కనీస విద్యా ప్రమాణాలు ఉండాలి
పెద్దపల్లి: విద్యార్థులకు కనీస విద్యా ప్రమాణాలు అందించాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష సూచించారు. రంగంపల్లిలోని వెంకటపద్మ ఫంక్షన్‌హాల్‌లో ప్రాథమిక తరగతి ఉపాధ్యాయులతో ఎఫ్‌ఎల్‌ఎన్ అమలుపై ఉపాధ్యాయులు, విద్యాధికారులతో శనివారం సమీక్షించారు. మిడ్‌లైన్ పరీక్ష ఫలితాలతో పిల్లల విద్యా ప్రమాణాలను అంచనా వేయొచ్చన్నారు. కనీసం 80 శాతం మంది పిల్లలు చదవడం, 60 శాతం మంది రాయడం, 90 శాతం మంది నంబర్లను గుర్తించండం, 80 శాతం మంది బేసిక్ మ్యాథ్స్ ప్రమాణాలు పొందేలా చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. జెడ్పీ సీఈవో నరేందర్, డీఈవో శారద, ప్లానింగ్ సెక్టోరియల్ ఆఫీసర్ మల్లేశ్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ కోయ శ్రీహర్ష


