యైటింక్లయిన్‌కాలనీ: పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్ యైటింక్లయిన్‌కాలనీ పెట్రోల్ బంక్ సమీపంలో మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో భూమయ్య అనే సింగరేణి కార్మికుడు తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికుల తెలిపిన వివరాల ప్రకారం.. సింగరేణి ఓసీపీ–3 క్వాంటీన్‌లో కుక్‌గా పనిచేసే భూమయ్య పనులు ముగించుకుని కాలనీ నుంచి పోతనకాలనీకి వెళ్తున్నాడు. ఈక్రమంలో కాలనీపెట్రోల్ బంక్ సమీపంలో బైక్ అదుపు తప్పి కింద పడిపోయాడు. తలకు తీవ్రంగా గాయాలు కాగా గమనించిన స్థానికులు గోదావరి సింగరేణి ఏరియా ఆస్పత్రికి తరలించారు.


