breaking news
Nizamabad
-
బయటికి రావాలంటే రూ.84 లక్షల బ్లడ్‌మనీ చెల్లించాల్సిందే..
నిజామాబాద్: పొట్టకూటి కోసం వలస వెళ్లిన యువకుడు సౌదీ అరేబియా దేశంలోని రియాద్ జైలులో మగ్గుతున్నాడు. అతడిపై ఎన్నో ఆశలు పెట్టుకున్న దివ్యాంగురాలైన భార్య చంటి బిడ్డను పట్టుకుని భర్త రాకకోసం వేయి కళ్లతో ఎదురు చూస్తోంది. తమ బిడ్డ తిరిగి రావాలని ఆ యువకుడి తల్లిదండ్రులు దేవుళ్లను వేడుకుంటున్నారు. కుటుంబాన్ని కష్టాల నుంచి గట్టెక్కిస్తాననే ఆశతో వలస వెళ్లిన యువకుడు శ్రావణ్‌కుమార్ కుటుంబ పరిస్థితి ఇది. సాలూర మండలం కుమ్మన్‌పల్లి గ్రామానికి చెందిన కుమ్మరి రామయ్య, రాజమణి దంపతుల కుమారుడు శ్రావణ్‌కుమార్ (32). జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం చింతల్‌పేటకు చెందిన దివ్యాంగురాలు మమతను 2022లో శ్రావణ్ పెళ్లి చేసుకున్నాడు. 2023 నవంబర్‌లో ఉపాధి కోసం సౌదీ అరేబియా దేశం రియాద్‌కు వెళ్లిన శ్రావణ్ అక్కడి ఓ ప్రైవేట్ మెడికల్ రీసెర్చ్ కంపెనీలో అంబులెన్స్ డ్రైవర్‌గా పనిలో చేరాడు. మంచి ఉద్యోగం రావడంతో తన కలలు సాకరమవుతాయని సంబురపడిన శ్రావణ్‌పై కోలుకోలేని దెబ్బపడింది. 2024 మే 6వ తేదీన శ్రావణ్ నడుపుతున్న అంబులెన్స వాహనం రోడ్డు ప్రమాదానికి గురికాగా.. ఈ ప్రమాదంలో స్థానికులైన భార్యాభర్తలు మృతి చెందారు. ఇద్దరు పిల్లలకు తీవ్రగాయాలయ్యాయి. అక్కడి పోలీసులు శ్రావణ్‌ను అరెస్టు చేసి జైలు తరలించారు. కొన్ని నెలల్లోనే అక్కడి న్యాయస్థానం తీర్పు వెలువరించింది. రోడ్డు ప్రమాద ఘటనకు శ్రావణ్‌కుమార్‌ను నేరస్థుడిగా నిర్ధారించింది. రూ.3.30 లక్షల సౌదీ రియాళ్లు (బ్లడ్ మనీ – రక్తపరిహారం) బాధితకుటుంబానికి చెల్లించాలని తీర్పులో పేర్కొంది. మన దేశ కరెన్సీలో ఆ మొత్తం సుమారు రూ.84 లక్షలు. బాధిత కుటుంబాల అంగీకారం మేరకు పరిహారం చెల్లిస్తే శ్రావణ్‌కుమార్‌కు జైలు నుంచి విముక్తి పొందే అవకాశం కలుగుతుంది. పరిహారం చెల్లించకపోతే జైలు నుంచి విడుదలయ్యే పరిస్థితి ఉండదు. అంత పెద్ద మొత్తంలో పరిహారం చెల్లించే ఆర్థిక స్థోమత లేక శ్రావణ్‌కుమార్ కుటుంబీకులు నిస్సహాయ స్థితిలో ఆపన్న హస్తం కోసం ఎదురు చూస్తున్నారు. శ్రావణ్‌కుమార్ పై అక్కడి దేశం ట్రావెలింగ్ బ్యాన్ ఆంక్షలు పెట్టింది. గడపగడపకు వెళ్తున్న మమత తన భర్తను జైలు నుంచి విడిపించాలని దివ్యాంగురాలైన మమత కొన్ని నెలలుగా ప్రజాప్రతినిధులను వేడుకుంటోంది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌తోపాటు నిజామాబాద్, జగిత్యాల జిల్లాకు చెందిన ఎంపీకి, పలువురు ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు వినతి పత్రాలు అందజేసింది. ఈ ఏడాది మే 29న హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రవాసీ ప్రజావాణిలో తమ పరిస్థితిని వివరించింది. తన భర్తను తీసుకురావాలని వేడుకుంది. ప్రభుత్వం ఆదుకోవాలి మాది నిరుపేద కుటుంబం. కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్న నా కొడుకు రెండేళ్ల నుంచి సౌదీ అరేబియా జైలులో ఉన్నాడు. రెక్కల కష్టంపై బతుకుతున్నాం. మాకు ఎలాంటి ఆస్తులు లేవు. లక్షల రూపాయలు ఎక్కడి నుంచి తీసుకురావాలి. – కుమ్మరి రామయ్య, శ్రావణ్‌కుమార్ తండ్రి మమ్మల్ని ఆదుకోండి ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు, మానవతావాదులు స్పందిస్తేనే మా కుటుంబం ఈ గండం నుంచి గట్టెక్కుతుంది. నేనే దివ్యాంగురాలిని చంటి బిడ్డను పట్టుకుని తిరుగుతున్నా. మా అత్తామామలు తల్లడిల్లుతున్నారు. సౌదీ అరేబియా కోర్టు చెప్పిన జరిమానా చెల్లించే స్థోమత మాకు లేదు. – మమత, శ్రావణ్‌కుమార్ భార్య -
2,11,864
ఓట్ల తొలగింపు!● ముగిసిన ఎస్ఐఆర్ ప్రక్రియ ● ఈనెల 17 నుంచి అభ్యంతరాల స్వీకరణ ● అక్టోబర్ 15 వరకు పరిష్కారం ● 19న తుది ఓటరు జాబితానిజామాబాద్ అర్బన్: జిల్లాలోని ఆరు నియోజకవర్గాల్లో సోమవారంతో ఎస్ఐఆర్ ప్రక్రియ ముగిసింది. మొత్తం 2,11,864 ఓట్లు తొలగిపోనున్నాయి. 1,565 మంది బీఎల్వోలు 14,39,734 ఓట్లకు సంబంధించిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ నిర్వహించారు. ఎస్ఐఆర్ ప్రక్రియ పూర్తికి గత నెల 24 చివరి తేదీగా ముందు నిర్ణయించినప్పటికీ.. ఆ తరువాత ఈనెల 3వ తేదీ వరకు, మళ్లీ 10వ తేదీ వరకు పొడిగించారు. ఎన్యుమరేషన్ ఫామ్‌ల పరిశీలన, డిజిటలైజేషన్ పూర్తి కావడంతో ఈనెల 17న ముసాయిదా ఓటరు జాబితాను విడుదల చేయనున్నారు. ఈనెల 17 నుంచి సెప్టెంబర్ 16 వరకు అభ్యంతరాలు స్వీకరించనున్నారు. అభ్యంతరాల స్వీకరణ మొదటి రోజు నుంచి మొదలుకుని అక్టోబర్ 15వ తేదీ వరకు అభ్యంతరాలను పరిష్కరిస్తారు. తుది ఓటరు జాబితాను అక్టోబర్ 19వ తేదీన ప్రకించనున్నారు. నిజామాబాద్ అర్బన్‌లోనే అత్యధిక సంఖ్యలో ఓట్లు తొలగిపోనున్నాయి. అర్బన్‌లో 42,015 మంది అందుబాటులో లేరు. జిల్లా వ్యాప్తంగా 147 ఎన్యుమరేషన్ ఫామ్‌లను బీఎల్వోలు పరిశీలించలేదు. ఇతర ఓటర్ల జాబితాలో చేర్చిన వారి నుంచి అభ్యంతరాలు వస్తే నోటీసులు అందజేసిన తరువాత పరిశీలించి ఓటరు జాబితా నుంచి తొలగింపుపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. దీంతో పూర్తిగా తొలగిపోనున్న ఓట్ల సంఖ్యలో కొద్దిమేర మార్పులు ఉండే అవకాశం ఉంది. (ఏఐ సాయంతో రూపొందించిన ప్రతీకాత్మక చిత్రం)నియోజకవర్గాల వారీగా రద్దు కానున్న ఓట్లునియోజకవర్గం మొత్తం మరణించిన అందుబాటులో ఇతర ప్రాంతాలకు డబుల్ ఇతర తొలగనున్న ఓటర్లు ఓటర్లు లేనివారు వెళ్లిన వారు ఓటర్లు ఓటర్లు ఓట్లు ఆర్మూర్ 215186 6185 1648 9918 7925 61 25,737 బోధన్ 223152 5397 4593 13003 4821 21 27,835 బాన్సువాడ 196331 3962 843 9881 5156 43 19,885 అర్బన్ 308261 5384 42015 15107 12167 8756 83,429 రూరల్ 264723 6902 1093 14,368 8722 66 31,151 బాల్కొండ 232081 5882 1590 9321 7003 31 23,827 మొత్తం 14,39,734 33,712 51,782 71,598 45,794 8978 2,11,864 -
సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి
డిచ్పల్లి: నేషనల్ హైవే 44 వెంబడి డిచ్పల్లి, ఇందల్వాయి, జక్రాన్‌పల్లి పరిధిలో వ్యాపారులు హోటళ్లు, దాబాల యాజమానులు సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని ఏసీపీ ప్రకాశ్ సూచించారు. డిచ్పల్లిలోని కేఎన్ఆర్ గార్డెన్లో సోమవారం మూడు మండలాల వ్యాపారులు, ఆటో డ్రైవర్లకు రోడ్డు భద్రతపై ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమానికి ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీతో కలిసి ఏసీపీ ప్రకాశ్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రోడ్డు భద్రత, ఇష్టారాజ్యంగా పార్కింగ్, లిక్కర్ అమ్మకం, గంజాయి వాడకం వంటి అంశాలపై అవగాహన కల్పించారు. అత్యవసరంలో సీసీ కెమెరాలు ఉంటేనే విచారణ వేగవంతంగా కొనసాగుతుందన్నారు. ఒక్క సీసీ కెమెరా వందమంది పోలీసులతో సమానమని పేర్కొన్నారు. డిచ్పల్లి సీఐ వినోద్, ఎస్సైలు ఆరిఫ్, మహేశ్, సుమలత, ఐఆర్‌ఏడీ మేనేజర్ వర్ష, తదితరులు పాల్గొన్నారు. -
ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలి
● 14న తిరంగా ర్యాలీలో పాల్గొనండి ● అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ పిలుపుసుభాష్నగర్: ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేసి దేశభక్తిని చాటాలని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అన్నారు. బీజేపీ ఆధ్వర్యంలో సోమవారం నగరంలోని బస్టాండ్ వద్ద త్రివర్ణ పతకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. స్వాతంత్య్ర సమరయోధుల పోరాట స్ఫూర్తితో దేశ ప్రధాని నరేంద్రమోదీ పిలుపుమేరకు ప్రతి సంవత్సరం ‘హర్ ఘర్ తిరంగా‘ కార్యక్రమం నిర్వహిస్తున్నామని గుర్తుచేశారు. కేవలం స్వాతంత్య్ర దినోత్సవం ఒక్కరోజు జెండా ఎగురవేయడమే కాకుండా ఇంటిపై నిత్యం రెపరెపలాడాలన్నారు. అలాగే ఈ నెల 14న నిర్వహించే తిరంగా ర్యాలీలో దేశభక్తులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ పటేల్ కులాచారి, జిల్లా ప్రధానకార్యదర్శి నాగోల్ల లక్ష్మీనారాయణ, పోతన్కర్ లక్ష్మీనారాయణ, మున్సిపల్ ఫ్లోర్‌లీడర్ ప్రమోద్, మోర్చాల ప్రతినిధులు వంశీగౌడ్, మాదాసు స్వామి యాదవ్, బొబ్బిలి వేణు, వెల్మ గంగారెడ్డి, కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
42 టీఎంసీలకు చేరిన ఎస్సారెస్పీ నీటి నిల్వ
వేల్పూర్(మెండోరా) : శ్రీరాంసాగర్ ప్రాజె క్టులోకి ఎగువ నుంచి ఇన్‌ఫ్లో కొనసాగుతోంది. సోమవారం సాయంత్రం సమయానికి 12,604 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు(80.5 టీఎంసీలు) కాగా.. ప్ర స్తుతం 1079.10 అడుగుల(42.534 టీఎంసీలు) నీరు నిల్వ ఉంది. కాకతీయ కాలువకు 300 క్యూసెక్కులు, మిషన్ భగీరథ అవసరాలకు 231 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తుండగా.. 462 క్యూసెక్కుల నీరు ఆవిరిరూపంలో పోతోందని ప్రాజెక్టు అధికారులు తెలిపారు. నిజాంసాగర్(జుక్కల్): ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలు తగ్గుముఖం పట్టడంతో నిజాంసాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం తగ్గింది. సోమవారం సాయంత్రానికి నిజాంసాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం1405 అడుగులు 17.8 టీఎంసీలకు గాను ప్రస్తుతం 1400.55 అడుగుల (11.949 టీఎంసీలు) నీరు నిల్వ ఉంది. ప్రాజెక్టు క్యాచ్మెంట్ ఏరియాల నుంచి 1,358 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోందని అధికారులు తెలిపారు. పోచారానికి తగ్గిన ఇన్ఫ్లోనాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): పోచారం ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో తగ్గుముఖం పట్టింది. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 1,472 క్యూసెక్కుల నీరు ఇన్‌ఫ్లోగా వస్తోంది. 100 క్యూసెక్కుల నీరు పోచారం ప్రధాన కాలువలోకి విడుదలవుతుండగా, 1,372 క్యూసెక్కుల నీరు అవుట్‌ఫ్లోగా వెళ్తోందని ఇరిగేషన్ అధికారులు తెలిపారు. ఈవీఎం గోదాము పరిశీలన ● బందోబస్తుపై సూచనలునిజామాబాద్ అర్బన్: జిల్లా కేంద్రంలోని వినాయకనగర్‌లో ఉన్న ఈవీఎం గోదాము ను కలెక్టర్ భవేశ్‌మిశ్రా, అదనపు కలెక్టర్ వి భుజంగరావు సోమవారం సందర్శించారు. సాధారణ పరిశీలనలో భాగంగా ఈవీఎం గోదాముకు వెళ్లిన కలెక్టర్.. పోలీసు బందో బస్తు, సీల్‌లను పరిశీలించారు. బందోబస్తు పై పలు సూచనలు చేశారు. వారి వెంట ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు బాలరాజు, సిబ్బంది సాత్విక్, విజయేందర్‌రెడ్డి, అగ్ని మాపక అధికారి శంకర్ ఉన్నారు. ● కేంద్రమంత్రి పీయూష్ గోయల్ నేతృత్వంలోని బృందంలో చోటు కామారెడ్డి టౌన్ : జిల్లాకు చెందిన ప్రముఖ శాస్త్రవేత్త, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు డాక్టర్ పైడి ఎల్లారెడ్డికి అంతర్జాతీయ స్థాయిలో అరుదైన గౌరవం లభించింది. కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి పీయూష్ గోయల్ నేతృత్వంలో ఈ నెల 24 నుంచి 28 వరకు జపాన్ దేశంలో పర్యటించనున్న ‘ఇండియన్ బిజినెస్ డెలిగేషన్’ బృందంలో ఆయనకు చోటు దక్కింది. ఈ మేరకు భారత పరిశ్రమల సమాఖ్య ఆయనకు అధికారికంగా లేఖను అందించింది. భారత్ – జపాన్ వాణిజ్య బంధం బలోపేతంలో భాగంగా ఇరుదేశాల మధ్య నూతన పెట్టుబడులు, సాంకేతిక భాగస్వామ్యంపై జపాన్ అగ్రగామి కంపెనీల ప్రతినిధులతో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నట్లు పైడి ఎల్లారెడ్డి ‘సాక్షి’తో తెలిపారు. -
రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
● ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌అలీ ● కామారెడ్డి, తిప్పాపూర్ పీఏసీఎస్‌ల ప్రమాణస్వీకారంకామారెడ్డి రూరల్/ భిక్కనూరు : రైతుల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్‌అలీ పేర్కొన్నారు. సహకార సంఘాలు కేవలం రాజకీయ పదవులు కాకుండా రైతుల సంక్షేమానికి పనిచేసే వేదికలుగా మారాలని ఆకాంక్షించారు. కామారెడ్డి పీఏసీఎస్ చైర్మన్ గూడెం శ్రీనివాస్‌రెడ్డి, భిక్కనూర్ మండలం తిప్పాపూర్ పీఏసీఎస్ చైర్మన్ భీంరెడ్డితోపాటు డైరెక్టర్ల ప్రమాణ స్వీకారం సోమవారం నిర్వహించారు. కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా మహమ్మద్ షబ్బీర్‌అలీ హాజరై మాట్లాడారు. కాంగ్రెస్ అంటే రైతులు.. రైతులు అంటే కాంగ్రెస్ అని ఆయన పేర్కొన్నారు. రైతులకు అవసరమైన సమయంలో ప్రభుత్వం అండగా నిలిచి, వారి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తోందని తెలిపారు. రైతులు అభివృద్ధి చెందితేనే రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందుతాయని అన్నారు. పాలకవర్గాలు సమన్వయంతో పనిచేసి సొసైటీలను మరింత బలోపేతం చేయా లని సూచించారు. కార్యక్రమాల్లో యువజన కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు ఇలియాస్, జిల్లా సహకార శాఖ అధికారి రాంమోహన్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రకాంత్‌రెడ్డి, పీసీసీ ప్రధాన కార్యదర్శి ఇంద్రకరణ్‌రెడ్డి, డీసీసీ మాజీ చైర్మన్ కైలాస్ శ్రీనివాస్‌రావు, మండల అధ్యక్షులు రాజాగౌడ్, నరేందర్‌రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ రాజు, లక్ష్మీ, బాల్‌రాజు, మాజీ ఎంపీపీలు, సర్పంచులు పాల్గొన్నారు. -
అటవీ శాఖలో కొత్త టాస్క్‌ఫోర్స్
డొంకేశ్వర్(ఆర్మూర్) : జిల్లా అటవీ అధికారి (డీఎఫ్‌వో)గా ఇటీవల బాధ్యతలు చేపట్టిన ప్రశాంత్ బాజీరావు పాటిల్ శాఖలో ప్రక్షాళన ప్రారంభించారు. ఇన్ని రోజులు పని లేక నీరసించిన టాస్క్‌ఫోర్స్ విభాగంలో కొత్తవారిని నియమించి పునర్జీవం పోశారు. కేవలం ఇద్దరికే పరిమితమైన టాస్క్‌ఫోర్స్ బృందంలో అత్యంత చురుకై న 9మంది బీట్ ఆఫీసర్లను చేర్చి టీమ్‌ను బలోపేతం చేశారు. ఇందులో ప్రతి ముగ్గురు బీట్ ఆఫీసర్లను కలిపి ఒక టీమ్‌గా ఏర్పాటు చేయగా, వీరిపైన ఒక ఎఫ్ఆర్వో, సెక్షన్ అధికారి ఉన్నారు. వీరంతా నేరుగా డీఎఫ్‌వో కనుసన్నల్లో పని చేయనున్నారు. డీఎఫ్‌వో ఆదేశాలతోనే ఈ టీమ్ రహస్య ఆపరేషన్లలోకి దిగనుంది. అటవీ ప్రాంతాల్లో కదలికలపై నిఘా పెట్టడం, ఎక్కడికక్కడ లాకస్మిక తనిఖీలు నిర్వహించడమే బృందం పని. అడవుల్లో జరిగే ఉల్లంఘనలు, అక్రమ రవాణాపై క్షేత్రస్థాయిలో లోతుగా విచారణ జరిపి, ఎప్పటికప్పుడు డీఎఫ్‌వోకు నివేదికలు సమర్పించనున్నారు. అయితే, ఇదివరకు పని చేసిన డీఎఫ్‌వోలు టాస్క్‌ఫోర్స్ విభాగాన్ని నిర్లక్ష్యం చేసి అసలు పట్టించుకోలేదనే విమర్శలున్నాయి. అధికారులు, సిబ్బందిలో వణుకు! నూతన డీఎఫ్‌వోగా ప్రశాంత్ బాజీరావు పాటిల్ రావడంతోనే శాఖను గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే విధులకు రాకుండా ఉన్న ఇద్దరు బీట్ ఆఫీసర్లను సస్పెండ్ చేశారు. రెంజల్ మండలం నీలా వద్ద బొగ్గుబట్టీ విషయంలోనూ అధికారులపై సీరియస్‌గా ఉన్నారు. దీనికి తోడు తాజాగా నూతన టాస్క్‌ఫోర్స్ బృందం ఏర్పాటుతో శాఖలోని కొందరు అవినీతి, నిర్లక్ష్యపు అధికారుల గుండెల్లోనూ వణుకు పుట్టిస్తోంది. డీఎఫ్‌వో ఆదేశిస్తే.. క్షేత్రస్థాయిలో అటవీ అధికారులు, సిబ్బంది పనితీరును కూడా ఈ టీమ్ నిశితంగా పరిశీలించనుంది. విధుల్లో అలసత్వం వహించినా, అక్రమార్కులకు సహకరించినా ఎవరినీ వదిలిపెట్టబోమని సంతేకాలు ఇవ్వడంతో అటవీ శాఖలో అందరికీ గుబులు పట్టుకుంది. పలువురు ఎఫ్ఆర్వోలు, డీఆర్వోలు, జిల్లా నుంచి బదిలీ చేసుకుంటేనే బతికి బయటపడుతామనే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. 9మంది బీట్ ఆఫీసర్లతో ఏర్పాటు డీఎఫ్‌వో కనుసన్నల్లో పని చేయనున్న ప్రత్యేక బృదం ఆకస్మిక తనిఖీలు.. విచారణ నివేదికలు ఇవ్వడమే టీమ్ పని -
మద్యంమత్తులో వ్యక్తి హల్చల్
వేల్పూర్(మెండోరా): మెండోరా మండల కేంద్రానికి చెందిన ఓ వ్యక్తి సోమవారం రాత్త్రి మద్యం మత్తులో కాకతీయ కాలువలో దిగి మునుగుతూ, తేలుతూ హల్చల్ చేశాడు. గ్రామస్తులు, పోలీసులు ఎంత చెప్పినా వినకపోవడంతో చివరకు ఎస్సై సుహాసిని ఘటన స్థలానికి వచ్చి అతడికి నచ్చజెప్పి కాలువ ఒడ్డుకు చేర్చారు. అనంతరం కౌన్సెలింగ్ నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. కాలువలో తక్కువ ప్రవాహం ఉండడంతో పూర్తిగా మునిగిపోకుండా ప్రాణాపాయం తప్పింది. బోధన్‌రూరల్: సాలూర మండలంలోని హున్సా శివారులో పేకాట ఆడుతున్న ఐదుగురిని పట్టుకున్నట్లు బోధన్ రూరల్ ఎస్సై రాజశేఖర్ సోమవారం తెలిపారు. పట్టుబడిన వారి వద్ద నుంచి రూ.7,400లు నగదు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు ఆయన వివరించారు. నిజామాబాద్ అర్బన్: ప్రతి ఆటో డ్రైవర్ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని ట్రాఫిక్ సీఐ ప్రసాద్ అన్నారు. నగరంలోని ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్‌లో సోమవారం ఆయన ఆటోడ్రైవర్లకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా ట్రాఫిక్ సీఐ మాట్లాడుతూ.. ప్రతిఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, రద్దీగా ఉన్నచోట ఆటో డ్రైవర్లు జాగ్రత్తలు పాటించాలన్నారు. నిజామాబాద్ అర్బన్: నగరంలోని ఒకటో టౌన్ పరిధిలోగల ఫ్రూట్ మార్కెట్లో ఇటీవల కొందరి యువకుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో ఒకరు తీవ్రంగా గాయపడగా, ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. మూడో వ్యక్తి షేక్‌రహీమ్ పరారీలో ఉండగా, సోమవారం అతడిని అరెస్టు చేసినట్లు ఒకటవ టౌన్ ఎస్‌హెచ్‌వో రఘుపతి తెలిపారు. నందిపేట్(ఆర్మూర్): నందిపేట మండలం ఆంధ్రనగర్ గ్రామ సమీపంలో ఓ వ్యానులో రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తుండగా సోమవారం సాయంత్రం నందిపేట పోలీసులు పట్టుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు ఆంధ్రానగర్లోని ఒక బొలెరో వాహనాన్ని ఆపి తనిఖీ చేశారు. అందులో మొత్తం 57 సంచులలోని 31క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని గుర్తించారు. అట్టి బియ్యానికి ఎటువంటి ఆధారాలు వారివద్ద లేకపోవడంతో వాటిని నందిపేట పోలీస్ స్టేషన్ కు తరలించారు. డ్రైవర్ ఖలీమ్తోపాటు ఓనర్ మాక్లూర్‌కు చెందిన ఇమ్రాన్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై వినయ్ వెల్లడించారు. -
సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి
తాడ్వాయి : గ్రామాల్లో సైబర్ మోసాలపై అప్రమ త్తంగా ఉండాలని ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాస్‌రావు సూచించారు. మండలంలోని చిట్యాల గ్రామంలో సోమవారం పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిన కమ్యూనిటీ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. సైబర్ నేరగాళ్ల నుంచి వచ్చే మోస పూరిమైన ఫోన్‌కాల్స్‌ను నమ్మవద్దన్నారు. ప్రస్తుతం జాబ్ నోటిఫికేషన్ విడుదలయిందని, ఈ నోటిఫికేషన్‌ను యువకులు వినియోగించుకోవాలని సూచించారు. డ్రగ్స్ పై అవగాహన కలిగి ఉండాలన్నారు. గ్రామంలో సీసీకెమెరాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. ద్విచక్రవాహనాలు నడిపేవారు హెల్మెట్ ధరించాలన్నా రు. అత్యవసర సమయంలో 112 నంబరుకు డ యల్ చేయాలన్నారు. ఎస్ఐ నరేశ్, గ్రామపోలీసు యాదగిరి, సర్పంచ్ రంజిత్‌రెడ్డి పాల్గొన్నారు. -
ఎస్సారెస్పీపై పర్యాటకుల సందడి
వేల్పూర్(మెండోరా): బాల్కొండ మండలంలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టుపై పర్యాటకుల సందడి నెలకొంది. వరుసగా రెండవ శనివారం, ఆది, సోమవారం సెలవులు రావడంతో తల్లిదండ్రులు, పిల్లలు, పెద్దలు శ్రీరాంసాగర్‌కు వచ్చి ప్రాజెక్టు అందాలను తిలకించారు. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద ప్రవాహం వల్ల ప్రాజెక్టు నీటిమట్టం సగం కంటే ఎక్కువగా పెరిగింది. జిల్లా వాసులే కాకుండా ఆదిలాబాద్, కరీంనగర్, హైదరాబాద్ లాంటి దూర ప్రాంతాలకు చెందిన పర్యాటకులు ప్రాజెక్టులోకి చేరిన నీటిని చూస్తూ ఆనందించారు. ప్రాజెక్టుపై ఉన్న గుర్రపు సవారీలు చిన్నారులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ప్రాజెక్టుకు భారీగా పర్యాటకులు తరలి రావడంతో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. డ్యామ్ దిగువ భాగానికి, ప్రమాదకర ప్రాంతాల వైపు వెళ్లకుండా మైకుల ద్వారా హెచ్చరించారు. -
మొక్కు తీర్చుకునేందుకు వెళ్లి.. అనంతలోకాలకు..
పెద్దకొడప్గల్(జుక్కల్): ఆషాఢ మాసం సందర్భంగా మొక్కులు తీర్చుకునేందుకు కుటుంబ సభ్యులతో కలిసి వాగు వద్దకు వెళ్లిన ఓ యువకుడు ప్రమాదవశాత్తు నీటిలో మునిగి అనంతలోకాలకు చేరుకున్న విషాద ఘటన మండలంలోని చిన్నతక్కడ్పల్లి గ్రామ శివారులో చోటుచేసుకుంది. ఎస్సై అరుణ్ కుమార్ తెలిపిన వివరాలు ఇలా.. బిచ్కుంద గ్రామానికి చెందిన మిట్టపల్లి లక్ష్మణ్ (25)అనే యువకుడు కుటుంబ సభ్యులతో కలిసి పెద్దకొడప్గల్లో కొన్ని రోజులుగా పాత ఇనుప సామానుకు వస్తువులను అమ్ముతూ జీవనం సాగిస్తున్నారు. తన కుటుంబ సభ్యులతో కలిసి అతడు ఆదివారం మొక్కులు తీర్చుకునేందుకు చిన్నతక్కడ్పల్లి గ్రామ శివారులోని వాగు వద్దకు వెళ్లారు. కుటుంబ సభ్యులు వంట కార్యక్రమాల్లో నిమగ్నమై ఉండగా లక్షణ్ మధ్యాహ్నం సమయంలో స్నానం చేసేందుకు వాగులోకి దిగాడు. ప్రమాదవశాత్తు నీట మునిగి మృతి చెందాడు. సాయంత్రం వాగులో గాలింపు చేపట్టగా, లక్ష్మణ్ మృతదేహాన్ని గుర్తించి బయటకు తీశారు. అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులు బాన్సువాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సోమవారం మృతుడి తల్లి సాయవ్వ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు పంచనామా నిర్వహించి పోస్టుమార్టం చేయించామని ఎస్సై అరుణ్ కుమార్ తెలిపారు. -
ఏటీఎం చోరీకి యత్నం.. నిందితుడి అరెస్టు
లింగంపేట(ఎల్లారెడ్డి): మండల కేంద్రంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎంలో చోరీకి యత్నించిన నిందితుడు పోలీసులకు పట్టుబడ్డాడు. ఎస్సై దీపక్‌కుమార్ తెలిపిన వివరాలు ఇలా.. గాంధారికి చెందిన శశికుమార్ అనే వ్యక్తి లింగంపేట మండలం లింగంపల్లి శివారులోని వాటర్ ప్లాంట్‌లో ఆటో డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. శశికుమార్ సోమవారం అర్ధరాత్రి ఒంటిగంట ప్రాంతంలో ఎస్బీఐ ఏటీఎంకు ఆటోలో వచ్చాడు. ఆటోను ఓ ఇంటి పక్కన సందులో నిలిపి ఏటీఎంలోకి చొరబడ్డాడు. ఏటీఎంలోని నగదును దోచుకునేందుకు ఏటీఎంను ధ్వంసం చేస్తుండగా శబ్ధం రావడంతో ఇంటి యజమాని పంబళ్ల శ్రీనివాస్ నిద్రలోనుంచి లేచి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఎస్సై దీపక్‌కుమార్ తన సిబ్బందితో ఏటీఎం వద్దకు చేరుకొని చోరీకి యత్నిస్తున్న శశికుమార్‌ను పట్టుకొని అదుపులోకి తీసుకున్నారు. ఎల్లారెడ్డి సీఐ రాజారెడ్డి ఉదయం ఏటీఎం కేంద్రం వద్దకు చేరుకొని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
క్రైం కార్నర్
అదుపుతప్పి ఆటో బోల్తా ● ఒకరి మృతి, ఆరుగురికి గాయాలు వేల్పూర్(మెండోరా): మెండోరా మండలంలో సోమవారం మధ్యాహ్నం ఓ ఆటో అదుపుతప్పి బోల్తాపడగా, ఒకరు మృతిచెందారు. మరో ఆరుగురికి గాయాలయ్యాయి. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా.. ముప్కాల్ మండల కేంద్రానికి చెందిన ఆటోడ్రైవర్ సాయికుమార్ తన సొంత ప్యాసింజర్ ఆటోలో ముప్కాల్ నుంచి మెండోరా మండలానికి ఏడుగురు ప్రయాణికులను తీసుకెళ్తున్నాడు. మెండోరా శివారులోని కాకతీయ కాలువ సమీపంలో ఆటోను అజాగ్రత్తగా వేగంగా నడపడం వల్ల ఆటో ఒక్కసారిగా బోల్తాపడింది. ఈ ఘటనలో కోడిచెర్ల గ్రామానికి చెందిన వేల్పూర్ దేవాయి(58)కి బలమైన గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతిచెందింది. మిగతా ఆరుగురు ప్రయాణికులకు గాయాలు కాగా, వారి కుటుంబీకులు, బంధువులు ఘటనా స్థలానికి చేరుకొని ఆస్పత్రులకు తీసుకెళ్లారు. మృతురాలి కుటుంబీకులు ఫిర్యాదు మేరకు ఆటోడ్రైవర్‌పై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఆమె తెలిపారు. ● డ్రైవర్‌కు తీవ్ర గాయాలు నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): మండలకేంద్రం గోపాల్‌పేటలో ఆటోను కారు ఢీకొనడంతో ఆటోడ్రైవర్ తీవ్రంగా గాయపడిన ఘటన ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా.. గోపాల్‌పేటకు చెందిన షాహీద్ ఆఫ్రీదీ తన ఆటోలో స్థానిక పెట్రోల్‌బంకులో డీజీల్ పోయించుకొని ఇంటికి బయలుదేరాడు. అదేసమయంలో ఎల్లారెడ్డి వైపు నుంచి మెదక్ వైపు వెళ్తున్న ఓ కారు ఆటోను బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆటో నడుపుతున్న షాహీద్ ఆఫ్రీదీ తీవ్రంగా గాయపడి అపస్మారకస్థితికి చేరుకున్నాడు. వెంటనే స్థానికులు అతడిని చికిత్స నిమిత్తం మొదట మెదక్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా అక్కడి వైద్యుల సూచన మేరకు మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని ఓ కార్పొరేట్ హాస్పిటల్ తరలించారు. ఈ ఘటనపై కేసునమోదు చేసినట్లు నాగిరెడ్డిపేట ఎస్సై భార్గవ్‌గౌడ్ తెలిపారు. వర్ని: మోస్రా మండలం చింతకుంట అటవీ ప్రాంతంలో ఉన్న శివకేశవ మందిరంలో గుర్తుతెలియని వ్యక్తులు రాధాకృష్ణ విగ్రహాలను ధ్వంసం చేశారు. సోమవారం ఆలయానికి వెళ్లిన భక్తులు విగ్రహాల ధ్వంసాన్ని గమనించి, గ్రామస్తులకు సమాచారం అందించగా, వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వర్ని ఎస్సై వంశీకృష్ణారెడ్డి ఘటన స్థలానికి వెళ్లి పరిస్థితిని సమీక్షించారు. విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఎస్సై తెలిపారు. -
మోడల్ సీబీఎస్ఈ స్కూల్స్!?
● రాష్ట్ర ప్రభుత్వానికి విద్యాశాఖ ప్రతిపాదనలు ● వచ్చే విద్యాసంవత్సరం నుంచి అమలయ్యే అవకాశం ఎల్లారెడ్డిరూరల్: మోడల్‌స్కూల్స్‌ను బలోపేతం చేసేందుకు గాను ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దీనిలో భాగంగానే సీబీఎస్ఈ విధానం అమలు చేయాలని విద్యాశాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ప్రభుత్వం నుంచి అనుమతి వస్తే 2027–28 విద్యా సంవత్సరం నుంచి ఈ విధానాన్ని అమలు చేయాలని ప్రణాళిక రూపొందించారు. దీనిద్వారా సంబంధిత పాఠశాలలు సీబీఎస్ఈ బోర్డు నుంచి అనుబంధ గుర్తింపును పొందవలసి ఉంటుంది. జిల్లాలో ఆరు మోడల్‌స్కూల్స్.. కామారెడ్డి జిల్లాలో ఎల్లారెడ్డి, నిజాంసాగర్(అచ్చంపేట్), బాన్సువాడ(కొత్తాబాది), నాగిరెడ్డిపేట(గోపాల్పేట్), మద్నూర్(మేనూర్), సదాశివనగర్‌లలో మోడల్‌స్కూల్స్ ఉన్నాయి. ప్రతి మోడల్స్కూల్లో 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు 500 మంది, ఇంటర్మీడియట్లో 320 మంది విద్యార్థులకు అడ్మిషన్లు నిర్వహించాల్సి ఉంది. ప్రస్తుతం నాగిరెడ్డిపేటలో 778, సదాశివనగర్‌లో 742, బాన్సువాడలో 735, నిజాంసాగర్‌లో 728, ఎల్లారెడ్డిలో 684, మద్నూర్‌లో 656 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. ప్రతి మోడల్స్కూల్లో ఇంటర్మీడియట్ విద్యార్థినుల కోసం వంద మందికి హాస్టల్ వసతిని కల్పిస్తున్నారు. జాతీయస్థాయి పరీక్షల్లో ఉత్తమ ర్యాంకులు సాధించే అవకాశం.. జాతీయ స్థాయి కాంపీటీటివ్ పరీక్షలకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) సిలబస్‌తో కూడిన పరీక్షా విధానం ఉంటుంది. దీనివల్ల సీబీఎస్ఈ విధానంతో చదువుకున్న విద్యార్థులు ఆయా పరీక్షల్లో ప్రతిభ చూపి మంచి ర్యాంకులను సాధించి మంచి కళాశాలల్లో సీట్లను సాధిస్తున్నారు. స్టేట్ సెలబస్‌తో చదువుకున్న విద్యార్థులు కాంపిటీటివ్ పరీక్షలలో వెనకబడడంతో మంచి ర్యాంకులు రాక మంచి కళాశాలల్లో సీట్లు లభించక చదువులో వెనకంజలో ఉంటున్నారు. మోడల్‌స్కూల్స్‌లో సీబీఎస్ఈ విధానం అమలైతే గ్రామీణ ప్రాంత విద్యార్థులు సైతం జాతీయస్థాయి కాంపిటీటివ్ పరీక్షలలో ఉత్తమ ర్యాంకులు సాధించి మంచి కళాశాలల్లో సీట్లు సాధించే అవకాశం ఉంటుంది. ఎల్లారెడ్డి మోడల్ స్కూల్ -
మున్సిపల్ కార్మికుడికి కరెంట్‌షాక్.. పట్టించుకోని అధికారులు!
కామారెడ్డి టౌన్: మున్సిపల్ పరిధిలోని అడ్లూర్ ఎస్సీవాడ 2వ వార్డులో వీధిదీపాల కోసం విద్యుత్ స్తంభంపై మరమ్మతులు చేస్తుండగా కరెంట్ షాక్ తగిలి ప్రమాదవశాత్తు మున్సిపల్ కార్మికుడు రాజు కింద పడిపోయారు. ఆదివారం జరిగిన ఈ ప్రమాదంలో కార్మికుడికి తీవ్ర గాయాలయ్యాయి. తోటి కార్మికులు హుటాహుటిన జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలించి వైద్య సేవలు అందించారు. ప్రమాదం తప్పిందని వైద్యులు వెల్లడించారు. బల్దియా అధికారులకు సమచారం ఇచ్చినా, ప్రమాదం జరిగి రెండు రోజు గడుస్తున్నా మున్సిపల్ ఏఈ, అధికారులు కనీసం స్పందించకపోవడంపై కార్మికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏఈ తీరుపై ఆందోళనలకు దిగుతామని మున్సిపల్ కార్మిక సంఘం నాయకులు సోమవారం హెచ్చరించారు. నిజామాబాద్ రూరల్: మండలంలోని కాలూరు చెందిన గంధక్వాడ్ సాయినాథ్ అనే వ్యక్తి అదృశ్యమైనట్లు రూరల్ ఎస్‌హెచ్‌వో శ్రీనివాస్ సోమవారం తెలిపారు. గంధక్వాడ్ మారుతి అతని కుటుంబ సభ్యులు మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా, నాయిగావ్ నుంచి వచ్చి కొన్ని సంవత్సరాలుగా రూరల్ మండలంలోని కాలూరులో హోటల్ నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నారు. మారుతి కుమారుడు సాయినాథ్ ఈనెల 2న హోటల్‌కు సంబంధించిన వస్తువులను తీసుకురావడానికి జిల్లాకేంద్రానికి వెళ్లి, తిరిగి రాలేదు. కుటుంబసభ్యులు ఎంత వెతికినా అతడి ఆచూకీ ఇప్పటికీ లభించలేదు. దీంతో సాయినాథ్ తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
సోయాకు తెగుళ్లు.. సస్యరక్షణ ఇలా..
● నివారణ చర్యలు సూచించిన వ్యవసాయ శాఖ అధికారి హరికృష్ణఆర్మూర్: సోయాబీన్‌కు సోకిన తెగుళ్లను రైతులు గుర్తించి నివారణ చర్యలు చేపట్టాలని వ్యవసాయాధికారులు పేర్కొంటున్నారు. ఈ ఖరీఫ్ సీజన్లో జిల్లాలో సుమారుగా 35,166 ఎకరాల్లో సోయా పంటను రైతులు పండిస్తున్నారు. వేరుకుళ్లు, లద్దె పురుగులతో పంట నష్టపోవడాన్ని రైతులు అధికారుల దృష్టికి తీసుకొస్తున్నారు. ఈక్రమంలో ఆర్మూర్ మండలంలోని పలు గ్రామాల్లో సోయాబీన్ పంటలను వ్యవసాయ అధికారులు పరిశీలించి తెగులు నివారణకు రైతులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఏవో హరికృష్ణ మాట్లాడుతూ.. సోయాబీన్లో వేరుకుళ్లు నివారణకు వర్షాలు తగ్గిన తర్వాత 3 గ్రాముల కాపర్ ఆక్సీ క్లోరైడ్ మందును లీటరు నీటికి కలిపి మొక్క మొదళ్లు తడిచే విధంగా పోయాలన్నారు. ● పొగాకు లద్దె పురుగు ఆశించడం గమనించినట్లయితే నివారణకు 1మీ.లీ నోవాల్యురాన్ లేదా 0.3 మి.లీ క్లోరాంట్రనిలీప్రోల్ లీటరు నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి. ● సోయా ఆకులపై రంధ్రాలు గమనిస్తే, నివార ణకు ఐదు కిలోల తవుడు, ఒక కిలో బెల్లం, 400 మిల్లీలీటర్ల మోనోక్రోటోపాస్‌ను కలిపి ఉండలుగా చేసి సాయంత్రం పూట పొలంలో చల్లాలి. పగలు నేలలో ఉండి సాయంత్రం పూట బయటకు వచ్చే లద్దె పురుగులు వీటిని తిని చనిపోతాయి. ● సోయా ఆకులను సెమిలూపర్ అనే గొంగలి పురుగు తినేసి పంటను నష్టం కలిగిస్తుంది. ఈ పురుగును నివారించడానికి 350 మిల్లీలీటర్ల క్లోరోపైరిఫాస్‌ను 200 లీటర్ల నీటిలో కలిపి ఒక ఎకరం పొలంలో పిచికారి చేయాలి. ● సోయాబీన్ ఆకులు, కాయలను పచ్చ పురుగు తిని పంటను నష్టం కలిగిస్తుంది. ఈ పురుగును నివారించడానికి 125మిల్లీలీటర్ల రిమాన్ను 200 లీటర్ల నీటిలో కలిపి ఒక ఎకరంలో పిచికారి చేయాలి. ● సోయా మొక్క కాండం లోపల కాండం ఈగ (స్టెమ్ ఫ్లె) ఆహార పదార్థాన్ని తినివేస్తుంది. దీంతో సోయా మొక్క వాడిపోయి ఎండిపోతుంది. ఆ మొక్కను చీల్చి చూస్తే ఎర్రని ఎండిన పదార్థం కనిపిస్తుంది. ఈ కాండం ఈగ నివారణకు 300 గ్రాముల ఎసిఫెట్ పొడిని 200 లీటర్ల నీటిలో కలిపి ఒక ఎకరం సోయ పంటపై పిచికారి చేయాలి. ● సోయా పంట వద్దకు పురుగులు రాకుండా నివారణ చర్యకు వేపనూనె 1,500 పీపీఎంను 300 నుంచి 500 మిల్లీ లీటర్ల నీటిలో కలిపి ఒక ఎకరంలో పిచికారి చేయాలి. రైతులు ఈ విధంగా చేస్తే తెగుళ్లను నివారించవచ్చు. సోయాబీన్ పూత, పిందె రాలకుండా, కాయగట్టితనానికి 19:19:19ని ఒక కిలో తీసుకొని నీటిలో కలిపి ఒక ఎకరానికి పిచికారి చేయాలి. సోయాబీన్ పంటను పండిస్తున్న రైతులు ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. సోయాలోని ఆకులు, కాయలు, కాండాన్ని రైతులు పరిశీలించాలి. తెగుళ్లు సోకినట్లు భావిస్తే వెంటనే మందులను పిచికారి చేయాలి. తెగుళ్ల బారి నుంచి పంటను రక్షించాలి. – హరికృష్ణ, వ్యవసాయాధికారి, ఆర్మూర్ మండలం -
బీసీసీ యూత్ నూతన కమిటీ ఎన్నిక
కామారెడ్డి టౌన్ : జిల్లా కేంద్రంలోని భారత్ క్రికెట్ క్లబ్ యూత్ ఫెడరేషన్ పట్టణ కమిటీని ఎన్నుకున్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని జరిగిన ఎన్నికలో గౌరవ అధ్యక్షుడిగా చిటిమెల్లి ప్రేమ్‌కుమార్, గోనెల జగన్నాథం, అధ్యక్షుడిగా పార్లపల్లి ప్రసాద్‌రెడ్డి, ఉపాధ్యక్షుడిగా నారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా దుబ్బాక ప్రసాద్, ఉప కార్యదర్శిగా తోట ప్రవీణ్‌కుమార్, కోశాధికారిగా వెంకటరాజం, సలహాదారులను ఎన్నుకున్నారు. కామారెడ్డి అర్బన్: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ, పీజీ ప్రవేశాలకు సెప్టెంబర్ 9 వరకు గడువు పొడిగించినట్టు కామారెడ్డి అధ్యయన కేంద్రం సమన్వయకర్త సుధాకర్ ఒక ప్రకటనలో తెలిపారు. డిగ్రీలో ప్రవేశానికి ఇంటర్ సమాన పరీక్ష, పీజీ ప్రవేశానికి ఏదేని డిగ్రీ ఉత్తీర్ణులైన వారు అర్హులని పేర్కొన్నారు. వివరాలకు కామారెడ్డి ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలోని ఓపెన్ యూనివర్సిటీ స్టడీ సెంటర్లో సంప్రదించాలని సూచించారు. తాడ్వాయి: మండలంలోని పల్లెగడ్డా తండా శివారులో నిర్వహించిన క్షుద్ర పూజలు కలకలం రేపాయి. వివరాలిలా ఉన్నాయి. గత 50 ఏళ్ల క్రితం ఈ ప్రాంతంలో రుక్మాయి అనే గ్రామం ఉండేదని, ఆ గ్రామ సమీపంలో ఉన్న గడి ప్రాంతంలో గుప్త నిధుల కోసం తరచూ తవ్వకాలు జరుగుతుండేవని ఈ ప్రాంత ప్రజలు చెబుతున్నారు. కొన్ని రోజులుగా ఆ గడి స్థలానికి సంబంధించి భూవివాదం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో శనివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు అక్కడికి వచ్చి క్షుద్ర పూజలు చేసినట్లు గ్రామస్తులు పేర్కొంటున్నారు. భూవివాదం విషయంలో ఎవరో కావాలనే క్షుద్ర పూజలు చేశారా.. లేదా భయపెట్టడానికి చేసి ఉంటారా అని తండావాసులు చర్చించుకుంటున్నారు. పోలీసు అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. -
‘సాగర్’లోకి 6,367 క్యూసెక్కులు..
కులబహిష్కరణ విధించడం నేరం. ఎక్కడైనా అలాంటి ఘటనలు జరిగితే మా దృష్టికి వచ్చిన వెంటనే కేసులు నమోదు చేస్తున్నాం. బాధితులు ఎవరైనా భయపడకుండా నేరుగా ఫిర్యాదు చేయొచ్చు. బాధ్యులపై చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. – శ్రీనివాస్, ఏసీపీ, బోధన్ నిజాంసాగర్(జుక్కల్): ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో నిజాంసాగర్‌లోకి వరద నీరు వస్తోంది. ఆదివారం సాయంత్రానికి ప్రాజెక్టులోకి 6,367 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తున్నట్లు అధికారులు తెలిపారు. నిజాంసాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1405 అడుగులు 17.8 టీఎంసీలకు గాను ప్రస్తుతం 1400.45 అడుగుల (11.838 టీఎంసీలు) నీరు నిల్వ ఉంది.నిజాంసాగర్(జుక్కల్): ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో సంగితం వాగులో వరద ప్రవహిస్తోంది. మహమ్మద్‌నగర్ మండలం సింగితం గ్రామ రైతులు, కూలీలు వ్యవసాయ పనులకు వెళ్లాలంటే వాగు దాటాల్సిందే. 15 రోజులుగా వాగులో వరద కొనసాగుతుండగా, వాగు దాటేందుకు తెప్పలను ఆశ్రయిస్తున్నారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని వాగుకు రెండు వైపులా తాడుకట్టి తెప్పపైన ప్రయాణిస్తున్నారు. వాగుపైన బ్రిడ్జి నిర్మాణ పనులు అర్ధంతరంగా నిలిచిపోవడంతోనే తెప్ప కష్టాలు తప్పడం లేదని రైతులు, గ్రామస్తులు వాపోతున్నారు. ప్రభుత్వ పాలకులు, అధికారులు స్పందించి బ్రిడ్జి నిర్మాణం త్వరగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.తెప్పపై సింగితం వాగు దాటుతున్న రైతులు, కూలీలు -
హైదరాబాద్ కార్పొరేట్ స్కూల్లో దారుణం
● కామారెడ్డి విద్యార్థిపై తోటి విద్యార్థుల దాడి ● తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చేరికకామారెడ్డి టౌన్ : హైదరాబాద్ దమ్మాయిగూడలోని ఓ కార్పొరేట్ హైస్కూల్లో దారుణం చోటుచేసుకుంది. కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన పదో తరగతి విద్యార్థిపై తోటి విద్యార్థులు దాడికి పాల్పడ్డారు. వివరాలు.. కామారెడ్డిలోని స్నేహపురి కాలనీకి చెందిన కిరణ్, శోభ దంపతుల కుమారుడు అభిషేక్ దమ్మాయిగూడలోని ఓ కార్పొరేట్ స్కూల్లో పదో తరగతి చదువుతున్నాడు. పాత కక్షలను మనసులో ఉంచుకొని శనివారం సుమారు 8 నుంచి 12 మంది తోటి విద్యార్థులు గుంపుగా చేరి అభిషేక్‌పై దాడికి తెగబడ్డారు. కర్రలు, ప్లేట్లతో కొడుతూ బూట్లతో ముఖంపై తొక్కుతూ గాయపరిచారు. కాగా, మెట్లపై నుంచి కింద పడిపోవడంతో అభిషేక్‌కు గాయాలయ్యాయని పాఠశాల యాజమాన్యం నమ్మించే ప్రయత్నం చేస్తూ అతడి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. తల్లిదండ్రులు తమ కుమారుడిని కామారెడ్డికి తీసుకొచ్చి ప్రయివేటు ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. తోటి విద్యార్థులే తనపై దాడి చేశారని అభిషేక్ తెలిపినట్లు తల్లిదండ్రులు పేర్కొన్నారు. దాడికి పాల్పడిన విద్యార్థులపై, నిజాన్ని దాచిపెట్టి నిర్లక్ష్యంగా వ్యవహరించిన పాఠశాల యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదివారం కామారెడ్డి పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
సార్ రాకుంటే స్కూల్ బందే!
● జిల్లాలో ఏకోపాధ్యాయ పాఠశాలలు 71 ● కుంటుపడుతున్న ప్రాథమిక విద్య ● ఆందోళనలో తల్లిదండ్రులు ఖలీల్‌వాడి: ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందించాలనే లక్ష్యానికి టీచర్ల కొరత అడ్డంకిగా మారుతోంది. జిల్లాలో 71 ప్రభుత్వ ప్రాథమిక, ప్రా థమికోన్నత పాఠశాలలు ఏకోపాధ్యాయులతో న డుస్తున్నాయి. ఒకే టీచర్ ఒకటి నుంచి ఐదు తరగతులకు బోధన చేయాల్సి ఉంటుంది. దీంతోపాటు పాఠశాల నిర్వహణ, ప్రభుత్వ కార్యక్రమాలు, వి ద్యార్థుల వివరాలు ఆన్లైన్లో నమోదు, మధ్యాహ్న భోజన పథకం తదితర వాటిని పర్యవేక్షించాల్సి ఉంటుంది. దీంతో విద్యార్థులకు పూర్తిస్థాయిలో బోధన అందే పరిస్థితి లేకపోవడంతో జిల్లాలోని చాలా ప్రభుత్వ పాఠశాల్లో చదివే విద్యార్థులకు కనీసం రాయడం, చదవడం, అక్షరాలు గుర్తించలేని పరిస్థితి ఏర్పడుతోంది. ఉన్న ఒక ఉపాధ్యాయుడు సెలవు పెట్టినా.. శాఖాపరమైన శిక్షణ కార్యక్రమాలకు వెళ్లినా విద్యార్ధులకు ఆ రోజు సెలవే! విధులకు హాజరైన ఉపాధ్యాయుడు ఒక తరగతికి పాఠం చెబుతున్నప్పుడు మిగతా నాలుగు తరగతుల విద్యార్థులు వారికి వారే పాఠాలు చదువుకుంటున్నారు. బోధన కన్నా విద్యార్థులను పర్యవేక్షించేందుకే ఎక్కువ టైం కేటాయించాల్సి వస్తుందని టీచర్లు చెబుతున్నారు. ప్రస్తుతం ఉపాధ్యాయులకు బోధనతోపాటు అనేక ప్రభుత్వ కార్యక్రమాల బాధ్యతలు అప్పగిస్తున్నారు. విద్యార్థుల సంఖ్య పెరుగుతున్నా.. ప్రభుత్వ పాఠశాలలోపై తల్లిదండ్రులకు విశ్వాసం పెరగడంతో తమ పిల్లలను చేర్పిస్తున్నారు. అయితే మరోవైపు పాఠశాల్లో టీచర్ల సంఖ్య సరిపడా లేక పోవడంతో ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో ఒకే ఉపాధ్యాయుడితో విద్యా ప్రమాణాలు ఎలా పెరుగుతాయనే ప్రశ్నలు తలెత్తున్నాయి. ఏకోపాధ్యాయులు సెలవు పెడితే ఎంఈవో, స్కూ ల్ కాంప్లెక్స్ హెచ్ఎంలకు తప్పనిసరిగా సమాచా రం ఇవ్వాలి. వెంటనే సీఆర్పీని కానీ లేదంటే టీచర్‌ను అడ్జెస్ట్ మెంట్ చేస్తాం. – పార్శి అశోక్, డీఈవో కృత్రిమ మేధతో రూపొందించిన ప్రతీకాత్మక చిత్రం విద్యార్థి జీవితానికి ఎంతో ప్రధానమైనది ప్రాథమిక విద్య. అక్షరాలు రాయడం, చదవడం, గణిత నైపుణ్యాలు, అర్థం చేసుకోవడం వంటి అంశాలపై ప్రత్యేక శ్రద్ధ అవసరం ఉంటుంది. ఒకే ఉపాధ్యాయుడితో ఐదు తరగతులను నిర్వహించడంతో విద్యార్థిపై వ్యక్తిగత దృష్టి పెట్టడం సాధ్యం కాదు. దీంతో విద్యార్థుల్లో అభ్యసన లోపాలు పెరిగి ఉన్నత తరగతుల్లో ఇబ్బందులు పడే పరిస్థితి ఏర్పడుతోంది. -
కేజీబీవీ టీచర్లకు బదిలీల కష్టాలు
ఆర్మూర్: కస్తుర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో(కేజీబీవీ) పనిచేస్తున్న ఉపాధ్యాయులకు రెగుల్యర్ బదిలీలు లేకపోవడం సమస్యగా మారుతోంది. ఏళ్ల తరబడి ఒకే పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులు తమకు కూడా సాధారణ బదిలీల అవకాశం కల్పించాలని కోరుతున్నారు. ప్రస్తుతం రిక్వెస్ట్ బదిలీల ద్వారా మాత్రమే కొంతమందికి స్థానచలనం కలుగుతుండగా.. సాధారణ బదిలీల కోసం ఎదురుచూస్తున్న వారు మాత్రం నిరాశకు గురవుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్తంగా విద్యా హక్కు చట్టాన్ని అమలు చేయడంలో భాగంగా బాలికా విద్యను ప్రోత్సహించడానికి కేజీబీవీలను 2011లో ప్రారంభించారు. ఉపాధ్యాయుల(సీఆర్టీ) ను నియమించినప్పటికీ పాఠశాలను నిర్వహించే బాధ్యతలను తొలినాళ్లలో పదవీ విరమణ పొందిన మండల విద్యాధికారులకు అప్పగించారు. 2013 నుంచి కాంట్రాక్టు పద్ధతిపై స్పెషల్ ఆఫీసర్ల నియామకం జరిగింది. 2011లో జిల్లాలో 19 కేజీబీవీలను ప్రారంభించగా ప్రస్తుతం కొత్త మండలాలు ఏర్పాటవడంతో కేజీబీవీల సంఖ్య 27కు పెరిగింది. ఈ ఏడాది 11 కేజీబీవీల్లో ఇంటర్ వరకు 16 కేజీబీవీల్లో పదో తరగతి వరకు 7,160 మంది బాలికలు విద్యనభ్యసిస్తున్నారు. వీటిల్లో మొత్తంగా 27 మంది స్పెషల్ ఆఫీసర్లతో పాటు సుమారు 135 మంది సీఆర్టీలు, 77 మంది పీజీ సీఆర్టీలు, 24 మంది పీ ఈటీలు, 26 మంది ఏఎన్ఎంలు, 212 మంది ఆపరేటర్లు, వాచ్మన్లు, కుకింగ్ స్టాఫ్ విధులు నిర్వహిస్తున్నారు. అయితే 15 ఏళ్లుగా కేజీబీవీల్లో సాధారణ బదిలీల ప్రక్రియ జరగడం లేదు. నాలుగేళ్ల నుంచి రిక్వెస్ట్, మ్యూచువల్ ట్రాన్స్ఫర్లు మాత్రం చేశారు. 15 ఏళ్లుగా ఒకే చోట విధులు.. కేజీబీవీల్లో స్పెషల్ ఆఫీసర్ అంటే ప్రధానోపాధ్యాయురాలు, వార్డెన్ రెండు బాధ్యతలు కలిపి ఒకే వ్యక్తి చూడాలి. ఉదయం నుంచి రాత్రి వరకు పాఠశాల అడ్మినిస్ట్రేషన్, విద్యార్థుల చదువులు, హాస్టల్ మెనూ, సరుకులు, అటెండెన్స్, ఆర్థిక లెక్కలు అన్నీ వీరే చూసుకోవాలి. 15 ఏళ్లుగా ఒకే చోట విధులు నిర్వహించడం వల్ల కొందరు అనుభవంతో బాగా రాణిస్తున్నా, మరికొందరిలో నిర్లక్ష్యం, ఏకపక్ష నిర్ణయాలు వచ్చే అవకాశం ఉందని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఎస్వోలతో పాటు సీఆర్టీలు, పీజీ సీఆర్టీలకు రెగ్యులర్ బదిలీలు లేని కారణంగా సానుకూల, ప్రతికూల పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఏళ్ల తరబడి ఒకే ఉపాధ్యాయులు చదువు చెప్ప డం వల్ల ఆ సబ్జెక్టుపై విద్యార్థుల ఇంట్రెస్టు తగ్గిపో యే ప్రమాదం లేకపోలేదు. ఇక ఎస్‌వోలకు పనిభా రం విపరీతంగా ఉంది. అలాగే ప్రధానోపాధ్యా యురాలు, వార్డెన్ పోస్టులను వేరు చేయాలి. లేకుంటే బాలికల భవిష్యత్తు అనే నినాదంతో ప్రారంభించిన కేజీబీవీల లక్ష్యం నీరుగారే ప్రమాదం లేకపోలేదు. బదిలీలు లేక స్తంభించిపోయిన ఈ వ్యవస్థలో మార్పు రావాల్సిన అవసరం ఎంతైనా ఉందంటూ ఉపాధ్యాయ సంఘాల వారు రాష్ట్ర ప్రభుత్వాని కి సమయానుకూలంగా విన్నవించుకుంటూనే ఉన్నారు. కృత్రిమ మేధతో రూపొందించిన ప్రతీకాత్మక చిత్రం రిక్వెస్ట్ బదిలీలే దిక్కు.. రెగ్యులర్ బదిలీలకు ఎదురుచూపులు ఏళ్లుగా ఒకే చోట విధులు బదిలీ విధానం అమలు చేయాలని ఉపాధ్యాయుల విజ్ఞప్తి -
కుటుంబానికి భరోసా ఉద్యోగం
● ఇందూరు యువతలో ఎంతో ప్రతిభ ఉంది ● సరైన వేదికనే జాబ్‌మేళా ● అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సుభాష్‌నగర్: ఇందూరు యువతలో ఎంతో ప్రతిభ దాగి ఉందని, వారి ప్రతిభకు తగిన విధంగా అవకాశాలు కల్పించాలనే మెగా జాబ్‌మేళా ఏర్పాటు చేశామని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అన్నారు. ఎమ్మెల్యే ఆధ్వర్యంలో నగరంలోని శ్రీరామ గార్డెన్లో ఆదివారం మెగా జాబ్ మేళా నిర్వహించగా.. సుమారు రెండున్నరవేల మంది అభ్యర్థులు ఇంటర్వ్యూలకు హాజరయ్యారు. ఆయా కంపెనీలో ఎంపికై న అభ్యర్థులకు ఎమ్మెల్యేతోపాటు సీపీ సాయిచైతన్య కాల్ లెటర్స్ అందజేశారు. ఈ సందర్భంగా ధన్పాల్ మాట్లాడుతూ.. యువతకు ఉద్యోగం కల్పించడం అంటే కేవలం ఒక వ్యక్తికి ఉద్యోగం ఇవ్వడం కాదని, ఒక కుటుంబానికి భరోసా ఇవ్వడం అని పేర్కొన్నారు. యువతకు సరైన వేదిక దొరకడం లేదని, ఆ సమస్యను దృష్టిలో పెట్టుకొని 70కి పైగా కంపెనీలను ఒకే వేదిక పైకి తీసుకొచ్చామని అన్నారు. నిజామాబాద్‌ను ఐటీ హబ్‌గా మార్చేందుకు తన వంతు ప్రయత్నం చేస్తున్నానన్నారు. ప్రజాభివృద్ధికి పాటుపడే ఎమ్మెల్యే.. ప్రజాభివృద్ధికి పాటుపడే ఎమ్మెల్యే దొరకడం నిజామాబాద్ యువత అదృష్టమని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య అన్నారు. భారీ జాబ్ మేళా నిర్వహించడం అభినందనీయమన్నారు. రాజకీయంతోపాటు ప్రజల అభివృద్ధికి పాటుపడే వారు అరుదుగా ఉంటారన్నారు. మేయర్ ఉమారాణి, బీజేపీ కార్పొరేటర్లు నాగోళ్ల లక్ష్మీనారాయణ, బెల్లాల్ శశాంక్, మఠం పవన్, శ్రవణ్, పసునూరి రాము, ప్రసూన శ్రీనివాస్‌రెడ్డి, ఎర్రం సుధీర్, జగదీశ్ కులకర్ణి, బంటు రాము, బంటు ప్రీతి ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. -
పేగుబంధంపై ప్రేమతో..
● తల్లిదండ్రుల పాలరాతి విగ్రహాల ఆవిష్కరణ ● చాట్ల నర్సయ్య సాహితీ సేవలు కొనియాడిన రచయితలు, కవులురామారెడ్డి(ఎల్లారెడ్డి): బతికుండగానే తల్లిదండ్రులను వదిలేస్తున్నారు కొందరు... అంత్యక్రియలకు కూడా హాజరుకాకుండా వీడియో కాల్స్‌లోనే చివరి మజిలీ పూర్తి చేస్తున్నారు మరికొందరు పిల్లలు. అలాంటిది మరణించిన తల్లిదండ్రులను నిత్యం గుర్తు చేసుకునేలా పాలరాతి విగ్రహాలు చేయించి ఆదివారం ఆవిష్కరించారు. రామారెడ్డి మండలం పోసానిపేటలోని వ్యవసాయ క్షేత్రంలో బహుముఖ ప్రజ్ఞాశాలి చాట్ల నర్సయ్యగంగామణి విగ్రహాలను కొడుకు చాట్ల జయకృష్ణ, చాట్ల విద్యుల్లత ప్రతిష్టించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ తండ్రి చాట్ల నర్సయ్య చరిత్ర పరిశోధకుడిగా, కళాకారుడిగా, రంగస్థల నటుడిగా, కవిగా, రచయితగా సాహితీ ప్రపంచంలో చెరగని ముద్ర వేశారని గుర్తుచేశారు. అనంతరం తెలంగాణ రచయితల వేదిక (తెరవే) జిల్లా అధ్యక్షుడు గఫూర్ శిక్షక్ మాట్లాడుతూ చాట్ల నర్సయ్య తన పరిశోధనలతో కామారెడ్డి జిల్లా కీర్తి ప్రతిష్టలను నలుదిశలా వ్యాపింపజేశారని గుర్తుచేశారు. ఉత్తమ అధ్యాపకుడిగా ఎంతోమంది శిష్యులను సమాజానికి ఉపయోగపడే మేటి పౌరులుగా తీర్చిదిద్దారని తెలిపారు. కార్యక్రమంలో ప్రముఖ గజల్ కవి సూరారం శంకర్, డాక్టర్ జి.లచ్చయ్య, గంగాప్రసాద్, పీతాంబర్, నాగభూషణం, సుప్పని సత్యనారాయణ, సీహెచ్ ప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు. -
రైతు రిజిస్ట్రేషన్ తప్పనిసరి!
జిల్లాలో పట్టాపాస్‌పుస్తకాలు ఉన్న రైతులు2,92,639ఫార్మర్ రిజిస్ట్రీ చేసుకున్న వారు2,38,426డొంకేశ్వర్(ఆర్మూర్): వ్యవసాయ రంగంలో పారదర్శకత, అర్హులైన వారికే రాయితీలు అందించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ‘రైతు రిజిస్ట్రేషన్’ (ఫార్మర్ రిజిస్ట్రీ) ప్రక్రియ ఇప్పుడు మరింత కీలకంగా మారింది. పంటలు సాగు చేస్తున్న ప్రతి రైతు వివరాలు ఆనన్‌లైన్‌లో నమోదై ఉండాలనే నిబంధన తెచ్చిన ప్రభుత్వం.. ఎరువులు కొనుగోలు చేయాలంటే రైతు రిజిస్ట్రేషన్ నంబర్ తప్పనిసరి చేసింది. ఇటీవల ‘ఫ్రేమ్‌వర్క్ ఫర్ ఫెర్టిలైజర్ సేల్’ (ఎఫ్ఎఫ్ఎస్) పేరుతో యాప్‌ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఇకపై యూరియాతోపాటు డీఏపీ, పొటాష్ వంటి ఏ రకమైన రాయితీ ఎరువులు కావాలన్నా... యాప్‌లో రైతు రిజిస్ట్రేషన్ నంబర్ లేదా లింక్ అయిన ఆధార్ నంబర్ నమోదు చేయడం తప్పనిసరి. ఆ వివరాలు సరిపోలితేనే రాయితీ ధరపై ఎరువులను కేటాయిస్తున్నారు. అయితే, కేవలం ఎరువుల కొనుగోలుకే పరిమితం కాకుండా.. ఈ ఫార్మర్ ఐడీని ఇతర కీలక ప్రభుత్వ పథకాలకు కూడా అనుసంధానిస్తున్నారు. పీఎం కిసాన్, పంటల కొనుగోలు (మద్దతు ధర), పంట పెట్టుబడి సాయం, ఇన్పుట్ సబ్సిడీ వంటి మరెన్నో ప్రయోజనాలు పొందాలంటే ఈ రిజిస్ట్రేషన్ నంబరే ప్రామాణికంగా మారనుంది. జిల్లా వ్యాప్తంగా ఇంకా 54,213 మంది రైతులు తమ రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేసుకోలేదు. రానున్న రోజుల్లో ఎరువుల కొరత లేదా సాగుసాయం అందక ఇబ్బంది పడకుండా ఉండాలంటే ఈ వేలాది మంది రైతులు తక్షణమే స్పందించాల్సి ఉంది. అయితే, ఫార్మర్ రిజిస్ట్రీలో నమోదుకాని రైతుల్లో కొందరు స్థానికంగా లేరని తెలుస్తోంది. మిగతా కొందరు అవగాహన లేక అలాగే ఉండిపోయారు. భీమ్‌గల్, కమ్మర్పల్లి, మోపాల్, నిజామాబాద్‌రూరల్, నిజామాబాద్‌సౌత్ మండలాలు రైతు రిజిస్ట్రేషన్‌లో వెనుకబడ్డాయి. మిగతా మండలాలు 80.55 శాతం నుంచి 86.21శాతం వరకు పూర్తి చేశాయి.రిజిసే్ట్రషన్ చేసుకోవాల్సిన వారు54,213(ఏఐతో రూపొందించిన ప్రతీకాత్మక చిత్రం) ఎరువుల కోసం.. ఎఫ్ఎఫ్ఎస్ యాప్‌కు లింక్ చేసిన కేంద్రం మున్ముందు ఇతర పథకాలకూ అనుసంధానం జిల్లాలో ఇంకా ఫార్మర్ రిజిస్ట్రీ చేసుకోని రైతులు 54,213 మంది.. తక్షణమే నమోదు చేసుకోవాలంటున్న వ్యవసాయాధికారులుఫార్మర్ ఐడీని కేంద్ర ప్రభుత్వం తప్పనిసరి చేసింది. ఇంకా నమోదు చేసుకోని రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మీ పరిధిలోని వ్యవసాయ విస్తరణ అధికారి (ఏఈవో) లేదా సమీప మీసేవ కేంద్రాలను సంప్రదించి, పట్టాదార్ పాస్‌బుక్, ఆధార్ కార్డు, మొబైల్ నంబర్ వివరాలు ఇచ్చి వెంటనే రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవాలి. – వీరాస్వామి, జిల్లా వ్యవసాయాధికారి -
క్రైం కార్నర్
బాన్సువాడ: పట్టణంలోని సంగమేశ్వర కాలనీలో ఆదివారం ఉదయం జరిగిన కుక్కల దాడిలో సితార అనే చిన్నారికి తీవ్ర గాయలయ్యాయి. రోడ్డు–2లో అమ్మమ్మతో కలిసి చెత్త వేసేందుకు వెళ్లిన సితారపై వీధి కుక్కలు ఒక్కసారిగా దాడి చేశాయి. ఈ ఘటనలో సితార పెదవిపై తీవ్ర గాయలయ్యాయి. వెంటనే స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం సితార ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇటీవల కక్కుల బెడదను నివారించాలని బీఆర్ఎస్ నాయకులు మున్సిపల్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. పలు కాలనీల్లో కుక్కలను పట్టి ఇతర ప్రాంతాలకు తరలించారు. ఇంకా చాలా కుక్కలు పట్టణంలో విహరిస్తూ చిన్నారులపై దాడులు చేస్తూనే ఉన్నాయి. గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం బాన్సువాడ: పట్టణంలోని జామా మజీద్ ఎదురుగా ఉన్న కాంప్లెక్స్‌లో ఆదివారం గుర్తుతెలియని మృతదేహాన్ని గుర్తించినట్లు సీఐ శ్రీధర్ తెలిపారు. మృతుడి వయస్సు 45 ఏళ్ల వరకు ఉంటుందని, సుమారు 5 అడుగుల ఎత్తు, కోల ముఖం, నలుపు రంగు గడ్డం, గోధుమ రంగు ప్యాంటు వేసుకుని ఉన్నాడని అన్నారు. మృతుడు కొంత కాలంగా బాన్సువాడలో భిక్షాటన చేస్తూ జీవిస్తున్నట్లు స్థానికుల ద్వారా తెలిసిందన్నారు. మృతుడి వివరాలు తెలిసిన 8712686167, 8712666243 నంబర్లను సంప్రదించాలని అన్నారు. -
పాత ఫోన్.. కొత్త మోసం
● వ్యక్తిగత డేటా దుర్వినియోగంతో సైబర్ నేరాలు ● ఆర్థిక మోసాలకు అవకాశం సదాశివనగర్: పాత ఫోన్లకు ప్లాస్టిక్ సామన్లు ఇస్తామంటూ ఊరూరా జరుగుతున్న ఈ వ్యాపారం వెనుక సైబర్ నేరగాళ్ల హస్తం ఉంటోంది. ప్రజలకు చిన్న పాటి ప్లాస్టిక్ సామన్లు ఎరవేసి పాత ఫోన్లను కొత్త నేరాలకు కేటుగాళ్లు వాడుకుంటున్నారు. తక్కువ మొత్తం డబ్బుకు ఆశపడి పాత ఫోన్లను అప్పగించడం చేస్తే నేరాల వలలో చిక్కే అవకాశం ఉందని పోలీసులు హెచ్చరిస్తున్నారు. పాత ఫోన్ల కొనుగోలు, విక్రయాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని సూచిస్తున్నారు. సైబర్ నేరగాళ్ల చేతికి.. పల్లెలు, పట్టణాల్లో సేకరించిన పాత ఫోన్లను చాలా వరకు ఝార్ఖండ్, బీహార్ తదితర రాష్ట్రాల్లో సైబర్ నేరగాళ్ల అడ్డాలకు వీటిని తరలిస్తారు. మరమత్తులు చేసి నకిలీ పేర్లతో తీసుకున్న సిమ్ కార్డులను అందులో వేసి మోసాలకు పాల్పడుతారు. సైబర్ నేరాల ద్వారా వచ్చిన సొమ్ములో కొంత భాగాన్ని పాత ఫోన్లకు సేకరించిన వారికి కమీషన్‌గా చెల్లిస్తున్నారు. ఆర్థిక మోసాలకు అవకాశం పాడైన ఫోన్లలో సిమ్‌కార్డు మర్చిపోయినా, డేటాను ఫార్మాట్ చేయకపోయినా ఇబ్బందులు తప్పవు. వ్యక్తిగత చిత్రాలు, వీడియోలు నంబర్లు నేరగాళ్లకు చిక్కితే వారి నుంచి ఆర్థిక వేధింపులకు గురయ్యే ప్రమాదం ఉంది. పాత ఫోన్లలో బ్యాంకింగ్ యాప్‌లు, చెల్లింపుల వివరాలు కనిపిస్తే ఆర్థిక పరమైన మోసాలు జరగవచ్చు. ప్రతి ఫోనుకు ఇంటర్నేషనల్ మొబైల్ ఎక్విప్మెంట్ ఐడెంటిడీ(ఐఎంఈఐ) నంబరు ఉంటుంది. సైబర్ నేరం జరిగినప్పుడు పోలీసులు ఈ నంబర్ ఆధారంగా దర్యాప్తు ప్రారంభిస్తారు. పాత ఫోన్ అమ్మిన వ్యక్తిని అపరాధిగా తేలుస్తారు. అసలు నేరం చేసిన వారు తప్పించుకుంటారు. వివరాలు నమోదు చేసుకోవాలి ఎవరైనా వ్యక్తికి, డీలర్‌కు ఫోన్ విక్రయిస్తే వారి చిరునామా, ఆధార్, వివరాలు సేకరించాలి. ఫోన్ అమ్మినట్లుగా(ఐఎంఈఐ) నంబరు, విక్రయించిన తేదీ, పేర్కొంటు రసీదు పొందాలి. విక్రయించారనే సమాచారం ఉంటే భవిష్యత్తులో ఆ ఫోన్ ద్వారా నేరం జరిగినా పోలీసు దర్యాప్తు నుంచి సురక్షితంగా బయటపడవచ్చు. పాత ఫోన్లను గుడ్డిగా కొనడం, విక్రయించడం చేయొద్దు. అవసరమైతే తప్ప గుర్తుతెలియని వారి నుంచి పాత ఫోన్లను కొనుగోలు చేయొద్దు. గ్రామా ల్లో తిరుగుతూ పాత ఫోన్లను తీసుకుని వస్తువులు ఇచ్చే వారిని నమ్మొద్దు. తగిన జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి. – సంతోష్‌కుమార్, సీఐ, సదాశివనగర్ -
దివ్యాంగుల సమస్యల పరిష్కారానికి పోరాటం
రుద్రూర్: దివ్యాంగులు, వృద్ధులు, వితంతులు, ఒంటరి మహిళలు, పెన్షన్‌దారులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించే వరకు పోరాటాలు నిర్వహిస్తామని దివ్యాంగుల హక్కుల జాతీయ వేదిక (ఎన్పీఆర్డీ) జిల్లా ప్రధాన కార్యదర్శి ఏశాల గంగాధర్ తెలిపారు. పొతంగల్ మండలం సోంపూర్ గ్రామంలో ఆదివారం ఎన్పీఆర్డీ జిల్లా అధ్యక్షుడు గైని రాములు అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 11న బోధన్ పట్టణంలోని రాకాసిపేట్‌లో జిల్లా సదస్సు నిర్వహించనున్నట్లు తెలిపారు. సదస్సులో దివ్యాంగులకు సంబంధించిన చట్టాలు, సంక్షేమ పథకాలు, వారు ఎదుర్కొంటున్న సమస్యలపై విస్తృతంగా చర్చించి, వాటిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లేందుకు కార్యాచరణ రూపొందిస్తామని తెలిపారు. సదస్సును దివ్యాంగులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో ఎన్పీఆర్డీ జిల్లా ఉపాధ్యక్షుడు దేవదాస్, మేత్రి చిన్న గంగారాం, శరత్ పవర్, నగేశ్, మహేశ్, గంగాసాగర్, సావిత్రి, హన్మంత్ రావు, గంగారాం పటేల్, బాజీరావు, సాయిలు, పోశెట్టి తదితరులు పాల్గొన్నారు. -
నిజామాబాద్
వాహ్ ‘తీజ్’వాతావరణం ఉదయం ఆకాశం పాక్షికంగా మేఘావృతం అవుతుంది. మధ్యాహ్నం ఉక్కపోతగా ఉంటుంది. అక్కడక్కడ ఓ మోస్తరు వర్షం కురిసే అవకాశాలు ఉన్నాయి.కేజీబీవీ టీచర్లకు బదిలీల.. కేజీబీవీల ఉపాధ్యాయులకు రెగుల్యర్ బదిలీలు లేకపోవడం సమస్యగా మారుతోంది. ఏళ్లుగా ఒకే చోట పనిచేస్తున్నారు.సోమవారం శ్రీ 10 శ్రీ ఆగస్టు శ్రీ 2026– 8లో uఇందల్వాయి మండలం దేవీతండాలో తీజ్ వేడుకలో పాల్గొన్న ఎమ్మెల్యే భూపతిరెడ్డి దంపతులుగాండ్ల పట్టణ సంఘం ఆధ్వర్యంలో నిజామాబాద్‌లో నిర్వహించిన పండుగలో బోనమెత్తిన మేయర్ ఉమారాణిగిరిజనుల సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అయిన తీజ్‌ను వైభవంగా నిర్వహించారు. గిరిజన పల్లెలు, తండాల్లో యువతులు, మహిళలు గోధుమ మొలకల బుట్టలను పూజించి ఊరేగించారు.ఆషాఢ మాసం చివరి ఆదివారం కావడంతో జిల్లా వ్యాప్తంగా బోనాల పండుగను వైభవంగా నిర్వహించారు. అమ్మవార్ల ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. బోనం.. వైభవం -
విద్యార్థులు లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలి
● సీపీ సాయిచైతన్య నిజామాబాద్ రూరల్: విద్యార్థులు లక్ష్యాన్ని నిర్దేశించుకొని ఆ దిశగా పయనించాలని సీపీ సాయిచైతన్య అన్నారు. నగరంలోని ఎంఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రతిభావంతులైన 130 మంది విద్యార్థులకు ఒకొక్కరికి రూ. పది వేల చొప్పున అందించిన స్కాలర్షిప్లను సీపీ సాయిచైతన్య ఆదివారం అందజేశారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. ప్రతిభగల విద్యార్థులను ఉన్నత విద్య వైపు ప్రోత్స హించాలనే ఉద్దేశంతో ఎంఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ అందిస్తున్న సేవలు అభినందనీయమని అన్నారు. జీవితంలో విజయం సాధించాలంటే లక్ష్యాన్ని నిర్దేశించుకుని, దానిని సాధించే వరకు నిరంతరం కష్టపడాలని సూచించారు. కార్యక్రమంలో చారిటబుల్ ట్రస్టు వ్యవస్థాపకుడు శివారెడ్డి, ట్రస్ట్ కో–ఫౌండర్ శిరీష, ఎస్సై సాయన్న, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. -
రైలు నుంచి జారిపడిన బాలుడు
● తలకు తీవ్రగాయాలు డిచ్పల్లి: మండలంలోని బీబీపూర్ తండా శివారులో ఆదివారం రైలు నుంచి ప్రమాదవశాత్తు బాలుడు జారిపడి తీవ్రంగా గాయపడ్డాడు. రైల్వే ఎస్సై సాయిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ ఓల్డ్ సిటీ ఏరియా తలాబ్ కట్టకు చెందిన బాలుడు నవీద్ తన కుటుంబసభ్యులతో కలిసి ఇంటర్సిటీ ఎక్స్‌ప్రెస్ రైలులో నాందేడ్‌కు బయలుదేరాడు. ఇందల్వాయి స్టేషన్ దాటిన తర్వాత మూత్ర విసర్జన కోసం టాయిలెట్‌కు వెళ్లి తిరిగి సీటు వద్దకు వస్తుండగా బీబీపూర్ శివారులో ప్రమాదవశాత్తు రైలు బోగీ డోర్ నుంచి కిందికి పడిపోయాడు. గమనించిన తోటి ప్రయాణికులు ఎవరో కింద పడిపోయాడని చెప్పుకోవడం విన్నప్పటికీ నవీద్ కుటుంబసభ్యులు ఇతరులెవరో ఉండవచ్చని భావించారు. ఇంతలోనే రైలు నిజామాబాద్‌కు రావడం.. నవీద్ కనిపించక పోవడంతో ఆందోళనకు గురైన వారు బీబీపూర్ శివారులో పడిపోయింది నవీద్ అయి ఉండవచ్చని భావించి వెంటనే రైల్వే పోలీసులను ఆశ్రయించారు. రైలు నుంచి కిందపడిన నవీద్ తలకు తీవ్రంగా గాయాలయ్యాయి. స్థానికులు 108 అంబులెన్స్‌కు సమాచారం అందించడంతో ఈఎంటీ రవి, పైలట్ శ్రీనివాస్ ఘటనా స్థలానికి చేరుకొని జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. నవీద్ తలకు దెబ్బ తగిలిన చోట వైద్యులు శస్త్రచికిత్స నిర్వహించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు. -
కులపెద్దనే వెలివేశారు..
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : సాంకేతిక పరిజ్ఙానం కొత్త పుంతలు తొక్కుతున్న ప్రస్తుత కాలంలోనూ కుల కట్టుబాట్లతో పేరుతో తోటి మనుషులతో అ మానుషంగా ప్రవర్తిస్తున్నారు. జిల్లాలోని పలుచోట్ల కొన్ని కులాల్లో పెద్దల ఆగడాలు కొనసాగుతూనే ఉ న్నాయి. జిల్లాలోని మోస్రా మండలకేంద్రానికి చెందిన గుమ్ముల పోశెట్టి కుటుంబం సుమారు ఏడాది కాలంగా కుల బహిష్కరణను ఎదుర్కొంటోంది. పోశెట్టి కుటుంబాన్ని కులం నుంచి బహిష్కరించా మని, వారి కుటుంబ సభ్యులను ఎవరైనా పలకరించినా, సహాయం చేసినా, వారితో పొలం పనులు చే యించుకున్నా జరిమానా విధిస్తామని కుల పెద్దలు ప్రకటించారు. ఆ కుటుంబంతో మాట్లాడిన వారిని సైతం బహిష్కరించడం, జరిమానాలు విధించడం యథేచ్ఛగా అమలుచేస్తున్నారు. ప్రత్యక్షంగా హాజరుకాలేదని.. గుమ్ముల పోశెట్టి(63) గతంలో సుమారు 18 ఏళ్ల పాటు రెడ్డిక కుల సంఘానికి అధ్యక్షుడిగా కొనసాగారు. గ్రామంలో కుల సంఘం భవనం నిర్మాణంతోపాటు సంఘం బలోపేతానికి పనిచేశారు. గతే డాది తలలో రక్తం గడ్డకట్టి తీవ్ర అనారోగ్యంతో మంచానికే పరిమితమయ్యారు. కులసంఘం ఏర్పా టు చేసిన సమావేశాలకు అనారోగ్యం కారణంగా హాజరుకాలేదు. గతేడాది వనభోజనాల సందర్భంగా కులసంఘం ఆధ్వర్యంలో మాంసం పంపిణీకి పోశెట్టి బదులుగా ఆయన కుమారుడు మహేశ్ వచ్చాడని కుల పెద్దలు అభ్యంతరం చెప్పారు. ఆ యన తండ్రి స్వయంగా రావాలని పట్టుబడుతూ త మ మాట వినడం లేదని పోశెట్టి కుటుంబాన్ని బహిష్కరిస్తూ కులసభ్యుల ఎదుట ప్రకటించారు. ఘట న తర్వాత పోశెట్టి కుటుంబం పోలీసులను ఆశ్రయించినా వారి నుంచి స్పందన కరువైంది. పలకరించిన పాపానికి కులం బంద్ పోశెట్టి కుటుంబ సభ్యులతో కులస్తులు ఎవరూ మా ట్లాడవద్దని, పలకరించినా, ఆ కుటుంబ సభ్యులతో పొలం పనులు చేయించుకున్నా వారికి రూ.10 వేల జరిమానా విధిస్తామని కుల పెద్దలు హుకుం జారీ చేశారు. ఆ కుటుంబంతో మాట్లాడినందుకు, బాధి త కుటుంబం వెంట పోలీస్‌స్టేషన్‌కు వెళ్లినందుకు కంచర సాయిలు కుటుంబాన్ని సైతం కుల పెద్దలు బహిష్కరించారు. ఇప్పటికే ఈ కుటుంబంతో మా ట్లాడినందుకు ఒకరు రూ. 5వేలు, వీరి ద్వారా పొ లం పనులు చేయించుకున్న కారణానికి మరొకరు రూ. 12 వేలు జరిమానా చెల్లించుకున్నారు. ఇలాంటి వేధింపులతో గ్రామంలోని కులస్తులు తమ వైపు కన్నెత్తి చూడటం లేదని, కులస్తుల శుభకార్యాలు, పెళ్లిళ్లకు, పలకరింపులకు దూరమయ్యామని మనో వేదన చెందుతున్నారు. ● ఈ ఫొటోలో దండం పెట్టి వేడుకుంటున్న వారు జిల్లాలోని మోస్రా మండలకేంద్రానికి చెందిన గుమ్ముల పోశెట్టి, కంచర సాయిలు. రెడ్డిక సామాజిక వర్గానికి చెందిన ఈ ఇద్దరి కుటుంబాలను కులపెద్దలు బహిష్కరించారు. వారితో కులస్తులు ఎవరూ మాట్లాడొద్దని, వారికి సహాయం చేసినా, పనికి పిలిచినా వారిని సైతం బహిష్కరిస్తామని ప్రకటించారు. ఆ రెండు కుటుంబాలతో మాట్లాడిన వారికి సైతం జరిమానాలు విధిస్తున్నారు. సామాజిక కుల బహిష్కరణను ఎదుర్కొంటున్న ఆ రెండు కుటుంబాలు తీవ్ర మనోవేదననుకు గురవుతున్నాయి. కుల సంఘం మాజీ అధ్యక్షుడి కుటుంబాన్ని బహిష్కరించిన కుల పెద్దలు ఆ కుటుంబంతో మాట్లాడితే రూ.10 వేల జరిమానా పనికి పిలిచినా.. పలకరించినా జరిమానాలు, బహిష్కరణలు కులం బంద్ ఆదేశంతో మనోవేదనలో బాధిత కుటుంబం జిల్లాలో పలుచోట్ల కొనసాగుతున్న కులపెద్దల ఆగడాలు -
హమ్మయ్య.. గట్టెక్కినట్లే!
నిజాంసాగర్ : ఉమ్మడి జిల్లా వరప్రదాయిని నిజాంసాగర్ ప్రాజెక్టు ఆయకట్టు కింద 1.15 లక్షల ఎకరాల్లో వరి పంట సాగు చేస్తున్నారు. జీరో డిస్ట్రీబ్యూటరీ నుంచి అలీసాగర్ రిజర్వాయర్ 49 డిస్ట్రీబ్యూటరీ వరకు అనధికారికంగా 1.5 లక్షల ఎకరాల వరకు ప్రధాన కాలువ ద్వారా విడుదల చేస్తున్న నీటితో పంటలు గట్టెక్కుతున్నాయి. అయితే, ఎల్‌నినో ప్రభావంతో నిజాంసాగర్ ప్రాజెక్టు నుంచి ప్రధాన కాలువకు నీటిని విడుదల చేసే ప్రసక్తి లేదని అధికారులు, ప్రభుత్వం తేల్చి చెప్పింది. అయినా ఆయకట్టు ప్రాంత రైతులు వరుణుడిపై భారంతో ఆయకట్టు కింద పంటలను సాగు చేశారు. వరినాట్లు పూర్తవుతున్న తరు ణంలో వర్షాలు సమృద్ధిగా కురవడంతో ఆయకట్టు పంటలకు భరోసా కలిగింది. ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు వాగులు, వంకలు వరద నీటి ప్రవా హం నెలకొన్నాయి. చెరువులు, కుంటలతోపాటు ప్రధాన జలాశయాలు జలకళ సంతరించుకున్నాయి. ఆదుకున్న పోచారం, ఘనపురం ఆనకట్ట ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు వరద పోటెత్తడంతో జిల్లాలోని పోచారం ప్రాజెక్టు పొంగి పొర్లుతోంది. మెదక్ జిల్లాలోని ఘనపురం ఆనకట్ట పొంగిపొర్లుతుండటంతో మంజీర నదిలో వరద పరవళ్లు తొక్కుతోంది. పోచారం, ఘనపురం ఆనకట్ట ద్వారా వరద నిజాంసాగర్ ప్రాజెక్టులోకి చేరుతోంది. దీంతో ప్రా జెక్టు నీటిమట్టం క్రమంగా పెరుగుతూ వస్తోంది. గత నెలాఖరు నుంచి నిజాంసాగర్ ప్రాజెక్టులోకి 5 టీఎంసీల మేర వరద వచ్చి చేరింది. వరద నీటి చేరికతో నిజాంసాగర్ ప్రాజెక్టు ఆయకట్టు ప్రాంత రైతులకు ఖరీఫ్ పంటలు గట్టెక్కుతాయనే భరోసా ఏర్పడింది.నీటి విడుదలకు తీర్మానంప్రస్తుతం నిజాంసాగర్ ప్రాజెక్టులో 11.182 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఈ నేపథ్యంలో ఆయకట్టు కింద సాగు చేస్తున్న పంటలకు మూడు విడతల్లో 4 టీఎంసీల నీటి విడుదలకు డీఐబీ సమావేశంలో తీర్మానం చేశారు. ఇటీవల నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన ఉమ్మడి జిల్లా నీటిపారుదల సమావేశంలో ప్రభుత్వ సలహాదారు పోచారం శ్రీనివాస్‌రెడ్డి సమక్షంలో చేసిన తీర్మాన పత్రాన్ని ప్రభుత్వానికి ప్రతిపాదించారు. ఒకటి, రెండు విడుతల్లో 1.2 టీఎంసీల చొప్పున మూడో విడుతలో 1.6 టీఎంసీల మేర నీటి విడుదలకు ప్రతిపాదించినట్లు నీటిపారుదలశాఖ అధికారులు తెలిపారు. అయితే, దీనిపై ఈ నెలాఖరున హైదరాబాద్‌లో రాష్ట్రస్థాయి సమగ్ర నీటి ప్రణాళిక, నిర్వహణ కమిటీ (స్కీవం) సమావేశంలో నిర్ణయం వెలువడనున్నది. ఖరీఫ్‌కు ‘సాగర్’ భరోసా కరుణించిన వరుణుడు ఖరీఫ్ పంటల సాగుకు ఢోకా లేదు ఆయకట్టుకు మూడు విడుతల్లో 4 టీఎంసీల నీరు -
హైవేపై డేంజర్ యూటర్న్..
సదాశివనగర్(ఎల్లారెడ్డి): మండల కేంద్రంలో 44వ జాతీయ రహదారి యూటర్న్ ప్రమాదకరంగా మారింది. ప్రభుత్వ జూనియర్ కళాశాల, మోడల్ కళాశాల, పాఠశాలలు జాతీయ రహదారికి ఆనుకొని ఉన్నాయి. రోజూ వెయ్యి మందికి పైగా విద్యార్థులు రోడ్డు దాటేందుకు జూనియర్ కళాశాల వద్ద యూటర్న్ ఏర్పాటు చేశారు. జాతీయ రహదారి కావడంతో వాహనాలు వేగంగా వెళుతుంటాయి. ఇదే సమయంలో విద్యార్థులు ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని యూటర్న్ దాటుతున్నారు. రహదారిపై వాహనాలు అదుపుతప్పితే పెను ప్రమాదం సంభవించే అవకాశాలు ఉన్నాయని తల్లిదండ్రులు, స్థానికులు ఆందోళన చెందుతున్నారు. అండర్‌పాస్ బ్రిడ్జి నిర్మాణం కోసం గతంలో ప్రతిపాదనలు తయారు చేసినా.. నిర్మాణం కలగానే మిగిలింది. -
భార్యతో గొడవపడి.. ఇంటికి నిప్పు పెట్టిన భర్త
నవీపేట: భార్యతో గొడవపడిన వ్యక్తి.. మద్యం మత్తులో తన ఇంటికే నిప్పు పెట్టాడు. మంటలు పక్కింటికి కూడా వ్యాపించడంతో లక్ష రూపాయల ఆస్తి నష్టం వాటిల్లింది. నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం మోకన్‌పల్లిలో శుక్రవారం అర్ధరాత్రి తర్వాత ఈ ఘటన చోటుచేసుకుంది. మోకన్‌పల్లి గ్రామానికి చెందిన రెవెన్యూ ఉద్యోగి (వీఆర్ఏ) అల్లం సురేశ్ తరచూ భార్య ఉమతో గొడవపడేవాడు. పలుమార్లు పెద్ద మనుషులు జోక్యం చేసుకుని పంచాయితీపెట్టి రాజీ కుదిర్చారు. తాగుడుకు బానిసైన సురేశ్.. శుక్రవారం రాత్రి ఎప్పటిలాగే మద్యం సేవించి భార్యతో గొడవపడ్డాడు.అర్ధరాత్రి వరకు గట్టిగా అరుస్తూ భార్యను కొట్టడంతో.. విషయం తెలుసుకున్న పుట్టింటివారు వచ్చి ఆమెను తీసుకువెళ్లారు. మద్యం మత్తులో తెల్లవారే వరకు కేకలు వేసిన సురేశ్.. శనివారం ఉదయం అదే మత్తులో పెట్రోల్ పోసి ఇంటి పైకప్పుకు నిప్పంటించాడు. మంటలు పక్కనే ఉన్న అల్లం సాయిబాబా ఇంటికీ వ్యాపించాయి. అగ్నిమాపక సిబ్బంది సకాలంలో రావడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఇంట్లోని వస్తువులు కాలిబూడి దయ్యాయని, రూ. లక్ష మేర ఆస్తినష్టం జరిగిందని సాయిబాబా తెలిపారు. సాయిబాబా ఫిర్యాదు మేరకు సురేశ్‌పై కేసు నమోదు చేశామని ఎస్సై శ్రీకాంత్ తెలిపారు. -
అదనంగా 28 పోలింగ్ కేంద్రాలు
నిజామాబాద్ అర్బన్: ఓటర్ల సంఖ్య, ఇతర అంశాలను ప్రాతిపదికగా చేసుకుని కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా 28 పోలింగ్ కేంద్రాలను కొత్తగా ఏర్పాటు చేయనున్నట్లు కలెక్టర్ భవేశ్ మిశ్రా తెలిపారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియలో భాగంగా జిల్లాలోని ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో పోలింగ్ కేంద్రాల హేతుబద్దీకరణ చేయడం జరిగిందన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని వీసీ హాల్లో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో శనివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు పోలింగ్ కేంద్రాల హేతుబద్దీకరణను చేపట్టి ముసాయిదా జాబితాను రూపొందించడం జరిగిందన్నారు. మొత్తం 1565 పోలింగ్ కేంద్రాలు ఉండగా, రేషనలైజేషన్ తరువాత ఆ సంఖ్య 1591కి చేరిందని తెలిపారు. ఆర్మూర్ నియోజకవర్గంలో 12, బోధన్‌లో 9, బాన్సువాడలో ఒకటి, నిజామాబాద్ రూరల్, బాల్కొండ నియోజకవర్గాల్లో మూడు చొప్పున పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు కానున్నాయన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ వి.భుజంగరావు, ఆర్మూర్ సబ్ కలెక్టర్ అభిజ్ఞాన్ మాల్వియా, నిజామాబాద్, బాన్సువాడ ఆర్డీవోలు రాజేంద్రకుమార్, రవీందర్, ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు బాలరాజు, ఆయా పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు. -
హమ్మయ్యా.. సగం నిండింది
● ఎస్సారెస్పీలోకి కొనసాగుతున్న ఇన్‌ఫ్లో ● రెండు వారాల్లో 25 టీఎంసీల వరద ● 40.861 టీఎంసీలకు చేరిన నీటిమట్టం వేల్పూర్(మెండోరా): ఎల్‌నినో కారణంగా వర్షాభావ పరిస్థితులు హడలెత్తించగా.. ఇటీవల కురుస్తున్న వర్షాలు ధైర్యాన్ని నింపాయి. రెండు వారాల క్రితం వరకు బోసిపోయిన శ్రీరాంసాగర్ ప్రాజెక్టు సగం నిండడం, ఇన్‌ఫ్లో కొనసాగుతుండడంతో సాగు, తాగునీటికి ఢోకా లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 1091 అడుగులు( 80.5 టీఎంసీలు) కాగా.. ప్రస్తుతం 1078.40 అడుగుల (40.861 టీఎంసీల) నీరు నిల్వ ఉంది. రెండు వారాలుగా వర్షాలు కురుస్తుండడంతో భారీగా వరదనీరు వచ్చి చేరింది. గత నెల 26 వరకు ప్రాజెక్టులో 15 టీఎంసీల నీరు మాత్రమే ఉండగా.. రెండు వారాల్లో సుమారు 25 టీఎంసీల ఇన్‌ఫ్లో వచ్చి చేరింది. ప్రస్తుతం 19,305 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. కాకతీయ కాలువకు 300 క్యూసెక్కులు, మిషన్ భగీరథకు 231 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తుండగా.. 462 క్యూసెక్క్లు నీరు ఆవిరిరూపంలో పోతోందని ప్రాజెక్ట్ అధికారులు తెలిపారు. -
పారదర్శకంగా సేవలందించాలి
● పోలీసులపై ప్రజల్లో విశ్వాసాన్ని పెంచాలి ● బాసర జోన్ డీఐజీ భాస్కరన్ బోధన్‌టౌన్(బోధన్): ప్రజలకు పోలీస్ శాఖపై విశ్వాసం మరింత పెంచేలా, క్రమశిక్షణతో పారదర్శకంగా సేవలందించాలని బాసర జోన్ డీఐజీ భాస్కరన్ అన్నారు. పట్టణ పోలీస్ స్టేషన్ ఆయన శనివారం తనిఖీ చేశారు. స్టేషన్‌లోని అన్ని విభాగాలతో పాటు రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. సిబ్బంది హాజరు రిజిస్టర్‌తోపాటు ఎవరెవరు ఏ డ్యూటీ చేస్తున్నారో అడిగి తెలుసుకున్నారు. పోలీస్ స్టేషన్లో నమోదైన, పరిష్కరించిన, పెండింగ్‌లో ఉన్న కేసుల రికార్డులను పరిశీలించారు. సీఐ వెంకట నారాయణ ద్వారా వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా భాస్కరన్ మాట్లాడుతూ.. స్టేషన్‌కు వచ్చే వృద్ధులు, మహిళలు, అత్యవసర సాయం కోసం వచ్చే వారితో స్నేహపూర్వకంగా మాట్లాడి సమస్యను తెలుసుకోవాలన్నారు. ముఖ్యంగా సైబర్ నేరాలపై ప్రజలను అప్రమత్తం చేయాలని, కళాశాలలు, పాఠశాలల్లో సైబర్ నేరాలపై అవగాహన సదస్సులు నిర్వహించాలని సూచించారు. పట్టణంలో ట్రాఫిక్ సమస్యను అధిగమించేందుకు ప్రధాన కూడళ్లలో ట్రాపిక్ ఎన్ఫోర్స్మెంట్ను ఏర్పాటు చేయాలని సూచించారు. కేసుల దర్యాప్తులో నూతన టెక్నాలజీని ఉపయోగించాలని, పట్టణంలోని ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల పనితీరును ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ పర్యవేక్షించాలన్నారు. మహారాష్ట్ర సరిహద్దులోని అన్ని ప్రధాన రహదారులపై పటిష్టమైన నిఘా ఏర్పాటు చేయాలని, కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయాలన్నారు. డీఐజీ వెంట సీపీ సాయి చైతన్య, అడిషనల్ డీసీపీ శుభం ప్రకాష్, ఏసీపీ శ్రీనివాస్, ఎస్సై హబీబ్‌ఖాన్, ట్రాపిక్ ఎస్సై మహేశ్ ఉన్నారు. -
పెరిగిన ఆరుతడి పంటల సాగు
డొంకేశ్వర్(ఆర్మూర్): జిల్లాలో ఆరుతడి పంటల సాగు విస్తీర్ణం పెరిగింది. ఖరీఫ్‌లో వర్షాభావ పరిస్థితులు ఉండొచ్చన్న అధికారుల సూచన మేరకు కొంతమంది రైతులు తక్కువ నీటితో సాగయ్యే పంటలను వేశారు. వ్యవసాయ శాఖ వేసిన అంచనా కన్నా ఎక్కువ ఎకరాల్లో ఆరుతడి పంటలు సాగవుతుండడం గమనార్హం. మినుములు 19 ఎకరాల్లో సాగవుతాయని అంచనా ఉండగా 138 ఎకరాల్లో వేశారు. అలాగే పెసర 29 ఎకరాలకుగాను 160 ఎకరాల్లో, కందులు 832 ఎకరాలకు గాను 960 ఎక రాల్లో రైతులు సాగు చేస్తున్నారు. సోయా కూడా అంచనాకు మించి 35,166 ఎకరాల్లో వేశారు. యూ రియాను పరిమితం చేయడం, నీటి లభ్యత తక్కువగా ఉండడంతో కొందరు రైతులు వరి స్థానంలో పప్పుదినుసుల పంటలు సాగు చేస్తున్నారు. -
బాల్యాన్ని ‘దారి’తప్పిస్తున్నారు..
నిజామాబాద్ అర్బన్ : పోలీసుల నిఘా పెరగడంతో నేరగాళ్లు తమ పంథాను మార్చుకుంటున్నారు. మైనర్లతో చట్ట వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. ఇందులో ప్రధానంగా పాత నేరస్తులు, కొందరు నేరచరిత్ర లేని వారు ప్రధాన సూత్రధారులుగా ఉంటూ టీనేజర్లతో నేరాలు చేయిస్తున్నారు. జిల్లాలో ఇటీవల చోటు చేసుకున్న ఘటనలే ఇందుకు నిదర్శనంగా చెప్పవచ్చు. బానిసలుగా మార్చి.. నేరాల వైపు నగరంలోని మూడో టౌన్ పరిధిలో ధనుష్ అనే వ్యక్తి పలువురు మైనర్ల ఆర్థిక అవసరాలను తీరుస్తూ వారి ఇంటిలోనే బంగారం దొంగతనం చేసేలా ప్రేరేపిస్తూ ఇటీవల 10 తులాల బంగారాన్ని దోచుకున్నాడు. ఈ విషయం తెలిసి పోలీసులు అవాక్కయ్యారు. నందిపేట మండల కేంద్రంలో ఓ బాలుడు చైన్ స్నాచింగ్‌కు ప్రయత్నించి దొరికిపోయాడు. ఒకటో టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో పలు దొంగతనాలలో ముగ్గురు మైనర్లు వెలుగులోకి వచ్చారు. జిల్లా కేంద్రంలోని ద్వారకానగర్‌కు చెందిన వ్యాపారి మైనర్లకు డబ్బులు, ద్విచక్ర వాహనం సమకూరుస్తూ గంజాయి విక్రయిస్తున్నాడు. మాలపల్లి, అర్సపల్లికి చెందిన మరో ఇద్దరు గంజా వ్యాపారస్తులు పిల్లలతో పాఠశాలలు, కళాశాలల వద్ద గాంజా విక్రయిస్తున్నారు. అయితే, కొన్ని ముఠాలు మైనర్లకు మొదటగా మద్యం, గంజాయి, జల్సాలకు అలవాటుపడేలా చేసి ఆ తర్వాత వాటి కోసం ఎలాంటి పని అయినా చేసేందుకు వెనుకాడకుండా తయారు చేస్తున్నట్లు తెలిసింది. డబ్బు, సెల్ఫోన్లు, బైక్‌లు, కొత్తబట్టలు తదితర వాటికి డబ్బులు తేలికగా వస్తుండటంతో సూత్రధారులు చెప్పినట్లు చేస్తున్నారు. ఇలా మైనర్లను దొంగతనాలకు వినియోగించుకుంటూ కొందరు నేరగాళ్లు అక్రమంగా సంపాదిస్తున్నారు. నేరాలకు పాల్పడే వారిలో మైనర్లు ఉండటానికి అనేక కారణాలున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. ప్రధానంగా తల్లిదండ్రులు పిల్లలపై దృష్టి సారించకపోవడం. చదువు మానేసిన పిల్లలు ఆర్థిక అవసరాల కోసం తప్పటడుగులు వేస్తున్నారు. పేదరికంలో ఉన్న వారి పిల్లలు ఈజీగా డబ్బు సంపాదించవచ్చని నేరగాళ్లతో జతకడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. అడ్డాలుగా శివారు ప్రాంతాలు! మైనర్లు, యువత పెడదారి పట్టేందుకు మండల, పట్టణ కేంద్రాల శివారు ప్రాంతాలే అడ్డాలుగా మారుతున్నట్లు సమాచారం. టీ పాయింట్లు, పాన్ షాపులు తదితర వాటి వద్ద సూత్రధారులు కొందరు చదువు మధ్యలో ఆపేసిన పిల్లలతోపాటు విద్యార్థులు, యువతను మభ్యపెడుతున్నట్లు తెలిసింది. టీనేజర్లకు మద్యం, గంజాయి, ఇతర మత్తుకు అలవాటు చేస్తున్నారు. ఆ తర్వాత డబ్బులు ఇస్తామని ఆశచూపుతూ గంజాయి సరఫరా, చైన్ స్నాచింగ్, దొంగతనాలకు పాల్పడేలా తీర్చిదిద్దుతున్నట్లు సమాచారం.పుస్తకాలు పట్టాల్సిన చేతులు.. మహిళల మెడల్లోని చైన్లు లాగుతున్నాయి. ఆటలాడాల్సిన వయసులో దొంగతనాలకు అలవడుతున్నారు. తరగతి గదిలో ఉండాల్సిన పిల్లలు పోలీసు స్టేషన్ల మెట్లు ఎక్కుతున్నారు. డబ్బు, మొబైల్స్ ఆశ చూపుతూ.. బీరు, బిర్యానీ అలవాటు చేస్తూ కొన్ని నేరప్రవృత్తి కలిగిన ముఠాలు బాల్యాన్ని దారితప్పిస్తున్నాయి. జిల్లాలో ఇటీవల పలు కేసుల్లో మైనర్లే కీలకం కావడం విస్తుగొలుపుతుంది.కఠిన చర్యలు తీసుకుంటాం.. నేరాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నాం. మైనర్లు నేరాల్లో వస్తున్న కేసుల్లో ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నాం. మళ్లీ నేరాలకు పాల్పడకుండా కౌన్సెలింగ్ ఇస్తున్నాం. తల్లిదండ్రుల నియంత్రణ లేనివారు కొందరు నేరాల్లోకి వస్తున్నారు. – ప్రకాశ్ యాదవ్, ఏసీపీఅవగాహనే ముఖ్యం మత్తుకు అలవాటుపడిన వారు ఎలాంటి పనులు చేయడానికై నా సిద్ధంగా ఉంటారు. పిల్లలకు చెడు వ్యసనాలపై ముందుగానే అవగాహన కల్పించారు. క్రమశిక్షణ ఎంతో అవసరం. పిల్లలపై ఎల్లప్పుడూ నిఘా ఉంచాలి. అలవాట్లలో తేడా కనిపిస్తే తక్షణమే స్పందించాలి. – డాక్టర్ విశాల్, మానసిక వైద్యనిపుణులు డబ్బు ఆశ చూపుతూ.. మైనర్లతో నేరాలు చేయిస్తున్న ముఠాలు చట్ట వ్యతిరేక కార్యకలాపాల్లోకి పిల్లలు మొబైల్స్, గంజాయి ఇతర అవసరాల కోసం దొంగతనాలు -
గర్భిణులు పౌష్టికాహారం తీసుకోవాలి
వేల్పూర్(బాల్కొండ): గర్భిణులు పౌష్టికాహారం తీసుకోవాలని, ప్రతి నెలా క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని డీఎంహెచ్‌వో రాజశ్రీ అన్నారు. బాల్కొండ, మోర్తాడ్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో శనివారం నిర్వహించిన ప్రత్యేక హెల్త్ మేళాను డీఎంహెచ్‌వో పరిశీలించారు. ప్రజలకు అందుతున్న వైద్య సేవలను, వైద్యులు, సిబ్బంది నిర్వహిస్తున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. గర్భిణులు ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే కాన్పు చేయించుకునేలా ప్రోత్సహించాలన్నారు. గర్భిణులతో స్వయంగా మాట్లాడారు. వైద్యురాలు సవిత, సీ్త్రల వైద్య నిపుణులు స్వాతి, సబ్ యూనిట్ అధికారి సాయి, ఆరోగ్య సిబ్బంది ఉన్నారు. వేల్పూర్: స్కూళ్ల సమస్యలను సమష్టి కృషితో పరిష్కరించుకుందామని బడ్జెట్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీపతి శేఖర్‌రెడ్డి పిలుపునిచ్చారు. లక్కోర వద్ద శనివారం నిర్వహించిన సాధారణ సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. బడ్జెట్ పాఠశాలలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించుకునే విధానాలపై ఐక్యంగా ఉండాలని కోరారు. రాష్ట్ర కార్యదర్శి జగ్గు మల్లారెడ్డి, రాష్ట్ర కోశాధికారి శ్రీనివాస్‌రావు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు షఫీ, జిల్లా కార్యదర్శి రవీందర్, జిల్లా ట్రెజరర్ హరీశ్, గిరి పాల్గొన్నారు. నవీపేట: ఆలిండియా డినేటిఫైడ్ ట్రైబ్స్ అండ్ డెవలప్మెంట్ బోర్డ్ కౌన్సిల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా జాదవ్ శరత్ శనివారం ఏకగ్రీవంగా ఎన్నియ్యారు. హైదరాబాద్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఆలిండియా డినేటిఫైడ్ కౌన్సిల్ బోర్డు జాతీయ అధ్యక్షుడు బికు రామ్ ఇదాతే, ప్రధాన కార్యదర్శి అనిల్ పహాడ్ ఆదేశాల మేరకు రాష్ట్ర అధ్యక్షుడు స్వర్ణ కుమార్, ప్రధాన కార్యదర్శి మిట్టపల్లి చిరంజీవి ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీని ఎన్నుకున్నారు. రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా జాదవ్ శరత్‌ను ఎన్నికయ్యారు. జాదవ్ శరత్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో అణగారిన సంచార జాతుల అభివృద్ధి, సంక్షేమం కోసం కృషి చేసే అవకాశం ఇచ్చిన జాతీయ, రాష్ట్ర కమిటీలకు ధన్యవాదాలు తెలిపారు. -
నిజామాబాద్
అదనంగా 28 పోలింగ్.. జిల్లాలో 28 పోలింగ్ కేంద్రాలను కొత్తగా ఏర్పాటు చేయనున్నట్లు కలెక్టర్ భవేశ్ మిశ్రా తెలిపారు. ఆదివారం శ్రీ 9 శ్రీ ఆగస్టు శ్రీ 2026– 8లో uరేషన్ కార్డుల పంపిణీకి రంగం సిద్ధమైంది. అయితే ఇప్పుడు చేతికందనున్నవి డిజిటల్ కార్డులు. ఏటీఎం కార్డుల తరహాలో రేషన్ కార్డులను రూపొందించిన ప్రభుత్వం.. కుటుంబ యజమాని, సభ్యుల పేర్లతోపాటు సీఎం, సంబంధిత మంత్రి ఫొటోతో కార్డులను తీసుకువస్తోంది. ఇప్పటికే కార్డులు జిల్లాకు చేరగా.. పంపిణీపై మార్గదర్శకాలు విడుదల కావాల్సి ఉంది. క్యూఆర్ కోడ్‌తో భద్రం కాగితానికి స్వస్తి చెప్పి ఏటీఎం కార్డు తరహాలో రేషన్‌కార్డును రూపొందించింది. చినిగిపోకుండా, తడిసిపోకుండా ఉండే విధంగా భద్రతా ప్రమాణాలతో రూపకల్పన చేశారు. కార్డుకు ఓ వైపు సీఎం రేవంత్‌రెడ్డి ఫొటోతోపాటు పౌరసరఫరాలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఫొటోలు, కుటుంబ యజమాని, సభ్యుల పేర్లు ముద్రించారు. మరోవైపు క్యూఆర్ కోడ్‌ను పొందుపర్చారు. సంబంధిత రేషన్‌దుకాణాలకు వెళ్లి స్కాన్ చేస్తే పూర్తి వివరాలు వెల్లడవుతాయి. త్వరలో ఇదే కార్డుపై బహుళ ప్రయోజనాలు కలిగే విధంగా ప్రభుత్వం ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది. ఆగస్ట్ 15న పంపిణీకి ఏర్పాట్లు ఇప్పటికే చేరిన కార్డులు జిల్లాలో 4,77,780 కార్డుదారులు నియోజకవర్గాల్లో పంపిణీ చేయనున్న ఎమ్మెల్యేలు? -
అంతర్ జిల్లా బైక్ దొంగల ముఠా అరెస్టు
సదాశివనగర్: సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశ్యంతో వివిధ ప్రాంతాల్లో పార్క్ చేసిన అంతర్ జిల్లా బైక్ దొంగల ముఠాను శనివారం మండలంలోని పద్మాజివాడి చౌరస్తా వద్ద అరెస్టు చేసినట్లు సీఐ సంతోష్‌కుమార్, ఎస్సై పుష్పరాజ్ తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. సదాశివనగర్ మండల కేంద్రానికి చెందిన హన్మంత్ రాజు అనే వ్యక్తి తన బైక్‌ను గత నెల 24న రాత్రి ఇంటి ఎదుట పార్క్ చేయగా మరుసటి రోజు కనిపించకుండా పోయింది. బాధితుడి ఫిర్యాదు మేరకు ఎల్లారెడ్డి డీఎస్పీ రెండు పోలీస్ ప్రత్యేక బృందాలుగా ఏర్పాటు చేసి దర్యాప్తును ప్రారంభించారు. పద్మాజీవాడి చౌరస్తా వద్ద పోలీస్ పెట్రోలింగ్ వాహనాన్ని గమనించి తప్పించుకునేందుకు యత్నించిన ఐదుగురు నిందితులను పోలీసులు వెంబడించి అదుపులోకి తీసుకుని విచారించారు. విచారణలో నిందితులు పార్క్ చేసిన బైక్‌లను దొంగతనాలకు పాల్పడినట్లు నేరం ఒప్పుకున్నారు. నిందితులు ఇమ్రాన్, అద్నా ఖాన్ పార్కింగ్ చేసిన బైక్‌లను గుర్తించి దొంగిలించేవారు. వాటిని జుబేర్, అయాన్, సచిన్‌లకు విక్రయించేవారు. వీరు ప్లేట్ నంబర్లను మార్చి వినియోగించేవారు. అందులో భాగంగానే దొంగిలించిన్ ఓ బైక్‌ను హైదరాబాద్‌లో విక్రయించేందుకు నిందితులు తీసుకెళ్తుండగా పోలీసులు పద్మాజీవాడి చౌరస్తా వద్ద పట్టుకున్నారు. నిందితుల నుంచి దొంగిలించిన నాలుగు బైక్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను పట్టుకోవడంలో కృషి చేసిన డీఎస్పీ శ్రీనివాస్ రావు, సీఐ సంతోష్‌కుమార్, ఎస్సైలు పుష్పరాజ్, సిద్ధిఖీ, సిబ్బంది అజహర్, ఫరూక్, ఏఆర్పీసీ శంకర్, సీసీఎస్ బృందం సభ్యులు రవి, గణపతిలను ఎస్పీ అభినందించారు. -
11న దివ్యాంగుల జిల్లా స్థాయి సదస్సు
బోధన్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దివ్యాంగుల సంక్షేమ పథకాల అమలులో విఫలమవుతున్న నేపథ్యంలో వారి సమస్యల పరిష్కారం అంశాల పై చర్చించేందుకు ఈ నెల 11న రాకాసీపేటలో జిల్లా స్థాయి సదస్సు నిర్వహించనున్నట్టు దివ్యాంగుల హక్కుల జాతీయ వేదిక జిల్లా ప్రధాన కార్యదర్శి యేశాల గంగాధర్ తెలిపారు. శనివారం పట్టణ కేంద్రంలో ఆయన వేదిక ముఖ్య కార్యకర్తలతో సమావేశమై మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం దివ్యాంగులకు ఇస్తున్న నెలసరి రూ.300 పెన్షన్‌ను రూ.5 వేలకు, రాష్ట్ర ప్రభుత్వం రూ.4016 నుంచి రూ.6016కు పెంచి చెల్లించాలని డిమాండ్ చేశారు. సదస్సును విజయవంతం చేయాలని కోరారు. వేదిక ప్రతినిధులు జల్లాపురం సాయిలు, గిర్ని రాజు, మంచిప్ప మోహన్, తబ్రీజ్, సాయిలు, పావని, సునీత తదితరులు పాల్గొన్నారు. -
కిక్కిరిసిన మేకల సంత
● రూ.4.5 కోట్ల లావాదేవీలువిక్రయదారులు, కొనుగోలుదారులతో కిటకిటలాడుతున్న మేకల సంత నవీపేట: ఉత్తర తెలంగాణలో ప్రత్యేక గుర్తింపు ఉన్న నవీపేట మేకల సంత విక్రయదారులు, కొనుగోలుదారులతో శనివారం కిటకిటలాడింది. ఆషాఢమాసం చివరి ఆదివారం రోజున బోనాల పండుగ నిర్వహించనుండడంతోపాటు వన భోజనాలకు వెళ్లనున్న నేపథ్యంలో జీవాల కొనుగోలుకు వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. మండల కేంద్రంలో ఎక్క డ చూసినా వాహనాలు పార్కింగ్ చేసి కనిపించాయి. మహారాష్ట్ర, కర్ణాటక సరిహద్దు ప్రాంతాలకు చెందిన వ్యాపారులు శుక్రవారం సా యంత్రమే తమ వాహనాల్లో జీవాలను తీసుకు ని వచ్చారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఈ ఆదివారానికి ప్రత్యేకత ఉండడంతో ఇరు రాష్ట్రాల నుంచి వ్యాపారులు, వినియోగదారులు సంతలో క్ర యవిక్రయాలు జరిపారు. సంత ప్రాంగణం సరిపోకపోవడంతో బాసర రహదారి పక్కన, బ స్టాండ్ పరిసర ప్రాంతాల్లో క్రయవిక్రయాలు కొ నసాగాయి. ఈ శనివారం రూ.4.5 కోట్ల లావాదేవీలు జరిగినట్లు వ్యాపారులు పేర్కొన్నారు. -
‘ఫుడ్ టెక్నాలజీ’ ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం
రుద్రూర్: మండలంలోని ఆహార శాస్త్ర సాంకేతిక విజ్ఞాన కళాశాల (కాలేజ్ ఆఫ్ ఫుడ్ సైనన్స్ అండ్ టెక్నాలజీ)లో 2026–27 విద్యా సంవత్సరానికి బీటెక్ (ఫుడ్ టెక్నాలజీ) కోర్సులో ప్రవేశాలకు అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని కళాశాల వర్గాలు శనివారం ఒక ప్రకటనలో తెలిపాయి. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలో కొనసాగుతున్న కళాశాలలో 82 మంది విద్యార్థులకు నాలుగేళ్ల బీటెక్ ఫుడ్ టెక్నాలజీ కోర్సు అందుబాటులో ఉందని పేర్కొన్నారు. ప్రవేశాలకు సంబంధించిన వివరాలు పీజేటీఏయూ అధికారిక వెబ్సైట్లో తెలుసుకొవచ్చని సూచించారు. 2015లో ప్రారంభమైన కోర్సు ఆహార రంగంలో పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా నాణ్యమైన సాంకేతిక విద్యను అందించాలనే లక్ష్యంతో 2015లో ఫుడ్ టెక్నాలజీ కోర్సును ప్రారంభించారు. న్యూఢిల్లీలోని ఐసీఏఆర్ నుంచి కళాశాలకు ‘ఏ’ గ్రేడ్ గుర్తింపు లభించింది. మారుతున్న ఆహార పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా కోర్సు పాఠ్యప్రణాళికను రూపొందించారు. కళాశాలలో ఆధునిక ప్రయోగశాలలు, మౌలిక వసతులు అందుబాటులో ఉండటంతో విద్యార్థులకు సైద్ధాంతిక పరిజ్ఞానంతోపాటు ఆచరణాత్మక నైపుణ్యాలు అందుతున్నాయి. విద్యార్థుల వృత్తిపరమైన ఎదుగుదలతోపాటు వ్యక్తిత్వ వికాసం, టీమ్ వర్క్, కమ్యూనికేషనన్ నైపుణ్యాలను పెంపొందించేలా విద్యాబోధన కొనసాగుతోంది. ఇప్పటికే కోర్సు పూర్తి చేసిన పలువురు విద్యార్థులు ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో ఉద్యోగాలు సాధించారు. మరికొందరు జాతీయ, అంతర్జాతీయ విశ్వవిద్యాలయాల్లో పీజీ కోర్సులు అభ్యసిస్తున్నారు. మెగా జాబ్ మేళాల ద్వారా పలువురు ఫుడ్ టెక్నాలజీ విద్యార్థులు క్యాంపస్ ప్లేస్మెంట్ పొందారు. అర్హతలు ఇవీ.. ఇంటర్మీడియెట్‌లో ఎంపీసీ లేదా బైపీసీ పూర్తి చేసి ఎప్‌సెట్‌లో అర్హత సాధించిన విద్యార్థులు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులని కళాశాల అసోసియేట్ డీన్ కె వెంకట్‌రెడ్డి తెలిపారు. ప్రవేశాలు మెరిట్ ఆధారంగానే ఉంటాయని పేర్కొన్నారు. రైతులు, వ్యవసాయ కార్మికులు, ఇతర ప్రత్యేక వర్గాలకు చెందిన విద్యార్థులకు నిబంధనల మేరకు కోటా ఉంటుందని తెలిపారు. ఈ నెల 11వ తేదీలోగా అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. రుద్రూర్ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కళాశాలలో 82 సీట్లు ఎప్‌సెట్ అర్హత తప్పని సరి.. మెరిట్ ఆధారంగా ప్రవేశాలు రైతులు, వ్యవసాయ కార్మికుల పిల్లలకు ప్రత్యేక కోటా -
అటవీ ఆక్రమణలు ఉపేక్షించం
మోపాల్: అటవీ ఆక్రమణలను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించబోమని ఎఫ్ఆర్వో రవి మోహన్ భట్ పేర్కొన్నారు. శనివారం మంచిప్ప అటవీ ప్రాంతంలో ఆయన పర్యటించారు. ఈ సందర్బంగా కాల్పోల్ వాటర్ ఫాల్స్‌ను పరిశీలించారు. వాటర్ ఫాల్స్ వద్ద ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడవద్దని సూచించారు. నీటి కుంటలను కాపాడాలని తెలిపారు. అడవులను నరికితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆయన వెంట సెక్షన్ అధికారులు బాసిత్, సాయికుమార్, బీట్ ఆఫీసర్స్ ఉన్నారు. బాన్సువాడ రూరల్: అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఓ మహిళ ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన బాన్సువాడ పట్టణం టీచర్స్ కాలనీలో చోటు చేసుకుంది. సీఐ తుల శ్రీధర్ తెలిపిన వివరాల ప్రకారం.. కాలనీకి చెందిన అంబిల్పూర్ రజిని(34) కొంత కాలంగా తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతోంది. పలు ఆస్పత్రుల్లో చూయించినా నయం కాలేదు. దీంతో జీవితంపై విరక్తి చెందిన ఆమె శుక్రవారం రాత్రి ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. మృతురాలికి భర్త బాలరాజు, ఇద్దరు పిల్లలు ఉన్నారు. -
రైతాంగ ప్రయోజనాలను కాపాడుదాం
నిజామాబాద్ అర్బన్ : నిజామాబాద్ ఉమ్మడి జిల్లా రైతాంగ ప్రయోజనాలను కాపాడడమే పరమావధిగా సమష్టిగా కృషి చేద్దామని శాసనసభ్యులు సూచించారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఇన్చార్జి కలెక్టర్ భవేశ్ మిశ్రా అధ్యక్షతన శనివారం జిల్లా నీటిపారుదల సలహా మండలి సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ సలహాదారు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి, నిజామాబాద్ రూరల్, అర్బన్, ఆర్మూర్ ఎమ్మెల్యేలు డాక్టర్ ఆర్.భూపతిరెడ్డి, ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, పైడి రాకేశ్‌రెడ్డి హాజరుకాగా, కామారెడ్డి కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ వర్చువల్‌గా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉమ్మడి జిల్లాలోని నిజాంసాగర్, శ్రీరాంసాగర్, సింగూరు, కౌలాస్‌నాలా, పోచారం, రామడుగు తదితర జలాశయాలలో నీటి నిల్వల స్థితిగతులు, ఆయకట్టుకు సాగు నీటిని అందించే వెసులుబాటు, ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక తదితర అంశాలపై చర్చించారు. తుపాను ప్రభావంతో ఇప్పటి వరకు కొంతవరకు వర్షాలు కురిసినప్పటికీ, ఎల్‌నినో ప్రభావంతో ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో వర్షపాతం తక్కువగా నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని ఇన్చార్జి కలెక్టర్ భవేశ్ మిశ్రా పేర్కొన్నారు. అందుబాటులో ఉన్న నీటి వనరులను జాగ్రత్తగా వినియోగించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. జిల్లాలోని 3.96 లక్షల ఎకరాల విస్తీర్ణంలో వరి నాట్లు పూర్తయ్యాయని, కమాండ్, నాన్ కమాండ్ ఏరియాల్లో ఇంకా 45 వేల ఎకరాల విస్తీర్ణంలో వరికి బదులు ఆరుతడి పంటలతోపాటు ఆయిల్ పామ్ సాగు చేసేలా రైతులను ప్రోత్సహించాలని అధికారులను ఆదేశించారు. 80 టీఎంసీల సామర్థ్యం కలిగిన ఎస్సారెస్పీలో గతేడాది తరహాలోనే ఈసారి కూడా ప్రస్తుతం 40 టీఎంసీల నీరు నిలువ ఉందన్నారు. ప్రాజెక్టు ద్వారా ఆయకట్టుకు ఏ మేరకు సాగునీటిని విడుదల చేయాలన్నది ఈ నెలాఖరులో రాష్ట్రస్థాయిలో నిర్వహించనున్న సివం కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారని తెలిపారు. నిజాంసాగర్ ప్రాజెక్టు కింద నిజామాబాద్ జిల్లాలో లక్షా 15 వేల ఆయకట్టు ఉందని, జలాశయంలో ప్రస్తుతం 10.78 టీఎంసీల నీరు నిలువ ఉన్నందున మూడు నుంచి నాలుగు తడులు సాగు నీటిని అందించేందుకు అవకాశం ఉందని తెలిపారు. నిజామాబాద్, కామారెడ్డి, మెదక్ జిల్లాల తాగునీటి అవసరాలకు ఉపయోగపడుతున్న సింగూర్ రిజర్వాయర్‌కు మరమ్మతులు చేపడుతున్న నేపథ్యంలో సామర్థ్యం మేరకు నీటిని నిలువ ఉంచే పరిస్థితి లేదని కామారెడ్డి కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో అందుబాటులో ఉన్న నీటి వనరులను జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం ఉందని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి పేర్కొన్నారు. నిజాంసాగర్ చివరి ఆయకట్టు ప్రాంతంగా ఉన్న ఆర్మూర్ నియోజకవర్గానికి కాలువలు సక్రమంగా నీరు అందడం లేదని ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డి అన్నారు. కేవలం గుత్ప ఎత్తిపోతల పథకం ద్వారా 40 వేల ఎకరాలకు సాగు నీరు అందుతోందని తెలిపారు. ఆర్మూర్, ఆలూర్, నందిపేట తదితర మండలాల్లోని ఆయకట్టుకు ఎత్తిపోతల ద్వారానైనా సాగు నీటిని అందించాలని కోరారు. ఎల్‌నినో పరిస్థితులను సవాల్‌గా స్వీకరిస్తూ అధికారులు సమగ్ర కార్యాచరణ ప్రణాళికను అమలు చేయాలని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ సూచించారు. సమావేశంలో నిజామాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, అదనపు కలెక్టర్ వి.భుజంగరావు, ట్రెయినీ కలెక్టర్ సురేశ్, డీఆర్వో గీత, ఇరిగేషన్, గ్రౌండ్ వాటర్, వ్యవసాయ, ఉద్యానవన తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు. ఆరుతడి పంటలు, ఆయిల్ పామ్ సాగుపై అవగాహన కల్పించాలి జలసిరి కార్యక్రమాన్ని విస్తృతంగా నిర్వహించాలి జిల్లా నీటిపారుదల సలహా మండలి సమావేశంలో ప్రభుత్వ సలహాదారు పోచారం, ఎమ్మెల్యేలు ఆరుతడిపై అవగాహన కల్పించాలి ప్రతి ఏడాది యాసంగిలో నీటి పారుదల సలహా మండలి సమావేశం నిర్వహించాల్సి ఉండగా.. ఎల్‌నినో ప్రభావం కారణంగా ప్రస్తుతం ఖరీఫ్ సీజన్లోనే ఏర్పాటు చేయడం జరిగిందని పోచా రం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. వర్షాలు తక్కువగా కురిసే అవకాశాలున్నందున వరి నాటేసిన రైతులు నష్టపోకుండా అధికారులు చొరవ చూపాలన్నారు. ఇంకా పంట వేసుకోని రైతులు ఆరుతడి పంటలు, కూరగాయలు, ఆయిల్‌పామ్ సాగు చేసేలా అవగాహన కల్పించా లని వ్యవసాయ, ఉద్యానవన తదితర శాఖల అధికారులకు సూచించారు. -
యూరియా కోసం బారులు తీరిన రైతులు
కమ్మర్పల్లి(భీమ్‌గల్): భీమ్‌గల్ పట్టణంలో యూరి యా కోసం రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. యూరియా కోసం తెల్లవారుజాము నుంచే ఫర్టిలైజర్ దుకాణాల వద్ద బారులు తీరుతున్నారు. శనివారం పట్టణంలోని ఓ ఫెర్టిలైజర్ షాప్ వద్దకు అధిక సంఖ్యలో రైతులు చేరుకోవడంతో రద్దీ ఏర్పడింది. తొక్కిసలాట వాతావరణం నెలకొంది. యూరియా పంపిణీలో భాగంగా బయోమెట్రిక్ విధానం అమలు చేస్తుండగా, నెట్వర్క్ సమస్యలు రైతుల ఇబ్బందులను మరింత పెంచుతున్నాయి. నాలుగు బస్తాల యూరియా కోసం గంటల తరబడి క్యూలో నిలబడాల్సి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమస్యను వెంటనే పరిష్కరించాలని రైతులు అధికారులను కోరుతున్నారు. -
విద్యుత్‌నగర్‌లో భారీ చోరీ
కామారెడ్డి క్రైం: కామా రెడ్డి మున్సిపల్ పరిధిలోని దేవునిపల్లి విద్యుత్‌నగర్ కాలనీలో శనివారం భారీ చోరీ జరిగింది. గాంధారికి చెందిన పబ్బ సురేశ్ విద్యుత్ శాఖలో లైన్ ఇన్స్పెక్టర్గా, అతని భార్య లావణ్య ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా పని చేస్తూ కామారెడ్డిలో నివాసం ఉంటున్నారు. శాఖాపరమైన శిక్షణకు హాజరయ్యేందుకు సురేశ్ మూడు రోజుల క్రితం వరంగల్ వెళ్లాడు. దీంతో అతని భార్యాపిల్లలు సమీప బంధువుల ఇంట్లో ఉన్నారు. శనివారం ఇంటికి వచ్చి చూసేసరికి దొంగలు పడినట్లు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇంట్లో దాచిన 16 తులాల బంగారం, 30 తులాల వెండి, రూ.90 వేలు చోరీకి గురైనట్లు బాధితులు తెలిపారు. దేవునిపల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. సీసీఎస్, క్లూస్‌టీం బృందాలు ఆధారాలు సేకరించారు. గాంధారిలో ఒకరి అదృశ్యం గాంధారి: మండల కేంద్రానికి చెందిన గాండ్ల నారాయణ(66) అనే వ్యక్తి అదృశ్యమైనట్లు పోలీసులు శనివారం తెలిపారు. శుక్రవారం మధ్యాహ్నం ఇంటి నుంచి బయటకు వెళ్లిన అతను తిరిగి రాలేదు. కుటుంబీకులు పలుచోట్ల గాలించినా ఆచూకీ లభించలేదు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. వర్ని: మండలంలోని ఓ పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్న బాలిక శనివారం ఉదయం అదృశ్యమైంది. పాఠశాల అధికారి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. సదరు బాలిక బస్సులో హైదరాబాద్ వెళ్తున్న విషయాన్ని తెలుసుకొని కండక్టర్ ద్వారా మేడ్చల్ పోలీస్‌స్టేషన్‌లో ఆశ్రయం కల్పించారు. బాలిక తల్లిదండ్రులు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఇంటికి తీసుకొచ్చారు.● 16 తులాల బంగారం, 30 తులాల వెండి, రూ.90 వేలు అపహరణ -
క్రైం కార్నర్
చేపల వేటకు వెళ్లి ఒకరి మృతి వర్ని: మండలంలోని తగిలేపల్లి ఊర చెరువులో చేపల వేటకు వెళ్లిన పిట్ల లచ్చిరాం(48) అనే వ్యక్తి మృతి చెందినట్లు వర్ని ఎస్సై వంశీకృష్ణారెడ్డి తెలిపారు. ఈనెల 6న చేపల వేటకు వెళ్లిన అతను ప్రమాదవశాత్తు చెరువులో పడగా శనివారం మృతదేహాన్ని గుర్తించినట్లు పేర్కొన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. చికిత్స పొందుతూ యువకుడు..నిజామాబాద్ రూరల్: కుటుంబ కలహాలతో ఆత్మహత్యకు యత్నించిన ఓ యువకుడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. రూరల్ ఎస్‌హెచ్‌వో శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని ఒకటో డివిజన్ కాలూర్‌కు చెందిన చిట్టి కుమార్(38) మద్యానికి బానిసయ్యాడు. దీంతో కుటుంబంలో కలహాలు మొదలయ్యాయి. భార్య అతన్ని వదిలేసి పుట్టింటికి వెళ్లిపోయింది. జీవితంపై విరక్తితో ఈ నెల 2న ఇంట్లో పురుగుల మందు సేవించి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించిన స్థానికులు ఆస్పత్రికి చేర్పించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌హెచ్‌వో శ్రీనివాస్ తెలిపారు. రైలు ఢీకొని ఒకరికి తీవ్ర గాయాలు డిచ్పల్లి: మండల కేంద్రంలోని రైల్వేగేట్ వద్ద పట్టాలు దాటుతున్న ముల్ల సురేశ్‌ను రైలు ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న 108 అంబులెన్స్ సిబ్బంది క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తలకు బలమైన గాయం కావడం, తీవ్ర రక్తస్రావం వల్ల సురేశ్ పరిస్థితి విషమంగా వైద్యులు పేర్కొన్నట్లు రైల్వే ఎస్సై సాయిరెడ్డి తెలిపారు. క్షతగాత్రుడు ప్రస్తుతం స్పృహలో లేడని, అతడు స్పృహలోకి వస్తేనే పూర్తి వివరాలు తెలుస్తాయన్నారు. డిచ్పల్లికి చెందిన సురేశ్ కొంతకాలంగా ఒంటరిగా ఉంటున్నట్లు సమాచారం. కారు ఢీకొని మరొకరికి..డిచ్పల్లి: మండలంలోని బర్ధిపూర్ శివారులో బైక్‌ను కారు ఢీకొన్న ఘటనలో ఒకరికి తీవ్రగాయాలైనట్లు ఎస్సై ఎండీ ఆరీఫ్ శనివారం తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. ఘన్పూర్ గ్రామానికి చెందిన అప్సర్ అనే వ్యక్తి జిల్లా కేంద్రానికి బైక్‌పై వెళ్తుండగా వెనుక నుంచి వచ్చిన కారు ఢీకొన్నది. ప్రమాదంలో అతనికి తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు 108 అంబులెన్స్‌లో జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అతని పరిస్థితి విషమంగానే ఉందని వైద్యులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. ప్రమాదానికి కారణమైన కారును గుర్తించినట్లు ఆయన పేర్కొన్నారు. -
ఇద్దరు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లపై వేటు
డొంకేశ్వర్(ఆర్మూర్): అటవీ శాఖలో ఇద్దరు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు సస్పెండైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎలాంటి అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైనందుకు కమ్మర్పల్లి రేంజ్‌లోని ఇనాయత్‌నగర్ బీట్ ఆఫీసర్ శ్రీదేవిని, వర్ని రేంజ్‌లోని మేడిపల్లి బీట్ ఆఫీసర్ వినోద్‌ను సస్పెండ్ చేస్తూ జిల్లా అటవీ శాఖ అధికారి (డీఎఫ్‌వో) ప్రశాంత్ బాజీరావు పాటిల్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇదే రేంజ్లో మరో బీట్ ఆఫీసర్‌ను కూడా వేరే విషయంలో సస్పెండ్ చేసేందుకు రంగం సిద్ధమైనట్లు తెలిసింది. ‘కల్తీ కల్లును నియంత్రిస్తున్నాం’ నిజామాబాద్ అర్బన్: జిల్లాలో ఆకస్మిక తనిఖీలు చేపడుతూ కల్తీ కల్లును నియంత్రిస్తున్నామని ఎకై ్సజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారి అరుణ్‌కుమార్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు నిజామాబాద్ డివిజన్లో 34, ఆర్మూర్ డివిజన్లో 14, బోధన్ డివిజన్లో 26, భీమ్‌గల్ డివిజన్లో మూడు, మోర్తాడ్ స్టేషన్ పరిధిలో పది కేసులు నమోదైనట్లు వివరించారు. బోధన్ స్టేషన్ పరిధిలో 19 మంది, భీమ్‌గల్ స్టేషన్ పరిధిలో 94 మంది, ఆర్మూర్ స్టేషన్ పరిఽధిలో ఇద్దరు , నిజామాబాద్ స్టేషన్ పరిధిలో 29 మందిని అరెస్టు చేయడం జరిగిందని పేర్కొన్నారు. అంతర్జాతీయ తైక్వాండో లో పతకాలు నిజామాబాద్ అర్బన్: జిల్లాకు చెందిన తైక్వాండో మార్షల్ ఆర్ట్స్ అకాడమీ ఇండియా (టీఎంఏఏఐ) విద్యార్థులు థాయిలాండ్‌లోని ఈస్టర్న్ నేషనల్ స్పోర్ట్స్ ట్రైనింగ్ సెంటర్లో నిర్వహించిన 9వ హీరోస్ అంతర్జాతీయ తైక్వాండో చాంపియనన్షిప్లో అద్భు త ప్రదర్శన కనబరిచారు. పోటీల్లో 33 దేశా ల తరఫున క్రీడాకారులు పాల్గొనగా నగరానికి చెందిన షేక్ మైతాబ్ అహ్మద్ (–81 కిలోలు) రెండు విభాగాల్లో ఒక బంగారు, ఒక కాంస్య పతకం గెలుచుకున్నాడు. షేక్ తల్హా (–41 కిలోలు) శక్తివంతమైన ప్రదర్శనతో ఒక వెండి పతకం సాధించాడు. ఇల్హాన్ అబ్దుల్లా ఫారూకీ (–31 కిలోలు) విభాగంలో కాంస్య పతకం గెలుపొందాడు. క్రీడాకారులను సీపీ సాయిచైతన్య, ఏసీపీ ప్రకాశ్‌యాదవ్ అభినందించారు. మళ్లీ దంచికొట్టిన వాన సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : జిల్లా కేంద్రంలో శుక్రవారం అర్ధరాత్రి భారీ వర్షం కురిసింది. అత్యధికంగా కామారెడ్డి పట్టణంలో 77.8 మిల్లీ మీటర్ల వర్షపాతం రికార్డయ్యింది. సదాశివనగర్‌లో 68.5 మి.మీ.లు, ఎల్పుగొండలో 50 మి. మీ.లు, గాంధారిలో 46.5, బీబీపేటలో 46.3, దోమకొండలో 41.3 తాడ్వాయిలో 38.5, లచ్చాపేటలో 36.8, హసన్‌పల్లిలో 35.5, ఇసాయిపేటలో 34.8, పిట్లంలో 33.8, బొమ్మన్‌దేవ్‌పల్లిలో 32.8, సర్వాపూర్ లో 30.5 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. -
కొత్త పింఛన్లకు గ్రీన్ సిగ్నల్
● దరఖాస్తులకు విడుదలైన మార్గదర్శకాలుడొంకేశ్వర్(ఆర్మూర్): కొత్త పింఛన్ల మంజూరుపై రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఆగస్టు 15 నుంచి కొత్త పింఛన్లు మంజూరు చేస్తామని ప్రకటించిన నేపథ్యంలో అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఈ మేరకు మార్గదర్శకాలతోపాటు దరఖాస్తు ఫారం మోడల్‌ను శుక్రవారం విడుదల చేసింది. దీంతో జిల్లాలో ఆశగా ఎదురుచూస్తున్న వారు దరఖాస్తు చేసుకోవడానికి అవసరమైన పత్రాలను సిద్ధం చేసుకుంటున్నారు. వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, కల్లుగీత, చేనేత కార్మికులతోపాటు ఫైలేరియా, డయాలసిస్ బాధితులు దరఖాస్తు చేసుకోచ్చని ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాలలో ఉన్నాయి. అయితే, బీడీ కార్మికులు, వృద్ధుల విషయాన్ని అందులో తెలుపలేదు. దీంతో వారు దరఖాస్తు చేసుకోవచ్చో లేదో తెలియని పరిస్థితి నెలకొంది. ఇటు నింపిన దరఖాస్తులను స్థానిక పంచాయతీ కార్యదర్శి సంతకాల అనంతరం ఎంపీడీవో కార్యాలయాల్లో అందజేయాల్సి ఉంటుందని సంబంధిత అధికారులు పేర్కొంటున్నారు. ఎంపీడీవోల పరిశీలన పూర్తయిన తర్వాత అర్హత ఉన్న దరఖాస్తులను ఆన్లైన్లో ఎంట్రీ చేయనున్నారు. ఆన్లైన్లో ఎంట్రీ అయిన డేటా ఆధారంగా ప్రభుత్వం కొత్త పింఛన్లను మంజూరు చేయనుంది. -
సాదాబైనామా దరఖాస్తులను పరిష్కరించాలి
● ప్రజావాణి అర్జీల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలి ● తహసీల్దార్లతో సమీక్షలో ఇన్ చార్జి కలెక్టర్ భవేశ్ మిశ్రా నిజామాబాద్ అర్బన్: భూభారతి, సాదాబైనామా పెండింగ్ దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాల ని ఇన్ చార్జి కలెక్టర్ భవేశ్ మిశ్రా ఆదేశించారు. కలెక్టరేట్లోని ప్రధాన సమీక్ష మందిరంలో శుక్రవారం ఆయన తహసీల్దార్లతో భూ భారతి, సాదాబైనామా పెండింగ్ దరఖాస్తులు, ప్రజావాణి ఫిర్యాదుల పరిష్కారం, ఇతర రెవెన్యూ అంశాలపై సమీక్షించారు. మండలాల వారీగా పెండింగ్‌లో ఉన్న దరఖాస్తుల వివరాలు, పరిష్కారంలో జాప్యానికి గల కారణాల ను అడిగి తెలుసుకున్నారు. పెండింగ్ దరఖాస్తులను ఈ నెలాఖరులోగా పరిష్కరించాలని కలెక్టర్ గ డువు విధించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా చొరవ చూపాలన్నారు. జిల్లాస్థాయిలో ని ర్వహించే ప్రజావాణితోపాటు రాష్ట్రస్థాయిలో నిర్వ హించే సీఎం ప్రజావాణి కార్యక్రమాల ద్వారా వచ్చిన అర్జీల పరిష్కారం విషయంలోనూ ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. వెంటదివెంట ఆర్జీలను పరిష్కరిస్తూ, వివరాలను ఆన్లైన్లో అప్లోడ్ చేయాల ని సూచించారు. పురోగతి వివరాలను నిర్ణీ త నమూనాలో రోజువారీగా తనకు పంపాలని ఆదేశించారు. ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికెట్ కోసం వచ్చిన దరఖాస్తులను కూడా సత్వరమే పరిష్కరించాలన్నా రు. కస్టం మిల్లింగ్ కోసం లేవీ ధాన్యం కేటాయించిన రైస్‌మిల్లులను పక్షం రోజులకోసారి అయినా సందర్శిస్తూ, ధాన్యం నిల్వలను పరిశీలించాలని తహసీల్దార్లను ఆదేశించారు. నూతన తహసీల్ కా ర్యాలయాల నిర్మాణాల కోసం అవసరమైన స్థలాలను గుర్తిస్తూ, సమగ్ర వివరాలతో నివేదికలు పంపాలని సూచించారు. హాస్టళ్లు, గురుకులాలను విధిగా సందర్శించాలి ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలు, పాఠశాలలు, గురుకులాలను క్రమం తప్పకుండా సందర్శించాల ని మండల ప్రత్యేకాధికారులను ఇన్ చార్జి కలెక్టర్ భవేశ్ మిశ్రా ఆదేశించారు. ప్రభుత్వ సంకల్పానికి అనుగుణంగా విద్యా సంస్థల నిర్వహణ గణనీయంగా మెరుగుపడేలా, నాణ్యమైన విద్యాబోధన జరిగేలా క్రియాశీలక పాత్ర పోషించాలని అన్నారు. కలెక్టరేట్లో శుక్రవారం మండల ప్రత్యేకాధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ప్రతివారం – ప్రతి విద్యాసంస్థను తప్పనిసరిగా సందర్శించేలా కార్యాచరణ రూపొందించుకోవాలని సూచించారు. సంక్షేమ వసతి గృహాలతోపాటు జిల్లాలోని కేజీబీవీలు, ఆశ్రమ పాఠశాలలు, మహాత్మా జ్యోతీబాపూలే, బీసీ, ఎస్సీ, మైనారిటీ రెసిడెన్షియల్ విద్యా సంస్థల ను విధిగా సందర్శించి నిర్వహణ తీరుతెన్నులను నిశితంగా పరిశీలించాలని కలెక్టర్ ఆదేశించారు. ఎ క్కడ కూడా ఫుడ్ పాయిజనింగ్, పాముకాటు, తేలు కాటు వంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. విద్యాసంస్థల సందర్శన సమయాల్లో గమనించిన అంశాలను ప్రత్యేక యాప్ ద్వారా తమకు నివేదించాలని కలెక్టర్ సూచించారు. శిథిలావస్థకు చేరిన భవనాలను వెంటనే వాటిని తొలగింపజేయాలని ఆదేశించారు. కాగా, జనగణన హ్యాండ్‌బుక్ రూ పొందించేందుకు జిల్లాలోని అన్ని మండలాల్లో అ న్ని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలు, చారిత్రక ప్రదేశాల సమాచారాన్ని క్షేత్రస్థాయి అధికారులు పక్కాగా అందించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. అదనపు కలెక్టర్ వి.భుజంగరావు, ట్రెయినీ కలెక్టర్ సురేశ్, జెడ్పీ సీఈవో సాయాగౌడ్ తదితరులు పాల్గొన్నారు. తహసీల్దార్లకు షోకాజ్ నోటీసులు సమీక్షా సమావేశానికి ఆలస్యంగా హాజరైన ప లువురు తహసీల్దార్లకు ఇన్చార్జి కలెక్టర్ భవేశ్ మిశ్రా షోకాజ్ నోటీసులు జారీచేశారు. నిర్ణీత సమయానికి కలెక్టర్ సమావేశ మందిరానికి చేరుకోగా, పలు మండలాల తహసీల్దార్లు గైర్హాజరు కావడాన్ని గమనించి వారి తీరుపై అసంతప్తి వ్యక్తంచేశారు. ప్రతి ఒక్కరూ విధిగా సమయపాలన పాటించాలని కలెక్టర్ సూచించా రు. సమావేశంలో అదనపు కలెక్టర్ వి.భుజంగరావు, ఆర్మూర్ సబ్ కలెక్టర్ అభిగ్యాన్ మాల్వియా, డీఆర్వో గీత, నిజామాబాద్, బోధన్ ఆర్డీవోలు రాజేంద్రకుమార్, విజయకుమారి, తహసీల్దార్లు పాల్గొన్నారు. -
బొగ్గు బట్టీల్లో నిబంధనలు బుగ్గి
● గతంలో లైసెన్స్ రద్దయిన వ్యాపారికే మళ్లీ అనుమతి! ● అటవీ అధికారుల పాత్రపై అనుమానాలుడొంకేశ్వర్(ఆర్మూర్): రెంజల్ మండలం నీలా శివారులో నడుస్తున్న ఓ బొగ్గు బట్టీపై ఈ నెల 5న అట వీ అధికారులు దాడులు నిర్వహించారు. అది లైసె న్స్ కలిగిన బట్టీ అయినప్పటికీ నిబంధనలకు విరుద్ధమైన కలపను వినియోగించడంతో ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు కాగా, మరో ముగ్గురు పరారీలో ఉన్నారు. ఇవి అటవీ అధికారులు చెప్తున్న మాటలు. కానీ, ఈ బొగ్గు బట్టీ వెనుక చాలా పెద్ద కథే దాగి ఉంది. 11 ఏళ్ల క్రితమే లైసెన్స్ రద్దు.. కానీ మళ్లీ ఎలా? సదరు వ్యాపారి చాలా ఏళ్ల నుంచే బొగ్గు బట్టీల దందాను కొనసాగిస్తున్నాడు. అటవీ అధికారులను మ చ్చిక చేసుకొచి దందాను నిబంధనలకు విరుద్ధంగా యథేచ్ఛగా నడిపిస్తున్నట్లుగా ఆరోపణలున్నా యి. 11 సంవత్సరాల క్రితమే సాటాపూర్ ప్రాంతంలో ఆయన పేరుపై ఉన్న బొగ్గు బట్టీని అటవీ అధికారులు తనిఖీ చేశారు. బొగ్గు కోసం అక్రమంగా కలపను వినియోగిస్తున్నందుకు లైసెన్సును రద్దు చేశా రు. మధ్యలో మళ్లీ లైసెన్స్ కోసం దరఖాస్తు చేయ గా తిరస్కరణకు గురైంది. దీంతో కుటుంబసభ్యులను ఒకరిని బినామీగా పెట్టి వారి పేరుతో మళ్లీ లైసెన్స్ కోసం దరఖాస్తు చేయగా, అటవీ అధికారు లు రెండేళ్ల క్రితం అనుమతి ఇచ్చారు. ఇందుకోసం వ్యాపారి సదరు అధికారుల చేయి తడిపినట్లుగా విశ్వసనీయంగా తెలిసింది. వచ్చిన లైసెన్స్‌తో రెంజల్ మండలం నీలా శివారులో బొగ్గుబట్టీని ఏర్పా టు చేశాడు. ఒకసారి లైసెన్స్ రద్దు చేసిన వ్యక్తికే మ ళ్లీ అనుమతులు ఇవ్వడం వెనుక అధికారులపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రెండేళ్ల కాలంలో అధికారులు ఈ బొగ్గు బట్టీ వైపు కన్నెతి చూడలేదని తెలు స్తోంది. బీట్ ఆఫీసర్ లేకపోవడం, అధికారుల పర్యవేక్షణ కొరవడడంతో యథేచ్ఛగా వేప, మామిడి, ఇ తర రకాల కలపను బొగ్గు తయారీ కోసం తెచ్చి వినియోగిస్తున్నారు. ఇటు ఎప్పటికప్పుడు కొందరు అధికారులకు మాముళ్లు ముడుతున్నాయనే ఆరోపణలు లేకపోలేవు. బొగ్గు దందా బయటకు పొక్కడంతో ఈ నెల 6న విజిలెన్స్, ఫ్లయింగ్ స్క్వాడ్ అధి కారులు వచ్చి విచారణ చేపట్టారు. సంబంధిత అధి కారులను ప్రశ్నించడంతోపాటు జాన్కంపేట్‌లోని వ్యాపారి బొగ్గు గోదామును సైతం తనిఖీ చేశారు. అధికారుల పాత్రపై కూడా ఆరా తీయడంతో పలువురు అటవీ అధికారులకు గుబులు పట్టుకుంది. -
ఆరుతడి సాగుపై దృష్టి సారించాలి
నిజామాబాద్ అర్బన్: ఎల్‌నినో ప్రభావంతో తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నందున రైతులు తక్కువ నీటి అవసరంతో ఎక్కువ దిగుబడి వచ్చే ఆరుతడి పంటల సాగుపై దృష్టి సారించాలని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి కోరారు. హైదరాబాద్ నుంచి రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, ఇతర ఉన్నతాధికారులతో కలిసి శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్లు, సంబంధిత అధికారులతో వానాకాలం సాగు, వన మహోత్సవం, పంట కుంటలు, స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి మాట్లాడుతూ ఆరుతడి పంటలపై వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు అవగాహన కల్పించి అవసరమైన విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచాలని సూచించారు. వన మహోత్సవంలో భాగంగా వివిధ ప్రభుత్వ శాఖలకు మొక్కలు నాటేందుకు లక్ష్యాలను నిర్దేశించామని, నాటిన ప్రతి మొక్కను తప్పనిసరిగా జియో ట్యాగింగ్ చేసి, వాటి మనుగడ శాతాన్ని నిరంతరం నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో సమగ్ర వ్యవసాయ క్షేత్ర చెరువుల పథకం పనులను వేగవంతం చేయాలని తెలిపారు. ఈ నెల 15 నాటికి అన్ని పనులను ప్రారంభించి పూర్తిస్థాయిలో అమ లు చేయాలని ఆదేశించారు. ‘ఒకే చెరువు – ఆరు రకాల జీవనోపాధులు‘ అనే భావనతో నీటిపారుద ల, చేపల పెంపకం, పాడి పరిశ్రమ, కూరగాయల సాగు, పశుగ్రాసం అభివృద్ధి, సేంద్రియ ఎరువుల తయారీ వంటి కార్యక్రమాల ద్వారా మహిళా రైతు ల ఆదాయాన్ని పెంచేలా శాఖల మధ్య సమన్వయంతో పనిచేయాలని సూచించారు. పౌర సరఫ రాల వ్యవస్థను మరింత పారదర్శకంగా, భద్రతాయుతంగా మార్చేందుకు ప్రభుత్వం ప్రవేశపెడుతోన్న స్మార్ట్ రేషన్ కార్డులను త్వరలోనే పంపిణీ చేస్తామన్నారు. డిజిటల్ సంతకం, హోలోగ్రామ్, వాటర్‌మార్క్, ఎన్క్రిప్టెడ్ క్యూఆర్ కోడ్, యూవీ లోగో తదితర అత్యాధునిక భద్రతా ఫీచర్లతో స్మార్ట్ రేషన్ కార్డులను రూపొందించినట్లు పేర్కొన్నారు. వీసీలో అదనపు కలెక్టర్ భుజంగరావు, నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్‌కుమార్ డీఆర్డీవో సాయన్న, డీఏవో వీరాస్వామి, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. వన మహోత్సవం లక్ష్యాలను పూర్తిచేయాలి త్వరలో స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేస్తాం వీసీలో రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి -
రోడ్ల అభివృద్ధికి నిధులివ్వండి
● కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని కోరిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్సుభాష్నగర్ : నగరంతోపాటు జిల్లాలోని పలు రోడ్ల అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని కేంద్ర రోడ్లు రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ కోరారు. నగరంలోని పలు రోడ్లు, వంతెనల అభివృద్ధి పనులకు సంబంధించి ప్రతిపాదనలను ఎంపీ అర్వింద్ ధర్మపురితో కలిసి శుక్రవారం ఢిల్లీలో కేంద్రమంత్రికి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నగరంలోని దేవీరోడ్డు, రైల్వేస్టేషన్, నాందేవ్‌వాడ అదనపు వంతెన (ఆర్వోబీ), సోనీ ఫంక్షన్ హాల్ సమీపంలో ఆర్యూబీ కోసం సుమారు రూ.170 కోట్లు మంజూరు చేయా లని విజ్ఞప్తిచేశారు. రేడియోస్టేషన్ నుంచి ముదక్పల్లి పాత పంచాయతీ కార్యాలయం వరకు రూ.30 కోట్లతో ఆర్అండ్బీ రోడ్డు కోసం ప్రతిపాదనలు అందజేశామని పేర్కొన్నారు. వర్ని జంక్షన్ నుంచి నిజామాబాద్, ఇందల్వాయి, భీమ్‌గల్ మీదుగా కమ్మర్పల్లి వరకు నగరాన్ని కలుపుతూ 107 కిలోమీటర్ల పొడవుతో కొత్త జాతీయ రహదారి ప్రతిపాదనను కూడా అందజేశామని తెలిపారు. రాజీవ్‌గాంధీ విగ్రహం నుంచి దుబ్బ మీదుగా కాలూర్ రోడ్డు ను పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశామన్నారు. -
కారు బీభత్సం
● రెండు బైకులను ఢీకొట్టి.. ● అతివేగంగా వెళ్లి కల్వర్టును ఢీకొని మంటల్లో దగ్ధం ● నలుగురికి తీవ్ర గాయాలు నందిపేట్(ఆర్మూర్): నందిపేట మండలంలో ఓ కారు గురువారం రాత్రి బీభత్సం సృషించింది. రెండు ద్విచక్ర వాహనాలను ఢీకొట్టిన అనంతరం కల్వర్టును ఢీ కొనడంతో కారు పూర్తిగా దగ్ధమైంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. నంది పేట మండల కేంద్రానికి చెందిన అక్తర్ హుస్సేన్, ఆయన భార్య అంజుమ్ సుల్తానా ఒక బైక్‌పై, ర హీమ్, ఆయన భార్య సమీనా మరోబైక్‌పై గురు వారం రాత్రి 9 గంటల ప్రాంతంలో నందిపేట నుంచి ఆర్మూర్‌కు వెళ్తుండగా విజయనగర్ సమీపంలో ఎదురుగా వచ్చిన కారు ఢీ కొట్టింది. దీంతో బైక్‌లపై ప్రయాణిస్తున్న నలుగురికి తీవ్ర గా యాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు వెంటనే జిల్లా ఆస్పత్రికి తరలించారు. అక్తర్ హుస్సేన్ ముప్కాల్ పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. రెండు బైక్‌లను ఢీకొట్టి అతివేగంగా వెళ్లిన కారు చింరాజ్‌పల్లి శివారు వి ద్యుత్ సబ్‌స్టేషన్ సమీపంలో గుత్ప కాలువ కల్వ ర్టును ఢీకొట్టింది. అనంతరం కారులో మంటలు చెలరేగడంతో స్థానికుల సమాచారం మేరకు పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పివేశారు. కారులో ప్ర యాణిస్తున్న వారు సురక్షితంగా బయటపడినట్లు తెలిసింది. కారు నడిపిన వ్యక్తిని చౌడమ్మ కొండూర్ గ్రామానికి చెందిన దొంతుల గంగాధర్‌గా గుర్తించి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వినయ్ తెలిపారు. -
చివరి బిల్లు రాక గొల్లు..
శనివారం శ్రీ 8 శ్రీ ఆగస్టు శ్రీ 2026– 8లో u● ఈ ఫొటోలోని మహిళ పేరు చిలుక సునీత. డొంకేశ్వర్ మండల కేంద్రానికి చెందిన ఈమె ఇందిరమ్మ ఇంటి నిర్మాణం చేపట్టగా, నాలుగు విడతలుగా రూ. లక్ష చొప్పున మొత్తం రూ. 4 లక్షల సాయం అందింది. కానీ, గతేడాది అక్టోబర్‌లో ఇంటి నిర్మాణం పూర్తయితే ఇప్పటి వరకు చివరి బిల్లు అందలేదు. గృహప్రవేశం పూర్తయి పది నెలలు గడిచింది. ఇంకెప్పుడు వస్తుందని అధికారులను ఆరా తీస్తున్నా సమాధానం రావడం లేదు. ● ఈ ఫొటోలోని వృద్ధుడి పేరు మోతె రాములు. మోపాల్ మండల కేంద్రానికి చెందిన ఈయనకు ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు మంజూరుచేసింది. నిర్మాణం ప్రారంభించి ఏడాది గడిచినా ఇప్పటి వరకు బిల్లు మంజూరు కాలేదు. అధికారులను అడిగితే ఆన్లైన్లో పొరపాటున ఎల్–3 కింద నమోదైందని చెబుతున్నారు. మళ్లీ విచారణ చేపట్టి నమోదు చేయించినా నిధులు రావడం లేదు. బిల్లుల కోసం 80 ఏళ్ల వయస్సులోనూ ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నాడు. ఉన్నతాధికారులు స్పందించి తన సమస్యను తీర్చాలని వేడుకుంటున్నాడు. -
నిలిచిన నిధులు.. ఆగిన ప్రయోగాలు
● ప్రభుత్వ పాఠశాలల్లో కానరాని సైన్స్ పరికరాలు ● ఇన్స్పైర్ పోటీల్లో రాణించలేక పోతున్న విద్యార్థులు నందిపేట్(ఆర్మూర్): ప్రయివేట్‌కు ధీటుగా ప్రభు త్వ పాఠశాల విద్యార్థులకు సైన్స్ విద్యను అందిచాలనే లక్ష్యంతో ప్రయోగశాలలు ఏర్పాటు చేసినా నిధులు లేమితో లక్ష్యం నీరుగారుతోంది. ఆరేళ్లుగా నిధులు విడుదల కాకపోవడం.. సరిపడా సైన్స్ పరికరాలు లేకపోవడంతో ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులు ప్రయోగ విద్యకు దూరమవుతున్నారు. విధిలేని పరిస్థితుల్లో ఉపాధ్యాయులు ఉన్న పరికరాలతోనే పాఠాలు బోధించి మమ అనిపిసున్నారు. కొద్దిపాటి పరికరాలు ఉన్నా.. 6వ తరగతి నుంచి పదో తరగతి వరకు విద్యార్థులకు సైన్స్ సబ్జెక్టులలో ఎక్కువ భాగం ప్రయోగాలతో కూడిన పాఠ్యాంశాలు ఉంటాయి. వాటిని ప్రయోగాల ద్వారా చేసి చూపితేగాని అర్థం కాని పరిస్థితి నెలకొంది. దీంతో ప్రయోగాత్మక బోధనపై సంబందిత సబ్జెక్టు ఉపాధ్యాయులు ప్రత్యేకంగా దృష్టిపెట్టాల్సి ఉంటుంది. ఇందుకోసం ప్రయోగ పరికరాలు, రసాయనాల కొనుగోలుకు గతంలో విద్యాశాఖ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. 2019లో రాష్ట్రీయ మాద్యమిక శిక్షా అభియాన్ ద్వారా ప్రతి ఉన్నత పాఠశాలకు రూ. 50 వేలు, ప్రాథమిక పాఠశాలలకు రూ. 22 వేలు విడుదల చేశారు. దీంతో కొద్దిపాటి పరికరాలు కొనుగోలు చేశారు. కానీ కొద్దిపాటి పరికరాలతో ప్రయోగాలు సంపూర్ణంగా చేసే అవకాశం లేకపోవడంతో పలు పాఠశాలల్లో అవిసైతం మూలన పడ్డాయి. మరికొని పాఠశాలల్లో ఉన్న పరికరాలతోపాటు కాలంచెల్లిన రసాయనాలతో ఉపాధ్యాయులు, విద్యార్థులతో ప్రయోగాలు చేయిస్తున్నారు. పోటీలకు దూరం.. ప్రయోగాలపై పూర్తిస్థాయి అవగాహన లేకపోవడంతో సైన్స్ పోటీలకు విద్యార్థులు దూరంగా ఉంటున్నారు. ఏటా ప్రభుత్వం నిర్వహించే సైన్స్‌ఫేర్, ఇన్స్‌స్పైర్ అవార్డుల్లో వెనుకబడుతున్నారు. ప్రతిభ ఉన్నా సరిపడా శిక్షణ, అవగాహన లేక విద్యార్థులు సత్తా చాటలేకపోతున్నారు. విద్యాశాఖ అధికారులు స్పందించి ప్రయోగాత్మక బోధనకు అవసరమైన పరికరాలు సమకూర్చాలని విద్యార్థులు, తల్లిదండ్రులు కోరుతున్నారు. అయిలాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సైన్స్ పరికరాల కొనుగోలుకు నిధులు మంజూరు కాలేదు. నిధులు మంజూరు కాగానే పరికరాలు కొనుగోలు చేస్తాం. విద్యార్థులకు కావాల్సిన కొన్ని సైన్స్ పరికరాలను ఉపాధ్యాయులు తయారు చేసి అవగాహన కల్పిస్తున్నారు. –అవదూత గంగాధర్, ఎంఈవో, నందిపేట -
పలకని సంగీత వాయిద్యాలు
ఖలీల్‌వాడి: విద్యార్థుల్లో ఏకాగ్రతను పెంచడంతోపాటు పాఠశాలల్లో ఉల్లాసభరిత వాతావరణం కో సం విద్యతోపాటు సంగీతం నేర్పించాలని ప్రభు త్వం నిర్ణయించింది. ఈ మేరకు జిల్లాలోని 40 పీఎంశ్రీ స్కూళ్లను సంగీతం శిక్షణ కోసం ఎంపిక చేసి సంగీత వాయిద్యాలను అందించింది. కానీ విద్యార్థులకు శిక్షణ ఇచ్చేందుకు ఇన్స్ట్రక్టర్లు లేకపోవడంతో వాయిద్యాలు మూలనపడ్డాయి. సంగీత వా యిద్యాలు, నృత్యం నేర్చుకోవాలనే తపన ఎంతో మంది విద్యార్థుల్లో ఉన్నా నిరాశే మిగులుతోంది. సంగీతంపై మక్కువ ఉన్న వారు పట్టణ ప్రాంతాల్లో సంగీత, నృత్య కళాకారుల వద్ద శిక్షణ పొందుతున్నా.. గ్రామీణ ప్రాంత విద్యార్థులు మాత్రం అటు పాఠశాలల్లో, ఇటు బయట శిక్షణ కేంద్రాల్లో శిక్షణకు దూరమవుతున్నారు. ప్రైవేట్‌గా శిక్షణ పొందాలంటే ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కావడంతో వెనకడుగు వేస్తున్నారు. ఎంపిక చేసిన పాఠశాలలకు సంగీత వాయిద్య పరికరాలను గతేడాది సరఫరా చేయగా, కొన్ని చోట్టే వీటిని ఉపయోగిస్తున్నారు. పీఎంశ్రీ నిధుల నుంచి.. జిల్లాలో ఎంపిక చేసిన 40 పీఎంశ్రీ పాఠశాలల్లో వయోలిన్, హార్మోనియం, తబలా, డోలక్ తదితర పరికరాలున్నాయి. ఒక్కో పాఠశాలకు శిక్షకుల వేతనాల కోసం రూ.1.50 లక్షలు కేటాయించారు. విద్యార్థులకు శిక్షణ ఇవ్వడానికి ప్రత్యేక తరగతి గదిని ఏర్పాటు చేశారు. పాఠశాలకు ఒక ఇన్స్ట్రక్టర్ను నియమించి, ప్రతి నెలా రూ.10 వేల చొప్పున వేతనం ఇవ్వాల్సి ఉంటుంది. టీచర్ తప్పనిసరిగా మ్యూజిక్ ట్రైనింగ్ పూర్తి చేసి ఉండాలి. టీచర్లు అందుబాటులో ఉన్న చోట శిక్షణ ఇస్తున్నట్లు తెలిసింది. లేని చోట వాయిద్యా పరికరాలు మూలకు చేరాయి. 2026–27 విద్యాసంవత్సరంలో పాఠశాలలు ప్రారంభమై 45 రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు మ్యూజిక్ టీచర్లను నియమించలేదు. ఇకనైనా శిక్షకులను నియమించాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కోరుతున్నారు. ఆదేశాలు రాగానే నియమిస్తాం గతంలో పని చేసిన మ్యూజిక్ టీచర్లను యథావిధిగా కొనసాగిస్తాం. లేని చోట ప్రకటన ఇస్తాం. విద్యాశాఖ నుంచి ఆదేశాలు రాగానే నియామకాలు చేపట్టి విద్యార్థులకు సంగీతం, నృత్యంపై శిక్షణ ఇస్తాం. – పార్శి అశోక్, డీఈవో, నిజామాబాద్ ఇన్స్ట్రక్టర్లు లేక నిరుపయోగంగా.. 40 పీఎంశ్రీ పాఠశాలల్లో మూలకు చేరిన వైనం పట్టించుకోని విద్యాశాఖాధికారులు -
క్రైం కార్నర్
మంజీర నదిలో దూకిన వ్యక్తి మృతి మద్నూర్(జుక్కల్): రెండు రోజుల క్రితం కుర్లా సమీపంలోని మంజీర నదిలో దూకిన వ్యక్తి మృతి చెందినట్లు శుక్రవారం ఎస్సై మోహన్‌రెడ్డి తెలిపారు. డోంగ్లి మండలంలోని ఎన్బుర గ్రామానికి చెందిన షేక్ షబ్బీర్(53) కుటుంబ సభ్యులతో గొడవ పడి మంజీరా నదిలో దూకి ఆత్మహత్యకు యత్నించినట్లు ఎస్సై తెలిపారు. బుధవారం సాయంత్రం షబ్బీర్ తన భార్య పిల్లలతో గొడవ పడి మంజీరా నదిలో దూకుతున్నట్లు కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి నదిలో దూకినట్లు ఎస్సై చెప్పారు. బుధవారం రాత్రి కావడంతో గాలింపు చేపట్టలేకపోయామని గురువారం గజ ఈత గాళ్లతో మంజీరా నదిలో బోటుతో సహాయంతో గాలించగా రాత్రి షబ్బీర్ మృతదేహం లభించిందని అన్నారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించామన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. సిరికొండ: మండలంలోని జంగిలోడి తండాలో గురువారం అర్ధరాత్రి బుక్యా రాములుకు చెందిన పశువుల షెడ్డులో అగ్ని ప్రమాదం సంభవించినట్లు స్థానికులు శుక్రవారం తెలిపారు. ప్రమాదంలో షెడ్డులో ఉన్న రెండు ఎడ్లలో ఒక ఎద్దు మృతి చెందగా మరో ఎద్దుకు గాయాలయ్యాయి. గడ్డి పూర్తిగా దగ్ధమైంది. ప్రమాదంలో బాధితుడికి రూ. రెండు లక్షల వరకు ఆస్తి నష్టం వాటిల్లినట్లు తెలిపారు. వర్ని: మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక అదృశ్యమైనట్లు ఎస్సై వంశీకృష్ణారెడ్డి శుక్రవారం తెలిపారు. అమ్మమ్మ ఇంటికి వచ్చిన బాలిక ఈ నెల 5న ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
అనాథ పిల్లలపై వాత్సల్యం
● తల్లిదండ్రుల సంరక్షణకు దూరమైన పిల్లలకు రక్షణ, పునరావాసం ● ప్రభుత్వ పథకంతో భరోసా ఎల్లారెడ్డిరూరల్: తల్లిదండ్రులు లేని అనాథ పిల్లలను ఆదుకోవాలనే ఉద్దేశంతో మిషన్ వాత్సల్య పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. అనాథ పిల్లల చదువు, పోషణ కోసం ఆర్థికసాయం అందిస్తోంది. వీరికి 18 ఏళ్లు వచ్చేంత వరకు ప్రతీ నెలా రూ.4 వేల ఆర్ధిక సాయం ప్రభుత్వం అందిస్తుంది. ప్రతీ ఆరు నెలలకు ఒకసారి వీటిని నేరుగా బ్యాంక్ అకౌంట్లో జమ చేస్తారు. 2019లో ప్రారంభం భారత ప్రభుత్వ మహిళా,శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ అమలు చేస్తున్న ఈ పథకం 2019లో ప్రారంభమైంది.అనాథలు, నిరాశ్రయులు, సంరక్షణ అవసరమైన పిల్లలకు రక్షణ, విద్య, పోషణ, పునరావా సం అందించడం దీని లక్ష్యం. కొవిడ్ 19 కారణంగా తల్లిదండ్రులు లేదా చట్టబద్ధ సంరక్షకులను కోల్పోయిన పిల్లల కోసం కేంద్ర ప్రభుత్వం మిషన్ వాత్స ల్య పథకాన్ని ప్రారంభించింది. కామారెడ్డి జిల్లాలో ఇప్పటి వరకు తల్లిదండ్రులు లేని 169 మంది మిష న్ వాత్సల్య పథకం ద్వారా ప్రతి నెలా రూ. నాలుగు వేల స్కాలర్షిప్ పొందుతున్నారు. వీరికి 18 ఏళ్లు వచ్చే వరకు ఈ స్కాలర్ షిప్ ప్రభుత్వం వారి ఖాతా ల్లో జమచేస్తుంది. అధికారులు పర్యవేక్షణ చేస్తారు.తల్లిదండ్రులు లేని అనాథలు మిషన్ వాత్సల్య పథకానికి జి ల్లా కేంద్రంలోని ఐసీడీఎస్ కేంద్రంలో దరఖాస్తులు చేసు కో వాలి. వీరికి ప్రభుత్వం ద్వా రా నెలకు రూ. 4వేల స్కాలర్ షిప్ అందిస్తుంది. చిన్నారుల వయస్సు 18 ఏళ్లు వచ్చేంత వరకు ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతారు. – ప్రసన్న, జిల్లా సంక్షేమ అధికారిణి, కామారెడ్డి ప్రతీ నెలా రూ.4వేల చొప్పున ఇవ్వనుండగా.. వీ టిని ఆరు నెలలకు ఒకసారి రూ.24 వేల చొ ప్పున అకౌంట్లలో జమ చేస్తారు. ఏడాదికి రూ. 48 వేలు అందుతాయి. వీటిని పిల్లల పోషణ, చ దువులకు ఉపయోగించుకోవచ్చు. సీడీఎస్ ప్రా జెక్టు కార్యాలయం అధికారులను, అంగన్వాడీ కార్యకర్త, పర్యవేక్షకురాలు, సీడీపీవోను సంప్రదించి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే పిల్లల డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్, ఇన్కమ్ సర్టిఫికెట్, క్యాస్ట్ సర్టిఫికెట్, సంరక్షకుల ఆధార్, రేషన్‌కార్డు కాపీలు, బ్యాంక్ పాస్ బుక్‌తో పాటు అవసరమైన పత్రాలు అందించాల్సి ఉంటుంది. -
భూముల రీసర్వేకు పట్టాదారులు సహకరించాలి
వేల్పూర్(బాల్కొండ): భూముల రీ సర్వేకు పట్టాదారులు సహకరించాలని ఆర్మూర్ డివిజన్ సబ్ కలెక్టర్ అభిగ్యాన్ మాల్వియా పేర్కొన్నారు. బాల్కొండ మండలం కిసాన్‌నగర్ గ్రామంలో చేపట్టిన భూముల రీ సర్వే కార్యక్రమాన్ని శుక్రవారం ఆయన పరిశీలించారు. భూముల రీసర్వేకు పట్టాదారులు అందుబాటులో ఉండి సహకరించాలని కోరారు. రెవెన్యూ సిబ్బంది సర్వేలో పాల్గొని, ఈనెల 31 లోగా గ్రామాలలో భూముల రీ సర్వే పూర్తి చేయాలని ఆదేశించారు. తహసీల్దార్ శ్రీనివాస్, డీఐ శేఖర్‌వర్మ, సర్వేయర్ శివకుమార్, ఆర్ఐ గంగాధర్, జీపీవోలు ఉన్నారు. తెయూ(డిచ్పల్లి): తెయూ పరిధిలో కొనసాగుతున్న పీజీ 4వ సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షలకు శుక్రవారం 64 మంది గైర్హాజరైనట్లు అకడమిక్ ఆడిట్ సెల్ డైరెక్టర్ ఘంటా చంద్రశేఖర్ తెలిపారు. పరీక్షలకు మొత్తం 2,059 మందికి 1,995 మంది విద్యార్థులు హాజరైనట్లు ఆయన పేర్కొన్నారు. తెయూ(డిచ్పల్లి): తెలంగాణ యూనివర్సిటీ ఇంజినీరింగ్ కాలేజ్ బీటెక్ సీఎస్ఈ, ఏఐ 2వ సెమిస్టర్ రెగ్యులర్ థియరీ పరీక్షలు శుక్రవారం ప్రశాంతంగా జరిగినట్లు అకడమిక్ ఆడిట్ సెల్ డైరెక్టర్ ఘంటా చంద్రశేఖర్ తెలిపారు. పరీక్షలకు 22 మందికి 21 మంది హాజరు కాగా ఒకరు గైర్హాజరైనట్లు పేర్కొన్నారు. నిజామాబాద్ అర్బన్: పోలీస్ కమిషనరేట్ పరిధిలో పదకొండు మంది హెడ్ కానిస్టేబుళ్లకు ఏఎస్సైలుగా పదోన్నతి లభించింది. పదోన్నతి పొందిన హెడ్ కానిస్టేబుళ్లలో శంకర్(ఎడపల్లి), కై లాస్పతి(వేల్పూర్), బీ చందులాల్(ట్రాఫిక్ పీఎస్),మోజీరామ్(ఎన్ఐబీ), పాండు(మోపాల్), ఏ ముత్తన్న(టాస్క్‌ఫోర్స్), బీ రాజు (ఐదో టౌన్), లక్ష్మణ్ (ట్రాఫిక్ పీఎస్), జీ శ్రీనివాస్(భీమ్‌గల్), జీవీ శంకర్(వర్ని) ఏఎస్సైలుగా ప దోన్నతి పొందారు. అలాగే కేసీ శర్మ(ఏఆర్ హె డ్క్వార్టర్స్) ఏఆర్ఎస్సైగా పదోన్నతి పొందా రు. వీరిని శుక్రవారం పోలీస్ కమిషనర్ కార్యా లయంలో సీపీ సాయి చైతన్య అభినందించా రు.పోలీసులు అధికారులు, సిబ్బంది ఉన్నారు. నిజామాబాద్ రూరల్: నగరంలో సామూహిక బంజారా తీజ్ ఉత్సవాలను ఈ నెల 14 నుంచి 23వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు ఉత్సవ కమిటీ అధికార ప్రతినిధి మోతీలాల్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. తీజ్ బంజారా సమాజం ఐక్యత, సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అని అన్నారు. ఈ నేపథ్యంలో అన్ని శాఖల ప్రభుత్వ, విశ్రాంత, కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్, ప్రైవేట్ ఉద్యోగులు, స్వయం ఉపాధి రంగాలలో పనిచేస్తున్న సోదరులు, యువత, మహిళలు, యావత్ బంజారా సమాజం అందరినీ ఒకే వేదికపై సమీకరించి ఉత్సవాలను నిర్వహించేందుకు ఉత్సవ కమిటీ కట్టుబడి ఉందన్నారు. బంజారాలు ఉత్సవాల్లో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. -
యువత వ్యసనాలకు దూరంగా ఉండాలి
● కమాండెంట్ సత్యనారాయణ ● బ్రహ్మకుమారీస్ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో వ్యసన విముక్తి ప్రతిజ్ఞలు డిచ్పల్లి: మత్తు పదార్థాలు, ఇతర వ్యసనాలకు దూరంగా ఉండటం ద్వారా ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని కమాండెంట్ పీ సత్యనారాయణ పేర్కొన్నారు. యువత వ్యసనాలకు బానిస కాకుండా క్రమశిక్షణతో కూడిన జీవన విధానాన్ని అలవర్చుకోవాలని సూచించారు. బ్రహ్మకుమారీస్ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో శుక్రవారం పోలీస్ ఏడో బెటాలియన్ డిచ్‌పల్లిలో నిర్వహించిన ‘10 కోట్ల వ్యసన విముక్తి ప్రతిజ్ఞల మహోత్సవం’ కార్యక్రమంలో కమాండెంట్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ప్రతి వ్యక్తి తన కుటుంబం, సమాజం, దేశాభివృద్ధి కోసం వ్యసనాలకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. బ్రహ్మకుమారీస్ ప్రతినిధులు మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా 10 కోట్ల మంది ప్రజలతో వ్యసన విముక్తి ప్రతిజ్ఞ చేయించే మహోత్తర లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అనంతరం వ్యసన విముక్తి ప్రతిజ్ఞల మహోత్సం పోస్టర్లను ఆవిష్కరించారు. అధికారులు, పోలీసు సిబ్బందితో వ్యసనాలకు దూరంగా ఉంటామని, ఇతరులను కూడా వ్యసన విముక్తి దిశగా చైతన్యపరుస్తామని ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో బెటాలియన్ అసిస్టెంట్ కమాండెంట్ శ్రీనివాస్, అధికారులు, సిబ్బంది, బ్రహ్మకుమారీస్ సంస్థ సభ్యులు అభిషేక్, సంతోషి, శారద, శ్రీలక్ష్మి, గోపి తదితరులు పాల్గొన్నారు. -
అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేయాలి
● రూరల్ ఎమ్మెల్యే ఆర్ భూపతి రెడ్డి నిజామాబాద్ రూరల్: రూరల్ నియోజకవర్గంలో చేపడుతున్న అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ ఆర్ భూపతిరెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో పంచాయతీరాజ్ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (ఈఈ) వీరానంద్తో నిర్వహించిన సమీక్ష సమావేశంలో వివిధ అభివృద్ధి పనుల పురోగతిపై ఎమ్మెల్యే సమీక్షించారు. నియోజకవర్గంలో చేపట్టిన కొత్త అప్రోచ్ రోడ్లు, ఎంఆర్ఆర్, సీఆర్ఆర్ రోడ్లు, హ్యామ్ రోడ్ల నిర్మాణ పనులను గడువులోగా పూర్తి చేయాలన్నారు. గ్రామాల్లో నిర్మిస్తున్న వీవో, జీపీ భవనాల నిర్మాణంలో ఎలాంటి జాప్యం లేకుండా పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో పలు ప్రాంతాల్లో రోడ్లు, కల్వర్టులు దెబ్బతిన్నాయని వాటికి వెంటనే మరమ్మతులు చేపట్టాలని సూచించారు. నియోజకవర్గ అభివృద్ధే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది ఉన్నారు. -
విద్యార్థుల భవిష్యత్తుకు పాటుపడాలి
● డీఐఈవో తిరుమలపుడి రవికుమార్ ఖలీల్‌వాడి: ప్రతి అధ్యాపకుడు విద్యార్థులను భావితరాలకు ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దాలని జిల్లా ఇంటర్ విద్యాధికారి తిరుమలపుడి రవికుమార్ అన్నారు. నిజామాబాద్ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో జూనియర్ లెక్చరర్లకు కొనసాగుతున్న శిక్షణా తరగతులను ఆయన శుక్రవారం తనిఖీ చేశారు. అధ్యాపకులు, విద్యార్థులు భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని సాంకేతికపరమైన పరిజ్ఞానంతో విద్యా బోధన చేసేందుకు శిక్షణ పొందడం, పేద విద్యార్థుల అభ్యున్నతికి నిదర్శమని అన్నారు. పలువురు అధ్యాపకులు మాట్లాడుతూ.. రెండు రోజుల ఓరియంటేషన్ తరగతులు తమ వత్తి నైపుణ్యాన్ని పెంపొందిస్తుందని అన్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ బుద్ధిరాజ్, అబ్జర్వర్ ధర్మపాల్, జిల్లా ప్రభుత్వ అధ్యాపకుల సంఘం అధ్యక్షుడు నర్సయ్య, అధ్యాపకులు ప్రసాద్, యమున, శివరాజ్, లావణ్య, విజయ, భోజరం, బాలాజీ తదిరులు పాల్గొన్నారు. -
పక్కాగా సమాచారం సేకరించాలి
● రాష్ట్ర జనాభా లెక్కల సంచాలకులు భారతి హోళికేరి ● జిల్లా జనగణన హ్యాండ్‌బుక్ సమాచార సేకరణపై వీసీ ద్వారా సమీక్ష నిజామాబాద్ అర్బన్: జిల్లా జనగణన హ్యాండ్‌బుక్ రూపకల్పనకు ఫీల్డ్ ఫంక్షనరీలు క్షేత్రస్థాయిలో నాణ్యతతో సమాచారాన్ని పక్కాగా సేకరించేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర జనాభా లెక్కల సంచాలకులు భారతి హోళికేరి సూచించారు. జనగణన 2027కు సంబంధించిన సన్నాహక కార్యక్రమాల్లో భాగంగా జిల్లా జనగణన హ్యాండ్‌బుక్ రూపకల్పన విషయమై ఆమె శుక్రవారం హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు. జిల్లా జనగణన హ్యాండ్‌బుక్ రూపొందించేందుకు విద్యా, వైద్య సదుపాయాలు, తాగునీరు, పారిశుద్ధ్యం, రవాణా, కమ్యూనికేషన్, బ్యాంకింగ్, రుణ సదుపాయాలు, విద్యుత్, ఇంధన వనరులు, భూమి, సాగునీటి వినియోగం, వ్యవసాయం, తయారీ చేతివత్తులు, గ్రామానికి సంబంధించిన ముఖ్యమైన ప్రత్యేక అంశాలు, పరిశీలనలు వంటి తొమ్మిది ప్రధాన అంశాలకు సంబంధించిన సమాచారాన్ని అందించేలా చూడాలన్నారు. అదేవిధంగా టౌన్ డైరెక్టరీ షెడ్యూల్ ను ఛార్జ్ ఆఫీసర్లచే (మున్సిపల్ కమిషనర్) నియమించబడిన అధికారుల ద్వారా పట్టణ పౌర, పరిశ్రమలు, సామాజిక సదుపాయాలు, మురికివాడలకు సంబంధించిన స మాచారాన్ని నమోదు చేయాలని సూచించారు. ఆ యా శాఖల జిల్లా అధికారులు పూర్తి సమాచారాన్ని సేకరించి ఛార్జ్ ఆఫీసర్లకు అందించాలని ఆదేశించారు. సమాచార సేకరణ ప్రక్రియ ఆగస్టు 10 నుంచి సెప్టెంబర్ 8 వరకు నిర్వహించనున్నట్లు భా రతి వెల్లడించారు. వీసీలో ఇన్చార్జి కలెక్టర్ భవేశ్ మిశ్రా, అదనపు కలెక్టర్ వీ భుజంగరావు, ట్రెయినీ కలెక్టర్ సురేశ్, సీపీఓ కిషన్, అధికారులు పాల్గొన్నారు. -
డ్రగ్స్‌పై అవగాహన సదస్సు
ఆర్మూర్‌టౌన్: మన కాలనీ– మన భద్రత– మన బాధ్యత కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని నారాయణ స్కూల్లో గురువారం ఆర్మూర్ ఎస్‌హెచ్‌వో సత్యనారాయణ గౌడ్ డ్రగ్స్‌పై విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్‌హెచ్‌వో మాట్లాడుతూ.. డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని, సోషల్ మీడియాలో వచ్చే అనుమానాస్పద మెసేజ్‌లతో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. రోడ్డు ప్రమాదాలు జరగకుండా హెల్మెట్లు ధరించడం, ట్రాఫిక్ సిగ్నల్స్ పాటించడం తప్పనిసరన్నారు. ఆడపిల్లల భద్రత కోసం షి టీమ్ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందన్నారు. నాణ్యమైన సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి ఆర్మూర్‌టౌన్: ప్రతి బంగారు షాపులో తప్పనిసరిగా నాణ్యమైన సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి 24 గంటలు పనిచేసేలా చూసుకోవాలని ఎస్‌హెచ్‌వో సత్యనారాయణగౌడ్ అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని పోలీస్‌స్టేషన్‌లో గురువారం గోల్డ్‌షాప్ దుకా ణ యజమానులతో సమావేశం నిర్వహించి ఆయ న మాట్లాడారు. దుకాణంలోకి వచ్చే ప్రతి కస్టమర్ వివరాలు, వాహన నెంబర్లను రిజిస్టర్లో నమోదు చేయాలన్నారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే 112కు డయల్ చేసి పోలీసులకు సమాచా రం అందించాలన్నారు. భద్రత విషయంలో ఎవ రూ అలసత్వం వహించొద్దన్నారు. మంచిర్యాల కిషన్, వైద్య సంజయ్, సాగర్ పాల్గొన్నారు. సమయానికి బస్సులు నడపాలని రాస్తారోకో రెంజల్: పాఠశాల సమయానికి బస్సులు నడపాలని డిమాండ్ చేస్తూ గురువారం సాటాపూర్ చౌరస్తాలో విద్యార్థులు రాస్తారోకో నిర్వహించారు. సాటాపూర్తో పాటు బోర్గాం, నీలా, కందకుర్తి గ్రామాల నుంచి విద్యార్థులు రెంజల్ ఆదర్శ పాఠశాలతో పాటు రెంజల్ హైస్కూల్, వీరన్నగుట్ట గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలలకు వెళతారు. ఆర్టీసీ అధికారుల నిర్లక్ష్యం వల్ల సమయానికి పాఠశాలలకు చేరుకోలేకపొతున్నామని ఆందోళన వ్యక్తం చేశారు. అధికారులు విద్యార్థుల సమస్యను గుర్తించి సమయానికి బస్సులు నడపాలని మాజీ సర్పంచ్ ఎఖార్పాష, మాజీ ఎంపీటీసీ హైమద్‌లు విద్యార్థులకు సంఘీభావం తెలిపారు. దరఖాస్తుల ఆహ్వానం కమ్మర్పల్లి: మండలంలోని బషీరాబాద్ ఐటీఐ కళాశాలో రెండో విడత ప్రవేశాలకు ఆన్లైన్లో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ కోటిరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల సర్టిఫికేట్లను 17వ తేదీ వరకు పరిశీలిస్తామన్నారు. 20న సీట్లను కేటాయిస్తామన్నారు. టెన్త్ క్లాస్ ఉత్తీర్ణులైన విద్యార్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. విద్యార్థులకు టై, బెల్టుల వితరణ వేల్పూర్: కోమన్‌పల్లి ప్రైమరీ స్కూలులో విద్యార్థులకు గురువారం స్థానిక నాయకుడు తెడ్డు గంగాధర్ వితరణ చేసిన టై బెల్టులను స్థానిక సర్పంచ్ కొత్తింటి రాజేందర్ అందజేశారు. తెడ్డు గంగాధర్‌కు ఉపాధ్యాయులు కృతజ్ఞతలు తెలిపారు. -
పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ పరిశీలన
రుద్రూర్: పోతంగల్ మండలం కారేగావ్‌లో రేషనలైజేషన్ ప్రక్రియలో భాగంగా గురువారం 9,10 పోలింగ్ స్టేషన్లను బాన్సువాడ ఆర్డీవో రవీందర్ రెడ్డి పరిశీలించారు. అనంతరం రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. తర్వాత గ్రామసభ నిర్వహించి పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ ప్రతిపాదిత మార్పులపై గ్రామస్తులకు వివరించారు. వారి సూచనలు, అభిప్రాయాలను స్వీకరించారు. సర్పంచ్ సునీల్, తహసీల్దార్ సందీప్ తదితరులు ఉన్నారు. బీఎల్వోలకు సన్మానం పెర్కిట్(ఆర్మూర్): ఆలూర్ మండల కేంద్రంలో ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని వంద శాతం పూర్తి చేసిన బీఎల్వోలను కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గురువారం ఘనంగా సన్మానించారు. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు దేగాం ప్రమోద్, సర్పంచ్ ముక్కెర విజయ్, కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు పెండ ఉదయ్, నాయకులు ముత్యం రెడ్డి, నారాయణ, గంగారెడ్డి, మోతె శ్రీనివాస్ పాల్గొన్నారు. ఆర్మూర్ ఎంఈవోకు.. పెర్కిట్(ఆర్మూర్): ఆర్మూర్ మండల ఎంఈవోగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన డి.రవీందర్‌ను టీఎస్ మెసా, ఏపీసీఆర్, జమా తే ఇస్లామి హింద్ ఆధ్వర్యంలో గురువారం ఘనంగా సన్మానించారు. టీఎస్ మెసా గౌరవ అధ్యక్షుడు మహమ్మద్ అశ్ఫాక్ అహ్మద్, ఆలూ ర్ ఎంఈవో నరేందర్, జబ్బార్, ఇమ్రాన్ జా బ్రీ, మతీన్, సాజీద్, తదితరులు పాల్గొన్నారు. అసత్య ఆరోపణలు చేయొద్దు కమ్మర్పల్లి(మోర్తాడ్): బాల్కొండ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరిచిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డిపై, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి ముత్యాల సునీల్‌కుమార్ అసత్య ఆరోపణలు మానుకోవాలని మోర్తాడ్ మండల బీఆర్ఎస్ నాయకులు హితవు పలికారు. గురువారం మోర్తాడ్ మండల కేంద్రంలోని డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల వద్ద బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కల్లెడ ఏలియా, సర్పంచ్ బోగ ఆనంద్, పీఏసీఎస్ చైర్మన్ అశోక్ తదితరులు మాట్లాడారు. సునీల్ అసత్య ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. నాయకులు పాపాయి పవన్, పర్స దేవన్న, శ్రీనివాస్, అశోక్, ఇంత్యాజ్, గంధం మహిపాల్, సామ శ్రీను, తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యేను విమర్శించే అర్హత బీజేపీ నేతలకు లేదు రెంజల్: మచ్చ లేని నాయకనిగా రాష్ట్రంలోనే పేరున్న ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డిని విమర్శించే అర్హత బీజేపీ నాయకులకు లేదని మండల కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు. గురువారం సాటాపూర్‌లో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మొబిన్‌ఖాన్ మాట్లాడారు. బీజేపీ జిల్లా అద్యక్షుడితో పాటు స్థానిక బీజేపీ నాయకులు రెంజల్‌లోని ఆదర్శ పాఠశాల ప్రిన్సిపాల్ చేసిన అవినీతి, అక్రమాలను ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి కాపాడుతున్నారని చేసిన ఆరోపణల్లో నిజం లేదన్నారు. అనుచిత వ్యాఖ్యలు చేయడం మంచి పద్ధతి కాదన్నారు. సర్పంచ్‌లు ధనుంజయ్, మల్లేశ్, గయాసోద్దిన్, మాజీ సర్పంచ్‌లు జావీద్, వినోద్, తదితరులు పాల్గోన్నారు. ఇళ్ల మంజూరు పత్రాలు అందజేత మాక్లూర్: రెండో విడుతలో ఇందిరమ్మ ఇళ్లు మంజూరైన లబ్ధిదారులకు గురువారం స్థానిక సర్పంచ్ కూన లతసాగర్, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు గంగాధర్‌గౌడ్ ఆధ్వర్యంలో మంజూరు పత్రాలు అందజేశారు. ఉపసర్పంచ్ చిరంజీవి, వార్డు సభ్యులు బోజేంధర్, లింగన్న, రూప, కూన సాగర్, ఇందిరమ్మ సమిటీ సభ్యులు పాల్గొన్నారు. జైల్ భరోను విజయవంతం చేయండి ఆర్మూర్/ఆర్మూర్‌టౌన్/నవీపేట: క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో ఆగస్టు 10న దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు, జైల్ భరో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఏఐయూకేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వి.ప్రభాకర్, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు శంకరగౌడ్, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు నాయక్వాడి శ్రీనివాస్‌లు పిలుపునిచ్చారు. గురువారం వారు ఆర్మూర్, నవీపేటలో వేర్వేరుగా మాట్లాడి వాల్‌పోస్టర్లను ఆవిష్కరించారు. ప్రజావ్యతిరేక విధానాలపై కేంద్రం తీరును వ్యతికేరిస్తూ నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. -
ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలి
ఆర్మూర్‌టౌన్: మున్సిపల్ నుంచి అందజేస్తున్న మొ క్కలను ప్రతిఒక్కరు తమ ఇంటి ఆవరణలో నాటి వాటిని సంరక్షించాలని మున్సిపల్ చైర్పర్సన్ గోనె లహరి అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని 1వ వా ర్డులో వనమహోత్సవంలో భాగంగా గురువారం ఆమె చేతుల మీదుగా మొక్కల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పచ్చదనం పెంపొందించడం, పర్యావరణ పరిరక్షణ, భావితరాలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. ఆ ర్మూర్ ఏఎంసీ చైర్మన్ సాయిబాబా గౌడ్, మున్సిపల్ కమిషనర్ శ్రీహరి రాజు, తదితరులున్నారు. బోధన్‌లో.. బోధన్‌టౌన్(బోధన్): ప్రతీఒక్కరు మొక్కను నాటి బాధ్యతగా పరిరక్షించాలని మున్సిపల్ చైర్ పర్సన్ తూము పద్మాశరత్ రెడ్డి పిలుపు నిచ్చారు. గురువారం పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో వన మహోత్సవాన్ని ప్రారంభించి, మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్ పర్సన్ మాట్లాడారు. మొక్కలు పెరిగే వరకు పరిరక్షించాలని సూచించారు. మున్సిపల్ కమిషనర్ జాదవ్ కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.ఆర్మూర్‌లో మొక్కలు పంపిణీ చేస్తున్న మున్సిపల్ చైర్పర్సన్ గోనె లహరిబోధన్లో మొక్కలు నాటుతున్న మున్సిపల్ చైర్ పర్సన్ తూము పద్మ -
రెండు పంటలకు సరిపడా సాగునీరు
● ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డివర్ని: ఇటీవల కురిసిన వర్షాల మూలంగా మండలంలోని సిద్ధాపూర్ రిజర్వాయర్‌లోకి ఖరీఫ్, రబీ పంటలకు సరిపడా సాగునీరు వచ్చి చేరినట్లు ప్రభు త్వ వ్యవసాయ సలహాదారు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. గురువారం ప్రాజెక్టు పనులను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రాజెక్టులోకి కొత్తగా వచ్చి చేరిన నీటికి పూజలు నిర్వహించారు. అనంతరం పోచారం మాట్లాడుతూ.. రిజర్వాయర్‌లో నాలుగు తూములకు గాను రెండిటి నిర్మాణం పూర్తయినట్లు తెలిపారు. ప్రాజెక్టు నిర్మాణం పూర్తి అయితే ఆయకట్టు పరిధిలో 10 వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని వెల్లడించారు. పనుల్లో నాణ్యతా ప్రమాణాలను కచ్చితంగా పాటిస్తూ నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. సిద్దాపూర్ సర్పంచ్ బాల్ సింగ్, జాకోరా సొసైటీ చైర్మన్ దశరథ్ పాల్గొన్నారు. -
దుబాయ్‌లో గుండెపోటుతో దొన్కల్వాసి మృతి
కమ్మర్పల్లి(మోర్తాడ్): మోర్తాడ్ మండలం దొన్కల్ గ్రామానికి చెందిన జిన్న రవి(38) అనే వ్యక్తి వారం రోజుల క్రితం దుబాయ్‌లో గుండెపోటుతో మృతి చెందాడు. రవి నాలుగేళ్ల క్రితం ఉపాధి నిమిత్తం కంపెనీ వీసాపై దుబాయ్ వెళ్లాడు. అక్కడ ఇన్నోవా బిల్డ్ ఎల్ఎల్సీ కంపెనీలో కార్మికుడిగా చేరాడు. ఈక్రమంలో జూలై 31న కంపెనీలో పని చేస్తుండగా, చాతీలో నొప్పిగా ఉందంటూ అకస్మాత్తుగా కుప్పకూలాడు. తోటి కార్మికులు, సోదరుడు భూమేష్ కలిసి ఆస్పత్రిలో చేర్పించారు. పరీక్షించిన వైద్యులు గుండెపోటుతో మరణించినట్లు ధృవీకరించారు. రవి రెండేళ్ల క్రితం స్వగ్రామానికి వచ్చి వెళ్లాడు. రవికి వృద్ధురాలైన తల్లి గంగుబాయి ఉన్నారు. కాగా రవి మృతదేహం శుక్రవారం స్వగ్రామానికి చేరుకోనుంది. -
‘ఆయుష్మాన్’ సేవలను బలోపేతం చేయాలి
సుభాష్‌నగర్: ఆయూష్మాన్ ఆరోగ్య కేంద్రంలో అందుతున్న సేవలను బలోపేతం చేయాలని సీహెచ్ఎఫ్డబ్ల్యూ(ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ) కమిషనర్ సంగీత సత్యనారాయణ అన్నారు. జాతీయ ఆరోగ్య కార్యక్రమాల అమలుపై గురువారం ఆమె జూమ్ మీటింగ్‌లో సమీక్ష నిర్వహించారు. కార్యక్రమంలో అన్ని జిల్లాల డీఎంహెచ్‌వోలతోపాటు ని జామాబాద్ డీఎంహెచ్‌వో రాజశ్రీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంగీత సత్యనారాయణ మాట్లాడుతూ.. క్షయ వ్యాధి నిర్ధారణ శిబిరాలను నిర్వహిస్తూ శాంపిళ్లను సేకరించి నిర్ధారణ పరీక్షలు చేపట్టాలని సూచించారు. తెలంగాణ డయాగ్నోస్టిక్ హబ్ ద్వారా నిర్ధారణ పరీక్షల సంఖ్యను పెంచాలన్నారు. సీజనల్ వ్యాధులు ప్రబలనున్న నేపథ్యంలో సమావేశాలు, సమీక్షలు, జ్వర సర్వే, ఫాగింగ్, యాంటీ లార్వా, తదితర చర్యలు చేపట్టాలని తెలిపారు. జీవనశైలి వ్యాధుల నియంత్రణలో భాగంగా గుండె జబ్బులు, మధుమేహం, క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు చేయాలన్నారు. డీటీసీవో దేవి నాగేశ్వరి, ప్రోగ్రాం అధికారులు అశోక్, వెంకన్న, శిఖర, వెంకటేష్, సుప్రియ, శ్రావ్య, తదితరులు పాల్గొన్నారు. -
అక్రమ వెంచర్లను ఉపేక్షించొద్దు
● ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డినందిపేట్(ఆర్మూర్): అక్రమ వెంచర్లు చేపట్టడాన్ని అధికారులు ఉపేక్షించకుండా చర్యలు చేపట్టాలని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి ఆదేశించారు. గురువారం నందిపేట్ మండల కేంద్రంలో ఇటీవల మంజూరైన కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కోసం స్థానిక అధికారులతో కలిసి ఎమ్మెల్యే స్థల పరిశీలన చేశారు. అలాగే మండల పరిషత్ కార్యాలయంలో డీసీహెచ్ఎస్ శ్రీనివాస ప్రసాద్, డిప్యూటీ డీఎంహెచ్‌వో రవీందర్, స్థానిక ఎంపీడీవో, ఎమ్మార్వో, ఇరిగేషన్, పంచాయతీ, జిల్లా క్రీడల అధికారులతో కలిసి సమీక్ష చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మండల కేంద్రానికి క్రీడాస్థలం మంజూరైందని, దానికి అనువైన స్థలం పరిశీలించాలని, అలాగే కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కోసం మిగతా భూములు కూడా చూడాలని రెవెన్యూ అధికారులకు సూచించారు. అనంతరం పలువురిని పరామర్శించారు. ఎంపీడీవో శ్రీనివాసరావు, తహసీల్దార్ లక్ష్మణ్, వివిధ శాఖల అధికారులు, బీజేపీ మండల అధ్యక్షుడు పటేళ్ల రాజు, నాయకులు పెయింటర్ రాజు, నాగ సురేష్, సాయి, కస్తూరి గంగాధర్, లక్కంపల్లి చిన్నయ్య, చింత శ్రీను, పెట్ల శీను తదితరులు పాల్గొన్నారు. ఎత్తిపోతల పథక నిర్మాణ పనుల పరిశీలన మాక్లూర్: గుత్ప ఎత్తిపోతల నుంచి వచ్చే ధర్మోరా చెరువులోని నీటిని ఆధారంగా చేసుకుని రూ.11.71 కోట్లతో లక్మాపూర్ వద్ద చేపట్టిన మినీ లిఫ్ట్ పనులను గురువారం ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి పర్యవేక్షించారు. సంబంధిత నీటిపారుదలశాఖ అధికారులతో కలిసి వెళ్లి బొంకన్పల్లి వద్ద నీటిని ఎత్తిపోసే ప్రాంతాన్ని పరిశీలించారు. ఎమ్మెల్యే వెంట నాయకులు నూతుల శ్రీనివాస్‌రెడ్డి, ముల్లంగి(బి) సర్పంచ్ ధర్మపతి, రైతులు ఉన్నారు. -
బాలుడి అదృశ్యం.. గంటల్లోనే ఆచూకీ లభ్యం
● క్షేమంగా తల్లిదండ్రులకు అప్పగించిన పోలీసులు కమ్మర్పల్లి: అదృశ్యమైన ఓ బాలుడి ఆచూకీని గంటల వ్యవధిలోనే కనుగొని తమ పనితీరును కమ్మర్పల్లి పోలీసులు నిరూపించుకున్నారు. ఎస్సై సతీష్ తెలిపిన వివరాలు ఇలా.. కమ్మర్పల్లి మండల కేంద్రానికి చెందిన టేకు కృష్ణ ప్రసాద్(15) అనే బాలుడు గురువారం ఉదయం ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. దీంతో బాలుడి తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఎస్ఐ సతీష్ స్పందించి వెంటనే పోలీస్ సిబ్బందిని రంగంలోకి దించారు. కానిస్టేబుళ్లు నరేష్, దినేష్, హరీష్‌లు క్షేత్రస్థాయికి వెళ్లి విచారణ చేపట్టారు. గ్రామంలోని సీసీ కెమెరాలో నమోదైన దృశ్యాలను నిశితంగా పరిశీలించారు. బాలుడి కదలికలను ట్రాక్ చేసి ఆర్మూర్‌లోని అంబేడ్కర్ చౌరాస్తాలో ఉన్నట్లు గుర్తించారు. వెంటనే వెళ్లి బాలుడిని పోలీస్‌స్టేషన్‌కు తీసుకువచ్చారు. అనంతరం బాలుడిని తల్లిదండ్రులకు అప్పగించారు. అదృశ్యమైన తమ కొడుకు ఆచూకీని గంటల వ్యవధిలోనే కనిపెట్టి సురక్షితంగా అప్పగించినందుకు పోలీసులకు బాలుడి తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. -
ఆహార ఉత్పత్తులతో అదనపు ఆదాయం
రుద్రూర్: మహిళా రైతులు, గ్రామీణ యువత పాలు, మాంసం, గుడ్లతో విలువ ఆధారిత ఆహార ఉత్పత్తులను తయారు చేసి అదనపు ఆదాయం పొందవచ్చని వ్యవసాయ పరిశోధన కేంద్రం అధి పతి పవన్ చంద్రారెడ్డి తెలిపారు. రుద్రూర్ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఆధ్వర్యంలో మహిళలకు మూడు రోజుల పాటు నిర్వహించిన పాలు, మాంసం, గుడ్ల విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీ, నిల్వ సాంకేతికతలపై శిక్షణ కార్యక్రమం గురువా రం ముగిసింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి గా పవన్ చంద్రారెడ్డి హాజరై మాట్లాడారు.. నాణ్య తా ప్రమాణాలు, పరిశుభ్రత, ఆహార భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ ఉత్పత్తులు తయారు చేస్తే మార్కెట్లో మంచి డిమాండ్ ఉంటుందని తెలిపారు. అనంతరం పుడ్ సైన్స్ టెక్నాలజీ కళాశాల అసోసియేట్ డీన్ వెంకట్ రెడ్డి మాట్లాడారు. పలు ఉత్పత్తుల తయారీ విధానాలను ప్రదర్శించారు. మూడు రోజుల శిక్షణ కార్యక్రమానికి కోర్సు ఇనన్చార్జీలు జె. సాయిప్రసాద్, ఎం. ప్రశాంతి సమర్థవంతంగా నిర్వహించారు. శిక్షణ పూర్తి చేసిన వారికి సర్టిఫికెట్లు అందజేశారు. -
అటవీ భూములను సంరక్షించాలి
● చెట్ల నరికివేత, కలప రవాణాను సహించేది లేదు ● అటవీశాఖతో సంయుక్తంగా చర్యలు ● పోలీస్ కమిషనర్ సాయిచైతన్యనిజామాబాద్ అర్బన్: అటవీ భూముల ఆక్రమణ అడ్డుకుని వాటి సంరక్షణకు కృషి చేయాలని పోలీస్ కమిషనర్ సాయిచైతన్య అన్నారు. అటవీ భూముల ఆక్రమణల నివారణ, సంరక్షణ విధానాలపై అటవీ శాఖ అధికారులతో కమిషనరేట్ కార్యాలయంలో గురువారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. జిల్లాలో అటవీ భూ ముల ఆక్రమణలను సమర్థవంతంగా అరికట్టాలని, ఇప్పటికే జరిగిన ఆక్ర మణలను చట్టపరంగా తొలగించాలన్నారు. అట వీ భూముల ఆక్రమణలు ప్రభుత్వ ఆస్తికి, పర్యావరణానికి తీవ్ర నష్టం కలిగించేవని పేర్కొన్నా రు. అటవీ భూముల్లో చెట్ల నరికివేత, అక్రమ మైనింగ్, కలప రవాణా వంటి చట్ట విరుద్ధ కార్యకలాపాలను ఏమాత్రం సహించబోమని స్పష్టం చేశారు. జియో ట్యాగింగ్, డ్రోన్ సర్వేల ఆధారంగా ఆక్రమణలకు సంబంధించిన ఆధారాలు సేకరించాలని, అటవీ శాఖ అధికారులతో సంయుక్తంగా చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం జిల్లా అటవీ అధికారి ప్రశాంత్ బా జీరావు పాటిల్ మాట్లాడుతూ.. అటవీ భూములను రక్షించడం ప్రతి ప్రభుత్వ శాఖతోపాటు ప్ర తి పౌరుడి బాధ్యత అని అన్నారు. అటవీ భూముల సరిహద్దుల గుర్తింపు, కేసుల నమోదు, కోర్టు వ్యవహారాల్లో సమన్వయం వంటి అంశాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. అటవీ భూముల ఆక్రమణలను గుర్తించి దశలవారీగా తొలగించాలన్నారు. అక్రమంగా చెట్ల నరికివేత, కలప అక్రమ రవాణాపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయడంతోపాటు పోలీస్, అట వీ శాఖల మధ్య సమాచార మార్పిడిని వేగవంతం చేసి తక్షణ స్పందన వ్యవస్థను బలోపేతం చేయాలన్నారు. అవసరమైన ప్రాంతాల్లో సంయుక్తంగా ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహించాలన్నారు. సమావేశంలో అదనపు డీసీపీ శుభం ప్రకాశ్, ఫారెస్ట్ డివిజనల్ ఆఫీసర్ చంద్రశేఖరరావు, నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ ఏసీపీలు ప్రకాశ్‌యాదవ్, వెంకటేశ్వర్‌రెడ్డి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
తెగిన చెరువు కట్ట
● మునిగిన పంటలు ● దెబ్బతిన్న ఆర్ అండ్ బీ రోడ్డుసిరికొండ: మండలంలోని కొండాపూర్ గ్రామ ఊర చెరువు కట్ట తెగిపోయింది. గురువారం తెల్లవారు జామున నాలుగు గంటల నుంచి చెరువు కట్టకు లీకేజీ ప్రారంభమై తొమ్మిది గంటల వరకు పూర్తిగా తెగిపోయింది. కట్ట తెగిపోవడంతో చెరువులో నీరంతా వృథా పోయింది. చెరువు నీరు వాగులో కలిసే ప్రదేశం వరకు పొలాలన్నీ జలమమయ్యాయి. వరద ఉధృతికి పొలాలు చాలా మేర ధ్వంసమయ్యాయి. పొలాల్లో ఇసుక మేటలు వేశాయి. కొండాపూర్–తూంపల్లి మధ్య పీఆర్ రోడ్డు, కొండాపూర్– ఒంటిప్పతండా మధ్య ఆర్అండ్బీ రోడ్డు ధ్వంసమైంది. రెండు చోట్ల వరద రోడ్డు పైనుంచి పొంగడంతో పెద్ద ఎత్తున కోతకు గురైంది. ఆ మార్గాల్లో రాకపోకలను నిలిపివేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఎస్సై రాజశేఖర్ సిబ్బందితో కలిసి బందోబస్తు ఏర్పాటు చేశారు. -
అన్నదాతలను ఆదుకుంటాం
● కొండాపూర్‌లో తెగిన చెరువుకట్ట పరిశీలన ● శిఖం కబ్జా కారణంగానే ఈ పరిస్థితి ● రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డిసిరికొండ: కొండాపూర్ ఊర చెరువు కట్ట తెగిపోయిన ఘటనలో పొలాలు ధ్వంసమై, పంట నష్టపోయిన రైతులను ఆదుకుంటామని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి అన్నారు. తెగిపోయిన ఊర చెరువు కట్టను, దెబ్బతిన పంటలను, కోతకు గురైన రోడ్లను, కల్వర్టులను ఆయన గురువారం పరిశీలించారు. వరద నష్టం గురించి ఇన్చార్జి కలెక్టర్‌తో ఎమ్మెల్యే ఫోన్లో చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చెరువు శిఖం భూమి కబ్జాకు గురికావడమే కట్ట తెగిపోవడానికి కారణమన్నారు. శిఖం భూములను సర్వే చేసి మార్కింగ్ చేయాలని రెవెన్యూ, నీటి పారుదల శాఖ అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. వరద ప్రవాహనికి దెబ్బతిన్న పంటల సర్వే నిర్వహించి నివేదికను ప్రభుత్వానికి సమర్పించి పరిహారం అందేలా చూస్తామని రైతులకు ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. నాయకులు మునిపల్లి సాయారెడ్డి, బాకారం రవి, ఉమ్మాజీ నరేశ్, నీరటి శ్రీధర్, ఆకుల జగన్, నల్ల బుచ్చన్న, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు చందర్‌నాయక్, సర్పంచులు, ఉపసర్పంచులు తదితరులు పాల్గొన్నారు. వరద ప్రవాహానికి దగ్గరగా వెళ్లొద్దు వర్షాకాలంలో వరద ప్రవాహం కొనసాగే వాగులు, చెరువులు, కాలువల వద్దకు ఎవరూ వెళ్లవద్దని పోలీస్ కమిషనర్ సాయిచైతన్య అన్నారు. మండలంలోని కొండాపూర్ శివారులో తెగిన ఊర చెరువు కట్టను, దెబ్బతిన్న రోడ్లు, కల్వర్టులను సీపీ గురువారం పరిశీలించారు. ప్రమాదకర ప్రాంతాల వద్ద ప్రజలు సంచరించకుండా తగిన హెచ్చరికలు జారీ చేయయాలని, అవసరమైన చోట్ల బారికేడ్లు ఏర్పా టు చేసి పోలీసు పికెట్లను కొనసాగించాలని స్థానిక అధికారులను ఆయన ఆదేశించారు. ఎలాంటి అత్యవసర పరిస్థితులు ఎదురైనా వెంటనే సంబంధిత పోలీసులకు, 112 నంబర్‌కు సమాచారం ఇవ్వాలన్నారు. ఆయన వెంట ధర్పల్లి సీఐ భిక్షపతి, సిరికొండ, ధర్పల్లి ఎస్సైలు, రామకృష్ణ, సందీప్, స ర్పంచ్ నీరటి మానస శ్రీధర్ తదితరులు ఉన్నారు. -
నిజామాబాద్
ఘనంగా జయశంకర్ సార్.. తెలంగాణ సిద్ధాంతకర్త, ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలను గురువారం జిల్లాలో ఘనంగా నిర్వహించారు. శుక్రవారం శ్రీ 7 శ్రీ ఆగస్టు శ్రీ 2026– 8లో uఇంటర్ విద్యలో ప్రభుత్వం కీలక సంస్కరణలు చేపట్టింది. మారుతున్న కాలానికి తగ్గట్టుగా సిలబస్‌లో మార్పులు చేసింది. మరోవైపు విద్యార్థులకు సులభంగా అర్థమయ్యేలా ఏఐ ద్వారా పాఠాలను బోధించనున్నది. ప్రస్తుతం జిల్లాస్థాయిలో శిక్షణ కొనసాగుతుండగా త్వరలోనే ఏఐ పాఠాలు మొదలుకానున్నాయి. -
అభివృద్ధిలో మునిపల్లి భేష్
జక్రాన్‌పల్లి: జిల్లాలోని మునిపల్లి గ్రామంలో అభివృద్ధి పనులు భేషుగ్గా ఉన్నాయని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ అదనపు కమిషనర్ రవీందర్ అభినందించారు. జక్రాన్‌పల్లి మండలంలోని మునిపల్లి గ్రా మంలో చేపట్టిన అభివృద్ధి పనులను గురువారం ఆయన పరిశీలించారు. గ్రామంలో పర్యటించి ఉపాధిహామీ పథకం ద్వారా చేపట్టిన మ్యాజిక్ డ్రెయిన్, కంపోస్ట్ షెడ్, డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన కమ్యూనిటీ సోక్ పిట్‌ను పరిశీలించారు. పనుల నాణ్యత, ని ర్వహణ విధానాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మునిపల్లి గ్రామాన్ని ఆదర్శంగా తీసుకుని ముందుకు పోవాలని అధికారులకు సూచించారు. నీటి సంరక్షణ, పారిశుద్ధ్యం, వ్యర్థాల నిర్వహణ, భూగర్భ జలాల పరిరక్షణ పను ల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆయ నవెంట సర్పంచ్ల ఫోరం జిల్లా అధ్య క్షుడు, మునిపల్లి సర్పంచ్ చిన్న సాయిరెడ్డి, జెడ్పీ సీఈవో సాయాగౌడ్, డీఆర్డీవో సాయ న్న, డీపీవో శ్రీనివాసరావు, డీఎల్పీవో శివకృష్ణ, ఎంపీడీవో సతీశ్‌కుమార్, ఉప సర్పంచ్ ప్రశాంత్ తదితరులున్నారు. -
రాఖీ బంధానికి పోస్టల్ సేవలు
● విదేశాల్లో ఉన్న సోదరులకు రాఖీలు పంపేందుకు ఐటీపీఎస్ నిజామాబాద్ రూరల్: తోబుట్టుల అనుబంధానికి ప్రతీకగా నిలిచే రాఖీ (రక్షాబంధన్) పండుగకు తపాలాశాఖ ప్రత్యేక సేవలందిస్తోంది. విదేశాల్లో ఉన్న తమ సోదరులకు సోదరీమణులు రాఖీలు పంపించేందుకు ప్రత్యేకంగా ఇండియా పోస్ట్ ఇంటర్నేషనల్ ట్రాక్డ్ ప్యాకెట్ సర్వీస్ (ఐటీపీఎస్)ను తీసుకొచ్చింది. రాఖీలతోపాటు చిన్న బహుమతులను సురక్షితంగా, వేగంగా, తక్కువ ఖర్చులతో పంపేందుకు ఐటీపీఎస్ ఎంతో ఉపయోగపడనుంది. ప్రపంచంలోని 130కిపైగా దేశాలకు రాఖీలను పంపే సౌకర్యం అందుబాటులో ఉండ గా, సురక్షిత ప్యాకింగ్, వేగవంతమైన ఎయిర్ మెయిల్ ర వాణా, ఆన్లైన్ ట్రా క్, ట్రేస్ సౌకర్యం, విశ్వసనీయమైన డెలివరీ వంటి ప్ర యోజనాలు ఉన్నా యి. ఐటీపీఎస్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని నిజామాబాద్ పోస్టల్ డివిజన్ సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోస్ట్ ఆఫీసెస్ కె జనార్దన్‌రెడ్డి కోరారు. సమీప తపాలా కార్యాలయాల్లో బుక్ చేసుకోవాలని సూచించారు. -
సబ్జెక్టుల్లో మార్పులు
ఖలీల్‌వాడి: ప్రస్తుతం అన్ని రంగాల్లో ఏఐ(ఆర్టి ఫిషియల్ ఇంటెలిజెన్స్) వేగంగా విస్తరిస్తున్న తరుణంలో, విద్యారంగం కూడా ఈ సాంకేతిక విప్లవానికి అనుగుణంగా మారుతోంది. అదే దిశగా రాష్ట్ర ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ జూనియర్ కాలేజీలో విద్యా ప్రమాణాలను పెంచేందుకు, విద్యలో ఏఐ సాంకేతికతను వినియోగించాలన్న ఉద్దేశంతో బోర్డు పలు కొత్త చర్యలు చేపడుతోంది. ఈ ఏడాది నుంచి నూతన కరికులమ్, సవరించిన పాఠ్యపుస్తకాలు, డిజిటల్ బోధన పద్ధతులు అమలు చేయనున్నారు. ఫస్ట్ ఇయర్ సబ్జెక్ట్‌లో మార్పులు.. ఇంటర్మీడియట్ సబ్జెక్టుల వారీగా మార్పులు, చేర్పులు చేశారు. ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు కొత్త పాఠ్య పుస్తకాలను అందజేశారు. జిల్లాలోని 16 ప్రభుత్వ జూనియర్ కాలేజీలకు పుస్తకాలను పంపించారు. ఇందులో తెలుగు పుస్తకాన్ని పూర్తిగా మార్చారు. జువాలజీలో ప్రోటోజోవాలో గమనం, ప్రత్యుత్పత్తి తొలగించి, ఫస్టియర్‌లో ప్రాక్టికల్స్ 15 మార్కులు, ఫిజిక్స్‌లో ఫిజిక్స్ ఆఫ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ చేర్చడంతోపాటు ప్రాక్టికల్స్‌కు 15 మార్కులు, బాటనీలో ఆర్థిక వృక్షశాస్త్రం చేర్చి ప్రాక్టికల్స్‌కు 15 మార్కులు కేటాయించారు. మ్యాథ్స్‌లో అనుక్రమాలు, శ్రేణులు, సమితుల సిద్ధాంతాలను పాఠ్యాంశంలో చేర్చారు. కెమిస్ట్రీలో పదార్థాల స్థితు లు, పర్యావరణ రసాయన శాస్త్రం, స్టాయికియోమెట్రీ పాఠంలో మెలారిటీ భావన తీసివేశారు. ఫస్ట్ ఇయర్ ప్రాక్టీకల్ పరీక్షల కోసం క్వాలిటేటివ్ అనాలసిస్ నుంచి 15 లవణాలు పాఠాన్ని కొత్తగా చే ర్చారు. హిస్టరీ యూనిట్–6లో దక్షిణ భారతదేశం, దక్కన్ సామ్రాజ్యాలు, యూనిట్–8లో ప్రాంతీయ రాజ్యాలు కొత్తగా చేర్చి, మరాఠాలు, ప్రాంతీయ శక్తుల ఎదుగుదల పాఠాలను తొలగించారు. సుల్తా న్ రాజవంశీయుల అంశం యూనిట్–7లో కలిపా రు. యూరోపియన్ల రాక, బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా జరిగిన తిరుగుబాటు, జాతీయోద్యమం (తొలిదశ, మలిదశ) యూనిట్లు విలీనం చేశారు. ఆర్థికశాస్త్రంలో పాజిటివ్ ఎకనామిక్స్, నార్రేటివ్, నార్మేటివ్ ఎకనామిక్స్ కలిపారు. అలాగే స్టాటిస్టిక్స్ సూచీ సంఖ్యలు కొత్తగా చేర్చారు. ఇంటర్ విద్యలో సంస్కరణలు మాస్టర్ ట్రైనర్లు, డిస్ట్రిక్ట్ రీసోర్స్ పర్సన్లకు ఏఐపై కొనసాగుతున్న శిక్షణ త్వరలో లెక్చరర్లకు.. తర్వాత విద్యార్థులకు బోధన ఏఐపై శిక్షణ ఇలా..ఇంటర్మీడియట్లో కొత్తగా ప్రాక్టికల్స్, ఏఐ ద్వారా విద్యార్థులకు విద్యను అందించేందుకు ముందుగా హైదరాబాద్‌లో జూలై 31 నుంచి ఆగస్టు 17 వరకు మూడు విడుతల్లో రాష్ట్రస్థాయి మాస్టర్ ట్రైనర్లు, డిస్ట్రిక్ రీసోర్స్ పర్సన్లకు (డీఆర్పీ) రెండు రోజుల శిక్షణ ఇస్తున్నారు. జిల్లా నుంచి ఇద్దరు లెక్చరర్లు వీటిపై శిక్షణ తీసుకుంటున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తోపాటు ఏఐ నిర్వచనం, చరిత్ర అ లాగే అప్లికేషన్, ఏఐ, మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్ మధ్య తేడాలు, మ్యాథ్స్‌కు ఏఐ, ప్రోగ్రామింగ్ పునాదులు, తదితర అంశాలపై శిక్షణ అందిస్తున్నారు. రాష్ట్రస్థాయిలో శిక్షణ పొందిన డీఆర్పీలు జిల్లాల వారీగా లెక్చరర్లకు ఈనెల 20 తర్వాత శిక్షణ అందించనున్నారు. ఆ తర్వాత వారు విద్యార్థులకు బోధిస్తా రు. ఈ విద్యాసంవత్సరం నుంచి ఇది అమల్లోకి తీసుకువచ్చి నూతన అసెస్మెంట్, పరీక్షల ప్యా ట్రన్పై వివరిస్తారు. ఏఐ బోధన ముఖ్యంగా ఇంజినీరింగ్ విద్యలో చేరే విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఉన్నత విద్యతోపాటు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. లెక్చరర్లకు రెండు రోజుల శిక్షణ జిల్లాలోని 16 ప్రభుత్వ జూనియర్ కాలేజీల లెక్చరర్లకు ఈ నెల 20 తర్వాత సబ్జెక్ట్‌ల వారీగా రెండు రో జుల శిక్షణ అందిస్తాం. తర్వాత విద్యార్థులకు ఏఐ ద్వారా పాఠాలు బోధించడంతో సులువుగా అర్థమ య్యే అవకాశాలు ఉంటాయి. దీంతో మెరుగైన ఫలితాలు వస్తాయి. జిల్లా నుంచి ఇద్దరు డీఆర్పీలు హైదరాబాద్‌లో శిక్షణ తీసుకుంటున్నారు. – రవికుమార్, డీఐఈవో, నిజామాబాద్ -
ఆచార్య జయశంకర్ ఆశయ సాధనకు కృషి చేయాలి
నిజామాబాద్ అర్బన్: తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య జయశంకర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్ భవేష్ మిశ్రా అన్నారు. జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో ప్రొఫెసర్ జయశంకర్ జయంతిని గురువారం ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై జయశంకర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ భావజాలాన్ని ఎంతో గొప్పగా ముందుకు తీసుకెళ్లిన మహనీయుడు జయశంకర్ అని ప్రశంసించారు. 1969 ఉద్యమంతోపాటు మలి విడత ఉద్యమంలోనూ ప్రజలను ప్రత్యేకించి విద్యార్థులు, యువతను భాగస్వామ్యం చేశారని గుర్తు చేశారు. ప్రత్యేక రాష్ట్ర సాధనే ఆశ, శ్వాసగా ఆరు దశాబ్దాలపాటు సుదీర్ఘంగా అలుపెరుగని కృషి చేస్తూ ప్రజలలో ఉద్యమ స్ఫూర్తిని రగిలించిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. ఆయన సేవలను స్మరించుకునేలా ప్రభుత్వం అధికారికంగా జయంతి వేడుకలు నిర్వహిస్తోందని, వ్యవసాయ విశ్వవిద్యాలయానికి ప్రొఫెసర్ జయశంకర్ పేరు పెట్టారని అన్నారు. అంతకుముందు కంఠేశ్వర్ చౌరస్తాలో గల ఆచార్య జయశంకర్ విగ్రహానికి అదనపు కలెక్టర్ వి భుజంగరావు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆయా సంఘాల బాధ్యులు వేడుకల్లో భాగస్వాములయ్యారు. ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, ట్రెయినీ కలెక్టర్ సురేశ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి, డీఆర్వో గీత, ఆర్డీవో రాజేంద్ర కుమార్, ట్రెయి డిప్యూటీ కలెక్టర్ సందీప్, జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఇన్చార్జి అధికారిణి రజిత, ఆయా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. -
పాఠశాలల నిధులపై ఆడిట్
ఖలీల్‌వాడి: సమగ్ర శిక్ష ద్వారా ప్రభుత్వ పాఠశాలలకు 2025–26 ఆర్థిక సంవత్సరానికి మంజూరైన నిధులపై నగరంలోని ఆదర్శ హిందీ విద్యాలయంలో బుధవారం ఆడిట్ నిర్వహించారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌కి చెందిన చార్టెడ్ అకౌంటెంట్స్ నిజామాబాద్ దక్షిణ, ఉత్తర మండలాలతోపాటు నిజామాబాద్ రూరల్, మోపాల్ మండలాలకు చెందిన దాదాపు 150 ప్రభుత్వ పాఠశాలలకు మంజూరైన నిధులు, ఖర్చయిన వివరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఆడిటర్లు జయప్రకాశ్, ధనుష్, నరేందర్ క్యాష్బుక్ వొచర్లను పరిశీలించారు. నాలుగు మండలాల్లో 100 శాతం ఆడిట్ పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు. -
అప్రెంటిస్‌షిప్‌కు దరఖాస్తు చేసుకోవాలి
● ఆర్ఎం కృష్ణమూర్తి నిజామాబాద్ రూరల్ : టీజీఎస్ ఆర్టీసీ నిజామాబాద్ రీజియన్‌లో అప్రెంటిస్‌షిప్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలని ఆర్ఎం కృష్ణమూర్తి తెలిపారు. జిల్లా కేంద్రంలోని రీజియన్ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. డిప్లొమా, ఇంజినీరింగ్, జనరల్ డిగ్రీ కోర్సులు పూర్తిచేసిన అభ్యర్థులు ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు ఈ నెల 10వ తేదీ వరకు https:// nats. education. gov. in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఎంపికై న అభ్యర్థులకు మూడు సంవత్సరాల శిక్షణ కాలంలో నిబంధనల ప్రకా రం స్టైఫండ్ చెల్లిస్తామన్నారు. శిక్షణ కాలం పూ ర్తి కాగానే సర్టిఫికెట్ ఇస్తామని, 13 డిప్లొమా, 5 జనరల్ డిగ్రీ అప్రెంటిషిప్ పోస్టులు భర్తీ చేయనున్నట్లు ఆర్ఎం పేర్కొన్నారు. ● డీఏవో వీరాస్వామి డొంకేశ్వర్(ఆర్మూర్): రైతులు సంప్రదాయ పంటలతోపాటు మేకల పెంపకం చేపడితే ఆర్థికంగా అదనపు ఆదాయం సమకూరుతుందని జిల్లా వ్యవసాయాధికారి వీరాస్వామి అన్నారు. జిల్లాలో ధర్పల్లి, సిరికొండ మండలాల్లో అమలవుతున్న ఎంఎంపీటీఎఫ్ కార్యక్రమంలో భాగంగా పలువురు మహిళా రైతులకు బుధవారం జిల్లా పశువైద్య శాఖలో మేకల పెంపకంపై అవగాహన సదస్సు నిర్వహించారు. డీఏవో వీరాస్వామి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. మేకల పెంపకానికి యాజమాన్య పద్ధతులు, పశుగ్రాసం, టీకాలు, షెడ్ల నిర్వహణ, జీవాలకు బీమా, మార్కెటింగ్ అంశాలపై వివరించి చెప్పారు. టెక్నికల్ ఏవో శ్రీనివాస్, పశువైద్యాధికారులు అహ్మద్, డీబీ రెడ్డి, కిరణ్ తదితరులు పాల్గొన్నారు. డిచ్పల్లి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జలసిరి కార్యక్రమంలో భాగంగా గ్రామాల వారీగా ఇచ్చిన లక్ష్యాన్ని సకాలంలో పూర్తి చేయాలని జిల్లా పంచాయతీ అధికారి (డీపీవో), జలసిరి ప్రత్యేక అధికారి శ్రీనివాస్‌రావు ఆదేశించారు. బుధవారం డిచ్పల్లి మండలం నడిపల్లి రైతు వేదికలో డిచ్పల్లి, ఇందల్వాయి మండలాలకు చెందిన పంచాయతీ రాజ్, ఆర్డబ్ల్యూఎస్ ఏఈలు, పంచాయతీ కార్యదర్శులు, ఈజీఎస్ సిబ్బందితో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో డీపీవో మాట్లాడారు. జలసిరి ప్రోగ్రాం కింద పామ్‌పాండ్స్, ఇంకుడు గుంతలు, బోర్వెల్ రీచార్జి స్ట్రక్చర్స్, కమ్యూనిటీ సోప్ కిట్స్ నిర్మాణాలు చేపట్టాలన్నారు. డీఎల్పీవో శ్రీనివాస్, ఎంపీడీవోలు ఉదయ్‌భాస్కర్, ఆరేటి అనంత్‌రావు, డిచ్పల్లి ఎంపీవో శ్రీనివాస్, పీఆర్ ఏఈ శ్రీధర్, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ గణేశ్, ఈజీఎస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
ఎస్సీ సబ్ ప్లాన్‌పై రైతులకు అవగాహన
రుద్రూర్: పొతంగల్ మండలం తిరుమలపూర్, దోమలెడ్గి గ్రామాల్లో ఐసీఏఆర్‌కు చెందిన హైదరాబాద్ నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ మేనేజ్మెంట్ ప్రధాన శాస్త్రవేత్తలు బాలకృష్ణన్, ని ర్మల, టెక్నికల్ ఆఫీసర్ మురహరి బుధవారం పర్య టించారు. ఎస్సీ సబ్‌ప్లాన్‌పై రైతులకు అవగాహన కల్పించారు. ఎస్సీ సబ్‌ప్లాన్ లక్ష్యాలు, ఆధునిక వ్యవసాయ సాంకేతికత, రైతులకు అందుబాటులో ఉన్న సౌకర్యాలను వివరించారు. ఎస్సీ రైతుల ఆర్థి కాభివద్ధి, వ్యవసాయ ఉత్పాదకత పెంపే లక్ష్యంగా అభిప్రాయాలను సేకరించి, అవసరమైన వ్యవసా య ఇన్పుట్ల జాబితాను రూపొందించనున్నట్లు తెలిపారు. ఏఈఓ శంకర్, రైతులు ఉన్నారు. -
ఐదుగురు వ్యక్తులు.. 80 నేరాలు..
● 11 రాష్ట్రాలలో నేర చరిత్ర ● కామారెడ్డి పోలీసులకు చిక్కిన అంతర్రాష్ట్ర దొంగల ముఠా ● వివరాలు వెల్లడించిన ఎస్పీ రాజేశ్చంద్ర కామారెడ్డి క్రైం: కామారెడ్డి పోలీసులు ఐదుగురు సభ్యుల అంతర్రాష్ట్ర దొంగల ముఠాను అరెస్ట్ చేశారు. వీరు 11 రాష్ట్రాల్లో 80 నేరాలకు పాల్పడ్డారు. జిల్లా పోలీసు కార్యాలయంలో బుధవారం విలేకరుల సమావేశంలో ఎస్పీ రాజేశ్ చంద్ర తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కామారెడ్డి పట్టణంలోని జయశంకర్ కాలనీకి చెందిన అజ్జన్ నిరేష్ మంగళవారం కుటుంబ సభ్యులతో కలిసి ఇంటికి తాళం వేసి బయటకు వెళ్లారు. గుర్తుతెలియని వ్యక్తులు ఇంటి తాళం పగులగొట్టి చోరీకి పాల్పడ్డారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కామారెడ్డి టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని సీసీ ఫుటేజీలను పరిశీలించారు. బుధవారం వేకువజామున కామారెడ్డి రైల్వే స్టేషన్ వద్ద తనిఖీలు నిర్వహిస్తుండగా.. అనుమానాస్పదంగా కనిపించిన ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి వేలిముద్రలను పరిశీలించారు. నిందితులను మహారాష్ట్రలోని నాగ్‌పూర్ జిల్లా కాంప్టీ గ్రామానికి చెందిన మహమ్మద్ అలీ రజాక్, మహమ్మద్ నాసిర్, మహమ్మద్ సాదిక్, మహమ్మద్ షాహిద్ రజాక్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన షేక్ ఫైజాన్లుగా గుర్తించారు. వారందరికీ నేరచరిత్ర ఉన్నట్లు గుర్తించి పోలీస్ స్టేషన్‌కు తరలించి విచారించగా ఈ ముఠా నేర చరిత్ర బయటపడింది. రద్దీ ప్రాంతాలే టార్గెట్‌గా.. నిందితులు ఒక అంతర్రాష్ట్ర ముఠాగా ఏర్పడి వివిధ రాష్ట్రాల్లో సంచరిస్తూ బ్యాంకులు, ఏటీఎంలు, మార్కెట్లు, బస్టాండ్లు వంటి రద్దీ ప్రాంతాలను లక్ష్యంగా చేసుకొని నేరాలకు పాల్పడుతున్నట్లు విచారణలో తేలింది. ప్రజల దృష్టిని మరల్చేందుకు హాత్ సఫాయి, బాబాగిరి, నకిలీ నోట్ల తనిఖీ పేరుతో నగదు, బంగారు ఆభరణాలను అపహరించడం వీరి పద్ధతి. రాత్రి సమయాలలో ఇళ్లలో చోరీలకు పాల్పడతారు. కత్తులతో బెదిరించి దారి దోపిడీలకూ పాల్పడతారని విచారణలో వెల్లడైంది. వరుస నేరాలు.. నిందితులు గతనెల 27 న మహారాష్ట్ర నుంచి కామారెడ్డికి చేరుకున్నారు. 28 న పట్టణంలోని మున్సిపల్ సమీపంలో ఉన్న ఎస్బీఐ ఇందిరానగర్ బ్రాంచ్‌లో నుంచి నగదు డ్రా చేసుకున్న ఓ వ్యక్తి వద్ద నుంచి నోట్లు లెక్కించేందుకు సహాయం చేసే పేరుతో (హాత్ సఫాయి పద్ధతిలో) రూ. 15 వేలు అపహరించారు. అనంతరం మహారాష్ట్రకు వెళ్లి బల్లార్షా గ్రామంలో మరో వ్యక్తి వద్ద నుంచి నగదు దోపిడీ చేశారు. మళ్లీ తెలంగాణలో నేరాలు చేసేందుకు వచ్చారు. ఈనెల 3 న నిజామాబాద్‌లో ఒంటరిగా వెళ్తున్న వ్యక్తిని కత్తులతో బెదిరించి నగదు దోచుకున్నారు. 4 న రాత్రి కామారెడ్డి జయశంకర్ కాలనీలోని ఇంట్లో చోరీకి పాల్పడ్డారు. బెంగళూరులోనే 50కిపైగా.. తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్, ఉత్తరప్రదేశ్, బిహార్, రాజస్థాన్, గుజరాత్, ఢిల్లీ, కర్ణాటక, తమిళనాడు తదితర రాష్ట్రాల్లో సుమారు 80 నేరాలకు పాల్పడ్డారు. ఈ ముఠా ఒక్క బెంగళూరులోనే 50 కి పైగా నేరాలకు పాల్పడినట్లు విచారణలో తేలింది. మహారాష్ట్రలోని బల్లార్షా, చంద్రపూర్తోపాటు హైదరాబాద్‌లోని నారాయణగూడ, చార్మినార్, మార్కెట్, ఉప్పల్ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదై ఉన్నాయని ఎస్పీ తెలిపారు. నిందితుల వద్దనుంచి రూ.4 వేలు నగదు, 3 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నామన్నారు. అంతర్రాష్ట్ర దొంగల ముఠాను పట్టుకోవడంలో విశేషంగా కృషి చేసిన కామారెడ్డి పట్టణ ఎస్‌హెచ్‌వో నరహరి, ఎస్సైలు సాయికృష్ణ, భువనేశ్వర్, సిబ్బంది రాజు, సంపత్, సీసీఎస్ సీఐ రామన్, సిబ్బంది స్వామి, కిషన్ లను అభినందించారు. సమావేశంలో కామారెడ్డి డీఎస్పీ మధుసూదన్ పాల్గొన్నారు. -
విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్న కాంగ్రెస్
● బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేశ్ కులాచారి ● ఆదర్శ పాఠశాల ప్రిన్సిపల్‌ను సస్పెండ్ చేయాలని ధర్నా రెంజల్: విద్యా వ్యవస్థను కాంగ్రెస్ ప్రభుత్వం భ్రష్టు పట్టిస్తోందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేశ్ కులాచారి ఆరోపించారు. అవినీతి, అక్రమాలకు పా ల్పడిన రెంజల్ ఆదర్శ పాఠశాల ప్రిన్సిపల్ ఫిరోజ్ హైదర్‌ను ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి వెనుకేసుకురావడంలో ఆంతర్యమేంటని ప్రశ్నించారు. వెంటనే ప్రిన్సిపల్‌ను సస్పెండ్ చేయాలని బుధవారం రెంజల్ ఆదర్శ పాఠశాల ఎదుట విద్యార్థులతో కలిసి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా దినేశ్ కు లాచారి మాట్లాడుతూ ప్రిన్సిపల్ అక్రమాలకు పా ల్పడినట్లు రుజువైనా చర్యలు తీసుకోకుండా, సంబంధం లేని కంప్యూటర్ ఆపరేటర్‌ను తొలగించి మూడు రోజులకే మళ్లీ విధుల్లోకి తీసుకోవడం వెను క కారణాలను ప్రశ్నించారు. ధర్నాలో నీలా, ఎడపల్లి సర్పంచులు క్యాతం యోగేశ్, కందగట్ల రాంచందర్ నాయకులు పాల్గొన్నారు. సీపీని కలిసిన బీజేపీ జిల్లా అధ్యక్షుడు నిజామాబాద్ అర్బన్: బీజేపీ జిల్లా అధ్యక్షుడు కులచారి దినేశ్ పోలీస్ కమిషనర్ సాయిచైతన్యను కలిశారు. శాంతియుతంగా నిరసన తెలిపితే పోలీసులు అడ్డుకున్నారని సీపీకి వివరించారు. -
దారి.. ధైర్యం
వన్‌స్టాప్ నుంచేనిజామాబాద్ రూరల్ : సఖి (వన్ స్టాప్) సెంటర్ బాధిత మహిళల్లో ధైర్యాన్ని నింపుతూ జీవితానికి కొత్త దారి చూపుతోంది. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి ఆవరణలో సంక్షేమ అధికారి నేతృత్వంలో కొనసాగుతున్న సఖి కేంద్రం బాధిత మహిళలను అక్కును చేర్చుకుంటోంది. సుమారు ఎనిమిదిన్నరేళ్ల కాలంలో 4,478 మంది బాధిత మహిళలకు వైద్యం, న్యాయసాయం, తాత్కాలిక ఆశ్రయం, కౌన్సెలింగ్ తదితర సేవలను అందించింది. ప్రతి ఫిర్యాదును కేవలం కేసుగా కాకుండా ఒక కుటుంబ సమస్యగా పరిగణించి కౌన్సెలింగ్, చట్టపరమైన సహాయం, పోలీసు సమన్వయం, వైద్య సేవలు, తాత్కాలిక ఆశ్రయం, పునరావాసం వంటి సేవలు అందిస్తూ అనేక కుటుంబాలను తిరిగి సగౌరవంగా నిలబెట్టింది. 2017 డిసెంబర్ 1 నుంచి 2026 జూలై 31 వరకు మొత్తం 4,478 మంది మహిళలు, బాలికలు సఖి కేంద్రాన్ని ఆశ్రయించారు. పోక్సో, బాల్య వివాహాలపై ప్రత్యేక దృష్టి పోక్సో, బాల్య వివాహాలు, గృహహింస, అత్యవసర పరిస్థితుల్లో ఉన్న మహిళలు, బాలికలకు అవసరమైతే రెస్క్యూ ఆపరేషన్లు నిర్వహించి సురక్షితంగా సఖి కేంద్రానికి తరలిస్తున్నారు. అనంతరం పోలీసు శాఖ, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ, జిల్లా బాలల పరిరక్షణ విభాగం, వైద్య శాఖలతో సమన్వయం చేసి న్యాయ సహాయం, వైద్య చికిత్స, కౌన్సెలింగ్, ఆశ్రయం అందిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో తల్లిదండ్రులను పిల్లలు నిర్లక్ష్యం చేయడం, గంజాయికి బానిసైన యువకులు తల్లిదండ్రులను వేధించడం వంటి కుటుంబ సమస్యలపై కూడా సంబంధిత శాఖలకు రిఫర్ చేసి తగిన చర్యలు తీసుకుంటున్నారు.మహిళల్లో ధైర్యాన్ని నింపే ల క్ష్యంతో సఖి కేంద్రం పని చే స్తుంది. మహిళలకు ఎదుర య్యే అన్ని రకాల సమస్యల ను సెంటర్ పరిష్కరిస్తుంది. భయపడకుండా వస్తే సఖి టీం సమస్యలకు పరిష్కార మార్గాన్ని చూపుతుంది. సమస్యను పూర్తిగా అర్థం చేసుకుని సంబంధిత శాఖలను సమన్వయం చేసుకుంటూ పని చేస్తాం. – భానుప్రియ, వన్‌స్టాప్ సెంటర్ అడ్మినిస్ట్రేటర్ వేధింపులకు గురైతే మహిళ లు అధైర్య పడకుండా వెంట నే సఖి కేంద్రాన్ని సంప్రదించాలి. మహిళలు, బాలికలకు అన్ని విధాలుగా అండగా ని లచే లక్ష్యంతో సెంటర్ పని చేస్తుంది. మహిళలు నిర్భయంగా తమ బాధలు స ఖి కేంద్రంలో చెప్పుకోవచ్చు. ప్రస్తుతం కాలంలో మహిళలు సైతం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. – డి సౌందర్య, జిల్లా సంక్షేమ అధికారిణి అగ్ని గోళం కాదు.. ఆకాశంపొద్దంతా వెలుగులు పంచిన సూర్యుడు.. అస్తమిస్తూ తన కిరణాలతో ఆకాశాన్ని అగ్ని గోళంగా తలపించాడు. బుధవారం సాయంత్రం ఆవిష్కృతమైన ఈ అద్భుత దృశ్యం కనులవిందు చేసింది. ఎరుపు వర్ణానికి నారింజ, బంగారు వర్ణాలు తోడుకావడంతో ఆకాశం ధగధగలాడింది. నందిపేట మండలం బజార్‌కొత్తూర్ శివారులో ‘సాక్షి’ తన కెమెరాలో ఈ దృశ్యాన్ని బంధించింది. – నందిపేట్ చికిత్సతో కొత్త జీవితంమద్యం, గంజాయి వంటి మత్తు పదార్థాలకు బానిసై కుటుంబ బాధ్యతలను విస్మరించే భర్తల కారణంగా అనేక మంది మహిళలు సఖి కేంద్రాన్ని ఆశ్రయిస్తున్నారు. ఇలాంటి సందర్భాల్లో సఖి కేంద్రం కేవలం మహిళలకు న్యాయ సహాయం అందించడమే కాకుండా, వ్యసనాలకు బానిసైన వ్యక్తులను నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో సైకియాట్రిస్ట్ పర్యవేక్షణలో చికిత్స పొందేలా సమన్వయం చేస్తోంది. అనంతరం వారికి, వారి కుటుంబ సభ్యులకు కౌన్సెలింగ్ నిర్వహించి, మళ్లీ కుటుంబంతో కలిసి సంతోషంగా జీవించేలా కృషి చేస్తోంది. దీంతో అనేక కుటుంబాలు తిరిగి సాధారణ జీవితంలోకి వచ్చాయి. సఖి కేంద్రానికి వచ్చిన కేసుల్లో అత్యధికంగా 2,717 గృహహింస కేసులు నమోదయ్యాయి. భర్త లేదా అత్తింటి వారి శారీరక, మానసిక వేధింపులు, వరకట్న డిమాండ్లు, అనుమానాలు వంటి సమస్యలతో మహిళలు సఖి కేంద్రాన్ని ఆశ్రయిస్తున్నారు. వరకట్న వేధింపుల కేసులు 598, పోక్సో 254, మిస్సింగ్, కిడ్నాప్ కేసులు 162, సోషల్ మీడియా, సైబర్ మోసాల కేసులు 132, అత్యాచార కేసులు 68, బాల్య వివాహాల కేసులు 39, లైంగిక వేధింపుల కేసులు 9, యాసిదాడి కేసు ఒకటి నమోదైంది. సోషల్ మీడియా మోసాలు ఫేస్బుక్, ఇన్న్స్ర్ట్రాగామ్, వాట్సాప్ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా పరిచయమైన వారి కారణంగా ప్రేమ పేరుతో మోసపోవడం, డబ్బులు కోల్పోవడం, వ్యక్తిగత ఫొటోలు, వీడియోలతో బ్లాక్‌మెయిల్‌కు గురవడం వంటి 132 కేసులు నమోదయ్యాయి. ఇలాంటి కేసుల్లో సైబర్ పోలీసులతో సమన్వయం చేసి బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటున్నారు సఖి సెంటర్ నిర్వాహకులు.కన్నీళ్లను తుడిచి కొత్త జీవితాన్నిస్తున్న ‘సఖి’ గృహహింస నుంచి సైబర్ నేరాల వరకు మహిళలకు ఒకే చోట సేవలు మానసిక ధైర్యాన్నిస్తున్న సెంటర్ ఆశ్రయం.. పునరావాసం ఇక్కడి నుంచే..సఖి కేంద్రం.. అంటేనే కేసులు అనుకోవడం అపోహ మాత్రమే. మహిళల వేధింపుల కేసుల్లో ముందుగా కుటుంబ సభ్యులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేస్తుంది. రాజీ సాధ్యమైన కేసుల్లో కుటుంబాలను మళ్లీ కలిపేందుకు ప్రయత్నిస్తుంది. మహిళ భద్రతకు ముప్పు ఉన్నప్పుడు మాత్రం చట్టపరమైన చర్యలు తీసుకుని పూర్తి రక్షణ కల్పిస్తుంది. ‘ఒక ఫోన్ కాల్... ఒక మహిళ జీవితాన్ని, ఒక కుటుంబ భవిష్యత్‌ను మార్చగలదు. సమస్యను దాచుకోవద్దు... సఖి మీకు అండగా ఉంటుంది’. అంటున్నారు అధికారులు. -
వాగులో గల్లంతైన రైతు మృతి
లింగంపేట: వాగులో గల్లంతైన శ్రీహరి మృతదేహం బుధవారం లభించింది. వివరాలిలా ఉన్నాయి. రాంపల్లి కొన తండాకు చెందిన దేవసోత్ శ్రీహరి సోమవారం రాత్రి పెద్దవాగులో గల్లంతైన విషయం తెలిసిందే. అతడి ఆచూకీ కోసం లింగంపేట ఎస్సై దీపక్‌కుమార్, ఎన్డీఆర్ఎఫ్ బృందం, ఎల్లారెడ్డి ఫైర్ సిబ్బంది గాలించారు. బుధవారం ఉదయం వరద ఉధృతి తగ్గడంతో చెక్‌డ్యామ్ వద్ద శ్రీహరి మృతదేహం కనిపించింది. మృతదేహాన్ని ఒడ్డుకు తెచ్చి కుటుంబ సభ్యులకు అప్పగించారు. శ్రీహరిని వెంటాడిన వరద.. దేవసోత్ శ్రీహరి మరో ఇద్దరితో కలిసి 2022 ఆగస్టు 28న చేపలు పట్టడానికి పంట చేను వద్ద ఉన్న పెద్దవాగులోకి దిగాడు. భారీ వర్షం కురియడంతో వరద ఉధృతి పెరగడంతో వాగులో చిక్కుపోయారు. సుమారు ఎనిమిది గంటలపాటు బి క్కుబిక్కుమంటూ వరద ఉధృతిలో గడిపారు. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ఐదు గంటలపాటు శ్రమించి ముగ్గురిని కాపాడారు. శ్రీహరి తాజాగా అదే వాగులో గల్లంతై మృతిచెందాడు. భార్య కమల, ఇద్దరు కుమారులు, ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. -
శ్మశాన వాటిక పరిశీలన
బోధన్‌టౌన్(బోధన్): పట్టణంలోని 16వ వార్డులో ఉన్న శ్మశాన వాటికను లోకాయుక్త డిప్యూటీ డైరెక్టర్ జైపాల్ బుధవారం సందర్శించారు. పట్టణప్రగతిలో భాగంగా రూ.28 లక్షలు వెచ్చించి శ్మశాన వాటికలో చేపట్టిన అభివృద్ధి పనుల్లో నిధులను దుర్వినియోగం చేఽశారనే ఫిర్యాదు మేరకు ఆయన వివరాలు సేకరించారు. ఫిర్యాదుదారుడైన రాజ్ విఠల్, మున్సిపల్ కమిషనర్ జాదవ్ కృష్ణను పనులపై ప్రశ్నించారు. శ్మశాన వాటికలో చేపట్టిన సీసీ రోడ్డు, ప్రహరీ, టాయిలెట్స్‌ను మున్సిపల్ కమిషనర్ చూపించారు. ప్రహరీ ఒక పక్కకు ఎందుకు ఒరిగిందని డిప్యూటీ డైరెక్టర్ బల్దియా అధికారులను ప్రశ్నించగా.. ప్రహరీని ఆనుకుని డ్రెయినేజీ నిర్మాణం చేపట్టడంతో ఒరిగిందని సమాధానం ఇచ్చారు. శ్మశాన వాటికలో జరిగిన అభివృద్ధి పనులకు సంబంధించిన ఫొటోలు, రికార్డులు తీసుకురావాలని ఆయన సూచించారు. మున్సిపల్ చైర్పర్సన్ తూము పద్మాశరత్‌రెడ్డి, ఏఈ శ్రీనివాస్, స్థానికులు ఉన్నారు. నేటి నుంచి అందుబాటులో ‘ఎఫ్ఎఫ్ఎస్’ యాప్ డొంకేశ్వర్(ఆర్మూర్): కేంద్ర ప్రభుత్వం కొత్త గా రూపొందించిన ‘ఫ్రేమ్ వర్క్ ఫర్ ఫెర్టిలైజర్ సేల్ (ఎఫ్ఎఫ్ఎస్)’ యూరియా మొబై ల్ యాప్ గురువారం నుంచి అందుబాటులోకి రానుందని జిల్లా వ్యవసాయాధికారి వీరాస్వామి బుధవారం ఒక ప్రకటనలో తెలి పారు. ఎరువుల పంపిణీని మరింత పారదర్శకంగా, వేగంగా చేయడానికి కొత్త యాప్ ఉపయోగపడుతుందని, యూరియాతో పాటు ఇతర ఎరువులు కూడా బుకింగ్ చేసుకొని పొందవచ్చని పేర్కొన్నారు. రైతులు ఆందోళన, గందరగోళానికి గురి కాకుండా కొత్త యాప్‌ను స్మార్ట్ ఫోన్లో డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. యాప్ సేవల్లో సందేహాలు ఉంటే స్థానిక వ్యవసాయాధికారులను లేదా ఎరువుల విక్రయ కేంద్రాల్లో సంప్రదించాలని సూచించారు. ‘సైబర్’ వలకు చిక్కొద్దు మాక్లూర్: సాంకేతిక రంగం ఎంత వేగంగా అభివృద్ధి చెందుతోందో అంతే వేగంగా సైబర్ నేరాలు పెరుగుతున్నాయని, సైబర్ నేరగాళ్ల వలకు చిక్కొద్దని సీపీ సాయిచైతన్య ప్రజలకు సూచించారు. జాతీయ సైబర్ జాగృతి దివస్‌ను పురస్కరించుకుని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఆదేశం మేరకు బుధవారం దాస్‌నగర్‌లోని విజయ్ రూరల్ ఇంజినీరింగ్ కళాశాలలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఎస్సై అనిల్‌రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమానికి సీపీ సాయిచైతన్య ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. అప్రమత్తతే రక్షణ, ధ్రువీకరణే భద్రత, అవగాహనే ఆయుధమని అన్నారు. ఈ మూడింటిని యువత, ప్రజలు పాటించినప్పుడు సైబర్ నేరగాళ్ల బారిన పడకుండా ఉంటామన్నారు. అనంతరం సైబర్ నేరాల అవగాహన పోస్టర్‌ను ఆవిష్కరించడంతోపాటు విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించారు. మత్తు పదార్ధాలకు దూరంగా ఉంటామని విద్యార్థులతో ప్రమాణం చేయించారు. ఏసీపీ బి ప్రకాశ్‌యాదవ్, నార్త్ జోన్ సీఐ శ్రీనివాస్‌రావు, సైబర్ క్రైం సీఐ ముఖీద్‌పాషా, సైబర్ క్రైమ్ ఎస్సైలు రవికుమార్, ప్రవళిక, విజయ్ రూరల్ ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్లు గణేశ్, సురేశ్ తదితరులు పాల్గొన్నారు. -
ఎన్‌హెచ్ 44
నిఘా నీడలో.. ● కిలోమీటర్‌కు ఒకటి చొప్పున బిగింపు ● ఇప్పటికే 190 కిలోమీటర్ల వరకు ఏర్పాటు ● టోల్‌ప్లాజాల్లో కంట్రోల్ రూంలుసాక్షి ప్రతినిధి, కామారెడ్డి : నాగ్‌పూర్ హైవేగా పిలవబడే 44వ నంబరు జాతీయ రహదారిపై నిఘాను మరింత పటిష్టం చేస్తున్నారు. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్హెచ్ఏఐ) పర్యవేక్షణలో సేవ్ లైఫ్ ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో వివిధ కార్పొరేట్ సంస్థల సహకారంతో ప్రతి కిలోమీటర్‌కు ఒక హై రిజల్యూషన్ కెమెరాను ఏర్పాటు చేస్తున్నారు. దాదాపు కిలోమీటర్ పొడవునా వాహనాల రాకపోకలను కెమెరాలు పసిగడతాయని ఎన్హెచ్ఏఐ ప్రాజెక్టు డైరెక్టర్ నాగేశ్వర్రావ్ ‘సాక్షి’తో తెలిపారు. నిరంతర నిఘా వ్యవస్థ... జాతీయ రహదారిపై 24/7 నిఘా కెమెరాలు పనిచేయనున్నాయి. దీంతో హైవేలపై ఎక్కడ ఏ చిన్న సంఘటన జరిగినా ఇట్టే తెలిసిపోతుంది. ఏదైనా వాహనం రోడ్డుపై మరో వాహనాన్ని ఢీకొట్టి వెళ్లిపోతే కంట్రోల్ రూంలో స్పష్టంగా కనబడుతుంది. దీంతో ఆ వాహనం తప్పించుకునే అవకాశం ఉండదు. ఎన్‌హెచ్ 44 మీదుగా నిత్యం వేలాది వాహనాల రాకపోకలు సాగిస్తుంటాయి. ఎక్కడో చోట ప్రమాదం జరుగుతూనే ఉంటుంది. అలాగే అప్పుడప్పుడు దారిదోపిడీలూ జరుగుతాయి. నిరంతర నిఘా వ్యవస్థ మూలంగా దోపిడీలకు కళ్లెం పడుతుందని భావిస్తున్నారు. హైవేపై హైరిజల్యూషన్ కెమెరాలు ఏర్పాటు చేయడం మూలంగా వాహన వేగ పరిమితి గంటలకు 80 కిలోమీటర్లు దాటకుండా వాహనదారులు జాగ్రత్త పడే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం కెమెరాలు ఉన్న ప్రాంతానికి వెళ్లగానే వాహనదారులు వేగాన్ని తగ్గించి 80 కిలోమీటర్లు దాటకుండా చూసుకుంటున్నారు. ఇప్పుడు కిలోమీటర్‌కో కెమెరా ఏర్పాటు అవడం, అవి కూడా హైరిజల్యూషన్ కెమెరాలు కావడంతో వాహనదారులు పరిమితిని దాటి వేగంగా వెళితే కచ్చితంగా కెమెరా కన్నుకు చిక్కాల్సిందే.జాతీయ రహదారిపై ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలుటోల్ ప్లాజాల వద్ద కెమెరాల కంట్రోల్ రూంలు ఏర్పాటు చేస్తున్నారు. మెదక్ జిల్లాలోని మనోహరాబాద్, కామారెడ్డి జిల్లాలోని భిక్కనూరు, నిజామాబాద్ జిల్లాలోని ఇందల్వాయి, నిర్మల్ జిల్లాలో ఒకటి, ఆదిలాబాద్ జిల్లాలో రెండు టోల్‌ప్లాజాలు ఉన్నాయి. ఆయా టోల్‌ప్లాజాలలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూంల ద్వారా నిరంతరం పరిశీలిస్తారు. దీంతో ఎక్కడ ఏం జరిగినా వెంటనే అధికారులకు తెలిసిపోతుంది. ఎన్హెచ్ఏఐ కేవలం రోడ్డు భద్రతకు సంబంధించిన అంశాలను పర్యవేక్షిస్తుంది. అయితే హైవేపై ప్రమాదాలు, నేరాలు జరిగినపుడు పోలీసు శాఖ హైవే అధికారుల సహకారం తీసుకుని సీసీ పుటేజీలను పరిశీలించడానికి ఆస్కారం ఉంటుంది.మేడ్చల్ సమీపంలోని కాళ్లకల్ నుంచి ఆదిలాబాద్ జిల్లాలోని మహారాష్ట్ర సరిహద్దు వరకు దారి పొడవునా కెమెరాలను అమర్చుతున్నారు. ఇప్పటికే 190 కిలోమీటర్ల మేర కెమెరాలు బిగించారు. రోడ్డుపైకి వచ్చిన ప్రతి వాహనం కదలికలను కెమెరాలు రికార్డు చేస్తాయి. వీటి పనితీరును అధికారులు పరిశీలిస్తున్నారు. మరో 60 కిలోమీటర్ల మేర కెమెరాల ఏర్పాటుకు సంబంధించిన పనులు కొనసాగుతున్నాయి. హైవేపై ఉన్న ఆయా టోల్ ప్లాజాల వద్ద కంట్రోల్ రూంలను ఏర్పాటు చేస్తున్నారు. హై రిజల్యూషన్ కెమెరాలు వాహనాల వేగాన్ని కూడా గమనించి హైవేపై ఏర్పాటు చేసిన స్క్రీన్ల మీద వాహనం వేగాన్ని వెల్లడిస్తాయి. కాగా కెమెరాలన్నీ శాటిలైట్ ద్వారానే కంట్రోల్ రూంతో కనెక్ట్ అయి ఉంటాయి. ఎక్కడా వైర్లు, కేబుళ్లు ఉండవు. దీంతో ఎలాంటి ఆటంకాలకు ఆస్కారం లేకుండా కెమెరాలు నిరంతరం పనిచేస్తాయి.నాగ్‌పూర్ హైవేపై హై రిజల్యూషన్ కెమెరాలు.. -
క్రైం కార్నర్
● భార్య మృతిని తట్టుకోలేక భర్త ఆత్మహత్య ● అనాథలైన ముగ్గురు పిల్లలు ● అంచనూరులో తీవ్ర విషాదం నీవు లేక నేనుండలేనంటూ..దోమకొండ : భార్య మృతిని తట్టుకోలేక భర్త ఆత్మహత్యకు పాల్పడిన ఘటన దోమకొండ మండలం అంచనూర్ గ్రామంలో బుధవారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన జోగిని సందీప్ (26) తెల్లవారుజామున ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి భార్య జోగిని మౌనిక జూలై 16న అత్త, మరిది వేధింపులతో బలవన్మరణానికి పాల్పడింది. కాగా సందీప్, మౌనిక దంపతులకు ఐదేళ్ల ఆరాధ్యతోపాటు ఏడాదిన్నర కవల కుమారులు ఆద్విత్, ఆద్యయత్ ఉన్నారు. మౌనిక మృతి చెందిన నాటి నుంచి సందీప్ తీవ్ర మనోవేదనకు గురయ్యేవాడు. చిన్న పిల్లలు ఉన్నారని, వారిని చూసుకోవాలని తండ్రి, బంధువులు సముదాయిస్తూ వస్తున్నారు. బుధవారం తెల్లవారుజామున పిల్లల ఏడుపులు విన్న మృతుడి తండ్రి నారాయణ వెళ్లి చూడగా మౌనిక ఆత్మ హత్యకు పాల్పడిన గదిలోనే సందీప్ సైతం ఉరేసుకున్నాడు. ఘటనా స్థలాన్ని ఎస్సై ప్రభాకర్ పరిశీలించారు. మృతదేహాన్ని కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి, మృతుడి తండ్రి నారాయణ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు. చిన్న వయసులోనే దంపతులు బలవన్మరణానికి పాల్పడి చిన్నారులను అనాథలను చేశారంటూ బంధువుల రోదించారు. కాగా, మౌనిక ఆత్మహత్య కేసులో అత్త, మరిది ప్రస్తుతం జైల్లో ఉన్నారు. 51 మెట్రిక్ టన్నుల కలప పట్టివేత ● ఇద్దరు అరెస్ట్, పరారీలో మరో ముగ్గురు బోధన్: రెంజల్ మండలం నీలా గ్రామ శివారులోని బొగ్గు తయారీ డిపోలో అక్రమంగా నిల్వ చేసిన 51 మెట్రిక్ టన్నుల కలపను పట్టుకున్నట్లు నిజామాబాద్ డివిజన్ అటవీశాఖ అధికారి కే సుధాకర్ రావు బుధవారం తెలిపారు. అటవీ సంపదను అక్రమంగా నిల్వ చేసి బొగ్గు తయారీకి వినియోగిస్తున్నారని గుర్తించి మంగళవారం తనిఖీలు చేశామన్నారు. తనిఖీలో వేప, మామిడి, తుమ్మ, ఇతర వృక్షజాతులకు సంబంధించిన 51 మెట్రిక్ టన్నుల కలపను గుర్తించినట్లు పేర్కొన్నారు. డిపో నిర్వాహకుడిపై కేసు నమోదు చేశామన్నారు. ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ తరలించినట్లు తెలిపారు. పరారీలో ఉన్న మరో ముగ్గురు నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయని వివరించారు. -
ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తున్నాం
నిజామాబాద్ అర్బన్: ఉద్యోగుల సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ పరిష్కరిస్తున్నామని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ అన్నా రు. పాత కలెక్టరేట్ ప్రాంగణంలోని నవదుర్గ ఆలయంలో టీఎన్జీవోఎస్ ఆధ్వర్యంలో బుధవారం బోనాల పండుగ నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా హాజరైన మహేశ్ కుమార్ మాట్లాడుతూ ఉద్యోగులు సమాజ సేవ తోపాటు ఆధ్యాత్మిక కార్యక్రమాలూ నిర్వహించడం అభినందనీయమన్నారు. అర్బన్ ఎమ్మె ల్యే ధన్పాల్ సూర్యనారాయణ మాట్లాడుతూ ఉద్యోగులంతా కలిసి బోనాల పండుగ నిర్వహించడం, తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను పాటించడం అభినందనీయమన్నారు. అ దనపు కలెక్టర్ భుజంగరావు మాట్లాడుతూ ఉ ద్యోగులు తమ బాధ్యతను నిర్వర్తిస్తూనే ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించడం సంతోషకరమన్నారు. అంతకుముందు పాత కలెక్టరేట్ ప్రాంగణంలోని నవదుర్గ మాత ఆలయంలో టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్, అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్, మేయర్ ఉమారాణి, టీఎన్జీవోఎస్ జిల్లా అధ్యక్షుడు సుమన్, మహిళా ఉ ద్యోగులు బోనాలను ఎత్తుకొని ఊరేగింపు నిర్వహించారు. ప్రత్యేక పూజల అనంతరం మహా అ న్నదానం చేశారు. మాజీ మేయర్ ధర్మపురి సంజయ్, టీఎన్జీవోస్ నాయకులు గైని గంగారాం, శ్రీనివాస్, మారుతి, పెద్దోళ్ల నాగరాజు, డీఎంహెచ్‌వో రాజ్యశ్రీ తదితరులు పాల్గొన్నారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ టీఎన్జీవోస్ ఆధ్వర్యంలో ఘనంగా బోనాల పండుగ -
హరీశ్ సమాధానం చెప్పాల్సింది ప్రజలకే..
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: ఆధునిక కాలంలోనూ క్షుద్రపూజలను నమ్మడం మంచిది కాదని, మూఢ నమ్మకాలను వీడాలని టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్‌కుమార్ గౌడ్ పేర్కొన్నారు. బుధవారం జిల్లాకేంద్రంలోని పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. బీఆర్ఎస్ నేత హరీశ్‌రావు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లోని క్షుద్రపూజల తర హా పూజలు నిర్వహించే ఆలయాల్లో పూజలు నిర్వహించినట్టు తమకు సమాచారం ఉందన్నారు. ఆ యన ఎలాంటి పూజలు చేశారో ప్రజలకు చెప్పాల్సి న అవసరం ఉందన్నారు. ఎల్నినోలాంటి పరిస్థితు ల్లో ఆ పూజల మర్మమేంటో ప్రజలకే చెప్పాలన్నందుకు ఎందుకు ఉలిక్కిపడుతున్నాడో అర్థం కావడం లేదన్నారు. కేటీఆర్ తెలంగాణతో పాటు మహారా ష్ట్ర, తమిళనాడులలో ఎక్కడ పాదయాత్రలు చేసినా ఒరిగేదేం లేదన్నారు. బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రాదని, కాంగ్రెస్సే తిరిగి అధికారంలోకి వస్తుందని పేర్కొన్నారు. ఈసారి 80 శాతానికిపైగా సీట్లు సాధిస్తామన్న ధీమా వ్యక్తం చేశారు. బిహార్‌లోని బంకీపూర్ ఉప ఎన్నికలో ఓటమితో మోదీకి నూకలు చెల్లినట్టేన్నారు. ఏకంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు నబీన్ రాజీనామా చేసిన సీటులో ఓడిపోవడంతోనే బీజేపీ పని అయిపోయిందన్నారు. జిల్లాకు ఇంజినీరింగ్, వ్యవసాయ కళాశాలల ను తీసుకొచ్చామని, జిల్లా అభివృద్ధే ధ్యేయంగా ముందుకు వెళ్తున్నామని అన్నారు. ధాన్యం సేకరణ విషయంలో కఠినంగా వెళ్లడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులు పూ ర్తి చేయడంపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. జి ల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కే నగేశ్‌రెడ్డి, నగర మేయర్ కే ఉమారాణి, కార్పొరేషన్ డీసీసీ అధ్యక్షుడు బొబ్బి లి రామకృష్ణ, బాడ్సి శేఖర్‌గౌడ్, గడుగు గంగాధర్, మానాల మోహన్‌రెడ్డి, తాహెర్ బిన్ హందాన్, ఏ ఎంసీ చైర్మన్ ముప్పగంగారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ఆ కుల లలిత, భక్తవత్సలం, నరేందర్‌రెడ్డి, జావిద్ అ క్రమ్, సీనియర్ నాయకులు పాల్గొన్నారు. క్షుద్రపూజలు, మూఢనమ్మకాలు మంచివి కాదని చెబుతున్నా.. ఈ విషయంలో అంత ఉలిక్కిపాటు ఎందుకు? టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ -
ఇంకా లోతులోనే..
● ఓడిన కాంగ్రెస్ అభ్యర్థులకు ఫండ్స్ ఇస్తున్నారు : అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ నియోజకవర్గానికి నయాపైసా ఇవ్వలేదుసుభాష్నగర్: నిజామాబాద్ నగర సమగ్రాభివృద్ధే లక్ష్యంగా తన ప్రతి అడుగు ఉంటుందని అర్బన్ ఎ మ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అన్నారు. ట్రా ఫిక్ శాశ్వత పరిష్కారం కోసం అవసరమైన వంతెన ల నిర్మాణానికి రూ.100 కోట్లు మంజూరు చేయాలని, రూ.70 కోట్లతో ఎల్లమ్మగుట్ట రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మించాలని, వర్ని, నిజామాబాద్, డిచ్పల్లి, ఇందల్వాయి, భీమ్‌గల్, కమ్మర్పల్లి వరకు నగరం మీదు గా 107 కిలోమీటర్ల కొత్త జాతీయ రహదారి ప్రతిపాదనలను ఆర్ అండ్‌బీ మంత్రికి అందించినట్లు వివరించారు. నగరంలోని బీజేపీ కార్యాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్ర భుత్వం ఏర్పడి రెండున్నరేళ్లు గడిచినా.. నియోజక వర్గ అభివృద్ధికి నయాపైసా ఇవ్వలేదని, ఓడిన కాంగ్రెస్ అభ్యర్థులకు నిధులను ఇస్తున్నారన్నారు. మేయర్‌కు, కార్పొరేషన్ కమిషనర్‌కు ప్రజా సమస్యలపై పట్టు లేదని మండిపడ్డారు. కార్పొరేషన్లో ఉన్న నిధులను కూడా ప్రజావసరాలకు వినియోగించక పోవడం సిగ్గుచేటన్నారు. యువతకు ఉద్యో గ అవకాశాలు కల్పించేందుకు కంపెనీలను తీసుకురావాలని, జీజీహెచ్‌లో సమస్యలను పరిష్కరించాలని, నిజామాబాద్ బస్టాండ్‌లో ప్రయాణికులకు మౌలిక వసతులు కల్పించాలని, కొత్త బస్టాండ్ నిర్మించాలని సంబంధిత మంత్రులకు విన్నవించినట్లు తెలిపారు. అలాగే ఆర్వోబీ, ఆర్యూబీల నిర్మాణానికి ఎంపీ అర్వింద్‌తో కలిసి కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు ప్రతిపాదనలు అందజేశానన్నారు. నాయకులు, కార్పొరేటర్లు నాగోళ్ల లక్ష్మీనారాయణ, పోతన్కర్ లక్ష్మీనారాయణ, మున్సిపల్ ఫ్లోర్‌లీడర్ ప్రమోద్ తదితరులు పాల్గొన్నారు. డొంకేశ్వర్(ఆర్మూర్) : జూలై నెలాఖరులో వర్షాలు కురిసినప్పటికీ జిల్లాలో భూగర్భ జల మట్టాలు పెరగకపోగా.. ఇంకా లోతులోకి వెళ్లాయి. జూన్‌లో 12.61 మీటర్లలో నీటి మట్టాలు ఉండగా.. జూలై ముగిసే నాటికి 0.32 మీటర్లు తగ్గి 12.93 మీటర్ల లోతులోకి పడిపోయాయి. గతేడాది ఇదే సమయంతో (11.76 మీటర్లు) పోలిస్తే లోటు రికార్డయ్యింది. అయితే.. వర్షపునీరు భూమిలోకి పూర్తిగా ఇంకకపోవడంతోపాటు వ్యవసాయ బోర్ల వాడకం పెరగడమే ఇందుకు కారణమని గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ అధికారులు పేర్కొంటున్నారు. జిల్లా వ్యాప్తంగా 82 ఫీజో మీటర్ల ద్వారా భూగర్భ జలాల లెక్కలను ఇటీవల తీశారు. 28 ఫీజో మీటర్లలో 10 మీటర్ల లోపు నీటి మట్టాలు ఉండగా.. 42 ఫీజో మీటర్లలో 10 నుంచి 20 మీటర్ల లోతులో ఉన్నాయి. మరో 12 ఫీజో మీటర్లలో 20 మీటర్ల లోతులో జలాలున్నాయి. వర్షపు నీరు భూగర్భంలోకి ఇంకి ఆగస్టు నెలలో నీటి మట్టాలు పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఇటు జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 50 సెంటీ మీటర్ల వర్షం కురిసింది. ఐదు మండలాలు అధిక, 26 మండలాలు సాధారణ, రెండు మండలాలు లోటు వర్షపాతంలో ఉన్నాయి. వర్షాకాల సీజన్ మొత్తంలో 94 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉంది. పూర్తిగా నిండని చెరువులు 600కు పైనే.. ఇటీవల భారీ వర్షాలు కురిసినా కూడా జిల్లాలో చాలా చెరువులు పూర్తిగా నిండలేవు. జిల్లాలో 1,097 చెరువులు ఉండగా 25శాతం నీరు చేరిన చెరువులు 221 ఉన్నాయి. అలాగే 25 నుంచి 50 శాతం వరకు నిండిన చెరువులు 385 ఉన్నాయి. అంటే, జిల్లాలో పూర్తిగా నిండని చెరువులు 600కు పైగానే ఉన్నాయి. అదే విధంగా 50 నుంచి 75శాతం నిండిన చెరువులు 296.. 75 నుంచి 100 శాతం నిండినవి 149, అలుగు పారుతున్నవి 46 ఉన్నాయి. మరో రెండుమూడు సార్లు భారీ వర్షపాతం నమోదైతే తప్ప జిల్లాలోని మిగతా చెరువులు నిండే పరిస్థితి లేదు. జూలైలో 0.32 మీటర్ల లోతుకు తగ్గిన భూగర్భ జలాలు ప్రస్తుతం జిల్లాలో 12.93 మీటర్ల వద్ద నీటి మట్టం గతేడాదితో పోలిస్తే లోటే -
వినూత్న పద్ధతులతో ఆదాయం పొందాలి
● డీఆర్డీవో సాయన్న వేల్పూర్(బాల్కొండ): వినూత్న పద్ధతులు అవలంబిస్తూ రైతులు అధిక ఆదాయం పొందాలని డీఆర్డీవో సాయన్న సూచించారు. బాల్కొండ మండల కేంద్రంలో ఏడాది క్రితం ఉపాధిహామీ పథకంలో రైతు నానం నరేశ్ ఫాంపాండ్ నిర్మించుకొని చేపట్టిన చేపల పెంపకాన్ని బుధవారం ఆయన పరిశీలించారు. చేపల పెంపకం, ఆదాయం తదితర వివరాలను రైతును అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా డీఆర్డీవో మాట్లాడుతూ ఫాంపాండ్ నిర్మించుకుంటే పంట పండే భూమిని కోల్పోతామని రైతులు భయపడుతున్నారని, నష్టపోయే పంటకు బదులు చేపల పెంపకంతో ఆదాయం పొందవచ్చన్నారు. ఫాంపాండ్‌ను సిరికొండ మండల రైతులు పరిశీలించారు. కార్యక్రమంలో ఏపీడీలు గంగామోహన్, ఓంపాల్, ప్లాంటేషన్ మేనేజర్ కపిల్, ఎంపీడీవో విజయభాస్కర్‌రెడ్డి, ఎంపీవో గంగామోహన్, ఏపీవో ఇందిర, సర్పంచ్ గాండ్ల రాజేశ్ తదితరులు పాల్గొన్నారు. -
నేడు ఇన్చార్జి కలెక్టర్‌గా భవేశ్ మిశ్రా బాధ్యతలు
నిజామాబాద్ అర్బన్: జిల్లా ఇన్చార్జి (ఎఫ్ఏసీ) కలెక్టర్‌గా నిర్మల్ జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా గురువారం బాధ్యతలు తీసుకోనున్నారు. కలెక్టర్ ఇలా త్రిపాఠి సెలవుపై వెళ్లగా.. ఆమె భర్త, నిర్మల్ జిల్లా కలెక్టర్ అయిన భవేశ్‌కు ఇన్చార్జి బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. గురువారం (నేడు) ఉదయం 10.30 గంటలకు ఆయన జిల్లా సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయానికి చేరుకోనున్నారు. భవేశ్ మిశ్రా ఇన్చార్జి కలెక్టర్‌గా 55 రోజులపాటు కొనసాగే అవకాశం ఉంది. -
80 కిలోల గంజాయి పట్టివేత
శంకర్పల్లి: గంజాయి తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను సోమవారం రాత్రి శంకర్పల్లి పోలీసులు పట్టుకున్నారు. వారిని మంగళవారం కోర్టులో హాజరు పరిచి, రిమాండ్‌కు తరలించారు. శంకర్పల్లి సీఐ రుధ్వీర్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. కామారెడ్డి జిల్లా పిట్లంకు చెందిన ఎం శ్రీనివాస్, ఎం శ్రీనివాస్, జే కిరణ్ కొంతకాలంగా జల్సాలకు అలవాటు పడ్డారు. సులభంగా డబ్బు సంపాదించేందుకు గంజాయి అక్రమ రవాణాను ఎంచుకున్నారు. ఒడిశాలోని చిత్రకొండ వద్ద 80 కిలోల గంజాయి కొనుగోలు చేసి, కర్ణాటకలోని బీదర్‌లో విక్రయిస్తున్నారు. సోమవారం శంకర్పల్లి నుంచి సరఫరా చేస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. పట్టణంలోని మంజీరా పైప్‌లైన్ రోడ్డులో తనిఖీలు జరుపగా వీరు పట్టుబడ్డారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం నిందితులను చేవెళ్ల కోర్టులో హాజరు పరిచి, సంగారెడ్డి జిల్లా జైలుకి తరలించారు.● రిమాండ్‌కు ముగ్గురి తరలింపు -
అంతర్జాతీయ కరాటే పోటీల్లో బోధన్ విద్యార్థుల ప్రతిభ
బోధన్‌టౌన్: హైదరాబాద్‌లో ఇటీవల నిర్వహించిన అంతర్జాతీయ కరాటే పోటీల్లో బోధన్‌కు చెందిన ఒకినోవా కరాటే స్కూల్ విద్యార్థులు సత్తా చాటారు. పోటీల్లో పలు రాష్ట్రాల నుంచి విద్యార్థులు 2800 మంది పాల్గొనగా కటాస్ విభాగంలో బోధన్‌కు చెందిన ఒకినోవా కరాటే స్కూల్‌కు చెందిన ఐదుగురు విద్యార్థులు బంగారు, ఏడుగురు సిల్వర్, ఒక్కరు రజత పథకాలు సాధించారని కరాటే మాస్టర్ సాయిలు తెలిపారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాల్గొన్న కరాటే మాస్టర్, సినిమా ఫైటర్ కన్నన్ గౌడ్, మాజీ ఎంపీ మధుయాష్కి, నేపాల్ కరాటే గ్రాండ్ మాస్టర్ జగదీశ్ సింగ్ ఖాత్రి కరాటే పోటీల్లో వివిధ భాగాల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారని తెలిపారు. -
పెరిగిన ఇంటర్ అడ్మిషన్లు
● పక్కా పర్యవేక్షణ.. బోధన ● పోటీ పరీక్షలకు కోచింగ్ ● ప్రభుత్వ కళాశాలల్లో చేరేందుకు విద్యార్థుల ఆసక్తి ఖలీల్‌వాడి: ఇంటర్మీడియట్ బోర్డు తీసుకువచ్చిన సంస్కరణలతో జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలు బలోపేతమవుతున్నాయి. కాలేజీల్లో మౌలిక వసతులు, బోధన, అధికారుల పర్యవేక్షణతో కళాశాలలు కొత్త రూపు సంతరించుకుంటున్నాయి. జిల్లాలో మొత్తం 16 ప్రభుత్వ జూనియర్ కాలేజీలు ఉండగా, గతేడాది ఫస్టియర్‌లో 3,300 మంది చేరారు. ఈ ఏడాది అడ్మిషన్ల సంఖ్యలో ఇప్పటి వరకు 4250కి పెరిగింది. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది 20శాతం అడ్మిషన్లు పెంచాలని ఇంటర్ బోర్డు అధికారులు లక్ష్యాన్ని నిర్దేశించారు. దీంతో లెక్చరర్లు ‘కాలేజీ బాట’లో భాగంగా విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు ప్రభుత్వ కాలేజీల్లో సౌకర్యాలపై అవగాహన కల్పించారు. ఫలితంగా ప్రభుత్వ కాలేజీల్లో అడ్మిషన్ల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. జిల్లా కేంద్రంలోని కోటగల్లీ బాలికల జూనియర్ కాలేజీలో 730 మంది అడ్మిషన్లు తీసుకోగా, కమ్మర్పల్లి జూనియర్ కాలేజీలో అడ్మిషన్లు వంద దాటాయి. ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు ఉదయం టిఫిన్స్, మధ్యాహ్నం భోజనం అమలు చేయగా, రెండో విడతలోనూ జిల్లాను ఎంపిక చేశారు. ఇది త్వరగా అమలు చేస్తే అడ్మిషన్ సంఖ్య పెరిగే అవకాశం ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రైవేట్ కళాశాలల్లో ఫీజుల మోతను భరించలేని తల్లిదండ్రులు.. తమ పిల్లలను గురుకుల కళాశాలల్లో చేర్పించేందుకు ఆసక్తి చూపుతున్నారని, అక్కడ సీట్లు రానివారు ప్రభుత్వ కళాశాలలను ఎంపిక చేసుకుంటున్నారని పలువురు పేర్కొంటున్నారు.జేఈఈ, ఎప్‌సెట్, క్లాట్ కోచింగ్ ప్రభుత్వ కాలేజీల్లో ఐఎఫ్‌పీ (ఇంటరాక్టివ్ ప్లాట్ ప్యానెల్) టచ్ స్క్రీన్‌పై డిజిటల్ బోధన చేస్తున్నారు. సెంకడియర్ విద్యార్థులను జేఈ ఈ, ఎంసెట్, ఎప్‌సెట్, క్లాట్(కామన్ లా అడ్మిషన్ టెస్ట్) తదితర పోటీ పరీక్షలకు కోచింగ్ ఇస్తున్నారు. ప్రాక్టికల్స్ నిర్వహణకు ప్రతి కాలేజీ రూ.25 వేల చొప్పున అందిస్తున్నారు. పర్యవేక్షణ కోసం ప్రతి కళాశాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతోపాటు ఎఫ్ఆర్ఎస్(ముఖ గుర్తింపు) హాజరు అమలు చేస్తున్నారు. కాలేజీకి విద్యార్థి గైర్హాజరైతే వెంటనే తల్లిదండ్రులకు మెస్సేజ్‌లు వెళ్తుండడంతో విద్యార్థుల హాజరు శాతమూ పెరుగుతోంది. ల్యాబ్‌లు, క్రీడా కార్యక్రమాలు, ఇతర మౌలిక వసతులకు నిధులను కేటాయిస్తున్నారు.ఇంటర్ ఫలితాల్లో రాష్ట్రస్థాయి ర్యాంకులు సాధించిన జిల్లా కేంద్రంలోని కోటగల్లీ ప్ర భుత్వ జూనియర్ కళాశాలలో అడ్మిషన్లు తీసుకునేందుకు విద్యార్థినులు ఆసక్తి చూపుతున్నారు. ఈ విద్యా సంవత్సరానికి ఇప్పటి వరకు 730 మంది విద్యార్థినులు అడ్మిషన్లు తీసుకున్నారు. గతేడాది 580 మంది విద్యార్థినులు చేరగా, ఈ ఏడాది అడ్మిషన్ల సంఖ్య ఇప్పటి వరకు 150కి పెరిగింది. 15 వరకు అడ్మిషన్లు తీసుకుంటాం జిల్లాలోని ప్రభుత్వ కాలేజీల్లో ఫస్టియర్ విద్యార్థుల సంఖ్య పెరిగింది. ఇంటర్మీడియట్ ఫలితాల్లో ఉత్తమ ఫలితాలు సాధించాం. కాలేజీల్లో మౌలిక వసతులు కల్పించడతోపాటు పోటీ పరీక్షలకు కోచింగ్ అందిస్తున్నాం. డిజిటల్ బోధన, అనుభజ్ఞులైన లెక్చరర్లు ఉన్నారు. ఈనెల 15 వరకు అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగుతుంది. – రవికుమార్, డీఐఈవో, నిజామాబాద్ -
షార్ట్‌సర్క్యూట్‌తో ఇల్లు దగ్ధం
మాచారెడ్డి: మండలంలోని మైసమ్మ చెరువు తండాలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో ఓ ఇల్లు పాక్షికంగా దగ్ధమైంది. దీంతో రూ. లక్ష వరకు నష్టం వాటిల్లింది. తండాకు చెందిన మాలోత్ తుల్జా నాయక్ కుటుంబ సభ్యులు మంగళవారం ఇంటికి తాళం వేసి పొలం పనులకు వెళ్లారు. సాయంత్రం ఇంటి నుంచి పొగలు రావడాన్ని గుర్తించిన స్థానికులు తుల్జా కుటుంబ సభ్యులకు సమాచారం అందించి మంటలను ఆర్పేశారు. ప్రమాదంలో ఇంట్లో ఉన్న విలువైన ఫర్నిచర్, ఇతక వస్తువులు దగ్ధమయ్యాయి. రూ. లక్ష వరకు ఆస్తినష్టం జరిగిందని బాధిత కుటుంబీకులు తెలిపారు. కామారెడ్డి అర్బన్: ఎల్ఐసీలో బీమా సఖి (మ హిళ ఏజెంట్లు), శ్రీరాం లైఫ్ ఇన్సూరెన్స్‌లో ఫీ ల్డ్ సెల్స్ అధికారుల నియామకం కోసం గురువారం కలెక్టరేట్లో జాబ్‌మేళా నిర్వహించనున్నారు. ఆసక్తిగలవారు ఉదయం 10.30 గంట ల నుంచి మధ్యాహ్నం వరకు నిర్వహించే జాబ్ మేళాలో పాల్గొనాలని జిల్లా ఉపాధి కల్పనాధికారి కిరణ్‌కుమార్ తెలిపారు. వివరాలకు 92928 05290లో సంప్రదించాలన్నారు. -
వరదలో చిక్కుకున్న పెళ్లి బస్సు
కామారెడ్డి క్రైం: జిల్లా కేంద్రంలో సోమవారం అర్ధరాత్రి కురిసిన భారీ వర్షానికి రోడ్లన్నీ జలమయం అయ్యాయి. ఈక్రమంలో తెల్లవారుజామున కామారెడ్డి మండలంలోని గొల్లపల్లి నుంచి రంగంపేట గ్రామానికి వివాహ వేడుకలకు హాజరయ్యేందుకు ఓ ప్రైవేట్ బస్సు 45 మంది ప్రయాణికులతో జిల్లా కేంద్రంగా గుండా బయలుదేరింది. రామారెడ్డి రోడ్డులోని సుభాష్ టాకీస్ సమీపంలోకి రాగానే బస్సు సైలెన్సర్లోకి నీళ్లు చేరి రోడ్డుపైనే ఆగిపోయింది. అప్పటికే రోడ్డుపై భారీగా నీటి ప్రవాహం ఉండడంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. సమాచారం అందడంతో పట్టణ పోలీసులు, ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. తాడు సహాయంతో ప్రయాణికులందర్నీ కొద్ది దూరంలోని సురక్షిత ప్రాంతానికి తరలించారు. మరో బస్సులో ఎక్కించి గమ్యస్థానానికి పంపించారు. దీంతో ప్రయాణికులందరూ ఊపిరిపీల్చుకున్నారు.● రోప్ సాయంతో ప్రయాణికులను సురక్షిత ప్రాంతానికి తరలించిన పోలీసులు -
ఎస్ఎస్ఆర్ కాలేజీలో క్యాంపస్ ప్లేస్మెంట్ డ్రైవ్
ఖలీల్‌వాడి: నగరంలోని ఎస్ఎస్ఆర్ డిగ్రీ, పీజీ కళాశాల (అటానమస్)లో మంగళవారం ఐటీ సంస్థ విప్రో ఆధ్వర్యంలో క్యాంపస్ ప్లేస్మెంట్ డ్రైవ్ నిర్వహించినట్లు విద్యాసంస్థల చైర్మన్ మారయ్యగౌడ్ తెలిపారు. సుమారు 400 మంది అర్హులైన అభ్యర్థులు తమ పేర్లను నమోదు చేసుకొని పాల్గొనగా, సంస్థ ప్రతినిధులు పలు దశల్లో ఎంపిక ప్రక్రియ నిర్వహించారు. అన్ని దశలు పూర్తయిన అనంతరం ఎంపికై న అభ్యర్థుల తుది జాబితాను విప్రో సంస్థ ప్రకటించనున్నట్లు పేర్కొన్నారు. విద్యార్థులకు మరిన్ని ఉపాధి అవకాశాలు కల్పించేందుకు జాతీయ, అంతర్జాతీయ స్థాయి సంస్థలతో కలిసి ఇలాంటి క్యాంపస్ నియామక కార్యక్రమాలను నిరంతరం నిర్వహిస్తామన్నారు. కార్యక్రమం విజయవంతం కావడంతో కళాశాల సిబ్బందికి, విప్రో ప్రతినిధులకు, విద్యార్థులకు అభినందనలు తెలిపారు. ఆర్మూర్‌టౌన్: ఆర్మూర్ పీఎస్ పరిధిలో పోగొ ట్టుకున్న ఫోన్లను సీఈఐఆర్ పోర్టల్ ద్వారా సేకరించి బాధితులకు మంగళవారం అందజేసినట్లు ఎస్‌హెచ్‌వో సత్యనారాయణగౌడ్ తెలిపారు. బాధితులు ఫోన్ పోయిన వెంటనే పోలీస్‌స్టేషన్, సీఈఐఆర్ పోర్ట్‌లో ఫిర్యాదు చేయా లని సూచించారు. నిజామాబాద్ అర్బన్: నగరంలోని 4వ టౌన్ పీఎస్ పరిధిలో గల మహాలక్ష్మీనగర్‌లో ఆటో చోరీకి గురైనట్లు ఎస్‌హెచ్‌వో సతీశ్ తెలిపారు. కాలనీకి చెందిన గుర్రం కల్యాణ్ అనే వ్యక్తి రోజు లాగే తన ఇంటి ఎదుట సోమవారం రాత్రి ఆటోను పార్కింగ్ చేశాడు. మంగళవా రం ఉదయం చూసే సరికి కనిపించకపోవడంతో పీఎస్‌లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. నిజామాబాద్ అర్బన్: నగరంలోని దుబ్బ ప్రాంతంలో ఉన్న ఓ ఇంట్లో చోరీ జరిగింది. మూడో టౌన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దుబ్బ ప్రాంతానికి చెందిన సాయి పని నిమిత్తం ఇతర ప్రాంతానికి, ఆయన కుటుంబ సభ్యులు వేరే ఊరికి వెళ్లారు. మంగళవారం తెల్లవారుజామున దొంగలు ఇంటి తాళం పగులగొట్టి చోరీకి పాల్పడ్డారు. ఇంట్లో మూడు తులాల బంగారం చోరీకి గురైందని బాధిత కుటుంబీకులు తెలిపారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్త్నుట్లు ఎస్సై తెలిపారు. ధర్పల్లి: అధికారుల విధులకు ఆటంకం కలిగించిన ఏడుగురిపై కేసు నమోదు చేసినట్లు ధర్పల్లి ఎస్సై సందీప్ తెలిపారు. ఎస్సై మంగళవారం తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని డీబీ తండా అటవీ ప్రాంతంలో రెండు ట్రాక్టర్లతో అటవీ భూమిని చదును చేస్తున్నప్పుడు అటవీశాఖ అధికారులు అడ్డుకొని ట్రాక్టర్లను పట్టుకున్నారు. ట్రాక్టర్లను సీజ్ చేసేందుకు అటవీ శాఖ అధికారులు ప్రయత్నించగా, తండాకు చెందిన ఏడుగురు వ్యక్తులు అడ్డువచ్చి వారి విధులకు ఆటంకం కలిగించారు. ఈ మేరకు దుబ్బాక బీట్ ఆఫీసర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
మైనర్లతో సొంతిళ్లలో చోరీలు.. నిందితుడి అరెస్టు
నిజామాబాద్ అర్బన్ : మైనర్లను ప్రలోభ పెట్టి తమ ఇళ్లలోని బంగారం చోరీ చేయించిన నిందితుడిని మూడో టౌన్ పోలీసులు అరెస్టు చేశారు. అతడి నుంచి సుమారు పది తులాల బంగారాన్ని స్వాధీనం చేసుకొని కోర్టులో హాజరుపర్చగా న్యా యస్థానం 14 రోజుల రిమాండ్ విధించినట్లు మూ డో టౌన్ ఎస్సై హరిబాబు తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. మూడో టౌన్ పోలీస్‌స్టేషన్ పరిధికి చెందిన ధనుష్ అనే వ్యక్తి కొంత మంది మైనర్లను ప్రలోభాలకు గురిచేసి, వారి ఇళ్లలో ఉన్న బంగారు ఆభరణాలను దొంగిలించి తనకు తీసుకురావాలని ప్రేరేపించేవాడు. మైనర్లు తమ ఇంట్లోని బంగారాన్ని అతనికి అందజేశారు. ఈ విషయం కుటుంబ సభ్యుల దృష్టికి రావడంతో వారు మూడో టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఈ నెల 2న ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు సీసీఎస్ ఏసీపీ శ్రీశైలం ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిందితుడు ధనుష్‌ను అదుపులోకి తీసుకొని విచారించి, అతని నుంచి 10 తులాల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని కోర్టులో హాజరుపర్చగా న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించినట్లు ఎస్సై తెలిపారు. -
తల్లీకుమార్తెల అదృశ్యం
నందిపేట్: మండలంలోని ఓ గ్రామానికి చెందిన వివాహిత తన కుమార్తెతో కలిసి అదృశ్యమైనట్లు ఎస్సై వినయ్ మంగళవారం తెలిపారు. నెల రోజుల క్రితం తన తల్లి గారింటికి వెళ్లి వస్తానని ఇంట్లో చెప్పిన ఆమె తిరిగి రాలేదు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. ఆర్మూర్‌టౌన్: ఆర్మూర్ పీఎస్ పరిధిలో పోలీసులు డ్రంకెన్ డ్రైవ్ తనిఖీ లు నిర్వహించగా ఐదుగురు వ్యక్తులు మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడ్డారు. వీరిని మంగళవారం ఆర్మూర్ కోర్టులో పోలీసులు హాజరుపర్చారు. విచారణ చేపట్టిన జడ్జి ఐదుగురికి రూ.10వేల చొప్పున జరిమానా విధించినట్లు ఎస్‌హెచ్‌వో సత్యనారాయణగౌడ్ తెలిపారు. ఒకరికి ఐదు రోజుల జైలు నిజామాబాద్ రూరల్: డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో ఒకరికి ఐదు రోజుల జైలు శిక్షను విధించినట్లు రూరల్ ఎస్‌హెచ్‌వో శ్రీనివాస్ మంగళవారం తెలిపారు. ఎస్‌హెచ్‌వో తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలో వాహనాల తనిఖీ చేస్తుండగా పడకల్ గ్రామానికి చెందిన జంపన్న అనే వ్యక్తి మద్యం సేవించినట్లు గుర్తించారు. అతన్ని కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పర్చారు. విచారణ చేపట్టిన జడ్జి ఐదు రోజుల జైలు శిక్షను విధించారు. మద్యం సేవించి వాహనాలు నడపరాదని, ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని అన్నారు. నందిపేట్ : మండల కేంద్రానికి చెందిన ముగ్గురిపై దొంగతనం, చీటింగ్ కేసు నమోదు చేసినట్లు ఎస్సై వినయ్ తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. నందిపేటకు చెందిన బీఎస్ఎన్ఎల్ రిటైర్డు ఉద్యోగి చల్ల విష్ణువర్ధన్ తన భార్య ఏటీఎంను తీసుకుని గత నెల 17వ తేదీన పని నిమిత్తం నిజామాబాద్ వెళ్లాడు. మార్గమధ్యలో తనకు స్నేహితులైన నందిపేటకు చెందిన టీ భోజాగౌడ్, గంగాధర్ కలిసి విష్ణువర్ధన్‌కు మందు తాగించి అతని వద్ద ఉన్న ఏటీఎం దొంగిలించారు. అనంతరం భోజాగౌడ్, గంగాధర్‌తో పాటు నందిపేటకు చెందిన లక్ష్మి అనే మహిళతో కలిసి ఏటీఎం నుంచి విడతల వారీగా రూ. 1,05,000 నగదును విత్‌డ్రా చేసుకుని వాడుకున్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు ముగ్గురిపై దొంగతనం, చీటింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
మాతృ మరణాలు తగ్గించాలి
● డీఎంహెచ్‌వో రాజశ్రీసుభాష్నగర్ : జిల్లాలో మాతృమరణాలు తగ్గించేలా ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంలు, ఎంసీహెచ్ సూపర్వైజర్లు చర్యలు చేపట్టాలని డీఎంహెచ్‌వో రాజశ్రీ తెలిపారు. మంగళవారం కలెక్టరేట్లోని డీఎంహెచ్‌వో కార్యాలయంలో మాతృ మరణాలపై సమీక్ష నిర్వహించారు. గర్భిణికి ఎత్తు, బరువు, బీపీ, హెచ్ బీ, రక్తహీనత, తదితర పరీక్షలతోపాటు హైపర్ టెన్షన్, ప్లేట్లెట్ల పరీక్షలు నిర్వహించాలని తెలిపారు. సాధారణ ప్రసవాలు అయ్యే విధంగా వారికి సహకరించాలని సూచించారు. ఏ ఒక్క మాతృమరణం జరగకుండా అన్ని విధాల కృషి చేయాలని, అనివార్య కారణాల వల్ల ఎక్కడైనా మాతృ మరణం సంభవిస్తే పూర్తి సమాచారాన్ని ఫార్మాట్లో పొందుపర్చాలని కోరారు. సమీక్షలో మాతృమరణాలు జరిగిన మాలపల్లి, సిరికొండ, గౌతమ్‌నగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల సిబ్బందితోపాటు డిప్యూటీ డీఎంహెచ్వోలు సికందర్ నాయక్, ప్రొఫెసర్ డాక్టర్ ఉమ, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ప్రోగ్రాం అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు. జాతీయ ఆరోగ్య కార్యక్రమాలపై సమీక్ష జిల్లా వైద్య ఆరోగ్యశాఖలో అమలవుతున్న జాతీయ ఆరోగ్య కార్యక్రమాలను జూమ్ ద్వారా డీఎంహెచ్‌వో రాజశ్రీ తన చాంబర్లో సమీక్షించారు. మొత్తం జనాభాలో 30ఏళ్లపైబడిన వారు 52శాతం ఉంటారని, వారికి హైపర్ టెన్షన్, డయాబెటిస్, క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయాలని సూచించారు. ప్రతి ఆరోగ్య కేంద్రంలో సగటున 60 ఓపీ ఉండేలా చూడాలన్నారు. జాతీయ ఆరోగ్య కార్యక్రమ సేవలు ప్రతి గ్రామంలో అర్హులకు అందేలా కృషి చేయాలన్నారు. ప్రోగ్రామ్ అధికారులు డాక్టర్ వెంకన్న, డాక్టర్ శిఖర, డాక్టర్ వెంకటేశ్, డాక్టర్ శ్రావ్య తదితరులు పాల్గొన్నారు. -
బీటెక్ సెమిస్టర్ పరీక్షలు ప్రారంభం
మోపాల్: తెయూ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ (సీఎస్ఈ అండ్ ఏఐ) సెమిస్టర్1 థియరీ పరీక్షలు (బ్యాక్లాగ్) మంగళవారం నుంచి ప్రారంభమయ్యాయని ఆడిట్ సెల్ డైరెక్టర్ చంద్రశేఖర్ తెలిపా రు. మొదటిరోజు 36 మందికి 35 మంది హాజరు కాగా ఒకరు గైర్హాజరయ్యారని పేర్కొన్నారు. పీజీ సెమిస్టర్ పరీక్షలు.. తెయూలోని పీజీ 3 సెమిస్టర్ (బ్యాక్ లాగ్) పరీక్షలు మంగళవారం నుంచి ప్రారంభమయ్యాయని ఆడి ట్ సెల్ డైరెక్టర్ చంద్రశేఖర్ తెలిపారు. మొత్తం 565 మందికి 500 మంది హాజరు కాగా 65 మంది గైర్హాజరయ్యారని పేర్కొన్నారు. కాగా కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో ఇద్దరు విద్యార్థులు మాల్ ప్రాక్టిస్ కింద నమోదయ్యారని ఆయన తెలిపారు. మోపాల్: తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో గల బీఎడ్ 2వ సెమిస్టర్(రెగ్యులర్), బీపీఎడ్ 1, 2, 3, 4 సెమిస్టర్ (బ్యాక్లాగ్) పరీక్షలు మంగళవారంతో ముగిశాయి. చివరిరోజు నిర్వహించిన పరీక్షలకు 562 మందికి 527 మంది హాజరు కాగా, 35మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు ఆడిట్ సెల్ డైరెక్టర్ చంద్రశేఖర్ పేర్కొన్నారు. ఖలీల్‌వాడి: ‘దోస్త్‘ స్పెషల్ ఫేజ్‌లో భాగంగా జిల్లా కేంద్రంలోని జీజీ కాలేజీలో ప్రథమ సంవత్సరంలో వివిధ కోర్సుల్లో చేరటానికి ఈనెల 6 నుంచి 11 వరకు దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపాల్ రామ్మోహన్‌రెడ్డి మంగళవారం తెలిపారు. దోస్తు ద్వారా డిగ్రీ కోర్సుల్లో దరఖాస్తు చేసుకొని, విద్యార్థులు రూ.400 చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని పేర్కొన్నారు. విద్యార్థులు ఈ చివరి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కమ్మర్పల్లి: తెలంగాణ ఓపెన్ స్కూల్ టెన్త్, ఇంటర్ పరీక్షల ఫీజు చెల్లింపు గడువు ఈనెల 15వ తేదీ వరకు పొడిగించినట్లు కో–ఆర్డినేటర్ సాయన్న తెలిపారు. 2026 ఏప్రిల్‌లో పరీక్షలు రాసి ఫెయిల్ అయిన విద్యార్థులు, అలాగే అంతకుముందు నిర్వహించిన పరీక్షల్లోఫెయిల్ అయిన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని నిర్ణీత గడువులోగా పరీక్షల ఫీజును చెల్లించాలి కోరారు. అలాగే 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించిన తెలంగాణ ఒపెన్ స్కూల్ పదో తరగతి, ఇంటర్ అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగుతోందన్నారు. అర్హత కలిగిన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. -
‘హైడ్రాలిక్ లిఫ్టర్’తో త్వరగా విద్యుత్ సరఫరా పునరుద్ధరణ
● ఎస్ఈ పీవీ రాజేశ్వర్రావుసుభాష్నగర్: నిజామాబాద్ కార్పొరేషన్‌తోపాటు మున్సిపాలిటీల్లో విద్యుత్ సరఫరాను త్వరితగతిన పునరుద్ధరించడంతోపాటు విద్యుత్ సిబ్బంది భద్రతతో పనులు నిర్వహించేందుకు హైడ్రాలిక్ లిఫ్టర్ ఎంతగానో ఉపయోగపడుతుందని ఎన్పీడీసీఎల్ నిజామాబాద్ ఆపరేషన్ సర్కిల్ సూపరింటెండెంట్ ఇంజినీర్ పీవీ రాజేశ్వర్‌రావు సూచించారు. మంగళవారం నగరంలో విద్యుత్ అంతరాయాల పరిష్కారానికి టాటా యోధా 3.0 ఎంటీ హైడ్రాలిక్ లిఫ్టర్ వాహన సేవలను ఆయన ప్రారంభించారు. వినియోగదారులకు మరింత నాణ్యమైన, వేగవంత మైన విద్యుత్ సేవలను అందించాలనే లక్ష్యంతో ని జామాబాద్ సర్కిల్ పరిధిలో ఈ వాహనాన్ని అందు బాటులోకి తీసుకొచ్చినట్లు తెలిపారు. హైడ్రాలిక్ లిఫ్టర్ ద్వారా 33 కేవీ, 11 కేవీ విద్యుత్ లైన్ల బ్రేక్డౌన్లు, ఫ్యూజ్ ఆఫ్ కాల్స్, చెట్ల కొమ్మల తొలగింపు, ఎత్తైన ప్రాంతాల్లో విద్యుత్ లైన్లు, పరికరాల నిర్వహణ పనులు సురక్షితంగా, వేగంగా చేపట్టేందుకు వీలవుతుందని పేర్కొన్నారు. ప్రత్యేకించి ని జామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో విద్యు త్ అంతరాయాలు సంభవించినప్పుడు తక్షణమే స్పందించి విద్యుత్ సరఫరాను త్వరితగతిన పునరుద్ధరించవచ్చని సూచించారు. ఈ వాహనం అందుబాటులోకి రావడంతో అత్యవసర పనులు మరింత సమర్థవంతంగా నిర్వహించడంతోపాటు వినియోగదారులకు మెరుగైన సేవలు అందించవచ్చని ఆ యన పేర్కొన్నారు. డీఈలు శ్రీనివాస్‌రావు, వెంకటరమణ, ఏడీఈలు చంద్రశేఖర్, ప్రసాద్‌రెడ్డి, వినో ద్, శ్రీధర్, తోట రాజశేఖర్, జేఏసీ ప్రతినిధులు ర ఘునందన్, పూదరి గంగాధర్, గంగారాం, ఏఈ లు, విద్యుత్ ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు. -
కొనసాగుతున్న ఇన్‌ఫ్లో..
వేల్పూర్(మెండోరా): శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి ఎగువ నుంచి స్వల్ప ఇన్‌ఫ్లో కొనసాగుతోంది. సోమవారం సాయంత్రం 5 వేల క్యూసెక్కులకు తగ్గిన వరద.. మంగళవారం మధ్యాహ్ననికి 28,570 క్యూసెక్కులకు పెరిగి.. సాయంత్రం సమయానికి 22,222 క్యూసెక్కులకు తగ్గింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు(80.5 టీఎంసీలు) కాగా, ప్రస్తుతం 1075 అడుగుల(34.817 టీఎంసీలు) నీరు నిల్వఉంది. కాకతీయ కాలువ ద్వారా 330, మిషన్ భగీరథ పథకానికి 231 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తుండగా, 403 కూసెక్కుల నీరు ఆవిరి రూపంలో పోతోందని ప్రాజెక్ట్ అధికారులు తెలిపారు. నిజాంసాగర్(జుక్కల్): నిజాంసాగర్ ప్రాజెక్టులోకి మంగళవారం 10 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోందని నీటిపారుదలశాఖ అధికారులు తెలిపారు. పోచారం ప్రాజెక్టు అలుగు ద్వారా 8 వేల క్యూసెక్కులు, మెదక్ జిల్లాలోని ఘనపురం ఆనకట్ట ద్వారా 2 వేల క్యూసెక్కుల వరద నీరు వస్తోందన్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1,405 అడుగులు (17.8 టీఎంసీలు) కాగా.. మంగళవారం సాయంత్రానికి 1,398 అడుగుల (9.5 టీఎంసీలు) నీరు నిల్వ ఉంది. ఎల్లారెడ్డి: కల్యాణి ప్రాజెక్టులోకి వంద క్యూ సెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. దీంతో అధికారులు మంగళవారం ప్రాజెక్టు రెండు గేట్లను ఎత్తి అంతే నీటిని మంజీర నదిలోకి వదులుతున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 409.50 అడుగులు కాగా.. మంగళవారం సాయంత్రానికి 408 అడుగుల నీరు నిల్వ ఉంది.నిజాంసాగర్‌లోకి..కల్యాణి ప్రాజెక్టు రెండు గేట్ల ఎత్తివేత -
పక్కాగా విలేజ్ ప్రొఫైల్
డొంకేశ్వర్(ఆర్మూర్): గ్రామీణ ప్రాంతాల రూపురేఖలు మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరో కార్యక్రమాన్ని ముందుకు తెచ్చింది. రాబోయే మూడేళ్ల కాలానికి (2026–29) గ్రామాల్లో చేపట్టాల్సిన మౌ లిక వసతుల కల్పన, సామాజిక భద్రత, సుపరిపాలన అంశాలతో కూడిన ‘తెలంగాణ గ్రామ పంచా యతీ సమగ్ర అభివృద్ధి ప్రణాళిక’ (జీపీసీడీపీ) రూపకల్పనకు శ్రీకారం చుట్టింది. దీని కోసం జిల్లా లో పంచాయతీల వారీగా పూర్తి వివరాలను సేకరి స్తున్న పంచాయతీ కార్యదర్శులు విలేజ్ ప్రొఫైల్‌ను సిద్ధం చేస్తున్నారు. అన్ని శాఖల నుంచి మొ త్తం వందకుపైగా అంశాలను నివేదికలో నమోదు చేస్తున్నా రు. పంచాయతీ పేరు మొదలుకొని ఊరి విస్తీర్ణం, వార్డులు, రేషన్‌కార్డులు, నివాసాలు, కుటుంబా లు, కులాల వారీగా జనాభా, గుడులు, బడులు, రోడ్లు, మహిళా సంఘాలు, రైతులు, అక్షరాస్యత రే టు, కావాల్సిన అభివృద్ధి పనులు తదితర వివరా లు సేకరిస్తున్నారు. ఈ సమాచారం ఆధారంగా రా బోయే రోజుల్లో అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. మరుగుదొడ్లు, సీసీ రోడ్లు, తాగునీరు గ్రామాల్లో మరుగుదొడ్లు అవసరమైన వారిని గుర్తించి జాబితా సిద్ధం చేస్తున్నారు. ఒక్కో మరుగుదొడ్డిని స్వచ్ఛ భారత్ మిషన్ కింద రూ.12 వేలతో నిర్మించనున్నారు. అలాగే కమ్యూనిటీ టాయిలెట్ల సముదాయాలను కట్టేందుకు అనువైన స్థలాలను గుర్తిస్తున్నారు. అదే విధంగా తాగునీటి సరఫరా లేని ప్రాంతాలకు నీటి సరఫరా చేసేందుకు అంచనాలను సి ద్ధం చేస్తున్నారు. ఓవర్ హెడ్ ట్యాంక్‌లు, పైపులైన్ల విస్తరణతోపాటు నల్లా కనెక్షన్లు లేని ఇళ్లను గుర్తిస్తున్నారు. పాత చేతి పంపులు, మోటార్ల మరమ్మతుల కోసం అవసరమైన అంచనాలను నివేదికలో చేరుస్తున్నారు. అలాగే అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణం, గ్రామాల మధ్య లింక్ రోడ్ల ఏర్పాటుకు సంబంధించిన వివరాలను నమోదు చేస్తున్నారు. గ్రామాలు శుభ్రంగా కనిపించేలా డ్రెయినేజీల నిర్మాణం, వీధు ల్లో ఎల్ఈడీ విద్యుత్ లైట్లు అవసరాలను గుర్తిస్తున్నారు. కాగా, ఉపాధిహామీలో వన మహోత్సవం కింద అవెన్యూ ప్లాంటేషన్, వ్యక్తిగత ఇంకుడు గుంతల నిర్మాణాలపై వివరాలు సేకరిస్తున్నారు. మహి ళా సంఘాలు, వారు తీసుకున్న రుణాలతో స్థాపించిన వ్యాపారాలను నివేదికలో పొందుపరుస్తున్నా రు. గ్రామ సమగ్ర సమాచారం ప్రతీ పౌరుడు సులభంగా తెలుసుకునేలా ఆన్లైన్లో నమోదు చేయనున్నారు. ఏ సమాచారం కావాలన్నా ఒక్క క్లిక్‌తో తెలుసుకోవచ్చు. దీనికి సంబంధించిన యాప్ కూడా త్వరలోనే అందుబాటులోకి రానుంది. పల్లెల ప్రగతికి ఇదే దిక్సూచి ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ప్రతి గ్రామ పంచాయతీలో మూడేళ్ల అభివృద్ధి ప్రణాళిక కోసం వివరాల సేకరణ వే గంగా జరుగుతోంది. ప్రతి అంశాన్ని పక్కాగా నమోదు చేయాలని కార్యదర్శులకు ఆదేశాలిచ్చాం. ఇతర శా ఖల ఉద్యోగులు, సర్పంచుల సహకారంతో దీనిని ఈ నెల 15వ తేదీలోగా పూర్తి చేయాలని చెప్పాం. ఈ నివేదిక పల్లెల ప్రగతికి దిక్సూచిలా పని చేస్తుంది. – శ్రీనివాస్ రావు, జిల్లా పంచాయతీ అధికారి సిద్ధమవుతున్న మూడేళ్ల సమగ్ర అభివృద్ధి ప్రణాళిక వందకుపైగా అంశాలపై వివరాలు సేకరిస్తున్న కార్యదర్శులు గ్రామ పంచాయతీల రూపురేఖలు మార్చేందుకు సన్నాహాలు -
ఫామ్ తిరిగివ్వరేమి..!?
నిజామాబాద్ అర్బన్: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) గడువును ఇప్పటికే రెండు సార్లు పొడిగించినా అర్బన్ నియోజకవర్గం పరిధిలో మాత్రం ప్రక్రియ వెనుకబడి ఉంది. అర్బన్‌లో ఇప్పటికీ సుమారు 60వేల ఎన్యుమరేషన్ ఫామ్‌లు బీఎల్వోల చేతికి అందలేదు. ఓటర్ల నిర్లక్ష్యమా..? అవగాహనా రాహిత్యామా? ప్రచార లోపమా? కారణమేదైనా మొత్తానికి ‘సర్’ ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. ఇదిలా ఉండగా జిల్లాలో ఇప్పటి వరకు తొలగించనున్న ఓట్లను గుర్తించారు. ఈనెల 4వ తేదీ వరకు 1,36,809 ఓట్లను గుర్తించారు. ఇందులో మరణించిన వారి ఓట్లు 32,858 ఉండగా, శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు వలసవెళ్లిన వారు 60,689 మంది ఉన్నారు. అలాగే డబుల్ ఓట్లు 43,262 ఉన్నాయి. అయితే సర్ ప్రక్రియ 10వ తేదీ వరకు కొనసాగనుండగా తొలగిపోనున్న ఓట్ల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. జిల్లా వ్యాప్తంగా 14,39,734 మంది ఓటర్లు ఉండగా.. ఇప్పటి వరకు 12,22,754 (84.93 శాతం) ఎన్యుమరేషన్ ఫామ్‌ల డిజిటలైజేషన్ పూర్తయ్యింది. అర్బన్ నియోజకవర్గంలో 3,08,261 ఓటర్లు ఉండగా ఇప్పటి వరకు 2,20,217 ఎన్యుమరేషన్ ఫామ్‌లను (71.44 శాతం) డిజిటలైజ్ చేశారు. బోధన్ నియోజకవర్గంలో 2,23,152 ఓటర్లు ఉండగా 1,95,134 (87.44 శాతం) ఫామ్‌లు, ఆర్మూర్ నియోజక వర్గంలో 2,15,186 ఓటర్లకుగాను 1,89,451 (88.04 శాతం) ఫామ్‌లు డిజిటలైజ్ అయ్యాయి. నిజామాబాద్ రూరల్ నియోజక వర్గంలో 2,64,723 ఓటర్లు ఉండగా.. 2,33,314 మంది ఓటర్ల (88.14 శాతం) ఫామ్‌లు, బాల్కొండ నియోజక వర్గంలో 2,32,081 ఓటర్లకుగాను 2,08,256 (89.73 శాతం) ఫామ్‌ల డిజిటలైజేషన్ పూర్తయ్యింది. బాన్సువాడ నియోజకవర్గంలో 1,96,331 మంది ఓటర్లు ఉండగా, 1,76,382 (89.84శాతం) ఎన్యుమరేషన్ ఫామ్‌లను డిజిటలైజ్ చేశారు. నియోజక వర్గం మృతులు వలస వెళ్లిన వారు డబుల్ ఓటర్లు ని.అర్బన్ 4,611 6,402 9,710ని.రూరల్ 6,892 13,436 8,846ఆర్మూర్ 6,185 9,931 7,908బోధన్ 5,345 12,099 4,776బాల్కొండ 5,877 9,278 6,991బాన్సువాడ 3,948 9,543 5,031మొత్తం 32,858 60,689 43,262తొలగిపోనున్న ఓట్లు అర్బన్‌లో బీఎల్వోల చేతికందని ఎన్యు మరేషన్ ఫామ్‌లు సుమారు 60 వేలు.. జిల్లాలో తొలగిపోనున్న మొత్తం ఓట్లు 1,36,809 కొనసాగుతున్న సర్ ప్రక్రియ -
సీజనల్ వ్యాధులపై అవగాహన
డొంకేశ్వర్(ఆర్మూర్): మండల కేంద్రంలోని పీఎంశ్రీ ప్రభుత్వ పాఠశాలలో డెంగీ, సీజన్ వ్యాధులపై వైద్యశాఖ ఆధ్వర్యంలో అవగాహన కల్పించారు. కార్యక్రమానికి జిల్లా మలేరియా అధికారి సికిందర్ హాజరై సీజనల్ జ్వరాలు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను విద్యార్థులకు వివరించారు. పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలని, జ్వరం, తలనొప్పి, ఒళ్లు నొప్పులుంటే వెంటనే ప్రభుత్వ ఆస్పత్రిలో రక్త పరీక్షలు చేయించుకోవాలన్నారు. ప్రతీ శుక్రవారం డ్రైడే పక్కాగా నిర్వహించాలని సిబ్బందిని ఆదేశించారు. హెచ్ఎం సురేశ్‌కుమార్, సబ్ యూనిట్ ఆఫీసర్ సాయి గోవర్ధన్, మెడికల్ ఆఫీసర్ శరత్ చంద్ర, సూపర్వైజర్లు సురేంధర్, సునీత ఉన్నారు. -
సీఎంఆర్ కేసులపై సమీక్ష
నిజామాబాద్ అర్బన్: రైస్‌మిల్లుల్లో సీఎంఆర్ అవకతవకల నేపథ్యంలో నమోదైన కేసులపై సీపీ సాయిచైతన్య మంగళవారం తన కార్యాలయంలో సమీక్షించారు. ఇప్పటి వరకు నమోదైన కేసులు, వాటి పురోగతి వివరాలను సంబంధిత అధికారుల ద్వారా తెలుసుకున్నారు. సివిల్ సప్లయీస్, పోలీసు అధికారులు సమన్వయంతో పనిచేసి కేసులను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. అదనపు డీసీపీ శుభం ప్రకాశ్, జిల్లా సివిల్ సప్లయీస్ అధికారి శ్రీకాంత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నకిలీ వీసాలు ఇచ్చిన వ్యక్తి అరెస్ట్ ● నాలుగేళ్లుగా తప్పించుకు తిరుగుతున్న నిందితుడు నిజామాబాద్ అర్బన్: విదేశాల్లో ఉద్యోగాల పేరిట నకిలీ వీసాలు ఇచ్చిన నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. రెండో టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై యాదగిరి తెలిపిన వివరాలు ప్రకారం.. హైదరాబాద్‌లోని శాలిబండకు చెందిన ఎంఏ ఖయ్యూమ్ 2022లో నిజామాబాద్ నగరానికి చెందిన 15 మందిని ఖఽతర్కు పంపిస్తానని ఒక్కొక్కరి వద్ద నుంచి రూ.50 వేలు వసూలు చేశాడు. డ్రైవర్ ఉద్యోగాలు ఉన్నాయంటూ నకిలీ వీసాలు ఇచ్చి పారిపోయాడు. అప్పట్లోనే బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ఖయ్యూమ్ నాలుగేళ్లుగా పరారీలో ఉన్నాడు. నిందితుడిని హైదరాబాద్‌లో పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. నిజామాబాద్ బస్టాండ్‌ను ఆధునికీకరించండి సుభాష్‌నగర్: జిల్లా కేంద్రంలోని బస్టాండ్‌ను ఆధునీకరించాలని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ను కోరారు. ఈమేరకు హైదరాబాద్‌లోని సెక్రటేరియట్లో మంగళవారం ఆర్మూర్ ఎమ్మె ల్యే పైడి రాకేష్‌రెడ్డితో కలిసి మంత్రికి ధన్‌పా ల్ వినతిపత్రం అందజేశారు. కొత్త బస్టాండ్‌ను నిర్మించే వరకూ ప్రస్తుత బస్టాండ్‌లో ప్రయాణికులకు సౌకర్యాలు మెరుగుపర్చాలని, ప్రత్యేక పార్కింగ్ సదుపాయం కల్పించాలని కోరారు. ఇంటిగ్రేటెడ్ బస్‌డిపో కోసం.. ఆర్మూర్: పట్టణంలో నూతన ఇంటిగ్రేటెడ్ బస్ డిపో, అత్యాధునిక బస్టాండ్ నిర్మాణానికి అన్ని అనుమతులు మంజూరు చేయాలని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్‌రెడ్డి కోరారు. ఈమేరకు హైదరాబాద్‌లో టీజీఎస్ ఆర్టీసీ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ నాగిరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం అందజేశారు. ఎలక్ట్రిక్ బస్సులు అన్ని రూట్లలో సరిపడా నడపాలని, నందిపేట బస్ డిపోను మంజూరు చేసి, మెరుగైన సేవలందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఆర్టీసీ ఎండీ సానుకూలంగా స్పందించారని ఎమ్మెల్యే తెలిపారు. -
రేషన్ పంపిణీ సజావుగా సాగాలి
● నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు ● అదనపు కలెక్టర్ భుజంగరావుసుభాష్నగర్: ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రజా పంపిణీ వ్యవస్థ (రేషన్ షాపుల) ద్వారా ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ మూడు మాసాలకు సంబంధించిన రేషన్ కోటాను ఒకేసారి సజావుగా పంపిణీ చేయాలని అదనపు కలెక్టర్ భుజంగరావు డీలర్లకు తెలిపారు. కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో మంగళవారం ఆయా మండలాల రేషన్‌డీలర్లతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. ఈనెల 31లోపు రేషన్ పంపిణీ ప్రక్రియను పూర్తి చేయాలన్నారు. బియ్యం పంపిణీలో అవకతవకలు, అలసత్వానికి తావిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. రేషన్ దుకాణాలకు సకాలంలో బియ్యం నిల్వలు చేరుకునేలా, కార్డుహోల్డర్లకు వారి కోటా మేరకు ఏకకాలంలో మూడు నెలల పంపిణీని పర్యవేక్షించాలని పౌరసరఫరాలశాఖ అధికారులను ఆదేశించారు. ఈ–పాస్ యంత్రాల్లో ఎక్కడైనా సాంకేతిక సమస్యలు ఏర్పడితే వెంటనే పరిష్కరించాలన్నారు. ఈ–కేవైసీ తప్పక చేయించుకోవాలి.. రేషన్ కోటా కలిగిన ప్రతిఒక్కరూ ఈ–కేవైసీ చేసుకునేలా రేషన్ డీలర్లు చొరవ చూపాలని అదనపు కలెక్టర్ భుజంగరావు సూచించారు. ప్రభుత్వం నిర్ధేశించిన గడువు లోపు ఈ–కేవైసీ చేయించుకోకపోతే రేషన్ కోటా నిలిచిపోయే ప్రమాదం ఉందన్నారు. దీన్నిదృష్టిలో పెట్టుకుని రేషన్ కార్డు కలిగిన కుటుంబాల్లోని ప్రతి సభ్యుడు ఆగస్టు 15లోపు తప్పక ఈ–కేవైసీ చేసుకునేలా డీలర్లు కృషిచేయాలన్నారు. డీఎస్వో శ్రీకాంత్‌రెడ్డి, ఏఎస్వో అరవింద్‌రెడ్డి, డీటీ పవన్‌కుమార్, రేషన్‌డీలర్లు పాల్గొన్నారు. -
ఎత్తి పోద్దామా..?
వేచి చూద్దామా.. ఎస్సారెస్పీ పునరుజ్జీవంపై తేల్చుకోలేని స్థితిలో అధికార యంత్రాంగం సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: ఓవైపు గోదావరి నది పై ఉన్న ప్రధాన ప్రాజెక్టులు జలకళను సంతరించుకోగా, శ్రీరామ్‌సాగర్ ప్రాజెక్టు మాత్రం అత్తెసరు నీటితో వెలవెలబోతోంది. జలాశయం పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 80.5 టీఎంసీలు కాగా, ఇప్పటివరకు ప్రాజెక్టులో 34.81 టీఎంసీలు మాత్రమే చే రింది. ప్రస్తుతం ఎగువ నుంచి 22 వేల క్యూసెక్కు ల ఇన్‌ఫ్లో కొనసాగుతోంది. ఈ స్థాయి నీటిప్రవాహంతో ప్రాజెక్టు పూర్థిస్థాయి నీటినిల్వపై నీలినీడ లు అలుముకున్నాయి. ఇలాంటి కరువు పరిస్థితు ల ను ఎదుర్కొనేందుకు ఉద్దేశించిన ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకం అమలుతీరుపై ప్రస్తుతం జోరుగా చర్చ సాగుతోంది. వరద కాలువ ద్వారా గోదావరి నీటిని తిరిగి ఎస్సారెస్పీకి చేర్చే ఈ ప్రక్రియపై ప్రభు త్వం దృష్టిపెడుతుందా? లేదా? అన్నదానిపై ఇంకా స్పష్టత రావడం లేదు. ఎగువ నుంచి మిగు లు జ లాల రాకకోసం మరికొంత కాలం వేచిచూ స్తారా లే క పునరుజ్జీవం ద్వారా ప్రాజెక్టు నింపేందుకు చర్య లు తీసుకుంటారా అన్నదానిపై ఆసక్తి నెలకొంది. రివర్స్ పంపింగ్పైనే కొనసాగుతున్న చర్చ ఎస్సారెస్పీ ఎగువన ఉన్న ప్రాజెక్టుల నుంచి నీటి విడుదల లేనప్పుడు, దిగువన ఉన్న ప్రాజెక్టుల నుంచి తిరిగి ఎస్సారెస్పీకి రివర్స్ పంపింగ్ విధానంలో నీటిని తీసుకురావడమే ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకం ఉద్దేశం. ఇందుకోసం ఎల్లంపల్లి నీటిని ఎస్సారెస్పీకి తరలించేందుకు వీలుగా వరదకాలువ అనుసంధానం చేస్తూ మూడు చోట్ల పంప్‌హౌస్, మోటార్లను ఏర్పాటుచేశారు. వరద కాలువలో నీరు నింపేదుకు మూడు చోట్ల పంప్‌హౌస్ ఏర్పాటుతోపాటు ఒక్కో మోటారు ద్వారా 1,450 క్యూసెక్కుల నీరు చొప్పున రోజుకు టీఎంసీ చొప్పున రెండు నెలల్లో 60 టీఎంసీలను ఎస్సారెస్పీకి తరలించాలనే ప్రణాళికతో ఈ పథకాన్ని చేపట్టారు. గత ప్రభుత్వ హయాంలో రెండు రోజులపాటు రివర్స్ పంపింగ్ ద్వారా ఎస్సారెస్పీలోకి ఎత్తిపోతలు చేపట్టినా, తర్వాత భారీ వర్షాలు, నీటిలభ్యత కారణంగా నిలిపివేశారు. ఈసారి వర్షాభావ పరిస్థితులు, గోదావరి ఎగువ నుంచి ఎస్సారెస్పీకి ఇన్‌ఫ్లో పెద్దగా లేని ప్రస్తుత పరిస్థితుల్లో ఎల్లంపల్లి నుంచి రివర్స్ పంపింగ్‌తో ప్రయోజనం ఉంటుందనే అభిప్రాయాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు. 55 టీఎంసీలు ఉంటేనే.. ఎస్సారెస్పీలో ప్రస్తుత నీటిమట్టం 1,075 అడుగుల వద్ద కేవలం 34.81 టీఎంసీల మేర నీరు నిల్వ ఉంది. తాగునీటి అవసరాలతోపాటు కనీస నిర్వహణ కోసం 55 టీఎంసీలకుపైగా నీరు ఉంటేనే పరిస్థితి ఆశాజనకంగా ఉండనుంది. ఇన్‌ఫ్లో రాకపోతే రివర్స్ పంపింగ్ పద్ధతిలో ఎస్సారెస్పీ పునరుజ్జీవం మినహా వేరే మార్గం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎస్సారెస్పీ కింద ఆయకట్టు రైతులకు పూర్తిస్థాయిలో సాగునీరు అందకపోయినా.. కనీసం ఆరుతడి పంటలను కాపాడుకునేందుకు వారబందీ పద్ధతిలోనైనా నీరందించేందుకు చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. ఎగువ నుంచి ఆశించిన మేర ఇన్‌ఫ్లో రాకపోవడంతో ఎస్సారెస్పీ వెలవెలబోతోంది. ఈ నేపథ్యంలో ‘పునరుజ్జీవ పథకం ద్వారా ఎస్సారెస్పీలోకి నీటిని తీసుకు వస్తారా? లేక ఎగువ నుంచి వచ్చే ఇన్‌ఫ్లో కోసం ఎదురు చూస్తారా? అనే చర్చ మొదలైంది. ఆశించిన మేర వరద లేని ప్రస్తుత పరిస్థితుల్లో రివర్స్ పంపింగ్ తప్పదనే అభిప్రాయం వ్యక్తమవుతుండగా.. వేచి చూద్దామా? లేక ఎత్తిపోద్దామా? అన్న దానిపై ప్రభుత్వం నుంచి స్పష్టత రావడం లేదు. వరద కాలువ జీరో పాయింట్‌కు చేరిన నీరుగోదావరి దిగువన ఎల్లంపల్లి ప్రాజెక్టులో సమృద్ధిగా నీరు ఉండటంతో అక్కడ పంప్‌ల ద్వారా ఎత్తిపోతలు మొదలయ్యాయి. ఎల్లంపల్లి నుంచి నందిమేడారం పంప్‌హౌస్, మల్యా ల మండలం రాంపూర్ పంప్‌హౌస్, మెట్పల్లి మండలం రాజేశ్వరరావుపేట పంప్‌హౌస్ మీదుగా ముప్కాల్ జీరోపాయింట్ వరకు వరద కాలువలో నీటిని నిల్వ చేసి ఉంచారు. కాలువలో 4.5 మీటర్ల ఎత్తులో నీరు నిల్వ ఉంది. కాల్వపై ఆధారపడిన రైతులతోపాటు భూ గర్భజలాల పెంపునకు ఉపయోగపడేలా ప్రస్తు తం నీటిని నిల్వ చేశామని అధికారులు చెబు తున్నారు. వరదకాలువ నుంచి ఎస్సారెస్పీలోనికి నీటిని ఎత్తిపోతపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. వరదకాలువలో నీటి నిల్వకే పరిమితం ప్రభుత్వ నిర్ణయంపైనే ఆయకట్టు భవితవ్యం ఇలాంటి పరిస్థితుల్లోనే పునరుజ్జీవం అవసరమనే చర్చ -
జీరో పాయింట్‌కు పునరుజ్జీవం నీరు
వేల్పూర్(మెండోరా): వరద కాలువ ద్వారా పునరుజ్జీవం నీరు ముప్కాల్ వద్ద ఎస్సారెస్పీ జీరో పాయింట్‌కు సోమవారం ఉదయం చేరుకుంది. రాజేశ్వర్‌రావు పేట పంపుహౌస్ నుంచి ముప్కాల్ వరకు రివర్స్ పంపింగ్ ప్రక్రియ ఆదివారం ప్రారంభించారు. ఒక పంపు ద్వారా 1450 క్యూసెక్కుల నీటిని వరద కాలువకు వదిలారు. 4.5 మీటర్ల వాటర్ లెవల్ వచ్చేలా నీటిని విడుదల చేశారు. 0.5 టీఎంసీల నీరు వరద కాలువలో నిల్వ ఉంచినట్లు డీఈ గణేశ్ తెలిపారు. వరద కాలువపై ఆధారపడ్డ రైతులతోపాటు కాలువ చుట్టుపక్కల సుమారు 2 కిలోమీటర్ల వరకు బో రుబావుల్లో భూగర్భజలాలు వృద్ధి చెందుతాయని పేర్కొన్నారు. 4.5 మీటర్ల ఎత్తు వరకు నిల్వ ఉన్న నీరుఎస్సారెస్పీ జీరో పాయింట్ -
రేపు టీఎన్జీవోస్ బోనాల పండుగ
నిజామాబాద్ అర్బన్: టీఎన్జీవోస్ ఆధ్వర్యంలో ఈ నెల 5న బోనాల పండుగ నిర్వహించనున్నట్లు జి ల్లా అధ్యక్షుడు సుమన్ కుమార్ పేర్కొన్నారు. నగరంలోని టీఎన్జీవోస్ భవన్లో సోమవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉత్సవా ల్లో ఎమ్మెల్సీ, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి, షబ్బీర్ అలీ, నిజామాబాద్ అర్బన్, రూరల్ ఎమ్మె ల్యేలు ధన్పాల్ సూర్యనారాయణ, డాక్టర్ భూపతిరెడ్డి, మేయర్ ఉమారాణి, సీపీ సాయి చైతన్య పాల్గొంటారని తెలిపారు. పాత కలెక్టరేట్ మైదానంలో ఏర్పాటు చేసిన సభాస్థలిలో బోనాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి, అనంతరం బోనాలను ఊరేగింపుగా తీసుకువచ్చి పాత కలెక్టరేట్ ఆలయంలో నవదుర్గా మాతకు సమర్పిస్తామని వివరించారు. ఉద్యోగ సంఘాలు నాయకులు, ఉద్యోగులు, మహిళలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. -
పోలీస్ ప్రజావాణికి 30 ఫిర్యాదులు
నిజామాబాద్ అర్బన్: నగరంలోని పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో సోమవారం పోలీస్ ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ సాయిచైతన్య జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. మొత్తం 30 ఫిర్యాదులు రాగా, చట్టప్రకారం సమస్యలను పరిష్కరించాలని సంబంధిత పోలీసు అధికారులను ఆదేశించారు. పండుగ వాతావరణంలో పంద్రాగస్టు నిర్వహించాలి నిజామాబాద్ అర్బన్: స్వాతంత్య్ర దినోత్సవాన్ని పండుగ వాతావరణంలో నిర్వహించేలా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్ వి.భుజంగరావు అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్ లో సోమవారం అన్ని శాఖల అధికారులతో సన్నాహక సమావేశం నిర్వహించారు. పంద్రాగస్టు సందర్భంగా చేపట్టాల్సిన కార్యక్రమాలపై శాఖల వారీగా అధికారులకు దిశానిర్దేశం చేశారు. పోలీస్ పరేడ్ గ్రౌండ్లో నిర్వహించనున్న వేడుకలో ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా, సజావుగా జరిగేలా అ న్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు ప్రతిబింబించేలా జిల్లా ప్రగతి నివేదిక రూపొందించాలని ఆదేశించారు. వ్యవసాయ, ఉద్యానవన, గ్రామీణాభివృద్ధి, ఫారెస్ట్, విద్యా, వై ద్యం తదితర శాఖల పనితీరు చాటేలా శకటాల ప్రదర్శన, స్టా ల్స్ ఏర్పాటు చేయాలని సూచించారు. ఎక్కడ కూడా జాతీయ ప తాకం గౌరవానికి భంగం వాటిల్లకుండా అ న్ని జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు. సమావేశంలో ట్రెయినీ కలెక్టర్ సురేశ్, డీఆర్వో గీత, జెడ్పీ సీఈవో సాయాగౌడ్, నిజామాబాద్ నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, డీఆర్డీవో సాయన్న, కలెక్టరేట్ ఏవో బాలరాజు, ఇతర శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. సబ్ స్టేషన్‌ను పరిశీలించిన సీఈ నవీపేట: నవీపేట మండలం హనుమాన్ ఫారం గ్రామ శివారులో నిర్మించిన నూతన విద్యుత్ ఉప కేంద్రాన్ని చీఫ్ ఇంజినీర్ ఇన్ కన్స్ట్రక్షన్ జేఆర్ చౌహాన్ సోమవారం సందర్శించారు. నిర్మాణంతోపాటు సాంకేతిక పరీక్షలు పూర్తయినట్లు అధికారులు ఆయన దృష్టికి తీసుకువచ్చారు. త్వరలోనే విద్యుత్ ఉప కేంద్రాన్ని వినియోగంలోకి తీసుకువస్తున్న ట్లు సీఈ తెలిపారు. చుట్టుపక్కల గ్రామాల వ్యవసాయ, గృహ అవసరాలకు విద్యుత్ ఉపకేంద్రం దోహదం చేస్తుందన్నారు. అనంతరం చార్జింగ్ పనులను పరిశీలించారు. ఎస్ఈ పీవీ రాజేశ్వర్‌రావు, అధికారులు శ్రీని వాసరావు, వెంకటరమణ, స్వామి, ప్రశాంత్ రెడ్డి, నటరాజ్, ఏఈలు పాల్గొన్నారు. -
‘సర్’ను నిశితంగా పరిశీలించాలి
● వీసీలో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డినిజామాబాద్ అర్బన్: స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(సర్)లో భాగంగా కొనసాగుతున్న ఓటర్ల వివరాల నమోదు ప్రక్రియను ఏఈఆర్వోలు, సూపర్వైజర్లు నిశితంగా పరిశీలించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి సూచించారు. సోమవారం హైదరాబాద్ నుంచి ఎస్ఐఆర్ కార్యక్రమ పురోగతి, పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ తదితర అంశాలపై జిల్లా ఎన్నికల అధికారులతో సీఈవో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఎల్వోలు వెబ్సైట్లో ఓటర్ల వివరాలు నమోదు చేసే సమయంలో అనేక పొరపాట్లు జరిగినట్లు గుర్తించామని, వాటి కారణంగా అర్హులైన ఓటర్ల పేర్లు జాబితా నుంచి తొలగిపోతున్నాయనే ఫిర్యాదులు అందుతున్నాయని తెలిపారు. బీఎల్వోలు నమోదు చేసిన ప్రతి వివరాన్ని ఏఈఆర్వోలు, సూపర్వైజర్లు తప్పనిసరిగా క్రాస్ వెరిఫై చేయాలని, లోపాలను గుర్తిస్తూ సరిదిద్దాలని ఆదేశించారు. అనవసర తప్పిదాలకు ఆస్కారం కల్పిస్తే సంబంధిత బీఎల్వోలు, సూపర్వైజర్లపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. పట్టణ ప్రాంతాల్లో డిజిటలైజేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. పోలింగ్ కేంద్రాల రేషనలైజేషన్ ప్రక్రియను వచ్చే శనివారం వరకు పూర్తి చేయాలని ఆదే శించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ భుజంగరావు మాట్లాడుతూ ఎన్నికల సంఘం నిర్దేశించిన నిబంధనలకు అనుగుణంగా జిల్లాలో ఎస్ఐఆర్ ప్రక్రియను నిర్వహించామని తెలిపారు. ఇప్పటికే రెండు నియోజకవర్గాలలో ప్రక్రియ పూర్తయ్యిందని, మిగతా సెగ్మెంట్లలో వివరాల నమోదు ప్రక్రియను పునఃపరిశీలన చేస్తున్నట్లు వివరించారు. వీసీలో నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
డిఫెన్స్ మద్యం పట్టివేత
రెంజల్: మండల కేంద్రంలో ఓ వ్యక్తి వద్ద అక్రమంగా నిల్వ ఉంచిన డిఫెన్స్ మద్యంను స్వాధీనం చేసుకున్నట్లు ఎకై ్సజ్ ఎన్ఫోర్స్మెంట్ సీఐ వెంకటేశ్ తెలిపారు. పరిమితికి మించి డిఫెన్స్ మద్యం బాటిళ్లు కలిగి ఉన్నట్లు సమాచారం రావడంతో సోమవారం రెంజల్‌లోని రాకేష్‌రెడ్డి అనే వ్యక్తి ఇంటిపై దాడి చేశామన్నారు. అతడి ఇంట్లో పంజాబ్ రాష్ట్రానికి చెందిన డిఫెన్స్ బాటిళ్లు లభ్యమైనట్లు పేర్కొన్నారు. అక్రమంగా నిల్వ చేసిన 14 పుల్ బాటిళ్లను స్వాధీనం చేసుకుని రాకేష్‌రెడ్డిపై కేసు నమోదు చేసినట్లు వివరించారు. పిట్లంలో రేషన్ బియ్యం.. పిట్లం(జుక్కల్): మండల కేంద్రంలో రేషన్ బియ్యాన్ని తరలిస్తున్న బొలెరో వాహనాన్ని పోలీసులు సోమవారం పట్టుకున్నారు. ఈ సందర్బంగా ఎస్సై అంజనేయులు మాట్లాడుతూ.. విశ్వసనీయ సమాచారం రావడంతో పిట్లంలోని గురుజాల రాకేష్ అనే కిరాణా వ్యాపారి ఇంటి వద్ద తనిఖీలు నిర్వహించగా, ఇంటి ముందర ఉన్న బొలెరో వాహనంలో సుమారు 450 కిలోల రేషన్ బియ్యాన్ని గుర్తించారు. నిందితుడు ప్రజల నుంచి తక్కువ ధరకు రేషన్ బియ్యాన్ని కొనుగోలు చేసి, వేరే ప్రాంతాల్లో ఎక్కువ ధరకు అమ్ముకుంటున్నాడని తెలిపాడు. బియ్యాన్ని స్వాధీనం చేసుకొని, వాహనాన్ని సీజ్ చేసి స్టేషన్‌కు తరలించామని, రాకేష్‌పై కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నట్లు ఎస్సై తెలిపారు. -
మాక్లూర్‌లో బాలిక ఆత్మహత్య
మాక్లూర్: మండలకేంద్రంలో ఓ బాలిక ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా.. మండలకేంద్రంలోని రామకృష్ణ తన భార్యతో కలిసి టిఫిన్ సెంటర్ నిర్వహిస్తున్నాడు. వారికి ఇద్దరు కుమారులు ఉండగా తన అన్న కూతురు సావిత్రి(17)ని కొన్నేళ్లుగా పెంచుకుంటున్నాడు. సావిత్రి తండ్రి గతంలో మృతిచెందగా, తల్లి కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తుంది. రామకృష్ణ సోమవారం సరుకులు తేవడానికి భార్యతో కలిసి నిజామాబాద్ వెళ్లాడు. తిరిగి సాయంత్రం వారు ఇంటికి వచ్చేసరికి బాలిక ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. కడుపునొప్పి భరించలేక ఆత్మహత్యకు పాల్పడినట్లు మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై అనిల్‌రెడ్డి తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. విద్యుత్ షాక్‌తో ఒకరికి తీవ్రగాయాలు రెంజల్: ట్రాన్స్‌కో అధికారుల నిర్లక్ష్యం వల్ల గ్రామంలో ప్రయివేట్ హెల్పర్‌గా పనిచేస్తున్న ఓ వ్యక్తి విద్యుత్ ప్రమాదానికి గురయ్యాడు. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా.. రెంజల్ గ్రామానికి చెందిన చినరాజం అనే వ్యక్తి ప్రయివేట్ హెల్పర్‌గా పనులు చేసుకుంటున్నారు. గ్రామం పక్కనే ఆయనకు ఎకరం భూమి ఉంది. గత శుక్రవారం ట్రాన్స్ఫార్మర్ ఫీజు కాలిపోవడంతో అప్పటి నుంచి స్థానిక లైన్‌మన్‌కు సమారాచం అందించారు. ఆయన స్పందించక పోవడంతో సోమవారం పొలం వద్దకు చేరుకుని లైన్‌ఇన్‌స్పెక్టర్‌కు ఫోన్ ద్వార సమాచారం అందించారు. ఆయన ఆదేశాల మేరకు సబ్‌స్టేషన్ నుంచి ఎల్సీ(లైన్‌క్లీయర్) ఇచ్చారు. ఇచ్చిన సమయంలో పనులు పూర్తి చేసుకునేందుకు చినరాజం 11కేవీ విద్యుత్ లైన్ ఎక్కి ఫీజు వేస్తుండగా విద్యుత్ సరఫరా కావడంతో షాక్ తగిలి కిందపడ్డాడు. గుర్తించిన స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించగా నిజామాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నట్లు కుటుంబీకులు తెలిపారు. -
ప్రజావాణి ఫిర్యాదులకు ప్రాధాన్యమివ్వాలి
● అదనపు కలెక్టర్ భుజంగరావు ● కలెక్టరేట్లో 121 వినతుల స్వీకరణనిజామాబాద్ అర్బన్: ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ భుజంగరావు అధికారులకు సూచించారు. నగరంలోని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను అదనపు కలెక్టర్ భుజంగరావుతోపాటు ట్రెయినీ కలెక్టర్ సురే ష్, డీఆర్వో గీత, నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, జెడ్పీ సీఈవో సాయాగౌడ్, డీఆర్డీవో సాయన్నలకు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు. మొత్తం 121 ఫిర్యాదులు రాగా, అర్జీలను పెండింగ్‌లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఫిర్యాదు వచ్చిన వెంటనే దాడులు.. రెంజల్: ఇందిరమ్మ ఇళ్ల కోసం పలువురు అనుమతులు తీసుకుని అక్రమంగా ఇసుకను నిల్వ చేసుకున్నట్లు రెంజల్ గ్రామ పంచాయతీ పాలకవర్గానికి చెందిన పలువురు వార్డు సభ్యులు కలెక్టరేట్లో ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన ఉన్నతాధికారులు ఇసుక నిల్వలను గుర్తించి సీజ్ చేయాలని సిబ్బందిని ఆదేశించారు. వారు వెంటనే గ్రామానికి చేరుకుని సుమారు 35 ట్రాక్టర్ల ఇసుకను సీజ్ చేసి పంచాయతీ కార్యదర్శికి అప్పగించారు. -
రాష్ట్రస్థాయి చౌక్‌బాల్ టోర్నీలో జిల్లా జట్టు ప్రతిభ
కమ్మర్పల్లి: రంగారెడ్డి జిల్లా కొత్తూరులో ఇటీవల నిర్వహించిన జూనియర్ చౌక్ బాల్ రాష్ట్రస్థాయి టోర్నమెంట్లో నిజామాబాద్ జిల్లా జట్టు రెండో స్థానంలో నిలిచింది. జిల్లా జట్టు తరపున కమ్మర్‌పల్లిలోని మిసిమి హైస్కూల్ జట్టు పాల్గొని ఉత్తమ ప్రతిభ కనబరిచి 2వ స్థానం కై వసం చేసుకున్నట్లు పాఠశాల కరెస్పాండెంట్ బాలి రవీంధర్, వ్యాయామ ఉపాద్యాయుడు సంజీవ్ సోమవారం తెలిపారు. ఫైనల్ మ్యాచ్‌లో రంగారెడ్డి, నిజామాబాద్ జిల్లా జట్లు తలపడగా, రంగారెడ్డి జిల్లా జట్టు విజేతగా నిలిచింది. రన్నర్ జట్టుగా నిజామాబాద్ నిలిచినట్లు తెలిపారు. ఈసందర్భంగా జట్టు సభ్యులను పాఠశాల యాజమాన్యం అభినందించింది. బోధన్: కేంద్ర ప్రభుత్వం సరికొత్తగా తీసుకొచ్చిన ఎఫ్‌ఎఫ్‌ఎల్( ఫ్రేం వర్క్ ఫర్ ఫర్టిలైజర్ సేల్) యాప్‌పై సోమవారం పట్టణంలోని రైతు వేదిక భవనంలో వ్యవసాయ శాఖ అధ్వర్యంలో శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. బోధన్, సాలూర మండలాల పరిధిలోని ప్రభుత్వ, ప్రయివేట్ ఎరువుల దుకాణాల డీలర్లకు హాజరుకాగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్రస్థాయి అధికారులు ఈ యాప్ ద్వారా ఎరువులను బు క్ చేసుకునే విధానం, డీలర్ల లాగిన్, స్లాట్ న మోదు, ఎరువుల పంపిణీ విధానం, రైతుల బు కింగ్‌ల ధ్రువీకరణ, సాంకేతిక సమస్యల పరిష్కారం వంటి అంశాలపై అవగాహన కల్పించారు. బోధన్ ఏడీఏ శ్రీనివాస్‌రావు, ఏవో శ్వేత, ఏఈవోలు, ఎరువుల దుకాణాల డీలర్లు పాల్గొన్నారు. ● నిలిచిన వాహనాల రాకపోకలు బోధన్‌టౌన్(బోధన్): పట్టణంలోని గాంధీ పార్కు వద్ద గల రైల్వే గేట్‌ను సోమవారం పొక్లెయిన్ ఢీకొనడంతో ధ్వంసమైంది. దీంతో గేట్ పనిచేయకపోవడంతో వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ జామ్ అయ్యింది. అదే సమయంలో రాయలసీమ ఎక్స్‌ప్రెస్ రైలు వస్తుండడంతో రైల్వే సిబ్బంది గేటును వేయడానికి ప్రయత్నించినా ఎంతకు గేటు పడక పోవడంతో, ట్రాఫిక్ పోలీసులు, తాడును కట్టి ట్రాఫిక్‌ను నియంత్రించారు. అప్పటికే రెండు వైపులా వాహనాలు నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. రైల్వే సిబ్బంది మరమ్మతులు చేసినా ఫలితం దక్కలేదు. దీంతో వాహనదారులు ఎక్కువ సమయం అక్కడే వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. -
క్రైం కార్నర్
రైతును బలిగొన్న విద్యుత్ ఫెన్సింగ్ సదాశివనగర్ (ఎల్లారెడ్డి): పంటను కాపాడుకుందామని వేసుకున్న విద్యుత్ తీగలే ఆ రైతు ప్రాణాలను బలిగొన్నాయి. మండలంలోని కుప్రియాల్ గ్రామంలో సోమవారం విద్యుత్ షాక్‌కు గురై ఓ రైతు అక్కడికక్కడే మృతి చెందినట్లు ఎస్సై పుష్పరాజ్ తెలిపారు. వివరాలు ఇలా.. కుప్రియాల్ గ్రామానికి చెందిన పెనుగొండ ఎల్లయ్య (55) అనే రైతు తన పొలంలో చెరకు పంటను సాగు చేస్తున్నాడు. పంటను అడవి పందుల బెడద నుంచి రక్షించుకునేందుకు పొలం చుట్టూ విద్యుత్ ఫెన్సింగ్ వైర్లు ఏర్పాటు చేసుకున్నాడు. ఈక్రమంలో అకస్మాత్తుగా ఆ ఫెన్సింగ్ వైర్లకు విద్యుత్ సరఫరా కావడంతో, ప్రమాదవశాత్తు వాటిని తాకిన ఎల్లయ్య విద్యుత్ షాక్‌కు గురై అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు. ● యాచారంలో ట్రాక్టర్ ఢీకొని బాలుడి మృతి సదాశివనగర్ (ఎల్లారెడ్డి): బంధువుల అంత్యక్రియలకు వచ్చి ప్రమాదవశాత్తు ట్రాక్టర్ ఢీకొని ఓ బాలుడు మృతి చెందిన ఘటన మండలంలోని యాచారం గ్రామంలో చోటుచేసుకుంది. ఎస్సై పుష్పరాజ్ తెలిపిన వివరాలు ఇలా.. ఇందల్వాయి మండలం చంద్రాయన్‌పల్లికి చెందిన సంగం అజిత్ (9) అనే బాలుడు తన తల్లిదండ్రులతో కలిసి సోమవా రం యాచారంలో జరిగిన ఓ అంత్యక్రియల కార్యక్రమానికి హాజరయ్యాడు. ఈక్రమంలో బాలుడు బయట ఆడుకుంటుండగా వేగంగా వచ్చిన ఓ ట్రాక్టర్ అజిత్‌ను ప్రమాదవశాత్తు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బాలుడు తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే అతడిని చికిత్స నిమిత్తం కామారెడ్డి జీజీహెచ్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బాలుడు పరిస్థితి విషమించి మృతి చెందినట్లు ఎస్సై తెలిపారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు. ఆర్మూర్‌టౌన్: పట్టణంలో ఇటీవల పోలీసులు డ్రంకన్‌డ్రైవ్ తనిఖీలు ని ర్వహించగా పలువురు మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడ్డా రు. సోమవారం నాలుగురిని ఆర్మూర్ కోర్టులో హాజరుపర్చగా, జడ్జి ఇద్దరికి రూ.10వేల చొప్పున జరిమానా, మరో ఇద్దరికి నాలుగు రోజుల పా టు జైలు శిక్ష విధించినట్లు ఎస్‌హెచ్‌వో సత్యనారాయణగౌడ్ తెలిపారు. అలాగే డీసీఎం వ్యాను రోడ్డుపై పెట్టి ప్రజలకు ఇబ్బంది కలిగించిన డ్రైవర్‌కు రూ. 5వేల జరిమానా విధించినట్లు ఎస్‌హెచ్‌వో పేర్కొన్నారు. -
ఆస్పత్రుల్లో సమస్యలు పరిష్కరించాలి
ఆర్మూర్/కమ్మర్పల్లి: బాల్కొండ, ఆర్మూర్ నియోజకవర్గాల పరిధిలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రిని, ఎమ్మెల్యేలు పైడి రాకేష్‌రెడ్డి, ప్రశాంత్‌రెడ్డి కోరారు. హైదరాబాద్‌లోని రాష్ట్ర సచివాలయంలో సోమవారం రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజ నర్సింహ అధ్యక్షతన ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వైద్య రంగ సమస్యలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్‌రెడ్డి, బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డిలు పలు సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాకే ష్‌రెడ్డి పలు సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెల్లారు. ఆస్పత్రుల్లో వైద్యులు, సిబ్బంది కొరత, డిజిట్ల్ ఎక్స్‌రే మిషన్, ఆల్ట్రా సౌండ్ మిషన్, ఈసీజీ మిషన్, ఓటీ పరికరాలు, నవజాత శిశు వార్మర్లు, క్రాస్ కార్డ్స్, వీల్ చైర్లు మంజూరు చేయాలని కోరారు. బయో మెడికల్ వ్యర్ధాల గది, మెకనైజ్డ్ ల్యాండ్రీ, కిచెన్ షెడ్ టాయిలెట్స్ మౌలిక సదుపాయాల మంజూరు చేయాలని కోరారు. ఆర్మూర్ మండలం అంకాపూర్, పిప్రిలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, మచ్చర్లలో ఆరోగ్య ఉప కేంద్రం, నందిపేట, మాక్లూర్‌లో కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు మంజూరు చేయాలని కోరగా అంకాపూర్‌లో పీహెచ్సీ, నందిపేటలో కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌ను మంజూరు చేస్తున్నట్లు మంత్రి ప్రకటించారని ఎమ్మెల్యే రాకేష్‌రెడ్డి పేర్కొన్నారు. అలాగే భీమ్‌గల్‌లో 100 పడకల ఏరియా ఆస్పత్రి పనులను త్వరితగతిన పూర్తిచేసి అందుబాటులోకి తీసుకురావాలని, పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మంజూరు చేయాలని ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి కోరారు. రాహత్ నగర్లో నూతన పీహెచ్సీ భవనం నిర్మాణం చేపట్టాలన్నారు. మోర్తాడ్ మండలం తిమ్మాపూర్ గ్రామంలో కొత్త పీహెచ్సీ, బాల్కొండలో సీహెచ్‌సీ కొత్త భవన నిర్మాణం, బాల్కొండ, మోర్తాడ్‌లో పోస్టుమార్టం భవనాల నిర్మాణం చేపట్టాలన్నారు. అలాగే సీహెచ్‌సీ, పీహెచ్‌సీల్లో ఖాళీ పోస్టులను భర్తీ చేయాలన్నారు. ఎన్హెచ్ఎం పెండింగ్ నిధులను తక్షణమే విడుదల చేయాలన్నారు. మొత్తం 18 ఆరోగ్య ఉపకేంద్రాలు / ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాల నిర్మాణానికి అనుమతులు మంజూరు చేసి, నిధులు విడుదల చేయవలసిందిగా కోరారు.జీజీహెచ్‌లో ఎంఆర్ఐ మెషిన్‌ను మంజూరు చేయాలనీ విన్నవించారు. -
మళ్లీ తెరపైకి..
తెయూఆరోపణలు నిజమైతే.. ● 2013లో జరిగిన అధ్యాపకుల ఎంపికపై జాతీయ ఎస్టీ కమిషన్ నోటీసులు ● ఈనెల 14న విచారణకు హాజరు కావాలని వర్సిటీ అధికారులకు ఆదేశం నియామకాల వ్యవహారం తెయూ(డిచ్పల్లి): తెలంగాణ యూనివర్సిటీలో గతంలో జరిగిన అధ్యాపకుల నియామకాల వ్యవహారం తాజాగా మళ్లీ తెరపైకి వచ్చింది. నియామకాల్లో కనీస నిబంధనలు పాటించలేదంటూ బాధితుడు అంగోత్ వెంకట్‌నాయక్ జాతీయ ఎస్టీ కమిషన్‌కు ఫిర్యాదు చేయగా, ఆ నియామకాలపై కమిషన్ దృష్టిసారించింది. ఈనెల 14న హైదరాబాద్‌లోని దిల్కుష గెస్ట్‌హౌస్‌లో విచారణకు హాజరు కావాలని తెలంగాణ ఉన్నత విద్యాశాఖ ప్రిన్సిపాల్ సెక్రెటరీ, తెలంగాణ యూనివర్సిటీ రిజిస్ట్రార్‌తో పాటు బాధితుడు వెంకట్నాయక్కు ఎస్టీ కమిషన్ డైరెక్టర్ కల్యాణరెడ్డి సోమవారం నోటీసులు జారీ చేశారు. అన్ని రికార్డులతో రావాలంటూ.. తెలంగాణ యూనివర్సిటీలో 2013లో చేపట్టిన అధ్యాపకుల నియామకాల్లో తనకు అన్యాయం జరిగిందంటూ బాధితుడు వెంకట్‌నాయక్ గత నెల 16న ఎస్టీ కమిషన్‌ను ఆశ్రయించారు. ఎస్టీ అభ్యర్థులకు చెందాల్సిన రోస్టర్ పాయింట్లలో అక్రమాలు జరిగాయని, రిజర్వేషన్ పాలసీ, రోస్టర్ విధానాన్ని సక్రమంగా పాటించలేదనే ఆరోపణలు చేశారు. దీనిపై కమిషన్ స్పందిస్తూ విచారణకు ఆదేశించింది. రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ, తెయూ రిజిస్ట్రార్‌తో పాటు బాధితుడు వెంకట్‌నాయక్ విచారణ కేంద్రంలో వ్యక్తిగతంగా హాజరుకావాలని ఆదేశించారు. కేవలం సమాధాన పత్రాలు పంపడం కాకుండా, 2013 నాటి నియామక నోటిఫికేషన్, రోస్టర్ పాయింట్ రిజిస్టర్లు, ఎంపిక జాబితాలు, మెరిట్ లిస్ట్‌లతో సహా అన్ని సంబంధిత అసలు రికార్డులను తీసుకొని విచారణకు హాజరుకావాలని నోటీసులో స్పష్టం చేసింది. తెయూ పరిపాలనా భవనం ఆ నియామకాల్లో రోస్టర్ పాయింట్ల గందరగోళం నిజమేనని జాతీయ ఎస్టీ కమిషన్ విచారణలో తేలితే, తెలంగాణ యూనివర్సిటీ అధికారులకు ఇది పెద్ద దెబ్బగా పరిణమించే అవకాశం ఉందని విద్యావేత్తలు అంటున్నారు. ఇప్పటికే ఈ నియామకాలను రద్దు చేసి కొత్తగా నోటిఫికేషన్ వేయాలని హైకోర్టు జడ్జి సింగిల్ జడ్జి తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. అయితే ఈ తీర్పు పై పలువురు అధ్యాపకులు హైకోర్టు డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించారు. ప్రస్తుతం ఈ కేసు హైకోర్టు డివిజన్ బెంచ్ వద్ద ఉంది. అయితే ఇదే సమ యంలో జాతీయ ఎస్టీ కమిషన్ స్వయంగా జో క్యం చేసుకోవడం, పైగా అధికారులను నేరుగా హాజరు కావాలని ఆదేశించడంతో ఈ విచారణ అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ విచారణ తర్వాత వర్సిటీ నియామకాలపై ఎలాంటి నిర్ణయం వెలువడుతుందోనని వర్సిటీ అధ్యాపకులు, విద్యార్థులలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. నోటీసు విషయమై తెయూ రిజిస్ట్రార్ యాదగిరిని ‘సాక్షి’ సంప్రదించగా ఇప్పటి వరకు తమకు ఎలాంటి నోటీసు అందలేదని తెలిపారు. -
నిర్వహణ లోపాలను సరిదిద్దుకోవాలి
నిజామాబాద్ అర్బన్: సంక్షేమ వసతి గృహాలు, గురుకులాలు, రెసిడెన్షియల్ స్కూళ్లు, కళాశాలల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని అదనపు కలెక్టర్ వి.భుజంగరావు హెచ్చరించారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో సోమవారం అన్ని సంక్షేమ శాఖల ప్రభుత్వ విద్యాసంస్థల అధికారులు, నిర్వాహకులు, కాంట్రాక్ట్ ఏజెన్సీల ప్రతినిధులతో సమీక్షించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ఇటీవల పలు హాస్టళ్లు, గురుకులాలను క్షేత్రస్థాయిలో సందర్శించగా, నిర్వహణపరమైన లోపాలు తన దృష్టికి వచ్చాయని అన్నారు. తక్షణమే వాటిని సరిదిద్దుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం విద్యార్థులకు డైట్ సమకూర్చాలని సూచించారు. కాంట్రాక్ట్ ఏజెన్సీలు నాసిరకం వస్తువులు, చికెన్, మటన్ వంటివి సరఫరా చేస్తే వెంటనే షోకాజ్ నోటీసు జారీచేయాలని ఆదేశించారు. విద్యార్థులకు పౌష్టికాహారం అందించే విషయంలో అలసత్వం వహిస్తే ఉపేక్షించబోమని, నిబంధనలు పాటించని కాంట్రాక్టు ఏజెన్సీని రద్దు చేసి, కొత్త వారికి బాధ్యతలు అప్పగిస్తామని స్పష్టంచేశారు. విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని, సానిటేషన్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ కనబర్చాలని హితవు పలికారు. మండల ప్రత్యేక అధికారులు, ఆర్సీవోలు క్రమం తప్పకుండా విద్యా సంస్థలను సందర్శిస్తూ, నిర్వహణ తీరును నిశితంగా పరిశీలించాలని సూచించారు. సమావేశంలో ట్రెయినీ కలెక్టర్ సురేశ్, డీఈవో అశోక్, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. విద్యార్థుల ఆరోగ్యానికి ప్రాధాన్యమివ్వాలి నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు అదనపు కలెక్టర్ వి.భుజంగరావు వెల్ఫేర్ హాస్టళ్ల అధికారులు, నిర్వాహకులతో సమీక్ష -
వైద్యం, వసతులు మెరుగవ్వాలి
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో వసతులు మెరుగుపర్చి మరింత నాణ్యమైన వైద్యం అందించేందుకు చర్యలు తీసుకుంటు న్నామని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దా మోదర రాజనర్సింహ పేర్కొన్నారు. రాష్ట్ర సచివాలయంలో నిజామాబాద్ జిల్లా ఆస్పత్రులు, వైద్య సౌ కర్యాలపై ఎమ్మెల్యేలతో సోమవారం ప్రత్యేకంగా సమీక్షించారు. సమావేశంలో ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్‌రెడ్డి, షబ్బీర్ అలీ, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యేలు ప్రశాంత్‌రెడ్డి, భూపతిరెడ్డి, ధన్పాల్ సూర్యనారాయణ, పైడి రాకేశ్‌రెడ్డి హాజరయ్యారు. జిల్లా కేంద్రంలోని జనరల్ ఆస్పత్రిని త్వ రలోనే డీఎంఈ, మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నతాధికారుల బృందం పరిశీలించనున్నట్లు మంత్రి దా మోదర తెలిపారు. జనరల్ ఆస్పత్రిలో మౌలిక వసతులపై సమగ్ర నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు. ఆస్పత్రిలో వసతుల కల్పనకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. జిల్లాలోని ధర్పల్లి, డిచ్పల్లి సీహెచ్‌సీలను అప్‌గ్రేడ్ చేయడంతోపాటు తిర్మన్‌పల్లి పీహెచ్సీలో వైద్యసిబ్బందిని పెంచాలని రూరల్ ఎమ్మెల్యే ఆర్. భూపతిరెడ్డి ఈ సందర్భంగా మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. నిత్యం 2 వేలకు పైగా ఓపీ ఉన్న జనరల్ ఆస్పత్రిలో ఎమ్మారై, మార్చురీ ఫ్రీజర్ల సౌకర్యంతోపాటు సివిల్ సర్జన్, రెసిడెంట్ మెడికల్ ఆఫీసర్ల సంఖ్య పెంచాలని నిజా మాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారా యణ కోరారు. బాల్కొండ నియోజకవర్గంలో భీమ్‌గల్ 100 పడకల ఆస్పత్రిని అందుబాటులోకి తీసుకురావాలని, ప్రస్తుత పీహెచ్‌సీని రహమత్‌నగర్‌కు తరలించాలని ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి కోరా రు. మోర్తాడ్ మండలం పాలెం లేదా తిమ్మాపూర్‌లో పీహెచ్సీ ఏర్పాటు, బాల్కొండ సీహెచ్‌సీకి నూతన భవనం, సీహెచ్‌సీల్లో అధికారులు, సిబ్బంది నియామకంపై పలు వినతులను సమర్పించారు. జిల్లా ప్రజాప్రతినిధులతో వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర సమీక్ష ఆస్పత్రులు, వైద్య సదుపాయాలపై ప్రత్యేక సమావేశం జీజీహెచ్‌లో సౌకర్యాల పెంపునకు హామీ -
సీ్త్రనిధి రుణాలపై ఫోకస్
డొంకేశ్వర్(ఆర్మూర్): జిల్లాలో సీ్త్రనిధి రుణాల పంపిణీని మరింత వేగవంతం చేయడంపై గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. 2026–27 ఆర్థిక సంవత్సరానికి నిర్దేశించుకున్న టార్గెట్‌ను చేరుకోవడమే లక్ష్యంగా ఉన్నతాధికారులు సమగ్ర కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేశారు. క్షేత్రస్థాయిలో మహిళా సంఘాల నుంచి రుణాల రికవరీతోపాటు కొత్త రుణాల మంజూరు ప్రక్రియను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ఇటీవల కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ భుజంగరావు సీ్త్రనిధిపై అధికారులతో సమీక్ష నిర్వహించగా నెమ్మదించిన రుణాల మంజూరును వేగవంతం చేయాలని ఆదేశించారు. దీంతో రుణాల పంపిణీలో వెనుకబడిన మండలాలపై జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. నందిపేట్, బాల్కొండ, భీమ్‌గల్, చందూర్, వర్ని, మోస్రా, రెంజల్, రుద్రూర్, బోధన్, మోర్తాడ్, సిరికొండ, డిచ్పల్లి, కోటగిరి మండలాలు వెనుకబడ్డాయి. ఈ మండలాల్లో ప్రగతిని మెరుగుపరిచేందుకు ఏపీఎంలతో ప్రతీరోజు డీఆర్డీవో సమీక్షలు చేస్తున్నారు. ఈ నెలాఖరు నాటికి ప్రతి మండలంలో 30 శాతానికి పైగా రుణాల పంపిణీని ఎలాగైనా పూర్తి చేయాలని గడువు విధించారు. దీంతో డబ్బులు అవసరమైన మహిళా సంఘాల సభ్యులను గుర్తించి రుణాలు ఇచ్చేందుకు సీసీలు క్షేత్రస్థాయిలోనే ఉంటున్నారు. రుణాలివ్వడమే కాకుండా రికవరీ కూడా ప్రస్తుతం 77.42 శాతం ఉండగా, 85 శాతానికి పెరగాలని స్పష్టమైన ఆదేశాలిచ్చారు. జిల్లా రుణ లక్ష్యం రూ.285.50 కోట్లు ఇప్పటి వరకు ఇచ్చింది రూ.52.53 కోట్లు (18శాతం) రుణాలు పొందిన మహిళా సభ్యులు 5,468 ఇంకా ఇవ్వాల్సిన రుణాలు రూ.232.97 కోట్లు లక్ష్యాలు చేరుకోవాల్సిందే నిర్దేశిత లక్ష్యాల మేరకు మహిళా సంఘాలకు సీ్త్రనిధి రుణాలు పంపిణీ చేయాలి. రికవరీ శాతం కూడా పెరగాలి. ఇప్పటికే ఈ రెండు విషయాల్లో చాలా మండలాలు వెనుకబడినట్లు గుర్తించాం. సిబ్బంది మరింత కృషి చేసి ప్రగతి చూపకపోతే శాఖాప రంగా చర్యలు తప్పవు. – సాయన్న, డీఆర్డీవో లక్ష్యసాధన కోసం అధికారుల ప్రణాళిక వెనుకబడిన మండలాలపై డీఆర్డీవో రోజువారీ సమీక్ష నెలాఖరు నాటికి 30 శాతానికి పైగా రుణాలివ్వాలని గడువు -
పోలీసు కొలువే లక్ష్యంగా..
ఖలీల్‌వాడి : పోలీసు ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలో 219, బాసర జోన్లో మరో 24 కానిస్టేబుల్, 36 ఎస్సై ఉద్యోగాలు ఉన్నాయి. ఈ నెల 19 నుంచి సెప్టెంబర్ 9 వరకు దరఖాస్తుల ప్రక్రియ కొనసాగనున్నది. పోలీసు ఉద్యోగ ప్రకటనతో పోటీ పరీక్షకు సిద్ధమయ్యేందుకు యువతీ, యువకులు పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు. గ్రంథాలయాలు కిటకిట.. జిల్లాలోని గ్రంథాలయాలు ఉద్యోగార్థులతో కిటకిటలాడుతున్నాయి. ఖలీల్వాడీలోని జిల్లా గ్రంథాలయం ఉదయం 6 నుంచి రాత్రి 11 గంటల వరకు అభ్యర్థులతో సందడిగా మారుతోంది. నిర్వాహకులు పోటీ పరీక్షలకు సంబంధించిన పుస్తకాలను అందుబాటులో ఉంచారు. ఈ గ్రంథాలయానికి ప్రతి రోజు 400 మంది అభ్యర్థులు వస్తుంటారు. సాధారణంగా ప్రతి శుక్రవారం గ్రంథాలయానికి సెలవు ఉండగా, అభ్యర్థుల కోసం ఆ రోజున ప్రత్యేకంగా ఓ ఉద్యోగిని అందుబాటులో ఉంచి లైబ్రరీని తెరిచి ఉంచుతున్నారు. అభ్యర్థుల సంఖ్య పెరిగితే ఓల్డ్ డీఈవో కార్యాలయం, రిటైర్డ్ ఎంప్లాయీస్ భవనంలో ఏర్పాట్లు చేశారు. దరఖాస్తుల ప్రక్రియ పూర్తయితే గ్రంథాలయాలకు అభ్యర్థుల తాకిడి ఎక్కువవుతుందని సిబ్బంది చెబుతున్నారు. నగరంలోని బాపూజీ వచనాలయంలో సైతం సుమారు 100 మంది పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారు. వీటితోపాటు జిల్లా కేంద్రంలోని మూడు ప్రయివేటు స్టడీ హాళ్లలో సుమారు 200 మంది అభ్యర్థులు ఉద్యోగ పరీక్షకు సన్నద్ధమవుతున్నట్లు సమాచారం. బాసర జోన్లో ఎస్సై పోస్టులుఏడు నెలలుగా ప్రిపేర్ అవుతున్నా.. జిల్లా గ్రంథాలయంలో ఏడు నెలలుగా ఎస్సై పో టీ పరీక్షకు ప్రిపేర్ అవుతున్నా. ఉదయం 6 నుంచి రాత్రి 10 గంటల వర కు గ్రంథాలయంలోనే చదువుతా. తోటి అభ్యర్థులను చూస్తే చదవాలన్న కసి పెరుగుతుంది. సబ్జెక్టుపై అభ్యర్థులందరం కలిసి గ్రూప్ డిస్కషన్ చేసుకుంటున్నాం. – అనిల్, ధర్పల్లిగ్రంథాలయంలోనే.. జిల్లా గ్రంథాలయంలో ఏడాదిగా చదువుతున్నా ను. ఎలాంటి కోచింగ్ తీసుకోలేదు. ఇక్కడికి వచ్చే అభ్యర్థుల సలహా తీసుకొని ప్రిపేర్ అవుతు న్నా. ఇక్కడ ఉంటే చదవాలని, పోలీస్ ఉద్యో గం సాధించాలనే తపన పెరుగుతుంది. పోటీ పరీక్షలకు కావాల్సిన పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. – నరేందర్, ఇందల్వాయి పుస్తకాలతో కుస్తీ పడుతున్న యువతీ యువకులు గ్రంథాలయాల్లో పెరిగిన సందడి జిల్లా పరిధిలో 219, బాసర జోన్లో 24 కానిస్టేబుల్ పోస్టులు.. 36 ఎస్సై ఉద్యోగాలకు ఈ నెల 19 నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం -
బీసీ స్టడీ సర్కిల్‌ను సద్వినియోగం చేసుకోవాలి
తెయూ(డిచ్పల్లి): తెలంగాణ ప్రభుత్వ బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బీసీ స్టడీ సర్కిల్‌ను నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని తెలంగాణ యూనివర్సిటీ రిజిస్ట్రార్ యాదగిరి కోరారు. బీసీ స్టడీ సర్కిల్–నిజామాబాద్ ద్వా రా కామారెడ్డి జిల్లాలోని నిరుద్యోగుల నుంచి ఉచిత కోచింగ్‌కు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ వెంకన్న తెలిపారు. ఈసందర్భంగా సోమవారం తెయూలో సంబంధిత పోస్టర్ల ను వారు ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. గ్రూప్–1, 2, 3, 4, బ్యాంకింగ్, ఎస్ఎస్సీ, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (ఆర్ఆర్బీ), పోలీస్ నియామక పరీక్షలు, యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రవేశాలకు ఉచిత కోచింగ్‌కు ఆగస్ట్ 14లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. అభ్యర్థులకు స్టైఫండ్ ఇస్తారని తెలిపారు. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు www.tgbcstudycircle.cgg.gov.in వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. -
కూరలో విషం కలిపిన భార్య....
మోపాల్(నిజామాబాద్ రూరల్): నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలంలో సెలైన్ ద్వారా టాయిలెట్ క్లీనర్ ఎక్కించి భర్తను హత్య చేసిన ఘటన మరువక ముందే.. ఇదే మండలంలో కూరలో గడ్డి మందు కలిపి భర్త, అత్తలను హత్య చేయడానికి యత్నించిందో భార్య. సకాలంలో ఆస్పత్రికి తీసుకువెళ్లడంతో ప్రాణాపాయం తప్పింది. ఎస్సై జాడె సుస్మిత తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మోపాల్ మండలంలోని ముదక్పల్లి గ్రామానికి చెందిన పొట్టోళ్ల భూమన్నకు వర్ని మండలం తిమ్మాపూర్‌కు చెందిన సోనితో 12 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి ముగ్గురు పిల్లలున్నారు. భూమన్న వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. భర్త, అత్త ఇద్దరూ తన వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నారని భావించిన సోని వారిని అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకుని ప్రణాళిక వేసింది. ఈనెల ఒకటో తేదీన మధ్యాహ్న సమయంలో మీల్మేకర్ కర్రీలో గడ్డి మందును కలిపి వడ్డించింది.ఆ కూరతో అన్నం తిన్న అత్త భూదవ్వకు తీవ్ర వాంతులు, విరేచనాలు అయ్యాయి. ఆ తర్వాత భూమన్న కూడా అదే కూరతో భోజనం చేశాడు. అయితే కూర వాసన రావడంతో తినడం మానేశాడు. అతడు సైతం అస్వస్థతకు గురికావడంతో స్థానికులు నిజామాబాద్ నగరంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలించారు. సకాలంలో వైద్యం అందడంతో ఇద్దరూ ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. భూమన్న ఇచ్చిన ఫిర్యాదు మేరకు సోనిని అదుపులోకి తీసుకుని విచారించగా నేరాన్ని అంగీకరించిందని ఎస్సై తెలిపారు. నిందితురాలు సోనిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించామన్నారు. -
పరిస్థితి విషమించి ఒకరి మృతి
బోధన్: ఎడపల్లి మండల కేంద్రానికి చెందిన షేక్ బాషా(50) గుర్తు తెలియని వాహనం ఢీకొన్న ఘటనలో గాయాలై హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందినట్లు ఎడపల్లి ఎస్సై ముత్యాల రమ తెలిపారు. గత నెల 29న ఇంటి నుంచి వ్యక్తిగత పని నిమిత్తం రెంజల్ మండలంలోని సాటాపూర్‌కు వెళ్లాడు. అక్కడ రోడ్డు దాటుతుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొనగా అపస్మారకస్థితిలోకి చేరాడు. కుటుంబ సభ్యులు చికిత్స కోసం నిజామాబాద్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ ఉస్మానియా ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి భార్య వజిదాబేగం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు.అమ్మవారిని దర్శించుకుంటున్న సీపీ సాయిచైతన్యశారదాంబ గద్దైపె ప్రతిష్ఠించిన అమ్మవార్లు -
ఆర్చరీలో పతకాల జోరు
దోమకొండ: కఠోర సాధన, లక్ష్యంపై అంచంచలమైన ఏకాగ్రతతో దోమకొండ ప్రాంతానికి చెందిన యువ ఆర్చర్లు జాతీయ స్థాయి ఆర్చరీ పోటీల్లో ప్రతిభ చాటుతూ వరుస పతకాలు సాధిస్తున్నారు. విల్లు చేతబట్టి గురిని ఛేదిస్తున్న క్రీడాకారులు జిల్లాకు మంచిపేరు తీసుకొస్తున్నారు. ఆర్చరీ ఆటకు దోమకొండ కేరాఫ్‌గా మారింది. గడీకోట మైదానంలో సంస్థాన వారసులైన కామినేని అనిల్‌కుమార్ 2007లో ఏర్పాటు చేసిన ఆర్చరీ అకడమీ విలువిద్యకు తోడ్పాటునందిస్తోంది. ఇక్కడ ఉచిత శిక్షణతో విలువిద్య క్రీడలో దోమకొండ విద్యార్థులు రాణిస్తున్నారు. పశ్చిమబెంగాల్‌కు చెందిన ఆర్చరీ శిక్షకుడు ప్రతాప్‌దాస్ శిక్షణలో మెలకువలు నేర్చుకుని రాష్ట్ర, జాతీయ స్థాయిలో సత్తా చాటుతూ పతకాలు సాధిస్తున్నారు. ఓ వైపు చదువుతూనే నిత్యం నాలుగు గంటల సాధన చేస్తున్నారు. 19 ఏళ్లుగా ఇక్కడ ఎంతోమంది ఆర్చరీలో రాణించి పలు పతకాలు సాధించారు. రాష్ట్ర, జాతీయ స్థాయిలో ఆర్చరీలో రాణించి తెలంగాణ రాష్ట్రానికి పేరు తీసుకొచ్చారు. దోమకొండతో పాటు భిక్కనూరు, బీబీపేట, మాచారెడ్డి మండలాలకు చెందిన పలు గ్రామాల విద్యార్థులతో పాటు కామారెడ్డి పట్టణానికి చెందిన పలువురు సైతం ఇక్కడికి వచ్చి విలువిద్య నేర్చుకుంటున్నారు. 40 మందితో మొదలై 550 మందితో.. 2007లో ఇక్కడ 40 మంది విద్యార్థులతో మొదలైన ఆర్చరీ ప్రస్తుతం 550 మందికి చేరిందని ఆర్చరీ కోచ్ ప్రతాప్‌దాస్ తెలిపారు. కామినేని అనిల్‌కుమార్ ఉచితంగా సొంత డబ్బులతో ఆర్చరీ మెటీరియల్ అందించి వారికి శిక్షణ ఇప్పిస్తున్నారు. దోమకొండ, కాచాపూర్, పెద్దమల్లారెడ్డి, బీబీపేట, ఫరీద్‌పేట, పాల్వంచ, భిక్కనూరు, రామేశ్వర్‌పల్లి, జంగంపల్లి, కామారెడ్డి పట్టణానికి చెందిన పలువురు విద్యార్థులు కొన్నేళ్లుగా ఇక్కడికి ఆర్చరీ శిక్షణ కోసం వస్తున్నారు. దీంతో ఆర్చరీ ఆట అంటేనే దోమకొండ అనే విధంగా తయారైంది. జాతీయస్థాయి ఆర్చరీ పోటీల్లో రాణిస్తున్న దోమకొండ క్రీడాకారులు కఠోర సాధనతో విజయాల బాటలో దూసుకెళ్తున్న ప్రతిభావంతులు వరుస విజయాలతో అందరి ప్రశంసలు అందుకుంటున్న ఆర్చర్లు -
జాతీయ రహదారిపై కంటెయినర్ బోల్తా
డిచ్పల్లి: మండలంలోని సుద్దపల్లి గ్రామం వద్ద జాతీయ రహదారిపై వెళ్తున్న కంటెయినర్ అదుపుతప్పి బోల్తా పడింది. ఆదివారం తెల్లవారు ఝామున ఈ ప్రమాదం జరిగింది. డిచ్పల్లి పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నాగ్‌పూర్ నుంచి బెంగుళూరు కు స్పేర్‌పార్ట్స్ లోడ్‌తో ఓ భారీ కంటెయినర్ వెళ్తోంది. సుద్దపల్లి గ్రామం వద్దకు రాగానే డ్రైవర్ నిద్రమత్తు వల్ల అదుపుతప్పి రహదారి పక్కనే ఉన్న సర్వీస్ రోడ్డుపై పడింది. ప్రమాదంలో లారీ డ్రైవర్ షోకీన్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. సర్వీస్ రోడ్డు పై ఉన్న విద్యుత్స్థంబాన్ని ఢీకొనడంతో విద్యుత్‌సరఫరా నిలిచిపోయింది. దీంతో ప్రమాదం తప్పింది. అలాగే ఈ ఘటన తెల్లవారుఝామున జరగడంతో సర్వీస్ రోడ్డుపై వాహనాల లేకపోవడం వల్ల పెద్ద ప్రమాదం తప్పినట్లయింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
పిట్లంలో వాహనాల తనిఖీ
పిట్లం : మండల కేంద్రంలోని పిట్లం – బాన్సువాడ రహదారిపై వాహనా ల తనిఖీ చేపట్టినట్లు ఎస్సై ఆంజనేయులు ఆదివారం తెలిపారు. హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తున్న, వాహన ధ్రువీకరణ పత్రాలు లేని వాహనాల ను గుర్తించి జరిమానా విధించారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధ రించాలని, కారు నడిపే వారు సీటు బెల్టు పెట్టుకోవాలని సూచించారు. వాహనదారులు రోడ్డు భద్రత నియమాలు పాటించాలన్నారు. పేకాట స్థావరంపై దాడి లింగంపేట: మండలంలోని మెంగారం అటవీ ప్రాంతంలో ఆదివారం పే కాట స్థావరంపై దాడి చేసి ఏడుగురిని అరెస్టు చేసినట్లు ఎస్సై దీపక్ కు మార్ తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. మెంగారం అటవీ ప్రాంతంలో గుడారం వేసుకొని పేకాడుతున్నట్లు సమాచారం అందడంతో దాడి చేశామన్నారు. వారి నుంచి రూ. 4100 నగదు, 5 మొబైల్ ఫో న్లు, ఒక బైక్‌ను స్వాధీనం చేసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. మండలంలో ఎవరైనా పేకాట ఆడితే పోలీసులకు సమాచారం అందించాలని వారి పేర్లను గోప్యంగా ఉంచుతామన్నారు. పోలీసు సిబ్బంది ఉన్నారు. -
కాళ్లు, చేతులు కట్టేసి చోరీ
నిజామాబాద్ అర్బన్ : ఓ ఇంట్లోకి చొరబడిన దుండగులు మహిళ కాళ్లు, చేతులు కట్టేసి బంగారం, వెండి, నగదు ఎత్తుకెళ్లారు. ఈ ఘటన నిజామాబాద్ నగరంలోని హస్మీ కాలనీలో ఆదివారం రాత్రి సుమారు 8.30 గంటలకు చోటు చేసుకున్న ఈ ఘటన కలకలం రేపింది. మెడికల్ షాపులో పనిచేసే మహ్మద్ మస్రత్ రోజూలాగే ఆదివారం సైతం పనికి వెళ్లగా.. ఇంట్లో అతడి భార్య ఉంది. ఇంట్లోకి చొరబడిన ముగ్గురు దుండగులు మస్రత్ భార్య కాళ్లు, చేతులను కట్టేసి ఇంట్లోని లోపలి రూములో తోసేశారు. అనంతరం ఇంట్లోని 8 తులాల బంగారం, 9 తులాల వెండి, రూ.70 వేల నగదు ఎత్తుకెళ్లారు. దుండగులు వెళ్లిపోయిన తరువాత అతికష్టం మీద బయటికి వచ్చిన బాధితురాలు చుట్టుపక్కల వారికి విషయం తెలిపింది. సమాచారం అందుకున్న ఐదో టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై సునీల్ ఘటనాస్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. నిందితులను త్వరలో పట్టుకుంటామన్నారు. -
నిజామాబాద్
వాతావరణం ఉదయం ఆహ్లాదకరంగా ఉంటుంది. ఆకాశం పాక్షికంగా మేఘావృతం అవుతుంది. అక్కడక్కడ ఓ మోస్తరు వర్షం కురిసే అవకాశాలున్నాయి. ఆర్చరీలో పతకాల.. కఠోర సాధన.. లక్ష్యంపై ఏకాగ్రతతో దోమకొండ ప్రాంతానికి చెందిన ఆర్చరీ క్రీడాకారులు పతకాలు సాధిస్తున్నారు.సోమవారం శ్రీ 3 శ్రీ ఆగస్టు శ్రీ 2026– 8లో uఅమ్మవార్లను దర్శించుకునేందుకు వచ్చిన భక్తజనంపోతరాజుల చిందులు.. శివసత్తుల పూనకాలు.. అమ్మవార్ల తొట్లెలు.. పులోరియా నినాదాల హోరు మధ్య సరిగుల్ల కోసం పోటాపోటీ.. కదిలొస్తున్న అమ్మను కళ్లారా చూసేందుకు వేల సంఖ్యలో వేచి ఉన్న జనం.. ఇదీ.. నిజామాబాద్ నగరంలో ఆదివారం నిర్వహించిన ఊర పండుగ సందడి. పిల్ల్లాపాపలను సల్లంగా చూడాలని, పాడిపంట సమృద్ధిగా ఉండాలని కోరుతూ అడుగడుగునా నగరవాసులు గ్రామదేవతలను కొలిచారు. నగరంలోని ఖిల్లా ప్రాంతంలో శారదాంబ గద్దె వద్ద అమ్మవార్లను ప్రతిష్టించి అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, సర్వసమాజ్ అధ్యక్షుడు యెండల లక్ష్మీనారాయణ, కార్యదర్శి బంటు రాజేశ్వర్, కోకన్వీనర్ అదె ప్రవీణ్, కార్పొరేషన్ డీసీసీ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ, నగర మేయర్ ఉమారాణి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఖిల్లా నుంచి డప్పుచప్పుళ్ల మధ్య బయల్దేరిన అమ్మవార్ల ముందు సరి గుల్ల ముందుకు సాగింది. కదిలొస్తున్న అమ్మవారిని చూస్తూ నగరవాసులు తన్మయత్వానికి లోనయ్యారు. – నిజామాబాద్ రూరల్ బందోబస్తును పర్యవేక్షిస్తున్న సీపీ సాయిచైతన్య, పోలీసు ఉన్నతాధికారులు -
గోదారి గట్టున షూటింగ్ సందడి
ఒక గుంతను తప్పిస్తే.. మరో గుంతఎన్హెచ్–44 పద్మాజివాడీ ఎక్స్ రోడ్డు నుంచి గాంధారి మీదుగా బాన్సువాడకు వెళ్లే ప్రధాన రహదారిపై భారీ గుంతలు వాహనదారులకు పరీక్ష పెడుతున్నాయి. ఒక గుంతను తప్పించబోతే ఇంకో గుంత తగులుతోంది. దీంతో ఆ రోడ్డుపై వెళ్లాలంటే సాహసం చేయాల్సిందే. పద్మాజివాడీ ఎక్స్ రోడ్డు నుంచి భూంపల్లి స్టేజీ వరకు అడుగడుగునా గుంతలు ఇబ్బంది పెడుతున్నాయి. దాదాపు గాంధారి వరకూ రోడ్డుపై ఏర్పడిన గుంతలతో వాహనాలు దెబ్బతింటున్నాయి. ప్రమాదాలూ చోటు చేసుకుంటున్నాయి. మరమ్మతులను అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదు. – సాక్షి ప్రతినిధి, కామారెడ్డి● ఎస్సారెస్పీ బ్యాక్ వాటర్ ప్రాంతంలో చిత్రీకరణ ● హీరో విశ్వక్సేన్ను చూసేందుకు ఎగబడిన జనండొంకేశ్వర్(ఆర్మూర్): గోదావరి అందాలు, ప్రకృతి సోయగాలకు కేరాఫ్ అడ్రస్‌గా ఉన్న ఎస్సారెస్పీ బ్యాక్‌వాటర్ ప్రాంతంలో సినిమా షూటింగ్ జరుగుతోంది. ప్రముఖ డైరెక్టర్ తరుణ్‌భాస్కర్ డైరెక్షన్లోహీరో విశ్వక్సేన్ నటిస్తున్న ‘ఈ నగరానికి ఏమైంది–2’ సినిమాను చిత్రీకరిస్తున్నారు. ఆదివారం బ్యా క్వాటర్ అందాలను తిలకించేందుకు వచ్చిన పర్యాటకులు క్యారవాన్లు, సినిమా సెట్టింగ్‌లను చూసి అక్కడికి పరుగులు తీశారు. విశ్వక్సేన్తో ఫొటోలు తీసుకునేందుకు ప్రయత్నించారు. సోమవారం సైతం పలు సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. ఫైనాన్స్, చిట్టీలు, రియల్టర్స్, బిల్డర్స్ అవతారమెత్తుతున్న కొందరు టీచర్లు ప్రయివేట్ స్కూళ్లు నిర్వహిస్తున్న మరికొందరు.. పట్టించుకోని జిల్లా విద్యాశాఖ -
ఎస్సారెస్పీలోకి కొనసాగుతున్న ఇన్‌ఫ్లో
● వారం రోజుల్లో 10 టీఎంసీలు.. ● 31.918 టీఎంసీల నీటి నిల్వ వేల్పూర్(మెండోరా): శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి ఎగువ ప్రాంతాల నుంచి ఇన్‌ఫ్లో కొనసాగుతోంది. ఆదివారం ఉదయం 47,391 క్యూసెక్కులు రాగా, రాత్రి సమయానికి 19,451 క్యూసెక్కులకు ఇన్‌ఫ్లో తగ్గి కొనసాగుతోంది. గత నెల 26వ తేదీన ప్రాజెక్టు నీటిమట్టం1069 అడుగులు (21.882 టీఎంసీలు) ఉండగా.. వారం రోజుల వ్యవధిలో 10 టీఎంసీల నీటిమట్టం పెరిగింది. ఆదివా రం రోజున ప్రాజెక్టులో 31.918 టీఎంసీల నీరు నిల్వ ఉంది. కాకతీయ కాలువకు 300 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తుండగా, మిషన్ భగీరథ అవసరాలకు 231 క్యూసెక్కుల నీటిని వినియోగిస్తున్నారు. ఆవిరి రూపంలో 291 క్యూసెక్కుల నీరు పోతోంది.నేటి నుంచి పీజీ సెమిస్టర్ పరీక్షలు తెయూ(డిచ్పల్లి): తెయూ పరిధిలోని పీజీ 4వ సెమిస్టర్ రెగ్యులర్, 1, 3వ సెమిస్టర్ బ్యాక్లాగ్ పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభమవుతాయని పరీక్షల నియంత్రణాధికారి సంపత్‌కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. పూర్తి వివరాలకు తెలంగాణ యూనివర్సిటీ వెబ్‌సైట్‌ను సంప్రదించాలని సూచించారు. మార్షల్ ఆర్ట్స్‌లో బంగారు పతకం కామారెడ్డి అర్బన్: కామారెడ్డి జీవదాన్ హైస్కూల్ 7వ తరగతి విద్యార్థి షేక్ అక్బరుద్దీన్ ఆదివారం హైదరాబాద్‌లో నిర్వహించిన రెండో ఇంటర్నేషనల్ మార్షల్ ఆర్ట్స్ చాంపియన్ షిప్–2026 పోటీల్లో కటా విభాగంలో బంగారు పతకం సాధించారు. అక్బరుద్దీన్ బంగారు పతకం సాధించడంపై కామారెడ్డి రాజీవ్‌నగర్‌కాలనీ డెవలప్మెంట్ కమిటీ ప్రతినిధులు తాజొద్దీన్, రాజు, మాలజంగం స్వామి, ఇమ్రత్ సింగ్ తదితరులు అభినందించారు. -
ఘనంగా సుదర్శన్‌రెడ్డి జన్మదిన వేడుకలు
● జిల్లాలో మొక్కలు నాటి కేక్‌లు కట్ చేసిన నాయకులుడిచ్పల్లి(నిజామాబాద్‌రూరల్): రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, బోధన్ ఎమ్మెల్యే పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి జన్మదిన వేడుకలను ఆదివారం జిల్లా లో ఘనంగా నిర్వహించారు. నిజామాబాద్ రూ రల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డితోపాటు డీసీసీ అధ్యక్షుడు కాటిపల్లి నగేష్‌రెడ్డి తదితరులు సుదర్శన్‌రెడ్డిని హైదరాబాద్‌లోని తన నివాసంలో కలిసి శుభాకాంక్షలు తెలిపారు. సుదర్శన్‌రెడ్డి ఆయురారోగ్యాలతో ఉంటూ ప్రజాసేవలో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. సుదర్శన్‌రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వారిలో ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్‌బిన్ హందాన్, గీత పారిశ్రామిక సహకార కా ర్పొరేషన్ చైర్మన్ శేఖర్‌గౌడ్, మాజీ విప్ ఈరవత్రి అనిల్, డీసీసీ మాజీ ప్రెసిడెంట్ మానాల మోహ న్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి, విజయ్‌పాల్ రెడ్డి, సుమన్ తదితరులు ఉన్నారు. -
మరో యూరియా యాప్!
డొంకేశ్వర్(ఆర్మూర్): ఎరువులను ఆన్లైన్లో బుక్ చేసుకునేందుకు మరో కొత్త యాప్ రైతుల ముందుకు రానుంది. ఎరువుల పంపిణీని డిజిటలైజ్ చేసే క్రమంలో ఈ నెల 6వ తేదీ నుంచి సరికొత్త యాప్‌ను ప్రవేశ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కస రత్తు చేస్తోంది. ఇప్పటి వరకు యూరియా బుకింగ్ కోసం వినియోగించిన ‘ఫెర్టిలైజర్ బుకింగ్ యాప్’ స్థానంలో... ఇకపై ‘ఫ్రేమ్‌వర్క్ ఫర్ ఫెర్టిలైజర్ సేల్’ (ఎఫ్ఎఫ్ఎస్) పేరుతో యాప్ అమల్లోకి రానుంది. మరో కొత్త విధానం వస్తుండడంపై క్షేత్ర స్థాయిలో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. త్వరలో అందుబాటులోకి రానున్న కొత్త యాప్‌లో రైతులకు మరిన్ని సేవలు లభించనున్నాయి. గతంలో ఉన్న యాప్‌లో కేవలం యూరియాను మాత్రమే బుక్ చేసేకునే వీలుండగా, కొత్త యాప్‌లో డీఏపీ, పొటాష్తోపాటు వివిధ రకాల కాంప్లెక్స్ ఎరువులను కూడా బుకింగ్ చేసుకునే అవకాశాన్ని కేంద్ర వ్యవసాయ మంత్రిత్వశాఖ కల్పిస్తోంది. దీని ద్వారానే రైతులు అన్ని రకాల ఎరువులు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. కొత్త యాప్ అందుబాటులోకి వచ్చిన వెంటనే పాత యాప్ సేవలను పూర్తిగా నిలిపివేసే అవకాశం ఉంది. ఈ రెండూ ఉంటేనే ఎరువులు ‘ఫ్రేమ్‌వర్క్ ఫెర్ట్టిలైజర్ సేల్’ పేరుతో రూపకల్పన ఈ నెల 6నుంచే అమలుకు కేంద్ర వ్యవసాయశాఖ కసరత్తు రైతు గుర్తింపు నంబర్ లేదా ఆధార్‌లింక్ మొబైల్ నంబర్ ఉంటేనే బుకింగ్ యూరియాతోపాటు డీఏపీ, కాంప్లెక్స్ ఎరువులకూ ఇదే విధానం కొత్త యాప్‌పై శిక్షణ ఇస్తాం పాత యాప్ స్థానంలోనే కేంద్ర ప్రభుత్వం కొత్త యాప్‌ను ఆగస్టు 6వ తేదీ నుంచి అమ లులోకి తెస్తోంది. ఇందులో యూరియాతోపాటు ఇతర ఎరువులు కూడా బుకింగ్ చేసుకోవచ్చు. యాప్ గురించి రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఫార్మర్ రిజిస్ట్రేషన్ లేదా ఆధార్ లింకై ఉన్న మొబైల్ నంబర్ ఉంటే సులభంగా బుకింగ్ చేసుకోవచ్చు. కొత్త యాప్ విధానంపై ఇదివరకే వ్యవసాయాధికారులకు అవగాహన కల్పించారు. త్వరలోనే డీలర్లకు, రైతులకు కూడా అవగాహన కల్పిస్తాం. – వీరాస్వామి, జిల్లా వ్యవసాయాధికారిఅమల్లోకి వచ్చే యాప్ ద్వారా ఎరువులు పొందాలంటనే ప్రతి రైతుకూ ‘ఫార్మర్ రిజిస్ట్రేషన్ నంబర్’ తప్పనిసరిగా ఉండాలి. ఈ నంబర్ ఆధారంగానే యాప్‌లో లాగిన్ కావాల్సి ఉంటుంది. ఒకవేళ ఫార్మర్ రిజిస్ట్రేషన్ నంబర్ లేకపోతే, రైతు ఆధార్ కార్డుతో లింక్ అయిన మొబైల్ నంబర్ తప్పనిసరిగా ఉండాలి. ఈ రెండింటిలో ఏది లేకపోయినా ఎరువులు బుకింగ్ చేసుకునే అవకాశం ఉండదు. అయితే, పాత యాప్ ద్వారా ఎకరానికి గరిష్టంగా రెండు బస్తాలే ఇవ్వగా, కొత్త యాప్‌లో ఎన్ని బస్తాలు ఇస్తారో అధికారిక సమాచారం లేకపోవడంతో రైతుల్లో కొంత ఆందోళన నెలకొంది. అలాగే పంటల సాగు సమయంలో కొత్త యాప్‌తో ఎరువులు సరిపడా అందుతాయో లేదోనని భయపడుతున్నారు. కాగా, సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన లేని సామాన్య రైతులకు యాప్‌లతో ఇబ్బందికరంగా మారిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
క్రైం కార్నర్
బస్సు ఢీకొని యువకుడి మృతి ఆర్మూర్‌టౌన్: ఆలూర్ మండల కేంద్ర శివారులో ఆర్టీసీ బస్సు, బైక్‌ను ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి మృతిచెందాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా.. మహారాష్ట్రలోని నాందెడ్ చెందిన గైక్వాడ్ రుషికేష్(22) దేగాంలో ఉంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈక్రమంలో శనివారం అతడు ఆలూర్‌లో పని ముగించుకొని బైక్‌పై తిరిగి దేగాంకు బయలుదేరాడు. ఆలూర్ శివారులో నందిపేట్ నుంచి ఆర్మూర్ వైపు వస్తున్న ఆర్టీసీ బస్సు ఎదురుగా వచ్చి బైక్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో రుషికేష్ తలకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడిక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. ఎస్‌హెచ్‌వో సత్యనారాయణ గౌడ్ మాట్లాడుతూ.. బస్సు డ్రైవర్ అతివేగం, నిర్లక్ష్యంగా నడపడం వల్లే ఘటన చోటు చేసుకున్నట్లు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడి కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌హెచ్‌వో పేర్కొన్నారు. ● ఒకరి మృతి, మరొకరి పరిస్థితి విషమం బోధన్‌రూరల్: బోధన్‌లో జరిగిన ఉర్సులో పాల్గొన్న ఇద్దరు యువకులు తిరిగి సొంతూరుకి వెళుతుండగా రోడ్డు ప్రమాదం జరగడంతో ఒకరు మృతిచెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. బోధన్ రూరల్ ఎస్సై రాజశేఖర్ తెలిపిన వివరాలు ఇలా.. మహారాష్ట్రలోని బిలోలి తాలూకా కార్ల గ్రామానికి చెందిన షేక్ అహ్మద్ (30) తన స్నేహితుడు పింజారి ఇర్ఫాన్ (22)తో కలిసి బోధన్‌లో జరిగిన ఉర్సులో శుక్రవారం పాల్గొన్నారు. తిరిగి బైక్‌పై అర్ధరాత్రి స్వగ్రామానికి బయలుదేరారు. సాలూర క్యాంపు సమీపంలో ఎదురుగా వస్తున్న మరో ద్విచక్ర వాహనం వీరిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరికీ తీవ్ర గాయాలు కాగా, వారిని వెంటనే బిలోలి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. షేక్ అహ్మద్ అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించగా, ఇర్ఫాన్ ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మృతుడి సోదరుడు షేక్ చాంద్ పాషా ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
ఊర పండుగకు సర్వం సిద్ధం
నిజామాబాద్ రూరల్: ఇందూరు నగరం నేడు నిర్వహించే ఊర పండుగకు ముస్తాబైంది. కులమతాలకు అతీతంగా నగరంలో ప్రతిఏటా నిర్వహించే ఈ పండుగకు ఎంతో ప్రత్యేకత ఉంది. ఆషాఢమాసంలో పౌర్ణమి తర్వాత వచ్చే ఆదివారం రోజు ఊరపండుగ నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. సుమారు 78 ఏళ్ల క్రితం నగరంలో కలరా, ప్లేగు వ్యాధులు ప్రబలడంతో తమను కాపాడాలంటూ ప్రజలు గ్రామదేవతలను ప్రతిష్టించి పూజలు చేశారు. వ్యాధులు తగ్గుముఖం పట్టడంతో అప్పటి నుంచి ప్రతియేటా భక్తిశ్రద్ధలతో ఊర పండుగను నిర్వహిస్తున్నారు. ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా ఊర పండగను ఘనంగా నిర్వహించేందుకు సర్వసమాజ్ ఏర్పాట్లు పూర్తి చేసింది. మున్సిపల్, పోలీసు శాఖలు సైతం తగిన ఏర్పాట్లు చేశారు. భారీ ఊరేగింపు.. ఊర పండుగలో భాగంగా అమ్మవార్ల ఊరేగింపులో నగరవాసులు భారీ సంఖ్యలో పాల్గొని, వారి ఆశీర్వాదం కోసం పూజిస్తారు. ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా బండారు పోసిన తర్వాత నగరంలోని నాకాశ్ గల్లీలో మామిడికర్రతో విగ్రహాలను సిద్ధం చేశారు. 44 కుల సంఘాలు పట్టిలు కట్టాయి. ఇతర సంఘల సైతం పండుగలో పాల్గొంటాయి. ఖిల్లా శారదాంబ గద్దె నుంచి ప్రారంభం కానున్న గ్రామదేవతల ఊరేగింపు పెద్దబజార్ చౌరస్తా వద్ద దుబ్బ, వినాయక్ నగర్, సిర్నాపల్లి గడి దిశగా విడి పోతుంది. గాజుల్ పేటలోని వివేకానంద చౌరస్తా వద్ద భారీ పోలీసు బందోబస్తు మధ్య సరి (ఇంటిపై చల్లుకునే పదార్థం) కోసం నగరవాసులు పోటీ పడుతారు. నగరంలో 12 గుడులు ఉండగా దుబ్బ ప్రాంతంలో రాట్నం, చక్రం, పెద్దమ్మ, పౌడటమ్మ, వినాయక్ నగర్లో మహలక్ష్మీ, ఐదు చేతుల పోచమ్మ, మత్తడి పోచమ్మ, సిర్నాపల్లి గడీ రోడ్డులో కొండల రాయుడు, బోగస్వామి, సమ్మక్క, సారక్క ఇలా మొత్తం 14 అమ్మవార్లు కొలువుదీరుతాయి. నేడు నగరంలో సర్వసమాజ్ ఆధ్వర్యంలో నిర్వహణ ఖిల్లా వద్ద ఉన్న శారదాంబ గద్దె నుంచి అమ్మవార్ల ఊరేగింపు పాల్గొననున్న అన్ని కుల సంఘాలు -
ప్రత్యేకం.. స్నేహితం
ఖలీల్‌వాడి: ప్రతి వ్యక్తికి అన్ని బంధాలను దేవుడిస్తే, స్నేహ బంధం మాత్రం మనమే ఏర్పాటు చేసుకుంటాం. రక్తసంబంధం కాకపోయినా, స్నేహితుడు ఉంటే కష్టమొచ్చిన, నష్టమొచ్చిన మన వెంటే ఉంటాడు. ప్రతి ఒక్కరి జీవితంలో స్నేహానికి ప్రత్యేక స్థానం ఉంటుంది. ఇలాంటి విలువలు ఇచ్చే స్నేహబంధానికి ప్రతీకగా ప్రతి యేటా ఆగష్టు మొదటి ఆదివారం స్నేహితుల దినోత్సవంగా నిర్వహిస్తా రు. ఈసందర్భంగా జిల్లా కేంద్రంలోని నిశిత డిగ్రీ కాలేజీలో శనివారం విద్యార్థులతో ‘సాక్షి’ టాక్‌షో నిర్వహించగా.. పలువురు విద్యార్థులు స్నేహం, స్నేహితులపై తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఈ రోజుల్లో ఫ్రెండ్షిప్ చాల డిఫరెంట్‌గా ఉంది. ఎప్పుడు ఎవరు ఎలా మారిపోతారో తెలియని పరిస్థితి. స్వార్థప్రయోజనాలకు స్నేహితుల మధ్య విభేధాలు వస్తాయి. చిన్ననాటి స్నేహం ఎప్పటికీ గుర్తుండిపోతుంది. తెలిసిన వారితోనే స్నేహం చేయాల్సి వస్తుంది. –సంజన, బీబీఏ సెకండియర్, నిజామాబాద్ స్నేహనికి విలువ కట్టలేమంటున్న యువత ఆన్లైన్ దోస్తీతో అప్రమత్తంగా ఉండాలని సూచన ‘సాక్షి’ టాక్ షోలో విద్యార్థుల అభిప్రాయం -
పొలాల్లో నిల్వ ఉన్న నీటిని తొలగించాలి
రుద్రూర్: ఇటీవల కురిసిన భారీ వర్షాలతో నీట మునిగిన వరి పొలాల్లో నీటిని వీలైనంత త్వరగా తొలగించాలని, పూర్తిగా కుళ్లిపోయిన మొక్కలను గుర్తించి తిరిగి నాటుకోవాలని వ్యవసాయ శాస్త్రవేత్తలు రైతులకు సూచించారు. రుద్రూర్ ప్రాంతీయ చెరుకు, వరి పరిశోధన కేంద్రం వ్యవసాయ శాస్త్రవేత్తలు సమతా పరమేశ్వరి, సాయిచరణ్, మంజు భార్గవి, రమ్య రాథోడ్ శనివారం కోటగిరి మండలం సైలంపూర్ గ్రామ శివారు, పోతంగల్ మండలం తిర్మలా పూర్ గ్రామశివారులో నీట మునిగిన పంట పొలాలను పరిశీలించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. రైతులకు యాజమాన్య సూచనలు చేశారు. ● వరి ఆకులు పసుపు రంగులోకి మారినట్లు గమనిస్తే 2 శాతం యూరియా లేదా 19:19:19 ఎరువును లీటరు నీటికి 5 గ్రాముల చొప్పున కలిపి పిచికారి చేయాలి. ● కాండం తొలిచే పురుగు నివారణకు నాట్లు వేసిన 25 రోజుల తర్వాత ఎకరాకు 10 కిలోల కార్బోఫ్యూరాన్ 3జీ వేయాలి, అలాగే ఎకరాకు 5–6 లింగాకర్షక బుట్టలను ఏర్పాటు చేసి పురుగుల ఉనికిని ఎప్పటికప్పుడు గమనించాలి. పురుగు ఉధృతి అధికంగా ఉంటే ఎకరాకు 400 గ్రాముల కార్టాప్ హైడ్రోక్లోరైడ్ లేదా 60 మిల్లీలీటర్ల క్లోరాంట్రానిలిప్రోల్‌ను పిచికారీ చేయాలి. ● బ్యాక్టీరియా ఎండాకు తెగులు లక్షణాలు కనిపించిన వెంటనే యూరియా వినియోగాన్ని నిలిపివేయాలి, వ్యాధి సోకిన మడి నుంచి కింది పొలాలకు నీరు వెళ్లకుండా చర్యలు తీసుకోవాలి. వ్యాధి ఉధృతి తగ్గించేందుకు ఎకరాకు 80 గ్రాముల ప్లాంటమైసిన్, 600 గ్రాముల కాపర్ ఆక్సీక్లోరైడ్‌ను పిచికారి చేయాలి. -
పంటపొలాల్లో కొండచిలువ ప్రత్యక్షం
రుద్రూర్: పోతంగల్ మండలం కారేగాం శివారులోని పంటపొలాల్లో శనివారం కొండచిలువ ప్రత్యక్షమవడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. పొలాలకు వెళ్లిన రైతులు భారీ కొండచిలువను గుర్తించి, అది జంతువును మింగినట్లు అనుమానించారు. విషయం గ్రామంలో వ్యాపించడంతో స్థానికులు అక్కడికి చేరుకున్నారు. జంతువును మింగిన కారణంగా కొండచిలువ కదలలేని స్థితిలో ఉండడంతో కొంతసేపు అదే ప్రాంతంలో కనిపించింది. దీంతో అడవికి సమీప ప్రాంతాల్లో సంచరించే సమయంలో అప్రమత్తంగా ఉండాలని స్థానికులు పేర్కొన్నారు. రుద్రూర్: మండలంలోని అక్బర్‌నగర్ సమీపంలో శనివారం బొలెరో వాహనం కల్వర్టును ఢీకొని బోల్తా పడింది. కర్ణాటక రాష్ట్రంలోని హున్నాబాద్ నుంచి బోధన్‌కు వెళ్తున్న బొలెరో కొరియర్ వాహనం ఉదయం వేళ ప్రమాదానికి గురైంది. ప్రమాదంలో డ్రైవర్ స్వల్ప గాయాలతో సురక్షితంగా బయటపడ్డాడు. రాత్రంతా నిరంతరాయంగా వాహనం నడపడంతో నిద్రమత్తులో కల్వర్టును గమనించకపోవడంతో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ప్రమాదంలో వాహనం దెబ్బతిన్నప్పటికీ ప్రాణనష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. -
సంకటాలు తొలగించే ‘చతుర్థి’
● ప్రతినెలా కృష్ణపక్షంలో నాలుగో రోజున వచ్చే పర్వదినం ● గణపతి పూజ, నోములు నిర్వహించనున్న మహిళలు ఆర్మూర్: సంకష్టహర చతుర్థినే సంకట హర చతుర్థి అని కూడా అంటారు. ప్రతినెలా కృష్ణపక్షంలో నాలుగో రోజున వచ్చే పర్వదినా న్ని సంకష్టహర చతుర్థిగా పిలుస్తా రు. ఈరోజున గణపతి పూజలు, నోములు నోచుకోవడం ఆనవాయితీగా వస్తోంది. వినాయక చవితి లాగానే ప్రతినెలాలో వచ్చే సంకష్టహర చతుర్థి రోజున ఈ వ్రతాన్ని జరుపుకోవడం వ ల్ల భరించలేని కష్టాలు, విఘ్నాలు, ఆటంకాలు తొ లగిపోతాయని, సుఖశాంతులు, సిరిసంపదలు పొందుతామని భక్తులకు నమ్మకం. అలాగే మంగళవారం వచ్చే ‘అంగారక చతుర్థి’ విశిష్టమైనదిగా భా విస్తారు. ఈ ఏడాది జనవరి, మే నెలలో మంగళవా రం వచ్చింది. సెప్టెంబర్ 29న మరోసారి మంగళవారం రానుంది. ఈరోజు ఉపవాసం ఉంటే 21 సంకష్ట చతుర్థులు చేసిన ఫలితం వస్తుందని నమ్ము తారు. ఎర్రని పువ్వులు, ఎర్రచందనంతో దైవాన్ని పూజిస్తే కుజదోషం పోతుందని పెద్దలు చెబుతారు. తెల్లవారుజామునుంచే.. మహిళలు ఈ రోజున తెల్లవారుజామునే లేచి ఇల్లు అలికి, వాకిలికి పసుపు రాసి, గడపకు మామిడాకుల తోరణం కడతారు. సూర్యోదయం నుంచి చంద్రోదయం వరకు ఉపవాసం. మధ్యాహ్నం గణపతి ప్రతిమను అలంకరించి, పూజలు చేస్తారు.‘ఉండ్రాళ్లు’ నైవేద్యంగా పెడతారు. కొన్ని చోట్ల గారెలు కూడా చేస్తారు. అనంతరం ‘సంకష్టహర గణపతి వ్రత కథ’ చదువుకుంటారు. కథ అయిపోయాక చంద్రుడి దర్శనం చేసుకొని, మహిళలు ఉపవాసం విరమిస్తారు.


