breaking news
Nizamabad District News
-
దశాబ్దాలైనా మారని దశ
కార్పొరేషన్‌గా మారి 20 ఏళ్లు.. ●● నిజామాబాద్ నగరంలో అమలవుతున్న 1972 మాస్టర్ ప్లాన్ ● ఫుట్‌పాత్‌లపై వ్యాపారం.. రోడ్లపై పార్కింగ్ ● అనుమతులు ఓ రకంగా.. నిర్మాణాలు మరో రకంగా.. ● రోజురోజుకూ తీవ్రమవుతోన్న ట్రాఫిక్ సమస్య ● ప్రభుత్వ స్థలాల్లో పార్కింగ్ చేస్తే సమస్యకు పరిష్కారం! ● కొత్త మాస్టర్‌ప్లాన్ అమలుకు నోచుకునేదెన్నడో..? -
ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి
నిజామాబాద్ సిటీ: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తు న్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని, ప్రతి కార్యకర్త పార్టీ సిద్ధాంతాలు, విధివిధానాలను కచ్చితంగా తెలసుకుని ముందుకు వెళ్లా లని జిల్లా ఇన్చార్జి మంత్రి ధనసరి అనసూయ (సీ తక్క) అన్నారు. ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ పార్లమెంట రీ విస్తృత స్థాయి సమావేశాన్ని నిజామాబాద్ డీసీ సీ అధ్యక్షుడు మానాల మోహన్‌రెడ్డి అధ్యక్షతన జి ల్లా కేంద్రంలోని ఈవీఎం గార్డెన్స్‌లో మంగళవారం నిర్వహించారు. నిజా మాబాద్, కామారెడ్డి, నిర్మల్, కోరుట్ల, జగిత్యాల, జుక్కల్‌ల నుంచి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీ లు, ఆయా కార్పొరేషన్ల చైర్మన్ లు, జిల్లా బాధ్యులు, పలు విభాగాలకు చెందిన నాయకులు హాజరయ్యారు. కార్యకర్తలనుద్దేశించి మంత్రి సీతక్క మాట్లాడుతూ.. సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన వేల కోట్ల రూపాయలతో సంక్షేమ పథకాలు విజయవంతంగా అమలుచేస్తున్నామన్నారు. కేవలం తొమ్మిదిరోజుల్లో రూ.9 వేల కోట్ల రూపాయల రైతుభరోసా ఇచ్చామన్నారు. సన్నబియ్యం ఇస్తున్న రాష్ట్రం దేశంలో కేవలం తెలంగాణ మాత్రమేనని పేర్కొన్నారు. రూ.21 వే కోట్ల రుణమాఫీ చేసిన ఘనత ప్రభుత్వానికి దక్కతుందని, అధికారంలోకి రాగానే 60 వేల ఉద్యోగాలు ఇచ్చామని గుర్తుచేశారు. 200 యూనిట్ల ఉచిత విద్యుత్, మహిళలకు ఉచిత బస్సు ప్రయా ణం వంటి పథకాలు విజయవంతంగా అమలు చేస్తున్నామని, నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరుచేశామని వివరించారు. ఇన్ని మంచి పథకాలు అమలు చేస్తున్నా.. వాటిని ప్రజలకు చేరవేయడంలో కార్యకర్తలు వెనుకబడి ఉన్నారన్నారు. ఈనెల 4న హైదరాబాద్‌లో నిర్వహించే కార్యకర్తల సదస్సుకు వేల సంఖ్యలో కార్యకర్తలు హాజరు కావాలని, ప్రతి గ్రామం నుంచి 500 మందిని తీసుకురావాలని పిలుపునిచ్చారు. సమావేశంలో ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, ఎమ్మెల్యేలు సుదర్శన్‌రెడ్డి, భూపతిరెడ్డి, మదన్మోహన్, డాక్టర్ సంజయ్, వెడ్మ బొజ్జు, లక్ష్మీకాంతారావు, ఎంపీ సురేశ్ షెట్కార్, మాజీ ఎమ్మెల్సీ జీవన్‌రావు , కార్పొరేషన్ల చైర్మన్లు ఈరవత్రి అని ల్, తాహెర్‌బిన్ హందాన్, మానాల మోహన్‌రెడ్డి, ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, ఏనుగు రవీందర్‌రెడ్డి, సునీల్‌రెడ్డి, వినయ్‌రెడ్డి, నిజామాబాద్ నగర కాంగ్రెస్ అధ్యక్షుడు, నుడా చైర్మన్ కేశ వేణు, నాయకులు రాంభూపాల్, విపుల్‌గౌడ్, బాడ్సి శేఖర్ గౌడ్, కేతావత్ యాదగిరి, నరాల రత్నాకర్ తదితరులు పాల్గొన్నారు. పార్టీ సిద్ధాంతాలు, విధివిధానాలను కార్యకర్తలు తెలుసుకోవాలి దేశంలో ఎక్కడాలేనన్ని సంక్షేమ పథకాలు ఇక్కడ అమలవుతున్నాయి.. క్షేత్రస్థాయిలో ప్రచారం చేయాలి జిల్లా ఇన్చార్జి మంత్రి ధనసరి అనసూయ (సీతక్క) -
నిజామాబాద్
బుధవారం శ్రీ 2 శ్రీ జూలై శ్రీ 2025జిల్లా కేంద్రమైన నిజామాబాద్ నగరం నలుదిశలా వేగంగా విస్తరిస్తోంది. ఎంత వేగంగా విస్తరిస్తోందో.. అంతే వేగంగా సమస్యలు పెరుగుతున్నాయి. రాష్ట్రంలోని ప్రముఖ నగరాల్లో ఒకటిగా గుర్తింపు ఉన్న నిజామాబాద్ నగరంలో ఐదు దశాబ్దాల క్రితం(1972) నాటి మాస్టర్ ప్లాన్ అమలులో ఉంది. 2018లో నూతన మాస్టర్ ప్లాన్‌ను రూపొందించినప్పటికీ దాని ప్రస్తావన ఎక్కడా లేకుండాపోయింది. నగర జనాభా రోజురోజుకూ పెరుగుతుండగా అందుకు అనుగుణంగా సౌకర్యాలు మాత్రం కనిపించడం లేదు. న్యూస్‌రీల్ -
ఆక్రమణలను తొలగిస్తాం
నగరంలో ఫుట్‌పాత్‌ల ఆక్రమణలను తొలగించాల్సిందే. పాదచారులకు ఇబ్బందులు కలిగించేవిధంగా ఫుట్‌పాత్‌ల మీద వ్యాపారాలు చేయడం నేరం. దుకాణదారులు తమ వాహనాలను సెల్లార్లలో పార్క్ చేసుకోవాలి. త్వరలోనే ప్రత్యేక టీమ్‌తో ఫుట్‌పాత్‌ల ఆక్రమణలు తొలగిస్తాం. ట్రాఫిక్ ఉండే ప్రాంతాల్లో తోపుడుబండ్లవారిని అనుమతించం. వారికి కేటాయించిన స్థలాల్లోమాత్రమే వ్యాపారాలు చేసుకోవాలి. బల్దియా తరఫున పెయిడ్ పార్కింగ్ ఏర్పాటును కూడా పరిశీలిస్తున్నాం. – దిలీప్ కుమార్, మున్సిపల్ కమిషనర్ -
అవసరం మేరకే ఎరువులు తీసుకోవాలి
ఇందల్వాయి: యూరియాతో సహా అన్ని ఎరువుల నిల్వలు సరిపడా అందుబాటులో ఉన్నాయని, రైతులు ప్రస్తుత అవసరం మేరకే ఎరువులను కొనుగోలు చేసుకోవాలని కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి అన్నారు. ముందస్తుగా నిల్వ చేసుకోవద్దని సూచించారు. ఇందల్వాయి మండల కేంద్రంలో కలెక్టర్ మంగళవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. తహసీల్ కార్యాలయంతోపాటు రేషన్ షాపు, ఎరు వుల దుకాణం, గ్రామీణ పశు వైద్యశాలను సందర్శించి పని తీరును పరిశీలించారు. ముందుగా తహసీల్ కార్యాలయాన్ని సందర్శించిన కలెక్టర్ భూ భారతి రెవెన్యూ సదస్సుల ద్వారా అందిన దరఖాస్తుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. మొత్తం 3480 దరఖాస్తులు అందాయని తహసీల్దార్ వెంకట్రావు తెలుపగా.. దరఖాస్తుదారులకు రసీదులు అందించారా అని కలెక్టర్ ఆరా తీశారు. అనంతరం 12 నంబర్ రేషన్ దుకాణాన్ని తనిఖీ చేశారు. లబ్ధిదారులకు మూడు నెలలకు సంబంధించి సన్నబియ్యం పంపిణీ పూర్తయ్యిందా అని డీలర్‌ను ప్రశ్నించగా, జూన్ నెలాఖరునాటికే పూర్తి చేశామని ఆయన సమాధానమిచ్చారు. అక్కడి నుంచి ఎరువుల పంపిణీ కేంద్రానికి చేరుకొని స్టాక్‌ను పరిశీలించారు. ఎరువుల కొనుగోలు కోసం వచ్చిన రైతులతో మాట్లాడారు. అవసరమైన ఎరువులు సక్రమంగా అందుతున్నాయా అని ప్రశ్నించగా రైతులు అందుతున్నాయని సమాధానమిచ్చారు. అక్కడి నుంచి గ్రామీణ పశు వైద్యశాలకు చేరుకున్న కలెక్టర్.. భవనాన్ని పరిశీలించారు. అవసరమైన మరమ్మతులు చేయించాలని పశువైద్యుడు గంగాప్రసాద్‌కు సూచించారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ వెంకట్రావు, మండల వ్యవసాయ అధికారి శ్రీకాంత్ తదితరులున్నారు. అందుబాటులో యూరియా సహా ఇతర ఎరువులు ఇందల్వాయిలో కలెక్టర్ వినయ్‌కృష్ణారెడ్డి రేషన్ దుకాణం, ఎరువుల పంపిణీ కేంద్రం, పశువైద్యశాల సందర్శన భూభారతి దరఖాస్తులపై ఆరా -
నేను వీసీ మనిషిని..
● తెయూలో ఓ అధికారి ఇష్టారాజ్యం ● డబ్బులు దండుకునేందుకు దొంగ లెక్కలు ● సహచర సిబ్బందికి వేధింపులు విచ్చలవిడిగా అడ్వాన్సులు.. ఇటీవల జరిగిన కళాశాల వార్షికోత్సవంలోనూ నాలుగు ఫ్లడ్‌లైట్లు, సౌండ్ సిస్టమ్ ఏర్పా టు చేయించి ఏకంగా రూ.2.35 లక్షల బిల్లు క్లెయి మ్ చేయడంతోపాటు నిర్వహణ ఖర్చుల కింద మరో రూ.40 వేల బిల్లు పెట్టినట్లు విశ్వసనీయ సమాచారం. మే నెలలో మహనీయుల జయంతి పేరుతో ఆయా అధికారులకు నిర్వహణ బాధ్యతలను అప్పగించినప్పటికీ సదరు అధికారి తానే అజమాయిషీ చెలాయించాడనే విమర్శలు ఉన్నా యి. మహనీయుల జయంతి సందర్భంగా మహి ళా, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సెల్లు ఏర్పాటు చేసే కార్యక్రమాలకు తానే వర్సిటీ నుంచి డ బ్బులు తీసుకునందుకు చేసిన ప్రయత్నం బెడిసికొట్టినట్లు సమాచారం. ఇప్పటికే కీలక పదవిలో ఉన్న ఆయనకు ఇటీవల వసతిగృహాల అదనపు బాధ్యతలు అప్పగించారు. సంబంధిత విభాగంలో విచ్చలవిడిగా అడ్వాన్సులు తీసుకుంటున్న ట్టు తెలిసింది. వీసీ మనిషి కావడంతో ఎవ్వరు కూడా అభ్యంతరం చెప్పలేని పరిస్థితి. ముగ్గురు బోధనేతర మహిళా సిబ్బందిని సదరు అధికారి వేధిస్తున్నట్లు సమాచారం. ఆ ముగ్గురు ఉద్యోగులు రిజిస్ట్రార్‌ను కలువగా, తానేమీ చేయలేనని, వీసీని కలవాలని సూచించినట్లు సమాచారం. ఇదిలా ఉండగా వీసీని కలిసి ఫిర్యాదు చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో సదరు అధికారి మరింత విచ్చలవిడిగా వ్యవహరిస్తున్నారనే చర్చ వర్సిటీలో సాగుతోంది. సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: ‘నేను వీసీ మనిషిని.. నన్ను ఆపేదెవరు..’ అంటూ తెలంగాణ యూనివర్సిటీలో ఓ అధికారి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తు న్నాని విద్యార్థి సంఘాల నాయకులు ఆగ్రహం వ్య క్తం చేస్తున్నారు. ఏ చిన్న అవకాశం దొరికినా లెక్క ల్లో గోల్మాల్ చేస్తూ డబ్బులు నొక్కేస్తున్నాడని, వైస్ ఛాన్స్లర్ ఎదుట మాత్రం ‘ఎస్ బాస్’ అన్నట్లుగా వ్యవహరిస్తూ సహచర సిబ్బందిని మాత్రం వేధిస్తున్నాడని విద్యార్ధి నాయకులు అంటున్నారు. మే 3వ తేదీన ‘నీట్ యూజీ’ ఆన్లైన్ పరీక్ష నిర్వహించగా, యూనివర్సిటీ కళాశాలతోపాటు వర్సిటీలోని మరో కళాశాలతో కలిపి రెండు పరీక్ష కేంద్రాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) కేటాయించింది. ఈ కేంద్రాల్లో దాదాపు 1,100 మంది అభ్యర్థులను కేటాయించారు. ఈ పరీక్ష కేంద్రాలకు సదరు అధికారిని, మరో కళాశాలకు అతడి సన్నిహితుడిని సూపరింటెండెంట్లుగా నియమించారు. పరీక్ష నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా స్టేషన రీ ఖర్చులు, తాగునీరు, శానిటైజేషన్, నంబర్లు వేయడం వంటి పనులకు, సంబంధిత సబ్ స్టాఫ్‌కు చెల్లించేందుకు అదనంగా పరీక్ష కేంద్రం నిర్వహణ కోసం ఒక్కో అభ్యర్థికి రూ.60 చొప్పున పరీక్ష తేదీకి వారం రోజులు ముందుగానే ఎన్టీఏ చెల్లించింది. రెండు పరీక్ష కేంద్రాల్లో పనిచేసిన సిబ్బందికి ఎన్టీఏ నిర్ణయించిన మొత్తాన్ని ఇవ్వలేదనే ఆరోపణలు వస్తున్నాయి. అయితే తాను వీసీ మనిషిని అని సదరు అధికారి చెబుతుండడంతో సిబ్బంది మిన్నకుండి పోయారని సమాచారం. ఇదిలా ఉంటే యూనివర్సిటీకి చెల్లించాల్సిన రూ.66వేలను సైతం గుట్టుచప్పుడు కాకుండా నొక్కేసినట్లు తెలుస్తోంది. పరీక్ష పూర్తయిన వెంటనే రిజిస్ట్రార్ అకౌంట్లో జమ చేయాల్సిన ఆ మొత్తాన్ని జేబులో వేసుకున్నట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. అయితే 2009లో ఆచార్య లింబాగౌడ్ ప్రిన్సిపల్‌గా ఉన్నప్పటి నుంచి ఇప్పటివరకు బయటి సంస్థలు ఎలాంటి పరీక్షలు జరిగినా సెంటర్ నిర్వహణ కోసం నిర్దేశిత మొత్తాన్ని నిర్వహణ ఖర్చుల కోసం యూనివర్సిటీ అకౌంట్లో జమ చేసే అనవాయితీ పాటిస్తూ వస్తున్నారు. -
కార్పొరేషన్ కహానీ–1
సుభాష్‌నగర్: నిజామాబాద్ నగరం మున్సిపల్ కార్పొరేషన్ హోదా దక్కించుకుని 20 ఏళ్లు గడుస్తున్నా నగరవాసులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు మాత్రం అలానే ఉన్నాయి. కార్పొరేషన్ స్థాయిలో పన్ను వసూలు చేస్తున్నా సౌకర్యాలు మాత్రం అధ్వానంగా ఉన్నాయి. ముఖ్యంగా రోడ్లు, ఫుట్‌పాత్‌లు, ట్రాఫిక్ సమస్య ప్రజలను తీవ్రంగా వెంటాడుతోంది. పెద్దపెద్ద వ్యాపార సముదాయాలకు అనుమతులు ఒక రకంగా తీసుకుంటూ మరో రకంగా నిర్మాణాలు చేపట్టడమే ఇందుకు కారణమవుతోంది. కొన్ని చోట్ల ఫుట్‌పాత్‌లపై వ్యాపారాలు చేస్తుండగా, మరికొన్ని చోట్ల వాహనాలు పార్కింగ్ చేస్తున్నారు. నిజామాబాద్ నగరంలో సుమారు ఐదు లక్షల మంది నివసిస్తుండగా, వివిధ ప్రాంతాల నుంచి పనుల నిమిత్తం ప్రతిరోజూ వేల సంఖ్యలో వస్తూవెళ్తుంటారు. ప్రస్తుతం నిజామాబాద్‌లో 1972 మాస్టర్ ప్లాన్ అమలవుతోంది. చాలా ప్రాంతాల్లో రోడ్లు చిన్నగా ఉండగా, విస్తరణ కోసం ప్రజాప్రతినిధులు, అధికార యంత్రాంగం 20 ఏళ్లుగా ఎలాంటి చొరవ తీసుకోకపోవడం, గడిచిన 15 ఏళ్లలో వాహనాల వినియోగం విపరీతంగా పెరగడంతో ట్రాఫిక్ సమస్య రోజురోజుకూ తీవ్రమవుతోంది. టౌన్ ప్లానింగ్ బాధ్యత మరిచిందా? నగరంలో నిత్యం వందల సంఖ్యలో నూతన నిర్మాణాలు చేపడుతున్నారు. ముఖ్యంగా వ్యాపార సముదాయాలు ఉన్న ప్రాంతాల్లో భవనాల నిర్మా ణాల విషయంలో టౌన్ ప్లానింగ్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అనుమతుల ఓ రకంగా.. నిర్మాణాలు మరో రకంగా ఉంటున్నాయంటూ ఫిర్యాదులు అందుతూనే ఉన్నాయి. అయితే ఆ ఫిర్యాదులు అధికారులకు కాసులు కురిస్తున్నాయని, తూతూ మంత్రంగా తనిఖీలు చేపట్టి చేతులు దులుపుకుంటున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. సెల్లార్లు నిర్మిస్తున్నా.. వాటిని ఇతర అవసరాలకు వాడుతున్నారనేది బహిరంగ రహస్యం. ఇళ్ల నిర్మాణాలను క్షుణ్ణంగా పరిశీలించే అధికారులు.. వ్యాపార సముదాయాల విషయంలో మాత్రం ఎందుకంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనేది ప్రశ్నార్థకంగా మారింది. మాస్టర్ ప్లాన్ కోసం ఎదురుచూపులు నగరంలో కొత్త మాస్టర్ ప్లాన్ అమలైతే అనేక సౌకర్యాలు ప్రజలకు అందుబాటులోకి వస్తాయి. ముఖ్యంగా విశాలమైన రోడ్లు, పార్కులు అందుబాటులోకి వస్తాయి. మాస్టర్ ప్లాన్ అమలైతే ట్రాఫిక్ సమస్యకు కొంతవరకు పరిష్కారం లభిస్తుంది. వ్యాపార సముదాయాలున్న ప్రాంతాల్లోని ప్రభుత్వ స్థలాల్లో పార్కింగ్ (టెండర్) ఏర్పాటు చేస్తే ఫుట్‌పాత్‌లపై వాహనాల పార్కింగ్‌కు అవకాశం ఉండదు. అదేవిధంగా వ్యాపార సముదాయాల నిర్మాణం విషయంలో టౌన్ ప్లానింగ్ అధికారులు నిక్కచ్ఛిగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వన్ వేలు చేయడం, వీధి వ్యాపారాలను కంట్రోల్లో ఉంచడం, అక్రమ పార్కింగ్‌లపై స్పెషల్ డ్రైవ్ చేపట్టడం వంటి వాటితో ట్రాఫిక్, ఫుట్‌పాత్ సమస్యను చెక్ పెట్టొచ్చని నగరవాసులు అంటున్నారు.ఫుట్‌పాత్‌ను ఆక్రమించి వ్యాపారం.. రోడ్డుపై పార్కింగ్..రాజీవ్‌గాంధీ ఆడిటోరియం రోడ్డులో ట్రాఫిక్ -
సంఘ సభ్యుడి మృతి: ఆర్థికసాయం అందజేత
డిచ్పల్లి: తమ సంఘంలోని సభ్యుడు మృతిచెందగా, బాధిత కుటుంబానికి ఆర్థికంగా చేయూతనందించడానికి రూ.3.10లక్షల నగదును అందించింది బహ్రెయిన్ సంఘం. మండలంలోని ఖిల్లా డిచ్పల్లి గ్రామానికి చెందిన పట్నం చిన్న లక్ష్మణ్ గతంలో బతుకుదెరువు కోసం బహ్రెయిన్ దేశానికి వెళ్లాడు. అక్కడ గ్రామానికి చెందిన వలస కార్మికులతో కలిసి బహ్రెయిన్ సంఘం ఏర్పాటు చేసుకున్నారు. ప్రతినెలా డబ్బు జమ చేస్తూ, సంఘ సభ్యుల్లో అవసరమైన వారికి ఇచ్చేవారు. సంఘ సభ్యుడిగా ఉన్న లక్ష్మణ్ కరోనా సమయంలో స్వగ్రామానికి వచ్చి, లాక్డౌన్ వల్ల తిరిగి వెళ్లలేకపోయాడు. ఈక్రమంలో అనారోగ్యంతో మృతిచెందాడు. దీంతో అతడి కుటుంబాన్ని ఆదుకోవడానికి సంఘం సభ్యులందరు జమ చేసిన రూ.3.10 లక్షల నగదు మంగళవారం లక్ష్మణ్ భార్య విజయకు అందించారు. -
విధుల్లో చేరిన డీపీఎంలు
డొంకేశ్వర్(ఆర్మూర్): ఐకేపీలో బదిలీలు పూర్తి చేసుకున్న డీపీఎంలు వారికి కేటాయించిన ప్రాంతాలకు వెళ్లి విధుల్లో చేరారు. వేరే జిల్లాల నుంచి మన జిల్లాకు వచ్చిన మోహన్‌కు మార్కెటింగ్, రాజేశ్వర్‌కు పెన్షన్, కిరణ్‌కు ఫైనాన్స్ సెక్షన్లు ఇచ్చారు. అలాగే మన జిల్లాలోనే ఉన్న డీపీఎంలు నీలిమాకు ఐబీ, రాచయ్యకు జీవనోపాధుల విభాగాలను కేటాయించారు. విధుల్లో చేరి సెక్షన్ల బాధ్యతలు చేపట్టిన డీపీఎంలు మంగళవారం డీఆర్డీవో సాయాగౌడ్‌ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. ఈసందర్భంగా డీఆర్డీవో డీపీఎంలకు శుభాకాంక్షలు తెలిపారు. బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించాలని, ఎలాంటి ఫిర్యాదులు రాకుండా పని చేయాలని వారికి సూచించారు. -
వ్యవసాయంలో ‘డ్రోన్’ సాయం
బాల్కొండ: వ్యవసాయ రంగంలో విప్లవాత్మకమైన మార్పులు రావడంతో అంతా యాంత్రికమైంది. అందులో భాగంగా పంటల్లో గడ్డి మందు, పురుగు మందు పిచికారి కోసం డ్రోన్ పంపులను వినియోగిస్తున్నారు. డ్రోన్ పంపు ధర రూ. 5 లక్షల వరకు ఉంటుంది. పది నిమిషాల వ్యవధిలో ఎకరం పంటలో మందును పిచికారి చేస్తుంది. వ్యవసాయంలో డ్రోన్ సాయంతో మందుల పిచికారి ఎంతో సొంపుగా ఉంటుందని రైతులు పేర్కొంటున్నారు. ఎకరానికి రూ. 500 తీసుకుని పంపు స్ప్రే చేస్తున్నారు. మందు కూడా పూర్తి స్థాయిలో వినియోగం జరుగుతుందని అంటున్నారు. డ్రోన్ ద్వారా స్ప్రే చేయడం వల్ల శ్రమ తగ్గడంతో పాటు ధర కూడ తక్కువే అవుతుందని రైతులు పేర్కొంటున్నారు. -
సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి
నిజామాబాద్‌అర్బన్: మైనారిటీల అభ్యున్నతి కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అర్హులైన వారందరూ సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర మైనార్టీ కమిషన్ చైర్మన్ తారిఖ్ అన్సారీ అన్నారు. నిజామాబాద్ నగరానికి మంగళవారం ఆయన విచ్చేయగా, వివిధ శాఖల అధికారులు పుష్పగుచ్ఛాలు అందించి స్వాగతం పలికారు. అనంతరం ఆయన ఆర్అండ్బీ అతిథిగృహంలో కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డితోపాటు ఇతర జిల్లాల అధికారులతో భేటీ అయ్యారు. జిల్లాలో మైనారిటీ వర్గాల స్థితిగతుల గురించి అడిగి తెలుసుకున్నారు. అన్సారీ మాట్లాడుతూ.. మైనారిటీల కోసం ఉద్దేశించిన సంక్షేమ, అభివృద్ధి పథకాల గరించి అవగాహన కల్పించేందుకు విస్తృత ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులకు సూచించారు. అనంతరం మైనారిటీ వర్గాల నుంచి కమిషన్ చైర్మన్ వివిధ సమస్యలపై వినతులు స్వీకరించారు. నిజామాబాద్ ఆర్డీవో రాజేంద్రకుమార్, జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారిణి కృష్ణవేణి, తదితరులు పాల్గొన్నారు. -
నాటి మా రాముని పల్లెనే.. నేటి మారంపల్లి
మీకు తెలుసా? గోదావరి సమీపంలో ఉన్న మారంపల్లికి తెలుసుకోదగిన చరిత్ర ఉంది. రాముడు గంగానది వెంట పరిక్రమణ చేసినట్లు స్థల పురాణం ఉంది. ఎస్సారెస్పీలో ముంపునకు గురైన పాత కుస్తాపురం శివలింగాన్ని స్వయంగా రాముడే ఇసుకతో తయారు చేసినట్లు చరిత్ర ఉంది. రాముడు తిరిగిన నేల కావడంతో ఆయనపై ప్రేమతో ‘మా రాముని పల్లె’గా నామకరణం చేశారు. కాలక్రమేనా అది మారంపల్లిగా మారింది. ● సుమారు 300 ఏళ్ల క్రితం మా రాముని పల్లెను స్థాపించుకున్నారు. మొదట ఇక్కడ 15 నుంచి 20 ఇళ్లు మాత్రమే ఉండేవి. ప్రస్తుతం 660 వరకు ఉన్నాయి. వ్యవసాయ భూములు కలుపుకొని ఊరి పూర్తి విస్తీర్ణం సుమారు 1,150 ఎకరాలు. ● ఊరిలో ఒకప్పుడు పెద్ద గడీ ఉండేది. ఈ గడీ గుండానే అప్పటి రాజులు, దొరలు పాలించేవారు. గడీ కూలిపోయి చాలా సంవత్సరాలు అవుతుంది. ● గ్రామానికి నలుదిక్కులా ఆరు చెరువులు ఉన్నాయి. వాటి పేర్లు సత్తర్‌కుంట, నాంకుంట, చించెరు, పెద్దచెరు, బందం కుంట, కమ్మరి కుంట. వీటిని ఇప్పటికీ ఇలాగే పిలుస్తున్నారు. వానాకాలంలో ఇవి పూర్తిగా నిండి ఊరు ఒక ద్వీపం మాదిరిగా కనిపిస్తుంది. ● ఊరు కళాకారులకు నిలయమని చెప్పవచ్చు. అప్పట్లో నాటకాలు వేయడంలో ప్రసిద్ధులు. నేటి తరం దానిని అందిపుచ్చుకుని ఇప్పుడు భజనలు, కీర్తనలు చేస్తున్నారు. ● 1959లో ఊరిలో ప్రభుత్వ పాఠశాల ఏర్పాటు కాగా, 1966లో గ్రామానికి మొదటి సర్పంచ్‌గా కృష్ణారెడ్డి పనిచేశారు. – డొంకేశ్వర్(ఆర్మూర్) -
పరీక్ష ఫీజు చెల్లించండి
తెయూ(డిచ్పల్లి): తెలంగాణ విశ్వవిద్యాలయ పరిధిలో బీఈడీ, బీపీఎడ్ రెండో, నాల్గో సెమిస్టర్ రెగ్యులర్ (2024–25), బ్యాక్ లాగ్ (2021 విద్యా సంవత్సరం) 1, 2, 3, 4 సెమిస్టర్ పరీక్ష ఫీజును ఈనెల 14వరకు చెల్లించాలని కంట్రోలర్ సంపత్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. రూ. 100 అపరాధ రుసుంతో ఈనెల 15 వరకు ఫీజు చెల్లించే అవకాశం ఉంటుందని కంట్రోలర్ తెలిపారు. పూర్తి వివరాల కోసం తెలంగాణ వర్సిటీ వెబ్‌సైట్‌ను సంప్రదించాలని సూచించారు రాష్ట్రస్థాయి ఫుట్‌బాల్ టోర్నమెంట్ విజేత రంగారెడ్డి● రన్నర్‌గా నిజామాబాద్ ● విజేతలకు ట్రోఫీ ప్రదానం చేసిన సీపీ సాయి చైతన్య నిజామాబాద్ నాగారం/ఖలీల్‌వాడి: జిల్లాకేంద్రంలోని రాజారాం స్టేడియంలో నాలుగు రోజులుగా సాగిన రాష్ట్రస్థాయి ఫుట్‌బాల్ టోర్నమెంట్ పోటీలు మంగళవారం ముగిశాయి. పోటీల్లో వి జేతగా రంగారెడ్డి జిల్లా జట్టు నిలువగా, రన్నర్‌గా నిజామాబాద్ జట్టు నిలిచింది. ముగింపు కార్యక్రమానికి సీపీ సాయిచైతన్య ముఖ్య అతిథిగా హాజరై, విజేతలకు బహుమతులు ప్రదానం చేశా రు. ఈసందర్భంగా సీపీ మాట్లాడుతూ.. ఆటలో గెలుపు ఓటములు సహజమని, క్రీడా స్ఫూర్తితో ఆడాలన్నారు. విన్నర్, రన్నర్ టీమ్‌లను అభినందించారు. ఫుట్‌బాల్ అసోసియేషన్ ప్రతినిధులు, జావిద్, కరీం, ఒలింపిక్ సంఘం ప్రతినిధులు బొబ్బిలి నర్సయ్య, కోచ్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు. -
భూ సేకరణ, చెల్లింపులు వేగవంతం చేయాలి
● అభివృద్ధి పనుల్లో జాప్యం జరగొద్దు ● కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి నిజామాబాద్‌అర్బన్: జిల్లాలో చేపట్టే రోడ్ల విస్తరణ, ఇతర అభివృద్ధి పనుల్లో జాప్యం జరగొద్దని, ఇందుకోసం భూ సేకరణ ప్రక్రియ, చెల్లింపులు త్వరితగతిన జరిగేలా చూడాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి అధికారులను ఆదేశించారు. నగరంలోని ఐడీవోసీ సమావేశ హాల్లో మంగళవారం వివిధ శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. బోధన్–బాసర్–భైంసా రోడ్డు నిర్మాణానికి సేకరించిన భూమికి సంబంధించిన చెల్లింపులు త్వరితగతిన జరిగేలా చూడాలన్నారు. అలాగే ఇతర అభివృద్ధి పనుల కోసం భూసేకరణ ప్రక్రియకు సంబంధించి రైతులతో సంప్రదింపులు జరుపుతూ, నష్టపరిహారం నిర్ణయంలో సానుకూల ధోరణిని అవలంభించాలని సూచించారు. నిబంధనలకు అనుగుణంగా వ్యవహరిస్తూ, భూసేకరణపై పెండింగ్‌లో ఉన్న అప్పీల్లను వేగంగా పరిష్కరించాలని అన్నారు. వారం అనంతరం భూసేకరణపై మళ్లీ సమీక్ష చేస్తామని, స్పష్టమైన ప్రగతి కనిపించాలని సూచించారు. అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో, నిజామాబాద్, ఆర్మూర్ ఆర్డీవోలు రాజేంద్ర కుమార్, రాజాగౌడ్, ఎస్సారెస్పీ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రాజేందర్, కలెక్టరేట్ పర్యవేక్షకుడు భాస్కర్ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు. -
ఒకరి ఆత్మహత్య
వర్ని: మోస్రా మండలం చింతకుంట గ్రామంలో ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ నాంపల్లి రాములు(53) మంగళవారం ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు వర్ని ఎస్ఐ మహేష్ వెల్లడించారు. రాములు మృతికి గల కారణాలు తెలియరాలేదని అతడి తల్లి పోశవ్వ ఫిర్యాదులో పేర్కొంది. ఈమేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు. గుర్తుతెలియని వ్యక్తి మృతి ఖలీల్‌వాడి: నగరంలోని పులాంగ్ వాగు వద్ద గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందినట్లు నాలుగో టౌన్ ఎస్సై శ్రీకాంత్ మంగళవారం తెలిపారు. స్థానికుల సమాచారం మేరకు ఘటన స్థలానికి వెళ్లి, వివరాలు సేకరించారు. మృతుడు చిత్తు కాగితాలు ఏరుకునే వ్యక్తిగా కనిపిస్తున్నట్లు తెలిపారు. గత కొద్దిరోజులుగా ఇక్కడే చుట్టుపక్కల తిరుగుతూ రోడ్డుపై పడుకుంటున్నట్లు పేర్కొన్నారు. మృతుడి వయస్సు సుమారు 55 నుంచి 60 ఏళ్ల మధ్య ఉండొచ్చని భావిస్తున్నారు. అతడు బ్రౌన్ కలర్ నైట్ ప్యాంట్ ధరించాడని, ఎవరికై నా తెలిసినట్లయితే పోలీస్ స్టేషన్లో గాని, 8712659840, 8712659719ను సంప్రదించాలని సూచించారు.గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం కామారెడ్డి క్రైం: కామారెడ్డి రైల్వే స్టేషన్ మూడో ప్లాట్‌ఫాం పక్కనే ఉన్న ఓ గుంతలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. స్థానికులు మంగళవారం మృతదేహాన్ని గుర్తించి, పోలీసులకు సమాచారం అందించగా, పట్టణ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ జరిపారు. మృతుడి వద్ద ఎలాంటి ఆధారాలు లభించలేదు. అతడి వయస్సు 30–40 ఏళ్ల మధ్య ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. మృతుడు నలుపు, తెలుపు రంగుల పూల షర్టును ధరించాడన్నారు. మృతదేహాన్ని కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. మృతుడి ఆనవాళ్లు తెలిసిన వారు పట్టణ పోలీసులను సంప్రదించాలని ఎస్‌హెచ్‌వో నరహరి కోరారు. డ్రంకన్‌డ్రైవ్ కేసులో పలువురికి జైలు ఖలీల్‌వాడి: నిజామాబాద్ డివిజన్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధుల్లో ఇటీవల డ్రంకన్‌డ్రైవ్ తనిఖీలు నిర్వహించగా, 17మంది మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడ్డట్లు ఏసీపీ రాజావెంకట్ రెడ్డి తెలిపారు. వారికి మంగళవారం సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులు కౌన్సెలింగ్ నిర్వహించి, జిల్లా కోర్టులో హాజరుపరిచినట్లు పేర్కొన్నారు. మేజిస్ట్రేట్ నూర్జహాన్ బేగం వారిలో ఆరుగురికి జరిమానా వేయగా, ఆరుగురికి ఒక రోజు, ఐదుగురికి రెండు రోజుల జైలు శిక్ష విధించారు. నవీపేట: నవీపేట శివారులో పోలీసులు ఇటీవల డ్రంకన్‌డ్రైవ్ తనిఖీలు నిర్వహించగా ఓ వ్యక్తి మద్యం తాగి వాహనం నడుపుతూ పట్టుబడ్డాడు. పోలీసులు అతడిపై కేసు నమోదు చేసి, మంగళవారం నిజామాబాద్ కోర్టులో హాజరుపర్చారు. జడ్జి అతడికి 7రోజుల జైలుశిక్ష విధించారు. మోత్కూర్ పోలీసుల అదుపులో జిల్లా వృద్ధుడు ఖలీల్‌వాడి: నిజామాబాద్ జిల్లాకు చెందిన వృద్ధుడు యాద్రాది జిల్లా మోత్కూర్ పోలీసుల అదుపులో ఉన్నట్లు నాలుగో టౌన్ ఎస్సై శ్రీకాంత్ మంగళవారం తెలిపారు. నిజామాబాద్‌కు చెందిన దండు గోవర్ధన్(60) అనే వృద్ధుడు మోత్కూర్‌లో సంచరిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన వ్యక్తి కావడంతో ఇక్కడి పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు తెలిపారు. ఇతని వివరా లు తెలిసినవారు మోత్కూర్ పీఎస్ 70970 52763 లేదా నాలుగో టౌన్ పోలీసులు 87126 59840, 8712659719ను సంప్రదించాలన్నారు. -
ఉచిత శిక్షణ.. ఉపకార వేతనం
నందిపేట్: పేద విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు తన మేధాశక్తిని పంచుతూ స్టడీ మెటీరియల్‌ను అందిస్తున్నాడు నందిపేట్ మండలం లక్కంపల్లికి చెందిన సౌదారి సాగర్. గత 15 ఏళ్లుగా 76 మంది పేద విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు పునాదులు వేశాడు. ప్రతి ఏడాది కేంద్ర ప్రభుత్వం నేషనల్ మీన్స్ మెరిట్ స్కాలర్షిప్ (ఎన్ఎంఎంఎస్) పేరిట ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద పిల్లలకు ఉపకార వేతనాలు అందిస్తుంది. 8వ తరగతి అర్హత సాధిస్తే ఇంటర్ వరకు నాలుగేళ్ల పాటు నెలకు రూ. వెయ్యి ఉపకార వేతనం అందిస్తుంది. ఇలా ఒక్కో విద్యార్థికి రూ. 48 వేలు ఆర్థిక సహాయం అందుతుంది. అత్యంత కీలకమైన పది, ఇంటర్ చదువులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ సాయం ఆసరా అవుతుంది. కాగా ఇందుకుగాను ఎన్ఎంఎంఎస్ పరీక్షలో మంచి మార్కులు సాధిస్తే ఉపకార వేతనాలకు ఎంపికవుతారు. 15 ఏళ్లుగా శిక్షణ.. ప్రభుత్వ పాఠశాలలో విద్యనభ్యసించే విద్యార్థులు పడుతున్న కష్టాలను స్వయంగా అనుభవించిన సాగర్ వారిలో ఉత్సాహం, ఉత్తేజం నింపేందుకు వారి తల్లిదండ్రులు ప్రోత్సహించేలా వెన్నుతట్టాడు. ప్రభుత్వ పాఠశాలలో చదివే పేద విద్యార్థులకు చేతనైనంత సాయం చేయాలని భావించిన సాగర్ గత 15 ఏళ్లుగా 2009 నుంచి ఉచితంగా ఎన్ఎంఎంఎస్ పరీక్షలకు విద్యార్థులకు సన్నద్ధం చేసేందుకు బోధించడం మొదలుపెట్టాడు. ఉన్నంతలో పుస్తకాలు, స్టడీ మెటీరియల్ అందించి విద్యాభివృద్ధికి కృషి చేస్తున్నాడు. కీలకమైన మేధానైపణ్యంపై దృష్టిపెట్టి శిక్షణ అందిస్తూ వారిని ముందుకు నడిపిస్తున్నాడు. ఇలా ఇప్పటి వరకు 76 మంది విద్యార్థులు ఎన్ఎంఎంఎస్ ప్రతిభా పరీక్షకు ఎంపికయ్యారు. వారంతా ఇప్పుడు ఐఐటీ, ఐఐఐటీల్లో చదువుతున్నారు. ఎన్ఎంఎంఎస్ కోసం విద్యార్థులకు శిక్షణ పదిహేను ఏళ్లుగా ఉదారంగా సేవలందిస్తున్న సౌదారి సాగర్పేద విద్యార్థుల కోసం.. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు హైస్కూల్, ఇంటర్ స్థాయిలో ఆర్థికపరమైన ఇబ్బందులతో అనేక మంది చదువుకు దూరమవుతున్నారు. కేంద్రం అందించే ఉపకార వేతనం అందితే వారికి ఎంతో చేయూత కలుగుతుందని భావించాను. నాకున్న ఖాళీ సమయాన్ని వారి కోసం వినియోగిస్తున్నాను. – సౌదారి సాగర్, లక్కంపల్లి, నందిపేట -
నత్తనడకన బదిలీలు.. నిరాశలో సెర్ప్ సిబ్బంది
డొంకేశ్వర్(ఆర్మూర్): సెర్ప్ ఉద్యోగుల బదిలీల ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. బదిలీల జీవో వచ్చి రెండు నెలలు దాటినా ప్రక్రియను పూర్తిచేయకుండా రాష్ట్ర శాఖ అధికారులు సాగదీస్తున్నారు. కేవలం ఏపీడీ, డీపీఎంల బదిలీలను నిర్వహించిన ఉన్నతాధికారులు ఏపీఎంలు, సీసీలు, ఇతర ఉద్యోగుల విషయంలో నాన్చుతున్నారు. దీంతో పక్షం రోజుల్లో పూర్తయ్యే బదిలీలకు నెలలు గడుస్తున్నాయని సిబ్బంది వాపోతున్నారు. జిల్లాలో సుమారు 200 మంది.. గ్రామీణాభివృద్ధి శాఖలో ఐకేపీ ఉద్యోగులకు గత ప దేళ్లుగా బదిలీలు లేవు. రాష్ట్ర ఉన్నతాధికారులపై ఒ త్తిడి పెట్టి ఇటీవల ఏపీడీ, డీపీఎంలు బదిలీలు పూర్తి చేసుకున్నారు. మండల స్థాయిలో పని చేసే ఏపీఎంలు, సీసీలు స్థానచలనం కోసం ఆప్షన్లు పెట్టుకుని బది లీల కోసం వేచి చూస్తున్నారు. జిల్లాలో బదిలీల కో సం వేచి చూస్తున్న ఏపీఎంలు 30మంది, సీసీలు 165 వరకు ఉండగా ఇతర సిబ్బంది 10మంది ఉన్నారు. ఈ నెలాఖరు నాటికి సెర్ప్‌లో అన్ని కేడర్ ఉద్యోగుల బదిలీలు పూర్తి కావాల్సి ఉండగా, ఉన్నతాధికారులు సాగదీయడం పట్ల ఏపీఎంలు, సీసీలు అసంతృప్తిగా ఉన్నారు. బదిలీలు ఆలస్యమైతే స్థానిక సంస్థల ఎలక్షన్ కోడ్ వచ్చే అవకాశముందని భయపడుతున్నారు. అదే జరిగితే రాకరాక వచ్చిన అవకాశం ఎక్కడ చేజారిపోతుందని వారు ఆందోళన చెందుతున్నారు. జిల్లాకు చేరని సీనియారిటీ లిస్టు.. ఏపీఎంలు, సీసీల బదిలీలకు సంబంధించిన ప్రక్రియ ఇంకా ముందుకు కదల్లేదు. జిల్లాలో పని చేస్తున్న వారందరి సీనియారిటీ లిస్టును రాష్ట్ర అధికారులు తెప్పించుకున్నారు. దానిని పరిశీలించి జిల్లాకు పంపాల్సి ఉంది. కానీ, సీనియారిటీ జాబితా ఇంత వరకు జిల్లాకు రాలేదు. జోనల్ స్థాయి ప్రకారమా? లేదా జిల్లా స్థాయా? ఎలా నిర్ణయించి జాబితాను పంపుతారానేది స్పష్టత లేదు. జిల్లా కలెక్టర్‌కు లిస్టు అందిన తర్వాత ఏపీఎంలు, సీసీలకు బదిలీలకు కౌన్సెలింగ్ చేపట్టనున్నారు. ఇదంతా జరిగే సరికి మరో పదిహేను రోజులు పట్టే పరిస్థితి కనిపిస్తోంది. ఎన్నికల కోడ్ రాకముందే తమ బదిలీలు కూడా పూర్తి చేయాలని వారు ఉన్నతాధికారులను కోరుతున్నారు. జీవో వచ్చి రెండు నెలలు దాటినా పూర్తికాని ప్రక్రియ ఎక్కడ ఎలక్షన్ కోడ్ వస్తుందోనని భయం -
డబుల్ ఇంజిన్ సర్కార్‌తో లాభం లేదు
జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్కకు ఘన స్వాగతంమోపాల్: నగరంలో నిర్వహించిన నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గస్థాయి సమావేశానికి హాజరైన జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్కకు మంగళవారం రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి, పీసీసీ డెలిగేట్, నిర్మల్ జిల్లా పరిశీలకులు బాడ్సి శేఖర్‌గౌడ్ ఘన స్వాగతం పలికారు. ఈసందర్భంగా ఆమెను శాలువాతో సన్మానించారు.నిజామాబాద్ సిటీ: ఇటీవల జిల్లాకు వచ్చిన కేంద్ర హోంమంత్రి అమిత్‌షా డబుల్ ఇంజిన్ సర్కార్ వ స్తుందని మాట్లాడుతున్నారని, డబుల్ ఇంజిన్ స ర్కార్తో ఏమీ లాభం లేదని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ అన్నారు. నగరంలో మంగళవారం ని ర్వహించిన ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ పార్లమెంటరీ వి స్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. బీ జేపీ పాలిత రాష్ట్రాల్లో ఎలాంటి అభివృద్ధి లేదన్నా రు. తెలంగాణలో అమలు చేస్తున్న సంక్షేమ పథ కాలు డబుల్ ఇంజిన్ సర్కార్ ఉన్న రాష్ట్రాల్లో ఎందు కు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. రేషన్ దు కాణాల్లో మోదీ బొమ్మ పెట్టాలనడం అర్థరహితమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకా లు అమలుచేస్తున్నా, వాటిని క్షేత్రస్థాయిలో ప్రచా రం చేయడంలో మాత్రం వెనుకబడి ఉన్నామన్నా రు. ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ మాట్లాడుతూ.. రా బోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చా టాలన్నారు. విభేదాలు పక్కనపెట్టి అంతా కలిసి మెలిసి పనిచేయాలన్నారు. ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి మా ట్లాడుతూ.. పాత, కొత్త తేడా లేకుండా కార్యర్తలు, నాయకులు కలిసిమెలిసి పనిచేయాలన్నారు. బోధ న్ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ.. సీఎం రే వంత్‌రెడ్డి అమలుచేస్తున్న పథకాలు చూసి బీఆర్ఎ స్ నాయకులు అసూయపడుతున్నారన్నారు. రూర ల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి మాట్లాడుతూ.. పసుపు బోర్డుతో కాకుండా, మద్దతు ధర లభించినప్పుడే పసుపు రైతుల కళ్లల్లో ఆనందం వస్తుందన్నారు. కార్యక్రమంలో జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కార్ తదితరులు మాట్లాడారు. ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ నగరంలో ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ పార్లమెంటరీ విస్తృత స్థాయి సమావేశం -
ప్రభుత్వ టీచర్లు అంకితభావంతో పనిచేయాలి
నిజామాబాద్‌అర్బన్: ప్రభుత్వ బడుల్లో నిష్ణాతులైన ఉపాధ్యాయులు ఉన్నారని, వారు అంకితభావంతో విధులు నిర్వర్తిస్తూ నాణ్యమైన విద్యను బోధిస్తే మరింత మెరుగైన ఫలితాలు సాధించవచ్చని బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అన్నారు. నగరంలోని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో సోమవారం పదో తరగతిలో అత్యుత్తమ మార్కులు సాధించి, టాపర్లుగా నిలిచిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు జిల్లా విద్యా శాఖ ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా విద్యార్థులను ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి, కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి సన్మానించారు. అలాగే వంద శాతం ఉత్తీర్ణత సాధించిన పల్లికొండ, డొంకేశ్వర్, రాంపూర్, మెండోరా, అమ్రాద్, చౌట్పల్లి, జక్రాన్‌పల్లి, మోస్రా, కల్లెడి, రెంజల్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులను కూడా సత్కరించారు. ప్రభుత్వ బడుల్లో అత్యధికంగా విద్యార్థులను చేర్పించిన బోర్గం(పి) హైస్కూల్, బోధన్ రాకాసిపేట్ బాలికల ఉన్నత పాఠశాల, చిట్టాపూర్ ప్రైమరీ స్కూల్, తుంపల్లి ప్రైమరీ స్కూల్, ఫులాంగ్ బాలుర ఉచ్ఛతర ప్రాథమిక పాఠశాలల హెచ్ఎంలను సత్కరించారు. సోమవారం పదవీ విరమణ చేసిన ముగ్గురు ఎంఈవోలు, ముగ్గురు హెచ్ఎంలను సన్మానించి వీడ్కోలు తెలిపారు. రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్‌బిన్ హందాన్, రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్‌రెడ్డి, రాష్ట్ర వ్యవసాయ, రైతు కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి, అదనపు కలెక్టర్ అంకిత్, డీఈవో అశోక్ తదితరులు పాల్గొన్నారు. -
రెండే గదుల్లో నాలుగు తరగ తులా..?
నిజామాబాద్ లీగల్: ఒకటి నుంచి నాలుగో తరగతి వరకు రెండే తరగతి గదుల్లోనే పాఠశాల నిర్వహిస్తున్నారా అని సీనియర్ సివిల్ జడ్జి ఉదయ్ భాస్కర్ రావు ఉపాధ్యాయులను ప్రశ్నించారు. సోమవారం నగరంలోని ధర్మపురిహిల్స్‌లో ఉన్న ప్రాథమిక పాఠశాలను జడ్జి తనిఖీ చేశారు. పాఠశాల ఆవరణలో ఖాళీ బీరు బాటిల్స్, పాన్ పరాగ్ లాంటి వస్తువులు ఉండటం గమనించారు. రాత్రి వేళల్లో అసాంఘిక శక్తులకు పాఠశాల అడ్డాగా మారకుండా చూడాలని ఉపాధ్యాయులకు సూచించారు. రాత్రి వేళ పోలీసులు పెట్రోలింగ్ చేసేలా ఆదేశాలు జారీ చేస్తామని, హెచ్ఎం పోలీసులకు ఫిర్యాదు చేయాలని జడ్జి సూచించారు. -
పోచంపాడ్‌లో పిచ్చికుక్కల స్వైర విహారం
బాల్కొండ: మెండోరా మండలం పోచంపాడ్‌లో సోమవారం ఉదయం పిచ్చి కుక్కలు స్వైర విహారం చేశాయి. గ్రామంలో వీధుల గుండా కనిపించిన వారిపై దాడి చేశాయి. దీంతో ముగ్గురుకి తీవ్ర గాయాలయ్యాయి. గ్రామానికి చెందిన రజిత చేతిపై, విఠల్, విష్ణులకు కంటి, కాలి భాగాలపై దాడి చేసి గాయపర్చాయి. వెంటనే స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి చికిత్స అందించారు. పోచంపాడ్‌లో వీధి కుక్కులు ఎక్కువ కావడంతో కనిపిస్తే కరుస్తున్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డీఎస్ విగ్రహావిష్కరణలో దొంగల చేతివాటంనిజామాబాద్ రూరల్: కంఠేశ్వర్ బైపాస్ సిగ్నల్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన డీఎస్ విగ్రహావిష్కరణలో కేంద్ర మంత్రి అమిత్‌షా చేతుల మీదుగా జరిగిన విషయం తెలిసిందే. ఈ ఆవిష్కరణలో మారుతినగర్‌కు చెందిన ప్రభుత్వ ఉద్యోగి కాసుల రఘు, అలాగే బాశెట్టి గంగాధర్‌కు చెందిన బంగారు గొలుసులను గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించినట్లు రూరల్ ఎస్‌హెచ్‌వో ఆరిఫ్ తెలిపారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. అంతర్జిల్లా దొంగల ముఠా రిమాండ్● 12 తులాల బంగారం, బైక్ స్వాధీనం వేములవాడ: వరుస దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్జిల్లా దొంగల ముఠాను రిమాండ్‌కు తరలించినట్లు వేములవాడ పోలీసులు సోమవారం తెలిపారు. వేములవాడ టౌన్ పీఎస్‌లో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎస్పీ మహేశ్ బీ గీతే వివరాలు వెల్లడించారు. జగిత్యాల జిల్లాకు చెందిన బోదాసు మహేశ్ నిజామాబాద్ జిల్లాకు చెందిన గద్దల స్వప్న, విశాల్‌సింగ్, జగిత్యాల జిల్లాకు చెందిన నేరెళ్ల శ్రీనివాస్, నేరెళ్ల రాణి, గోత్రాల బాలమణి ముఠాగా ఏర్పడి ఆర్మూర్, నిజామాబాద్, వేములవాడ, కోనరావుపేట, బోయినపల్లి ప్రాంతాల్లో గత రెండు నెలలుగా దొంగతనాలకు పాల్పడ్డారు. టెక్నాలజీ సాయంతో వీరు వేములవాడ సమీపంలో తిప్పాపూర్ బస్టాండ్ ప్రాంతంలో అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 12 తులాల బంగారం, ఒక బైక్‌ను స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు. దొంగలను పట్టుకున్న వేములవాడ టౌన్ సీఐ వీరప్రసాద్, ఎస్సైలు అనిల్‌కుమార్, వెంకట్రాజం, సిబ్బంది గోపాల్, పంతులు, లత, సాహెబ్ హుస్సేన్, దేవేందర్, సమియుద్దీన్‌ను అభినందించారు. నలుగురు కానిస్టేబుళ్లకు పదోన్నతిఖలీల్వాడి: నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని నలుగురు కానిస్టేబుళ్లకు హెడ్ కానిస్టేబుళ్లలుగా పదోన్నతి పొందారు. పదోన్నతి పొందిన కానిస్టేబుళ్లు ఎండీ తయ్యబ్ అలీ(మోర్తాడ్), ఈ ఈశ్వర్(ఇందల్వాయి), పి రాకేశ్(నిజామాబాదు రూరల్), ఎన్ వెంకట్ రామ్(సీసీఎస్, నిజామాబాద్) సీపీ సాయిచైతన్యను సోమవారం సీపీ కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిశారు. అనంతరం సీపీ సిబ్బందిని అభినందించారు. -
ప్రజావాణి అర్జీలను పరిష్కరించాలి
నిజామాబాద్‌అర్బన్: ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమంలో వచ్చే ఫిర్యాదులకు త్వరగా పరిష్కరించాలని కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి అధికారులను ఆదేశించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 127 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్‌తో పాటు, అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, ట్రెయినీ కలెక్టర్ కరోలిన్ చింగ్తియాన్ మావీ, డీఆర్డీవో సాయాగౌడ్, నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, మెప్మా పీడీ రాజేందర్‌కు అర్జీలను సమర్పించారు. అర్జీలను పెండింగ్‌లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఫిర్యాదులపై చేపట్టిన చర్యలను వివరిస్తూ అర్జీదారులకు సమాచారం అందించాలన్నారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్ వినయ్‌కృష్ణారెడ్డి -
నీవు లేని జీవితం నాకొద్దని..
వర్ని: ప్రేమతో వారిద్దరి మనసులు కలిశాయి. వివాహ బంధంతో ఒక్కటయ్యారు. జీవితాంతం ఒకరికొకరు కష్టసుఖాల్లో తోడునీడగా ఉండాలని భావించారు. కానీ విధి ఆడిన వింత నాటకంలో భార్య ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా ఆమె మృతుని తట్టుకోలేని భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన వర్ని మండలం వడ్డేపల్లిలో సోమవారం చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. రుద్రూర్ మండలం అంబం గ్రామానికి చెందిన ఎరుకల పోశెట్టి(25) వడ్డేపల్లిలో ఉండే తన బంధువుల ఇంట్లో చిన్న నాటి నుంచి ఉంటున్నాడు. అదే గ్రామానికి చెందిన అనితను ఆరు నెలల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరి జీవితం సాఫీగా సాగుతుందనుకుంటున్న సమయంలో ఇటీవల ఆమె అనారోగ్యంతో మృతి చెందింది. ఆమె మృతిని తట్టుకోలేని పోశెట్టి తన ఇంటి సమీపంలోని చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి అన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మహేశ్ తెలిపారు. భార్య మృతి తట్టుకోలేక భర్త ఆత్మహత్య -
చేపల వేటకు వెళ్లి ఒకరి మృతి
బోధన్‌రూరల్: మండలంలోని బండార్పల్లికి చెందిన సాయికుమార్(28) చేపల వేటకు వెళ్లి ప్రవమాదవశాత్తు వల చుట్టుకుని నీటి మునిగి మృతిచెందినట్లు బోధన్ రూరల్ ఎస్సై మచ్చేందర్ రెడ్డి సోమవారం తెలిపారు. మృతుడి భార్య అనురాధ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. మృతుడికి భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. అర్గుల్‌లో ఒకరి అదృశ్యంజక్రాన్పల్లి: మండలంలోని అర్గుల్‌లో నివాసముంటున్న లింగంపేట గ్రామానికి చెందిన కొరబోయిన అశోక్ అనే వ్యక్తి అదృశ్యమైనట్లు ఎస్సై మాలిక్ రహమాన్ తెలిపారు. ఈ నెల 28న రాత్రి 9 గంటలకు జక్రాన్పల్లిలోని తన స్నేహితుడిని కలిసి వస్తానని చెప్పి బైక్‌పై వెళ్లిన అతను తిరిగి ఇంటికి రాలేదు. దీంతో కుటుంబీకులు పలుచోట్ల గాలించినా ఆచూకీ లభించలేదు. అశోక్ తండ్రి ప్రభురాజ్యం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
మొక్కలు నాటి వాటిని సంరక్షించాలి
డిచ్పల్లి: పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నివారణ కోసం ప్రతి ఒక్కరూ తమ ఇంటి వద్ద 6 మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని డిచ్పల్లి ఎంపీడీవో బుక్య లింగం నాయక్ సూచించారు. సోమవారం మండలంలోని ఘన్పూర్ గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో పలువురు మహిళలకు మొక్కలు అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ.. గ్రామ పంచాయతీ నర్సరీలో 10వేల మొక్కలు ఉండగా అందులో గ్రామంలోని ఇంటికి 6 మొక్కల చొప్పున 6,626 మొక్కలు పంపిణి చేస్తున్నట్లు తెలిపారు. మిగిలిన గ్రామాల్లో ఇలాగే ఇంటికి ఆరు మొక్కలు పంపిణీ చేయాలని ఆయన సూచించా రు.ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి రమే ష్,సిబ్బంది,మహిళలు తదితరులు పాల్గొన్నారు. -
అన్ని వర్గాల అభ్యున్నతికి కృషి
నిజామాబాద్ రూరల్: అన్ని వర్గాల అభ్యున్నతికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని రూరల్ ఎమ్మెల్యే రేకులపల్లి భూపతి రెడ్డి అన్నారు. సోమవారం నగరంలోని రూరల్ ఎమ్మెల్యే కాంపు కార్యాలయంలో ఎమ్మెల్యేను జక్రాన్‌పల్లి మండల రజక సంఘ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శాలువా, పుష్పగుచ్ఛంతో సన్మానించారు. మండలంలోని అర్గుల్ గ్రామంలో చాకలి ఐలమ్మ విగ్రహ ఆవిష్కరణకు రావాలని వారు ఎమ్మెల్యేను ఆహ్వానించారు. కార్యక్రమంలో రజకసంఘం మండల అధ్యక్షుడు చిన్నరెడ్డి, ఉపాధ్యక్షుడు సుధాకర్, సభ్యులు ప్రభాకర్, గంగాధర్, నారాయణ, జైపాల్. మైపాల్, రాజు, శివకుమార్, శ్రీనివాస్, స్వామి, నాగరాజ్, తదితరులు పాల్గొన్నారు. -
జీపీ నిర్మాణ పనులకు భూమిపూజ
డిచ్పల్లి: డిచ్పల్లి మండలం అమృతాపూర్ గ్రామంలో నూతన గ్రామ పంచాయతీ భవన నిర్మాణ పనులకు సోమవారం మండల కాంగ్రెస్ అధ్యక్షుడు అమృతాపూర్ గంగాధర్ భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా గంగాధర్ మాట్లాడుతూ.. ప్రస్తుతం ఉన్న జీపీ భవనం శిథిలావస్థకు చేరుకోవడంతో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి నూతన భవనం నిర్మాణం కోసం రూ.20లక్షలు నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. భవన నిర్మాణ పనులను నాణ్యతతో చేపట్టాలని కాంట్రాక్టర్‌కు సూచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు శ్యాంసన్, ధర్మాగౌడ్, గంగాధర్‌గౌడ్, నర్సయ్య, బాలయ్య, కృష్ణ, పీఆర్ ఏఈ శ్రీధర్, పంచాయతీ కార్యదర్శి భూలక్ష్మి, గ్రామపెద్దలు తదితరులు పాల్గొన్నారు. -
సంక్షిప్తం
బెస్ట్ అవైలబుల్ స్కీం బకాయిలను విడుదల చేయాలి నిజామాబాద్‌అర్బన్: జిల్లావ్యాప్తంగా బెస్ట్ అవైలబుల్ స్కీం బకాయిలను విడుదల చేయాలని యుఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి పెద్ద సూరి ఒక ప్రకటనలో రాష్ట్ర ప్రభుత్వాన్ని డి మాండ్ చేశారు. ఎస్సీ, ఎస్టీ పేద విద్యార్థులకు చేయూతనందించడానికి తెచ్చిన ఈ పథకానికి నిధులు రాకపోవడంతో వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. రాష్ట్ర ప్రభు త్వం స్పందించి వెంటనే నిధులను విడుదల చేయాలన్నారు. సారంగపూర్ చక్కెర ఫ్యాక్టరీ తెరిపించాలి నిజామాబాద్ సిటీ: రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సారంగాపూర్‌లోని సహకార చక్కెర ఫ్యాక్టరీని వెంటనే తెరిపించాలని చెరుకు ఉత్పత్తిదారుల సంఘం కన్వీనర్ ఆకుల పాపయ్య డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలో సోమవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాకు ఇటీవల ఎన్సీఎస్ఎఫ్ సారంగాపూర్ చక్కెర ఫ్యాక్టరీని తెరిపించాలని రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి వినతిపత్రం ఇవ్వడం అభినందనీయమన్నారు. కేంద్ర ప్రభుత్వం చెరుకుకు టన్నుకు రూ.4వేల ధర ప్రకటించి రైతులను ప్రోత్సహించాలన్నారు. ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షుడు వేల్పూర్ భూమయ్య, నాయకులు కొట్టె గంగాధర్, మురళి తదితరులు పాల్గొన్నారు. కొనసాగుతున్న వారాహిమాత నవరాత్రి ఉత్సవాలు నిజామాబాద్ రూర ల్:నగరంలోని అ మ్మ వెంచర్లో గల వారాహిమాత ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నా యి. సోమవారం భక్తులు అమ్మవారికి ప్రత్యేక పూజలు ని ర్వహించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ మంచాల జ్ఞానేంద్ర గుప్తా భక్తులు పాల్గొన్నారు. 6న ఆర్యవైశ్య సంఘం ఎన్నికలు నిజామాబాద్‌నాగారం: నగరంలోని శివాజీనగర్‌లోగల వైశ్య ఉన్నత పాఠశాల మాణిక్‌భవన్‌లో ఈనెల 6న ఆర్యవైశ్య సంఘం అధ్యక్ష, కార్యవర్గ ఎన్నికలు నిర్వహించనున్నట్లు అధ్యక్ష అభ్యర్థి అర్వపల్లి పురుషోత్తం గుప్తా అన్నారు. నగరంలోని ప్రెస్‌క్లబ్‌లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పట్టణంలోని ఆర్యవైశ్యులంతా తనకు మద్దతు తెలిపి, ఓటు వేయాలని, అలాగే తమ ప్యానెల్ సభ్యులను కూడా గెలిపించాలని కోరారు. తహిసీల్దార్ను కలిసిన డీఎస్పీ నాయకులు ధర్పల్లి: ధర్పల్లి తహసీల్దార్‌గా ఇటీవలే బాధ్యతలు స్వీకరించిన శాంతను ధర్మ సమాజ్ పార్టీ (డీఎస్పీ) నాయకులు సోమవారం మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పుష్పగుచ్ఛం అందజేసి శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో డీఎస్పీ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు ప్రశాంత్, మండల అధ్యక్షులు మహిపాల్, నాయకులు కిషన్ గంగాధర్ , శ్రీకాంత్ ,చంటి తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ కాసర్ల కృషి అపూర్వం నిజామాబాద్ రూరల్:జాతీయస్థాయి ఉత్తమ ఉపాధ్యాయు లుగా వరల్డ్ చారిటీ వెల్ఫేర్ సంస్థ వారిచే గౌరవింపబడిన డాక్టర్ కాసర్ల అపూర్వమని ప్రముఖ సామాజిక ఆధ్యాత్మిక వేత్త రాజ్‌కుమార్ సుబేదార్ అన్నారు. సోమవారం తెలుగు వెలుగు సాంస్కతిక సంస్థ ఆధ్వర్యంలో అధ్యక్షులు చంద్రశేఖర్ అధ్యక్షతన సంస్థ కార్యాలయంలో డాక్టర్ కాసర్ల అభినందన సభ నిర్వహించారు. ఈసభలో సుప్రసిద్ధ కవులు డాక్టర్ గణపతి, అశోక శర్మ, మహేశ్ బాబు,వి.పి. చందన్ రావు, సూర్య ప్రకాశరావు, డాక్టర్ గంట్యాల ప్రసాద్, కందకుర్తి ఆనంద్, చింతల శ్రీనివాస్ గుప్త తదితరులు పాల్గొన్నారు. -
వనమహోత్సవానికి సర్వం సిద్ధం
ధర్పల్లి: పచ్చదనాన్ని పెంచేందుకు ఏటా వనమహోత్సవం కార్యక్రమాన్ని అధికారులు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఈ ఏడాది వానాకాలంలో మొక్కలు నాటేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. పట్టణాలు, పల్లెల్లో పచ్చదనం పెంచాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఏటా మొక్కలు పెంచే కార్యక్రమాన్ని చేపడుతోంది. ఇందులో భాగంగానే ఈ ఏడాది కూడా మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు కార్యాచరణ రూపొందించారు. గత ప్రభుత్వం తెలంగాణ హరితహారం పేరుతో నాటిన మొక్కలు పెరిగి చెట్లుగా ఎదగడంతో గ్రామాల్లో పచ్చదనం కనువిందు చేస్తోంది. పల్లెల్లో, రహదారుల వెంట నాటిన మొక్కలు నీడనిస్తున్నాయి. ఇదే కార్యక్రమాన్ని ప్రస్తుత ప్రభుత్వం వన మహోత్సవం పేరుతో మొక్కలను నాటుతున్నారు. ఈ క్రమంలో జూలైలో మొక్కలు నాటేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అధికారులు పేర్కొంటున్నారు. 22 జీపీల్లో.. ఈ ఏడాది కూడా వనమహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు నర్సరీలు లో పెంచిన మొక్కలు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయి. వర్షాలతో పాటు ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చిన వెంటనే జూలై మొదటి వారంలో మొక్కలు నాటేందుకు సంబంధిత అధికారులు సమాయత్తమవుతున్నారు. ధర్పల్లి మండలంలోని 22 జీపీల్లో మొక్కలు పెంచేందుకు 21 నర్సరీలను ఏర్పాటు చేశారు. ఒక్కొక్క నర్సరీలో 8 వేల మొక్కల చొప్పున మండలంలో మొత్తం 1 లక్ష 76 వేల మొక్కలను గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా నర్సరీలో మొక్కలను పెంచారు. లక్ష్యానికి అనుగుణంగా అన్ని గ్రామాల్లో మొక్కలు నాటేందుకు అనువైన స్థలాలను ఇప్పటికే అధికారులు గుర్తించి గ్రామాల్లో గుంతలు తీసే ప్రక్రియను షురూ చేశారు. ముఖ్యంగా ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటనున్నారు. ఇళ్లల్లో పెంచేందుకు వీలుగా గ్రామాల్లో ఏర్పాటు చేసిన నర్సరీలో ఇళ్లల్లో పెంచేందుకు వీలుగా గులాబీ, మల్లె, జామ, దానిమ్మ, తులసి, ఉసిరి, నిమ్మ, బొప్పాయి, అల్లనేరేడు, ఆకాశమల్లి వంటి 20 రకాల మొక్కలతోపాటు ఇతర ప్రదేశాల్లో నాటేందుకు ఈత, తాటి మొక్కలు నాటేందుకు సిద్ధంగా ఉన్నాయి. ధర్పల్లి మండలంలో లక్షా 76 వేల మొక్కలు నాటాలని లక్ష్యం ఒక్కో నర్సరీలో 8 వేల వరకు మొక్కల పెంపకం గ్రామంలో గుంతలుతీసే ప్రక్రియ షురూ ప్రతి గ్రామానికి పంపిణీ చేస్తాం ప్రతి గ్రామంలో మొక్కల పంపిణీకి ఏర్పాట్లు సిద్ధం చేశాం. ప్రభుత్వ ఆదేశాల మేరకు వర్షాలు పడగానే జూలై మొదటి వారంలో మొక్కలు నాటే కార్యక్రమం చేపడతాం. ప్రతి గ్రామంలో ఇచ్చిన లక్ష్యం మేరకు మొక్కలను నాటిస్తాం. – బాలకృష్ణ, ఎంపీడీవో, ధర్పల్లి -
నిర్భంద అరెస్టులు సరికాదు
నిజామాబాద్ సిటీ: కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఇందూరు పర్యాటన సందర్భంగా సందర్భంగా వామపక్ష నేతల గృహనిర్భందం, అరెస్టులు సరికాదని సీపీఎం జిల్లా కార్యదర్శి రమేశ్ బాబు అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎంపీ అర్వింద్ పెండింగ్ రైల్వే లైన్ పనులకు నిధులను కేంద్రం నుంచి తీసుకురాలేదన్నారు. నిజాం షుగర్ ఫ్యాక్టరీని తిరిగి ఓపెన్ చేస్తానని చెప్పిన మాట ఇప్పటికీ నెరవేరలేదన్నారు. ఆర్మూర్ నియోజకవర్గంలో లక్కంపల్లి సేజ్ కోసం 500 ఎకరాల భూమిని సేకరించిన ఒక్క పరిశ్రమను తీసుకురాలేదన్నారు. ఈ సమావేశంలో నాయకులు వెంకటేశ్, నాగన్న, నన్నేసాహెబ్, జంగం గంగాధర్, కొండ గంగాధర్ సాయిలు తదితరులు పాల్గొన్నారు. బంగారం ధరలు (10గ్రాములు) -
పేదలకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం
నిజామాబాద్‌అర్బన్ : పేదలకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ ఆలీ అన్నారు. సోమవారం ఆర్అండ్బీ గెస్ట్‌హౌస్‌లో 27మంది బాధితులకు రూ.16 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఆయన పంపిణీ చేశారు.ఈ సందర్భంగా షబ్బీర్ ఆలీ మాట్లాడుతూ..అర్హులకు ఇందిరమ్మ ఇల్లు, కొత్త రేషన్ కార్డులు అందిస్తామన్నారు. జిల్లా కేంద్రంలోని ఎమ్ఆర్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన కార్యక్రమంలో లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను షబ్బీర్ ఆలీ అందించారు. అర్బన్ నియోజకవర్గంలో 1300 మంది లబ్ధిదారులను ఎంపిక కాగా, త్వరలోనే ఇంకా 2200 మంది లబ్ధిదారులను ఎంపిక చేస్తామన్నారు. పెండింగ్‌లో ఉన్న బెస్ట్ అవైలబుల్ స్కీం బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరుతూ ఎస్ఎఫ్ఐ నాయకులు షబ్బీర్ ఆలీకి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ, జిల్లా కార్యదర్శి రాచకొండ విగ్నేష్, బొర్రా నాగరాజు మాట్లాడుతూ ప్రభుత్వం గత రెండేళ్లుగా రూ. 300 కోట్లు చెల్లించడంలేదన్నారు. దీంతో దళిత గిరిజన విద్యార్థుల చదువుకు కోత పడే అవకాశం ఉందన్నారు. నగరంలోని ఇంపీరియల్ గార్డెన్లో షాహిన్ కాలేజ్ విద్యార్థుల సన్మాన కార్యక్రమంలో షబ్బీర్ ఆలీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా షబ్బీర్ ఆలీ మాట్లాడుతూ ముస్లింల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందన్నారు. షాహిన్ కాలేజీలో 22 మంది విద్యార్థులకు 4 శాతం రిజర్వేషన్ ద్వారా ఎంబీబీఎస్ సీట్లు సాధించడంపై హర్షం వ్యక్తం చేశారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయంలో ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు చేసిన ఘనత ఉందన్నారు. ఈకార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, షాహిన్ కాలేజీ యాజమాన్యం, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ ఆలీ -
పీసీసీ చీఫ్‌ను కలిసిన శ్యాం బాబు
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : పీసీసీ చీఫ్ మహేష్ కుమార్‌గౌడ్‌ను మున్సిపల్ స్టాండింగ్ కౌన్సిల్ శ్యాంబాబు హైదరాబాద్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. సోమవారం గాంధీభవన్‌లో స్టేట్ లీగల్ సెల్ వైస్ చైర్మన్ దయాకర్‌గౌడ్, టీపీసీసీ క్రమశిక్షణ సంఘం సభ్యుడు జి.వి రామకృష్ణతో కలిసి వెళ్లారు.. తనను మున్సిపల్ స్టాండింగ్ కౌన్సిల్‌గా నియమించినందుకు ధన్యవాదాలు తెలిపారు. లయన్స్‌క్లబ్ చైర్మన్‌గా అవన్‌కుమార్ నిజామాబాద్‌నాగారం: జిల్లాలోని నాలుగు లయన్స్ క్లబ్‌లకు జోన్ చైర్మన్‌గా నగరానికి చెందిన లయన్స్ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ పూర్వ అధ్యక్షుడు కాలేరు అవన్ కుమార్‌కు లయన్స్ ఇంటర్నేషనల్ జిల్లా గవర్నర్ అమర్నాథ్రావు సోమవారం నియామకపత్రం అందజేశారు. ఈ మేరకు జిల్లాలోని లయన్స్ క్లబ్ ఆఫ్ తెలంగాణ, నిజామాబాద్, డైమండ్, సెంట్రల్ క్లబ్‌లకు అవన్ కుమార్ జోన్ చైర్మన్‌గా వ్యవహరిస్తారు. లయన్స్ సేవలను మరింత విస్తృత పరుస్తానని అవన్‌కుమార్ పేర్కొన్నారు. జాతీయ స్థాయి హాకీ పోటీలకు ఎంపిక సిరికొండ: జాతీయ స్థాయి హాకీ పోటీలకు తూంపల్లి గ్రామానికి చెందిన క్రీడాకారిణి బైకన్ జశ్విత ఎంపికై నట్లు జెడ్పీహెచ్ఎస్ పీడీ సడాక్ నగే్శ్ సోమవారం తెలిపారు. తెలంగాణ హాకీ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్యాంపులో ప్రతిభ కనబర్చి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై ందన్నారు. జార్ఖండ్ రాష్ట్రంలో జూలై 03 నుంచి 08 వరకు జరగనున్న జాతీయ స్థాయి సబ్ జూనియర్ పోటీల్లో జశ్విత పాల్గొననున్నట్లు పీడీ తెలిపారు. జశ్విత జాతీయ స్థాయి పోటీలకు ఎంపికవ్వడంపై ఎంఈవో రాములు, ఇన్చార్జి హెచ్ఎం మనోహర్, జిల్లా హకీ అసోసియేషన్ అధ్యక్షుడు విశాఖ గంగారెడ్డి, కార్యదర్శి రమణలు హర్షం వ్యక్తం చేశారు. ఫీజు నియంత్రణ చట్టం అమలు చేయాలి నిజామాబాద్‌అర్బన్ : ఫీజు నియంత్రణ చట్టం అమలు చేయాలని, అధిక ఫీజు వసూలు చేస్తున్న నారాయణ పాఠశాలపై చర్యలు తీసుకోవాలని అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్ఎఫ్) నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం పాఠశాల ఎదుట వారు ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా అ ధ్యక్ష ,కార్యదర్శులు రఘురాం, అంజలి మా ట్లాడారు. ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్య దర్శి కుషాల్, నాయకులు నవీన్ కృష్ణ, లక్ష్మణ్, రమేష్, దినేష్, తదితరులు పాల్గొన్నారు. ధాన్యం తూకంలో అక్రమాలపై అదనపు కలెక్టర్‌కు ఫిర్యాదు నిజామాబాద్‌అర్బన్: వరి ధాన్యం తూకంలో రైస్‌మిల్ యాజమానులు అక్రమాలకు పాల్పడినట్లు భారతీయ కిసాన్‌సంఘ్ జిల్లా కమిటీ ఆరోపించింది. ఈ మేరకు సోమవారం అదనపు కలెక్టర్ కిరణ్‌కుమార్ ఫిర్యాదు చేశారు. మోపాల్ మండలం సిర్పూర్ గ్రామం రైతులు యాసంగి ధాన్యం కొనుగోలు సమయంలో అకాల వర్షాలు కురిస్తాయి. అప్పటికే ధాన్యం విక్రయించిన రైతులు ధాన్యంను లారీల్లో రైస్‌మిల్లులకు తరలించారు. 745 వరిధాన్యం బస్తాలు అమ్మితే 560 బస్తాల ధాన్యం మాత్రమే అమ్మినట్లు ట్యాక్షీట్లో చూపించారని రైతులు వాపోయారు. విచారణ జరిపి రైతులకు న్యాయం చేయాలని వారు పేర్కొన్నారు. భారతీయ కిసాన్ సంఘ జిల్లా అధ్యక్షుడు సాయిరెడ్డి, కోశాధికారి భూమారెడ్డి, నగర అధ్యక్షలు దశరత్‌రెడ్డి, కార్యవర్గ సభ్యుడు గంగారెడ్డి, సిర్పూర్ గ్రామ రైతులు, తదితరులు పాల్గొన్నారు. -
వరినాట్లలో పశ్చిమబెంగాల్ కూలీలు
ధర్పల్లి: మండలంలో వరి సాగు పనులు జోరుగా కొనసాగుతున్నాయి. రామడుగు, మైలారం, దుబ్బాక, ధర్పల్లి, హోన్నాజీపేట్ గ్రామాల్లో ఇప్పటికే వరినాట్లు ప్రారంభమయ్యాయి. స్థానికంగా కూలీల కొరత అధికంగా ఉండడంతో ఇతర రాష్ట్రాలకు చెందిన కూలీలు (మగ) వరి నాట్లు వేసేందుకు ఇక్కడికి వలస వస్తున్నారు.హోన్నాజీపేట్ గ్రామ శివారులో పశ్చిమ బెంగాల్ చెందిన కూలీలు వరి నాట్లు వేస్తున్నారు. ఎకరాకు రూ. 4000 నుంచి రూ.4500 వరకు వరి నాట్లు వేయడానికి రైతులు వీరికి చెల్లిస్తున్నారు. రోజువారీగా ఐదు నుంచి ఆరు ఎకరాల వరకు నాట్లు వేస్తున్నారు. రేపటి నుంచి డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్ కళాశాలల బంద్ నిజామాబాద్‌అర్బన్: రాష్ట్ర వ్యాప్తంగా ఈనెల 2, 3, 4 తేదీల్లో 72 గంటల పాటు డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్, ప్రొఫెషనల్ కళాశాలల బంద్ చేపట్టినట్లు పీడీఎస్‌యూ జిల్లా కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్లను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో బంద్‌కు పిలుపునిచ్చినట్లు తెలిపారు. విద్యార్థులు, కళాశాలల యాజమాన్యాలు సహకరించి బంద్‌ను విజయవంతం చేయాలన్నారు.ఈమేరకు సోమవారం నగరంలోని నీలం రామచంద్య్ర భవన్లో బంద్‌కు సంబంధించిన పోస్టర్లను ఆయన ఆవిష్కరించారు. నాయకులు నిఖిల్, దేవిక, సాయి కిరణ్, దుర్గా ప్రసాద్, రాజు పాల్గొన్నారు. బీఎస్పీ రూరల్ నియోజకవర్గ ఇన్చార్జిగా నీరడి లక్ష్మణ్ నిజామాబాద్‌నాగారం: బహుజన్ సమాజ్ పార్టీ నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ ఇన్చార్జిగా నీరడి లక్ష్మణ్ నియమితులయ్యారు. ఈ నెల 28న ఆయన బీఎస్పీలో చేరారు. రాష్ట్ర అధ్యక్షులు మంద ప్రభాకర్ ఆదేశాల మేరకు జిల్లా అధ్యక్షులు ఎస్ పాండు నీరడి లక్ష్మణ్‌ను నియోజకవర్గ ఇన్చార్జిగా నియమించారు. నియోజకవర్గంలో బీఎస్పీ అభివృద్ధికి పాటుపడతానని తెలిపారు. -
అమిత్ షా దిష్టిబొమ్మ దహనం
నిజామాబాద్ సిటీ: కేంద్ర హోంమంత్రి అమిత్ షా నిజామాబాద్ పర్యటనలో వామపక్ష పార్టీ, ప్రజాసంఘాల నాయకులను అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో అమిత్ షా దిష్టిబొమ్మను ధర్నాచౌక్ వద్ద దహనం చేశారు. సోమవారం ఎన్టీఆర్ చౌరస్తా వరకు ర్యాలీగా వెళ్లి అమిత్ షా దిష్టిబొమ్మను దహనం చేశారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ.. ముందస్తు పేరుతో అరెస్టు చేసి పోలీస్స్టేషన్లలో నిర్బంధించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఎలాంటి ఆందోళనలకు, నిరసనలకు పిలుపు ఇవ్వకున్నా ముందస్తు పేరుతో అరెస్టులు చేయడం అన్యాయమన్నారు. ఇది వ్యక్తిగత స్వేచ్ఛను హరించడమే అవుతుందన్నారు. కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ప్రముఖులు జిల్లా పర్యటనకు వచ్చినప్పుడల్లా ఇలా ముందస్తు పేరుతో అరెస్టులు చేయడం పోలీసులకు పరిపాటిగా మారిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. అమిత్ షా జిల్లా పర్యటనతో ప్రజలకు, రైతులకు ఎలాంటి లబ్ధి చేకూరలేదన్నారు. పసుపు బో ర్డుకు అధికారులను, సిబ్బందిని, నిధులను కేటాయించాలని డిమాండ్ చేశారు.కార్యక్రమంలో నా యకులు కృష్ణ, ఎం నరేందర్, డి రాజేశ్వర్, కె గంగాధర్, ఎం సుధాకర్, డి కిషన్, కె గణేశ్, కిషన్, సజన్,గంగాధర్ చరణ్,సంతోష్,లక్ష్మి,వసంత్, సాయి లు,నరేశ్, ప్రణయ్ తదితరులు పాల్గొన్నారు. -
టెక్సాస్ యూనివర్సిటీలో తెయూ అధ్యాపకురాలి ప్రసంగం
తెయూ(డిచ్పల్లి): అమెరికాలోని టెక్సాస్ యూనివర్సిటీ ఆస్టీన్లో నిర్వహించిన అంతర్జాతీయ వర్క్‌షాప్‌లో తెలంగాణ యూనివర్సిటీ ఉర్దూ విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ గుల్–ఏ–రాణా తన ప్రసంగంతో ఆకట్టుకున్నారు. కార్యక్రమంలో ఆమె ముజ్తబా హుస్సేన్‌తో సహా ఉర్దూ వినోదం, హాస్య సాహిత్యంపై చేసిన ప్రసంగం విద్యావేత్తలు, పీహెచ్డీ విద్యార్థులను ఎంతగానో ఆకట్టుకుంది. ప్రొఫెసర్ అక్బర్ హైదర్, ప్రఖ్యాత కవయిత్రి ఇశ్రాత ఆప్రిన్, ఇతర పండితులు హైదరాబాద్‌లో ఉర్దూ భాష స్థితిగతులపై ప్రసంగించారు. టెక్సాస్ యూనివర్సిటీ వర్క్‌షాప్‌లో పాల్గొన్న గుల్–ఏ–రాణాను తెయూ వీసీ ప్రొఫెసర్ యాదగిరిరావు, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ యాదగిరి, ఆర్ట్స్ డీన్ లావణ్య, ప్రిన్సిపాల్ మామిడాల ప్రవీణ్, ఉర్దూ విభాగం అధ్యాపకులు ప్రత్యేకంగా అభినందించారు. -
ఎంఆర్టీ అండ్ కన్స్ట్రక్షన్ డీఈగా వెంకటరమణ
సుభాష్‌నగర్: నార్తన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలో ఎంఆర్టీ, కన్స్ట్రక్షన్ విభాగం డీఈగా డీ వెంకటరమణ శనివారం పవర్‌హౌస్‌లో బాధ్యతలు స్వీకరించారు. నార్తన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలో ఎంఆర్టీ, కన్స్ట్రక్షన్ విభాగం పునర్ వ్యవస్థీకరణలో భాగంగా విలీనం చేసిన విషయం తెలిసిందే. బాధ్యతలు స్వీకరించిన డీఈని డివిజన్ ఏడీఈలు, ఏఈలు, సబ్ ఇంజినీర్లు, జేఏవోలు, ఓఎం స్టాఫ్ సిబ్బంది మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ఏడీఈలు తోట రాజశేఖర్, నటరాజ్, ఏఈలు కాశీనాథ్, దుర్గాప్రసాద్, నవీన్‌రెడ్డి, మౌనిక రెడ్డి, సాయిలు, గయాస్ హైమద్, భాస్కర్, ప్రసాద్, వివిధ సెక్షన్ల ఓఎం స్టాఫ్, యూనియన్ నాయకులు పాల్గొన్నారు. -
పోరుబాటలో ఎన్నో విజయాలు..
ఆర్మూర్ : వ్యవసాయ క్షేత్రంలో ఆరుగాలం శ్రమించి పంట పండించడమే కాదు, తమ డిమాండ్ల సాధనకు అవసరమైతే ఉద్యమించి ప్రభుత్వాల మెడలు వంచి ఒప్పించగల నేర్పరులు ఆర్మూర్ ప్రాంత రైతులు. రైతు ఐక్య కార్యాచరణ కమిటీల ఆధ్వర్యంలో పోరాడి డిమాండ్లు సాధించుకుంటున్నారు. రైతుల ఉద్యమాల ఫలితంగానే 2003లో అర్గుల రాజారాం(గుత్ప) ఎత్తిపోతల పథకం నిర్మాణానికి అడుగులుపడ్డాయి. 2008లో ఎర్రజొన్న వ్యాపారి చేతిలో మోపోయిన రైతులకు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం రూ.35 కోట్లు చెల్లించింది. 2009లో అప్పటి సీఎం రోశయ్య కమ్మర్‌పల్లిలో పసుపు పరిశోధన కేంద్రం ఏర్పాటు చేశారు. 2024 ఆగస్టులో ప్రధాని నరేంద్ర మోదీ పసుపు బోర్డును తెలంగాణలో ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. అంతేకాకుండా పసుపు బోర్డు కేంద్ర కార్యాలయాన్ని జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేశారు. ఈ విజయాలన్నింటి వెనక రాజకీయాలకు అతీతంగా ఐకమత్యంతో పోరాటాలు చేసిన రైతులే ఉన్నారు. పసుపు పరిశోధనకు.. 2007లో అప్పటి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శరద్ పవార్ సూచన మేరకు ఆచార్య ఎన్జీ రంగా విశ్వవిద్యాలయం సహకారంతో 2009లో కమ్మర్‌పల్లిలోని 36 ఎకరాల్లో పసుపు పరిశోధన కేంద్రం ఏర్పాటు చేశారు. దీనిని అప్పటి సీఎం రోశయ్య ప్రారంభించగా శాస్త్రవేత్తలు ఇక్కడ కొత్త వంగడాలను సృష్టిస్తూ పసుపు పంట పండించడంలో రైతులకు మెళకువలు నేర్పుతున్నారు. బోర్డు కోసం ఢిల్లీ వరకు.. పసుపు బోర్డు ఏర్పాటు కోసం ఢిల్లీ వీధుల్లో ధర్నాలు చేశారు. రైతు ఐక్య కార్యాచరణ కమిటీ ప్రతినిధులు 2018–19లో ఉద్యమ బాటపట్టారు. ఫలితంగా బీజేపీ ప్రభుత్వం పసుపునకు ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. ప్రభుత్వాలను ఒప్పించి డిమాండ్లు సాధించే నేర్పరులు ఆర్మూర్ రైతులు ఐకమత్యంలో ఆదర్శం ఎర్రజొన్న, రుణమాఫీ, లిఫ్ట్ సాధనసాధించి చూపారు.. నిజాంసాగర్ చివరి ఆయకట్టు ప్రాంతమైన ఆర్మూర్, బాల్కొండకు సాగు నీరందకపోవడంతో గుత్ప ఎత్తిపోతల పథకానికి రూపకల్పన చేశారు. ఎస్సారెస్పీ బ్యాక్ వాటర్‌ను ఎత్తిపోతల ద్వారా ఆర్మూర్‌కు తీసుకురావడం సాధ్యం కాదని అప్పటి ప్రభుత్వాలు పేర్కొడంతో 2003లో రైతు ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో ఉద్యమించి ఎత్తిపోతల పథకాన్ని సాధించుకున్నారు. రైతులు చేసిన ఉద్యమానికి దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం కదలి వచ్చి రూ. 204 కోట్లతో అర్గుల్ రాజారాం (గుత్ప) ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసింది. 2008 మార్చి 18న గుత్ప ఎత్తిపోతల పథకం పూర్తికావడంతో ఆర్మూర్, బాల్కొండ నియోజకవర్గాల పరిధిలోని 38,792 ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరిగింది. -
అటవీ భూమిని దున్నుతున్న ట్రాక్టర్ పట్టివేత
సిరికొండ: సిరికొండ అటవీ రేంజ్ తూంపల్లి సెక్షన్ గుడిలింగాపూర్ తూర్పు బీట్ పరిధిలో అటవీభూమిని దున్నుతున్న ట్రాక్టర్‌ను పట్టుకున్నట్లు రేంజర్ రవీందర్ తెలిపారు. గుడిలింగాపూర్కు చెందిన మలావత్ మంగికి చెందిన ట్రాక్టర్‌ను సీజ్ చేసి సిరికొండ పోలీస్ స్టేషన్లో ఉంచినట్లు పేర్కొన్నారు. అటవీ భూమిని అక్రమంగా దున్నడం నేరమని ట్రాక్టర్ యజమానికి గతంలో నోటీసు ఇచ్చినట్లు తెలిపారు. నోటీసులను బేఖాతరు చేస్తూ అటవీ భూమిని దున్నుతుండటంతో పట్టుకొని కేసు నమోదు చేశామన్నారు. దాడిలో డిప్యూటీ రేంజర్ గంగారం, సెక్షన్ అధికారి కృష్ణగీత్, బీట్ అధికారులు నాగేశ్, రీజేందర్, నవీన్, హరీశ్ పాల్గొన్నారు. -
ఆటకు దూరమైన చిన్నారి లోకం
నిజామాబాద్‌నాగారం: ఆటా..పాటా లేక చిన్నారి లోకం ఉసూరుమంటోంది. ఆడుకోవాల్సిన వయసులో పిల్లలు స్మార్ట్ ఫోన్లకు బందీలవుతున్నారు. పాఠశాలల్లో సరైన క్రీడా మైదానాలు, వసతులు లేక చదువులకే అంకితమవుతున్నారు. ఫలితంగా పిల్లల జీవనశైలి మారుతోంది. ఆటలు దూరంగా ఉండడంతో మానసిక, శారీరక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ప్రైవేటులో అంతంత మాత్రమే.. జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలు 1171 ఉండగా, ప్రైవేట్ పాఠశాలలో 475 ఉన్నాయి. ప్రభుత్వ పాఠశాలలో 80 శాతానికి పైగా క్రీడా మైదానాలు ఉన్నాయి. ఇందులో పీఈటీలు ఉన్నారు. అయితే క్రీడా సామగ్రి లేకపోవడంతో అంతంత మాత్రంగానే ఆటలు ఆడిస్తున్నారు. ఇక 90 శాతం ప్రైవేట్ పాఠశాలలు క్రీడా మైదానాలు లేకుండానే కొనసాగుతున్నాయి. ఫలితంగా పాఠశాలలో విద్యార్థులకు ఆటలు కరువయ్యాయి. ప్రైవేట్ పాఠశాలలో పేరుకు మాత్రమే పీఈటీలను తీసుకొని నవంబర్ , డిసెంబర్‌లల్లో తొలగిస్తున్నారు. బోర్డులే మిగిలాయి.. గత ప్రభుత్వం జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీలల్లో క్రీడా ప్రాంగణాలను డీఆర్డీఏ, పంచాయితీరాజ్ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసింది. జిల్లా యువజన క్రీడల కార్యాలయానికి కేటాయించలేదు. ప్రాంగణాల్లో బోర్డులు మాత్రమే మిగిలాయి. క్రీడా పరికరాలు లేవు. జిల్లాలోని కమ్మర్పల్లి, వేల్పూర్, బోధన్, జక్రాన్‌పల్లి, నాగారం, ఆర్మూర్ తదితర ప్రాంతాల్లో మినీ స్టేడియాలు ఉన్నా పరికరాలు, కోచ్‌లు లేరు. సమయం కరువు.. నిత్యం ఉదయం, సాయంత్రం ఆటలు ఆడే అవకాశం ఉంటుంది. ప్రభుత్వ పాఠశాలకు చెందిన పిల్లలు మాత్రం ఎంతో కొంత ఆటలు ఆడుతున్నారు. ప్రైవేట్ పాఠశాలలో ఆటలు ఆడే పరిస్థితి పదుల సంఖ్యలో మాత్రమే కనిపిస్తుంది. యాజమాన్యాలు చిన్నప్పటి నుంచే ర్యాంకుల పేరుతో పిల్లలపై చదవాలని ఒత్తిడి పెంచుతున్నారు. తల్లిదండ్రులకు సైతం క్రీడల కన్నా చదువుపైనే ఫోకస్ పెట్టాలని పట్టుబడుతున్నారు. దీంతో చాలా మంది పిల్లలు ఆన్లైన్లో చదువుకుంటున్నామని చెప్పి వీడియో గేమ్స్, బొమ్మలు, రీల్స్ చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. స్మార్ట్ ఫోన్లలో ఆటలు.. మూడేళ్లు వచ్చే పిల్లల నుంచి పాఠశాల, కళాశాల స్థాయి చదివే విద్యార్థుల వరకు స్మార్ట్ ఫోన్లకు బందీలవుతున్నారు. ఉదయం, సాయంత్రం, రాత్రి అని తేడా లేకుండా ఫోన్లకు అతుక్కపోతున్నారు. ఫోన్ ఇస్తేనే అన్నం తింటామని మారాం చేస్తున్నా రు. సెలవుల సమయంలో గంటల తరబడిగా ఫోన్ లు లేదంటే టీవీలు చూస్తూ కాలక్షేపం చేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో అరకొర వసతులు పీఈటీలు ఉన్నా సామగ్రి కరువు ప్రైవేట్ పాఠశాలలో క్రీడా మైదానాల కొరత పల్లె, పట్టణాల్లో పేరుకే క్రీడా ప్రాంగణాలు ఫలితంగా సెల్ఫోన్లకు బందీలుగా పిల్లలు పిల్లలను కచ్చితంగా ఆడించాలి చిన్నప్పటి నుంచే పిల్లలకు నచ్చిన ఆటలో మెళకువలు నేర్పించాలి. పాఠశాలలో క్రీడలు ఆడితేనే భవిష్యత్తులో మంచి క్రీడాకారునిగా తయారవుతారు. క్రీడలతో క్రమశిక్షణ అలవడుతుంది. వ్యసనాలకు దూరంగా ఉంటారు. చదువు ఎంత ముఖ్యమో క్రీడలూ అంతే ముఖ్యం. కచ్చితంగా ఆడించాలి. – ముత్తెన్న, జిల్లా యువజన క్రీడల అధికారి -
భరతనాట్యంలో జిల్లా విద్యార్థినుల ప్రతిభ
నిజామాబాద్ రూరల్: తిరుమల తిరుపతి దేవస్థానంలోని శ్రీ వేంకటేశ్వర స్వామి సన్నిధిలో జల్లా కేంద్రానికి చెందిన సిద్ధార్థ కళాక్షేత్రానికి చెందిన జయలక్ష్మి ఆధ్వర్యంలో 27 మంది విద్యార్థినులు భరతనాట్యం, కూచిపూడి ప్రదర్శనలు ఇచ్చారు. ఆషాఢ మాసం పుర్కసరించుకొని కార్యక్రమాల్లో పాల్గొన్నట్లు తెలిపారు. జల్లా కేంద్రంలోని తేనె సాయిబాబా ఆలయంలో ప్రతి ఆదివారం కూచిపూడి, భరతనాట్యం క్లాసులు నిర్వహిస్తామని నిర్వాహకులు తెలిపారు. తమిళనాడు, కర్నాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో నిర్వహించిన పోటీలు ముగించుకొని విద్యార్థినులు ఆదివారం జిల్లాకు చేరుకోనున్నట్లు పేర్కొన్నారు. -
స్కూటీ, బైక్ ఢీ..
● నలుగురికి తీవ్ర గాయాలు కామారెడ్డి క్రైం: ఎదురెదురుగా వచ్చిన స్కూటీ, బైక్‌లు ఢీకొన్న ప్రమాదంలో నలుగురు యువకులకు తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన జిల్లా కేంద్రంలోని రైల్వేస్టేషన్ మూడో ప్లాట్‌ఫామ్ రోడ్డుపై శుక్రవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. ఎక్కువగా గూడ్స్ రైళ్లు నిలిచే మూడో నెంబరు ప్లాట్‌ఫాం వెంబడి కోర్టు రోడ్డు నుంచి అశోక్‌నగర్ వరకు వాహనాల రాకపోకలకు వీలుగా రోడ్డును నిర్మించారు. కొంతకాలంగా ఈ రోడ్డు గుండా వాహనాల రాకపోకలు జరుగుతున్నాయి. ఇదే దారిపై శుక్రవారం రాత్రి ఎదురెదురుగా వేగంగా వచ్చిన స్కూటీ, బైక్‌లు ఢీకొన్నాయి. రెండు వాహనాలపై ప్రయాణిస్తున్న నలుగురు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు, పోలీసులు వారిని వెంటనే ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిని పట్టణంలోని అశోక్‌నగర్ కాలనీకి చెందిన శ్రీధర్, మురారి, బొంతల లెనిన్, లోకేశ్‌గా గుర్తించారు. వారిలో లెనిన్, లోకేశ్‌లు మైనర్లుగా తెలుస్తోంది. శ్రీధర్, మురారిల కుటుంబాలు ప్రకాశం జిల్లా నుంచి వలస వచ్చి మేసీ్త్ర పనులు చేసుకుంటున్నాయి. వారిద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు రిఫర్ చేశారు. పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
కడుపునొప్పి భరించలేక ఒకరి ఆత్మహత్య
మద్నూర్(జుక్కల్): డోంగ్లీ మండలం లింబూర్ గ్రామానికి చెందిన కిస్వే సంజయ్(45) శనివారం కడుపునొప్పి భరించలేక ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై విజయ్‌కొండ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. లింబూర్కు చెందిన సంజయ్ మహారాష్ట్రలోని పుణె నగరంలో కుటుంబసభ్యులతో కలిసి కూలీ పని చేసేవాడు. గత కొంత కాలంగా కడుపునొప్పితో బాధపడుతున్న సంజయ్.. చికిత్స కోసం చాలా ఆస్పత్రులు తిరిగినా నయం కాలేదని కుటుంబసభ్యులు చెప్పారు. దీంతో 15 రోజుల క్రితం సొంతూరికి వచ్చి కూలీ పని చేసుకుంటున్నాడు. కడుపునొప్పి తీవ్రం కావడంతో శనివారం లింబూర్ శివారులో రోడ్డు పక్కన చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై తెలిపారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చెప్పారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. జీవితంపై విరక్తితో రైలుకు ఎదురెళ్లి ..ఖలీల్‌వాడి: జీవితంపై విరక్తితో ఓ యువకుడు రైలుకు ఎదురెళ్లి ఆత్మహత్య చేసుకున్నట్లు రైల్వే ఎస్సై సాయిరెడ్డి తెలిపారు. రైల్వే ఎస్సై చెప్పిన ప్రకారం.. నగరంలోని ఎల్లమ్మగుట్టకు చెందిన జాదవ్ శివతేజ(19) శనివారం ఉదయం 8.50 గంటల సమయంలో జీవితంపై విరక్తి చెంది రైలుకు అడ్డుగా వెళ్లి బలవన్మరణం చెందాడు. నిజామాబాద్ స్టేషన్ మేనేజర్ చందన్ కుమార్ సమాచారం మేరకు ఘటనా స్థలాన్ని సందర్శించి, మృతదేహాన్ని జీజీహెచ్‌కు తరలించారు. మృతుడు నగరంలోని తిలక్‌గార్డెన్ వద్ద ఉన్న కమర్షియల్ కాంప్లెక్స్‌లోని అశోక్ టీ పాయింట్లో పని చేసేవాడు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
నాణ్యత డొల్ల!
● పనులు చేపట్టిన మూడు నెలలకే పగుళ్లు ఏర్పడిన రోడ్డు ఇందల్వాయి: ఇందల్వాయి–ధర్పల్లి రోడ్డు మార్గంలో వెంగల్పాడ్ వద్ద నూతనంగా నిర్మించిన హైలెవెల్ వంతెనకు ఇరువైపుల వేసిన రోడ్డు ఇటీవల కురిసిన వర్షానికి కుంగి ప గుళ్లు ఏర్పడ్డాయి. ఏళ్ల తరబడి మ న్నికగా ఉండాల్సిన రోడ్డు మూడు నెలలకే కుంగడంపై వాహనదారులు నాణ్యత లోపాలను విమర్శిస్తున్నారు. రోడ్డుకు ఇరువైపుల పోసిన మొరం వర్షానికి కొట్టుకుపోయింది. ఇకనైనా అధికారులు స్పందించి రోడ్డు పాడవకముందే మరమ్మతులు చేయించాలని వాహనదారులు కోరుతున్నారు. -
ఎస్సారెస్పీని సందర్శించిన ఆర్మీ బృందం
బాల్కొండ: శ్రీరాంసాగర్ జలాశయాన్ని ఆర్మీ ప్రత్యేక బృందం శనివారం సందర్శించింది. ఆర్మీ సబ్ ఇన్స్పెక్టర్ నీతూ రామ్ ఆధ్వర్యంలోని బృందం ప్రాజెక్ట్‌లోకి ఒకేసారి భారీ వరద వచ్చి ముంపు తలెత్తితే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, బెటాలియన్ బృందాలు చేపట్టాల్సిన చర్యలపై పరిశీలించారు. గతంలో ప్రాజెక్ట్‌లోకి వచ్చిన వరదల వివరాలను అధికారులు అడిగి తెలుసుకున్నారు. ప్రాజెక్ట్ భద్రతతోపాటు దిగువన ఉన్న గ్రామాల ప్రజలను ఎలా సురక్షితంగా కాపాడవచ్చో పరిశీలించారు. వారి వెంట ప్రాజెక్ట్ ఏఈఈ అక్తర్, సిబ్బంది ఉన్నారు. వ్యవసాయశాఖ మంత్రిని కలిసిన డీసీసీబీ చైర్మన్ సుభాష్‌నగర్ : రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావును ఉమ్మడి నిజామాబాద్ డీసీసీబీ చైర్మన్ కుంట రమేశ్ రెడ్డి శనివారం హైదరాబాద్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రైతులకు వానాకాలం పంట పెట్టుబడి సాయంగా రైతు భరోసా అందించినందుకు జిల్లా రైతాంగం తరఫున మంత్రికి పుష్పగుచ్చం అందజేసి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఉమ్మడి జిల్లాలో యూరియా కొరతపై మంత్రి దృష్టికి తీసుకెళ్లగా, సానుకూలంగా స్పందించిన మంత్రి.. అవసరం మేరకు యూరియాను అందుబాటులో ఉంచుతామని హామీనిచ్చినట్లు చైర్మన్ తెలిపారు. కళాశాల విద్యార్థినులకు హాస్టల్ వసతి నిజామాబాద్‌అర్బన్: నిజామాబాద్ నగరంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల విద్యార్థులకు హాస్టల్ వసతి కల్పించినట్లు ప్రిన్సిపల్ బుద్ధిరాజ్ తెలిపారు. దూర ప్రాంతాల నుంచి వచ్చి కళాశాలలో విద్యాభ్యాసం చేస్తున్న బాలికలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న దృష్ట్యా కలెక్టర్‌కు పలుమార్లు విజ్ఞప్తి చేయడంతో నామ్‌దేవ్‌వాడ ప్రాంతంలో ఎస్సీ వసతి గృహంలో వసతి కల్పించినట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మొదటి సంవత్సరం విద్యార్థులు కళాశాలలో అడ్మిషన్ పొందాలని పేర్కొన్నారు. నిజామాబాద్ సీసీఆర్బీ ఏసీపీ బదిలీ ఖలీల్‌వాడి: నిజామాబాద్ సీసీఆర్బీ ఏసీబీగా పనిచేస్తున్న అంబటి రవీందర్‌రెడ్డిని బదిలీ చేస్తూ డీజీపీ జితేందర్‌రెడ్డి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 44 మంది డీఎస్పీలు బదిలీలు జరిగాయి. ఏసీపీ రవీందర్‌రెడ్డిని సైబరాబాద్‌లోని సైబర్ క్రైమ్ ఏసీపీగా బదిలీ అయ్యారు. నిజామాబాద్ ఎస్బీ సెక్యూరిటీ ఏసీపీగా సత్యనారాయణ బదిలీపై రానున్నారు. ఆయన గద్వాల జిల్లాలో ఎస్డీపీవో ఉండగా హైడ్రా ఏసీపీగా పనిచేస్తున్నారు. ఎస్బీ ఏసీపీగా పనిచేసిన శ్రీనివాస్‌రావు డీసీపీగా పదోన్నతిపై వెళ్లడంతో కొన్ని రోజులుగా ఆ పోస్టు ఖాళీగా ఉంది. -
సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి
నిజామాబాద్ సిటీ: కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ జూలై 9న చేపట్టే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని వెజిటేబుల్ ఆటో–మోటర్ వర్కర్స్ యూనియన్ కార్యదర్శి శివకుమార్ అన్నారు. నగరంలోని కోటగల్లి ఎన్ఆర్ భవన్లో శనివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆటో కార్మికుల కోసం సంక్షేమ బోర్డుని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఆటో కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలన్నారు. సమావేశంలో నాయకులు ఇమ్రాన్, సురేశ్, బాబా ప్రసాద్, హైమద్, రంజిత్ పాల్గొన్నారు. -
క్యూసెక్కు, టీఎంసీ అంటే..
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లోకి ఎగువ ప్రాంతాల నుంచి క్యూసెక్కుల వరద నీరు, టీఎంసీల వరద నీరు వచ్చి చేరిందని ప్రాజెక్ట్ అధికారులు పేర్కొంటారు. అసలు క్యూసెక్కు, టీఎంసీ అనే పదాల పూర్తి అర్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.. ● క్యూసెక్కు అనేది నీటి ప్రవాహ వేగాన్ని కొలిచే ప్రమాణం. క్యూబిక్ ఫీట్ పర్ సెకండ్(క్యూసెక్). ఒక సెకను కాలంలో 28 లీటర్లు నీరు వచ్చి చేరడం, లేదా విడుదలవ్వడం. ● క్యూసెక్కును ప్రాజెక్ట్‌లోకి వచ్చే ఇన్‌ఫ్లో, అవుట్ఫ్లోలో వినియోగిస్తారు. ● టీఎంసీ అంటే థౌసండ్ మిలియన్ క్యూబిక్ ఫీట్ (శత కోటి ఘనపుటడుగులు) అని అర్థం. ● ఒక్క టీఎంసీకి 2831 కోట్ల లీటర్ల నీరు. ● ప్రాజెక్ట్‌లోకి వచ్చే నీటిని, వదిలిన నీటికి క్యూసెక్కుల్లో తెలుపుతారు. పూర్తి నీటి నిల్వ, నీటి విడుదలను టీఎంసీల్లో చూపుతారు. ● వెయ్యి అడుగుల వెడల్పు, వెయ్యి అడుగుల పొడవు, వెయ్యి అడుగుల ఎత్తులో ఉండే నీరు ఒక టీఎంసీ అవుతుంది. ● 2300 ఎకరాల్లో ఒక్క అడుగు నీరు నిల్వ ఉంటే టీఎంసీకీ సమానం. – బాల్కొండ మీకు తెలుసా? -
నియామకం
మోపాల్: సేవాలాల్ సేన మహాసభ తెలంగాణ రాష్ట్ర ప్రధానకార్యదర్శిగా మండలంలోని అమ్రాబాద్‌కు చెందిన బానో త్ నరేశ్ నాయక్ నియమితులయ్యారు. ఈమేరకు శనివారం హైదరాబాద్‌లోని సుందరయ్య వి జ్ఞాన కేంద్రంలో వ్యవస్థాపక అధ్యక్షుడు సంజీవ్ నాయక్ నరేశ్‌కు నియామకపత్రాన్ని అందజేశారు. అనంతరం నరేశ్‌నాయక్ మాట్లాడు తూ.. తనపై నమ్మకంతో ప్రధాన కార్యదర్శిగా నియమించినందుకు సంజీవ్ నాయక్‌కు, రాష్ట్ర కార్యవర్గానికి ధన్యవాదాలు తెలిపారు. గిరిజన జాతి అభివృద్ధికి అహర్నిశలు కృషి చేసి శక్తి వంచన లేకుండా పని చేస్తానని పేర్కొన్నారు. -
రోడ్డు ఇలా.. హైస్కూల్‌కు వెళ్లేదెలా..
డిచ్పల్లి: మండలంలోని రాంపూర్‌లో ప్రధాన బీటీ రోడ్డు పూర్తిగా గుంతలు పడి అధ్యానంగా మారింది. గ్రామానికి చెందిన పలువురు విద్యార్థులు ఇదే రోడ్డుగుండా జెడ్పీ హైస్కూల్‌కు వెళ్తుంటారు. చిన్నపాటి వర్షం కురిసినా రోడ్డుపై ఉన్న గుంతల్లో నీరు చేరడంతో రాకపోకలకు ఇబ్బంది పడుతున్నారు. నీరు ఎక్కువగా నిలిచినప్పుడు గుంతలు కనబడక సైకిల్ పై వెళ్లే విద్యార్థులు, బైక్‌లపై వెళ్లే వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి బీటీ రోడ్డుకు మరమ్మతులు చేపట్టాలని గ్రామస్తులు, విద్యార్థులు కోరుతున్నారు. -
వ్యవసాయానికి సాంకేతికతను జోడించాలి
మోపాల్: వ్యవసాయరంగంలో కూలీల కొరతను అధిగమించేందుకు సాంకేతికతను జోడించాలని, తద్వారా అద్భుత ఫలితాలు సాధించవచ్చని డివిజనల్ ఆగ్రోనామిస్ట్ డాక్టర్ సుధాకర్‌రెడ్డి అన్నారు. శనివారం మండలంలోని బాడ్సి సొసైటీ పరిధిలో అంతర్జాతీయ సహకార సంవత్సరం–2025 ఉత్సవాల్లో భాగంగా జిల్లాస్థాయి డ్రోన్ సాంకేతికత ప్రదర్శన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నూతన వ్యవసాయ సాంకేతికతలపై అవగాహన కల్పించేందుకు డ్రోన్ ప్రదర్శనను చేపట్టారు. డ్రోన్ల వినియోగం, వాటి పద్ధతులు, ప్రయోజనా లు, వ్యవసాయ రంగంలో వాటి పాత్రపై నానో బి జినెస్ మేనేజర్ ఎల్ఎస్ స్వరూప్, సీనియర్ ఆగ్రోనామిస్ట్ పాపిరెడ్డి, ఆగ్రోనామిస్ట్ డాక్టర్ వంశీ రైతులకు వివరించారు. డ్రోన్ల సహాయంతో కీటక నాశినుల స్ప్రే, పంటల ఆరోగ్య నిర్ధారణ, భూమి పర్యవేక్షణ, తదితర అంశాలపై వ్యవసాయ క్షేత్రంలో ప్ర దర్శనలిచ్చారు. రైతులు ప్రత్యక్షంగా వీక్షించి, నిపుణులతో చర్చించి తమ సందేహాలను నివృత్తి చేసు కున్నారు. బాడ్సి సొసైటీ చైర్మన్ నిమ్మల మోహన్‌రెడ్డి, డైరెక్టర్ పృథ్వీరాజ్, సహకారశాఖ సీనియర్ ఇన్స్పెక్టర్ ఎం శ్రీనివాస్, రైతులు మహిపాల్‌రెడ్డి, శే రు మల్లయ్య, ఉపసర్పంచ్ రవి, రైతులు, సంఘాల ప్రతినిధులుపాల్గొన్నారు. డివిజనల్ ఆగ్రోనామిస్ట్ డాక్టర్ సుధాకర్‌రెడ్డి బాడ్సిలో జిల్లాస్థాయి డ్రోన్ సాంకేతికత ప్రదర్శన -
ఆరు గ్యారంటీలను అమలు చేయాలి
మోపాల్: ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలను ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలని ఎంసీపీఐ(యూ) జిల్లా కార్యదర్శి కర్రోళ్ల శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఈమేరకు శనివారం మోపాల్ మండల కమిటీ ఆధ్వర్యంలో తహసీల్దార్ రామేశ్వర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వం అనుసరించిన ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకించిన ప్రజలు ఎన్నికల్లో కాంగ్రెస్ గ్యారంటీలను నమ్మి గెలిపించారని అన్నారు. కానీ అధికారంలోకి వచ్చి 18 నెలలు గడిచినా పూర్తి స్థాయిలో హామీలను అమలు చేయడం లేదన్నారు. నిరుద్యోగ యువతకు పెన్షన్, ఆటో కార్మికులకు రూ.12వేలు, కౌలు రైతుల హామీలు, జర్నలిస్టులకు ఇంటి స్థలాలు, ఉద్యమ పెన్షన్, తదితర హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఏఐఎఫ్డీఎస్ జాతీయ కన్వీనర్ మేత్రి రాజశేఖర్, నాయకులు రవితేజ, గుర్రం రమాదేవి, బొడ్డు సునీత, తదితరులు పాల్గొన్నారు. -
ఫ్లెక్సీల ఏర్పాటు
జిల్లా కేంద్రానికి ఆదివారం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా రానున్నారు. పసుపు బోర్డు జాతీయ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా నగరంలో భారీగా ఫ్లెక్సీలు వెలిశాయి. డీఎస్ ప్రథమ వర్ధంతి పురస్కరించుకుని కంఠేశ్వర్ బైపాస్ చౌరస్తాలో కాంస్య విగ్రహాన్ని అమిత్ షా ఆవిష్కరించనున్నారు. అనంతరం పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో నిర్వహించనున్న కిసాన్ సమ్మేళన్(రైతు సమ్మేళనం) బహిరంగ సభలో అమిత్‌షా ప్రసంగించనున్నారు. బైపాస్ చౌరస్తాలో భారీ ఎత్తున సిగ్నల్ లైట్స్, కెమెరాలను ట్రాఫిక్ పోలీసులు ఏర్పాటు చేశారు. – సాక్షి నెట్వర్క్ -
మాజీ ప్రధాని పీవీ బహుభాషా కోవిదుడు
నుడా చైర్మన్ కేశ వేణు మోపాల్: మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు బహుభాషా కోవిదుడు అని, ఆర్థిక సంస్కరణలకు ఆధ్యుడని నుడా చైర్మన్ కేశ వేణు అన్నారు. శనివారం తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మాజీ ప్రధాని, భారత రత్న పీవీ నర్సింహారావు 104వ జయంతి సందర్భంగా నగరశివారులోని బోర్గాం(పి) చౌరస్తాలో ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పీవీ తీసుకొచ్చిన ఆర్థిక సంస్కరణల వల్లే దేశం అభివృద్ధి చెందుతోందని అన్నారు. సంఘం జిల్లా అధ్యక్షుడు శశికాంత్ కులకర్ణి మాట్లాడుతూ.. బ్రాహ్మణ ముద్దుబిడ్డ, అపర చాణక్యుడు పీవీ నర్సింహారావు అని, వారిని భారతరత్నతో గతంలోనే కేంద్ర ప్రభుత్వం సత్కరించడం బ్రాహ్మణ జాతికి గర్వకారణమన్నారు. కార్యక్రమంలో ఒలింపిక్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు, నుడా మాజీ చైర్మన్ ఈగ సంజీవ్‌రెడ్డి, బ్రాహ్మ ణ సంఘం ప్రతినిధులు కంజర్కర్ భూపతిరావు, రమేశ్‌బాబు,కోళవి విజయ్‌కుమార్, మిలింద్, రమే శ్, కిరణ్ దేశ్‌ముఖ్, పుల్కల్ రమేశ్, లక్ష్మీనారాయణ భరద్వాజ్, జయంత్‌రావు, మల్లికార్జున్, లక్ష్మీకాంత్, అప్పాల కిష్టయ్య, అమర్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ భవన్లో.. నిజామాబాద్ రూరల్: హైదరాబాద్‌లోని తెలంగా ణ భవన్లో శనివారం నిర్వహించిన మాజీ ప్రధాని పీవీ నరసింహరవు జయంతి వేడుకల్లో జెడ్పీ మాజీ చైర్మన్ దాదన్నగారి విఠల్‌రావు పాల్గొన్నారు. దేశానికి ఆయన అందించిన సేవలను కొనియాడారు. నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి
ధర్పల్లి: ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని ఆదర్శ పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీనివాస్ అన్నారు. మండల కేంద్రంలో శనివారం ఆదర్శ పాఠశాల విద్యార్థులు ట్రాఫిక్ నిబంధనలపై ప్రజలకు అవగాహన కల్పించారు. హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనాలు నడుపుతున్న వాహనదారులకు పుష్పగుచ్ఛం అందించి హెల్మెట్ ప్రాముఖ్యతను వివరించారు. రాత్రి సమయంలో ప్రమాదాల నివారణకు వాహనాలకు రేడియం స్టిక్కర్లను అతికించారు. ఉపాధ్యాయులు లక్ష్మీనర్సయ్య, డేనియల్, రంజిత్ తదితరులు పాల్గొన్నారు. ఉపాధ్యాయుల కృషి అభినందనీయం మోపాల్: ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి, విద్యాభివృద్ధికి కృషి చేస్తున్న సిర్పూర్ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులను హెచ్ఎం సత్యనారాయణ అభినందించారు. మోపాల్ మండలంలోని సిర్పూర్ ప్రాథమిక పాఠశాలలో వంద మంది విద్యార్థులకు కంపాస్ బాక్సులు, పెన్నులు, పెన్సిళ్లు, తదితర వస్తువులను శనివారం పంపిణీ చేశారు. కాగా పాఠశాలలో నో బ్యాగ్ డే సందర్భంగా విద్యార్థులు తయారు చేసిన ఇన్నోవేటివ్ వస్తువులను ప్రదర్శించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు రాజేందర్, అక్బర్ భాషా, వసంత, అనురాధ తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులకు నోట్‌బుక్స్ పంపిణీ ఇందల్వాయి: మండలంలోని గండితండా జీపీ సెక్రటరి అశోక్ ప్రోత్సాహంతో హైదరాబాద్‌కి చెందిన డాక్టర్ అనీల గ్రామ పాఠశాల విద్యార్థులకు రూ. పదివేలు విలువ చేసే నోట్స్ బుక్స్, పెన్సులను శనివారం అందించారు. ఎంఈవో శ్రీధర్, ఎంపీడీవో అనంత్‌రావు, హెచ్ఎం పరమేశ్వర్, ఉపాధ్యాయులు ఉన్నారు. కేంద్ర మంత్రి కార్యక్రమాన్ని అడ్డుకుంటాం నిజామాబాద్‌అర్బన్: జిల్లా కేంద్రంలో కేంద్ర మంత్రి అమిత్ షా నిర్వహించే కార్యక్రమాన్ని అడ్డుకుంటామని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి విఘ్నేశ్ అన్నారు. శనివారం నగరంలోని ఎస్ఎఫ్ఐ కార్యాలయంలో నిర్వహించిన సమావే శంలో మాట్లాడారు. పార్లమెంట్లో అంబేడ్కర్ ను అవమానించిన హోం మంత్రి వెంటనే క్షమాపణ చెప్పాలని లేదంటే జిల్లా పర్యటనను అడ్డుకుంటామన్నారు. నాయకులు రాజు, ఆజాద్, గణేశ్ తదితరులు పాల్గొన్నారు. అభివృద్ధి పనులు ప్రారంభం సిరికొండ: మండలంలోని కొండాపూర్‌లో పలు అభివృద్ధి పనులను కాంగ్రెస్ నాయకులు శనివారం ప్రారంభించారు. 350 మీటర్ల సీసీ డ్రెయినేజీ నిర్మాణానికి రూ. ఏడున్నర లక్షలు, సీసీ రోడ్డు నిర్మాణానికి రూ. మూడు లక్షల నిధులను ఎమ్మెల్యే భూపతిరెడ్డి మంజూరు చేశారని వారు తెలిపారు. కార్యక్రమంలో పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు నల్ల బుచ్చన్న, ఆకుల జగన్, నీరటి శ్రీధర్, గౌసొద్దీన్, కిశోర్‌గౌడ్, చంద్రాగౌడ్, ఎల్లయ్య, శంకర్‌గౌడ్, రవిగౌడ్ పాల్గొన్నారు. రక్తదాన శిబిరం నిజామాబాద్‌నాగారం: నగరంలోని రెడ్‌క్రా స్లో జమాల్పూర్ విఠల్ వ్యాస్ మెమోరియల్ సొసైటీ ఆధ్వర్యంలో శనివారం రక్తదాన శిబి రం నిర్వహించారు. జర్నలిస్టు విఠల్ వ్యాస్ ఐ దో వర్ధంతి సందర్భంగా 19 మంది రక్తదానం చేశారు. కార్యక్రమంలో వైద్యులు బొద్దుల రాజేంద్రప్రసాద్, ధన్పాల్ వినయ్, సందీప్‌రావు, సొసైటీ అధ్యక్షుడు జమాల్పూర్ రాజశేఖర్, రెడ్‌క్రాస్ చైర్మన్ ఆంజనేయులు, మెడికల్ ఆఫీసర్ వి రాజేశ్, విజయానంద్, బైర శేఖర్, చింతల గంగాదాస్, అర్వింద్, పంచరెడ్డి శ్రీకాంత్, సుభాష్, మధుసూదన్, ఆశ నారాయణ, దయాకర్ గౌడ్, సభ్యులు పాల్గొన్నారు. చంద్రశేఖర్‌కు పీహెచ్డీ ప్రదానం డిచ్పల్లి: తెలంగాణ యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా విధులు నిర్వహిస్తున్న మైస చంద్రశేఖర్ ఏపీ లోని ద్రవిడ విశ్వవిద్యాలయం నుంచి గణిత శాస్త్రంలో పీహెచ్డీ పట్టాను శనివారం అందుకున్నారు. ‘సమ్ జనరలైజేషన్స్ యూసింగ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంపెటబిలిటి’ అనే అంశంపై గ్రంథాన్ని సమర్పించారు. పీహెచ్డీ పొందిన చంద్రశేఖర్‌ను యూనివర్సిటీ అధ్యాపకులు అభినందించారు. -
పోలీసులు ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి
● బెటాలియన్ కమాండెంట్ సత్యనారాయణ డిచ్పల్లి: విధి నిర్వహణలో పోలీసులు ఒత్తిడికి గురవుతుంటారని, ఒత్తిడిని జయించి ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలని టీజీఎస్పీ ఏడో బెటాలియన్, డిచ్పల్లి కమాండెంట్ పి సత్యనారాయణ పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని మెడికవర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో శనివారం బెటాలియన్‌లో ఉచిత మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించారు. హాస్పిటల్‌కు చెందిన వివిధ విభాగాల డాక్టర్లు బెటాలియన్ అధికారులు, సిబ్బంది, వారి కుటుంబసభ్యులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. అవసరమైన వారికి ఉచితంగా మందులు అందజేశారు. కమాండెంట్ మాట్లాడుతూ.. మెడికవర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో వైద్య శిబిరం నిర్వహించడం హర్షనీయమన్నారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కమాండెంట్ కేపీ శరత్‌కుమార్, ఆర్ఐలు, ఆర్ఎస్సైలు, బెటాలియన్ సిబ్బంది, వారి కుటుంబసభ్యులు తదితరులు పాల్గొన్నారు. -
ప్రధాన రహదారిపై గుంతలు
నేటి చిత్రంమాకు ఫొటో పంపండినిజామాబాద్ రూరల్ – 97053 46541 రోడ్డుపై ప్రమాదకరంగా ఉన్న గుంతలు సిరికొండ: సిరికొండ నుంచి గడ్కోల్ వెళ్లే మార్గంలో ప్రధాన రహదారిపై గుంతలు ఏర్పడ్డాయి. గుంతలతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రమాదకర గుంతలను పూడ్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలి. – సి బాలకిషన్, గడ్కోల్ మీ ప్రాంతంలో నెలకొన్న సమస్యను, ఫొటోను మాకు వాట్సాప్‌లో పంపించండి. ప్రచురించి అధికారుల దృష్టికి తీసుకెళ్తాము. పంపిన వారి పేరు, ఫొటో ప్రచురిస్తాము. నిజామాబాద్ అర్బన్ – 95531 30597 -
రైతు ఉద్యమం.. పసుపు బోర్డు
పసుపు బోర్డు కోసం 2019లో ఆర్మూర్ పట్టణంలోని మామిడిపల్లి చౌరస్తాలో ధర్నా చేస్తున్న రైతులు (ఫైల్) వినాయక్‌నగర్‌లో ప్రారంభానికి ముస్తాబైన పసుపు బోర్డు కార్యాలయ భవనంఆర్మూర్: జిల్లాలో జాతీయ పసుపు బోర్డు ఏర్పాటు లో ఆర్మూర్ ప్రాంత రైతాంగానిది కీలక పాత్ర. పసుపు బోర్డు కావాలనే నినాదాన్ని ఉద్యమంగా మల్చిన రైతులు అనుకున్నది సాధించారు. 2007 లో స్వదేశీ జాగరణ్ మంచ్ ఆధ్వర్యంలో కోటపాటి నర్సింహనాయుడు పసుపు బోర్డు నినాదం ఇచ్చా రు. రాజకీయాలకు అతీతంగా రైతులు స్వచ్ఛందంగా పచ్చ కండువాలు భుజాన వేసుకుని ముందుకు కదిలారు. రైతులు జరిపిన ఉద్యమ తీవ్రతకు పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలు ఏవైనా పసుపు బోర్డు అంశం కేంద్రంగానే నేతలు హామీలు ఇచ్చేలా పరిస్థితి వచ్చింది. పసుపు పరిశోధన కేంద్రం, పసుపునకు గిట్టుబాటు ధర, పసుపునకు పొగాకు తరహాలో ప్రత్యేక బోర్డు.. ఈ మూడు నినాదాలతో పసుపు రైతుల సంఘం చేపట్టిన ఉద్యమం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టిని ఆకర్షించింది. ఫలితంగా 2009లో అప్పటి ముఖ్యమంత్రి రోశయ్య కమ్మర్‌పల్లిలో 36 ఎకరాల విస్తీర్ణంలో పసుపు పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేసి ప్రారంభించారు. పసుపు బోర్డు ఏర్పాటైతేనే తమకు గిట్టుబాటవుతుందని ఆశించిన రైతులు ఢిల్లీ వీధుల్లో సైతం పలు మార్లు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఈ క్రమంలో గతేడాది అక్టోబర్‌లో మహబూబ్‌నగర్ వేదికగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పసుపు బోర్డును ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ప్రధాని నోట పసుపు బోర్డు ప్రకటన ఆర్మూర్ రైతులు ఏళ్లుగా జరిపిన ఉద్యమ విజయంగా చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో పార్లమెంట్ ఎన్నికల వేళ పసుపు బోర్డు సాధిస్తానంటూ రైతులకు బాండ్ పేపర్ రాసిచ్చిన ధర్మపురి అర్వింద్ రెండు పర్యాయాలు ఎంపీగా గెలవడం గుర్తు చేసుకోవాల్సిన అంశం. ఇది పసుపు రైతుల ఉద్యమ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోనుంది. వారణాసిలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై నామినేషన్లు వేయడానికి వెళ్తున్న రైతులు(ఫైల్) ఢిల్లీకి వినిపించిన రైతు నినాదం 2019 పార్లమెంట్ ఎన్నికల్లో 178 మంది రైతుల నామినేషన్లు ఈవీఎంలు పక్కన పెట్టి బ్యాలెట్ బాక్సు పద్ధతిలో ఎన్నికలు జరిపిన అధికారులు మోదీపైనా వారణాసిలో నామినేషన్లు వేసిన 25 మంది రైతులు, పోటీలో నిలిచిన ఏర్గట్ల రైతు ఇస్తారి రైతులకు బాండ్ రాసిచ్చిన అర్వింద్ చివరికి అనుకున్నది సాధించుకున్న రైతన్నలు రైతు ఉద్యమాల్లో ప్రత్యేక గుర్తింపుఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు ఎంపీ ధర్మపురి అర్వింద్ జిల్లా రైతాంగానికి ఇచ్చిన హామీని నెరవేరుస్తామని కేంద్ర మంత్రులతోపాటు బీజేపీ ముఖ్యులు పలుమార్లు ప్రకటించారు. ఇచ్చిన హామీని నెరవేర్చి మాట నిలబెట్టుకున్నారు. పసుపు రైతుల సమస్యలను గుర్తించిన ప్రధాని నరేంద్ర మోదీతోపాటు బీజేపీ ప్రభుత్వానికి పసుపు రైతుల పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. – పల్లె గంగారెడ్డి, జాతీయ పసుపు బోర్డు చైర్మన్, అంకాపూర్, ఆర్మూర్ మండలం2007 ఎన్నికల నుంచే పసుపు బోర్డు నినాదం పసుపు సాగు వ్యయం పెరిగి గిట్టుబాఽటు ధర లభించకపో వడంతో 2007లో చేపట్టిన ఉద్యమంలోనే మొదటి సారి గా పసుపు బోర్డు నినాదాన్ని తీసుకున్నాం. రైతుల ఉద్య మాలకు ఎంపీ ధర్మపురి అర్వింద్ కృషి తోడైంది. జిల్లా కేంద్రంలో జాతీయ కార్యాలయం ఏర్పాటు కా వడం ఈ ప్రాంత రైతుల విజయం. – కోటపాటి నర్సింహనాయుడు, పసుపు రైతుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, ఆర్మూర్ -
లక్ష్యానికి అనుగుణంగా మొక్కలు నాటాలి
నిజామాబాద్‌అర్బన్: వన మహోత్సవం లక్ష్యానికి అనుగుణంగా మొక్కలు నాటాలని, సమగ్ర ప్రణాళికతో సమాయత్తమై సమష్టిగా కృషి చే యాలని కావాలని కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి అధికారులను ఆదేశించారు. సమీకృత జిల్లా కా ర్యాలయాల సముదాయం నుంచి శనివారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వన మహోత్సవం, ఇందిరమ్మ ఇళ్లు, సీజనల్ వ్యా ధుల నియంత్రణ, ఎల్ఆర్ఎస్ తదితర అంశాలపై మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలు, ఎంపీవోలు, వైద్యాధికారులు, పంచాయతీ కార్యదర్శులతో సమయాత్తం సమీక్షించారు. గతేడాది నాటిన మొక్కల స్థితిగతులను క్షేత్రస్థాయిలో పరిశీలించి నివేదిక అందించాలని అన్నారు. చనిపోయిన మొక్కల స్థానంలో కొత్త మొక్కలు నాటేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు. మొక్కలు నాటిన ప్రతి చోట వివరాలతో కూడిన నేమ్ బోర్డు ఉండాలన్నారు. మొక్కల పంపిణీ కోసం నర్సరీలను సిద్ధం చేస్తూ, వాటిని నాటేందుకు నిర్దేశిత ప్రదేశాల్లో గుంతలు తవ్వించాలని అన్నారు. బ్లాక్ ప్లాంటేషన్‌లో విద్యార్థులను భాగస్వాములు చేయాలని, ప్రజాప్రతినిధులను ఆ హ్వానించి కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించాలని ఆదేశించారు. ‘ఫ్రైడే – డ్రై డే’ ప్రతి చోటా అమలయ్యేలా చూడాలని అన్నారు. ఈ నెలాఖరు వరకు ఎల్ఆర్ఎస్ రాయితీ అమలులో ఉన్న నేపథ్యంలో అర్హులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వారం రోజుల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో స్పష్టమైన ప్రగతి కనిపించాలని అన్నారు. వీడియో కాన్ఫరెనన్స్‌లో అదనపు కలెక్టర్ అంకిత్, జిల్లా అటవీ శాఖ అధికారి వికాస్ మీనా, డీఆర్డీవో సాయాగౌడ్, నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్‌కుమార్, హౌసింగ్ అధికారి నివర్తి, డీఎంహెచ్‌వో రాజశ్రీ, డీసీవో శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. వన మహోత్సవానికి సమగ్ర ప్రణాళికతో సమాయత్తం కావాలి వీడియోకాన్ఫరెన్స్‌లో కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి -
నేడు ఇందూరుకు అమిత్ షా
సుభాష్‌నగర్: జిల్లా కేంద్రానికి నేడు (ఆదివారం) కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా రానున్నారు. పసుపు రైతుల దశాబ్దాల కల అయిన పసుపు బోర్డు జాతీయ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించనున్నారు. అమిత్ షా పర్యటన సందర్భంగా ఏర్పాట్లు, ఇతర అంశాలపై కలెక్టర్, సీపీ సహా పసుపు బోర్డు అధికారులతో కేంద్ర హోంమంత్రిత్వశాఖ ఎప్పటికప్పుడు సమీక్షిస్తోంది. మరోవైపు ఎంపీ అర్వింద్ ధర్మపురి, పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి సైతం బీజేపీ శ్రేణులు, రైతు సంఘాలతో చర్చిస్తున్నారు. అమిత్ షా పర్యటన ఏర్పాట్లు చకచకా కొనసాగుతున్నాయి. నగరంలో భారీగా ఫ్లెక్సీలు వెలిశాయి. డీఎస్ ప్రథమ వర్ధంతి పురస్కరించుకుని కంఠేశ్వర్ బైపాస్ చౌరస్తాలో కాంస్య విగ్రహాన్ని అమిత్ షా ఆవిష్కరించనున్నారు. పసుపు బోర్డు కార్యాలయం ప్రారంభం అనంతరం పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో నిర్వహించనున్న కిసాన్ సమ్మేళన్(రైతు సమ్మేళనం) బహిరంగ సభలో షా పాల్గొననున్నారు. కేంద్ర హోంమంత్రి పర్యటనను పార్టీ రాష్ట్ర, జిల్లా నాయకత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని జిల్లాలతోపాటు నిర్మల్, కామారెడ్డి, తదితర జిల్లాల నుంచి రైతులు, పార్టీ శ్రేణులను తరలించేలా ఏర్పాట్లు పూర్తిచేశారు. ముఖ్యంగా పసుపు రైతులను సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. రైతు సమ్మేళన కార్యక్రమానికి ఏర్పాట్లు పూర్తిచేశారు. వర్షం కురిసినా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీ చర్యలు చేపడుతున్నారు. జాతీయ పసుపు బోర్డు కార్యాలయాన్ని ప్రారంభించనున్న కేంద్ర మంత్రి బైపాస్ చౌరస్తాలో పీసీసీ మాజీ చీఫ్ డీఎస్ విగ్రహావిష్కరణ.. పాలిటెక్నిక్ మైదానంలో కిసాన్ సమ్మేళన్ ఏర్పాట్లను పర్యవేక్షించిన ఎంపీ అర్వింద్, పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి పర్యటన షెడ్యూల్.. అహ్మదాబాద్(గుజరాత్) ఎయిర్‌పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో ఆదివారం ఉదయం బయల్దేరి హైదరాబాద్‌లోని బేగంపేట్‌కు అమిత్ షా చేరుకుంటారు. అక్కడి నుంచి హెలీక్యాప్టర్ ద్వారా జిల్లాకేంద్రానికి మధ్యాహ్నం 1.30 గంటలకు చేరుకుంటారు. 2 గంటలకు జాతీయ పసుపు బోర్డు కార్యాలయం ప్రారంభించిన అనంతరం బస్వాగార్డెన్‌లో పసుపు బోర్డు అధికారులు, రాష్ట్ర ఉన్నతాధికారులతో సమావేశమవుతారు. 3.30 గంటలకు డీఎస్ విగ్రహాన్ని ఆవిష్కరించి, పాలిటెక్నిక్ మైదానంలో నిర్వహించే రైతు సమ్మేళనంలో పాల్గొంటారు. సాయంత్రం 4.30 గంటలకు బహిరంగ సభాప్రాంగణం నుంచి హెలీప్యాడ్ వద్దకు బయల్దేరుతారు. -
ప్రత్యేక పారిశుధ్య పనుల పరిశీలన
నిజామాబాద్ సిటీ: కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా ఆదివారం జిల్లా కేంద్రానికి వస్తున్న సందర్భంగా చేపట్టిన ప్రత్యేక పారిశుధ్య పనులను మున్సిపల్ కమిషనర్ దిలీప్‌కుమార్ పరిశీలించారు. శనివారం ఉదయం ఆయన నగరంలోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. కంఠేశ్వర్ చౌరస్తాలో ఏర్పాటుచేసిన డీఎస్ విగ్రహం, ఐలాండ్ పనులను పరిశీలించిన ఆయన.. పనులను వేగవంతం చేయాలని ఏఈ వాజీద్‌ను ఆదేశించారు. కలెక్టరేట్లోని హెలీప్యాడ్ పరిసరాలను పరిశీలించి పిచ్చిమొక్కలను తొలగింపజేశారు. కలెక్టరేట్ నుంచి కంఠేశ్వర్ బైపాస్, పాలిటెక్నిక్ గ్రౌండ్, ఆర్యనగర్‌లోని పసుపు బోర్డు కార్యాలయం వరకు రోడ్డుకు ఇరువైపులా వి విధ పనులు చేయించారు. పాలిటెక్నిక్ గ్రౌండ్ ప్రహరీ పక్కన ఉన్న పండ్ల బండ్లను తొలగింపజేశారు. రోడ్డుపై ఆక్రమనలను టౌన్‌ప్లానింగ్ అధికారులు తొలగించారు. ఏఎంసీ జయకుమార్, సూపర్వైజర్ సాజిద్, ఎస్ఐలు శ్రీకాంత్, షాదుల్లా, సునీల్, సాల్మన్‌రాజ్ తదితరులున్నారు. దరఖాస్తులకు ఆహ్వానం నిజామాబాద్‌అర్బన్: వివిధ అంశాల్లో నైపుణ్యాన్ని పెంపొందించుకునేందుకు బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఎంబీసీ నిరుద్యోగ యువతీయువకులకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు బీసీ సంక్షేమ శాఖ అధికారిణి స్రవంతి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆస క్తి గల వారు జూలై 12వ తేదీలోగా ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని, అలాగే 14వ తేదీలోగా జిల్లా బీసీ సంక్షేమ శాఖ కార్యాలయంలో దరఖాస్తులను అందజేయాలని సూచించారు. దరఖాస్తుదారుల వయస్సు 21 నుంచి 30 ఏళ్లలోపు ఉండి, ఏదైనా డిగ్రీ అర్హత ఉండాలని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతానికి చెందిన దరఖాస్తుదారుల కు టుంబ సంవత్సర ఆదాయం రూ.1.50 లక్ష లు, పట్టణ ప్రాంతల వారికి రూ.2 లక్షల ఆదాయం మించొద్దని తెలిపారు. ఉత్తమ టీచర్ అవార్డు కోసం..నిజామాబాద్‌అర్బన్: జాతీయ ఉత్తమ టీచర్ అవార్డుల కోసం ఉపాధ్యాయులు దరఖాస్తులు చేసుకోవాలని డీఈవో అశోక్ కోరారు. 2025 సంవత్సరానికి గాను అవార్డుల కోసం ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకునేవారు సంబంధిత పత్రాలను అప్లోడ్ చేయాలని సూచించారు. జూలై 17వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. కాల్పోల్ శివార్లలో ఎలుగుబంటి సంచారం మోపాల్: మండలంలోని కాల్పోల్ శివారు అటవీప్రాంతంలో ఎలుగుబంటి సంచరిస్తోంది. ఈ మేరకు ఓ వీడియో శనివారం వైరల్ కావడంతో పరిసర ప్రాంతాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఎలుగుబంటి సంచరిస్తున్న సమయంలో అటువైపు వెళ్లిన గ్రామస్తులు సెల్ఫోన్లో వీడియో చిత్రీకరించారు. ఎలుగుబంటి సంచరిస్తోన్న విషయం వాస్తవమేనని, మంచిప్ప అటవీ ప్రాంత పరిసరాల్లోని ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని ఫారెస్ట్ అధికారులు సూచించారు. అటవీప్రాంతం గుండా ఒంటరిగా వెళ్లొద్దని, ద్విచక్రవాహనదారులు, కా ర్లు నడిపేవారు హారన్ ఇవ్వాలన్నారు. ము ఖ్యంగా వ్యవసాయ పనులకు వెళ్లే రైతులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. -
రైతుల నామినేషన్లపై దేశవ్యాప్త చర్చ
నిజామాబాద్ జిల్లాలో పసుపు బోర్డు ఏర్పాటు చేయాలనే తమ డిమాండ్ దేశమంతటికీ తెలియజేయాలనే ఉద్దేశంతో పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని నిజామాబాద్, జగిత్యాల జిల్లాలకు చెందిన రైతులు పెద్ద సంఖ్యలో 2019 పార్లమెంట్ ఎన్నికల్లో నామినేషన్లు వేశారు. నిజామాబాద్ పార్లమెంట్ స్థానానికి మొత్తం 185 మంది అభ్యర్థులు బరిలో ఉండగా, అందులో 178 మంది రైతులే ఉన్నారు. బరిలో నిలిచిన అభ్యర్థుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో ఈవీఎంల స్థానంలో బ్యాలెట్ బాక్సులను ఏర్పాటు చేసి ఎన్నికలు నిర్వహించాల్సిన పరిస్థితి వచ్చింది. అదే విధంగా ప్రధాని మోదీ పోటీ చేసిన వారణాసి (ఉత్తరప్రదేశ్) స్థానం నుంచి బరిలో నిలిచేందుకు 50 మంది రైతులు తరలివెళ్లారు. 25 మంది నామినేషన్లు వేయగా, వివిధ కారణాలతో 24 మందివి తిరస్కరణకు గురయ్యాయి. ఏర్గట్ల మండలానికి చెందిన రైతు ఇస్తారి ఎన్నికల బరిలో నిలిచారు. నరేంద్ర మోదీపై పోటీలో నిలిచిన ఇస్తారికి 711 ఓట్లు వచ్చాయి. -
రైతుల 30 ఏళ్ల కల పసుపు బోర్డు
సుభాష్‌నగర్: రైతుల 30 ఏళ్ల పసుపు బోర్డు కల నెరవేరిందని, స్పైసెస్ బోర్డు నుంచి పసుపు బోర్డు వేరు చేసి ప్రత్యేక బోర్డును ఏర్పాటు చేయడంలో ఎంపీ అర్వింద్ ధర్మపురి కృషి ఎంతో ఉందని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కార్యక్రమ పరిశీలకురాలు బంగారు శృతి అన్నారు. జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో శనివారం ఆమె విలేకరులతో మాట్లాడారు. ఎంపీ అర్వింద్ ఎంతో శ్రమించి పసుపు బోర్డును సాధించారని, రైతులు ఢిల్లీ వెళ్లే శ్రమ లేకుండా పసుపు బోర్డు జాతీయ కార్యాలయాన్ని నిజామాబాద్‌లో ఏ ర్పాటు చేసినట్లు తెలిపారు. పసుపు బోర్డు కా ర్యాలయ ప్రారంభోత్సవం, రైతు సమ్మేళన కార్యక్రమానికి రైతులు పెద్దసంఖ్యలో తరలివ చ్చి విజయవంతం చేయాలని ఆమె కోరారు. నిజామాబాద్ అర్బన్, ఆర్మూర్ ఎమ్మెల్యేలు ధన్పాల్ సూర్యనారాయణ, రాకేశ్‌రెడ్డి మాట్లాడుతూ.. పసుపు బోర్డు తెలంగాణకు ఎంతో ఉప యోగకరంగా ఉంటుందన్నారు. పరిశ్రమల రాకతో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని పేర్కొ న్నారు. ఎంపీ అర్వింద్ బోర్డు ఏర్పాటు చేస్తానని వాగ్దానం చేస్తే ప్రతిపక్షాలు అవహేళన చేశాయ ని గుర్తుచేశారు. కానీ అర్వింద్ అవేవీ పట్టించుకోకుండా పట్టుబట్టి విక్రమార్కుడిలా పసుపు బోర్డును సాధించడంతోపాటు జిల్లాలోనే కార్యాలయం ఏర్పాటయ్యేలా, చైర్మన్‌గా జిల్లా రైతు బిడ్డనే నియమించేలా కృషి చేశారని కొనియాడారు. వ్యవసాయ రంగానికి ఇందూరు కేంద్రబిందువు కానుందన్నారు. అవహేళన చేసిన వారి కళ్లు చెదిరిపోయేలా బోర్డు కార్యాలయాన్ని ప్రారంభించేందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరవుతున్నారని పేర్కొన్నారు. పసుపు బోర్డు జాతీయ కార్యాలయం ప్రారంభోత్సవం, రైతులతో ముఖాముఖి, కంఠేశ్వర్ బైపాస్ చౌరస్తాలో డీఎస్ విగ్రహావిష్కరణ, పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో రైతు సమ్మేళన కార్యక్రమం ఉంటుందని బీజేపీ జిల్లా అధ్యక్షు డు దినేశ్ కులాచారి వివరించారు. కేంద్రమంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్, రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్, బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎ మ్మెల్సీలు, పార్టీ జాతీయ, రాష్ట్ర నాయకులు, ప సుపు బోర్డు ఉన్నతాధికారులు పాల్గొంటారని తె లిపారు. ఎమ్మెల్సీ అంజిరెడ్డి, నాయకులు ప్రకాశ్‌రెడ్డి, న్యాలం రాజు తదితరులు పాల్గొన్నారు. ఎంపీ అర్వింద్ కృషితో సాకారమైంది రైతు సమ్మేళనాన్ని విజయవంతం చేయాలి బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బంగారు శృతి -
సీఎంను విమర్శించే స్థాయి ప్రశాంత్‌రెడ్డికి లేదు
తెయూ(డిచ్పల్లి): ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను రేవంత్‌రెడ్డి ప్రభుత్వం పక్కాగా అమలు చేస్తుందని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి కాటిపల్లి నగేష్‌రెడ్డి పేర్కొన్నారు. ఓర్వలేక మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి విమర్శలు చేయడం తగదన్నారు. ప్రజా సంక్షేమానికి అహర్నిషలు కృషి చేస్తున్న సీఎంను విమర్శించే స్థాయి ప్రశాంత్‌రెడ్డికి లేదన్నారు. శుక్రవారం డిచ్పల్లి మండల కేంద్రంలోని కేఎన్ఆర్ గార్డెన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నగేష్‌రెడ్డి మాట్లాడారు. స్థానిక ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు భారీ మెజారిటీతో గెలువడం ఖాయమని నగేష్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో డిచ్పల్లి మాజీ ఎంపీపీ చిన్నోల్ల నర్సయ్య, కాంగ్రెస్ ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు యాదగిరి, మోపాల్ సొసైటీ ఛైర్మన్ గంగారెడ్డి, నాయకులు పులి వెంకటేశ్వరరావు, సుదాం శ్రీనివాస్, రాధ, తదితరులు పాల్గొన్నారు. స్థానిక ఎన్నికల్లో యూత్ కాంగ్రెస్ ప్రముఖ పాత్ర వహించాలి నిజామాబాద్ సిటీ : స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేవిధంగా యూత్ కాంగ్రెస్ నాయకులు కృషిచేయాలని, క్షేత్రస్థాయిలో పర్యటించాలని జిల్లా యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు విపుల్‌గౌడ్ సూచించారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ భవన్లో నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గ స్థాయీ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా విపుల్‌గౌడ్ మాట్లాడారు. పార్టీ కోసం పనిచేసే వారికి పదవులు వస్తాయని తెలిపారు. రానున్న స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపుకోసం పనిచేయాలని కోరారు. త్వరలో సోషల్ మీడియా కమిటీలను ఏర్పాటు చేస్తామన్నారు. యూత్ కాంగ్రెస్ నాయకులు యూసుఫ్, బింగి శుభం, మోసిన్‌ఖాన్, దినేష్ కుమార్, దీక్షిత్ కుమార్, సయీద్ ముద్దశీర్, సర్ఫరాజ్,అక్రం, ఫైజల్ పాల్గొన్నారు. -
ఇద్దరి మధ్య ఘర్షణ.. ఒకరి మృతి
మోర్తాడ్: మద్యం సేవిస్తూ ఇద్దరు వ్యక్తులు ఘర్షణ పడగా తీవ్ర గాయాలపాలైన ఒకరు మృతి చెందిన ఘటన మోర్తాడ్ మండలం దొన్కల్‌లో చోటు చేసుకుంది. జిల్లా కేంద్రంలోని నందిగుట్టకు చెందిన షేక్ రహమాన్(42) అనే వ్యక్తి లారీ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. అలాగే ఇంటి నిర్మాణ కార్మికునిగా కూడా పని చేస్తున్న అతను నాలుగు రోజుల క్రితం అల్లెపు రాజు అనే వ్యక్తితో దొన్కల్‌లో పని చేయడానికి వచ్చాడు. ఇక్కడ పని చేస్తున్న రాజు, రహమాన్లు గురువారం అర్ధరాత్రి మద్యం సేవించారు. ఇద్దరి మధ్య వివాదం తలెత్తగా రాజు రహమాన్‌పై దాడి చేశాడు. ఈ దాడిలో రహమాన్ తల, కాళ్లు, చేతులపై తీవ్ర గాయాలయ్యాయి. అపస్మారక స్థితిలో ఉన్న బాధితుడిని ముత్యం అనే వ్యక్తి అంబులెన్స్‌లో శుక్రవారం ఆర్మూర్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందాడు. విషయం తెలుసుకున్న భీమ్‌గల్ సీఐ పొన్నం సత్యనారాయణ, మోర్తాడ్ ఎస్సై విక్రమ్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.మద్యం మత్తులో కాలువలో పడి ఒకరి మృతి బీబీపేట: మద్యం మత్తులో కాలువలో పడి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన బీబీపేట మండల కేంద్రంలో చోటు చేసుకుంది. ఎస్సై ప్రభాకర్ శుక్రవారం తెలిపిన వివరాల ప్రకారం.. బీబీపేటకు చెందిన శ్యాగ గణేశ్(45) మద్యానికి బానిస కావడంతో ఎలాంటి పనిచేయకుండా తిరుగుతుండే వాడు. మద్యం తాగుతూ బస్టాండ్ ఆవరణలో పడుకునేవాడు. గురువారం రాత్రి మద్యం తాగి స్థానిక వైన్స్ షాప్ దగ్గర ఉన్న మురికి కాలువ వద్ద పడుకున్నాడు. ప్రమాదవశాత్తు మురికి కాలువలో పడి మృతిచెందాడు. మృతుడి భార్య భార్య నర్సవ్వ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. డ్రంకన్ డ్రైవ్‌లో పట్టుబడిన ఐదుగురికి జైలు ఖలీల్‌వాడి: డ్రంకన్ డ్రైవ్‌లో పట్టుబడిన ఐదుగురికి సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ నూర్జహాన్ రెండు రోజుల జైలు శిక్షను విధించినట్లు ట్రాఫిక్ సీఐ పి ప్రసాద్ శుక్రవారం తెలిపారు. జిల్లా కేంద్రంలో మద్యం తాగి వాహనాలు నడిపిన 15 మందిని ట్రాఫిక్ పోలీసులు పట్టుకున్నారు. వీరికి ట్రాఫిక్ పీఎస్‌లో కౌన్సెలింగ్ నిర్వహించి కోర్టులో హాజరుపర్చినట్లు తెలిపారు. పది మందికి రూ. పదివేను వేల జరిమానా, ఐదుగురికి రెండు రోజుల జైలు శిక్షను జడ్జి విధించినట్లు సీఐ పేర్కొన్నారు.పోలీసుల అదుపులో ఇద్దరు ఆకతాయిలు ఖలీల్‌వాడి: నగరంలోని రెండవ టౌన్ పీఎస్‌లో పరిధిలోని ఉన్న దర్గా వద్ద ఇద్దరు ఆకతాయి యువకులను షీటీం సభ్యులు అదుపులోకి తీసుకున్నారు. వీరిని షీటీమ్ సభ్యులు స్థానిక పీఎస్‌కు తరలించారు. విచారణ చేపట్టి వీరిపై కేసు నమోదు చేయనున్నట్లు సమాచారం. బాత్రూమ్ విషయంలో గొడవరామారెడ్డి: బాత్రూమ్ విషయంలో ఇద్దరు అన్నాదమ్ముళ్లు, వారి కుమారుల మధ్య జరిగిన గొడవలో పలువురు గాయపడినట్లు ఎస్సై రాజారాం తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. రామారెడ్డి మండలం మద్దికుంట గ్రామానికి చెందిన నర్సయ్య, రాజయ్య ఇద్దరు అన్నాదమ్ముళ్లు. కాగా వీరికి చెందిన బాత్రూం విషయంలో గొడవ జరుగుతోంది. శుక్రవారం వారి మధ్య మళ్లీ గొడవ చోటు చేసుకుంది. మొదట రాజయ్యను తన అన్న నర్సయ్య కుమారుడు శ్రీకాంత్ గొడ్డలితో గాయపర్చాడు. ఆ తర్వాత చిన్న కుమారుడు శ్రీధర్ సైతం రాజయ్యను అతని కుమారుడు నరేశ్‌పై దాడి చేశాడు. దీంతో ఇరు కుటుంబాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. గాయపడ్డ వారిని ఆస్పత్రికి తరలించారు. పలువురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. -
ముందుకు సాగని రెవెన్యూ పనులు
నిజామాబాద్ సిటీ : నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో రెవెన్యూ పనులు ముందకు సాగడంలేదు. చిన్న చిన్న పనుల నుంచి ఇంటి నిర్మాణ అనుమతుల వరకు పనుల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది. బల్దియా చుట్టూ తిరుగుతున్నా పనులు కావడం లేదని నగరవాసులు వాపోతున్నారు. పర్మినెంట్ డిప్యూటీ కమిషనర్ లేకపోవడంతో ఫైళ్లకు మోక్షం కలగడం లేదు. వందల సంఖ్యలో ఫైళ్లు పెండింగ్ ఉండగా, పరిశీలించేవారు లేరు. ఇన్చార్జి డీసీగా జయకుమార్‌కు బాధ్యతలు అప్పగించినా, ఆయన శానిటరీ విభాగానికి చెందిన అధికారి కావడం, రెవెన్యూపై పట్టు లేకపోవడంతో పనులు ముందుకు వెళ్లడం లేదని తెలుస్తోంది. ఇద్దరు ఆర్వోలున్నా పనులకు అంతరాయం.. కార్పొరేషన్‌కు రెవెన్యూ విభాగం ప్రధాన ఆదాయ వనరు. గత కొన్ని నెలలుగా ఈ విభాగం సుప్తావస్థలో ఉంది. సరియైన అధికారిని నియమించలేరు. డీసీగా రాజేంద్రకుమార్ రిటైర్ అయిన తర్వాత ఆయన స్థానంలో ఎవరు రాలేదు. ఇద్దరు ఆర్వోలున్నా పనుల్లో ముందడగు పడటంలేదు. గత డిసెంబర్ నెల నుంచి పనులు ముందుకు సాగడం లేదు. ఆస్తిపన్నుల వసూళ్లలో బిజీగా ఉన్న అధికారులు ఇతర పనులపై పెద్దగా శ్రద్ధ వహించలేదు. పాత ఇంటిని తొలగించి నూతన ఇంటి నిర్మాణం కోసం చేసుకున్న దరఖాస్తులే ఎక్కువ. మ్యుటేషన్ కోసం దరఖాస్తు చేసుకున్న ఫైళ్లు కూడా ముందుకు సాగడం లేదు. ఒకే ఇంటికి రెండు నెంబర్లు కేటాయించడం. రెండు డిమాండ్ నోటీసులు ఇవ్వడం, ఆస్తిపన్ను చెల్లించినా ఇప్పటికీ ఆన్లైన్లో డ్యూ చూపించడం వంటి పనులు పెండింగ్‌లో ఉన్నాయి. శిథిలావస్థలోని ఇళ్లు, నివాస యోగ్యంలేని ఇళ్లకు సైతం డిమాండ్ నోటీసులు ఇచ్చారు. వెకెంట్ లాండ్ టాక్స్‌లకు సంబంధించి పన్ను చెల్లిస్తామన్న బల్దియాలోని రెవెన్యూ సిబ్బంది తీసుకోవడం లేదని కొందరు వాపోతున్నారు. కొత్త కాలనీవాసులకు ఇంటినెంబర్ కేటాయింపులో కూడా తీవ్ర జాప్యం జరుగుతోంది. నల్లా కనెక్షన్ కోసం దరఖాస్తుచేసుకున్న కనెక్షన్ ఇవ్వడానికి సిబ్బంది ముందుకు రావడం లేదు. ట్రేడ్‌లైసెన్స్‌ల జారీలో కూడా తీవ్ర జాప్యం సాగుతోంది. నగరంలో ఐదంతస్తుల భవనాన్ని మొదటి అంతస్తు కమర్షియల్‌గా చూపిస్తూ.. మిగతా వాటిని రెసిడెన్షియల్‌గా చూపిస్తూ బల్దియా ఆదాయానికి కొందరు అధికారులు గండికొడుతున్నారు. ఆస్తిపన్నుల కోసం దరఖాస్తు చేసుకున్నవారికి నిర్ణీత సమయంలో అనుమతులు ఇస్తే సంబంధిత పన్నులు చెల్లిస్తారు. అనుమతుల్లో జాప్యం కారణంగా బల్దియాకు వచ్చే ఆదాయం రాకుండా పోతోంది. బల్దియాలో డీసీ స్థాయి రెవెన్యూ అధికారి లేకపోవడంతో కొందరు కిందిస్థాయి సిబ్బంది, ఆపరేటర్లు, సహాయకులు దళారులు అందినకాడికి దండుకుంటున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. శివారు గ్రామాల సమస్యలే ఎక్కువ కార్పొరేషన్లో విలీనమైన విలీన గ్రామాల్లోని ప్రజలకు సమస్యలు ఎక్కువ వస్తున్నాయి. ముబారక్‌నగర్, గూపన్పల్లి, బోర్గాం (పి), పాంగ్రా, సారంగపూర్ గ్రామస్తులకు చెందిన సమస్యలు ఎక్కువగా పెండింగ్‌లో ఉంటున్నాయి. ట్రేడ్ లైసెన్సులు, మ్యుటేషన్ల జారీలో జాప్యం కార్యాలయం చుట్టూ ప్రజల ప్రదక్షిణలు వందల సంఖ్యలో పైళ్ల పెండింగ్..! దళారులుగా కిందిస్థాయి సిబ్బంది బల్దియా ఆదాయానికి గండి సమస్యలకు చెక్ పెడతాం కార్పొరేషన్‌కు డిప్యూటీ కమిషనర్ నియామకమయ్యారు. పెండింగ్‌లో ఉన్న సమస్యలన్నింటిని పరిష్కరిస్తాం. సమ స్యలుంటే నా దృష్టికి తీసుకురావాలి. దళారులను నమ్మవద్దు. – దిలీప్‌కుమార్, బల్దియా కమిషనర్ -
షెడ్డు నిర్మాణానికి భూమిపూజ
నిజామాబాద్ రూరల్ : నగరంలోని నాందేవ్‌వాడలోని ఆరే మరాఠా సమాజ్ సంఘం షెడ్డు నిర్మాణానికి సభ్యులు శుక్రవారం భూమి పూజ చేశారు. ఎంపీ అర్వింద్ మంజూరు చేసిన నిధులతో పనులు ప్రారంభించినట్లు సభ్యులు తెలిపారు. ఆర్య మరాఠా సమాజ్ సంఘ అధ్యక్షులు దిగంబరావ్ పవర్, డివిజన్ మాజీ కార్పొరేటర్ ఎర్రం సుధీర్, సంఘ సభ్యులు పాల్గొన్నారు. బంజారా సేవా సంఘం జిల్లా కార్యవర్గం ఎన్నిక నిజామాబాద్‌నాగారం: నగరశివారులోని పాంగ్రా బ్యాంక్ కాలనీలోని కమ్యూనిటీ భవనంలో బంజారాల ప్రత్యేక సమావేశం శుక్రవారం నిర్వహించారు. ఈసమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు సేనావత్ శ్రీహరి ఆధ్వర్యంలో బంజారా సేవా సంఘం జిల్లా కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. బంజారా సేవా సంఘం జిల్లా అధ్యక్షుడిగా రామావత్ మోహన్‌నాయక్, ప్రధాన కార్యదర్శిగా కేతావత్ పీర్‌సింగ్‌నాయక్, ఉపాధ్యక్షులుగా రంజ్యానాయక్, బన్నీనాయక్, ఎం.కిషన్‌నాయక్, సంయుక్త కార్యదర్శులుగా మోతిలాల్, జోర్సింగ్, బానోత్ రంజ్యానాయ క్, కిషన్‌నాయక్, రాములునాయక్తోపా టు ఎనిమిది మంది కార్యవర్గ సభ్యులు ఎన్నుకున్నారు. నూతన కార్యవర్గసభ్యులను సేనావత్ శ్రీహరి సన్మానించారు. కార్యక్రమంలో బంజారా నాయకులు బాదావత్ శంకర్‌నాయ క్, బానోత్ గోపాల్‌నాయక్, మాజీ ఎంపీపీ ప్రేమ్నాయక్,రాజశేఖర్,రవి తదితరులున్నారు. మహిళా సంఘాలను బలోపేతం చేయాలి ఇందల్వాయి: మండలంలోని మహిళా సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేయాలని సెర్ప్ ఐబీ డైరెక్టర్ భారతి అన్నారు. ఇందల్వాయి రైతు వేదికలో మహిళా సంఘాల సభ్యులతో ఆమె శుక్రవారం అవగాహన సమావేశాన్ని నిర్వహించారు.నూతనంగా ఎన్నికై న మహిళా సంఘాల పదాతిపతులు సంఘంలోని సభ్యులందరికీ రుణాలు అందేలా వారు రుణాన్ని సకాలంలో చెల్లించేలా కృషి చేయాలని సూచించారు.కామారెడ్డి జిల్లా నుంచి వచ్చిన సీఆర్పీ లు మహిళా సంఘాల అధ్యక్షులకు ఆర్థిక పద్దు ల నిర్వహణ సభ్యులతో సమన్వయం వంటి అంశాలపై శిక్షణ ఇచ్చారు. కార్యక్రమంలో ఏపీఎం సువర్ణ, ఐబీ డీపీఎం శ్రీనివాస్, ఏటీఎం సరోజిని, సీసీ ఉదయ్ తదితరులున్నారు. -
పిచ్చికుక్క దాడిలో పలువురికి గాయాలు
గాంధారి: పిచ్చికుక్క దాడిలో పలువురు గాయాలపాలైన ఘటన గాంధారి మండల కేంద్రంలో శుక్రవారం చోటు చేసుకుంది. ఓ చిన్నారి తలకు తీవ్ర గాయాలయ్యాయి. మండల కేంద్రంలోని ఎనిమిదో వార్డులో పిచ్చి కుక్క వీధుల్లో తిరుగుతూ కనబడిన వారందరిపై దాడి చేసి గాయపర్చింది. అమల, అమిక, పాపవ్వ, అనితతో పాటు ఇంటి బయట ఆడుకుంటున్న అమిక అనే చిన్నారిని గాయపర్చింది. పక్కింట్లో ఉండే పాపవ్వ అనే మహిళ కుక్క నుంచి చిన్నారిని విడిపించే ప్రయత్నం చేయగా ఆమైపె కూడా దాడి చేసింది. కుక్కకాటుకు గురైన వారందరిని స్థానికులు స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా డాక్టర్ ప్రసన్న చికిత్స చేశారు. మెరుగైన చికిత్స కోసం కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అంతేకాకుండా పిచ్చి కుక్క పశువులు, దూడలపై దాడి చేసి గాయపర్చింది. కాలనీ వాసులు వెంబడించి పిచ్చికుక్కను చంపేశారు. -
హిందూ ధర్మ పరిరక్షణ అందరి బాధ్యత
నిజామాబాద్ రూరల్: హిందూ ధర్మాన్ని పరిరక్షించుకునే బాధ్యత అందరిపై ఉందని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ నిర్మలమైన మనస్సుతో భగవంతున్ని ప్రార్థించాలని తెలిపారు. అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం (ఇస్కాన్) ఇందూరు శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం నగరంలో నిర్వహించిన జగన్నాథ రథయాత్రలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా భక్తులనుద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇస్కాన్ ఆధ్వర్యంలో శ్రీకృష్ణ తత్వాన్ని, మహాభగవత్ సమస్త మానవాళి జీవనానికి గల ప్రాముఖ్యతను వారం రోజులుగా భక్తులకు సప్తాహం ద్వారా తెలియజేశారన్నారు. శ్రీ కృష్ణుడు సకల శుభాలను అందించి భక్తుల కష్టాలను తీరుస్తాడని తెలిపారు. రథయాత్రలో స్వామిని దర్శించుకోవడం, రథసేవ చేయడం మహాభాగ్యమన్నారు. మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి మాట్లాడుతూ జిల్లాలో ఇస్కాన్ వారు జగన్నాఽథ రథయాత్ర నిర్వహించడం సంతోషకరమన్నారు. ప్రజలకు భగవంతుని పట్ల విశ్వాసం పెరిగేలా ఇస్కాన్ ప్రతినిధులు ప్రవచనాలు అందించారని అన్నారు. కాగా, ఇస్కాన్ ముంబై ఉపాధ్యక్షుడు, ఇస్కాన్ గ్రంథ తెలుగు అనువాదకులు శ్రీమాన్ వైష్ణవాంగ్రీ సేవక్ దాస్ ఆధ్వర్యంలో కేంద్రం అధ్యక్షుడు బలరాం దాస్ ఎనిమిది రోజులపాటు పాత గంజ్‌లో జగన్నాథ రథయాత్ర కార్యక్రమంలో ప్రవచనాలు చేశారు. రథయాత్రకు ముందు భజనలు, కీర్తనలు, మహాహారతి, పల్లకీ సేవ, ఊంజల్ సేవ, సాంస్కృతిక కార్యక్రమాలతో గంజ్ ప్రాంతంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ఊరేగింపులో జిల్లా నుంచే కాకుండా వివిధ రాష్ట్రాల భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ వైభవంగా జగన్నాథ రథయాత్ర పెద్ద సంఖ్యలో హాజరైన భక్తజనం -
కాంగ్రెస్, బీఆర్ఎస్లు ఖాళీ కావడం ఖాయం
బాల్కొండ: స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఖాళీ కావడం ఖాయమని ఎంపీ ధర్మపురి అర్వింద్ పేర్కొన్నారు. బాల్కొండ మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో శుక్రవారం నిర్వహించిన వికసిత్ భారత్ సంకల్ప సభకు ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడారు. బీజేపీలోకి పదవులు ఆశించి రావొద్దని, కేవలం సేవ చేయాలనే భావనతో రావాలన్నా రు. బీజేపీలోకి చేరికలు తప్ప బయటకు పోయే పరి స్థితి ఉండదన్నారు. గతంలో నిజామాబాద్ కార్పొ రేషన్‌లో బీజేపీ టికెట్‌పై గెలిచిన 10 మంది కార్పొరేటర్లు వేరే పార్టీకి వెళ్లి తిరిగి మళ్లీ బీజేపీలో 14 మందితో చేరారన్నారు. జిల్లా కేంద్రంలో ఆదివారం ని ర్వహించే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సభ కు భారీగా తరలిరావాలని కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఏలేటి మల్లికార్జున్‌రెడ్డి, జి ల్లా ఉపాధ్యక్షుడు నిమ్మల శ్రీనివాస్, నియోజకవర్గ కన్వీనర్ మల్కన్నగారి మోహన్, బాల్కొండ, ము ప్కాల్, మెండోరా మండలాల అధ్యక్షులు అంబటి నవీన్, సంతోష్‌రెడ్డి, ముత్యంరెడ్డి పాల్గొన్నారు. బీజేపీలో భారీగా చేరికలు.. బీజేపీలో బీఆర్ఎస్ నుంచి ఎంపీ అర్వింద్ సమక్షంలో భారీగా చేరికలు జరిగాయి. ముప్కాల్ మండల బీఆర్ఎస్ అధ్యక్షుడు ముస్కు భూమేశ్వర్, బాల్కొండ మాజీ ఎంపీపీ లావణ్యాలింగాగౌడ్, కొత్తపల్లి మాజీ ఎంపీటీసీ వెంకట్రాజ్, ముప్కాల్ మాజీ ఉపసర్పంచ్ సువర్ణలింగం, రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగి సుంకం శ్రీనివాస్ తమ అనుచరులతో కలిసి బీజేపీలో చేరారు. వారికి ఎంపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఎంపీ ధర్మపురి అర్వింద్ -
పసుపు రైతులు సంబురాలు చేసుకోవాలి
ఆర్మూర్: జిల్లా కేంద్రంలో జాతీయ పసుపు బోర్డు కేంద్ర కార్యాలయాన్ని ప్రారంభించడానికి వస్తున్న కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా బహిరంగ సభను విజయవంతం చేసి రైతులు సంబురాలు చేసుకోవాలని పసుపు రైతుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కోటపాటి నరసింహనాయుడు అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని రైతు సేవా కేంద్రంలో శుక్రవారం బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు పాటూరి తిరుపతిరెడ్డితో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 29న జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్ గ్రౌండ్లో నిర్వహించే పసుపు రైతుల సమ్మేళనాన్ని గొప్పగా జరుపుకోవాలన్నారు. ఆర్మూర్ సబ్ డివిజన్లోని 250 పసుపు రైతు సంఘాల సభ్యులందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. -
గుంతలమయంగా బర్ధిపూర్ రోడ్డు..
నేటి చిత్రంమాకు ఫొటో పంపండినిజామాబాద్ అర్బన్ – 95531 30597 గుంతలు పడిన బర్ధిపూర్ రోడ్డు.. డిచ్పల్లి: మండలంలోని కేశాపూర్ క్రాస్ రోడ్డు నుంచి బర్ధిపూర్ గ్రామానికి వెళ్లే రోడ్డు పూర్తిగా కంకరతేలి గుంతలమయంగా మారింది. ఏప్రిల్ 19న ఈ బీటీ రోడ్డు పునరుద్ధరణ పనులకు రూ.60లక్షల తో రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి శంకుస్థాపన చేశారు. ఇప్పటికీ పనులు ప్రారంభం కాలేదు. దీంతోఈరోడ్డు గుండా వెళ్లే వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. – గంగాధర్, బర్ధిపూర్ మీ ప్రాంతంలో నెలకొన్న సమస్యను, ఫొటోను మాకు వాట్సాప్‌లో పంపించండి. ప్రచురించి అధికారుల దృష్టికి తీసుకెళ్తాము. పంపిన వారి పేరు, ఫొటో ప్రచురిస్తాము. నిజామాబాద్ రూరల్ – 97053 46541 -
బ్లాక్‌లాగ్ పరీక్షలు నిర్వహించండి
తెయూ(డిచ్పల్లి): తెలంగాణ యూనివర్సిటీ పీజీ బ్యాక్లాగ్ పరీక్షలను నిర్వహించాలని ఏబీవీపీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం తెయూ కంట్రోలర్ సంపత్‌కుమార్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఏబీవీపీ స్టేట్ వర్కింగ్ కమిటీ మెంబర్ అమృతాచారి, వర్సిటీ అధ్యక్షుడు సాయికుమార్ మాట్లాడుతూ.. వచ్చే సెమిస్టర్ పరీక్షల సమయంలో వర్సిటీ విద్యార్థులకు రెగ్యులర్ పరీక్షలతో పాటు బ్లాక్‌లాగ్ పరీక్షలను నిర్వహించాలని కోరారు. కార్యక్రమంలో వర్సిటీ ఏబీవీపీ ఎగ్జిక్యూటీవ్ మెంబర్ అక్షయ్, నాయకులు పృథ్వీ, మనోజ్, శ్రీను తదితరులు పాల్గొన్నారు. -
హోంగార్డ్స్కు ఉలెన్ జాకెట్స్ అందజేత
ఖలీల్‌వాడి: నగరంలోని సీపీ కార్యాలయంలో హోంగార్డులకు సీపీ సాయిచైతన్య ఉలెన్ జాకెట్స్‌ను శుక్రవారం అందజేశారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. వర్షాకాలం, చలికాలంలో విధుల నిర్వహణ కష్టమవుతున్నందున ముందు జాగ్రత్తలో భాగంగా జిల్లాలోని 369 మంది హోంగార్డ్స్కు ఉలెన్ జాకెట్స్‌ను అందించినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో హోంగార్డ్స్ విభాగం ఇన్చార్జి రిజర్వ్ సీఐ సతీశ్, వెల్ఫేర్ విభాగం రిజర్వ్ సీఐ తిరుపతి, హోంగార్డులు తదితరులు ఉన్నారు. ‘ఖిల్లా’ను సందర్శించిన దాశరథి శతజయంతి కమిటీనిజామాబాద్ రూరల్: నగరంలోని ఖిల్లా రఘునాథ రామాలయాన్ని దాశరథి శతజయంతి కమిటీ సభ్యులు సాయికుమార్, లింగం, సీతయ్య, నర్సారెడ్డిలు శుక్రవారం సందర్శించారు. ఖిల్లాలోని దాశరథి కృష్ణమాచార్యులను బంధించిన జైలు గదిని పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఖిల్లాను దాశరథి స్మృతి వనంగా మార్చాలని, భావితరాలకు దాశరథి పోరాట పటిమ గుర్తుండిపోయేలా తీర్చిదిద్దాలని కోరారు. జాతీయ స్థాయి తైక్వాండో పోటీల్లో ప్రతిభ సిరికొండ: జాతీయ స్థాయి తైక్వాండో పోటీల్లో నారాయణపల్లె గ్రామానికి చెందిన చౌట్పల్లి నేహ ప్రతిభ చాటినట్లు ఆమె తండ్రి శ్రీనివాస్ తెలిపారు. హైదరాబాద్‌లోని గచ్చిబౌలి బాలయోగి ఇండోర్ స్టేడియంలో జరుగుతున్న జాతీయ స్థాయి తైక్వాండో పోటీల్లో నేహ ప్రతిభ చాటి బంగారు పతకం సాధించింది. జిల్లా కేంద్రంలోని నిశిత డిగ్రీ కళాశాలలో నేహ ఫైనల్ ఇయర్ చదువుతోంది. -
అభివృద్ధిని అడ్డుకుంటున్న బీజేపీ, బీఆర్ఎస్
● పాత డిజైన్ ప్రకారమే ‘మంచిప్ప’ పనులు ● ‘స్థానిక’ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలి ● నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే ఆర్ భూపతిరెడ్డి మోపాల్(నిజామాబాద్‌రూరల్): బీజేపీ, బీఆర్ఎస్ రెండు పార్టీలు కలిసి తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటున్నాయని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ ఆర్ భూపతిరెడ్డి విమర్శించారు. శుక్రవారం మండలంలోని కంజర్, కులాస్పూర్, చిన్నాపూర్, బాడ్సి గ్రామాల్లో సీసీ రోడ్లు, డ్రెయినేజీ పనులు, శివాలయం ప్రహరీకి భూమిపూజ చేశారు. అంగన్వాడీ భవనాలు, ఆరోగ్య సబ్‌సెంటర్లు, బాడ్సిలో సొసైటీ గోదాం, కార్యాలయం, సీసీ రోడ్లు ప్రారంభోత్సవాలు చేశారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను పరిశీలించి, లబ్ధిదారులకు మంజూరుపత్రాలు అందజేశారు. ఈసందర్భంగా ఏర్పాటుచేసిన సభల్లో ఎమ్మెల్యే మాట్లాడారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ పదేళ్ల పాలనకు, కాంగ్రెస్ 18 నెలల పాలన గురించి ప్రజలు బేరీజు చేసుకోవాలని సూచించారు.విడతలవారీగా కులసంఘాలకు నిధులు కేటాయిస్తామని, గ్రామాల అభివృద్ధి బాధ్యత తనదేనని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించుకోవాలన్నారు.బీసీలకు 42శాతం రిజర్వేషన్ల అమలుకు కాంగ్రెస్ కట్టుబడి ఉందని, కవిత ఇప్పుడు బీసీల కోసం ఉద్యమిస్తుందని, పదేళ్లు ఏం చేశారని ప్రశ్నించారు. ప్రాణహిత–చేవెళ్ల పథకంలో భాగంగా మంచిప్ప వద్ద పాత డిజైన్ ప్రకారమే పనులు కొనసాగేలా త్వరలో జీవో విడుదల అవుతుందని, ప్రతి గుంటకు నీరందిస్తామని ఎమ్మెల్యే ప్రకటించారు. మనం రామభక్తులం.. బీజేపీ వాళ్లు మోదీ భక్తులు.. బీజేపీ వారు మోదీ భక్తులని, మనమంతా రామభక్తులమని ఎమ్మెల్యే భూపతిరెడ్డి పేర్కొన్నారు. పన్నులరూపేణ తెలంగాణ నుంచి రూపాయి చెల్లిస్తే.. కేంద్రం తిరిగి కేవలం 42పైసలు మాత్రమే ఇస్తుందని, మిగతా డబ్బులు యూపీ, బీహార్ వంటి రాష్ట్రాలకు తరలిస్తుందని ఆరోపించారు. బీజేపీ ఎంపీలు గుజరాత్‌కు గులాంగిరి చేస్తున్నారని, కేసీఆర్ కుటుంబం అవినీతిలో కూరుకుపోయిందని విమర్శించారు. కార్యక్రమాల్లో నిజామాబాద్ ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, పీసీసీ డెలిగేట్ బాడ్సి శేఖర్‌గౌడ్, మండల అధ్యక్షుడు ఎల్లోల్ల సాయిరెడ్డి, డీసీసీబీ వైస్ చైర్మన్ నల్ల చంద్రశేఖర్‌రెడ్డి, డైరెక్టర్ గోర్కంటి లింగన్న, బాడ్సి సొసైటీ చైర్మన్ మోహన్‌రెడ్డి, డీసీఓ శ్రీనివాస్‌రావు, డీసీసీబీ డీజీఎం లింబాద్రి, నాయకులు గంగాప్రసాద్, ప్రతాప్, మహిపాల్‌రెడ్డి, సతీష్‌రెడ్డి, ప్రవీణ్‌రెడ్డి, గంగారెడ్డి, దిలావర్ హుస్సేన్, సాయన్న, రవి, పోశెట్టి, మల్లయ్య, జగదీశ్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహిస్తుంది నిజామాబాద్‌నాగారం: కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో క్రీడలను ప్రోత్సహిస్తుందని ఎమ్మెల్యే భూపతిరెడ్డి పేర్కొన్నారు. కంఠేశ్వర్ బైపాస్ వద్దగల రూరల్ ఎమ్మెల్యే క్యాంప్‌కార్యాలయంలో నిజామాబాద్ జిల్లా పీడీ, పీఈటీ అసోసియేషన్ వైస్ చైర్మన్ బొబ్బిలి నర్సయ్య , అధ్యక్షులు నాంచారి శ్రీనివాస్ ఆధ్వర్యంలో భూపతిరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేసి శాలువతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో కార్యదర్శి రంగు కృష్ణంరాజు, ట్రెజరర్ గణేష్ నిజామాబాద్ ప్రైవేట్ పీఈటీ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు అజ్మత్ ప్రశాంత్ , పీఈటీ, పీడీ అసోసియేషన్ ఉపాధ్యక్షు లు నరేంద్రచారి, కార్యదర్శులు పాల్గొన్నారు. -
డ్యూటీకి డుమ్మాకొట్టేవారిపై చర్యలు
నిజామాబాద్ సిటీ : మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో విధులు నిర్వహించకున్నా వేతనాలు పొందేవారిపై కమిషనర్ దిలీప్ కుమార్ చర్యలకు ఉపక్రమించారు. ఈనెల 25న ‘‘డ్యూటీ చేయకున్నా ఠంచన్‌గా వేతనాలు’’ పేరుతో వచ్చిన కథనానికి బల్దియా కమిషనర్ స్పందించారు. డిప్యూటీ కమిషనర్ రవిబాబును విచారించాల్సిందిగా ఆదేశించారు. దాంతో శుక్రవారం అకౌంట్స్ సెక్షన్, రెవెన్యూ విభాగంలో కూడా విచారించారు. వీరిలో కొందరు ఉద్యోగులు డ్యూటీకీ రాకున్నా వేతనాలు పొందుతున్నట్లు విచారణలో వెల్లడైంది. డుమ్మాకొడుతున్నవారికి పూర్తివేతనం ఇవ్వాలని సిఫారసు చేసినవారికి మెమోలు ఇవ్వనున్నట్లు తెలిసింది. సాక్షి కథనంతో గత ప్రజాప్రతినిధుల వద్ద పనులు చేసే సిబ్బందిలో ఒకరిద్దరు శుక్రవారం విధులకు హాజరయ్యారు. మరికొందరు అస్సలురాలేదు. ఇలాంటి ఉద్యోగులపై శాఖపరమైన చర్యలు ఉంటాయని కమిషనర్ దిలీప్ కుమార్ హెచ్చరించినట్లు తెలిసింది. విచారణ చేపడుతున్న డీసీ రవిబాబు ఇప్పటికే పలువురి గుర్తింపు మెమోలు ఇవ్వనున్న అధికారులు -
పోచంపాడే.. శ్రీరాంసాగర్
మెండోరా మండలంలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌ను ముందు పోచంపాడ్ ప్రాజెక్ట్‌గా పిలిచేవారు. ● 1978లో శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ సందర్శనకు వ చ్చిన నాటి ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి పో చంపాడ్ను శ్రీరాంసాగర్‌గా పేరు మార్చారు. ● పోచంపాడ్‌లో విధులు నిర్వర్తించే ఉద్యోగులు పోచంపాడ్‌ను పాడ్ అనడం బాగుండదని సీఎంకు విన్నవించడంతో పేరు మార్పు జరిగింది. ● పోచంపాడ్‌లో గోదావరి తీరాన కోదండ రామాలయం ఉండటంతో ఆ ఆలయం పేరు మీదుగా శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌గా పేరు మార్చారు. ● పోచంపాడ్ ప్రాజెక్ట్‌కు 1963లో నాటి ప్రధాని జవహార్‌లాల్ నెహ్రూ శంకుస్థాపన చేయగా 1978లో పూర్తయింది. ● శ్రీరాంసాగర్ ప్రధాన కాలువలకు కూడా అప్పుడే కాకతీయ, లక్ష్మి, సరస్వతి కాలువలకు నామకరణం చేశారు. – బాల్కొండమీకు తెలుసా? -
స్వచ్ఛమైన కల్లును అందించాలి
● జిల్లా ఎకై ్సజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి రుద్రూర్: గీత వృత్తి కార్మికులు స్వచ్ఛమైన కల్లును అందించాలని జిల్లా ఎకై ్సజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి అన్నారు. కోటగిరి మండలం రాంపూర్ శివారులో గతంలో నాటిన ఈత వనాలను శుక్రవారం పరిశీలించారు. హరితహారం ద్వారా నాటిన ఈత మొక్కలను శ్రద్ధగా పెంచడం వల్లే నేడు స్వచ్ఛమైన కల్లు తీయడానికి సిద్ధంగా ఉన్నాయని గీత కార్మికులు అధికారికి వివరించారు. ఐదేళ్ల క్రితం ఈత వనం పెంపకానికి నాటి ప్రభుత్వం ఐదెకరాల భూమి కేటాయించింది. ఈ భూమిలో సూమారు ఐదు వేల మొక్కలు నాటి పెంపకం చేపట్టారు. ఈతవనం పరిశీంచిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో ఆరువేల కుటుంబాలు ప్రత్యక్షంగా, 40వేల కుటుంబాలు పరోక్షంగా గీత వృత్తిపై ఆధారపడి జీవనాన్ని కొనసాగిస్తున్నాయన్నారు. కల్తీ కల్లును అరికట్టేందుకు గత ప్రభుత్వ హాయంలో జిల్లాలో ఈత, ఖర్జురా మొక్కలను ఎకై ్సజ్ శాఖ ఆధ్వర్యంలో నాటగా ప్రస్తుతం అరవై శాతం పెరిగి కల్లు అందించేందుకు సిద్ధంగా ఉన్నాయన్నారు. వచ్చే నెల 1న వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా ఈత, ఖర్జూర మొక్కలు నాటే కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు. కల్తీ కల్లును అరికట్టేందుకు ఎకై ్సజ్ శాఖ ఆధ్వర్యంలో తనిఖీలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. డీటీఎఫ్ సీఐ విలాస్ కుమార్, ఎకై ్సజ్ సీఐ భాస్కర్‌రావు, ఎస్సై జమీల్, ఎ విఠల్ గౌడ్, శంకర్ గౌడ్, అరుణ్ గౌడ్, శ్రీధర్ గౌడ్, గౌడ సంఘం నాయకులు, గీత కార్మికులు పాల్గొన్నారు.సొసైటీ అవినీతిపరులపై చర్యలు తీసుకోవాలి మాక్లూర్: మాక్లూర్ సొసైటీలో అవినీతి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ మాజీ డైరెక్టర్ గంగోనె గంగాధర్ రాష్ట్ర వ్యవసాయ సహకార కమిషనర్‌కు శుక్రవారం ఫిర్యాదు చేశారు. సొసైటీ పాలకవర్గంలోని కొందరు సభ్యులు, సిబ్బంది, మాజీ సీఈవోలు కలిపి రూ. 5 కోట్లకు పైగా నిధులు దుర్వినియోగమైనట్లు అధికారులు గుర్తించారు. అధికారుల ఎంకై ్వరీ నివేదిక మేరకు సంఘం నిధులు దుర్వినియోగం చేసిన వారిని తొలగించి, దుర్వినియెగం చేసిన సొమ్మును రాబట్టాలని కోరారు. -
రోడ్డు ప్రమాదంలో ఆరేళ్ల బాలుడి మృతి
నిజామాబాద్ రూరల్: మే డ్చల్ జిల్లా దుండిగల్‌లో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో రూరల్ మండలం కేశాపూర్‌కు చెందిన ఓ బాలుడు మృతి చెందాడు. బాలుడి పై నుంచి టిప్పర్ వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. వివరాలిలా ఉన్నాయి. రూరల్ మండలం కేశాపూర్‌కు చెందిన గుడిపల్లి రాజ్‌కుమార్ నిహారిక భార్యాభర్తలు. వీరు మేడ్చల్ జిల్లా దుండిగల్ పరిధి మల్లంపేట్‌లో గత ఆరేళ్లుగా నివాసం ఉంటున్నారు. వీరికి అభిమాన్షు(6) కుమారుడు, ఓ పాప ఉన్నారు. స్థానిక గీతాంజలి పాఠశాలలో ఒకటో తరగతి చదువుతున్నారు. రోజు మాదిరిగానే శుక్రవారం ఉదయం తన తల్లి నిహారికతో కలిసి ఇంటి నుంచి స్కూటీపై పాఠశాలకు బయలుదేరాడు. మార్గమధ్యలో పల్లవి స్కూల్ జంక్షన్ దగ్గరికి రాగానే వెనుక నుంచి వచ్చిన టిప్పర్ స్కూటీని తాకింది. దీంతో బాలుడు స్కూటీపై నుంచి టిప్పర్ చక్రాల కిందపడిపోయాడు. ఈ ఘటనలో బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. రెప్పపాటు కాలంలో జరిగిన ప్రమాదంలో కుమారుడిని కోల్పోయనంటూ ఆ తల్లి కన్నీరుమున్నీరయ్యింది. దీంతో బాధిత కు టుంబ సభ్యులు స్వగ్రామమైన కేశాపూర్‌లో సా యంత్రం బాలుడి అంత్యక్రియలు నిర్వహించారు. బాలుడి తల్లితండ్రులు రోదించిన తీరు గ్రామస్తులను కంటితడి పెట్టించింది. బాలుడి మృతితో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. మేడ్చల్ జిల్లా దుండిగల్‌లో ఘటన -
సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి
మోపాల్(నిజామాబాద్‌రూరల్): గురుకులాల్లో సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని అదనపు కలెక్టర్ అంకిత్ సూచించారు. శుక్రవారం మండలంలోని కంజర్ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలను అదనపు కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్భంగా కిచెన్, విద్యార్థులకు అందించే భోజనం, తరగతి గదులు, హాస్టల్, లైబ్రరీని పరిశీలించారు. అనంతరం అంకిత్ మాట్లాడుతూ గురుకులంలో 608 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, విద్యార్థులకు నాణ్యమైన భోజనం మెనూ ప్రకారం వడ్డించాలని తెలిపారు. విష పురుగులు రాకుండా చెత్తాచెదారం ఎప్పటికప్పుడు తొలగించాలన్నారు. ఆయన వెంట ప్రిన్సిపాల్ విజయలలిత, సిబ్బంది ఉన్నారు. పరిసరాల పరిశుభ్రత పాటించాలి డిచ్పల్లి: వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రత పాటించాలని విద్యార్థినులకు మండల ఆరోగ్య విస్తరణాధికారి (హెచ్‌ఈవో) వై.శంకర్ సూచించారు. శుక్రవారం ఇందల్వాయి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో డిచ్పల్లి మండలం సుద్దపల్లి గ్రామంలోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల/కళాశాల లో ఉచిత ఆరోగ్య శిబిరం నిర్వహించి సీజనల్ వ్యాధులపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా హెచ్‌ఈవో శంకర్ మాట్లాడారు. పాఠశాల చుట్టూ పరిసరాలను, మెస్ హాల్, వంట గదులను పరిశుభ్రంగా ఉంచాలని ప్రిన్సిపాల్ నళిని కి సూచించారు. విద్యార్థినులు పౌష్టికాహారాన్ని తీసుకున్నట్లయితే రోగనిరోధక శక్తి పెరిగి ఎలాంటి రోగాలు దరిచేరవన్నారు.కార్యక్రమంలో ఆరోగ్య కార్యకర్తలు గంగుబాయి, వెంకట్ రెడ్డి, ఉదయ, ఎంఎల్‌హెచ్‌పీ మలేహ సుల్తానా, కీర్తన, గ్రామ పంచాయతీ కార్యదర్శి కవిత, ఆశా కార్యకర్తలు సంధ్య, నిర్మల, మంజుల, నిరోషా, అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. కంజర్ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల తనిఖీ అదనపు కలెక్టర్ అంకిత్ -
లభించని అభయహస్తం
మోర్తాడ్(బాల్కొండ): అభయహస్తం సొమ్మును మహిళల ఖాతాల్లో తిరిగి జమ చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి అసెంబ్లీలో ప్రకటించారు. అంతకు ముందే ఎన్నికల మేనిఫెస్టోలో ఈ అంశాన్ని చేర్చి హామీ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్నర కాలం ముగిసిపోయినా ఇప్పటి వరకు అభయహస్తం సొమ్మును దరఖాస్తుదారుల ఖాతాల్లో ఇప్పటికీ జమ కాలేదు. మహిళా సంఘాల్లోని సభ్యులకు 55 ఏళ్ల వయస్సు నిండితే వారికి పింఛన్‌ను అమలు చేసేందుకు ఉమ్మడి రాష్ట్రంలో రూపుదిద్దుకున్న అభయహస్తం పథకాన్ని రద్దు చేసి ఏళ్లు గడుస్తోంది. జిల్లాలోని మహిళలకు సంబంధించి రూ.12,67,69,610 బ్యాంకులోనే మూలుగుతున్నాయి. ఈ సొమ్మును వాపస్ చేసేందుకు రెండేళ్ల కింద మహిళా సంఘాల ప్రతినిధులు అభయహస్తం సభ్యత్వ రుసుం చెల్లించిన మహిళల వివరాలను నమోదు చేసుకున్నారు. అభయహస్తం పథకాన్ని 2017లో నిలిపివేసి అప్పటి నుంచి పింఛన్ల పంపిణీని రద్దు చేశారు. అలాగే పింఛన్ అర్హుల సొమ్మును బ్యాంకులోనే ఉంచారు. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ద్వారా కొనసాగిస్తున్న మహిళా సంఘాల్లో మెజార్టీ మహిళలు పేద, మధ్య తరగతి కుటుంబాలకు చెందినవారే ఉన్నారు. మహిళల పరిస్థితిని అర్థం చేసుకుని ప్రభుత్వం అభయహస్తం సభ్యత్వ సొమ్మును వారి ఖాతాల్లో జమ చేయాలని ప్రభుత్వానికి పలువురు సూచిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో ఇలా.. అభయహస్తం పింఛన్ పథకం కింద ఉమ్మడి జిల్లాలో 13,506 మందిని అర్హులుగా గుర్తించి వారితో రూ.3,685 చొప్పున జమ చేయించారు. వారికి ప్రతి నెలా రూ.500 చొప్పున పింఛన్ అందించారు. మరో 40వేల మందిని సభ్యులుగా చేర్చుకుని ప్రతి సంవత్సరం ఒక్కొక్కరితో రూ.385 చొప్పున ఐదేళ్లపాటు రూ.1,925 జమ చేయించారు. అభయహస్తం పథకంలో చేరిన వారికి భవిష్యత్‌లో ఆర్థికంగా లబ్ధి చేకూర్చాలని దివంగత సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి భావించారు. ‘అభయహస్తం పథకం కింద మహిళా సంఘాల సభ్యులు చెల్లించిన సభ్యత్వ సొమ్మును తిరిగి వారి ఖాతాల్లో జమ చేస్తాం.. గత ప్రభుత్వంలా మేము నిర్లక్ష్యం చేయబోము.’ – అసెంబ్లీలో సీఎం రేవంత్‌రెడ్డి పథకం రద్దు చేసి ఏళ్లు గడుస్తున్నా.. దరఖాస్తుదారుల ఖాతాల్లోకి చేరని సొమ్ము జిల్లా మహిళలకు రావాల్సిన మొత్తం రూ.12.67కోట్లు -
డబుల్ ఇంజిన్ సర్కారుతోనే రాష్ట్రాభివృద్ధి
సుభాష్‌నగర్: డబుల్ ఇంజిన్ సర్కారుతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని బీజేపీ అసెంబ్లీ ఫ్లోర్ లీడర్ ఏలేటి మహేశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు. నగరంలోని బీజేపీ కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. గత పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఫౌమ్‌హౌస్ నుంచి పాలన సాగిస్తే.. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఢిల్లీ ఆదేశాలతో పాలన కొనసాగిస్తోందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు నెరవేర్చే వరకూ మెడలు వంచుతామని హెచ్చరించారు. అరెస్టులతో బీజేపీ నాయకులు, కార్యకర్తలను భయపెట్టే పరిస్థితి లేదన్నారు. ఇదే చివరి రైతుభరోసా కాబట్టి కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయని ఎద్దేవాచేశారు. ఇందిరాగాంధీ తన పదవిని కాపాడుకోవడానికి దేశంలో ఎమర్జెన్సీని విధించిందని విమర్శించారు. అన్ని పథకాలకు ఇందిరమ్మ పేర్లు పెడుతున్నారని, కాంగ్రెస్‌ది కుటుంబ పాలన అని, గాంధీల పేరుతో కాంగ్రెస్ నేతలు కాలం వెళ్లదీస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ నాయకులు గ్రా మాల్లో తిరిగే పరిస్థితి లేదని, రైతు సంబరాలు ఎందుకు చేస్తున్నారో అర్థం కావడంలేదన్నారు. రాష్ట్రంలో సీఎం రేవంత్‌రెడ్డి ప్రజాస్వామ్యాన్ని భ్రష్టుపట్టిస్తున్నారని విమర్శించారు. ప్రజాస్వామ్యాన్ని కాపా డే ఏకై క పార్టీ బీజేపీ అన్నారు. ఎంపీ అర్వింద్ వల్లే నిజామాబాద్‌లో పసుపుబోర్డు సాధ్యమైందన్నారు. ఈ నెల 29న జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్ మైదానంలో నిర్వహించే అమిత్ షా రైతు సమ్మేళన బహిరంగ సభకు రైతులు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని మహేశ్వర్‌రెడ్డి కోరారు. అనంతరం పాలిటెక్నికల్ కళాశాల మైదానాన్ని ఎంపీ అర్వింద్ ధర్మపురితో కలిసి పరిశీలించారు. వారి వెంట అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, నాయకులు న్యాలం రాజు, నాగోళ్ల లక్ష్మీనారాయణ, స్రవంతిరెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, తారక్ వేణు, మధు, ఇప్పకాయల కిశోర్ తదితరులు ఉన్నారు. ఢిల్లీ ఆదేశాలతోనే రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన అమిత్ షా సభకు రైతులు తరలిరావాలి బీజేపీ అసెంబ్లీ ఫ్లోర్‌లీడర్ ఏలేటి మహేశ్వర్‌రెడ్డి రైతు సమ్మేళనం బహిరంగ సభాస్థలి పరిశీలన -
స్థానిక బరిపై గురి
● స్థానిక ఎన్నికల్లో నిలిచేందుకు నాయకులు, శ్రేణుల ప్రణాళికలు ● అభ్యర్థిత్వాల కోసం కీలక నేతల చుట్టూ ప్రదక్షిణలు ● మరోవైపు గ్రామాల్లో విందు సమావేశాలు ● మద్దతు కూడగట్టుకునేందుకు నాయకుల కసరత్తులు ● రిజర్వేషన్లపై ఉత్కంఠగా ఎదురుచూపులు సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: స్థానిక సంస్థల్లో అధికారం చేజిక్కుంచుకునేందుకు గాను ప్రధాన రాజకీయ పార్టీల శ్రేణులు రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. పంచాయతీల పాలకవర్గాల పదవీకాలం పూర్తయి ఏడాదిన్నర, పరిషత్‌ల పదవీకాలం ముగిసి ఏడాది కావస్తోంది. మున్సిపాలిటీల పాలకవర్గాల పదవీకాలాలు పూర్తయి ఐదు నెలలు దాటిపోయింది. అన్ని చోట్లా ప్రత్యేక అధికారుల పాలన నడుస్తోంది. దీంతో అభివృద్ధి పనుల విషయంలో సమస్యలు తలెత్తుతున్నాయి. ప్రజాసమస్యల పరిష్కారం అంతంత మాత్రంగానే ఉంది. కాగా సెప్టెంబర్ 30 లోగా స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి చేయాలని హైకోర్టు తీర్పునిచ్చింది. దీంతో పల్లెల్లో, పట్టణాల్లో స్థానిక పోరు సందడి నెలకొంది. నిజామాబాద్ నగరపాలక సంస్థలో ఎట్టిపరిస్థితుల్లో పాగా వేసేందుకు బీజేపీ పకడ్బందీగా పావులు కదుపుతోంది. ఎంపీ అర్వింద్, ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణలు విడతలవారీగా సర్వేలు సైతం చేయించారు. అయితే అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇందూరు నగరపాలకాన్ని చేజిక్కించుకునేందుకు ప్రణాళికలు రచిస్తోంది. పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్, షబ్బీర్‌అలీలు కసరత్తులు చేస్తున్నారు. ఆర్మూర్, బోధన్, భీంగల్ మున్సిపాలిటీల్లో పాగా వేసేందుకు బీజేపీ, కాంగ్రెస్‌లు నువ్వా నేనా అనేవిధంగా పట్టుదలతో ఉన్నాయి. ఇక జిల్లా ప్రజాపరిషత్, మండల ప్రజా పరిషత్‌లలో, గ్రామ పంచాయతీల్లో సత్తా చాటేందుకు కాంగ్రెస్ పార్టీ నాయకత్వం పకడ్బందీగా కసరత్తులు చేస్తోంది. బీజేపీ పంచాయతీలు, పరిషత్‌లలో పాగా వేసేందుకు ప్లాన్ చేస్తోంది. త్రిముఖ పోటీలో తమకు కలిసొస్తుందని బీఆర్ఎస్ అంచనాలు వేసుకుంటోంది. రిజర్వేషన్ల విషయమై ఉత్కంఠగా.. సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఉవ్విళ్లూరుతున్న ఆశావహులు రిజర్వేషన్ల ఖరారు కోసం ఎదురు చూస్తున్నారు. రిజర్వేషన్లు తాము ఆశించినవిధంగా వస్తే టిక్కెట్లు దక్కించుకునేందుకు కీలక నేతల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. గ్రామాల్లో, పట్టణాల్లోని డివిజన్లలో విందు సమావేశాలు నిర్వహిస్తున్నారు. మద్దతు కూడగట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఎమ్మెల్యేల సుడిగాలి పర్యటనలు షురూ.. ఎమ్మెల్యేలు తాము ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో సాధ్యమైనన్ని ఎక్కువ స్థానాలు గెలిపించుకునేందుకు కసరత్తులు చేస్తున్నారు. ప్రణాళికలు రచిస్తున్నారు. ఇందులో భాగంగా ఆయా ప్రాంతాల్లో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు వరుసగా చేస్తున్నారు. అదేవిధంగా సీఎంఆర్ఎఫ్, కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేస్తున్నారు. ఇక సన్నబియ్యం, సన్నధాన్యం బోనస్, రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు తమకు కలిసొస్తాయని కాంగ్రెస్ నాయకులు భావిస్తున్నారు. ఇక స్థానిక ఎన్నికలకు ముందు పసుపు బోర్డు కార్యాలయం ప్రారంభోత్సవానికి వస్తున్న అమిత్‌షా రైతు సమ్మేళనం సభలో పాల్గొననుండడంతో తమకు పట్టణాలతో పాటు గ్రామాల్లోనూ తిరుగులేని బలం పెరుగుతుందని బీజేపీ నేతలు లెక్కలు వేసుకుంటున్నారు. స్థానిక ఎన్నికల నేపథ్యంలో గ్రామాల్లో, పట్టణాల్లో హడావుడి రోజురోజుకూ పెరుగుతోంది. -
జాతీయస్థాయి స్విమ్మింగ్‌లో గోల్డ్‌మెడల్
నవీపేట: మండలంలోని బినోల గ్రామానికి చెందిన స్విమ్మింగ్ క్రీడాకారిణి మిట్టపల్లి రిత్విక జాతీయస్థాయి స్విమ్మింగ్ పోటీలో బంగారు పతకం సాధించింది. స్విమ్మింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లోని బిజూ పట్నాయక్ స్విమ్మింగ్ పూల్ కాంప్లెక్స్(కళింగ స్టేడియం)లో ఈ నెల 22 నుంచి 26 వరకు అక్విటిక్ నేషనల్ చాంపియన్‌షిప్ (2025) పోటీలు నిర్వ హించారు. అందులో భాగంగా 50 మీటర్ల బ్రెస్ట్ స్ట్రోక్‌లో జరిగిన పోరులో 33.98 సెకన్లలో లక్ష్యాన్ని ఛేదించిన రిత్విక బంగారు పతకాన్ని సాధించింది. ఈ సందర్భంగా రిత్వికను పీసీసీ అధ్యక్షుడు మ హేశ్కుమార్ గౌడ్, అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూ ర్యనారాయణ గుప్త అభినందించినట్లు క్రీడాకారిణి తండ్రి మిట్టపల్లి ప్రకాశ్‌రావ్ శుక్రవారం తెలిపారు. రాష్ట్ర స్విమ్మింగ్ అసోసియేషన్ అధ్యక్ష, ఉపాధ్యక్షులు చంద్రశేఖర్‌రెడ్డి, మహిపాల్‌రెడ్డి, కార్యదర్శి ఉమేశ్, జిల్లా ప్రతినిధులు గడీల శ్రీరాములు, శ్యాంసుందర్‌రెడ్డి, వేణుగోపాల్, రాగిణి, శ్రీనివాస్‌లు అభినందించారన్నారు. కాగా, వచ్చే నెల 14 నుంచి జర్మనీలో జరిగే వరల్డ్ యూనివర్సిటీ పోటీలలో ఇండియా నుంచి రిత్విక పాల్గొంటున్నట్లు ఆయన తెలిపారు. జిల్లా క్రీడాకారిణి మిట్టపల్లి రిత్విక ఘనత -
నాణ్యమైన విద్యాబోధనతో ఉత్తమ ఫలితాలు
నిజామాబాద్ అర్బన్ : పదో తరగతి, ఇంటర్ వార్షిక పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు రాబట్టేందుకు జిల్లాలోని అన్ని ప్రభుత్వ విద్యా సంస్థల్లో ఇప్పటి నుంచే మెరుగైన బోధన అందించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ టీ వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం కాన్ఫరెన్స్ హాల్ లో శుక్రవారం సాయంత్రం కలెక్టర్ విద్యాశాఖ పనితీరుపై అధికారులతో సమీక్షించారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, రెసిడెన్షియల్ స్కూల్స్, గురుకులాలు, కేజీబీవీల నిర్వహణ తీరుతెన్నులు, గత సంవత్సరం సాధించిన ఫలితాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. పరీక్షలు సమీపించిన సమయంలో హడావుడి పడకుండా ఇప్పటి నుండే ప్రణాళికబద్ధంగా విద్యార్థులకు నాణ్యమైన విద్యను బోధిస్తే అ త్యుత్తమ ఫలితాలు వస్తాయని అన్నారు. ఎంఈవో, కాంప్లెక్స్ హెచ్ఎంలతో క్రమం తప్పకుండా సమీక్ష జరుపుతూ ప్రభుత్వ బడులలో కార్పొరేట్‌కు దీటు గా విద్యా బోధన జరిగేలా చూడాలని డీఈవో అశోక్‌ను ఆదేశించారు. గణితం, ఆంగ్లం, సామాన్య శా స్త్రం వంటి సబ్జెక్టులలో వెనుకబడి ఉన్న విద్యార్థులను గుర్తిస్తూ వారిపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాల ని సూచించారు. పదో తరగతి ఉత్తీర్ణులైన ప్రతి వి ద్యార్థి కళాశాలల్లో చేరేలా పర్యవేక్షణ జరపాలన్నా రు. ఒక జత ఏకరూప దుస్తులు విద్యార్థులకు అందించామని, రెండో జత యూనిఫామ్‌లను మహిళా స్వయం సహాయక సంఘాలు త్వరగా కుట్టించి ఇచ్చేలా కృషి చేయాలని సూచించారు. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ఆధ్వర్యంలో చేపట్టిన మరమ్మతు పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయించాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, డీఐఈవో రవికుమార్, డీఈవో అశోక్, బీసీ, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖల అధికారులు స్రవంతి, రజనీ, నాగోరావు, రెసిడెన్షియల్ విద్యా సంస్థల ప్రాంతీయ సమన్వయకర్తలు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్ టీ వినయ్ కృష్ణారెడ్డి పదో తరగతి ఉత్తీర్ణులైన ప్రతి విద్యార్థి కళాశాలల్లో చేరేలా చూడాలి -
గిరిజనులకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం
● ఎమ్మెల్యే రేకులపల్లి భూపతిరెడ్డి నిజామాబాద్ రూరల్: గిరిజనులకు అండగా కాంగ్రెస్ పార్టీ నిలబడుతుందని రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి అన్నారు. గురువారం నగరంలోని కంఠేశ్వర్ బైపాస్‌లో ఉన్న రూరల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నూతనంగా ఎన్నికై న ఆలిండియా బంజారా సేవా సంఘం సభ్యులు జిల్లా ఆదివాసి గిరిజన అధ్యక్షుడు యాదగిరి ఆధ్వర్యంలో ఎమ్మెల్యేను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అన్నివర్గాల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. నూతన కార్యవర్గ సభ్యులకు ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే సభ్యులు, నాయకులు సన్మానించారు. కార్యక్రమంలో నాయకులు చంద్రనాయక్, కేతావత్ ప్రకాశ్ పాల్గొన్నారు. -
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభం
సిరికొండ: మండలంలోని వర్జన్తండాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడు మోజీరాం గురువారం ప్రారంభించారు. గత ప్రభుత్వ హయాంలో పేదవాడు సొంత ఇళ్లు కలగానే మిగిలిపోయిందని, కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు ఇళ్లు మంజూరు చేసి గూడు కల్పిస్తున్నదని పేర్కొన్నారు. పార్టీ నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. టీపీసీసీ ప్రధాన కార్యదర్శికి సన్మానం నిజామాబాద్ సిటీ: టీపీసీసీ ప్రధాన కార్యదర్శిగా నియామకమైన చిన్నబ్బు రాంభూపాల్‌ను కాంగ్రెస్ నాయకులు కలిశారు. గురువారం జిల్లా కాంగ్రెస్ భవన్లో ఎస్టీసెల్ నగర అధ్యక్షుడు సుభాష్ జాదవ్ రాంభూపాల్‌ను శాలువా కప్పి సత్కరించారు. టీపీసీసీలో ఇందూరుకు ప్రాతినిధ్యం లభించినందుకు శుభాకాంక్షలు తెలిపారు. కార్మిక నాయకుడు డీవీ కృష్ణకు ఘన నివాళులు నిజామాబాద్ సిటీ: కార్మిక ఉద్యమాల నాయకుడు ప్రజాపంథా రాష్ట్ర మాజీ కార్యదర్శి డీవీ కృష్ణ వర్ధంతిని సీపీఐ(ఎంఎల్) మాస్‌లైన్ (ప్రజాపంథా) నిజామాబాద్ అర్బన్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. గురు వారం నిర్వహించిన వర్ధంతి సభలో డీవీ కృష్ణ విగ్రహానికి ఘన నివాళులర్పించారు. అనంతరం జిల్లా కార్యదర్శి వనమాల కృష్ణ మాట్లాడుతూ.. డీవీకే 50 యేళ్లు విప్లవోద్యమాలను నిర్మించారని, జిల్లాలో బీడీ కార్మికుల హక్కుల కోసం పోరాటాలు చేశారన్నారు. కార్యక్రమంలో నాయకులు ఎం నరేందర్, ఎం వెంకన్న, డి రాజేశ్వర్, ఎం సుధాకర్, కె గంగాధర్, బి మల్లేశ్, సీహెచ్ సాయన్న, డి కిషన్, బి మురళి, పి సాయన్న, వి గోదావరి, కె సంధ్యారాణి, కె గణేశ్, సాయిబాబా, కిరణ్, రవి, గంగారాం, చరణ్, రమేశ్, శకుంతల, నర్సక్క, అమూల్య, మంజుల, గంగాధర్, మల్లవ్వ మహిపాల్, సృజన్, శాంతి కుమార్, మహేశ్ పాల్గొన్నారు. ఇంజినీరింగ్ కళాశాలను ఏర్పాటు చేయాలి నిజామాబాద్‌అర్బన్: జిల్లాలో ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాలను ఏర్పాటు చేయాలని పీడీఎస్ యూ రాష్ట్ర అధ్యక్షులు శ్రీకాంత్ డిమాండ్ చేశారు. గురువారం నగరంలోని జంపాల చంద్రశేఖర్ ప్రసాద్ మెమోరియల్ లైబ్రరీలో పీడీఎస్‌యూ జిల్లా కమిటీ సమావేశం సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను విడుదల చేయాలన్నారు. కార్యక్రమంలో నాయకులు ఆర్ గౌతం కుమార్, జన్నారపు రాజేశ్వర్, ప్రిన్స్, దేవిక, నిఖిల్, సాయినాథ్, హుస్సేన్, శ్రీకాంత్ తదితదిరులు పాల్గొన్నారు. నియామకం జక్రాన్‌పల్లి: మండలంలోని అర్గుల్ గ్రామానికి చెందిన మాసం లక్ష్మీనర్సు అఖిల భారత యాదవ మహాసభ జిల్లా అధ్యక్షురాలిగా నియామకం అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర అధ్యక్షుడు రవీంద్రనాథ్ యాదవ్, మహిళా అధ్యక్షురాలు శ్రీదేవి యాదవ్ చేతుల మీదుగా ఆమె నియామకపత్రం అందుకున్నారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు మహిపాల్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. -
కేసీఆర్ కుటుంబం జైలుకెళ్లడం ఖాయం
డిచ్పల్లి: అధికార దుర్వినియోగంతో రాష్ట్రాన్ని దోచుకున్న మాజీ సీఎం కేసీఆర్ కుటుంబం అవినీతి కేసుల్లో జైలుకెళ్లడం ఖాయమని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి అన్నారు. గురువారం డిచ్పల్లి మండలం నక్కలగుట్ట తండా, దూస్‌గాం గ్రామాల్లో సుమారు రూ.2కోట్ల వ్యయంతో పలు అభివృద్ధి పనులను ప్రారంభించి శంకుస్థాపనలు చేశారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను పరిశీలించారు. అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కాంగ్రెస్ హయాంలో వందేళ్ల క్రితం కట్టిన శ్రీశైలం, నాగార్జునసాగర్, పోచంపాడ్ ప్రాజెక్టులు ఇప్పటికీ అలాగే ఉంటే కేసీఆర్ కట్టిన కాళేశ్వరం మూడేళ్లకే కుంగిపోయిందని విమర్శించారు. పేదల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. వచ్చే మూడున్నరేళ్లలో రాష్ట్రంలో ఇళ్లు లేని నిరుపేదలు ఉండకూడదనే లక్ష్యంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లనుమంజూరు చేస్తోందని అన్నారు. కోటి మంది మహిళలను స్వయం ఉపాధి ద్వారా కోటీశ్వరులను చేయడానికి కృషి చేస్తోందన్నారు. జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించుకుని గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలని ఎమ్మెల్యే కోరారు. బీఆర్ఎస్, బీజేపీ దొందూ దొందేనని విమర్శించారు. అనంతరం మిట్టాపల్లి, లింగసముద్రం గ్రామాల్లో ఇటీవల మృతిచెందిన బాధిత కుటుంబాలను ఎమ్మెల్యే పరామర్శించారు. అంతకుముందు మండలంలోని యానంపల్లికి చెందిన పలువురు యువకులు బీజేపీ నుంచి కాంగ్రెస్‌లో చేరారు. వారికి ఎమ్మెల్యే కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమాల్లో తహసీల్దార్ సతీశ్‌రెడ్డి, ఎంపీడీవో బుక్య లింగం నాయక్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు అమృతాపూర్ గంగాధర్, మాజీ ఎంపీపీ కంచెట్టి గంగాధర్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పొలసాని శ్రీనివాస్, సొసైటీ చైర్మన్ రాంచందర్ గౌడ్, డీసీసీ డెలిగేట్స్ వాసుబాబు, శ్యాంసన్, ధర్మాగౌడ్, తండా, గ్రామపెద్దలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలి -
బల్దియాలో అధికారుల కొరత
నిజామాబాద్ సిటీ: నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో అధికారుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. ముఖ్యమైన అధికారులు లేకపోవడంతో పాలనలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ముఖ్యమైన పోస్టులు ఖాళీగా ఉండటంతో మున్సిపల్ కమిషనర్‌పైనే పనిభారం పెరుగుతోంది. ముఖ్యమైన రెవెన్యూ, శానిటేషన్ విభాగాలకు హెడ్లు లేకపోవడంతో ఆయా విభాగాల పనులు సవ్యంగాసాగడం లేదు. ఇదీ పరిస్థితి.. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ తెలంగాణలోనే మూడో పెద్ద కార్పొరేషన్. కార్పొరేషన్లో ప్రధాన పోస్టులన్నీ ఖాళీగా ఉన్నాయి. మున్సిపల్ కమిషనర్ మినహా మిగతా పెద్ద పోస్టులు భర్తీ కావడం లేదు. అడిషనల్ కమిషనర్, మున్సిపల్ వైద్యాధికారి (ఎంహెచ్వో) వంటి ప్రధాన పోస్టులు భర్తీకావడం లేదు. ఇదివరకు డిప్యూటీ కమిషనర్‌గా విధులు నిర్వహించిన రాజేంద్రకుమార్ పదవీ విరమణ పొందారు. అడిషనల్ కలెక్టర్‌గా పనిచేసిన ఎన్ శంకర్ జీహెచ్ఎంసీకి బదిలీచేయించుకుని వెళ్లిపోయారు. ఎంహెచ్వో పోస్టు మాత్రం రెండేళ్లుగా ఖాళీగానే ఉంది. బోధన్‌లో శానిటరీ ఇన్స్పెక్టర్గా వి ధులు నిర్వహిస్తున్న జయకుమార్ పదోన్నతిపై అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్‌గా వచ్చారు. ఆయనకు ఇన్చార్జి ఎంహెచ్‌వోగా బాధ్యతలు అప్పజెప్పారు. కుప్పలు తెప్పలుగా ఫైళ్లు.. అధికారుల కొరతతో బల్దియాలో పనులు ముందుకు కదలడం లేదు. రెవెన్యూ శాఖలో ఫైళ్లు కుప్పలుకుప్పలుగా పడి ఉంటున్నాయి. చిన్న పనుల కోసం సైతం ఆరు నెలలుగా తిరుగుతున్నవారు ఎక్కువగా ఉన్నారు. రెవెన్యూ శాఖలో ఇద్దరు ఆర్వోలు ఉండేవారు. ప్రస్తుతం ఇద్దరు పదోన్నతిపై బదిలీపై వెళ్లనున్నారు. నత్తనడకన పారిశుధ్య పనులు.. పారిశుధ్య విభాగంలో రెండేళ్ల నుంచి ఉన్నతాధికారి లేకపోవడంతో వ్యవస్థ మొత్తం గాడితప్పింది. శానిటరీ జవాన్లపై అజమాయిషీ లేదు. ప్రతీరోజు 100 మంది కార్మికులు గైర్హాజరవుతున్నారు. చెత్త తొలగింపు సరిగ్గా జరగడం లేదు. ప్రధాన రోడ్డులో మాత్రమే శానిటేషన్ చేసి ఫొటోలు తీసి కమిషనర్‌కు పంపి మమ అనిపిస్తున్నారు. శానిటేషన్ సూపర్వైజర్ ఉన్నా ఆయనను ఎవరూ పట్టించుకోవడం లేదు. శానిటరీ ఇన్స్పెక్టర్లదే హవా. వారు చెప్పిందే వేదం అన్నట్లుగా మారింది. అన్నీ కమిషనరే.. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో చిన్న చితకా మొదలు ఇతర పనులన్నీ కమిషనర్ దిలీప్‌కుమార్ చేస్తున్నారు. ప్రతీరోజు ఉదయం 6 గంటలకే డివిజన్లలో రెండు గంటలు ఆకస్మిక తనిఖీలు చేసి పారిశుద్య పనులు పర్యవేక్షిస్తున్నారు. రెవె న్యూ, శానిటేషన్ పనులు, ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారుల ఎంపిక, రాజీవ్ వికాసం వంటి అన్ని పనులు స్వయంగా కమిషనరే చూస్తున్నారు. కార్పొరేషన్లో ముఖ్యమైన పోస్టులు ఖాళీ శానిటేషన్ అస్తవ్యస్తం కుంటుపడుతున్న పాలన ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం బల్దియాలోని ఖాళీలపై ఉన్న తాధికారుల దృష్టికి తీసుకొచ్చాం. అడిషనల్ కమిషనర్‌తో పాటు ఎంహెచ్వో పోస్టు చాలా ముఖ్యమైనవి. నగరవాసులకు ఎలాంటి సమస్యలున్నా వెంటనే నా దృష్టికి తీసుకురావాలి. ఉద్యోగులు ప్రతి ఒక్కరు జవాబుదారీగా ఉండాల్సిందే. ఫిర్యాదులు వస్తే మాత్రం చర్యలు తప్పవు. – దిలీప్ కుమార్, కమిషనర్ -
బీజేపీలో పలువురి చేరిక
జక్రాన్‌పల్లి: జక్రాన్‌పల్లి మాజీ ఎంపీపీ కంతి అనంత్‌రెడ్డి గురువారం బీజేపీలో చేరారు. గురువారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ అరవింద్ సమక్షంలో బీజేపీలో చేరారు. కిషన్‌రెడ్డి ఆయనకు కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, ఎమ్మెల్సీ అంజి రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు దినేశ్ కులచారి, జక్రాన్‌పల్లి పార్టీ మండల అధ్యక్షుడు కన్నెపల్లి ప్రసాద్, శ్రీనివాస్‌గౌడ్, వంశీగౌడ్, కుంట శ్రీనివాస్, బొజ్జ సంజీవ్, విక్రమ్ పటేల్, మునిపల్లి నాయకులు క్యాతం రాజారెడ్డి, పోగుల భాస్కర్, క్యాతం రాజేశ్వర్, కృష్ణ, క్యాతం శ్రీధర్, సీహెచ్ గంగారెడ్డి, నవీన్, సంతోష్, కొలిప్యాక సాయిరెడ్డి పాల్గొన్నారు. -
మత్తుపదార్థాల నిర్మూలనపై అవగాహన ర్యాలీ
సాక్షి నెట్వర్క్: యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని పలువురు అధికారులు, ఎస్సైలు సూచించారు. ప్రపంచ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా నిజామాబాద్ అర్బన్, రూరల్ నియోజకవర్గాల్లో పోలీస్, విద్య, వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో గురువారం అవగాహన ర్యాలీ, 2కె రన్ నిర్వహించారు. పలు చోట్ల మానవహారంగా ఏర్పడి అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. అనంతరం విద్యార్థులు, గ్రామస్తులతో ప్రతిజ్ఞ చేయించారు. మత్తుపదార్థాల నిర్మూలనపై విద్యార్థులకు వ్యాసరచన, డ్రాయింగ్ పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. ఉత్తమ ప్రతిభ కనబర్చిన వారికి ప్రశంసాపత్రం అందజేశారు. -
నూతన కార్యవర్గం ఎన్నిక
నిజామాబాద్ రూరల్: ముబారక్‌నగర్ పరిధిలోని వీవీనగర్‌లో ఉన్న సాయిబాబా ఆలయ నూతన కార్యవర్గాన్ని సభ్యులు గురువారం ఎన్నుకున్నారు. ఆలయ అధ్యక్షుడిగా రచ్చ సుదర్శన్, ఉపాధ్యక్ష, కార్యవర్గ సభ్యులు ఎన్నికయ్యారు. నూతన కార్యవర్గ సభ్యులను జెడ్పీ మాజీ చైర్మన్ అభినందించారు. సాయిబాబా ఆలయంలో ఎమ్మెల్యే పూజలు నిజామాబాద్ రూరల్: ముబారక్‌నగర్ ప్రాంతంలో ఉన్న సాయిబాబా ఆలయంలో రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి గురువారం ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికై న కార్యవర్గ సభ్యులను అభినందించారు. అనంతరం ఎమ్మెల్యేను సభ్యులు సన్మానించారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ రచ్చ సుదర్శన్, నాయకులు బాగిర్తి బాగారెడ్డి, సభ్యులు పాల్గొన్నారు. -
ప్రమాదకరంగా లోలెవల్ వంతెన
● నర్సింగ్‌పల్లి లోలెవల్ వంతెనతో పొంచి ఉన్న ప్రమాదం ● ఇరుగ్గా ఉండటంతో వాహనదారులకు తిప్పలు సిరికొండ: లోలెవల్ వంతెనతో వాహనదారులకు ప్రమాదం పొంచి ఉంది. నర్సింగ్‌పల్లి వాగుపై ఉన్న వంతెన ఇరుగ్గా ఉండటంతో ప్రయాణికులకు తిప్పలు తప్పడం లేదు. వంతెనపై ఎదురెదురుగా వాహనాలు వచ్చినప్పుడు ఆదమరిస్తే పక్కన ఉన్న వాగులో పడిపోయే అవకాశం నెలకొంది. భీంగల్ నుంచి కామారెడ్డి వైపు, చిన్నవాల్గోట్, సిరికొండ మీదుగా జిల్లా కేంద్రానికి వెళ్లే మార్గంలో ఈ లోలెవల్ వంతెన ఉంది. ఈ మార్గంలో రోజు వందలాది వాహనాలు నిత్యం నడుస్తుంటాయి. నలభై ఏళ్ల క్రితం ఆనాటి అవసరాలకు అనుగుణంగా అప్పటి రద్దీ మేరకు వాగుపై లోలెవల్ వంతెనను నిర్మించారు. క్రమేణా వాహనాల రద్దీ పెరిగిపోవడంతో వంతెనపై ప్రయాణం గగనంగా మారుతోంది. జగిత్యాల జిల్లా కోరుట్ల, మెట్పల్లి, నిజామాబాద్ జిల్లాలోని కమ్మర్పల్లి, మోర్తాడ్, భీంగల్, వేల్పూర్ మండలాలకు హైదరాబాద్ వెళ్లేందుకు కామారెడ్డి వద్ద ఉ్న ఎన్‌హెచ్ 44 చాలా దగ్గరవుతుంది. దూర భారం తగ్గుతుండటం వల్ల ఈ రహదారి వాహనాల రాకపోకలతో చాలా రద్దీగా మారింది. లోలెవల్‌కు తోడు వంతెన ఇరుగ్గా ఉండటంతో వాహనదారులకు ప్రయాణం ఇబ్బందిగా మారింది. మండల వాసులు ఈ వంతెన మీదుగా భీంగల్, ఆర్మూర్ వైపు నిత్యం వెళ్తుంటారు. వంతెనకు ఇరు వైపులా భద్రత కోసం ఏర్పాటు చేసిన రాతి దిమ్మెలు ధ్వంసమయ్యాయి. రాళ్లు విరిగిపోవడంతో ప్రమాదం అంచున ప్రయాణం చేయాల్సిన దుస్థితి నెలకొంది. లోలెవల్ వంతెన స్థానంలో భారీ వంతెన నిర్మించాలని ప్రయాణికులు కోరుతున్నారు. కొత్త వంతెన నిర్మించాలి నర్సింగ్‌పల్లి వద్ద వాగుపై ఉన్న లోలెవల్ వంతెన ప్రమాదకరంగా ఉంది. వంతెన మీదుగా వెళ్తుండగా కొద్దిగా ఆదమర్చినా పక్కన ఉన్న వాగులో పడిపోయే ప్రమాదం నెలకొంది. వంతెన ఇరుగ్గా ఉండటంతో ఇబ్బందిగా మారింది. పాత వంతెన స్థానంలో కొత్త వంతెనను నిర్మించాలి. – రవీందర్‌గౌడ్, గడ్కోల్ -
మున్సిపల్ స్టాండింగ్ కౌన్సిల్‌గా శ్యాంబాబు నియామకం
నిజామాబాద్ లీగల్: నిజామాబాద్ మున్సిపల్ స్టాండింగ్ కౌన్సిల్‌గా న్యాయవాది ముత్యాల శ్యాం బాబును నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు న్యాయశాఖ కార్యదర్శి ఆర్ తిరుపతి ఉత్తర్వులు విడుదల చేశారు. శ్యాంబాబు స్టాండింగ్ కౌన్సిల్‌గా నియమితులవడంపై నిజామాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు మామిళ్ల సాయిరెడ్డి, మాణిక్ రాజ్, ప్రభుత్వ న్యాయవాది అమిడాల సుదర్శన్‌తోపాటు సీనియర్ న్యాయవాదులు నరసింహారెడ్డి, సురేశ్, మధ్యపల్లి శంకర్, నరేశ్, గంగాప్రసాద్, ఆశనారాయణ, అన్వే ష్, శ్రీమన్ హర్షం వ్యక్తం చేశారు. అనంతరం శ్యాంబాబును సన్మానించారు. -
జిల్లా కేంద్రంలో ప్రత్యేక పారిశుధ్య పనులు
నిజామాబాద్ సిటీ: కేంద్ర హోంమంత్రి అమిత్‌షా జిల్లా కేంద్ర పర్యటన సందర్భంగా నగరంలో ప్రత్యేక పారిశుధ్య పనులు నిర్వహిస్తున్నారు. అమిత్ షా ఈనెల 29న నగరానికి రానున్న విషయం తెలిసిందే. కంఠేశ్వర్ బైపాస్ వద్ద దివంగత డి శ్రీనివాస్ విగ్రహ ప్రతిష్ట జరగనుంది. దీంతో సర్కిల్–1, సర్కిల్–4ఏ కు చెందిన పారిశుధ్య సిబ్బంది ప్రత్యేక పారిశుధ్య పనులు నిర్వహిస్తున్నారు. కంఠేశ్వర్ బైపాస్ నుంచి కొత్త కలేక్టరేట్ వరకు, చంద్రశేఖర్ కాలనీ, గౌతంనగర్, పాలిటెక్నిక్ మైదానం మొత్తం శుభ్రం చేశారు. పిచ్చిమొక్కలు తొలగించారు. వినాయక్‌నగర్‌లోని పసుపుబోర్డు నూతన కార్యాలయ పరిసరాలు కూడా శుభ్రం చేయించారు. ఏఎంసీ జయకుమార్, సూపర్వైజర్ సాజిద్, శానిటరీ ఇన్స్పెక్టర్లు సునీల్, శ్రీకాంత్, షాదుల్లాలు పనులను పరిశీలించారు. -
బెండ సాగు.. బహు బాగు
నిజామాబాద్ జిల్లాలో రైతులు వరి, మొక్కజొన్న, టమాటా పంటలే కాకుండా కూరగాయల సాగును సైతం చేపడుతున్నారు. ఈనేపథ్యంలోనే మాక్లూర్ మండలం కృష్ణానగర్ గ్రామ శివారులో స్థానిక రైతు నర్సింలు తనకున్న 5 ఎకరాల్లో బెండకాయ తోట సాగుచేస్తున్నాడు. ప్రస్తుతం కాయలు కాయడంతో నిత్యం కూలీలు వచ్చి, బెండకాయలను తెంపుతూ మార్కెట్‌కు తరలిస్తున్నారు. గురువారం తోటలో కూలీలు బెండకాయలను తెంపుతుండగా ‘సాక్షి’ క్లిక్‌మనిపించింది. నిత్యం నిజామాబాద్ మార్కెట్‌కి పంటను తీసుకువచ్చి హోల్‌సేల్‌గా విక్రయిస్తున్నట్లు రైతు తెలిపారు. –సాక్షి స్టాఫ్ ఫోటోగ్రాఫర్, నిజామాబాద్ -
గోపాల మిత్రల గోడు పట్టదా!
పెర్కిట్(ఆర్మూర్): పాడి పరిశ్రమలో కీలక పాత్ర పోషిస్తున్న గోపాల మిత్రలకు ప్రభుత్వం నుంచి 9నెలలుగా జీతాలు అందక ఆందోళన చెందుతున్నారు. అసలే చాలీచాలని గౌరవ వేతనంతో నెట్టుకొస్తున్న తమకు సకాలంలో జీతాలు రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డబ్బులు లేక కుటుంబ పోషణ భారమవుతుందని పేర్కొంటున్నారు.అయినా తమ దుస్థితిని ఎవరూ పట్టించుకోవడంలేదంటున్నారు. చాలీచాలని వేతనం.. పాడి పరిశ్రమ అభివృద్ధి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గోపాల మిత్రలకు ప్రతి నెల లక్ష్యాలను నిర్ధేశించి పశువులకు కృత్రిమ గర్భాధారణ చేయిస్తున్నారు. గోపాల మిత్రలకు జాతీయ కృత్రిమ గర్భాధారణ పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం అందించే ప్రోత్సాహకాలతో పాటు రాష్ట్ర ప్రభుత్వం గౌరవ వేతనంగా రూ.11,050 చొప్పున అందజేస్తున్నారు. వీరు వేసవిలో నెలకు 50 నుంచి 60, ఇతర సీజన్లలో 100 నుంచి 120 పశువులకు కృత్రిమ గర్భాధారణ చేయాల్సి ఉంటుంది. ఇందుకు గాను ఒక్కో కృత్రిమ గర్భాధారణకు రైతుల నుంచి రూ.40లు వసూలు చేసి, ప్రభుత్వ ఖాతాలో జమా చేయాల్సి ఉంటుంది. కృత్రిమ గర్భాధారణ లక్ష్యం పూర్తయిన, కాకపోయిన అనుకున్న సంఖ్య ప్రకారం ప్రభుత్వ ఖాతాల్లో వారు డబ్బులు జమా చేయాలి. ఒక్కోసారి అనుకున్న లక్ష్యం పూర్తి కాకపోతే వారి జీతం నుంచి కోతలు తప్పవు. అసలే చాలీచాలని వేతనంతో ఇబ్బందులు పడుతుంటే అందులో కోతలు విధిస్తుంటే ఏమి మిగలడం లేదని వారు వాపోతున్నారు. అలాంటిది 9నెలలుగా జీతాలు రాకపోవడంతో తమ కష్టాలు తీవ్రంగా మారాయంటున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి తమకు వెంటనే వేతనాలు అందించాలని గోపాలమిత్రలు కోరుతున్నారు. ఉమ్మడి జిల్లాలో 132 మంది.. తొమ్మిది నెలలుగా అందని జీతాలు పట్టించుకోని అధికారులు కుటుంబ పోషణ భారంగా మారింది.. తాము చాలీచాలని జీతంతో కుటుంబాలను నెట్టుకొస్తున్నాం. దీనికి తోడు తొమ్మి ది నెలలుగా జీతం రాకపోవ డంతో కుటుంబ పోషణ భా రంగా మారింది. ప్రభుత్వం మా కు ఉద్యోగ భద్రత కల్పిస్తారని ఆశతో 24సంవత్సరాలుగా సేవలందిస్తున్నాను. ప్రభుత్వం స్పందించి మా సమస్యలను పరిష్కరించాలి. –ఉంగరాల రాజన్న, గోపాల మిత్ర, ఇస్సాపల్లి గ్రామాల్లో పశువుల సంరక్షణకు జిల్లా పశు గణాభివృద్ధి సంస్థ(డిస్ట్రిక్ట్ లైవ్ స్టాక్ డెవలప్మెంట్ ఏజేన్సీ) ద్వారా గోపాల మిత్ర వ్యవస్థను 2000 సంవత్సరంలో ఏర్పాటు చేశారు. ఉమ్మడి జిల్లాల వ్యాప్తంగా ఆయా గ్రామాల్లో 132 మంది గోపాల మిత్రలు సేవలు అందిస్తున్నారు. గ్రామాల్లో పశువులకు కృత్రిమ గర్భాధారణ చేయడంతోపాటు పాడి రైతులకు అందుబాటులో ఉంటూ పశువులకు ప్రథమ చికిత్సలు అందిస్తున్నారు. అలాగే పశు వైద్యుల సూచనల మేరకు నట్టల నివారణ మందులు, వ్యాక్సినేషన్ వంటి అన్ని రకాల వైద్య సేవలందిస్తున్నారు. -
కారు బోల్తా: ఐదుగురికి గాయాలు
రెంజల్(బోధన్): మండలంలోని సాటాపూర్ రహదారిపై కారు బోల్తా పడటంతో డ్రైవర్‌తోపాటు మరో నలుగురికి గాయాలయ్యాయి. ఎస్సై చంద్రమోహన్ తెలిపిన వివరాలు ఇలా.. నిజామాబాద్ నగరానికి చెందిన నలుగురు వ్యక్తులు బుధవారం కారులో సాటాపూర్‌లోని ఓ ఫంక్షన్హాల్లో జరిగిన కార్యక్రమానికి వచ్చారు. కార్యక్రమం అనంతరం అదే రాత్రి తిరిగి నగరానికి బయలుదేరారు. సాటాపూర్ రహదారిపై వారి కారు ప్రమాదవశాత్తు అదుపుతప్పి రోడ్డు పక్కన గల గుంతలో పడిపోయింది. ఈ ఘటనలో కారు డ్రైవర్‌తోపాటు కారులో ప్రయాణిస్తున్న మరో నలుగురికి గాయాలయ్యాయి. డ్రైవర్ సర్పరాజ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు వివరించారు. -
5.25 కిలోల గంజాయి పట్టివేత
ఖలీల్‌వాడి: నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీనగర్ గ్రామ శివారులో దారు కుమార్ అనే వ్యక్తి గంజాయి విక్రయిస్తుండగా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. నిందితుడిని తనిఖీ చేయగా అతని ప్యాంటు జేబులో ఐదు గంజాయి ప్యాకెట్లు లభ్యమయ్యాయి. అనంతరం ఒక బ్యాగులో ఉన్న 5.25 కిలోల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. తదుపరి చర్యల నిమిత్తం ఎండు గంజాయిని, నిందితుడిని, సెల్‌ఫోన్‌ను నిజామాబాదు రూరల్ ఎస్సైకి అప్పగించినట్లు టాస్క్ ఫోర్స్ సీఐ అంజయ్య, ఎస్సై గోవింద్ తెలిపారు. -
టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేయాలి
తెయూ(డిచ్పల్లి): రాష్ట్రంలోని యూనివర్సిటీల లో నెలకొన్న సమస్యలు పరిష్కరించి, టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేయాలని ఏఐఎస్ఎఫ్ జాతీయ కౌన్సిల్ సభ్యుడు రఘురాం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ యూనివర్సిటీలో గురువారం నిర్వహించిన ఏ ఐఎస్ఎఫ్ ముఖ్య కార్యకర్తల సమావేశానికి ఆ యన ముఖ్య అతిథిగా హాజరై, మాట్లాడారు. రాష్ట్రంలో విద్యారంగాన్ని పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేయాలన్నారు. యూనివర్సిటీల స్వయం ప్రతిపత్తిని కాపాడాలని, అభివృద్ధి కోసం అధి క నిధులు కేటాయించాలని ప్రభుత్వాన్ని డి మాండ్ చేశారు. అలాగే పీజీ కోర్సుల్లో అడ్మిషన్ పొందిన ప్రతి విద్యార్థికి ఉచితంగా మెస్, హాస్టల్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశా రు. కన్వీనర్ సంజీవ్, కో కన్వీనర్ చందు, నా యకులు అజయ్, నవీన్, కుషాల్, టోకు, లక్ష్మణ, చతుర్ సింగ్, పీరు పాల్గొన్నారు. పాఠశాల గది సీజ్ నిజామాబాద్ అర్బన్: నగరంలోని నారాయణ పాఠశాలలో బుక్స్, దుస్తులు విక్రయిస్తున్న గదిని అధికారులు గురువారం సీజ్ చేశారు. పాఠశాలలో బుక్స్, దుస్తులు విక్రయిస్తున్నట్లు టీజీవీపీ నాయకులు ఎంఈవోకు సమాచారం అందించారు. పాఠశాలకు వచ్చి విచారించిన ఎంఈవో బుక్స్ విక్రయిస్తున్నట్లు తేలడంతో గదిని సీజ్ చేయించారు. సమ్మెను జయప్రదం చేయాలి నిజామాబాద్ సిటీ: కేంద్రంలోని నరేంద్రమోదీ సర్కార్ అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా జూలై9న దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మెను నిర్వహిస్తున్నామని, సమ్మెను కార్మికులు జయప్రదం చేయాలని ఐఎఫ్టీయూ నాయకులు భూమన్న, దాసు కోరారు. నగరంలోని కోటగల్లి ఎన్ఆర్భవన్లో గురువారం నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ.. కేంద్రం కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్లను తీసుకొచ్చి కార్మికులకు మరణ శాసనం విధించారని మండిపడ్డారు. సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని, కార్మికులకు పీఎఫ్, ఈఎస్ఐ చట్టాలు వర్తింపజేసి, పని భద్రత కల్పించాలన్నారు. కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి, సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో నాయకులు సూర్య, శివాజీ, నీలం సాయిబాబా, మల్లికార్జున్, శివకుమార్, జేపీ గంగాధర్, వి బాలయ్య, భారతి, మోహన్, రాజు పాల్గొన్నారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించని కానిస్టేబుల్ ● జరిమానా విధించిన అధికారులు ఖలీల్‌వాడి: నిజామాబాద్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్‌కు ట్రాఫిక్ నిబంధనలు పాటించనందుకు జరిమానా విధించారు. సదరు కానిస్టేబుల్‌కు చెందిన బుల్లెట్ బండి శబ్ద కాలుష్యంతో ప్రయాణించడంతో రూ.1400 జరిమానా విధించినట్టు ట్రాఫిక్ సీఐ ప్రసాద్ గురువారం తెలిపారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించని ట్రాఫిక్ పోలీస్‌కే జరిమానా విధించడం పోలీస్ వర్గాల్లో చర్చకు తెరలేపింది. ఈ–కేవైసీ తప్పనిసరి నస్రుల్లాబాద్: కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పీఎం కిసాన్ పథకం కింద రైతులకు అందించే పెట్టుబడి సహాయం కోసం రైతులు తప్పనిసరిగా ఈ–కేవైసీ చేసుకోవాలని ఏఈవో గ్రీష్మ అన్నారు. అందులో భాగంగా మిర్జాపూర్ క్లస్టర్‌కు సంబందించి 34 మంది చేసుకోలేదని తెలిపారు. ఈసందర్భంగా గురువారం కామిశెట్టిపల్లిలో ఫేసియల్ యాప్ ద్వారా కేవైసీ చేశామన్నారు. డబ్బులు పడుతూ కేవైసీ చేసుకోని వారు ఉన్నా కూడా తప్పకుండా ఈ–కేవైసీ చేసుకోవాలని సూచించారు. -
మొలకెత్తని సోయా విత్తనాలు
డొంకేశ్వర్ (ఆర్మూర్): మార్కెట్లో దొరుకుతున్న విత్తనాలతో రైతులు మోసపోతున్నారు. అవి నకిలివో, మంచివో తెలియక కొనుగోలు చేసి విత్తుతున్నారు. ఎన్నిరోజులైనా మొలకలు రాకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. డొంకేశ్వర్ మండలం దత్తాపూర్‌కు చెందిన లంబాడి రాజు రూ.10 వేలు ఖర్చు చేసి మూడు సోయా విత్తన ప్యాకెట్లను స్థానికంగా కొనుగోలు చేశాడు. రెండెకరాల్లో విత్తనాలు విత్తి పది రోజులైనా ఇప్పటి వరకు మొలకలు రాలేదు. నీటిని అందించినా అంతే పరిస్థితి ఉండడంతో పెట్టుబడిని కోల్పోయాడు. చేసేదేమి లేక మళ్లీ రూ.5వేలు పెట్టి మక్క విత్తనాలు కొని సోయా వేసిన పొలంలోనే విత్తాడు. ఈవిధంగా దత్తాపూర్లోనే కాకుండా మండలంలోని చుట్టుపక్కల గ్రామాల్లో చాలా మంది రైతులు వేసిన సోయా విత్తనాలు మొలకెత్తలేదని పేర్కొంటున్నారు. ఐతే, స్థానికంగా గ్రామాల్లో లైసెన్సు లేని కొంతమంది వ్యాపారులు విత్తనాలు తయారు చేసి రైతులకు అంటగడుతున్నారు. అధికారులు స్పందించి క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించి, రైతులకు న్యాయం జరిగేలా చూడాలని పలువురు కోరుతున్నారు. -
ప్రేమ వ్యవహారంలో బెదిరింపులు: యువకుడి ఆత్మహత్య
లింగంపేట(ఎల్లారెడ్డి): మండలంలోని ఒంటర్పల్లి గ్రామంలో ఓ యువకుడు ఓ యువతిని ప్రేమించగా, విషయం తెలిసిన యువతి కుటుంబ సభ్యులు బెదిరింపులకు పాల్పడటంతో ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సై వెంకట్రావు తెలిపిన వివరాలు ఇలా.. గ్రామానికి చెందిన రాపర్తి సాయిలు–అంజవ్వ దంపతులకు ఓ కూతురు, కొడుకు శ్రీకాంత్(21) ఉన్నారు. వారం రోజుల క్రితం కూతురును తీసుకొని దంపతులిద్దరూ హైదరాబాదుకు బతుకుదెరువు కోసం వెళ్లారు. కొడుకు ఒక్కడే ఒంటర్పల్లిలో నివాసం ఉంటున్నాడు. శ్రీకాంత్ అదే గ్రామానికి చెందిన ఓ యువతి గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. విషయం తెలిసిన యువతి మామ శ్రీకాంత్‌పై బెదిరింపులకు పాల్పడ్డాడు. ఈక్రమంలో బుధవారం రాత్రి శ్రీకాంత్ ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. గ్రామస్తులు ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. తన కొడుకు ఆత్మహత్యకు కారణం యువతి కుటుంబ సభ్యులే అని శ్రీకాంత్ తల్లిదండ్రులు, బంధువులు ఆందోళనకు దిగారు. గ్రామానికి ఎల్లారెడ్డి సీఐ రవీందర్ నాయక్, ఎస్సై వెంకట్రావు, పోలీసులు చేరుకొని ఇరువర్గాల వారిని సముదాయించి వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
దాబా, హోటళ్లపై పోలీసుల దాడులు
నిజాంసాగర్(జుక్కల్): నాందేడ్–సంగారెడ్డి 161 జాతీయ రహదారి వెంబడి ఉన్న దాబాలు, రెస్టారెంట్లపై బుధవారం అర్ధరాత్రి పోలీసులు దాడులు నిర్వహించారు. నిజాంసాగర్, పిట్లం, పెద్దకొడప్గల్, జుక్కల్, బిచ్కుంద, మద్నూర్ మండలాల్లోని జాతీయ రహదారి పక్కన ఎటువంటి అనుమతులు లేకుండా మద్యం సిట్టింగులు, విక్రయాలు జరుపుతున్న దాబాలపై దాడి చేసి, అక్రమంగా నిల్వ చేసిన మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా మద్య సిట్టింగులు నిర్వహిస్తున్న దాబా నిర్వాహకులపై కేసులు నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు. -
మతిస్థిమితం లేని యువకుడి వీరంగం
లింగంపేట(ఎల్లారెడ్డి): మండలంలోని అయ్యపల్లి తండాకు చెందిన దేవసోత్ సంతోష్ అనే యువకు డు మతిస్థిమితం కోల్పోయి గత కొద్ది రోజులుగా తండాలో వీరంగం సృష్టిస్తున్నాడు. ఈక్రమంలో గు రువారం అతడికి ఎదురువచ్చిన తండావాసులను రాళ్లతో, కర్రలతో కొడుతూ అసభ్యకరమైన మాటల తో దూషించాడు. తండాకు చెందిన ఓ వ్యక్తి ఇంట్లో కి చొరబడి ఫర్నిచర్, టీవీ, వంటపాత్రలు, రెండు బైక్‌లను ధ్వంసం చేశాడు. దీంతో సుమారు రూ. 2లక్షల వరకు ఆస్తినష్టం జరిగినట్లు బాధితుడు తెలి పారు. సంతోష్ చేష్టలతో విసిగిపోయిన తండావాసులు అతడిని బంధించి పోలీసులకు సమాచారం ఇచ్చి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పోలీస్ స్టేషన్ లో సైతం రాళ్లు రువ్వుతూ అతడు దాడి చేశాడు. వెంటనే సీఐ రవీందర్‌నాయక్ ఎల్లారెడ్డి ప్రభుత్వ ఆ స్పత్రి వైద్యులను పిలిపించి మత్తు ఇంజక్షన్ ఇప్పించారు. గంట తర్వాత సంతోష్ అరవడం మానేశాడు. అనంతరం వైద్య చికిత్సల నిమిత్తం అతడిని ప్రత్యేక వాహనంలో హైదరాబాద్‌కు తరలించారు. బాబాయ్ మృతితో కుంగిపోయి.. సంతోష్ వింత చేష్టలతో ఎల్లారెడ్డి సీఐ అతడిపై ఆరా తీశారు. సంతోష్ బాబాయి అయిన దేవసోత్ పకీరాను గత నెల 24న కన్న కొడుకు ప్రకాష్ గొడ్డలితో నరికి చంపాడు. పకీరా మృతి చెందిన సమయంలో అక్కడే ఉన్న సంతోష్ ఇంట్లో పడిన రక్తాన్ని తొలగించి శుభ్రం చేశాడు. అప్పటి నుంచి సంతోష్ మానసికంగా కుంగిపోయి మతిస్థిమితం కోల్పోయినట్లు తండావాసులు తెలిపారు. మంచి భవిష్యత్ ఉన్న యువకుడు మతిస్థిమితం కోల్పోవడంతో కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళన వ్యక్తం చేశారు. -
ఎన్నికల ప్రచారం ఇక్కడి నుంచే ప్రారంభం
మీకు తెలుసా? బాల్కొండ: బాల్కొండ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థులు ఏ పార్టీ వారైనా ఎన్నికల ప్రచారాన్ని మండలంలోని శ్రీరాంపూర్గల చిలుకల చిన్నమ్మ ఆలయం నుంచే ప్రారంభిస్తారు. ఈ అమ్మ ఆలయం నుంచే ప్రచారం ప్రారంభించడం సెంట్‌మెంట్‌గా భావిస్తారు. ● శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లో ముంపునకు గురైన శ్రీరాంపూర్ గ్రామం అదే పేరుతో 1963లో బాల్కొండ మండలంలో నూతన గ్రామంగా వెలిసింది. ముంపు గ్రామం నుంచి చిలుకల చిన్నమ్మను తీసుకువచ్చి ఇక్కడ స్థాపించారు. ● భక్తులు కోరిన కోర్కెలు తీర్చే దేవతగా ఈ ఆలయంలోని చిలుకల చిన్నమ్మ ప్రసిద్ధి చెందింది. ● ప్రతి ఆదివారం, గురువారం ఆలయం వద్ద సుదూర ప్రాంతాల నుంచి వచ్చి భక్తులు మొక్కులు తీర్చుకుంటారు. ● ప్రతి సంవత్సరం మాఘ ఆమావాస్య రోజున ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. ● చిలుకల చిన్నమ్మ పేరున గ్రామాల్లో చిన్నయ్య, చిన్నమ్మ నామకరణం చేసుకుంటారు. -
క్రైం కార్నర్
బైక్‌ను ఢీకొన్న బస్సు : ఒకరి మృతి ఆర్మూర్‌టౌన్: ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని కోటార్మూర్లో బైక్‌ను ఓ బస్సు ఢీకొన్న ఘటనలో ఒకరు మృతిచెందారు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా.. కోటార్మూర్‌కు చెందిన మామిడి మహేష్ (38) గురువారం ఉదయం తన బైక్‌పై తన భార్య లావణ్యను మహిళా ప్రాంగణ సమీపంలో ఓ పనికి దించి ఇంటికి బయలుదేరాడు. కాగ కోటార్మూర్‌లోని తిరుపతి ఆస్పత్రి వద్ద అతడి బైక్‌ను జగిత్యాల డిపోకు చెందిన బస్సు వెనుక నుంచి అతివేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ఘటనలో మహేష్‌కు తీవ్రమైన గాయాలవ్వడంతో అక్కడిక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని, వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌హెచ్‌వో సత్యనారాయణగౌడ్ తెలిపారు. పాముకాటుతో ఒకరు.. కామారెడ్డి క్రైం: గుడిసెలో నిద్రిస్తుండగా పాము కా టు వేయడంతో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన కా మారెడ్డి మండలం క్యాసంపల్లి తండాలో వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. తండాకు చెందిన భుక్యా కపుర్యా (30) వ్యవసాయం, కూలీ పనులు చేసుకునేవాడు. అతనికి గతంలో వివాహం జరుగ గా భార్యతో విడాకులు అయ్యాయి. అతడు బుధ వారం రాత్రి తల్లిదండ్రులతో కలిసి ఇంట్లో నిద్రించాడు. వేకువజామున మెలకువ వచ్చి చూసుకోగా పాము కాటుకు గురైనట్లు గుర్తించాడు. కుటుంబసభ్యులు వెంటనే అతడిని కామారెడ్డి ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఉదయం 6 గంటల ప్రాంతంలో మృతి చెందాడు. అర్ధరాత్రి విషసర్పం కాటు వేసి ఉంటుందని భావిస్తున్నారు. పోలీసులు విచారణ జరుపుతున్నారు. -
కట్టుదిట్టమైన భద్రత చేపట్టాలి
నిజామాబాద్ అర్బన్ : జిల్లా కేంద్రంలో నూతనంగా నెలకొల్పిన జాతీయ పసుపు బోర్డు కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఈ నెల 29న కేంద్ర హోంమంత్రి అమిత్ షా వస్తున్న సందర్భంగా ఏర్పాట్లపై గురువారం ఐడీవోసీ కాన్ఫరెన్స్ హాల్లో కలెక్టర్ టీ వినయ్‌కృష్ణారెడ్డి, సీపీ సాయి చైతన్య జిల్లా అధికారులతో సమీక్షించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని హెలిప్యాడ్‌ను సిద్ధం చేయాలని ఆర్అండ్బీ అధికారులకు సూచించారు. ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా కేంద్ర హోం మంత్రి పర్యటనకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సీపీ పోలీసు అధికారులకు సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ● కేంద్ర హోంమంత్రి పర్యటన ఏర్పాట్లపై కలెక్టర్, సీపీ సమీక్ష -
పాలిటెక్నిక్ మైదానం పరిశీలన
సుభాష్‌నగర్: ఈ నెల 29న రైతు సమ్మేళన బహి రంగ సభ జరిగే పాలిటెక్నిక్ కళాశాల మైదానాన్ని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, ఎంపీ అర్వింద్ ధ ర్మపురి గురువారం పరిశీలించారు. ఈ సంద ర్భంగా సభ ఏర్పాట్లు, భద్రత, ట్రాఫిక్ మళ్లింపు, హెలీప్యాడ్ తదితర వివరాలను పోలీస్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. సభా వేదిక, భద్రత వంటి వివరాలను ఏసీపీ రాజా వెంకట్ రెడ్డి కేంద్రమంత్రికి వివరించారు. అంతకుముందు జాతీయ పసుపు బోర్డు కార్యాలయాన్ని కేంద్రమంత్రి పరిశీలించారు. చైర్మన్, చాంబర్ల ఏ ర్పాటు తదితర పనులపై చైర్మన్ పల్లె గంగారెడ్డి వివరించారు. -
డ్రగ్స్ నిర్మూలన అందరి బాధ్యత
ఖలీల్‌వాడి : మాదకద్రవ్యాలను నియంత్రించాల్సిన బాధ్యత అందరిపై ఉందని సీపీ పోతరాజు సాయి చైతన్య అన్నారు. జిల్లా కేంద్రంలోని పాత కలెక్టరేట్ నుంచి రాజీవ్ గాంధీ ఆడిటోరియం వరకు గురువారం నిర్వహించిన యాంటీ డ్రగ్స్ అవేర్నెస్ ర్యాలీని ఆయన ప్రారంభించి మాట్లాడారు. పిల్లలు ఏం చేస్తున్నారో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు గమని స్తూ ఉండాలన్నారు. బంగారు భవిష్య త్తు ఉన్న యువత కొంతమంది చెడుమార్గాల వైపు ఆకర్షితులవుతున్నారని పేర్కొ న్నారు. మత్తుకు అలవాటు పడి జీవితా లు నాశనం చేసుకుంటున్నారని, వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపా రు. గంజాయి ఇతర మత్తు పదార్థాలు సేవించేవారు వారి మానసికస్థితిని కో ల్పోయి నేరాలు చేసే అవకాశం ఉంటుందన్నారు. డ్రగ్స్ రహిత తెలంగాణ కోసం అందరూ కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో ట్రెయినీ ఐఏఎస్ కరోలి నా ఛాంగ్ ఎన్ మావీ, ఏసీపీ (అడ్మిన్) బస్వారెడ్డి, వెల్ఫేర్ ఆఫీసర్ రసూల్ బీ, ఎకై ్సజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి, డీసీ సోమిరెడ్డి, ఏసీపీ రాజా వెంకట్ రెడ్డి, విద్యార్థులు పాల్గొన్నారు. సీపీ సాయి చైతన్య -
ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలి
నిజామాబాద్‌నాగారం: ప్రభుత్వ ఆస్పత్రుల ద్వారా ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించాలనే సంకల్పంతో ప్రభుత్వం అన్ని సదుపాయాలు అందుబాటులో ఉండేలా కృషి చేస్తోందని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ సంచాలకులు (డీపీహెచ్) డాక్టర్ రవీందర్ నాయక్ పేర్కొన్నారు. ప్రభుత్వ సంకల్పానికి అనుగుణంగా ప్రజలకు సంతృప్తికరంగా వైద్య సేవలు అందించాలని, ఎక్కడైనా లోటుపాట్లు ఉంటే సరిదిద్దుకోవాలని వైద్యాధికారులకు సూచించారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి, వైద్య కళాశాలను కలెక్టర్ టీ వినయ్ కృష్ణారెడ్డితో కలిసి డీపీహెచ్ రవీందర్ నాయక్ గురువారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆస్పత్రిలోని ఐసీయూ, ఆర్ఐసీయూ, ల్యాబ్, బ్లడ్ బ్యాంకు, టీ హబ్ తదితర వాటిని పరిశీలించారు. వైద్య కళాశాలలో ఫిజియాలజీ, అనాటమీ, హెమటాలజీ ల్యాబ్‌లు, లైబ్రరీ, లెక్చరర్ హాల్ ఇతర విభాగాలను సందర్శించారు. అనంతరం జీజీహెచ్ సూపరింటెండెంట్ చాంబర్లో ఆయా విభాగాల అధిపతులతో సమావేశమై అన్ని అంశాలపై కూలంకషంగా చర్చించారు. ఈ సందర్భంగా డీపీహెచ్ రవీందర్ నాయక్, కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి మాట్లాడుతూ జాతీయ మెడికల్ కౌన్సిల్ (ఎన్ఎంసీ) మార్గదర్శకాలకు అనుగుణంగా సదుపాయాలు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు. తద్వారా ఎన్ఎంసీ అనుమతుల మంజూరులో ఇబ్బందులకు ఆస్కారం ఉండదన్నారు. వైద్య విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ప్రొఫెసర్లు, అసిస్టెంట్, అసోసియేట్ ప్రొఫెసర్లు, బోధనేతర సిబ్బంది ఉండాలన్నారు. ఖాళీలు ఉంటే, వాటి వివరాలను సమర్పించాలని కళాశాల ప్రిన్సిపాల్‌ను ఆదేశించారు. అవసరమయ్యే వైద్య పరికరాలు, యంత్రాలపై సమగ్ర నివేదిక సమర్పించాలని ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాస్, మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ శివప్రసాద్‌లకు సూచించారు. తాము క్రమం తప్పకుండా ఆస్పత్రిని తనిఖీ చేస్తానని, ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని అన్నారు. వీరి వెంట డీఎంహెచ్‌వో డాక్టర్ రాజ శ్రీ, వైద్య విభాగాల అధిపతులు ఉన్నారు. మెడికల్ కాలేజీలో ఎన్ఎంసీ నిబంధనల మేరకు సదుపాయాలు కల్పించాలి వైద్యాధికారులకు సూచించిన డీపీహెచ్ డాక్టర్ రవీందర్ నాయక్, కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి జీజీహెచ్, మెడికల్ కళాశాల తనిఖీ -
యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి
నిజామాబాద్ లీగల్: యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జీవీఎన్ భరతలక్ష్మి పేర్కొన్నారు. మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా గురువారం కోర్టు ప్రాంగణంలో జిల్లా న్యాయసేవా సంస్థ ఏర్పాటు చేసిన ర్యాలీని ఆమె జెండా ఊపి ప్రారంభించారు. జడ్జి మాట్లాడుతూ దేశంలో విలువైన మానవ వనరుల్ని మాదకద్రవ్యాలు దెబ్బతీస్తున్నాయని, ముఖ్యంగా యువత, విద్యార్థులు మాదక ద్రవ్యాలకు అలవాటు పడి తమ జీవితాలను కోల్పోతున్నారని అన్నారు. దేశంలో, రాష్ట్రంలో ఎవరూ మాదకద్రవ్యాలను వినియోగించకుండా చూడాలని, వాటి నివారణకు కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. తల్లిదండ్రులు, తమపై పెట్టుకున్న ఆశలను మమ్ము చేయకుండా, డ్రగ్స్‌కు యువత దూరంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి ఉదయ భాస్కర్ రావు, జడ్జీలు హరీశ, ఆశాలత, వడ్డీ హరికుమార్, శ్రీనివాసరావు, జూనియర్ సివిల్ జడ్జిలు కుష్బూ ఉపాధ్యాయ, గోపికృష్ణ, బార్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు మామిళ్ల సాయిరెడ్డి, మాణిక్ రాజ్, లీగల్ ఎయిడ్ కౌన్సిల్ చీఫ్ రాజ్‌కుమార్ సుబేదార్, అడ్వకేట్లు, కోర్టు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. జిల్లా జడ్జి జీవీఎన్ భరతలక్ష్మి -
పసుపు బోర్డు కేంద్రం ఇచ్చిన బహుమతి
సుభాష్‌నగర్ : పసుపు బోర్డు ఏర్పాటు జిల్లా రైతుల కు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన బహుమతి అని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జీ కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. నగరంలోని బీజేపీ కార్యాలయంలో ఎమర్జె న్సీ డే సందర్భంగా ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌ను ఎంపీ అర్వింద్ ధర్మపురితో కలిసి గురువారం ఆయ న వీక్షించారు. అనంతరం విలేకరులతో కిషన్‌రెడ్డి మాట్లాడారు. పసుపు బోర్డు కావాలనే 40 ఏళ్ల రైతు ల ఆకాంక్ష, అనేక పోరాటాలు, ఉద్యమాల ఫలితంగా కేంద్రం ప్రకటించిందని, ఎంపీ అర్వింద్ కృషితో రాష్ట్ర, జాతీయ పార్టీ నిర్ణయం, ప్రధాని మోదీ ఆశీస్సులతో పసుపు బోర్డు ఏర్పడిందన్నారు. నిజామాబాద్‌లో జాతీయ పసుపు బోర్డు కార్యాలయం ఏ ర్పాటు నిర్ణయం తీసుకోవడం గొప్ప విషయమని పేర్కొన్నారు. పసుపు బోర్డు తమ రాష్ట్రంలో ఏర్పా టు చేయాలని మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ ఇతర రాష్ట్రాలు అడిగాయని, మోదీ చివరకు నిజామాబాద్‌లోనే ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అలాగే జాతీయ పసుపు బోర్డు చైర్మన్‌గా జిల్లాకు చెందిన రైతుబిడ్డనే నియమించారన్నారు. ఈ నెల 29న జాతీయ పసుపు బోర్డు కా ర్యాలయం పూర్తిస్థాయిలో కార్యరూపం దాల్చనుందని పేర్కొన్నారు. రాష్ట్ర రాజకీయాల్లో కీలకపాత్ర పోషించిన ధర్మపురి శ్రీనివాస్ (డీఎస్) ప్రథమ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహాన్ని కూడా అమిత్ షా ఆవిష్కరిస్తారని తెలిపారు. రైతు సమస్యలపై పోరాటాలు, ఉద్యమాలకు నిజామాబాద్ జిల్లా కేంద్రబిందువని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. రైతు సంఘాలను ఏర్పాటు చేసుకుని సమస్యలపై పోరాటం చేస్తారన్నారు. రాజకీయ పార్టీలకతీతంగా రైతులు సమ్మేళనానికి హాజరై విజయవంతం చేయాలని కోరారు. పసుపు బోర్డు కార్యాలయం ప్రారంభం తర్వాత బోర్డు లోగోను అమిత్ షా ఆవిష్కరిస్తారని తెలిపారు.రైతు సమ్మేళనానికి తరలిరావాలికేంద్ర హోంమంత్రి అమిత్ షా పసుపు బోర్డు కేంద్ర కార్యాలయం ప్రారంభించిన తర్వాత పాలిటెక్నిక్ మైదానంలో నిర్వహించే రైతు స మ్మేళన బహిరంగ సభకు హాజరవుతారని, రై తులు పెద్దసంఖ్యలో తరలిరావాలని ఎంపీ అ ర్వింద్ ధర్మపురి పిలుపు నిచ్చారు. సమావేశంలో నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, ఎమ్మెల్సీ చిన్నమైల్ అంజిరె డ్డి, జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగా రెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేశ్ పటేల్ కులాచారి, నాయకులు బద్దం లింగారెడ్డి, పెద్దోళ్ల గంగారెడ్డి, మోరెపల్లి సత్యనారాయణ, మేడపాటి ప్రకాశ్‌రెడ్డి, వడ్డి మోహన్‌రెడ్డి, ఏలేటి మల్లికార్జున్‌రెడ్డి, బోగ శ్రావణి, గోపిడి స్రవంతిరెడ్డి, అ డ్లూరి శ్రీనివాస్, న్యాలం రాజు, నాగోళ్ల లక్ష్మీనారాయణ, కంచెట్టి గంగాధర్, మాదాసు స్వామి యాదవ్, పంచరెడ్డి ప్రవళిక పాల్గొన్నారు. కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జీ కిషన్‌రెడ్డి ఎంపీ అర్వింద్ విజ్ఞప్తిని కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది నిజామాబాద్ జిల్లా రైతు ఉద్యమాలకు కేంద్రబిందువు అమిత్ షా సభను జయప్రదం చేయాలని పిలుపు -
భూభారతిపై ఎన్నో ఆశలు
నిజామాబాద్గోపాల మిత్రల గోడు పట్టదా! పాడి పరిశ్రమలో కీలకపాత్ర పోషిస్తున్న గోపాలమిత్రలకు ప్రభుత్వం నుంచి జీతాలు అందక ఆందోళన చెందుతున్నారు. శుక్రవారం శ్రీ 27 శ్రీ జూన్ శ్రీ 2025– 8లో uఐకేపీలో డీపీఎంల బదిలీలు ● ముగ్గురికి స్థాన చలనం డొంకేశ్వర్(ఆర్మూర్) : గ్రామీణ పేదరిక ని ర్మూలన సంస్థ (సెర్ప్)లో జిల్లా ప్రాజెక్టు మే నేజర్ల (డీపీఎం) బదిలీలు జరిగాయి. హై దరాబాద్‌లో సెర్ప్ సీఈవో దివ్య దేవరాజన్ ఆధ్వర్యంలో బుధవారం జరిగిన బదిలీల్లో జిల్లాకు చెందిన ముగ్గురు డీపీఎంలకు స్థానచలనం కలిగింది. శ్రీనివాస్, సాయిలు కా మారెడ్డి జిల్లాకు అలాగే మారుతి నిర్మల్ జి ల్లాకు బదిలీ అయ్యారు. జిల్లా కార్యాలయంలో పనిచేస్తున్న మరో ముగ్గురికి స్థానచల నం కలుగలేదు. అదే విధంగా ఇతర జిల్లాల నుంచి ముగ్గురు డీపీఎంలు జిల్లాకు వస్తున్నారు. అందులో మెదక్ నుంచి మోహన్, సిద్దిపేట నుంచి కిరణ్, నిర్మల్ నుంచి రాజేశ్వర్ ఉన్నారు. వీరు రెండు, మూడు రోజుల్లో బాధ్యతలు తీసుకోనున్నారు. అయితే, ఎవరికి ఏ సెక్షన్లు ఇవ్వాలనేది సెర్ప్ సీఈవోనే నిర్ణయం తీసుకోనున్నారు. కాగా, డీపీఎంలకు ఇది వరకు ఉన్న విభాగాలు కాకుండా కొత్త విభాగాలు ఇవ్వనున్నట్లు సమాచారం. ఎస్సారెస్పీలోకి 2,894 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో బాల్కొండ: స్థానిక ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో శ్రీరాంసాగర్ జలాశయంలోకి 2,894 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్ట్ నుంచి కాకతీయ కాలు వ ద్వారా 100, మిషన్ భగీరథ ద్వారా 231, ఆవిరి రూపంలో 261 క్యూసెక్కుల నీరు పోతోంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 1091(80.5 టీఎంసీలు) అడుగులు కాగా గురువారం సాయంత్రానికిప్రాజెక్ట్లో 1064 (14.77 టీఎంసీలు) అడుగుల నీరు నిల్వ ఉందని ప్రాజెక్ట్ అధికారులు తెలిపారు. నిజాంసాగర్‌లోకి ఇన్‌ఫ్లో నిజాంసాగర్(జుక్కల్): ఎగువ ప్రాంతాల్లో వర్షాలు కురుస్తుండడంతో నిజాంసాగర్ ప్రాజెక్టులోకి 1,025 క్యూసెక్కుల ఇన్‌ఫ్లోగా వస్తున్నట్లు ప్రాజెక్టు అధికారులు గురువారం తెలిపారు. క్యాచ్మెంట్ ఏరియాతోపాటు ఎ గువన కుండపోతగా కురిసిన వర్షానికి వరద వస్తోందన్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1405 అడుగులు (17.8 టీఎంసీలు)కాగా.. ప్రస్తుతం 1392 అడుగుల (5.2 టీ ఎంసీలు) నీరు నిల్వ ఉంది. ప్రాజెక్టు నుంచి ప్రధాన కాలువకు 1,025 క్యూసెక్కుల నీటి ని విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇద్దరు ఏఎస్సైలకు పదోన్నతి ఖలీల్‌వాడి: నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ని ఇద్దరు ఏఎస్సైలు ఎస్సైలుగా పదోన్నతి పొందారు. రుద్రూర్ ఏఎస్సై రాజు, సీసీఎస్ ఏఎస్సై జవాన్ భీమ్రావులకు ఎస్సైలుగా ప్రమోషన్ రావడంతో ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు గురువారం సీపీని కలిశారు. పోలీస్ క మిషనర్ వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. బాధ్యతల స్వీకరణ నిజామాబాద్ సిటీ: నగర మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ కమిషనర్‌గా ఎం రవిబాబు గురువారం బాధ్యతలు చేపట్టారు. 2002లో నిజామాబాద్ కార్పొరేషన్లో డిప్యూటీ కమిషనర్‌గా రవిబాబు పనిచేశారు. బదిలీపై అమరచింతకు వెళ్లారు. తిరిగి మళ్లీ నగరానికే డిప్యూటీ కమిషనర్‌గా వచ్చారు. డీసీ రవిబాబుకు రెవెన్యూ సిబ్బంది కలిసి పుష్పగుచ్ఛం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. భూభారతి రెవెన్యూ సదస్సులతో తమ భూ సమస్యలు పరిష్కారమై న్యాయం జరుగుతుందని వేలాది మంది రైతులు ఆశగా ఎదురుచూస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఈ నెల 3 నుంచి 20 వరకు రెవెన్యూ గ్రామాల్లో నిర్వహించిన సదస్సులలో 39 వేలకు పైగా రైతులు దరఖాస్తు చేసుకున్నారు. అర్జీలు పెట్టుకున్న రైతులకు సమస్య పరిష్కారం కోసం అధికారులు నోటీసులు పంపిస్తున్నారు. వివాదాలు లేని వాటిని ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నారు. అత్యధిక దరఖాస్తులు వచ్చిన సాదాబైనామాల అంశం కోర్టులో ఉండగా, అసైన్మెంట్ భూముల విషయంలో కమిటీలు ఏర్పాటు చేయాల్సి ఉంది. సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : భూభారతి పోర్టల్ ద్వారా తమ భూసమస్యల పరిష్కారం కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు. ధరణి స్థానంలో వచ్చిన భూభారతికి జిల్లాలో భారీగా దరఖాస్తులు వచ్చాయి. ఈ నెల 3 నుంచి 20 వరకు అన్ని రెవెన్యూ గ్రామాల్లో నిర్వహించిన రెవెన్యూ సదస్సుల్లో భూ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ దరఖాస్తులు వచ్చాయి. వివిధ సమస్యలకు సంబంధించి అన్ని మండలాల్లో కలిపి 39,806 దరఖాస్తులు వచ్చాయి. వీటిలో ముఖ్యంగా మిస్సింగ్ సర్వే నంబర్లు, పెండింగ్ మ్యుటేషన్లు, పేర్ల మార్పులు, అసైన్డ్ భూముల సమస్యలు ఇతరాలు ఉన్నాయి. మిస్సింగ్ సర్వే నంబర్ల విషయానికి వస్తే 6,898, పెండింగ్ మ్యుటేషన్లు 1,121, పేర్ల మార్పు 914, అసైన్డ్ భూముల సమస్యలు 494, ఇతర భూసమస్యలకు సంబంధించి 22,254 దరఖాస్తులు ఉన్నాయి. ఇదిలా ఉండగా దాబైనామాలకు సంబంధించి అన్ని మండలాల్లో కలిపి 30,442 దరఖాస్తులు రాగా ఇందులో 11,891 తిరస్కరణకు గురయ్యాయి. మరో 18,551 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. తహసీల్దార్, ఆర్డీవో స్థాయిలో రెండంచెల్లో దరఖాస్తులను పరిశీలిస్తారు. న్యూస్రీల్మూడంచెల వారీగా నోటీసులు.. దరఖాస్తుల్లో ఆయా సమస్యలకు సంబంధించి తహసీల్దారు, ఆర్డీవో, కలెక్టర్ల ద్వారా నోటీసులు పంపిస్తున్నారు. వీటిలో అత్యధికం తహసీల్దారు, ఆర్డీవో స్థాయిలోనే పరిష్కారం అవుతున్నాయి. ఇక తహసీల్దారు వద్ద పరిష్కారం కాకపోతే ఆర్డీవో వద్ద, ఆర్డీవో వద్ద పరిష్కారం కాకపోతే కలెక్టర్ వద్దకు వెళ్లే అవకాశం ఉంది. కలెక్టర్ వద్ద కాకపోతే ట్రిబ్యునల్‌కు వెళ్లే అవకాశం కల్పించారు. సాదాబైనామాలు, అసైన్మెంట్ భూములకు సంబంధించి మినహా ఇతర దరఖాస్తులను వేగంగా పరిష్కరిస్తున్నట్లు అదనపు కలెక్టర్ కిరణ్‌కుమార్ తెలిపారు.అసైన్మెంట్ కమిటీలు ఏర్పాటైన తర్వాతే.. అసైన్మెంట్ భూముల విషయానికి వస్తే అన్ని మండలాల్లో అసైన్మెంట్ కమిటీలు ఏర్పాటు చేయాల్సి ఉంది. ఇందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి గైడ్‌లైన్స్ రాకపోవడంతో ఈ కమిటీల ఏర్పాటు ప్రక్రియ మొదలు కాలేదు. మిగిలిన సమస్యల విషయమై వివాదాలు లేనివాటిని క్లియర్ చేస్తున్నారు.పెండింగ్‌లో సాదాబైనామాల దరఖాస్తులుసాదాబైనామాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి జీవో రావాల్సి ఉండడంతో తిరస్కరణకు గురైన దరఖాస్తులను తీసేస్తే మిగిలిన వాటిని రెవెన్యూ అధికారులు పెండింగ్‌లో ఉంచారు. సాదాబైనామాల అంశం కోర్టులో పెండింగ్‌లో ఉండడంతో అధికారులు ఏమీ చేయలేని పరిస్థితి ఉంది. భూ సమస్యల పరిష్కారం కోసం ఎదురు చూపులు జిల్లాలో ఇప్పటి వరకు వచ్చిన దరఖాస్తులు 39,806 రెండంచెల్లో పరిశీలన చేయనున్న అధికారులు -
తీవ్ర జాప్యం.. యువతలో నైరాశ్యం
మోర్తాడ్(బాల్కొండ): రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం పథకాన్ని ప్రారంభించింది. ఇందులో భాగంగా యువత నుంచి రుణాల కోసం దరఖాస్తులను ఆహ్వానించింది. జిల్లాలో వేలాదిగా యువత దరఖాస్తులను చేసుకుంది. కానీ నెలలు గడుస్తున్నా రుణాల పంపిణీ ప్రక్రియ ముందుగు సాగడం లేదు. దీంతో దరఖాస్తు చేసుకున్న నిరుద్యోగులు రుణాల కోసం వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. పంపిణీలో తీవ్ర జాప్యం నెలకొనడంతో యువత నైరాశ్యం చెందుతున్నారు. జిల్లాలో 58వేల మంది.. రాష్ట్ర ఆవిర్బావ దినోత్సవం సందర్బంగా రుణాల పంపిణీని ఆరంభిస్తామని ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం పథకం కింద దరఖాస్తులను స్వీకరించే సమయంలోనే ప్రకటించింది. కానీ ఇప్పటి వరకూ ఎప్పుడు ఆరంభిస్తారో షెడ్యూల్‌ను వెల్లడించలేదు. ఫలితంగా జిల్లా వ్యాప్తంగా దరఖాస్తు చేసుకున్న 58వేల మందికి పైగా ఆశావహులు నిరీక్షిస్తున్నారు. రూ.50వేల వరకు రుణం కోసం దరఖాస్తు చేసుకునేవారికి వంద శాతం రాయితీని వర్తించేలా ప్రభుత్వం మార్గదర్శకాలను ఖరారు చేసింది. రూ.1లక్ష రుణానికి 90 శాతం రాయితీని, రూ.1లక్ష నుంచి రూ.2లక్షల వరకూ రుణాలకు 80 శాతం రాయితీని, రూ.2లక్షల నుంచి రూ.4లక్షల వరకు రుణాలకు 70 శాతం రాయితీని అందిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అనేక మంది రూ.4లక్షల వరకు రుణం కావాలని దరఖాస్తు చేసుకున్నారు. కానీ ప్రభుత్వం ఇప్పటి వరకూ ఏ ఒక్కరికి కూడా రుణాలను పంపిణీ చేయలేదు. వాయిదా వేసినప్పటికీ మరో షెడ్యూల్‌ను ఖరారు చేయకపోవడంతో నిరుద్యోగులకు నిరీక్షణ తప్పడం లేదు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలోను రాయితీ రుణాలకు తీవ్ర అన్యాయం జరిగిందని ఇప్పటి ప్రభుత్వ హయాంలోను ఇదే పరిస్థితి కొనసాగితే ఎలా అని పలువురు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి రాయితీ రుణాల కార్యక్రమాన్ని వెంటనే ప్రారంభించాలని నిరుద్యోగులు కోరుతున్నారు. జాడ లేని రాజీవ్ యువ వికాసం రుణాల పంపిణీ షెడ్యూల్ ప్రకారం సాగని ప్రక్రియ మోర్తాడ్‌కు చెందిన మహేష్ బ్యాంగిల్ స్టోర్ ఏర్పాటు చేయడానికి రాజీవ్ యువ వికాసం కింద రూ.4లక్షల రుణం కోసం దరఖాస్తు చేసుకున్నాడు. సిబిల్ స్కోర్ బాగుండటంతో బ్యాంకర్లు కూడా అతని దరఖాస్తును మొదటి ప్రాధాన్యత జాబితాలో ఉంచారు. ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించే ప్రక్రియను వాయిదా వేయడం, కనీసం అమలు చేసే షెడ్యూల్‌ను ప్రకటించకపోవడంతో మహేష్‌కు రుణం దక్కలేదు. సొంతంగా వ్యాపారం ఆరంభించాలని దరఖాస్తుదారుడు భావించినా పెట్టుబడి పెట్టే స్థోమత లేకపోవడంతో తన కలలను సాకారం చేసుకోవడం కోసం ప్రభుత్వ పథకానికి దరఖాస్తు చేసుకున్నాడు. రుణ పంపిణీలో తీవ్ర జాప్యం కారణంగా అతడు ఆందోళన చెందుతున్నాడు. ఇలా జిల్లాలోని నిరుద్యోగ యువత ప్రభుత్వం అందించే రాయితీ రుణాల కోసం ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం స్పందించాలి.. రాజీవ్ యువ వికాసం పేరిట రుణాలు ఇచ్చి ఆదుకుంటామని దరఖాస్తులు తీసుకుని ఇప్పటి వరకూ ఏ ఒక్కరికి కూడా నయాపైసా రుణం ఇవ్వలేదు. యువతను నమ్మించి మోసం చేస్తున్నారు. ఇది సరైన విధానం కాదు. ప్రభుత్వం స్పందించి వెంటనే రాయితీ రుణాలకు నిధులు విడుదల చేయాలి. – తక్కూరి సాగర్, దరఖాస్తుదారుడు, మోర్తాడ్ యువతకు దారి చూపాలి.. నిరుద్యోగులైన యువతీయువకులు ఎంతో ఆశతో రాజీవ్ యువ వికాసం కోసం దరఖాస్తు చేసుకున్నారు. వారి కి సకాలంలో రాయితీ రుణా లు ఇవ్వకపోతే ఇబ్బంది ఎదురవుతుంది. స్వయం ఉపాధి పొందాలనుకునే వారికి రాయితీ రుణాలు ఇచ్చి అండగా ఉండాలి. – తోకల నర్సయ్య, మాజీ సర్పంచ్, తాళ్లరాంపూర్ -
సమస్య పోయేదెన్నడు?
పోడువర్ని మండలం జలాల్పూర్ అటవీ ప్రాంతంలో సిద్ధాపూర్ గ్రామస్తులతో మాట్లాడుతున్న ఎఫ్ఆర్వో గంగాధర్ (ఫైల్)డొంకేశ్వర్(ఆర్మూర్): ఒకవైపు అడవుల్లో కలప కో సం చెట్ల నరికివేత, మరో వైపు పోడు భూముల ఆ క్రమణ.. ఈ రెండు విషయాలు అటవీ శాఖ ఉద్యోగులకు నిద్ర లేకుండా చేస్తున్నాయి. ప్రధానంగా వ ర్షాకాలం వచ్చిందంటే చాలు పోడు భూముల వ్యవహారం పెద్ద తలనొప్పిగా మారుతోంది. అటవీ భూ ములను రక్షించడానికి వెళ్లిన అధికారులపై దాడులకు తెగబడుతున్నారు. కళ్లల్లో కారం చల్లి చంపేంత పనిచేస్తున్నారు. దీంతో అటవీ ఉద్యోగులు ప్రాణభయంతో విధులు నిర్వర్తిస్తున్నారు. జిల్లాలో నిజామాబాద్ సౌత్, ఇందల్వాయి. సిరికొండ, కమ్మర్పల్లి రేంజ్‌ల పరిధిలో అటవీ భూముల ఆక్రమణలు ఎక్కువగా జరుగుతున్నాయి. రెండేళ్ల క్రితం బీఆర్ఎస్ ప్రభుత్వం జిల్లాలో 4,229 మందికి పోడు పట్టాలను పంపిణీ చేసి అటవీ భూములను దున్నుకునేందుకు అవకాశం కల్పించింది. పోడు కొడితే మాకు కూడా పట్టాలు వస్తాయనే ఆశతో ఇప్పుడు మరికొందరు భూములను దున్నుతున్నారు. అయి తే అటవీ భూములను రక్షించే విషయంలో ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కఠినంగానే వ్యవహరిస్తోంది. అడవులను ఆక్రమిస్తే అధికారులను బా ధ్యులను చేసి వారిపై చర్యలు తీసుకుంటోంది. దీంతో అటవీ స్థలాలను కాపాడడం ఆ శాఖ ఉద్యోగులకు పెద్ద సవాల్‌గా మారింది. వ్యక్తులపై ఎన్ని కేసు లు నమోదు చేసినా, ట్రాక్టర్లు సీజ్ చేసినా అడవుల్లో మళ్లీ పోడు కొడుతూనే ఉన్నారు. అటవీ చట్టాలు, శిక్షలు కఠినంగా లేకపోవడంతోపాటు తమకు ఆ యుధాలు లేకపోవడంతో పోడు భూములను ఆక్రమిస్తున్నారని ఫారెస్టు ఉద్యోగులు పేర్కొంటున్నా రు. పోడు కొట్టిన వ్యక్తులను కోర్టుకు తీసుకెళ్తే బెయిలబుల్ కేసు కావడంతో ఏడేళ్లలోపే శిక్ష వేయడానికి అవకాశముంది. శిక్షను అనుభవించకుండా ఉండేందుకు తిరిగి అటవీ అధికారుల నుంచి బెయిల్ తీసుకొని తిరుగుతున్నారు. అదే నాన్‌బెయిల్ కేసు ఉంటే ఈ పరిస్థితి ఉండేది కాదని, చట్టాన్ని కఠినంగా చేయాలని అటవీ ఉద్యోగులు కోరుతున్నారు. లేదంటే పోడు సమస్య పోయే దాకా తమ పరిస్థితి ఇంతే ఉంటుందని, అటవీ ఆక్రమణలు నిలువరించడం కష్టసాధ్యమని చెప్తున్నారు. ఎనిమిదేళ్లలో కేసుల తీరు..కేసులు నమోదు చేస్తున్నా ఆగని అటవీ ఆక్రమణలు జిల్లాలో ఫారెస్టు అధికారులపై కొనసాగుతున్న దాడులు తలనొప్పిగా మారిన పోడు భూముల వ్యవహారం -
జూలై 16న తెయూ రెండో కాన్వొకేషన్
తెయూ(డిచ్పల్లి): తెలంగాణ విశ్వవిద్యాలయంలో రెండో కాన్వొకేషన్‌ను జూలై 16న ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్నామని వైస్–చాన్స్‌లర్ ప్రొఫెసర్ టీ యాదగిరిరావు తెలిపారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ఐఐసీటీ) మాజీ డైరెక్టర్ డాక్టర్ శ్రీవారి చంద్రశేఖర్ హాజరుకానున్నారు. వర్సిటీ కంట్రోలర్, డీన్స్, ప్రిన్సిపాల్స్, డైరెక్టర్స్, అధ్యాపకులతో బుధవారం వీసీ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ కాన్వొకేషన్ విజయవంతం చేయడానికి రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎం యాదగిరి కన్వీనర్‌గా 13 కమిటీలను ఏర్పాటు చేశామన్నారు. కమిటీల కన్వీనర్లు క్రమశిక్షణతో కాన్వొకేషన్ పనులను పూర్తిచేసి విజయవంతం చేయాలని సూచించారు. వర్సిటీ ప్రారంభమైన తర్వాత 13 నవంబర్ 2013న మొదటి కాన్వొకేషన్ నిర్వహించారని, రెండో కాన్వొకేషన్ కోసం అప్పటి వీసీ ప్రొఫెసర్ పీ సాంబయ్య హయాంలో 6 జూలై 2018న, మళ్లీ గత వీసీ ప్రొఫెసర్ రవీందర్ గుప్తా హయాంలో 12 మార్చి 2020న నోటిఫికేషన్లు ఇచ్చినప్పటికీ పలు కారణాలతో వాయిదా పడినట్లు వీసీ తెలిపారు. ప్రస్తుతం వీసీగా తాను బాధ్యతలు చేపట్టిన తర్వాత 14 నవంబర్ 2024న కాన్వొకేషన్ నోటిఫికేషన్ విడుదల చేసినట్లు ప్రొఫెసర్ యాదగిరిరావు తెలిపారు. పీజీ, యూజీలో వివిధ విభాగాల నుంచి మొదటి ర్యాంకు సాధించిన 130 మంది విద్యార్థులకు గోల్డ్ మెడల్స్‌తోపాటు సుమారు 70 మంది స్కాలర్స్‌కు పీహెచ్డీ డాక్టరేట్ పట్టాలను రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ చేతుల మీదుగా అందించనున్నట్లు వీసీ తెలిపారు. ముఖ్య అతిథిగా హాజరుకానున్న ఐఐసీటీ మాజీ డైరెక్టర్ డాక్టర్ చంద్రశేఖర్ వీసీ ప్రొఫెసర్ యాదగిరిరావు వెల్లడి -
పాతికేళ్ల తర్వాత మోగిన గంట
సుభాష్‌నగర్: జిల్లా కేంద్రంలోని గాంధీగంజ్‌లో పురాతన గడియారానికి పునర్జీవం వ చ్చింది. దాదాపు 25 ఏళ్ల తర్వాత గంజ్‌లో బుధవారం మళ్లీ గంట మోగింది. 1905లో సిర్నాపల్లి సంస్థానాధీశురాలు శీలం జానకీబాయి గంజ్‌లో గడియారాన్ని ఏర్పాటు చేశా రు. ఆ గడియారం రైతులు, స్థానిక వ్యాపారు లు, ప్రజలకు వందేళ్లపాటు సమయాన్ని తెలిపింది. అడపాదడపా మరమ్మతులు చేస్తూ కొన్నిరోజులు నెట్టుకొచ్చినా.. సరైన నిర్వహ ణ లేక మధ్యలో ఆగిపోయింది. నిజామాబా ద్ ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి ప్రత్యేక చొరవ తీసుకొని రూ.4.35 లక్షలు కేటాయించారు. దీంతో ఒడిశాలోని భువనేశ్వర్‌కు చెందిన తాజ్ కంపెనీలో తయారైన బ్యాటరీ గడియారాన్ని బిగించారు. ఈ గడియారం సమయం తెలియజేయడంతోపాటు ప్రాత:కాలం, సుప్రభాతం, పరిసరాల శుభ్రత, గంజ్ నియ మాల అనౌన్స్మెంట్ చేస్తుంది. తిరుపతిలో గడియారం ఏర్పాటు చేసిన కంపెనీయే దీనిని తయారు చేయడం విశేషం. గాంధీగంజ్‌లో క్లాక్‌టవర్‌కు కొత్త గడియారం -
బుజ్జమ్మా.. ఆరోగ్యం ఎట్లుంది
ఆర్మూర్ : ‘బుజ్జమ్మా ఆరోగ్యం ఎలా ఉంది? డాక్ట ర్లు, సిబ్బంది సరిగ్గా పట్టించుకుంటున్నారా? అవసరమైతే హైదరాబాద్‌కు పంపిస్తా?’ అని ఆర్మూర్ ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వృద్ధురాలిని కలెక్టర్ టీ వినయ్‌కృష్ణారెడ్డి పరామర్శించారు. ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను వి వరాలు అడిగి తెలుసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. పెర్కిట్‌కు చెందిన బుజ్జమ్మ అనారోగ్యంతో బాధపడుతుండడంతో అంబులెన్స్ సిబ్బంది మంగళవారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో చేర్పించారు. ఆస్పత్రి సిబ్బంది గాయమైన కాలికి పట్టీ కట్టి బయటకు పంపించారు. దీంతో బుజ్జమ్మ ఆస్పత్రి బయట రేకుల షెడ్డులో దయనీయ పరిస్థితుల్లో పడుకొని ఉంది. ఆస్పత్రి వర్గాలు సరిగా పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించి బయటకు పంపించారని గమనించిన సీపీఐ(ఎంఎల్) ప్రజాపంథా నాయకుడు ప్రభాకర్ ఫోన్ ద్వారా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో స్పందించిన కలెక్టర్ బుజ్జమ్మకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని జీజీహెచ్ అధికారులను ఆదేశించారు. అయితే, తమ స్వస్థలమైన పెర్కిట్‌కు చేరువలో ఉన్న ఆర్మూర్ ఆస్పత్రిలో చికిత్స చేయించాలని బుజ్జమ్మ దూరపు బంధువులు కోరడంతో ఆమెను ఆర్మూర్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. కలెక్టర్ బుధవారం ఆర్మూర్ ప్రభుత్వ ఆస్పత్రిని సందర్శించి బుజ్జమ్మను పరామర్శించారు. ఆమె కాలికి గాయం తీవ్రంగా ఉందని, మెరుగైన వైద్య సేవలు అవసరమని డీసీహెచ్ఎస్ డాక్టర్ శ్రీనివాస్ ప్రసాద్ కలెక్టర్ దృష్టికి తెచ్చారు. దీంతో బుజ్జమ్మను తిరిగి జీజీహెచ్‌కు షిఫ్ట్ చేయాలని, పూర్తిగా కోలుకునే వరకు మెరుగైన చికిత్స అందించాలని, అవసరమైతే హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించాలని కలెక్టర్ ఆదేశించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు బుజ్జమ్మను వెంటనే జీజీహెచ్‌కు తరలించారు. వృద్ధురాలిని పరామర్శించిన కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు ఆదేశం -
రైతు సమ్మేళన సభాస్థలి పరిశీలన
సుభాష్‌నగర్: నగరంలోని పాలిటెక్నిక్ మైదానంలో ఈ నెల 29వ తేదీన నిర్వహించే రైతు సమ్మేళనం బహిరంగ సభాస్థలిని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డితో కలిసి ఎంపీ అర్వింద్ ధర్మపురి బుధవారం సాయంత్రం పరిశీలించారు. సభకు కేంద్ర హోంశా ఖ మంత్రి అమిత్ షా హాజరు కానున్న నేపథ్యంలో కేంద్ర బలగాలు, పోలీస్ అధికారులతో ఆయన భ ద్రతా ఏర్పాట్లపై సమీక్షించారు. 29న జాతీయ ప సుపుబోర్డు కార్యాలయం ప్రారంభం, కంఠేశ్వర్ బైపాస్ చౌరస్తాలో డీఎస్ విగ్రహావిష్కరణ, పాలిటెక్నిక్ మైదానంలో రైతు సమ్మేళనం కార్యక్రమంలో అమిత్ షా పాల్గొంటారని ఎంపీ అర్వింద్ వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ మేరకు పాలిటెక్నిక్ మైదానాన్ని ఎంపీ అర్వింద్ పరిశీలించారు. ఈ సందర్భంగా హెలీప్యాడ్ ఏర్పాటు, ట్రాఫిక్ మళ్లింపు, వేదిక తదితర ఏర్పాట్లపై కేంద్ర బలగాలు, పోలీస్ ఉన్నతాధికారులను అడిగి తెలుసుకున్నారు. అమిత్ షా మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో జిల్లాకు చేరుకునే అవకాశముందని ఎంపీ తెలిపారు. ఆయ న వెంట బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేశ్ పటేల్ కులాచారి, ఏసీపీ రాజావెంకట్‌రెడ్డి తదితరులు ఉన్నారు. నేడు నిజామాబాద్‌కు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి! 29న జిల్లాలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటన నేపథ్యంలో భద్రత, బహిరంగ సభ ఏర్పాట్లపై సమీక్షించేందుకు గురువారం కేంద్ర మంత్రి జీ కిషన్‌రెడ్డి జిల్లాకు వస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. జాతీయ పసుపు బోర్డు కార్యాలయం, బహిరంగ సభ నిర్వహించే పాలిటెక్నిక్ కళాశాల మైదానాన్ని కిషన్‌రెడ్డి పరిశీలించనున్నారు. భద్రత ఏర్పాట్లపై ఉన్నతాధికారులతో ఎంపీ అర్వింద్ సమీక్ష 29న జిల్లాలో పర్యటించనున్న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా -
కాసర్లకు బెస్ట్ టీచర్ అవార్డు
మోపాల్: హైదరాబాద్‌లోని ఏఎస్రావు నగర్లో బుధవారం వరల్డ్ క్లారిటీ అవార్డు ప్రదానోత్సవం జరిగింది. ఈకార్యక్రమంలో మోపాల్ మండలం సిర్పూర్ ఉన్నత పాఠశాల తెలుగు ఉపాధ్యాయుడు కాసర్ల నరేష్‌రావు నేషనల్ బెస్ట్ టీచర్ అవార్డును అందుకున్నారు. విద్యావేత్తలు నాగేశ్వర్రావు, మీను శ్రీ, మిస్ తెలంగాణ జెనియా, చారిటీ సంస్థ నిర్వాహకులు, వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన సుమారు 200 మంది సభ్యులు పాల్గొన్నారు. కాసర్లకు డీఈవో అశోక్ తదితరులు అభినందనలు తెలియజేశారు. అధ్యాపక పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం డిచ్పల్లి(నిజామాబాద్‌రూరల్): జిల్లాలోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల/కళాశాలల్లో ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టులను పార్ట్‌టైం ప్రాతిపదికన భర్తీ చేయడానికి అర్హులైన మహిళల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ జిల్లా కోఆర్డినేటర్ మాధవీలత ఒక ప్రకటనలో తెలిపారు. జేఎల్– ఫిజిక్స్, బోటనీ, జువాలజీ, పీజీటీ– ఫిజికల్ సైన్స్, బయో సైన్స్, సోషల్ స్టడీస్, టీజీటీ–బయో సైన్స్ ఖాళీలు ఉన్నాయన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు సంబంధిత సబ్జెక్టులో పోస్ట్ గ్రాడ్యుయేట్ (పీజీ)తో పాటు బీఈడీ విద్యార్హత కలిగి ఉండి, కనీసం ద్వితీయ శ్రేణిలో ఉత్తీర్ణులై ఉండాలని ఆమె తెలిపారు. అర్హత, ఆసక్తి గల మహిళా అభ్యర్థులు ఒరిజినల్ ధ్రువీకరణ పత్రాలతో ఈ నెల 28న డిచ్పల్లి మండలం ధర్మారం(బి) గ్రామంలో గల సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల/కళాశాలలో హాజరు కావాలన్నారు. డెమో, అనుభవం ప్రాతిపదికన అభ్యర్థుల ఎంపిక జరుగుతుందని జిల్లా కోఆర్డినేటర్ తెలిపారు. -
సరదాతో పొంచి ఉన్న ప్రమాదం
బాల్కొండ: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ సందర్శనకు వస్తున్న పర్యాటకులు నీటి అంచున సరదా కోసం అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో ప్రాజెక్ట్‌లో మునిగి పోయే ప్రమాదం ఉందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో అనేక మంది యువకులు నీటిలో మునిగి మృత్యువాత పడ్డారు. కానీ పర్యాటకులు నీటి లోపలికి వెళ్లకుండా ప్రాజెక్ట్ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ఇప్పటికై నా ప్రాజెక్ట్ అధికారులు స్పందించి వెంటనే పర్యాటకులు నీటి లోపలికి వెళ్లకుండా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. సకాలంలో సిలబస్ పూర్తి చేయాలి తెయూ(డిచ్పల్లి): అకడమిక్ క్యాలెండర్ ప్రకారం సకాలంలో సిలబస్ పూర్తి చేసి 2025–26 విద్యాసంవత్సరాన్ని విజయవంతం చేయాలని తెయూ వీసీ యాదగిరిరావు సూచించారు. యూనివర్సిటీలో బుధవారం ఆయన రిజిస్ట్రార్ యాదగిరి, ప్రిన్సిపాల్ ప్రవీణ్‌లతో కలిసి వివిధ విభాగాల అధ్యాపకులతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా వీసీ మాట్లాడుతూ.. ఈ విద్యా సంవత్సరం ప్రతి విభాగం నుంచి వర్తమాన సాంకేతిక అంశా లపై సదస్సులు, సింపోజియం, వర్క్‌షాప్‌లు నిర్వహించాలన్నారు.పరీక్షలు వాయిదా వేయ రాదని, సమయానికి ఇంటర్నల్ ఎగ్జామ్స్, ప్రాక్టికల్స్ కంప్లీట్ చేయాలని స్పష్టం చేశారు. తక్షశిలకు డాక్టరేట్ తెయూ(డిచ్పల్లి): తెలంగాణ యూనివర్సిటీ హిందీ విభాగంలో పరిశోధకురాలు తక్షశిల పీహెచ్డీ డాక్టరేట్ సాధించారు. హిందీ విభాగాధ్యక్షురాలు పార్వతి మార్గనిర్దేశనంలో ‘హిందీ దళిత మహిళా ఆత్మకథా వోమే యదార్థ వాద’ అనే అంశంపై తక్షశిల పరిశోధన పూర్తి చేసి సిద్ధాంత గ్రంథం సమర్పించారు. తెయూ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ మినీ సెమినార్ హాల్లో బుధవారం నిర్వహించిన ఓపెన్ వైవాకు ఇఫ్లూ హిందీ హెచ్‌వోడీ రేఖారాణి ఎక్స్టర్నల్ ఎగ్జామినర్‌గా వ్యవహరించారు. పరిశోధకురాలిని పలు ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టారు. డాక్టరేట్ సాధించిన తక్షశిలను వీసీ యాదగిరిరావు, రిజిస్ట్రార్ యాదగిరి, అధ్యాపకులు అభినందించారు. ఆర్ట్స్ అండ్ సైన్స్ డీన్ లావణ్య, బీవోఎస్ చైర్మన్ మహ్మద్ జమీల్ అహ్మద్, హెచ్‌వోడీ పార్వతి, ప్రిన్సిపాల్ ప్రవీణ్, ప్రొఫెసర్ కనకయ్య, అధ్యాపకులు పాల్గొన్నారు. డైట్ ప్రవేశాలకు 27న సర్టిఫికెట్ల పరిశీలన కామారెడ్డి అర్బన్: డైట్లో ప్రవేశాల కోసం సర్టి ఫికెట్ వెరిఫికేషన్ పొందని అభ్యర్థులు ఈనెల 27న హాజరు కావాలని నిజామాబాద్ ప్రిన్సిపల్ శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు. రెండో విడత కౌన్సెలింగ్, వెబ్ ఆధారిత ప్రాధాన్యతలకు ఈనెల 28 నుంచి 30 వరకు పాల్గొనవచ్చన్నారు. తొలి విడత సీటు పొందని కొత్త అభ్యర్థులు సైతం వెబ్ ప్రాధాన్యతలు ఇవ్వడంతో పాటు ఎడిట్ ఆప్షన్ ఇవ్వడానికి జూలై 1 వరకు అవకాశం ఉందన్నారు. రెండో విడత అభ్యర్థులకు సీట్లు, కళాశాల కేటాయింపు జూలై 5న జరుగుందన్నారు. -
కరెంట్ షాక్‌తో స్తంభంపైనే ఒకరి మృతి
బోధన్: విద్యుత్ స్తంభం ఎక్కి కరెంట్ తీగుల లాగుతుండగా ఓ వ్యక్తి కరెంట్ షాక్‌తో అక్కడికక్కడే మృతిచెందాడు. నవీపేట ఎస్సై వినయ్ కుమార్, స్థానికులు తెలిపిన వివరాలు ఇలా.. నవీపేట మండలం లింగాపూర్ గ్రామ శివారులోని పంట పొలాల్లో గ్రామానికి చెందిన దినసరి కూలి రెంజర్ల పోశెట్టి (44) బుధవారం ఇదే గ్రామానికి చెందిన రైతు కళ్లెం శివ పొలంలో కరెంట్ బోరుబావి వద్ద పనికి వెళ్లాడు. బోరుబావికి సంబంధించిన సర్వీస్ వైర్‌ను 11కేవీ లైన్ తీగలున్న స్తంభంపైకి ఎక్కి లాగుతుండగా ప్రమాదవశాత్తు షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. పాముకాటుతో మహిళ.. సదాశివనగర్(ఎల్లారెడ్డి): మండలంలోని వజ్జపల్లి గ్రామంలో పాముకాటుతో ఓ మహిళ మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. గ్రామంలోని చర్ల చిన్నమ్మ (52) అనే మహిళ బుధవా రం వ్యవసాయ భూమి వద్ద పనులు చేస్తుండగా పాము కాటు వేసింది. ఇది గమనించిన బంధువులు వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. కానీ మార్గమధ్యలోనే ఆమె మృతిచెందినట్లు గ్రామస్తులు తెలిపారు. మృతురాలికి భర్త భూమయ్య, నలుగురు కుమార్తెలు ఉన్నారు గుర్తుతెలియని వాహనం ఢీకొని ఒకరు.. రుద్రూర్: మండలంలోని అంబం(ఆర్) శివారులో బుధవారం మండల కేంద్రానికి చెందిన వ్యవసాయ కూలి కడారి చిన్న సాయిలు (37) మృతదేహం లభ్యమయింది. పొలాలకు వెళ్తున్న రైతులు మృతదేహాన్ని గుర్తించి రుద్రూర్ పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించారు. ఎస్ఐ సాయన్న ఆధ్వర్యంలో పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహన్ని పరిశీలించారు. మృతుడి వద్ద లభించిన ఆధార్ కార్డు ఆధారంగా రుద్రూర్‌కు చెందిన కడారి చిన్న సాయిలుగా గుర్తించారు. మంగళవారం రాత్రి గుర్తుతెలియని వాహనం ఢీకొనడం వల్ల అతడు మృతిచెంది ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. మృతుడి భార్య బాలామణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు. -
‘ఎమర్జెన్సీ డే’ ప్రజాస్వామ్య చరిత్రలో చీకటి దినం
సుభాష్‌నగర్: భారతదేశ ప్రజాస్వామ్య చరిత్రలో ఎమర్జెన్సీ డే చీకటి దినమని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ పటేల్ కులాచారి అన్నారు. నగరంలోని బీజేపీ కార్యాలయంలో బుధవారం ఎమర్జెన్సీ డేకు వ్యతిరేకంగా పోరాడి జైలుకెళ్లిన వుల్సే రాజేశ్వర్, పుప్పాల రాజేందర్, భూసారి గోవర్ధన్, చెలివేలి శ్రీధర్‌ను ఘనంగా సన్మానించారు. ఈసందర్భంగా దినేష్ మాట్లాడుతూ.. 1971 సార్వత్రిక ఎన్నికల్లో ఇందిరాగాంధీ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆమైపె పోటీ చేసి ఓడిపోయిన రాజ్ నారాయణ్ అలహాబాద్ హైకోర్టులో కేసువేశారు. 4ఏళ్ల విచారణ తర్వాత 1975 జూన్ 12న ఇందిరా ఎన్నిక చెల్లదని, 6ఏళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయొద్దని కోర్టు తీర్పునిచ్చింది. ఆ సమయంలో ప్రతిపక్ష పార్టీ లు ఇందిరాగాంధీ రాజీనామా చేయాలని డిమాండ్ చేయగా, 1975 జూన్ 25న అర్ధరాత్రి ఎమర్జెన్సీ ప్రకటించిందన్నారు. దాదాపు రెండేళ్లు దేశాన్ని గుప్పిట్లో పెట్టుకుని ప్రజల స్వేచ్ఛను పూర్తిగా హరించారని విమర్శించారు. అధికారం కోసం ప్రధానమంత్రే నియంతగా మారిన ఒకే ఒక ప్రధాని ఇందిరాగాంధీ అని ఆరోపించారు. నాయకులు పోతన్కర్ లక్ష్మీనారాయణ, నాగోళ్ల లక్ష్మీనారాయణ, శివప్రసాద్, పంచరెడ్డి ప్రవళిక, ఇప్పకాయల కిషోర్, కోడూరు నాగరాజు, తారక్ వేణు, పద్మారెడ్డి, సందీప్, మాస్టర్ శంకర్, జగన్‌రెడ్డి, పడాల భూపతి, చిరంజీవి, తదితరులు పాల్గొన్నారు. -
కష్టపడ్డ వారికి కచ్చితంగా గుర్తింపు
నిజామాబాద్ సిటీ: కాంగ్రెస్ పార్టీకోసం కష్టపడ్డవారిని, కష్టకాలంలో పార్టీని కాపాడుకున్నవారికి క చ్చితంగా గుర్తింపు లభిస్తుందని డీసీసీ అధ్యక్షుడు, రాష్ట్ర సహకార సంఘం చైర్మన్ మానాల మోహన్‌రెడ్డి, నగర కాంగ్రెస్ అధ్యక్షుడు నుడా చైర్మన్ కేశవేణు అన్నారు. జిల్లాకు చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు రాంభూపాల్‌కు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, జీవీ రామకృష్ణకు క్రమశిక్షణాసంఘం సభ్యుడిగా బాధ్యతలు అప్పగించడం అభినందనీయమన్నారు. ఈసందర్భంగా జిల్లాకేంద్రంలోని కాంగ్రెస్ భవన్లో బుధవారం వారిద్దరినీ పార్టీ తరపున సన్మానించారు. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి రాంభూపాల్, క్రమశిక్షణా సంఘం సభ్యుడు జీవీ రామకృష్ణను గజమాలతో సత్కరించి, అభినందించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. జిల్లాకు చెందిన నాయకులకు టీపీసీసీలో చోటు దక్కడం, సముచితంగా ఉందన్నారు. తమపై నమ్మకంతో టీపీసీసీలో ఉన్నత పదవులు ఇచ్చిన సీఎం రేవంత్‌రెడ్డికి, పీసీసీ చీఫ్ బొమ్మ మహేష్‌కుమార్‌గౌడ్‌కు, ఏఐసీసీ పెద్దలకు రాంభూపాల్, జీవీ రామకృష్ణ కృతజ్ఞతలు తెలిపారు. జిల్లా గ్రంథాలయ చైర్మన్ రాజారెడ్డి, ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, నాయకులు రత్నాకర్, విపుల్ గౌడ్, లింగం, సంతోష్, నవాజ్, ప్రీతం, రాజేంద్ర ప్రసాద్, నరేందర్‌సింగ్ పాల్గొన్నారు. డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్‌రెడ్డి టీపీసీసీ పదవులు పొందిన రాం భూపల్, రామకృష్ణలకు సన్మానం -
నేరాలు, ప్రమాదాల నివారణకు ‘ప్లాన్ ఆఫ్ యాక్షన్’
ఖలీల్‌వాడి: రోడ్డు ప్రమాదాల నివారణ, నేరాల నియంత్రణ కోసం పోలీస్ స్టేషన్ పరిధిలో సిబ్బందికి ప్రణాళిక ప్రకారంగా ‘ప్లాన్ ఆఫ్ యాక్షన్’ నిర్వహించాలని సీపీ పోతరాజు సాయిచైతన్య ఎస్సైలకు సూచించారు. జిల్లా కేంద్రంలోని సీపీ కార్యాలయంలో బుధవారం బోధన్ డివిజన్లోని పోలీసు అధికారులకు నేరాల నియంత్రణపై నెలవారి సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా సీపీ మాట్లాడుతూ.. లాంగ్ పెండింగ్ కేసులను వెంటనే పరిష్కరించాలని సూచించారు. ప్రజలకు సైబర్ క్రైమ్స్‌పై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. వచ్చే ఆరు నెలల్లో ప్రతి ఎస్‌హెచ్‌వో లక్ష్యాలు పెట్టుకొని నేరాల నియంత్రణ కోసం ఒక ప్రణాళికను ఏర్పాటు చేసుకోవాలన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణ కోసం బ్లాక్ స్పాట్లను గుర్తించి, అక్కడ ప్రమాదాలు జరగకుండా కావాల్సిన ఏర్పాట్లు చేయాలన్నారు. మట్కా, గ్యాంబ్లింగ్, గంజాయి మొదలగు చట్టవ్యతిరేక కార్యాకలాపాలపై ప్రత్యేకమైన ‘నిఘా’ ఏర్పాటు, లాడ్జీలలో ఎప్పటికప్పుడు ముమ్మరంగా తనిఖీలు చేయాలన్నారు. నిజామాబాద్ అదనపు పోలీస్ కమిషనర్ (అడ్మిన్) బస్వారెడ్డి , ఏసీపీలు, సీఐలు, ఎస్సైలు స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ శ్రీశైలం పాల్గొన్నారు. ప్రతి ఎస్‌హెచ్‌వో ప్రణాళిక ఏర్పాటు చేసుకోవాలి సీపీ సాయి చైతన్య -
‘అతిసార’ నియంత్రణకు చర్యలు చేపట్టాలి
నిజామాబాద్‌నాగారం: జిల్లాలో అతిసార వ్యాధి నియంత్రణకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని అడిషనల్ కలెక్టర్ అంకిత్ సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో అతిసార వ్యాధి నియంత్రణపై జిల్లా స్థాయి టాస్క్‌ఫోర్స్ కమిటీ సమావేశం బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా అడిషనల్ కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ ప్రతి అంగన్వాడీ కేంద్రంలో చేతుల శుభ్రత, ఓఆర్ఎస్ ద్రావణం తయారీ విధానంపై అంగన్వాడీ కార్యకర్తలకు వివరించాలన్నారు. ప్రతి గ్రామంలోని నీటి ట్యాంకులను క్లోరినేషన్ చేయించాలని సూచించారు. శుద్ధి చేసిన నీటినే తాగాలని ప్రజలకు ఆయా శాఖల ఆధ్వర్యంలో అవగాహన క ల్పించాలని టాస్క్‌ఫోర్స్ కమిటీ మెంబర్లకు సూచించారు. ఓఆర్ఎస్, జింక్ మాత్రలు ప్రతి అంగన్వాడి, పాఠశాలల్లో అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. పట్టణ ప్రాంతాల్లోని మురికివాడల్లో ప్ర త్యేక శ్రద్ధ పెట్టాలన్నారు. అనంతరం అతిసార వ్యా ధిపై అవగాహన కోసం రూపొందించిన పోస్టర్లను అడిషనల్ కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌వో మాట్లాడుతూ స్టాప్ డయేరియా క్యాంపెయిన్ జూలై 31 వ తేదీ వరకు కొనసాగుతుందన్నారు. ఐదు సంవత్సరాలలోపు పిల్లల్లో అతి సార వ్యాధితో కలిగే మరణాలను తగ్గించడమే ల క్ష్యంగా ఈ కార్యక్రమం ఉందన్నారు. జిల్లాలో అతిసార వ్యాధితో ఏ ఒక్కరూ మరణించకుండా చర్య లు తీసుకుంటామని ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ అశోక్ తెలిపారు. డీఆర్డీవో సాయాగౌడ్, డీడబ్ల్యూవో రసూల్‌బీ, ఆర్డబ్ల్యూఎస్ డిప్యూటీ ఈఈ ధర్మేందర్, మున్సిపల్ కమిషనర్ ఆర్మూర్ రాజు, పీవోలు రాజు, సుప్రియ, సానిటరీ ఇన్స్పెక్టర్ షాదుల్లా, సీ డీపీవో సౌందర్య, డీపీహెచ్‌ఎన్‌వో స్వామి సులోచ న, డీహెచ్ఈ ఘన్పూర్ వెంకటేశ్వర్లు, రాజాబాబు, సచిన్, తరుణ్, వినోద్, వైద్య సిబ్బంది ఉన్నారు. అడిషనల్ కలెక్టర్ అంకిత్ నీటి ట్యాంకులను క్లోరినేషన్ చేయించాలి -
సంక్షేమ పథకాలు లబ్ధిదారులకు చేరాలి
మోర్తాడ్: రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి లబ్ధిదారుడికి చేరే విధంగా ఉద్యోగులు కృషి చేయాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. పథకాల అమలుకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు. భీమ్‌గల్ మున్సిపాలిటీలో బుధవారం ఆయన పర్యటించారు. పట్టణంలో అమలవుతున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, వన మహోత్సవం, సీజనల్ వ్యాధుల నివారణ కోసం చేపడుతున్న చర్యలపై మున్సిపల్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. వార్డుల వారీగా సమీక్షించి ప్రణాళికబద్దంగా కార్యక్రమాలను అమలు చేయాలని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో వేగం పెంచాలని ఆదేశించారు. వన మహోత్సవం కింద మొక్కలను నాటించడమే కాకుండా వాటిని సంరక్షించడానికి జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రతి శుక్రవారం డ్రైడే నిర్వహించి పరిసరాలను శుభ్రంగా ఉంచేలా చూడాలన్నారు. అనంతరం బోయగల్లి, బాపూజీనగర్‌లలో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పనులను ఆయన పరిశీలించారు. తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించి, భూభారతి రెవెన్యూ సదస్సులో వచ్చిన దరఖాస్తుల ఆన్లైన్ నమోదు ప్రక్రియను పరిశీలించారు. ఆగష్టు 14వరకు భూమి సమస్యలపై వచ్చిన దరఖాస్తులకు పరిష్కారం చూపాలని సూచించారు. జిల్లా మలేరియా నియంత్రణ విభాగం అధికారి డాక్టర్ తుకారాం రాథోడ్, మున్సిపల్ కమిషనర్ గోపు గంగాధర్, తహసీల్దార్ షబ్బీర్, ఎంపీడీవో సంతోష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
మాదక ద్రవ్యాల నియంత్రణే లక్ష్యం
నిజామాబాద్‌అర్బన్: మత్తు పదార్థాలు, మాదక ద్ర వ్యాల నియంత్రణే లక్ష్యమని, ఇందుకోసం విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, సీపీ సాయి చైతన్య అన్నారు. నగరంలోని కలెక్టరేట్లో బుధవారం మత్తు పదార్థాల నిరోధక కమిటీ జిల్లాస్థాయి సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్, సీపీ సంబంధిత శాఖల జిల్లా అధికారులకు పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు. మాదక ద్రవ్యాల వల్ల కలిగే దుష్పరిణామాల గురించి ప్రజలలో అవగాహన పెంపొందించేందుకు సామాజిక మాధ్యమాలతో పాటు అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలను వినియోగించుకోవాలని సూచించారు. కల్తీ కల్లు తయారీ కోసం వినియోగించే క్లోరోఫాం, డైజోఫాం, ఆల్ఫ్రాజోలం వంటి వాటిని కట్టడి చేయడానికి గట్టి నిఘా ఉంచాలన్నారు. కొంతమంది గర్భిణులు కల్తీ కల్లు సేవిస్తున్నట్లు తెలుస్తోందని, ఇది పుట్టబోయే బిడ్డతోపాటు మహిళ ఆరోగ్యంపై కూడా తీవ్ర దుష్ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. దీనిని దృష్టిలో పెట్టుకొని గ్రామగ్రామాన అవగాహన కల్పించాలని సూచించారు. పాఠశాలలు, కళాశాలల్లో మత్తు పదార్థాలు, మాదకద్రవ్యాల నిరోధక కమిటీలను బలోపేతం చేస్తూ పూర్తిస్థాయిలో అవి పని చేసేలా చూడాలని విద్యాశాఖ అధికారులకు సూ చించారు. ఎక్కడైనా గంజాయి, క్లోరల్ హైడ్రేట్, డైజోఫామ్, అల్ఫ్రాజోలం వంటి వాటి రవాణా, విక్రయాలు జరుగుతున్నట్లు గమనిస్తే వెంటనే సంబంధిత శాఖల అధికారులకు సమాచారం అందించాలని, టోల్ ఫ్రీ నెంబర్ 1908కు ఫోన్ చేసి సమాచారం తెలియజేయవచ్చన్నారు. అదనపు కలెక్టర్ అంకిత్, ఎకై ్సజ్ సూపరింటెండెంట్ లక్ష్మారెడ్డి, డీఈవో అశోక్, డీఏవో వీరాస్వామి, డీఎఫ్‌వో సుధాకర్, డీటీవో ఉమా మహేశ్వరరావు, జిల్లా ఔషధ నియంత్రణ అధికారిణి శ్రీలత తదితరులు పాల్గొన్నారు. విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలి కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, సీపీ సాయి చైతన్య కలెక్టరేట్లో అధికారులతో జిల్లాస్థాయి సమావేశం -
అందుబాటులో ఎరువులు, విత్తనాలు
డిచ్పల్లి(నిజామాబాద్‌రూరల్): జిల్లాలో ఖరీఫ్ సీజన్‌కు అవసరమైన ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉన్నాయని కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి తెలిపారు. జూన్, జూలై నెలలకు సరిపడా నిల్వలున్నా యని, ఎక్కడా రైతులకు కొరత లేకుండా అందుబాటులో ఉండేలా ప్రణాళికాబద్ధంగా కృషి చేయాలని వ్యవసాయ అధికారులను ఆదేశించారు.ఎక్కడైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. డిచ్పల్లి మండల కేంద్రంలోని ఎరువులు, విత్తన విక్రయ కేంద్రమైన గ్రోమోర్ సెంటర్‌తోపాటు డిచ్పల్లి సహకార సొసైటీ గోదాము (యానంపల్లి)ను కలెక్టర్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. కలెక్టర్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టాక్ రిజిస్టర్, ఇన్వాయిస్, బిల్‌బుక్‌లను, విత్తన బస్తాలపై లాట్ నంబర్, ఎమార్పీ ధర, బ్యాచ్ నంబర్, గడువు తేదీ తదితర వివరాలను పరిశీలించారు. స్టాక్ రిజిస్టర్, ఈ–పాస్ నమోదు వివరాల్లో తేడా ఉండొద్దని కేంద్రం నిర్వా హకులకు సూచించారు. ఎరువులు, విత్తన విక్రయ దుకాణాలను క్రమం తప్పకుండా తనిఖీ చేయాలని అధికారులను ఆదేశించారు. కలెక్టర్ వెంట జిల్లా వ్యవసాయ అధికారి వీరాస్వామి, డిచ్పల్లి తహసీల్దార్ సతీశ్‌రెడ్డి, మండల వ్యవసాయ అధికారిణి సుధామాధురి, సొసైటీ చైర్మన్ రాంచందర్‌గౌడ్, మాజీ ఎంపీపీ కంచెట్టి గంగాధర్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పొలసాని శ్రీనివాస్, సొసైటీ సీఈవో ఒస సాయిలు, సిబ్బంది తదితరులు ఉన్నారు. -
భారీ యంత్రాలు పసుపు రైతులకు భారమే..
● కొనుగోలుకు సబ్సిడీ ఇవ్వని రాష్ట్ర ప్రభుత్వం ● యంత్రాల కొనుగోలుకు ఆసక్తి చూపని పసుపు రైతులు ● సుమారు 20 మందికే పరిమితమైన భారీ యంత్రాలుఇతర రైతులకు ఇస్తున్నా రూ.లక్షలు వెచ్చించి పసుపు సాగుకోసం అవసరమయ్యే యంత్రాలను కొనుగోలు చేశా. గ్రామానికి చెందిన వారితోపాటు ఇతర గ్రామాల రైతులకు యంత్రాలను ఇస్తున్నా. పెట్టుబడి వ్యయం తగ్గి వారు లాభపడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ అందించి యంత్రాలను రైతులకు చేరువ చేయాలి. – నలిమెల చిన్నారెడ్డి, రైతు, మగ్గిడి, ఆర్మూర్ మండలంఆర్మూర్: వ్యవసాయ యాంత్రీకరణకు 2025–26లో రూ.104 కోట్లు కేటాయించినట్లు రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు ఇటీవల ప్రకటించారు. రైతులకు ఉపయోగకరమైన, డి మాండ్ ఉన్న పరికరాలను గుర్తించి సబ్సిడీపై రైతులకు అందించాలని మంత్రి అధికారులకు సూచించారు. అయితే పసుపు సాగుకు అవసరమైన భారీ యంత్రాలకు సబ్సిడీ వర్తింపజేయకపోవడంతో క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉంది. తమకు అవసరమైన యంత్రాలపై సబ్సిడీ ఇవ్వడం లేదని పసుపు రైతు లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో వేలాది మంది రైతులు సుమారు 25 వేల హెక్టార్లలో పసుపు సాగు చేస్తున్నారు. కానీ యంత్రాల సాయంతో సాగు చేస్తున్న వారి సంఖ్య మాత్రం 20కి మించ లేదు. యంత్రాలను కొనుగో లు చేసిన రైతులు వ్యవసాయ కూలీల ఖర్చులను తగ్గించుకుంటున్నారు. యంత్రాల సాయంతో పసుపు సాగు పను లు చేస్తున్న రైతులకు ఎకరాకు సుమారు రూ.లక్షల వరకు ఖర్చవుతుండగా, యంత్రాలు లేని రైతులకు రూ.లక్షా యాభైవేల వరకు అవుతోంది. యంత్రాల కొనుగోలుకు ల క్షల రూపాయలు అవసరం కావడమే అందుకు కారణం. సీజనల్ వారీగా అవసరం ఉన్న పరికరాలను పెద్ద రైతుల నుంచి అద్దెకు తెచ్చుకుని పని పూర్తి చేసుకుంటున్నారు. సబ్సిడీ ఇవ్వాలి రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ యాంత్రీకరణను ప్రోత్సహిస్తూ పసుపు సాగుకు ఉపయోగించే యంత్రాలన్నింటికి సబ్సిడీ ఇవ్వాలి. దీంతో సన్న, చిన్నకారు రైతులు సైతం యంత్రాలను కొనుగోలు చేసి ఉపయోగించడం ద్వారా పెట్టుబడి వ్యయం తగ్గి ఆర్థికంగా లాభపడతారు. పసుపు రైతులపై ప్రభుత్వం దృష్టి సారిస్తే పంట సాగు విస్తీర్ణం మరింత పెరిగే అవకాశం ఉంటుంది. – పెద్దకాపు రాజు, రైతు, పెర్కిట్, ఆర్మూర్ పట్టణం -
రైతులే అంతర్జాతీయ ఎగుమతి చేసుకోవచ్చు
వ్యవసాయ ఉత్పత్తుల్లో దేశంలోనే పేరుగాంచిన ఇందూరు జిల్లాలో డ్రైపోర్టు అత్యవసరం. రైతులే ఎగుమతిదారులుగా తయారవుతారు. దేశంలోనే భా రీ పసుపు మార్కెట్లలో నిజామాబాద్ మొదటి వరుసలో ఉంది. పంట ఉత్పత్తులకు అదనపు విలువ జోడించకుండా వచ్చి న వెంటనే అమ్మేస్తే రైతులకు ఆశించిన ధర ద క్కడం లేదు. ఈ క్రమంలో జక్రాన్‌పల్లి మండలంలో ఐదు గ్రామాల రైతులం కలిసి తెలంగాణలోనే మొదటి పసుపు క్లస్టర్‌ను ఏర్పాటు చేశాం. రైతులు పండించిన పంటతో ఆర్గానిక్ పసుపు పౌడర్‌ను తయారుచేసి విక్రయిస్తున్నాం. డ్రైపో ర్టు ఏర్పాటు చేస్తే రైతులకు మరింత మే లు చేకూరుతుంది. వ్యవసాయ ఉత్పత్తుల ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేసేందుకు యువతకు మరిన్ని అవకాశాలు సృష్టించబడతాయి. గల్ఫ్ దే శాలకు వెళ్లి పనిచేసే అవసరం ఉండదు. ఆత్మనిర్భర్ భారత్ కింద జిల్లాకు డ్రై పోర్టును సాధించుకోవాలి. కేంద్ర ప్రభుత్వ సాయాన్ని కోరుదాం. అందరం పిడికిలి బిగిస్తేనే డ్రైపోర్టు క ల సాకారమవుతుంది. పార్టీలకతీతంగా ముందు కెళదాం. ఎంపీ అర్వింద్, పీసీసీ అధ్యక్షుడు మహే శ్గౌడ్ను కలుద్దాం. – పాట్కూరి తిరుపతిరెడ్డి, పసుపు ఎఫ్‌పీవో చైర్మన్ -
డ్రైపోర్టుకు అన్నివిధాలుగా అనుకూలం
డ్రైపోర్టు ఏర్పాటుకు ని జామాబాద్ జిల్లా అన్ని విధాలుగా అనుకూలంగా ఉంది. వ్యవసాయ ఆధారిత జిల్లాలో తగినవిధంగా పరిశ్రమలు లేకపోవడంతో రైతులు పండించిన పంటలకు ఆశించిన ధరలు దక్కడం లేదు. గతంలో జిల్లాలో 85 వేల ఎకరాల్లో పసుపు, 45 వేల ఎకరాల్లో చెరుకు సాగయ్యేది. తగిన మార్కెటింగ్ వ్యవస్థ, ఎగుమతులకు అవసరమైన సదుపాయాలు లేకపోవడంతో పసుపు సాగు తగ్గిపోగా, చెరుకు సాగు లేకుండా పోయింది. అన్ని వ్యాపారాలు దెబ్బతిన్నాయి. నాణ్యమైన పంటలు పండించే రైతులున్న జిల్లాలో డ్రైపోర్టు అత్యవసరం. జిల్లా కేంద్రంగా చుట్టుపక్కల జిల్లాల నుంచి పంట, ఇతర ఉత్పత్తులు ఎగుమతి చేసుకోవచ్చు. జిల్లాకు రావాల్సిన ఎయిర్‌పోర్టు, రైల్వే ప్రాజెక్టు, పెద్ద పరిశ్రమలు కలగానే ఉన్నాయి. వీటిని సాధించడంలో నాయకులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఇప్పుడు కనీసం డ్రై పోర్టు ఏర్పాటు చేసినా జిల్లా ఎంతగానో అభివృద్ధి చెందుతుంది. రవాణా సౌకర్యానికి అనుకూలంగా ఉన్న హైవే పక్కన డ్రైపోర్టు పెడితే బాగుంటుంది. పంట ఉత్పత్తులు నిల్వ చేసుకుని మంచి ధర వచ్చినప్పుడు ఎగుమతి చేసుకోవచ్చు. ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. డ్రైపోర్టు కోసం గతంలో కేటీఆర్, హరీశ్‌రావు, ప్రశాంత్‌రెడ్డిలను కలిసి వివరించినా ఫలితం లేదు. ఇప్పుడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తెద్దాం. సంకల్ప బలంతో పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లాలి. డ్రైపోర్టు ఏ ఒక్కరి కోసమో కాదు, ముందు తరాల భవిష్యత్తు కోసం. – నల్ల దినేశ్‌రెడ్డి, చాంబర్ ఆఫ్ కామర్స్ మాజీ అధ్యక్షుడు -
కలిసి పోరాడితే డ్రైపోర్టు సాధ్యం
నిజామాబాద్‌లీగల్/డొంకేశ్వర్: జిల్లాలో డ్రైపోర్టు సాధించేందుకు తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో పో రాడుదామని చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు, రైతు ఉత్పత్తిదారుల సంఘాల బాధ్యులు, ఇతర సంఘాల ప్రతినిధులు నిర్ణయించారు. ఇందుకోసం ఐక్య కార్యాచరణ కమిటీ ఏర్పాటు చేసుకుని ముందుకు వెళ్లేందుకు తీర్మానం చేశారు. ఇందులో భాగంగా ఈ నెల 29న కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి అమిత్‌షాను కలిసి విన్నవించేందుకు సిద్ధమయ్యారు. తర్వాత ఢిల్లీ వెళ్లి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చేందుకు ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించారు. మంగళవారం ‘సాక్షి’ ఆధ్వర్యంలో ప్ర కాష్ హ్యుందయ్ షోరూంలో నిజామాబాద్ జిల్లాలో డ్రైపోర్టు ఏర్పాటు కోరుతూ చర్చ వేదిక జరిగింది. నిజామాబాద్, జగిత్యాల, నిర్మల్, ఆదిలాబాద్, కామారెడ్డి, సిరిసిల్ల జిల్లాల్లో పండుతున్న పసుపు, ధాన్యం, సోయా, మొక్కజొన్న, ఎర్రజొన్న, పత్తి, మామిడి పంటలకు అదనపు విలువ జోడించడంతోపాటు సిరిసిల్ల జిల్లాల్లో నేతన్నల ఉత్పత్తులను అంతర్జాతీయ మార్కెట్‌కు నేరుగా ఎగుమతి చేసేందుకు డ్రైపోర్టుతో అవకాశం కలుగుతుంద ని, రూ.వెయ్యి కోట్ల ఎకానమీ సాధ్యమవుతుందని వక్తలు అభిప్రాయపడ్డారు. అన్నిరంగాల్లో వివిధ యూనిట్లు ఏర్పాటై యువతకు ఉద్యోగ, ఉపాధి అ వకాశాలు పెరుగుతాయన్నారు. డ్రైపోర్టు కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచేందుకు కచ్చితమైన కార్యాచరణ రూపొందించుకుని ముందుకెళ్లాలని తీర్మానం చేశా రు. చర్చ వేదిక సమన్వయకర్త గా సాక్షి బ్యూరో ఇన్చార్జి తుమాటి భద్రారెడ్డి వ్యవహరించారు.జిల్లాలో డ్రైపోర్లు, కంటెయినర్ డిపో ఏర్పాటు చేస్తే జిల్లాలో అభివృద్ధి వేగవంతమవుతుంది. దీనికోసం ఆరేళ్లుగా ఛాంబ ర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో పోరాటం చేస్తున్నాం. జిల్లాలో బ్రాడ్‌గేజ్ రైల్వే లైన్‌ను చాంబర్ ఆఫ్ కామర్స్ పోరాటం చేసి సాధించింది. ప్ర స్తుతం బ్రాడ్‌గేజ్ రైల్వే లైన్ పోరాటాన్ని స్ఫూ ర్తిగా తీసుకుని ఉద్యమిద్దాం. – జగదీశ్వర్‌రావు, అధ్యక్షులు, నిజామాబాద్ చాంబర్ ఆఫ్ కామర్స్కేంద్రం అంగీరిస్తుందనే ఆశ ఉందిడ్రైపోర్టు కోసం ఈ నెల 29న జిల్లాకు రానున్న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాను కలిసి విన్నవిద్దాం. ఈలోపు సమ గ్రంగా ప్రాజెక్టు రిపోర్టు తయారు చేయాలి. ఎంపీ అర్వింద్ సహాయాన్ని కోరుదాం. కేంద్ర ప్రభుత్వం పరిశ్రమల ఏర్పాటుపై సానుకూలంగా ఉన్న నేపథ్యంలో ఇందూరులో డ్రైపోర్టు ఏర్పాటుకు అంగీకరిస్తుందనే ఆశ ఉంది. చర్చవేదికను ఏర్పాటు చేసిన ‘సాక్షి’ యాజమాన్యానికి అభినందనలు.– శ్రీనివాస్, చాంబర్ ఆఫ్ కామర్స్ కార్యవర్గ సభ్యుడుఅన్ని పార్టీలు మద్దతు తెలపాలిఇందూరులో డ్రైపోర్ట్ ఏర్పాటు కోసం ఛాంబర్ ఆఫ్ కామర్స్ చేస్తున్న పోరాటానికి రాజకీయాలు అతీతంగా మద్దతు తెలపాల్సి ఉంది. దీని సాధన కోసం తెలంగాణ ఉద్యమం స్ఫూర్తిగా ముందుకెళదాం. డ్రైపోర్ట్ ఏర్పాటైతే జిల్లా అభివృద్ధికి టర్నింగ్ పాయింట్ అవుతుంది.– రాజశేఖర్‌రెడ్డి, రియల్ ఎస్టేట్ వ్యాపారిసముద్రమార్గం అనుసంధానంభూపరివేష్టిత రాష్ట్రంగా ఉన్న తెలంగాణలో సారవంతమైన భూములున్నాయి. జీఎస్డీపీని భారీగా అందించగలిగే సత్తా ఉన్న ఉత్తర తెలంగాణలోని ఇందూరు జిల్లాలో డ్రైపోర్టు ఏర్పాటు చేయాలి. ఈ జిల్లాకు రోడ్డు, రైలు మార్గం అనుసంధానంగా ఉన్నప్పటికీ సముద్రతీరం లేనందున డ్రైపోర్టు అత్యావశ్యకం. దీంతో నేరుగా సముద్రమార్గంతో సైతం అనుసంధానం అవుతుంది.– కమల్ కిషోర్ ఇనాని, కార్యదర్శి, చాంబర్ ఆఫ్ కామర్స్పార్టీలకతీతంగా పోరాడుదాండ్రైపోర్టుతో జిల్లాలో అన్నిరంగాలు అ భివృద్ధి చెందుతాయి. పార్టీలకతీతంగా డ్రైపోర్టు సాధనకు పోరాటం చే యాల్సిన సమయం వచ్చింది. జిల్లా కు రావాల్సిన డ్రైపోర్టును నల్లగొండకు తరలించుకుపోయారు. ఆదిలాబాద్, ని ర్మల్, జగిత్యాల, కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాలకు గేమ్ ఛేంజరైన డ్రైపోర్టును ఇందూరులో ఏర్పాటు చేసేందుకు బలమైన వాదనను కలసికట్టుగా వినిపిద్దాం. రైతులు, యు వత భాగస్వాములు కావాలి. – శివాజీ లక్ష్మణ్ పాటిల్, వ్యాపారి -
గేట్వేగా జిల్లా..
ఉత్తర, దక్షిణ భారతదేశానికి గేట్‌వే గా జిల్లా ఉంది. డ్రై పోర్టు ఏర్పాటు చేస్తే వ్యాపారాలు మరింత వృద్ధి చెందుతాయి. 1980–90లలో నిజామాబాద్ వ్యాపారులు వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులకు 20 టన్నుల సామర్థ్యం కలిగిన రైల్వే గూడ్స్ ర్యాక్‌లను బుక్ చేసుకునేవారు. ఇప్పుడు పెద్ద మొ త్తంలో ఎగుమతి చేస్తేనే రైల్వే శాఖ అవకాశం కల్పిస్తోంది. డ్రైపోర్ట్ వస్తే 24 టన్నుల కంటెయినర్లను బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది. – హితేన్ భీమాని, కోశాధికారి చాంబర్ ఆఫ్ కామర్స్ -
ఉత్సాహంగా రైతు సంబురం
డిచ్పల్లి: రైతు విజయోత్సవ కార్యక్రమం జిల్లాలో ఉత్సాహభరిత వాతావరణంలో అట్టహాసంగా నిర్వహించారు. వానాకాలం–2025 సీజన్‌కు సంబంధించి ముందస్తు పంట పెట్టుబడి సాయం కింద రైతు భరోసా నిధులు రైతుల ఖాతాల్లో జమ చేసిన సందర్భంగా మంగళవారం రైతు సంబురాలు నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా రైతు వేదికల వద్దకు అన్నదాతలు స్వచ్ఛందంగా తరలివచ్చి ఉత్సాహంగా సంబరాల్లో పాల్గొన్నారు. రైతు భరోసా నిధులు తొమ్మిది రోజుల వ్యవధిలోనే పూర్తి స్థాయిలో బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వం జమ చేయడంపై హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. రైతు వేదికలో వీడియో కా న్ఫరెన్స్ ద్వారా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రసంగాన్ని ఆసక్తిగా విన్నారు. డిచ్పల్లి మండలం యా నంపల్లి రైతు వేదిక లో ఆదర్శ రైతులతో కలిసి కలె క్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి సీఎం ప్రసంగాన్ని తిలకించారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి వీరాస్వామి, తహసీల్దార్ సతీశ్‌రెడ్డి, మండల వ్యవసాయ అధికారిణి సుధామాధురి, మాజీ ఎంపీపీ కంచెట్టి గంగాధర్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పొల సాని శ్రీనివాస్, సొసైటీ చైర్మన్ రాంచందర్‌గౌడ్, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. -
ఉపాధి అవకాశాలుండే విద్య అవసరం
తెయూ(డిచ్పల్లి): స్కిల్ బేస్డ్ ఎడ్యుకేషన్‌తోపాటు ఉపాధి అవకాశాలుండే విద్య అవసరమని, అలాంటి విద్యా విధానం అమలు చేయాలని రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకిష్టారెడ్డి అన్నారు. తెలంగాణ విశ్వవిద్యాలయం వాణిజ్య విభాగం, తెలంగాణ కామర్స్ అసోసియేషన్ (టీసీఏ) సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారం కామర్స్ అండ్ బిజినెస్మేనేజ్మెంట్ కాలేజ్ సెమినార్ హాల్లో ‘వికసిత్ భారత్–2047, ట్రాన్స్ఫార్మటివ్ రోల్ అఫ్ కామర్స్’ అనే అంశంపై జాతీయ సదస్సు నిర్వహించారు. కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. యువతకు స్కిల్ డెవలప్మెంట్ కోర్సుల ద్వారా సరైన మార్గదర్శనం చేయడానికి యూనివర్సిటీలు కృషి చేయాలన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి రాష్ట్రంలో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేసి యువతకు ఉపాధి అవకాశాలు పెంపొందించేలా చూస్తున్నారని, ఆయన ఆశయాలను మనం అందిపుచ్చుకోవాలని పేర్కొన్నారు. నైపుణ్యం కలిగిన విద్య ఉన్న వారికి సముద్ర అంతర్భాగాల నుంచి ఆకాశం వరకు అవకాశాలు లభిస్తాయన్నారు. ప్రపంచంతో పోటీపడే విద్యతోనే వికసిత్ భారత్ లక్ష్యం నెరవేరుతుందన్నారు. తెయూ వీసీ యాదగిరిరావు మాట్లాడుతూ.. వికసిత్ భారత్ లక్ష్యంతో కో–ఆపరేటివ్ ఫెడరలిజం వల్ల అవినీతి తగ్గి ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు. సదస్సు కార్యదర్శి రాంబాబు గోపిశెట్టి మాట్లాడుతూ.. జాతీయ సదస్సులో మానవ వనరుల నిర్వహణ, అకౌంటింగ్, ఆర్థికం, మార్కెటింగ్, పన్నులు, ఆర్టిఫి షియల్ ఇంటెలిజెన్స్, బ్లాక్‌చెయిన్, బిగ్ డేటా, ఆటోమేషన్‌పై పరిశోధకులు, విద్యావేత్తలు, వివిధ విశ్వవిద్యాలయాలు, కళాశాలల నుంచి విచ్చేసి పత్ర సమర్పణ చేసినట్లు తెలిపారు. విదేశాల నుంచి 4, భారత్‌లోని 8 రాష్ట్రాల నుంచి 174 పత్రాలు వచ్చినట్లు తెలిపారు. ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ (ఐపీఈ) డైరెక్టర్ శ్రీనివాసమూర్తి, తెలంగాణ కామర్స్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు పురుషోత్తమరావు, అధ్యక్షుడు చెన్నప్ప, జనరల్ సెక్రెటరీ రవికుమార్ జాస్తి, రిజిస్ట్రార్ యాదగిరి ప్రసంగించారు. అనంతరం సదస్సులో ‘వికసిత్ భారత్–2047, ట్రాన్స్ఫార్మటివ్ రోల్ అఫ్ కామర్స్’ సావనీర్‌ను అతిథులు ఆవిష్కరించారు. ప్రిన్సిపాల్ మామిడాల ప్రవీణ్, సదస్సు కన్వీనర్ శ్రీనివాస్, కో కన్వీనర్లు గంగాధర్, స్వప్న తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి తెయూలో ‘వికసిత్ భారత్–2047’ జాతీయ సదస్సు -
చదివింది పీజీ.. చేస్తోంది పారిశుధ్య పని
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : ఆమె ఉన్నత విద్యావంతురాలు.. పీజీ, బీఈడీ పూర్తి చేసింది. తండ్రి పారి శుధ్య కార్మికుడు.. ఆయన అనారోగ్యానికి గురికావడంతో కుటుంబ పోషణకు కూతురు ఆ పనిలో చే రింది. వివరాలిలా ఉన్నాయి. కామారెడ్డి బల్దియా ప రిధిలోని దేవునిపల్లికి చెందిన శ్యామల దేవునిపల్లి ఉన్నత పాఠశాలలో పదో తరగతి వరకు చదువుకుంది. కామారెడ్డిలోనే ఇంటర్, డిగ్రీ పూర్తి చేసింది. త ర్వాత పీజీ, బీఈడీ కూడా చదివింది. శ్యామల తండ్రి నాగయ్య మూడు దశాబ్దాలపాటు పారిశుధ్య కా ర్మికుడిగా పనిచేశాడు. ఆయన అనారోగ్యానికి గురవగా.. 2021లో ఆయన స్థానంలో శ్యామలను కాంట్రాక్టు కార్మికురాలిగా ఉద్యోగంలో చేర్చుకున్నారు. కొద్దిరోజులకే శ్యామల తండ్రి నాగయ్య చనిపోయా డు. కాగా పీజీతో పాటు బీఈడీ చదివిన శ్యామల పారిశుధ్య కార్మికురాలిగా పనిచేయడానికి అనేక ఇ బ్బందులు పడుతోంది. మురికి కాలువలు శుభ్రం చేయడం, రో డ్లు ఊడ్చడం, గడ్డి తీయడం వంటి పనుల న్నీ చేయాల్సి ఉంటుంది. అ ప్పట్లో మున్సి పల్ మంత్రిని, ఉన్నతాధికారులను కలిసి తన చదువుకు తగ్గ ఉద్యోగం ఇప్పించాలని వేడుకుంది. అ యినా ఎవరూ పట్టించుకోలేదు. తప్పనిసరి పరిస్థితుల్లో పారిశుధ్య కార్మికురాలిగా పనిచేస్తోంది. డ్రెయినేజీ లు శుభ్రం చేయడం మూలంగా ఆరోగ్యం కూడా దెబ్బతిందని శ్యామల ఆవేదన వ్యక్తం చేస్తోంది. తన చదువును చూసి మున్సిపాలిటీలో ఏదైనా రాత పని ఇప్పించాలని వేడుకుంటోంది. తండ్రి స్థానంలో కార్మికురాలిగా చేరిక చదువుకు తగ్గ ఉద్యోగం ఇవ్వాలని కోరుతున్న శ్యామల -
డ్రగ్స్ నియంత్రణకు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలి
ఖలీల్‌వాడి: డ్రగ్స్ నియంత్రణకు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకోవాలని సీపీ పోతరాజు సాయిచైతన్య ఎస్సైలకు సూచించారు. జిల్లా కేంద్రంలోని సీపీ కార్యాలయంలో మంగళవారం నిజామాబాద్ డివిజన్లోని పోలీసు అధికారులకు నేరాల నియంత్రణపై నెలవారి సమీక్ష నిర్వహించారు. ఈసందర్బంగా సీపీ మాట్లాడుతూ.. వచ్చే ఆరు నెలల్లో ప్రతి ఎస్‌హెచ్‌వో లక్ష్యాలు పెట్టుకొని నేరాల నియంత్రణ కోసం ఒక ప్రణాళికను ఏర్పాటు చేసుకోవాలన్నారు. పోలీస్ స్టేషన్ల వారీగా పెండింగ్‌లో ఉన్న కేసులను క్షుణ్ణంగా సమీక్షించి, త్వరితగతిన దర్యాప్తు ముగించడానికి తగిన సూచనలు చేశారు. మహిళల భద్రత కోసం అన్ని రకాల చర్యలు తీసుకోవాలని, వారికి అన్ని రకాల భద్రతల విషయంలో ఎల్లప్పుడు సహకారం అందించాలని తెలియజేశారు. మట్కా, గ్యాంబ్లింగ్, గంజాయి మొదలగు చట్టవ్యతిరేక కార్యాకలాపాలపై ప్రత్యేకమైన ‘నిఘా’ ఏర్పాటు, లాడ్జీలలో ఎప్పటికప్పుడు ముమ్మరంగా తనిఖీలు చేయాలన్నారు. పెండింగ్‌లో ఉన్న ఎన్బీడబ్ల్యూఎస్పై ప్రత్యేకంగా డివిజన్ పరిధిలో టీమ్స్ ఏర్పాటు చేసి త్వరితగతిన ఎగ్జిక్యూట్ చేయాలని సూచించారు. రాత్రి వేళల్లో వాహనాల తనిఖీ చేసి, దొంగతనాల నివారణకు కృషి చేయాలన్నారు. డయల్ 100 ఫిర్యాదుల పట్ల త్వరితగతిన స్పందించాలన్నారు. నిజామాబాద్ అదనపు పోలీస్ కమిషనర్ బస్వారెడ్డి, ఏసీపీలు, సీఐలు, ఎస్సైలు స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్లు శ్రీశైలం పాల్గొన్నారు. -
ఖతార్‌లో ఆర్మూర్‌వాసి అదృశ్యం
ఆర్మూర్: పట్టణంలోని కాశీ హనుమాన్ గల్లీకి చెందిన కా నూర్ నాగరాజు ఖతార్‌లో అ దృశ్యం అయ్యాడని బాధిత కుటుంబ సభ్యులు తెలిపా రు. అతడి ఆచూకీ కనుగొనా లని కోరుతూ మంగళవారం హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రవాసీ ప్రజావాణి లో తండ్రి కానూర్ నారాయణ వినతిపత్రం సమ ర్పించారు. ఆరు నెలల క్రితం నాగరాజు ఖతార్‌కు వెళ్లి విధుల్లో చేరాడని, గత నెల 26 నుంచి ఫోన్లో అందుబాటులో లేడని అతడి తండ్రి ఆందోళన వ్య క్తం చేశారు. ఏదో క్రిమినల్ కేసు విచారణ కోసం పో లీసుల అదుపులో ఉన్నట్లు అనుమానంగా ఉందంటూ సాయం అందించాలని విజ్ఞప్తి చేశారు. ఆర్మూ ర్ ఎమ్మెల్యే రాకేష్‌రెడ్డి, తెలంగాణ ఎన్నారై అడ్వయిజరీ కమిటీ వైస్ చైర్మన్ మంద భీంరెడ్డి చొరవ చూపాలని వారికి అభ్యర్థనలు పంపారు. ప్రవాసీ ప్రజావాణి కౌంటర్‌ను సందర్శించిన జీఏడీ ఎన్నారై విభాగం అధికారులు శ్రీనివాసరెడ్డి, చిట్టిబాబులకు నారాయణ తన గోడును వెళ్లబోసుకున్నారు. ఆచూకీ కనుక్కోవాలంటూ ప్రవాసీ ప్రజావాణిని ఆశ్రయించిన కుటుంబం -
చరిత్రకు సాక్షిగా నిలిచిన శివాలయం
మీకు తెలుసా? పట్టణంలోని అపురూపమైన ఏకచక్రేశ్వర శివాలయం చరిత్ర కు సాక్షిగా నిలుస్తోంది. భక్తులు కోరిన కోర్కెలు తీరుస్తూ జిల్లాలోనే విశిష్టత కలిగిన ఆలయంగా ప్రసిద్ధి చెందింది. ● 13వ శతాబ్దంలో కాకతీయులు బోధన్ ప్రాంతాన్ని పాలించిన కా లంలో ఈ ఆలయాన్ని నిర్మాణం చేసినట్లు శివలీలామృతం అనే ప్రాచీన సంస్కృత గ్రంథంలో పేర్కొనబడింది. ● కాకతీయ పాలనలో ముష్కరులు దక్షిణ భారతదేశ దండయాత్రకు పూనుకున్న సమయంలో ఆలయాన్ని రక్షించుకునేందుకు ఈ ప్రాంతం వారు మట్టితో ఆలయాన్ని కప్పివేసి ఉంటారని ప్రచారంలో ఉంది. ● 1959లో గుంటూరు వాస్తవ్యుడైన రామిరెడ్డి అనే వ్యక్తి బోధన్‌లో స్థిరపడటానికి ఒక మట్టికోటను చదును చేస్తుండగా (పుష్య బహుళ అమావాస్య రోజు) ఈ ఆలయం బయల్పడినట్లు బోధన్ పూర్వీకులు చెబుతుంటారు. ● సముద్రంలో అరుదుగా లభించే ప్రత్యేకమైన సాలాగ్రామము శిలతో చేయబడిన శివలింగాన్ని ఇక్కడ ప్రతిష్ఠాపన చేయడం అత్యంత విశేషమైనది. ● ఆలయంలోని శివలింగానికి నిత్యం పూజలు చేసేవారికీ ధనధాన్యాలకు లోటు ఉండదని శివపురాణంలో ప్రత్యేకంగా చెప్పబడింది. అందుకు తగ్గట్టుగానే ఈ ప్రాంతంలో ప్రజలకు తిండికి, నీటికి కొదవుండదు. ● ఆలయ అభివృద్ధి కమిటీ పాలకవర్గం ఆధ్వర్యంలో శివరాత్రి, కార్తీకమాసం, శ్రావణమాసంలో ప్రత్యేక పూజాకార్యక్రమాలతోపాటు, భక్తులకు ప్రత్యేక వసతులు, సౌకర్యాలు కల్పిస్తున్నారు. – బోధన్‌రూరల్ -
మట్టి వ్యాపారులకు చెక్
బాల్కొండ: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్ నిలిచే ప్రాంతం (బాల్కొండ మండలం జలాల్పూర్ శివారు) లో ఎలాంటి అనుమతులు లేకుండా చేపడుతున్న మట్టి తవ్వకాలను అధికారులు అడ్డుకున్నారు. ఈ మట్టి దందాపై సోమవారం సాక్షి దిన పత్రికలో ‘అనుమతులు లేవు.. పర్యవేక్షణ లేదు’ అనే శీర్షికన వార్తా కథనం ప్రచురితమైంది. ఈ కథనానికి స్పందించిన ప్రాజెక్ట్ ఏఈఈ రవి ఆధ్వర్యంలో అధికారులు రెండు పొక్లెయిన్లను పట్టుకుని బాల్కొండ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఎలాంటి అనుమతులు లేకుండా మట్టిని తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. యూజీసీ నెట్ పరీక్ష కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తు ఖలీల్‌వాడి: నిజామాబాద్ డివిజన్లోని యూజీసీ నెట్ పరీక్ష కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు సీపీ పోతరాజు సాయిచైతన్య మంగళవారం తెలిపారు. ఈనెల 25 నుంచి 29 వరకు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మల్టీ షిఫ్ట్ ప్రకారం పరీక్షలు జరుగనున్నట్లు ఆయన పేర్కొన్నారు. నగరంలోని అర్సపల్లి బైపాస్ రోడ్డులో గల పరీక్ష కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తుగా నిషేధిత ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ బీఎన్ఎస్ఎస్ 163 అమలులో ఉంటుందన్నారు. పరీక్ష కేంద్రం పరిసర ప్రాంతాలలోని అన్ని జిరాక్స్ సెంటర్లను ఈనెల 25 నుంచి 29 వరకు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మూసివేయాలన్నారు. -
‘భూ భారతి’ దరఖాస్తులను పరిష్కరించాలి
నిజామాబాద్‌అర్బన్: భూ భారతి రెవెన్యూ సదస్సు ల్లో అందిన దరఖాస్తులను పరిశీలించి ఆగస్టు 15 నాటికి సమస్యలను పరిష్కరించాలని రాష్ట్ర ప్రభు త్వ ముఖ్య కార్యదర్శి కే రామకృష్ణారావు సూచించా రు. మంగళవారం వీడియోకాన్ఫరెన్స్ ద్వారా ఆయ న మాట్లాడారు. అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ సైతం పాల్గొనగా.. వన మహోత్సవం, ఇందిరమ్మ ఇళ్లు, ఎరువుల లభ్యత, ఆయిల్‌పామ్ పంట విస్తర ణ, సీజనల్ వ్యాధుల నియంత్రణకు చర్యలు, భూ భారతి దరఖాస్తుల పరిష్కారం తదితర అంశాలపై సీఎస్ సుదీర్ఘంగా చర్చించి పలు సూచనలు చేశారు. భారీ వర్షాలు కురవకముందే ఇందిరమ్మ ఇళ్ల గ్రౌండింగ్తోపాటు బేస్మెంట్స్థాయి వరకు పనులు పూర్త య్యేలా చూడాలన్నారు. ఇళ్ల నిర్మాణానికి ఉచితంగా ఇసుక సరఫరా చేస్తూ, సీనరేజీ చార్జీలను కూడా ప్రభుత్వం రద్దు చేసిందని గుర్తు చేశారు. డబుల్ బె డ్ రూమ్ ఇళ్ల పెండింగ్ పనులు లబ్ధిదారులు పూర్తి చేసుకునేలా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని తెలిపారు. లాభసాటి పంట అయిన ఆయిల్‌పామ్ సాగు విస్తరణకు చర్యలు తీసుకోవాలని అన్నారు. సీజనల్ వ్యాధులను నియంత్రించేందుకు పటిష్ట చ ర్యలు తీసుకోవాలని కలెక్టర్‌కు సూచించారు. లక్ష్యం మేరకు వనమహోత్సవంలో భాగంగా మొక్కలను నాటాలని మంత్రి సురేఖ ఆదేశించారు. కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరిస్తున్నామని, ఇప్పటికే 19,490 ఇండ్లు కేటాయించగా, 15,834 మందికి ప్రొసీడింగ్స్ అందించామని, 7181 ఇళ్ల నిర్మాణాల గ్రౌండింగ్ పూర్తయ్యిందని వివరించారు. క్షేత్రస్థాయిలో పనులను పరిశీలి స్తూ లబ్ధిదారులను ప్రోత్సహిస్తున్నామని అన్నారు. అలాగే జిల్లాలో 7075 డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయని సీఎస్‌కు తెలిపారు. అదన పు కలెక్టర్ కిరణ్‌కుమార్, జిల్లా అటవీశాఖ అధికారి వికాస్ మీనా, ట్రెయినీ కలెక్టర్ కరోలిన్ చింగ్తియాన్ మావీ, డీఆర్డీవో సాయాగౌడ్, నిజామాబాద్ నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, డీఎంహెచ్‌వో రాజశ్రీ, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. ఆగస్టు 15 నాటికి పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలి భారీ వర్షాలకు ముందే ఇందిరమ్మ ఇళ్ల గ్రౌండింగ్ పూర్తవ్వాలి ఆయిల్‌పామ్ పంట సాగు విస్తరణకు చర్యలు వీడియోకాన్ఫరెన్స్‌లో సీఎస్ రామకృష్ణారావు -
చికిత్స పొందుతూ ఒకరి మృతి
భిక్కనూరు: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఓ వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. భిక్కనూరు ఎస్సై అంజనేయులు తెలిపిన వివరాలు ఇలా.. మండల కేంద్రానికి చెందిన చెట్లపల్లి రవి (42) ఈనెల 14న తాటికొండ అశోక్ అనే వ్యక్తికి జ్వరం రావడంతో చికిత్స కోసం అతడిని బైక్‌పై ఎక్కించుకొని భిక్కనూరు ప్రభుత్వాస్పత్రికి బయలుదేరారు. మార్గమధ్యలో వారి బైక్‌ను కామారెడ్డి వైపు నుంచి భిక్కనూరుకు వస్తున్న కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో రవికి తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు వెంటనే చికిత్స నిమిత్తం కామారెడ్డి ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యుల సలహా మేరకు మెరుగైన చికిత్స కోసం అతడిని హైదరాబాద్‌కు తరలించారు. అక్కడ రవి చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందినట్లు ఎస్సై వివరించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు. -
విద్యా ప్రణాళిక లక్ష్యాలు సాధించాలి
బోధన్: విద్యార్థుల అభ్యసన సామర్థ్యాల పెంపుదల లక్ష్యంతో ప్రభుత్వం అమలు చేస్తున్న ఎఫ్ఎల్ఎన్ (ఫౌండేషన్ లిటరసీ న్యూమర్సీ), ఎల్ఐపీ (లె ర్నింగ్ ఇంప్రూమెంట్ ప్రోగ్రాం) రెండు విద్యా ప్రణాళికలను క్షేత్రస్థాయిలో పటిష్టంగా అమలు చేసి లక్ష్యాలు సాధించాలని బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో ఎంఈవోలకు సూచించారు. పట్టణంలోని తన కార్యాలయంలో మంగళవారం ఆయన రుద్రూర్, కోటగిరి, పోతంగల్, వర్ని, చందూర్, మోస్రా మండలాల ఎంఈవోలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా సబ్ కలెక్టర్ మాట్లాడుతూ.. 1వ తరగతి నుంచి 5వ తరగతి విద్యార్థులకు చదవటం, రాయటం, గణిత పరిజ్ఞాన నైపుణ్యాలాభివృద్ధి ఎఫ్ఎల్ఎన్ ప్రణాళిక లక్ష్యమన్నారు. విద్యాప్రణాళికల అమలును పర్యవేక్షించాలని సూచించారు. నిర్దేశిత షెడ్యూల్ ప్రకారం 2వ తరగతి నుంచి 9వ తరగతి వరకు విద్యార్థుల అభ్యసన సామర్థ్యాల నిర్ధారణకు ఈ నెల 25 నుంచి 30 వరకు ప్రతి పాఠశాలలో బేస్‌లైన్ పరీక్షలు ఉంటాయని ప్రస్తావించారు. ఉపాధ్యాయుల ప్రత్యేక దృష్టిసారించాలని సూచించారు. -
ధూపదీప నైవేద్య దరఖాస్తుల పరిశీలన
నిజామాబాద్ రూరల్: జిల్లా కేంద్రంలోని దేవాదాయ ధర్మాదాయశాఖ జిల్లా కార్యాలయంలో మంగళవానం ధూపదీప నైవేద్యం పథకానికి వచ్చిన అర్జీలను జిల్లా ఎండోమెంట్ సహయ కమిషనర్ విజయ రామరావు పరిశీలించారు. నాలుగు రోజులలో అర్చకులకు మౌఖిక పరీక్ష నిర్వహించి నివేదిక ఇవ్వవలసినదిగా కార్యనిర్వాహణాధికారులకు, పరిశీలకులకు, విజయ రామారావు సూచించారు. మొత్తం 97 అర్జీలను పరిశీలించాలని ఆయన కోరారు. జిల్లాలోని వివిధ ఆలయాలకు చెందిన కార్యనిర్వహణ అధికారులు పాల్గొన్నారు.తప్పిన పెను ప్రమాదంఆర్మూర్టౌన్: పట్టణంలోని జర్నలిస్టు కాలనీలో ఉదయం విద్యుత్ సరఫరా అవుతున్న కరెంట్ తీగలు ఒక్కసారిగా తెగి రోడ్డుపై పడ్డాయి. వెంటనే ఓ వాహనదారుడు గమనించి అటుపక్క ఎటువంటి వాహనాలు రాకుండా అడ్డుకున్నాడు. అనంతరం స్థానిక లైన్‌మన్ సంతోష్నాయక్కు సమాచారం అందించడంతో అతడు వెంటనే ఘటన స్థలానికి చేరుకొని విద్యుత్ సరఫరా నిలిపివేశాడు. అనంతరం లైన్‌మన్ విద్యుత్ తీగలు సరిచేసి విద్యుత్ సరఫరా చేశారు. చెట్టు కొమ్మలు కరెంట్ తీగలపై పడటంతో తెగిపడ్డాయని విద్యుత్ సిబ్బంది తెలిపారు.యాదవులపై కాంగ్రెస్ ప్రభుత్వం వివక్ష● యాదవ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రాజారామ్ యాదవ్నిజామాబాద్నాగారం: గతంలో ఎన్నడూ లేనివిధంగా కాంగ్రెస్ పార్టీ యాదవ కులస్తులను అణిచివేస్తుందని, ప్రభుత్వం వివక్ష చూపుతుందని రాష్ట్ర యాదవ సంఘం బీసీ జనసభ అధ్యక్షుడు రాజారామ్ యాదవ్ విమర్శించారు. నగరంలోని ప్రెస్‌క్లబ్‌లో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఎం రేవంత్‌రెడ్డి యాదవులను, మున్నూరు కాపులను ఇతర కులాలను అణిచివేస్తుందన్నారు. బీసీలను అణగదొక్కడమే సామాజిక న్యాయమా అంటూ ఆయన ప్రశ్నించారు. మంత్రివర్గంలో, కార్పొరేషన్స్‌లో, పార్టీ పదవుల్లో యాదవులకు అన్యాయం చేస్తుందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి సరైన గుణపాఠం చెప్పడానికి నిరసనగా హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ వద్ద ఈనెల 30న మహా ధర్నా చేపడుతున్నట్లు తెలిపారు. ధర్నాకు యాదవ కులస్తులు భారీగా తరలిరావాలన్నారు. అనంతరం ధర్నా వాల్‌పోస్టర్లను ఆవిష్కరించారు. జిల్లా అధ్యక్షుడు మహిపాల్ యాదవ్, కన్వీనర్ బాపూరావు యాదవ్, సంఘ ప్రతినిధులు రాజన్న యాదవ్, జనార్ధన్ యాదవ్, లింగన్న యాదవ్ పాల్గొన్నారు. -
ఇంజినీరింగ్ కళాశాల మంజూరుకు కృషి
తెయూ(డిచ్పల్లి): తెలంగాణ యూనివర్సిటీలో ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాల ఏర్పాటుకు అన్ని రకాల వసతులు ఉన్నాయని, సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లి కళాశాల మంజూరుకు కృషి చేస్తానని రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకిష్టారెడ్డి అన్నారు. తెయూలో జరిగిన జాతీయ సదస్సుకు హాజరైన ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తెయూలో ఇంజినీరింగ్ కళాశాల ఏర్పాటుకు తగిన సౌకర్యాలు, ఫ్యాకల్లీ ఉందన్నారు. ఈమేరకు వీసీ యాదగిరిరావు, రిజిస్ట్రార్ యాదగిరిలతో కలిసి తాను క్యాంపస్‌లోని భవనాలను, వసతి సౌకర్యాలను పరిశీలించినట్లు తెలిపారు. అలాగే యూజీసీ ఆదేశాల ప్రకారం ఈ విద్యాసంవత్సరం నుంచి అన్ని యూజీ, పీజీ కళాశాలల్లో 20 శాతం స్కిల్ బేస్డ్ కోర్సులు ప్రవేశపెడుతున్నట్లు తెలిపారు. అర్టిఫిషియల్ ఇంటలిజెన్స్, ఇతర టెక్నికల్ కోర్సులు అమలు చేస్తున్నట్లు తెలిపారు. ప్రతి విద్యార్థికి స్కిల్ (నైపుణ్యం) అత్యంత అవసరమని, ఫస్ట్ లాంగ్వేజ్, సెకండ్ లాంగ్వేజ్ ఉన్నట్లే థర్డ్ లాంగ్వేజ్ ఇకనుంచి స్కిల్ కోర్సులు ఉండాలని ఆయన వివరించారు. అలాగే కళాశాలలు కంపెనీలతో ఎంవోయూ చేసుకుని ఉపాధి అవకాశాలు సృష్టించాలన్నారు. సిలబస్‌లో మార్పులు చేస్తున్నామని, ఇందుకు వేర్వేరు రెగ్యులేటరీ కమిటీలు అనుమతులు అవసరమన్నారు. త్వరలోనే అన్ని ప్రభుత్వ యూనివర్సిటీల్లో టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల ఖాళీలను గుర్తించి రిక్రూట్మెంట్ ప్రక్రియ ప్రారంభిస్తామని తెలిపారు. ఉన్నత విద్యామండలి చైర్మన్‌కు వినతి.. తెలంగాణ యూనివర్సిటీకి ఇంజినీరింగ్ కళాశాల మంజూరు చేయాలని వర్సిటీ ఎన్ఎస్యూఐ నాయకులు కోరారు. ఈమేరకు వారు మంగళవారం రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డికి వినతిపత్రం అందజేశారు. అనంతరం ఎన్ఎస్యూఐ ఆధ్వర్యంలో ఆయనను సత్కరించారు. ఎన్ఎస్యూఐ అధ్యక్షు డు బానోత్ సాగర్ నాయక్, నాయకులు శ్రీనునాయక్, విజయ్, వెంకటేష్, నరేష్ తదితరులున్నారు. -
వేర్వేరు కారణాలతో ఇద్దరి ఆత్మహత్య
వర్ని: మండలంలోని జాకోరా గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వర్ని ఎస్సై మహేష్ తెలిపిన వివరాలు ఇలా.. గ్రామానికి చెందిన కమ్మరి సతీష్ (40) ఫొటో గ్రాఫర్‌గా జీవనం సాగిస్తున్నాడు. మంగళవారం తెల్లవారుజామున అతడు ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్యకు యత్నించాడు. వెంటనే కుటుంబ సభ్యులు గమనించి ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగానే సతీష్ ఆత్మహత్యకు పాల్పడినట్లు కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈమేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. లింగంపేట మండలంలో.. లింగంపేట(ఎల్లారెడ్డి): మండలంలోని అయిలాపూర్ గ్రామంలో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై వెంకట్రావు తెలిపారు. వివరాలు ఇలా.. గ్రామానికి చెందిన మున్నూరుపల్లి సాయిలు–అనసుజ దంపతులకు కూతురు, కొడుకు ఉన్నారు. కొడుకు మున్నూరుపల్లి అశోక్(22) ఇంటర్ వరకు చదివి, గొర్లను కాస్తున్నాడు. కొంత కాలంగా దుబాయి వెళ్తానని తల్లిదండ్రులకు చెప్పగా వారు వద్దని వారించారు. పెళ్లి చేసుకొమ్మని చెప్పగా తర్వాత చేసుకుంటానన్నాడు. మనస్తాపం చెందిన అశోక్ మంగళవారం ఉదయం తెల్లవారుజామున దూలానికి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. చేతికందిన కొడుకు మృతి చెందడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. లింగంపేట పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.పంపుసెట్ కేబుల్ వైర్లు చోరీ వేల్పూర్: వేల్పూర్ మండలం జాన్కంపేట్ గ్రామంలో సోమవారం అర్ధరాత్రి దొంగలు పంటపొలాల వద్ద సుమారు 20 వ్యవసాయ పంపుసెట్ల కేబుల్ వైర్లు చోరీ చేశారని గ్రామ రైతులు తెలిపారు. ఒక్కో పంపు సెట్‌కు స్టాటర్ నుంచి జాయింట్ వరకు అయిదు నుంచి ఇరవై మీటర్ల వరకు కేబుల్ వైరు ఉంటుందన్నారు. వైరును కత్తిరించి ఒర్రెలో కాల్చి అందులో ఉండే కాపర్ వైరును తీసుకెళ్లినట్లు తెలుస్తోందన్నారు. ప్రతి రైతుకు సుమారు రూ.2వేల వరకు నష్టం వాటిళ్లినట్లు వారు మంగళవారం తెలిపారు. -
ప్రజావాణికి ఫిర్యాదుల వెల్లువ
నిజామాబాద్ అర్బన్: ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమానికి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. అర్జీలకు ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను త్వరగా పరిష్కరించాలని కలెక్టర్ టీ వినయ్ కృష్ణారెడ్డి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి 217 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు కలెక్టర్‌తోపాటు అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, ట్రెయినీ కలెక్టర్ కరోలిన్ చింగ్తియాన్ మావీ, డీఆర్డీవో సాయాగౌడ్, ఇన్చార్జి డీపీవో శ్రీనివాస్, మెప్మా పీడీ రాజేందర్‌లకు అర్జీలు సమర్పించారు. బాధితులకు త్వరగా పరిహారం చెల్లించాలిపోక్సో చట్టం కింద కేసులు నమోదు అయిన అనంతరం దాని బాధితులకు త్వరగా పరిహారం చెల్లించాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి పేర్కొన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం పోక్సో చట్టం, అట్రాసిటీ బాధితుల పరిహారం, మహిళలు, బాలికలపై జరిగిన దారుణాలకు సంబంధించి పరిహారం చెల్లింపుపై జిల్లా స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బాధితులకు పరిహారం చెల్లింపుల్లో నిర్లక్ష్యం చేయ వద్దని సంక్షేమ అధికారిణి, మహిళా శిశు సంక్షేమ అధికారికి ఆదేశించారు. అర్హత కలిగిన 86 కేసులను జిల్లా స్థాయి కమిటీ సమావేశం ఆమోదించింది. సీ పీ సాయిచైతన్య, ప్రాజెక్టు డైరెక్టర్, డీఆర్డీవో సాయా గౌడ్ , డీఎంహెచ్‌వో రాజశ్రీ, డీఈవో అశోక్, జిలా సంక్షేమ అధికారిణి ఎస్కే రసూల్ బీ, ఏజీవో స్నేహ సొసైటీ కార్యదర్శి సిద్ధయ్య పాల్గొన్నారు. అర్జీలను త్వరితగతిన పరిష్కరించాలి కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి -
రోడ్డు ప్రమాదంలో విద్యార్థిని మృతి
బోధన్: నవీపేట మండల కేంద్ర శివారులోని బాసర–నిజామాబాద్ ప్రధాన రహదారిపై సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ విద్యార్థిని మృతి చెందింది. స్థానికులు, కుటుంబసభ్యుల తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. నవీపేట మండలంలోని బినోలా గ్రామానికి చెందిన బైండ్ల గంగాధర్ కొన్నేళ్లుగా మండల కేంద్రంలో ఫర్టిలైజర్ షాప్ నిర్వహిస్తూ ఇక్కడే నివాసం ఉంటున్నారు. గంగాధర్‌కు ఇద్దరు కూతుర్లు, కుమారుడు ఉన్నారు. పెద్ద కూతురు బైండ్ల తేజశ్విని (16) ఇటీవల పదో తరగతి పూర్తి చేయగా, ఇంటర్ కోసం నిజామాబాద్ నగరంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో చేర్పించారు. కళాశాల హాస్టల్‌కు వెళ్లేందుకు సోమవారం సాయంత్రం గంగాధర్ కూతురు తేజశ్వినితో కలిసి బైక్‌పై ఇంటి నుంచి బయల్దేరారు. మండల కేంద్ర శివారులో బాసర వైపు నుంచి అతివేగంగా వచ్చిన లారీ.. బైక్‌ను ఢీకొట్టింది. దీంతో ఇద్దరూ కిందపడిపోగా తీవ్రగాయాలైన తేజశ్విని అక్కడిక్కడే మృతి చెందింది. కళ్ల ముందే కూతురు మరణించడంతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. గంగాధర్ ఫిర్యాదు మేరకు నవీపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
డబ్బుల కోసం తల్లి హత్య
పోలీసుల అదుపులో కొడుకుబోధన్రూరల్: డబ్బులు, నగల కోసం కన్నతల్లిని కొడుకు గొడ్డలితో నరికి హత్య చేసిన ఘటన బోధన్ మండలంలో కలకలం రేపింది. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. బోధన్ మండలం పెంటాకుర్దు గ్రామానికి చెందిన అంబం చంద్రకళకు మహారాష్ట్రకు చెందిన గైక్వాడ్ వెంకటితో 40 ఏళ్ల క్రితం వివాహమైంది. ఇద్దరు కొడుకులు భూషణ్, సురేశ్, కూతురు జ్యోతి పుట్టిన తర్వాత చంద్రకళ భర్తకు దూరమై సుమారు 20 ఏళ్ల నుంచి పెంటాకుర్దులోనే ఒంటరిగా జీవిస్తోంది. పిల్లలందరికీ పెళ్లిళ్లు కాగా అప్పుడప్పుడు వారు తల్లి వద్దకు వెచ్చివెళ్తుంటారు. చిన్న కుమారుడు సురేశ్ నిత్యం తల్లి దగ్గరకు వచ్చి డబ్బులు తీసుకోవడం, డబ్బులు ఇవ్వకపోతే గొడవ పడుతుండేవాడు. నాలుగు రోజుల కిత్రం తల్లి వద్దకు వచ్చిన సురేశ్ పెంటాకుర్దులోనే ఉంటూ ఆదివారం డబ్బుల కోసం గొడవకు పడ్డాడు. ఈ క్రమంలో మద్యం మత్తులో చంద్రకళ (59)ను కిరాతకంగా గొడ్డలితో దాడి చేసి హత్య చేశాడు. అనంతరం ఆమె కాలికి ఉన్న సుమారు 50 తులాల వెండి కడియాన్ని ఎత్తుకెళ్లాడు. సోమవారం చంద్రకళ రక్తపుమడుగులో ఉండటాన్ని చుట్టుపక్కల వారు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. బోధన్ ఏసీపీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో రూరల్ పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి, నిందితుడు సురేశ్‌ను అదుపులోకి తీసుకొని కేసు దర్యాప్తు చేస్తున్నట్లు బోధన్ రూరల్ ఎస్సై మచ్చేందర్ రెడ్డి తెలిపారు. -
కలెక్టర్‌ను కలిసిన ట్రెయినీ కలెక్టర్
నిజామాబాద్‌అర్బన్: జిల్లాకు ట్రెయినీ కలెక్టర్‌గా వచ్చిన 2024 బ్యాచ్ ఐఏఎస్ అధికారిణి కరోలిన్ చింగ్తియాన్ మావీ సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో కలెక్టర్ టీ వినయ్ కృష్ణారెడ్డిని మర్యాద పూర్వకంగా కలిసి పూలమొక్కను అందజేశారు. గత ఏప్రిల్ నెలలో ట్రెయినీ కలెక్టర్‌గా నిజామాబాద్ జిల్లాకు కేటాయించబడిన కరోలిన్ చింగ్తియాన్ మావీ, నెలన్నరపాటు మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్నారు. సోమ వారం జిల్లాకు తిరిగి వచ్చిన సందర్భంగా ఇటీవల నూతనంగా బాధ్యతలు చేపట్టిన కలెక్టర్‌ను మర్యా ద పూర్వకంగా కలిశారు. -
చెట్టును ఢీకొన్న మోపెడ్.. ఒకరి మృతి
నిజాంసాగర్(జుక్కల్): మండలంలోని సుల్తాన్‌నగర్ గ్రామశివారులో సోమవారం ఉదయం మోపెడ్ వాహనం చెట్టును ఢీకొని మహమ్మద్ గని(36) అనే వ్యక్తి మృతి చెందాడు. మహమ్మద్‌నగర్ గ్రామానికి చెందిన గని పాన్‌షాపు డబ్బా నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. పెట్రోల్ కోసం మోపెడ్‌పై వెళ్తున్న గని సుల్తాన్‌నగర్ శివారులో ప్రమాదవశాత్తు చెట్టును ఢీకొన్నాడు. తలపగిలి తీవ్ర రక్తస్రావం కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య సైనాజీ, తల్లి ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదవశాత్తు కాలువలో పడి..మోపాల్: మండలంలోని కంజర్ గ్రామానికి చెందిన జే శ్రీనివాస్ (53) ప్రమాదవశాత్తు చెరువు కాలువలో పడి మృతిచెందినట్లు ఎస్సై యాదగిరి గౌడ్ సోమవారం తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. శ్రీనివాస్ రోజూవారీ పనులు చేసుకుంటూ జీవనం సాగించేవాడు. కొంతకాలంగా పని చేయకుండా తాగుడికి బానిసయ్యాడు. ఈ నెల 2న ఇంట్లో నుంచి వెళ్లిపోయిన శ్రీనివాస్.. సోమవారం కంజర్ చెరువు కాలువలో మృతదేహామై కనిపించాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కొడుకు సుకేశ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు. చోరీ కేసులో ఒకరి అరెస్టునిజాంసాగర్(జుక్కల్): చోరీ కేసులో ఒకరి అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై శివకుమార్ తెలిపారు. ఈ నెల 8 మహమ్మద్ నగర్ మండల కేంద్రంలో తాళం వేసి ఉన్న మన్నె అంజవ్వ ఇంట్లో అత్రం ప్రశాంత్ అనే వ్యక్తి చోరీకి పాల్పడ్డాడు. నిందితుడిని సోమవారం అరెస్టు చేసి, వెండి ఆభరణాలు, నగదు స్వాధీనం చేసుకున్నామన్నారు. ద్విచక్రవాహన చోరీలో.. నిజాంసాగర్(జుక్కల్): మాగి గ్రామంలో గత నెల 28న నిర్వహించిన కుస్తీ పోటీల ప్రాంతం నుంచి ద్విచక్ర వాహనాన్ని చోరీ చేసిన కేసులో నిందితుడు రవిని సోమవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై శివకుమార్ తెలిపారు. ఒడ్డేపల్లి గ్రామానికి చెందిన పొట్లోళ్ల సాయిరాం మాగి గ్రామంలో కుస్తీ పోటీలు తిలకించేందుకు పల్సర్ బైక్‌పై వచ్చాడు. వాహనాన్ని పార్కింగ్ చేసి, కుస్తీపోటీలను తిలకించాడు. అనంతరం వెళ్లి చూడగా బైక్ కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. నర్సింగ్‌రావ్‌పల్లి చౌరస్తా వద్ద వాహనాలను తనిఖీ చేస్తుండగా పల్సర్ బైక్‌పై వెళ్తున్న రవిని పట్టుకొని విచారించామని ఎస్సై తెలిపారు. బైక్‌ను తానే దొంగిలించినట్లు నేరం ఒప్పుకున్నాడని పేర్కొన్నారు. దీంతో వాహనాన్ని స్వాధీనం చేసుకొని నిందితుడిని అరెస్టు చేశామన్నారు. తాళం వేసిన ఇంట్లో చోరీబాల్కొండ: మండలంలోని కిసాన్‌నగర్‌లో తాళం వేసిన ఇంట్లో ఆదివారం రాత్రి దుండగులు చొరబడి భారీ చోరీకి పాల్పడ్డారు. బాల్కొండ ఏఎస్సై చిన్నయ్య తెలిపిన వివరాల ప్రకారం.. జాకీర్ అనే వ్యక్తి తాను అద్దెకు ఉంటున్న ఇంటికి తాళం వేసి సొంతింటికి వెళ్లాడు. ఈ క్రమంలో గుర్తు తెలియిన దుండగులు తాళం పగులగొట్టి ఇంట్లోకి చొరబడి ఇంటి నిర్మాణం కోసం బీరువాలో దాచుకున్న రూ. లక్ష నగదును అపహరించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.