించి వాటిని భర్తీ చేసి తిరిగి అప్పగించాలని ఇప్పటికే సూచించారు. అయితే కొంతమంది వలస వెళ్లడం, ఇతరత్రా కారణాలతో ఎన్యూమరేటర్ నుంచి దరఖాస్తు ఫారం పొందని ఓటర్లు ఎలాంటి కంగారు పడకుండా నేరుగా తమ మండల తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి ఓటరు కార్డు వివరాలు చెప్పి ఎన్యూమరేటర్ దరఖాస్తు ఫారాన్ని పొందవచ్చని అధికారులు స్పష్టం చేస్తున్నారు. పెద్దపల్లి పట్టణంతో పాటు మండలంలోని పలు గ్రామాల్లో దరఖాస్తు ఫారం రాని కొందరు తహసీల్దార్ కార్యాలయానికి వస్తే ఆన్లైన్లో వారి వివరాల ఆధారంగా ఫారం డౌన్లోడ్ చేసి అందిస్తున్నామని డీటీ రవీందర్ తెలిపారు. మీసేవ కేంద్రాలకు వెళ్లినా ఆన్లైన్లో వివరాలు నమోదు చేస్తారని పేర్కొన్నారు. అయితే తహసీల్దార్ ఆఫీసుకు రండి -
రైతు భరోసా రూ.161.39 కోట్లు
పెద్దపల్లి: రైతులకు పెట్టుబడి సాయంగా రైతు భరోసా నిధులు బ్యాంకు ఖాతాల్లో జమయ్యాయి. గతంలో లబ్ధిపొందుతున్న 1,53,582 మంది రైతు ల ఖాతాల్లోకి రూ.161.39 కోట్లు (రూ. 1,61,38,59,520) చేరాయి. ఈక్రాప్ నమోదు ఆధారంగా 54 ఎకరాల వరకు సాగు చేస్తున్న రైతులకు పెట్టుబడి సాయంగా రైతు భరోసా నిధులు జమ చేసినట్లు జిల్లా వ్యవసాయ అధికారి శ్రీనివాస్ తెలిపారు. కొత్తగా నమోదైన 1,068 మంది రైతులకు దశల వారీగా నిధులు జమకానున్నాయి. పెట్టుబడి సాయం కీలకం కొన్నేళ్లుగా ఎల్‌నినో ప్రభావం వల్ల వర్షాలు ఆలస్యంగా కురవడం, వర్షపాతం అసమానంగా ఉండటం, సాగు ఖర్చులు పెరగడం వంటి పరిస్థితులు రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల కొనుగోలు వ్యయం పెరిగిన నేపథ్యంలో రైతు భరోసా కింద ప్రభుత్వం అందిస్తున్న పెట్టుబడి సాయం రైతులకు ఉపశమనంగా మారుతోంది. వానాకాలం సాగు ప్రారంభ దశలోనే నిధులు ఖాతాల్లో జమ కావడంతో రైతులు సాగు పనులను వేగవంతం చేసుకునే అవకాశం ఏర్పడింది. మండలాల వారీగా రైతు భరోసా నిధుల వివరాలు మండలం రైతులు రైతుభరోసా పెద్దపల్లి 21,618 రూ.21.48 కోట్లు ధర్మారం 17,852 రూ.17.27 కోట్లు సుల్తానాబాద్ 16,082 రూ.16.05 కోట్లు మంథని 15,588 రూ.18.80 కోట్లు ఓదెల 14,316 రూ.15.88 కోట్లు కాల్వశ్రీరాంపూర్ 14,184 రూ.16.43 కోట్లు జూలపల్లి 10,421 రూ.10.42 కోట్లు ముత్తారం,మంథని 8,184 రూ.9.18 కోట్లు పాలకుర్తి 7,847 రూ.7.65 కోట్లు ఎలిగేడు 7,604 రూ.8.27 కోట్లు రామగిరి 6,370 రూ.7.08 కోట్లు అంతర్గాం 5,965 రూ.6.15 కోట్లు కమాన్‌పూర్ 5,616 రూ.5.11 కోట్లు రామగుండం 1,935 రూ.1.60 కోట్లు 1,53,582 మంది రైతుల ఖాతాల్లో జమ -
విద్యారంగ సమస్యలపై పోరాటం
పెద్దపల్లి: విద్యారంగ సమస్యలు పరిష్కరించే వరకు పోరాటం ఆగదని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బాలసాని లెనిన్ అన్నారు. గురువారం కలెక్టరేట్ ఎదుట విద్యార్థులతో కలిసి ధర్నా నిర్వహించారు. విద్యార్థుల స్కాలర్షిప్, ఫీజురీయింబర్స్‌మెంట్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయులు, లెక్చరర్లు, ఎంఈవో, డీఈఓ పోస్టులను భర్తీ చేయాలని అన్నారు. ఎఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు అర్నకొండ సాయి ఆజాద్, కార్యదర్శి రేణుకుంట్ల ప్రీతం, సహాయ కార్యదర్శి లక్ష్మీప్రసన్న తదితరులు పాల్గొన్నారు. -
మడేలయ్యస్వామి బోనాలు
రామగిరి: బేగంపేటలో రజకులు బుధవారం మడేలయ్యస్వామి బోనాల వేడుక వైభవంగా నిర్వహించారు. రజకవాడ నుంచి భక్తులు సామూహిక బోనాలతో డప్పు చప్పుళ్లతో ఊరేగింపుగా ఆలయానికి తరలివెళ్లారు. స్వామివారికి బోనంతో నైవేద్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. వర్షాలు సమృద్ధిగా కురవాలని, పంటలు బాగా పండాలని వేడుకున్నారు. మాదాసి శ్రీనివాస్, బాలేల్లు పాల్గొన్నారు. పనులు వేగవంతం చేయాలి పెద్దపల్లి: జిల్లా కేంద్రంలోని రైల్వేస్టేషన్ అభివృద్ధిని వేగవంతం చేయాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ మల్కా కొమురయ్య కోరారు. బుధవారం సికింద్రాబాద్‌లోని దక్షిణ మధ్య రైల్వే ప్రధాన కార్యాలయంలో సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాత్సవను కలిసి వినతిపత్రం అందజేశారు. ఎమ్మెల్సీ మాట్లాడు తూ, అమృత్ భారత్ పథకం ద్వారా పెద్దపల్లి రైల్వేస్టేషన్లో చేపట్టిన అభివృద్ధి పనులు ఆలస్యమవుతున్నాయన్నారు. వాటిని వేగంగా పూర్తిచేయాలని కోరారు. జీఎం సానుకూలంగా స్పందించినట్లు కొమురయ్య తెలిపారు. స్వచ్ఛతకు గుర్తింపు ఫెర్టిలైజర్‌సిటీ: స్వచ్ఛత, పచ్చదనంతోపాటు నాణ్యమైన విద్య అందిస్తూ జాతీయస్థాయిలో ‘స్వచ్ఛ ఏవం హరిత విద్యాలయ’ పురస్కారం సాధించిన పాలకుర్తి మండలం ఎల్కలపల్లి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు అనుమ లక్ష్మీనారాయణను పీఆ ర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు పుల్గం దామోదర్‌రెడ్డి బుధవారం స్కూల్లో సన్మానించారు. దామోదర్‌రెడ్డి మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాల రూ పురేఖలు మార్చి, జాతీయస్థాయిలో గుర్తింపు తేవడం గర్వకారణమన్నారు. అనంతరం పీఆర్టీయూ సభ్యత్వ నమోదు చేపట్టారు. యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి కానుగంటి శ్రీనివాస్, నాయకులు, టీచర్లు పాల్గొన్నారు. పత్తి పంట పరిశీలన కమాన్‌పూర్: వివిధ గ్రామాల్లో సాగైన పత్తి పంటను రామగిరి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త లు వెంకన్న, కిరణ్ బుధవారం పరిశీలించారు. పత్తి మొక్కలపై త్రిప్స్(పురుగు) ఉధృతి ఉందని, దానినివారణకు చర్యలు చేపట్టాలని రైతులకు సూచించారు. శాస్త్రవేత్తల వెంట ఏవో రామకృష్ణ, ఏఈవో రామకృష్ణ ఉన్నారు. అలవెన్స్‌ల కోసం ఆందోళన రామగుండం: తమ డిమాండ్ల సాధన కోసం రన్నింగ్ స్టాఫ్(లోకోపైలెట్లు) బుధవారం స్థాని క రైల్వేప్లాటఫారమ్పై ఆందోళన చేపట్టారు. దక్షిణ మధ్య రైల్వే మజ్దూర్ యూనియన్ జాతీ య కమిటీ పిలుపు మేరకు నిరసన తెలిపారు. తమకు సైన్ ఆన్ నుంచి సైన్ ఆఫ్ వరకు కనీ సం 120 కిలోమీటర్ల అలవెన్స్ చెల్లించాలనే డిమాండ్ చేశారు. మజ్దూర్ యూనియన్ ప్రతినిధులు, లోకోపైలెట్లు ఓవై స్వామి, మోజెస్, రాథోడ్ ఆనంద్, రఘు, మధు, రామారావు, కుమార్, రమేశ్ తదితరులు పాల్గొన్నారు. సమస్యలు పరిష్కరించండి పెద్దపల్లిరూరల్: కేజీబీవీ, యూఆర్ఎస్, ఎస్ఎ స్ఏ ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని టీఎస్‌యూటీఎఫ్ నాయకులు లక్ష్మణ్, రహీముద్దిన్ డిమాండ్ చేశారు. ఎంఈ వో ఆఫీసు ఎదుట బుధవారం సీఎంకు పోస్టుకార్డులు రాసి నిరసన తెలిపారు. మినిమం టైంస్కేల్ ఇవ్వాలని, సెలవులు వర్తింపజేయాలని కోరారు. సమ్మెకాలపు జీతాలు విడుదల చే యాలని కోరారు. నాయకులు శ్రీలత, శ్రీనివా స్, సంధ్యారాణి, సంపత్, రజని పాల్గొన్నారు. -
దోమల దండుయాత్ర
సాక్షి, పెద్దపల్లి/కోల్‌సిటీ: జిల్లాలో నాలుగు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. వర్షపునీరు ఎక్కడపడితే నిల్వ అవుతోంది. దోమలు వృద్ధి చెందుతున్నాయి. ప్రజలు జ్వరాల బారినపడుతున్నారు. దోమల నివారణకు చర్యలు చేపడుతున్నామని అధికారులు చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో అవేమీ కనిపించడంలేదు. చర్యలు శూన్యం జిల్లాలో రామగుండం కార్పొరేషన్‌తోపా టు పెద్దపల్లి, మంథని, సుల్తానాబాద్ మున్సిపాలిటీలు ఉన్నాయి. దోమల నియంత్రణ చర్యలు ఎక్కడా కనిపించడం లేదు. రామగుండంలో పరి స్థతి మరింత దారుణంగా ఉంది. వాటి నివారణకు అవసరమైన రసా యనాలులేవు. యంత్రాలు, రసాయనాల కొనుగోలు, మిషన్ల నిర్వహణ పేరిట ఏటా రూ.లక్షలు ఖర్చు చేస్తున్నట్లు రికార్డుల్లో ఉన్నా.. క్షేత్రస్థాయిలో వాటిజాడ కనిపించడం లేదు. రామగుండంలో మరీ అధ్వానం రామగుండం నగరంలో దోమల నివారణ చర్యలు అటకెక్కాయి. ఎక్కడపడితే అక్కడ నీటినిల్వ పెరిగి దోమలు వృద్ధి చెందుతున్నాయి. అక్కడ మలాథియన్ వంటి రసాయనం పిచికారీ చేయడం, ఆయిల్‌బాల్స్ వేయడం, గంబూషియా చేపలు వదలడం వంటి పనులు చేపట్టడమేలేదు. మూలనపడిన యంత్రాలు.. నగరంలో మూడు భారీఫాగింగ్ యంత్రాలకు ఆటోట్రాలీలు ఏర్పాటు చేశారు. ఇందులో ఒకటి సాంకేతి క సమస్యలతో మూలనపడింది. మిగతావి కండీషన్లో ఉన్నా.. ఫాగింగ్ చేయడంలేదు. హ్యాండ్ ఫాగింగ్ మిషన్లు కూడా గదికే పరిమితమయ్యాయి. డెంగీ ముప్పు.. కానరాని స్పెషల్ డ్రైవ్.. డెంగీ, మలేరియా, చికున్‌గున్యా ముప్పు పొంచిఉన్నా దోమల నివారణకు ఇప్పటివరకు జిల్లాలో ఎక్కడా స్పెషల్ డ్రైవ్ చేపట్టిన దాఖలాలు లేవు. కొన్ని ప్రాంతాల్లో బ్లీచింగ్ పౌడర్ చల్లడానికే సిబ్బంది పరిమితమవుతున్నారు. మూలనపడిన ఫాగింగ్ యంత్రాలు కాగితాలకే పరిమితమైన నివారణ చర్యలు జిల్లావ్యాప్తంగా వృద్ధి చెందుతున్న దోమలు ప్రజల జేబుకు చిల్లు దోమల నివారణకు ప్రతీ కుటుంబం నెలకు రూ.1,000 నుంచి రూ.1,500 వరకు ఖర్చు చేస్తోంది. ప్రధానంగా లిక్విడ్లు, కాయిల్స్, అగరొత్తులు, బ్యాట్లు, దోమతెరలు కొనుగోలు చేస్తూ ఆర్థికంగా ఇబ్బందులు పడుతోంది. వీటితోపాటు జ్వరాలు వస్తే వైద్య ఖర్చులు భారంగా మారుతున్నాయి. -
తుపాకీతో బెదిరించి.. దుప్పటితో బంధించి
కరీంనగర్‌క్రైం: నిషిరాత్రిలో నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. పీఎంజే జువెల్లరీస్ దోపిడీ ఘటన నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న సమయంలో మంగళవారం అర్ధరాత్రి మరో భారీచోరీ జరిగింది. భగత్‌నగర్‌లోని ఓ ఇంట్లో చొరబడిన దుండగులు ఇంట్లోవారిని డమ్మీ తుపాకీతో బెదిరించి, ఆపై బంధించి పెద్ద ఎత్తున చోరీకి పాల్పడ్డారు. వన్‌టౌన్ పోలీసుల వివరాల ప్రకారం.. నగరంలోని భగత్‌నగర్‌లో అజ్మత్‌అలీ భార్య మహముదా బేగం, ఇద్దరు కుమార్తెలతో నివాసం ఉంటున్నాడు. మంగళవారం అర్ధరాత్రి సుమారు 12 గంటలకు ఇంటి ఆవరణలో లైట్లు ఆఫ్ చేసేందుకు బయటకొచ్చాడు. అప్పటికే కారిడార్‌లో మాటువేసి ఉన్న 6 నుంచి 8మంది గుర్తు తెలియని దుండగులు అలీపై దాడి చేశారు. డమ్మీ తుపాకులు, కత్తులతో బెదిరించారు. హాల్లోకి ఈడ్చుకెళ్లి బెడ్షీట్లతో బంధించారు. నోటికి గుడ్డ కట్టి టీవీ శబ్దాన్ని పెంచారు. బెడ్రూమ్లో ఉన్న మహముదా బేగం, ఇద్దరు కుమార్తెలనూ అదే విధంగా బంధించారు. అల్మారా తెరిచి రూ.25 లక్షల నగదు, 54 తులాల బంగారం, 30 తులాల వెండి, రెండు ఖరీదైన సెల్ఫోన్లు అపహరించారు. ఇంట్లో అద్దెకుంటున్న వినోద్, మహ్మద్ గౌసోద్దీన్లకు చెందిన రెండు బైక్‌లను తీసుకుని పరారయ్యారు. మెల్లిగా తేరుకున్న బాధితులు బంధువులు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. వన్‌టౌన్ పోలీసులు అక్కడికి చేరుకుని బాధితులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అనంతరం చోరీ జరిగిన ఇంట్లో దర్యాప్తు చేపట్టారు. క్లూస్ టీం, డాగ్‌స్క్వాడ్, ఫోరెన్సిక్ నిపుణులు వేలిముద్రలు, పాదముద్రలు, ఇతర ఆధారాలను సేకరించారు. దుండగులు వదిలివెళ్లిన డమ్మీ తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. నిందితులు యూపీ– ఢిల్లీ ప్రాంతానికి చెందినట్లుగా, హిందీలో మాట్లాడినట్లు బాధితులు పోలీసులకు వివరించారు. తెలిసినవారి హస్తం ఉందా? ఇంట్లో ఉన్న నగదు, బంగారాన్ని నిందితులు నేరుగా వెళ్లి చోరీచేసిన తీరు, కుటుంబ సభ్యుల కదలికలపై వారికున్న స్పష్టమైన అవగాహనను బట్టి బాధితులకు అత్యంత సన్నిహితంగా ఉన్న వ్యక్తి సమాచారం ఇచ్చి ఉండొచ్చనే అనుమానాలను పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. పరిశీలించిన సీపీ గౌస్ ఆలం ఘటనాస్థలాన్ని సీపీ గౌస్ ఆలం, అడిషనల్ డీసీపీ వెంకటరమణ, ఏసీపీ వెంకటస్వామి పరిశీలించారు. దోపిడీ జరిగిన తీరుపై ఆరా తీశారు. నిందితులను పట్టుకునేందుకు ఎనిమిది ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. దుండగులు నగరంలోకి ఏ మార్గంలో వచ్చారు..? దోపిడీ అనంతరం ఏ దిశగా వెళ్లారు, దొంగిలించిన బైక్‌లను ఎక్కడ వదిలివేశారు అనే అంశాలపై దర్యాప్తు చేస్తున్నారు. ఘటనా స్థలం పరిసరాల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు పనిచేయకపోవడం దర్యాప్తునకు ప్రతిబంధకంగా మారింది. సమీపంలోని ప్రధాన రహదారులు, కూడళ్లు, టోల్‌ప్లాజాలు, పెట్రోల్ బంకుల వద్ద ఉన్న సీసీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. వరంగల్ వైపుగా పారిపోయిన నిందితులు నిందితులు దొంగతనం అనంతరం వరంగల్ వైపు వెళ్లినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నా రు. రెండు వాహనాలపై ఐదుగురు వెళ్లి సిరిసిల్ల బై పాస్ రోడ్డులో ఉన్న బంక్‌లో పెట్రోల్ పోయించుకున్నట్లు గుర్తించారు. వరంగల్ రూట్లో పెద్దపాపయ్యపల్లి వరకు వెళ్లి అక్కడ నుంచి గ్రామీణరోడ్ల గుండా ప్రయాణించినట్లు అనుమానిస్తున్నారు. మొత్తం 8 మంది వచ్చి ఉంటే, ఐదుగురు మాత్రమే రెండు బై కులపై వరంగల్ వైపునకు వెళ్తే.. మిగితా ముగ్గురు ఎటువైపు వెళ్లారనేదానిపై విచారణ చేస్తున్నారు. -
సొంతూరులోనే ఓటు
పెద్దపల్లి: ఓటరు జాబితా ప్రత్యేక సవరణ (సర్) ప్రక్రియ జిల్లాలో వేగంగా సాగుతోంది. ఇంటింటా సర్వే చేస్తున్న బీఎల్వోలు.. ప్రతీ ఓటరును కలుసుకుని వివరాలు ధృవీకరించుకుంటున్నారు. మరణించి, శాశ్వతంగా వలస వెళ్లిన, ఒకటికన్నా ఎక్కువచోట్ల ఓటుహక్కు కలిగి ఉన్నవారి వివరాలు గుర్తించి ఓటరు జాబితా నుంచి తొలగించే చర్యలు చేపడుతున్నారు. తల్లిగారింటి వద్ద తొలగింపులు.. వివాహానంతరం అత్తగారింటి వద్ద ఓటుహక్కు నమోదు చేసుకున్న మహిళల విషయంలో తల్లిగారి ఇంటి వదకద ఓటును తొలగిస్తున్నారు. ఉపాధి కోసం వల సవచ్చి జిల్లాలో నివసిస్తున్న వారు తమ ఓటు ఎక్కడ కొనసాగించాలనుకుంటున్నారో తెలుసుకుని నమోదు చేస్తున్నారు. వెరి ఫికేషన్ పూర్తయ్యాక అర్హులైన వారిపేర్లతోనే తుది ఓటరు జాబితా సిద్ధం చేయనున్నట్లు ఎన్ని కల అధికారులు తెలిపారు. స్వగ్రామాల్లో నమోదు చేసుకునేలా.. ప్రభుత్వ ఉద్యోగులు స్వగ్రామాల్లోనే ఓటుహక్కు నమోదు చేసుకునేలా అవగాహన కల్పిస్తున్నారు. విధులు నిర్వర్తిస్తున్న ప్రాంతాల్లో ఓటు నమోదు చేసుకోవడంతో గ్రామాల్లో ఓటర్ల సంఖ్య తగ్గుతున్నట్లు అధికారులు గుర్తించి ఈ నిర్ణయం తీసుకున్నారు. సింగరేణి ఉద్యోగులపై ప్రత్యేక దృష్టి పెద్దపల్లి నియోజకవర్గానికి చెందిన సింగరేణి ఉద్యోగులు గోదావరిఖని, రామకృష్ణాపూర్, బెల్లంపల్లి, మంచిర్యాలతోపాటు కాగజ్‌నగర్, మహారాష్ట్రలోని వివిధ ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్నారు. వీరిలో కొందరికి ఉద్యోగ ప్రాంతంతోపాటు స్వగ్రామంలోనూ ఓటు నమోదై ఉండటాన్ని బీఎల్వోలు గుర్తిస్తున్నారు. ఆధార్ అనుసంధాన ప్రక్రియలో భాగంగా వారు ఓటును ఏ ప్రాంతంలో కొనసాగించాలనుకుంటున్నారో వివరాలు సేకరిస్తున్నారు. దీంతో డబుల్ ఓట్ల తొలగింపుతోపాటు గ్రామాల్లో ఓటర్ల సంఖ్యలో మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు. రెండేసి ఓట్లు చట్టవిరుద్ధం ఒక వ్యక్తికి ఒకేచోటే ఓటుహక్కు ఉండా లని ఎన్నికల అధికారులు స్పష్టం చేస్తున్నా రు. సొంతూరు, ఉద్యోగ ప్రాంతాల్లో రెండుచోట్ల ఓటరుగా నమోదు చేసుకోవడం చట్టవిరుద్ధమని హెచ్చరిస్తున్నారు. అలాంటి వారు స్వచ్ఛందంగా ఒక ఓటును తొలగించుకోవాలని సూచిస్తున్నారు. రెండేసి ఓట్లకు చెక్ -
సమస్యల్లో ఠాణా
పెద్దపల్లిరూరల్: జిల్లా కేంద్రమైన పెద్దపల్లిలో 2025 జూన్ 13న సీఎం రేవంత్‌రెడ్డి మహిళా పోలీస్‌స్టేషన్‌తోపాటు ట్రాఫిక్, పెద్దపల్లి రూరల్, ఎలిగేడు ఠాణాలను ప్రారంభించిన విషయం విదితమే. ఠాణాలు ఏర్పాటయ్యాయి అంతే.. ఇప్పటివరకు పాలనాపరమైన అనుమతులు మాత్రం మంజూరు కాదు. పోలీస్ అధికారులు, సిబ్బందిని కూడా పూర్తిస్థాయిలో నియమించలేదు. వీరిలో దాదాపు చాలామంది డిప్యుటేషన్‌పైనే విధులు నిర్వర్తిస్తున్నారు. రూ.29 లక్షలతో తాత్కాలిక షెడ్డు, టాయిలెట్లు కుటుంబ తగాదాలతో స్టేషన్‌ను ఆశ్రయిస్తున్న మహిళలు కనీస సౌకర్యాలు లేక అనేక ఇబ్బందులు పడుతున్నారు. వాటిని దూరం చేసేందుకు ప్రభు త్వ విప్ విజయరమణారావు సూచనతో కలెక్టర్ ప్రత్యేక నిధుల్లోంచి రూ.29 లక్షలు వెచ్చించారు. వీటితో షెడ్డు, టాయిలెట్లు నిర్మించారు. తద్వారా బాధిత మహిళలకు ఊరట కలిగినట్లయ్యింది. డిప్యుటేషన్‌పైనే విధులు కొత్తగా ఏర్పాటైన మహిళా ఠాణాతోపాటు ట్రాఫిక్, రూరల్, ఎలిగేడు పోలీసుస్టేషన్లకు అవసరమైన పో లీస్ అధికారులు, సిబ్బంది నియామక ప్రక్రియ ఇంకా పూర్తికాలేదు. ప్రజాసేవలకు ఆటంకం కలుగకుండా వీలుగా పోలీస్ అఽధికారులు, సిబ్బందిని డిప్యుటేషన్‌పై నియమించారు. మహిళా పోలీస్‌స్టేషన్ సీఐగా రమేశ్‌బాబును ఎస్బీ నుంచి కేటాయించారు. ఈయనతోపాటు మరో ముగ్గురు ఎస్సైలు (ఇందులో ఒకరు ప్రసూతి సెలవులో ఉన్నారు), ముగ్గురు ఏఎస్సైలు, 8మంది కానిస్టేబుళ్లు, ఓ హెడ్‌కానిస్టేబుల్ సేవలు అందిస్తున్నారు. వీరితోనే పోలీస్‌స్టేషన్‌లో కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారు. ఏడాదిలో 1,550 ఫిర్యాదులు జిల్లాలోని వివిధ మండలాలు, గ్రామాల నుంచి ఏ డాదిలో 1,550 వరకు పోలీసులకు ఫిర్యాదులు అందాయి. ఇందులో భార్యాభర్తల గొడవలు, కుటుంబ తగాదాలు ఉన్నాయి. వీటిలో 190 కేసులు నమోదు చేసిన అధికారులు.. మిగతా కేసుల్లో కౌన్సెలింగ్ ఇచ్చి నచ్చజెప్పి పంపించారు. ప్రతీరోజు మహిళా పోలీస్‌స్టేషన్ ప్రాంతం దంపతుల మధ్య ఏర్పడ్డ అభిప్రాయ భేదాలు, తగదాలను పరిష్కరించేందుకు వచ్చే కుటుంబీకులు, వారి పెద్దమనుషులతో కిటకిటలాడుతూ కనిపిస్తోంది. ఏడాదిలో 1,550 ఫిర్యాదులు నమోదైనవి 190 కేసులు తరలివస్తున్న బాధితులు డిప్యుటేషన్‌పై అధికారులు ఫిర్యాదుదారులకు తప్పని తిప్పలు రెగ్యులర్ సిబ్బందిని నియమించాలని వినతి -
కేంద్ర విద్యా శాఖ మంత్రి రాజీనామా చేయాలి
మంథని: నీట్ పరీక్ష పేపర్ లీకేజ్ వ్యవహారంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే డిమాండ్‌తో స్థానిక అంబేడ్కర్ చౌరస్తాలో ప్రజాసంఘాల ఆధ్వర్యంలో బుధవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న విద్యార్థులు, యువతపై పోలీసులు చేసిన దాడిని ఖండిస్తూ ఆందోళన చేపట్టారు. నాయకులు మాట్లాడుతూ, నీట్ పేపర్ లీకేజీ దేశవ్యాప్తంగా విద్యార్థుల భవిష్యత్‌ను అనిశ్చితిలోకి నెట్టిందన్నారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై టియర్ గ్యాస్, వాటర్ కెనాన్లు, రబ్బర్ బుల్లెట్లు ప్రయోగించడం కిరాతక చర్య అని విమర్శించారు. ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు ఆర్ల సందీప్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బూడిద గణేశ్, నాయకులు అఖిల్, మహేందర్, రణధీర్, మనోజ్, సాయి కిరణ్, రామ్ చరణ్ తదితరులు పాల్గొన్నారు. -
బీజేపీది లీకేజీల పాలన
పెద్దపల్లిరూరల్: ‘ప్రధాని నరేంద్రమోదీ పాలనలో ‘నీట్’ ప్రశ్నాపత్రం లీకేజీ అయింది.. విద్యార్థుల కష్టమంతా వృథా అయింది.. వారి జీవితాలతో కేంద్రప్రభుత్వం చెలగాటమాడుతోంది’ అని ప్రభుత్వ విప్ విజయరమణారావు దుయ్యబట్టారు. కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్‌గాంధీ, ప్రియాంకగాంధీ అరెస్టులను నిరసిస్తూ, కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీ నామా చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లాకేంద్రంలోని కమాన్ చౌరస్తా వద్ద రాజీవ్ రహదారిపై కాంగ్రెస్ శ్రేణులు, ప్రజాప్రతినిధులతో కలిసి విప్ బుధవారం బైఠాయించారు. యువతకు ఉద్యోగావకాశాలు కల్పిస్తారని ప్రధాని మోదీపై పెట్టుకున్న ఆశ లు అడియాసలయ్యాయన్నారు. విద్యార్థుల న్యా యమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. పెద్దపల్లి, సుల్తానాబాద్ మున్సిపల్ చైర్మన్లు మల్లయ్య, రాధాకృష్ణతోపాటు మార్కెట్ కమిటీ చైర్మన్లు కూర మల్లారెడ్డి, ప్రకాశ్‌రావు, తిరుపతిరెడ్డి, సింగిల్‌విండో చైర్మన్లు ముత్యాల నరేశ్, రాజేశ్వర్‌రెడ్డి, సతీశ్, జానీ తదితరులు పాల్గొన్నారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తే ఊరుకునేదిలేదు గోదావరిఖని: ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని డీసీసీ అధ్యక్షుడు, రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్‌ఠాకూర్ హెచ్చరించారు. ఎన్ఎస్యూఐ ఆధ్వర్యంలో స్థానిక రాజీవ్ రహదారిపై చేపట్టిన ధర్నాలో రాజ్‌ఠాకూర్ మాట్లాడారు. రాజ్యాంగం ప్రతీ పౌరుడికి శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు కల్పించిందని, ప్రజల తరఫున ప్రశ్నించే ప్రతిపక్ష నేతను అరెస్ట్ చేయడం అప్రజాస్వామికమన్నారు. కార్యక్రమంలో మేయర్ మహంకాళి స్వామి, డిప్యూటీ మేయర్ పా తిపెల్లి ఎల్లయ్య, కాంగ్రెస్ కార్పొరేషన్ అధ్యక్షుడు బొంతల రాజేశ్ తదితరులు పాల్గొన్నారు. యువతకు ఉద్యోగాలు ఇవ్వడంలో విఫలం నిరసన తెలిపేందుకు వస్తే అక్రమ అరెస్టులా..? కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్, ప్రియాంక అరెస్టుపై నిరసన రాజీవ్ రహదారిపై బైఠాయించిన ప్రభుత్వ విప్ విజయరమణారావు -
గురువారం శ్రీ 23 శ్రీ జూలై శ్రీ 2026
దొంగల బీభత్సంఉమ్మడి జిల్లాలో దొంగలు బీభత్సం సృష్టించారు. పీఎంజే జువెల్లరీ దోపిడీ మరవక ముందే గంటల వ్యవధిలో కరీంనగర్, వేములవాడలో హల్చల్చేశారు. మంగళవారం అర్ధరాత్రి కరీంనగర్‌లోని భగత్‌నగర్‌లోని ఓ ఇంట్లో దుందగులు చొరబడి కుటుంబ సభ్యులను డమ్మీ తుపాకీతో బెదిరించారు. ఆపై బంధించి పెద్ద చోరీకి పాల్పడ్డారు. రూ.25 లక్షల నగదు, 54 తులాల బంగారం, 30 తులాల వెండి, రెండు ఖరీదైన సెల్ఫోన్లు ఎత్తుకెళ్లారు. ఇంటి ఎదుట పార్క్చేసిన రెండు బైక్‌లను తీసుకుని పరారయ్యారు. ఈ వాహనాలను బుధవారం పోలీసులు హుజూరాబాద్ పరిసరాల్లో గుర్తించారు. మరో ఘటనలో నగరంలోని వావిలాలపల్లి తులసీనగర్‌లో మధ్యాహ్నం ఓ ఇంట్లోకి చొరబడిన గుర్తుతెలియని వ్యక్తులు రూ.4.80 లక్షలు దొంగలించారు. ఇదే రోజు రాజన్నసిరిసిల్ల జిల్లా వేములవాడలో మూడు నిమిషాల్లో రూ.3.50 లక్షలు చోరీకి గురయ్యాయి. బైక్ ట్యాంక్ కవర్లో పెట్టిన డబ్బులను నిమిషాల్లో మాయం చేశారు. ఆంధ్ర–తమిళనాడు సరిహద్దులోని తల్లగడ ప్రాంతానికి చెందిన అంతర్రాష్ట్ర దొంగల ముఠా పనేనని పోలీసులు అనుమానిస్తున్నారు. జాతరగ్రౌండ్‌లో కూడా దుండగులు హల్చల్ చేశారు. మూసివేసి ఉన్న ఆరు డేరాషాపుల్లోరాత్రిచోరీకి పాల్పడ్డారు. – కరీంనగర్ క్రైం/వేములవాడ – వివరాలు 8లోu -
కాపుకాసిన మృత్యువు
● ఆగిఉన్న లారీని ఢీకొట్టిన డీసీఎం ● ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఇద్దరు దుర్మరణం ● వారిద్దరూ మంచిస్నేహితులు జ్యోతినగర్: నిశీథిలో మృత్యువు కాపుకాసింది. రోడ్డు ప్రమాదంలో ఇద్దరిని బలి తీసుకుంది. పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీ వద్ద రాజీవ్ రహదారిపై బుధవారం తెల్లవారు జామున జరిగింది. ఆగిఉన్న లారీని డీసీఎం వ్యాను వెనుకనుంచి ఢీకొట్టింది. ఈ ఘటనలో ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందిన చెందిన ఇద్దరు స్నేహితులు(డ్రైవర్, క్లీనర్) దుర్మరణం చెందారు. వాహనాల్లో ఇరుక్కున్న వారిని రక్షించేందుకు గోదావరిఖని వన్ టౌన్ సీఐ ఇంద్రసేనారెడ్డి, రామగుండం సీఐ కృష్ణకుమార్, ఎన్టీపీసీ ఎస్సై ఉదయ్‌కిరణ్, పోలీసులు నాలుగు గంటల పాటు శ్రమించినా ఫలితం దక్కలేదు. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. గోదావరిఖని వైపు నుంచి హైదరాబాద్ వెళ్తున్న లారీ టైర్ ఎన్టీపీసీ క్రషర్‌నగర్ వద్ద బుధవారం వేకువజామున పంక్చర్ అయ్యింది. అప్పటికే వర్షం కురుస్తోంది. డ్రైవర్ పుష్పేంద్ర గోండ్, క్లీనర్ అనురాగ్ సింగ్ మరమ్మతులు చేస్తుండగా, అదే సమయంలో ఛత్తీస్‌ఢ్ నుంచి బఠాణీల లోడుతో డీసీఎం వ్యాన్ హైదరాబాద్ వైపు వెళ్తోంది. చీకటిగా ఉండడం, వర్షం కురుస్తుండడంతో ఆగిఉన్న లారీని గమనించక వెనకాలే వేగంగా వచ్చిన డీసీఎం వ్యాన్ ఢీకొట్టింది. ఘటనలో వ్యాన్‌లోని డ్రైవర్ మనోహర్(26), క్లీనర్ సూర్యవంశీ(23) క్యాబిన్లో ఇరుక్కుపోయారు. భారీశబ్దం రావడంతో అప్రమత్తమైన స్థానికులు డయల్ 100కు సమాచారం అందించారు. సీఐలు ఇంద్రసేనారెడ్డి, కృష్ణకుమార్ ఘటనా స్థలానికి వెంటనే చేరుకున్నారు. నాలుగు గంటల పాటు శ్రమించినా వాహనంలో ఇరుక్కున్నవారిని కాపాడలేకపోయారు. రెండు క్రేన్ల సాయంతో బయటకు తీసి పోస్ట్‌మార్టం నిమిత్తం గోదావరిఖని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మనోహర్, సూర్యవంశీ స్నేహితులు. మనోహర్ తండ్రి నకుల్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు సీఐ కృష్ణకుమార్ తెలిపారు. వర్షంలోనూ సీఐలు, ఎస్సైతోపాటు హెడ్ కానిస్టేబుళ్లు పురుషోత్తం, కృష్ణారెడ్డి, కానిస్టేబుళ్లు అంజి, వినయ్, హోంగార్డు మనోహర్, హెచ్‌కేఆర్ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టడాన్ని స్థానికులు అభినందించారు. -
పట్టాలపై ఇరుక్కున్న లారీ
పెద్దపల్లిరూరల్: పెద్దపల్లి–కూనారం రైల్వే లె వల్ క్రాసింగ్ గేట్ వద్ద బుధవారం రాత్రి ధా న్యం లారీ పట్టాల మధ్య ఇరుక్కుంది. లారీ క దలకపోవడంతో ఆ సమయంలో వస్తున్న కేర ళ, జైపూర్, భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను పరిసర ప్రాంతాల్లోనే నిలిపివేశారు. స్థానికుల సా యంతో లారీని పట్టాలపై నుంచి తొలగించేందుకు దాదాపు అర్ధగంట పాటు ఇబ్బంది పడ్డా రు. ఎలాగోలా లారీ పట్టాలపై నుంచి బయట కు రావడంతో రైళ్ల రాకపోకలను పునరుద్ధరించారు. రైల్వేగేట్‌ను వారం క్రితం మూసిఉంచిన అధికారులు.. పట్టాల మరమ్మతు చేపట్టారు. స్లీపర్లను మార్చే పనులు పూర్తికావడంతో బుధవారం సాయంత్రమే గేటు తెరిచారు. కాసేటికే ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. కుప్పకూలిన రైస్మిల్లుపెద్దపల్లి: జిల్లాలోని బుధవారం ముసరువానకు కురిసింది. సుల్తానాబాద్ మండలం కాట్నపల్లిలోని సాయి సరస్వతి బాయిల్డ్ రైస్‌మిల్లు గోడలు కుప్పకూలినట్లు కార్మికులు తెలిపారు. గోదాములో నిల్వచేసిన ధాన్యం తడిసి ముద్ద య్యింది. సుమారు రూ.3కోట్లకు పైగా నష్టం వాటిల్లినట్లు యజమాని శ్రీకాంత్ అధికారులకు విన్నవించారు. సమాచారం అందుకున్న రైస్‌మిల్లు అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు తిరుపతిరెడ్డి, మండల అధ్యక్షులు విజయ్‌పాల్‌రెడ్డి, చీటి సతీశ్‌రావు కేశవరావు తదితర అధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ‘ఎల్లంపల్లి’లోకి ఇన్‌ఫ్లో రామగుండం: రెండు రో జులుగా ఎగువన కురుస్తున్న వర్షాలతో బుధ వారం ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి స్వల్పంగా ఇన్ ఫ్లో వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీ టినిల్వ సామర్థ్యం 20.175 టీఎంసీలు కాగా ప్రస్తుతం 7.87 టీఎంసీలు ఉంది. ఇన్‌ఫ్లో 1,808 క్యూసెక్కులు కాగా ఔట్‌ఫ్లో 396 క్యూసెక్కులుగా ఉంది. ఎన్టీపీసీకి 121 క్యూసెక్కులు, హైదరాబాద్ తాగునీటి అవసరాలకు 275 క్యూసెక్కులు పంపింగ్ చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. భారీ త్రివర్ణ పతాకంతో ర్యాలీ రామగిరి: జాతీయ పతాక దినోత్సవాన్ని పురస్కరించుకుని కల్వచర్లలోని ఓ పాఠశాల ఆధ్వర్యంలో 500 మీటర్ల పొడవైన త్రివర్ణ పతాకంతో బుధవారం అవగాహన ర్యాలీ నిర్వహించా రు. ఎస్సై శ్రీనివాస్ జెండా ఊపి ర్యాలీ ప్రారంభించారు. మన జాతీయ పతాకం దేశ సమైక్యత, స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలు, సార్వభౌమత్వానికి ప్రతీక అని ఎస్సై అన్నారు. పాఠశాల ఇన్చార్జి కొప్పుల గోవర్ధన్, ఉపాధ్యాయులు వీర్రాజు, రవీందర్, దేవదాస్, ఇందిరా, రజిత, బిందు తదితరులు పాల్గొన్నారు. -
బీఆర్ఎస్ నేతలపై అక్రమ కేసులు
రామగిరి: మంథని నియోజకవర్గంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలనే లక్ష్యంగా చేసుకుని అక్రమ కేసులు నమోదు చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ ఆరోపించారు. నాగేపల్లి గ్రామంలో ఏఎంసీ మాజీ చైర్మన్ పూదరి సత్యనారాయణగౌడ్ నివాసంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆనాడు మంత్రిగా ఉన్నప్పుడు తనపై అనేక కేసులు పెట్టించడంతోపాటు చివరకు రౌడీషీట్ ఓపెన్ చేయించిన కీర్తి దుద్దిళ్లకే దక్కుతుందని, ప్రస్తుతం ప్రజల పక్షాన బీఆర్ఎస్ నాయకత్వం కోసం అహర్నిశలు కృషి చేస్తున్న పూదరి సత్యనారాయణపై 20కేసులు పెట్టించాడని ఆరోపించారు. భవిష్యత్‌లో తాము అధికారంలోకి రావడం ఖాయమని, ఈ కేసులపై సమీక్షించి తగిన చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అద్యక్షుడు శంకేశీ రవీందర్, మంథని కౌన్సిలర్ మాచిడి రాజుగౌడ్, నాయకులు మ్యాదరబోయిన కుమార్‌యాదవ్, కాపురబోయిన భాస్కర్, జాపతి శేఖర్, బొంకూరి పోచం, వేగోలపు శంకర్‌గౌడ్, సైండ్ల సత్యనారాయణ, సాన సురేశ్ తదితరులు పాల్గొన్నారు. -
దొంగిలించిన బైక్‌ల గుర్తింపు
దోపిడీ కేసు దర్యాప్తులో కీలక పరిణామం చోటుచేసుకుంది. దుండగులు ఎత్తుకెళ్లిన రెండు బైక్‌లు హుజూరాబాద్ మండలం పెద్దపాపయ్యపల్లి శివారులోని ఎస్సారెస్పీ కాలువ సమీపంలో లభ్యమయ్యాయి. గ్రామ శివారులో అనుమానాస్పదంగా రెండు బైక్‌లు ఉన్నాయని గ్రామస్తులు సమాచారం ఇవ్వడంతో వెంటనే హుజూరాబాద్ ఏసీపీ వాసంశెట్టి మాధవి, సీఐలు జి.కరుణాకర్, శ్రీనివాస్ పరిశీలించారు. దోపిడీకి పాల్పడిన ముఠా హుజూరాబాద్ ప్రాంతానికి చెందినదేనా? లేక పోలీసులను తప్పుదారి పట్టించేందుకు ఉద్దేశపూర్వకంగా బైక్‌లను అక్కడ వదిలేసిందా? అనే కోణాల్లో విచారణ కొనసాగిస్తున్నారు. కరీంనగర్ నుంచి హుజూరాబాద్ వరకు ఉన్న మానకొండూరు, శంకరపట్నం, హుజూరాబాద్ పోలీస్స్టేషన్ల పరిధిలోని సీసీ కెమెరాల ఫుటేజీలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఉప్పల్, జమ్మికుంట, బిజిగిరి షరీఫ్ రైల్వే స్టేషన్లు, ఆర్టీసీ బస్టాండ్లలోని సీసీ కెమెరా దృశ్యాలను విశ్లేషిస్తూ నిందితుల కదలికలను గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. రెక్కీ చేశారా? నగర నడిఒడ్డున ఉండే భగత్‌నగర్‌కు నేరుగా వచ్చి దోపిడీ చేయడంపై అనుమానం వ్యక్తం అవుతోంది. దోపిడీకి ముందుగానే కొద్దిరోజులు రెక్కీ చేశారా అని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అంత నగదు, బంగారం బాధితులు ఇంట్లో ఎందుకు పెట్టుకోవాల్సి వచ్చిందనే కోణాల్లోనూ దర్యాప్తు కొనసాగుతోంది. కీలకంగా సర్జికల్ గ్లౌజ్ నిందితులు దోపిడీకి సర్జికల్ గ్లౌజులు వాడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. సర్జికల్ గ్లౌజ్ ముక్కలు లభ్యమైనట్లు తెలిసింది. దీని ఆధారంగా నిందితులు అప్పటికప్పుడే గ్లౌజులు కొని ఉంటారనే కోణంలో నగరంలోని అన్ని మెడికల్‌షాపుల సీసీ ఫుటేజీలు పరిశీలిస్తున్నారు. గతంలో హుజూరాబాద్ ప్రాంతంలో జరిగిన బంగారం దోపిడీ నిందితుడిని సర్జికల్ గ్లౌజ్ పట్టించింది.హుజూరాబాద్ సమీపంలో పోలీసులు స్వాధీనం చేసుకున్న బైక్‌లు -
బీఆర్ఎస్ అధికారంలోకి రావడమే లక్ష్యం
● పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గోదావరిఖని: రాబోయే ఎన్నికల్లో కేసీఆర్‌ను సీఎం చేయడమే లక్ష్యంగా పనిచేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచించారు. హైదరాబాద్‌లోని కేసీఆర్ నివాసంలో మాజీమంత్రి కొప్పుల ఈశ్వర్, మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్, సీనియర్ నాయకులు కౌశిక హరి, వ్యాళ్ల హరీశ్‌రెడ్డితో కేటీఆర్ బుధవారం ప్రత్యేకంగా సమావేశమయ్యారు. రామగుండం నియోజకవర్గంలో నెలకొన్న అంతర్గత విభేదాలు, పార్టీ కార్యకలాపాల నిర్వహణ తదితర అంశాలపై చర్చించారు. గ్రూపు రాజకీయాలకు స్వస్తిపలికి, పార్టీ బలోపేతమే లక్ష్యంగా సమన్వయంతో పనిచేయాలని కేటీఆర్ ఆదేశించారు. మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌కు తెలియకుండా పార్టీ కార్యక్రమాలు నిర్వహించవద్దని సూచించారు. మాజీ మంత్రికొప్పుల ఈశ్వర్ నాయకులు, కార్యకర్తల మధ్య సమన్వయం నెలకొల్పి పార్టీ కార్యక్రమాలు సమర్థవంతంగా నిర్వ హించేలా చర్యలు తీసుకోవాలని కేటీఆర్ సూచించారు. -
ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముట్టడి
పెద్దపల్లిరూరల్: దేశద్రోహులతో కుమ్మకై ్క మనదేశాన్ని ముక్కలు చేసేందుకు కాంగ్రెస్ కుట్రలు చేస్తోందని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లె సదానందం, రాష్ట్ర నాయకుడు నల్ల మనోహర్‌రెడ్డి ఆరోపించారు. ఢిల్లీలో ప్రధాని ఇంటిఎదుట కాంగ్రెస్ నేతలు ధర్నా చేయడాన్ని నిరసిస్తూ బీజేపీ పట్టణ, మండల అధ్యక్షుడు రాకేశ్, రమేశ్ ఆధ్వర్యంలో బుధవారం స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించారు. రాహుల్‌గాంధీ దిష్టిబొమ్మ దహనం చేశారు. స్కాంల కాంగ్రెస్‌ను గద్దెదింపిన ప్రజలు నరేంద్రమోదీ సారథ్యంలో అందిస్తున్న నీతివంతమైన పాలనను చూసి వరసగా మూడుసార్లు అధికారం అప్పగించారని అన్నారు. నాయకులు శివంగారి సతీశ్, రాజం మహంత, సమ్మయ్య, ఈర్ల శంకర్, తిరుపతి, వెల్లంపల్లి శ్రీనివాసరావు, మేకల శ్రీనివాస్, మంథెన కృష్ణ, సతీశ్, ఉప్పు కిరణ్, మనోహర్, రాజు, సురేందర్, అఖిల్, సందీప్, మధుకర్, అనిల్, అంజి, శివ, ఫహీం తదితరులు పాల్గొన్నారు. -
నిలిచిన టీ హబ్ వాహనాలు
పెద్దపల్లి: ఆస్పత్రులు, పీహెచ్‌సీల నుంచి రక్తనమూనాలు సేకరించి టీ హబ్‌కు తరలించే వాహనాలు మంగళవారం నుంచి నిలిచిపోయాయి. ఏడు నెలలుగా వాహన అద్దె చెల్లించకపోవడంతో యజమానులు సేవలను నిలిపివేశారు. ప్రభుత్వ వైద్యసేవలపై ఆధారపడే పేషెంట్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోజూ రక్తం, మూత్రం, తెమడ తదితర నమూనాలు సేకరించి టీ హబ్‌కు తరలించే బాధ్యతను 4 వాహనాలు నిర్వహిస్తున్నాయి. వీటిఆధారంగా 56 రకాల వైద్య పరీక్షలు నిర్వహించి ఫలితాలను సంబంధిత వైద్యులకు, పేషెంట్లకు అందజేస్తారు. ప్రస్తుతం వాహన సేవలు నిలిచిపోవడంతో పరీక్షల ప్రక్రియకు అంతరాయం ఏర్పడింది. రోజూ 800 నుంచి 2,500 నమూనాల రవాణా జిల్లాలోని 17 ప్రాథమిక, 6 అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 3 కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, రామగుండం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రితోపాట, గోదావరిఖనిలో రెండు, పెద్దపల్లిలో రెండు బస్తీ దవాఖానాల నుంచి రోజూ రక్తనమూనాలు సేకరించి టీ హబ్‌కు పంపిస్తారు. సగటున 800 నుంచి 2,500 వరకు నమూనాలు సేకరించి వాహనాల ద్వారా చేరవేస్తున్నారు. అక్కడ బయోకెమిస్ట్రీ, మైక్రోబయాలజీ, పాథాలజీ తదితర విభాగాల్లో 56 రకాల పరీక్షలు నిర్వహిస్తారు. పరీక్షల ఫలితాలు ఆన్లైన్ ద్వారా వైద్యులకు అందుబాటులోకి రావడంతో వాటి ఆధారంగా చికిత్స అందిస్తున్నారు. ఏడు నెలలుగా బకాయి ప్రతీవాహనానికి నెలకు రూ.33 వేల చొప్పున అద్దె చెల్లించాల్సి ఉంది. 7 నెలలుగా చెల్లింపులు లేవని వాహన యజమానులు తెలిపారు. వాహనాల నిర్వహణ, డ్రైవర్ల వేతనాలు, ఇంధన ఖర్చులు భరించడం కష్టంగా మారిందని పేర్కొన్నారు.ఈ నేపథ్యంలో సేవలు నిలిపివేస్తున్నట్లు టీ హబ్ మేనేజర్ శ్రీవాణికి వినతిపత్రం అందజేశారు. సీజనల్ వ్యాధుల సమయంలో ఆందోళన జిల్లాలో వర్షాలు కురుస్తుండటంతో వైరల్ జ్వరాలు, డెంగీ, మలేరియా, జలుబు, ఇతర సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది. ఈ పరిస్థితుల్లో రక్తపరీక్షలు కీలకంగా మారాయి. వాహనాల సేవలు నిలిచిపోవడంతో ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే పేద రోగులకు సకాలంలో పరీక్షలు, ఫలితాలు రాక ఇబ్బందులు తలెత్త అవకాశం ఉందని వైద్య వర్గాలు పేర్కొంటున్నాయి. -
నీటి సంరక్షణ పనులు చేపట్టాలి
పెద్దపల్లి: తెలంగాణ జలసిరి, వీబీజీ రాంజీ ద్వారా జిల్లాలో నీటి సంరక్షణ చర్యలు పెద్దఎత్తున చేపట్టాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. జలసిరి, వీబీజీ రాంజీ పథకాల అమలుపై ఎంపీడీవోలతో కలెక్టర్ తన కార్యాలయంలో బుధవారం సమీక్షించారు. వీబీజీ రాంజీని సమర్థవంతంగా వినియోగిస్తూ గ్రామాల్లో నీటి సంరక్షణ నిర్మాణాలు చేపట్టాలన్నారు. ప్రధానంగా నీటికుంటలు, ఇంకుడుగుంతలు, ఊటకుంటలు, బోరుబావుల రీచార్జి చేయాలని సూచించారు. ఆగస్టు ఒకటో తేదీ పనులు చేయాలని చెప్పారు. సూపర్ ఎల్‌నినో పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రతీనీటి చుక్కను ఒడిసిపట్టాలని అన్నారు. జెడ్పీ సీఈవో నరేందర్, డీఆర్డీవో కాళిందిని, జిల్లా వ్యవసాయాధికారి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
55 అడుగులతో మెయిన్ రోడ్డు విస్తరణ
పెద్దపల్లిరూరల్: జిల్లా కేంద్రంలోని మెయిన్ రోడ్డు విస్తరణపై బుధవారం స్పష్టత వచ్చింది. పట్టణాభివృద్ధిలో భాగంగా మెయిన్ రోడ్డును 66 అడుగులకు విస్తరించాలని అధికారులు నిర్ణయించగా.. వ్యాపారుల నుంచి వ్యతిరేకత వ్యక్తమైన విషయం తెలిసిందే. అటు, ఇటు చర్చలు జరిపిన నేపథ్యంలో బుధవారం ప్రభుత్వ విప్ విజయరమణారావు, మున్సిపల్ చైర్మన్ మల్లయ్య, కమిషనర్ వెంకటేశ్, కౌన్సిలర్ల సమక్షంలో వ్యాపారులతో చర్చించారు. 55 అడుగుల మేర రోడ్డు విస్తరణ చేపట్టాలన్న వ్యాపారుల అభ్యర్థనను మున్సిపల్ పాలకమండలి అంగీకరించింది. నోటీసులు జారీ చేస్తాం – వెంకటేశ్, మున్సిపల్ కమిషనర్ జిల్లా కేంద్రంలోని మెయిన్‌రోడ్డు విస్తరణను 55 ఫీట్లతో విస్తరించనున్నాం. ఇందుకు గాను 55 ఫీట్ల మేర హద్దులు నిర్ణయించి మార్కింగ్ చేస్తాం. ఇళ్ల యజమానులకు గురువారం నోటీసులు జారీచేస్తాం. 15రోజులపాటు గడువు ఇచ్చి ఆ తదుపరి నిర్మాణాలు ఉంటే కూల్చి విస్తరణ పనులు చేపడతాం. -
మూత్రవిసర్జన చేస్తుండగా నాగుపాము కాటు
పెద్దపల్లి: ఇంటిముందు మూత్ర విసర్జనకు వెళ్లిన పసి బాలుడు పాముకాటుకు బలైన ఘటన ధర్మపురిలో విషాదం నింపింది. పోలీసులు, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. పట్టణంలోని దుర్గమ్మకాలనీకి చెందిన ముస్కు రాజవ్వకు కుమారుడు లోకేశ్ (4) ఉన్నాడు. రాజవ్వ కొత్తగా ఇల్లు కట్టుకుని ఇటీవలే గృహ ప్రవేశం చేసింది. ఆ ఇంట్లోనే తల్లితో కలిసి లోకేశ్ సోమవారం రాత్రి పడుకున్నాడు. మంగళవారం ఉదయం లేచి ఇంటిముందు మూత్ర విసర్జనకు వెళ్లాడు. అదే సమయంలో నాగుపాము బాలుడి కాలుపై కాటు వేసింది. అతని తాత సాంబయ్య గమనించి చికిత్స నిమిత్తం ముందుగా స్థానికంగా ఉన్న ప్రైవేట్ ఆస్పత్రికి తరలించాడు. పరిస్థితి విషమించడంతో జగిత్యాల తరలించేందుకు 108కు సమాచారం అందించారు. అంబులెన్సులో ఎక్కిస్తుండగానే బాలుడు మృతిచెందాడు. లోకేశ్ ఓ ప్రైవేట్ పాఠశాలలో యూకేజీ చదువుతున్నాడు. ఒక్కగానొక్క కొడుకు పాముకాటుతో చనిపోవడంతో ఆ తల్లి గుండలవిసేలా రోధించింది. రాజవ్వ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై మహేశ్ తెలిపారు. -
చిన్న నిర్లక్ష్యం.. మూడు కుటుంబాల్లో విషాదం
గంభీరావుపేట(సిరిసిల్ల): ఆ ఇళ్లలో ఒక్కగానొక్క కొడుకులు.. కుటుంబాలకు అండగా నిలవాల్సిన వయస్సు.. భవిష్యత్‌పై ఎన్నో కలలు.. కానీ, విధి ఒక్క క్షణంలో అన్నింటినీ ఛిద్రం చేసింది. కామారెడ్డి జిల్లా పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదం మూడు కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది. నెల రోజుల క్రితం జరిగిన కారు ప్రమాదంలో సంఘటన స్థలంలో గంభీరావుపేట మండలకేంద్రానికి చెందిన కోట అనిల్, రెండ్రోజుల తర్వాత ఆస్పత్రిలో అన్వేశ్గౌడ్ మృతిచెందారు. నెల రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో యువకుడు దుంపల వికాస్ మంగళవారం మృతిచెందాడు. దీంతో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. ఇంటి నుంచి బయలుదేరినప్పుడు త్వరగా వస్తాం.. అని చెప్పిన మాటలే వారి చివరి మాటలయ్యాయి. తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తుండగా.. కుటుంబసభ్యులు దుఃఖాన్ని దిగమింగుకోలేకపోతున్నారు. చిన్న నిర్లక్ష్యం.. అతివేగం.. మూడు ప్రాణాలను బలితీసుకుంది. ఆ ముగ్గురి కోసం ఎదురుచూసిన ఇళ్లలో ఇప్పుడు నిశ్శబ్దం రాజ్యమేలుతోంది. రోడ్డు ప్రమాదంలో మొన్న ఇద్దరు.. చికిత్స పొందుతూ నేడు మరో యువకుడు మృతి -
విద్యా ప్రమాణాల పెంపు ఎన్టీపీసీ లక్ష్యం
జ్యోతినగర్: ఎన్టీపీసీ ప్రభావిత, పునరావాసాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను పెంపు లక్ష్యంగా కృషి చేస్తున్నామని దీప్తి మహిళా సమితి అధ్యక్షురాలు రాఖీ సా మంత అన్నారు. మేడిపల్లి సెంటర్ సమీప వృత్తి విద్యా శిక్షణా కేంద్రంలో ప్రభుత్వ పాఠ శాలల విద్యార్థులకు సీఎస్సార్ ద్వారా 10,000 మంది విద్యార్థులకు మంగళవారం నోట్‌బుక్ పంపిణీ చేశారు. ఎంఈవో మల్లేశం హాజరయ్యారు. రాఖీ సామంత మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు విద్యను ప్రోత్సహించడంలో ఎన్టీపీసీ నిరంతర ప్రయత్నాలు చేస్తోందన్నారు. దీప్తి మహిళా సమితి సభ్యులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
వేగంగా సర్ ప్రక్రియ : ఆర్డీవో గంగయ్య
పెద్దపల్లిరూరల్: స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(ఎస్ఐఆర్) ప్రక్రియలో వేగం పెంచాలని ఆర్డీవో గంగయ్య ఆదేశించారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో మంగళవారం తహసీల్దార్ రాజయ్య, డెప్యూటీ తహసీల్దార్ విజేందర్‌తో కలిసి బీఎల్వోలతో సమీక్షించారు. అర్హులైన ఓటర్ల పేరు జాబితాలో ఉండాలని, పొరపాట్లు లేకుండా సర్వే చేపట్టాలని సూచించారు. ప్రతీఓటరు ఎన్యూమరేటర్ ఇచ్చిన దరఖాస్తు పూర్తిచేసి వారికే ఇవ్వాలని తెలిపారు. ఫారం అందని వారు నేరుగా తహసీల్దార్ ఆఫీసులో పొందవచ్చన్నారు. పూర్తిఆధారాలతో నేరుగా మీ సేవ కేంద్రాల్లోనూ ఉచితంగానే తమ వివరాలు నమోదు చేసుకునే వీలుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ రవీందర్ తదితరులు పాల్గొన్నారు. -
ఉరేసుకుని సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఆత్మహత్య
జీడిమెట్ల: మానసిక వేదనతో ఓ వ్యక్తి ఉరివేసుకుని అత్మహత్య చేసుకున్న సంఘటన హైదరాబాద్‌లోని జీడిమెట్ల పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ రవికుమార్ వివరాల ప్రకారం పెద్దపల్లి జిల్లా మంథనికి చెందిన శ్రీరామోజు దక్షిణమూర్తి కొడుకు చందు(34)కు 2017లో అదే ప్రాంతానికి చెందిన సంధ్యతో వివాహమైంది. చందు సంధ్యతో కలిసి చింతల్ గాంధీనగర్‌లో నివాసముంటూ సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. వారం క్రితం దంపతుల మధ్య గొడవ జరిగింది. సంధ్య ఇద్దరు కుమార్తెలను తీసుకుని పుట్టింటికి వెళ్లింది. చందు సోమవారం సాయంత్రం సంధ్యకు ఫోన్ చేసి అత్మహత్య చేసుకుంటున్నానని చెప్పాడు. అనంతరం సీలింగ్ ఫ్యాన్‌కు ఉరి వేసుకున్నాడు. సంధ్య హైదరాబాద్‌లో ఉండే బంధువులకు విషయాన్ని తెలపగా, వారువెళ్లి చూసేసరికి చందు మృతిచెంది ఉన్నాడు. దక్షిణమూర్తి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. మేడిపల్లి: ఇంటి నిర్మాణ పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తు కాలుజారి కింద పడి ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందిన ఘటన మండలంలోని కొండాపూర్‌లో చోటుచేసుకుంది. ఎస్త్సె శ్రీధర్‌రెడ్డి కథనం ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకాశం జిల్లా పామూరు మండలం వగ్గంపల్లికి చెందిన బల్లారపు రవీంద్ర (31) ఉపాధి నిమిత్తం కొండాపూర్‌కు వచ్చి కొన్ని రోజులుగా భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తున్నాడు. మంగళవారం ఓ యజమాని ఇంటికి ఎలివేషన్ పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తు కింద పడటంతో అక్కడికక్కడే మృతి చెందాడు. రవీంద్ర తండ్రి బల్లారపు నర్సయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ● ద్విచక్రవాహనం నుంచి రూ.లక్ష మాయం ● పోలీస్‌స్టేషన్‌లో బాధితుడి ఫిర్యాదు కోరుట్ల: పట్టణంలోని ఇందిరారోడ్లో ఉన్న బ్యాంకులో రూ.లక్ష డ్రా చేసి.. ద్విచక్రవాహనంపై వెళ్తుండగా బస్టాండ్ వద్ద గుర్తు తెలియని దొంగలు డబ్బులు ఎత్తుకెళ్లిన ఘటన మంగళవారం చోటు చేసుకుంది. మేడిపల్లి మండలం దమ్మన్నపేటకు చెందిన కొక్కెర రాజం కోరుట్లలోని బ్యాంకు నుంచి రూ.లక్ష డ్రా చేశాడు. బస్టాండ్ వద్ద వాహనం ఆపి పక్కనే చాయ్ తాగేందుకు వెళ్లాడు. వచ్చి చూసే సరికి డబ్బులు కనిపించలేదు. దీంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చిరంజీవి తెలిపారు. ● వలస కూలీ అక్కడికక్కడే మృతి మల్యాల: కట్టెల లోడుతో వెళ్తున్న ట్రాక్టర్‌ను వ్యాన్ వెనుక నుంచి ఢీకొన్న ఘటనలో ట్రాక్టర్‌పై కూర్చున్న కూలీ ఎగిరిపడి తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందిన ఘటన మండలంలోని కరీంనగర్ – జగిత్యాల రహదారిపై చోటుచేసుకుంది. బల్వంతాపూర్ నుంచి కట్టెల లోడుతో జగిత్యాల వైపు వెళ్తున్న ట్రాక్టర్‌ను మంగళవారం ఉదయం కరీంనగర్ నుంచి జగిత్యాల వైపు వెళ్తున్న వ్యాన్ వెనక నుంచి ఢీకొంది. ఈ సంఘటనలో ట్రాక్టర్‌పై కూర్చున్న కూలీ మానెపల్లి పోచయ్య (45) ఎగిరి రోడ్డుపై పడ్డాడు. వ్యాన్ అతడిపై నుంచి వెళ్లడంతో తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. వ్యాన్‌లో ఉన్న వెల్గటూర్‌కు చెందిన రాజ్ మహమ్మద్ గాయపడ్డాడు. అతడిని 108లో జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కట్టెలు అన్లోడింగ్ చేసేందుకు వెళ్తూ... మంచిర్యాల జిల్లా భీమిని మండలకేంద్రానికి చెందిన పోచయ్య కుటుంబంతో సహా బల్వంతాపూర్‌కు పన్నెండేళ్ల క్రితం వలస వచ్చి కూలీగా పనిచేస్తున్నాడు. ట్రాక్టర్లో కట్టెలు వేసుకుని అన్లోడ్ చేసేందుకు వెళ్తుండగా రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. మృతుడికి భార్య విజయ, కూతురు స్రవంతి, కుమారుడు వినయ్ ఉన్నారు. విజయ ఫిర్యాదు మేరకు వ్యాన్ డ్రైవర్ కృష్ణశంకర్పై కేసు నమోదు చేశామని ఎస్సై సందీప్ తెలిపారు. కాళేశ్వరం: పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన ఓ కానిస్టేబుల్ ఓ గుర్తుతెలియని యువతితో కలిసి మహదేవపూర్ మండలం కాళేశ్వరంలోని ఓ ప్రైవేట్ లాడ్జిలో గది అద్దెకు ఉన్నట్లు అనుమానించిన భార్య, సోదరుడు కాళేశ్వరం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మంగళవారం సెల్ లొకేషన్ ఆధారంగా కాళేశ్వరంలోని ఓ లాడ్జిలో సెర్చింగ్ చేపట్టగా కానిస్టేబుల్ ఉన్నట్లు కనుగొన్నారు. దీంతో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకొని ఠాణాకు తరలించి విచారించి పంపినట్లు తెలిపారు. ఈ విషయమై మహదేవపూర్ సీఐ వెంకటేశ్వర్లును ఫోన్లో సంప్రదించగా.. అతను లాడ్జి గదిలో ఒక్కడే ఉన్నాడని, యువతి ఎవరూ లేరని తెలిపారు. అతనికి కౌన్సెలింగ్ ఇచ్చి పంపించినట్లు తెలిపారు. -
సర్‌లో మీపేరుందా?
జ్యోతినగర్: ఓటరు జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియ(సర్) కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో చాలామంది ఓటర్లు తమ వివరాలు తెలుసుకునేందుకు బీఎల్వోలను సంప్రదిస్తున్నారు. కొందరైతే బీఎల్వోలు నమోదు చేశారా? లేదా? అనే సందేహంలో ఉన్నారు. ఆ సందేహానికి చాలా సులభమైన పరిష్కారం ఉంది. మీ చేతిలో ఉన్న సాధారణ మొబైల్ ఫోన్‌తోనే ఇంట్లో నుంచే, కేవలం ఒక ఎస్ఎంఎస్ పంపడం ద్వారా మీ ఓటు వివరాలు సర్‌లో నమోదు అయ్యాయో లేదో తెలుసుకోవచ్చు. ఇంటర్నెట్ అవసరం లేదు. స్మార్ట్‌ఫోన్ లేకపోయినా ఈ సేవను సాధారణ ఫోన్‌తో కూడా తెలుసకోవచ్చు. ఎలా తెలుసుకోవాలంటే.. మొబైల్ మెసేజ్ బాక్స్ ఓపెన్ చేసి ECI (SPACE) EPIC NUMBER (ఓటరు కార్డు) అని టైప్ చేసి 1950 నంబరుకు పంపాలి. ఎస్ఎంఎస్ పంపిన కాసేపటికే ఎన్నికల కమిషన్ నుంచి మీ ఓటరు వివరాలతో ఎస్ఎంఎస్ వస్తుంది. వివరాలు వస్తే మీ పేరు సర్ ప్రక్రియలో నమోదు అయినట్లు, రాకపోతే ప్రాసెస్‌లో జాప్యం ఉండటం, సరిగ్గా నమోదు కాలేదని తెలుసుకోవాలి. ECI, EPIC నంబర్ల మధ్య తప్పనిసరిగా స్పేస్ ఉండాలి. ఒకవేళ ఎస్ఎంఎస్ రాకపోతే నెట్‌వర్క్‌లో ఆలస్యం, నమోదు ప్రక్రియ పెండింగ్‌లో ఉండవచ్చు. ఈ క్రమంలో మీ ప్రాంతంలోని బూత్ లెవల్ అధికారి(బీఎల్వో)లను సంప్రదించాలి. ప్రతీఓటరు తన వివరాలు ఒకసారి తప్పకుండా పరిశీలించుకోవాలి. మీ ఓటుహక్కు అమూల్యమైనది. ఎన్నికల సమయంలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఇప్పుడే మీ సర్ నమోదు స్థితిని తెలుసుకోవాలని, ఎన్నికల సమయంలో ఎలాంటి ఇబ్బందులు ఉండకుండా ప్రతీ ఒక్కరు వెంటనే 1950 నంబర్‌కు ఎస్ఎంఎస్ పంపి తమ ఓటుహక్కు నమోదును పరిశీలించుకోవాలని ఎన్నికల సంఘం అధికారులు సూచిస్తున్నారు. ఇలా తెలుసుకోండి -
మా పిల్లలు ఎలా చదువుతున్నారు?
మంథనిరూరల్: సర్కారు బడుల బలోపేతం నాణ్యమైన విద్యాబోధన దిశగా కృషి చేస్తున్న ప్రభుత్వం, విద్యాశాఖ.. మరోఅడుగు ముందుకు వేశాయి. ప్రతీవిద్యార్ధి ప్రగతి తెలుసుకునేందుకు చర్యలు చేపట్టాయి. ఇందులో ఉపాధ్యాయులతోపాటు తల్లిదండ్రులనూ భాగస్వాములను చేసేలా పేరెంట్స్, టీచర్స్ మీటింగ్‌కు శ్రీకారం చుట్టాయి. జిల్లాలోని 530 ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతీనెల మూడోశనివారం సమావేశాలు పకడ్బందీగా నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నాయి. తల్లిదండ్రుల పాత్ర కీలకమనే.. విద్యార్ధుల ప్రగతిలో తల్లిదండ్రుల పాత్ర కీలకమని విద్యాశాఖ భావిస్తోంది. పాఠశాలలో పిల్లలు ఏం చేస్తున్నారనేది తెలుసుకోవడం, ఇంటివద్ద చదువుకు ఆటంకం కలుగకుండా ఆహ్లాదకర వాతావరణం కల్పించేలా ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకోసం పేరెంట్స్ మీటింగ్‌ను మొక్కుబడిగా కాకుండా ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు వందశాతం హాజరయ్యేలా ఆదేశాలు జారీచేసింది. తల్లిదండ్రుల ఎదుటే.. పేరెంట్స్, టీచర్స్ సమావేశంలో తల్లిదండ్రుల ఎదుటే పిల్లల విద్యాప్రగతి పరిశీలించాల్సి ఉంటుంది. విద్యార్థులతో చదివించడం, రాయించడం, లెక్కలు చేయించడం, ఇంగ్లిష్‌లో మాట్లాడించడం ద్వారా విద్యార్థుల ప్రగతిని తల్లిదండ్రులు తెలుసుకుంటారు. విద్యార్థులు స్వయంగా రూపొందించిన చిత్రాలు, హస్తకళలు, సైన్స్ నమూనాలు ప్రదర్శిస్తారు. దీంతో తమ పిల్లల అభ్యసన సామర్థ్యం అర్థమై ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకం పెరుగుతుందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. ప్రధానోపాధ్యాయులకు మీటింగ్‌ల బాధ్యతలు అప్పగించి సత్ఫలితాలు సాధించాలని విద్యాశాఖ ఆదేశించినట్లు తెలిసింది. సాగు కాలం కావడంతో.. ప్రస్తుతం వర్షాకాలం.. సాగు కాలం. రైతులు, రైతు కూలీలు ఈ పనుల్లో బిజీగా ఉంటారు. పేరెంట్స్, టీచర్స్ మీటింగ్‌కు వారు హాజరు కాలేరు. అయినా, వందశాతం హాజరు కావాలనే ఆదేశాలు ఉన్నాయి. హెచ్ఎంలు విస్తృతంగా ప్రచారం చేసినా తల్లిదండ్రులు మొగ్గు చూపిన దాఖలాలు కనిపించలేదు. కొన్ని పాఠశాలల్లో తల్లిదండ్రులు ఆసక్తి చూపినా.. మరికొన్నిచోట్ల తక్కువశాతం హాజరయ్యారు. తల్లిదండ్రుల వాగ్దానమే ప్రధాన ఎజెండా.. ప్రతీ పాఠశాలలో నిర్వహించే పేరెంట్స్, టీచర్స్ మీటింగ్‌లో తల్లిదండ్రుల వాగ్దానమే ప్రధాన ఎజెండాగా చర్చిస్తారు. ముఖ్యంగా తల్లిదండ్రులు ఆరు వాగ్దానాలు చేయాలి. ‘మా పిల్లలను ప్రతీరోజు బడికి పంపుతాం.. వారు బడికి రాకపోతే టీచర్లకు ముందుగానే తెలియజేస్తాం.. నేను ప్రతీరోజు పిల్లవాడిని ఇంటి వద్ద చదివిస్తా.. ఈ సంవత్సరం ప్రతీపీటీఎంకు హాజరై నా పిల్లల చదువు, ప్రవర్తనపై చర్చిస్తా.. నేను నెలకోసారి బడికి వెళ్లి పిల్లల ప్రగతిపై టీచర్లతో వ్యక్తిగతంగా చర్చిస్తా’ అనే వాగ్దానాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఇళ్ల వద్ద మేం ఎలాంటి చర్యలు తీసుకోవాలి? ఇకనుంచి సర్కారు బడుల్లో మూడోశనివారం పీటీఎం సమావేశంలో తల్లిదండ్రుల హామీనే ప్రధాన ఎజెండా ప్రతీస్కూల్లో పకడ్బందీగా నిర్వహించేలా విద్యాశాఖ కసరత్తు పకడ్బందీగా నిర్వహిస్తాం ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ప్రగతిని తల్లిదండ్రులు తెలుసుకునేలా పేరెంట్స్, టీచర్స్ మీటింగ్‌ను పకడ్బందీగా నిర్వహిస్తాం. గతంలోనూ మీటింగ్‌లు నిర్వహించాం. ఈసారి ప్రత్యేకంగా మూడోశనివారం పీటీఎం నిర్వహించి పిల్లల ప్రగతిని తల్లిదండ్రులు స్వయంగా చూసేలా చర్యలు తీసుకుంటున్నాం. తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాల్లోనే చేర్పించేలా తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్నాం. – శారద, జిల్లా విద్యాధికారి -
రీల్స్‌పై సింగరేణి సీరియస్
గోదావరిఖని: సింగరేణి గనుల్లోని పనిస్థలాల్లోకి మొబైల్ఫోన్లు తీసుకెళ్లడాన్ని యాజమాన్యం నిషేధించింది. పనులు పక్కనపెట్టి వీడియోలు తీస్తూ, రీల్స్ చేస్తూ సోషల్ మీడియాలో వైరల్ చేయడతోపాటు సామాజిక మాధ్యమాలపైనే దృష్టి పెడుతున్నారనే కారణంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఈమేరకు సోమవారం జారీచేసిన ఆదేశాలు కార్మికులు, ఉద్యోగుల్లో గుబులు రేపుతున్నాయి. డీడీఎంఎస్ నిబందనల ప్రకారం భూగర్భ గనులు, ఓసీపీ ప్రాంతాల్లో సెల్ఫోన్లు వినియోగించరాదు. రాజకీయ నాయకులు భూగర్భ గనుల సందర్శనకు వెళ్లినప్పుడు ఇష్టానుసారంగా వీడియోలు, ఫొటోలు తీయడం, వారితో కార్మికులు, ఉద్యోగులు సెల్ఫీలు దిగడం చేస్తున్నారు. ఇవి నిబంధనలకు విరుద్ధమని యాజమాన్యం చెబుతోంది. ఓసీపీల్లో కూడా నోఎంట్రీ ఓసీపీ(ఓపెన్‌కాస్ట్ ప్రాజెక్టు) క్వారీల్లోనూ సెల్ఫోన్ల వినియోగాన్ని నిషేధించారు. సెల్ఫోన్లు వి నియోగిస్తూ భారీయంత్రాలు నడిపితే ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని అధికారులు భావి స్తున్నారు. ఉత్పాదకత దెబ్బతినడంతోపాటు డీడీఎంఎస్ నిబంధనలు ఉల్లంఘించినట్లు అవుతుందని యాజమాన్యం గుర్తించింది. ఏరియా జీఎంలకు బాధ్యతలు అన్ని బొగ్గు గనుల్లో సెల్ఫోన్ల వినియోగాన్ని కట్టడిచేసేందుకు ఏరియాల జీఎంలు బాధ్యత తీసుకోవాలని యాజమాన్యం సూచింది. భూగర్భ గనులు, డిపార్ట్మెంట్లు, ఓసీపీల్లో మొబైల్ఫోన్ల వినియోగంపై ఆంక్షలు విధించాలని ఆదేశాలు రావడంతో ఆయా ఏరియాల అధికారులు అప్రమత్తమయ్యారు. మ్యాన్‌రైడింగ్ రీల్సే కారణమా? సింగరేణి కార్మికులు భూగర్భ గనుల్లోకి వెళ్లేటప్పుడు సెల్ఫోన్లు వెంట తీసుకెళ్లి మ్యాన్‌రైడింగ్ నుంచి పనిస్థలాల వరకు వీడియోలు తీస్తూ రీల్స్ చేస్తున్న దృశ్యాలు సీఎండీ కార్యాలయానికి వెళ్లాయి. తద్వారా పనిస్థలాల్లో ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయని, ఉత్పాదక సమయాన్ని కోల్పో యే అవకాశం ఉందని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ప్రతీఒక్కరు తమ సెల్ఫోన్లు డిపాజిట్ చేసిన తర్వాతే భూగర్భ గనిలోకి వెళ్లాలని ఉత్తర్వులు జారీచేశారు. సెల్‌ఫోన్‌తో బొగ్గు గనుల్లోకి నో ఎంట్రీ క్రమశిక్షణ చర్యలకు సిద్ధమవుతున్న యాజమాన్యం -
‘ఖని’ జిల్లా అదనపు జడ్జి బదిలీ
గోదావరిఖనిటౌన్: గోదావరిఖని పారిశ్రామిక, లేబర్ కోర్టు చైర్పర్సన్, అదనపు జిల్లా న్యాయమూర్తి కోట్ల లావణ్య బాల్‌రెడ్డి బదిలీ అయ్యా రు. రాష్ట్రవ్యాప్తంగా ముగ్గురు జిల్లాస్థాయి న్యాయమూర్తులను బదిలీ చేస్తూ హైకోర్టు రిజిస్ట్రార్(జనరల్) మంగళవారం ఉత్తర్వూలు జారీచేశారు. బదిలీ అయినవారిలో ఖని జడ్జి లావణ్య బాల్‌రెడ్డి ఉన్నారు. జిల్లా అదనపు జడ్జిని వనపర్తి జిల్లా పోక్సో కోర్టుకు బదిలీ చేశారు. సరిగ్గా నెలరోజుల క్రితమే జడ్జి లావణ్య బాల్‌రెడ్డి గోదావరిఖనికి బదిలీపై వచ్చారు. నిర్లక్ష్యం చేస్తే చర్యలు మంథని: అభివృద్ధి పనుల్లో అలసత్వం పనికిరాదని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు సూచించారు. పట్టణంలో చేపట్టిన అభివృద్ధి పనులను మంత్రి మంగళవారం పరిశీలించారు. నాణ్యతతో కూడిన పనులు చేపట్టాలన్నారు. గోదా వరి పుష్కరాలలోపు నదీతీరంలో నిర్మించే ఘాట్ల వద్ద నీటిసౌకర్యం కల్పించేలా ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు. మంథని మున్సిపల్ పరిధిలో చేపట్టిన అభివృద్ధి పనులు సకాలంలో పూర్తి చేయాలని ఆయన అన్నారు. ప్రతీ ఓటరు పేరు ఉండాలి గోదావరిఖని: జాబితాలో ప్రతీ ఓటరు పేరు ఉండేలా బీఎల్ఏలు ప్రణాళికతో వ్యవహరించాలని రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్‌ఠాకూర్ సూచించారు. స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బీఎల్ఏ, కార్పొరేటర్లు, డివి జన్ ఇన్చార్జిలతో మంగళవారం సర్‌పై ఆయన సమీక్షించారు. ప్రతీ బీఎల్ఏ తన పరిధిలోని ఓటరు వివరాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. ఓటర్ల వద్దకే వెళ్లి సర్ ప్రక్రియలో నమోదు పూర్తిచేయాలని సూచించారు. మే యర్ మహంకాళి స్వామి, డిప్యూటీ మేయర్ పాతపల్లి ఎల్లయ్య, కాంగ్రెస్ కార్పొరేషన్ అధ్యక్షుడు బొంతల రాజేశ్ పాల్గొన్నారు. కేటీఆర్‌కు ఘనస్వాగతం ధర్మారం: మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేటలో నిర్వహిస్తున్న రైతు సదస్సుకు హాజరయ్యేందుకు వెళ్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీమంత్రి కొప్పుల ఈశ్వర్‌కు మండల కేంద్రంలో మంగళవారం ఘనస్వాగతం లభించింది. సింగిల్‌విండో మాజీ చైర్మన్ ముత్యాల బలరాంరెడ్డి కేటీఆర్‌కు గజమాలతో సన్మానం చేశారు. మహిళలు బతుకమ్మలతో స్వాగతం పలికి వీర తిలకందిద్దారు. వెల్గటూర్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గుండాటి దీపిక, నాయకులు వ్యాల్ల హరీశ్‌రెడ్డి, ముత్యాల బల రాంరెడ్డి, రాసూరి శ్రీధర్, ఆవుల వేణుగోపాల్, శ్రీనివాస్, అజ్మీర మల్లేశ్‌నాయక్, పు స్కూరి రామారావు, తుమ్మల రాంబాబు, గాజుల రాజు, దేవి నళినీకాంత్, పాకాల రాజయ్య, మోతె కనుకయ్య, మంద శ్రీనివాస్, ఎండీ రఫీ, కాంపెల్లి అపర్ణ, ఆవుల లత, మార్క సంధ్య, ఆకారి సత్యం, సాన రాజేందర్, అమరపెల్లి నారాయణ తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులకు న్యాయం చేయాలి పెద్దపల్లి: ‘నీట్’ రాసిన విద్యార్థులకు న్యాయం చేయాలని, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని ఎస్ఎఫ్ఐ నాయకులు డిమాండ్ చేశారు. స్థానిక అంబేడ్కర్ విగ్రహం వద్ద మంగళవారం కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేశారు. ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు ఆర్ల సందీప్, కార్యదర్శి జిల్లాల ప్రశాంత్ మాట్లాడుతూ, నీట్ రాసిన సుమారు 22 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్‌ను కేంద్ర ప్రభుత్వ విధానాలు దెబ్బతీస్తున్నాయన్నారు. నాయకులు మామిడిపల్లి అరవింద్, బాలాజీ, నరేశ్, ప్రణయ్, రఘు, రాజ్‌కుమార్, నవీన్, అభిలాష్ పాల్గొన్నారు. -
సాగుకు ముందే ఆన్లైన్..
మంథనిరూరల్: సన్నరకం వరిసాగును ప్రోత్సహించేందుకు ప్రభుత్వం, వ్యవసాయశాఖ నడుం బిగించాయి. సన్నరకానికే బోనస్ వర్తింపజేస్తామని ప్రకటించిన నేపథ్యంలో రైతులకు ఇబ్బందుల్లేకుండా పకడ్బందీగా చర్యలు చేపట్టాయి. సాగుకు ముందే సన్నరకం సాగుచేసే రైతులు తమ వివరాలను ఆన్లైన్ నమోదు చేసుకునేలా నిబంధనలు విధించాయి. ఈక్రమంలో తమ వివరాలు ఆన్లైన్లో నమోదు చేసుకునే పనుల్లో అన్నదాతలు నిమగ్నమయ్యారు. 2లక్షల ఎకరాల్లో సాగుకు సన్నాహాలు.. ఈ వానాకాలంలో జిల్లావ్యాప్తంగా సుమారు రెండు లక్షలకుపైగా వరి సాగు చేస్తారని వ్యవసాయ అధికారులు అంచనా వేశారు. ఎల్‌నినో ప్రభావంతో సన్నాలు మాత్రమే సాగు చేయాలని, వాటికే బోనస్ ఇస్తామని ప్రకటించారు. దీంతో రైతులు ఏడు రకాల సన్నరకం విత్తనాలను కొనుగోలు చేసి నారుమడులు సిద్ధం చేసుకున్నారు. అయితే ఆశించిన స్థాయిలో వర్షాలు కురువక నాట్లు ఆలస్యమవుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సన్నాలను ప్రోత్సహించేలా.. జిల్లాలో ఆర్ఎన్ఆర్ 15048, కేఎన్ఎం 1638, బీపీటీ 5204, హెచ్ఎంటీ సోనా, జైశ్రీరాం, డ బ్ల్యూజీఎల్ 44, కేఎన్ఎం 7715లాంటి సన్నర కాలను సాగు చేస్తున్నారు. విత్తనాలను కొనుగోలు చేసిన దుకాణ యజమానికి ఆధార్, ప ట్టా, బ్యాంక్ పాసుబుక్ జిరాక్స్, రసీదు ఇస్తే ఆన్లైన్ పోర్టల్‌లో నమోదు చేస్తారు. కోతలు పూర్తయిన తర్వాత ప్రభుత్వం వివరాలను వెరిి ఫకేషన్ చేసినేరుగా బ్యాంకు ఖాతాలో బోనస్ జమ చేస్తుందని అధికారులు చెబుతున్నారు. -
తండావాసులు సుభిక్షంగా ఉండాలి
ఓదెల: శీత్లాభవాని ఆశీస్సులతో తండాలు సుభిక్షింగా ఉండాలని ప్రభుత్వ విప్ విజయరమణావు ఆ కాంక్షించారు. లంబాడితండాలో మంగళవారం జరిగిన శీత్లాభవాని ఉత్సవాల్లో విప్ ప్రత్యేకపూజలు చే శారు. ఈ సందర్భంగా తండావాసులు, ప్రముఖు లు చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. పెద్దపల్లి డీసీ పీ భూక్యారాంరెడ్డి, పూజారి మహరాజ్ సేవాలాల్, సర్పంచ్ గుగులోతు నిమ్మనాయక్, ఉప సర్పంచ్ గుగులోతు నిమ్మనాయక్, తహసీల్దార్ వనజ నా యక్, ఎంపీడీవో అనిల్‌రెడ్డి, మాజీ జెడ్పీటీసీ గంట అక్షితయాదవ్ తదితరులు పాల్గొన్నారు. జిల్లాకు మరో కేబినెట్ ర్యాంకు పెద్దపల్లి: జిల్లాను మరో క్యాబినెట్ ర్యాంకు వరించింది. ఇప్పటికే మంథని ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు మంత్రిగా ఉన్నారు. పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు ప్రభుత్వ విప్‌గా కొనసాగుతున్నారు. తా జాగా విజయరమణారావు, యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, వేముల వీరేశంకు రాష్ట్రమంత్రి (మినిస్టర్ ఆఫ్ స్టే ట్) హోదా కల్పిస్తూ జీవో1064 జారీ అయ్యింది. విజయరమణారావుకు రాష్ట్రమంత్రి హోదా కల్పించడంపై నియోజకవర్గ ప్రజలు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నృత్యాలు చేస్తున్న తండావాసులు పూజలు చేస్తున్న విప్ విజయరమణారావు, డీసీపీ ప్రభుత్వ విప్ విజయరమణారావు -
జర్నలిస్టులకు ప్రజల్లో సుస్థిరస్థానం
గోదావరిఖని: ప్రజల పక్షాన నిలిచి, నిష్పక్షపాతంగా పనిచేసినప్పుడే జర్నలిస్టులకు జనాల గుండెల్లో సుస్థిరస్థానం ఉంటుందని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె.శ్రీనివాసరెడ్డి అన్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో మంగళవారం గోదావరిఖని ప్రెస్‌క్లబ్–అక్షర ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన ప్రోలిటేరియన్ జర్నలిస్టు మునీర్ పుస్తక పరిచయ సభలో శ్రీనివాస్‌రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని మా ట్లాడారు. మీడియా రంగం పెట్టుబడిదారుల చేతుల్లోకి వెళ్లిపోయిందన్నారు. గడిచిన 12 ఏళ్లలో ప్రధానమంత్రి కనీసం ఒక్క మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేయలేదన్నారు. జర్నలిజాన్ని నమ్ముకుని జీవితాంతం అన్యాయాన్ని, ఆధిపత్యాన్ని ప్రశ్నిస్తూ, పాలకుల లోపాలను ఎత్తిచూపుతూ అనేక కష్టాలను ఎదుర్కొన్న జర్నలిస్ట్ మునీర్ జీవితం ఆదర్శప్రాయమన్నారు. జర్నలిస్టుల జీతభత్యాల కోసం సమరశీల పోరాటం చేయాల్సి ఉందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు అప్రజాస్వామికంగా ఉందన్నారు. ప్రధాన పత్రికా రంగంలో వృత్తి ని బద్ధత కోల్పోవడంతో సోషల్ మీడియాకు ఆదరణ పెరిగిందని చెప్పారు. సోషల్ మీడియాలోని కొన్ని కథనాలు వాస్తవానికి దూరంగా ఉంటున్నాయన్నా రు. ప్రింట్ మీడియా నిబద్ధతతో పనిచేస్తుందని, ప్రతీవార్తపై నియంత్రణ ఉంటుందన్నారు. రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్‌ఠాకూర్ మాట్లాడు తూ అక్షరాలను నమ్ముకుని జీవితాంతం పనిచేసిన మునీర్ జీవితం ఆచరణీయమన్నారు. అక్షర ఫౌండేషన్ అధ్యక్షుడు మాదాసి రామమూర్తి అధ్యక్షతన జ రిగిన సభలో రామగుండం మేయర్ మహంకాళి స్వామి, డిప్యూటీ మేయర్ పాతపల్లి ఎల్లయ్య, ఐజే యూ, టీయూడబ్ల్యూజే జాతీయ నాయకుడు నగు నూరి శేఖర్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంపత్‌కుమార్, జి ల్లా అధ్యక్షుడు మల్లావఝుల వంశీ, గోదావరిఖని ప్రెస్‌క్లబ్ అధ్యక్ష, కార్యదర్శులు డి.మాధవరావు, గ డ్డం శ్యాంకుమార్, కార్మిక నాయకులు కె.స్వామి, తుమ్మల రాజిరెడ్డి, రియాజ్ అహ్మద్, పర్లపల్లి రవి, ఐ.కృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
తిరుమలకు ప్రత్యేక రైలు
● నాందేడ్ – తిరుచానూరు మధ్య రాకపోకలు ● వారంలో రెండుపర్యాయాలు అందుబాటులో ● ఉమ్మడి జిల్లా భక్తులకు ప్రయాణ సౌకర్యం కరీంనగర్‌రూరల్: తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనానికి వెళ్లే ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల భక్తుల కోసం మంగళవారం నుంచి నాందేడ్ –తిరుచానూరు ప్రత్యేక రైలు అందుబాటులోకి వచ్చింది. కరీంనగర్ రైల్వేస్టేషన్‌కు రాత్రి 8.30 గంటలకు వచ్చిన ప్రత్యేక రైలుకు దక్షిణ మధ్య రైల్వే అధికారులు స్వాగతంపలికారు. వారంలో రెండు పర్యాయాలు రైలు అందుబాటులో ఉంటుంది. ప్రతీమంగళవారం మధ్యాహ్నం 2.45 గంటలకు నాందేడ్‌లో బయలుదేరి బుధవారం ఉదయం 11గంటలకు తిరుచానూరు చేరుకుంటుంది. ప్రతీ బుధవారం మధ్యాహ్నం 1.20 గంటలకు తిరుచానూరులో బయలుదేరి గురువారం ఉదయం 8 గంటలకు నాందేడ్ చేరుకుంటుంది. ప్రత్యేక రైలు (07603) ఈనెల 21 నుంచి ఆగస్టు 25 వరకు ప్రతీ మంగళవారం నడుస్తుంది. తిరుచానూరు–నాందేడ్ రైలు(07604) ఈ నెల 22 నుంచి ఆగస్టు 26 వరకు ప్రతీ బుధవారం అందుబాటులో ఉంటుంది. ముద్ఖేడ్, ధర్మాబాద్, బాసర, నిజామాబాద్, ఆర్మూర్, కోరుట్ల, లింగంపేట, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జమ్మికుంట, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, విజయవాడ, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట స్టేషన్లలో ఆగుతుంది. ప్రతీ మంగళవారం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని కోరుట్లకు 18.30 గంటలకు, జగిత్యాలకు 19 గంటలకు, కరీంనగర్‌కు 20.28 గంటలకు, పెద్దపల్లికి 21గంటలకు, జమ్మికుంటకు 22 గంటలకు చేరుకుంటుంది. కేవలం ధర్డ్ ఏసీ, స్లీపర్ క్లాస్ కోచ్‌లు మాత్రమే అందుబాటులో ఉంటాయని, జనరల్ కోచ్లుండవని కరీంనగర్ రైల్వేస్టేషన్ కమర్షియల్ మేనేజరు భానుచందర్ తెలిపారు. -
ప్రజలకు నాణ్యమైన సేవలు
కమాన్‌పూర్/రామగిరి: ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. కమాన్‌పూర్, రామగిరి మండలాల్లో ఆయన మంగళవారం పర్యటించారు. గుండారం ప్రభుత్వ జూనియర్ కళాశాల, ప్రభుత్వ పాఠశాల, కమాన్‌పూర్ పీహెచ్సీ, కొత్త తహసీల్దార్ భవనం, పేంచికల్‌పేటలో ఎస్ఐఆర్ ప్రక్రియ, రామగిరి మండలం పన్నూర్‌లో చేపట్టిన తహసీల్దార్ కార్యాలయ భవన నిర్మాణం ప్రగతి పరిశీలించారు. మేడిపల్లిలోని ఇండస్ట్రియల్ పార్క్ స్థలంపై ఆరా తీశారు. కమాన్‌పూర్, రామగిరి తహసీల్దార్లు వాసంతి, సుమన్, అధికారులు వెంకటేశ్వర్లు, శైలాజారాణి, ఏఈ జగదీశ్, ఆర్ఐ స్రవంతి, సర్పంచ్ చిందం మహేశ్ పాల్గొన్నారు. రేపు కౌన్సిలర్లకు శిక్షణ పెద్దపల్లిరూరల్/పెద్దపల్లి: జిల్లాలోని మున్సిపల్ కౌన్సిలర్లు, కార్పొరేటర్లకు హైదరాబాద్‌లో గురువారం ఒకరోజు శిక్షణ ఇవ్వనున్నట్లు జిల్లా అధికారులు మంగళవారం తెలిపారు. రామగుండం కార్పొరేటర్లతోపాటు పెద్దపల్లి, సుల్తానాబాద్, మంథని మున్సిపల్ కౌన్సిలర్లకు ఈనెల 23న శిక్షణ ఉంటుందన్నారు. వీరు హైదరాబాద్‌కు తరలివెళ్లేందుకు వీలుగా వాహనాలను సిద్ధం చేయాలని, ఓ కో ర్టినేటర్ను నియమించుకోవాలని కమిషనర్లకు ఆదేశాలు జారీ అయ్యాయి. -
ఆరుతడి పంటలే మేలు
ధర్మారం: ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో రైతులు ఆరుతడి పంటలు వేయాలని మంత్రి లక్ష్మణ్‌కుమార్ కోరారు. నందిమేడారం రైతువేదికలో మంగ ళవారం ఆరుతడి పంటలపై రైతులకు అవగాహన కల్పించారు. అంతకుముందు పైడిచింతలపల్లి, ర చ్చపల్లిలో సర్ ప్రక్రియ పరిశీలించారు. నందిమేడారంలో కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలిసి రెండు ఇందిరమ్మ ఇళ్లకు గృహ ప్రవేశం కల్పించారు. విద్యుదాఘాతంతో ఇటీవల మరణించిన కట్ట అశోక్ కుటుంబానికి రూ.8లక్షల చెక్కు అందించారు. అంగన్ వాడీ భవనాలు ప్రారంభించారు. ధర్మారం మండల పరిషత్ కార్యాలయంలో 34 మందికి కల్యాణలక్ష్మి, 73 మందికి సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందించా రు. మేడారంలో మంత్రి మాట్లాడుతూ, వరి సాగు పై పూర్తిగా ఆధారపడకుండా వ్యవసాయాధికారుల సూచనలను పాటించాలన్నారు. మార్కెట్ కమిటీ చైర్మన్ లావుడ్య రూప్లానాయక్, నాయకులు అరిగే లింగయ్య, గాగిరెడ్డి తిరుపతిరెడ్డి, కొత్త నర్సింహులు, సున్నం రాజయ్య, వీర్పాల్, సంగ రంజిత్, చింతల ప్రదీప్‌రెడ్డి, దాగేటి ఉదయ్‌యాదవ్, కాడే సూర్యనారాయణ, దేవి జనార్దన్ పాల్గొన్నారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ -
పత్తికి ప్రాణం
బుధవారం శ్రీ 22 శ్రీ జూలై శ్రీ 2026చాలారోజుల నిరీక్షణ తర్వాత జిల్లాలో కురుస్తున్న వర్షాలు రైతులకు ఊరటనిస్తున్నాయి. తొలకరి ఆధారంగా పత్తి విత్తనాలు వేసినా.. ఆ తర్వాత ముఖం చాటేయడంతో ఆందోళనకు గురయ్యారు. అధిక ఉష్ణోగ్రతలు, వర్షాభావంతో పత్తి మొక్కలు వాడి నేలవాలాయి. కొన్నిచోట్ల రెండోసారి విత్తనాలు వేయాల్సి వచ్చింది. ఈక్రమంలో మూడు రోజులుగా కురుస్తున్న జల్లులు మొక్కలకు జీవం పోయడంతో పచ్చదనం సంతరించుకుంటున్నాయి. రైతుల ముఖాల్లో ఆనందం కనిపిస్తోంది. అయినా సీజన్ పూర్తిస్థాయిలో గాడిన పడాలంటే మరింత వర్షం అవసరమని అన్నదాతలు అభిప్రాయపడుతున్నారు. -
జలపాతం.. సింగారం
పెద్దపల్లి ప్రాంతంలో సోమవారం రాత్రి కురిసిన వర్షానికి సబ్బితం శివారులోని గట్టుసింగారం జలపాతం జాలువారుతోంది. జలపాతం అందాలను తిలకించేందుకు సమీప మండలాలు, గ్రామాల నుంచి భారీసంఖ్యలో సందర్శకులు తరలివస్తున్నారు. ప్రకృతి సోయగాన్ని తిలకించి పరవశిస్తున్నారు. జలపాతం అభివృద్ధికి ప్రభుత్వం ఇప్పటికే రూ.6 కోట్లు మంజూరు చేయగా.. విప్ విజయరమణారావు పనులు ప్రారంభించిన విషయం విదితమే. పనులు పూర్తయితే గట్టుసింగారం జలపాతం పర్యాటక కేంద్రంగా మారి సందర్శకులకు మరింత ఆహ్లాదం పంచుతుంది. – పెద్దపల్లిరూరల్ -
కాపురం చేయాల్సిన భర్త.. వాట్సాప్‌లోనే!?
పెద్దపల్లి: అదనపు కట్నం కోసం వేధింపులకు గురిచేసి ఇంటినుంచి వెళ్లగొట్టారని ఆరోపిస్తూ భజ్జురి రేఖలత సోమవారం కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. అనంతరం కలెక్టరేట్ ఎదుట బైఠాయించి తనకు న్యాయం చేయాలని వేడుకున్నారు. బాధితురాలి కథనం ప్రకారం.. పెద్దపల్లికి చెందిన రేఖలతకు భీమారం ప్రాంతానికి చెందిన ప్రవీణ్ కుమార్‌తో వివాహం జరిగింది. కొంతకాలం వరకు దాంపత్యజీవితం సజావుగానే సాగినా.. ఆ తర్వాత అదనపు కట్నం తీసుకురావాలని భర్త, కుటుంబ సభ్యులు శారీరకంగా, మానసికంగా వేధింపులకు గురిచేశారు. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేయగా, పెద్దల సమక్షంలో పంచాయితీ కూడా జరిగింది. ఇకపై సక్రమంగా చూసుకుంటానని భర్త హామీ ఇచ్చాడు. కానీ, ఇంటికి తీసుకెళ్లకుండా వాట్సాప్ సందేశాలు, నోటీసుల ద్వారా వేధింపులకు పాల్పడ్డాడు. తన వద్ద ఉన్న బంగారు ఆభరణాలను తీసుకుని, భౌతిక దాడులకు పాల్పడ్డాడు. ప్రస్తుతం ఆర్థిక ఆధారం లేకుండా పెద్దపల్లిలో అద్దె ఇంట్లో జీవనం సాగిస్తున్న రేఖలత.. తన భర్త, ఆయన కుటుంబ సభ్యులు, తోటి కోడలు, బావల నుంచి తనకు ప్రాణహాని ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు తనకు రక్షణ కల్పించి న్యాయం చేయాలని కలెక్టర్‌ను కోరారు. -
కృషికి విశేష గుర్తింపు
పెద్దపల్లి: విద్యా ప్రమాణాల పెంపులో జిల్లాను రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలిపినందుకు కలెక్ట ర్ కోయ శ్రీహర్ష, జిల్లా విద్యాధికారి శారద, అ ధికారులకు విశిష్ట గౌరవం లభించింది. హై దరాబాద్ ఎల్బీ స్టేడియంలో సోమవారం ని ర్వహించిన ఓ కార్యక్రమంలో గవర్నర్, పాఠశా ల విద్యాశాఖ డైరెక్టర్ నుంచి పురస్కారం, ప్ర శంసాపత్రం అందుకున్నారు. విద్యా రంగంలో వసతుల కల్పన, ఆన్లైన్ కార్యకలాపాల సమ ర్థ నిర్వహణ, నాణ్యతాభివృద్ధి, విద్యార్థుల అ భ్యాస ఫలితాల మెరుగుదల, స్కూళ్ల సమర్థ నిర్వహణ వంటి అంశాల్లో జిల్లారాష్ట్రంలోనే ముందంజలో నిలవడంతో ఈ ప్రతిష్టాత్మక గుర్తింపు లభించిందని కలెక్టర్ ప్రశంసించారు. స్కూల్ వ్యాన్ అడ్డగింత మంథనిరూరల్: భట్టుపల్లి గ్రామంలో విద్యార్థులను చేరవేసే ప్రైవేట్ స్కూల్ వ్యాన్‌ను గ్రా మస్తులు సోమవారం అడ్డుకున్నారు. గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించకుండా ప్రైవేటు స్కూల్‌కు పంపించడంపై సర్పంచ్ బొగొండ స్వరూప – రవికుమార్ ఆధ్వర్యంలో వ్యాన్‌ను అడ్డుకున్నారు. విద్యార్థులను కిందకు దింపివేశారు. స్థానిక ప్రభుత్వ పాఠశాలలోనే విద్యార్థులను చేర్పించాలని, ప్రైవేటు స్కూల్ లో చేర్పించి ఆర్థికంగా నష్టపోవద్దని ఆమె సూచించారు. ప్రతీగ్రామానికి గుడి ఎంత ము ఖ్యమో, బడి కూడా అంతే ముఖ్యమని తెలి పారు. బడిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఆమె పేర్కొన్నారు. వార్డు స భ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. సమస్యల పరిష్కారమే లక్ష్యం గోదావరిఖని: ప్రజాసమస్యల పరిష్కారమే ల క్ష్యంగా గ్రీవెన్స్ డే నిర్వహిస్తున్నట్లు రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా అ న్నారు. తన కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స్‌డే ద్వారా పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారు ల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. బాధితుల సమస్యలను చట్టపరంగా పరిష్కరించాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. అదనపు డీసీపీ(అడ్మిన్) శ్రీనివాస్ పాల్గొన్నారు. ఆరుతడి పంటలు వేయాలి పెద్దపల్లి: ఎల్‌నినో ప్రభావం దృష్ట్యా రైతులు ప్రత్యామ్నాయంగా ఆరుతడి పంటలు వేయా లని జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమల అధికారి శ్యాంప్రసాద్ సూచించారు. జిల్లా కేంద్రంలో కూరగాయల సాగును ఆయన సోమవారం పరిశీలించి పలు సూచనలు చేశారు. వాతావరణ మార్పులను తట్టుకునే ఆయిల్‌పామ్ పండించాలని అన్నారు. కూరగాయలు, పప్పుధాన్యాలపైనా దృష్టి సారించాలని చెప్పారు. విద్యార్థులపై దాడి సరికాదుపెద్దపల్లి: ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద శాంతియుతంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులపై అక్కడి పోలీసులు లాఠీచార్జీ చేయడం, అక్రమ నిర్బంధాలకు పాల్పడం శోచనీయమని ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు సయ్యద్ వలీ ఉల్లా ఖాద్రి అన్నారు. స్థానిక సీపీఐ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు ఆరేపల్లి మానస్ కుమార్ అధ్యక్షతన సోమవారం నిర్వహించిన ఏఐవైఎఫ్ జిల్లా 4వ మహాసభలో మాట్లాడారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయా లని డిమాండ్ చేశారు. నాయకులు తాండ్ర స దానందం, మార్కపురి సూర్య, మాచర్ల అంజి, తాళ్లపల్లి సురేందర్, ఆసాల నవీన్, రాణవేణి సుధీర్ కుమార్, కల్లేపల్లి నవీన్, చంద్రగిరి ఉద య్, సాదుల శివ, ఖాజా, శివ పాల్గొన్నారు. ‘వన్ నేషన్’లో చోటు ఫెర్టిలైజర్‌సిటీ: వన్ నేషన్.. వన్ ఎలక్షన్‌పై ప్రజాచైతన్య కార్యక్రమాలు చేపట్టేందుకు తెలంగాణలో ఆరు జోన్లు వి భజించి పర్యవేక్షణ బాధ్యత లు కేటాయించారు. జూన్ –1 ఇన్చార్జిగా సోమారపు లావణ్యను నియమించారు. -
హోమాలు కాదు.. కాళేశ్వరం పంపులు ఆన్‌చేయండి
ధర్మారం: వర్షాల కోసం వరుణ హోమాలు చేస్తే మంత్రులు, ఎమ్మెల్యేలకు పుణ్యం వస్తుంది కానీ వా నలు కురవవని, కాళేశ్వరం పంప్‌లు ఆన్‌చేస్తే నీటి సౌకర్యం అందుబాటులోకి వచ్చి రాష్ట్రం సస్యశ్యామలంగా మారుతుందని మాజీమంత్రి కొప్పుల ఈశ్వ ర్ అన్నారు. నందిమేడారం రిజర్వాయర్‌ను సోమ వారం ఆయన సందర్శించి నీటిమట్టం పరిశీలించారు. నీరు తగ్గి మైదానంగా మారిన ప్రాంతంలో బీఆర్ఎస్ కార్యకర్తలతో కలిసి క్రికెట్, కబడ్డీ ఆడి నిరసన తెలిపారు. ముత్యాల బలరాంరెడ్డి, రాసూరి శ్రీధర్, పుస్కూరి రామారావు, బుచ్చిరెడ్డి, వేణుగో పాల్, శ్రీనివాస్, తిరుపతి, రమణ, నర్సింగం, రాంబాబు, అపర్ణ, లత, ఆకారి సత్యం పాల్గొన్నారు. మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ -
అమ్మోనియా కొనాలంటున్నరు
పెద్దపల్లిలో డీఏపీ బస్తా ధర రూ.1,900తో అమ్ముతు న్నరు. దీనికి అమ్మోనియా కూడా తప్పనిసరిగా కొ నాల ని చెబుతున్నరు. అవసరం లేని ఎరువులు కొనాల్సి రావడంతో ఖర్చు పెరుగుతంది. అధికారులు స్పందించాలె. – శ్రీనివాస్, రైతు,దేవునిపల్లి బ్లాక్‌లో కొనుగోలు చేయొద్దు రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. డీఏపీ ని హోల్‌సేల్ డీలర్లు లింకు పెట్టి అమ్మకాలు చేస్తున్నట్లు మా దృష్టికి వచ్చింది. రిటైల ర్స్ ఇలా చేయడం లేదు. రైతులు బ్లాక్ మా ర్కెట్లో కొనుగోలు చేయవద్దు. నష్ట పోవద్దు. – శ్రీనివాస్, డీఏవో -
ప్రజావాణి అర్జీలకు ప్రాధాన్యం
పెద్దపల్లి: ప్రజావాణి దరఖాస్తులకు అత్యంత ప్రా ధాన్యం ఇచ్చి పరిష్కరించాలని కలెక్టర్ కోయ శ్రీహ ర్ష ఆదేశించారు. అదనపు కలెక్టర్ శ్రీరాములుతో కలిసి కలెక్టరేట్లో సోమవారం ప్రజావాణిలో అర్జీ లు స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడా రు. దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి పెండింగ్ లో ఉండకుండా తక్షణమే పరిష్కరించాలని సూచించారు. వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. మంథనిలోని సర్వే నంబరు 94లో అక్రమ పట్టాలతో రిజి స్ట్రేషన్లు జరుగుతున్నాయి. వాటిని రద్దు చేయాలి. – మంథని రాజగోపాల్, మంథని దివ్యాంగురాలిని. పక్షవాతంతో ఇబ్బందిపడుతున్న. కార్యాలయంలో చుట్టూ తిరుగుతూ ఇబ్బంది పడుతున్న. పింఛన్ మంజూరు చేయండి. – జి.లక్ష్మి, అప్పన్నపేట గత యాసంగిలో మొక్కజొన్న కోసమని పెద్దపల్లిలోని ఓంసాయి ఫెర్టిలైజర్లో మందులు కొన్న. క్రాప్ రాకపోగా భారీగా నష్టం వాటిల్లింది. రసీదు ఉంది. – ఆవుల తిరుపతి, రేగడిమద్దికుంట నాకు ఆధార్ ఉంది. ఆన్లైన్లో వెతికితే మరొకరి వివరాలు వస్తున్నయి. భూమి రిజిస్ట్రేషన్‌లో ఇబ్బందులు ఎదురవుతన్నయి. స్కీంలు రావడం లేదు. నా కూతురు శ్రీవాణి వికలాంగురాలు. పింఛన్ రావడంలేదు. – రెడ్డి సునీత, శ్రీవాణి విద్యార్థుల డ్రెస్సులు కుట్టాలని డీఆర్డీవో అధికారు లు ఆర్డరు ఇచ్చారు. వారంరోజుల్లో కుట్టిస్తామని చెప్పినా వినకుండా మరొకరికి ఇచ్చారు. నిబంధన ల ప్రకారం కుట్టు శిక్ష పొందినవారికి ఉపాధి కల్పి ంచాలి. మా ఉపాధిని దెబ్బతీసిన వారిపై చర్య తీసుకోవాలి. – మాధవి, అరుణ అనంత, రాధిక, స్రవంతి, సుల్తానాబాద్ -
పెద్దపల్లికి బంగారం!
సాక్షిప్రతినిధి,కరీంనగర్ ●: పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయం మరోసారి వార్తల్లోకెక్కింది. ఆ మధ్య జిల్లాలో గాడితప్పుతున్న పోలీసులకు క్లాస్ తీసుకున్న కలెక్టర్ కార్యాలయం ఇటీవల ఇతర జిల్లాల నుంచి వస్తున్న లారీలకు భారీ జరిమానాలు విధిస్తున్నారని విమర్శలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. తాజాగా కలెక్టర్ కార్యాలయం తీసుకున్న మరో నిర్ణయం హాట్ టాపిక్‌గా మారింది. రామగుండంలోని కుందనపల్లి బూడిద లారీల నుంచి వసూలు చేస్తున్న ప్రత్యేక లెవీ చార్జీలు జిల్లాలో చర్చానీయాంశంగా మారాయి. నిత్యం కుందనపల్లి యాష్‌పాండ్ నుంచి వందలాది లారీలు రాష్ట్రవ్యాప్తంగా వివిధ గమ్యస్థానాలకు బయల్దేరుతుంటాయి. అలా బయల్దేరాలంటే ముందు ప్రతీ లారీ రూ.500 లెవీ చార్జీలు చెల్లించాలి. ఈ లెవీ చార్జీలు చెల్లిస్తేనే లారీలు కదులుతాయి. ఎందుకు చేస్తున్నారు? పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీ పవర్ ప్లాంట్‌లో విద్యుదుత్పత్తికి నిత్యం వందల టన్నుల బొగ్గు మండించాల్సి వస్తుంది. ఫలితంగా ఉత్పత్తి అయిన బూడిదను కుందనపల్లి చెరువులో కలుపుతారు. ఈ బూడిద గాలిలో కలిసి పరిసరాలను కాలుష్యభరితం చేస్తుంది. బూడిద గాలిలోకి లేవడం వల్ల ఉత్తరాదికి వెళ్లే రైళ్లకు అంతరాయం కలిగింది. దీంతో పర్యావరణ హితం కోసం ఈ బూడిదను ఇటుకబట్టీలు, రోడ్ల నిర్మాణాల్లో వినియోగాన్ని కేంద్ర ప్రభుత్వం అనివార్యం చేసింది. ఈ నేపథ్యంలో కుందనపల్లి యాష్‌పాండ్‌లోని బూడిదకు ఎన్టీపీసీ టెండర్లు పిలిచి, ఇటుకబట్టీ వ్యాపారులకు విక్రయిస్తుంది. కరోనా తరువాత ఈ బూడిదకు డిమాండ్ పెరగడంతో గతంలో పలువురు రాజకీయ నాయకుల జోక్యం చేసుకోవడంతో బూడిద రేట్లు పెరగడం, పరోక్షంగా ఇటుకల ధర కూడా పెరిగింది. కానీ, ప్రస్తుత జిల్లా కలెక్టర్ కార్యాలయం ప్రతీ లారీకి లెవీ చార్జీలు వసూలు చేస్తూ దాన్ని జిల్లా మౌలిక సదుపాయాల కల్పనకు వినియోగిస్తున్నారని చెప్పడం గమనార్హం. అంతర్గాం తహసీల్దార్ పేరిట.. జనవరి 2024 నుంచి బూడిద లారీలపై లెవీ పేరిట చార్జీలు వసూలు చేస్తున్నారు. ప్రతీ లారీకి రూ.500 చొప్పున లెవీ చార్జీలను కలెక్టర్ కార్యాలయం ఆదేశాల మేరకు అంతర్గాం తహసీల్దార్ వసూలు చేస్తున్నారు. రెండేళ్ల కాలంలో దాదాపు 1.24 లక్షల లారీలపై దాదాపు రూ.6.30 కోట్ల వరకు లెవీ చార్జీలు వసూలు చేశారు. వీటిని జిల్లాలోని ఆసుపత్రి, ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు వినియోగిస్తున్నారని కలెక్టర్ కార్యాలయం పలుమార్లు తెలిపింది. ఇదే విషయమై కలెక్టర్ శ్రీహర్షను వివరణ కోరేందుకు సంప్రదించగా ఆయన అందుబాటులోకి రాలేదు.1,24,220ఫిబ్రవరి 24– అక్టోబర్ 25 వరకుఅక్టోబరు 25– మార్చి 26 వరకుజనవరి 24– మార్చి 26 వరకుజూలై 24– ఏప్రిల్ 25 వరకుఫిబ్రవరి 25– మార్చి 26 వరకుమొత్తంఇటుక బట్టీలకుఖమ్మం దేవరపల్లి హైవేకుఇటుక బట్టీలకుఇటుకబట్టీలకుగ్రీన్ఫీల్డ్ హైవే కోసం(వివరాలు 2026 మార్చి 31 వరకు)అంతర్గాం తహసీల్దార్ పేరిట చెల్లించిన లెవీ చార్జీలు65,72725,81421,2178,0543,408 -
దిగిరాని యూరియా
సాగు విస్తీర్ణం తగ్గినా..పెద్దపల్లి: వానాకాలం సీజన్ ప్రారంభమైంది కానీ, ఆశించిన వానలు కురవడంలేదు. ఎల్‌నినో ప్రభావంతో ఈసారి సాగు విస్తీర్ణం పడిపోతోంది. మొన్నకురిసిన మోస్తరు వర్షాలతో కొందరు రైతులు పత్తి విత్తనాలు చల్లారు. మరికొందరు వరినారు పోశారు. వీటికి అవసరమైన యూరియా, డీఏపీ కొనుగోలు చేసేందుకు ఫెర్టిలైజర్ షాపుల బాటపడుతున్నారు. వీరి అవసరాన్ని ఆసరాగా చేసుకున్న కొందరు డీలర్లు డీఏపీ బస్తా ధర రూ.1,350 ఉంటే రూ.1,900కు పెంచి విక్రయిస్తున్నారు. అంతేకాదు.. డీఏపీ కావాలంటే తప్పనిసరిగా అమ్మో నియా లేదా ఇతర ఎరువులు కూడా కొనుగోలు చేయాలని షరతులు విధిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. అవసరం లేనివాటిని కూడా కొనాల్సి రావడంతో తమపై అదనపు ఆర్థిక భారం పడుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో సుమారు 400 మంది ఎరువుల డీలర్లు ఉండగా అందులో 220 మంది అత్యధికంగా విక్రయాలు సాగిస్తున్నారని అధికారులు చెప్పారు. సాగు విస్తీర్ణం తగ్గినా కొందరు డీలర్లు కృత్రిమ కొరత సృష్టిస్తూ విక్రయిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఎరువుల విక్రయాలపై డీలర్ల తీరు అధిక ధరలకు విక్రయిస్తున్న వ్యాపారులు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న అన్నదాతలు -
ఇంట్లోకి చొరబడుతున్నయ్
కోతులు గుంపులుగా తిరుగుతున్నయ్. ఇంట్లో జొరబడి ఏది కనిపిస్తే దానిని ఎత్తుకుపోతున్నయ్. ఎవరుంటే వాళ్లపై దాడి చేస్తున్నయి. గతంలో కోతిని చూసి భయంతో బంగ్లాపై నుంచి పడి ఒకామె చనిపోయింది. చిన్నపిల్లలుండే ఇంటి తలుపులు మూసే ఉంచుతున్నరు. – మిట్టపల్లి శ్రీనివాస్, పెద్దబొంకూర్ వైద్యం అందిస్తున్నాం రాఘవాపూర్ పీహెచ్‌సీకి నెలలో కనీసం 12 నుంచి 15 మంది వరకు కోతుల దాడిలో గాయపడి ఆస్పత్రికి వస్తున్నారు. రాఘవాపూర్, రంగాపూర్, సబ్బితం, దేవునిపల్లి నుంచే అధికంగా వస్తున్నారు. సకాలంలో వైద్యం అందిస్తున్నాం. అవసరమైన వ్యాక్సిన్ అందుబాటులో ఉంది. – డాక్టర్ మమత, పీహెచ్సీ, రాఘవాపూర్ -
వానర బాధలు
పెద్దపల్లిరూరల్: జిల్లాలో కోతుల దండు జనావా సాల్లో దండయాత్ర కొనసాగిస్తున్నాయి. ప్రభుత్వ కార్యాలయాలు, రైల్వేస్టేషన్లు, పల్లెలు, పట్టణాలు తేడాలేకుండా సంచరిస్తున్నాయి. అటుగా వెళ్తున్న జనాలపై దాడులకు తెగబడుతున్నాయి. పెద్దపల్లి తహసీల్దార్ కార్యాలయంలో పార్క్ చేసిన బైక్ కవర్లలో ఉంచిన కవర్లు, ఇతర సామగ్రి చిందరవందర చేస్తూ ఆహారపదార్థాలు లభిస్తే ఆరగిస్తున్నాయి. రైల్వేస్టేషన్లో కోతులబెడద మరీ తీవ్రరూపం దాల్చింది. చేతిలో లగేజీ పట్టుకుని రైల్వేస్టేషన్‌కు వెళ్లేవారిని టార్గెట్ చేసి ఏదిదొరికే దానిని పట్టుకుని పరుగెత్తుతున్నాయి. భయపడి సంచులు వదిలేస్తే తినుబండారాల కోసం వెతికి సామగ్రిని చిందరవందర చేస్తున్నాయి. వీటిబెడదతో కొందరు రైలు కూడా ఎక్కలేని పరిస్థితి దాపురిస్తోంది. బేజారవుతున్న పల్లెటూరు ప్రజలు జిల్లాలోని పలు మండలాలు, గ్రామాల్లో కోతుల బెడద సాధారణంగా లేదు. ఇంటి ఆవరణలో పెంచుకునే కూరగాయలు, పండ్ల చెట్లపైకి చేరికాయలు తిని కొమ్మలు విరిచేస్తున్నాయి. కోతుల భయంతో ఇలాంటి పంటలు వేయడం లేదని పల్లెవాసులు పేర్కొంటున్నారు. జిల్లా కేంద్రమైన పెద్దపల్లితోపాటు సబ్బితం, రంగాపూర్, దేవునిపల్లి, రాఘవాపూర్, పెద్దకల్వల, పెద్దబొంకూర్ తదితర గ్రామా ల్లో కోతులతో తీవ్రంగా సతమతమవుతున్నారు. కోతులు గుంపులుగా స్వైరవిహారం చేయడమే కాకుండా అటుగా వెళ్తున్నవారిపై దాడులకు తెగబడుతూ గాయపరుస్తున్నాయి. గౌరెడ్డిపేట, రాఘవాపూర్, రంగాపూర్ ప్రాంతాల్లోని ఇటుకబట్టీల్లో పనిచేసే వలస కూలీలు సైతం కోతుల దాడిలో గాయపడి చికిత్స కోసం రాఘవాపూర్ పీహెచ్‌సీని ఆశ్రయిస్తున్నారు. కొద్దిరోజులుగా బాధితుల సంఖ్య క్రమంగా పెరుగుతోందని వైద్యసిబ్బంది చెబుతున్నారు.అడవుల నుంచి.. జనావాసాల్లోకి అడవుల్లో పండ్లు, ఫలాలు తింటూ హాయిగా ఉండాల్సిన కోతులు.. అక్కడ అవసరమైన తిండి దొరక్క జనావాసాల్లోకి వచ్చి ఇంట్లో ఉన్న ఆహార పదార్థాలను ఎత్తుకెళ్లేందుకు యత్నిస్తున్నాయి. రైలు ప్రయాణికుల సంచుల్లో ఏమైనా తిండి దొరుకుతుందేమోననే ఆశతో వాటిని చించేసి వెదుకులాడుతున్నాయి. గుంపులుగా సంచరిస్తూ.. కనిపించిన వారిపై దాడి ప్రజల్ని భయపెడుతున్న కోతులు -
ఇసుక తరలిస్తే ఊరుకునేది లేదు
ఓదెల: ‘నా ఏరియా నుంచి ఇసుక తరలిస్తే ఊరుకోబోమ’ని ప్రభుత్వ విప్ చింతకుంట విజయరమణా రావు హెచ్చరించారు. పొత్కపల్లి మానేరులో ఇసుక లోడ్‌చేసిన లారీలను గమనించి నాయకులు విప్‌కు సమాచారం అందించారు. స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. పెద్దపల్లి నియోజకవర్గంలోని మానేరు సరిహద్దుల నుంచి ఇసుక తరలిస్తే సహించబోనని మాట ఇచ్చానని గుర్తుచేశారు. ఈసందర్భంగా ఎస్సై సనత్‌కుమార్‌రెడ్డి మానేరులోని మూడు ఇసుక లారీలను పట్టుకున్నారు. బస్తీవాసులకు మెరుగైన వైద్యం పెద్దపల్లి: బస్తీవాసులకు మెరుగైన వైద్యం అందించేందుకే బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేస్తున్నామని ప్రభుత్వ విప్ విజయరమణారావు అన్నారు. సుల్తానాబాద్ ఏడోవార్డులో బస్తీదవాఖానా నిర్మాణం కో సం శంకుస్థాపన చేసి మాట్లాడారు. అనంతరం వ ర్షాలు కురవాలని గొల్లపల్లిలో బొడ్రాయికి జలాభి షేకం చేశారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతటి అన్నయ్యగౌడ్, మున్సిపల్ చైర్మన్ బిరుదు రాధాకృష్ణ, మార్కెట్ కమిటీ చైర్మన్ మినుపాల ప్రకాశ్‌రావు, సింగిల్‌విండో చైర్మన్ శ్రీగిరి శ్రీనివాస్, మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ అంతటి పుష్పలత, కౌన్సిలర్ ఊట్ల వరప్రదీప్ పాల్గొన్నారు. ప్రభుత్వ విప్ విజయరమణారావు -
రాజకీయ సన్యాసం తీసుకునేందుకు సిద్ధమా?
● బీఆర్ఎస్ నేత కేటీఆర్‌కు ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ సవాల్ రామగుండం: ‘కాంగ్రెస్ ప్రజాపాలనలో ఉద్యోగా లు భర్తీ చేసినట్లు నిరూపిస్తాం.. నీ మాటకు కట్టుబ డి రాజకీయ సన్యాసం పుచ్చుకో కేటీఆర్’ అని రా మగుండం ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్‌ఠాకూర్ సవాల్ విసిరారు. రామగుండంలోని తన నివాసంలో సో మవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గ్రూప్స్‌లో 17,326, పోలీస్‌శాఖలో 16,126, వైద్యశాఖలో 11,664, రెసిడెన్షియల్ ఇనిస్టిట్యూషన్స్‌లో 8,400, స్కూల్ ఎడ్యుకేషన్‌లో 10,006, రెవెన్యూలో 4,682, సింగరేణిలో 441, జెన్కోలో 635, ఎన్పీడీసీఎల్లో 470తో పాటు ఇతర విభాగాల్లో 914 ఉ ద్యోగాలు భర్తీ చేశామని తెలిపారు. వీటితోపాటు వ్యవసాయం, వెటర్నరీ, బీసీ వెల్ఫేర్, ఎన్విరాన్మెంట్, అటవీ, సైన్స్, టెక్నాలజీ, ఫైనాన్స్ సెక్రటేరిటట్, ఫుడ్, సివిల్ సప్లయ్, సాధారణ పరిపాలన, హయ్యర్ ఎడ్యుకేషన్ తదితర విభాగాల్లో నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పించామన్నారు. మే యర్ మహంకాళి స్వామి, డిప్యూటీ మేయర్ పాతిపెల్లి ఎల్లయ్య, నాయకులు దీటి బాలరాజు, అంజులు, సతీశ్‌గౌడ్, కుమార్ తదితరులు ఉన్నారు. -
అన్నదాత .. కన్నీటి వెత
కార్తెలు కరుగుతున్నాయి. కాలం వెక్కిరిస్తోంది. వర్షాకాలం ప్రారంభమై నెల గడిచిపోయింది. తొలకరితో మురిపించిన వరుణుడు మళ్లీ తొంగి చూడకపోగా.. కోటి ఆశలతో వరినార్లు పోసిన రైతులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. మడుల్లోనే నార్లు ముదిరిపోతుండగా.. వ్యవసాయబావులు, బోర్లు ఉన్నవారు ధైర్యం చేసి నాటు వేస్తే.. అప్రకటిత విద్యుత్ కోతలు షాక్‌నిస్తున్నాయి. పొలానికి నీరందాల్సిన సమయంలో కరెంటు కోతలతో వేసిన పంటలు ఎండిపోతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో బోర్లు, బావుల్లో సరిపడా నీరులేక పంటపొలాలు బీటలు వారుతున్నాయి. పత్తి మొక్కలు చినుకులేక వాడిపోతుండగా.. ఎల్‌నినో, భూమిలో ఉష్ణోగ్రతల కారణంగా బోరుబావులు వట్టిపోతున్నాయి. వ్యవసాయ బావులు అడుగంటుతున్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వానాకాలం సాగు ఆరంభంలోనే రైతులను కన్నీరు పెట్టిస్తుండగా.. పెట్టుబడి రావడం కూడా కష్టమేనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవారం రోజుల్లో వర్షాలు కురవకుంటే పరిస్థితి మరింత దయనీయంగా మారుతుందని ఆందోళన చెందుతున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాపై ఎల్‌నినో ప్రభావంతో రైతులు పడుతున్న సాగు కష్టాలపై ‘సాక్షి’ గ్రౌండ్ రిపోర్ట్..!!– మరిన్ని కథనాలు 8లోu -
రైతుల సంక్షేమమే లక్ష్యంగా పనిచేయాలి
పెద్దపల్లి: రైతుల సంక్షేమమే లక్ష్యంగా పనిచేయాలని ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు కోరారు. ఎలిగేడు మండలం శివపల్లిలోని తన నివాసంలో పెద్దపల్లి సింగల్‌విండో పాలకవర్గం విప్‌ను ఆదివారం మర్యాద పూర్వకంగా కలిశారు. తమ నియామకానికి స హకరించినందుకు వారు కృతజ్ఞతలు తెలిపారు. విప్‌ను కలిసినవారిలో పర్సన్ ఇన్చార్జి ముత్యాల నరేశ్ ముదిరాజ్, డైరెక్టర్లు తదితరులు ఇందులో ఉన్నారు. సహకార సంఘం ద్వారా రైతులకు అన్ని సేవలు అందించాలని, ప్రభుత్వ పథకాలు, రుణ సదుపాయాలు వర్తింపజేయాలని విప్ వారికి సూచించారు. ఈ కార్యక్రమంలో పీఎసీఎస్ కార్యదర్శి మెట్టు మధు, డైరెక్టర్లు నాంసాని సతీశ్, ఎనగందుల రవీందర్, పిన్‌రెడ్డి సుధాకర్ రెడ్డి, మేకల మల్లేశ్, కలవేన సంపత్, జూపల్లి తిరుపతిరావు, ధోనేటి స్వరూప, వేల్పుల శ్రీనివాస్, పూరేళ్ల శంకర్‌గౌడ్, భగీరం శ్రీనివాస్, ఈదునూరి ప్రసన్న, మానుపాటి రవి తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ విప్ విజయరమణారావు ఎలిగేడు పీఏసీఎస్ పాలకవర్గానికి అభినందనలు -
పల్లెకు ‘బెల్ట్’ మత్తు
పెద్దపల్లిరూరల్: ఎనీ టైం మద్యం.. ఏ రకమైన బ్రాండ్ కావాలన్నా పల్లెప్రాంతాల్లోని బెల్ట్‌షాపుల్లో లభిస్తోంది. బార్ అండ్ రెస్టారెంట్లను తలపించేలా నిర్వాహకులు వంటకాలు సైతం నిమిషాల్లో వండి వడ్డిస్తున్నారు. మందుబాబులను మజాలో ముంచేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. పల్లెల్లో బెల్ట్ దందా ‘మూడు మద్యం సీసాలు.. ఆరుపెగ్గులు’ చందంగా లాభసాటిగా సాగుతోంది. దీంతో కొందరు పోటీపడుతూ బెల్ట్‌షాప్‌లు ఏర్పాటు చేస్తున్నారు. ఫలితంగా ప్రతీఊరిలో 20 నుంచి 30 వరకు మద్యం దుకాణాలు వెలుస్తున్నాయి. అధికారికంగా ఇచ్చే వైన్స్, బార్ షాపులకు నిబంధనలు ఉంటాయి. కానీ, బెల్ట్‌షాప్‌లకు అవేమీ వర్తించడంలేదు. గుడి, బడికి చెంతనే ఉన్నా ఎవరూ పట్టించుకోవడం లేదనే విమర్శలూ ఉన్నాయి. బార్లను తలపించేలా.. పెద్దపల్లి శివారుతోపాటు పలు పల్లెల్లో కొందరు నిర్వాహకులు బెల్ట్‌షాప్‌లు ఏర్పాటు చేస్తున్నారు. మందుబాబుల ఆర్డర్‌ను బట్టి మటన్, చికెన్, గుడ్లతో కూడిన వంటకాలు, గుడాలు నిమిషాల్లో వండి సిద్ధం చేసి వడ్డిస్తున్నారు. చపాతీ, రైస్ కూడా వండి పెడుతుండడంతో నలుగురైదుగురు కలిసి విందులు చేసుకునేందుకు బెల్ట్ షాపులనే ఆశ్రయిస్తున్నారు. దీంతో ఈ దందా జోరుగా సాగుతోంది. రాత్రి 10 గంటలు దాటితే మద్యం ధరలకు రెక్కలు వస్తున్నాయి. ఒక్కో మద్యం బాటిల్‌పై రూ.80 నుంచి రూ.100 వరకు అదనంగా వసూలు చేస్తున్నారనే ఆరోపణలూ ఉన్నాయి. ఆదర్శగ్రామం.. ఆగమాగం పెద్దపల్లి మండలం నిట్టూరులో మహిళా సంఘాల సభ్యులు ఉద్యమించడంతో అమల్లోకి వచ్చిన మద్య నిషేధం దాదాపు 14ఏళ్ల పాటు అమలైంది. ఇప్పుడు వాడకో రెండు, మూడు బెల్ట్‌షాప్‌లు వెలిశాయి. ఇక్కడ మద్యం తాగేసమయంలో పంచా యతీ ఎన్నికల ప్రస్తావన రావడంతో ఓ ఇద్దరి మ ధ్య మాటామాట పెరిగి తన్నులాడుకునే దాకా వెళ్లింది. ఈమేరకు పెద్దపల్లి రూరల్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదులు, కేసులు వరకూ వెళ్తోంది. మత్తుకు బానిసలు.. బెల్ట్‌షాపుల్లో నిత్యం మద్యం అందుబాటులో ఉంటోంది. కొందరు మత్తుకు బానిస అవుతున్నారు. దినసరి కూలీలు, చేతివృత్తుల వారు మద్యం మత్తులో బలవన్మరణాలకూ పాల్పడుతున్నారు. పాతికేళ్ల క్రితం పెద్దపల్లికి వలస వచ్చిన ఓ కూలీ మద్యం మత్తులో ఇటీవల బావిలో పడి మరణించాడు. ఇలాంటి ఘటనల్లో వారి భార్యాపిల్లలు రోడ్డున పడుతున్నారు. శుభ, అశుభ, బర్త్‌డే లాంటి కార్యక్రమాల పేరిట యువత, విద్యార్థులు మద్యం తాగేందుకే మొదటి ప్రాధాన్యం ఇస్తున్నారు. తనిఖీలు చేస్తున్నాం పల్లెల్లో మద్యం అమ్మకాలను నియంత్రించేందుకు తనిఖీలు చేస్తున్నాం. మద్యం, గుడుంబా రవాణాదారులపై దృష్టి సారించాం. గుడుంబా తయారీ, రవాణాదారులను గుర్తించి బైండోవర్ చేశాం. ఫిర్యాదులు అందితే సత్వరమే స్పందిస్తాం. – నాగేశ్వర్రావు, సీఐ, పెద్దపల్లి గ్రామాల్లో ఎనీటైం మద్యం ఇష్టారాజ్యంగా బెల్ట్‌షాపులు ఊరూరా పెద్దసంఖ్యలో ఏర్పాటు -
వాడిపోతున్న పత్తి
ఎల్లారెడ్డిపేట: వర్షాలు లేక వాడిపోతున్న ఈ పత్తిచేను రాజన్నసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట శివారులోది. గ్రామానికి చెందిన మద్దుల అంజిరెడ్డి తనకున్న ఐదెకరాల్లో పత్తి సాగుచేశారు. ఇప్పటి వరకు వర్షాలు కురువకపోవడంతో పత్తి మొక్కలు వాడిపోతున్నాయి. పరిస్థితి ఇలాగే ఉంటే మొక్కలు బతికేలా లేవని అంజిరెడ్డి ఆందోళన చెందుతున్నాడు. ఇప్పటికే రూ.50వేల పెట్టుబడి పెట్టానని, మరో వారం పరిస్థితి ఇలాగే ఉంటే మొత్తం బీడుగా మారుతుందని వాపోయాడు. ఎల్‌నినో ప్రభావంతో నీటి వనరుల లభ్యతను చూసుకొని పంటలు వేయాలని, సాగవుతున్న పత్తిని కాపాడుకునేందుకు 2 శాతం యూరి యా ద్రావణాన్ని పిచికారీ చేయాలని ఏవో రాజశేఖర్ వివరించారు. -
ఎల్‌నినోను ఎదుర్కొందాం
● ఆరుతడి పంటలపై అవగాహన కల్పించాలి ● అధికారులు, ప్రజాప్రతినిధులు బాధ్యత తీసుకోవాలి ● ఎల్‌నినోపై సమీక్షలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుపాల్గొన్న ఎమ్మెల్యేలు, మేయర్లు, కలెక్టర్లు, సీపీ, ఎస్పీలు, వివిధ శాఖల ఉన్నతాధికారులుకరీంనగర్కార్పొరేషన్: ‘రైతులు, ప్రజలను కాపాడుకోవడమే ప్రభుత్వ లక్ష్యం. ఎల్‌నినో ప్రభావాన్ని సమష్టిగా అధిగమిద్దాం’ అని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. ఎల్‌నినో ప్రత్యామ్నాయ కార్యాచరణపై ఆదివారం కరీంనగర్ కలెక్టరేట్లో ఉమ్మడి జిల్లాపై సమీక్షించారు. ఎల్‌నినో ప్రభావం, ప్రాజెక్టుల్లో నీటి నిల్వ లు, భూగర్భజలాల పరిస్థితి, తాగునీటి సరఫరా, ఆరుతడి పంటల ప్రోత్సాహం తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో రానున్న రోజుల్లో కూడా ఆశించినస్థాయిలో వర్షం కురవకపోవచ్చని, తక్కువ నీటితో సాగయ్యే పంటల వైపు రైతులను మళ్లించాలని అధికారులకు సూచించారు. తాగునీటి కొరత తలెత్తకుండా ప్రణాళికలు సిద్ధం చేయాలని మంత్రి పేర్కొన్నారు. వ్యవసాయ, ఇరిగేషన్, భూగర్భ, విద్యుత్‌శాఖ అధికారులు, శాస్త్రవేత్తలు పరిస్థితిని ఎప్పటికప్పుడు కలెక్టర్లకు వివరించాలన్నారు. రాజకీయాలకతీతంగా ముందుకు రావాలి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు మాట్లాడుతూ.. ప్రతిపక్ష ఎమ్మెల్యేలు కూడా రాజకీయాలకు అతీతంగా రైతులు, ప్రజలను ఆదుకునేందుకు ముందుకురావాలన్నారు. మరో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ వర్షపు నీటిని ఒడిసిపట్టేందుకు ఇంకుడుగుంతలు నిర్మించాలని, ఇందుకు కలెక్టర్లు చొరవ చూపాలని సూచించారు. వర్షాలు సమృద్ధిగా కురవాలని ధర్మపురి, కొండగట్టు, కాళేశ్వరం, వేములవాడ ఆలయాల్లో వరుణయాగాలు, ప్రత్యేక పూజలు చేద్దామన్నారు. మంత్రి అడ్లూరి మాట్లాడుతూ ఎల్‌నినోను అఽధిగమిద్దామన్నారు. -
ఎండుతున్న వరి
సోమవారం శ్రీ 20 శ్రీ జూలై శ్రీ 2026శంకరపట్నం: ఎండుతున్న ఈ వరి పొలం కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కన్నాపూర్‌లోని గొర్ల అనిల్, కుమార్ సోదరులది. వీరికి నాలుగు ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. బావి ఆధారంగా సాగు చేస్తారు. నాలుగు ఎకరాలకు నారు పోయగా నీటి లభ్యత లేకపోవడంతో రెండు ఎకరాల్లో నాటు వేశారు. కొద్దిరోజులు సరిపడా నీరందగా.. తర్వాత బావి ఎండిపోయింది. ఫలితంగా రెండు ఎకరాల పంటతో పాటు నారు మొత్తం ఎండిపోతోంది. పెట్టుబడికి రూ.50వేలు అయ్యాయని, ఆదివారం బావి పూడిక తీయించగా మరో రూ.50వేలు అయ్యాయని అన్నదమ్ములు వాపోయారు. ఈ ఇద్దరే కాదు.. మండలవ్యాప్తంగా అన్నదాతలది ఇదే పరిస్థితి కొనసాగుతోంది.


