Cricket
-
MS Dhoni: ఆ ఒక్కటీ అడక్కు!
ఐపీఎల్(IPL) రాగానే ఎమ్మెస్ ధోనికి(MS Dhoni) ఇదే ఆఖరి సీజనా అనే చర్చ మళ్లీ మొదలవుతుంది! గత నాలుగేళ్లుగా అతను ‘డెఫినెట్లీ నాట్’ అంటూ చిరునవ్వులు చిందిస్తూనే ఉన్నాడు. లీగ్‌లో బ్యాటర్‌గా ధోని ప్రభావం దాదాపు సున్నాగా మారిపోయింది. అతని స్థాయి ఆట ఎంతో కాలంగా అస్సలు కనిపించడం లేదు. తప్పనిసరి అయితే తప్ప బ్యాటింగ్‌కు రాకుండా బౌలర్లను ముందుగా పంపిస్తున్నాడు. ఒక రకంగా టీమ్ 10 మందితోనే ఆడుతోంది! అయితే చెన్నై సూపర్ కింగ్స్ మేనేజ్మెంట్ ఆలోచనలు మాత్రం భిన్నంగా ఉన్నాయి. ఆటగాడిగా ఎలా ఉన్నా అతను మైదానంలో ఉంటే చాలు అని వారు భావిస్తున్నారు. అధికారికంగా కెప్టెన్ కాకపోయినా జట్టును నడిపించడంలో, వ్యూహాల్లో, టీమ్‌కు పెద్ద దిక్కుగా అతనికి అతనే సాటి. ఫిట్‌గానే ఉన్నాడు కాబట్టి అతను తనకు నచ్చినంత కాలం ఆడతాడేమో. -
నేటి నుంచి పరుగుల పండుగ
2008 మండు వేసవిలో ఐపీఎల్ తొలి మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్, బెంగళూరు రాయల్ చాలెంజర్స్ తలపడ్డాయి. ఈ మొదటి పోరులో మెకల్లమ్ తన మెరుపు బ్యాటింగ్‌తో అగ్గి పుట్టించాడు. 73 బంతుల్లోనే 10 ఫోర్లు, 13 సిక్సర్లతో 158 పరుగులు చేసి అతను అంటించిన మంట ఆ తర్వాత అంతకంతా పెరిగి దావానంలా మారి అన్ని వైపులకు వ్యాపించిపోయింది. టి20 క్రికెట్లో ఉండే బ్యాటింగ్ ధమాకా ఏమిటో అందరికీ చూపించేసింది. ఐపీఎల్ అంటే క్రికెట్ మాత్రమే కాదని... అంతకు మించిన వినోదమని సగటు అభిమాని ఆటతో పాటు ఊగిపోయేలా చేసింది ఈ లీగ్. ఐపీఎల్లో 17 సీజన్లు ముగిసిపోయాయి. ఇన్నేళ్లలో ఎన్నో మార్పులు వచ్చాయి. లీగ్‌లో ఆటగాళ్లు మారగా, కొన్ని నిబంధనలూ మారాయి. దిగ్గజాలు స్వల్పకాలం పాటు తామూ ఓ చేయి వేసి తప్పుకోగా, తర్వాతి తరం ఆటను మరో స్థాయికి తీసుకెళ్లింది. ఆటలో ఎన్ని మార్పులు వచి్చనా మారనిది లీగ్‌పై అభిమానం మాత్రమే. ఇన్ని సీజన్లలో కలిపి 1030 మ్యాచ్‌లు జరిగినా ఇప్పటికీ అదే ఉత్సాహం. అంతర్జాతీయ మ్యాచ్‌కంటే వేగంగా సీట్లు నిండిపోతుండగా, ఆటగాళ్ల రాక సినిమా ట్రైలర్‌లా కనిపిస్తోంది. ఇలాంటి వీరాభిమానం మధ్య ఐపీఎల్ 18వ పడిలోకి అడుగు పెడుతోంది. కోల్‌కతా: ఇండియన్ ప్రీమియర్ లీగ్–2025కు రంగం సిద్ధమైంది. నేడు మొదలు కానున్న 18వ సీజన్ 65 రోజుల పాటు జోరుగా సాగనుంది. ఈడెన్ గార్డెన్స్ మైదానంలో శనివారం జరిగే తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తలపడుతుంది. 2008 తర్వాత ఇరు జట్ల మధ్య సీజన్ తొలి మ్యాచ్ జరగడం ఇదే మొదటిసారి కావడం విశేషం. 69 లీగ్ మ్యాచ్‌లు, ఆపై 4 ‘ప్లే ఆఫ్స్’ సమరాల తర్వాత మే 25న ఇదే మైదానంలో జరిగే ఫైనల్ పోరుతో టోర్నీ ముగుస్తుంది. గత మూడు సీజన్ల తరహాలోనే ఇప్పుడు కూడా 10 జట్లు టైటిల్ కోసం అమీతుమీ తేల్చుకోనున్నాయి. మొదటి మ్యాచ్‌కు వాన అంతరాయం కలిగించే సూచనలు కనిపిస్తున్నాయి. శ్రేయా ఘోషాల్, కరణ్ ఔజ్లా, దిశా పటాని ఆట, పాటలతో కూడిన ప్రత్యేక ప్రారంబోత్సవ కార్యక్రమం కూడా జరగనుంది. ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ప్రేమించే లీగ్ మళ్లీ వచ్చిన నేపథ్యంలో టోర్నీకి సంబంధించిన పలు విశేషాలు... 300 దాటతారా! ఐపీఎల్లో ఇప్పటి వరకు టీమ్ అత్యధిక స్కోరు 287 పరుగులు. గత ఏడాది బెంగళూరుపై సన్‌రైజర్స్ ఈ స్కోరు సాధించింది. ఐపీఎల్లో మొత్తం 250కు పైగా స్కోరు10 సార్లు నమోదైతే ఇందులో ఎనిమిది 2024లోనే వచ్చాయి. కొత్త సీజన్లో ఇలాంటి మరిన్ని మెరుపు ప్రదర్శనలు రావచ్చని అంతా భావిస్తున్నారు. బ్యాటర్లు జోరు సాగితే తొలిసారి లీగ్‌లో 300 స్కోరు కూడా దాటవచ్చు.2008 నుంచి 2025 వరకు... ఐపీఎల్ తొలి సీజన్లో జట్టుతో ఉండి ఈసారి 18వ సీజన్లో కూడా బరిలోకి దిగబోయే ఆటగాళ్లు 9 మంది ఉండటం విశేషం. ధోని, కోహ్లి, రోహిత్, మనీశ్ పాండే, రహానే, అశ్విన్, జడేజా, ఇషాంత్ శర్మ, స్వప్నిల్ సింగ్ ఈ జాబితాలో ఉన్నారు. వీరిలో కోహ్లి ఒక్కడే ఒకే ఒక జట్టు తరఫున కొనసాగుతున్నాడు. ఇందులో 34 ఏళ్ల లెఫ్టార్మ్ స్పిన్నర్ స్వప్నిల్ సింగ్ ప్రస్థానం భిన్నం. 2008లో ముంబై టీమ్‌తో ఉన్నా... 2016లో పంజాబ్ తరఫున తొలి మ్యాచ్ ఆడే అవకాశం వచ్చింది. మొత్తంగా 5 సీజన్లే అవకాశం దక్కించుకున్న అతను 14 మ్యాచ్‌లు మాత్రమే ఆడగలిగాడు. రోహిత్, కోహ్లి మళ్లీ టి20ల్లో... గత ఏడాది టి20 వరల్డ్ కప్ విజయం తర్వాత ఈ ఫార్మాట్‌కు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి రిటైర్మెంట్ పలికారు. ఇప్పుడు వారి టి20 ఆటను చూసే అవకాశం మళ్లీ ఐపీఎల్‌లోనే కలగనుంది.ఆ ఒక్కటీ అడక్కు! ఐపీఎల్ రాగానే ఎమ్మెస్ ధోనికి ఇదే ఆఖరి సీజనా అనే చర్చ మళ్లీ మొదలవుతుంది! గత నాలుగేళ్లుగా అతను ‘డెఫినెట్లీ నాట్’ అంటూ చిరునవ్వులు చిందిస్తూనే ఉన్నాడు. లీగ్‌లో బ్యాటర్‌గా ధోని ప్రభావం దాదాపు సున్నాగా మారిపోయింది. అతని స్థాయి ఆట ఎంతో కాలంగా అస్సలు కనిపించడం లేదు. తప్పనిసరి అయితే తప్ప బ్యాటింగ్‌కు రాకుండా బౌలర్లను ముందుగా పంపిస్తున్నాడు. ఒక రకంగా టీమ్ 10 మందితోనే ఆడుతోంది! అయితే చెన్నై సూపర్ కింగ్స్ మేనేజ్మెంట్ ఆలోచనలు మాత్రం భిన్నంగా ఉన్నాయి. ఆటగాడిగా ఎలా ఉన్నా అతను మైదానంలో ఉంటే చాలు అని వారు భావిస్తున్నారు. అధికారికంగా కెప్టెన్ కాకపోయినా జట్టును నడిపించడంలో, వ్యూహాల్లో, టీమ్‌కు పెద్ద దిక్కుగా అతనికి అతనే సాటి. ఫిట్‌గానే ఉన్నాడు కాబట్టి అతను తనకు నచ్చినంత కాలం ఆడతాడేమో.2025 లీగ్ వివరాలు» మొత్తం 13 వేదికల్లో టోర్నీ జరుగుతుంది. 7 టీమ్‌లకు ఒకే ఒక హోం గ్రౌండ్ ఉండగా... 3 జట్లు రెండు వేదికలను హోం గ్రౌండ్లుగా ఎంచుకున్నాయి. ఢిల్లీ తమ మ్యాచ్‌లను ఢిల్లీతోపాటు విశాఖపట్నంలో, పంజాబ్ తమ మ్యాచ్‌లను ముల్లన్‌పూర్‌తో పాటు ధర్మశాలలో, రాజస్తాన్ తమ మ్యాచ్‌లను జైపూర్‌తో పాటు గువాహటిలో ఆడుతుంది. » ఐపీఎల్ ప్రదర్శనను బట్టే 10 టీమ్‌లను రెండు గ్రూప్‌లుగా విభజించారు. గ్రూప్ ‘ఎ’లో చెన్నై, కోల్‌కతా, రాజస్తాన్, బెంగళూరు, పంజాబ్ ఉండగా... గ్రూప్ ‘బి’లో ముంబై, హైదరాబాద్, గుజరాత్, ఢిల్లీ, లక్నో ఉన్నాయి. ప్రతీ టీమ్ తమ గ్రూప్‌లోని మిగతా 4 జట్లతో రెండు మ్యాచ్‌ల చొప్పున (8 మ్యాచ్‌లు), మరో గ్రూప్‌లో ఒక జట్టుతో రెండు మ్యాచ్‌లు (2), మిగతా నాలుగు టీమ్‌లతో ఒక్కో మ్యాచ్ (4) ఆడతాయి. అందరికీ సమానంగా 14 మ్యాచ్‌లు వస్తాయి. వీటిలో 7 సొంత గ్రౌండ్లలో ఆడతాయి. » కొత్త సీజన్లో కొన్ని మార్పులు కూడా వచ్చాయి. బంతిని షైన్ చేసేందుకు ఉమ్మి (సలైవా)ను వాడేందుకు అనుమతినిచ్చారు. హైట్‌కు సంబంధించిన వైడ్లు, ఆఫ్ సైడ్ వైడ్లను తేల్చేందుకు కూడా డీఆర్ఎస్ సమయంలో ‘హాక్ ఐ’ ని ఉపయోగిస్తారు. స్లో ఓవర్ రేట్ నమోదు చేస్తే కెప్టెన్లపై జరిమానా వేయడాన్ని, సస్పెన్షన్ విధించడాన్ని తొలగించారు. దానికి బదులుగా డీ మెరిట్ పాయింట్లు విధిస్తారు. రాత్రి మ్యాచ్‌లలో మంచు ప్రభావం ఉందని భావిస్తే రెండో ఇన్నింగ్స్ సమయంలో 10 ఓవర్ల తర్వాత ఒక బంతిని మార్చేందుకు అవకాశం ఇస్తారు. ఇప్పటి వరకు బంతి దెబ్బ తిందని భావించి మార్చే విచక్షణాధికారం అంపైర్లకే ఉండేది. అయితే ఇప్పుడు ఫీల్డింగ్ కెపె్టన్ బంతి మార్చమని కోరవచ్చు. » అన్ని మ్యాచ్‌లు రాత్రి 7 గంటల 30 నిమిషాలకు మొదలవుతాయి. మొత్తం షెడ్యూల్లో 12 రోజులు మాత్రం ఒకే రోజు రెండు మ్యాచ్‌లు ఉన్నాయి. అప్పుడు తొలి మ్యాచ్ మధ్యాహ్నం 3 గంటల 30 నిమిషాలకు ప్రారంభమవుతుంది.» గత ఏడాదితో పోలిస్తే ఐదు టీమ్‌లు కొత్త కెపె్టన్లతో బరిలోకి దిగుతున్నాయి. అక్షర్ పటేల్ (ఢిల్లీ క్యాపిటల్స్), రిషభ్ పంత్ (లక్నో సూపర్ జెయింట్స్), శ్రేయస్ అయ్యర్ (పంజాబ్ కింగ్స్), అజింక్య రహానే (కోల్‌కతా నైట్‌రైడర్స్), రజత్ పాటీదార్ (రాయల్ చాలెంజర్స్ బెంగళూరు) ఆయా టీమ్‌లకు తొలిసారి సారథులుగా వ్యవహరించనున్నారు. నిషేధం కారణంగా ముంబై తొలి మ్యాచ్‌కు పాండ్యా స్థానంలో సూర్యకుమార్... గాయం నుంచి సామ్సన్ కోలుకోకపోవడంతో రాజస్తాన్ రాయల్స్ తొలి మూడు మ్యాచ్‌లకు రియాన్ పరాగ్‌కెప్టెన్లుగా మైదానంలోకి దిగుతారు. వేలంలో రూ. 27 కోట్లకు అమ్ముడుపోయి రికార్డు సృష్టించిన రిషభ్ పంత్‌పై ఇప్పుడు ఆటగాడిగా, కెప్టెన్‌గా అందరి దృష్టీ ఉంది.ఐపీఎల్ విజేతలు (2008 నుంచి 2024 వరకు)2008 రాజస్తాన్ రాయల్స్ 2009 డెక్కన్ చార్జర్స్ 2010 చెన్నై సూపర్ కింగ్స్ 2011 చెన్నై సూపర్ కింగ్స్ 2012 కోల్‌కతా నైట్‌రైడర్స్ 2013 ముంబై ఇండియన్స్ 2014 కోల్‌కతా నైట్‌రైడర్స్ 2015 ముంబై ఇండియన్స్ 2016 సన్‌రైజర్స్ హైదరాబాద్ 2017 ముంబై ఇండియన్స్ 2018 చెన్నై సూపర్ కింగ్స్ 2019 ముంబై ఇండియన్స్ 2020 ముంబై ఇండియన్స్ 2021 చెన్నై సూపర్ కింగ్స్ 2022 గుజరాత్ టైటాన్స్ 2023 చెన్నై సూపర్ కింగ్స్ 2024 కోల్‌కతా నైట్‌రైడర్స్ -
IPL 2025: కోల్‌కతాలో వర్షం.. కేకేఆర్, ఆర్సీబీ మధ్య రేపటి మ్యాచ్ జరిగేనా..?
ఐపీఎల్ 2025 సీజన్ తొలి మ్యాచ్‌కు వరుణుడు అడ్డు తగిలేలా ఉన్నాడు. కేకేఆర్, ఆర్సీబీ మధ్య రేపు (మార్చి 22) జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దయ్యే అవకాశముందని తెలుస్తుంది. రేపు మ్యాచ్ జరిగే సమయానికి (రాత్రి 7:30 గంటలకు) వర్షం పడే అవకాశాలు 90 శాతం ఉన్నాయని వాతావరణ నివేదికలు ఇదివరకే స్పష్టం చేశాయి. దీన్ని నిజం చేస్తూ ఇవాల్టి నుంచే వర్షం మొదలైంది. NO RAIN pleaseeee!!!!pic.twitter.com/YgfkvBSfx0— CricTracker (@Cricketracker) March 21, 2025ఇవాళ రాత్రి 8 గంటల ప్రాంతంలో కోల్‌కతాలోని ఈడెన్ గార్డన్స్ మైదానంలో వర్షం కురుస్తూ ఉండింది. ఇవాల్టి పరిస్థితి చూసి రేపటి మ్యాచ్ జరిగేనా అని క్రికెట్ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. మ్యాచ్ సమయానికి వర్షం తగ్గిపోవాలని దేవుడిని వేడుకుంటున్నారు. ఐపీఎల్ కోసం క్రికెట్ అభిమానులు చాలాకాలంగా కళ్లకు వత్తులు పెట్టుకుని ఎదురుచూస్తున్నారు. ఈ పరిస్థితుల్లో సీజన్ ఆరంభ మ్యాచ్ రద్దైతే వారి బాధ వర్ణణాతీతం.మరోవైపు రేపటి మ్యాచ్‌కు ముందు ఈడెన్‌గార్డెన్స్‌లో ఐపీఎల్-18వ సీజన్ ప్రారంభోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని బీసీసీఐ ప్లాన్ చేస్తోంది. ఈ ఓపెనింగ్ సెర్మనీ దాదాపుగా రద్దయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.ఇదిలా ఉంటే, డిఫెండింగ్ ఛాంపియన్ అయిన కేకేఆర్ సొంత మైదానంలో జరిగే తొలి మ్యాచ్ విజయం సాధించి సీజన్‌ను ఘనంగా ప్రారంభించాలని ప్లాన్ చేసింది. అయితే వారి ఆశలు వర్షార్పణం అయ్యేలా కనిపిస్తున్నాయి. ఈ సీజన్లో కేకేఆర్ కొత్త కెప్టెన్ ఆజింక్య రహానే సారథ్యంలో బరిలోకి దిగనుంది. గత సీజన్లో కేకేఆర్‌కు టైటిల్ అందించిన శ్రేయస్ అయ్యర్ ఈ సీజన్లో పంజాబ్ కింగ్స్‌కు వెళ్లాడు. ఆర్సీబీ విషయానికొస్తే.. ఈ జట్టు ప్రతి ఏడాది లాగే ఈసారి కూడా 'ఈ సాలా కప్ నమ్మదే' అనుకుంటూ ఉంది. అయితే వీరి ఆశలకు వర్షం ఆదిలోనే బ్రేకులు వేసేలా ఉంది. ఈ సీజన్లో ఆర్సీబీ కూడా కొత్త కెప్టెన్‌తో బరిలోకి దిగుతుంది. రజత్ పాటిదార్ ఆర్సీబీ నూతన నాయకుడిగా నియమితుడయ్యాడు.ఆర్సీబీ జట్టు..రజత్ పాటిదార్ (కెప్టెన్), విరాట్ కోహ్లి, దేవ్‌దత్ పడిక్కల్, టిమ్ డేవిడ్, స్వస్తిక్ చికారా, కృనాల్ పాండ్యా, మనోజ్ భాండగే, రొమారియో షెపర్డ్, స్వప్నిల్ సింగ్, లియామ్ లివింగ్‌స్టోన్, జేకబ్ బేతెల్, మోహిత్ రతీ, ఫిలిప్ సాల్ట్, జితేశ్ శర్మ, జోష్ హాజిల్‌వుడ్, భువనేశ్వర్ కుమార్, లుంగి ఎంగిడి, రసిఖ్ సలాం ధార్, సుయాశ్ శర్మ, యశ్ దయాల్, నువాన్ తుషార, అభినందన్ సింగ్కేకేఆర్ జట్టు..అజింక్య రహానే (కెప్టెన్), మనీశ్ పాండే, రింకూ సింగ్, రోవ్‌మన్ పావెల్, అంగ్క్రిష్ రఘువంశీ, అనుకుల్ రాయ్, రమన్‌దీప్ సింగ్, వెంకటేశ్ అయ్యర్, మొయిన్ అలీ, సునీల్ నరైన్, ఆండ్రీ రసెల్, క్వింటన్ డికాక్, రహ్మానుల్లా గుర్బాజ్, లవ్నిత్ సిసోడియా, వరుణ్ చక్రవర్తి, మయాంక్ మార్కండే, వైభవ్ అరోరార, హర్షిత్ రాణా, అన్రిచ్ నోర్జే, చేతన్ సకారియా, స్పెన్సర్ జాన్సన్ -
సిరాజ్‌తో డేటింగ్ రూమర్స్‌పై స్పందించిన మహిర శర్మ
టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్‌తో డేటింగ్ రూమర్స్‌పై బిగ్‌బాస్ సెలబ్రిటీ మహిర శర్మ స్పందించింది. తాను ఎవరితోనూ డేటింగ్ చేయడం లేదని వివరణ ఇచ్చింది. తనపై వస్తున్న ఊహాగానాలను ఆపాలని సోషల్‌మీడియా వేదికగా కోరింది. ఇదే విషయంపై సిరాజ్ కూడా స్పందించాడు. మహిరతో డేటింగ్ చేయడం లేదని సోషల్‌మీడియా వేదికగా స్పష్టం చేశాడు. జర్నలిస్ట్‌లు ఈ విషయంపై తనను ప్రశ్నించడం మానుకోవాలని కోరాడు. తాను మహిరతో డేటింగ్ చేయడమనేది పూర్తిగా అవాస్తవమని కొట్టిపారేశాడు. అయితే ఈ పోస్ట్ చేసిన కొద్ది సేపటికే సిరాజ్ తన సోషల్‌మీడియా ఖాతా నుంచి తొలగించడం ఆసక్తికరంగా మారింది. సిరాజ్ ఏదో దాయాలనే ప్రయత్నం చేస్తున్నాడంటూ అభిమానులు గుసగుసలాడుకుంటున్నారు. కాగా, సోషల్‌మీడియాలో మహీరకు చెందిన ఓ పోస్ట్‌ను సిరాజ్ లైక్ చేయడంతో వీరిద్దరి మధ్య డేటింగ్ పుకార్లు మొదలయ్యాయి. అనంతరం సిరాజ్, మహిర ఒకరినొకరు ఫాలో చేసుకోవడంతో పుకార్లు బలపడ్డాయి. ఓ దశలో సిరాజ్, మహిర పెళ్లి కూడా చేసుకోబోతున్నారని వదంతులు వ్యాపించాయి. సిరాజ్‌తో డేటింగ్ రూమర్లను మహిర తల్లి చాలాసార్లు ఖండించారు. అయినా ఈ ప్రచారానికి పుల్‌స్టాప్ పడలేదు.ఇటీవల ముంబైలో జరిగిన ఓ క్రికెట్ అవార్డుల ఫంక్షన్లో మహిర కనిపించినప్పుడు జర్నలిస్ట్‌లు ఈ విషయమై ఆమెను గుచ్చిగుచ్చి ప్రశ్నించారు. త్వరలో జరుగబోయే ఐపీఎల్లో ఆమెకు ఇష్టమైన జట్టు ఏదని పదేపదే ప్రశ్నించి రాక్షసానందం పొందారు.ఇంతకీ ఈ మహిర ఎవరు..?రియాలిటీ షో బిగ్ బాస్-13 సీజన్‌తో మహిర శర్మ ఫేమస్ అయ్యింది. మహిర.. నాగిన్ 3, కుండలి భాగ్య, బెపనా ప్యార్ వంటి షోలలో పనిచేస్తూ టీవీ పరిశ్రమలో పరిశ్రమలో మంచి పేరు తెచ్చుకుంది. గతంలో మహిర బిగ్ బాస్ ద్వారా పరిచయమైన టీవీ నటుడు పరాస్ ఛబ్రాతో డేటింగ్ చేసింది. మహిర ప్రైవేట్ మ్యూజిక్ ఆల్బమ్స్‌లో కూడా నటిస్తుంది.ఇదిలా ఉంటే, ఈ ఐపీఎల్ సీజన్లో సిరాజ్ గుజరాత్ టైటాన్స్‌కు ఆడుతున్న విషయం తెలిసిందే. గతేడాది మెగా వేలానికి ముందు ఆర్సీబీ సిరాజ్‌ను వదిలేయగా.. మెగా వేలంలో గుజరాత్ సిరాజ్‌ను రూ. 12.25 కోట్లకు సొంతం చేసుకుంది. 2018 నుంచి సిరాజ్ ఆర్సీబీకి ఆడుతున్నాడు. ఈ సీజన్లో గుజరాత్ తమ తొలి మ్యాచ్‌ను పంజాబ్ కింగ్స్‌తో ఆడుతుంది. ఈ మ్యాచ్ అహ్మదాబాద్ వేదికగా మార్చి 25న జరుగనుంది. -
ఈ ఏడాది ఐపీఎల్లో కోహ్లి బ్రేక్ చేయగలిగే ఐదు భారీ రికార్డులు
క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న క్రికెట్ పండుగ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) రేపటి నుంచి (మార్చి 22) ప్రారంభం కానుంది. సీజన్ తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్స్ కేకేఆర్ ఆర్సీబీతో తలపడనుంది. ఈ మ్యాచ్ కేకేఆర్ సొంత మైదానమైన ఈడెన్ గార్డెన్స్‌లో రాత్రి 7:30 గంటలకు మొదలవుతుంది.అత్యధిక బౌండరీలుఈ సీజన్లో ఆర్సీబీ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లిని పలు భారీ రికార్డులు ఊరిస్తున్నాయి. ఈ సీజన్లో కోహ్లి మరో 64 బౌండరీలు బాదితే ఐపీఎల్ చరిత్రలో అత్యధిక బౌండరీలు బాదిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పుతాడు. ప్రస్తుతం ఈ రికార్డు శిఖర్ ధవన్ పేరిట ఉంది. ధవన్ ఖాతాలో 768 బౌండరీలు ఉండగా.. ప్రస్తుతం విరాట్ ఖాతాలో 705 బౌండరీలు ఉన్నాయి.అత్యధిక హాఫ్ సెంచరీలుఈ సీజన్లో విరాట్ మరో నాలుగు హాఫ్ సెంచరీలు చేస్తే.. ఐపీఎల్లో అత్యధిక 50 ప్లస్ స్కోర్లు (హాఫ్ సెంచరీ ప్లస్ సెంచరీలు) చేసిన బ్యాటర్‌గా అవతరిస్తాడు. ప్రస్తుతం ఈ రికార్డు డేవిడ్ వార్నర్ పేరిట ఉంది. వార్నర్ ఖాతాలో 66 ఫిఫ్టి ప్లస్ స్కోర్లు ఉండగా.. ప్రస్తుతం విరాట్ ఖాతాలో 63 ఫిఫ్టి ప్లస్ స్కోర్లు ఉన్నాయి.తొలి భారతీయుడిగా రికార్డుఈ ఐపీఎల్ సీజన్లో విరాట్ మరో 114 పరుగులు చేస్తే.. టీ20 క్రికెట్లో 13000 పరుగులు పూర్తి చేసిన తొలి భారత ఆటగాడిగా రికార్డు నెలకొల్పుతాడు. ప్రస్తుతం విరాట్ ఖాతాలో 12886 పరుగులు ఉన్నాయి. ప్రస్తుతం విరాట్ ప్రపంచవాప్తంగా అత్యధిక టీ20 పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో ఆరో స్థానంలో ఉన్నాడు. ఈ జాబితాలో క్రిస్ గేల్ (14562), అలెక్స్ హేల్స్ (13610), షోయబ్ మాలిక్ (13537), కీరన్ పోలార్డ్ (13537), డేవిడ్ వార్నర్ (12913) టాప్-5లో ఉన్నారు.తొలి ప్లేయర్‌గా..!ఈ ఐపీఎల్ సీజన్లో విరాట్ మరో 24 పరుగులు చేస్తే ఆసియా ఖండంలో 11000 టీ20 పరుగులు పూర్తి చేసిన తొలి ఆటగాడిగా ప్రపంచ రికార్డు నెలకొల్పుతాడు.విరాట్ ఆసియాలో ఇప్పటివరకు 10976 పరుగులు స్కోర్ చేశాడు.ఓపెనర్‌గా 5000 పరుగులుఈ ఐపీఎల్లో విరాట్ మరో 97 పరుగులు చేస్తే టీ20 క్రికెట్లో 5000 పరుగులు పూర్తి చేసుకున్న ఓపెనర్ల జాబితాలో చేరతాడు.ఐపీఎల్ 2025లో ఆర్సీబీ జట్టు..రజత్ పాటిదార్ (కెప్టెన్), విరాట్ కోహ్లి, దేవ్‌దత్ పడిక్కల్, టిమ్ డేవిడ్, స్వస్తిక్ చికారా, కృనాల్ పాండ్యా, మనోజ్ భాండగే, రొమారియో షెపర్డ్, స్వప్నిల్ సింగ్, లియామ్ లివింగ్‌స్టోన్, జేకబ్ బేతెల్, మోహిత్ రతీ, ఫిలిప్ సాల్ట్, జితేశ్ శర్మ, జోష్ హాజిల్‌వుడ్, భువనేశ్వర్ కుమార్, లుంగి ఎంగిడి, రసిఖ్ సలాం ధార్, సుయాశ్ శర్మ, యశ్ దయాల్, నువాన్ తుషార, అభినందన్ సింగ్ఐపీఎల్ 2025లో కేకేఆర్ జట్టు..అజింక్య రహానే (కెప్టెన్), మనీశ్ పాండే, రింకూ సింగ్, రోవ్‌మన్ పావెల్, అంగ్క్రిష్ రఘువంశీ, అనుకుల్ రాయ్, రమన్‌దీప్ సింగ్, వెంకటేశ్ అయ్యర్, మొయిన్ అలీ, సునీల్ నరైన్, ఆండ్రీ రసెల్, క్వింటన్ డికాక్, రహ్మానుల్లా గుర్బాజ్, లవ్నిత్ సిసోడియా, వరుణ్ చక్రవర్తి, మయాంక్ మార్కండే, వైభవ్ అరోరార, హర్షిత్ రాణా, అన్రిచ్ నోర్జే, చేతన్ సకారియా, స్పెన్సర్ జాన్సన్ -
భారత జట్టు కెప్టెన్‌గా యువరాజ్ సింగ్
డాషింగ్ బ్యాటర్ యువరాజ్ సింగ్ భారత క్రికెట్ జట్టు కెప్టెన్‌గా మళ్లీ ఎంపికయ్యాడు. వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ (WCL) రెండో ఎడిషన్ కోసం ఇండియా ఛాంపియన్స్ మేనేజ్మెంట్ యువీని కెప్టెన్‌గా నియమించింది. యువీ సారథ్యంలో ఇండియా ఛాంపియన్స్ డబ్ల్యూసీఎల్ తొలి ఎడిషన్‌లో విజేతగా నిలిచింది. రెండో ఎడిషన్ డబ్ల్యూసీఎల్ ఈ ఏడాది జులైలో (18 నుంచి) యునైటెడ్ కింగ్డమ్ వేదికగా జరుగనుంది. ఈ టోర్నీలో ఇండియా ఛాంపియన్స్ డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగుతుంది.డబ్ల్యూసీఎల్ మొదటి సీజన్లో భారత్‌తో పాటు ఆస్ట్రేలియా, వెస్టిండీస్, ఇంగ్లండ్, పాకిస్తాన్, సౌతాఫ్రికా జట్లు పాల్గొనగా.. ఫైనల్లో భారత్ పాకిస్తాన్‌ను చిత్తు చేసి ఛాంపియన్‌గా నిలిచింది. తొలి సీజన్లో భారత్ తరఫున యువీతో పాటు సురేశ్ రైనా, రాబిన్ ఉతప్ప, ఇర్ఫాన్ పఠాన్, యూసఫ్ పఠాన్ మెరుపులు మెరిపించారు.ఈ సీజన్లో భారత జట్టులో మరో స్టార్ కూడా చేరనున్నాడు. టీమిండియా మాజీ ఓపెనర్ శిఖర్ ధవన్ ఈ సీజన్లో ఇండియా ఛాంపియన్స్‌తో జతకట్టేందుకు సంసిద్దత వ్యక్తం చేశాడు. డబ్ల్యూసీఎల్లో ఇండియా ఛాంపియన్స్‌కు సుమంత్ బల్, సల్మాన్ అహ్మద్, జస్పాల్ బహ్రా ఓనర్లు వ్యవహరిస్తున్నారు. డబ్ల్యూసీఎల్ టోర్నీలో అంతర్జాతీయ వేదికపై మెరిసిన చాలా మంది స్టార్ క్రికెటర్లు పాల్గొంటున్నారు. ఈ టోర్నీ ప్రైవేటు యాజమాన్యం అండర్లో జరుగుతుంది.కాగా, డబ్ల్యూసీఎల్ రెండో సీజన్లో పాకిస్తాన్‌కు కొత్త సారధి వచ్చాడు. ఈ సీజన్ కోసం పాక్ ఛాంపియన్స్ మేనేజ్మెంట్ సర్ఫరాజ్ అహ్మద్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేసింది. ఈ వెటరన్ వికెట్ కీపర్ 2023 నుంచి కాంపిటేటివ్ క్రికెట్‌కు దూరంగా ఉంటున్నాడు. సర్ఫరాజ్ చేరిక పాకిస్తాన్ ఛాంపియన్స్‌కు బూస్టప్ ఇస్తుంది. గత సీజన్ పాక్‌కు యూనిస్ ఖాన్ కెప్టెన్‌గా వ్యవహరించగా.. మిస్బా ఉల్ హక్, షాహిద్ అఫ్రిది, షోయబ్ మాలిక్, మహ్మద్ హఫీజ్, అబ్దుల్ రజాక్, కమ్రాన్ అక్మల్, వాహబ్ రియాజ్, సోహైల్ తన్వీర్, సయీద్ అజ్మల్ లాంటి స్టార్లు ప్రాతినిథ్యం వహించారు.గత సీజన్లో పాల్గొన్న భారత ఛాంపియన్స్ జట్టు..అంబటి రాయుడు, గురుకీరత్ మాన్, సౌరభ్ తివారి, సురేశ్ రైనా, యూసఫ్ పఠాన్, యువరాజ్ సింగ్, ఇర్ఫాన్ పఠాన్, పవన్ నేగి, రాబిన్ ఉతప్ప, నమన్ ఓఝా, అనురీత్ సింగ్, ధవల్ కులకర్ణి, హర్భజన్ సింగ్, రాహుల్ శుక్లా, రాహుల్ శర్మ, ఆర్పీ సింగ్, వినయ్ కుమార్ -
ఈసారి ఆర్సీబీ పదో స్థానంలో నిలుస్తుంది: ఆస్ట్రేలియా దిగ్గజం
ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్ ఆడం గిల్‌క్రిస్ట్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) అభిమానులకు క్షమాపణలు చెప్పాడు. ఆర్సీబీ అంటే తనకేమీ ద్వేషం లేదని.. సూపర్‌స్టార్ విరాట్ కోహ్లి (Virat Kohli)కి తానెప్పుడూ వ్యతిరేకం కాదని పేర్కొన్నాడు. అయితే, ఆర్సీబీలో ఓ దేశానికి చెందిన ఆటగాళ్లు ఎక్కువగా ఉన్నారని.. అందుకే ఈసారి ఆ జట్టు పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో నిలుస్తుందంటూ వ్యంగ్యాత్మక వ్యాఖ్యలు చేశాడు.నాయకుడిగా రజత్ పాటిదార్ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) పద్దెనిమిదవ ఎడిషన్ శనివారం (మార్చి 22)ఆరంభం కానున్న విషయం తెలిసిందే. కోల్‌కతా నైట్ రైడర్స్- ఆర్సీబీ మధ్య మ్యాచ్‌తో ఐపీఎల్-2025కి తెరలేవనుంది. డిఫెండింగ్ చాంపియన్ కోల్‌కతాతో పాటు ఆర్సీబీకి కూడా ఈసారి కొత్త కెప్టెన్ వచ్చాడు. కేకేఆర్‌కు అజింక్య రహానే సారథ్యం వహించనుండగా... బెంగళూరు జట్టుకు రజత్ పాటిదార్ నాయకుడిగా వ్యవహరించనున్నాడు.ఈసారి చివరి స్థానంలో ఉండేది ఆర్సీబీఈ నేపథ్యంలో ఓ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతున్న ఆసీస్ దిగ్గజం గిల్‌క్రిస్ట్‌కు ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. ఈసారి ఐపీఎల్లో పాయింట్ల పట్టికలో అట్టడుగున పదో స్థానంలో ఉండే జట్టు ఏది? అన్న ప్రశ్నకు బదులిస్తూ.. ‘‘ఆ జట్టులో అనేక మంది ఇంగ్లండ్ ఆటగాళ్లు ఉన్నారు.కాబట్టి.. వాస్తవాల ఆధారంగానే నేను ఈ మాట చెబుతున్నా. ఈసారి చివరి స్థానంలో ఉండేది ఆర్సీబీ. వాళ్లకే ఈసారి ఆఖర్లో ఉండే అర్హతలు ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తున్నాయి’’ అని పేర్కొన్నాడు. అయితే, అదే సమయంలో ఆర్సీబీ, కోహ్లి అభిమానులకు గిల్‌క్రిస్ట్ క్షమాపణలు కూడా చెప్పడం విశేషం.మనస్ఫూర్తిగా క్షమాపణలు‘‘విరాట్ లేదంటే.. ఆర్సీబీ ఫ్యాన్స్‌కు నేను వ్యతిరేకం కాదు. ఇలా మాట్లాడినందుకు వారికి మనస్ఫూర్తిగా క్షమాపణలు చెబుతున్నా. కానీ మీ రిక్రూట్మెంట్ ఏజెంట్లకు మీరైనా చెప్పండి. ఆటగాళ్ల ఎంపిక విషయంలో జాగ్రత్తగా వ్యవహరించడం అత్యంత ముఖ్యం’’ అని గిల్‌క్రిస్ట్ చెప్పుకొచ్చాడు. ఇంగ్లండ్ ప్లేయర్ల ప్రదర్శన అంతగొప్పగా ఉండదని.. ఈసారి వారి వల్ల ఆర్సీబీకి పెద్దగా ఒరిగేదేమీ ఉండదని ఈ సందర్భంగా అభిప్రాయపడ్డాడు.కాగా మెగా వేలం-2025 సందర్భంగా ఆర్సీబీ.. ఇంగ్లండ్ స్టార్లు లియామ్ లివింగ్‌స్టోన్, జేకబ్ బెతెల్, ఫిల్ సాల్ట్ తదితరులను కొనుగోలు చేసింది. సాల్ట్ ఈసారి కోహ్లితో కలిసి ఆర్సీబీ ఇన్నింగ్స్ ఆరంభించే అవకాశం ఉంది.కాగా ఐపీఎల్ చరిత్రలో బెంగళూరు జట్టుకు రెండుసార్లు ట్రోఫీని దూరం చేసిన జట్టు హైదరాబాద్. 2009లో ఆడం గిల్‌క్రిస్ట్ కెప్టెన్సీలో నాటి దక్కన్ చార్జర్స్.. 2016లో డేవిడ్ వార్నర్ సారథ్యంలోని సన్‌రైజర్స్ హైదరాబాద్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరును ఫైనల్లో ఓడించి టైటిల్ సొంతం చేసుకున్నాయి. ఇక ఆర్సీబీ ఇంత వరకు ఒక్కసారి కూడా ట్రోఫీ గెలవలేదన్న విషయం తెలిసిందే. గతేడాది ప్లే ఆఫ్స్ చేరిన ఈ జట్టు.. ఈసారి టైటిల్ రేసులో నిలవాలని పట్టుదలగా ఉంది.ఐపీఎల్-2025లో ఆర్సీబీ జట్టురజత్ పాటిదార్ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, యశ్ దయాల్, జోష్ హేజిల్‌వుడ్, ఫిల్ సాల్ట్, జితేష్ శర్మ, లియామ్ లివింగ్‌స్టోన్, రసిఖ్ దార్, సుయాష్ శర్మ, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, స్వప్నిల్ సింగ్, టిమ్ డేవిడ్, రొమారియో షెపర్డ్, నువాన్ తుషార, మనోజ్ భాండగే, జేకబ్ బెతెల్, దేవ్‌దత్ పడిక్కల్, స్వస్తిక్చికార, లుంగి ఎంగిడి, అభినందన్ సింగ్, మోహిత్ రాఠీ.చదవండి: 44 బంతుల్లో శతక్కొట్టిన పాక్ ఓపెనర్.. 9 వికెట్ల తేడాతో చిత్తైన న్యూజిలాండ్ -
మెగా వేలంలో ఎవరూ పట్టించుకోలేదు.. అయినా ఐపీఎల్‌ను వదలని కేన్ మామ
ఐపీఎల్ 2025 మెగా వేలంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్‌ను ఎవరూ పట్టించుకోని విషయం తెలిసిందే. 34 ఏళ్ల కేన్ మామ నిదానంగా ఆడతాడన్న కారణంగా ఐపీఎల్ ఫ్రాంచైజీలు అతన్ని చిన్న చూపు చూశాయి. ఆటగాడిగా ఎంపిక కాకపోయినా ఏ మాత్రం నిరాశ చెందని విలియమ్సన్.. ఐపీఎల్లో కొత్త అవతారంలో దర్శనమివ్వబోతున్నాడు.రేపటి నుంచి ప్రారంభం కాబోయే ఐపీఎల్ 18వ ఎడిషన్‌లో కేన్ కామెంటేటర్‌గా వ్యవహరించనున్నాడు. స్టార్లతో నిండిన కామెంటేటర్ల ప్యానెల్‌ను ఐపీఎల్ ఇవాళ (మార్చి 21) విడుదల చేసింది. ఇందులో కేన్‌తో పాటు హర్ష భోగ్లే, రవిశాస్త్రి, సునీల్ గవాస్కర్, ఇయాన్ బిషప్, నవజ్యోత్ సింగ్ సిద్ధూ లాంటి ప్రముఖ వ్యాఖ్యాతల పేర్లు ఉన్నాయి. ఈ ఐపీఎల్ సీజన్‌తో కామెంటేటర్‌గా అరంగేట్రం చేస్తున్న కేన్ మామ నేషనల్ ఫీడ్‌ను అందిస్తాడు.ఐపీఎల్ విడుదల చేసిన వ్యాఖ్యాతల జాబితాలో రెండు విభాగాలు ఉన్నాయి. ఒకటి నేషనల్ ఫీడ్ కాగా.. రెండోది వరల్డ్ ఫీడ్. నేషనల్ ఫీడ్‌లో దేశీయ వ్యాఖ్యాతలతో పాటు విదేశీ వ్యాఖ్యాతలు ఉండగా.. వరల్డ్ ఫీడ్‌లో ఎక్కువ శాతం విదేశీ వ్యాఖ్యాతలే ఉన్నారు.ఐపీఎల్ జాతీయ ఫీడ్ వ్యాఖ్యాతల జాబితా..సునీల్ గవాస్కర్, నవజ్యోత్ సింగ్ సిద్ధూ, ఆకాశ్ చోప్రా, సంజయ్ మంజ్రేకర్, మైకేల్ క్లార్క్, మాథ్యూ హేడెన్, మార్క్ బౌచర్, ఆర్పీ సింగ్, షేన్ వాట్సన్, సంజయ్ బంగర్, వరుణ్ ఆరోన్, ప్రజ్ఞాన్ ఓజా, అజయ్ జడేజా, వీరేంద్ర సెహ్వాగ్, హర్భజన్ సింగ్, శిఖర్ ధావన్, అనిల్ కుంబ్లే, సురేశ్ రైనా, కేన్ విలియమ్సన్, ఏబీ డివిలియర్స్, ఆరోన్ ఫించ్, రాబిన్ ఉతప్ప, అంబటి రాయుడు, మహ్మద్ కైఫ్, పీయూష్ చావ్లా.ఐపీఎల్ ప్రపంచ ఫీడ్ వ్యాఖ్యాతల జాబితా..ఇయాన్ మోర్గాన్, గ్రేమ్ స్వాన్, హర్ష భోగ్లే, సైమన్ డౌల్, ఎంపుమలెలో ఎంబాంగ్వా, నిక్ నైట్, డానీ మారిసన్, ఇయాన్ బిషప్, అలన్ విల్కిన్స్, డారెన్ గంగా, కేటీ మార్టిన్, నటాలీ జర్మానోస్, రవిశాస్త్రి, సునీల్ గవాస్కర్, మాథ్యూ హేడెన్, దీప్‌దాస్ గుప్తా, షేన్ వాట్సన్, మైకేల్ క్లార్క్, ఆరోన్ ఫించ్, వరుణ్ ఆరోన్, అంజుమ్ చోప్రా, డబ్ల్యూవీ రామన్, మురళీ కార్తీక్.కాగా, 79 మ్యాచ్‌ల ఐపీఎల్ అనుభవం ఉండటంతో అంతర్జాతీయ స్థాయిలో అన్ని ఫార్మాట్లలో విశేషంగా రాణిస్తున్న కేన్ విలియమ్సన్‌ను గతేడాది జరిగిన ఐపీఎల్ 2025 మెగా వేలంలో ఏ ఫ్రాంచైజీ పట్టించుకోకపోవడం బాధాకరం. కేన్ మామను గత సీజన్లో ఆడిన గుజరాత్ టైటాన్స్ సహా అతని మాజీ ఫ్రాంచైజీ సన్‌రైజర్స్ హైదరాబాద్ కూడా లైట్‌గా తీసుకుంది. అంతర్జాతీయ వేదికపై కేన్ తన సొంత జట్టు న్యూజిలాండ్‌కు ఆడుతుండటంతో పాటు సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో డర్బన్ సూపర్ జెయింట్స్‌కు.. ద హండ్రెడ్ లీగ్‌లో లండన్ స్పిరిట్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు.ఇదిలా ఉంటే, ఐపీఎల్ 2025 సీజన్ రేపటి నుంచి ప్రారంభం కానుంది. సీజన్ తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్స్ కేకేఆర్ ఆర్సీబీతో తలపడనుంది. ఈ మ్యాచ్ కేకేఆర్ సొంత మైదానమైన ఈడెన్ గార్డెన్స్‌లో జరుగనుంది. -
సాహసోపేత నిర్ణయాలు.. టైటాన్స్ ఈసారి విజృంభిస్తుందా?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) లోకి అడుగుపెట్టిన తొలి సీజన్లోనే (2022)లో టైటిల్ సాధించి తనదైన ముద్రవేసింది గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans). ఆ తర్వాత సీజన్లో మళ్ళీ ఫైనల్లోకి ప్రవేశించింది. కానీ టైటిల్ పోరులో చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ఓటమితో రన్నర్ అప్ తో సరిపెట్టుకుంది. అయితే, గతేడాది గుజరాత్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టుకి స్ఫూర్తిదాయకంగా నిలిచి ముందుండి నడిపించిన భారత్ అల్ రౌండర్, జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యాను ముంబై ఇండియన్స్‌కు బదిలీ అయ్యాడు.ఈ మార్పుతో భారత్ యువ ఓపెనర్ శుబ్‌మన్ గిల్ (Shubman Gill)కు కెప్టెన్‌గా పగ్గాలు అప్పగించారు. కానీ గత సీజన్ గుజరాత్ కి పెద్దగా కలిసిరాలేదు. కేవలం 5 విజయాలు, 7 ఓటములతో గుజరాత్ 8వ స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. దీనితో కొత్త సీజన్ కోసం గుజరాత్ కొన్ని సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంది.భారత్ సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ, నూర్ అహ్మద్, దక్షిణాఫ్రికాకి చెందిన డేవిడ్ మిల్లర్ వంటి సీనియర్ ఆటగాళ్ళని పక్కకుపెట్టాలని నిర్ణయించారు. ఇందుకు బదులుగా కొత్త తరహా జట్టుని నిర్మించాలని నిర్ణయించారు. ప్రపంచ క్రికెట్లో నిలకడగా రాణిస్తున్న ఆటగాళ్ల కోసం పెద్ద మొత్తంలో ఖర్చు చేయాలని నిర్ణయించుకుంది.మాజీ ఆరెంజ్ క్యాప్ విజేత జోస్ బట్లర్, దక్షిణాఫ్రికా పేస్ స్పియర్‌హెడ్ కగిసో రబాడను దక్కించుకోవడానికి గుజరాత్ పెద్ద మొత్తంలో ఖర్చు చేసింది. ఛాంపియన్స్ ట్రోఫీ లో తన వీరోచిత ప్రదర్శనలతో అందరినీ ఆశ్చర్యపరిచిన గ్లెన్ ఫిలిప్స్‌ను కూడా తీసుకున్నారు.వేలంలో గుజరాత్ ఎలా రాణించింది?ఐపీఎల్ 2025 మెగా వేలంలో గుజరాత్ చాలా సమయస్ఫూర్తితో వ్యవహరించింది. గిల్, రాహుల్ తెవాటియా, సాయి సుదర్శన్ మరియు షారుఖ్ ఖాన్‌లతో పాటు రషీద్ ఖాన్‌ను వేలానికి ముందు రెటైన్ చేసింది. వేలంలో ఇంగ్లాండ్ కెప్టెన్ జోస్ బట్లర్ ని రూ 15.75 కోట్లు కు కనుగోలు చేసారు.ఇంకా భారత్ పేసర్ మహమ్మద్ సిరాజ్ ( (రూ12.25 కోట్లు), రబాడ (రూ 10.75 కోట్లు) మరియు ప్రసిధ్ కృష్ణ (రూ 9.5 కోట్లు) ముగ్గురితో పేస్ బౌలింగ్ ని బలోపేతం చేశారు. గత సీజన్లో వారికి సమస్యగా ఉన్న రంగాల కోసం భారీగా ఖర్చు చేశారు. ఇక మిల్లర్ స్థానంలో జిటి ఫిలిప్స్ మరియు షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్‌లను జట్టులోకి తీసుకువచ్చారుగుజరాత్ టైటాన్స్ జట్టులో ప్రధాన ఆటగాళ్లుశుబ్మన్ గిల్ఒకప్పుడు భారత టీ20ఐ జట్టులో ప్రధాన ఆటగాళ్లలో ఒకడైన గిల్ ఇప్పుడు మునుపటి రీతిలో రాణించలేక పోతున్నాడన్నది వాస్తవం. 2023 ఐపీఎల్ లో చెలరేగిపోయిన గిల్ దాదాపు 900 పరుగులు సాధించాడు.గత సీజన్‌ను ఆశాజనకంగా ప్రారంభించినప్పటికీ ఆ తర్వాత అతని ఫామ్ తగ్గింది . 2024లో తన మొదటి ఆరు మ్యాచ్‌ల్లో 151.78 స్ట్రైక్ రేట్‌తో 255 పరుగులు చేశాడు, కానీ ఆ తర్వాత 147.40 సగటుతో 426 పరుగులు చేశాడు. ఈ సీజన్లో గిల్ మళ్ళీ మునుపటి ఫామ్ ని ప్రదర్శించాలని, జట్టుని విజయ బాటలో నడిపించాలని కృత నిశ్చయంతో ఉన్నాడు.జోస్ బట్లర్జట్టులో అత్యంత ఖరీదైన ఆటగాడు కావడంతో, బట్లర్ పై అందరి దృష్టి ఉంటుందనడంలో సందేహం లేదు. 2022 ఐపిఎల్ లో ఏకంగా 863 పరుగులు చేసిన తర్వాత, బట్లర్ 2023 మరియు 2024 సీజన్లలో 400 కి మించి పరుగులు చేయలేకపోయాడు. అయితే గత సంవత్సరం ఈడెన్ గార్డెన్స్‌లో కోల్‌కతా పై జరిగిన ఫైనల్లో 224 పరుగుల లక్ష్యం సాధించడంలో బట్లర్ చేసిన సెంచరీ లీగ్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన ఇన్నింగ్స్‌లలో ఒకటిగా నిలిచింది. బట్లర్ ఈ సీజన్ లో గిల్ తో కలిసి గుజరాత్ ఇన్నింగ్స్ ప్రారంభించే అవకాశముంది. లేదా గత సీజన్లో లేని ఫైర్‌పవర్‌ను అందించడానికి 3వ స్థానంలోకి వస్తాడని భావిస్తున్నారు. అదనంగా అతన్ని స్టంప్స్ వెనుక కూడా చూడవచ్చు.రషీద్ ఖాన్గాయం నుంచి ఇప్పుడు పూర్తిగా కోలుకున్న ఆఫ్ఘన్ స్పిన్నర్ రషీద్ ఖాన్ మరోసారి గుజరాత్‌కు ట్రంప్ కార్డ్ గా భావించవచ్చు. గత సీజన్లో, రషీద్ శస్త్రచికిత్స నుండి కోలుకుంటున్నందున తన పూర్తి స్థాయిలో ఆడలేక పోయాడు. ఈసారి మాత్రం గుజరాత్ టైటిల్ సాధించాలన్న ఆశయాన్ని సాధించడంలో రషీద్ పెద్ద పాత్ర పోషిస్తాడని భావిస్తున్నారు.కగిసో రబాడపంజాబ్ కింగ్స్ తరుపున ఆది కాస్త నిరాశబరిచిన కగిసో రబాడ ఇప్పుడు గుజరాత్ జట్టులో చేరడంతో కోచ్ ఆశిష్ నెహ్రా ఆధ్వర్యంలో మళ్ళీ పుంజుకోగలడని భావిస్తున్నారు.మహ్మద్ సిరాజ్ఇటీవలి కాలంలో పెద్దగా రాణించలేక పోతున్న హైదరాబాద్ పేసర్ మొహమ్మద్ సిరాజ్ కి మళ్ళీ మునుపటి వైభవం సాధించడానికి ఐపీఎల్ మంచి అవకాశం కల్పిస్తోంది. భారత్ ఛాంపియన్స్ ట్రోఫీ జట్టు లో స్థానం పొందలేకపోయిన సిరాజ్ తన విమర్శకులను సమాధానము చెప్పాలని, తన కెరీర్‌ను తిరిగి ట్రాక్‌లోకి తీసుకురావాలని పట్టుదలతో ఉన్నాడు.గుజరాత్ టైటాన్స్ జట్టురషీద్ ఖాన్, శుబ్మాన్ గిల్, సాయి సుదర్శన్, రాహుల్ తెవాటియా, షారుఖ్ ఖాన్, కగిసో రబాడ, జోస్ బట్లర్. మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, నిషాంత్ సింధు, మహిపాల్ లోమ్రోర్, కుమార్ కుషాగ్ర, అనుజ్ రావత్, మానవ్ సుతార్, వాషింగ్టన్ సుందర్, జెరాల్డ్ కోట్జీ, అర్షద్ ఖాన్, గుర్నూర్ బ్రార్, షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్, సాయి కిషోర్, ఇషాంత్ శర్మ, జయంత్ యాదవ్, గ్లెన్ ఫిలిప్స్, కరీం జనత్, కుల్వంత్ ఖేజ్రోలియా. చదవండి: విధ్వంసకర వీరులు.. పంత్‌కు పగ్గాలు.. లక్నో ఫైనల్ చేరుతుందా? -
తొలి రెండు మ్యాచ్‌ల్లో డకౌట్లు.. కట్ చేస్తే టీ20ల్లో ఫాస్టెస్ట్ సెంచరీ.. పాక్ ప్లేయర్ సంచలనం
పాకిస్తాన్ యువ ఓపెనర్ హసన్ నవాజ్ సంచలన ప్రదర్శనతో వార్తల్లో నిలిచాడు. న్యూజిలాండ్‌తో ఇవాళ (మార్చి 21) జరిగిన టీ20లో 44 బంతుల్లోనే శతక్కొట్టి.. పొట్టి ఫార్మాట్లో పాక్ తరఫున వేగవంతమైన సెంచరీ చేసిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. నవాజ్ అంతర్జాతీయ క్రికెట్లో తన మూడో మ్యాచ్‌లోనే ఈ ఘనత సాధించడం విశేషం. కెరీర్లో తొలి రెండు మ్యాచ్‌ల్లో ఖాతా కూడా తెరవలేకపోయిన నవాజ్.. మూడో మ్యాచ్‌లో ఏకంగా సెంచరీ చేసి తన జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. ఈ సెంచరీతో నవాజ్ పలు రికార్డులు తన ఖాతాలో వేసుకున్నాడు.టీ20ల్లో ఫాస్టెస్ట్ సెంచరీఈ మ్యాచ్‌లో నవాజ్ చేసిన సెంచరీ (44 బంతుల్లో) పాక్ తరఫున టీ20ల్లో ఫాస్టెస్ట్ సెంచరీ. గతంలో ఈ రికార్డు పాక్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజమ్ (49 బంతుల్లో) పేరిట ఉండేది. తాజాగా బాబర్ రికార్డును నవాజ్ బద్దలు కొట్టాడు.టీ20ల్లో పాక్ తరఫున ఫాస్టెస్ట్ సెంచరీలుహసన్ నవాజ్- 44 బంతులుబాబర్ ఆజమ్- 49బాబర్ ఆజమ్- 58అహ్మద్ షెహజాద్- 58బాబర్ ఆజమ్- 62మహ్మద్ రిజ్వాన్- 63మూడో అత్యధిక వ్యక్తిగత స్కోర్ఈ మ్యాచ్‌లో మొత్తంగా 45 బంతులు ఎదుర్కొన్న నవాజ్ 10 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 105 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. నవాజ్ చేసిన ఈ స్కోర్ టీ20ల్లో పాక్ తరఫున మూడో అత్యధిక వ్యక్తిగత స్కోర్‌గా రికార్డైంది. టీ20ల్లో పాక్ తరఫున అత్యధిక వ్యక్తిగత స్కోర్ రికార్డు బాబర్ ఆజమ్ పేరిట ఉంది. 2021లో సౌతాఫ్రికాపై బాబర్ 122 పరుగులు చేశాడు. బాబర్ తర్వాత టీ20ల్లో పాక్ తరఫున అత్యధిక వ్యక్తిగత స్కోర్ రికార్డు అహ్మద్ షెహజాద్ పేరిట ఉంది. 2014లో షెహజాద్ బంగ్లాదేశ్‌పై 111లతో అజేయంగా నిలిచాడు.ఏడో అతి పిన్న వయస్కుడుఈ సెంచరీతో నవాజ్ టీ20ల్లో సెంచరీ చేసిన ఏడో అతి పిన్న వయస్కుడిగా రికార్డుల్లోకెక్కాడు. నవాజ్ 22 ఏళ్ల 212 రోజుల వయసులో సెంచరీ చేశాడు. టీ20ల్లో సెంచరీ చేసిన అతి పిన్న వయస్కుడి రికార్డు ఆఫ్ఘనిస్తాన్ ఆటగాడు హజ్రతుల్లా జజాయ్ పేరిట ఉంది. జజాయ్ 20 ఏళ్ల 337 రోజుల వయసులో శతక్కొట్టాడు.టీ20ల్లో సెంచరీలు చేసిన అతి పిన్న వయస్కులుహజ్రతుల్లా జజాయ్- 20 ఏళ్ల 337 రోజులుయశస్వి జైస్వాల్- 21 ఏళ్ల 279 రోజులుతిలక్ వర్మ- 22 ఏళ్ల 5 రోజులుతిలక్ వర్మ- 22 ఏళ్ల 7 రోజులురహ్మానుల్లా గుర్బాజ్- 22 ఏళ్ల 31 రోజులుఅహ్మద్ షెహజాద్- 22 ఏళ్ల 127 రోజులుహసన్ నవాజ్- 22 ఏళ్ల 212 రోజులుకెరీర్లో మూడో మ్యాచ్‌లోనే సెంచరీ చేసిన నవాజ్ టీ20ల్లో అత్యంత వేగంగా (మ్యాచ్‌ల పరంగా) సెంచరీ చేసిన ఐదో ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. రిచర్డ్ లెవి-రెండో మ్యాచ్ఎవిన్ లెవిస్- రెండో మ్యాచ్అభిషేక్ శర్మ- రెండో మ్యాచ్దీపక్ హూడా- మూడో మ్యాచ్హసన్ నవాజ్- మూడో మ్యాచ్టీ20ల్లో పాక్ తరఫున మూడో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీఈ మ్యాచ్‌లో నవాజ్ 26 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. తద్వారా పొట్టి ఫార్మాట్లో పాక్ తరఫున మూడో వేగవంతమైన హాఫ్ సెంచరీని నమోదు చేశాడు. టీ20ల్లో పాక్ తరఫున ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ రికార్డు షర్జీల్ ఖాన్ (24) పేరిట ఉంది.మ్యాచ్ విషయానికొస్తే.. 5 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా జరిగిన మూడో టీ20లో పాకిస్తాన్ న్యూజిలాండ్‌పై 9 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో పాక్ యువ ఓపెనర్ హసన్ నవాజ్ 44 బంతుల్లోనే శతక్కొట్టి పాక్‌కు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు.తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 19.5 ఓవర్లలో 204 పరుగుల భారీ స్కోర్ చేసి ఆలౌటైంది. మార్క్ చాప్మన్ 44 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 94 పరుగులు చేసి న్యూజిలాండ్ భారీ స్కోర్ చేయడానికి దోహదపడ్డారు. పాక్ బౌలర్లలో హరీస్ రౌఫ్ అద్భుతంగా బౌలింగ్ చేసి 3 వికెట్లు తీయగా.. షాహీన్ అఫ్రిది, అబ్రార్ అహ్మద్, అబ్బాస్ అఫ్రిది తలో 2, షాదాబ్ ఖాన్ ఓ వికెట్ పడగొట్టారు.అనంతరం 205 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన పాక్ ఓపెనర్ హసన్ నవాజ్ విధ్వంసకర శతకంతో విరుచుకుపడటంతో 16 ఓవర్లనే లక్ష్యాన్ని ఊదేసింది. నవాజ్‌కు మరో ఓపెనర్ మహ్మద్ హరీస్ (20 బంతుల్లో 41), కెప్టెన్ సల్మాన్ అఘా (31 బంతుల్లో 51 నాటౌట్) సహకరించారు. ఈ గెలుపుతో పాక్ సిరీస్‌లో న్యూజిలాండ్ ఆధిక్యాన్ని 1-2కు తగ్గించింది. తొలి రెండు టీ20ల్లో న్యూజిలాండ్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. నాలుగో టీ20 మార్చి 23న మౌంట్ మాంగనూయ్ వేదికగా జరుగనుంది. -
న్యూజిలాండ్‌తో మూడో టీ20.. చరిత్ర సృష్టించిన పాకిస్తాన్
పాక్ క్రికెట్ జట్టు టీ20ల్లో సరికొత్త రికార్డు నెలకొల్పింది. ఆక్లాండ్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 205 పరుగుల భారీ లక్ష్యాన్ని కేవలం 16 ఓవర్లలోనే ఊదేసి.. పొట్టి క్రికెట్ చరిత్రలో అత్యంత వేగంగా 200 ప్లస్ టార్గెట్‌ను ఛేదించిన జట్టుగా చరిత్ర సృష్టించింది. అంతర్జాతీయ టీ20ల్లో 200 పైబడిన లక్ష్యాలను ఇంత తొందరగా ఏ జట్టూ ఛేదించలేదు. గతంలో ఈ రికార్డు సౌతాఫ్రికా పేరిట ఉండేది. సౌతాఫ్రికా 2007లో వెస్టిండీస్ నిర్దేశించిన 208 పరుగుల లక్ష్యాన్ని 17.2 ఓవర్లలో ఛేదించింది. టీ20ల్లో అత్యంత వేగంగా (బంతుల పరంగా) 200 ప్లస్ లక్ష్యాలను ఛేదించిన జట్ల జాబితాలో మూడో స్థానంలో కూడా పాకిస్తానే ఉంది. 2021లో సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో పాక్ 205 పరుగుల లక్ష్యాన్ని 18 ఓవర్లలో ఛేదించింది.మ్యాచ్ విషయానికొస్తే.. 5 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా జరిగిన మూడో టీ20లో పాకిస్తాన్ న్యూజిలాండ్‌పై 9 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 19.5 ఓవర్లలో 204 పరుగుల భారీ స్కోర్ చేసి ఆలౌటైంది. మార్క్ చాప్మన్ 44 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 94 పరుగులు చేసి న్యూజిలాండ్ భారీ స్కోర్ చేయడానికి దోహదపడ్డారు. న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌లో బ్రేస్‌వెల్ (18 బంతుల్లో 31), టిమ్ సీఫర్ట్ (19), డారిల్ మిచెల్ (17), ఐష్ సోధి (10) రెండంకెల స్కోర్లు చేయగా.. ఫిన్ అలెన్ 0, నీషమ్ 3, మిచెల్ హే 9, జేమీసన్ 0, డఫీ 2 పరుగులకు ఔటయ్యారు. పాక్ బౌలర్లలో హరీస్ రౌఫ్ అద్భుతంగా బౌలింగ్ చేసి 3 వికెట్లు తీయగా.. షాహీన్ అఫ్రిది, అబ్రార్ అహ్మద్, అబ్బాస్ అఫ్రిది తలో 2, షాదాబ్ ఖాన్ ఓ వికెట్ పడగొట్టారు.అనంతరం 205 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన పాక్ ఓపెనర్ హసన్ నవాజ్ (45 బంతుల్లో 105 నాటౌట్; 10 ఫోర్లు, 7 సిక్సర్లు) విధ్వంసకర శతకంతో విరుచుకుపడటంతో 16 ఓవర్లనే లక్ష్యాన్ని ఊదేసింది. నవాజ్‌కు మరో ఓపెనర్ మహ్మద్ హరీస్ (20 బంతుల్లో 41), కెప్టెన్ సల్మాన్ అఘా (31 బంతుల్లో 51 నాటౌట్) సహకరించడంతో పాక్ మరో 4 ఓవర్లు మిగిలుండగానే వికెట్ మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. పాక్ కోల్పోయిన ఏకైక వికెట్ డఫీకి దక్కింది. ఈ గెలుపుతో పాక్ 5 మ్యాచ్‌ల సిరీస్‌లో న్యూజిలాండ్ ఆధిక్యాన్ని 1-2కు తగ్గించింది. తొలి రెండు టీ20ల్లో న్యూజిలాండ్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. నాలుగో టీ20 మార్చి 23న మౌంట్ మాంగనూయ్ వేదికగా జరుగనుంది. -
ఉప్పల్ స్టేడియంలో ఎల్లుండి ఐపీఎల్ మ్యాచ్.. భారీ బందోబస్తు
సాక్షి, హైదరాబాద్: ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్‌లకు పటిష్టమైన భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్ల రాచకొండ సీపీ సుధీర్ వెల్లడించారు. శుక్రవారం ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో ఐపీఎల్ (IPL-2025) మ్యాచ్‌ల భద్రతా ఏర్పాట్లపై శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఐపీఎల్ మ్యాచ్‌ల కోసం ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.ఉప్పల్ స్టేడియంలో 450 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని సీపీ వెల్లడించారు. 2,700 మంది పోలీస్ సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశామని.. 300 మంది ట్రాఫిక్ పోలీసులు, లా అండ్ ఆర్డర్లో 1,218 మంది, 12 మంది బెటాలియన్లు, 2 ఆక్టోపస్ బృందాలు, 10 మౌంటెడ్ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ఐపీఎల్ 2025 మహా సంగ్రామానికి సర్వం సిద్ధమైంది. రేపు (శనివారం) నుంచి ఐపీఎల్ 2025 సీజన్ ప్రారంభం కానుంది. కోల్‌కతా ఈడెన్ గార్డెన్స్ వేదికగా కేకేఆర్-ఆర్సీబీ మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. ఆదివారం (ఎల్లుండి) సన్ రైజర్స్ హైదరాబాద్-రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. మధ్యాహ్నం 3.30 గంటలకు హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. -
44 బంతుల్లో శతక్కొట్టిన పాక్ ఓపెనర్.. 9 వికెట్ల తేడాతో చిత్తైన న్యూజిలాండ్
ఆక్లాండ్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన మూడో టీ20లో పాకిస్తాన్ సంచలన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో పాక్ యువ ఓపెనర్ హసన్ నవాజ్ 44 బంతుల్లోనే శతక్కొట్టి పాక్‌కు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. టీ20ల్లో పాక్ తరఫున ఇదే ఫాస్టెస్ట్ సెంచరీ. గతంలో ఈ రికార్డు బాబర్ ఆజమ్ పేరిట ఉండేది. బాబర్ 2021లో సౌతాఫ్రికాపై 49 బంతుల్లో శతక్కొట్టాడు.నవాజ్ సుడిగాలి శతకంతో విరుచుకుపడటంతో న్యూజిలాండ్ నిర్ధేశించిన 205 పరుగుల భారీ లక్ష్యాన్ని పాక్ 16 ఓవర్లలోనే ఊదేసింది. ఈ గెలుపుతో పాక్ ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో న్యూజిలాండ్ ఆధిక్యాన్ని 1-2కు తగ్గించింది. తొలి రెండు టీ20ల్లో ఘన విజయాలు సాధించిన న్యూజిలాండ్ ఈ మ్యాచ్‌లో కూడా గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలని భావించింది. అయితే కివీస్ అశలపై హసన్ నవాజ్ నీళ్లు చల్లాడు. నవాజ్ తన కెరీర్లో మూడో మ్యాచ్‌లోనే ఫాస్టెస్ట్ సెంచరీ సాధించడం విశేషం. ఈ సిరీస్‌తోనే అంతర్జాతీయ అరంగేట్రం చేసిన నవాజ్ తొలి రెండు మ్యాచ్‌ల్లో దారుణంగా విఫలమయ్యాడు.పాక్ క్రికెట్ జట్టు విషయానికొస్తే.. ఈ జట్టు ఎప్పుడు ఎలా ఆడుతుందో ఎవరికీ తెలీదు. వరుసగా పరాజయాలతో ముప్పేట దాడిని ఎదుర్కొంటున్న ఆ జట్టు.. ఒక్కసారిగా సంచలన ప్రదర్శనతో భారీ లక్ష్యాన్ని ఛేదించి ఊహించని విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో పాక్ గెలవడాన్ని ఎవరూ నమ్మలేకపోతున్నారు. ఇటీవలికాలంలో ఆ జట్టు ప్రదర్శన అంత దారుణంగా ఉంది మరి. నవాజ్ తన సుడిగాలి శతకంతో పాక్ క్రికెట్లో ఒక్కసారిగా హీరో అయిపోయాడు.మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 19.5 ఓవర్లలో 204 పరుగుల భారీ స్కోర్ చేసి ఆలౌటైంది. మార్క్ చాప్మన్ 44 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 94 పరుగులు చేసి న్యూజిలాండ్ భారీ స్కోర్ చేయడానికి దోహదపడ్డారు. న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌లో చాప్మన్ తర్వాత ఎవరూ ఆ స్థాయిలో రాణించలేదు. ఆఖర్లో కెప్టెన్ బ్రేస్‌వెల్ (18 బంతుల్లో 31) మెరుపు ఇన్నింగ్స్ ఆడగా.. టిమ్ సీఫర్ట్ (19), డారిల్ మిచెల్ (17), ఐష్ సోధి (10) రెండంకెల స్కోర్లు చేయగలిగారు. ఫిన్ అలెన్ 0, నీషమ్ 3, మిచెల్ హే 9, జేమీసన్ 0, డఫీ 2 పరుగులకు ఔటయ్యారు. పాక్ బౌలర్లలో హరీస్ రౌఫ్ అద్భుతంగా బౌలింగ్ చేసి 3 వికెట్లు తీయగా.. షాహీన్ అఫ్రిది, అబ్రార్ అహ్మద్, అబ్బాస్ అఫ్రిది తలో 2, షాదాబ్ ఖాన్ ఓ వికెట్ పడగొట్టారు.అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన పాక్ ఆది నుంచి దూకుడు ప్రదర్శించింది. ఓపెనర్లు మహ్మద్ హరీస్ (20 బంతుల్లో 41), హసన్ నవాజ్ (45 బంతుల్లో 105 నాటౌట్; 10 ఫోర్లు, 7 సిక్సర్లు) మెరుపు వేగంతో పరుగులు సాధించారు. హరీస్ ఔటయ్యాక క్రీజ్‌లోకి వచ్చిన సల్మాన్ అఘా (31 బంతుల్లో 51 నాటౌట్) కూడా దూకుడుగా ఆడాడు. ఫలితంగా పాక్ మరో 4 ఓవర్లు మిగిలుండగానే వికెట్ మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. పాక్ కోల్పోయిన ఏకైక వికెట్ డఫీకి దక్కింది. ఈ సిరీస్‌లో నాలుగో టీ20 మార్చి 23న మౌంట్ మాంగనూయ్ వేదికగా జరుగనుంది. -
కోల్‌కతా- లక్నో మ్యాచ్.. కీలక మార్పు
ఐపీఎల్-2025 షెడ్యూల్లో స్వల్ప మార్పు చోటు చేసుకుంది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్-లక్నో సూపర్ జైయింట్స్ మధ్య ఏప్రిల్ 6న జరగాల్సిన మ్యాచ్‌ను గౌహతికి తరలించారు. అదే రోజు శ్రీ రామ నవమి ఉండటంతో భద్రత కల్పించలేమని కోల్‌కతా పోలీసులు బెంగాల్ క్రికెట్ అసోసియేషన్‌కు తెలియజేశారు.ఈ విషయాన్ని ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్‌తో బెంగాల్ క్రికెట్ బోర్డు చర్చింది. ఈ క్రమంలోనే ఐపీఎల్ పాలకమండలి వేదికను గౌహతికి మార్చింది.ఈ వేదిక మార్పును బీసీసీఐ కూడా ఆమోదించింది. కాగా రామ నవమి వేడుకల కారణంగా కోల్‌కతాలో ఐపీఎల్ మ్యాచ్‌లను రీ షెడ్యూల్ చేయడం ఇదేమి తొలిసారి కాదు. గతేడాది కూడా ఏప్రిల్ 17న జరగాల్సిన కోల్‌కతా వేదికగా కేకేఆర్-రాజస్తాన్ రాయల్స్ మధ్య జరగాల్సిన మ్యాచ్‌ను రామ నవమి కారణంగా.. ఒకరోజు ముందు (ఏప్రిల్ 16న) నిర్వహించారు.ఇందుకోసం మరో మ్యాచ్‌ను బీసీసీఐ రీ షెడ్యూల్ చేయాల్సి వచ్చింది. వాస్తవానికి గౌహతిలోని అస్సాం క్రికెట్ అసోషియేషన్ స్టేడియం రాజస్తాన్ రాయల్స్‌కు సెకెండ్ హోం గ్రౌండ్‌గా ఉంది. రాజస్తాన్ టీమ్ ఈ వేదికలో రెండు మ్యాచ్‌లు ఆడనుంది. ఈ మైదానంలో రాజస్తాన్ మార్చి 26న కేకేఆర్‌తో, మార్చి 30న చెన్నై సూపర్‌కింగ్స్‌తో తలపడనుంది.కాగా ఈ మెగా ఈవెంట్ మొత్తం 13 వేదికల్లో జరగనుంది. ఐపీఎల్-18వ సీజన్ మార్చి 22 నుంచి ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో ఈడెన్‌గార్డెన్స్ వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్లు తలపడనున్నాయి.చదవండి: CT 2025: ‘రూ. 739 కోట్ల నష్టం’.. పాక్ క్రికెట్ బోర్డు స్పందన ఇదే! -
CT 2025: ‘రూ. 739 కోట్ల నష్టం’.. పాక్ క్రికెట్ బోర్డు స్పందన ఇదే!
దాదాపు ఇరవై తొమ్మిదేళ్ల తర్వాత పాకిస్తాన్ చాంపియన్స్ ట్రోఫీ-2025 (ICC Champions Trophy) రూపంలో ఐసీసీ టోర్నమెంట్‌కు ఆతిథ్యం ఇచ్చింది. డిఫెండింగ్ చాంపియన్ హోదాలో నిర్వహణ హక్కులు దక్కించుకున్న పాక్.. టీమిండియా కోసం హైబ్రిడ్ విధానానికి అంగీకరించాల్సి వచ్చింది. భద్రతా కారణాల దృష్ట్యా రోహిత్ సేనను అక్కడకు పంపేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) నిరాకరించగా.. ఐసీసీ జోక్యంతో పాక్ క్రికెట్ బోర్డు (PCB) వెనక్కి తగ్గింది.ఈ నేపథ్యంలో టీమిండియా తమ మ్యాచ్‌లన్నీ దుబాయ్‌లో ఆడింది. గ్రూప్ దశలో మూడు, సెమీస్, ఫైనల్ మ్యాచ్‌లను అక్కడే పూర్తి చేసుకుంది. మరోవైపు.. పాకిస్తాన్ పది మ్యాచ్‌ల నిర్వహణకు సిద్ధంకాగా.. వర్షం వల్ల కేవలం ఎనిమిది మ్యాచ్‌లు మాత్రమే సజావుగా సాగాయి.రూ. 739 కోట్ల మేర నష్టం?ఇదిలా ఉంటే.. చాంపియన్స్ ట్రోఫీ-2025 నిర్వహణ నేపథ్యంలో పీసీబీకి రూ. 739 కోట్ల మేర నష్టం వాటిల్లిందనే వార్తలు వచ్చాయి. అయితే, పీసీబీ అధికార ప్రతినిధి ఆమిర్ మిర్, చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ జావేద్ ముర్తజా ఈ వదంతులను ఖండించారు. ఐసీసీ ఈవెంట్ నిర్వహించడం ద్వారా తమకు ఎలాంటి నష్టం రాలేదని.. పైగా రూ. 100 కోట్ల మేర ఆదాయం చేకూరిందని చెప్పడం గమనార్హం.‘‘టోర్నమెంట్‌కు సంబంధించి అయిన ఖర్చు మొత్తాన్ని ఐసీసీ సమకూర్చింది. టికెట్ల అమ్మకం, ఇతర మార్గాల ద్వారా పీసీబీకి పెద్ద మొత్తంలో ఆదాయం చేకూరింది’’ అని ఆమిర్ మిర్ స్పష్టం చేశాడు. తమ అంచనాలకు మించి రెవెన్యూ వచ్చిందని.. ఆడిట్ తర్వాత ఈ మొత్తం ఇంకాస్త పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నాడు.ఇక 2023-24 ఆర్థిక సంవత్సరం నాటికి తమకు రూ. 300 కోట్ల మేర ఆదాయం చేకూరిందని పీసీబీ వర్గాలు పేర్కొనడం గమనార్హం. ఆదాయంలో ఏకంగా 40 శాతం పెరుగుదల నమోదైందని.. ప్రపంచంలో తాము ఇప్పుడు టాప్-3 సంపన్న బోర్డుల జాబితాలో చేరామని పేర్కొన్నాయి.అత్యంత సంపన్న బోర్డుగా బీసీసీఐకాగా దాదాపు 19 వేల కోట్లకు పైగా రూపాయలతో బీసీసీఐ ప్రపంచంలోనే అత్యంత సంపన్న బోర్డుగా కొనసాగుతోంది. క్రికెట్ ఆస్ట్రేలియా రూ. 689 కోట్లు, ఇంగ్లండ్ &వేల్స్ బోర్డు రూ. 513 కోట్ల మేర సంపదతో ఆ తర్వాతి స్థానాల్లో కొనసాగుతుండగా.. రూ. 300 కోట్ల సంపద కలిగి ఉన్నామన్న చెపుతున్న పీసీబీ నాలుగో స్థానంలో కొనసాగుతుండగా.. తాము టాప్-3లో ఉన్నామంటూ బోర్డు వర్గాలు వెల్లడించడం గమనార్హం.చాంపియన్‌గా టీమిండియాఇక ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీల-2025లో గ్రూప్-ఎ నుంచి భారత్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్, పాకిస్తాన్.. గ్రూప్-బి నుంచి ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, అఫ్గనిస్తాన్, ఇంగ్లండ్ పోటీ పడ్డాయి. గ్రూప్-ఎ నుంచి భారత్, న్యూజిలాండ్.. గ్రూప్-బి నుంచి ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా సెమీ ఫైనల్లో అడుగుపెట్టాయి. తొలి సెమీస్‌లో భారత్.. ఆసీస్‌ను.. రెండో సెమీస్‌లో న్యూజిలాండ్ ప్రొటిస్ జట్టును ఓడించి టైటిల్ పోరుకు అర్హత సాధించాయి. దుబాయ్‌లో మార్చి 9న జరిగిన ఫైనల్లో టీమిండియా కివీస్ జట్టును ఓడించి చాంపియన్‌గా అవతరించింది.ఇదిలా ఉంటే.. పాకిస్తాన్లో రావల్పిండి, కరాచీ, లాహోర్ మైదానాలు చాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇచ్చాయి. ఈ మెగా వన్డే ఈవెంట్ కోసం ఈ మూడు స్టేడియాలలో భారీ ఖర్చుతో పీసీబీ మరమతులు చేపట్టింది. అయితే, వర్షం కారణంగా రావల్పిండి, లాహోర్లలో మ్యాచ్‌లు రద్దు కావడం.. అక్కడి డ్రైనేజీ వ్యవస్థ దుస్థితికి అద్దం పట్టాయి. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో సన్నద్ధం కాలేనపుడు ఇలాంటి మెగా టోర్నీలను నిర్వహిస్తామని పట్టుబట్టడం సరికాదంటూ పీసీబీ తీరుపై విమర్శలు వచ్చాయి. చదవండి: 'సెహ్వాగ్ నన్ను అవమానించాడు.. అందుకే మాట్లాడటం మానేశా' -
వారెవ్వా.. ఫిలిప్స్‌ను మించిపోయాడుగా! వీడియో వైరల్
ఆక్లాండ్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడో టీ20లో పాకిస్తాన్ ఆటగాడు హారిస్ రవూఫ్ అసాధరణ ఫీల్డింగ్ ప్రదర్శన కనబరిచాడు. రవూఫ్ అద్భుతమైన క్యాచ్‌తో కివీస్ స్టార్ ఓపెనర్ ఫిన్ అలెన్ పెవిలియన్‌కు పంపాడు. అతడి క్యాచ్‌తో ఆక్లాండ్ మైదానం మొత్తం ఒక్కసారిగా సైలెంట్ అయిపోయింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాకిస్తాన్ ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించుకుంది.ఈ క్రమంలో పాక్ బౌలింగ్ ఎటాక్‌ను షాహీన్ అఫ్రిది ప్రారంభించగా.. కివీస్ ఓపెనర్లగా టిమ్ సీఫర్ట్, అలెన్ బరిలోకి దిగారు. అయితే మొదటి ఓవర్ వేసిన షాహీన్ అఫ్రిది ఐదో బంతిని లెగ్ సైడ్‌గా సంధించాడు. ఆ బంతిని అలెన్ లెగ్ సైడ్‌లోకి ఫ్లిక్ చేశాడు. ఈ క్రమంలో షార్ట్ ఫైన్ లెగ్‌లో ఉన్న రవూఫ్ అద్బుతం చేశాడు.రౌఫ్ తన కుడి వైపునకు జంప్ చేస్తూ సింగిల్ హ్యాండ్‌తో స్టన్నింగ్ క్యాచ్‌ను అందుకున్నాడు. ఇది చూసిన ఫిన్ అలెన్ ఆశ్చర్యపోయాడు. రవూఫ్ క్యాచ్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. గ్లెన్ ఫిలిప్స్‌ను మించిన క్యాచ్ పట్టావు అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కాగా ఈ మ్యాచ్ పాకిస్తాన్ డూర్ ఆర్ డై. ఇప్పటికే తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓటమి చవిచూసిన పాకిస్తాన్.. సిరీస్‌లో నిలవాలంటే ఈ మ్యాచ్‌లో కచ్చితంగా గెలవాల్సిందే.ఇక ఈ సిరీస్‌కు సీనియర్ ప్లేయర్లు మహ్మద్ రిజ్వాన్, బాబర్ ఆజం దూరమైన సంగతి తెలిసిందే. ఛాంపియన్స్ ట్రోఫీలో విఫలమైనందుకు ఈ సీనియర్ ద్వయంపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు వేటు వేసింది. టీ20ల్లో పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అలీ అఘాను నియమించిన పీసీబీ.. వైస్ కెప్టెన్సీ బాధ్యతలు స్టార్ ఆల్‌రౌండర్ షాదాబ్ ఖాన్‌కు అప్పగించింది.చదవండి: IPL 2025: ఐపీఎల్ వేలంలో అన్‌సోల్డ్.. కట్ చేస్తే! పంత్ టీమ్‌లోకి ఎంట్రీ? pic.twitter.com/odGcpMzlPX— kuchnahi123@12345678 (@kuchnahi1269083) March 21, 2025 -
న్యూజిలాండ్‌ను చిత్తు చేసిన ఆస్ట్రేలియా..
న్యూజిలాండ్ మహిళలతో మూడు టీ20ల సిరీస్‌ను ఆస్ట్రేలియా విజయంతో ఆరంభించింది. ఆక్లాండ్ వేదికగా జరిగిన తొలి టీ20లో న్యూజిలాండ్‌ను 8 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా చిత్తు చేసింది. కివీస్ నిర్ధేశించిన 138 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఆసీస్ అమ్మాయిలు కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 13.3 ఓవర్లలోనే ఛేదించారు.లక్ష్య చేధనలో ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ బెత్ మూనీ విధ్వంసం సృష్టించింది. కేవలం 42 బంతుల్లో 10 ఫోర్లు, 1 సిక్సర్‌తో 75 పరుగులు చేసి ఆజేయంగా నిలిచింది. ఆమెతో పాటు మరో ఓపెనర్ జార్జియా వాల్(31 బంతుల్లో 9 ఫోర్లతో 50) హాఫ్ సెంచరీతో మెరిసింది. న్యూజిలాండ్ బౌలర్లలో తహుహు రెండు వికెట్లు సాధించగా.. మిగితా బౌలర్లు దారుణంగా విఫలమయ్యారు.అంతకముందు బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 137 పరుగులు చేసింది. వైట్‌ఫెర్న్స్ బ్యాటర్లలో అమీలియా కేర్(51 నాటౌట్) టాప్ స్కోరర్‌గా నిలవగా.. సోఫీ డివైన్(39) పర్వాలేదన్పించారు. ఆసీస్ బౌలర్లలో బ్రౌన్, మెక్‌గ్రాత్ తలా వికెట్ సాధించారు. ఇరు జట్ల మధ్య రెండో టీ20 మార్చి 23న మౌంట్ మౌంగనుయ్ వేదికగా జరగనుంది. ఆసీస్‌తో సిరీస్ కంటే ముందు శ్రీలంకతో జరిగిన వైట్‌బాల్ సిరీస్‌లను న్యూజిలాండ్ సొంతం చేసుకుంది.చదవండి: IPL 2025: ఐపీఎల్ వేలంలో అన్‌సోల్డ్.. కట్ చేస్తే! పంత్ టీమ్‌లోకి ఎంట్రీ? -
ఐపీఎల్ వేలంలో అన్‌సోల్డ్.. కట్ చేస్తే! పంత్ టీమ్‌లోకి ఎంట్రీ?
ఐపీఎల్-2025 ఆరంభానికి కేవలం ఒక్క రోజు సమయం మాత్రమే మిగిలింది. మార్చి 22న ఈడెన్ గార్డెన్స్ కేకేఆర్-ఆర్సీబీ మధ్య జరగనున్న మ్యాచ్‌తో ఈ మెగా ఈవెంట్‌కు తేరలేవనుంది. ఈ క్రమంలో మొత్తం పది ఫ్రాంచైజీలు గాయాల కారణంగా దూరమైన ఆటగాళ్ల స్ధానాలను భర్తీ చేసే పనిలో పడ్డాయి. లక్నో సూపర్ జెయింట్స్ ఫ్రాంచైజీ టీమిండియా వెటరన్ ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. గాయం కారణంగా ఈ ఏడాది సీజన్‌కు దూరమైన లక్నో పాస్ట్ బౌలర్ మొహ్సిన్ ఖాన్ స్థానంలో శార్ధూల్‌ను తీసుకున్నట్లు సమాచారం. ఇప్పటికే శార్ధూల్ ఠాకూర్ వైజాగ్‌లో ఉన్న లక్నో సూపర్ జెయింట్స్ టీమ్‌తో కలిసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ టోర్నీలో లక్నో సూపర్ జెయింట్స్ తమ తొలి మ్యాచ్‌లో ఈ నెల 24న ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఆడనుంది. కాగా ఐపీఎల్-2025 మెగా వేలంలో శార్ధూల్ ఠాకూర్ అమ్ముడు పోలేదు. రూ. 2 కోట్ల బేస్‌ప్రైస్‌తో వేలంలోకి వచ్చిన అతడిని ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపలేదు.కానీ ఇప్పుడు మరోసారి అతడికి ఐపీఎల్లో భాగమయ్యే అవకాశం లక్నో జట్టు కల్పించింది. కాగా శార్థూల్‌తో ఒప్పందంపై లక్నో ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు. శార్ధూల్ ఇటీవల జరిగిన హోలీ వేడుకల్లో ఢిల్లీ జట్టు సభ్యులతో కన్పించాడు.ఐపీఎల్లో అదుర్స్.. కాగా ఐపీఎల్లో శార్దూల్ ఠాకూర్ మంచి రికార్డు ఉంది. శార్థూల్ 2015లో పంజాబ్ కింగ్స్ తరపున ఐపీఎల్ అరంగేట్రం చేశాడు. అప్పటి నుంచి ఇప్పటివరకు 95 మ్యాచ్‌లు ఆడిన లార్డ్ ఠాకూర్.. 307 పరుగులతో పాటు 94 వికెట్లు పడగొట్టాడు. 2017 నుంచి అతడు అన్ని ఐపీఎల్ సీజన్లలోనూ ఆడాడు. గతేడాది మెగా వేలానికి ముందు సీఎస్కే అతడిని విడిచిపెట్టింది.వీక్‌గా పేస్ బౌలింగ్ యూనిట్..కాగా లక్నో సూపర్ జెయింట్స్ పేస్ బౌలింగ్ విభాగం చాలా వీక్‌గా కన్పిస్తోంది. పేస్ అటాక్‌లో భాగంగా ఉన్న ఆకాష్ దీప్, అవేష్ ఖాన్, మయాంక్ యాదవ్ గాయాలతో పోరాడుతున్నారు. వీరూ ఇంకా లక్నో జట్టుతో చేరలేదు. మోహ్షిన్ ఖాన్ అయితే పూర్తిగా ఈ ఏడాది సీజన్‌కే దూరమయ్యాడు. ప్రస్తుతం షెమార్ జోషఫ్, ప్రిన్స్ యాదవ్, రాజవర్ధన్ హంగర్గేకర్ వంటి యువ పేసర్ల లక్నో జట్టులో ఉన్నారు. ఈ నేపథ్యంలో శార్థూల్ ఠాకూర్ లక్నో జట్టుకు కీలకంగా మారే అవకాశముంది.చదవండి: 'సెహ్వాగ్ నన్ను అవమానించాడు.. అందుకే మాట్లాడటం మానేశా' -
'సెహ్వాగ్ నన్ను అవమానించాడు.. అందుకే మాట్లాడటం మానేశా'
ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్ గ్లెన్ మాక్స్వెల్ ముచ్చటగా మూడోసారి పంజాబ్ కింగ్స్‌తో జతకట్టాడు. ఐపీఎల్-2025 సీజన్లో పంజాబ్ కింగ్స్‌కు మాక్స్వెల్ ప్రాతినిథ్యం వహించనున్నాడు. గతేడాది డిసెంబర్లో జరిగిన మెగా వేలంలో రూ. 4.2 కోట్లకు మాక్స్‌వెల్‌ను పంజాబ్ సొంతం చేసుకుంది.ఇప్పటికే పంజాబ్ జట్టుతో చేరిన మాక్సీ నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నాడు. కాగా మాక్స్వెల్ తొలిసారిగా 2014 ఐపీఎల్ సీజన్లో పంజాబ్ కింగ్స్‌కు ప్రాతినిథ్య వహించాడు. 2014, 2015, 2016 సీజన్లలో మాక్సీ అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు. దీంతో ఈ ఆసీస్ స్టార్ ఐపీఎల్-2017లో పంజాబ్ కింగ్స్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. అయితే ఆ సీజన్లో మాక్స్వెల్ సారథ్యంలోని పంజాబ్ కింగ్స్ గ్రూపు స్టేజికే పరిమితమైంది. అప్పటి జట్టు రైజింగ్ పూణే సూపర్ జెయింట్స్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో పూర్తిగా తేలిపోయిన పంజాబ్ టీమ్.. లీగ్ స్టేజిలోనే ఇంటిముఖం పట్టింది. ఆ మ్యాచ్‌లో పంజాబ్ కేవలం 73 పరుగులకే ఆలౌటై ఘోర ఓటమిని మూట కట్టుకుంది.అయితే ఆ మ్యాచ్ అనంతరం అప్పటి పంజాబ్ మెంటార్ వీరేంద్ర సెహ్వాగ్‌తో గ్లెన్ మాక్స్‌వెల్‌కు తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. కాగా తాజాగా మాక్స్వెల్.. సెహ్వాగ్‌తో జరిగిన గొడవ గురించి "గ్లెన్ మాక్స్వెల్: ది షోమ్యాన్" పుస్తకంలో రాసుకొచ్చాడు. సెహ్వాగ్ అందరూ ముందు తనను అవమానించాడని మాక్స్వెల్ చెప్పుకొచ్చాడు."మ్యాచ్ ముగిశాక జరిగిన విలేకరుల సమావేశానికి వీరేంద్ర సెహ్వాగ్ హాజరు కావాలని భావించాడు. కానీ ఓటమికి బాధ్యత వహిస్తూ స్వచ్ఛందంగా నేనే ప్రెస్‌కాన్ఫరెన్స్‌కు వెళ్లాను. ఆ తర్వాత హోటల్‌కు వెళ్లేందుకు అందరం కలిసి బస్‌లో కూర్చున్నాము. ఆ సమయంలో నన్ను మా టీమ్ ప్రధాన వాట్సాప్ గ్రూప్ నుండి తొలగించినట్లు గమనించాను. వెంటనే ఆయనకు మీరు ఒక అభిమానిని కోల్పోయారు అని మెసేజ్ చేశాను. నీలాంటి అభిమాని అవసరం లేదని ఆయన బదులిచ్చాడు. మేము హోటల్‌కు చేరుకునే సమయానికి ఆయన మెసెజ్‌లతో నా ఫోన్ నిండిపోయింది. నిజంగా అతడి ప్రవర్తన నాకు తీవ్ర నిరాశపరిచింది. కెప్టెన్‌గా ఆ మ్యాచ్‌లో నేను విఫలమైనందుకు నిందించాడు.అప్పటి నుంచి ఇప్పటివరకు ఒక్కసారి కూడా సెహ్వాగ్‌తో మాట్లాడలేదు" అని తన బుక్‌లో మాక్సీ పేర్కొన్నాడు. ఆ తర్వాత ఓ సారి ఐపీఎల్-2020లో పంజాబ్ కింగ్స్‌కు ప్రాతినిథ్యం వహించాడు. మళ్లీ ఇప్పుడు ఐదేళ్ల తర్వాత పంజాబ్ జట్టుతో మాక్స్వెల్ చేరాడు. ఐపీఎల్-18వ సీజన్ మార్చి 22 నుంచి ప్రారంభం కానుంది. -
సీఎస్కే, ఢిల్లీ కాదు.. ప్లే ఆఫ్స్‌కు చేరే జట్లు ఇవే: డివిలియర్స్
ఐపీఎల్-2025 సీజన్‌కు కౌంట్‌డౌన్ మొదలైంది. మరో 24 గంటల్లో ఈ మెగా ఈవెంట్‌కు తేరలేవనుంది. శనివారం ఈడెన్‌గార్డెన్స్ వేదికగా జరగనున్న తొలి మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు అమీతుమీ తెల్చుకోనున్నాయి.కాగా ఈ టోర్నీ ఆరంభానికి సమయం దగ్గరపడుతుండడంతో మాజీ క్రికెటర్లు ప్లే ఆఫ్స్ చేరే జట్లు, టైటిల్ విజేతగా నిలిచే జట్టును అంచనా వేస్తున్నారు. ఈ జాబితాలోకి తాజాగా దక్షిణాఫ్రికా దిగ్గజ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ చేరాడు. ఈ ఏడాది సీజన్లో ప్లే ఆఫ్స్‌కు చేరే నాలుగు జట్లను డివిలియర్స్ ప్రిడక్ట్ చేశాడు.గతంలో తను ప్రాతినిథ్యం వహించిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో పాటు పాటు ముంబై ఇండియన్స్ (MI), గుజరాత్ టైటాన్స్ (GT), డిఫెండింగ్ ఛాంపియన్స్ కోల్‌కతా నైట్‌రైడర్స్ (KKR) ప్లే ఆఫ్స్‌కు చేరుతాయని ఏబీడీ జోస్యం చెప్పాడు."ముంబై ఇండియన్స్ జట్టు చాలా పటిష్టంగా కన్పిస్తోంది. ఈసారి ముంబై ఇండియన్స్ కచ్చితంగా ప్లే ఆఫ్స్‌కు చేరుకుంటుంది. ఆర్సీబీ కూడా టాప్-4లో నిలుస్తోంది. ఆర్సీబీ జట్టు అన్ని విభాగాల్లో సమతుల్యంగా ఉంది. ఆపై గుజరాత్ టైటాన్స్ కూడా తమ ప్లే ఆఫ్ బెర్త్‌ను ఖారారు చేసుకుంటుందని భావిస్తున్నాను.ఈ మూడు జట్లతో పాటు డిఫెండింగ్ ఛాంపియన్ కెకెఆర్ కూడా ప్లేఆఫ్ రేసులో ఉంటుంది" అని స్పోర్ట్స్ టాక్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో డివిలియర్స్ పేర్కొన్నాడు. కాగా డివిలియర్స్ ఎంచుకున్న జట్లలో ఐదు సార్లు ఛాంపియన్ చెన్నై సూపర్‌కింగ్స్ లేకపోవడం అభిమానులు ఆశ్చర్యపరిచింది. కాగా గతేడాది సీజన్లో రుతురాజ్ గైక్వాడ్ సారథ్యంలోని సీఎస్కే గ్రూపు స్టేజికే పరిమితమైంది.చదవండి: ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ విధ్వంసం.. 37 బంతుల్లో సెంచరీ -
ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ విధ్వంసం.. 37 బంతుల్లో సెంచరీ
ఐపీఎల్-2025లో ఢిల్లీ క్యాపిటల్స్ తమ తొలి మ్యాచ్ ఆడేందుకు సిద్దమవుతోంది. మార్చి 24న విశాఖపట్నం వేదికగా లక్నో సూపర్ జెయింట్స్‌తో ఢిల్లీ క్యాపిటల్స్ తలపడనుంది. ఇప్పటికే వైజాగ్ చేరుకున్న ఢిల్లీ జట్టు నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తోంది.ఈ క్రమంలో ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాళ్లు గురువారం రెండు జట్లగా విడిపోయి ఇంట్రాస్క్వాడ్ మ్యాచ్ ఆడారు. ఈ ప్రాక్టీస్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా యువ సంచలనం, ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్ అద్భుతమైన సెంచరీతో మెరిశాడు. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్-ఎ జట్టు తరపున ఆడిన మెక్‌గర్క్.. ఆకాశమే హద్దుగా చెలరేగాడు. వైజాగ్ మైదానంలో బౌండరీల వర్షం కురిపించాడు. కేవలం 39 బంతులు మాత్రమే ఎదుర్కొన్న జేక్ ఫ్రేజర్ మెక్‌గుర్క్.. 9 ఫోర్లు, 10 సిక్స్‌లతో 110 పరుగులు చేశాడు. అతడి విధ్వంసకర ఇన్నింగ్స్ ఫలితంగా ఢిల్లీ-ఎ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 289 పరుగుల భారీ స్కోర్ చేయగల్గింది. మెక్‌గర్క్ ఇన్నింగ్స్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.కాగా జేక్ ఫ్రేజర్ మెక్‌గర్క్ ఐపీఎల్-2024 సీజన్‌తో ఈ క్యాష్‌రిచ్ లీగ్‌లోకి అడుగుపెట్టాడు. అరంగేట్రంలోనే ఈ యువ సంచలనం తన అద్భుత ప్రదర్శనతో అందరిని ఆకట్టుకున్నాడు. జేక్ ఫ్రేజర్ దూకుడుగా ఆడటంలో స్పెషలిస్ట్. గతేడాది సీజన్లో 9 మ్యాచ్‌లు ఆడిన జేక్ ఫ్రేజర్.. 234.04 స్ట్రైక్‌రేట్‌తో 330 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు హాఫ్ సెంచరీలు ఉన్నాయి.అయితే అంతర్జాతీయ క్రికెట్లో మాత్రం అతడు తన మార్క్‌ను చూపించలేకపోయాడు. ఆస్ట్రేలియా తరపున ఇప్పటివరకు 14 మ్యాచ్‌లు ఆడిన ఫ్రేజర్ కేవలం 221 పరుగులు మాత్రమే చేశాడు. ఇటీవల జరిగిన బిగ్‌బాష్ లీగ్‌లో సైతం అతడు తీవ్ర నిరాశపరిచాడు. 10 మ్యాచ్‌లు ఆడి కేవలం 188 పరుగులు మాత్రమే చేయగలిగాడు. అయినప్పటికి మరోసారి అతడిపై ఢిల్లీ క్యాపిటల్స్ నమ్మకం ఉంచింది. ఐపీఎల్-2025 మెగా వేలంలో రూ.9 కోట్ల భారీ ధరకు జేక్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ కొనుగోలు చేసింది.చదవండి: షకీబ్‌కు బిగ్ రిలీఫ్.. బౌలింగ్‌కు లైన్ క్లియర్TEAM TOTAL: 289 🤯JFM’s SCORE: 110* 🥵 pic.twitter.com/FT1hSsYjlA— Delhi Capitals (@DelhiCapitals) March 20, 2025 -
షకీబ్‌కు బిగ్ రిలీఫ్.. బౌలింగ్‌కు లైన్ క్లియర్
బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్, మేటి ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్‌కు మళ్లీ బౌలింగ్ చేసేందుకు అనుమతి లభించింది. అతని బౌలింగ్ శైలితీరు నియమాలకు లోబడే ఉందని, సందేహాస్పదంగా లేదని సమీక్ష అనంతరం తేలింది. అయితే తన బౌలింగ్ యాక్షన్‌ను ఎక్కడ సమీక్షించారనే విషయాన్ని షకీబ్ వెల్లడించలేదు.ఇప్పటికే టెస్టులకు, అంతర్జాతీయ టి20లకు వీడ్కోలు పలికిన షకీబ్ వన్డే ఫార్మాట్లో, ఫ్రాంచైజీ లీగ్‌లలో బౌలింగ్ చేసేందుకు మార్గం సుగమం అయింది. గత ఏడాది అక్టోబర్ కాన్పూర్‌లో భారత్‌తో జరిగిన రెండో టెస్టు తర్వాత షకీబ్ మళ్లీ బరిలోకి దిగలేదు. గత డిసెంబర్లో ఇంగ్లిష్ కౌంటీ క్రికెట్లో సర్రే జట్టు తరఫున మ్యాచ్ ఆడిన సమయంలో షకీబ్ బౌలింగ్ శైలి సందేహాస్పదంగా ఉండటంతో అతడు బౌలింగ్‌పై నిషేధం విధించారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్, పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో పాల్గొనే అవకాశాన్ని దక్కించుకోలేకపోయిన షకీబ్ త్వరలో శ్రీలంకతో వన్డే సిరీస్‌లో పాల్గొనే అవకాశముంది.చదవండి: ఐపీఎల్లో ‘సలైవా’ వాడవచ్చు! -
‘ఎంపిక నా చేతుల్లో లేదు’
బెంగళూరు: పేస్ బౌలర్ మొహమ్మద్ సిరాజ్ ఆ్రస్టేలియాతో టెస్టు సిరీస్ తర్వాత భారత జట్టులో చోటు కోల్పోయాడు. స్వదేశంలో ఇంగ్లండ్‌తో సిరీస్‌తో పాటు టీమిండియా విజేతగా నిలిచిన చాంపియన్స్ ట్రోఫీ టీమ్‌లోనూ అతనికి స్థానం లభించలేదు. అయితే ఈ హైదరాబాదీ పేసర్ జాతీయ జట్టులోకి త్వరలోనే పునరాగమనం చేస్తానని ఆశాభావంతో ఉన్నాడు. ప్రస్తుతం అంతగా ఆందోళన చెందడం లేదని, ఐపీఎల్లో సత్తా చాటాలనే పట్టుదలతో బరిలోకి దిగుతున్నట్లు అతను చెప్పాడు.ఐపీఎల్లో సిరాజ్ ఈసారి గుజరాత్ టైటాన్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహించబోతున్నాడు. ‘భారత జట్టు ఎంపిక నా చేతుల్లో ఉండదనేది వాస్తవం. నా చేతుల్లో బంతి మాత్రమే ఉంటుంది. దాంతో ఏం చేయగలను అనేదే ముఖ్యం. టీమ్ సెలక్షన్ గురించి అతిగా ఆలోచిస్తూ ఒత్తిడి పెంచుకోను. అలా చేస్తే నా ఆటపై ప్రభావం పడుతుంది. మున్ముందు ఇంగ్లండ్ పర్యటన, ఆసియా కప్లాంటివి ఉన్నాయనే విషయం నాకు తెలుసు. ఏం జరుగుతుందో చూద్దాం. ప్రస్తుతానికి దృష్టంతా ఐపీఎల్ పైనే ఉంది’ అని సిరాజ్ వ్యాఖ్యానించాడు. టీమిండియా తరఫున ఆడని సమయంలో బౌలింగ్ మెరుగుపర్చుకోవడంతో పాటు ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టినట్లు సిరాజ్ వెల్లడించాడు. ‘గత కొన్నేళ్లుగా నిరంతరాయంగా ఆడుతున్నాను. సాధారణంగా విశ్రాంతి తక్కువగా దొరుకుతుంది. కానీ ఈసారి మంచి విరామం లభించింది. అందుకే బౌలింగ్, ఫిట్‌నెస్‌పై మరింత దృష్టి పెట్టా. కొత్త బంతులు, పాత బంతులతో బౌలింగ్ చేశాం. స్లో బంతులు, యార్కర్ల విషయంలో ప్రత్యేక సాధన చేశాను. కొత్తగా నేర్చుకున్న అంశాలను ఐపీఎల్లో ప్రదర్శిస్తా’ అని అతను చెప్పాడు. శుబ్‌మన్ గిల్ నాయకత్వంలో ఆడేందుకు ఉత్సాహంగా ఎదురు చూస్తున్నట్లు సిరాజ్ వెల్లడించాడు. ‘బెంగళూరు జట్టుకు దూరం కావడం కొంత బాధకు గురి చేసిందనేది వాస్తవం. కోహ్లి అన్ని రకాలుగా అండగా నిలిచాడు. అయితే ఇక్కడా గిల్ సారథ్యంలో చాలా మంచి జట్టుంది. గిల్ కెపె్టన్సీలో బౌలర్లకు మంచి స్వేచ్ఛ ఉంటుంది. ఏదైనా కొత్తగా ప్రయత్నిస్తే ఎప్పుడూ వారించడు. మేమిద్దరం ఒకే టెస్టుతో అరంగేట్రం చేశాం. వ్యక్తిగతంగా కూడా మంచి సాన్నిహిత్యం ఉంది’ అని సిరాజ్ సంతోషం వ్యక్తం చేశాడు. తమ టీమ్‌లో రబాడ, రషీద్, ఇషాంత్, కొయెట్జీ లాంటి అగ్రశ్రేణి బౌలర్లు ఉండటం సానుకూల విషయమని, ఇది అందరిపై ఒత్తిడి తగ్గిస్తుందని అతను అభిప్రాయ పడ్డాడు. గత సీజన్ వరకు ఇదే ఫ్రాంచైజీకి ప్రాతినిధ్యం వహించిన మొహమ్మద్ షమీతో తనను పోల్చడంపై స్పందిస్తూ... ‘టైటాన్స్ టీమ్ తరఫున షమీ భాయ్ చాలా బాగా ఆడాడు. కీలక సమయాల్లో స్వింగ్‌తో వికెట్లు తీశాడు. నేను కూడా ఆయనలాగే పెద్ద సంఖ్యలో వికెట్లు తీసి జట్టుకు ఉపయోగపడితే చాలు. మొతెరా మైదానంలో కొత్త బంతితో షమీ వికెట్లు తీయడం నేను చూశాను. అదే తరహాలో పవర్‌ప్లేలో వికెట్లు తీయడమే నా పని’ అని సిరాజ్ చెప్పాడు. టైటాన్స్ కోచ్‌గా ఉన్న మాజీ పేసర్ ఆశిష్ నెహ్రాతో కలిసి పని చేసేందుకు, ఆయన వద్ద కొత్త విషయాలు నేర్చుకునేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు ఈ హైదరాబాదీ పేర్కొన్నాడు. -
ఐపీఎల్లో ‘సలైవా’ వాడవచ్చు!
న్యూఢిల్లీ: బంతిని రివర్స్ స్వింగ్ చేయగల సత్తా ఉన్న బౌలర్లకు శుభవార్త ఇది! బ్యాటర్ల బాదుడుతో ఏ దశలోనూ బంతిని నియంత్రణలో ఉంచుకోలేకపోతున్న పేసర్లకు ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ఊరటనిచ్చింది. 2025 సీజన్లో బంతిపై ఉమ్మి (సలైవా)ని రుద్దేందుకు అనుమతినిచ్చింది. గురువారం జరిగిన టీమ్ కెప్టెన్ల సమావేశంలో వారి అభిప్రాయం అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు. సలైవాను ఉపయోగిస్తే బంతిపై నునుపుదనం పెరిగి రివర్స్ స్వింగ్ అయ్యేందుకు అవకాశం ఉంటుంది. మ్యాచ్ కీలక క్షణాల్లో పేసర్లు దీనిని సమర్థంగా వాడుకోగలిగితే పైచేయి సాధించవచ్చు. క్రికెట్లో సుదీర్ఘ కాలంగా ఇది అమల్లో ఉంది. అయితే కోవిడ్ వచ్చిన తర్వాత నాటి ఆరోగ్య పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) సలైవాను రుద్దడంపై నిషేధం విధించడంతో పాటు ఎవరైనా వాడితే ఆ బౌలర్లకు శిక్షలు కూడా విధించింది. అయితే ఇప్పుడు అంతా మారిపోవడంతో బౌలర్ల వైపు నుంచి అభ్యర్థనలు వచ్చాయి. దాంతో ఒక మేజర్ ఈవెంట్లో తొలిసారి సలైవాను వాడేందుకు అనుమతినిస్తున్నారు. ఐసీసీ ఆంక్షలు ఇంకా ఉన్నా... ఐపీఎల్ మాత్రం దానికి సై అంది. తాజా నిర్ణయాన్ని పేస్ బౌలర్ మొహమ్మద్ సిరాజ్ స్వాగతించాడు. లీగ్‌లో గుజరాత్ టైటాన్స్ తరఫున తొలిసారి ఆడనున్న అతను ‘సలైవా’ తమకు మేలు చేస్తుందని అభిప్రాయపడ్డాడు. ‘ఇది పేస్ బౌలర్లకు ఎంతో మంచిది. బంతితో ఏమాత్రం ప్రభావం చూపలేకపోతున్న పరిస్థితుల్లో సలైవా వాడటం తప్పనిసరి. కొంతైనా రివర్స్ స్వింగ్‌కు ప్రయత్నించవచ్చు. బంతిని షర్ట్‌ను రుద్దడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండటం లేదు. సలైవా వల్ల ఒకవైపు మెరుపును కొనసాగించవచ్చు. ఇది చాలా ముఖ్యం’ అని సిరాజ్ అన్నాడు. మరోవైపు ఎత్తుకు సంబంధించిన వైడ్లు, ఆఫ్‌సైడ్ వైడ్ల విషయంలో డీఆర్ఎస్ వాడుకునేందుకు కూడా గవర్నింగ్ కౌన్సిల్ అంగీకరించింది. రాత్రి మ్యాచ్‌లలో మంచు ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకొని రెండో ఇన్నింగ్స్ సమయంలో 11వ ఓవర్ ఒక బంతిని మార్చేందుకు కూడా అనుమతినిచ్చారు. కెప్టెన్లపై నిషేధం ఉండదు... ఇక నుంచి ఐపీఎల్లో స్లో ఓవర్ రేట్ కారణంగా కెపె్టన్లపై మ్యాచ్ నిషేధం ఉండదని గవర్నింగ్ కౌన్సిల్ తెలిపింది. గురువారం జరిగిన ఐపీఎల్ జట్ల కెప్టెన్ల సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. నిషేధం బదులుగా కెప్టెన్లపై డీ మెరిట్ పాయింట్లు విధిస్తారు. గత ఏడాది హార్దిక్ పాండ్యా సారథ్యంలోని ముంబై ఇండియన్స్ జట్టు మూడుసార్లు స్లో ఓవర్‌రేట్ నమోదు చేసింది. దాంతో పాండ్యాపై ఒక మ్యాచ్ నిషేధం పడింది. గతేడాది హార్దిక్‌పై విధించిన ఒక మ్యాచ్ నిషేధం ఈ ఏడాది అమలు కానుంది. ఫలితంగా 23న చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగే తమ తొలి మ్యాచ్‌కు హార్దిక్ దూరమయ్యాడు. హార్దిక్ స్థానంలో సూర్యకుమార్ యాదవ్ ముంబై ఇండియన్స్ జట్టుకు నాయకత్వం వహిస్తాడు. -
ఒక్క టైటిల్ కోసం...
ఐపీఎల్ మొదలైనప్పుడు ఉన్న ఎనిమిది జట్లలో ఐదు టీమ్‌లు ఎప్పుడో విజేతగా నిలిచాయి... బెంగళూరు ఒక్కసారి కూడా గెలవకపోయినా ఆ జట్టు మూడుసార్లు ఫైనల్‌కు వెళ్లింది. పైగా విరాట్ కోహ్లిలాంటి దిగ్గజం కారణంగా ఫలితాలతో సంబంధం లేకుండా ఆకర్షణ కోల్పోని జట్టుగా సాగుతోంది... కానీ మరో రెండు టీమ్‌లు మాత్రం ప్రతీ సీజన్లో ఎన్నో ఆశలతో బరిలోకి దిగడం, సగం టోర్నీ ముగిసేవరకే పేలవ ప్రదర్శనతో చేతులెత్తేయడం దాదాపుగా రివాజుగా మారిపోయింది... ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఆటగాళ్లు, కెప్టెన్లు, సిబ్బందిని మార్చి మార్చి ప్రయోగాలు చేసినా, వ్యూహాలు మార్చినా ఆశించిన ఫలితం దక్కలేదు. డేర్‌డెవిల్స్ నుంచి క్యాపిటల్స్‌గా మారినా... కింగ్స్ ఎలెవన్ నుంచి కింగ్స్‌కు పరిమితమైనా రాత మాత్రం మారలేదు. మరోసారి కొత్త మార్పులు, కొత్త బృందంతో దండయాత్రకు సిద్ధమవుతున్న ఢిల్లీ, పంజాబ్ టీమ్‌లకు ఇప్పుడైనా టైటిల్ రూపంలో అదృష్టం తలుపు తడుతుందా చూడాలి. –సాక్షి క్రీడా విభాగం అక్షర్ అద్భుతం చేసేనా? 2020 సీజన్లో ఫైనల్ చేరిన ఢిల్లీ క్యాపిటల్స్ రన్నరప్‌గా నిలిచి సంతృప్తి చెందింది. ఐపీఎల్లో ఢిల్లీకిదే అత్యుత్తమ ప్రదర్శన. ఆ తర్వాత నాలుగు సీజన్లలో ఢిల్లీ వరుసగా 3, 5, 9, 6 స్థానాల్లో నిలిచింది. గత ఏడాది తొలి ఐదు మ్యాచ్‌లలో ఓడిన తర్వాత కోలుకోవడం కష్టమైంది. ఈసారి జట్టు ఆటగాళ్లతో పాటు సహాయక సిబ్బందిలో కూడా భారీ మార్పు జరిగింది. వేలానికి ముందు అట్టి పెట్టుకున్న అక్షర్ పటేల్, కుల్దీప్, స్టబ్స్, పొరేల్లతో పాటు వేలంలో జేక్ ఫ్రేజర్‌ను మళ్లీ తెచ్చుకుంది. ఇప్పుడు అందరి దృష్టి కేఎల్ రాహుల్‌పై ఉంది. లక్నో యాజమాన్యంతో విభేదాల తర్వాత ఆ జట్టుకు దూరమైన రాహుల్ బ్యాటింగ్‌పై దృష్టి పెట్టేందుకే కెపె్టన్సీని తిరస్కరించినట్లు సమాచారం. ఇటీవలి ఫామ్ చూస్తే రాహుల్ చక్కటి ప్రదర్శనపై అంచనాలు పెరుగుతున్నాయి. ఓపెనింగ్‌లో ఫ్రేజర్, డుప్లెసిస్‌తో పాటు మిడిలార్డర్లో స్టబ్స్ దూకుడు కీలకం కానుంది. గత ఏడాది పంజాబ్ తరఫున చెలరేగిన అశుతోష్ శర్మతో పాటు సమీర్ రిజ్వీ ఫినిషర్లుగా సిద్ధమయ్యారు. ఇక ఆల్‌రౌండర్‌గా, కెపె్టన్‌గా అక్షర్ పటేల్ తన ముద్రను చూపించాల్సి ఉంది. ముఖ్యంగా టి20 వరల్డ్ కప్, చాంపియన్స్ ట్రోఫీలలో సత్తా చాటి ఒక్కసారిగా స్థాయిని పెంచుకున్న అతను ఢిల్లీని సమర్థంగా నడిపిస్తే చరిత్రలో నిలిచిపోగలడు. స్టార్క్‌లాంటి దిగ్గజం జట్టుతో ఉండటం ఎప్పుడైనా బలమే. ముకేశ్, నటరాజన్, కుల్దీప్లు అతనికి అండగా నిలవాల్సి ఉంది. మోహిత్ రూపంలో మరో చక్కటి బౌలింగ్ ప్రత్యామ్నాయం అందుబాటులో ఉంది. హెడ్ కోచ్‌గా హేమంగ్ బదాని, డైరెక్టర్ హోదాలో వచ్చిన వేణుగోపాలరావు ఎలాంటి మార్పు తీసుకొస్తారనేది ఆసక్తికరం. మాజీ ఇంగ్లండ్ స్టార్ కెవిన్ పీటర్సన్ మెంటార్‌గా తన ప్రభావం చూపించవచ్చు. స్టార్క్ మినహా మిగతా భారత పేసర్లకు బౌలింగ్ కోచ్ మునాఫ్ పటేల్ ఎలా మార్గనిర్దేశం చేస్తాడో చూడాలి. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు: అక్షర్ పటేల్ (కెప్టెన్), కేఎల్ రాహుల్, కుల్దీప్ యాదవ్, ట్రిస్టన్ స్టబ్స్, జేక్ ఫ్రేజర్, మిచెల్ స్టార్క్, ఫాఫ్ డుప్లెసిస్, ముకేశ్ కుమార్, కరుణ్ నాయర్, డొనొవాన్ ఫెరీరా, అభిషేక్ పొరేల్, సమీర్ రిజ్వీ, అశుతోష్ శర్మ, దర్శన్ నల్కండే, విప్రాజ్ నిగమ్, అజయ్ మండల్, మన్వంత్ కుమార్, త్రిపురాన విజయ్, మాధవ్ తివారి, టి.నటరాజన్, మోహిత్ శర్మ, దుష్మంత్ చమీరా. శ్రేయస్ నాయకత్వంలోనైనా... 2014లో అనూహ్య ప్రదర్శనతో దూసుకుపోయి ఫైనల్ వరకు వెళ్లగలగడం పంజాబ్ కింగ్స్ జట్టు సాధించిన ఘనత. కానీ ఆ తర్వాత లీగ్‌లో మరే ఇతర జట్టుకు లేనంత చెత్త రికార్డును ఈ టీమ్ నమోదు చేసింది. తర్వాతి పదేళ్లలో ఒక్కసారి కూడా కనీసం ‘ప్లే ఆఫ్స్’కు అర్హత సాధించలేకపోయిన జట్టు వరుసగా 8, 8, 5, 7, 6, 6, 6, 6, 8, 9 స్థానాలకు పరిమితమైంది! గత సీజన్లో 14 మ్యాచ్‌లలో 5 మాత్రమే గెలిచిన టీమ్ ఈసారి ఇద్దరు ఆటగాళ్లను మాత్రమే అట్టి పెట్టుకొని మళ్లీ కొత్తగా మొదలు పెట్టేందుకు సిద్ధమైంది. ప్రభ్‌సిమ్రన్ సింగ్, శశాంక్ సింగ్‌లను కొనసాగించి వారిపై అంచనాలు పెంచుకున్న టీమ్ వేలంలో యువ పేస్ అర్‡్షదీప్‌ను తిరిగి తెచ్చుకోవడం సరైన నిర్ణయం. ఏడాది కాలంగా ఫామ్‌లో ఉన్న అతను టీమ్ విజయాలను శాసించగలడు. ఢిల్లీ కోచ్‌గా ఫలితాలు సాధించలేకపోయిన రికీ పాంటింగ్, 2024 ఐపీఎల్ విన్నింగ్ కెపె్టన్ శ్రేయస్ అయ్యర్ కాంబినేషన్లో జట్టు సంచలనాలు ఆశిస్తోంది. ట్రోఫీ గురించి ఇప్పుడే మాట్లాడకపోయినా కనీసం గతంలోకంటే మెరుగైన విజయాలు అందుకొని ముందుగా ప్లే ఆఫ్స్ వరకు వెళ్లాలని జట్టు భావిస్తోంది. జట్టుపై ఆ్రస్టేలియన్ల ప్రభావం చాలా ఉంది. గతంలో ఐదు సీజన్లు ఇదే టీమ్‌కు ఆడిన మ్యాక్స్‌వెల్ మళ్లీ ఇక్కడికే వచ్చాడు. కెరీర్ చివర్లో ఉన్న అతను ఎంతగా ప్రభావం చూపిస్తాడనేది చర్చనీయాంశం. మరో నలుగురు ఆసీస్ ఆటగాళ్లు స్టొయినిస్, ఇన్‌గ్లిస్, బార్ట్లెట్, హార్డీ టీమ్‌తో ఉన్నారు. అయ్యర్ కెప్టెన్సీతో పాటు దూకుడైన బ్యాటింగ్ చూపించాల్సి ఉంటుంది. అంతర్జాతీయ క్రికెట్లో చక్కటి ఫామ్‌లో ఉన్న అజ్మతుల్లా, మార్కో యాన్సెన్ కచ్చితంగా ప్రభావం చూపించగలరు. ఐపీఎల్ స్టార్ స్పిన్నర్ చహల్ ఉండటం జట్టుకు అదనపు బలం. హాడిన్, హోప్స్, సునీల్ జోషిలతో కూడిన సహాయక సిబ్బంది కూడా కీలకం కానున్నారు. పంజాబ్ కింగ్స్ జట్టు: శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), అర్ష్ దీప్ సింగ్, యుజువేంద్ర చహల్, ప్రభ్‌సిమ్రన్ సింగ్, శశాంక్ సింగ్, స్టొయినిస్, మ్యాక్స్‌వెల్, ఇన్‌గ్లిస్, హర్‌ప్రీత్ బ్రార్, మార్కో యాన్సెన్, అజ్మతుల్లా ఒమర్జాయ్, ఫెర్గూసన్, నేహల్ వధేరా, విష్ణు వినోద్, హర్నూర్ పన్ను, పైలా అవినాశ్, ప్రియాన్‡్ష ఆర్య, ఆరోన్ హార్డీ, ముషీర్ ఖాన్, సూర్యాంశ్ షెడ్గే, వైశాక్ విజయ్‌కుమార్, యశ్ ఠాకూర్, కుల్దీప్ సేన్, ప్రవీణ్ దూబే, జేవియర్ బార్ట్లెట్. -
KKR Vs RCB: ఐపీఎల్ తొలి మ్యాచ్.. ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్!?
ఐపీఎల్-2025 సీజన్‌కు రంగం సిద్దమైంది. మార్చి 22న ఈడెన్‌గార్డెన్స్ వేదికగా జరగనున్న తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ కోల్‌కతా నైట్‌రైడర్స్, ఆర్సీబీ జట్లు అమీతుమీ తెల్చుకోనున్నాయి. ఈ మ్యాచ్‌కు ముందు అభిమానులకు ఓ బ్యాడ్ న్యూస్. ఆర్సీబీ-కేకేఆర్ మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించే ఛాన్స్ ఉంది.ప్రస్తుతం కోల్‌కతా నగరం "ఆరెంజ్ అలర్ట్"లో ఉంది. ఈ క్యాష్‌రిచ్ లీగ్ ప్రారంభం రోజున, అంటే మార్చి 22 (శనివారం) గరిష్టంగా 80 శాతం వర్షపాతం నమోదయ్యే అవకాశముందని అక్కడి వాతవారణ శాఖ పేర్కొంది. శనివారం ఉదయం నుంచి పిచ్‌ను కవర్లతో కప్పి ఉంచే ఛాన్స్ ఉంది.ఈ మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభం కానుంది. అంతకంటే ముందు అక్కడ వర్షం కురిసే సూచనలు కన్పిస్తున్నాయి. అదేవిధంగా ఈడెన్‌గార్డెన్స్‌లో ఐపీఎల్-18వ సీజన్ ప్రారంభోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని బీసీసీఐ ప్లాన్ చేస్తోంది. ఈ ఓపెనింగ్ సెర్మనీకి కూడా ఆటంకం కలిగే అవకాశముంది.కేకేఆర్ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ రోజున వర్ష శాతం అంచనా(అక్యూ వెదర్ ప్రకారం)7-8PM- 10%8-9 PM- 50%9-10PM-70%10-11 PM- 70%కేకేఆర్: అజింక్యా రహానే (కెప్టెన్), రింకు సింగ్, క్వింటన్ డి కాక్, రహ్మానుల్లా గుర్బాజ్, అంగ్క్రిష్ రఘువంశీ, వెంకటేష్ అయ్యర్, రమణదీప్ సింగ్, ఆండ్రీ రస్సెల్, అన్రిచ్ నార్ట్జే, హర్షిత్ రాణా, సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తి, మయాంక్ మార్కండే, రోవ్‌మన్ పావెల్, మనీష్ పాండే, స్పెన్సర్ జాన్సన్, లవ్‌నీత్ సిసోడియా, అనుకుల్ రాయ్, మొయిన్ అలీ, చేతన్ సకారియాఆర్సీబీ: రజత్ పాటిదార్ (కెప్టెన్), విరాట్ కోహ్లి, యశ్ దయాల్, జోష్ హేజిల్‌వుడ్, ఫిల్ సాల్ట్, జితేష్ శర్మ, లియామ్ లివింగ్‌స్టోన్, రసిఖ్ దార్, సుయాష్ శర్మ, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, స్వప్నిల్ సింగ్, టిమ్ డేవిడ్, రొమారియో షెపర్డ్, నువాన్ తుషార, మనోజ్ భాండాగే, జాకబ్ బెతేల్, దేవదత్ పడిక్కల్, స్వస్తిక్ చికార, లుంగి ఎన్గిడి, అభినందన్ సింగ్, మోహిత్ రాథీచదవండి: IPL 2025: బీసీసీఐ కీలక నిర్ణయం.. బౌలర్లకు పండగే? -
ట్రోఫీ గెలవడమే మా లక్ష్యం.. అతడు ఎంతో సపోర్ట్‌గా ఉంటాడు: అయ్యర్
ఐపీఎల్-2025 సీజన్లో పంజాబ్ కింగ్స్‌కు సారథ్యం వహించేందుకు టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ సిద్దమయ్యాడు. పంజాబ్ హెడ్ కోచ్ రికీ పాంటింగ్‌తో మరోసారి కలిసి పనిచేసేందుకు అయ్యర్ ఆతృతగా ఎదురు చూస్తున్నాడు. ఇప్పటికే జట్టుతో కలిసిన శ్రేయస్.. ధర్మశాలలో ఏర్పాటు చేసిన ప్రాక్టీస్ క్యాంపులో తీవ్రంగా శ్రమిస్తున్నాడు.అదే విధంగా ఈ ఏడాది సీజన్లో కెప్టెన్‌గా అనుసరించాల్సిన వ్యూహాలపై శ్రేయస్ ప్రత్యేకంగా దృష్టి సారించాడు. తాజాగా ఈ మెగా ఈవెంట్ ప్రారంభానికి ముందు విలేకరుల సమావేశంలో మాట్లాడిన అయ్యర్.. హెడ్ కోచ్ పాంటింగ్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు. పాంటింగ్ తనను అద్బుతమైన ఆటగాడిగా భావిస్తున్నాడని అయ్యర్ చెప్పుకొచ్చాడు."రికీ(పాంటింగ్) అందరికి చాలా సపోర్ట్‌గా ఉంటాడు. అతడితో నాకు మంచి అనుబంధం ఉంది. తొలిసారి అతడితో కలిసి పనిచేసినప్పుడే, నేను గొప్ప ఆటగాడిగా ఎదుగుతానని నాతో అన్నాడు. అంతేకాకుండా టీ20 ఫార్మాట్లో నేను బాగా రాణించగలన్న నమ్మకం కలిగించాడు. పాంటింగ్ ప్రతీ ప్లేయర్‌కు ఇచ్చే కాన్ఫిడెన్స్ వేరే స్థాయిలో ఉంటుంది. ట్రోఫీని గెలవడమే మా లక్ష్యం. ఈ ఏడాది సీజన్లో మెరుగ్గా రాణించేందకు ప్రయత్నిస్తాము. ఈ సీజన్లో ప్రతీ మ్యాచ్‌ను కీలకంగా భావించి ముందుకు వెళ్తాము. నెట్స్‌లో కూడా తీవ్రంగా శ్రమిస్తున్నాము" అని అయ్యర్ పేర్కొన్నాడు. అదేవిధంగా పాంటింగ్ కూడా అయ్యర్‌ను పొగడ్తలతో ముంచెత్తాడు.శ్రేయస్ గొప్ప వ్యక్తిత్వం ఉన్నవాడు"శ్రేయస్ మంచి కెప్టెనే కాదు.. గొప్ప వ్యక్తిత్వం ఉన్నవాడు కూడా. అతడు ఐపీఎల్ విన్నింగ్ కెప్టెన్ అన్న విషయం మనకు తెలుసు. అతడితో ఇంకా మేము ఎక్కువగా చర్చించలేదు. ఎందుకంటే శ్రేయస్ మూడు రోజుల కిందటే క్యాంపులో చేరాడు.కెప్టెన్‌గా తన పనిని అయ్యర్ ప్రారంభించాడు. మా తొలి మ్యాచ్‌కు అన్ని విధాల సిద్దంగా ఉంటామని" పాంటింగ్ వెల్లడించాడు. కాగా వీరిద్దరూ గతంలో ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ కలిసి పనిచేశారు. కాగా ఐపీఎల్-2025 మెగా వేలంలో అయ్యర్‌ను రూ. 26.75 కోట్లకు పంజాబ్ కింగ్స్ కొనుగోలు చేసింది. కాగా ఐపీఎల్-18 సీజన్ మార్చి 22 నుంచి ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో ఈడెన్‌గార్డెన్స్ వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్లు తలపడనున్నాయి.చదవండి: ధనశ్రీకి చహల్ కౌంటర్?.. ఆ మాటలకు అర్థం ఏమిటి? మధ్యలో ఆమె! -
కొత్త వ్యూహంతో.. అక్షర్‌పై ఆశలతో ఢిల్లీ క్యాపిటల్స్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో ఒక్కసారి కూడా టైటిల్ సాధించలేకపోయిన అతి కొద్ది జట్లలో ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) ఒకటి. గత సీజన్లో వరుసగా పరాజయ పరంపరతో ప్రారంభించి మొదటి అయిదు మ్యాచ్ లలో నాలుగింటిలో ఓటమి చవిచూసి.. చివరికి ఆరో స్థానంతో ముగించింది ఢిల్లీ. అయితే, ఈసారి జట్టు స్వరూపాన్నే మార్చేసింది. గత సీజన్ కెప్టెన్ భారత్ జట్టు వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ (Rishabh Pant)ను రికార్డు స్థాయిలో రూ 27 కోట్లకు లక్నో సూపర్ జెయింట్స్ కనుగోలు చేసిన తర్వాత కొత్త వ్యూహానికి తెరతీసింది.అనుభవజ్ఞుడైన భారత్ వికెట్ కీపర్ బ్యాటర్ కెఎల్ రాహుల్ (KL Rahul), దక్షిణాఫ్రికా వెటరన్ ఆటగాడు ఫాఫ్ డు ప్లెసిస్ వంటి సీనియర్లను కొనుగోలు చేసింది. కానీ గతంలో పంజాబ్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్‌కి కెప్టెన్ గా వ్యవహరించిన కెఎల్ రాహుల్ ఢిల్లీ పగ్గాలు చేపట్టేందుకు అంత ఆసక్తి చూపించకపోవడంతో ఇటీవల ఛాంపియన్స్ ట్రోఫీ లో రాణించిన మరో యువ ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ కి నాయకత్వ బాధ్యతలు అప్పగించారు.ఢిల్లీ క్యాపిటల్స్ మేనేజ్‌మెంట్‌లోనూ మార్పులుఢిల్లీ బ్యాక్‌రూమ్ సిబ్బందిలో కూడా మార్పులు చేశారు. ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ స్థానంలో భారత్ మాజీ ఆల్ రౌండర్ హేమాంగ్ బదానీని ప్రధాన కోచ్‌గా నియమించారు. భారత మాజీ బ్యాటర్ విశాఖపట్నంకి చెందిన వై వేణుగోపాలరావు కొత్త క్రికెట్ డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టాడు. ఇంగ్లండ్ మాజీ ఆటగాడు కెవిన్ పీటర్సన్‌ను మెంటార్‌గా, మాథ్యూ మోట్‌ను అసిస్టెంట్ కోచ్‌గా, మునాఫ్ పటేల్‌ను బౌలింగ్ కోచ్‌గా నియమించారు.సీనియర్లకు మళ్ళీ జట్టులో చోటుఅయితే ఢిల్లీ జట్టులో చాలా మంది గత సీజన్ ఆటగాళ్లు మళ్లీ జట్టు లో కొనసాగుతున్నారు. గత సీజన్ లో ప్రాతినిధ్యం వహించిన అక్షర్ పటేల్ , కుల్దీప్ యాదవ్, ట్రిస్టన్ స్టబ్స్, అభిషేక్ పోరెల్లను రెటైన్ చేసారు. వేలంలో ఆస్ట్రేలియా బ్యాటర్ జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్‌ను తిరిగి కొనుగోలు చేశారు. పేసర్ ముఖేష్ కుమార్ కూడా గత సీజన్ లో ఢిల్లీ తరపున ఆడాడు. దేశవాళీ క్రికెట్ లో అద్భుతంగా రాణించిన కరుణ్ నాయర్ కూడా గతంలో ఈ ఫ్రాంచైజీ తరపున ఆడారు.గత సీజన్లో తమ ఫాస్ట్ బౌలింగ్ యూనిట్‌తో ఢిల్లీ సమస్యలను ఎదుర్కొంది. ఈ కారణంగా బౌలింగ్ విభాగాన్ని బలోపేతం చేశారు. ఆస్ట్రేలియా కి చెందిన సీనియర్ పేస్ బౌలర్ మిచెల్ స్టార్క్ (రూ 11.75 కోట్లు), టి నటరాజన్ (రూ 10.75 కోట్లు), ముఖేష్ కుమార్ (రూ 8 కోట్లు) , మోహిత్ శర్మ (రూ 2.20 కోట్లు)లను తీసుకువచ్చారు. ఇక స్పిన్ విభాగం లో కుల్దీప్ మరియు అక్షర్ పటేల్ ఉన్నారు.ఇంగ్లండ్ ఆటగాడు హ్యారీ బ్రూక్ జట్టు నుంచి తప్పుకోవడం ఢిల్లీ క్యాపిటల్స్ ని కొంత దెబ్బతీసింది. అయితే ఢిల్లీ కొత్త జట్టు కొత్త కెప్టెన్, కొత్త వ్యూహం తో ఈసారి రంగ ప్రవేశం చేస్తోంది. అక్షర్ పటేల్ నేతృత్వంలోని ఢిల్లీ క్యాపిటల్స్ మార్చి 24 (సోమవారం)న విశాఖపట్నంలోని డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఏసీఏ-విడిసిఏ క్రికెట్ స్టేడియంలో రిషబ్ పంత్ నాయకత్వంలోని లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగే మ్యాచ్ తో తమ ఐపీఎల్ 2025 సీజన్‌ని ప్రారంభిస్తుంది. విశాఖపట్నం ని తన రెండో హోమ్ గ్రౌండ్ గా ఎంచుకున్న ఢిల్లీ తన మొదటి రెండు హోమ్ మ్యాచ్‌లను ఇక్కడే ఆడుతుంది.ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు లో ప్రధాన ఆటగాళ్ళుజేక్ ఫ్రేజర్-మెక్గుర్క్ఆస్ట్రేలియా కి చెందిన జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్ 2023 నుండి టీ20లలో పవర్‌ప్లేలో అత్యధిక స్ట్రైక్ రేట్ (168.04) ఉన్న బ్యాటర్లలో ట్రావిస్ హెడ్ (184.8), అభిషేక్ శర్మ (181.47) ల తర్వాత మూడో స్థానం లో ఉన్నాడు. 21 ఏళ్ల ఈ యువ బ్యాటర్ 2024లో ఢిల్లీ క్యాపిటల్స్ తరపున 234.04 స్ట్రైక్ రేట్‌తో 330 పరుగులు సాధించాడు. ఈ కారణంగా ఢిల్లీ క్యాపిటల్స్ మరోసారి అతడిని కొనుగోలు చేసింది.కెఎల్ రాహుల్మాజీ లక్నౌ కెప్టెన్ కెఎల్ రాహుల్ ఇటీవల ఛాంపియన్ ట్రోఫీ లో తన అసాధారణ ప్రతిభతో భారత్ జట్టుకి విజయాలు చేకూర్చి ప్రశంసలు అందుకున్నాడు. ఈ సీజన్లో రాహుల్ ఢిల్లీ క్యాపిటల్స్ తరపున ఓపెనింగ్ చేయనున్నాడు. ఐపీఎల్ లో బాగా నిలకడ రాణిస్తున్న బ్యాటర్లలో ఒకడిగా పేరు పొందిన రాహుల్ 132 మ్యాచ్‌లు ఆడి 135 స్ట్రైక్ రేట్‌తో 37 అర్ధ సెంచరీలు, నాలుగు సెంచరీలతో 4,683 పరుగులు సాధించాడు.ఫాఫ్ డు ప్లెసిస్అపార అనుభవం ఉన్న ఈ దక్షిణాఫ్రికా వెటరన్ ఆటగాడు ఈ సీజన్ లో ఓపెనర్ గాను, ఢిల్లీ క్యాపిటల్స్‌కు వైస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు. ఫాఫ్ 145 ఐపీఎల్ మ్యాచ్‌లలో ఆడాడు. 140 స్ట్రైక్ రేట్‌తో 37 అర్ధ సెంచరీ లతో 4571 పరుగులు చేశాడు.కరుణ్ నాయర్దేశవాళీ క్రికెట్ లో సెంచరీలతో రికార్డుల మోత మోగించిన కరుణ్ నాయర్ మళ్ళీ ఐపీఎల్ లో ఢిల్లీ తరపున రంగ ప్రవేశం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. విదర్భ రంజీ ట్రోఫీ విజయంలో కరుణ్ నాయర్ కీలక పాత్ర పోషించాడు. ఫైనల్స్‌లో 120 , 80 పరుగులు చేశాడు. విజయ్ హజారే ట్రోఫీలో కరుణ్ నాయర్ ఎనిమిది మ్యాచ్‌ల్లో 700 కంటే ఎక్కువ పరుగులు సాధించాడు. 76 ఐపీఎల్ మ్యాచ్‌లతో, దాదాపు 130 స్ట్రైక్ రేట్‌తో 10 అర్ధ సెంచరీలతో 1,496 పరుగులు చేశాడు. మిడిల్ ఆర్డర్లో అతని స్థిరత్వం ఢిల్లీ కి కీలకం.అక్షర్ పటేల్కొత్త కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టిన అక్షర్ పటేల్ తన జట్టును ఫైనల్స్‌కు తీసుకెళ్లాలని పట్టుదలతో ఉన్నాడు. ఇటీవల ఛాంపియన్స్ ట్రోఫీ లో భారత్ తరపున బ్యాటింగ్ లోనూ, బౌలింగ్ లోనూ రాణించిన అక్షర్ పటేల్ కి కెప్టెన్ గా పెద్ద అనుభవం లేదు. అయితే తన నైపుణ్యంతో రాణించగల సామర్థ్యముంది. అక్షర్ ఇంతవరకు 150 ఐపీఎల్ మ్యాచ్‌లలో, 130 స్ట్రైక్ రేట్‌తో మూడు అర్ధ సెంచరీలతో 1,653 పరుగులు చేశాడు. 8 కంటే తక్కువ ఎకానమీతో 123 వికెట్లతో సాధించిన అక్షర్ జట్టుకు సరైన సమతుల్యతను ఇస్తాడనడంలో సందేహం లేదు.ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకెఎల్ రాహుల్, జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్, కరుణ్ నాయర్, అభిషేక్ పోరెల్, ట్రిస్టియన్ స్టబ్స్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, టి నటరాజన్, మిచెల్ స్టార్క్, సమీర్ రిజ్వీ, అశుతోష్ శర్మ, మోహిత్ శర్మ, ఫాఫ్ డుప్లెసిస్, ముఖేష్ కుమార్, దర్శన్ నల్కాండే, విప్ రాజ్ నిగమ్, దుష్మంత చమీరా, డోనోవన్ ఫెరీరా, అజయ్ మండల్, మన్వంత్ కుమార్, త్రిపురాన విజయ్, మాధవ్ తివారీ. -
ఐపీఎల్లో కొత్త రూల్.. ఇక టాస్‌తో 'డోంట్ వర్రీ'
ఐపీఎల్-2025 సీజన్‌కు మరో రెండు రోజుల్లో తెరలేవనుంది. మార్చి 22 నుంచి ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఈ మెగా ఈవెంట్ షూరూ కానుంది. ఈ టోర్నీ ఆరంభానికి ముందు బీసీసీఐ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. ఐపీఎల్లో సాయంత్రం వేళ జరిగే మ్యాచ్‌ల్లో రెండో ఇన్నింగ్స్‌లో రెండు బంతులను వినియోగించుకునే అవకాశాన్ని బీసీసీఐ కల్పించింది. గురువారం(మార్చి 20) ముంబైలో జరిగిన కెప్టెన్ల సమావేశంలో బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. కాగా ఐపీఎల్లో సాయంత్రం జరిగే మ్యాచ్‌లలో మంచు ప్రభావం ఎక్కువగా ఉంటుంది. డ్యూ ఫాక్టర్ కారణంగా రెండో ఇన్నింగ్స్‌లో బంతి తడిగా మారి బౌలర్లకు గ్రిప్ దొరికేది కాదు. దీంతో బౌలర్లు సరైన లైన్ అండ్ లెంగ్త్‌లో బంతులు వేయలేక పరుగులు సమర్పించుకునేవారు. చాలా మ్యాచ్‌ల్లో మంచునే ఎక్స్ ఫ్యాక్టర్‌గా మారేది. అందుకే ప్రతీ జట్టు టాస్ గెలిస్తే తొలుత బౌలింగ్ ఎంచుకునేందుక మొగ్గు చూపేవారు. ఈ క్రమంలోనే డ్యూ ఫాక్టర్‌ను తగ్గించడానికి రెండు కొత్త బంతుల రూల్‌ను బీసీసీఐ తీసుకొచ్చింది.ఈ రూల్ ప్రకారం.. రెండో కొత్త బంతిని సెకెండ్ ఇన్నింగ్స్‌లో మాత్రం ఉపయోగించాలి. అది కూడా 11వ ఓవర్ తర్వాత మాత్రమే జట్ల కెప్టెన్లు కొత్త బంతిని తీసుకునే అవకాశముంటుంది. అయితే బంతిని మార్చాలా వద్దా అనే దానిపై తుది నిర్ణయం అంపైర్‌దే.మంచు ఎక్కువగా ఉందా లేదా అని పరిశీలించి అంపైర్ తుది నిర్ణయం తీసుకుంటారు. మధ్యాహ్నం జరిగే మ్యాచ్‌లకు ఈ రూల్ వర్తించదు. ఈ నిర్ణయంతో బౌలర్లకు ప్రయోజనం చేకూరనుంది.అదేవిధంగా ఇంపాక్ట్ రూల్‌ను కొనసాగించేందుకు బీసీసీఐ మొగ్గు చూపింది. ఐపీఎల్-2023 సీజన్లో ప్రవేశిపెట్టిన ఈ రూల్ పట్ల మొత్తం పది మంది కెప్టెన్లు కూడా సముఖుత చూపినట్లు తెలుస్తోంది. మరోవైపు సలైవా బ్యాన్‌ను కూడా బీసీసీఐ ఎత్తివేసింది.చదవండి: BCCI: ఒక్కో ఆటగాడికి రూ. 3 కోట్లు.. గంభీర్‌కు ఎంతో వెల్లడించిన బీసీసీఐ -
ధనశ్రీకి చహల్ కౌంటర్?.. ఆ మాటలకు అర్థం ఏమిటి? మధ్యలో ఆమె!
టీమిండియా స్టార్ క్రికెటర్ యజువేంద్ర చహల్ (Yuzuvendra Chahal)- యూట్యూబర్ ధనశ్రీ వర్మ (Dhanashree Verma) తమ వైవాహిక బంధానికి స్వస్తి పలికారు. గత కొంతకాలంగా వేరుగా ఉంటున్న ఈ జంటకు విడాకులు మంజూరు అయ్యాయి. ముంబైలోని బాంద్రా ఫ్యామిలీ కోర్టు గురువారం (మార్చి 20) ఈ మేరకు తుదితీర్పును వెల్లడించింది.ఈ నేపథ్యంలో చహల్ - ధనశ్రీ వేర్వేరుగా కోర్టుకు హాజరయ్యారు. విడాకుల అనంతరం వీరిద్దరు బయటకు వస్తున్న ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో చహల్ ధరించిన షర్టుపై ఉన్న సామెత నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది.ధనశ్రీకి చహల్ కౌంటర్?'Be your own sugar daddy' అని రాసి ఉన్న నలుపు రంగు కస్టమైజ్డ్ షర్టును చహల్ వేసుకున్నాడు. ఈ సామెతకు.. ‘ఆర్థికంగా స్వతంత్రంగా ఉండండి.. మీ బాగోగులు మీరే చూసుకోండి.. ఆర్థిక సాయం, బహుమతుల కోసం ఇతరులపై ఆధారపడకండి’’ అనే అర్థం ఉంది. ఈ నేపథ్యంలో చహల్ తన మాజీ భార్య ధనశ్రీకి కౌంటర్ ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఈ షర్టు ధరించాడని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.కాగా లాక్డౌన్ సమయంలో ధనశ్రీ వద్ద డాన్స్ పాఠాలు నేర్చుకున్న చహల్ ఆమెతో ప్రేమలో పడ్డాడు. ఈ క్రమంలో 2020, డిసెంబరులో ఇరు కుటుంబాల అంగీకారంతో అంగరంగ వైభవంగా వీరి పెళ్లి జరిగింది. ఇద్దరూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండేవారు. ధనశ్రీ కొరియోగ్రాఫర్‌గా రాణిస్తూ ఇన్ఫ్లూయెన్సర్గా పేరు తెచ్చుకుంటోంది.ఈ క్రమంలో వీరిద్దరు రీల్స్‌లో కనిపిస్తూ అభిమానులకు కనువిందు చేయడంతో పాటు.. టీమిండియా, ఐపీఎల్ మ్యాచ్‌ల కోసం చహల్ వెంట వెళ్లిన ఫొటోలు కూడా పంచుకునేది. అయితే, కొన్నాళ్ల క్రితం తన ఇన్‌స్టా అకౌంట్ నుంచి ధనశ్రీ ‘చహల్’ పేరును తీసివేసింది. దీంతో విడాకుల వార్తలు తెరమీదకు వచ్చాయి.ఆర్థిక స్వాతంత్యం గురించి ప్రస్తావిస్తూఆ తర్వాత ఇద్దరూ పెళ్లి ఫొటోలు సోషల్ మీడియా అకౌంట్ల నుంచి తొలగించడంతో వీటికి మరింత బలం చేకూరింది. ఈ నేపథ్యంలో తాజాగా బాంద్రా కోర్టు వీరికి విడాకులు మంజూరు చేయడంతో.. వదంతులు నిజమేనని తేలాయి. ఇక విడాకుల నేపథ్యంలో ధనశ్రీకి చహల్ రూ. 4.75 కోట్ల భరణం చెల్లించేందుకు అంగీకరించాడు. ఇందులో ఇప్పటికే దాదాపు రెండున్నర కోట్లకు పైగా ముట్టజెప్పినట్లు సమాచారం.ఈ నేపథ్యంలో చహల్.. ఆర్థిక స్వాతంత్యం గురించి ప్రస్తావిస్తూ ధనశ్రీకి హితవు పలికేలా ఈ సామెత ఉన్న షర్టును ధరించాడని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. కాగా ధనశ్రీ గతంలో టీమిండియా క్రికెటర్ శ్రేయస్ అయ్యర్‌తో కలిసి డాన్స్ చేసిన వీడియోలు వైరల్ కాగా.. అతడి పేరుతో ఆమెను ముడిపెట్టారు. నిజానికి శ్రేయస్ సోదరి శ్రేష్ట కూడా కొరియోగ్రాఫర్ కావడం.. ధనశ్రీకి ఆమె స్నేహితురాలు కావడం వల్ల శ్రేయస్‌తో ఆమె డాన్స్ చేసి ఉండవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.మధ్యలో ఆమె!అయితే, చహల్ ప్రస్తుతం ఆర్జే మహవశ్‌తో డేటింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆమెతో కలిసి డిన్నర్ పార్టీలకు వెళ్లడం, ఐసీసీ చాంపియన్స్‌ట్రోఫీ-2025 సమయంలోనూ మహవశ్‌తో జంటగా కనిపించడం ‘ప్రేమ’ వార్తలకు ఊతమిచ్చాయి. ఇక చహల్- ధనశ్రీ విడాకుల వేళ మహవశ్ కూడా.. ‘‘అబద్ధాలు, అత్యాశ, అబద్ధపు ప్రచారాలు.. దేవుడి దయవల్ల వీటన్నింటికీ అతీతంగా నిలబడగలుగుతున్నాం’’ అని ఇన్‌స్టాలో పోస్ట్ పెట్టడం గమనార్హం. ఇందుకు నెటిజన్ల నుంచి భిన్న స్పందన వస్తోంది. చహల్- ధనశ్రీ మధ్య విభేదాలకు కారణం ఏమిటన్నది ఇప్పుడు అర్థమైందంటూ కొంతమంది కామెంట్లు చేస్తుండగా.. ‘కొత్త వదినతోనైనా జాగ్రత్త’ అంటూ మరికొందరు ఉచిత సలహాలు ఇస్తున్నారు.చదవండి: IPL 2025: ఈసారి విజేతగా ఆ జట్టే.. సన్‌రైజర్స్ ప్లే ఆఫ్స్ చేరడం కష్టమే: ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) View this post on Instagram A post shared by Mahvash (@rj.mahvash) -
IPL 2025: బీసీసీఐ కీలక నిర్ణయం.. బౌలర్లకు పండగే?
ఐపీఎల్-2025కు ముందు భారత క్రికెట్ బోర్డు (బీసీసీఐ) ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఐపీఎల్ మ్యాచ్‌ల సమయంలో బంతులపై లాలాజలం(సలైవా) వాడకంపై నిషేధాన్ని బీసీసీఐ ఎత్తివేసింది. గురువారం(మార్చి 20) జరిగిన కెప్టెన్ల సమావేశం అనంతరం బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. ముంబైలో జరిగిన ఈమీట్‌లో ఎక్కువ మంది కెప్టెన్లు సలైవా ఉపయోగించాలనే ఆలోచనకు అంగీకరించారు.ఈ ఏడాది సీజన్ నుంచే ఈ రూల్ అమలులోకి రానుంది. కాగా ఇదే విషయంపై బీసీసీఐ పెద్దలు ఇప్పటికే ఐపీఎల్ జట్ల కెప్టెన్లతో అంతర్గతంగా చర్చించారు. తుది నిర్ణయం తీసుకోవలసిన బాధ్యత కెప్టెన్లకే బోర్డు విడిచిపెట్టింది. ఇప్పుడు అందుకు కెప్టెన్లు కూడా అంగీకరించడంతో బీసీసీఐ తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది."ఇది కెప్టెన్లు ఇష్టం. సలైవా వాడకాన్ని వారు కొనసాగించాలనకుంటే, మాకు ఎటువంటి సమస్య లేదు. మేము దానికి అంగీకరిస్తున్నాము. అయితే అంతర్జాతీయ మ్యాచ్‌ల సమయంలో మాత్రం ఐసీసీ రూల్‌కు కట్టుబడి ఉంటాము" అని బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు పేర్కొన్నారు.2020లో బ్యాన్..కోవిడ్-19 మహమ్మారి తర్వాత.. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ లాలాజల వాడకాన్ని నిషేధించింది. దీంతో ఫాస్ట్ బౌలర్లు బంతిని రివర్స్ స్వింగ్‌ను చేయడానికి కాస్త ఇబ్బంది పడ్డారు. బంతిపై సలైవా ఉపయోగించితే అది ఎక్కువగా రివర్స్ స్వింగ్ అవుతుంది.ఐపీఎల్(2020)లో సైతం బీసీసీఐ సైతం లాలాజల వాడకంపై బ్యాన్ విధించింది. అప్పటి నుంచి గతసీజన్ వరకు ఏ ఫాస్ట్ బౌలర్, ఏ ప్లేయర్ కూడా సలైవాను ఉపయోగించలేదు. తాజాగా ఇదే విషయంపై భారత ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీ కూడా స్పందించాడు. లాలాజల వాడకంపై బ్యాన్‌ను ఎత్తివేయాలని ఐసీసీని షమీ అభ్యర్థించాడు"మేము రివర్స్ స్వింగ్ చేయడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నాము. కానీ సలైవాను మాత్రం ఉపయోగించడం లేదు. మ్యాచ్ జరిగే సమయంలో సలైవా వాడకాన్ని అనుమతించమని మేము చాలా సార్లు ఐసీసీకి విజ్ఞప్తి చేశాము. అందుకు అనుమతి ఇస్తే బంతి మరింత ఎక్కువగా రివర్స్ సింగ్ అయ్యే అవకాశముంటుంది" అని ఛాంపియన్స్ ట్రోఫీ సందర్భంగా విలేకరుల సమావేశంలో షమీ పేర్కొన్నాడు.కాగా ఐపీఎల్-2025 సీజన్ మార్చి 22 నుంచి ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడనున్నాయి.చదవండి: BCCI: ఒక్కో ఆటగాడికి రూ. 3 కోట్లు.. గంభీర్‌కు ఎంతో వెల్లడించిన బీసీసీఐ -
BCCI: ఒక్కో ఆటగాడికి రూ. 3 కోట్లు.. గంభీర్‌కు ఎంతంటే?
టీమిండియాకు ప్రకటించిన నగదు బహుమతి పంపిణీ అంశంపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) కార్యదర్శి దేవజిత్ సైకియా స్పందించారు. ఆటగాళ్లకు, కోచ్‌లకు, సహాయక సిబ్బందికి ఇచ్చే మొత్తం ఎంతన్నది తాజాగా వెల్లడించారు. చాంపియన్స్ ట్రోఫీ జట్టులోని ప్రతి ఆటగాడికి రూ. 3 కోట్ల మేర అందజేయనున్నట్లు తెలిపారు.కాగా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 (ICC Champions Trophy)లో టీమిండియా విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. గ్రూప్ దశలో మూడింటికి మూడు గెలిచిన రోహిత్ సేన.. సెమీస్‌లో ఆస్ట్రేలియాపై, ఫైనల్లో న్యూజిలాండ్‌పై విజయం సాధించి టైటిల్ సొంతం చేసుకుంది. ఐదు మ్యాచ్‌లలో అజేయంగా నిలిచి తొమ్మిది నెలల వ్యవధిలోనే మరో ఐసీసీ ట్రోఫీని సాధించింది.ఈ నేపథ్యంలో బీసీసీఐ భారత జట్టుకు భారీ క్యాష్ రివార్డు (BCCI Cash Reward) ప్రకటించింది. రూ. 58 కోట్ల నజరానా ఇవ్వనున్నట్లు గురువారం వెల్లడించింది. అయితే, ఇందులో ఎవరెవరికి ఎంత మొత్తం ఇస్తారన్న విషయం గురించి కార్యదర్శి దేవజిత్ సైకియా తాజాగా వెల్లడించారు.గౌతం గంభీర్‌కు మూడు కోట్లువార్తా సంస్థ ఏఎన్ఐతో మాట్లాడుతూ.. ‘‘జట్టులోని ప్రతి ఆటగాడికి రూ. 3 కోట్లు.. హెడ్‌కోచ్ గౌతం గంభీర్‌కు మూడు కోట్లు.. మిగిలిన కోచ్‌లలో అసిస్టెంట్లు ర్యాన్ టెన్ డష్కాటే, అభిషేక్ నాయర్, బ్యాటింగ్ కోచ్ సితాన్షు కొటక్, బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్, ఫీల్డింగ్ కోచ్‌కు టి. దిలీప్‌నకు రూ. 50 లక్షలు.. మిగిలిన సహాయక సిబ్బందికి రూ. యాభై లక్షలు.. బీసీసీఐ అధికారులకు రూ. 25 లక్షలు ఇస్తాం’’ అని దేవజిత్ సైకియా తెలిపారు.కాగా సొంతగడ్డపై వన్డే వరల్డ్‌కప్-2023లో ఫైనల్ వరకు అజేయంగా నిలిచిన.. ఆఖరి మెట్టుపై బోల్తా పడింది. ఆస్ట్రేలియాతో చేతిలో ఓటమి పాలై టైటిల్‌ను చేజార్చుకుంది. అయితే, టీ20 ప్రపంచకప్-2024తో ఈ గాయాలను మాన్పివేసింది. అమెరికా- వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్యమిచ్చిన ఈ మెగా టోర్నీలో ఆఖరి వరకు ఓటమన్నదే లేక చాంపియన్‌గా నిలిచింది.దుబాయ్‌లోనే అన్ని మ్యాచ్‌లు తొమ్మిది నెలల అనంతరం తాజాగా చాంపియన్స్ ట్రోఫీలోనూ అదే ఫలితాన్ని పునరావృతం చేసింది. ఈ వన్డే టోర్నమెంట్‌కు పాకిస్తాన్ ఆతిథ్య దేశంగా వ్యవహరించిగా.. భద్రతా కారణాల వల్ల టీమిండియాను అక్కడకు పంపేందుకు బీసీసీఐ నిరాకరించింది. ఈ క్రమంలో ఐసీసీ జోక్యంతో దుబాయ్‌లో భారత జట్టు తమ మ్యాచ్‌లన్నీ ఆడేలా హైబ్రిడ్ మోడల్‌కు పాక్ అంగీకరించింది. ఇక ఒకే వేదిక మీద అన్ని మ్యాచ్‌లు ఆడటం వల్ల టీమిండియాకు మిగతా జట్లతో పోలిస్తే.. అదనపు ప్రయోజనాలు చేకూరాయని ఇంగ్లండ్, సౌతాఫ్రికా మాజీ క్రికెటర్లు విమర్శించారు. అయితే, భారత జట్టు ఎంతో పటిష్టంగా ఉందని.. వేదిక ఏదైనా గెలుపు టీమిండియాదేనంటూ సునిల్ గావస్కర్ వంటి దిగ్గజాలు ఆ విమర్శలను తిప్పికొట్టారు. టీ20 ప్రపంచకప్-2024లో మిగతా జట్ల మాదిరే టీమిండియా కూడా ప్రయాణాలు చేసిందని.. అయినా విజేతగా నిలిచిందంటూ కౌంటర్ ఇచ్చారు.ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025లొ పాల్గొన్న భారత జట్టురోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, మహమ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, వాషింగ్టన్ సుందర్, అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణా, రిషభ్ పంత్.సహాయక సిబ్బంది:హెడ్‌కోచ్ గౌతం గంభీర్, కోచ్‌లు అభిషేక్ నాయర్, ర్యాన్ టెన్ డష్కాటే, టి. దిలీప్, మోర్నీ మోర్కెల్. చదవండి: ‘రేపు మీ బౌలింగ్‌ను చితక్కొడతాను చూడు!.. అన్నంత పని చేశాడు’ -
‘ఈసారి విజేతగా ఆ జట్టే.. సన్‌రైజర్స్ ప్లే ఆఫ్స్ చేరడం కష్టమే’
అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మెగా క్రికెట్ టోర్నీ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) వినోదం పంచేందుకు సిద్ధమైంది. రెండు నెలలకు పైగా నిర్విరామంగా క్రికెట్ ప్రేమికులకు పొట్టి క్రికెట్ మజా అందించనుంది. ఐపీఎల్-2025 మార్చి 22న మొదలై.. మే 25న ఫైనల్‌తో ముగియనుంది.గతేడాది.. కోల్‌కతా నైట్ రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad), రాజస్తాన్ రాయల్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్, గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ పాయింట్ల పట్టికలో వరుసగా ఒకటి నుంచి పది స్థానాల్లో నిలిచిన విషయం తెలిసిందే.పది జట్లలో భారీ మార్పులువీటిలో కోల్‌కతా- హైదరాబాద్ ఫైనల్లో తలపడగా.. రైజర్స్పై నైట్ రైడర్స్ విజయం సాధించి చాంపియన్‌గా నిలిచింది. ఇక ఏడాది ఈ పది జట్లలో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. మెగా వేలం-2025 నేపథ్యంలో ఐదు జట్ల కెప్టెన్లూ మారారు. లక్నోకు రిషభ్ పంత్, పంజాబ్‌కు శ్రేయస్ అయ్యర్, ఢిల్లీకి అక్షర్ పటేల్, బెంగళూరుకు రజత్ పాటిదార్, కోల్‌కతాకు అజింక్య రహానే సారథులుగా నియమితులయ్యారు.అత్యధికంగా పదికి 9 పాయింట్లుఈ పరిణామాల నేపథ్యంలో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ ఐపీఎల్-2025లో పది జట్లకు తనదైన శైలిలో రేటింగ్ ఇచ్చాడు. అదే విధంగా.. ప్లే ఆఫ్స్ చేరే జట్లు, విజేతపై తన అంచనా తెలియజేశాడు. గుజరాత్ టైటాన్స్ జట్టుకు అత్యధికంగా పదికి 9 పాయింట్లు ఇచ్చిన మైకేల్ వాన్.. అతి తక్కువగా ఢిల్లీ క్యాపిటల్స్‌కు 5 పాయింట్లు వేశాడు.అయితే, గతేడాది పేలవ ప్రదర్శన కనబరిచిన పంజాబ్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్‌కు ఏడేసి పాయింట్లు ఇవ్వడం విశేషం. ఇక 2024లో పద్నాలుగింట కేవలం నాలుగే గెలిచి అట్టడుగున నిలిచిన ముంబై ఇండియన్స్‌కు ఏకంగా 7.5 రేటింగ్ ఇవ్వడం గమనార్హం. అన్ని జట్ల కంటే ఈసారి గుజరాత్ టైటాన్స్ గొప్పగా ఉందన్న మైకేల్ వాన్.. ఆ జట్టును తొమ్మిది పాయింట్లతో టాప్‌లో నిలిపాడు.ఇక గతేడాది ఫైనలిస్టు అయిన సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు 6.5 పాయింట్లే ఇచ్చిన వాన్.. ఈసారి ఆ జట్టు ప్లే ఆఫ్స్ చేరే అవకాశాలు చాలా తక్కువని అభిప్రాయపడ్డాడు. నాలుగో స్థానం కోసం ఎస్ఆర్హెచ్.. పంజాబ్, లక్నోలతో పోటీ పడుతుందని అంచనా వేశాడు. ఈసారి ముంబై ఇండియన్స్ చాంపియన్‌గా నిలవడం ఖాయమని వాన్ జోస్యం చెప్పాడు. ఈ మేరకు క్రిక్‌బజ్‌తో తన అభిప్రాయాలు పంచుకున్నాడు.ఐపీఎల్-2025 జట్లకు మైకేల్ వాన్ ఇచ్చిన రేటింగ్(పది పాయింట్లకు)👉గుజరాత్ టైటాన్స్- 9👉కోల్‌కతా నైట్ రైడర్స్- 8👉లక్నో సూపర్ జెయింట్స్- 7👉పంజాబ్ కింగ్స్- 7👉సన్‌రైజర్స్ హైదరాబాద్- 6.5👉రాయల్ చాలెంజర్స్ బెంగళూరు- 6.5👉రాజస్తాన్ రాయల్స్- 6.5👉చెన్నై సూపర్ కింగ్స్- 6👉ఢిల్లీ క్యాపిటల్స్- 5.మైకేల్ వాన్ ఎంచుకున్న టాప్-4 జట్లు(ప్లే ఆఫ్స్)గుజరాత్, కోల్‌కతా, ముంబై ఇండియన్స్ టాప్-3లో ఉండగా.. నాలుగో స్థానం కోసం లక్నో, పంజాబ్, సన్‌రైజర్స్ పోటీ.విజేతపై మైకేల్ వాన్ అంచనాఈసారి ముంబై ఇండియన్స్ ట్రోఫీ గెలిచే అవకాశం.చదవండి: CT 2025: టీమిండియాకు భారీ నజరానా ప్రకటించిన బీసీసీఐ -
చహల్, ధనశ్రీ బంధానికి ఎండ్ కార్డు.. విడాకులు మంజూరు
టీమిండియా లెగ్ స్పిన్నర్ యుజువేంద్ర చహల్, ధనశ్రీ వర్మ విడిపోతున్నారంటూ వస్తున్న వార్తలకు తెరపడింది. చాహల్-ధనశ్రీ అధికారికంగా విడిపోయారు. వీరిద్దిరికి ముంబైలోని బాంద్రా ఫ్యామిలీ కోర్టు గురువారం విడాకులు మంజూరు చేసింది. దీంతో ఈ జంట ఐదేళ్ల వివాహ బందం నేటితో ముగిసింది. ధనశ్రీకి భరణం కింద రూ.4.75 కోట్లు ఇవ్వడానికి చాహల్ అంగీకరించాడు. ఇప్పటికే రూ. 2 కోట్ల 37 లక్షలు ధనశ్రీకి భరణం కింద చెల్లించినట్లు తెలుస్తోంది. కాగా వీరిద్దరి విడాకుల కేసుపై గత కొంతకాలంగా బాంద్రా ఫ్యామిలీ కోర్టులో విచారణ సాగుతోంది. అయితే ఐపీఎల్-2025లో పాల్లోనేందుకు చాహల్ వెళ్లనుండడంతో విచారణను వేగవంతం చేయాలని ఫ్యామిలీ కోర్టును బాంబే హైకోర్టు బుధవారం ఆదేశించింది. అదేవిధంగా పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకుంటున్న కారణంగా, తప్పనిసరి ఆరు నెలల విరామ (కూలింగ్ ఆఫ్ పీరియడ్) గడువును హైకోర్టు రద్దు చేసింది. ఈ నేపథ్యంలొనే బాంద్రా ఫ్యామిలీ కోర్టు నేడు ఈ జంటకు విడాకులు మంజూరు చేసింది.యూట్యూబర్, కొరియాగ్రాఫర్ అయిన ధనశ్రీతో 2020 డిసెంబర్ 22న చాహల్‌కు వివాహం జరిగింది. వీరిద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉంటూ, ఎప్పటికప్పుడు ఇన్‌స్టాలో రీల్స్ చేస్తూ అభిమానులను అలరించేవారు. కానీ గత రెండేళ్లగా విభేదాలు తలెతెత్తడంతో వీరిద్దరూ విడిగానే ఉంటున్నారు.అయితే గతేడాది ధనశ్రీ సోషల్ మీడియా ఖాతాల్లో తన పేరు నుంచి ‘చాహల్’ పేరును తీసేయడంతో పాటు ఫొటోలను కూడా డిలేట్ చేసింది. దీంతో ఈ జంట విడిపోతున్నరంటూ వార్తలు వ్యాపించాయి. అప్పటి నుంచి వీరిద్దరూ విడాకులకు సంబంధించి పూటకో ఓ వార్త వస్తూనే ఉండేది. ఎట్టకేలకు ఈ వార్తలు నిజమేనని అధికారికంగా స్పష్టమైంది. ఇక ధనశ్రీతో విడాకులు తీసుకున్న చాహల్ ప్రస్తుతం సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఆర్జే మహ్వశ్తో ప్రేమలో ఉన్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్-2025లో పంజాబ్ కింగ్స్ తరపున ఆడనున్నాడు.చదవండి: షాక్‌లో క్రికెట్ ఫ్యాన్స్.. నమీబియా కెప్టెన్‌గా ఫాఫ్ డుప్లెసిస్ -
షాక్‌లో క్రికెట్ ఫ్యాన్స్.. నమీబియా కెప్టెన్‌గా ఫాఫ్ డుప్లెసిస్
అండర్-19 వరల్డ్ కప్ 2026 క్వాలిఫయర్స్‌కు నమీబియా క్రికెట్ బోర్డు 14 మంది సభ్యులతో కూడిన తమ జట్టును ప్రకటించింది. ఈ జట్టు కెప్టెన్‌గా ఫాఫ్ డుప్లెసిస్ ఎంపికయ్యాడు. అవును మీరు విన్నది నిజమే. దక్షిణాఫ్రికా మాజీ సారథి ఫాఫ్ డుప్లెసిస్ నమీబియా అండర్-19 కెప్టెన్‌గా ఎలా ఎంపికయ్యాడని ఆలోచిస్తున్నారా? అయితే మీరు అనుకుంటున్నట్లు ఆ డుప్లెసిస్ .. ఈ డుప్లెసిస్ ఒకరు కాదు. ఒకే పేరుతో ఉన్నప్పటికి ఈ ఇద్దరు క్రికెటర్లు వేర్వేరు.17 ఏళ్ల డుప్లెసిస్ దేశవాళీ టోర్నీల్లో మెరుగ్గా రాణించి నమీబియా కెప్టెన్‌గా నియమితుడయ్యాడు. అయితే సౌతాఫ్రికా మాజీ కెప్టెన్ మాదిరిగానే ఈ ఫాఫ్ డుప్లెసిస్ కూడా రైట్ హ్యాండ్ బ్యాటరే కావడం గమనార్హం. ఈ డుప్లెసిస్ లెగ్ బ్రేక్ బౌలింగ్ కూడా చేయగలడు. ఇక సీనియర్ డుప్లెసిస్ విషయానికి వస్తే.. ఐపీఎల్-2025లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు ప్రాతినిథ్యం వహించేందుకు సిద్దమవుతున్నాడు. ఇప్పటికే ఢిల్లీ జట్టుతో కలిసిన డుప్లెసిస్.. నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నాడు. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ తమ మొదటి మ్యాచ్‌లో మార్చి 24న వైజాగ్ వేదికగా లక్నో సూపర్‌జెయింట్స్‌తో తలపడనుంది.వరల్డ్‌కప్‌లో ఆడడమే లక్ష్యంగా.. కాగా జింబాబ్వే వేదికగా జరగనున్న అండర్-19 వరల్డ్ కప్ 2026లో ఆడేందుకు నమీబియాకు ఇదొక సువర్ణ అవకాశం. నైజీరియాలోని లాగోస్‌లో జరగనున్న ప్రపంచ కప్ క్వాలిఫైయర్‌లో సత్తాచాటి ఈ మెగా టోర్నీకి ఆర్హత సాధించాలని ఈ ఆఫ్రికా జట్టు పట్టుదలతో ఉంది. డివిజన్ 1 క్వాలిఫైయర్లలో సియెర్రా లియోన్, టాంజానియా, కెన్యా, నైజీరియా, ఉగాండా వంటి జట్లతో నమీబియా తలపడనుంది. మార్చి 28 నుంచి డివిజన్ 1 క్వాలిఫైయర్ మ్యాచ్‌లు ప్రారంభం కానున్నాయి. ఈ రౌండ్లో గెలిచిన జట్టు నేరుగా 2026 అండర్-19 ఆఫ్రికా ఉపఖండం తరపున ప్రపంచకప్‌కు ఆర్హత సాధిస్తారు.నమీబియా జట్టు: ఫాఫ్ డుప్లెసిస్(కెప్టెన్), అడ్రియన్ కోయెట్జీ, బెన్ బ్రాసెల్, డాన్ బ్రాసెల్, ఎరిక్ లింట్వెల్ట్, హెన్రీ గ్రాంట్, జాంకో ఎంగెల్‌బ్రెచ్ట్, జునియన్ తనయాండా, లియామ్ బెసన్, లుకా మైకెలో, మాక్స్ హెంగో, రోవాన్ వాన్ వురెన్, టియాన్ వాన్ డెర్ మెర్వే, వాల్డో స్మిత్.చదవండి: IPL 2025: రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రియాన్ పరాగ్.. అఫీషియల్ అప్డేట్ -
ఐపీఎల్‌కు ముందే స్టార్ట్ అయిన అభిషేక్ విధ్వంసం.. సిక్సర్ల దెబ్బకు అద్దాలు ధ్వంసం
ఐపీఎల్ 2025 ప్రారంభానికి ముందే సన్‌రైజర్స్ హైదరాబాద్ విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ షో మొదలైంది. ప్రాక్టీస్ సెషన్స్‌లో, ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్‌ల్లో శర్మ సిక్సర్ల వర్షం కురిపిస్తున్నాడు. నిన్నటి ప్రాక్టీస్ సందర్భంగా శర్మ కొట్టిన ఓ బంతి అగ్నిమాపక పరికరం అద్దాలు ధ్వంసం చేసింది. సన్‌రైజర్స్ విడుదల చేసిన ఓ వీడియోలో శర్మ ఈ విషయాన్ని ప్రస్తావించాడు. సిక్సర్లు బాదే క్రమంలో చాలా బ్యాట్లు కూడా విరిగిపోయాయని చెప్పుకొచ్చాడు. View this post on Instagram A post shared by SunRisers Hyderabad (@sunrisershyd)ఈ వీడియోతో సన్‌రైజర్స్ ప్రత్యర్థులను బయపెట్టే పనిలో పడింది. అభిషేక్ శర్మతో జాగ్రత్తగా ఉండాలని సంకేతాలు పంపింది. గత సీజన్లో అరివీర భయంకరమైన ఫామ్‌లో ఉండిన అభిషేక్.. సహచర ఓపెనర్ ట్రవిస్ హెడ్‌తో కలిసి సుడిగాలి ఇన్నింగ్స్‌లు ఆడాడు. సన్‌రైజర్స్ సాధించిన అతి భారీ స్కోర్లలో అభిషేక్ పాత్ర కీలకం. అభిషేక్ గత సీజన్లో 16 మ్యాచ్‌లు ఆడి 204.22 స్ట్రయిక్‌రేట్‌తో 484 పరుగులు చేశాడు. ఇందులో 36 బౌండరీలు, 42 సిక్సర్లు ఉన్నాయి. గత సీజన్లో అత్యధిక సిక్సర్లు బాదింది కూడా అభిషేకే. అభిషేక్ గత సీజన్లోలాగే ఈ సీజన్లోనూ పేట్రేగిపోయే అవకాశం ఉంది. గత ఐపీఎల్ తర్వాత అతను మరింత రాటు దేలాడు. టీమిండియాకు ఎంపికై అంతర్జాతీయ వేదికపై కూడా సత్తా చాటాడు. ఆ అనుభవంతో అభిషేక్ ఈ ఐపీఎల్ సీజన్లో సునామీలా విరుచుకుపడవచ్చు. అభిషేక్‌తో పాటు సహచరులు ట్రవిస్ హెడ్, హెన్రిచ్ క్లాసెన్, ఇషాన్ కిషన్, నితీశ్ కుమార్ రెడ్డి కూడా విజృంభిస్తే.. గత సీజన్లో మిస్సైన టైటిల్‌ను సన్‌రైజర్స్ ఈ సీజన్లో సాధించవచ్చు. పై పేర్కొన్న బ్యాటర్లు తమ సహజ ఆటతీరును ప్రదర్శిస్తే ఈ సీజన్లో సన్‌రైజర్స్ 300 పరుగుల మార్కును దాటేస్తుంది. ప్రాక్టీస్ సందర్భంగా సన్‌రైజర్స్ బ్యాటర్లు ఇదే టార్గెట్ పెట్టుకుని భారీ షాట్లు ఆడుతూ కనిపించారు. ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్‌ల్లో ఆరెంజ్ ఆర్మీలోకి కొత్తగా చేరిన ఇషాన్ కిషన్ విశ్వరూపం ప్రదర్శిస్తున్నాడు. అభిషేక్ జోరుకు ఇషాన్ విధ్వంసం కూడా తోడైతే సన్‌రైజర్స్‌కు ఈ సీజన్లో పట్టపగ్గాలు ఉండవు. గత సీజన్లో బ్యాటర్లు చెలరేగడంతో సన్‌రైజర్స్ ఆర్సీబీపై 287 (ఐపీఎల్ హిస్టరీలో ఇదే అత్యధిక స్కోర్), ముంబై ఇండియన్స్‌పై 277, ఢిల్లీ క్యాపిటల్స్‌పై 266 పరుగులు చేసింది. గత సీజన్‌తో పోలిస్తే ఈ సీజన్లో సన్‌రైజర్స్ బ్యాటింగ్ మరింత ప్రమాదకరంగా కనిపిస్తుంది.ఈ సీజన్లో సన్‌రైజర్స్ బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లోనూ బలంగా ఉంది. భువనేశ్వర్ కుమార్, నటరాజన్ లాంటి దేశీయ పేసర్లు దూరమైనా షమీ, ఉనద్కత్, హర్షల్ పటేల్ కొత్తగా జట్టులో చేరారు. స్పిన్ విభాగంలోనూ సన్‌రైజర్స్ పటిష్టంగా కనిపిస్తుంది. ఆసీస్ స్టార్ స్పిన్నర్ ఆడమ్ జంపాను సన్‌రైజర్స్ ఈ సీజన్లో అక్కున చేర్చుకుంది. లోకల్ స్పిన్నర్ రాహుల్ చాహర్ తనదైన రోజున అద్భుతాలు చేయగలడు. పార్ట్ టైమ్ స్పిన్నర్లు అభిషేక్ శర్మ, ట్రవిస్ హెడ్, కమిందు మెండిస్ ఫుల్‌టైమ్ స్పిన్నర్లకు ఏమాత్రం తీసిపోరు. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో పటిష్టంగా కనిపిస్తున్న సన్‌రైజర్స్ ఈ సీజన్లో టైటిల్ గెలుస్తుందేమో చూడాలి.కాగా, ఈ సీజన్లో సన్‌రైజర్స్ ప్రయాణం మార్చి 23న రాజస్థాన్ రాయల్స్‌తో జరిగే మ్యాచ్‌తో మొదలవుతుంది. ఈ మ్యాచ్ ఎస్ఆర్హెచ్ హోం గ్రౌండ్ ఉప్పల్ స్టేడియంలో జరుగనుంది. ఈ ఏడాది ఐపీఎల్ మార్చి 22న ప్రారంభం కానుండగా.. తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ కేకేఆర్.. ఆర్సీబీతో తలపడనుంది.2025 ఐపీఎల్ కోసం సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఇదే..పాట్ కమిన్స్ (కెప్టెన్), అథర్వ్ తైడే, అభినవ్ మనోహర్, అనికేత్ వర్మ, సచిన్ బేబి, ట్రవిస్ హెడ్, నితీశ్ కుమార్ రెడ్డి, కమిందు మెండిస్, వియాన్ ముల్దర్, అభిషేక్ శర్మ, హెన్రిచ్ క్లాసెన్, ఇషాన్ కిషన్, జీషన్ అన్సారీ, మహ్మద్ షమీ, హర్షల్ పటేల్, రాహుల్ చాహర్, సిమర్జీత్ సింగ్, ఎషాన్ మలింగ, ఆడమ్ జంపా, జయదేవ్ ఉనద్కత్ -
మానసిక వేదన.. అయినా తట్టుకున్నాడు.. సింహంలా తిరిగొచ్చాడు!
టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా (Hardik Pandya)పై భారత మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ ప్రశంసలు కురిపించాడు. అవమానాలను దిగమింగుకుని.. సింహంలా అతడు తిరిగి వచ్చాడని కొనియాడాడు. మానసికంగా తనను వేదనకు గురిచేసినా.. అద్భుత ప్రదర్శనతో తన విలువను చాటుకున్నాడని.. భారత్ రెండు ఐసీసీ టైటిళ్లు గెలవడంలో కీలక పాత్ర పోషించాడని ప్రశంసించాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)-2025లో సరికొత్త హార్దిక్ పాండ్యాను చూడబోతున్నారని.. ముంబై ఇండియన్స్‌ను అతడు ఈసారి ప్లే ఆఫ్స్‌లో నిలుపుతాడని కైఫ్ ధీమా వ్యక్తం చేశాడు. అవహేళనలుకాగా గతేడాది హార్దిక్ ముంబై ఇండియన్స్ సారథిగా ఎంపికైన విషయం తెలిసిందే. ముంబైకి ఐదు ట్రోఫీలు అందించిన రోహిత్ శర్మ (Rohit Sharma)ను కాదని.. హార్దిక్ పాండ్యాకు పగ్గాలు అప్పగించడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. సొంత మైదానం వాంఖడేలోనూ అతడిని దూషిస్తూ పెద్ద ఎత్తున ట్రోల్ చేశారు. హార్దిక్ కనిపిస్తే చాలు అవహేళనలతో అతడి ఆత్మవిశ్వాసం దెబ్బతినేలా ప్రవర్తించారు.ఈ క్రమంలో ముంబై గతేడాది పద్నాలుగింట కేవలం నాలుగే గెలిచి పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది. దీంతో హార్దిక్ కెప్టెన్సీపై మరోసారి విమర్శలు తీవ్రమయ్యాయి. అయితే, ఈ చేదు అనుభవాల నుంచి త్వరగానే కోలుకున్న హార్దిక్ పాండ్యా.. టీ20 ప్రపంచకప్-2024లో సత్తా చాటాడు. జట్టు చాంపియన్‌గా నిలవడంలో కీలకంగా వ్యవహరించాడు.అంతేకాదు.. తాజాగా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025లో టీమిండియా టైటిల్ గెలవడంలోనూ హార్దిక్‌ది కీలక పాత్ర. ఈ నేపథ్యంలో భారత మాజీ బ్యాటర్ మహ్మద్ కైఫ్.. హార్దిక్ పాండ్యా బయోపిక్ గనుక తెరకెక్కితే గత ఏడాది కాలం ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని వ్యాఖ్యానించాడు.పంటిబిగువన భరిస్తూ.. ‘‘మనసుకైన గాయాలను పంటిబిగువన భరిస్తూ.. అతడు ముందుకు సాగాడు. అభిమానులే అతడిని హేళన చేశారు. కొంతమంది అతడి గురించి చెడుగా ఆర్టికల్స్ రాశారు. ఓ ఆటగాడిగా ఇన్ని బాధలను భరిస్తూ ముందుకు సాగడం అంత తేలికైన విషయం కాదు.అతడు ఆ నొప్పిని మర్చిపోలేడు. జట్టు నుంచి తప్పిస్తే ఆ బాధ కొన్నాళ్లే ఉంటుంది. కానీ.. అభిమానులే ఇంతలా అవమానిస్తే తట్టుకోవడం కష్టం. ఓ ఆటగాడికి ఇంతకంటే మానసిక వేదన మరొకటి ఉండదు. సింహంలా పోరాడి గెలిచాడుఅయితే, అతడు కుంగిపోలేదు. సింహంలా పోరాడి గెలిచాడు. టీ20 ప్రపంచకప్-2024 ఫైనల్లో హెన్రిచ్ క్లాసెన్ వంటి విధ్వంసకర వీరుడిని అవుట్ చేశాడు. చాంపియన్స్ ట్రోఫీలో జంపా బౌలింగ్‌లో సిక్సర్లు బాదాడు.బంతితో, బ్యాట్‌తో రాణించి భారత్ గెలవడంలో కీలకంగా వ్యవహరించాడు. ఒకవేళ అతడి బయోపిక్ తీస్తే.. గత ఏడాది కాలం అందరికీ స్ఫూర్తిగా నిలుస్తుంది. సవాళ్లను, గడ్డు పరిస్థితులను అధిగమించి ఎలా ముందుకు సాగాలో తెలుస్తుంది. పాండ్యా తన బలాన్ని గుర్తించాడు. అందుకే ఇంత గొప్పగా పునరాగమనం చేశాడు. ఐపీఎల్-2025లో అతడు ముంబైని తప్పక ప్లే ఆఫ్స్ చేరుస్తాడు’’ అని కైఫ్ హిందుస్తాన్ టైమ్స్‌తో వ్యాఖ్యానించాడు.కాగా మార్చి 22న ఐపీఎల్ పద్దెనిమిదవ ఎడిషన్ ప్రారంభం కానుండగా.. ఆ మరుసటి రోజు ముంబై తమ తొలి మ్యాచ్ ఆడనుంది. మార్చి 23న చెన్నై సూపర్ కింగ్స్‌ను ఢీకొట్టనుంది. అయితే, గతేడాది స్లో ఓవర్ రేటు కారణంగా హార్దిక్ పాండ్యా తొలి మ్యాచ్‌కు దూరం కానున్నాడు. దీంతో అతడి స్థానంలో టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ సారథ్య బాధ్యతలు నిర్వర్తించనున్నాడు.చదవండి: CT 2025: టీమిండియాకు భారీ నజరానా ప్రకటించిన బీసీసీఐ -
IPL 2025: రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రియాన్ పరాగ్.. అఫీషియల్ అప్డేట్
ఐపీఎల్ 2025 సీజన్ ప్రారంభానికి రెండు రోజుల ముందు రాజస్థాన్ రాయల్స్‌కు సంబంధింది కీలక అప్డేట్ వెలువడింది. ఈ సీజన్ తొలి మూడు మ్యాచ్‌ల్లో రాయల్స్ కెప్టెన్‌గా రియాన్ పరాగ్ వ్యవహరించనున్నాడు. ఈ విషయాన్ని రెగ్యులర్ కెప్టెన్ సంజూ శాంసన్ స్వయంగా ప్రకటించాడు. సంజూ పూర్తి స్థాయి ఆటగాడిగా ఫిట్నెస్ సాధించకపోవడమే కెప్టెన్సీ తాత్కాలిక మార్పుకు కారణమని తెలిస్తుంది. SANJU SAMSON ANNOUCING RIYAN PARAG AS ROYALS CAPTAIN IN FIRST 3 GAMES..!!! - Riyan will lead vs SRH, KKR & CSK. pic.twitter.com/G6F4WYgGD3— Johns. (@CricCrazyJohns) March 20, 2025ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ఇంగ్లండ్‌తో జరిగిన టీ20 సిరీస్ సందర్భంగా సంజూ గాయపడిన (కుడి చేతి చూపుడు వేలు) విషయం తెలిసిందే. ఆ గాయం నుంచి పాక్షికంగా కోలుకున్న సంజూ బ్యాటర్‌గా ఫిట్నెస్ సాధించినప్పటికీ.. వికెట్‌కీపింగ్‌కు సంబంధించి పూర్తి ఫిట్నెస్ సాధించలేదు. ఈ కారణంగా అతను రాయల్స్ ఆడబోయే తొలి మూడు మ్యాచ్‌ల్లో కేవలం బ్యాటర్‌గానే కొనసాగనున్నాడు. ఈ మూడు మ్యాచ్‌ల్లో సంజూ ఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలోకి దిగవచ్చు. కేవలం బ్యాటర్‌గా మాత్రమే కొనసాగే అవకాశం ఉండటంతో సంజూ కెప్టెన్సీని రియాన్‌ను అప్పజెప్పాల్సి వస్తుంది. రియాన్ తాత్కాలిక కెప్టెన్‌గా ఉంటాడన్న విషయాన్ని వెల్లడించే సందర్భంగా సంజూ ఇలా అన్నాడు."జట్టులో చాలా మంది నాయకులు ఉన్నారు. గత కొన్ని సంవత్సరాల్లో పలువురు జట్టును అద్భుతంగా ముందుండి నడిపించారు. తదుపరి మూడు మ్యాచ్‌ల్లో రియాన్ జట్టుకు నాయకత్వం వహిస్తాడు. అందరూ అతనికి మద్దతు ఇస్తారని ఆశిస్తున్నాను"కాగా, సంజూ ఇవాళ (మార్చి 20) ముంబైలో జరిగే కెప్టెన్ల సమావేశంలో రాయల్స్‌కు ప్రతినిధిగా ఉంటాడు. సంజూ వారం తర్వాత మరోసారి ఫిట్నెస్ టెస్ట్‌ను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ పరీక్ష కేవలం వికెట్‌కీపింగ్‌కు సంబంధించి మాత్రమే ఉంటుంది.ఇదిలా ఉంటే, ఈ ఐపీఎల్ సీజన్లో రాజస్థాన్ రాయల్స్ ప్రయాణం మార్చి 23న సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగే మ్యాచ్‌తో మొదలవుతుంది. ఈ మ్యాచ్ ఎస్ఆర్హెచ్ హోం గ్రౌండ్ ఉప్పల్ స్టేడియంలో (హైదరాబాద్) జరుగనుంది. మార్చి 22న డిఫెండింగ్ ఛాంపియన్ కేకేఆర్, ఆర్సీబీ మధ్య జరిగే మ్యాచ్‌తో ఈ ఏడాది ఐపీఎల్ ప్రారంభం కానుంది.రియాన్ పరాగ్ విధ్వంసకర శతకంఐపీఎల్ 2025 ప్రారంభానికి ముందే రాజస్థాన్ రాయల్స్ చిచ్చరపిడుగు రియాన్ పరాగ్ విధ్వంసకర శతకంతో విరుచుకుపడ్డాడు. నిన్న జరిగిన ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్‌లో రియాన్ 64 బంతుల్లో 10 సిక్సర్లు, 16 ఫోర్ల సాయంతో 144 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఇదే మ్యాచ్‌లో దృవ్ జురెల్ కూడా సెంచరీ చేశాడు. జురెల్ 44 బంతుల్లో 104 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. రియాన్, జురెల్ మెరుపు సెంచరీల మధ్య ఇదే మ్చాయ్లో యశస్వి జైస్వాల్ కూడా బీభత్సం సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో జైస్వాల్ 34 బంతుల్లో 83 పరుగులు చేసి ఔటయ్యాడు. రాజస్థాన్ రాయల్స్..సంజూ శాంసన్ (కెప్టెన్), వైభవ్ సూర్యవంశీ, యశస్వి జైస్వాల్, నితీశ్ రాణా, శుభమ్ దూబే, షిమ్రోన్ హెట్‌మైర్, రియాన్ పరాగ్, యుద్ద్‌వీర్ సింగ్ చరక్, వనిందు హసరంగ, దృవ్ జురెల్, కునాల్ సింగ్ రాథోడ్, సందీప్ శర్మ, తుషార్ దేశ్‌పాండే, కుమార్ కార్తీకేయ, ఆకాశ్ మధ్వాల్, క్వేనా మపాకా, మహీశ్ తీక్షణ, ఫజల్ హక్ ఫారూకీ, అశోక్ శర్మ, జోఫ్రా ఆర్చర్ -
నా కొడుకు నన్ను బ్రో అని పిలుస్తాడు: సానియా మీర్జా మాజీ భర్త షోయబ్ మాలిక్
పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షోయబ్ మాలిక్.. అతని మాజీ భార్య, భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా విడాకులు తీసుకుని ప్రస్తుతం వేరేవేరుగా ఉంటున్నారు. షోయబ్ పాకిస్తాన్‌లోనే స్థిరపడగా.. సానియా దుబాయ్‌లో నివాసం ఏర్పరచుకుంది. సానియా నుంచి విడిపోయాక షోయబ్ మరో పెళ్లి (పాకిస్తానీ నటి సనా జావేద్) చేసుకోగా.. సానియా మాత్రం కొడుకు ఇజాన్ మీర్జా మాలిక్‌తో కాలం వెల్లబుచ్చుతుంది.తాజాగా ఓ పాకిస్తానీ టీవీ షోలో కొడుకు ఇజాన్ గురించి ప్రస్తావన రాగా షోయబ్ మాలిక్ స్పందించాడు. సానియాతో వేరు పడినా కొడుకు ఇజాన్‌తో సన్నిహితమైన బంధాన్ని కొనసాగిస్తున్నానని అన్నాడు. భౌతికంగా దూరంగా ఉన్నప్పటికీ.. వీడియో కాల్స్ ద్వారా ప్రతి రోజూ కాంటాక్ట్‌లో ఉంటానని తెలిపాడు. కొడుకును చూసేందుకు నెలలో రెండు సార్లు దుబాయ్‌కు వెళ్తానని చెప్పాడు. ఆ సమయంలో తనే స్వయంగా ఇజాన్‌ను స్కూల్లో దింపి, పికప్ చేసుకుంటానని తెలిపాడు. తాము నేరుగా కలసినప్పుడు క్రీడలతో పాటు చాలా విషయాలు పంచుకుంటామని వివరించాడు.ఇజాన్‌తో తన బంధాన్ని స్నేహ బంధంగా అభివర్ణించాడు. తమ ఇద్దరి మధ్య ఫ్రెండ్షిప్ బాండింగ్ ఉందని చెప్పుకొచ్చాడు. ఇజాన్ తనను బ్రో అని పిలుస్తాడని.. తను కూడా ఇజాన్‌ను అలాగే పిలుస్తానని తెలిపాడు.కాగా, సానియా-షోయబ్‌ల వివాహ బంధం ఖులా (విడాకుల ప్రక్రియ) ద్వారా తెరపడింది. ఖులా తర్వాత ఇజాన్ కస్టడీ తల్లి సానియాకు దక్కింది. ప్రస్తుతం ఇజాన్ వయసు ఏడేళ్లు. ఇదిలా ఉంటే, అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత షోయబ్ పలు దేశాల్లో లీగ్ క్రికెట్ ఆడుతున్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీ-2025 సందర్భంగా అతను వ్యాఖ్యాతగా కనిపించాడు. సానియా విషయానికొస్తే.. ప్రస్తుతం ఆమె పికిల్‌బాల్ ఓపెన్ 2025 టోర్నీ కోసం గ్లోబల్ స్పోర్ట్స్‌లో భాగస్వామిగా చేరింది. ఈ టోర్నీ మే 8-11 వరకు దుబాయ్‌లో జరగనుంది. ఈ టోర్నీని దుబాయ్ స్పోర్ట్స్ కౌన్సిల్ సహకారంతో నిర్వహిస్తుంది.ఆరుసార్లు గ్రాండ్‌స్లామ్ ఛాంపియన్ అయిన సానియా.. ప్రస్తుతం పికిల్‌బాల్ వృద్ధికి కృషి చేస్తుంది. ఈ క్రీడ వాషింగ్టన్లో రాష్ట్రీయ క్రీడగా చలామణి అవుతుంది. పికిల్ బాల్ టెన్నిస్ మరియు టేబుల్ టెన్నిస్‌ను పోలి ఉంటుంది. -
CT 2025: టీమిండియాకు భారీ నజరానా ప్రకటించిన బీసీసీఐ
టీమిండియాపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) కాసుల వర్షం కురిపించింది. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 (ICC Champions Trophy)లో విజేతగా నిలిచినందుకు భారీ క్యాష్ రివార్డు ప్రకటించింది. ఈ మెగా వన్డే టోర్నీలో ఐదింటికి ఐదు మ్యాచ్‌లు గెలిచి అజేయంగా చాంపియన్‌గా నిలిచిన రోహిత్ సేనకు రూ. 58 కోట్ల నజరానా ఇచ్చింది. రోహిత్ సేన జైత్రయాత్రను ప్రస్తావిస్తూఈ మొత్తాన్ని ఆటగాళ్లు, కోచ్‌లు, సహాయక సిబ్బంది.. అదే విధంగా అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ సభ్యులకు బీసీసీఐ పంచనుంది. ఇందుకు సంబంధించి బోర్డు గురువారం అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈ మేరకు.. ‘‘ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025లో అద్భుత ప్రదర్శన కనబరిచిన టీమిండియాకు రూ. 58 కోట్ల క్యాష్ రివార్డు ప్రకటిస్తున్నాం.మెన్స్ సెలక్షన్ కమిటీ సభ్యులతో పాటు ఆటగాళ్లు, కోచ్‌లు, సహాయక సిబ్బంది పనితీరును గుర్తిస్తూ వారిని ఇలా సత్కరిస్తున్నాం’’ అని పేర్కొంది. అదే విధంగా.. ‘‘కెప్టెన్ రోహిత్ శర్మ సారథ్యంలో టీమిండియా టోర్నీ ఆసాంతం ఆధిపత్యం కనబరిచింది. ఓటమన్నదే ఎరుగక నాలుగు విజయాలతో ఫైనల్ చేరింది.తొలుత బంగ్లాదేశ్‌పై ఆరు వికెట్ల తేడాతో గెలిచిన టీమిండియా.. ఆ తర్వాత పాకిస్తాన్‌పై కూడా ఆరు వికెట్ల తేడాతో జయకేతనం ఎగురవేసింది. అదే జోరును కొనసాగిస్తూ న్యూజిలాండ్‌పై 44 పరుగుల తేడాతో గెలిచి గ్రూప్ టాపర్ అయ్యింది. సెమీ ఫైనల్లో ఆస్ట్రేలియాను నాలుగు వికెట్ల తేడాతో ఓడించి ఫైనల్ చేరుకుంది. ఫైనల్లో న్యూజిలాండ్‌ను ఓడించింది’’ అని బీసీసీఐ తమ ప్రకటనలో రోహిత్ సేన జైత్రయాత్రను ప్రస్తావించింది.అందుకే ఈ నగదు బహుమతిఈ సందర్భంగా బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ మాట్లాడుతూ.. ‘‘వరుసగా రెండు ఐసీసీ టైటిళ్లు సాధించడం ఎంతో ప్రత్యేకమైనది. భారత జట్టు అంకిత భావం, ప్రపంచ వేదికపై దేశానికి వారు తెచ్చి పెట్టిన కీర్తి ప్రతిష్టలకు గుర్తింపుగా నగదు బహుమతి అందజేస్తున్నాం.ఈ గెలుపునకు కారణమైన ప్రతి ఒక్కరి సేవలను మేము గుర్తించాం. భారత్‌కు ఈ ఏడాది ఇది రెండో ఐసీసీ ట్రోఫీ. అండర్-19 వుమెన్స్ వరల్డ్‌కప్‌లో మనం చాంపియన్లుగా నిలిచాం. ఆ తర్వాత ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీని కూడా సొంతం చేసుకున్నాం.దేశంలో క్రికెటింగ్ ఎకోసిస్టమ్ ఎంత పటిష్టంగా ఉందో చెప్పేందుకు ఇంతకంటే నిదర్శనం మరొకటి ఉండదు’’ అని హర్షం వ్యక్తం చేశాడు. కాగా గతేడాది టీ20 ప్రపంచకప్-2024 సాధించిన రోహిత్ సేన.. ఆ టోర్నీలోనూ అన్ని మ్యాచ్‌లలో అజేయంగా నిలిచింది. నాడు బీసీసీఐ రోహిత్ సేనకు ఏకంగా రూ. 125 కోట్ల నజరానా ప్రకటించింది.ఎనిమిది జట్ల మధ్య పోటీతాజాగా చాంపియన్స్ ట్రోఫీలోనూ అదే ఫలితాన్ని పునరావృతం చేయగా.. ఈసారి రూ. 58 కోట్ల బహుమతి ఇచ్చింది. ఇది ఐసీసీ ఇచ్చిన ప్రైజ్ మనీ (భారత కరెన్సీలో దాదాపు రూ. రూ.19.5 కోట్లు) కంటే దాదాపు మూడు రెట్లు ఎక్కువ కావడం విశేషం. ఇక ఈ మెగా ఈవెంట్‌కు పాకిస్తాన్ ఆతిథ్యం ఇవ్వగా.. భారత జట్టు మాత్రం తటస్థ వేదికైన దుబాయ్‌లోనే తమ మ్యాచ్‌లన్నీ ఆడింది. ఈ టోర్నీలో భారత్‌తో పాటు గ్రూప్-ఎ నుంచి పాకిస్తాన్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్.. గ్రూప్-బి నుంచి ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, అఫ్గనిస్తాన్, ఇంగ్లండ్ పోటీపడ్డాయి.తొలి సెమీస్‌లో భారత్ ఆస్ట్రేలియాను ఓడించగా.. రెండో సెమీస్‌లో సౌతాఫ్రికాను న్యూజిలాండ్ చిత్తు చేసింది. ఈ క్రమంలో టీమిండియా- న్యూజిలాండ్ మధ్య మార్చి 9న జరిగిన టైటిల్ పోరులో రోహిత్ సేన నాలుగు వికెట్ల తేడాతో కివీస్‌ను ఓడించింది. ఈ మ్యాచ్‌లో అద్భుత అర్ధ శతకం(76) బాదిన కెప్టెన్ రోహిత్ శర్మ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.చదవండి: ‘రేపు మీ బౌలింగ్‌ను చితక్కొడతాను చూడు!.. అన్నంత పని చేశాడు’ -
ఐపీఎల్-2025 ప్రారంభానికి ముందు గుజరాత్ కెప్టెన్ గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు
ఐపీఎల్-2025 ప్రారంభానికి ముందు గుజరాత్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సారథ్యాన్ని, బ్యాటింగ్‌ను విడివిడిగా చూడగలిగితేనే విజయవంతమవుతామని అభిప్రాయపడ్డాడు. ఈ నెల 22 నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్ 18వ సీజన్లో గిల్ గుజరాత్ టైటాన్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఈ నేపథ్యంలో అతడు మాట్లాడుతూ... ‘కెప్టెన్సీని, బ్యాటింగ్‌ను వేర్వేరుగా ఉంచాలి. అప్పుడే విజయవంతం కాగలం. క్రీజులో అడుగుపెట్టినప్పుడు కేవలం బ్యాటింగ్‌పైనే దృష్టి పెడతా. నా అనుభవంలో ఇదే నేర్చుకున్నా. ఫీల్డ్‌లో ఉన్నప్పుడు మాత్రం కెప్టెన్‌గా మరింత బాధ్యతగా వ్యవహరిస్తా’ అని అన్నాడు.2023 సీజన్లో టైటాన్స్ తరఫున హార్దిక్ పాండ్యా సారథ్యంలో బరిలోకి దిగిన గిల్ 890 పరుగులతో సత్తా చాటాడు. ఇక గత ఏడాది సారథిగా బాధ్యతలు తీసుకున్న గిల్ 426 పరుగులు చేశాడు. అంతకుముందు ఏడాదితో పోల్చుకుంటే అతడి స్ట్రయిక్‌రేట్ 10 శాతం తగ్గింది. ‘సారథిగా ప్రతి రోజు నేర్చుకుంటూనే ఉంటా. అదే ఒక ఆటగాడిగా, కెప్టెన్‌గా నన్ను మరింత మెరుగు పరుస్తుందని నమ్ముతున్నా. కోచ్ ఆశిష్ నెహ్రా, విక్రమ్ సోలంకి సూచనలతో ముందుకు సాగుతున్నా. ఇంటా బయట అనే తేడా ఏమీ లేదు. మంచి లయలో ఉంటే వేదికతో సంబంధం ఉండదు. గత మూడేళ్ల ఫలితాలు పరిశీలిస్తే లీగ్‌లో అత్యధిక విజయాల శాతం మా జట్టుదే. దాన్నే కొనసాగిస్తే ఈ సీజన్‌ను కూడా చిరస్మరణీయం చేసుకోగలం’ అని వివరించాడు. మ్యాచ్‌లు గెలవాలంటే భారీ స్కోర్లు చేయడం మాత్రమే కాదని... పిచ్, పరిస్థితులకు తగ్గట్లు ఆడటం ముఖ్యమని పేర్కొన్నాడు. కాగా, ఈ సీజన్లో గుజరాత్ తమ తొలి మ్యాచ్‌లో (మార్చి 25) పంజాబ్ కింగ్స్‌ను ఢీకొట్టనుంది. 2022లో ఐపీఎల్ అరంగేట్రం చేసిన గుజరాత్.. ఈ సీజన్లో కొత్తగా కనిపిస్తుంది. జోస్ బట్లర్, గ్లెన్ ఫిలిప్స్ లాంటి విధ్వంసకర బ్యాటర్ల చేరికతో ఆ జట్టు బ్యాటింగ్ విభాగం ప్రమాదకరంగా కనిపిస్తుంది. శుభ్‌మన్ గిల్ నేతృత్వంలో ఆ జట్టు టైటిల్ గెలిచేందుకు ఉరకలేస్తుంది. గుజరాత్ బౌలింగ్ విభాగం కూడా పటిష్టంగా కనిపిస్తుంది. రబాడ, సిరాజ్, ఇషాంత్ శర్మ, ప్రసిద్ద్ కృష్ణ, గెరాల్డ్ కొయెట్జీ లాంటి అంతర్జాతీయ స్థాయి పేసర్లతో కళకళలాడుతుంది. ప్రపంచ మేటి స్పిన్నర్ రషీద్ ఖాన్ జట్టులో ఉండనే ఉన్నాడు. అతనితో పాటు కొత్తగా వాషింగ్టన్ సుందర్ చేరాడు. దేశీయ ఆటగాళ్లు సాయి సుదర్శన్, రాహుల్ తెవాతియా, షారుఖ్ ఖాన్, మహిపాల్ లోమ్రార్ గుజరాత్‌కు అదనపు బలాన్ని ఇస్తున్నారు.గుజరాత్ టైటాన్స్శుభ్మన్ గిల్ (కెప్టెన్), సాయి సుదర్శన్, గ్లెన్ ఫిలిప్స్, రాహుల్ తెవాతియా, షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్, రషీద్ ఖాన్, మహిపాల్ లోమ్రార్, రవిశ్రీనివాసన్ సాయి కిషోర్, షారుఖ్ ఖాన్, నిషాంత్ సింధు, అర్షద్ ఖాన్, కరీమ్ జనత్, వాషింగ్టన్ సుందర్, జయంత్ యాదవ్, జోస్ బట్లర్, కుమార్ కుషాగ్రా, అనూజ్ రావత్, గెరాల్డ్ కొయెట్జీ, మానవ్ సుతార్, గుర్నూర్ బ్రార్, ఇషాంత్ శర్మ, కగిసో రబాడ, కుల్వంత్ కేజ్రోలియా, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ద్ కృష్ణ -
టీ20 ర్యాంకింగ్స్‌లో టీమిండియా బ్యాటర్ల హవా.. టాప్-5లో ముగ్గురు
ఐసీసీ తాజాగా ప్రకటించిన టీ20 ర్యాంకింగ్స్‌లో టీమిండియా బ్యాటర్ల హవా కొనసాగింది. టాప్-5లో ఏకంగా ముగ్గురు చోటు దక్కించుకున్నారు. రెండో స్థానంలో అభిషేక్ శర్మ, 4, 5 స్థానాల్లో తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ కొనసాగుతున్నారు. ఆసీస్ విధ్వంసకర బ్యాటర్ ట్రవిస్ హెడ్ అగ్రపీఠంపై తిష్ట వేశాడు. పాక్ బ్యాటర్ బాబర్ ఆజమ్ ఓ స్థానం కోల్పోయి ఎనిమిదో ప్లేస్‌కు పడిపోగా.. శ్రీలంక ఆటగాడు పథుమ్ నిస్పంక ఓ స్థానం మెరుగుపర్చుకుని ఏడో స్థానానికి చేరాడు.ఇవి మినహా ఈ వారం టాప్-10 బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో ఎలాంటి మార్పులు లేవు. పాక్‌తో జరుగుతున్న సిరీస్‌లో చెలరేగిపోతున్న న్యూజిలాండ్ బ్యాటర్లు టిమ్ సీఫర్ట్, ఫిన్ అలెన్ ఈ వారం ర్యాంకింగ్స్‌లో గణనీయంగా లబ్ది పొందారు. సీఫర్ట్ 20 స్థానాలు మెరుగుపర్చుకుని 13వ స్థానానికి చేరగా.. అలెన్ 8 స్థానాలు మెరుగుపర్చుకుని 18వ స్థానానికి ఎగబాకాడు. భారత బ్యాటర్లలో యశస్వి జైస్వాల్ 12, రుతురాజ్ గైక్వాడ్ 26, సంజూ శాంసన్ 36, శుభ్‌మన్ గిల్ 41, హార్దిక్ పాండ్యా 52, రింకూ సింగ్ 54, శివమ్‌దూబే 57 స్థానాల్లో ఉన్నారు.బౌలర్ల ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. విండీస్ స్పిన్నర్ అకీల్ హొసేన్ టాప్ ర్యాంక్‌లో కొనసాగుతుండగా.. భారత మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి రెండో స్థానంలో నిలిచాడు. వరుణ్‌కు టాప్ ప్లేస్‌లో ఉన్న అకీల్ హొసేన్‌కు కేవలం ఒక్క పాయింట్ వ్యత్యాసం మాత్రమే ఉంది. టాప్-10లో వరుణ్ సహా ముగ్గురు భారత బౌలర్లు ఉన్నారు. రవి బిష్ణోయ్ 6, అర్షదీప్ సింగ్ 9 స్థానాల్లో కొనసాగుతున్నారు. తాజాగా పాక్‌తో జరిగిన రెండు టీ20ల్లో అద్భుత ప్రదర్శనలు చేసిన న్యూజిలాండ్ బౌలర్లు ర్యాంక్‌లను భారీగా మెరుగుపర్చుకున్నారు. జేకబ్ డఫీ 23 స్థానాలు మెరుగుపర్చుకుని 12వ స్థానానికి ఎగబాకగా.. బెన్ సియర్స్ 22 స్థానాలు మెరుగుపర్చుకుని 67వ స్థానానికి.. జకరీ ఫౌల్క్స్ 41 స్థానాలు మెరుగుపర్చుకుని 90వ స్థానానికి చేరారు. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ 38, బుమ్రా 41, హార్దిక్ పాండ్యా 48 స్థానాల్లో ఉన్నారు.ఇదిలా ఉంటే, ప్రస్తుతం పాక్, న్యూజిలాండ్ టీ20 సిరీస్ మినహా ఎలాంటి అంతర్జాతీయ మ్యాచ్‌లు జరగడం లేదు. ఈ సిరీస్ ముగిశాక మరో మూడు నెలలు అస్సలు అంతర్జాతీయ మ్యాచ్‌లే జరుగవు. మార్చి 22 నుంచి ఐపీఎల్ స్టార్ట్ కానుండగా అన్ని జట్ల ఆటగాళ్లు ఆ లీగ్‌తోనే బిజీగా ఉంటారు. ఈ మూడు నెలల కాలంలో ఐసీసీ ర్యాంకింగ్స్‌కు సంబంధించి ఎలాంటి అప్డేట్స్ ఉండవు. -
IPL 2025: సూపర్ ఫామ్‌ను కొనసాగించిన శ్రేయస్ అయ్యర్
ఐపీఎల్ 2025 ప్రారంభానికి ముందు పంజాబ్ కింగ్స్ నయా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సూపర్ ఫామ్‌ను కొనసాగించాడు. నిన్న (మార్చి 19) జరిగిన ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్‌లో విధ్వంసకర హాఫ్ సెంచరీ (41 బంతుల్లో 85 పరుగులు) విరుచుకుపడ్డాడు. పంజాబ్ కింగ్స్ టీమ్-ఏ, టీమ్-బిగా విడిపోయి ప్రాక్టీస్ మ్యాచ్ ఆడగా.. టీమ్-బి శ్రేయస్ అయ్యర్ ప్రాతినిథ్యం వహించాడు. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రేయస్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 205 పరుగులు చేసింది. శ్రేయస్ ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో ప్రదర్శించిన ఫామ్‌ను కొనసాగించాడు. అనంతరం ఛేదనలో టీమ్-ఏ కూడా పర్వాలేదనిపించింది. ఆ జట్టుకు ఓపెనర్లు ప్రియాన్ష్ ఆర్య, ప్రభ్‌సిమ్రన్ సింగ్ మెరుపు ఆరంభాన్ని అందించారు. వీరిద్దరు పోటీ పడి బౌండరీలు, సిక్సర్లు బాదారు. ఆర్య 72, ప్రభ్‌సిమ్రన్ 66 పరుగులు చేసి ఔటైన అనంతరం టీమ్-ఏ కష్టాల్లో పడింది. ఆతర్వాత వచ్చిన బ్యాటర్లు పెద్ద స్కోర్లు చేయలేకపోవడంతో టీమ్-ఏ నిర్ణీత ఓవర్లలో 198 పరుగులు మాత్రమే చేయగలిగింది. తద్వారా శ్రేయస్ టీమ్ 7 పరుగుల తేడాతో విజయం సాధించింది. టీమ్-ఏ ఓడిపోయినా ప్రియాన్ష్ ఆర్య, ప్రభ్‌సిమ్రన్ సింగ్ ఫామ్‌లోకి రావడం పంజాబ్ కింగ్స్‌కు శుభసూచకం. ఈ ఇద్దరే రానున్న సీజన్లో పంజాబ్ ఇన్నింగ్స్‌లు ప్రారంభిస్తారు. ఈ ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్‌లో మరో అద్భుత ప్రదర్శన నమోదైంది. శ్రేయస్ టీమ్‌లో భాగమైన అర్ష్‌దీప్ సింగ్ 4 ఓవర్లలో కేవలం 22 పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు తీశాడు. సీజన్ ప్రారంభానికి ముందు పంజాబ్‌కు ఇది కూడా శుభసూచకమే. మొత్తంగా ముగ్గురు బ్యాటర్లు, ఓ బౌలర్ ప్రాక్టీస్ మ్యాచ్‌లో ఫామ్‌ను ప్రదర్శించడం పంజాబ్ కింగ్స్‌కు తమ తొలి మ్యాచ్ ముందు మంచి బూస్టప్‌ను ఇస్తుంది. ఐపీఎల్ 2025 సీజన్ ఈ నెల 22 నుంచి ప్రారంభం కానుండగా... పంజాబ్ కింగ్స్ మార్చి 25న గుజరాత్ టైటాన్స్‌తో తమ తొలి మ్యాచ్ ఆడనుంది. ఈసారి పంజాబ్ కింగ్స్ గతంలో ఎప్పుడూ లేనంత పటిష్టంగా కనిపిస్తుంది. ఆ జట్టు బ్యాటింగ్ విభాగాన్ని చూస్తే ఎంతటి బౌలర్లైనా ఉలిక్కి పడాల్సిందే.శ్రేయస్ అయ్యర్, మార్కస్ స్టోయినిస్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, శశాంక్ సింగ్, జోస్ ఇంగ్లిస్, ప్రభ్‌సిమ్రన్ సింగ్, ఆరోన్ హార్డీ, అజ్మతుల్లా ఒమర్జాయ్, మార్కో జన్సెన్ రూపంలో ఆ జట్టులో డైనమైట్లు ఉన్నారు. బౌలింగ్ విభాగం కాస్త బలహీనంగా కనిపిస్తున్నా.. బ్యాటింగ్ బలగం చూసి పంజాబ్‌ను టైటిల్ ఫేవరెట్లలో ఒకటిగా చెప్పవచ్చు.తొలి మ్యాచ్‌తో పంజాబ్ ఎదుర్కోబోయే గుజరాత్ ఈ సీజన్లో కొత్తగా కనిపిస్తుంది. జోస్ బట్లర్, గ్లెన్ ఫిలిప్స్ లాంటి విధ్వంసకర బ్యాటర్ల చేరికతో ఆ జట్టు బ్యాటింగ్ విభాగం కూడా ప్రమాదకరంగా కనిపిస్తుంది. శుభ్‌మన్ గిల్ నేతృత్వంలో ఆ జట్టు టైటిల్ గెలిచేందుకు ఉరకలేస్తుంది. గుజరాత్ బౌలింగ్ విభాగం కూడా పటిష్టంగా కనిపిస్తుంది. రబాడ, సిరాజ్, ఇషాంత్ శర్మ, ప్రసిద్ద్ కృష్ణ, గెరాల్డ్ కొయెట్జీ లాంటి అంతర్జాతీయ స్థాయి పేసర్లతో కళకళలాడుతుంది. ప్రపంచ మేటి స్పిన్నర్ రషీద్ ఖాన్ ఆ జట్టులో ఉండనే ఉన్నాడు. అతనితో పాటు కొత్తగా వాషింగ్టన్ సుందర్ స్పిన్ విభాగంలో చేరాడు. దేశీయ ఆటగాళ్లు సాయి సుదర్శన్, రాహుల్ తెవాతియా, షారుఖ్ ఖాన్, మహిపాల్ లోమ్రార్ గుజరాత్‌కు అదనపు బలాన్ని ఇస్తున్నారు.పంజాబ్ కింగ్స్శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), నేహల్ వధేరా, ప్రియాన్ష్ ఆర్య, హర్నూర్ సింగ్, పైలా అవినాశ్, ముషీర్ ఖాన్, మార్కస్ స్టోయినిస్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, శశాంక్ సింగ్, ఆరోన్ హార్డీ, అజ్మతుల్లా ఒమర్జాయ్, మార్కో జన్సెన్, సూర్యాంశ్ షేడ్గే, ప్రవీణ్ దూబే, జోస్ ఇంగ్లిస్, ప్రభ్‌సిమ్రన్ సింగ్, విష్ణు వినోద్, హర్‌ప్రీత్ బ్రార్, అర్షదీప్ సింగ్, యుజ్వేంద్ర చహల్, లోకీ ఫెర్గూసన్, విజయ్‌కుమార్ వైశాక్, కుల్దీప్ సేన్, యశ్ ఠాకూర్, జేవియర్ బార్ట్లెట్గుజరాత్ టైటాన్స్శుభ్మన్ గిల్ (కెప్టెన్), సాయి సుదర్శన్, గ్లెన్ ఫిలిప్స్, రాహుల్ తెవాతియా, షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్, రషీద్ ఖాన్, మహిపాల్ లోమ్రార్, రవిశ్రీనివాసన్ సాయి కిషోర్, షారుఖ్ ఖాన్, నిషాంత్ సింధు, అర్షద్ ఖాన్, కరీమ్ జనత్, వాషింగ్టన్ సుందర్, జయంత్ యాదవ్, జోస్ బట్లర్, కుమార్ కుషాగ్రా, అనూజ్ రావత్, గెరాల్డ్ కొయెట్జీ, మానవ్ సుతార్, గుర్నూర్ బ్రార్, ఇషాంత్ శర్మ, కగిసో రబాడ, కుల్వంత్ కేజ్రోలియా, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ద్ కృష్ణ -
IPL 2025: రియాన్ పరాగ్ విధ్వంసకర శతకం.. 16 ఫోర్లు, 10 సిక్సర్లతో..!
ఐపీఎల్ 2025 ప్రారంభానికి ముందే రాజస్థాన్ రాయల్స్ చిచ్చరపిడుగుల బ్యాటింగ్ ఊచకోత మొదలైంది. నిన్న జరిగిన ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్‌లో ముగ్గురు రాయల్స్ బ్యాటర్లు చెలరేగిపోయారు. స్టార్ బాయ్ రియాన్ పరాగ్, వికెట్‌కీపర్ బ్యాటర్ దృవ్ జురెల్ విధ్వంసకర సెంచరీలతో విరుచుకుపడగా.. యువ సంచలనం యశస్వి జైస్వాల్ మెరుపు అర్ద శతకంతో బీభత్సం సృష్టించాడు. రాజస్థాన్ రాయల్స్ రెండు గ్రూప్‌లుగా విడిపోయి ఆడిన మ్యాచ్‌లో తొలుత రియాన్ పరాగ్ శతకొట్టాడు. రియాన్ 64 బంతుల్లో 10 సిక్సర్లు, 16 ఫోర్ల సాయంతో 144 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అనంతరం జురెల్ 44 బంతుల్లో 104 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఆతర్వాత జైస్వాల్ 34 బంతుల్లో 83 పరుగులు చేసి ఔటయ్యాడు. ఈ ముగ్గురిలో రియాన్ పరాగ్ విధ్వంసం ఓ రేంజ్లో సాగింది. 144* (64) - What a Riyan yaar 🔥💗 pic.twitter.com/K6Ht3wRFQE— Rajasthan Royals (@rajasthanroyals) March 19, 2025రియాన్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. రియాన్ తన వీర బాదుడును ముగించుకుని పెవిలియన్‌కు వెళ్తుండగా సహచరులు సంజూ, జైస్వాల్, జురెల్ ప్రశంసలతో ముంచెత్తారు. సంజూ 'వెల్ డన్ మచ్చా..నైస్ హిట్టింగ్' అనగా.. జైస్వాల్, జురెల్ 'వాట్ ఎ రియాన్' అంటూ అభినందించారు. సహచరులు రియాన్‌ను అభినందిస్తున్న వీడియో రాయల్స్ తమ సోషల్‌మీడియా ఖాతాల్లో పోస్ట్ చేసింది.కాగా, ఐపీఎల్ 2025 సీజన్ మరో రెండు రోజుల్లో ప్రారంభం కానుండగా అన్ని జట్లు ప్రాక్టీస్‌ను ముమ్మరం చేశాయి. ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్‌లు ఆడుతూ బిజీగా గడుపుతున్నాయి. మార్చి 22న డిఫెండింగ్ ఛాంపియన్ కేకేఆర్, ఆర్సీబీ మధ్య జరిగే మ్యాచ్‌తో ఐపీఎల్ 18వ ఎడిషన్ ప్రారంభం కానుంది. ఈ సీజన్లో రాజస్థాన్ రాయల్స్ తమ ప్రయాణాన్ని మార్చి 23న సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగే మ్యాచ్‌తో ప్రారంభిస్తుంది. ఈ సీజన్లో రాయల్స్, సన్‌రైజర్స్ జట్లు బ్యాటింగ్ విస్పోటాలు కలిగి ఉన్నాయి. ఇరు జట్లలో విధ్వంసకర వీరులు ఉన్నారు. బౌలర్లను ఊచకోత కోయడంలో ఈ ఇరు జట్ల మధ్య పోటీ పెడితే ఎవరు గెలుస్తారో చెప్పలేం.సన్‌రైజర్స్‌లో ట్రవిస్ హెడ్, నితీశ్ కుమార్ రెడ్డి, అభిషేక్ శర్మ, హెన్రిచ్ క్లాసెన్, ఇషాన్ కిషన్ లాంటి విధ్వంసకర యోధులు ఉండగా.. రాయల్స్‌లో రియాన్ పరాగ్, దృవ్ జురెల్, సంజూ శాంసన్, యశస్వి జైస్వాల్, హెట్‌మైర్ లాంటి చిచ్చరపిడుగులు ఉన్నారు.సన్‌రైజర్స్ హైదరాబాద్..పాట్ కమిన్స్ (కెప్టెన్), అథర్వ్ తైడే, అభినవ్ మనోహర్, అనికేత్ వర్మ, సచిన్ బేబి, ట్రవిస్ హెడ్, నితీశ్ కుమార్ రెడ్డి, కమిందు మెండిస్, వియాన్ ముల్దర్, అభిషేక్ శర్మ, హెన్రిచ్ క్లాసెన్, ఇషాన్ కిషన్, జీషన్ అన్సారీ, మహ్మద్ షమీ, హర్షల్ పటేల్, రాహుల్ చాహర్, సిమర్జీత్ సింగ్, ఎషాన్ మలింగ, ఆడమ్ జంపా, జయదేవ్ ఉనద్కత్రాజస్థాన్ రాయల్స్..సంజూ శాంసన్ (కెప్టెన్), వైభవ్ సూర్యవంశీ, యశస్వి జైస్వాల్, నితీశ్ రాణా, శుభమ్ దూబే, షిమ్రోన్ హెట్‌మైర్, రియాన్ పరాగ్, యుద్ద్‌వీర్ సింగ్ చరక్, వనిందు హసరంగ, దృవ్ జురెల్, కునాల్ సింగ్ రాథోడ్, సందీప్ శర్మ, తుషార్ దేశ్‌పాండే, కుమార్ కార్తీకేయ, ఆకాశ్ మధ్వాల్, క్వేనా మపాకా, మహీశ్ తీక్షణ, ఫజల్ హక్ ఫారూకీ, అశోక్ శర్మ, జోఫ్రా ఆర్చర్ -
ఐపీఎల్లో ‘సలైవా’కు అనుమతి!
న్యూఢిల్లీ: బంతిపై నునుపుదనం పెంచడం కోసం సలైవా (ఉమ్మి)ని వాడేందుకు అనుమతించాలంటూ ఇటీవల భారత పేసర్ మొహమ్మద్ షమీ విజ్ఞప్తి చేశాడు. సాధారణంగా ఉమ్మిని రుద్దడం వల్ల బంతి తన మెరుపును కోల్పోకుండా ఉండి రివర్స్ స్వింగ్‌కు సహకరిస్తుంది. ఎన్నో ఏళ్లుగా ఇది ఆటలో భాగంగానే ఉన్నా... కోవిడ్ వచి్చనప్పుడు దీనిపై ఐసీసీ నిషేధం విధించింది. ఇప్పుడు ఆ ప్రమాదం లేదు కాబట్టి నిబంధన తొలగించాలంటూ బౌలర్లు కోరుతున్నారు. ఈ విషయంలో బీసీసీఐ తీవ్రంగా ఆలోచిస్తోంది. బ్యాటర్ల ఆధిపత్యం సాగే లీగ్‌లో కొంతైనా బౌలర్లకు ‘రివర్స్ స్వింగ్’ ప్రయోజనం కలగవచ్చు. కాబట్టి కెప్టెన్లందరూ అంగీకరిస్తే ఐపీఎల్లో ‘సలైవా’ వాడేందుకు బోర్డు అనుమతించే అవకాశం ఉంది. మరోవైపు గతంలోలాగే హైట్, ఆఫ్ సైడ్ వైడ్లను నిర్ణయించే విషయంలో డీఆర్ఎస్ కొనసాగనుంది. -
కోల్'కథ' ఎంతవరకు!
ఏ జట్టయినా విజయవంతమైన కూర్పును కొనసాగించాలనుకుంటుంది... కానీ కోల్‌కతా నైట్‌రైడర్స్ మాత్రం అందుకు విభిన్నమైన ప్రణాళికలతో అభిమానులను సైతం ఆశ్చర్యపరిచింది. దశాబ్దకాలం తర్వాత తమ జట్టుకు ఐపీఎల్ ట్రోఫీ అందించిన కెపె్టన్ శ్రేయస్ అయ్యర్‌ను వేలానికి వదిలేసుకున్న నైట్‌రైడర్స్... ఓ మామూలు ఆటగాడి కోసం భారీగా ఖర్చు పెట్టింది. జాతీయ జట్టుకు దూరమైన సీనియర్ ప్లేయర్ అజింక్య రహానేకు పిలిచి మరీ జట్టు పగ్గాలు అప్పగించింది. అయితే ఎన్ని మార్చినా కోర్ గ్రూప్‌ను మాత్రం కదల్చని కోల్‌కతా... డిఫెండింగ్ చాంపియన్‌గా టైటిల్ నిలబెట్టుకునేందుకు సై అంటోంది! ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు మాత్రమే ఐపీఎల్ చరిత్రలో వరుసగా రెండేళ్లు చాంపియన్‌గా నిలిచాయి. నైట్‌రైడర్స్ ఈసారి తమ గెలుపు ‘కథ’ను ఎంతవరకు తీసుకెళ్తుందనేది ఆసక్తికరం కానుంది! –సాక్షి క్రీడావిభాగం ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) చరిత్రలో చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ చెరో ఐదుసార్లు ట్రోఫీ చేజిక్కించుకోగా... ఆ తర్వాత అత్యధికంగా కోల్‌కతా నైట్‌రైడర్స్ (కేకేఆర్) మూడుసార్లు విజేతగా నిలిచింది. 2012, 2014, 2024లో కేకేఆర్ ట్రోఫీ హస్తగతం చేసుకుంది. గతేడాది ఐపీఎల్ వేలంలో ‘కోర్ గ్రూప్’ను తిరిగి కొనసాగించిన ఫ్రాంచైజీ... జట్టుకు మూడోసారి కప్పు అందించిన కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, ఆ్రస్టేలియా స్టార్ పేసర్ స్టార్క్‌ను మాత్రం వదిలేసుకుంది. పేస్ ఆల్‌రౌండర్ వెంకటేశ్ అయ్యర్ కోసం ఏకంగా రూ. 23 కోట్ల 75 లక్షలు ఖర్చు చేసి ఆశ్చర్యపరిచిన యాజమాన్యం... కోటిన్నర ప్రాథమిక ధరతో కొనుగోలు చేసుకున్న సీనియర్ బ్యాటర్ అజింక్య రహానేకు అనూహ్యంగా కెప్టెన్సీ పగ్గాలు అప్పగించింది. వేలంలో ఒక్కో జట్టు అత్యధికంగా 25 మందిని ఎంపిక చేసుకునే అవకాశం ఉండగా... కేకేఆర్ 21 మందినే తీసుకుంది. సిక్సర్ల వీరుడు రింకూ సింగ్‌కు రూ. 13 కోట్లు... ‘మిస్టరీ స్పిన్నర్’ వరుణ్ చక్రవర్తి, వెస్టిండీస్ టి20 స్పెషలిస్ట్‌లు రసెల్, నరైన్‌లకు రూ. 12 కోట్లు చొప్పున అందించి అట్టిపెట్టుకున్న ఫ్రాంచైజీ... హర్షిత్ రాణా, రమణ్‌దీప్‌లను రూ. 4 కోట్లతో కొనసాగించింది. ఆరుగురు ప్లేయర్లను అట్టిపెట్టుకునే అవకాశం ఉంటే దాన్ని సంపూర్ణంగా వినియోగించుకుంది. నరైన్‌పై భారీ అంచనాలు... సుదీర్ఘ అనుభవం ఉన్న చంద్రకాంత్ పండిత్ కేకేఆర్‌కు కోచ్‌గా వ్యవహరిస్తుండగా... గతేడాది జట్టుకు మెంటార్‌గా ఉన్న గౌతమ్ గంభీర్ ... టైటిల్ గెలిచిన అనంతరం టీమిండియా హెడ్ కోచ్‌గా వెళ్లిపోయాడు. ఇప్పుడతడి స్థానంలో విండీస్ మాజీ ఆటగాడు డ్వేన్ బ్రావో మెంటార్‌గా వ్యవహరించనున్నాడు. ఐపీఎల్ చరిత్రలో ముంబై, చెన్నై జట్లు మాత్రమే వరుసగా రెండు సీజన్లు విజేతగా నిలిచాయి. ఇప్పుడు కోల్‌కతా ముందు అలాంటి అరుదైన అవకాశం మూడోసారి ఉంది. వెస్టిండీస్ స్పిన్ ఆల్‌రౌండర్ నరైన్‌ను ఓపెనర్‌గా దింపి మెరుగైన ఫలితాలు రాబట్టిన కేకేఆర్ ఈసారి కూడా అదే ప్లాన్ అనుసరిస్తుందనడంలో సందేహం లేదు. అంతర్జాతీయ క్రికెట్‌కు ఎప్పుడో వీడ్కోలు పలికిన నరైన్... కేకేఆర్ తరఫున అటు స్పిన్నర్‌గా ఇటు ఓపెనర్‌గా కీలక పాత్ర పోషిస్తున్నాడు. గత సీజన్లో 488పరుగులు, 17 వికెట్లు తీసి ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’గా నిలిచాడు. గుర్బాజ్, నరైన్ ఇన్నింగ్స్ ఆరంభించడం ఖాయమే కాగా... అజింక్య రహానే, వెంకటేశ్ అయ్యర్, రింకూ సింగ్, రసెల్, రమణ్‌దీప్ సింగ్ మిడిలార్డర్లో బ్యాటింగ్‌కు రానున్నారు. బౌలింగ్‌లో వరుణ్ చక్రవర్తి, నరైన్, హర్షిత్ రాణా, వైభవ్ అరోరా కీలకం కానున్నారు. రహానే రాణించేనా? డిఫెండింగ్ చాంపియన్‌గా మరింత బాధ్యతగా ఉండాల్సిన కేకేఆర్... తన నిర్ణయాలతో ఆశ్చర్యపరిచింది. కప్పు అందించిన కెపె్టన్‌ను వదిలేసుకోవడం... తుదిజట్టులో ఉంటాడో లేదో నమ్మకంగా చెప్పలేని ఆటగాడికి జట్టు పగ్గాలు అప్పగించడం... వెరసి సీజన్ ఆరంభానికి ముందే వార్తల్లో నిలిచింది. ఫామ్‌లేమికి తోడు వయసు మీదపడుతున్న కారణంగా భారత జట్టుకు దూరమైన రహానే మరి కేకేఆర్‌ను ఎలా నడిపిస్తాడో చూడాలి. వెంకటేశ్ అయ్యర్ వైస్ కెప్టెన్ గా వ్యవహరించనుండగా... ఆస్థాన ఆటగాళ్లు రసెల్, నరైన్ కేకేఆర్‌కు ప్రధాన బలంకానున్నారు. బౌలింగ్, బ్యాటింగ్‌లో ఈ ఇద్దరు జట్టుకు చేకూర్చే విలువ మాటల్లో చెప్పలేనిది. ఇటీవల చాంపియన్స్ ట్రోఫీలో చక్కటి ప్రదర్శన కనబర్చిన వరుణ్ చక్రవర్తిపై భారీ అంచనాలు ఉన్నాయి. నోర్జే, స్పెన్సర్ జాన్సన్, హర్షిత్ రాణా, రావ్మన్ పావెల్, వైభవ్ అరోరాతో పేస్ విభాగం బలంగానే ఉన్నా... వీరు ఎలాంటి ప్రదర్శన కనబరుస్తారో చూడాలి. విదేశీ ఆటగాళ్ల కోటాలో నరైన్, రసెల్, గుర్బాజ్ తుది జట్టులో ఉండటం పక్కా కాగా... నాలుగో ప్లేయర్‌గా నోర్జే, మొయిన్ అలీలలో ఒకరికి అవకాశం దక్కొచ్చు. కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు: రహానే (కెప్టెన్), రింకూ సింగ్, డికాక్, గుర్బాజ్, రఘువంశీ, పావెల్, మనీశ్ పాండే, లవ్నిత్ సిసోడియా, వెంకటేశ్ అయ్యర్, అనుకూల్ రాయ్, మొయిన్ అలీ, రమణ్‌దీప్, రసెల్, నోర్జే, వైభవ్, మయాంక్ మార్కండే, స్పెన్సర్ జాన్సన్, హర్షిత్ రాణా, నరైన్, వరుణ్, చేతన్ సకారియా. అంచనా: డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగుతున్న కేకేఆర్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. బ్యాటింగ్, బౌలింగ్‌లో నాణ్యమైన ప్లేయర్లు ఉన్న కోల్‌కతా... స్థాయికి తగ్గ ఆటతీరు ప్రదర్శిస్తే ఫైనల్‌కు చేరడం పెద్ద కష్టం కాదు. రహానే జట్టును ఎలా నడిపిస్తాడనేది కీలకం. -
రూ.4 కోట్ల 75 లక్షలు!
ముంబై: భారత క్రికెట్ జట్టు లెగ్‌స్పిన్నర్ యుజువేంద్ర చహల్, ధనశ్రీ వర్మ మధ్య వివాహ బంధం అధికారికంగా ముగింపు దశకు వచ్చింది. వీరిద్దరు చాలా కాలంగా దూరంగానే ఉంటున్నా ఈ ఏడాది ఫిబ్రవరి 5న తమ విడాకుల కోసం ఫ్యామిలీ కోర్టులో కేసు వేశారు. కానీ హిందూ వివాహ చట్టం ప్రకారం సర్దుబాటు కోసం ప్రయత్నించేందుకు వీలుగా కనీసం ఆరు నెలల సమయం ఇస్తారు. దీనినే ‘కూలింగ్ ఆఫ్ పీరియడ్’గా చెబుతారు.అయితే తాము రెండున్నరేళ్లకు పైగా విడిగానే ఉంటున్నామని, పరస్పర అంగీకారంతో విడాకులు కోరుతున్నాం కాబట్టి ‘కూలింగ్ ఆఫ్ పీరియడ్’ను తొలగించి వెంటనే విడాకులు మంజూరు చేయాలని చహల్, ధనశ్రీ కోరారు. ఈ విజ్ఞప్తిని ఫ్యామిలీ కోర్టు కొట్టేయడంతో వారు హైకోర్టును ఆశ్రయించారు. ఐపీఎల్ కారణంగా తాను కనీసం మూడు నెలలు అందుబాటులో ఉండలేనని కూడా చహల్ వెల్లడించాడు. దీనిపై స్పందించిన హైకోర్టు...ఈ నిబంధన నుంచి వీరిద్దరికి సడలింపు ఇవ్వాలని ఆదేశించడంతో పాటు విడాకులకు సంబంధించి గురువారమే తుది తీర్పు ఇవ్వాలని కూడా సూచించింది. మరోవైపు విడాకుల ప్రక్రియను ముగించే క్రమంలో ధనశ్రీకి చహల్ రూ. 4 కోట్ల 75 లక్షలు భరణం రూపంలో చెల్లించనున్నాడు.ఇందులో అతను ఇప్పటికే రూ. 2 కోట్ల 37 లక్షలు ఇచ్చేశాడు. యూట్యూబర్, కొరియాగ్రాఫర్ ధనశ్రీ వర్మతో చహల్‌కు డిసెంబర్, 2020లో పెళ్లి జరగ్గా... 18 నెలల తర్వాత జూన్ 2022 నుంచి వీరిద్దరు విడిగానే ఉంటున్నారు. -
‘అక్షర్‌తో పోలిస్తే అతడికి కాస్త కష్టమే.. కోహ్లి సూపర్స్టార్డమ్తో పోటీ’
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)- 2025లో ఐదు జట్లకు కొత్త కెప్టెన్లు వచ్చారు. లక్నో సూపర్ జెయింట్స్‌కు రిషభ్ పంత్ (Rishabh Pant), పంజాబ్ కింగ్స్‌కు శ్రేయస్ అయ్యర్, ఢిల్లీ క్యాపిటల్స్‌కు అక్షర్ పటేల్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు రజత్ పాటిదార్, కోల్‌కతా నైట్ రైడర్స్‌కు అజింక్య రహానే సారథ్యం వహించనున్నారు.అయితే, వీరిలో రజత్ (Rajat Patidar), అక్షర్‌లకు ఐపీఎల్లో కెప్టెన్‌గా పనిచేసిన అనుభవం లేదు. ఈ నేపథ్యంలో ఈసారి ఈ ఇద్దరు కఠిన సవాళ్లు ఎదుర్కోబోతున్నారని టీమిండియా మాజీ వికెట్ కీపర్ బ్యాటర్ రాబిన్ ఊతప్ప అన్నాడు. అయితే, వీరిద్దరిలో రజత్తో పోలిస్తే అక్షర్‌పై ఒత్తిడి కాస్త తక్కువగా ఉంటుందని అభిప్రాయపడ్డాడు.కోహ్లి సూపర్స్టార్డమ్తోనూ పోటీఇందుకు గల కారణాన్ని వెల్లడిస్తూ.. ‘‘అక్షర్ పటేల్, రజత్ పాటిదార్లను పోల్చి చూస్తే అక్షర్‌కు కాస్త వెసలుబాటు ఉంటుంది. జట్టు, సారథ్య బాధ్యతలు తీసుకోవడం కొత్తే అయినా.. కొంతమంది పాతవాళ్లు కూడా ఉండటం అక్షర్‌కు సానుకూలాంశం.రజత్‌కు కూడా జట్టులో కొంతమంది ఆటగాళ్లతో గతంలో ఆడిన అనుభవం ఉంది. కానీ.. అతడు మిగతా విషయాలతో పాటు.. విరాట్ కోహ్లి సూపర్స్టార్డమ్తోనూ పోటీ పడాల్సి ఉంటుంది. అతడిపై కోహ్లి ప్రభావం కచ్చితంగా ఉంటుంది. కెప్టెన్సీ నైపుణ్యాలు మెరగుపరచుకునే క్రమంలో ఒక్కోసారి కోహ్లిపైనే ఆధారపడాల్సి ఉంటుంది.కోహ్లి నీడలో కాకుండా.. అయితే, నాకు తెలిసి రజత్‌కు ఆర్సీబీ మేనేజ్మెంట్ పూర్తి స్వేచ్ఛ ఇచ్చి ఉంటుందనిపిస్తోంది. కోహ్లి నీడలో కాకుండా.. రజత్ తన మార్కు చూపిస్తే బాగుంటుంది. ఏదేమైనా ఈసారి ఆర్సీబీ, కోల్‌కతా, ఢిల్లీ జట్లు తమ కొత్త కెప్టెన్లతో ఎలాంటి ఫలితాలు సాధిస్తాయో చూడాలని ఆతురతగా ఉంది.ముఖ్యంగా రజత్పైనే ఎక్కువ మంది దృష్టి సారిస్తారు అనడంలో సందేహం లేదు. ఆర్సీబీకి ఉన్న క్రేజ్ అలాంటిది. ఈ జట్టు ఒక్కసారి కూడా టైటిల్ గెలవలేదు.. కాబట్టి రజత్ ఆ రాతను మారుస్తాడో లేదో చూడాలి. దేశవాళీ క్రికెట్లో మధ్యప్రదేశ్ జట్టుకు విజయాలు అందించిన ఘనత అతడికి ఉంది. అయితే, ఐపీఎల్‌లోనూ అదే ఫలితాన్ని పునరావృతం చేయడం అంత సులువేమీ కాదు’’ అని రాబిన్ ఊతప్ప అభిప్రాయపడ్డాడు. కాగా ఐపీఎల్-2025 సీజన్ మార్చి 22న కోల్‌కతా- బెంగళూరు మధ్య మ్యాచ్‌తో మొదలుకానుంది.ఐపీఎల్-2025లో ఆర్సీబీ జట్టువిరాట్ కోహ్లి, రజత్ పటిదార్, యశ్ దయాళ్, జోష్ హాజల్‌వుడ్, ఫిల్ సాల్ట్,జితేశ్ శర్మ, భువనేశ్వర్ కుమార్, లియామ్ లివింగ్‌స్టోన్, రసిక్ ధార్, కృనాల్ పాండ్యా , టిమ్ డేవిజ్, జాకబ్ బెథెల్, సుయాశ్ శర్మ, దేవ్‌దత్ పడిక్కల్, తుషార, రొమరియో షెఫర్డ్, లుంగి ఎంగిడి, స్వప్నిల్ సింగ్, మనోజ్, మోహిత్ రాఠి, అభినందన్, స్వస్తిక్ చికార.చదవండి: ముగ్గురు టీమిండియా కెప్టెన్లు.. అది నా అదృష్టం: హార్దిక్ పాండ్యా -
‘రేపు మీ బౌలింగ్‌ను చితక్కొడతాను చూడు!.. అన్నంత పని చేశాడు’
పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer)పై ఒకప్పటి సహచర ఆటగాడు, అతడి స్నేహితుడు అమన్ ఖాన్ (Aman Khan) ప్రశంసలు కురిపించాడు. అయ్యర్‌లో ఆత్మవిశ్వాసం మెండు అని.. ఓ మ్యాచ్‌లో చెప్పి మరీ తమ జట్టు బౌలింగ్‌ను చితక్కొట్టాడని గుర్తు చేసుకున్నాడు. ప్రత్యర్థి ఎవరన్న అంశంతో సంబంధం లేకుండా దూకుడుగా ముందుకు సాగుతాడని కొనియాడాడు.పునరాగమనంలో సూపర్ హిట్‌కాగా గాయం సాకు చూపి రంజీ మ్యాచ్ ఆడకుండా తప్పించుకున్నాడన్న ఆరోపణలతో శ్రేయస్ అయ్యర్ గతేడాది సెంట్రల్ కాంట్రాక్టు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో.. జాతీయ జట్టుకు దూరమైన అతడు.. కఠిన శ్రమకోర్చి దేశవాళీ క్రికెట్లో తనను తాను మరోసారి నిరూపించుకున్నాడు.ముంబై తరఫున బరిలోకి దిగి రంజీ (ఫస్ట్ క్లాస్), విజయ్ హజారే ట్రోఫీ (వన్డే), సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ (టీ20)లలో విధ్వంసకర ఇన్నింగ్స్‌తో పరుగుల సునామీ సృష్టించాడు. ఈ క్రమంలో తిరిగి జాతీయ జట్టుకు ఎంపికైన శ్రేయస్ అయ్యర్.. ఇటీవల ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 (ICC Champions Trophy)లోనూ అదరగొట్టాడు.దుబాయ్ వేదికగా జరిగిన ఈ వన్డే టోర్నమెంట్లో నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేసిన అయ్యర్.. టీమిండియా చాంపియన్‌గా నిలవడంలో కీలక పాత్ర పోషించాడు. మొత్తంగా 243 పరుగులు సాధించి భారత్ తరఫున టాప్ రన్ స్కోరర్‌గా నిలిచాడు. ఇదిలా ఉంటే.. ఐపీఎల్-2025 మెగా వేలంలో ఈ కుడిచేతి వాటం బ్యాటర్ భారీ ధర పలికిన విషయం తెలిసిందే.రూ. 26.75 కోట్లుపంజాబ్ కింగ్స్ ఏకంగా రూ. 26.75 కోట్లకు శ్రేయస్ అయ్యర్‌ను కొనుగోలు చేసి.. కెప్టెన్‌గా నియమించింది. గతేడాది కోల్‌కతా నైట్ రైడర్స్‌ను చాంపియన్‌గా నిలిపిన అతడిని ఈసారి తమ సొంతం చేసుకుని పగ్గాలు అప్పగించింది. ఈ నేపథ్యంలో శ్రేయస్ అయ్యర్ గురించి కోల్‌కతా మాజీ ఆల్‌రౌండర్ అమన్ ఖాన్ ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.రేపు మీ బౌలింగ్‌ను చితక్కొడుతాను చూడు‘‘విజయ్ హజారే మ్యాచ్‌కు ముందు.. నేను, శ్రేయస్ డిన్నర్‌కు వెళ్లాం. ప్రత్యర్థులుగా పోటీ పడటం గురించి చర్చిస్తూ సరదాగా గడిపాము. శ్రేయస్ ముంబైకి ఆడుతుంటే.. నేను పాండిచ్చేరికి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. మరుసటి రోజు మ్యాచ్ గురించి చెబుతూ.. ‘రేపు మీ బౌలింగ్‌ను చితక్కొడుతాను చూడు’ అన్నాడు.పదహారు ఫోర్లు, నాలుగు సిక్సర్ల సాయంతోఅన్నట్లుగానే సెంచరీ చేశాడు. కేవలం 133 బంతుల్లోనే 137 పరుగులతో అజేయంగా నిలిచాడు. మిగతా ముంబై బ్యాటర్లంతా పరుగులు రాబట్టేందుకు ఆపసోపాలు పడుతున్న వేళ శ్రేయస్ అయ్యర్ మాత్రం ముందు రోజు రాత్రి నాకేం చెప్పాడో అది చేసి చూపించాడు’’ అని అమన్ ఖాన్ టైమ్స్ ఆఫ్ ఇండియాతో పేర్కొన్నాడు.కాగా గతేడాది విజయ్ హజారే మ్యాచ్‌లో భాగంగా పాండిచ్చేరితో తలపడ్డ ముంబై.. 82 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన వేళ శ్రేయస్ బ్యాట్ ఝులిపించాడు. పదహారు ఫోర్లు, నాలుగు సిక్సర్ల సాయంతో శతక్కొట్టి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.ఇదిలా ఉంటే.. ఐపీఎల్-2022స సీజన్లో శ్రేయస్ కెప్టెన్సీలో కేకేఆర్ తరఫున అమన్ ఖాన్ ఆడాడు. తాము తప్పకుండా టైటిల్ గెలుస్తామని అతడు తరచూ చెప్పేవాడని.. అన్నట్లుగానే 2024లో కోల్‌కతాను చాంపియన్‌గా నిలిపాడని అమన్ ఖాన్ గుర్తు చేసుకున్నాడు. ఆటగాళ్లపై అరవడం, మైదానంలో దూకుడుగా కనిపించడం శ్రేయస్ శైలి కాదని.. కూల్‌గానే తను అనుకున్న ఫలితం రాబట్టడంలో అతడు దిట్ట అని ప్రశంసించాడు.చదవండి: ముగ్గురు టీమిండియా కెప్టెన్లు.. అది నా అదృష్టం: హార్దిక్ పాండ్యా -
విధ్వంసకర వీరులు.. పంత్‌కు పగ్గాలు.. లక్నో ఫైనల్ చేరుతుందా?
లక్నో సూపర్ జెయింట్స్ జట్టు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) లో 2022లో అరంగేట్రం చేసింది. వరుసగా రెండు (2022, 2023) సీజన్లలో మూడో స్థానంలో నిలిచి.. ప్లే ఆఫ్స్ చేరింది. అయితే, గతేడాది మాత్రం లక్నోకు ఎదురు దెబ్బతగిలింది. తొలిసారిగా ఐపీఎల్లో లీగ్ దశ నుంచే నిష్క్రమించింది. ఏడు విజయాలు, ఏడు పరాజయాలతో 14 పాయింట్లతో ఏడవ స్థానంతో ముగించింది.ఈ నేపథ్యంలో 2025 సీజన్ కోసం జట్టులో భారీ మార్పులు చేపట్టింది. ఐపీఎల్ మెగా వేలం ఇందుకు అనువుగా ఉపయోగించుకుంది. విశాఖపట్నంలోని డాక్టర్ వై.ఎస్. రాజశేఖర రెడ్డి ఏసీఏ-విడిసిఏ క్రికెట్ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్ మార్చి 24 (గురువారం)న ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగే మ్యాచ్ తో లక్నో సూపర్ జెయింట్స్ తన ఐపీఎల్ టైటిల్ వేట ప్రారంభిస్తుంది.భారీ మార్పులతో కొత్త సీజన్లోకి ప్రారంభంలో నికోలస్ పూరన్ (Nicholas Pooran), రవి బిష్ణోయ్, మయాంక్ యాదవ్, ఆయుష్ బదోని, మోసిన్ ఖాన్ వంటి ఆటగాళ్ళని రెటైన్ చేసుకుంది. అయితే అనూహ్యంగా కెప్టెన్ కేఎల్ రాహుల్ (KL Rahul)ను తప్పించాలని నిర్ణయించింది. రాహుల్ ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో చేరాడు. వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ విడుదల చేసిన భారత యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ (Rishabh Pant)ను రూ. 27 కోట్ల భారీ బిడ్‌తో కొనుగోలుచేసింది. ఇది ఐపీఎల్ చరిత్రలో నే అత్యంత ఖరీదైన ఒప్పందంగా రికార్డ్ నెలకొల్పింది.ఇంకా వేలంలో డేవిడ్ మిల్లర్, ఐడెన్ మార్క్రామ్ మరియు మిచెల్ మార్ష్ వంటి విదేశీ ఆటగాళ్ల ను జట్టులో చేర్చుకుంది. వీరు కాక అవేష్ ఖాన్, అబ్దుల్ సమద్, ఆర్యన్ జుయల్, ఆకాష్ దీప్ వంటి వారిని కూడా తీసుకున్నారు. విధ్వంసకర ఆటగాళ్లు.. ఫైనల్ చేరేనా?రిషబ్ పంత్‌తో పటు విధ్వంసకర ఆటగాళ్లుగా పేరుపొందిన మాథ్యూ బ్రీట్జ్కే, నికోలస్ పూరన్, డేవిడ్ మిల్లర్ వంటి ఆటగాళ్లు ఉన్నందున లక్నో జట్టు బ్యాటింగ్ ఫైర్ పవర్ పూర్తి స్థాయిలో ఉందని చెప్పవచ్చు.ఇంకా ఆల్ రౌండర్లు మిచెల్ మార్ష్, షాబాజ్ అహ్మద్ జట్టు కు సమతుల్యతను తెస్తారు. అవేష్ ఖాన్, మోసిన్ ఖాన్, రవి బిష్ణోయ్ నేతృత్వంలోని బౌలింగ్ యూనిట్ ఏ బ్యాటింగ్ లైనప్‌నైనా కూల్చివేసే సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఈ భారీ మార్పులు తర్వాత ఇప్పుడు రిషబ్ పంత్ నాయకత్వంలో ఐపీఎల్ ఫైనల్‌కి చేరాలని లక్నో ఆశిస్తోంది.గంభీర్ వెళ్లిపోయిన తర్వాతఅలాగే, 2024 సీజన్ ప్రారంభంలో మెంటార్ గౌతమ్ గంభీర్ జట్టును విడిచిపెట్టి కోల్‌కతాలో చేరాడు. గంభీర్ రెండు సీజన్ లలో లక్నో జట్టుకు మెంటార్ గా పనిచేసాడు. ఇప్పుడు అతడి స్థానంలో దక్షిణాఫ్రికా లెజెండ్ లాన్స్ క్లూసెనర్‌ను అసిస్టెంట్ కోచ్‌గా చేర్చుకోవడం ద్వారా కోచింగ్ సిబ్బందిని బలోపేతం చేసింది. ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ జస్టిన్ లాంగర్ నాయకత్వంలో క్లూసెనర్ నైపుణ్యం ఉండటంతో, లక్నో చివరి అడ్డంకులను అధిగమించి రాబోయే సీజన్లో విజయం సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది.లక్నో సూపర్ జెయింట్స్ జట్టు లో ప్రధాన ఆటగాళ్లురిషబ్ పంత్లక్నో సూపర్ జెయింట్స్ బిడ్డింగ్ పోరులో విజయం సాధించి, రిషబ్ పంత్‌ను రూ. 27 కోట్లకు దక్కించుకుంది. ఈ చారిత్రాత్మక బిడ్‌లో గత రికార్డులన్నింటినీ బద్దలు కొట్టి, పంత్‌ను టోర్నమెంట్ చరిత్రలో అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిపింది. పంత్ చేరికతో లక్నో వ్యూహం, స్వరూపం పూర్తిగా మారే అవకాశముంది.నికోలస్ పూరన్ఈ వెస్టిండీస్ వికెట్ కీపర్ బ్యాటర్ తన అసాధారణ ప్రతిభ తో మ్యాచ్ స్వరూపాన్ని మార్చేయగలడు. అందుకే లక్నో ఈ ఆటగాడ్ని వేలానికి ముందే రెటైన్ చేసుకుంది. 76 ఐపీఎల్ మ్యాచ్ లలో పూరన్ 160 కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్ తో 1,769 పరుగులు చేశాడు, తొమ్మిది అర్ధ సెంచరీలు కూడా సాధించాడు. అతని అపార సామర్థ్యం కారణంగా జట్టులో కీలకమైన ఆటగాడనడంలో సందేహం లేదు.డేవిడ్ మిల్లర్మిడిల్ ఆర్డర్ లో బ్యాటింగ్ చేసే డేవిడ్ మిల్లర్ ఇప్పటికే మ్యాచ్ విన్నర్‌గా నిరూపించుకున్నాడు. డేవిడ్ మిల్లర్ 130 ఐపీఎల్ మ్యాచ్ లలో 13 అర్ధ సెంచరీలు, ఒక సెంచరీతో దాదాపు 140 స్ట్రైక్ రేట్ తో 2,924 పరుగులు చేశాడు.మయాంక్ యాదవ్మయాంక్ యాదవ్ బౌలింగ్‌లో లక్నోకి కీలకమైన ఆటగాడిగా ఉండే అవకాశముంది. లక్నో రూ. 11 కోట్లకు మయాంక్ యాదవ్ ను కొనుగోలు చేసింది. వేగం, వైవిధ్యం మయాంక్ సొత్తు. కొత్త బంతితో పాటు డెత్ బౌలింగ్‌లో కూడా మయాంక్ బాగా రాణించగలనని ఇప్పటికే నిరూపించాడు.ఆయుష్ బదోనిలక్నో జట్టుతో చేరినప్పటి నుంచి ఆయుష్ బదోని తన క్రికెట్ కెరీర్లో భారీ పురోగతి సాధించాడు. 25 ఏళ్ల ఈ స్టైలిష్ బ్యాటర్ 2022 సీజన్లో రెండు మ్యాచ్ విన్నింగ్ నాక్స్ ఆడటం ద్వారా ఫ్రాంచైజీపై తనదైన ముద్ర వేశాడు. అయితే, టోర్నమెంట్ కొనసాగే కొద్దీ అతని ఫామ్ క్షీణించింది. కొద్దిగా నిలకడ తగ్గినప్పటికీ లక్నో అతన్ని రెటైన్ చేయాలని నిర్ణయించింది.లక్నో సూపర్ జెయింట్స్ జట్టులక్నో సూపర్ జెయింట్స్ జట్టునికోలస్ పూరన్, రవి బిష్ణోయ్, మయాంక్ యాదవ్, మొసిన్ ఖాన్, ఆయుష్ బదోని, రిషబ్ పంత్, డేవిడ్ మిల్లర్, ఐడెన్ మార్క్రామ్, మిచెల్ మార్ష్, అవేష్ ఖాన్, అబ్దుల్ సమద్, ఆర్యన్ జుయల్, ఆకాష్ దీప్, హిమ్మత్ సింగ్, ఎం. సిద్ధార్థ్, దిగ్వేష్ సింగ్, ప్రిన్స్ యాదవ్, యువరాజ్ చౌదరి, రాజవర్ధన్ హంగర్గేకర్, షెహబాజ్ అహ్మద్, షమార్ జోసెఫ్, అర్షిన్ కులకర్ణి, మాథ్యూ బ్రీట్జ్కే. చదవండి: ముగ్గురు టీమిండియా కెప్టెన్లు.. అది నా అదృష్టం: హార్దిక్ పాండ్యా Never give up the superpower 👊 pic.twitter.com/NtahEerR2x— Lucknow Super Giants (@LucknowIPL) March 19, 2025 -
నేను క్రికెటర్ అవడానికి కారణం సచిన్ సర్: శుబ్‌మన్ గిల్
టీమిండియా వైస్ కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (Shubman Gill) ప్రస్తుతం ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) సన్నాహకాలతో బిజీగా ఉన్నాడు. గతేడాది గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans) కెప్టెన్‌గా పగ్గాలు చేపట్టిన ఈ పంజాబీ బ్యాటర్.. ఈసారి కూడా జట్టును ముందుండి నడిపించనున్నాడు. ఈ నేపథ్యంలో ఐపీఎల్-2025 ఆరంభానికి ముందు గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.మరింత వినోదాత్మకంగాఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన వల్ల జట్లకు అదనపు ప్రయోజనం కలుగుతుందని శుబ్‌మన్ గిల్ అభిప్రాయపడ్డాడు. ఈ రూల్ కారణంగా అదనపు బ్యాటర్ లేదంటే బౌలర్ సేవలను ఉపయోగించుకునేందుకు వీలుగా ఉంటుందని.. ఈసారి స్కోర్లు 300 దాటినా ఆశ్చర్యపోనక్కర్లేదని పేర్కొన్నాడు. ఈ నిబంధన ఐపీఎల్‌ను మరింత వినోదాత్మకంగా మార్చిందని గిల్ జియోహాట్‌స్టార్ షోలో వ్యాఖ్యానించాడు. అదే విధంగా.. ఐపీఎల్‌తో ముడిపడిన తన చిన్ననాటి జ్ఞాపకాలను ఈ సందర్భంగా గిల్ గుర్తు చేసుకున్నాడు. ‘‘పంచకులలోని తౌ దేవి లాల్ స్టేడియానికి మా నాన్నతో కలిసి మూడు, నాలుగు మ్యాచ్‌లకు వెళ్లాను. నాకు తెలిసి అప్పటికి ఐపీఎల్ మొదలై మూడేళ్లు గడిచి ఉంటాయి.నేను క్రికెటర్ అవడానికి కారణం సచిన్ సర్అప్పట్లో ముంబై ఇండియన్స్ జట్టు అక్కడ ప్రాక్టీస్ చేసేందుకు వచ్చింది. నాకప్పుడు తొమ్మిదేళ్లు ఉంటాయనుకుంటా.. సచిన్ సర్‌తో గ్లెన్ మాక్స్‌వెల్‌తో నేను ఫొటో తీసుకున్నా.వాళ్లు ప్రాక్టీస్ చేస్తున్నపుడు బాల్స్ త్రో చేసేవాడిని. ఐపీఎల్‌తో నాకున్న తొలి జ్ఞాపకం అదే. సచిన్ సర్ గురించి నాకు ముందు నుంచే తెలుసు. ఆయనను చూసే నేను క్రికెట్ ఆడటం మొదలుపెట్టాను.మా నాన్న ఆయనకు వీరాభిమానిఇక మా నాన్న అయితే.. సచిన్ సర్కి వీరాభిమాని. మా గ్రామంలో ఎక్కడ చూసినా ఆయన పోస్టర్లే కనిపించేవి’’ అని శుబ్‌మన్ గిల్ తెలిపాడు. ఇక కెప్టెన్సీ అనేది ఓ నిరంతర ప్రయాణమన్న ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. నాయకుడిగా భిన్న అనుభవాలు ఎదుర్కోక తప్పదని పేర్కొన్నాడు.జట్టులోని ప్రతి ఒక్క సభ్యుడి నైపుణ్యాలపై అవగాహన పెంచుకుని.. వారి నుంచి అత్యుత్తమ ప్రదర్శన రాబట్టుకున్న వారే నాయకులుగా రాణిస్తారని గిల్ అన్నాడు. ప్రతి మ్యాచ్ సరికొత్తగా ఉంటుందని.. ఆటగాళ్ల బలాలు, బలహీనతలు అర్థం చేసుకుంటే.. వారి సేవలు ఎలా వినియోగించుకోవాలో తెలుస్తుందని పేర్కొన్నాడు. కెప్టెన్‌గా అనుభవం గడించినపుడే..ఇక సారథిగా చేసే ప్రయాణంలో అనుభవం గడిస్తున్న కొద్దీ మరింత రాటుదేలతామని.. అయితే, ఒక్కోసారి కఠిన సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉంటుందని పేర్కొన్నాడు. అలాంటపుడు సంయమనంతో ముందుకు సాగితే ప్రతికూల ప్రభావం పడదని గిల్ చెప్పుకొచ్చాడు. టైటాన్స్ పగ్గాలు చేపట్టిన కొత్తల్లో తాను సహచర ఆటగాళ్లతో ఎక్కువగా మమేకం కాలేకపోయానన్న.. అయితే, నాయకుడిగా తన కర్తవ్యాన్ని నెరవేర్చే క్రమంలో తనకు తెలియకుండానే ఎంతో మారిపోయానని పేర్కొన్నాడు. ప్రతి ఒక్క ఆటగాడితో వ్యక్తిగతంగా మాట్లాడటం.. వారి మైండ్‌సెట్‌ను అర్థం చేసుకోవడం అలవాటు చేసుకున్నానని గిల్ తెలిపాడు.చదవండి: BCCI: విరాట్ కోహ్లి ఘాటు విమర్శలు.. స్పందించిన బీసీసీఐ -
ముగ్గురు టీమిండియా కెప్టెన్లు.. అది నా అదృష్టం: హార్దిక్ పాండ్యా
జట్టులో ‘ముగ్గురు కెప్టెన్ల’ను కలిగి ఉండటం తనకు అదనపు బలమని ముంబై ఇండియన్స్ సారథి హార్దిక్ పాండ్యా (Hardik Pandya) హర్షం వ్యక్తం చేశాడు. భిన్న ఫార్మాట్లలో టీమిండియాను ముందుకు నడిపించిన వ్యక్తుల నుంచి తాను తప్పక సలహాలు, సూచనలు తీసుకుంటానని పేర్కొన్నాడు. అంతిమంగా జట్టును విజేతగా నిలపడమే తమ లక్ష్యమని హార్దిక పాండ్యా పేర్కొన్నాడు.ఈసారి తాను రెట్టించిన ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతున్నానన్న హార్దిక్ పాండ్యా... ఈసారి అభిమానుల నుంచి సానుకూల స్పందన మాత్రమే కోరుకుంటున్నానని తెలిపాడు. కెప్టెన్‌గా సూర్యకాగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) పద్దెనిమిదవ ఎడిషన్ మార్చి 22 నుంచి ఆరంభం కానున్న విషయం తెలిసిందే. కోల్‌కతా నైట్ రైడర్స్- రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్‌తో ఈ మెగా ఈవెంట్‌కు తెరలేవనుండగా.. ముంబై మార్చి 23న చెన్నై సూపర్ కింగ్స్‌తో తమ తొలి మ్యాచ్ ఆడనుంది.అయితే, గతేడాది స్లో ఓవర్ రేటు కారణంగా హార్దిక్ పాండ్యాపై ఒక మ్యాచ్ నిషేధం పడగా.. ఐపీఎల్-2025 ఆరంభ మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్ ముంబై కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించిన పాండ్యా.. ఈ ఏడాది తాము కచ్చితంగా అనుకున్న ఫలితాన్ని రాబడతామని ధీమా వ్యక్తం చేశాడు.రోజురోజుకూ పెరుగుతుందే తప్ప తగ్గదు‘‘నేను చాలా చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నా. అప్పుడు కూడా గెలుస్తామనే నేను విశ్వసించాను. అయితే, నేను ఇటీవలే చాంపియన్స్ ట్రోఫీలో ఆడాను. నా ఆత్మవిశ్వాసం రెట్టింపు అయింది, కాన్ఫిడెన్స్ గురించి నన్ను అడిగితే.. రోజురోజుకూ అది పెరుగుతుందే తప్ప తగ్గదు.ముగ్గురు టీమిండియా కెప్టెన్లు.. అది నా అదృష్టంఇక మా జట్టులో నాతో పాటు మరో ముగ్గురు కెప్టెన్లు ఉండటం ఒక రకంగా నా అదృష్టం అని చెప్పాలి. నాకు అవసరమైనపుడు వారి అనుభవాన్ని ఉపయోగించుకుంటా. టీమిండియాను మూడు ఫార్మాట్లలో భిన్న రీతిలో నడిపించిన వారి అనుభవం నాకు కచ్చితంగా అదనపు బలమే.నాకు వారు ఎల్లవేళలా మద్దతుగా ఉంటారు. క్లిష్ట పరిస్థితుల్లో నా భుజం తట్టి నన్ను ముందుకు నడిపిస్తారు. మేమంతా కలిసి అనుకున్న రీతిలో జట్టును ముందుకు తీసుకువెళ్తాం’’ అని హార్దిక్ పాండ్యా బుధవారం నాటి మీడియా సమావేశంలో పేర్కొన్నాడు.కాగా టీమిండియా వన్డే, టెస్టు సారథి రోహిత్ శర్మతో పాటు.. టెస్టుల్లో రోహిత్ గైర్హాజరీలో కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న జస్ప్రీత్ బుమ్రా.. టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న విషయం తెలిసిందే.ముంబై రంగులు తప్ప ఇంకేమీ కనిపించవద్దుఇదిలా ఉంటే.. ముంబై అభిమానులను ఉద్దేశించి మాట్లాడుతూ.. ‘‘నేను టాస్ కోసం వెళ్లినపుడు.. బ్యాటింగ్‌కి వెళ్లినపుడు నన్ను చీర్ చేయండి. సిక్సర్ బాదితే గట్టిగా అరవండి. వాంఖడే స్టేడియంలో నాకు ముంబై రంగులు తప్ప ఇంకేమీ కనిపించవద్దు’’ అని హార్దిక్ పాండ్యా పేర్కొన్నాడు. కాగా ఐదుసార్లు ట్రోఫీ అందించిన రోహిత్ శర్మను తప్పించి ముంబై ఫ్రాంఛైజీ గతేడాది పాండ్యాకు బాధ్యతలు అప్పగించిన విషయం తెలిసిందే.అయితే, అతడి రాకతో రోహిత్, బుమ్రా, సూర్య అసంతృప్తిగా ఉన్నారనే వార్తలు వచ్చాయి. ముంబై గతేడాది దారుణంగా విఫలమైన నేపథ్యంలో.. ఆటగాళ్ల మధ్య సమన్వయ లోపమే ఇందుకు కారణమనే విమర్శలు వచ్చాయి. గతేడాది ముంబై పద్నాలుగింట కేవలం నాలుగే గెలిచి పాయింట్ల పట్టికలో పదో స్థానంలో నిలిచింది. చదవండి: BCCI: విరాట్ కోహ్లి ఘాటు విమర్శలు.. స్పందించిన బీసీసీఐ -
HCA: నిధుల గోల్మాల్ కేసులో కీలక పరిణామం
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) గత అపెక్స్ కౌన్సిల్ నిధుల గోల్మాల్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కాంట్రాక్టుల పేరుతో క్విడ్ ప్రో కో జరిగినట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) గుర్తించింది. ఈ నేపథ్యంలో హెచ్‌సీఏ మాజీ కోశాధికారి సురేందర్ అగర్వాల్‌పై పలు అభియోగాలు నమోదయ్యాయి.క్రికెట్ బాల్స్, బకెట్ చైర్స్, జిమ్ ఎక్విప్మెంట్ పేరుతో హెచ్‌సీఏ చేపట్టిన సబ్ కాంట్రాక్టుల విషయంలో.. సురేందర్ అగర్వాల్‌కు క్విడ్ ప్రో కో కింద మూడు కంపెనీలు 90 లక్షలు చెల్లించినట్లు సమాచారం. అగర్వాల్‌తో పాటు అతడి కుటుంబ సభ్యుల ఖాతాలకు ఈ మొత్తాన్ని బదిలీ చేసినట్లు తెలుస్తోంది.ఇందులో భాగంగా అగర్వాల్ భార్య, కొడుకు , కోడలు అకౌంట్లకు నగదు బదిలీ జరిగిందని.. సురేందర్ అగర్వాల్ భార్యకు చెందిన కేబీ జ్యువెలర్స్ ఖాతాకు ఈ మేర చెల్లింపులు జరిగాయని సమాచారం. ఈ నేపథ్యంలో ఆ 90 లక్షల రూపాయలలో 51.29 లక్షల రూపాయల ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. -
BCCI: విరాట్ కోహ్లి ఘాటు విమర్శలు.. స్పందించిన బీసీసీఐ
ఆటగాళ్ల కుటుంబ సభ్యులను విదేశీ పర్యటనలకు అనుమతించే విషయంలో తమ నిర్ణయం మారదని భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) స్పష్టం చేసింది. జట్టుతో పాటు బోర్డుకు కూడా ఇదే మంచిదని పేర్కొంది. ఈ విషయంలో ఆటగాళ్లకు భిన్నాభిప్రాయాలు ఉండవచ్చని.. అయితే, తాము జట్టు ప్రయోజనాల కోసం కఠినంగా వ్యవహరించక తప్పదని తెలిపింది.ఈ మేరకు బోర్డు తరఫున.. బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా (Devajit Saikia) తమ స్పందన తెలియజేశారు. కాగా ఆస్ట్రేలియా పర్యటనలో టీమిండియా ఘోరంగా విఫలమైన విషయం తెలిసిందే. దాదాపు పదేళ్ల తర్వాత తొలిసారి బోర్డర్ గావస్కర్ ట్రోఫీని చేజార్చుకుంది. 3-1తో ఓడి ఇంటిబాటపట్టింది.ఈ పరాభవం తర్వాత.. విదేశీ పర్యటనలకు ఆటగాళ్ల కుటుంబ సభ్యులను అనుమతించే విషయమై బీసీసీఐ కఠిన నిబంధనలు ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. నలభై ఐదు రోజుల్లోపు విదేశీ పర్యటనలో ఆటగాళ్లు, సహాయ సిబ్బంది కుటుంబ సభ్యులను వారం రోజులు మాత్రమే అనుమతిస్తారు.విరాట్ కోహ్లి ఘాటు విమర్శలుఅంతకు మించి పర్యటన కొనసాగితే రెండు వారాల పాటు సన్నిహితులకు అక్కడే ఉండే వెసలుబాటు ఉంటుంది. అయితే, ఈ విషయంలో టీమిండియా సూపర్‌స్టార్ విరాట్ కోహ్లి (Virat Kohli) బీసీసీఐ తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. సన్నిహితులే సగం బలమని.. ఆటగాడి విజయం వెనుక కుటుంబ సభ్యుల పాత్రను అందరికీ వివరించలేమని పేర్కొన్నాడు.మైదానంలో దిగని వాళ్లు, అక్కడ ఏం జరుగుతుందో తెలియని వాళ్లు ఇలాంటి నిర్ణయం తీసుకోవడం నిరాశ కలిగించిందని కోహ్లి ఘాటుగా విమర్శించాడు. ప్రతి ఆటగాడు తన కుటుంబ సభ్యులు వెంట ఉంటే మరింత బాధ్యతగా ఆడతారని ఈ సందర్భంగా పేర్కొన్నాడు. ఈ నేపథ్యంలో బీసీసీఐ ఈ విషయంలో యూటర్న్ తీసుకోనుందనే వార్తలు వచ్చాయి.బీసీసీఐకి, దేశానికి ఇదే మంచిదిఅయితే, అలాంటిదేమీ లేదని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా తాజాగా కొట్టిపడేశారు. ‘‘మేము ప్రవేశపెట్టిన నిబంధనలో ప్రస్తుతం ఎలాంటి మార్పులు చేయడం లేదు. బీసీసీఐకి, వ్యవస్థకి, జట్టుకు, దేశానికి ఇదే మంచిది.ఈ అంశంలో ఆటగాళ్ల నుంచి భిన్నాభిప్రాయాలు, మిశ్రమ స్పందన వస్తుందని తెలుసు. ఇక్కడంతా ప్రజాస్వామ్యం ఉంటుంది కాబట్టి.. ఎవరైనా తమ గొంతును వినిపించవచ్చు. తమ భావాలను నిర్భయంగా పంచుకోవచ్చు.అయితే, ఈ నిబంధన విషయంలో అందరు ఆటగాళ్లూ సమానమే. జట్టులోని ప్రతి సభ్యుడు, కోచ్‌లు, మేనేజర్లు, సహాయక సిబ్బంది.. ఇలా అందరికీ రూల్స్ వర్తిస్తాయి. ఇందుకు ఎవరూ మినహాయింపు కాదు. జట్టు ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే ఈ నిర్ణయం తీసుకున్నాం.రాత్రికి రాత్రే హడావుడిగా ఈ విధానాన్ని మేము ప్రవేశపెట్టలేదు. దశాబ్దాలుగా జరుగుతున్న విషయాలను పరిగణనలోకి తీసుకుని మా అధ్యక్షుడు రోజర్ బిన్నీ ఈ పాలసీ తీసుకువచ్చారు. నిజానికి గతంతో పోలిస్తే విదేశీ పర్యటనల సమయంలో కుటుంబ సభ్యులను అనుమతించే విషయమై మేము ఆటగాళ్లకు చాలా వరకు మినహాయింపులు ఇచ్చాం. అయితే, ఇప్పుడు ఈ రూల్ కాస్త కఠినంగా అనిపించినా.. తప్పక అమలు చేస్తాం’’ అని దేవజిత్ సైకియా స్పష్టం చేశారు.చదవండి: IPL 2025: ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్ -
భార్యకు విడాకులు.. భరణంగా చహల్ ఎన్ని కోట్లు ఇస్తున్నాడంటే..?
టీమిండియా స్టార్ స్పిన్నర్ యజువేంద్ర చహల్ (Yuzuvendra Chahal)- సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ ధనశ్రీ వర్మ (Dhanashree Verma)ల వైవాహిక బంధం ముగిసిపోయింది. పరస్పర అంగీకారంతో వీరిద్దరు విడిపోయేందుకు సిద్ధమయ్యారు. ఇందుకోసం ఈ ఏడాది ఫిబ్రవరి 5న ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.అయితే, చట్ట ప్రకారం ఆరు నెలల పాటు కలిసి ఉండాలన్న నిబంధనను తమ కేసులో పరిగణనలోకి తీసుకోవద్దని చహల్- ధనశ్రీ కోరగా.. ఫిబ్రవరి 20న ఫ్యామిలీ కోర్టు వీరి అభ్యర్థనను తిరస్కరించింది. దీంతో వీరు బాంబే హైకోర్టును ఆశ్రయించారు.ఈ క్రమంలో చహల్- ధనశ్రీ పిటిషన్‌ను విచారించిన న్యాయస్థానం.. ఆరు నెలల కూలింగ్ పీరియడ్ విషయంలో వీరికి ఉపశమనం కలిగించింది. విడాకుల అంశాన్ని గురువారం తేల్చాల్సిందిగా బాంద్రా మెజిస్ట్రేట్ కోర్టును ఆదేశించింది. వేరుగా ఉంటున్నారుజస్టిస్ మాధవ్ జామ్దార్తో కూడిన ఏకసభ్య ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు ఇచ్చింది. మార్చి 22 నుంచి చహల్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)తో కానున్న నేపథ్యంలో ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.‘‘పిటిషనర్ 1 (చహల్) ఐపీఎల్లో పాల్గొనాల్సి ఉందని.. కాబట్టి మార్చి 21 తర్వాత అతడు అందుబాటులో ఉండకపోవచ్చని అతడి తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. కాబట్టి మార్చి 20న ఈ విషయమై ఫ్యామిలీ కోర్టు నిర్ణయం తీసుకోవాల్సిందిగా ఆదేశిస్తున్నాం’’ అని పేర్కొంది.కాగా హిందూ వివాహ చట్టం ప్రకారం.. విడాకులు జారీ చేసే ముందు తమ సమస్యను పరిష్కరించుకుని కలిసిపోయేందుకు కనీసం ఆరు నెలల పాటు కోర్టు సమయం ఇస్తుంది. అయితే, చాలా కాలం నుంచే చహల్- ధనశ్రీ విడిగా ఉంటున్నట్లు సమాచారం. ఇప్పటికే భార్యాభర్తలుగా వారు వేరుపడినందున.. ఆరు నెలల కూలింగ్ పీరియడ్ విషయంలో తమకు మినహాయింపు ఇవ్వాలని న్యాయస్థానాన్ని అభ్యర్థించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే బాంబే హైకోర్టు ఈ విషయమై తక్షణమే చర్యలు చేపట్టాలని ఆదేశించినట్లు తెలుస్తోంది. రూ. 4.75 కోట్ల భరణం!కాగా ధనశ్రీకి భరణం రూపంలో రూ. 4.75 కోట్లు చెల్లించేందుకు చహల్ సిద్ధపడినట్లు సమాచారం. ఇందుకు సంబంధించి ఇప్పటికే రూ. 2 కోట్ల 37 లక్షల యాభై ఐదు వేలు చెల్లించినట్లు తెలుస్తోంది. మిగతా మొత్తం చెల్లించేందుకు కూడా చహల్ సిద్ధంగా ఉన్నాడు కాబట్టి.. పిటిషనర్ల మధ్య ఎలాంటి వివాదానికి తావు లేనందున విడాకుల మంజూరు విషయంలో నిర్ణయం తీసుకోవాల్సిందిగా హైకోర్టు ఫ్యామిలీ కోర్టును ఆదేశించినట్లు సమాచారం. ప్రేమ వివాహం..కాగా 2016లో టీమిండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన చహల్.. ఇప్పటి వరకు 72 వన్డేలు, 80 టీ20లు ఆడాడు. ఈ రైటార్మ్ లెగ్ బ్రేక్ స్పిన్నర్ ఆయా ఫార్మాట్లలో 121, 96 వికెట్లు తీశాడు. ఇక టీ20 ప్రపంచకప్-2024 సందర్భంగా చివరిగా జాతీయ జట్టుకు ఎంపికైన చహల్ ఆ టోర్నీలో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. ఆ తర్వాత మళ్లీ టీమిండియాకు ఎంపిక కాలేదు.అయితే, ఐపీఎల్లో మాత్రం చహల్‌కు ఘనమైన రికార్డు ఉంది. ఇప్పటి వరకు 160 మ్యాచ్‌లు ఆడిన ఏకంగా 205 వికెట్లు తీశాడు. తద్వారా క్యాష్ రిచ్ లీగ్‌లో అత్యధిక వికెట్ల వీరుడిగా కొనసాగుతున్నాడు. ఈ నేపథ్యంలో ఐపీఎల్-2025 మెగా వేలంలో పంజాబ్ కింగ్స్ అతడిని ఏకంగా రూ. 18 కోట్లకు కొనుగోలు చేసింది.ఇక చహల్ వ్యక్తిగత విషయానికొస్తే.. 2020, డిసెంబరులో కొరియాగ్రాఫర్ ధనశ్రీ వర్మను పెళ్లాడాడు. లాక్డౌన్లో సోషల్ మీడియా ద్వారా ధనశ్రీతో పరిచయం ప్రేమగా మారింది. అయితే, వీరి బంధం మూణ్ణాళ్ల ముచ్చటే అయింది.చదవండి: IPL 2025: కెప్టెన్ల మార్పు.. ఎవరి జీతం ఎంత?.. అతి చవగ్గా దొరికిన సారథి అతడే! -
IPL 2025: పీసీబీ ధమ్కీలకు బెదరని ముంబై ఇండియన్స్ బౌలర్
సౌతాఫ్రికా పేసర్ కార్బిన్ బాష్.. ఐపీఎల్-2025లో ముంబై ఇండియన్స్ నుంచి ఆఫర్ రావడంతో పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్) నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పాక్ క్రికెట్ బోర్డు బాష్‌కు లీగల్ నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులపై బాష్ తాజాగా స్పందించాడు. పీసీబీ అధికారుల ధమ్కీలకు వివరణ ఇస్తూ ఇలా అన్నాడు. తన నిర్ణయం పీఎస్ఎల్ను అగౌరవపరచాలని కాదు. ముంబై ఇండియన్స్ బలమైన ఐపీఎల్ జట్టు మాత్రమే కాకుండా అనేక ఇతర లీగ్‌లలో ఫ్రాంచైజీలు కలిగి ఉంది. ఇలాంటి జట్టు ఆఫర్‌ను వదులుకుంటే నా భవిష్యత్తుకు ఇబ్బంది అవుతుంది. అందుకే ఐపీఎల్ ఆఫర్‌కు ప్రాధాన్యత ఇచ్చాను. ఈ ఆఫర్ నా కెరీర్‌కు గణనీయమైన ప్రయోజనం చేకూరుస్తుందంటూ వివరణలో పేర్కొన్నాడు. బాష్ వివరణ తర్వాత కూడా పీసీబీ అతనిపై ఐపీఎల్ తరహాలో రెండేళ్లు నిషేధం విధించాలని భావించింది. అయితే ఇలా చేస్తే వచ్చే ఒకరిద్దరు విదేశీ స్టార్లు కూడా పీఎస్ఎల్కు రారని వెనక్కు తగ్గింది.కాగా, ముంబై ఇండియన్స్ నుంచి ఆఫర్ రాకముందు బాష్‌ను పీఎస్ఎల్ ఫ్రాంచైజీ పెషావర్ జల్మీ వేలంలో కొనుగోలు చేసింది. వాస్తవానికి బాష్ మొదటి నుంచి ఐపీఎల్‌కే ప్రాధాన్యత ఇచ్చాడు. అయితే తొలుత వేలంలో బాష్‌ను ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయలేదు. సహచరుడు లిజాడ్ విలియమ్స్ గాయపడటంతో బాష్‌కు ముంబై ఇండియన్స్ నుంచి పిలుపు వచ్చింది. దీంతో అతను తప్పనిసరి పరిస్థితుల్లో పీఎస్ఎల్ ఆఫర్‌కు నో చెప్పాడు.వాస్తవంగా ఈ రాద్దాంతం జరగడానికి పాక్ క్రికెట్ బోర్డే కారణం. ఎప్పుడూ ఐపీఎల్‌తో క్లాష్ కాకుండా షెడ్యూల్ తయారు చేసుకునే పీఎస్ఎల్.. ఈసారి ఐపీఎల్‌తో పోటీ పడి ఐపీఎల్ డేట్స్‌లోనే షెడ్యూల్‌ను ఫిక్స్ చేసుకుంది. దీంతో పీఎస్ఎల్కు ఎంపికైన వారు (విదేశీ ఆటగాళ్లు) ఐపీఎల్లో ఆడటానికి వీలుండదు. ఐపీఎల్లో ఆడితే పీఎస్ఎల్కు పోలేరు. ఈ యేడు పీఎస్ఎల్ విషయంలో పీసీబీ తీసుకున్న నిర్ణయం కారణంగా చాలా మంది విదేశీ ఆటగాళ్లు ఐపీఎల్‌వైపే మొగ్గు చూపారు. ఐపీఎల్లో అయితే డబ్బుతో పాటు పేరు ప్రఖ్యాతలు వస్తాయని వారి భావన. ఐపీఎల్‌తో క్లాష్ కావడంతో ఈ సారి పీఎస్ఎల్లో విదేశీ మెరుపులు కనిపించవు. లోకల్ ఆటగాళ్లతోనే పాక్ లీగ్ తూతూ మంత్రంగా జరుగనుంది. పీఎస్ఎల్-2025 సీజన్ ఏప్రిల్ 11 నుండి మే 25 వరకు జరగనుండగా.. ఐపీఎల్ 2025 మార్చి 22 నుండి మే 25 వరకు జరుగుతుంది.సౌతాఫ్రికా ఫాస్ట్ బౌలింగ్ ఆల్‌రౌండర్ అయిన కార్బిన్ బాష్ ఫైవ్ టైమ్ ఐపీఎల్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్‌తో జతకట్టక ముందు ఆ ఫ్రాంచైజీ యాజమాన్యానికి చెందిన ఎంఐ కేప్‌టౌన్‌కు (సౌతాఫ్రికా టీ20 లీగ్) ఆడాడు. ఈ సీజన్లో (2025) ఎంఐ కేప్‌టౌన్ ఛాంపియన్‌గా అవతరించింది. ఈ సీజన్లో బాష్ 8 మ్యాచ్‌ల్లో 11 వికెట్లు తీసి ఎంఐ కేప్‌టౌన్ తొలి టైటిల్ సాధించడంలో కీలకపాత్ర పోషించాడు.ఇదిలా ఉంటే, మరో మూడు రోజుల్లో ప్రారంభంకానున్న ఐపీఎల్-2025 ఎడిషన్‌లో ముంబై తమ తొలి మ్యాచ్‌ను మార్చి 23న ఆడుతుంది. చెన్నైలో జరిగే ఆ మ్యాచ్‌లో ముంబై సీఎస్కేను ఢీకొంటుంది.ఐపీఎల్-2025లో ముంబై ఇండియన్స్..రోహిత్ శర్మ, తిలక్ వర్మ, సూర్యకుమార యాదవ్, నమన్ ధిర్, బెవాన్ జాకబ్స్, రాజ్ బవా, విల్ జాక్స్, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), విజ్ఞేశ్ పుథుర్, సత్యనారాయణ రాజు, కార్బిన్ బాష్, మిచెల్ సాంట్నర్, అర్జున్ టెండూల్కర్, ర్యాన్ రికెల్టన్, కృష్ణణ్ శ్రీజిత్, రాబిన్ మింజ్, జస్ప్రీత్ బుమ్రా, అశ్వనీ కుమార్, కర్ణ్ శర్మ, ట్రెంట్ బౌల్ట్, దీపక్ చాహర్, ముజీబ్ ఉర్ రెహ్మాన్ -
IPL 2025: ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్
ఐపీఎల్ 2025లో ముంబై ఇండియన్స్ తమ తొలి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్ చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా మార్చి 23న జరుగనుంది. ఆ రోజు డబుల్ హెడర్ మ్యాచ్‌లు జరుగనుండగా.. ఎంఐ, సీఎస్కే మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతుంది.ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ తమ రెగ్యులర్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా సేవలు కోల్పోనుంది. గత సీజన్లో చేసిన తప్పుల కారణంగా హార్దిక్ సీఎస్కేతో మ్యాచ్‌కు దూరం కానున్నాడు. గత సీజన్లో ముంబై ఇండియన్స్ మూడు మ్యాచ్‌ల్లో స్లో ఓవర్ రేట్‌తో బౌలింగ్ చేసింది.దీంతో ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ముంబై కెప్టెన్‌గా ఉన్న హార్దిక్ పాండ్యాకు రూ.30 లక్షల జరిమానాతో పాటు ఓ మ్యాచ్ ఆడకుండా నిషేధం విధించింది. గత సీజన్లో ముంబై గ్రూప్ దశలోనే నిష్క్రమించడంతో హార్దిక్‌పై నిషేధం సాధ్యం కాలేదు. ఈ క్రమంలో ఈ సీజన్లో తొలి మ్యాచ్‌లోనే అతను నిషేధం ఎదుర్కొంటున్నాడు.హార్దిక్ గైర్హాజరీలో ముంబై ఇండియన్స్ తాత్కాలిక సారధిగా సూర్యకుమార్ యాదవ్ ఎంపికయ్యాడు. ఈ విషయాన్ని రెగ్యులర్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఇవాళ (మార్చి 19) స్వయంగా ప్రకటించాడు. సూర్యకుమార్‌కు భారత టీ20 జట్టు కెప్టెన్‌గా అనుభవం ఉండటంతో ఎంఐ మేనేజ్మెంట్ అతనికే సారథ్య బాధ్యతలు కట్టబెట్టింది.కాగా, ముంబై ఇండియన్స్‌ను ఐదు సార్లు ఛాంపియన్‌గా నిలబెట్టిన రోహిత్ శర్మ కెప్టెన్సీపై అయిష్టతతో 2023 సీజన్ తర్వాత తప్పుకున్న విషయం తెలిసిందే. మరో సీనియర్ ఆటగాడు జస్ప్రీత్ బుమ్రా ఈ సీజన్ ఆరంభ మ్యాచ్‌లకు దూరం కానున్నాడని తెలుస్తుంది. ఈ నేపథ్యంలో సీనియర్లలో ఒకరైన సూర్యకుమార్‌కే సీఎస్కేతో మ్యాచ్‌లో ముంబై కెప్టెన్‌గా వ్యవహరించే అవకాశం వచ్చింది.టీ20ల్లో సూర్య కుమార్ యాదవ్‌కు అద్భుతమైన ట్రాక్ రికార్డు ఉంది. స్కై సారథ్యంలో భారత్ 18 మ్యాచ్‌ల్లో కేవలం నాలుగింట మాత్రమే ఓడింది. ఓవరాల్‌గా స్కై 39 టీ20 మ్యాచ్‌ల్లో సారథ్యం వహించి 28 మ్యాచ్‌ల్లో తన జట్టును గెలిపించుకున్నాడు. స్కై.. గతంలోనూ ఓ సందర్భంలో (2023 సీజన్లో) ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. స్కై తన కెప్టెన్సీలో బ్యాటర్‌గానూ విశేషంగా రాణించాడు. 37 ఇన్నింగ్స్‌ల్లో సెంచరీ, 8 హాఫ్ సెంచరీల సాయంతో 164.56 స్ట్రయిక్‌రేట్‌తో 1068 పరుగులు చేశాడు.కాగా, ఐపీఎల్ 2025 సీజన్లో ముంబై ఇండియన్స్ దేశీయ స్టార్లపై ఆధారపడి ఉంది. మెగా వేలానికి ముందు ఆ జట్టు రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రాను రీటైన్ చేసుకుంది. మెగా వేలంలోనూ ఆ జట్టు పెద్దగా విదేశీ స్టార్ల కోసం పాకులాడలేదు.విల్ జాక్స్, మిచెల్ సాంట్నర్, ముజీబ్ ఉర్ రెహ్మాన్, కార్బిన్ బాష్, ర్యాన్ రికెల్టన్ లాంటి ఆటగాళ్లు కొత్తగా జట్టులోకి చేర్చుకుంది. ఈసారి జట్టులోకి వచ్చిన ట్రెంట్ బౌల్ట్‌కు గతంలో ముంబై ఇండియన్స్‌తో అనుబంధం ఉంది. మెగా వేలంలో దక్కించుకున్న రీస్ టాప్లే గాయం కారణంగా ఈ సీజన్‌కు దూరమయ్యాడు. దేశీయ పేసర్ దీపక్ చాహర్‌ను ముంబై సీఎస్కేతో పోటీపడి దక్కించుకుంది.ఐపీఎల్ 2025 సీజన్ కోసం ముంబై ఇండియన్స్..హార్దిక్ పాండ్యా (కెప్టెన్), రోహిత్ శర్మ, తిలక్ వర్మ, నమన్ ధిర్, సూర్యకుమార్ యాదవ్, బెవాన్ జాకబ్స్, రాజ్ భవా, విల్ జాక్స్, విజ్ఞేశ్ పుథుర్, మిచెల్ సాంట్నర్, కార్బిన్ బాష్, సత్యనారాయణ రాజు, అర్జున్ టెండూల్కర్, ర్యాన్ రికెల్టన్, రాబిన్ మింజ్, కృష్ణణ్ శ్రీజిత్, ట్రెంట్ బౌల్ట్, జస్ప్రీత్ బుమ్రా, అశ్వనీ కుమార్, రీస్ టాప్లే, కర్ణ్ శర్మ, దీపర్ చాహర్, ముజీబ్ రెహ్మాన్ -
IPL 2025: డైనమైట్లతో నిండిన పంజాబ్ బ్యాటింగ్ విభాగం.. వీరిని ఆపతరమా..?
ఈ ఏడాది ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్ విభాగం విధ్వంసకర డైనమైట్లతో నిండుకుని ఉంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈ జట్టు బ్యాటింగ్ విభాగం అత్యంత పటిష్టంగా, ప్రమాదకరంగా కనిపిస్తుంది. కొత్త కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మొదలు మార్కస్ స్టోయినిస్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, శశాంక్ సింగ్, జోస్ ఇంగ్లిస్, ప్రభ్‌సిమ్రన్ సింగ్, ఆరోన్ హార్డీ, అజ్మతుల్లా ఒమర్జాయ్, మార్కో జన్సెన్.. ఇలా జట్టు మొత్తం విధ్వంసకర వీరులే ఉన్నారు.బౌలింగ్ విభాగం కాస్త బలహీనంగా కనిపిస్తున్నా.. బ్యాటింగ్ బలగం చూసి పంజాబ్‌ను టైటిల్ ఫేవరెట్లలో ఒకటిగా చెప్పవచ్చు. జట్టులో చాలామంది మిడిలార్డర్ బ్యాటర్లు ఉండటంతో తుది జట్టు కూర్పు సమస్యగా మారవచ్చు. ఓపెనర్లుగా జోస్ ఇంగ్లిస్, ప్రభ్‌సిమ్రన్ సింగ్ రావచ్చని అంచనా. వన్‌డౌన్‌లో శ్రేయస్ అయ్యర్, నాలుగో స్థానంలో నేహల్ వధేరా, ఐదో ప్లేస్‌లో శశాంక్ సింగ్ బ్యాటింగ్‌కు దిగే అవకాశం ఉంది.ఆరో స్థానంలో మ్యాక్స్‌వెల్, ఏడో ప్లేస్‌లో అజ్మతుల్లా ఒమర్జాయ్/మార్కో జన్సెన్, బౌలర్లుగా అర్షదీప్ సింగ్, లోకీ ఫెర్గూసన్, యుజ్వేంద్ర చహల్, జేవియర్ బార్ట్లెట్ తుది జట్టులో ఉండవచ్చు.కాగా, ఈ నెల 22 నుంచి ఐపీఎల్ 18వ సీజన్ ప్రారంభం కానుండగా... పంజాబ్ కింగ్స్ మార్చి 25న గుజరాత్ టైటాన్స్‌తో తమ తొలి మ్యాచ్ ఆడనుంది.లీగ్ ఆరంభం నుంచి ఒక్కసారి కూడా ట్రోఫీ చేజిక్కించుకోలేకపోయిన పంజాబ్ కింగ్స్... ఈసారి తమ చిరకాల స్వప్నం నెరవేర్చుకోవాలనే లక్ష్యంతో ఉంది. గతేడాది కోల్‌కతా నైట్‌రైడర్స్‌ను చాంపియన్‌గా నిలిపిన శ్రేయస్ అయ్యర్ ఈసారి పంజాబ్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఆసీస్ దిగ్గజం రికీ పాంటింగ్ హెడ్‌కోచ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. వీరిద్దరి కాంబినేషన్లో పంజాబ్ తమ టైటిల్ కల నేరవేర్చుకుంటుందేమో చూడాలి. ఐపీఎల్ 2025 సీజన్లో పంజాబ్ కింగ్స్ జట్టు..శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), నేహల్ వధేరా, ప్రియాన్ష్ ఆర్య, హర్నూర్ సింగ్, పైలా అవినాశ్, ముషీర్ ఖాన్, మార్కస్ స్టోయినిస్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, శశాంక్ సింగ్, ఆరోన్ హార్డీ, అజ్మతుల్లా ఒమర్జాయ్, మార్కో జన్సెన్, సూర్యాంశ్ షేడ్గే, ప్రవీణ్ దూబే, జోస్ ఇంగ్లిస్, ప్రభ్‌సిమ్రన్ సింగ్, విష్ణు వినోద్, హర్‌ప్రీత్ బ్రార్, అర్షదీప్ సింగ్, యుజ్వేంద్ర చహల్, లోకీ ఫెర్గూసన్, విజయ్‌కుమార్ వైశాక్, కుల్దీప్ సేన్, యశ్ ఠాకూర్, జేవియర్ బార్ట్లెట్ -
IPL 2025: అంపైర్‌గా కోహ్లి సహచరుడు
ఆర్సీబీ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి చిన్ననాటి స్నేహితుడు తన్మయ్ శ్రీవాత్సవ ఐపీఎల్ 2025 సీజన్ కోసం అంపైర్‌గా ఎంపికయ్యాడు. ఈ విషయాన్ని ఉత్తర్‌ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ (శ్రీవాత్సవ సొంత రాష్ట్రం) అధికారికంగా ప్రకటించింది. నిజమైన ఆటగాడు ఎప్పుడూ మైదానాన్ని వడిచి వెళ్ళడు. మైదానంలో అతని పాత్ర మాత్రమే మారుతుంది. కొత్త ప్రయాణంలో శ్రీవాస్తవకు శుభాకాంక్షలు అంటూ ఉత్తర్‌ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ తమ ఎక్స్ ఖాతాలో రాసుకొచ్చింది.35 ఏళ్ల తన్మయ్ శ్రీవాత్సవ్ కోహ్లి కెప్టెన్సీలో అండర్-19 వరల్డ్‌కప్ (2008) గెలిచిన భారత జట్టులో కీలక సభ్యుడు. సౌతాఫ్రికాతో జరిగిన ఆ టోర్నీ ఫైనల్లో శ్రీవాత్సవ్ టాప్ రన్ స్కోరర్‌గా (ఇరు జట్ల తరఫున) నిలిచి భారత్ టైటిల్ సాధించడంలో ప్రధానపాత్ర పోషించాడు. ఆ మ్యాచ్‌లో మూడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన శ్రీవాత్సవ్ 46 పరుగులు చేశాడు. ఆ మ్యాచ్‌లో భారత 12 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాను ఓడించి (డక్ వర్త్ లూయిస్ పద్దతిలో) ఛాంపియన్‌గా నిలిచింది. ఐదేళ్ల క్రితం ప్రొఫెషనల్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన శ్రీవత్సవ.. అప్పటి నుంచి దేశవాలీ క్రికెట్లో అంపైర్‌గా వ్యవహరిస్తున్నాడు. శ్రీవాత్సవ 2008-2012 వరకు ఐపీఎల్ ఆడాడు. ఐపీఎల్లో ఆటగాడిగా శ్రీవాత్సవ కెరీర్ అంత ఆశాజనకంగా సాగలేదు. ఐదేళ్లలో అతను 7 మ్యాచ్‌లు ఆడి కేవలం 8 పరుగులే చేశాడు. శ్రీవాత్సవ దేశవాలీ కెరీర్ మాత్రం పర్వాలేదన్నట్లుగా ఉంది. ఉత్తర్‌ప్రదేశ్ తరఫున అతను 90 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు, 44 లిస్ట్-ఏ, 34 టీ20 ఆడి 7000 పైచిలుకు పరుగులు చేశాడు. ఇందులో 17 సెంచరీలు, 81 అర్ద సెంచరీలు ఉన్నాయి.ఆసక్తికరమైన మరో విషయం ఏంటంటే.. శ్రీవాత్సవతో పాటు 2008 అండర్-19 వరల్డ్‌కప్ గెలిచిన భారత జట్టులో మరో సభ్యుడు కూడా బీసీసీఐ అంపైర్‌గా ఉన్నాడు. ఆ జట్టులోని అజితేశ్ అర్గాల్ ప్రస్తుతం ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌ల్లో అంపైరింగ్ చేస్తున్నాడు. ఇద్దరు సహచరులు అంపైర్లుగా మారినా కోహ్లి మాత్రం ఇంకా ఆటగాడిగానే కొనసాగుతున్నాడు. కోహ్లి కెరీర్ ప్రస్తుతం ఉన్నత దశలో ఉంది. సహచరుడు అంపైరింగ్ చేస్తుండగా కోహ్లి ఆటగాడిగా ఆడటం వింత ఆసక్తికరం.ఇదిలా ఉంటే, ఐపీఎల్ 2025 సీజన్ మార్చి 22 నుంచి ప్రారంభం కానుంది. సీజన్ తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ కేకేఆర్.. ఆర్సీబీతో తలపడనుంది. -
IPL 2025: మరోసారి తన బ్యాటింగ్ స్థానాన్ని త్యాగం చేయనున్న కేఎల్ రాహుల్..?
జట్టు ప్రయోజనాల కోసం కేఎల్ రాహుల్ మరోసారి తన బ్యాటింగ్ స్థానాన్ని మార్చుకోనున్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో ఓపెనర్‌గా, మూడో నంబర్ ఆటగాడిగా, 4, 5, 6 స్థానాల్లో బ్యాటింగ్ చేసిన రాహుల్.. ఐపీఎల్-2025లో తన కొత్త జట్టు ఢిల్లీ క్యాపిటల్స్ కోసం నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు రానున్నాడు. ఐపీఎల్లో ఓపెనర్‌గా మంచి సక్సెస్ సాధించిన రాహుల్.. జట్టు అవసరాల దృష్ట్యా ఓపెనింగ్ స్థానాన్ని త్యాగం చేయనున్నాడు. రాహుల్ మిడిలార్డర్ బ్యాటింగ్‌కు వస్తాడన్న విషయాన్ని ఢిల్లీ క్యాపిటల్స్ మేనేజ్మెంట్ సూచనప్రాయంగా వెల్లడించింది. జట్టు ఏదైనా ప్రయోజనాలే ముఖ్యమనుకునే రాహుల్.. ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్సీని సైతం వద్దనుకున్నాడు. సాధారణ ఆటగాడిగా కొనగేందుకే ఇష్టపడ్డాడు. రాహుల్ కాదనుకుంటే అక్షర్ పటేల్‌ను ఢిల్లీ కెప్టెన్సీ వరిచింది. అక్షర్ జూనియర్ అయినా అతని అండర్లో ఆడేందుకు రాహుల్ సుముఖత వ్యక్తం చేశాడు.గత మూడు సీజన్లలో కెప్టెన్‌గా వ్యవహరించిన రాహుల్‌ను లక్నో సూపర్ జెయింట్స్ వద్దనుకుంటే ఈ సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ అక్కును చేర్చుకుంది. రాహుల్‌ను డీసీ మేనేజ్మెంట్ రూ. 14 కోట్లకు సొంతం చేసుకుంది. ఈ సీజన్ మెగా వేలంలో తన సహచరులంతా (శ్రేయస్, పంత్) భారీ మొత్తాలు దక్కించుకున్నా రాహుల్ ఏ మాత్రం బాధపడటం లేదు. జట్టు ప్రయోజనాలే ముఖ్యమంటున్నాడు.రాహుల్ మిడిలార్డర్లో వస్తే జేక్ ఫ్రేజర్ మెక్‌గుర్క్, ఫాఫ్ డుప్లెసిస్ ఢిల్లీ ఇన్నింగ్స్‌ను ఓపెన్ చేస్తారు. అభిషేక్ పోరెల్ లేదా కరుణ్ నాయర్ మూడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగుతారు. రాహుల్ నాలుగో స్థానంలో బరిలోకి దిగితే అక్షర్ పటేల్, ట్రిస్టన్ స్టబ్స్ ఆతర్వాతి స్థానాల్లో వస్తారు. ఢిల్లీ ఈ సీజన్లో హాట్ ఫేవరెట్ జట్లలో ఒకటి. ఆ జట్టు బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో పటిష్టంగా కనిపిస్తుంది. బ్యాటింగ్‌లో అభిషేక్ పోరెల్, ఫాఫ్ డుప్లెసిస్, జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్, కరుణ్ నాయర్, కేఎల్ రాహుల్, సమీర్ రిజ్వీ, ట్రిస్టన్ స్టబ్స్, అక్షర్ పటేల్.. బౌలింగ్‌లో దుష్మంత చమీర, కుల్దీప్ యాదవ్, ముకేశ్ కుమార్, టి. నటరాజన్, మిచెల్ స్టార్క్, అక్షర్ పటేల్‌లతో ఆ జట్టు అత్యంత బలీయంగా కనిపిస్తుంది. ఈ జట్టును చూసి ఇప్పటికే చాలా మంది విశ్లేషకులు ఈ సీజన్లో ఢిల్లీ టైటిల్ సాధించడం ఖాయమని జోస్యం చెప్పారు. మరి కొత్త సారథి అక్షర్ పటేల్ అండర్లో ఢిల్లీ తమ తొలి టైటిల్ గెలుస్తుందేమో చూడాలి. ఈ సీజన్లో ఢిల్లీ మే 24న లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగే మ్యాచ్‌తో తమ టైటిల్ వేటను ప్రారంభిస్తుంది. ఈ మ్యాచ్ వైజాగ్‌లో జరుగనుంది. ఈ సీజన్ మార్చి 22న కేకేఆర్, ఆర్సీబీ మ్యాచ్‌తో మొదలవుతుంది.ఐపీఎల్ 2025 సీజన్ కోసం ఢిల్లీ జట్టు..అభిషేక్ పోరెల్, ఫాఫ్ డుప్లెసిస్, జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్, కరుణ్ నాయర్, కేఎల్ రాహుల్, సమీర్ రిజ్వీ, ట్రిస్టన్ స్టబ్స్, అక్షర్ పటేల్, డోనోవన్ ఫెరీరా, అజయ్ మండల్, మన్వంత్ కుమార్, అశుతోష్ శర్మ, మాధవ్ తివారీ, దుష్మంత చమీర, కుల్దీప్ యాదవ్, ముకేశ్ కుమార్, టి. నటరాజన్, విప్రాజ్ నిగమ్, మిచెల్ స్టార్క్, త్రిపురణ విజయ్ -
ఐపీఎల్‌కి ముందే విధ్వంసం మొదలుపెట్టిన ఇషాన్ కిషన్
ఐపీఎల్ 2025 సీజన్ ప్రారంభానికి ముందే సన్‌రైజర్స్ హైదరాబాద్ న్యూ జాయినీ ఇషాన్ కిషన్ విధ్వంసం మొదలైంది. ఎస్ఆర్హెచ్ ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్‌ల్లో పాకెట్ డైనమైట్ చెలరేగిపోతున్నాడు. ఇప్పటివరకు ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో మూడు మెరుపు అర్ద సెంచరీలు సాధించాడు. తాజాగా జరిగిన ఓ ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్‌లో ఇషాన్ ఆకాశమే హద్దుగా చెలరేగి 22 బంతుల్లో 51 పరుగులు చేశాడు. అంతకుముందు ఓ మ్యాచ్‌లో 19 బంతుల్లో 49.. మరో మ్యాచ్‌లో 30 బంతుల్లో 70.. ఇంకో మ్యాచ్‌లో 23 బంతుల్లో 64 పరుగులు చేశాడు. సీజన్ ప్రారంభానికి ముందు ఇషాన్ అరివీర భయంకర ఫామ్ చూసి సన్‌రైజర్స్ శ్రేణులు ఖుషీగా ఉన్నాయి. ఈ సీజన్లో ఇషాన్ మరో విధ్వంకర ఓపెనర్ అభిషేక్ శర్మతో కలిసి సన్‌రైజర్స్ ఇన్నింగ్స్‌కు ప్రారంభించే అవకాశం ఉంది. ఇషాన్, అభిషేక్ తమ సహజ శైలిలో చెలరేగితే ఈ సీజన్లో సన్‌రైజర్స్ ఆపడం ఎవరి తరమూ కాదు. ఇషాన్‌ను ఈ సీజన్ మెగా వేలంలో సన్‌రైజర్స్ రూ. 11.25 కోట్లకు దక్కించుకుంది. గత సీజన్ వరకు ముంబై ఇండియన్స్‌కు ఆడిన ఇషాన్.. ఆ జట్టు విజయాల్లో అత్యంత ప్రాముఖ్యమైన పాత్ర పోషించాడు.ఈ సీజన్లో సన్‌రైజర్స్ బ్యాటింగ్ లైనప్ ఇషాన్, అభిషేక్, హెడ్, క్లాసెన్, అభినవ్ మనోహర్, నితీశ్ కుమార్ రెడ్డితో కూడి అత్యంత ప్రమాదకరంగా కనిపిస్తుంది. గత సీజన్లో ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత భారీ స్కోర్లు నమోదు చేసిన సన్‌రైజర్స్ ఈసారి ఆ స్కోర్లను కూడా అధిగమించే అవకాశం ఉంది. ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్‌ల్లోనే 260, 270 పరుగులను సునాయాసంగా చేస్తున్న ఆరెంజ్ ఆర్మీ.. అస్సలు మ్యాచ్‌ల్లో 300 స్కోర్‌ను దాటినా ఆశ్చర్యపోనక్కర్లేదు. గత సీజన్లో సన్‌రైజర్స్ ఆర్సీబీపై 287 (ఐపీఎల్ హిస్టరీలో ఇదే అత్యధిక స్కోర్), ముంబై ఇండియన్స్‌పై 277, ఢిల్లీ క్యాపిటల్స్‌పై 266 పరుగులు చేసింది. గత సీజన్‌తో పోలిస్తే ఈ సీజన్లో మరింత ప్రమాదకరంగా కనిపిస్తున్న ఆరెంజ్ ఆర్మీ పరుగుల సునామీ సృష్టించడం ఖాయమనిపిస్తుంది. గత సీజన్లో తృటిలో టైటిల్ చేజార్చుకున్న హైదరాబాద్ ఫ్రాంచైజీ ఈసారి ఎలాగైనా కప్పు కొట్టాలని పట్టుదలగా ఉంది. ఈ సీజన్లో బ్యాటింగ్‌తో పాటు సన్‌రైజర్స్ బౌలింగ్ కూడా సమతూకంగా ఉంది. కెప్టెన్ కమిన్స్‌తో పాటు ఈ సీజన్లో కొత్తగా షమీ, ఉనద్కత్, హర్షల్ పటేల్, ఆడమ్ జంపా జట్టులో చేరారు.ఈ సీజన్లో సన్‌రైజర్స్ ప్రయాణం మార్చి 23న రాజస్థాన్ రాయల్స్‌తో జరిగే మ్యాచ్‌తో మొదలవుతుంది. ఈ మ్యాచ్ ఎస్ఆర్హెచ్ హోం గ్రౌండ్ ఉప్పల్ స్టేడియంలో జరుగనుంది. ఈ ఏడాది ఐపీఎల్ మార్చి 22న ప్రారంభం కానుండగా.. తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ కేకేఆర్.. ఆర్సీబీతో తలపడనుంది.2025 ఐపీఎల్ కోసం సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఇదే..పాట్ కమిన్స్ (కెప్టెన్), అథర్వ్ తైడే, అభినవ్ మనోహర్, అనికేత్ వర్మ, సచిన్ బేబి, ట్రవిస్ హెడ్, నితీశ్ కుమార్ రెడ్డి, కమిందు మెండిస్, వియాన్ ముల్దర్, అభిషేక్ శర్మ, హెన్రిచ్ క్లాసెన్, ఇషాన్ కిషన్, జీషన్ అన్సారీ, మహ్మద్ షమీ, హర్షల్ పటేల్, రాహుల్ చాహర్, సిమర్జీత్ సింగ్, ఎషాన్ మలింగ, ఆడమ్ జంపా, జయదేవ్ ఉనద్కత్ -
రెచ్చిపోయిన రిషి ధవన్.. లెజెండ్స్ లీగ్ ఛాంపియన్‌గా ఆసియా స్టార్స్
తొట్ట తొలి ఆసియా లెజెండ్స్ లీగ్ ఛాంపియన్‌షిప్‌ను ఆసియా స్టార్స్ కైవసం చేసుకుంది. ఉదయ్‌పూర్‌లోని మిరాజ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో నిన్న (మార్చి 18) జరిగిన ఫైనల్లో ఇండియన్ రాయల్స్‌ను 6 వికెట్ల తేడాతో ఓడించి ట్రోఫీని సొంతం చేసుకుంది. ఈ టోర్నీలో ఆసియా ప్రాంతానికి చెందిన మాజీలు, దిగ్గజ క్రికెటర్లు పాల్గొన్నారు. ఐదు జట్లు (ఇండియన్ రాయల్స్, ఆసియా స్టార్స్, శ్రీలంక లయన్స్, ఆఫ్ఘనిస్తాన్ పఠాన్స్, బంగ్లాదేశ్ టైగర్స్) పాల్గొన్న ఈ టోర్నీలో ఆసియా స్టార్స్ విజేతగా అవతరించింది. గ్రూప్ దశలో టాపర్‌గా నిలిచిన ఇండియన్ రాయల్స్ ఫైనల్లో ఆసియా స్టార్స్ చేతిలో చిత్తైంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన రాయల్స్.. 19.5 ఓవర్లలో 148 పరుగులకే ఆలౌటైంది. ఆసియా బౌలర్లు ఈశ్వర్ పాండే (4-0-31-3), రిషి ధవన్ (3.5-0-27-2), మునవీర (4-0-33-2), పవన్ సుయాల్ (4-0-19-1) రాయల్స్‌ను దెబ్బేశారు. రాయల్స్ ఇన్నింగ్స్‌లో సంజయ్ సింగ్ (57) ఒక్కడే అర్ద సెంచరీతో రాణించాడు. మిగతా బ్యాటర్లు ఒక్కరు కూడా కనీసం 20 పరుగులు చేయలేకపోయారు. నమన్ ఓఝా 5, రాహుల్ యాదవ్ 4, కెప్టెన్ ఫయాజ్ ఫజల్ 11, నగార్ 16, మనన్ శర్మ 14, సక్సేనా 15, బిపుల్ శర్మ 5, గోని 2, అనురీత్ సింగ్ 15 పరుగులు చేశారు.అనంతరం బరిలోకి దిగిన ఆసియా స్టార్స్ 19.1 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి రాయల్స్ నిర్దేశించిన లక్ష్యాన్ని ఛేదించింది. బౌలింగ్‌లో పర్వాలేదనిపించిన రిషి ధవన్ (57 బంతుల్లో 83; 11 ఫోర్లు, సిక్స్) బ్యాటింగ్‌లో రెచ్చిపోయి తన జట్టు విజయంలో ప్రధానపాత్ర పోషించాడు. ధవన్‌కు మరో ధవన్ (రాఘవ్) సహకరించాడు. రాఘవ్ ధవన్ 29 బంతుల్లో 37 పరుగులు చేసి ఆసియా స్టార్స్‌ను విజయతీరాలకు చేర్చాడు. ఆసియా స్టార్స్ ఇన్నింగ్స్‌లో కెప్టెన్ మెహ్రాన్ ఖాన్ డకౌట్ కాగా.. కశ్యప్ ప్రజాపతి 15, దిల్షన్ మునవీర 2, సరుల్ కన్వర్ 2 (నాటౌట్) పరుగులు చేశారు. ఇండియన్ రాయల్స్ బౌలర్లలో మన్‌ప్రీత్ గోని, అనురీత్ సింగ్, బిపుల్ శర్మ, మనన్ శర్మ తలో వికెట్ తీశారు. ఈ టోర్నీలో ఇండియన్ రాయల్స్ తరఫున టీమిండియా మాజీ ప్లేయర్లు శిఖర్ ధవన్, మునాఫ్ పటేల్, మనోజ్ తివారి, సుబ్రమణ్యం బద్రీనాథ్ ఆడారు. -
మహిళల ప్రపంచకప్ కోసం...
న్యూఢిల్లీ: ఈ ఏడాది భారత్ ఆతిథ్యమివ్వబోయే మహిళల వన్డే ప్రపంచకప్ కోసం ఆర్గనైజింగ్ కమిటీని ఏర్పాటు చేసేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కసరత్తు చేస్తోంది. ఇందుకోసం ఈ నెల 22న కోల్‌కతాలో బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ సమావేశం కానుంది. అదే రోజు అక్కడి ఈడెన్ గార్డెన్స్‌లో ఈ సీజన్ ఐపీఎల్ ఆరంభ మ్యాచ్ జరుగనుంది. ఐపీఎల్ తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తలపడుతుంది. ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందే బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ ఆర్గనైజింగ్ కమిటీపై కసరత్తు పూర్తి చేయనుంది. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా పొగాకు, మద్యం ఉత్పాదనలకు సంబంధించిన ప్రకటనలు క్రికెట్ మైదానంలో నిషేధం, క్రిప్టో కరెన్సీపై గట్టి నిర్ణయం కూడా తీసుకుంటారు. ఈ ఏడాది అక్టోబర్‌లో వన్డే మెగా ఈవెంట్ జరగాల్సి ఉంది. ఈ కౌన్సిల్ అజెండాలో కమిటీ ఏర్పాటుతో పాటు మెగా ఈవెంట్ వేదికలపై కూడా చర్చించనున్నట్లు తెలిసింది. దీంతో పాటు 2025–26 దేశవాళీ సీజన్ షెడ్యూల్‌ను ఖరారు చేస్తారని, అలాగే భారత పర్యటనకు వచ్చే వెస్టిండీస్, దక్షిణాఫ్రికాలతో ద్వైపాక్షిక సిరీస్ వేదికలపై కూడా అపెక్స్ కౌన్సిల్ చర్చించే అవకాశముందని బోర్డు వర్గాలు తెలిపాయి. పొగాకు, మద్యం ప్రకటనలపై ఇదివరకే ఐపీఎల్ సీజన్లో విధించిన నిషేధాన్ని బోర్డు అమలు చేయనుంది. టీమిండియా పురుషుల జట్టు వన్డే వరల్డ్‌కప్‌ను రెండుసార్లు గెలిచినప్పటికీ... భారత మహిళల జట్టుకు మాత్రం ఆ ‘కప్’ అందని ద్రాక్షే అయ్యింది. ఫైనల్ చేరిన రెండు సార్లు కూడా అమ్మాయిల జట్టు రన్నరప్‌తోనే సరిపెట్టుకుంది. హర్మన్‌ప్రీత్ కౌర్ సేన కనీసం ఈ ఏడాదైన సొంతగడ్డపై ప్రపంచకప్ గెలిచి సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతుందో చూడాలి! -
షఫాలీ ‘హ్యాట్రిక్’
గువాహటి: డాషింగ్ బ్యాటర్ షఫాలీ వర్మ జాతీయ టోర్నీలో బంతితో మెరిసింది. మహిళల అండర్–23 వన్డే ట్రోఫీలో ‘హ్యాట్రిక్’ వికెట్లతో అదరగొట్టింది. దీంతో హరియాణా క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. మంగళవారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో హరియాణా జట్టు 6 వికెట్ల తేడాతో కర్ణాటకపై విజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన కర్ణాటక జట్టు 49.3 ఓవర్లలో 217 పరుగుల వద్ద ఆలౌటైంది. ఇన్నింగ్స్ 44వ ఓవర్ వేసిన షఫాలీ వర్మ (3/20) ఐదో బంతికి సలోని (50 బంతుల్లో 30; 4 ఫోర్లు), ఆరో బంతికి సౌమ్య వర్మ (0)లను అవుట్ చేసింది. మళ్లీ 46వ ఓవర్ వేసిన ఆమె తొలి బంతికే నమిత డిసౌజా (1)ను బౌల్డ్ చేయడంతో ‘హ్యాట్రిక్’ పూర్తయ్యింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన హరియాణా 42 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 219 పరుగులు చేసి గెలిచింది. ఓపెనింగ్ చేసిన షఫాలీ (18) తక్కువ స్కోరుకే పరిమితం కాగా, సోనియా (79 బంతుల్లో 66; 8 ఫోర్లు), తనీషా (77 బంతుల్లో 77 నాటౌట్; 10 ఫోర్లు, 1 సిక్స్) అర్ధసెంచరీలతో రాణించారు. ఇటీవలే ముగిసిన మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో షఫాలీ ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున విశేషంగా రాణించింది. అయితే ఫైనల్లో ఢిల్లీ మళ్లీ ఓడి వరుసగా మూడోసారి రన్నరప్‌తో సరిపెట్టుకుంది. ముంబై ఇండియన్స్ రెండో డబ్ల్యూపీఎల్ టైటిల్‌ను సాధించింది. ఈ సీజన్ లీగ్ టాప్ స్కోరర్లలో ఆమె 304 పరుగులతో నాలుగో స్థానంలో నిలిచింది. ఈమె కంటే ముందు వరుసలో నాట్ సివర్ (523), ఎలీస్ పెరి (372), హేలీ మాథ్యూస్ (307) ఉన్నారు. భారత బ్యాటర్లలో షఫాలీనే టాప్ స్కోరర్! గతేడాది టి20 ప్రపంచకప్ అనంతరం జట్టులో స్థానం కోల్పోయిన ఆమె తిరిగి జాతీయ జట్టులోకి వచ్చేందుకు పట్టుదలగా రాణిస్తోంది. -
‘సిక్సర్’ కొట్టేదెవరో?
ఐపీఎల్లో విజయవంతమైన జట్టుగా గుర్తింపు... హేమాహేమీలు ప్రాతినిధ్యం వహించిన ఫ్రాంచైజీగా రికార్డు... నైపుణ్యాన్ని వలవేసి పట్టే నేర్పరితనం... యువ ఆటగాళ్లకు అండగా నిలిచే యాజమాన్యం... వెరసి ఐపీఎల్ టోర్నీ చరిత్రలో 5 ట్రోఫీలు సాధించిన ముంబై ఇండియన్స్ జట్టు గత కొన్నాళ్లుగా స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చలేకపోతోంది. రోహిత్ శర్మ నుంచి సారథ్య బాధ్యతలు హార్దిక్ పాండ్యాకు అప్పగించడంతో జట్టులో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. అభిమానుల అసహనం, మాజీల రుసరుసలు, విశ్లేషకులు వెటకారాలతో గత సీజన్ గడిచిపోగా... 2024 ఐపీఎల్ తర్వాత భారత జట్టుకు రోహిత్ శర్మ 2 ఐసీసీ ట్రోఫీలు అందించాడు. ఈ రెండింట్లో హార్దిక్ కీలకపాత్ర పోషించడంతో సమస్య సమసిపోయినట్లైంది. మరి ఈ ఏడాదైనా ముంబై సమష్టిగా సత్తాచాటి మునుపటి జోరు సాగిస్తుందా చూడాలి! ఐపీఎల్ చరిత్రలో అత్యంత విజయవంతమైన జట్టు ఏదైనా ఉందంటే... అది ముమ్మాటికీ చెన్నై సూపర్ కింగ్సే! ఇప్పటి వరకు 15 సీజన్లు ఆడిన చెన్నై జట్టు అందులో 10 సార్లు ఫైనల్‌కు చేరి ఐదుసార్లు ట్రోఫీ చేజిక్కించుకుంది. ఈ గణాంకాలు చాలు ఐపీఎల్లో చెన్నై జోరు ఏంటో చెప్పేందుకు. వికెట్ల వెనక ధోని మాయాజాలం... కాన్వే, రచిన్ రవీంద్ర బ్యాటింగ్ సామర్థ్యం... శివమ్ దూబే, రవీంద్ర జడేజా ఆల్‌రౌండ్ మెరుపులు, అశ్విన్, పతిరణ బౌలింగ్ నైపుణ్యం ఇలా అన్నీ విభాగాల్లో పటిష్టంగా ఉన్న చెన్నై సూపర్ కింగ్స్... ఆరో కప్పువేటకు సిద్ధమైంది. –సాక్షి క్రీడావిభాగం ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ప్రారంభం నుంచి నిలకడ కొనసాగిస్తున్న ముంబై ఇండియన్స్ జట్టు ఆరోసారి ట్రోఫీ చేజిక్కించుకునేందుకు సిద్ధమవుతోంది. గత కొన్ని సీజన్లుగా పెద్దగా ఆకట్టుకోలేకపోతున్న ముంబై ఇండియన్స్ ఈసారి మెరుగైన ప్రదర్శన చేయడమే లక్ష్యంగా సాగుతోంది. గత సీజన్ ఆరంభానికి ముందు ఫ్రాంచైజీకి ఐదు ట్రోఫీలు (2013, 2015, 2017, 2019, 2020) అందించిన ‘హిట్‌మ్యాన్’ రోహిత్ శర్మను కాదని... గుజరాత్ టైటాన్స్ నుంచి హార్దిక్ పాండ్యాను తీసుకొచ్చి సారథ్య బాధ్యతలు అప్పగించడం అభిమానులకు ఏమాత్రం రుచించలేదు. దీంతో సామాజిక మాధ్యమాల్లో ముంబై ఇండియన్స్ నిర్ణయాన్ని దుమ్మెత్తిపోసిన అభిమానులు... మైదానంలో హార్దిక్‌ను గేలి చేశారు. సొంత మైదానం వాంఖడేతో పాటు... దేశంలో ఎక్కడ మ్యాచ్ ఆడేందుకు వెళ్లినా... పాండ్యాకు ఇదే అనుభవం ఎదురైంది. దీంతో సహజంగానే డ్రెస్సింగ్‌రూమ్ వాతావరణం దెబ్బతింది. అదే మైదానంలో ప్రస్ఫుటమైంది. గత సీజన్లో 14 మ్యాచ్‌లాడిన ముంబై ఇండియన్స్ జట్టు కేవలం 4 విజయాలు మాత్రమే సాధించి 10 పరాజయాలతో పట్టికలో అట్టడుగున నిలిచింది. గత నాలుగు సీజన్లలో ఒక్కసారి (2023లో) మాత్రమే ముంబై జట్టు ప్లే ఆఫ్స్‌కు చేరింది. 2022, 2024లో పట్టికలో కింది స్థానంతో లీగ్‌ను ముగించింది. అయితే అప్పటికీ ఇప్పటికీ జట్టులో ఎంతో తేడా కనిపిస్తోంది. ఏడాది వ్యవధిలో రోహిత్ శర్మ సారథ్యంలోని భారత జట్టు ఐసీసీ టి20 ప్రపంచకప్‌తో పాటు, చాంపియన్స్ ట్రోఫీ చేజిక్కించుకుంది. ఈ రెండు విజయాల్లోనూ కీలకంగా నిలిచిన హార్దిక్ పాండ్యాను అభిమానులు తిరిగి అక్కున చేర్చుకున్నారు. దీనికి తోడు రోహిత్ వంటి అనుభవజ్ఞుడి సలహాలు, సూచనలు ఉంటే... పాండ్యా జట్టును మరింత ముందుకు తీసుకెళ్లడం ఖాయమే. బుమ్రా ఫిట్నెస్ సాధించేనా! ఆ్రస్టేలియా పర్యటన సందర్భంగా గాయపడ్డ భారత ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఫిట్‌నెస్‌పై ముంబై ఆందోళన చెందుతోంది. వెన్నునొప్పితో చాంపియన్స్ ట్రోఫీకి దూరమైన ఈ ఏస్ పేసర్... ఐపీఎల్ తొలి దశ మ్యాచ్‌లకు అందుబాటులో ఉండబోడని ఇప్పటికే ఫ్రాంచైజీ వెల్లడించింది. అయితే అతడి సేవలు ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తాయనే దానిపై స్పష్టత లేదు. గతేడాది వేలంలో బుమ్రా, రోహిత్, హార్దిక్, సూర్యకుమార్‌తో పాటు హైదరాబాదీ ప్లేయర్ తిలక్ వర్మను ఫ్రాంచైజీ రిటైన్ చేసుకుంది. అందులో అత్యధికంగా బుమ్రాకు రూ. 18 కోట్లు కట్టబెట్టింది. యువ ఆటగాడు ఇషాన్ కిషన్‌ను వేలానికి వదిలేసిన ముంబై... ట్రెంట్ బౌల్ట్, దీపక్ చాహర్, సాంట్నర్‌తో బౌలింగ్‌ను మరింత పటిష్టం చేసుకుంది. రోహిత్‌తో కలిసి దక్షిణాఫ్రికా ప్లేయర్ రికెల్టన్ ఇన్నింగ్స్‌ను ఆరంభించనున్నాడు. భారత ఆటగాళ్ల విషయంలో పటిష్టంగా కనిపిస్తున్న ముంబై ఇండియన్స్... విదేశీ ఆటగాళ్ల ఎంపిక మాత్రం కాస్త అనూహ్యంగా ఉంది. లోయర్ ఆర్డర్లో ధాటిగా ఆడగల విదేశీ పించ్ హిట్టర్ లోటు కనిపిస్తోంది. రూ.5 కోట్ల 25 లక్షలు వెచ్చించి ‘రైట్ టు మ్యాచ్’ ద్వారా తిరిగి దక్కించుకున్న నమన్ ధీర్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. బుమ్రా గైర్హాజరీలో బౌల్ట్, సాంట్నర్, దీపక్ చాహర్, కరణ్ శర్మ పై బౌలింగ్ భారం పెరగనుంది. ఆంధ్ర ఆటగాడు పెనుమత్స సత్యనారాయణ రాజు, క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ జట్టులో ఉన్నా... వారికి మ్యాచ్ ఆడే అవకాశం దక్కడం కష్టమే. ముంబై ఇండియన్స్ జట్టు: హార్దిక్ పాండ్యా (కెప్టెన్ ), రోహిత్, సూర్యకుమార్, తిలక్, రాబిన్ మిన్జ్, రికెల్టన్, శ్రీజిత్ క్రిష్ణన్, జాకబ్స్, నమన్ ధీర్, జాక్స్, సాంట్నర్, అంగద్ , విఘ్నేశ్, కార్బిన్, బౌల్ట్, కరణ్ శర్మ, దీపక్ చాహర్, అశ్వని కుమార్, టాప్లీ, వెంకట సత్యనారాయణ, అర్జున్ టెండూల్కర్, ముజీబ్, బుమ్రా. అంచనా: ముంబై ఇండియన్స్ ఆటతీరు పరిశీలిస్తే... ఆడితే అందలం, లేకుంటే అట్టడుగు స్థానం అనేది సుస్పష్టం. గత నాలుగు సీజన్లలో కేవలం ఒక్కసారే ప్లే ఆఫ్స్‌కు చేరిన ముంబై... స్థాయికి తగ్గ ప్రదర్శన చేస్తే ఈ సారి కూడా ప్లే ఆఫ్స్ చేరొచ్చు. సాధారణ ఆటగాడు సైతం... అసాధారణ ప్రదర్శన చేయడం... అప్పటి వరకు జట్టులో చోటు దక్కడమే కష్టమనుకున్న ప్లేయర్ సైతం... ‘ఎక్స్’ ఫ్యాక్టర్‌గా మారడం... చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో నిత్యకృత్యం.అందుబాటులో ఉన్న వనరులను వినియోగించుకోవడంలో చెన్నైని మించిన జట్టు లేదనడంలో అతిశయోక్తి లేదు. ఇప్పటి వరకు 5 సార్లు (2010, 2011, 2018, 2021, 2023) ఐపీఎల్ ట్రోఫీ చేజిక్కించుకున్న సూపర్ కింగ్స్ మరో 5 సార్లు (2008, 2012, 2013, 2015, 2019) రన్నరప్‌గా నిలిచింది. గతేడాదే రుతురాజ్ గైక్వాడ్‌కు సారథ్య బాధ్యతలు అప్పగించిన ఫ్రాంచైజీ... అతడితో పాటు రవీంద్ర జడేజాకు రూ. 18 కోట్లు ఇచ్చి అట్టిపెట్టుకుంది.పతిరణను రూ. 13 కోట్లు, శివమ్ దూబేను రూ. 12 కోట్లు వెచ్చించి రిటైన్ చేసుకుంది. అంతర్జాతీయ మ్యాచ్ ఆడి ఐదేళ్లు దాటిపోయిన మహేంద్రసింగ్ ధోనిని రూ. 4 కోట్లకు కొనసాగించింది. వీరితో పాటు రచిన్ రవీంద్రను రూ. 4 కోట్లతో ‘రైట్ టు మ్యాచ్’ ద్వారా తిరిగి సొంతం చేసుకుంది. ఇక సుదీర్ఘ కాలం తర్వాత రవిచంద్రన్ అశ్విన్‌ను తిరిగి కొనుగోలు చేసుకుంది. మరి గత కొంత కాలంగా నిలకడగా రాణించలేకపోతున్న సూపర్ కింగ్స్ ఈసారి ఎలాంటి ప్రదర్శన చేస్తుందో చూడాలి. తలా... అన్నీ తానై! అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన అనంతరం కేవలం ఐపీఎల్ మాత్రమే ఆడుతున్న ధోని... ఈసారి కూడా జట్టును ముందుండి నడిపించనున్నాడు. పేరుకు రుతురాజ్ కెప్టెన్ అయినా... వికెట్ల వెనక నుంచి టీమ్‌కు దిశానిర్దేశం చేసేది ధోనినే అనడంలో సందేహం లేదు. ఎలాంటి ఒత్తిడి లేకుండా ఆడుతున్న ధోనీ గతేడాది బ్యాటింగ్ ఆర్డర్లో మరీ కింది స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చాడు. మరి ఈసారైనా అతని బ్యాట్ నుంచి మెరుపులు వస్తాయోమో చూడాలి. బ్యాటింగ్‌లో కాన్వే, రచిన్, దూబే, రుతురాజ్, జడేజా, ధోని కీలకం కానుండగా... పతిరణ, అశ్విన్, ఖలీల్ అహ్మద్, స్యామ్ కరన్ బౌలింగ్ బాధ్యతలు మోయనున్నారు. రచిన్, జడేజా, దూబే, దీపక్ హూడా, విజయ్ శంకర్, అశ్విన్, జేమీ ఓవర్టన్, సామ్ కరన్ ఇలా లెక్కకు మిక్కిలి ఆల్‌రౌండర్లు ఉండటం చెన్నైకి అదనపు బలం. ఆంధ్ర ఆటగాడు షేక్ రషీద్ జట్టులో ఉన్నా... అతడికి మ్యాచ్ ఆడే అవకాశం దక్కుతుందో లేదో వేచి చూడాలి. చెన్నై జట్టు: రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్ ), మహేంద్రసింగ్ ధోని, కాన్వే, రాహుల్ త్రిపాఠి, షేక్ రషీద్, వన్ష్ బేదీ, సిద్ధార్్థ, రచిన్ రవీంద్ర, రవిచంద్రన్ అశ్విన్, విజయ్ శంకర్, స్యామ్ కరన్, అన్షుల్ కంబోజ్, దీపక్ హూడా, జేమీ ఓవర్టన్, కమలేశ్ నాగర్కోటి, రామకృష్ణ ఘోష్, రవీంద్ర జడేజా, శివమ్ దూబే, ఖలీల్ అహ్మద్, నూర్ అహ్మద్, ముకేశ్, గుర్జప్నీత్ సింగ్, నాథన్ ఎలీస్, శ్రేయస్ గోపాల్, పతిరణ. అంచనా: ఐపీఎల్లో మిగిలిన జట్లతో పోల్చుకుంటే అత్యధిక మంది ఆల్‌రౌండర్లు అందుబాటులో ఉన్న చెన్నై స్థాయికి తగ్గ ప్రదర్శన చేస్తే ఫైనల్ చేరడం పెద్ద కష్టం కాకపోవచ్చు. -
IPL 2025: స్పిన్-టు-విన్ వ్యూహం.. ఆరో టైటిల్‌కు గురి!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) చరిత్రలో అత్యంత విజయవంతమైన జట్లలో ఒకటి చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings). రికార్డు స్థాయిలో ఆరవ టైటిల్‌ను లక్ష్యంగా చేసుకుని ఈసారి బరిలోకి దిగుతోంది. 2024లో లీగ్ దశ నుంచి నిష్క్రమించిన బాధ ఇంకా చెన్నై ఆటగాళ్ల మనసులో కదులుతూనే ఉంది. ఈ నేపథ్యంలో కొత్త సీజన్లో తమ అద్భుతమైన ప్రదర్శనతో తిరిగి పూర్వ వైభవం సాధించాలని సీఎస్కే పట్టుదలతో ఉందనడంలో సందేహం లేదు.యువ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ గత సీజన్‌కు ముందు కెప్టెన్‌గా బాధ్యతలు అప్పగించిన తర్వాత కొంత అనుభవం గడించిన నేపథ్యంలో ఈ సీజన్లో కొత్త కెప్టెన్ మరింత మెరుగ్గా వ్యవహరించే అవకాశముందని భావిస్తున్నారు. కాగా.. గత సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ ప్లేఆఫ్ స్థానాన్ని కూడా సాధించలేకపోయింది.7 విజయాలు, 7 ఓటములతో కేవలం 14 పాయింట్లు మాత్రమే సాధించి గత సీజన్లో పేలవంగా ఐదో స్థానం తో ముగించింది. ఈ ఐపీఎల్ సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ మార్చి 23న చెన్నైలోని ఎం ఎ చిదంబరం స్టేడియంలో ముంబై ఇండియన్స్ తో జరిగే మ్యాచ్ తో తన టైటిల్ వేట ప్రారంభిస్తుంది.స్పిన్-టు-విన్ వ్యూహంఈ నేపథ్యంలో ఈ సారి భారత వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మరియు చెన్నై అభిమానుల ఫేవరెట్ ఆటగాడు సామ్ కుర్రాన్‌తో సహా అనేక సుపరిచితమైన ఆటగాళ్లను చెన్నై మళ్ళీ జట్టులోకి తీసుకుంది. భారత్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని వెనుక నుంచి తన వ్యూహరచనలో జట్టును ముందుండి నడిపిస్తాడని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు.ఇక జట్టును చూస్తే, గత కొన్ని సంవత్సరాలుగా అద్భుతమైన ఫలితాల్ని ఇచ్చిన 'స్పిన్-ట్రిక్' కు కట్టుబడి ఉండాలని చెన్నై భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకు అనుగుణంగా రవీంద్ర జడేజా, న్యూజిలాండ్‌కు చెందిన భారత్ సంతతి ఆల్ రౌండర్ రచిన్ రవీంద్రతో పాటు నూర్ అహ్మద్, అశ్విన్‌లను చేర్చడం, ముఖ్యంగా సొంత గడ్డ పై గరిష్ట ప్రభావాన్ని చూపడానికి టర్నర్లను ఉపయోగించాలనే వారి ధోరణిని గుర్తుచేస్తుంది.అశ్విన్, నూర్ లతో పాటు జడేజా ఎడమచేతి ఫింగర్స్పిన్, గోపాల్ లెగ్‌స్పిన్, ఇంకా దీపక్ హుడా పార్ట్-టైమ్ ఆఫ్‌స్పిన్ వంటి బౌలర్లు చెన్నై స్పిన్ బౌలింగ్ కి వెరైటీ సమకూరుస్తున్నారు. ఇది చెపాక్‌లో స్పిన్-టు-విన్ వ్యూహానికి సరిగ్గా సరిపోతుంది.బలీయంగా కనిపిస్తున్న బ్యాటింగ్ఇక బ్యాటింగ్ పరంగా చూస్తే, కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్, న్యూ జిలాండ్ ఓపెనర్ డెవాన్ కాన్వేతో కలిసి బ్యాటింగ్‌ను ప్రారంభించే అవకాశముంది. ఈ జంట 2023 సీజన్లో చాలా విజయవంతమైంది. కానీ గత సీజన్లో గాయం కారణంగా కాన్వే ఆడలేక పోయాడు. ఈ సీజన్లో ఈ ఇద్దరి అద్భుతమైన భాగస్వామ్యంతో చెన్నై మళ్ళీ పుంజుకోవాలని భావిస్తోంది. ఇటీవల ముగిసిన ఛాంపియన్స్ ట్రోఫీలో విజృంభించిన ఆడిన రచిన్ రవీంద్రను మూడవ స్థానంలో బ్యాటింగ్ కి వచ్చే అవకాశముంది.కీలకమైన నాల్గవ స్థానంలో దీపక్ హుడా, రాహుల్ త్రిపాఠి లేదా విజయ్ శంకర్ ఒకరు వచ్చే అవకాశముంది. ఆ తర్వాత హార్డ్ హిట్టింగ్ శివమ్ దూబేను ఐదవ స్థానంలో, ఆ తర్వాత ఆరో స్థానంలో వచ్చే ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా బ్యాటింగ్ మరియు బౌలింగ్ రెండింటిలోనూ తన నైపుణ్యంతో కీలక పాత్ర పోషిస్తాడని భావిస్తున్నారు. జడేజా తర్వాత, ఎంఎస్ ధోని ఏడో స్థానంలో బ్యాటింగ్ చేసే అవకాశముంది. లోయర్ ఆర్డర్ బ్యాటింగ్‌లో గత సీజన్లో కీలక పాత్ర పోషించిన ధోని మరోసారి ప్రభావం చూపే అవకాశం ఉంది.జట్టులో ప్రధాన ఆటగాళ్ళు:రుతురాజ్ గైక్వాడ్: గత కొన్ని సీజన్లగా చెన్నై తరఫున నిలకడగా బ్యాటింగ్ చేస్తున్నవారిలో కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ ఒకడు. రుతురాజ్ తన జట్టు బ్యాటింగ్ యూనిట్‌కు వెన్నెముకగా నిలిచాడు, 41.75 సగటుతో మరియు 136.86 స్ట్రైక్ రేట్‌తో 2380 పరుగులు సాధించాడు. అతని నాయకత్వంలో పసుపు బ్రిగేడ్ గత సీజన్లో ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించలేక పోయినా, గైక్వాడ్ ఈ సీజన్లో మెరుగైన ఆటతీరుతో చెన్నై ని ముందుకు నడిపించాలని పట్టుదలతో ఉన్నాడు.రవిచంద్రన్ అశ్విన్: అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్ అయిన రవిచంద్రన్ అశ్విన్, తన కెరీర్ ప్రారంభ దశలో తనను వెలుగులోకి తెచ్చిన ఫ్రాంచైజీ అయిన చెన్నై కి ఐపీఎల్ టైటిల్‌ను అందించాలని భావిస్తున్నాడు. 212 మ్యాచ్‌ల్లో 7.12 ఎకానమీ రేటుతో 180 వికెట్ల తో అశ్విన్ ఐపీఎల్లో అత్యధిక వికెట్లు తీసిన ఐదవ బౌలర్‌గా నిలిచాడు. అంతేకాకుండా, ఈ ఆఫ్ స్పిన్నర్ తాను బ్యాట్‌తో దూకుడుగా ఉండగలనని మరియు అవసరమైనప్పుడు ఫ్లోటర్‌గా వ్యవహరించగలనని చూపించాడు.నాథన్ ఎల్లిస్: వేగంగా బౌలింగ్ చేయగల మరియు తన వైవిధ్యాలను చాలా చక్కగా ఉపయోగించుకునే సామర్థ్యంతో, నాథన్ ఎల్లిస్ చెన్నై జట్టులో కీలకమైన బౌలర్‌గా రాణిస్తాడని భావిస్తున్నారు.శివం దూబే: దూకుడుతో బ్యాటింగ్ చేసే శివం దూబే చెన్నై జట్టుకు మిడిల్ ఆర్డర్లో కీలక పాత్ర పోషించాడు. సూపర్ కింగ్స్ తరఫున 39 ఇన్నింగ్స్‌లలో 34.47 సగటు మరియు 159.16 స్ట్రైక్ రేట్‌తో 1103 పరుగులు చేశాడు. చెన్నై జట్టుకి మిడిల్ ఓవర్లలో శివం దూబే ను గేమ్-ఛేంజర్ గా భావించవచ్చు.రాహుల్ త్రిపాఠి: డైనమిక్ బ్యాట్స్‌మన్ రాహుల్ త్రిపాఠి చెన్నై సూపర్ కింగ్స్ తరఫున మూడు లేక నాలుగో స్థానంలో ఆడే అవకాశముంది. త్రిపాఠి ఐపీఎల్లో ఇప్పటికే తన ప్రతిభను నిరూపించుకున్నాడు. 27.27 సగటుతో, 139.3 స్ట్రైక్ రేట్‌తో 2236 పరుగులు చేశాడు.చెన్నై సూపర్ కింగ్స్ జట్టురుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), ఎంఎస్ ధోని , రవీంద్ర జడేజా, శివం దూబే, మతీషా పతిరానా, నూర్ అహ్మద్, రవిచంద్రన్ అశ్విన్, డెవాన్ కాన్వే, సయ్యద్ ఖలీల్ అహ్మద్, రచిన్ రవీంద్ర, రాహుల్ త్రిపాఠి, విజయ్ శంకర్, సామ్ కర్రాన్, షేక్ రషీద్, అన్షుల్ కాంబోజ్, ముఖేష్ చౌదరి, దీపక్ హుడా, గుర్జన్‌ప్రీత్ సింగ్, నాథన్ ఎల్లిస్, జామీ ఓవర్టన్, కమలేష్ నాగర్కోటి, రామకృష్ణన్ ఘోష్, శ్రేయాస్ గోపాల్, వంశ్ బేడి, ఆండ్రీ సిద్దార్థ్.చదవండి: అందుకే ఆర్సీబీ టైటిల్ గెలవలేదు.. ఈసారి ఆరెంజ్ క్యాప్ అతడికే: సీఎస్కే మాజీ స్పిన్నర్ -
IPL: ‘గతేడాది ముంబై గెలవాల్సింది.. ఈసారీ ఆ జట్టు సూపర్.. కానీ..’
ముంబై ఇండియన్స్ (Mumbai Indians) ఆటగాళ్లు ఐకమత్యంగా ఉంటే ఆ జట్టును ఎవరూ ఓడించలేరని భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ అన్నాడు. గతం తాలుకు చేదు అనుభవాలు, భేషజాలను వదిలేసి ‘స్టార్లంతా’ ఒకటిగా ముందుడుగు వేయాలని సూచించాడు. యాజమాన్యం సైతం ఈ విషయంలో మరింత చొరవ చూపాలని భజ్జీ విజ్ఞప్తి చేశాడు.కాగా ఐపీఎల్-2024 (IPL)లో ముంబై ఇండియన్స్ అనూహ్య నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. గుజరాత్ టైటాన్స్ నుంచి ట్రేడ్ చేసుకున్న హార్దిక్ పాండ్యాను అందలమెక్కించింది. తమకు ఐదుసార్లు టైటిల్ అందించిన రోహిత్ శర్మ (Rohit Sharma)పై వేటు వేసి.. పాండ్యాను కెప్టెన్‌ను చేసింది. దీంతో అభిమానులు సైతం ముంబై ఓడిపోవాలని కోరుకుంటూ.. పాండ్యాను తీవ్ర స్థాయిలో ట్రోల్ చేశారు.ఇక రోహిత్‌తో పాటు టీమిండియా స్టార్లు జస్ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్ కూడా పాండ్యాకు ప్రాధాన్యం ఇవ్వడాన్ని జీర్ణించుకోలేకపోయారనే వార్తలు వచ్చాయి. అందుకు తగ్గట్లుగానే మైదానంలో వీరి మధ్య సమన్వయలోపం కొట్టొచ్చినట్లు కనిపించింది. ఫలితంగా పద్నాలుగు మ్యాచ్‌లకు గానూ కేవలం నాలుగే గెలిచిన ముంబై.. పాయింట్ల పట్టికలో అట్టడుగున పదో స్థానంలో నిలిచింది.విభేదాలు పక్కనపెట్టాలిఅయితే, ఈసారి విభేదాలన్నీ పక్కనపెట్టి ముంబై ఆటగాళ్లు గనుక కలిసికట్టుగా ఉంటే విజయం వారిదేనని హర్భజన్ సింగ్ అభిప్రాయపడ్డాడు. ఈ మేరకు ఈఎస్పీఎన్క్రిక్ఇన్ఫోతో మాట్లాడుతూ.. ‘‘జట్టు ప్రదర్శన ఆధారంగానే కెప్టెన్ పనితీరును అంచనా వేస్తారు.అతడు గుజరాత్ టైటాన్స్ కెప్టెన్‌గా ఉన్నపుడు.. జట్టు మొత్తం రాణించింది. టైటిల్ గెలిచింది. అందుకే అతడు మంచి కెప్టెన్ అయ్యాడు. నిజానికి ముంబై జట్టు గతేడాది పటిష్టంగా ఉంది. ట్రోఫీ గెలవాల్సింది కూడా!బౌలింగ్ విభాగంలో చిన్న చిన్న సమస్యలు ఉన్నా.. బ్యాటింగ్‌లో మాత్రం బలంగా ఉంది. అయినా దారుణంగా ఓడిపోయింది. కలిసికట్టుగా ఉన్న జట్లే విజయం సాధిస్తాయి. గతం గతః.. ఆటగాళ్లు తమ మధ్య ఉన్న విభేదాలు పక్కనపెట్టాలి. ఈసారి ముంబై జట్టు మిగతా జట్ల కంటే పటిష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా వారికి అద్భుతమైన బ్యాటర్లు ఉన్నారు. సరికొత్తగా ఈ సీజన్‌ను ఆరంభించి సమిష్టిగా రాణిస్తే జట్టుకు ఎదురే ఉండదు’’ అని భజ్జీ చెప్పుకొచ్చాడు.ఐపీఎల్-2025లో ముంబై ఇండియన్స్ జట్టు- వారి ధరజస్ప్రీత్ బుమ్రా (రూ. 18 కోట్లు), హార్దిక్ పాండ్యా (కెప్టెన్- రూ.16.35 కోట్లు), సూర్యకుమార్ యాదవ్ (రూ. 16.35 కోట్లు), రోహిత్ శర్మ (రూ. 16.30 కోట్లు), తిలక్ వర్మ (రూ. 8 కోట్లు) , ట్రెంట్ బౌల్ట్ (రూ.12.50 కోట్లు), దీపక్ చహర్ (రూ. 9.25 కోట్లు), నమన్ ధీర్ (రూ.5.25 కోట్లు), విల్ జాక్స్ (రూ.5.25 కోట్లు), ఘజన్ఫర్ (రూ. 4.80 కోట్లు- గాయం వల్ల దూరం- అతడి స్థానంలో ముజీబ్ ఉర్ రెహమాన్)..మిచెల్ సాంట్నర్ (రూ. 2 కోట్లు), ర్యాన్ రికెల్టన్ (రూ. 1 కోటి), రీస్ టోప్లే (రూ. 75 లక్షలు), లిజాద్ విలియమ్స్ (రూ. 75 లక్షలు), రాబిన్ మిన్జ్ (రూ.65 లక్షలు) , కరణ్ శర్మ (రూ.50 లక్షలు), అర్జున్ టెండూల్కర్ (రూ.30 లక్షలు), విఘ్నేశ్ (రూ.30 లక్షలు), సత్యనారాయణ (రూ. 30 లక్షలు), రాజ్ అంగద్ (రూ. 30 లక్షలు), శ్రీజిత్ కృష్ణన్ (రూ. 30 లక్షలు), అశ్వని కుమార్ (రూ. 30 లక్షలు), బెవాన్ జాకబ్స్ (రూ. 30 లక్షలు). చదవండి: IPL 2025: కెప్టెన్ల మార్పు.. ఎవరి జీతం ఎంత?.. అతి చవగ్గా దొరికిన సారథి అతడే! -
అతడి సెంట్రల్ కాంట్రాక్టు రద్దు చేయండి: పాక్ మాజీ క్రికెటర్
పాకిస్తాన్ క్రికెట్ జట్టు కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ (Mohammad Rizwan) ఇటీవలి కాలంలో తీవ్ర విమర్శలు మూటగట్టుకున్నాడు. బాబర్ ఆజం (Babar Azam) నుంచి పగ్గాలు చేపట్టిన తర్వాత ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా పర్యటనల్లో అద్వితీయ విజయాలు అందుకున్న రిజ్వాన్.. సొంతగడ్డపై మాత్రం తేలిపోయాడు.న్యూజిలాండ్- సౌతాఫ్రికాలతో వన్డే త్రైపాక్షిక సిరీస్‌తో పాటు.. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 (ICC Champions Trophy)లోనూ దారుణంగా విఫలమయ్యాడు. ఇటు బ్యాటర్‌గా.. అటు కెప్టెన్‌గా పేలవ ప్రదర్శనతో విమర్శలపాలవుతున్నాడు. ఈ క్రమంలో పాక్ క్రికెట్ బోర్డు (పీసీబీ) అతడికి గట్టి షాకిచ్చిన విషయం తెలిసిందే. టీ20 జట్టు కెప్టెన్‌గా రిజ్వాన్‌ను తొలగించి.. సల్మాన్ ఆఘాకు ఆ బాధ్యతలు అప్పగించింది.ఇదిలా ఉంటే.. రిజ్వాన్ తాజాగా పీసీబీ ఆదేశాలను బేఖాతరు చేసినట్లు పాకిస్తాన్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. దేశవాళీ క్రికెట్ టోర్నమెంట్లో ఆడకుండా అతడు.. పెషావర్‌లో ఓ స్థానిక క్లబ్‌కు ఆడినట్లు తెలుస్తోంది. ఇలా నేషనల్ టీ20 కప్ ఆడకుండా.. క్లబ్ క్రికెట్‌కు ప్రాధాన్యం ఇవ్వడాన్ని పాకిస్తాన్ మాజీ క్రికెటర్ సికందర్ బక్త్ తప్పుబట్టాడు.పీసీబీని అవమానించాడు.. ఈ విషయంలో రిజ్వాన్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని పీసీబీ చీఫ్ మొహ్సిన్ నక్వీకి సూచించాడు. ‘‘నెలకు రూ. 60 లక్షలు తీసుకుంటున్నాడు. మరి జాతీయ జట్టు ఆటగాళ్లు పీసీబీ నిర్వహించే దేశీ మ్యాచ్‌లలో ఎందుకు ఆడరు? దేశవాళీ క్రికెట్ ఆడకుండా.. క్లబ్ క్రికెట్‌కు ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా రిజ్వాన్ పీసీబీని దారుణంగా అవమానించాడు.సెంట్రల్ కాంట్రాక్టు రద్దు చేయండిమొహ్సిన్ నక్వీ మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తారని తెలుసు. అయితే, ఈసారి మాత్రం ఆయన తన వైఖరి మార్చుకోవాలి. ఇలాంటి వాళ్లపై కొరడా ఝులిపించాల్సిందే. పీసీబీని పట్టించుకోని ఆటగాళ్ల సెంట్రల్ కాంట్రాక్టులు రద్దు చేసే దిశగా ఆలోచన చేయాలి’’ అని సికందర్ బక్త్ పేర్కొన్నాడు.బ్యాటర్‌గానూ విఫలంకాగా కెప్టెన్‌గా ఆస్ట్రేలియా గడ్డ మీద వన్డే సిరీస్ గెలవడంతో పాటు.. సౌతాఫ్రికా పర్యటనలో వన్డే సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్ చేయడం ద్వారా రిజ్వాన్ ప్రశంసలు అందుకున్నాడు. కానీ.. ఆ తర్వాత వరుస పరాజయాల కారణంగా విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో అతడి సారథ్యంలో పాకిస్తాన్.. గ్రూప్ దశలో న్యూ జిలాండ్, టీమిండియా చేతుల్లో ఓడిపోయింది.ఇక ఆఖరిదైన మూడో మ్యాచ్ వర్షం వల్ల టాస్ పడకుండానే రద్దు కావడంతో గెలుపున్నదే లేకుండా ఈ వన్డే టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఇక ఈ మెగా ఈవెంట్లో రిజ్వాన్ కివీస్‌తో మ్యాచ్‌లో 3, భారత్‌తో మ్యాచ్‌లో 46 పరుగులు చేశాడు. రోహిత్ సేనతో పోరులో రిజ్వాన్ స్లో ఇన్నింగ్స్ వల్ల పాకిస్తాన్‌కు చేదు అనుభవం ఎదురైందని ఆ దేశ మాజీ క్రికెటర్లు విమర్శించడం గమనార్హం. కాగా పాక్ జట్టు ప్రస్తుతం న్యూజిలాండ్‌లో పర్యటిస్తోంది. ఇందులో భాగంగా కివీస్‌తో ఐదు టీ20లు, మూడు వన్డే మ్యాచ్‌లు ఆడుతుంది.చదవండి: IPL 2025: కెప్టెన్ల మార్పు.. ఎవరి జీతం ఎంత?.. అతి చవగ్గా దొరికిన సారథి అతడే! -
‘అందుకే ఆర్సీబీ టైటిల్ గెలవలేదు.. ఈసారి ఆరెంజ్ క్యాప్ అతడికే’
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) ఆరంభ ఎడిషన్ నుంచి రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టు టైటిల్ కోసం పోరాడుతూనే ఉంది. కానీ పదిహేడు సీజన్లుగా ఆర్సీబీ కల మాత్రం నెరవేరడం లేదు. విరాట్ కోహ్లి (Virat Kohli) వంటి సూపర్ స్టార్ జట్టుతో ఉండటం వల్ల భారీ స్థాయిలో క్రేజ్ సంపాదించగలిగింది కానీ.. ఇప్పటి వరకు ట్రోఫీని అందుకోలేకపోయింది.ఇందుకు ప్రధాన కారణం.. బెంగళూరు ఫ్రాంఛైజీ ఆటగాళ్లందరినీ సమానంగా చూడకపోవటమే అంటున్నాడు ఆ జట్టుకు ఆడిన షాబాద్ జకాతి. గతంలో రెండుసార్లు చెన్నై సూపర్ కింగ్స్‌కు ప్రాతినిథ్యం వహించిన ఈ భారత స్పిన్నర్.. అనంతరం ఆర్సీబీకి కూడా ఆడాడు. 2014లో బెంగళూరు తరఫున.. కోహ్లి కెప్టెన్సీలో ఒక్క మ్యాచ్ ఆడిన షాదాబ్ జకాతి తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.ఇది జట్టుగా ఆడాల్సిన ఆట..పదిహేడేళ్లుగా ఆర్సీబీకి టైటిల్ అందని ద్రాక్షగా ఉండటానికి కారణం ఏమిటన్న ప్రశ్నకు బదులిస్తూ.. ‘‘ఇది జట్టుగా ఆడాల్సిన ఆట. మనం ట్రోఫీలు గెలవాలని బలంగా కోరుకుంటే.. జట్టంతా ఐకమత్యంగా ఉంటేనే అది సాధ్యమవుతుంది.చెన్నై జట్టు పటిష్టంగా ఉండటానికి కారణం.. టీమిండియాలోని ప్రధాన ప్లేయర్లు ఆ టీమ్‌తో కొనసాగడం. అంతేకాదు.. ఆ జట్టులోని విదేశీ క్రికెటర్లు కూడా అంకితభావంతో ఆడతారు. ఒక జట్టు విజయవంతం కావాలంటే.. కూర్పు సరిగ్గా ఉండాలి. నేను ఆర్సీబీకి ఆడుతున్నపుడు.. ఆ ఫ్రాంఛైజీ కేవలం ఇద్దరు- ముగ్గురు ఆటగాళ్లపై మాత్రమే దృష్టి సారించేది.నమ్మకం, సహోదర భావం లేదుయాజమాన్యం, డ్రెసింగ్‌రూమ్ వాతావరణానికి పొంతనే ఉండేది కాదు. నిజానికి ఆ జట్టులో మంచి మంచి ఆటగాళ్లు ఉన్నారు. కానీ.. వారి మధ్య పరస్పర నమ్మకం, సహోదర భావం లోపించినట్లు అనిపిస్తుంది. సీఎస్కేలో మాదిరి ఆర్సీబీ ఆటగాళ్లు ఒకరితో ఒకరు మమేకం కాలేదనేది నా భావన’’ అని జకాతి స్పోర్ట్స్‌కీడాతో పేర్కొన్నాడు.గెలిచేది ఆ జట్టేఇక ఈసారి ప్లే ఆఫ్స్ చేరే జట్లపై తన అంచనా తెలియజేస్తూ.. ‘‘కోల్‌కతా నైట్ రైడర్స్ ఈసారి కూడా క్వాలిఫై అవుతుంది. చెన్నై కూడా బలంగా కనిపిస్తోంది. ఈ రెండు జట్లతో పాటు గుజరాత్ కూడా టాప్-4లోకి అడుగుపెట్టే అవకాశం ఉంది.అయితే, నాలుగో జట్టుగా లక్నో ఉంటుందా? లేదా ఢిల్లీ వస్తుందా? అనేది మాత్రం స్పష్టంగా చెప్పలేను. ఈసారి ఢిల్లీ జట్టు బాగుంది. కాబట్టి ఆ జట్టు ప్లే ఆఫ్స్ చేరినా ఆశ్చర్యం లేదు.అంతేకాదు.. ఢిల్లీ ఈసారి టైటిల్ గెలుస్తుందని నాకు అనిపిస్తోంది’’ అని షాదాబ్ జకాతి వెల్లడించాడు. ఇక ఆర్సీబీ ఈసారి ప్లే ఆఫ్స్ చేరే సూచనలు కనిపించడం లేదన్న అతడు.. విరాట్ కోహ్లి కోసమైనా వారు ట్రోఫీ గెలిస్తే బాగుండని పేర్కొన్నాడు.ఆరెంజ్ క్యాప్ అతడికేఇక ఈసారి కోహ్లి లేదంటే.. రోహిత్ శర్మ (ముంబై ఇండియన్స్)అత్యధిక పరుగుల వీరుడిగా ఆరెంజ్ క్యాప్ గెలుస్తారని జకాతి అంచనా వేశాడు.ఇక పర్పుల్ క్యాప్‌ను పేసర్ జస్ప్రీత్ బుమ్రా (ముంబై ఇండియన్స్) దక్కించుకుంటాడని జోస్యం చెప్పాడు. స్పిన్నర్లలో కుల్దీప్ యాదవ్ (ఢిల్లీ క్యాపిటల్స్), యజువేంద్ర చహల్ (పంజాబ్ కింగ్స్)కు ఈ అవకాశం ఉందని పేర్కొన్నాడు.చదవండి: IPL: అప్పుడు బాల్ బాయ్.. ఇప్పుడు టైటిల్ గెలిచిన కెప్టెన్!.. హ్యాట్సాఫ్ -
Pak vs Ban: పాకిస్తాన్ పర్యటనకు బంగ్లాదేశ్ జట్టు.. ఈసారి..
పాకిస్తాన్ క్రికెట్ జట్టు ప్రస్తుతం న్యూజిలాండ్ పర్యటనలో ఉంది. కివీస్ జట్టుతో ఐదు టీ20లు, మూడు వన్డేలు ఆడేందుకు అక్కడకు వెళ్లింది. తొలి రెండు టీ20లలో ఓటమి పాలైన సల్మాన్ ఆఘా బృందం తీవ్ర విమర్శలు మూటగట్టుకుంటోంది. మరోవైపు.. ఈ టూర్ ముగిసిన తర్వాత పాక్ క్రికెటర్లు పాకిస్తాన్ సూపర్ లీగ్‌తో బిజీ కానున్నారు.అనంతరం.. స్వదేశంలో బంగ్లాదేశ్‌తో పాక్ జట్టు సొంతగడ్డపై పరిమిత ఓవర్ల సిరీస్ ఆడనుంది. బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు ఈ ఏడాది మే నెలలో పాకిస్తాన్లో పర్యటించేందుకు సిద్ధమైంది. ఈ టూర్ (Bangladesh Tour Of Pakistan) లో భాగంగా పాక్- బంగ్లా జట్ల మధ్య 3 టీ20లు, 3 వన్డేలు జరుగుతాయి. ఏప్రిల్ 11 నుంచి మే 18 వరకు పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్) 10వ సీజన్ జరగనుండగా... ఇది ముగిసిన అనంతరం బంగ్లాదేశ్‌తో పాక్ జట్టు మ్యాచ్‌లు ఆడనుంది.ఇందుకు సంబంధించిన షెడ్యూల్ త్వరలోనే విడుదల కానుంది. లాహోర్ (Lahore), ముల్తాన్ (Multan), ఫైసలాబాద్‌లో ఈ మ్యాచ్‌లు నిర్వహించే అవకాశం ఉంది. ఇటీవల చాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్ సందర్భంగా బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు చైర్మన్ ఫారూఖ్ అహ్మద్ పాకిస్తాన్‌కు వచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అతడితో చర్చించిన.. అనంతరం ఇరు దేశాల బోర్డులు ఈ సిరీస్‌లకు పచ్చజెండా ఊపాయి. ద్వైపాక్షిక సిరీస్ కోసం చివరిసారిగా గతేడాది పాకిస్తాన్లో పర్యటించిన బంగ్లాదేశ్ జట్టు రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను 2–0తో క్లీన్ స్వీప్ చేసింది.ఇదిలా ఉంటే.. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025లో ఆతిథ్య పాకిస్తాన్‌తో పాటు.. బంగ్లాదేశ్ కూడా ఘోర ఓటములు చవిచూసింది. గ్రూప్-ఎలో టీమిండియా, న్యూజిలాండ్‌తో కలిసి ఉన్న ఈ ఆసియా జట్లు.. ఈ రెండు టీమ్‌ల చేతిలో చిత్తుగా ఓడాయి. అనంతరం పాక్- బంగ్లా మధ్య మ్యాచ్ జరగాల్సి ఉండగా వర్షం అడ్డుపడటంతో టాస్ పడకుండానే రద్దైపోయింది. దీంతో చెరో పాయింట్‌తో పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఈ వన్డే టోర్నమెంట్ నుంచి నిష్క్రమించాయి.ఇక గ్రూప్-బి నుంచి చాంపియన్స్ ట్రోఫీలో ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, అఫ్గనిస్తాన్, ఇంగ్లండ్ తలపడ్డాయి. ఇందులో సౌతాఫ్రికా సెమీస్ చేరి.. అక్కడ కివీస్ చేతిలో ఓడి ఇంటిబాటపట్టింది. ఈ నేపథ్యంలో టీమిండియా- న్యూజిలాండ్ మధ్య జరిగిన ఫైనల్లో రోహిత్ సేన జయకేతనం ఎగురువేసింది. ఐదింటికి ఐదు మ్యాచ్‌లు గెలిచి అజేయంగా చాంపియన్‌గా అవతరించింది. చదవండి: వెంటిలేటర్‌పై పాక్ క్రికెట్ -
కెప్టెన్ల మార్పు.. ఎవరి జీతం ఎంత?.. అతి చవగ్గా దొరికిన సారథి అతడే!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) పద్దెమినిదవ ఎడిషన్ ఆరంభానికి రంగం సిద్ధమైంది. డిఫెండింగ్ చాంపియన్ కోల్‌కతా నైట్ రైడర్స్- రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్‌తో శనివారం (మార్చి 22) ఐపీఎల్-2025కి తెరలేవనుంది. ఇక ఈ సీజన్‌కు ముందు మెగా వేలం జరగడంతో జట్లలో చాలా మార్పులే చోటుచేసుకున్నాయి.చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్, రాజస్తాన్ రాయల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ తప్ప.. మిగిలిన ఐదు జట్లు తమ కెప్టెన్లను కూడా మార్చేశాయి. లక్నో సూపర్ జెయింట్స్ టీమిండియా స్టార్ రిషభ్ పంత్ (Rishabh Pant) కోసం రికార్డు స్థాయిలో రూ. 27 కోట్లు ఖర్చు చేసి.. అతడిని తమ సారథిగా నియమించుకుంది.మరోవైపు.. పంజాబ్ కింగ్స్ కూడా ఈసారి కెప్టెన్ కోసం భారీగానే ఖర్చుపెట్టింది. భారత జట్టు మిడిలార్డర్ స్టార్, ఐపీఎల్ విన్నింగ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer)ను రూ. 26.75 కోట్లకు కొనుగోలు చేసింది. ఈ క్రమంలో ఈ ఇద్దరు టీమిండియా స్టార్లు క్యాష్ రిచ్ లీగ్ చరిత్రలోనే అత్యధిక ధరకు అమ్ముడుపోయిన ఆటగాళ్లుగా తొలి రెండు స్థానాల్లో నిలిచారు. మరి మిగిలిన జట్ల కెప్టెన్లు, వారి జీతాలు ఈసారి ఎలా ఉన్నాయో చూద్దామా?కోల్‌కతా నైట్ రైడర్స్2012, 2014 2024లో చాంపియన్‌గా నిలిచిన జట్టు. గతేడాది తమకు ట్రోఫీ అందించిన శ్రేయస్ అయ్యర్‌ను వదులుకున్న కేకేఆర్.. ఈసారి అనూహ్య రీతిలో ఓ వెటరన్ ప్లేయర్‌ను తమ కెప్టెన్‌గా నియమించింది.మెగా వేలం-2025లో తొలి రౌండ్లో అమ్ముడుపోకుండా మిగిలి పోయిన అజింక్య రహానేను రూ. 1.5 కోట్లకు కొని.. పగ్గాలు అప్పగించింది. అతడికి డిప్యూటీగా యువ ఆల్‌రౌండర్ వెంకటేశ్ అయ్యర్‌కు బాధ్యతలు ఇచ్చింది. ఐపీఎల్-2025 కెప్టెన్లలో అతి తక్కువ జీతం అందుకున్న కెప్టెన్ రహానేనే కావడం గమనార్హం. అన్నట్లు వెంకటేశ్ అయ్యర్ జీతం రూ.23.75 కోట్లు.సన్‌రైజర్స్ హైదరాబాద్గతేడాది రన్నరప్‌గా నిలిచిన సన్‌రైజర్స్ ఈసారీ తమ కెప్టెన్‌గా ఆస్ట్రేలియా సారథి ప్యాట్ కమిన్స్‌ను కొనసాగించింది. అయితే, గతేడాది అతడికి రూ. 20.50 కోట్ల మేర ముట్టజెప్పిన ఫ్రాంఛైజీ.. ఈసారి రూ. 18 కోట్లకు రిటైన్ చేసుకోవడం గమనార్హం.రాజస్తాన్ రాయల్స్ఐపీఎల్ తొట్టతొలి విజేతగా చరిత్ర సృష్టించిన రాజస్తాన్ రాయల్స్ గత కొన్నేళ్లుగా టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ సామ్సన్ను తమ కెప్టెన్‌గా కొనసాగిస్తోంది. ఈసారి కూడా ‘పింక్’ జట్టును సంజూ ముందుండి నడిపించనున్నాడు. ఇందుకోసం రూ. 18 కోట్ల జీతం అందుకుంటున్నాడు.చెన్నై సూపర్ కింగ్స్మహేంద్ర సింగ్ ధోని కెప్టెన్సీలో ఏకంగా ఐదు ట్రోఫీలు గెలిచిన చెన్నై.. గతేడాది నుంచి రుతురాజ్ గైక్వాడ్ సారథ్యంలో ఆడుతోంది. ఈసారీ అతడినే కెప్టెన్‌గా కొనసాగించిన సీఎస్కే.. ఇందుకోసం అతడిని రూ. 18 కోట్లకు రిటైన్ చేసుకుంది.ఢిల్లీ క్యాపిటల్స్ఈసారి కెప్టెన్‌ను మార్చిన ఫ్రాంఛైజీల జాబితాలో ఢిల్లీ ఒకటి. గతేడాది రిషభ్ పంత్ కెప్టెన్సీలో ఆడిన ఢిల్లీ.. ఈసారి టీమిండియా వైస్ కెప్టెన్ అక్షర్ పటేల్ నాయకత్వంలో బరిలోకి దిగనుంది. ఇందుకోసం తమ కెప్టెన్‌కు రూ. 16.50 కోట్ల మేర చెల్లిస్తోంది.గుజరాత్ టైటాన్స్అరంగేట్ర సీజన్లో తమకు టైటిల్ అందించిన హార్దిక్ పాండ్యా జట్టును వీడిన తర్వాత.. అంటే గతేడాది టీమిండియా నయా సూపర్ స్టార్ శుబ్‌మన్ గిల్‌కు పగ్గాలు అప్పగించింది. వేలానికి ముందు గిల్‌ను రూ. 16.5 కోట్లకు రిటైన్ చేసుకున్న గుజరాత్ ఈసారీ అతడినే సారథిగా కొనసాగిస్తోంది.ముంబై ఇండియన్స్ఐదు ట్రోఫీలు అందించిన రోహిత్ శర్మను కాదని.. గతేడాది హార్దిక్ పాండ్యాను ఏరికోరి కెప్టెన్‌ను చేసిన ముంబై ఘోర పరాభవం చవిచూసింది. పాయింట్ల పట్టికలో అట్టడుగున పదో స్థానంలో నిలిచింది. అయితే, ఈసారీ అతడికి మరో అవకాశం ఇచ్చిన అంబానీల యాజమాన్యంలోని ముంబై... పాండ్యాను రూ. 16.35 కోట్లకు రిటైన్ చేసుకుంది.రాయల్ చాలెంజర్స్ బెంగళూరుఎంత క్రేజ్ ఉన్నా ఒక్క టైటిల్ కూడా గెలవని జట్టుగా పేరొందిన ఆర్సీబీ.. ఈసారి ఊహించని రీతిలో రజత్ పాటిదార్‌ను సారథిగా నియమించింది. విరాట్ కోహ్లి మరోసారి పగ్గాలు చేపడతాడనే ప్రచారం జరిగగా.. బెంగళూరు ఫ్రాంఛైజీ ప్రకటనతో అది జరగదని తేలింది. అన్నట్లు వేలానికి ముందు రూ. 11 కోట్లకు పాటిదార్‌ను ఆర్సీబీ రిటైన్ చేసుకుంది. ఐపీఎల్-2025 కెప్టెన్లలో రహానే తర్వాత తక్కువ జీతం ఆర్సీబీ సారథికే!చదవండి: వాళ్లను చూస్తేనే చిరాకు.. బుమ్రా, రబడ మాత్రం వేరు: డేల్ స్టెయిన్ -
IPL: వారెవ్వా..! అప్పుడు బాల్ బాయ్.. ఇప్పుడు టైటిల్ గెలిచిన కెప్టెన్!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో ఒకప్పుడు బాల్ బాయ్‌గా ఉన్న పిల్లాడు.. కెప్టెన్ స్థాయికి ఎదిగాడు. అంతేనా.. టైటిల్ గెలిచిన మొనగాడు కూడా అతడు!.. అంతేకాదండోయ్.. క్యాష్ రిచ్ లీగ్ చరిత్రలోనే అత్యంత ఎక్కువ ధరకు అమ్ముడుపోయిన రెండో ఆటగాడు కూడా! ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది.. అవును.. శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer).సారథిగా సూపర్ హిట్ఇటీవల ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 (ICC Champions Trophy)లో భారత్ ట్రోఫీ గెలవడంలో కీలకంగా వ్యవహరించిన శ్రేయస్.. ప్రస్తుతం ఐపీఎల్-2025 సన్నాహకాల్లో మునిగిపోయాడు. గతంలో ఢిల్లీ క్యాపిటల్స్ సారథిగా జట్టును ఫైనల్ వరకు చేర్చిన ఈ ముంబైకర్.. గతేడాది కోల్‌కతా నైట్ రైడర్స్‌ను చాంపియన్‌గా నిలిపాడు. గౌతం గంభీర్ తర్వాత కోల్‌కతాకు ట్రోఫీ అందించిన రెండో కెప్టెన్‌గా నిలిచాడు.అయితే, మెగా వేలానికి ముందు శ్రేయస్ అయ్యర్ కేకేఆర్‌తో తెగదెంపులు చేసుకోగా.. పంజాబ్ కింగ్స్ అతడిని ఏకంగా రూ. 26.75 కోట్లకు కొనుగోలు చేసి.. పగ్గాలు అప్పగించింది. పంజాబ్ టైటిల్ కలను తీర్చాలని గత ప్రదర్శనను పునరావృతం చేస్తూ ఈసారి పంజాబ్ టైటిల్ కలను ఎలాగైనా తీర్చాలని శ్రేయస్ పట్టుదలగా ఉన్నాడు. ఈ నేపథ్యంలో తాజాగా జియోహాట్‌స్టార్‌తో ముచ్చటించిన ఈ కెప్టెన్ సాబ్ గత జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నాడు.అప్పుడు బాల్ బాయ్‌ని‘‘మా వీధిలో క్రికెట్ ఆడుతూ ఎంజాయ్ చేసేవాళ్లం. అప్పట్లో (2008) నేను ముంబై అండర్-14 జట్టుకు ఆడుతున్నాడు. ముంబై జట్టులో ఉన్న పిల్లలందరినీ ఐపీఎల్లో బాల్ బాయ్స్‌గా తీసుకువెళ్లారు.నేను కాస్త బిడియస్తుడిని. ఎవరితోనూ ఎక్కువగా కలవను. అయినా సరే.. అదృష్టవశాత్తూ వారిలో ఒకడిగా నాకూ అవకాశం దక్కింది. అప్పట్లో నా ఫేవరెట్ క్రికెటర్ రాస్ టేలర్‌ను దగ్గరగా చూడాలని అనుకునేవాడిని.సర్.. నేను మీకు వీరాభిమానినిఅనుకోకుండా ఆరోజు అవకాశం వచ్చింది. ఆయన దగ్గరకు వెళ్లి.. ‘సర్.. నేను మీకు వీరాభిమానిని’ అని చెప్పాను. ఆయన నా మాటలకు నవ్వులు చిందించడంతో పాటు థాంక్యూ కూడా చెప్పారు. అలా మన అభిమాన క్రికెటర్లను కలిసినపుడు గ్లోవ్స్ లేదంటే బ్యాట్ అడగటం పరిపాటి. నాకూ ఆయనను బ్యాట్ అడగాలని అనిపించినా సిగ్గు అడ్డొచ్చింది.ఓ మ్యాచ్‌లో ఇర్ఫాన్ పఠాన్ లాంగాన్‌లో ఫీల్డింగ్ చేస్తున్నారు. ఆ తర్వాత ఆయన మా పక్కకు వచ్చి కూర్చుని.. మ్యాచ్ ఆస్వాదిస్తున్నారా అని అడిగారు. అవును.. మేము బాగా ఎంజాయ్ చేస్తున్నాం అని చెప్పాను. అప్పట్లో ఇర్ఫాన్ భాయ్ క్రేజ్ తారస్థాయిలో ఉండేది. పంజాబ్ జట్టులోని అందగాళ్లలో ఆయనా ఒకరు. యువీ పాను కూడా అప్పుడు దగ్గరగా చూశాం. ఈ జ్ఞాపకాలు నా మనసులో ఎల్లప్పుడూ నిలిచిపోతాయి’’ అని శ్రేయస్ అయ్యర్ తన మనసులోని భావాలు పంచుకున్నాడు.2015లో ఎంట్రీకాగా ఐపీఎల్ తొలి సీజన్ 2008లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు- ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ సందర్భంగా తాను రాస్ టేలర్ (RCB)ని తొలిసారి కలిసినట్లు అయ్యర్ వెల్లడించాడు. కాగా శ్రేయస్ అయ్యర్ 2015లో ఐపీఎల్ అరంగేట్రం చేశాడు. నాటి ఢిల్లీ డేర్‌డెవిల్స్ (ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్) తరఫున తన తొలి మ్యాచ్ ఆడిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. ఇప్పటి వరకు ఐపీఎల్లో 115 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్నాడు.మొత్తంగా 3127 పరుగులు సాధించడంతో పాటు కెప్టెన్‌గా టైటిల్ సాధించాడు. ప్రస్తుతం పంజాబ్ కెప్టెన్‌గా ఉన్న శ్రేయస్ అయ్యర్ మార్చి 25న గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌తో తాజా సీజన్‌ను మొదలుపెట్టనున్నాడు.చదవండి: వాళ్లను చూస్తేనే చిరాకు.. బుమ్రా, రబడ మాత్రం వేరు: డేల్ స్టెయిన్ -
బ్యాటింగ్ చేస్తూ కుప్పకూలిన పాకిస్తానీ క్రికెటర్.. తీవ్ర విషాదం
ఆస్ట్రేలియా క్రికెట్లో తీవ్ర విషాదం నెలకొంది. పాకిస్తాన్‌కు చెందిన క్లబ్ లెవల్ క్రికెటర్ జునైల్ జఫార్ ఖాన్ (Junail Zafar Khan) దుర్మరణం పాలయ్యాడు. మ్యాచ్ ఆడుతున్న సమయంలో మైదానంలో కుప్పకూలిన అతడు.. అక్కడే ప్రాణాలు విడిచాడు. ఎండ వేడిమి తట్టుకోలేకే జఫార్ ఖాన్ మరణించినట్లు తెలుస్తోంది.ఆలస్యంగా వెలుగులోకికాగా నలభై ఏళ్ల జఫార్ ఖాన్‌కు క్రికెట్ అంటే చాలా ఇష్టం. అందుకే వయసు పైబడుతున్నా లెక్కచేయక క్లబ్ స్థాయిలో మ్యాచ్‌లు ఆడుతున్నాడు. ఓల్డ్ కాంకొర్డియన్స్ క్రికెట్ క్లబ్‌కు ప్రాతినిథ్య వహిస్తున్న అతడు.. గత శనివారం ప్రిన్స్ అల్ఫ్రెడ్ ఓల్డ్ కాలేజియన్స్‌తో మ్యాచ్‌లో పాల్గొన్నాడు.నలభై ఓవర్ల పాటు ఫీల్డింగ్ చేసిన జఫార్ ఖాన్.. ఏడు ఓవర్ల పాటు బ్యాటింగ్ చేశాడు. పదహారు పరుగుల వ్యక్తిగతస్కోరు వద్ద ఉన్న వేళ అతడు కిందపడిపోయాడు. ఆస్ట్రేలియా సెంట్రల్ డే లైట్ టైమ్ ప్రకారం సాయంత్రం నాలుగు గంటలకు మైదానంలో కుప్పకూలిపోయాడు. తీవ్ర విషాదంలో మునిగిపోయాంఈ విషాదకర ఘటనపై ఓల్డ్ కాంకొర్డియన్స్ క్రికెట్ క్లబ్ స్పందించింది. ‘‘మా క్లబ్‌కు చెందిన విలువైన ఆటగాడు అకస్మాత్తుగా లోకాన్ని విడిచి వెళ్లిపోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నాం. ఈ ఘటనతో మేము తీవ్ర విషాదంలో మునిగిపోయాం. మ్యాచ్ ఆడుతున్న సమయంలోనే మా క్లబ్ సభ్యుడు మృతి చెందడం మమ్మల్ని కలచివేస్తోంది.అతడికి చికిత్స అందించేందుకు వైద్య బృందం చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. అతడి కుటుంబానికి, సహచర ఆటగాళ్లు, స్నేహితులకు మా ప్రగాఢ సానుభూతి ’’ అని సంతాపం వ్యక్తం చేస్తూ ప్రకటన విడుదల చేసింది.అడిలైడ్‌లో ఉద్యోగం?కాగా 2013లో వరకు పాకిస్తాన్‌లోనే ఉన్న జఫార్ ఖాన్.. ఐటీ రంగంలో అవకాశాలు అందిపుచ్చుకునే క్రమంలో ఆస్ట్రేలియాకు మకాం మార్చినట్లు సమాచారం. అడిలైడ్‌లో ఉద్యోగం చేస్తున్న అతడు క్లబ్ క్రికెట్ కూడా ఆడుతూ.. దురదృష్టవశాత్తూ ప్రాణాలు కోల్పోవడం విషాదకరం. కాగా దక్షిణ ఆస్ట్రేలియాలో ఎండలు మండిపోతున్నాయి.గరిష్టంగా 40కి పైగా డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్న వేళ.. ప్రజలంతగా అప్రమత్తంగా ఉండాలని స్థానిక వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ పరిణామాల నేపథ్యంలో అడిలైడ్ టర్ఫ్ క్రికెట్ అసోసియేషన్ కీలక ప్రకటన విడుదల చేసింది. 42 డిగ్రీల సెల్సియస్ కంటే ఉష్ణోగ్రత మించినట్లయితే..మ్యాచ్‌లు రద్దు చేస్తామని పేర్కొంది.చదవండి: వెంటిలేటర్‌పై పాక్ క్రికెట్ -
వాళ్లను చూస్తేనే చిరాకు.. అసలేం చేస్తున్నార్రా బాబూ!: డేల్ స్టెయిన్ ఫైర్
నవతరం ఫాస్ట్ బౌలర్ల తీరుపై సౌతాఫ్రికా దిగ్గజ పేసర్ డేల్ స్టెయిన్ (Dale Steyn) తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. పరిస్థితులకు అనుగుణంగా బౌలింగ్ చేయడంలో దారుణంగా విఫలమవుతున్నారని.. ఒత్తిడిలో చిత్తైపోయి పరుగులు సమర్పించుకుంటున్నారని విమర్శించాడు. కనీసం ఒక్కసారి కూడా ఫీల్డింగ్ మార్చకుండానే ఓవర్ పూర్తి చేస్తున్నారని.. ఇదంతా చూస్తే తనకు చిర్రెత్తుకొస్తుందంటూ ఘాటు వ్యాఖ్యలు చేశాడు.అయితే, టీమిండియా పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah), సౌతాఫ్రికా స్పీడ్‌స్టర్ కగిసో రబడ (Kagiso Rabada) మాత్రం ఇందుకు మినహాయింపు అని స్టెయిన్ పేర్కొన్నాడు. ఈ మేరకు ఈఎస్పీఎన్క్రిక్ఇన్ఫోలో నేటి తరం ఫాస్ట్ బౌలర్ల గురించి మాట్లాడుతూ.. ‘‘ఈరోజుల్లో అంతర్జాతీయ స్థాయి పేసర్ల తీరు నాకు నచ్చడం లేదు.వాళ్లను చూస్తేనే చిరాకు.. ఒక్కసారి కూడా ఫీల్డ్ మార్చకుండానే ఓవర్ పూర్తి చేసేసి వెళ్తున్నారు. పదేళ్లుగా కెరీర్ కొనసాగిస్తున్న వారు కూడా తమకేమీ పట్టదన్నట్లుగా చేతులు దులిపేసుకుంటున్నారు. ఇలాంటి వాళ్లను చూసినపుడు నాకైతే జట్టు పీక్కోవాలనిపిస్తుంది. చిరాకు వస్తుంది. ఇంతకంటే గొప్ప బౌలర్లను మనం చూడలేమా? అని నా మనసు ఆవేదన చెందుతుంది’’ అని డేల్ స్టెయిన్ చెప్పుకొచ్చాడు.బుమ్రా, రబడ మాత్రం వేరుఅదే విధంగా.. ‘‘బుమ్రా మాత్రం ఇందుకు అతీతం. అతడు పరిపూర్ణమైన ప్యాకేజ్లాంటివాడు. కగిసో రబడ కూడా బుమ్రా మాదిరే పర్ఫెక్ట్. వాళ్లిద్దరు ఎలాంటి సమయంలోనైనా బౌలింగ్ చేయగలగరు. వికెట్లూ పడగొట్టగలరు. నిజంగా వాళ్లిద్దరు బంగారం. కెప్టెన్‌కు సగం పని తగ్గించేస్తారు.ఇలాంటి వారి సంఖ్య పెరిగితేనే.. ఫాస్ట్ బౌలింగ్ విభాగం మరింత పటిష్టంగా ఉంటుంది. గంటకు 155 కిలో మీటర్ల వేగంతో బౌలింగ్ చేశారా? లేదా? అన్నది ముఖ్యం కాదు. మనలో పది రకాల నైపుణ్యాలు ఉండవచ్చు. కానీ సరైన సమయంలో.. సరైన విధంగా స్పందించి కెప్టెన్ చెప్పిన పని పూర్తి చేస్తేనే దేనికైనా విలువ’’ అని స్టెయిన్ పేర్కొన్నాడు.70 శాతం మంది బౌలర్ల తీరు అలాగేఇక ఇదే షోలో స్టెయిన్‌తో గొంతు కలిపిన న్యూజిలాండ్ పేస్ దిగ్గజం షేన్ బాండ్.. ‘‘ఈరోజుల్లో 70 శాతం మంది బౌలర్లకు అసలు తామేం చేస్తున్నామో అన్న స్పృహ ఉండటం లేదు. కెప్టెన్లు మరింత చొరవ తీసుకోవాలి. వారి నుంచి ఎలాంటి ప్రదర్శన కోరుకుంటాన్నారో కచ్చితంగా చెప్పాలి. ఫీల్డింగ్ సెట్ చేసే విషయంలోనూ నిక్కచ్చిగా వ్యవహరించాలి’’ అని అభిప్రాయపడ్డాడు. బుమ్రా రీఎంట్రీ ఎప్పుడో?కాగా ఇటీవల జరిగిన ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025కి వెన్నునొప్పి కారణంగా బుమ్రా దూరమైన విషయం తెలిసిందే. అయితే, ప్రధాన పేసర్ లేకుండానే టీమిండియా ఈ మెగా వన్డే టోర్నీలో విజేతగా అవతరించింది. స్పిన్‌కు అనుకూలించే దుబాయ్ పిచ్‌పై అజేయ రికార్డుతో ట్రోఫీని ముద్దాడింది. ఇక బుమ్రా ఇప్పుడిప్పుడే గాయం నుంచి కోలుకుంటున్నట్లు సమాచారం. ఈ క్రమంలో ఐపీఎల్-2025లో ముంబై ఇండియన్స్ ఆరంభ మ్యాచ్‌లకు అతడు అందుబాటులో ఉండటం లేదు. మరోవైపు.. రబడ చాంపియన్స్ ట్రోఫీలో ఆడాడు. ఈ ఈవెంట్లో సౌతాఫ్రికా న్యూజిలాండ్ చేతిలో ఓడి సెమీస్‌లోనే ఇంటిబాటపట్టింది.చదవండి: నేను ఎదుర్కొన్న కఠినమైన బౌలర్ అతడే.. మూడు ఫార్మాట్లలోనూ బెస్ట్: కోహ్లి -
పృథ్వీ షా మారతాడా..?
ఎదిగేకొద్ది ఒదిగి ఉండాలంటారు మన పెద్దలు. విజయగర్వం తలకెక్కితే పతనం తప్పదు. ఏ రంగానికైనా ఈ మాటలు వర్తిస్తాయి. ముఖ్యంగా క్రీడారంగంలో చాలా మంది ప్లేయర్లు తలపొగరుతో కెరీర్ ఆరంభంలోనే తెరమరుగయ్యారు. ఎంతో ప్రతిభావంతుడైన వినోద్ కాంబ్లీ వివాదాలతో క్రికెట్‌కు దూరమయ్యాడు. తాజాగా మరో టీమిండియా (Team India) యువ క్రికెటర్ కూడా ఇదే దారిలో ప్రయనిస్తున్నాడు. ఇప్పటికైనా మేలుకోకుంటే అతడి కెరీర్‌కు ముప్పు తప్పదని సహచరుడొకరు సున్నితంగా హెచ్చరించాడు.యువ క్రికెటర్ పృథ్వీ షా (Prithvi Shaw) గురించి క్రికెట్ అభిమానులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పిన్న వయసులోనే పవర్ఫుల్ బ్యాటింగ్‌తో అందరి ఆకట్టుకున్నాడు. అతడి నాయకత్వంలో యువ టీమిండియా 2018లో అండర్-19 వరల్డ్‌కప్ సాధించింది. అదే ఏడాది జాతీయ జట్టు తరపున అరంగ్రేటం చేసిన ఈ యువ సంచలనం.. సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar) తర్వాత చిన్న వయసులో టెస్టు సెంచరీ సాధించిన రికార్డు కొట్టాడు. దీంతో అతడిని అందరూ సచిన్‌తో పోల్చడం మొదలు పెట్టారు. అటు ఐపీఎల్‌లోనూ అదరగొట్టడంతో మనోడి పేరు మార్మోగిపోయింది.శశాంక్ సింగ్ కీలక వ్యాఖ్యలుఆటగాళ్ల జీవితాల్లో ఉత్థానపతనాలు సహజం. అయితే పృథ్వీ షా మాత్రం చేజేతులారా తన కెరీర్‌ను నాశనం చేసుకున్నాడు. క్రమశిక్షణా రాహిత్యం, ఫిట్నెస్ లేమితో తన ఉనికినే ప్రశ్నార్థకం చేసుకున్నాడు. జాతీయ జట్టులో స్థానం కోల్పోడంతో పాటు రంజీల్లోనూ అతడికి చోటు కరువైంది. ఐపీఎల్‌లోనూ అతడికి తీసుకునేందుకు ఏ జట్టు ముందుకు రాలేదంటే మనోడి పరిస్థితి ఎంత దిగజారిపోయిందో అర్థమవుతోంది. ఈ నేపథ్యంలో పృథ్వీ షా గురించి అతడి బాల్యస్నేహితుడు, పంజాబ్ కింగ్స్ బ్యాటర్ శశాంక్ సింగ్ (Shashank Singh) కీలక వ్యాఖ్యలు చేశాడు.తక్కువగా అంచనా వేయొద్దుమళ్లీ గాడిలో పడే సత్తా పృథ్వీ షాకు ఉందని, దీని కోసం అతడు కొన్ని పద్ధతులు మార్చుకోవాలని శశాంక్ సూచించాడు. శుభంకర్ మిశ్రా పాడ్‌కాస్ట్‌లో శశాంక్ మాట్లాడుతూ.. ‘పృథ్వీ షాను తక్కువగా అంచనా వేస్తున్నారు. అతడు మళ్లీ మూలాల్లోకి వెళితే పూర్వ వైభవాన్ని పొందగలడు. పృథ్వీ షా నాకు 13 సంవత్సరాల వయసు నుంచి తెలుసు, అతడితో కలిసి బొంబాయిలో క్లబ్ క్రికెట్ ఆడాను. పృథ్వీ షాలో ఏముందని మీరు నన్ను అడిగితే, అతడికి కొన్ని విషయాలపై భిన్నమైన దృక్పథం ఉంది. అయితే తన జీవనశైలిని కొంచెం మార్చుకుంటే మళ్లీ గాడిలో పడతాడు. రాత్రి 11 గంటలకు బదులుగా రాత్రి 10 గంటలకు నిద్రపోతే మంచింది. అలాగే ఆహారపు అలవాట్లను మెరుగుపరుచుకుంటే బాగుటుంది. ఈ మార్పులను అంగీకరించి, ఆచరిస్తే భారత క్రికెట్‌కు మంచి జరుగుతుంది. బహుశా అతడు ఇప్పటికే తన వెంట ఉన్న మంచి వ్యక్తులు చెప్పిన సలహాలను పాటిస్తుండొచ్చు. అతడికి నేను సలహా ఇవ్వాల్సిన అవసరం లేద’ని చెప్పాడు.చదవండి: అక్షర్ పటేల్ ఐపీఎల్ కప్ కొడతాడా?ఏకంగా రూ. 5.5 కోట్లు!కాగా, పృథ్వీ షా ఇటీవల డీవై పాటిల్ టీ20-2025 టోర్నమెంట్లో 'రూట్ మొబైల్' జట్టుకు నాయకత్వం వహించాడు. గతేగాది సౌదీ అరేబియాలో నిర్వహించిన ఐపీఎల్ మెగా వేలంలో రూ. 75 లక్షల కనీస ధరకు అందుబాటులో ఉన్నా ఒక్క ఫ్రాంచైజీ కూడా అతడిని కొనుగోలు చేయలేదు. 2018లో అతడిని కోటీ 20 లక్షలకు వేలంలో దక్కించుకున్న ఢిల్లీ ఫ్రాంచైజీ.. నిరుడు అతడిని వదిలించుకుంది. మరోవైపు శశాంక్ సింగ్ గత ఐపీఎల్లో సత్తా చాటడంతో పంజాబ్ కింగ్స్ అతడిని అట్టేపెట్టుకుంది. ఇందుకోసం ఏకంగా రూ. 5.5 కోట్లు వెచ్చించింది. -
వెంటిలేటర్‌పై పాక్ క్రికెట్
అంతర్జాతీయ వేదికపై పాకిస్తాన్ క్రికెట్ జట్టు పరిస్థితి నానాటికి దిగజారుతుంది. ఓ సారి వన్డే వరల్డ్‌కప్ (1996), ఓ సారి టీ20 వరల్డ్‌కప్ (2009), ఓ సారి ఛాంపియన్స్ ట్రోఫీ (2017) గెలిచిన ఆ జట్టు ప్రస్తుతం పసికూనలపై గెలిచేందుకు కూడా నానా తంటాలు పడుతుంది. గడిచిన రెండేళ్లలో పాక్ క్రికెట్ జట్టు అదఃపాతాళానికి పడిపోయింది. ఆ జట్టు పరిస్థితి వెంటిలేటర్‌పై ఉన్న రోగిలా తయారైంది. యూఎస్ఏ, జింబాబ్వే, ఐర్లాండ్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ లాంటి చిన్న జట్లు సైతం పాక్‌ను మట్టికరిపిస్తున్నాయి. స్వదేశంలో కూడా ఆ జట్టు మ్యాచ్‌లు గెలవలేకపోతుంది. సొంతగడ్డపై జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో కనీసం ఒక్క మ్యాచ్ కూడా గెలవలేక గ్రూప్ దశలోనే నిష్క్రమించింది. అంతకుముందు స్వదేశంలో న్యూజిలాండ్, సౌతాఫ్రికా పాల్గొన్న ట్రై సిరీస్‌లోనూ పరాజయంపాలైంది. తాజాగా పరిమిత ఓవర్ల సిరీస్‌ల కోసం న్యూజిలాండ్‌లో పర్యటిస్తున్న ఆ జట్టు ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓడింది. ప్రక్షాళన పేరుతో సీనియర్లను పక్కన పెట్టిన పాక్ సెలెక్టర్లు ప్రస్తుతం వస్తున్న ఫలితాలతో నైరాశ్యంలో మునిగిపోయారు. ఇక ఏం చేసినా తమ జట్టు పరిస్థితి బాగుపడదని అనుకుంటున్నారు. భారత్‌లో గల్లీ క్రికెట్ ఆడే జట్లు సైతం పాక్‌ను ఓడించే పరిస్థితులు ఉన్నాయి. న్యూజిలాండ్ పర్యటనకు ముందు పూర్వవైభవం సాధిస్తామని ప్రగల్భాలు పలికిన పీసీబీ.. ప్రస్తుతం వస్తున్న ఫలితాలతో నోరు మెదపకుండా ఉంది. సీనియర్లు బాబర్ ఆజమ్, మహ్మద్ రిజ్వాన్ అన్నా ఉంటే కనీసం ఈ ఘోర పరాజయాల గోస తప్పేదని అనుకుంటున్నారు. న్యూజిలాండ్ పర్యటనలో పాక్ వరుసగా రెండు మ్యాచ్‌ల్లో చిత్తుగా ఓడింది. తొలి మ్యాచ్‌లో కనీసం 100 పరుగులు కూడా చేయలేకపోయిన పాక్ బ్యాటర్లు.. ఇవాళ (మార్చి 18) జరిగిన రెండో మ్యాచ్‌లో ముక్కీ మూలిగి 135 పరుగులు చేశారు. అయినా న్యూజిలాండ్ బ్యాటర్లు విధ్వంసం సృష్టించి పాక్ నిర్దేశించిన లక్ష్యాన్ని ఊదేశారు. ఈ మ్యాచ్‌లో పాక్ బౌలర్లు గల్లీ బౌలర్లను తలపించారు. వరల్డ్ క్లాస్ బౌలర్ అని చెప్పుకునే షాహీన్ అఫ్రిదికి న్యూజిలాండ్ బ్యాటర్ టిమ్ సీఫర్ట్ చుక్కలు చూపించాడు. ఓ ఓవర్లో ఏకంగా నాలుగు సిక్సర్లు బాది పక్కకు కూర్చోబెట్టాడు. మరో పేసర్ మొహమ్మద్ ఆలీని ఫిన్ అలెన్ వాయించాడు. ఆలీ వేసిన ఓ ఓవర్లో అలెన్ మూడు సిక్సర్లు కొట్టాడు. వాస్తవానికి ఈ సిరీస్ కోసం క్రికెట్ న్యూజిలాండ్ ద్వితియ శ్రేణి జట్టును ఎంపిక చేసింది. ఛాంపియన్స్ ట్రోఫీ ఆడిన సీనియర్లు ఐపీఎల్ కోసం భారత్‌కు పయనమయ్యారు. 'ఏ' జట్టుతోనే పాక్ పరిస్థితి ఇలా ఉంటే, సీనియర్లు ఉన్న జట్టు ఎదురైనప్పుడు పాక్ పరిస్థితి తలచుకుంటే జాలేస్తుంది. ఇలాంటి దయనీయ పరిస్థితుల్లో పాక్ క్రికెట్‌ను ఆదుకునే ఆపద్భాంధవుడెవరో చూడాలి.2023 నుంచి పాక్ క్రికెట్ జట్టు పరిస్థితిఆఫ్ఘనిస్తాన్ చేతిలో టీ20 సిరీస్ ఓటమివన్డే ప్రపంచ కప్-2023లో ఆఫ్ఘనిస్తాన్ చేతిలో ఘోర పరాజయం2023 వన్డే ప్రపంచ కప్‌లో గ్రూప్ దశలోనే నిష్క్రమణస్వదేశంలో బంగ్లాదేశ్ చేతిలో టెస్ట్ సిరీస్ ఓటమిఐర్లాండ్ చేతిలో టీ20 మ్యాచ్‌లో షాకింగ్ ఓటమి2024 టీ20 ప్రపంచ కప్‌లో యూఎస్ఏ చేతిలో ఊహించని పరాభవం2024 టీ20 ప్రపంచ కప్‌లో గ్రూప్ దశలోనే నిష్క్రమణజింబాబ్వే చేతిలో వన్డే, టీ20 మ్యాచ్‌ల్లో ఓటమి2025 ఛాంపియన్స్ ట్రోఫీలో గ్రూప్ దశలోనే నిష్క్రమణగత 16 టీ20ల్లో పాక్ కేవలం 4 మ్యాచ్‌ల్లో మాత్రమే గెలిచింది. అది కూడా జింబాబ్వే, ఐర్లాండ్, కెనడాపై -
Video: అఫ్రిదికి చుక్కలు చూపించిన కివీస్ బ్యాటర్.. సిక్సర్ల వర్షం
డునెడిన్ వేదికగా న్యూజిలాండ్‌తో ఇవాళ (మార్చి 18) జరిగిన రెండో టీ20లో పాక్ చిత్తుగా ఓడింది. ఈ మ్యాచ్‌లో పాక్ పేసర్ షాహీన్ అఫ్రిదికి న్యూజిలాండ్ ఓపెనర్ టిమ్ సీఫర్ట్ చుక్కలు చూపించాడు. ఒకే ఓవర్లో నాలుగు సిక్సర్లు సహా 26 పరుగులు పిండుకున్నాడు. తద్వారా అఫ్రిది పలు చెత్త రికార్డులు మూటగట్టుకున్నాడు. టీ20ల్లో ఓ ఓవర్లో అత్యధిక సిక్సర్లు సమర్పించుకున్న పాక్ బౌలర్‌గా మొహమ్మద్ సమీ, ఫహీమ్ అష్రాఫ్ పేరిట ఉన్న చెత్త రికార్డును సమం చేశాడు. సమీ 2010లో ఆస్ట్రేలియాతో.. ఫహీమ్ 2021లో సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌ల్లో ఓ ఓవర్లో నాలుగు సిక్సర్లు సమర్పించుకున్నారు. తాజాగా న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో అఫ్రిది కూడా 4 సిక్సర్లు సమర్పించుకొని సమీ, ఫహీమ్ రికార్డును సమం చేశాడు. అఫ్రిది బౌలింగ్‌ను సీఫర్ట్ ఊచకోత కోసిన వీడియో సోషల్‌మీడియాలో వైరలవుతుంది.Seifert has 7 letters, so does Maximum 🤌Tim Seifert took Shaheen Afridi to the cleaners in his second over, smashing four sixes in it 🤯#NZvPAK pic.twitter.com/F5nFqmo7G6— FanCode (@FanCode) March 18, 2025ఒకే ఓవర్లో 26 పరుగులు సమర్పించుకోవడంతో అఫ్రిది మరో చెత్త రికార్డును కూడా మూటగట్టుకున్నాడు. తన టీ20 కెరీర్లో అత్యధిక పరుగులు సమర్పించుకున్న ఓవర్‌గా ఇది రికార్డుల్లోకెక్కింది. గతంలో అఫ్రిది టీ20ల్లో ఓ ఓవర్లో రెండు సార్లు (ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌పై) 24 పరుగులు సమర్పించుకున్నాడు. అఫ్రిది ఈ చెత్త రికార్డులు నమోదు చేయడానికి న్యూజిలాండ్ బ్యాటర్ టిమ్ సీఫర్ట్ కారకుడు. అఫ్రిది వేసిన ఇన్నింగ్స్ 3వ ఓవర్లో సీఫర్ట్ శివాలెత్తిపోయి నాలుగు సిక్సర్లు బాదాడు. ఓ డబుల్ తీశాడు.ఈ మ్యాచ్‌లో సీఫర్ట్ మొత్తంగా 5 సిక్సర్లు, 3 బౌండరీలు బాది 22 బంతుల్లో 45 పరుగులు చేశాడు. సీఫర్ట్‌కు ముందు మొహమ్మద్ అలీ వేసిన ఇన్నింగ్స్ రెండో ఓవర్లో న్యూజిలాండ్ మరో ఓపెనర్ ఫిన్ అలెన్ కూడా చెలరేగాడు. ఈ ఓవర్లో అలెన్ మూడు సిక్సర్లు కొట్టాడు. సీఫర్ట్ ఔటయ్యాక కూడా చెలరేగిన అలెన్ 16 బంతులు ఎదుర్కొని 5 సిక్సర్లు, ఓ బౌండరీ సాయంతో 38 పరుగులు చేశాడు. సీఫర్ట్, అలెన్ విధ్వంసం సృష్టించడంతో న్యూజిలాండ్ తొలి 7 ఓవర్లలో ఏకంగా 88 పరుగులు సాధించింది.వర్షం కారణంగా 15 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ 9 వికెట్ల నష్టానికి 135 పరుగులు చేసింది. 46 పరుగులు చేసిన కెప్టెన్ సల్మాన్ అఘా టాప్ స్కోరర్‌గా నిలువగా.. షాదాబ్ ఖాన్ (26), షాహీన్ అఫ్రిది (22 నాటౌట్), మహ్మద్ హరీస్ (11), ఇర్ఫాన్ ఖాన్ (11), అబ్దుల్ సమద్ (11) రెండంకెల స్కోర్లు చేశారు. పాక్ ఇన్నింగ్స్‌లో హసన్ నవాజ్ (0), ఖుష్దిల్ షా (2), జహన్దాద్ ఖాన్ (0), హరీస్ రౌఫ్ (1) దారుణంగా విఫలమయ్యారు. న్యూజిలాండ్ బౌలర్లలో జేకబ్ డఫీ, బెన్ సియర్స్, జిమ్మీ నీషమ్, ఐష్ సోధి తలో రెండు వికెట్లు తీసి పాక్‌ను దెబ్బకొట్టారు.అనంతరం ఓ మోస్తరు లక్ష్య ఛేదనకు దిగిన న్యూజిలాండ్ ఆది నుంచే దూకుడుగా ఆడింది. ఓపెనర్లు టిమ్ సీఫర్ట్, ఫిన్ అలెన్ చెలరేగిపోయారు. ఫలితంగా న్యూజిలాండ్ 13.1 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. సీఫర్ట్, అలెన్ ఔటయ్యాక తడబడిన న్యూజిలాండ్ 31 పరుగుల వ్యవధిలో 4 వికెట్లు కోల్పోయింది. మార్క్ చాప్మన్ (1), డారిల్ మిచెల్ (15), జిమ్మీ నీషమ్ (5) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. ఈ దశలో మిచెల్ హే (21 నాటౌట్), కెప్టెన్ బ్రేస్‌వెల్ (5 నాటౌట్) సహకారంతో న్యూజిలాండ్‌ను విజయతీరాలకు చేర్చారు. పాక్ బౌలర్లలో హరీస్ రౌఫ్ 2, మొహమ్మద్ అలీ, ఖుష్దిల్ షా, జహన్దాద్ ఖాన్ తలో వికెట్ పడగొట్టారు.ఈ గెలుపుతో న్యూజిలాండ్ 5 మ్యాచ్‌ల సిరీస్‌లో 2-0 ఆధిక్యంలోకి వెళ్లింది. అంతకుముందు తొలి మ్యాచ్‌లో కూడా న్యూజిలాండ్ పాక్‌ను చిత్తుగా ఓడించింది. మూడో టీ20 ఆక్లాండ్ వేదికగా మార్చి 21న జరుగనుంది. ఈ మ్యాచ్‌లో కూడా ఓడితే పాక్ సిరీస్‌ను కోల్పోతుంది. -
న్యూజిలాండ్ ఓపెనర్ల ఊచకోత.. రెండో టీ20లోనూ చిత్తైన పాకిస్తాన్
5 టీ20లు, మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ కోసం న్యూజిలాండ్‌లో పర్యటిస్తున్న పాక్ క్రికెట్ జట్టుకు మరో పరాభవం ఎదురైంది. టీ20 సిరీస్‌లో భాగంగా ఇవాళ (మార్చి 18) జరిగిన రెండో మ్యాచ్‌లో ఆతిథ్య జట్టు పాక్‌ను 5 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించింది. వర్షం కారణంగా 15 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ 9 వికెట్ల నష్టానికి 135 పరుగులు చేసింది. 46 పరుగులు చేసిన కెప్టెన్ సల్మాన్ అఘా టాప్ స్కోరర్‌గా నిలువగా.. షాదాబ్ ఖాన్ (26), షాహీన్ అఫ్రిది (22 నాటౌట్), మహ్మద్ హరీస్ (11), ఇర్ఫాన్ ఖాన్ (11), అబ్దుల్ సమద్ (11) రెండంకెల స్కోర్లు చేశారు. పాక్ ఇన్నింగ్స్‌లో హసన్ నవాజ్ (0), ఖుష్దిల్ షా (2), జహన్దాద్ ఖాన్ (0), హరీస్ రౌఫ్ (1) దారుణంగా విఫలమయ్యారు. న్యూజిలాండ్ బౌలర్లలో జేకబ్ డఫీ, బెన్ సియర్స్, జిమ్మీ నీషమ్, ఐష్ సోధి తలో రెండు వికెట్లు తీసి పాక్‌ను దెబ్బకొట్టారు.అనంతరం ఓ మోస్తరు లక్ష్య ఛేదనకు దిగిన న్యూజిలాండ్ ఆది నుంచే దూకుడుగా ఆడింది. ఓపెనర్లు టిమ్ సీఫర్ట్ (22 బంతుల్లో 45), ఫిన్ అలెన్ (16 బంతుల్లో 32) చెలరేగిపోయారు. వీరిద్దరి ధాటికి న్యూజిలాండ్ 4 ఓవర్లలోనే 50 పరుగుల మార్కును తాకింది. పాక్ స్టార్ పేసర్ షాహీన్ అఫ్రిది వేసిన ఇన్నింగ్స్ 3వ ఓవర్లో టిమ్ సీఫర్ట్ శివాలెత్తిపోయాడు. ఈ ఓవర్లో సీఫర్ట్ ఏకంగా నాలుగు సిక్సర్లు బాదాడు. అంతకుముందు మొహమ్మద్ అలీ వేసిన రెండో ఓవర్లో ఫిన్ అలెన్ కూడా చెలరేగాడు. ఈ ఓవర్లో అలెన్ మూడు సిక్సర్లు కొట్టాడు. వీరిద్దరూ క్రీజ్‌లో ఉండగా మ్యాచ్ 10 ఓవర్లలోనే ముగిస్తుందని అంతా అనుకున్నారు. అయితే పాక్ బౌలర్లు ఒక్కసారిగా ఫామ్‌లోకి రావడంతో న్యూజిలాండ్ 31 పరుగుల వ్యవధిలో 4 వికెట్లు కోల్పోయింది. మార్క్ చాప్మన్ (1), డారిల్ మిచెల్ (15), జిమ్మీ నీషమ్ (5) తక్కువ స్కోర్లకే ఔట్ కాగా.. మిచెల్ హే (21 నాటౌట్), కెప్టెన్ బ్రేస్‌వెల్ (5 నాటౌట్) న్యూజిలాండ్‌ను విజయతీరాలకు చేర్చారు. న్యూజిలాండ్ 13.1 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. పాక్ బౌలర్లలో హరీస్ రౌఫ్ 2, మొహమ్మద్ అలీ, ఖుష్దిల్ షా, జహన్దాద్ ఖాన్ తలో వికెట్ పడగొట్టారు.ఈ గెలుపుతో న్యూజిలాండ్ 5 మ్యాచ్‌ల సిరీస్‌లో 2-0 ఆధిక్యంలోకి వెళ్లింది. అంతకుముందు తొలి మ్యాచ్‌లో కూడా న్యూజిలాండ్ పాక్‌ను చిత్తుగా ఓడించింది. మూడో టీ20 ఆక్లాండ్ వేదికగా మార్చి 21న జరుగనుంది. ఈ మ్యాచ్‌లో కూడా ఓడితే పాక్ సిరీస్‌ను కోల్పోతుంది. -
విశాఖలో ఐపీఎల్ మ్యాచ్‌లకు జనాదరణ కరువు.. ప్రచారంలో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వైఫల్యం
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 సీజన్లో రెండు మ్యాచ్‌లు విశాఖ వేదికగా జరుగనున్నాయి. మార్చి 24న ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్ తలపడనుండగా.. మార్చి 30న ఢిల్లీ సన్‌రైజర్స్ హైదరబాద్‌ను ఢీకొట్టనుంది. ఢిల్లీ, లక్నో మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభం కానుండగా.. ఢిల్లీ, సన్‌రైజర్స్ మ్యాచ్ మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రారంభమవుతుంది. లక్నోతో జరుగబోయే తొలి మ్యాచ్ కోసం ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు నిన్ననే విశాఖకు చేరుకుంది.ఢిల్లీ క్యాపిటల్స్ విశాఖను రెండో హోం గ్రౌండ్‌గా ఎంచుకోవడంతో ఇక్కడ బీసీసీఐ రెండు మ్యాచ్‌లను షెడ్యూల్ చేసింది. గతేడాది కూడా ఢిల్లీ రెండు మ్యాచ్‌లను విశాఖలో ఆడింది. నాడు సీఎస్కే, కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లకు మంచి ప్రజాదరణ లభించింది. అయితే ఈ సీజన్లో జరుగబోయే మ్యాచ్‌లకే జనాదరణ కరువైంది. మ్యాచ్‌లకు సంబంధించి సరైన ప్రచారం లేకపోవడం వల్ల టికెట్ల అమ్మకాలు నత్త నడకన సాగుతున్నాయి. మ్యాచ్‌లపై జనాలు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. తొలి మ్యాచ్ (లక్నో) ప్రారంభానికి ఇంకా ఆరు రోజులు మాత్రమే ఉండగా.. ఇప్పటికీ ఆన్లైన్లో టికెట్లు అమ్ముడుపోలేదు. ఆన్లైన్లో టికెట్ల అమ్మకాలు ప్రారంభించి నాలుగు రోజులవుతున్నా ఏమాత్రం జనాదరణ కనిపించడం లేదు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వైఫల్యమే ఈ పరిస్థితికి కారణమని తెలుస్తుంది.ఇదిలా ఉంటే, ఢిల్లీ క్యాపిటల్స్ ఈ సీజన్లో తమ తొలి మ్యాచ్‌ను విశాఖలోనే (లక్నో) ఆడనుంది. ఈ సీజన్లో ఢిల్లీ అక్షర్ పటేల్ నేతృత్వంలో కొంగొత్త జట్టుతో ఉరకలేస్తుంది. కెప్టెన్‌గా తొలిసారి బాధ్యతలు చేపట్టిన అక్షర్‌కు డిప్యూటీగా అనుభవజ్ఞుడైన ఫాఫ్ డుప్లెసిస్‌ను నియమించింది ఢిల్లీ మేనేజ్మెంట్.ఈ సీజన్లో ఢిల్లీ బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో చాలా పటిష్టంగా కనిపిస్తుంది. అభిషేక్ పోరెల్, ఫాఫ్ డుప్లెసిస్, జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్, కరుణ్ నాయర్, కేఎల్ రాహుల్, సమీర్ రిజ్వీ, ట్రిస్టన్ స్టబ్స్‌లతో కూడిన ప్రమాదకర బ్యాటింగ్ లైనప్‌ను కలిగి ఉంది. మిచెల్ స్టార్క్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, ముకేశ్ కుమార్, నటరాజన్‌లతో బౌలింగ్ విభాగం కూడా ప్రమాదకరంగా ఉంది.ఐపీఎల్ 2025 సీజన్ కోసం ఢిల్లీ జట్టు..అభిషేక్ పోరెల్, ఫాఫ్ డుప్లెసిస్, జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్, కరుణ్ నాయర్, కేఎల్ రాహుల్, సమీర్ రిజ్వీ, ట్రిస్టన్ స్టబ్స్, అక్షర్ పటేల్, డోనోవన్ ఫెరీరా, అజయ్ మండల్, మన్వంత్ కుమార్, అశుతోష్ శర్మ, మాధవ్ తివారీ, దుష్మంత చమీర, కుల్దీప్ యాదవ్, ముకేశ్ కుమార్, టి. నటరాజన్, విప్రాజ్ నిగమ్, మిచెల్ స్టార్క్, త్రిపురణ విజయ్ -
IPL 2025: పంజాబ్ కింగ్స్‌కు చేదు వార్త
ఐపీఎల్ 2025 సీజన్ ప్రారంభానికి ముందు పంజాబ్ కింగ్స్‌కు చేదు వార్త వినిపించింది. ఆ జట్టు స్టార్ ఆల్‌రౌండర్ (అఫ్గానిస్తాన్) అజ్మతుల్లా వ్యక్తిగత కారణాల చేత జట్టుతో కాస్త ఆలస్యంగా జతకట్టనున్నాడు. ఈ నెల 22 నుంచి ఐపీఎల్ 18వ సీజన్ ప్రారంభం కానుండగా... పంజాబ్ కింగ్స్ మార్చి 25న గుజరాత్ టైటాన్స్‌తో తమ తొలి మ్యాచ్ ఆడనుంది.లీగ్ ఆరంభం నుంచి ఒక్కసారి కూడా ట్రోఫీ చేజిక్కించుకోలేకపోయిన పంజాబ్ కింగ్స్... ఈసారి తమ చిరకాల స్వప్నం నెరవేర్చుకోవాలనే లక్ష్యంతో ఉంది. గతేడాది కోల్‌కతా నైట్‌రైడర్స్‌ను చాంపియన్‌గా నిలిపిన శ్రేయస్ అయ్యర్ ఈసారి పంజాబ్ కెప్టెన్‌గా వ్యవహరించనుండగా... ఆసీస్ దిగ్గజం రికీ పాంటింగ్ హెడ్‌కోచ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. వీరిద్దరితో పాటు చహల్, అర్ష్‌దీప్ సింగ్ ఇప్పటికే ధర్మశాల చేరుకున్నారు. ‘అజ్మతుల్లా వ్యక్తిగత కారణాలతో ఆలస్యంగా భారత్‌కు రానున్నాడు. మిగిలిన విదేశీ ఆటగాళ్ల రాక ఇప్పటికే మొదలైంది’ అని ఐపీఎల్ వర్గాలు వెల్లడించాయి.ప్రాక్టీస్‌లో సీఎస్కే జోరుమరోవైపు చెన్నై సూపర్ కింగ్స్ జట్టు జోరుగా సాధన సాగిస్తోంది. ఆ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న విదేశీ ఆటగాళ్లలో ఆసీస్ పేసర్ నాథన్ ఎలీస్ మినహా తక్కిన వాళ్లంతా ఇప్పటికే చెన్నై చేరుకున్నారు. ఈ మేరకు ఫ్రాంచైజీ సీఈఓ కాశీ విశ్వనాథ్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ‘రచిన్ రవీంద్ర, కాన్వే ఇప్పటికే జట్టుతో చేరారు. త్వరలోనే ఎలీస్ రానున్నాడు’ అని పేర్కొన్నారు. ధోనీ, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశి్వన్ ప్రాక్టీస్‌లో పాల్గొంటున్నారు. -
ఐపీఎల్‌లోనూ విజృంభిస్తా.. ఢిల్లీకి టైటిల్ అందించడమే లక్ష్యం: కరుణ్ నాయర్
దేశవాళీల్లో పరుగుల వరద పారించిన సీనియర్ బ్యాటర్ కరుణ్ నాయర్... ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లోనూ అదే జోరు కొనసాగిస్తానని ఆశాభావం వ్యక్తం చేశాడు. ఈ నెల 22 నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్ 18వ సీజన్లో కరుణ్ నాయర్ ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఈ ఏడాది విజయ్ హజారే వన్డే టోర్నమెంట్లో 9 మ్యాచ్‌లు ఆడిన కరుణ్ నాయర్ 389.50 సగటుతో 779 పరుగులు చేశాడు. అందులో 5 సెంచరీలు ఉన్నాయి. ఇక రంజీ ట్రోఫీలోనూ అదే జోష్ కొనసాగిస్తూ 57.33 సగటు 4 సెంచరీల సాయంతో 860 పరుగులు చేసి విదర్భ జట్టు చాంపియన్‌గా నిలవడంలో కీలక పాత్ర పోషించాడు. ఇప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు తొలిసారి ఐపీఎల్ టైటిల్ గెలవడంలోనూ కీలక పాత్ర పోషించాలని భావిస్తున్నాడు.‘చాన్నాళ్లుగా క్రికెట్ ఆడుతున్నా. కెరీర్లో ఎన్నో ఎత్తుపల్లాలు చూశాను. కిందపడ్డ ప్రతిసారీ అంతకు రెట్టింపు బలంతో పైకి లేవడానికి ప్రయత్నించా. ప్రస్తుతానికి ఐపీఎల్ మీదే దృష్టి పెట్టా. జట్టుకు ఏం అవసరమో అది చేసేందుకు సిద్ధంగా ఉన్నా. అవకాశం వచ్చిన ప్రతి మ్యాచ్‌లో టీమ్ విజయం కోసం శక్తివంచన లేకుండా కృషి చేస్తా. ఢిల్లీ జట్టుతో చేరడం ఆనందంగా ఉంది. ప్రతి మ్యాచ్... కెరీర్లో చివరిది అనే విధంగానే కష్టపడతా.ఢిల్లీ కొత్త కెప్టెన్ అక్షర్ పటేల్‌కు ఆటపై మంచి అవగాహన ఉంది. ఇటీవలి కాలంలో అతడు అంతర్జాతీయ క్రికెట్లో మెరుగైన ప్రదర్శన కనబరుస్తున్నాడు. ఇక కేఎల్ రాహుల్‌తో ఎన్నో ఏళ్ల అనుబంధం ఉంది. అతడి కెరీర్ ఆరంభం నుంచి దగ్గర నుంచి గమనించా. తిరిగి వాళ్లతో కలిసి ఆడేందుకు ఉత్సుకతతో ఉన్నా. క్యాపిటల్స్‌కు తొలిసారి కప్పు అందించేందుకు ప్రయత్నిస్తా’ అని నాయర్ అన్నాడు. -
విశాఖ చేరిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు
విశాఖ స్పోర్ట్స్: ఐపీఎల్లో తొలి మ్యాచ్ ఆడేందుకు ఢిల్లీ క్యాపిటల్స్(డీసీ) జట్టు విశాఖ చేరుకుంది. సోమవారం రాత్రి ప్రత్యేక విమానంలో విచ్చేసిన జట్టు సభ్యుల్ని అభిమానులు హర్షాతిరేకాలతో స్వాగతం పలికారు. కెపె్టన్ అక్షర్ పటేల్‌తో పాటు జట్టు సభ్యులు, సపొరి్టంగ్ స్టాఫ్ విమానాశ్రయం నుంచి నేరుగా నోవోటల్కు చేరుకున్నారు. వీరంతా మంగళవారం నుంచి నెట్స్‌లో శ్రమించనున్నారు. విదేశీ ఆటగాళ్లు డుప్లెసిస్, ఫ్రేజర్, ఫెరీరా కులసాగా మాట్లాడుకుంటూ విశాఖ విమానాశ్రయానికి చేరుకున్నారు. డీసీ జట్టు డైరెక్టర్ వేణుగోపాలరావు, హెడ్ కోచ్ హేమంగ బదాని విశాఖ చేరుకున్న వారిలో ఉన్నారు. డీసీ జట్టులో ఆంధ్రా ఆటగాడు త్రిపురాన విజయ్ చేరాడు. ఢిల్లీ క్యాపిటల్స్ విశాఖ వేదికగా 24న లక్నో సూపర్ జెయింట్స్, 30న సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లతో తలపడనుంది. అందుబాటులోకి రూ.వెయ్యి టికెట్లు ఐపీఎల్ సీజన్లో విశాఖ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్ ఆరంభ మ్యాచ్ చూసేందుకు లోయర్ డినామినేషన్ రూ.1000, రూ.1500 టికెట్లు ఆన్లైన్లో అందుబాటులోకి వచ్చాయి. రూ.వెయ్యి టికెట్ ఈ స్టాండ్‌లో, రూ.1500 టికెట్ ఎం–1 స్టాండ్‌లో అందుబాటులోకి తెచ్చింది. -
IPL 2025: రజత్‌ను ఆశీర్వదించండి.. ఆర్సీబీ అభిమానులకు విరాట్ పిలుపు
యువ ఆటగాడు రజత్ పాటీదార్ సుదీర్ఘ కాలం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టు కెప్టెన్‌గా కొనసాగుతాడని స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి అభిప్రాయపడ్డాడు. రజత్‌ను ఆశీర్వదించాలని ఆర్సీబీ అన్‌బాక్స్ ఈవెంట్ సందర్భంగా పిలుపునిచ్చాడు. గత సీజన్లో డు ప్లెసిస్ ఆర్సీబీ కెప్టెన్‌గా వ్యవహరించగా... ఈ సీజన్ ఆరంభానికి ముందు ఫ్రాంచైజీ సారథ్య బాధ్యతలను రజత్ పాటీదార్‌కు అందించింది. విరాట్ మాటల్లో..‘రజత్ పెద్ద బాధ్యతలు అందుకున్నాడు. సుదీర్ఘ కాలం అతడు సారథిగా కొనసాగుతాడు. జట్టును నడిపంచేందుకు అతడికి తగిన వనరులు అందుబాటులో ఉన్నాయి’ అని విరాట్ అన్నాడు. ఇక లీగ్ ఆరంభం (2008) నుంచి ఒకే ఫ్రాంచైజీకి ప్రాతినిధ్యం వహిస్తున్న విరాట్ కోహ్లి... ఇదంతా ఆర్సీబీ అభిమానుల ప్రేమాభిమానాల వల్లే సాధ్యమైందని అన్నాడు. ‘18 సంవత్సరాలుగా ఆర్సీబీకి ఆడుతున్నా. ఇదో అద్భుతమైన అనుభూతి. ప్రతి సీజన్‌కు ముందు అదే ఉత్సాహం నన్ను మరింత ఉత్తేజపరుస్తోంది. జట్టులో నైపుణ్యానికి కొదవలేదు. ఈ బృందంతో కలిసి ఆడేందుకు ఆతృతగా ఎదురుచూస్తున్నా’ అని అన్నాడు. గతేడాది టి20 ప్రపంచకప్ గెలిచాక అంతర్జాతీయ స్థాయిలో ఈ ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన కోహ్లి ఆ తర్వాత తొలిసారి ఐపీఎల్ ఆడనున్నాడు.గౌరవం.. ఆనందం.. సక్రమంగా నిర్వర్తిస్తా: పాటీదార్బెంగళూరు జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించే అవకాశం రావడం గౌరవంగా భావిస్తున్నానని రజత్ పాటీదార్ అన్నాడు. ‘విరాట్, డివిలియర్స్, క్రిస్ గేల్ వంటి దిగ్గజ ఆటగాళ్లు ప్రాతినిధ్యం వహించిన జట్టుకు సారథిగా వ్యవహరించడం చాలా ఆనందంగా ఉంది. వీళ్ల ఆటను చూస్తూనే పెరిగా. చిన్నప్పటి నుంచే ఆర్సీబీ అంటే ప్రత్యేక అభిమానం. కెప్టెన్సీ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తా’ అని ఆర్సీబీ జట్టు సోమవారం నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా పాటీదార్ వ్యాఖ్యానించాడు. -
IPL 2025: ‘విన్’రైజర్స్ అయ్యేనా!
మొదట ఓ మాదిరి స్కోరు చేయడం... ఆ తర్వాత కట్టుదిట్టమైన బౌలింగ్‌తో దాన్ని కాపాడుకోవడం ఇది ఒకప్పుడు ఐపీఎల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు తీరు! కానీ గతేడాది బౌలింగ్ బలాన్ని పక్కన పెట్టిన రైజర్స్... బ్యాటింగ్‌తో లీగ్‌లో ప్రకంపనలు సృష్టించింది. ఒకటికి మూడుసార్లు 250 పైచిలుకు పరుగులు చేసిన సన్‌రైజర్స్... ఐపీఎల్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన జట్టుగా... పవర్‌ప్లేలో అత్యధిక పరుగులు పిండుకున్న టీమ్‌గా రికార్డుల్లోకెక్కింది!! లీగ్ ఆసాంతం రాణించిన బ్యాటర్లు ఆఖర్లో విఫలమవడంతో గత సీజన్లో రన్నరప్ ట్రోఫీతో సరిపెట్టుకున్న హైదరాబాద్ ఫ్రాంచైజీ ఈసారి కప్పు కొట్టాలని కృతనిశ్చయంతో ఉంది. కమిన్స్ కెప్టేన్సీకి... అభిషేక్ శర్మ, హెడ్ ఆరంభ మెరుపులు... క్లాసన్, నితీశ్ కుమార్ రెడ్డి ఫినిషింగ్ టచ్ తోడైతే సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను ఆపడం ప్రత్యర్థులకు శక్తికి మించిన పనే!!! –సాక్షి క్రీడావిభాగం ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో నాణ్యమైన బౌలింగ్‌కు పెట్టింది పేరైన సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) జట్టు... గతేడాది అందుకు పూర్తి భిన్నంగా బాదుడే పరమావధిగా విజృంభించి కొత్త గుర్తింపు తెచ్చుకుంది. గత సీజన్లో సన్‌రైజర్స్ సాగించిన విధ్వంసకాండ మాటలకు అందనిది. అరాచకం అనే పదానికి అర్థం మార్చుతూ... ప్రత్యర్థి బౌలర్లను బెంబేలెత్తిస్తూ సన్‌రైజర్స్ బ్యాటర్లు సాగించిన ఊచకోత గురించి ఎంత చెప్పినా తక్కువే! ఒకరి తర్వాత ఒకరు అన్నట్లు వంతులు వేసుకొనిమరీ వీరబాదుడు బాదడంతోనే రైజర్స్... లీగ్ చరిత్రలోనే అత్యధిక స్కోరు తమ పేరిట లిఖించుకుంది. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, హెన్రిచ్ క్లాసెన్, నితీశ్ కుమార్ రెడ్డి... ఈ ‘రన్’ చతుష్టయానికి ఇప్పుడు మరో పిడుగు తోడయ్యాడు. ‘పాకెట్ డైనమైట్’ ఇషాన్ కిషన్ ఈ ఏడాది నుంచి రైజర్స్‌కు ప్రాతినిధ్యం వహించనున్నాడు. ఇప్పటికే హిట్టర్లతో దట్టంగా ఉన్న హైదరాబాద్ బ్యాటింగ్ లైనప్... ఇషాన్ రాకతో మరింత రాటుదేలనుంది. వేలంలో అత్యధికంగా 25 మందిని తీసుకునే అవకాశం ఉన్నా... కేవలం 20 మంది ప్లేయర్లనే కొనుగోలు చేసుకున్న రైజర్స్... అట్టిపెట్టుకున్న ఆటగాళ్ల కోసమే భారీగా ఖర్చు పెట్టింది. క్లాసెన్‌కు రూ. 23 కోట్లు, కెప్టేన్ ప్యాట్ కమిన్స్‌కు రూ. 18 కోట్లు... అభిషేక్ శర్మ, హెడ్లకు రూ. 14 కోట్ల చొప్పున ఇచ్చిన రైజర్స్... రూ. 6 కోట్లకు నితీశ్ కుమార్ రెడ్డిని కొనసాగించింది. 2016లో తొలిసారి టైటిల్ సాధించిన ఎస్ఆర్హెచ్... 2018, 2024లో రన్నరప్‌గా నిలిచింది. ఈసారి అటు బ్యాటింగ్‌తో పాటు ఇటు బౌలింగ్ దళాన్ని కూడా మరింత పటిష్ట పరుచుకున్న హైదరాబాద్... రెండోసారి కప్పు చేజక్కించుకోవాలని తహతహలాడుతోంది. నాలుగో ఆటగాడు ఎవరో? కెప్టేన్ కమిన్స్‌తో పాటు క్లాసెన్, హెడ్ తుది జట్టులో ఉండటం ఖాయమే కాగా... గతేడాది నాలుగో విదేశీ ప్లేయర్‌గా మార్క్రమ్ను ఎంచుకుంది. అయితే ఈసారి మాత్రం ఆడమ్ జాంపా, ముల్డర్, కమిందు మెండిస్ రూపంలో పరిమిత వనరులే ఉన్నాయి. దీంతో హెడ్ కోచ్ డానియల్ వెటోరీ... ఆసీస్ స్పిన్నర్ జాంపా వైపే మొగ్గుచూపే అవకాశాలున్నాయి. అయితే రాహుల్ త్రిపాఠి, అబ్దుల్ సమద్, షాబాజ్ అహ్మద్ వంటి దేశీయ ఆటగాళ్లు ఈసారి అందుబాటులో లేకపోవడం రైజర్స్‌కు ప్రతిబంధకంగా మారింది. అభినవ్ మనోహర్, అనికేత్ వర్మ, అథర్వ తైడె, సచిన్ బేబీకి తుది జట్టులో అవకాశం దక్కుతుందో లేదో వేచి చూడాలి. గత సీజన్లో తొలి ఏడు మ్యాచ్‌ల్లో ఐదింట నెగ్గి ఆరంభంలోనే ఆధిపత్యం కనబర్చిన హైదరాబాద్ జట్టు... పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచి ప్లే ఆఫ్స్‌కు చేరింది. క్వాలిఫయర్–1లో కోల్‌కతా నైట్‌రైడర్స్ చేతిలో ఓడిన రైజర్స్... క్వాలిఫయర్–2లో రాజస్తాన్ రాయల్స్‌పై గెలిచినా... ఫైనల్లో మరోసారి కోల్‌కతా చేతిలోనే ఓడి రన్నరప్‌తో సరిపెట్టుకుంది. తమదైన రోజులో అరవీర భయంకరంగా రెచ్చిపోయి రికార్డులు తిరగరాసే రైజర్స్... టాపార్డర్ విఫలమైతే మాత్రం తేలిపోతోందని గత సీజన్‌తోనే అర్థమైంది. దీంతో ఈసారి ఎలాంటి ప్రణాళికతో ముందడుగు వేస్తుందో చూడాలి. షమీ రాకతో రాత మారేనా! సుదీర్ఘ కాలంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలింగ్ తురుపుముక్కగా ఉన్న భువనేశ్వర్ కుమార్‌తో పాటు యార్కర్ కింగ్ నటరాజన్‌ను వదిలేసుకున్న జట్టు... గతేడాది వేలంలో టీమిండియా సీనియర్ పేసర్ మొహమ్మద్ షమీ, హర్షల్ పటేల్‌లను ఎంపిక చేసుకుంది. కమిన్స్, జైదేవ్ ఉనాద్కట్లకు ఈ ఇద్దరూ తోడవడంతో మన బౌలింగ్ మరింత రాటుదేలనుంది. అవకాశం వస్తే పేస్ బౌలింగ్ బాధ్యతలు నిర్వర్తించేందుకు ఆంధ్ర ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి ఉండనే ఉన్నాడు. ఆడమ్ జాంపా, రాహుల్ చహర్ స్పిన్ బాధ్యతలు మోయనున్నారు. అయితే తుది 11 మందితో కూడిన జట్టులో అనికేత్ వర్మ, అభినవ్ మనోహర్, సచిన్ బేబీలలో ఇద్దరికి అవకాశం దక్కొచ్చు. రైజర్స్ తరఫున తొలిసారి ప్రాతినిధ్యం వహిస్తున్న వీరు కూడా మేనేజ్మెంట్ అంచనాలను అందుకుంటే జట్టుకు తిరుగుండదు. పవర్‌ప్లేలో జట్టుకు వికెట్లు అందించాల్సిన బాధ్యత మాత్రం షమీపైనే ఉంది. 2022, 2023 సీజన్లలో మెరుగైన ప్రదర్శన కనబర్చిన షమీ... గాయం నుంచి తిరిగి వచ్చిన అనంతరం అదే తీవ్రత కొనసాగిస్తే జట్టుకు అదనపు బలం చేకూరినట్లే. గాయం కారణంగా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీకి దూరమైన ఆ్రస్టేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ సుదీర్ఘ విరామం తర్వాత టి20 ఫార్మాట్లో బరిలోకి దిగనున్నాడు. అతడు జట్టును ఎలా నడిపిస్తాడనేది కీలకం. గాయంతో జట్టుకు దూరమైన కార్స్ స్థానంలో దక్షిణాఫ్రికా ప్లేయర్ ముల్డర్‌ను రైజర్స్ ఎంపిక చేసుకుంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు: కమిన్స్ (కెప్టేన్), ట్రావిస్ హెడ్, హెన్రిచ్ క్లాసెన్, అభిషేక్ శర్మ, నితీశ్ కుమార్ రెడ్డి, ఇషాన్ కిషన్, అథర్వ తైడె, అభినవ్ మనోహర్, అనికేత్ వర్మ, సచిన్ బేబీ, హర్షల్ పటేల్, కమిందు మెండిస్, ముల్డర్, షమీ, రాహుల్ చాహర్, ఆడమ్ జాంపా, సిమర్జీత్ సింగ్, జీషాన్ అన్సారీ, జైదేవ్ ఉనాద్కట్, ఇషాన్ మలింగ. అంచనా: గతేడాది కళ్లుచెదిరే ఆటతీరుతో రన్నరప్‌గా నిలిచిన సన్‌రైజర్స్... ఈసారి కూడా హిట్టర్లు దంచికొడితే ప్లే ఆఫ్స్ చేరడం దాదాపు ఖాయమే! -
రోహిత్, కోహ్లి, బుమ్రా లేకున్నా భారత్ గెలిచింది: టీమిండియా దిగ్గజం
పరిమిత ఓవర్ల క్రికెట్లో టీమిండియా దూసుకుపోతోంది. తొమ్మిది నెలల వ్యవధిలో రెండు ఐసీసీ ట్రోఫీలు గెలవడమే ఇందుకు నిదర్శనం. రోహిత్ శర్మ (Rohit Sharma) కెప్టెన్సీలో గతేడాది టీ20 ప్రపంచకప్ గెలిచిన భారత్.. ఇటీవల ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ (ICC Champions Trophy)ని సొంతం చేసుకుంది.ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah)జట్టుతో లేకపోయినా అద్భుత ప్రదర్శనతో ఆఖరి వరకు అజేయంగా నిలిచింది. అంతకు ముందు పొట్టి వరల్డ్‌కప్ టోర్నీలో పరాజయమన్నదే లేకుండా ట్రోఫీని ముద్దాడింది. ఈ రెండు ఐసీసీ ఈవెంట్లలో వంద శాతం విజయాలతో రోహిత్ సేన తమ సత్తా చాటింది.అత్యంత పటిష్టంగాఈ నేపథ్యంలో టీమిండియా దిగ్గజం, మాజీ కెప్టెన్ సునిల్ గావస్కర్ చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. భారత జట్టు ప్రస్తుతం అత్యంత పటిష్టంగా ఉందన్న సన్నీ.. బెంచ్ స్ట్రెంత్‌లోనూ మిగతా జట్లతో పోలిస్తే ముందు వరుసలో ఉందని పేర్కొన్నాడు. వ్యక్తులకు అతీతంగా జట్టుగా భారత్ ఎదిగిందని.. రోహిత్, కోహ్లి, బుమ్రా లాంటి వాళ్లు లేకపోయినా గెలవగల స్థాయికి చేరుకుందని అన్నాడు.రోహిత్, కోహ్లి లేకుండానేఈ మేరకు ‘మిడ్-డే’కు రాసిన కాలమ్‌లో.. ‘‘బుమ్రా లేకుండానే టీమిండియా చాంపియన్స్ ట్రోఫీలో అద్భుత విజయం సాధించిన తర్వాత.. వ్యక్తులను మించి టీమిండియా స్థాయి పెరిగిందని అర్థమవుతోంది. గతంలో కూడా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి లేకుండానే టీమిండియా చాలాసార్లు గెలిచింది.అయితే, వాళ్లిద్దరు ఉంటే జట్టు మరింత పటిష్టంగా మారినట్లు కనిపిస్తుంది. ఆస్ట్రేలియా పర్యటనలో జస్ప్రీత్ బుమ్రాపై టీమిండియా ఎక్కువగా ఆధారపడింది. ఇలాంటివి అరుదుగా జరుగుతూ ఉంటాయి.అయితే, అతడు లేకుండానే ఆస్ట్రేలియా వెలుపల స్వల్ప టార్గెట్లను కూడా టీమిండియా డిఫెండ్ చేసుకుంది. ఇంగ్లండ్‌తో సొంతగడ్డపై టీ20, వన్డే సిరీస్‌లలో టీమిండియా పరిపూర్ణ విజయాలు సాధించింది. భారత క్రికెట్ జట్టుతో పాటు బెంచ్ కూడా ఎంత బలంగా ఉందో దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు’’ అంటూ గావస్కర్ టీమిండియాపై ప్రశంసల జల్లు కురిపించాడు. రోహిత్, కోహ్లి లేకుండానే యువ ఆటగాళ్లు టీ20 ఫార్మాట్లో భారత్‌కు అద్భుత విజయాలు అందిస్తున్నారని ఈ సందర్భంగా పేర్కొన్నాడు.ఏకంగా 17 గెలిచిన సూర్య సేనకాగా టీ20 ప్రపంచకప్-2024లో టీమిండియా చాంపియన్‌గా నిలిచిన తర్వాత రోహిత్- కోహ్లి అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్‌కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. అంతకుముందు కూడా విశ్రాంతి పేరిట ఈ దిగ్గజాలు పలు మ్యాచ్‌లకు దూరమయ్యారు. ఇక రోహిత్- కోహ్లి రిటైర్మెంట్ తర్వాత టీమిండియా 20 టీ20 మ్యాచ్‌లు ఆడితే.. అందులో ఏకంగా 17 గెలవడం విశేషం. సూర్యకుమార్ సేన విజయాల శాతం 85గా ఉండటం గమనార్హం. ఈ నేపథ్యంలోనే గావస్కర్ పైవిధంగా స్పందించినట్లు తెలుస్తోంది.ఇదిలా ఉంటే.. చాంపియన్స్ ట్రోఫీ-2025కి పాకిస్తాన్ ఆతిథ్యమివ్వగా.. రోహిత్ సేన మాత్రం ఈ వన్డే టోర్నీలో తమ మ్యాచ్‌లన్నీ దుబాయ్‌లోనే ఆడింది. గ్రూప్ దశలో బంగ్లాదేశ్, పాకిస్తాన్, న్యూజిలాండ్‌లను ఓడించిన భారత్.. సెమీస్‌లో ఆస్ట్రేలియా, ఫైనల్లో న్యూజిలాండ్‌లపై గెలిచి చాంపియన్‌గా నిలిచింది. ఇక సెమీస్ మ్యాచ్‌లో కోహ్లి.. ఫైనల్లో రోహిత్ శర్మ అద్భుత అర్ధ శతకాలతో జట్టు టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించారు.చదవండి: నేను ఎదుర్కొన్న కఠినమైన బౌలర్ అతడే.. మూడు ఫార్మాట్లలోనూ బెస్ట్: కోహ్లి -
పాకిస్తాన్ ఆల్‌రౌండర్‌కు భారీ షాకిచ్చిన ఐసీసీ
పాకిస్తాన్ ఆల్‌రౌండర్ ఖుష్దిల్ షాకు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) భారీ షాకిచ్చింది. ఐసీసీ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు గానూ అతడి మ్యాచ్ ఫీజులో 50 శాతం మేర కోత విధించింది. అంతేకాదు.. క్రమశిక్షణ అంశంలో అతడి ఖాతాలో మూడు డిమెరిట్ పాయింట్లు జత చేసింది.ఇందుకు సంబంధించి ఐసీసీ తాజాగా ప్రకటన విడుదల చేసింది. న్యూజిలాండ్‌తో తొలి టీ20 సందర్భంగా ఖుష్దిల్ షా వ్యవహరించిన తీరుకు ఈ మేర కఠిన చర్యలు చేపట్టినట్లు వెల్లడించింది. కాగా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 (ICC Champions Trophy)లో గ్రూప్ దశలోనే నిష్క్రమించిన పాకిస్తాన్ క్రికెట్ జట్టు ప్రస్తుతం న్యూజిలాండ్ పర్యటనలో ఉంది. కివీస్‌తో ఐదు టీ20లు, మూడు వన్డేలు ఆడేందుకు అక్కడికి వెళ్లింది.32 పరుగులతో టాప్ స్కోరర్గాఈ క్రమంలో మార్చి 16న కివీస్- పాక్ మధ్య తొలి టీ20 జరిగింది. క్రైస్ట్‌చర్చ్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆతిథ్య జట్టు.. పాకిస్తాన్‌ను తొలుత బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. చాంపియన్స్ ట్రోఫీ తాలుకు వైఫల్యాన్ని కొనసాగిస్తూ పాక్ 91 పరుగులకే కుప్పకూలింది. పాక్ ఇన్నింగ్స్‌లో ఖుష్దిల్ షా 32 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.ఇక సల్మాన్ ఆఘా బృందం విధించిన 92 పరుగుల లక్ష్యాన్ని న్యూజిలాండ్ ఆడుతూపాడుతూ ఛేదించింది. 10.1 ఓవర్లలో ఒక వికెట్ నష్టపోయి టార్గెట్‌ను ఊదేసింది. ఇదిలా ఉంటే.. ఖుష్దిల్ షా తాను బ్యాటింగ్ చేస్తున్న సమయంలో కాస్త అతిగా ప్రవర్తించాడు.అతడిని బలంగా ఢీకొట్టాడుపాక్ ఎనిమిదో ఇన్నింగ్స్‌లో కివీస్ యువ పేసర్ జకారీ ఫౌల్క్స్ బౌలింగ్‌లో వికెట్ల మధ్య పరుగులు తీసే క్రమంలో ఖుష్దిల్ షా.. ఫౌల్క్స్‌ను బలంగా ఢీకొట్టాడు. ఆ సమయంలో అతడు నిర్లక్ష్యపూరితంగా, దురుసుగా ప్రవర్తించినట్లు స్పష్టంగా కనిపించింది.ఈ నేపథ్యంలో క్రమశిక్షణా చర్యలకు పూనుకున్న ఐసీసీ.. ఖుష్దిల్ షాకు గట్టి పనిష్మెంట్ ఇచ్చింది. ఈ మేరకు.. ‘‘ఐసీసీ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.12 సూచిస్తున్న నిబంధనను ఖుష్దిల్ ఉల్లంఘించాడు.అంతర్జాతీయ మ్యాచ్‌లో ఆటగాళ్లను, సిబ్బంది, మ్యాచ్ రిఫరీ లేదా ప్రేక్షకులు.. ఎవరినైనా సరే అనుచిత రీతిలో వారికి ఇబ్బంది కలిగించేలా తాకితే కఠిన చర్యలు ఉంటాయి. అందుకు తగ్గట్లుగా ఖుష్దిల్పై చర్యలు తీసుకుంటున్నాం’’ అని ఐసీసీ ప్రకటనలో పేర్కొంది. అతడి మ్యాచ్ ఫీజులో 50 శాతం కోత విధించడంతో పాటు మూడు డీమెరిట్ పాయింట్లు చేర్చింది. తప్పును అంగీకరించిన ఆల్రౌండర్గత 24 నెలల కాలంలో ఇదే ఖుష్దిల్ మొదటి తప్పు కాబట్టి.. ఇంతటితో సరిపెట్టింది. ఆన్ ఫీల్డ్ అంపైర్లు వేన్ నైట్స్, సామ్ నొగస్కి, థర్డ్ అంపైర్ కిమ్ కాటన్, ఫోర్త్ అంపైర్ క్రిస్ బ్రౌన్ ఫిర్యాదు ఆధారంగా ఈ మేర ఐసీసీ చర్యలు తీసుకుంది. ఖుష్దిల్ సైతం తన తప్పును అంగీకరించాడు. కాగా 30 ఏళ్ల ఖుష్దిల్ షా లెఫ్టార్మ్ ఆర్థోడాక్స్ బౌలర్. అదే విధంగా.. ఎడమచేతి వాటం గల బ్యాటర్. 2019లో పాకిస్తాన్ తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన ఈ స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ ఇప్పటి వరకు 15 వన్డేలు, 28 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. ఆయా ఫార్మాట్లలో వరుసగా 328, 376 పరుగులు చేయడంతో పాటు.. నాలుగు, మూడు వికెట్లు తీశాడు.చదవండి: నేను ఎదుర్కొన్న కఠినమైన బౌలర్ అతడే.. మూడు ఫార్మాట్లలోనూ బెస్ట్: కోహ్లి -
Virushka: తల్లీ, తండ్రి, తోబుట్టువు.. అందరికీ ఒకేలా కనిపించవు!
విదేశీ పర్యటనల సమయంలో కుటుంబ సభ్యుల అనుమతిని పరిమితం చేస్తూ భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) తీసుకున్న నిర్ణయంపై స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి (Virat Kohli) అసంతృప్తి వ్యక్తం చేశాడు. సన్నిహితులు వెంట ఉంటే ఆటగాళ్లు మానసికంగా మరింత బలంగా ఉంటారని అతడు అభిప్రాయపడ్డాడు. ఈ నేపథ్యంలో కోహ్లి సతీమణి, బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ (Anushka Sharma) సోషల్ మీడియాలో షేర్ చేసిన పోస్ట్ వైరల్‌గా మారింది. అందరికీ ఒకేలా కనిపించవు!‘‘నువ్వెవరో తెలిసిన ప్రతి వ్యక్తి మనసులో నీ పట్ల భిన్న భావాలు ఉన్నాయి. నువ్వు ఎవరని నువ్వు అనుకుంటావో అదే నువ్వు. ఆ ‘నువ్వు’ ఎవరన్నది నీకూ పూర్తిగా తెలియదు. నిన్ను కలిసిన వ్యక్తులు, నీ బంధువులు.. లేదంటే వీధిలో వెళ్తున్నపుడు నీతో చూపులు కలిపిన వాళ్లు.. ఇలా ప్రతి ఒక్కరి మదిలో నీ గురించిన ఆలోచన వేరుగా ఉంటుంది.తల్లి, తండ్రి, తోబుట్టువులకు నువ్వు ఒకే తీరుగా కనిపించవు. సహచరులకు, ఇరుగుపొరుగు వారికి, నీ స్నేహితులకూ వారి కోణంలోనే కనిపిస్తావు. ఎదుటివారి ఆలోచనల్లో నీకు వెయ్యి రూపాలు ఉండవచ్చు. కానీ.. ప్రతి వర్షన్లోనూ నువ్వు ప్రత్యేకమే. నువ్వు నువ్వే.. వేరొకరివి అసలే కావు’’ అని అనుష్క శర్మ తన ఇన్‌స్టా స్టోరీలో పోస్ట్ చేసింది. ఈ నేపథ్యంలో తన భర్త.. ప్రత్యేకమైన వాడని అనుష్క చెప్పాలనుకుందంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. పరోక్షంగా బీసీసీఐ నిబంధనను ఆమె కూడా విమర్శించిందని అభిప్రాయపడుతున్నారు.కాగా ‘బోర్డర్–గావస్కర్ ట్రోఫీ’లో టీమిండియా పరాజయం పాలవడంతో బీసీసీఐ కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా 45 రోజుల్లోపు విదేశీ పర్యటనలో ఆటగాళ్లు, సహాయ సిబ్బంది కుటుంబ సభ్యులను వారం రోజులు మాత్రమే అనుమతించనుంది. దానికి వెలకట్టలేంనలభై ఐదు రోజులకు మించిన విదేశీ పర్యటనల్లో రెండు వారాల పాటు సన్నిహితులకు అనుమతి ఉంటుంది. ఈ నేపథ్యంలో కోహ్లి మాట్లాడుతూ... ‘ఒక ఆటగాడి వెనక కుంటుబ సభ్యుల ప్రాతను అందరికీ వివరించడం కష్టం. కఠిన పరిస్థితులను ఎదుర్కొంటున్నప్పుడు వారిచ్చే మద్దతును వెలకట్టలేం. దాని మీద ప్రజలకు అవగాహన లేదని అనుకోలేం.కుటుంబ సభ్యులు పక్కన ఉంటే మైదానంలో ఆవరించిన నిరాశ, నిస్పృహ నుంచి ప్లేయర్లు త్వరగా బయటపడగలరు. అంతేకానీ మ్యాచ్ ముగిసిన తర్వాత దిగాలుగా వెళ్లి గదిలో కూర్చోవడం ఎవరికీ ఇష్టం ఉండదు. నిరాశ కలిగించిందిసన్నిహితుల సమక్షంలో బాధ్యత మరింత పెరుగుతుంది. ఆట అయిపోయిన తర్వాత కుటుంబంతో గడపడంలో తప్పేముంది. నా వరకైతే కుటుంబ సభ్యులతో ఉండేందుకు ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తా. అలాంటి అవకాశాలను వదిలిపెట్టను.మైదానంలో ఏం జరుగుతుందో తెలియని వ్యక్తులు దీనిపై నియంత్రణ తేవడం నిరాశ కలిగించింది. ఏ ఆటగాడిని అడిగినా కుటుంబ సభ్యులు వెంట ఉండటానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాడు’ అని వివరించాడు. కాగా ఐపీఎల్‌లోనూ డ్రెసింగ్ రూమ్‌లోకి కుటుంబ సభ్యులను అనుమతించబోమని బీసీసీఐ స్పష్టం చేసిన విషయం తెలిసిందే. అయితే, కోహ్లి మాత్రం తాను అనుష్కతో ప్రేమలో ఉన్ననాటి నుంచి.. ఇప్పుడు తాము ఇద్దరు పిల్లలకు తల్లిదండ్రులైన తర్వాత కూడా.. భార్యను ఎల్లవేళలా తన వెంటే తీసుకువెళ్లడానికి ప్రాధాన్యం ఇస్తాడు. ఆమె ఎదురుగా ఉంటే.. తాను సానుకూల దృక్పథంతో ముందుకు సాగగలనని పలు సందర్భాల్లో కోహ్లి వెల్లడించాడు. అయితే, బీసీసీఐ తెచ్చిన కొత్త రూల్ వల్ల కోహ్లి బాగా ఇబ్బంది పడుతున్నట్లు అతడి మాటల ద్వారా వెల్లడైంది. అనుష్క శర్మ కూడా ఇదే తరహా అభిప్రాయం వ్యక్తం చేయడం గమనార్హం.చదవండి: నేను ఎదుర్కొన్న కఠినమైన బౌలర్ అతడే.. మూడు ఫార్మాట్లలోనూ బెస్ట్: కోహ్లి -
టీమిండియా స్టార్లు.. హార్డ్ హిట్టర్లు, దిగ్గజ పేసర్లు.. ముంబై ఈసారైనా..!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో ఐదుసార్లు చాంపియన్‌గా నిలిచిన మేటి జట్టుగా ముంబై ఇండియన్స్‌కు పేరుంది. ఈ ఘనత సాధించిన తొలి జట్టుగానూ ముంబై రికార్డు చెక్కు చెదరకుండా ఉంది. అయితే, గత కొంతకాలంగా అంబానీల ఫ్రాంఛైజీకి గడ్డు పరిస్థితులు ఎదురవుతున్నాయి. గతేడాది ఏకంగా పాయింట్ల పట్టికలో అట్టడుగున పదో స్థానంలో నిలిచింది. అయితే, మెగా వేలంలో తెలివైన కొనుగోళ్లతో మునుపటి వైభవం సాధించేలా ప్రణాళికలు రచించింది.విదేశీ, భారత్ ఆటగాళ్ల తో జట్టుని పునర్నిర్మించే ప్రయత్నం చేసింది. జస్ప్రీత్ బుమ్రాకు తోడుగా న్యూ జిలాండ్ వెటరన్ ట్రెంట్ బౌల్ట్‌ను రూ. 12.50 కోట్లకు కొనుగోలు చేసి బలమైన బౌలింగ్ ని రూపొందించే ప్రయత్నం చేసింది. చెన్నై సూపర్ కింగ్స్ మాజీ ఆల్ రౌండర్ దీపక్ చాహర్‌ను కూడా జత చేసి తమ బౌలింగ్ యూనిట్‌ను మరింత బలోపేతం చేసుకుంది.మిచెల్ సాంట్నర్, కర్ణ్ శర్మలను చేర్చుకోవడంతో స్పిన్ విభాగం కూడా మరింత బలపడింది. ఇక విల్ జాక్స్, బెవాన్ జాకబ్స్, ర్యాన్ రికెల్టన్ లతో బ్యాటింగ్‌కు మునుపటి పదును సమకూర్చారు. అయితే భారత్ టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఇటీవల కాలంలో ఆశించిన స్థాయిలో రాణించడం లేదు. విదేశీ ఆటగాళ్లతో పాటు, రాబిన్ మింజ్, విఘ్నేష్ పుత్తూర్ మరియు రాజ్ బావా వంటి వారిని కనుగోలు చేసి యువ జట్టుని నిర్మించే దిశగా పావులు కదిపింది. అందువల్ల, ఐదుసార్లు ఛాంపియన్లుగా నిలిచిన ఈ జట్టు అన్ని స్థావరాలను కవర్ చేసే ఆల్ రౌండ్ జట్టును నిర్మించడానికి తమ పర్స్‌ను సమర్థవంతంగా ఉపయోగించింది.ముంబై ఇండియన్స్‌లో ప్రధాన ఆటగాళ్లుట్రెంట్ బౌల్ట్ ఈ ఎడమచేతి వాటం సీమర్ మూడు సంవత్సరాల తర్వాత ఐపీఎల్ లో మళ్ళీ ముంబై ఇండియన్స్‌కు తిరిగి ఆడబోతున్నాడు. ప్రపంచవ్యాప్తంగా వివిధ టీ20 లీగ్‌లలో ముంబై ఇండియన్స్‌కు చెందిన జట్ల తరపున ఆడుతూనే ఉన్నాడు. బౌల్ట్ పవర్‌ప్లేలో రాణించడంలో మంచి దిట్ట. బుమ్రాతో పాటు ముంబై బౌలింగ్ ని ప్రారంభించే అవకాశముంది.ర్యాన్ రికెల్టన్దక్షిణాఫ్రికాలో బాగా రాణిస్తున్న స్టార్లలో ఒకరు గా ఖ్యాతి గడించిన రికెల్టన్ ఇటీవల ఛాంపియన్స్ ట్రోఫీ లో తన బ్యాటింగ్ తో పరుగుల వర్షం కురిపించాడు. ఈ 28 ఏళ్ల వికెట్ కీపర్ ను మరో క్వింటన్ డి కాక్ గా నిపుణులు భావిస్తున్నారు.రాబిన్ మింజ్వికెట్ కీపర్ కూడా అయినా రాబిన్ మింజ్ తన అసాధారణ స్ట్రోక్ ప్లే తో విజృభించి ఆడగలడు. దురదృష్టవశాత్తు బైక్ ప్రమాదం కారణంగా గత సీజన్‌కు దూరమైన , మింజ్ ఈ సీజన్లో మళ్ళీ తన సత్తా చూపించాలిని పట్టుదలతో ఉన్నాడు.ముజీబ్ ఉర్ రెహమాన్గాయం కారణంగా జట్టు నుంచి తప్పుకున్న తోటి ఆఫ్ఘన్ దేశస్థుడు ఎ ఎం గజన్ఫర్ స్థానంలో ఈ ఆఫ్ స్పిన్నర్‌ను జట్టులోకి తీసుకున్నారు. రెహమాన్ తన టి 20 కెరీర్లో 18.11 సగటు తో నిలకడగా బౌలింగ్ చేయగల సామర్ధ్యముంది.బెవాన్ జాకబ్స్న్యూజిలాండ్ కి చెందిన 22 ఏళ్ల హార్డ్ హిట్టింగ్ బ్యాటర్. తన అసాధారణ స్ట్రోక్ ప్లే తో ఇటీవల కాలం లో బాగా రాణిస్తున్నాడు. టీ20 కెరీర్లో 148.42 స్ట్రైక్ రేట్ తో ఉన్న జాకబ్స్ ఈ సీజన్లో అనేక మంది బౌలర్లకు తలనొప్పిగా పరిణమించే అవకాశం ఉంది.ముంబై ఇండియన్స్ జట్టుజస్ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, రోహిత్ శర్మ, తిలక్ వర్మ, ట్రెంట్ బౌల్ట్, నమన్ ధిర్, రాబిన్ మింజ్, కర్ణ్ శర్మ, ర్యాన్ రికెల్టన్, దీపక్ చాహర్, ముజీబ్ ఉర్ రెహమాన్, విల్ జాక్స్, అశ్వనీ కుమార్, మిచెల్ సాంట్నర్, రీస్ టాప్లే, క్రిష్ణన్ శ్రీజిత్, రాజ్ అంగద్ బవా, సత్యనారాయణ రాజు, బెవాన్ జేకబ్స్ అర్జున్ టెండుల్కర్, లిజాడ్ విలియమ్స్, విఘ్నేశ్ పుత్తూరు, కార్బిన్ బాష్.చదవండి: నేను ఎదుర్కొన్న కఠినమైన బౌలర్ అతడే.. మూడు ఫార్మాట్లలోనూ బెస్ట్: కోహ్లి -
‘స్టుపిడ్.. స్టుపిడ్.. స్టుపిడ్’: గావస్కర్ ఫైర్.. రిపీట్ చేసిన పంత్!
టీమిండియా స్టార్ క్రికెటర్ రిషభ్ పంత్ ఐపీఎల్ -2025 (IPL 2025)కి సన్నద్ధమవుతున్నాడు. గతేడాది ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌గా ఉన్న ఈ వికెట్ కీపర్ బ్యాటర్.. ఈసారి లక్నో సూపర్ జెయింట్స్ (Lucknow Super Giants) సారథిగా బరిలోకి దిగనున్నాడు. ఈ ఉత్తరాఖండ్ ఆటగాడి కోసం లక్నో ఏకంగా రూ. 27 కోట్లు ఖర్చు చేసింది.సమతూకంగాతద్వారా క్యాష్ రిచ్ లీగ్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన క్రికెటర్‌గా పంత్ నిలిచాడు. ఇక ఈ సీజన్లో తాము రెట్టించిన ఉత్సాహంతో ముందుకు సాగబోతున్నామన్న పంత్.. సీనియర్లు, యువ ఆటగాళ్లతో జట్టు సమతూకంగా ఉందని హర్షం వ్యక్తం చేశాడు. నికోలస్ పూరన్, ఐడెన్ మార్క్రమ్, డేవిడ్ మిల్లర్ వంటి అనుభవజ్ఞులైన ఆటగాళ్లు అందుబాటులో ఉండటం తమకు సానుకూలాంశమని పేర్కొన్నాడు. ‘‘జట్టులోని ప్రతి ఒక్కరు తమ నైపుణ్యాలను ప్రదర్శరించే విధంగా.. తమలోని అత్యుత్తమ ప్రదర్శనను వెలికి తీసేలా.. అందుకు తగ్గట్లుగా డ్రెసింగ్ రూమ్ వాతావరణం ఉండేలా మేము చూసుకుంటున్నాం. మా మేనేజ్మెంట్ అన్ని రకాలుగా ఆటగాళ్లకు అండగా ఉంటుంది. అనుభవజ్ఞులైన ఆటగాళ్లు నిక్కీ, మార్క్రమ్, మిల్లర్ ఉండటం మాకు కలిసి వస్తుంది’’ అని పంత్ పేర్కొన్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోను లక్నో తమ సోషల్ మీడియా అకౌంట్లో షేర్ చేసింది.Oh Captain… My Captain! 💙 pic.twitter.com/Qkite1n4bh— Lucknow Super Giants (@LucknowIPL) March 17, 2025 ఇదిలా ఉంటే.. ఓ బ్రాండ్ షూట్లో భాగంగా రిషభ్ పంత్ వ్యవహరించిన తీరు వైరల్‌గా మారింది. టీమిండియా దిగ్గజం సునిల్ గావస్కర్ తనను ఉద్దేశించి విమర్శించిన మాటలను పునరావృతం చేస్తూ పంత్ వ్యాఖ్యానించడంపై నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. ‘‘స్టుపిడ్.. స్టుపిడ్.. స్టుపిడ్’’అసలేం జరిగిందంటే.. ఆస్ట్రేలియా గడ్డ మీద రిషభ్ పంత్‌కు మంచి రికార్డు ఉన్న విషయం తెలిసిందే. అయితే, గతేడాది కంగారూ దేశ పర్యటనలో భాగంగా బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో పంత్ తన స్థాయికి తగ్గట్లు రాణించలేకపోయాడు. 'ముఖ్యంగా మెల్బోర్న్ టెస్టులో అతడు అవుటైన తీరు విమర్శలకు దారి తీసింది. ఆసీస్ పేసర్ స్కాట్ బోలాండ్ బౌలింగ్‌లో పంత్ వికెట్ పారేసుకున్న తీరుపై కామెంటేటర్ గావస్కర్ తీవ్ర స్థాయిలో అసహనం, అసంతృప్తి వ్యక్తం చేశాడు. ‘‘స్టుపిడ్.. స్టుపిడ్.. స్టుపిడ్’’ అంటూ పంత్ తీరును విమర్శించాడు.రీక్రియేట్ చేసిన పంత్ఇప్పుడు అదే మూమెంట్‌ను పంత్ రీక్రియేట్ చేశాడు. తనదైన శైలిలో.. ‘‘స్టుపిడ్.. స్టుపిడ్.. స్టుపిడ్’’ అంటూ సరదాగా వ్యాఖ్యానించాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కాగా.. ‘‘ఎన్నోసార్లు నిన్ను సమర్థించి, నీకు మద్దతుగా నిలిచిన గావస్కర్ సార్నే ఇలా ఇమిటేట్ చేసి అవమానిస్తావా?’’ అంటూ కొంత మంది కామెంట్ చేస్తున్నారు. మరికొందరు మాత్రం.. ‘‘ఐకానిక్ మూమెంట్‌ను పంత్ క్యాష్ చేసుకుంటున్నాడు. ఇందులో గావస్కర్‌ను అవమానించిట్లు ఏమీ లేదు’’ అని పంత్‌కు సపోర్టు చేస్తున్నారు.Rishabh Pant recreating the 'Stupid, Stupid, Stupid!' of Sunil Gavaskar. 🤣pic.twitter.com/JhrK34luWh— Mufaddal Vohra (@mufaddal_vohra) March 17, 2025 కాగా గతేడాది ఐపీఎల్లో ఈ లెఫ్టాండర్ బ్యాటర్ 446 పరుగులు చేశాడు. అయితే, ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌గా మాత్రం ఆకట్టుకోలేకపోయాడు. జట్టును ఆరో స్థానంలో నిలిపి విమర్శలు మూటగట్టుకున్నాడు. ఇక ఈసారి మార్చి 24న లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్‌గా.. ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌తో పంత్ తన కొత్త ప్రయాణం మొదలుపెట్టనున్నాడు. చదవండి: అతడిపై నిషేధం.. బీసీసీఐ నిర్ణయం సరైందే: మొయిన్ అలీ -
నేను ఎదుర్కొన్న కఠినమైన బౌలర్ అతడే.. అన్ని ఫార్మాట్లలోనూ బెస్ట్: కోహ్లి
భారత పేస్ దళ నాయకుడు జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah)పై టీమిండియా సూపర్ స్టార్ విరాట్ కోహ్లి (Virat Kohli) ప్రశంసలు కురిపించాడు. మూడు ఫార్మాట్లలోనూ ప్రస్తుతం ప్రపంచంలో అత్యుత్తమ బౌలర్ అతడేనని కొనియాడాడు. తాను ఎదుర్కొన్న బౌలర్లలో అత్యంత కఠినమైన బౌలర్ బుమ్రానే అని కోహ్లి వెల్లడించాడు.ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025లో సత్తా చాటిన కోహ్లి.. ప్రస్తుతం ఐపీఎల్-2025 సన్నాహకాలతో బిజీగా ఉన్నాడు. ఇందులో భాగంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) సోషల్ మీడియాతో మమేకమైన కోహ్లి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. అత్యుత్తమ బౌలర్ ఇక మీ కెరీర్లో ఎదుర్కొన్న టఫెస్ట్ బౌలర్ ఎవరన్న ప్రశ్నకు బదులిస్తూ.. ‘‘ప్రపంచంలో ప్రస్తుతం వన్డే, టెస్టు, టీ20 ఫార్మాట్లలో అత్యుత్తమ బౌలర్ ఎవరంటే.. జస్ప్రీత్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.ఐపీఎల్లో కొన్ని సందర్భాల్లో అతడు నన్ను అవుట్ చేశాడు. అయితే, ఎక్కువసార్లు నేనే అతడిపై పైచేయి సాధించాను. అయినా సరే.. మా ఇద్దరి మధ్య పోటీ అంటే ఎంతో ఆసక్తికరంగా, సరదాగా ఉంటుంది. ప్రతి బంతిని షాట్ బాదేందుకు నేను ప్రయత్నిస్తా.నన్ను ఆపేందుకు అతడూ ట్రై చేస్తాడు. ఇద్దరి మధ్య పోటీ తీవ్రస్థాయికి చేరుకున్న వేళ.. ఎవరూ కూడా తగ్గకుండా ముందుకు సాగితే మజాగా ఉంటుంది కదా!.. ఇక నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తున్నపుడు నేను రెగ్యులర్‌గా బుమ్రా బౌలింగ్‌ను ఎదుర్కొంటా. నాకు నచ్చిన, నేను ఆస్వాదించే మూమెంట్ అది. అంతేకాదు.. అదే కఠినమైన సవాల్ కూడా!’’ అని విరాట్ కోహ్లి చెప్పుకొచ్చాడు.కాగా క్యాష్ రిచ్ లీగ్ ఆరంభమైన నాటి(2008) నుంచి కోహ్లి ఆర్సీబీలో కొనసాగుతుండగా.. బుమ్రా తన కెరీర్ ఆరంభం నుంచి ముంబై ఇండియన్స్‌తో ప్రయాణిస్తున్నాడు. ఫోర్లు బాదిన కోహ్లి.. అవుట్ చేసిన బుమ్రాఇక 2013, ఏప్రిల్ 4న ముంబై తరఫున ఆర్సీబీతో మ్యాచ్‌తో బుమ్రా ఐపీఎల్లో అరంగ్రేటం చేసిన విషయం తెలిసిందే. నాడు చిన్నస్వామి స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో నాలుగు ఓవర్ల కోటా పూర్తి చేసి.. 32 పరుగులు ఇచ్చిన బుమ్రా మూడు వికెట్లు తీశాడు.తన ఆరంభ ఓవర్లోనే కోహ్లి ఒకటి, రెండు, నాలుగో బంతుల్లో ఫోర్లు బాది చుక్కలు చూపించగా.. ఐదో బంతికి బుమ్రా విజయం సాధించాడు. నాడు 19 ఏళ్ల వయసులో ఉన్న బుమ్రా తన అద్భుత నైపుణ్యాలతో వికెట్ల ముందు కోహ్లిని దొరకబుచ్చుకుని.. తన తొలి వికెట్ సాధించాడు. ఇక ఇప్పటి వరకు 133 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న బుమ్రా 165 వికెట్లు తీశాడు. ముంబై జట్టు ఐదుసార్లు టైటిల్ గెలిచిన సందర్భాల్లోనూ అతడు జట్టులో భాగంగా ఉన్నాడు.మరోవైపు.. కోహ్లి జట్టు ఆర్సీబీ ఇంత వరకు ఒక్కసారి కూడా ట్రోఫీని ముద్దాడలేకపోయింది. ఇదిలా ఉంటే.. కోహ్లి- బుమ్రా టీమిండియాకు కలిసి ఆడుతున్న విషయం తెలిసిందే. కోహ్లి సారథ్యంలో బుమ్రా ఆడగా.. పలు సందర్భాల్లో బుమ్రా కెప్టెన్సీలో కోహ్లి ఆడటం విశేషం. చదవండి: అసలు అతడిని జట్టులోకి తీసుకుంది ఎవరు?: పాక్ మాజీ క్రికెటర్ ఆగ్రహం"𝙒𝙝𝙚𝙣𝙚𝙫𝙚𝙧 𝙄 𝙛𝙖𝙘𝙚 𝙝𝙞𝙢, 𝙞𝙩'𝙨 𝙡𝙞𝙠𝙚, '𝙊𝙠𝙖𝙮, 𝙞𝙩'𝙨 𝙜𝙤𝙣𝙣𝙖 𝙗𝙚 𝙛𝙪𝙣.'" 🗣Ever wondered who’s the toughest bowler Virat’s ever faced? 🤔 Catch him spill the tea, at the 𝗥𝗖𝗕 𝗜𝗻𝗻𝗼𝘃𝗮𝘁𝗶𝗼𝗻 𝗟𝗮𝗯 𝗜𝗻𝗱𝗶𝗮𝗻 𝗦𝗽𝗼𝗿𝘁𝘀 𝗦𝘂𝗺𝗺𝗶𝘁… pic.twitter.com/36F8d8twN6— Royal Challengers Bengaluru (@RCBTweets) March 17, 2025 -
అతడిపై నిషేధం.. బీసీసీఐ నిర్ణయం సరైందే: కేకేఆర్ స్టార్
హ్యారీ బ్రూక్ విషయంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) తీసుకున్న నిర్ణయాన్ని ఇంగ్లండ్ వెటరన్ ఆటగాడు మొయిన్ అలీ (Moeen Ali) సమర్థించాడు. రెండేళ్ల పాటు ఈ ఇంగ్లండ్ యువ బ్యాటర్‌పై నిషేధం విధించడం తప్పేమీ కాదని పేర్కొన్నాడు. ఆటగాళ్లు అకస్మాత్తుగా ‘తప్పుకోవాలనే’ నిర్ణయం తీసుకోవడం వల్ల జట్టు కూర్పు దెబ్బతింటుందని అభిప్రాయపడ్డాడు.ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఎదురుదెబ్బకాగా ఇంగ్లండ్ బ్యాటర్ హ్యారీ బ్రూక్‌పై బీసీసీఐ నిషేధం విధించిన విషయం తెలిసిందే. అతడు రాబోయే రెండు సీజన్ల పాటు ఐపీఎల్లో పాల్గొనకుండా ఈ నిషేధం అమలుకానుంది. ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఎంపికైన బ్రూక్.. మార్చి 22 నుంచి జరిగే ఐపీఎల్ 18వ సీజన్ (IPL 2025)లో పాల్గొనాల్సి ఉంది. అయితే ఈ సీజన్ ఐపీఎల్ నుంచి తప్పుకొంటున్నట్లు బ్రూక్ ప్రకటించాడు. ఈ నేపథ్యంలో బీసీసీఐ కఠిన చర్యలు చేపట్టింది.ఐపీఎల్లో ఈ ఏడాది సవరించిన నిబంధనల ప్రకారం.. ఎవరైనా విదేశీ ఆటగాడు వేలంలో తన పేరు నమోదు చేసుకొని అమ్ముడైన తర్వాత సీజన్‌కు అందబాటులో ఉండాల్సిందే. గాయం తప్ప ఇతరత్రా కారణాలను సాకులుగా చెబితే కుదరదు. నిబంధన ప్రకారమేఇలా సీజన్ నుంచి అనూహ్యంగా తప్పుకొన్న ఆటగాళ్లను రెండు సీజన్ల పాటు వేలంలో.. అలాగే లీగ్‌లో పాల్గొనకుండా నిషేధం విధిస్తారు. ఈ మేరకు ఐపీఎల్ నియమావళిలో నిబంధనలు పొందుపరిచారు. తాజా నిబంధన ప్రకారమే హ్యారీ బ్రూక్‌పై చర్యలు తీసుకున్నట్లు బోర్డు అధికారి ఒకరు వెల్లడించారు. కాగా 2025, 2026 సీజన్లలో బ్రూక్ పాల్గొనేందుకు వీలుండదు. ఈ మేరకు సదరు క్రికెటర్‌తో పాటు, ఇంగ్లండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ)కు సమాచారం ఇచ్చారు. నిజానికి బ్రూక్ ఇలా చేయడం ఇదేం మొదటిసారి కాదు. నానమ్మ మృతి కారణం చూపుతూగతేడాది కూడా తన నానమ్మ మృతి కారణం చూపుతూ ఏకంగా లీగ్ మొత్తానికి దూరంగా ఉన్నాడు. ఈ ఏడాది ఇంగ్లండ్ క్రికెట్‌కే తన ప్రాధాన్యత అని స్వదేశంతో భారత్ (జూన్‌లో)తో జరిగే సిరీస్‌కు ముందు పూర్తిస్థాయి ఉత్తేజంతో అందుబాటులో ఉండేందుకు ఐపీఎల్ నుంచి తప్పుకుంటున్నట్లు వెల్లడించాడు. బీసీసీఐ నిర్ణయాన్ని సమర్థిస్తాఈ పరిణామాల నేపథ్యంలో కోల్‌కతా నైట్ రైడర్స్ ఆల్‌రౌండర్, ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ మొయిన్ అలీ మాట్లాడుతూ.. ‘‘ఇదేమీ కఠిన నిర్ణయం కాదు. బీసీసీఐ ఎందుకు ఇలా వ్యవహరించిందో నేను అర్థం చేసుకోగలను. బ్రూక్ ఒక్కడే కాదు.. చాలా మంది గతంలో ఇలాగే చేశారు.తమకు నచ్చినపుడు తిరిగి వచ్చి ఆర్థికంగా లబ్ది పొందారు. అయితే, వారికి ఇదంతా బాగానే ఉన్నా.. సదరు ఆటగాళ్లను కొన్న ఫ్రాంఛైజీలకు నష్టం జరుగుతుందనేది కాదనలేని వాస్తవం. ఒక్క ఆటగాడి వల్ల జట్టు కూర్పు, వ్యూహాలు, ప్రణాళికలు మార్చుకోవాల్సిన పరిస్థితి వస్తుంది.అకస్మాత్ మార్పుల వల్ల అంతా గందరగోళమైపోతుంది. హ్యారీ బ్రూక్‌ను కొనుక్కున్న జట్టు అతడి స్థానాన్ని సరైన ఆటగాడితో భర్తీ చేయాలనే చూస్తుంది. కానీ అది సాధ్యం కావచ్చు.. కాకపోవచ్చు. కాబట్టి వారు తమ ప్రణాళికలను అందుకు తగ్గట్లుగా మార్చుకోవాల్సి ఉంటుంది.ఆదిల్ రషీద్ సైతంగాయం వల్ల సీజన్ నుంచి తప్పుకొంటే ఎవరూ తప్పుబట్టరు. బోర్డు కూడా ఇందుకు మినహాయింపు ఇస్తుంది. కానీ ఇలా వేరే కారణాలు చూపుతూ అర్ధంతరంగా తప్పుకోవడం ఏమాత్రం సరికాదు’’ అని మొయిన్ అలీ బ్రూక్ తీరును విమర్శించాడు. ఇంగ్లండ్ క్రికెటర్ ఆదిల్ రషీద్ కూడా మొయిన్ అలీ తరహాలోనే బీసీసీఐ నిర్ణయాన్ని సమర్థించడం విశేషం. ఇదిలా ఉంటే.. ఐపీఎల్-2025 మెగా వేలంలో మొయిన్ అలీని కోల్‌కతా రూ. 2 కోట్లకు కొనుగోలు చేసింది.చదవండి: IPL 2025: ఓపెనర్లుగా కోహ్లి, సాల్ట్.. ఆర్సీబీ ప్లేయింగ్ ఎలెవెన్ ఇదే..? -
అతడిని జట్టులోకి తీసుకుంది ఎవరు? : పాక్ మాజీ క్రికెటర్ ఆగ్రహం
పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) తీరుపై ఆ దేశ మాజీ క్రికెటర్ అహ్మద్ షెహజాద్ (Ahmed Shehzad) మండిపడ్డాడు. స్వప్రయోజనాల కోసం జట్టును భ్రష్టుపట్టిస్తున్నారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. ఆటగాళ్లను మెరికల్లా తీర్చిదిద్దాల్సిన జాతీయ క్రికెట్ అకాడమీ (NCA) ఎప్పుడో చేతులెత్తేసిందని.. కేవలం సొంతవాళ్లకు జీతాలు ఇచ్చుకునేందుకు ఇదొక మాధ్యమంగా ఉపయోగపడుతుందని ఆరోపించాడు.గత కొంతకాలంగా పాకిస్తాన్ క్రికెట్ జట్టు దారుణంగా విఫలమవుతున్న విషయం తెలిసిందే. స్వదేశంలో న్యూజిలాండ్- సౌతాఫ్రికా జట్లతో త్రైపాక్షిక వన్డే సిరీస్‌లో ఓటమిపాలైన రిజ్వాన్ బృందం.. ఆ తర్వాత ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025లోనూ వైఫల్యం చెందింది.ఈ మెగా వన్డే టోర్నీలో డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగి.. కనీసం ఒక్క విజయం లేకుండానే నిష్క్రమించింది. గ్రూప్ దశలో న్యూజిలాండ్, టీమిండియా చేతిలో చిత్తుగా ఓడిన రిజ్వాన్ బృందం.. ఆఖరిదైన బంగ్లాదేశ్‌తో మ్యాచ్ వర్షం వల్ల రద్దు కావడంతో నిరాశగా వెనుదిరిగింది.ఈ క్రమంలో కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్, సీనియర్ బ్యాటర్ బాబర్ ఆజంలపై వేటు వేసిన పీసీబీ.. న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్ నుంచి వారిని పక్కనపెట్టింది. టీ20 కొత్త కెప్టెన్‌గా సల్మాన్ ఆఘాకు బాధ్యతలు అప్పగించింది. 91 పరుగులకే ఆలౌట్ .. ఘోర ఓటమిఅయితే, కివీస్ దేశ పర్యటనలో భాగంగా తొలి టీ20లో పాకిస్తాన్ అత్యంత ఘోర ఓటమిని మూటగట్టుకుంది. తొలుత 91 పరుగులకే ఆలౌట్ అయిన పాకిస్తాన్.. లక్ష్య ఛేదనలో కివీస్‌ను ఏ దశలోనూ కట్టడి చేయలేకపోయింది.పాక్ విధించిన స్వల్ప లక్ష్యాన్ని న్యూజిలాండ్ 10.1 ఓవర్లలో కేవలం ఒక వికెట్ నష్టపోయి ఛేదించింది. ఫలితంగా పాక్ టీ20 చరిత్రలో ఇదో ఘోర ఓటమి(59 బంతులు మిగిలి ఉండగానే ప్రత్యర్థి టార్గెట్ ఛేదించడం)గా మిగిలిపోయింది. ఈ నేపథ్యంలో మాజీ బ్యాటర్ అహ్మద్ షెహజాద్ పీసీబీ సెలక్షన్ కమిటీ తీరును తూర్పారబట్టాడు.అతడిని జట్టులోకి తీసుకుంది ఎవరు? ‘‘అసలు షాదాబ్‌ను ఏ ప్రాతిపదికన జట్టులోకి తీసుకున్నారు. అతడి ప్రదర్శన గత కొంతకాలంగా ఎలా ఉందో మీకు తెలియదా? అతడిని జట్టులోకి తీసుకువచ్చింది ఎవరు? ఈ సిరీస్ ముగిసిన తర్వాత ఏమవుతుందో చూడండి. షాదాబ్ విషయంలో పీసీబీ ప్రణాళికలే వేరు. అతడిని ఎందుకు ఎంపిక చేశారన్నది కొద్దిరోజుల్లోనే బయటపడుతుంది.అయినా.. కివీస్‌తో తొలి టీ20లో మా బౌలర్లు అసలు ఏం చేశారు? మాట్లాడితే సీనియర్లు, అనుభవజ్ఞులు ఉన్నారు అంటారు. కానీ వాళ్లలో ఒక్కరైనా బాధ్యతగా ఆడారా? అసలు ప్రత్యర్థిని కాస్తైనా భయపెట్టగలిగారా? ఇంతకంటే చెత్త ఓటమి మరొకటి ఉంటుందా?’’ అని షెహజాద్ ఘాటు విమర్శలు చేశాడు. కాగా కివీస్‌తో తొలి టీ20లో స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ షాదాబ్ ఖాన్ కేవలం 3 పరుగులే చేశాడు. అదే విధంగా.. రెండు ఓవర్ల బౌలింగ్‌లో పద్దెమినిది పరుగులు ఇచ్చి వికెట్ తీయలేకపోయాడు.ఎన్సీఏను ఎవరు నడిపిస్తున్నారు?ఇక NCA గురించి ప్రస్తావిస్తూ.. ‘‘జాతీయ క్రికెట్ అకాడమీ ఆటగాళ్ల నైపుణ్యాలకు మరింత మెరుగులు దిద్దాలి. ఇక్కడి నుంచే మెరికల్లాంటి ఆటగాళ్లు వచ్చేవారు. నేను.. మహ్మద్ ఆమిర్, ఇమాద్ వసీం, ఉమర్ అమీన్, షాన్ మసూద్ వచ్చాం. మేము ఎన్సీఏలో ఉన్నప్పుడు వివిధ రకాల శిక్షణా శిబిరాలు నిర్వహించేవారు. ముదాస్సర్ నజర్ వంటి కోచ్‌లు ఉండేవారు.కానీ గత నాలుగేళ్లుగా ఎన్సీఏ ఏం చేస్తోంది? ఎన్సీఏను ఎవరు నడిపిస్తున్నారు? ఆటగాళ్ల అభివృద్ధికి దోహదం చేయాల్సింది పోయి.. సొంతవాళ్లకు జీతాలు ఇచ్చేందుకు మాత్రమే దీనిని ఉపయోగించుకుంటున్నారు. ఎన్సీఏ చీఫ్ నదీమ్ ఖాన్ ఏం చేస్తున్నారు.ఆయన బాధ్యతాయుతంగా వ్యవహరిస్తున్నారా? జవాబుదారీతనం ఉందా? ప్రతిసారీ ఆటగాళ్లను ఓటములకు బాధ్యులను చేయడం సరికాదు. నదీమ్ ఖాన్‌ను ఎవరూ ఎందుకు ప్రశ్నించడం లేదు? ఎన్సీఏ లాంటి కీలకమైన వ్యవస్థను నీరుగారుస్తుంటే ఎవరూ మాట్లాడరే? అసలు ఆయనను ఏ ప్రాతిపదికన అక్కడ నియమించారు? ఇందుకు అతడికి ఉన్న అర్హతలు, నైపుణ్యాలు ఏమిటి? అసలు పీసీబీ ఏం చేస్తోంది?’’ అని అహ్మద్ షెహజాద్ ఆగ్రహం వ్యక్తం చేశాడు.చదవండి: IPL 2025: 18వ సారైనా... బెంగళూరు రాత మారేనా! -
IPL 2025: ఢిల్లీ క్యాపిటల్స్ వైస్ కెప్టెన్‌గా డుప్లెసిస్
ఐపీఎల్ 2025 సీజన్ ప్రారంభానికి ముందు ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యం కీలక ప్రకటన చేసింది. తమ జట్టు వైస్ కెప్టెన్‌గా ఫాఫ్ డుప్లెసిస్‌ను నియమిస్తున్నట్లు ఇవాళ (మార్చి 17) వెల్లడించింది. గత రెండు సీజన్లలో ఆర్సీబీ కెప్టెన్‌గా వ్యవహరించిన ఫాఫ్‌ను ఢిల్లీ ఈ సీజన్ మెగా వేలంలో సొంతం చేసుకుంది. ఢిల్లీ ఫాఫ్‌ను బేస్ ధర రూ. 2 కోట్లకు దక్కించుకుంది. కొద్ది రోజుల కిందటే ఢిల్లీ యాజమాన్యం తమ నూతన కెప్టెన్‌గా అక్షర్ పటేల్‌ను ఎంపిక చేసింది. ఈ సీజన్లో ఫాఫ్ అక్షర్‌కు డిప్యూటీగా పని చేస్తాడు. ఆర్సీబీ కెప్టెన్‌గా, సౌతాఫ్రికా కెప్టెన్‌గా ఫాఫ్‌కు మంచి అనుభవం ఉంది. ఫాఫ్ కెప్టెన్సీ అనుభవం ఈ సీజన్లో అక్షర్ పటేల్‌కు చాలా ఉపయోగపడుతుందని ఢిల్లీ మేనేజ్మెంట్ భావిస్తుంది. ఫాఫ్ ఐపీఎల్లో చెన్నై సూపర్‌కింగ్స్, ఆర్సీబీ ఫ్రాంచైజీల తరఫున ఆడాడు. ఫాఫ్ తన ఐపీఎల్ కెరీర్లో 145 మ్యాచ్‌లు ఆడి 136.37 స్ట్రయిక్‌రేట్‌తో 4571 పరుగులు చేశాడు. ఇందులో 37 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఫాఫ్ ఈ సీజన్లో ఢిల్లీ ఓపెనర్‌గా బరిలోకి దిగే అవకాశం ఉంది. ఆసీస్ యువ ఆటగాడు జేక్ ఫ్రేజర్ మెక్‌గుర్క్‌తో ఫాఫ్ జోడీ కట్టవచ్చు. కాగా, ఢిల్లీ మేనేజ్మెంట్ అక్షర్ పటేల్‌ను కెప్టెన్‌గా నియమించకముందు ఈ సీజన్లోనే తమతో చేరిన కేఎల్ రాహుల్‌ను కెప్టెన్సీ కోసం సంప్రదించినట్లు తెలుస్తుంది. అయితే ఢిల్లీ మేనేజ్మెంట్ ఆఫర్‌ను రాహుల్ తిరస్కరించాడని సమాచారం. రాహుల్ కేవలం ఆటగాడిగా మాత్రమే కొనసాగేందుకు సుముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది. ఈ సీజన్లో రాహుల్, డుప్లెసిస్‌తో పాటు ఆసీస్ స్పీడ్‌స్టర్ మిచెల్ స్టార్క్ కూడా ఢిల్లీతో జతకట్టాడు. ఈ సీజన్ మెగా వేలంలో ఢిల్లీ మేనేజ్మెంట్ స్టార్క్‌కు మంచి ధర చెల్లించి సొంతం చేసుకుంది. గత సీజన్ వరకు ఢిల్లీ కెప్టెన్‌గా ఉన్న రిషబ్ పంత్‌ను ఈ సీజన్లో లక్నో రికార్డు ధరకు (రూ.27 కోట్లు) సొంతం చేసుకుంది. పంత్ లక్నో కెప్టెన్‌గా నియమితుడయ్యాడు. ఇదిలా ఉంటే, ఐపీఎల్ 2025 సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ ప్రయాణం.. మే 24న లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగే మ్యాచ్‌తో మొదలవుతుంది. ఈ మ్యాచ్ వైజాగ్‌లో జరుగనుంది. ఈ సీజన్ మార్చి 22న కేకేఆర్, ఆర్సీబీ మ్యాచ్‌తో మొదలవుతుంది.ఐపీఎల్ 2025 సీజన్ కోసం ఢిల్లీ జట్టు..అభిషేక్ పోరెల్, ఫాఫ్ డుప్లెసిస్, జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్, కరుణ్ నాయర్, కేఎల్ రాహుల్, సమీర్ రిజ్వీ, ట్రిస్టన్ స్టబ్స్, అక్షర్ పటేల్, డోనోవన్ ఫెరీరా, అజయ్ మండల్, మన్వంత్ కుమార్, అశుతోష్ శర్మ, మాధవ్ తివారీ, దుష్మంత చమీర, కుల్దీప్ యాదవ్, ముకేశ్ కుమార్, టి. నటరాజన్, విప్రాజ్ నిగమ్, మిచెల్ స్టార్క్, త్రిపురణ విజయ్ -
ఛాంపియన్స్ ట్రోఫీ ఎఫెక్ట్.. పాక్ ఆటగాళ్ల మ్యాచ్ ఫీజ్‌ల్లో భారీ కోత
ఛాంపియన్స్ ట్రోఫీ-2025 నిర్వహణ వల్ల పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) అప్పుల ఊబిలో కూరుకుపోయిందని తెలుస్తుంది. ఈ మెగా టోర్నీకి ఆతిథ్యమివ్వడం వల్ల పీసీబీకి రూ. 869 కోట్ల నష్టం వాటిల్లినట్లు సమాచారం. ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణపై పెట్టిన పెట్టుబడిలో 85 శాతం నష్టాలు వచ్చినట్లు పాక్ మీడియానే ప్రచారం చేస్తుంది. టోర్నీ నిర్వహణ వల్ల వచ్చిన భారీ నష్టాలను.. ఆటగాళ్లపై ఆర్దిక అంక్షల ద్వారా పూడ్చుకోవాలని పీసీబీ భావిస్తుంది. ఇందులో భాగంగా తొలుత దేశవాలీ క్రికెటర్ల మ్యాచ్ ఫీజ్‌ల్లో కోత విధించిన పీసీబీ.. తాజాగా జాతీయ ఆటగాళ్లపై కాస్ట్ కట్టింగ్ కొరడా ఝులిపించింది. పాకిస్తాన్ జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహించే ఆటగాళ్ల మ్యాచ్ ఫీజుల్లో సగానికిపైగా కోత విధించినట్లు తెలుస్తుంది. అలాగే పాక్ ఆటగాళ్లు ఫైవ్ స్టార్ హోటల్లలో బస చేయడంపై కూడా నిషేధం విధించినట్లు సమాచారం.ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణ కోసం పాక్ క్రికెట్ బోర్డు దాదాపు రూ. 1000 కోట్లు ఖర్చు చేసినట్లు తెలుస్తుంది. ఇందులో వేదికల ఆధునీకరణ (కరాచీ, లాహోర్, రావల్పిండి) కోసమే సగానికి పైగా నిధులు ఖర్చు చేసినట్లు సమాచారం. స్టేడియాల మరమ్మత్తుల కోసం ముందుగా అంచనా వేసిన వ్యయం కంటే 50 శాతం అధిక మొత్తం ఖర్చైనట్లు పాక్ మీడియా వెల్లడించింది. బదులుగా స్పాన్సర్‌షిప్‌లు, టికెట్ల అమ్మకం ద్వారా వచ్చిన మొత్తం గోరంత కూడా లేదని పేర్కొంది.భారీ అంచనాల మధ్య స్వదేశంలో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో డిఫెండింగ్ ఛాంపియన్స్ హోదాలో బరిలోకి దిగిన పాక్ ఒక్కటంటే ఒక్క మ్యాచ్ కూడా గెలవకుండా గ్రూప్ దశలోనే టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ టోర్నీలో పాక్.. న్యూజిలాండ్, టీమిండియా చేతుల్లో వరుసగా ఓడింది. బంగ్లాదేశ్‌తో జరగాల్సిన చివరి గ్రూప్ మ్యాచ్ వర్షం కారణంగా బంతి కూడా పడకుండానే రద్దైంది. భారత్‌తో మ్యాచ్‌ను దుబాయ్‌లో ఆడిన పాక్.. కోట్లు ఖర్చు చేసి స్వదేశంలో ఒక్క మ్యాచ్ మాత్రమే ఆడగలిగింది. అందులోనూ న్యూజిలాండ్ చేతిలో చావుదెబ్బ తినింది. చివరి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై అయినా గెలుద్దాం అనుకుంటే వరుణుడు కరుణించలేదు. ఈ టోర్నీలో భారత్ చివరి వరకు అజేయంగా నిలిచి ఛాంపియన్‌గా నిలిచింది. ఫైనల్లో భారత్ న్యూజిలాండ్‌ను ఓడించి మూడో సారి ఛాంపియన్స్ ట్రోఫీని కైవసం చేసుకుంది. పాక్‌కు టోర్నీ నిర్వహణ వల్ల వచ్చిన నష్టాల కంటే తమ దేశం ఆతిథ్యమిచ్చిన టోర్నీలో భారత్ గెలవడం వల్ల కలిగే బాధ ఎక్కువగా ఉంది. కాగా, పాక్ ఆతిథ్యమిచ్చిన ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ తమ మ్యాచ్‌లను దుబాయ్‌లో ఆడిన విషయం తెలిసిందే. భద్రతాపరమైన సమస్యల కారణంగా బీసీసీఐ టీమిండియాను పాక్‌లో ఆడేందుకు అనుమతించలేదు. -
IPL 2025: ఓపెనర్లుగా కోహ్లి, సాల్ట్.. ఆర్సీబీ ప్లేయింగ్ ఎలెవెన్ ఇదే..?
క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 18వ ఎడిషన్ మరో 5 రోజుల్లో (మార్చి 22) ప్రారంభం కానుంది. లీగ్ ఆరంభ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ కేకేఆర్.. ఇప్పటివరకు ఒక్కసారి కూడా టైటిల్ సాధించని ఆర్సీబీతో తలపడనుంది. ఈ మ్యాచ్ కేకేఆర్ హోం గ్రౌండ్ అయిన ఈడెన్ గార్డెన్స్‌లో జరుగనుంది.అన్ని సీజన్లకు ముందు లాగే ఈ సారి కూడా ఆర్సీబీ 'ఈ సాలా కప్ నమ్మదే' అన్న నినాదంతో బరిలోకి దిగుతుంది. 17 సీజన్లలో ఒక్క సారి కూడా టైటిల్ గెలవని ఆర్సీబీ ఈసారి ఎలాగైనా తమ కల నెరవేర్చుకోవాలని భావిస్తుంది. ఈ సారి ఓ అంశం ఆర్సీబీ టైటిల్ కలను సాకారం చేసేలా సూచిస్తుంది. ఆ జట్టు స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లి జెర్సీ నంబర్.. ఈ సారి ఐపీఎల్ ఎడిషన్ సంఖ్య మ్యాచ్ అవుతున్నాయి. విరాట్ జెర్సీ నంబర్ 18 కాగా.. ఈ యేడు ఐపీఎల్ ఎడిషన్ సంఖ్య కూడా పద్దెనిమిదే. ఇలాగైనా విరాట్ లక్కీ నంబర్ 18 ఆర్సీబీకి టైటిల్ సాధించిపెడుతుందేమో చూడాలి.ఇదిలా ఉంటే, గత సీజన్లతో పోలిస్తే ఆర్సీబీ ఈ సీజన్లో కాస్త ఫ్రెష్‌గా కనిపిస్తుంది. కొత్త కెప్టెన్ (రజత్ పాటిదార్), కొత్త ఆటగాళ్లతో బెంగళూరు ఫ్రాంచైజీ ఉరకలేస్తుంది. మెగా వేలానికి ముందు విరాట్ (21 కోట్లు), రజత్ పాటిదార్ (11 కోట్లు), యశ్ దయాల్‌ను (5 కోట్లు) మాత్రమే అట్టిపెట్టుకున్న ఆర్సీబీ.. మ్యాక్స్‌వెల్, డుప్లెసిస్, సిరాజ్ లాంటి స్టార్లను వదిలేసింది.మెగా వేలంలో ఆర్సీబీకి 25 మంది ఆటగాళ్లను కొనుగోలు చేసే అవకాశం ఉన్నా కేవలం 22 మందితోనే సరిపెట్టుకుంది. వేలంలో ఆర్సీబీ ఫిల్ సాల్ట్, జేకబ్ బేతెల్, లియామ్ లివింగ్‌స్టోన్, టిమ్ డేవిడ్, రొమారియో షెఫర్డ్ లాంటి విధ్వంసకర విదేశీ బ్యాటర్లను.. హాజిల్‌వుడ్, ఎంగిడి లాంటి స్టార్ విదేశీ పేసర్లను కొనుగోలు చేసింది. దేశీయ స్టార్లు జితేశ్ శర్మ, భువనేశ్వర్ కుమార్, దేవ్‌దత్ పడిక్కల్, కృనాల్ పాండ్యాపై కూడా ఆర్సీబీ మేనేజ్మెంట్ నమ్మకముంచింది.ఈ సీజన్ కోసం ఆర్సీబీ ఎంపిక చేసుకున్న జట్టును చూస్తే.. ఫిల్ సాల్ట్, విరాట్ కోహ్లి ఇన్నింగ్స్‌ను ఓపెన్ చేసే అవకాశం ఉంది. ఈ విషయాన్ని ఆ జట్టు హెడ్ కోచ్ ఆండీ ఫ్లవర్ కూడా ధృవీకరించాడు. వన్‌డౌన్‌లో కెప్టెన్ రజత్ పాటిదార్.. నాలుగో స్థానంలో లివింగ్‌స్టోన్, ఐదో స్థానంలో జితేశ్ శర్మ, ఆరో ప్లేస్‌లో టిమ్ డేవిడ్, ఏడో స్థానంలో కృనాల్ పాండ్యా, బౌలర్లుగా భువనేశ్వర్ కుమార్, యశ్ దయాల్, హాజిల్‌వుడ్, సుయాశ్ శర్మ తుది జట్టులో ఉండే అవకాశం ఉంది.ఆర్సీబీ మొత్తం జట్టు: రజత్ పాటీదార్ (కెప్టెన్), కోహ్లి, సాల్ట్, జితేశ్ శర్మ, దేవదత్ పడిక్కల్, స్వస్తిక్ చికారా, లియామ్ లివింగ్‌స్టోన్, కృనాల్ పాండ్యా, స్వప్నిల్ సింగ్, టిమ్ డేవిడ్, రొమారియో షెఫర్డ్, మనోజ్ భాండగే, జాకబ్ బెథెల్, జోష్ హాజల్‌వుడ్, భువనేశ్వర్ కుమార్, రసిక్ సలాం దార్, సుయశ్ శర్మ, నువాన్ తుషారా, లుంగి ఇన్‌గిడి, అభినందన్ సింగ్, మోహిత్ రతీ, యశ్ దయాల్. -
రాబిన్‌హుడ్‌లో డేవిడ్ వార్నర్.. లక్షల్లో కాదు కోట్లల్లో పారితోషికం!
ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ (David Warner).. మైదానంలో ఎంత ఫేమస్సో, సోషల్ మీడియాలోనూ అంతే ఫేమస్.. టాలీవుడ్ చిత్రాల డైలాగులతో రీల్స్ చేస్తూ తెలుగువారి మనసు గెలుచుకున్నాడు. ఈసారి ఏకంగా తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు. నితిన్ హీరోగా నటించిన రాబిన్‌హుడ్ సినిమాలో డేవిడ్ వార్నర్ కీలక పాత్రలో నటించాడు. ఈ మేరకు ఆయన ఫస్ట్ లుక్ పోస్టర్ సైతం రిలీజ్ చేశారు.కోట్ల పారితోషికం?అందులో వార్నర్.. షార్ట్ హెయిర్, కూల్ ఎక్స్‌ప్రెషన్స్‌తో వావ్ అనిపించాడు. ఇక పోస్టర్ రిలీజైనప్పటినుంచి ఈ దిగ్గజ క్రికెటర్ రాబిన్‌హుడ్ (Robinhood Movie)కు ఎంత పారితోషికం తీసుకుంటున్నాడన్న చర్చ మొదలైంది. సోషల్ మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం.. సినిమాలో నటించినందుకుగానూ రూ.3 కోట్లు తీసుకున్నాడట. ప్రమోషన్స్‌లో పాల్గొనేందుకు మరో రూ.1 కోటి అదనంగా అడిగాడట! ఇది విన్న అభిమానులు.. స్టార్ క్రికెటర్ అంటే ఆమాత్రం ఇచ్చుకోవాల్సిందేనని కామెంట్లు చేస్తున్నారు.(చదవండి: రైతు అంటేనే ఛీ అనేలా చేసిన వెధవ.. ఈ దొంగ రైతుబిడ్డ: అన్వేష్ ఫైర్)అప్పుడలా.. ఇప్పుడిలా.. గతంలోనూ వార్నర్ పారితోషికం (David Warner Remuneration for Robinhood) గురించి కొన్ని వార్తలు వెలువడ్డాయి. కేవలం సరదా కోసమే ఆయన ఈ పాత్ర ఎంచుకున్నారని, డబ్బు గురించి ఆలోచించలేదని అందులో పేర్కొన్నారు. అయినప్పటికీ నిర్మాతలు రూ.50 లక్షలను అతడికి అందించినట్లుగా ప్రస్తావించారు. ఇప్పుడేమో ఏకంగా రూ.4 కోట్లు తీసుకున్నట్లుగా కథనాలు వస్తున్నాయి. వార్నర్ స్పందిస్తే కానీ దీనిపై క్లారిటీ వచ్చేలా లేదు!సినిమారాబిన్హుడ్ సినిమా విషయానికి వస్తే.. భీష్మ వంటి హిట్ మూవీ తర్వాత నితిన్, వెంకీ కుడుముల కాంబినేషన్లో వస్తున్న రెండో చిత్రమిది. శ్రీలీల కథానాయికగా నటించింది. రాజేంద్రప్రసాద్, వెన్నెల కిశోర్ కీలక పాత్రలు పోషించారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ నిర్మించారు. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందించిన ఈ సినిమా మార్చి 28న ప్రేక్షకుల ముందుకు వస్తోంది.చదవండి: థియేటర్లో సినిమాల జోరు.. ఓటీటీలో ఏకంగా 15 చిత్రాలు/సిరీస్‌లు -
బీసీసీఐకి బిగ్ షాక్
న్యూఢిల్లీ: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) వైద్య బృంద అధిపతి నితిన్ పటేల్ రాజీనామా చేశాడు. బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ (సీఓఈ, గతంలో ఎన్సీఏ)లో మూడేళ్లుగా స్పోర్ట్స్ సైన్స్, మెడికల్ టీమ్‌కు అధిపతిగా ఉన్న నితిన్ పటేల్ వ్యక్తిగత కారణాలతో బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. దీనిపై నితిన్ ఎలాంటి ప్రకటన చేయకపోయినా... బోర్డు వర్గాలు రాజీనామాను ధ్రువీకరించాయి. ‘నితిన్ రాజీనామా చేశాడు. బోర్డుతో అతడికి చక్కటి అనుబంధం ఉంది. గత మూడేళ్లలో టీమిండియా కోసం నితిన్ ఎంతో చేశాడు. సీఓఈలో వైద్య విధానాలను రూపొందించడంలో అతడి పాత్ర కీలకం. ఆటగాళ్లెవరైనా గాయపడి ఎన్సీఏకు వెళ్తే... వారు పూర్తిగా కోలుకోవడమే కాకుండా రెట్టించిన ఉత్సాహంతో కోలుకునే విధంగా తీర్చిదిద్దాడు. నితిన్ కుటుంబం విదేశాల్లో స్థిరపడింది’ అని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా, షమీ, కేఎల్ రాహుల్, కుల్దీప్ యాదవ్ వంటి ఎందరో ఆటగాళ్లు గాయపడి ఎన్సీఏకు వెళ్లగా... నితిన్ పర్యవేక్షణలో తిరిగి కోలుకున్నారు. -
హోరాహోరీ సమరం.. ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌గా కొరియా స్టార్
బర్మింగ్‌హామ్: ప్రతిష్టాత్మక ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ మహిళల సింగిల్స్ విభాగంలో ప్రపంచ నంబర్‌వన్ ఆన్ సె యంగ్ (దక్షిణ కొరియా) చాంపియన్‌గా నిలిచింది. ప్రపంచ రెండో ర్యాంకర్ వాంగ్ జి యి (చైనా)తో ఆదివారం జరిగిన ఫైనల్లో ఆన్ సె యంగ్ 13–21, 21–18, 21–18తో విజయం సాధించింది. 95 నిమిషాలపాటు ఆద్యంతం హోరాహోరీగా జరిగిన ఈ తుది సమరంలో ఆన్ సె యింగ్ కీలకదశలో పాయింట్లు గెలిచి కెరీర్లో రెండోసారి ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ టైటిల్‌ను సొంతం చేసుకుంది.2023లో తొలిసారి ఆన్ సె యింగ్ ఈ టైటిల్‌ను సాధించింది. పురుషుల సింగిల్స్ విభాగంలో చైనా ప్లేయర్, ప్రపంచ నంబర్‌వన్ షి యుకీ రెండోసారి ఈ టైటిల్‌ను దక్కించుకున్నాడు. తొలిసారి 2018లో విజేతగా నిలిచిన షి యుకీ ఫైనల్లో 21–17, 21–19తో లీ చియా హావో (చైనీస్ తైపీ)పై నెగ్గాడు. విజేతగా నిలిచిన ఆన్ సె యింగ్, షి యుకీలకు 1,01,500 డాలర్ల (రూ. 88 లక్షలు) చొప్పున ప్రైజ్‌మనీ లభించింది. -
IPL 2025: సన్‌రైజర్స్ ఆల్‌రౌండర్ రేర్ టాలెంట్
ఐపీఎల్ 2025 సీజన్ ప్రారంభానికి ముందు గత సీజన్ రన్నరప్ సన్‌రైజర్స్ హైదరాబాద్ కఠోరంగా శ్రమిస్తుంది. ఈ సీజన్ కోసం చాలా రోజుల కిందటే ప్రాక్టీస్ షూరూ చేసిన ఆరెంజ్ ఆర్మీ.. ప్రస్తుతం ఇంటర్ స్క్వాడ్ మ్యాచ్‌లతో బిజీగా ఉంది. నిన్న జరిగిన ఓ ప్రాక్టీస్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ ఆల్‌రౌండర్ కమిందు మెండిస్లోని ఓ రేర్ టాలెంట్ బయటపడింది. కమిందు రెండు చేతులతో బౌలింగ్ చేసి వైవిధ్యాన్ని ప్రదర్శించాడు. ఇన్నింగ్స్ 8వ ఓవర్ తొలి రెండు బంతులను కుడి చేతితో వేసిన కమిందు.. ఆతర్వాత బంతిని ఎడమ చేతితో బౌలింగ్ చేశాడు. కమిందు కుడి చేతితో బౌలింగ్ చేస్తూ అప్పటికే బౌండరీ బాది జోష్ మీదున్న ఇషాన్ కిషన్‌ను ఔట్ చేశాడు. ఆ తర్వాత బంతికి అభినవ్ మనోహర్ క్రీజ్‌లోకి రాగా.. అతనికి తన ఎడమ చేతి వాటాన్ని రుచి చూపించాడు. కమిందు రెండు చేతులతో బౌలింగ్ చేస్తూ ప్రదర్శించిన వైవిధ్యాన్ని సన్‌రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం సోషల్‌మీడియాలో షేర్ చేయగా.. అభిమానుల నుంచి మంచి స్పందన వస్తుంది. రేర్ టాలెంట్ అంటూ ఫ్యాన్స్ కమిందును పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. శ్రీలంక నయా సంచలనం కమిందును ఎస్ఆర్హెచ్ ఈ సీజన్ మెగా వేలంలో రూ. 75 లక్షల బేస్ ప్రైజ్‌కు కొనుగోలు చేసింది.కాగా, ఐపీఎల్-2025లో సన్‌రైజర్స్ తమ తొలి మ్యాచ్‌ను మార్చి 23న ఆడుతుంది. ఈ మ్యాచ్‌లో ఆరెంజ్ ఆర్మీ రాజస్థాన్ రాయల్స్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్ ఎస్ఆర్హెచ్ హోం గ్రౌండ్ ఉప్పల్ స్టేడియంలో జరుగనుంది. ఈ ఏడాది ఐపీఎల్ మార్చి 22న ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ కేకేఆర్.. ఆర్సీబీతో తలపడనుంది. కేకేఆర్ హోం గ్రౌండ్ ఈడెన్ గార్డెన్స్‌లో ఈ మ్యాచ్ జరుగనుంది.ఇదిలా ఉంటే, ఈ సీజన్ మెగా వేలానికి ముందు సన్‌రైజర్స్ ఎయిడెన్ మార్క్రమ్, గ్లెన్ ఫిలిప్స్ లాంటి విధ్వంకర బ్యాటర్లను వదిలేసి ఇషాన్ కిషన్, అభినవ్ మనోహర్, జయదేవ్ ఉనద్కత్ లాంటి లోకల్ టాలెంట్‌ను అక్కున చేర్చుకుంది. మెగా వేలానికి ముందు సన్‌రైజర్స్ భువనేశ్వర్ కుమార్, నటరాజన్ లాంటి నాణ్యమైన పేసర్లను కూడా వదిలేసింది. టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీ, గత సీజన్ అత్యధిక వికెట్ల వీరుడు హర్షల్ పటేల్, ఆసీస్ స్టార్ స్పిన్నర్ ఆడమ్ జంపా, శ్రీలంక ఆల్‌రౌండర్ కమిందు మెండిస్ కొత్తగా జట్టులోకి చేరారు. 2025 ఐపీఎల్ కోసం సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఇదే..పాట్ కమిన్స్ (కెప్టెన్), అథర్వ్ తైడే, అభినవ్ మనోహర్, అనికేత్ వర్మ, సచిన్ బేబి, ట్రవిస్ హెడ్, నితీశ్ కుమార్ రెడ్డి, కమిందు మెండిస్, వియాన్ ముల్దర్, అభిషేక్ శర్మ, హెన్రిచ్ క్లాసెన్, ఇషాన్ కిషన్, జీషన్ అన్సారీ, మహ్మద్ షమీ, హర్షల్ పటేల్, రాహుల్ చాహర్, సిమర్జీత్ సింగ్, ఎషాన్ మలింగ, ఆడమ్ జంపా, జయదేవ్ ఉనద్కత్ -
వయసు పెరుగుతున్నా అదే టెంపర్.. విండీస్ ఆటగాడితో కయ్యానికి కాలు దువ్విన యువరాజ్ సింగ్
వయసు పెరుగుతున్నా టీమిండియా మాజీ ఆటగాడు యువరాజ్ సింగ్‌లో టెంపర్ ఏమాత్రం తగ్గలేదు. ఆటగాడిగా ఉన్న రోజుల్లో ఎలా దూకుడుగా ఉండే వాడో ఇప్పుడూ అలాగే ఉన్నాడు. ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ (దిగ్గజ క్రికెటర్లు పాల్గొన్న టోర్నీ) ఫైనల్లో యువీ తన పాత రోజులను గుర్తు చేశాడు. విండీస్ ఆటగాడు టీనో బెస్ట్‌పై తనదైన పంధాలో విరుచుకుపడ్డాడు. pic.twitter.com/y2iHtEPyCr— Cricket Heroics (@CricHeroics786) March 16, 2025అసలేం జరిగిందంటే.. ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ తొలి ఎడిషన్ ఫైనల్లో భారత మాస్టర్స్, వెస్టిండీస్ మాస్టర్స్ తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో భారత్ విజేతగా నిలిచి టైటిల్‌ను ఎగరేసుకుపోయింది. తొలుత బౌలింగ్‌లో వినయ్ కుమార్ (3-0-26-3), షాబాజ్ నదీం (4-1-12-2).. ఆతర్వాత బ్యాటింగ్‌లో అంబటి రాయుడు (50 బంతుల్లో 74; 9 ఫోర్లు, 3 సిక్సర్లు) సత్తా చాటి భారత్‌ను గెలిపించారు.అయితే ఈ మ్యాచ్ మధ్యలో ఓ దురదృష్టకర ఘటన చోటు చేసుకుంది. విండీస్ ఆటగాడు టీనో బెస్ట్, భారత స్టార్ ప్లేయర్ యువరాజ్ సింగ్ గొడవ పడ్డారు. విండీస్ నిర్దేశించిన లక్ష్యాన్ని భారత మాస్టర్స్ ఛేదిస్తుండగా (14వ ఓవర్ తొలి బంతి తర్వాత).. యువీ టీనో బెస్ట్‌పై తన సహజ శైలిలో వ్యంగ్యమైన వ్యాఖ్యలు చేశాడు. బెస్ట్ కూడా ఏమాత్రం తగ్గకుండా యువీకి తిరుగు సమాధానం చెప్పాడు. దీంతో గొడవ పెద్దదైంది. ఒకరిపైకి ఒకరు దూసుకొచ్చారు. ఇద్దరి మధ్య కొద్ది సేపు వాగ్వాదం జరిగింది. అంపైర్ బిల్లీ బౌడెన్, క్రీజ్‌లో ఉన్న అంబటి రాయుడు, విండీస్ కెప్టెన్ బ్రియాన్ లారా సర్ది చెప్పడంతో ఇద్దరూ వెనక్కు తగ్గారు. ఆతర్వాత ఆట సజావుగా సాగి భారత్ విజేతగా నిలిచింది. యువీ-బెస్ట్ గొడవకు ముందు రాయుడు ఆష్లే నర్స్ బౌలింగ్‌లో భారీ సిక్సర్ బాదాడు. అంతకుముందు బెస్ట్ వేసిన ఓవర్లో రాయుడు, యువీ కలిసి 12 పరుగులు పిండుకున్నారు. రాయుడు సిక్సర్ కొట్టిన అనందంలో యువీ బెస్ట్‌ను కవ్వించగా.. అతను కూడా తగ్గేదేలేదంటూ సమాధానం చెప్పాడు. యువీకి ఇలాంటి గొడవలు కొత్తేమీ కాదు. ఆటగాడి ఉన్న రోజుల్లో ఇలాంటి ఘటనలు కోకొల్లలు. 2007 టీ20 ప్రపంచకప్ సందర్భంగా ఇంగ్లండ్ ఆటగాడు ఆండ్రూ ఫ్లింటాఫ్‌తో జరిగిన ఫైట్ భారత క్రికెట్ అభిమానులకు ఇప్పటికీ గుర్తుంటుంది. మొత్తానికి మాస్టర్స్ లీగ్ ఫైనల్లో యువీ చర్యను కొందరు సమర్దిస్తుంటే.. మరికొందరు తప్పుబడుతున్నారు. దిగ్గజాల కోసం నిర్వహించిన టోర్నీలో హుందాగా ఉండాల్సింది పోయి, గొడవలు పడటమేంటని చురకలంటిస్తున్నారు. యువీనే తొలుత బెస్ట్‌ను కవ్వించాడని మ్యాచ్‌ను చూసిన వాళ్లు అంటున్నారు. ఏది ఏమైనా సప్పగా సాగుతున్న మాస్టర్స్ లీగ్.. ఫైనల్లో యువీ చర్య వల్ల రక్తి కట్టింది. ఈ టోర్నీలో ఒకే ఒక మ్యాచ్ ఓడిపోయిన (ఆస్ట్రేలియా చేతిలో) భారత్.. ఫైనల్లో విండీస్‌పై 6 వికెట్ల తేడాతో గెలుపొంది టైటిల్‌ను చేజిక్కించుకుంది. ఈ టోర్నీలో భారత్ సచిన్ టెండూల్కర్ నాయకత్వంలో అద్భుత విజయాలు సాధించింది. భారత మాస్టర్స్ ఆటగాళ్లు సచిన్ టెండూల్కర్, యువరాజ్ సింగ్, ఇర్ఫాన్ పఠాన్, యూసఫ్ పఠాన్, అంబటి రాయుడు పూర్వపు రోజులు గుర్తు చేశారు. లజెండ్స్ లీగ్ పోటీలు చాలా జరుగుతుండటంతో ఈ టోర్నీ ఫెయిల్ అవుతుందని అంతా అనుకున్నారు. అయితే భారత్, విండీస్, శ్రీలంక, ఆస్ట్రేలియాకు చెందిన దిగ్గజాలు అద్భుత ప్రదర్శనలు చేసి ఈ టోర్నీని సక్సెస్ చేశారు. ఈ టోర్నీలో ఆసీస్ దిగ్గజం షేన్ వాట్సన్ ఏకంగా మూడు సెంచరీలు చేయడం హైలైట్. ఫైనల్లో తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 148 పరుగులు చేయగా.. భారత్ మరో 17 బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని ఛేదించింది. విండీస్ ఇన్నింగ్స్‌లో డ్వేన్ స్మిత్ (45), లెండిల్ సిమన్స్ (57) మాత్రమే రాణించగా.. దిగ్గజం లారా (6) నిరాశపరిచాడు. -
IPL 2025: కేకేఆర్‌కు బిగ్ షాక్.. స్టార్ పేసర్‌కు గాయం
ఐపీఎల్ 2025 ప్రారంభానికి ముందు డిఫెండింగ్ ఛాంపియన్ కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు (కేకేఆర్) భారీ షాక్ తగిలింది. గాయం కారణంగా ఆ జట్టు స్టార్ పేసర్ ఉమ్రాన్ మాలిక్ సీజన్ మొత్తనికి దూరమ్యాడు. దీంతో అతనికి రీ ప్లేస్‌మెంట్‌గా 27 ఏళ్ల లెఫ్ట్ ఆర్మ్ మీడియం పేసర్ చేతన్ సకారియాను ఎంపిక చేసుకుంది కేకేఆర్ మేనేజ్మెంట్. మాలిక్‌ను కేకేఆర్ ఈ సీజన్ మెగా వేలంలో రూ. 75 లక్షలకు దక్కించుకుంది. మాలిక్ కేకేఆర్ తరఫున ఒక్క మ్యాచ్ కూడా ఆడకుండానే వైదొలిగాడు. జమ్మూ కశ్మీర్ ఎక్స్‌ప్రెస్‌గా ప్రసిద్ది చెందిన మాలిక్ 2021లో సన్‌రైజర్స్ తరఫున అరంగేట్రం చేసి గత సీజన్ వరకు అదే జట్టుకు ఆడాడు. మూడు సీజన్లలో అద్బుతమైన ప్రదర్శనలు చేసిన మాలిక్.. ఎస్ఆర్హెచ్ తరఫున 26 మ్యాచ్‌లు ఆడి 29 వికెట్లు తీశాడు. ఈ ప్రదర్శనల కారణంగా మాలిక్ టీమిండియాలో కూడా చోటు దక్కించుకున్నాడు. రైట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ అయిన మాలిక్ భారత్ తరఫున 10 వన్డేలు, 8 టీ20లు ఆడి 24 వికెట్లు తీశాడు. సకారియా విషయానికొస్తే.. గుజరాత్లో పుట్టి దేశవాలీ క్రికెట్లో సౌరాష్ట్రకు ఆడే సకారియా గత సీజన్లో కేకేఆర్‌తో పాటే ఉన్నాడు. అయితే ఆ సీజన్లో అతనికి ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం రాలేదు. 2021లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఐపీఎల్ అరంగేట్రం చేసిన సకారియా ఆతర్వాత రెండు సీజన్ల పాటు (2022, 2023) రాజస్థాన్ రాయల్స్‌కు ఆడాడు. సకారియా తన ఐపీఎల్ కెరీర్లో 19 మ్యాచ్‌లు ఆడి 8.43 ఎకానమీతో 20 వికెట్లు తీశాడు. ఐపీఎల్ ప్రదర్శనల కారణంగా సకారియా భారత జట్టుకు ఆడే అవకాశం కూడా దక్కించుకున్నాడు. 2021లో టీమిండియా తరఫున అరంగేట్రం చేసిన సకారియా ఓ వన్డే, 2 టీ20లు ఆడి 3 వికెట్లు తీశాడు. ఓవరాల్‌గా 46 టీ20లు ఆడిన సకారియా 65 వికెట్లు పడగొట్టాడు. ప్రస్తుతం కేకేఆర్ సకారియాను రూ. 75 లక్షల బేస్ ధరకు దక్కించుకుంది.ఇదిలా ఉంటే, ఐపీఎల్ 2025లో కేకేఆర్ ప్రయాణం సీజన్ ఆరంభ మ్యాచ్‌తోనే మొదలవుతుంది. మార్చి 22న జరిగే మ్యాచ్‌లో కేకేఆర్ ఆర్సీబీని ఢీకొంటుంది. ఈ సీజన్లో కేకేఆర్‌కు కొత్త కెప్టెన్ వచ్చాడు. గత సీజన్లో టైటిల్ అందించిన శ్రేయస్ అయ్యర్ పంజాబ్ కింగ్స్‌ను వెళ్లడంతో కేకేఆర్ మేనేజ్మెంట్ అజింక్య రహానేను నూతన కెప్టెన్‌గా ఎంపిక చేసుకుంది. రహానేకు డిప్యూటీగా (వైస్ కెప్టెన్) వెంకటేశ్ అయ్యర్ ఎంపికయ్యాడు.2025 ఐపీఎల్ సీజన్ కోసం కేకేఆర్ జట్టు..అజింక్య రహానే (కెప్టెన్), వెంకటేశ్ అయ్యర్ (వైస్ కెప్టెన్), మనీశ్ పాండే, రింకూ సింగ్, రోవ్‌మన్ పావెల్, అంగ్క్రిష్ రఘువంశీ, అనుకూల్ రాయ్, మొయిన్ అలీ, రమన్‌దీప్ సింగ్, సునీల్ నరైన్, ఆండ్రీ రసెల్, క్వింటన్ డికాక్, లవ్నిత్ సిసోడియా, రహ్మానుల్లా గుర్బాజ్, వరుణ్ చక్రవర్తి, వైభవ్ అరోరా, అన్రిచ్ నోర్జే, ఉమ్రాన్ మాలిక్, మయాంక్ మార్కండే, హర్షిత్ రాణా, స్పెన్సర్ జాన్సన్ -
ఇంటర్నేషనల్ మాస్టర్స్ చాంపియన్ భారత్
రాయ్‌పూర్: ఇంటర్నేషనల్ మాస్ట్సర్స్ లీగ్‌లో భారత మాస్టర్స్ జట్టు చాంపియన్‌గా నిలిచింది. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ సారథ్యంలో బరిలోకి దిగిన భారత మాస్టర్స్ జట్టు ఆదివారం రాయ్‌పూర్ వేదికగా జరిగిన ఫైనల్లో 6 వికెట్ల తేడాతో వెస్టిండీస్ మాస్టర్స్‌పై విజయం సాధించింది. తొలిసారి నిర్వహించిన ఈ లీగ్‌లో భారత జట్టు సమష్టి ప్రదర్శనతో సత్తా చాటింది. తుదిపోరులో మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ మాస్టర్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 148 పరుగులు చేసింది. సిమ్మన్స్ (41 బంతుల్లో 57; 5 ఫోర్లు, 1 సిక్స్), డ్వైన్ స్మిత్ (35 బంతుల్లో 45; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించారు. భారత బౌలర్లలో వినయ్ కుమార్ 3, నదీమ్ 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో భారత మాస్టర్స్ జట్టు 17.1 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. ఓపెనర్ అంబటి తిరుపతి రాయుడు (50 బంతుల్లో 74; 9 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధశతకంతో విజృంభించగా... కెపె్టన్ సచిన్ టెండూల్కర్ (25; 2 ఫోర్లు, 1 సిక్స్) రాణించాడు. యువరాజ్ సింగ్ (13 నాటౌట్), గుర్కీరత్ సింగ్ (14), స్టువర్ట్ బిన్నీ (16 నాటౌట్) తలా కొన్ని పరుగులు చేశారు. -
18వ సారైనా... బెంగళూరు రాత మారేనా!
పరుగుల వీరులు... వికెట్లు ధీరులు... మెరుపు ఫీల్డర్లు... అశేష అభిమానులు... విశేష ఆదరణ... ఇలా ‘అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని’ అన్నట్లు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టు ఒక్కసారి కూడా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ట్రోఫీ చేజిక్కించుకోలేకపోయింది. లీగ్ ఆరంభం (2008) నుంచి ప్రతిసారీ ‘ఈ సాలా కప్ నమ్దే’ అంటూ బరిలోకి దిగడం... రిక్తహస్తాలతో వెనుదిరగడం పరిపాటిగా మారింది. టోర్నమెంట్ ఆరంభం నుంచి ఒకే ఫ్రాంచైజీకి ప్రాతినిధ్యం వహిస్తున్న ఏకైక ఆటగాడిగా రికార్డుల్లోకి ఎక్కిన విరాట్ కోహ్లి... తన జెర్సీ నంబర్ 18వ సారైనా ట్రోఫీని అందిస్తాడా లేదో వేచి చూడాలి! – సాక్షి క్రీడావిభాగం ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో అత్యధిక జనాదరణ ఉన్న జట్లలో ఒకటైన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) మరోసారి కప్పు వేటకు సిద్ధమైంది. ఇప్పటి వరకు 17 సీజన్లు ఆడి ఒక్కసారి కూడా ట్రోఫీ నెగ్గలేకపోయిన ఆర్సీబీ ఈ సారైనా తమ కల నెరవేర్చుకోవాలని భావిస్తోంది. లీగ్ చరిత్రలో అత్యుత్తమంగా మూడుసార్లు (2009, 2011, 2016లో) రన్నరప్‌గా నిలిచిన ఆర్సీబీ... తమ స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లి జెర్సీ నంబర్ 18వ సీజన్లో ట్రోఫీ ఒడిసి పట్టాలని పట్టుదలతో ఉంది. అంతర్జాతీయ స్టార్లపై ఎక్కువ నమ్మకముంచే ఫ్రాంచైజీ ఈసారి దేశీ ఆటగాడు రజత్ పాటీదార్‌కు సారథ్య బాధ్యతలు అప్పగించింది. 2021 నుంచి ఆర్సీబీకు ప్రాతినిధ్యం వహిస్తున్న రజత్ జట్టు రాత మారుస్తాడని ఆశిస్తోంది. గతేడాది జరిగిన ఐపీఎల్ వేలంతోనే ఈసారి విభిన్నమైన ప్రణాళికతో బరిలోకి దిగనున్నట్లు ఆర్సీబీ సంకేతాలు పంపింది. వేలంలో ఒక్కో జట్టు అత్యధికంగా 25 మంది ఆటగాళ్లను కొనుగోలు చేసుకునే అవకాశం ఉన్నా... ఆర్సీబీ 22 మంది ప్లేయర్లకే పరిమితమైంది. విరాట్ కోహ్లికి రూ. 21 కోట్లు ఇచ్చి అట్టిపెట్టుకున్న ఫ్రాంచైజీ... రజత్ పాటీదార్ (రూ. 11 కోట్లు), యశ్ దయాల్ (రూ. 5 కోట్లు)ను రిటైన్ చేసుకుంది. మ్యాక్స్‌వెల్, సిరాజ్ వంటి అంతర్జాతీయ స్టార్లను వదిలేసుకున్న ఆర్సీబీ... స్వప్నిల్ సింగ్‌ను రూ. 50 లక్షలతో ‘రైట్ టు మ్యాచ్’ ద్వారా తిరిగి తీసుకుంది. కేఎల్ రాహుల్, చహల్, రిషబ్ పంత్ వంటి వారిని వేలంలో చేజిక్కించుకునే అవకాశం ఉన్నా పట్టించుకోలేదు. అటు అనుభవం... ఇటు యువరక్తంతో కూడిన కొత్త బృందాన్ని కొనుగోలు చేసుకుంది. గత సీజన్లో తొలి ఎనిమిది మ్యాచ్‌ల్లో ఏడింట ఓడి ఆ తర్వాత వరుసగా ఆరు మ్యాచ్‌లు నెగ్గి ప్లేఆఫ్స్‌కు చేరిన బెంగళూరు... ఎలిమినేటర్‌లో రాజస్తాన్ రాయల్స్ చేతిలో ఓడి ఇంటిబాట పట్టింది. అతడే బలం... బలహీనత ఆర్సీబీ ప్రయాణాన్ని గమనిస్తే... ఆ జట్టుకు అతిపెద్ద బలం విరాట్ కోహ్లినే. అదే సమయంలో బలహీనత కూడా అతడే. విరాట్ రాణించిన మ్యాచ్‌ల్లో అలవోకగా విజయాలు సాధించే ఆర్సీబీ... అతడు విఫలమైన సమయంలో కనీస ప్రదర్శన కూడా కనబర్చలేక వెనుకబడి పోతుంది. 17 సీజన్లుగా ఒకే ఫ్రాంచైజీకి ప్రాతినిధ్యం వహిస్తున్న విరాట్ ఐపీఎల్లో ఇప్పటి వరకు 252 మ్యాచ్‌లాడి 8004 పరుగులు చేసి ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నాడు. 8 శతకాలు, 55 అర్ధశతకాలు ఇలా లెక్కకు మిక్కిలి రికార్డులు తన పేరిట లిఖించుకున్నాడు. ఈ క్రమంలో ఐదు సీజన్లలో జట్టు తరఫున అత్యధిక స్కోరు చేసిన ఆటగాడిగా నిలిచిన కోహ్లి... చాంపియన్స్ ట్రోఫీ తాజా ఫామ్‌ను ఐపీఎల్‌లోనూ కొనసాగించాలని భావిస్తున్నాడు. గతేడాది కోల్‌కతా నైట్‌రైడర్స్ చాంపియన్‌గా నిలవడంలో కీలక పాత్ర పోషించిన ఫిల్ సాల్ట్... ఫార్మాట్‌తో సంబంధం లేకుండా రాణిస్తున్న ఇంగ్లండ్ యువ ఆల్‌రౌండర్ జాకబ్ బెథెల్... హార్డ్ హిట్టర్ లివింగ్‌స్టోన్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. రూ. 11 కోట్లు పెట్టి తీసుకున్న భారత వికెట్ కీపర్ బ్యాటర్ జితేశ్ శర్మ, స్పిన్ ఆల్‌రౌండర్ కృనాల్ పాండ్యాపై కూడా టీమ్ మేనేజ్మెంట్ ఆశలు పెట్టుకుంది. ఆండీ ఫ్లవర్ ఆర్సీబీ హెడ్‌కోచ్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తుండగా... దినేశ్ కార్తీక్ మెంటార్‌గా వ్యవహరించనున్నాడు.బౌలర్లపైనే భారం... బ్యాటింగ్ విషయంలో బలంగా ఉన్న బెంగళూరు... ఈసారి మెరుగైన బౌలింగ్ దళంతో బరిలోకి దిగనుంది. ఆస్థాన బౌలర్ సిరాజ్‌ను వదిలేసుకున్న ఆర్సీబీ... తిరిగి తీసుకునే అవకాశం వచ్చినా పట్టించుకోలేదు. రూ. 12.50 కోట్లు పెట్టి కొనుగోలు చేసుకున్న ఆ్రస్టేలియా స్పీడ్‌స్టర్ జోష్ హాజల్‌వుడ్, ఐపీఎల్లో అపార అనుభవం ఉన్న భువనేశ్వర్ కుమార్, గతేడాది మెరుగైన ప్రదర్శన చేసిన యశ్ దయాల్, దక్షిణాఫ్రికా పేసర్ ఇన్‌గిడి పేస్ భారాన్ని మోయనున్నారు. స్వప్నిల్ సింగ్, జాకబ్ బెథెల్, సుయశ్ శర్మ స్పిన్ బాధ్యతలు పంచుకోనున్నారు. అంతర్జాతీయ అనుభవం ఉన్న నాణ్యమైన స్పిన్నర్ లోటు స్పష్టంగా కనిపిస్తోంది. ఐపీఎల్లో ఇతర స్టేడియాలతో పోల్చుకుంటే కాస్త చిన్నదైన బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో ఈ బౌలింగ్ బృందం ప్రదర్శనపైనే ఆర్సీబీ విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి. ఆర్సీబీ జట్టు: రజత్ పాటీదార్ (కెప్టెన్ ), కోహ్లి, సాల్ట్, జితేశ్ శర్మ, దేవదత్ పడిక్కల్, స్వస్తిక్, లివింగ్‌స్టోన్, కృనాల్ పాండ్యా, స్వప్నిల్ సింగ్, టిమ్ డేవిడ్, రొమారియో షెఫర్డ్, మనోజ్, జాకబ్ బెథెల్, హాజల్‌వుడ్, భువనేశ్వర్ కుమార్, రసిక్, సుయశ్ శర్మ, నువాన్ తుషారా, ఇన్‌గిడి, అభినందన్ సింగ్, మోహిత్ రాఠి, యశ్ దయాల్. అంచనా ఇప్పటి వరకు ఐపీఎల్లో 9 సార్లు ప్లేఆఫ్స్‌కు చేరిన చరిత్ర ఉన్న ఆర్సీబీ... స్థాయికి తగ్గ ప్రదర్శన కనబరిస్తే ఈసారి కూడా ప్లే ఆఫ్స్‌కు చేరే అవకాశం ఉంది. -
IPL 2025: ముంబై ఇండియన్స్ బౌలర్‌కు నోటీసులు ఇచ్చిన పాకిస్తాన్ క్రికెట్ బోర్డు
ఐపీఎల్-2025లో భాగమైన ముంబై ఇండియన్స్ బౌలర్ కార్బిన్ బాష్‌కు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు నోటీసులు ఇచ్చింది. బాష్.. ఐపీఎల్ కాంట్రాక్ట్ కోసం పాకిస్తాన్ సూపర్ లీగ్ కాంట్రాక్ట్‌ను వదులుకున్నాడు. సౌతాఫ్రికా ఆల్‌రౌండర్ అయిన బాష్.. పాకిస్తాన్ సూపర్ లీగ్ 2025 ఎడిషన్ కోసం పెషావర్ జల్మీ ఫ్రాంచైజీతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. బాష్‌కు అనుకోకుండా ఐపీఎల్ ఆఫర్ రావడంతో పీఎస్ఎల్ కాంట్రాక్ట్‌కు నో చెప్పాడు. లిజాడ్ విలియమ్స్ గాయపడటంతో ముంబై ఇండియన్స్ బాష్‌ను రీప్లేస్‌మెంట్‌గా ఎంపిక చేసుకుంది. పీఎస్ఎల్ ఒప్పందాన్ని ఉల్లంఘించినందుకు గానూ పీసీబీ బాష్‌పై చర్యలకు ఉపక్రమించింది. ఫ్రాంచైజీ (పెషావర్ జల్మీ) ఏజెంట్ ద్వారా బాష్‌కు లీగల్ నోటీసులు పంపింది. కాంట్రాక్ట్ ఉల్లంఘించినందుకు గానూ వివరణ ఇవ్వాలని కోరింది. పీఎస్ఎల్ నుండి వైదొలగడం వల్ల ఎదురయ్యే పరిణామాలను వివరించింది. ఈ విషయాన్ని ఇవాళ (మార్చి 16) ఓ ప్రకటన ద్వారా వెల్లడించింది. కాగా, ఐపీఎల్ 2025, పాకిస్తాన్ సూపర్ లీగ్-2025 తేదీలు క్లాష్ అయ్యాయి. పీఎస్ఎల్-2025 ఏప్రిల్ 11 నుండి మే 25 వరకు జరగనుండగా.. ఐపీఎల్ 2025 మార్చి 22 నుండి మే 25 వరకు జరుగుతుంది. -
హోలీ ఆడినందుకు షమీ కూతురిపై మండిపడ్డ ముస్లిం మత పెద్ద
టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీని ప్రముఖ మతాధికారి, ఆల్ ఇండియా ముస్లిం జమాత్ అధ్యక్షుడు మౌలానా షాబుద్దీన్ రజ్వీ బరేల్వీ ఇటీవలికాలంలో తరుచూ టార్గెట్ చేస్తున్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీ-2025 సందర్భంగా షమీ ఎనర్జీ డ్రింక్ తాగడాన్ని తప్పుబట్టిన మౌలానా షాబుద్దీన్ రజ్వీ.. తాజాగా షమీ కూతురు ఐరా హోలీ ఆడటాన్ని పెద్ద ఇష్యూ చేశాడు. హోలీ రోజు ఐరా రంగులు పూసుకొని దిగిన ఫోటో ఒకటి సోషల్‌మీడియాలో ప్రత్యక్షం కావడంతో మౌలానా షాబుద్దీన్ రజ్వీ ఫైరయ్యాడు. పవిత్ర రంజాన్ మాసంలో ఐరా హోలీ ఆడటాన్ని తప్పుబట్టాడు. ఐరాను రంగులు పూసుకునేందుకు అనుమతించిన తల్లి హసీన్ జహాను తిట్టి పోశాడు. రంజాన్ మాసంలో ముస్లింలు హోలీ ఆడటం అక్రమమని.. షరియత్‌కు ఇది వ్యతిరేకమని అన్నాడు.ఐరా లాంటి చిన్నారి రంజాన్ యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకోకపోవచ్చు. రంజాన్ విశిష్టత తెలియకుండా ఆ చిన్నారి హెలీ ఆడి ఉంటే అది నేరం కాదు. అయితే ఐరా రంజాన్ పవిత్రత తెలిసి కూడా హోలీ ఆడి ఉంటే మాత్రం అది ఇస్లాం చట్టానికి విరుద్ధమని ఓ వీడియో ద్వారా సందేశాన్ని పంపాడు. ఐరా విషయంలో మౌలానా షాబుద్దీన్ రజ్వీ స్పందించిన తీరును చాలా మంది తప్పుబడుతున్నారు. చిన్నారి సరదాగా రంగులు పూసుకుంటే ఇంత రాద్దాంతం చేయాలా అని మండిపడుతున్నారు. కొందరేమో ఇందులో చిన్నారి ఐరా తప్పు లేదు కానీ, రంజాన్ మాసం అని తెలిసి కూడా ఆమె తల్లి హోలీ ఆడేందుకు అనుమతించడం పెద్ద నేరమని కామెంట్లు చేస్తున్నారు. ఈ విషయంలో ఐరా తల్లిని తీవ్ర పదజాలంతో దూషిస్తున్నారు. ఐరా తల్లి హసీన్ జహా మహ్మద్ షమీతో విడాకులు తీసుకొని ప్రస్తుతం వేరుగా ఉంటుంది. కాగా, మౌలానా షాబుద్దీన్ రజ్వీ ఛాంపియన్స్ ట్రోఫీ సందర్భంగా షమీ ఎనర్జీ డ్రింక్ తాగినప్పుడు కూడా పెద్ద రాద్దాంతం చేశాడు. రంజాన్ మాసంలో రోజా (ఉపవాసం) ఉండకుండా షమీ పెద్ద నేరం చేశాడని అరోపించాడు. ఇలా చేసి షమీ ఇస్లాం సమాజానికి ఏం సందేశం ఇవ్వాలని అనుకుంటున్నాడని విమర్శించాడు. మౌలానా షాబుద్దీన్ రజ్వీ వ్యాఖ్యలపై అప్పట్లో భారత క్రికెట్ అభిమానులు మండిపడ్డారు. షమీ ఏం తప్పు చేశాడని ఇంత పెద్ద షో చేస్తున్నావని రజ్వీని ప్రశ్నించారు. దేశం కోసం శ్రమించాల్సి వచ్చినప్పుడు ఉపవాసం ఉండాలని అనడం ఎంత వరకు సమంజసమని నిలదీశారు. మతోన్మాధం ఎక్కువైనప్పుడే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారని చురకలంటించారు.ఇదిలా ఉంటే, షమీ ఛాంపియన్స్ ట్రోఫీలో అద్భుతంగా రాణించి భారత్ టైటిల్ గెలవడంలో తనవంతు పాత్ర పోషించాడు. ఆ టోర్నీలో షమీ 5 మ్యాచ్‌ల్లో 9 వికెట్లు తీసి టోర్నీ లీడింగ్ వికెట్ టేకర్ల జాబితాలో నాలుగో స్థానంలో నిలిచాడు. ఈ టోర్నీలో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్లు తీసిన షమీ.. ఆసీస్‌తో జరిగిన సెమీస్‌లో 3 వికెట్లు పడగొట్టాడు. షమీ త్వరలో ఐపీఎల్లో ఆడనున్నాడు. ఈ సీజన్లో షమీని సన్‌రైజర్స్ హైదరాబాద్ కొనుగోలు చేసింది. షమీ గత సీజన్లో గుజరాత్ టైటాన్స్‌కు ఆడాడు. మెగా వేలంలో షమీని సన్‌రైజర్స్ రూ. 10 కోట్లకు దక్కించుకుంది. -
రాజవంశీకుడైన మాజీ క్రికెటర్ మృతి
రాజస్థాన్ రంజీ జట్టు మాజీ కెప్టెన్, మేవార్ పూర్వ రాజకుటుంబ సభ్యుడు, రాజ్‌పుత్ రాజు మహారాణా ప్రతాప్ వారసుడు, హెచ్ఆర్హెచ్ (HRH) గ్రూప్ ఆఫ్ హోటల్స్ చైర్మన్ అయిన అరవింద్ సింగ్ మేవార్ (81) ఇవాళ (మార్చి 16) తెల్లవారుజామున ఉదయపూర్‌లోని తన స్వగృహంలో కన్నుమూశారు. మేవార్ చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ, ఉదయపూర్‌లోని సిటీ ప్యాలెస్‌లో చికిత్స పొందారు. అరవింద్ సింగ్ మేవార్ మహారాణా భగవత్ సింగ్ మేవార్ మరియు సుశీలా కుమారి మేవార్ దంపతుల చిన్న కుమారుడు. అరవింద్‌కు భార్య విజయ్‌రాజ్ కుమారి, కుమారుడు లక్ష్యరాజ్ సింగ్ మేవార్, కుమార్తెలు భార్గవి కుమారి మేవార్, పద్మజ కుమారి పర్మార్ ఉన్నారు. అరవింద్ సింగ్ మేవార్ మృతికి గౌరవ సూచకంగా ఉదయపూర్‌లోని సిటీ ప్యాలెల్ను ఆది, సోమవారాల్లో మూసివేయబడుతుంది.మేవార్ అజ్మీర్‌లోని ప్రతిష్టాత్మక మాయో కళాశాలలో విద్యనభ్యసించారు. UK, USAలలో హోటల్ మేనేజ్మెంట్ కోర్సులు చేశారు. తదనంతరం వివిధ అంతర్జాతీయ హోటళ్లలో శిక్షణ పొందాడు. ఆసక్తిగల క్రికెటర్ అయిన మేవార్ 1945-46లో రాజస్థాన్ రంజీ జట్టు కెప్టెన్‌గా వ్యవహరించారు. మేవార్ రెండు దశాబ్దాల పాటు క్రికెటర్‌గా కెరీర్‌ను కొనసాగించాడు. మేవార్ ప్రొఫెషనల్ పోలో ఆటగాడు కూడా. UKలో అతను కేంబ్రిడ్జ్ మరియు న్యూమార్కెట్ పోలో క్లబ్లో 'ది ఉదయపూర్ కప్'ను స్థాపించాడు. 1991లో మేవార్ పోలో జట్టు 61వ కావల్రీ ఆటగాళ్లను ఓడించి ప్రతిష్టాత్మక ప్రెసిడెంట్స్ కప్‌ను కైవసం చేసుకుంది.ఆసక్తిగల పైలట్ కూడా అయిన మేవార్.. మైక్రోలైట్ విమానంలో భారతదేశం అంతటా సోలో విమానాలు నడిపారు. మేవార్ ఉదయపూర్‌లోని మహారాణా ఆఫ్ మేవార్ ఛారిటబుల్ ఫౌండేషన్‌కు ఛైర్మన్ మరియు మేనేజింగ్ ట్రస్టీగా ఉన్నారు. -
శ్రీలంకను చిత్తు చేసిన న్యూజిలాండ్
మహిళల క్రికెట్లో భాగంగా శ్రీలంకతో ఇవాళ (మార్చి 16) జరిగిన టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో రెండో మ్యాచ్ ఇది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన న్యూజిలాండ్ శ్రీలంకను 113 పరుగులకే (20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి) పరిమితం చేసింది. న్యూజిలాండ్ బౌలర్లు బ్రీ ఇల్లింగ్, జెస్ కెర్ తలో 2 వికెట్లు పడగొట్టగా.. ఫ్లోరా డెవాన్‌షైర్, బ్రూక్ హ్యలీడే చెరో వికెట్ దక్కించుకున్నారు. కెప్టెన్ సూజీ బేట్స్ (4-1-16-0) వికెట్ తీయకపోయినా అత్యంత పొదుపుగా బౌలింగ్ చేసింది. శ్రీలంక ఇన్నింగ్స్‌లో మనుడి ననయక్కార (35) టాప్ స్కోరర్‌గా నిలువగా.. చమారీ ఆటపట్టు (23), కవిశ దిల్హరి (12), నిలాక్షి డిసిల్వ (20), హర్షిత మాధవి (11) రెండంకెల స్కోర్లు చేయగలిగారు. విష్మి గౌతమ్ డకౌట్ కాగా.. సుగంధిక కుమార్ 1 పరుగు చేసి ఔటయ్యారు.అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన న్యూజిలాండ్ 18.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. సుజీ బేట్స్ (47), బ్రూక్ హ్యాలీడే (46 నాటౌట్) మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్‌లు ఆడి న్యూజిలాండ్‌ను గెలిపించారు. న్యూజిలాండ్ ప్లేయర్స్‌లో జార్జియా ప్లిమ్మర్ 4, ఎమ్మా మెక్లియాడ్ 11 పరుగులకు ఔటయ్యారు. హ్యాలీడే.. ఇజ్జీ షార్ప్‌తో (8 నాటౌట్) కలిసి న్యూజిలాండ్‌ను విజయతీరాలకు చేర్పింది. ఈ గెలుపుతో న్యూజిలాండ్ మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-1తో నిలిచింది. తొలి టీ20లో శ్రీలంక న్యూజిలాండ్‌పై సంచలన విజయం సాధించింది. నిర్ణయాత్మక మూడో టీ20 మార్చి 18న డునెడిన్‌లో జరుగనుంది. కాగా, మూడు వన్డేలు, మూడు టీ20ల సిరీస్‌ల కోసం శ్రీలంక న్యూజిలాండ్‌లో పర్యటిస్తుంది. ఈ పర్యటనలో తొలుత జరిగిన వన్డే సిరీస్‌ను ఆతిథ్య న్యూజిలాండ్ 2-0 తేడాతో గెలుపొందింది. -
IPL 2025: టైటిల్ లక్ష్యంగా బరిలోకి దిగనున్న సన్ రైజర్స్ హైదరాబాద్
గత సీజన్ లో అనూహ్యంగా ఫైనల్ కి దూసుకొచ్చి కోల్‌కతా నైట్ రైడర్స్ చేతిలో పరాజయంపాలై రన్నరప్ టైటిల్ తో సరిపెట్టుకున్న సన్ రైజర్స్ హైదరాబాద్ ఈ సీజన్ లో మరింత దూకుడుగా ఆడి టైటిల్ సాధించాలని ప్రణాళిక సిద్దం చేసుకుంది.ఆరు సంవత్సరాల విరామం తర్వాత సన్ రైజర్స్ 2024లో తొలిసారి ఫైనల్‌కు చేరుకుంది. సన్ రైజర్స్ తమ మొదటి ఏడు మ్యాచ్ ల లో ఐదింటి లో విజయం సాధించి గత సీజన్ లో శుభారంభం చేసింది. చివరి దశలో మరో మూడు విజయాలు నమోదు చేసుకొని గ్రూప్ దశ చివరిలో రాజస్థాన్ రాయల్స్ తో పాటు 17 పాయింట్లతో సమంగా నిలిచింది. కానీ మెరుగైన నెట్ రన్ రేట్ తో సన్ రైజర్స్ రెండవ స్థానం పొందింది. ఆ తర్వాత క్వాలిఫైయర్ 1లో కోల్‌కతా నైట్ రైడర్స్ చేతిలో పరాజయం చవిచూసింది. కానీ క్వాలిఫైయర్ 2లో రాజస్థాన్ రాయల్స్ ను ఓడించి ఫైనల్‌కు చేరుకుని అక్కడ మళ్ళీ నైట్ రైడర్స్ చేతిలో పరాజయం చేతిలో పరాజయం చవిచూసి రన్నర్ ఆప్ తో సర్దుకోవాల్సి వచ్చింది. బ్యాటింగ్ బ్యాండ్ బాజా గత సీజన్లో బ్యాటింగ్ బ్యాండ్ బాజాతో ప్రారంభించి ప్రత్యర్థులను హడలెత్తించిన సన్ రైజర్స్ ఈ ఏడాది కూడా తమ ఫార్ములా లో పెద్దగా మార్పులు చేయకపోవచ్చు. ఆస్ట్రేలియా కి చెందిన ట్రావిస్ హెడ్, భారత్ యువ ఓపెనర్ అభిషేక్ శర్మ ల ద్వయం ప్రారంభం లో తమ విధ్వంసకర బ్యాటింగ్ తో ప్రత్యర్థులను పరుగులు పెట్టించారు. గత సీజన్ లో మూడుసార్లు 250 పరుగులు కి పైగా స్కోర్ చేసి సన్ రైజర్స్ ఐపీఎల్ చరిత్రలో అత్యధిక స్కోరు సాధించిన జట్టుగా రికార్డును సృష్టించింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పై 3 వికెట్లకు 287 పరుగులు స్కోర్ తో కొత్త రికార్డ్ ని నమోదు చేసింది. అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, హెన్రిచ్ క్లాసెన్ మరియు నితీష్ కుమార్ రెడ్డి ఇప్పటికీ లైనప్‌లో ఉండటంతో మరియు వేలంలో ఇషాన్ కిషన్‌ను చేర్చడంతో, సన్ రైజర్స్ హైదరాబాద్ తన పంథాను మార్చుకునే అవకాశం లేదు. ఈ సీజన్లో కూడా సన్ రైజర్స్ యొక్క టాప్ ఐదుగురు అలాగే కొనసాగే అవకాశముంది. అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, నితీష్ కుమార్ రెడ్డి, ఇషాన్ కిషన్, హెన్రిచ్ క్లాసెన్. లీగ్‌లోని ప్రతి బౌలింగ్ లైనప్‌ను వణికించడానికి ఇది సరిపోతుంది. కర్ణాటకకు చెందిన అభినవ్ మనోహర్ కూడా దిగువ ఆర్డర్లో ఫైర్‌పవర్‌ను జోడిస్తాడు. లీగ్‌లో అత్యంత శక్తివంతమైన బ్యాటింగ్ లైనప్ సన్ రైజర్స్ హైదరాబాద్ సొంతం.బలహీనంగా బౌలింగ్ అయితే సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలింగ్ కొంత బలహీనంగా ఉన్నట్టు కనిపిస్తోంది. భువనేశ్వర్ కుమార్, టి నటరాజన్‌ను తప్పించి వారి స్థానంలో మహమ్మద్ షమీ మరియు హర్షల్ పటేల్‌ను జట్టులోకి తీసుకున్నారు. ఇక సన్ రైజర్స్ ప్రధాన స్పిన్నర్ రాహుల్ చాహర్ కూడా ఇటీవలి కాలంలో ఆశించిన ఫామ్‌లో లేడు. దీంతో కెప్టెన్ పాట్ కమ్మిన్స్ భారత్ సీనియర్ పేసర్ మహమ్మద్ షమీతో కొత్త బంతిని పంచుకోవచ్చు. సన్ రైజర్స్ తమ ఓపెనింగ్ బౌలర్లుగా ప్రపంచ స్థాయి బౌలింగ్ జతతో బరిలోకి దిగనుంది. అయితే కమ్మిన్స్ మరియు ఆస్ట్రేలియా స్పిన్నర్ ఆడమ్ జంపా ఇద్దరూ విదేశీ ఆటగాళ్లు అయినందున వారిపై భారం ఎక్కువగా ఉండే అవకాశముంది, జంపా, కమిండు మెండిస్, ఎషాన్ మలింగ మరియు వియాన్ ముల్డర్లలో ఒకరిని నాల్గవ విదేశీ ఆటగాడిగా ఆడించాల్సి ఉంటుంది. జంపా ఆడటం అంటే చాహర్‌కు విశ్రాంతి ఇవ్వడం లేదా ఇద్దరు లెగ్ స్పిన్నర్లను ఫీల్డింగ్ చేయడం.ప్రధాన ఆటగాళ్లు:పాట్ కమ్మిన్స్: ప్రపంచ ప్రధాన ఫాస్ట్ బౌలర్లలో ఒకడైన పాట్ కమ్మిన్స్ జట్టు పగ్గాలు చేపట్టిన తర్వాత సన్ రైజర్స్ దశ మారిపోయింది. కమ్మిన్స్ నాయకత్వం, అపార అనుభవం ఒత్తిడి లో తట్టుకొని బౌలింగ్ చేయగల సామర్ధ్యం సన్ రైజర్స్ విజయాల్లో కీలక పాత్ర వహించే అవకాశముంది.ట్రావిస్ హెడ్: ట్రావిస్ హెడ్ సన్ రైజర్స్ బ్యాటింగ్ లైనప్‌లో చాలా ముఖ్యమైన భాగంగా మారాడు. టాప్ ఆఫ్ ది ఆర్డర్లో అతని విధ్వంసకర బ్యాటింగ్ సన్ రైజర్స్ కి శుభారంభం ఇస్తుందనడంలో సందేహం లేదు.హెన్రిచ్ క్లాసెన్: టి 20 క్రికెట్లో అత్యంత విధ్వంసక మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్లలో ఒకడిగా హెన్రిచ్ క్లాసెన్ ఖ్యాతి గడించాడు. సులభంగా బౌండరీలను క్లియర్ చేయగల అతని సామర్థ్యం మరియు స్కోరింగ్ రేటును వేగవంతం చేయడంలో నైపుణ్యం అతన్ని సన్ రైజర్స్ కి గేమ్-ఛేంజర్‌గా చేస్తాయి.అభిషేక్ శర్మ: యువ ఆల్ రౌండర్ అభిషేక్ శర్మ గత సీజన్ లో నిలకడగా ఆడి తన సామర్థ్యాన్ని ప్రదర్శించాడు. అతని దూకుడు బ్యాటింగ్ శైలి, మెరుగైన బౌలింగ్ సన్ రైజర్స్ కి అదనపు బలాన్నిస్తాయి.సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుపాట్ కమ్మిన్స్, అభిషేక్ శర్మ, నితీష్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్, ట్రావిస్ హెడ్, మహ్మద్ షమీ, హర్షల్ పటేల్, ఇషాన్ కిషన్, రాహుల్ చాహర్, ఆడమ్ జంపా, అథర్వ తైడే, అభినవ్ మనోహర్, సిమర్జీత్ సింగ్, జీషాన్ అన్సారీ, జయదేవ్ ఉనద్కట్, కమిందు మెండిస్, అనికేత్ వర్మ, ఎషాన్ మలింగ, సచిన్ బేబీ, వియాన్ ముల్డర్. -
బీసీసీఐ నిర్ణయంపై కోహ్లి అసంతృప్తి
బీసీసీఐ కొత్తగా ప్రవేశపెట్టిన కుటుంబ నియంత్రణ నిర్ణయంపై (విదేశీ పర్యటనల్లో ఆటగాళ్ల కుటుంబాలపై అంక్షలు) టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి అసంతృప్తి వ్యక్తం చేశాడు. విదేశీ పర్యటనల్లో కుటుంబాలు దగ్గరగా లేకపోతే ఆటగాళ్లు మానసిక సమస్యలు ఎదుర్కొంటారని అన్నాడు. దీని ప్రభావం జట్టు జయాపజయాలపై పడుతుందని తెలిపాడు. కఠిన సమయాల్లో కుటుంబాలు వెంట ఉంటే ఆటగాళ్లకు ఊరట కలుగుతుందని పేర్కొన్నాడు. పర్యటనల్లో ఆటగాళ్లకు కుటంబాలు తోడుండటం ఎంతో ముఖ్యమో కొంతమందికి తెలియట్లేదని బీసీసీఐపై పరోక్షంగా తన అసహనాన్ని వ్యక్తం చేశాడు. మ్యాచ్‌లు ముగిశాక ఆటగాళ్లు ఒంటరిగా కూర్చొని బాధపడాలా అని ప్రశ్నించాడు. కుటుంబాలు దగ్గరగా ఉంటే ఆటగాళ్ల ప్రదర్శన మరింత మెరుగుపడుతుందని తెలిపాడు. ఐపీఎల్ 2025 ప్రారంభానికి ముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ఏర్పాటు చేసిన ఇన్నోవేషన్ ల్యాబ్ ఇండియన్ స్పోర్ట్స్ సమ్మిట్‌లో కోహ్లి ఈ విషయాలను పంచుకున్నాడు.కాగా, బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024-25 పరాజయం తర్వాత బీసీసీఐ విదేశీ పర్యటనల్లో ఆటగాళ్ల కుటుంబాలపై నియంత్రణ విధించింది. ఈ మేరకు ఓ రూల్‌ను జారీ చేసింది. కుటుంబ నియంత్రణ రూల్ ప్రకారం.. 45 రోజుల కంటే తక్కువ వ్యవధి ఉండే విదేశీ పర్యటనల్లో ఆటగాళ్ల కుటుంబాలకు అనుమతి లేదు. 45 రోజుల కంటే ఎక్కువ నిడివితో సాగే విదేశీ పర్యటనల్లో ఆటగాళ్ల కుటుంబాలను రెండు వారాల తర్వాత అనుమతిస్తారు. మొత్తంగా కుటుంబాలు ఆటగాళ్లతో కేవలం 14 రోజులు మాత్రమే గడిపే అవకాశం ఉంటుంది.ఇదిలా ఉంటే, తాజాగా ముగిసిన ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో భారత్ విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. ఈ టోర్నీలో విరాట్ అద్భుతంగా ఆడి భారత్ మూడోసారి ఛాంపియన్స్ ట్రోఫీ గెలవడంలో కీలకంగా వ్యవహరించాడు. ఛాంపియన్స్ ట్రోఫీ అనంతరం కొద్ది రోజులు దుబాయ్‌లోనే సేద తీరిన విరాట్.. తాజాగా ఐపీఎల్ 2025 సీజన్ కోసం తన జట్టుతో చేరాడు. ఐపీఎల్లో విరాట్ ప్రాతినిథ్యం వహించే ఆర్సీబీ.. మార్చి 22న డిఫెండింగ్ ఛాంపియన్ కేకేఆర్‌తో జరిగే మ్యాచ్‌తో తమ జర్నీ ప్రారంభిస్తుంది. ఐపీఎల్లో ఇప్పటివరకు ఒక్క టైటిల్ కూడా గెలవని ఆర్సీబీ.. ఈ సాలా కప్ నమ్మదే అంటూ మరోసారి తమ అదృష్టాన్ని పరీక్షించుకోనుంది.ఆర్సీబీ ఈ ఏడాది జట్టు మొత్తాన్ని ప్రక్షాళన చేసింది. గత రెండు సీజన్లు కెప్టెన్‌గా వ్యవహరించిన డుప్లెసిస్‌ను తప్పించి కొత్త కెప్టెన్‌గా రజత్ పాటిదార్‌ను నియమించుకుంది. ఈ ఏడాది ఆర్సీబీలోకి టిమ్ డేవిడ్, లియామ్ లివింగ్‌స్టోన్, జేకబ్ బేతెల్, ఫిల్ సాల్ట్, రొమారియో షెపర్డ్, జోష్ హాజిల్‌వుడ్ లాంటి విదేశీ స్టార్లు వచ్చారు. చాలాకాలం పాటు తమకు సేవలందించిన హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్‌ను ఆర్సీబీ ఈ ఏడాది వదులుకుంది. ఈ ఏడాది ఆర్సీబీలోకి కృనాల్ పాండ్యా, దేవ్‌దత్ పడిక్కల్, భువనేశ్వర్ కుమార్ లాంటి దేశీయ స్టార్లు కూడా వచ్చారు. జట్టు మొత్తం మారడంతో తమ ఫేట్ కూడా మారుతుందని ఆర్సీబీ అభిమానులు ఆశిస్తున్నారు.ఐపీఎల్-2025లో ఆర్సీబీ జట్టు..రజత్ పాటిదార్ (కెప్టెన్), విరాట్ కోహ్లి, దేవ్‌దత్ పడిక్కల్, టిమ్ డేవిడ్, స్వస్థిక్ చికారా, కృనాల్ పాండ్యా, మనోజ్ భండగే, రొమారియో షెపర్డ్, స్వప్నిల్ సింగ్, జేకబ్ బేతెల్, లియామ్ లివింగ్‌స్టోన్, మోహిత్ రతీ, ఫిలిప్ సాల్ట్, జితేశ్ శర్మ, జోష్ హాజిల్‌వుడ్, భువనేశ్వర్ కుమార్, లుంగి ఎంగిడి, రసిక్ సలాం దార్, సుయాశ్ శర్మ, యశ్ దయాల్, నువాన్ తుషార, అభినందన్ సింగ్ -
IPL 2025: విధ్వంసం సృష్టించిన రింకూ సింగ్
ఐపీఎల్ 2025 సీజన్ ప్రారంభానికి ముందు కేకేఆర్ స్టార్ బ్యాటర్ రింకూ సింగ్ ఫామ్‌లోకి వచ్చాడు. నిన్న (మార్చి 15) జరిగిన కేకేఆర్ ఇన్ట్రా స్క్వాడ్ మ్యాచ్‌లో చెలరేగిపోయాడు. బౌండరీలు, సిక్సర్లతో విరుచుకుపడి విధ్వంసం సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో రింకూ 33 బంతులు ఎదుర్కొని 77 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఫలితంగా అతను ప్రాతినిథ్యం వహించిన టీమ్ పర్పుల్ టీమ్ గోల్డ్‌పై విజయం సాధించింది.ఐపీఎల్ ప్రారంభానికి మరి కొద్ది రోజుల సమయం మాత్రమే ఉండటంతో అన్ని ఫ్రాంచైజీలు ప్రాక్టీస్‌ను ముమ్మరం చేశాయి. ఇంట్రా స్క్కాడ్ మ్యాచ్‌లు ఆడుతూ బిజీగా గడుపుతున్నాయి. ఈ క్రమంలో డిఫెండింగ్ ఛాంపియన్ కేకేఆర్ కూడా ఇన్ట్రా స్క్వాడ్ మ్యాచ్‌లు ఆడుతుంది. నిన్న జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్ రెండు టీమ్‌లుగా విడిపోయి ప్రాక్టీస్ మ్యాచ్ ఆడింది. టీమ్ పర్పుల్‌కు అజింక్య రహానే.. టీమ్ గోల్డ్‌కు వెంకటేశ్ అయ్యర్ సారథ్యం వహించారు.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమ్ గోల్డ్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 215 పరుగులు చేసింది. వెంకటేశ్ అయ్యర్ (61) మెరుపు అర్ద సెంచరీతో సత్తా చాటాడు. లవ్నిత్ సిసోడియా 46 పరుగులతో రాణించాడు.అనంతరం 216 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన టీమ్ పర్పుల్.. రింకూ సింగ్ చెలరేగడంతో 15.5 ఓవర్లలోనే విజయతీరాలకు చేరింది. ప్రాక్టీస్ మ్యాచ్ కావడంతో విజయం సాధించాక కూడా మ్యాచ్‌ను కొనసాగించారు. రెండో లక్ష్యంగా టీమ్ పర్పుల్‌కు 250 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించారు. ఈ లక్ష్యాన్ని కూడా టీమ్ పర్పుల్ మరో 13 బంతులు మిగిలుండగానే ఛేదించింది. మరో లక్ష్యంగా టీమ్ పర్పుల్‌కు 280 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించారు. అయితే ఈసారి టీమ్ పర్పుల్ 280 పరుగుల లక్ష్యానికి 2 పరుగుల దూరంలో నిలిచిపోయింది. నిర్ణీత ఓవర్లలో టీమ్ పర్పుల్ 5 వికెట్ల నష్టానికి 277 పరుగులు చేసింది. టీమ్ పర్పుల్ ఇన్నింగ్స్‌లో రింకూ సింగ్‌తో పాటు ఆండ్రీ రసెల్ (64 నాటౌట్), క్వింటన్ డికాక్ (52) చెలరేగిపోయారు.ఇదిలా ఉంటే, ఐపీఎల్-2025 సీజన్లో కేకేఆర్ జర్నీ లీగ్ ఆరంభ రోజున (మార్చి 22) ఆర్సీబీతో జరిగే మ్యాచ్‌తో మొదలవుతుంది. ఈ మ్యాచ్ కేకేఆర్ హెం గ్రౌండ్ అయిన ఈడెన్ గార్డెన్స్‌లో జరుగుతుంది. గత సీజన్ ఫైనల్లో శ్రేయస్ అయ్యర్ నేతృత్వంలోని కేకేఆర్ సన్‌నైజర్స్ హైదరాబాద్‌ను చిత్తుగా ఓడించి, తమ మూడో ఐపీఎల్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. గత సీజన్ తర్వాత శ్రేయస్ అయ్యర్ కేకేఆర్‌ను విడిచిపెట్టాడు. మెగా వేలంలో శ్రేయస్‌ను పంజాబ్ కొనుగోలు చేసింది. శ్రేయస్‌ను ఆ జట్టు కెప్టెన్‌గా కూడా ఎంపిక చేసింది. శ్రేయస్ వీడటంతో కేకేఆర్‌కు కెప్టెన్ ఎంపిక అనివార్యమైంది. మెగా వేలంలో బేస్ ధర రూ. 1.5 కోట్లకు కొనుగోలు చేసిన అజింక్య రహానేను కేకేఆర్ కెప్టెన్‌గా ఎంపిక చేసింది. అతనికి డిప్యూటీగా (వైస్ కెప్టెన్) వెంకటేశ్ అయ్యర్‌ను నియమించింది. తొలుత వెంకటేశ్ అయ్యర్‌నే కేకేఆర్ కెప్టెన్‌గా ఎంపిక చేస్తారని ప్రచారం జరిగింది. అయితే చివరి నిమిషంలో రహానే ఎంట్రీ ఇచ్చి కెప్టెన్సీని ఎగరేసుకుపోయాడు. మెగా వేలంలో రహానేను కేకేఆర్ తొలుత పట్టించుకోలేదు. అమ్ముడుపోని ఆటగాళ్ల రౌండ్లో రహానేను కేకేఆర్ దక్కించుకుంది.2025 ఐపీఎల్ సీజన్ కోసం కేకేఆర్ జట్టు..అజింక్య రహానే (కెప్టెన్), వెంకటేశ్ అయ్యర్ (వైస్ కెప్టెన్), మనీశ్ పాండే, రింకూ సింగ్, రోవ్‌మన్ పావెల్, అంగ్క్రిష్ రఘువంశీ, అనుకూల్ రాయ్, మొయిన్ అలీ, రమన్‌దీప్ సింగ్, సునీల్ నరైన్, ఆండ్రీ రసెల్, క్వింటన్ డికాక్, లవ్నిత్ సిసోడియా, రహ్మానుల్లా గుర్బాజ్, వరుణ్ చక్రవర్తి, వైభవ్ అరోరా, అన్రిచ్ నోర్జే, ఉమ్రాన్ మాలిక్, మయాంక్ మార్కండే, హర్షిత్ రాణా, స్పెన్సర్ జాన్సన్ -
పాకిస్తాన్ సూపర్ హిట్ పాటను పాడిన పంత్.. షాకైన జహీర్ ఖాన్.. వైరల్ వీడియో
టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ త్వరలో ప్రారంభం కానున్న ఐపీఎల్-2025 కోసం సన్నాహకాలు మొదలుపెట్టాడు. గత వారమంతా సోదరి వివాహ వేడుకలతో బిజీగా గడిపిన పంత్.. నిన్ననే తన కొత్త ఐపీఎల్ జట్టు లక్నో సూపర్ జెయింట్స్‌తో కలిశాడు. పంత్‌ను ఎల్ఎస్జీ మేనేజ్మెంట్ గతేడాది జరిగిన మెగా వేలంలో రికార్డు ధరకు (రూ. 27 కోట్లు) సొంతం చేసుకుంది. ఐపీఎల్ చరిత్రలో ఓ ఆటగాడికి లభించిన అత్యధిక ధర ఇదే. పంత్‌ను ఎల్ఎస్జీ యాజమాన్యం కెప్టెన్‌గా కూడా ఎంపిక చేసింది. గత సీజన్ వరకు కెప్టెన్‌గా ఉండిన కేఎల్ రాహుల్‌ను లక్నో యాజమాన్యం మెగా వేలానికి ముందు వదిలేసింది. రాహుల్‌ను వేలంలో ఢిల్లీ కొనుగోలు చేసింది. లక్నో.. ఐపీఎల్ 2025 సీజన్‌ను మార్చి 24న ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగే మ్యాచ్‌తో మొదలుపెడుతుంది. ఈ మ్యాచ్ విశాఖలో జరుగనుంది.2022లో గుజరాత్‌తో పాటు ఐపీఎల్ అరంగేట్రం చేసిన లక్నో మూడు సీజన్లలో ఒక్క టైటిల్ కూడా గెలువలేదు. తొలి రెండు సీజన్లలో మూడో స్థానంలో సరిపెట్టుకున్న లక్నో.. గత సీజన్లో పేలవ ప్రదర్శన చేసి ఏడో స్థానంలో నిలిచింది. కొత్త కెప్టెన్ రిషబ్ పంత్ నాయకత్వంలో ఈ సారైనా టైటిల్ సాధించాలని లక్నో అభిమానులు కోరుకుంటున్నారు. మరి పంత్ లక్నో ఆశలను నిజం చేస్తాడో లేక నీరుగారుస్తాడో వేచి చూడాలి.Part-time wicketkeeper-batter. Full-time karaoke singer 🎤 pic.twitter.com/mFf2BC77e3— Lucknow Super Giants (@LucknowIPL) March 15, 2025ఇదిలా ఉంటే, పంత్‌కు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరలవుతుంది. ఈ వీడియోలో పంత్ పాకిస్తాన్ సూపర్ హిట్ పాట 'అఫ్సానే'ను పాడుతూ కనిపించాడు. పాకిస్తానీ బ్యాండ్ యంగ్ స్టన్నర్స్కు చెందిన ఈ పాటను పంత్ అద్భుతంగా పాడాడు. పంత్‌లో సింగింగ్ టాలెంట్ చూసి లక్నో మెంటార్ జహీర్ ఖాన్ షాక్‌కు గురయ్యాడు. పంత్ పాట పాడుతుండగా జహీర్ అతన్ని చూస్తూ ఉండిపోయాడు. దీనికి సంబంధించిన వీడియోను లక్నో సూపర్ జెయింట్స్ యాజమాన్యం తమ సోషల్‌మీడియా ఖాతాల్లో షేర్ చేసింది. ఈ వీడియోకు పార్ట్ టైమ్ వికెట్‌కీపర్ బ్యాటర్.. ఫుల్ టైమ్ కరావోకే సింగర్ అని క్యాప్షన్ ఇచ్చింది. ఈ వీడియోకు నెటిజన్ల నుంచి విపరీతమైన స్పందన వస్తుంది. పంత్ సింగింగ్ టాలెంట్‌కు జనాలు ముగ్దులవుతున్నారు. చిన్న పిల్లాడిలా, ఎప్పుడూ ఏదో ఒక కోతి పని చేస్తూ ఉండే పంత్‌లో ఇంత టాలెంట్ ఉందా అని ముక్కున వేలేసుకుంటున్నారు.కాగా, 27 ఏళ్ల పంత్ 2022వ సంవత్సరం చివర్లో కారు ప్రమాదానికి గురై తీవ్ర గాయాలపాలైన విషయం తెలిసిందే. ఈ ఘటనతో పంత్ కెరీర్ ముగుస్తుందని అంతా అనుకున్నారు. అయితే పంత్ మొక్కవోని మనో ధైర్యంతో గాయాలను జయించి పునర్జన్మ సాధించాడు. రీఎంట్రీలో పంత్ గతం కంటే మెరుగ్గా ఆడుతున్నాడు. గతేడాది ఐపీఎల్‌తో రీఎంట్రీ ఇచ్చిన పంత్.. ఆ సీజన్లో ఢిల్లీ తరఫున లీడింగ్ రన్‌స్కోరర్‌గా నిలిచాడు. అనంతరం పంత్ భారత జట్టుకు కూడా ఎంపికై టీ20 వరల్డ్‌కప్-2025, ఛాంపియన్స్ ట్రోఫీ-2025 గెలిచాడు.2016లో ఐపీఎల్ కెరీర్ ప్రారంభించిన పంత్.. వరుసగా ఎనిమిది సీజన్ల పాటు ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఆడాడు. పంత్ ఐపీఎల్లో 111 మ్యాచ్‌లు ఆడి 148.93 స్ట్రయిక్‌రేట్‌తో3284 పరుగులు చేశాడు. ఇందులో సెంచరీ, 18 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.2025 సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్ జట్టు..రిషబ్ పంత్ (కెప్టెన్), డేవిడ్ మిల్లర్, హిమ్మత్ సింగ్, ఎయిడెన్ మార్క్రమ్, ఆయుశ్ బదోని, అబ్దుల్ సమద్, యువరాజ్ చౌదరీ, షాబాజ్ అహ్మద్, మిచెల్ మార్ష్, అర్శిన్ కులకర్ణి, ఆర్ఎస్ హంగార్గేకర్, మాథ్యూ బ్రీట్జ్కీ, నికోలస్ పూరన్, ఆర్యన్ జుయల్, రవి భిష్ణోయ్, మయాంక్ యాదవ్, ఆకాశ్‌దీప్, మణిమారన్ సిద్దార్థ్, షమార్ జోసఫ్, ఆవేశ్ ఖాన్, ప్రిన్స్ యాదవ్, మొహిసిన్ ఖాన్, ఆకాశ్ మహారాజ్ సింగ్, దిగ్వేశ్ రతీ -
శ్రీలంక కెప్టెన్ విధ్వంసం.. ఒకే ఓవర్లో 6 సిక్స్‌లు! వీడియో వైరల్
ఆసియా లెజెండ్స్ లీగ్ 2025లో శ్రీలంక దిగ్గజ ఆటగాడు తిసారా పెరీరా సంచలనం సృష్టించాడు. ఈ టోర్నీలో శ్రీలంక లయన్స్‌కు సారథ్యం వహిస్తున్న పెరీరా.. శనివారం ఆఫ్ఘనిస్తాన్ పఠాన్స్తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు.ఈ మ్యాచ్‌లో పెరీరా ఒకే ఓవర్లో వరుసగా 6 సిక్స్‌లు బాది అందరిని ఆశ్చర్యపరిచాడు. శ్రీలంక ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్ వేసిన స్పిన్నర్ అయాన్ ఖాన్ బౌలింగ్‌లో పెరీరా వరుసగా 6 బంతుల్లో ఆరు సిక్స్‌లు కొట్టాడు. అయాన్ ఖాన్ తన ఓవర్‌ను వైడ్‌తో ప్రారంభించాడు. ఆ తర్వాత పెరీరా వరుసగా మూడు సిక్సర్లు కొట్టాడు. మళ్లీ నాలుగో బంతిని అయన్ వైడ్‌గా సంధించాడు. మిగిలిన మూడు బంతులను కూడా పెరీరా సిక్సర్లగా మలిచాడు.35 బంతుల్లో సెంచరీ..ఐదో స్ధానంలో బ్యాటింగ్‌కు వచ్చిన పెరీరా.. అఫ్గాన్ బౌలర్లను ఊచకోత కోశాడు. మిరాజ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో తిసారా సిక్సర్ల వర్షం కురిపించాడు. ఫస్ట్ డౌన్ బ్యాటర్ మెవాన్ ఫెర్నాండోతో కలిసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. ఈ క్రమంలో పెరీరా కేవలం కేవలం 35 బంతుల్లోనే తన సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. ఓవరాల్‌గా 36 బంతులు ఎదుర్కొన్న ఈ శ్రీలంక కెప్టెన్.. 2 ఫోర్లు, 13 సిక్స్‌లతో 108 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. అతడితో పాటు మెవాన్ ఫెర్నాండో(81) పరుగులతో రాణించాడు. వీరిద్దరి విధ్వంసం ఫలితంగా శ్రీలంక 20 ఓవర్లలో 3 వికెట్లకు 230 పరుగుల భారీ స్కోరు సాధించింది. అనంతరం లక్ష్య చేధనలో అఫ్గానిస్తాన్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 204 పరుగులు చేయగల్గింది. దీంతో అఫ్గాన్‌పై 26 పరుగుల తేడాతో శ్రీలంక ఘన విజయం సాధించింది.కాగా ప్రొఫెషనల్ క్రికెట్లో ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు కొట్టిన జాబితాలో తిసారా పెరీరాతో పాటు భారత మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్, వెస్టిండీస్ మాజీ కెప్టెన్ కీరన్ పొలార్డ్, రవిశాస్త్రి, హర్షల్ గిబ్స్ ఉన్నారు.చదవండి: టెస్టు క్యాప్ పై '804' నెంబర్.. పాక్ ఆటగాడికి రూ. 4 కోట్లు జరిమానా!? Skipper on duty 🤩Thisara Perera's blistering 108* off 36 balls helped Sri Lankan Lions to put 230 on board 🔥#MPMSCAsianLegendsLeague pic.twitter.com/cE3Zw9rQJq— FanCode (@FanCode) March 15, 2025 -
టెస్టు క్యాప్ పై '804' నెంబర్.. పాక్ ఆటగాడికి రూ. 4 కోట్లు జరిమానా!?
పాకిస్తాన్ ఆల్‌రౌండర్ అమీర్ జమాల్‌కు ఆ దేశ క్రికెట్ బోర్డు భారీ షాకిచ్చినట్లు తెలుస్తోంది. తాము నిర్ధేశించిన నియమాలు, నిబంధనలను ఉల్లఘించినందుకు గాను జమాల్‌కు పీకేఆర్ 1.4 మిలియన్ల (భారత కరెన్సీలో సుమారు. రూ. 4. 35 కోట్లు) భారీ జరిమానా పీసీబీ విధించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అతడితో పాటు క్రమశిక్షణా రాహిత్యంగా వ్యవహరించిన పలువురు పాక్ ఆటగాళ్లపై కూడా పాక్ క్రికెట్ కొరడా ఝులిపించినట్లు సమాచారం.జమాల్ ఏమి తప్పు చేశాడంటే?జమాల్ స్వదేశంలో ఓ టెస్టు మ్యాచ్ సందర్భంగా తన క్యాప్‌పై 804 నంబర్‌ను రాసుకున్నాడు. ఆ నంబర్‌ను తన క్యాప్‌పై రాసుకున్నందుకు అతడిపై పీసీబీ సీరియస్ అయినట్లు పాకిస్తాన్ మీడియా వర్గాలు వెల్లడించాయి. ఎందుకంటే 804 అనేది జైలు శిక్ష అనుభవిస్తున్న పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ బ్యాడ్జ్ నంబర్.ఇమ్రాన్‌కు సంఘీభావం తెలియజేయాలనే ఉద్దేశ్యంతోనే అతడి బ్యాడ్జ్ నంబర్‌ను జమాల్ తన క్యాప్‌పై రాసుకున్నట్లు పీసీబీ విచారణలో తేలింది. కాగా పాకిస్తాన్ క్రికెట్లో భాగంగా ఉన్న ఆటగాళ్లు గానీ, కోచింగ్ స్టాప్ గానీ రాజకీయాల గురించి మాట్లాడకూడదని బోర్డు ఇప్పటికే స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే అతడికి పీసీబీ ఫైన్ విధించినట్లు సమా టీవీ తమ రిపోర్ట్‌లో పేర్కొంది. అంతేకాకుండా ఈ కారణంగానే జమాల్‌ను ఛాంపియన్స్ ట్రోఫీ పీసీబీ సెలక్టర్లు ఎంపిక చేయలేందంట. జరిమానా పడిన ఆటగాళ్లలో అమీర్ జమాల్‌తో పాటు సల్మాన్ అఘా, సైమ్ అయూబ్, అబ్దుల్లా షఫీక్, సుఫీయాన్ ముఖీమ్, ఉస్మాన్ ఖాన్, అబ్బాస్ అఫ్రిది ఉన్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. కాగా పాకిస్తాన్ క్రికెట్ జట్టు ప్రస్తుతం న్యూజిలాండ్ పర్యటనలో ఉంది. క్రైస్ట్ చర్చ్ వేదికగా జరిగిన తొలి టీ20లో 9 వికెట్ల తేడాతో పాక్ ఓటమి పాలైంది.చదవండి: IPl 2025: ఓపెనర్లగా కాన్వే, రవీంద్ర.. సీఎస్కే ప్లేయింగ్ ఎలెవన్ ఇదే? -
ఓపెనర్లగా కాన్వే, రవీంద్ర.. సీఎస్కే ప్లేయింగ్ ఎలెవన్ ఇదే?
ఐపీఎల్-2025 సీజన్ కోసం చెన్నై సూపర్ కింగ్స్ (CSK) అన్ని విధాల సిద్దమవుతోంది. చెపాక్‌లోని చిదంబరం స్టేడియంలో ఏర్పాటు చేసిన ప్రాక్టీస్ క్యాంపులో సీఎస్కే ఆటగాళ్లు తీవ్రంగా శ్రమిస్తున్నారు. గత సీజన్లో గ్రూపు స్టేజికే పరిమితమైన సీఎస్కే.. ఈ ఏడాది సీజన్లో మాత్రం అదరగొట్టాలన్న పట్టుదలతో ఉంది.రికార్డు స్ధాయిలో ఆరో ఐపీఎల్ ట్రోఫీపై మెన్ ఇన్ ఎల్లో కన్నేసింది. అందుకోసం సీఎస్కే తమ ఆస్త్రశాస్త్రాలను సిద్దం చేసుకుంటుంది. ఈ ఏడాది సీజన్ కోసం సామ్ కుర్రాన్, డెవాన్ కాన్వే, రవిచంద్రన్ అశ్విన్ వంటి స్టార్ ఆటగాళ్లు సీఎస్కే జట్టులోకి వచ్చారు. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్, రచిన్ రవీంద్ర, శివమ్ దూబే, ధోని వంటి ఆటగాళ్లతో సీఎస్కే బ్యాటింగ్ విభాగం పటిష్టంగా కన్పిస్తోంది. బౌలింగ్‌లోనూ పతిరానా, నాథన్ ఈల్లీస్, నూర్ ఆహ్మద్ వంటి యువ సంచలనాలతో సీఎస్కే బలంగా ఉంది. ఈ ఏడాది సీజన్లో సీఎస్కే తమ తొలి మ్యాచ్‌లో మార్చి 23న చెపాక్ వేదికగా ముంబై ఇండియన్స్‌తో తలపడనుంది. ఈ క్రమంలో సీఎస్కే బెస్ట్ ప్లేయింగ్ ఎలెవన్‌ను ఆ జట్టు మాజీ ఆటగాడు అంబటి రాయుడు అంచనా వేశాడు.సీఎస్కే ఇన్నింగ్స్‌ను రుతురాజ్ గైక్వాడ్‌తో పాటు డెవాన్ కాన్వే ప్రారంభించాలని రాయుడు అభిప్రాయపడ్డాడు. కాగా గత సీజన్లో గైక్వాడ్‌కు ఓపెనింగ్ భాగస్వామిగా రచిన్ రవీంద్ర వచ్చాడు. కానీ గత సీజన్లో రవీంద్ర తన మార్క్ చూపించలేకపోయాడు. ఈ క్రమంలోనే రవీంద్రను మూడో స్దానంలో బ్యాటింగ్‌కు పంపించాలని రాయుడు సూచించాడు. అదేవిధంగా నాలుగో స్ధానం కోసం దీపక్ హుడా, రాహుల్ త్రిపాఠి, విజయ్ శంకర్ మధ్య పోటీ ఉంటుందని ఈ భారత మాజీ క్రికెటర్ చెప్పుకొచ్చాడు. ఇక ఆల్‌రౌండర్ల కోటాలో శివమ్ దూబే, సామ్ కుర్రాన్, రవీంద్ర జడేజాలకు అంబటి చోటు ఇచ్చాడు. ఫాస్ట్ బౌలర్లగా మతీషా పతిరాన, అన్షుల్ కాంబోజ్.. స్పెషలిస్టు స్పిన్నర్‌గా అశ్విన్‌కు తుది జట్టులో అతడు అవకాశమిచ్చాడు. కాగా ఐపీఎల్-18 సీజన్ మార్చి 22 నుంచి ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో ఈడెన్‌గార్డెన్స్ వేదికగా కేకేఆర్-ఆర్సీబీ జట్లు తలపడనున్నాయి.రాయుడు ఎంపిక చేసిన సీఎస్కే ప్లేయింగ్ ఎలెవన్ ఇదే: రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), డెవాన్ కాన్వే, రచిన్ రవీంద్ర, దీపక్ హుడా/రాహుల్ త్రిపాఠి/విజయ్ శంకర్, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, సామ్ కర్రాన్, మతీషా పతిరణ, అన్షుల్ కాంబోజ్బెంచ్: ఖలీల్ అహ్మద్, నూర్ అహ్మద్, షేక్ రషీద్, ముఖేష్ చౌదరి, గుర్జప్నీత్ సింగ్, నాథన్ ఎల్లిస్, కమలేష్ నాగర్కోటి, రామకృష్ణ ఘోష్, శ్రేయాస్ గోపాల్, వంశ్ బేడి, ఆండ్రీ సిద్ధార్థ్, జామీ ఓవర్టన్చదవండి: IPL 2025: చరిత్రకు అడుగు దూరంలో రహానే.. -
IPL 2025: చరిత్రకు అడుగు దూరంలో రహానే..
క్రికెట్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న ఐపీఎల్-2025 సీజన్ మార్చి 22 నుంచి ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో ఈడెన్ గార్డెన్స్ వేదికగా డిఫెండింగ్ ఛాంపియన్ కోల్‌కతా నైట్‌రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడతున్నాయి.ఈ మ్యాచ్‌కు ముందు టీమిండియా వెటరన్, కేకేఆర్ కెప్టెన్ అజింక్య రహానేను ఓ అరుదైన రికార్డు ఊరిస్తోంది. ఈ మ్యాచ్‌తో ఐపీఎల్ చరిత్రలోనే మూడు ఫ్రాంచైజీలకు సారథిగా వ్యవహరించిన తొలి భారత ఆటగాడిగా రహానే రికార్డులకెక్కనున్నాడు.కేకేఆర్ ఫ్రాంచైజీ ఇటీవలే తమ కెప్టెన్‌గా రహానేను ఎంపిక చేసింది. రహానే కేకేఆర్‌ను గతేడాది ఛాంపియన్‌గా నిలిపిన శ్రేయస్ అయ్యర్ స్ధానాన్ని భర్తీ చేయనున్నాడు. అదేవిదంగా ఆల్‌రౌండర్ వెంకటేశ్ అయ్యర్ కోల్‌కతా జట్టుకు వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు.మూడోసారి..రహానే తొలిసారిగా 2017 ఐపీఎల్ సీజన్లో రైజింగ్ పూణే సూపర్‌జెయింట్ (RPS) జట్టుకు సారథిగా వ్యవహరించాడు. ఓ మ్యాచ్‌లో స్టీవ్ స్మిత్ గైర్హజారీలో పూణే జట్టును రహానే నడిపించాడు. ఆ తర్వాత ఐపీఎల్ 2018లో రాజస్థాన్ రాయల్స్‌లోకి రీఎంట్రీ ఇచ్చిన రహానే.. స్మిత్‌పై ఏడాది పాటు నిషేధం విధించడంతో కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టాడు.తర్వాతి ఐపీఎల్-2019లో హాఫ్ సీజన్ వరకు ఆర్ఆర్ జట్టుకు నాయకత్వం వహించాడు. అయితే స్మిత్ తిరిగి రావడంతో కెప్టెన్సీ నుంచి రహానే తప్పుకున్నాడు. 2019 ప్రపంచ కప్‌కు సిద్ధం కావడానికి స్మిత్ తన స్వదేశానికి వెళ్లిపోవడంతో రహానే మళ్లీ రాజస్తాన్ రాయల్స్ బాధ్యతలు చేపట్టాడు.ఆ తర్వాతి సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్, కేకేఆర్,చెన్నై సూపర్ కింగ్స్‌కు ప్రాతినిథ్యం వహించిన రహానే ఆటగాడిగానే కొనసాగాడు. ఐపీఎల్-2025లో మెగా వేలంలో రహానేను కేవలం రూ. 1.5 కోట్లకు కొనుగోలు చేసింది. తొలి రౌండ్లో అమ్ముడుపోని రహానే ఆఖరి రౌండ్లో కేకేఆర్ సొంతం చేసుకుంది.చదవండి: PAK vs NZ: మళ్లీ అదే కథ.. పాకిస్తాన్‌ను చిత్తు చేసిన న్యూజిలాండ్ -
మళ్లీ అదే కథ.. పాకిస్తాన్‌ను చిత్తు చేసిన న్యూజిలాండ్
ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో ఘోర ప్రదర్శన కనబరిచిన పాకిస్తాన్ క్రికెట్ జట్టు.. ఇప్పుడు న్యూజిలాండ్ పర్యటనలో కూడా అదే తీరును కనబరుస్తోంది. న్యూజిలాండ్‌తో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను పాకిస్తాన్ ఘోర ఓటమితో ప్రారంభించింది.ఆదివారం క్రైస్ట్ చర్చ్ వేదికగా జరిగిన తొలి టీ20లో 9 వికెట్ల తేడాతో పాక్ పరాజయం పాలైంది. ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్ బ్యాటర్లు తీవ్ర నిరాశపరిచారు. తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 18.4 ఓవర్లలో కేవలం 91 పరుగులకే కుప్పకూలింది. కివీస్ ఫాస్ట్ బౌలర్లు నిప్పులు చెరిగారు.ఇన్నింగ్స్ తొలి ఓవర్ నుంచే పాకిస్తాన్ వికెట్ల పతనం మొదలైంది. కివీస్ బౌలర్లలో జాకబ్ డఫీ 4 వికెట్లతో పాకిస్తాన్ పతనాన్ని శాసించగా.. కైల్ జేమిసన్ మూడు, ఇష్ సోది రెండు వికెట్లు పడగొట్టారు. పాకిస్తాన్ బ్యాటర్లలో కుష్దిల్ షా(32) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.సీఫర్ట్ విధ్వంసం..అనంతరం 92 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని న్యూజిలాండ్ ఒక్క వికెట్ కోల్పోయి కేవలం 10.1 ఓవర్లలో ఊదిపడేసింది. కివీస్ ఓపెనర్ టిమ్ సీఫర్ట్ విధ్వంసం సృష్టించాడు. కేవలం 29 బంతుల్లో 7 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 44 పరుగులు చేసి ఔటయ్యాడు. అతడితో పాటు ఫిన్ అలెన్(29),రాబిన్సన్(18) ఆజేయంగా నిలిచి మ్యాచ్‌ను ఫినిష్ చేశారు. పాక్ బౌలర్లలో అర్బర్ ఆహ్మద్ ఒక్క వికెట్ పడగొట్టాడు.టీమ్ మారినా..ఇక కివీస్‌తో టీ20 సిరీస్‌కు దాదాపుగా కొత్త టీమ్‌ను పాకిస్తాన్ క్రికెట్ బోర్డు సెలక్టర్లు ఎంపిక చేశారు. కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్, బాబర్ ఆజం, సౌద్ షకీల్ వంటి స్టార్ ఆటగాళ్లపై పీసీబీ వేటు వేసింది. వారి స్ధానంలో హసన్ నవాజ్, ఇర్ఫాన్ ఖాన్, అబ్దుల్ సమద్ వంటి యువ ఆటగాళ్లకు సెలక్టర్లు అవకాశమిచ్చారు.కానీ వీరివ్వరూ కూడా తమకు వచ్చిన అవకాశాలను అందిపుచ్చకోలేకపోయారు. దీంతో పాకిస్తాన్ సెలకర్టపై మరోసారి విమర్శల వర్షం కురిపిస్తుంది. బాబర్, రిజ్వాన్‌ను తప్పించాల్సిన అవసరం ఏముంది అని ఫ్యాన్స్ మండిపడుతున్నారు.చదవండి: WPL 2025: ఫైనల్లో ఓటమి.. బోరున ఏడ్చేసిన ఢిల్లీ ప్లేయర్! వీడియో వైరల్ -
ఫైనల్లో ఓటమి.. బోరున ఏడ్చేసిన ఢిల్లీ ప్లేయర్! వీడియో వైరల్
మహిళల ప్రీమియర్ లీగ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టును మరోసారి దురదృష్టం వెంటాడింది. డబ్ల్యూపీఎల్-2025లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన ఫైనల్లో 8 పరుగుల తేడాతో ఢిల్లీ ఓటమి పాలైంది. దీంతో వరుసగా మూడోసారి ఫైనల్‌కు చేరిన ఢిల్లీ క్యాపిటల్స్‌కు మరోసారి నిరాశే ఎదురైంది. ఇక ఈ ఫైనల్ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. ముంబై బ్యాటర్లలో ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్ హర్మన్‌ప్రీత్ కౌర్ (44 బంతుల్లో 66; 9 ఫోర్లు, 2 సిక్స్‌లు) టాప్ స్కోరర్ కాగా... నాట్ సివర్ బ్రంట్ (28 బంతుల్లో 30; 4 ఫోర్లు) రాణించింది.కాప్ పోరాడినా..అనంతరం ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 141 పరుగులకు పరిమితమైంది. లక్ష్య చేధనలో ఢిల్లీ క్యాపిటల్స్‌కు శుభారంభం లభించలేదు. ఓపెనర్లు లానింగ్(13), షెఫాలీ వర్మ(4) ఆదిలోనే పెవిలియన్‌కు చేరారు. ఆ సమయంలో రోడ్రిగ్స్(30) కాసేపు అలరించింది.ఓ దశలో 67 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి ఢిల్లీ కష్టాల్లో పడింది. ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన ఆల్‌రౌండర్ మరిజాన్ కాప్ ప్రత్యర్ధి బౌలర్లపై ఎదురుదాడికి దిగింది. బౌండరీల వర్షం కురిపిస్తూ ఢిల్లీని విజయానికి దగ్గరగా తీసుకువెళ్లింది. ఆమె క్రీజులో ఉండడంతో ఢిల్లీ విజయం లాంఛనమే అంతా భావించారు.అయితే 18 ఓవర్లో కాప్ భారీ షాట్‌కు ప్రయత్నించి తన వికెట్ కోల్పోవడంతో ఒక్కసారిగా మ్యాచ్ ముంబై వైపు మలుపు తిరిగిపోయింది. తర్వాత వచ్చిన బ్యాటర్లు ఢిల్లీని గెలిపించలేకపోయారు. కాప్ (26 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 40 పరుగులు చేసింది. అంతకుముందు బౌలింగ్‌లోనూ రెండు వికెట్లతో సత్తాచాటింది.కన్నీళ్లు పెట్టుకున్న కాప్..ఇక ఈ ఓటమి అనంతరం కాప్ భావోద్వేగానికి లోనైంది. మ్యాచ్ ముగిసిన తర్వాత మైదానంలోకి వచ్చిన కాప్ కన్నీళ్లు పెట్టుకుంది. సహచరులు కాప్‌ను ఓదర్చారు. ఆమెతో కెప్టెన్ మెగ్ లానింగ్ సైతం కంటితడి పెట్టుకుంది. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ఢిల్లీ క్యాపిటల్స్‌కు అభిమానులు సపోర్ట్‌గా నిలుస్తున్నారు. ఓడినా మీరు మా మనసులు గెలిచారు అంటూ సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నారు.DC lost 3rd Consecutive Final of wplFeeling sad for #DC #WPL2025Final #WPLFinal pic.twitter.com/Kyk6ehqScu— Rajkumar Saini (@Dr_Raj23) March 16, 2025 3 seasons, 3 finals and 3 losses in final Feel for Delhi 🥲 @wplt20 @DelhiCapitals #WPLFinal #WPL2025 pic.twitter.com/TBxGn8CIoJ— Psycho Naidu (@eshwarnaidu5313) March 15, 2025 -
తీరు మారని పాకిస్తాన్.. 91 పరుగులకే ఆలౌట్
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో పేలవ ప్రదర్శనతో గ్రూపు స్టేజిలోనే ఇంటిముఖం పట్టిన పాకిస్తాన్ క్రికెట్ జట్టు ఆటతీరు ఏ మాత్రం మారలేదు. క్రైస్ట్ చర్చ్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టీ20లో పాకిస్తాన్ బ్యాటర్లు ఘోరంగా విఫలమయ్యారు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్.. కివీస్ బౌలర్ల దాటికి 18.4 ఓవర్లలో కేవలం 91 పరుగులకే కుప్పకూలింది.న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ల దాటికి పాక్ బ్యాటర్లు విల్లవిల్లాడారు. కివీస్ బౌలర్లలో జాకబ్ డఫీ 4 వికెట్లతో పాకిస్తాన్ పతనాన్ని శాసించగా.. కైల్ జేమిసన్ మూడు, ఇష్ సోది రెండు వికెట్లు పడగొట్టారు. పాకిస్తాన్ బ్యాటర్లలో కుష్దిల్ షా(32) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. కెప్టెన్ అగా సల్మాన్(18)తో సహా మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. కాగా న్యూజిలాండ్ పర్యటనలో భాగంగా పాకిస్తాన్.. ఆతిథ్య జట్టుతో ఐదు టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది. అయితే టీ20 సిరీస్‌కు మాత్రం కీలక ఆటగాళ్లపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు వేటు వేసింది. కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్, బాబర్ ఆజాంలను టీ20 జట్టు నుంచి పాకిస్తాన్ సెలక్టర్లు తప్పించారు. మహ్మద్ రిజ్వాన్ స్ధానంలో సల్మాన్ అలీ అగాకు కెప్టెన్సీ పగ్గాలు అప్పగించారు. కానీ వన్డేల్లో మాత్రం రిజ్వాన్‌ను కెప్టెన్‌గా పీసీబీ కొనసాగించింది.తుది జట్లున్యూజిలాండ్: టిమ్ సీఫెర్ట్, ఫిన్ అలెన్, టిమ్ రాబిన్సన్, మార్క్ చాప్మన్, డారిల్ మిచెల్, మిచెల్ హే (వికెట్ కీపర్), మైఖేల్ బ్రేస్‌వెల్ (కెప్టెన్), జకారీ ఫౌల్క్స్, కైల్ జామిసన్, ఇష్ సోధి, జాకబ్ డఫీపాకిస్తాన్: హారీస్ (వికెట్ కీపర్), హసన్ నవాజ్, సల్మాన్ అఘా (కెప్టెన్), ఇర్ఫాన్ ఖాన్, షాదాబ్ ఖాన్, అబ్దుల్ సమద్, ఖుష్దిల్ షా, జహందాద్ ఖాన్, షాహీన్ అఫ్రిది, మహ్మద్ అలీ, అబ్రార్ అహ్మద్చదవండి: WPL 2025: ఛాంపియన్‌గా ముంబై ఇండియన్స్.. ప్రైజ్ మనీ ఎన్ని కోట్లంటే? -
ఛాంపియన్‌గా ముంబై ఇండియన్స్.. ప్రైజ్ మనీ ఎన్ని కోట్లంటే?
మహిళల ప్రీమియర్ లీగ్- 2025 ఛాంపియన్స్‌గా ముంబై ఇండియన్స్ నిలిచింది. శనివారం బ్రౌబౌర్న్ వేదికగా జరిగిన ఫైనల్లో 8 పరుగుల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఓడించిన ముంబై ఇండియన్స్ రెండోసారి డబ్ల్యూపీఎల్ టైటిల్‌ను ముద్దాడింది. ఈ ఫైనల్ పోరులో మొదట బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. ముంబై బ్యాటర్లలో ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్ హర్మన్‌ప్రీత్ కౌర్ (44 బంతుల్లో 66; 9 ఫోర్లు, 2 సిక్స్‌లు) టాప్ స్కోరర్ కాగా... నాట్ సివర్ బ్రంట్ (28 బంతుల్లో 30; 4 ఫోర్లు) రాణించింది.కాప్ ఒంటరి పోరాటం..అనంతరం లక్ష్య చేధనలో ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 141 పరుగులే చేయగలిగింది. ఢిల్లీ బ్యాటర్లలో ఆల్‌రౌండర్ మరిజాన్ కాప్ (26 బంతుల్లో 40; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఒంటరి పోరాటం చేసింది. ఓ దశలో ఢిల్లీని కాప్ ఒంటి చేత్తో గెలిపించేలా కన్పించింది.కానీ ఆఖరిలో కాప్ ఓ భారీ షాట్‌కు ప్రయత్నించి ఔట్ కావడంతో మ్యాచ్ ఫలితం తారుమారు అయింది. నాట్ సివర్ బ్రంట్ 3 కీలక వికెట్లతో ఢిల్లీని దెబ్బ తీసింది. ఇక ఛాంపియన్ నిలిచిన ముంబై ఇండియన్స్‌కు ఎంత ప్రైజ్‌మనీ దక్కింది ఆరెంజ్? ఆరెంజ్ క్యాప్ విజేత ఎవరు? వంటి వివరాలను తెలుసుకుందాం.ముంబైకి ప్రైజ్ మనీ ఎంతంటే?ఈ టోర్నీ విజేతగా నిలిచిన ముంబై ఇండియన్స్‌కు రూ. 6 కోట్లు ప్రైజ్‌మనీగా లభించింది. రన్నరప్ ఢిల్లీ క్యాపిటల్స్‌కు రూ. 3 కోట్లు నగదు బహుమతి అందనుంది. అదేవిధంగా 523 పరుగులు చేసిన ముంబై ఇండియన్స్ స్టార్ ఆల్‌రౌండర్ నాట్ స్కివర్ బ్రంట్ ఆరెంజ్ క్యాప్‌ను సొంతం చేసుకుంది. అందుకు గాను 5 లక్షలు నగదు బహుమతి ఆమెకు దక్కింది. పర్పుల్ క్యాప్ విజేతగా నిలిచిన అమీలియా కేర్‌కు కూడా రూ.5 లక్షలు నగదు లభించింది.ప్రైజ్ మనీ వివరాలు..విజేత- ముంబై ఇండియన్స్- రూ. 6 కోట్లురన్నరప్-ఢిల్లీ క్యాపిటల్స్- రూ.3 కోట్లుఆరెంజ్ క్యాప్ విజేత- స్కివర్ బ్రంట్-రూ. 5 లక్షలుపర్పుల్ క్యాప్ విజేత- కేర్- రూ. 5లక్షలుమోస్ట్ వాల్యబుల్ ప్లేయర్- స్కివర్ బ్రంట్(523 పరుగులు, 12 వికెట్లు)-రూ. 5 లక్షలుఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్-అమన్‌జోత్ కౌర్-రూ. 5 లక్షలుసీజన్లో అత్యధిక సిక్సర్లు- ఆష్లీ గార్డనర్ (18 సిక్సర్లు)- రూ.5 లక్షలుచదవండి: హ్యాట్సాఫ్ హర్మన్ -
ఒలింపిక్ చాంపియన్‌గా నిలిస్తే బాగుంటుంది!
బెంగళూరు: ఒక క్రికెటర్‌గా ఒలింపిక్ పతకాన్ని గెలుచుకోగలిగితే అది ఎంతో ప్రత్యేకం అవుతుందని, దానికి మరేదీ సాటి రాదని భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి అన్నాడు. 2028 లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్‌లో క్రికెట్ పోటీలు జరగనున్న నేపథ్యంలో కోహ్లి వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. 1900 తర్వాత తొలిసారి విశ్వక్రీడల్లో క్రికెట్‌ను ప్రవేశ పెడుతున్నారు. ఒలింపిక్స్‌లో క్రికెట్‌కు చోటు దక్కడంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) కూడా కీలక పాత్ర పోషించిందని కోహ్లి అభిప్రాయపడ్డాడు. ‘ఒలింపిక్ చాంపియన్‌గా నిలిస్తే ఎంతో బాగుంటుంది. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ఐపీఎల్ ఇందులో ప్రముఖ పాత్ర పోషించింది. క్రికెట్‌ను ఒలింపిక్స్‌లో భాగమయ్యే స్థాయికి తెచి్చంది. ఇది యువ ఆటగాళ్లకు గొప్ప అవకాశం. ప్రతి అథ్లెట్ దాని కోసమే కష్టపడతాడు. పురుషుల, మహిళల విభాగాల్లో మన జట్టు పతకానికి చేరువవుతుందని అనుకుంటున్నా’ అని విరాట్ అన్నాడు. ఇటీవల చాంపియన్స్ ట్రోఫీలో చక్కటి ప్రదర్శన కనబర్చిన కోహ్లి... లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్ వరకు కెరీర్ కొనసాగిస్తాడా అనేది చూడాలి. 2028కి విరాట్ 40వ పడిలోకి అడుగుపెట్టనున్నాడు. ‘ఇప్పుడే దాని గురించి మాట్లాడటం తొందరపాటు అవుతుంది. ఒకవేళ ఒలింపిక్ పసిడి పతకం కోసం మ్యాచ్ ఆడుతుంటే... నేను గుట్టు చప్పుడు కాకుండా జట్టులో చేరి పతకం సాధించి ఇంటికి వస్తా’ అని విరాట్ చమత్కరించాడు. ఐపీఎల్ ప్రారంభానికి ముందు వివిధ అంశాలపై విరాట్ పంచుకున్న విశేషాలు అతడి మాటల్లోనే... » మహిళల ప్రీమియర్ లీగ్ వల్ల దేశంలో మహిళల క్రికెట్ ప్రాధాన్యత మరింత పెరిగింది. భారత మహిళల క్రికెట్ జట్టు గత కొంతకాలంగా నిలకడైన ప్రదర్శన చేస్తూ అభిమానుల మనసులు గెలుచుకుంటోంది. » ఆరేడేళ్ల క్రితం మహిళల ఆటకు ఇంత ప్రాధాన్యత దక్కలేదు. డబ్ల్యూపీఎల్‌కు వస్తున్న ఆదరణ చూస్తుంటే ముచ్చటేస్తోంది. ఇప్పుడు ఎక్కడ చూసినా వారి గురించి చర్చ జరుగుతోంది. రోజు రోజుకు ఆటలో ప్రమాణాలు పెరుగుతున్నాయి. » వేరే రంగాల్లో విజయం సాధించినప్పుడు రాని పేరు, ప్రఖ్యాతలు క్రీడల్లో సులువుగా వస్తాయి. ఎందుకంటే మైదానంలో ఆడేది తామే అని ప్రతి ఒక్క అభిమాని ఊహించుకుంటాడు కాబట్టే ఇది సాధ్యం. అందుకే క్రీడాకారులు విజయాలు సాధించినప్పుడు యావత్ భారత్ సంబరాలు చేసుకుంటుంది. » ఆటను ఆస్వాదించడం నాకు ఇష్టం... అదే చేస్తున్నా. ఎలాంటి తీవ్ర నిర్ణయాలు తీసుకోవాలని అనుకోవడం లేదు. మైదానంలో వంద శాతం కష్టపడటం అలవాటు. దాన్ని ఇక మీద కూడా కొనసాగిస్తా. భావోద్వేగాలు ఆటలో భాగం. వాటిని దాచుకోవడానికి ఎప్పుడూ ప్రయత్నించను. » ఆటలో పోటీ సహజం. అప్పుడే మన సహజ నైపుణ్యం బయటకు వస్తుంది. ఈ స్థాయికి చేరుకున్నాక కూడా ఇంకేదో గుర్తింపు పొందాలనుకోవడం లేదు. ఆటపై ప్రేమ ఉన్నంతకాలం మైదానంలో కొనసాగుతా. ఈ అంశంలో రాహుల్ ద్రవిడ్ విలువైన సూచనలిచ్చారు. ‘‘నీతో నువ్వు తరచూ మాట్లాడుతూ ఉండు ఎప్పుడు ఆపేయాలో నీకే తెలుస్తుంది’’ అన్నారు. దాన్నే పాటిస్తున్నా. » జీవితంలో సాధించిన దాంతో సంతృప్తిగా ఉన్నా. కెరీర్ ఆరంభంతో పోల్చుకుంటే సుదీర్ఘ అనుభవం సాధించిన తర్వాత అన్నీ విషయాలను అనుకున్న విధంగా పూర్తి చేయడం కష్టం. వయసు పెరుగుతున్న భావన కలగడం సహజం. ఫిట్‌గా ఉండేందుకు మరింత కష్టపడాల్సి వస్తుంది. » అప్పుడప్పుడు అసంతృప్తి ఆవరిస్తుంది. నా వరకు ఈ ఏడాది ఆరంభంలో ఆ్రస్టేలియా పర్యటనలో మెరుగైన ప్రదర్శన చేయలేకపోయా. దీంతో తీవ్ర ఇబ్బంది ఎదుర్కొన్నా.. అయితే దాన్ని ఒత్తిడిగా భావించలేదు. అందులో నుంచి బయటపడేందుకు మార్గాలు అన్వేషించి వాటిపై కసరత్తు చేసి ఫలితాలు సాధించా. 2014లో ఇంగ్లండ్ పర్యటన సందర్భంగా కూడా ఇలాంటి పరిస్థితే ఎదురైంది. అయితే అన్నింటిని అధిగమించాల్సిందే. మరో అవకాశం వచ్చినప్పుడు దాన్ని మరింపిచే ప్రదర్శన చేయాలి. 2018లో నేను అదే చేశా. » క్రికెటేతర విషయాల గురించి ఆలోచించి ఒత్తిడి పెంచుకోను. డ్రెస్సింగ్ రూమ్ బయటి వ్యాఖ్యలకు పెద్దగా ప్రాముఖ్యత ఇవ్వను. ఒక్కసారి వాటిని పట్టించుకోవడం ప్రారంభిస్తే ఇక ఒత్తిడి కొండలా పెరుగుతుంది. -
జై ముంబై
మహిళల ప్రీమియర్ లీగ్‌లో ముంబై ఇండియన్స్ మరో సారి జయకేతనం ఎగురవేసింది. రెండేళ్ల క్రితం టోర్నీ తొలి విజేతగా నిలిచిన జట్టు ఇప్పుడు మళ్లీ టైటిల్‌ను తమ ఖాతాలో వేసుకుంది. ఢిల్లీతో తుది పోరులో తక్కువ స్కోరుకే పరిమితమైనా... పట్టుదల, సమష్టితత్వంతో ఆడిన జట్టు లక్ష్యాన్ని కాపాడుకోగలిగింది. ఆల్‌రౌండర్ నాట్ సివర్ బ్రంట్, కెప్టెన్ హర్మన్ ఆఖరి పోరులో కీలక పాత్ర పోషించారు. మరో వైపు ఢిల్లీ క్యాపిటల్స్ బృందం విషాదంలో మునిగిపోయింది. వరుసగా మూడు సీజన్ల పాటు గ్రూప్‌లో టాపర్... వరుసగా మూడు ఫైనల్ మ్యాచ్‌లు... మూడింటిలోనూ పరాజయాలు. ఛేదనలో 17 పరుగులకే ఇద్దరు టాప్ బ్యాటర్లను కోల్పోయిన తర్వాత జట్టు కోలుకోలేకపోయింది. ఆ తర్వాత కొంత పోరాడినా లాభం లేకపోయింది. ముంబై: డబ్ల్యూపీఎల్ సీజన్–3లో ముంబై ఇండియన్స్ చాంపియన్‌గా నిలిచింది. శనివారం జరిగిన ఫైనల్లో ముంబై 8 పరుగుల స్వల్ప తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఓడించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ముంబై 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ హర్మన్‌ప్రీత్ కౌర్ (44 బంతుల్లో 66; 9 ఫోర్లు, 2 సిక్స్‌లు) టాప్ స్కోరర్ కాగా... నాట్ సివర్ బ్రంట్ (28 బంతుల్లో 30; 4 ఫోర్లు) రాణించింది. 14 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన దశలో వీరిద్దరు మూడో వికెట్‌కు 62 బంతుల్లోనే 89 పరుగులు జోడించి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. అనంతరం ఢిల్లీ 20 ఓవర్లలో 9 వికెట్లకు 141 పరుగులే చేయగలిగింది. మరిజాన్ కాప్ (26 బంతుల్లో 40; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు), జెమీమా రోడ్రిగ్స్ (21 బంతుల్లో 30; 4 ఫోర్లు) రాణించగా, నికీ ప్రసాద్ (23 బంతుల్లో 25 నాటౌట్; 1 ఫోర్, 1 సిక్స్) ఫర్వాలేదనిపించింది. నాట్ సివర్ బ్రంట్ 3 కీలక వికెట్లతో ఢిల్లీని దెబ్బ తీసింది. 523 పరుగులు చేసి 12 వికెట్లు తీసిన నాట్ సివర్ బ్రంట్ ‘ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ’గా నిలిచింది.మరిజాన్ కాప్ తన వరుస ఓవర్లలో హేలీ మాథ్యూస్ (3), యస్తిక భాటియా (3)లను వెనక్కి పంపడంతో ముంబై ఒత్తిడిలో పడింది. అయితే సివర్, హర్మన్ కలిసి దూకుడుగా ఆడారు. సదర్లాండ్ ఓవర్లో సిక్స్, ఫోర్ కొట్టిన హర్మన్...జొనాసెన్ వేసిన తర్వాత ఓవర్లో వరుసగా మూడు ఫోర్లు బాదింది. 33 బంతుల్లోనే ఆమె హాఫ్ సెంచరీ పూర్తయింది. వీరిద్దరి భాగస్వామ్యం తర్వాత ముంబై తడపడింది. 15 పరుగుల వ్యవధిలో 4 వికెట్లు కోల్పోవడంతో భారీ స్కోరు సాధ్యం కాలేదు. ఛేదనలో ఢిల్లీ అవకాశాలన్నీ ఓపెనింగ్ భాగస్వామ్యంపైనే ఉన్నాయి. అయితే ఫామ్‌లో ఉన్న లానింగ్ (13), షఫాలీ (4) రెండు పరుగుల తేడాతో వెనుదిరగడంతో జట్టు స్కోరు వేగం బాగా తగ్గిపోయింది. మధ్యలో జెమీమా కొంత జోరుగా ఆడే ప్రయత్నం చేసినా చేయాల్సిన రన్‌రేట్ బాగా పెరిగిపోయి చేయిదాటిపోయింది. మరిజాన్ కాప్ ప్రయత్నం కూడా వృథా అయింది. స్కోరు వివరాలు ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: యస్తిక (సి) జెమీమా (బి) కాప్ 8; హేలీ (బి) కాప్ 3; నాట్సివర్ (సి) మణి (బి) చరణి 30; హర్మన్‌ప్రీత్ (సి) కాప్ (బి) సదర్లాండ్ 66; కెర్ (సి) షఫాలీ (బి) జొనాసెన్ 2; సజన (ఎల్బీ) (బి) జొనాసెన్ 0; కమలిని (స్టంప్డ్) బ్రైస్ (బి) చరణి 10; అమన్‌జోత్ (నాటౌట్) 14; సంస్కృతి (నాటౌట్) 8; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 149. వికెట్ల పతనం: 1–5, 2–14, 3–103, 4–112, 5–112, 6–118, 7–132. బౌలింగ్: మరిజాన్ కాప్ 4–0–11–2, శిఖా పాండే 4–0–29–0, అనాబెల్ సదర్లాండ్ 4–0–29–1, జొనాసెన్ 3–0–26–2, శ్రీ చరణి 4–0–43–2, మిన్ను మణి 1–0–10–0. ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్: లానింగ్ (బి) సివర్ 13; షఫాలీ (ఎల్బీ) (బి) షబ్నమ్ 4; జెస్ జాన్సన్ (సి) యస్తిక (బి) కెర్ 13; జెమీమా (సి అండ్ బి) కెర్ 30; అనాబెల్ (స్టంప్డ్) యస్తిక (బి) సైకా 2; మరిజాన్ కాప్ (సి) హేలీ (బి) సివర్ 40; సారా (రనౌట్) 5; నికీ (నాటౌట్)25; శిఖ (బి) సివర్ 0; మిన్ను మణి (సి) సజన (బి) హేలీ 4; శ్రీ చరణి (నాటౌట్) 3; ఎక్స్‌ట్రాలు 2; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 141. వికెట్ల పతనం: 1–15, 2–17, 3–37, 4–44, 5–66, 6–83, 7–123, 8–123, 9–128. బౌలింగ్: షబ్నమ్ ఇస్మాయిల్ 4–0–15–1; నాట్సివర్ బ్రంట్ 4–0–30–3; హేలీ మాథ్యూస్ 4–0–37–1; అమేలియా కెర్ 4–0–25–2; సైకా 4–0–33–1. -
హ్యాట్సాఫ్ హర్మన్
డబ్ల్యూపీఎల్‌లో 2023 టైటిల్ నెగ్గిన ముంబై ఇండియన్స్ గత ఏడాది డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగింది. అయితే అనూహ్యంగా ఎలిమినేటర్ మ్యాచ్‌లో బెంగళూరు చేతిలో 5 పరుగుల తేడాతో ఓడి నిష్క్రమించింది. హర్మన్‌ప్రీత్ క్రీజ్‌లో ఉన్నంత వరకు జట్టు గెలుపు దిశగానే వెళ్లినా...ఆమె వెనుదిరిగాక ఇతర బ్యాటర్లు 12 బంతుల్లో 16 పరుగులు కూడా చేయలేకపోయారు. ఇది హర్మన్‌ను తీవ్రంగా బాధించింది. 2025 సీజన్‌కు ముందు జట్టు కోచ్ దేవిక పల్షికర్తో కలిసి హర్మన్ ఇదే విషయంపై ప్రత్యేకంగా చర్చించింది. చివర్లో ధాటిగా ఆడే ప్రయత్నంలో ఒత్తిడి పెంచుకోవడంకంటే తొలి బంతినుంచే హర్మన్ తనదైన శైలిలో ధాటిగా ఆడాలనేది ప్రణాళిక. ఇందులో తొందరగా అవుటయ్యే ప్రమాదం ఉన్నా... ఇది సరైందిగా వారు భావించారు. ఈసారి టీమ్ విజయంలో బ్యాటర్‌గా హర్మన్ కీలక పాత్ర పోషించింది. ఏకంగా 154.87 స్ట్రైక్‌రేట్‌తో 302 పరుగులు సాధించి తన విలువను చాటింది. టోర్నీలో 11 సిక్స్‌లు బాదిన తీరు ఆమె ఆధిక్యాన్ని చూపించింది. ఈ టోర్నీలో ప్రతీ మ్యాచ్‌లో ఆమె దాదాపు చివరి వరకు నిలిచి పని పూర్తయ్యేలా చూసింది. 10 ఇన్నింగ్స్‌లలో 5 అర్ధసెంచరీలతో 523 పరుగులు చేసిన నాట్ సివర్ ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచింది. పరుగుల పట్టికలో మూడో స్థానంలో ఉన్న హేలీ మాథ్యూస్ (307) జట్టుకు అదనపు బలంగా మారింది. బౌలింగ్‌లో అమేలియా కెర్ (18 వికెట్లు), హేలీ మాథ్యూస్ (18), నాట్ సివర్ (12) ప్రత్యర్థులను పడగొట్టడంలో సఫలమయ్యారు. మరో ప్రధాన పేసర్ షబ్నిమ్ ఇస్మాయిల్ అంచనాలకు తగినట్లుగా రాణించకపోయినా... ఆ ప్రభావం జట్టుపై పడకుండా ఈ ముగ్గురు బాధ్యత తీసుకున్నారు. ఫైనల్లో మాత్రం షబ్నమ్ తన స్థాయి ప్రదర్శనను చూపించింది. తొలి మ్యాచ్‌లో ఢిల్లీ చేతిలో పరాజయంతో ముంబై టోర్నీ మొదలైంది. అయితే ఆ తర్వాత వరుసగా మూడు విజయాలతో జట్టు కోలుకుంది. తర్వాతి మ్యాచ్‌లో మళ్లీ ఢిల్లీ చేతిలోనే పరాజయం. ఈ సారి హర్మన్, సివర్ ఇద్దరూ విఫలమయ్యారు. ఆ తర్వాత మరో రెండు మ్యాచ్‌లు గెలిచి ప్లే ఆఫ్స్ ఖాయమైనా... టాప్ స్థానం కోసం జట్టు గట్టిగానే పోరాడింది. అయితే బెంగళూరు చేతిలో ఓటమి తప్పలేదు. దాంతో ఎలిమినేటర్ మ్యాచ్‌లో ప్రదర్శనపై సందేహాలు వచ్చాయి. అయితే సంపూర్ణ ఆధిక్యంతో విజయం సాధించిన ముంబై అలవోకగా ఫైనల్ చేరింది. గత రెండు లీగ్ మ్యాచ్ తరహాలో ఈ సారి కూడా ఢిల్లీపై ఆరంభంలో తడబాటు కనిపించింది. కానీ మళ్లీ హర్మన్, సివర్ భాగస్వామ్యమే జట్టును నడిపించింది. ప్రతికూల పరిస్థితుల్లోనూ వీరిద్దరు పట్టుదలగా ఆడటంతో జట్టు ప్రత్యర్థికి సవాల్ విసిరేంత స్కోరును సాధించగలిగింది. ఫైనల్ సహా ఇదే వేదికపై వరుసగా నాలుగో మ్యాచ్ ఆడటం కూడా జట్టుకు కలిసొచ్చింది. టోర్నీలో ఢిల్లీ ఫామ్ చూస్తే 150 పరుగుల ఛేదన పెద్ద కష్టం కాదనిపించినా... ముంబై బౌలర్లంతా సమష్టిగా చెలరేగి మూడేళ్ల వ్యవధిలో రెండో టైటిల్‌ను అందించడం విశేషం. -
WPL-2025: డబ్ల్యూపీఎల్ విజేతగా ముంబై ఇండియన్స్
డబ్ల్యూపీఎల్-2025లో భాగంగా ముంబై వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఢిల్లీపై 8 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. అనంతరం 150 పరుగుల లక్ష్య చేదనలో ఢిల్లీ క్యాపిటల్స్ వెనుక పడింది. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి కేవలం 141 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో ముంబై ఇండియన్స్ జట్టు ఈ సీజన్‌కి విజేతగా నిలిచింది. ఈ విజయంతో రెండోసారి ముంబై జట్టు టైటిల్ విన్నర్‌గా నిలిచింది. ముంబై బ్యాటర్లలో కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్(44 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్‌లతో 66) టాప్ స్కోరర్‌గా నిలిచారు.తుది జట్లుముంబై ఇండియన్స్ (ప్లేయింగ్ XI): యాస్తికా భాటియా(వికెట్ కీపర్), హేలీ మాథ్యూస్, నాట్ స్కివర్-బ్రంట్, హర్మన్‌ప్రీత్ కౌర్(సి), సజీవన్ సజన, అమేలియా కెర్, అమంజోత్ కౌర్, జి కమలిని, సంస్కృతి గుప్తా, షబ్నిమ్ ఇస్మాయిల్, సైకా ఇషాక్ఢిల్లీ క్యాపిటల్స్ (ప్లేయింగ్ XI): మెగ్ లానింగ్ (కెప్టెన్), షఫాలీ వర్మ, జెమిమా రోడ్రిగ్స్, అనాబెల్ సదర్లాండ్, మారిజానే కాప్, జెస్ జోనాస్సెన్, సారా బ్రైస్ (వికెట్ కీపర్), నికి ప్రసాద్, మిన్ను మణి, శిఖా పాండే, నల్లపురెడ్డి చరణి -
హర్మన్ కెప్టెన్ ఇన్నింగ్స్.. ఢిల్లీ క్యాపిటల్స్ టార్గెట్ ఎంతంటే?
డబ్ల్యూపీఎల్-2025లో భాగంగా ముంబై వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న ఫైనల్లో ముంబై ఇండియన్స్ బ్యాటర్లు తడబడ్డారు. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. ముంబై బ్యాటర్లలో కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్(44 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్‌లతో 66) టాప్ స్కోరర్‌గా నిలిచారు.ఆమెతో పాటు నాట్ స్కివర్(30) పరుగులతో పర్వాలేదన్పించారు. మిగితా బ్యాటర్లంతా విఫలమయ్యారు. ఢిల్లీ బౌలర్లలో జానెసన్, చరణి, కాప్ తలా రెండు వికెట్లు పడగొట్టగా.. సదర్లాండ్ ఒక్క వికెట్ సాధించారు.తుది జట్లుముంబై ఇండియన్స్ (ప్లేయింగ్ XI): యాస్తికా భాటియా(వికెట్ కీపర్), హేలీ మాథ్యూస్, నాట్ స్కివర్-బ్రంట్, హర్మన్‌ప్రీత్ కౌర్(సి), సజీవన్ సజన, అమేలియా కెర్, అమంజోత్ కౌర్, జి కమలిని, సంస్కృతి గుప్తా, షబ్నిమ్ ఇస్మాయిల్, సైకా ఇషాక్ఢిల్లీ క్యాపిటల్స్ (ప్లేయింగ్ XI): మెగ్ లానింగ్ (కెప్టెన్), షఫాలీ వర్మ, జెమిమా రోడ్రిగ్స్, అనాబెల్ సదర్లాండ్, మారిజానే కాప్, జెస్ జోనాస్సెన్, సారా బ్రైస్ (వికెట్ కీపర్), నికి ప్రసాద్, మిన్ను మణి, శిఖా పాండే, నల్లపురెడ్డి చరణిచదవండి: IPL 2025: ఇషాన్ కిషన్ విధ్వంసం.. 16 బంతుల్లో హాఫ్ సెంచరీ! వీడియో వైరల్ -
ఇషాన్ కిషన్ విధ్వంసం.. 16 బంతుల్లో హాఫ్ సెంచరీ! వీడియో వైరల్
ఐపీఎల్-2025 సీజన్ కోసం సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) సన్నాహాలు జోరుగా సాగుతున్నాయి. హైదరాబాద్‌లోని హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఎస్ఆర్హెచ్ ఆటగాళ్లు నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ ఏడాది సీజన్లో ఎస్ఆర్హెచ్ తమ తొలి మ్యాచ్‌లో మార్చి 23న హైదరాబాద్ వేదికగా రాజస్తాన్ రాయల్స్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచి ఐపీఎల్ 18వ ఎడిషన్‌ను విజయంతో ప్రారంభించాలని సన్‌రైజర్స్ భావిస్తోంది. అయితే ఇంకా కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ ఇంకా జట్టుతో చేరలేదు. కాలి మడమ గాయంతో బాధపడుతున్న కమ్మిన్స్.. ఇప్పుడు పూర్తి ఫిట్నెస్ సాధించాడు. కమ్మిన్స్ ఒకట్రెండు రోజుల్లో జట్టుతో చేరే అవకాశముంది.ఇషాన్ కిషన్ విధ్వంసం..ఇక ప్రాక్టీస్‌లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ శనివారం ఇంట్రా-స్క్వాడ్ సిమ్యులేషన్ మ్యాచ్ ఆడింది. సన్‌రైజర్స్ ఆటగాళ్లు ఎస్ఆర్హెచ్-ఎ, ఎస్ఆర్హెచ్-బి జట్లగా విడిపోయారు. ఈ ఇంట్రా-స్క్వాడ్ మ్యాచ్‌లో ఎస్ఆర్హెచ్-ఎకు ప్రాతినిథ్యం వహించిన వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ విధ్వంసం సృష్టించాడు. బి జట్టు బౌలర్లను ఊచకోత కోశాడు. అభిషేక్ శర్మతో కలిసి ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన కిషన్.. ఆరంభం నుంచే దూకుడుగా ఆడాడు.ఈ క్రమంలో ఇషాన్ 16 బంతుల్లో అర్ధ సెంచరీ సాధించాడు. మొత్తంగా 30 బంతుల్లో 73 పరుగులతో అజేయంగా నిలిచాడు. 10 ఓవర్ల తర్వాత వేరే ఆటగాళ్లకు అవకాశమిచ్చేందుకు ఔటవ్వకుండానే బయటకు వెళ్లిపోయాడు. అతనితో పాటు అభినవ్ మనోహర్, అభిషేక్ శర్మ దూకుడుగా ఆడారు. దీంతో మొదట బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్హెచ్-ఎ టీమ్.. నిర్ణీత 20 ఓవర్లలో 261 పరుగులు చేసింది. కిషన్ బ్యాటింగ్‌కు సంబంధించిన వీడియోను సన్‌రైజర్స్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. కాగా ఐపీఎల్-2025 మెగా వేలంలో కిషన్‌ను రూ.11.25 కోట్ల భారీ ధరకు ఎస్ఆర్హెచ్ కొనుగోలు చేసింది. ఇషాన్ కిషన్ గత కొన్ని సీజన్లలో ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిథ్యం వహించాడు. ఈ మెగా వేలానికి ముందు అతడిని ముంబై రిటైన్ చేసుకోలేదు.చదవండి: IPL 2025: ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి విధ్వంసకర వీరుడు! Ishan Kishan scored a half-century in just 16 balls during SRH's intra-squad match😎📸💥@ishankishan51 #IshanKishan #SRH #IPL2025 #PlayWithFire pic.twitter.com/Vc1UiJAEZM— Ishan's🤫🧘🧡 (@IshanWK32) March 15, 2025ఐపీఎల్-2025కు ఎస్ఆర్హెచ్ జట్టుఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), హర్షల్ పటేల్, రాహుల్ చాహర్, మహ్మద్ షమీ, ఆడమ్ జంపా , అథర్వ తైదే, అభినవ్ మనోహర్, సిమర్జీత్ సింగ్, జీషన్ అన్సారీ, జయదేవ్ ఉనద్కత్, వియాన్ ముల్డర్, కమిందు మెండిస్, సచిన్ హేషన్ బేబీ, అనికేత్, హెన్రిచ్ క్లాసెన్ (వికెట్ కీపర్), పాట్ కమిన్స్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ , నితీష్ కుమార్ రెడ్డి -
ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి విధ్వంసకర వీరుడు!
ఐపీఎల్-2025కు ముందు హ్యారీ బ్రూక్ రూపంలో ఢిల్లీ క్యాపిటల్స్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలిన సంగతి తెలిసిందే. ఈ ఇంగ్లండ్ వైస్ కెప్టెన్ అనూహ్యంగా ఈ ఏడాది సీజన్ ఐపీఎల్ నుంచి వైదొలిగాడు. గతేడాది సీజన్ నుంచి వ్యక్తిగత కారణాలతో తప్పుకున హ్యారీ బ్రూక్.. ఈ ఏడాది సీజన్‌కు అందుబాటులో ఉంటాడని ఢిల్లీ క్యాపిటల్ యాజమాన్యం భావించింది.ఈ క్రమంలో గత డిసెంబర్లో జరిగిన మెగా వేలంలో రూ. 6.25 కోట్ల భారీ ధర వెచ్చించి మరి ఢిల్లీ అతడిని కొనుగోలు చేసింది. కానీ ఈసారి కూడా అతడు హ్యాండ్ ఇచ్చాడు. దీంతో అతడిపై బీసీసీఐ రెండేళ్ల పాటు నిషేదం విధించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ మెనెజ్‌మెంట్ హ్యారీ బ్రూక్ స్ధానాన్ని భర్తీ చేసే పనిలో పడింది.బ్రెవిస్‌పై కన్ను.. ?సౌతాఫ్రికా విధ్వంసకర ఆటగాడు డెవాల్డ్ బ్రెవిస్‌తో హ్యారీ బ్రూక్ స్ధానాన్ని భర్తీ చేయాలని ఢిల్లీ క్యాపిటల్స్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్-2025 మెగా వేలంలో రూ. 75 లక్షల బేస్‌ప్రైస్‌తో వచ్చిన బ్రెవిస్‌ను ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపలేదు.అయితే ఆ తర్వాత జరిగిన సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో 21 ఏళ్ల బ్రెవిస్ దుమ్ములేపాడు. బ్రెవిస్ మిడిలార్డర్లో వచ్చి అద్బుత ఇన్నింగ్స్‌లు ఆడాడు. ఈ టోర్నీలో ఏంఐ కేప్ టౌన్ తరపున 12 మ్యాచ్‌లు ఆడిన బ్రెవిస్.. 184.17 స్ట్రైక్ రేట్‌తో 291 పరుగులు చేశాడు. బ్రెవిస్‌తో బంతితో కూడా మ్యాజిక్ చేసే సత్తాఉంది.ఈ క్రమంలోనే అతడిని తమ జట్టులోకి తీసుకోవాలని ఢిల్లీ భావిస్తోంది. బ్రెవిస్ ఐపీఎల్లో గతసీజన్ వరకు ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిథ్యం వహించాడు. ఐపీఎల్-2022 మెగా వేలంలో బ్రెవిస్‌ను మూడు కోట్లకు ముంబై కొనుగోలు చేసింది.ఆ తర్వాత ఐపీఎల్-2025 మెగా వేలానికి ముందు అతడిని ముంబై విడిచిపెట్టింది. ఇక ఐపీఎల్ 18వ సీజన్ మార్చి 22 నుంచి ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో ఈడెన్ గార్డెన్స్ వేదికగా డిఫెండింగ్ ఛాంపియన్ కోల్‌కతా నైట్‌రైడర్స్, ఆర్సీబీ జట్లు తలపడనున్నాయి.2025 ఐపీఎల్ సీజన్ కోసం ఢిల్లీ జట్టు..ఫాఫ్ డుప్లెసిస్, జేక్ ఫ్రేజర్ మెక్‌గుర్క్, కరుణ్ నాయర్, సమీర్ రిజ్వి, అషుతోష్ శర్మ, విప్రాజ్ నిగమ్, దర్శన్ నల్కండే, అజయ్ జాదవ్ మండల్, త్రిపురణ విజయ్, అక్షర్ పటేల్, మన్వంత్ కుమార్, మాధవ్ తివారి, ట్రిస్టన్ స్టబ్స్, అభిషేక్ పోరెల్, డొనొవన్ ఫెరియెరా, కేఎల్ రాహుల్, కుల్దీప్ యాదవ్, దుష్మంత చమీరా, మిచెల్ స్టార్క్, మోహిత్ శర్మ, టి నటరాజన్, ముకేశ్ కుమార్చదవండి: IPL 2025: 'ఒకప్పుడు రోహిత్ వారసుడు.. కానీ సడన్‌గా ఏమైందో మరి' -
ముంబై ఇండియన్స్ వర్సెస్ ఢిల్లీ ఫైనల్.. తుది జట్లు ఇవే
మహిళల ప్రీమియర్ లీగ్-2025లో తుది సమరానికి తెరలేచింది. ముంబైలోని బ్రౌబౌర్న్ స్టేడియం వేదికగా ఫైనల్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది.ఈ తుది పోరులో ముంబై ఎటువంటి మార్పులు లేకుండా బరిలోకి దిగగా.. ఢిల్లీ ఒకే మార్పు చేసింది. టిటాస్ సాదు స్ధానంలో చరణి తుది జట్టులోకి వచ్చింది.తుది జట్లుముంబై ఇండియన్స్ (ప్లేయింగ్ XI): యాస్తికా భాటియా(వికెట్ కీపర్), హేలీ మాథ్యూస్, నాట్ స్కివర్-బ్రంట్, హర్మన్‌ప్రీత్ కౌర్(సి), సజీవన్ సజన, అమేలియా కెర్, అమంజోత్ కౌర్, జి కమలిని, సంస్కృతి గుప్తా, షబ్నిమ్ ఇస్మాయిల్, సైకా ఇషాక్ఢిల్లీ క్యాపిటల్స్ (ప్లేయింగ్ XI): మెగ్ లానింగ్ (కెప్టెన్), షఫాలీ వర్మ, జెమిమా రోడ్రిగ్స్, అనాబెల్ సదర్లాండ్, మారిజానే కాప్, జెస్ జోనాస్సెన్, సారా బ్రైస్ (వికెట్ కీపర్), నికి ప్రసాద్, మిన్ను మణి, శిఖా పాండే, నల్లపురెడ్డి చరణిచదవండి: సంచలనం.. సూపర్ ఓవర్లో జీరో రన్స్! 16 ఏళ్ల చరిత్రలోనే? -
సంచలనం.. సూపర్ ఓవర్లో జీరో రన్స్! 16 ఏళ్ల చరిత్రలోనే?
మలేషియా- హాంకాంగ్-బహ్రెయిన్ మధ్య జరుగుతున్న టైసిరీస్లో సంచలనం నమోదైంది. ఈ సిరీస్‌లో భాగంగా శుక్రవారం బ్యూమాస్ క్రికెట్ ఓవల్ వేదికగా హాంకాంగ్, బహ్రెయిన్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో బహ్రెయిన్ అత్యంత చెత్త రికార్డును తమ పేరిట లిఖించుకుంది. సూపర్ ఓవర్లో ఒక్క పరుగు కూడా సాధించని జట్టుగా బహ్రెయిన్ చెత్త రికార్డును నెలకొల్పింది. 16 ఏళ్ల సూపర్ ఓవర్ చరిత్రలో ఏ జట్టు కూడా ఈ చెత్త ఫీట్‌ను నమోదు చేయలేదు.ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన హాంకాంగ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 129 పరుగులు చేసింది. హాంకాంగ్ బ్యాటర్లలో జీషన్ అలీ (29), షాహిద్ వాసిఫ్ (31), నస్రుల్లా రాణా (14) రాణించారు. అనంతరం స్వల్ప లక్ష్య చేధనలో ఓపెనర్ ప్రశాంత్ కురుప్ (37 బంతుల్లో 31) బహ్రెయిన్‌కు అద్బుతమైన ఆరంభాన్ని ఇచ్చాడు.అయితే ఆ తర్వాత బహ్రెయిన్ వరుస క్రమంలో వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. దీంతో బహ్రెయిన్ విజయానికి చివరి ఓవర్లో 13 పరుగులు అవసరమయ్యాయి. ఆ జట్టు కెప్టెన్ అహ్మర్ బిన్ నాసిర్, మొదటి రెండు బంతుల్లో నాలుగు పరుగులు చేశాడు.తర్వాతి రెండు బంతుల్లో రెండు సింగిల్స్ వచ్చాయి. దీంతో బహ్రెయిన్ విజయసమీకరణం చివరి రెండు బంతుల్లో ఏడు పరుగులుగా మారింది. ఐదో బంతికి అహ్మర్ బిన్ సిక్సర్‌గా మలచి మ్యాచ్‌ను టై చేశాడు. అయితే ఆఖరి బంతికి బిన్ ఔట్ కావడంతో మ్యాచ్ టై అయింది. ఈ క్రమంలో ఫలితాన్ని తేల్చేందుకు అంపైర్లు సూపర్ ఓవర్‌ను నిర్వహించారు.ఎహ్సాన్ అదుర్స్..ఈ క్రమంలో సూపర్ ఓవర్లో ఛేజింగ్ జట్టు ముందుగా బ్యాటింగ్ చేయాల్సి వచ్చింది. బహ్రెయిన్ కెప్టెన్ బిన్, సోహైల్ అహ్మద్ లు సూపర్ ఓవర్‌ను ఎదుర్కోనేందుకు వచ్చారు. అదేవిధంగా ప్రత్యర్ధి జట్టు కెప్టెన్ ఈ సూపర్ ఓవర్ వేసే బాధ్యతను స్పిన్నర్ ఎహ్సాన్ ఖాన్‌కు అప్పగించాడు.ఈ క్రమంలో ఎహ్సాన్ రెండవ బంతికి బిన్ ను, మూడవ బంతికి సోహైల్ అహ్మద్‌ను ఔట్ చేయడంతో పరుగులు ఏమి రాకుండా సూపర్ ఓవర్ ముగిసింది. దీంతో బహ్రెయిన్ ఈ చెత్త రికార్డును తమ ఖాతాలో వేసుకుంది. కాగా బ్యాటింగ్‌కు దిగిన జట్టు రెండు వికెట్లు కోల్పోతే సూపర్ ఓవర్ ముగుస్తుంది.చదవండి: IPL 2025: 'ఒకప్పుడు రోహిత్ వారసుడు.. కానీ సడన్‌గా ఏమైందో మరి' -
'ఒకప్పుడు రోహిత్ వారసుడు.. కానీ సడన్‌గా ఏమైందో మరి'
ఐపీఎల్-2025కు సమయం అసన్నమవుతోంది. మార్చి 22 నుంచి ఈ క్రికెట్ పండగ ప్రారంభం కానుంది. ఈ టైటిల్ వేటలో మొత్తం పది జట్లు మరోసారి తమ ఆదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, ఎంఎస్ ధోని వంటి దిగ్గజాలు అభిమానులను అలరించేందుకు సిద్దమయ్యారు. అయితే ఈ ఏడాది సీజన్లో అందరి దృష్టి ఐదు సార్లు ఛాంపియన్స్ ముంబై ఇండియన్స్‌పైనే ఉంది.గతేడాది సీజన్లో హార్దిక్ పాండ్యా నాయకత్వంలోని ముంబై ఇండియన్స్ దారుణ ప్రదర్శనతో పాయింట్ల పట్టికలో ఆఖరి స్ధానంలో నిలిచింది. రోహిత్ శర్మను తప్పించి మరి హార్దిక్‌కు ముంబై యాజమాన్యం తమ జట్టు పగ్గాలను అప్పగించింది. అప్పటిలో ఇది తీవ్ర చర్చనీయాంశమైంది. తొలి సీజన్లోనే గుజరాత్ టైటాన్స్‌ను ఛాంపియన్‌గా నిలిచిన పాండ్యా.. ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా మాత్రం తన మార్క్‌ను చూపించలేకపోయాడు. ఆటగాడిగా, కెప్టెన్‌గా విఫలమై తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు. దీంతో ఐపీఎల్ 18వ సీజన్లో హార్దిక్ పాండ్యా ఎలా రాణిస్తాడో అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో హార్దిక్‌పై భారత మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా కీలక వ్యాఖ్యలు చేశాడు. "కెప్టెన్‌గా తనను తను నిరూపించుకోవడానికి హార్దిక్ పాండ్యాకు ఇదొక అద్భుత అవకాశం. ఒకప్పుడు అతడు రోహిత్ శర్మ వారుసుడిగా కొనసాగాడు. రోహిత్ శర్మ గైర్హజారీలో భారత జట్టు కెప్టెన్‌గా అతడు వ్యవహరించేవాడు. వైట్‌బాల్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా అవుతాడని అంతా ఊహించారు.కానీ సడన్‌గా కెప్టెన్సీ జాబితా నుంచి పాండ్యాను తప్పించారు. హార్దిక్ గురించి ప్రస్తుతం ఎవరూ చర్చించడం లేదు. అతడిని కనీసం వైస్ కెప్టెన్‌గా కూడా ఎంపిక చేయలేదు. పాండ్యా అద్బుతమైన ఆటగాడు. జట్టు కష్టాల్లో ఉన్న ప్రతీసారి తను ముందుకు వచ్చి అదుకునేవాడు. కెప్టెన్‌గా గుజరాత్ టైటాన్స్‌కు టైటిల్‌ను అందించాడు. వరుసగా రెండోసారి ఫైనల్‌కు కూడా చేర్చాడు.ఈ సీజన్లో హార్దిక్ కెప్టెన్‌గా తన తను నిరూపించుకుంటే మళ్లీ అందరి దృష్టిని ఆకర్షించే అవకాశముంది" అని చోప్రా తన యూట్యూబ్ ఛానల్లో పేర్కొన్నాడు. కాగా ముంబై ఇండియన్స్ తమ తొలి మ్యాచ్‌లో మార్చి 23న చెన్నై సూపర్‌కింగ్స్‌తో తలపడనుంది.చదవండి: IPL 2025: సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు గుడ్‌న్యూస్ -
IPL 2025: రాయల్స్ మునుపటి వైభవం సాధిస్తుందా?
మొట్ట మొదటి ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) టైటిల్ గెలుచుకున్న జట్టు రాజస్థాన్ రాయల్స్. ప్రపంచ ప్రఖ్యాత ఆస్ట్రేలియా స్పిన్నర్, దివంగత షేన్ వార్న్ (Shane Warne) నాయకత్వంలో 2008లో టైటిల్ గెలిచింది. ఆ తర్వాత మళ్లీ 2022లో రన్నర్ అప్ గా నిలవడంతో పాటు.. మొత్తంగా ఆరుసార్లు ప్లేఆఫ్‌లకు చేరుకుంది. రాయల్స్ కెప్టెన్‌గా టీమిండియా వికెట్ కీపర్ సంజూ సామ్సన్ (Sanju Samson) కొనసాగుతున్నాడు. 2025 మెగా వేలానికి ముందు రాయల్స్ అతడిని రూ.18 కోట్ల భారీ ధరకు రెటైన్ చేసుకుంది.భారత్ క్రికెట్ లో అపార నైపుణ్యం ఉన్న ఆటగాళ్ల లో ఒకడిగా 30 ఏళ్ళ ఈ కేరళ వికెట్ కీపర్ ఖ్యాతి వహించాడు. సామ్సన్ నాయకత్వం, సామర్థ్యాలపై ఉన్న అపార విశ్వాసాన్ని రాయల్స్ పునరుద్ఘాటించింది. సీజన్‌లోని మొదటి మ్యాచ్ నుంచే అతను పూర్తిగా ఫిట్‌గా, అందుబాటులో ఉండాలని ఫ్రాంచైజీ ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఐపీల్ రెండో రోజున (మార్చి 23న) హైదరాబాద్ వేదిక గా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్ తో రాయల్స్ ఈ సీజన్ లో తన టైటిల్ వేట ప్రారంభిస్తుంది.గాయం నుంచి కోలుకున్న సామ్సన్ ఇంగ్లండ్‌తో జరిగిన ఐదో టి20 మ్యాచ్ సందర్భంగా సామ్సన్ కుడి చూపుడు వేలు కి గాయమైంది. కొన్ని రోజుల తర్వాత అతనికి శస్త్రచికిత్స కూడా జరిగింది, రెండు నెలల పాటు క్రికెట్‌కు దూరంగా ఉన్న సామ్సన్ మళ్ళీ కోలుకున్నట్టు తెలుస్తోంది. అయితే అతను ఇంకా జట్టు శిక్షణ శిబిరంలో చేరలేదు. సంజు సామ్సన్ పునరాగమనం కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.అయితే సామ్సన్ బ్యాటింగ్ ఫిట్నెస్ పరీక్షలో విజయవంతంగా పూర్తి చేసినప్పటికీ, వికెట్ కీపింగ్ విధులను తిరిగి ప్రారంభించడానికి ఇంకా అనుమతి రాలేదని తెలుస్తోంది. అయితే రాయల్స్ జట్టులో ధ్రువ్ జురెల్ ఉన్నందున వికెట్ కీపింగ్ బాధ్యతలు అతనికి అప్పగించే అవకాశముంది. బౌలింగ్ లో ఇంగ్లాండ్ పేస్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ పునరాగమనం తో రాయల్స్ కొత్త ఉత్సాహం తో ఉంది. గత సంవత్సరం చివరి దశలో తడబడిన తర్వాత, మెగా వేలంలో రాయల్స్ తమ జట్టును స్మార్ట్ కొనుగోళ్ల ద్వారా పునర్నిర్మించింది.ప్రధాన కోచ్ గా చేరిన రాహుల్ ద్రవిడ్ మార్గదర్శకత్వంతో రాయల్స్ విధానంలో మార్పు కనిపిస్తోంది. మానసిక దృఢత్వం, వ్యూహాత్మక ఖచ్చితత్వాన్ని పెంపొందించడంపై దృష్టి పెట్టింది. సామ్సన్, యశస్వి జైస్వాల్, షిమ్రాన్ హెట్‌మైర్, రియాన్ పరాగ్, మరియు ధ్రువ్ జురెల్ వంటి నైపుణ్యం ఉన్న ఆటగాళ్లు జట్టులో ఉన్నందున బ్యాటింగ్, బౌలింగ్ రెండింటినీ బలోపేతం చేయడానికి రాయల్స్ జోఫ్రా ఆర్చర్, నితీష్ రాణాతో సహా వేలంలో కీలకమైన చేర్పులను చేసింది.రాయల్స్ జట్టులో వ్యూహాత్మక మార్పులు రాయల్స్ 2025 సీజన్ కోసం జట్టులో వ్యూహాత్మక మార్పులు చేసింది. అనుభవజ్ఞులైన స్పిన్నర్లు రవిచంద్రన్ అశ్విన్, యుజ్వేంద్ర చాహల్‌లను వదులుకోవడం వారి జట్టు యొక్క ప్రధాన వ్యూహంలో మార్పును సూచిస్తుంది. జోఫ్రా ఆర్చర్‌ను కొనుగోలు చేయడంతో బౌలింగ్ కి గణనీయమైన పదును లభించింది. ఇంకా ఫజల్హాక్ ఫరూఖీ , తుషార్ దేశ్‌పాండే లతో పాటు స్పిన్ విభాగంలో వానిందు హసరంగా, మహేష్ తీక్షణ ఉన్నందున మిడిల్ ఓవర్ల లలో వైవిధ్యం, పొదుపుగా బౌలింగ్ చేసే అవకాశముంది. నితీష్ రాణా చేరికతో బ్యాటింగ్ యూనిట్ బలోపేతమయ్యింది. కోల్‌కతా నైట్ రైడర్స్ తరపున నిలకడగా రాణించిన రాణా బ్యాటింగ్ ని బలోపేతం చేస్తాడనడంలో సందేహం లేదు. ఇంకా 13 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ కొనుగోలు ఫ్రాంఛైజీ దీర్ఘకాలిక దృక్పథాన్ని నొక్కి చెబుతుంది.రాయల్స్ ప్రధాన ఆటగాళ్లు:సంజు సామ్సన్కెప్టెన్గా, అత్యంత నమ్మకమైన బ్యాటర్‌గా, సామ్సన్ ముందు నుండి నాయకత్వం వహించే బాధ్యతను నిర్వర్తిస్తున్నాడు. ఈ సీజన్లో జోస్ బట్లర్ లేనందున సామ్సన్ పై బాధ్యత మరింత పెరిగే అవకాశముంది. జట్టుకి స్థిరత్వాన్నివ్వడం, క్లిష్టమైన సమయాల్లో ఆదుకోవడం ఇప్పుడు సామ్సన్ పైనే ఉంటుంది.యశస్వి జైస్వాల్అపార నైపుణ్యం ఉన్న యువ బ్యాటర్ జైస్వాల్ ఇటీవలి ఫామ్ అంత నిలకడగా లేనందున, భారత పరిమిత ఓవర్ల జట్టులోకి మళ్ళీ రావడానికి ఐపీఎల్ అతనికి మరో అవకాశం కల్పిస్తోంది.నితీష్ రాణాకోల్కతా నైట్ రైడర్స్ నుండి రాయల్స్ కి మారడం రాణా ఐపీఎల్ కెరీర్లో కొత్త అధ్యాయాన్ని సూచిస్తుంది. బ్యాటింగ్ మరియు బౌలింగ్ రెండింటిలోనూ అతని బహుముఖ ప్రజ్ఞ రాజస్థాన్‌కు గట్టి బలాన్నిస్తోంది.జోఫ్రా ఆర్చర్గాయాల నుంచి కోలుకున్న ఆర్చర్ తిరిగి రావడంతో రాజస్థాన్ బౌలింగ్ కు మళ్ళీ పదును చేకూరింది. వ్యక్తిగతంగా సంవత్సరాల గాయాల వైఫల్యాల తర్వాత, ఐపీఎల్ 2025 ఇంగ్లాండ్ పేసర్‌కు తన పూర్వ వైభవాన్ని తిరిగి సాధించేందుకు అవకాశాన్ని కల్పిస్తుండంలో సందేహం లేదు.రాజస్థాన్ రాయల్స్ పూర్తి జట్టుసంజూ శాంసన్, యశస్వి జైస్వాల్, రియాన్ పరాగ్, సందీప్ శర్మ, షిమ్రోన్ హెట్మెయర్, ధ్రువ్ జురెల్, జోఫ్రా ఆర్చర్, మహేశ్ తీక్షణ, వనిందు హసరంగా, ఆకాష్ మధ్వల్, కుమార్ కార్తికేయ, నితీష్ రాణా, తుషార్ దేశ్‌పాండే, శుభమ్ దూబే, ఎఫ్ యుధ్వీర్ సింగ్, వైభవ్ సూర్యవంశీ, క్వేనా మఫాకా, కునాల్ రాథోడ్, అశోక్ శర్మ.చదవండి: టీ20, వన్డేలు చాలు.. టెస్టుల్లో ఆడలేను.. కారణం ఇదే: వరుణ్ చక్రవర్తి -
బుమ్రా ఒక అద్బుతం.. అతడిని ఎదుర్కోవడం చాలా కష్టం: ఆసీస్ క్రికెటర్
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ (2024-25)ని 3-1 తేడాతో టీమిండియా కోల్పోయిన సంగతి తెలిసిందే. అయితే ఈ సిరీస్‌లో భారత్ ఓటమి పాలైనప్పటికి.. స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా మాత్రం ప్రత్యర్ధి బ్యాటర్లను బెంబేలెత్తించాడు. అతడి బౌలింగ్ ప్రదర్శనకు ఆస్ట్రేలియా ఆటగాళ్లు సైతం ఫిదా అయిపోయారు.బుమ్రా.. ఓవరాల్‌గా 32 వికెట్లు పడగొట్టి లీడింగ్ వికెట్ టేకర్‌గా నిలిచాడు. తాజాగా టీమిండియా పేస్ గుర్రంపై ఆస్ట్రేలియా యువ బ్యాటర్ నాథన్ మెక్‌స్వీని ప్రశంసల వర్షం కురిపించాడు. బుమ్రా అద్భుతమైన బౌలర్ అని అతడు కొనియాడాడు. అదేవిధంగా బుమ్రా బౌలింగ్‌లో తాను ఎదుర్కొన్న సవాళ్ల గురించి ఈ ఆసీస్ యువ క్రికెటర్ వెల్లడించాడు."బుమ్రాను ఎదుర్కొవడం చాలా కష్టం. బీజీటీలో అతడి నుంచి నాకు కఠిన సవాలు ఎదురైంది. అతడు బౌలింగ్‌ను ఆర్ధం చేసుకోవడంలో ఘోరంగా విఫలమయ్యాను. బుమ్రా ఒక వరల్డ్ క్లాస్ బౌలర్. ఈ విషయం నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అంతకుముందు ఎప్పుడూ అతనిని ఎదుర్కోలేదు.బహుశా నేను విఫలమవడానికి ఇదొక కారణం కావచ్చు. బుమ్రాకు అద్భుతమైన స్కిల్స్ ఉన్నాయి. బంతిని ఏ ప్రాంతంలో సంధిస్తే బ్యాటర్ ఇబ్బంది పడతాడో అతడికి బాగా తెలుసు. అందుకే అతడిని ఎదుర్కొవడం అంత సులువు కాదు. ఈ సిరీస్‌లో నేను ఒక్కడినే కాదు మా జట్టులోని ఇతర ఆటగాళ్లూ సైతం బుమ్రాపై పైచేయి సాధించలేకపోయారు. నాకు అదికాస్త ఆత్మవిశ్వాసం ఇచ్చింది అని విల్లో టాక్ పాడ్‌కాస్ట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మెక్‌స్వీనీ పేర్కొన్నాడు. కాగా ఈ సిరీస్‌లో మెక్‌స్వీనిని మూడు టెస్టుల్లో 4 సార్లు బుమ్రానే ఔట్ చేశాడు. ఇక ఈ సిరీస్‌లో ఆఖరి టెస్టులో బుమ్రా వెన్ను గాయం తిరగబెట్టింది. దీంతో అతడు ఛాంపియన్స్ ట్రోఫీ-2025కు దూరమయ్యాడు. ప్రస్తుతం ఏన్సీఎలో ఉన్న జస్ప్రీత్ ఐపీఎల్ ఆరంభ మ్యాచ్‌లకు దూరం కానున్నాడు. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ మార్చి 22 నుంచి ప్రారంభం కానుంది.చదవండి: IPL 2025: రాజస్తాన్ రాయల్స్‌కు భారీ షాక్.. సంజూ ఇంకా బెంగళూరులోనే? -
రాజస్తాన్ రాయల్స్‌కు భారీ షాక్.. సంజూ ఇంకా బెంగళూరులోనే?
ఐపీఎల్-2025 (IPL 2025)కు మరో వారం రోజుల్లో తెరలేవనుంది. మార్చి 22న ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్, ఆర్సీబీ మధ్య జరగనున్న మ్యాచ్‌తో ఈ మెగా టోర్నీ ప్రారంభం కానుంది. ఈ మెగా ఈవెంట్ కోసం మొత్తం పది జట్లు తమ అస్త్రశస్త్రాలను సిద్దం చేసుకుంటున్నాయి. తమ హోం గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన ప్రాక్టీస్ క్యాంపులలో ఆటగాళ్లు తీవ్రంగా శ్రమిస్తున్నారు.అయితే ఈ ఏడాది సీజన్ ఆరంభానికి కొన్ని జట్లను గాయాల బెడద వెంటాడుతోంది. అందులో ఒకటి రాజస్తాన్ రాయల్స్. అరంగేట్ర సీజన్లో ఛాంపియన్స్‌గా నిలిచిన రాజస్తాన్ రాయల్స్.. అప్పటి నుంచి మరోసారి టైటిల్‌ను సొంతం చేసుకోలేకపోయింది. ఈసారి ఎలాగైనా విజేతగా నిలిచి తమ పదిహేడు ఏళ్ల నిరీక్షణకు తెరదించాలని రాజస్తాన్ భావిస్తోంది. అయితే కెప్టెన్ సంజూ శాంసన్(Sanju Samson) ఇంకా పూర్తి ఫిట్నెస్ సాధించకపోవడం ఆర్ఆర్కు ప్రధాన సమస్యగా మారింది.తొలి మ్యాచ్‌కు దూరం..ఈ ఏడాది సీజన్లో రాజస్తాన్ రాయల్స్ తమ తొలి మ్యాచ్‌లో మార్చి 23న ఉప్పల్ స్టేడియం వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తలపడనుంది.ఈ మ్యాచ్‌కు సంజూ శాంసన్ దూరమయ్యే అవకాశముంది. ఐపీఎల్లో పాల్గోనేందుకు శాంసన్ కు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (నేషనల్ క్రికెట్ అకాడమీ) నుండి ఫిట్నెస్ క్లియరెన్స్ రాలేదు.ఇంగ్లండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో బ్యాటింగ్ చేస్తుండగా అతడి కుడి చూపుడు వేలుకు గాయమైంది. చూపుడు వేలు విరిగిపోవడంతో సర్జరీ చేయించుకున్నాడు. దీంతో అతడు ఆరు వారాల పాటు అతడికి విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు. ఈ క్రమంలోనే రంజీ ట్రోఫీ ఫైనల్‌కు సైతం సంజూ దూరమయ్యాడు. అయితే ప్రస్తుతం బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో ఉన్న శాంసన్.. మార్చి 16 లేదా మార్చి 17న రాజస్తాన్ రాయల్స్ ట్రైనింగ్ క్యాంపులో చేరుతాడని వార్తలు వినిపించాయి. కానీ ఇప్పుడు అతడు రాజస్తాన్ జట్టులో చేరడానికి మరింత సమయం పట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ కేరళ వికెట్ కీపర్ బ్యాటర్‌కు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లోని వైద్య సిబ్బంది ఇంకా క్లియరన్స్ ఇవ్వలేదు.తాజాగా సంజూకు వైద్య సిబ్బంది ఫిట్నెస్ పరీక్షలు నిర్వహించినట్లు సమాచారం. అతడు బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఎటువంటి సమస్య ఎదుర్కోలేదని, వికెట్ కీపింగ్ సమయంలో మాత్రం కాస్త ఇబ్బంది పడుతున్నట్లు ఐపీఎల్ వర్గాలు వెల్లడించాయి. అయితే భారత టీ20 జట్టులో సంజూ కీలక సభ్యునిగా ఉండడంతో పూర్తి ఫిట్నెస్ సాధించకుండా అతడి ఆడించి రిస్క్ తీసుకోకూడదని బీసీసీఐ భావిస్తున్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. ఒకట్రెండు రోజుల్లో సంజూ ఫిట్‌నెస్‌పై ఓ క్లారిటీ వచ్చే అవకాశముంది. ఒకవేళ సంజూ తొలి మ్యాచ్‌లో ఆడినా స్పెషలిస్ట్ బ్యాటర్‌గానే ఉండనున్నాడు. అతడి స్ధానంలో ధ్రువ్ జురెల్ వికెట్ కీపింగ్ చేసే ఛాన్స్ ఉంది.ఐపీఎల్-2025కు రాజస్తాన్ టీమ్..బ్యాటర్లు: సంజు శాంసన్ (కెప్టెన్ అండ్ వికెట్ కీపర్), యశస్వి జైస్వాల్, ధృవ్ జురెల్ (వికెట్ కీపర్), షిమ్రోన్ హెట్మెయర్, నితీష్ రాణా, శుభమ్ దూబే, వైభవ్ సూర్యవంశీ, కునాల్ రాథోడ్ఆల్ రౌండర్లు: రియాన్ పరాగ్, వనిందు హసరంగాబౌలర్లు: సందీప్ శర్మ, జోఫ్రా ఆర్చర్, మహేశ్ తీక్షణ, తుషార్ దేశ్‌పాండే, ఫజల్హక్ ఫరూకీ, క్వేనా మఫాకా, ఆకాష్ మధ్వల్, యుధ్వీర్ సింగ్, కుమార్ కార్తికేయ, అశోక్ శర్మచదవండి: IPL 2025: సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు గుడ్‌న్యూస్ -
టీ20, వన్డేలు చాలు.. టెస్టుల్లో ఆడలేను.. కారణం ఇదే: వరుణ్ చక్రవర్తి
టెస్టు ఫార్మాట్ తనకు సరిపడదని టీమిండియా మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి (Varun Chakravarthy) అన్నాడు. టీ20, వన్డేల్లో కొనసాగితే చాలని.. అందులోనే తనకు సంతృప్తి దొరుకుతుందని పేర్కొన్నాడు. కాగా 2021లో టీమిండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన ఈ కర్ణాటక బౌలర్ చాలాకాలం పాటు జట్టుకు దూరంగానే ఉన్నాడు.రీ ఎంట్రీలో అదుర్స్అయితే, ఐపీఎల్లో సత్తా చాటుతున్న వరుణ్ చక్రవర్తి జాతీయ జట్టులో పునరాగమనం చేయడానికి ప్రధాన కారణం హెడ్‌కోచ్ గౌతం గంభీర్. గతేడాది కోల్‌కతా నైట్ రైడర్స్ మెంటార్‌గా పనిచేసిన గౌతీ.. ఆ జట్టుకు ప్రాతినిథ్యం వహించిన వరుణ్ నైపుణ్యాలను దగ్గరగా గమనించాడు. ఈ క్రమంలో వరుణ్ టీమిండియా రీఎంట్రీకి మార్గం సుగమమైందని చెప్పవచ్చు.గతేడాది స్వదేశంలో బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్ సందర్భంగా అదరగొట్టిన వరుణ్.. ఆ తర్వాత సౌతాఫ్రికా పర్యటనలోనూ సత్తా చాటాడు. అనంతరం సొంతగడ్డపై ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌లో అద్భుత ప్రదర్శనతో ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’గా నిలిచిన ఈ రైటార్మ్ లెగ్ బ్రేక్ స్పిన్నర్.. వన్డే జట్టులోనూ చోటు దక్కించుకున్నాడు.చాంపియన్స్ ట్రోఫీలోనూ సత్తా చాటిఇంగ్లండ్తో వన్డే సిరీస్ సందర్భంగా అరంగేట్రం చేసిన వరుణ్.. అనూహ్య రీతిలో ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 జట్టుకు ఎంపికయ్యాడు. తొలి రెండు మ్యాచ్‌లలో తుదిజట్టులో స్థానం దక్కనప్పటికీ.. లీగ్ దశలో ఆఖరిగా న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో ఆడిన 33 ఏళ్ల ఈ స్పిన్ బౌలర్.. ఏకంగా ఐదు వికెట్లు కూల్చాడు.అంతేకాదు.. ఆస్ట్రేలియాతో సెమీస్‌లో టీమిండియా విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. అదే విధంగా.. ఫైనల్లో న్యూజిలాండ్‌ను ఓడించడంలోనూ తన వంతు సాయం చేశాడు. కేవలం మూడు మ్యాచ్‌లలోనే తొమ్మిది వికెట్లు తీసి చాంపియన్స్ ట్రోఫీ-2025 అత్యధిక వికెట్ల వీరుల జాబితాలో రెండో స్థానంలో నిలిచాడు.టెస్టుల్లో ఆడటం నాకూ ఇష్టమే.. కానీఈ నేపథ్యంలో వరుణ్ చక్రవర్తిపై ప్రశంసల వర్షం కురుస్తోంది. టెస్టుల్లోనూ అతడిని ఆడించాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో వరుణ్ స్వయంగా తనకు టెస్టు ఫార్మాట్ సరిపడదని చెప్పడం విశేషం. ఓ యూట్యూబ్ చానెల్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘‘టెస్టుల్లో ఆడటం నాకూ ఇష్టమే. కానీ నా బౌలింగ్ శైలి అందుకు సరిపడదు.నా బౌలింగ్ స్టైల్ ఇంచుమించు మీడియం పేస్లాగే ఉంటుంది. ఇక టెస్టు క్రికెట్లో వరుస విరామాల్లో 20- 30 ఓవర్లు బౌలింగ్ చేయాల్సి ఉంటుంది. నాకు అది సాధ్యం కాదు. నేను కాస్త ఫాస్ట్‌గా బౌల్ చేస్తాను కాబట్టి.. 10- 15 ఓవర్ల వరకే నాకు సౌకర్యంగా ఉంటుంది. అదేమో రెడ్ బాల్ క్రికెట్‌కు సరిపడదు.అందుకే నేను ప్రస్తుతం 20, 50 ఓవర్ల క్రికెట్‌పై మాత్రమే దృష్టి పెట్టాను. వైట్‌బాల్ క్రికెట్‌కే పరిమితం కావాలని భావిస్తున్నాను’’ అని వరుణ్ చక్రవర్తి తన మనసులోని మాటను వెల్లడించాడు.అక్కడన్నీ స్పిన్‌కు అనుకూలమైన వికెట్లుఇక ఆరంభంలో పేసర్‌గా ఉన్న తమిళనాడు బౌలర్ వరుణ్.. తర్వాత స్పిన్నర్‌గా మారిన విషయం తెలిసిందే. ఈ విషయంలో పశ్చాత్తాపం ఉందా అన్న ప్రశ్నకు బదులిస్తూ.. ‘‘నిజమే.. తొలిరోజుల్లో నేను మీడియం పేస్‌తో బౌలింగ్ చేశా. అక్కడ చాలా మంది పేసర్లు ఉండేవారు.అయితే, తమిళనాడు వికెట్లపై బంతి స్వింగ్ కాదు. అక్కడన్నీ స్పిన్‌కు అనుకూలమైన వికెట్లు. అందుకే మీరు తమిళనాడు నుంచి ఎక్కువ మంది ఫాస్ట్ బౌలర్లను చూడలేరు’’ అని చెప్పుకొచ్చాడు. కాగా ఇంగ్లండ్‌తో జూన్‌లో మొదలయ్యే టెస్టు సిరీస్‌లో వరుణ్ చక్రవర్తిని ఆడించాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్న వేళ.. అతడు తనంతట తానుగా పోటీ నుంచి తప్పుకోవడం గమనార్హం.చదవండి: ఇంగ్లండ్‌తో టెస్టులు.. టీమిండియా కెప్టెన్‌గా అతడే! బీసీసీఐ గ్రీన్ సిగ్నల్? -
IPL 2025: సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు గుడ్‌న్యూస్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) ఫ్రాంఛైజీ సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు శుభవార్త. ఆ జట్టు యువ ఆల్‌రౌండర్, తెలుగు తేజం నితీశ్ కుమార్ రెడ్డి (Nitish Kumar Reddy) ఫిట్నెస్ సాధించాడు. జాతీయ క్రికెట్ అకాడమీ (NCA) నుంచి క్లియరెన్స్ సర్టిఫికెట్ పొందాడు.ఈ క్రమంలో నితీశ్ రెడ్డి ఆదివారం సన్‌రైజర్స్ జట్టుతో చేరనున్నాడు. కాగా గతేడాది ఐపీఎల్లో సత్తా చాటి ‘ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్’గా నిలిచాడు ఈ విశాఖపట్నం కుర్రాడు. రైజర్స్ తరఫున బరిలోకి దిగిన ఈ పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ 13 మ్యాచ్‌లలో కలిపి 303 పరుగులు చేశాడు. అంతర్జాతీయ క్రికెట్లో అడుగుఇందులో రెండు అర్ధ శతకాలు ఉండటం విశేషం. అదే విధంగా.. మూడు వికెట్లు కూడా తీశాడు ఈ ఆంధ్ర ఆల్‌రౌండర్. ఈ నేపథ్యంలో టీమిండియా సెలక్టర్ల దృష్టిని ఆకర్షించిన నితీశ్ రెడ్డి గతేడాది అక్టోబరులో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. బంగ్లాదేశ్‌తో స్వదేశంలో టీ20 సిరీస్ సందర్భంగా అరంగేట్రం చేసిన ఈ 21 ఏళ్ల ఆటగాడు.. అనూహ్య రీతిలో అదే ఏడాది టెస్టుల్లోనూ రంగప్రవేశం చేశాడు.కంగారూ గడ్డపై శతకంతో..ఏకంగా ఆస్ట్రేలియాతో ప్రతిష్టాత్మక బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో ఆడే అవకాశం దక్కించుకున్న నితీశ్ రెడ్డి.. కంగారూ గడ్డపై అదరగొట్టాడు. ముఖ్యంగా సీనియర్లంతా విఫలమైన వేళ మెల్బోర్న్లో శతకం సాధించి క్రికెట్ ప్రపంచం దృష్టిని తనవైపునకు తిప్పుకున్నాడు. అయితే, ఇటీవల స్వదేశంలో ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌కు ఎంపికైన నితీశ్.. దురదృష్టవశాత్తూ గాయపడ్డాడు.18.1 పాయింట్లుపక్కటెముకల నొప్పి కారణంగా సిరీస్ మొత్తానికి దూరమైన నితీశ్ రెడ్డి.. ఇప్పటి వరకు మైదానంలో దిగలేదు. ఈ క్రమంలో బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో చికిత్స పొందిన అతడు.. యో-యో టెస్టు పాస్ అయ్యాడు. బెంగళూరులోని NCAలో నిర్వహించిన పరీక్షలో నితీశ్ 18.1 పాయింట్లు సాధించాడు. ఈ క్రమంలో క్లియరెన్స్ సర్టిఫికెట్ పొందిన అతడు ఆదివారం సన్‌రైజర్స్ శిబిరంలో చేరనున్నాడు.కాగా తన అంతర్జాతీయ కెరీర్లో ఇప్పటి వరకు 5 టెస్టులు ఆడిన నితీశ్ రెడ్డి.. 298 పరుగులు చేయడంతో పాటు.. ఐదు వికెట్లు తీశాడు. అదే విధంగా నాలుగు టీ20లలో కలిపి 90 రన్స్ చేసిన నితీశ్.. మూడు వికెట్లు పడగొట్టాడు. ఇక ఐపీఎల్లో ఇప్పటి వరకు 15 మ్యాచ్‌లలో కలిపి 303 పరుగులు సాధించడంతో పాటు.. మూడు వికెట్లు తీశాడు.రన్నరప్ఇదిలా ఉంటే.. గతేడాది ప్యాట్ కమిన్స్ కెప్టెన్సీలో ఫైనల్ చేరిన సన్‌రైజర్స్ టైటిల్ పోరులో మాత్రం ఓడిపోయింది. కోల్‌కతా నైట్ రైడర్స్ చేతిలో పరాజయం పాలై రన్నరప్‌తో సరిపెట్టుకుంది. ఇక ఈ ఏడాది మార్చి 23న సొంతమైదానం ఉప్పల్‌లో రైజర్స్ తమ తొలి మ్యాచ్ ఆడనుంది. రాజస్తాన్ రాయల్స్‌తో మ్యాచ్‌తో తమ ఐపీఎల్-2025లో ప్రయాణం మొదలుపెట్టనుంది. కాగా కోల్‌కతా- బెంగళూరు మధ్య పోరుతో మార్చి 22 నుంచి తాజా ఎడిషన్ ఆరంభం కానుంది.చదవండి: ఇంగ్లండ్‌తో టెస్టులు.. టీమిండియా కెప్టెన్‌గా అతడే! బీసీసీఐ గ్రీన్ సిగ్నల్? -
‘నువ్వుంటే నిశ్చింత.. నువ్వే నా హృదయ స్పందన’
టీమిండియా స్టార్ క్రికెటర్ జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah)- స్పోర్ట్స్ ప్రజెంటర్ సంజనా గణేషన్ (Sanjana Ganesan) వివాహ వార్షికోత్సవం నేడు (మార్చి 15). ఈ సందర్భంగా సంజనా భర్తపై ప్రేమను కురిపిస్తూ ఉద్వేగ పూరిత నోట్ షేర్ చేసింది. ‘‘నువ్వుంటేనే నా గుండె కొట్టుకుంటుంది.. నువ్వు నాతో ఉంటేనే నాకు శ్వాస ఆడుతుంది.. నువ్వు లేని ఇల్లు ఇల్లులా కనిపించదు.. నువ్వే నా ధైర్యం.. నువ్వుంటే నేను నిశ్చితంగా ఉంటాను.. హ్యాపీ 4 లవ్’’ అంటూ సంజనా కవితాత్మక పంక్తులతో భర్తకు పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలియజేసింది. ‘మిస్టర్ అండ్ మిసెస్ మాహి’ సినిమా పాటలోని లిరిక్స్‌తో తన ప్రేమను వ్యక్తపరిచింది.హ్యాపీ యానివర్సరీఇందుకు బుమ్రాతో కలిసి ఉన్న ఫొటోను సంజనా జతచేసింది. ఈ క్రమంలో బుమ్రా దంపతులకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. కాగా సాధారణ కుటుంబంలో జన్మించిన బుమ్రా.. తన అంకిత భావం, కఠిన శ్రమతో వరల్డ్‌క్లాస్ బౌలర్‌గా ఎదిగాడు. ప్రస్తుతం ప్రపంచంలోని అత్యుత్తమ ఫాస్ట్ బౌలర్లలో అతడే ముందున్నాడు.అంతేకాదు.. టీమిండియా పేస్ దళ నాయకుడిగా ఉన్న బుమ్రా.. వైస్ కెప్టెన్‌గానూ సేవలు అందిస్తున్నాడు. ఇక సంజనా విషయానికొస్తే.. బీటెక్ పూర్తి చేసిన తర్వాత మోడలింగ్‌లో ప్రవేశించిన ఆమె.. తర్వాత స్పోర్ట్స్ ప్రజెంటర్‌గా మారింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL)తో పాటు అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) ప్రజెంటర్‌గా పనిచేస్తూ ఉన్నత స్థాయికి చేరుకుంది.ఈ క్రమంలో బుమ్రా- సంజనా మధ్య కుదిరిన స్నేహం ప్రేమగా రూపాంతరం చెందింది. ఇరు కుటుంబాల సమ్మతంతో వీరు 2021, మార్చి 15న సిక్కు సంప్రదాయ పద్ధతిలో వివాహం చేసుకున్నారు. ఈ జంటకు సెప్టెంబరు 4, 2023లో కుమారుడు జన్మించగా.. అతడికి అంగద్‌గా నామకరణం చేశారు. కోలుకుంటున్న బుమ్రాకాగా బుమ్రా ప్రస్తుతం వెన్నునొప్పితో బాధపడుతున్నాడు. గాయం కారణంగా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 మొత్తానికి దూరమైన అతడు... కోలుకుంటున్నట్లు సమాచారం. అయితే, ఐపీఎల్-2025లో ఆరంభ మ్యాచ్‌లకు అతడు అందుబాటులో ఉండే పరిస్థితి లేదు.ఈ విషయాన్ని ముంబై ఇండియన్స్ ఫ్రాంఛైజీ వర్గాలు వెల్లడించాయి. కాగా ఐపీఎల్ ఆరంభం నుంచి ముంబైతో ప్రయాణిస్తున్న బుమ్రాను మెగా వేలానికి ముందు ఫ్రాంఛైజీ తమ మొదటి ప్రాధాన్య ప్లేయర్‌గా రిటైన్ చేసుకుంది. అతడి కోసం రూ. 18 కోట్లు ఖర్చు చేసింది.ఇక ఇప్పటి వరకు అంతర్జాతీయ క్రికెట్లో 45 టెస్టులు ఆడిన బుమ్రా.. 205 వికెట్లు తీశాడు. ఇక 89 వన్డేల్లో ఈ రైటార్మ్ ఫాస్ట్ బౌలర్ 149 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. టీ20 ఫార్మాట్లో టీమిండియా తరఫున 89 వికెట్లు తీసిన బుమ్రా.. ఐపీఎల్లో ఇప్పటి వరకు 133 మ్యాచ్‌లు ఆడి 165 వికెట్లు పడగొట్టాడు. చదవండి: ఇంగ్లండ్‌తో టెస్టులు.. టీమిండియా కెప్టెన్‌గా అతడే! బీసీసీఐ గ్రీన్ సిగ్నల్? -
ఉత్కంఠ పోరులో లంకపై గెలుపు.. భారత్‌తో ఫైనల్లో వెస్టిండీస్
అంతర్జాతీయ మాస్టర్స్ లీగ్-2025 (International Masters League)లో వెస్టిండీస్ ఫైనల్‌కు దూసుకువచ్చింది. ఆఖరి వరకు ఉత్కంఠగా సాగిన రెండో సెమీ ఫైనల్లో శ్రీలంక మాస్టర్స్ (Sri Lanka Masters)ను చిత్తు చేసి.. టైటిల్ పోరుకు అర్హత సాధించింది. రాయ్‌పూర్ వేదికగా వెస్టిండీస్ (West Indies Masters)- శ్రీలంక మధ్య శుక్రవారం రాత్రి మ్యాచ్ జరిగింది.టాస్ గెలిచిన శ్రీలంక మాస్టర్స్షాహిద్ వీర్ నారాయణన్ సింగ్ అంతర్జాతీయ స్టేడియంలో టాస్ గెలిచిన శ్రీలంక మాస్టర్స్.. వెస్టిండీస్ మాస్టర్స్‌ను తొలుత బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో విండీస్ జట్టు ఐదు వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. ఓపెనర్లలో డ్వేన్ స్మిత్(0) విఫలం కాగా.. విలియం పెర్కిన్స్(24) ఫర్వాలేదనిపించాడు.రామ్‌దిన్ ధనాధన్వన్డౌన్ బ్యాటర్ లెండిల్ సిమ్మన్స్(12 బంతుల్లో 17) వేగంగా ఆడగా.. కెప్టెన్ బ్రియన్ లారా దంచికొట్టాడు. 33 బంతుల్లో 4 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 41 పరుగులు చేసి రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. ఈ క్రమంలో చాడ్విక్ వాల్టన్‌తో కలిసి దినేశ్ రామ్‌దిన్ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు.వాల్టన్ 20 బంతుల్లో 31 పరుగులు చేసి నిష్క్రమించగా.. రామ్‌దిన్ మాత్రం 22 బంతుల్లోనే 50 రన్స్ సాధించి అజేయంగా నిలిచాడు. అతడి ఇన్నింగ్స్‌లో నాలుగు ఫోర్లు, మూడు సిక్సర్లు ఉన్నాయి. శ్రీలంక బౌలర్లలో నువాన్ ప్రదీప్, జీవన్ మెండిస్, అసేల గుణరత్నె ఒక్కో వికెట్ దక్కించుకున్నారు.గుణరత్నె ఒంటరిపోరాటం వృథాఇక లక్ష్య ఛేదనలో శ్రీలంక ఆఖరి వరకు అద్భుత పోరాటం చేసింది. ఓపెనర్లలో ఉపుల్ తరంగ(30) రాణించగా.. కెప్టెన్ కుమార్ సంగక్కర(17), వన్‌డౌన్‌లో వచ్చిన లాహిరు తిరిమన్నె(9) పూర్తిగా నిరాశపరిచారు.ఇలాంటి తరుణంలో అసేల గుణరత్నె ఒంటరిపోరాటం చేశాడు. 42 బంతుల్లో 7 ఫోర్లు, ఒక సిక్స్ సాయంతో 66 పరుగులు సాధించాడు. అతడికి తోడుగా ఇసురు ఉడానా(10 బంతుల్లో 21), దిల్రువాన్ పెరీరా(6 బంతుల్లో 11) రాణించారు. కానీ విండీస్ బౌలర్ల విజృంభణ కారణంగా శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు నష్టపోయి 173 పరుగుల వద్ద నిలిచింది.ఫలితంగా ఆరు పరుగుల స్వల్ప తేడాతో గెలుపొంది వెస్టిండీస్ ఫైనల్ బెర్తును ఖరారు చేసుకుంది. విండీస్ బౌలర్లలో ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ టినో బెస్ట్ (4/27) అత్యుత్తమంగా రాణించగా.. డ్వేన్ స్మిత్ రెండు, ఆష్లే నర్స్, జెరోమ్ టేలర్, లెండిల్ సిమ్మన్స్ ఒక్కో వికెట్ తీశారు.ఇండియాతో ఫైనల్‌కాగా అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ఆటగాళ్లతో మాస్టర్స్ లీగ్‌కు ఈ ఏడాది శ్రీకారం చుట్టారు. ఇండియా మాస్టర్స్, శ్రీలంక మాస్టర్స్, ఇంగ్లండ్ మాస్టర్స్, సౌతాఫ్రికా మాస్టర్స్, ఆస్ట్రేలియా మాస్టర్స్, వెస్టిండీస్ మాస్టర్స్ జట్లు ఇందులో భాగమయ్యాయి. నవీ ముంబై, వడోదర, రాయ్‌పూర్‌లో మ్యాచ్‌లను షెడ్యూల్ చేశారు.ఇక తొలి సెమీస్‌లో ఇండియా ఆసీస్‌ను ఓడించి ఫైనల్‌కు చేరుకోగా.. రెండో సెమీ ఫైనల్లో విండీస్ లంకపై గెలుపొందింది. ఇండియా మాస్టర్స్- వెస్టిండీస్ మాస్టర్స్ మధ్య ఆదివారం(మార్చి 16) నాటి ఫైనల్‌కు రాయ్‌పూర్ వేదిక. చదవండి: ఉన్నదే ఒక్కడు.. మీరు కాస్త నోళ్లు మూయండి: పాక్ మాజీ స్పిన్నర్ ఫైర్ View this post on Instagram A post shared by INTERNATIONAL MASTERS LEAGUE (@imlt20official) -
IND vs ENG: టీమిండియా కెప్టెన్‌గా అతడే! బీసీసీఐ గ్రీన్ సిగ్నల్?
టీమిండియా టెస్టు జట్టు కెప్టెన్‌గా రోహిత్ శర్మ (Rohit Sharma) కొనసాగనున్నట్లు తెలుస్తోంది. ఇంగ్లండ్ పర్యటనలో అతడే భారత జట్టును ముందుకు నడిపించనున్నట్లు సమాచారం. భారత క్రికెట్ నియంత్రణ మండలి(BCCI) నాయకత్వ బృందం రోహిత్‌తో చర్చించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.మరోసారి సూపర్ ‘హిట్’కాగా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 (ICC Champions Trophy)లో రోహిత్ శర్మ టీమిండియాను విజేతగా నిలిపిన విషయం తెలిసిందే. ఈ మెగా వన్డే టోర్నీలో భారత్ ఐదింటికి ఐదూ గెలిచి అజేయంగా నిలిచి ట్రోఫీని ముద్దాడింది. ముఖ్యంగా న్యూజిలాండ్‌తో ఫైనల్లో రోహిత్ శర్మ అద్భుత అర్ధ శతకం(76)తో బ్యాటర్‌గానూ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.తద్వారా చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచి.. ఇంత వరకు ఏ కెప్టెన్‌కూ సాధ్యం కాని ఘనతను రోహిత్ సాధించాడు. అంతకంటే ముందు ఇంగ్లండ్‌తో స్వదేశంలో వన్డే సిరీస్‌లోనూ హిట్‌మ్యాన్ విధ్వంసకర శతకంతో చెలరేగాడు. అయితే, ఈ అద్బుత ప్రదర్శన కంటే ముందు రోహిత్ గడ్డు పరిస్థితులు ఎదుర్కొన్నాడు.అత్యంత ఘోర ఓటమి కారణంగాముఖ్యంగా సొంతగడ్డపై న్యూజిలాండ్‌తో టెస్టుల్లో రోహిత్ శర్మ కెప్టెన్సీలోని భారత్.. 3-0తో వైట్‌వాష్‌కు గురైంది. భారత టెస్టు క్రికెట్ చరిత్రలోనే ఇది అత్యంత ఘోర ఓటమి. ఇక ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా బోర్డర్- గావస్కర్ ట్రోఫీ సిరీస్‌లోనూ టీమిండియా పరాజయం పాలైంది. ఐదు టెస్టుల సిరీస్‌లో 3-1తో ఓడి దశాబ్ద కాలం తర్వాత కంగారూలకు ఈ ప్రతిష్టాత్మక ట్రోఫీని చేజార్చుకుంది. అంతేకాదు ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్‌కు చేరకుండానే నిష్క్రమించింది.ఇక ఈ రెండు సిరీస్‌లలో కెప్టెన్‌గా.. బ్యాటర్‌గా రోహిత్ శర్మ దారుణంగా విఫలమయ్యాడు. ఆ తర్వాత రంజీ బరిలో ముంబై తరఫున ఓపెనర్‌గా వచ్చి అక్కడా వైఫల్యాన్ని కొనసాగించాడు. సీన్ రివర్స్ఈ పరిణామాల నేపథ్యంలో రోహిత్ శర్మ టెస్టులకు గుడ్‌బై చెప్పాలనే డిమాండ్లు పెరిగాయి. జస్ప్రీత్ బుమ్రాకు పగ్గాలు అప్పగించాలనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అయితే, చాంపియన్స్ ట్రోఫీ విజయం తర్వాత పరిస్థితి మారిపోయింది.రోహిత్ శర్మకు మద్దతుగా భారత మాజీ క్రికెటర్లు గళం వినిపిస్తున్నారు. కాగా ఐపీఎల్-2025 కారణంగా దాదాపు రెండు నెలలపాటు అంతర్జాతీయ క్రికెట్‌కు దూరంగా ఉండనున్న టీమిండియా.. జూన్ ఆఖర్లో ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనుంది. అక్కడ ఇంగ్లిష్ జట్టుతో ఐదు టెస్టులు ఆడనుంది.ఈ నేపథ్యంలో భారత మాజీ బ్యాటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధు మాట్లాడుతూ.. ఈ సిరీస్‌లో రోహిత్‌నే కెప్టెన్‌గా కొనసాగించాలని సూచించాడు. సొంతగడ్డపై ఇంగ్లండ్‌ను ఓడించాలంటే రోహిత్ వంటి అనుభవజ్ఞుడి సేవలు అవసరమని పేర్కొన్నాడు. ఇక బీసీసీఐ సన్నిహిత వర్గాలు తాజాగా ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌తో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలు వెల్లడించాయి.బీసీసీఐ గ్రీన్ సిగ్నల్‘‘రోహిత్ ఏం చేయగలడో మరోసారి నిరూపితమైంది. బీసీసీఐలో భాగమైన ప్రతి ఒక్కరు ఇంగ్లండ్ పర్యటనలోనూ అతడినే కొనసాగించాలని.. అతడే సరైన సారథి అని నమ్ముతున్నారు. అటు రోహిత్ కూడా రెడ్ బాల్ క్రికెట్లో కొనసాగేందుకు ఆసక్తిగానే ఉన్నట్లు బోర్డుకు తెలిపాడు’’ అని పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో రోహిత్ శర్మ మరికొంతకాలం టెస్టులు ఆడటం ఖాయమైపోయిందని అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.కాగా టీ20 ప్రపంచకప్-2024, చాంపియన్స్ ట్రోఫీ-2025 గెలవడంతో మహేంద్ర సింగ్ ధోని తర్వాత భారత్‌కు అధిక ఐసీసీ టైటిళ్లు అందించిన కెప్టెన్‌గా రోహిత్ చరిత్రకెక్కిన విషయం తెలిసిందే. గతేడాది పొట్టి వరల్డ్‌కప్ గెలిచిన తర్వాత అంతర్జాతీయ టీ20లకు వీడ్కోలు పలికిన రోహిత్ శర్మ.. ప్రస్తుతం వన్డే, టెస్టుల్లో కొనసాగుతున్నాడు. ఇక చాంపియన్స్ ట్రోఫీ గెలిచిన తర్వాత మాట్లాడుతూ.. ఇప్పట్లో తనకు రిటైర్ అయ్యే ఉద్దేశం లేదని తెలిపాడు. ఇక రోహిత్ ప్రస్తుతం ఐపీఎల్-2025 సన్నాహకాలతో బిజీగా ఉన్నాడు.చదవండి: IPL 2025: హార్దిక్‌పై నిషేధం.. ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా సూర్యకుమార్..? -
బుమ్రా ఇకపై మరింత తెలివిగా వ్యవహరించాలి: ఆసీస్ దిగ్గజం వార్నింగ్
టీమిండియా పేస్ దళ నాయకుడు జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah )ను ఉద్దేశించి ఆస్ట్రేలియా దిగ్గజ ఫాస్ట్ బౌలర్ గ్లెన్ మెగ్రాత్ కీలక సూచనలు చేశాడు. గాయాలతో సావాసం చేస్తున్న ఈ రైటార్మ్ బౌలర్.. కెరీర్ పొడిగించుకోవాలంటే జిమ్‌లో మరింతగా కష్టపడాలన్నాడు. రోజురోజుకు వయసు పెరుగుతున్న కారణంగా మునుపటిలా త్వరగా కోలుకునే అవకాశాలు తక్కువ.. కాబట్టి గాయాల బారిన పడకుండా తనను తాను కాపాడుకోవడం అత్యంత ముఖ్యమని పేర్కొన్నాడు. కాగా ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా టీమిండియా పేస్ దళ భారం మొత్తాన్ని బుమ్రా తన భుజాలపై మోసిన విషయం తెలిసిందే. ప్రతిష్టాత్మక బోర్డర్- గావస్కర్ ట్రోఫీ (Border- Gavaskar Trophy)లో ఐదు టెస్టులకు గానూ.. రెండింటిలో కెప్టెన్‌గానూ వ్యవహరించాడు. ఇటు బౌలర్‌గా.. అటు కెప్టెన్‌గా అదనపు భారం వల్ల బుమ్రాకు వెన్నునొప్పి తిరగబెట్టింది.ఐపీఎల్-2025 ఆరంభ మ్యాచ్‌లకూ దూరంఫలితంగా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy) మొత్తానికి బుమ్రా దూరమయ్యాడు. అయితే, ప్రధాన బౌలర్ లేకపోయిన్పటికీ.. ఈ వన్డే టోర్నీలో టీమిండియా దుబాయ్‌లో తమ మ్యాచ్‌లు ఆడిన కారణంగా స్పిన్నర్లను ఎక్కువగా ఉపయోగించుకుని విజయవంతమైంది. ఈ మెగా ఈవెంట్లో చాంపియన్‌గా అవతరించింది.ఇదిలా ఉంటే.. బుమ్రా ఇంకా పూర్తిగా కోలుకోనేట్లు సమాచారం. ఈ క్రమంలో ఐపీఎల్-2025 ఆరంభ మ్యాచ్‌లకు అతడు దూరమయ్యే పరిస్థితి నెలకొంది. బుమ్రా ప్రాతినిథ్యం వహిస్తున్న ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ వర్గాలు ఈ విషయాన్ని వెల్లడించాయి. స్పష్టంగా ఏ రోజు నుంచి, ఏ మ్యాచ్‌కు అతడు ఆడేది చెప్పనప్పటికీ.. ఏప్రిల్ రెండో వారంలో బుమ్రా ముంబై ఇండియన్స్ జట్టుతో కలిసే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో ఈ నెల చివరి వారం, వచ్చే నెల మొదటి వారం రోజుల్లో జరిగే ముంబై ఇండియన్స్ ఆరంభ మ్యాచ్‌లకు బుమ్రా గైర్హాజరు కానున్నాడు. ప్రస్తుతం బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌లో పునరావాస శిబిరంలో ఉన్న పేసర్ వెన్నుగాయం నుంచి వేగంగా కోలుకుంటున్నాడు.ఈ పరిణామాల నేపథ్యంలో ఆసీస్ దిగ్గజ పేసర్ గ్లెన్ మెగ్రాత్ మాట్లాడుతూ.. ‘‘మిగతా పేసర్లతో పోలిస్తే బుమ్రా తన శరీరాన్ని ఎక్కువగా కష్టపెడతాడు. శరీరాన్ని తీవ్రమైన ఒత్తిడికి గురిచేస్తాడు. అయితే, దానిని ఎలా మేనేజ్ చేసుకోవాలో అతడికి బాగా తెలుసు. కానీ దురదృష్టవశాత్తూ అన్నిసార్లు పరిస్థితులు అనుకూలంగా ఉండకపోవచ్చు.ఇకపై మరింత తెలివిగా వ్యవహరించాలిగతంలో చాలాసార్లు గాయాల నుంచి అతడు బయటపడి.. సరికొత్త ఉత్సాహంతో పునరాగమనం చేశాడు. కోలుకోవడానికి ఎంత సమయం పడుతుంది.. జిమ్‌లో ఎంతగా కష్టపడాలి అనే విషయాలపై అతడికి స్పష్టత ఉంది. కానీ రోజురోజుకూ వయసు పెరుగుతున్న కారణంగా.. ఫిట్నెస్ కాపాడుకునేందుకు అతడు ఇంకాస్త కఠినంగా శ్రమించాలి.మైదానం వెలుపలా కష్టపడాలి. మరింత స్మార్ట్‌గా ఉండాలి. ఫాస్ట్ బౌలర్ నడిచే కార్ లాంటివాడైతే.. అందులో ఇంధనం ఉన్నంత వరకే ముందుకు వెళ్తుంది. నిజానికి బుమ్రాతో పోలిస్తే నా ఫ్యూయల్ ట్యాంకు పెద్దది. ఎందుకంటే.. అతడిలా నేను అతి వేగంతో బౌలింగ్ చేయను.ముందుగా చెప్పినట్లు.. బుమ్రా తన శరీరాన్ని తీవ్రమైన ఒత్తిడికి గురిచేస్తాడు కాబట్టే.. పనిభారాన్ని తగ్గించుకోవడం కూడా ముఖ్యం. అతడు లేకుంటే టీమిండియా అనుకున్న ఫలితాలు రాబట్టలేదు. కాబట్టి బుమ్రాను కాపాడుకోవాల్సిన బాధ్యత మేనేజ్మెంట్ కూడా ఉంది’’ అని టైమ్స్ ఆఫ్ ఇండియాతో తన అభిప్రాయాలు పంచుకున్నాడు. కాగా ఇటీవల న్యూజిలాండ్ మాజీ పేసర్ షేన్ బాంగ్ కూడా బుమ్రా గురించి ఇదే తరహా అభిప్రాయం వ్యక్తం చేశాడు. -
ఢిల్లీ ఈ సారైనా సాధించేనా!
ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో 17 సీజన్ల పాటు ఆడినా ఢిల్లీ జట్టు టైటిల్ గెలవలేకపోయింది. అదే యాజమాన్యానికి చెందిన మహిళల జట్టు ఢిల్లీ క్యాపిటల్స్ కూడా ఉమెన్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో వరుసగా రెండు సీజన్ల పాటు నిరాశపర్చింది. 2023, 2024 సీజన్లలో గ్రూప్ దశలో టాపర్‌గా నిలవడంతో ఫైనల్‌కు చేరిన క్యాపిటల్స్ రెండుసార్లూ ఫైనల్ మ్యాచ్‌లలో ఓడి రన్నరప్‌గానే సంతృప్తి చెందాల్సి వచ్చింది. ఇప్పుడు తాజా సీజన్లో కూడా టాపర్‌గా ఫైనల్ చేరిన టీమ్ మరోసారి ట్రోఫీ కోసం తమ అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. నేడు జరిగే ఫైనల్లో 2023 చాంపియన్ ముంబై ఇండియన్స్‌తో ఢిల్లీ క్యాపిటల్స్ ఆడుతుంది. తాజా సీజన్ లీగ్ దశలో ఇరు జట్ల మధ్య జరిగిన రెండు మ్యాచ్‌లలోనూ ఢిల్లీనే నెగ్గి 2–0తో ఆధిక్యం ఉంది. అంతర్జాతీయ మహిళల క్రికెట్లో ఆల్‌టైమ్ గ్రేట్ కెప్టెన్ గా ఉన్న మెగ్ లానింగ్ గత ఏడాది ఢిల్లీకి టైటిల్ అందించడంలో విఫలమైంది. ఈసారి అది పునరావృతం కాకుండా సత్తా చాటాలని ఆమె పట్టుదలగా ఉంది. సీజన్లో ఏకంగా 157.89 స్ట్రయిక్ రేట్‌తో 300 పరుగులు చేసిన షఫాలీ వర్మ మరోసారి టీమ్‌కు కీలకం కానుంది.మెగ్ లానింగ్ కూడా 263 పరుగులతో టీమ్ విజయాల్లో ప్రధాన పాత్ర పోషించింది. జెమీమా రోడ్రిగ్స్ మాత్రం ఆశించినంత మెరుగైన ప్రదర్శన ఇవ్వలేదు. ఫైనల్లోనైనా ఆమె రాణించాల్సి ఉంది. ఆల్‌రౌండర్‌గా జెస్ జొనాసెన్ టోర్నీలో చక్కటి ప్రదర్శన కనబర్చింది. 137 పరుగులతో పాటు 11 వికెట్లు తీసిన ఆమెకు శిఖా పాండే (11) అండగా నిలిచింది. వీరిద్దరితో పాటు అనాబెల్ సదర్లాండ్ తమ బౌలింగ్‌తో ప్రత్యరి్థని కట్టడి చేయగలరు. దూకుడైన బ్యాటింగే ముంబై ప్రధాన బలం. నాట్ సివర్ 156.50 స్ట్రయిక్‌రేట్‌తో 5 అర్ధసెంచరీలు సహా 493 పరుగులు సాధించి అగ్ర స్థానంలో ఉంది. హేలీ మాథ్యూస్ (304) కూడా దూకుడైన ఆటకు మారు పేరు. కెపె్టన్‌గా హర్మన్‌ప్రీత్ కౌర్ కూడా 156.29 స్ట్రయిక్ రేట్‌తో 236 పరుగులు చేసి తన వంతు పాత్ర పోషించింది. బౌలింగ్‌లో హేలీ, అమెలియా కెర్ కలిసి 33 వికెట్లతో ప్రత్యర్థి బ్యాటర్లను ఇబ్బంది పెట్టారు. సమష్టిగా సత్తా చాటడంతో ముంబై జట్టుదే పైచేయి. ఈ నేపథ్యంలో అంతిమ విజేత ఎవరు అవుతారనేది చూడాలి. -
త్వరలో పాక్‌లో మరో ఐసీసీ టోర్నీ.. షెడ్యూల్ విడుదల
త్వరలో పాకిస్తాన్ మరో ఐసీసీ టోర్నీకి ఆతిథ్యమివ్వనుంది. ఏప్రిల్ 9 నుంచి 19 వరకు పాకిస్తాన్‌లోని లాహోర్‌లో ఐసీసీ మహిళల క్రికెట్ వరల్డ్‌కప్ క్వాలిఫయర్స్-2025 పోటీలు జరుగనున్నాయి. ఈ టోర్నీకి సంబంధించిన షెడ్యూల్‌ను ఐసీసీ ఇవాళ (మార్చి 14) విడుదల చేసింది.ఈ టోర్నీలో మొత్తం ఆరు జట్లు పాల్గొంటాయి. ఇందులో రెండు జట్లు (ఫైనల్‌కు చేరే జట్లు) ఈ ఏడాది భారత్‌లో జరిగే వన్డే వరల్డ్‌కప్‌కు అర్హత సాధిస్తాయి. ఈ టోర్నీలో పాకిస్తాన్ సహా బంగ్లాదేశ్, వెస్టిండీస్, ఐర్లాండ్, స్కాట్లాండ్, థాయ్‌లాండ్ జట్లు పాల్గొంటున్నాయి. ఈ టోర్నీలో మొత్తం 15 మ్యాచ్‌లు జరుగనున్నాయి. డే మ్యాచ్‌లు ఉదయం 9:30 గంటలకు.. డే అండ్ నైట్ మ్యాచ్‌లు మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమవుతాయి.భారత్‌లో వరల్డ్కప్ఈ ఏడాది అక్టోబర్‌లో భారత్ వేదికగా మహిళల వన్డే వరల్డ్‌కప్ జరుగనుంది. ఈ టోర్నీకి భారత్ సహా ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, సౌతాఫ్రికా, శ్రీలంక, న్యూజిలాండ్ నేరుగా అర్హత సాధించాయి. క్వాలిఫయర్స్ ద్వారా మరో రెండు జట్లు పోటీలోకి వస్తాయి.కాగా, పాకిస్తాన్ ఇటీవలే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025కి ఆతిథ్యమిచ్చింది. 29 ఏళ్ల తర్వాత పాక్ గడ్డపై జరిగిన తొలి ఐసీసీ టోర్నీ ఇది. ఈ టోర్నీలో పాక్ ఘోర పరాభవం ఎదుర్కొంది. సొంతగడ్డపై జరిగిన టోర్నీలో పాక్ ఒక్క మ్యాచ్ కూడా గెలవకుండా, గ్రూప్ దశలోనే నిష్క్రమించింది. డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగిన పాక్‌కు ఇది పెద్ద అవమానం. ఈ టోర్నీలో భారత్ విజేతగా నిలిచింది. దుబాయ్‌లో జరిగిన ఫైనల్లో భారత్ న్యూజిలాండ్‌ను చిత్తు చేసి మూడోసారి ఛాంపియన్స్ ట్రోఫీని గెలిచింది. భద్రతా కారణాల రిత్యా ఈ టోర్నీలో భారత్ తమ మ్యాచ్‌లను దుబాయ్‌లో ఆడింది.షెడ్యూల్ఏప్రిల్ 9- పాక్ వర్సెస్ ఐర్లాండ్, వెస్టిండీస్ వర్సెస్ స్కాట్లాండ్ఏప్రిల్ 10- థాయ్‌లాండ్ వర్సెస్ బంగ్లాదేశ్ఏప్రిల్ 11- పాక్ వర్సెస్ స్కాట్లాండ్, ఐర్లాండ్ వర్సెస్ వెస్టిండీస్ఏప్రిల్ 13- స్కాట్లాండ్ వర్సెస్ థాయ్‌లాండ్, బంగ్లాదేశ్ వర్సెస్ ఐర్లాండ్ఏప్రిల్ 14- వెస్టిండీస్ వర్సెస్ పాకిస్తాన్ఏప్రిల్ 15- థాయ్‌లాండ్ వర్సెస్ ఐర్లాండ్ఏప్రిల్ 17- బంగ్లాదేశ్ వర్సెస్ వెస్టిండీస్, పాక్ వర్సెస్ థాయ్లాండ్ఏప్రిల్ 18- ఐర్లాండ్ వర్సెస్ స్కాట్లాండ్ఏప్రిల్ 19- పాక్ వర్సెస్ బంగ్లాదేశ్, వెస్టిండీస్ వర్సెస్ థాయ్‌లాండ్ -
IPL 2025: హార్దిక్‌పై నిషేధం.. ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా సూర్యకుమార్..?
ఐపీఎల్ 2025 సీజన్లో ముంబై ఇండియన్స్ తమ తొలి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్ చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా మార్చి 23న జరుగనుంది. ఆ రోజు డబుల్ హెడర్ మ్యాచ్‌లు జరుగనుండగా.. ఎంఐ, సీఎస్కే మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతుంది.ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ తమ కెప్టెన్ సేవలు కోల్పోనుంది. గత సీజన్లో ముంబై ఇండియన్స్ మూడు మ్యాచ్‌ల్లో స్లో ఓవర్ రేట్‌తో బౌలింగ్ చేసింది. దీంతో ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ముంబై కెప్టెన్‌గా ఉన్న హార్దిక్ పాండ్యాకు రూ.30లక్షల జరిమానా విధించడంతో పాటు ఓ మ్యాచ్ ఆడకుండా నిషేధం విధించింది. గత సీజన్లో ముంబై గ్రూప్ దశలోనే వెనుదిరగడంతో హార్దిక్‌పై నిషేధం సాధ్యం కాలేదు. ఈ క్రమంలోనే ఐపీఎల్ 2025 సీజన్లో తొలి మ్యాచ్‌లోనే అతను నిషేధం ఎదుర్కోవాల్సి ఉంటుంది.తొలి మ్యాచ్‌లో హార్దిక్ గైర్హాజరీలో సూర్యకుమార్ యాదవ్ ముంబై ఇండియన్స్ సారధిగా వ్యవహరించే అవకాశం ఉంది. భారత టీ20 జట్టుకు సారధిగా వ్యవహరిస్తుండటంతో ఎంఐ యాజమాన్యం అతనిరే సారథ్య బాధ్యతలు అప్పజెప్పనుందని తెలుస్తుంది. రోహిత్ కెప్టెన్సీపై అయిష్టతను ఇదివరకే తెలియజేశాడు. మరో సీనియర్ బుమ్రా ఆరంభ మ్యాచ్‌లకు దూరమవుతాడని సమాచారం. ఈ నేపథ్యంలో సీనియర్లలో ఒకరైన సూర్యకుమార్‌కే తొలి మ్యాచ్‌లో కెప్టెన్‌గా వ్యవహరించే అవకాశం రావచ్చు.టీ20ల్లో టీమిండియా కెప్టెన్‌గా సూర్య కుమార్ యాదవ్‌కు మంచి ట్రాక్ రికార్డు ఉంది. స్కై సారథ్యంలో భారత్ 18 మ్యాచ్‌ల్లో కేవలం నాలుగింట మాత్రమే ఓడింది.కాగా, ఐపీఎల్ 2025 సీజన్లో ముంబై ఇండియన్స్ దేశీయ స్టార్లపై ఆధారపడి ఉంది. మెగా వేలానికి ముందు ఆ జట్టు యాజమాన్యం రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రాను రీటైన్ చేసుకుంది. మెగా వేలంలోనూ ఆ జట్టు పెద్దగా విదేశీ స్టార్ల కోసం పాకులాడలేదు.విల్ జాక్స్, మిచెల్ సాంట్నర్, ముజీబ్ ఉర్ రెహ్మాన్, కార్బిన్ బాష్, ర్యాన్ రికెల్టన్ లాంటి ఆటగాళ్లు కొత్తగా జట్టులోకి చేర్చుకుంది. ఈసారి జట్టులోకి వచ్చిన ట్రెంట్ బౌల్ట్‌కు గతంలో ముంబై ఇండియన్స్‌తో అనుబంధం ఉంది. మెగా వేలంలో దక్కించుకున్న రీస్ టాప్లే గాయం కారణంగా ఈ సీజన్‌కు దూరమయ్యాడు. దేశీయ పేసర్ దీపక్ చాహర్‌ను ముంబై సీఎస్కేతో పోటీపడి దక్కించుకుంది.ఐపీఎల్ 2025 సీజన్ కోసం ముంబై ఇండియన్స్..హార్దిక్ పాండ్యా (కెప్టెన్), రోహిత్ శర్మ, తిలక్ వర్మ, నమన్ ధిర్, సూర్యకుమార్ యాదవ్, బెవాన్ జాకబ్స్, రాజ్ భవా, విల్ జాక్స్, విజ్ఞేశ్ పుథుర్, మిచెల్ సాంట్నర్, కార్బిన్ బాష్, సత్యనారాయణ రాజు, అర్జున్ టెండూల్కర్, ర్యాన్ రికెల్టన్, రాబిన్ మింజ్, కృష్ణణ్ శ్రీజిత్, ట్రెంట్ బౌల్ట్, జస్ప్రీత్ బుమ్రా, అశ్వనీ కుమార్, రీస్ టాప్లే, కర్ణ్ శర్మ, దీపర్ చాహర్, ముజీబ్ రెహ్మాన్ -
Axar Patel: ‘ఆర్మ్ బౌలర్’ కప్ అందిస్తాడా?
క్రికెట్ అభిమానులను అలరించేందుకు ఐపీఎల్ 18వ సీజన్ రెడీ అవుతోంది. పొట్టి ఫార్మాట్లో క్రికెట్ లవర్స్‌ను బాగా ఆకట్టుకున్న ఈ మెగా టోర్నమెంట్ మార్చి 22 నుంచి ప్రారంభమవుతోంది. 10 టీమ్‌లు బరిలోకి దిగేందుకు సమాయత్తమవుతున్నాయి. ఐపీఎల్ ఆరంభం నుంచి ఉన్న బెంగళూరు రాయల్ చాలెంజర్స్, ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్ ఇప్పటివరకు కప్ కొట్టలేకపోయాయి. మధ్యలో వచ్చిన లక్నో సూపర్ జెయింట్స్ కూడా ఇంకా టైటిల్ దక్కించుకోలేదు. కొత్త కెప్టెన్లతో బరిలోకి దిగుతున్న ఈ నాలుగు జట్లు ఈసారైనా ఐపీఎల్ కప్ అందుకుంటాయా, లేదా అనేది ఆసక్తికరంగా మారింది.న్యూ రోల్లో రాణిస్తాడా?టోర్నమెంట్‌కు వారం రోజుల ముందు ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ తమ టీమ్ కెప్టెన్ (Team Captain) ఎవరనేది ప్రకటించింది. ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేసినట్టు అధికారికంగా వెల్లడించింది. కేఎల్ రాహుల్ సారథ్య బాధ్యతలు తీసుకోవడానికి సుముఖంగా లేకపోవడంతో అక్షర్ పటేల్‌కు అరుదైన అవకాశం లభించింది. ఇప్పటివరకు ఆల్‌రౌండర్‌గా రాణించిన ఈ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ కమ్ బ్యాటర్.. జట్టు నాయకుడిగా ఎలాంటి ముద్ర వేస్తాడనేది చూడాలి. ఆటగాడిగా తానేంటో నిరూపించుకున్న అక్షర్ కెప్టెన్‌గా జట్టును ఎలా నడిపిస్తాడేనన్నది ఆసక్తికరంగా మారింది.పొట్టి ఫార్మాట్లో రాణిస్తూ..గత కొంతకాలంగా పొట్టి ఫార్మాట్లో అక్షర్ పటేల్ (Axar Patel) స్థిరంగా రాణిస్తున్నాడు. టీమిండియాలో అవకాశం వచ్చిన ప్రతిసారీ దాన్ని సద్వినియోగం చేసుకునేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నాడు. తాజాగా ముగిసిన ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలోనూ జట్టు విజయంలో తన వంతు పాత్ర పోషించాడు. బ్యాటింగ్ ఆర్డర్లో ప్రమోషన్ పొందడమే కాకుండా మెప్పు పొందేలా ఆడాడు. ముఖ్యంగా మిడిల్ ఓవర్లలో స్పిన్నర్లను దీటుగా ఎదుర్కొంటూ పరుగులు రాబడుతూ జట్టుకు ప్రయోజనకరంగా మారాడు. చాంపియన్స్ ట్రోఫీలో 5 వికెట్లు పడగొట్టడంతో పాటు 109 పరుగులు చేసి తన విలువ చాటుకున్నాడు.ఐపీఎల్లో అదుర్స్2014లో ఐపీఎల్లో అరంగ్రేటం చేసిన అక్షర్ పటేల్ ఇప్పటివరకు 150 మ్యాచ్‌లు ఆడాడు. 21.47 సగటు, 130.88 స్టైక్ రేటుతో 1653 పరుగులు చేశాడు. గత రెండు సీజన్లలో అద్భుతంగా రాణించాడు. గత ఐపీఎల్లో 235 పరుగులు చేయగా, 2023లో 283 పరుగులు సాధించాడు. ఈ రెండు ఎడిషన్లలోనూ 11 వికెట్ల ప్రదర్శన చేశాడు. ఐపీఎల్లో ఇప్పటివరకు మొత్తం 123 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ఫీల్డింగ్‌లోనూ చురుకుదనం ప్రదర్శించాడు. బౌలింగ్‌కు కాస్త పేస్ జోడించి ‘ఆర్మ్ బాల్’తో నేరుగా వికెట్లపైకి సంధిస్తూ వికెట్లు చేజిక్కించుకోవడం అక్షర్ పటేల్ స్పెషాలిటీ. తన మ్యాజిక్‌తో ఈ ఐపీఎల్లో ఎలాంటి ఫలితం రాబతాడో చూడాలి మరి.చదవండి: 'అక్షరా'ల అమూల్యం., టీమిండియాలో స్థానం సుస్థిరంక్యాపిటల్స్కు కప్ తెస్తాడా?ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌గా ఎంపికైన అక్షర్ పటేల్ ముందు ఇప్పుడు పెద్ద లక్షమే ఉంది. ఇప్పటివరకు డీసీ ఒక్కసారి కూడా ఐపీఎల్ టైటిల్ గెలవలేదు. 2020లో దుబాయ్‌లో జరిగిన టోర్నమెంట్లో ఫైనల్ వరకు చేరుకుని ముంబై ఇండియన్స్ చేతిలో పరాజయం పాలైంది. గత సీజన్లో ఆరో స్థానానికి పరిమితమైంది. మరి ఈసారి ఢిల్లీ క్యాపిటల్స్‌ను (Delhi Capitals) అక్షర్ పటేల్ అంతకంటే మెరుగైన స్థానంలో ఉంచుతాడా, టైటిల్ గెలుస్తాడా అనేది వేచి చూడాల్సిందే. -
IPL 2025: కోహ్లీ ఈసారైనా టైటిల్ సాధించేనా..?
ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన జట్లలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఒకటి. అయితే ఈ జట్టు ఇంతవరకూ ఒక్కసారి కూడా ట్రోఫీని సాధించలేకపోవడం ఒకింత ఆశ్చర్యకరం. ఎప్పుడూ ఉత్సాహంతో ఉరకలేసే స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీ మస్కట్ గా ఉన్న ఈ జట్టుకి ఎందుకో ఇంతవరకు ఐపీఎల్ టైటిల్ అందించలేకపోయాడు.ఐపీఎల్ 2025 ప్రారంభం రోజున (మార్చి 22) కోల్‌కతాలోని చారిత్రాత్మక ఈడెన్ గార్డెన్స్‌లో గతేడాది టైటిల్ విజేత కోల్‌కతా నైట్ రైడర్స్ జరిగే మ్యాచ్ తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) తన టైటిల్ వేటను ప్రారంభిస్తుంది. ఒకవేళ అదృష్టం కలిసి రానందువల్ల ఆర్సీబీ ఇంతవరకు టైటిల్ సాధించలేకపోయిందని భావించినట్టయితే, ఈ సీజన్ అందుకు చాల అనుకూలమైనది గా భావించాలి. ఎందుకంటే ఐపిఎల్ సీజన్ 18 స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీ ఐకానిక్ జెర్సీ నంబర్ 18 తో సరిగ్గా సరిపోతుంది. చాలా కాలంగా జెర్సీ నంబర్ 18 కి పర్యాయపదంగా ఉన్న విరాట్ కోహ్లీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కి ఈ సారైనా టైటిల్ సాధించి పెడతాడని అతని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు. రజత్ పాటిదార్ కి కెప్టెన్సీ బాధ్యతలుఇక జట్టు కూర్పును చూస్తే, దేశవాళీ క్రికెట్ లో నిలకడగా రాణిస్తున్న 31 ఏళ్ల రజత్ పాటిదార్ కి ఆర్సీబీ ఈసారి కెప్టెన్సీ బాధ్యతలు అప్పజెప్పింది. ఐపీఎల్లో తొలిసారి కెప్టెన్సీ చేపట్టనున్నప్పటికీ, పాటిదార్ 2024-25 సయ్యద్ ముష్తాక్ అలీ టోర్నమెంట్ లో మధ్యప్రదేశ్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఇందులో మధ్యప్రదేశ్ జట్టు రన్నరప్‌గా నిలిచింది. మెగా వేలం ద్వారా గణనీయమైన మార్పులు చేసిన తర్వాత ఆర్సీబీ కొత్త దృక్పథంతో, కొత్త ఉత్సాహంతో ఐపీఎల్-2025లోకి అడుగుపెడుతుంది. గత సీజన్లో ఆర్సీబీ వరుసగా ఆరు మ్యాచ్‌లను గెలిచి టాప్ నాలుగు స్థానాల్లో నిలిచి ప్లేఆఫ్‌లకు అర్హత సాధించింది. చివరికి రాజస్థాన్ రాయల్స్ చేతిలో ఎలిమినేటర్‌లో పరాజయం చవిచూసింది. ఆర్సీబీ మరోసారి సామర్థ్యంతో నిండిన జట్టును నిర్మించింది. శక్తివంతమైన బ్యాటింగ్ లైనప్, బలీయమైన బౌలింగ్, నాయకత్వ అనుభవం, కలగలిసి ఈ సీజన్ లోనైనా తొలి టైటిల్ సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది.ఫిల్ సాల్ట్ తో కోహ్లీ ఓపెనింగ్ఐసీసీ టి20 ర్యాంకింగ్స్ లో మూడో స్థానంలో ఉన్న ఇంగ్లాండ్ బ్యాటర్ ఫిల్ సాల్ట్ ను ఆర్సీబీ రూ. 11.50 కోట్లకు తీసుకుంది. గత సీజన్లో కేకేఆర్ టైటిల్ గెలుచుకోవడంలో సాల్ట్ కీలక పాత్ర పోషించాడు. 12 మ్యాచ్‌ల్లో 182.01 అద్భుతమైన స్ట్రైక్ రేట్‌తో 435 పరుగులు సాధించాడు. గత సీజన్లో ఓపెనర్‌గా అతను సాధించిన విజయాన్ని దృష్టిలో ఉంచుకుంటే ఆర్సీబీలో సాల్ట్ కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. ఫిల్ సాల్ట్ మరియు విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్ ప్రారంభించే అవకాశం ఉన్నందున, జట్టు అసాధారణమైన టాప్ ఆర్డర్‌ను సమకూర్చుకుంది. మిడిల్ ఆర్డర్లో రజత్ పాటిదార్, లియామ్ లివింగ్‌స్టోన్ మరియు టిమ్ డేవిడ్ ఉండటం జట్టు లైనప్‌ను మరింత బలోపేతం అవుతుంది. యావ బ్యాట్స్‌మన్ జితేష్ శర్మ కీపింగ్ విధులను కూడా నిర్వహిస్తాడు.సీనియర్ పేస్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ ఆర్సీబీ రావడంతో వారి బౌలింగ్ లైనప్‌కు గణనీయమైన బలాన్నిచ్చింది. ముంబై ఇండియన్స్‌తో బిడ్డింగ్ యుద్ధం తర్వాత ఆస్ట్రేలియన్ పేసర్ జోష్ హాజిల్‌వుడ్ సేవలను పొందేందుకు ఆర్సీబీ రూ. 12.50 కోట్లు ఖర్చు చేసింది. ఇంకా లుంగి ఎంగిడి, నువాన్ తుషార వంటి ఫాస్ట్ బౌలర్లను చేర్చుకోవడం వలన ఆర్సీబీ బౌలింగ్ బలీయంగా ఉంది.ఫీల్ సాల్ట్: గత సంవత్సరం కోల్‌కతా నైట్ రైడర్స్ టైటిల్ సాధించడం లో కీలక పాత్ర పోషించిన సాల్ట్ ఈసారి జట్టులో చేరడంతో ఆర్సీబీ బ్యాటింగ్ మరింత బలోపేతంగా తయారైంది. గత సీజన్లో ఓపెనర్‌గా అద్భుతంగా రాణించిన సాల్ట్ మళ్ళీ అదే రీతిలో విజృభించి ఆడతాడని ఆర్సీబీ అభిమానులు ఆశిస్తున్నారు. భువనేశ్వర్ కుమార్: ఎంతో అనుభవ్గుణుడైన సీనియర్ బౌలర్ భువనేశ్వర్ జట్టులో చేరడంతో ఆర్సీబీ బౌలింగ్ లైనప్‌కు గణనీయమైన పదును లభించింది. కొత్త బంతిని స్వింగ్ మరియు డెత్ ఓవర్లలో యార్కర్లను వేసే సామర్థ్యం ఉన్న భువనేశ్వర్ జట్టు బౌలింగ్ కి కీలకం అనడంలో సందేహం లేదు. రజత్ పాటిదార్: ఆర్సీబీ తొలి సారి ఐపీఎల్ టైటిల్ సాధించాల్సిన బృహత్తర బాధ్యత రజత్ పాటిదార్ పై ఉంది. మంచి ఫామ్ తో నిలకడగా బ్యాటింగ్ చేస్తున్న రజత్ పాటిదార్ జట్టును ముందుండి నడిపించడం ఆర్సీబీకి చాల ముఖ్యం.విరాట్ కోహ్లీ: ఇటీవల ఛాంపియన్స్ ట్రోఫీలో అద్భుతంగా రాణించి మంచి ఫామ్ లో ఉన్న కోహ్లీ కి ఐపీల్ సీజన్ 18 చాల కీలకం. చాలా సంవత్సరాలుగా ఐపీఎల్ ట్రోఫీని గెలవాలనే కోహ్లీ ఆకాంక్ష ఈ సారైనా నెరవేరుతుందేమో చూడాలి.ఆర్సీబీ జట్టు: రజత్ పాటిదార్ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, యష్ దయాల్, జోష్ హాజిల్‌వుడ్, ఫిల్ సాల్ట్, జితేష్ శర్మ, లియామ్ లివింగ్‌స్టోన్, రసిక్ దార్, సుయాష్ శర్మ, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, స్వప్నిల్ సింగ్, టిమ్ డేవిడ్, రొమారియో షెపర్డ్, నువాన్ తుషార, మనోజ్ భండగే, జాకబ్ బెథెల్, దేవదత్ పడిక్కల్, స్వస్తిక్ చికర, లుంగి ఎంగిడి, అభినందన్ సింగ్, మోహిత్ రథీ. -
ఐపీఎల్‌కు ముందు ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న రోహిత్
అతి పెద్ద క్రికెట్ పండుగ ఐపీఎల్ మరో 8 రోజుల్లో ప్రారంభం కానుంది. క్యాష్ రిచ్ లీగ్ 18వ ఎడిషన్ కోసం యావత్ క్రికెట్ ప్రపంచ ఆతృతగా ఎదురుచూస్తుంది. లీగ్‌లో పాల్గొనే ఫ్రాంచైజీలన్నీ సన్నాహకాల్లో బిజీగా ఉన్నాయి. ఆటగాళ్లు ఒక్కొక్కరుగా జట్లతో చేరుతున్నారు. ఫ్రాంచైజీల ముఖ్యులు వ్యూహరచనల్లో నిమగ్నమై ఉన్నారు.రెండు నెలలకు పైగా సాగే ఈ మెగా ఈవెంట్లో మొత్తం 74 మ్యాచ్‌లు జరుగనున్నాయి. మార్చి 22న డిఫెండింగ్ ఛాంపియన్ కేకేఆర్, ఆర్సీబీ మధ్య మ్యాచ్‌తో ఐపీఎల్ 2025 ప్రారంభమవుతుంది. మే 25న జరిగే ఫైనల్లో ముగుస్తుంది. ఛాంపియన్స్ ట్రోఫీ అనంతరం భారత ఆటగాళ్లు కూడా ఒక్కొక్కరుగా తమతమ శిబిరాలకు చేరుకుంటున్నారు. అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్ ఆల్రెడీ డ్యూటీకి ఎక్కేశారు. యాడ్స్‌తో బిజీగా ఉన్న విరాట్ కోహ్లి మరికొద్ది రోజుల్లో ఆర్సీబీతో జతకడతాడు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సుదీర్ఘంగా సాగే ఐపీఎల్‌కు ముందు సేద తీరుతున్నాడు. రోహిత్ సరదాగా కుటుంబంతో కలిసి దిగిన ఫోటో ఒకటి సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ ఫోటోలో రోహిత్.. తన నెలల చిన్నారి, కూతురు సమైరా మరియు భార్య రితికాతో కలిసి బోట్లో ప్రయాణిస్తూ కనిపించాడు.ఐపీఎల్ 2025లో రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. రోహిత్ కెప్టెన్సీలో ముంబై ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచింది. ఐపీఎల్ హిస్టరీలో సీఎస్కే, ముంబై ఇండియన్స్ మాత్రమే ఐదు టైటిల్స్ సాధించాయి. రోహిత్ గత సీజన్‌కు ముందు ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. రోహిత్ తర్వాత హార్దిక్ పాండ్యా ముంబై పగ్గాలు చేపట్టాడు. హార్దిక్ కెప్టెన్సీలో ముంబై గత సీజన్లో పేలవ ప్రదర్శన చేసింది. త్వరలో ప్రారంభం కానున్న సీజన్లో ముంబై ప్రస్థానం మార్చి 23న మొదలవుతుంది. చెన్నై వేదికగా ఆ రోజు జరిగే మ్యాచ్‌లో ముంబై.. సమవుజ్జీ సీఎస్కేతో తలపడుతుంది. ఈ మ్యాచ్‌పై అభిమానుల్లో చాలా అంచనాలు ఉన్నాయి.ఈ సీజన్ కోసం ముంబై ఇండియన్స్ పెద్దగా మార్పులేమీ చేయలేదు. మెగా వేలంలో బడా స్టార్లకు ఎర వేయలేదు. కొత్తగా విల్ జాక్స్, మిచెల్ సాంట్నర్, కార్బిన్ బాష్, ర్యాన్ రికెల్టన్ లాంటి విదేశీ ఆటగాళ్లు జట్టులో చేరారు. ట్రెంట్ బౌల్ట్‌కు గతంలో ముంబై ఇండియన్స్‌తో అనుబంధం ఉంది. మెగా వేలానికి ముందు ముంబై రోహిత్ శర్మ, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రాను రీటైన్ చేసుకుంది.ఐపీఎల్ 2025 సీజన్ కోసం ముంబై ఇండియన్స్..హార్దిక్ పాండ్యా (కెప్టెన్), రోహిత్ శర్మ, తిలక్ వర్మ, నమన్ ధిర్, సూర్యకుమార్ యాదవ్, బెవాన్ జాకబ్స్, రాజ్ భవా, విల్ జాక్స్, విజ్ఞేశ్ పుథుర్, మిచెల్ సాంట్నర్, కార్బిన్ బాష్, సత్యనారాయణ రాజు, అర్జున్ టెండూల్కర్, ర్యాన్ రికెల్టన్, రాబిన్ మింజ్, కృష్ణణ్ శ్రీజిత్, ట్రెంట్ బౌల్ట్, జస్ప్రీత్ బుమ్రా, అశ్వనీ కుమార్, రీస్ టాప్లే, కర్ణ్ శర్మ, దీపర్ చాహర్, ముజీబ్ రెహ్మాన్ -
పాక్ ప్లేయర్లకు జరిమానా
గత కొంతకాలంగా పాకిస్తాన్ క్రికెట్ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటుంది. ఈ మధ్య కాలంలో ఏం చేసినా ఆ జట్టుకు కలిసి రావట్లేదు. తాజాగా స్వదేశంలో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో పాక్ ఘోర పరాభవం ఎదుర్కొంది. సొంతగడ్డపై జరిగిన టోర్నీలో ఆ జట్టు ఒక్క మ్యాచ్ కూడా గెలవకుండా, గ్రూప్ దశలోనే నిష్క్రమించింది. డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగిన పాక్‌కు ఇది పెద్ద అవమానం. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు స్వదేశంలో జరిగిన ముక్కోణపు సిరీస్‌లోనూ పాక్‌కు పరాభవం ఎదురైంది. న్యూజిలాండ్, సౌతాఫ్రికా పాల్గొన్న ఈ టోర్నీలోనూ పాక్ ఓటమిపాలైంది. ఇన్ని ఘెర అవమానాల తర్వాత పాక్ పరిమిత ఓవర్ల సిరీస్‌ల కోసం న్యూజిలాండ్‌కు బయల్దేరనుంది. ఈ పర్యటనలో పాక్ న్యూజిలాండ్‌తో 5 టీ20లు, 3 వన్డేలు ఆడనుంది. మార్చి 16న తొలి టీ20 జరుగనుంది. ఆతర్వాత మార్చి 18, 21, 23, 26 తేదీల్లో మిగతా మ్యాచ్‌లు జరుగుతాయి. అనంతరం మార్చి 29న వన్డే సిరీస్ మొదలవుతుంది. ఈ సిరీస్‌లో మ్యాచ్‌లు మార్చి 29, ఏప్రిల్ 2, ఏప్రిల్ 5 తేదీల్లో జరుగనున్నాయి.పాక్ ఆటగాళ్లకు జరిమానాఇదిలా ఉంటే, ఆటగాళ్ల ప్రదర్శనను పెంపొందించడానికి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) కఠినమైన క్రమశిక్షణా చర్యలు అమలు చేసినట్లు తెలుస్తోంది. ఇటీవలి కాలంలో క్రమశిక్షణా రాహిత్యంగా వ్యవహరించిన పలువురు పాక్ ఆటగాళ్లపై పీసీబీ కొరడా ఝులిపించినట్లు సమాచారం. గతేడాది చివర్లో స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్ మొదలుకుని తాజాగా జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ వరకు రూల్స్ అతిక్రమించిన పాక్ ఆటగాళ్లకు జరిమానా విధించారని తెలుస్తుంది. జరిమానాల రూపంలో పాక్ క్రికెట్ బోర్డు దాదాపు 3.3 మిలియన్ రూపాయలు వసూలు చేసిందని సమాచారం. జరిమానా పడిన ఆటగాళ్లలో సల్మాన్ అఘా, సైమ్ అయూబ్, అబ్దుల్లా షఫీక్, అమీర్ జమాల్, సుఫీయాన్ ముఖీమ్, ఉస్మాన్ ఖాన్, అబ్బాస్ అఫ్రిది ఉన్నట్లు సమాచారం.ఓ టెస్ట్ మ్యాచ్ సందర్భంగా క్యాప్‌పై 804 అంకెను ముద్రించుకున్నందుకు అమీర్ జమాల్‌కు 1.4 మిలియన్ రూపాయలు..గతేడాది ఆస్ట్రేలియా పర్యటనలో హోటల్ రూమ్‌కు లేట్‌గా వచ్చినందుకు సల్మాన్ అఘా, సైమ్ అయూబ్, అబ్దుల్లా షఫీక్‌కు 5 లక్షల రూపాయలు..సౌతాఫ్రికా పర్యటనలో హోటల్‌కు లేట్‌గా వచ్చినందుకు సుఫీయాన్ ముఖీమ్, ఉస్మాన్ ఖాన్, అబ్బాస్ అఫ్రిదికి 200 డాలర్ల జరిమానాను విధించినట్లు పలు క్రికెట్ వెబ్సైట్లు వెల్లడించాయి.న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్ కోసం పాక్ జట్టు: ఒమెయిర్ యూసఫ్, అబ్దుల్ సమద్, హసన్ నవాజ్, ఖుష్దిల్ షా, సల్మాన్ అఘా (కెప్టెన్), షాదాబ్ ఖాన్, ఇర్ఫాన్ ఖాన్, జహన్దాద్ ఖాన్, మొహమ్మద్ హరీస్, ఉస్మాన్ ఖాన్, షాహీన్ అఫ్రిది, అబ్బాస్ అఫ్రిది, హరీస్ రౌఫ్, అబ్రార్ అహ్మద్, సూఫియాన్ ముఖీమ్, మొహమ్మద్ అలీన్యూజిలాండ్తో వన్డే సిరీస్ కోసం పాక్ జట్టు: అబ్దుల్లా షఫీక్, ఇమామ్ ఉల్ హాక్, ఖుష్దిల్ షా, బాబర్ ఆజమ్, తయ్యబ్ తాహిర్, ఇర్ఫాన్ ఖాన్, సల్మాన్ అఘా, ఫహీమ్ అష్రాఫ్, మహ్మద్ రిజ్వాన్, అబ్రార్ అహ్మద్, అకీఫ్ జావిద్, మొహమ్మద్ ఆలీ, మహ్మద్ వసీం జూనియర్, నసీం షా, సూఫియాన్ ముఖీమ్పాకిస్తాన్తో 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం న్యూజిలాండ్ జట్టు: మైఖేల్ బ్రేస్‌వెల్ (కెప్టెన్), ఫిన్ అలెన్, మార్క్ చాప్మన్, జాకబ్ డఫీ, జాక్ ఫౌల్క్స్ (4,5 మ్యాచ్‌లకు), మిచ్ హే, మాట్ హెన్రీ (4,5 మ్యాచ్‌లకు), కైల్ జామిసన్ (1, 2, 3 మ్యాచ్‌లకు), డారిల్ మిచెల్, జిమ్మీ నీషమ్, విల్ ఓ'రూర్కే (1, 2, 3 మ్యాచ్‌లకు), టిమ్ రాబిన్సన్, బెన్ సియర్స్, టిమ్ సీఫెర్ట్, ఇష్ సోధిన్యూజిలాండ్ పర్యటనలో పాక్ షెడ్యూల్..మార్చి 16- తొలి టీ20 (క్రైస్ట్‌చర్చ్)మార్చి 18- రెండో టీ20 (డునెడిన్)మార్చి 21- మూడో టీ20 (ఆక్లాండ్)మార్చి 23- నాలుగో టీ20 (మౌంట్ మౌంగనూయ్)మార్చి 26- ఐదో టీ20 (వెల్లింగ్టన్)మార్చి 29- తొలి వన్డే (నేపియర్)ఏప్రిల్ 2- రెండో వన్డే (హ్యామిల్టన్)ఏప్రిల్ 5- మూడో వన్డే (మౌంట్ మౌంగనూయ్) -
హోలీ వేళ క్రికెట్ గాడ్ సచిన్ హంగామా.. వైరల్ వీడియో
హోలీ పండుగ వేళ క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ సచిన్ టెండూల్కర్ సంబురాలు అంబరాన్నంటాయి. సందర్భం ఏదైనా రిజర్వ్డ్గా కనిపించే సచిన్.. ఈసారి హోలీ ఉత్సవాల్లో చెలరేగిపోయాడు. చిన్నపిల్లాడిలా మారి సహచరులను రంగులతో ముంచెత్తాడు. సచిన్.. సహచర క్రికెటర్లు యువరాజ్ సింగ్, అంబటి రాయుడు, ఇర్ఫాన్ పఠాన్‌ను రంగులతో ముంచెత్తిన వీడియో సోషల్‌మీడియాలో వైరలవుతుంది. ఈ వీడియోలో సచిన్ రంగులతో నింపిన వాటర్ గన్‌తో యువీ, రాయుడు, ఇర్ఫాన్‌లపై దాడి చేశాడు.Sachin Tendulkar, Yuvraj Singh and Yusuf Pathan celebrating Holi. 😂👌 pic.twitter.com/PYEaMoNbHV— Mufaddal Vohra (@mufaddal_vohra) March 14, 2025కాగా, సచిన్ ప్రస్తుతం ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్‌లో బిజీగా ఉన్నాడు. యువరాజ్, ఇర్ఫాన్, రాయుడు కూడా ఈ టోర్నీలో భారత మాస్టర్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఈ టోర్నీలో భారత జట్టుకు సచిన్ సారథ్యం వహిస్తున్నాడు. తొలిసారి నిర్వహిస్తున్న ఈ టోర్నీలో భారత్ ఫైనల్‌కు చేరింది. నిన్న జరిగిన సెమీఫైనల్లో టీమిండియా ఆస్ట్రేలియాను 94 పరుగుల తేడాతో చిత్తు చేసింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. సచిన్ (42), యువరాజ్ (59), స్టువర్ట్ బిన్నీ (36) చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 220 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఇన్నింగ్స్‌లో చివర్లో పఠాన్ సోదరులు కూడా చెలరేగిపోయారు. ఇర్ఫాన్ 10 బంతుల్లో 23, యూసఫ్ 7 బంతుల్లో 19 పరుగులు చేశారు. ఈ మ్యాచ్‌లో సచిన్‌కు జతగా ఓపెనర్‌గా వచ్చిన అంబటి రాయుడు 5, పవన్ నేగి 14, గురుకీరత్ సింగ్ 1 పరుగు చేశారు. ఆసీస్ బౌలర్లలో డేనియల్ క్రిస్టియన్, దోహర్తి చెరో 2 వికెట్లు పడగొట్టగా.. హిల్ఫెన్హాస్, స్టీవ్ ఓకీఫీ, కౌల్టర్ నైల్ తలో వికెట్ దక్కించుకున్నారు.అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన ఆసీస్.. భారత బౌలర్ షాబాజ్ నదీమ్ (4-1-15-4) విజృంభించడంతో 18.1 ఓవర్లలో 126 పరుగులకే చాపచుట్టేసింది. భారత బౌలర్లలో షాబాజ్‌తో పాటు వినయ్ కుమార్ (2-0-10-2), ఇర్ఫాన్ పఠాన్ (3.1-0-31-2), స్టువర్ట్ బిన్నీ (3-0-20-1), పవన్ నేగి (3-0-13-1) కూడా రాణించారు. ఆసీస్ ఇన్నింగ్స్‌లో బెన్ కట్టింగ్ (39) టాప్ స్కోరర్‌గా నిలువగా.. షాన్ మార్ష్ (21), బెన్ డంక్ (21), నాథన్ రియర్డాన్ (21), దోహర్తి (10 నాటౌట్) రెండంకెల స్కోర్లు చేశారు. ఈ టోర్నీలో మూడు సెంచరీలు చేసి భీకర ఫామ్‌లో ఉన్న ఆసీస్ కెప్టెన్ షేన్ వాట్సన్ (5) ఈ మ్యాచ్‌లో విఫలమయ్యాడు. డేనియల్ క్రిస్టియన్ 2, కౌల్టర్ నైల్ 0, హిల్ఫెన్హాస్ 2, ఓకీఫీ 0, మెక్‌గెయిన్ 3 పరుగులు చేసి ఔటయ్యారు. శ్రీలంక, వెస్టిండీస్ జట్ల మధ్య ఇవాళ (మార్చి 14) జరిగే రెండో సెమీఫైనల్లో విజేతతో భారత్ ఫైనల్లో తలపడుతుంది. ఫైనల్ మ్యాచ్ మార్చి 16న జరుగుతుంది. ఈ టోర్నీలో భారత్, శ్రీలంక, వెస్టిండీస్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, ఇంగ్లండ్ దేశాలకు చెందిన దిగ్గజ క్రికెటర్లు పాల్గొనగా.. సౌతాఫ్రికా, ఇంగ్లండ్ సెమీస్‌కు చేరుకుండానే టోర్నీ నుంచి నిష్క్రమించాయి. -
న్యూ లుక్‌లో విరాట్.. సోషల్‌మీడియాను షేక్ చేస్తున్న ఫోటోలు
ఐపీఎల్ 2025 సీజన్ ప్రారంభానికి టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి సరికొత్త లుక్‌లో కనిపించాడు. కోహ్లి న్యూ లుక్కు సంబంధించిన ఫోటోలు సోషల్‌మీడియాను షేక్ చేస్తున్నాయి. ఈ ఫోటోలను విరాట్ హెయిర్ స్టైలిస్ట్ ఆలీమ్ ఖాన్ ఇన్‌స్టాలో షేర్ చేయగా.. అభిమానుల నుంచి విపరీతమైన స్పందన వస్తుంది. ఈ ఫొటోలకు అలీమ్ ఖాన్ 'ది గోట్ ఎనర్జీ' అని క్యాప్షన్ ఇచ్చారు. "వన్ అండ్ ఓన్లీ విరాట్ కోహ్లీ కోసం కొత్త స్నిప్. రేజర్ షార్ప్ గా కనిపిస్తున్నాడు" అని ఆలీమ్ ఖాన్ తన ఇన్‌స్టా స్టోరీలో రాసుకొచ్చాడు. నయా లుక్‌లో ఫోటోలను చూసి తమదైనశైలిలో స్పందిస్తున్నారు. కొత్త లుక్‌లో కింగ్ అదుర్స్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. View this post on Instagram A post shared by Aalim Hakim (@aalimhakim)ఇదిలా ఉంటే మరో 8 రోజుల్లో (మార్చి 22) ఐపీఎల్ 2025 సీజన్ ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లోనే విరాట్ జట్టు ఆర్సీబీ డిఫెండింగ్ ఛాంపియన్స్ కేకేఆర్‌ను ఢీకొంటుంది. ఈ మ్యాచ్ కోల్‌కతా వేదికగా జరుగనుంది. అన్నీ ఫ్రాంచైజీలు ఐపీఎల్ కోసం సన్నాహకాలు మొదలుపెట్టాయి. ఆటగాళ్లు ఒక్కొక్కరుగా తమతమ జట్లలో చేరుతున్నారు. విరాట్ మరి కొద్ది రోజుల్లో ఆర్సీబీ క్యాంప్‌లో చేరే అవకాశం ఉంది. ఆర్సీబీ తమ ప్రాక్టీస్‌ను ఇదివరకే షురూ చేసింది. విరాట్ కొన్ని యాడ్ షూట్స్ కారణంగా జట్టుతో కలవడం ఆలస్యమైంది.విరాట్‌తో కూడిన టీమిండియా కొద్ది రోజుల కిందట ఛాంపియన్స్ ట్రోఫీ-2025 గెలిచిన విషయం తెలిసిందే. దుబాయ్ వేదికగా జరిగిన ఈ టోర్నీ ఫైనల్లో భారత్ న్యూజిలాండ్‌ను ఓడించి మూడోసారి ఛాంపియన్స్ ట్రోఫీని కైవసం చేసుకుంది. ఈ టోర్నీలో విరాట్ భారత విజయాల్లో కీలకపాత్ర పోషించాడు. ఈ టోర్నీలో అతను 5 మ్యాచ్‌ల్లో సెంచరీ, హాఫ్ సెంచరీ సాయంతో 218 పరుగులు చేశాడు. ఈ టోర్నీలో విరాట్ ఐదో లీడింగ్ రన్‌స్కోరర్‌గా నిలిచాడు.ఈ టోర్నీలో పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో సూపర్ సెంచరీ చేసిన విరాట్.. కీలకమైన సెమీఫైనల్లో ఆసీస్‌పై మ్యాచ్ విన్నింగ్ హాఫ్ సెంచరీ సాధించాడు. గత కొంతకాలంగా ఫామ్ లేమి వల్ల అపవాదులు ఎదుర్కొన్న విరాట్.. ఈ టోర్నీతో తిరిగి పూర్వ వైభవం సాధించాడు. విరాట్ ఇదే ఫామ్‌ను ఐపీఎల్‌లోనూ కొనసాగించాలని ఆర్సీబీ అభిమానులు కోరుకుంటున్నారు. ప్రతి ఏడాది లాగే ఈసారి కూడా ఆర్సీబీ అభిమానులు ఈ సాలా కప్ నమ్మదే అంటూ డప్పు కొట్టుకుంటున్నారు.ఆర్సీబీ ఈ ఏడాది జట్టు మొత్తాన్ని ప్రక్షాళన చేసింది. గత రెండు సీజన్లు కెప్టెన్‌గా వ్యవహరించిన డుప్లెసిస్‌ను సైతం తప్పించి కొత్త కెప్టెన్‌గా రజత్ పాటిదార్‌ను నియమించుకుంది. ఈ ఏడాది ఆర్సీబీలోకి టిమ్ డేవిడ్, లియామ్ లివింగ్‌స్టోన్, జేకబ్ బేతెల్, ఫిల్ సాల్ట్, రొమారియో షెపర్డ్, జోష్ హాజిల్‌వుడ్ లాంటి విదేశీ స్టార్లు వచ్చారు. చాలాకాలం పాటు తమకు సేవలందించిన హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్‌ను ఆర్సీబీ ఈ ఏడాది వదులుకుంది. ఈ ఏడాది ఆర్సీబీలోకి కృనాల్ పాండ్యా, దేవ్‌దత్ పడిక్కల్, భువనేశ్వర్ కుమార్ లాంటి దేశీయ స్టార్లు కూడా వచ్చారు. జట్టు మొత్తం మారడంతో తమ ఫేట్ కూడా మారుతుందని ఆర్సీబీ అభిమానులు ఆశిస్తున్నారు.ఐపీఎల్-2025లో ఆర్సీబీ జట్టు..రజత్ పాటిదార్ (కెప్టెన్), విరాట్ కోహ్లి, దేవ్‌దత్ పడిక్కల్, టిమ్ డేవిడ్, స్వస్థిక్ చికారా, కృనాల్ పాండ్యా, మనోజ్ భండగే, రొమారియో షెపర్డ్, స్వప్నిల్ సింగ్, జేకబ్ బేతెల్, లియామ్ లివింగ్‌స్టోన్, మోహిత్ రతీ, ఫిలిప్ సాల్ట్, జితేశ్ శర్మ, జోష్ హాజిల్‌వుడ్, భువనేశ్వర్ కుమార్, లుంగి ఎంగిడి, రసిక్ సలాం దార్, సుయాశ్ శర్మ, యశ్ దయాల్, నువాన్ తుషార, అభినందన్ సింగ్ -
కంగ్రాట్స్ బాపు.. నా సపోర్ట్ నీకు ఎప్పుడూ ఉంటుంది: రాహుల్
ఐపీఎల్-2025 సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ కొత్త కెప్టెన్ ఎవరన్న ఉత్కంఠకు తెరపడింది. టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ తమ కెప్టెన్‌గా నియమించింది. కాగా ఢిల్లీ క్యాపిటల్స్ తొలుత కేఎల్ రాహల్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేయాలని భావించింది.కానీ అందుకు రాహుల్ సుముఖత చూపకపోవడంతో అక్షర్‌కు తమ జట్టు పగ్గాలను ఢిల్లీ యాజమాన్యం అప్పగించింది. ఐపీఎల్‌లలో అక్షర్ పటేల్ ఓ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించనుండడం ఇదే తొలిసారి. కాగా అక్షర్ 2019 నుంచి డీసీ జట్టుతో కొనసాగుతున్నాడు.ఐపీఎల్-2025 మెగా వేలానికి ముందు రూ. 16.50 కోట్ల భారీ ధర వెచ్చించి అక్షర్‌ను ఢిల్లీ రిటైన్ చేసుకుంది. అదేవిధంగా అక్షర్ పటేల్ ప్రస్తుతం భారత జట్టులో కీలక సభ్యునిగా కొనసాగుతున్నాడు. టీ20ల్లో అతడికి బీసీసీఐ సెలక్టర్లు వైస్ కెప్టెన్సీ పగ్గాలు అప్పగించారు.ఇటీవల ముగిసిన ఛాంపియన్స్ ట్రోఫీలోనూ అక్షర్ ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టాడు. భారత్ టైటిల్ కైవసం చేసుకోవడంలో అక్షర్ది కీలక పాత్ర. . టీమిండియా తరఫున అక్షర్ పటేల్ 71 టీ20 మ్యాచ్‌లు ఆడిన అక్షర్ పటేల్ 535 పరుగులతో పాటు, 71 వికెట్లు కూడా తీసుకున్నాడు. 150 ఐపీఎల్ మ్యాచ్‌లలో 1653 పరుగులు చేసి 123 వికెట్లు తీసుకున్నాడు.రాహుల్ విషెస్..ఇక కెప్టెన్‌గా ఎంపికైన అక్షర్ పటేల్‌కు తన సహచర ఆటగాడు కేఎల్ రాహుల్‌కు అభినందనలు తెలిపాడు. "కంగ్రాట్స్ బాపు(అక్షర్ పటేల్). ఈ సరికొత్త ప్రయాణంలో మీకు అంతా మంచి జరగాలని కోరుకుంటున్నాను. నా వంతు సపోర్ట్ మీకు ఎల్లప్పుడూ ఉంటుంది" అని రాహుల్ తన ఇన్‌స్టా స్టోరీలో రాసుకొచ్చాడు.కాగా రాహుల్ గత మూడు సీజన్లలో లక్నో సూపర్ జెయింట్స్‌కు నాయకత్వం వహించాడు. అయితే ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందు రాహుల్‌ను లక్నో ఫ్రాంచైజీ విడుదల చేసింది. అతడి స్ధానంలో డైనమిక్ వికెట్ కీపర్-బ్యాటర్ రిషబ్ పంత్‌ను రూ. 27 కోట్లకు కొనుగోలు చేసి లక్నో సూపర్ జెయింట్స్ తమ జట్టు కెప్టెన్సీ అప్పగించింది.చదవండి: స్టార్ క్రికెటర్ ఇంట్లో తీవ్ర విషాదం.. చిన్నారి మృతి -
న్యూజిలాండ్‌కు షాకిచ్చిన శ్రీలంక
పరిమత ఓవర్ల సిరీస్‌ల కోసం న్యూజిలాండ్‌లో పర్యటిస్తున్న శ్రీలంక మహిళల జట్టు తొలి విజయం సాధించింది. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా ఇవాళ (మార్చి 14) జరిగిన తొలి మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 18.5 ఓవర్లలో 101 పరుగులకే ఆలౌటైంది. లంక బౌలర్లు మల్కి మదారా 3, కవిష దిల్హరి, ఇనోషి ప్రియదర్శిని తలో 2, సుగంధిక కుమారి, చమారీ ఆటపట్టు చెరో వికెట్ తీసి న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌ను కుప్పకూల్చారు. న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌లో ఎమ్మా మెక్లియోడ్ (44), కెప్టెన్ సూజీ బేట్స్ (21), జెస్ కెర్ (10) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. జార్జియా ప్లిమ్మర్ 2, బ్రూక్ హ్యాలిడే 4, ఇజ్జి షార్ప్ 0, మ్యాడీ గ్రీన్ 5, పోల్లి ఇంగ్లిస్ 4, రోస్‌మేరీ మైర్ 0, ఎడెన్ కార్సన్ 7 పరుగులు చేశారు. లంక బౌలర్లు చెలరేగడంతో న్యూజిలాండ్ బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు.అనంతరం ఓపెనర్ చమారీ ఆటపట్టు (48 బంతుల్లో 64 నాటౌట్) అజేయ అర్ద సెంచరీతో చెలరేగడంతో శ్రీలంక 14.1 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. నిలాక్షి డిసిల్వతో (12 నాటౌట్) కలిసి ఆటపట్టు లంకను విజయతీరాలకు చేర్చింది. లంక ఇన్నింగ్స్‌లో విష్మి గౌతమ్ 7, హర్షిత సమరవిక్రమ 2, కవిశ దిల్హరి 12 పరుగులు చేసి ఔటయ్యారు. న్యూజిలాండ్ బౌలర్లలో జెస్ కెర్ 2 వికెట్లు పడగొట్టింది. ఈ గెలుపుతో శ్రీలంక మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. కాగా, ఈ పర్యటనలో శ్రీలంక ముందుగా వన్డే సిరీస్ ఆడింది. మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్‌ను న్యూజిలాండ్ 2-0 తేడాతో కైవసం చేసుకుంది. ఈ సిరీస్‌లోని తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కాగా.. రెండు, మూడు మ్యాచ్‌ల్లో న్యూజిలాండ్ జయకేతనం ఎగురవేసింది. రెండో టీ20 క్రైస్ట్‌చర్చ్ వేదికగా మార్చి 16న జరుగనుంది. -
ఆర్సీబీకి గుడ్ న్యూస్.. రూ. 12 కోట్ల ఆటగాడు వచ్చేస్తున్నాడు?
ఐపీఎల్-2025కు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు అదిరిపోయే వార్త అందింది. గత కొంతకాలంగా మెకాలి గాయంతో బాధపడుతున్న ఆస్ట్రేలియా స్టార్ ఫాస్ట్ బౌలర్ జోష్ హేజిల్‌వుడ్ ఇప్పుడు పూర్తి ఫిట్నెస్ సాధించినట్లు తెలుస్తోంది. గతేడాది ఆఖరిలో జరిగిన ఐపీఎల్ మెగా వేలంలో రూ.12.50 కోట్ల భారీ ధరకు హేజిల్‌వుడ్‌ను ఆర్సీబీ కొనుగోలు చేసింది. 34 ఏళ్ల హేజిల్‌వుడ్.. భారత్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో ప్రక్కటెముకల గాయం బారిన పడ్డాడు. దీంతో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ మధ్యలోనే అతడు వైదొలగాడు. అనంతరం ఇదే గాయం కారణంగా ఛాంపియన్స్ ట్రోఫీకి కూడా దూరమయ్యాడు. అయితే తాజాగా హాజిల్‌వుడ్‌కు నిర్వహించిన ఫిట్నెస్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో హాజిల్‌వుడ్ ఐపీఎల్లో ఆడేందుకు క్రికెట్ ఆస్ట్రేలియా నుంచి క్లియరెన్స్ పొందినట్లు ప్రముఖ క్రికెట్ వెబ్సైట్ ఈఎస్పీఎన్ వెల్లడించింది. అతడు త్వరలోనే భారత గడ్డపై అడుగుపెట్టే అవకాశముంది. కాగా ఈ ఏడాది సీజన్లో ఆర్సీబీ బౌలింగ్ విభాగం చాలా పటిష్టంగా కన్పిస్తోంది.ఆర్సీబీ బౌలింగ్ యూనిట్లో భువనేశ్వర్ కుమార్, లుంగీ ఎంగిడి, జోష్ హేజెల్‌వుడ్ వంటి హేమహేమీలు ఉన్నారు. హాజిల్‌వుడ్ చివరగా 2023 ఐపీఎల్ సీజన్లో ఆర్సీబీకే ఆడాడు. ఇక ఐపీఎల్-2025 సీజన్ మార్చి 22 నుంచి ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో ఆర్సీబీ, కేకేఆర్ జట్లు తలపడనున్నాయి.ఆర్సీబీ తలరాత మారుతుందా?కాగా ఐపీఎల్ సీజన్లు మారుతున్నప్పటికి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలరాత మాత్రం మారడం లేదు. తొలి సీజన్ ఆడుతున్నప్పటికీ కనీసం ఒక్కసారి కూడా ఆర్సీబీ టైటిల్‌ను ముద్దాడలేకపోయింది. కనీసం 18వ ఎడిషన్‌లో అయినా ఛాంపియన్స్‌గా నిలవాలని ఆర్సీబీ భావిస్తోంది. తొలిసారి 2009లో ఐపీఎల్ ఫైనల్స్‌కు చేరుకున్న ఆర్సీబీ డక్కన్ ఛార్జెస్‌పై ఓడిపోయింది. 2011లో మరోసారి చెన్నై సూపర్ కింగ్స్‌పై, 2016లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుపై ఫైనల్స్‌లో ఓటమి పాలైందిఐపీఎల్-2025కు బెంగళూరు జట్టురజత్ పటీదార్ (కెప్టెన్), విరాట్ కోహ్లి, ఫిల్ సాల్ట్, జితేష్ శర్మ, దేవదత్ పడిక్కల్, స్వస్తిక్ చికర, లియామ్ లివింగ్స్టన్, కృనాల్ పాండ్యా, స్వప్నిల్ సింగ్, టిమ్ డేవిడ్, రొమారియో షెఫార్డ్, మనోజ్, జోష్ హేజెల్‌వుడ్, రషిక్ దార్, సుయాష్ శర్మ, భువనేశ్వర్ కుమార్, నువాన్ తుషారా, లుంగీ ఎంగిడి, అభినందన్ సింగ్, మోహిత్, యశ్ దయాల్.చదవండి: ఉన్నదే ఒక్కడు.. మీరు కాస్త నోళ్లు మూయండి: పాక్ మాజీ స్పిన్నర్ ఫైర్