స్టార్ హీరోయిన్ కూతురు ఎంట్రీ.. ఘట్టమనేని జయకృష్ణతో ఫస్ట్ సినిమా!
ఘట్టమనేని కుటుంబం నుంచి మరో హీరోను లాంచ్ చేసేందుకు అంతా సిద్ధం అయినట్లు తెలుస్తోంది. ఇప్పటికే మహేశ్ బాబు పాన్ ఇండియా రేంజ్లో సత్తా చాటుతున్నారు. త్వరలో ఆయన సోదరుడు రమేశ్ బాబు కుమారుడు జయకృష్ణ చిత్ర పరిశ్రమలో ఎంట్రీ ఇచ్చేందుకు రెడీగా ఉన్నాడు. మహేశ్ కి అన్నయ్య అయిన రమేశ్ బాబు కూడా హీరోగా పలు చిత్రాలు చేశారు గానీ పెద్దగా నిలదొక్కుకోలేకపోయారు. తర్వాత వ్యాపారాలు చూసుకున్నారు. కొన్నేళ్ల క్రితం అనారోగ్య సమస్యలతో ఆయన చనిపోయారు. బాబాయ్గా జయకృష్ణను ఇండస్ట్రీకి పరిచయం చేసే బాధ్యతను మహేశ్ తీసుకున్నారు.హీరోయిన్ ఎవరు..?ఘట్టమనేని వారసుడు జయకృష్ణకు జోడీగా బాలీవుడ్ హీరోయిన్ రవీనా టాండన్ కుమార్తె రషా టాండానీ టాలీవుడ్కు పరిచయం కానుందని వార్తలు వస్తున్నాయి. ఆమె ఇప్పటికే బాలీవుడ్లో ఆజాద్ అనే సినిమాలో నటించింది. - రషా తైక్వాండోలో బ్లాక్ బెల్ట్ పొందింది. సోషల్మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గానే ఉంటుంది. ఇప్పుడు వీరద్దరూ కలిసి సినిమా చేస్తున్నట్లు వార్తలు రావడంతో నెట్టింట వైరల్ అవుతుంది. 'ఆర్ఎక్స్ 100', 'మంగళవారం' సినిమాల ఫేమ్ దర్శకుడు అజయ్ భూపతిని దర్శకుడిగా తీసుకున్నారని సమాచారం. ఎమోషనల్ లవ్ స్టోరీతో జయకృష్ణను చిత్రపరిశ్రమకు పరిచయం చేయాలనే ఆలోచనతో అజయ్ భూపతి ఉన్నారని టాక్.మహేశ్ బాబుని లాంచ్ చేసిన నిర్మాత అశ్వనీదత్.. జయకృష్ణని కూడా ఒక నిర్మాతగా పరిచయం చేయబోతున్నారని ఇండస్ట్రీలో టాక్. ప్రస్తుతం అంతా ఫిక్స్ అయినప్పటికీ, త్వరలో ఈ విషయమై క్లారిటీ ఇస్తారు. ఇకపోతే మహేశ్.. రాజమౌళి సినిమా బిజీలో ఉన్నారు. ప్రస్తుతం షూటింగ్ కి విరామం ప్రకటించడంతో జయకృష్ణ లాంచింగ్ పనులు చూస్తున్నారట.