SPSR Nellore
-
ప్రశాంతంగా జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష
నెల్లూరు (టౌన్): ఐఐటీల్లో ప్రవేశం కోసం ఆదివారం నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష ప్రశాంతంగా జరిగింది. జిల్లాలో రెండు కేంద్రాల్లో ఈ పరీక్ష నిర్వహించారు. ఉదయం 9 నుంచి 12 గంటల వరకు, మధా్‌య్‌హ్నం 2.30 నుంచి 5.30 గంటల వరకు రెండు విడతల్లో పరీక్షను నిర్వహించారు. జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షకు 96 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారు. పరీక్షకు విద్యార్థులతోపాటు తల్లిదండ్రులు రావడంతో కేంద్రల వద్ద సందడి నెలకొంది. పరీక్ష రాసి బయటకు వచ్చేంత వరకు తల్లిదండ్రులు కేంద్రాల వద్ద పడిగాపులు కాశారు. పరీక్ష కేంద్రాల వద్ద తాగునీటి సౌకర్యం ఏర్పాటు చేయకపోవడంతో తల్లిదండ్రులు ఇబ్బందులు పడ్డారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో కేంద్రాల సమీపంలోని చెట్లు కింద సేద తీరారు. -
ఏం ముఖం పెట్టుకుని వస్తావు బాబు
● మత్స్యకార నేతల నిలదీత కావలి: మత్స్యకారులను నిలువునా మోసం చేసిన సీఎం చంద్రబాబు మత్స్యకార సేవలో పేరుతో తుమ్మలపెంటకు వస్తున్నాడని, ఏం ముఖం పెట్టుకుని వస్తున్నావంటూ మత్స్యకార కాపు నేతలు నిలదీశారు. ఆదివా రం పట్టణంలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి సూచనలతో మత్స్యకారులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. వారు మాట్లాడుతూ మత్స్యకారులు ప్రాణాలకు తెగించి పట్టుకొన్న తమిళనాడు బోట్లను నీ కుమారుడు లోకేశ్, నీ పార్టీ రాజ్యసభ సభ్యుడు బీద మస్తాన్‌రావు కలిసి వదిలేసి ద్రోహం చేసిన సంగతి ఏ మత్స్యకారుడు మరిచిపోరన్నారు. గతంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మత్స్యకారులు అభివృద్ధికి, భావితరాల భవిష్యత్‌కు జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ కడితే.. దాన్ని మా మత్స్యకారులకు అంకితం చేయకుండా ప్రైవేట్ పరం చేయడానికి సిద్ధపడ్డారని ధ్వజమెత్తారు. ఇంత జరిగినా.. బోట్లు వదిలేసిన వారిపై చర్యల్లేవని, జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్‌ను ప్రారంభించే విషయాన్ని స్పష్టం చేయకుండా ఇప్పుడు మత్స్యకారుల సేవలో.. పేరుతో మత్స్యకారులను మరోసారి మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. తీర ప్రాంత ప్రజలకు భరోసా కల్పించేందుకు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి పర్యటనకు ఎవరు వెళ్లొద్దని గ్రామాల వారీగా ప్రచారం చేసిన ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఇప్పుడు ప్రతి మత్స్యకార గ్రామానికి వెళ్లి కార్యక్రమానికి రావాలని చెప్పడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. ఇది మత్స్యకారుల్లో విబేధాలను సృష్టించడమేనని విమర్శించారు. ఈ సమావేశంలో మత్స్యకార నాయకులు కోడూరు రాజయ్య, కొమారి రాజు, వాయిల తిరుపతి, వాయిల రాధాకృష్ణ, గోవిందస్వామి, మత్స్యకార కాపులు, మత్స్యకారులు పాల్గొన్నారు. -
ఇరిగేషన్ పనుల పేరుతో భారీ దోపిడీ
● పనులు చేయకుండానే సోమిరెడ్డి స్వాహా ● క్షేత్రస్థాయికి వెళ్తే బండారం బట్టబయలు ● మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డిముత్తుకూరు(పొదలకూరు): ఇరిగేషన్ పనుల పేరుతో కాలువల్లో పూడికలు తొలగించకుండా టీడీపీ నాయకులు సోమిరెడ్డి ఆధ్వర్యంలో భారీ దోపిడీకి పాల్పడినట్టు మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి అన్నారు. మండలంలోని జంగాలకండ్రిక జంక్షన్ వద్ద ముత్తుకూరు, తోటపల్లిగూడూరు మండలాలకు సాగునీరందించే పలు కాలువలను ఆదివారం రైతులతో కలిసి కాకాణి పరిశీలించారు. ఈ సందర్భంగా పెద్దఎత్తున రైతులు హాజరై పంట కాలువల వల్ల పడుతున్న ఇబ్బందులను కాకాణి దృష్టికి తీసుకెళ్లారు. జంగాలకండ్రిక కాలువ గట్టుపై నివాసముంటున్న గిరిజన కుంటుంబాల వారు కలిసి సంక్షేమ పథకాలు తమకు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం కాకాణి మాట్లాడుతూ జిల్లాలో ఇరిగేషన్ పనులను అడ్డుపెట్టుకుని టీడీపీ నాయకులు దోచుకుంటున్నట్టు తెలిపారు. సర్వేపల్లి నియోజకవర్గంలో ఎలాంటి పనులు చేయకుండానే సోమిరెడ్డి అడ్డగోలుగా రూ.కోట్లు దోపిడీకి పాల్పడుతున్నట్టు ఆరోపించారు. రైతుల విజ్ఞప్తి మేరకు క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే అసలు కథ బయటపడుతోందన్నారు. రోడ్డు పక్కన మాత్రం కాలువలను రిపేర్లు చేసినట్టు తెలిపారు. అవినీతికి పాల్పడటంలో ఇన్ని రకాలు ఉంటాయనేది సోమిరెడ్డికే తెలుసన్నారు. మోంథా తుఫాను నష్ట నివారణా చర్యల్లో భాగంగా కలెక్టర్ ఆమోదించిన పనులు చేయకుండానే దొంగ బిల్లులు చేసుకున్నట్టు ఆరోపించారు. కాలువలకు నీళ్లు వదిలిన తర్వాత సోమిరెడ్డి పనులకు సంబంధించిన అగ్రిమెంట్లు చేసుకున్నట్టు విమర్శించారు. అధికారులు విచారణ ఎదుర్కోవాలి తాము సేకరించిన ఆధారాల ప్రకారం ఒకే పనిని మూడు, నాలుగు రకాలుగా చూపుతూ బిల్లులు చేశారని సంబంధిత అధికారులు విచారణను ఎదుర్కోక తప్పదని కాకాణి పేర్కొన్నారు. పని జరిగే ప్రాంతం ఒకటే అయినా పేర్లు మార్చి మోసాలకు పాల్పడుతున్నట్టు వెల్లడించారు. కనుపూరు కాలువ మనుషులతో చేయించాలని కి.మీ పనులకు రూ.10 లక్షల వంతున అంచనా వేసి డోజర్ (జేసీబీ)తో కాలువకు ఇరువైపులా మట్టిని నెట్టి పూడికతీత పనులు పూర్తి చేసినట్టు దొంగ బిల్లులు సృష్టించి దోచుకున్నట్టు చెప్పారు. ప్రతి సీజన్లో రైతులే కాలువల పనులు చేపడుతున్నారని ప్రభుత్వం నుంచి కాంట్రాక్టర్లు వచ్చి పనులు చేసింది లేదని వెల్లడించినట్టు పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో సోమిరెడ్డి ముఠా చేస్తున్న దోపిడీని ఆధారాలతో సహా చూపుతున్నామని, దమ్ము, ధైర్యం ఉంటే కాలువల వద్దకు వారు రావాల్సిందిగా సవాల్ విసిరారు. సాగునీరందక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, గత ప్రభుత్వంలో కాలువల పనులను ముమ్మురంగా చేపట్టినట్టు వెల్లడించారు. నీరు – చెట్టును పోలిన అవినీతి 2014 – 19 మధ్య టీడీపీ నేతలు నీరు – చెట్టు పథకంలో ఎలాగైతే దోచుకున్నారో ఇప్పుడు కూడా అదే తరహాలో దోపిడీకి పాల్పడుతున్నట్టు కాకాణి తెలిపారు. గతంలో జరిగిన పనులకు విజిలెన్స్ విచారణ పేరుతో సాగదీస్తున్నారని ఇప్పటి వరకు నివేదిక బయటకు రాలేదన్నారు. సర్వేపల్లి రిజర్వాయర్ రిపేర్లకు గతంలో రూ.12 కోట్లు మంజూరైతే ఆ పనులు పూర్తి కాకుండానే ఇప్పుడు మరో రూ.50 కోట్లు దోపిడీకి సోమిరెడ్డి తెరలేపినట్టు విమర్శించారు. ఇరిగేషన్ పనులపై విజిలెన్స్ విచారణ జరిపిస్తే అన్ని విషయాలు వెలుగు చూస్తాయన్నారు. షట్టర్లు బిగించడంలో అవినీతి జరిగిందని సోమిరెడ్డి గగ్గోలు పెట్టి కమీషన్లు దండుకున్నట్టు తెలిపారు. దొంగ బిల్లులు చేసే అధికారులు మాత్రం విచారణను ఎదుర్కొని ఇబ్బందులకు గురికాక తప్పదన్నారు. ఇరిగేషన్ మంత్రి రామానాయుడు కమీషన్లు దండుకోవడం మానేసి వాస్తవాలపై విచారణ జరిపించాల్సిందిగా డిమాండ్ చేశారు. కాకాణి వెంట మండల పార్టీ కన్వీనర్ మెట్టా విష్ణువర్ధన్‌రెడ్డి, ఎంపీపీ సుగుణ, నెల్లూరు శివప్రసాద్, రైతులున్నారు. -
ఆర్టీసీ ప్రైవేటీకరణకు చంద్రబాబు కుట్రలు
● నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి వాకాడు: ఆర్టీసీని ప్రైవేటీకరించేందుకు చంద్రబాబు ప్రభుత్వం చాపకింద నీరులా కుట్ర చేస్తుందని వైఎస్సార్సీపీ వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. ఆయన ఆదివారం వాకాడులోని తన నివాసంలో కోట, వాకాడు, చిట్టమూరు మండలాల నేతలు, కార్యకర్తలు, స్థానికులతో సమావేశమయ్యారు. ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గాలను పలు గ్రామాల ప్రజలు రామ్‌కుమార్‌రెడ్డికి విన్నవించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యుత్ బస్సుల ముసుగులో చంద్రబాబు తన కుతంత్నాన్ని మరింత వేగం పెంచారన్నారు. 2024లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఆర్టీసీని నిర్వీర్యం చేస్తోందన్నారు. ఈ విషయమై పలు సంఘాలు, ప్రజలు తీవ్ర వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నారన్నారు. కోట, చిట్టమూరు, వాకాడు మండలాల ప్రజలు రామ్‌కుమార్‌రెడ్డిని కలిసి వాకాడు డిపోను తొలగిస్తే జరిగే నష్టాలను వివరించారు. డిపోను ఎత్తేస్తే ప్రజలతో కలిసి ఉద్యమాలు చేయడానికి వెనుకాడబోమని రామ్‌కుమార్‌రెడ్డి హెచ్చరించారు. రాబోయే రోజుల్లో చంద్రబాబు ప్రభుత్వానికి ప్రజలు దిమ్మతిరిగే సమాధానం చెబుతారన్నారు. వాకాడు గొల్లపాళెం గ్రామానికి చెందిన పాపారెడ్డి మనోజ్‌కుమార్‌రెడ్డి రామ్‌కుమార్‌రెడ్డిని కలిసి తమ గ్రామంలో 19వ తేదీన జరిగే మహాలక్ష్మి అమ్మవారి ఉత్సవాలకు ఆహ్వానించారు. -
పోలీసుల దర్యాప్తు ముమ్మరం
పొదలకూరు: పట్టణంలోని గేటుసెంటరు ప్రాంతానికి చెందిన పడ్డాల వేమయ్య (65) మృతిపై కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆ దశగా ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. పట్టణానికి సమీపంలోని చిట్టేపల్లి చెరువు వద్ద కొందరు శుక్రవారం సాయంత్రం పార్టీ చేసుకున్నట్టు తెలిసింది. దీనికి వేమయ్యను పిలవడంతో వెళ్లాడు. అక్కడికి వచ్చిన వారిలో ఫర్టిలైజర్స్ కంపెనీకి చెందిన ఓ ప్రతినిధి, నెల్లూరు నగరానికి చెందిన ఇద్దరు వ్యక్తులు, పొదలకూరులో వ్యాపారం చేస్తున్న మరో వ్యక్తి ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. వేమయ్య వెళ్లిన తర్వాత గొడవ జరిగినట్టుగా చెబుతున్నారు. ఈ సమయంలో గ్రామానికి చెందిన ఒకరిద్దరు కూడా చూశారని తెలుస్తోంది. దీనికితోడు వేమయ్య తలపై గాయాలు ఉండటం వల్ల హత్యగా అనుమానించాల్సి వస్తోందంటున్నారు. అందరికీ సుపరిచితుడైన వేమయ్య మృతదేహం చెరువులో తేలడంపై పట్టణంలో చర్చ జరుగుతోంది. రౌడీషీటర్‌పై పీడీ యాక్ట్నెల్లూరు సిటీ: కలెక్టర్ హిమాన్షు శుక్లా ఉత్తర్వుల మేరకు వేదాయపాళెం పోలీసులు రౌడీషీటర్ షేక్ రసూల్‌పై పీడీ యాక్ట్ ప్రయోగించారు. ఆ స్టేషన్ పరిధిలో బుజబుజనెల్లూరులో నివాసం ఉంటున్న రసూల్‌పై గతంలో ఒక హత్య, నాలుగు హత్యాయత్నం, మూడు కొట్లాట, రెండు దోపిడీ కేసులున్నాయి. ఆదివారం అతడిని నెల్లూరు జిల్లా జైలు నుంచి కడప జైలుకు తరలించారు. ఈ సందర్భంగా ఎస్పీ అజిత మాట్లాడుతూ జిల్లాలో హత్యలు, దోపిడీలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుని పీడీ యాక్ట్‌లు ప్రయోగిస్తామన్నారు. రైలు ఢీకొని వృద్ధుడి మృతి నెల్లూరు సిటీ: పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొని గుర్తుతెలియని వృద్ధుడు మృతిచెందిన ఘటన ఆదివారం చోటు చేసుకుంది. రైల్వే పోలీసుల కథనం మేరకు.. నెల్లూరు – పడుగుపాడు రైల్వేస్టేషన్ల మధ్య 65 – 70 సంవత్సరాల మధ్య వయసున్న వృద్ధుడు పట్టాలు దాటుతున్నాడు. ఈ సమయంలో రైలు ఢీకొంది. వృద్ధుడు తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతిచెందాడు. బులుగు రంగు చొక్కా, గళ్ల లుంగీ ధరించి ఉన్నాడు. చేతి కర్ర ఉంది. రెండు మోకాళ్లకి క్యాపులు ధరించి ఉన్నారు. రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జీజీహెచ్‌కి తరలించారు. రైల్వే ఎస్సై హరిచందన కేసు నమోదు చేశారు. చికెన్ వ్యర్థాలు తరలిస్తుండగా..● వాహనాల పట్టివేత వెంకటాచలం: చికెన్ వ్యర్థాలను తరలిస్తున్న రెండు వాహనాలను వెంకటాచలం టోల్‌ప్లాజా వద్ద పోలీసులు ఆదివారం ఉదయం పట్టుకున్నారు. టోల్‌ప్లాజా వద్ద తనిఖీలు చేస్తుండగా.. చైన్నె వైపు నుంచి నెల్లూరు వైపు వెళ్తున్న రెండు వాహనాలను ఆపి పరిశీలించారు. అందులో చికెన్ వ్యర్థాలు ఉన్నట్లుగా గుర్తించారు. వాహనాలను సీజ్ చేసి కేసు నమోదు చేశారు. కదులుతున్న రైలు ఎక్కబోయి..● గుర్తుతెలియని వ్యక్తి మృతి చిల్లకూరు(గూడూరుటౌన్): గూడూరు రైల్వే స్టేషన్ ఒకటో నంబర్ ప్లాట్‌ఫారంపై కదులుతున్న రైలు ఎక్కబోయి జారి పడి గాయాలపాలైన ఓ వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. రైల్వే పోలీసుల కథనం మేరకు.. భువనేశ్వర్ నుంచి తిరుపతికి వెళుతున్న రైలు గూడూరు స్టేషన్‌కు ఆదివారం ఉదయం ఆరు గంటలకు చేరుకుంది. సుమారు 48 సంవత్సరాల వయసున్న గుర్తుతెలియని వ్యక్తి దిగాడు. రైలు కదులుతున్న సమయంలో పరుగెడుతూ ఎక్కే క్రమంలో కాలు జారి రైలు, ప్లాట్ఫారానికి మధ్యలో పడిపోయాడు. దీంతో అతడికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో గూడూరు ఏరియా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయాడు. మృతుడిని ఒడిశా వాసిగా చెబుతున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆస్పత్రిలో ఉంచారు. శ్రీవారి దర్శనానికి 18 గంటలుతిరుమల: తిరుమలలో ఆదివారం భక్తుల రద్దీ అధికంగా ఉంది. క్యూ కాంప్లెక్స్‌లోని కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. క్యూలైన్ శిలాతోరణం వద్దకు చేరింది. శనివారం అర్ధరాత్రి వరకు 90,011 మంది స్వామిని దర్శించుకున్నారు. 39,083 మంది తలనీలాలు అర్పించారు. కానుకల రూపంలో హుండీలో రూ.3.76 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టికెట్లు లేని వారికి 18 గంటలు, ప్రత్యేక టికెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు. -
రెడ్‌క్రాస్ పాలనలో స్వల్ప మార్పులు
నెల్లూరు(అర్బన్): ఇండియన్ రెడ్‌క్రాస్ జిల్లా కమిటీ పాలకవర్గం ఈనెల 14వ తేదీతో ముగిసింది. ఎన్నికలు నిర్వహించకపోవడంతో అదేరోజు డీఆర్వో విజయకుమార్‌ను ప్రత్యేకాధికారిగా నియమిస్తూ కలెక్టర్ హిమాన్షు శుక్లా ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికలు జరిగే వరకు రెడ్‌క్రాస్ కోశాధికారి, రెడ్‌క్రాస్ సెక్రటరీతో సమన్వయం చేసుకుంటూ ముగ్గురు కలిసి రోజు వారి విధులు నిర్వర్తించాలని డీఆర్వోని ఆదేశించారు. అయితే కలెక్టర్ ఉత్తర్వులపై రెడ్‌క్రాస్ రాష్ట్ర జనరల్ సెక్రటరీ, సీఈఓ ఏకే ఫరీదా రెడ్‌క్రాస్ పాలనలో స్పల్ప మార్పులు చేయాలని సూచించారు. కోశాధికారి కూడా రెడ్‌క్రాస్‌లో ఎన్నికై న పాలకవర్గ సభ్యుడు. ఆ సభ్యుడు పదవీకాలం ముగిసినందున బాధ్యతలు కూడా ముగిసినట్టేనని తెలిపారు. అందువల్ల స్పెషలాఫీసర్‌గా నియమితులైన డీఆర్వోతోపాటుసెక్రటరీగా పనిచేస్తున్న మస్తానయ్యకు మాత్రమే రోజువారీ వ్యవహారాలు నిర్వహించే అధికారాన్ని ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. కొత్త జిల్లా శాఖ మేనేజింగ్ కమిటీ ఏర్పాటయ్యేవరకు రెడ్‌క్రాస్ జిల్లా శాఖకు చెందిన బ్యాంక్ ఖాతాలను ఉమ్మడిగా నిర్వహించేందుకు వారిద్దరికీ మాత్రమే అనుమతించాలని కోరారు. దీంతో రెడ్‌క్రాస్‌లో మళ్లీ మార్పులు జరిగి ప్రత్యేకాధికారి, సెక్రటరీలు బాధ్యతలు నిర్వర్తించనున్నారు.నిమ్మ ధరలు (కిలో) పెద్దవి : రూ.100 సన్నవి : రూ.40 పండ్లు : రూ.20 -
తిరుపతి ఎంపీకి ఘోర అవమానం
● ప్రోటోకాల్ ఉల్లంఘించిన అధికారులు ● శిలాఫలకాల్లో కానరాని ఎంపీ గురుమూర్తి పేరు చిల్లకూరు: గూడూరు పట్టణంలో అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా ఆదివారం ఎమ్మెల్యే సునీల్ ప్రారంభించిన కూరగాయల మార్కెట్, పీహెచ్సీ భవనం శిలాఫలకాల్లో తిరుపతి ఎంపీ మద్దెల గురుమూర్తి పేరును నమోదు చేయకుండా ప్రోటోకాల్‌ను ఉల్లంఘించారు. కేంద్ర ప్రభుత్వంలోని ఎన్హెచ్ఎం నిధులతో పాటు మున్సిపాలిటీ నిధులతో ఆస్పత్రి భవనం నిర్మించడం గమనార్హం. ప్రోటోకాల్ ప్రకారం ప్రజాప్రతినిధులను గౌరవిస్తూ పేర్లు నమోదు చేయాల్సిన అధికారుల అత్యుత్సాహమో, బాధ్యతా రాహిత్యమో తెలియదు కానీ గూడూరు నియోజకవర్గానికి ఏ మాత్రం సంబంధం లేని నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి పేరును మాత్రం శిలాఫలకంలో వేయించి, తిరుపతి ఎంపీ గురుమూర్తి పేరును వేయకుండా ఘోరంగా అవమానించారంటూ దళిత సంఘాలు మండిపడుతున్నాయి. అయితే ఆయా కార్యక్రమాలకు ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్‌తోపాటు, తిరుపతి ఎంపీ గురుమూర్తికి ఆహ్వాన పత్రికలు కూడా పంపకపోవడం దళిత ఎమ్మెల్యేగా ఉండి దళిత ప్రజాప్రతినిధులను అవమానించడం దారుణమన్నారు. గూడూరు మున్సిపల్ ప్రత్యేకాధికారిగా వ్యవహరించే గూడూరు ఆర్డీఓ సత్యనారాయణ కూడా శిలాఫలకాల ప్రోటోకాల్‌పై ప్రశ్నించకపోవడం విమర్శలకు తావిస్తుంది. రేపు సీఎం జిల్లా పర్యటన నెల్లూరురూరల్: సీఎం చంద్రబాబు ఈ నెల 19న జిల్లాలో పర్యటించనున్నారని కలెక్టర్ హిమాన్షు శుక్లా ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 9 గంటలకు ఉండవల్లిలోని నివాసం నుంచి హెలికాప్టర్లో బయలుదేరి 10 గంటలకు కావలి మండలం తుమ్మలపెంటకు చేరుకుంటారన్నారు. ఇక్కడ మత్స్యకారుల సేవలో కార్యక్ర మం అనంతరం 12.45 గంటలకు మత్స్యకారులతో ముఖాముఖిలో పాల్గొంటారు. మధ్యాహ్నం 1.30 నుంచి 3 గంటల వరకు పార్టీ కేడర్ సమావేశంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 3.15 గంటలకు హెలికాప్టర్లో చిత్తూరు జిల్లాకు వెళ్తారని కలెక్టర్ వివరించారు. -
పదో తరగతి విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ
● డిప్యూటీ డీఈఓ వెంకటేశ్వర నాయక్ కోవూరు: పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ప్రత్యేక తరగతులను పూర్తిస్థాయిలో వినియోగించుకుని ఉత్తీర్ణత సాధించాలని డిప్యూటీ డీఈఓ వెంకటేశ్వర నాయక్ సూచించారు. కోవూరులోని పచ్చిపాల రామనాథమ్మ జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న శిక్షణ తరగతులను ఆదివారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నెల్లూరు – 3 డివిజన్ పరిధిలోని పలు మండలాలకు చెందిన 1,095 మంది విద్యార్థులు ఈనెల 20వ తేదీ నుంచి జరిగే సప్లిమెంటరీ పరీక్షలకు హాజరుకానున్నట్లు తెలిపారు. ఇందుకోసం ఎంపిక చేసిన ఉన్నత పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయుల పర్యవేక్షణలో సంబంధిత సబ్జెక్ట్ ఉపాధ్యాయులు ప్రత్యేక శిక్షణ అందిస్తున్నారని పేర్కొన్నారు. ప్రతి విద్యార్థి నూరుశాతం ఫలితాలు సాధించేలా ఉపాధ్యాయులు కృషి చేస్తున్నారని చెప్పారు. విద్యార్థులు కూడా క్రమశిక్షణతో తరగతులకు హాజరై సందేహాలను నివృత్తి చేసుకోవాలని సూచించారు. పాఠశాలలో నిర్వహిస్తున్న శిక్షణ, హాజరు వివరాలు, విద్యార్థుల పురోగతిని పరిశీలించారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయిని సోఫియా కిరణ్మయి పాల్గొన్నారు. -
అధికారం ఉంది.. మా ఇష్టం
● అర్ధరాత్రి అక్రమంగా మట్టి తరలింపు ● అడ్డుకున్న కృష్ణపట్నం గ్రామస్తులు ● పోలీసుల పంచాయితీముత్తుకూరు(పొదలకూరు): అధికారాన్ని అడ్డం పెట్టుకుని టీడీపీ నాయకులు ఎక్కడపడితే అక్కడ మట్టి, గ్రావెల్ తరలిస్తున్నారు. ప్రశ్నించిన వారిని బెదిరించడంతోపాటు అక్రమంగా కేసులు పెడుతున్నారు. పగలు, రాత్రి అనే తేడా లేకుండా మట్టిని తరలిస్తున్నా పట్టించుకునే వారు లేరనే విమర్శలున్నాయి. మండలంలోని కృష్ణపట్నం గ్రామంలో శనివారం అర్ధరాత్రి ట్రాక్టర్లలో మట్టిని అక్రమంగా తరలిస్తుండగా పంచాయతీ పరిధిలోని గోపాలపురం గ్రామస్తులు అడ్డుకున్నారు. ముఖ్యనేతల అండదండలతోనే మట్టిని తరలిస్తున్నట్టు గ్రామస్తులు వెల్లడించారు. అయితే మట్టి మాఫియా పోలీసులకు సమాచారం అందజేయడంతో వారు ఘటనా స్థలానికి వెళ్లి పంచాయితీ చేశారు. అలాగే మాట వినని గ్రామస్తులను బెదరగొట్టి ట్రాక్టర్లను విడిపించి పంపారు. మట్టి తరలింపును అడ్డుకోవాల్సిన పోలీసులే ఇలా చేయడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ట్రాక్టర్ మట్టి డిమాండ్‌ను బట్టి రూ.1,200 నుంచి రూ.1,500 వంతున అమ్ముకుంటున్నట్టు తెలుస్తోంది. జేసీబీకి ఇందులో ట్రిప్పునకు రూ.200 వంతున చెల్లిస్తున్నారు. ఇందుకోసం ఎవరి వద్ద ఎలాంటి అనుమతులు తీసుకోవడం లేదు. కలెక్టర్, ఎస్పీ చొరవ తీసుకుని చర్యలు తీసుకోవాల్సిందిగా గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు. -
ఏం న్యాయం చేశారు?
● ఉదయగిరి ఎమ్మెల్యేపై ఆగ్రహం కొండాపురం: ‘దళితులపై దాడి చేసి, ఒక వ్యక్తిని హత్య చేసి బావిలో వేసిన వారిపై ఇప్పటికి ఎలాంటి చర్యలు తీసుకోలేదు. మాకు ఏం న్యాయం చేశారు’ అని గానుగపెంట ఎస్సీ కాలనీకి చెందిన జడ రసూల్, హజరత్ కుటుంబ సభ్యులు, ఎమ్మార్పీఎస్ నాయకులు ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్‌ను నిలదీశారు. రసూల్ మృతదేహానికి పోస్టుమార్టం అనంతరం ఆదివారం కావలి నుంచి గానుగపెంటకు తీసుకొచ్చారు. పరామర్శకు వచ్చిన సురేష్‌పై కాలనీ వాసులు, ఎమ్మార్పీఎస్ నాయకులు ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ పార్టీని నమ్మి ఓట్లు వేసి గెలిపించినందునందుకు తగిన శాస్తి చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రసూల్‌ను తమ గ్రామ టీడీపీ నాయకుడు కిలారి నరేంద్ర తీసుకెళ్లి దగ్గరుండి వారి చేతుల్లో పెట్టి హత్య చేయించాడని, అతడిని వెంటనే అరెస్ట్ చేసి శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే రసూల్, హజరత్‌పై దాడి చేసిన 15 మందిని అరెస్ట్ చేసి రిమాండ్‌కి పంపాలని కోరారు. అనంతరం మాజీ జెడ్పీటీసీ సభ్యుడు దామా మహేశ్వరరావుపై కూడా కాలనీవాసులు ఆగ్రహించారు. ఊరికి ఒక యువ నాయకుడి పేరుతో రౌడీయిజం చేయిస్తున్నావని.. నీ వల్లే మండలం హత్యాకాండలతో మారు మోగిపోతుందని.. మండలంలో కనిపిస్తే నీ అంతు చూస్తామని హెచ్చరించారు. ఎమ్మెల్యే స్పందిస్తూ రెండు, మూడు రోజుల్లో నిందితులను అరెస్ట్ చేయిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం రసూల్ కుటుంబ సభ్యులకు రూ. 50 వేల ఆర్థిక సహాయం చేశారు. -
దమ్ముంటే అడ్డుకోండి చూద్దాం
● సవాల్ విసురుతున్న మట్టి, గ్రావెల్ మాఫియా ● ఇష్టారాజ్యంగా చెరువులో తవ్వకాలు చిట్టమూరు: మండల పరిధిలోని మొలకలపూడి చెరువులో ఆదివారం కూడా కూటమి నాయకులు అక్రమంగా గ్రావెల్, మట్టిని తరలిస్తున్నారు. ఇదేమని అడిగితే దౌర్జన్యం చేస్తున్నారని ఆయకట్టు రైతులు భయాందోళనకు గురవుతున్నారు. ఇంత తంతు జరుగుతున్నా ఇరిగేషన్ అధికారులు మాత్రం కన్నెత్తి కూడా చూడకపోవడం విమర్శలకు తావిస్తుంది. చెరువులో రెండు యంత్రాలు పెట్టి టిప్పర్లకు నింపి సాగరమాల రోడ్డుకు తోలుకుని సొమ్ము చేసుకుంటున్నారు. మట్టిని చెరువు తూముల కంటే లోతుకు ఎత్తి వేయడంతో చెరువులోని సాగునీరు పొలాలకు పారే పరిస్థితి లేదని అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొలకలపూడి చెరువు గొలుసుకట్టు చెరువు. దీని కింద నాలుగైదు చెరువులకు నీరు సరఫరా అవుతుంది. ఈ విషయంపై గ్రామ వీఆర్వో భక్తవత్సలరెడ్డిని వివరరణ కోరగా చెరువులో గ్రావెల్, మట్టి తోలకాలకు ఎటువంటి అనుమతుల్లేవన్నారు. ఆపేవారే లేరా? మండలంలో కూటమి నాయకులు అధికారాన్ని అడ్డుపెట్టుకుని అధికారులపై ఒత్తిళ్లు తెస్తూ మట్టి, ఇసుక, గ్రావెల్ తవ్వకాలు చేస్తున్నారు. ఆలయాల నిర్మాణాల పేరు చెప్పి చెరువుల్లో మట్టిని అమ్ముకుని జేబులు నింపుకొంటున్నారు. చెరువు కట్టలపై ఉన్న కలపను కూడా నరికి అమ్ముకుంటున్నట్లు ఆరోపిస్తున్నారు. -
రెండేళ్లలో 7,685 మంది లబ్ధిదారులకు మొండి చేయి
నెల్లూరు (వేదాయపాళెం): మత్స్యకారులకు సంక్షేమ పథకాల అమలు విషయంలో సీఎం చంద్రబాబు నిజ స్వరూపం మరోసారి బట్టబయలైంది. ఏటా గంగపుత్రులకు వేట నిషేధ కాలంలో మత్స్యకార భరోసాగా రూ.20 వేలిస్తామని హామీ ల్చిన చంద్రబాబు.. తొలి ఏడాది ఎగనామం పెట్టారు. రెండో ఏడాదిలో ఈ పథకాన్ని అమలు చేసినా.. గతంలోని లబ్ధిదారుల సంఖ్యను భారీగా కుదించారు. జిల్లాలోని కావలి మండలం తుమ్మలపెంటలో ఈ నెల 19న చంద్రబాబు ‘మత్స్యకారుల సేవలో’ పథకం ద్వారా అందించనున్న లబ్ధిదారుల జాబితాలో పలువురి అర్హుల ఏరివేత ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. అలవికానీ హామీలిచ్చి.. ఆరు దశల వెరిఫికేషన్‌తో.. అధికారంలోకి వచ్చేందుకు ఆర్భాటపు ప్రకటనలు, అలవికాని హామీల్చినా చంద్రబాబు సంక్షేమ పథకాల లబ్ధి చేకూర్చే విషయంలో సవాలక్ష నిబంధనలు విధించి అర్హులను నిర్ధాక్షిణ్యంగా తొలగించి దగా చేస్తోంది. లబ్ధిదారులను భారీగా కుదించేందుకు.. వేట నిషేధం ప్రారంభమయ్యే రోజు ఏప్రిల్ 14వ తేదీ నాటికి లైసెన్స్ రెన్యూవల్ అయి ఉండాలని, వేట చేసే బోటుకు జరిమానా విధించి ఉండకూడదని నిబంధనలు పెట్టింది. కుటుంబంలో ఒకరికి మాత్రమే ఈ భరోసా వర్తిస్తుందని, వేట చేసే మత్స్యకారుడికి 18 నుంచి 60 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలని, లబ్ధిదారుల కుటుంబంలో ఎవరైనా సరే సామాజిక పింఛన్ తీసుకుంటుంటే ఆ కుటుంబానికి ఈ పథకం వర్తించదని, విద్యుత్ 200 యూనిట్లు కంటే ఎక్కవ వాడకూడదని, నాలుగు చక్రాల వాహనం ఉండకూడదంటూ, మోటారైజ్డ్ బోటులో ఆరుగురు, సంప్రదాయ పడవలో ముగ్గురు మాత్రమే వేట సాగిస్తూ ఉండాలంటూ చివరాఖరులో నిబంధనలు పెట్టింది. ఈ నేపథ్యంలో జిల్లాలో 13,108 మంది మత్స్యకారులు మత్స్యకారుల సేవలో పథకానికి గంపెడాశతో దరఖా స్తు చేసుకున్నారు. అయితే ఆరు దశల పరిశీలన (సిక్స్ స్టేజ్ వెరిఫికేషన్)లో వివిధ సాకులు చూపించి 1,464 మంది దరఖాస్తులను తిరిస్కరించింది. చివరకు 11,644 మంది లబ్ధిదారులను ఎంపిక చేసింది. మత్స్యకారుల సేవలో 7,685 మంది లబ్ధిదారులకు కోత వైఎస్సార్సీపీ పాలనలో 19,329 మందికి లబ్ధి కూటమి ప్రభుత్వంలో తొలి ఏడాది భరోసా ఎగనామం రెండో ఏడాది అమలు చేసినా.. 12,192 మందికే సాయం మూడో ఏడాదిలో భారీగా లబ్ధిదారుల కుదింపు గతేడాది లబ్ధి పొందిన 548 మంది ఈ ఏడాది అర్హుల జాబితా నుంచి ఔట్ 11,644 మందిని అర్హులుగా తేల్చిన చంద్రబాబు సర్కారు గత ప్రభుత్వం ఎంతో ఘనం గత సర్కారు అన్ని వర్గాల పేదలను ఆదరించి అక్కున చేర్చుకుందని, పేదలను గుర్తించి వారికి అన్ని విధాలా సహాయ సహకారాలు అందించిందని ప్రజలు నేటికీ వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వాన్ని గుర్తు చేసుకుంటున్నారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పార్టీలకతీతంగా పేదలందరికీ అన్ని పథకాలు వర్తింప చేశారని కొనియాడుతున్నారు. ఆయన సీఎంగా ఉన్నప్పుడు ఏ సంక్షేమ పథకానికై నా తుది గడువు అంటూ ఉండేది కాదని, లబ్ధిదారుల జాబితా ప్రకటించి నగదు విడుదల చేసిన తర్వాత కూడా అర్హత ఉండి సాయం అందని పేదలు మరోసారి దరఖాస్తు చేసుకునే వీలు కల్పించి మరీ సాయం అందించారంటూ కీర్తిస్తున్నారు. గత నెలలో కలెక్టర్ హిమాన్షు శుక్లా ఆధ్వర్యంలో నిర్వహించిన నాలుగు జిల్లాల మత్స్యకారుల సదస్సులో మత్స్యకారులు కలెక్టర్ ఎదుటే బహిరంగంగా చేసిన వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఇది గత ప్రభుత్వ పాలనా దక్షతకు, మెరుగైన పనితీరుకు నిదర్శనంగా నిలుస్తోంది. చంద్రబాబు అంటేనే మోసం. వెన్నుపోటుకు బ్రాండ్ అంబాసిడర్ ఆయనే. మత్స్యకారుల సేవలో పథకం ఆయన మోసానికి, వెన్నుపోటుకు అద్దం పడుతోంది. గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ నాడు మత్స్యకారుల సంక్షేమానికి, అభివృద్ధికి ఎటువంటి చర్యలు తీసుకున్న పాపాన పోలేదు. వేట నిషేధ కాలంలో పరిహారం అందించడంలోనూ ‘పచ్చ’ పాతం చూపించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి లబ్ధిదారుల ఎంపికలోనూ, పరిహారం అందించడంలోనూ ఉదారంగా వ్యవహరిస్తే.. అంతకు మించి మత్స్యకారులకు భరోసా కల్పిస్తానని తొలి ఏడాది ఎగనామం పెట్టి మోసం చేశాడు. రెండో ఏడాదికి వచ్చే సరికి అర్హులను భారీగా కుదించారు. తాజాగా మూడో ఏడాదిలో ఇంకా మరికొంత మందిని తొలగించి వెన్నుపోటు పొడిచారు. అర్హులందరి ఖాతాలో రూ.20వేలు ఈ నెల 19న జిల్లాలోని అర్హులైన మత్స్యకారులందరి ఖాతాల్లో రూ.20 వేలు జమ అవుతాయి. జిల్లాలో అర్హులైన లబ్ధిదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించాము. ప్రభుత్వ నిబంధనల మేరకు ఆరు దశల వెరిఫికేషన్ ప్రక్రియ తర్వాత తుదిగా 11,644 మంది లబ్ధిదారులను మత్స్యకార సేవలో పథకానికి అర్హులుగా గుర్తించాము. – శాంతి, మత్స్యశాఖ జాయింట్ డైరెక్టర్ జిల్లాలోని కావలి, బోగోలు, అల్లూరు, విడవలూరు, ఇందుకూరుపేట, తోటపల్లిగూడూరు, ముత్తుకూరు, కోట, చిల్లకూరు తీరప్రాంత మండలాల్లో వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో 19,329 మంది లబ్ధిదారులకు ఏటా రూ.10 వేల లెక్కన వైఎస్సార్ మత్స్యకార భరోసా సాయం అందించింది. తాము అధికారంలోకి వస్తే రెట్టింపు మొత్తంలో భరోసా సాయాన్ని అందిస్తామని చెప్పిన చంద్రబాబు తొలి ఏడాది పూర్తిగా ఎగ్గొట్టేశారు. రెండో ఏడాది (గతేడాది)లో పథకాన్ని అమలు చేసినా.. 12,192 మందికే లబ్ధి చేకూర్చగా ఈ ఏడాది మరో 548 అర్హులను జాబితా నుంచి తొలగించి 11,644 మందితో లబ్ధిదారుల జాబితాను ప్రకటించడంతో మత్స్యకారులు జీర్ణించుకోలేకపోతున్నారు. మొత్తానికి రెండేళ్లల్లో 7,685 మంది లబ్ధిదారులను ఏరివేయడం చంద్రబాబు సర్కారుకే దక్కుతోంది. -
పెట్రో మంట.. నెలకు రూ.100 కోట్లు
నెల్లూరు (పొగతోట): ఇంధన డిమాండ్ నేపథ్యంలో కేంద్రం పెంచిన పెట్రో మంట ప్రభావంతో జిల్లాలో నెలకు రూ.100 కోట్ల జనం జేబులకు చిల్లులు పడుతున్నాయి. దేశ వ్యాప్తంగా ఉండే ధరల కంటే గతంలో చంద్రబాబు ప్రభుత్వం అత్యధిక ట్యాక్స్ విధించింది. దీంతో జిల్లాలో మిగతా రాష్ట్రాలతో పోల్చినప్పుడు రూ.10 అదనంగా ఉంది. అయితే వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై ఈ నెపం నెట్టి చంద్రబాబు, లోకేశ్‌లు దుష్ప్రచారం చేశారు. ఎన్నికల ముందు కూటమి అధికారంలోకి వస్తే పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తామంటూ ఆర్భాటంగా హామీలు గుప్పించారు. అధికారం దక్కాక ఆ ఊసే మరిచిపోయారు. తాజాగా కేంద్రం పెట్రోల్ ధరలు పెంచిన నేపథ్యంలోనూ రాష్ట్రంలో ధరలు తగ్గించకపోగా, పెరిగిన ధరలతోనే విక్రయాలు జరుపుతోంది. ప్రస్తుతం లీటర్ పెట్రోల్, డీజిల్ ధరలు రూ.వందకు దిగువన ఉంటే.. జిల్లాలో మాత్రం పెట్రోల్ రూ.113.62, డీజిల్ రూ. 101.24 ధరలు ఉన్నాయి. కూరగాయలు, నిత్యావసర ధరలు జంప్ పెట్రోలు, డీజిల్ ధరల ప్రభావంతో కూరగాయలు, నిత్యావసర సరుకుల ధరల ఆకాశాన్నంటుతున్నాయి. కేజీ కందిపప్పు రూ.130 నుంచి రూ.140, మినపప్పు రూ.120 నుంచి రూ.130లకు, నూనె రూ.160 నుంచి రూ.170 పెరిగాయి. ఇక కూరగాయల ధరలు టమాటా కేజీ రూ.40 నుంచి రూ.50, వంకాయలు రూ.60 నుంచి రూ.70 ధరలు పలుకుతున్నాయి. కూట మి ప్రభు త్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ధరల మోతతో సామాన్య ప్రజలకు చుక్కలు కనిపిస్తున్నాయి. ధర లు పెంచమంటూనే ప్రభుత్వం అన్ని ధరలను పెంచుకుంటూ పోతుంది. జిల్లా ప్రజలపై అదనపు భారం పెట్రోలు, డీజిల్ ధరల పెరగడంతో జిల్లా ప్రజలపై అదనపు భారం పడుతోంది. జిల్లాలో 250కి పైగా పెట్రోల్ బంకులు నిత్యం 5 లక్షల లీటర్ల పెట్రోల్, 7 లక్షల లీటర్ల డీజిల్ విక్రయాలు జరుగుతున్నాయి. వీటిపైనే నెలకు జిల్లా ప్రజలపై ప్రత్యక్షంగా రూ.11.67 కోట్ల పైగా భారం పడుతుండగా, పరోక్షంగా రవాణా రంగంపై పడిన భారంతో పెరుగుతున్న నిత్యావసరాలు, కూరగాయల ధరలతో సుమారు రూ.100 కోట్లపైనే ప్రజల జేబులకు చిల్లులు పడుతున్నట్లు అంచనా. ఇప్పటికే కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు అమాంతం పెరగడంతో దాని ప్రభావంతో హోటల్స్, రెస్టారెంట్లు, చిన్న చిన్న టిఫిన్ అంగళ్లలో ఆహార పదార్థాల ధరలూ పెరిగాయి. నేడు వైఎస్సార్సీపీ నిరసనలు : కాకాణి పెట్రోల్, డీజిల్ ధరల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం వైఖరిని నిరసిస్తూ సోమవారం జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో నిరసనలు చేపడుతున్నట్లు మాజీమంత్రి, పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి తెలిపారు. తహసీల్దార్లు, ఆర్డీఓలు, కలెక్టరేట్ల ఎదుట ధర్నాలు నిర్వహించి, పెట్రోల్, డీజిల్ ధరలపై రాష్ట్ర ప్రభు త్వం మోసపూరిత వాగ్దానాలను ఎండగట్టాలని పేర్కొన్నారు. నిరసన కార్యక్రమాల్లో వైఎస్సార్సీపీ సమన్వయకర్తలు, నాయకులు, కార్యకర్తలు, ప్రజలతో కలిసి పోరాటం చేయాలన్నారు. కూరగాయలు, నిత్యావసర ధరలపై ప్రభావం రవాణా రంగంపై అదనపు భారం కూటమి అధికారంలోకి వస్తే తగ్గిస్తామని.. రెండేళ్లుగా మౌనం తాజా పెరుగుదలపై కూడా మారుమాట్లాడని వైనం రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు పిలుపునిచ్చిన వైఎస్సార్సీపీ నేడు నియోజకవర్గ కేంద్రాలు, కలెక్టరేట్ వద్ద నిరసనలు : కాకాణి -
పొగాకు రైతులపై ఎందుకీ పగ?
మర్రిపాడు/పొదిలి/ఒంగోలు సబర్బన్: శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా డీసీపల్లి పొగాకు వేలం కేంద్రంలో రైతులు శనివారం ధర్నాకు దిగారు. గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ వేలాన్ని నిలిపివేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. వేలం ప్రారంభ సమయంలో కిలో ధర రూ.250 వరకు పలికిన ధర, ఆపై రూ.235లో కొనసాగుతోందన్నారు. దీనివల్ల ఎకరాకు రూ.20 వేల నుంచి రూ.50 వేల వరకు నష్టం వస్తోందన్నారు.బోర్డు అనుమతి మేరకు తీసుకొచ్చిన పొగాకును కూడా బయ్యర్లు పూర్తిగా కొనుగోలు చేయకుండా వెనక్కి పంపిస్తున్నారని తెలిపారు. దీంతో రవాణా ఖర్చులు, గోడౌన్ ఖర్చులు అదనంగా భారం అవుతున్నాయని వాపోయారు. సమాచారం అందుకున్న వేలం నిర్వహణాధికారి సునీల్ రైతులతో మాట్లాడి సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేశారు. బయ్యర్లతో చర్చించి రైతులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. పొదిలిలో వేలం నిలిపివేత మార్కాపురం జిల్లా పొదిలి పొగాకు వేలం కేంద్రంలో శనివారం పొగాకు వేలం నిలిచిపోయింది. నష్టం కలిగిస్తున్న వేలం అవసరం లేదంటూ వేలాన్ని రైతులు అడ్డుకున్నారు. కేజీకి గరిష్టంగా రూ.230, కనిష్టం రూ.195 మాత్రమే పలకడంతో గిట్టుబాటు ధరలు లేవని రైతులు తెలిపారు. పోరాటం ఉధృతం చేస్తాం పొగాకుకు గిట్టుబాటు ధర రాకపోవటంతో రైతులు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తోందని మాజీ మంత్రి, సంతనూతలపాడు నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇన్చార్జి మేరుగు నాగార్జున ఆందోళన వ్యక్తం చేశారు. ప్రకాశం జిల్లా ఒంగోలు–2 వేలం కేంద్రాన్ని ఒంగోలు నియోజకవర్గ పార్టీ ఇన్చార్జి చుండూరి రవిబాబు, పార్టీ నేతలతో కలిసి శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైఎస్సార్సీపీ హయాంలో మార్క్‌ఫెడ్‌ను రంగంలోకి దించి వ్యాపారుల మధ్య పోటీ పెంచారని గుర్తు చేశారు. రూ.300 కోట్లు వెచ్చించి పొగాకు రైతులను లాభాల బాట పట్టించారని చెప్పారు. పొగాకు ధరలు ఇదేవిధంగా కొనసాగితే వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. -
అంతర్జాతీయ వేదికపై నెల్లూరీయుల సత్తా
నెల్లూరు (టౌన్): అంతర్జాతీయ కరాటే పోటీల్లో నెల్లూరు క్రీడాకారులు పలు పతకాలతో సత్తా చాటారు. ఉత్తరాఖండ్ రాష్ట్రం హరిద్వార్‌లో ఈనెల 12వ తేదీ నుంచి 14వ తేదీ వరకు ఒకినావన్ కరాటే కోబుడో అసోసియేషన్ ఇంటర్నేషనల్ లీగ్–4 చాంపియన్‌షిప్ 2026 పోటీల్లో వివిధ విభాగాల్లో పలు పతకాలు సాధించి అంతర్జాతీయ వేదికపై తెలుగుజెండాను రెపరెపలాడించారు. కరాటే పోటీల్లో సుశ్రూష నందన, సుశ్మేత, కృష్ణ, నిధిజైన్, దియా అక్తర్, విన్సీ మేధిత, జీవ దర్శిని, హనీష్ శంకర్, లేయాన్, ప్రణయ్, సుశ్వంత్, గురుచరణ్, వినీల్ (బంగారు పతకాలు), లహరి, గుణ విచ్యాత్, మౌనిష్, జైసన్నిత్, హనీష్ (సిల్వర్ పతకాలు), తనివ్హా, పవన్ (కాంస్య పతకాలు) సాధించారు. నెల్లూరుకు చెందిన ప్రముఖ మార్షలార్ట్స్ గురువు, అంతర్జాతీయ బ్లాక్‌బెల్ట్ ఆరో డాన్, షిఫూ మాస్టర్ ప్రభాకర్‌రెడ్డి సారథ్యంలో వీరు పతకాలు సాధించారు. ఆయన ఇప్పటికే 37 గిన్నీస్ వరల్డ్ రికార్డులు సాధించి దేశంలోనే అరుదైన ఘనతను అందుకున్నారు. ఈ సందర్భంగా పతకాలు సాధించిన క్రీడాకారులను అభినందించారు. బంగారు పతకాలను చూపిస్తున్న నెల్లూరు క్రీడాకారులు -
మైనింగ్‌తో పేదల జీవనం వినాశనం
నెల్లూరురూరల్: సర్వేపల్లి నియోజకవర్గ కేంద్రంగా జరుగుతున్న గ్రావెల్, ఇసుక, మట్టి అక్రమ తవ్వకాలతో పేద ప్రజల జీవనాధారాలు నాశనమవుతున్నాయని మాజీమంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. పేదల కడుపు కొట్టి, వారి జీవనాధారాన్ని కూల్చేసి.. మాఫియాలు బొక్కసాలు నింపుకుంటున్నారని ధ్వజమెత్తారు. అక్రమ మైనింగ్, రవాణాతో నిండు ప్రాణాలు బలైపోతున్నా.. కనీసం మానవత్వం లేకుండా యథేచ్ఛగా సహజ సంపదను దోచుకుంటున్నారని మండిపడ్డారు. సర్వేపల్లిలో జరుగుతున్న అక్రమ మైనింగ్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ జిల్లా మైనింగ్‌శాఖ డిప్యూటీ డైరెక్టర్‌ను శనివారం కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం కాకాణి మాట్లాడుతూ గత నెల రోజుల క్రితం తాను కందలపాడు గ్రామానికి వెళ్లినప్పుడు అక్కడ మైనింగ్ మాఫియా దోపిడీ తనను తీవ్రంగా కలచి వేసిందన్నారు. తరతరాలుగా వరి, నిమ్మ తోటలు, చిన్న చిన్న కూరగాయల పంటలు వేసుకుని జీవనం సాగిస్తున్న పేద రైతుల భూముల్లో ఇష్టారాజ్యంగా గ్రావెల్ దోపిడీకి జరుగుతుందని, సోమిరెడ్డి గ్రావెల్ ముఠా కందలపాడు రైతుల జీవనాధారాన్ని దెబ్బతీస్తుందన్నారు. కందలపాడులో మైనింగ్ సంబంధించి గత నెల 30వ తేదీతో ముగిసిపోయిందని, అయినా మైనింగ్‌ను ఎందుకు సాగిస్తున్నారని నిలదీశారు. అక్రమ మైనింగ్ మాఫియా చెలరేగిపోతుందన్నారు. కందలపాడు మైనింగ్‌లో సోమిరెడ్డికి 40 శాతం వాటా ఉందని, నెలకు రూ.15 నుంచి రూ.20 లక్షల వరకు వాటా వెళ్తుందన్నారు. సోమిరెడ్డి అవినీతిని తాను వెల్లడించి... ప్రమాణం చేయమని అడిగా చేయలేదన్నారు. ఏఎంఆర్ సంస్థ ఇష్టారాజ్యం జిల్లాలో నిబంధనలు, అనుమతులతో సంబంధం లేకుండా ఏఎంఆర్ సంస్థ ఇష్టారాజ్యంగా నేరుగా రాయల్టీ వసూలు చేస్తోందన్నారు. చంద్రబాబు, లోకేశ్‌కు నెలవారీ ముడుపులు చెల్లించడానికే ఏఎంఆర్ సంస్థ దోపిడీకి పాల్పడుతుందన్నారు. పేదవాడు తన పొలానికి ఒక ట్రిప్పు మట్టి తోలుకోవాలన్నా లేదా ఇళ్ల నిర్మాణానికి లెవలింగ్ చేసుకోవాలన్న సామాన్యులను పీడిస్తోందన్నారు. మైనింగ్ అనుమతులు లేకుండా ఎక్కడ పడితే అక్కడ తాటి చెట్టు లోతు గుంతలు తవ్వేస్తున్నారని, వాటిల్లో పడి జంతువులు, మనుషులు, ప్రాణాలు కోల్పోతున్నారన్నారు. ఏఎంఆర్ సంస్థ ప్రతినిధులు తమ వాహనాలకు పోలీస్ స్టిక్కర్లు వేసుకుని రోడ్లపై తిరుగుతున్నారని, మైనింగ్, పోలీస్ అధికారులకు ఉండాల్సిన అధికారాలను తమ చేతుల్లోకి తీసుకుని వాహనాలను అడ్డగించి పోలీస్స్టేషన్లకు తరలిస్తున్నారన్నారు. జిల్లాలో విచ్చలవిడిగా అక్రమాలు చేస్తున్న ఏఎంఆర్ సంస్థపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలన్నారు. ఇసుక రీచ్‌ల్లో పెట్రోల్ బంక్ క్యూఆర్ కోడ్‌తో దోపిడీ జిల్లాలో అనంతసాగరం, బుచ్చిరెడ్డిపాళెం, సంగం, తెలుగురాయపురం, రాజుపాళెం ఇసుక రీచ్‌ల దగ్గర నుంచి, సర్వేపల్లి నియోజకవర్గంలోని విరువూరు, సూరాయపాళెం ఇసుక రీచ్‌ల వరకు అక్రమాలకు పాల్పడుతున్నారని కాకాణి ఆరోపించారు. విరువూరు ఇసుక రీచ్‌లో సంగం పెట్రోల్ బంకుకు సంబంధించిన ఫోన్‌పే క్యూఆర్ కోడ్‌ని పెట్టి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారన్నారు. దోపిడీ ముఠాలతో పాటు, అధికారుల ఆగడాలపై ఆధారాలతో సహా లోకాయుక్త, గ్రీన్ ట్రిబ్యునల్, న్యాయస్థానాలను ఆశ్రయిస్తామని, ప్రజా సమస్యలను ప్రశ్నించే వారిపై పోలీసు కేసులు పెట్టడం ద్వారా తమను కంట్రోల్ చేయడం సాధ్యం కాదని తెలియజేస్తామన్నారు. జిల్లాలో ఉన్న అధికారులు అవినీతి, అక్రమాలను అరికట్టడం మానేసి, వాటిని ప్రశ్నించే వారిని అణచివేయాలని చూడడం మూర్ఖత్వమే అవుతుందన్నారు. ప్రాణాలు పోతున్నా పట్టదా? సూరాయపాళెం ఇసుక రీచ్‌లో క్వారీ నిర్వాహకుల నిర్వాకం వల్ల ఇసుక గుంతలో పడి ఒక ఎస్టీ వర్గానికి చెందిన వ్యకి చనిపోతే, పోలీసులు దాన్ని కేవలం ప్రమాదవశాత్తు జరిగిన మరణంగా కేసు నమోదు చేసి చేతులు దులుపుకున్నారన్నారు. అదే ఇసుక రీచ్‌లో గోదావరి జిల్లాకు చెందిన ఒక కూలీ కూడా బలయ్యాడు. ఆ రెండు కుటుంబాలు నేడు వీధిన పడ్డాయన్నారు. ఈ ఘటనలను పోలీసులు మసిపూసి మారేడుకాయ చేశారన్నారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే వీటిపై సమగ్ర విచారణ జరిపించి దోషులను కఠినంగా శిక్షిస్తామన్నారు. పేద రైతుల భూముల్లో గ్రావెల్ మాఫియా రాబందులు సోమిరెడ్డి అవినీతి దాహం తీరడం లేదు నిండు ప్రాణాలు బలిగొంటున్న గ్రావెల్, ఇసుక, మట్టి అక్రమ రవాణా మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి ధ్వజం అక్రమ మైనింగ్‌పై చర్యలకు మైనింగ్ డిప్యూటీ డైరెక్టర్‌కు వినతి -
కార్పొరేట్‌కు దీటుగా పది ఫలితాలు
● జెడ్పీ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ నెల్లూరు(పొగతోట): జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో కార్పొరేట్‌కు దీటుగా పదో తరగతి ఫలితాలు సాధించడం అభినందనీయమని జెడ్పీ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ అన్నారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జెడ్పీ పాఠశాలల్లో పదో తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన 11 మంది విద్యార్థులు, వంద శాతం ఫలితాలు సాధించిన పాఠశాలల హెచ్ఎంలను శనివారం సన్మానించారు. అద్భుత ఫలితాలు సాధించిన విద్యార్థులకు చైర్పర్సన్ అభినందనలు తెలిపారు. విద్యార్థుల బంగారు భవిష్యత్తు కోసం హెచ్ఎంలు, ఉపాధ్యాయులు చేసిన కృషి ప్రశంసనీయమన్నారు. 22 జెడ్పీ పాఠశాలల్లో వంద శాతం ఉత్తీర్ణత సాధించడం సంతోషకరమన్నారు. జెడ్పీ సీఈఓ శ్రీధర్‌రెడ్డి, డిప్యూటీ సీఈఓ విజయకుమార్, డీఈఓ బాలాజీరావు, జెడ్పీటీసీలు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. చెట్టుకు ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య బుచ్చిరెడ్డిపాళెం: బుచ్చిరెడ్డిపాళెం పట్టణంలో గుర్తుతెలియని వ్యక్తి చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన శనివారం కలకలం రేపింది. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై సంతోష్‌కుమార్‌రెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతుడు పశ్చిమ బెంగాల్‌కు చెందిన వ్యక్తిగా ప్రాథమికంగా గుర్తించినట్లు తెలిపారు. అయితే పూర్తి వివరాలు తెలియాల్సి ఉందన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై వెల్లడించారు. కల్లేరు వాగులో గుర్తుతెలియని మృతదేహం చిల్లకూరు: గూడూరు రూరల్ సంతదాసుపల్లి సమీపంలోని కల్లేరు వాగులో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో రూరల్ ఎస్సై తిరుపతయ్య తన సిబ్బందితో కలిసి వాగులో ఉన్న మృతదేహాన్ని బయటకు తీయించి పరిశీలించారు. సుమారు మూడ్రోజుల క్రితం మృతిచెంది నీటిలో ఉండడం వల్ల గుర్తుపట్టలేని విధంగా మారిందని, మృతుడి వయస్సు సుమారు 25 నుంచి 30 ఏళ్ల ఉండొచ్చని పోలీసులు తెలిపారు. మృతుడి శరీరంపై నల్ల ప్యాంట్ మాత్రమే ఉందని, ఎలాంటి గాయాల్లేవన్నారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గూడూరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. -
చెరువులోని మృతదేహం వేమయ్యదిగా నిర్ధారణ
● అనుమానాస్పద మృతిగా కేసు నమోదు పొదలకూరు: పట్టణానికి సమీపంలోని సోమశిల రోడ్డు చిట్టేపల్లి చెరువులో స్థానికులు శుక్రవారం సాయంత్రం గుర్తించిన మృతదేహం పొదలకూరు రామ్నగర్గేటు సెంటర్‌కు చెందిన పడ్డాల వేమయ్య(65)గా పోలీసులు నిర్ధారించారు. అదేరోజు రాత్రి మృతదేహాన్ని నెల్లూరు జీజీహెచ్‌కు పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కుటుంబ సభ్యులు, స్థానికుల కథనం మేరకు.. వేమయ్య నలుగురిలో కలివిడిగా ఉంటూ స్థానిక గంగమ్మతల్లి దేవస్థానం గౌరవాధ్యక్షునిగా కొనసాగుతున్నారు. ఆయన భార్య మృతిచెందగా, ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. కుమార్తెకు వివాహం చేశారు. ఆయన ఫర్టిలైజర్స్ షాపు నిర్వహిస్తూ ఇటీవల తొలగించారు. కాగా శుక్రవారం సాయంత్రం చెరువుకు సమీపంలో కొందరు పురుగు మందుల కంపెనీలకు చెందిన వారు మాట్లాడేందుకు వేమయ్యను పిలిపించినట్టుగా తెలుస్తోంది. అక్కడ వాగ్వాదం కూడా చోటు చేసుకున్నట్టుగా చెప్పుకుంటున్నారు. ఈ మధ్యలో వేమయ్య తన కుమారుడికి ఫోన్ చేసి పురుగు మందుల కంపెనీల వారు తిరిగి వ్యాపారం ప్రారంభించాలని చెబుతున్నారని, అందుకు కావాల్సిన మందులను అందజేస్తామంటున్నారని వెల్లడించినట్టు సమాచారం. తర్వాత మృతుడి కుమారుడు ఫోన్ చేసినా స్పందించ లేదంటున్నారు. ఏమి జరిగిందో ఏమో తెలియదు కానీ వేమయ్య చెరువులో శవమై తేలడంతో పలు అనుమానాలకు తావిస్తోంది. అయితే మృతుడు ఆత్మహత్యకు పాల్పడేంత పిరికివాడు కాదని, ఎన్ని సమస్యలు ఉన్నా గట్టిగా నిలబడి ఎదుర్కొనే మనస్తత్వం కలిగిన వాడంటున్నారు. దీంతో కుటుంబసభ్యులు అనుమానాస్పద మృతిగా భావిస్తున్నారు. పోలీసులు సైతం అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
కల్యాణం.. కమనీయం
● కనుల పండువగా మల్లికార్జున స్వామి సమేత కామాక్షితాయి బ్రహ్మోత్సవాలు ● ఆకట్టుకున్న ఎదుర్కోలు ఉత్సవం ● వేలాదిగా తరలివచ్చిన భక్తజనం ● మారుమోగిన శివనామస్మరణ బుచ్చిరెడ్డిపాళెం: మల్లికార్జున స్వామి సమేత కామాక్షితాయి కల్యాణ మహోత్సవం భక్త జనుల కనుల పండువగా శనివారం జరిగింది. మండలంలోని జొన్నవాడలో కొలువైన కామాక్షితాయి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల్లో అత్యంత ప్రధాన ఘట్టమైన స్వామి అమ్మవార్ల కల్యాణాన్ని వేదమంత్రోచ్ఛరణలు, మంగళ వాయిద్యాల నడుమ ఆధ్యాత్మిక వైభవంతో ఘనంగా సాగింది. జిల్లాతో పాటు ప్రకాశం, తిరుపతి, కడప, తమిళనాడు ప్రాంతాల నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున చేరుకుని స్వామి అమ్మవార్ల కల్యాణాన్ని తిలకించారు. ముందుగా స్వామి అమ్మవార్లను పరిమళ పుష్పాలు, పట్టు వస్త్రాలు, ముత్యాల హారాలు, రత్న కిరీటాలతో విశేషంగా అలంకరించారు. అనంతరం మంగళ వాయిద్యాలు, వేదఘోష మధ్య ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కల్యాణ మండపానికి ఊరేగింపుగా తీసుకువచ్చారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఎదుర్కోలు ఉత్సవం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. ఒక వైపు స్వామివారి తరఫున, మరో వైపు అమ్మవారి తరఫున వేద పండితులు ఎదురెదురుగా నిలబడి లీలగా సాగించిన సంవాదం ఆధ్యాత్మిక ఉత్సాహాన్ని రెట్టింపు చేసింది. ప్రతి ఘట్టానికి భక్తులు హర్షధ్వానాలు చేస్తూ ఉత్సాహంగా పాల్గొన్నారు. అనంతరం మండపంలో స్వామి అమ్మవార్లను అధిష్టించి అర్చకులు వేద పారాయణాల మధ్య ఆది దంపతుల కల్యాణ విశిష్టతను భక్తులకు వివరిస్తూ అర్చకులు కమనీయంగా నిర్వహించారు. జీలకర్ర బెల్లం, మంగళసూత్రధారణ, తలంబ్రాల ఘట్టాల సమయంలో ఆలయ ప్రాంగణం శివనామస్మరణలతో మారుమోగిపోయింది. హర హర మహాదేవ, ఓం నమఃశివాయ నినాదాలతో భక్తులు భక్తి పారవశ్యంలో మునిగిపోయారు. విశిష్ట అలంకరణలో దర్శనమిచ్చిన స్వామి అమ్మవార్ల దివ్య మంగళ స్వరూపాలను చూసి భక్తులు మంత్రముగ్ధులయ్యారు. కళ్యాణ అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. కల్యాణంలో వినియోగించిన తలంబ్రాలను తీసుకునేందుకు భక్తులు పోటీ పడ్డారు. ఈ కార్యక్రమంలో ఉభయ దాతలు, ట్రస్ట్ బోర్డు సభ్యులు, దేవదాయ శాఖ అధికారులు, ఆలయ అర్చకులు, సిబ్బంది, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. -
యథేచ్చగా గ్రావెల్ అక్రమ రవాణా
వెంకటాచలం: మండలంలోని తిక్కవరప్పాడు నుంచి గొలగమూడికి యథేచ్ఛగా గ్రావెల్ అక్రమ రవాణా చేస్తున్నారు. మైనింగ్ శాఖ అనుమతులు ఉంటేనే గ్రావెల్ తవ్వకాలు చేపట్టాల్సి ఉంది. అయితే ఎలాంటి అనుమతులు లేకుండా ఏఎంఆర్ సంస్థకు రాయల్టీ చెల్లించామని నిర్వాహకులు ఇష్టారాజ్యంగా తవ్వకాలు చేపడుతున్నారు. భూగర్భ గనుల శాఖ అధికారుల అనుమతి ఉంటేనే ఏఎంఆర్ సంస్థ రాయల్టీ వసూళ్లు చేసుకోవచ్చుననే నిబంధనలున్నా వాటిని బేఖాతరు చేస్తూ ఆ సంస్థ పేరుతో కొందరు సిబ్బంది గ్రావెల్ రవాణా చేస్తున్న నిర్వాహకుల వద్ద రాయల్టీ వసూలు చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా గనులశాఖ, రెవెన్యూ శాఖ అధికారులు పట్టించుకోకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కలెక్టర్ జోక్యం చేసుకుని అనుమతులు లేకుండా చేపడుతున్న అక్రమ గ్రావెల్ తవ్వకాలపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. -
రైతులకు నో.. తమ్ముళ్లకు రయ్ రయ్
● పోలీసులు, అధికారుల తీరుపై స్థానికుల ఆగ్రహం చిట్టమూరు: మండల పరిధిలోని అరవపాళెంలో సామాన్య రైతులు తమ పొలాలకు మట్టిని తోలి చదును చేసుకునేందుకు ప్రయత్నించగా శనివారం పోలీసులు, అధికారులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. పక్కనే టీడీపీ నేతలు చెరువులో హిటాచీ పెట్టి మట్టిని వారి పొలాలకు తోలుకుంటుంటే మాత్రం అటువైపు కన్నెత్తి కూడా చూడకపోవడం ఏమిటని రైతులు పోలీసులను నిలదీశారు. మట్టి తోలకాలు ఆపితే అందరివీ అడ్డుకోవాలని, లేకుండా తమనూ తోలనివ్వాలని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో అక్కడ గందరగోళ వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ గ్రామంలో తమ పొలాలు ముంపునకు గురై వరి పంటలు సక్రమంగా పండకపోవడంతో పొలానికి మట్టిని తోలి లెవలింగ్ చేసుకుందామని ప్రయత్నించగా అధికార టీడీపీ నేతల ఒత్తిళ్లకు తలొగ్గి చిట్టమూరు పోలీసులు, అధికారులు తమను అడ్డుకున్నారని వాపోయారు. తాము మట్టి తోలకముందే తీసుకొచ్చిన జేసీబీను పోలీస్‌స్టేషన్‌కు తలించాలని, లేకుంటే కేసులు పెట్టి జైల్లో వేస్తామని పోలీసులు బెదిరింపులకు దిగారని తెలిపారు. రైతులు ఎంత మొత్తుకున్నా పోలీసులు తమ మాట వినకుండా అధికార పార్టీ నేతల మాటలు విని తాము తెప్పించుకున్న జేసీబీను మాత్రం స్టేషన్‌కు తరలించాలని బెదిరింపులకు దిగారన్నారు. మరోపక్క అధికార టీడీపీ నేతల మట్టి తోలకాలు యథావిధిగా జరుగుతున్నా అధికారులు మాత్రం తమకేమీ పట్టనట్టు వారికి పర్మిషన్లు ఉన్నాయని వారి తరఫున అనుకూలంగా చెబుతూ సామాన్య రైతులను భయభ్రాంతులకు గురి చేయడంతో వారు చేసేది లేక వెనుదిరిగారు. కూటమి ప్రభుత్వంలో సామాన్య రైతు నుంచి, వైఎస్సార్సీపీ సానుభూతి పరుల వరకు కక్ష సాధింపు చర్యలు ఎక్కువైపోయాయన్నారు. దీనిపై జిల్లా అధికారులు స్పందించి గ్రామాల్లో సామాన్య రైతులపై టీడీపీ నేతల దౌర్జన్యాన్ని ఆపాలని కోరుతున్నారు. చెరువులో యథేచ్ఛగా సాగుతున్న టీడీపీ నేతల మట్టి తోలకాలు సామాన్య రైతులు తెచ్చుకున్న జేసీబీని అడ్డుకున్న పోలీసులు -
20, 21న వెయిట్ లిఫ్టింగ్, అథ్లెటిక్స్ ఎంపికలు
నెల్లూరు (టౌన్): జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో జిల్లాస్థాయి వెయిట్ లిఫ్టింగ్, అథ్లెటిక్స్ బాలుర, బాలికల జిల్లాస్థాయి ఎంపికలను నిర్వహించనున్నట్లు జిల్లా క్రీడాభివృద్ధి అధికారి ఎస్కే జసీమ్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. స్థానిక ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో ఈనెల 20న వెయిట్ లిఫ్టింగ్ యూత్ అండర్–17 బాలురు, బాలికలు, జూనియర్ అండర్–20 పురుషులు, మహిళల ఎంపికలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. 21న అథ్లెటిక్స్ అండర్–16, అండర్–20 బాలురు, బాలికలు ఎంపికలు ఉంటాయన్నారు. అనంతరం వెయిట్ లిఫ్టింగ్ రాష్ట్రస్థాయి పోటీలు ఏలూరు, అథ్లెటిక్స్ రాష్ట్రస్థాయి పోటీలు గుంటూరులో ఉంటాయన్నారు. ఆసక్తి గల క్రీడాకారులు తప్పనిసరిగా అధికార వెబ్సైట్ www.sports.ap.gov.inలో శాప్ లీగ్ పోర్టల్ లేదా మొబైల్లోని క్రీడా యాప్‌లో తమ పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. మరిన్ని వివరాల కోసం 88862 28444 నంబర్‌ను సంప్రదించాలన్నారు. హోటల్స్, రెస్టారెంట్లలో తనిఖీలు నెల్లూరు(బారకాసు): పీజీఆర్ఎస్కు అందిన ఫిర్యాదుల మేరకు నగరంలోని పలు హోటల్స్, రెస్టారెంట్లలో అధికారులు శనివారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఆహార భద్రత, తూనికలు–కొలతలు, పౌరసరఫరాల శాఖల అధికారులు సంయక్తంగా చేసిన దాడుల్లో మనుబోలులోని ఓ దాబాలో గడువు ముగిసిన టూటీ ఫ్రూటీ బొప్పాయి ముక్కల ప్యాకెట్లను గుర్తించి కేసు నమోదు చేశారు. నెల్లూరు హైవే వెంబడి ఉన్న దాబాలో తయారీ, ఎక్స్పైరీ తేదీ లేకుండా, ఫ్రిజ్‌లో నిల్వఉంచిన చేపలు, రొయ్యలు, కంజులు, బేబీ కార్న్ ప్యాకెట్లను గుర్తించి ధ్వంసం చేశారు. వంట గదులు అపరిశుభ్రంగా ఉండటం పట్ల మూడు దాబాలకు ఇంప్రూమెంట్ నోటీసులు జారీ చేశారు. ఎలక్ట్రానిక్ తూనిక యంత్రాలు, కొలతల పరికరాలను పరిశీలించి, ధ్రువీకరణ ముద్రల్లేని కాటాలను గుర్తించి మూడు కేసులను నమోదు చేశారు. ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ డి.నీరజ, లీగల్ మెట్రాలజీ ఇన్స్పెక్టర్ రియాజ్, పౌరసరఫరాల డీటీ అబ్దుల్ పాల్గొన్నారు. కోళ్ల వ్యర్థాల వాహనం సీజ్ బుచ్చిరెడ్డిపాళెం: అనధికారికంగా కోళ్ల వ్యర్థాలు తరలిస్తున్న వాహనాన్ని బుచ్చిరెడ్డిపాళెం పోలీసులు శనివారం పట్టుకున్నారు. పోలీసుల వివరాల మేరకు.. నెల్లూరు నుంచి బుచ్చిరెడ్డిపాళెం వైపు వస్తున్న ఓ వాహనం జొన్నవాడ వద్ద అనుమానాస్పదంగా కనిపించడంతో పోలీసులు తనిఖీలు చేపట్టారు. వాహనంలో కోళ్ల వ్యర్థాలను గుర్తించడంతో పోలీస్‌స్టేషన్‌కు తరలించి సీజ్ చేశారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సంతోష్‌కుమార్‌రెడ్డి తెలిపారు. శ్రామికులకు పనులు కల్పించండి నెల్లూరు(పొగతోట): గ్రామ పంచాయతీల్లో ఉద్యోగులు, సిబ్బంది కష్టపడి శ్రామికులకు ఉపాధి పనులు కల్పించేలా చర్యలు తీసుకోవాలని డ్వామా పీడీ శ్రీనివాసప్రసాద్ ఆదేశించారు. డ్వామా కార్యాలయం నుంచి వివిధ మండలాల ఏపీఓలు, ఈసీలు, టీఏలు, ఎఫ్ఏలతో నిర్వహించిన జూమ్ కాన్ఫరెన్స్‌లో శనివారం పీడీ మాట్లాడారు. ప్రస్తుతం ప్రతిరోజు ఉపాధి పనులకు 42 వేల మందికి పైగా శ్రామికులు హాజరవుతున్నారని, దీనిని 60 వేలకు పెంచేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. రోజుకు రూ.300లు తగ్గకుండా వేతనాలు మంజూరయ్యేలా చూడాలన్నారు. -
చంద్రబాబు రైతు ద్రోహి అనడానికి ఇదొక ఉదాహరణ. ఆయన సీఎంగా ఉంటే రైతులు ఏ విధంగానూ బాగుపడిన చరిత్ర లేదు. అన్నదాతలకు వెన్నుదన్నుగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి, ఆ తర్వాత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన అభివృద్ధి ఫలాలు, తీసుకువచ్చిన సంస్కర
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: దశాబ్దాలుగా పూర్వీకుల నుంచి వారసత్వంగా సంక్రమించిన, సొంత భూములకు సంబంధించి రెవెన్యూ రికార్డుల్లో చుక్కల సమస్యకు నాటి వైఎస్సార్సీపీ ప్రభుత్వంలోని అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శాశ్వత పరిష్కారం చూపించారు. 2023 మే 12వ తేదీ కావలి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 97,471 రైతు కుటుంబాలకు మేలు జరిగేలా 2,06,171 ఎకరాల్లోని భూములకు విముక్తి కల్పించారు. ఈ మేరకు జిల్లాలో 25 వేల మంది రైతులకు సంబంధించిన 32,270 ఎకరాలకు రెవెన్యూ కార్యాలయాలు, కోర్టుల చుట్టూ రైతన్నలు తిరిగే అవసరం లేకుండా, వారికి ఒక్క పైసా ఖర్చు కూడా లేకుండా దశాబ్దాలుగా క్రయవిక్రయాలకు నోచుకోని ఈ చుక్కల భూముల చిక్కులు తొలగించారు. బ్రిటిష్ పాలకుల హయాంలో జిల్లాలో 1908 – 1920 మధ్య కాలంలో కొత్తగా భూముల రికార్డుల రూపకల్పన జరిగింది. ఆ సమయంలో భూసర్వే జరిగినప్పుడు ‘ప్రభుత్వ భూమి’ లేదా ‘ప్రైవేట్ భూమి’ అని నిర్ధారణ చేయని కారణంగా రెవెన్యూ రికార్డుల్లో (రీ సెటిల్మెంట్ రిజిస్టర్ ఆర్ఎస్ఆర్) పట్టాదారు గడిలో ’డాట్స్’ (చుక్కలు) పెట్టి వదిలేశారు. సదరు భూములే ‘చుక్కల భూములు’. తమ సొంత భూములను దశాబ్దాలుగా రైతులు అనుభవిస్తు న్నా.. వీటికి రెవెన్యూ రికార్డుల్లో సంపూర్ణ హక్కులు లేక వాటిని అమ్ముకునే స్వేచ్ఛ లేక ఇబ్బంది పడుతున్న దుస్థితి నెలకొంది. ఆ తర్వాత కాలంలో 1954 సంవత్సరానికి ముందు పేద రైతుల జీవ నాధారం కోసం భూములు కేటాయిస్తూ ప్రభుత్వం పట్టాలను మంజూరు చేసింది. ఈ భూములు సాగు చేసుకోవడానికి మాత్రమేనని, సాగుదారులకు ఎలాంటి హక్కులు ఉండవని షరతులు విధించింది. క్రయవిక్రయాలకు ఆస్కారం లేకుండా నిషేధిత జాబితా (22 ఏ) (22ఏఈ)లో చేర్చింది. అప్పటి నుంచి సాగుదారులు హక్కుల్లేక తల్లడిల్లుతున్నారు. బిడ్డల పెళ్లిళ్లు, ఆరోగ్య సమస్యలు తలెత్తి అత్యవసరమై భూములను అమ్ముకోవాల్సి వస్తే ఆ భూమిని నిషేధిత జాబితాలో నుంచి తొలగించేందుకు చాలా తతంగం ఉండేది. గత ప్రభుత్వాలు ఈ సమస్యకు పరిష్కారం చూపలేకపోయాయి. జిల్లాలో 22,578 సర్వే నంబర్లలో 25 వేల మంది రైతులకు సంబంధించి 32,270 ఎకరాలు భూములు నిషేధిత జాబితాలో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. గతంలో ఇలాంటి భూములకు సంబంధించి రైతుల విజ్ఞప్తి మేరకు తహసీల్దార్లు ఆర్డీఓ, కలెక్టర్‌కు ప్రతిపాదించి క్షేత్రస్థాయిలో హక్కుదారుల హక్కులు పరిశీలించి పరిష్కారం చూపించే వారు. అయితే ఈ ప్రక్రియలోనూ ఏళ్ల తరబడి తిరిగి పరిష్కరించుకో వాల్సి ఉండేది. ఇందుకు రెవెన్యూ అధికారులకు అమ్యామ్యాలు సమర్పించుకుంటేనే పనులు జరిగేవి. అవి కూడా ఇచ్చుకునే స్థోమత లేని వారు మిన్నకుండిపోయారు. 2023లో అప్పటి వైఎస్సార్సీపీ ప్రభుత్వం చుక్కల భూములకు విముక్తి కల్పిస్తూ తెచ్చిన జీఓలను తిరిగి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం పక్కన పెట్టేసింది. పాత రెవెన్యూ రికార్డుల ప్రకారం చుక్కల భూములను తిరిగి 22ఏ నిషేధిత జాబితాలో చేర్చింది. వైఎస్ జగన్మోహన్రెడ్డి రైతులకు మేలు చేసేందుకు చేపట్టిన ఈ ప్రక్రియను మరో సారి గుదిబండగా మార్చి రైతులను ఇబ్బందుల పాల్జేస్తోంది. చుక్కలు చిక్కులు తొలగాయిని సంతోషిస్తున్న రైతు కుటుంబాలకు ఏడాది తిరగకుండానే అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం చుక్కలు చూపిస్తోంది.నిషేధిత జాబితాలో 32,270 ఎకరాలు మళ్లీ నిషేధిత జాబితాలోకే.. గుదిబండగా మార్చిన టీడీపీ 2014లో అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం నిషేధిత భూముల యజమానుల సమస్యను మరింత గుదిబండగా మార్చింది. ఇలాంటి సమస్యకు పరిష్కారాన్ని సరళతరం చేయాల్సిన అప్పటి ప్రభుత్వం శాశ్వతంగా పరిష్కారం చేసుకునే వీలు లేకుండా నిబంధనలు కఠిన తరం చేసింది. 2016లో రెవెన్యూ రికార్డుల ఫ్యూరిఫికేషన్ పేరుతో ఇలాంటి నిషేధిత జాబితా భూములు కాజేసేందుకు కుట్రలు చేసింది. ఏకంగా భూముల హక్కులను కాలరాసే చట్టాన్ని తెచ్చే ప్రయత్నం చేసింది. దీనిపై రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురు కావడంతో ఆ ప్రయత్నాన్ని విర మించుకుంది. నిషేధిత భూముల పరిష్కారానికి కొత్త చిక్కులు తెచ్చి పెట్టింది. గతంలో నిషేధిత జాబితాలో నుంచి భూములను తొలగించాలంటే కలెక్టర్ ఆమోదంతో పరిష్కారం అయ్యే ఈ సమస్యను ఏకంగా సీసీఎల్ఏ ఆమోదం తర్వాత ప్రభుత్వ ఆమోదం తెలపాలని నిబంధనలు చేర్చింది. ఆ స్థాయి వరకు వ్యయ ప్రయాసల కోర్చి వెళ్లలేక రైతులు మిన్నకుండిపోయారు. కొందరు రైతులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. న్యాయస్థానం తీర్పుతో జిల్లా స్థాయిలో కమిటీ ద్వారా చుక్కల భూమి క్రమబద్ధీకరణ చేయాలని 2017లో జీఓ నంబర్ 216 ఇచ్చింది. అయితే క్షేత్రస్థాయిలో అమలు చేయడంలో అప్పటి ప్రభుత్వం దీర్ఘకాలంగా కాలయాపన చేసింది. శాశ్వత హక్కులకు కూటమి చిక్కులు 22ఏ నిషేధిత జాబితా నుంచి భూములకు వైఎస్ జగన్ విముక్తి జిల్లాలో 32 వేల ఎకరాలకు అడ్డంకులు తొలగించిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం 25 వేల మంది రైతులకు ప్రయోజనం కల్పించిన వైనం కూటమి అధికారంలోకి వచ్చాక మళ్లీ నిషేధిత జాబితాలోకే.. నాటి మంత్రి కాకాణి చొరవతో.. జిల్లాకు చెందిన అప్పటి మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి చొరవ తీసుకుని చుక్కల భూములను క్రమబద్ధీకరించి శాశ్వత హక్కులు కల్పించేందుకు శ్రీకారం చుట్టారు. అప్పట్లో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్న కాకాణి ఈ సమస్యను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకెళ్లడంతో వెను వెంటనే పూర్తిగా పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఆ మేరకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం నిషేధిత భూముల సమస్యను పరిష్కరించేందుకు ప్రత్యేక జీఓ తెచ్చింది. జిల్లా వ్యాప్తంగా 32 వేల ఎకరాలకు విముక్తి లభించింది. -
ఈతకెళ్లి యువకుడి గల్లంతు
● గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు నెల్లూరు సిటీ: రూరల్ పరిధిలోని పెన్నానదిలో ఓ యువకుడు ఈతకెళ్లి గల్లంతైన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. నెల్లూరు నగరంలోని వెంకటేశ్వరపురానికి చెందిన చంద్రశేఖర్(27) నాలుగేళ్ల క్రితం ఇంజినీరింగ్ పూర్తి చేశారు. శుక్రవారం ఉదయం తన స్నేహితులైన నవీన్, సతీష్‌లతో కలిసి జొన్నవాడకు వెళ్లారు. సమీపంలోని పెన్నానదిలో ఈత కొడుదామని ముగ్గురు స్నేహితులు నది వద్దకు చేరుకున్నారు. చంద్రశేఖర్‌కు ఈతరాకపోవడంతో చాలాసేపు ఒడ్డునే ఉన్నారు. స్నేహితులు ఈతకొట్టడాన్ని చూసి చంద్రశేఖర్ నాలుగు అడుగులు ముందుకు వేశారు. ప్రమాదవశాత్తు నీటిలో మునగడంతో స్నేహితులు కాపాడే ప్రయత్నం చేశారు. కొంతసేపటికి చంద్రశేఖర్ ఆచూకీ కనిపించలేదు. దీంతో స్థానికుల సహాయంతో నదిలో గాలించినా ఫలితం లేకపోవడంతో రూరల్ పోలీసులకు సమాచారం ఇవ్వగా ఘటనా స్థలానికి చేరుకుని గజ ఈతగాళ్లతో గాలింపు చేపట్టారు. ఈ ఘటనపై రూరల్ ఎస్సై సుధీర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పొదలకూరు నిమ్మధరలు(కిలో) పెద్దవి: రూ.100 సన్నవి: రూ.40 పండ్లు: రూ.20 -
నగదు వివాదమే హత్యకు దారితీసింది
చిల్లకూరు: ఉపాధి కోసం వచ్చిన ఇద్దరు యువకుల మధ్య నగదు విషయంలో నెలకొన్న వివాదం హత్యకు దారితీసిందని గూడూరు రూరల్ సీఐ కిశోర్‌బాబు తెలిపారు. చెన్నూరులో ఈనెల 7న జరిగిన హత్య కేసును పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. ఈ మేరకు శుక్రవారం గూడూరు రూరల్ పోలీస్‌స్టేషన్‌లో కేసు వివరాలను సీఐ కిశోర్‌బాబు వెల్లడించారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కాన్పూర్ నగర్ జిల్లా, జజ్మా ప్రాంతానికి చెందిన మహ్మద్ షెహన్షా, మహ్మద్ సమ్మీ గూడూరు మండలంలోని ఓ రేకుల పరిశ్రమలో చేరేందుకు వచ్చారు. వీరు ఇక్కడికి వస్తుండగా రైలులో పరిచయం ఏర్పడడంతో ఇరువురు చెన్నూరులో ఇంటిని అద్దెకు తీసుకున్నారు. ఆ సమయంలో ఇద్దరి మధ్య నగదు విషయంలో వివాదం నెలకొనడంతో మహ్మద్ షెహన్షా ఇటుక రాయి తీసుకుని మహ్మద్సమ్మీపై దాడి చేసేందుకు యత్నించాడు. దీంతో సమ్మీ వంట గదిలో ఉన్న చాకు తీసుకుని పలుమార్లు మహ్మద్ షెహన్షాను పొడవడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో నిందితుడు తన ఆధారాలు ఏమీ లేకుండా బెంగళూరుకు వెళ్లి అక్కడి నుంచి కాన్పూరుకు వెళ్లాడు. కాగా హత్యకు సంబంధించి పోలీసులు ముమ్మరంగా గాలింపు చేపడుతున్న విషయం తెలుసుకున్న నిందితుడు తనను పనికి పిలిపించిన కాంట్రాక్టర్‌తో కలిసి నేరుగా రూరల్ పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయాడు. ఈ కేసును ఛేదించడంలో ఎస్సైలు తిరుపతయ్య, సురేష్‌బాబు, వెంకటేశ్వరరెడ్డితో పాటుగా హెడ్‌కానిస్టేబుల్ మహ్మద్, శ్రీనివాసరావు, కానిస్టేబుల్స్ కె.శ్రీనివాసరావు, వి.శ్రీనివాసులు, నాగరాజు, విష్ణు తదితరలు చొరవ చూపగా, వారిని ఎస్పీ అజిత అభినందనలు తెలిపారు. సమావేశంలో గూడూరు ఒకటో పట్టణ సీఐ శేఖర్‌బాబు పాల్గొన్నారు. -
అప్రమత్తతతో డెంగీకి కళ్లెం
● ఏటా వేలాది మందికి వ్యాప్తి ● అధికారిక లెక్కల్లో మాత్రం పదుల సంఖ్యలోనే.. ● నేడు జాతీయ డెంగీ నివారణ దినోత్సవం నెల్లూరు(అర్బన్): డెంగీ జ్వరం వస్తే రోగి నీరసించిపోతాడు. ఆస్పత్రి పాలవుతారు. ఆర్థికంగా నష్టపోతారు. కొన్ని సందర్భాల్లో ప్రాణాలు కోల్పోతున్నారు. ఇంటి పెద్ద మృతి చెందితే ఆ కుటుంబం వీధిన పడుతోంది. అందువల్ల డెంగీని నివారించేందుకు కేంద్రం నడుం బిగించింది. మే నెల 16వ తేదీని జాతీయ డెంగీ నివారణ డేగా ప్రకటించి వైద్యశాఖ ద్వారా ప్రజలను చైతన్యం చేస్తోంది. అందులో భాగంగా జిల్లాలో శనివారం వైద్యశాఖ ఆధ్వర్యంలో ప్రదర్శనలు, అవగాహన సదస్సులు జరుగనున్నాయి. నిల్వ నీటిలో దోమల ఉధృతి డెంగీ వ్యాధి ప్రధానంగా ఏడిస్ ఈజిప్టె అనే రకం దోమ కాటు వల్ల వస్తుంది. ఇంటి పరిసరాల్లో నిల్వ ఉండే స్వచ్ఛమైన నీటిలో ఈ దోమలు గుడ్లు పెట్టి సంతానోత్పత్తి ద్వారా విస్తృతమవుతాయి. కూలర్లు, పాతటైర్లు, కొబ్బరి చిప్పలు, పూలకుండీలు, నీటి ట్యాంకుల్లో నిల్వ ఉండే నీటిలో ఈ దోమలు ఆవాసంగా ఉంటాయి. వైద్యశాఖ కాకి లెక్కలు వైద్యశాఖ లెక్కల ప్రకారం 2025 సంవత్సరంలో జిల్లాలో కేవలం 37 డెంగీ కేసులు మాత్రమే నమోదయ్యాయి. 2026 జనవరి నుంచి ఇప్పటి వరకు నాలుగున్నర నెలల కాలంలో 21 కేసులు మాత్రమే నమోదైనట్టు లెక్కలు రాశారు. అయితే ప్రైవేటు ఆస్పత్రులు, కార్పొరేట్ ఆస్పత్రులను పరిశీలిస్తే గత సంవత్సరం సుమారు 4 వేలకు పైగానే డెంగీతో రోగులు చికిత్స పొందినట్టు తెలుస్తోంది. ఉదాహరణకు శంకరాగ్రహారంలోని ఒక ప్రజా వైద్యశాలను పరిశీలిస్తే గత సంవత్సరం 400 వరకు డెంగీ కేసులు నమోదయ్యాయి. ఇలా మిగతా ఆస్పత్రుల్లో కూడా డెంగీ కేసులు నమోదవుతున్నాయి. ఆగస్టు నుంచి జనవరి మధ్య కాలంలో ఈ కేసులు ఉధృతంగా నమోదవుతున్నాయి. డెంగీ కేసులు ఎక్కువగా రాపూరు, కలువాయి, ఉదయగిరి, సీతారామపురం లాంటి అటవీ ప్రాంతాల గ్రామాల్లో ఎక్కువగా నమోదవుతున్నాయి. ప్రైవేటు ఆస్పత్రుల కేసులు లెక్కల్లో లేవు వైద్యశాఖ ప్రకారం ప్రభుత్వ ఆస్పత్రుల్లో మాత్రమే ఎలీసా పద్ధతిలో రక్త పరీక్షలు చేయించుకోవాలి. వాటిలో పాజిటివ్ వస్తేనే డెంగీగా నిర్ధారిస్తున్నారు. అయితే డెంగీ నిర్ధారణ పరీక్షలు పీహెచ్సీలలో లేవు. ఇందువల్ల అనేక కేసులు నమోదు కావడం లేదు. ఇక ప్రైవేటు ఆస్పత్రుల్లో చేసే స్ట్రిప్ పద్ధతి పరీక్షలను వైద్యశాఖ ఒప్పుకోవడం లేదు. పైగా డెంగీ అని చెప్పకూడదంటూ వైద్యశాఖ ప్రైవేటు ఆస్పత్రులకు ముందుగానే హెచ్చరికలు పంపుతోంది. దీంతో ప్రైవేటు ఆస్పత్రుల వారు డెంగీ కేసులు నమోదైనప్పటికీ తమకెందుకులే అని చెప్పడం లేదు. ఫలితంగా వైద్యశాఖ చెప్పే కాకిలెక్కలను మాత్రమే నమ్మాలట. నివారణ చర్యలు ప్రధానంగా దోమలు కుట్టకుండా చూసుకోవాలి. ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఏ కొంచెం నీరు కూడా నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంటి కిటికీలకు మెస్‌లు ఏర్పాటు చేసుకోవాలి. దోమతెరలు, దోమల నివారణ క్రీములు వినియోగించాలి. ప్రతి వారం క్రమం తప్పకుండా నీటి ట్యాంకులను శుభ్రపరుచుకోవాలి.పరిశుభ్రత పాటిద్దాం.. డెంగీని దూరం చేద్దాం వైద్యశాఖ తీసుకున్న చర్యల ఫలితంగా కొన్నేళ్లుగా జిల్లాలో డెంగీ కేసులు దాదాపు కనుమరుగయ్యాయి. అక్కడక్కడా కొన్ని కేసులు మాత్రమే కనిపిస్తున్నాయి. ఇలా డెంగీ బారిన పడకుండా ఉండాలంటే పరిశుభ్రత పాటించాలి. దోమలు కుట్టకుండా చూసుకోవాలి. తద్వారా డెంగీని దూరం చేయాలి. – డాక్టర్ అన్షుధర్, జిల్లా మలేరియా నివారణాధికారి డెంగీ లక్షణాలు అధిక జ్వరం, తీవ్రమైన తలనొప్పి, కండరాలు, కీళ్ల నొప్పులు, కళ్ల వెనుక భాగంలో నొప్పి, వాంతులు, నీరసం లాంటివి ఉంటే డెంగీగా అనుమానించి పరీక్షలు చేయించుకోవాలి. చర్మంపై ఎర్రటి మచ్చలు ఏర్పడితే అది ప్రమాద సంకేతం. కడుపులో నొప్పి, మలవిసర్జన రంగు నలుపులో ఉంటే ఇది అత్యంత ప్రమాదకరమైన లక్షణం. అందువల్ల లక్షణాలు కనిపించిన వెంటనే నిర్లక్ష్యం చేయకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. -
ధరలు పెంచడం అన్యాయం
అప్సడా చట్టం ప్రకారం ప్రభుత్వ అనుమతులు లేకుండా ఫీడ్ కంపెనీలు ఇష్టారాజ్యంగా ధరలు పెంచడం అన్యాయం. కంపెనీలన్నీ సిండికేట్లుగా మారి ధరలు పెంచి రైతులను దోచుకుంటున్నారు. ఫీడ్ ధరలు తగ్గించకపోతే క్రాప్ హాలిడే ప్రకటించాల్సి ఉంటుంది. – పి చెంగయ్య ఆక్వా రైతు, కల్లూరుపల్లిపాళెం ●ఇలా అయితే సాగు చేయలేం ఇప్పటికే రొయ్యలకు సరైన ధరలు లేక తీవ్రంగా నష్టపోతున్నాం. ఈ పరిస్థితుల్లో మేత ధరలు పెంచడం మరో భారంగా మారుతోంది. వ్యాపారులు సిండికేట్లుగా ఏర్పడి రొయ్యల ధరలు అమాంతంగా తగ్గించేశారు. ఈ పరిస్థితుల్లో ఆక్వా సాగు కష్టతరంగా మారుతోంది. – వి వెంకటరమణయ్య ఆక్వా రైతు, తూపిలిపాళెం -
సమస్యల పరిష్కారానికి అధిక ప్రాధాన్యం
నెల్లూరురూరల్: ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు కలెక్టర్ హిమాన్షు శుక్లా తెలిపారు. ఆయన శుక్రవారం ఉదయం కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో జేసీ మొగిలి వెంకటేశ్వర్లు, డీఆర్వో విజయ్‌కుమార్‌తో కలిసి ఉద్యోగుల గ్రీవెన్స్ డేను నిర్వహించారు. పలువురు ఉద్యోగులు తమ సమస్యలపై వినతి పత్రాలు అందించారు. అలాగే ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సమస్యలపై ప్రత్యేకంగా అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతినెలా మూడో శుక్రవారం ఉద్యోగుల గ్రీవెన్స్‌డేను నిర్వహిస్తున్నామని చెప్పారు. ఇక్కడ తెలిపిన సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ శ్రీధర్‌రెడ్డి, డీఆర్డీఏ పీడీ నాగరాజ కుమారి, మెప్మా పీడీ కిరణ్ కుమార్, బీసీ వెల్ఫేర్ అధికారి వెంకట లక్ష్మమ్మ, సోషల్ వెల్ఫేర్ డీడీ శోభారాణి, డీఎంహెచ్ఓ సుజాత, ఆర్టీసీ ఆర్ఎం షమీమ్, వివిధ శాఖల జిల్లాస్థాయి అధికారులు పాల్గొన్నారు. -
మంత్రి ‘ఆనం’పై పల్లాకు ఫిర్యాదు
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: రాష్ట్ర మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఆత్మకూరు నియోజకవర్గంలో టీడీపీ సీనియర్లను అగౌరపరుస్తూ నమ్ముకున్న పార్టీ కార్యకర్తలకు అన్యాయం చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యేలు కొమ్మి లక్ష్మయ్యనాయుడు, మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, సీనియర్ నాయకుడు గూటూరు కన్నబాబు శుక్రవారం టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావును కలిసి ఫిర్యాదు చేశారు. మహానాడు ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు కొడవలూరు కిసాన్ సెజ్‌కు వచ్చిన పల్లా శ్రీనివాసరావును ఆ ముగ్గురు నేతలు కలిసి ఆనం తీరుపై తీవ్రస్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇద్దరు దుష్ట శక్తులను పక్కన పెట్టుకొని నియోజకవర్గంలో సహజ వనరుల దోపిడీ చేస్తున్నారని, ఇసుక, గ్రావెల్ దోచుకుంటున్నారని, భూములను అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడని పలు ఆధారాలతో వివరించారు. పార్టీ కోసం కష్టపడిన వారిని కాదని, గత ప్రభుత్వంలో అధికారం అనుభవించిన నాయకులను వెంటబెట్టుకొని వారికే ప్రాధాన్యత ఇస్తున్నారంటూ వాపోయారు. ఎన్నో ఏళ్లుగా పార్టీని నమ్ముకున్న తమ వంటి సీనియర్లకు కనీస గౌరవ మర్యాద కూడా ఇవ్వడం లేదని, పార్టీ కార్యక్రమాలకు కూడా ఆహ్వానించడం లేదని వాపోయారు. తాడో పేడో తేల్చుకుంటాం మా బాధ, ఆవేదనను అర్థం చేసుకొని మాకు గుర్తింపు ఇవ్వకుంటే తాము తెగదెంపులు చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నామని వారు స్పష్టం చేసినట్లు సమాచారం. ఇప్పటికే నియోజకవర్గంలో పూచిక పుల్లలా తీసేశారని, ఎన్నికల సమయంలో మా ఇళ్ల చుట్టూ తిరిగిన నేతలు, ఇప్పుడు మమ్మల్ని చూసే నవ్వుకునే పరిస్థితి వచ్చిందని, ఇంకా ఈ అవమానాలు తాము భరించలేమని, అఽవసరమైతే అధిష్టానం వద్ద తాడోపేడో తేల్చుకుంటామంటూ చెప్పినట్లు రాజకీయ వర్గాల్లో చర్చగా మారింది. సీనియర్లమైన మాకు కనీస గౌరవం ఇవ్వడం లేదు ఏ కార్యక్రమానికి ఆహ్వానించడం లేదు ఆయన నియోజకవర్గంలో సహజ వనరులు దోపిడీ చేస్తున్నారు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లాకు మాజీ ఎమ్మెల్యేలు కొమ్మి, చంద్రశేఖర్‌రెడ్డి, గూటూరు ఫిర్యాదు -
మార్కెట్లోకి నూతన ట్రాక్టర్ల విడుదల
నెల్లూరురూరల్: నగరంలో నూతనంగా ప్రారంభమైన ట్రాక్టర్ల షోరూమ్, అగస్త్య ఆగ్రోస్‌ను మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి శుక్రవారం సందర్శించి, సోలిస్, యన్మార్ ట్రాక్టర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా కాకాణి చేతుల మీదుగా రైతులకు ట్రాక్టర్లు అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులకు చేరువ చేయడంలో ఇలాంటి షోరూమ్‌ల పాత్ర కీలకమని, సోలీస్ సంస్థ విడుదల చేస్తున్న ట్రాక్టర్లు ఏసీ క్యాబిన్లతో సిద్ధమవుతుండడం ఆహ్వానించదగిన అంశమన్నారు. నిర్వాహకులు గుండాల వంశీకృష్ణారెడ్డి, యనమల నాగార్జునరెడ్డిలకు అభినందనలు తెలిపారు. డీలర్ నాగార్జునరెడ్డి మాట్లాడుతూ మా వద్ద 20 హార్స్ పవర్ నుంచి 120 హార్స్ పవర్ వరకు వాహనాలు లభ్యమవుతాయని తెలిపారు. వైఎస్సార్సీపీ యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వంశీకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
గుర్తుతెలియని వ్యక్తి మృతి
నెల్లూరు(క్రైమ్): నగరంలోని అభిరామ్ హోటల్ సమీపంలో శుక్రవారం అనారోగ్యమో? వడదెబ్బ వల్లనో స్పష్టమైన కారణాలు తెలియదు గానీ గుర్తుతెలియని వ్యక్తి(35) మృతిచెందాడు. ఈ విషయమై స్థానికులు చిన్నబజారు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతుని వద్ద ఎలాంటి ఆధారాలు లభించలేదు. మృతదేహాన్ని జీజీహెచ్ మార్చురీకి తరలించి కేసు నమోదు చేశారు. మృతుని వివరాలు తెలిసిన వారు చిన్నబజారు పోలీసులను సంప్రదించాలని కోరారు. పెయింట్స్ గోదాములో అగ్నిప్రమాదం నెల్లూరు(క్రైమ్): పెయింట్స్ గోదాములో అగ్నిప్రమాదం సంభవించి రూ.లక్షల్లో ఆస్తి నష్టం వాటిల్లిన ఘటన ప్రశాంతినగర్‌లో శుక్రవారం చోటుచేసుకుంది. అగ్నిమాపక సిబ్బంది సమాచారం మేరకు.. నగరానికి చెందిన కె.జనార్దన్‌రెడ్డి ప్రశాంతినగర్‌లో పెయింట్స్ గోదాము నిర్వహిస్తున్నారు. శుక్రవారం మధ్యాహ్నం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపుచేశారు. ఈ ప్రమాదంలో రూ.5 లక్షల మేర ఆస్తి నష్టం వాటిల్లినట్లు అగ్నిమాపక సిబ్బంది తెలిపారు. ఇద్దరు టీఏల సస్పెన్షన్ వాకాడు: మండలంలో 19 పంచాయతీలకు సంబంధించి ఏడాది కాలంలో జరిగిన గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులపై శుక్రవారం వాకాడులో సామాజిక తనిఖీలు నిర్వహించారు. పీడీ ఎంసీ మద్దిలేటి పంచాయతీల వారీగా పనులను తనిఖీ చేశారు. పీడీ మాట్లాడుతూ మండలంలో 227 పనులకు రూ.8.27 కోట్లు ఖర్చు చేయగా, అవకతవకలకు పాల్పడిన ఇద్దరు టీఏలు రమేష్, మల్లికార్జున్ నుంచి రూ.77 వేలు రికవరీకి ఆదేశించారు. ఈ మేరకు వారిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. వారిపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి నివేదిక అందించాలని ఎంపీడీఓ సాయిప్రసాద్‌ను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఏపీఓ విజయమ్మ, పలువురు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. చోరీ కేసుల్లో నలుగురి అరెస్ట్ నెల్లూరు(క్రైమ్): చోరీలకు పాల్పడుతూ పోలీసుల కళ్లుగప్పి తిరుగుతున్న నలుగురు దొంగలను వేదాయపాళెం పోలీసులు అరెస్ట్ చేశారు. వేదాయపాళెం పోలీస్‌స్టేషన్‌లో ఇన్స్పెక్టర్ కె.శ్రీనివాసరావు శుక్రవారం వివరాలను వెల్లడించారు. నెల్లూరు రూరల్ మండలం కావేరినగర్లోని ఓ దుకాణంలో ఇటీవల గృహోపకరణాలను గుర్తుతెలియని వ్యక్తులు అపహరించుకుని వెళ్లారు. బాధితుని ఫిర్యాదు మేరకు వేదాయపాళెం పోలీసులు కేసు నమోదు చేశారు. ఇన్స్పెక్టర్ కె.శ్రీనివాసరావు నేతృత్వంలో ఎస్సై అంకమ్మ తన సిబ్బందితో దర్యాప్తు ప్రారంభించారు. సాంకేతికత ఆధారంగా నిందితులు వైఎస్సార్ నగర్ పుట్టవీధికి చెందిన పాతనేరస్తుడు చిన్నబ్బయ్య, శివాజీ నగర్‌కు చెందిన సాయి, శ్రామికనగర్‌కు చెందిన సుప్రజ, పోలమ్మలుగా గుర్తించి గాలింపు చర్యలు చేపట్టారు. గురువారం సాయంత్రం నిందితులను వల్లూరమ్మ కాలనీ వద్ద అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అనంతరం వారిని విచారించగా గృహోపకరణాలతో పాటు దర్గామిట్ట, బాలాజీనగర్ పోలీస్స్టేషన్ల పరిధిలో దొంగతనాలకు పాల్పడినట్లు వెల్లడించారు. దీంతో నిందితులను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి రూ.50 వేలు విలువ చేసే రెండు టీవీఎస్ ఎక్స్ఎల్ మోటారు సైకిళ్లు, గృహోపకరణాలను స్వాధీనం చేసుకున్నట్లు ఇన్స్పెక్టర్ చెప్పారు. చెడు వ్యసనాలకు బానిసైన నిందితులు చోరీలకు పాల్పడుతన్నట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు. కండలేరులో నీటి నిల్వ రాపూరు: కండలేరు జలాశయంలో శుక్రవారం నాటికి 41.750 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు ఈఈ గజేంద్రరెడ్డి తెలిపారు. కండలేరు నుంచి సత్యసాయి గంగ కాలువకు 1050, లోలెవల్ కాలువకు 50, లెవల్ కాలువకు 80, పిన్నేరు కాలువకు 20, మొదటి బ్రాంచ్ కాలువకు 65 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు వివరించారు. -
నేత్రపర్వం.. రథోత్సవం
అమ్మవారి రథోత్సవం ● జొన్నవాడలో అంగరంగ వైభవంగా కామాక్షితాయి అమ్మవారి బ్రహ్మోత్సవం ● భక్తజన సందోహంతో కిటకిటలాడిన ఆలయ పరిసరాలు బుచ్చిరెడ్డిపాళెం: మండలంలోని జొన్నవాడలో కొలువుదీరిన మల్లికార్జున సమేత కామాక్షితాయి అమ్మవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. శుక్రవారం ఉదయం రథోత్సవ ఘట్టం నేత్రపర్వంగా సాగింది. తెల్లవారు జాము నుంచే ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసి పోయింది. ప్రత్యేక పూజలు, వేదమంత్రోచ్ఛరణల నడుమ స్వామి అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలను అలంకరించిన మహారథంపై ప్రతిష్టించి పురవీధుల్లో ఊరేగించారు. రథోత్సవాన్ని తిలకించేందుకు మండలంతోపాటు జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి వేలాదిగా భక్తులు తరలివచ్చారు. జై కామాక్షితాయి, హరహర మహాదేవ నామస్మరణలతో ఆలయ పరిసరాలు మార్మోగిపోయాయి. రథాన్ని లాగేందుకు భక్తులు పోటీపడి పడ్డారు. రథోత్సవంలో భక్తులు మొక్కులు తీర్చుకున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయ పరిసరాల్లో విస్తృత ఏర్పాట్లు చేపట్టారు. ఎండ తీవ్రత నేపథ్యంలో ఉభయదాతలు పలుచోట్ల మజ్జిగ, తాగునీటి చలివేంద్రాలు ఏర్పాటు చేసి భక్తులకు సేవలందించారు. నేడు ఆది దంపతుల దివ్య కల్యాణం బ్రహ్మోత్సవాల్లో అత్యంత వైభవంగా నిర్వహించే స్వామి అమ్మవార్ల దివ్య కల్యాణ మహోత్సవం శనివారం జరగనుంది. భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయ అధికారులు విస్తృ ఏర్పాట్లు చేశారు. తాగునీరు, వైద్య శిబిరాలు, పార్కింగ్, క్యూలైన్ల నిర్వహణ వంటి సౌకర్యాలు కల్పించారు. -
సోమిరెడ్డి దోపిడీ నభూతో నభవిష్యతి
నెల్లూరురూరల్: సర్వేపల్లి నియోజకవర్గంలో రైతులు కష్టపడి, తమ సొంత డబ్బుతో కాలువలు బాగు చేసుకుంటే, ఆ పనులను తానే చేసినట్లుగా సోమిరెడ్డి బిల్లులు చేయించుకోవడం సిగ్గు చేటని, సోమిరెడ్డి చేస్తున్న దోపిడీ నభూతో నభవిష్యతి అని మాజీ మంత్రి, జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి ధ్వజమెత్తారు. నగరంలోని జిల్లా పార్టీ కార్యాలయంలో శుక్రవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఇరిగేషన్ పనుల పేరుతో కూటమి నాయకులు దొంగ బిల్లులు సృష్టించి కోట్లాది రూపాయలు దోచుకుంటున్నారని, కుంభకోణాలు జరుగుతున్నా కలెక్టర్ కనీసం స్పందించకపోవడం దారుణమన్నారు. మంత్రి రామానాయుడుకు అవినీతిలో వాటాలు అందుతుండేసరికి ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు. కాయకష్టం చేసే అన్నదాతల సొమ్మును ఆశించడం కంటే దౌర్భాగ్యం మరొకటి లేదన్నారు. ఐఏబీ సమావేశంలో కాలువలు శుభ్రం చేసి నీళ్లు వదలాలని నిర్ణయం తీసుకున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉందన్నారు. గతంలో నీరు–చెట్టు పథకాన్ని ఏ విధంగా అయితే దోచుకోవడానికి వాడుకున్నారో, ఇప్పుడు నీటి భద్రత సాగునీటి సంఘాల బాధ్యత అనే కొత్త పేరుతో రైతులను అడ్డం పెట్టుకుని దోపిడీ చేస్తున్నారని, ఎమ్మెల్యేలు, పనులు చేయకుండానే బిల్లులు కాజేసేందుకు జేసీబీ దగ్గర కొబ్బరికాయలు కొట్టి హడావుడి చేస్తున్నారన్నారు. జేసీబీలను కేవలం ఎమ్మెల్యేలు కొబ్బరికాయలు కొట్టే ఫొటోల కోసమే వాడుతున్నారని, ఆ తర్వాత అవి పనిచేయకుండానే అక్కడి నుంచి వెళ్లిపోతున్నాయన్నారు. ప్రభుత్వ యంత్రాంగంలో అవినీతి ఏ స్థాయికి చేరిందంటే, గంగాధర్ రెడ్డి అనే అధికారి నేరుగా ఫోన్ పే ద్వారా లంచాలు తీసుకున్నాడని పత్రికల్లో కథనాలు వచ్చినా.. కేవలం సస్పెన్షన్ తప్ప విచారణ జరిపి చర్యలు తీసుకోలేదన్నారు. రాష్ట్రంలో ఏసీబీ వ్యవస్థ అసలు పనిచేస్తుందా? అనిపిస్తుందని, బహిరంగంగా లంచాలు తీసుకుంటున్నట్లు ఆధారాలు ఉన్నా పట్టించుకోలేదన్నారు. ఇరిగేషన్ పనుల వివరాలను సమాచార హక్కు చట్టం కింద కోరితే అధికారులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారన్నా రు. ప్రభుత్వం చూపిస్తున్న లెక్కలకు, క్షేత్రస్థాయిలో జరిగిన పనులకు పొంతన లేదన్నారు. ఒకే పనికి సంబంధించి మూడు వేర్వేరు సందర్భాల్లో బిల్లులు తీసుకున్నారని, కూటమి పాలనలో జరుగుతున్న అవినీతిపై ఏ రోజు అగ్రిమెంట్ అయింది, ఏ రోజు పని చేశారు, ఏ రోజు బిల్లు పెట్టారో గూగుల్ మ్యాప్స్ ఆధారాలతో అవినీతిని నిరూపించడానికి తాము సాంకేతికంగా చూపించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. కాలువలో కనీసం మట్టి కూడా తీయకుండానే కోట్లాది రూపాయల బిల్లులు చెల్లించారని, దీనిపై విజిలెనన్స్ విచారణ చేపట్టాలన్నారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తే తప్పు చేసిన ఏ అధికారిని విడిచి పెట్టేది లేదన్నారు. రేపు విచారణ జరిగినప్పుడు ఈ గూగుల్ మ్యాప్స్ ఫొటోలే మీ అవినీతికి నిదర్శనంగా నిలుస్తాయని, అవినీతి పాల్పడుతూ, రైతులను ఇబ్బంది గురి చేస్తున్న అధికారులపై విచారణ జరిపి, తగు ఆధారాలతో నిరూపించి కఠినంగా శిక్షిస్తామన్నారు. ఇరిగేషన్ పనుల్లో దొంగ బిల్లులు పెట్టి చేతివాటం రైతులు చేసిన పనికి బిల్లులు చేసుకున్న ఘనుడు మాజీ మంత్రి కాకాణి ధ్వజం -
ఆక్వా ఫీడ్ ధరల పెంపుపై రైతుల నిరసన
డాలర్ల పంటగా ఖ్యాతిగడించిన ఆక్వా రంగం కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో సంక్షోభంలో పడింది. రాబోయే సీజన్ నాటికి ఆక్వా సాగుపై క్రాప్ హాలిడే ప్రకటించే పరిస్థితులు నెలకొన్నాయి. అప్సడా నిబంధనలకు విరుద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం అండతో ఫీడ్ యాజమాన్యాలు ధరలు పెంచడంతో ఈ ప్రభావం ఆక్వా రంగంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. జిల్లాలో ఒకప్పుడు లక్షాపాతిక వేల ఎకరాల్లో సాగవుతుంటే.. ప్రస్తుతం మూడో వంతుకు పడిపోయింది. తాజాగా నాలుగైదు రోజులుగా ఫీడ్ ధరలు పెరగడంతో ఖర్చులు భరించలేక తక్కువ కౌంట్లోనే పట్టేస్తున్నారు. ఒక పక్క ధరల పెరుగుదలను తాత్కాలికంగా నిలిపివేశామని చెబుతున్నా.. వ్యాపారులు మాత్రం పెరిగిన ధరలతోనే రైతులకు విక్రయిస్తున్నారు. వాకాడు : ఏపీలోని ఆక్వా ఫీడ్, ప్రాసెసింగ్ యూనిట్లన్నీ టీడీపీ నేతలు చేతుల్లో ఉండడంతో వీరి కన్ను ఆక్వా రైతులపై పడింది. పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో వీరు రొయ్యల ధరలను తగ్గించేశారు. తాజాగా రా మెటీరియల్ ధరలు పెరిగాయంటూ టన్నుకు రూ.10 వేల లెక్కన పెంచేసి దోపిడీకి తెర తీశారు. వాస్తవానికి కూటమి అధికారంలోకి వచ్చాక ధాన్యం నుంచి పప్పు ధాన్యాలు, ఆహార ధాన్యాలు, చిరుధాన్యాల ధరల వరకు పాతాళానికి పడిపోయాయి. ఇక చేపల ధరలు కూడా తగ్గిపోయాయి. రొయ్యల మేతలో వినియోగించే చేపలు, సోయాబీన్, గోధుమలు, మొక్కజొన్నలు, రొయ్యల వేస్ట్, కొవ్వు నూనెలు సైతం ధరల పతనం కోవలోనే ఉంటే.. రా మెటీరియల్ ధరలు ఎక్కడ పెరిగాయో అర్థం కావడం లేదని ఆక్వా రైతులు ప్రశ్నిస్తున్నారు. దిగుమతి సుంకాలు తగ్గించినా.. ఫీడ్ తయారీలో వాడే ముడి సరుకు దిగుమతుల సుంకాన్ని గతేడాది కేంద్రం 30 శాతం నుంచి 5 శాతానికి తగ్గించగా కొన్ని ఉత్పత్తులపై పూర్తిగా సుంకాన్ని మినహాయించింది. అంటే ఈ లెక్కన ఫీడ్ ధరలు టన్నుకు రూ.15 వేలు నుంచి రూ. 20 వేలు వరకు తగ్గాల్సి ఉంది. కాని ఆయా కంపెనీలు యుద్ధాన్ని బూసిగా చూపి ఇష్టారాజ్యంగా ధరలు పెంచేసి రైతులను నిలువు దోపిడీ చేస్తున్నారు. అప్సడా అనుమతి అవసరం ఫీడ్, సీడ్ ధరలు పెంచాలంటే అప్సడా (ఏపీ ఆక్వా కల్చర్ డెవలప్మెంట్ అథారిటీ) అనుమతి పొందాల్సి ఉంటుంది. ఒక వేళ ధరల పెంపు అనివార్యమైనప్పడు ఆక్వా రైతుల సంఘాల నేతలతో సమావేశమై వారి అంగీకారంతో ధరలు పెంచాలి. కాని చంద్రబాబు ప్రభుత్వం ఫీడ్ కంపెనీలతో కుమ్మకై ్క అప్సడా చట్టాన్ని నిర్వీర్యం చేసి ఏక పక్షంగా ధరలు పెంచేందుకు అనుమతులు ఇవ్వడంపై రైతులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. అంతర్జాతీయంగా ముడిసరుకుల ధరలు పెరిగాయంటూ ఈ ఏడాది ఫిబ్రవరిలో అప్సడా అనుమతి లేకుండానే టన్నుపై రూ.4 వేలు ధరలు పెంచారు. దీంతో జిల్లాలో వెనామీ ఫీడ్ టన్ను రూ.87 వేలు ఉండగా, టైగర్ ఫీడ్ టన్ను రూ.98 వేలుగా ఉండగా తాగాజా టన్నుపై మరో రూ.10 వేలు లెక్కన పెంచారు. కూటమి అధికారంలో ఉండడంతో అప్సడాతో మాకేం పనంటూ ఫీడ్ యాజమాన్యాలు దోపిడీకి తెరతీశాయి. ఒక పక్క దీనిపై చర్చించిన తర్వాతనే ధరలపై నిర్ణయం తీసుకుంటామంటూనే మరో పక్కన పెంపును అమల్లోకి తెచ్చారు. రొయ్యల ధరలు పతనం ప్రకృతి వైపరీత్యాలతో తగ్గుతున్న దిగుబడులు, సాగులో పెరుగుతున్న ఉత్పాదక వ్యయం వెరసి ఆక్వా రైతులు సంక్షోభంలో కొట్టు మిట్టాడుతున్నారు. ఇదిలా ఉంటే ట్రంప్ సుంకాలు, పశ్చిమ ఆసియాలో జరుగుతున్న యుద్ధం సాకుగా చూపి కొందరు పచ్చ నేతలు సిండికేట్ వ్యాపారులుగా మారి ఆక్వా సాగును నిలువునా దోసుకుంటున్నారు. ఓ పక్క నాసిరకం సీడ్‌తోపాటు, మరో పక్క పెరిగిన ఫీడ్ ధరలు, ప్రకృతి వైపరీత్యాలతో రొయ్య రైతులు తల్లడిల్లుతుంటే చంద్రబాబు ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోవడంతో ఆక్వా రైతులు మండి పడుతున్నారు. ఆక్వా సాగులో ఒక టన్ను రొయ్యలు ఉత్పత్తి చేయాలంటే రైతులు 90 రోజులు రొయ్య పిల్లలను కంటికి రెప్పలా కాపాడుకోవాలి. అందులో ఫీడ్, సీడ్, కెమికల్స్, ఏయిరేటర్స్ కరెంట్ బిల్లులు, జనరేటర్, ఫీడింగ్ కూలీలు, తదితర పరికరాల కొనుగోలు, లీజులతో కలిపి దాదాపు రెండు ఎకరాల చెరువుకు రూ. 2.60 లక్షల వరకు ఖర్చు చేయాలి. ప్రస్తుతం ఉన్న రొయ్యల ధరలతో సరి చూసుకుంటే ఎకరాకు రూ. 20 వేలు నుంచి రూ.30 వేలు వరకు నష్టం వాటిల్లుతోంది. నాసిరకం సీడ్ చెరువుల్లో పోసిన పది రోజులకే రొయ్యి పిల్లలు విపరీతంగా చనిపోతున్నాయి. దీంతో సాగులో మరింత నష్టం చవి చూడాల్సి వస్తుంది. జిల్లాలో ఏడాదికి రూ.2,500 కోట్ల వ్యాపారం ఉమ్మడి నెల్లూరు జిల్లా తీరం వెంబడి 12 మండలాల్లో ప్రస్తుతం 45 వేల ఎకరాలకు సాగు జరుగుతోంది. ఏడాదికి లక్ష టన్నుల రొయ్య ఉత్పతి జరుగుతోంది. టన్ను ఉత్పత్తికి రెండున్నర టన్నుల మేతను వినియోగించాల్సి ఉంది. సగటున ఏడాదికి 2.5 లక్షల మెట్రిక్ టన్నుల మేతను రైతులు కొనుగోలు చేస్తున్నారు. తద్వారా ఏడాదికి రూ.2500 కోట్లు ఫీడ్ వ్యాపారం జరుగుతుంది. తాజాగా పెరిగిన ధరల ప్రకారం చూస్తే ఇదే స్థాయిలో ఆక్వా సాగు జరిగితే.. ఏడాదికి రూ.250 కోట్ల అదనపు భారం పడుతోందని అంచనా. టన్నుకు మూడు నెలల్లో రూ.14 వేల వరకు పెంపు రొయ్యల ధరలు చూస్తే పాతాళానికి పతనం ఈ పరిస్థితుల్లో మేత కొనుగోలు చేయలేక తక్కువ కౌంట్లోనే పట్టేస్తున్న రైతులు జిల్లాలో ఏడాదికి రూ.2500 కోట్ల ఫీడ్ వ్యాపారం తాజాగా పెరిగిన ధరల ప్రకారం రూ.250 కోట్ల అదనపు భారం ఆక్వా రంగం అతలాకుతలం రొయ్యల ధరలు చిల్లకూరు: ఆక్వా ఫీడ్ ధరలను పెంచడాన్ని వ్యతిరేకిస్తూ పలువురు రైతులు నల్లబాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఓ ఫీడ్ కంపెనీ నిర్వాహకులు చిల్లకూరులోని ఓ హోటల్లో శుక్రవారం ఆక్వా రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. చిల్లకూరు, కోట మండలాలకు చెందిన ఆక్వా సాగుదారులు కార్యక్రమం పూర్తయిన తర్వాత హోటల్ బయట నల్లబాడ్జీలు ధరించిన నిరసన వ్యక్తం చేశారు. వారు మాట్లాడుతూ ఆక్వా సాగు రెండేళ్లుగా ఒడిదొడుకులు ఎదుర్కొంటోందని, దీంతో సాగుదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఈ సమయంలో ఫీడ్ యాజమాన్యాలు టన్నుపై రూ.10 వేల వరకు పెంచడం దారుణమన్నారు. ఇప్పటికే మూడు నెలల క్రితం టన్నుపై రూ.4 వేల పెంచడంతో భారాన్ని మోస్తున్నామని, అంతలోనే మరోసారి అధికంగా ధులు పెంచేందుకు పూనుకోవడం బాధాకరమన్నారు. ఇకనైనా ప్రభుత్వం ఫీడ్ పరిశ్రమల వారితో పూర్తిస్థాయిలో చర్చలు జరిపి ధరలను తగ్గించడంతోపాటు రొయ్యల ధరలు పెరుగుదలకు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. -
కారుణ్య నియామకపత్రాల అందజేత
నెల్లూరురూరల్: కారుణ్య నియామకం ద్వారా ఇద్దరికి ఉద్యోగావకాశాలు కల్పిస్తూ కలెక్టర్ హిమాన్షు శుక్లా శుక్రవారం నియామక ఉత్తర్వులను అందించారు. వైద్యారోగ్య శాఖలో ఏఎన్ఎం గ్రేడ్–3గా పనిచేస్తూ మృతి చెందిన సులోచనమ్మ కుమారుడు అఖిల్‌కు సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో వెల్ఫేర్, ఎడ్యుకేషన్ అసిస్టెంట్‌గా, వీఆర్వో గ్రేడ్–1గా రెవెన్యూ శాఖలో పనిచేస్తూ మృతి చెందిన నాగేశ్వరావు కుమార్తె శోభకు ఏపీజీఎల్ఐ శాఖలో జూనియర్ అసిస్టెంట్‌గా నియామక ఉత్తర్వులు అందించారు. ఈ కార్యక్రమంలో డీఆర్ఓ విజయకుమార్, కలెక్టరేట్ ఏఓ శ్రీనివాసులు పాల్గొన్నారు. జిల్లాలో 142 విద్యా సంస్థల బస్సులకు నోటీసులు నెల్లూరు (టౌన్): జిల్లాలో ఫిట్నెస్ గడువు ముగిసిన విద్యాసంస్థల బస్సులను జిల్లా రవాణాశాఖ అధికారులు శుక్రవారం తనిఖీ చేశారు. జిల్లా వ్యాప్తంగా 436 విద్యాసంస్థల బస్సులను తనిఖీ చేసినట్లు ఆర్టీఓ మదాని తెలిపారు. ఈ బస్సుల్లో కండీషన్ లేని 142 బస్సులకు నోటీసులు జారీ చేసినట్లు చెప్పారు. మోటారు వెహికల్ చట్టం 185 ప్రకారం బస్సులన్ని కండీషన్లో ఉంచుకుని ఫిట్నెస్ చేయించుకోవాలన్నారు. ఫిట్నెస్ చేయించని బస్సులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మట్టి మాఫియా ట్రాక్టర్ డ్రైవర్ దుర్మరణం సంగం: మట్టిని అక్రమంగా తరలిస్తున్న ట్రాక్టర్ అదుపు తప్పిన ప్రమాదంలో డ్రైవర్ దుర్మరణం పాలయ్యాడు. ఈ ఘటన మండలంలోని మర్రిపాడులో శుక్రవారం రాత్రి జరిగింది. పోలీసుల వివరాల మేరకు.. గ్రామానికి చెందిన కొందరు టీడీపీ నేతలు మట్టి మాఫియాగా ఏర్పడి గ్రామంలోని ట్రాక్టర్ల ద్వారా మట్టిని కొల్లగొడుతున్నారు. ఈ క్రమంలో బుచ్చిరెడ్డిపాళెం మండలం చెల్లాయపాళేనికి చెందిన ఆర్.హరికిరణ్ (45) ట్రాక్టర్ డ్రైవర్‌గా వెళ్లి మట్టిని తరలిస్తుండగా ట్రాక్టర్ అదుపుతప్పి వాగులోకి దూసుకెళ్లడంతో బోల్తా పడింది. హరికిరణ్ ట్రాక్టర్ కింద పడి మృత్యువాత పడ్డాడు. సమాచారం అందుకున్న సంగం పోలీసులు హరికిరణ్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
రవాణాపై పెట్రో, డీజిల్ పిడుగు
నెల్లూరు (టౌన్): రవాణా రంగంపై డీజిల్, పెట్రోలు పిడుగు పడింది. ఇప్పటికే కిరాయిలు లేక ఇబ్బందులు పడుతున్న రవాణా వాహనదారులపై తాజాగా పెట్రోలు, డీజిల్ ధరలు మరింత సంక్షోభంలోకి నెట్టనున్నాయి. కేంద్ర ప్రభుత్వం పెట్రోల్‌పై 3.24 పైసలు, డీజిల్‌పై 3.17 పైసలు భారం మోపింది. పెరిగిన చార్జీలు వెంటనే అమల్లోకి వస్తాయని ప్రకటించింది. ఈ నేపథ్యంలో రవాణా రంగం కుదేలు కానుంది. జిల్లాలో ప్రతి రోజు 3.13 లక్షల లీటర్లు పెట్రోలు, 5.68 లక్షల లీటర్లు డీజిల్ విక్రయం జరుగుతోంది. జిల్లాలో ఎక్కువ మంది ఆటో రంగంపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. జిల్లాలో 6 లక్షలకు పైగా వాహనాలు ఉన్నాయి. వీటిల్లో ప్రధానంగా 4.02 లక్షలు మోటారు బైక్‌లు, 60,200 కార్లు, 13,725 అగ్రికల్చర్ ట్రాక్టర్లు, 22,450 ఆటోలు, 13,500 గూడ్సు క్యారియర్లతో పాటు మిగిలిన వివిధ రకాల వాహనాలు ఉన్నాయి. ఇప్పటికే రవాణా రంగం పరిస్థితి మరింత దిగజారిపోయింది. కొత్తగా వాహనాలు కొనుగోలు చేసే పరిస్థితి లేదు. అత్యవసర వాహనాలను మాత్రమే కొనుగోలు చేస్తున్నారు. త్వరలో పెట్రోలు, డీజిల్‌పై లీటరుకు రూ. మరో 4 నుంచి రూ.5 పెంచే అవకాశం ఉందని డీజిల్, పెట్రోలు బంకుల యాజమానులు చెబుతున్నారు. పెరగనున్న నిత్యావసర, రవాణా ఛార్జీలు పెట్రోలు, డీజిల్ ధరల పెరుగుదల వివిధ రకాల రంగాలపై భారం పడనుంది. ప్రధానంగా నిత్యావసర సరుకులైన పాలు, గుడ్లు, ప్రొవిజన్స్, కూరగాయలు తదితర వాటిపై ప్రభావం పడనుంది. వీటితో పాటు ఆటో, బస్సుల చార్జీలు కూడా పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే నిత్యావసర సరుకులు ధరలు పెరిగి ఇబ్బందులు పడుతున్న వినియోగదారులు వీటి ధరలు మళ్లీ పెరిగితే మరిన్ని ఇబ్బందులు తప్పవని చెబుతున్నారు. పెళ్లిళ్లు, ఫంక్షన్లకు వెళ్లాలంటే ఎక్కువ మంది అద్దె వాహనాలపై ఆధార పడుతున్నారు. డీజిల్, పెట్రోలు ధరలు పెరగడంతో వాటి అద్దె ధరలు కూడా పెంచనున్నారు. పెట్రోల్‌పై రూ.3.24, డీజిల్‌పై రూ.3.17 త్వరలో మరోసారి పెరగనున్న ధరలు జిల్లాలో 6 లక్షలకు పైగా వివిధ రకాల వాహనాలు ఇప్పటికే కిరాయిలు లేక ఇబ్బందులు ఆటోలపై భారం పెట్రోల్ ధరలు పెరుగుదల ఆటోలపై తీవ్ర ప్రభావం పడుతుంది. ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు పథకంతో ఆటోలు ఎక్కే వారు కరవయ్యారు. నగరంలో ఆటోలు ఎక్కువగా ఉన్నాయి. డీజిల్ పెరగడంతో చార్జీలు పెంచనిదే గిట్టుబాటు కాదు. – రమణయ్య, ఆటో డ్రైవరు వాహనాలను తిప్పలేం ఇప్పటికే బాడుగలు లేక స్టాండ్లకే మినీ లారీలను పరిమితం చేస్తున్నాం. పెట్రోలు, డీజిల్ ధరలు పెరిగితే లారీలను తిప్పలేని పరిస్థితి ఉంటుంది. నెల్లూరు నగ రంలో మినీ లారీలు ఎక్కువగా ఉన్నాయి. ధరలు పెంచితే బాడుగలు దొరకని పరిస్థితి ఉంది. పోటీ తత్వంతో తక్కువ కిరాయితోనే బాడుగకు వెళుతున్నారు. – శ్రీను, మినీ లారీ ఓనర్ -
ప్రజా సొమ్మును కాంట్రాక్టర్లకు దోచిపెడుతున్నారు
నెల్లూరు(బారకాసు): నగరపాలక సంస్థలో పన్నుల రూపంలో ముక్కుపిండి వసూలు చేసిన ప్రజాధనాన్ని వివిధ రకాల పేర్లతో ప్రైవేటు కాంట్రాక్టర్లకు దోచిపెడుతున్నారని సీఐటీయూ నాయకులు కత్తి శ్రీనివాసులు, పెంచలయ్య అన్నారు. చెత్త తరలించే వాహనాల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో శుక్రవారం పాతమున్సిపల్ కార్యాలయ సమీపంలోని వెహికల్ షెడ్డు వద్ద డ్రైవర్లు, పారిశుద్ధ్య కార్మికులు నిరసన ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నగరపాలక సంస్థ ద్వారానే వాహనాలు కొనసాగించాలని, ప్రైవేటీకరణ చర్యలను నిలుపుదల చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే నెలకు ఒకటిన్నర కోటికి పైగా ప్రైవేటు ట్రాక్టర్ల పేరుతో ప్రజా సొమ్మును వృథా చేస్తున్నారన్నారు. ఇప్పుడు మరలా 200 ఈవీ వాహనాలను ప్రైవేటు కాంట్రాక్టర్ ద్వారా తీసుకురావడం వల్ల నెలకు రూ.2 కోట్లకు పైగా ప్రజాధనం దుర్వినియోగం అవుతుందన్నారు. వివిధ సంఘాల నాయకులు వజ్రమ్మ, సునీల్, సుధాకర్, సీహెచ్ మనోజ్‌కుమార్, ఎం.అశోక్, మట్టిపాటి శ్రీనివాసులు, లోకేష్, పందల శ్రీనివాసులు నాగేశ్వరరావు, శివ, షఫీ తదితరులు పాల్గొన్నారు. -
చికెన్ వ్యర్థాలతో కాసుల వేట
నిత్యం వాహనాల్లో జిల్లాకు సరఫరా ● పెరిగిన మేత ధరల నేపథ్యంలో మరింత ఎక్కువగా.. ● 80 డ్రమ్ములున్న వాహనమైతే రూ.16 వేల మామూలివ్వాల్సిందే.. ● తమ్ముళ్ల అండతో చెలరేగుతున్న వైనంఆత్మకూరు: కొందరు అక్రమార్కుల స్వార్థం ప్రజల ఆరోగ్యాన్ని ప్రమాదంలో పడేస్తోంది. జిల్లాకు చికెన్ వ్యర్థాల రాక ఆగడం లేదు. రోజూ ఏదో ఒక మండలంలో వాహనాలను పట్టుకుంటూనే ఉన్నారు. సంగం, ముత్తుకూరు, కొడవలూరు, విడవలూరు, తదితర మండలాల పరిధిలో ఆక్వా సాగు తగ్గి చేపల గుంతల సాగు ఎక్కువైంది. రొయ్యలు అమ్ముకుందామంటే సరైన గిట్టుబాటు ధర లేకపోవడం, పెరిగిన ఖర్చుల నేపథ్యంలో పలువురు రైతులు దీనివైపు దృష్టి సారించారు. జిల్లా పరిధిలో సుమారు 2,717 హెక్టార్లలో చేపల గుంతలు సాగులో ఉన్నాయని సమాచారం. వీటి పెంపకంలో మేత ప్రధానమైంది. కంపెనీ మేతకు రూ.వేలు ఖర్చు చేయాలి. అందుకే చికెన్ వ్యర్థాల వైపు అనేకమంది మొగ్గుచూపారు. 33 వాహనాల పట్టివేత ఏడాదిన్నర వ్యవధిలో ఆత్మకూరు నియోజకవర్గ పరిధిలోనే సంగం మండల పోలీసులు చికెన్ వ్యర్థాలను తీసుకొస్తున్న 33 వాహనాలను పట్టుకొని కేసులు నమోదు చేశారు. ఇక చిక్కకుండా తప్పించుకున్న వాహనాలు వందల సంఖ్యలో ఉంటాయని ప్రజలు అంటున్నారు. కొన్ని వాహనాలను పట్టుకుని తూతూమంత్రంగా కేసులు నమోదు చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. పటిష్ట చర్యలు చేపట్టే పరిస్థితి కనిపించడం లేదు. చేపల గుంతల వద్దనే ప్లాస్టిక్ డ్రమ్ముల్లో వ్యర్థాలు నిల్వ ఉంటుంటే వాటిపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు చేపడితే తప్ప దీనిని అరికట్టడం సాధ్యం కాదు. అన్ని శాఖల అధికారుల సమన్వయంతోనే ఇది సాధ్యమవుతుందనే అభిప్రాయం ప్రజల్లో ఉంది. ఇటీవల ● ఈనెల ఒకటో తేదీన బెంగళూరు నుంచి అనంతసాగరం మండలంలో రేవూరు గ్రామానికి చికెన్ వ్యర్థాలను తరలిస్తున్న మినీ లానీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ● 12వ తేదీన సంగం మండలంలో మినీ లారీ, మరో వాహనంలో వ్యర్థాలను పట్టుకున్నారు. ● గత 27వ తేదీన మర్రిపాడు మండలంలో 20 డ్రమ్ములను స్వాధీనం చేసుకున్నారు.తెలుగు తమ్ముళ్ల దందా అక్రమ దందాకు అధికార పార్టీ అండదండలు పుష్కలంగా ఉన్నాయి. ముఖ్యంగా బెంగళూరు నుంచి అధిక సంఖ్యలో మినీవ్యాన్లలో వ్యర్థాలు సరఫరా అవుతున్నాయి. చెక్‌పోస్ట్ సిబ్బంది, పోలీసులు, అధికార పార్టీ నాయకులకు మామూళ్లు ఇచ్చుకుంటూ నిరాటంకంగా వ్యర్థాలు మండలాలకు తరలిస్తున్నారు. కొన్ని వ్యాన్లలో 80 ప్లాస్టిక్ డ్రమ్ములు, మరికొన్నింట్లో 35 డ్రమ్ములు పేర్చుకొని సరఫరా చేస్తున్నారు. పెద్ద వ్యాన్‌కు రూ.16 వేల చొప్పున, చిన్నవ్యాన్లకు రూ.7 వేల చొప్పున టీడీపీ నాయకులు వసూలు చేస్తూ గ్రామాలకు ఆ వాహనాలు క్షేమంగా చేరేలా బాధ్యత వహిస్తున్నారు. ఫిషరీస్, చెక్‌పోస్ట్ అధికారులు, పోలీసులు, స్థానిక నాయకుల సహకారంతో ఈ దందా దర్జాగా కొనసాగుతోంది. చికెన్ వ్యర్థాలపై నిషేధమున్నా అక్రమార్కులు తెలుగు తమ్ముళ్ల అండతో యథేచ్ఛగా తరలిస్తున్నారు. ఈ తంతు బహిరంగంగానే జరుగుతున్నా అధికార యంత్రాంగం పటిష్ట చర్యలు తీసుకోవడంలో విఫలమైందనే విమర్శలున్నాయి. వ్యర్థాల కారణంగా భూగర్భ జలాలు కలుషితమవ్వడంతోపాటు చేపలు తిన్న వారు రోగాల బారిన పడటం ఖాయం. -
నక్కలగండి మత్స్య సంపదపై నేతల కన్ను?
ఉదయగిరి: వరికుంటపాడు మండలంలోని నక్కలగండి రిజర్వాయర్‌లో రూ.కోట్ల విలువైన మత్స్య సంపదను కొల్లగొట్టే ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. దీనికి మత్స్యకార సహకార సంఘం ఉన్నప్పటికీ డమ్మీని చేసి పామూరుకు చెందిన ఓ వ్యక్తి కొన్ని సంవత్సరాల నుంచి సంపద దోచేస్తున్నాడు. అతను స్థానిక నేతలను గుప్పెట్లో పెట్టుకున్నాడని తెలిసింది. రెండు సంవత్సరాల నుంచి రిజర్వాయర్‌లో నీరు అధికంగా ఉండటంతో పూర్తి స్థాయిలో చేపలు వేట సాగలేదు. దీంతో వాటి బరువు బాగా పెరిగింది. ప్రస్తుతం సుమారు రూ.2 కోట్ల విలువైన మత్స్య సంపద ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. చేపలు కొల్లగొట్టే ప్రయత్నం ఇటీవల తూముల ద్వారా నీరు బయటకు వదిలే ప్రయత్నాలు జరిగినట్లు స్థానికులు చెబుతున్నా అధికారులు మాత్రం తూము లీకేజీ నీరు మాత్రమే బయటకు వస్తోందని అంటున్నారు. ఈ నేపథ్యంలో అధికార పార్టీకి చెందిన ముఖ్యనేత రంగ ప్రవేశం చేసి చేపల వేట నిలిపివేయించారు. నిబంధనలకు విరుద్ధంగా చేపలు పట్టించిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. ప్రైవేట్‌గా చేపల పట్టే వ్యక్తిని తమ దారిలోకి తెచ్చుకుని కొంత మొత్తం వసూలు చేసే ప్రయత్నాలు సాగుతున్నట్లు ప్రచారం సాగుతోంది. నామమాత్రం జిల్లాలో పలు మత్స్యకార సహకార సంఘాలు నామమాత్రంగా ఉన్నాయి. కొందరు ప్రభుత్వానికి రుసుము కట్టడం లేదు. దీనిని ఆసరాగా చేసుకున్న పలువురు వ్యక్తులు సొసైటీ ముసుగులో వచ్చి, వారికి నామమాత్రంగా నగదు ఇచ్చి మత్స్య సంపద దోచేస్తూ రూ.కోట్లు గడిస్తున్నారు. ఉదయగిరి నియోజకవర్గం పరిధిలో చిన్నక్రాక రిజర్వాయర్ పరిధిలో ఉన్న పలు చెరువుల్లో సంపదను కాజేసే ప్రయత్నాలు జరగ్గా, కోర్టు ఆదేశాలతో బ్రేక్ పడింది. తాజాగా నక్కలగండి రిజర్వాయర్‌లో చేపల్ని కొల్లగొట్టేందుకు ప్రయత్నాలు సాగుతున్నట్లు సమాచారం. ఓవైపు ప్రభుత్వం మత్స్యకారులను అన్ని విధాలా ఆదుకుంటామని చెబుతున్నా.. క్షేత్ర స్థాయిలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. రూ.కోట్ల స్వాహాకు రంగం సిద్ధం? నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేట్ వ్యక్తి వేట స్థానికుల అభ్యంతరంతో తాత్కాలికంగా నిలుపుదలమాకు సంబంధం లేదు నక్కలగండి రిజర్యాయర్లో 50 శాతం మేర నీరు ఉంది. తూముల ద్వారా కొంత లీకేజీగా పోతుంది. ప్రాజెక్ట్‌లో నీరు వృథాగా వదిలే పరిస్థితి లేదు. జలాశయంలో నీరు ఉంటే దిగువ ప్రాంతంలో భూగర్భ జలాలు సమృద్ధిగా ఉండి ప్రజలకు, రైతులకు మేలు జరుగుతుంది. – రమేష్, ఏఈ, ఇరిగేషన్ -
నేత్రపర్వంగా వెండి నందిసేవ
బుచ్చిరెడ్డిపాళెం: ప్రముఖ పుణ్యక్షేత్రమైన జొన్నవాడలో కొలువైన మల్లికార్జునస్వామి సమేత కామాక్షితాయి అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం వెండి నందిసేవను నేత్రపర్వంగా నిర్వహించారు. మల్లికార్జునస్వామి, కామాక్షితాయి ఉత్సవమూర్తులను విశేషంగా అలంకరించి వెండి నంది వాహనంపై కొలువుదీర్చి గ్రామోత్సవం జరిపారు. కామాక్షితాయికి శ్రీశైలం భ్రమరాంబ సమేత మల్లికార్జునస్వామి దేవస్థానం వారు పట్టువస్త్రాలు సమర్పించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ చైర్మన్ అశోక్‌రెడ్డి, సహాయ కమిషనర్ వెంకట శ్రీనివాసులురెడ్డి ఏర్పాట్లను పర్యవేక్షించారు. డీసీపల్లిలో 115 పొగాకు బేళ్ల విక్రయం మర్రిపాడు: డీసీపల్లి పొగాకు వేలం కేంద్రంలో గురువారం 115 బేళ్లను విక్రయించినట్లు వేలం నిర్వహణాధికారి సునీల్‌కుమార్ తెలిపారు. వేలానికి 189 బేళ్లు రాగా, 115 బేళ్లను విక్రయించామని, మిగిలిన బేళ్లను వివిధ కారణాలతో తిరస్కరించినట్లు చెప్పారు. కిలో గరిష్టంగా రూ.250, కనిష్టంగా రూ.200, సగటు రూ.223.80 ధర పలికిందని తెలిపారు. వేలంలో ఏడు కంపెనీలకు చెందిన వ్యాపార ప్రతినిధులు పాల్గొన్నారు. సచివాలయాన్ని తనిఖీ చేసిన జేసీ కొడవలూరు: మండలంలోని నార్తురాజుపాళెం–1 సచివాలయాన్ని జేసీ మొగిలి వెంకటేశ్వర్లు గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. సచివాలయ సిబ్బంది హాజరు, మూమెంట్, ప్రజావిజ్ఞప్తుల రిజిస్టర్లను పరిశీలించారు. హాజరు రిజిస్ట్టరులో కొందరి సంతకాలు లేకపోవడాన్ని చూసి ప్రశ్నించారు. గృహ గణన విధుల్లో ఉన్నందున సంతకాలు చేయలేదని సచివాలయ సిబ్బంది తెలిపారు. ప్రతిరోజూ విధులు ముగిశాక విధిగా సంతకాలు చేయాలని ఆదేశించారు. రిజిష్టర్‌లో విధిగా తేదీ, సమయం వేయాలని సూచించారు. సచివాలయాల్లో అందుతున్న సేవలను విధిగా బోర్డుపై ప్రదర్శించాలని ఆదేశించారు. జేసీ వెంట తహసీల్దార్ కే స్ఫూర్తిరెడ్డి, వీఆర్వో మల్లికార్జున, పంచాయతీ కార్యదర్శి విజయ్‌కుమార్, సచివాలయ సిబ్బంది ఉన్నారు. డాక్టర్ వంశీకృష్ణసుమన్పై చర్యలకు ఆదేశం నెల్లూరు(అర్బన్): గతంలో వైద్యశాఖలో పని చేసే సమయంలో అధికారులకు చెప్పకుండా, ఎలాంటి అనుమతులు తీసుకోకుండా విధులకు గైర్హాజరవడం, అదే సమయంలో పీజీ చేస్తూ వైద్యశాఖ నుంచి రూ 24,62,714 వేతనాన్ని డ్రాచేసిన డాక్టర్ వంశీకృష్ణసుమన్పై చర్యలు తీసుకోవాలని వైద్యశాఖ కార్యదర్శి సౌరభ్‌గౌర్ ఆదేశాలు జారీ చేశారు. వివరాలు..డాక్టర్ వంశీకృష్ణసుమన్ మర్రిపాడు మండలం కృష్ణాపురం పీహెచ్సీలో డాక్టర్‌గా చేరాడు. ఆయన 5 మే 2022 నుంచి 30 సెప్టెంబర్ 2024 వరకు విధులకు గైర్హాజరయ్యారు. అదే సమయంలో నారాయణ మెడికల్ కళాశాలలో పీడీయాట్రిక్ విభాగంలో పీజీ చేరాడు. ఈ కాలంలో ఒక్కరోజు కూడా విధులకు హాజరు కాకుండానే జీతాల రూపంలో రూ.24,62,714 ను డ్రా చేశాడు. అలాగే స్టైఫండ్ రూపంలో నారాయణ కళాశాలలో నెలకు రూ.30 వేలు వంతున డ్రా చేశాడు. ప్రభుత్వాన్ని మోసం చేసి ఇలా నిధులు డ్రా చేశారని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ఏపీ శాక్స్ రాష్ట్ర ఉన్నతాధికారి కామేశ్వరప్రసాద్ విచారణ చేపట్టారు. అలాగే మరో అధికారి రాధారాణి కూడా విచారణ చేశారు. ప్రాథమిక విచారణ 29 డిసెంబర్ 2024న జరిగింది. నివేదికను 24 డిసెంబర్ 2025న ప్రభుత్వానికి అందజేశారు. ఈ నివేదికలో డాక్టర్ అక్రమాలకు పాల్పడ్డాడని నిర్ధారించారు. ఉన్నతాధికారుల అనుమతులు లేకుండానే పీజీ చదివాడని తేల్చారు. ఈ నేపథ్యంలో ఆయనపై ప్రభుత్వం చర్యలకు పూనుకుంది. -
నేరేడు తోట దగ్ధం
● సుమారు రూ.15 లక్షలు నష్టం ● పోలీసులకు ఫిర్యాదు ఆత్మకూరు: అల్లనేరేడు చెట్లు దగ్ధమైన ఘటన ఆత్మకూరు మండలం కరటంపాడులో చోటు చేసుకుంది. బాధితుడు మలినేని సురేష్ ఆత్మకూరు పోలీసులకు గురువారం ఫిర్యాదు చేశాడు. అందులోని వివరాల మేరకు.. కరటంపాడుకు చెందిన సురేష్ హైదరాబాద్‌లో ఉంటున్నాడు. అతనికి స్వగ్రామంలో 9 ఎకరాల భూమి ఉంది. ఇందులో, మరో మూడున్నర ఎకరాలు లీజుకు తీసుకుని 2021 నుంచి జామ, మామిడి, అల్లనేరేడు సాగు చేపట్టాడు. డ్రిప్ ఇరిగేషన్ కోసం రూ.11 లక్షలు ఖర్చు చేశాడు. సురేష్ తన తోటకు సమీపంలో ప్రసాద్ అనే వ్యక్తికి చెందిన ఎకరా పొలాన్ని లీజుకు తీసుకుని ఖాళీగా పెట్టాడు. అక్కడ గడ్డి మొలవడంతో దానిని మూడురోజుల క్రితం ప్రసాద్ తగులబెట్టాడు. దీంతో మంటలు వ్యాపించగా 160 అల్లనేరేడు చెట్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. డ్రిప్ పైపులు మొత్తం కాలిపోయాయి. సుమారు రూ.15 లక్షలకుపైగా నష్టం వాటిల్లిందని సురేష్ చెబుతున్నాడు. దీని కారకుడైన వ్యక్తిని విచారించి కఠినంగా శిక్షించాలని పోలీసులకు విన్నవించాడు. -
కమిషనర్.. మాకు నీతులు చెప్పొద్దు
నెల్లూరురూరల్: 35 ఏళ్లుగా ఉన్న బీజేపీ కార్యాలయాన్ని తీసివేసి, పీడబ్ల్యూడీ కెనాల్లో ఉందని తొలగించామని కమిషనర్ నీతులు చెప్పాలని చూస్తే ఊరుకోబోమని బీజేపీ నేతలు హెచ్చరించారు. గురువారం నెల్లూరులోని ఆ పార్టీ జిల్లా కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కెనాల్‌ను ఆక్రమించి పెద్ద భవంతులు కట్టుకున్నారని, వాటిని కూల్చే దమ్ముందా అని సవాల్ విసిరారు. మీకు తెలియకపోతే ఎక్కడెక్కడ ఉన్నాయో చూపిస్తామన్నారు. అవినీతితో కమిషనర్ నగరాన్ని భ్రష్టు పట్టిస్తున్నాడని, అతని ఆటలు చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. బిల్డింగ్ వర్క్ ఇన్స్పెక్టర్లు ఎంత డబ్బు దండి ఆయనకు ఇస్తున్నారో తమకు తెలుసన్నారు. కమిషనర్ అవినీతి బుడగ త్వరలో పేలుస్తామని, వెనుకుండి నడిపించే వాళ్లను కూడా వదిలిపెట్టమని హెచ్చరించారు. కమిషనర్‌గా ఐఏఎస్‌లు లేరా అంటూ ప్రభుత్వాన్ని నిలదీశారు. నీ అంతట నువ్వే తప్పుకో అంటూ హితవు పలికారు. సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు వంశీధర్‌రెడ్డి, నేతలు గడ్డం విజయ్‌కుమార్, భరత్‌కుమార్, యాకసిరి ఫణిరాజు, మండ్ల ఈశ్వరయ్య, రాజేష్, యశ్వంత్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. -
బంగారం, నగదు చోరీ
వెంకటాచలం: తాళం వేసిన ఇంటి తలుపులను గుర్తుతెలియని వ్యక్తులు పగులగొట్టి చోరీకి పాల్పడిన ఘటన మండల కేంద్రమైన వెంకటాచలంలో గురువారం వెలుగు చూసింది. పోలీసుల కథనం మేరకు.. వెంకటాచలంలోని రైల్వేగేట్ సమీపంలో నివాసముంటున్న పద్మమ్మ మూడు రోజుల క్రితం ఇంటికి తాళం వేసి తన కుమార్తె వద్దకు వెళ్లింది. గురువారం ఉదయం తిరిగి రాగా ఇంటి తలుపులు తెరిచి ఉన్నాయి. చోరీ జరిగినట్లు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చింది. వారు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. నివాసంలో రెండు బీరువాలు పగులగొట్టి అందులో ఉన్న రూ.50 వేల నగదు, రెండు సవర్ల బంగారు నగలు చోరీ చేశారని బాధితురాలు తెలిపారు. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. రోడ్డు ప్రమాదంలో యువకుడికి తీవ్రగాయాలు రాపూరు: మండలంలోని గోనుపల్లి వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు, పోలీసుల కథనం మేరకు.. రాపూరు నుంచి పెంచలకోనకు ఆర్టీసీ బస్సు వెళ్తోంది. పెంచలకోన నుంచి రాపూరుకు మోటార్‌బైక్‌పై కలువాయి మండలం ఊయాలపల్లికి గ్రామానికి చెందిన సురేష్ వెళ్తున్నాడు. ఈ క్రమంలో గోనుపల్లి మలుపు వద్ద బస్సు, బైక్ ఢీకొనడంతో సురేష్ తీవ్రంగా గాయపడ్డాడు. సమాచారం అందుకున్న 108 సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సురేష్‌ను రాపూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేశారు. -
కబ్జా కోరల్లో ప్రభుత్వ భూమి
● నెల్లూరు నగరంలో ఇదీ పరిస్థితి ● పట్టించుకోని నగరపాలక సంస్థ ● తాజాగా మూడో డివిజన్లో ఇరిగేషన్ స్థలం ఆక్రమణ ● మంత్రి, కమిషనర్ మాటలు నీటిమూటలే..నెల్లూరు(బారకాసు): తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నెల్లూరులో ప్రభుత్వ స్థలాలు కబ్జాకు గురవుతున్నాయి. అయినా సంబంధిత శాఖాధికారులు పట్టించుకోవడం లేదు. నగరపాలక సంస్థ పరిధిలో 54 డివిజన్లున్నాయి. దాదాపు 150 చదరపు కిలోమీటర్ల మేర విస్తీర్ణం ఉన్న నగరంలో ప్రభుత్వానికి చెందిన అనేక స్థలాలున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇరిగేషన్‌కు సంబంధించి రూ.కోట్ల విలువ చేసే స్థలాలు కబ్జాకు గురవుతున్నాయి. ఇప్పటికే ముత్తుకూరు రోడ్డులోని కృష్ణపట్నం కాలువ వెంబడి స్థలాన్ని కొందరు ఆక్రమించి దుకాణాలు నిర్మించి విక్రయించినట్లు తెలుస్తోంది. ఆ ప్రాంతంలో దాదాపు 50కి పైగా దుకాణాలు ఏర్పాటు చేసి వివిధ రకాల వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. దీనిపై సంబంధిత అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. మైపాడు రోడ్డులో.. తాజాగా మైపాడురోడ్డులో మూడో డివిజన్ పరిధిలో ఇరిగేషన్ స్థలాన్ని కొందరు ఇష్టారాజ్యంగా ఆక్రమించేసి దుకాణాలు ఏర్పాటు చేసి వాటిని విక్రయించడం, లీజుకు ఇవ్వడం చేస్తున్నారు. కిసాన్ నగర్ సమీపంలో వేణుగోపాల స్వామి దేవస్థాన స్థలానికి ఆనుకున్ని ఉన్న ఇరిగేషన్ స్థలాన్ని కూడా పలువురు ఆక్రమించి ఇళ్లు నిర్మించుకున్నారు. అక్కడి సమీప ప్రాంతంలోనే కార్పొరేషన్‌కు చెందిన చేపల మార్కెట్ పక్కనే ఉన్న ఓ బార్ అండ్ రెస్టారెంట్‌కు ముందు వైపు ఉన్న ప్రభుత్వ స్థలాన్ని నాలుగు రోజుల క్రితం ఆక్రమించి ప్రహరీ నిర్మించారు. ఈ స్థలం దాదాపు 30 నుంచి 40 అంకణాల వరకు ఉంటుంది. ఒక అంకణం రూ.4 లక్షల వరకు ధర పలుకుతోంది. రూ.కోటికిపైగానే విలువ చేసే ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి గోడ నిర్మిస్తే సంబంధిత అధికారులెవరూ పట్టించకోకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అలాగే బార్ పక్కనే ఉన్న ఇరిగేషన్ స్థలాన్ని కొందరు ఆక్రమించి దుకాణాలు నిర్మించగా గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో రోడ్డు విస్తరణలో భాగంగా వాటిని తొలగించడం జరిగింది. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తిరిగి మరలా అదే స్థలాన్ని ఆక్రమించి దుకాణాలు నిర్మించి అద్దెలకు ఇచ్చుకుని తమ జేబులు నింపుకుంటున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మంత్రి మాటలు నీటి మూటలేనా? ప్రభుత్వానికి చెందిన పార్కు, ఇరిగేషన్ స్థలాలు, దేవస్థాన భూములు ఎవరైనా ఆక్రమించినట్లు తెలిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని మంత్రి నారాయణ నిత్యం చెబుతుంటారు. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి మరోలా ఉంది. మంత్రి అనుచరుల్లో కొందరు ప్రభుత్వ స్థలాలు కబ్జాకు పాల్పడుతున్నట్లు ఆరోపణలున్నాయి. మరోవైపు కమిషనర్ నందన్ నిత్యం వార్డుల్లో పర్యటిస్తున్నారు. ఆ సమయంలో ప్రభుత్వ భూములు ఆక్రమిస్తే చర్యలు తీసుకుంటామని పదేపదే చెబుతున్నారు. అలాంటిది మూడో డివిజన్లో ఆక్రమణకు గురైన రూ.కోట్ల విలువైన స్థలం ఆయనకు కనిపించలేదా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి నెల్లూరు నగరంలో ప్రభుత్వ స్థలాలను గుర్తించి కబ్జాకు గురికాకుండా కాపాడాల్సిన అవసరముంది. -
శ్రీవారి దర్శనానికి 15 గంటలు
తిరుమల: తిరుమలలో గురువారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లోని 31 కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. క్యూ లైన్ ఏటీజీహెచ్ వద్దకు చేరుకుంది. బుధవారం అర్ధరాత్రి వరకు 78,024 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 36,826 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.85 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టికెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 15 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు. ఇదిలా ఉంటే సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి మాత్రమే క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. కేటాయించిన సమయానికంటే ముందు వెళ్లిన వారిని క్యూలోకి అనుమతించరని స్పష్టం చేసింది. -
అక్రమ కేసులు పెట్టిన అధికారులను వదలం
● న్యాయ పోరాటం చేసైనా కోర్టుకు లాగుతాం ● మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి నెల్లూరురూరల్: కూటమి ప్రభుత్వంలో వైఎస్సార్సీపీ నాయకులపై అక్రమ కేసులు పెట్టిన అధికారులను వదిలే ప్రసక్తే లేదని, న్యాయ పోరాటం చేసైనా వారిని కోర్టుకు లాగుతామని మాజీ మంత్రి, జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి అన్నారు. గురువారం ఆయన సూళ్లూరుపేట మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్యతో కలిసి అక్రమ కేసులో నెల్లూరు సెంట్రల్ జైలులో ఉన్న జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ మాజీ చైర్మన్, వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి కామిరెడ్డి సత్యనారాయణరెడ్డిని ములా ఖత్ ద్వారా పరామర్శించారు. అనంతరం జైలు బయట మీడియాతో మాట్లాడారు. పెళ్లకూరు ప్రాంతంలో స్వర్ణముఖి నదిలో ఇసుక అక్రమ తవ్వకాలు చేపడుతున్నట్లు గుర్తించి, దానిని వీడియో తీసి అడ్డుకునేందుకు ప్రయత్నించిన కామిరెడ్డి సత్యనారాయణరెడ్డిని అక్రమంగా అరెస్టు చేసి జైలుకు పంపారని తెలిపారు. ఆ తరువాత రెండో పీటీ వారెంట్ వేశారని చెప్పారు. బెయిల్‌పై వచ్చే సమయంలో మూడేళ్ల క్రితం జరిగిన ఓ పాత కేసును తవ్వి తీసి అందులో ఆయన పాత్ర ఉందని ఒక తప్పుడు కన్ఫెషన్ స్టేట్మెంట్ సృష్టించి మూడో పీటీ వారెంట్ వేశారని తెలిపారు. సత్యనారాయణరెడ్డికి బెయిల్ రాకుండా అడ్డుకోవడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పావులు కదుపుతోందన్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనను రెండు నెలలుగా జైల్లో ఉంచి బెయిల్ రాకుండా అడ్డుకుంటూ సీడీ ఫైల్స్ సమర్పించకుండా పోలీసులు అధికారులు జాప్యం చేయడం దుర్మార్గమన్నారు. ఇదే కేసులో మాజీ ఎమ్మెల్యే సంజీవయ్యకు హైకోర్టు స్టే ఆఫ్ అరెస్ట్ ఇవ్వడంతో కోర్టు బెయిల్ మంజూరు చేసిందని గుర్తుచేశారు. కామిరెడ్డి వ్యవహారంపై ఇప్పటికే కింది కోర్టు నుంచి హైకోర్టు వరకు న్యాయ నిపుణులతో చర్చిస్తున్నామని, న్యాయపరంగా కూటమి వేధింపులను ఎదుర్కొంటామన్నారు. గూడూరులో దళితుడిపై జరిగిన లాకప్ హింసను హైకోర్టు తీవ్రంగా పరిగణించిందని, దీనిపై జిల్లా ఎస్పీని కోర్టుకు హాజరుకావాలని ఆదేశించిందని గుర్తుచేశారు. దళిత యువకుడిని చిత్రహింసలకు గురిచేసిన వ్యవహారంలో సంబంధిత అధికారులు, సీఐ, ఎస్సై, కానిస్టేబు ల్ళ్లు కూడా కోర్టు మెట్లు ఎక్కాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు కూడా నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు. మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య మాట్లాడుతూ కూటమి నాయ కులు అక్రమ కేసులతో ప్రశ్నించే గొంతును నొక్కలేరని, జైల్లో సత్యనారాయణరెడ్డి ధైర్యంగా ఉన్నారన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వైఎస్సార్సీపీ నాయకులే లక్ష్యంగా అక్రమ కేసులు బనాయిస్తూ జైళ్లకు పంపుతున్నారన్నారు. వైఎస్సార్సీపీ తరపున ఎవరు మాట్లాడినా వారిపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారన్నారు. కూటమి ప్రభుత్వం పాలన గాలికి వదిలేసి కేవలం ప్రతిపక్షమే లక్ష్యంగా రాజకీయ కక్ష సాధింపులకు దిగుతోందన్నారు. సూళ్లూరుపేట నియోజకవర్గంలో అక్రమ దందాల గురించి ప్రశ్నిస్తే అరెస్ట్ట్లు చేస్తున్నారన్నారు. అక్రమ సంపాదన, అవినీతే ధ్యేయంగా సాగుతున్న కూటమి పాలనపై రాబోయే రోజుల్లో పోరాటాన్ని ఉద్ధృతం చేస్తామన్నారు. కామిరెడ్డిపై పెట్టిన అక్రమ కేసులో తనను ఇరికించి జైలుకు పంపాలని చూడగా కోర్టు ద్వారా బెయిల్ మంజూరు చేయించుకున్నానని తెలిపారు. అధికార పార్టీ ఒత్తిళ్లకు లొంగి వైఎస్సార్సీపీ నేతలపై అక్రమ కేసులు పెడుతున్న అధికారులు కూడా జాగ్రత్తగా ఉండాలని, రేపు వీటన్నింటికీ సమాధానం చెప్పాల్సిన రోజు వస్తుందన్నారు. జిల్లాలో కాకాణి గోవర్ధన్‌రెడ్డి నాయకత్వంలో వైఎస్సార్సీపీ శ్రేణులు ఏకతాటిపై ఉన్నాయని, ఆయన నాయకత్వంలో కష్టపడి పనిచేసి పార్టీని మళ్లీ అధికారంలోకి తీసుకొస్తామన్నారు. -
అక్రమ కేసులకు ఎవరూ భయపడరు
● ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్ చిల్లకూరు: ‘వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై ఎన్ని అక్రమ కేసులు బనాయించినా భయపడటం లేదు. పోలీసులు ప్రభుత్వానికి కీలుబొమ్మలా వ్యవహరిస్తూ అక్రమ కేసులు బనాయించేందుకు అత్యుత్సాహం చూపిస్తే కోర్టు ఎదుట హాజరయ్యే పరిస్థితి ఏర్పడుతుంది’ అని ఎమ్మెల్సీ, వైఎస్సార్సీపీ గూడూరు నియోజకవర్గ సమన్వయకర్త మేరిగ మురళీధర్ అన్నారు. గూడూరులోని సనత్ నగర్లో ఉన్న పార్టీ కార్యాలయంలో ఆయన గురువారం కార్యకర్తలు, నాయకులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ గూడూరు రూరల్ పరిధిలోని మంగళపూరు గ్రామానికి చెందిన రవీంద్రపై పోలీసులు అక్రమంగా కేసులు బనాయించారన్నారు. కేసు విషయంలో రవీంద్ర కోసం ఇంటికి వెళ్లిన పోలీసులు అతను లేకపోతే ఎక్కడో కూలీ పనులు చేసుకుంటున్న తండ్రి పోలయ్యను ఆచూకీ చెప్పమని చితబాది అనంతరం రూరల్ పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చి హింసించడం దారుణమన్నారు. వారు కొట్టిన దెబ్బలకు తాళలేక తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. పోలయ్య తనపై జరిగిన దాడికి హైకోర్టును ఆశ్రయించగా బాధ్యులైన పోలీసులతోపాటు అధికారులను నేరుగా కోర్టుకు హాజరు కావాలని ఆదేశించిందన్నారు. అలాగే దాడి చేసిన వారిపై అట్రాసిటీ కేసులు నమోదు చేయాలని చెప్పడం పోలీసులకు చెంప పెట్టులాంటిదని తెలిపారు. అక్రమ కేసులు బనాయించి రెడ్‌బుక్ రాజ్యాంగం అమలు చేయాలని చూస్తే భవిష్యత్‌లో పోలీసులు ఇబ్బందులు పడాల్సి వస్తుందని, ఇకనైనా అక్రమ కేసులు బనాయించే విషయంలో ఆలోచన చేయాలన్నారు. ఆయన వెంట పలువురు పలువురు నాయకులున్నారు. -
పులిమి కుటుంబానికి ప్రసన్న పరామర్శ
కోవూరు: నెల్లూరు శ్రీనివాస అగ్రహారానికి చెందిన పులిమి లీలావతమ్మ ఇటీవల అనారోగ్యంతో మృతిచెందారు. మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ రాష్ట్ర పీఏసీ సభ్యుడు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి బుధవారం వెళ్లి లీలావతమ్మ కుమారుడు పులిమి రమేష్‌రెడ్డి, కుటుంబ సభ్యులను పరామర్శించారు. నల్లపరెడ్డి కుటుంబ సభ్యులు రాజేంద్రరెడ్డి, జగదీష్‌రెడ్డి తదితరులు పులిమి కుటుంబ సభ్యులను ఓదార్చారు. రెండు కుటుంబాల మధ్య ఘర్షణ● పోలీసులకు ఫిర్యాదు అనుమసముద్రంపేట: రెండు కుటుంబాల మధ్య ఘర్షణ జరిగిన ఘటన అనుమసముద్రంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన బొద్దుకూరు హజరత్‌రెడ్డి, బొద్దుకూరు వివేకానందరెడ్డి పక్కపక్కనే నివాసం ఉంటారు. రెండు ఇళ్ల మధ్యలో ప్రభుత్వానికి చెందిన పాత చావడి స్థలం ఉంది. ఇది కొన్ని సంవత్సరాల నుంచి వివేకానందరెడ్డి ఆధీనంలో ఉంది. బుధవారం జేసీబీతో ఆ స్థలాన్ని చదును చేయించే క్రమంలో హజరత్‌రెడ్డి ఇంటి గోడలు, రేకులు కూలిపోయాయి. దీంతో రెండు కుటుంబాల మధ్య ఘర్షణ జరిగింది. పాతకక్షలతోనే తనను అంతమొందించేందుకే వివేకానందరెడ్డి ప్రయత్నిస్తున్నట్లు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో హజరత్‌రెడ్డి పేర్కొన్నారు. విచారణ చేసి కేసు నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు. చెట్టును ఢీకొట్టిన బైక్● యువకుడి మృతి పొదలకూరు: మండలంలోని సోమశిల – పొదలకూరు రోడ్డు వనంతోపు సెంటర్‌కు సమీపంలో మంగళవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతిచెందాడు. స్థానికులు, పోలీసుల కథనం మేరకు.. పొదలకూరు పట్టణానికి చెందిన ఆకాష్ (21) ఏసీ మెకానిక్‌గా పనిచేస్తూనే ఈవెంట్ మేనేజ్మెంట్ను కూడా నిర్వహిస్తుంటాడు. అర్ధరాత్రి బైక్‌పై చేజర్ల మండలం నాగులవెల్లటూరు గ్రామానికి వెళ్తూ లారీని ఓవర్టేక్ చేసే ప్రయత్నంలో రోడ్డుపక్కనున్న చెట్టును ఢీకొట్టాడు. దీంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న అంబులెన్స్ సిబ్బంది ఘటనా స్థలానికి వెళ్లి పొదలకూరు సీహెచ్‌సీకి తరలించారు. అయితే అప్పటికే ప్రాణాలు విడిచినట్టు సీహెచ్‌సీ వైద్య సిబ్బంది నిర్ధారించారు. పోలీసులు బుధవారం కేసు నమోదు చేశారు. పని చేయకుంటే వేరే జిల్లాకు బదిలీ చేస్తాం● డ్వామా పీడీ శ్రీనివాసప్రసాద్ నెల్లూరు(పొగతోట): ఉపాధి హామీ శ్రామికులకు పనులు కల్పించడంలో నిర్లక్ష్యం వహించే సిబ్బందిని ఇతర జిల్లాలకు బదిలీలు చేస్తామని డ్వామా పీడీ శ్రీనివాసప్రసాద్ హెచ్చరించారు. బుధవారం నెల్లూరులోని డ్వామా కార్యాలయం నుంచి వివిధ మండలాల ఏపీఓలు, ఈసీలు, టీఏలు, ఎఫ్ఏలతో నిర్వహించిన జూమ్ కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. ప్రస్తుతం ఉపాధి పనులకు హాజరయ్యే శ్రామికుల సంఖ్య 42 వేలు ఉందన్నారు. దీనిని క్రమంగా పెంచేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. రోజూ గ్రామాల్లో పర్యటించి పనులు గుర్తించాలన్నారు. శ్రామికులు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ విషయాల్లో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని, కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎండ తీవ్రత నేపథ్యంలో పని ప్రదేశాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కండలేరులో 42 టీఎంసీలు..రాపూరు: కండలేరు జలాశయంలో బుధవారం నాటికి 42 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు ఈఈ గజేంద్రరెడ్డి తెలిపారు. కండలేరు నుంచి సత్యసాయి గంగ కాలువకు 1,050, లోలెవల్ కాలువకు 50, హైలెవల్ కాలువకు 80, పిన్నేరు కాలువకు 20, మొదటి బ్రాంచ్ కాలువకు 65 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు.నిమ్మ ధరలు (కిలో) పెద్దవి : రూ.120 సన్నవి : రూ.32 పండ్లు : రూ.20 -
అక్రమ లేవుట్లపై డీటీసీపీ మెరుపు దాడులు
● 24 అనధికార లేఅవుట్ల గుర్తింపు నెల్లూరు(బారకాసు): నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (నుడా) పరిధిలోని అనధికార లేఅవుట్లపై డైరెక్టర్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ (డీటీసీపీ) అధికారులు కొరడా ఝుళిపిస్తున్నారు. బుధవారం నుడా పరిధిలోని బుచ్చిరెడ్డిపాళెం, వెంకటాచలం, బోగోలు, రాపూరు, జలదంకి, కావలి, ఇందుకూరుపేట, తోటపల్లిగూడూరు, వరికుంటపాడు మనుబోలు మండలాల్లో 128.94 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న 24 అనధికార లేఅవుట్లను గుర్తించారు. డీటీసీపీ అధికారులు పది బృందాలుగా ఏర్పడి పది మండలాల్లోని అనధికార లేఅవుట్లపై మెరుపు దాడులు చేశారు. ఈ సందర్భంగా డీటీసీపీ అధికారి శ్రీనివాసులు మాట్లాడుతూ ఎల్ఆర్ఎస్ స్కీమ్‌కు దరఖాస్తు చేసుకోని లేఅవుట్దారులకు భవిష్యత్‌లో ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. అనుమతి తీసుకోని వాటిని 22–ఏ నిషేధిత జాబితాలో పెడతామని హెచ్చరించారు. అనధికార లేవుటలో ప్లాట్లు కొనుగోలు చేసిన వారికి భవన నిర్మాణానికి అనుమతులు మంజూరు చేయబోమని స్పష్టం చేశారు. అలాగే బ్యాంక్‌లు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు కూడా మంజూరు కావన్నారు. భవిష్యత్‌లో డబుల్ రిజిస్ట్రేషన్లు కూడా అయ్యే ప్రమాదం ఉందన్నారు. ఇదే సమయంలో అనధిక లేఅవుట్లలో ప్లాట్ల క్రయ, విక్రయాలు, ఇతర లావాదేవీలు నిలిపివేయాలని రిజిస్ట్రేషన్ శాఖకు ఆదేశాలు జారీ చేశామన్నారు. విద్యుత్ కనెక్షన్ కూడా ఇవ్వొద్దని సంబంధిత శాఖకు లేఖ పంపామన్నారు. నిరంతరం నిఘా ఉంటుందని స్పష్టం చేశారు. -
తమ్ముళ్ల రాజ్యం.. నిధుల భోజ్యం
వైఎస్సార్సీపీ పాలనలో.. రూ.69 లక్షలుటీడీపీ పాలనలో నెలకు ఖర్చు రూ.1.38 కోట్లకుపైగా..మున్సిపల్ శాఖ మంత్రి ప్రాతినిద్యం వహిస్తున్న నెల్లూరు కార్పొరేషన్లో అక్రమాలకు అంతు లేకుండా పోయింది. టీడీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి తెలుగు తమ్ముళ్లకు ఆర్థికంగా ప్రయోజనం కలిగించే వివిధ కార్యక్రమాలను అమలు చేస్తున్నారు. నగరపాలక సంస్థ పరిధిలో ఇటీవల మొక్కల పెంపకం పేరుతో రూ.కోట్ల నిధులను ఆరగించారు. అలాగే చెత్త తరలింపు పేరుతో కొందరి జేబుల్ని నింపుతున్నారు.నెల్లూరు(బారకాసు): కార్పొరేషన్ పరిధిలో 54 డివిజన్లున్నాయి. సుమారు 10 లక్షల జనాభా ఉన్నారు. నిత్యం 320 మెట్రిక్ టన్నుల చెత్త ఉత్పత్తి అవుతుంది. అసలే పారిశుద్ధ్యం గాడినపడటం లేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఏడాదికి సుమారు రూ.40 కోట్లు ఖర్చు చేస్తున్నా ఫలితం మాత్రం శూన్యం. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఇంటింటి చెత్త సేకరణకు క్లాప్ వాహనాలను ఏర్పాటు చేశారు. అందులో తడి, పొడిచెత్తను వేర్వేరుగా సేకరించేవారు. ఒక్కో వాహనానికి రోజుకు రూ.2,300 చొప్పున నెలకు రూ.69 వేలు కార్పొరేషన్ చెల్లించేది. వంద క్లాప్ వెహికల్స్‌కు నెలకు రూ.69 లక్షలిచ్చారు. అయితే టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పరిస్థితి మారింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన చెత్త తరలింపు వాహనాలను ఉంచకూడదని భావించింది. క్లాప్ వెహికల్స్ మరమ్మతులకు గురయ్యాయన్న సాకుతో మూలనపడేసి వాటి స్థానంలో ట్రాక్టర్లను ఏర్పాటు చేశారు. వారి కోసమే.. నగరంలో చెత్త తరలింపునకు అద్దె ప్రాతిపదికన ట్రాక్టర్లను ఏర్పాటు చేశారు. ఒక్కోదానికి రోజుకు రూ.3,750 చొప్పున నెలకు రూ.1,12,500 చెల్లిస్తున్నారు. ప్రారంభంలో 123 ట్రాక్టర్లను ఏర్పాటు చేసి వాటికి నెలకు రూ.1,38,37,500 ఇచ్చారు. ప్రస్తుతం 116 ట్రాక్టర్లకు నెలకు రూ.1,30,50,000 చెల్లిస్తున్నారు. ఏడాదిగా వాహనాలకు అధిక మొత్తంలో అద్దె చెల్లించినట్లుగా తెలుస్తోంది. కాగా ట్రాక్టర్లను ఏర్పాటు చేసుకునే అవకాశాన్ని తెలుగు తమ్ముళ్లకే కల్పించారు. వాస్తవానికి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇంటింటా సేకరించిన చెత్తను ట్రాక్టర్ల ద్వారా తరలించాల్సి ఉంది. కానీ కేవలం రోజుకు రెండు, మూడు ట్రిప్పులే చెత్తను తరలించేసి ఆ తర్వాత ఇటుక, ఇసుక తరలించుకుంటూ తెలుగు తమ్ముళ్లు తమ జేబులు నింపుకొంటున్నారన్న విమర్శలున్నాయి. దోచుకోవడమే.. ప్రజా ధనాన్ని ఇష్టారీతిన పచ్చ నేతలు దోచుకోవడంపై నగర ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల మొక్కల పేరుతో రూ.కోట్లు స్థానిక టీడీపీ నేతల జేబుల్లోకి వెళ్లాయని విమర్శలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. అదే తరహాలో ఇంటింటి చెత్త సేకరణ కోసమని నేతల ద్వారా ట్రాక్టర్లను ఏర్పాటు చేయించి వాటికి ఎన్ఎంసీ అధికారులు రూ.కోట్లు అద్దె చెల్లించడం జరుగుతోంది. తమ్ముళ్లకు లబ్ధి చేకూరుస్తుంటే కార్పొరేషన్ ఖజానా ఖాళీ కాకుండా ఎలా ఉంటుందనే ప్రశ్నలు ప్రజల నుంచి వస్తున్నాయి. ఇదేవిధంగా కొనసాగుతుంటే నగరాభివృద్ధి ఎలా సాధ్యపడుతుందని అడుగుతున్నారు. మౌలిక సదుపాయాలు ఎలా కల్పిస్తారో చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. కేవలం మాటల మంత్రి మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న నెల్లూరు సిటీ నియోజకవర్గంలో టీడీపీ నేతలు లబ్ధి పొందేలా పలు పనుల పేరిట రూ.కోట్లు నిధులు నీళ్లలా ఖర్చు చేస్తుండటాన్ని ఎవరైనా ప్రశ్నిస్తే వారిపై దౌర్జన్యం చేయడం, భయభ్రాంతులకు గురి చేయడం, లేకుంటే కేసులు పెట్టించడం జరుగుతోందని విమర్శలున్నాయి. ఓవైపు పాలనా వ్యవస్థలో ఏదైనా పొరపాట్లుంటే తన దృష్టికి తీసుకొస్తే సరిదిద్దుకుంటామని మంత్రి పదేపదే మీడియా ఎదుట చెబుతున్నారు. అలాంటిది ఆయనే తెలుగు తమ్ముళ్లకు అడ్డదారిలో నిధులు అందించడం చర్చకు దారి తీస్తోంది. నారాయణ కేవలం మాటలకే పరిమితమనే అభిప్రాయాన్ని ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్ శాఖా మంత్రి ఇలాకాలో ఇష్టారాజ్యం చెత్త తరలింపు పేరుతో అక్రమాలు అద్దె ట్రాక్టర్ల ఏర్పాటు కార్పొరేషన్‌పై అదనపు భారం -
పొట్టకూటి కోసం వచ్చి..
● లారీ ఢీకొని కూలీ దుర్మరణం నెల్లూరు సిటీ: ఓ వ్యక్తి కూలీ పని ముగించుకుని మోటార్‌బైక్‌పై జాతీయ రహదారి దాటుతుండగా వేగంగా వచ్చిన లారీ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతిచెందిన ఘటన బుధవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. ఇందుకూరుపేట మండలం జంగాల దొరువుకు చెందిన జి.వెంకటరమణయ్య (53) కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. నిత్యం నెల్లూరుకు వస్తుంటాడు. అతడికి ఇద్దరు పిల్లలున్నారు. ఈ క్రమంలో బుధవారం నెల్లూరులోని భగత్‌సింగ్ కాలనీలో పనికి వచ్చాడు. పూర్తయ్యాక బైక్‌పై ఇంటికి బయలుదేరాడు. కాలనీలో నుంచి జాతీయ రహదారి దాటుతుండగా నెల్లూరు నుంచి కావలి వైపు వెళ్తున్న లారీ అతివేగంగా వెంకటమరణయ్యను ఢీకొట్టింది. కొంతదూరం అతడిని ఈడ్చుకెళ్లింది. దీంతో నుజ్జునుజ్జయ్యాడు. మృతదేహం గుర్తుపట్టలేని స్థితిలో ఉంది. లారీ డ్రైవర్ అక్కడ్నుంచి పరారయ్యాడు. సమాచారం అందుకున్న ట్రాఫిక్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ట్రాఫిక్ సీఐ రామకృష్ణ కేసు నమోదు చేశారు. -
కొత్త పింఛన్లు ఎప్పుడిస్తారు?
● ప్రాణాలు పోతున్నా రోడ్లు బాగు చేయరా? ● ప్రశ్నించిన జెడ్పీటీసీ సభ్యులు ● సీఈఓ ఆధ్వర్యంలో జెడ్పీ స్థాయీ సంఘ సమావేశాలునెల్లూరు(పొగతోట): ‘కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలవుతోంది. ఇంత వరకు ఒక్క కొత్త పింఛన్ కూడా ఇవ్వలేదు. ఎప్పుడిస్తారో చెప్పండి’ అంటూ జెడ్పీటీసీ సభ్యులు అధికారులను ప్రశ్నించారు. నెల్లూరులోని జెడ్పీ కార్యాలయంలో సీఈఓ శ్రీధర్‌రెడ్డి, వైస్ చైర్పర్సన్ ప్రసన్న ఆధ్వర్యంలో బుధవారం స్థాయీ సంఘాల సమావేశాలు జరిగాయి. పంచాయతీరాజ్, ఆర్అండ్బీ, ఆర్డబ్ల్యూఎస్, హౌసింగ్, వ్యవసాయం, డీఆర్డీఏ, డ్వామా, విద్య, సంక్షేమ శాఖలపై సమీక్షించారు. ప్రజలు అడుగుతున్నారు గ్రామాల్లోకి వెళ్తే పింఛన్లు మంజూరు చేయించాలని ప్రజలు అడుగుతున్నారని డీఆర్డీఏ పీడీ నాగరాజకుమారి దృష్టికి పలువురు సభ్యులు తీసుకెళ్లారు. వారికి ఏం సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. పీడీ స్పందించి మరణించిన వారి స్థానంలో కొత్త పింఛన్లు ఇస్తున్నామన్నారు. కొత్త వాటికి దరఖాస్తులు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వలేదన్నారు. వితంతు పెన్షన్ల కోసం కలెక్టరేట్‌కు అనేకమంది వచ్చి ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అర్జీలు ఇస్తున్నారని, దీనిపై స్పష్టత ఇవ్వాలని సీఈఓ చెప్పారు. దీంతో పీడీ స్పందించి వితంతు పింఛన్లకు సంబంధించి గైడ్‌లైన్స్ ఇంతవరకు రాలేదన్నారు. ● ఎండల తీవ్రతకు భూగర్భ జలాలు అడుగంటి పోయాయని, అనేక గ్రామాల్లో ప్రజలు మంచినీటికి ఇబ్బందులు పడుతున్నారని సభ్యులు వెల్లడించారు. పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తి చేసి ప్రజల దాహార్తిని తీర్చాలని కోరారు. ఆర్డబ్ల్యూఎస్ అధికారులు స్పందించి జిల్లా వ్యాప్తంగా 2,265 పనులు చేపట్టడం జరిగిందన్నారు. ఇప్పటి వరకు 1,819 పనులు పూర్తయ్యాయన్నారు. 197 పనులు ప్రారంభం కాలేదని వెల్లడించారు. ● ఉపాధి పనులకు హాజరవుతున్న శ్రామికులకు సకాలంలో వేతనాలు మంజూరు చేసేలా చర్యలు తీసుకోవాలని, గ్రావెల్ రోడ్లకు అనుమతి ఇవ్వాలని సభ్యులు కోరారు. డ్వామా పీడీ శ్రీనివాసప్రసాద్ సమాధానమిస్తూ గ్రావెల్ రోడ్లు వేయడానికి అనుమతులు లేవన్నారు. ● జగనన్న కాలనీల్లో ఖాళీగా ఉన్న స్థలాలు ఆక్రమణకు గురవుతున్నాయని అనంతసాగరం జెడ్పీటీసీ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అర్హులైన ప్రజల కోసం వాటిని ఖాళీగా ఉంచడం జరిగిందన్నారు. ఆక్రమించిన వారిని ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్య జిల్లా వ్యాప్తంగా ఉందని, చర్యలు తీసుకుంటామని సీఈఓ తెలిపారు. ● గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు అధ్వానంగా ఉన్నాయని, ప్రమాదాలు జరిగి ప్రజల ప్రాణాలు పోతున్నా పట్టించుకోరా అంటూ కొందరు సభ్యులు అధికారులను ప్రశ్నించారు. త్వరితగతిన మరమ్మతులు చేయించాలన్నారు. విద్యుత్ కోతలతో ప్రజలు నరకం చూస్తున్నారని సభ్యులు వెల్లడించారు. ఉదయం ఉక్కపోత, రాత్రి దోమల బెడద అధికంగా ఉందన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో సరఫరా లేకపోతే ఏ విధంగా ఉంటుందో ఒకసారి ఆలోచించాలని సంబంధిత అధికారులను ప్రశ్నించారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లభించడం లేదని వ్యవసాయ శాఖ అధికారుల దృష్టికి సభ్యులు తీసుకెళ్లారు. ● విజయదీపిక పుస్తకంతో ఈ విద్యా సంవత్సరంలో పదో తరగతి పరీక్ష ఫలితాల్లో విద్యార్థులు మంచి ఫలితాలు సాధించారని విద్యాశాఖ అధికారులు జెడ్పీ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ, అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. ఏఎస్‌పేట బీసీ హాస్టల్ మరమ్మతులకు జెడ్పీ నుంచి రూ.10 లక్షలు మంజూరు చేసిన కృతజ్ఞతలు తెలిపారు. సమావేశాల్లో జెడ్పీ డీప్యూటీ సీఈఓ విజయకుమార్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
మర్యాదపూర్వకంగా..
తాడేపల్లిలోని నివాసంలో బుధవారం మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిసిన ఎమ్మెల్సీ, నెల్లూరు సిటీ వైఎస్సార్సీపీ ఇన్చార్జి పర్వతరెడ్డి చంద్రశేఖరరెడ్డి మలిదేవికి సాగునీరు విడుదల కొడవలూరు: కనిగిరి రిజర్వాయర్ నుంచి మలిదేవి కాలువకు సాగునీరు విడుదల చేశారు. ఈ కాలువ కింద కోవూరు, నార్తురాజుపాళెం, రామన్నపాళెం, మానేగుంటపాడు, ఆలూరుపాడు, మోడేగుంటలో 9,200 ఎకరాల ఆయకట్టు ఉంది. నార్లు పోసుకునేందుకు అదను దాటిపోతున్నా కాలువకు సాగునీరు విడుదల చేయలేదు. ఈ విషయమై ‘సాక్షి’లో ‘మలిదేవి ఏం పాపం చేసింది?’ శీర్షికన మంగళవారం కథనం ప్రచురితమవడంతో ఇరిగేషన్ అధికారులు స్పందించారు. మంగళవారం సాయంత్రం సాగునీటిని విడుదల చేశారు. కాలువ చివరి ఆయకట్టుకు బుధవారం నాటికి సాగునీరు చేరాయి. కే జీబీవీ విద్యార్థినులకు అభినందన నెల్లూరు (టౌన్): జిల్లాలోని కస్తూర్బా బాలికా విద్యాలయాల్లో పదో తరగతి, ఇంటర్మీడియట్లో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను సమగ్రశిక్ష కార్యాలయంలో బుధవారం అభినందించారు. సమగ్రశిక్ష ఏపీసీ వెంకటసుబ్బయ్య ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులతో పాటు నూరు శాతం ఫలితాలు సాధించిన కేజీబీవీ ప్రిన్సిపాళ్లకు ప్రశంసాపత్రాలతో పాటు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేజీబీవీ విద్యార్థినులు క్రమశిక్షణతో చదివి ఉత్తమ ఫలితాలు సాధించడం గర్వకారణమన్నారు. భవిష్యత్తులో కూడా ఉత్తమ ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు. వెబ్సైట్లో సీనియార్టీ జాబితా నెల్లూరు (టౌన్): ఉమ్మడి నెల్లూరు జిల్లా పరిధిలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్తు, మండల పరిషత్తు, మున్సిపాలిటీ, కార్పొరేషన్‌లోని పాఠశాలల్లో పనిచేస్తున్న మండల విద్యాశాఖ అధికారులు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయుల ఫైనల్ సీనియార్టీ జాబితాను ఆన్లైన్లో అందుబాటులో ఉంచినట్లు డీఈఓ ఆర్ బాలాజీ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. http:// deonellore.50webs.com వెబ్‌సైట్‌లోని సీనియార్టీ జాబితాను సరిచూసుకుని ఏమైనా అభ్యంతరాలు ఉంటే తగిన ఆధారాలను ఈ నెల 19వ తేదీలోపు జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో అందజేయాలని కోరారు. కిలో పొగాకు గరిష్ట ధర రూ.250 మర్రిపాడు: డీసీపల్లి పొగాకు వేలం కేంద్రంలో బుధవారం కిలో పొగాకుకు గరిష్ట ధర రూ.250 లభించింది. వేలానికి 255 బేళ్లు రాగా, 179 బేళ్లను విక్రయించారు. మిగిలిన బేళ్లను వివిధ కారణాలతో తిరస్కరించారు. కిలో పొగాకు గరిష్టంగా రూ.250, కనిష్టంగా రూ.200, సగటున రూ.227.13 ధర పలికిందని వేలం నిర్వహణాధికారి సునీల్‌కుమార్ తెలిపారు. వేలంలో ఏడు కంపెనీల వ్యాపార ప్రతినిధులు పాల్గొన్నారు. -
ప్రభుత్వ భూముల్లో అక్రమార్కుల పాగా
ఉదయగిరి: ప్రభుత్వ భూమి కనిపిస్తే అక్రమార్కులు వాలిపోతున్నారు. దర్జాగా ఆక్రమించి చదువును చేసి సాగుకు ఉపక్రమిస్తున్నారు. ఆ తర్వాత నకిలీ పత్రాలు సృష్టించి రెవెన్యూ అధికారుల సహకారంతో ఆన్లైన్ రికార్డుల్లో తమ పేర్లు నమోదు చేసుకుంటున్నారు. ఇలా రూ.కోట్ల విలువ చేసే భూములను కాజేస్తున్నారు. ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా అడ్డుకోవాల్సిన రెవెన్యూ అధికారులు అక్రమార్కులకు కొమ్ముకాస్తున్నారు. తాజాగా కలిగిరి మండలం గుడ్లదొనలో రూ.కోటికి పైగా విలువ చేసే ప్రభుత్వ భూముల్లో జాయింట్‌కలెక్టర్ ఆదేశాలతో ఏర్పాటు చేసిన హెచ్చరిక బోర్డులను సైతం తొలగించి ఆక్రమార్కులు సాగుకు ఉపక్రమించారు. అయినా రెవెన్యూ అధికారులు చోద్యం చూస్తుండడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కలిగిరి మండలం గుడ్లదొనలో సర్వే నంబర్లు 103–2లో 5.19 ఎకరాలు, 103–4లో 2.05 ఎకరాలు, 104–2లో 1.70 ఎకరాలు రెవెన్యూ రికార్డుల ప్రకారం ప్రభుత్వ భూమిగా నమోదై ఉంది. ఈ భూమిపై కన్నేసిన కొందరు అక్రమార్కులు కబ్జా చేశారు. నకిలీ పత్రాలు సృష్టించి అధికారుల సహకారంతో రికార్డుల్లో తమ పేర్లు నమోదు చేయించుకుని దర్జాగా సాగు చేసుకుంటున్నారు. ఈ విషయాన్ని పక్క భూములకు చెందిన ఓ రైతు అధికారులు, న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. ఈ మేరకు ఆక్రమణదారులను తొలగించడంతో పాటు రెవెన్యూ రికార్డుల్లోని అక్రమార్కుల పేర్లను తొలగించి ప్రభుత్వ భూమిగా నమోదు చేయాలని 2022 డిసెంబరు 30న తహసీల్దార్‌కు కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే రెవెన్యూ అధికారులు కలెక్టరు ఉత్తర్వులను అమలు చేయకుండా చెత్తబట్టలో పడేశారు. దీంతో ఆక్రమణదారులు దర్జాగా భూములను సాగు చేసుకుంటూ అనుభవిస్తున్నారు. తాజాగా గతంలో భూములపై పోరాడిన రైతు మళ్లీ కలెక్టర్ ఉత్తర్వులు అమలు కాని విషయాన్ని జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు ప్రస్తుతం రికార్డుల్లో ఉన్న ఆక్రమణదారుల పేర్లను తొలగించి ప్రభుత్వ భూమిగా ఆన్లైన్లో నమోదు చేయాలని గత నెలలో కలిగిరి తహసీల్దార్‌కు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు స్థానిక రెవెన్యూ అధికారులు గత నెల 25వ తేదీన సదరు భూముల్లో ప్రభుత్వ భూములుగా సూచించే ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఫ్లెక్సీలు తొలగించి సాగుకు సమాయత్తం ప్రభుత్వ భూముల్లో రెవెన్యూ అధికారులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగించి ఆక్రమణదారులు మళ్లీ సాగుకు సమాయత్తమవుతున్నారు. భూమిని ట్రాక్టర్లతో దున్ని సాగుకు సిద్ధం చేశారు. అయినా రెవెన్యూ అధికారులు మౌనంగా ఉండడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. స్వయంగా జాయింట్ కలెక్టర్ జారీ చేసిన ఉత్తర్వులను బేఖాతరు చేసినా ఆక్రమణదారులపై చట్టపరమైన చర్యలు తీసుకోకుండా అధికారులు మౌనవ్రతం పాటించడం వెనుక ఉన్న లోగుట్టు వారికే ఎరుక. ఆన్లైన్ రెవెన్యూ రికార్డుల్లో సైతం ఇంతవరకు ఆక్రమణదారుల పేర్లను తొలగించలేదు. స్వయంగా జేసీ ఇచ్చిన ఉత్తర్వులు అమలు కాకపోవడం విశేషం.ఈ ఉదంతం క్షేత్రస్థాయిలోని రెవెన్యూ అధికారుల పనితీరుకు అద్దం పడుతోంది. మరి కలెక్టర్, జేసీలు ఏ మేరకు స్పందిస్తారో వేచి చూడాలి. ప్రభుత్వ భూములుగా పేర్కొంటూ అధికారులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ (ఫైల్) సాగుకు దుక్కి చేసిన ప్రభుత్వ భూమి రూ.కోటికిపైగా విలువైన భూముల ఆక్రమణ నకిలీ పత్రాలతో ఆన్లైన్లో పేర్లు నమోదు 2022లో పేర్లు తొలగించాలని కలెక్టర్ ఉత్తర్వులు బుట్టదాఖలు చేసిన అధికారులు గత నెలలో మరోసారి జేసీ ఆదేశాలు అయినా ఫ్లెక్సీలు మాత్రమే ఏర్పాటు చేసిన వైనం వాటిని తొలగించి సాగుకు సిద్ధమైన ఆక్రమణదారులు -
ఇదే వివాదానికి కారణం..
జిల్లాలో కూటమి పార్టీల మధ్య రాజకీయ వైరం కుంపటి రగులుతోంది. టీడీపీ ఆధిపత్యం ప్రదర్శిస్తూ.. భాగస్వామ్య పార్టీలను అణచివేసే ధోరణితో వ్యవహరిస్తున్న వైఖరితో ఆ పార్టీల మధ్య కురుక్షేత్ర యుద్ధం తలపించే రీతిలో పరిస్థితులు మారాయి. టీడీపీకి అధికారం కట్టబెట్టే క్రమంలో అహర్నిశలు పాటుపడిన బీజేపీ ఉనికిని లేకుండా చేసేందుకు మంత్రి నారాయణ అనుసరిస్తున్న వ్యవహార శైలి రణరంగంగా మారింది. కమలం అంటే ఫ్లవర్ అనుకుంటివా.. ఫైర్ అంటూ బీజేపీ జిల్లా అగ్రనేతలు ఆగ్రహంతో రగిలిపోయారు. మంత్రికి తమ పవర్ చూపిస్తామంటూ బీజేపీ సీనియర్ నేత సన్నపురెడ్డి సురేష్‌రెడ్డి ఇచ్చిన మాస్ వార్నింగ్ జిల్లా రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. సాక్షి ప్రతినిధి, నెల్లూరు: జాతీయ స్థాయిలో కమలం వికసిస్తున్నా.. ఏపీలో అందులో జిల్లాలో ఉనికిని చాటుకోలేకపోతోంది. బీజేపీ భాగస్వామ్యంతోనే అధికారంలోకి వచ్చిన టీడీపీ ఆ విషయాన్ని విస్మరించి ఇప్పుడు ఆ పార్టీనే కూకటి వేళ్లతో పెకళించేందుకు మంత్రి నారాయణ వ్యవహరిస్తున్న తీరు ఆ రెండు పార్టీ ల మధ్య వైరాన్ని పెంచింది. తాజాగా నెల్లూరు నగరంలో బీజేపీ కార్యాలయం తొలగింపు పెద్ద వివాదం రేపింది. మంత్రి నారాయణ ప్రాతినిథ్యం వహించే నియోజకవర్గంలోనే కమలనాథులకు ఊహించని షాక్ ఎదురవ్వడమే కాకుండా ఘోర అవమానం చోటు చేసుకుంది. దాదాపు రెండేళ్లు సంయమనంతో వ్యవహరిస్తున్న బీజేపీ నేతలు బస్తీమే సవాల్ అంటూ మాస్ వార్నింగ్ ఇస్తూ తొడగొట్టారు. ఎన్నడూ లేని విధంగా కమలనాథులు ఈ దఫా చూపించిన తెగువ రాజకీయ వర్గాల్లో తీవ్ర స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. తొలగించిన చోటే కార్యాలయ నిర్మాణం ఎక్కడైతే బీజేపీ కార్యాలయాన్ని తొలగించారో అదే స్థలంలో బుధవారం పార్టీ శ్రేణులు ఆ పార్టీ జిల్లా అగ్రనేతల సన్నపురెడ్డి సురేష్‌రెడ్డి, సురేంద్రరెడ్డి సమక్షంలోనే తిరిగి కార్యాలయ నిర్మాణాన్ని చేపట్టారు. విషయం తెలుసుకున్న ఎన్ఎంసీ అధికారులు నిర్మాణం జరుగుతున్న ప్రదేశానికి వచ్చి నిలుపదల చేసే ప్రయత్నం చేశారు. అయితే అక్కడ వందలాది మంది పార్టీ శ్రేణులు ఉండడం..వారంతా ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఇక చేసే ది ఏమీలేక ఎన్ఎంసీ పట్టణ ప్రణాళిక విభాగాధికారులు వెనుతిరగాల్సి వచ్చింది. మంత్రి నారాయణను ఏకంగా బండబూతులే తిట్టారు. మంత్రి అండతో కార్పొరేషన్ కమిషనర్ రెచ్చిపోతున్నాడంటూ ఆగ్రహంతో ఊగిపోవడమే కాకుండా సస్పెండ్ చేయాలంటూ డిమాండ్ చేయడం, మంత్రి నారాయణకే సవాల్ విసురుతూ మాస్ వార్నింగ్ ఇవ్వడం రాజకీయ వర్గాల్లో హాట్‌టాపిక్ చర్చ జరుగుతోంది. ఏరు దాటక ముందు మల్లన్న.. దాటాక బోడి మలన్న సార్వత్రిక ఎన్నికల వరకు బీజేపీతో అంటకాగిన జిల్లా టీడీపీ నేతలు అధికారం దక్కాక వీరిని పూచిక పుల్లల్లా తీసే పారేశారు. బీజేపీ భాగస్వామ్యం వల్లేనే అధికారంలోకి వచ్చామనే కృతజ్ఞత కూడా ఆ పార్టీ నేతలు చూపించడం లేదంటూ పాలన ప్రారంభమైన నాటి నుంచి వీరి మధ్య అగాధం నానాటికి పెరుగుతోంది. జిల్లాలో అనాదిగా బీజేపీలో కొనసాగుతున్న కొందరు సీనియర్ నేతలకు సైతం జిల్లాలో పనులు జరగని పరిస్థితిని టీడీపీ ప్రజాప్రతినిధులు కల్పించడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఏ పని కావాలన్నా.. స్థానిక ఎమ్మెల్యే చెప్పిందే వేదంగా అధికారులు ఉచిత సలహాలు ఇచ్చి పంపిస్తున్నారు. జిల్లాలో మంత్రులు చెప్పిందే చట్టాలుగా నడుస్తున్నాయి. ఈ క్రమంలో బీజేపీ నేతలు ప్రతి పనికి టీడీపీ నేతల ద్వారా చెప్పించుకోవాల్సి వస్తోంది. దీనికి తోడు కార్యాలయం తొలగింపుతో వారు తమలో ఉన్న ఆవేశాన్ని బహిరంగంగా ప్రదర్శించడమే కాకుండా టీడీపీతో బస్తీమే సవాల్ అంటూ తొడగొట్టడం సంచలనంగా మారింది. అధికారులకు వ్యతిరేకంగా నిరసన చేపడుతున్న బీజేపీ నాయకులుప్రశాంతినగర్ వద్ద మైపాడు రోడ్డు పక్కన నిర్మిస్తున్న బీజేపీ కార్యాలయంబీజేపీ, టీడీపీ నేతల మధ్య మరింత దూరం భాగస్వామ్య పార్టీని అణగదొక్కుతున్న మంత్రి నారాయణ మూడు దశాబ్దాలుగా ఉన్న బీజేపీ నగర కార్యాలయం తొలగింపు ప్రత్యామ్నాయ స్థలం చూపిస్తామంటూ పట్టించుకోని మున్సిపల్ అధికారులు తాత్కాలికంగా కంటైనర్‌తో ఆఫీసు తెరిస్తే.. రాత్రికి రాత్రే ఎత్తేసిన వైనం మంత్రికి తమ పవర్ చూపిస్తామంటున్న కమలనాథులు నెల్లూరు నగరంలోని మైపాడురోడ్డులో ప్రశాంతినగర్ ప్రాంతంలో రోడ్డు పక్కనే 30 ఏళ్లకు పైగా బీజేపీ కార్యాలయం ఉంది. అయితే ఇటీవల రోడ్డు విస్తరణలో భాగంగా కార్పొరేషన్ అధికారులు మంత్రి నారాయణ ఆదేశాలతో ఆ పార్టీ కార్యాలయాన్ని తొలగించారు. అయితే అధికారంలో భాగస్వామ్యంగా ఉన్న బీజేపీ కార్యాలయాన్ని తొలగించడాన్ని ఆ పార్టీ నేతలు సీరియస్‌గా తీసుకున్నారు. మంత్రి నారాయణకు తెలియకుండానే కార్పొరేషన్ అధికారులు తొలగిస్తారా? అంటూ ఆ పార్టీ నేతలు సురేష్‌రెడ్డి, సురేంద్రరెడ్డి భగ్గుమన్నారు. అయినప్పటికీ రాజకీయ వైరం పెంచుకోకూడదనే భావనతో తమ పార్టీ కార్యాలయ నిర్మాణం కోసం ప్రత్యామ్నాయ స్థలం చూపించాలని బీజేపీ శ్రేణులు నగర పాలక సంస్థ కమిషనర్ నందన్‌ను కోరగా అందుకు ఆయన సమ్మతించారు. అయితే రోజులు గడుస్తున్నా.. మంత్రి నారాయణ ఆదేశాలు లేకపోవడంతో ఆయన నుంచి ఎలాంటి స్పందన లేదు. దీంతో బీజేపీ నేతల కార్యాలయాన్ని తొలగించిన ప్రదేశంలోనే తాత్కాలికంగా కంటైనర్‌ను కార్యాలయంగా ఏర్పాటు చేసుకున్నారు. దీన్ని కూడా తొలగించాలని పక్కనే ఉన్న ఖాళీ స్థల యజమాని మంత్రి నారాయణ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. దీంతో మంత్రి ఆదేశాలతో కమిషనర్ ఓ రోజు అర్ధరాత్రి సమయంలో తన సిబ్బందితో పాటు పోలీస్ బందోబస్తుతో వచ్చి క్రేన్ సహాయంతో బీజేపీ కార్యాలయంగా ఏర్పాటు చేసిన కంటైనర్‌ను సైతం తొలగించారు. ఈ పరిణామంతో బీజేపీ శ్రేణులు రగిలిపోతున్నారు. నగరంలో రోడ్డు ఆక్రమణలు అనేకం ఉంటే వాటన్నింటిని తొలగించకుండా తమ పార్టీ కార్యాలయాన్ని తొలగించడం ఏమిటని కార్పొరేషన్ అధికారులపై మండి పడ్డారు. దీనికి కారణం మంత్రి నారాయణ అంటూ బీజేపీ శ్రేణులు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. దీంతో దాదాపు రెండు నెలలకు పైగా పార్టీ కార్యాలయ విషయంలో బీజేపీ వర్సెస్ టీడీపీల మధ్య అంతర్గత విభేదాలు ప్రారంభమయ్యాయన్న ఆరోపణలు నగర ప్రజల్లో వ్యక్తమవుతోంది. -
సాగునీటి పంపిణీలోనూ రాజకీయం దుర్మార్గం
● మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి వెంకటాచలం: సాగునీటి పంపిణీ విషయంలోనూ సర్వేపల్లిలో రాజకీయం చేయడం దుర్మార్గమని మాజీ మంత్రి , వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి విమర్శించారు. మండలంలోని గొలగమూడి, కురిచెర్లపాడు గ్రామాల్లో బుధవారం కాకాణి పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక రైతులు జగనన్న పాలనలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా పంటలు పండించుకున్నామని, మద్దతు ధర లభించడంతో కల్లాల్లోనే ధాన్యం అమ్ముకుని చాలా సంతోషంగా జీవించామని, కూటమి ప్రభుత్వంలో ఎరువుల ధరలు పెరిగి, గిట్టుబాటు ధరల్లేక నష్టాల ఊబిలో చిక్కుకుపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కాకాణి మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలో అభివృద్ధి, సంక్షేమంతో పాటు, రైతులకు ఎలాంటి సమస్యలు లేకుండా చర్యలు చేపట్టామని గుర్తుచేశారు. కూటమి అధికారంలోకి వచ్చాక రైతుల పరిస్థితి దయనీయంగా మారిందన్నారు. నాణ్యమైన విత్తనాలు, ఎరువులు దొరక్కపోవడం, పండించిన పంటలకు గిట్టుబాటు ధర లభించకపోవడంతో రైతులు తీవ్ర నష్టాలను చవిచూడాల్సి వచ్చిందన్నారు. సర్వేపల్లి నియోజకవర్గంలో రెండో పంటకు సాగునీరు విడుదల విషయంలో రాజకీయాలు చేయడం సిగ్గు చేటన్నారు. వైఎస్ జగన్ పాలనలో సర్వేపల్లి నియోజకవర్గంలో రెండు పంటలకూ ఎలాంటి ఢోకా లేకుండా సాగునీరు అందించామని గుర్తుచేశారు. ఇటీవల జరిగిన నెల్లూరు జిల్లా సాగునీటి సలహా మండలి సమావేశంలో సర్వేపల్లి నియోజకవర్గానికి రెండో పంటకు సాగునీరు అవసరం లేదని తేల్చి చెప్పడంతో రైతు సంఘాల నాయకులు తమకు కావాల్సిందేనని సోమిరెడ్డి మాటలకు అడ్డు తగిలిన మాట వాస్తవమన్నారు. రెండో పంటకు నీరు విడుదల చేస్తే దొంగ బిల్లులు చేసుకోవడం సాధ్యం కాదనే దుర్మార్గపు ఆలోచనతో సాగునీరు విడుదల చేయకుండా అడ్డుకున్నాడని ఆరోపించారు. రాష్ట్రంలో ఆక్వా రైతుల పరిస్థితి రోజురోజుకి మరింత దిగజారుతోందని, ఆక్వా ఫీడ్ రేట్లు పెరగడంతో రైతులు ఏమి చేయాలో అర్థంకాని పరిస్థితిలో ఉన్నారన్నారు. తమ ప్రభుత్వంలో రాష్ట్రంలో కోట్లాది రూపాయలతో అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేస్తే, కూటమి పాలనలో కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూ అభివృద్ధిని పూర్తిగా విస్మరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారం ఉన్నా , లేకున్నా ప్రజల సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తామని పేర్కొన్నారు. వైఎస్సార్సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు మందల వెంకటశేషయ్య, వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ కొణిదెన మోహన్‌నాయుడు, జిల్లా నాయకుడు విజయభాస్కర్‌నాయుడు తదితరులు పాల్గొన్నారు. -
రెండు మోటార్‌బైక్‌ల ఢీ
● వృద్ధుడి మృతి ● ముగ్గురికి తీవ్రగాయాలుసంగం: రెండు బైక్‌లు ఎదురెదురుగా ఢీకొనడంతో ఓ వృద్ధుడు మృతిచెందగా ముగ్గురు యువకులు తీవ్రంగా గాయపడిన ఘటన మండలంలోని కొరిమెర్ల వద్ద మంగళవారం జరిగింది. పోలీసులు, స్థానికుల కథనం మేరకు.. లింగసముద్రం మండలానికి చెందిన వట్టిగుంట రమణయ్య (70) చేజర్ల మండలం ఆదూరుపల్లి చవటపల్లిలో ఉంటున్న తన కుమార్తె వద్దకు మామిడిపండ్లు తీసుకుని ద్విచక్ర వాహనంపై బయలుదేరాడు. అలాగే కలిగిరి మండలంలో జరిగే హనుమాన్ జయంతి కార్యక్రమానికి నెల్లూరు నుంచి ముగ్గురు యువకులు బైక్‌పై బయలుదేరాడు. రెండు వాహనాలు కొరిమెర్ల వద్ద ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో రమణయ్యతోపాటు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. రమణయ్యను 108లో ఆత్మకూరుకు తరలించగా పరిస్థితి విషమంగా ఉండటంతో నెల్లూరుకు తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ సాయంత్రం మృతిచెందాడు. బుధవారం పోస్టుమార్టం అనంతరం రమణయ్య మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించనున్నట్లు ఎస్సై రాజేష్ తెలిపారు. -
బీసీ వెల్ఫేర్ అధికారిణికి పురస్కారం
నెల్లూరు(వేదాయపాళెం): జిల్లాలోని బీసీ హాస్టళ్లలో ఉండి చదువుకున్న పదో తరగతి విద్యార్థులు ఫలితాల్లో ప్రతిభ చూపిన నేపథ్యంలో, అందుకు కృషి చేసిన బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ పి.వెంకటలక్ష్మికి పురస్కారం లభించింది. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో మంగళవారం నిర్వహించిన రాష్ట్రస్థాయి అభినందన కార్యక్రమంలో ఆమె బీసీ వెల్ఫేర్ మంత్రి సవిత చేతుల మీదుగా ప్రశంసాపత్రం, జ్ఞాపిక అందుకున్నారు. జోనల్ స్థాయిలో ఆత్మకూరు రిటైర్డ్ అసిస్టెంట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ ఐ.కృష్ణయ్యను ఘనంగా సన్మానించారు. జిల్లాలోని 19 హాస్టళ్లలో వంద శాతం ఉత్తీర్ణత సాధించడం, 99 మంది 500కుపైగా మార్కులు, 25 మంది 550 మార్కులు సాధించేందుకు విశేష కృషి చేసినందుకు అవార్డులు దక్కాయి. -
అత్త హత్య కేసులో కోడలి అరెస్ట్
● సహకరించిన తల్లి కూడా.. ● వివరాలు వెల్లడించిన కావలి డీఎస్పీ కావలి: దగదర్తి మండలం సున్నపుబట్టి గ్రామంలో మైపాటి మాధవి అనే మహిళను హత్య చేసిన కేసులో ఆమె కోడలు పద్మశ్రీని పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా కావలి రూరల్ పోలీస్‌స్టేషన్‌లో డీఎస్పీ రమణకుమార్ విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. పద్మశ్రీకి అదే గ్రామానికి చెందిన తన భర్త స్నేహితుడితో సన్నిహిత సంబంధం ఉంది. దీంతో అత్త మాధవి ఇలాంటి పనులు మానుకోవాలని కోడలు పద్మశ్రీకి చెప్పింది. అయినా ఆమెలో మార్పు రాకపోవడంతో కులపెద్దల వద్ద పంచాయితీ జరిగింది. వారు కూడా ప్రవర్తన మార్చుకోవాలని తెలిపారు. ఈక్రమంలో కోపోద్రిక్తురాలైన పద్మశ్రీ తన అత్తను అడ్డుతొలగించుకోవాలని నిర్ణయించుకుంది. మే 8వ తేదీ తన తల్లి పుచ్చలపల్లి మాధవి సహాయంతో ఇంట్లో నిద్రిస్తున్న అత్తపై దిండుపెట్టి గొంతు నులిమి హత్య చేసింది. యూట్యూబ్‌లో సీరియల్స్ చూసి ప్రజలు పక్కదోవ పడుతున్నారని, నేరాలు చేసిన వారు తప్పించుకునే అవకాశం లేదన్నారు. చెడు వ్యసనాలకు బానిసలు కావొద్దన్నారు. రూరల్ సీఐ శివశంకర్, ఎస్సై జంపాని కుమార్, సిబ్బందికి ఉన్నతాధికారులు రివార్డులివ్వాలని ఉన్నతాధికారులకు సిఫార్స్ చేశారు. -
జరిగింది ఇది..
జిల్లాలో ఖాకీల ‘పచ్చ’ కావరంతో అరాచకాలకు తెగబడుతున్నారు. పోలీస్ ప్రతిష్టను దిగజార్చుతూ పచ్చ పార్టీ నేతల కాళ్ల దగ్గర మోకరిల్లుతున్నారు. ‘పచ్చ’ ఉచ్చులో పడి పైశాచికంగా వ్యవహరించిన ఖాకీల మెడకు ఉచ్చు బిగిస్తోంది. అధికార పార్టీ నేతల ఒత్తిళ్లకు తలొగ్గిన గూడూరు రూరల్ పోలీసులు ఓ దళిత కుటుంబంపై అమానుషంగా విరుచుకు పడిన ఘటన నేపథ్యంలో హైకోర్టు చర్యలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపాయి. ఫ్లెక్సీ చించేశాడన్న అనుమానంతో అనుమానితుడు దొరకలేదని, అతని తండ్రిని స్టేషన్‌కు ఈడ్చుకెళ్లి లాఠీలతో చిత్ర హింసలకు గురి చేయడంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ కేసు విచారణకు జిల్లా ఎస్పీతోపాటు సీఐ, ఎస్సైలు, కానిస్టేబుళ్లు గురువారం కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది. పోలీసులపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని స్పష్టం చేయడంతో ఆ శాఖలో కలకలం రేపుతోంది. సాక్షి ప్రతినిధి, నెల్లూరు: జిల్లాలో కొందరు పోలీసులు పచ్చ పాలకుల పాదా క్రాంతమై.. రాజ్యాంగాన్ని వదిలేసి రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు. రాజ్యాంగం అంటే గౌరవం.. న్యాయవ్యవస్థ అంటే భయమూ లేకుండా ఖాకీ దుస్తులు ధరించిన పచ్చ నేతల కిరాయిరౌడీల్లా వ్యవహరిస్తున్నారు. కూటమి నేతల అరాచకాలకు వంత పాడుతూ జీ హుజూర్ అంటున్నారు. ప్రజల హక్కులను కాలరాస్తూ, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు. న్యాయాధికారుల చట్టబద్ధమైన ఆదేశాలను తుంగలో తొక్కేస్తూ.. అధికార పార్టీలోని గల్లీ స్థాయి వ్యక్తుల నోటి మాటలను శిరోధార్యంగా భావించి ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలతోపాటు సామాన్య ప్రజలను, రైతులను, దళితులను ఈడ్చుకెళ్లి లాఠీలతో కుళ్లబొడుస్తున్నారు. ఇటీవల పొదలకూరులో ఎస్సై ఓ రైతును స్టేషన్లో ఉంచి చితకబాదుతూ వీడియో కాల్ చేసి తమ్ముళ్ల కళ్లల్లో ఆనందం చూసిన ఖాకీ ఉదంతం తెలిసింది. దీనికంటే ముందు గత నెల 18న గూడూరు రూరల్ పోలీసులు ఇదే తరహాలో ఓ దళితుడ్ని స్టేషన్లో నిర్బంధించి లాఠీలతో కుళ్లపొడవడంతో తీవ్ర గాయాలపాలైన విదితమే. ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. పోలీసు కర్కశంపై బాధితుడి తరఫున వైఎస్సార్సీపీ నేతలు హైకోర్టును ఆశ్రయించడంతో జరిగిన పరిణామాలను పరిశీలించిన న్యాయస్థానం పోలీసుల దుశ్చర్యపై తీవ్ర స్థాయిలో తలంటడంతో ఈ వ్యవహారం రాష్ట్రంలోనే సంచలనం సృష్టిస్తోంది. ఈ ఘటనకు సంబంధించి జిల్లా ఎస్పీ అజిత వేజెండ్ల గూడూరు రూరల్ సీఐ కిషోర్‌బాబు, ఎస్సై తిరుపతయ్యలతోపాటు కానిస్టేబుళ్లను స్వయంగా ఈ నెల 14న హైకోర్టుకు హాజరుకావాలని ఆదేశాలిచ్చింది. దీంతో పాటు బాధితుడిని విచక్షణా రహితంగా కొట్టిన పోలీసులపై అట్రాసిటీ నమోదు చేయాలని ఎస్పీని ఆదేశించడంతో ఆ శాఖలో కలవరం రేగింది. పోలీసుల కర్కశత్వంపై.. హైకోర్టు సీరియస్ వైఎస్సార్సీపీ నేతల సహకారంతో పోలయ్య తనను కర్కశంగా హింసించిన కానిస్టేబుళ్లు, సీఐ, ఎస్సైపై ప్రైవేట్ కేసు నమోదు చేయాలని తన న్యాయవాది వి సురేందర్‌రెడ్డి ద్వారా రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానంలో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సమగ్ర విచారణ చేపట్టిన అనంతరం ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉన్నందున దీంతో హైకోర్టు ప్రైవేట్ కేసును ఆమోదించింది. పోలీసుల అరాచకంపై హైకోర్టు సీరియస్ అయింది. అధికార దుర్వినియోగంతో ఒక వ్యక్తిని చిత్ర హింసకు గురిచేశారన్న ఘటనపై హైకోర్టు ఆగ్రహం చేసింది. ఈ దాష్టీకానికి బాధ్యత వహిస్తూ ఎస్పీ అజిత వెజేండ్లతోపాటు సీఐ, ఎస్సై, ఇద్దరు కానిస్టేబుళ్లు ఈ నెల 14వ తేదీ కోర్టు ముందు స్వయంగా హాజరు కావాలని ఆదేశించింది. సీసీ ఫుటేజీలు అందజేయండి గూడూరు రూరల్ పోలీస్‌స్టేషన్‌లో ఘటన జరిగిన 2026 ఏప్రిల్ 18వ తేదీ సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు సీసీ కెమెరాల ఫుటేజీలను భద్ర పరచి హైకోర్టుకు అందించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. పోలయ్య హైకోర్టులో వేసిన పిటిషన్‌లోని ప్రతివాదులుగా రాష్ట్ర హోం శాఖ కార్యదర్శి, జిల్లా ఎస్పీ, గూడూరు రూరల్ పోలీస్‌స్టేషన్ సీఐ కిషోర్‌బాబు, ఎస్సై తిరుపతయ్య, కానిస్టేబుళ్లు దాస్, చిన్నలను కేసులో చేర్చారు. వీరిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసును నమోదు చేయాలని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వై.లక్ష్మణరావు ఆదేశాలు జారీ చేశారు. గతంలో ఇలా ఎన్నో . గూడూరురూరల్ స్టేషన్ పరిధిలో ఇలా వైఎస్సార్సీపీ నాయకులు, మద్దతుదారులపై పలుమార్లు అక్రమ కేసులు నమోదు చేసిన ఘటనలు ఉన్నాయి. గతంలో కూడా విందూరులో అధికార పార్టీ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని అదే పార్టీకి చెందిన ఓ యువకుడు మద్యం మత్తులో చించేస్తే దానిని వైఎస్సార్సీపీ మద్దతుదారుకు ఆపాదించి గ్రామానికి చెందిన ఐదుగురిని స్టేషన్లో ఉంచి చితక బాదిన ఘటన ఉంది. ఈ ఘటనతో గూడూరురూరల్ పోలీసుల వైఖరిపై ప్రజల్లో వ్యతిరేకత వచ్చినా కూడా వారిలో ఎలాంటి మార్పు చోటు చేసుకోకుండా ఓ దళితుడిపై పోలీసులు వ్యవహరించిన తీరుపై హైకోర్టు స్పందించడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గూడూరు రూరల్ పోలీసులకు చట్టం చెంప దెబ్బ ఫ్లెక్సీ చించేశారని లాకప్‌లో పెట్టి దళితుడిని చితకబాదిన వైనం పోలీస్ అరాచకంపై హైకోర్టుకెళ్లిన వైఎస్సార్సీపీ నేతలు ఈ నెల 14న జిల్లా ఎస్పీ, సీఐ, ఎస్‌ఐలతోపాటు కానిస్టేబుళ్లు స్వయంగా హాజరు కావాలని హైకోర్టు ఆదేశాలు పోలీసులపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని కోర్టు ఉత్తర్వులు ఘటన జరిగిన రోజు సీసీ ఫుటేజీలు అందజేయాలని స్పష్టీకరణ గూడూరు మండలం మంగళపూరులో గత నెల (ఏప్రిల్) 1న స్థానిక ఎమ్మెల్యే సునీల్‌కుమార్‌కు స్వాగతం పలుకుతూ అధికార పార్టీ నేతలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకున్నారు. అయితే మూడు రోజుల తర్వాత అవి చినిగిపోయాయి. దీనికి గ్రామ దళితవాడకు చెందిన వైఎస్సార్సీపీ మద్దతుదారుడు గడుతోటి రవీంద్ర కారణమనే కేవలం అనుమానంతో టీడీపీ నేతలు గూడూరు రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అధికార పార్టీ నేతల ఫిర్యాదు కావడంతో పోలీసులు ఆగమేఘాలపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడంతోపాటు ఆ యువకుడిని అరెస్ట్ చేసేందుకు రంగంలోకి దిగారు. అయితే ఈ విషయంలో తనకెలాంటి సంబంధం లేకపోవడంతో పోలీసులు తనపై కేసు నమోదు చేశారని, కొడతారని భావించిన రవీంద్ర పరారీ అయ్యాడు. -
ఏపీ ఈఏపీ సెట్‌కు 77 మంది గైర్హాజరు
నెల్లూరు(టౌన్): ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించిన ఏపీ ఈఏపీ సెట్ తొలిరోజు మంగళవారం ప్రశాంతంగా జరిగింది. జిల్లా వ్యాప్తంగా 12 కేంద్రాల్లో జరగ్గా 1,422 మందికి గానూ 1,345 మంది విద్యార్థులు హాజరయ్యారు. 77 మంది గైర్హాజరయ్యారు. పరీక్ష ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు జరిగింది. విద్యార్థులను పరీక్ష సమయానికి గంటన్నర ముందుగా కేంద్రాల్లోకి క్షుణ్ణంగా తనిఖీ చేసి అనుమతించారు. ఎలక్ట్రానిక్స్, స్మార్ట్ వాచ్‌లు తదితర వాటిని అనుమతించలేదు. తల్లిదండ్రులు కేంద్రాల వద్ద రావడంతో సందడిగా మారింది. కాగా బయట తాగునీటిని ఏర్పాటు చేయకపోవడంతో ఇబ్బందులు పడ్డారు. ఎండ తీవ్రత కూడా ఎక్కువగా ఉండటంతో చెట్లు, దుకణాల సముదాయాల వద్ద సేదతీరారు. -
రైల్వే అధికారుల అప్రమత్తం
● తనిఖీలు ముమ్మరం నెల్లూరు(క్రైమ్): జిల్లా రైల్వే పోలీస్ యంత్రాగం అప్రమత్తమైంది. గుంటూరు జిల్లా నిడుబ్రోలు రైల్వేస్టేషన్ సమీప ఆలూరుగేటు వద్ద మంగళవారం తెల్లవారుజామున జరిగిన ఘటన నేపథ్యంలో నెల్లూరు రైల్వే సీఐ ఎ.సుధాకర్ నేతృత్వంలో జీఆర్పీ, ఆర్పీఎఫ్, స్థానిక పోలీసులతో (38 మంది) కూడిన ప్రత్యేక బృందాలు రైల్వేస్టేషన్లు, నేరాలు అధికంగా జరిగే అవకాశమున్న తెట్టు, వెంకటేశ్వరపురం, అల్లూరురోడ్డు, తలమంచి, కొడవలూరు, మనుబోలు, గూడూరు ఔటర్ తదితర ప్రాంతాల్లో తనిఖీలు చేస్తున్నారు. పాతనేరస్తుల కదలికలపై నిఘా పెంచడంతోపాటు ప్రయాణికులను అప్రమత్తం చేస్తున్నారు. ప్రధాన రైల్వేస్టేషన్లో.. నెల్లూరు ప్రధాన స్టేషన్లో సీఐ తన సిబ్బందితో కలిసి రైళ్లలో జరుగుతున్న నేరాలు, నియంత్రణ చర్యలు, ప్రయాణికుల భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రయాణ సమయంలో తమ సామగ్రి, విలువైన వస్తువులను జాగ్రత్తగా కాపాడుకోవాలన్నారు. కొందరు సహచర ప్రయాణికుల ముసుగులో నేరాలకు పాల్పడే అవకాశం ఉందన్నారు. అనుమానాస్పదంగా ఎవరైనా కనిపిస్తే రైల్వే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. కార్యక్రమంలో ఎస్సై హరిచందన, సిబ్బంది పాల్గొన్నారు. -
దర్జాగా ఇసుక దందా
చేజర్ల: మండలంలోని పెరుమాళ్లపాడు గ్రామంలో వందల సంవత్సరాల చరిత్ర కలిగిన నాగేశ్వరాలయం నది ఒడ్డున ఉండేది. వరదలకు ఆ గుడి కాస్త ఇసుకతో కప్పబడింది. 20 అడుగుల మేర ఇసుకమేట ఏర్పడింది. నాలుగేళ్ల క్రితం గ్రామ యువత ఆలయాన్ని వెలికితీయాలని సంకల్పించారు. గోపురం కొంతమేర బయటకు కనపడేలా ఇసుకను తీశారు. ఆర్థిక చేయూత కోసం ఈ గుడి దేవదాయ శాఖ పరిధిలో ఉండడంతో గ్రామస్తులు సంబంధిత అధికారులను ఆశ్రయించారు. అధికార గణంతో ఆ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పరిశీలించారు. ఆలయాన్ని వెలికితీసి పునర్ని ర్మిస్తామని హామీ ఇచ్చారు. మా ఇష్టం మంత్రి ముఖ్య అనుచరులు ఆలయం చుట్టూ పరిసర ప్రాంతాల్లోని టన్నుల ఇసుకను మాయం చేశారు. కొద్దినెలలుగా ఆలయ ప్రాంగణంలోని ఇసుకను ఇతర ప్రాంతాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. పేరుకేమో ఆలయాన్ని వెలికి తీస్తున్నామని అభివృద్ధికి సహకరిస్తున్నామని చెబుతూ దేవుడి భూముల్లో ఉన్న సహజ సంపదను భారీగా దోపిడీ చేస్తూ రూ.కోట్లు వెనకేసుకుంటున్నారు. ఈ తంతు మంత్రి కనుసన్నల్లోనే జరుగుతోందని, అందువల్లే దోపిడీకి అడ్డుకట్ట లేకుండా పోయిందని ప్రజలు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. సందర్శకులను ఆపి.. వందల సంవత్సరాల చరిత్ర కలిగిన శివాలయం ఇసుక గర్భం నుంచి వెలికి తీశారన్న విషయం సోషల్ మీడియా ద్వారా రాష్ట్రమంతటా వ్యాపించింది. రోజూ వందలాది మంది భక్తులు ఈ ప్రాంతాన్ని సందర్శిస్తున్నారు. ఇసుక అక్రమ రవాణాకు వారి తాకిడి ఆటంకం కలిగిస్తోందని భావించారు. అధికార దర్పంతో ఎండోమెంట్, పోలీస్ అధికారుల చేత భక్తులెవరూ ఈ ప్రాంతానికి రావొద్దని, పనులు జరుగుతున్నాయని ప్రకటన ఇప్పించారు. భారీ యంత్రాలతో పగలు, రాత్రి అనే తేడా లేకుండా ఇసుకను దోపిడీ చేస్తున్నారు. ఎందుకు స్పందించడం లేదో.. రోజూ భారీ యంత్రాలు ఇసుకను తోడేస్తుండగా పెద్ద వాహనాల్లో ఇతర ప్రాంతాలకు తరలిస్తుండటంతో రోడ్లు దెబ్బ తినడంతోపాటు ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. అయినా మైనింగ్, ఎండోమెంట్ అధికారులు ఆ వైపున కన్నెత్తి కూడా చూడటం లేదని పెరుమాళ్లపాడు గ్రామస్తులు విమర్శిస్తున్నారు. మంత్రి ముఖ్య అనుచరులు కావడంతో పట్టించుకోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆలయ అభివృద్ధి ఏమో గానీ స్వామికి చెందాల్సిన ఇసుకను ప్రైవేట్ వ్యక్తులు దోచుకుంటూ శఠగోపురం పెడుతున్నారు. పెరుమాళ్లపాడు నాగేశ్వరస్వామి సాక్షిగా అపచారం గుడి వెలికితీత మాటున భారీగా ఇసుక దోపిడీ దేవదాయ శాఖ మంత్రి ముఖ్య అనుచరుల ఇష్టారాజ్యం ఆ వైపు కన్నెత్తి చూడని అధికార గణం తెలుగు తమ్ముళ్ల అరాచకాలకు అడ్డు లేకుండా పోయింది. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇసుక అక్రమంగా తరలిస్తూ జేబులు నింపుకొంటున్నారు. పెన్నా నది ఇసుకమేటతో కాలగర్భంలో కలిసిన ఆలయం వెలికితీత పేరుతో అక్రమ దందా జరుగుతోంది. గుడిని కప్పబడి ఉన్న ఇసుకతోపాటు పరిసర ప్రాంతాల్లోని టన్నుల కొద్దీ ఇసుకను దేవదాయ శాఖ మంత్రి అనుచరులు అక్రమంగా తరలిస్తున్నారు. భక్తులు ఇదేమి ఘోరం స్వామి అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు. అధికారులు మాత్రం ఆ వైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. -
ప్రజల సమస్యల్ని పరిష్కరించండి
● కలెక్టర్ హిమాన్షు శుక్లా నెల్లూరురూరల్: క్షేత్ర స్థాయిలో ప్రజా సమస్యలను గుర్తించి పరిష్కరించాలని కలెక్టర్ హిమాన్షు శుక్లా పిలుపునిచ్చారు. జిల్లావ్యాప్తంగా వీఆర్వో గ్రేడ్ – 2 నుంచి గ్రేడ్ – 1కు పదోన్నతులు పొందిన 110 మంది సచివాలయాల వీఆర్వోలకు మంగళవారం నెల్లూరు కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో కలెక్టర్, జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు, డీఆర్వో విజయ్‌కుమార్ నియామక ఉత్తర్వులను అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అంకితభావంతో పనిచేయాలని సూచించారు. విధులను క్రమశిక్షణతో నిర్వహిస్తూ ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలని పిలుపునిచ్చారు. అక్రమాలకు పాల్పడకుండా నిజాయితీగా, పారదర్శకంగా సేవ చేయాలని హితవు పలికారు. చిన్న తప్పు చేసినా వెంటనే ప్రజల్లో దోషులుగా నిలబడే పరిస్థితి ఉందన్నారు. సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం జరిగి సమాజం తక్కువగా చూసే పరిస్థితులు వస్తాయని పేర్కొన్నారు. వీఆర్వోలు ప్రజలతో నేరుగా సంబంధాలు కలిగి ఉంటారని, వారికి ప్రభుత్వపరంగా అవసరమైన సహాయ, సహకారాలు అందించడం బాధ్యతగా భావించాలని సూచించారు. కార్యక్రమంలో కలెక్టరేట్ పరిపాలనాధికారి శ్రీనివాసులు, తహసీల్దార్ డానియల్ పీటర్ తదితరులు పాల్గొన్నారు. -
రైతులను హింసిస్తున్న బాబు సర్కారు
నెల్లూరు (వీఆర్సీసెంటర్): చంద్రబాబు ప్రభుత్వంలో రైతుల అభివృద్ధి, సంక్షేమమే కాకుండా.. భద్రత కూడా కొరవడిందని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి ధ్వజమెత్తారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయానికి పెంచిన విద్యుత్ చార్జీలు తగ్గించమని ఉద్యమించిన రైతులపై పోలీసులతో కాల్పులు జరిపించి ప్రాణాలు తీశారని, ఇప్పుడు విద్యుత్ కనెక్షన్ అడిగితే.. పోలీసులతో కొట్టించి ఆ దృశ్యాలను వీడియో కాల్ ద్వారా చూస్తూ టీడీపీ నేతలు పైశాచికానందాన్ని పొందారంటూ మండిపడ్డారు. రైతులకు ఎరువులు, సాగునీరు అందించడం, గిట్టుబాటు ధర కల్పించడంతోపాటు సంక్షేమ పథకాలను అందించే విషయంలోనూ చంద్రబాబు ప్రభుత్వ మోసం చేస్తోందని ఆరోపించారు. మంగళ వారం విద్యుత్‌భవన్‌లో ఏపీఎస్పీడీసీఎల్ జిల్లా సర్కిల్ ఎస్ఈ రాఘవేంద్రంను కలిసి రైతులకు వ్యవసాయ విద్యుత్ సర్వీసు మంజూరులో జరుగుతున్న అవినీతి, రాజకీయ జోక్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఫిర్యాదు చేశారు. అనంతరం విలేకరుల సమావేశంలో కాకాణి మాట్లాడుతూ జిల్లాలో ప్రాధాన్యాతా క్రమంలో విద్యుత్ సర్వీసులు మంజూరు చేయాలని అడిగితే రైతులను పోలీసులతో కొట్టించడం, ఇదేమని ప్రశ్నించిన వారితోపాటు తనపై పోలీసు కేసులు పెట్టటం చూస్తుంటే రాష్ట్రంలో రైతులపై ఎంతటి దమనకాండ జరుగుతోందో తెలుస్తోందన్నారు. రెండేళ్లుగా కనెక్షన్ ఇవ్వని అధికారులు కాకు పెంచలయ్య అనే రైతు 2024 జూలై 11వ తేదీ వ్యవసాయ విద్యుత్ సర్వీసు కోసం విద్యుత్‌శాఖకు నగదు చెల్లించినా.. రెండేళ్లుగా కనెక్షన్ ఇవ్వలేదని, 3 నెలల క్రితం దరఖాస్తు చేసిన వారికి కనెక్షన్ ఇవ్వడం ఏమిటని కాకాణి ప్రశ్నించారు. ఏఈలు లంచాలు తీసుకుని ఇష్టారాజ్యాంగా వ్యవహరిస్తున్నారని, ఇదేమని అధికారులను ప్రశ్నిస్తే, టీడీపీ వారికి కోపమెచ్చి లంచాలు తీసుకుంటున్న అధికారులకు వత్తాసు పలుకుతూ ప్రెస్మీట్లు పెట్టటం శోచనీయమన్నారు. హరికృష్ణ అనే రైతును కొట్టిన ఎస్సైపై చర్యతీసుకోవాలని డీఎస్పీకు ఫిర్యాదు చేశామని, అయితే ఆయనపై చర్య తీసుకుంటారన్న నమ్మకం తమకు లేదన్నారు. ఆ ఎస్సైకు సీఐగా ప్రమోషన్ ఇచ్చినా ఆశ్చర్యం లేదన్నారు. ఎస్సై పోలీసు చరిత్ర 2029తో ముగుస్తుందన్నారు. ఈ పోరాటం ఇంతటితో ఆగదు రైతులకు వ్యవసాయ విద్యుత్ సర్వీసులు మంజూరు చేసే విషయంలో మితిమీరిన రాజకీయ జోక్యం, అధికారుల అవినీతిపై తాము చేస్తున్న పోరాటం ఇంతటితో ఆగదని కాకాణి హెచ్చరించారు. పొదలకూరు మండలం నావూరుపల్లిలో హరికృష్ణ అనే రైతు విషయంలో విద్యుత్ శాఖాధికారులు, పోలీసులు వ్యవహరించిన తీరు గర్హనీయమన్నారు. వ్యవసాయ కనెక్షన్ల విషయంలో ఇష్టారీతిగా వ్యవహరిస్తే.. చూస్తూ ఊరుకోబోమన్నారు. రైతులకు జరిగిన అన్యాయంపై, అకారణంగా పోలీసులు కొట్టటంపై న్యాయ స్థానాన్ని ఆశ్రయిస్తామని అవసరమైతే మానవ హక్కుల సంఘానికి, పౌరహక్కుల సంఘానికి ఫిర్యాదు చేసి న్యాయపోరాటం చేస్తామని హెచ్చరించారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలపై చేయిపడితే.. జిల్లాలో ఏ ఒక్క వైఎస్సార్సీపీ కార్యకర్తపైనా దాడి జరిగినా సహించేది లేదని కాకాణి హెచ్చరించారు. మహానాడుకు వచ్చే టీడీపీ నాయకులు ఫొటోలకు ఫోజులు ఇస్తూ తమను తిట్టి వెళ్తుతున్నారని ఎద్దేవా చేశారు. తమ పార్టీ కార్యకర్తలకు కానీ రైతులకు కానీ ఎక్కడ అన్యాయం జరిగినా.. పోరాడేందుకు వైఎస్సార్సీపీ శ్రేణులు, పార్టీ సిద్ధంగా ఉన్నారన్నారు. ఈ సారి అన్ని స్థానాల్లో వైఎస్సార్సీపీ క్లీన్‌స్వీప్ నిత్యం ప్రజల మధ్య తిరిగే తనకు ప్రజల నాడీ తెలుసునని ప్రజల్లో ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత ఉందని, ఇప్పటికప్పుడు ఎన్నికలు వచ్చినా ఉమ్మడి జిల్లాలో 10 ఎమ్మెల్యే స్థానాలు, 2 ఎంపీ స్థానాలు వైఎస్సార్సీపీ కై వసం చేసుకోవడం తథ్యమని కాకాణి స్పష్టం చేశారు. ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసే ధైర్యం లేని, దొడ్డి దారిలో ఎమ్మెల్సీ అయిన బీద రవిచంద్ర వంటి వాళ్లు కూడా మా పార్టీ గెలుపు గురించి మాట్లాడడం హాస్యాస్పదమన్నారు. అంత ధైర్యం ఉంటే ఎన్నికలు జరపాలని సవాల్ విసిరారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీరాష్ట్ర సెక్రటరీ చిల్లకూరు సుధీర్‌రెడ్డి, నాయకులు వెంకటశేషయ్య,ఇంద్రసేనగౌడ్, పెంచలరెడ్డి, సురేంద్రబాబు, హరగోపాల్‌రెడ్డి, శంకరయ్యగౌడ్, సురేష్‌కుమార్‌రెడ్డి, గోపాల్‌రెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి, రైతులు, తదిత రులు పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలపై చేయి పడితే సహించేది లేదు జిల్లాలో 10 ఎమ్మెల్యే, 2 ఎంపీ స్థానాలు వైఎస్సార్సీపీకే.. తప్పులు చేసే ఏ అధికారిని వదిలిపెట్టబోము మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి -
అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు ఏర్పాట్లు
● డీఆర్వో విజయ్కుమార్నెల్లూరురూరల్: జిల్లాలో ఇంటర్మీడియట్, పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణకు పక్కాగా ఏర్పాట్లు చేయాలని డీఆర్వో విజయ్‌కుమార్ ఆదేశించారు. మంగళవారం నెల్లూరు కలెక్టరేట్లో పరీక్షలపై సంబంధిత అధికారులతో సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఆర్ఐఓ వరప్రసాద్‌రావు మాట్లాడుతూ ఈనెల 21 నుంచి జూన్ 4వ తేదీ వరకు 66 కేంద్రాల్లో ఇంటర్మీడియట్ పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. మొదటి, ద్వితీయ సంవత్సరాలకు సంబంధించి 28,693 మంది విద్యార్థులు హాజరు కానున్నట్లు తెలిపారు. ఏమైనా సందేహాలుంటే కంట్రోల్ రూమ్ నంబర్ 0861 – 2320312కు ఫోన్ చేయాలన్నారు. ● డీఈఓ ఆర్.బాలాజీరావు మాట్లాడుతూ ఈనెల 25 నుంచి జూన్ 4వ తేదీ వరకు పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరుగుతాయన్నారు. 31 సెంటర్లలో జరిగే పరీక్షలకు 4,124 మంది హాజరవుతారన్నారు. అలాగే ఈనెల 25 నుంచి జూన్ 1వ తేదీ వరకు ఏపీ ఓపెన్ స్కూల్ ఇంటర్, టెన్త్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరుగుతాయన్నారు. నిర్వహణ కోసం చీఫ్ సూపరింటెండెంట్లు, ఇ న్విజిలేటర్లు, తనిఖీ బృందాలను నియమించామన్నారు. సమావేశంలో మున్సిపల్, విద్యుత్, మెడికల్ అండ్ హెల్త్, పోలీస్, ఆర్టీసీ అధికారులు పాల్గొన్నారు. -
వైఎస్సార్సీపీ నేతలపై పోలీసులకు ఫిర్యాదు
పొదలకూరు: వైఎస్సార్సీపీ నేతలపై టీడీపీ మండల అధ్యక్షుడు, పీఏసీఎస్ చైర్మన్ తలచీరు మస్తాన్‌బాబు మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. నావూరుపల్లి గ్రామానికి చెందిన గాలం హరికృష్ణ ఆయన అనుచరులతో తనకు ప్రాణహాని ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు. వారు నిర్వహించిన మీడియా సమావేశంలో తనను బెదిరించే విధంగా మాట్లాడారన్నారు. సోమవారం స్థానిక టీడీపీ కార్యాలయంలో ఆ పార్టీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించి శనివారం పోలీస్‌స్టేషన్ ఎదుట కాకాణి ఆధ్వర్యంలో జరిగిన ధర్నాను ఉద్దేశించి మాట్లాడుతూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో వెంటనే స్పందించిన వైఎస్సార్సీపీ మండల నాయకులు మీడియా సమావేశం నిర్వహించి కౌంటర్ ఇచ్చారు. ఈ క్రమంలో గాలం హరికృష్ణ తనపై పోలీసులు చేయి చేసుకున్న అంశాన్ని ప్రస్తావిస్తూ టీడీపీ నాయకులు తనను కొట్టించారని చర్యకు ప్రతి చర్య ఉంటుందని హెచ్చరించారు. దీంతో టీడీపీ నాయకుడు ప్రాణహాని ఉందని పోలీసులకు రాత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. యూట్యూబ్ చానల్ రిపోర్టర్ అరెస్ట్ నెల్లూరు (క్రైమ్): నెల్లూరు నగరంలో టీడీపీలోని ఓ మహిళా నేత విజేతరెడ్డి డాన్‌గా వ్యవహరిస్తుందంటూ 9 టీవీ యూట్యూబ్ చానల్ రిపోర్టర్ రమణారెడ్డి ప్రసారం చేసిన కథనాలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ సదరు మహిళా నేత ఈ నెల 7న బాలాజీనగర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతోపాటు రూ.5 కోట్ల పరువు నష్టం కేసును వేశారు. ఈ నేపథ్యంలో టీడీపీ మహిళా నేత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు మంగళవారం రమణారెడ్డిని అరెస్ట్ చేసి కోర్టుకు హాజరు పరచగా న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు. శ్రీవారి దర్శనానికి 8 గంటలు తిరుమల: తిరుమలలో మంగళవారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూ కాంప్లెక్స్‌లోని 22 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సోమవారం అర్ధరాత్రి వరకు 78,985 మంది స్వామి వారిని దర్శించుకున్నారు. 33,761 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామి వారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.55 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టికెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 8 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు. నేడు జెడ్పీ స్థాయీ సంఘాల సమావేశాలు నెల్లూరు (పొగతోట): జిల్లా పరిషత్ స్థాయీ సంఘాల సమావేశాలు బుధవారం ఉదయం 10.30 గంటల నుంచి జెడ్పీ కార్యాలయంలో నిర్వహించనున్నట్లు జెడ్పీ సీఈఓ శ్రీధర్‌రెడ్డి మంగళవారం తెలిపారు. జెడ్పీ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ అధ్యక్షతన సమావేశాలు జరుగుతాయన్నారు. పంచాయతీరాజ్, గ్రామీణ నీటి సరఫరా, జిల్లా నీటి యాజమాన్య సంస్థ, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, విద్యుత్, జిల్లా వ్యవసాయం, పశు సంవర్థకం, మత్స్య, విద్యా, వైద్య ఆరోగ్యం, ఐసీడీఎస్, ఐటీడీఏ, మైనార్టీ సంక్షేమం, జిల్లా మైనార్టీ సహకారం సంఘాలతో సమీక్ష, సమావేశాలు నిర్వహించనున్నారన్నారు. సమావేశాలకు ఆయా శాఖల జిల్లా అఽధికారులు, జెడ్పీ సభ్యులు తప్పకుండా హాజరుకావాలని కోరారు. హంస వాహనంపై కామాక్షితాయి విహారం బుచ్చిరెడ్డిపాళెం: మండలంలోని జొన్నవాడలో కొలువైన మల్లికార్జున సమేత కామాక్షితాయి అమ్మవారి ఆలయ బ్రహ్మోత్సవాలు భక్తి కోటి మధ్య కోలాహలంగా జరుగుతున్నాయి. సోమవారం అమ్మవారు పట్టు వస్త్రాలు, దగదగ మెరిసే సువర్ణాభరణాలతో అలంకరించి, సుగంధ పరిమళాలలు విరజల్లే విశేష పుష్పాలంకరణలో హంస వాహనంపై కొలువుదీరి పురవీధుల్లో విహరించి భక్తులకు కటాక్షించారు. అమ్మవారిని తేజోమయమైన వైభవాన్ని కనులారా దర్శించుకున్న భక్తులు ఆధ్యాత్మిక పారవశ్యంలో ఆనందో డోలికల్లో తేలియాడారు. వేలాది మంది భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆలయ పరిసరాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ పాలకమండలి, అసిస్టెంట్ కమిషర్ వెంకట శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో విస్తృత ఏర్పాటు చేసింది. సీఐ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్తు నిర్వహించారు. -
పెంచలకోనలో హనుమజ్జయంతి వేడుకలు
రాపూరు: జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన పెంచలకోనలో మంగళవారం హనుమజ్జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. క్షేత్రపాలకుడైన ఆంజనేయస్వామికి అభిషేకం, పూలంగిసేవ, ఆకుపూజ చేశారు. సాయంత్రం తిరుచ్చిపై ఆంజనేయస్వామి ఉత్సవ విగ్రహాన్ని కొలువుదీర్చి వివిధ రకాల పుష్పాలు, ఆభరణాలతో శోభాయమానంగా అలంకరించారు. కో న మాడవీధుల్లో క్షేత్రోత్సవం నిర్వహించారు. బెల్ట్ షాపులపై ఎకై ్సజ్ దాడులువరికుంటపాడు: మండల కేంద్రంలో బెల్ట్ షాపులు నిర్వహిస్తున్న వారిపై ఎకై ్సజ్ అధికారులు మంగళవారం దాడులు నిర్వహించారు. ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని 43 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఎకై ్సజ్ సీఐ ఎస్కే అబ్దుల్ జలీల్ మాట్లాడుతూ పట్టుబడిన ఇద్దరిపై కేసు నమోదుచేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు చెప్పారు. అక్రమంగా మద్యం విక్రయాలు నిర్వహించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గుర్తుతెలియని వాహనం ఢీకొని..● యువకుడి దుర్మరణం మనుబోలు: మండలంలోని మనుబోలు బైపాస్ రోడ్డు ఫ్లై ఓవర్ వద్ద మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతిచెందాడు. పోలీసుల కథనం మేరకు.. సైదాపురం మండలం మొలకలపూండ్ల గ్రామానికి చెందిన కొత్తలూరు చంద్రశేఖర్ కుమారుడు కల్యాణ్ (22) మోటార్‌బైక్‌పై నెల్లూరులోని పెదనాన్న ఇంటికి వెళ్లి తిరిగి వస్తున్నాడు. మనుబోలు బైపాస్ రోడ్డు ఫ్లై ఓవర్ దిగుతుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గూడూరు ప్రభుత్వాస్పత్రికి తరలించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేశారు. చికెన్ వ్యర్థాల అక్రమ రవాణా● రెండు వాహనాల సీజ్ సంగం: చికెన్ వ్యర్థాలు తరలిస్తున్న వాహనాలను మండలంలోని సంగం జాతీయ రహదారిపై పోలీసులు మంగళవారం స్వాధీనం చేసుకు న్నారు. స్థానికులిచ్చిన సమాచారంతో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. మినీ లారీ, మరో వాహనంలో వ్యర్థాలను తరలిస్తున్నట్లు గుర్తించారు. వాటిని సీజ్ చేసి కేసు నమోదు చేశారు. కుక్క దాడిలో ముగ్గురికి గాయాలుకోట: విద్యానగర్ మసీదు వీధిలో మంగళవారం నడిచి వెళ్తున్న ముగ్గురిపై కుక్క దాడి చేసింది. నవాజ్, మోహన్, లోకేశ్ అనే ముగ్గురు వ్యక్తులపై దాడి చేసి గాయపరిచింది. బాధితులు కోట ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందారు. కుక్కల బెడదను అరికట్టాలని స్థానికులు కోరుతున్నారు. -
నీట్‌గా ఆశలు సమాధి
నెల్లూరు (టౌన్): కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న నేషనల్ ఎలిజిబులిటీ కం ఎంట్రెన్స్ టెస్ట్ (నీట్) నిర్వహణ లోపభూయిష్టంగా మారి అపహస్య పాలవుతుంది. వైద్య వృత్తిలో రాణించాలనే ఆశలు పెట్టుకున్న వేలాది మంది విద్యార్థుల ఆశలను సమాధి చేస్తున్నారు. గతేడాది పరీక్ష కేంద్రాల్లో సరైన వసతులు ఏర్పాటు చేయకపోవడం, మరో వైపు గాలివాన బీభత్సంతో ఏ విద్యార్థి పరీక్షను రాయలేకపోయారు. ఈ ఏడాది చూస్తే.. ఏకంగా ప్రశ్నపత్రం లీకేజ్ కావడంతో పరీక్షనే కేంద్రం రద్దు చేయడంతో నీట్‌పై ఆశలు పెట్టుకున్న విద్యార్థులకు శరాఘాతంగా మారింది. జిల్లాలో 3486 మంది విద్యార్థులు జిల్లా లాంగ్, షార్ట్ టర్మ్‌ల్లోనూ నీట్‌కు ప్రిపేర్ అయిన విద్యార్థులు ఈ దఫా తమ ప్రతిభను చాటుకుందామని ఆకాంక్షతో ఈనెల 3వ తేదీ నిర్వహించిన పరీక్షకు హాజరయ్యారు. జిల్లా వ్యాప్తంగా 12 కేంద్రాలో జరిగిన పరీక్షకు 3486 మంది విద్యార్థులు హాజరయ్యారు. మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు నిర్వహించారు. ఎన్డీఏ తాజా ప్రకటనతో విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు హతాశులయ్యారు. నీట్ నిర్వహణపై ఆగ్రహం నీట్‌ను నిర్వహిస్తున్న నేషనల్ టెస్ట్ ఏజెన్సీపై విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. దేశ వ్యాప్తంగా జరుగుతున్న ఈ పరీక్షను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించాల్సి ఉన్నా కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ విద్యార్థుల భవిష్యత్‌తో ఆటలాడుతోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత 2024లో నిర్వహించిన నీట్ ప్రశ్నపత్రం బీహార్‌లో లీక్ కావడంతో అప్పుడు తొలుత ప్రకటించిన ర్యాంకుల జాబితాను రద్దు చేసి రెండో సారి ర్యాంకులు ప్రకటించారు. ఆ సమయంలో ఎంతో మంది విద్యార్థుల ర్యాంకులు మారడంతో ఆ విద్యా సంవత్సరం నష్టపోయారు. తాజాగా నీట్ పరీక్షను రద్దు చేయడంతో కచ్చితంగా మెడికల్ సీటు వస్తుందని ఆశ పడిన విద్యార్థులు తీవ్రమైన డిప్రెషన్లోకి వెళ్లిపోయారు. ఈ సారి నిర్వహించబోయే నీట్ పరీక్షలో ర్యాంకు వస్తుందో లేదో అనే ఆందోళన వారిలో నెలకొంది. నీట్ పరీక్ష కూడా ఎప్పుడు ఉంటుందో కూడా ప్రకటించలేదు. ఇప్పటికే పరీక్ష రాసి ర్యాంకుల కోసం ఎదురు చూస్తున్న విద్యార్థులు మళ్లీ పరీక్ష రాయాల్సి రావడంతో తీవ్ర అసంతృప్తి గురవుతున్నారు. నీట్ నిర్వహణపై కూడా విద్యార్థులు తల్లిదండ్రులు మండి పడుతున్నారు. బాధ్యత లేకుండా పరీక్ష నిర్వహించడమేమిటని ప్రశ్నిస్తున్నారు. పరీక్ష రద్దు బాధాకరం నీట్ రద్దు చేయడం బాధాకరం. మా పాప నీట్ రాసింది. మైనార్టీ కోటాలో తప్పనిసరిగా ఎంబీబీఎస్ సీటు వస్తుందని భావిస్తున్నాం. ఒకవేళ అక్కడ మిస్ అయినా బీడీఎస్ సీటు వస్తుంది. నీట్ రద్దుతో తీవ్ర నిరాశకు గురవుతున్నాం. ఈ సారి నిర్వహించబోయే పరీక్షలో ర్యాంకు వస్తుందో లేదోనన్న టెన్షన్లో ఉన్నాం. ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించాల్సిన నీట్ పరీక్షపై నిర్లక్ష్యం బాధాకరం. – బీబీ జాన్, విద్యార్థిని తండ్రి నిరాశ.. ఆందోళనగా ఉంది నీట్ రద్దు చేయడంతో నిరాశ, ఆందోళనకు గురవుతున్నాను. నీట్ కోసం ప్రిపేర్ అయి పరీక్ష బాగా రాశా. నీట్ సంస్థ విడుదల చేసిన కీ ఆధారంగా కచ్చితంగా నాకు ర్యాంకు వస్తుంది. ప్రభుత్వ మెడికల్ కళాశాలలో సీటు వస్తుంది. అయితే తాజాగా ఈ పరీక్షను రద్దు చేయడం వల్ల నష్టపోతున్నా. ఈ సారి నిర్వహించబోయే పరీక్షలో ఏ పాటి ర్యాంకు వస్తుందో లేదోనన్న టెన్స్న్లో ఉన్నా. – తేజశ్రీ, విద్యార్థిని ఒత్తిడికి లోనవుతాం నీట్ రద్దు చేయడం వల్ల ఏడాదంతా పడిన కష్టం.. మళ్లీ నీట్ జరిపితే ఫలితాల్లో నాకు ర్యాంకు వస్తుందో రాదో తెలియక, తీవ్ర ఒత్తిడికి గురవుతున్నాను. మంచి ప్రభుత్వ వైద్య కళాశాలలో చేరుతానని భావించా. నీట్ రద్దుతో అది కలగా మారింది. ముందు పరీక్షలో సీటు వస్తుందని ఆశ ఉంది. మళ్లీ పరీక్షలో ర్యాంక్ వస్తుందో రాదో తెలియదు. – రూపేష్, విద్యార్థి తీవ్ర నిరుత్సాహమే నీట్ రద్దు కావడం తీవ్ర నిరుత్సాహాన్ని కలిగించింది. నా కుమార్తె వర్ష ఎంతో కష్టపడి రాత్రింబవళ్లు చదివింది. పరీక్ష బాగా రాసింది. కీ చెక్ చూసుకుంటే 510 మార్కులకు పైగా వస్తున్నాయి. ఈ మార్కులతో ఎంబీబీఎస్ సీటు వస్తుందన్న ఆశలున్నాయి. ఇప్పుడు పరీక్ష రద్దు చేశామంటున్నారు. మళ్లీ పరీక్షల వరకు చదివితే.. ఈ సారి వచ్చే ప్రశ్నపత్రంతో ఇన్ని మార్కులు వస్తాయా? అనేది అనుమానంగా ఉంది. – పందిపాటి ఉదయ్‌కుమార్, నీట్ విద్యార్థిని తండ్రి, కోవూరు ప్రశ్నపత్రం లీక్.. పరీక్ష రద్దుతో విద్యార్థుల్లో ఆందోళన ఏళ్లుగా కష్టపడి చదివిన పిల్లల భవిష్యత్‌ను చిదిమేయడమే ఫ్రీ సీట్లు వస్తాయనే ఆనందంపై నీళ్లు విద్యార్థుల్లో ఆత్మస్థైర్యం దెబ్బతినడంపై తల్లిదండ్రుల ఆగ్రహం -
వియత్నాంకు మొక్కజొన్న ఎగుమతులు
● నౌకకు జెండా ఊపిన కలెక్టర్, పోర్టు సీఈఓ ముత్తుకూరు (పొదలకూరు): నెల్లూరు జిల్లా రైతులు పండించిన మొక్కజొన్నకు మెరుగైన మార్కెట్ అవకాశాలు కల్పించేందుకు జిల్లా యంత్రాంగం తీసుకున్న చర్యల్లో భాగంగా కృష్ణపట్నం పోర్టు నుంచి వియత్నాంకు మొక్కజొన్న ఎగుమతి నౌకను మంగళవారం కలెక్టర్ హిమాన్షు శుక్లా, సీఈఓ జగదీష్ పటేల్‌తో కలిసి నౌకను జెండా ఊపి ప్రారంభించారు. ఎంవీ పర్వరాజ్ పేరుతో బయలుదేరిన నౌక ద్వారా 53,318 మెట్రిక్ టన్నుల మొక్కజొన్నను వియత్నాంకు ఎగుమతి చేస్తున్నారు. ఈ ఏడాది జిల్లాలో మొక్కజొన్న పంట అధికంగా దిగుబడి కావడంతో రైతులకు గిట్టుబాటు ధరలు లభించేలా కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారించారు. ఈ నేపథ్యంలో అదానీ కృష్ణపట్నం పోర్ట్ లిమిటెడ్, వ్యవసాయ శాఖ అధికారులతో సమన్వయం చేసుకుంటూ మొక్కజొన్న ఎగుమతులకు అవసరమైన ఏర్పాట్లు జిల్లా యంత్రాంగం చేపట్టింది. మొక్కజొన్న ఎగుమతుల ద్వారా రైతులకు విస్తృత మార్కెట్ అవకాశాలు లభించడంతోపాటు, వ్యవసాయ ఉత్పత్తులకు అంతర్జాతీయ స్థాయిలో డిమాండ్ పెరుగుతుందని అధికారులు తెలిపారు. రైతుల ఆదాయం పెంచేందుకు ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం తీసుకుంటున్న చర్యల్లో ఇది ఒక ముఖ్యమైందన్నారు. ఈ కార్యక్రమంలో పోర్టు, వ్యవసాయ శాఖ అధికారులు, సంబంధిత విభాగాల ప్రతినిధులు పాల్గొన్నారు. -
కొడుకు ఆచూకీ చెప్పాలని.. తండ్రిపై లాఠీల విన్యాసం
అయితే రవీంద్రను అరెస్ట్ చేసేందుకు వచ్చిన పోలీసులు అతను లేకపోవడంతో తండ్రి గడుకోటి పోలయ్య ఎక్కడ అని కుటుంబ సభ్యులను అడిగారు. గొర్రెలు మేపుకునేందుకు మనుబోలు మండలం బద్దెవోలు గ్రామానికి వెళ్లాడని కుటుంబ సభ్యులు చెప్పడంతో పోలీసులు నేరుగా బద్దెవోలు గ్రామానికి వెళ్లి పోలయ్యపై విచక్షణా రహితంగా లాఠీతో చితకబాదారు. అతన్ని ఆటోలో ఎక్కించుకుని గూడూరు రూరల్ పోలీస్‌స్టేషన్‌కు తీసుకు వచ్చి అక్కడ కూడా కొడుకు ఆచూకీ చెప్పాలంటూ సీఐ, ఎస్సైలు, కానిస్టేబుళ్లు వరుస పెట్టి మరోసారి లాఠీలతో తీవ్రంగా కొట్టడంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. అతని పరిస్థితి విషమంగా ఉండడంతో ఆ రాత్రికి వదిలేశారు. స్థానిక వైఎస్సార్సీపీ నాయకులు ఈ విషయం తెలుసుకుని ఆతన్ని గూడూరు ఏరియా ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందించారు. అతని పరిస్థితి విషమంగా ఉండడంతో నెల్లూరుకు తరలించారు. -
అయ్యా.. న్యాయం చేయండి
● కలెక్టరేట్లో ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ ● వినతులు స్వీకరించిన కలెక్టర్ హిమాన్షు శుక్లానెల్లూరురూరల్: ‘అయ్యా.. చాలాదూరం నుంచి వచ్చాం. మా వినతులు చూసి న్యాయం చేయండి’ అంటూ ప్రజలు కోరారు. సోమవారం నెల్లూరు కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. కలెక్టర్ హిమాన్షు శుక్లా, జేసీ మొగిలి వెంకటేశ్వర్లు, డీఆర్వో విజయకుమార్, డిప్యూటీ కలెక్టర్లు వంశీకృష్ణ, కేశవర్ధన్‌రెడ్డి, జిల్లా సర్వే ల్యాండ్ రికార్డుల డీడీ నాగశేఖర్ అర్జీలను స్వీకరించారు. ● భూగర్భ జలాలను పెంపొందించాలని ఆర్టీసీ రీజినల్ చైర్మన్ సన్నపరెడ్డి సురేష్‌రెడ్డి కోరారు. జేసీకి వినతిపత్రం సమర్పించారు. ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం కొద్దిరోజులుగా ఇంకుడుగుంతలపై అశ్రద్ధ వహించిందన్నారు. నీటి వనరులను పెంపొందించేందుకు కావాల్సిన చర్యలు చేపట్టాలన్నారు. నేతలు మాల్యాద్రి, మిడతల రమేష్ తదితరులు పాల్గొన్నారు. ● జేసీసీ డైరెక్టర్లను ఏర్పాటు చేయాలని యానాది సంఘాల మహాకూటమి నాయకులు కోరారు. రాష్ట్ర మీడియా కో ఆర్డినేటర్ బత్తిన లక్ష్మీశేఖర్ మాట్లాడుతూ జూన్ 12న జరగాల్సిన సమావేశాన్ని నిలిపివేశారన్నారు. జిల్లాలోని అటవీ ప్రాంతంలో ఫలరసం సేకరణ కేంద్రాల్లో 274 మంది యానాదులకు సభ్యత్వం ఉందన్నారు. సేకరించిన ఫలసారాన్ని జేసీసీకి విక్రయిస్తామన్నారు. కొత్త ఓటర్లకు డైరెక్టర్లకు అవకాశం కల్పించాలని, ఏళ్లు గడుస్తున్నా పాతవారినే కొనసాగించడం బాధాకరమన్నారు. ● విద్యా హక్కు చట్టాన్ని పటిష్టంగా అమలు చేసి, తల్లిదండ్రులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని పేరెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కోరారు. ఆర్టీఈ అమలుకు పర్యవేక్షణ కమిటీని ఏర్పాటు చేయాలన్నారు. నిరంతరం తనిఖీలు చేపట్టాలన్నారు. ఫిర్యాదులు చేయడానికి ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలన్నారు. ● చిల్లకూరు మండలం కడివేడు గ్రామంలో సర్వే నంబర్ 872/4బీ, సర్వే నంబర్ 872/5లో ఉన్న రెండెకరాల భూమిని కలెక్టరేట్ ఆదేశాలను ధిక్కరిస్తూ ఆక్రమించారని సీపీఐ ఆధ్వర్యంలో స్థానికులు నినాదాలు చేశారు. విచారణ జరిపి ఆక్రమించిన వారిపై తగిన చర్యలు తీసుకుని హక్కుదారుడికి భూమిని అప్పగించాలని కోరారు. -
గ్రావెల్ గద్దలు
● ప్రభుత్వ భూముల్లో పెద్దఎత్తున అక్రమ తవ్వకాలు ● సాగరమాల రోడ్డుకు తరలింపు ● రూ.కోట్లు కొల్లగొడుతున్న కూటమి నాయకులు కోట: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక టీడీపీ నాయకులు చెలరేగిపోతున్నారు. మండలంలోని ప్రభుత్వ భూముల నుంచి గ్రావెల్‌ను అక్రమంగా తరలిస్తున్నారు. రేయింబవళ్లు భారీ యంత్రాలతో తవ్వకాలు చేపట్టి పెద్ద ఎత్తున సాగరమాల రోడ్డు పనులకు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. సాగరమాల రోడ్డు పనులకు గ్రావెల్ పెద్ద ఎత్తున అవసరం ఉంది. మండలంలోని విద్యానగర్ నుంచి కేశవరం వరకు నాణ్యమైన గ్రావెల్ భూములు ఉన్నాయి. ఈ అవకాశాన్ని తమ్ముళ్లు వరంలా మార్చుకున్నారు. ప్రభుత్వ భూముల్లో అక్రమంగా తవ్వకాలు చేస్తూ రూ.కోట్లు కొల్లగొడుతున్నారు. తమ్ముళ్ల గ్రావెల్ దందాకు ఆయా ప్రాంతాల్లో తవ్వేసిన గ్రావెల్ గుంతలు సజీవ సాక్ష్యంగా నిలుస్తున్నాయి. రూ. కోట్లలో దోపిడీ సాగరమాల ప్రాజెక్ట్ కింద చిల్లకూరు మండలం తూర్పుకనుపూరు నుంచి నాయుడుపేట వరకు 38 కిలోమీటర్ల మేర ఆరు వరుసల రహదారి నిర్మాణ పనులు జరుగుతున్నాయి. దీని కోసం వేల టన్ను ల గ్రావెల్ అవసరం ఉంది. దీన్ని తెలుగు తమ్ముళ్లు జేబులు నింపుకొనేందుకు అవకాశంగా మార్చుకున్నారు. గ్రావెల్ ఉన్న ప్రభుత్వ భూములు, కుంటలను కారు చౌకగా రైతుల వద్ద తీసుకుని దర్జాగా గ్రావెల్‌ను తవ్వేసి సొమ్ము చేసుకుంటున్నారు. వీటిలో ప్రభుత్వం పేదలకు ఇచ్చిన అసైన్మెంట్, డీకేటీ భూములు కూడా ఉన్నాయి. ప్రాంతాన్ని బట్టి రైతుకు ఎకరాకు రూ.5లక్షల నుంచి రూ.7లక్షల వరకు చెల్లిస్తున్నారు. ఎకరా భూములో రూ.20 లక్షల నుంచి రూ.25లక్షల వరకు విలువైన గ్రావెల్‌ను తరలిస్తున్నారు. నిబంధనలు అతిక్రమించి 50 అడుగుల వరకు ఇష్టానుసారం తవ్వేస్తున్నారు. ఊనుగుంటపాళెం, చిట్టేడు, గూడలి, కేసవరం పంచాయతీల పరిధిలో 100 ఎకరాలకుపైగా భూముల్లో కోట్లాది రూపాయల విలువ చేసే గ్రావెల్‌ను ఇప్పటి వరకు తరలించారు. ఇలా రూ.కోట్లలో గ్రావెల్ దందా కొనసాగించనట్లు తెలుస్తోంది. సాగరమాల ముసుగులో బయట ప్రాంతాలకు సైతం గ్రావెల్‌ను తరలిస్తున్నారు. జిల్లా ఉన్నతాధికారులు స్పందించి సాగరమాల రహదారి పేరుతో టీడీపీ నేతలు సాగిస్తున్న గ్రావెల్దందాపై విచారణ జరపాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు. -
ఆక్వా సర్వీసులపై విజిలెన్స్ దాడులు
● రొయ్యల గుంతలు టీడీపీ నేతలవిగా ప్రచారం వాకాడు: మండలంలోని పామంజి, జమీన్ కొత్తపాళెం గ్రామాల్లో ఆక్వా విద్యుత్ సర్వీసులపై సోమవారం తిరుపతి జిల్లా విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. 7 అక్రమ విద్యుత్ సర్వీసులను గుర్తించారు. అయితే పట్టుబడిన వారు అధికార పార్టీ నేతలు కావడంతో అధికారులు సమాచారం బయటకు రాకుండా జాగ్రత్త పడినట్లు ప్రచారం జరుగుతోంది. అందులో 100, 101, 75, 154, 66, 79, 74 నంబర్లు గల ఆక్వా విద్యుత్ సర్వీసులను తొలగించి సీజ్ చేసినట్లు సమాచారం. దాడుల్లో విజిలెన్స్ అధికారులు పూర్ణచంద్రకుమార్, రంగయ్య, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. కత్తితో హల్చల్.. యువకుడికి రిమాండ్ముత్తుకూరు(పొదలకూరు): పిడతాపోలూరు సెంటర్ వద్ద కత్తి పట్టుకుని హల్చల్ చేసిన యువకుడిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. వారి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ఈనెల 9వ తేదీన రాత్రి పిడతాపోలూరు సెంటర్లో వీరంగం సృష్టించి ప్రజలను భయభ్రాంతులకు గురిచేసిన యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నెల్లూరు రూరల్ మండలం చింతలరెడ్డిపాళెం యలమదిన్నె ప్రాంతానికి చెందిన డేనియల్ రాజుగా యువకుడిని గుర్తించారు. అతడిని వైద్య పరీక్షల అనంతరం కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించినట్లు సోమవారం పోలీసులు వెల్లడించారు. -
మలిదేవి ఏం పాపం చేసింది?
● 9,200 ఎకరాల ఆయకట్టు ● విడుదల కాని సాగు నీరు ● అదను దాటిపోతోందని రైతుల గగ్గోలు కొడవలూరు: జిల్లాలో రెండో పంట సాగుకు సోమశిల నుంచి ఈ నెల 4న సాగునీటిని విడుదల చేశారు. శనివారం కనిగిరి రిజర్వాయర్ నుంచి కూడా అన్ని కాలువలకు నీటిని వదిలారు. అయితే మలిదేవి కాలువ ఆయకట్టు రైతులు ఏం పాపం చేశారో గానీ సోమవారం కూడా సాగునీరు విడుదల చేయలేదు. మలిదేవి కాలువ కింద నార్తురాజుపాళెం, కోవూరు, రామన్నపాళెం, మానేగుంటపాడు, ఆలూరుపాడు, మోడేగుంట గ్రామాల్లో 9,200 ఎకరాల ఆయకట్టు ఉంది. ఈ కాలువ డ్రెయిన్ గాను, సాగునీటి కాలువ గాను ఉపకరిస్తుంది. అందువల్ల దీనికి అత్యంత ప్రాధాన్యత ఉంది. కనిగిరి రిజర్వాయర్ నుంచి అన్ని సాగు నీటి కాలువలతో పాటు దీనికి నీరు విడుదల చేస్తుంటారు. రెండ్రోజుల క్రితమే తూర్పు కాలువ కింద ఉన్న అన్ని కాలువలకు సాగునీరు విడుదల చేశారు. కానీ మలిదేవి కాలువకు మాత్రం సోమవారం సాయంత్రం వరకు విడుదల చేయలేదు. మరోపక్క నార్లు పోసుకునేందుకు అదను దాటుతుండడంతో ఆయకట్టు రైతులు గగ్గోలు పెడుతున్నారు. సంబంఽధిత ఇరిగేషన్ ఏఈ శ్రీనివాసులును ఫోన్లో సంప్రదించినా సరైన సమాధానం చెప్పడం లేదని ఆయకట్టు రైతులు వాపోయారు. ఎప్పటికి విడుదల చేస్తారో కూడా స్పష్టత ఇవ్వడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయమై ‘సాక్షి’ ఏఈ శ్రీనివాసులును వివరణ కోరేందుకు ఫోన్లో ప్రయత్నించగా లిఫ్ట్ చేయలేదు. జిల్లా ఉన్నతాధికారులైనా స్పందించి మలిదేవికి నీటి విడుదలపై స్పష్టత ఇవ్వడం ద్వారా రైతుల్లో ఆందోళనకు తెర దించాల్సిన అవసరం ఉంది. -
ముత్యాలమ్మ హుండీ రాబడి రూ.27.90 లక్షలు
చిల్లకూరు: మండలంలోని తూర్పుకనుపూరులోని ముత్యాలమ్మ ఆలయంలో హుండీ కానుకల లెక్కింపును సోమవారం చేపట్టారు. మార్చిలో ముత్యాలమ్మ జాతర జరిగింది. ఆ తరువాత నుంచి 58రోజుల పాటు భక్తులు ముత్యాలమ్మ, పోలేరమ్మ ఆలయాల్లోని హుండీల్లో సమర్పించిన కానుకలను లెక్కించగా రూ.27,90,038 రాబడి వచ్చిందని ఆలయ ఈఓ నవీన్‌కుమార్ తెలిపారు. ముత్యాలమ్మ ఆలయ హుండీల ద్వారా రూ.24,86,668, పోలేరమ్మ ఆలయ హుండీల ద్వారా రూ.3,03,370 ఆదాయం వచ్చిందని వివరించారు. దేవదాయశాఖ ఇన్స్పెక్టర్ ఎం సుధీర్, ఆలయ చైర్మన్ చిల్లకూరు దశరథరామిరెడ్డి, ఆలయ, విశ్రాంత బ్యాంక్ సిబ్బంది పాల్గొన్నారు. 14న జాబ్‌మేళా నెల్లూరు(పొగతోట): ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఎంప్లాయీమెంట్ ఆఫీస్, సీడాప్ సంయుక్తంగా ఈ నెల 14న నెల్లూరులోని నారాయణ ఇంజినీరింగ్ కళాశాలలో జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి అబ్దుల్‌ఖయ్యూం సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. 23 ప్రముఖ కంపెనీల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు జాబ్‌మేళా నిర్వహిస్తున్నారని చెప్పారు. 10వ తరగతి, ఇంటర్, ఐటీఐ, డిప్లొమో, డిగ్రీ చదివిన నిరుద్యోగులు ఇంటర్వ్యూలకు హాజరుకావచ్చని తెలిపారు. నిరుద్యోగ యువత అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వివరాలకు 87126 55686, 87901 17279 నంబర్లను సంప్రదించాలని సూచించారు. సింహ వాహనంపై కామాక్షితాయి బుచ్చిరెడ్డిపాళెం: మండలంలోని జొన్నవాడలో మల్లికార్జునస్వామి సమేత కామాక్షితాయి అమ్మవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగు తున్నాయి. ఉత్సవాల్లో భాగంగా సోమవారం కామాక్షితాయి అమ్మవారు సింహ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. కామాక్షితాయి ఉత్సవమూర్తిని విశేషంగా అలంకరించి సింహ వాహనంపై కొలువుదీర్చి గ్రామోత్సవం జరిపారు. ఆలయ చైర్మన్ అశోక్‌రెడ్డి, దేవదాయ శాఖ సహాయ కమిషనర్ వెంకట శ్రీనివాసులురెడ్డి ఏర్పాట్లను పర్యవేక్షించారు. శ్రీవారి దర్శనానికి 8 గంటలు తిరుమల: తిరుమలలో సోమవారం భక్తుల రద్దీ మోస్తరుగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లోని 10 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. ఆదివారం అర్ధరాత్రి వరకు 85,942 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 29,238 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.94 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టికెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 8 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు. ఇదిలా ఉంటే సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి మాత్రమే క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. కేటాయించిన సమయానికంటే ముందు వెళ్లిన వారిని క్యూలోకి అనుమతించరని స్పష్టం చేసింది. టీకాలు క్రమం తప్పకుండా అందించాలి దుత్తలూరు: చిన్నారులకు టీకాలను క్రమం తప్పకుండా అందించాలని జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారిణి ఉమామహేశ్వరి సూచించారు. దుత్తలూరు పీహెచ్‌సీని సోమవారం ఆమె తనిఖీ చేశారు. పీహెచ్సీ పరిసరాలు, టీకాలు భద్రపరిచే గది, ఫార్మశీ గదిని పరిశీలించారు. వ్యాక్సినేషన్‌పై వైద్యారోగ్య సిబ్బందికి సూచనలు చేశారు. అనంతరం పీహెచ్సీ వైద్యాధికారి ఆయూబ్ అప్సర్‌ను అడిగి వైద్యసౌకర్యాలు, సమస్యలపై ఆరా తీశారు. -
ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కు గురై..
● బాలుడికి తీవ్రగాయాలు ఉదయగిరి: విద్యుదాఘాతానికి గురై ఓ బాలుడు తీవ్రంగా గాయపడిన ఘటన సోమవారం పట్టణంలోని ఇందిరానగర్ కాలనీ సమీపంలో జరిగింది. స్థానికుల కథనం మేరకు.. కాలనీకి చెందిన వినీత్ పంచాయతీరాజ్ కార్యాలయ ఆవరణలో తోటి చిన్నారితో కలిసి ఆడుకుంటున్నాడు. ఈ క్రమంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్పై కోతి పిల్ల ఉండటంతో దానిని తరుముకుంటూ ప్రమాదవశాత్తు షాక్‌కు గురయ్యాడు. దీంతో అతని శరీరంపై తీవ్ర గాయాలయ్యాయి. తోటి పిల్లలు కుటుంబ సభ్యులకు తెలపడంతో వారు వెంటనే చికిత్స నిమిత్తం ఉదయగిరి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అనంతరం మెరుగైన వైద్య చికిత్స కోసం ఆత్మకూరుకు తీసుకెళ్లారు.నిమ్మ ధరలు (కిలో) పెద్దవి : రూ.120 సన్నవి : రూ.32 పండ్లు : రూ.20 -
ఇటుక బట్టీలకు చెరువు మట్టి అక్రమ తరలింపు
● అడ్డుకున్న గ్రామస్తులు పొదలకూరు : మండలంలోని డేగపూడి గ్రామ చెరువులోని మట్టిని అక్రమంగా ఇటుకబట్టీలకు ఆదివారం రాత్రి తరలిస్తుండగా గ్రామస్తులు అడ్డుకున్నారు. అప్పటికే పదుల సంఖ్యలో ట్రక్కుల మట్టిని ఇటుకబట్టీ వద్దకు తోలారు. గ్రామంలో ఇటుక బట్టీలను నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో బయట ప్రాంతం నుంచి ఇటుక రాయిని కాల్చేందుకు వచ్చిన ఓ వ్యక్తి అధికార పార్టీ నాయకుల అండదండలతో చెరువులో జేసీబీని ఏర్పాటు చేసి ఎలాంటి అనుమతులు లేకుండా మట్టిని తరలిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న గ్రామరైతులు ట్రాక్టర్లను నిలువరించారు. ఎవరి అనుమతితో చెరువులోని మట్టిని ఇటుక బట్టీలను తరలిస్తున్నారని ప్రశ్నించారు. దీంతో మట్టి తరలింపును తాత్కాలికంగా నిలిపివేశారు. ఆ వెంటనే గ్రామస్తులు ఇరిగేషన్ ఏఈ అనిల్‌కుమార్‌కు సమాచారం అందించారు. సోమవారం ఏఈ చెరువు వద్దకు వచ్చి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎవరైనా చెరువు నుంచి అనుమతులు లేకుండా మట్టిని తరలిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మట్టి అక్రమ తరలింపుపై గ్రామస్తులు సమాచారం అందజేసిన వెంటనే నిలిపివేయించామన్నారు. ఇకపై అనుమతులు లేకుండా ఎవరైనా మట్టిని తరలిస్తే పోలీసు కేసులు పెట్టాలని సాగునీటి సంఘం అధ్యక్షుడికి సూచించారు. -
సేవకు ప్రతిరూపం
నెల్లూరు(అర్బన్): చిరునవ్వుతో పలుకరిస్తూ.. రోగుల మంచి, చెడుల్ని తెలుసుకుంటూ స్వాంతన చేకూర్చే వారే నర్సులు. నర్సింగ్ వృత్తి ఎంతో పవిత్రమైంది. సేవకు ప్రతి రూపం. రోగి శరీరం నుంచి చీము, రక్తం కారుతున్నా.. దుర్వాసన వస్తున్నా ఏ మాత్రం పట్టించుకోకుండా వైద్యం చేస్తారు. కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో తమ ప్రాణాలు పణంగా పెట్టి రోగులకు సేవలందించారు. జీవితాన్ని సేవకే అంకితం చేసిన ఫ్లోరెన్స్ నైటింగేల్ జయంతిని పురస్కరించుకుని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతి సంవత్సరం మేనెల 12వ తేదీన అంతర్జాతీయ నర్సుల దినోత్సవాన్ని నిర్వహిస్తోంది. మంగళవారం జిల్లాలో నర్సులు పలు కార్యక్రమాలు చేపట్టనున్నారు. ఎంతమందంటే.. జిల్లాలో 52 పీహెచ్‌సీలు, 10 సీహెచ్‌సీలు, 28 పట్టణ ఆరోగ్య కేంద్రాలు, ఒక జిల్లా ఆస్పత్రి, రెండు ఏరియా ఆస్పత్రులు, జిల్లా కేంద్రంలో సర్వజన ఆస్పత్రి, 490 విలేజ్ హెల్త్‌క్లినిక్‌లు ఉన్నాయి. ఇవే కాకుండా ప్రైవేట్ రంగంలో సుమారు 500 హాస్పిటళ్లున్నాయి. వీటిలో సుమారు 5 వేల మందికి పైగా నర్సులు సేవలందిస్తున్నారు. గ్రామాల్లో సుమారు 1,500 మంది ఏఎన్ఎంలు విధుల్లో ఉన్నారు. ఆప్యాయంగా మాట్లాడుతూ.. ఆస్పత్రిలో పలువురు రోగులకు చీము, నెత్తురు కారుతుంటుంది. అయితే నర్సులు నవ్వుతూ రోగిని ఆప్యాయంగా పలకరిస్తూ గాయాలను శుభ్రపరిచి కట్లు కడుతారు. ప్రమాదాల్లో గాయపడిన వారికి సైతం ఇలాగే చికిత్స అందిస్తారు. జీవితంపై విరక్తితో మందు తాగిన, ఆపరేషన్ చేయించుకున్న వారికి, విషజ్వరాలతో మంచం పట్టిన వారికి సేవలందించేది నర్సులే. ఐసీయూలో వెంటిలేటర్ మీదున్న రోగులకు, డాక్టర్ల సూచనల ప్రకారం దగ్గరుండి సేవలు చేస్తారు. రాత్రి, పగలు తేడాల్లేకుండా వారు చేసే సపర్యల వల్లనే రోగులు కోలుకుంటారు. నెల్లూరు నగరంలోని సర్వజన ఆస్పత్రిలో ఓపీ పేషెంట్లు రోజుకు సుమారు 1,500 మంది వస్తారు. ఇన్ పేషెంట్లుగా 500 మంది ఉంటారు. వీరిలో పురిటి బిడ్డలు, గర్భిణులు, బాలింతలున్నారు. వీరందరికి సేవలందించడమే కాకుండా నెలలు నిండకుండా పుట్టిన పసికందులు ఐసీయూలో ఉంటారు. వారిని బాక్సుల్లో ఉంచి కంటికి రెప్పలా కాపాడేది నర్సులే. అందుకే నర్సింగ్ వృత్తి అంటే పవిత్రమైందని పేర్కొంటున్నారు. రోగికి సైలెన్ పెడుతున్న నర్సు రోగులకు అండగా నర్సులు జిల్లాలో 5 వేల మందికి పైగా.. కరోనా సమయంలో ప్రాణాలు పణంగా పెట్టి సేవలు నేడు అంతర్జాతీయ నర్సుల దినోత్సవం -
జనావాసాల్లోకి జింకలు
ఇందుకూరుపేట: అటవీ ప్రాంతం నుంచి రెండు జింకలు మండలంలోని నిడిముసలి గ్రామంలోకి సోమవారం తెల్లవారుజామున వచ్చాయి. అవి వీధుల్లో తిరుగుతుండగా స్థానికులు చూసి ఆశ్చర్యానికి గురయ్యారు. కొందరు యువకులు ఉత్సాహంతో పట్టుకునేందుకు ప్రయత్నించారు. ఈ సమయంలో ఒకటి తప్పించుకుని వేగంగా వెళ్లిపోయింది. మరో జింకను పట్టుకోగా.. కాసేపటికి అది సమీప వ్యవసాయ పొలాల్లోకి పరుగులు తీసింది. గ్రామస్తులు పోలీసులు, అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. కోడూరు సెక్షన్‌కు చెందిన అటవీ శాఖ అధికారి అల్తాఫ్ నిడిముసలి గ్రామానికి చేరుకుని జింకలు వచ్చిన మార్గం, పరిసర పరిస్థితులపై వివరాలు సేకరించారు. గతంలో కూడా జింకలు, అడవి పందులు గ్రామాల్లో కనిపించిన సంఘటనలు చోటుచేసుకున్నాయి. అటవీ జంతువులను వెంబడించకూడదని, వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని అటవీ శాఖ అధికారులు కోరారు. -
అధికార దర్పం ప్రదర్శిస్తే ఊరుకోం
● చర్యకు ప్రతి చర్య తప్పదు ● వైఎస్సార్సీపీ నాయకులు పొదలకూరు : అధికారం ఉందని అరాచకాలు సాగించి అక్రమ కేసులు పెట్టిస్తే ఊరుకునే ప్రసక్తే లేదని, చర్యకు ప్రతి చర్య ఉంటుందని వైఎస్సార్సీపీ నాయకులు హెచ్చరించారు. పొదలకూరులోని జెడ్పీటీసీ సభ్యురాలు నిర్మలమ్మ గృహంలో సోమవారం వారు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా మైనార్టీ విభాగం కార్యదర్శి ఎస్కే అంజాద్, బాధిత రైతు గాలం హరికృష్ణ, బిరదవోలు బీసీ సెల్ అధ్యక్షుడు రావుల విజయభాస్కర్‌గౌడ్ మాట్లాడారు. సోమిరెడ్డి పొదలకూరులో ఎందుకు పనికిరాని నలుగురిని పెట్టుకుని మా నాయకుడు కాకాణిపై విమర్శలు చేయిస్తే ఊరుకునేది లేదన్నారు. అధికారం ఉందని భయపడి కొందరు అధికారులు దిగజారి ఊడిగం చేస్తే భవిష్యత్తులో విచారణను ఎదుర్కోక తప్పదన్నారు. సోమిరెడ్డి మండలానికి ఒక కలెక్షన్ ఏజెంట్‌ను ఏర్పాటు చేసుకుని నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో అక్రమంగా సంపాదిస్తున్నాడని, అందుకు తోడ్పడే అధికారులు సంపాదించినదంతా కక్కాల్సిన పరిస్థితి వస్తుందన్నారు. సర్వేపల్లి చరిత్రలో లేఅవుట్ల యజమానుల వద్ద దండకాలు సాగించిన ఎమ్మెల్యేలు లేరని, సోమిరెడ్డి ఒక్కడికే ఆ ఘనత దక్కిందన్నారు. కూటమి అధికారంలోకి రాగానే లేఅవుట్లపై నానాయాగి చేసి పోలీసు కేసులు పెట్టించారని గుర్తుచేశారు. ప్రస్తుతం ఆ కేసులు ఏమయ్యాయో తెలియదన్నారు. సత్యనారాయణ లేఅవుట్లో స్థలాన్ని డ్రామాలు ఆడి కొట్టేసేందుకు ప్రయత్నిస్తున్నారని, ఎంత మందికి రిజిస్ట్రేషన్లు చేసినా మా పార్టీ అధికారంలోకి రాగానే గోవర్ధన్‌రెడ్డి ద్వారా ప్రజలకు అప్పగించడం జరుగుతుందన్నారు. మస్తాన్‌బాబు గొంతు చించుకుంటే అబద్ధాలు నిజాలైపోవని, ఎవరు తాగుబోతులో చర్చించేందుకు మేము సిద్ధంగా ఉన్నామన్నారు. హరికృష్ణ వద్ద విద్యుత్ ఏఈ లంచం తీసుకోలేదని ప్రమాణం చేయగలడా అని ప్రశ్నించారు. సోమిరెడ్డి జరిగిన ఘటనపై విచారణ చేయించాల్సింది పోయి, టీడీపీ నాయకులతో విలేకరుల సమావేశం పెట్టించడం అవినీతి పరులను వెనుకేసుకు రావడమేనన్నారు. అకారణంగా రైతును కొట్టించడమే కాక తాగుబోతులని చిత్రీకరించేందుకు మస్తాన్‌బాబు ప్రయత్నించడాన్ని ఖండిస్తున్నామన్నారు. బిరదవోలు పంచాయతీలో కమీషన్ల కోసం కక్కుర్తి పడే భాస్కర్ వంటి వ్యక్తుల మాటలకు విలువ ఉండదన్నారు. ఉపాధి పనుల్లో దొంగ సంతకాలు పెట్టించుకుని డబ్బులు సంపాదించే భాస్కర్‌కు నీతి, నిజాయతీలు లేవన్నారు. బిరదవోలు పంచాయతీ బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన ఉమ్మడి స్థలం విషయంలో కూడా టీడీపీ నాయకులు తప్పుడు ప్రచారం సాగిస్తున్నారని తెలిపారు. ఈ సమావేశంలో జెడ్పీటీసీ తెనాలి నిర్మలమ్మ, మాజీ సొసైటీ చైర్మన్ గోగిరెడ్డి గోపాల్‌రెడ్డి, మాజీ ఎంపీపీ కోనం చినబ్రహ్మయ్య, నాయకులు సీహెచ్ రమేష్, దస్తిగిరి, కేతు రామిరెడ్డి, జీ శ్రీనివాసులు, వాకాటి శివప్రసాద్‌రెడ్డి, డీ విజయభాస్కర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
కలలు కల్లలై.. కన్నీళ్లు ధారలై..
● మరణంలోనూ వీడని బంధం ● ఉన్నత విద్యనభ్యసించిన స్నేహితులు ● సినీ రంగంలో రాణించాలని సంకల్పం ● చిన్నచూపు చూసిన విధినెల్లూరు(బృందావనం): ఆ ఇద్దరిది ఒకే ఊరు.. ఒకరు చైన్నెలో, మరొకరు వేలూరులో ఇంజినీరింగ్ విద్యనభ్యసించారు. సాఫ్ట్వేర్ రంగంలో అడుగిడారు. కొంతకాలం ఉద్యోగులుగా ప్రతిభ చాటారు. ఒకరు డ్యాన్స్, నటనలో, మరొకరు ఫొటోగ్రఫీ, దర్శకత్వంపై ఆసక్తి పెంచుకున్నారు. అందులో రాణించారు. సినీ రంగంలో రాణించాలన్న సంకల్పం వారిని స్నేహితులుగా మార్చింది. కానీ విధి ఆడిన వింత నాటకంతో విగతజీవులుగా మారారు. నెల్లూరు వేదాయపాళేనికి చెందిన కత్తి భరత్‌కాంత్ (31), గూడ సాయి త్రిలోక్ (31) హైదరాబాద్ ఔటర్ రింగ్‌రోడ్డుపై ఆదివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన విషయం తెలిసిందే. భరత్‌కాంత్ తల్లిదండ్రులు కత్తి మోహన్‌రావు, విజయలక్ష్మి, సాయిత్రిలోక్ తల్లిదండ్రులు గూడ మాల్యాద్రి, విజయలక్ష్మి వేదన చూసిన బంధుమిత్రుల కళ్లు చెమ్మగిల్లి గుండెలను బరువెక్కించాయి. ఇదీ నేపథ్యం మోహన్‌రావు వేదాయపాళెంలోని శ్రీస్వామి అయ్యప్ప దేవస్థానం పాలకమండలి కార్యదర్శిగా ఉన్నారు. తూపిలిపాళెంలో శ్రీహరిహర హేచరీస్ నిర్వహిస్తున్నారు. సాహితి ప్యారడైజ్‌లో నివాసముంటున్నారు. ఆయనకు ఇద్దరుపిల్లలు ఒక కుమార్తె, కుమారుడు భరత్‌కాంత్. కుమార్తె అమెరికాలో ఉద్యోగిగా ఉన్నారు. మాల్యాద్రి కల్లూరుపల్లి హౌసింగ్ బోర్డులో ఉద్యోగి. కరెంటాఫీస్ సెంటర్లోని రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయం వెనుకవైపున ఐకానిక్ హోమ్స్ మాగ్నోలియాలో నివాసముంటున్నారు. -
శేఖరన్నా.. నోరు అదుపులో పెట్టుకో
● లేకుంటే గుణపాఠం తప్పదు ఉదయగిరి రూరల్: శేఖరన్నా.. నోరు అదుపులో పెట్టుకోకపోతే తగిన గుణపాఠం తప్పదని మాజీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డిపై వైఎస్సార్సీపీ ప్రచార విభాగ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చేజర్ల సుబ్బారెడ్డి ధ్వజమెత్తారు. ఆయన సోమవారం ఉదయగిరిలోని తన నివాసంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. చంద్రశేఖర్‌రెడ్డి నెల్లూరులో మాట్లాడిన తీరుపై నియోజకవర్గ ప్రజలు అసహ్యించుకుంటున్నారన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డిని విమర్శించే స్థాయి ఆయనకు లేదన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో రెండు సార్లు, జగన్మోహన్రెడ్డి హయాంలో రెండుసార్లు టికెట్ పొంది నాలుగుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించిన నీవు వారిని విమర్శించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఎమ్మెల్యేగా పనిచేసిన సమయంలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ, ఎంపీపీ, సర్పంచ్, అభ్యర్థుల వద్ద, అంగన్వాడీ పోస్టు కోసం, విద్యుత్ శాఖలో షిఫ్ట్ ఆపరేటర్ల పోస్టుల కోసం నగదు వసూలు చేసిన చరిత్ర నీదన్నారు. ప్రస్తుతం మీ పరిస్థితి కూరలో కరివేపాకులా తయారైందన్నారు. అవుట్ డేటెడ్ పొలిటీషియన్ అయిన నిన్ను టీడీపీలో ఎవరూ పట్టించుకోవడం లేదన్నారు. అందుకే ఉనికి చాటుకునేందుకు నానా పాట్లు పడుతున్నావన్నారు. ఎంతో గౌరవప్రదమైన మేకపాటి కుటుంబంలో పుట్టి ఇలాంటి దిగజారుడు మాటలు మాట్లాడటం మంచి పద్ధతి కాదన్నారు. నీకు దమ్ముంటే టీడీపీ టికెట్ తెచ్చుకొని ఉదయగిరిలో ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిస్తే తాను రాష్ట్రం వదిలి వెళ్లిపోతానని సవాల్ విసిరారు. సమావేశంలో వైఎస్సార్సీపీ నాయకులు బి.శ్రీనివాసులు యాదవ్, సయ్యద్ గౌస్‌మొహిద్దీన్, సోమిరెడ్డి, ఎంఏ రియాజ్ తదితరులు పాల్గొన్నారు. -
ఎన్సీసీ క్యాడెట్లకు కొనసాగుతున్న శిక్షణ
వెంకటాచలం: మండలంలోని సరస్వతీనగర్ వద్ద ఉన్న అక్షర విద్యాలయంలో ఎన్సీసీ క్యాడెట్లకు రెండో రోజు శిక్షణ ఆదివారం కొనసాగింది. ఇందులో భాగంగా రెండో రోజు ఫైరింగ్, డ్రిల్‌లో శిక్షణ ఇచ్చినట్లు క్యాంపు కమాండెంట్ కల్నల్ డి.కరంచంద్ తెలిపారు. పది రోజుల పాటు శిక్షణ కొనసాగుతుందని తెలియజేశారు. కార్యక్రమంలో డిప్యూటీ క్యాంపు కమాండెంట్ కల్నల్ సూరజ్, ఆర్మీ స్టాఫ్ జాస్పల్ సింగ్, రమేష్ పాండే, వెంకటరమణ, ఎన్సీసీ ఆధికారులు ప్రసాద్, మస్తాన్‌వలీ, పెంచలపులయ్య, దీప్తి, జయరాం, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. బైక్ అదుపుతప్పి వ్యక్తి మృతి ఆత్మకూరు: ద్విచక్ర వాహనం అదుపుతప్పి బ్రిడ్జ్ పిల్లర్‌ను ఢీకొనడంతో వ్యక్తి మృతిచెందిన ఘటన మున్సిపల్ పరిధిలో ఆదివారం సాయంత్రం జరిగింది. ఎస్సై జిలానీ వివరాల మేరకు.. పొదలకూరుకు చెందిన గురునాథం శీనయ్య (36) తన ద్విచక్ర వాహనంపై రెండు రోజుల క్రితం ఆత్మకూరుకు వచ్చాడు. బంధువుల ఇంటిలో ఉండి తిరిగి స్వగ్రామానికి వెళ్తుండగా ఆత్మకూరు మున్సిపల్ పరిధిలోని బొగ్గేరు బ్రిడ్జిపై అదుపుతప్పి బ్రిడ్జి పిల్లర్‌ను ఢీకొంది. ఈ ఘటనలో తలకు తీవ్ర గాయమై శీనయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. ఇతనికి వివాహమై, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. పెద్ద పడుగుపాడులో కార్డెన్ సెర్చ్ ● 29 బైక్‌లు, 2 ఆటోల సీజ్ కోవూరు: మండలంలోని పెద్ద పడుగుపాడు పంచాయతీ ఎన్టీఆర్ మిక్స్డ్ కాలనీలో పోలీసులు ఆదివారం కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. కోవూరు సీఐ సుధాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో సిబ్బంది ఇంటింటికీ వెళ్లి తనిఖీలు చేపట్టారు. సరైన పత్రాల్లేని 29 బైక్‌లు, 2 ఆటోలను స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. కాలనీలో అనుమానిత వ్యక్తుల సంచారం ఉందా అని ఆరాతీశారు. అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నట్లు అనుమానం ఉంటే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. కార్యక్రమంలో కోవూరు ఇందుకూరుపేట ఎస్సైలు ముత్యాలరావు, నవీన్‌కుమార్, సిబ్బంది పాల్గొన్నారు. -
వ్యాసరచన పోటీల విజేతలకు బహుమతులు
నెల్లూరు(బృందావనం): అంతర్జాతీయ మాతృ దినోత్సవం సందర్భంగా సీఎంఆర్, చందన బ్రదర్స్ అధినేత మావూరి శ్రీనివాసరావు సూచనల మేరకు షాపింగ్‌మాల్‌లో శనివారం ‘మదర్స్ లవ్.. మై ఎక్స్పీరియన్స్’ అనే అంశంపై జూనియర్, సీనియర్ విభాగాల్లో వ్యాస రచన పోటీలు నిర్వహించారు. రెండు విభాగాల్లో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచిన చిన్నారులతో ఆదివారం వారి మాతృమూర్తులకు బహుమతులు ఇప్పించారు. ఈ పోటీల్లో 110 మందికి పైగా విద్యార్థులు పాల్గొనగా వారందరికీ సర్టిఫికెట్లు అందజేశారు. ముఖ్యఅతిథులుగా విచ్చేసిన డాక్టర్ సువర్చల, అడ్వొకేట్ నర్మద మాట్లాడుతూ వ్యాసరచన పోటీలు తమ బాల్యాన్ని గుర్తు చేశాయన్నారు. కార్యక్రమంలో సీఎంఆర్ షాపింగ్‌మాల్, చందన బ్రదర్స్ డైరెక్టర్ సంతోష్రామ్మోహన్, జనరల్ మేనేజర్ వాసు, స్టోర్ మేనేజర్ కిశోర్ తదితరులు పాల్గొన్నారు. నిమ్మ ధరలు(కిలో) పెద్దవి: రూ. 120 సన్నవి: రూ. 32 పండ్లు: రూ. 20 -
పచ్చని పల్లెలు.. కాలుష్య కాసారాలు
ముత్తుకూరు (పొదలకూరు): ముత్తుకూరు మండలంలోని పల్లె ప్రాంతాలు ప్రశాంత వాతావరణానికి ప్రతీకలుగా నిలవాల్సిన వేళ పారిశ్రామిక అభివృద్ధి పేరుతో కాలుష్య కోరల్లో చిక్కుకొని విలవిలల్లాడుతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గ్రామాభివృద్ధి కోసం మంజూరు చేసే నిధులను సక్రమంగా వినియోగిస్తూ పల్లె ప్రగతికి బాటలు వేయాల్సిన అవసరం ఉన్నప్పటికీ మండలంలో పరిస్థితి భిన్నంగా మారింది. పారిశ్రామిక కేంద్రంగా ఎదుగుతూ, కృష్ణపట్నం పోర్టు, థర్మల్ విద్యుత్ కేంద్రాలు, పెట్రోలియం సంస్థలు, సిమెంట్ కర్మాగారాలు, పామాయిల్ ఫ్యాక్టరీలు వంటి పరిశ్రమలు ఏర్పడ్డాయి. అయితే ఈ అభివృద్ధి గ్రామస్తుల జీవన విధానాన్ని దెబ్బతీస్తున్నట్టు ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాగు క్షీణత.. ఉపాధి కోల్పోయిన కూలీలు ప్రాజెక్టుల నిర్మాణానికి ముందు పచ్చని వాతావరణంలో ఉన్న కృష్ణపట్నం, ముత్తుకూరు, పంటపాళెం, నేలటూరు, పైనాపురం గ్రామాలు నేడు పూర్తిగా మారిపోయాయి. వేల ఎకరాల భూములు పరిశ్రమల కోసం రైతులు త్యాగాలు చేసినప్పటికీ అప్పట్లో ఇచ్చిన నష్టపరిహారం తక్కువగా ఉంది. ప్రస్తుతం ఆ భూముల విలువలు రూ.కోట్లు పలుకుతున్నాయి. ఈ గ్రామాల ప్రజలు ప్రధానంగా వ్యవసాయంపై ఆధారపడి జీవనం సాగించేవారు. పరిశ్రమల ప్రభావంతో వ్యవసాయం క్షీణ దశకు చేరుకుంది. ఫలితంగా వ్యవసాయ కూలీలకు పనులు లేకుండాపోయాయంటున్నారు. ప్రభుత్వం చొరవ చూపాలి పారిశ్రామిక అభివృద్ధి ఆహ్వానించదగ్గ విషయమైనా పర్యావరణ సమతుల్యతను పాటించాల్సిన బాధ్యత పరిశ్రమలపై ఉంది. ముఖ్యంగా ప్రజల సంక్షేమం కోసం పరిశ్రమలు కాలుష్యాన్ని నియంత్రించాలి. ఇందుకోసం పొల్యూషన్ బోర్డు సమర్థవంతంగా పనిచేసి కాలుష్య కోరల నుంచి ప్రజలను కాపాడాల్సిన అవసరం ఉంది. ఇందుకోసం ప్రభుత్వం పూర్తి బాధ్యత తీసుకుని చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలని ఆయా గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు. కాలుష్య నియంత్రణ చర్యలు చేపట్టి, గ్రామాల్లో మెడికల్ క్యాంపులు నిర్వహించి కృష్ణపట్నం, ముత్తుకూరు, నేలటూరు, పంటపాళెం, పైనాపురం గ్రామాలను కాపాడాలని వేడుకుంటున్నారు.గ్రామాల మీదుగా బొగ్గును తరలిస్తున్న లారీలు కృష్ణపట్నం గ్రామ వ్యూ బొగ్గు, పరిశ్రమల దుమ్ముతో గాలి, నీరు కలుషితం ప్రజల్లో పెరుగుతున్న ఆరోగ్య సమస్యలు పట్టించుకోని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పేరుకేమో పారిశ్రామికవాడ.. ప్రజలకేమో రోగాలు అన్న చందంగా మారింది ముత్తుకూరు మండల పరిస్థితి. ఒకప్పుడు ఇక్కడి గ్రామాల్లో పచ్చని పైర్లు, స్వచ్ఛమైన సాగునీరు, పక్షుల కిలకిల రావాలతో పరవశించే వాతావరణం ఉండేది. అయితే ప్రస్తుతం ఎక్కడ చూసినా కాలుష్యం కోరలు చాచుతూ గ్రామస్తులు జబ్బుల బారిన పడుతున్నారు. -
మండే ఎండలు.. చెంతనే ప్రమాదాలు
నెల్లూరు(క్రైమ్): భానుడి భగభగలు రోజురోజుకు పెరుగుతున్నాయి. సూర్యుడి ధాటికి ప్రజలు అల్లాడుతున్నారు. పెరుగుతున్న ఉష్ణోగ్రత్తలతో అగ్నిప్రమాదాలు పొంచి ఉన్నాయి. అప్రమత్తంగా లేకపోతే ఆస్తి నష్టంతో పాటు ప్రాణనష్టం జరిగే అవకాశం ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అగ్నిమాపకశాఖ అధికారులు పలు సూచనలు చేస్తున్నారు. నివాసాల్లో.. గ్యాస్ స్టౌను నేలమట్టానికి వీలైనంత ఎత్తులో ఉంచుకోవాలి. అగ్గిపుల్ల లేదా లైటర్‌ను వెలగించిన తర్వాత మాత్రమే గ్యాస్ బర్నల్ నాబ్‌ను తిప్పాలి. వంట పూర్తయ్యాక సిలిండర్ వాల్వ్‌ను, బర్నల్ వాల్‌ను ఆపివేయాలి. గ్యాస్ లీకై తే వెంటనే రెగ్యులేటర్లు ఆపివేయాలి. ఎలక్ట్రికల్ స్విచ్‌లు ఆన్ చేయరాదు. దేవుని దీపాలు, అగర్బత్తీలు ఆర్పివేయాలి. గాలి, వెలుతురు కోసం అన్ని కిటికీలు, తలుపులను తెరవాలి. గ్రామీణ ప్రాంతాల్లో.. గ్రామాల్లో గుడిసెల మధ్య కనీస దూరం ఉండాలి. బహిరంగ మంటలను అనుమతించరాదు. దీని వల్ల నిప్పురవ్వలు ఎగిరి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. విద్యుత్ తీగలకు దగ్గరలో గడ్డివాములు ఏర్పాటు చేయరాదు. విద్యుత్ పరికరాలతో జాగ్రత్త నాణ్యత కలిగిన విద్యుత్ వైర్లు, పరికరాలు మాత్రమే ఇళ్లు, దుకాణాల్లో వాడాలి. పాతవి, కాలం చెల్లిన వైర్లను ఎప్పటికప్పుడు మార్చుకుని ఫ్యూజులు, కెపాసిటర్లు ఏర్పాటు చేసుకోవాలి. ఒక సాకెట్‌కు ఒక్క విద్యుత్ పరికరం మాత్రమే ఏర్పాటు చేసుకోవాలి. లాప్‌ట్యాప్, సెల్‌ఫోను చార్జింగ్‌లను బెడ్ దగ్గర పెట్టుకోరాదు. ప్రమాదం జరిగిన వెంటనే విద్యుత్ సరఫరా నిలిపివేసే ఆధునిక ఆపరేటింగ్ పరికరాలను ఏర్పాటు చేసుకోవాలి. వాహన ప్రయాణంలో.. కారులో లేదా ఇతర వాహనాల్లో సుదూర ప్రాంతాలకు ప్రయాణించే సమయంలో వాహనంపై అధిక ఉష్ణోగ్రత్తల ప్రభావం చూపే అవకాశం ఉంది. పెట్రోల్, డీజిల్ ట్యాంకును పూర్తిగా నింపడం ప్రమాదకరం. అధిక వేడి ప్రభావంతో ట్యాంకులో గ్యాస్ వ్యాకోచం చెంది ట్యాంక్ పేలిపోయే అవకాశం ఉంది. టైర్లలో గాలి ఎప్పటికప్పుడు పరిశీలించుకోవడం మంచిది. గంటల తరబడి ప్రయాణించినప్పుడు ఇంజిన్ వేడెక్కడం, వాహనంలోని వైరింగ్ కాలిపోవడం వల్ల అకస్మాత్తుగా మంటలు వ్యాపిస్తాయి. బ్యాటరీ, ఫ్యూజ్, విద్యుత్ వైర్లు నాణ్యమైనవి వాడాలి. వాహనంలో వైరింగ్‌ను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉండాలి. మంటలు చుట్టుముడితే.. దుస్తులకు నిప్పంటుకుంటే పరిగెత్తకూడదు. నేలపై దొర్లడం లేదా దుప్పటి చుట్టుకోవడం మంచిది. కాలిన శరీరభాగంపై చల్లని నీరు పోయాలి. విద్యుదాఘాతం వల్ల జరిగే ప్రమాదాల్లో మంటలు ఆర్పేందుకు నీటిని ఉపయోగించరాదు. పొగతో నిండిన గదుల్లో మోచేతులు, మోకాళ్లతో నేలపై పాకుతూ బయటపడాలి. ముక్కు, నోటికి అడ్డంగా తడిగుడ్డ ఉంచాలి. లిఫ్ట్, ఎక్స్లేటర్స్ను ఉపయోగించకపోవడం ఉత్తమం. అత్యవసర వేళల్లో డయల్ 101 నంబర్‌కు ఫోన్ చేసి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వాలి.కేంద్రం కార్యాలయ నంబర్ అధికారి నంబర్ నెల్లూరు 0861–2331051 99637 34284 కావలి 08626–243101 99637 34286 వింజమూరు 08629–249101 99637 35446 ఉదయగిరి 08620–229251 99637 35314 మర్రిపాడు 08620–210111 99637 44817 ఆత్మకూరు 08627–221222 99637 34394 పొదలకూరు 08621–225202 99637 34828 రాపూరు 08621–226145 99637 35094 గూడూరు 08624–251899 99637 34305 అప్రమత్తంగా ఉండాలంటున్న అగ్నిమాపక అధికారులు -
ముగిసిన బీచ్ కబడ్డీ పోటీలు
సంగం: మండలంలోని దువ్వూరులో నిర్వహిస్తున్న 13వ అంతర్ జిల్లాల బీచ్ కబడ్డీ పోటీలు ఆదివారం ఉత్కంఠభరితంగా ముగిశాయి. మహిళా విభాగంలో శ్రీకాకుళం జట్టుపై విజయనగరం విజేతగా నిలిచింది. మూడు, నాలుగు స్థానాల్లో నెల్లూరు, బాపట్ల జట్లు నిలిచాయి. పురుషుల విభాగంలో బాపట్ల జట్టు నెల్లూరుపై విజయం సాధించింది. మూడు, నాలుగు స్థానాల్లో పల్నాడు, కృష్ణా జట్లు నిలిచాయి. విజేతలకు రాష్ట్ర మంత్రి ఆనం రామనారాయణరెడ్డి బహుమతులు అందజేశారు. భారీ సంఖ్యలో అభిమానులు, స్థానిక ప్రజలు తరలివచ్చి పోటీలను తిలకించారు. -
పంచాయతీ స్థలాలకు ఎసరు
పొదలకూరు: పొదలకూరు పరిసర ప్రాంతాల్లో వేసిన లేఅవుట్లలో ప్రజాప్రయోజనాల కోసం పంచాయతీలకు కేటాయించిన స్థలాలకు కొందరు ఎసరు పెడుతున్నారు. అక్రమ లేఅవుట్లు వేసిన వారు ఇటీవల ఆ స్థలాలను సైతం అమ్మకాలకు పెట్టారు. రూ.కోట్ల విలువైన స్థలాలను ఆయా పంచాయతీలు స్వాధీనం చేసుకోలేకపోతున్నాయి. లేఅవుట్లు అప్రూవల్ కాకపోవడంతో చేతులెత్తేస్తున్న పరిస్థితి ఉంది. అక్రమాలపై చర్యలు తీసుకోవాల్సిన అధికార యంత్రాంగం మిన్నకుంటున్నట్టు విమర్శలున్నాయి. అంతే కాకుండా అక్రమ లేఅవుట్లలో ప్లాట్లు కొనుగోలు చేసిన వారు ఇళ్లు నిర్మించుకోవాలని పంచాయతీ అప్రూవల్‌కు వెళ్తే చేదు అనుభవం ఎదురవుతోంది. వ్యక్తిగతంగానైనా ప్లాట్‌ను పంచాయతీ ఆమోదం తీసుకోవాలని అధికారులు వెల్లడిస్తున్నారు. పట్టించుకోకపోవడంతో.. పొదలకూరు పంచాయతీ పరిసర ప్రాంతాల్లో 57 లేఅవుట్లున్నాయి. అవి నుడా పరిధిలోకి రాకముందు అంటే పదేళ్ల క్రితం పంచాయతీలకు అక్షరాల రూ.8.64 కోట్ల ఆదాయం రావాల్సి ఉంది. అయితే సంబంధిత శాఖ అధికారులు నాడు పట్టించుకోలేదు. పట్టణ పరిసర ప్రాంతాల్లో 2006 నుంచి 2010 వరకు జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన వారు వచ్చి రూ.కోట్లు వెచ్చించి పొలాలు కొనుగోలు చేసి లేఅవుట్లు వేశారు. ప్రస్తుతం పొదలకూరు పంచాయతీలో 10 లేఅవుట్లకు ఆమోదం లేకపోవడంతో వాటిలో పంచాయతీకి కేటాయించిన స్థలాలను సైతం అమ్ముకున్నట్టు తెలుస్తోంది. ఇష్టారాజ్యంగా.. అప్రూవల్ లేని లేఅవుట్లలో ఇష్టానుసారం అమ్మకాలు సాగించారు. తర్వాత నుడా పరిధిలోకి పొదలకూరు రావడంతో ఆ నిబంధనల ప్రకారం లేఅవుట్లను నిర్మించాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో ఇప్పటికీ ఆమోదం పొందని వాటిల్లో కొందరు అమ్మకాలు సాగిస్తున్నారు. నిబంధనల ప్రకారం లేఅవుట్ వేసేవారు 10 శాతం స్థలాన్ని బడి, గుడి, ఇతర ప్రజాప్రయోజనాల కోసం పంచాయతీ లేదా నుడాకు అప్పగించాలి. ఆ మేరకు రిజిస్ట్రేషన్ చేయించాలి. గతంలో వేసిన అక్రమ లేఅవుట్లలో కొందరు పంచాయతీలకు 10 శాతం స్థలాన్ని వదిలారు. కొంతకాలం వేచి ఉండి గుట్టుచప్పుడు కాకుండా వాటిని కూడా అమ్ముకున్నారు. వివాదాలు ఇటీవల సత్యనారాయణ లేఅవుట్లో ఉన్న ప్రజాప్రయోజన స్థలంపై పెద్ద ఎత్తున వివాదాలు ఏర్పడిన విషయం తెలిసిందే. ఈ స్థలంపై పంచాయతీ, ప్రైవేట్ వ్యక్తులు కోర్టును ఆశ్రయించడంతో న్యాయస్థానం తీర్పు వెలువడాల్సి ఉంది. అయితే గతనెలలో స్థలాన్ని ప్లాట్లుగా మార్పుచేసి రిజిస్ట్రేషన్ చేయడంతో పంచాయతీ సెక్రటరీ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో ఎస్సై కేసు నమోదు చేశారు. ఇలాంటి వివాదాలున్న స్థలాలు ఇంకా పంచాయతీలో ఉన్నాయి. అధికారులు చొరవ తీసుకుని ప్రజాప్రయోజన స్థలాలను కాపాడాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం లేఅవుట్లలో అటువంటి స్థలాలు రూ.కోట్లు విలువైనవిగా స్థానికులు వెల్లడిస్తున్నారు. ఇదిలా ఉండగా వివాదాస్పదంగా మారిన సత్యనారాయణ లేఅవుట్లోని ప్రజాప్రయోజన స్థలాన్ని ఇటీవల ఆడిట్ జిల్లా రిజిస్ట్రార్ దీపిక పరిశీలించారు. నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోకున్నారు. అప్రూవల్ కాని లేఅవుట్లలో భూముల అమ్మకాలు పదేళ్ల క్రితమే రూ.8.64 కోట్ల శఠగోపం పరిసర ప్రాంతాల్లో అక్రమ లేఅవుట్లు కొత్తవాటికి మాత్రం నుడా అనుమతులు నిద్రావస్థలో అధికార యంత్రాగం పొదలకూరులో ఇదీ పరిస్థితి చర్యలు తీసుకుంటాం పొదలకూరు పంచాయతీలో పాత లేఅవుట్లు 10 వరకు ఉన్నాయి. వాటిలో పంచాయతీలకు కేటాయించిన స్థలాలపై చర్యలు తీసుకుంటాం. నుడా పరిధిలో కొత్త లేఅవుట్లు నాలుగు ఉన్నాయి. అవకతవకలకు పాల్పడినట్టు మా దృష్టికి వస్తే వెంటనే స్పందిస్తున్నాం. – యశ్వంత్‌సింగ్, పంచాయతీ సెక్రటరీ, పొదలకూరు -
ఈవీ.. మొత్తేశాయా!
నెల్లూరు (బారకాసు): నగర ప్రజల నుంచి వివిధ పన్ను రూపంలో వసూలు చేస్తున్న సొమ్ముతో నగరాభివృద్ధితోపాటు ప్రజలకు మౌలిక వసతులు కల్పించాల్సి ఉంది. అయితే అందుకు విరుద్ధంగా నగర పాలక సంస్థ అధికారులు వ్యవహరిస్తున్న తీరు విమర్శల పాలవుతోంది. ఇటీవల కాలంలో నగర ప్రజల నుంచి పన్నుల పేరుతో రూ.వంద కోట్లకు పైగా కోర్టు నోటీసులు అంటూ భయపెట్టి ముక్కు పిండి మరీ వసూలు చేశారు. ఈ నిధులను పలు అభివృద్ధి పనుల పేరుతో టీడీపీకి చెందిన నాయకులకు కట్టబెడుతున్నారు. మరో వైపు తమ లగ్జరీ జీవనానికి సైతం ఖర్చు చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈవీ కార్లు వద్దు.. ప్రైవేట్ కార్లే ముద్దు నగర పాలక సంస్థలో వివిధ హోదాల్లోని అధికారులు నగర పరిధిలో క్షేత్ర స్థాయిలో తనిఖీలకు, పర్యవేణకు వెళ్లేందుకు గతంలో ప్రైవేట్ కార్లను అద్దెకు పెట్టుకుని వినియోగిస్తున్నారు. దీంతో కార్ల అద్దె భారం కార్పొరేషన్‌పై పడడంతో 9 ఏళ్ల క్రితం అప్పటి కమిషనర్ మూర్తి ఓ మంచి ఆలోచన చేశారు. ప్రైవేట్ కార్ల కంటే ఎలక్ట్రిక్ కార్లను అద్దెకు చెల్లించే మొత్తాన్ని ఈఎంఐ పద్ధతిలో కొనడం ద్వారా సొంత కార్లు మిగిలిపోతాయని భావించారు. తద్వారా కార్పొరేషన్‌పై ఆర్థిక భారం తగ్గుతుందని ఆలోచన చేసి ఈఎల్ఎస్ ఏజెన్సీకు బాధ్యత అప్పగించారు. ఒక్కసారి చార్జింగ్ చేస్తే 100 కి.మీ. దూరం తిరిగే సామర్థ్యం ఉన్న ఈవీ కార్లను అప్పట్లో కార్పొరేషన్ అధికారులు కొనుగోలు చేశారు. అప్పట్లో ఒక్కొక్క కారుకు నెలకు రూ.20 వేలు చెల్లించేలా 15 కార్లను కొనుగోలు చేసి సదరు ఏజెన్సీ ఎన్ఎంసీకి అందజేసింది. ఎన్ఎంసీ ప్రాంగణంలో చార్జింగ్ చేసే సదుపాయాన్ని కూడా ఏర్పాటు చేశారు. అయితే ఆ ఎలక్ట్రిక్ కార్లు మరమ్మతులకు గురవుతున్నాయంటూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వాటిని పక్కన పడేశారు. చిన్న మొత్తంలో ఖర్చు చేయడం ద్వారా తిరిగి వినియోగించే అవకాశం ఉన్నప్పటికీ సంబంధిత అధికారులు సొంత పనులకు తిరగాలంటే కి.మీ. దూరం పెరుగుతుందని, ఈవీ కార్లు అంత దూరం నడిచే అవకాశం లేదని వాటిని క్రమక్రమంగా పక్కన పడేశారు. నెలకు రూ.4 లక్షలు అద్దె చెల్లింపు ఎలక్ట్రిక్ కార్లను మూలన పడేసిన అధికారులు ప్రత్యామ్నాయంగా ఎవరికి వారు సొంతంగా ప్రైవేట్ కార్లను ఏర్పాటు చేసుకుని దర్జాగా ప్రజాధనాన్ని దుర్వినియో గం చేస్తున్నారు. ఇందులో మేయర్, ఇంజినీరింగ్ విభాగం ఎస్ఈకి పెద్ద కార్లు ఒక్కొక్కదానికి నెలకు రూ.60 వేలు, మిగతా అధికారులకు 8 చిన్న కార్లకు నెలకు రూ.35 వేల లెక్కన అద్దె చెల్లిస్తున్నారు. ఈ లెక్కన నెలకు రూ.4 లక్షలు ఈ రకంగా ఖర్చు పెడుతున్నారు. గతంలో కొనుగోలు చేసిన ఈవీ (ఎలక్ట్రిక్) కార్లను మూలన పడేశారు. ప్రజల నుంచి పన్నుల రూపంలో ముక్కుపిండి వసూలు చేస్తున్న ప్రజాధనా న్ని కార్పొరేషన్ అధికారులు దర్జాగా ప్రైవేట్ కార్లకు అద్దెలు చెల్లిస్తూ దుర్వినియోగం చేస్తున్నారని నగర ప్రజలు దుమ్మెత్తి పోస్తున్నారు. రెండేళ్లు ఈవీ కార్లను మూలన పడేయడంతో అందులోని వస్తువులన్నీ తుప్పుపట్టిపోతున్నాయి. ఇదిలా ఉంటే.. ప్రైవేట్ కార్లకు ఎన్ఎంసీలో డ్రైవర్లుగా పనిచేస్తున్న వారిని వినియోగిస్తుండడం కొసమెరుపు. ప్రైవేట్ కార్ల డ్రైవర్లకు ఇచ్చే మొత్తాన్ని కూడా సంబంధిత అధికారులు జేబు ల్లోకి వెళ్తున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మూలన పడేసిన ఎలక్ట్రిక్ కార్లు ప్రైవేట్ వాహనాల్లో ఎన్ఎంసీ అధికారుల దర్జా నెలకు రూ.4 లక్షల ప్రజాధనం వృథా ప్రైవేట్ కార్లకు కార్పొరేషన్ డ్రైవర్ల వినియోగం నగర పాలక సంస్థలో అదనపు ఖర్చులు తగ్గించుకుని ప్రజాధనాన్ని సద్వినియోగం చేయాలనే ఆశయంతో అప్పటి కార్పొరేషన్ కమిషనర్ ఎలక్ట్రిక్ (ఈవీ) కార్లను ఈఎంఐ పద్ధతిలో కొని వినియోగంలోకి తెచ్చారు. ప్రైవేట్ వాహనాలకు చెల్లించే అద్దెతో కార్పొరేషన్‌కు సొంతంగా వాహనాలు సమకూరుతాయని భావిస్తే.. నేటి అధికారులు ఆ గొప్ప సంకల్పానికి తిలోదకాలిచ్చారు. కార్పొరేషన్‌కు వాహనాలు సమకూరినా.. చిన్నపాటి మరమ్మతులు వస్తే పక్కన పడేసి ప్రైవేట్ కార్లకు అద్దెలు చెల్లిస్తూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. -
పురుషా మృగ వాహనంపై కామాక్షితాయి చిద్విలాసం
బుచ్చిరెడ్డిపాళెం: మండలంలోని జొన్నవాడలో కొలువైన మల్లికార్జున సమేత కామాక్షితాయి అమ్మవారి బ్రహ్మోత్సవాలు వైభోవపేతంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆదివారం కామాక్షితాయి పురుషామృగ వాహనంపై కొలువుదీరి విశేష పుష్పాలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. దేవదేవేరులను దర్శించేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి, తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ చైర్మన్ అశోక్‌రెడ్డి, ఆలయ సహాయ కమిషనర్ వెంకట శ్రీనివాసులురెడ్డి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా సీఐ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో ఆలయ పాలకమండలి సభ్యులు నక్కల శివకృష్ణ, వరలక్ష్మి, చాముండేశ్వరి, ప్రత్యూష, శ్రీనివాసులు, సుధారాణి తదితరులు పాల్గొన్నారు. 15న ఉద్యోగులు, ఎస్సీ, ఎస్టీలకు ప్రత్యేక గ్రీవెన్స్‌డే ● కలెక్టర్ హిమాన్షు శుక్లా నెల్లూరురూరల్: ఈ నెల 15న ఉద్యోగులు, ఎస్సీ, ఎస్టీలకు సంఘాలకు సంబంధించి ప్రత్యేక గ్రీవెన్న్స్డే నిర్వహించనున్నట్లు కలెక్టర్ హిమాన్షు శుక్లా ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. 15వ తేదీ ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ఉద్యోగులకు సంబంధించి గ్రీవెన్స్ స్వీకరించనున్నట్లు, 12.30 గంటల నుంచి ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు, సంఘాలకు ప్రత్యేక గ్రీవెన్స్ డే నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఐటీడీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్, జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారులు ముందస్తుగా ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు, సంఘాలకు సమాచారం అందించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. కాకాణితోపాటు పలువురిపై కేసు నమోదు పొదలకూరు: మండలంలోని నావూరుపల్లి గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ నాయకుడు, రైతు గాలం హరికృష్ణను అకారణంగా పొదలకూరు ఎస్సై హనీఫ్ స్టేషన్లో పెట్టి కొట్టడం, ఆ దృశ్యాలను టీడీపీ నేతలకు వీడియో కాల్ చేసి చూపించిన దాష్టీకంపై మాజీమంత్రి, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి ఆధ్వర్యంలో శనివారం పోలీస్‌స్టేషన్ ఎదుట ధర్నా చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు అదే రోజు రాత్రి కాకాణితో పాటు అంజాద్, బచ్చల సురేష్‌కుమార్‌రెడ్డి, వెంకటశేషయ్య, రమేష్, హరి మరికొందరిపై కేసు నమోదు చేశారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించడంతోపాటు, ప్రజలకు ఇబ్బందులు కలిగించారని స్టేషన్ కానిస్టేబుల్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని పోలీసులు పేర్కొన్నారు. 33 టన్నుల రేషన్ బియ్యం పట్టివేత నెల్లూరు (పొగతోట): అక్రమంగా తరలిస్తున్న 33 టన్నుల రేషన్ బియ్యాన్ని పౌరసరఫరాల శాఖ అధికారులు ఆదివారం రాత్రి పట్టుకున్నారు. జేసీ మొగిలి వెంకటేశ్వర్లు ఆదేశాల ప్రకారం ఆదివారం పౌరసరఫరాల శాఖ అఽధికారులు వెంకటాచలం టోల్‌ప్లాజా వద్ద తనిఖీలు నిర్వహించారు. లారీలో అక్రమంగా తరలిస్తున్న 33 టన్నుల పీడీఎస్ రైస్‌ను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ 10 లక్షలు ఉంటుందని అధికారుల అంచనా. బియ్యం తరలిస్తున్న లారీని సీజ్ చేశారు. అక్రమ రవాణాదారులపై కేసులు నమోదు చేశారు. ఈ తనఖీల్లో ఏఎస్ఓ లక్ష్మీనారాయణరెడ్డి, సీఎస్‌డీటీ సైమన్‌బాబు, ఎఫ్ఐ వెంకటేశ్వర్లు, జూనియర్ అసిస్టెంట్ సురేష్ పాల్గొన్నారు. -
జగనన్న పుణ్యమే పేదలకు పక్కా ఇళ్లు
ముత్తుకూరు (పొదలకూరు) : వైఎస్ జగన్మోహన్రెడ్డి పుణ్యానే పేదలు పక్కా ఇళ్లు నిర్మించుకోగలిగారని, ప్రభుత్వ లేఅవుట్లు ఏర్పాటు చేసి ఊర్లే నిర్మించిందని మాజీమంత్రి, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి అన్నారు. మండలంలోని బ్రహ్మదేవంలో జగనన్న కాలనీని ఆదివారం కాకాణి సందర్శించారు. ఆయన కాలనీలో లబ్ధిదారులకు కేటాయించిన ఇళ్లను క్షేత్రస్థాయిలో పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కాలనీలో మౌలిక సదుపాయాలు కల్పించాల్సి ఉందని లబ్ధిదారులు తెలిపారు. మళ్లీ తమ ప్రభుత్వం వచ్చి ఉంటే అన్ని సదుపాయలను కల్పించే వారమని కాకాణి వెల్లడించారు. మహిళలు తమకు రూ.లక్షలు విలువ చేసే ప్లాట్లు ఇచ్చి ఇళ్లను నిర్మించి అందజేసిన జగన్మోహన్రెడ్డిపై కృతజ్ఞతాభావంతో ఆయన చిత్రపటానికి పాలాభిషే కం చేసి అభిమానం చాటుకున్నారు. ఈ సందర్భంగా కాకాణి మాట్లాడుతూ బ్రహ్మదేవం సచివాలయం వద్ద గిరిజనులకు లేఅవుట్ వేసి ప్లాట్లు పంపిణీ చేస్తే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే లాగేసుకుని వ్యవసాయం చేసుకుంటున్నట్టు తెలిపారు. గిరిజనుల ఇళ్లు అర్ధాంతరంగా నిలిపివేశారని గ్రామ నాయకుడు మస్తాన్ ఇల్లు నిర్మించేందుకు వీల్లేదని టీడీపీ నాయకులు హుకుం జారీ చేశారన్నారు. పేదవాడి సొంతింటి కలను జగన్మోహన్రెడ్డి నెరవేర్చితే.. సోమిరెడ్డి ఆదేశాలతో సర్వేపల్లి నియోజకవర్గంలో ఇళ్ల నిర్మాణాలను ఆపేశారని ఆరోపించారు. బ్రహ్మదేవంలో ఇళ్ల పట్టాల సమస్య 24 ఏళ్లుగా నోచుకోలేదని 2002లో అప్పటి ఎంపీపీ మెట్టా చంద్రశేఖర్‌రెడ్డి ఇళ్ల పట్టాలు అందజేయాలని ప్రయత్నిస్తే సోమిరెడ్డి అడ్డుకున్నాడన్నారు. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చినా సోమిరెడ్డి మంత్రిగా ఉన్నప్పటికీ ఈ గ్రామంలో పేదల పట్టాలపై శ్రద్ధ చూపలేదన్నారు. 4.57 ఎకరాల్లో నుడా తరహాలో అధునాతనంగా 137 ప్లాట్లతో లేఅవుట్ వేసి పేదలకు పట్టాలను పంపిణీ చేశామన్నారు. లేఅవుట్లో ఎస్టీలకు ప్లాట్లు కేటాయించి సీఎస్ఆర్ నిధులు రూ.15 వేలు అదనంగా వారికి అందజేశామన్నారు. లేఅవుట్లో 74 ఇళ్ల నిర్మాణం ప్రారంభించగా 54 ఇళ్లలో పేదలు నిర్మాణాలను పూర్తి చేసుకుని నివసిస్తున్నారని 20 ఇళ్లు పూర్తి కావాల్సి ఉందన్నారు. రూ.13 లక్షల నుంచి రూ.15 లక్షల విలువైన ఆస్తిని పేదలకు పట్టాల రూపంలో అందజేసిన ఘనత జగన్మోహన్రెడ్డికే దక్కుతుందన్నారు. టెన్త్ ఫలితాల్లో 587 మార్కులు సాధించిన గ్రామానికి చెందిన కాళంగి లక్ష్మీశ్రావ్యను కాకాణి అభినందించి మెమోంటోను అందజేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల కన్వీనర్ మెట్టా విష్ణువర్ధన్‌రెడ్డి, ఎంపీపీ సుగుణమ్మ, అన్నాబత్తిన కృష్ణవేణి, జెడ్పీటీసీ వెంకటసుబ్బయ్య, నాయకులు రామ్మోహన్‌రెడ్డి, జమీల్, బషీర్, అగ్ని మస్తాన్, సుబ్రహ్మణ్యం, జనార్దన్‌రెడ్డి, చెంగారెడ్డి, కోదండరామిరెడ్డి పాల్గొన్నారు. మళ్లీ ప్రభుత్వం వచ్చి ఉంటే మౌలిక సదుపాయాలు జరిగేవి మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి వైఎస్ జగన్ చిత్రపటానికి మహిళల పాలాభిషేకం -
రూ. లక్షల్లో జీతాలు.. అయినా లంచాలు
నెల్లూరు (వీఆర్సీ సెంటర్): జిల్లాలో ఏపీఎస్పీడీసీఎల్ ఉద్యోగులు, అధికారులు అవినీతిలో మునిగి తేలుతున్నారు. రూ.లక్షల్లో జీతాలు తీసుకుంటూ ప్రతి పనికీ ఒక్కో రేటు నిర్ణయిస్తూ లంచాలు డిమాండ్ చేస్తూ ప్రజలు, రైతుల రక్తాన్ని జలగల్లా పీల్చేస్తున్నారు. ఇటీవల జిల్లాలోని మనుబోలు మండలం కట్టువపల్లి విద్యుత్ సబ్‌స్టేషన్‌లో పనిచేస్తున్న లైన్మెన్ రమేష్ వ్యవసాయ విద్యుత్ సర్వీసు పేరు మార్చేందుకు ఓ రైతు వద్ద నుంచి రూ. లక్ష లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడిన ఘటన మరిచిపోక ముందే శుక్రవారం పొదలకూరు మండలం నావూరుపల్లి గ్రామానికి చెందిన రైతుకు వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ ఇచ్చేందుకు స్థానిక విద్యుత్‌శాఖ ఇన్చార్జి అసిస్టెంట్ ఇంజినీర్ (ఏఈ) శ్రీనివాసరావు రూ.40 వేలు లంచం తీసుకుని కూడా విద్యుత్ సర్వీసు ఇవ్వకపోవడం, నిలదీసిన రైతును పోలీస్‌స్టేషన్‌లో కొట్టించడం జిల్లాలో సంచలనంగా మారింది. లంచం తీసుకుని కూడా.. టీడీపీ నేతలు చెప్పారని.. పొదలకూరు మండలం నావూరుపల్లికి చెందిన పెంచలమ్మ, మహేష్ అనే రైతులు నాలుగున్నర ఎకరాల్లో నిమ్మ పంట సాగు చేసుకుంటున్నారు. పంటకు నీరందించేందుకు వ్యవసాయ విద్యుత్ సర్వీసు కోసం వీరు దరఖాస్తు చేసుకున్నారు. ఐదుగురు రైతులకు కలిపి ఒక ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేస్తారు. వీరి పరిధిలో ఉన్న ట్రాన్స్ఫార్మర్ కింద ఇద్దరు రైతులు మాత్రమే ఉండడంతో కొత్త సర్వీస్ కోసం పెంచలమ్మ, మహేష్ దరఖాస్తు చేశారు. ఈ మేరకు సర్వీస్ చార్జీలకు సంబంధించి డిమాండ్ డ్రాఫ్ట్‌ను అందజేశారు. అయితే సర్వీస్ మంజూరైనా.. విద్యుత్ స్తంభాలు, కండక్టర్ (వైర్లు) సిద్ధంగా ఉన్నప్పటికీ కనెక్షన్ ఇచ్చేందుకు ఇన్చార్జి ఏఈ శ్రీనివాసరావు రూ.40 వేల లంచం డిమాండ్ చేశారు. ఈ మొత్తాన్ని సదరు రైతులు ఇచ్చినప్పటికీ కనెక్షన్ ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నాడు. సదరు రైతులు నిలదీయడంతో ఏఈ శ్రీనివాసరావు స్థానిక టీడీపీ నాయకుడు మీకు విద్యుత్ కనెక్షన్ ఇవ్వొద్దని చెప్పాడని, మీరెళ్లి ఆ నాయకుడిని కలిస్తే పని అవుతుందని చెప్పడంతో రైతుల బంధువు గాలం హరికృష్ణ వెళ్లి ఏఈని నిలదీశాడు. ఈ క్రమంలో ఏఈ టీడీపీ నేతలకు చెప్పి.. హరికృష్ణను పోలీసులతో కొట్టించడంతో ఈ వివాదం జిల్లాలో సంచలనంగా మారింది. ఉన్నతాధికారుల పర్యవేక్షణా లోపం విద్యుత్ శాఖ ఉన్నతాధికారుల పర్యవేక్షణా లోపంతోనే కింది స్థాయి అధికారులు అవినీతిలో మునిగి తేలుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. విద్యుత్ సర్వీసుల కోసం వచ్చిన దరఖాస్తులు ఎంత కాలం, ఎందుకు పెండింగ్‌లో ఉన్నాయో పరిశీలించి, అందుకు కారణాలను విశ్లేషించి చర్యలు చేపట్టాల్సి ఉన్నా.. అందుకు భిన్నంగా మొక్కుబడిగా వ్యవహరిస్తున్నారనే విమర్శలూ లేకపోలేదు. సర్వీస్ పేరు మార్చడానికి రూ.లక్ష లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడినప్పుడైనా.. సరే ఉన్నతాధికారులు స్పందించి ఉంటే పొదలకూరు ఘటన జరిగేది కాదు. ప్రతి సోమవారం గంట పాటు డయల్ యువర్ ఎస్ఈ, డయల్ యువర్ సీఎండీ కార్యక్రమం నిర్వహిస్తున్నా.. ఇటువంటి ఫిర్యాదులు వారి దృష్టికి రాకుండానే కాల్ డిస్కనెక్ట్ అయిపోవడం సర్వసాధారణంగా మారిందనే విమర్శలు ఉన్నాయి. ప్రతి పనికీ ఒక్కో రేటు విద్యుత్ శాఖలో ఎలాంటి పని జరగాలన్నా క్షేత్రస్థాయి సిబ్బంది నుంచి అధికారుల వరకు ముడుపులు ఇవ్వాల్సిందే. ప్రతి పనికీ ఒక్కో రేటుగా నిర్ణయించుకుని పనులు చేస్తున్నారని పలు ఆరోపణలు ఉన్నాయి. మంజూరైన కొత్త విద్యుత్ మీటర్ పెట్టాలంటే రూ.500 నుంచి రూ.1,000 వసూలు చేస్తున్నారు. విద్యుత్ లైన్ల మార్పిడికి దూరాన్ని బట్టి రూ.10 వేల నుంచి రూ.60 వేల వరకు, స్తంభాలను మార్చాలంటే రూ. 5 వేల నుంచి రూ.10 వేల వరకు ముట్ట జెప్పాల్సిందే. ఇక అపార్ట్మెంట్ల వద్ద ప్రత్యేక ట్రాన్స్ఫార్మర్, విద్యుత్ లైన్లకు సంబంధించి సర్వీస్ చార్జీలు కాకుండా.. రూ.60 వేల నుంచి రూ.లక్ష వరకు లంచాల రూపంలో డిమాండ్ చేసి మరీ దండుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రహసనంగా డయల్ యువర్ ఎస్ఈ, సీఎండీ కార్యక్రమం ఉచిత సేవలకు డబ్బులు వసూళ్లు ప్రతి పనికీ ఒక్కో రేటు.. అడిగినంత ఇచ్చినా ఫలితం శూన్యం పరిష్కారం దొరకని డయల్ యువర్ ఎస్ఈ, సీఎండీ కార్యక్రమం రైతులను సైతం వదలని అవినీతి విద్యుత్ అధికారులు ఉచిత సేవలకు సైతం అదనపు వసూళ్లు విద్యుత్‌శాఖ నిబంధనల మేరకు వ్యవసాయ సర్వీసు కోసం రైతు దరఖాస్తు చేసుకుంటే ఆ ట్రాన్స్ఫార్మర్ పరిధిలో సీనియార్టీ ప్రాతిపదికన కనెక్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. 1 హెచ్‌పీకి రూ.1500, 2 హెచ్‌పీకి రూ.3000, 3 హెచ్‌పీకి రూ.4500, 4 హెచ్‌పీకి రూ.6000, 5 హెచ్‌పీకి రూ.7500 డిపాజిట్‌ను డీడీ రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ నుంచి రైతు పొలంలో ఉన్న పంపుసెట్ వరకు మూడు విద్యుత్ స్తంభాలు, 240 మీటర్ల కండక్టర్ (వైర్లు) ఉచితంగా ఇవ్వాల్సి ఉంటుంది. ఇంకా దూరం ఉంటే.. విద్యుత్ స్తంభాలు, కండక్టర్ ఖర్చును రైతునే భరించాలి. అయితే విద్యుత్ శాఖాధికారులు వీటిని ఖర్చు పేరుతో రైతుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు. ఫిర్యాదులొస్తే కఠిన చర్యలు తప్పవు విద్యుత్‌శాఖ అధికారులు, సిబ్బందిపై అవినీతి ఆరోపణలు వస్తే ఉపేక్షించేది లేదు. రైతులకు మంజారైన వ్యవసాయ విద్యుత్ సర్వీ సులు ఇచ్చే విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించినా, అవినీతికి పాల్పడినా కఠిన చర్యలు తీసుకుంటాం. గృహ, వ్యవసాయ విద్యుత్ సర్వీసులు ఇచ్చేందుకు విద్యుత్ అధికారులుకానీ, సిబ్బంది కానీ నగదును డిమాండ్ చేస్తే నా దృిష్టికి తీసుకు వస్తే వారిపై చర్యలు తీసుకుంటాను. నావూరుపల్లిలో వ్యవసాయ విద్యుత్ సర్వీసు విషయంలో ఏఈ రూ. 40 వేలు లంచం తీసుకున్నట్లు ఇప్పటి వరకూ ఎలాంటి ఫిర్యాదు అందలేదు. – రాఘవేంద్రం, ఏపీఎస్పీడీసీఎల్ జిల్లా సర్కిల్ ఎస్ఈ రాష్ట్రంలో ఏ ప్రభుత్వ శాఖ, చివరకు బ్యాంకు ఉద్యోగులు సైతం అందుకోని విధంగా అత్యధిక మొత్తాల్లో విద్యుత్‌శాఖ అధికారులు, ఉద్యోగులు జీతాలు అందుకుంటున్నారు. విద్యుత్ శాఖలో విధులు నిర్వహించే లైన్మెన్ స్థాయి ఉద్యోగి నెలకు రూ.90 వేల నుంచి రూ. లక్ష, లైన్ ఇన్స్పెక్టర్ స్థాయి ఉద్యోగి రూ.1.50 లక్షల నుంచి రూ.1.90 లక్షలు, ఏఈ స్థాయి అధికారి రూ.2 లక్షలు, అసిస్టెంట్ ఎగ్జిక్యూటీవ్ ఇంజినీర్ స్థాయి అధికారి రూ.రూ.2.50 లక్షల నుంచి రూ. 3 లక్షల వరకూ నెల నెలా జీతాల రూపంలో అందుకుంటున్నారు. అయితే ఇవి చాలదన్నట్టుగా కొందరు లంచాలకు అలవాటు పడిన విద్యుత్ అధికారులు, సిబ్బంది విద్యుత్ వినియోగదారులు, రైతుల నుంచి ముక్కు పిండి మరీ లంచాలను తీసుకుంటూ జేబులు నింపుకుంటున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. -
దళారుల సిండికేట్.. తగ్గిన మిర్చి రేటు
చిట్టమూరు: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏ పంటలకు కనీసం ధరలు కూడా ఉండడం లేదు. ఏడాదికేడాది ధరలు పతనమవుతున్నా.. పాలకులకు, అధికార యంత్రాంగానికి పట్టడం లేదు. గతంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వ పాలనలో దళారులు ధరలు తగ్గిస్తే.. వెంటనే మార్క్‌ఫెడ్‌ను రంగంలోకి దించి మద్దతు ధరకు కొనుగోలు చేస్తూ రైతులను ఆదుకునేది. కూటమి ప్రభుత్వం వచ్చాక రైతుల కష్టాన్ని దళారులు దోచుకుంటున్నా.. పట్టీపట్టనట్లు వ్యవహరిస్తోంది. మండలంలో అత్యధికంగా వరి సాగు చేస్తుంటారు. రెండేళ్లుగా ధాన్యానికి ధరల్లేకపోవడంతో ఈ దఫా మెట్ట ప్రాంతాల్లో రైతులు వాణిజ్య పంట ఎండు మిర్చి సాగు చేశారు. కనీసం మిర్చితోనైనా అప్పుల ఊబిలో నుంచి బయటపడుతామని ఆశతో ఉన్న రైతుల కళ్లల్లో దళారులు కారం కొడుతున్నారు. క్వింటాకు రూ.6 వేల తగ్గింపు పది రోజుల ముందు వరకు కిలో ఎండు మిర్చి ధర రూ.400 ఉండగా, ప్రస్తుతం కేజీ రూ.340 మాత్రమే దళారులు కొనుగోలు చేస్తున్నట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. క్వింటాకు రూ.6 వేల నష్టపోతున్నట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కల్లాలోకి వచ్చి కొనుగోలు చేసే దళారులు సిండికేట్ కావడంతో నెల్లూరుకు తీసుకువచ్చి అమ్మాలంటూ డిమాండ్ పెట్టడంతో రవాణా చార్జీలు అదనంగా తమపై పడడంతో రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ ధరకు గిట్టుబాటు కాకపోవడంతో రైతులు నెల్లూరులోని పొట్టేపాళెంలో ఉన్న కోల్డ్ స్టోరేజీలో నిల్వ చేసుకుంటున్నారు. దీంతో అదనపు ఖర్చులు కూడా పెరుగుతున్నాయని రైతులు చెబుతున్నారు. కొంత మంది రైతులు ఇంటికి తీసుకు వచ్చి కల్లాల్లో ఎండ బెట్టుకుంటున్నారు. దిగుబడి ఆశ.. ధర నిరాశ మంచి గిట్టుబాటు ధర ఉంటుందని రైతులు మండలంలో హైబ్రీడ్ వంగడం కాకుండా దేశీయ వంగడాన్ని సాగు చేశారు. చిల్లమూరు, రామాపురం, చిట్టమూరు, మొలకలపూడి గ్రామాల్లో సుమారు 300 ఎకరాల్లో రైతులు మిరప పంట సాగు చేశారు. ఈ ఏడాది ఎకరాకు 10 నుంచి 11 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుందని రైతులు తెలిపారు. ఆశించిన మేర దిగుబడి వచ్చినా గిట్టుబాటు ధరల్లేకపోవడంతో నిరాశ చెందుతున్నారు. ఎకరా మిరప పంట సాగుకు మొత్తం కూలీలతో కలిపి రూ.80 నుంచి 90 వేలు వరకు ఖర్చు అవుతుందన్నారు. పది రోజుల ముందు కోత కోసిన రైతులకు మాత్రం ఎకరాకు 10 క్వింటాళ్లకు రూ.4 లక్షలు వరకు గిట్టుబాటు అయిందన్నారు. ప్రస్తుతం ధర తగ్గడంతో రైతులు దిగాలు చెందుతున్నారు. -
పెళ్లికెళ్లి వస్తుండగా ఘోరం
● ఆవును తప్పించబోయి టాటా దోస్త్ వాహనం బోల్తా ● మహిళ మృతి, పది మందికి తీవ్రగాయాలు మర్రిపాడు: పెళ్లికెళ్లి ఆనందంగా వస్తున్న కుటుంబంలో ఓ ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. ఆవును తప్పించబోయి టాటా దోస్తు వాహనం బోల్తా పడడంతో ఓ మహిళ మరణించగా, పది మంది తీవ్రంగా గాయపడిన ఘటన మండలంలోని చుంచులూరు కొత్తపల్లి గ్రామ సమీపంలోని 565 జాతీయ రహదారిపై శనివారం జరిగింది. పోలీసుల కథనం మేరకు.. కలువాయికి చెందిన 20 మంది వైఎస్సార్ కడప జిల్లా ఖాజీపేటలో ఓ వివాహ కార్యక్రమానికి టాటా దోస్తు వాహనంలో వెళ్లారు. తిరుగు ప్రయాణంలో ఆనందంగా వస్తుండగా చుంచులూరు కొత్తపల్లి సమీపంలో ఎదురుగా వచ్చిన ఆవును తప్పించబోయే క్రమంలో అదుపుతప్పి రోడ్డుపై బోల్తా పడింది. ఈ ప్రమాదంలో రామసుబ్బమ్మ(55) అనే మహిళ అక్కడికక్కడే మృతిచెందగా, పది మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఇందులో చంద్రశేఖర్ అనే యువకుడి ఎడమ చేయి పూర్తిగా తెగిపోయింది. మరికొందరికి స్వల్ప గాయాలు కాగా, స్థానికులు వెంటనే స్పందించి గాయపడిన వారిని 108లో ఆత్మకూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
దైవ సాక్షిగా ఏఈ లంచం తీసుకున్నాడు
● ఎస్సై బెదిరించి కొట్టాడు ● బాధిత రైతు హరికృష్ణ పొదలకూరు: ‘దైవ సాక్షిగా చెబుతున్నాను. విద్యు త్ ఏఈ శ్రీనివాసరావు నా వద్ద రూ.40 వేలు లంచం తీసుకున్నాడు. లంచం ఇస్తే కనెక్షన్ ఇస్తానని చెప్పడంతో ఆ మొత్తం ఇచ్చిన తర్వాత విద్యుత్ స్తంభాలు కూడా తోలారు. అయితే మా గ్రామంలో టీడీపీ నాయకులు మాకు విద్యుత్ కనెక్షన్ ఇవ్వకుండా ఆపించారు. నిమ్మ చెట్లు ఎండుతుంటే కడుపు మండి ఏఈను ఎందుకు కనెక్షన్ ఇవ్వరని ప్రశ్నించి, ఇవ్వకుంటే నేను ఇచ్చిన లంచం డబ్బులు తిరిగి ఇవ్వాల్సిందిగా అడిగాను. దీంతో ఏఈ ఎస్సై హనీఫ్‌కు ఫోన్ చేసి చెప్పడంతో ఆయన నన్ను శుక్రవారం సాయంత్రం 4 గంటలకు పిలిపించి బెదిరించి ఇష్టానుసారం కొట్టాడు. ఆ సమయంలో మా గ్రామ టీడీపీ నాయకులకు వీడియో కాల్ చేసి నన్ను కొట్టే దృశ్యాలను ఎస్సై చూపించాడని అని బాధిత రైతు గాలం హరికృష్ణ వెల్లడించారు. రైతుగా తో టను కాపాడుకునేందుకు ప్రయత్నిస్తే కనెక్షన్ ఇవ్వకపోగా పోలీసులతో కొట్టించారని వాపోయాడు. -
రెడ్‌బుక్ రాజ్యాంగం అమలులో తలమునకలు
ప్రసన్న ఇంటిపై దాడి..జిల్లాలో ఖాకీల వ్యవహార తీరు పరాకాష్టకు చేరింది. కనిపించే మూడు సింహాలు చట్టానికి, న్యాయానికి, ధర్మానికి ప్రతీకలైతే.. కనిపించని నాలుగో సింహమే ఈ పోలీస్.. అని గొప్పగా అభివర్ణించే స్థాయి నుంచి ఖాకీల ప్రతిష్ట మంట గలుస్తోంది. రాజ్యాంగబద్ధమైన కొలువుల్లో ఉంటూ రెడ్‌బుక్ రాజ్యాంగం అమలు చేస్తూ కొందరు ఖాకీలు వ్యవహరిస్తున్న తీరు ప్రజాస్వామ్య వర్గాల్లో ఆందోళన కలిగిస్తోంది. ప్రతిపక్ష నేతలు, కార్యకర్తలు, జర్నలిస్టులు, సోషల్‌మీడియా యాక్టివిస్టులపై అక్రమ కేసులు, వేధింపులు, దౌర్జన్యాలు పెరుగుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. తాజాగా ఓ ఎస్సై వైఎస్సార్సీపీ నాయకుడిని సెల్లో పెట్టి కొడుతూ ఆ దృశ్యాలను వీడియో కాల్ ద్వారా టీడీపీ నేతలకు చూపించిన ఘటన జిల్లాలో సంచలనం రేపింది. చట్టాన్ని కాపాడాల్సిన ఖాకీలు రాజకీయాలకు బానిసలవుతున్నారన్న విమర్శలు మరింతగా బలపడుతున్నాయి. సాక్షిప్రతినిధి నెల్లూరు: జిల్లాలో కొందరు ఖాకీలు అధికార పార్టీ నేతల కిరాయి రౌడీల్లా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. శాంతిభద్రతలతోపాటు చట్టాన్ని కాపాడాల్సిన పోలీసులే.. అధికారిక అరాచక శక్తుల్లా మారి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు. ఓ వైపు శాంతిభద్రతలు రోజు రోజకు క్షీణించిపోతున్నాయి. మరో వైపు అధికార పార్టీ నేతల ఇసుక, గ్రావెల్, మద్యం అక్రమ రవాణా, వ్యాపారాలు విచ్చలవిడిగా జరుగుతున్నా.. చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. అధికార పార్టీ నేతల అండదండలతో పోస్టింగ్‌లు దక్కించుకున్న కొందరు ఖాకీలు తమ స్వామి భక్తిని చాటుకుంటున్నారు. శాంతి భద్రతల కంటే అధికార పార్టీ నేతల ఆదేశాలే ప్రామాణికాలుగా, రెడ్‌బుక్ రాజ్యాంగమే గీటురాయి అన్నట్టు వ్యవహరిస్తున్నారు. పచ్చ నేతల మెప్పు పొందేందుకు అడ్డగోలుగా ప్రతిపక్ష నేతలు, కార్యకర్తలు, సోషల్ మీడియా యాక్టివిస్టులపై అక్రమ కేసులు బనాయించి జైళ్లకు పంపుతున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించే గొంతుకులను అక్రమ కేసులతో అణిచివేస్తున్నారు. ప్రతిపక్ష సభ్యులపై అధికార పార్టీ నేతలు, వారి కిరాయి మూకలు సాగించే దాష్టీ కాలపై నోరు మెదపకపోగా తిరిగి వారిపైనే కేసులు పెడుతున్నారు. శంకరనగరం నుంచి నావూరుపల్లి వరకు.. చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేశాక.. టీడీపీ నేతల అరాచకాలకు హద్దు లేకుండా పోయింది. వీరి అరాచకాలను అడ్డుకోవాల్సిన పోలీసులు ఆ నాటి నుంచి ఈ రోజు వరకు పచ్చ నేతలకు ఊడిగం చేయడంలో తలమునకలవుతున్నారు. అనంతసాగరం మండలం శంకరనగరం నుంచి.. పొదలకూరు మండలం నావూరుపల్లి వరకు పోలీసుల వ్యవహార తీరు అత్యంత వివాదాస్పదంగా మారుతోంది. రెండేళ్లుగా వైఎస్సార్సీపీ కార్యకర్తల నుంచి మాజీ మంత్రి వరకు కేసుల పరంపర కొనసాగుతోంది. శంకరనగరంలో వైఎస్సార్సీపీ నేత, అప్పటి సర్పంచ్ ఇంటి వద్ద టీడీపీ నాయకులు కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. ప్రశ్నించిన వైఎస్సార్సీపీ నేతలపై మారణాయుధాలతో తెగబడ్డారు. వారి ఇళ్లలోకి చొరబడి టీవీలు, ఫ్రిజ్‌లు ధ్వంసం చేశారు. సర్పంచ్‌తోపాటు ఆమె ఇంటి పక్కనే ఉంటున్న రవికుమార్‌రెడ్డి, నాగసునీల్‌రెడ్డి, రామసుబ్బారెడ్డిపై గొడ్డలితో దాడి చేసి ఆస్తులను ధ్వంసం చేశారు. న్యాయం చేయాల్సిన పోలీసులు అధికార పార్టీ నేతల ఒత్తిళ్లకు తలొగ్గి బాధితులపైనే అక్రమ కేసులు బనాయించి జైళ్లకు పంపారు. చదువుకునే విద్యార్థులు, వృద్ధులపై రౌడీషీట్లు తెరిచి ఖాకీలు పచ్చ పైత్యం ప్రదర్శించారు. కాకాణిపై కేసుల పరంపరరాజకీయ విమర్శల నేపథ్యంలో మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి ఇంటిపై వందలాది మంది టీడీపీ ముష్కర మూకలు దాడి చేస్తుండగా పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ముష్కరుల్లో కొందరు వెళ్లిపోగా కొందరు నింపాదిగా నడుచుకుంటూ వెళ్లారు. పోలీసులు వారిని పట్టుకునే అవకాశం ఉన్నప్పటికి మిన్నకుండిపోయారన్న విమర్శలున్నాయి. సదరు ఘటనపై నామమాత్రంగా కేసు నమోదు చేసి కొందరికి నోటీసులు జారీతో సరిపెట్టారు. కొడుతూ.. వీడియో కాల్ చేసి చూపిస్తూ.. జిల్లాలోని పొదలకూరు ఎస్సై హనీఫ్ పోలీస్ ప్రతిష్టను నడిబజారులో పచ్చ పార్టీకి తాకట్టు పెట్టాడు. ప్రతిపక్ష పార్టీకి చెందిన నేతను తమ కాళ్ల దగ్గరకు తీసుకురావాలని టీడీపీ నేతలు ఆదేశించడంతో జీ.. హుజూర్ అంటూ ఎస్సై అతనిపై ఖాకీల బలం చూపించి బలవంతంగా అభ్యంతరకరంగా లాక్కెళ్లి సెల్లో పెట్టి లాఠీలతో కొడుతూ.. ఆ దృశ్యాలను వీడియో కాల్ ద్వారా టీడీపీ నేతలకు చూపించాడు. అధికార పార్టీ నేతల మెప్పు కోసం.. సదరు పోలీస్ అధికారి వ్యవహరించిన తీరు ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టుగా మారింది. ఈ ఘటన ఖాకీల పచ్చ కావరానికి పరాకాష్టగా నిలుస్తోంది. ఎస్సై తీరుపై ప్రజల్లో సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయం తెలుసుకున్న వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి పార్టీ శ్రేణులతో కలిసి పొదలకూరు పోలీసుస్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. స్టేషన్ ముందు బైఠాయించి ఎస్సైపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. టీడీపీ నేతలు చెప్పిందే వేదంగా పోలీసుల వ్యవహారం శంకరనగరం నుంచి నావూరుపల్లి వరకు వీరి తీరు వివాదాస్పదం రెండేళ్లుగా వైఎస్సార్సీపీ కార్యకర్తల నుంచి మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేల వరకు కేసుల పరంపర తాజాగా టీడీపీ నేతలకు వీడియో కాల్ చేసి వైఎస్సార్సీపీ నేతను కొట్టిన ఎస్ఐ ఇక నిత్యం టీడీపీ ప్రభుత్వాన్ని ఎండగట్టుతూ.. సర్వేపల్లి ఎమ్మెల్యే అక్రమాలను ఎప్పటికప్పుడు వెలుగులోకి తెస్తుండడంతో మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ జిల్లా పార్టీ అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డిపై అక్రమ కేసులు నమోదు చేసి జైలుకు పంపారు. జైలు నుంచి బయటకు వచ్చినా ఆయనపై అక్రమ కేసులు పరంపర కొనసాగుతూనే ఉంది. కోవూరులో ఓ మైనర్ బాలిక మృతి చెందడంతో బాధిత కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. టీడీపీ నేతల ఫిర్యాదు మేరకు ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆంధ్రజ్యోతి, ఏబీఎన్ నీచపు రాతలను నిరసిస్తూ శాంతియుతంగా ఆందోళన చేయగా పోలీసులతో దురుసుగా ప్రవర్తించారని కాకాణి గోవర్ధన్‌రెడ్డితో పాటు కాకాణి పూజిత, తిరుపతి ఎంపీ గురుమూర్తి, నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇన్చార్జి ఆనం జయకుమార్‌రెడ్డి తదితరులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆంధ్రజ్యోతి బ్రాంచ్ మేనేజర్ ఫిర్యాదు మేరకు కాకాణిపై మరో కేసు నమోదు చేశారు. -
హోరాహోరీగా బీచ్ కబడ్డీ పోటీలు
సంగం: మండలంలోని దువ్వూరు గ్రామంలో 13వ అంతర్ జిల్లాల బీచ్ కబడ్డీ చాంపియన్‌షిప్ పోటీలు మూడో రోజు శనివారం హోరాహోరీగా కొనసాగాయి. రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి వచ్చిన పురుష, మహిళా జట్లు తమ ప్రతిభతో ప్రేక్షకులను అలరించాయి. ఈ సందర్భంగా పోటీలను ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి సందర్శించారు. కాగా శనివారం జరిగిన ప్రీ క్వార్టర్ పోటీల్లో కృష్ణా జట్టు కడప జట్టుపై విజయం సాధించి క్వార్టర్ ఫైనల్స్‌కు చేరింది. అదే విధంగా నెల్లూరు జట్టు ఎన్టీఆర్ జిల్లా జట్టుపై, ప్రకాశం జట్టు పశ్చిమ గోదావరిపై, శ్రీకాకుళం జట్టు ఏలూరుపై, చిత్తూరు జట్టు నంద్యాలపై, బాపట్ల జట్టు గుంటూరుపై, అనంతపురం జట్టు పల్నాడుపై, విజయనగరం జట్టు కాకినాడపై విజయం సాధించి క్వార్టర్ ఫైనల్స్‌కు చేరాయి. -
కదం తొక్కిన కార్యకర్తలు
పొదలకూరు : స్థానిక ఎస్సై హనీఫ్ ‘పచ్చ’ కావరంతో వ్యవహరించిన తీరుపై వైఎస్సార్సీపీ శ్రేణులు పోలీస్‌స్టేషన్ ఎదుట ధర్నాకు కదం తొక్కారు. మండలంలోని నావూరుపల్లికి చెందిన రైతు హరికృష్ణ తన పొలానికి విద్యుత్ కనెక్షన్ నిబంధనల ప్రకారం ఫీజులు చెల్లించడంతోపాటు సంబంధిత ఏఈకి రూ.40 వేలు లంచంగా ఇచ్చినప్పటికీ కనెక్షన్ ఇవ్వకపోవడాన్ని ప్రశ్నించడంతో టీడీపీ నేతల జోక్యంతో ఎస్సై అతన్ని స్టేషన్‌కు తీసుకువచ్చి కొడుతూ వీడియో కాల్లో టీడీపీ నేతలకు చూపించారు. ఈ దాష్టీకాన్ని నిరసిస్తూ.. మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి ఆధ్వర్యంలో శనివారం పొదలకూరు పోలీస్‌స్టేషన్ ఎదుట ఎస్సై హనీఫ్ తీరుకు నిరసనగా మండుటెండలో ధర్నా నిర్వహించారు. సుమారు గంటకుపైగా ఎస్సైపై చర్యలు తీసుకోవాలని కోరుతూ నినాదాలు చేశారు. ఎస్సై తీరు ఏకపక్షంగా ఉందని సివిల్ వివాదాల్లో తలదూర్చుతూ వైఎస్సార్సీపీ నాయకులను, కార్యకర్తలను దుర్మార్గంగా దుర్భాషలాడడమే కాక ఇష్టానుసారం కొడుతున్నట్టు ఆగ్రహం వ్యక్తం చేశారు. మండలంలోని అన్ని గ్రామాల నుంచి నాయకులు, కార్యకర్తలు పోలీస్‌స్టేషన్ వద్దకు చేరుకున్నారు. పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో పొదలకూరు సీఐ గుత్తి వెంకటరావు కాకాణి వద్దకు వెళ్లి ట్రాఫిక్ సమస్యలు తలెత్తాయని నిరసన విరమించాల్సిందిగా కోరారు. ఈ సందర్భంగా కాకాణి పోలీసుల తీరుపై పలు ప్రశ్నలు సంధించారు. ఫిర్యాదు లేకుండా రైతులను స్టేషన్‌కు పిలిపించి కొట్టే హక్కు పోలీసులకు ఎవరిచ్చారన్నారు. డీటీసీ డీఎస్పీ గిరిధర్ వచ్చి ఎస్సైపై విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో డీఎస్పీ మాటపై గౌరవంతో నిరసన విరిమిస్తున్నట్లు కాకాణి వెల్లడించారు. ఎస్సైపై చర్యలు తీసుకోకుంటే తిరిగి ఆందోళన ఉధృతం చేస్తామన్నారు. కార్యకర్తలపై దెబ్బపడితే నాపై పడినట్టే – కాకాణి గోవర్ధన్‌రెడ్డి వైఎస్సార్సీపీ కార్యకర్తలపై దెబ్బపడితే నాపై పడినట్టే అని కాకాణి గోవర్ధన్‌రెడ్డి పేర్కొన్నారు. టీడీపీ నాయకుల మాటలు విని పోలీసులు ఓవరాక్షన్ చేస్తే చట్టం ముందు నిలబెట్టి భవిష్యత్‌లో ఉద్యోగంలో లేకుండా చేస్తామన్నారు. కూటమి పాలనలో దౌర్జన్యాలు పెరిగిపోయాయని అధికారంలోకి వచ్చిన వెంటనే పోలీసులను ప్రయోగించి తమ పార్టీ కార్యకర్తలు, నాయకులపై అక్రమ కేసులతోపాటు కొడుతున్నారని ఆరోపించారు. హరికృష్ణను ఎస్సై హనీఫ్ విచక్షణారహితంగా కొట్టి హింసించాడని, ఆ దృశ్యాలను టీడీపీ నాయకులకు వీడియో కాల్లో చూపడం ఎంత దుర్మార్గమో ఉన్నత స్థాయి పోలీసు అధికారులు విచారణ జరపాలన్నారు. పోలీస్ అధికారి టీడీపీ నాయకుల వద్దకు వెళ్లాలంటూ చెప్పడం సిగ్గు చేటన్నారు. సర్వేపల్లిలో ధనప్రవాహం సర్వేపల్లిలో అధికారులు ప్రజల వద్ద దండుకుని సోమి రెడ్డికి లంచాలు ఇస్తున్నారని కాకాణి ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే పొదలకూరు విద్యుత్ ఏఈ వ్యవహారం నెలకొందన్నారు. నాయకులకు లంచాలు ఇవ్వకుంటే సర్వేపల్లిలో పోస్టింగ్ రాదని అధికారులు, ఉద్యోగులే బహిరంగంగా చెబుతున్నారన్నారు. సోమి రెడ్డి ఆయన కుమారుడు పొదలకూరు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా లేఅవుట్ల నుంచి రూ.2.50 కో ట్లు వసూలు చేసినట్టు ఆరోపించారు. ధర్నాలో నాయకులు గోగిరెడ్డి గోపాల్‌రెడ్డి, బచ్చల సురేష్‌కుమార్‌రెడ్డి, ఎం.వెంకటశేషయ్య, వూకోటి లక్ష్మీనారాయణ, జీ.లక్ష్మీకల్యాణి, తెనాలి నిర్మలమ్మ, ఎస్కే అంజాద్, మద్దిరెడ్డి రమణారెడ్డి, వాకాటి శివప్రసాద్‌రెడ్డి, సీహెచ్ రమేష్, ఆనంద్‌రెడ్డి, వి.దయాకర్‌రెడ్డి, రావుల ఇంద్రసేన్‌గౌడ్, జీ.వేణుగోపాల్‌రెడ్డి, శ్రీనివాసులురెడ్డి పాల్గొన్నారు. -
కూటమి పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత
● ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి ● వైఎస్సార్సీపీలో 50 కుటుంబాల చేరిక నెల్లూరురూరల్: ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని, అంతే కాకుండా రాష్ట్రంలో అరాచకాలు పెరిగిపోవడంతో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందని వైఎస్సార్సీపీ నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్చార్జి, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి అన్నారు. నెల్లూరు నగరంలోని రామ్‌జీ నగర్లో ఉన్న వైఎస్సార్సీపీ సిటీ కార్యాలయంలో శనివారం 53వ డివిజన్ పార్టీ ఇన్చార్జి వెంగళ్‌రెడ్డి నాయకత్వంలో మహిళా నాయకురాలు రాగాల జయమ్మ ఆధ్వర్యంలో రెహనా బేగం, చెవురూ మహేశ్వరి, ఆరవ మంజులమ్మ, పసుపులేటి మహాలక్ష్మి, తుపాకుల ఈశ్వరమ్మతో పాటు వారి అనుచరగణం 50 కుటుంబాలు వైఎస్సార్సీపీలో చేరాయి. పార్టీలో చేరిన వారికి పర్వతరెడ్డి పార్టీ కండువా వేసి ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారికి సముచిత స్థానం కల్పిస్తామని భరోసా కల్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ మొదటి నుంచి నెల్లూరు నగర నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు చురుగ్గా పనిచేస్తున్నారని తెలిపారు. పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ అందరూ ముందుకొచ్చి జగన్మోహన్రెడ్డి నాయకత్వంలో పనిచేయాలని వారు చూపిస్తున్న చొరవ పార్టీకి మరింత ఉత్సాహాన్ని ఇస్తోందన్నారు. మళ్లీ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం రావాలని ప్రజలందరూ ఆకాంక్షిస్తున్నారని తెలియజేశారు. 53వ డివిజన్ గాంధీ గిరిజన కాలనీకి సంబంధించిన జయమ్మ ఆధ్వర్యంలో 50 కుటుంబాలు పార్టీ చేరడం అభినందనీయమని తెలిపారు. పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్న ప్రతిఒక్కరికీ వైఎస్సార్సీపీ అండగా ఉంటుందన్నారు. అలాగే రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్రెడ్డి సూచించిన విధంగా సముచిత న్యాయం, గౌరవం కల్పిస్తామని తెలిపారు. -
ప్రజల హృదయాల్లో నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి
వాకాడు: మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి 12వ వర్ధంతి కార్యక్రమాన్ని శనివారం వాకాడులోని నేదురుమల్లి నివాసంలో నిర్వహించారు. జనార్దన్‌రెడ్డి చిత్రపటానికి ఆయన తనయుడు, వైఎస్సార్సీపీ వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి నివాళి అర్పించారు. కోట, వాకాడు, చిట్టమూరు మండలాల నుంచి విచ్చేసిన పలువురు నాయకులు, కార్యకర్తలు నేదురుమల్లి చిత్రపటానికి శ్రద్ధాంజలి ఘటించారు. నేదురుమల్లి జనార్దన్‌రెడ్డితో ఉన్న అనుభవాలను పలువురు గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ ఎస్ఈసీ సభ్యులు కొడవలూరు భక్తవత్సలరెడ్డి, వాకాడు, చిట్టమూరు మండలాల కన్వీనర్లు సుధాకర్‌నాయుడు, శ్రీనివాసులురెడ్డి, నాగూర్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, రాజశేఖర్‌రెడ్డి, శ్రీధర్‌రెడ్డి, పెంచల్‌రెడ్డి, వాకాటి రవి, వెంకటేశ్వర్‌రెడ్డి, మధురెడ్డి పాల్గొన్నారు. కోట: మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి వర్ధంతిని శనివారం విద్యానగర్‌లోని ఎన్బీకేఆర్ ఐఎస్టీలో ఘనంగా నిర్వహించారు. అధ్యాపకులు, సిబ్బంది ఆయన చిత్రపటానికి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ శ్రీనివాసులు మాట్లాడుతూ 1979లో నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి విద్యానగర్‌లో ఎన్బీకేఆర్ ఐఎస్టీని ఏర్పాటు చేశారన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని అనేక మంది పేద విద్యార్థులకు ఉన్నత చదువులు అందించారన్నారు. తండ్రి ఆశయాలను నేడు ఆయన తనయుడు, ఎన్బీకేఆర్ విద్యాసంస్థల కరస్పాండెంట్ నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి కొనసాగిస్తున్నారన్నారు. ముఖ్యమంత్రిగా జనార్దన్‌రెడ్డి చేసిన అభివృద్ధి పనులు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయన్నారు. రాజకీయాల్లో నేదురుమల్లి చెరగని ముద్రవేశారన్నారు. ఈ కార్యక్రమంలో హెచ్ఓడీలు చింతా రవీంద్రారెడ్డి, నాగిరెడ్డి, శ్రీహరిరెడ్డి, హరనాథ్‌రెడ్డి, సుబ్బారెడ్డి పాల్గొన్నారు. -
అదనపు కట్నం కోసం వేధింపులు
● ప్రశ్నించినందుకు బాధితురాలి తల్లిపై దాడి ఆత్మకూరు: అబ్బాయి సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడని, తమ కుమార్తె కూడా సాఫ్ట్వేర్ ఉద్యోగి కావడంతో ఇరువురు అన్యోన్యంగా ఉంటారని వివాహం చేస్తే అదనపు కట్నం కోసం తీవ్రంగా వేధిస్తున్నారని, ఇదేమి న్యాయం అని అడిగేందుకు ఇంటికి వెళ్తే గాయపరిచారని బాధిత తల్లి వాపోయింది. వివరాల్లోకెళ్తే.. నెల్లూరుకు చెందిన అనసూయ, నారాయణ దంపతులు పూణేలో నివసిస్తుంటారు. వీరి కుమార్తె నవీనను ఆత్మకూరుకు చెందిన డి.మాల్యాద్రి, లలితమ్మ కుమారుడు వినీత్ అనే యువకుడికి ఇచ్చి రెండేళ్ల క్రితం వివాహం చేశారు. అయితే పెళ్లయిన నెల నుంచే కట్నం కోసం అమ్మాయిని వేధిస్తుండడంతో ఎన్నిసార్లు మధ్యవర్తిత్వం చేసినా కుదరలేదు. దీంతో అమ్మాయి తల్లిదండ్రుల వద్దకు వెళ్లిపోయింది. ఈ నేపథ్యంలో శనివారం ఆత్మకూరు పోలీసులకు అమ్మాయి తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో ఇంటికి వస్తే అమ్మాయి దుస్తులు ఇస్తామని వియ్యంకులు చెప్పడంతో అనసూయ, తన సమీప బంధువుతో కలిసి వెళ్లగా నానా దుర్భాషలాడి ఇద్దరిపై దాడి చేసి తరిమేశారని వాపోతూ తిరిగి పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్నారు. ఎస్సై జిలానీతో తమకు జరిగిన విషయాన్ని వివరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు ఆయన తెలిపారు. నడిరోడ్డుపై కత్తి చేతపట్టి.. ● మద్యం మత్తులో యువకుడి హల్చల్ ముత్తుకూరు (పొదలకూరు): మండలంలోని పిడతాపోలూరులో మద్యం మత్తులో గుర్తుతెలియని యువకుడు శనివారం రాత్రి కత్తి చేతపట్టి హల్చల్ చేశాడు. ఆ యువకుడు మద్యం మత్తులో నడిరోడ్డుపై నిలబడి కత్తి చేతబట్టి తిరుగుతుండటంతో వాహనచోదకులు భీతిల్లారు. మద్యం ఎక్కడపడితే అక్కడ లభ్యం కావడం వల్లనే యువకులు అతిగా మద్యం సేవించి ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నట్లు స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు మత్తులో జోగుతున్న ఆ యువకుడిని అతికష్టంపై అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించారు. కొనదిన్నె కాలనీలో కార్డెన్ సెర్చ్ కావలి: మండలంలోని తుమ్మలపెంట రోడ్డు శివారు కొనదిన్నె గిరిజన కాలనీలో శనివారం తెల్లవారుజామున పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. 150పైగా నివాసాలను పరిశీలించడంతో పాటు సరైన పత్రాల్లేని 44 ద్విచక్ర వాహనాలు, మూడు ఆటోలను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ ఫిరోజ్ తెలిపారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. అక్రమ మద్యం, జూదం, బెట్టింగ్‌లు వంటి కార్యకలాపాలకు పాల్పడేవారి గురించి తమకు తెలియజేయాలన్నారు. -
వైద్య విద్యలో మరో ముందడుగు
నెల్లూరు (అర్బన్): నెల్లూరులోని ఏసీఎస్ఆర్ ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ఈ ఏడాది విద్యా సంవత్సరం నుంచి మరో 50 ఎంబీబీఎస్ సీట్లు పెరగడంతో 225 సీట్లు అందుబాటులోకి రానున్నాయి. జిల్లా ప్రజల చిరకాల కోరిక అయిన ప్రభుత్వ మెడికల్ కళాశాల నాటి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మంజూరు కాగా, 150 సీట్లతో 2014లో ప్రారంభమైంది. అయితే నాటి టీడీపీ ప్రభుత్వం కళాశాలలో తగిన వసతులు కల్పించకపోవడం, డాక్టర్లు, సిబ్బంది ఖాళీలను భర్తీ చేయకపోవడంతో నేషనల్ మెడికల్ కౌన్సిల్ అధికారులు తనిఖీ చేసి మెడికల్ సీట్లకు కోత పెట్టింది. తర్వాత ప్రభుత్వం వసతులు కల్పిస్తామని, ఎన్ఎంసీ నిబంధనలు పాటిస్తామని హామీ పత్రం ఇవ్వడంతో మెడికల్ కళాశాలలో సీట్ల కోత ఎత్తేశారు. ఇలా రెండు దఫాలు జరిగింది. 2019లో ముఖ్యమంత్రి అయిన వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం వైద్య రంగాన్ని ప్రక్షాళన చేసింది. ప్రభుత్వ మెడికల్ కళాశాల, అనుబంధ సర్వజన ఆస్పత్రిలో ఉన్న ఖాళీలను వరుస నోటిఫికేషన్లతో డాక్టర్లు, నర్సింగ్ సిబ్బందిని భర్తీ చేసింది. సిటీ, ఎంఆర్ఐ వంటి అత్యాధునిక వైద్య యంత్రాలను అందుబాటులోకి తెచ్చింది. మౌలిక వసతులు కల్పించారు. దీంతో మళ్లీ తనిఖీలకు వచ్చిన ఎన్ఎంసీ అధికారులు ఎంబీబీఎస్ సీట్లను 150 నుంచి 175కి పెంచింది. అదే సమయంలో పీజీ సీట్లను మంజూరు చేసింది. ఇప్పటి వరకు 2015, 2016, 2017, 2018, 2019, 2020, 2021లకు చెందిన 7 బ్యాచ్‌లు ఎంబీబీఎస్ పూర్తి చేసుకుని పట్టాలు అందుకున్నాయి. వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంలో చేపట్టిన సంస్కరణల ఫలితంగా తాజాగా మరో 50 మెడికల్ సీట్లు నెల్లూరు వైద్యకళాశాలకు అదనంగా రానున్నాయి. ఫలితంగా రోగులకు నాణ్యమైన వైద్యం అందనుంది. 2023లో పీజీ కోర్సులు ప్రారంభం అన్ని రకాల వసతులు, ఫ్యాకల్టీలను అందుబాటులో తీసుకురావడంతో న్యూరాలజీ, యురాలజీ, న్యూరో సర్జరీ విభాగాలను మంజూరు చేసింది. గతంలో కేన్సర్ విభాగంలో ఒకే ఒక డాక్టరుండే వారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో కేన్సర్ విభాగంలో ముగ్గురు డాక్టర్లను నియమించారు. 2023 నుంచి ఎండీ, ఎంఎస్ వంటి ఎంబీబీఎస్ తర్వాత చదివే స్పెషాలిటీ పీజీ కోర్సులను ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో ప్రారంభించారు. దీంతో రోగులకు ఖరీదైన వైద్య సేవలు ఉచితంగా అందుబాటులోకి వచ్చా యి. క్రిటికల్ కేర్ యూనిట్, సెంట్రల్ ల్యాబ్ సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయి. ప్రభుత్వ మెడికల్ కళాశాల మెడికల్ కళాశాలలో ఈ ఏడాది నుంచి మరో 50 సీట్లు పెరుగుదల 150 నుంచి 225 మెడికల్ సీట్లకు ఎదిగిన కళాశాల 2023లో పీజీ కోర్సులను ప్రారంభించిన నాటి సర్కారు పూర్తి స్థాయిలో డాక్టర్లు, సిబ్బంది నియామకానికి చర్యలు నాటి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం తీసుకున్న చర్యలే నేటి ఫలితాలు 225 ఎంబీబీఎస్.. 55 పీజీ సీట్లతో.. ప్రభుత్వ మెడికల్ కళాశాల తగినంత మంది డాక్టర్లు, సిబ్బంది సంతృప్తి స్థాయిలో ఉండడంతో పాటు క్వార్టర్స్, హాస్టల్ వసతి, ఆధునిక భవనాలు అందుబాటులో ఉన్నాయి. గతంలో 800 నుంచి 1000 వరకు ఉండే ఓపీ ఇప్పుడు 1500 వరకు పెరిగింది. విషయాన్ని పరిశీలించిన ఎన్ఎంసీ అధికారులు మరో మెడికల్ సీట్లు పెంచేందుకు అంగీకరించింది. 150 సీట్లతో మొదలైన మెడికల్ కళాశాల క్రమేపి 225 సీట్లకు చేరుకోబోతోంది. అంతేకాకుండా 55 పీజీ సీట్లతో కళాశాల, ఆస్పత్రి నడుస్తున్నాయి. దీంతో రోగులకు నాణ్యమైన స్పెషాలిటీ వైద్య సేవలు అందించేందుకు వీలవుతోంది. నెల్లూరులోని ఏసీఎస్ఆర్ ప్రభుత్వ మెడికల్ కళాశాల మరో ముందడుగు వేసింది. 2019–24 మధ్య నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం తీసుకున్న చర్యల ఫలితంగా ఇప్పటికే ఎంబీబీఎస్‌లో 25 సీట్లు పెరగ్గా.. తాజాగా మరో 50 సీట్లు మంజూరుకు ఎన్ఎంసీ సంసిద్ధత వ్యక్తం చేసింది. ఆ ప్రభుత్వ హయాంలోనే 55 పీజీ సీట్లు అందుబాటులోకి రావడం గమనార్హం. టీడీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లు మెడికల్ కళాశాలలో వివిధ విభాగాల్లో ఖాళీలు భర్తీ చేయకపోవడంతో ఉన్న సీట్లను రద్దు చేస్తామని అప్పట్లో ఎన్ఎంసీ హెచ్చరించడం తెలిసిందే. 50 మెడికల్ సీట్లు పెరగనున్నాయి ప్రస్తుతం మెడికల్ కళాశాలలో 175 సీట్లు ఉన్నాయి. వీటిని 225 పెంచేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసి ఎన్ఎంసీకి పంపాం. అందుకు అవసరమైన ప్రాథమిక ఫీజును రూ. 5 లక్షలు ఎన్ఎంసీకి చెల్లించాం. త్వరలోనే అదనపు మెడికల్ సీట్లు మంజూరు కానున్నాయి. మెడికల్ సీట్లు పెరిగితే అందుకనుగుణంగా వైద్య సేవలు పెరుగుతాయి. నాణ్యమైన సేవలు రోగులకు అందుతాయి. – డాక్టర్ రాజేశ్వరి, ప్రిన్సిపల్, ఏసీఎస్ఆర్ ప్రభుత్వ మెడికల్ కళాశాల -
డ్రైవర్ నిద్రమత్తు.. బస్సు బోల్తా
● ఐదుగురికి గాయాలు ● త్రుటిలో తప్పిన పెను ప్రమాదం మర్రిపాడు: మండలంలోని సింగనపల్లి సమీపంలో 565 జాతీయ రహదారిపై కార్మికులతో వెళ్తున్న బస్సు బోల్తా పడిన ఘటన శనివారం తెల్లవారుజామున జరిగింది. పోలీసుల కథనం మేరకు.. పశ్చిమబెంగాల్‌కు చెందిన 46 మంది కార్మికులు శ్రీసత్యసాయి జిల్లాలోని ఓ కంపెనీలో పనిచేస్తున్నారు. వీరు ఇటీవల అక్కడి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు స్వగ్రామాలకు వెళ్లారు. తిరుగు ప్రయాణంలో ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో వస్తుండగా, సింగనపల్లి సమీపంలో డ్రైవర్ నిద్రమత్తులోకి జారుకోవడంతో బస్సు అదుపుతప్పి రహదారి పక్కకు దూసుకెళ్లి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఐదుగురు కార్మికులు గాయపడగా, వారిని స్థానికులు, పోలీసులు కలిసి వెంటనే బద్వేలు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న ఆత్మకూరు సీఐ గంగాధర్, ఎంవీఐ రాములు, మర్రిపాడు ఎస్సై శ్రీనివాసరావు ఘటనా స్థలానికి చేరుకుని 46 మందిని ప్రైవేట్ వాహనంలో తరలించారు. ప్రమాదానికి సంబంధించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. -
భారత రాజ్యాంగ ఫలాలు అందరికీ అందాలి
● జస్టిస్ చంద్రు నెల్లూరు (వీఆర్సీసెంటర్): భారత లౌకిక రాజ్యాంగంలోని ఫలాలు దేశ పౌరులందరికీ అందాలని తమిళనాడు హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ చంద్రు అన్నారు. నగరంలోని జెట్టి శేషారెడ్డి విజ్ఞాన కేంద్రంలో శనివారం ఆవాజ్ 3వ రాష్ట్ర మహాసభలు ప్రారంభమయ్యాయి. రెండు రోజుల పాటు నిర్వహించే ఈ సభల్లో మొదటి రోజు శనివారం ఆవాజ్ పతాకాన్ని ఆవాజ్ సీనియర్ నాయకులు రియాజ్, ఎస్ఎం బాషా ఆవిష్కరించారు. అనంతరం ‘భారతరాజ్యాంగం– లౌకిక వాదం ఎదుర్కొంటున్న సవాళ్లు’ అనే అంశంపై జరిగిన సదస్సులో జస్టిస్ చంద్రు మాట్లాడుతూ నేడు దేశంలో లౌకికవాదం చాలా ప్రమాదంలో ఉందన్నారు. అయితే కుల, మతాలకు అతీతంగా అందరూ కలిసి నేడు భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. నేడు కేంద్ర ప్రభుత్వం విభజన రాజకీయాలు చేస్తోందని ఆరోపించారు. రానున్న రోజుల్లో లౌకికవాదాన్ని కాపాడుకునేందుకు ఆవాజ్ మహాసభల్లో చర్చించి తీర్మానాలు చేయా లని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రహ్మణ్యం, ఆవాజ్ జిల్లా కార్యదర్శి రషీద్, ఆవాజ్ రాష్ట్ర, జిల్లా నా యకులు డాక్టర్ రఫీ, జాషువా, డాక్టర్ ఖాజారసూల్, ససుభాహాన్, చిష్టి, సీఐటీయూ నాయకులు ఉమామహేశ్వ రరావు, రఫీ తదితరులు పాల్గొన్నారు. -
నెల్లూరులో పట్టపగలు భారీ చోరీ
● రూ.15 లక్షల నగదు, 183 గ్రాముల బంగారం అపహరణ నెల్లూరు(క్రైమ్): ఇంట్లో ఎవరూ లేని సమయంలో గుర్తుతెలియని దుండగులు రూ.15 లక్షల నగదు, 183 గ్రాముల బంగారు ఆభరణాలను అపహరించిన ఘటన శుక్రవారం పట్టపగలు చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. మనుమసిద్ధి నగర్లో మహేశ్వరి కుటుంబం అద్దె ఇంట్లో నివాసం ఉంటోంది. ఆమె భర్త రెండేళ్ల క్రితం మృతిచెందాడు. నెల్లూరులో ఇల్లు కొనుక్కునేందుకు గానూ తనకున్న ఆస్తులను అమ్మగా సుమారు రూ.15 లక్షలు వచ్చాయి. వాటిని ఇంట్లోనే భద్రపరిచారు. గతనెల 30వ తేదీన తన సోదరి వివాహ నిమిత్తం ఆమె పిల్లలతో కలిసి కోడూరుపాడుకు వెళ్లారు. శుక్రవారం సాయంత్రం ఇంటి యజమానులు మిద్దైపెకి వెళ్లే గేటు తెరిచి ఉండటంతో అనుమానం వచ్చి పైకి వెళ్లిచూడగా మహేశ్వరి ఇంటి తలుపులు తెరిచి ఉన్నాయి. దీంతో ఆమెకు ఫోన్ చేసి సమాచారం అందించారు. బాధితురాలు బంధువులతో కలిసి ఇంటికి చేరుకుంది. బీరువాలోని నగదు, 183 గ్రాముల బంగారు ఆభరణాలు కనిపించలేదు. దీంతో చిన్నబజారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇన్స్పెక్టర్ చిట్టెం కోటేశ్వరరావు, ఎస్సై అబ్దుల్ రజాక్ ఘటనా స్థలాన్ని చేరుకుని పరిశీలించారు. క్లూస్‌టీమ్ వేలిముద్రలను సేకరించింది. ఇన్స్పెక్టర్ సాంకేతికత ఆధారంగా కేసు దర్యాప్తు చేపట్టారు. ఘటన జరిగిన ప్రాంతంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లోని సీసీ కెమెరాల ఫుటేజ్‌లను పరిశీలిస్తున్నారు. పక్కాగా రెక్కీవేసి నిందితులు చోరీకి పాల్పడినట్లు తెలుస్తోంది. -
రూ.3 కోట్ల భూమి హాంఫట్
కావలి రూరల్: కావలి మున్సిపాలిటీలో విలీనమైన ముసునూరులో భూముల ధరలకు రెక్కలొచ్చాయి. ఈ క్రమంలో ప్రభుత్వ భూములను కొందరు కబ్జాకోరులు ఆక్రమించి ఏకంగా ప్లాట్లుగా విభజించి విక్రయాలు చేస్తున్నారు. ఇప్పటికే మందాటి చెరువు, రాళ్లగుట్ట పోరంబోకు భూములు వందలాది ఎకరాలు కబ్జాకోరుల కబంధహస్తాల్లో చిక్కుకుంది. ఇంత జరుగుతున్నా.. సంబంధిత రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు భారీ మొత్తాల్లో ముడుపులు తీసుకుని చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సాక్షాత్తూ కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఇంటికి కూతవేటు దూరంలో సుమారు రూ.3 కోట్లు విలువైన భూమిని ఆక్రమించి పాట్లు వేసి విక్రయాలు చేయడంతో అక్కడ నిర్మాణాలు సాగుతున్నాయి. దాదాపు ఏడు దశాబ్దాల క్రితం పంచాయతీగా ఏర్పడిన ముసునూరు ఇటీవల కావలి మున్సిపాలిటీలో విలీనం అయింది. ఈ ప్రాంతం జాతీయ రహదారికి పక్కనే ఉండడంతోపాటు జీఎన్టీ రోడ్డుకు అటూఇటూగా ఉండడంతో ఇక్కడి స్థలాలు ఖరీదుగా మారాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. ప్రభుత్వ స్థలాలను కొంచెం కొంచెంగా ఆక్రమించుకుంటూ వస్తున్నారు. తాజాగా జీఎన్టీ రోడ్డుని ఆనుకొని ఉన్న అయ్యప్ప గుడి మెయిన్ రోడ్డు పక్కనే ఉన్న సర్వే నంబరు 911, 911/2లోని సుమారు 122 అంకణాలను ఆక్రమించారు. ఒక్కొక్కటి 12 అంకణాలుగా 10 ప్లాట్లుగా విభజించి అమ్మేశారు. ఇక్కడ అంకణం ధర సుమారు రూ.2.50 లక్షలపైమాటే. ఈ లెక్కన దీని విలువ సుమారు రూ.3 కోట్లకు పైనే ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. అయితే అక్రమార్కులు ఈ భూములను కావలిలో రిజిస్ట్రేషన్ చేయించుకుండా అల్లూరులో రిజిస్ట్రేషన్ జరిగినట్లు నకిలీ డాక్యుమెంట్లు సృష్టించినట్లు తెలుస్తోంది. అసలు సర్వే నంబర్లు కాకుండా 918/2, 920 నంబర్లతో రిజిస్ట్రేషన్ చేయించారు. ఇప్పటికే ఈ సర్వే నంబర్లకు పక్కనే ఉన్న సర్వే నంబరు 914లో మర్రిచెట్టు కాలనీలో చెరువు పోరంబోకు స్థలం ఉండగా దాన్నీ కబ్జాదారులు ఆక్రమించి గృహాలను నిర్మించుకున్నారు. రైల్వే ట్రాక్ నుంచి వరద నీరు పారే గుడ్డి తూము సర్వే నంబర్ 908లోని భూమి కూడా ఆక్రమణలకు గురికావడంతో పూర్తిగా కనుమరుగైంది. పై నుంచి వర్షపు వరదనీరు ప్రవహించేందుకు వీలుగా పూర్వీకులు నిర్మించిన ఈ కాలువను ఆక్రమించడంతో భారీ వర్షాలు కురిస్తే మర్రిచెట్టు సంఘం పూర్తిగా నీట మునిగే పరిస్థితి నెలకొందని గ్రామస్తులు వాపోతున్నారు. ఇప్పటికై నా సంబంధిత అధికారులు, పాలకులు ముసునూరులో జరుగుతున్న ప్రభుత్వ భూముల ఆక్రమణలపై దృష్టి సారించాలని స్థానికులు కోరుతున్నారు. ఇప్పటికే పలు సర్వే నంబర్లలో భూముల ఆక్రమణ, రిజిస్ట్రేషన్లు కబ్జా కోరల్లో మందాటి చెరువు, రాళ్లగుట్ట పోరంబోకు భూములు చోద్యం చూస్తున్న అధికారులు, పాలకులు -
ఉత్తరప్రదేశ్ యువకుడి దారుణ హత్య
చిల్లకూరు: పొట్టకూటి కోసం వేరే రాష్ట్రం నుంచి వచ్చిన ఓ యువకుడు హత్యకు గురయ్యాడు. ఈ ఘటన శుక్రవారం గూడూరు రూరల్ ప్రాంతంలోని చెన్నూరు గ్రామంలో వెలుగు చూసింది. పోలీసుల కథనం మేరకు.. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఐదుగురు యువకులు గూడూరు రూరల్ ప్రాంతంలోని కలర్ షైన్ పరిశ్రమలో పనిచేసేందుకు ఈనెల 5వ తేదీన మంగళవారం రాత్రి వచ్చారు. వీరిని పరిశ్రమలో లేబర్ కాంట్రాక్ట్ చేసే భానుప్రతాప్ సింగ్, అనిల్‌కుమార్ పిలిపించినట్లు సమాచారం. వారు యువకులకు చెన్నూరులో ఐఓబీ బ్యాంక్ సమీపంలో ఇల్లు అద్దెకు తీసిచ్చారు. 11వ తేదీ నుంచి పరిశ్రమలో విధుల్లో చేరాల్సి ఉంది. ఏమైందో.. 7వ తేదీ గురువారం రాత్రి యువకుల మధ్య ఏం జరిగిందో తెలియదు. శుక్రవారం ఉదయం ఇంటి యజమాని వెళ్లి చూసేసరికి సుమారు 20 ఏళ్ల వయస్సున్న యువకుడు రక్తమడుగులో పడి ఉన్నాడు. దీంతో పోలీసులకు సమాచారమిచ్చాడు. రూరల్ సీఐ కిశోర్‌బాబు, ఎస్సై తిరుపతయ్య ఘటనా స్థలాన్ని పరిశీలించి యువకుడి హత్య విషయంపై ఉన్నతాధికారులకు చెప్పారు. దీంతో ఏఎస్పీ సౌజన్య, ఇన్చార్జి డీఎస్పీ గిరిధర్, గూడూరు ఒకటో పట్టణ సీఐ శేఖర్‌బాబు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అనంతరం డాగ్ స్క్వాడ్, క్లూస్‌టీమ్‌ను పిలిపించారు. వేలిముద్రలు సేకరించారు. రూరల్ సీఐ మాట్లాడుతూ యువకుల మధ్య జరిగిన ఘర్షణల కారణంగానే హత్య జరిగి ఉండొచ్చన్నారు. హత్య జరిగిన గదిలో ఎలాంటి ఆధారాలు లేకుండా చేశారన్నారు. మృతుడికి చెందిన ఆధార్‌కార్డు తదితరాలను తీసుకెళ్లినట్లు వెల్లడించారు. దీంతో లేబర్ కాంట్రాక్టర్ల ద్వారా విషయం తెలుసుకుని బాధిత కుటుంబ సభ్యులకు సమా చారం అందిస్తామన్నారు. హత్యకు దారి తీసిన విషయాలను తెలుసుకోవడంతోపాటు మిగిలిన యువకుల ఆచూకీ కోసం గాలింపు చేపట్టామన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గూడూరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేశారు. పరిశ్రమలో పనిచేసేందుకు రాక సహచరులపై అనుమానం ఆధారాలు దొరక్కుండా చేసిన వైనం -
తగలబడిందా?.. తగలబెట్టారా?
● అల్లీపురం డంపింగ్ యార్డులో పెద్దఎత్తున మంటలు ● కార్పొరేషన్ సిబ్బందిపైనే అనుమానం ● గత 15 రోజులుగా పేరుకుపోయిన చెత్తనెల్లూరు సిటీ: నెల్లూరు రూరల్ పరిధిలోని అల్లీపురంలోని డంపింగ్ యార్డులో శుక్రవారం తెల్లవారుజామున పెద్దఎత్తున మంటలు చెలరేగాయి. దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే స్పందించి అగ్నిమాపక శాఖకు సమాచారమిచ్చారు. ఫైరింజిన్ అక్కడికి చేరుకుని మంటలు ఆ ర్పింది. ఇదిలా ఉండగా చెత్తను ఎవరైనా తగలబెట్టారా? లేదా తగలబడిందా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. నెల్లూరులోని డివిజన్ల నుంచి రోజూ చెత్తను ట్రాక్టర్ల ద్వారా డంపింగ్‌యార్డుకు తరలిస్తారు. అక్కడ్నుంచి టిప్పర్లు, కాంపాక్టర్ల ద్వారా దొంతాలి డంపింగ్ యార్డుకు పంపుతున్నారు. అయితే 15 రోజులుగా అల్లీపురం యార్డులో పెద్ద ఎత్తున పేరుకుపోయింది. ట్రాక్టర్ల ద్వారా చెత్తను తీసుకొచ్చినా లోపల వేయడానికి అవకాశం లేని పరిస్థితి ఏర్పడింది. లోపలున్న చెత్త బయటకు వెళ్లేందుకు టిప్పర్లను అధికారులు కేటాయించకపోవడం, కాంపాక్టర్లు సరిపోకపోవడంతో చెత్త టన్నుల్లో పేరుకుపోయింది. నగరం నుంచి వచ్చే ట్రాక్టర్లు రెండురోజులుగా రోడ్డు పక్కన నిలుపుతున్న పరిస్థితి ఉంది. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో సమస్య మరింత జఠిలమైంది. అనేక సందేహాలు అల్లీపురంలోని డంపింగ్ యార్డులోని చెత్తను దొంతాలికి తరలించే పరిస్థితి లేకపోవడంతో కార్పొరేషన్ సిబ్బంది చెత్తను తగలబెట్టారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కొన్నిరోజులుగా చెత్త లోపలికి వెళ్లలేని పరిస్థితిని బట్టి అనేకమంది ఈ అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం తెల్లవారుజామున జరిగిన ఘటనపై తీవ్ర చర్చ జరుగుతోంది. అయితే స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డంపింగ్ యార్డుకు సమీపంలో ఇళ్లు ఉన్నాయి. చెత్త తగలబడటంతో ఏదైనా ప్రమాదం చోటు చేసుకుంటే తమ పరిస్థితి ఏంటని కన్నీరుమున్నీరయ్యారు. మంత్రి నారాయణ హామీ ఏమైంది? అల్లీపురంలో డంపింగ్ యార్డును ఇక్కడ్నుంచి నెలల వ్యవధిలోనే తొలగిస్తామని మంత్రి నారాయణ గతేడాది మీడియా ముఖంగా హామీ ఇచ్చారు. అయితే అది మాటలకు పరిమితమైంది. ఆచరణలోకి రాలేదు. నెల్లూరు నుంచి అల్లీపురం వైపు వెళ్లే వాహనదారులు, ప్రజలు నిత్యం కంపును భరించలేక ఇబ్బంది పడుతున్నారు. పలుమార్లు రోడ్లపైనే చెత్త పేరుకుపోయిన సందర్భాలున్నాయి. కార్పొరేషన్ ఉన్నతాధికారులు ఏ మ్రాతం పట్టించుకున్న దాఖలాల్లేవు. -
డీసీపల్లిలో 318 పొగాకు బేళ్ల విక్రయం
మర్రిపాడు: మండలంలోని డీసీపల్లి పొగాకు బోర్డు వేలం కేంద్రంలో శుక్రవారం 318 బేళ్లను విక్రయించినట్లు వేలం నిర్వహణాధికారి సునీల్‌కుమార్ తెలిపారు. వేలానికి 413 బేళ్లు రాగా 318 బేళ్లను విక్రయించామని, మిగిలిన బేళ్లను వివిధ కారణాలతో తిరస్కరించినట్లు తెలిపారు. వేలంలో 43474.2 కిలోల పొగాకును విక్రయించగా రూ.9924534.60 వ్యాపారం జరిగింది. గరిష్టంగా కిలోకు రూ.250, కనిష్ట ధర రూ.210 లభించింది. సగటు ధర 228.29గా నమోదైంది. వేలంలో 8 కంపెనీల వ్యాపార ప్రతినిధులు పాల్గొన్నారు. ఔత్సాహిక మహిళా వ్యాపారవేత్తల గుర్తింపు నెల్లూరు(పొగతోట): ప్రతి గ్రామ సంఘం నుంచి 15 మంది ఔత్సాహిక మహిళా వ్యాపారవేత్తలను గుర్తించామని డీఆర్డీఏ పీడీ నాగరాజకుమారి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. వారికి శిక్షణ, నైపుణ్యం, రుణాలు మంజూరు చేసే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. అనంతరం మహిళల అర్హతను పరిశీలించి రుణాలు మంజూరు చేస్తామన్నారు. 2026 – 27 ఆర్థిక సంవత్సరం లక్ష్యాలను నిర్దేశిస్తామన్నారు. జిల్లాలోని 3,54,361 మంది గ్రూపు సభ్యులు ఉండగా 3,49,565 మందికి రుణాలు, జీవనోపాధుల సమాచారాన్ని సీఆర్పీలు నమోదు చేశారన్నారు. వార్షిక రుణాలు, జీవనోపాధుల ప్రణాళికలు 99 శాతం పూర్తయినట్లు వెల్లడించారు. వీఓఏ, సీసీ, ఏపీఎం లాగిన్‌లో సభ్యులకు మంజూరు చేయాల్సిన రుణాల వివరాలు బ్యాంక్‌ల వారీగా మ్యాప్ చేయడం జరుగుతుందని తెలిపారు. పేదల సొంతింటి కలలు కూటమి భగ్నం ● మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్‌రెడ్డి ఆత్మకూరు: రాష్ట్రంలో పేదల సొంతింటి కలలను సాకారం చేయడంలో కూటమి ప్రభు త్వం నిర్లక్ష్యం ధోరణి అవలంబిస్తోందని మాజీ ఎమ్మెల్యే మేక పాటి విక్రమ్‌రెడ్డి ధ్వజమెత్తారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నిధులను సకాలంలో వినియోగించకపోవడంతో పేదలకు అన్యాయం జరుగుతోందన్నారు. సొంతింటి కలలను భగ్నం చేస్తోందంటూ మండిపడ్డారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి కారణంగా సుమారు రూ.200 కోట్లు నిధులు వినియోగం కాకుండా నిలిచిపోయాయని మేకపాటి విమర్శించారు. పేదలు ఇప్పటికే నిర్మాణం చేపట్టిన ఇళ్లకు బిల్లులు మంజూరు చేయకుండా ఆలస్యం చేయడం అమానుషమన్నారు. గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో మంజూరైన ఇళ్లను కూడా పూర్తి చేయకుండా కూటమి ప్రభుత్వం అడ్డంకులు సృష్టిస్తోందని విమర్శించారు. అధికారులు రూపొందించిన ప్రణాళికలను కూడా పట్టించుకోకుండా, కేంద్ర నిధులను లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయాలన్న ప్రతిపాదనను ప్రభుత్వం పట్టించుకోకపోవడం దురదృష్టకరమన్నారు. దీని వల్ల పేదల ఇళ్ల నిర్మాణం నిలిచిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఇప్పటికే రూ.30 కోట్ల నుంచి రూ.50 కోట్ల వరకు పెండింగ్ బిల్లులు ఉన్నప్పటికీ వాటిని విడుదల చేయకుండా, నిధులను తిరిగి కేంద్రానికి పంపేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నదని ఆయన ఆరోపించారు. ఇది పేదల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని విమర్శించారు. శ్రీవారి దర్శనానికి 8 గంటలు తిరుమల: తిరుమలలో శుక్రవా రం భక్తుల రద్దీ మోస్తరుగా ఉంది. క్యూ కాంప్లెక్స్‌లోని 10 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. గురువారం అర్ధరాత్రి వరకు 70,001 మంది స్వామి వారిని దర్శించుకున్నారు. 30,085 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామి వారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.77 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టికెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 8 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు. -
వైభవంగా ధ్వజారోహణ
బుచ్చిరెడ్డిపాళెం: మండలంలోని జొన్నవాడలో కొలువైన మల్లికార్జున సమేత కామాక్షితాయి దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు శుక్రవారం ఉదయం ధ్వజారోహణతో వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆలయ అర్చకులు వేద మంత్రోచ్ఛారణల మధ్య ఈ ఘట్టాన్ని వైభవోపేతంగా నిర్వహించారు. ముందుగా గణపతి పూజ, స్వస్తి వాచనం, దేవత ఆహ్వానం, బేరి పూజలు నిర్వహించారు. అనంతరం ధ్వజ పటానికి ఆవాహన పూజ చేసి, ధ్వజ స్తంభానికి సంప్రోక్షణ చేశారు. మంగళహారతి, మంత్రపుష్పంతో కార్యక్రమం కొనసాగింది. స్వామివారి ధ్వజస్తంభం వద్ద నంది, త్రిశూలం, డమరుకం గుర్తులను ఏర్పాటు చేసి ధర్మసూత్రంతో ధ్వజారోహణ నిర్వహించారు. అమ్మవారి ధ్వజస్తంభం వద్ద సింహం, త్రిశూలం గుర్తులతో ధ్వజపటాన్ని ఆవాహన చేసి ధ్వజారోహణ చేశారు. ఈ కార్యక్రమానికి శివకుమార్ కుటుంబ సభ్యులు ఉభయకర్తలుగా వ్యవహరించారు. పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై స్వామి, అమ్మవార్లను దర్శించుకుని కోడి ముద్దల ప్రసాదాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ తిరువూరు అశోక్ రెడ్డి, సహాయ కమిషనర్ వెంకట శ్రీనివాసులురెడ్డి, పాలక మండలి సభ్యులు శివకృష్ణ, వరలక్ష్మి, చాముండేశ్వరి, ప్రత్యూష, శ్రీనివాసులు, సుధారాణి తదితరులు పాల్గొన్నారు. -
మీ న్యాయమే అంతిమతీర్పు కావాలి
● జిల్లా ప్రధాన న్యాయమూర్తి జీ శ్రీనివాస్ నెల్లూరు (లీగల్): జూనియర్ సివిల్ జడ్జిలుగా ఎంపికై న వారు ఇష్టంతో కష్టపడి పనిచేసి మంచి పేరు తెచ్చుకోవాలని, మీరు వెల్లడించే న్యాయమే అంతిమతీర్పు కావాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి శ్రీనివాస్ అన్నారు. ఇటీవల అదనపు జిల్లా న్యాయమూర్తులుగా నగరానికి బదిలీ అయిన న్యాయమూర్తులకు, ఇటీవల జూనియర్ సివిల్ జడ్జిలుగా ఎంపికైన నెల్లూరు బార్ అసోసియేషన్ సభ్యులకు శుక్రవారం బార్ అసోసియేషన్ సమావేశ మందిరంలో అభినందన కార్యక్రమం నిర్వహించారు. బార్ అధ్యక్షుడు పి. అయ్యప్పరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ ఉన్నత స్థాయికి ఎదగాలని ఆయన ఆకాంక్షించారు. జూనియర్ సివిల్ జడ్జిలుగా ఎంపికై న పెళ్లకూరు కృష్ణ ప్రియాంక దేవి, దర్శి వెంకటసత్య ధనుషా, దామరమడుగు దివ్యశ్రీ, బడుగు విశ్వజాహిందులను జిల్లా ప్రధాన న్యాయమూర్తి అభినందించారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు అయ్యప్పరెడ్డి మాట్లాడుతూ నలుగురు మహిళలు నెల్లూరు బార్ అసోసియేషన్ నుంచి జూనియర్స్ జడ్జిలుగా ఎంపిక కావడం గర్వ కారణమన్నారు. అనంతరం బార్ అసోసియేషన్ కమిటీ, పలువురు న్యాయవాదులు జూనియర్ సివిల్ జడ్జిలుగా ఎంపికై న నలుగురిని శాలువాలు జ్ఞాపకలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యుడు ఎస్.అంకయ్య, బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఎన్. నాగరాజు ఉపాధ్యక్షుడు జల్లి పద్మాకర్ సంయుక్త కార్యదర్శి కేఎల్‌నారాయణ కమిటీ సభ్యు లు, పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు. -
మెప్మా కార్యాలయం
నెల్లూరు (పొగతోట): జిల్లాలోని పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా)లో అవినీతి మాఫియా రాజ్యమేలుతోంది. పేద మహిళల ఆత్మ నిర్భరత కోసం ఏర్పాటు చేసిన మెప్మా విభాగాన్ని కొందరు అవినీతి సామ్రాజ్యాంగా విస్తరించారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గ్రూపు సభ్యులకు తెలియకుండానే బ్యాంకుల నుంచి భారీ మొత్తాల్లో రుణాలు మంజూరు చేయించడం, బినామీ గ్రూపులను సృష్టించి నిధులు కాజేయడం, ఆన్లైన్ నమోదు పేరుతో అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న అక్రమాలు వెలుగుచూస్తున్నాయి. కొన్ని నెలలుగా సుమారు రూ.100 కోట్లపైగా రుణాలు స్వాహా అయ్యాయన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయం కూటమి కీలక నేత వరకు వెళ్లినా మౌనం వహిస్తున్నట్లు సమాచారం. పొదుపు మహిళపై అవినీతి పంజా జిల్లాలోని నెల్లూరు నగర పాలక సంస్థతోపాటు కావలి, గూడూరు, ఆత్మకూరు, బుచ్చిరెడ్డిపాళెం మున్సిపాలిటీలు, అల్లూరు నగర పంచాయతీ పరిధిలో సుమారు 30 వేలకుపైగా పొదుపు గ్రూపులు మెప్మా ఆధ్వర్యంలో ఉన్నాయి. ఆయా గ్రూపుల్లో సుమారు 4 లక్షల మందికిపైగా మహిళలు సభ్యులుగా ఉన్నారు. మహిళా సాధికారత కోసం ఏటా బ్యాంక్ లింకేజీతో రూ.కోట్ల రుణాలు మంజూరు చేస్తున్నారు. గత ఆర్థిక సంవత్సరంలో రూ.518 కోట్లు రుణాలు మంజూరయ్యాయి. మహిళలు 10 మంది గ్రూపుగా ఏర్పడి బ్యాంకులో ఖాతాను ప్రారంభించి పొదుపు చేస్తారు. ఏ బ్యాంకులో అకౌంట్ ఉండి పొదుపు చేస్తున్నారో అదే బ్యాంకు ద్వారా సభ్యులకు రుణాలు మంజూరు చేయాల్సి ఉంటుంది. అయితే మెప్మాలో నిబంధనలకు విరుద్ధంగా గ్రూపుల పేరుతో అనేక బ్యాంక్‌ల్లో ఖాతాలు తెరిచి వందల కోట్ల రుణాలు మంజూరు చేయించడం గమనార్హం. ఇదిలా ఉంటే.. చాలా గ్రూపుల సభ్యులకు తెలియకుండానే రుణాలు మంజూరు చేయించి ఆ మొత్తాలను తమ ఖాతాలకు మళ్లించుకుని నిధులు స్వాహా చేసినట్లు ఇటీవల బ్యాంకుల నుంచి సదరు సభ్యులకు రుణాలు చెల్లించాలంటూ నోటీసులు పంపడంతో వెలుగులోకి వచ్చాయి. కొన్ని గ్రూపు సభ్యుల పేరుతో రుణాలు మంజూరు చేయించి.. తృణమో.. పణమో ఇచ్చి మిగతా డబ్బులను స్వాహా చేస్తున్నట్లు కూడా సమాచారం. తీసుకున్న రుణాలతో వడ్డీల వ్యాపారం గ్రూపు మహిళలు పొదుపు చేసుకుంటూ బ్యాంకుల ద్వారా రుణాలు పొందుతున్నారు. పట్టణాల్లో అధిక శాతం మంది పేద మహిళలు గ్రూపులకు దూరంగా జీవిస్తున్నారు. డబ్బులు ఉన్న మహిళలు, మధ్య తరగతి మహిళలు అధిక శాతం మంది గ్రూపుల్లో సభ్యులుగా కొనసాగుతున్నారు. పలుకుబడి కలిగిన వ్యక్తులు బ్యాంకుల నుంచి రూ.20 లక్షలు రుణంగా తీసుకుంటున్నారు. రుణం మంజూరు అయినట్లు గ్రూపుల్లో ఇతర మహిళలకు తెలియకుండా జాగ్రత్త పడుతున్నారు. తీసుకున్న రుణాన్ని వడ్డీలకు ఇవ్వడం, లేదా వ్యాపారంలో పెట్టుబడి పెట్టడం చేస్తున్నారు. మూడు రూపాయలు వడ్డీ వేసుకున్న నెలకు రూ.60 వేలు వస్తుంది. ఈ విధంగా సంపాదించే వారు పట్టణాల్లో అధిక శాతం ఉన్నారు. బ్యాంక్ మేనేజర్న్యాయ పోరాటం చేద్దాంపొదుపు గ్రూపుఆన్లైన్ పేరుతో దోపిడీ గ్రూపు సభ్యుల వివరాలు ఆన్లైన్ నమోదు ప్రక్రియ జరుగుతోంది. వివరాలు ఆన్లైన్ చేయడానికి వేలకు వేలు డిమాండ్ చేస్తున్నారని సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై మహిళ సభ్యులు కలెక్టర్ హిమాన్షు శుక్లాకు ఫిర్యాదు చేశారు. ఆన్లైన్లో పేర్లు వివరాలు నమోదు చేయకపోతే రుణాలు, సంక్షేమ కార్యక్రమాలు ఏవీ అందవని ప్రచారం చేశారు. దీంతో మహిళలు వారి వారి వివరాలను తప్పనిసరిగా నమోదు చేయించుకోవాల్సిన పరిస్థితి ఉంది. నగదు ఇవ్వనిదే సిబ్బంది ఆన్లైన్లో వివరాలు నమోదు చేయడంలేదు. గ్రూపు మహిళల పూర్తి వివరాలు, బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాల వివరాలు, బకాయిలు పూర్తి వివరాలు ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. దీనికి సంబంధించి మెప్మా సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇచ్చి వివరాలు ఆన్లైన్లో నమోదు చేయిస్తున్నారు. ఉచితంగా చేయాల్సిన ప్రక్రియకు నగదు డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. రూ.100 కోట్లకు పైగా పొదుపు గ్రూపుల పేరిట స్వాహా? సంఘాల సభ్యులకు తెలియకుండానే రుణాలు భారీ ఎత్తున బినామీ గ్రూపులు ఏర్పాటు చేసినట్లు అనుమానాలు బ్యాంక్ మేనేజర్లు, ఫీల్డ్ అసిస్టెంట్లతో కలిసి అక్రమాలు రుణ బకాయిలు చెల్లించాలంటూ నోటీసులివ్వడంతో అవినీతి బట్టబయలు ఎన్ఓసీ లేకుండానే రుణాలు వాస్తవానికి బ్యాంకు రుణాలు మంజూరు చూసే క్రమంలో నో అబెక్షన్ సర్టిఫికెట్ తీసుకుంటారు. అయితే ఇందుకు భిన్నంగా నగరంలోని మెప్మా సిబ్బంది, అధికారులు, గ్రూపు సభ్యులు కుమ్మకై ఎన్ఓసీలు లేకుండానే, నెల్లూరు నగర పరిధిలో బినామీ గ్రూపులు ఏర్పాటు చేసి రూ.కోట్ల స్వాహా చేసినట్లు సమాచారం. ఇలాంటి విషయాలు బయటకు పొక్కడంతో సిబ్బందిని మార్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఆయా డివిజన్లల్లో కూటమి నేతలు వారికి అవసరమైన, అనుకూలంగా ఉండే వారి వివరాలను కీలక నేత సతీమణికి అప్పగించారు. పాత సిబ్బందిని తొలగించి కొత్త వారిని తీసుకునేందుకు అప్పటి అధికారుల వద్ద చర్చలు జరిగాయి. ఏమి జరిగిందో తెలియదు.. తిరిగి పాత వారినే కొనసాగిస్తున్నారు. ఈ విషయంలో కోట్ల రూపాయలు చేతులు మారాయని, దీంతో ఎవరిపైనా చర్యలు తీసుకోకుండా మౌనం వహిస్తున్నారని విమర్శలు ఉన్నాయి. ఈ విషయంపై అనేక మంది ఆర్టీఐ యాక్ట్ ద్వారా ఎన్ఓసీలు ఎంత ఎన్ని గ్రూపులకు ఇచ్చారు వివరాలు అడిగితే అధికారులు తప్పుడు సమాచారం ఇవ్వడం గమనార్హం. బ్యాంకు అధికారుల నుంచి మౌనమే సమాధానంగా కనిపిస్తోంది. పరిశీలించి చర్యలు తీసుకుంటాం గ్రూపులకు అకౌంట్ ఉన్న బ్యాంకుల నుంచి మాత్రమే రుణాలు మంజూరు చేయడం జరుగుతుంది. గ్రూపునకు ఒక బ్యాంకులోనే అకౌంట్ ఉంటుంది. ఒకే గ్రూపు రెండు, మూడు బ్యాంకుల్లో రుణాలు తీసుకోవడంపై పరిశీలిస్తాం. గతంలో ఈ విషయానికి సంబంధించి ఏదైనా ఫైల్ పెట్టారో లేదో చూస్తాను. పూర్తి స్థాయిలో పరిశీలించి చర్యలు తీసుకుంటాం. – కిరణ్‌కుమార్, మెప్మా పీడీ -
విజయవాడ ప్రజాప్రతినిధుల స్పెషల్ కోర్టుకు కాకాణి కేసు బదిలీ
● కోర్టు విచారణకు గోవర్ధన్‌రెడ్డి హాజరు నెల్లూరు (లీగల్): సోమిరెడ్డి అక్రమాస్తులను కలిగి ఉన్నాడంటూ మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి ఆరోపణలు చేసిన నేపథ్యంలో టీడీపీ ప్రభుత్వంలో అధికారాన్ని అడ్డు పెట్టుకుని 2017లో ఆయనపై నమోదైన కేసులో ఎగ్జామినేషన్ పూర్తి కావడంతో నెల్లూరు నాలుగో అదనపు జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టు న్యాయమూర్తి నిసాద్నాజ్ షేక్ కేసును విజయవాడ ప్రజాప్రతినిధుల స్పెషల్ కోర్టుకు పంపుతూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కేసు విచారణకు కాకాణితోపాటు పసుపులేటి చిరంజీవి, వెంకటకృష్ణన్, హరిహరణ శుక్రవారం హాజరయ్యారు. ఈ కేసులో పోలీసులు దాఖలు చేసిన చార్జిషీట్లోని అభియోగాలను న్యాయమూర్తి నిసాద్నాజ్ షేక్ తెలుగులో చదివి వినిపించారు. ఈ సందర్భంగా తనపై తప్పుడు ఆరోపణలతో కేసు నమోదు చేశారని కాకాణి న్యాయమూర్తికి వివరించారు. ఈ మేరకు కేసును విజయవాడ ప్రత్యేక కోర్టుకు బదిలీ చేశారు. సోమిరెడ్డి తాతలు దిగి రావాలి ‘సోమిరెడ్డి అనే వాడు ఓ అవినీతి పరుడు. కాకాణిపై తప్పుడు కేసులు పెట్టించి ఆయనేదో నిజాయితీ పరుడన్నట్లు తనకు తానే డబ్బా కొట్టుకుంటున్నాడు. మాజీ కాకాణి గోవర్ధన్‌రెడ్డిపై పెట్టిన తప్పుడు కేసులను సోమిరెడ్డి కాదు కదా.. ఆయన తాతలు దిగొచ్చినా నిరూపించలేరు. తప్పుడు కేసులకు భయపడే పిరికి తనం కాకాణిలో లేదు. దమ్ముగా ధైర్యంగా ఎదుర్కొంటారు.’ అని ఆయన అనుచరులు స్పష్టం చేశారు. వివరాల్లోకి వెళ్తే.. సోమిరెడ్డికి ఇతర దేశాల్లో అక్రమ ఆస్తులు ఉన్నాయని కాకాణి మీడియా సమావేశంలో ఆరోపించారు. అయితే సోమిరెడ్డి తనకు అక్రమ ఆస్తులు లేవని నిరూపించుకోలేక 2017లో కాకాణి పై తప్పుడు కేసు బనాయించారు. కేసు పూర్వాపరాలు పరిశీలించిన నాటి పబ్లిక్ ప్రాసిక్యూటర్లు కేసుకు విచారణ అర్హత లేదని ప్రభుత్వానికి నివేదించి, కేసును తీసివేయాలంటూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ క్రమంలో కేసుకు సంబంధించిన ఫైళ్లు దొంగతనానికి గురయ్యాయి. అయితే సోమిరెడ్డి పదే పదే కోర్టులో ఫైళ్లు గల్లంతు విషయమై కాకాణి పాత్ర ఉన్నట్లు విష ప్రచారం చేశారు. పచ్చమీడియా సైతం అత్యుత్సాహంతో చిలువలు పలువులుగా కథనాలు వండి వార్చింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉందని రాష్ట్ర ప్రభుత్వం దర్యాప్తు చేస్తే నిజానిజాలు వెల్లడి కావంటూ గగ్గొలు పెట్టింది. సీబీఐ విచారణలో క్లీన్ చిట్ కోర్టులో ఫైళ్ల మిస్సింగ్ కేసులో ఉన్నత న్యాయస్థానం సీబీఐను విచారణ జరిపి నిజానిజాలు నిగ్గు తేల్చాలని ఆదేశించింది. సుమారు ఏడాది పాటు సీబీఐ విచారణ చేపట్టి చివరకు కాకాణికి కోర్టులో ఫైళ్ల మిస్సింగ్‌లో పాత్ర లేదని క్లీన్ చిట్ ఇచ్చింది. అయితే పచ్చ మీడియా సాక్షాత్తు సీబీఐ దర్యాప్తు పైనా అనేక అనుమానాలు వ్యక్తం చేస్తూ, కథనాలు వండి వార్చింది. ఈ నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించి ప్రాథమిక విచారణ జిల్లా కోర్టులో శుక్రవారం విచారణ ఉండడంతో కాకాణి కోర్టుకు రానున్నారని తెలిసి పచ్చ మీడియా ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు కోర్టు ప్రాంగంణంలో పడిగాపులు పడ్డారు. వీరిని న్యాయవాదులతోపాటు కోర్టుకు వచ్చిన వారందరూ చూసి ఏం ఖర్మరా బాబు మీకు అంటూ మాట్లాడడం గమనార్హం. చివరకు కేసును విజయవాడ ప్రజాప్రతినిధుల స్పెషల్ కోర్టుకు బదిలీ చేశారని తెలుసుకుని నిట్టూర్పులతో పచ్చమీడియా వెనుదిరిగింది. -
ట్రాక్టర్ బోల్తా పడి డ్రైవర్ మృతి
సంగం: కంకర లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ అదుపుతప్పి చెరువులో బోల్తాపడి డ్రైవర్ మృతిచెందిన ఘటన శుక్రవారం మండలంలోని వంగల్లు గ్రామ సమీపంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. తిరువీధిపాడు గ్రామం నుంచి సంగం వైపు కంకర లోడుతో ట్రాక్టర్ వెళ్తోంది. ఈ క్రమంలో అదుపుతప్పి చెరువులో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ కాశీపాళేనికి చెందిన షేక్ సుభాని (48) మృతిచెందాడు. సమాచారం అందుకున్న సంగం ఎస్సై రాజేష్ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని బయటకు తీయించారు. కేసు నమోదు చేశారు. -
సీఆర్పీఎఫ్ ఏఎస్సైకు కన్నీటి వీడ్కోలు
మర్రిపాడు: మండలంలోని సింగనపల్లి గ్రామానికి చెందిన సీఆర్పీఎఫ్ ఏఎస్సై ఎన్.శేఖర్‌రెడ్డి గురువారం ఆకస్మికంగా మృతిచెందాడు. శుక్రవారం స్వగ్రామంలో అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలను నిర్వహించారు. సీఆర్పీఎఫ్ ఉన్నతాధికారులు, సిబ్బంది గౌరవ వందనం సమర్పించి నివాళులర్పించారు. మర్రిపాడు ఎస్సై శ్రీనివాసరావుతోపాటు పలువురు అధికారులు అంత్యక్రియలకు హాజరయ్యారు. శేఖర్‌రెడ్డి పార్థివదేహానికి వైఎస్సార్సీపీ నాయకుడు గంగవరపు శ్రీనివాసులు నాయుడు, మండల యువత అధ్యక్షుడు చండ్ర నారాయణస్వామి, విద్యార్థి విభాగం మండలాధ్యక్షుడు గంగినేని విజయ్‌కుమార్, స్థానిక నాయకులు గోపవరం కాశిరెడ్డి, కాసాల శ్రీను, బాలకృష్ణ, రసూల్ సాహెబ్, చల్లా వెంకటేశ్వర్లురెడ్డి, రేవూరు రామకృష్ణారెడ్డి, అయ్యవారయ్య నివాళులర్పించారు. -
దోపిడీ కేసులో నిందితుల అరెస్ట్
● వెలుగులోకి దొంగతనాలు ● రూ.7 లక్షల సొత్తు స్వాధీనం నెల్లూరు(క్రైమ్): దోపిడీ కేసులో నిందితులను పోలీసులు విచారించే క్రమంలో కారు, ఇంట్లో దొంగతనం కేసులు వెలుగులోకి వచ్చాయి. దీంతో నిందితులను అరెస్ట్ చేసి సుమారు రూ.7 లక్షలు విలువైన చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. నెల్లూరు నగర ఏఎస్పీ దీక్ష, చిన్నబజారు ఇన్స్పెక్టర్ చిట్టెం కోటేశ్వరరావుతో కలిసి తన కార్యాలయంలో గురువారం నిందితుల వివరాలను వెల్లడించారు. చిట్వేలు మండలం బక్రాపురం కొత్తపల్లికి చెందిన ఈశ్వరయ్య ఈనెల రెండో తేదీ తెల్లవారుజామున నెల్లూరు ఆర్టీసీ బస్టాండ్ బయట ఉండగా నలుగురు వ్యక్తులు కారులో వచ్చారు. ఎక్కడికి వెళ్లాలని ఈశ్వరయ్యను అడగ్గా చిట్వేలని చెప్పాడు. వారు తాము కడపకు వెళ్తున్నామని వస్తే వదిలిపెడతామని ఆయన్ను కారులో ఎక్కించుకున్నారు. కొద్దిదూరం తీసుకెళ్లి కత్తితో చంపుతామని బెదిరించి రూ.7,200 నగదు, సెల్‌ఫోన్ దోచుకెళ్లారు. ఈశ్వరయ్య ఫిర్యాదు మేరకు చిన్నబజారు పోలీసులు కేసు నమోదు చేశారు. దొంతాలి క్రాస్‌రోడ్డు వద్ద.. ఇన్స్పెక్టర్ నేతృత్వంలో ఎస్సై అయ్యప్ప తన సిబ్బందితో కలిసి సాంకేతికత ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. సీసీ కెమెరాల ఫుటేజీల ఆధారంగా నిందితులు తిరుపతి కొర్లగుంటకు చెందిన ఎస్.మోహిత్‌సాయి, చంద్రగిరి మండలానికి చెందిన ఎస్.జయకుమార్, వైఎస్సార్ కడప జిల్లా పులివెందుల ప్రాంతానికి చెందిన పాతనేరస్తుడు పి.రాజా, ప్రకాశం జిల్లా రాచర్ల మండలం రామాపురానికి చెందిన ఎం.వెంకటరమణారెడ్డిగా గుర్తించి గాలింపు చర్యలు చేపట్టారు. బుధవారం వారిని దొంతాలి క్రాస్‌రోడ్డు వద్ద అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. విచారించగా దోపిడీ కేసుతోపాటు తిరుపతి తూర్పు అర్బన్ పోలీస్‌స్టేషన్ పరిధిలో షిఫ్ట్ డిజైర్ కారు, వేదాయపాళెం స్టేషన్ పరిధిలోని శ్రీలంక కాలనీలో ఇంట్లో దొంగతనం చేసినట్లు అంగీకరించారు. దీంతో నిందితులని అరెస్ట్ చేసి దోపిడీ కేసులోని రూ.7,200ల నగదు, కారు, ఇంటి దొంగతనం కేసులోని 22.230 గ్రాముల బంగారు ఆభరణాలు, 50 గ్రాముల వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నామని ఏఎస్పీ చెప్పారు. రాజాపై వేంపల్లి పోలీస్‌స్టేషన్‌లో సస్పెక్ట్ షీట్ ఉందని తెలిపారు. నిందతులని అరెస్ట్ చేయడంలో ప్రతిభ చూపిన ఇన్స్పెక్టర్, ఎస్సై, క్రైమ్ పార్టీ హెచ్‌సీ జె.సురేష్‌బాబు, పీసీలు ఎస్వీ శ్యామ్, ఎం.సుబ్బారావు, సీహెచ్కె.వర్ధన్, ఎన్.దయాశంకర్, కె.వేణు, కె.దేవానాయుడిని ఏఎస్పీ అభినందించారు. -
ట్రాక్టర్లో వెళ్తుండగా..
● కిందపడి మున్సిపల్ కార్మికుడి మృతి ఆత్మకూరు: పారిశుద్ధ్య కార్మికుడు ట్రాక్టర్ పైనుంచి జారిపడి మృతిచెందిన ఘటన ఆత్మకూరులో చోటు చేసుకుంది. మృతుడి కుటుంబీకులు, మున్సిపల్ కార్మికుల వివరాల మేరకు.. అనంతసాగరం మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన చిచ్చు మల్లికార్జున (32) ఆత్మకూరులో వివాహం చేసుకుని ఇక్కడే నివాసముంటున్నాడు. ఆప్కాస్ ద్వారా మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుడిగా నియమింపబడి పనిచేస్తున్నాడు. గురువారం చెత్త సేకరించిన ట్రాక్టర్ బైపాస్ రోడ్డులోని డంపింగ్ యార్డు వద్ద అన్లోడ్ చేసి తిరిగి వస్తుండగా ట్రాక్టర్‌పై నుంచి జారిపడ్డాడు. దీంతో తలకు తీవ్ర గాయమై కోమాలోకి చేరుకున్నాడు. ట్రాక్టర్ డ్రైవర్, మరో కార్మికుడు పరిశీలించి వెంటనే మల్లికార్జునను ఆత్మకూరు ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఎక్స్‌గ్రేషియా చెల్లించాలి మృతుని కుటుంబానికి రూ.50 లక్షలు ఎక్స్‌గ్రేషి యా చెల్లించాలని, బాధిత కుటుంబంలో ఒకరికి ఆప్కాస్ ద్వారా ఉద్యోగం కల్పించాలని సీఐటీయూ నాయకులు డిమాండ్ చేశారు. మున్సిపల్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. కమిషనర్ సి.గంగాప్రసాద్ అక్కడికి చేరుకుని ప్రభుత్వ ఆర్థిక సాయం త్వరలోనే అందేలా చూస్తామని హామీ ఇవ్వడంతో వారు ధర్నా విరమించారు. -
గడ్డివాములు దగ్ధం
● రూ.10 లక్షల నష్టంచేజర్ల: మండలంలోని మడపల్లి గ్రామంలో బుధవారం అర్ధరాత్రి అగ్ని ప్రమాదం జరిగింది. ఇందులో గ్రామానికి చెందిన పొదలకూరు శ్రీనివాసులు, పుట్లూరు కామయ్య, ఈగ భాస్కర్‌రెడ్డి, పొదలకూరు రమణయ్యకు చెందిన ఆరు గడ్డివాములు దగ్ధమయ్యాయి. అందరూ నిద్రలో ఉండగా ఒకసారిగా మంటలు చెలరేగి గడ్డివాములు తగలపడటంటంతో రైతులు గమనించి ఆత్మకూరు ఫైర్ స్టేషన్‌కు సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేసినప్పటికీ గడ్డి మొత్తం కాలిపోయింది. దీంతో రూ.10 లక్షల నష్టం వాటిలినట్లుగా చెబుతున్నారు. ప్రమాదవశాత్తు జరిగిందా లేదా ఆకతాయిలు చేశారా అనే కోణంపై పోలీసులు విచారణ చేపట్టారు. బాధితులు పలువురిపై అనుమానం వ్యక్తం చేస్తున్నట్లు తెలిసింది. కాగా గత సంవత్సరం కూడా గ్రామంలో ఇదే విధంగా గడ్డివాములు దగ్ధమైన ఘటన జరిగి ఉంది. ఏది ఏమైనా మూగజీవాలు తినాల్సిన పశుగ్రాసం అగ్నికి ఆహుతవడంతో బాధిత రైతులు ఆందోళన చెందుతున్నారు. బోధనా సిబ్బంది నియామక నోటిఫికేషన్లు రద్దు వెంకటాచలం: విక్రమ సింహపురి యూనివర్సిటీలో 2023 సంవత్సరంలో విడుదల చేసిన బోధనా సిబ్బంది నియామక నోటిఫికేషన్లను రద్దు చేసినట్లు వర్సిటీ ఇన్చార్జి రిజిస్ట్రార్ డాక్టర్ కె.సునీత గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. విశ్వవిద్యాలయ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ తీర్మానం, జీఓ ప్రకారం యూనివర్సిటీలోని 106 ఖాళీ అధ్యాపక పోస్టుల భర్తీకి గతంలో ఇచ్చిన అనుమతిని ప్రభుత్వం ఉపసంహరించుకుందన్నారు. అభ్యర్థులకు దరఖాస్తు రుసుము తిరిగి చెల్లింపునకు సంబంధించిన వివరాల కోసం విశ్వవిద్యాలయ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలని తెలియజేశారు.ప్రమాదవశాత్తు కిందపడి..● యువకుడి మృతి నెల్లూరు(క్రైమ్): పిట్టగోడపై కూర్చొని నీళ్లు తాగుతుండగా ప్రమాదవశాత్తు కిందపడి ఓ యువకుడు మృతిచెందాడు. పోలీసుల కథనం మేరకు.. నెల్లూరు గాయత్రినగర్ రెండో వీధిలో పవన్ సాయికుమార్ (26) తన భార్య, తల్లి, సోదరితో కలిసి నివాసం ఉంటున్నాడు. అతను నగరంలోని ఓ ప్రముఖ వస్త్ర షోరూమ్‌లో పనిచేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. భార్య గర్భవతి కావడంతో బుధవారం రాత్రి ఇంట్లోనే సీమంతం చేశారు. అనంతరం సాయి బంధువులతో కలిసి మిద్దైపె నిద్రపోయాడు. గురువారం తెల్లవారుజామున ఇంట్లోకి వచ్చి వాటర్ బాటిల్ తీసుకుని మెట్లెక్కి మిద్దైపెకి వెళ్లాడు. మెట్ల చివరన ఉన్న పిట్టగోడపై కూర్చొని నీళ్లు తాగుతుండగా ప్రమాదవశాత్తు కిందపడడంతో తలకు తీవ్రగాయమైంది. ఈ విషయాన్ని గమనించిన కుటుంబ సభ్యులు సాయికుమార్‌ను 108 అంబులెన్స్‌లో చికిత్స నిమిత్తం జీజీహెచ్‌కు తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. ఈ మేరకు మృతుడి తల్లి రత్నమ్మ దర్గామిట్ట పోలీసులకు ఫిర్యాదు చేయగా మృతదేహాన్ని మార్చురీకి తరలించి కేసు నమోదు చేశారు. ప్రత్యేక నోడల్ అధికారిగా కలెక్టర్నెల్లూరురూరల్: రాష్ట్ర సచివాలయంలో గురువారం నిర్వహించిన సదస్సులో కలెక్టర్ హిమాన్షు శుక్లా పాల్గొన్నారు. ఆయన్ను భూ వివాదాల పరిష్కారానికి ప్రత్యేక నోడల్ అధికారిగా సీఎం చంద్రబాబు నియమించారు. -
ప్రభుత్వాస్పత్రుల్లో మెరుగైన సేవలందించాలి
● స్టేట్ విజిలెన్స్ జాయింట్ కమిషనర్ డీసీకే నాయక్ పొదలకూరు : ప్రభుత్వాస్పత్రుల్లో రోగులకు మెరుగైన వైద్య సేవలను అందించాలని స్టేట్ విజిలెన్స్ జాయింట్ కమిషనర్ డీసీకే నాయక్ అన్నారు. పొదలకూరు సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని గురువారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులను తనిఖీ చేసి మందుల స్టాక్‌ను పరిశీలించారు. సీహెచ్‌సీలో రోగులకు అందిస్తున్న సేవలు, సౌకర్యాలు, కాన్పులు, కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలపై ఆరాతీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీహెచ్‌సీలో సౌకర్యాలు మెరుగ్గా ఉన్నాయన్నారు. సీహెచ్‌సీలో సర్జన్ పోస్టు ఖాళీగా ఉందన్నారు. ప్రస్తుతం సీహెచ్‌సీని 30 పడకల నుంచి 50 పడకలకు అప్‌గ్రేడ్ చేసేందుకు సిఫార్సు చేస్తామన్నారు. 50 పడకల ఆస్పత్రిగా మార్చితే మరికొన్ని వైద్యనిపుణుల పోస్టులు మంజూరయ్యేందుకు అవకాశం ఉంటుందన్నారు. సీహెచ్‌సీలోని వైద్యసేవలపై పూర్తి నివేదికను రూపొందించి ప్రభుత్వానికి సమర్పిస్తామని తెలిపారు. ఆయన వెంట డీసీహెచ్ఎస్ డాక్టర్ పరిమళ, సూపరింటెండెంట్ డాక్టర్ ప్రసాద్, వైద్యాధికారులు ఉన్నారు. -
మాతృ, శిశు ఆరోగ్య సేవలకు కిమ్స్‌లో ప్రాధాన్యం
నెల్లూరు(అర్బన్): మాతృ, శిశు ఆరోగ్య సేవలకు అత్యంత ప్రాధాన్యమిస్తూ నాణ్యమైన వైద్య సేవలందించేందుకు కిమ్స్ కడల్స్ విభాగాన్ని ప్రారంభిస్తున్నామని కిమ్స్ స్పెషాలిటీ ఆస్పత్రి యూనిట్ హెడ్ డాక్టర్ రోహిణి ప్రియలక్ష్మి తెలిపారు. గురువారం ఆమె వివరాలను హాస్పిటల్లో వివరించారు. హైరిస్క్ ప్రెగ్నెన్సీ మేనేజ్మెంట్, ఆధునిక ఎన్ఐసీయూ (నియోనేటల్), 24 గంటలు అత్యవసర సేవలు అందించడం జరుగుతుందన్నారు. తల్లీశిశువు సురక్షితంగా ఉండేందుకు ఆధునిక లేబర్ రూమ్స్, అత్యాధునిక వైద్యపరికరాలు, భద్రతా ప్రమాణాలతో కిమ్స్ కడల్స్ విభాగాన్ని ఏర్పాటు చేశామన్నారు. కిమ్స్ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ బి.భాస్కర్‌రావు ఆధ్వర్యంలో వైద్యుల సమక్షంలో శనివారం ప్రత్యేక విభాగాన్ని ప్రారంభిస్తామన్నారు.జనారణ్యంలోకి చుక్కలదుప్పిఉదయగిరి: దాహార్తిని తీర్చుకునేందుకు అటవీ ప్రాంతం నుంచి చుక్కలదుప్పి పట్టణంలోని ప్రభుత్వ వైద్యశాల సమీపానికి గురువారం ఉదయం వచ్చింది. కుక్కలు దాడి చేసేందుకు దానిని వెంబడించాయి. గమనించిన వైద్యశాల సెక్యూరిటీ సిబ్బంది కుక్కల బారినుంచి దుప్పిని రక్షించారు. అనంతరం అటవీ రేంజ్ అధికారి బీఎస్ కుమార్‌రాజాకు సమాచారం అందించారు. ఆయన ఆదేశాల మేరకు ఏబీఓ బచ్చల వెంకటేశ్వర్లు తన సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకున్నారు. పరిశీలించి దుప్పికి నీరు తాగించి, గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం స్థానిక పశువైద్యశాలకు తరలించారు. చికిత్స తర్వాత దుప్పిని దుర్గం అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు. అదుపుతప్పి కోళ్ల వ్యాన్ బోల్తా● డ్రైవర్‌కు స్వల్ప గాయాలు ● సుమారు 700 కోళ్ల మృతి దగదర్తి: చిత్తూరు నుంచి చీరాలకు వెళ్తున్న ఐషర్ వ్యాన్ గురువారం తెల్లవారుజామున అల్లూరు రోడ్డు రైల్వే వంతెన వద్ద బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ స్వల్పంగా గాయపడ్డాడు. సుమారు 700 కోళ్లు మృతిచెందాయి. అతివేగంతో వెళ్తున్న వ్యాన్ అల్లూరు రోడ్డు రైల్వే వంతెన వద్ద ఏర్పాటుచేసిన మలుపు దగ్గరకు రాగానే అదుపుతప్పి బోల్తా పడినట్లు పోలీసులు తెలిపారు. హైవే మొబైల్ సిబ్బంది, దగదర్తి పోలీసులు వంతెనపై ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా చర్యలు చేపట్టారు. కేసు నమోదు చేసినట్లు ఎస్సై జంపాని కుమార్ తెలిపారు. రాష్ట్ర స్థాయి బీచ్ కబడ్డీ పోటీలు ప్రారంభంసంగం: మండలంలోని దువ్వూరు గ్రామంలో 13వ రాష్ట్రస్థాయి పురుషుల, మహిళ బీచ్ కబడ్డీ చాంపియషిప్ పోటీలు గురువారం ప్రారంభమయ్యాయి. రాజ్యసభ సభ్యుడు బీద మస్తాన్‌రావు, టీడీపీ నాయకురాలు ఆనం లీలా కై వల్య హాజరై క్రీడా జ్యోతి వెలిగించి పోటీలను ప్రారంభించారు. రాష్ట్ర, జిల్లా కబడ్డీ అసోసియేషన్ సభ్యులు, క్రీడాకారులు, నాయకులు, యువత, పరిసర గ్రామాల ప్రజలు భారీగా విచ్చేశారు. నాలుగు రోజులపాటు పోటీలను 15 మంది టెక్నికల్ ప్రత్యేక బృందం పర్యవేక్షణలో నిర్వహిస్తున్నారు. ప్రజాభిప్రాయం మేరకే అనుమతులు● జేసీ వెంకటేశ్వర్లుసైదాపురం: ప్రజాభిప్రాయం మేరకే మైనింగ్‌కు అనుమతులు ఇస్తామని జాయింట్ కలెక్టర్ ఎం.వెంకటేశ్వర్లు అన్నారు. స్థానిక కృష్ణా మైకా మైన్స్ కంపెనీ ఆధ్వర్యంలో గురువారం పర్యావరణంపై ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ మొలకలపూండ్ల, చాగణం రెవెన్యూ పరిఽధిలోని సర్వే 528, 505లో 10.02 హెక్టార్లలో మైనింగ్ కార్యకలాపాలను నిర్వహించేందుకు పర్యావరణ అనుమతి కోసం ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ఆయన చెప్పారు. ప్రజల మనోభావాలను పరిగణలోకి తీసుకుని ప్రభుత్వానికి నివేదిక పంపుతామన్నారు. కార్యక్రమంలో ఎన్విరాన్మెంట్ అధికారి అశోక్‌కుమార్, తహసీల్దార్ సుభద్ర, స్వచ్ఛంద సేవా సంస్థల సభ్యులు పాల్గొన్నారు. -
కాకాణి రమణారెడ్డి ప్రజల మనిషి
● ఈ ప్రాంతంతో ఆయనకు విడదీయలేని బంధం ● ప్రజల కోసం పరితపించిన దార్శనీకుడు ● మాజీమంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డిపొదలకూరు: మాజీ సమితి అధ్యక్షుడు కాకాణి రమణారెడ్డి ప్రజల మనిషి అని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి తెలిపారు. గోవర్ధన్‌రెడ్డి తండ్రి రమణారెడ్డి ఐదో వర్ధంతిని పొదలకూరు మండలం తోడేరు గ్రామంలో గురువారం నిర్వహించారు. ఘాట్ వద్ద కాకాణి కుటుంబ సభ్యులు ఘనంగా నివాళుర్పించారు. ఈ సందర్భంగా చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రజలు వచ్చి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం గోవర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ రమణారెడ్డికి ఈ ప్రాంతంతో విడదీయలేని బంధం ఉన్నట్లు చెప్పారు. ప్రజల కోసం నిరంతరం పరితపించిన దార్శనికుడన్నారు. ఆయన నిబద్ధత వెలకట్టలేనిదని, ప్రజల కోసం ఆలోచించే గుణం తమకు ఎల్లవేళలా స్ఫూర్తిదాయకమన్నారు. కష్టకాలాన్ని అధిగమించేందుకు ఓర్పు, నేర్పుతోపాటు కష్టాలను ఎదుర్కొని తట్టుకునే మనో నిబ్బరాన్ని తండ్రి నుంచి నేర్చుకున్నట్టు పేర్కొన్నారు. ఆయన 18 ఏళ్లు సమితి ప్రెసిడెంట్‌గా రాజకీయాల్లో కొనసాగారన్నారు. రమణారెడ్డి చూపిన బాటలో పయనిస్తూ ప్రజాసేవలో ముందుకు వెళుతున్నామని, ఇదే ఆయనకు మేమిచ్చే ఘన నివాళిగా పేర్కొన్నారు. రమణారెడ్డి వర్ధంతి సందర్భంగా స్వచ్ఛందంగా తరలివచ్చిన ఆత్మీ యులు, అభిమానులు, నాయకులు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజితారెడ్డి, వైస్ ఎంపీపీ వేణుంబాక చంద్రశేఖర్‌రెడ్డి, మాజీ సొసైటీ చైర్మన్ గోగిరెడ్డి గోపాల్‌రెడ్డి, నాయకులు బచ్చల సురేష్‌కుమార్‌రెడ్డి, విష్ణువర్ధన్‌రెడ్డి, వీరి చలపతిరావు, ఎం.వెంకటశేషయ్య, రావుల దశరథరామయ్య గౌడ్, దాసరి భాస్కర్‌గౌడ్, ఇంద్రసేన్‌గౌడ్, కేతు రామిరెడ్డి, ఏనుగు శశిధర్‌రెడ్డి, జి.లక్ష్మీకల్యాణి, వాకాటి శ్రీనివాసులురెడ్డి, ఎస్కే అంజాద్, జి.వేణుగోపాల్‌రెడ్డి, కిషోర్, ఎ.రవీంద్ర తదితరులు పాల్గొన్నారు. -
సంక్షోభంలో వ్యవసాయం
● రైతులను అప్పుల్లోకి నెట్టిన ప్రభుత్వం ● వెంకటగిరి సమన్వయకర్త నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి వాకాడు: రాష్ట్రంలో వ్యవసాయ సంక్షోభంలో ఉందని, రైతులను ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకపోవడంతో అప్పుల్లో కూరుకుపోయారని వైఎస్సార్సీపీ వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. వాకాడులోని స్వగృహంలో వాకాడు, కోట, చిట్టమూరు మండలాలకు చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు గురువారం ఆయన్ను కలిశారు. అలాగే రైతులు కలిసి తమ బాధలను వివరించారు. ఈ సందర్భంగా రామ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ రెండేళ్లుగా పెరిగిన సేద్యపు ఖర్చులు, పంటకు సరైన గిట్టుబాటు ధర లేకపోవడం, దళారుల దోపిడీ వంటి కారణాలతో రైతులు అప్పులపాలవుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. మారుతున్న వాతావరణ పరిస్థితుల దృష్ట్యా అన్నదాతలు ఆరుగాలం కష్టపడి పండించిన పంట నష్టపోయినా చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. పాలకులు ఇసుక, గ్రావెల్ అక్రమ తవ్వకాలు చేపట్టి లాభాలతో విర్రవీగుతూ ప్రజలను గాలికొదిలేశారన్నారు. త్వరలోనే ప్రజలు తగిన గుణపాఠం చెబుతారన్నారు. ఈనెల 9వ తేదీన జరిగే దివంగత మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్ధన్‌రెడ్డి వర్ధంతిపై స్థానికులతో ఆయన చర్చించారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ ఎస్ఈసీ సభ్యుడు కొడవలూరు భక్తవత్సలరెడ్డి, వాకాడు, చిట్టమూరు మండలాల కన్వీనర్లు సుధాకర్‌నాయుడు, శ్రీనివాసులురెడ్డి, నాయకులు రాజారెడ్డి, నాగూర్‌రెడ్డి, రాజశేఖర్‌రెడ్డి, సుధాకర్‌రెడ్డి, పెంచలరెడ్డి, వెంకటేశ్వర్లురెడ్డి, రవి, శేషురెడ్డి, శ్రీహరిరెడ్డి, శిశికుమార్రెడ్డి, రైతులు పాల్గొన్నారు. -
మానవత్వానికి ప్రతీక రెడ్‌క్రాస్
నెల్లూరు(అర్బన్): ప్రకృతి వైపరీత్యాలు, రోడ్డు ప్రమాదాలు, అంటువ్యాధుల విజృంభణ, యుద్ధాలు.. ఇలాంటి అత్యవసర పరిస్థితుల్లో ముందుండి సేవలందించే సంస్థగా రెడ్‌క్రాస్ గుర్తింపు పొందింది. మే 8వ తేదీన రెడ్‌క్రాస్ వ్యవస్థాపకుడు, నోబెల్ శాంతి బహుమతి గృహీత హెన్రీ డ్యూనాంట్ జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రపంచ రెడ్‌క్రాస్ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం నిర్వహిస్తారు. సేవలతో మానవత్వానికి ప్రతీకగా రెడ్‌క్రాస్ నిలుస్తోంది. ఇలా మొదలై.. 1859లో ఇటలీలో జరిగిన సోల్ఫెరీనో యుద్ధంలో గాయపడిన సైనికుల దుస్థితిని చూసి హెన్రీ డ్యూనాంట్ వారికి సేవలందించేందుకు స్వచ్ఛంద సేవా సంస్థ అవసరాన్ని గుర్తించారు. ఈ ఆలోచనే 1863లో అంతర్జాతీయ రెడ్‌క్రాస్ కమిటీ ఏర్పాటుకు దారితీసింది. భారతదేశంతోపాటు నేడు 190 దేశాల్లో సేవలు కొనసాగుతున్నాయి. సేవే పరమావధిగా.. రెడ్‌క్రాస్ ప్రధానంగా రక్తదాన శిబిరాలు నిర్వహిస్తుంది. ప్రథమ చికిత్స శిక్షణను చేపడుతుంది. వరదలు, తుఫాన్, భూకంపాలు వచ్చినప్పుడు అనాథలు, వృద్ధులకు సేవలందించడంలో, ఆశ్రయం కల్పించడంలో కీలకపాత్ర పోషిస్తోంది. నెల్లూరు నగరంలో ఎంతోమంది దాతల సాయంతో రెడ్‌క్రాస్ స్థాపించబడింది. నేడు రాష్ట్రంలోనే నంబర్ వన్ స్థానంలో ఉంది. జిల్లా రెడ్‌క్రాస్ సంస్థ ఎన్నో అవార్డులు అందుకుంది. వాటిలో ప్రధానంగా బ్లడ్‌బ్యాంక్, తలసేమియా చికిత్స కేంద్రం, కేన్సర్ ఇన్స్టిట్యూట్, సింహపురి సంజీవిని జెనరిక్ మందుల షాపు, యూత్ రెడ్‌క్రాస్, పల్లిపాడులోని పినాకినీ సత్యాగ్రహ ఆశ్రమం, ఏఆర్వీ కేంద్రం, ప్రకృతి విపత్తుల సంస్థ ఇలా 14 ప్రాజెక్ట్‌లున్నాయి. అంతా తామై.. ప్రధానంగా కేన్సర్ ఆస్పత్రి ద్వారా, బ్లడ్‌బ్యాంక్ ద్వారా ప్రతి సంవత్సరం సుమారు 30 వేల మంది రోగులను ఆదుకుంటోంది. అలాగే వరదలు, కరోనా లాంటి విపత్కర సమయాల్లో నెల్లూరు రెడ్‌క్రాస్ సేవలకు ఎంతో ఘన కీర్తి ఉంది. కరోనా మహమ్మారి విజృంభించిన సమయంలో రక్తసంబంధీకులు సైతం తమ వారి మృతదేహాలను ఖననం చేసేందుకు ముందుకు రాకపోతే రెడ్‌క్రాస్ నేతలు, వలంటీర్లు అంతా తామై గౌరవప్రదంగా అంత్యక్రియలు చేశారు. రోజూ అన్నదానం చేస్తూ లక్షలాది మంది ఆకలి తీర్చారు. అలాగే రవాణా లేక సుదూర ప్రాంతాలకు నడిచి వెళ్తున్న కార్మికులకు ఎన్టీఆర్ నగర్ తదితర ప్రాంతాల్లో తాత్కాలిక వసతి ఏర్పాటు చేసి వారి రవాణాకు బస్సులు ఏర్పాటు చేశారు. ఇలా ఎన్నో కార్యక్రమాలు చేపడుతూ స్వచ్ఛంద రక్తదానాన్ని రెడ్‌క్రాస్ ప్రోత్సహిస్తోంది. ఈ క్రమంలో గవర్నర్, మంత్రుల చేతుల మీదుగా నెల్లూరు రెడ్‌క్రాస్ అవార్డులు దక్కించుకుంటూ సేవల్లో ముందు వరుసలో ఉంది. యుద్ధభూమి నుంచి ప్రారంభమైన సేవలు నెల్లూరులో 14 ప్రాజెక్ట్‌లు రాష్ట్రంలోనే నంబర్ వన్ స్థానం ప్రపంచ రెడ్‌క్రాస్ దినోత్సవం నేడు -
వైభవంగా జొన్నవాడ బ్రహ్మోత్సవాలు ప్రారంభం
బుచ్చిరెడ్డిపాళెం: ప్రముఖ పుణ్యక్షేత్రమైన జొన్నవాడలోని మల్లికార్జునస్వామి సమేత కామాక్షితాయి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు గురువారం వైభవంగా ప్రారంభమయ్యాయి. సాయంత్రం ఆలయ అర్చకులు స్వామి, అమ్మవార్లను విశేషంగా అలంకరించి పూజలు నిర్వహించారు. అనంతరం పెన్నా నది వద్ద నుంచి పుట్టమన్నును తీసుకొచ్చి నవధాన్యాలు చల్లి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ చేశారు. ఆలయ చైర్మన్ తిరువూరు అశోక్‌రెడ్డి, ఆలయ ఈఓ అర్వభూమి శ్రీనివాసులురెడ్డి, పాలక మండలి సభ్యులు, లలితా పరమేశ్వరి ఆశ్రమ పీఠాధిపతి రామాయణ మహేష్‌స్వామి పాల్గొన్నారు. జీపీసీఎంఎస్ ఓటర్ల జాబితా విడుదల నెల్లూరు(వేదాయపాళెం): జూన్ 12న నిర్వహించనున్న గిరిజన ప్రాథమిక సహకార మార్కెటింగ్ సంఘ డైరెక్టర్ల ఎన్నికలకు సంబంధించి ఓటర్ల జాబితాను విడుదల చేసినట్లు ఆ సంఘ చైర్మన్, డివిజనల్ మేనేజర్ ఎమ్మార్సీవీ గిరిబాబు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఐటీడీఏ ప్రధాన కార్యాలయంతో పాటు అన్ని మండలాల్లోని తహసీల్దార్, ఎంపీడీఓ కార్యాలయాల్లోని నోటీసు బోర్డుల్లో ఓటర్ల జాబితాలను ప్రదర్శించామని చెప్పారు. ఓటర్ల జాబితాపై ఏమైనా అభ్యంతరాలుంటే తగిన ఆధారాలతో ఈ నెల 14న ఐటీడీఏ ప్రధాన కార్యాలయంలో సమర్పించాలని కోరారు. ఉపాధి శ్రామికుల సంఖ్యను పెంచండి నెల్లూరు(పొగతోట): ఉపాధి హామీ పనులకు హాజరయ్యే శ్రామికుల సంఖ్యను పెంచేందుకు చర్యలు తీసుకోవాలని డ్వామా పీడీ శ్రీనివాసప్రసాద్ మండలాధికారులను ఆదేశించారు. గురువారం డ్వామా కార్యాలయం నుంచి వివిధ మండలాల ఏపీఓలు, ఈసీలు, టీఏలతో జూమ్‌కాన్ఫరెన్స్ ద్వారా పీడీ మాట్లాడారు. ఈ నెల 11వ తేదీ నాటికి నిత్యం 50 వేల మంది శ్రామికులు పనులకు హాజరయ్యేలా చూడాలన్నారు. శ్రామికుల వేతన బకాయిలు మంజూరయ్యాయని తెలిపారు. పెండింగ్‌లో ఉన్న వేతన బకాయిలు పూర్తి స్థాయిలో చెల్లించేలా చర్యలు తీసుకుంటామన్నారు. పంచాయతీల్లో అవసరమైన పనులు గుర్తించి శ్రామికులకు పనులు కల్పించాల్సిన బాధ్యత క్షేత్రస్థాయి సిబ్బందిపై ఉందన్నారు. ఈ విషయంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 136 బస్తాల రేషన్ బియ్యం పట్టివేత జలదంకి(కావలి): కలిగిరి నుంచి కావలి వైపు రేషన్ బియాన్ని తరలిస్తున్న లారీని జలదంకి వద్ద కలిగిరి సీఐ సుబ్బారావు, జలదంకి ఎస్సై లతీఫున్నీసా గురువారం పట్టుకున్నారు. అనంతరం లారీని పోలీస్‌స్టేషన్‌కు తరలించి పౌరసరఫరాల శాఖ అధికారులకు అప్పగించారు. లారీలో 138 బస్తాల బియ్యం ఉన్నట్లు గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నా మని వారు తెలిపారు. శ్రీవారి దర్శనానికి 6 గంటలు తిరుమల: తిరుమలలో గురువారం భక్తుల రద్దీ మోస్తరుగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లోని 11 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. బుధవారం అర్ధరాత్రి వరకు 71,029 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 31,184 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూ పంలో హుండీలో రూ.3.07 కోట్లు సమర్పించా రు. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టికెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 6 గంటల సమ యం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగ లుగుతున్నారు. కాగా సర్వదర్శనం టోకెన్లు కలిగి న భక్తులు నిర్దేశించిన సమయానికి మాత్రమే క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. కేటాయించిన సమయానికంటే ముందు వెళ్లిన వారిని క్యూలోకి అనుమతించరని స్పష్టం చేసింది. -
అధికారం మనదే.. వేసేయ్ పాగా
సాక్షి, టాస్క్‌ఫోర్స్: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక టీడీపీ నాయకులు చెలరేగిపోతున్నారు. అధికారం అండతో జాతీయ రహదారి అనుకుని ఎక్కడ ప్రభుత్వ భూములు కనిపిస్తే అక్కడ పాగా వేస్తున్నారు. విలువైన స్థలాలను దర్జాగా కబ్జా చేసి నిర్మాణాలు చేపడుతున్నారు. భూముల ధరలకు రెక్కలు రావడంతో.. సర్వేపల్లి నియోజకవర్గ కేంద్రమైన వెంకటాచలం మండలంలో జాతీయ రహదారి ఆనుకుని ఉన్న గ్రామాల్లో భూముల ధరలు కొన్నేళ్ల నుంచి విపరీతంగా పెరిగాయి. ఒక్కో అంకణం ధర రూ.లక్ష నుంచి రూ.రెండు లక్షలకుపైగా పలుకుతోంది. జాతీయ రహదారి పక్కన నిర్మాణాలు చేపడితే వ్యాపారానికి అనువుగా ఉండడంతో అక్రమార్కుల కన్ను విలువైన ప్రభుత్వ భూములపై పడింది. సర్వేపల్లి ముఖ్యనేత అండతో దర్జాగా ప్రభుత్వ భూములు ఆక్రమించి చకచకా అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు. వాటికి అడ్డుకట్ట వేయాల్సిన అధికారులు పట్టించుకోకపోవడంపై పలు విమర్శలు వస్తున్నాయి. ● వెంకటాచలం మండలం ఎర్రగుంట వద్ద జాతీ య రహదారి ఆనుకుని సుమారు రూ.50 కోట్ల విలువ చేసే మూడెకరాల ప్రభుత్వ భూమి ఉంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ విలువైన ప్రభుత్వ భూమిని కాజేసేందుకు కొందరు నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. గత నాలుగు రోజుల నుంచి కొంత భూమిని జేసీబీతో చదును చేయించి పనులు చేస్తున్నారు. సర్వేపల్లి ముఖ్యనేత అండతోనే ఈ భూ ఆక్రమణలకు దిగినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ ఆక్రమణల గురించి రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినా ఎటువంటి చర్యలు తీసుకోలేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ● గొలగమూడి క్రాస్‌రోడ్డు వద్ద జాతీయ రహ దారి ఆనుకుని పోతురాజు చెరువు ఉంది. జాతీయ రహదారి, చెరువుకు మధ్యలో రూ.కోట్ల విలువ చేసే ప్రభుత్వ స్థలాలు ఉన్నాయి. ఈ విలువైన స్థలాలను ఆక్రమించి అక్రమ కట్టడాలు నిర్మిస్తే వ్యాపారాలకు అనువుగా ఉంటుందని వాటిపై కొందరు కన్నేశారు. కాకుటూరు గ్రామానికి చెందిన ఓ టీడీపీ నాయకుడి అండతో రూ.1.50 కోట్ల విలువ చేసే సుమారు 150 అంకణాల ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించారు. రెండు చెరువులకు సాగునీరు సరఫరా చేసే పంట కాలువను సైతం ఆక్రమించి ధ్వంసం చేశారు. ఆక్రమిత భూమిలో నిర్మాణాలు చేపడుతున్నా ఇరిగేషన్ అధికారులు పట్టించుకోకపోవడంపై రైతులు మండిపడుతున్నారు. ● కాకుటూరు గ్రామంలో సర్వే నంబర్లు 84,85 లలో ఉన్న రూ.2కోట్ల విలువ చేసే 0.36 సెంట్ల ప్రభుత్వ భూమిని నెల్లూరు నగరానికి చెందిన ఓ టీడీపీ నేత ఇటీవల ఆక్రమించి అక్రమ కట్టడాలు నిర్మించారు. ఈ విషయంపై స్థానికులు పలు దఫాలు రెవెన్యూ, ఇరిగేషన్, అధికారులకు ఫిర్యాదు చేశారు. వెంకటాచలంలో హద్దు మీరుతున్న తమ్ముళ్ల భూకబ్జాలు ఆక్రమణల చెరలో రూ.కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూములు ఫిర్యాదు చేసినా పట్టించుకోని అధికారులు ఆక్రమణదారులపై చర్యలేవీ? కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూములను టీడీపీ నేతల అండతో కొందరు దర్జాగా ఆక్రమించడాన్ని స్థానికులు చూసి విస్తుపోతున్నారు. ఎన్నో సంవత్సరాల నుంచి ఆక్రమణలకు గురికాకుండా కాపాడుకుంటూ వచ్చిన విలువైన భూములు కబ్జా చేయడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సామాన్యులు తలదాచుకునేందుకు సెంటు భూమిలో గుడిసెలు వేస్తే వెంటనే వాలిపోయి తొలగించే అధికారులు కోట్ల విలువ చేసే స్థలాలను దర్జాగా ఆక్రమిస్తే చర్యలు తీసుకోరా అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇరిగేషన్ కాలువ ఆక్రమణకు గురికావడంతో తమ గ్రామ చెరువులకు సాగునీరు సక్రమంగా అందదని ఇరిగేషన్ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని రైతులు మండిపడుతున్నారు. కాకుటూరులోని సర్వే నంబర్లు 84,85లోని ప్రభుత్వ భూమి ఆక్రమణలపై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదేశించినా ఇరిగేషన్ అధికారులు పట్టించుకోకపోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. ఆక్రమణదారులకు సర్వేపల్లి ముఖ్యనేత అండదండలు ఉండడంతో అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టడంలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
‘ఇంగ్లిష్ మీడియం వద్దన్న వాళ్లంతా ఇప్పుడేమంటారు?’
సాక్షి, నెల్లూరు: వైఎస్సార్సీపీ హయాంలో ప్రభుత్వ బడుల్లో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెడితే మాతృభాషకు ద్రోహం చేస్తున్నారని విమర్శించిన కూటమి నాయకులు, ప్రభుత్వ బడుల్లో ఇంగ్లిష్ మీడియం తప్పక ఉండాలని హైకోర్టు చేసిన వ్యాఖ్యలను ఖండించే దమ్ముందా? అంటూ వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ప్రశ్నించారు.నెల్లూరులోని పార్టీ జిల్లా కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ పేదల పిల్లలు భవిష్యత్తులో ఉన్నత స్థానాల్లో ఉండాలన్న ఆకాంక్షతో ప్రభుత్వ బడుల్లో ఐబీ, సీబీఎస్ఈ ప్రవేశపెడితే.. అధికారంలోకి వచ్చాక కేసులు వేస్తామని హెచ్చరించారని గుర్తుచేసుకున్నారు. తమ పిల్లలను ఇంగ్లిష్ మీడియంలో చదివిస్తున్న కూటమి నాయకులు పేదల పిల్లలు ఇంగ్లిష్ మీడియంలో చదువుతుంటే ఓర్వలేక కళ్లల్లో నిప్పులు పోసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నారా లోకేష్ విద్యారంగాన్ని సర్వనాశనం చేశాడని, పదో తరగతిలో వచ్చిన ఉత్తమ ఫలితాలకు వైయస్ జగన్ ఐదేళ్ల పాలనలో వేసిన ఫౌండేషన్ కారణమని చెప్పారు. కోట్ల రూపాయల పత్రికా ప్రకటనలిచ్చి క్రెడిట్ చోరీకి పాల్పడటం సిగ్గుచేటని మండిపడ్డారు. జీతాలు తగ్గిస్తామని బ్లాక్మెయిల్ చేస్తున్న ప్రభుత్వ బెదిరింపులకు భయపడకుండా తమకు రావాల్సిన బకాయిలపై ఉద్యోగులంతా సంఘటితమై పోరాడాలని పిలుపునిచ్చారు.పీఆర్సీ, డీఏ, ఐఆర్‌లపై ప్రశ్నించకుండా జీతాలు తగ్గిస్తామని ఉద్యోగులను ప్రభుత్వం బ్లాక్మెయిల్ చేస్తుందని ఆరోపించారు. శ్రీకాకుళం జిల్లాలో జరగాల్సిన మహానాడు కార్యక్రమాన్ని ఉన్నట్టుండి నెల్లూరు జిల్లాకు మార్చాల్సిన అవసరం ఏమొచ్చిందని ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ప్రశ్నించారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..ఇంగ్లిష్ మీడియం తీసుకొచ్చారని జగన్‌పై విషం చిమ్మారు2019-24 మధ్య తన ఐదేళ్ల పాలనలో ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో తీసుకొచ్చిన సంస్కరణలు దేశానికే దిక్సూచిలా నిలిచాయి. ప్రధానంగా నాడు- నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్‌కి దీటుగా అభివృద్ధి చేయడంతోపాటు ఇంగ్లిష్ మీడియం బోధన ద్వారా పేద విద్యార్థులకు ఖరీదైన చదువులను ఉచితంగా అందించారు. ప్రభుత్వ బడుల్లో ఇంగ్లిష్ మీడియాన్ని తప్పనిసరి చేస్తే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సహా ఎంతోమంది కూటమి నాయకులు వైఎస్ జగన్ మీద విష ప్రచారం చేశారు.ఇంగ్లిష్ మీడియం తీసుకొస్తే తెలుగుభాషకు అన్యాయం జరుగుతుందంటూ ప్రజల్లో లేనిపోని అపోహలు సృష్టించారు. కూటమి అధికారంలోకి వస్తే సర్కారు బడుల్లో ఆనాడు అమలవుతున్న ఐబీ, టోఫెల్ విధానాలపై కేసులు వేస్తామని హెచ్చరించారు. విద్య ప్రభుత్వ బాధ్యత కాదు అని చెప్పిన చంద్రబాబు మనకి ముఖ్యమంత్రిగా ఉండటం దౌర్భాగ్యం. అమ్మ భాషను వైఎస్సార్సీపీ నుంచి కాపాడుకోవాలని పిలుపునిచ్చారు.వైఎస్సార్సీపీ మాతృ భాషకి వ్యతిరేకి అని మండలి బుద్ధ ప్రసాద్ వంటి వారు ప్రచారం చేశారు. తెలుగుభాషను విచ్చిన్నం చేస్తున్నామని అన్నారు. మాతృభాషకు ముప్పు ఉందని, మాతృ భాషలోనే బోధన కొనసాగాలని సుప్రీం మాజీ సీజేఐ ఎన్వీ రమణ చెప్పుకొచ్చారు. ఇంగ్లిష్ మీడియం లేకుండా చేయడానికి చివరికి కోర్టులను కూడా ఆశ్రయించారు. దాదాపు 95 శాతం మంది విద్యార్థుల తల్లిదండ్రుల కోరిక మేరకే జగన్ ప్రభుత్వం ఇంగ్లిష్ మీడియం తీసుకొచ్చింది. కానీ పేద బిడ్డలకు ఇంగ్లిష్ మీడియం చదువులు అందుతుంటే చూసి ఓర్వలేని కూటమి నాయకులు ఎల్లో మీడియాను అడ్డం పెట్టుకుని చేయని కుట్రలు లేవు.ఆనాడు కళ్లల్లో నిప్పులు పోసుకున్నారుపేద విద్యార్థులకు ఇంగ్లిష్ మీడియం చదువులు అందించాలని ముందుచూపుతో వ్యవహరించి ప్రభుత్వ బడుల్లో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టడాన్ని నేడు హైకోర్టు ధర్మాసనం కూడా సమర్థించింది. ఉన్నతంగా ఎదగాలంటే, నేటి సమాజంలో రాణించాలంటే ఇంగ్లిష్ ఎంతో ముఖ్యమని హైకోర్టు అభిప్రాయపడింది. ప్రభుత్వ బడుల్లో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టడాన్ని నాటి వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఒక ప్రణాళిక ప్రకారం అమలు చేసింది. తెలుగు సబ్జెక్టును తప్పనిచేస్తూ 202-21లో ఆరో తరగతి వరకు మాత్రమే మొదటిసారి ఇంగ్లిష్ మీడియం తీసుకొచ్చారు.ఆ తర్వాత ఒక్కో ఏడాది పదో తరగతి వరకు పెంచుకుంటూ పోయారు. ఆరోజు ప్రభుత్వ బడుల్లో ఇంగ్లిష్ మీడియం బోధనను వ్యతిరేకించిన చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ సహా కూటమి నాయకులంతా వారి పిల్లలను మాత్రం ఇంగ్లిష్ మీడియంలోనే చదివిస్తున్నారు. పేదల పిల్లలు ఇంగ్లిష్ మీడియంలో చదువుతుంటే ఆనాడు కళ్లల్లో నిప్పులు పోసుకున్నవాళ్లంతా ఇప్పుడు తమ అంతరాత్మను ప్రశ్నించుకోవాలి. హైకోర్టు తీర్పుతోనైనా కళ్లు తెరవాలి.జగన్ పాలనలో విద్యారంగంలో సంస్కరణలుపదో తరగతి పరీక్షా ఫలితాలు వెలువడిన వెంటనే ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికల్లో సర్కారు బడుల్లో వచ్చిన మార్కులతో ప్రభుత్వం భారీగా ఖర్చు చేసి మొదటి పేజీ ప్రకటనలు ఇచ్చింది. ఈ పిల్లలు ఇంతటి విజయాలు సాధించడానికి వైఎస్ జగన్ ఐదేళ్ల పాలనలో చేసిన కష్టానికి ఫలితమేనని కూటమి నాయకులు ఒప్పుకుని తీరాలి. నాడు -నేడు ద్వారా 38 వేల ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్‌కి దీటుగా తీర్చిదిద్దారు.తాగడానికి నీరు కూడా దొరకని పరిస్థితుల్లో ఉన్న పాఠశాలల్లో ఆర్వీ వాటర్ ప్లాంట్లు, డిజిటల్ బోర్డులు ఏర్పాటు చేశారు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చాక వాటి నిర్వహణను పూర్తిగా గాలికొదిలేసింది. ఒక్కో ఐఎఫ్బీ ప్యానల్ బోర్డును లక్ష రూపాయలతో కొనుగోలు చేసి 62 వేల బోర్డులను ప్రతి క్లాసులోనూ ఏర్పాటు చేయడం జరిగింది.ప్రాథమిక స్థాయి పాఠశాలల్లో 33,590 స్మార్ట్ టీవీలు ఏర్పాటు చేశారు. పిల్లలకు లెక్కలు బాగా రావాలని పాల్ ల్యాబ్స్‌ను తీసుకొచ్చారు. సీబీఎస్ఈ, ఐబీ సిలబస్‌ను ప్రవేశ పెట్టడంతోపాటు 8వ తరగతి నుంచి పిల్లలకు ట్యాబ్‌లతో పాఠాలు చెప్పించారు. జగనన్న విద్యాకానుక ద్వారా విద్యార్థులకు స్కూల్ బ్యాగులు, యూనిఫాం, సాక్సులు, షూ, నోట్ బుక్కులు అందించే కార్యక్రమానికి వైయస్ జగన్ గారు శ్రీకారం చుట్టారు. 8 వేల మంది టీచర్లకు స్కూల్ అసిస్టెంట్ లుగా ప్రమోషన్ ఇచ్చి మూడో తరగతి నుంచే సబ్జెక్టు టీచింగ్ మొదలు పెట్టిన ఘనత వైఎస్ జగన్‌కే దక్కుతుంది.కార్పొరేట్ స్కూళ్లకు చంద్రబాబు దాసోహంకూటమి ప్రభుత్వం వచ్చాక ఆర్వో ప్లాంట్ల నిర్వహణ గాలికొదిలేశారు. ట్యాబ్‌లు పాడైనా పట్టించుకోలేదు. ఆఖరుకి టాయ్లెట్ల నిర్వహణ సరిగా లేదు. గోరుముద్ద పథకం ద్వారా నాణ్యమైన పౌష్టికాహారంతో కూడిన మెనూతో పిల్లలకు భోజనం పెడితే ఇప్పుడు దానికీ దిక్కులేదు. ప్రభుత్వ స్కూల్స్, విద్యారంగం గురించి కూటమి ప్రభుత్వంలో ఒక్క గొప్ప నిర్ణయం తీసుకున్న పాపానపోలేదు. ఇవేమీ చేయకుండానే కోట్ల రూపాయలు వెచ్చించి పత్రికా ప్రకటనలు ఇచ్చుకోవడం సిగ్గుచేటు.వైఎస్ జగన్ అమ్మ ఒడి పేరుతో అమలు చేసిన పథకానికి తల్లికి వందనంగా పేరు మార్చి లోకేష్ మదిలో నుంచి వచ్చిన ఆలోచన అని తండ్రికొడుకులు క్రెడిట్ చోరీకి పాల్పడ్డారు. ఫీజురీయింబర్స్‌మెంట్ పథకాన్ని కూడా కూటమి ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేసింది. వైయస్సార్సీపీ హయాంలో 17 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తే దాన్ని ప్రైవేటీకరించాలని చూస్తున్న చంద్రబాబుకి విద్యారంగం గురించి మాట్లాడే నైతిక అర్హత లేదు. కార్పొరేట్ విద్యాసంస్థలకు దాసోహమై వారి కోసం పనిచేస్తున్నాడే కానీ ప్రభుత్వ బడులను తీర్చిదిద్దే ప్రయత్నం చేయడం లేదు.హామీలపై ప్రశ్నిస్తే ఉద్యోగులను బ్లాక్మెయిల్ చేస్తున్నారుఅధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రభుత్వ ఉద్యోగులను చంద్రబాబు వేధిస్తున్నాడు. ఉద్యోగులను కూటమి ప్రభుత్వం తీవ్రంగా వంచిస్తోంది. కేంద్ర ప్రభుత్వం డీఏలు ఇచ్చినా చంద్రబాబు మాత్రం 4 డీఏలు పెండింగ్‌లో పెట్టాడు. ఇంతవరకు పీఆర్సీ ఊసే లేదు. కనీసం పీఆర్సీ కమిషనర్ని కూడా లేకుండా చేశారు. ఐఆర్ గురించి కూడా ఆలోచన చేయడం లేదు. దీన్ని నిరసిస్తూ ఉపాధ్యాయులంతా విజయవాడలో ధర్నా చేశారు. ఉద్యోగులంతా ప్రభుత్వంపై యుద్ధం చేస్తే తప్ప వారికిచ్చిన హామీలు ఈ ప్రభుత్వం నెరవేర్చే పరిస్థితి కనిపించడం లేదు.పీఆర్సీ, ఐఆర్, డీఏలపై ఉద్యోగులు ఒత్తిడి చేయడంతో శాలరీ కోతలంటూ కూటమి బ్లాక్‌మెయిలింగ్‌కి పాల్పడుతోంది. ఏపీ హెచ్‌పీ అంటూ హిమాచల్ ప్రదేశ్‌లో మాదిరిగా ఉద్యోగాల జీతాలకు కోతలు విధిస్తామన్న హెచ్చరికలకు ప్రభుత్వ ఉద్యోగులు భయపడాల్సిన పనిలేదు. అందరూ సంఘటితపై ప్రభుత్వంపై పోరాడి హక్కులను సాధించుకోవాలి. వైయస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఉద్యోగులను వైయస్సార్సీపీ ఆదుకుంటుంది. కూటమి పాలనపై సర్వేలు చేయించుకున్న చంద్రబాబు నెల్లూరులో ఒక్క సీటూ గెలిచే పరిస్థితి లేదని తెలిసి షాకయ్యాడు. అందుకే శ్రీకాకుళం జిల్లాలో పెట్టాల్సిన మహానాడును నెల్లూరు జిల్లాకు చంద్రబాబు మార్చేశాడని పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఆరోపించారు. -
ఓట్లు తొలగించే ప్రమాదముంది
● నాయకులు, కార్యకర్తలు జాగ్రత్త వహించండి● ఆత్మకూరు మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్‌రెడ్డి ఆత్మకూరు: ‘గ్రామాలకు చెందిన ఓటర్లు ఉద్యోగ, వ్యాపార పనుల రీత్యా ఇతర ప్రాంతాల్లో ఉంటే ఆ ఓట్లను తొలగించే ప్రమాదం ఉంది. వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు జాగ్రత్త వహించాలి’ అని ఆత్మకూరు మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్‌రెడ్డి సూచించారు. పట్టణంలోని తన కార్యాలయంలో బుధవారం పార్టీ కార్యకర్తలు, నాయకులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఎస్ఐఆర్ (స్పెషల్ ఇన్టెన్సివ్ రివిజన్)లో ఓటర్ల జాబితాను సరిచూసే కార్యక్రమం ఆత్మకూరు నియోజకవర్గంలో పదిరోజుల అనంతరం ప్రారంభం కానుందన్నారు. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాల్లో లక్షలాది ఓట్లను తొలగించిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రతి ఒక్కరూ వారి ఓటును తొలగింపబడకుండా చూసుకోవాలన్నారు. అనంతరం పార్టీ కమిటీల జాబితాను వెంటనే అందజేయాలని ఆయన నాయకులను కోరారు. కార్యక్రమంలో ఉదయగిరి నియోజకవర్గ పార్టీ పరిశీలకుడు సుధాకర్‌రెడ్డి, నాయకులు బొమ్మిరెడ్డి రవికుమార్‌రెడ్డి, సీహెచ్ కామాక్షయ్య నాయుడు, ఎన్ఆర్ఐ మీరామొహిద్దీన్, కె.కిశోర్, టి.అశోక్, అండ్రా సుబ్బారెడ్డి, రావూరు శ్రీనివాసులురెడ్డి, బొలిగర్ల వెంకటేశ్వర్లు, రాజారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద వాగ్వాదం
● అక్రమ రిజిస్ట్రేషన్లు చేశారని ఫిర్యాదు ● లేఅవుట్‌ను పరిశీలించిన ఆడిట్ జిల్లా రిజిస్ట్రార్పొదలకూరు: సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద బుధవారం వాగ్వాదం చోటు చేసుకుంది. పట్టణంలోని సత్యనారాయణ లేఅవుట్లో ఇటీవల ప్రజాప్రయోజనాల కోసం కేటాయించిన 286 అంకణాలను ప్లాట్లుగా మార్పుచేసి అక్రమంగా రిజిస్ట్రేషన్ చేశారని అధికారులకు ఫిర్యాదు అందింది. దీంతో ఆడిట్ జిల్లా రిజిస్ట్రార్ దీపిక విచారణ చేశారు. ఆమె విచ్చేస్తున్న సందర్భంగా ప్రజాప్రయోజన స్థలానికి సంబంధించి గతంలో ఫిర్యాదు చేసిన వారికి నోటీసులివ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయస్థానంలో కేసు నడుస్తున్న లేఅవుట్లో ప్రజాప్రయోజన స్థలాన్ని పది ప్లాట్లుగా మార్చి ఇటీవల నాలుగింటిని రిజిస్ట్రేషన్ చేశారు. దీంతో పంచాయతీ సెక్రటరీ యశ్వంత్‌సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎస్సై హనీఫ్ కొన్నవారు, అమ్మిన వారిపై కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో రిజిస్ట్రేషన్లను అక్రమంగా చేశారని జిల్లాస్థాయి అధికారికి ఫిర్యాదు చేయడంతో స్పందించి విచారణ నిర్వహించారు. అయితే ఇరువర్గాల వారు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్దకు చేరుకుని డాక్యుమెట్లను విచారణాధికారికి సమర్పించారు. ఓ వర్గం వారు ప్రజాప్రయోజన స్థలాన్ని ఎలా రిజిస్ట్రేషన్ చేస్తారని ప్రశ్నించారు. పంచాయతీ ఆధీనంలో ఉన్న స్థలంలో వారు మూడురోజుల క్రితం వాలీబాల్ కోర్టు, పార్కును ఏర్పాటు చేశారు. మరో వర్గం వారు అన్ని రకాల డాక్యుమెంట్లు ఉన్నాయని తమకే స్థలం చెందుతుందని వాదనలు వినిపించారు. బహిరంగ మార్కెట్లో స్థలం సుమారు రూ.4 కోట్ల వరకు ధర పలుకుంది. ● రికార్డులను పరిశీలించిన దీపిక సత్యనారాయణ లేఅవుట్, సత్యనారాయణ ట్రేడర్స్ రెండు చోట్ల స్థలాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇరువర్గాలు, పంచాయతీ సెక్రటరీ వద్ద స్టేట్మెంట్ రికార్డు చేశామన్నారు. ఇందుకు సంబంధించిన రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించి నివేదిక రూపొందిస్తామన్నారు. ఆమె వెంట సబ్‌రిజిస్ట్రార్ శోభమ్మ ఉన్నారు. -
కండలేరు నుంచి నీటి విడుదల
రాపూరు: చైన్నె నగర ప్రజల దాహార్తి తీర్చేందుకు, నెల్లూరు, తిరుపతి జిల్లాల రైతులు, ప్రజల అవసరాల నిమిత్తం నీటిని కండలేరు జలాశయం నుంచి బుధవారం విడుదల చేశారు. తొలుత గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెలుగుగంగ ఎస్ఈ సుబ్రహ్మణ్యేశ్వరరావు, వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ కండలేరు హెడ్ రెగ్యులేటర్ వద్ద ఉన్న పవర్‌ప్లాంట్ యూనిట్ నుంచి నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కండలేరు జలాశయంలో 43 టీఎంసీల నీరు నిల్వ ఉందన్నారు. చైన్నె నగర ప్రజలకు, పరిశ్రమలకు, తిరుపతి, నెల్లూరు జిల్లా ప్రజలకు, రైతులకు తాగు, సాగునీటి అవసరాల నిమిత్తం 130 రోజుల్లో 13.78 టీఎంసీలను నీటిని విడుదల చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. తిరుపతి జిల్లాలో 70 వేల ఎకరాలు, నెల్లూరు జిల్లాలో 54 వేల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నట్లు చెప్పారు. చైన్నె నగరానికి తాగునీటి కోసం 5 టీఎంసీలు, రాపూరు, వెంకటగిరి, శ్రీకాళహస్తి, తిరుపతి ప్రాంతాలకు తాగునీటి కోసం 2, స్వర్ణముఖి బ్యారేజ్‌కి 2, మేనకూరు పారిశ్రామికవాడకు ఒక టీఎంసీని విడుదల చేయనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఈఈ గజేంద్రరెడ్డి, డీఈ అనిల్‌బాబు, ఏఈ అనిల్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
వాణిజ్య గ్యాస్ ధరల పెంపు దారుణం
నెల్లూరు(వీఆర్సీసెంటర్): వాణిజ్య గ్యాస్ ధరల పెంపు దారుణమని పలువురు నేతలు అన్నారు. ఏఐటీయూసీ ఆధ్వర్యంలో బుధవారం ఖాళీ సిలిండర్లతో నెల్లూరులోని ఆజాద్ సెంటర్లో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా ప్రదాన కార్యదర్శి యామాల మధు మాట్లాడుతూ కేంద్రం వాణిజ్య సిలిండర్‌పై ఏకంగా రూ.993 పెంచడంతో చిన్న టిఫిన్ సెంటర్ల నిర్వాహకులపై పెనుభారం పడిందన్నారు. మూడు నెలల వ్యవధిలో 81 శాతం గ్యాస్ ధరలను పెంచడం దారుణమన్నారు. 2014లో రూ.400 ఉన్న డొమెస్టిక్ గ్యాస్ ధర నేడు రూ.1,000కి చేరువలో ఉందన్నారు. ఇది నరేంద్రమోదీ వైఫల్యానికి నిదర్శనమన్నారు. గ్యాస్ ధరలను తగ్గించాలని లేకపోతే రానున్న రోజుల్లో పోరాటాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు రమణయ్య, సిరాజ్, సుధాకర్, అజీజ్, లీలామోహన్, షాన్వాజ్, వనజ, శీనయ్య, అహ్మద్, మహీంద్ర తదితరులు పాల్గొన్నారు. -
హ్యాండ్లూమ్ టెక్నాలజీ కోర్సులో ప్రవేశాలు
నెల్లూరురూరల్: వెంకటగిరిలోని ప్రగడ కోటయ్య మెమోరియల్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీలో ప్రవేశాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లుగా సంస్థ ప్రతినిధులు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. హ్యాండ్లూమ్స్ టెక్నాలజీపై మూడు సంవత్సరాల డిప్లొమా కోర్సులో శిక్షణ ఇచ్చి కేంద్ర ప్రభుత్వ శాఖచే సర్టిఫికెట్లు జారీ చేస్తామన్నారు. పదో తరగతి ఉత్తీర్ణులైన వారికి మెరిట్ ఆధారంగా ప్రవేశాలను కల్పిస్తామన్నారు. ఇంటర్మీడియట్ (ఎంపీసీ), ఐటీఐ ఉత్తీర్ణులైన వారు నేరుగా రెండో సంవత్సరంలో చేరొచ్చని, నెలకు రూ.2500 స్టై ఫండ్ ఇస్తామన్నారు. వివరాలకు 93999 36872, 98661 69908 ఫోన్ నంబర్లను సంప్రదించాలన్నారు. ఈనెల 30వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచిచారు.దువ్వూరు సమీపంలో రోడ్డు ప్రమాదం● బస్సును ఢీకొట్టిన లారీ సంగం: మండలంలోని దువ్వూరు సమీపంలో నెల్లూరు – ముంబై జాతీయ రహదారిపై మంగళవారం అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికులు, పోలీసుల కథనం మేరకు.. కనిగిరి నుంచి చైన్నె వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సును వెనుక నుంచి లారీ ఢీకొట్టింది. బస్సులోని ముగ్గురు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. గాయపడిన వారిని వెంటనే సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. సమాచారం అందుకున్న ఎస్సై రాజేష్ వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మిగిలిన ప్రయాణికులను మరో బస్సులో గమ్యస్థానాలకు పంపించారు. అలాగే వాహనాల రాకపోకలు సజావుగా జరిగేలా చర్యలు తీసుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. లారీ ముందు భాగం దెబ్బతింది. శ్రీవారి దర్శనానికి 8 గంటలుతిరుమల: తిరుమలలో బుధవారం భక్తుల రద్దీ మోస్తరుగా ఉంది. క్యూ కాంప్లెక్స్‌లోని 10 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. మంగళవారం అర్ధరాత్రి వరకు 76,240 మంది స్వామిని దర్శించుకున్నారు. 28,257 మంది తలనీలాలు అర్పించారు. కానుకల రూపంలో హుండీలో రూ.3.44 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టికెట్లు లేనివారు 8 గంటల్లో, ప్రత్యేక ప్రవేశ టికెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు. ఇదిలా ఉంటే సర్వ దర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి మాత్రమే క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. కేటాయించిన సమయానికంటే ముందు వెళ్లిన వారిని క్యూలోకి అనుమతించరని స్పష్టం చేసింది. -
9 నుంచి ఆవాజ్ రాష్ట్ర మహాసభలు
నెల్లూరు(వీఆర్సీసెంటర్): ఈనెల 9, 10వ తేదీల్లో నెల్లూరులో ఆవాజ్ మూడో రాష్ట్ర మహాసభలు జరుగుతాయని జిల్లా కార్యదర్శి రషీద్ తెలిపారు. నెల్లూరులోని ఆవాజ్ జిల్లా కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 9వ తేదీ ఉదయం భారత రాజ్యాంగం – లౌకికవాదం ఎదుర్కొంటున్న సమస్యలపై సదస్సు జరుగుతుందన్నారు. ఈ సదస్సుకు ముఖ్యఅతిథిగా మద్రాస్ హైకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ చంద్రు, ఆవాజ్ వ్యవస్థాపకులు గఫూర్ తదితరులు హాజరవుతారన్నారు. మతసామరస్యానికి, లౌకికత్వానికి ప్రతీక అయిన జిల్లాలో మొదటిసారిగా నిర్వహిస్తున్న సభలను జయప్రదం చేయాలని కోరారు. అనంతరం పోస్టర్లను ఆవిష్కరించారు. సమావేశంలో ఆవాజ్ జిల్లా అధ్యక్షుడు సయ్యద్ రఫీ, నాయకులు జానీబాషా, చాన్‌బాషా, కోశాధికారి సర్దార్ అహ్మద్, జిల్లా కమిటీ సభ్యులు నాయబ్ రసూల్, ఫయాజ్, రవూఫ్, మునీర్ అహ్మద్, బషీర్ తదితరులు పాల్గొన్నారు. -
మా రూట్.. సపరేటు
● సర్వేపల్లిలో మద్యం దుకాణాల్లో ‘ఎస్’ ట్యాక్స్ వసూలు ● పుట్టగొడుగుల్లా బెల్టు షాపులు.. అందులో ధరలు మరింత ౖపైపెకి.. ● ఒక్కో బాటిల్‌పై రూ.50 నుంచి రూ.80 వరకు అమ్మకాలు ● పట్టించుకోని ఎకై ్సజ్ అధికారులు సాక్షి టాస్క్‌ఫోర్స్: సర్వేపల్లి నియోజకవర్గంలో టీడీపీ నేతలు ప్రతి అవకాశాన్ని రాబడి వనరులుగా మార్చుకుంటున్నారు. అధికార పార్టీ ముఖ్యనేత అండదండలతో ప్రకృతి వనరుల నుంచి.. వివిధ రంగాల వ్యాపారులనూ దోచుకుంటున్నారు. ఆఖరికి మందుబాబులనూ వదలడం లేదు. నియోజకవర్గంలో ఊరూరా బెల్టుషాపుల ఏర్పాటుకు ఏకంగా బహిరంగ వేలం పెట్టిన సదరు నేతలు, అక్కడే అధిక ధరలకు అమ్ముతున్నారనుకుంటే.. తాజాగా దుకాణాల్లోనూ ఎమ్మార్పీపై అధిక ధరలకు విక్రయాలు సాగిస్తున్నారు. అడిగితే.. ‘ఎస్’ ట్యాక్స్ కట్టాలంటూ నిర్వాహకులు చెబుతున్నారని మద్యం ప్రియులు ధ్వజమెత్తుతున్నారు. ఇక ఏకంగా మద్యం దుకాణాల పక్కనే అనధికారికంగా మినీబార్లను తలపించే రీతిలో పర్మిట్ రూమ్‌లను ఏర్పాటు చేసి మరీ వ్యాపారం చేస్తున్నారు. తమ కళ్ల ముందే మద్యం విక్రయాల్లో నిబంధనలు ఉల్లంఘనలు జరుగుతున్నా.. ఎకై ్సజ్ అధికారుల కళ్లకు కనిపించకపోవడం దారుణమనే విమర్శలు వినిపిస్తున్నాయి. సర్వేపల్లి నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో మొత్తం 28 గెజిట్ మద్యం దుకాణాలను ఏర్పాటు చేశారు. ఇందులో వెంకటాచలంలో 6, పొదలకూరులో 6, ముత్తుకూరులో 8, మనుబోలులో 3, తోటపల్లిగూడూరు మండలంలో 5 దుకాణాలు ఉండగా, ఆయా దుకాణాల పరిధిలో విస్తృతంగా బెల్టు షాపులను ఏర్పాటు చేసేందుకు టీడీపీ నాయకులు, కార్యకర్తలు విపరీతంగా ఎగబడడంతో నిర్వాహకులంతా సిండికేట్ అయి ఒక్కో బెల్టు షాపునకు భారీ మొత్తంలో వేలం పాటలు పెట్టి మరీ అనుమతులిచ్చారు. దీంతో బెల్టుషాపులతోపాటు దుకాణాల నుంచి ‘ఎస్’ ట్యాక్స్ డిమాండ్ చేయడంతో ఎమ్మార్పీ కంటే అదనంగా వసూలు చేసి దోచుకుంటున్నారు. దుకాణాల వద్ద అయితే చీప్ లిక్కర్ క్వార్టర్ బాటిల్‌పై రూ.10 లెక్కన వసూలు చేస్తుండగా, మిగతా బ్రాండెడ్ మద్యంపై రూ.50 నుంచి రూ.80 వరకు అదనంగా వసూలు చేస్తున్నారు. ఎందుకు ఎమ్మార్పీ ధర కంటే ఎక్కువగా అమ్ముతున్నారని ప్రశ్నిస్తే క్యాషియర్లు మాత్రం నీళ్లు నములుతున్నారు. మామూళ్ల మత్తులో ఎకై ్సజ్ శాఖ సర్వేపల్లి నియోజకవర్గంలో సుమారు 250పైగా బెల్టు షాపులు ఏర్పాటు చేసి మందుబాబులను దోచుకుంటున్నారని సమాచారం. కొన్ని గ్రామాల్లో నేతల మధ్య ఉన్న పోరు కారణంగా పోటాపోటీగా బెల్టు షాపులు తెరుచుకున్నాయి. నిబంధనల ప్రకారం మద్యం దుకాణాల్లో ఎమ్మార్పీ ధరకే మద్యం విక్రయాలు చేయాల్సి ఉంది. అయితే సర్వేపల్లి నియోజకవర్గంలో ఎమ్మార్పీ ధర కంటే రూ.10 అదనంగా అమ్ముతున్నారని ఎక్సైజ్ అధికారులకు సమాచారం ఇచ్చినా మామూళ్ల మత్తులో పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వెంకటాచలంలోని మద్యం దుకాణం వద్ద టీడీపీ సానుభూపతిపరులే ఎమ్మార్పీ ధర కంటే అదనంగా మద్యం అమ్మకాలు చేపట్టడంపై విమర్శలు చేయడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కొన్ని గ్రామాల్లో పగలు, రాత్రి తేడా లేకుండా బెల్టు షాపుల్లో మద్యం విక్రయాలు జరుగుతున్నా పట్టించుకోవడం లేదని మహిళలు మండి పడుతున్నారు. గ్రామాల్లో బెల్టు షాపుల గురించి ఎకై ్స జ్ అధికారులకు, సిబ్బందికి సమాచారం ఇచ్చినా పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఏ గ్రామం నుంచి అయితే ప్రజలు బెల్టు షాపుల గురించి సమాచారం ఇస్తున్నారో వెంటనే ఎకై ్సజ్‌శాఖ సిబ్బంది సంబంధిత బెల్టు షాపుల నిర్వాహకులకు ఫోన్ చేసి జాగ్రత్తగా అమ్మకాలు చేసుకోవాలని సూచిస్తున్నారని మహిళలు ఆరోపిస్తున్నారు. జిల్లా ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని గ్రామాల్లో బెల్టు దుకాణాలు లేకుండా చర్యలు చేపట్టాలని మహిళలు డిమాండ్ చేస్తున్నారు.కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సర్వేపల్లి నియోజకవర్గంలో దోపిడీకి కాదేది అనర్హం అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది. విలువైన ప్రభుత్వ భూముల్లో పాగా వేసి అక్రమ గ్రావెల్ దోచుకుంటున్నారు. ఏకంగా పెన్నానదిలోకి రోడ్లేసి ఇసుక కొల్లగొడుతున్నారు. బొగ్గు బూడిద రవాణా నుంచి పోర్టు నుంచి వెళ్లే సరుకుల వాహనాలు ‘ఎస్’ ట్యాక్స్‌ను వసూలు చేస్తుండగా తాజాగా మద్యంపైనా వసూలు చేస్తున్నట్లు మద్యం ప్రియులు సోషల్ మీడియా వేదికగా ఆరోపణలు గుప్పిస్తున్నారు. మద్యంను ఎమ్మార్పీ ధరల కంటే అధికంగా అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నారు. నిత్యం ఏదొక దుకాణం వద్ద అధిక ధరల అమ్మకాలపై గొడవలు జరుగుతున్నా.. ఎకై ్సజ్‌శాఖ అధికారులు పట్టించుకోక పోవడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. -
వెన్నుపోటు బాబుకు గునపం గుర్తే కరెక్ట్
● బాబు, పవన్.. ఒంటరిగా పోటీ చేయగలరా? ● జగన్ పాలన, కూటమి పాలనపై ప్రజల్లో చర్చ ● మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి ముత్తుకూరు (పొదలకూరు) : వెన్నుపోటు చంద్రబాబుకు గునపం గుర్తే కరెక్ట్‌గా సరిపోతుందని మాజీమంత్రి, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి పునరుద్ఘాటించారు. మండలంలోని ఈపూరు, రొయ్యలపాళెంలో బుధవారం కాకాణి పర్యటించారు. దువ్వూరు విశ్వమోహన్‌రెడ్డి, నిరంజన్‌రెడ్డి ఆధ్వర్యంలో ఎంతో వైభవంగా నిర్వహిస్తున్న శ్రీమహాలక్ష్మి అమ్మవారి ఆలయ ఐదో వార్షికోత్సవ ప్రత్యేక పూజల్లో కాకాణి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈపూరు అనంతరాజు వేణుగోపాల్ గృహంలో కార్యకర్తల సమావేశం నిర్వహించి మీడియాతో మాట్లాడుతూ జగన్మోహన్రెడ్డి, చంద్రబాబు పాలనపై ప్రజలు చర్చించుకుంటున్నట్లు తెలిపారు. ఏ ఒక్క వర్గం కూటమి పాలనలో సంతృప్తిగా లేరని, పొరుగు రాష్ట్రాల విజయాలను చూసైనా పవన్‌కల్యాణ్, చంద్రబాబు నేర్చుకోవాల్సి ఉందన్నారు. వీరిద్దరూ ఒంటరిగా ఎన్నికల్లో పోటీ చేయగలరాని ప్రశ్నించారు. 2019లో వైఎస్ జగన్మోహన్రెడ్డి ఒంటరిగా పోటీ చేసి అఖండ విజయం సాధించిన విషయాన్ని గుర్తు చేశారు. చంద్రబాబు పాలనలో ప్రజ లు అనేక ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు. జిల్లాలో మహానాడు ఎక్కడ జరపాలని టీడీపీ నాయకులు పోట్లాడుకుంటున్నార న్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో అన్ని సీట్లు తమవేనని స్పష్టం చేశారు. చంద్రబాబు ఎన్టీయార్‌ను నుంచి నమ్మిన పార్టీ నేతలను, కార్యకర్తలను ప్రధానంగా ప్రజలను గునపంతో పొడవడం అలవాటు చేసుకున్నందునే గునపం గుర్తు ఆయనకు సరిపోతుందన్నారు. తాను జోస్యం చెప్పడం లేదని ప్రజల నాడిని బట్టి వచ్చే ఎన్నికల సరళిని వివరిస్తున్నట్లు తెలిపారు. వాస్తవాలు చెబితే టీడీపీకు చెందిన బీద రవిచంద్ర జీర్ణించుకోలేక తాను జోస్యం చెపుతున్నానంటున్నాడన్నారు. కూటమి పాలనలో జరుగుతున్న మోసాలను తాము స్పష్టంగా ప్రజల దృష్టికి తీసుకుని వెళుతున్నామని, తమ ప్రభుత్వంలో ప్రతి వర్గానికి మేలు జరిగినట్లు తెలిపారు. కూటమి ప్రభుత్వం వచ్చి రెండేళ్లవుతున్నా గ్రామాల్లో పనులు జరగడం లేదన్నారు. సీఎస్ఆర్ నిధుల కేటాయింపులో అవకతవకలకు పాల్పడుతున్నారని సైకిళ్ల పంపిణీ వ్యవహారంలో డీలర్ల నుంచి కమీషన్లను దండుకుంటూ ప్రజాసేవ చేస్తున్నట్లు ప్రచారం చేసుకుంటున్నారని ఆరోపించారు. 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉందని చెప్పుకునే చంద్రబాబు ఒక్కసారైనా పొత్తులు లేకుండా ఎన్నికల బరిలో నిలిచాడా అని ప్రశ్నించారు. తమిళనాడులో విజయ్ ఒంటరిగా పోటీ చేసి పూర్తి మెజార్టీ రాలేకున్నా అతిపెద్ద పార్టీగా విజయం సాధించినట్లు తెలిపారు. అధికారం ఉన్నా లేకున్నా ఎల్లప్పుడు ప్రజలతోనే ఉంటామని, వారి సమస్యలపై స్పందించి పోరాటం చేస్తామని వెల్లడించారు. పార్టీ మండల కన్వీనర్ విష్ణువర్ధన్‌రెడ్డి, నాయకులు దువ్వూరు విశ్వమోహన్‌రెడ్డి, దువ్వూరు నిరంజన్‌రెడ్డి, దవ్వూరు తేజారెడ్డి, అలపాక శ్రీనివాసులు, పాముల శ్రీనివాసులు పాల్గొన్నారు. -
ప్రతి గ్రామంలో పార్టీ బలోపేతానికి కృషి
● మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి కోవూరు: నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో వైఎస్సార్సీపీ బలోపేతానికి కృషి చేయాలని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ రాష్ట్ర పీఏసీ సభ్యుడు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. మాజీ ముఖ్యమంత్రి, పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో బుధవారం నెల్లూరులోని తన నివాసంలో కోవూరు నియోజకవర్గానికి చెందిన బూత్ లెవల్ ఏజెంట్లు, పార్టీ నాయకులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నల్లపరెడ్డి మాట్లాడుతూ నిరంతరం ప్రజల మధ్య ఉండి పార్టీ కార్యక్రమాలను చేరవేయాలన్నారు. బూత్ కమిటీల పనితీరును సమగ్రంగా సమీక్షించిన ఆయన, ఎక్కడ లోపాలున్నాయో గుర్తించి వెంటనే సరిదిద్దాలని ఆదేశించారు. ప్రతి బూత్‌లో ఓటర్ల వివరాలు సక్రమంగా నమోదు చేయడం, కొత్త ఓటర్ల నమోదు, తొలగింపులపై అప్రమత్తంగా ఉండటం వంటి అంశాలపై దిశానిర్దేశం చేశారు. పార్టీపై ప్రజల్లో ఉన్న నమ్మకాన్ని మరింత పెంచేలా కృషి చేయాలన్నారు. యువత, మహిళలను పెద్దఎత్తున పార్టీ కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేయాలని, సోషల్ మీడియాను సమర్థవంతంగా వినియోగించుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి వీరి చలపతిరావు, జిల్లా ఉపాధ్యక్షుడు పచ్చిపాల రాధాకృష్ణారెడ్డి, రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు శివుని నరసింహారెడ్డి, ఇందుకూరుపేట మండల అధ్యక్షుడు మావులూరు శ్రీనివాసులురెడ్డి, బుచ్చి రూరల్ అధ్యక్షుడు చెర్లో సతీష్‌రెడ్డి, బుచ్చి మున్సిపాలిటీ అధ్యక్షుడు షేక్ షాహుల్, విడవలూరు మండల అధ్యక్షుడు కాటంరెడ్డి నవీన్‌రెడ్డి, కోవూరు మండల అధ్యక్షుడు అత్తిపల్లి అనూప్‌రెడ్డి, నియోజకవర్గ బూత్ కమిటీల ఇన్చార్జి కొండూరు లక్ష్మీనారాయణరెడ్డి, నియోజకవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షుడు అనపల్లి ఉదయభాస్కర్ తదితరులు పాల్గొన్నారు. -
మద్యం మత్తులో యువకుల బీభత్సం
● ఆటో డ్రైవర్‌పై దాడి ● మహిళా ప్రయాణికులపై దాడికి యత్నం కావలి: మద్యం మత్తులో ఓ వ్యక్తి ఆటో డ్రైవర్‌పై దాడిచేసిన ఘటన మంగళవారం జలదంకి – గట్టుపల్లి క్రాస్‌రోడ్డు వద్ద జరిగింది. స్థానికులు, పోలీసుల కథనం మేరకు.. కావలికి చెందిన కుప్పు సాయిసునీల్, షేక్ సుభాని జలదంకిలో మద్యం తాగి కావలి వైపు మోటార్‌బైక్‌పై వేగంగా వెళ్తున్నారు. ఇదే సమయంలో కావలి నుంచి బ్రాహ్మణక్రాకకు వెళ్తున్న ఆటోలో ముగ్గురు మహిళా ప్రయాణికులున్నారు. వీరు క్రాస్‌రోడ్డు వద్ద ఆగి కొబ్బరి బోండాలు, పండ్లు కొనుగోలు చేస్తున్నారు. అదే సమయంలో అత్యంత వేగంగా సాయిసునీల్, సుభాని వేగంగా వచ్చి ఆటోను బైక్‌తో ఢీకొట్టి పడిపోయారు. మద్యం మత్తులో ఉన్న ఆ యువకులు ఆటో డ్రైవర్ ప్రవీణ్‌పై దాడిచేసి తరుముకున్నారు. అంతటి ఆగకుండా రాళ్లతో ఆటోను ధ్వంసం చేసి బీభత్సం సృష్టించారు. మహిళా ప్రయాణికులపై దాడి చేయబోయారు. స్థానికులు వారిని వారించగా యువకులు తిరగబడి దాడికి యత్నించారు. గందరగోళం చేసి కావలికి వస్తే మీ సంగతి చూస్తామంటూ బెదిరింపులకు దిగారు. అయితే స్థానికులు ధైర్యం చేసి వారిని పట్టుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు. జలదంకి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేశామని ఎస్సై లతీఫున్నీసా తెలిపారు. ఇద్దరిపై కావలిలోని వివిధ పోలీస్స్టేషన్లలో పలు కేసులున్నట్లు వెల్లడించారు. -
90 శాతం ప్రాజెక్టు పనులు పూర్తి
రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులను 90 శాతం మాజీ సీఎం వైఎస్ జగన్ పూర్తి చేశారు. 10 శాతం పనులు పూర్తి చేయాల్సి ఉంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రాజెక్టు పనులు పెండింగ్ పెట్టింది. చంద్రబాబు తన శిష్యుడు తెలంగాణ సీఎం రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్ర రైతులను తాకట్టుపెట్టారు. అమరావతి నిర్మాణానికి రెండు లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రతిపాదించిన మావిగన్‌తో తక్కువ ఖర్చుతో అమరావతి ఏర్పాటవుతుంది. ప్రాజెక్టుల సాధన కోసం గ్రామ స్థాయి నుంచి ప్రజలు ఏకమై ఉద్యమించాలి. –శివశంకర్‌రెడ్డి, వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి ● -
ప్రభుత్వం మెడలు వంచుదాం
అమరావతిలో నిర్మాణాలకు చేస్తున్న ఖర్చులో కొంత భాగం కేటాయిస్తే రాష్ట్రంలోని పెండింగ్ సాగునీటి ప్రాజెక్టులు పూర్తవుతాయి. జిల్లాలోని రైతాంగం పెన్నాపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. ఆత్మకూరు, ఉదయగిరి నియోజకవర్గాలకు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అవసరం ఎంతైనా ఉంది. సాగునీటి ప్రాజెక్ట్‌లు పూర్తయితే వేలాది హెక్టార్ల భూములు సాగులోకి వస్తాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి ముఖ్యమైన ప్రాజెక్టులపై దృష్టి పెట్టడంలేదు. సంగం బ్యారేజ్‌కు మాజీ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి అన్న పేరును తీసేయడం బాధాకరం. భవిష్యత్ తరాల కోసం ప్రభుత్వం మెడలు వంచి ప్రాజెక్టులు సాధించుకుందాం. –మేకపాటి విక్రమ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే -
కేజీబీవీ టీచర్లు, ప్రిన్సిపల్స్‌కు బదిలీల కౌన్సెలింగ్ నేడు
నెల్లూరు(టౌన్): జిల్లాలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, ప్రిన్సిపల్స్, పీజీటీలు, సీఆర్టీలకు బుధవారం బదిలీల కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. కావలిలోని కేజీబీవీలో పనిచేస్తున్న ప్రిన్సిపల్ ఐదేళ్లు సర్వీసు పూర్తి చేసుకున్నారు. అదే విధంగా 8 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఆరుగురు పీజీటీలు, సీఆర్టీలున్నారు. వీరికి తప్పనిసరిగా బదిలీలు జరుగనున్నాయి. అదే విధంగా మరో 11 మంది రిక్వెస్ట్ బదిలీలకు దరఖాస్తు చేసుకున్నారు. వీరందరికీ సమగశిక్ష ఏపీసీ వెంకటసుబ్బయ్య ఆధ్వర్యంలో కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. ఇసుక వాహనాలు నిబంధనలు పాటించాల్సిందే● ఇన్చార్జి డీడీ శ్రీనివాసరావు నెల్లూరు(టౌన్): జిల్లాలో ఇసుక రవాణా చేస్తున్న వాహనదారులు ప్రభుత్వ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని జిల్లా గనుల, భూగర్భ శాఖ ఇన్చార్జి డీడీ శ్రీనివాసరావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతి వాహనాన్ని టార్పాలిన్‌తో పూర్తిగా కప్పాలన్నారు. ముందు భాగంలో ఉచిత ఇసుక వాహనం అంటూ బోర్డును అమర్చాలన్నారు. వినియోగదారుల నుంచి తప్పనిసరిగా రసీదు తీసుకోవడంతోపాటు తనిఖీల సమయంలో దానిని సంబంధిత అధికారులకు చూపించాలన్నారు. పాఠశాలలు, ఆస్పత్రుల్లాంటి ప్రాంతాల వద్ద జాగ్రత్తగా వాహనాన్ని నడపాలన్నారు. ఇసుక రవాణా చేసే అన్ని వాహనాల్లో తప్పనిసరిగా జీపీఎస్ పరికరం అమర్చాలన్నారు. లేకపోతే డ్రైవర్ మొబైల్లో జీపీఎస్ యాప్ డౌన్లోడ్ చేసి రవాణా పూర్తయ్యే వరకు ఆన్‌లో ఉంచాలన్నారు. ఉచిత ఇసుకను అధిక మొత్తంలో నిల్వ చేయడం లేదా డంపింగ్ చేయడం, వాణిజ్య ప్రయోజనాల కోసం వినియోగించడం పూర్తి నిషేధమన్నారు. ఈ నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విధులకు వచ్చి.. గుండెపోటుకు గురై..● ఆత్మకూరులో ఫార్మసిస్ట్ మృతి ఆత్మకూరు: అతను ఉదయం ఇంటి నుంచి విధులకు వచ్చాడు. ఈ క్రమంలో గుండెపోటుకు ప్రాణాలు విడిచాడు. ఈ ఘటన ఆత్మకూరు ప్రభుత్వ జిల్లా ఆస్పత్రిలో మంగళవారం జరిగింది. ఆస్పత్రి సిబ్బంది వివరాల మేరకు.. కలువాయికి చెందిన వడిదారి పెంచలయ్య (43) కొంతకాలంగా కాంట్రాక్ట్ పద్ధతిలో ఫార్మసిస్ట్‌గా పనిచేస్తున్నాడు. భార్య, ఇద్దరు పిల్లలున్నారు. ఊరి నుంచి వచ్చి విధుల్లో ఉన్న సమయంలో గుండెనొప్పిని గ్యాస్ సమస్యగా భావించి మాత్రలు వేసుకునేందుకు ఉపక్రమిస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలాడు. వెంటనే సిబ్బంది ఎమర్జెన్సీ వార్డుకు తీసుకెళ్లారు. డాక్టర్లు చికిత్స చేస్తుండగా అప్పటికే మృతిచెందినట్లు గుర్తించారు. పెంచలయ్య మృతి వార్త తెలుసుకున్న ఏపీ హంస (ఆంధ్రప్రదేశ్ హెల్త్ అడ్మినిస్ట్రేషన్ మెడికల్ సర్వీసెస్ అసోసియేషన్) జిల్లా అధ్యక్షుడు చేజర్ల సుధాకర్‌రావు, కార్యదర్శి బి.కమల్ కిరణ్, పట్టణాధ్యక్షుడు శ్రీనివాసరావు, ఉపాధ్యక్షుడు వెంకట్రావు సంతాపం తెలిపారు. పెంచలయ్య కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని కోరారు. గుర్తుతెలియని వాహనం ఢీకొని..● వ్యక్తి దుర్మరణం బిట్రగుంట: జాతీయ రహదారిపై గుర్తుతెలియని వాహనం ఢీకొని ఓ వ్యక్తి దుర్మరణం పాలైన ఘటన బోగోలు మండలం కోవూరుపల్లి వద్ద మంగళవారం రాత్రి జరిగింది. స్థానికులు, పోలీసుల కథనం మేరకు.. బోగోలు మండలం ముంగమూరుకు చెందిన గొత్తల నాగరాజు (35) అల్లూరులోని కెనరా బ్యాంక్‌లో ఉద్యోగం చేస్తూ కావలిలో నివాసం ఉంటున్నాడు. బ్యాంక్ విధులు ముగించుకుని మోటార్‌బైక్‌పై కావలికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అయితే ఘటనా స్థలాన్ని బట్టి చూస్తే బైక్‌ను ఏ వాహనం ఢీకొన్నట్లుగా లేదని అర్థమవుతోంది. అదుపుతప్పి పడటంతో వెనుక నుంచి వాహనం అతడిపైకి ఎక్కడంతో అక్కడికక్కడే దుర్మరణం చెందినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వారు, బంధువులు ఘటనా స్థలానికి చేరుకుని నాగరాజు మృతదేహాన్ని చూసి కన్నీరుమున్నీరయ్యారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని కావలి ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిమ్మ ధరలు (కిలో)పెద్దవి : రూ.150 సన్నవి : రూ.50 పండ్లు : రూ.30 -
కలెక్టర్‌కు సమస్యలు ఏకరువు
● అప్పసముద్రంలో కలెక్టర్ పల్లె వీక్షణ ● ఫిర్యాదులు స్వీకరిస్తూ.. పరిష్కారాలకు ఆదేశాలు ● గంటన్నరలో ముగిసిన పర్యటన ఉదయగిరి: పల్లె వీక్షణలో భాగంగా అప్పసముద్రంలో కలెక్టర్ హిమాన్షు శుక్లా మంగళవారం పర్యటించారు. సుడిగాలి పర్యటన చేస్తూ గంటన్నర వ్యవధిలో పల్లెవీక్షణను పూర్తిచేశారు. తొలుత చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాన్ని పరిశీలించి వర్మికంపోస్టును రైతులకు అందించాలని సూచించారు. అనంతరం అక్కడే ఉన్న పశువుల తాగునీటి తొట్టెను పరిశీలించి మొక్కలు నాటారు. ఆ తరువాత ఎస్సీకాలనీలో పర్యటించారు. ఆరికొండ మాలకొండయ్య ట్రైసైకిల్ కోసం అర్జీ ఇవ్వగా మంజూరుకు ఆదేశాలు ఇచ్చారు. అప్పసముద్రం గ్రామ వీధుల్లో పర్యటించి విద్యార్థులు, గ్రామస్తులతో ముచ్చటించారు. స్థానిక సమస్యలు, అధికారుల పనితీరుపై ఆరాతీశారు. అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఓవర్‌హెడ్ ట్యాంకును పరిశీలించి నీటిలో ఫ్లోరిన్ శాతాన్ని పరీక్షించారు. అనంతరం సచివాలయం వద్ద ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. అప్పసముద్రం నుంచి నర్రవాడ జాతీయ రహదారిని కలిపే గ్రావెల్ రోడ్డును మంజూరు చేయాలని కోరగా అంగీకారం తెలిపారు. అప్పసముద్రానికి దుత్తలూరుకు బదులుగా ఉదయగిరి ఫీడర్ నుంచి సరఫరా ఇవ్వాలని, విద్యుత్ లైన్మెన్ల కొరతను వెంటనే పరిష్కారించాని ఎస్పీడీసీఎల్ ఎస్ ఈ రాఘవేంద్రను అదేశించారు. స్థానిక ఎంపీపీ స్కూల్లో ఉపాధ్యాయులు లేరని తెలుసుకుని విద్యాశాఖ అధికారులపై అసహనం వ్యక్తం చేశారు. మళ్లీ బడులు తెరిచేలోగా నియమించాలని డీఈఓకు ఆదేశాలు ఇచ్చారు. దాసరిపల్లి గ్రామ సమస్యలను టీచర్ జాఫర్ మొయినుద్దీన్ కలెక్టర్ దృష్టికి తెచ్చారు. ఆక్రమణకు గురైన పాతూరు చెరువును పరిశీలించి ఆక్రమణదారులపై చర్యలు తీసుకోవాలని ఆర్డీఓను కలెక్టర్ అదేశించారు. పదో తరగతి ఫలితాల్లో మండలస్థాయిలో ప్రతిభకనబర్చిన విద్యార్థులను కలెక్టర్ అభినందించి ప్రశంసాపత్రాలు జ్ఞాపికలు అందజేశారు. భూములు, నూతన పింఛన్లు, ఆరోగ్య సేవల కోసం పలువురు కలెక్టర్‌కు అర్జీలు ఇవ్వగా ఆర్డీఓకు అందజేసి పరిష్కారించాలని ఆదేశించారు. గ్రామస్థాయిలో అధికారులు, సిబ్బంది పనితీరులో లోపాలు స్పష్టంగా కనిపించినా కలెక్టర్ వారిని మందలించకపోవడం విశేషం. కాగా కలెక్టర్ షెడ్యూల్లో ఉపాధి పనుల పరిశీలన ఉన్నప్పటికి వెళ్లలేదు. సీఈఓ శ్రీధ ర్, డీపీఓ వసుమతి, వ్యవసాయశాఖ జేడీ సత్యవాణి, జిల్లా ఉద్యాన అధికారి సుబ్బారెడ్డి, డీఆర్డీఏ పీడీ నాగరాజకుమారి, డ్వామా పీడీ శ్రీనివాసప్రసాద్, ఆర్డీఓ పావని, డిప్యూటీ కలెక్టర్లు సన్నీ వంశీ పాల్గొన్నారు. -
వైఎస్ జగన్ సూచనలతో ఆర్థిక సాయం
కావలి: మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సూచనలతో కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి ఓ కుటుంబానికి అండగా నిలిచారు. కావలి రూరల్ మండలం ఒట్టూరు గ్రామానికి చెందిన సింగోటి రాజేష్ అనే యువకుడు ఇటీవల బ్రెయిన్ స్ట్రోక్‌కు గురయ్యాడు. చికిత్స కోసం ఆస్పత్రికి తరలించగా వైద్య ఖర్చుల నిమిత్తం ఆ కుటుంబం తీవ్ర ఇబ్బందుల్లోకి పడిపోయింది. జువ్వలదిన్నె షిప్పింగ్ హార్బర్ సందర్శనకు వచ్చిన జగన్మోహన్రెడ్డికి బాధిత కుటుంబం విషయం చెప్పింది. ఆయన సూచనల మేరకు ప్రతాప్‌కుమార్‌రెడ్డి ఒట్టూరు గ్రామాల నాయకులను, రాజేష్ తండ్రి ప్రసాద్‌ను మంగళవారం కార్యాలయానికి పిలిపించి చికిత్స నిమిత్తం రూ.2 లక్షల నగదు అందచేశారు. ప్రసాద్ కన్నీటి పర్యంతమవుతూ కృతజ్ఞతలు తెలిపారు. -
రేపట్నుంచి రాష్ట్రస్థాయి బీచ్ కబడ్జీ పోటీలు
సంగం: మండలంలోని దువ్వూరులో ఈ నెల 7 నుంచి 10వ తేదీ వరకు రాష్ట్ర స్థాయి బీచ్ కబడ్డీ చాంపియన్‌షిప్ పోటీలను నిర్వహించనున్నట్లుగా జిల్లా కబడ్డీ అసోసియేషన్ సెక్రటరీ సతీష్ తెలిపారు. రాష్ట్రస్థాయి బీచ్ కబడ్జీ పోటీలకు ఎంపికై న జిల్లా పురుష, మహిళల జట్లకు టీషర్టులను మంగళవారం అందజే శారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రస్థాయి పోటీల్లో తొలిసారిగా 26 జిల్లాల నుంచి మహిళలు, పురుషుల జట్లు పాల్గొంటున్నాయని తెలిపారు. క్రీడాకారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా భోజనం, వసతి సౌకర్యాలను కల్పిస్తున్నామని చెప్పారు. జిల్లా పురుషుల జట్టుకు 16 మంది, మహిళల జట్టకు 10 మంది క్రీడాకారులను ఎంపిక చేశామని తెలిపా రు. వారిలో ప్రతిభ కనబరిచిన 6 మంది పురుషులు, 6 మంది మహిళలను తుది జట్లలోకి తీసుకుంటా మని చెప్పారు. జిల్లా జట్టులో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించిన సునీల్, నవీన్ వంటి ప్రముఖ క్రీడాకారులు ఉండడం గర్వకారణమన్నారు. ఈ పోటీల్లో నెల్లూరు జట్టు ఫైనల్స్‌కు చేరుకుంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. -
కేసులకు భయపడకుండా పోరాటం
హక్కుల సాధన కోసం, ప్రశ్నించే వారిపై ప్రభుత్వం కేసులు బనాయిస్తోంది. కేసులు పెట్టిన భయపడేది లేదు. ప్రజలు, రైతుల హక్కుల సాధన కోసం పోరాటం చేస్తాం. రాష్ట్ర ముఖ్యమంత్రి రైతులను మోసం చేస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చీకటి ఒప్పందాలను ప్రజల్లోకి తీసుకుపోవాలి. మాజీ సీఎం జగన్మోహన్రెడ్డి రైతుల పక్షపాతి. మాజీ సీఎం ఆదేశాలను గ్రామ స్థాయికి తీసుకెళ్లి ఉద్యమించి ప్రాజెక్ట్‌లు సాధించుకుందాం. –నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి, వెంకటగిరి వైఎస్సార్సీపీ సమన్వయకర్త -
56 ప్రాంతాల్లో వేసవి శిక్షణ శిబిరాలు
నెల్లూరు(టౌన్): ఈనెలాఖరు వరకు జిల్లా వ్యాప్తంగా 56 కేంద్రాల్లో వేసవి శిక్షణ శిబిరాలు కొనసాగుతాయని జిల్లా క్రీడాభివృద్ధి అధికారి ఎస్కే జసీమ్ తెలిపారు. మంగళవారం నెల్లూరులోని ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో వేసవి క్రీడా శిక్షణ శిబిరాలను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వివిధ క్రీడలకు శిక్షణ ఇస్తున్న కోచ్‌లకు పరికరాలను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ శిబిరాలకు హాజరువుతున్న క్రీడాకారుల్లో నైపుణ్యాన్ని వెలికితీయాలన్నారు. క్రీడలతో మానసిక, శారీరక ఒత్తిడి తగ్గుతుందన్నారు. సెట్నల్ సీఈఓ, జిల్లా పారిశ్రామిక డిప్యూటీ డైరెక్టర్ శ్రీధర్‌బాబు మాట్లాడుతూ ఉన్నత క్రీడాకారులుగా ఎదగడానికి వేసవి శిబిరాలు మంచి అవకాశమన్నారు. జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆనం మహేష్‌రెడ్డి మాట్లాడుతూ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం శాప్‌లీగ్స్ లాంటి టోర్నమెంట్లను ప్రవేశపెట్టిందన్నారు. కార్యక్రమంలో జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ సెక్రటరీ కె.గురుప్రసాద్, ఎస్సీజీఎఫ్ఐ సెక్రటరీ దేవిక, రమణయ్య, వివేకానంద, ఏసీ సుబ్బారెడ్డి, ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. -
హక్కుల సాధనకు ఉద్యమిద్దాం
గతంలో జిల్లాలోని సోమశిల, కండలేరు జలాశయాలు డెడ్ స్టోరేజ్‌కి చేరి తాగునీరు లేని పరిస్థితులను చూశాం. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి రైతులకు సాగునీటి భరోసా కల్పించారు. జలయజ్ఞం పేరుతో అనేక ప్రాజెక్ట్‌లను పూర్తి చేశారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం భవిష్యత్ తరాలకు భరోసా. అటువంటి పథకాన్ని సాధించుకునేందుకు అట్టడుగు స్థాయి నుంచి ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవాలి. హక్కుల సాధన కోసం అందరూ కలిసి ఉద్యమించాలి. –ఆనం విజయకుమార్‌రెడ్డి, నెల్లూరు రూరల్ వైఎస్సార్సీపీ సమన్వయకర్త -
తెలంగాణ నీటి దోపిడీకి చంద్రబాబు మద్దతు
సీమ ప్రాజెక్ట్ సాధనకు పోరాడుతాం వెలుగొండకు మోకాలడ్డు సాక్షి ప్రతినిధి, నెల్లూరు: చంద్రబాబు రైతాంగం పాలిట జలద్రోహి అని, ఆయన పాలనలో ఏనాడు ఒక్క ప్రాజెక్ట్‌ను ప్రారంభించనూ లేదు.. పూర్తి చేయనూ లేదని, దివంగత వైఎస్సార్, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన జలప్రాజెక్ట్లనూ ప్రభుత్వం మారాక తుంగలో తొక్కారని వైఎస్సార్సీపీ టాస్క్‌ఫోర్స్ చైర్మన్ సాకే శైలజానాథ్, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి దుయ్యబట్టారు. వైఎస్సార్, వైఎస్ జగన్ దూరదృష్టితోనే ప్రాజెక్ట్‌ల నిర్మాణం చేప ట్టి పూర్తి చేశారని గుర్తు చేశారు. వైఎస్ జగన్ హయాంలో చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకం సీమతో పాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాలను సస్యశ్యామలం చేసే అత్యంత గొప్ప ప్రాజెక్ట్ అన్నారు. అటువంటి ప్రాజెక్ట్‌ను చంద్రబాబు తెలంగాణకు తాకట్టు పెట్టి రైతుల గుండెల్లో గునపాలు దింపారని మండిపడ్డారు. చంద్రబాబు అటకెక్కించిన పథకాన్ని తిరిగి పునరుద్ధరించేందుకు చేపట్టాల్సిన భవిష్యత్ కార్యాచరణపై నగరంలోని వేదాయపాళెం ఆర్ఎస్ఎన్ కల్యాణ మండపంలో రైతులు, రైతు సంఘాల నేతలు, మేధావులు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్తలు, నాయకులతో కాకాణి అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశం మంగళవారం జరిగింది. వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి వీరి చలపతిరావు, జిల్లా రైతు సంఘ అధ్యక్షుడు నరసింహారెడ్డి, రాష్ట్ర మహిళా జోనల్ అధ్యక్షురాలు మొయిళ్ల గౌరి, జిల్లా మహిళా అధ్యక్షురాలు లక్ష్మీసునంద, కోవూరుకు చెందిన బత్తుల విజయ్‌కుమార్, సూళ్లూరుపేటకు చెందిన గీతానందరెడ్డి, ఉదయగిరికి చెందిన వెంకట్‌రెడ్డి, నెల్లూరురూరల్‌కు చెందిన రాంప్రసాద్‌రెడ్డి, కొడవలూరు దామోదర్‌రెడ్డి, ఆత్మకూరుకు చెందిన ఏ కోటిరెడ్డి, వెంకటగిరికి చెందిన దశరథరామిరెడ్డి, భాస్కర్‌గౌడ్, చిలుకూరు సురేష్,సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయన్సర్ నెల్లూరు సుబ్బు, తదితరులు ప్రసంగించారు. ఉదయగిరి వైఎస్సార్సీపీ సమన్వయకర్త మేక పాటి రాజగోపాల్‌రెడ్డి, విజయ డెయిరీ మాజీచైర్మన్ రంగారెడ్డి, తదితరులు పాల్గొన్నారు. మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ ఓటుకు నోటు కేసులో ఇరుక్కున్న చంద్రబాబు తెలంగాణ నీటి దోపిడీపై మాట్లాడలేకపోయారని, రేవంత్‌రెడ్డి సీఎం అయ్యాక ఏకంగా ఆయనకు రాజకీయ ప్రయోజనం కల్పించేందుకు సీమతోపాటు నెల్లూ రు, ప్రకాశం జిల్లాలను తాకట్టు పెట్టారన్నారు. జిల్లా రైతాంగానికి మేలు చేసిన సీఎంలు ఎవరైనా ఉన్నారంటే వైఎస్ రాజశేఖరరెడ్డి, వైఎస్ జగన్మోహన్రెడ్డి మాత్రమే అని గుర్తు చేశారు. అప్పట్లో వరుసగా తొమ్మిదేళ్లు సీఎంగా ఉన్న సమగ్ర సోమశిల విషయంలో ఒక అడుగు నీటి మట్టాన్ని కూడా చంద్రబాబు పెంచలేకపోయారన్నారు. వైఎస్సార్ అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే సమగ్రసోమశిలతో పాటు స్వర్ణముఖి బ్యారేజీలను పూర్తి చేసి రైతాంగానికి అంకితం చేశారని గుర్తుచేశారు. చంద్రబాబు హయాంలో 35 టీఎంసీలను మాత్రమే సోమశిలలో నిలువ చేస్తున్న క్రమంలో వైఎస్సార్ తన సొంత జిల్లాలో ఒక గ్రామాన్ని ఖాళీ చేయించి 78 టీఎంసీల సమగ్ర సోమశిలకు కృషి చేశారన్నారు. వైఎస్ జగన్ సంగం, నెల్లూరు బ్యారేజీలను పూర్తి చేసి మేకపాటి గౌతమ్‌రెడ్డి, నల్లపరెడ్డి శ్రీనివాసులురెడ్డి పేర్లను పెడితే టీడీపీ ప్రభుత్వం వచ్చి వెంటనే తొలగించిందన్నారు. వైఎస్ జగన్ కృషితో కండలేరు వరద కాలువ పరిమాణాన్ని 24 వేల క్యూసెక్కులకు పెంచగా, చంద్రబాబు ఆ పనులు కూడా ఆపేశారన్నారు. సీమతోపాటు నెల్లూరు ప్రజల గుండెల్లో గునపాలు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్‌తో ముక్కారు పంటలతో సస్యశ్యామలం వైఎస్సార్, వైఎస్ జగన్ దూరదృష్టితోనే ప్రాజెక్ట్‌ల నిర్మాణం సమగ్ర సోమశిల, స్వర్ణముఖి, నెల్లూరు, సంగం బ్యారేజ్‌లు ఘనత వీరిదే రైతాంగం ఐక్యంగా సర్కారు మెడలు వంచకపోతే జిల్లా ఎడారే రౌండ్ టేబుల్ సమావేశంలో మాజీ మంత్రులు శైలజానాథ్, కాకాణి గోవర్ధన్‌రెడ్డి సాకే శైలజానాథ్ మాట్లాడుతూ శ్రీశైలంలో 800 అడుగుల డెడ్ స్టోరేజీ ఉన్నప్పుడు సైతం తెలంగాణ ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా రోజుకు 8 టీఎంసీల నీటిని తరలిస్తోందన్నారు. 854 టీఎంసీలు నీరుంటేనే పోతిరెడ్డిపాడు ద్వారా రాయలసీమ, నెల్లూరుకు నీటిని తరలించే అవకాశముందన్నారు. కర్ణాటకలోని ఆల్మట్టి ప్రాజెక్ట్ వల్ల దిగువ కృష్ణాకు వరద జలాలు తగ్గిపోయాయన్నారు. తెలంగాణ నీటి దోపిడీ వల్ల ప్రాజెక్ట్ 854 అడుగులకు చేరడం గగనంగా మారిందన్నారు. ఈ పరిస్థితిని గమనించిన జగన్మోహన్రెడ్డి సీమ ఎత్తిపోతల పథకం ద్వారా నీటిని సీమతో పాటు నెల్లూరుకు తరలించేందుకు ప్రాజెక్టును ప్రారంభించారన్నారు. ఈ పథకం పూర్తయితే ప్రతి రోజూ కూడా 3 టీఎంసీలు ఈ ప్రాంతానికి చేరేవన్నారు. రైతుల నీటి కష్టాలు తీర్చడం దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి తర్వాత ఆయన తనయుడు జగన్మోహన్రెడ్డికే సాధ్యమైందన్నారు. బ్యారేజీలను వైఎస్సార్ పూర్తి చేస్తే, నెల్లూరు, సంగం బ్యారేజీలను జగన్మోహన్రెడ్డి పూర్తి చేశారన్నారు. చంద్రబాబు కాలంలో ఒక్క ప్రాజెక్టును కూడా పూర్తి చేయలేదన్నారు. -
రాజకీయ దురంధరుడు కలికి
● యానాదిరెడ్డికి ఘన నివాళి కావలి: మాజీ మంత్రి కలికి యానాదిరెడ్డి రాజకీయ దురంధరుడని మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి అన్నారు. కలికి 20వ వర్ధంతి కార్యక్రమం మంగళవారం పట్టణంలోని ఉదయగిరి బ్రిడ్జి సెంటర్ వద్ద ఘనంగా జరిగింది. రామిరెడ్డి, వైఎస్సార్సీపీ పట్టణాధ్యక్షుడు కేతిరెడ్డి శివకుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు కలిసి యానాదిరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రామిరెడ్డి మాట్లాడుతూ రాజకీయ పార్టీలకు అతీతంగా యానాదిరెడ్డి వర్ధంతి నిర్వహించడం సంతోషకరమని తెలిపారు. ఎంతోమంది యువకులకు రాజకీయ ఓనమాలు నేర్పి వారికి దిశానిర్దేశం చేసిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. అనంతరం వైఎస్సార్సీపీ శ్రేణుల ఆధ్వర్యంలో భారీగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో దామిశెట్టి సుధీర్‌నాయుడు, పందిటి కామరాజు, విజయ్‌కుమార్‌రెడ్డి, జంపాని రాఘవులు, మెట్టుకూరి రామిరెడ్డి, గంధం ప్రసన్నాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. -
చివరి భూములకు సాగునీరందాలి
రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు రై తు వ్యతిరేకి. గతంలో వ్యవసాయం దండగ అని మా ట్లాడారు. ఆయన తన శిష్యుడు తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టుపెట్టాడు. రైతులకు వెన్నుపోటు పొడిచాడు. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని నిలిపివేయడం వల్ల తలెత్తే పరిణామాలు, నష్టాలను రైతులకు వివరించాలి. సోమశిల ప్రాజెక్ట్ నుంచి కావలి ప్రాంతంలోని చివరి భూములకు సాగునీరంది రెండు పంటలు పండాలంటే రాయలసీమ ఎత్తిపోతల పథకం అవసరం. –రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే -
ఆస్తి కోసం అక్కపై దాడి
చిల్లకూరు: తండ్రి ఆస్తి కోసం ఓ వ్యక్తి అక్కపై దాడి చేసిన ఘటన గూడూరు రూరల్ పరిధిలోని తిప్పవరప్పాడు గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. రూరల్ పోలీసుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన పద్మమ్మ, శంకరయ్య అనే వారి మధ్య కొంతకాలంగా తండ్రి ఆస్తి విషయమై వివాదం నెలకొంది. ఈ క్రమంలో శంకరయ్య తన అక్క పద్మమ్మపై దాడికి పాల్పడటంతో ఆమె గాయపడి గూడూరు ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. సమాచారం అందుకున్న రూరల్ పోలీసులు ఆస్పత్రికి చేరుకుని బాధితురాలి నుంచి వివరాలు సేకరించారు.రౌడీషీటర్‌పై పీడీ యాక్ట్● కడప కేంద్ర కారాగారానికి తరలింపు నెల్లూరు(క్రైమ్): తీరు మారని రౌడీషీటర్లపై ఎస్పీ అజిత వేజెండ్ల ఆదేశాల మేరకు పోలీస్ అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఇప్పటికే పలువురిపై పీడీ యాక్ట్‌లు నమోదు చేసి కడప కేంద్ర కారాగారానికి తరలించారు. నెల్లూరు రామచంద్రాపురానికి చెందిన పి.మనోహర్ అలియాస్ మనుపై నవాబుపేట పోలీస్‌స్టేషన్‌లో రౌడీషీట్ ఉంది. అతను ప్రస్తుతం బంగ్లాతోటలో నివాసం ఉంటున్నాడు. హత్య, హత్యాయత్నం కిడ్నాప్, దాడి తదితర తొమ్మిది కేసులున్నాయి. పలుమార్లు కౌన్సెలింగ్ ఇచ్చినా అతని తీరులో మార్పురాలేదు. నేరాలకు పాల్పడుతూనే ఉన్నాడు. దీంతో కలెక్టర్ హిమాన్షు శుక్లా ఉత్తర్వుల మేరకు మంగళవారం మనోహర్‌పై పీడీ యాక్ట్ నమోదు చేసి కడప కేంద్ర కారాగారానికి తరలించినట్లు ఇన్స్పెక్టర్ జి.వేణుగోపాల్‌రెడ్డి తెలిపారు. రౌడీషీటర్లు సత్ప్రవర్తతో మెలగాలని, ప్రజా జీవనానికి, శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విద్యుత్ వైర్ల చోరీకోట: పొలాల్లో మోటార్లకు ఉన్న విద్యుత్ వైర్లు చోరీకి గురవుతున్నాయని మండలంలోని వెంకన్నపాళెం, తిన్నెలపూడి గ్రామాల రైతులు మంగళవారం ఎస్సై పవన్‌కుమార్‌కు ఫిర్యాదు చేశారు. రాత్రివేళల్లో గుర్తుతెలియని వ్యక్తులు మోటార్లకు ఉన్న వైర్లను తస్కరిస్తున్నారని, దీంతో నష్టపోతున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. కొద్దిరోజులుగా సుమారు 50 మంది రైతులకు చెందిన వైర్లు చోరీ జరిగినట్లు వెల్లడించారు. విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు. కండలేరులో 43.190 టీఎంసీల నీరురాపూరు: కండలేరు జలాశయంలో మంగళవారానికి 43.190 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు ఈఈ గజేంద్రరెడ్డి తెలిపారు. కండలేరు నుంచి సత్యసాయి గంగ కాలువకు 400, లోలెవల్ కాలువకు 50, హైలెవల్ కాలువకు 50, పిన్నేరు కాలువకు 20, మొదటి బ్రాంచ్ కాలువకు 5 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు.


