breaking news
Peddapalli District Latest News
-
మారు పేర్ల సమస్య పరిష్కరించాలి
గోదావరిఖని: సింగరేణిలో మారుపేర్లు, వి జిలెన్స్ కేసులు వెంట నే పరిష్కరించాలని ఐ ఎన్టీయూసీ సెక్రటరీ జనరల్ జనక్‌ప్రసాద్ కోరారు. సోమవారం సంస్థ సీఎండీని హైద రాబాద్‌లో కలిసి వినతిపత్రం అందజేశారు. అనేక సంవత్సరాలుగా పనిచేస్తున్న కార్మికుల పేర్లలో ఉన్న మారుపేర్ల సమస్యతో ఉద్యోగ సంబంధిత హక్కులు, వారసత్వ/కారు ణ్య నియామకాలు, సర్వీస్ ప్రయోజనాలు, ఇతర సంక్షేమ ప్రయోజనాల విషయంలో ఎదురవుతున్న ఇబ్బందులను సీఎండీ దృష్టికి తీసుకెళ్లారు. కార్మిక కు టుంబాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని, ఉద్యోగి నిరంతర సేవా రికార్డులు, సర్వీస్ వివరాలు, ఆధారాలను పరిగణనలోకి తీసుకుని మానవతా దృక్పథంతో సమస్య పరిష్కరించాలని కోరారు. దీనిపై సీఎండీ సానుకూలంగా స్పందించినట్లు జనక్‌ప్రసాద్ తెలిపారు. సెంట్రల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్లు నరసింహారెడ్డి, ధర్మపురి, త్యాగరాజన్, కాంపెల్లి సమ్మయ్య, జనరల్ సెక్రటరీ వికాస్‌కుమార్‌యాదవ్, తదితరులు పాల్గొన్నారు. కాగా మంగళవారం ఈవిషయంపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కలవనున్నట్లు ఆయన తెలిపారు. -
కలెక్టర్‌ను కలిసిన హెచ్ఎం
పెద్దపల్లి: జాతీయస్థాయిలో స్వచ్ఛ పాఠశాలగా ఎంపికై న పాలకుర్తి మండలం ఎల్కలపల్లి యూపీఎస్ ప్రధానోపాధ్యాయుడు అనుమాల లక్ష్మీనారాయణ సోమవారం కలెక్టర్ కోయ శ్రీహర్షను మర్యాదపూర్వకంగా కలిశారు. పచ్చదనం, పరిశుభ్రతను పెంపొందించేందుకు కేంద్రప్రభుత్వం ప్రా రంభించిన ఎస్‌హెచ్‌వీఆర్ కార్యక్రమంలో భాగంగా తమ పాఠ శాల రాష్ట్రస్థాయిలో 4, జాతీయ స్థాయి లో 47వ స్థానం సా ధించి ఉత్తమ స్వచ్ఛ పాఠశాలగా ఎంపికవడంపై ఆనందం వ్యక్తం చేశారు. కలె క్టర్ ఇటీవల పాఠశాలను సందర్శించి వసతుల కల్పనకు రూ.10 లక్షలు మంజూరు చేశారు. దీంతో సోలార్ ప్యా నల్స్, వాల్‌పెయింటింగ్స్ తదితర సౌకర్యాలు కలల్పించారు. కలెక్టర్ అభినందించారు. -
జీజీహెచ్‌లో మోకీలు మార్పిడి సక్సెస్
కోల్‌సిటీ: పెద్దపల్లి జిల్లా రామగుండంలోని సింగరేణి ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(సిమ్స్)కు బోధానస్పత్రి గోదావరిఖని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి(జీజీహెచ్)లో అత్యాధునిక వైద్య సేవలు అందుబాటులోకి వస్తున్నాయి. సోమవారం ఓ వృద్ధురాలికి మోకీలు మార్పిడి శస్త్రచికిత్స విజయవంతంగా నిర్వహించారు. రెండేళ్లుగా నొప్పితో.. రెండేళ్లుగా ఎడమ మోకాలిలో నొప్పితోపాటు నడవడంలో ఇబ్బంది పడుతున్న మంచిర్యాల జిల్లా నస్పూర్ ప్రాంతానికి చెందిన పెంటమ్మ(74)ను జీజీహెచ్ ఆర్థోపెడిక్స్ విభాగానికి ఈనెల 11న తీసుకొచ్చారు. పరీక్షల్లో మోకీలులో ఆర్థరైటిస్ మార్పులు, కీళ్ల మధ్య ఖాళీ తగ్గడం, మోకీలు ఆకతిలో వైకల్యం ఉన్నట్లు గుర్తించారు. వ్యాధి తీవ్రత, రోజువారీ కార్యకలాపాలపై ప్రభావాన్ని పరిగణనలోకి తీసుకుని మోకీలు మార్పిడి శస్త్రచికిత్స చేయాలని వైద్యులు నిర్ణయించారు. విజయవంతంగా శస్త్రచికిత్స... ఈనెల 12న ఆర్థోపెడిక్స్ ప్రొఫెసర్ ప్రదీప్‌చంద్ర నేతృత్వంలో డాక్టర్లు బండి శ్రీధర్, బి.యాకూబ్, ఇ.హేమంత్, ఎన్.హేమంత్‌తో కూడిన వైద్య బృందం శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించింది. అనెస్థీషియా ప్రొఫెసర్ భానులక్ష్మి పర్యవేక్షణలో డాక్టర్లు శ్రీనివాస్, జయప్రకాశ్, జాకీర్ సహకరించారు. నర్సింగ్ సిబ్బంది రాజేశ్, అజయ్ సేవలందించారు. ప్రస్తుతం వృద్ధురాలి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉండటంతోపాటు సంతప్తికరంగా కోలుకుంటున్నట్లు వైద్యులు తెలిపారు.ప్రభుత్వ ఆస్పత్రుల్లోనూ అధునాతన వైద్య సేవలు ప్రభుత్వ వైద్యసంస్థలోనే మోకీలు మార్పిడి వంటి అధునాతన శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించడం సిమ్స్ ప్రొఫెసర్ల వైద్యసేవల సామర్థ్యం మరింత బలోపేతమైందని కలెక్టర్ కోయ శ్రీహర్ష కొనియాడారు. ఈ సందర్భంగా జీజీహెచ్ సూపరింటెండెంట్ హిమబిందు సింగ్, ఆర్ఎంవో కృపాభాయి, ఆర్థోపెడిక్స్, అనెస్థీషియా నిపునులు, నర్సింగ్, సహాయక సిబ్బంది సమన్వయంతో చేసిన కృషిని అభినందించారు. -
నాగుల పంచమి వేళ.. నాగుపాముకు హింస
జగిత్యాలక్రైం: నాగుల పంచమి వేళ.. భక్తుల కళ్ల ముందే పామును హింసిస్తూ ఓ వేటగాడు డబ్బుల వసూళ్లకు పాల్పడ్డాడు. ఇంత జరుగుతున్నా అటవీ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరించడంతో తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జగిత్యాలలో ని గొల్లపల్లి రోడ్‌లోని మోతె శివారులోని పాముల పుట్ట వద్ద పుట్టలో పాలు పోసేందుకు మహిళలు త రలివచ్చారు. ఇదే ఆసరాగా చేసుకున్న పాముల వే టగాడు ఓ నాగుపామును బంధించి హింసిస్తూ భ క్తుల నుంచి డబ్బు వసూళ్లకు పాల్పడ్డాడు. డబ్బులు ఇవ్వని భక్తులపై నాగుపామును ఉసిగొల్పడంతో కొంతమంది భక్తులు భయభ్రాంతులతో పరుగులు పెట్టారు. నాగుపామును వేటగాడు గంటలతరబడి హింసించినా అటవీశాఖ అధికారులు మాత్రం చూసీచూడనట్లు వ్యవహరించారని, పాముతో వసూళ్లకు పాల్పడుతున్న వేటగానిపై అటవీశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. -
నియామకం
జ్యోతినగర్: తెలంగాణ ఉద్యమకారుల సమితి జిల్లా అధ్యక్షుడిగా మలిదశ ఉద్యమకారుడు కత్తెరమల్ల రమేశ్ నియమితులయ్యారు. ఈ మేరకు సమితి రాష్ట్ర అధ్యక్షుడు తోడేటి శంకర్‌గౌడ్ సోమవారం ఉత్తర్వులు విడుదల చేశారు. నియామక పత్రాన్ని అందించారు. ఎన్టీపీసీ రామగుండం ప్రాంతానికి చెందిన మాజీ కౌన్సిలర్ కత్తెరమల్ల రమేశ్ మలిదశ ఉద్యమంలో క్రియాశీలకంగా వ్యవహరించారని గుర్తుచేశారు. పరిహారం అందకుండానే కార్మికుడి మృతి రామగుండం: పెద్దపల్లి జిల్లా అంతర్గాం స్పిన్నింగ్ మిల్లు కార్మికుడు మహ్మద్ నసీరొద్దీన్(71) వయోభారంతో సోమవారం మృతి చెందాడు. ఇతడికి రావాల్సిన వేతన బకాయిలు, ఇళ్లస్థలం ఇతరత్రా ప్రయోజనాలు అందకుండానే మృతి చెందడంపై బర్మా, కాందీశీకుల సంక్షేమ సంఘం ప్రతినిధి ఇండిబిల్లి రవీందర్ ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి తక్షణమే టెక్స్టైల్ మిల్లు కార్మికులకు రావాల్సిన బకాయిలు, ఇళ్ల స్థలాల సమస్యను పరిష్కరించేందుకు కృషి చేయాలని కోరారు. ఈతపోటీల్లో ఉమ్మడి జిల్లా క్రీడాకారుల ప్రతిభ గోదావరిఖనిటౌన్: హైదరాబాద్ అంబర్‌పేట జీహెచ్ఎంసీ స్విమ్మింగ్ పూల్‌లో ఇటీవల జరిగిన తెలంగాణ మాస్టర్స్ రాష్ట్రస్థాయి ఈతపోటీల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన సీ నియర్ స్విమ్మర్స్ పలు పతకాలు సాధించా రు. ఆర్.ప్రశాంత్, గోల్డ్‌మెడల్, ఎం.శ్రీధర్ గోల్డ్, సిల్వర్, ఆర్.రామారావు, గోల్డ్, 2 కాంస్య, ఎ.రమేశ్‌కుమార్, గోల్డ్, మంగ వెంకటే శ్వర్లు కాంస్య, ఎం.శ్రీధర్ కాంస్య, బంగారి రాజయ్య సిల్వర్, కాంస్య పతకాలు సాధించినట్టు తెలంగాణ స్విమ్మింగ్ అసోసియేషన్ ఉమ్మడి జిల్లా కార్యదర్శి కృష్ణమూర్తి తెలిపా రు. ప్రతిభ చూపిన స్విమ్మర్స్ హరియాణాలో సెప్టెంబర్‌లో జరిగే జాతీయస్థాయి ఈతపోటీల్లో పాల్గొంటారని ఆయన వివరించారు. రూ.20లక్షలతో డ్రైనేజీ నిర్మాణం మంథని: మున్సిపల్ పరిధిలోని గొల్లగూడెం ప్రాంత ప్రజలు చాలాకాలంగా ఎదుర్కొంటున్న డ్రైనేజీ సమస్యకు పరిష్కారం లభించనుంది. రూ.20 లక్షలతో చేపట్టే డ్రైనేజీ పనులను మున్సిపల్ చైర్మన్ వోడ్నాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో కౌన్సిలర్ పోతరబోయిన శ్రీలత ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ ముస్కుల సహేందర్‌రెడ్డి, కౌన్సిలర్ ఎల్లంకి వంశీధర్, నాయకులు పోతరబోయిన క్రాంతికుమార్, లైశెట్టి రాజు, స్థానికులు పాల్గొన్నారు. సభ ఏర్పాట్ల పరిశీలన పట్టణంలో ఈనెల 19న మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు. ఈ నేపథ్యంలో సభ ఏర్పాట్లను మున్సిపల్ చైర్మన్ వోడ్నాల శ్రీనివాస్, వైస్ చైర్మన్ ముస్కుల సహేందర్‌రెడ్డి, కౌన్సిలర్లు పెంటరి రాజు, ఎల్లంకి వంశీధర్ తదితరులు పరిశీలించారు. వోడ్నాల శ్రీనివాస్ మాట్లాడుతూ, సభకు హాజరయ్యే ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా అన్ని చర్యలు చేపట్టాలన్నారు. నాయకులు ఎరుకల రమేశ్, ఖాజా, సామ్రాట్ తదితరులు పాల్గొన్నారు. శ్రావణమాసం సందర్భంగా ఆలయ పరిసరాల్లో ప్రత్యేక పారిశుధ్య పనులు చేపట్టారు. పోలీసులకు అనుమానాస్పద వ్యక్తుల అప్పగింతకథలాపూర్: భూషణరావుపేటలో సోమవా రం మధ్యాహ్నం అనుమానాస్పదంగా తిరుగుతున్న నలుగురిని గ్రామస్తులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన నలుగురు వ్యక్తులు వింత వేషధారణలో కారులో భూషణరావుపేట వచ్చారు. పలు దుకాణాల్లోకి వెళ్లి భిక్షాటనకు వచ్చామని చెప్పి యజమానులపై పొగ పెట్టడంతో మత్తు మందు కావచ్చనే అనుమానంతో వారంతా కేకలు వేశారు. గ్రామస్తులు గుమిగూడి కారును అడ్డగించి వారిని నిలదీశారు. పొంతనలేని సమాధానం చెప్పడంతో పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు వచ్చి వారిని పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. నలుగురిని తహసీల్దార్ ఎదుట బైండోవర్ చేసినట్లు ఎస్సై రవికిరణ్ పేర్కొన్నారు. -
హైరిస్క్ గర్భిణికి డెలివరీ
పెద్దపల్లి: జిల్లాలోని ఓ ప్రాంతానికి చెందిన గర్భిణి(23)కి హైరిస్క్ ఉండడంతో స్థానిక జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు సవాల్‌గా తీసుకున్నారు. వివిధ పరీక్షలు చేస్తూ సోమవారం సూపరింటెండెంట్ శ్రీధర్ పర్యవేక్షణలో సురక్షితంగా ప్రసవం చేశారు. తల్లీబిడ్డలు క్షేమంగా ఉన్నారు. మరో తీవ్రమైన సమస్యతో బాధపడుతున్న మహిళ(37)కు శస్త్రచికిత్స విజయవంతం చేశారు. ఇందుకు కృషి చేసి వైద్యులు కుమార్‌గౌడ్, శ్రీనివాస్‌రెడ్డి, మేఘన, వినయ్‌కుమార్, రవళిక, స్వాతిని సూపరింటెండెంట్ శ్రీధర్ అభినందించారు. -
జీఎస్టీ బకాయిలపై కేంద్రం దృష్టి
జ్యోతినగర్: రామగుండం పారిశ్రామిక ప్రాంతంలోని వివిధ ప్రాజెక్టుల్లో పనులు చేస్తున్న కొందరు కాంట్రాక్టర్ల జీఎస్టీ చెల్లింపుల వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే చెల్లించిన, ఇంకా చెల్లించాల్సిన బిల్లుల్లో పేర్కొన్న జీఎస్టీ, రిటర్న్‌లు, పన్ను చెల్లింపుల వివరాలపై కేంద్ర జీఎస్టీ అధికారులు దృష్టి సారించినట్లు సమాచారం. పలు ప్రాజెక్టుల్లో సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్, మెయింటెనెన్స్ తదితర విభాగాల్లో అనేకకాంట్రాక్టు సంస్థలు పనులు నిర్వహిస్తున్నా యి. పనులకు సంబంధించి కాంట్రాక్టర్లు సమర్పించే బిల్లు ల్లో జీఎస్టీ కీలక అంశంగా ఉంటుంది. పనుల విలువ, వ ర్తించే పన్నురేటు, జీఎస్టీ ఇన్వాయిస్లు, రిటర్న్‌ల దాఖలు, పన్ను చెల్లింపుల వివరాలను రికార్డులతో సరిపోల్చే ప్రక్రియపై అధికారులు దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. అసంపూర్తి పనుల బిల్లులపై అనుమానాలు కొన్నిపనులు పూర్తిస్థాయిలో పూర్తికాకముందే బిల్లింగ్ ప్రక్రియలో జీఎస్టీ చూపించినట్లు ఆరోపణలు, అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈఅంశాన్ని అధికారికంగా ధ్రువీకరించాల్సిన ఉంది. వాస్తవంగా పనులు ఏ మేరకు పూర్తయ్యా యి, బిల్లులు ఏ ప్రాతిపదికన తయారయ్యాయి, అందులో జీఎస్టీ ఎలా లెక్కించారనే అంశాలను పరిశీలించిన తర్వాతే వాస్తవ పరిస్థితి వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. సమన్వయం కీలకం కాంట్రాక్టర్‌కు బిల్లు మంజూరయ్యే సమయంలో చూపించిన జీఎస్టీ మొత్తానికి, సంబంధిత కాంట్రాక్టర్ ప్రభుత్వానికి చెల్లించిన పన్నుకు మధ్య వ్యత్యాసం ఉంటే అది అధికారుల పరిశీలనకు కారణమయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా జీ ఎస్టీ ఇన్వాయిస్లు, రిటర్న్‌లు, పన్ను చెల్లింపు వివరాలు, ప్రాజెక్టు బిల్లులు, అకౌంటింగ్ రికార్డులను పరిశీలించడం ద్వారా బకాయిలు ఉన్నాయా? లేదా అనేది నిర్ధారించవచ్చు. ముందస్తు హెచ్చరికలు ఎందుకు? బకాయిలు ఉన్నట్లు గుర్తించిన సందర్భాల్లో కాంట్రాక్టర్లు స్వచ్ఛందంగా పన్ను బకాయిలను చెల్లించి వ్యవహారాన్ని సరిచేసుకోవాలని అధికారులు ముందస్తుగా సూచిస్తున్నట్లు సమాచారం. నోటీసులు, వడ్డీ, వర్తించే ఇతర చట్టపరమైన చర్యల వరకు వ్యవహారం వెళ్లకుండా ముందుగానే బకాయిలను సరిచేసుకోవాలని సూచిస్తున్నట్లు తెలుస్తోంది. ఎవరెవరికి వర్తిస్తుందనే దానిపై స్పష్టత రావాలి ఈ వ్యవహారం ప్రాజెక్టుల్లో ఎంతమంది కాంట్రాక్టర్లకు సంబంధించినది? ఎంత మొత్తంలో జీఎస్టీ బకాయిలు ఉన్నాయనే అంశంపై ప్రస్తుతం అధికారిక గణాంకాలు బయటకు రాలేదు. అలాగే అసంపూర్తి పనులకు సంబంధించిన బిల్లుల్లో జీఎస్టీ చూపించిన అంశంపై కూడా అధికారిక నిర్ధారణ వెలువడలేదు. విచారణతోనే వాస్తవాలు వెలుగులోకి జీఎస్టీ చట్టం ప్రకారం పన్ను చెల్లింపులు, రిటర్న్‌ల దాఖలు, ఇన్వాయిస్ నమోదు తదితర అంశాల్లో లోపాలు ఉన్నాయా? అనేది రికార్డుల పరిశీలన ద్వారానే నిర్ధారించాల్సి ఉంటుంది. ప్రస్తుతం వెలువడుతున్న సమాచారం ఆధారంగా కాంట్రాక్టర్లపై తుది నిర్ధారణకు రావడం సరికాదని, అధికారికంగా వెల్లడించే వివరాల కోసం వేచి చూడాల్సి ఉంది. కాంట్రాక్టు బిల్లులు, వాటిలో చూపిన జీఎస్టీ, వాస్తవ పన్ను చెల్లింపులపై పూర్తిస్థాయి స్పష్టత వస్తే ఈ వ్యవహారంలో అసలు వాస్తవాలు బయటపడే అవకాశం ఉంది. -
ఆర్టీసీ బస్సు, లారీ ఢీ
మల్యాల/జగిత్యాల/కరీంనగర్/కరీంనగర్‌అర్బన్:ఆర్టీసీ బస్సు, ఓ లారీ ఎదురెదురుగా ఢీకొనగా.. బస్సులో ఉన్న నలుగురు ప్రయాణికులు తీవ్రంగా.. మరో 19 మంది స్వల్ప గాయాల బారిన పడ్డారు. ఈ సంఘటన జగిత్యాల జిల్లాలోని మల్యాల మండలం కొండగట్టు సమీపంలోని మూలమలుపు వద్ద సోమవారం చోటుచేసుకుంది. కరీంనగర్–1 డిపోకు చెందిన బస్సు కరీంనగర్ నుంచి నిజామాబాద్ వైపు వెళ్తోంది. జగిత్యాల నుంచి కరీంనగర్ వైపు వస్తున్న లారీ దిగువ కొండగట్టు సమీపంలోని మూలమలుపు వద్ద ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో బస్సు డ్రైవర్ మురళి, గుడివాడకు చెందిన లారీ డ్రైవర్ జాజి బాబు, అలాగే బస్సులో ప్రయాణిస్తున్న నిర్మల్ జిల్లా కడెంకు చెందిన ఎండీ.మునార్, సుప్రియ తీవ్రంగా గాయపడ్డారు. మరో 19మంది ప్రయాణికుల ముఖాలు, చేతులు, కాళ్లు, తలకు స్వల్ప గాయాలయ్యాయి. కొందరు ప్రయాణికులు బస్సు అత్యవసర ద్వారం, కిటికీల గుండా స్థానికుల సాయంతో కిందికి దిగారు. క్షతగాత్రులను 108 అంబులెన్స్‌లో జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సంఘటన స్థలం వద్ద వాహనాలు భారీగా నిలిచిపోయాయి. మల్యాల ఎస్సై సందీప్ సంఘటనా స్థలానికి చేరుకుని వాహనాలను కొండగట్టు ఘాట్ రోడ్డు మీదుగా దారి మళ్లించారు. బాధితులకు అండగా ఉంటాం : మంత్రులు పొన్నం, అడ్లూరి బస్సు ప్రమాద బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ అన్నారు. ప్రమాద విషయం తెలుసుకున్న మంత్రి అడ్లూరి వెంటనే కలెక్టర్ సత్యప్రసాద్, ఎస్పీ అశోక్‌కుమార్‌తో ఫోన్లో మాట్లాడారు. ఘటనపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కేంద్రమంత్రి బండి సంజయ్ దిగ్భ్రాంతి ఆర్టీసీ బస్సు, లారీ ఢీకొన్న ఘటనపై కేంద్రహోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జగిత్యాల కలెక్టర్, ఎస్పీతో ఫోన్లో మాట్లాడారు. క్షతగాత్రులను మెరుగైన వైద్య సదుపాయాలున్న ఆసుపత్రులకు తరలించాలని సూచించారు. అధికారులను అప్రమత్తం చేసిన కరీంనగర్ కలెక్టర్ ఆర్టీసీ బస్సు, లారీ ప్రమాదంపై కరీంనగర్ కలెక్టర్ చిత్రమిశ్రా వెంటనే స్పందించారు. క్షతగాత్రులకు ఇబ్బంది కలగకుండా మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు. కరీంనగర్ ఆర్టీసీ రీజినల్ మేనేజర్‌తో ఫోన్లో మాట్లాడారు. మెరుగైన చికిత్స అందించాలి గాయపడిన వారికి మెరుగైన వైద్యసేవలు అందించాలని ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ సూచించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను సోమవారం రాత్రి పరామర్శించారు. దూర ప్రాంతాలవారు కావడంతో బాధితులు, వారి కుటుంబ సభ్యులకు భోజన సౌకర్యం కల్పించాలన్నారు. అందరి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు తెలిపారు. నలుగురికి తీవ్ర గాయాలు 19మందికి స్వల్పగాయాలు నుజ్జునుజ్జయిన బస్సు, లారీ ముందుభాగం కొండగట్టు మూలమలుపు వద్ద ఘటన -
చోరీ కేసులో నిందితుడి అరెస్టు
పాలకుర్తి: పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం కుక్కలగూడూరులో ఈనెల 14న జరిగిన చోరీ కేసులో నిందితుడు మేడం కరుణాకర్‌ను సోమవారం అరె స్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు పెద్దపల్లి డీసీపీ రాంరెడ్డి తెలిపారు. బసంత్‌నగర్ ఠాణాలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. గ్రామానికి చెందిన పోతురాజుల చొక్కయ్య, కుటుంబసభ్యులు పొలం పనులకు వెళ్లగా.. ధర్మా రం మండలం కమ్మర్‌ఖాన్‌పేటకు0 చెందిన కరుణాకర్.. తాళం తీసి ఇంట్లో చొరబడి బీరువా పగుల గొట్టి నాలుగున్నర తులాల బంగారం, 18తులాల వెండితోపాటు రూ.3వేల నగదును చోరీచేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చోరీ జరిగిన రోజు ఆ ఊరులో కనిపించినట్లు గ్రామస్తులు సమాచారం ఇచ్చారు. దీంతో కరుణాకర్‌ను పోలీసులు సెల్ఫోన్లో సంప్రదించగా.. ఫోన్ స్విచ్ఛాప్ వచ్చింది. దీంతో కదలికలపై నిఘా ఉంచిన పోలీసులు. ధర్మారం క్రాస్‌రోడ్డు వద్ద కరుణాకర్ ఉన్నాడనే సమాచారం మేరకు వెళ్లి అదుపులోకి తీసుకున్నారు. నిందితుని నుంచి నల్లపూసల తాడు, ఒకజత కమ్మలు, బుట్టాలు, ఒకజత మాటీలు, ఉంగరంతోపాటు వెండి కడియం, రూ.3వేల నగదు, ఒక సెల్‌ఫోన్, కారు తాళం చెవిని స్వాధీనం చేసుకున్నారు. కేసును చాకచక్యంగా ఛేదించిన గోదావరిఖని ఏసీపీ రమేశ్, రామగుండం సీఐ కృషష్ణకుమార్, బసంత్‌నగర్ ఎస్సై శ్రీధర్‌ను డీసీపీ అభినందించారు. కానిస్టేబుళ్లు అనిల్, శ్రీనివాస్‌కు నగదు రివార్డులు అందజేశారు. -
రూ.24 కోట్ల సీఎమ్మార్ పక్కదారి
సుల్తానాబాద్‌రూరల్: కస్లమ్ రైస్ మిల్లింగ్(సీఎమ్మార్)ను ప్రభుత్వానికి అప్పగించకుండా పక్కదారి పట్టించిన కేసులో ఇద్దరు రైస్‌మిల్లు యాజమానులపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు పెద్దపల్లి డీసీపీ రాంరెడ్డి తెలిపారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పోలీసుస్టేషన్లో సోమవారం కేసు వివరాలు వెల్లడించారు. సుల్తానాబాద్ పరిధిలోని ఓ రైస్‌మిల్లుకు 2023–24 సంవత్సరానికి గాను 10వేల మెట్రిక్ టన్నుల ధాన్యం అప్పగించారు. అందులో 6,662 మెట్రిక్ టన్నుల బియ్యం ప్రభుత్వానికి అప్పగించాల్సి ఉంది. అయితే, 5,020 మెట్రిక్ టన్నుల సీఎమ్మార్ ఉండగా, ధాన్యం కూడా నిల్వలేదని ఈనెల 6న సివిల్ సప్లయ్ అధికారులు చేసిన తనిఖీల్లో గుర్తించారు. పక్కదారి పట్టిన సీఎమ్మార్ విలువ రూ.24.18 కోట్లు ఉంటుంది. జిల్లా పౌర సరఫరాల మేనేజర్ శ్రీకాంత్ సోమవారం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. రైస్‌మిల్లు యాజమానులు రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంటకు చెందిన మధు, రవీందర్‌రెడ్డిని అరెస్టు చేశారు. కోర్టు ఆదేశాలతో రిమాండ్‌కు తరలిస్తున్నట్లు డీసీపీ వివరించారు. కేసును ఛేదించిన ఏసీపీ గజ్జి కృష్ణ, సీఐ రంజిత్‌రావు, ఎస్సై చంద్రకుమార్‌ను డీసీపీ అభినందించారు. రివార్డుకు సిఫారసు చేస్తున్నట్లు డీఎస్పీ వివరించారు. -
ప్రజలకు మెరుగైన సేవలు
గోదావరిఖని: ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా సూచించారు. కమిషనరేట్‌లో సోమవారం జరిగిన ప్రజావాణిలో పెద్ద పల్లి, మంచిర్యాల జిల్లాలకు చెందిన బాధితులతో మాట్లాడారు. ఫిర్యాదులపై వెంటనే స్పందించి పరిష్కరించాలని సూచించారు. శాంతిభద్రతలను పరిరక్షించడంతోపాటు ప్రజలకు మెరుగైన పోలీస్ సేవలు అందించేందుకు కమిషనరేట్ పోలీస్ యంత్రాంగం నిరంతరం కృషి చేస్తోందని సీపీ అన్నారు. కార్యక్రమంలో అదనపు డీసీపీ (అడ్మిన్) శ్రీనివాస్ పాల్గొన్నారు. అత్యవసర సేవలకు ‘112’ పెద్దపల్లి: పోలీసు, అంబులెన్స్, అగ్నిమాపక తదితర అత్యవసర సేవల కోసం ప్రభుత్వం ఇటీవల డయల్ –112 నంబరును అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పటివరకు పోలీసు డయల్ 100, వైద్యం 108, అగ్నిమాపక 101, మహిళల భద్రత సేవల కోసం డయల్ 181, 1091, 1092 నంబర్లు ఉండేవి. ఇలాంటి సేవలన్నింటినీ ఒకేనంబర్ ద్వారా పొందే అవకాశం తాజాగా కల్పించారు. డయల్–112 దేశవ్యాప్తంగా అందుబాటులో ఉంటుంది. మంత్రుల పర్యటనకు భారీబందోబస్తు సుల్తానాబాద్‌రూరల్: సుల్తానాబాద్ మండలంలో ఈనెల 17న జరిగే మంత్రుల పర్యటనకు భారీ బందోబస్తు చేపట్టామని పెద్దపల్లి డీసీపీ రాంరెడ్డి తెలిపారు. గర్రెపల్లి – కాల్వశ్రీరాంపూ ర్ మండలం పెగడపల్లి వరకు చేపట్టే రోడ్డు ని ర్మాణం కోసం మంత్రులు చేసే శంకుస్థాపన స్థ లాన్ని సోమవారం ఏసీపీ గజ్జి కృష్ణతో కలిసి ప రిశీలించారు. డీసీపీ మాట్లాడుతూ సామాన్యులకు ఇబ్బందులు, ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. వాహనాల పార్కింగ్‌పై ఏసీపీతోపాటు సీఐరంజిత్రావు, ఎస్సై చంద్రకుమార్‌తో చర్చించారు. మద్యం విక్రయిస్తే రూ.50వేల జరిమానా మంథనిరూరల్: తమ గ్రామంలో మద్యం విక్రయిస్తే రూ.50వేల జరిమానా విధిస్తామని నా గారం గ్రామ పంచాయతీ పాలకవర్గం సోమ వారం తీర్మానించిందని సర్పంచ్ బెల్లంకొండ శ్రీదేవి తెలిపారు. తీర్మాన పత్రాలను ఎకై ్సజ్, పోలీస్ అధికారులకు అందజేశారు. సర్పంచ్ మాట్లాడుతూ, బెల్ట్‌షాప్‌ల నిర్వహణతో యు వత మద్యానికి బానిసై భవిష్యత్‌ను నాశనం చేసుకుంటోందన్నారు. అనేక కుటుంబాలు ఆర్థికంగా, ఆరోగ్యపరంగా నష్టపోతున్నాయని తెలిపారు. ఈ క్రమంలో ప్రజల ఆమోదం మేరకు మద్యపాన నిషేధం అమలుకు తీర్మానించామని ఆమె వివరించారు. ఉపసర్పంచ్ ఎరుకల లలిత, వార్డు సభ్యులు బూడిద తిరు పతి, ఎరుకల రాజశేఖర, దాసరి రవీందర్, బూడిద శ్రీకాంత్, జక్కుల భాగ్యలక్ష్మి, తోకల శైలజ, అనసూయ సత్తమ్మ, వీవో అధ్యక్షురాలు ఎరుకల జ్యోతి తదితరులు పాల్గొన్నారు. మరమ్మతులో ఎన్టీపీసీ యూనిట్ జ్యోతినగర్: రామగుండంలోని ఎన్టీపీసీ 500 మెగావాట్ల ఐదో విద్యుత్ యూనిట్‌ను సో మవారం వార్షిక మరమ్మతుల కోసం నిలిపివేశారు. సుమారు 20 రోజులపాటు మరమ్మతు చేపట్టనున్నారు. ఏటా ఏప్రిల్ నుంచి అన్ని యూనిట్లకు షెడ్యూల్ ప్రకారం వార్షిక మరమ్మతు చేపడతారు. విద్యుత్‌కు డిమాండ్ తక్కువగా ఉండడంతో ప్రస్తుతం పలు యూనిట్లు సగం సామర్థ్యంతోనే విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నాయి. సౌరవిద్యుత్ ఉత్పత్తి గణనీయంగా పెరగడంతో థర్మల్ కేంద్రాల్లో పూర్తిసామర్థ్యంతో ఉత్పత్తి చేయడం లేదని తెలుస్తోంది. నేడు ‘సర్వాయి’ జయంతి పెద్దపల్లి: సర్ధార్ సర్వాయి పాపన్నగౌడ్ జయంతి ఈనెల 18న కలెక్టరేట్లో నిర్వహించనున్నట్లు జిల్లా బీసీ అభివృద్ధి అధికారి రంగారెడ్డి సోమవారం తెలిపారు. సామాజిక సమానత్వం, బహుజనుల ఆత్మగౌరవం కోసం సర్ధార్ సర్వాయి పాపన్నగౌడ్ చేసిన పోరాటం, చూపి న ధైర్యసాహసాలు నేటి తరానికి స్ఫూర్తిదాయకమని ఆయన పేర్కొఓన్నారు. వేడుకులను విజయవంతం చేయాలని ఆయన కోరారు. -
‘ఇచ్చంపల్లి’పై చిగురిస్తున్న ఆశలు
మంథని: అంతర్ రాష్ట్ర వివాదం.. అటవీ, పర్యావరణ అడ్డంకుల సాకుతో ఇన్నాళ్లూ ఆగిన ఇచ్చంపల్లి ప్రాజెక్టు నిర్మాణంపై మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి. తెలంగాణకు తాగు, సాగునీరు అందిస్తూ, జలవిద్యుత్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఆంధ్రప్రదేశ్ మధ్య రవాణా సౌకర్యం కల్పించేందుకు అనుకూల పరిస్థితులు ఏర్పడుతున్నాయి. దీంతో ఈ ప్రాంత ప్రజల్లో సంబురాలు వ్యక్తమవుతున్నాయి. ఇంజినీర్లకు కలరా సోకి..! ఇచ్చంపల్లి నిర్మాణంతో తెలంగాణ సస్యశ్యామలమవుతుందని, ఈదిశగా చర్యలు తీసుకోవాలని రాజకీయపార్టీలు అప్పట్లో అనేక ఉద్యమాలు చేశాయి. అనేక అవాంతరాలతో మూలనపడింది. ప్రస్తుత ప్రభుత్వం దృష్టి సారించడంతో ప్రాజెక్టుపై ఆశలు చిగురిస్తున్నాయి. సుమారు ఎనిమిది దశాబ్దాల క్రితం దట్టమైన అటవీ ప్రాంతంలోని మంథని నియోజకవర్గం(ప్రస్తుతం జయశంకర్ భూపాలపల్లిపల్లి జిల్లా) పరిధిలో గల మహదేవపూర్ మండలం ఇచ్చంపల్లి వద్ద బ్రిటిష్ ప్రభుత్వం ప్రాజెక్టు నిర్మాణం చేపట్టింది. ప్రాజెక్టు పనుల్లో పాల్గొన్న ఫ్రెంచి ఇంజినీర్లు కలరాతో మృతి చెందటంతో నిర్మాణం ఆగిపోయినట్లు ప్రచారంలో ఉంది. 1978లో పునరుద్ధరించాలని సంకల్పించి.. 1978లో ఇచ్చంపల్లి పనులు పునప్రారంభించాలని అప్పటి కేంద్రప్రభుత్వం సంకల్పించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌లోని సుమారు వంద గ్రామాలు, వేలాది హెక్టార్ల అడవులు ప్రాజెక్టు నీటిలో కలిసి పోతాయని అప్పటి ఏపీ ప్రభుత్వం అడ్డుచెప్పింది. దీంతో ఇప్పటివరకు దీని నిర్మాణం అడుగుముందుకు పడలేదు. తద్వారా బహుళార్థ సాధక అంతర్జాతీయ ప్రాజెక్టు నిర్మాణం క్రమంగా పట్టుకోల్పోతూ వస్తోంది. అప్పటి సీఎం వైఎస్సార్ హఠాన్మరణంతో.. 1999లో అప్పటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సీహెచ్ విద్యాసాగర్‌రావు ప్రాజెక్టు నిర్మాణాన్ని ప్రారంభించాలనే డిమాండ్‌తో ఇచ్చంపల్లి వరకు పాదయాత్ర చేపట్టారు. 2004 ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌కు చెందిన 41మంది ఎమ్మెల్యేలు ఇచ్చంపల్లి వద్ద బహిరంగ సభ ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి జలయజ్ఞంలో ప్రాజెక్టు నిర్మాణం పూర్తిచేయడానికి ప్రయత్నాలు తీవ్రతరం చేశారు. కానీ ఆయన హఠాన్మరణంతో ఫైలు మూలనపడింది. ఎత్తు తగ్గించి.. ఎత్తిపోతలతో.. ప్రాజెక్టు ఎత్తు తగ్గించి ఎత్తిపోతల ద్వారా నీటిని మళ్లించవచ్చని, దీనిద్వారా ముంపునకు గురైయ్యే ప్రాంతాలు తక్కువగా ఉంటాయని నీటిపారుదల శాఖ అధికారులు అభిప్రాయపడుతున్నారు. అంతేకాదు.. ల్యాడర్ సిస్టంతో గోదావరి నదికి ఇరువైపులా ఆనకట్ట నిర్మిస్తే.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గడ్‌కు రవాణా సౌకర్యం కలుగుతుందని చెబుతున్నారు. నౌకాయానంతోపాటు ఏటా రూ.30 కోట్ల విలువైన చేపలు ఎగుమతి చేసే అవకాశం ఉంటుందని అంటున్నారు. అంతర్రాష్ట్ర వివాదాల పరిష్కారానికి విధివిధానాలు ఉన్నాయని, ఒక్కో నదీజలాలు ఐదేసీ రాష్ట్రాలు వినియోగించుకుంటున్నాయని గుర్తుచేస్తున్నారు. కేవలం అంతర్ రాష్ట్ర వివాదాన్ని బూచీచూపుతూ ప్రాజెక్టు నిర్మాణాన్ని అడ్డుకుంటున్నారని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. తెలంగాణతోపాటు ఆంధ్రాలోని రెండు మండలాలకు సాగునీరు, మూడు రాష్ట్రాలకు ప్రయోజనం చేకూర్చేలా ప్రాజెక్టు నిర్మాణాన్ని వెంటనే చేపట్టాలని రైతాంగం కోరుతోంది. -
అర్జీలకు అత్యధిక ప్రాధాన్యం
పెద్దపల్లి: ప్రజావాణిలో అందిన అర్జీలకు ప్రాధాన్యత ఇచ్చి పరిష్కరించాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో దరఖాస్తులు స్వీకరించారు. సమస్యలు పరి ష్కరించాలని అధికారులకు ఆదేశాలు జారీచేశారు. విద్యపై ప్రత్యేక దృష్టి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడంతోపా టు నైపుణ్యాలపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ శ్రీహర్ష సూచించారు. సుల్తానాబాద్‌లోని పలు వి ద్యా సంస్థలను సందర్శించి సూచనలు చేశారు. అ నంతరం టీబీ నివారణపై సమీక్షించారు. 100రోజు ల టీబీ ముక్త్ భారత్ అభియాన్‌లో జిల్లాలో 100 శా తానికి పైగా స్క్రీనింగ్, నాట్ పరీక్షలను సమర్థవంతంగా నిర్వహించడంతో జాతీయస్థాయిలో అవార్డు లభించిందన్నారు. కలెక్టరేట్లో విద్యాశాఖపై నిర్వహించిన సమావేశంలో కలెక్టర్.. పెండింగ్ పనులపై ఆరా తీశారు. అనంతరం ప్రభుత్వ జూనియర్ కళా శాల పరిశీలించారు. ఈఈ అశోక్‌కుమార్, డీఈవో శారద, జిల్లా ఇంటర్ అధికారి కల్పన పాల్గొన్నారు. 20 మంది సర్వేయర్ల లైసెన్స్‌లు రద్దు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూముల రీసర్వేకు గైర్హాజరైన 20 మంది సర్వేయర్ల లైసెన్స్‌లు రద్దు చేసినట్లు కలెక్టర్ శ్రీహర్ష తెలిపారు. ఎవరైనా ప్రభుత్వ నిబంధనలు పాటించాలని సూచించారు. -
ఓట్లలో లోపాలు
జిల్లా ఓటర్ల సంఖ్య 6,31,018 లక్షల 1.27సాక్షి పెద్దపల్లి: ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(సర్) ప్రక్రియలో భాగంగా జిల్లాలో చేపట్టిన ఇంటింటి సర్వేలో ఓటర్ల వివరాల్లో భారీగా తేడాలు బయటపడ్డాయి. జూన్ 25 నుంచి ఆగస్టు 10వ తేదీ వరకు బీఎల్వోలు నిర్వహించిన ఎన్యూమరేషన్ ప్ర క్రియ అనంతరం తాజాగా విడుదలైన ముసాయి దా ఓటరు జాబితాలో జిల్లాలో మొత్తం 6,31,018 మంది ఓటర్లు ఉన్నట్లు తేలింది. వీరిలో 1,27,457 మంది (20.20 శాతం)అనామలీస్ ఓటర్లుగా, మ రో 20,065 మంది ఓటర్లను అన్మ్యాప్డ్గా, అలాగే జిల్లావ్యాప్తంగా 81,139 మంది చనిపోవడం, వలసపోవడం, వారిచిరునామా దొరకని వారిని ఓటరు జాబితా నుంచి తొలగించారు. మొత్తంగా సోమవా రం పోలింగ్ కేంద్రాల వారీగా ముసాయిదా ఓటరు జాబితాను నోటీసు బోర్డులపై అతికించారు. భారీగా తగ్గనున్న ఓట్లు జిల్లాలో జూన్ 10 నాటితో పోలిస్తే ఆగస్టు 17 నాటి కి ఓటర్ల సంఖ్య గణనీయంగా తగ్గింది. గతంలో 7,12,157 మంది ఓటర్లు ఉండగా, తాజా ముసాయిదా జాబితా నాటికి ఈసంఖ్య 6,31,018కి పడిపోయింది. చనిపోవడం, వలస వెళ్లడం, చిరునా మా లభించక ఏకంగా 81,139 మంది(11.39శాతం) ఓట్లను జాబితా నుంచి తొలగించారు. ● అనామలీస్ (లోపాలు ఉన్నవి): డిజిలైజ్ అయిన ఓటర్లలో పేరు, చిరునామా, పుట్టిన తేదీ తదితర వివరాల్లో తప్పులున్న అనామలీస్ ఓటర్లు 1,27,457 మంది ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఇందులో అత్యధికంగా మంథని నియోజకవర్గంలో 54,654 అనామలీస్ ఓట్లు ఉండటం గమనార్హం. ● మ్యాపింగ్ కానివి: ప్రస్తుత ఓటరు జాబితాకు, 2002 ఓటరు జాబితాకు లేదా తల్లిదండ్రుల వివరాలకు సంబంధించి అనుసంధానం కాని ఓటర్లు జిల్లాలో 20,065 మంది ఉన్నారు. అనుమానాస్పద ఓటర్లుకు విచారణ తప్పనిసరి! జిల్లాలో ఉన్న 1.27 లక్షల అనామలీస్ ఓటర్లు, మ్యా పింగ్ కాని 20 వేల మందిని ఎన్నికల సంఘం ‘అ నుమానాస్పద’ ఓటర్లుగా పరిగణించింది. తొలగించిన 81 వేల మందితోపాటు, ఇప్పుడు నోటీసులు అందుకోనున్న ఈ 1.48 లక్షల మందిని కలుపుకుంటే.. మొత్తంగా జిల్లా ఓటర్లలో దాదాపు 32 శాతం మంది ఓటర్ల ఉనికి ప్రశ్నార్థకంగా మారింది. సోమ వారం నుంచి అక్టోబర్ 15వ తేదీ వరకు ఈఆర్వోలు వీరికి నోటీసులు జారీచేసి విచారణకు పిలుస్తారు. నోటీసులు అందుకున్న వారు విచారణకు హాజరై ఈసీ నిర్దేశించిన 11 రకాల పత్రాల్లో ఏదోఒకటి రుజువుగా చూపించాల్సి ఉంటుంది. అధికారుల విచారణలో సంతృప్తి చెందితేనే అక్టోబర్ 19న వచ్చే తుది జాబితాలో వీరి పేర్లు ఉంటాయి. రాజకీయ వర్గాల్లో టెన్షన్.. ఓటర్ల సంఖ్య తగ్గడం, జాబితాలో లక్షల లోపాలు బయటపడటంతో ప్రధాన రాజకీయ పార్టీల నా యకుల్లో ఆందోళన మొదలైంది. తొలగించిన, తొ లగింపు ముప్పు ఎదుర్కొంటున్న వారిలో ఏ పార్టీకి చెందిన ఓటర్లు ఎక్కువగా ఉన్నారనే దానిపై ఎవరి లెక్కలు వారు వేసుకుంటున్నారు.అసెంబ్లీ పాత కొత్త తగ్గినవి అనామలీస్ అన్మ్యాప్డ్ రామగుండం 2,13,990 1,83,233 30,757 49,040 5,555 మంథని 2,38,765 2,14,924 23,841 54,652 8,074 పెద్దపల్లి 2,59,402 2,32,861 26,541 23,775 6,436 మొత్తం 7,12,157 6,31,018 81,139 1,27,457 20,065 కొత్త వారికి అవకాశం ముసాయిదా జాబితాపై అభ్యంతరాలు, పేరు గల్లంతైనవారు, కొత్త ఓటర్ల నమోదుకు ఈసీ అవకాశం కల్పించింది. సెప్టెంబర్ 16 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. కొత్తగా ఓట రు నమోదుకు ఫారం–6, వివరాల మార్పు లే దా తప్పుల సవరణకు ఫారం–8 ద్వారా దర ఖాస్తు చేసుకోవాలి. ఈఆర్వోలు సంతృప్తి చెందితేనే అక్టోబర్ 19న ప్రకటించే తుది సర్ ఓటరు జాబితాలోకి వీరిపేర్లను ప్రచురిస్తారు. -
సమస్యలు పరిష్కరించాలి
కార్మికులకు కనీస వేతనం నెలకు రూ.30 వేలు చెల్లించాలని, ఇతర సమస్యలు పరిష్కరించాలని బీఎంఎస్ నాయకులు డిమాండ్ చేశారు. కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశాక కలెక్టర్‌ను ప్రజావాణిలో కలిసి వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వ ఆస్పతుల్లో మెరుగైన వైద్యం అందించాలని, స్కూళ్లు, వసతి గృహాల్లో సమస్యలు పరిష్కరించాలని సీపీఎం జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. సమస్యలతో కూడిన వినతిపత్రాలను కలెక్టర్‌కు సమర్పించారు. లోతట్టు ప్రాంతాలు వర్షానికి జలమయమవుతున్నాయి. నీరు రాకుండా చూడాలి. గాంధీనగర్, జోవహార్ నగర్, స్వప్నకాలనీ అనుమతులు లేకుండా సాగే ఆక్రమణలను ఆపి, బాధ్యులపై చర్య తీసుకోవాలి. – లక్ష్మణ్, పాపయ్య, సుల్తానాబాద్ -
పథకాలు తక్షణమే పునరుద్ధరించాలి
జ్యోతినగర్: పేదల సంక్షేమాన్ని కాంగ్రెస్ ప్రభు త్వం విస్మరిస్తోందని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ విమర్శించారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట రాజీవ్ రహదారిపై ఆ పార్టీ నేతలు కౌషిక హరి, వ్యాళ్ల హరీశ్‌రెడ్డితో కలిసి సోమవారం ధర్నా చేశారు. మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ మా ట్లాడుతూ, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను తక్షణమే పునరుద్ధరించాలన్నారు. బీఆర్ఎస్ మున్సిపల్ ఫ్లోర్‌లీడర్ మేకల సమ్మయ్య యాదవ్, కార్పొరేటర్లు తోకల రమేశ్, మహేశ్, కర్క పద్మజ, నిమ్మరాజల రవి, మాజీ జెడ్పీటీసీ అముల నారాయణ, నాయకులు నారాయణదాసు మారుతి, మందల కిషన్‌రెడ్డి, మెతుకు దేవరాజ్, బొడ్డుపెల్లి శ్రీనివాస్, ఈదునూరి పర్వతాలు, ఈదునూరి శ్రీకాంత్, తస్లీమా బాను, అయిత శివకుమార్, వకుల, సత్యవతి, సాజిదా, కళావతి, కిరణ్, రామరాజు తదితరులు పాల్గొన్నారు. -
ఆర్టీపీసీఆర్ కిట్లు లేవు?
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ప్రపంచాన్ని గడగడలాడించిన కోవిడ్ మళ్లీ చాపకింద నీరులా విస్తరిస్తోంది. పొరుగు తెలుగు రాష్ట్రమైన ఏపీలో ఈ వైరస్ బారిన పడి పలువురు మృతి చెందుతున్నా.. తెలంగాణ ప్రభుత్వం ఇంకా సంసిద్ధంగా లేకపోవడం తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. గతవారం ఒకే రోజు 12 మందికిపైగా బాధితులు ప్రాణాలు కోల్పోవడం వైరస్ తీవ్రతకు అద్ధం పడుతోంది. నిత్యం ఏపీ నుంచి తెలంగాణతో పాటు ఉమ్మడి కరీంనగర్ లక్షలాది మంది ప్రయాణాలు సాగిస్తారు. ఈ క్రమంలోనే పలువురు తెలంగాణవాసులకూ కోవిడ్ సోకుతోంది. లక్షణాలతో పరీక్షలు చేయించుకుందామనుకుని ప్రభుత్వాసుపత్రులకు వెళ్తే ఆర్టీపీసీఆర్ కిట్లు లేవని తిప్పి పంపుతున్నారు. ర్యాపిడ్ యాంటిజన్ కిట్లు కూడా లేకపోవడం గమనార్హం. ఒక్క ఉమ్మడి కరీంనగర్ జిల్లానే కాదు.. వరంగల్ ఎంజీఎంలోనూ ఇదే దుస్థితి నెలకొంది. వెలుగు చూసిందిలా జూలై చివరివారంలో ఓ ప్రైవేటు కార్యక్రమానికి హాజరయ్యేందుకు కరీంనగర్, వరంగల్, నిజామాబాద్ నుంచి పలువురు స్నేహితుల బృందం విజయవాడ వెళ్లారు. తిరిగొచ్చాక బృందంలో కరీంనగర్‌కు చెందిన ఒక వ్యక్తికి కోవిడ్ లక్షణాలు కనిపించాయి. ప్రభుత్వాసుపత్రికి వెళ్తే పరీక్షలు జరిపేందుకు ఆర్టీపీసీఆర్తోపాటు ర్యాపిడ్ యాంటిజన్ కిట్లు లేవని సిబ్బంది చెప్పడంతో ప్రైవేటు డయాగ్నోస్టిక్ సెంటర్లకు పరుగులు తీయాల్సి వచ్చింది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తడంతో చివరికి హైదరాబాద్‌లోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో చేరాల్సి వచ్చింది. తీరా అక్కడ కోవిడ్ పాజిటివ్‌గా తేల్చారు. ఆ బృందంలోని ఇతర జిల్లాలకు చెందిన వారూ ప్రభుత్వాసుపత్రులకు వెళ్తే కిట్లు లేవని తిప్పిపంపారు. గతంలో ఎలా ఉండేది? కోవిడ్–19 ప్రారంభంలో ర్యాపిడ్ యాంటిజన్ కిట్లతో కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించేవారు. తర్వాత ఆర్టీపీసీఆర్ ల్యాబ్‌ను ఏర్పాటు చేశారు. కరోనా వైరస్ సోకిన వారికి ప్రభుత్వాసుపత్రులలో ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేయడంతో పాటు ఆక్సిజన్ ప్లాంట్ల ద్వారా ప్రతి బెడ్‌కు ఆక్సిజన్ అందించే ప్రయత్నం చేశారు. మెరుగైన వైద్యం అందించి చాలా మంది ప్రాణాలు కాపాడారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో కోవిడ్ కేసులు విస్తరిస్తున్నప్పటికీ తెలంగాణలో ఆరోగ్యశాఖ నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరించడం విమర్శలకు తావిస్తోంది.ఆదేశాలు లేవు కరోనా లక్షణాలతో ఇప్పటి వరకు ఎవరు జీజీహెచ్‌కు రాలేదు. ప్రభుత్వం నుంచి కరోనా పరీక్షలు నిర్వహించాలని ఎలాంటి ఆదేశాలు లేవు. ఆర్టీపీసీఆర్ కిట్లు కూడా పంపించలేదు. కరోనా అనుమానిత కేసులు వస్తే ఉన్నతాధికారులకు సమాచారం అందించి కిట్లు తెప్పించి పరీక్షలు నిర్వహిస్తాం. – డాక్టర్ వీరారెడ్డి, సూపరింటెండెంట్, జీజీహెచ్ కరీంనగర్ -
నేరమా..? ప్రమాదమా?
ప్రతినెలా 30 పోస్టుమార్టంలు సిమ్స్ మెడికల్ కాలేజీకి అనుబంధంగా ఉన్న జీజీహెచ్ టీచింగ్ ఆస్పత్రిలో ప్రతినెలా సుమారు 30 మెడికో–లీగల్ పోస్టుమార్టంలు జరుగుతున్నాయి. సాధారణ కేసులతో పాటు క్లిష్టమైన, సవాళ్లతో కూడిన కేసులు కూడా ఇందులో ఉంటాయి. ప్రతీ కేసులోనూ శాసీ్త్రయ ఆధారాలను సేకరించడం, నిష్పక్షపాతంగా నివేదికలు రూపొందించడం అత్యంత కీలకం. ఫోరెన్సిక్ వైద్యులు నిర్వహించే పోస్టుమార్టం నివేదికలు పోలీసుల దర్యాప్తులో కీలక ఆధారాలుగా మారుతున్నాయి. తద్వారా న్యాయస్థానాల్లోనూ వాస్తవాలను నిర్ధారించే ప్రక్రియకు ఇవి దోహదపడుతున్నాయి. మృతదేహాల సంరక్షణకు భరోసా మార్చురీలో ప్రధానంగా ఎదురయ్యే సమస్యల్లో మృతదేహాల భద్రత, సంరక్షణ ఒకటి. దీనికి పరిష్కారంగా నాలుగు కోల్డ్ ఫ్రీజర్ బాక్సులు ఏర్పాటు చేశారు. దీంతో పోస్టుమార్టం పూర్తయ్యే వరకు మృతదేహాలను సురక్షితంగా, గౌరవప్రదంగా భద్రపర్చే అవకాశం ఏర్పడింది. పోస్టుమార్టానికి కొత్త టేబుళ్లు పోస్టుమార్టం ప్రక్రియను మరింత సౌకర్యవంతంగా, శాసీ్త్రయంగా నిర్వహించేందుకు కొత్త డిసెక్షన్ టే బుళ్లను ఏర్పాటు చేశారు. సరైన లైటింగ్ సదుపాయాలను కల్పించారు. అవసరమైన వసతులను కూడా మెరుగుపర్చారు. దీంతో ఫోరెన్సిక్ వైద్యులు తమ విధులను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు అనుకూల వాతావరణం ఏర్పడింది. రాత్రివేళల్లోనూ సేవలు శాంతిభద్రతలకు సంబంధించిన కేసులు, అత్యవసర పరిస్థితుల్లో పోస్టుమార్టం కోసం రాత్రివేళల్లోనూ సేవలు అందించాల్సి ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో ఆలస్యం జరగకుండా అవసరమైన ఏర్పా ట్లు చేయాలని అధికారులు ఆదేశించారు. అత్యవసర కేసుల్లో సమయం కీలకం. ఆధారాలు చెదిరిపోకుండా, దర్యాప్తు ఆలస్యం కాకుండా ఫోరెన్సిక్ సేవలు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టడం ద్వారా పోలీసు, వైద్య, న్యాయ వ్యవస్థల మధ్య సమన్వయానికి మరింత బలం చేకూరనుంది. న్యాయ పరిరక్షణలో కీలక అడుగు ఫోరెన్సిక్ సేవలు కేవలం పోస్టుమార్టానికి పరిమితం కావు, న్యాయ పరిరక్షణలో ఇవి కీలక భాగం అన్నదే అధికారుల ఉద్దేశం. ప్రజలు, పోలీసు, న్యాయవ్యవస్థకు సకాలంలో నాణ్యమైన మెడికో, లీగల్ సేవలు అందించడమే లక్ష్యంగా మార్చురీని ఆధునిక సదుపాయాలతో తీర్చిదిద్దారు. జీజీహెచ్ మోర్చరీలో చోటుచేసుకున్న ఈ మార్పులు ఫోరెన్సిక్ సేవలకు వేగం న్యాయ ప్రక్రియకు మరింత బలం చేకూర్చేలా నిలవనున్నాయి. కోల్‌సిటీ: మృతదేహం వెనుక దాగిన నిజాన్ని వెలికితీయడం.. న్యాయం వైపు దర్యాప్తును నడిపించడం.. నేరం జరిగిందా? ప్రమాదమా? అనే ప్రశ్నలకు శాసీ్త్రయ ఆధారాలతో సమాధానం చెప్పడం.. ఫోరెన్సిక్ వైద్యుల కీలక బాధ్యత. అలాంటి సేవలు అందించే గోదావరిఖని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి(జీజీహెచ్) మార్చురీ ఇప్పుడు ఆధునిక సదుపాయాలతో కొత్త రూపు సంతరించుకుంది. ఫోరెన్సిక్ సేవలు ఆలస్యమైతే దాని ప్రభావం పోలీసుల దర్యాప్తు నుంచి న్యాయస్థానాల వరకు పడే అవకాశం ఉంది. దీనిని దృష్టిలో పెట్టుకున్న కలెక్టర్ కోయ శ్రీహర్ష ప్రత్యేక దృష్టిసారించారు. మార్చురీలో మౌలిక సదుపాయాలను మెరుగుపర్చారు. దీంతో మెడికో, లీగల్ కేసుల్లో పోస్టుమార్టం ప్రక్రియ మరింత వేగంగా, శాసీ్త్రయంగా నిర్వహించేందుకు మార్గం సుగమమైంది. -
వరాల స్వామికి విశేష పూజలు
వైభవం.. మల్లన్న పెద్ద పట్నంముత్తారం: ముత్తారం మండలం పారుపల్లి మల్లన్న గుట్టలోని శ్రీఆది మల్లికార్జున స్వామి ఆలయంలో ఆదివారం పెద్ద పట్నం మహోత్సవం వైభవంగా జరిగింది. ముత్తారానికి చెందిన కుర్మగొల్ల కులపెద్దలు, ఆలయ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన మల్లన్న ఉత్సవాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. సర్పంచులు చొప్పరి సంపత్, రవీందర్రావు, ఉప సర్పంచ్ అమ్ము రజిత శ్రీనివాస్, నాయకులు అమ్ము దేవేందర్, ఓదెలు, తిరుపతి పాల్గొన్నారు. కమాన్‌పూర్(మంథని): శ్రావణమాసం పురస్కరించుకొని కమాన్పూర్లోని స్వయంభు శ్రీఆది వరాహస్వామి ఆలయానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు స్వామి వారిని దర్శించుకొని ముడుపు కట్టారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయ చైర్మన్ ముస్త్యా ల దామోదర్, ఈవో కాంతారెడ్డిలు ఏర్పాట్లు చేశారు. కనుల పండువగా ఆలయ వార్షికోత్సవంరామగుండం: పట్టణంలోని శ్రీభక్తాంజనేయస్వామి ఆలయ ప్రాంగణంలో గల శ్రీసంతోషిమాతా ఆలయ 51వ వార్షికోత్సవం ఆదివారం కనులపండువగా నిర్వహించారు. శ్రీసంతోషిమాత విగ్రహం, ఆలయ ముఖద్వారం, గర్భాలయాన్ని వివిధ రంగుల పూలతో అలంకరించారు. ఆలయ ఫౌండర్స్ రత్నీదేవి, లోకేష్, అగర్వాల్, శివసంతోష్ అగర్వాల్ నేతృత్యంలో హోమం నిర్వహించారు. అమ్మ వారికి వివిధ రకాల అభిషేకాలు చేశారు. -
అర్హులందరికీ ఇందిరమ్మ ఇల్లు
ఓదెల: అర్హులందరికీ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తోందని ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. ఆదివారం ఓదెల మండలం గుంపులలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లతో పాటు హకా ఫార్మర్ సర్వీస్ సెంటర్‌ను ప్రారంభించారు. దేశంలో ఎక్కడాలేని విధంగా పేదలకు రూ.5లక్షలతో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు సీ ఎం రేవంత్‌రెడ్డి శ్రీకారం చుట్టారన్నారు. సర్పంచ్ వినుకొండ సమ్మక్క వినయ్, సింగిల్‌విండో చైర్మన్ సుమన్‌రెడ్డి, నాయకులు పాల్గొన్నారు. మట్టి గణపతులనే పూజిద్దాం పెద్దపల్లిరూరల్: పర్యావరణాన్ని కాపాడేందుకు గణపతి నవరాత్రోత్సవాల సందర్భంగా అందరూ మట్టి గణపతులనే పూజించాలని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. పెద్దపల్లి శివారు రంగంపల్లిలో ఆది వారం శివశక్తి కళాఆర్ట్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మట్టి గణపతుల తయారీ కేంద్రాన్ని ప్రారంభించి మాట్లాడారు. మున్సిపల్ చైర్మన్ మల్లయ్య, నాయకులు మహేందర్, క్రాంతి, సుభాష్, సంపత్, సతీశ్, రవి, శ్రీనివాస్, రవితేజ, వెంకన్న తదితరులు పాల్గొన్నారు. మంత్రుల పర్యటన ఏర్పాట్లు పరిశీలనరామగుండం: రామగుండంలో ఈనెల 19న పలు అభివృద్ధి పనులకు మంత్రులు బృందం శంకుస్థాపన చేయనున్న నేపథ్యంలో పర్యటన ఏర్పాట్లను ఆదివారం మేయర్ మహంకాళి స్వామి పరిశీలించారు. ఏ పవర్‌హౌస్ కూడలిలో సభాస్థలి ఏర్పాట్లు పరిశీలించి పారిశుధ్య నిర్వహణ, ఇతరాత్ర ఏర్పాట్లపై సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఐటీశాఖ మంత్రి శ్రీధర్‌బాబు, సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌తో పాటు ఎమ్మెల్యే, పార్టీ ముఖ్యులు హాజరుకానున్నారన్నారు. రూ.236 కోట్ల వ్యయంతో అత్యాధునిక ప్రపంచస్థాయి హంగులతో నిర్మితమయ్యే ఇంటిగ్రేటేడ్ స్కూల్ నిర్మాణం, ఇతరత్రా గ్రామీణ హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ రహదారులు, ఐటీఐ రహదారి నిర్మాణం తదితర అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారని తెలిపారు. ప్రతీ కార్యకర్తకు అవకాశం కల్పిస్తాంగోదావరిఖని: పార్టీలోని ప్రతీ కార్యకర్తలకు అవకాశం కల్పించేలా సంఘటన్ సృజన్అభియాన్ కార్యక్రమంతో ముందుకు వచ్చామని ఏఐసీసీ అబ్జర్వర్ దీపక్ రాథోడ్, పీసీసీ సభ్యులు ఎంఏ. ఫయీం, బుద్ధారెడ్డి ప్రభాకర్‌రెడ్డి, రాజేంద్రప్రసాద్ యాదవ్ తెలిపారు. ఆదివార ం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కార్పొరేషన్, డివిజన్ అధ్యక్షులుగా, కమిటీ సభ్యులుగా సామాన్య కార్యకర్త కూడా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పిస్తామన్నారు. ఈసందర్భంగా కార్పొరేషన్ అధ్యక్షుని పోటీలో ఉండే అభ్యర్థుల ధరఖాస్తు ఫాంలు స్వీకరించారు. సమావేశంలో మేయర్ మహంకాళి స్వామి, డిప్యూటీ మేయర్ ఎల్లయ్య, కాంగ్రెస్ పార్టీ కార్పొరేషన్ అధ్యక్షుడు బొంతల రాజేశ్, కార్పొరేటర్లు, టౌన్ అధ్యక్షులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తీర్థ యాత్రల ప్రత్యేక టూర్ ప్యాకేజీగోదావరిఖనిటౌన్: శ్రావణ మాసం సందర్భంగా నాలుగు రాష్ట్రాల్లోని ఏడు జ్యోతిర్లింగాలు, రెండు శక్తి పీఠాల దర్శనం కోసం ఈనెల 31న ప్రత్యేక టూర్ ప్యాకేజీ బస్సు సర్వీస్ ఏర్పాటు చేసినట్లు గోదావరిఖని ఆర్టీసీ డీఎం కవిత తెలి పారు. 31న ఖని ఆర్టీసీ డిపో నుంచి ప్రారంభమై సెప్టెంబర్ 8న తిరిగి గోదావరిఖనికి చేరుకుంటుందన్నారు. మధ్యప్రదేశ్‌లోని ఓంకారేశ్వర్, ఉజ్జయిని మహాకాళేశ్వర్, గుజరాత్‌లోని నాగేశ్వర్, సోమనాథ్, మహారాష్ట్రలోని త్రయంబకేశ్వర్, భీమాశంకర్, గ్రీశ్నేశ్వర్, 2 శక్తి పీఠాల పుణ్యక్షేత్ర దర్శనాలు ఉంటాయని తెలిపారు. ప్రయాణ చార్జీలు ఒక్కరికీ రూ.11,500 ఉంటుందని, భోజన, వసతి ఖర్చులు ప్రయాణీకులే భరించాల్సి ఉంటుందని వివరించారు. వివరాలకు సెల్7013504982, 7382847596 నంబర్లలో సంప్రదించాలని కోరారు. -
● సింగరేణిలో విలువైన కాపర్ కేబుళ్లు చోరీ ● నాలుగు రోజుల్లో మూడు చోట్ల దొంగతనాలు
గోదావరిఖని: సింగరేణి సంస్థ రామగుండం డివిజన్లోని గనుల్లో కాపర్ కేబుళ్ల చోరీ ఆగడం లేదు. వరుస దొంగతనాలతో సింగరేణికి భారీగా నష్టం జరుగుతోంది. గడిచిన నాలుగు రోజుల్లో దొంగలు స్వైర విహారం చేసి అందినంత కాపర్ కేబుల్ ఎత్తుకెళ్లారు. ఈవిషయంలో యాజమాన్యం సీరియస్‌గా ఉన్నప్పటికీ దొంగలు మాత్రం తమ పనిని సులువుగా చేసుకుంటూ పోతున్నారు. కేబుల్ యార్డులో చొరబడిన దొంగలు సింగరేణి సంస్థ రామగుండం డివిజన్–3 పరిధిలోని ఓసీపీ 2లో కాపర్ కేబుల్ యార్డులో ఈనెల 12న దొంగలు పడి అందినంత కాపర్ కేబుల్ ఎత్తుకెళ్లారు. ప్రధాన ఎంట్రన్స్‌కు సమీపంలో ఉన్న ఎస్ఎంఈ సెక్షన్లో సీసీ కెమెరాల నిఘాలో ఉన్న ఎలక్ట్రికల్ షెడ్ లోపల ఉన్న సీసీ కెమెరాల విద్యుత్‌ను తొలగించి అందులోని సుమారు 300 మీటర్ల కాపర్ కేబుల్‌ను చోరీ చేశారు. దొంగలు లోపల ఉన్నంత సేపు ముందున్న సెక్యూరిటీ గార్డు పోస్టు వద్ద లేనట్లు అధికారులు గుర్తించారు. అయితే దొంగలు విద్యుత్ తీసేసిన సీసీ కెమెరాలు కాకుండా రహస్యంగా ఉన్న కెమెరాల్లో చోరీ వ్యవహారం మొత్తం రికార్డు అయినట్లు చెబుతున్నారు. ఈ సంఘటనకు సంబంధించి ఓ సెక్యూరిటీ గార్డుకు చార్జిషీట్ కూడా ఇచ్చినట్లుగా తెలుస్తోంది. పంద్రాగస్టురోజునే రెండు చోరీలు స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సెక్యూరిటీ సిబ్బంది పరేడ్, ఇతర బిజీలో ఉంటారని గుర్తించిన దొంగలు రెండు చోట్ల చోరీకి పాల్పడ్డారు. మధ్యాహ్నం క్వారీలోపల ఉన్న 301, 302, 303, సీడీపీ, 304 క్రషర్ల వద్ద కేబుల్ కత్తిరించుకెళ్లారు. వర్షాల మూలంగా రోడ్డు చెడిపోవడంతో వాహనాలు అటుగా వెళ్లే వీలు లేకపోవడంతో సెక్యూరిటీ గార్డును నియమించకపోవడంతో ఈచోరీ జరిగినట్లుగా చెబుతున్నారు. ఇదేరోజు రాత్రిషిఫ్టులో ఏటూ సమీపంలో చోరీ జరిగి సుమారు 20మీటర్ల ఆర్మ్డ్ కేబుల్ఎత్తుకెళ్లారు. అప్పటివరకు ఉన్న ప్రయివేట్ సెక్యూరిటీ గార్డు వెళ్లిపోగా పర్మినెంట్ సెక్యూరిటీ గార్డు విధులకు వచ్చిన క్రమంలో కాపర్ కేబుల్ చోరీకి గురైనట్లు గుర్తించారు. అధికారులు ఈవిషయాన్ని గోప్యంగా ఉంచి విచారణ జరుపుతుండగా విజిలెన్స్ అధికారులు కూడా ఈవిషయంపై లోతుగా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. -
బడుల్లో చదువులెట్లున్నయ్..
మంథనిరూరల్: ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసే దిశగా ఇప్పటికే ప్రభుత్వం, విద్యాశాఖ అనేక కార్యక్రమాలు చేస్తుండగా తాజాగా మరో అడుగు ముందుకేసింది. వసతులు, విద్యాబోధన, విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలు, పాఠశాలల స్థితిగతులను తనిఖీ చేసేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించుతోంది. అకాడమిక్ ప్యానెల్ బృందాలను ఏర్పాటు చేసి శిక్షణ కూడా ఇచ్చారు. శిక్షణ పొందిన బృందాలు ఈనెల 17నుంచి జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలను తనిఖీ చేసి లోపాలను గుర్తించి విద్యాశాఖకు నివేదించనున్నారు. అయితే గతంలో చేసిన తనిఖీలు సత్పలితాలు ఇవ్వడంతో ఈసారి మరోసారి తనిఖీలు చేసి మరింత బలోపేతం చేసేందుకు ప్రభుత్వం ముందుకు సాగుతున్నట్లు తెలుస్తోంది. జిల్లాలో రెండు బృందాల ఏర్పాటు జిల్లాలో 520 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా 105 జిల్లా పరిషత్, 415 ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలున్నాయి. ఈ పాఠశాలలను తనిఖీ చేసేందుకు రెండు అకాడమిక్ ప్యానల్బృందాలను ఏర్పాటు చేశారు. మొదటి కోర్ కమిటీ బృందంలో ఒక హెచ్ఎంతో పాటు ఏడు సబ్జెక్టులకు సంబంధించిన ఉపాధ్యాయులు ఉంటారు. అలాగే రెండో బృందం సపోర్టింగ్ టీం. ఇందులో సైతం హెచ్ఎంతో పాటు ఏడుగురు బృందంగా నియమించారు. తనిఖీ చేసే అంశాలు మొదట కోర్‌కమిటీ బృందం పాఠశాలల్లో విద్యార్థులకు అందుబాటులో ఉన్న మౌలిక వసతులు, అభ్యాసన సామర్థ్యాలు, హాజరు నమోదు, మధ్యాహ్న భోజనం పథకం అమలు తీరు, పరిశుభ్రత, తదితర అంశాలను పరిశీలిస్తారు. అనంతరం సపోర్టింగ్ టీంతో కలిసి ఆయా పాఠశాలలపై అనాలసిస్ చేసి ఒక నివేదిక తయారు చేస్తారు. ఆ నివేదికను కలెక్టర్‌కు అందజేయగా నివేదక ఆధారంగా ఆయా పాఠశాలల్లో అవసరమైన చర్యలు తీసుకోనున్నారు. పకడ్బందీగా తనిఖీలు పాఠశాలల తనిఖీలను పకడ్భందీగా నిర్వహిస్తాం. జిల్లాలో రెండు బృందాలను ఏర్పాటు చేసి శిక్షణ ఇచ్చాం. ఈనెల 17 నుంచి జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలను బృందసభ్యులు సందర్శించి అక్కడి స్థితిగతులను పరిశీలిస్తారు. స్థితిగతులపై నివేదికలు తయారు చేసి కలెక్టర్‌కు అందజేస్తాం. – డా.పీఎం షేక్, ఆకాడమిక్ మానిటరింగ్ అధికారి, పెద్దపల్లి -
సీఐకి ఇండియన్ పోలీస్ మెడల్
కరీంనగర్‌రూరల్: కరీంనగర్‌రూరల్ పోలీస్‌స్టేషన్ సీఐ అనుముల నిరంజన్‌రెడ్డి పోలీస్‌సేవలను గుర్తించి కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన ఇండియన్ పోలీస్ మెడల్ ప్రకటించగా శనివారం స్వాతంత్య్ర వేడుకల్లో భాగంగా సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా అందుకున్నారు. అసాంఘిక శక్తుల అణచివేత, మావోయిస్టుల ఏరివేతలో అత్యున్నత సేవలందించి ప్రస్తుతం కరీంనగర్‌రూరల్ సీఐగా విధులు నిర్వర్తిస్తున్న నిరంజన్‌రెడ్డి 2025 సంవత్సరం ఐపీఎం అవార్డుకు ఎంపికయ్యారు. కానిస్టేబుల్ నుంచి సీఐ వరకు.. 1989లో కానిస్టేబుల్‌గా ఎంపికై న నిరంజన్‌రెడ్డి పోలీస్ శిక్షణ అనంతరం 1990లో జగిత్యాల రూరల్‌పోలీస్‌స్టేషన్‌లో తొలిపోస్టింగ్ పొందారు. నక్సలైట్ల ఏరివేత కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ పలు ఎదురుకాల్పుల్లో విధులు నిర్వహించారు. నిరంజన్‌రెడ్డి సేవలను గుర్తించిన అప్పటి కరీంనగర్ జిల్లా ఎస్పీ రత్నారెడ్డి తక్కువ సర్వీస్‌లోనే హెడ్‌కానిస్టేబుల్‌గా పదోన్నతి కల్పించారు. 1992లో స్వగ్రామం వరంగల్ జిల్లాకు వెళ్తున్న క్రమంలో మావోయిస్టులు జరిపిన కాల్పుల్లో నిరంజన్‌రెడ్డితోపాటు మరో కానిస్టేబుల్‌కు తీవ్రగాయాలయ్యాయి. ధైర్యంగా మావోయిస్టులపై ఎదురుకాల్పులు జరిపి ప్రాణాలతో బయటపడ్డారు. ఆయన ధైర్యసాహసాలు, విశిష్టసేవలను అప్పటి ప్రభుత్వం గుర్తించి ముఖ్యమంత్రి సేవాపతకం, ముఖ్యమంత్రి ఉత్తమ సేవాపతకంతో సత్కరించింది. అనంతరం 1994లో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా సిరిసిల్లలోని వీర్నపల్లిలో సీఆర్పీఎఫ్ పోలీస్‌క్యాంప్ గైడ్‌గా నిరంజన్‌రెడ్డి వ్యవహరించారు. నక్సలైట్ల నుంచి బాంబులు, ఆయుధాలను స్వాధీనం చేసుకుని ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు కీలకంగా పనిచేశారు. 1994 సంవత్సరం తర్వాత ఎస్సైగా, 2023లో సీఐగా ప్రమోషన్ పొందారు. ఎస్సైగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పలు పోలీస్స్టేషన్లలో పనిచేసిన ఆయన సీఐగా విజిలెన్స్, ఇంటెలిజెన్స్‌తోపాటు మెట్పల్లిలో సేవలందించారు. సామాజిక సేవా కార్యక్రమాలను విరివిగా చేపట్టారు. ప్రస్తుతం కరీంనగర్‌రూరల్ సీఐగా పనిచేస్తున్న నిరంజన్‌రెడ్డి డ్రగ్స్ నిర్మూలన, ఇసుక అక్రమరవాణా నియంత్రణ, సైబర్‌క్రైంపై అవగాహన కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇండియన్ పోలీస్ మెడల్ రావడంలో ప్రజలు అందించిన సహకారం, ఉన్నతాధికారులు తన సేవలను గుర్తించి సిఫారసు చేయడం ఎంతో ముఖ్యమైనవన్నారు. ఇప్పటివరకు 82 క్యాష్ రివార్డులు, 64 జీఎస్సీలు, 24 ప్రశంసాపత్రాలు అందుకున్నట్లు తెలిపారు. సీఎం చేతులమీదుగా స్వీకరణ -
భవిష్యత్ అంతా జెన్ – జీలదే..
పెద్దపల్లి: బీజేపీ జిల్లా అధ్యక్షుడు కర్రే సంజీవరెడ్డి ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో శనివారం హర్ ఘర్ తిరంగా ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించారు. జాతీయ జెండాలతో అలంకరించిన వందలాది సంఖ్య ట్రాక్టర్లతో ర్యాలీ నిర్వహిస్తూ దేశభక్తి, జాతీయ సమైక్యత చాటిచెప్పారు. బీజేపీ నాయకులు, కార్యకర్తలు, రైతులు, యువతీయువకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. దేశ భవిష్యత్ జెన్ –జీ చేతుల్లోనే ఉందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు నల్ల మనోహర్‌రెడ్డి, తిరంగా యాత్ర జిల్లా కో–కన్వీనర్ ఊషణ అన్వేష్, పట్టణ కన్వీనర్ మధుకరన్, అధ్యక్షుడు పెంజర్ల రాకేశ్, జిల్లా కార్యదర్శి శివంగారి సతీశ్ తదితరులు పాల్గొన్నారు. -
విత్తనోత్పత్తి కంపెనీల దగా
వీణవంక: వర్షాభావ పరిస్థితులను అధిగమించి ధాన్యం పండించిన రైతులకు విత్తనోత్పత్తి కంపెనీలు చేయిచ్చాయి. ఆశించిన స్థాయి కంటే మూడొంతుల దిగుబడి వచ్చిందని రైతులు సంబరపడితే, అధిక దిగుబడి వచ్చిందని, విత్తనం అమ్ముడుపోవడం లేదని కంపెనీలు చేతులెత్తేశాయి. రైతులు పండించిన సీడ్ (ఆడ, మగ)ను తీసుకెళ్లిన కంపెనీలు.. 20 రోజుల్లో సొమ్ము చెల్లిస్తామని చెప్పి 80 రోజులు దాటినా చిల్లిగవ్వ ఇవ్వకుండా ముప్పుతిప్పలు పెడుతున్నాయి. మరో పక్క వానాకాలం సీజన్ ప్రారంభం కావడంతో పెట్టుబడికి డబ్బులు లేక రైతులు మల్లగుల్లాలు పడుతున్నారు. కొన్ని కంపెనీలు డబ్బు చెల్లించినా కొందరు డీలర్లు తమ ఖాతలో జమ చేసుకొని రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఆడ, మగ వరి 1.20లక్షల ఎకరాలు, 22వేల ఎకరాల్లో మక్క సాగు చేశారు. వరి క్వింటాల్‌కు రూ.6 వేల నుంచి 20వేలు ఉండగా, మక్క క్వింటాల్‌కు రూ.2 వేల నుంచి 3,300 వరకు కంపెనీలు ధరలు నిర్ణయించాయి. ఈ లెక్కన రూ.150కోట్లకు పైగా కంపెనీలు రైతులకు బకాయి పడినట్లు సమాచారం. ఇక్కడి నేలలు అనుకూలం రాష్ట్రంలోనే హైబ్రిడ్ (ఆడ, మగ) సీడ్ వరి, మక్క సాగులో కరీంనగర్ జిల్లా అగ్రస్థానంలో నిలిచింది. విత్తనోత్పత్తికి ఇక్కడి నెలలు అనువుగా ఉన్నాయి. అందుకే జిల్లాలో సాగు చేయడానికి 50కి పైగా కంపెనీలు పోటీపడుతున్నాయి. 48 ఏళ్లుగా ఇక్కడి రైతులు ఈ పంటలు సాగు చేస్తున్నారు. పంట ఉత్పత్తులను తీసుకెళ్లిన తర్వాత కొన్ని కంపెనీలు మాత్రమే రైతుల ఖాతాలో జమ చేస్తుండగా, మరికొన్నిడీలర్ల ద్వారా ఇస్తున్నాయి. దీంతో కొందరు డీలర్లు సొంత అవసరాలకు వాడుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. పంట దిగుబడి వచ్చినా రాకపోయినా ఒప్పందం ప్రకారం చెల్లిస్తామని కంపెనీల ప్రతినిధులు చెప్పడంతో రైతులు సాగు చేశారు. కానీ, వానాకాలం ప్రారంభమైనా ఇంత వరకు డబ్బులు ఇవ్వలేదు. అంతేకాకుండా కంపెనీలు మరో మాయాజాలానికి తెరలేపాయి. క్వింటాల్‌కు 10–15కిలోల చొప్పున తరుగు పేరిట దోపిడీకి దిగుతున్నాయి. అప్పులపాలైన ఆర్గనైజర్లు సీడ్ కంపెనీలు నేరుగా రైతుకు విత్తనం ఇవ్వకుండా ఆయా గ్రామాల్లో డీలర్ల(ఆర్గనైజర్లు)ను నియమిస్తుంది. వారి ద్వారా విత్తనాలను రైతులకు అంటగడుతుంటారు. దీంతో ఏ సమస్య వచ్చినా రైతులు డీలర్లను మాత్రమే ఆశ్రయించాలి. నేరుగా కంపెనీకి వెళ్లకుండా యాజమాన్యాలు తమ మాయజాలాన్ని ప్రదర్శిస్తున్నాయి. అయితే కొందరు డీలర్లు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. జిల్లాలోని ఓ డీలర్ 600ఎకరాలకు పైగా మక్క విత్తనాలు ఇచ్చాడు. ఇందులో కొంత కంపెనీ ఇవ్వగా, మిగిలినది తన సొంతంగా ఇచ్చాడు. కానీ, ఈసారి మార్కెట్లో మక్కకు డిమాండ్ లేక సదరు డీలర్ చేతులెత్తేశాడు. మరికొందరు డీలర్లు గత్యంతరం లేక రూ.లక్షలో అప్పు తెచ్చి రైతులకు చెల్లించారు. దీంతో వారు రోడ్డునపడే దుస్థితి నెలకొంది. కాగా, గతంలో ఇదే డీలర్లు రైతులను నిలువుదోపిడీ చేసి రూ.లక్షల్లో సంపాదించారు. ఈ సారీ మాత్రం వారికి గడ్డు పరిస్థితి ఎదురైంది రూ.150కోట్లకు పైగా పెండింగ్ హైబ్రిడ్ వరిని శంకరపట్నం, మానకొండూరు, వీణవంక, జమ్మికుంట, పెద్దపల్లి జిల్లాలోని ఓదెల, కాల్వశ్రీరాంపూర్, ముత్తారం, ఓడేడు, జగిత్యాల జిల్లాలో సాగు చేస్తున్నారు. ఎకరాకు 8క్వింటాళ్ల దిగుబడి వస్తుందని కంపెనీలు ఆశించగా, ఈసారి వాతావరణం అనుకూలించడంతో ఎకరాకు 15క్వింటాళ్లకు పైగా దిగుబడి వచ్చింది. కంపెనీలు మాత్రం టార్గెట్ కంటే మూడొంతులు ఎక్కువ దిగుబడి వచ్చిందని, ఎల్‌నినో ప్రభావంతో విత్తనం అమ్ముడుపోవడంలేదనే సాకుతో డబ్బులు చెల్లించడంలేదనే ఆరోపణలున్నాయి. మక్క, వరి కలిపి రూ.150కోట్లకు పైగా కంపెనీలు రైతులకు చెల్లించాల్సి ఉందని ఓ డీలర్ చెప్పుకొచ్చాడు. హుజూరాబాద్ నియోజ్కవర్గంలోని ఓ డీలర్‌కు రూ.30కోట్లు రావాల్సి ఉందని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికై నా ప్రజాప్రతినిధులు, అధికారులు కలుగజేసుకొని సకాలంలో డబ్బులు వచ్చేలా చూడాలని రైతులు కోరుతున్నారు. రైతులకు సకాలంలో డబ్బులు ఇవ్వని కంపెనీలపై అధికారులు చర్యలు తీసుకోవాలి. నాకున్న రెండెకరాల్లో మక్క సాగు చేసిన .60క్వింటాళ్ల దిగుబడి రాగా రూ.1.80లక్షలు రావాల్సి ఉంది. రెండునెలలుగా డీలర్‌ను అడుగుతున్న. రేపు మాపంటూ అరిగోస పెడుతుండు. మంత్రి కలుగజేసుకొని కంపెనీల నుంచి డబ్బులు ఇప్పించాలి. – సంపత్, రైతు, వీణవంక సీడ్ ధాన్యం ఉత్పత్తులను తీసుకెళ్లిన కంపెనీలు 80 రోజులు గడిచినా రైతులకు అందని సొమ్ము ఉమ్మడి జిల్లావ్యాప్తంగా వరి, మక్క కలిపి రూ.150 కోట్లకు పైగా పెండింగ్ శ్రమకు తగిన ఫలితం రాక రైతుల కుదేలు ‘వీణవంక మండలంలోని ఓ గ్రామానికి చెందిన రైతు రెండెకరాల్లో ఆడ, మగ వరి.. మరో రెండెకరాలు ఆడ, మగ మక్క వేశాడు. వరి ఎకరాన రూ.1.20 లక్షల చొప్పున, రూ.80 వేల చొప్పున మక్క మొత్తం రూ.4లక్షల దిగుబడి వచ్చింది. అదే గ్రామానికి చెందిన కంపెనీ డీలర్ నెల రోజుల్లో డబ్బులు ఇస్తానని చెప్పి ఉత్పత్తులను తీసుకెళ్లాడు. ఇప్పటికీ 80రోజులు గడిచినా చిల్లిగవ్వ ఇవ్వలేదు. పిల్లల చదువులకు ఫీజు కట్టాలని ఎంత మొరపెట్టుకున్నా కంపెనీలు డబ్బులు ఇవ్వడం లేదని, రోజూ దాటవేస్తున్నారని సదురు రైతు వాపోయాడు. కంపెనీల మాయలో రైతులు, డీలర్లు కొట్టుమిట్టాడుతున్నారు. ఇదీ ఈ ఒక్క రైతు దుస్థితి కాదు. ఆడ, మగ పంటలు సాగు చేసిన రైతుల దీనస్థితి’. -
రామగుండం నగర అభివృద్ధే లక్ష్యం
జ్యోతినగర్: రామగుండం నగర అభివృద్ధే లక్ష్యంగా ముందుకుసాగుతున్నట్లు మేయర్ మహంకాళి స్వామి అన్నారు. ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్ పుట్టినరోజు సందర్భంగా రెండోడివిజన్ నర్రాశాలపల్లెలో శనివారం కార్పొరేటర్ వెంగల బాపు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు. డిప్యూటీ మేయర్ పాతిపెల్లి ఎల్లయ్యతోపాటు కార్పొరేటర్లతో కలిసి పాల్గొని కేక్ కట్ చేసి, అన్నదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ నేతృత్వంలో అభివృద్ధి చేస్తున్నామన్నారు. కార్పొటర్ గట్ల రమేశ్, నాయకులు పాల్గొన్నారు. -
అబ్బురపర్చిన ‘ఏరో షో’
జ్యోతినగర్: విద్యార్థుల్లో శాసీ్త్రయ ఆలోచన, సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించే లక్ష్యంతో ఎన్టీపీసీ ఏరో షో ప్రోటోటైప్ వర్క్‌షాప్ నిర్వహించింది. ఎన్టీపీసీ కాకతీయ హాల్లో ఏవియేషన్, ఏరోడైనమిక్స్, మోడల్ తయారీ వంటి అంశాలపై ఏరోవిషన్ ఏరో మోడలింగ్, నాగపూర్ అధినేత, మాజీ సైంటిస్ట్ రాజేశ్ ఎన్. జోషి అవగాహన కల్పించారు. విద్యార్థులు పాఠ్యాంశాలకు మాత్రమే పరిమితం కాకుండా ప్రాక్టికల్ అనుభవం ద్వారా సైన్స్, టెక్నాలజీ రంగాలపై ఆసక్తి పెంచుకోవాలని, వర్క్‌షాప్ ప్రధాన ఉద్దేశం ఇదేనని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏజీఎం(హెచ్ఆర్)సాగర్ రంజన్ సాహు, ప్రవీణ్ కే చౌదరి, జ్యోతిక క్లబ్ కార్యదర్శి రంజిత్ కుమార్ పలు వురు నిపుణులు తదితరులు పాల్గొన్నారు. ఆర్పీఎఫ్ సీఐకి పురస్కారం రామగుండం: స్థానిక రై ల్వే రక్షక దళం(ఆర్పీఎఫ్) సీఐ కొదురుపాక రాజేంద్రప్రసాద్ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సికింద్రాబాద్‌లోని దక్షిణ మధ్య రైల్వే కేంద్ర కార్యాలయంలో శనివారం నిర్వహించిన వేడుకలకు పరేడ్ కమాండర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. పతాకావిష్కరణ తర్వాత అత్యుత్తమ విధులు నిర్వహించినందుకు డివిజనల్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ కమిషనర్ నవీన్‌కుమార్, అసిస్టెంట్ కమిషనర్ నరేంద్రవర్మ, మేనేజర్ గోపాలకృష్ణ రూ.50వేలు అందజేశారు. స్థానిక ఆర్పీఎఫ్ ఎస్సై క్రాంతికుమార్, ఏఎస్ఐ మాసాని నాగరాజు, శేఖర్‌రెడ్డి తదితరులు అభినందించారు. రైల్వేస్టేషన్ అభివృద్ధి పనుల పరిశీలనపెద్దపల్లిరూరల్: అమృత్ పథకం ద్వారా స్థానిక రైల్వే జంక్షన్లో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులను పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ శనివారం పరిశీలించారు. హమాలీలతో మాట్లాడి సమస్యల పై ఆరా తీశారు. పరిష్కారానికి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళతానన్నారు. రామగుండం–మణుగూరు రైల్వే పనులు సాగుతున్నందుకు సంతోషంగా ఉందని అన్నారు. రైల్వే సమస్యలను తెలుసుకుని అధికారులతో మాట్లాడి పరిష్కారానికి ప్రయత్నిస్తున్నట్టు చెప్పారు. కన్నాలలో మద్యపాన నిషేధం మంథనిరూరల్: కన్నాల గ్రామ పంచాయతీలో మద్యపాన నిషేధం విధిస్తూ పంచాయతీ పాలకవర్గం తీర్మానం చేసింది. శనివారం గ్రామసభ నిర్వహించి పాలకవర్గం, గ్రామస్తుల ఆమోదంతో ఈ తీర్మానం చేశారు. ఆగస్టు 15నుంచి మద్యం అమ్మకాలు చేయరాదని, అతిక్రమిస్తే రూ.520వేల జరిమానా విధిస్తామని సర్పంచ్ గుడిసె గట్టయ్య హెచ్చరించారు. మద్యపాన నిషేధం అమలుకు ఎకై ్సజ్, పోలీస అధికారులు సహకారం అందించాలని కోరుతూ తీర్మానపత్రాలను వారికి అందజేశారు. ఉపసర్పంచ్ గాదె దివ్య సంజీవ్‌రెడ్డి, వార్డు సభ్యులు ముస్కుల కృష్ణవేణి, వంగల కీర్తన, రామగిరి సంపత్, కావటి రజిత, పర్శవేన అనిల్, తోట శ్రావణ్, చంద్రు పద్మ, గ్రామస్తులు పాల్గొన్నారు. జాతీయ జెండాకు అవమానంపెద్దపల్లిరూరల్: జిల్లా కేంద్రంలోని ఓ స్కూల్ ఆవరణలో శనివారం స్వాతంత్య్ర దినోత్సవం ఘనంగా నిర్వహించారు. జాతీయ పతాకాన్ని ఎగరేసిన పాఠశాల సిబ్బంది ఆ తర్వాత వెళ్లిపోయారు. కాసేపటికే పతాకం కిందకు జారింది. గమనించిన స్థానికులు విద్యాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన అధికారులు వెంటనే సరిచేశారు. జాతీయ జెండా కిందకు జారిందని సమాచారం తెలియగానే సరిచేశామని పెద్దప ల్లి ఎంఈవో సురేందర్‌కుమార్ తెలిపారు. -
రక్షణతో కూడిన బొగ్గు ఉత్పత్తి లక్ష్యం
గోదావరిఖని: రక్షణతో కూడిన బొగ్గు ఉత్పత్తితో ముందుకు సాగి దేశప్రగతిలో సింగరేణీయులు కీలకపాత్ర పోషించాలని ఆర్జీ –వన్ జీఎం లలిత్‌కుమార్ సూచించారు. స్థానిక జీఎం కార్యాలయంలో జరిగిన పంద్రాగస్టు వేడుకల్లో మాట్లాడారు. సేవా అధ్యక్షురాలు అనిత, క్వాలిటీ జీఎం వెంకటరమణ, సీఎంవోఏఐ ప్రతినిధి కోల మల్లేశం, ఏఐటీయూసీ నాయకుడు మడ్డి ఎల్లగౌడ్, ఎస్వోటూ జీఎం చంద్రశేఖర్, పర్సనల్ మేనేజర్ రెడ్డిమల్ల తిరుపతి, ఏరియా ఇంజినీర్ రాజాజీ, ప్రాజెక్ట్ అధికారి రమేశ్, ఏజెంట్లు శ్రీనివాస్, రమేశ్, అధికారులు జితేందర్‌సింగ్, కర్ణ, వీరారెడ్డి, వేణు, శ్రావణ్‌కుమార్, హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. -
దేశాభివృద్ధిలో ఎన్టీపీసీ కీలకం
జ్యోతినగర్: భారతదేశ అభివృద్ధిలో ఎన్టీపీసీ కృషి ఎంతోఉందని రామగుండం – తెలంగాణ ప్రాజెక్టు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్(ఈడీ) చందన్ కుమార్ సామంత అన్నారు. ఎన్టీపీసీ మహాత్మాగాంధీ క్రీడా మైదానంలో జరిగిన స్వాతంత్య్ర దినోత్సవంలో ఆయన మాట్లాడారు. మనదేశ స్వాతంత్య్రం కోసం పోరాడిన వారి త్యాగాలు, ధైర్యం, సంకల్పం గురించి గుర్తు చేసుకోవాలన్నారు. అనంతరం జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ప్రతిభావంతులకు అవార్డులు, జ్ఞాపికలు అందించారు. దీప్తి మహిళా సమితి అధ్యక్షురాలు రాఖీ సామంత, జనరల్ మేనేజర్లు, సీనియర్ అధికారులు, ఉద్యోగ గుర్తింపు సంఘం ప్రతినిధులు, సీఐఎస్ఎఫ్ అధికారులు పాల్గొన్నారు. జెండా ఆవిష్కరిస్తున్న చందన్ కుమార్ సామంత -
చివరిశ్వాస వరకూ ప్రజలతోనే..
గోదావరిఖని: తన చివరిశ్వాస వరకూ ప్రజల వెంటే ఉంటానని ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్‌ఠాకూర్ అన్నా రు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శనివారం జరిగిన ఎమ్మెల్యే పుట్టినరోజు వేడుకల్లో ప్రజలతో కలిసి ఆనందంగా నృత్యం చేశారు. అనంతరం మా ట్లాడుతూ ప్రజాసమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తానన్నారు. ఎమ్మెల్యే సతీమణి మనాలీఠాకూర్, మేయర్ మహంకాళి స్వామి, డిప్యూటీ మేయర్ పాతిపెల్లి ఎల్లయ్య, నాయకులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు తన కార్యాలయంలో జాతీయ జెండా ఎగురవేశారు. డిప్యూటీ మేయర్ ఎల్లయ్య పాల్గొన్నారు. ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్ జన్మదిన వేడుకలు ప్రధాన చౌరస్తాలో ఘనంగా నిర్వహించారు. కేక్‌కట్ చేసి అన్నదానం చేశారు. ఆయా కార్యక్రమాల్లో డిప్యూటీ మేయర్ పాతిపెల్లి ఎల్లయ్య, నాయకులు దీటి బాలరాజు, ముస్తాఫా తదితరులు పాల్గొన్నారు. -
ప్రజలకు అండగా ఉండాలి
గోదావరిఖని: అత్యవసర పరిస్థితుల్లో పోలీసులు ప్రజలకు అండగా ఉండాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా సూచించారు. రామగుండం పోలీస్ కమిషనరేట్‌లో ఆయన జాతీయ జెండా ఎగురవేసి మాట్లాడారు. స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలు, బలిదానాల ఫలి తంగానే మనం స్వేచ్ఛాయుతమైన, ప్రశాంతమైన జీవితా న్ని గడుపుతున్నామని అన్నారు. అడిషనల్ డీసీపీ(అడ్మిన్) శ్రీనివాస్, గోదావరిఖని, స్పెషల్ బ్రాంచ్, ట్రాఫిక్, సీసీ ఎస్, ట్రాఫిక్, టాస్క్‌ఫోర్స్ ఏసీపీలు రమేశ్ నాగేంద్రగౌడ్, శ్రీనివాస్, రవీందర్, ప్రవీణ్ కుమార్, శ్రీనివాస్‌రావు, ఏవో శ్రీనివాస్, సీఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు. -
త్యాగధనుల స్ఫూర్తితో అభివృద్ధి
జాతీయ జెండా ఎగురవేస్తున్న విప్ విజయరమణారావు, పక్కన కలెక్టర్ శ్రీహర్షస్వాతంత్య్ర సమరయోధుల త్యాగాల స్ఫూర్తితో ప్రజాసంక్షేమం, సమగ్రాభివృద్ధికి ప్రజాప్రభుత్వం కృషి చేస్తోందని ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అన్నారు. స్థానిక పోలీస్ పరేడ్ గ్రౌండ్లో శనివారం నిర్వహించిన స్వాతంత్య్ర దినోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జాతీయ పతాకం ఎగురవేశారు. పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం మాట్లాడారు. – సాక్షి,పెద్దపల్లిఆగస్టు 15 నుంచి రాష్ట్రవ్యాప్తంగా 2.50 లక్షల మందికి కొత్త పింఛన్లు అందిస్తున్నామని విప్ విజయరమణారావు తెలిపారు. జిల్లాలో 30,909 కొత్త రేషన్ కార్డులు మంజూరు చేసి 88,357 మందికి ప్రయోజనం కల్పించామన్నారు. చేయూత ద్వారా 90,540 మందికి రూ.40.70 కోట్లు అందిస్తున్నా మని చెప్పారు. మహాలక్ష్మి పథకం ద్వారా 1.19 లక్షల మందికి రూ.14.03 కోట్ల సబ్సిడీతో 4.74 లక్షల వంటగ్యాస్ సిలిండర్లను రూ.500కే అందించామని వివరించారు. గృహజ్యోతి పథకం ద్వారా 1,40,116 కుటుంబాలకు ఉచిత విద్యుత్ అందిస్తూ ఇప్పటివరకు రూ.141.64 కోట్ల సబ్సిడీ ఇచ్చామని తెలిపారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళల ఉచిత ప్రయాణంతో రూ.245.27 కోట్ల మేర ఆదా జరిగిందని అన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా ఇప్పటివరకు 5,982 మంది లబ్ధిదారుల ఖాతాల్లో రూ.135 కోట్లు జమ చేశామని ప్రభుత్వ విప్ తెలిపారు. రైతు సంక్షేమానికి ప్రాధాన్యం ● రైతుభరోసా ద్వారా జిల్లాలో 1,53,582 మంది రైతులకు రూ.161.38 కోట్లు, ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి 23వ విడతలో 65,757 రైతు కుటుంబాలకు రూ.13.15 కోట్లు జమ చేశామని విజయరమణారావు తెలిపారు. 75,257 కనెక్షన్ల ద్వారా వ్యవసాయ రంగానికి 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తూ ఏటా రూ.101 కోట్ల సబ్సిడీ ఇస్తున్నామని ప్రభుత్వ విప్ విజయరమణారావు చెప్పారు. 2025–26 ఖరీఫ్‌లో రూ.845.89 కోట్ల విలువైన 3.54 లక్షల మెట్రిక్ టన్నులు, రబీలో రూ.1,057 కోట్ల విలువైన 4.46 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని తెలిపారు. విద్య, వైద్య రంగాలకు భారీగా నిధులు ● అమ్మ ఆదర్శ పాఠశాలల్లో వసతుల కల్పనకు రూ.22 కోట్లు, భవిత కేంద్రాల అభివృద్ధికి రూ.66 లక్షలు, కేజీబీవీలకు రూ.1.69 కోట్లు, ప్రీ ప్రైమరీ విద్య బలోపేతానికి రూ.98.60 లక్షలు ఖర్చు చేసినట్లు విప్ వెల్లడించారు. ఆరోగ్యశ్రీ ద్వారా 48,188 మందికి శస్త్రచికిత్సలు చేసి రూ.120.56 కోట్ల మేర లబ్ధి చేకూర్చామని తెలిపారు. రూ.101.45 కోట్ల అంచ నా వ్యయంతో జిల్లా ఆస్పత్రిని 50 నుంచి 100 పడకలకు విస్తరించామని, మంథనిలో 50 పడకలు, గుంజపడుగులో పీహెచ్సీ, రామగుండంలో ప్రభుత్వ నర్సింగ్ కళాశాల పనులు కొనసాగుతున్నాయని ప్రభుత్వ విప్ చెప్పారు. వసతుల కల్పనకు పెద్దపీట ● హ్యామ్ తొలిదశలో 141 కి.మీ. మేర 44 రహదారి పనులు చేపడుతున్నామని విప్ విజయరమణారావు తెలిపారు. ప్లాన్గ్రాంట్ల కింద 21 రోడ్లకు రూ.574 కోట్లు, డీఎంఎఫ్టీ నిధులతో 19 రహదారి పనులకు రూ.187 కోట్లు కేటాయించినట్లు వివరించారు. రూ.482 కోట్లతో 10 వంతెనల నిర్మాణం, విస్తరణ చేపట్టి ఆరు పూర్తిచేశామని చెప్పారు. పెద్దపల్లి–కాల్వ శ్రీరాంపూర్ – కూనారం రోడ్డుపై రూ.119 కోట్లతో చేపట్టిన ఆర్వోబీ పనులు 75 శాతం పూర్తయ్యాయని తెలిపారు. అమృత్ 2.0, యూఐడీఎఫ్, డీఎంఎఫ్టీ నిధులతో తాగునీరు, రోడ్లు, డ్రైనేజీ, వీధిదీపాలు తదితర అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు తెలిపారు. బస్సు డిపో, బైపాస్ రోడ్డు పనులకు ఊతం ● పెద్దపల్లి ప్రజల చిరకాల స్వప్నం ఆర్టీసీ బస్సు డిపో నిర్మాణానికి రూ.8.40 కోట్లు మంజూరయ్యాయని విజయరమణారావు తెలిపారు. బైపాస్ రోడ్డు నిర్మాణానికి సీఎం రేవంత్‌రెడ్డి రూ.82 కోట్లు మంజూరు చేశారని అన్నారు. కోకాకోలా పెట్టుబడితో పారిశ్రామిక ప్రగతి ● జిల్లాలో పారిశ్రామికాభివృద్ధికి 31 యూనిట్లకు అనుమతులు ఇచ్చి రూ.17.75 కోట్ల పెట్టుబడులకు మార్గం సుగమం చేశామని విప్ తెలిపారు. వీటిద్వారా 346 ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు చెప్పారు. సీఎం రేవంత్‌రెడ్డి, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు కృషితో కోకాకోలా సంస్థ రూ.700 కోట్లకుపైగా పెట్టుబడితో జిల్లాకు వస్తోందని వెల్లడించారు. జాతీయ స్థాయి అవార్డు గ్రహీతకు సన్మానం ● స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జాతీయస్థాయిలో సంగీత నాటక అవార్డు అందుకున్న దురిశెట్టి రామయ్యతోపాటు వరదల నుంచి ప్రజలను రక్షించడంలో ధైర్యసాహసాలు ప్రదర్శించిన అంతం శేఖర్, ఆకుల అరవింద్‌ను విప్ విజయరమణారావు సన్మానించారు. విధుల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 12 మంది పోలీసు అధికారులు, సిబ్బందికి తెలంగాణ రాష్ట్ర పోలీస్ సేవా పతకాలు అందజేశారు. అలాగే వివిధ శాఖల్లో సమర్థవంతంగా విధులు నిర్వహించిన 244 మంది ఉద్యోగులను ప్రశంసించారు. అనంతరం ధర్మారం, జూలపల్లి కేజీబీవీ, ఎంజేపీ విద్యార్థులు చేసిన ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. కలెక్టర్ కోయ శ్రీహర్ష, అదనపు కలెక్టర్లు శ్రీరాములు, అరుణశ్రీ, డీసీపీ రాంరెడ్డి, రామగుండం ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్, ఆర్డీవో గంగయ్య, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అన్నయ్యగౌడ్, అధికారులు, ప్రజాప్రతినిధులు, పోలీసులు, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. పేదలకు నాణ్యమైన సన్నబియ్యం పెద్దపల్లి: ప్రజాప్రభుత్వం ప్రతీకుటుంబానికి రేషన్‌కార్డు, నాణ్యమైన సన్నబియ్యం అందిస్తోందని ప్రభుత్వ విప్ విజయరమణారావు అన్నారు. కలెక్టరేట్లో శనివారం జరిగిన కార్యక్రమంలో ఆయన రేషన్‌కార్డుదారులకు స్మార్ట్‌రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియను ప్రారంభించి మాట్లాడారు. జిల్లాలో 2 లక్షల 46 వేల 157 కుటుంబాలకు స్మార్ట్‌రేషన్ కార్డులు పంపిణీ చేస్తామని విప్ అన్నారు. అనంతరం కులాంతర వివాహం చేసుకున్న 116 జంటలకు రూ.2.50 లక్షల చొప్పున ప్రోత్సాహకాలు పంపిణీ చేశారు. అధికారులు పాల్గొన్నారు. -
శాత్రజ్‌పల్లిలో భూమాయ!
ముత్తారం: మంథని డివిజన్లో మారుమూలన ఉ న్న పల్లె శాత్రజ్‌పల్లి. ఒక గిరిజన గ్రామం కూడా. అ క్కడి ప్రభుత్వ భూమిపై అక్రమార్కుల కన్నుపడింది. దాంతోపాటే రోడ్డునూ కబ్జా చేశారు. ఫిర్యాదుల తో స్పందించిన అధికారులు.. సర్వే చేయగా.. అది కబ్జా అని తేల్చి హెచ్చరికలు జారీచేశారు. అయినా అక్రమార్కులు వాటిని బేఖాతరు చేస్తున్నారు. మానేరు ఉప్పొంగితే.. ముత్తారం మండలం పారుపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని మానేరు ఆవలివైపు ఉండేది మా రు మూల శాత్రజ్‌పల్లి. ఇది పూర్తిగా గిరిజన గ్రామం. మానేరు ఉప్పొంగితే రాకపోకలు స్తంభిస్తాయి. దీనిని దృష్టిలో పెట్టుకున్న అధికారులు.. గిరిజనులకు రవాణా సౌకర్యం కల్పించేందుకు ప్రొఫెసర్ జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండ లం వెంకట్రావ్పల్లి వెళ్లడానికి ఉపాఽధిహామీ పథకంలో రూ.లక్షలు వెచ్చించి రోడ్డు నిర్మించారు. 28 ఎకరాలు, రహదారి కబ్జా.. శాత్రజ్‌పల్లి గ్రామ శివారులోని 181 సర్వే నంబరు లో ప్రభుత్వ భూమి ఉంది. అందులో సుమారు 28 ఎకరాలతోపాటు ఉపాఽధిహామీ ద్వారా నిర్మించిన రహదారిని ఓ కబ్జాదారు ఆక్రమించేశాడు. ప్రభుత్వ భూమిని కబ్జా చేయడమే కాకుండా రోడ్డును సైతం ధ్వంసం చేసి సాగు చేయడం ప్రారంభించాడు. దీనిపై స్థానికులు, గిరిజనులు ఇటీవల కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. కలెక్టర్ ఆదేశాల మేరకు స్థానిక రెవెన్యూ అధికారులు సర్వే చేయగా.. 181 సర్వే నంబరులో 21.26 ఎకరాలు కబ్జాకు గుర య్యాయని తేలింది. అంతేకాదు.. ఉపాధిహామీ ద్వారా నిర్మించిన రోడ్డునూ ఆక్రమించి సాగు చేశారని పారుపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శి, ఉపాధిహామీ క్షేత్ర సహాయకుడు ఉన్నతాధికారులకు నివేదిక సమర్పించారు. అక్రమార్కులపై చర్యలేవి? ప్రభుత్వ భూమి, ఉపాధిహామీ రోడ్డు కబ్జాకు గురయ్యాయని అధికారులు నివేదిక అందజేసినా అక్రమార్కులపై ఇంకా చర్యలు చేపట్టకపోవడంపై స్థానికులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పదేళ్లక్రితం పోతారంలో ప్రభుత్వ భూమి కబ్జాచేసిన అక్రమార్కులపై చర్యలు తీసుకున్న ఉన్నతాధికారులు.. తాజా భూఆక్రమణదారుపై కూడా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. కలెక్టర్ ఈవిషయంలో జోక్యం చేసుకోవాలని విన్నవిస్తున్నారు. మరోవైపు.. జిల్లా, మండలస్థాయి అధికారుల దృష్టికి సమస్య వెళ్లినా పరిష్కారం కాకపోవడంతో ముత్తారానికి చెందిన మాజీ జెడ్పీటీసీ నాగినేని జగన్మోహన్రావు గిరిజనుల తరఫున హైకోర్డును ఆశ్రయించారు. శాత్రజ్‌పల్లిలో భూఆక్రమణపై ఫిర్యాదు అందగానే విచారణ చేపట్టాం. ఓ వ్యక్తి ప్రభుత్వ భూమి చదును చేసుకుంటున్నాడని, ఏమై నా ఆధారాలు ఉంటే తమకు అందజేయా లని నోటీసులు జారీచేశాం. ప్రభుత్వ భూ మిని కబ్జా చేయొద్దని ఆ స్థలంలో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశాం. ప్రభుత్వ భూమి కబ్జాపై విచారణ చేపట్టి తయారు చేసిన నివేదికను కలెక్టర్‌కు అందజేస్తాం. – మధూసూదన్‌రెడ్డి, తహసీల్దార్ -
ఆదర్శ నగరం మన లక్ష్యం
కోల్‌సిటీ: స్వాతంత్య్ర సమరయోధుల ఆశయాలు, ఆకాంక్షలకు అనుగుణంగా రామగుండం నగరాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్తున్నామని మేయర్ మహంకాళి స్వామి అన్నారు. బల్దియాలో జరిగిన స్వాతంత్య్ర దినోత్సవంలో జాతీయ పతాకం ఆవిష్కరించి మాట్లాడారు. స్వాతంత్య్రం చారిత్రక ఘట్టమేకాదని, ప్రగతి, సామాజిక సమానత్వం, స్వయం సమృద్ధి లక్ష్యాలతో సాగే నిరంతర ప్రయాణమన్నారు. పాలకవర్గం నేటితో ఆరు నెలల పదవీకాలాన్ని విజయవంతంగా పూర్తిచేసుకుందని తెలిపారు. కమిషనర్ అరుణశ్రీ మాట్లాడుతూ.. ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారులు, ప్రజాప్రతినిధులు ఇదే సహకారాన్ని కొనసాగించాలన్నారు. డిప్యూటీ మేయర్ పాతపెల్లి ఎల్లయ్య, కార్పొరేటర్లు, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
వారసుల దీక్షలకు మద్దతు
గోదావరిఖని: సింగరేణి మారుపేర్లు, విజిలెన్స్ పెండింగ్ కేసుల సమస్యకు శాశ్వత పరిష్కారం కల్పించాలని డిమాండ్ చేస్తూ కొత్తగూడెం హెడ్ఆఫీస్ వద్ద ప్రారంభమైన ఆమరణ నిరాహార దీక్షకు ఐఎఫ్టీయూ మద్దతు ప్రకటిస్తుందని ఆ యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఐ.కృష్ణ తెలిపారు. శుక్రవారం యూనియన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేసి, సింగరేణి యాజమాన్యం మారుపేర్లు, విజిలెన్స్ పెండింగ్ కేసుల సమస్యను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సమస్య పరిష్కారమయ్యే వరకు బాధితులు వెనక్కి తగ్గబోరని, ఉద్యోగం వచ్చేదాకా పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో నాయకులు చింతల శేఖర్, ఈదునూరి రామకృష్ణ, చింతల శేఖర్, రవికుమార్, ఇర్ఫాన్, పోగుల శేఖర్, ప్రభాకర్, రాజయ్య తదితరులు పాల్గొన్నారు. -
ఆర్మీలో ఇల్లంతకుంట యువత..
ఇల్లంతకుంట: రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట గ్రామం ఆర్మీ జవాన్లకు కేరాఫ్‌గా నిలుస్తోంది. 1948లో మొదటిసారిగా ఇల్లంతకుంట నుంచి జెట్టిపోచయ్య సైన్యంలో చేరారు.మహమ్మద్ జైనుద్దీన్ సైన్యంలో పనిచేసి రిటైర్డ్ అయ్యారు. సింగిరెడ్డి శ్రీనివాసరెడ్డి 1985 నుంచి ఆర్మీలో సేవలందించారు. రిటైర్డ్ అయిన తర్వాత రైల్వేశాఖలో ఉద్యోగం చేస్తున్నట్టు పేర్కొన్నారు. వీరే కాకుండా బండారి అజయ్, అనిల్, అంతటి అనిల్, గడ్డమీద శ్రీకాంత్, డి.శశి కుమార్, కూనబోయిన పరశురాం, బైరి అనిల్ కుమార్, ఓదెల శివ, ఆనంద్ సైన్యంలో సేవలందిస్తున్నారు. -
శ్రీకృష్ణసేన విద్యానిధి యాత్ర ప్రారంభం
మంథని: యాదవ చారిటబుల్ ట్రస్ట్, అఖిల భారత యాదవ మహాసభ ఆధ్వర్యంలో చేపట్టిన శ్రీకృష్ణ సేవా విద్యానిధి యాత్ర పట్టణంలో శుక్రవారం ఘనంగా ప్రారంభమైంది. యాదవులు, బడుగు, బలహీన వర్గాల పేదవిద్యార్థులు చదువులో వెనుకబడుతున్నారని, వారిని విద్యకు దగ్గర చేయడంతోపాటు ఉన్నత చదువుల వైపు ప్రోత్సహించాలనే సదుద్దేశంతో ఈయాత్ర చేపట్టామని నిర్వాహకులు తెలిపారు. విద్య ద్వారా సామాజిక అభివృద్ధి సాధించాలనే సంకల్పంతో యాత్ర కొనసాగుతుందని పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలో పేద విద్యార్థుల కోసం ఉచిత విద్య, వసతి భవనం నిర్మిస్తున్నామని, ఈ కార్యక్రమానికి యాదవులు సహకరించాలని కోరారు. అఖిల భారత యాదవ మహాసభ జిల్లా అధ్యక్షుడు మేకల మల్లేశం యాదవ్, గొర్రెలకాపరుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు సలేంద్ర రాములు యాదవ్, అఖిల భారత యాదవ మహాసభ మహిళా విభాగం అధ్యక్షురాలు సల్పాల సుమలత, ప్రధాన కార్యదర్శి ఓదెలు, నాయకులు వేముల లక్ష్మణ్, పెగడ శ్రీనివాస్, అశోక్, సామ తిరుపతి, సాంబమూర్తి తదితరులు పాల్గొన్నారు. -
తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు
పెద్దపల్లి: జిల్లాలో తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. తాగునీటి సరఫరా, సమస్యలపై కలెక్టరేట్లో శుక్రవారం సమీక్షించారు. అధికారులు, ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకుంటూ తాగునీటి సమస్యలు గుర్తించి పరిష్కరించాలని సూచించారు. మిషన్ భగీరథ ఈఈలు గంగాధర శ్రీనివాస్, పూర్ణచందర్, తదితరులు పాల్గొన్నారు. 17న దివ్యాంగులకు ఉపకరణాలు రామగుండం నియోజకవర్గంలోని గోదావరిఖని ఆర్జీ–1 సింగరేణి కమ్యూనిటీహాల్లో ఈనెల 17న దివ్యాంగులకు ఉచితంగా ఉపకరణాలు పంపిణీ చేస్తామని కలెక్టర్ శ్రీహర్ష తెలిపారు. రామగుండం, పాలకుర్తి, అంతర్గాం ప్రాంతాలకు చెందిన వారే హారు కావాలన్నారు. బ్యాటరీ ఆపరేటెడ్ ట్రైసైకిల్, మూడు చక్రాల రిక్షా, వీల్‌చైర్, చంక కర్రలు, చేతికర్రలు అందించనున్నట్లు పేర్కొన్నారు. వివరాలకు 94408 52495, 95507 96597 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. -
పేదలకు స్మార్ట్‌కార్డులు
పెద్దపల్లి: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రప్రభుత్వం స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీకి శ్రీకారం చుటింది. ఈనెల 15న వీటిని పంపిణీ చయనుంది. సంగారెడ్డిలో జరిగే కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించనుండగా.. జిల్లా కేంద్రంలో జరిగే పంద్రాగస్టు వేడుకల్లో ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు స్మార్ట్‌రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియను ప్రారంభిస్తారు. ఇందుకోసం అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. జిల్లాలో 2,46,157 కార్డులు జిల్లాలో 2,46,157 రేషన్ కార్డులు ఉన్నాయి. వీటిద్వారా పేదలు రేషన్ పొందుతున్నారు. ఇకపై ప్రజా పంపిణీ వ్యవస్థలో స్మార్ట్ రేషన్ కార్డులను వినియోగించనున్నారు. కొత్తకార్డులతో రేషన్ పంపిణీ ప్రక్రియను మరింత పారదర్శకంగా, సులభంగా నిర్వహించనున్నారు. కార్డుల దుర్వినియోగానికి అడ్డుకట్ట వేయాలని ప్రభుత్వం భావిస్తోంది. తొమ్మిది రకాల భద్రతా ఫీచర్లు నకిలీకి అవకాశం లేకుండా స్మార్ట్‌రేషన్ కార్డుల్లో ఆధునిక భద్రతా సాంకేతికతను పొందుపరిచారు. పాస్‌పోర్టులు, కరెన్సీనోట్లలో ఉపయోగించే తరహా భద్రతా అంశాలను ఇందులో వినియోగించారు. అసెంబ్లీ కార్డులు పెద్దపల్లి 1,04,025 మంథని 49,425 రామగుండం 74,601 ధర్మారం(మండలం) 18,108 స్మార్ట్ రేషన్ కార్డులో కుటుంబయజమాని ఫొటోతోపాటు సభ్యుల వివరాలు ఉంటాయి. రేషన్‌కార్డు కోసం ఇకపై మీసేవ కేంద్రాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్లో లాంఛనంగా ప్రారంభిస్తాం. తర్వాత మండలాల వారీగా పంపిణీ చేస్తాం. ఇందుకోసం త్వరలోనే షెడ్యూల్ ప్రకటిస్తాం. – శ్రీనాథ్, జిల్లా పౌర సరఫరాల అధికారి -
పోగొట్టుకున్న బంగారం అప్పగింత
ధర్మారం: పెద్దపల్లి జిల్లా ధర్మారంలోని మా షాపింగ్ మాల్ వద్ద బంగారు పుస్తెలు పోగొట్టుకున్న జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం కొండాపూర్ గ్రామానికి చెందిన ఎనగందుల స్రవంతికిఎస్సై ప్రవీణ్‌కుమార్ శుక్రవారం తిరిగి అందించారు. గురువారంరాత్రి షాపింగ్‌మాల్‌లో బట్టలు కొనుగోలు చేసుకుని ఇంటికి వెళ్తుండగా.. బంగారు పుస్తెలు, గుండ్లు పొగోట్టుకుంది. బాధితురాలు పోలీస్టుస్టేషన్లో ఫిర్యాదు చేయగా ఎస్సై ఆదేశాల మేరకు పోలీస్ కానిస్టేబుల్ సతీశ్.. సీసీ కెమోరా ఫుటేజీలు పరిశీలించారు. బంగారంతో ఉన్నపర్స్ తీసుకున్న వ్యక్తిని గుర్తించారు. ఆ వ్యక్తిని ప్రశ్నించగా తనకు పర్స్ దొరినట్లు తెలిపాడు. బాధితురాలిని స్టేషన్‌కు పిలిపించి పుస్తెలు, గుండ్లతో ఉన్నపర్స్ను ఎస్సై అందించారు. సకాలంలో స్పందించిన పీసీని ఎస్సై అభినందించారు. -
హక్కుల సాధనకు ఐక్య పోరాటం
గోదావరిఖని: సింగరేణి కార్మికుల హక్కుల సాధనకు ఐక్యంగా పోరాడుదామని టీజీబీకేఎస్ వ్యవస్థాపక కన్వీనర్ కెంగెర్ల మల్లయ్య కోరారు. బాయిబాటలో భాగంగా ఆర్జీ–1 ఏరియా జీడీకే–2వ గనిని శుక్రవారం ఆయన సందర్శించి కార్మికులతో మాట్లాడారు. నష్టాల్లో ఉన్న సంస్థను కార్మికులంతా కలిసి లాభాల బాటలోకి తీసుకొచ్చారని తెలిపారు. కానీ నేడు సంస్థ ఆర్థికంగా వెనకపడిపోయిందన్నారు. సంస్థకు రావాల్సిన బకాయిలు వెంటనే అందజేసి కాపాడాల్సిన అవసరం ఉందని అన్నారు. కార్మికులకు పనిముట్లు అందజేయడంలో యాజమాన్యం విఫలం అయ్యిందని విమర్శించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కనువిప్పు కలిగేలాగా కార్మికులు ఏకమై పోరాడాలని ఆయన కోరారు. కార్యక్రమంలో నాయకులు దొడ్ల సతీశ్, జక్కుల శంకర్, రేగుల నరేశ్, భాస్కర్, సాగర్ తదితరులు పాల్గొన్నారు. -
కార్మికుల హక్కులు కాపాడుకుందాం
గోదావరిఖని: స్వాతంత్య్ర ఉద్యమ స్ఫూర్తితో కార్మికుల హక్కుల సాధనకు పోరాడాలని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎ.ముత్యంరావు కోరారు. శుక్రవారం స్థానిక ప్రధాన చౌరస్తాలో కాగడాల ప్రదర్శన నిర్వహించారు. కార్మికుల హక్కుల కోసం వీరోచితమైన పోరాటాలు చేసి హక్కులు, చట్టాలు సాధించుకున్న ఘనత కార్మిక వర్గానికి ఉందన్నారు. 4 లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షడు టి.రాజారెడ్డి, జిల్లా అధ్యక్షుడు వేల్పుల కుమారస్వామి, కోశాధికారి రామాచారి, ఉపాధ్యక్షుడు బిక్షపతి, నాయకులు నెర్వట్ల నర్సయ్య, లక్ష్మారెడ్డి, నరహరిరావు, ఎ.మొగిలి, శ్రీహరి, కిషన్, రవి, సాగర్, ఎన్.నారాయణ తదితరులు పాల్గొన్నారు. -
500 మీటర్ల జాతీయ జెండా
గోదావరిఖని/గోదావరిఖనిటౌన్: 500 మీటర్ల పొడవైన జాతీయ జెండాతో హర్ ఘర్ తిరంగా ర్యాలీని బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కందుల సంధ్యారాణి ఆధ్వర్యంలో శు క్రవారం నగరంలో ఘనంగా నిర్వహించారు. పలు కళాశాలలు, పాఠశాలల విద్యార్థులు జా తీయ జెండాలు చేత పట్టుకుని దేశభక్తి నినాదాలు చేశారు. కార్యక్రమంలో భాస్కర్‌రెడ్డి, ల క్ష్మీనర్సయ్య, పద్మ, అపర్ణ, వెంకటరమణ, జన గామ భూమయ్య, సుభాష్, స్వామి, బాలు, కల్యాణ్, బియ్యాల మహేందర్, రాజ్‌కుమార్, నరేశ్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. త్రివర్ణ పతాకం ప్రదర్శన జ్యోతినగర్: ఎన్టీపీసీ పీటీఎస్‌లో శుక్రవారం హర్ ఘర్ తిరంగా ప్రదర్శనను ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ చందన్ కుమార్ సామంత, దీప్తి మహి ళా సమితి అధ్యక్షురాలు రాఖీ సామంత ప్రారంభించారు. త్రివర్ణ పతాకం, భారతదేశ స్వాతంత్య్ర ప్రస్థానం, జాతీయ గుర్తింపును తెలియజేసే అంశాలు ఈ ప్రదర్శనలో ఉన్నాయని సామంత పేర్కొన్నారు. సీఐఎస్ఎఫ్ ‘హర్ ఘర్ తిరంగా’ జ్యోతినగర్: ఎన్టీపీసీలో సీఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో శుక్రవారం హర్ ఘర్ తిరంగా యాత్ర (బైక్ ర్యాలీ) నిర్వహించారు. ప్రాజెక్టు లేబర్ గేట్లో సీఐఎస్ఎఫ్ కమాండెంట్ నవనీత్ కౌర్ జెండా ఊపి ర్యాలీ ప్రారంభించారు. జాతీయ జెండాలతో నిర్వహించిన ర్యాలీ ఆకట్టుకుంది. సుమారు 50 బైక్‌లపై 100 మంది పాల్గొని జాతీయ జెండాలతో దేశభక్తి చాటారు. కార్యక్రమంలో రామగుండం సీఐ కృష్ణకుమార్, ట్రాఫిక్ ఎస్సై హరిశేఖర్, సీఐఎస్ఎఫ్ సిబ్బంది, అధికారులు పాల్గొన్నారు. బాధ్యతలు స్వీకరణ మంథని: స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో జనరల్ సర్జన్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. వైద్యవిధాన పరిషత్ చేపట్టిన నియామకాల్లో భాగంగా మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు చొరవతో జనరల్ సర్జన్ నికీల్ తేజ శుక్రవారం విధుల్లో చేరారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ టీవీ రాజశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ, డాక్టర్ నికీల్తేజ విధుల్లో చేరడంతో పట్టణంతో పాటు పరిసర మండలాల ప్రజలకు శస్త్రచికిత్స సేవలు మరింత మెరుగ్గా అందుబాటులోకి వస్తాయన్నారు. అవసరమైన సందర్భాల్లో లాప్రోస్కోపిక్ శస్త్రచికిత్సలు కూడా నిర్వహిస్తున్నామని, ప్రజలు వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. డయాగ్నొస్టిక్ సెంటర్ తనిఖీ పెద్దపల్లి: అర్హులైన నిపుణులు ఉంటేనే డయాగ్నొస్టిక్ సెంటర్ తెరవాలని జిల్లా వైద్యాధికారి పవిత్ర సూచించారు. అధిక చార్జీలు వసూలు చేస్తున్నారనే ఫిర్యాదుతో జిల్లా కేంద్రంలో ఓ డయాగ్నొస్టిక్ను శుక్రవారం ఆమె తనిఖీ చేశారు. డాక్టర్ లేకుండా పరీక్షలు చేయడాన్ని తప్పుపట్టారు. సెంటర్ నిర్వాహకులకు నోటీసులు జారీ చేశారు. ఇదే విధానం పునరావృతమైతే సెంటర్ సీజ్ చేస్తామని హెచ్చరించారు. తప్పడు ఫిర్యాదు చేసిన వ్యక్తికి రూ.10వేల జరిమానా పెద్దపల్లి: లోకాయుక్తలో అధికారులపై తప్పుడు ఫిర్యాదు చేసిన రాఘవాపూర్ గ్రామానికి చెందిన బొబ్బిలి సత్యనారాయణకు రూ.10వేల జరిమానా విధించినట్లు కలెక్టర్ కోయ శ్రీహర్ష శుక్రవారం తెలిపారు. రాఘవాపూర్ గ్రామపంచాయతీ పరిధిలో ఎల్లమ్మ ఆలయ నిర్మాణానికి అనుమతులు లేవన 2023 జనవరి 2న లోకాయుక్తకు ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. సమగ్ర విచారణ జరిపిన అధికారులు లోకాయుక్తకు నివేదిక సమర్పించారని, పరిశీలించిన అనంతరం బొబ్బిలి సత్యనారాయణ చేసిన ఫిర్యాదు నిరాధారమైనదని, వేధింపులకు ఉద్దేశించినదని లోకాయుక్త కొట్టివేసిందని ఆయన వివరించారు. -
పోలీసులు బాధ్యతతో పనిచేయాలి
గోదావరిఖని: పోలీసు అధికారులు సమర్థవంతంగా పనిచేయాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్‌కిశోర్‌ఝా సూచించారు. ఏఆర్‌హెడ్ కానిస్టేబుళ్లుగా విధులు నిర్వహిస్తూ ఇటీవల ఏఆర్ ఎస్ఐలుగా పదోన్నతి పొందిన టి.మోహన్, ఎస్.సత్త య్య శుక్రవారం సీపీని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. పోలీస్‌కమిషనర్ వారి భుజాలపై పదోన్నతి చిహ్నాలను అలంకరించి అభినందించారు. ఆయన మాట్లాడుతూ పదోన్నతి మ రింత బాధ్యతతో కూడిన అవకాశమన్నారు. విధు ల్లో నిజాయతీ, క్రమశిక్షణ, అంకితభావంతో పనిచేస్తూ పోలీసు శాఖ ప్రతిష్టను మరింత పెంచాలని సూచించారు. కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ(అడ్మిన్) శ్రీనివాస్, ఏఆర్ ఏసీపీలు ప్రతాప్, రమేశ్, ఆర్ఐలు దామోదర్, రమేశ్, ఆర్ఎస్ఐ పోచలింగం, సీసీ హరీశ్ తదితరులు పాల్గొన్నారు. -
కలెక్షన్ కింగ్ సాయిరాం
సిరిసిల్లటౌన్: చిన్నప్పటి నుంచి పెంచుకున్న దేశభక్తి, గాంధీపై ప్రేమ అతడిని కలెక్షన్ కింగ్‌గా మార్చింది. దేశంలో స్వాతంత్రం ముందునుంచి, అనంతరం ముద్రించిన కరెన్సీ భద్రపరిచాడు సిరిసిల్లకు చెందిన సాయిరాం. రిజర్వుబ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి బాపూజీ బొమ్మలతో వెలువడిన రూపాయి నాణేలనూ సేకరించారు. ఇప్పటి వరకు 200కు పైగా దేశాలకు సంబంధించి వివిధ రకాల నాణేలు, కరెన్సీని సేకరించి సిరిసిల్ల, కరీంనగర్, హైదరాబాద్‌లో జరిగిన ప్రదర్శనల్లో పాల్గొన్నారు. 12 ఏళ్ల వయసులోనే ఈ సేకరణ మొదలైన ఆయన ప్రయత్నం ఇంకా కొనసాగుతోంది. -
పొట్యాలలో పట్టపగలే చోరీ
రామగుండం: పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం పొట్యాల గ్రామంలో శుక్రవారం పట్టపగలే భారీచో రీ జరిగింది. సింగరేణి రిటైర్డ్ ఉద్యోగి వేల్పుల శంకరయ్య – రాధ దంపతులు. వీరికి వివాహమైన కు మార్తెఉంది. స్వగ్రామంలోని ఎకరంలో సాగు చేసుకుంటూ జీవనం గడుపుతున్నారు. శుక్రవారం ఉద యం 9 గంటలకు పత్తి వేసిన పొలం పనులకు వె ళ్లారు. సాయంత్రం ఐదు గంటలకు ఇంటికి రాగా తాళం పగులగొట్టి ఉంది. లోనికి వెళ్లి చూడగా బీ రువా, లాకర్ ధ్వంసమై కనిపించాయి. వెంటనే డ యల్ 112 నంబరుకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న క్లూస్ టీం జాగిలాలతో వచ్చి సోదాలు చేస్తున్నారు. ఈ ఘటనలో 12 తు లాల బంగారు, కేజీ వెండి ఆభరణాలు, రూ.23వేల నగదు చోరీకి గురైనట్లు బాధితులు తెలిపారు. ఈ విషయమై రామగుండం సీఐ కృష్ణకుమార్‌ను వి వరణ కోరగా బాధితుల నుంచి తమకు ఫిర్యాదు రాలేదన్నారు. దొంగలు రెక్కీ నిర్వహించిన తర్వాతే చోరీకి పాల్పడినట్లు స్థానికంగా ప్రచారం జరుగుతుంది. ప్రధాన కూడళ్లలోని సీసీ కెమెరాల విద్యుత్ కనెక్షన్లను కోతులు తెంచివేయడంతో పనిచేయడం లేదు. రెడు రోజుల క్రితం పొట్యాల, విసంపేట, మద్ధిర్యాలలోని పంట పొలాల్లోని విద్యుత్ పంపుసెట్ల తీగలను కాపర్ కోసం కట్ చేసుకొని వెళ్లిన ఘటన మరువకముందే భారీచోరీ జరగడంపై గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
పెట్రోల్‌బంక్‌లో అదుపుతప్పిన కారు
సిరిసిల్ల అర్బన్: పెట్రోల్‌బంక్‌లో పనిచేసే ఆపరేటర్ కారు నడిపేందుకు ప్రయత్నించగా అదుపుతప్పి బంక్‌లోని పంపింగ్ మిషన్‌ను ఢీకొట్టిన సంఘటన శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని పెద్దూరు విద్యుత్ సబ్‌స్టేషన్ సమీపంలో ఉన్న హెచ్‌పీ పెట్రోల్‌బంక్‌లో పనిచేసే పంపింగ్ ఆపరేటర్ డ్రైవింగ్ తెలియకపోయినా బంక్‌లో ఆగి ఉన్న కారును నడిపేందుకు ప్రయత్నించాడు. ఈక్రమంలోనే కారు అదుపుతప్పి బంక్‌లోని పంపింగ్ మిషన్‌ను ఢీకొట్టడంతో ధ్వంసమైంది. ఈ ప్రమాదంలో కారు ముందు భాగం దెబ్బతింది. ప్రమాద సమయంలో పెట్రోల్‌బంక్‌లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ కారుపై ఇప్పటికే 5 చలాన్లు, ఒక ట్రాఫిక్ ఉల్లంఘన కేసు నమోదై ఉన్నాయి. పంపింగ్ మిషన్ ధ్వంసం -
శతాధిక వృద్ధురాలి మృతి
కాల్వశ్రీరాంపూర్: పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలం ఆశన్నపల్లె గ్రామానికి చెందిన శతాధిక వృద్ధురాలు గాజుల లస్మమ్మ గురు వారం రాత్రి మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. మృతురాలుకు ఇద్దరు కూతుళ్లు లక్ష్మి, రాధ, కుమారుడు శంకరయ్య, సుమారు 20 మంది మనుమలు, మనుమరాళ్లు ఉన్నారు. అనారోగ్యంతో హెడ్‌కానిస్టేబుల్..కాళేశ్వరం: జయశంకర్ భూపా లపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరం పోలీసుస్టేషన్లో హెడ్‌కానిస్టేబుల్‌గా వి ధులు నిర్వర్తిస్తున్న హనుమండ్ల కనుకయ్య (52) అనారోగ్య కా రణాలతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం తెల్లవారుజామున మృతి చెందారు. ఆయన అంత్యక్రియలు స్వగ్రామం కరీంనగర్ జిల్లా మానకొండూరులో జరుగుతాయని పోలీసులు తెలిపారు. కనుకయ్య పదేళ్లుగా కాళేశ్వరంలోనే ఇల్లు నిర్మించుకొని ఉంటున్నారు. అందరితో మర్యాద, కలివిడిగా ఉండేవాడని గుర్తు చేసుకుంటున్నారు. భూ సమస్యకు పరిష్కారం కాల్వశ్రీరాంపూర్: కిష్టంపేట గ్రామానికి చెందిన కంకణాల అమృతమ్మ భూసమస్యను తహసీల్దార్ రాపెల్లి రాముడు భూపోర్టల్ ద్వారా శుక్రవారం పరిష్కరించారు. 347/ఏ/బి/సర్వే నంబర్లో 0.30 గుంటలను పట్టా చేయించుకునేందుకు దశాబ్దంగా తహసీల్దార్ కార్యాలయ చుట్టూ తిరిగి వేసారిపోయింది. భూభారతి పోర్టల్‌లో తహసీల్దార్లే సమస్య పరిష్కరిస్తున్నారనే సమాచారంతో తహసీల్దార్ కార్యాలయానికి చేరుకున్న అమృతమ్మ.. సమస్యను తహసీల్దార్ రాముడుకు విన్నవించింది. దీంతో అమృతమ్మ పేరిట భూమి పట్టాచేసి సమస్యకు పరిష్కారం చూపారు. తహసీల్దార్‌ను ఆమె శాలువాతో సన్మానించింది. -
అంతరిక్ష బాటలో యువకెరటాలు
సిరిసిల్ల: భారత తొలి ప్రైవేట్ అంతరిక్ష సంస్థ స్కైరూట్ ఏరోస్పేస్ ప్రైవేట్ లిమిటెడ్ తన తొలి కక్ష్య రాకెట్ ‘విక్రమ్–1’ విజయవంతంగా ప్రయోగించి కొత్త చరిత్రను సృష్టించింది. ఆ ప్రయోగంలో రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రానికి చెందిన ముగ్గురు యువ ఇంజినీర్ల భాగస్వామ్యం ఉంది. దేశం నాకేమిచ్చిందని ఆలోచించే ఈ రోజుల్లో దేశానికి తాము ఏమిచ్చామనే లక్ష్యంతో అంతరిక్ష ప్రయోగంలో జిల్లా యువకులు పాల్గొనడం విశేషం. పాలిటెక్నిక్ డిప్లొమాతో డీఆర్డీవోకు వెళ్లిన సిరిసిల్లలోని సుభాష్‌నగర్‌కు చెందిన అడుప కిరణ్ రాకెట్ క్యాడ్ డిజైనర్‌గా పని చేశారు. పోస్టాఫీస్ వీధికి చెందిన అడుప సంతోష్ భువనగిరిలో బీటెక్ పూర్తి చేసి డీఆర్డీఏలో ఎలక్ట్రికల్ ఇంజినీర్‌గా చేరారు. మూడేళ్ల పాటు సీనియన్ ఇంజినీర్‌గా ప్రైవేటు కంపెనీలో పని చేసి 2024 నుంచి స్కైరూట్ ఏరోస్పేస్ ప్రైవేటు లిమిటెండ్ కంపెనీలో టీమ్ లీడర్‌గా పని చేశారు. రాకెట్లో తనిఖీలు, పరీక్షలు, ప్రయోగానికి ముందు కీలకమైన బాధ్యతలు నిర్వహించారు. సిరిసిల్లలో ప్రాథమిక విద్యను అభ్యసించిన బొమ్మదేని నాగరాజు బీటెక్ కంప్యూటర్ సైన్స్ చేశారు. నిజామాబాద్‌లో ఇంటర్, హైదరాబాద్‌లో బీటెక్ కంప్యూటర్ సైన్స్ చేశారు. అంతరిక్ష ప్రయోగంలో ఎలక్ట్రికల్ ఇంటిగ్రేషన్ విభాగంలో రాకెట్ విద్యుత్ వ్యవస్థ సమీకరణ పనులను పర్యవేక్షించారు. -
పెద్దపల్లి
శనివారం శ్రీ 15 శ్రీ ఆగస్టు శ్రీ 2026పంద్రాగస్టు వేడుకలకు ఏర్పాట్లు పెద్దపల్లి: కలెక్టరేట్లోని పరేడ్‌గ్రౌండ్ పంద్రాగస్టు వేడుకలకు ముస్తాబైంది. శనివారం ఉదయం వేడుకలు ప్రారంభమవుతాయని కలెక్టర్ కోయ శ్రీహర్ష, అదనపు కలెక్టర్ శ్రీరాములు తెలిపారు. ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు ముఖ్య అతిథిగా హాజరు కానున్నారని పేర్కొన్నారు. తొలుత పోలీసుల గౌరవ వందనం స్వీకరించాక, సాంస్క ృతి కార్యక్రమాలు ఉంటాయని వివరించారు. ఈమేరకు మైదానాన్ని అందంగా ముస్తాబు చేశారు. -
వికసిత్ భారత్ లక్ష్యం
మనదేశం సాంకేతికతతో అన్నిరంగాల్లో దూసుకెళుతోంది. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యం సాధించడం ఖాయం. విదేశీయుల టెక్నాలజీపై ఆధారపడకుండా సొంత పరిజ్ఞానంతో ఇప్పటికే అనేక విజయాలు సాధించి ప్రపంచ దేశాలనే నివ్వెర పర్చుతోంది. – అర్చన, విద్యార్థిని, పెద్దపల్లి ఉన్నత చదువులు, ఉద్యోగాల కోసం పొరుగు విదేశాలకు వలసవెళ్లడం కాదు.. మనదేశ యువతే ప్రపంచ దేశాల కంపెనీలను శాసించేస్థాయిలో పట్టు సాధించాలి. పరదేశీయులే జాబ్స్ కోసం మనదేశం వైపు చూడాలి. ఇది 2047 వరకు సాధ్యమవుతుందనే నమ్మకం ఉంది. – గాయత్రీ, పెద్దపల్లి ప్రస్తుత ప్రపంచంలో పెరుగుతున్న పోటీకి అనుగుణంగా యువత ఆధునికత సాంకేతికతపై పట్టు సాధించాలి. విదేశాలపై ఆధారపడకుండా సొంత పరిజ్ఞానంతోనే సూ పర్ కంప్యూటర్లు సృష్టించే హబ్‌గా ఎదుగుతాం. సాంతికేతకను అందిపుచ్చుకుంటాం. – సిరిహాసిని, పెద్దపల్లి సహజవనరులను సద్వినియోగం చేసుకుంటూ ఉన్నతంగా ఎదుగుతాం. ఇప్పటికే పీఎం సూర్యఘర్ లాంటి పథకంతో సౌరశక్తితో విద్యుత్ ఉత్పత్తికి బాటలు వేసుకున్నాం. ప్రజలూ భాగస్వాములవుతున్నారు. – వైష్ణవి, సెకండియర్, పెద్దపలి -
ఆలోచనలు మారాలి
పాతతరం ఆలోచన విధానం మారాలి. ఆధునిక సాంకేతికత అందుబాటులోకి వచ్చినా ఇంకా మూఢనమ్మకాలు ఉన్నాయి. వాటితోనే కుటుంబాల్లో చిచ్చు రేగి విధ్వంసాలకు కారణమవుతున్నాయి. ఈ పద్దతి పూర్తిగా మారాలి. – హర్షిత, పెద్దపల్లి సమాజంలోని అసమానతలకు స్వస్తి పలికి 2047 కల్లా సమానత్వం సాధిస్తాం. 1947నాటి స్వాతంత్య్రం ఓ చరిత్ర. వందేళ్ల తర్వాత 2047 కల్లా భారతావని గడ్డ గ్లోబల్‌టెక్ హబ్‌గా మారుతుందనే నమ్మకం ఉంది. – ఇమ్రాన్, పెద్దపల్లి ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్సీ(ఏఐ) సాంకేతికత అందుబాటులోకి వచ్చింది. వందేళ్ల స్వతంత్ర భారతం విదేశీ సాంకేతికతపై ఆధారపడకుండా సొంతంగానే ఏఐ మోడల్స్‌తో గ్లోబల్ టెక్ హబ్‌గా మారాలి. – రాహుల్, విద్యార్థి, పెద్దపల్లి 1947 నాటి పరిస్థితులు కనుమరుగవుతున్నాయి. 2047 వరకు అంతా డిజిటల్ యుగమే. ఇప్పటికే ఆ దిశగా అడుగులు వడివడిగా పడుతున్నయ్. వ్యవహారాలన్నీ డిజిటల్ రూపంలోనే జరగనున్నాయి. – శివ, విద్యార్థి, పెద్దపల్లి -
మంత్రుల పర్యటనను విజయవంతం చేయండి
పెద్దపల్లి: పెద్దపల్లి నియోజకవర్గంలో రూ.250 కోట్లతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు ఈనెల 17న మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారని ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు తెలిపారు. సుల్తానాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో నిర్వహించనున్న మంత్రుల బహిరంగసభ ఏర్పాట్లను ఆయన శుక్రవారం పరిశీలించారు. అనంతరం స్థానిక వైశ్య భవన్లో ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ శ్రేణులతో సమావేశమయ్యారు. మంత్రుల కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈకార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు అన్నయ్యగౌడ్, సుల్తానాబాద్ మున్సిపల్ చైర్మన్ బిరదు రాధాకృష్ణ, పలువురు నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
నాణేం నుంచి స్కాన్
సాక్షి, పెద్దపల్లి: ఒకప్పుడు జేబులో చిల్లర నాణేలు గలగలమంటేనే డబ్బున్న భావన. ఇప్పుడు డిజిటల్ రూపాయి, ప్లాస్టిక్ కరెన్సీ నోట్ల దిశగా భారత రూపాయి ప్రయాణం సాగుతోంది. ఎనిమిది దశాబ్దాల స్వతంత్య్ర భారత చరిత్రలో డబ్బు రూపం ఎన్నోసార్లు మారింది. 1949లో స్వతంత్ర భారత ప్రభుత్వం రూపాయి నోటు ను విడుదల చేసింది. 2016లో పెద్దనోట్ల రద్దు తర్వాత డిజిటల్ చెల్లింపులకు ఊతమిచ్చింది. యూపీఐ అందుబాటులోకి రావడంతో దేశ చెల్లింపుల వ్యవస్థలో విప్లవాత్మక మార్పు వచ్చింది. చిన్న కిరాణా దుకాణం నుంచి పెద్ద సంస్థ వరకు.. కూరగాయల బండి నుంచి ఆన్లైన్ షాపింగ్ వరకు నగదు అవసరం తగ్గింది. ‘క్యాష్ ఉందా?’ అనే ప్రశ్నకు బదులుగా ‘స్కాన్ ఉందా?’ అనే మాట వినిపించడం ప్రారంభమైంది. ప్రస్తుతం ప్లాస్టిక్ కరెన్సీ దిశగా నవ భారత ప్రయాణం సాగుతోంది. -
స్కూల్ బస్సు ప్రారంభం
గోదావరిఖనిటౌన్: ఆర్టీసీ గోదావరిఖని డీఎం కవిత కేటాయించిన బస్సును ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్‌సింగ్ స్థానిక సింగరేణి సెక్టా ర్–2 పాఠశాల ఆవరణలో శుక్రవారం ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతు, విద్యార్థుల భద్రత, సౌకర్యం కోసం ఆర్టీసీ బస్సు కేటాయించారన్నారు. మేయర్ మహంకాళి స్వా మి, డిప్యూటీ మేయర్ పాతపల్లి ఎల్లయ్య, ఆర్జీ–1 జీఎం లలిత్‌కుమార్ పాల్గొన్నారు. నేరాల నియంత్రణకే సీసీ కెమెరాలు పెద్దపల్లిరూరల్: సమాజంలో రోజురోజుకూ పెరుగుతున్న నేరాలు, అసాంఘిక కార్యకలాపాలను కట్టడి చేసేందుకే సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని డీసీసీ రాంరెడ్డి సూచించారు. పట్టణంలోని లక్ష్మీనగర్‌లో ఏర్పాటు చేసిన 15 సీసీ కెమెరాలను శుక్రవారం ఏసీపీ గజ్జి కృష్ణ, సీఐ ప్రవీణ్‌కుమార్, ఎస్సై నరేశ్‌తో కలిసి ఆయన ప్రారంభించారు. కాలనీల్లో అనుమానాస్పదంగా తిరిగే వ్యక్తులు, అపరిచితుల సమాచారాన్ని పోలీసులకు అందించాలని కోరారు. కౌన్సిలర్ సుజాత, క్రాంతికుమార్‌తోపాటు కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.భద్రత ప్రమాణాలు పాటించాలి జ్యోతినగర్: ఎన్టీపీసీ ప్రాజెక్టు ఉద్యోగులు విధి నిర్వహణలో భద్రత ప్రమాణాలను పాటించి ప్రమాదాలను నివారించాలని ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ చందన్ కుమార్ సామంత సూచించారు. ప్రాజెక్టులోని గేర్ బాక్స్‌లు, ఫ్లూయిడ్ కప్లింగ్ యూనిట్లు, పుల్లీలు, ఇతర కీలకమైన మెకానికల్ పరికరాలతో సహా ప్రధాన కన్వేయర్ భాగాల ఓవర్‌హాలింగ్, మరమ్మతు నిర్వహణను సులభతరం చేయడానికి ఎంహెచ్‌పి వర్క్‌షాప్‌ను ఆయన శుక్రవారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ, ఈ సదుపాయం ఇన్–హౌస్ నిర్వహణ సామర్థ్యాలను బలోపేతం చేస్తుందన్నారు. జనరల్ మేనేజర్లు ముకుల్ రాయ్, నవీన్ గుప్తా, అవిజిత్ దత్తా, బినోయ్ జోస్, ఏజీఎం(హెచ్ఆర్) సాగర్ రంజన్ సాహూ, వెంకట రమేశ్ తదితరులు పాల్గొన్నారు. రేషన్ బియ్యం పట్టివేత పెద్దపల్లిరూరల్: జిల్లా కేంద్రంలోని బండారికుంటలో అక్రమంగా తరలిస్తున్న 15 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పట్టుకున్నామని ఎస్సై నరేశ్ శుక్రవారం తెలిపారు. అక్రమంగా బియ్యాన్ని తరలిస్తున్న సమీర్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని పేర్కొన్నారు. -
లక్ష్యానికి మించి హెచ్‌పీవీ టీకా
పెద్దపల్లి: కిశోర బాలికలను క్యాన్సర్ ముప్పు నుంచి రక్షించేందుకు ప్రభుత్వం చేపట్టిన హెచ్‌పీవీ (హ్యూమన్ పాపిలోమా వైరస్) టీకా కార్యక్రమం జిల్లాలో లక్ష్యానికి మించి కొనసాగుతోంది. డిసెంబర్ నాటికి జిల్లాలో 13–14 ఏళ్లు నిండిన విద్యార్థినులు 3,701 మంది ఉన్నట్లు గుర్తించి టీకా ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకోగా, ఈనెల 13 నాటికి 3,992 మందికి టీకాలు వేసినట్లు జిల్లా ఇమ్యూనైజేషన్ అఽ దికారి డాక్టర్ కిరణ్‌కుమార్ తెలిపారు. దీంతో 108 శాతం టీకా పంపిణీ పూర్తయిందని పేర్కొన్నారు. కొత్తగా 291 మంది గుర్తింపు 13 ఏళ్లు దాటిన కిశోర బాలికలను గుర్తించి హెచ్‌పీవీ టీకా అందించడంలో భాగంగా ఈ నెలలో మరో 291 మందిని కొత్తగా గుర్తించినట్లు అధికారులు తెలిపారు. క్యాన్సర్‌కు కారణమయ్యే హెచ్‌పీవీ వైరస్ నుంచి ముందస్తు రక్షణ కల్పించేందుకు టీకాను అందిస్తున్నారు. గత మార్చి నుంచి జిల్లాలో ఈ కార్యక్రమాన్ని విస్తృతంగా నిర్వహిస్తున్నారు. జిల్లా కేంద్ర ఆసుపత్రితో పాటు 17 పీహెచ్‌సీలు, 4 సామాజిక ఆరోగ్య కేంద్రాలు, 8 అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సబ్సెంటర్లలో అర్హులైన విద్యార్థులకు టీకాలు వేస్తున్నారు. సిబ్బంది, అధికారుల సహకారంతో.. జిల్లాలో ఎప్పటికప్పుడు 14 ఏళ్లు నిండిన విద్యార్థులను గుర్తించి టీకాలు వేస్తున్నాం. క్యాన్సర్ రాకుండా ఈ టీకా దోహదపడుతుంది. సిబ్బంది, అధికారుల సహకారంతో లక్ష్యానికి మించి టీకాలు పంపిణీ చేశాం. – కిరణ్‌కుమార్, జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి జిల్లాలో 108 శాతం పూర్తి 3,701 మందికి గాను 3,992 మందికి వ్యాక్సిన్ -
లోకోపైలట్ల నిరసన
రామగుండం: కేంద్రం ప్రకటించిన వేతన కమీషన్లో లోకోపైలట్లకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆలిండియా లోకోరన్నింగ్ స్టాఫ్ అసోసియేషన్ కేంద్ర కమిటీ పిలుపు మేరకు గురువారం రామగుండం రైల్వేస్టేషన్ ప్లాట్‌ఫాంపై లోకో పైలట్లు ఆందోళన చేపట్టారు. 5,6,7వ పే కమీషన్లో లోకోరన్నింగ్ స్టాఫ్‌కు తీవ్ర అన్యాయం జరిగిందని, రైల్వేలోని రెండు ప్రధాన ట్రేడ్ యూనియన్లు దీనిపై స్పందించకపోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు. సత్వరమే రన్నింగ్ స్టాఫ్ వేతన సవరణకు అనుకూలంగా కేంద్రానికి లేఖలు రాయాలన్నారు. 8వ పే కమీషన్ సభ్యులు బేసిక్ పే సవరించి లెవల్ సిక్స్ నుంచి మొదలుకొని 8 వరకు లోకోరన్నింగ్ స్టాఫ్‌కు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రకృతికి విరుద్ధంగా విధులు నిర్వహించే తమపై కేంద్రం ప్రత్యేక చొరవ చూపించాలన్నారు. రామగుండం బ్రాంచ్ సెక్రటరీ సీహెచ్రవి, సచిన్, పురుషోత్తం మీనా, పల్లికొండ శంతన్‌కుమార్, కిరణ్, ప్రేమ్, రఫీ పాల్గొన్నారు. -
వందేమాతరం
శుక్రవారం శ్రీ 14 శ్రీ ఆగస్టు శ్రీ 2026మన దేశం సుసంపన్నమైనదని ఎన్టీపీసీ రామగుండం–తెలంగాణ ప్రాజెక్టు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ చందన్‌కుమార్ సామంత అన్నారు. స్వాతంత్య్ర వేడుకల్లో భాగంగా గురువారం పర్మినెంట్ టౌన్‌షిప్‌లోని సెయింట్ క్లేర్ హైస్కూల్ మైదానంలో నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడారు. సుమారు 1,500 మంది విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఎన్టీపీసీ ఉద్యోగులు వందేమాతరం సామూహిక గానంతో పాటు రూపకల్పన చేయడం ఆనందంగా ఉందన్నారు. అందరిలో దేశభక్తి, ఐక్యత స్ఫూర్తి ప్రతిబింబించాలని ఆకాంక్షించారు. కార్పొరేటర్ కొలని కవితారెడ్డి, సంస్థ ఉద్యోగులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. – జ్యోతినగర్(రామగుండం) -
మెరుగైన రవాణా సౌకర్యానికి ప్రాధాన్యం
కాల్వశ్రీరాంపూర్(పెద్దపల్లి): నియోజకవర్గంలోని గ్రామీణ ప్రాంతాలకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పించేందుకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని ప్రభుత్వ విప్ విజయరమణారావు అన్నారు. గురువారం మండలంలోని జాఫర్‌ఖాన్‌పేట నుంచి వయా పెద్దపల్లి, గోదావరిఖనికి ఆర్టీసీ బస్ సర్వీస్‌ను ప్రారంభించారు. మద్దెలవాగుపై రూ.5.43 కోట్లతో నిర్మించిన వంతెన, అప్రోచ్‌రోడ్డు, రూ.5 లక్షలతో చేపట్టిన సీసీ రోడ్ల శిలాఫలకానేఇ్న సర్పంచ్ జ్యోత్స్న యాదగిరితో కలిసి ఆవిష్కరించారు. అనంతరం విప్ మాట్లాడుతూ, మంగపేట, కూనారం టర్నింగ్ నుంచి ముత్తారం వరకు డబుల్ రోడ్డుకు రూ.32 కోట్లు, పెద్దపల్లి–ర్రెపెల్లి మేజర్ రోడ్డుకు రూ.100 కోట్లు, సుల్తానాబాద్– పెద్దాపూర్ రోడ్డుకు రూ.47 కోట్లు, కూనారం– పెద్దపల్లి రోడ్డుకు రూ.14 కోట్లు, జాఫర్‌ఖాన్‌పేట్ రింగ్ రోడ్డుకు రూ.7 కోట్లు, కాల్వశ్రీరాంపూర్‌లో సెంట్రల్ లైటింగ్ సిస్టమ్‌కు రూ.5.30కోట్లు ప్రభుత్వం మంజూరు చేసినట్లు వివరించారు. ఈనెల 17న వీటంన్నిటికీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి శంకుస్థాపన చేయనున్నట్లు పేర్కొన్నారు. మాజీ ఎంపీపీ సారయ్యగౌడ్, ఏఎంసీ చైర్మన్ రామిడి తిరుపతిరెడ్డి, ఈఈ రమణారెడ్డి, ఏఈ నాగరాజు, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గాజనవేన సదయ్య, డీసీసీ వైస్ ప్రెసిడెంట్ మునీర్ తదితరులు పాల్గొన్నారు. శిలాఫలకం ధ్వంసంమండలంలోని జాఫర్‌ఖాన్‌పేట మద్దెలవాగు వంతెనపై శిలాఫలకం ధ్వంసం చేసిన ఘటన ఉద్రిక్తతకు దారితీసింది. వాగుపై వంతెన నిర్మాణానికి బీఆర్ఎస్ ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. నిర్మాణం పూర్తయ్యేలోగా ప్రభుత్వం మారింది. గురువారం విప్ విజయరమణారావు అదే వంతెన ప్రారంభోత్సవం చేశారు. సదరు కాంట్రాక్టర్ అప్పటి శంకుస్థాపన శిలాఫలకం ఏర్పాటు చేసేందుకు అక్కడే గద్దె కట్టారు. ఆ గద్దెను గుర్తు తెలియని వ్యక్తులు కూల్చి వేయడంతో బీఆర్ఎస్ నాయకులు ఆందోళనకు దిగగా, పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గద్దె కూల్చివేతను మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహార్‌రెడ్డి ఖండించారు. మాజీ ఎంపీపీ నూనేటి సంపత్ యాదవ్, మాజీ జెడ్పీటీసీ వంగళ తిరుపతిరెడ్డి తదితర నాయకులతో కలిసి మాట్లాడారు. ఎలాంటి ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు. ఆర్టీసీ బస్సు సర్వీసు ప్రారంభిస్తున్న విప్ విజయరమణారావు ప్రభుత్వ విప్ విజయరమణారావు -
తనిఖీలకే పరిమితం కావొద్దు
పెద్దపల్లి: అకడమిక్ ప్యానల్ సందర్శనలు కేవలం తనిఖీలకే పరిమితం కాకుండా ఉపాధ్యాయులకు అవసరమైన అకడమిక్ సహకారం అందిస్తూ, పాఠశాలల్లో నిరంతర విద్యాభివృద్ధికి దోహదపడేలా ఉండాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష సూచించారు. గురువారం హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో రాష్ట్రంలోని అన్ని మండలాల విద్యాధికారులు, జిల్లా విద్యాధికారులు, ప్రాంతీయ సంయుక్త సంచాలకుల కోసం నిర్వహించిన ఒకరోజు శిక్షణ, అవగాహన కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లాలో అమలు చేస్తున్న అకడమిక్ ప్యానల్ విధానంపై రాష్ట్రస్థాయి అధికారులకు ప్రజెంటేషన్ ఇచ్చారు. పాఠశాల స్థాయిలో బోధన, అభ్యసన ప్రక్రియను పర్యవేక్షిస్తున్నట్లు కలెక్టర్ వివరించారు. ఉపాధ్యాయులకు ఫీడ్‌బ్యాక్ ఇచ్చే విధానం నిర్మాణాత్మకంగా ఉండాలన్నారు. అకడమిక్ ప్యానల్ సందర్శనల ద్వారా ఉపాధ్యాయుల్లో భయాన్ని కలిగించకుండా, వారి బోధన సామర్థ్యాలను మరింత బలోపేతం చేసేందుకు అవసరమైన సహకారం అందించాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అకడమిక్ మానిటరింగ్‌ను మరింత సమగ్రంగా అమలు చేసేందుకు పెద్దపల్లి జిల్లాలోని ఈ విధానం ఉపయోగకరంగా ఉంటుందన్నారు. కలెక్టర్ కోయ శ్రీహర్ష -
త్రివర్ణ శోభితం
జాతీయ జెండాలు రెపరెపలాడాయి. వేలాది మంది విద్యార్థుల దేశభక్తి నినాదాలతో పట్టణం మార్మోగింది. ‘హర్ ఘర్ తిరంగా’ సందేశాన్ని చాటుతూ బీజేపీ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన ర్యాలీ కన్నుల పండువగా సాగింది. దాదాపు 10 వేల మంది విద్యార్థులు చేతుల్లో త్రివర్ణ పతాకాలను పట్టుకుని కదం తొక్కగా ఆ దృశ్యం దేశభక్తికి ప్రతీకగా నిలిచింది. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానం నుంచి ప్రారంభమైన ర్యాలీ పట్టణ పురవీధుల గుండా నిర్వహించి కమాన్ మీదుగా కళాశాలకు చేరింది. – పెద్దపల్లి -
అవయవదానంపై అపోహలు వద్దు
పెద్దపల్లిరూరల్: మనిషి మరణానంతరం అవయవదానం చేయడం వల్ల ఆపదలో ఉన్న వారికి అండగా నిలిచి వారికి బతుకునిచ్చిన వారమవుతామని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల అన్నారు. గురువారం ప్రపంచ అవయవదాన దినోత్సవం సందర్భంగా కోర్టు ఆవరణలో జిల్లా అడిషనల్ జడ్జి భవాని, జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి మంజుల, జూనియర్ జడ్జి శ్రావణ్‌కుమార్ సదాశయ ఫౌండేషన్ వారితో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు. అవయవాలను దానం చేయడంపై ప్రజల్లో అపోహలు ఉన్నాయని, వాటిని నివృత్తి చేసేందుకు స్వచ్ఛందసంస్థలు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ఈ సందర్భంగా అవయవదానం చేసేందుకు ముందుకొచ్చిన న్యాయవాద దంపతులు అశోక్, రమాదేవిని జిల్లా జడ్జి, డీసీపీ రాంరెడ్డి తదితరులు సత్కరించారు. ఫౌండేషన్ ఫౌండర్ భీష్మాచారి, బార్అసోసియేషన్ అధ్యక్షుడు మేకల మల్లేశం, మార కిషోర్, డొంకెన రవీందర్, శ్రీధర్ తదితరులున్నారు. స్వాతంత్య్ర దినోత్సవాన్ని వైభవంగా నిర్వహించాలిపెద్దపల్లి: జిల్లాలో స్వాతంత్య్ర దినోత్సవాన్ని వైభవంగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ శ్రీరాములు అన్నారు. కలెక్టరేట్ ప్రాంగణంలో వేడుకల ఏర్పాట్లను గురువారం డీసీపీ రామ్‌రెడ్డితో కలిసి పరిశీలించారు. ప్రభుత్వ విప్ చింతకుంట విజయరమణారావు వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరవుతారని పేర్కొన్నారు. అవసరమైన ఏర్పాట్లు పకడ్బందీగా పూర్తి చేయాలని సూచించారు. పెద్దపల్లి ఆర్డీవో బి.గంగయ్య, కలెక్టరేట్ పరిపాలన అధికారి బండి ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. పంద్రాగస్టు వేడుకలకు అతిథిగా విప్ విజయరమణారావుసాక్షి, పెద్దపల్లి: ఉమ్మడి జిల్లాలో జిల్లాలవారీగా జాతీయ జెండాను ఎగురవేసేందుకు మంత్రులతో పాటు కేబినెట్ ర్యాంక్ ప్రజాప్రతినిధులను కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పెద్దపల్లిలో విప్ చింతకుంట విజయరమణరావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు. నీట్ కోచింగ్‌కు దరఖాస్తులుపెద్దపల్లి: సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల ఆధ్వర్యంలో నీట్–2027 ప్రవేశ పరీక్షకు సిద్ధమయ్యే విద్యార్థులకు ఉచిత లాంగ్‌టర్మ్ కోచింగ్ అందించనున్నట్లు డీసీవో, మంథని ప్రిన్సిపాల్ శ్రీనాథ్ తెలిపారు. బాలురకు హైదరాబాద్‌లోని సీఓఈ, బాలికలకు మహీంద్రాహిల్స్‌లోని సీఓఈ పాఠశాలలో కోచింగ్ ఇవ్వనున్నట్లు తెలిపారు. 100 మంది బాలురు, 100 మంది బాలికల చొప్పున కోచింగ్ అందించనున్నట్లు వివరించారు. 2026 విద్యా సంవత్సరంలో బైపీసీ ఉత్తీర్ణులై, నీట్–2026 ప్రవేశ పరీక్షకు హాజరైన ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ విద్యార్థులు అర్హులని తెలిపారు. దరఖాస్తులకు ఈ నెల 28 గడువని, ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. tgswreis. telangana. gov.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అవసరమైన ధ్రువపత్రాలు జతచేసి సమీప డీసీవో కేంద్రంలో సమర్పించాలన్నారు. ఆకట్టుకున్న నాటిక ప్రదర్శన రామగిరి: ఆర్జీ–3, ఏపీఏ ఏరియాలోని సెంటినరికాలనీ రాణిరుద్రమదేవి క్రీడా ప్రాంగణంలో గురువారం సింగరేణి, అభ్యుదయ ఆర్ట్స్ అకాడమీ, హైదరాబాద్ ఆధ్వర్యంలో అంబేడ్కర్ జీవిత చరిత్ర నాటిక ప్రదర్శన నిర్వహించారు. ఏపీఏ జీఎం కొలిపాక నాగేశ్వరరావు హాజరై అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. సంఘాల ప్రతినిధులు ఎం.రామచంద్రారెడ్డి, కోట రవీందర్‌రెడ్డి, శ్రీకాంత్, పర్సనల్ విభాగాధిపతి బి.సుదర్శనం, ఎస్సీ, ఎస్టీ అసోసియేషన్ సభ్యులు బత్తుల శంకర్, ఆకునూరి బాల అంకూస్, కిషన్‌నాయక్ పాల్గొన్నారు. -
బొగ్గు రవాణాపై సింగరేణి నజర్
సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి.. గోదావరిఖని: ఎల్నీనో నేపథ్యంలో సింగరేణిలో బొగ్గు ఉత్పత్తిపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. థర్మల్ కేంద్రాలకు బొగ్గు కొరత రాకుండా చూసుకోవాలని ఆదేశించింది. వర్షాభావ పరిస్థితుల మూలంగా రై తులకు విద్యుత్ ఇబ్బంది లేకుండా నిరంతరం సరఫరా చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో విద్యుత్ అవసరాలు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర థర్మల్ విద్యుత్ కేంద్రాలపై ఉత్పత్తి టార్గెట్ పె రిగింది. రోజూ 28 నుంచి 32 రేకుల నాణ్యమైన బొగ్గు సరఫరా చేయాలని సంస్థ సీఎండీ అన్ని ఏరియాల జీఎంలకు ఆదేశాలు జారీ చేశారు. ఓసీపీల్లో తగ్గిన ఉత్పత్తి వర్షాల కారణంగా ఓపెన్‌కాస్ట్ గనుల్లో బొగ్గు ఉత్పత్తి తగ్గింది. అయినా ముందస్తు జాగ్రత్తలతో నిర్దేశిత ఉత్పత్తి లక్ష్యాలను సాధించేలా చూడాలని అన్ని ఏరియాలకు ఆదేశాలు జారీ అయ్యాయి. ఓసీపీల్లో బొగ్గు ఉత్పత్తి తగ్గినా భూగర్భ గనుల్లో ఉత్పత్తిని పెంచేందుకు ప్రత్యేక కార్యాచరణ అమలు చేయాలని ఆదేశించారు. రాష్ట్ర విద్యుత్ అవసరాలకు ప్రాధాన్యం ఇస్తూ థర్మల్ కేంద్రాలకు 75 నుంచి 80 శాతం బొగ్గును సింగరేణి అందిస్తోంది. ఉత్పత్తికి అనుగుణంగా అన్ని ఓసీపీల్లో ప్రత్యేక దృష్టి సారించాలని, ఈ ఆర్థిక సంవత్సర లక్ష్యాలను పూర్తి చేయడంతో పాటు భవిష్యత్తులో 70 మిలియన్ టన్నుల లక్ష్యాన్ని చేరుకోవాలని, 500 మిలియన్ క్యూబిక్ మీటర్ల ఓవర్ బర్డెన్ తొలగింపు లక్ష్యాన్ని చేరుకునేందుకు ప్రణాళికతో ముందుకెళ్లాలని నిర్ణయించారు. ఓసీపీల్లో 93శాతం ఉత్పత్తి సింగరేణి వ్యాప్తంగా ఉన్న ఓసీపీల్లో ఈనెల 10 నాటికి 18.21మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తికి గాను 16.87మిలియన్ టన్నుల బొగ్గు సాధించి లక్ష్యాల్లో 93శాతం చేరుకున్నాయి. వర్షాకాలం తర్వాత లక్ష్యాలకు మించి బొగ్గు ఉత్పత్తి చేసేలా యాజమాన్యం ప్రణాళికలు రూపొందిస్తోంది. 80 శాతం బొగ్గు థర్మల్ విద్యుత్ కేంద్రాలకే -
అంబులెన్స్ సేవలు వినియోగించుకోవాలి
కోల్‌సిటీ(రామగుండం): గోదావరిఖని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి (జీజీహెచ్)లో కొత్త అడ్వాన్స్డ్ లైఫ్ సపోర్ట్ (ఏఎల్ఎస్) అంబులెన్స్ సేవలు గురువారం ప్రారంభమయ్యాయి. ఎన్టీపీసీ సీఎస్ఆర్ నిధులతో మంజూరైన అంబులెన్స్‌ను ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్, నగర మేయర్ మహంకాళి స్వామి ప్రారంభించారు. ఈసందర్భంగా ఆస్పత్రి ఆవరణలో ఎమ్మెల్యే స్వయంగా అంబులెన్స్ నడిపి సేవలను ప్రారంభించారు. ఎన్టీపీసీ సీఎస్ఆర్ నిధుల నుంచి రెండు అంబులెన్స్‌ల కొనుగోలుకు రూ.45 లక్షలు మంజూరయ్యాయని, పెద్దపల్లికి, గోదావరిఖని జీజీహెచ్‌కు కేటాయించినట్లు చెప్పారు. ప్రజలు జీజీహెచ్‌లో అందుతున్న సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. త్వరలోనే క్యాథ్‌ల్యాబ్ సేవలు కూడా అందుబాటులోకి రానున్నాయని తెలిపారు. అనంతరం వైద్యాధికారులతో సమావేశమై ఆస్పత్రి అభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలపై సమీక్షించారు. కార్పొరేటర్లు సంతోష్‌రావు, ఎండీ ముస్తఫా, గట్ల రమేశ్, నాయకులు ధీటీ బాలరాజు, బొంతల రాజేశ్, డిప్యూటీ సూపరింటెండెంట్ అరుణ, ఆర్ఎంవోలు కృపాబాయి, అప్పారావు తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ -
‘పెద్ద’పల్లి బస్టాండ్ విస్తరణపై ఆశలు
పెద్దపల్లిరూరల్: జిల్లా కేంద్రం పెద్దపల్లిలోని ఆర్టీసీ బస్టాండ్ విస్తరణ జరగక ప్రయాణికులు నానాపాట్లు పడుతున్నారు. ఉమ్మడి జిల్లాలో 12వ బస్‌డిపోను పెద్దపల్లిలో ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం అనుమతినిచ్చి పనులు చేపట్టడంతో దానిని ఆనుకునే ఉన్న శ్రీపెద్దశ్రీపల్లి బస్టాండ్‌ను ఆధునీకరిస్తారనే ఆశ ఈ ప్రాంత ప్రయాణికుల్లో వ్యక్తమవుతోంది. రైల్వే స్టేషన్‌కు సమీపంలోనే ఈ బస్టాండ్ ఉండడంతో దూర, సుదూర ప్రాంతాలకు రైళ్లలో ప్రయాణించాలనుకునే వారు సైతం పెద్దపల్లి వరకు ఆర్టీసీ బస్సుల్లోనే చేరుకుంటుండడంతో రోజురోజుకు ప్రయాణికుల సంఖ్య పెరుగుతోంది. నిత్యం దాదాపు 500 పైగా ట్రిప్పులతో 12వేల నుంచి 15వేల మంది దాకా ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారని అంచనా. పలు డిపోల నుంచే 382 ట్రిప్పులు పెద్దపల్లి బస్టాండ్ మీదుగా నిత్యం జిల్లాలోని కరీంనగర్, గోదావరిఖని, మంచిర్యాల, హుస్నాబాద్, హుజురాబాద్, మంథని, ఆసిఫాబాద్ తదితర డిపోలకు చెందిన బస్సులే 382 ట్రిప్పులు నడుస్తుంటాయి. ఈ బస్సుల్లో కరీంనగర్, సిద్దిపేట, హైదరాబాద్ లాంటి ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తున్నారు. ఇవి కాకుండా మరో వంద ట్రిప్పుల వరకు పెద్దపల్లి, దాని చుట్టూ ఉన్న పరిసర మండలాలు, గ్రామాలకు ఆర్టీసీ బస్సులు నడుస్తుంటాయి. బస్టాండ్ నుంచి యైటింక్లయిన్‌కాలనీకి రోజూ 30 ట్రిప్పులు, దొంగతుర్తి, ధర్మారంకు 19 ట్రిప్పులు నడుస్తున్నాయి. బస్‌డిపో ఏర్పాటుతో పెరగనున్న బస్సులు పెద్దపల్లిలో ఆర్టీసీ బస్సుడిపో మంజూరు కావడంతో పనులు మొదలయ్యాయి. పనులు కాస్త నెమ్మదించినా మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్‌బాబు, విప్ విజయరమణారావు పనులు పొందిన కాంట్రాక్టర్‌పై ఒత్తిడి పెంచడంతో చకచకా సాగుతున్నాయి. ఈ డిపో అందుబాటులోకి వస్తే 52 బస్సులను పెద్దపల్లి డిపోకు ఆర్టీసీ అధికారులు కేటాయించనున్నారు. ఫ్లాట్‌ఫాంల విస్తరణ అవసరం పెద్దపల్లి బస్టాండ్‌లో కేవలం ఆరు ఫ్లాట్‌ఫాంలే ఉన్నాయి. దీంతో బస్సులను బస్టాండ్‌లోని ఖాళీ ప్రదేశాల్లోనే నిలపాల్సి వస్తోంది. దీంతో బస్సు ఎక్కేందుకు ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. మరిన్ని ఫ్లాట్‌ఫాంలు నిర్మించేలా బస్టాండ్‌ను విస్తరించాల్సిన అవసరముందని ప్రయాణికులు కోరుతున్నారు. మూత్రశాలలు శిథిలం బస్టాండ్ ఆవరణలో మూత్రశాలలు అధ్వానంగా మారాయి. తొట్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. తొ ట్లు లేకండానే మూత్రవిసర్జన చేయాల్సి వస్తోందని ప్రయాణికులు పేర్కొంటున్నారు. అయితే మహిళా ప్రయాణికుల సంఖ్య పెరగడంతో వారు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఓ మరుగుదొడ్డిని నిర్మిస్తున్నట్టు ఆర్టీసీ అధికారులు తెలిపారు. రద్దీకి అనుగుణంగా అభివృద్ధికి నోచని వైనం మరిన్ని ఫ్లాట్‌ఫాంలు అవసరం నిత్యం 500 వరకు ట్రిప్పులు.. 15వేల మంది ప్రయాణం -
పుణ్యక్షేత్రాలకు నడపాలి
పెద్దపల్లి నుంచి ధర్మపురి, వేములవాడ, కొండగట్టు, కాళేశ్వరం లాంటి పుణ్యక్షేత్రాలకు నేరుగా బస్సులు నడపాలి. కొంతకాలం ధర్మారం మీదుగా జగిత్యాలకు నడిపిన బస్సులు రద్దు చేశారు. వాటినే ధర్మపురి దాకా నడిపించాలి. – స్వప్న, అప్పన్నపేట ఆధునీకరించాలి జిల్లా కేంద్రం హోదాకు తగ్గట్టుగా పెద్దపల్లి బస్టాండ్‌ను ఆధునీకరించాలి. ప్రయాణికులకు సౌకర్యంగా ఉండేలా ప్లాట్‌ఫాంలను విస్తరించాలి. డిపో ఏర్పాటు కావడంతో బస్సుల సంఖ్య పెరిగే అవకాశమున్నందును బస్టాండ్‌ను ఆధునిక వసతులతో అభివృద్ధి చేయాలి. – సోడాబాబు, పెద్దపల్లి ప్రతిపాదనలున్నాయి పెద్దపల్లి బస్టాండ్‌ను విస్తరించే యోచనలో ఉన్నతాధికారులు ఉన్నారు. ఆర్టీసీకి ఆదాయం వచ్చేలా ప్రస్తుతం ఉన్న 16 గదులకు తోడుగా షాపింగ్ కాంప్లెక్సు విస్తరణ కూడా చేపట్టే అవకాశముంది. బస్‌డిపో ఏర్పాటుతో ఈ ప్రాంత ప్రయాణికులకు మెరుగైన రవాణ సౌకర్యం కల్పిస్తాం. – రాంగోపాల్‌రెడ్డి, స్టేషన్‌మేనేజర్ -
గడువులోగా సీఎమ్మార్ పూర్తి చేయాలి
పెద్దపల్లి: 2024–25 యాసంగి సీజన్ సీఎమ్మార్ స రఫరాలో నాణ్యత ప్రమాణాలు పాటించాలని అద నపు కలెక్టర్ శ్రీరాములు కోరారు. కలెక్టరేట్లోని తన చాంబర్ సీఎమ్మార్ డెలివరీపై అధికారులు, రైస్‌మిల్లు సంఘాలతో బుధవారం సమీక్షించారు. జిల్లాలోని రైస్‌మిల్లుల్లో ఎఫ్‌సీఐ నిబంధనల ప్రకా రం రా రైస్, పాలిష్‌రైస్ నాణ్యత లోపం వంటి సమస్యలు పరిష్కరించాలని తెలిపారు. జిల్లా పౌర సరఫరాల అధికారి శ్రీనాథ్, మేనేజర్ శ్రీకాంత్, రైస్ మి ల్లర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు తిరుపతిరెడ్డి, జయపాల్‌రెడ్డి, రాజన్న తదితరులు పాల్గొన్నారు. అదనపు కలెక్టర్ శ్రీరాములు -
సీజనల్ వ్యాధులపై అప్రమత్తం
ముత్తారం: గ్రామాల్లో ప్రబలుతున్న సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని జిల్లా వై ద్యాధికారి పవిత్ర ఆదేశించారు. స్థానిక ప్రభు త్వ జూనియర్ కళాశాలలో సీజనల్ వ్యాధులపై బుధవారం విద్యార్థులకు అవగాహన కల్పించా రు. ఇంట్లో పరిసరాలను పరిశుభ్రత ఎంతోఅవసరమని అన్నారు. ఇన్చార్జి వైద్యుడు ప్రదీప్, సర్పంచ్ సుదాడి రవీందర్రావు, వైద్య సిబ్బంది, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు. 16న ఫుట్‌బాల్ జట్టు ఎంపికరామగుండం: ఉమ్మడి కరీంనగర్ జిల్లాస్థాయి ఫుట్‌బాల్ జట్టు ఎంపిక పోటీలను ఈనెల 16న యైటింక్లయిన్‌కాలనీ ఏపీజే అబ్దుల్ కలాం స్టేడియంలో నిర్వహించనున్నట్లు ఫుట్‌బాల్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి గణపతి తెలిపారు. క్రీడాకారులు ఆధార్, వయసు ధ్రువీకరణపత్రం, నాలుగు పాస్‌పోర్ట్ సైజు ఫొటోలు, ఫుట్‌బాల్ కిట్‌తో హాజరుకావాలని కోరారు. వివరాలకు 73867 63273, 95509 03088, 99088 39896లో సంప్రదించాలని సూచించారు. బెల్ట్‌షాపులు బంద్ చేయాలని గ్రామ పంచాయతీ తీర్మానంసుల్తానాబాద్రూరల్: తొగర్రాయి గ్రామంలో బెల్ట్‌షాపుల బంద్‌కు పంచాయతీ పాలకవర్గం తీర్మా నం చేసి అమలు చేస్తున్న ట్లు సర్పంచ్ చిలుక స్రవంతి, పంచాయతీ కార్యదర్శి తెలిపారు. ఇందులో భాగంగా బెల్డ్షాపుల నిర్వాహకులకు బుధవారం పంచాయతీ కార్యదర్శి నోటీసులు జారీ చేశారు. బెల్ట్‌షాపులు నిర్వహిస్తే పంచాయతీరాజ్ – 2016 చట్టం ప్రకారం పోలీసుల సాయంతో క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని నోటీసులో హెచ్చరించారు. ‘బ్లాక్హక్స్ టీం’లో చోటు జూలపల్లి: వాలీబాల్ ఇండి యా ప్రీమియం లీగ్ అండ ర్ –21 కేటగిరీలో హైదరాబాద్ బ్లాక్ హక్స్ టీంకు అ బ్బాపూర్ గ్రామానికి చెంది న టెక్కం సృనిక్ ఎంపిక య్యాడు. ఈనెల 14 – 16వ వరకు గోవాలో జ రిగే పోటీల్లో సృనిక్ పాల్గొంటాడు. వాలీబాల్ క్రీడాకారులు అమరగాని గంగాధర్, వెంకటేశ్, ఖాజమియా, బొమ్మెనవేని సతీశ్, ఆవుల రాజు, కొమ్మ సతీశ్, కోడూరి రాజశేఖర్, రాకేశ్, సాగర్, మహేశ్ తదితరులు అభినందించారు. పీఆర్సీ ప్రకటించాలి మంథనిరూరల్: ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించేందుకు పీఆర్సీ ప్రకటించాల ని పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు గండు కృష్ణమూర్తి డిమాండ్ చేశారు. వివిధ పాఠశాలల్లో బుధవారం పీఆర్టీయూ సభ్యత్వ నమోదు కా ర్యక్రమం నిర్వహించారు. ఆయన మాట్లాడు తూ, సెప్టెంబర్ 1న హైదరాబాద్‌లో నిర్వహించే మహాధర్నాను విజయవంతం చేయాలన్నా రు. పీఆర్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి కా నుగంటి శ్రీనివాస్, మండల అధ్యక్షుడు ఎగడి సురేశ్, ప్రధాన కార్యదర్శి పచ్చిక స్వరూప, కొమురయ్య, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. నేడు బీజేపీ చీఫ్ రాక పెద్దపల్లిరూరల్: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావు గురువారం జిల్లా కేంద్రంలో పర్యటిస్తారని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు కర్రె సంజీవరెడ్డి తెలిపారు. స్థానిక ప్రభుత్వ జూనియర్ కాలేజీ నుంచి ప్రారంభమయ్యే బీజేపీ తిరంగా యాత్రకు రాంచందర్‌రావు హాజరవుతారని, యువత ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు. హెచ్ఎం సస్పెన్షన్ పెద్దపల్లి : మద్యం మత్తులో విధులకు హాజర య్యారనే ఆరోపణలపై మంథని మండలం క న్నాల ఎంపీపీఎస్ హెడ్మాస్టర్ ఎం.మధునయ్యను బుధవారం సస్పెండ్ చేస్తూ డీఈవో శారద ఉత్తర్వులు జారీచేశారు. కలెక్టర్ శ్రీహర్ష సూచన మేరకు సస్పెండ్ చేసినట్లు తెలిపారు. ట్రాఫిక్ సీఐపై దాడికి యత్నం గోదావరిఖని: సర్వీస్ రోడ్డుకు అడ్డుగా పెట్టిన ద్విచక్రవాహనాన్ని ట్రాఫిక్ సీఐ గన్‌మెన్ పక్క కు తీస్తుండగా వాహనదారు దాడికి దిగిన సంఘటన బుధవారం రాత్రి జరిగింది. స్థానిక బీ – గెస్ట్‌హౌస్ సమీపంలో మద్యం మత్తులో ఉన్నఇద్దరు యువకులు రోడ్డుకు అడ్డంగా ద్విచ క్రవాహనం నిలిపి మూత్రానికి వెళ్లారు. అటు గా వెళ్తున్న ట్రాఫిక్ సీఐ చూసి పక్కకు పెట్టా లని గన్‌మెన్‌కు సూచించారు. టూవీలర్‌ను ప క్కకు పెడుతుండగా.. తన వాహనం తీయడానికి మీరెవరంటూ యువకులు దౌర్జాన్యానికి దిగారు. అడ్డుకోబోయిన సీఐని సైతం నెట్టివేశా రు. ట్రాఫిక్ సీఐ ఫిర్యాదు మేరకు వన్‌టౌన్ పో లీసులు యువకులపై కేసు నమోదు చేశారు. -
మెడికిల్ దందా
సాక్షి పెద్దపల్లి: మీకు తల నొప్పివస్తుందా? జ్వరం ఉందా? కడుపు, ఒళ్లు నొప్పులతో భరించలేకుండా ఉ న్నారా? నిద్ర పట్టడం లేదా? ఏం భయం లేదు.. అనారోగ్య సమస్యలపై డాక్టర్ వద్దకు వెళ్లాల్సిన అవసరమే లేదు. సమస్యగ గురించి చెబితే చాలు మెడికల్ షాపుల్లో అన్నిరకాల మందులూ ఇస్తారు. ఎంత మొత్తంలో కావాలన్నా ఇస్తారు. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ అవసరమే లేదు. ఏ మందు వేసుకోవాలో, రోజుకు ఎన్ని వేసుకోవాలో, ఎన్ని రోజులు వాడాలో కూడా మెడికల్ షాపుల నిర్వాహకులే చెప్పేస్తారు. ఇలా జిల్లాలో మెడికల్ షాపుల నిర్వాహకులు అడ్డగోలు వ్యాపారం చేస్తున్నారు. అప్పుడప్పుడు తని ఖీలు చేయడం, నామమాత్రంగా కేసులు నమోదు చేసి చేతులు దులుపుకోవడం సంబంధిత శాఖ అధికారులకు పరిపాటిగా మారింది. వైద్యుల చీటీ ఉంటేనే.. నిబంధనల ప్రకారం వైద్యుల ప్రిస్క్రిప్షన్ ఉంటేనే మెడికల్ షాపుల్లో మందులు ఇవ్వాలి. చాలామంది నిబంధనలు పాటించడం లేదు. జ్వరం, జలుబు, తలనొప్పి, కడుపునొప్పి, గ్యాస్ట్రిక్ సమస్యలు, ఒంటినొప్పులు తదితర సమస్యలకు మెడికల్ షాపుల్లో అడగ్గానే మందలిస్తున్నారు. కార్డియాలజీ, సైక్రి యాట్రిక్, న్యూరాలజీ, యూరాలజీ, బ్రెయిన్ స్ట్రోక్, డయాబెటిక్, బీపీ, థైరాయిడ్, యూరిన్ ఇన్ఫెక్షన్ తదితర సమస్యలకు ప్రిస్క్రిప్షన్ లేకుండా మందు లు ఇవ్వకూడదు. ఈ వ్యాధుల ఔషధాల్లో హైడోస్, లోడోస్ అనే రకాలు ఉంటాయి. వ్యాధితీవ్రత, పే షెంట్ వయసు, శరీరతత్వం తదితరాలను బట్టి డాక్టర్లు మెడిసిన్ నిర్ణయిస్తారు. సాధారణంగా మెడికల్ షాపులకు వెళ్లి అడిగితే ఏ రోగానికై నా, ఎన్ని మందులు కావాలన్నా ఇచ్చేస్తున్నారు. ఆల్కహాల్, ఇతర మత్తు పదార్థాలకు బానిసైనవారు అవి దొర కని సమయాల్లో మెడికల్ సిరప్లు వాడుతున్నారు. ఎక్స్పైర్డ్ మందులూ అమ్ముతున్నారు డ్రగ్స్, కాలపరిమితి దాటిన, నకిలీ మందుల విక్రయాలూ జిల్లాలో జోరుగా సాగుతున్నాయి. డాక్టర్ రాసిన కంపెనీవి లేకుంటే వేరే కంపెనీ మందులు అంటగడుతున్నారు. జిల్లాలో సుమారు 500 వరకు రిటైల్, హోల్‌సేల్ మెడికల్ షాపులున్నాయి. రోజూ చిన్న, పెద్దదుకాణాల్లో రూ.3వేల నుంచి రూ.లక్ష వ్యాపారం జరుగుతోంది. డ్రగ్ఇన్స్పెక్టర్ల అడ్రెస్సే లేదు. అర్హత, అనుభవం లేనివారు ఫార్మసిస్ట్ సర్టిఫికెట్లతో మెడికల్ షాపులను ఏర్పాటు చేస్తున్నారు. లైసెన్స్ ఒకరిది.. నిర్వహణ మరొకరిది జిల్లాల్లో మందుల షాపులు బినామీలే నిర్వహిస్తున్నారు. ప్రొఫెషనల్ ఫార్మసిస్టు ఆధ్వర్యంలో అవగాహన ఉన్నసిబ్బందితోనే షాప్‌లు నిర్వహించాలి. చాలా మంది తక్కువ వేతనంతో యువకులకు పనిలో పెట్టుకుంటున్నారు. మెడికల్‌పై పరిజ్ఞానం లేనివారు షాపులను నడుపుతూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. మామూళ్ల మత్తులో.. డ్రగ్స్, కాస్మొటిక్స్ యాక్ట్ ప్రకారం ప్రతీ మెడికల్ షా పులో రిజిష్టర్డ్ ఫార్మసిస్టు ఉండాలి. బీ ఫార్మసీ, ఎం ఫార్మసీ.. ఇలా ఏదోఒక ఫార్మసీ కోర్సు చేసినవారే షాపు నిర్వహించాలి. అనుమతిచ్చే సమయంలో ఔషధ నియంత్రణ శాఖ అధికారులు ఫార్మాసిస్టు ఉన్నదీ లేనిదీ తనిఖీ చేయాలి. ఏరియా ఇన్స్పెక్టర్లు ఈ బాధ్యత నిర్వర్తించాలి. కానీ కొందరు ఏరియా ఇన్స్పెక్టర్లు మామూళ్ల మత్తులో చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. పర్సంటేజీలు మాట్లాడుకొని.. జనరిక్, నాన్ జనరిక్ అనే తేడా లేకుండా నిర్వాహకులు ఔషధ కంపెనీలతో పర్సంటేజీలు మాట్లాడుకొని వైద్యులతో కుమ్మకై ్క ప్రజలను నిలువుదోపిడీ చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఇదే విషయమై డ్రగ్ ఇన్స్పెక్టర్ను సంప్రదించగా తనిఖీలు చేస్తున్నామన్నారు. నిబంధనలు పాటించని మెడిక్ షాపుల నిర్వాహకులపై చర్యలు తీసుకుంటున్నామని ఆయన వివరించారు. ప్రిస్క్రిప్షన్ లేకుండానే ఔషధాల విక్రయాలు ఫిజీషియన్ శాంపిళ్లు, కాలంచెల్లిన మందుల అమ్మకాలు జిల్లావ్యాప్తంగా డ్రగ్ఇన్స్పెక్టర్ల నామమాత్రపు తనిఖీలు షాపుల్లో బినామీల దందా కానరాని ఫార్మసిస్ట్‌లు -
డయాగ్నొస్టిక్ సెంటర్ నిర్వాహకులపై దాడికి యత్నం
పెద్దపల్లి: అధిక ధరలు వసూలు చేస్తున్నారనే ఆ రోపణలతో జిల్లా కేంద్రంలోని ఓ డయాగ్నొస్టిక్ సెంటర్ నిర్వాహకులపై స్థానికులు దాడికి య త్నించారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రైవేట్ ల్యాబ్‌లు, డయాగ్నొస్టిక్ సెంటర్లను ఆశ్రయించే వారినుంచి అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారని స్థానికులు, బాధితులు ఆరోపించా రు. ఈ క్రమంలో బుధవారం సదరు డయాగ్ని స్టిక్ సెంటర్ వద్ద వివాదం చోటుచేసుకుంది. ని ర్వాహకులపై స్థానికులు దాడిచేసినట్లు సమాచారం. సమాచారం అందుకున్న పోలీసులు ఘట నా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం సెంటర్‌ను పోలీసులు మూసివేయించారు. ప్రైవేట్ ల్యాబ్‌లు, డయాగ్నొస్టిక్ సెంటర్లలో అధిక ధరల వ సూలుపై వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు తనిఖీ లు చేయాలని స్థానికులు డిమాండ్ చేశారు. -
మొదటి అంతస్తులో డిగ్రీ తరగతులు
మంథని: విద్యార్థుల కోసం డిగ్రీ కళాశాల తరగతులను ప్రభుత్వ జూనియర్ కళాశాల భవనం మొద టి అంతస్తులో నిర్వహించాలని కలెక్టర్ కోయ శ్రీహ ర్ష ఆదేశించారు. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలను బుధవారం సందర్శించారు. మల్లేపల్లి డిగ్రీ క ళాశాలకు దూరం ఎక్కువగా ఉండడంతో రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్న దృష్ట్యా విద్యా ర్థులు గైర్హాజరవుతున్నారని, ఈ విషయం తన దృష్టికి వచ్చిందన్నారు. మల్లేపల్లి డిగ్రీ కళాశాలను జూ నియర్ కళాశాలలోని ఖాళీ గదుల్లో నిర్వహించాలని సూచించారు. మున్సిపల్ చైర్మన్ వొడ్నాల శ్రీనివా స్, వైస్ చైర్మన్ ముస్కుల సహేందర్‌రెడ్డి, కమిషనర్ మనోహర్, తహసీల్దార్ అరీఫొద్దీన్ పాల్గొన్నారు. క్రీడలతో ఆరోగ్యం పెద్దపల్లి: డ్రగ్స్‌కు దూరంగా ఉంటూ క్రీడలు, వ్యా యామాలను జీవితంలో భాగం చేసుకుని ఆరోగ్యంగా ముందుకు సాగాలని కలెక్టర్ శ్రీహర్ష యువతకు సూచించారు. సెప్టెంబర్ 27న నిర్వహించనున్న నాలుగో కరీంనగర్ హాఫ్ మారథాన్ ప్రచార పోస్టర్ ను కలెక్టరేట్లో ఆవిష్కరించారు. డీఎంవో ప్రవీణ్‌రెడ్డి, కేఆర్‌సీఏ అధ్యక్షుడు మహేశ్ పాల్గొన్నారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు వైద్యారోగ్య శాఖ అధికారులు సమన్వయంతో పని చేయాలని కలెక్టర్ శ్రీహర్ష సూచించారు. వైద్యారో గ్య శాఖ పనితీరుపై కలెక్టరేట్లో జరిగిన సమీక్షలో సూచనలు చేశారు. డీఎంహెచ్‌వో పవిత్ర, డీసీహెచ్ఎస్ శ్రీధర్, సుల్తానాబాద్ డీసీహెచ్ఎస్ రమాదేవి, ప్రోగ్రాం అధికారులు తదితరులు పాల్గొన్నారు. సమస్యలకు పరిష్కారం చూపాలి పాలకుర్తి: ప్రజాప్రతినిధులు లెవనెత్తే సమస్యలకు పరిష్కారం చూపాలని కలెక్టర్ శ్రీహర్ష ఆదేశించా రు. పాలకుర్తి రైతువేదికలో జరిగిన మండల సర్వసభ్య సమావేశంలో కలెక్టర్ పలు సూచనలు చేశా రు. వివిధ విభాగాల ప్రగతి నివేదికలను శాఖలవారీగా సమీక్షించి సమస్యలను అడిగి తెలుసుకున్నా రు. ఎంపీడీవో రమేశ్, ఎంపీవో సుదర్శన్, ఐసీడీఎస్ సూపర్వైజర్లు విజయ, సువర్ణ, వైద్యాధికారు లు సాయి సూర్య, సరళి తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ కోయ శ్రీహర్ష -
షాపింగ్ కాంప్లెక్స్ షెట్టర్లు సీజ్
పెద్దపల్లి: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ క ళాశాల షాపింగ్ కాంప్లెక్స్‌లోని 25 షెట్టర్లను బుధవారం సీజ్ చేశారు. టెండర్ గడువు ముగిసినా ని ర్వాహకులు గదులు ఖాళీ చేయకపోవడంతో ఐదుసార్లు నోటీసులు జారీచేశామని, అయినా స్పందించకపోవడంతో ఈ చర్యలు చేపట్టామని ప్రిన్సిపాల్ రవీందర్‌రెడ్డి తెలిపారు. కాంప్లెక్స్‌లో 26 షట్టర్లు ఉండగా ఆరు నెలల క్రితం ఒకటి స్వాధీనం చేసుకు న్నామన్నారు. పోలీసు, మున్సిపల్, కళాశాల సి బ్బంది బందోబస్తు చర్యల్లో పాల్గొన్నారు. ఓపెన్ టెండర్‌కు సన్నాహాలు బహిరంగ మార్కెట్లో ఒక్కో షట్టర్ అద్దె రూ.13 వేలు పలుకుతోంది. ప్రస్తుతం రూ.8,000 చొప్పున చెల్లిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఒక్కోషట్టర్కు రూ.5వేల చొప్పున ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతున్నట్లు గుర్తించిన సంబంధిత శాఖ అధికారులు.. ఇకపై ఓపెన్ టెండర్ ద్వారా గదులు అద్దెకు కేటాయించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. టెండర్ గడువు ముగిసినా ఖాళీ చేయని నిర్వాహకులు పోలీసులు బందోబస్తు మధ్య 25 గదులు సీజ్ -
ఐటీఐ క్లస్టర్ ఏర్పాటు చేయాలి
రామగుండం: పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో పీఎం సేతు ఐటీఐ క్లస్టర్ ఏర్పాటు చేయాలని ఎంపీ వంశీకృష్ణ కోరారు. బుధవారం ఢిల్లీలో కేంద్రమంత్రి హెచ్డీ కుమారస్వామితో ఎంపీతోపాటు కార్మికశాఖ మంత్రి గడ్డం వివేక్ సమావేశమై విన్నవించారు. కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించినట్లు ఎంపీ పేర్కొన్నారు. కాంగ్రెస్‌ను బలోపేతం చేయాలి గోదావరిఖని: గ్రామస్థాయిలో కాంగ్రెస్ పార్టీని మ రింత బలోపేతం చేయాలని రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్‌ఠాకూర్ సూచించారు. బుధవారం ఎ మ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో జిల్లా కాంగ్రెస్ పా ర్టీ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా పలు మండలాల ఇన్చార్జిలను ప్రకటించారు. సర్ పక్రియ సాగిన తీరుపై సమీక్షించారు. జిల్లాలో ని నాయకులు, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. యూరియా నిల్వచేస్తే చర్యలు కమాన్‌పూర్: అనుమతి లేకుండా యూరియా నిల్వచేస్తే చర్యలు తీసుకుంటామని డీసీపీ రాంరెడ్డి హె చ్చరించారు. ముల్కపల్లిలో అక్రమంగా నిల్వ చేసిన 127 యూరియ బస్తాలను టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నట్లు తెలిపారు. స్థానిక పోలీస్‌స్టేషన్‌లో బుధవారం విలేకరుల సమావేశంలో డీసీపీ మాట్లాడుతూ, ఎస్ఆర్ ట్రేడర్స్‌లో అక్రమంగా యూరియా నిల్వ చేసినట్లు అందిన సమాచారం మేరకు రామగుండం టాస్క్ఫోర్ ఏసీపీ శ్రీనివాస్, ఎస్ఐలు లక్ష్మ ణ్, రమేశ్, లచ్చన్న, కమాన్‌పూర్ తనిఖీ చేయగా.. యూరియా లభించిందన్నారు. వ్యవసాయాధికారి శ్రీకాంత్‌కు సమాచారం అందించగా యూరియా పరిశీలించారు. ట్రాలీ డ్రైవర్ రాజ్‌కుమార్‌ను విచారించగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల గ్రామం నుంచి యూరియా తీసుకువచ్చినట్లు తెలి పినట్లు డీసీపీ వివరించారు. డ్రైవర్‌తోపాటు పలువురిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు -
నిర్లక్ష్యం వహించే అధికారులపై కఠిన చర్యలు
గోదావరిఖని: విధుల్లో అలసత్వం వహించే అధికారులపై కఠిన చర్యలు తప్పవని రామగుండం పోలీ స్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా హెచ్చరించారు. తన కార్యాలయంలో బుధవారం నిర్వహించిన నేర సమీక్షలో పెండింగ్ కేసులు, నిందితుల అరెస్టు, ద ర్యాప్తు పురోగతి, నేర నియంత్రణ తదితర అంశాలపై సూచనలు చేశారు. ఆర్థిక నేరాల్లో నిబంధనల ప్రకారం ఆస్తుల జప్తు చేయాలని ఆదేశించారు. కొత్త చట్టాలపై ప్రతీపోలీస్ అధికారి పూర్తిఅవగాహన క లిగి ఉండాలని సూచించారు. సమాచార వ్యవస్థను మరింత బలోపేతం చేసుకోవాలన్నారు. మంచిర్యా ల, పెద్దపల్లి డీసీపీలు భాస్కర్, రాంరెడ్డి, అద నపు డీసీపీ(అడ్మిన్) శ్రీనివాస్, గోదావరిఖని, పెద్దపల్లి, మంచిర్యాల, జైపూర్, బెల్లంపల్లి, స్పెషల్ బ్రాంచ్, ట్రాఫిక్, సీసీఎస్, టాస్క్‌ఫోర్స్, సైబర్‌క్రైం, ఏఆర్ ఏసీపీలు రమే శ్, కృష్ణ, ప్రకాశ్, వెంకటేశ్వర్లు, కిరణ్‌కుమార్, నాగేంద్రగౌడ్, శ్రీనివాస్, రవీందర్, ప్రవీ ణ్ కుమార్, శ్రీనివాస్‌రావు, రంగారెడ్డి, ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు. పోలీస్ వాహనాల తనిఖీ పెద్దపల్లి, మంచిర్యాల జోన్ల పోలీస్స్టేషన్లకు చెందిన వాహనాల పనితీరు, నిర్వహణను సీపీ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా పరిశీలించారు. నిర్ణీత వ్యవధిలో మరమ్మతు, ఇంజిన్ ఆయిల్ మార్పు, టైర్ల నిర్వహణ తదితర అంశాల్లో నాణ్యతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. రామగుండం సీపీ అంబర్ కిశోర్ ఝా -
అంజన్న సొమ్ము గోల్‌మాల్‌పై చర్యలు
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: సుమారు రెండేళ్ల క్రితం.. కొండగట్టు ఆలయ నిధుల గోల్మాల్ వ్యవహారంలో దేవాదాయ శాఖ కొరఢా ఝుళిపించింది. సొమ్ము గల్లంతుకు బాధ్యులుగా చేస్తూ నలుగురు అధికారులను పేర్కొన్న దేవాదాయ శాఖ.. వారిలో ముగ్గురికి రెండు ఇంక్రిమెంట్లలో కోత విధించింది. మరో అధికారిని విధు ల నుంచి శాశ్వతంగా తొలగిస్తూ సంచలన నిర్ణ యం తీసుకుంది. ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు వెలువరించింది. జగిత్యాల జిల్లా కొండగట్టులోని శ్రీఆంజనేయ స్వామి ఆలయంలో 2024లో దాదాపు రూ.52,90,000 సొమ్ము గల్లంతైంది. ఈ విషయాన్ని దేవాదాయ శాఖ అంతర్గత ఆడిటింగ్‌లో గుర్తించి విచారణకు ఆదేశించింది. దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ వినోద్‌ను విచారణాధికారిగా నియమించింది. ఆయన తన విచారణలో నిధుల గోల్మాల్ నిజమేనని నిర్ధారించారు. ఈ వ్యవహారానికి బాధ్యులుగా ప్రస్తుతం కొమురవెల్లి మల్లికార్జునస్వామి ఆలయంలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న బి.శ్రీనివాస్, ప్రస్తుతం సస్పెన్షన్‌లో ఉన్న అప్పటి సీనియర్ అసిస్టెంట్ కె.శ్రీనివాసాచారి, వేములవాడ రాజన్న ఆలయ సూపరింటెండెంట్ శ్రీనివాసశర్మ, కొండగట్టు ఆలయ సూపరింటెండెంట్ డి.సునీల్‌కుమార్‌కు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. దీనికి ఈ నలుగురు అధికారులు ఇచ్చిన సమాధానం సంతృప్తికరంగా లేదని భావించిన ఉన్నతాధికారులు నలు గురిపైనా చర్యలకు ఉపక్రమించారు. నిధుల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు.. రికార్డులను సరిగా తనిఖీ చేయనందుకు వీరిపై చర్యలు తీసుకుంది. ప్రస్తుతం కొమురవెల్లి మల్లన్న ఆలయ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ బి.శ్రీనివాస్, సూ పరింటెండెంట్లు శ్రీనివాసశర్మ (వేములవాడ), సునీల్‌కుమార్ (కొండగట్టు)కు రెండు ఇంక్రిమెంట్లలో కోత విధించింది. ఆ సమయంలో సీనియర్ అసిస్టెంట్‌గా ఉండి ప్రస్తుతం సస్పెన్షన్‌లో ఉన్న శ్రీనివాసాచారిని సర్వీసు నుంచి డిస్మిస్ చేసినట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. గతంలో ఇదే వ్యవహారంలో కొండగట్టు ఈవో (ఎండోమెంట్ ఆఫీసర్)గా ఉన్న టంకశాల వెంకటేశ్ సస్పెన్షన్‌కు గురైన విషయం తెలిసిందే. ముగ్గురు అధికారుల ఇంక్రిమెంట్లలో కోత ఒక అధికారి ఏకంగా విధుల నుంచి డిస్మిస్ దేవాదాయశాఖ సంచలన ఉత్తర్వులు జారీ రూ.52లక్షలు రికవరీ చేయాలని భక్తుల డిమాండ్సొమ్ము రికవరీ మాటేంటి? దేవాలయానికి వివిధ మార్గాల్లో వచ్చిన ఆదా యం అధికారుల నిర్లక్ష్యంతో గల్లంతయ్యా యి. ఈ విషయాన్ని గుర్తించిన దేవాదాయ శాఖ విచారణ చేసి బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకుంది. ఇంతవరకూ బానే ఉ న్నా.. గల్లంతైన అంజన్న సొమ్ము రికవరీ బా ధ్యత ఎవరిది అని భక్తులు ప్రశ్నిస్తున్నారు. అసలే అంతంతమాత్రంగా ఆదాయం వ స్తున్న ఆలయానికి రూ.52.9 లక్షల రికవరీకి చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. 2023లో ఆలయంలో చోరీ చేసిన దొంగల నుంచి ఆభరణాలను రికవరీ చేసినట్లే ఇప్పుడు గల్లంతైన సొమ్మును వసూలు చే యాలని స్వామివారి భక్తులు కోరుతున్నారు. -
తగ్గుతున్న నీటిమట్టం
సీనియర్ అసిస్టెంట్ సస్పెన్షన్ పెద్దపల్లి: మంథని మండల పరిషత్ కార్యాలయంలో పనిచేస్తున్న సీనియర్ అసిస్టెంట్ కేఎన్ జయ ప్రకాశ్‌పై వచ్చిన ఆర్థిక ఆరోపణల నేపథ్యంలో సస్పెండ్ చేసినట్లు కలెక్టర్ కోయ శ్రీహ ర్ష మంగళవారం తెలిపారు. ఈనెల 7న అధికారులు, సర్పంచులతో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు, ఉద్యోగ విరమణ పొందినవారు జయప్రకాశ్‌పై పలు ఆర్థిక ఆరోపణలు చేసినట్లు పేర్కొన్నారు. ప్రాథమిక విచారణ అనంతరం జయప్రకాశ్‌ను సస్పెండ్ చేసినట్లు ఆయన వివరించారు. -
స్క్రబ్బర్ల పేరిట స్కాం!
ప్యాకింగ్ కవర్లుప్యాకింగ్ మెషీన్సాక్షిప్రతినిధి, కరీంనగర్: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు ఉన్న చందంగా ఉంది ఆన్లైన్ మోసగాళ్ల పరిస్థితి. కోవిడ్ కాలంలో ‘దీపాల వత్తులు చేసిస్తే నెలనెలా డబ్బులిస్తాం.. కుంకుడుకాయలు దంచిస్తే.. పైసలిస్తాం..’ అంటూ ఆన్లైన్ ద్వారా మోసాలు చేసిన ఘనులు తిరిగి విజృంభిస్తున్నారు. అమాయక గృహిణులే లక్ష్యంగా తిరిగి తమ మోసాలు కొనసాగిస్తున్నారు. పాత్రలు తోముకునే స్క్రబ్బర్ల పేరిట ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జరిగిన భారీ స్కాం వెలుగుచూసింది. మూడు నెలలపాటు సాఫీగా సాగిన ఈ కుంభకోణం ఇటీవల బోర్డు తిప్పడంతో లోకమంతా తెలిసింది. తొలుత ఆన్లైన్లో మొదలైన ఈ స్కాం.. క్రమక్రమంగా మల్టీ చైన్ మార్కెటింగ్‌గా రూపాంతరం చెందింది. అసలేం జరిగింది? జగిత్యాలకు చెందిన ఓ మహిళ.. ఇన్‌స్ట్రాగాంలో పార్ట్‌టైం జాబులు, ఎంఎక్స్‌వో కంపెనీ పేరిట వర్క్ ఫ్రం హోం అంటూ ప్రకటన చూసింది. విజయవాడలోని కొందరు నిర్వాహకులు తాము స్క్రబ్బర్లకు సంబంధించిన ప్యాకింగ్ చేయిస్తామని, మెటీరియల్ ఇస్తామని, ఇంటి వద్ద ఉండి పనిచేసుకుంటే నెలకు రూ.24వేలు ఇస్తామని చెప్పారు. ప్యాకింగ్ మెటీరియల్ కోసం రూ.1.50 లక్షలు చెల్లించింది. తనకు నెలనెలా ఠంఛనుగా రూ.24వేలు రావడంతో కరీంనగర్, గోదావరిఖనిలలో ఉండే తన బంధువులు, స్నేహితులకు చెప్పడంతో వారూ చేరారు. ఇలా వందలాది మంది స్కీంలో చేరారు. ఈ స్కీములో చేరిన వారికి ఒక ప్యాకింగ్ మెషీన్, కొన్ని స్క్రబ్బర్ల షీట్లు, ప్యాకింగ్ కవర్లు ఇచ్చారు. వీటిని ప్యాకింగ్ చేసిన తరువాత స్థానికంగా సదరు కంపెనీ నియమించుకున్న డిస్ట్రిబ్యూటర్లు వచ్చి సామగ్రిని కలెక్ట్‌చేసి తీసుకెళ్లేవారు. ఈ క్రమంలో పెద్దపల్లి నుంచి 30 మంది, కరీంనగర్ నుంచి 57 మంది, జగిత్యాలలో 52 మంది మహిళలు ఈ స్కీములో చేరారు. బోర్డు తిప్పేయడంతో లబోదిబో ఏప్రిల్ నుంచి జూన్ వరకు బాగానే తన కస్టమర్లకు నెలనెలా డబ్బులు పంపిన సంస్థ అకస్మాత్తుగా జూలై నుంచి చెల్లింపులు నిలిపివేసింది. రేపు మాపూ అంటూ వాయిదాలు వేస్తూ వచ్చారు. ఈ వారంలో విజయవాడకు చెందిన ఎంఎక్స్‌వో కంపెనీ ప్రతినిధులందరి ఫోన్లు మూగబోవడంతో మోసపోయామని గ్రహించారు. కొందరు విజయవాడకు వెళ్లి కంపెనీ ప్రతినిధులను కలిసే ప్రయత్నం చేసినా అవేమీ సఫలం కాలేదు. దీంతో మెటీరియల్ కొనుగోలు చేసిన వారంతా డిస్ట్రిబ్యూటర్ల వెంట పడుతుంటే.. వారంతా ముఖం చాటేసి తప్పించుకు తిరుగుతున్నారు. మోసపోయిన వారిలో చాలామంది గత నెలలో మెటీరియల్ కొనుగోలు వారు కూడా ఉండటం గమనార్హం. తమకు కనీసం ఒక నెల చెల్లింపులు కూడా దక్కలేదని వారు వాపోతున్నారు. -
మెలకువలు నేర్పిస్తున్నా
క్రికెట్‌పై ఆసక్తిని ఉన్న విద్యార్థులను సరైన మార్గంలో మలచడమే మా లక్ష్యం. క్రీడలు శారీరక దారుఢ్యంతోపాటు క్రమశిక్షణ, జట్టు భావన, పట్టుదలను నేర్పిస్తాయి. సెల్‌ఫోన్ వినియోగాన్ని తగ్గించి మైదానానికి వచ్చేలా ప్రోత్సహిస్తున్నాం. ప్రతిభ ఉన్నవారికి మెరుగైన శిక్షణ అందిస్తున్నాం. – సుధీశ్, క్రికెట్ కోచ్క్రమశిక్షణ వస్తుంది పిల్లలు ఎక్కువ సమయం సెల్ఫోన్లలో గడపకుండా క్రీడలు ఆడడం సంతోషంగా ఉంది. క్రికెట్ శిక్షణతో మా పిల్లల్లో శారీరక చురుకుదనం, క్రమశిక్షణ పెరుగుతున్నాయి. చదువుతోపాటు ఆటలూ సమాన ప్రాధాన్యం ఇవ్వడంతో వారి వ్యక్తిత్వ వికాసానికి ఎంతో ఉపయోగపడుతుంది. – సింఽఽఽధు, పేరెంట్ క్రికెట్ అంటే ఇష్టం మొదట్లో ఖాళీ సమయం దొరికితే సెల్ఫోన్లో గేమ్స్ ఆడేవాళ్లం. ఇప్పుడు క్రికెట్ ప్రాక్టీస్ కోసం మైదానానికి రావడం ఆనందంగా ఉంది. కోచ్ చెప్పే సూచనలతో బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్‌లో కొత్త విషయాలు నేర్చుకుంటున్నాం. భవిష్యత్‌లో మంచి క్రికెటర్‌గా ఎదగాలనుకుంటున్నాం. – కోడెం అశ్విత్, ఎన్టీపీసీ -
జీజీహెచ్‌లో పుస్తెలతాడు మాయం!
కోల్‌సిటీ: పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి(జీజీహెచ్)లో చికిత్స పొందుతున్న ఓ వృద్ధురాలి మెడలోని సుమారు మూడు తులాల బంగారు పుస్తెలతాడు మాయమైంది. ఈ ఘటన మంగళవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితురాలి కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. ఈ ఘటనపై పోలీసులు, ఆస్పత్రి అధికారులు విచారణ చేపట్టినట్లు సమాచారం. కుందనపల్లి సమీప బద్రిపల్లి గ్రామానికి చెందిన రాజమ్మ షుగర్ లెవల్స్ తగ్గడంతో సోమవారం జీజీహెచ్చే చేరింది. వైద్యుల సూచన మేరకు తొలుత సీటీ స్కాన్ చేయించారు. ఈ సమయంలో పేషెంట్ మెడలోని పుస్తెలతాడును కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు తెలుస్తోంది. ఈఎండీ విభాగంలో ఆభరణాలు కనిపించలేదని.. సీటీస్కాన్ అనంతరం ఈసీజీ కోసం ఈఎండీ విభాగానికి తరలించారు. ఈసీజీ కోసం వృద్ధురాలికిని బెడ్‌పై పడుకోబెట్టారు. ఆమె కూతురును బయటకు పంపించారు. ఈ క్రమంలోనే పుస్తెలతాడు కనిపించలేదని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు మంగళవారం ఈసీజీ విభాగాన్ని పరిశీలించినట్లు తెలిసింది. పేషెంట్ కుటుంబ సభ్యులతోపాటు ఆస్పత్రి సిబ్బందిని కూడా విచారించినట్లు సమాచారం. పుస్తెలతాడు మాయంపై భిన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పేషెంట్ వెంట ఉన్న వారెవరైనా తీసుకున్నారా? లేక ఆస్పత్రిలోనే ఎవరి చేతికై నా చిక్కాయా? అనే కోణంలోనూ పోలీసులు విచారణ చేస్తున్నట్లు సమాచారం. శ్రీఇంటి దొంగల పనే అయి ఉంటుందా?శ్రీ అనే అనుమానాలను కూడా కొందరు వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల మరో చైన్ మాయం? ఈఎండీలో ఇటీవల ఓ పేషెంట్ చైన్ మాయమైనట్లు సమాచారం. అయితే అది ఒకేగ్రామ్ గోల్డ్ కావడంతో బాధితులు పెద్దగా పట్టించుకోకపోవడంతో విషయం బయటకు రాలేదని తెలుస్తోంది. -
కుటుంబ వివరాలకు అధికారిక రికార్డు
జ్యోతినగర్: కుటుంబ సభ్యుల వివరాలను అధికారికంగా నమోదు చేసేందుకు ఫ్యామిలీ రిజిష్టర్ (కుటుంబ రిజిష్టర్) రూపొందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటివరకు అభివృద్ధి, సంక్షేమపథకాలు, ఇతర అధికారిక అవసరాల కోసం కుటుంబ సభ్యుల వివరాలను ధ్రువీకరించేందుకు సమగ్ర అధికారిక రికార్డు లేదు. పలు సందర్భాల్లో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ సమస్యలకు పరిష్కారం చూపే లక్ష్యంతో కుటుంబాల వివరాలను ఒకేచోట నమోదు చేసే విధానాన్ని ప్రభుత్వం తీసుకొచ్చింది. రేషన్‌కార్డు డేటా ఆధారంగా.. ప్రస్తుతం అందుబాటులో ఉన్నరేషన్ కార్డుల్లోని కుటుంబసభ్యుల వివరాల ఆధారంగా ఫ్యామిలీ రిజిష్టర్ సిద్ధం చేసినట్లు ప్రభుత్వం నిర్ణయించింది. భవిష్యత్‌లో ప్రజలకు అవసరమైనప్పుడు మీ సేవ కేంద్రాల ద్వారా ఫ్యామిలీ రిజిష్టర్ సర్టిఫికెట్ పొందే అవకాశం కల్పించింది. దీంతో కుటుంబంలో ఎవరు సభ్యులు, వారిప్రాథమిక వివరాలు ఏమిటనే అంశాల అధికారిక ధ్రువీకరణ పత్రం అందుబాటులో ఉంటుంది. సంక్షేమ పథకాలకు కీలకంగా మారే అవకాశం పథకాల అమలులో లబ్ధిదారులను గుర్తించడం, కు టుంబ సభ్యుల వివరాలను ధ్రువీకరించడం, ప్ర భుత్వ సేవలను పారదర్శకంగా అందించడం వంటి అంశాల్లో ఫ్యామిలీ రిజిష్టర్ కీలకంగా మారే అ వకాశం ఉంది. కుటుంబ వివరాల ఆధారంగా పథకాలు, సేవలను మరింత సమర్థవంతంగా అమలు చేసేందుకు ఈ డేటాబేస్ ఉపయోగపడుతుందని అధికారులు భావిస్తున్నారు. ఆస్తిహక్కులకు సంబంధం లేదు సర్టిఫికెట్ కేవలం కుటుంబ సభ్యుల వివరాల ధ్రువీకరణ కోసం మాత్రమే ఉపయోగపడుతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ సర్టిఫికెట్ ఆధారంగా ఆస్తిపై ఎలాంటి హక్కులు ఉండవని, అలాగే ఇది లీగల్ హెయిర్(చట్టబద్ధ వారసుల) నిర్ధారణకు ప్రామాణిక పత్రంగా పరిగణించరని పేర్కొంది. -
రోడ్డు ప్రమాదంలో కార్మికుడికి గాయాలు
యైటింక్లయిన్‌కాలనీ: పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్ యైటింక్లయిన్‌కాలనీ పెట్రోల్ బంక్ సమీపంలో మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో భూమయ్య అనే సింగరేణి కార్మికుడు తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికుల తెలిపిన వివరాల ప్రకారం.. సింగరేణి ఓసీపీ–3 క్వాంటీన్లో కుక్‌గా పనిచేసే భూమయ్య పనులు ముగించుకుని కాలనీ నుంచి పోతనకాలనీకి వెళ్తున్నాడు. ఈక్రమంలో కాలనీపెట్రోల్ బంక్ సమీపంలో బైక్ అదుపు తప్పి కింద పడిపోయాడు. తలకు తీవ్రంగా గాయాలు కాగా గమనించిన స్థానికులు గోదావరి సింగరేణి ఏరియా ఆస్పత్రికి తరలించారు. -
సెల్ఫోన్లకు దూరం.. క్రికెట్ వైపు పరుగులు
జ్యోతినగర్: చేతిలో సెల్‌ఫోన్.. గంటల తరబడి గేమ్స్ ఆడడం.. నిత్యం సోషల్ మీడియాపై దృష్టి సారించడం విద్యార్థుల దైనందిన జీవితంలో భాగమవుతున్నాయి. ఇలాంటి వారిని డిజిటల్ ప్రపంచం నుంచి బయటకు తీసుకొచ్చి మైదానం వైపు నడిపించేందుకు క్రికెట్ కోచింగ్ ఇస్తున్నారు సీనియర్ క్రీడాకారులు. విద్యార్థుల్లో క్రీడాస్ఫూర్తిని పెంపొందించడంతో పాటు శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరిచే లక్ష్యంతో ఫిజికల్ డైరెక్టర్ సుధీష్ ఆధ్వర్యంలో క్రికెట్ శిక్షణ కొనసాగుతోంది. ఆసక్తి ఉన్నవారికి.. క్రికెట్‌పై ఆసక్తి ఉన్న చిన్నారులు, విద్యార్థులకు క్రమశిక్షణతో కూడిన శిక్షణ అందిస్తున్నారు. ప్రధానంగా బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్, క్యాచ్‌లు, ఫిట్నెస్ వంటి అంశాల్లో మెలకువలు నేర్పిస్తున్నారు. కేవలం ఆటలో నైపుణ్యం సాధించడమే కాకుండా సమయపాలన, జట్టు స్ఫూర్తి, నాయకత్వ లక్షణాలు, ఓటమిని స్వీకరించే మనస్తత్వం వంటి జీవిత విలువలూ పెంపొందిస్తున్నారు.మైదానమే మంచి మార్గం విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని క్రీడలకు ప్రాధాన్యం ఇవ్వడం, సెల్‌ఫోన్ వ్యసనానికి దూరంగా ఉంచడం తల్లిదండ్రు లు, విద్యాసంస్థలు, సమాజం ఉమ్మడి బా ధ్యత. ఈ నేపథ్యంలో ఎన్టీపీసీ పర్మనెంట్ టౌన్షిప్లో కొనసాగుతున్న క్రికెట్ కోచింగ్ విద్యార్థుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. మరింత మంది మైదానం వైపు అడుగులు వేస్తే ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి బాటలు పడతాయని పలువురు క్రీడాభిమానులు అభిప్రాయపడుతున్నారు. -
‘ఎల్లంపల్లి’ నీటి వినియోగానికి దశాబ్దం
రామగుండం: ఎల్లంపల్లి ప్రాజెక్టు ద్వారా 2016 నుంచి ఇప్పటివరకు నీటి తరలింపుతో రాష్ట్ర ప్రభుత్వ ఖాజానాకు రూ.వందల కోట్ల ఆదాయం సమకూరింది. ఈ విషయాన్ని ప్రాజెక్టును ఇటీవల సందర్శించిన మంత్రులకు ఇరిగేషన్ ఉన్నతాధికారులు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. ముఖ్యంగా ఎన్టీపీసీ, హైదరాబాద్ – సికింద్రాబాద్ జంటనగరాలు, వివిధ పరిశ్రమలు, సాగు, తాగునీటి అవసరాలకు వినియోగించుకున్న నీటికి చెల్లించిన రుసుంతో సుమారు రూ.648 కోట్లు సమకూరినట్లు వారు వివరించారు. భారీ పరిశ్రమలు, విద్యుత్ ఉత్పాదక కేంద్రాలకు ప్రతీ టీఎంసీ నీటి వినియోగానికి రూ.7.16 కోట్లు రుసుం వసూలు చేస్తున్నారు. పరిశ్రమలు, తాగునీటి రంగం, మత్స్య సంపద, మైనింగ్ డీసిల్టేషన్ ద్వారా వచ్చే ఆదాయాలు వేర్వేరుగా ఉంటాయి. ‘ఖని’లో ఫ్లెక్సీల యుద్ధం గోదావరిఖని: సింగరేణి స్థలాల్లోని కట్టడాల పై ఫ్లెక్సీల యుద్ధం సాగుతోంది. కాంగ్రెస్ వర్సెస్ సీపీఐగా వివాదం కొనసాగుతోంది. దీనిలో భాగంగా ఎల్బీనగర్లో నిర్మించిన క ట్టడాల వద్ద లబ్ధిదారుల పేర్లను రాయాలని కాంగ్రెస్ నాయకులు ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. సీపీఐ నాయకులు మంగళవారం తిలక్‌నగర్‌లో సింగరేణి స్థలంలో కొనసాగుతున్న నిర్మాణం వద్ద లబ్ధిదారుల పేర్లను ప్రకటించాలని ఫ్లెక్సీ కట్టి సవాల్ చేశారు. ప్రతిస్పందించిన కాంగ్రెస్ నాయకులు.. లబ్ధిదారుల పేర్లను ఆ ఫ్లెక్సీపై రాసి తాము క్లియర్‌గా ఉంటామని స్పష్టం చేశారు. సింగరేణి స్థలాల్లో కొనసాగుతున్న కట్టడాలపై రాజకీయ దుమారం రేగుతున్న విషయం తెలిసిందే. ఎంఎస్ఎంఈడీలకు ప్రయోజనం పెద్దపల్లి: వ్యాపార వివాదాలను వేగంగా పరిష్కరించడం, పరిశ్రమల అభివృద్ధికి అనుకూల వాతావరణం కల్పించే ఉద్దేశంతో భారత ప్రభుత్వం ఎంఎస్ఎంఈడీ సవరణ బిల్లు–2026 ప్రవేశపెట్టిందని జిల్లా పరిశ్రమల మేనేజర్ కీర్తికాంత్ తెలిపారు. దీనిద్వారా సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ప్రయోజనాలు కల్పించనున్నట్లు పేర్కొన్నారు. జిల్లాలోని సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలకు కొనుగోలుదారుల నుంచి చెల్లింపులు ఆలస్యమైతే పరిష్కారం కోసం సూక్ష్మ, చిన్న పరిశ్రమల సదుపాయ మండలి, కరీంనగర్‌ను ఆశ్రయించాలని సూచించారు. -
నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవాలి
రామగిరి: విద్యార్థులు నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవాలని గోదావరిఖని ఏసీపీ రమేశ్ సూచించారు. పన్నూర్ మంథని జేఎన్టీయూలో ప్రిన్సిపాల్ విష్ణువర్ధన్ అధ్యక్షతన మంగళవారం నిర్వహించిన ఓరియేంటేషన్ డేలో సింగరేణి ఆర్జీ–3, ఏపీఏ జీఎంలు మధుసూదన్, నాగేశ్వరరావుతో కలిసి పాల్గొన్నారు. ఏసీపీ మాట్లాడుతూ, విద్యార్థులు సమాజ శ్రేయస్సు కోసం పాటుపడాలన్నారు. కొత్త విషయాలు తెలుసుకోవడానికి ఉత్సాహంతో ఉండాలని సూచించారు. లక్ష్యం కోసం పట్టుదలతో శ్రమించాలని, పరిజ్ఞానాన్ని సమాజం కోసం వినియోగించాలని, సమయపాలన కచ్చితంగా పాటించాలని చెప్పారు. వ్యసనాలకు దూరంగా ఉండాలని ఆయన అన్నారు. కళాశాల పరిసరాల్లో పోలీసు ప్రత్యేక నిఘా ఉంటుందని, చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ ఎం.ఉదయ్‌కుమార్, మంథని సీఐ స్వామి, రామగిరి ఎస్సై శ్రీనివాస్, విద్యార్థులు, తల్తిదండ్రులు పాల్గొన్నారు. -
10వేల మందితో తిరంగా యాత్ర
పెద్దపల్లి: స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈనెల 13న జిల్లా కేంద్రంలో 10వేల మందితో తిరంగా యాత్ర నిర్వహించనున్నట్లు బీజేపీ జిల్లా అధ్యక్షుడు కర్రె సంజీవరెడ్డి తెలిపారు. జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మంథని, రామగుండం నియోజకవర్గ కేంద్రాల్లో ర్యాలీ ఉంటుందని తెలిపారు. యాత్రకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు, ఉపాధ్యక్షుడు గుజ్జుల రామకృష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్యే కాసిపేట లింగయ్య, మాజీ ఎంపీ వెంకటేశ్ నేత తదిరతులు హాజరుకానున్నారని చెప్పారు. ఈకార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో నాయకులు గొట్టిముక్కల సురేశ్‌రెడ్డి, ఉషణ అన్వేష్, కావేటి రాజగోపాల్, మధుకరన్, పెంజర్ల రాకేశ్ యాదవ్, శివంగారి సతీశ్, రాజం మహంతకృష్ణ, రామగిరి అఖిల్, పూదరి హరీశ్, రజనీకర్‌రెడ్డి, గాదాసి సతీశ్, షిండే శివసాయి తదితరులు పాల్గొన్నారు. -
నిరుద్యోగులకు లైబ్రరీలు
● పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులు ● పలువురికి సర్కారు కొలువులు ● నేడు నేషనల్ లైబ్రేరియన్స్ డేబోయినపల్లి(చొప్పదండి): నిరుద్యోగులకు సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని గ్రంధాలయం పోటీ పరీక్షలకు సన్నద్ధం చేయడంలో సహకారం అందిస్తోంది. డబ్బులు వెచ్చించి కోచింగ్ లేకుండా లైబ్రరీలో ఉచితంగా పుస్తకాలు చదివి పోటీ పరీక్షల్లో పలువురు ప్రభుత్వ ఉద్యోగాలు సాధిస్తున్నారు. ఏటా ఆగస్టు 12న నేషనల్ లైబ్రేరియన్స్ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. సిరిసిల్లలో ఆధునిక లైబ్రరీ సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఆధునిక హంగులతో గ్రంధాలయ భవనం నిర్మించారు. రోజుకు 150 మంది పాఠకులు హాజరు అవుతారు. పోటీ పరీక్షల పుస్తకాలు, తెలుగు అకాడమీ తదితర సుమారు 32 వేలకు పైగా అందుబాటులో ఉన్నాయి. అలాగే జిల్లాలో 9 గ్రంధాలయాలు ఉన్నాయి. బోయినపల్లి, చందుర్తి, సిరిసిల్ల, ఇల్లంతకుంట, ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేటలో, వేములవాడ తదితర స్వంత భవనాలు 8 ఉన్నాయి. ముస్తాబాద్‌లో అద్దె లేకుండా ఓ భవనంలో విధులు నిర్వహిస్తున్నారు. లైబ్రరీ పోస్టులన్నీ ఖాళీలే జిల్లాలో 9 లైబ్రేరియన్ పోస్టులు ఉండాల్సి ఉండగా అన్ని ఖాళీలే ఉన్నాయి. కేవలం గ్రేడ్–2 లైబ్రరీయన్ ఒకరు, గ్రేడ్–3 లైబ్రేరియన్ ఒకరు మాత్రమే ఉన్నారు. ముగ్గురు ఔట్సోర్సింగ్ లైబ్రేరియన్స్, ఒక అటెండర్లు, ఇద్దరు పార్ట్‌టైం స్వీపర్లు ఆయా చోట్ల విధులు నిర్వహిస్తున్నారు. సిరిసిల్లలోని లైబ్రరీలో పోటీ పరిక్షల పుస్తకాలు ఉన్నాయి. నిరుద్యోగులు పైసా ఖర్చు లేకుండా పలు ఉద్యోగాలకు సంబందించిన స్టడీ మెటేరియల్ చదివే అవకాశాన్ని కల్పించాం. సద్వినియోగం చేసుకోవాలి. – శంకరయ్య, జిల్లా గ్రంధాయల సంస్థ, కార్యదర్శి, సిరిసిల్ల -
పోరుబాట వీడని వీబీజీ.. రాంజీ ఉద్యోగులు
మంథనిరూరల్: సుమారు ఇరవై ఏళ్లుగా ఉపాధిహా మీ పథకం(వీబీజీ రాంజీ)లో పనిచేస్తున్నా తమ సమస్యలు పరిష్కరించడం లేదని ఉద్యోగులు పోరుబాట పట్టారు. గతనెల 27వ తేదీ నుంచి పెన్‌డౌన్, కంప్యూటర్ షెట్‌డౌన్ చేపట్టి నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సుమారు రెండు దశాబ్దాలుగా సేవలు అందిస్తున్నా పేస్కేల్ అమలు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ డిమాండ్లు నెరవేర్చే వరకు పోరాటం చేస్తామంటూ చెబుతున్నారు. జిల్లావ్యాప్తంగా 64మంది జిల్లాలోని 14 మండలాల్లో వీబీజీ రాంజీ పథకంలో 69 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. ఇందులో 11మంది ఏపీవోలు, 9 మంది ఈసీలు, 24 మంది టీఏలు, 17మంది సీలోలతోపాటు జిల్లాకేంద్రంలో మరో 8మంది విధులు నిర్వహిస్తున్నారు. 2006లో జిల్లా సెలక్షన్ కమిటీ రాత పరీక్ష, ఇంటర్వ్యూల ద్వారా విఽవిధ హోదాల్లో వీరంతా ఎంపికయ్యారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల పరిధిలోని డీఆర్డీఏలో హ్యూమన్ రిసోర్స్ పాలసీ కింద విధులు నిర్వహిస్తున్నారు. పే స్కేల్ అమలు చేయాలని.. వీబీజీ రాంజీ పథకంలో పనిచేసే ఉద్యోగులకు పేస్కేల్ అమలు చేయాలనేది ప్రధాన డిమాండ్‌గా చెబుతున్నారు. దీనితోపాటు వేతనాలు ప్రతీనెల ఒకటో తేదీన చెల్లించాలని, బదిలీలు, పదోన్నతులు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను ఎఫ్టీలుగా గుర్తించాలని గత పది రోజులుగా ఆయా మండల కేంద్రాల్లో పెన్‌డౌన్.. కంప్యూటర్ షట్‌డౌన్‌తో నిరసన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఐకేపీ ఉద్యోగులకు గత ప్రభుత్వం పేస్కేల్ అమలు చేయగా ఉపాధిహామీ ఉద్యోగులకు ఇప్పటివరకు పేస్కేల్ వర్తింప జేయకపోవడంతో పోరుబాటకు శ్రీకారం చుట్టారు.పే స్కేల్ కోసం పోరు పేస్కేల్ ఇప్పటివరకు అమలుకు నోచుకోలేదు. ఇది అమలైతే మా ఆకాంక్ష నెరవేరుతుంది. వేతనాల చెల్లింపు, బదిలీలు, ప్రమోషన్ ప్రక్రియ అమలు చేయాలి. అనేక సమస్యలు ఉన్నా గ్రామాల్లో ప్రభుత్వ పథకాలను అమలు చేస్తూ అనేక సేవలు అందించాం. ఇప్పటికై నా ప్రభుత్వం మమ్మల్ని గుర్తించి మా డిమాండ్లను పరిష్కరించాలి. – సదానందం, ఏపీవో, మంథని ఆగిన అభివృద్ధి పనులు వీబీజీ రాంజీ ఉద్యోగులు తమ డిమాండ్ల సాధనకు విధులకు హాజరైనా.. పెన్‌డౌన్, కంప్యూటర్ షట్‌డౌన్ చేయడంతో జిల్లాలోని అనేక ప్రభుత్వ కార్యక్రమాలపై ప్రభావం పడుతోంది. ముఖ్యంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల బిల్లుల చెల్లింపులో జాప్యం జరుగుతున్నట్లు తెలుస్తోంది. అలాగే వనమహోత్సవ కార్యక్రమం ఇప్పటికే ప్రారంభించాల్సి ఉండగా ఉద్యోగుల పోరుబాటతో ఆలస్యం అవుతోంది. జలసిరి, ఇతరత్రా అభివృద్ధి కార్యక్రమాలు సైతం ఆగిపోయాయని అధికారులు చెబుతున్నారు. -
ఎస్జీఎఫ్ పోటీలకు ప్రణాళిక
జ్యోతినగర్: పాఠశాల స్థా యిలోనే క్రీడా ప్రతిభను గుర్తించేందుకు జిల్లావ్యాప్తంగా అండర్–14, 17 బాలురు, బాలికల క్రీడా పోటీలు నిర్వహించేందుకు కార్యాచరణ రూపొందించామని స్కూల్ గేమ్స్ ఫెడరేషన్(ఎస్జీఎఫ్) జిల్లా కార్యదర్శి కనుకుంట్ల లక్ష్మణ్ తెలిపారు. మండల, జోనల్‌స్థాయి పోటీలను ఈనెల 31లోగా, జిల్లాస్థాయి పోటీలను సెప్టెంబర్ 15లోపు, రాష్ట్రస్థాయి పోటీలను అక్టోబర్ 10వ తేదీలోగా నిర్వహించేలా కార్యాచరణ రూపొందించామన్నారు. జిల్లా విద్యాశాఖాధికారి అనుమతితో ఈనెల 14లోగా సిద్ధం చేసి 17న హైదరాబాద్‌లో నిర్వహించనున్న సమావేశంలో నివేదిస్తామని ఆయన వివరించారు. బాధ్యతతో పనిచేయాలి ఎలిగేడు: పోలీసులు, అధికారులు విధి ని ర్వహణలో బాధ్యతగా వహరిస్తూ పోలీసు శాఖకు మంచిగుర్తింపు తీసుకురావాలని పెద్దపల్లి డీసీపీ రాంరెడ్డి సూచించారు. స్థానిక పోలీసుస్టేషన్‌ను సోమవారం ఆయన ఆకసస్మికంగా తనిఖీ చేశారు. క్రైం రికార్డులను పరిశీలించారు. సీసీటీఎన్ఎస్, ఈ సాక్ష్య, స్టేషన్‌హౌస్ మేనేజ్మెంట్ సిస్టమ్ తదితర సాంకేతిక విభాగాల పనితీరు సమీక్షించారు. పోలీసు సిబ్బందికి సలహాలు, సూచనలు చేశారు. బాధితుల నుంచి ఫిర్యాదులను స్వీకరించి వేగంగా పరిష్కరించాలని సూచించారు. ఈకార్యక్రమంలో సు ల్తానాబాద్ సీఐ రంజిత్‌రావు, ఎలిగేడు ఎస్సై మధుకర్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. పంద్రాగస్టు వేడుకలు ఘనంగా జరపాలి గోదావరిఖని: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సింగరేణి చేపట్టే వేడుకలను ఘనంగా నిర్వహించేలా చూడాలని పలువురు అధికారులు కోరారు. సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణపై సోమవారం నగరంలోని కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ, దేశభక్తి భావాలను విద్యార్థుల్లో మరింత పెంపొందించేలా కార్యక్రమాలు ఉండాలని సూచించారు. విద్యార్థులతో దేశభక్తి గీతాలు, జాతీయ గీతాలు, సాంస్కృతిక ప్రదర్శనలు క్రమబద్ధంగా కొనసాగేలా చూడాలని అన్నారు. సమావేశంలో సింగరేని పర్సనల్ మేనేజర్ తిరుపతి, సీనియర్ పీవో హన్మంతరావు, సేవా కార్యదర్శి బీనాసింగ్, జాయింట్ సెక్రటరీ పెరుమాళ్ల రజిత తదితరులు పాల్గొన్నారు. స్వాతంత్య్ర వేడుకలకు పకడ్బందీ ఏర్పాట్లు గోదావరిఖని: స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని సింగరేణి ఆర్జీ–2 జీఎం లక్ష్మీపతిగౌడ్ సూచించారు. తన కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రధాన వేడుకలను కమ్యూనిటీహాల్లో నిర్వహించనున్నామని తెలిపారు. జాతీయ జెండా ఆవిష్కరణ, సెక్యూరిటీ సిబ్బంది నుంచి గౌరవ వందనం తర్వాత ఉత్తమ ఉద్యోగులకు సన్మానం, విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ఉంటాయని చెప్పారు. అధికారులు ఎన్.వేణుగోపాల్, రాముడు, చంద్రశేఖర్, వెంకటరామచంద్ర, చంద్రశేఖర్, ఉజ్వల్ బందోపాధ్యాయ, నెహ్రూ, ఉదయ్‌హరిజన్, రాంరెడ్డి, రాజేందర్‌రెడ్డి, జీవీ మహిపాల్ పాల్గొన్నారు. ఆకట్టుకున్న నాటిక ప్రదర్శన గోదావరిఖని: అంబేడ్కర్ జీవిత చరిత్రపై నాటికను సోమవారం స్థానిక ఆర్సీవోఏ క్లబ్లో ప్రదర్శించారు. ఈకార్యక్రమాన్ని ఆర్జీ–వన్ జీఎం లలిత్‌కుమార్ ప్రారంభించారు. అంబేడ్కర్ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో నాటిక వంటి కళారూపాలు ప్రభావవంతమైన మాధ్యమాలుగా నిలుస్తాయని పలువురు వక్తలు పేర్కొన్నారు. కార్యక్రమంలో సింగరేణి అధికారులు పాల్గొన్నారు. -
వైకల్యాన్ని అధిగమించి.. పిడికిలి బిగించి..
ఇతడి పేరు ఆకుల నరేశ్. పెద్దపల్లి జిల్లా ఓదెల స్వస్థలం. సుమారు 30ఏళ్లుగా గ్రామపంచాయతీ ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తున్నాడు. 2011లో విధి నిర్వహణలో ఉండగా విద్యుదాఘాతానికి గురై రెండు చేతులు కోల్పోయాడు. అయినా, వెరవడంలేదు. కార్మికులు, రైతులు, ఇతర శ్రామికుల హక్కుల కోసం వామపక్షాలు సోమవారం జిల్లా కేంద్రంలో జైల్‌భరో కార్యక్రమం చేపట్టాయి. నరేశ్ కూడా ఇందులో పాల్గొని అందరినీ ఆకర్షించాడు. మోతుల వరకు చేతులు కోల్పోయినా.. వాటితోనే తన చొక్కా జేబులోంచి సెల్‌ఫోన్ బయటకు తీసుకుని చెవికి ఆనించి మాట్లాడి, ఆ తర్వాత మళ్లీ తన జేబులో వేసుకున్నాడు. వామపక్ష నేతలతో కలిసి పెద్ద ఎత్తున నినాదాలూ చేశాడు. – సాక్షి ఫొటోగ్రాఫర్, పెద్దపల్లి -
కేంద్రప్రభుత్వం తీరు శోచనీయం
పెద్దపల్లి: కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, రైతు, ప్రజావ్యతిరేక విధానాలను విరమించుకోవాలని ఐఎఫ్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు ఐ.కృష్ణ, సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎరవెల్లి ముత్యంరావు డిమాండ్ చేశారు. స్థానిక వ్యవసాయ మార్కెట్‌యార్డు నుంచి బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించి రాజీవ్ రహదారిపై బైఠాయించారు. వారు మాట్లాడుతూ, నాలుగు లేబర్కోడ్లు రద్దు చేయాలని, ఉపాధిహామీ చట్టాన్ని మార్చడం సరికాదని, విద్యుత్ సంస్కరణలను రద్దు చేయాలని, విదేశాల నుంచి ధాన్యం దిగుమతి వద్దని, గ్యాస్, పెట్రోల్, డీజిల్, నిత్యావసరాల ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా పోలీసులు నాయకులను అరెస్టు చేస్తున్న క్రమంలో కాస్త ఉద్రిక్తత నెలకోంది. ఆయా పార్టీలు, యూనియన్ల నాయకులు మంద రాజేందర్, శ్రీనివాస్‌రెడ్డి సీపెల్లి రవీందర్, తాండ్ర అంజయ్య, ఎండీ ఖాజా, రామలక్ష్మి, లచ్చయ్య, మాంతగి రాజమల్లు, జి.జ్యోతి, భారతి, శ్రీనివాస్, నాగయ్య, దొడ్ల రాజబాబు, నరేశ్, రమేశ్, రామస్వామి, అంబాల లక్ష్మణ్, అశోక్, రాజేశం, తిరుపతి, లింగమూర్తి, బాలకష్ణ, సజన్ తదితరులు పాల్గొన్నారు. -
12వ వేజ్‌బోర్డు ప్రక్రియ ప్రారంభించాలి
గోదావరిఖని: సింగరేణి కార్మికుల 12వ వేజ్‌బోర్డు ప్రక్రియ ప్రారంభించాలని జాతీయ కార్మిక సంఘా లు డిమాండ్ చేశాయి. సోమవారం ఆర్జీ–వన్ జీఎం కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. బొగ్గుగని కార్మికుల వేతనాలు పెంచాలని, నాలుగు లే బర్ కోడ్లను బొగ్గు పరిశ్రమల్లో అమలు చేయవ ద్దని కోరారు. వేజ్‌బో ర్డు కాలపరిమితి గత జూన్ 30తో ముగిసిందని, జూలై 1 నుంచి వేజ్‌బోర్డు ప్రక్రియ ప్రారంభం కావాల్సి ఉందని, కోలిండియా ఇంతవరకు ప్రారంభించలేదని విమర్శించారు. 51 శాతం ఓట్లు వచ్చిన కార్మిక సంఘంతో వేతన సవరణ జరుపుతామంటామే కేంద్ర కార్మిక సంఘాలు వ్యతిరేకించాయని గుర్తుచేశారు. కొరిమి రాజ్‌కుమా ర్, ధర్మపురి, ఎస్.వీరయ్య, తుమ్మల రాజారెడ్డి, సతీశ్, శ్రీను, ఎల్లాగౌడ్, సదానందం పాల్గొన్నారు. -
వేగంగా ‘ఆటో సిగ్నల్స్’
ఓదెల: దక్షిణ మధ్య రైల్వేలోని కాజీపేట – బల్హార్ష సెక్షన్ల మధ్య సమయానకూలంగా రైళ్లు రాకపోకలు సాగించేందుకు వీలుగా రైల్వే శాఖ చేపట్టిన ఆటో సిగ్నల్స్ వ్యవస్థ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇందుకోసం ఉద్దేశించిన రైల్వేస్టేషన్ల సమీపంలో ఏబీఎస్ హట్ల నిర్మాణంలో వేగం పెంచింది. మూడో రైల్వేలైను పనులు పూర్తయ్యాక రైళ్లను మరింత వేగవంతంతోపాటు సకాలంలో గమ్యం చేరుకునేలా ఆటో సిగ్నల్స్ సిస్టమ్‌ను రైల్వేశాఖ అందుబాటులోకి తీసుకొచ్చింది. కిలోమీటరుకో ఆటో సిగ్నల్స్ సిస్టమ్ ప్రతీ కిలోమీటర్‌కు ఆటో సిగ్నల్స్ సిస్టం, ప్రతీ రెండు కిలోమీటర్ల నిడివితో ఒకటితర్వాత మరోరైలు పరుగులు పెట్టేలా చూడడమే ఆటోసిగ్నల్స్ సిస్టం లక్ష్యం. దీనికోసం కాజీపేట నుంచి బల్హార్షా మధ్య కొలనూర్, కొత్తపల్లి, ఓదెల, చీకురాయి, జమ్మికుంట, హసన్‌పర్తి, రామగుండం, రాఘవపూర్ నుంచి ప్రతీ నాలుగు కిలోమీటర్ల దూరంతో ఏబీఎస్ హట్ల నిర్మాణం చేపట్టింది. రెడీమేడ్‌గా రూపొందించిన హట్లో కంప్యూటర్ సిస్టం అమర్చారు. మందమర్రి– రామగుండం, హసన్‌పర్తి – జమ్మికుంట.. ప్రస్తుతం ఆటో సిగ్నల్స్ సిస్టం ఆధారంగా మందమర్రి – రామగుండం, హసన్‌పర్తి – జమ్మికుంట మధ్య రైళ్లు పరుగెత్తుతున్నాయి. మిగతా రైల్వేస్టేషన్లను అనుసంధానం చేస్తూ రైలుపట్టాలకు ఇరువైపులా ఆటోసిగ్నల్స్ కోసం గుంతలు తవ్వుతున్నారు. కేబుల్ పనులనూ శరవంగా చేస్తోంది. వాగులపై వంతెనలు, మానేరు, గోదావరి బ్రిడ్జిపై కూడా ఆటోసిగ్నల్ సిస్టంతో పాటు ఏబీఎస్ హట్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నారు. పెరుగుతున్న రైళ్ల రద్దీకి అనుగుణంగా సమయపాలన పాటించడం కోసం అమలు చేస్తున్న సిగ్నల్స్ సిస్టం సత్ఫలితాలు ఇస్తోందనిఫ రైల్వేసిబ్బంది తెలిపారు. కాజీపేట – బల్హార్షాతోపాటు సికింద్రాబాద్ – వరంగల్ – రాజమండి మధ్య కూడా కొత్త విధానం అమలు చేస్తున్నారు. -
సర్ ముగిసింది
సాక్షి పెద్దపల్లి: ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్ఐఆర్–సర్) ప్రక్రియలో కీలకమైన ఎన్యూమరేషన్ ఫామ్స్ స్వీకరణ గడువు ముగిసింది. బూత్‌స్థాయి అధికారులు (బీఎల్వోలు) ఇంటింటికీ వెళ్లి ఓటర్ల నుంచి ఫామ్స్ సేకరించే ప్రక్రియ సోమవారంతో పూర్తయింది. సేకరించిన వాటి వివరాలను ఆన్లైన్లో నమోదు చేసే డిజిటలైజేషన్ ప్రక్రియకు అర్ధరాత్రి వరకూ గడువు ఉండటంతో.. చివరిరోజు అందిన ఫామ్స్‌ను నమోదు చేసేందుకు బీఎల్వోలు రాత్రివరకూ బిజీగా గడిపారు. జిల్లాలో మొత్తం 7,12,157 మంది ఓటర్లు ఉండగా, అందులో వందశాతం ఎన్యూమరేషన్ ఫామ్స్‌ను ఓటర్లకు పంపిణీ చేశారు. 6,30,876 మంది ఓటర్ల డిజిటలైజేషన్ ప్రక్రియ పూర్తియింది. ఇది మొత్తం ఓటర్లల్లో 88.59 శాతంగా నమోదైంది. మిగిలిన దాదాపు 1,35,675 మంది ఓటర్లు తప్పుగా నమోదైనట్లు అధికారులు గుర్తించారు. ఎస్ఐఆర్ ప్రక్రియలో తమ ఓటుహక్కు కోల్పోయే అవకాశం ఉందన్న ఆందోళనతో పలువురు ఓటర్లు ముందుగానే ఎన్యూమరేషన్ ఫామ్స్‌ను అన్నివివరాలతో పూర్తిచేసి బీఎల్వోలకు అందజేశారు. ముఖ్యంగా ఇతర ప్రాంతాల్లో ఉద్యోగాలు, వ్యాపారాలు, ఇతర కారణాలతో నివాసం ఉంటున్నవారు బోనాల పండుగ సందర్భంగా స్వస్థలాలకు రావడంతో తమఓటు వివరాలను నమోదు చేసుకున్నారు. దీంతో చివరిరోజు కూడా బీఎల్వోలకు పెద్దసంఖ్యలో ఎన్యూమరేషన్ ఫామ్స్ అందాయి. ఒకవైపు ఫామ్స్ సేకరణ.. మరోవైపు వాటి వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాల్సి రావడంతో బీఎల్వోలు ఒత్తిడికి గురయ్యారు. గడువు ముగిసే సమయం సమీపిస్తుండడంతో చివరిరోజు రాత్రివరకూ డిజిటలైజేషన్ ప్రక్రియ కొనసాగించారు. రాష్ట్రంలో ఎస్ఐఆర్ ప్రక్రియను తొలుత జూన్ 25 నుంచి జూలై 24వ తేదీ వరకు నిర్వహించాలని ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది. ఈకాలంలో బీఎల్వోలు ఇంటింటికీ వెళ్లి ఓటర్ల నుంచి ఎన్యూమరేషన్ ఫామ్స్ స్వీకరించి, వాటివివరాలను డిజిటలైజ్ చేయాల్సి ఉంది. అయితే ప్రక్రియలో ఓటర్ల నుంచి అభ్యంతరాలు వ్యక్తం కావడం, పలు ప్రాంతాల్లో ప్రక్రియ నెమ్మదిగా సాగడంతో తొలుత గడువును ఆగస్టు 3 వరకు పొడిగించారు. అయినా ప్రక్రియ ఆశించిన వేగంతో ముందుకు సాగకపోవడంతో ఎన్నికల సంఘం మరోసారి గడువును పొడిగించింది. చివరగా ఆగస్టు 10 అర్ధరాత్రి 12 గంటల వరకు తుది గడువు విధించింది. దీంతో మొత్తం 46 రోజుల పాటు కొనసాగిన ఎన్యూమరేషన్ ప్రక్రియకు సోమవారం తెరపడింది. ఎన్యూమరేషన్ ప్రక్రియ పూర్తయిన అనంతరం అధికారులు తదుపరిదశపై దృష్టి సారించనున్నారు. ఈనెల 17న డ్రాఫ్ట్ ఓటరు జాబితా ప్రకటించనుండగా, ఓటర్లు ఈ జాబితాలో తమపేరు ఉందో లేదో తప్పనిసరిగా పరిశీలించుకోవాల్సి ఉంటుంది. డ్రాఫ్ట్ జాబితాలో పేరు లేకపోయినా.. పేరు, చిరునామాలో లేదా ఇతర వివరాల్లో తప్పులు ఉన్నా ఈనెల 17 నుంచి సెప్టెంబర్ 16వ తేదీ వరకు అభ్యంతరాలు, ఫిర్యాదులు సమర్పించేందుకు అవకాశం ఉంటుంది. అందిన ఫిర్యాదుల ఆధారంగా నోటీసులు జారీచేసి అక్టోబర్ 15వ తేదీ వరకు అధికారులు పరిశీలించి, అవసరమైన విచారణను పూర్తిచేసిన అనంతరం అక్టోబర్ 19న తుదిఓటరు జాబితా ప్రకటించనున్నారు. ఇక ఓటర్లంతా డ్రాఫ్ట్ జాబితా విడుదలయ్యే రోజును దృష్టిలో పెట్టుకుని తమపేరు, వివరాలను మరోసారి పరిశీలించుకోవాల్సిన అవసరం ఉంది. -
దశల వారీగా కాలనీల అభివృద్ధి
కోల్‌సిటీ: రామగుండం నగరంలోని 35వ డివిజన్ సప్తగిరికాలనీ, రాజ్యలక్ష్మీ కాలనీల్లో అభివృద్ధి పనులన్నీ దశల వారీగా పూర్తిచేస్తామని మేయర్ మహంకాళి స్వామి అన్నారు. రాజ్యలక్ష్మీకాలనీలో రూ.7 కోట్ల ప్రత్యేక నిధుల ప్యాకేజీలో భాగంగా రూ.8 లక్షల అంచనా వ్యయంతో చేఏపట్టిన సీసీ రోడ్డు పనులను స్థానిక కార్పొరేటర్ జంగపల్లి రమాదేవితో కలిసి మేయర్ సోమవారం ప్రారంభించారు. మేయర్ మాట్లాడుతూ, ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్‌ఠాకూర్ ఇచ్చిన హామీ మేరకు రాజ్యలక్ష్మీ, సప్తగిరికాలనీలు వర్షాకాలంలో ముంపునకు గురికాకుండా వరద నీటికాలువ నిర్మించామన్నారు. కొత్తకాలనీల్లో డ్రైనేజీ వ్యవస్థ లేక మురుగు రోడ్లపై వస్తోందని, ప్రస్తుతం డ్రైనేజీ నిర్మాణం పూర్తయిందని, ఇక ఆ సమస్య ఉండదని తెలిపారు. ఇటీవల వార్డు సందర్శన నిర్వహించి ప్రజల సమస్యలను గుర్తించినట్లు తెలిపారు. గుర్తించిన సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ డివిజన్‌ను అభివృద్ధి చేస్తామని మేయర్ స్పష్టం చేశారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు దాసరి సాంబమూర్తి, డేవిడ్ రాజు, నాయకులు గడ్డం శ్రీనివాస్, పీచర శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
మంథనిలో జైల్‌భరో
మంథని: బీజేపీ ప్రభుత్వం కార్మిక, రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా సీఐటీయూ, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో పట్టణంలో జైల్‌భరో నిర్వహించారు. పట్టణంలో భారీనిరసన ర్యాలీ చేపట్టారు. అంబేడ్కర్ ప్రధాన చౌరస్తాలో రాస్తారోకో చేశారు. రాస్తారోకో చేస్తున్న సమయంలో నాయకులు బూడిద గణేశ్, ఆర్ల సందీప్, వనజారాణిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నాయకులు మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం కార్మికులు, రైతులు, వ్యవసాయ కూలీలకు నష్టం కలిగించే విధానాలను అమలు చేస్తోందన్నారు. భారత స్వాతంత్య్ర సమరంలోని క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. విద్యుత్ సవరణ బిల్లుతో రైతులపై భారం మోపాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. స్మార్ట్ మీటర్ల పేరుతో ఉచిత విద్యుత్ పథకాన్ని రద్దు చేసే యత్నాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. విత్తన చట్టం ద్వారా వ్యవసాయ రంగాన్ని దెబ్బతీయాలని చూస్తున్నారని విమర్శించారు. నాయకులు కొమురయ్య, వేల్పుల సురేశ్, బాబు రవి, ఉప్పు రమేశ్, కుమార్, పాషా, సులోచన, శ్యామల, సుగుణ, శోభ, హరిత, మున్సిపల్ కార్మికులు తదితరులు ఉన్నారు. -
24న ఆటోల బంద్
పాలకుర్తి: తమ సమస్యలు పరిష్కరించడంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాన్ని నిరసిస్తూ ఈనెల 24న ఆ టోల బంద్ పాటిస్తామని ఆటోడ్రైవర్ల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు మంద రవికుమార్ తెలిపారు. బసంత్‌నగర్‌లో ఆదివారం నిర్వహించిన ఆటో అసోసియేష న్ల జేఏసీ సమావేశంలో రవికుమార్ మాట్లాడారు. ఆటోడ్రైవర్ల కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని, ఏడాదికి రూ.12 వేలు సాయం చేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన కాంగ్రెస్.. మూడేళ్లు కావస్తున్నా అమలు చేయలేదన్నారు. ఈనేపథ్యంలో అన్ని పార్టీల ఆటో యూనియన్లతో కలిసి ఆ టోల బంద్‌కు పిలుపునిచ్చాయని, బంద్‌ను విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఆటో జేఏసీ రామగుండం నియోజకవర్గ ఇన్చార్జి మడిపెద్ది రమే శ్ అధ్యక్షతన జరిగిన ఈసమావేశంలో రాష్ట్ర కార్య దర్శి ఎస్కే జబ్బార్, నాయకులు బాణాల భాస్కర్, బరిగెల కమలాకర్, బెక్కం రవి, కుమార్, చంద్రయ్య, దేవయ్య, సంతోష్ పాల్గొన్నారు. -
కాంగ్రెస్‌కు యువతే బలం
పెద్దపల్లి: యువతే కాంగ్రెస్ పార్టీకి బలమని యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు బొంకూరు అవినాష్ అ న్నారు. జిల్లా కేంద్రంలో ఆదివారం యువజన కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జెండాఆ విష్కరించారు. అనంతరం అవినాష్ మాట్లాడు తూ, రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ ప థకాల ఫలాలు ఇంటింటా చేరవేయాలన్నారు. యూత్ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు శ్రావణ్, ఓదెల, జూలపల్లి మండలాల అధ్యక్షులు రాహుల్, దేవేందర్, నాయకులు ఫిరంగి రాజు, ఆయుబ్ మహమ్మద్, గుమ్మడి ప్రసాద్, తిరుమలేశ్ పాల్గొన్నారు. -
కల్యాణం.. కమనీయం
గోదావరిఖనిటౌన్: సత్యసాయిబాబా జయంతి సందర్భంగా లోక కల్యాణార్థం స్థానిక శ్రీసత్యసాయి మందిరంలో మూడు రో జులుగా నిర్వహిస్తున్న దేవతామూ ర్తుల కల్యాణ మ హోత్సవం ఆదివారం పార్వతీపరమేశ్వరుల కల్యాణంతో వైభవంగా ముగిసింది. ఈ కార్యక్రమంలో శ్రీసత్యసాయి సేవా సంస్థల తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు వెంకటరావు, ఆధ్యాత్మిక సమన్వయకర్త మహేశ్, జిల్లా ఇన్చార్జి వెంకటనర్సింహారెడ్డి, జిల్లా అధ్యక్షుడు వెంకటస్వామి, పూజారులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. మడేలేశ్వరస్వామికి పూజలు జ్యోతినగర్: ఎన్టీపీసీ పట్టణ రజక సేవా సంఘం అధ్యక్షుడు పూసాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో పోచమ్మ, మడేలేశ్వరస్వామి బోనాల ఉత్సవాలను ఆదివారం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. రామగుండం ఒకటి, 33వ డివిజన్ల కార్పొరేటర్లు మడిపెల్లి విజయ, మెరుగు భూలక్ష్మి హాజరై ప్రత్యేక పూజలు చేశారు. సంఘం అధ్యక్షుడు పూసాల శ్రీనివాస్ మాట్లాడు తూ.. రజకుల కులదైవమైన మడేలేశ్వరస్వామి ఆశీస్సులతో రజక కుటుంబాలు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో, పాడిపంటలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. నాయకులు నస్పూరి శ్రీనివాస్, భూమయ్య, లక్ష్మణ్, వెంకటేశ్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు. వేజ్‌బోర్డు కోసం నేడు ధర్నా యైటింక్లయిన్‌కాలనీ: సింగరేణి కార్మికుల 12వ వేజ్‌బోర్డు కమిటీ ఏర్పాటు చేయాలని కార్మిక సంఘాల జేఏసీ నాయకులు వైవీ రావు, కొత్త సత్యనారాయణరెడ్డి, కుంట ప్రవీణ్ డిమాండ్ చేశారు. ఆర్జీ–2 ఏరియా యైటింక్లయిన్‌కాలనీ ఏఐటీయూసీ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు. 11వ వేజ్‌బోర్డు కాలపరిమితి ముగిసి రెండు నెలలు కావస్తున్నా కొత్త వేజ్‌బోర్డు కోసం ఎలాంటి చర్యలు చేపట్టడం లేదన్నారు. దీనికి నిరసనగా ఈనెల 10న అన్ని జీఎం కార్యాలయాల ఎదుట ధర్నా చేస్తామని తెలిపారు. జేఏసీ నాయకులు అన్నారావు, శాంసన్, రవికుమార్, మహేందర్, వెంకన్న, నారాయణ, కుమారాస్వామి, ఆంజనేయులు, వినయ్, లక్ష్మయ్య, అనిల్ కుమార్, సురేశ్ పాల్గొన్నారు. ఏబీఏపీ సమావేశం ఫెర్టిలైజర్‌సిటీ: అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ(ఏబీఏపీ) రాష్ట్రస్థాయి సమా వేశం ఖాజీపల్లి శ్రీమయి కన్వెన్షన్ హాల్లో ఆదివారం నిర్వహించారు. ఏబీఏపీ రాష్ట్ర వలంటీర్ కమాండెంట్ జనగామ తిరుపతి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి రాష్ట్ర అధ్యక్షు డు పుల్లంరాజు, కార్యదర్శి దూశెట్టి భాస్కర్, కోశాధికారి పోతరాజుల రమేశ్, జాతీయ స భ్యుడు పోతుగంటి గంగాధర్ అతిథులుగా హా జరయ్యారు. రాంపల్లి వామనశర్మ జ్యోతి ప్రజ్వలన, అయ్యప్పస్వామికి పూజలతో కార్యక్ర మం ప్రారంభమైంది. అయ్యప్ప తత్వం, దీక్షనియమాల విశిష్టత, సనాతన ధర్మం, సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణతోపాటు సంస్థ భవి ష్యత్ కార్యాచరణపై చర్చించి కీలక తీర్మానాలు చేశారు. అనంతరం ఏబీఏపీ జిల్లా కమిటీని ఎ న్నుకున్నారు. అధ్యక్షుడిగా అందె సదానందం, కార్యదర్శిగా వేదాంతం శేషుకుమార్, కోశాధికారిగా పల్లెర్ల జగన్, కమాండెంట్‌గా కనకమేడ ప్రణీత్ ఎన్నికయ్యారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, ఏబీఏపీ ప్రతినిధులు, అర్చకులు, అయ్యప్ప భక్తులు పాల్గొన్నారు. ప్రతిభకు ప్రశంసలు ధర్మారం: స్థానిక ఆ దర్శ పాఠశాలలో ఇంటర్ ప్రథమ సంవత్సరం(సీఈసీ) చ దువుతున్న తుమ్మల మనోజ్ఞ రాష్ట్రస్థాయి యూత్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ కమాండ్ ఈవెంట్లో ద్వితీయస్థానం సాధించినట్లు ప్రిన్సిపాల్ ఈరవేణి రాజ్‌కుమార్ తెలిపారు. వెండి పతకం సాధించిన విద్యార్థిని మనోజ్ఞను ప్రిన్సిపాల్ రాజ్‌కుమార్, పీఈటీ బైకనీ కొంరయ్య, ప్రతినిధి మేకల సంజీవరావు, ఉపాధ్యాయులు అభినందించారు. -
ఎన్నికల ఊసేది?
ఐదేళ్లు దాటినా పెద్దపల్లి: జిల్లాలో గీతపారిశ్రామిక సహకార సంఘాల పరిస్థితి దయనీయంగా మారింది. 97 సంఘాలు ఉండగా, అందులో రెండింటికే పాలకవ ర్గాలు ఉన్నట్లు చెబుతున్నారు. మిగిలిన 95 సంఘాల పాలకవర్గాల పదవీకాలం ఐదేళ్ల క్రితమే ముగిసినా ఇప్పటివరకు ఎన్నికలు నిర్వహించలేదు. సంఘాలు ఉన్నా పట్టించుకునే వారెవరు? గీతకార్మికుల సంక్షేమం కోసం గత ప్రభుత్వం అనేకపన్నులు పూర్తిగా రద్దు చేసింది. దీంతో వారివృత్తిలో స్వేచ్ఛ లభించిందని అధికారులు పేర్కొంటున్నారు. ఈ పరిణామంతో గీత పారిశ్రామిక సహకార సంఘాల అధ్యక్షులు, పాలకవర్గాల మాట వినే పరిస్థితి తగ్గిపోయిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సంఘాలు క్రియాశీలకంగా లేకపోవడంతో గీతకార్మికుల సమస్యలను పట్టించుకునే వ్యవస్థ కూడా బలహీనపడిందని అంటున్నారు. ఎన్నికలకు నోటీసులు.. జిల్లాలోని 97 సొసైటీలు ఉండగా.. మంథని, రత్నా పూర్ సంఘాలకు ఇటీవల ఎన్నికలు నిర్వహించా రు. మిగతా సొసైటీలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. వీటికోసం నోటీసులిస్తున్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల మాదిరిగానే ఎన్నికల అధికారిని నియామకం చేసి ఎన్నికలు నిర్వహిస్తారు. ఎన్నికల తేదీతోపాటు నామినేషన్, విత్‌డ్రాలు ఉంటాయి. గీతకార్మికుల్లో ఆశలు.. జిల్లా కో ఆపరేటివ్ ఇన్స్పెక్టర్ ద్వారా గీత పారిశ్రామిక సంఘాలకు ఎన్నికలు నిర్వహించుకోవాలని ఇ టీవల ఆదేశాలు జారీ అయ్యాయి. స్థానిక ఎక్సైజ్ అధికారులు ఉత్తర్వులను సంబంధిత సంఘాలకు అందజేశారు. తద్వారా ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్నఎన్నికలపై గీతకార్మికుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. గీత పారిశ్రామిక సహకార సంఘాలకు కార్యవర్గాల్లేవ్ -
మద్యంపై సమరం
పండుగలు, వేడుకలు, శుభ, అశుభ కార్యక్రమాలు ఏవైనా సరే ఆ ఊళ్లో మద్యం సీసాలే కనిపించే వి.. ‘నాలుగు బెల్ట్‌షాప్‌లు.. ఆరు గొడవలు’ అన్న చందంగా ఉండేది ఆ పల్లెల పరిస్థితి. ఇప్పుడాపరిస్థితి మారుతోంది. ‘మద్యం వద్దు.. మా కుటుంబాలు బాగుండాలి’ అని గ్రామస్తులే ముందుకొచ్చి తీర్మానాలు చేసుకుంటున్నారు.. వెరసి కుటుంబ కలహాలు, ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యం, రోడ్డు ప్రమాదాల బారిన పడడంలేదు. గ్రామసభ వేదికగా మద్యపాన నిషేధానికి నిర్ణయం తీసుకుంటున్నాయి. సుల్తానాబాద్ మండలం మంచిరామి, మంథని మండలం దుబ్బపల్లి, గాజులపల్లి, మల్లేపల్లి, ఎక్లాస్పూర్ సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాయి. సాక్షి పెద్దపల్లి: మద్యం అనేది వ్యసనమే కాదు.. అనేక కుటుంబాల కన్నీటి కథ. పచ్చని బతుకులను ఛిన్నాభిన్నం చేస్తున్న మృత్యువు. ఈ చీకటిని చీల్చుకుంటూ కొన్ని గ్రామాలు ధైర్యంగా ముందడుగు వేస్తున్నాయి. ‘మా ఊళ్లో మద్యం వద్దు’ అంటూ ఏకగ్రీవంగా తీర్మానించి భవిష్యత్‌కు బాటలు వేసుకుంటూ ఆదర్శంగా నిలుస్తున్నాయి. మంథని మండలం దుబ్బపల్లి, గాజులపల్లి, మల్లేపల్లి, ఎక్లాస్పూ ర్, సుల్తానాబాద్ మండలం మంచిరామి గ్రామాలు మద్యపానం నిషేధిస్తూ ఏకతాటిపైకి వచ్చాయి. పచ్చని కాపురాల్లో ‘మత్తు’చిచ్చు జిల్లాలో ఎక్కడ చూసినా మద్యం మత్తులో జరుగుతున్న అనర్థాలు కోకొల్లలు. మద్యానికి బానిసైన కొడుకు పింఛన్ డబ్బుల కోసం ఇటీవల కన్నతండ్రినే హత్యచేశాడు. మద్యం తాగి వాహనాలు నడపడం, కుటుంబ సభ్యులపై దాడులు చేయడం, చిన్నపాటి గొడవలు ఘర్షణలకు దారితీయడం, చివరకు ప్రాణాలు పోవడం వంటి ఘటనలు నిత్యకృత్యంగా మారాయి. ఇవి అనేక కుటుంబాలను విషాదంలోకి నెడుతున్నాయి. భర్త సంపాదన మద్యానికి వెచ్చించడంతో మహిళలు, పిల్లలు పూటగడవని దుర్భర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితులను చూసిన మహిళా సర్పంచులు.. తమ ఊళ్లో బెల్ట్‌షాప్‌లకు చోటులేదంటూ నిర్ణయించుకున్నారు. గ్రామసభలోనే నిర్ణయం.. ఊరంతా ఒకేమాట మద్యం విక్రయంతో వచ్చే ఆదాయం కన్నా దాని వల్ల కుటుంబాలు కోల్పోతున్న ప్రశాంతత, ఆరోగ్యం, ఆర్థిక భద్రతే ఎక్కువని గుర్తించిన గ్రామాలు ఒక్కొక్కటిగా మేల్కొంటున్నాయి. ‘మా గ్రామంలో మద్యం అమ్మకాలు వద్దు.. బెల్ట్‌షాపులు ఉండకూడదు’ అని తీర్మానిస్తున్నాయి. ఉల్లంఘించిన వారికి భారీజరిమానా, సామాజిక బహిష్కరణ వంటి హెచ్చరికలు జారీచేస్తున్నాయి. యువత పెడదోవ పట్టకుండా, భవిష్యత్ అంధకారం కాకుండా కాపాడుకోవడమే దీని ఉద్దేశమని చాటిచెబుతున్నాయి. అధికారులు మద్దతు ఇస్తేనే.. మద్యం రహిత గ్రామాలను తీర్చిదిద్దడంలో ప్రజలదే ప్రథమ పాత్ర అయినా.. పోలీస్, ఎకై ్సజ్ అధికారుల మద్దతు ఉంటేనే ఈ ఉద్యమం విజయవంతం అవుతుంది. నిషేధాన్ని ఉల్లంఘించేవారిపై తక్ష ణమే కఠిన చర్యలు తీసుకోవాలి. చైతన్యం చూపుతున్న పల్లెవాసులను అభినందించి ప్రభుత్వపరంగా ప్రోత్సాహకాలు ఇవ్వాలి. గ్రామస్తులకు ఫిర్యా దు చేసేందుకు సులభమైన మార్గాలు కల్పించాలి. ఇలా చేస్తే మరిన్ని పల్లెలకు స్ఫూర్తిగా మారుతాయి. బెల్ట్‌షాపులే అసలు సమస్య! ఇంటి చెంత, వీధిచివరన, చిన్నషాపుల మాటున మద్యం లభిస్తోంది. దీంతో మద్యానికి అలవాటు పడుతున్న వారిసంఖ్య పెరుగుతోందనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఎకై ్సజ్ అధికారులు లిక్కర్ సేల్స్‌పైనే దృష్టి పెట్టకుండా, బెల్ట్‌షాపులపై ఉక్కుపాదం మోపితేనే మార్పు శాశ్వతంగా నిలుస్తుంది. ఆ ఊళ్లో మద్యపానంపై సంపూర్ణ నిషేధం గ్రామపంచాయతీల ఏకగ్రీవ తీర్మానాలు మంచిరామి, దుబ్బపల్లి, గాజులపల్లి, మల్ల్లేపల్లి, ఎక్లాస్పూర్ ఆదర్శం -
పొదుపు చేస్తూ.. పేదలకు పంచుతూ..
జ్యోతినగర్: ఆపదలో ఉన్నవారు, అభాగ్యులు, పేద కుటుంబాల దయనీయ పరిస్థితులను చూసి చలించిన మహిళలు, యువజనులు సంస్థలుగా ఏర్పడి ప్రజాసేవకు అంకితమవుతన్నారు. మారుతున్న సాంకేతికతను అందిపుచ్చుకుని డిజిటల్ ఫార్మాట్లో బాధితులకు ఆర్థిక సాయం చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ప్రధానంగా ఎన్టీపీసీలోని అన్నపూర్ణకాలనీకి చెందిన శ్రీసీతారామ సేవా సమితి, కృష్ణానగర్‌కు చెందిన శ్రీభగవతీ యూత్ సభ్యులు.. ఎవరికి ఆదప వచ్చినా, పేదలు ఎక్కడ కనిపించినా అక్కడకు చేరుకుని సాయం చేస్తున్నా రు. గోలివాడ చంద్రకళ మహిళా మండలి శ్రీసీతారామ సేవాసమతి పేరిట వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసింది. ఇందులోని సభ్యులు ప్రతినెలా రూ.100 చొప్పున పొదుపు చేస్తూ అన్నార్థులకు సాయం చేస్తున్నారు. 2023 ఫిబ్రవరి 19న ఆవిర్భవించిన ఈ సంస్థలో ప్రస్తుతం 120 మంది సభ్యులు ఉండగా, మహిళలే అత్యధిక సంఖ్యలో ఉండడం గమనార్హం. పేదలకు నిత్యావసరాలు, పేదింటి యువతుల వివాహానికి ఆర్థిక సాయం, గూడులేనివారికి ఇళ్లు నిర్మించి ఇవ్వడం, విద్యార్థులకు స్కూల్‌బ్యాగులు, స్టడీ మెటీరియల్ అందించడం ఈ సంస్థ లక్ష్యంగా ముందుకు సాగుతోంది. మానవతే మతం.. సమాజ అభివృద్ధే లక్ష్యంగా 2008లో 20మంది యువకులతో శ్రీభగవతీ యూత్ ఏర్పాటు చేసుకున్నారు. వ్యవస్థాపక అధ్యక్షుడిగా కంకటి రవిగౌడ్ అధ్యక్షుడు, 85 మంది సభ్యులు ఉన్న ఈ సంస్థ.. మానవతే మతం.. సమాజ అభివృద్ధే లక్ష్యంగా సేవా సేవా కార్యక్రమాలు చేపడుతోంది. 2025లో అన్నపూర్ణకాలనీకి చెందిన పేద క్రికెటర్ స్ఫూర్తి శిక్షణకోసం రూ.30 వేలు, కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న విరాట్‌కు రూ.15 వేలు, పేద కుటుంబానికి చెందిన చదువుల తల్లి సిరి అనారోగ్యంతో బాధపడుతుండగా రూ.25 వేలు, రామగుండానికి చెందిన శివానికి రూ.పది వేలు, గుండెపోటుతో మృతి చెందిన దేవరకొండ శ్రీనివాస్ కుటుంబానికి రూ.1,25,116 అందజేశారు. మహిళలు, యువతులు, యువకులు.. ఇలా సామాజిక స్పృహ ఉన్నవారు సామాజిక సేవే లక్ష్యంగా ముందుకు సాగుతూ ఆదర్శంగా నిలుస్తున్నారు. వీరిని పలువురు ప్రముఖులు అభినందిస్తున్నారు.సాయం అందిస్తున్న సీతారామ సేవా సమితి సభ్యులుక్రికెటర్కు ఆర్థికసాయం అందిస్తున్న యువకులు సామాజిక సేవలో మహిళలు అదేబాటలో పయనిస్తున్న యువకులు ఆదర్శంగా నిలుస్తున్న సీతారామ సేవా సమితి, శ్రీభగవతీ యూత్కొందరు మహిళలు సంఘటితమయ్యారు. ప్రతినెలా కొంత సొమ్ము జమచేస్తున్నారు.. ఆ సొమ్మును పేదలు, అభాగ్యులు, అన్నార్థులకు అందజేస్తున్నారు. మరి కొందరు యువకులు కూడా తామేమీ తక్కువ కాదంటూ సామాజిక సేవే లక్ష్యంగా తలాకొంత పోగుచేస్తున్నారు. ఎవరికి ఆదపద వచ్చినా, పేద విద్యార్థుల ఉన్నత విద్యకూ సాయం చేస్తున్నారు. ఇలాంటి వారిలో కొందరిపై కథనం.. -
పేదలకు అందిస్తున్నాం
గ్రూప్ సభ్యులు ప్రతీనెల పొదుపుచేసే సొమ్మును పేద కుటుంబాలకు అందిస్తున్నాం. ఇందుకోసం అందరం కలిసి వాట్సాప్ వేదికగా సమావేశమై చర్చించుకుంటాం. ఒక్కోనెలలో రెండు కుటుంబాలకు కూడా ఆర్థిక సాయం చేస్తున్నాం. – వనజ, కోశాధికారి, శ్రీసీతారామ సేవా సమితి సమాజ సేవే లక్ష్యం సమాజ సేవే లక్ష్యంగా మా వంతుగా సామాజిక సేవలో భాగస్వాములవుతున్నాం. ప్రతీనెల కొంత జమచేసి పేద విద్యార్థుల ఉన్నత చదువులతోపాటు నిరుపేద కుటుంబాలకు సాయం చేస్తున్నాం. రక్తదాన శిబిరాలూ ఏర్పాటు చేస్తున్నాం. – కంకటి రవిగౌడ్, అధ్యక్షుడు, శ్రీభగవతీ యూత్ -
కార్మికులకు న్యాయం చేయరా?
గోదావరిఖని: సింగరేణి కార్మికుల డిపెండెంట్ల మా రుపేర్ల సమస్య పరిష్కరించాలని బీజేపీ రామగుండం నియోజకవర్గ ఇన్చార్జి కందుల సంధ్యారాణి కోరారు. జీఎం కార్యాలయం ఎదుట డిపెండెంట్లు చేపట్టిన నిరాహార దీక్ష శిబిరాన్ని ఆదివారం సందర్శించి మద్దతు తెలిపారు. అనంతరం మాట్లాడు తూ, కార్మికులు ఎదుర్కొంటున్న విజిలెన్స్ పెండింగ్ కేసులు పరిష్కరించడంలో యాజమాన్యం చొరవ చూపాలన్నారు. మారుపేర్ల సవరణకు అన్నిశాఖల్లో నిర్దిష్టమైన విధానాలు ఉన్నాయని, కార్మికుల విషయంలోనే ఎందుకు ఇంత నిర్లక్ష్యమని ప్రశ్నించారు. నాయకులు గుండబోయిన భూమయ్య, అపర్ణ, స త్యనారాయణ, నరసన్న, భరత్, నరసింహారెడ్డి, మ హేందర్, అందే రాజ్కుమార్చారి పాల్గొన్నారు. -
పేదలకు వరం సన్నబియ్యం
పెద్దపల్లి: ప్రభుత్వం అందించే సన్నబియ్యం పేదల ఇంట్లో పండుగ నింపుతోందని ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేర కు జిల్లా కేంద్రంలోని శాంతినగర్‌లో కొత్త రేషన్‌షాపును స్థానిక నాయకులతో కలిసి ఆయన ఆదివా రం ప్రారంభించారు. అనంతరం విప్ విజయరమణారావు మాట్లాడుతూ, అర్హులైన పేదలందరికీ నూ తన రేషన్ కార్డులు మంజూరు చేసి సన్నబియ్యం అందిస్తున్నామన్నారు. గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని ఆయన తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తోందని చెప్పారు. అనంతరం జెండా చౌరస్తా ప్రధాన రోడ్డులోని ఓ షాపింగ్ మాల్ నిర్వహించిన ఆషాడమాసం బోనాల మహోత్సవంలో విజయరమణా రావు పాల్గొన్నారు. బోనాల పండుగ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తోందని అన్నారు. పండుగను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఆర్థిక సహాయ సహకారాలు అందిస్తోందని తెలిపారు. ఆయా కార్యక్రమాల్లో మున్సిపల్ చైర్మన్ నూగిల్ల మల్లయ్య, కౌన్సిలర్లు, కాంగ్రెస్ నాయకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. సన్నబియ్యంతో పండుగ చేసుకుంటున్న లబ్ధిదారులు ప్రభుత్వ విప్ చింతకుంట విజయరమణారావు -
సంఘటితం కావాలి
ప్రభుత్వం, అధికారులు తీసుకున్న నిర్ణయంతో గీతకార్మికులు సంఘటితమై ఎన్నికలు జరుపుకునే అవకాశం ఉంది. గ్రామాల్లో గౌడ సంఘం చైర్మన్‌కు ఒకప్పుడు ప్రజల నుంచి సానుభూతిఉండేది. క్రమంగా అదితగ్గుతూ వస్తోంది. పూర్వ వైభవం తీసుకురావడానికి కమిటీలు దోహదపడతాయి. – వీరగోని రమేశ్‌గౌడ్, గర్రెపల్లి క్రియాశీలకమవుతాయి గీత పారిశ్రామిక సహకార సంఘాలకు ఐదేళ్ల క్రితం ఎన్నికలు నిర్వహించారు. పాలకవర్గాలు లేవక గీతకార్మికులు సంఘటితం కావడం లేదు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎన్నికల నిర్వహణకు నోటీసులు జారీచేస్తున్నాం. ఎన్నికలు నిర్వహించి క్రియాశీలకంగా మార్చడమే ప్రభుత్వ లక్ష్యంగా ఉంది. – శ్రీనివాసమూర్తి, సూపరింటెండెంట్, ఎకై ్సజ్ -
గుడిలో నిద్రకు వెళ్లి అనంతలోకాలకు..
గోదావరిఖని: బంధువు చనిపోతే దశదినకర్మ తర్వాత కుటుంబ సభ్యులతో కలిసి గుడిలో నిద్రకు వెళ్లాడు. రాత్రి నిద్రలోనే అనంత లోకాలకు చేరుకోవడం విషాదం నింపింది. వివరాలు.. పెద్దపల్లి జిల్లా గో దావరిఖని కృష్ణానగర్ చెందిన దాసరి స దానందం(45) ప్రైవేట్ స్కూల్ బస్సు డ్రై వర్గా పనిచేస్తున్నాడు. కొద్దిరోజుల క్రితం సమీప బంధువు మృతి చెందింది. దశదినకర్మ అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి గుడిలో నిద్రించేందుకు ఈనెల 7న రాత్రి గోదావరిఖనిలోని కోదండరామా లయం వెళ్లాడు. రాత్రి నిద్ర తర్వాత శనివారం తెల్లవారుజామున గుడి నుంచి ఇంటికి వెళ్లేందుకు సదానందం నిద్రలేపేందుకు యత్నించారు. ఎంతపిలిచినా చలనం లేకుండా పోయింది. దీంతో కుమారుడికి ఫోన్ ద్వారా సమాచారం అందించారు. కుటుంబ సభ్యులు అక్కడకు చేరుకుని 108అంబులెన్స్ ద్వారా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. మృతునికి భార్య ఇద్దరు కుమారులు ఉన్నారు. మృతుడి భార్య దాసరి శారద ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై మనోహర్ తెలిపారు. పోతారంలో విషాదం మంథనిరూరల్: బంధువు చనిపోతే దశదిన కర్మ అనంతరం గుడిలో నిద్ర చేసేందుకు వెళ్లి శాశ్వత నిద్రలోకి వెళ్లిన ఘటనతో స్వగ్రామం మంథని మండలం పోతారంలో విషాదం నెలకొంది. పోతారం గ్రామానికి చెందిన దాసరి నదానందం గోదావరిఖనిలోని కృష్ణానగర్‌లో నివసిస్తున్నాడు. ఓ ప్రైవేట్ పాఠశాల వాహనానికి డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అతడు మృతి చెందిన విషయం తెలుసుకున్న బంధువులు, కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటి పోయాయి. బంధువు చనిపోతే గుడికి నిద్రకు పోయి శాశ్వత నిద్రలోకి వెళ్లిపోయాడంటూ కన్నీటి పర్వంతమయ్యారు. స్వగ్రామమైన పోతారంలో శనివారం అంత్యక్రియలు నిర్వహించారు. -
విద్యార్థులకు ప్రోత్సాహకాలు
మంథనిరూరల్: ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేలా సర్కారు అనేక కార్యక్రమాలు అమలు చేస్తోంది. హాజరుశాతం పెంచేలా హెచ్ఎం వినూత్న ఆలోచన అమలు చేస్తున్నారు. మంథని మండలం ఆరెంద జెడ్పీ హైస్కూల్లో వందశాతం విద్యార్థులు హాజరయ్యేలా హెచ్ఎం, స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎం ఈదులపల్లి నర్సింహారావు సరికొత్తగా ఆలోచనచేశారు. వందశాతం హాజరు నమోదు చేసే విద్యార్ధులకు బహుమతులు అందజేస్తామని ప్రకటించారు. ఈ క్రమంలోగత నెలలో వందశాతం హాజరైనవారికి శనివారం బహుమతులు అందజేశారు. ప్రతీరోజు ప్రతీ విద్యార్థి హాజరు కావాలనే లక్ష్యంతోనే ప్రోత్సాహకాలు ప్రకటించినట్లు హెచ్ఎం తెలిపారు. పాఠశాల అభివృద్ధితోపాటు విద్యార్థుల భవిష్యత్‌ను తీర్చిదిద్దాలన్నదే తన లక్ష్యమని, ఇందుకోసం అవసరమైన చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. ఉపాధ్యాయు లు, గ్రామస్తుల సహకారంతో పాఠశాలను మరింత అభివృద్ధి చేస్తానని వెల్లడించారు. ఆరెంద బడిలోనే చదువుకున్న నర్సింహారావు అదే స్కూల్లో హెచ్ఎంగా పనిచేస్తూ పాఠశాల అభివృద్ధికి చేస్తున్న కృషిని గ్రామస్తులు అభినందిస్తున్నారు. హాజరు శాతం పెంపు లక్ష్యం ఆరెంద హైస్కూల్ హెచ్ఎం వినూత్న ఆలోచన -
రోడ్డు ప్రమాదంలో ఐదుగురికి గాయాలు
జ్యోతినగర్: పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీ లేబర్గే ట్ వద్ద రాజీవ్ రహదారిపై శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు గాయపడ్డారు. కరీంనగర్ నుంచి గోదావరిఖని వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ప్రయాణికులను దించేందుకు ఎన్టీపీసీ లేబర్‌గేట్ వద్ద రహదారి పక్కన ఆగింది. అదేసమయంలో పెద్దపల్లి నుంచి గోదావరిఖని వైపు వేగంగా వస్తున్న ఆటో ఆగిఉన్న బస్సును వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోడ్రైవర్ ఎండీ షబ్బీర్‌తోపాటు అందులో ప్రయాణిస్తున్న మహానందు, చందు, మల్లవ్వ, గట్టమ్మలకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే 108లో గోదావరిఖని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ప్రమాద వివరాలను సేకరించి, కేసు నమోదు చేసుకున్నారు. విద్యుత్ తీగలు చోరీ కాల్వశ్రీరాంపూర్: పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలం గంగారం గ్రామ పంచాయ తీకి చెందిన నల్లాలబావి విద్యుత్ తీగలు చో రీకి గురైనట్లు సర్పంచ్ రేకుల జ్యోతి తెలిపా రు. శనివారం తెల్లవారు జామున గుర్తించిన పంపు డ్రైవర్.. చోరీ విషయాన్ని సర్పంచ్‌కు చేరవేశారు. దీంతో పోలీస్టేషన్లో ఫిర్యాదు చే సినట్లు సర్పంచ్ పేర్కొన్నారు. కరెంట్ తీగలు చోరీకి గురికావడంతో గ్రామంలో తాగునీటి సరఫరాకు తీవ్ర అంతరాయ కలిగిందని, వెంటనే కొత్తవైర్లు బిగించి సరఫరా పురుద్ధరించామని ఆమె వివరించారు. పోలీసులు దొంగలను పట్టుకుని ఇలాంటి ఘటనలు పునారావృతం కాకుండా చూడాలని కోరారు. పోలీస్‌స్టేషన్ తనిఖీ మంథని: స్థానిక పోలీస్‌స్టేషన్‌ను గోదావరిఖ ని ఏసీపీ రమేశ్ శనివారం తనిఖీ చేశారు. స్టే షన్ పరిసరాలు, రికార్డులు, ఫైళ్లు పరిశీలించా రు. పెండింగ్‌లోని ఫిర్యాదులు, కేసులను స కాలంలో పరిష్కరించాలని అధికారులను ఆ దేశించించారు. నాణ్యమైన దర్యాప్తు చేపట్టి, కోర్టులతో సమన్వయంతో పనిచేస్తూ నిందితులకు శిక్షలు పడేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజాఫిర్యాదులపై తక్షణమే స్పందిస్తూ బాధితులకు రక్షణ కల్పించడం పోలీసుల ప్రధాన బాధ్యత అని ఏసీపీ గుర్తుచేశారు. సిబ్బంది సమస్యలను అడిగి తెలుసుకున్న ఆయన.. క్రమశిక్షణతో విధులు నిర్వహిస్తూ ప్రజలతో మమేకమై పనిచేయాలని సూచించారు. కార్యక్రమంలో సీఐ స్వామి, ఎస్ఐ సందీప్ కుమార్ పాల్గొన్నారు. వ్యక్తి ఆత్మహత్యపెగడపల్లి: రాములపల్లికి చెందిన రాచర్ల మాణిక్యం (46) శనివారం ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై కిరణ్‌కుమార్ తెలిపారు. కూలి పని చేసుకుంటూ ఒంటరిగా నివాసముంటున్న మాణిక్యం కొంతకాలంగా తాగుడుకు బానిసయ్యాడు. జీవితంపై విరక్తి చెంది ఇంట్లోనే ఉరేసుకున్నాడు. -
భర్తపై మొదటి భార్య బంధువుల దాడి
వేములవాడ: భార్య, పిల్లలను కాదని రెండో భార్యతో కాపురం చేస్తున్నాడని మొదటి భార్య బంధువులు దాడి చేసిన సంఘటన కలకలం రేపింది. వేములవాడలోని న్యూఅర్బన్‌కాలనీలో ఉంటున్న వావిలాల శంకర్ ఆటో డ్రైవర్. శంకర్‌కు భార్య, పిల్లలు ఉన్నారు. మరో మహిళను రెండో పెళ్లి చేసుకొని వేరు కాపురం పెట్టాడు. దీంతో మొదటి భార్య పోలీసులను ఆశ్రయించగా కేసు నమోదు చేశారు. ఇదిలా ఉండగా శనివారం మొదటి భార్య బంధువులు శంకర్ ఇంటికి వెళ్లారు. ఈక్రమంలో మాటమాట పెరిగి దాడి చేయడంతో తలకు తీవ్రంగా గాయమైంది. వెంటనే పోలీసుల అక్కడికి చేరుకుని శంకర్‌ను ఏరియా ఆసుపత్రికి తరలించారు. శంకర్ మాట్లాడుతూ తాను ఇంట్లో ఉండగా కత్తులు, కర్రలతో వచ్చి దాడి చేశారన్నారు. మొదటి భార్య బంధువులు మాత్రం తాము ఏమీ అనకుండానే గోడకు ఉన్న గ్లాస్ అద్దానికి తలబాదుకుని తనకుతానే తల పగులగొట్టుకున్నాడని వెల్లడిస్తున్నారు. ఇరుపక్షాలు పరస్పరం పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు. -
విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు
ధర్మారం: రామయ్యపల్లి గ్రామంలో దీర్ఘకాలికంగా ఎదురవుతున్న లో వోల్టేజీ సమస్య పరిష్కరించేందుకు ఏర్పాటు చేసిన 25 కేవీ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ను సర్పంచ్ మూల మంగతో కలిసి ఏడీఈ వెంకటరమణారెడ్డి శనివారం ప్రారంభించారు. కొద్దిరోజులుగా లోవోల్టేజీ సమస్య ఉండడంతో మంత్రి లక్ష్మణ్‌కుమార్ దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన మంత్రి.. విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ఏర్పా టు చేయాలని ఆదేశించారు. దీంతో అధికారులు యుద్ధ ప్రాతిపదికన ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేసి విద్యుత్ సరఫరా చేసినట్లు సర్పంచ్ మంగ తెలిపా రు. ఈ కార్యక్రమంలో ఖిలావనపర్తి ఏఈ మహేందర్‌రెడ్డి, ఉపసర్పంచ్ భూతగడ్డ గట్టమ్మ, లైన్మెన్ హైమద్‌పాషా, వార్డు సభ్యులు తదతరులు పాల్గొన్నారు. -
భూసేకరణ వెంటే పునరావాసం
సాక్షిప్రతినిధి, కరీంనగర్: సాగునీటి ప్రాజెక్టుల పూర్తికి అడ్డుగా నిలు స్తున్న భూసేకరణ, పునరావాసం, అటవీ, పర్యావరణ అనుమతుల సమస్య పరిష్కరించేందుకు ప్ర భుత్వం కీలక నిర్ణయం తీసుకుందని మంత్రులు స్పష్టం చేశారు. మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ వివిధ అంశాలపై శనివా రం హైదరాబాద్‌లో ఉమ్మడి జిల్లా కలెక్టర్లు, అదన పు కలెక్టర్లతో సమీక్షించారు. కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో కొనసాగుతున్న సాగునీటి ప్రాజెక్టులపై పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రాజెక్టుల నిర్మాణంలో భూసేకరణ, ఆర్అండ్ఆర్, అటవీ, పర్యావరణ అనుమతులను అ త్యంత ప్రాధాన్యత కలిగిన అంశాలుగా పరిగణించాలని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆదేశించారు. సుమారు నాలుగున్నరేళ్లుగా నిలిచిపోయిన మిడ్‌మానేరు ఎడ మ కాలువ మిగులు పనులను వెంటనే పునఃప్రారంభించాలని ఆదేశించారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలో ప్రతిపాదించిన శ్రీలక్ష్మీనరసింహస్వామి పత్తిపాక రిజర్వాయర్ పనులను వేగవంతం చే యాలన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా కొత్తగా 10వేల ఎ కరాలకు సాగునీరు అందించడంతో పాటు కాకతీ య ప్రధాన కాలువలో డీ–83 నుంచి డీ–94 వరకు ఉన్న 2.40 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించా లన్నది ప్రభుత్వ లక్ష్యమని వివరించారు. పత్తిపాక వద్ద 3 టీఎంసీలు లేదా 5 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్ నిర్మాణానికి రెండు ప్రత్యామ్నాయాల ను అధికారులు పరిశీలిస్తున్నారని తెలిపారు. ఈ నె లాఖరులోగా డీపీఆర్ సిద్ధం చేసి పంపాలని ఆదేశించారు. జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలంలోని రో ళ్లవాగు ప్రాజెక్టు పనులు ఇప్పటికే 96 శాతం పూర్తయ్యాయని అన్నారు. మిగిలిన పనులను వేగంగా పూర్తి చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవా లని ఆదేశించారు. ప్రస్తుతం ఉన్న 0.250 టీఎంసీల నిల్వ సామర్థ్యాన్ని 0.949 టీఎంసీలకు పెంచడం ద్వారా స్థానిక పరీవాహక ప్రాంతం నుంచి లభించే నీటిని సమర్థంగా వినియోగించుకోవాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు. చివరి ఆయకట్టులోని దాదాపు 15 వేల ఎకరాలకు సాగునీటి భరోసా లభించనుందని అన్నారు. ఆటంకాలు లేకుండా చూడాలి: మంత్రి దుద్దిళ్ల నీటి పారుదల ప్రాజెక్టులు, రోడ్ల నిర్మాణానికి భూ సేకరణ అడ్డంకిగా మారకుండా చూడాలని ఉమ్మడి కరీంనగర్ జిల్లా కలెక్టర్లను మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆదేశించారు. నీటి పారుదల ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేసి రైతాంగానికి సాగునీరు అందించాలని అధికారులకు సూచించారు. భూసేకరణ ఆలస్యం అవడం, అటవీ భూముల బదలాయింపు వివిధాలను ప్రాధాన్యతతో పరిష్కరించాలని కోరారు. నూతన రోడ్ల నిర్మాణం, దెబ్బతిన్న రహదారుల మరమ్మతు పనులను త్వరిత గతిన పూర్తి చేయాలని అన్నారు. జిల్లాల్లోని మున్సిపల్ కార్పోరేషన్లు, మున్సిపాలిటీల్లో ఇంజనీర్ల కొరత ఉందన్న ఫిర్యాదులు వస్తున్నాయని, డిప్యుటేషన్‌పై వాటిని సాధ్యమైనంత త్వరలో భర్తీ చేయాలని ఆదేశించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు జలమైన నివాస ప్రాంతాల ప్రజలకు మరొక చోట ఇళ్ల స్థలాలను కేటాయించాలని కలెక్టర్లను ఆదేశించారు. రామగుండం అభివృద్ధికి నిధుల్విండికోల్సిటీ: రామగుండం నగర అభివృద్ధికి నిధులు మంజూరు చేసి, సమస్యలు పరిష్కరించాలని మేయర్ మహంకాళి స్వామి కోరారు. రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్‌ఠాకూర్‌తో కలిసి మేయర్ కీలక సమస్యలను మేయర్.. మంత్రుల దృష్టికి తీసుకెళ్లారు. మంత్రుల దృష్టికి తీసుకెళ్లిన అంశాలు -
జలుబు.. దగ్గు.. జ్వరం
పెద్దపల్లి: ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులు పేషెంట్లతో రద్దీగా మారుతున్నాయి. కొద్దిరోజులుగా కురుస్తు న్న చిరుజల్లులతో వాతావరణంలో మార్పులు రావడంతో సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి. అస్వస్థతకు గురవుతున్న జిల్లావాసులు ఆస్పత్రుల బాటపడుతున్నారు. ప్రధానంగా విషజ్వరం, జలుబు, దగ్గు, విరేచనాలతో బాధపడుతున్నవారు దవాఖానాలను ఆశ్రయిస్తున్నారు. వీరిరాకతో ముఖ్యంగా జిల్లాకేంద్ర ఆస్పత్రిలో ఓపీ భాగా పెరుగుతోంది. వేగంగా వైద్యసేవలు జిల్లాలో 17 ప్రాథమిక, 6 అర్బన్ పీహెచ్‌సీలు, 3 క మ్యూనిటీ హెల్త్ సెంటర్లు ఉన్నాయి. వీటితోపాటు జిల్లా కేంద్ర ఆస్పత్రి, రామగుండం, మంథని, పెద్దపల్లి, సుల్తానాబాద్, ధర్మారం ఆస్పత్రుల్లోనూ వైద్య సేవలు అందిస్తున్నారు. జిల్లా కేంద్ర ఆస్పత్రికి రో జూ 900 మంది నుంచి 1,100 మంది పేషెంట్లు వస్తున్నారు. అందులో జ్వరంతో 300 మంది వరకు బాధపడుతున్న వారు ఉంటున్నట్లు వైద్యులు చెబుతున్నారు. అవుట్ పేషెంట్ల సంఖ్య అధికంగా నమోదవుతుండగా.. ఇన్‌పేషెంట్ల సంఖ్య తక్కువగా నమోదవుతోందని పేర్కొంటున్నారు. మరోవైపు.. గ్రామాల్లో ఇంటింటా జ్వరసర్వే కొనసాగుతోంది. పెరుగుతున్న సీజనల్ వ్యాధులు ఆస్పత్రులను ఆశ్రయిస్తున్న బాధితులు జిల్లా కేంద్ర ఆస్పత్రిలో పేషెంట్ల రద్దీ -
రేపే ఆఖరు సర్
సాక్షి పెద్దపల్లి: జిల్లాలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(ఎస్ఐఆర్ – సర్) గడువు ఈనెల 10వ తేదీతో ముగియనుంది. సర్ ప్రక్రియలో భాగంగా ఎన్యూమరేషన్ ఫారాల డిజిటైలైజేషన్ ప్రక్రియ జిల్లాలో శరవేగంగా కొనసాగుతోంది. జిల్లావ్యాప్తంగా మొత్తం 7,12,157 మంది ఓటర్లు ఉండగా, వారికోసం 844 మంది బీఎల్వోలు వందశాతం ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ ప్రక్రియ పూర్తిచేశారు. ఇప్పటివరకు 6,30,576 ఫారాలు డిజిటలైజేషన్ చేయగా, ఇదిమొత్తం ఓటర్లలో 88.54 శాతంగా నమోదైంది. 80 వేల మందికిపైగా ఇంకా మిగిలి.. జిల్లాలో ఇంకా 80,449 మంది ఓటర్లకు సంబంధించిన ప్రక్రియ పూర్తికావాల్సి ఉంది. ఇది మొత్తం ఓటర్లలో 11.30 శాతంగా ఉంది. దీంతో మిగిలిన ఓటర్లకు సంబంధించిన ఫారాల సేకరణ, డిజిటలైజేషన్, వెరిఫికేషన్ ప్రక్రియపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ఇదేసమయంలో జిల్లాలో 5,713 మంది ఓటర్లకు డబుల్, తొలగింపు, ఓగస్ ఓట్లుగా నమోదయ్యాయి. అలాగే 4,573 ఫారాలు ఓటర్ల నుంచి సేకరించాల్సి ఉంది. మొత్తంగా సర్ ప్రక్రియ 88 శాతానికిపైగా పూర్తయినా.. ఇంకా 80వేల మందికిపైగా ఓటర్ల ప్రక్రియ పూర్తి కావాల్సి ఉంది. దీంతో మిగిలిన ప్రక్రియను పూర్తిచేయడానికి జిల్లా అధికారులకు రెండురోజుల గడువు మాత్రమే ఉంది. ఈమేరకు ప్రక్రియ జోరుగా సాగుతోంది. ఈనెల 10తో ముగియనున్న ఎస్ఐఆర్ ప్రక్రియ జిల్లాలో 88.54శాతం ఈఎఫ్‌ల డిజిటలైజేషన్ మంథని నియోజకవర్గంలో 100 శాతం నమోదు జిల్లాలో సర్ ఇలా.. బీఎల్వోలు 844 ఓటర్లు 7,12,157 ఫారాల పంపిణీ(శాతం) 100 బీఎల్వోలకు చేరినవి 6,30,478 డిజిటలైజేషన్ చేసింది 6,30,576 డిజిటలైజేషన్ శాతం 88.54 డబుల్, తొలగించినవి 5,713 వ్యత్యాసం ఉన్నవి 1,35,675 -
కరుడుగట్టిన ‘థార్ గ్యాంగ్’ పట్టివేత
కొత్తపల్లి(కరీంనగర్): కరుడుగట్టిన అంతరాష్ట్ర దొంగల ముఠాకు చెందిన ఇద్దరిని శనివారం కొత్తపల్లి పోలీసులు అరెస్టు చేశారు. సీఐ బిల్ల కోటేశ్వర్ వివరాల ప్రకారం.. మధ్యప్రదేశ్‌లోని థార్ జిల్లా తాండా తాలూకాకు చెందిన కరుడుగట్టిన నలుగురు సభ్యుల ముఠా (థార్ గ్యాంగ్) ఇటీవల కరీంనగర్‌కు చేరుకుంది. కొత్తపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలోని రేకుర్తి, మల్కాపూర్ ప్రాంతాల్లో రెక్కీ నిర్వహిస్తూ అనుమానాస్పదంగా సంచరిస్తుండగా.. రేకుర్తి కంటి ఆసుపత్రి కమాన్ సమీపంలో సర్దు(25), సర్దార్(29)ను అదుపులోకి తీసుకున్నారు. దొంగతనానికి ఉపయోగించే సుత్తె, పానను స్వాధీనం చేసుకున్నారు. గతేడాడాది సంక్రాంతి సమయంలో చింతకుంట ప్రాంతంలో జరిగిన పలు దొంగతనాల్లో ప్రమేయం ఉన్నట్లు అంగీకరించారు. మళ్లీ దొంగతనాలకు పాల్పడేందుకు కరీంనగర్‌కు వచ్చినట్లు విచారణలో తేలింది. నలుగురు సభ్యుల ముఠాలో ఇద్దరు పరారైనట్లు, అరెస్ట్ చేసిన ఇద్దరిని రిమాండ్‌కు తరలించినట్లు సీఐ పేర్కొన్నారు. -
రైల్వేబోర్డు దృష్టికి సమస్యలు
రామగుండం: పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ శని వారం రైల్వేబోర్డు చైర్మన్ సతీశ్‌కుమార్‌ను కలి శారు. రామగుండం కాలనీలో మూతపడిన రైల్వేస్కూల్ను పునరుద్ధరించాలని, బద్రిపల్లి, మల్యాలపల్లి, రామగుండం రైల్వే గేట్ల స్థానంలో సబ్ వే వంతెన, పెద్దంపేట, కుందనపల్లిలో రైల్వే ఓవర్ బ్రిడ్జి, భూగర్భ వంతెన నిర్మించాలని ఆయనకు విన్నతించారు. రామగుండంలో ఫిరోజ్‌పూర్ కాంటోన్మెంట్ – హంసఫర్, నవజీవన్, గరీభ్‌రథ్, స్వర్ణజయంతి రైళ్లకు హాల్టింగ్ సౌకర్యం కల్పించాలని ఎంపీ కోరా రు. ఇందుకు రైల్వే బోర్డు చైర్మన్ సానుకూలంగా స్పందించినట్లు ఎంపీ పేర్కొన్నారు. అథ్లెటిక్స్‌లో ‘బంగారం’ కమాన్‌పూర్: మండల కేంద్రానికి చెందిన నల్లవెలి ఆనంది అథ్లెటిక్స్ పోటీల్లో బంగారు పతకం సాధించి జాతీయస్థాయికి ఎంపికై ంది. హన్మకొండలో శుక్రవారం నిర్వహించిన బాలికల విభాగం– 400 మీటర్ల పరుగు పందెంలో 56 సెకన్లలో లక్ష్యాన్ని చేరుకొని ప్రతిభ చూపింది. ఆనంది కమాన్‌పూర్ ప్రభుత్వ కళాశాలలో ఇంటర్ ద్వితీయ చదువుతోంది. ప్రతిభ చూపిన అథ్లెట్స్ జ్యోతినగర్: హన్మకొండలో జరిగిన రాష్ట్రస్థా యి అథ్లెటిక్స్ పోటీల్లో జిల్లానుంచి 70 మంది విద్యార్థులు పాల్గొని ప్రతిభ కనభర్చినట్లు అథ్లెటిక్స్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి కొమ్ము గట్టయ్య తెలిపారు. బాలికల అండర్–18, 400, 200 మీటర్ల పరుగు పందెంలో నల్లవెల్లి ఆనంది జట్టు ప్రథమ స్థానం సాధించిందని, బాలుర అండర్–6 స్టాండింగ్ బోర్డు జంప్‌లో మోహాంశ్రావు తృతీయ స్థానం సా ధించారని పేర్కొన్నారు. విజేతలను పీఈటీ స త్యనారాయణ, కోచ్ సుబ్బారావు, అథ్లెటిక్స్ అ సోసియేషన్ సభ్యులు అభినందించారు. 23 నుంచి ఆదివరాహ స్వామి ఉత్సవాలు కమాన్‌పూర్: ప్రసిద్ధ శ్రీఆదివరాహస్వామి జయంతిని ఈనెల 23 నుంచి 26వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ చైర్మన్ కమిటీ ముస్త్యాల దామోదర్, అర్చకుడు వరప్రసాదాచార్యులు, ఈవో కాంతారెడ్డి తెలిపా రు. ఉత్సవాల ప్రచార పోస్టర్‌ను దేవస్థానం ఆవరణలో శనివారం ఆవిష్కరించి మాట్లాడా రు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి వేడుకలను విజయవంతం చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సత్యనారాయణ, డైరెక్టర్లు రాజయ్య, రాజు, మల్లేశ్, సతీశ్, శంకర్, శ్రీనివాస్, శ్యామల పాల్గొన్నారు. కట్టడాలు తొలగించాలి గోదావరిఖని: ఎల్బీనగర్లోని సింగరేణి స్థలంలో అక్రమ కట్టడాలను తొలగించాలని ఆర్జీ –1 జీఎం పేరిట ఫిల్లర్లకు నోటీసులు అంటించింది. ఈకట్టడాలకు అనుమతి లేదని స్పష్టం చే సింది. సంస్థకు చెందిన స్థలంలో అనుమతి లే కుండా కట్టడాలను సహించబోమని పేర్కొంది. నాలుగు రోజుల్లోగా తొలగించకపోతే తా మే తొలగిస్తామని నోటీసులో పేర్కొంది. స్వ చ్ఛందంగా తొలగించపోతే బాధ్యులపైనా చ ర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. కాగా లబ్ధిదారులకు అన్యాయం జరిగిందని సీపీఐ కార్పొరేటర్ మార్కపురం సూర్య ఆరోపించా రు. ఈవిషయంలో బాధితులకు న్యాయం చే యాలని డిమాండ్ చేశారు. ఈవిషయంలో ఎ మ్మెల్యేను బద్నాం చేస్తే ఊరుకోబోమని కాంగ్రె స్ నాయకుడు ఉదయ్‌రాజ్ హెచ్చరించారు. -
మహిళపై లైంగికదాడిలో రౌడీషీటర్లు!
జగిత్యాలక్రైం: జగిత్యాల జిల్లా మల్యాల మండలం నూకపల్లి శివారులో ఈనెల 3న నిజామాబాద్‌కు చెందిన మహిళపై సామూహిక లైంగికదాడికి పాల్పడిన ఘటనలో రౌడీషీటర్లు ఉన్నారు. పోలీసులు అరెస్ట్ చేసిన నిందితుల్లో ఇద్దరు రౌడీషీటర్లు ఉండగా.. వీరికి మరో ఇద్దరు సహకరించారు. రౌడీషీటర్లలో ఒకరు అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే అనుచరుడిగా చెప్పుకుంటూ పలు భూ సెటిల్మెంట్లు, పలు పంచాయితీలు చేస్తూ భయభ్రాంతులకు గురిచేస్తున్నట్లు స్థానికులు వెల్లడించారు. ఏ–1 నిందితుడు, రాజారం గ్రామానికి చెందిన శివరాత్రి నరేశ్‌పై మల్యాల పోలీస్‌స్టేషన్‌లో 13 కేసులు, మరోచోట మరో కేసు నమోదైంది. రాజారం గ్రామానికి చెందిన గుర్రం శ్రీకాంత్‌పై ఇప్పటికే 9 కేసులున్నాయి. అలాగే గుర్రం అంజయ్యపై ఇప్పటికే ఒక కేసు నమోదైంది. ఇది రెండో కేసు. అలాగే ఏ–3, ధరూర్ గ్రామానికి చెందిన మర్రవేని మల్లేశ్‌పై గతంలో రెండు కేసులు నమోదు కాగా, మరో కేసు నమోదైంది. మహిళను రౌడీషీటర్ నరేశ్ పథకం ప్రకారమే రప్పించి శ్రీకాంత్‌కు సమాచారం అందించి.. లైంగికదాడికి పాల్పడి.. వీడియో చిత్రీకరణ చేసినట్లు గుర్తించారు. రౌడీషీటర్ల హంగామా.. కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న ఇద్దరు రౌడీషీటర్లలో ఒకరు ఎమ్మెల్యే అనుచరుడిగా మండలంలో చలామణి అవుతున్నాడు. పలువురు యువకులను వెంటేసుకుని నిత్యం రాజారం, టీఆర్‌నగర్, నూకపల్లి, మల్యాల, ముత్యంపేట, కొండగట్టు తదితర ప్రాంతాల్లో భూ సెటిల్మెంట్లు, పంచాయితీలు చేసి సొమ్ము చేసుకుంటున్నాడు. ఏదైనా గొడవలు జరిగితే తన వద్దనున్న గ్యాంగ్‌ను తెప్పించి దాడులకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కొద్దికాలంగా కొండగట్టు పుణ్యక్షేత్రానికి వచ్చే ప్రేమికులు, స్నేహితులు, కొంతమంది మహిళలను వీడియోలు చిత్రీకరించి భయబ్రాంతులకు గురిచేసి నగదుతోపాటు, బంగారు ఆభరణాలు కూడా బలవంతంగా లాక్కున్నాడనే ఆరోపణలు వెలువడుతున్నాయి. వీరి అరాచకాలకు అడ్డుకట్ట వేయాలని చూసినా.. అధికార పార్టీ ఎమ్మెల్యే అండ ఉండటంతో పోలీసులు చూసీచూడనట్లుగా వ్యవహరించినట్లు మండలంలో ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కేసులో ఉన్న ఇద్దరు రౌడీషీటర్లపై పీడీ యాక్ట్ ఓపెన్ చేయాలని మండల ప్రజలు కోరుతున్నారు. మహిళపై అత్యాచార కేసులో ఉన్న రౌడీషీటర్లపై పూర్తిస్థాయిలో దర్యాఫ్తు చేపట్టి పీడీయాక్ట్ ఓపెన్ చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నాం. ఎవరైనా శాంతిభద్రతలకు విఘాతం కలిగించినా.. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినా పోలీసు శాఖ కఠిన చర్యలు చేపడుతుంది. నేర చరిత్ర ఉన్న వారిపై కూడా పోలీసు శాఖ వారి కదలికలపై ఎప్పటికప్పుడు నిఘా పెడుతోంది. – అశోక్‌కుమార్, జగిత్యాల ఎస్పీ పథకం ప్రకారమే వీడియో చిత్రీకరణ నిందితుల్లో ఒకరు అధికారి పార్టీ ఎమ్మెల్యే అనుచరుడు -
ఆర్టీసీ డ్రైవర్ అప్రమత్తతతో తప్పిన ప్రమాదం
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): ఆర్టీసీ డ్రైవర్ అప్రమత్తతతో పెను ప్రమాదం తప్పింది. శనివారం కామారెడ్డి జిల్లా కేంద్రం నుంచి సిరిసిల్ల జిల్లా కేంద్రానికి వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఎల్లారెడ్డిపేట మండలం గొల్లపల్లికి చేరుకోగానే డ్రైవర్ చక్రపాణికి ఫిట్స్ వచ్చాయి. ప్రమాదాన్ని ముందుగానే గుర్తించిన డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించి బస్సును రోడ్డు పక్కన నిలిపారు. బస్సులో ఉన్న ప్రయాణికులను కిందకి దింపిన తర్వాత అతను అక్కడే నేలపైన కొంత సేపు సేదతీరారు. గమనించిన స్థానికులు వెంటనే అక్కడికి చేరుకొని ఎల్లారెడ్డిపేటలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అనంతరం సిరిసిల్ల ఆస్పత్రికి తీసుకెళ్లారు. డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతోనే పెద్ద ప్రమాదం తప్పిందని ప్రయాణికులు తెలిపారు. డ్రైవర్‌కు ఫిట్స్ బస్సును రోడ్డు పక్కన నిలిపిన డ్రైవర్ ప్రయాణికులు సురక్షితం -
కోహెడలో రోడ్డు ప్రమాదం – తారుపల్లిలో విషాదం
కాల్వశ్రీరాంపూర్: కోహెడ సమీపంలోని రాజీవ్ రహదారిపై శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలం తారుపల్లి గ్రామానికి చెందిన జక్కుల సాయికృష్ణ(25) మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. కారు అద్దెకు నడుపుతూ జీవనోపాధి పొందుతున్న యువకుడు .. గ్రామానికి చెందిన క్యాన్సర్ పేషెంట్‌ను హైదరాబాద్‌లోని ఆస్పత్రికి తరలించి తిరుగు ప్రయాణంలో కోహెడ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. దీంతో తారుపల్లిలో విషాదం అలుముకుంది. మృతుడికి తల్లిదండ్రులు రమాదేవి– మల్లయ్య ఉన్నారు. సాయికృష్ణ అందరితో కలిమిడితో ఉండేవాడని గ్రామస్తులు పేర్కొన్నారు. తల్లిదండ్రులు రోదనలు మిన్నంటాయి. -
రెక్కీ.. ఆ తర్వాతే చోరీ
మంథని: తాళం వేసిన ఇళ్లు లక్ష్యంగా వరుస చోరీలు చేస్తున్న కేసులో నిందితుడిని పెద్దపల్లి జిల్లా మంథ ని సీఐ స్వామి ఆధ్వర్యంలోని ప్రత్యేక బృందం, రా మగిరి పోలీసులు సంయుక్తంగా అరెస్ట్ చేశారు. కేసు వివరాలను గోదావరిఖని ఏసీపీ రమేశ్ శనివా రం మంథని సీఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. తాళంవేసిన ఇళ్లను పగలు గమనించి రాత్రి తాళాలు పగులగొట్టి ఆభరణాలు, నగదు చోరీ చేస్తున్నాడు. రామగిరి ఎస్సై శ్రీనివాస్ శనివారం గస్తీ చేస్తుండగా అనుమానాస్పదంగా కనిపించిన వ్యక్తి చూసి పారిపోవడానికి యత్నించాడు. పోలీసులు వెంటాడి పట్టుకున్నారు. అతడిని తనిఖీ చేయగా బటన్ కత్తి లభించింది. తన పేరు వనం రాము అని, జగిత్యాల జిల్లా తారకరామనగర్ స్వస్థలమని వెల్లడించాడు. సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో తనభార్య కవితతోపాటు దాసరి రవి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం మందలపల్లికి చెందిన వనం పాపయ్య, అశ్వరావుపేటకు చెందిన వనం నగేశ్‌తో కలిసి ముఠాగా ఏర్పడి చోరీలు చేస్తున్నాడు. గతంలో రాయికల్, జగిత్యాల ప్రాంతాల్లో కూడా చోరీలు చేసి జైలుకు వెళ్లి వచ్చాడు. రామగిరి మండలం కల్వచర్ల, ముత్తారం, ధర్మారం, రత్నాపురం, జూలపల్లిలో తాళం వేసి ఉన్న ఇళ్లను టార్గెట్‌గా చేసుకుని చోరీలు చేశారు. చోరీచేసిన ఆభరణాల తాకట్టు, విక్రయం పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం ఓడేడులో దొంగిలించిన నల్లపూసల గొలుసు, కల్వచర్లలో చోరీచేసి ఆభరణాలను జగిత్యాలలో తాకట్టు పెట్టినట్లు నిందితుడు తెలిపాడు. వాటి ద్వారా వచ్చిన నగదును ఎన్నికల సమయంలో ఖర్చు చేసినట్లు వెల్లడించాడు. మరికొన్ని ఆభరణాలను జగిత్యాల టవర్ సర్కిల్లోని నగల దుకాణాదారుకు విక్రయించినట్లు, ఆ వ్యక్తి కొన్ని నెలల క్రితం మృతి చెందినట్లు వివరించాడు. ఆభరణాల విక్రయం ద్వారా వచ్చిన నగదులో కొంతమొత్తాన్ని రవి, పాపయ్య, నగేశ్‌కు ఇచ్చి మిగిలిన సొమ్మును తన భార్య ఖర్చులు, జల్సాలకు వినియోగించినట్లు వెల్లడించాడు. అలాగే ఓడేడులో దొంగిలించిన రూ.లక్షతోపాటు గతంలో దొంగిలించిన నగదును ఆంధ్రప్రదేశ్‌లోని జంగారెడ్డిగూడేనికి చెందిన జగన్నాథం లక్ష్మణరావు వద్ద సెప్టిక్ ట్యాంకర్ కొనుగోలు కోసం రూ.2 లక్షలు చెల్లించినట్లు తెలిపాడు. నిందితుడి నుంచి మరిన్ని వివరాలు సేకరిస్తున్నామని, దొంగతనాలకు సంబంధించిన ఆస్తి రికవరీతోపాటు ఇతర నిందితుల పాత్రపై కూడా దర్యాప్తు కొనసాగుతోందని ఏసీపీ రమేశ్ వివరించారు. నిందితుడిని చాకచక్యంగా పట్టుకోవడంలో కీలక పాత్ర పోషించిన మంథని సీఐ స్వామి, రామగిరి ఎస్సై శ్రీనివాస్, హెడ్ కానిస్టేబుల్ భార్గవ్, పోలీస్ కానిస్టేబుళ్లు రమేశ్, అభిషేక్, రాజ్‌కుమార్‌ను ఏసీపీ ఈ సందర్భంగా అభినందించారు. -
12వ వేతన కమిటీ ఏర్పాటు చేయాలి
గోదావరిఖని: దేశంలోని ప్రభుత్వ రంగ బొగ్గు పరిశ్రమల్లో పనిచేస్తున్న బొగ్గు గని కార్మికులు, ఉద్యోగు ల వేతనాలు, అలవెన్సుల పెంపుకోసం 12వ వేజ్‌బోర్డు కమిటీని వెంటనే నియమించాలని జేఏసీ నా యకులు వాసిరెడ్డి సీతారామయ్య, తుమ్మల రాజారెడ్డి డిమాండ్ చేశారు. శనివారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడా రు. నాలుగు లేబర్ కోడ్లను బొగ్గు పరిశ్రమల్లో అ మలు చేయొద్దన్నారు. నూతన వేజ్‌బోర్డు ఏర్పాటు కోసం ఈనెల 10న జీఎం కార్యాలయాల ఎదుట ధర్నా చేస్తామని తెలిపారు. ఈ సమావేశంలో వివిధ యూనియన్ల నాయకులు గడ్డం కృష్ణ, మడ్డి ఎల్లాగౌడ్, కవ్వంపల్లి స్వామి, గౌతం గోవర్ధన్, దాసరి శ్రీనివాస్, బిట్టి వెంకటేశ్వర్లు, ఏవీఎస్ ప్రకాశ్, రాజేశ్వర్‌రావు, దేవయ్య, తొడుపునూరి రమేశ్ కుమార్, శివరాంరెడ్డి, రాజమౌళి, నరహరిరావు, ప్రవీణ్, వెంకటేశ్వర్లు, రమేశ్ పాల్గొన్నారు. రేపు జీఎం కార్యాలయాల ఎదుట ధర్నా సింగరేణి జేఏసీ నాయకుల వెల్లడి -
బంగారం చోరీ.. నిందితుడి అరెస్టు
కరీంనగర్‌క్రైం/కరీంనగర్: ఇంట్లో ఒంటరిగా ఉన్న వృద్ధురాలిపై దాడి చేసి బంగారం ఎత్తుకెళ్లిన కిసాన్‌నగర్‌కు చెందిన మునుగొండ మధుకర్ అలియాస్ మధు(42)ను కరీంనగర్ త్రీటౌన్ పోలీసులు అరెస్టు చేశారు. వారి వివరాల ప్రకారం.. శివాజీనగర్‌లో నివాసముండే జంగం రాజమ్మ ఒంటరిగా ఉండడం గమనించి ఇంట్లోకి 7వ తేదీ మధ్యాహ్నం 3 గంటల సమయంలో మధుకర్ ముఖానికి మాస్క్ ధరించి ప్రవేశించాడు. మెడలోని బంగారు గొలుసు, ఎడమ చెవి కమ్మను బలవంతంగా లాక్కున్నాడు. బాధితురాలు ప్రతిఘటించడంతో తలను గోడకేసి కొట్టడంతో గాయపడింది. నిందితుడు అక్కడి నుంచి పారిపోయాడు. దోచుకున్న బంగారాన్ని బజాజ్ ఫైనాన్స్‌లో గోల్డ్‌లోన్ కింద తాకట్టు పెట్టి రూ.2.25 లక్షలు తన బ్యాంకు ఖాతాలో జమ చేసుకున్నాడు. కేసు నమోదైన వెంటనే పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. సీసీ కెమెరాల ఫుటేజీ, సాంకేతిక ఆధారాలు, బ్యాంకు లావాదేవీలు విశ్లేషించారు. శనివారం నిందితుడిని అరెస్టు చేసి ద్విచక్ర వాహనం, మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. వృద్ధురాలిని పరామర్శించిన డిప్యూటీ మేయర్ దోపిడి దొంగ దాడిలో గాయపడి ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జంగం రాజమ్మను డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్‌రావు పరామర్శించారు. బాధితురాలి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆసుపత్రి డాక్టర్లకు సూచించారు. బాధితురాలికి తక్షణ ఆర్థిక సహాయం అందజేశారు. 27వ డివిజన్ కార్పొరేటర్ బొట్ల శ్యామల–కిరణ్ పాల్గొన్నారు. -
చికిత్స పొందుతూ విజ్ఞత మృతి
యైటింక్లయిన్‌కాలనీ: వంటగ్యాస్ సిలిండర్ పేలిన ఘటనలో తీవ్రంగా గాయపడిన యావనవేని విజ్ఞత(27) చికిత్స పొందుతూ శనివారం మృతి చెందింది. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని టూటౌన్ పోలీస్‌స్టేషన్ పరిధి మహాకవి పోతనకాలనీలోని నివాసం ఉంటున్న సింగరేణి కార్మికుడు యాదనవేని వసంత్ – విజ్ఞత దంపతులు ఈనెల 2న గ్యాస్‌స్టౌవ్ పేలి తీవ్రంగా గాయపడిన విషయం విదితమే. 80శాతం కాలిన గాయలతో విజ్ఞత, 60 శాతం కాలిన గాయాలతో వసంత్‌ను హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ విజ్ఞత చనిపోయింది. వసంత్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆయన పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. కాగా, దంపతుల ఇద్దరు పిల్లలు బంధువుల వద్ద ఆశ్రయం పొందుతున్నారు. దీంతో పోతనకాలనీలో విషాదచాయలు నెలకొన్నాయి. మృతదేహాన్ని గోదావరిఖని ఏరియా ఆస్పత్రికి తీసుకురానున్నట్లు స్థానికులు తెలిపారు. విజ్ఞత తల్లిగారి గ్రామమైన బెల్లంపల్లిలోని బుచ్చంపల్లిలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. -
ప్రభుత్వ భూమి కబ్జాకు యత్నం
● స్వాధీనం చేసుకున్న రెవెన్యూ అధికారులు పాలకుర్తి: ధర్మారం క్రాస్‌రోడ్డు వద్ద కన్నాల గ్రామ రెవెన్యూ శివారులోని సర్వే నంబర్ 425లో గల ప్రభుత్వ భూమిని కబ్జా చేసేందు కు యత్నించగా రెవెన్యూ అధికారులు శనివా రం అడ్డుకున్నారు. ఆ భూమిని గతంలో జిల్లా కోర్టు నిర్మాణం కోసం సేకరించారు. అప్పటి జిల్లా జడ్జికి భూమిపత్రాలను అందజేశారు. జిల్లా కోర్టు నిర్మాణానికి పెద్దపల్లి సమీపంలో ని రాఘవాపూర్ శివారులో భూమి కేటాయించారు. బీడుగా ఉన్న కోర్టు భూమిపై కొందరు రియల్టర్ల కన్నుపడింది. రెండు, మూడు రోజులుగా ట్రాక్టర్‌తో చదును చేస్తున్నారు. సమాచారం అందుకున్న తహసీల్దార్ రాజేశ్వరరావు, ఆర్ఐ సంతోష్ ఘటనా స్థలానికి చేరుకుని ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకున్నారు. అందులో ప్రభుత్వ భూమి అని సూచించేలా సైన్ బోర్డును ఏర్పాటు చేశారు. ఈభూమిని ఆక్రమిస్తే చట్టప్రకారం తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
టాస్క్‘ఫోర్స్’ దూకుడు
గోదావరిఖని: అసాంఘిక కార్యకలాపాలు, ఆహార కల్తీ, నిషేదిత క్రిమిసంహారక మందులు, అక్రమాలపై నార్కోటిక్, టాస్క్‌ఫోర్స్ దాడులు ఉధృతం చేసింది. ప్రధానంగా గంజాయి, మత్తు పదార్థాల విక్రయం, పేకాట స్థావరాలపై మెరుపు దాడులు చేస్తోంది. ఏడాది క్రితం రామగుండం కమిషనరేట్‌లో టాస్క్‌ఫోర్స్‌ను ఎత్తివేశారు. అయితే, నెలరోజులుగా నార్కోటిక్, టాస్క్‌ఫోర్స్‌ను పునరుద్ధరించడంతో మంచిర్యాల, పెద్దపల్లిజిల్లాల్లో దూకుడు పెంచాయి. పోలీస్ కమిషనర్ నేతృత్వంలో టాస్క్‌ఫోర్స్‌లో ఏసీపీ, ముగ్గురు ఎస్సైలు, పదిమంది కానిస్టేబుళ్లు విధులు నిర్వర్తిస్తున్నారు. వీరికి ప్రత్యేక శిక్షణ ఇచ్చి పక్కా సమాచారంతో ఆకస్మిక దాడులు చేసేలా ప్రణాళిక రూపొందించారు. దాడుల్లో స్వాధీనం చేసుకుంటున్న సొత్తు, ఇతర పదార్థాలు, అదుపులోకి తీసుకుంటున్న నిందితులను పోలీస్స్టేషన్లలో అప్పగించి కేసులు నమోదు చేసేలా చర్యల చేపడుతున్నారు. మత్తు పర్థాలపై డేగకన్ను గంజాయి, డ్రగ్స్ తదితర మత్తు పదార్థాల విక్రయాలపై నార్కోటిక్, టాస్క్‌ఫోర్స్ డేగకన్నువేశాయి. గంజాయి విక్రయాలను మూలాలతో సహా పెకిలించివేస్తున్నాయి. విక్రయదారులతోపాటు వినియోగదారులనూ వదిలిపెట్టడంలేదు. విక్రయదారులపై కేసులు నమోదు చేస్తూ, వినియోగదారులను ప్రత్యేక కేంద్రాలకు తరలించి కౌన్సెలింగ్ ఇస్తున్నారు. ఇలా ఈఏడాదిలోనే 31 కేసులు నమోదు చేసి 5.86కిలోల రూ.2.93 లక్షల విలువైన గంజాయి స్వాధీనం చేసుకుని 47 మందిపై కేసు నమోదు చేశారు. ఆరు వాహనాలను సీజ్ చేశారు. పీడీఎస్ రైస్ స్వాధీనం రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని రెండు జిల్లాల్లో టాస్క్‌ఫోర్స్ బృందాలు పీడీఎస్ రైస్‌పై కూడా దృష్టి పెట్టాయి. గత 8 నెలల్లో 117 క్వింటాళ్ల రూ.15.16 లక్షల విలువైన బియ్యం స్వాధీనం చేసుకుని ఆరుగురిపై కేసు నమోదు చేశారు. ఒక వాహనం స్వాధీనం చేసుకున్నారు. వీటితోపాటు నకిలీ ఆహారపదార్థాలు, నిషేధిత గడ్డిమందు విక్రయాలు, నకిలీ విత్తనాలు తదితర వాటిపై టాస్క్‌ఫోర్స్ ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఈఏడాదిలో టాస్క్‌ఫోర్స్ దాడులు వివరాలు కేసులు కేజీ/లీటర్ విలువ(రూ.లక్షలు) నిందితులు వాహనాల స్వాధీనం గంజాయి 31 5.863 2.93 47 06 రేషన్‌బియ్యం 06 117.85 15.16 06 01 గేమింగ్ 05 3.09 22 08 – ఫెస్టిసైడ్స్ 03 315 1.57 05 03 పచ్చళ్లు 03 600 0.90 03 – కల్తీ, పేకాట, ఫెస్టిసైడ్ షాప్‌లపై ఫోకస్ గంజాయి, మత్తుపదార్థాలపై ప్రత్యేక దృష్టి కేసులు నమోదు చేస్తూ.. జరిమానా విధిస్తూ ముందుకు ప్రత్యేక దృష్టి పెట్టాం గంజాయి, డ్రగ్స్ తదితర మత్తు పదార్థాల విక్రయాలపై ప్రత్యేక దృష్టి సారించాం. అసాంఘిక కార్యకలాపాలనూ కట్టడి చేస్తున్నాం. పేకాట, పీడీఎస్ రైస్, నకిలీ పురుగుల మందు విక్రయాలపై కేసులు నమోదు చేస్తున్నాం. ఇందులో టాస్క్‌ఫోర్స్ బృందాలు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాయి. ప్రజలు ఏలాంటి ఇబ్బందులున్నా డయల్ 100 నంబర్ ద్వారా పోలీసులను సంప్రదించాలి. – అంబర్ కిశోర్ ఝా, సీపీ, రామగుండం -
మద్యం మత్తులో కొడుకుపై దాడి
కోనరావుపేట(వేములవాడ): తండ్రీకొడుకుల మధ్య వాగ్వాదం ముదిరి.. గొడ్డలితో దాడికి దారితీసింది. రాజన్నసిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం మల్కపేటకు చెందిన గుడిపేట రాఘవులు, రాజేందర్(36) తండ్రీకొడుకులు. గల్ఫ్‌కు వెళ్లిన రాజేందర్ ఏడాది క్రితం ఇంటికొచ్చాడు. ఇద్దరి మధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. కొన్ని నెలల క్రితం రాజేందర్ దాడి చేయడంతో తండ్రి రాఘవులు చేయి విరిగింది. ఇటీవల కొడుకును హత్య చేసేందుకు తండ్రి బండరాయితో ప్రయత్నించగా రాజేందర్‌కు గాయాలయ్యాయి. శనివారం కూడా ఎప్పటిలాగే ఇద్దరి మధ్య ఇంట్లోనే వాగ్వాదం చోటుచేసుకుంది. మద్యం సేవించిన రాఘవులు ఇంట్లోనే మంచంపై పడుకుని ఉన్న రాజేందర్‌పై గొడ్డలితో దాడి చేశాడు. ఈ సంఘటనలో రాజేందర్ మెడపై, చెవిబాగంలో గాయాలయ్యాయి. వెంటనే గమనించిన గ్రామస్తులు సిరిసిల్లలోని జిల్లా ఆస్పత్రికి తరలించారు. రాజేందర్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. కోనరావుపేట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆస్పత్రికి తరలింపు.. పరిస్థితి విషమం -
కొత్త పింఛన్లు15 నుంచి..
● పంపిణీకి అధికారుల కసరత్తు ● దరఖాస్తుదారుల్లో ఆశలు పెద్దపల్లి: కొత్త పింఛన్ల కోసం ఎదురుచూస్తున్న దరకాస్తుదారులకు త్వరలోనే లబ్ధిచేకూరనుంది. ఇందుకోసం జిల్లా అధికార యంత్రాంగం ప్రత్యేక కార్చారణ రూపొందించింది. ఈనెల 15 నుంచి కొత్త పింఛన్‌దారులకు డబ్బులు పంపిణీ చేయనున్నట్లు మంత్రి సీతక్క ఇటీవల ప్రకటించడంతో అర్హుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. చిగురిస్తున్న ఆశలు జిల్లాలో వేలాది మంది దరఖాస్తుదారులు పింఛన్ల కోసం ఎంతో ఆశతో ఎదురుచూస్తున్నారు. అర్హత ఉన్నకొత్త లబ్ధిదారులతోపాటు కుటుంబ పరిస్థితుల్లో మార్పులు వచ్చిన వారికి కూడా పింఛన్లు మంజూరు చేయాలని సర్కార్ నిర్ణయించింది. ముఖ్యంగా పింఛన్ పొందుతున్న వ్యక్తి మరణించినా అర్హత ఉన్నభార్యకు వెంటనే మంజూరు చేయాలని అధికారులను ఆదేశించింది. సర్కారు నిర్ణయంతో హర్షం మృతుల కుటుంబాలకు పింఛన్ మంజూరు చేయాలనే నిర్ణయం క్షేత్రస్థాయిలో ఇప్పటివరకు పూర్తిస్థాయిలో అమలు కావడం లేదనే విమర్శలున్నాయి. పింఛన్ మార్పిడి కోసం దరఖాస్తు చేసి చాలామంది ఏళ్లుగా కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు. ధ్రువపత్రాలు సమర్పించినా మంజూరు ప్రక్రియ ఆలస్యమవుతోందని దరఖాస్తుదా రులు వాపోతున్నారు. ప్రభుత్వ తాజా నిర్ణయంతో ఇలాంటి వేలాది మందికి ప్రయోజనం చేకూరుతుందని భావిస్తున్నారు. మన జిల్లాలోనే సుమారు 10 వేల మంది కొత్త లబ్ధిదారులు లేదా మార్పిడి కోసం ఎదురుచూస్తున్నారని, వారికి లబ్ధిచేకూరుతుంని అధికార వర్గాల అంచనా. ఇతరులపై ఆధారపడకుండా.. వృద్ధులు, వితంతులు, దివ్యాంగులు ఆర్థిక అవసరాల కోసం ఇతరులపై ఆధారపడకుండా ప్రభుత్వం ప్రతినెలా చేయూత పేరిట పింఛన్లు అందిస్తోంది. అయితే, వృద్ధాప్య, వితంతు, దివ్యాంగ, గీత, చేనేత, బీడీ కార్మికులు, బోదకాలు, డయాలసిస్ పేషెంట్లు, ఒంటరి మహిళలు మూడేళ్లుగా కొత్త పింఛన్ల కోసం ఏళ్లకింద దరఖాస్తు చేసుకున్నారు. వీరు జిల్లా, మండల, గ్రామ పంచాయతీ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా ఇప్పటికీ పింఛన్లు మంజూరు కాక తీవ్ర నిరాశలో ఉన్నారు. ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయంతో వీరందరూ సంతోషంతో ఎదురు చూస్తున్నారు. జిల్లాలో పింఛన్‌దారులు -
రైలు రాకపాయె!
పదేళ్లు అయిపాయెగోపాల్రావుపల్లి.. అనుపురం మధ్య ప్రారంభమైన రైల్వే వంతెన పనులుసాక్షిప్రతినిధి, కరీంనగర్ ●: ఉమ్మడి కరీంనగర్ జిల్లా వాసులు హైదరాబాద్‌కు రైల్వే ద్వారా రాకపోకలు సాగించేందుకు కొత్తపల్లి– మనోహరాబాద్ రైల్వే ప్రాజెక్టు పనులు ప్రారంభించి 10 ఏళ్లు పూర్తయ్యాయి. 2016 ఆగస్టు 7న అప్పటి సీఎం కేసీఆర్ ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయించారు. హైదరాబాద్– మనోహరాబాద్– సిద్దిపేట– సిరిసిల్ల– వేములవాడల మీదుగా కరీంనగర్ చేరుకునేలా రూటు డిజైన్ చేశారు. భూసేకరణ, పరిహారం, బడ్జెట్ కేటాయింపుల్లో సమస్యలతో ప్రాజెక్టు రోజురోజుకు జాప్యమవుతోంది. రాజధాని హైదరాబాద్– పాత కరీంనగర్ జిల్లాకు కనెక్టివిటీ పెంచాలన్న ఉద్దేశంతో అప్పటి సీఎం కేసీఆర్ ఈ ప్రాజెక్టుకు పెద్దపీట వేశారు. తొలి ఐదేళ్లు వచ్చే నష్టాలను భరించేందుకు కేంద్రాన్ని ఒప్పించి మరీ ప్రాజెక్టును పట్టాలెక్కించారు. ఈ ప్రాజెక్టు అందుబాటులోకి వస్తే సిరిసిల్ల, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి జిల్లా ప్రజలకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. 17 స్టేషన్లతో 151 కిలోమీటర్ల దూరం మేర విస్తరించిన ఈ ప్రాజెక్టుకు ఆరంభ వ్యయం రూ.1,167 కోట్లు కావడం గమనార్హం.కొత్తపల్లిలో 3 గుంటలు సేకరణకొత్తపల్లి రైల్వేస్టేషన్ వద్ద ఇటీవల ఓ ఆశ్చర్యమైన ఘటన చోటు చేసుకుంది. స్టేషన్ సమీపంలో నిర్మించిన సీసీ రోడ్డు కోసం రైల్వేకు అప్పగించేందుకు కరీంనగర్ రెవెన్యూ అధికారులు భూసేకరణ జరిపి భూమి అప్పగించారు. ఇటీవల తాము అప్పగించిన భూమి కన్నా మూడు గుంటల భూమి అధికంగా రైల్వే కోసం వినియోగించినట్లు అధికారులు గుర్తించారు. దీంతో వారికి పరిహారం ఇవ్వాలని పాత ఆర్డీవో మహేశ్వర్ నిర్ణయించినట్లు తెలిసింది. ఈ క్రమంలోనే ఆ మూడు గుంటల భూమి కోసం నిబంధనల ప్రకారం.. ఇటీవల నోటిఫికేషన్ ఇచ్చారు. త్వరలోనే మొత్తం 3 గుంటల భూమికి మార్కెట్ రేటు ప్రకారం.. పరిహారం చెల్లించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.పెరగనున్న కనెక్టివిటీఈ ప్రాజెక్టు పూర్తయితే ఉమ్మడి జిల్లావాసులకు రాజధానితో కనెక్టివిటీ పెరగడంతోపాటు వేములవాడ, కొమురవెల్లి, కొండగట్టు, ధర్మపురి వంటి పుణ్యక్షేత్రాలకు రాజధాని నుంచి భక్తులు పెరుగుతారు. కొత్తపల్లి– మనోహరాబాద్ హైదరాబాద్ డివిజన్ పరిధిలోకి వస్తుంది. భవిష్యత్తులో ఉత్తరతెలంగాణలో హైదరాబాద్ సికింద్రాబాద్ డివిజన్లకు కీలకమైన రూట్‌గా మరింత ప్రాధాన్యం దక్కించుకోనుంది. సిరిసిల్ల, సిద్ధిపేట, జగిత్యాల జిల్లాలకు పారిశ్రామిక, వ్యవసాయ ఉత్పత్తులను ఇటు హైదరాబాద్ అటు, మహరాష్ట్ర వైపు తరలింపు సులభతరంగా మారుతుంది. కొండగట్టు పరిసరాల్లోని రేర్ ఎర్త్ మెటల్స్ గనుల తవ్వకం మొదలై, ఎగుమతులనాటికి రైల్వే లైన్ అందుబాటులోకి వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. -
విద్యార్థులు లక్ష్యం నిర్దేశించుకోవాలి
పెద్దపల్లి: విద్యార్థులు నిర్దేశిత లక్ష్యం సాధించాలని ప్రభుత్వ విప్ విజయరమణారావు సూచించారు. సుల్తానాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రథ మ సంవత్సరం విద్యార్థులకు శుక్రవారం స్వాగతం పలుకుతూ ‘ఆరంభ్–2026’ పేరిట ఫ్రెషర్స్ డే ఘ నంగా నిర్వహించారు. విప్‌తోపాటు పలువురు అతిథులు మాట్లాడుతూ, విద్యార్థులు క్రమశిక్షణ, కృషి, పట్టుదలతో ముందుకు సాగాలన్నారు. విద్యా సౌకర్యాలు, స్కాలర్షిప్లు, మధ్యాహ్న భోజనం, ఉపా ధి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సుల్తానాబాద్‌లో తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేయనున్నట్లు విప్ విజయరమణారావు చెప్పారు. అనంతరం శ్రీవెంకటేశ్వర చేనేత సొసైటీ వద్ద పద్మశాలీ సంఘం నిర్వహించిన కార్యక్రమంలో భక్త మార్కండేయ, తెలంగాణ ఉద్యమకారుడు కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్రపటాలకు విప్ పూల మాలలు వేసి నివాళి అర్పించారు. ఆయా కార్యక్రమాల్లో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతటి అన్నయ్యగౌడ్, మున్సిపల్ చైర్మన్ బిరుదు రాధాకృష్ణ, వైస్ చైర్పర్సన్ పుష్పలత, ప్రిన్సిపాల్ నల్ల రాంచంద్రారెడ్డి, పద్మశాలీ సంఘం అధ్యక్షుడు వేముల రామ్మూర్తి, ప్రధాన కార్యదర్శి ఐల రమేశ్, ఉపాధ్యక్షుడు సాయిరి మహేందర్, ఓదెల దేవస్థానం చై ర్మన్ చీకట్ల మొండయ్య, చేనేత సొసైటీ అధ్యక్షురా లు గోలి పద్మ, కౌన్సిలర్ గాదాసు మంజుల, పద్మ శాలీ యువజన సంఘం అధ్యక్షుడు మేరుగు యా దగిరి, మండల అధ్యక్షుడు గుండ మురళి, స్పోర్ట్స్ క్లబ్ అధ్యక్షుడు రవీందర్ తదితరులు పాల్గొన్నారు. -
రాష్ట్రస్థాయి ఫుట్‌బాల్ పోటీలకు ఎంపిక
ధర్మారం: దొంగతుర్తి ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు రాష్ట్రస్థాయి ఫుట్‌బాల్ పోటీలకు ఎంపికై నట్లు పీఈటీ నక్క శ్రీనివాస్ తెలిపారు. ప్రతిష్టాత్మక 65వ సుబ్రోతో కప్ ఇంట ర్నేషనల్ అండర్– 17లో జిల్లా నుంచి వీరు ఎంపికైనట్లు వివరించారు. భారత వైమానిక దళం ఏటా నిర్వహించే ఈ టోర్నమెంట్ దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైనదిగా వివరించారు. పోటీలకు వేల్పుల హరిణి, జంజీరాల రవళి, మోతే సాత్విక, మోతే హారతి, వడ్నాల వైష్ణవి, ముత్యాల శ్రీనిధి, గండికోట అంజలీ, ముత్యాల నందిని, ముల్కల హరిణి, కాంపెల్లి గౌతమి, భూపెల్లి భవ్యశ్రీ, బొంగాని హర్షి ణి, కలవేని శ్రీనిధి, పెరుక అక్షయ, ఎలిగేటి మధుప్రియ, పాలకుర్తి అనుప్రియ, మోతే అక్ష య, సామంతుల మానలు ఎంపికైనట్లు వివరించారు. వీరిని ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాస్‌రావు, ఉపాధ్యాలు అభినందించారు. జేఎంఈటీల నిరసన గోదావరిఖని: సింగరేణి బొగ్గు గనుల సంస్థ లో 2016, 2017 నుంచి పనిచేస్తున్న మైనింగ్ డిప్లొమా హోల్డర్లకు ప్రమోషన్ పాలసీ వెంట నే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఓసీపీ–1 సైటాఫీస్ వద్ద శుక్రవారం జేఎంఈటీలు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. కొ త్తగూడెంలో నిరాహార దీక్ష చేస్తున్న జూనియర్ ఇంజినీర్ మైనింగ్ ట్రైనీలు (జేఎంఈటీలు)ల కు మద్దతుగా ఈ ఆందోళన చేపట్టారు. అర్హత ఉన్నప్పటికీ సంవత్సరాల తరబడి తమకు ప్ర మోషన్లు నిలిచిపోయాయన్నారు. యాజమా న్యం చర్చలు జరిపి సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేశారు. హెడ్ ఓవర్ మెన్లు మాడుగు ల ప్రభాకర్‌రెడ్డి, మామిడి సాంబయ్య, కల్వల రమేశ్, వేముల రాజేశం, ఎలిగేటి ఆనందం, ఎం.సత్యనారాయణ, ఎ.రాజేశ్, నారాయణ, సమ్మయ్య, డీటీరావు పాల్గొన్నారు. మహిళా సాధికారత లక్ష్యం జ్యోతినగర్: మహిళా సాధికారత ఎన్టీపీసీ ల క్ష్యమని దీప్తి మహిళా సమితి అధ్యక్షురాలు రా ఖీ సామంత అన్నారు. మేడిపల్లి సెంటర్లోని వృత్తి విద్యాశిక్షణ కేంద్రంలో మహిళలకు మూ డు నెలల ఉచిత బ్యూటిషియన్ కోర్సును ఆ మె శుక్రవారం ప్రారంభించి మాట్లాడారు. ఎ న్టీపీసీ ప్రభావిత, పునరావాస గ్రామాల అభివృద్ధికి సీఎస్సార్ ద్వారా ప్రత్యేక నిధులు విడుదల చేస్తోందన్నారు. మహిళలకు ప్రాథమిక బ్యూటిషియన్ నైపుణ్యాలను అందించడంపై దృష్టి పెడుతున్నామని తెలిపారు. తద్వారా స్వయం ఉపాధి అవకాశాలను అన్వేషించి, మరింత ఆర్థిక స్వాతంత్య్రం సాధించేలా ప్రోత్సాహం అందిస్తున్నామని వెల్లడించారు. కార్యక్రమంలో దీప్తి మహిళా సమితి స భ్యులు, సీఎస్సార్ ప్రతినిధులు పాల్గొన్నారు. ‘మా గ్రామంలో మద్యం బంద్’ మంథని: గ్రామీణ సమాజంలో మద్యంతో ఏ ర్పడుతున్న అనేక సమస్యలకు చెక్ పెట్టాలనే ఉద్దేశంతో ఽజిల్లాలో అనేక గ్రామాల్లో ప్రజలు స్వచ్ఛందంగా మద్యం నిషేధానికి ఏకగ్రీవ తీ ర్మానాలు చేస్తున్నారు. ఇప్పటికే డివిజన్లో ప లు గ్రామాలు తీర్మానాలు చేసి అధికారులకు తమ నిర్ణయాలను తెలియజేశారు. మద్య ని షేధం సదరు గ్రామాల్లో అమలు అవుతోంది. తాజాగా శుక్రవారం మంథని మండలం ఎక్లాస్పూర్ గ్రామంలో మద్య నిషేధానికి పంచా యతీ పాలకవర్గం ఏకగ్రీవంగా తీర్మానం చే సింది. గ్రామసభలో మహిళలు, యువత పెద్దఎత్తున పాల్గొని మద్యంతో ఎదురవుతున్న ఇ బ్బందులను వివరించగా, గ్రామపెద్దలు, ప్ర జాప్రతినిధులు కలిసి ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఆర్డీవో సురేశ్‌ను కలిసి మద్యం నిషేధానికి సంబంధించిన వినతిపత్రాన్ని సమర్పించారు. గ్రామంలో మద్యం వి నియోగంతో కుటుంబాల ఆర్థిక పరిస్థితి దెబ్బతింటోందని, గృహహింస ఘటనలు పెరుగుతున్నాయని, యువత చెడు అలవాట్లకు గురవుతోందని వినతిపత్రంలో పేర్కొన్నారు. పంచాయతీ పాలకవర్గం తీర్మానం ప్రకారం గ్రా మ పరిధిలో ఈనెల 15 నుంచి మద్యం అ మ్మకాలు పూర్తిగా నిషేధించాలని నిర్ణయించారు. అక్రమంగా మద్యం విక్రయాలు జరిపితే కఠిన చర్యలు తీసుకోవాలని, జరిమానా విధించాలని కూడా స్పష్టం చేశారు. ఈ మేరకు గ్రామంలో ప్రత్యేక పర్యవేక్షణ కమి టీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. -
చేనేతకు చేయూత ఇవ్వాలి
● మేయర్ మహంకాళి స్వామి కోల్‌సిటీ: చేనేతకు చేయూత ఇవ్వాలని మేయర్ మహంకాళి స్వామి కోరారు. మున్సిపల్ కార్పొరేషన్ పద్మశాలీ సేవా సంఘం ఆధ్వర్యంలో మార్కండేయకాలనీలోని తెలంగాణ జాతిపిత కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి మేయర్ శుక్రవారం పూలమాల వేసి నివాళి అర్పించారు. చేనేత కార్మికులు బండి రాజన్న, మొగ్గం రూపకల్పన, తాటికొండ రాజమౌళి, సీనియర్ ఉపాధ్యాయుడు గడ్డం జానకిరాములును శాలువాలతో సత్కరించి మాట్లాడారు. కార్పొరేటర్లు దాసరి సాంబమూర్తి, వెంగల బాపు, పద్మశాలి సేవా సంఘం అధ్యక్షుడు బండారి రాజమల్లు, ప్రధాన కార్యదర్శి బూర్ల దామోదర్, గౌరవ అధ్యక్షుడు సిరిమల్ల జయరాములు, ముఖ్య సలహాదారులు సుంక లింగమూర్తి, సిరిపురం నరసయ్య, ముడతనపల్లి సారయ్య పాల్గొన్నారు. నాలాలను ఆక్రమిస్తే ఊరుకునేది లేదు నాలాలు ఆక్రమించి నిర్మాణాలు చేపడితే ఊరుకునేది లేదని మేయర్ మహంకాళి స్వామి హెచ్చరించారు. 3వ డివిజన్లోని ప్రశాంత్‌నగర్, వినాయక్‌నగర్‌లో కార్పొరేటర్ వడ్లూరి రవితో కలిసి మేయ ర్ డివిజన్ సందర్శన చేపట్టారు. శానిటేషన్ స్పెషల్ డ్రైవ్, కాలువల్లో పూడికతీత, చెట్లకొమ్మలు, పిచ్చిచెట్లు, పొదలతొలగింపు పనులు పరిశీలించి పలు సూచనలు చేశారు. అసిస్టెంట్ కమిషనర్ సంపత్‌కుమార్, ఏఈలు తేజస్విని, మనోజ్, శానిటరీ ఇన్స్పెక్టర్ నాగభూషణం, జూనియర్ అసిస్టెంట్ చంద్రారెడ్డి, ఎన్విరాన్ మెంటల్ ఇంజినీర్ మధుకర్ తదితరులు పాల్గొన్నారు. తల్లిపాలు అమృతంతో సమానం ఫెర్టిలైజర్‌సిటీ: తల్లిపాలు అమృతంతో సమానమని మేయర్ మహంకాళి స్వామి అన్నారు. గౌతమినగర్‌లో 21, 22, 23 46వ డివిజన్ అంగన్వాడీ కేంద్రాల ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో మేయర్ మాట్లాడారు. అనంతరం గర్భిణులకు సీమంతం, చిన్నారులకు అన్నప్రాసన చేశారు. కార్పొరేటర్లు కన్నూరి భాగ్యలక్ష్మి, బెంద్రం సునీత, ఐసీడీఎస్ సూపర్వైజర్ మమత, మెడికల్ ఆఫిసర్ అలేఖ్య తదితరులు పాల్గొన్నారు. -
రైల్వేకు కాసుల వర్షం
● నైనీబ్లాక్ బొగ్గు తెలంగాణకు రవాణా ● జైపూర్ ఎస్టీపీపీ, ఎన్టీపీసీకి తరలింపు ● ప్రతీరోజు 12వేల టన్నులు దిగుమతి లక్ష్యంగా ముందుకు.. రామగుండం: ఒడిశాలోని నైనీబ్లాక్(ఎన్సీబీ) నుంచి మంచిర్యాల జిల్లా జైపూర్‌లోని సింగరేణి థర్మల్ పవర్ ప్రాజెక్టు(ఎస్టీపీపీ) నుంచి తెలంగాణకు బొగ్గు రవాణా చేయడం ద్వారా రైల్వే శాఖకు కాసుల వర్షం కురుస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్(ఎన్టీపీసీ)తో సింగరేణికి కుదిరిన కొనుగోలు ఒప్పందం నేపథ్యంలో ఎన్టీపీసీకి 4 వేల టన్నుల బొగ్గు 59 వ్యాగన్ల(రేక్) ద్వారా నైనీబ్లాక్ నుంచి రవాణా ప్రారంభమైంది. అక్కడి నుంచి రోజూ కనీసం 12వేల టన్నుల బొగ్గును రైలు ద్వారా ఇక్కడకు తరలించాలని అధికారులు లక్ష్యంగా నిర్దేశించారు. నైనీ గని వార్షిక బొగ్గు ఉత్పత్తి సామర్థ్యం కోటి టన్నులు అని అధికారులు పేర్కొంటున్నారు. బొగ్గు రవాణా ఇటీవల ప్రారంభం కావడంతో వార్షికాదాయంపై రైల్వేఉన్నతాధికారులు ఇంకా అంచనాకు రాలేకపోతున్నారని సమాచారం. తొలిసారి నైనీ బొగ్గు.. ఒడిశాలోని నైనీకోల్ బ్లాక్ నుంచి హిందోల్ రైల్వేసైడింగ్ ద్వారా తెలంగాణలోని మంచిర్యాల జిల్లా జైపూర్ ఎస్టీపీపీకి బొగ్గు చేరుకోవడానికి 1,131 కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉంటుంది. ఇంత సుదీర్ఘ దూరానికి(లాంగ్ లీడ్ ఫ్రైట్) రోజూ వేలాది టన్నుల బొగ్గును వివిధ కేంద్రాలకు రవాణా చేయడం ద్వారా రైల్వేకు సంతృప్తికరమైన ఆదాయం సమకూరుతుందని భావిస్తున్నారు. రవాణా చార్జీలు ఇలా.. భారతీయ రైల్వే నిబంధనల ప్రకారం దేశీయంగా రవాణా యుపు బొగ్గుకు క్లాస్ – 145ఏ మేరకు చార్జీ లు వర్తింపజేస్తారు. రైల్వేలో బొగ్గు ఫ్రైట్ చార్జీలు స్థిరంగా ఉండవు. ప్రయాణించే దూరం, లోడింగ్ రకం ఆధారంగా ధరల్లో మార్పులు ఉంటాయి. చార్జీల అంచనాలు తొలిసారిగా ఎన్టీపీసీకి చేరిన నైనీబ్లాక్లోని బొగ్గు(ఫైల్), కోల్‌మైన్ ఈసీవోఆర్, దక్షిణమధ్య రైల్వేలకూ ఆదాయంఒడిశాలోని అంగుల్ జిల్లాలోగల నైనీ బొగ్గు బ్లాక్ నుంచి బొగ్గు రవాణాతో ఈస్ కోస్ట్ రైల్వే(ఈసీవోఆర్)తోపాటు దక్షిణ మధ్య రైల్వేకు ఫ్రైట్ చార్జీలతో కాసుల వర్షం కురుస్తుందని భావిస్తున్నారు. దక్షిణ మధ్యరైల్వే జోన్ పరిధిలో మంచిర్యాల, రామగుండం ఎన్టీపీసీ సికింద్రాబాద్ డివిజన్ పరిధిలోకి రానుండడంతో డివిజన్‌కు సమకూరే ఆదాయంతో రైల్వేస్టేషన్ల అభివృద్ధికి దోహదపడే అవకాశం ఉంటుంది. వీటితోపాటు ఒడిశా నుంచి తెలంగాణకు చేరుకునే క్రమంలో మధ్యలో సౌత్ ఈస్టర్న్ సెంట్రల్ రైల్వే (ఎస్ఈసీఆర్), ఈస్ట్ కోస్ట్ రైల్వే (ఈఎస్ఆర్) పరిధిలోని ఆదాయంగా కూడా సదరు జోన్లకు ఫ్రైట్ చార్జీల రూపంలో వెళ్తుంది. మొత్తంగా భారతీయ రైల్వే ఖజానాకు ఏటా రూ.వందల కోట్ల ఆదాయం సమకూరుతుందని భావిస్తున్నారు. -
అభ్యసన సామర్థ్యం పెంపు లక్ష్యం
● పక్కాగా ఎఫ్ఎల్ఎన్ అమలు ● కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశాలుపెద్దపల్లి: ఎఫ్ఎల్ఎన్ను సమర్థవంతంగా అమలు చేయడం ద్వారానే విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యం పెంపు సాధ్యమని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. జిల్లాలోని 180 ఎఫ్ఎల్ఎన్ కాంపిటెంట్ పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో కలెక్టరేట్లో శుక్రవారం నిర్వహించిన ప్రత్యేక కార్యాచరణపై సమీక్షలో కలెక్టర్ మాట్లాడారు. చదవడం, రాయడం, గణితంలో ప్రాథమిక నైపుణ్యాలను ప్రతీవిద్యార్థి తప్పనిసరిగా సాధించేలా కార్యాచరణ రూపొందించి అమలు చేయాలని ఆదేశించారు. ఎంఈవోలు, కాంప్లెక్స్ హెడ్మాస్టర్లు తరచూ పాఠశాలలను సందర్శించి ఎఫ్ఎల్ఎన్ కార్యక్రమాల అమలు తీరు పరిశీలించాలని సూచించారు. ఈ సమావేశంలో జిల్లా విద్యాశాఖాధికారి శారద, ఏఎంవో పీఎం షేక్, డీఆర్పీలు, ఎంఈవోలు, కాంప్లెక్స్ హెడ్మాస్టర్లు, 180 ఎఫ్ఎల్ఎన్ కాంపిటెంట్ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు. నీటి సంరక్షణ చర్యలు చేపట్టాలి గ్రామాల్లో భూగర్భ జలాలను పెంపొందించేందుకు జలసిరి కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేస్తూ, వీబీజీ రామ్ జీ పథకం ద్వారా నీటి సంరక్షణ నిర్మాణాలను పెద్దఎత్తున చేపట్టాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. కలెక్టరేట్లో జలసిరిపై కలెక్టర్ సమీక్షించారు. గ్రామాల్లో ప్రతిపాదించిన వ్యక్తిగత ఇంకుడుగుంతలు, సామూహిక ఇంకుడుగుంతలు, పంట కుంటల నిర్మాణాలను నిర్దేశిత లక్ష్యాలను సకాలంలో పూర్తిచేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీవో కాళిందిని, ఎంపీడీవోలు తదితరులు తదితరులు పాల్గొన్నారు. -
నవోదయ కావాలి
సాక్షి పెద్దపల్లి: పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన జిల్లాగా, తలసరి ఆదాయంలో రాష్ట్రంలో అగ్రస్థానాల్లో నిలిచిన పెద్దపల్లి జిల్లాకు ఇప్పటికీ జవహర్ నవోదయ విద్యాలయం ఏర్పాటుకు నోచుకోలేదు. జిల్లా ఏర్పడి ఏళ్లు గడిచినా గ్రామీణ ప్రాంతాల పేద, ప్రతిభావంతులైన విద్యార్థులకు ఉచితంగా నాణ్యమైన విద్య అందించే నవోదయ విద్యాలయం కోసం ప్రజలు, విద్యార్థి సంఘాలు, విద్యావేత్తలు నిరంతరం డిమాండ్ చేస్తున్నా ఫలితం లేదని ఆవేదన వ్యక్తమవుతోంది. ఎన్టీపీసీ, ఆర్ఎఫ్సీఎల్, కేశోరాం, జెన్కో, సింగరేణి వంటి జాతీయ స్థాయి పరిశ్రమలకు నిలయమైన జిల్లా రాష్ట్ర ఆర్థికాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నా, నవోదయ విద్యాలయానికి నోచుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. స్థానిక ప్రజల చిరకాల వాంఛ అయిన నవోదయ సాధనలో స్థానిక ఎంపీ గడ్డం వంశీకృష్ణ ప్రత్యేక చొరవ తీసుకోవాలని విద్యావేత్తలు, ప్రజలు కోరుతున్నారు. జిల్లాకు నవోదయ విద్యాలయం సాధించడంలో స్థానిక ఎంపీ గడ్డం వంశీకృష్ణ కీలక పాత్ర పోషించాల్సిన అవసరం ఉందని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. లోక్‌సభలో ఈ అంశాన్ని ప్రస్తావించడం, కేంద్ర విద్యాశాఖ మంత్రి, నవోదయ విద్యాలయ సమితి అధికారులతో సమావేశమై జిల్లా అవసరాన్ని వివరించడం, రాష్ట్ర ప్రభుత్వంతో సమన్వయం చేసి భూ కేటాయింపును వేగవంతం చేయించడం, జిల్లా యంత్రాంగంతో కలిసి మౌలిక వసతుల ఏర్పాటుకు చర్యలు తీసుకోవడం ద్వారా జిల్లాకు నవోదయ మంజూరయ్యే అవకాశాలు మెరుగుపడతాయని వారు సూచిస్తున్నారు. రాష్ట్రంలో ఇప్పటికే 9 నవోదయ విద్యాలయాలు ఉండగా, మరో 7 పాఠశాలలకు అనుమతి ఇచ్చినా రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదు. తెలంగాణలో ఇప్పటికే చాలా జిల్లాల్లో నవోదయ విద్యాలయాలు విజయవంతంగా కొనసాగుతున్నా, పెద్దపల్లి జిల్లా మాత్రం ఇప్పటికీ ఆ అవకాశానికి దూరంగా ఉండడం విద్యార్థులు, తల్లిదండ్రులను నిరాశకు గురిచేస్తోంది. ప్రైవేట్, కార్పొరేట్ విద్యను భరించే ఆర్థిక స్థోమత లేని కుటుంబాలకు నవోదయ విద్యాలయం ఒక గొప్ప అవకాశమని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. -
మొక్కుబడిగా ‘వార్డు బాట’
రామగుండం బల్దియా 7వ డివిజన్లో గురువారం నిర్వహించిన ‘వార్డు బాట’ కార్యక్రమం అధికారుల పనితీరుపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. మేయర్ స్వామి, కమిషనర్, అధికారులు పర్యటించిన రోడ్డుపైనే ఒకవైపు బురద, మరోవైపు ప్రమాదకర మ్యాన్‌హోల్ కనిపించింది. అదే మార్గంలో నడుచుకుంటూ వెళ్లిన ప్రజాప్రతినిధులు, అధికారులు ఆ మ్యాన్‌హోల్‌ను దాటుకుని వెళ్లారే తప్ప.. వెంటనే మూత ఏర్పాటు చేయాలని, ప్రమాద సూచికలు పెట్టాలని ఎలాంటి ఆదేశాలు ఇవ్వకపోవడం విమర్శలకు తావిస్తోంది. అధికారుల తనిఖీలు కేవలం మొక్కుబడిగానే సాగుతున్నాయనడానికి ఈ దృశ్యమే నిదర్శనమని పలువురు ఎద్దేవా చేస్తున్నారు. -
ఆశల ‘పోతలు’
ఇటీవల కురిసిన వర్షాలు రైతుల్లో గంపెడాశలు నింపాయి. ఎండిపోతున్న ఎల్లంపల్లి ప్రాజెక్టు నిండుకుండలా మారగా, మిడ్‌మానేరు, లోయర్ మానేరు డ్యాంలను ఎత్తిపోతలతో నింపుతున్నారు. ఎల్లంపల్లి నంది పంప్‌హౌజ్ నుంచి రోజూ 4 మోటార్లతో 12,600 క్యూసెక్కుల నీటిని నంది మేడారం రిజర్వాయర్‌లోకి నీరు ఎత్తిపోస్తున్నారు. ఇక్కడి నుంచి ఎగువ, దిగువ మానేరుతో పాటు కరీంనగర్, వరంగల్, రంగారెడ్డి, హైదరాబాద్, సిద్దిపేట జిల్లాలకు తాగు, సాగు నీటికి కాస్త ఉపశమనం కలిగిందంటున్నారు సంబంధిత అధికారులు. – సాక్షి ఫొటోగ్రాఫర్, పెద్దపల్లి -
పనైపోయిందా.. పట్టింపు గోవిందా
పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్లో పత్తి కొనుగోళ్ల సమయంలో వినియోగించే ఎలక్ట్రానిక్ తూకం మిషన్లను భద్రపరచాల్సిన అధికారులు, సిబ్బంది ఇలా కార్యాలయంలో నిర్లక్ష్యంగా పడేయడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రూ.లక్షల విలువైన మిషన్లను పనిలేని సమయంలో భద్రపరచకుండా పనికిరాని వస్తువుల్లా పడేయడం బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని విమర్శిస్తున్నారు. వర్షాలు, దుమ్ము, తేమ కారణంగా మిషన్లు దెబ్బతినే అవకాశం ఉందని, బాధ్యులపై చర్యలు తీసుకొని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. – పెద్దపల్లి -
నవోదయ లేకపోవడం సిగ్గుచేటు
ఎన్టీపీసీ, సింగరేణి, ఆర్ఎఫ్సీఎల్ వంటి భారీ పరిశ్రమలతో కోట్లాది రూపాయల ఆదాయం ఇస్తున్న జిల్లాలో నవోదయ పాఠశాల లేకపోవడం సిగ్గుచేటు. అలాగే రామగుండంలో మరో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు చేసేలా స్థానిక ఎంపీ, ప్రజాప్రతినిధులు ప్రయత్నాలు చేయాలి. – చిలుక శంకర్, ఐఎఫ్‌టీ అనుబంధ సంఘం నాయకుడు జిల్లాకు నవోదయ విద్యాలయాన్ని సాధించడం ప్రజాప్రతినిధుల బాధ్యత. స్థానిక ఎంపీ పూర్తిగా విఫలమయ్యారు. నవోదయ అంశంపై స్థానిక ఎంపీ కేంద్ర ప్రభుత్వంతో సమర్థవంతంగా చర్చించి జిల్లాకు మంజూరు చేయించడంలో చొరవ చూపాలి. – బండి రాజశేఖర్, ఏబీవీపీ జిల్లా కన్వీనర్ -
పంటలు ఎండిపోకుండా ఎస్సారెస్పీ నీరు
ఓదెల(పెద్దపల్లి): రైతులు సాగుచేసిన పంటలు ఎండిపోకుండా సీఎం దృష్టికి తీసుకెళ్లి ఎస్సారెస్పీ నీరందిస్తానని ప్రభుత్వ విప్ చింతకుంట విజయరమణారావు పేర్కొన్నారు. గురువారం ఓదెల మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో అనిల్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన మండల సభలో మాట్లాడారు. ప్రస్తుతం కురిసిన వర్షాలు పంటల సాగుకు సరిపోతాయని, మున్ముందు పంటలు ఎండిపోకుండా చివరి భూములకు నీరందిస్తానన్నారు. వచ్చే సమావేశాలకు వ్యవసాయ అధికారులు పూర్తి సమాచారంతో రావాలన్నారు. కుంటలు, చెరువులు, ప్రభుత్వ స్థలాల అన్యాక్రాంతంపై సర్పంచులు తీర్మానం చేసి సంబంధిత అధికారులకు ఇవ్వాలని సూచించారు. రూపునారాయణపేటకు విద్యుత్ సబ్‌స్టేషన్ మంజూరయినట్లు పేర్కొన్నారు. స్థలాన్ని గుర్తించి వేగంగా ప్రతిపాదనలు పంపాలని తహసీల్దార్‌ను ఆదేశించారు. అనంతరం హరిపురం సర్పంచ్ గ్యారవేని విజయనాగరాజు మాట్లాడుతూ, కొలనూర్ నుంచి హరిపురం దారిలో నాగులకుంట వద్ద కల్వర్టు నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని కోరారు. జీలకుంట, గోపరపల్లె సర్పంచులు రాగిడి మంగ, మద్దెవెని రవిలు మాట్లాడుతూ, గ్రామాల్లో సమస్యల పరిష్కారానికి ఆయా శాఖల అధికారులు చొరవ తీసుకోవాలన్నారు. జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ అధికారి రంగారెడ్డి, డీఎల్పీవో దేవకిదేవి, తహసీల్దార్ వనజానాయక్, ట్రాన్స్‌కో ఏడీఏ రవీందర్, డీఈఈ పద్మ పాల్గొన్నారు. -
అభివృద్ధి పనులకు అనుమతివ్వండి
గోదావరిఖని: రామగుండం నియోజకవర్గం అభివృద్ధి పనులకు అవసరమైన అనుమతులు మంజూరు చేయాలని ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్‌ఠాకూర్ కోరారు. గురువారం హైదరాబాద్‌లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్‌జాజును మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. నియోజకవర్గంలో ప్రతిపాదిత 800 మెగావాట్ల పవర్ ప్లాంట్ నిర్మాణం, ఈఎస్ఐ హాస్పిటల్, రైల్వే ఓవర్ బ్రిడ్జిల నిర్మాణంతో పాటు ఇతర పనులకు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల నుంచి అవసరమైన అనుమతులు త్వరగా మంజూరై పనులు ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిపై సానుకూలంగా పరిశీలించి పనులు వేగవంతం అయ్యేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు ఏర్పాట్లుపెద్దపల్లి: స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు ఘనంగా ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్ శ్రీరాములు ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. వేడుకలు కలెక్టరేట్లో జరుగుతాయని, పోలీస్, రెవెన్యూ శాఖ అధికారులు సమన్వయంతో పూర్తి చేయాలన్నారు. ప్రొటోకాల్ ప్రకారం సీటింగ్, వైద్య శిబిరాలు, అంబులెన్స్ తదితర ఏర్పాట్లు చేయాలన్నారు. పెద్దపల్లి రెవెన్యూ డివిజన్ అధికారి బి.గంగయ్య, కలెక్టరేట్ పరిపాలన అధికారి బండి ప్రకాష్, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఐటీఐల్లో రెండో దశ ప్రవేశాలకు దరఖాస్తులు పెద్దపల్లి: ప్రభుత్వ, ప్రైవేట్ యాజమాన్యంలోని ఐటీఐలు, ప్రైవేట్ పాలిటెక్నిక్ సంస్థలు, ఏటీసీల్లో 2026–27 విద్యాసంవత్సరానికి రెండో దశ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు ఎస్సెస్సీ మెమో తదితర ధ్రువపత్రాలతో iti.telangana.gov.inలో రూ.100 రుసుముతో దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వ ఐటీఐ పెద్దపల్లి ప్రిన్సిపాల్ వెంకట్‌రెడ్డి తెలిపారు. దరఖాస్తు అనంతరం విద్యార్థులు తమ సమీపంలోని హెల్ప్‌లైన్ కేంద్రానికి వెళ్లి ఈ–మెయిల్ ఐడీ, ఫోన్ నంబర్‌ను ధ్రువీకరించుకోవాలని సూచించారు. పూర్తి వివరాలకు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఐటీఐ, జిల్లా పరిశ్రమల అధికారి కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించారు. ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలి పెద్దపల్లి: రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలని బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు కుండె గణేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం మంచిర్యాల వెళ్తున్న సందర్భంగా పెద్దపల్లి కమాన్ చౌరస్తా వద్ద ఆయనకు బీజేవైఎం నాయకులు స్వాగతం పలికి సత్కరించారు. ఈ సందర్భంగా గణేశ్ మాట్లాడుతూ, రాష్ట్రంలోని సుమారు 40 లక్షల మంది విద్యార్థులకు అందాల్సిన రూ.15 వేల కోట్ల రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్లను తక్షణమే విడుదల చేయాలన్నారు. తమ హక్కులను కోరుతున్న విద్యార్థులను ‘క్రిమినల్ వేస్ట్‘గా అభివర్ణించడం సీఎం రేవంత్‌రెడ్డి అహంకారానికి, విద్యార్థులపై నిర్లక్ష్య వైఖరికి నిదర్శనమని విమర్శించారు. గత బీఆర్ఎస్, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాలు విద్యార్థులకు అన్యాయం చేశాయని ఆరోపించారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించకుంటే బీజేవైఎం ఆధ్వర్యంలో ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. జిల్లా కన్వీనర్ రామగిరి అఖిల్‌కుమార్, ఉప్పు కిరణ్, శివంగారి రాజేశ్, అన్వేశ్ తదితరులు పాల్గొన్నారు. -
సోలార్ పనులు పూర్తి చేయండి
కాల్వశ్రీరాంపూర్(పెద్దపల్లి): మండలకేంద్రంలో ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం ఆధ్వర్యంలో పీఎం కుసుము పథకంలో చేపట్టిన సోలార్ పవర్ ప్లాంట్‌లో ఈనెల 10 వరకు విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించేలా పనులు పూర్తి చేియాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. మండలకేంద్రంలోని పాండవుల గుట్టపై నిర్మిస్తున్న సోలార్ ప్లాంట్‌ను గురువారం కలెక్టర్ సందర్శించారు. పనుల్లో నాణ్యతకు ప్రాధాన్యత ఇస్తూ అన్ని ప్రక్రియలు వేగంగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. తహసీల్దార్ రాపెల్లి రాముడు, పీఏసీఎస్ చైర్మన్ చదువు రాంచంద్రారెడ్డి, ఏఎంసీ చైర్మన్ రామిడి తిరుపతిరెడ్డి, సీఈవో కోలేటి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అభివృద్ధి పనుల అంచనాలు సిద్ధం చేయాలి ముత్తారం(మంథని): గ్రామాల్లో అభివృద్ధి పనులు గుర్తించి అంచనాలు త్వరగా సిద్ధం చేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష పేర్కొన్నారు. గురువారం ముత్తారం మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన సర్వసభ్య సమావేశంలో మాట్లాడారు. అధికారులు క్షేత్రస్థాయిలో పని చేస్తూ ప్రజా సమస్యలకు సత్వర పరిష్కారం చూపాలన్నారు. వీబీజీరామ్‌జీ పథకంలో అభివృద్ధి పనులు నిర్ణీత కాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు. వ్యవసాయం, విద్య, వైద్యం, తాగునీరు తదితర అంశాలపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. సమావేశంలో పలువురు సర్పంచులు విన్నవించిన సమస్యలు విని, పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. స్పెషల్ ఆఫీసర్ రవీందర్, ఎంపీడీవో ప్రవీణ్‌కుమార్, తహసీల్దార్ మధుసూదన్‌రెడ్డి, ఎంఈవో హరిప్రసాద్, మండల సర్పంచుల కన్వీనర్ బియ్యని శివకుమార్, సర్పంచులు పాల్గొన్నారు. -
విద్యుత్ తీగలు సరి చేయండి
కోల్‌సిటీ(రామగుండం): నగరంలో వేలాడుతున్న విద్యుత్ తీగలను వెంటనే సరి చేయాలని ఎన్పీడీసీఎల్ అధికారులను రామగుండం నగర మేయర్ మహంకాళి స్వామి ఆదేశించారు. గురువారం 7వ డివిజన్ జీఎంకా లనీలో మున్సిపల్ కమిషనర్ జె.అరుణ్శ్రీ, కార్పొరేటర్ వెగోలపు రమాదేవి––శ్రీనివాస్‌తో కలిసి పర్యటించారు. చేతికి అందేంత ఎత్తులోనే విద్యుత్ తీగలు ఉండడంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని కార్పొరేటర్, కాలనీవాసులు మేయర్ దృష్టికి తీసుకెళ్లగా, వెంటనే ట్రాన్స్‌కో ఏఈకి ఫోన్ చేసి సాధ్యమైనంత త్వరగా సమస్య పరిష్కారం కావాలని ఆదేశించారు. వర్షాకాలానికి కంటే ముందే అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు చేసినా సింగరేణి, ఎన్టీపీసీ, ఆర్ఎఫ్సీఎల్ పట్టించుకోకపోవడంతో వాటిని ఆనుకొని ఉన్న 2ఏ మోరీ, వీర్లపల్లి, రామగుండం ప్రాంతాలు జలమయమయ్యాయన్నారు. అసిస్టెంట్ కమిషనర్ సంపత్‌కుమార్, ఈఈ శాంతిస్వరూప్, టీపీఎస్ నవీన్, ఏఈలు అన్వేశ్, మనోజ్, నరేశ్, శానిటరీ ఇన్‌స్పెపక్టర్ నాగభూషణం పాల్గొన్నారు. -
మధుర జ్ఞాపకాలు.. గురువులకు సన్మానాలు
గోదావరిఖని మార్కండేయకాలనీ లిటిల్ ఫ్లవర్ హైస్కూల్ 1997 పదో తరగతి బ్యాచ్ విద్యార్థులు ఎన్టీపీసీ సింధూర కళాశాల రోడ్డులోని శ్రీమయి హాల్లో బుధవారం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఒకేవేదికపై కలుసుకున్న పూర్వవిద్యార్థులు చిన్ననాటి మధుర జ్ఞాపకాలు నెమరువేసుకున్నారు. తమకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులు మల్లికార్జున్‌రెడ్డి, వెంకటరమణ, రమేశ్, నాగరాజును శాలువాలు కప్పి, పుష్పగుచ్ఛాలతో ఆత్మీయంగా సన్మానించారు. అనంతరం సహపంక్తి భోజనాలు చేశారు. క్రాంతిసుధ, చిందం స్వరూప, స్నేహలత, స్వప్న, పందిల్ల స్వరూప, కరుణాకర్, శ్రీనివాస్, చంద్రశేఖర్, ధర్మేందర్, శివ, కృష్ణ, రవి పాల్గొన్నారు. – జ్యోతినగర్ -
సేవా చేయడం సంతృప్తినిస్తుంది
జగిత్యాలజోన్: జిల్లా ప్రధాన న్యా యమూర్తి పోస్టు ఒక్క ఉద్యోగంగా కాకుండా, కక్షిదారులకు మెరుగైన సేవలు అందిస్తున్నామనే తృప్తి మిగులుతుంది. ఓ వైపు ఉ ద్యోగం.. మరో వైపు కుటుంబ బాధ్యతలను బ్యాలెన్స్ చేస్తుండటంతో హ్యాపీగా గడిచిపోతుంది. మహిళా అధి కారులుగా ఆఫీసు పనుల్లో ఎంత ఒత్తిడికి గురైనా.. ఆ భావం మన ముఖంపై కనిపించొద్దు. చిరునవ్వుతోనే చాలా సమస్యలు పరిష్కరించవచ్చనేది నా అభిప్రాయం – సి.రత్న పద్మావతి, జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జగిత్యాల కుటుంబ సహకారంతో ఉన్నత స్థానానికి ఎది గాను. మనం ఏ రంగంలో ఉన్నా అందులో ఉన్నత స్థానానికి ఎదగాలన్న కాంక్ష ఉండాలి. మహిళలు ఉద్యోగం.. కుటుంబ బాధ్యతలకు సమన్యాయం చేస్తున్నారు. కుటుంబంతోపాటు సమాజాన్ని అధ్యయనం చేస్తుండడంతో మరింత మెరుగ్గా బాధ్యతలు నిర్వహించే అవకాశం ఉంటుందనేది నా అభిప్రాయం. – జి.సునీత–రవీందర్‌రెడ్డి, జిల్లా మొదటి అదనపు జడ్జి, జగిత్యాల ఓ వైపు జడ్జీగా ఉద్యోగానికి, మరోవైపు కుటుంబానికి తగిన ప్రాధాన్యం ఇస్తాను. కోర్టులో జరిగిన విషయాలను ఇంట్లో, కుటుంబ విషయాలను కోర్టుల్లో మాట్లాడుకునే పరిస్థితి ఉండదు. ఎక్కడి బాధ్యతలు అక్కడే నిర్వర్తించుకోవాలి. మహిళా అధికారులుగా అనుకున్న లక్ష్యాలను సాధించి శభాష్ అనిపించుకోవాలి. – ఆర్.లావణ్య, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి, జగిత్యాల -
ఆమె సంతకం
● మహిళా అధికారులు.. పాలనలో ఆదర్శమూర్తులు ● ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 45 మంది అధికారిణులు ● అభివృద్ధి.. సంక్షేమం పరుగులు ● ఆదర్శంగా నిలుస్తున్న లేడీబాస్లు ఒక ఇంటిని చక్కదిద్దడమే కాదు, ఒక జిల్లాను, పరిపాలనా వ్యవస్థను ఎంత సమర్థంగా నడిపించగలరో మహిళా అధికారులు చేసి చూపుతున్నారు. ప్రజా సమస్యల పరిష్కారం, పారదర్శక పరిపాలన, సంక్షేమ పథకాల అమలు, న్యాయసేవలు, అభివృద్ధి కార్యక్రమాల్లో దూసుకెళ్తున్నారు. సేవాభావం, నాయకత్వపటిమతో కొత్త ప్రమాణాలు సృష్టిస్తున్న మహిళా అధికారులు నేటి యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ‘కలలు కనండి... కష్టపడండి... నాయకత్వం వహించండి’ అనే నమ్మకాన్ని బలపరుస్తున్నారు. -
ఎవరూ ఖాళీగా ఉండద్దు
జిల్లాలో నిరుద్యోగ సమస్య చాలా ఉంది. ఉద్యోగాలు కావాలని ప్రజావాణికి వస్తున్నారు. ప్రభుత్వ, అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు కావాలని ఆశిస్తున్నారు. కానీ ప్రభుత్వ పథకాలను వినియోగించుకుని స్వయం ఉపాధి సాధించాలి. ఆ దిశగా యువకుల్లో అవగాహన సదస్సులు నిర్వహించాలని ప్రణాళిక సిద్ధం చేశాం. యువకులు ఎవరూ ఖాళీగా ఉండొద్దు. వారి కోసమే జాబ్‌మేళాలు నిర్వహిస్తూ.. ప్రైవేటు రంగంలో ఉపాధి కల్పిస్తున్నాం. వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి ఉద్యోగావకాశాల సమాచారాన్ని ఎప్పటికప్పుడు చేరవేస్తున్నాం. – నిర్మల, జిల్లా ఉపాధి కల్పన అధికారి -
స్కూల్ యూనిఫామ్ ధరించి విధులకు హాజరైన ఉపాధ్యాయుడు
కాల్వశ్రీరాంపూర్: పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలంలోని తారుపల్లి జెడ్పీహైస్కూల్ ఇంగ్లిష్ ఉపాధ్యాయుడు కూరపాటి సత్యప్రకాశ్‌రావు బుధవారం స్కూల్ యూనిఫామ్ ధరించి విధులకు హాజరయ్యారు. విద్యార్థులతో మమేకమై పాఠాలు వింటూ, మొక్కలు నాటారు. తాను చదువుకునే సమయంలో కాళ్లకు కనీసం చెప్పులు, మంచిబట్టలు కూడా లేవని, చిరిగిన దుస్తులు ధరించి బడికి వెళ్లాలనని గుర్తు చేసుకున్నారు. బలపాలు ఉండేవి కావన్నారు. చెక్కపలకపై బొగ్గు, ఆకుపసరుతో అక్షరాలు రాసి చదువుకున్నామని తెలిపారు. కరెంట్ లేదని, కిరోసిన్ దీపాల వెలుగులో చదువుకున్నామన్నారు. పెన్నులు, పుస్తకాలు ఉండేవి కావని ఆయన చెబుతూ ఉంటే విద్యార్థులు విస్తుపోయారు. తాము అనేక కష్టాలతో విద్యాభ్యాసం చేశామని, ప్రస్తుతం ప్రభుత్వం అన్నీ ఉచితంగా అందిస్తోందని, విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రూ.వేలు వెచ్చించి ప్రైవేట్ పాఠశాలల్లో చేరవద్దని, సర్కారు బడిలో ఉచిత విద్య నేర్చుకోవాలని సందేశం ఇచ్చేందుకే తాను స్కూల్ విద్యార్థుల యూనిఫాం ధరించి విధులకు హాజరయ్యానని సత్యప్రకాశ్‌రావు అనంతరం విలేకరులకు వివరించారు. ఆయన ఇప్పటికే అనేకమంది పేదల విద్యార్థులకు ఫీజు చెల్లించారు. డిక్షనరీలు, నోటుపుస్తకాలు, విద్యాసామగ్రి ఉచితంగా అందజేశారు. అనేకసార్లు రక్తదానం చేశారు. తెలంగాణ ఉద్యమంలోనూ చురుగ్గా పాల్గొన్నారు. ఒకేపేజీలో 12 నెలల క్యాలెండర్ రూపొందించారు. అనేక ప్రత్యేకతలు ఉన్న ఆయనను పలువురు అభినందించారు. -
మేయర్‌తో కార్పొరేటర్ల పిక్నిక్!
● డీజే కార్యక్రమంలో స్వల్ప ఉద్రిక్తత ● ఖండించిన మహంకాళి స్వామి కోల్‌సిటీ: రామగుండం మేయర్ మహంకాళి స్వామి ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన పిక్నిక్లో పలువురు కార్పొరేటర్లతోపాటు వారి కుటుంబ సభ్యులు భారీసంఖ్యలో హాజరయ్యారు. బసంత్‌నగర్ సమీపంలోని బుగ్గ రామస్వామి ఆలయ పరిసరాల్లోని పిక్నిక్ స్పాట్‌ను సందర్శించిన సందర్భంగా సుమారు 40 మందికిపైగా కార్పొరేటర్లు తమ కుటుంబ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు హాజరై సందడి చేశారు. ప్రజాప్రతినిధుల్లో జోష్.. తమకు తగిన ప్రాధాన్యం కల్పించడం లేదని, ప్రొటోకాల్ పాటించడం లేదని ఆరోపిస్తూ పార్టీలకు అతీతంగా పలువురు కార్పొరేటర్లు కొద్దిరోజుల క్రితం బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో నిర్వహించిన కార్పొరేటర్ల శిక్షణకు కూడా ముగ్గురే హాజరుకాగా, మిగిలినవారు గైర్హాజరై నిరసన తెలిపారు. అనంతరం పలువురు కార్పొరేటర్లు మేడారంలోని సమ్మక్క–సారలమ్మ వనదేవతలను దర్శించుకోవడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. ఈ పరిణామాల నేపథ్యంలో మేయర్ ఆధ్వర్యంలో జరిగిన పిక్నిక్కు అసంతృప్తి కార్పొరేటర్లతో జతకట్టిన కొందరు కార్పొరేటర్లు కుటుంబ సభ్యులతో హాజరుకావడం ప్రాధాన్యం సంతరించుకుంది. వారిని బుజ్జగించడానికే పిక్నిక్ ఏర్పాటు చేశారని ప్రచారం జరిగింది. అయితే పిక్నిక్ జోష్ నింపిందని పలువురు ప్రజాప్రతినిధులు వెల్లడిస్తున్నారు. డీజే కార్యక్రమంలో స్వల్ప ఉద్రిక్తత పిక్నిక్లో విందు, వినోద కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులు ఉల్లాసంగా గడిపారు. ఈ సందర్భంగా డీజే కార్యక్రమంలో స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకున్నట్లు ప్రచారం జరిగినా... అలాంటిదేమీలేదని మేయర్ మహంకాళి స్వామి స్పష్టం చేశారు. కాంగ్రెస్ సీనియర్ నాయకులు, కాంగ్రెస్ పార్టీతోపాటు తమకు మద్దతు ఇచ్చిన ఇతర పార్టీల కార్పొరేటర్లు, తన విజయానికి కృషి చేసిన కార్యకర్తలు, వారి కుటుంబ సభ్యులతో కలిసి ఆత్మీయంగా గడిపేందుకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని, ప్రశాంతంగా, ఆనందంగా కార్యక్రమం ముగిసిందని మేయర్ ‘సాక్షి’కి తెలిపారు. -
బొగ్గు లారీలపై చర్య తీసుకోవాలి
● రామగుండం సీపీ అంబర్ కిశోర్‌ఝా గోదావరిఖని: నిబంధనలు విస్మరించి రాకపోకలు సాగిస్తున్న బొగ్గు లారీలపై చర్య తీసుకోవాలని పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా ఆదేశించారు. తన కార్యాలయంలో బుధవారం జరిగిన శాంతిభద్రతలు, ట్రాఫిక్, రవాణాశాఖ అధికారులతో ఆయన సమావేశమయ్యారు. రోడ్డు ప్రమాదాల నివారణతోపాటు ప్రజల సురక్షిత ప్రయాణమే ప్రధాన లక్ష్యంగా రోడ్డు భద్రతా నిబంధనలను కట్టుదిట్టంగా అమలు చేయాలన్నారు. ఇసుక, బొగ్గు(కోల్), యాష్ తదితర రవాణా వాహనాలు టార్పాలిన్ కవర్లతో కప్పి తరలించాలని స్పష్టం చేశారు. నిబంధనలు పాటించని వాహన యజమానులు, డ్రైవర్లపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పరిమితికి మించి విద్యార్థులను తరలించే ఆటోలు, వాహనాపైనా కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. రోడ్డు ప్రమాద బాధితులకు సకాలంలో సహాయం అందించే రహ్–వీర్ పథకంపై అవగాహన కల్పించాలని సూచించారు. రామగుండం ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్, మంచిర్యాల డీటీవో గోపీకృష్ణ, రామగుండం, పెద్దపల్లి, మంచిర్యాల ట్రాఫిక్ సీఐలు రాజేశ్వరరావు, శ్రీనివాస్, హనన్, మంచిర్యాల మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ లక్ష్మణ్ పాల్గొన్నారు. పెట్టుబడుల్లో మోసాలపై అప్రమత్తం ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్‌పై అప్రమత్తంగా ఉండాలని పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ జా సూచించారు. స్థానిక ఇల్లెందు క్లబ్లో ‘సింగరేణి హెచ్వోడీలు, అధికారులకు సురక్షా తిరంగా – సైబర్ స్వతంత్ర తెలంగాణ’పై అవగాహన కల్పించారు. తొలుత ప్రచార పోస్టర్ విడుదల చేశారు. సైబర్ మోసాలపై అవగాహన కల్పించారు. పెద్దపల్లి డీసీపీ రాంరెడ్డి, సింగరేణి ఆర్జీ–1 జీఎం లలిత్‌కుమార్, సైబర్‌క్రైం, గోదావరిఖని ఏసీపీలు రంగారెడ్డి, రమేశ్, గోదావరిఖని వన్‌టౌన్ ఇన్స్పెక్టర్ ఆఫ్జల్, రామగుండం సైబర్‌క్రైం సీఐ శ్రీనివాస్, రాణాప్రతాప్, ట్రాఫిక్ సీఐ రాజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
ఎక్కువ మంది మహిళలు ఉండడం సంతోషకరం
కరీంనగర్‌అర్బన్: కలెక్టర్ చిత్రామిశ్రా పాలనలో పనిచేయడం చాలా సంతోషంగా ఉంది. ఒక మహిళ అధికారిగా ఆమె దిశానిర్ధేశం బాగుంది. ఎక్కువ సంఖ్యలో మహిళలే అధికారులుగా ఉండటం సంతోషకర పరిణామం. ప్రజలకు మరింత సేవ చేయాలనే కాన్ఫిడెన్స్ పెరిగింది. సహచరుల సహకారం, ఉన్నతాధికారుల మార్గదర్శకత్వం నాకు ప్రేరణగా నిలుస్తాయి. – షర్మిళ, కరీంనగర్ ఆర్డీవో కరీంనగర్‌అర్బన్: మహిళా అధికారిగా పనిచేయడం.. సమాజంలో మార్పు తీసుకురావడానికి లభించిన గొప్ప అవకాశం. మహిళలు, పిల్లలు, దివ్యాంగులు, వద్ధులు, ట్రాన్స్‌జెండర్స్ సంక్షేమం కోసం పనిచేయడం ఎంతో ఆత్మసంతృప్తినిస్తుంది. ప్రతీ సవాలును ధైర్యంగా ఎదుర్కొంటూ.. అర్హులైన ప్రతీ లబ్ధిదారుడికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు చేరేలా కృషి చేయడమే నా ప్రధాన లక్ష్యం. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకోవడం, వారి సమస్యలకు పరిష్కారం చూపడం నా ఉద్యోగంలో అత్యంత విలువైన అంశం. – సరస్వతి, జిల్లా సంక్షేమాధికారి, కరీంనగర్ పరిపాలనలో లభిస్తున్న అవకాశాలు, బాధ్యతలు మాపై మరింత జవాబుదారీతనాన్ని పెంచుతున్నాయి. ప్రజలకు పారదర్శకంగా, వేగవంతంగా సేవలు అందించడమే మా ప్రధాన లక్ష్యం. ప్రస్తుతం ప్రతీ రంగంలో మహిళలు రాణిస్తున్నారు. కుటుంబ, పరిపాలన బాధ్యతలను సమర్థంగా నిర్వహించగలమని నిరూపిస్తున్నారు. ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ, అంకితభావం ఉంటే ఏ లక్ష్యాన్నైనా చేరుకోవచ్చు. మహిళా సాధికారత అంటే సమాజంలో సానుకూల మార్పునకు నాయకత్వం వహించడం. ఆ దిశగా ప్రతి మహిళ ముందుకురావాలి. – అరుణశ్రీ, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, పెద్దపల్లి -
కాలువలోపడి సెక్యూరిటీ సూపర్వైజర్ మృతి
రామగుండం: స్థానిక ఇండియన్ ఆయిల్ కా ర్పొరేషన్ లిమిటెడ్ (ఐవోసీఎల్)లో సెక్యూరిటీ సూపర్వైజర్గా పనిచేస్తే నయీం(50) పెద్ద పల్లి జిల్లా రామగుండం అక్బర్‌నగర్‌లోని ఎన్టీపీసీ బూడిద కాలువలో బుధవారం ప్రమాదవశాత్తు పడి మృతిచెందాడు. ఎస్సై సంధ్య కథ నం ప్రకారం.. కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌కు చెందిన నయీం స్థానిక ఐవోసీ లో సెక్యూరిటీ సూపర్వైజర్గా పనిచేస్తున్నా డు. అక్కడి నుంచి రోజూ రైలులో వచ్చి వెళ్తున్నాడు. ఈ క్రమంలో బుధవారం విధులు ము గించుకొని ద్విచక్ర వాహనంపై రైల్వేస్టేషన్‌కు వెళ్తుండగా అక్బర్‌నగర్‌లోని బూడిదకాలులో బైక్ అదుపు తప్పి పడి చనిపోయాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గోదావరిఖని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొన్నారు. ఆస్తికోసమే తండ్రి హత్య ● మద్యానికి డబ్బులు ఇవ్వడంలేదని ఆగ్రహం ● తండ్రిని చంపిన కుమారుడి అరెస్ట్ ఓదెల: మద్యం కోసం డబ్బులు ఇవ్వడంలేదని, హతమార్చితే ఆస్తి మొత్తం దక్కించుకోవచ్చుని భావించిన మేకల బాబురావు తన తండ్రి మేకల మాదయ్య(76)ను హత్య చేసినట్లు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ సీఐ రంజిత్‌రావు, పొత్కపల్లి ఎస్సై సనత్‌కుమార్‌రెడ్డి తెలిపారు. సుల్తానాబాద్ సర్కిల్ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఘటన వివరాలు వెల్లడించారు. వారి కథనం ప్రకారం.. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం మడక గ్రామానికి చెందిన బాబురావు ఉద్యోగం చేయకుండా మద్యం, గుట్కాకు బానిసయ్యాడు. సింగరేణి రిటైర్డ్ ఉద్యోగి అయిన తనతండ్రిని మంగళవారం పింఛన్ డబ్బులు ఇవ్వాలని అడుగగా.. తనవద్ద లేవని చెప్పాడు. ఆగ్రహంతో ఇంట్లోఉన్న పెద్దరాయిని తండ్రి చాతి, తల, కాళ్లపై తీవ్రంగా బాదాడు. దీంతో మాదయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. ఆ తర్వాత నిందితుడు పారిపోయాడు. మడక బస్‌స్టాప్ వద్ద నిందితుడు ఉన్నట్లు సమాచారం అందడంతో అక్కడకు వెళ్లి అరెస్టు చేశారు. మృతుడి పెద్దకూతురు చందా సరోజన ఫిర్యాదు మేరకు బాబురావుపై కేసు నమోదు చేసి ఓదెల కోర్టులో హాజరుపర్చినట్లు సీఐ, ఎస్సై వివరించారు. సరదా కోసం వచ్చి.. గోదావరిలో మునిగి.. రామగుండం: మిత్రులతో కలిసి సరదా కోసం గోదావరినదికి వచ్చి చేపలు వేటాడుతూనే, స్విమ్మింగ్ చేసే క్రమంలో ప్రమాదవశాత్తు గుంతలో పడి మృతిచెందిన ఘటన పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం గోలివాడ శివారు లో బుధవారం జరిగింది. ఎస్సై వెంకటస్వా మి కథనం ప్రకారం.. గోదావరిఖని వకీల్‌పల్లిగనిలో విధులు నిర్వహించే సింగరేణి ఉద్యోగి కూన రాజ్‌కుమార్(32) బుధవారం మిత్రుల తో కలిసి గోలివాడ శివారులోని గోదావరినది వద్దకు వచ్చాడు. మిత్రులతో కలిసి సరదాగా చేపలు పడుతూ నీటిలో స్విమ్మింగ్ చేస్తూ ఉన్నాడు. ఈక్రమంలో రాజ్‌కుమార్ నీటిలో మునిగి కనిపించకుండా పోయయాడు. మిత్రులు ఆందోళన చెంది పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై వెంటనే రెస్క్యూ టీంతో వచ్చిగాలింపు చర్యలు చేపట్టగా మృతదేహం లభ్యమైంది. రాజ్‌కుమార్ ప్రస్తుతం మంచిర్యాల జిల్లా మందమర్రిలోని గణేశ్‌నగర్‌లో నివాసం ఉంటున్నాడు. స్వగ్రామం పెద్దపల్లి జిల్లా నందిమేడారం. మృతుడికి భార్య అఖిల, కుమారుడు హరీశ్ ఉన్నారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొన్నట్లు ఎస్సై పేర్కొన్నారు. జ్యోతినగర్: తెలంగాణ ఉద్యమకారులను రాష్ట్రప్రభుత్వం విస్మరించడం బాధాకరమని తెలంగాణ ఉద్యమకారుల సమితి రాష్ట్ర అధ్యక్షుడు తోడేటి శంకర్‌గౌడ్ అన్నారు. ఎన్టీపీసీ ఆటోనగర్ ఐఎఫ్టీయూ కార్యాలయంలో బుధవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల సమయం, రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో ఎన్టీపీసీ పట్టణ కమిటీ బలోపేతం, సభ్యత్వ నమోదు, ఉద్యమకారుల సమస్యలపై భవిష్యత్ కార్యాచరణ, రాష్ట్రవ్యాప్తంగా చేపట్టాల్సిన ఆందోళన కార్యక్రమాలపై విస్తృతంగా చర్చించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారుల సమితి జనరల్ సెక్రటరీ చిలుక శంకర్, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఈదునూరి పర్వతాలు, శంకర్, వంశీ, చందు, సురేశ్, వోల్లాల మల్లేశ్, వీరాలాల్, మామిడాల శంకరయ్య, గుండేటి కిశోర్, నారాయణ, మల్లేశ్, కుమార్, పొన్నం విజయ్‌గౌడ్, మేకల సరోజన, శాంత తదితరులు పాల్గొన్నారు.


