రెండు బైకులు ఢీ.. ఒకరి మృతి | - | Sakshi
Sakshi News home page

రెండు బైకులు ఢీ.. ఒకరి మృతి

Feb 19 2026 9:43 AM | Updated on Feb 19 2026 9:43 AM

రెండు బైకులు ఢీ.. ఒకరి మృతి

రెండు బైకులు ఢీ.. ఒకరి మృతి

మరొకరికి గాయాలు

సిరికొండ: రెండు బైకులు ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందగా మరొకరికి గాయాలయ్యాయి. ఎస్సై జే రామకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. సిరికొండ మండలం మైలారం గ్రామానికి చెందిన గోనుగొప్పుల అన్వేష్‌(34) అనే యువకుడు తన సోదరిని భీమ్‌గల్‌ మండలం ముచ్కూర్‌ గ్రామంలో దింపడానికి బైక్‌పై వెళ్తున్నాడు. అదేవిధంగా జగదాంబ తండాకు చెందిన బానావత్‌ మోతీలాల్‌ తన బైక్‌పై నర్సింగ్‌పల్లి నుంచి తండాకు వెళ్తున్నాడు. న్యావనంది చౌరస్తా – నర్సింగ్‌పల్లి గ్రామాల మధ్య ఈ రెండు బైక్‌లను ఎదురెదురుగా ఢీకొన్నాయి. ప్రమాదంలో అన్వేష్‌ తలకు తీవ్రగాయాలు, మోతీలాల్‌కు గాయాలు కాగా 108 అంబులెన్స్‌లో ఇద్దరిని జిల్లా కేంద్రంలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి అన్వేష్‌ మృతి చెందినట్లు తెలిపారు. గాయాలైన మోతీలాల్‌కు చికిత్స అందిస్తున్నారు. మృతుడికి భార్య సౌజన్యతో పాటు ఇద్దరు పిల్లలు, తల్లిదండ్రులు ఉన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement