వీబీజీ రాంజీ పథకాన్ని రద్దు చేయాలి | - | Sakshi
Sakshi News home page

వీబీజీ రాంజీ పథకాన్ని రద్దు చేయాలి

Mar 9 2026 7:43 AM | Updated on Mar 9 2026 7:43 AM

అలరించిన రోబోటిక్‌ ఎక్స్‌ పో

నిజామాబాద్‌ రూరల్‌: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వీబీజీ రాంజీ పథకాన్ని రద్దు చేయాలని సీపీఐఎంఎల్‌ మాస్‌లైన్‌ జిల్లా కార్యదర్శి వనమాల కృష్ణ, పీవోడబ్ల్యూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు వీ గోదావరి, కే సంధ్యారాణి డిమాండ్‌ చేశారు. అంతర్జాతీయ శ్రామిక మహిళా పోరాట దినోత్సవం సందర్భంగా ఆదివారం ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని కోటగల్లిలో సదస్సు నిర్వహించారు. పీవోడబ్ల్యూ జిల్లా ఉపాధ్యక్షులు నా గమణి, శకుంతల, సహాయ కార్యదర్శులు గౌరి, బిపాషా, నాయకులు జమున, నర్సక్క, అ మూల్య, ఆశలత, కీర్తి, అంబిక, మానస, పూజ, రెహా నా, విజయ, భూదేవి, సునీత, లక్ష్మి పాల్గొన్నారు.

ఖలీల్‌వాడి: నగరంలోని సెయింట్‌ జేవియర్స్‌ హైస్కూల్‌లో ఆదివారం రోబోటిక్‌ ప్రదర్శన నిర్వహించారు. ఈ ప్రదర్శనను సౌత్‌ ఎంఈవో సాయిరెడ్డి రోబోటిక్‌ ప్రదర్శనను తిలకించారు. విద్యార్థుల నుంచి రోబోటిక్‌తో వచ్చే లాభాలను అడిగి తెలుసుకున్నారు. భవిష్యత్తులో రోబోలు మానవులకు చాలా ఉపయోగపడుతుందని ఎంఈవో అన్నారు. రోబోటిక్‌ ప్రదర్శన చేసిన సెయింట్‌ జేవియర్స్‌ హైస్కూల్‌ యాజమాన్యాన్ని అభినందించారు. కార్యక్రమంలో పాఠశాల చైర్మన్‌ పాకాల నరసింహారావు, ప్రిన్సిపాల్‌ లతాగౌడ్‌, డైరెక్టర్‌ పుష్ప, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement