టీమిండియాపై చంద్ర గ్రహణం ఎఫెక్ట్‌ | Know Reason Behind Why India Coach Postponed Practice Session Ahead Of IND Vs ENG T20 WC Semi Final, Read Story Inside | Sakshi
Sakshi News home page

టీమిండియాపై చంద్ర గ్రహణం ఎఫెక్ట్‌

Mar 4 2026 4:42 PM | Updated on Mar 4 2026 5:32 PM

lunar eclipse: India coach on postponing practice session for IND vs ENG

ఇషాన్‌ కిషన్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌, కుల్దీప్‌ యాదవ్‌ (PC: BCCI)

టీమిండియా టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నీతో బిజీగా ఉంది. గ్రూప్‌ దశలో అమెరికా, నమీబియా, పాకిస్తాన్‌, నెదర్లాండ్స్‌ జట్లను ఓడించి అజేయంగా సూపర్‌-8కు చేరుకుంది.

ఇంగ్లండ్‌తో సెమీ ఫైనల్‌
అయితే, సూపర్‌-8లో తొలి మ్యాచ్‌లోనే సౌతాఫ్రికా చేతిలో చిత్తుగా ఓడిన సూర్యకుమార్‌ సేన.. ఆ తర్వాత జింబాబ్వే, వెస్టిండీస్‌లను ఓడించి సెమీస్‌కు అర్హత సాధించింది. ఈ క్రమంలో రెండో సెమీ ఫైనల్లో భాగంగా ఇంగ్లండ్‌ (IND vs ENG)తో గురువారం తలపడనుంది టీమిండియా. ఇందుకు ముంబైలోని వాంఖడే మైదానం వేదిక.

ఇందుకోసం ఇప్పటికే ముంబై చేరుకున్న భారత జట్టు ప్రాక్టీస్‌ మొదలుపెట్టేసింది. అయితే, మంగళవారం నాటి చంద్ర గ్రహణం ప్రభావం టీమిండియాపై కూడా పడింది. గ్రహణం కారణంగా సూర్యకుమార్‌ సేన తమ ప్రాక్టీస్‌ సెషన్‌ను గంటపాటు వాయిదా వేసుకుంది.

టీమిండియాపై చంద్ర గ్రహణం ఎఫెక్ట్‌
కాగా గ్రహణం మధ్యాహ్నం 3.20 నుంచి సాయంత్రం 6.47 నిమిషాల వరకు కొనసాగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సాయంత్రం 6- 9 గంటల వరకు టీమిండియా ప్రాక్టీస్‌ చేయాల్సి ఉండగా.. గంట ఆలస్యంగా అంటే ఏడు గంటలకు నెట్‌ సెషన్‌ను ఆరంభించింది. 

గ్రహణం సమయంలో ఏ పని చేయకూడదని.. అలా చేస్తే దురదృష్టం వెంటాడుతుందేమోనన్న భయంతో భారత జట్టు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లుగా వార్తలు వచ్చాయి.

అవును.. మా వాళ్లు చెప్పారు
ఈ విషయం గురించి టీమిండియా కోచ్‌ మోర్నీ మోర్కెల్‌ స్పందించాడు. ‘‘అవును.. చంద్ర గ్రహణం గురించి నాకు మా వాళ్లు చెప్పారు. అందుకే సెషన్‌ను వాయిదా వేసుకున్నాం. అయితే, గ్రహణం ఒక్కటే మా రాతను మారుస్తుందనే భయం లేదు. గెలుపు కోసం అత్యుత్తమంగా ప్రయత్నించడమే ముఖ్యమైనది’’ అని మోర్కెల్‌ పేర్కొన్నాడు.

కాగా ఇంగ్లండ్‌తో సెమీ ఫైనల్‌కు ఆఖరిగా బుధవారం కూడా టీమిండియా ప్రాక్టీస్‌ చేయాల్సి ఉంది. అయితే ఇది ఆప్షనల్‌ కావడంతో వరుణ్‌ చక్రవర్తి, రింకూ సింగ్‌, వాషింగ్టన్‌ సుందర్‌, తిలక్‌ వర్మ మాత్రమే నెట్స్‌లో శ్రమించారు. మిగతా వారు విశ్రాంతి తీసుకున్నట్లు సమాచారం.  

చదవండి: IND vs ENG: అభిషేక్‌ శర్మను తప్పించండి.. కానీ: రవిశాస్త్రి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement