బాసరలో డీఎఫ్‌వో పూజలు | - | Sakshi
Sakshi News home page

బాసరలో డీఎఫ్‌వో పూజలు

Mar 9 2026 7:43 AM | Updated on Mar 9 2026 7:43 AM

బాసరలో డీఎఫ్‌వో పూజలు మహిళలు తమ సమస్యలపై పోరాడాలి మహిళలకు సమాన హక్కులు కల్పించాలి

బాసర: బాసర శ్రీజ్ఞాన సరస్వతి అమ్మవారిని నిజామాబాద్‌ డీఎఫ్‌వో వికాస్‌ కుటుంబ సమేతంగా ఆదివారం దర్శించుకున్నారు. ఆలయ ఇన్‌చార్జి ఈవో విజయరామారావు, ఏఈవో శ్రీనివాస్‌ స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనం అనంతరం చిన్నారికి అక్షర శ్రీకారం చేయించారు. వేద పండితులు వారిని ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందజేశారు.

నిజామాబాద్‌ రూరల్‌: మహిళలు తమ సమస్యలపై పోరాడాలని, ఉపాధికి దూరం చేసే విధానాలకు వ్యతిరేకంగా పోరాడాలని తెలంగాణ యూనివర్సిటీ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పిట్ల సరిత అన్నారు. నగరంలో కోటగల్లి నీలం రామచంద్రయ్య భవన్‌లో శ్రామిక అంతర్జాతీయ మహి ళా దినోత్సవ సభను ఆదివారం నిర్వహించా రు. సరిత మాట్లాడుతూ.. స్వాతంత్య్రం వచ్చి 78 ఏళ్లు దాటినా దేశంలో మహిళలపై వివక్షత ఇంకా కొనసాగుతోందని అన్నారు. సీపీఐ ఎంఎల్‌ న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఆకుల పాపయ్య మాట్లాడుతూ.. అంతర్జాతీయ యు ద్ధాలతో భారతదేశంలో గ్యాస్‌, పెట్రోల్‌, డీజల్‌ ధరలు పెరుగుతాయని, యుద్ధాలతో మానవాళికి నష్టం తప్ప ఉపయోగం లేదని అన్నారు. కార్యక్రమంలో నాయకులు భారతి,నీలం లక్ష్మి, సంజన, అనంత, లక్ష్మి, దేశెట్టి రాధ, ఆకుల స్వప్న, రేఖ, సురేఖ తదితరులు పాల్గొన్నారు.

నిజామాబాద్‌ రూరల్‌: మహిళలకు సమాన హ క్కులు కల్పించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వా లు విఫలమయ్యాయని సీఐటీయూ, ఏఐకేఎంఎస్‌, ఏఐఏడబ్ల్యూ, ఐద్వా, డీవైఎఫ్‌ఐ, ఎస్‌ఎఫ్‌ ఐ నాయకులు అన్నారు. జిల్లా కేంద్రంలోని సీ ఐటీయూ కార్యాలయంలో ప్రజాసంఘాల ఆ ధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జిల్లా సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కార్యదర్శి నూ ర్జహాన్‌, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కా ర్యదర్శి పెద్ది వెంకట్రాములు, ిసీఐటీయూ జి ల్లా ఉపాధ్యక్షుడు ఏ రమేశ్‌బాబు మాట్లాడుతూ.. అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్స వం వేడుక కాదు.. సుదీర్ఘ పోరాటాల ఫలితమ ని అన్నారు. కార్యక్రమంలో నాయకులు దేవేందర్‌ సింగ్‌,సిర్పలింగం,పీ స్వర్ణ, సుకన్య, సూ ర్యకళ, రేణుక, డీ రాములు, ఎస్‌కే ఇమామ్‌, నీలావతి, సరస్వతి తదితరులు పాల్గొన్నారు.

అన్ని రంగాల్లో

మహిళలు రాణించాలి

నిజామాబాద్‌ రూరల్‌: నగరంలోని ప్రెస్‌క్లబ్‌లో ఆదివారం సీపీఐఎంఎల్‌ ప్రతిఘటన పార్టీ అనుబంధ సంఘం ప్రగతిశీల మహిళా సంఘం ఆధ్వర్యంలో అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవం నిర్వహించారు. ప్రగతిశీల మహిళా సంఘం రెండు తెలుగు రాష్ట్రాల కార్యదర్శి బొనుగుల లలిత మాట్లాడుతూ.. మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని అన్నారు. కార్యక్రమంలో నాయకులు ఎస్‌కే సైదులు, బొంగుల లలిత, బెల్లడిగ సాయిలు, ప్రశాంత్‌, ఖాన్‌, జీవన్‌, ఎస్‌కే భానుబేగం తదితరులు పాల్గొన్నారు.

ఐక్యంగా పోరాడితేనే హక్కులు సాధ్యం

సిరికొండ: ఐక్యంగా పోరాడితేనే తమ హక్కుల ను సాధించుకోవడం సాధ్యమవుతుందని ప్రగ తిశీల మహిళా సంఘం జిల్లా ఉపాధ్యక్షురాలు వీ సత్తెవ్వ అన్నారు. మండలంలోని హుస్సేన్‌నగర్‌ గ్రామంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏర్పాటు చేసిన సమావేశంలో సత్తెవ్వ మాట్లాడుతూ.. మహిళా బిల్లును అమలు చేయడంలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని ఆరోపించారు. సమావేశంలో నాయకులు పిట్ల రమ, పుష్పలత, పద్మ, సునీత, లతిక, సావిత్రి, విజయ, అరుణ, ప్రవీణ, లత, మానస, సరిత, రాణి, జయంతి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement