సింగరేణి కార్మిక కుటుంబాలకు కార్పొరేట్ వైద్యం అందించడమే లక్ష్యం. ఇప్పటికే అత్యాధునిక వైద్యం అందుబాటులోకి వచ్చింది. గుండె సంబంధిత వ్యాధులకు వైద్యం, మోకాలిచిప్ప మార్పిడి ఆపరేషన్ కూడా చేయాలని నిర్ణయించాం. దశలవారీగా మిగతా ఆస్పత్రుల్లో కార్పొరేట్ వైద్య సేవలు అందిస్తాం. గోదావరిఖని సింగరేణి ఏరియా ఆస్పత్రిలో సాధ్యమైనంత త్వరగా క్యాథ్‌ల్యాబ్ ప్రారంభిస్తాం. ఇటీవల దీనిపై సమీక్షించాం.
– కిరణ్‌రాజ్‌కుమార్,
చీఫ్ మెడికల్ ఆఫీసర్, సింగరేణి


