ఆర్‌ఎక్స్ 100, మంగళవారం చిత్రాల ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వం వహిస్తోన్న ఇంటెన్స్ లవ్ డ్రామా ‘శ్రీనివాస మంగాపురం’. ఈ మూవీతో సూపర్‌స్టార్ కృష్ణ మనవడు, దివంగత నటుడు రమేష్ బాబు కుమారుడు ఘట్టమనేని జయకృష్ణ హీరోగా ఎంట్రీ ఇస్తున్నారు.
ఈ చిత్రం ద్వారా బాలీవుడ్ నటి రషా తడాని తెలుగులో హీరోయిన్‌గా అరంగేట్రం చేస్తోంది.
ఈ మూవీని చందమామ కథలు బ్యానర్‌పై పి.కిరణ్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు కూడా ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు.
తాజాగా ఈ మూవీ టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.


