నిరుద్యోగులకు లైబ్రరీలు | - | Sakshi
Sakshi News home page

నిరుద్యోగులకు లైబ్రరీలు

Aug 12 2026 12:22 AM | Updated on Aug 12 2026 12:22 AM

పోటీ పరీక్షల పుస్తకాలు

● పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులు

● పలువురికి సర్కారు కొలువులు

● నేడు నేషనల్‌ లైబ్రేరియన్స్‌ డే

బోయినపల్లి(చొప్పదండి): నిరుద్యోగులకు సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని గ్రంధాలయం పోటీ పరీక్షలకు సన్నద్ధం చేయడంలో సహకారం అందిస్తోంది. డబ్బులు వెచ్చించి కోచింగ్‌ లేకుండా లైబ్రరీలో ఉచితంగా పుస్తకాలు చదివి పోటీ పరీక్షల్లో పలువురు ప్రభుత్వ ఉద్యోగాలు సాధిస్తున్నారు. ఏటా ఆగస్టు 12న నేషనల్‌ లైబ్రేరియన్స్‌ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం.

సిరిసిల్లలో ఆధునిక లైబ్రరీ

సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఆధునిక హంగులతో గ్రంధాలయ భవనం నిర్మించారు. రోజుకు 150 మంది పాఠకులు హాజరు అవుతారు. పోటీ పరీక్షల పుస్తకాలు, తెలుగు అకాడమీ తదితర సుమారు 32 వేలకు పైగా అందుబాటులో ఉన్నాయి. అలాగే జిల్లాలో 9 గ్రంధాలయాలు ఉన్నాయి. బోయినపల్లి, చందుర్తి, సిరిసిల్ల, ఇల్లంతకుంట, ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేటలో, వేములవాడ తదితర స్వంత భవనాలు 8 ఉన్నాయి. ముస్తాబాద్‌లో అద్దె లేకుండా ఓ భవనంలో విధులు నిర్వహిస్తున్నారు.

లైబ్రరీ పోస్టులన్నీ ఖాళీలే

జిల్లాలో 9 లైబ్రేరియన్‌ పోస్టులు ఉండాల్సి ఉండగా అన్ని ఖాళీలే ఉన్నాయి. కేవలం గ్రేడ్‌–2 లైబ్రరీయన్‌ ఒకరు, గ్రేడ్‌–3 లైబ్రేరియన్‌ ఒకరు మాత్రమే ఉన్నారు. ముగ్గురు ఔట్‌సోర్సింగ్‌ లైబ్రేరియన్స్‌, ఒక అటెండర్లు, ఇద్దరు పార్ట్‌టైం స్వీపర్లు ఆయా చోట్ల విధులు నిర్వహిస్తున్నారు.

సిరిసిల్లలోని లైబ్రరీలో పోటీ పరిక్షల పుస్తకాలు ఉన్నాయి. నిరుద్యోగులు పైసా ఖర్చు లేకుండా పలు ఉద్యోగాలకు సంబందించిన స్టడీ మెటేరియల్‌ చదివే అవకాశాన్ని కల్పించాం. సద్వినియోగం చేసుకోవాలి.

– శంకరయ్య, జిల్లా గ్రంధాయల సంస్థ,

కార్యదర్శి, సిరిసిల్ల

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement