
బాలీవుడ్ నటి రవీనా టాండన్ కుమార్తె రాషా తడానీ టాలీవుడ్ ఎంట్రీ దాదాపు ఖారారు అయిందనే టాక్ ఫిల్మ్‌నగర్‌లో వినిపిస్తోంది. ఘట్టమనేని జయకృష్ణ (ఘట్టమనేని రమేశ్‌బాబు తనయుడు) హీరోగా ‘ఆర్‌ఎక్స్ 100, మంగళవారం’ చిత్రాల ఫేమ్ అజయ్ భూపతి డైరెక్షన్‌లో ఓ సినిమా రానుందనే ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే.
కాగా ఈ సినిమాలోని హీరోయిన్‌పాత్రకు రాషా తడానీని మేకర్స్ సంప్రదించారని, కథ నచ్చడంతో ఈ సినిమాకు ఆమె ఓకే చెప్పారని సమాచారం. వైజయంతీ మూవీస్, ఆనంది ఆర్ట్స్ సంస్థలు ఈ సినిమాను నిర్మించనున్నాయని, అక్టోబరు నెలలో చిత్రీకరణ ప్రారంభం కానుందని టాక్. మరోవైపు అజయ్ దేవగన్ హిందీ చిత్రం ‘అజాద్’లో ఓ కీలకపాత్రలో నటించి, మెప్పించారు రాషా. ఈ యంగ్ బ్యూటీ నటించిన ఈ చిత్రం ఈ ఏడాది జనవరిలో విడుదలైంది.