ప్రశాంతంగా జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష | - | Sakshi
Sakshi News home page

ప్రశాంతంగా జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష

May 18 2026 12:06 AM | Updated on May 18 2026 12:06 AM

నెల్లూరు (టౌన్‌): ఐఐటీల్లో ప్రవేశం కోసం ఆదివారం నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష ప్రశాంతంగా జరిగింది. జిల్లాలో రెండు కేంద్రాల్లో ఈ పరీక్ష నిర్వహించారు. ఉదయం 9 నుంచి 12 గంటల వరకు, మధా్‌య్‌హ్నం 2.30 నుంచి 5.30 గంటల వరకు రెండు విడతల్లో పరీక్షను నిర్వహించారు. జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షకు 96 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారు. పరీక్షకు విద్యార్థులతోపాటు తల్లిదండ్రులు రావడంతో కేంద్రల వద్ద సందడి నెలకొంది. పరీక్ష రాసి బయటకు వచ్చేంత వరకు తల్లిదండ్రులు కేంద్రాల వద్ద పడిగాపులు కాశారు. పరీక్ష కేంద్రాల వద్ద తాగునీటి సౌకర్యం ఏర్పాటు చేయకపోవడంతో తల్లిదండ్రులు ఇబ్బందులు పడ్డారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో కేంద్రాల సమీపంలోని చెట్లు కింద సేద తీరారు.

Advertisement
 
Advertisement
Advertisement