10వేల మందితో తిరంగా యాత్ర | - | Sakshi
Sakshi News home page

10వేల మందితో తిరంగా యాత్ర

Aug 12 2026 12:22 AM | Updated on Aug 12 2026 12:22 AM

పెద్దపల్లి: స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈనెల 13న జిల్లా కేంద్రంలో 10వేల మందితో తిరంగా యాత్ర నిర్వహించనున్నట్లు బీజేపీ జిల్లా అధ్యక్షుడు కర్రె సంజీవరెడ్డి తెలిపారు. జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మంథని, రామగుండం నియోజకవర్గ కేంద్రాల్లో ర్యాలీ ఉంటుందని తెలిపారు. యాత్రకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు, ఉపాధ్యక్షుడు గుజ్జుల రామకృష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్యే కాసిపేట లింగయ్య, మాజీ ఎంపీ వెంకటేశ్‌ నేత తదిరతులు హాజరుకానున్నారని చెప్పారు. ఈకార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో నాయకులు గొట్టిముక్కల సురేశ్‌రెడ్డి, ఉషణ అన్వేష్‌, కావేటి రాజగోపాల్‌, మధుకరన్‌, పెంజర్ల రాకేశ్‌ యాదవ్‌, శివంగారి సతీశ్‌, రాజం మహంతకృష్ణ, రామగిరి అఖిల్‌, పూదరి హరీశ్‌, రజనీకర్‌రెడ్డి, గాదాసి సతీశ్‌, షిండే శివసాయి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement