semi final
-
అల్కరాజ్కు ఊహించని షాక్!
స్పెయిన్ టెన్నిస్ స్టార్ ఆటగాడు, ప్రపంచ నంబర్‌వన్ కార్లోస్ అల్కరాజ్ వరుస విజయాలకు బ్రేక్ పడింది. ఇండియానా వెల్స్ టోర్నీలో భాగంగా శనివారం రాత్రి జరిగిన పురుషుల సెమీఫైనల్లో రష్యా స్టార్ డానిల్ మెద్వదెవ్ చేతిలో 6-3, 7-6(7/3)తో అల్కరాజ్ ఓటమి చవిచూశాడు. కేవలం రెండు సెట్ల పాటు జరిగిన మ్యాచ్‌లో మెద్వదెవ్‌ను అల్కరాజ్ ప్రతిఘటించలేకపోయాడు. తొలి సెట్‌ను మెద్వదెవ్ సులువుగా కైవసం చేసుకున్నాడు. అయితే రెండో సెట్లో అల్కరాజ్, మెద్వదెవ్ మధ్య రసవత్తరపోరు సాగింది. ఈ నేపథ్యంలో మ్యాచ్ టైబ్రేక్‌కు దారి తీసింది. అయితే టైబ్రేక్‌లో మెద్వదెవ్ మరోసారి తన స్ట్రోక్ పవర్ చూపించి అల్కరాజ్ దెబ్బకొట్టడంతో పాటు టోర్నీ ఫైనల్లో ప్రవేశించాడు. అయితే అల్కరాజ్ ఇండియన్ వెల్స్ టోర్నీ సెమీఫైనల్ వరకు వరుసగా 16 మ్యాచ్‌ల్లో విజయం సాధించి ఒక టైటిల్ ఫెవరెట్‌గా నిలిచాడు. ఈ ఏడాది వరుస విజయాలతో దుమ్మురేపిన అల్కరాజ్ కాలిఫోర్నియన్ డెసెర్ట్‌లో వరుసగా మూడో టైటిల్ సాధిస్తాడని అనుకన్నప్పటికీ అతని ఆశలకు మెద్వదెవ్ గండి కొట్టాడు. మరోవైపు మెద్వదెవ్‌కు ఇది వరుసగా తొమ్మిదో విజయం కావడం విశేషం. గత నెలలో దుబాయ్ వేదికగా జరిగిన టోర్నీలో మెద్వదెవ్ విజయం సాధించాడు. ఇక ఇండియన్ వెల్స్ టోర్నీలో మెద్వదెవ్ ఫైనల్ చేరడం ఇది మూడోసారి. గతంలో 2023, 2024లో ఫైనల్ చేరినప్పటికీ రన్నరప్‌కే పరిమితమయ్యాడు. తాజాగా మూడో ప్రయత్నంలోనైనా టైటిల్ సాధించాలనే కసితో మెద్వదెవ్ ఉన్నాడు. మరో సెమీస్‌లో ప్రపంచ రెండో ర్యాంకర్ జానిక్ సిన్నర్ 6-2, 6-4తో అలెగ్జాండర్ జ్వెరెవ్‌ను ఓడించి టైటిల్ పోరుకు అర్హత సాధించాడు. సోమవారం జరగనున్న పురుషుల సింగిల్స్ ఫైనల్లో సిన్నర్‌తో మెద్వదెవ్ అమీతుమీ తేల్చుకోనున్నాడు.చదవండి: ‘పాక్, బంగ్లా నాటకం ఫలించలేదు’ -
నీకంత దూకుడు ఎందుకు?: అభిషేక్ శర్మపై అశ్విన్ ఆగ్రహం
అభిషేక్ శర్మ.. తొలిసారి ప్రపంచకప్ టోర్నీ ఆడుతున్న ఈ ఓపెనింగ్ బ్యాటర్ దారుణంగా విఫలమవుతున్నాడు. ఇప్పటి వరకు ఆడిన మ్యాచ్‌లలో అతడు చేసిన స్కోర్లు వరుసగా.. 0 (1), 0 (4), 0 (3), 15 (12), 55 (30), 10 (11), 9 (7).విఫలమైనా..లీగ్ దశలో మూడు మ్యాచ్‌లు ఆడి డకౌట్ అయినా యాజమాన్యం అభిషేక్ శర్మ (Abhishek Sharma)ను ఓపెనర్‌గా కొనసాగించిది. అయితే, అతడి ఆట తీరు మాత్రం మారలేదు. ముఖ్యంగా ఇంగ్లండ్‌తో కీలక సెమీ ఫైనల్లోనూ ఈ ఎడమచేతి వాటం బ్యాటర్ తేలిపోయాడు. తొందరపడి వికెట్ పారేసుకుని తొమ్మిది పరుగులకే నిష్క్రమించాడు.సంజూ మెరుపు ఇన్నింగ్స్మరో ఓపెనర్ సంజూ శాంసన్ (Sanju Samson) మెరుపు ఇన్నింగ్స్ (42 బంతుల్లో 89) తో రాణించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ నేపథ్యంలో అభిషేక్ ఆట తీరుపై విమర్శల వర్షం కురుస్తోంది. టీమిండియా దిగ్గజ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ సైతం ఈ ఓపెనింగ్ బ్యాటర్ వైఖరిని తప్పుబట్టాడు.తలతిక్క బ్యాటింగ్‘‘ఇంగ్లండ్‌తో సెమీ ఫైనల్లో అతడు తలతిక్కగా బ్యాటింగ్ చేశాడు. నిజానికి అభిషేక్ గేమ్‌ప్లాన్‌కు నేను వీరాభిమానిని. విల్ జాక్స్ బౌలింగ్‌లో అతడు ఎనిమిది పరుగులు రాబట్టాడు. కానీ ఈ తర్వాత అతడి ఓవర్లోనే 30 పరుగులు తీయాలి అన్నట్లు తొందరపడ్డాడు.నీకంత దూకుడు ఎందుకు?కొన్నిసార్లు బాల్‌ను వదిలేయాల్సి ఉంటుంది. ఓవైపు సంజూ శాంసన్ కుదురుగా ఆడుతున్నాడు కదా!.. నీకు కష్టంగా అనిపిస్తే ఒక సింగిల్ తీసి మరో ఎండ్‌కు వెళ్లిపోవాల్సింది. ఆ తర్వాత మళ్లీ అవకాశం వస్తుంది కదా!.. ఏదేమైనా అంత దూకుడు పనికిరాదు’’ అని అశ్విన్ అభిషేక్‌పై మండిపడ్డాడు.అదే విధంగా.. న్యూజిలాండ్‌తో ఫైనల్ నేపథ్యంలో.. ‘‘అభిషేక్ మంచి బ్యాటర్. న్యూజిలాండ్‌తో ఇటీవలి సిరీస్‌లో సూపర్ ఫామ్ కనబరిచాడు. మిచెల్ సాంట్నర్, మ్యాట్ హెన్రీ బౌలింగ్‌లో గతంలో అదరగొట్టాడు.ఒత్తిడిలో ఉన్నాడుఅయితే, ఇప్పుడు అతడు ఒత్తిడిలో ఉన్నాడు. కెప్టెన్, హెడ్‌కోచ్ అతడితో మాట్లాడాలి. తనకు వ్యతిరేకంగా ప్రత్యర్థి జట్టు వద్ద ఉన్న ప్రణాళికలను వివరించాలి. అతడిలో గొప్ప ప్రతిభ ఉంది. కానీ ఎందుకో తడబడుతున్నాడు.ఇలాంటి తరుణంలో అతడిపై మరింత ఒత్తిడి చేసే విధంగా మేనేజ్మెంట్ ఉండకూడదు. మానసికంగా దృఢంగా తయారయ్యేలా తీర్చిదిద్దాలి’’ అని టీమిండియా యాజమాన్యానికి అశూ సూచనలు ఇచ్చాడు. కాగా ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో ఆ జట్టు కెప్టెన్ హ్యారీ బ్రూక్.. అభిషేక్ కోసం లెగ్‌సైడ్‌లో ఒకే ఒక్క ఫీల్డర్‌ను ఉంచాడు. అతడికి క్యాచ్ ఇచ్చి అభిషేక్ పెవిలియన్ చేరాడు. ఇదిలా ఉంటే.. మార్చి 8న భారత్- న్యూజిలాండ్ మధ్య టీ20 ప్రంచకప్-2026 ఫైనల్‌కు షెడ్యూల్ ఖరారైంది.చదవండి: T20 WC: అతడి వల్లే ఇదంతా.. మా కొంప మునిగింది అక్కడే: మెకల్లమ్ -
సంజూ కాదు!.. అతడే అందుకు అర్హుడు: మాజీ క్రికెటర్
టీమిండియా ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రాపై భారత మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ ప్రశంసలు కురిపించాడు. బుమ్రా లాంటి బౌలర్ దొరకడం భారత జట్టు చేసుకున్న అదృష్టం అని కొనియాడాడు. టీమిండియాలో ఇంత వరకు ఇలాంటి బౌలర్‌ను ఎన్నడూ చూడలేదంటూ ఆకాశానికెత్తాడు.టైటిల్ పోరుకు అర్హతటీ20 ప్రపంచకప్-2026లో భారత్ ఫైనల్‌కు దూసుకువెళ్లిన విషయం తెలిసిందే. ముంబై వేదికగా వాంఖడేలో జరిగిన సెమీ ఫైనల్లో ఇంగ్లండ్‌పై ఏడు పరుగుల తేడాతో గెలిచిన సూర్య సేన.. టైటిల్ పోరుకు అర్హత సాధించింది.ఈ మ్యాచ్‌లో ఓపెనర్ సంజూ శాంసన్ (42 బంతుల్లో 89) బ్యాట్‌తో రాణిస్తే.. బుమ్రా తన అద్భుత స్పెల్‌తో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా ఇంగ్లండ్ చిచ్చర పిడుగు జేకబ్ బెతెల్ (48 బంతుల్లో 105) విధ్వంసకర ఇన్నింగ్స్‌తో మ్యాచ్‌ను లాగేసుకునే ప్రయత్నం చేస్తున్న వేళ.. బుమ్రా తన మ్యాజిక్ చూపించాడు.కీలక సమయంలో రాణించిపద్దెనిమిదవ ఓవర్లో 0,1,1,2,1,1 మాత్రమే ఇచ్చిన బుమ్రా.. టీమిండియా వైపు మ్యాచ్ తిప్పేశాడు. ఈ నేపథ్యంలో ఇర్ఫాన్ పఠాన్ బుమ్రాను ప్రశంసలతో ముంచెత్తాడు. ‘‘బుమ్రా గురించి ఇప్పటికే చాలాసార్లు మాట్లాడుకున్నాం. అతడు తరానికొక్క బౌలర్. టీమిండియాలో ఇలాంటి బౌలర్‌ను చూడటం అరుదు.సంజూ కాదు!.. అతడే అందుకు అర్హుడుయార్కర్లు, స్లో బాల్స్ వేస్తాడు.. అవుట్ స్వింగ్, ఇన్‌స్వింగ్ రాబడతాడు. బౌన్సర్లు సంధిస్తాడు. ముఖ్యంగా ఒత్తిడిలోనూ ఎలా బౌలింగ్ చేయాలో అతడికి బాగా తెలుసు. నా దృష్టిలో ఈ మ్యాచ్‌కు సంబంధించి బుమ్రాకే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ఇవ్వాల్సింది.ఈ పిచ్‌పై బౌలర్లందరి ఎకానమీ దాదాపుగా 10 దాటి పోయింది. రెండు జట్లు కలిపి 500కు పైగా పరుగులు చేశాయి. ఇలాంటి పరిస్థితుల్లో అలా బౌలింగ్ చేయడం అందరికీ సాధ్యం కాదు. ఇంతటి కఠినమైన ఓవర్‌ను బుమ్రా మాత్రమే వేయగలడు’’ అని ఇర్ఫాన్ పఠాన్ తన యూట్యూబ్ చానెల్ వేదికగా పేర్కొన్నాడు.అక్షర్ పటేల్ సైతంకాగా ఈ మ్యాచ్‌లో సంజూకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. సంజూ సైతం బుమ్రానే ఈ అవార్డుకు అర్హుడు అని పేర్కొనడం గమనార్హం. ఇదిలా ఉంటే.. బుమ్రా ఓవరాల్‌గా నాలుగు ఓవర్లలో 33 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీశాడు. మరోవైపు.. అక్షర్ పటేల్ అద్భుతమైన క్యాచ్‌లతో టీమిండియా విజయంలో తన వంతు పాత్ర పోషించాడు. Next stop: FINAL! 😍A high-scoring thriller, but #TeamIndia hold their nerve and book a spot in the final! 🔥ICC Men’s #T20WorldCup | FINAL | #INDvNZ | SUN, 8th MAR, 5:30 PM pic.twitter.com/PQfdlxUEv7— Star Sports (@StarSportsIndia) March 5, 2026చదవండి: T20 WC: అతడి వల్లే ఇదంతా.. మా కొంప మునిగింది అక్కడే: మెకల్లమ్ -
ఇది వరల్డ్‌కప్.. గుర్తుందా?: గావస్కర్ ఫైర్
ఐసీసీ టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో భారత్ ఫైనల్‌కు చేరుకుంది. ఇంగ్లండ్‌తో సెమీ ఫైనల్లో ఆఖరి ఓవర్ వరకు నరాలు తెగే ఉత్కంఠ రేపిన మ్యాచ్‌లో.. ఏడు పరుగుల తేడాతో గట్టెక్కింది. ముంబైలోని ప్రసిద్ధ వాంఖడే మైదానంలో భారత్- ఇంగ్లండ్ మధ్య రెండో సెమీస్ మ్యాచ్ గురువారం జరిగిన విషయం తెలిసిందే.సంజూ భారీ అర్ధ శతకంటాస్ ఓడిన టీమిండియా తొలుత బ్యాటింగ్‌కు దిగి.. నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 253 పరుగుల మేర భారీ స్కోరు సాధించింది. ఓపెనింగ్ బ్యాటర్ సంజూ శాంసన్ భారీ అర్ధ శతకం (42 బంతుల్లో 89) తో ఆకట్టుకున్నాడు.ఇక లక్ష్యాన్ని కాపాడుకునే క్రమంలో టీమిండియాకు శుభారంభం లభించింది. హార్దిక్ పాండ్యా ఫిల్ సాల్ట్ (5) రూపంలో తొలి వికెట్ దక్కించుకోగా.. ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా హ్యారీ బ్రూక్ (7)ను అవుట్ చేసి కీలక వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు.బెతెల్ విధ్వంసకర శతకంఅయితే, జేకబ్ బెతెల్ విధ్వంసకర శతకం (48 బంతుల్లో 105)తో విరుచుకుపడి.. భారత శిబిరంలో గుబులు రేపాడు. అయితే, పద్దెనిమిదో ఓవర్లో బుమ్రా కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి మ్యాచ్‌ను భారత్ వైపు తిప్పాడు. దీంతో ఏడు పరుగుల స్వల్ప తేడాతో గెలిచి టీమిండియా ఊపిరి పీల్చుకుంది.ఇక ఈ మ్యాచ్‌లో బుమ్రా నాలుగు ఓవర్ల కోటాలో 33 పరుగులు ఇచ్చి ఒక వికెట్ కూల్చాడు. ఇదిలా ఉంటే.. బుమ్రా బౌలింగ్ వేసేందుకు సిద్ధమవుతున్న క్రమంలో వాంఖడే డీజే బృందం.. ‘‘బూమ్ బూమ్ బుమ్రా’’ అంటూ బుమ్రా నామస్మరణ చేయాలని ప్రేక్షకులకు పిలుపు ఇచ్చారు. దీంతో అందరూ బుమ్రా పేరును గట్టిగా పలుకుతూ స్టేడియం దద్దరిల్లేలా చేశారు.Every Team India fan after watching Jasprit Bumrah’s masterclass! 🇮🇳🔥ICC Men’s #T20WorldCup 👉🏻 FINAL | #INDvNZ | SUN, 8th MAR, 5:30 PM pic.twitter.com/My9xx2WPyt— Star Sports (@StarSportsIndia) March 6, 2026బుమ్రా ఏంటి బుమ్రా?ఈ విషయంపై స్పందిస్తూ భారత మాజీ కెప్టెన్, కామెంటేటర్ సునిల్ గావస్కర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశాడు. ‘‘బుమ్రా బౌలింగ్ చేసేందుకు సిద్ధపడినపుడు.. ‘బూమ్ బూమ్ బుమ్రా’ అని అరవాలని చెప్పడం సరికాదు.బుమ్రా నామస్మరణ చేయాలనుకుంటే అతడు ఫ్రీగా ఉన్నపుడు చేయాలి. ఇది వరల్డ్‌కప్ అన్న విషయం గుర్తుంచుకోవాలి’’ అని గావస్కర్ ఫైర్ అయ్యాడు. కాగా కీలక సెమీ ఫైనల్లో బుమ్రా బౌలింగ్ చేస్తున్నపుడు.. అతడి ఏకాగ్రత దెబ్బతినేలా ప్రవర్తించడం సరికాదన్నది గావస్కర్ అభిప్రాయం.ఇదిలా ఉంటే.. వెస్టిండీస్‌తో సూపర్-8లో టీమిండియా తప్పక గెలవాల్సిన మ్యాచ్ సందర్భంగా.. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) చేసిన ఏర్పాట్లపై కూడా గావస్కర్ ఇదే విధంగా స్పందించాడు. మ్యాచ్ మధ్యలో లేజర్ షో ఏర్పాటు చేయడం ఏమిటని ప్రశ్నించాడు. రవిశాస్త్రి కూడా అతడికి మద్దతు పలికాడు.చదవండి: T20 WC: అతడి వల్లే ఇదంతా.. మా కొంప మునిగింది అక్కడే: మెకల్లమ్ -
T20 WC: మా ఓటమికి కారణం అతడే: మెకల్లమ్
ఇంగ్లండ్ కల చెదిరింది. టీ20 ప్రపంచకప్-2026 ఫైనల్లో అడుగుపెట్టాలనుకున్న బ్రూక్ బృందాన్ని టీమిండియా గట్టి షాకిచ్చింది. ముంబై వేదికగా గురువారం నాటి సెమీ ఫైనల్లో ఏడు పరుగుల స్వల్ప తేడాతో గెలిచి భారత్ ఫైనల్‌కు దూసుకువెళ్లింది.ఆఖరి వరకు పోరాడినా ఇంగ్లండ్‌కు చేదు అనుభవమే మిగిలింది. ఇక టీమిండియా గెలుపులో అక్షర్ పటేల్ (Axar Patel)దీ కీలక పాత్రే. సంజూ శాంసన్ బ్యాట్‌తో రాణించగా.. జస్ప్రీత్ బుమ్రా బంతితో అదరగొట్టాడు. వీరిద్దరికి తోడు అక్షర్ అందుకున్న క్యాచ్‌లే గెలుపును టీమిండియా వైపు తిప్పాయి.ఇంగ్లండ్ హెడ్‌కోచ్ బ్రెండన్ మెకల్లమ్ (Brendon McCullum) కూడా ఇదే మాట అంటున్నాడు. తమ ఓటమికి గల కారణాలు విశ్లేషిస్తూ.. అక్షర్ అందుకున్న అద్భుత క్యాచ్‌లే మ్యాచ్‌ను తమ నుంచి లాగేసుకున్నాయని పేర్కొన్నాడు. స్కై స్పోర్ట్స్ క్రికెట్‌తో మాట్లాడుతూ..అద్భుత రీతిలో క్యాచ్‌లు అందుకుని‘‘నిజం చెప్పాలంటే ఈ మ్యాచ్‌లో అక్షర్ అందుకున్న ఆ రెండు క్యాచ్‌ల గురించి మాట్లాడాలి. వాంఖడే మైదానంలో ఇలాంటి క్యాచ్‌లు అంత సులువేమీ కాదు. ఈ మ్యాచ్‌లో టీమిండియా తమ ప్రణాళికలను పక్కాగా అమలు చేసింది.ముఖ్యంగా అక్షర్ అద్భుత రీతిలో క్యాచ్‌లు అందుకుని మ్యాచ్‌ను టీమిండియా వైపు తిప్పేశాడు. కీలక సమయంలో అతడు రాణించాడు. నిజానికి చాన్నాళ్లుగా వాళ్ల ఫీల్డింగ్ అంత గొప్పగా ఏమీ లేదు.. ఈ రోజు మా వాళ్లే ఇంకాస్త మెరుగ్గా ఆడి ఉండే బాగుండేది. ఏదేమైనా వాళ్లకి (టీమిండియా) క్రెడిట్ ఇవ్వాల్సిందే’’ అని మెకల్లమ్ చెప్పుకొచ్చాడు.𝗕𝗮𝗽𝘂 𝗯𝗮𝘁𝘁𝗲𝗿𝘀 𝗸𝗲 𝗹𝗶𝘆𝗲 𝗵𝗮𝗻𝗶𝗸𝗮𝗿𝗮𝗸 𝗵𝗮𝗶. 🥵ICC Men’s #T20WorldCup | FINAL | #INDvNZ | SUN, 8th MAR, 5:30 PM pic.twitter.com/4e06e0SYAv— Star Sports (@StarSportsIndia) March 5, 2026అక్షర్ ఫీల్డింగ్.. భారత్ విజయానికి బాటలుకాగా ఇంగ్లండ్‌తో సెమీ ఫైనల్లో అక్షర్ పటేల్ రెండు క్యాచ్‌లు అందుకున్నాడు. తొలుత హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో ఫిల్ సాల్ట్ (5) ఇచ్చిన సులువైన క్యాచ్‌ను అందుకున్నాడు. అయితే, కెప్టెన్, డేంజరస్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ బుమ్రా బౌలింగ్‌లో బంతిని గాల్లోకి తరలించగా.. పాయింట్ నుంచి చాలా దూరం పరిగెత్తి అక్షర్ బంతిని అందుకున్నాడు.అయితే, అన్నింటికంటే విల్ జాక్స్ (35) ఇచ్చిన క్యాచ్‌ను బౌండరీ వద్ద అద్భుత రీతిలో అందుకున్నా పట్టు కోల్పోయినట్లు అనిపించగా.. అక్కడే ఉన్న దూబే వైపు విసరగా అతడు బంతిని క్యాచ్ పట్టాడు. ఇలా మ్యాచ్‌ను మలుపుతిప్పిన కీలక క్యాచ్‌లోనూ అక్షర్ భాగమయ్యాడు.చదవండి: టీమిండియా గెలుపునకు ప్రధాన కారణాలు ఇవే -
IND Vs ENG: నరాలు తెగే ఉత్కంఠ: టీమిండియా ధనాధన్ షో.. .. దర్జాగా ఫైనల్‌కు
టీ20 ప్రపంచకప్-2026 టోర్నమెంట్లో టీమిండియా ఫైనల్‌కు దూసుకువెళ్లింది. సెమీ ఫైనల్లో ఇంగ్లండ్‌ను ఓడించి.. టైటిల్ పోరుకు అర్హత సాధించింది. గత ఎడిషన్‌లో విజేతగా నిలిచిన భారత్.. ఈసారి కూడా ఫైనల్‌కు చేరి సత్తా చాటింది.253 పరుగులుముంబైలోని వాంఖడేలో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 253 పరుగులు సాధించింది. ఓపెనర్ సంజూ శాంసన్ మరోసారి ధనాధన్ దంచికొట్టాడు. 42 బంతుల్లో 89 పరుగులతో ఈ వికెట్ కీపర్బ్యాటర్ అదరగొట్టాడు.వన్‌డౌన్ బ్యాటర్ ఇషాన్ కిషన్ (18 బంతుల్లో 39) కూడా వేగంగా ఆడగా.. ఆల్‌రౌండర్లు శివం దూబే (25 బంతుల్లో 43), హార్దిక్ పాండ్యా (12 బంతుల్లో 27) మెరుపులు మెరిపించారు. తిలక్ వర్మ (7 బంతుల్లో 21) సైతం రాణించాడు.ఇంగ్లండ్ బౌలర్లలో విల్ జాక్స్, ఆదిల్ రషీద్ చెరో రెండు వికెట్లు తీయగా.. జోఫ్రా ఆర్చర్‌కు ఒక వికెట్ దక్కింది. లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్ ఆదిలోనే ఓపెనర్ ఫిల్ సాల్ట్ (5), వన్‌డౌన్ బ్యాటర్, కెప్టెన్ హ్యారీ బ్రూక్ (7) వికెట్లు కోల్పోయింది.పట్టువదలని విక్రమార్కుడిలాఇక టామ్ బాంటన్ (17) కాసేపు నిలబడగా.. జోస్ బట్లర్ 25 పరుగులతో ఫర్వాలేదనిపించాడు. అయితే, ఓవైపు వికెట్లు పడుతున్నా జేకబ్ బెతెల్ మాత్రం పట్టువదలని విక్రమార్కుడిలా క్రీజులో పాతుకుపోయాడు. కేవలం 19 బంతుల్లోనే అర్ధ శతకం బాది.. టీ20 ప్రపంచకప్ నాకౌట్ మ్యాచ్‌లలో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ చేసిన బ్యాటర్‌గా ఫిన్ అలెన్ (న్యూజిలాండ్) రికార్డు సమం చేశాడు.నరాలు తెగే ఉత్కంఠఅదే జోరు కొనసాగిస్తూ బెతెల్ భారత శిబిరంలో ఆందోళన పెంచాడు. అయితే, పద్దెనిమిదో ఓవర్లో బుమ్రా కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి.. కేవలం ఆరు పరుగులే ఇచ్చాడు. ఈ క్రమంలో రెండు ఓవర్లలో ఇంగ్లండ్ విజయ సమీకరణం 39 పరుగులుగా మారింది.అయితే, హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో పందొమ్మిదో ఓవర్లో సిక్స్ బాది బెతెల్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 45 బంతుల్లోనే 102 పరుగులు సాధించాడు. దీంతో ఉత్కంఠ పెరిగింది. అయితే, పాండ్యా మూడో బంతికి సామ్ కర్రాన్ (18)ను అవుట్ చేశాడు. పాండ్యా బౌలింగ్‌లో కర్రాన్ బంతిని గాల్లోకి లేపగా బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న తిలక్ అద్భుతంగా క్యాచ్‌పట్టాడు.ఏడు పరుగుల తేడాతో గెలిచి ఫైనల్లోతన ఓవర్లో పాండ్యా 9 పరుగులే ఇవ్వగా.. ఆఖరి ఓవర్లో ఇంగ్లండ్ గెలుపునకు 30 పరుగులు అవసరమయ్యాయి. చివరి ఓవర్లో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ బంతిని శివం దూబేకు ఇచ్చాడు. అతడి ఓవర్లో తొలి బంతికే బెతెల్ (105) రనౌట్ అయ్యాడు. దీంతో ఐదు బంతుల్లో 29 పరుగులు అవసరం కాగా.. ఆర్చర్ ఆఖరి మూడు బంతుల్లో సిక్సర్లు కొట్టినా లాభం లేకుండా పోయింది. ఇంగ్లండ్ 22 పరుగులకే పరిమితమైంది. ఫలితంగా టీమిండియా ఏడు పరుగుల తేడాతో గెలిచి ఫైనల్లో అడుగుపెట్టింది. ఇక అహ్మదాబాద్ వేదికగా ఆదివారం న్యూజిలాండ్‌తో ట్రోఫీ కోసం సూర్యకుమార్ సేన తలపడుతుంది. Next stop: FINAL! 😍A high-scoring thriller, but #TeamIndia hold their nerve and book a spot in the final! 🔥ICC Men’s #T20WorldCup | FINAL | #INDvNZ | SUN, 8th MAR, 5:30 PM pic.twitter.com/PQfdlxUEv7— Star Sports (@StarSportsIndia) March 5, 2026 స్కోర్లు: భారత్ - 253/7(20)ఇంగ్లండ్ - 246/7(20)ఫలితం: ఏడు పరుగుల తేడాతో భారత్ గెలుపు. -
చరిత్ర సృష్టించిన టీమిండియా.. వరల్డ్ రికార్డు
టీమిండియా సరికొత్త చరిత్ర సృష్టించింది. టీ20 క్రికెట్లో ఇంత వరకు ఏ జట్టుకూ సాధ్యం కాని ఘనత సాధించింది. పురుషుల పొట్టి ఫార్మాట్లో అత్యంత అరుదైన రికార్డును సొంతం చేసుకుంది.జింబాబ్వేపై 256 పరుగులుభారత జట్టు సొంతగడ్డపై టీ20 ప్రపంచకప్-2026 టోర్నీతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. సూపర్-8 దశలో జింబాబ్వేపై 256 పరుగులు సాధించిన భారత జట్టు.. తాజాగా గురువారం నాటి మ్యాచ్‌లోనూ 250కి పైగా స్కోరు నమోదు చేసింది.పొట్టి క్రికెట్లో తొలి జట్టుగాముంబైలోని ప్రసిద్ధ వాంఖడే మైదానంలో ఇంగ్లండ్‌తో సెమీ ఫైనల్లో.. నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 253 పరుగులు సాధించింది. ఓపెనర్ సంజూ శాంసన్ (42 బంతుల్లో 82) అదరగొట్టగా.. ఇషాన్ కిషన్ (18 బంతుల్లో 39), శివం దూబే (25 బంతుల్లో 43), హార్దిక్ పాండ్యా (12 బంతుల్లో 27), తిలక్ వర్మ (7 బంతుల్లో 21) మెరుపులు మెరిపించారు.Another must-win game, another Sanju Samson masterclass! 🔥His maiden T20I fifty against England and what an occasion to bring it up! 👏ICC Men’s #T20WorldCup | Semi-final 2 | #INDvENG | LIVE NOW 👉 https://t.co/L2OuYBUDbL pic.twitter.com/1csgOPterB— Star Sports (@StarSportsIndia) March 5, 2026ఫలితంగా టీమిండియాకు ఈ మేర 253 పరుగుల స్కోరు సాధ్యమైంది. ఈ క్రమంలోనే పొట్టి క్రికెట్లో అత్యధిక సార్లు 250 ప్లస్ స్కోరు సాధించిన జట్టుగా నిలిచింది. తద్వారా ఐపీఎల్ ఫ్రాంఛైజీ సన్‌రైజర్స్ హైదరాబాద్ పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టింది.పురుషుల టీ20 క్రికెట్లో అత్యధిక సార్లు 250కి పైగా పరుగులు సాధించిన జట్లు👉టీమిండియా- ఆరు సార్లు👉సన్‌రైజర్స్ హైదరాబాద్- ఐదు సార్లు👉వెస్టిండీస్- మూడు సార్లు👉జింబాబ్వే- మూడు సార్లు👉సర్రే- మూడు సార్లు.చదవండి: IND vs ENG: సెమీస్‌లోనూ ఫెయిల్.. జట్టు నుంచి తీసేయండి! -
T20 WC 2026: చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్
టీ20 ప్రపంచకప్-2026 సెమీ ఫైనల్లో టీమిండియా ఓపెనర్ సంజూ శాంసన్ అదరగొట్టాడు. ఇంగ్లండ్ బౌలింగ్‌ను చితక్కొడుతూ ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించాడు. మూడో ఓవర్లో తనకు లభించిన లైఫ్‌ను సద్వినియోగం చేసుకున్న ఈ కేరళ వికెట్ కీపర్ బ్యాటర్ మెరుపు ఇన్నింగ్స్‌తో అలరించాడు.Ohhhhh, Harry Brook! 😳Sanju Samson makes the most of the lifeline and sends it into the stands! 🚀ICC Men’s #T20WorldCup | Semi-final 2 | #INDvENG | LIVE NOW 👉 https://t.co/L2OuYBUDbL pic.twitter.com/zOWfIEAdUv— Star Sports (@StarSportsIndia) March 5, 2026మరోసారి సెంచరీ మిస్‌అయితే, దురదృష్టవశాత్తూ మరోసారి సెంచరీ మిస్సయ్యాడు. ప్రపంచకప్ టోర్నీ ఆరంభానికి ముందు ఫామ్‌లేమితో సతమతమైన సంజూ ఓపెనర్‌గా జట్టులో స్థానం కోల్పోయిన సంగతి తెలిసిందే. టీ20 ఓపెనర్, వికెట్ కీపర్‌గా ఇషాన్ కిషన్ అతడి స్థానాన్ని భర్తీ చేసి అదరగొట్టాడు.అయితే, మరో ఓపెనర్ అభిషేక్ శర్మ కడుపు నొప్పి కారణంగా నమీబియాతో మ్యాచ్‌కు దూరం కాగా.. తొలిసారి సంజూకు వరల్డ్‌కప్ మ్యాచ్ ఆడే అవకాశం వచ్చింది. అయితే, ఈ మ్యాచ్‌లో వేగంగా ఆడిన సంజూ 8 బంతుల్లో 22 పరుగులు చేసి అవుటయ్యాడు.అనంతరం సూపర్-8 జింబాబ్వేతో మ్యాచ్ సందర్భంగా తిరిగి తుదిజట్టులోకి వచ్చిన సంజూ.. 15 బంతుల్లో 24 రన్స్ చేయగలిగాడు. అయినప్పటికీ మేనేజ్మెంట్ ఈసారి సంజూపై నమ్మకం ఉంచింది. ఈ క్రమంలో వెస్టిండీస్‌తో తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో సంజూ 97 పరుగులతో అజేయంగా నిలిచాడు. భారత్‌ను గెలిపించి సెమీ ఫైనల్‌కు చేర్చాడు. అయితే, మూడు పరుగులతో అక్కడ సెంచరీ మిస్సయ్యాడు.8 ఫోర్లు, 7 సిక్స్‌లు కొట్టితాజాగా ఇంగ్లండ్‌తో సెమీ ఫైనల్లోనూ సంజూ శతకం చేసే అవకాశాన్ని చేజార్చుకున్నాడు. భారత్ ఇన్నింగ్స్‌లో పద్నాలుగో ఓవర్లో విల్ జాక్స్ బౌలింగ్‌కు దిగాడు. అతడి బౌలింగ్‌లో తొందరపడి షాట్‌కు యత్నించిన సంజూ.. ఫిల్ సాల్ట్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. ఈ మ్యాచ్‌లో మొత్తంగా 42 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్స్‌లు కొట్టి 89 పరుగులు సాధించి.. సెంచరీకి పదకొండు పరుగుల దూరంలో నిలిచిపోయాడు.Just Hardik Pandya things at the Wankhede Stadium! 🔥🚨 RECORD ALERT: 19 sixes by #TeamIndia - the most in an innings in ICC Men's T20 World Cup history!ICC Men’s #T20WorldCup | Semi-final 2 | #INDvENG | LIVE NOW 👉 https://t.co/L2OuYBUDbL pic.twitter.com/JdGVdpz1B4— Star Sports (@StarSportsIndia) March 5, 2026ఇక ఓపెనర్ అభిషేక్ శర్మ (9)తో కలిసి తొలి వికెట్‌కు 20 పరుగులు జోడించిన సంజూ.. వన్‌డౌన్ బ్యాటర్ ఇషాన్ కిషన్ (39)తో కలిసి రెండో వికెట్‌కు 45 బంతుల్లో 97 పరుగులు, శివం దూబేతో కలిసి మూడో వికెట్‌కు 43 పరుగులు జోడించాడు. ఈ మ్యాచ్‌లో టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 253 పరుగులు సాధించింది.చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్‌టీ20 ప్రపంచకప్ ఎడిషన్‌లో టీమిండియా తరఫున అత్యధిక సిక్సర్లు బాదిన భారత బ్యాటర్‌గా సంజూ శాంసన్ చరిత్ర సృష్టించాడు. ఇంగ్లండ్‌తో సెమీ ఫైనల్ సందర్భంగా ఈ ఘనత సాధించాడు.టీ20 ప్రపంచకప్ ఎడిషన్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన భారత బ్యాటర్లు👉సంజూ శాంసన్- 16 సిక్స్‌లు- 2026లో👉రోహిత్ శర్మ- 15 సిక్స్‌లు- 2024లో👉శివం దూబే- 15 సిక్స్‌లు- 2026లో👉ఇషాన్ కిషన్- 14 సిక్స్‌లు- 2026లో👉హార్దిక్ పాండ్యా- 14 సిక్స్‌లు- 2026లో👉యువరాజ్ సింగ్- 12 సిక్స్‌లు- 2007లో.చదవండి: IND vs ENG: సెమీస్‌లోనూ ఫెయిల్.. జట్టు నుంచి తీసేయండి! -
IND vs ENG: సెమీస్‌లోనూ ఫెయిల్.. జట్టు నుంచి తీసేయండి!
టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మ మరోసారి దారుణంగా విఫలమయ్యాడు. ఇంగ్లండ్‌తో కీలక సెమీ ఫైనల్లోనూ పేలవ ఆట తీరుతో తేలిపోయాడు. వైఫల్యాల పరంపర కొనసాగిస్తూ స్వల్ప స్కోరుకే పెవిలియన్ చేరాడు. దీంతో టీమిండియా అభిమానులు సైతం అభిషేక్ శర్మపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.టీ20 ప్రపంచకప్-2026 ఆరంభం నుంచి అభిషేక్ శర్మ విఫలమవుతున్న విషయం తెలిసిందే. గ్రూప్ దశలో మూడు మ్యాచ్‌లు ఆడిన ఈ లెఫ్టాండ్ బ్యాటర్ డకౌట్లతో తీవ్రంగా నిరాశపరిచాడు. సూపర్-8 దశలో భాగంగా సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో పదిహేను పరుగులకే పెవిలియన్ చేరిన అభిషేక్.. పసికూన జింబాబ్వేతో మ్యాచ్‌లో మాత్రం అర్ధ శతకంతో రాణించాడు.పాత కథే పునరావృతంఅయితే, సూపర్-8లో కీలకమైన వెస్టిండీస్‌తో మ్యాచ్‌లో మరోసారి తేలిపోయాడు అభిషేక్ శర్మ. పట్టుమని పది పరుగులు చేసి నిష్క్రమించాడు. దీంతో సెమీ ఫైనల్లో అతడిని ఆడించే విషయంలో పునరాలోచన చేయాలని మాజీ క్రికెటర్లు సూచించారు. అయితే, యాజమాన్యం మాత్రం అభిషేక్‌పై నమ్మకం ఉంచగా.. అతడు పాత కథనే పునరావృతం చేశాడు.తొమ్మిది పరుగులే చేసిముంబై వేదికగా గురువారం ఇంగ్లండ్‌తో సెమీ ఫైనల్లో టాస్ ఓడిన భారత్ తొలుత బ్యాటింగ్‌కు దిగింది. ఓపెనర్ అభిషేక్ శర్మ ఏడు బంతుల్లో రెండు ఫోర్లు బాది కేవలం తొమ్మిది పరుగులే చేసి నిష్క్రమించాడు. రెండో ఓవర్లో విల్ జాక్స్ బంతితో రంగంలోకి దిగి ఆఖర్లో స్లోబాల్ వేశాడు. ఈ క్రమంలో భారీ షాట్‌కు యత్నించిన అభిషేక్.. బంతిని గాల్లోకి లేపగా డీప్ మిడ్ వికెట్ నుంచి పరిగెత్తుకు వచ్చిన ఫిల్ సాల్ట్ బంతిని ఒడిసిపట్టాడు. దీంతో అభిషేక్ శర్మ పెవిలియన్ చేరాడు. మరోసారి ఆఫ్ స్పిన్నర్ చేతికి చిక్కి నిరాశగా వెనుదిరిగాడు. ఇప్పటి వరకు అభిషేక్ శర్మ ఈ టోర్నీలో చేసిన పరుగులు 89. వరుస వైఫల్యాల నేపథ్యంలో టీమిండియా అభిమానులు అభిషేక్‌పై భగ్గుమంటున్నారు. ‘‘ నువ్విక మారవా?.. అతడిని జట్టు నుంచి తీసేయండి’’ అని యాజమాన్యానికి విజ్ఞప్తి చేస్తున్నారు.చదవండి: T20 WC 2026: జింబాబ్వే జట్టుకు భారీ ఊరట -
T20 WC 2nd Semis: ఇంగ్లండ్‌పై భారత్ గెలుపు
ఐసీసీ టీ20 ప్రపంచకప్-2026 టోర్నమెంట్లో కీలక పోరు... రెండో సెమీ ఫైనల్లో భారత్- ఇంగ్లండ్ అమీతుమీ... ముంబైలోని వాంఖడే వేదికగా టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బౌలింగ్... ఫలితంగా బ్యాటింగ్‌కు దిగిన భారత్.భారత్ భారీ స్కోరునిర్ణీత 20 ఓవర్లలో టీమిండియా ఏడు వికెట్ల నష్టానికి 253 పరుగుల మేర భారీ స్కోరు సాధించింది. ఓపెనర్ సంజూ శాంసన్ భారీ హాఫ్ సెంచరీ (42 బంతుల్లో 89) బాదగా.. ఇషాన్ కిషన్ (18 బంతుల్లో 39), శివం దూబే (25 బంతుల్లో 43), తిలక్ వర్మ (7 బంతుల్లో 21),హార్దిక్ పాండ్యా (12 బంతుల్లో 27) మెరుపు ఇన్నింగ్స్‌తో అలరించారు.UPDATES: ఇంగ్లండ్‌పై భారత్ గెలుపులక్ష్య ఛేదనలో ఇంగ్లండ్ పై టీమిండియా 7 పరుగుల తేడాతో గెలుపొందింది. సెమీ ఫైనల్లో ఇంగ్లండ్‌ను ఓడించి.. టైటిల్ పోరుకు అర్హత సాధించింది. గత ఎడిషన్‌లో విజేతగా నిలిచిన భారత్.. ఈసారి కూడా ఫైనల్‌కు చేరి సత్తా చాటింది.ఏడో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్దూబే బౌలింగ్‌లో బెతల్ రన్ ఔట్ (105) అయ్యాడు.పదిహేడు ఓవర్లలో ఇంగ్లండ్ స్కోరు: 209-515 ఓవర్లలో ఇంగ్లండ్ స్కోరు: 185-5కర్రాన్ 5, బెతెల్ 81 పరుగులతో ఉన్నారు.13.6: ఐదో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్అర్ష్దీప్ బౌలింగ్‌లో జాక్స్ (35) ఇచ్చిన క్యాచ్‌ను అద్భుతంగా పట్టిన శివం దూబే.పదమూడు ఓవర్లలో ఇంగ్లండ్ స్కోరు: 160-4విజయానికి 42 బంతుల్లో 94 పరుగులు కావాలి. బెతెల్ 65, విల్ జాక్స్ 35 పరుగులతో ఉన్నారు.పది ఓవర్లలో ఇంగ్లండ్ స్కోరు: 119-4నాలుగో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్7.3: అక్షర్ పటేల్ బౌలింగ్‌లో టామ్ బాంటన్ (5 బంతుల్లో 17) బౌల్డ్. క్రీజులోకి విల్ జాక్స్. స్కోరు: 95-4(7.3).బెతెల్ 39 పరుగులతో ఉన్నాడు. విజయానికి 75 బంతుల్లో 159 పరుగులు కావాలి.మూడో వికెట్ డౌన్5.5: వరుణ్ చక్రవర్తి అద్భుత రీతిలో బట్లర్ (25)ను బౌల్డ్ చేశాడు. స్కోరు: 64-3(5.5). బెతెల్ 26 పరుగులతో ఉన్నాడు.రెండో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్4.1: బుమ్రా బౌలింగ్‌లో హ్యారీ బ్రూక్ (7) ఇచ్చిన క్యాచ్‌ను అక్షర్‌పటేల్ అద్భుత రీతిలో అందుకున్నాడు. ఫలింగా ఇంగ్లండ్ రెండో వికెట్ కోల్పోయింది. జేకబ్ బెతెల్ క్రీజులోకి రాగా.. బట్లర్ 25 పరుగులతో ఉన్నాడు. స్కోరు: 38-2(4.2).తొలి వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్1.1: హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో ఫిల్ సాల్ట్ (5) అక్షర్ పటేల్‌కు క్యాచ్ ఇచ్చి అవుట్. క్రీజులోకి బ్రూక్. బట్లర్ ఎనిమిది పరుగులతో ఉన్నాడు. స్కోరు: 14-1(1.2)భారత్ స్కోరు: 253-7ఏడో వికెట్ డౌన్19.5: ఆఖరి ఓవర్‌ఐదో బంతికి పాండ్యా రనౌట్ (12 బంతుల్లో 27). వరుణ్ చక్రవర్తి క్రీజులోకి రాగా.. అక్షర్ పటేల్ 2 పరుగులతో అజేయంగా నిలిచాడు.ఆరో వికెట్ కోల్పోయిన భారత్18.5: తిలక్ వర్మ రూపంలో ఆరో వికెట్ కోల్పోయిన భారత్. ఆర్చర్ బౌలింగ్‌లో తిలక్ బౌల్డ్ (7 బంతుల్లో 21). అక్షర్ క్రీజులోకి రాగా.. పాండ్యా 14 రన్స్‌తో ఉన్నాడు. స్కోరు: 237-6(19)ఐదో వికెట్ కోల్పోయిన భారత్17.3: సామ్ కర్రాన్ బౌలింగ్‌లో సింగిల్‌కు యత్నించి.. హార్దిక్ పాండ్యాతో సమన్వయ లోపం కారణంగా దూబే (25 బంతుల్లో 43) రనౌట్. తిలక్ వర్మ క్రీజులోకి వచ్చాడు.నాలుగో వికెట్ డౌన్15.4: ఆదిల్ రషీద్ బౌలింగ్‌లో సూర్యకుమార్ యాదవ్ స్టంపౌట్. స్కోరు: 190-4 (16). హార్దిక్ పాండ్యా క్రీజులోకి వచ్చాడు. దూబే35 పరుగులతో ఉన్నాడు.15 ఓవర్లలో టీమిండియా స్కోరు: 177-3సూర్య 5, దూబే 28 పరుగులతో ఉన్నారు.సంజూ శాంసన్ అవుట్13.1: సంజూ శాంసన్ మరోసారి సెంచరీ మిస్సయ్యాడు. వెస్టిండీస్‌తో మ్యాచ్‌లో 97 పరుగులతో అజేయంగా నిలిచిన ఈ ఓపెనింగ్ బ్యాటర్.. ఇంగ్లండ్‌తో సెమీస్‌లో 89 పరుగుల వద్ద పెవిలియన్ చేరాడు. విల్ జాక్స్‌బౌలింగ్‌లో తొందరపడి షాట్‌కు యత్నించి.. ఫిల్ సాల్ట్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. మొత్తంగా 42 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్స్‌లు కొట్టి 89 పరుగులు రాబట్టాడు. సూర్యకుమార్ యాదవ్ క్రీజులోకి వచ్చాడు. దూబే 18 పరుగులతో ఉన్నాడు. స్కోరు: 160-3(13.1)రెండో వికెట్ కోల్పోయిన టీమిండియా9.3: మెరుపు ఇన్నింగ్స్‌తో అలరించిన ఇషాన్ కిషన్.. ఆదిల్ రషీద్ బౌలింగ్‌లో విల్ జాక్స్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. 18 బంతుల్లో 39 పరుగులు చేసి నిష్క్రమించాడు. శివం దూబే క్రీజులో వచ్చాడు. సంజూ 66 పరుగులతో ఉన్నాడు. స్కోరు: 117-2(9.3). 8.3: వంద పరుగులు పూర్తి చేసుకున్న టీమిండియాAnother must-win game, another Sanju Samson masterclass! 🔥His maiden T20I fifty against England and what an occasion to bring it up! 👏ICC Men’s #T20WorldCup | Semi-final 2 | #INDvENG | LIVE NOW 👉 https://t.co/L2OuYBUDbL pic.twitter.com/1csgOPterB— Star Sports (@StarSportsIndia) March 5, 2026సంజూ హాఫ్ సెంచరీవెస్టిండీస్తో మ్యాచ్‌లో భారీ హాఫ్ సెంచరీ బాదిన సంజూ.. తాజా మ్యాచ్‌లోనూ ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. 26 బంతుల్లోనే యాభై పరుగుల మార్కు అందుకున్నాడు. డాసన్ బౌలింగ్‌లో సిక్స్ బాది మరీ ఈ మైలురాయి చేరుకున్నాడు.పవర్ ప్లేలో భారత్ స్కోరు: 67-1(6)సంజూ 20 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లు బాది 41 పరుగులతో ఉండగా.. ఇషాన్ కిషన్ 9 బంతుల్లో 16 పరుగులతో క్రీజులో ఉన్నాడు.తొలి వికెట్ డౌన్1.6: విల్ జాక్స్ బౌలింగ్‌లో ఫిల్ సాల్ట్‌కు క్యాచ్ ఇచ్చి అభిషేక్ శర్మ (7 బంతుల్లో 9) అవుట్. సంజూ 11 పరుగులతో ఉండగా.. ఇషాన్ కిషన్ క్రీజులోకి వచ్చాడు. స్కోరు: 20-1(2)సైలెంట్ చేసేస్తాంటాస్ సందర్భంగా ఇంగ్లండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ మాట్లాడుతూ.. ‘‘పిచ్ బాగుంది. వికెట్ పాతబడే కొద్దీ బ్యాటింగ్‌కు అనుకూలిస్తుందని అనుకుంటున్నాం. అందుకే మేము ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాము.ఒక మార్పుతో బరిలోకిటీమిండియాకు ఈ పిచ్‌పై ఆడిన అనుభవం మాకంటే ఎక్కువే. అయితే, టీ20 క్రికెట్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించలేము. టీమిండియా మద్దతుదారులు నిశ్శబ్దంగా ఉండేలా చేస్తాం. రెహాన్ అహ్మద్ స్థానంలో ఓవర్టన్ జట్టులోకి వచ్చాడు’’ అని తెలిపాడు.అదే జట్టు..ఇక టీమిండియా సారథి సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ.. ‘‘సెమీ ఫైనల్. బిగ్ గేమ్. మేము ముందుగా బ్యాటింగ్ చేయాలనే అనుకున్నాం. ఇక్కడ అంతగా డ్యూ ఉంటుందని అనుకోవడం లేదు. పిచ్ బాగుంది. క్యూరేటర్లు, గ్రౌండ్స్‌మెన్‌కు ధన్యవాదాలు. గత మ్యాచ్‌లో ఆడిన జట్టునే కొనసాగిస్తున్నాం’’ అని పేర్కొన్నాడు.Harry Brook calls it right, and England will bowl first in the semi-final! ✌️What do you make of the decision? 👀ICC Men’s #T20WorldCup | Semi-final 2 | #INDvENG | LIVE NOW 👉 https://t.co/L2OuYBUDbL pic.twitter.com/Zabmv2MsVT— Star Sports (@StarSportsIndia) March 5, 2026భారత్ వర్సెస్ ఇంగ్లండ్ తుదిజట్లుభారత్‌అభిషేక్ శర్మ, సంజు శాంసన్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా.ఇంగ్లండ్ఫిలిప్ సాల్ట్, జోస్ బట్లర్(వికెట్ కీపర్), హ్యారీ బ్రూక్(కెప్టెన్), జేకబ్ బెతెల్, టామ్ బాంటన్, సామ్ కర్రాన్, విల్ జాక్స్, జామీ ఓవర్టన్, లియామ్ డాసన్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్.చదవండి: T20 WC 2026: జింబాబ్వే జట్టుకు భారీ ఊరట -
ఫిన్ అలెన్ వరల్డ్ రికార్డ్.. ప్రపంచకప్ చరిత్రలోనే తొలి బ్యాట్స్‌మెన్..!
న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్ ఫిన్ అలెన్ సెమీస్‌లో విధ్వంసం సృష్టించాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 వరల్డ్ కప్ సెమీస్ మ్యాచ్‌లో కేవలం 33 బంతుల్లో సెంచరీ బాదేశాడు. ఫిన్ అలెన్ దూకుడుతో సౌతాఫ్రికా నిర్దేశించిన 170 పరుగుల లక్ష్యాన్ని 12.5 ఓవర్లలోనే చేధించారు. టీ20 వరల్డ్ కప్ చరిత్రలోనే ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన బ్యాట్స్‌మెన్‌గా ఫిన్ అలెన్ ఘనత సాధించారు. ఈ విజయంతో న్యూజిలాండ్ టీమ్ వరల్డ్ కప్ ఫైనల్లో అడుగుపెట్టింది.కోల్‌కతా వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో ఫిన్ అలెన్ భీభత్సం సృష్టించాడు. ఏకంగా పది ఫోర్లు, 8 సిక్సర్లతో ఊచకోత కోశాడు. ఫిన్ అలెన్ దూకుడుతో న్యూజిలాండ్ 9 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది. -
T20 WC: అలెన్ విధ్వంసకర శతకం.. వరల్డ్‌కప్ ఫైనల్లో న్యూజిలాండ్
టీ20 ప్రపంచకప్-2026 టోర్నమెంట్లో న్యూజిలాండ్ ఫైనల్‌కు దూసుకువెళ్లింది. కోల్‌కతాలో జరిగిన తొలి సెమీస్ మ్యాచ్‌లో సౌతాఫ్రికాను తొమ్మిది వికెట్ల తేడాతో ఓడించి టైటిల్ పోరుకు అర్హత సాధించింది. ఈడెన్ గార్డెన్స్‌లో బుధవారం నాటి ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన కివీస్.. సౌతాఫ్రికాను తొలుత బ్యాటింగ్‌కు ఆహ్వానించింది.కెప్టెన్ నమ్మకాన్ని నిలబెడుతూ న్యూజిలాండ్ బౌలర్లు ఆది నుంచే నిప్పులు చెరిగారు. క్వింటన్ డికాక్ (10)ను అవుట్ చేసి కివీస్ వికెట్ల వేట మొదలుపెట్టిన కోల్ మెకాంచీ.. వన్‌డౌన్‌లో వచ్చిన ర్యాన్ రికెల్టన్ (0)ను డకౌట్‌గా వెనక్కి పంపాడు. ఇక మరో ఓపెనర్, కెప్టెన్ ఐడెన్ మార్క్రమ్ (18)ను రచిన్ రవీంద్ర పెవిలియన్‌కు చేర్చాడు.యాన్సెన్ హాఫ్ సెంచరీఅదే విధంగా డారిల్ మిచెల్ (6)ను కూడా అవుట్ చేసిన రచిన్ కివీస్ శిబిరంలో జోష్ నింపాడు. ఇక డెవాల్డ్ బ్రెవిస్ (34)ను జేమ్స్ నీషమ్ అవుట్ చేయగా.. ట్రిస్టన్ స్టబ్స్ (29)ను లాకీ ఫెర్గూసన్ పెవిలియన్‌కు పంపించాడు. అయితే, మార్కో యాన్సెన్ హాఫ్ సెంచరీ (30 బంతుల్లో 55) నాటౌట్‌గా నిలవడంతో సౌతాఫ్రికా.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది.ఇక లక్ష్య ఛేదనకు దిగిన న్యూజిలాండ్ 12.5 ఓవర్లలోనే కేవలం ఒక వికెట్ నష్టపోయి 173 పరుగులు సాధించింది. ఓపెనర్లలో టిమ్ సీఫర్ట్ 33 బంతుల్లో 58 పరుగులు సాధించగా.. ఫిన్ అలెన్ విధ్వంసకర శతకం బాదాడు. Everything is flying to the boundary tonight! 🫣ICC Men’s #T20WorldCup | Semi-final 1 #SAvNZ | LIVE NOW 👉 https://t.co/LMBOn54jDE pic.twitter.com/1kQbb9uF6n— Star Sports (@StarSportsIndia) March 4, 2026ఫాస్టెస్ట్ సెంచరీకేవలం 33 బంతుల్లోనే 10 ఫోర్లు, 8 సిక్సర్లు బాది 100 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఫోర్ బాది కివీస్ గెలుపును ఖరారు చేశాడు. రచిన్ రవీంద్ర 11 బంతుల్లో 13 పరుగులతో అజేయంగా నిలిచాడు. కాగా ఈ మ్యాచ్ సందర్భంగా టీ20 ప్రపంచకప్ చరిత్రలో ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేసిన బ్యాటర్‌గా అలెన్ చరిత్ర సృష్టించాడు. -
పర్ఫెక్ట్ గేమ్ ఆడలేదు: టీమిండియాకు హ్యారీ బ్రూక్ వార్నింగ్
టీమిండియాతో సెమీ ఫైనల్ నేపథ్యంలో ఇంగ్లండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ కీలక వ్యాఖ్యలు చేశాడు. టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో తాము ఇంత వరకు పరిపూర్ణమైన మ్యాచ్ ఆడలేదని.. అయినప్పటికీ సమిష్టిగా రాణించి విజయం సాధించామని పేర్కొన్నాడు. కాబట్టి టీమిండియాతో మ్యాచ్ గురించి తాము ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నాడు.టీ20 ప్రపంచకప్-2026 లీగ్ దశలో నేపాల్ వంటి పసికూన చేతిలో తృటిలో ఓటమి నుంచి తప్పించుకున్న ఇంగ్లండ్.. ఆ తర్వాత సూపర్-8లో మాత్రం అదరగొట్టింది. శ్రీలంక, పాకిస్తాన్, న్యూజిలాండ్ మీద విజయాలు సాధించి సెమీ ఫైనల్లో అడుగుపెట్టింది. అయితే, ఈ మూడు మ్యాచ్‌లలో కూడా ఆఖరి వరకు పోరాడి ఇంగ్లండ్ గెలిచింది.కల నిజమైన తరుణం ఇదిఈ నేపథ్యంలో హ్యారీ బ్రూక్ (Harry Brook) మాట్లాడుతూ.. ‘‘ఆతిథ్య జట్టు (టీమిండియా)తో సెమీ ఫైనల్ ఆడటం విశేషం. మా జట్టులోని చాలా మంది కల నిజమైన తరుణం ఇది. ఈ మ్యాచ్ కోసం మేము ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం.పర్ఫెక్ట్ గేమ్ ఆడలేదు.. అయినాపూర్తి ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతున్నాం. ఇప్పటి వరకు ఆడిన మ్యాచ్‌లలో పరిపూర్ణంగా ఆడలేదు. ఒక్కో మ్యాచ్‌లో ఒక్కొక్కరు కీలకంగా వ్యవహరించారు. టీమిండియాతో మ్యాచ్‌లో సైతం పూర్తి స్వేచ్ఛగా.. ధైర్యంగా ఆడతాం.ఈ టోర్నీలో కొన్ని ఉత్కంఠ మ్యాచ్‌లలో మేము గెలిచాము. మా బ్యాటర్లు స్పిన్‌ను ఎదర్కోవడంలో ఇబ్బంది పడతారని అంతా అనుకుంటున్నారు. కానీ మేము చక్కగా స్పిన్ ఆడగలము.వరుణ్ చక్రవర్తి బౌలింగ్లోప్రపంచంలోని అత్యుత్తమ బౌలర్లలో ఒకడైన భారత స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి (Varun Chakravarthy) బౌలింగ్‌లో ఆడేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం. అతడి బౌలింగ్‌లో అత్యుత్తమంగా ఆడి వీలైనన్ని ఎక్కువ పరుగులు రాబట్టేందుకు ప్రయత్నిస్తా’’ అని హ్యారీ బ్రూక్ చెప్పుకొచ్చాడు. ఏదేమైనా టీమిండియాకు కఠిన సవాలు తప్పదని సంకేతాలు ఇచ్చాడు. తాము ఇప్పటివరకు పర్ఫెక్ట్గా ఆడకపోయినా ఎవరో ఒకరు జట్టును ఆదుకుంటారని.. గతంలో మాదిరే ఈసారి అదే పునరావృతం కావొచ్చని బ్రూక్ వార్నింగ్ ఇచ్చాడు. కాగా ముంబై వేదికగా భారత్- ఇంగ్లండ్ మధ్య గురువారం సెమీ ఫైనల్ నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది.చదవండి: T20 WC 2026: బాబర్ ఎందుకు?.. పాక్ బోర్డులో తొలి రాజీనామా -
T20 WC 2026: చరిత్ర సృష్టించిన సఫారీ క్రికెటర్లు
న్యూజిలాండ్‌తో సెమీ ఫైనల్లో సౌతాఫ్రికా ఆల్‌రౌండర్ మార్కో యాన్సెన్ అద్బుత బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. కివీస్ బౌలర్ల ధాటికి టాపార్డర్ కుదేలైన వేళ తాను ఉన్నానంటూ ముందుకు వచ్చాడు.చరిత్ర సృష్టించిన సఫారీ క్రికెటర్లుకేవలం 77 పరుగులే చేసి సగం వికెట్లు కోల్పోయిన తరుణంలో యాన్సెన్ (Marco Jansen) .. ట్రిస్టన్ స్టబ్స్ (Trisran Stubss)తో కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దాడు. వీరిద్దరు కలిసి ఆరో వికెట్‌కు 47 బంతుల్లో 73 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. తద్వారా ఈ జోడీ సరికొత్త చరిత్ర సృష్టించింది.సౌతాఫ్రికా తరఫున అంతర్జాతీయ టీ20 ఫార్మాట్లో ఆరు లేదంటే అంతకంటే ఎక్కువ వికెట్లకు అత్యధిక భాగస్వామ్యం నెలకొల్పిన జట్టుగా నిలిచింది. అంతేకాదు.. టీ20 ప్రపంచకప్ ప్లే ఆఫ్స్ మ్యాచ్‌లలో ఆరు లేదంటే అంతకంటే ఎక్కువ వికెట్లకు యాభైకి పైగా పరుగులు జోడించిన రెండో జంటగా యాన్సెన్- స్టబ్స్ నిలిచారు.Marco 𝗖𝗟𝗨𝗧𝗖𝗛 Jansen 🔥Entered at 77/5 & played an innings of a lifetime to guide South Africa a fighting total! 🙌ICC Men’s #T20WorldCup | Semi-final 1 #SAvNZ | LIVE NOW 👉 https://t.co/LMBOn54jDE pic.twitter.com/CCD0QTflth— Star Sports (@StarSportsIndia) March 4, 2026టీ20 ప్రపంచకప్ ప్లే ఆఫ్స్ మ్యాచ్‌లలో ఆరు లేదంటే అంతకంటే ఎక్కువ వికెట్లకు 50 ప్లస్ పార్ట్నర్షిప్ నమోదు చేసిన జోడీలు👉మార్కస్ స్టొయినిస్- మాథ్యూవేడ్ (ఆస్ట్రేలియా) పాకిస్తాన్ మీద 2021 సెమీ ఫైనల్లో 81*👉మార్కో యాన్సెన్- ట్రిస్టన్ స్టబ్స్ (సౌతాఫ్రికా) న్యూజిలాండ్ మీద 2026 సెమీ ఫైనల్లో 73👉ఏంజెలో మాథ్యూస్- కుమార్ సంగక్కర (శ్రీలంక) పాకిస్తాన్ మీద 2009 ఫైనల్లో 68*👉జార్జ్ బెయిలీ- ప్యాట్ కమిన్స్ (ఆస్ట్రేలియా) వెస్టిండీస్ మీద 2012 సెమీ ఫైనల్లో 68👉కార్లోస్ బ్రాత్‌వైట్- మార్లన్ సామ్యూల్స్ (వెసిండీస్) ఇంగ్లండ్ మీద 2016 ఫైనల్లో 54*👉మైకేల్ హస్సీ- మిచెల్ జాన్సన్ (ఆస్ట్రేలియా) పాకిస్తాన్ మీద 2010 సెమీ ఫైనల్లో 53*169 పరుగులుఇదిలా ఉంటే.. టీ20 ప్రపంచకప్-2026లో భాగంగా న్యూజిలాండ్‌తో సెమీ ఫైనల్లో టాస్ ఓడిన సౌతాఫ్రికా తొలుత బ్యాటింగ్ చేసింది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 169 పరుగులు సాధించింది. మార్కో యాన్సెన్ 55 పరుగులతో అజేయంగా నిలవగా.. స్టబ్స్ 29 పరుగులు చేశాడు. డెవాల్డ్ బ్రెవిస్ 34 పరుగులతో రాణించాడు. చదవండి: T20 WC 2026: బాబర్ ఎందుకు?.. పాక్ బోర్డులో తొలి రాజీనామా -
T20 WC: వార్ వన్‌సైడ్ అనుకుంటే.. ఆఖర్లో దంచికొట్టేశాడే!
న్యూజిలాండ్‌తో సెమీ ఫైనల్లో సౌతాఫ్రికా మెరుగైన స్కోరు సాధించింది. ఆదిలోనే వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన సఫారీ జట్టును ఆల్‌రౌండర్ మార్కో యాన్సెన్ మెరుపు అర్ధ శతకంతో ఆదుకున్నాడు. ఫలితంగా ప్రొటిస్ జట్టు గౌరవప్రదంగా ఇన్నింగ్స్ ముగించగలిగింది.టీ20 ప్రపంచకప్-2026 తొలి సెమీస్ మ్యాచ్‌లో భాగంగా కోల్‌కతాలో టాస్ గెలిచిన న్యూజిలాండ్ సౌతాఫ్రికాను తొలుత బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఆది నుంచే కివీస్ బౌలర్లు నిప్పులు చెరగడంతో వరుస విరామాల్లో ప్రొటిస్ జట్టు వికెట్లు కోల్పోయింది. టాపార్డర్ కుదేలుఓపెనర్లు ఐడెన్ మార్క్రమ్ (18), క్వింటన్ డికాక్ (10), ర్యాన్ రికెల్టన్ (0) పూర్తిగా విఫలమయ్యారు. డెవాల్డ్ బ్రెవిస్ (34) కాసేపు నిలబడగా... డేవిడ్ మిల్లర్ (6) పూర్తిగా నిరాశపరిచాడు. ఫలితంగా డెబ్బై ఏడు పరుగులకే సౌతాఫ్రికా ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో కూరుకుపోయింది. ఇలాంటి తరుణంలో ట్రిస్టన్ స్టబ్స్ (29)తో కలిసి మార్కో యాన్సెన్ భాగస్వామ్యం నిర్మించాడు. వీరిద్దరు కలిసి ఆరో వికెట్‌కు 47 బంతుల్లో 73 పరుగులు జోడించారు. 27 బంతుల్లో అర్ధ శతకంఇక ఈ మ్యాచ్‌లో యాన్సెన్ 27 బంతుల్లో అర్ధ శతకం సాధించాడు. ఈ టోర్నీలో అతడికి ఇదే తొలి హాఫ్ సెంచరీ. లాకీ ఫెర్గూసన్ బౌలింగ్‌లో సిక్స్ బాది యాభై పరుగుల మార్కు అందుకున్నాడు యాన్సెన్. మొత్తంగా 30 బంతులు ఎదుర్కొని రెండు ఫోర్లు, ఐదు సిక్సర్ల సాయంతో 55 పరుగులతో అజేయంగా నిలిచాడు.Marco 𝗖𝗟𝗨𝗧𝗖𝗛 Jansen 🔥Entered at 77/5 & played an innings of a lifetime to guide South Africa a fighting total! 🙌ICC Men’s #T20WorldCup | Semi-final 1 #SAvNZ | LIVE NOW 👉 https://t.co/LMBOn54jDE pic.twitter.com/CCD0QTflth— Star Sports (@StarSportsIndia) March 4, 2026మిగిలిన వారిలో కార్బిన్ బాష్ రెండు పరుగులు చేయగా.. కగిసో రబడ డకౌట్ అయ్యాడు. కేశవ్ మహరాజ్ ఒక పరుగుతో నాటౌట్‌గా నిలిచాడు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 169 పరుగులు సాధించింది. హెన్రీ పొదుపుగా బౌలింగ్ చేయడంతోకివీస్ బౌలర్లలో మ్యాట్ హెన్రీ, కోల్ మెకాంచీ, రచిన్ రవీంద్ర తలా రెండు వికెట్లు తీయగా.. లాకీ ఫెర్గూసన్, జేమ్స్ నీషమ్ చెరో వికెట్ పడగొట్టారు. ఆఖరి ఓవర్లో హెన్రీ కేవలం ఆరు పరుగులే ఇచ్చి ప్రొటిస్ జట్టును నామమాత్రపు స్కోరుకు పరిమితం చేయడంలో కీలక పాత్ర పోషించాడు.చదవండి: T20 WC 2026: బాబర్ ఎందుకు?.. పాక్ బోర్డులో తొలి రాజీనామా -
T20 WC 1st Semi Final: టాస్ గెలిచిన కివీస్.. తుదిజట్లు ఇవే
పొట్టి క్రికెట్ మహా సంగ్రామంలో తొలి సెమీ ఫైనల్ పోరుకు తెరలేచింది. టీ20 ప్రపంచకప్-2026లో భాగంగా సౌతాఫ్రికా- న్యూజిలాండ్ మధ్య జరిగే ఈ మెగా మ్యాచ్‌కు కోల్‌కతా వేదిక. ఈడెన్ గార్డెన్స్‌లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ తొలుత బౌలింగ్ ఎంచుకుని.. ప్రొటిస్ జట్టును బ్యాటింగ్‌కు ఆహ్వానించింది.టాస్ సందర్భంగా కివీస్ కెప్టెన్ మిచెల్ సాంట్నర్ మాట్లాడుతూ.. ‘‘పిచ్ బాగుంది. వికెట్ పాతబడే కొద్ది బ్యాటింగ్‌కు ఇంకాస్త సహకరిస్తుందని అనిపిస్తోంది. అందుకే తొలుత బౌలింగ్ ఎంచుకున్నాం. ఆది నుంచే ప్రత్యర్థిని ఒత్తిడిలోకి నెట్టాల్సి ఉంటుంది. మ్యాట్ హెన్రీ తిరిగిఇ వచ్చాడు. సోధి స్థానంలో నీషమ్ కూడా తుదిజట్టులోకి వచ్చాడు’’ అని తెలిపాడు.It’s semi-final time! Mitchell Santner has won the toss and opted to bowl first! 🪙Who will be the first team to make it to the final? 🤔ICC Men’s #T20WorldCup | Semi-final 1 #SAvNZ | LIVE NOW 👉 https://t.co/LMBOn54jDE pic.twitter.com/N8m1kkxoX8— Star Sports (@StarSportsIndia) March 4, 2026మా తుదిజట్టులో మూడు మార్పులుఇక సౌతాఫ్రికా సారథి ఐడెన్ మార్క్రమ్ మాట్లాడుతూ.. ‘‘ఈ టోర్నీలో ఇప్పటి వరకు మా జట్టులోని ప్రతి సభ్యుడు తమ వంతు సహకారం అందించడం సంతోషకరం. ఈ మ్యాచ్‌లోనూ గొప్పగా రాణించి మంచి స్కోరు నమోదు చేస్తామని ఆశిస్తున్నా. గత రాత్రి కూడా మేము ప్రాక్టీస్ చేశాము.మా తుదిజట్టులో మూడు మార్పులు చేశాము. రబడ, యాన్సెన్, కేశవ్ మహరాజ్ తిరిగి జట్టులోకి వచ్చారు’’ అని పేర్కొన్నాడు. కాగా సూపర్-8 దశలో అజేయంగా నిలిచిన సౌతాఫ్రికా తొలి టైటిల్ వేట దిశగా సెమీస్ రూపంలో మరో ముందడుగు వేసింది. గత ఎడిషన్‌లో రన్నరప్‌తో సరిపెట్టుకున్న సఫారీలు ఈసారి పట్టు వదలకుండా పోరాడేందుకు సిద్ధమయ్యారునిలకడైన ఆట.. ప్రొటిస్దే పైచేయిమరోవైపు.. సౌతాఫ్రికా మాదిరే ఇంత వరకు ఒక్కసారి కూడా టైటిల్ గెలవని న్యూజిలాండ్ సైతం ఈసారి ట్రోఫీ గెలవాలనే పట్టుదలతో ఉంది. అయితే, ఈ ఎడిషన్‌లో ప్రదర్శనల పరంగా కివీస్ కంటే సఫారీలే ఓ అడుగు ముందున్నారు. ఇక సూపర్-8 దశలో పాకిస్తాన్‌తో ఆడాల్సిన మ్యాచ్ రద్దు కాగా.. శ్రీలంకపై గెలిచిన న్యూజిలాండ్ సెమీస్ రేసులో ముందుకు దూసుకువచ్చింది. ఆఖరి మ్యాచ్‌లో ఇంగ్లండ్ చేతిలో ఓడినా.. పాక్ శ్రీలంకపై నామమాత్రపు విజయంతో సరిపెట్టుకోవడంతో సెమీ ఫైనల్లో అడుగుపెట్టగలిగింది.తుదిజట్లు ఇవేన్యూజిలాండ్టిమ్ సీఫెర్ట్(వికెట్ కీపర్), ఫిన్ అలెన్, రచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్మన్, డారిల్ మిచెల్, జేమ్స్ నీషమ్, మిచెల్ సాంట్నర్(కెప్టెన్), కోల్ మెక్కాంచీ, మ్యాట్ హెన్రీ, లాకీ ఫెర్గూసన్సౌతాఫ్రికాఐడెన్ మార్క్రమ్ (కెప్టెన్), క్వింటన్ డి కాక్(వికెట్ కీపర్), ర్యాన్ రికెల్టన్, డెవాల్డ్ బ్రెవిస్, డేవిడ్ మిల్లర్, ట్రిస్టన్ స్టబ్స్, మార్కో యాన్సెన్, కార్బిన్ బాష్, కగిసో రబాడ, కేశవ్ మహారాజ్, లుంగి ఎన్గిడి.చదవండి: T20 WC 2026: బాబర్ ఎందుకు?.. పాక్ బోర్డులో తొలి రాజీనామా -
టీమిండియాపై చంద్ర గ్రహణం ఎఫెక్ట్
టీమిండియా టీ20 ప్రపంచకప్-2026 టోర్నీతో బిజీగా ఉంది. గ్రూప్ దశలో అమెరికా, నమీబియా, పాకిస్తాన్, నెదర్లాండ్స్ జట్లను ఓడించి అజేయంగా సూపర్-8కు చేరుకుంది.ఇంగ్లండ్‌తో సెమీ ఫైనల్అయితే, సూపర్-8లో తొలి మ్యాచ్‌లోనే సౌతాఫ్రికా చేతిలో చిత్తుగా ఓడిన సూర్యకుమార్ సేన.. ఆ తర్వాత జింబాబ్వే, వెస్టిండీస్‌లను ఓడించి సెమీస్‌కు అర్హత సాధించింది. ఈ క్రమంలో రెండో సెమీ ఫైనల్లో భాగంగా ఇంగ్లండ్ (IND vs ENG)తో గురువారం తలపడనుంది టీమిండియా. ఇందుకు ముంబైలోని వాంఖడే మైదానం వేదిక.ఇందుకోసం ఇప్పటికే ముంబై చేరుకున్న భారత జట్టు ప్రాక్టీస్ మొదలుపెట్టేసింది. అయితే, మంగళవారం నాటి చంద్ర గ్రహణం ప్రభావం టీమిండియాపై కూడా పడింది. గ్రహణం కారణంగా సూర్యకుమార్ సేన తమ ప్రాక్టీస్ సెషన్‌ను గంటపాటు వాయిదా వేసుకుంది.టీమిండియాపై చంద్ర గ్రహణం ఎఫెక్ట్కాగా గ్రహణం మధ్యాహ్నం 3.20 నుంచి సాయంత్రం 6.47 నిమిషాల వరకు కొనసాగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సాయంత్రం 6- 9 గంటల వరకు టీమిండియా ప్రాక్టీస్ చేయాల్సి ఉండగా.. గంట ఆలస్యంగా అంటే ఏడు గంటలకు నెట్ సెషన్‌ను ఆరంభించింది. గ్రహణం సమయంలో ఏ పని చేయకూడదని.. అలా చేస్తే దురదృష్టం వెంటాడుతుందేమోనన్న భయంతో భారత జట్టు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లుగా వార్తలు వచ్చాయి.అవును.. మా వాళ్లు చెప్పారుఈ విషయం గురించి టీమిండియా కోచ్ మోర్నీ మోర్కెల్ స్పందించాడు. ‘‘అవును.. చంద్ర గ్రహణం గురించి నాకు మా వాళ్లు చెప్పారు. అందుకే సెషన్‌ను వాయిదా వేసుకున్నాం. అయితే, గ్రహణం ఒక్కటే మా రాతను మారుస్తుందనే భయం లేదు. గెలుపు కోసం అత్యుత్తమంగా ప్రయత్నించడమే ముఖ్యమైనది’’ అని మోర్కెల్ పేర్కొన్నాడు.కాగా ఇంగ్లండ్‌తో సెమీ ఫైనల్‌కు ఆఖరిగా బుధవారం కూడా టీమిండియా ప్రాక్టీస్ చేయాల్సి ఉంది. అయితే ఇది ఆప్షనల్ కావడంతో వరుణ్ చక్రవర్తి, రింకూ సింగ్, వాషింగ్టన్ సుందర్, తిలక్ వర్మ మాత్రమే నెట్స్‌లో శ్రమించారు. మిగతా వారు విశ్రాంతి తీసుకున్నట్లు సమాచారం. చదవండి: IND vs ENG: అభిషేక్ శర్మను తప్పించండి.. కానీ: రవిశాస్త్రి -
IND vs ENG: అభిషేక్ శర్మను తప్పించండి.. కానీ: రవిశాస్త్రి
టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మ గత కొంతకాలంగా విమర్శలు మూటగట్టుకుంటున్నాడు. టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో అతడి వైఫల్యాలే ఇందుకు కారణం. ఐసీసీ ర్యాంకింగ్స్‌లో నంబర్ వన్ టీ20 బ్యాటర్‌గా కొనసాగుతున్న ఈ ఎడమచేతి వాటం బ్యాటర్.. కెరీర్లో తొలిసారి వరల్డ్‌కప్ ఆడుతున్నాడు.మూడు డకౌట్లువిధ్వంసకర ఓపెనర్‌గా పేరొందిన అభిషేక్ శర్మ (Abhishek Sharma).. సొంతగడ్డపై భారీ అంచనాల నడుమ బరిలోకి దిగాడు. అయితే, ఆడిన తొలి మూడు మ్యాచ్‌లలో డకౌట్ అయి తీవ్రంగా నిరాశపరిచాడు. మొత్తంగా ఆరు మ్యాచ్‌లలో కలిపి అతడు చేసిన పరుగులు కేవలం 80.ఈ నేపథ్యంలో ఇంగ్లండ్‌తో కీలక సెమీ ఫైనల్‌కు ముందు భారత జట్టు మాజీ హెడ్‌కోచ్ రవిశాస్త్రి (Ravi Shastri) అభిషేక్ శర్మను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశాడు. వరుస వైఫల్యాల కారణంగా అతడు మానసికంగా కాస్త కుంగిపోయి ఉండవచ్చని అభిప్రాయపడ్డాడు. అలాంటపుడు తుదిజట్టు నుంచి అభిషేక్ శర్మను తప్పించడమే సరైన నిర్ణయమని పేర్కొన్నాడు.అదొక్క మార్పు సరిపోతుందిఐసీసీ రివ్యూ షోలో మాట్లాడుతూ.. ‘‘నెట్స్‌లో బ్యాటింగ్ తీరును చూసి అంచనాకు రాకూడదు. అతడితో ప్రత్యేకంగా మాట్లాడాలి. మానసికంగా అతడు ఎంత దృఢంగా ఉన్నాడో తెలుసుకోవాలి.ఒకవేళ అభిషేక్ శర్మను కొనసాగించకూడదని అనుకుంటే.. ఇషాన్ కిషన్‌ను ఓపెనర్‌గా ఆడించాలి. లోయర్ ఆర్డర్లో రింకూ సింగ్‌ను తీసుకువస్తే సరి. సెమీ ఫైనల్లో తుదజట్టులో అదొక్క మార్పు సరిపోతుంది.అయితే, అభిషేక్ శర్మ గత సిరీస్‌లో ఇంగ్లండ్ మీద అదరగొట్టిన తీరును మర్చిపోకూడదు. వాంఖడేలో గతంలో అతడి ప్రదర్శన అద్భుతం. అక్కడ అతడు భారీ, వేగవంతమైన శతకాలు బాదాడు. కాబట్టి అభిషేక్ శర్మను కొనసాగిస్తే బాగుంటుందనీ అనుకుంటున్నాను ఒకవేళ రింకూను తీసుకురావాలని అనుకుంటే మాత్రం ఓపెనింగ్ జోడీ మారక తప్పదు’’ అని రవిశాస్త్రి పేర్కొన్నాడు. గతేడాది ఇంగ్లండ్‌పై ఇరగదీసిన అభిషేక్కాగా గతేడాది వాంఖడే వేదికగా ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో అభిషేక్ శర్మ 54 బంతుల్లోనే 135 పరుగులు సాధించాడు. తద్వారా అంతర్జాతీయ పొట్టి క్రికెట్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన భారత బ్యాటర్‌గా అతడు చరిత్రకెక్కాడు. ఇదిలా ఉంటే.. ముంబైలోని ప్రసిద్ధ వాంఖడే మైదానం వేదికగా భారత్- ఇంగ్లండ్ సెమీ ఫైనల్లో తలపడేందుకు రంగం సిద్ధమైంది.చదవండి: అతడిని సెలక్ట్ చేసింది ఎవరు?.. BCCI గ్రీన్ సిగ్నల్! -
చెత్త ఫీల్డింగ్.. టీమిండియా గెలవలేదు: పాక్ మాజీ బౌలర్ ఓవరాక్షన్
పాకిస్తాన్ మాజీ బౌలర్ మహ్మద్ ఆమిర్ మరోసారి టీమిండియాపై విమర్శలు గుప్పించాడు. భారత జట్టుకు ఫైనల్ చేరే సత్తా లేదంటూ అవాకులు చెవాకులు పేలాడు. కాగా టీ20 ప్రపంచకప్-2026 గ్రూప్ దశలో సూర్యకుమార్ సేన అజేయంగా నిలిచిన విషయం తెలిసిందే.అజేయంగా సూపర్-8గ్రూప్-‘ఎ’లో అమెరికా, నమీబియా, పాకిస్తాన్, నెదర్లాండ్స్ జట్లను ఓడించి.. సూపర్-8లో అడుగుపెట్టింది. అయితే, స్థాయికి తగ్గట్లు రాణించడంలో మాత్రం విఫలమైందనే చెప్పవచ్చు. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ ఆమిర్ స్థానిక మీడియాలో మాట్లాడుతూ.. గ్రూప్-1 నుంచి సౌతాఫ్రికా, వెస్టిండీస్ సెమీస్ చేరతాయని.. టీమిండియా ఎట్టి పరిస్థితుల్లోనూ సెమీ ఫైనల్లో అడుగుపెట్టలేదంటూ ఓవరాక్షన్ చేశాడు.అయితే, అతడి అంచనాలు తలకిందులు చేస్తూ భారత జట్టు సెమీ ఫైనల్‌కు దూసుకువెళ్లింది. వెస్టిండీస్‌తో చావోరేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్‌లో ఐదు వికెట్ల తేడాతో గెలిచి సగర్వంగా టాప్-4లో అడుగుపెట్టింది. దీంతో మహ్మద్ ఆమిర్‌ను చివాట్లు పెడుతూ టీమిండియా అభిమానులు సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెట్టారు.ఆ జట్టు ఫీల్డింగ్ చూడండిఅయినప్పటికీ ఆమిర్ తీరు మారలేదు. మరోసారి టీమిండియాను ఉద్దేశించి అతడు చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. ‘‘క్రికెట్ కోణంలోనే నేను మాట్లాడుతున్నాను. నిజానికి టీమిండియా అంత గొప్పగా ఏమీ ఆడటం లేదు. ముఖ్యంగా ఆ జట్టు ఫీల్డింగ్ చూడండి.గత మ్యాచ్‌లో వాళ్లు 3-4 క్యాచ్‌లు వదిలేశారు. జస్ప్రీత్ బుమ్రా తప్ప ఇతర బౌలర్లు పెద్దగా రాణించడం లేదు. హార్దిక్ పాండ్యా పెద్ద జట్లపై ఆడలేడని నేను చెప్పాను. అందుకు తగ్గట్లేఅతడు నాలుగు ఓవర్లలో అతడు 40 పరుగులు ఇచ్చుకున్నాడు.టీమిండియా టైటిల్ ఫేవరెట్ కాదుఇక వెస్టిండీస్ బ్యాటర్లు వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లోనూ చితక్కొట్టారు. సెమీ ఫైనల్లో భారత్‌తో ఆడే జట్టు స్పిన్నర్ల బౌలింగ్‌లో రాణించగల సత్తా కలిగి ఉంది. కాబట్టి నా దృష్టిలో టీమిండియా టైటిల్ ఫేవరెట్ కాదు. వాళ్లు ఫైనల్ చేరతారని నేను ఇప్పటికీ నమ్మడం లేదు’’ అని మహ్మద్ ఆమిర్ అతి చేశాడు. ఈ నేపథ్యంలో మరోసారి భారత నెటిజన్లు ఆమిర్‌కు చురకలు అంటిస్తున్నారు. ముందు పాకిస్తాన్ పరిస్థితి ఎలా ఉందో చూసుకోవాలని హితవు పలుకుతున్నారు. కాగా పాక్ సూపర్-8 దశలోనే ఇంటిబాట పట్టిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. సెమీ ఫైనల్లో టీమిండియా ఇంగ్లండ్‌ను ఎదుర్కోనుంది. ముంబైలో గురువారం జరిగే ఈ మ్యాచ్‌కు వాంఖడే స్టేడియం వేదిక. చదవండి: అతడిని సెలక్ట్ చేసింది ఎవరు?.. BCCI గ్రీన్ సిగ్నల్! -
T20 WC: సంజూకు పొంచి ఉన్న ప్రమాదం.. వేటు తప్పదా?
ఐసీసీ టీ20 ప్రపంచకప్-2026 టోర్నమెంట్ నాకౌట్ దశకు చేరుకుంది. ఇప్పటికే నాలుగు సెమీస్ బెర్తులు ఖరారయ్యాయి. తొలి సెమీ ఫైనల్లో సౌతాఫ్రికా- న్యూజిలాండ్.. రెండో సెమీస్ మ్యాచ్‌లో ఇంగ్లండ్- టీమిండియా తలపడేందుకు సిద్ధంగా ఉన్నాయి.సఫారీ- కివీస్ జట్లు బుధవారం కోల్‌కతా వేదికగా అమీతుమీ తేల్చుకోనుండగా.. భారత్- ఇంగ్లండ్ (IND vs ENG) ముంబై గురువారం సెమీ ఫైనల్లో పోటీపడేందుకు షెడ్యూల్ ఖరారైంది. ఇక సూపర్-8లో హ్యాట్రిక్ విజయాలతో ఇంగ్లండ్ జోరు మీద ఉండగా.. టీమిండియా మాత్రం సెమీస్ చేరేందుకు కష్టపడాల్సి వచ్చింది.వీరోచిత ఇన్నింగ్స్అయితే, వెస్టిండీస్‌తో తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో సంజూ శాంసన్ వీరోచిత ఇన్నింగ్స్ (50 బంతుల్లో 97 నాటౌట్)తో రాణించడంతో భారత్ గట్టెక్కి.. సెమీ ఫైనల్లో అడుగుపెట్టింది. అయితే, ఈ మ్యాచ్‌లో ఫీల్డింగ్ తప్పిదాలు.. ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా తప్ప వేరే బౌలర్ ఎవరూ పెద్దగా రాణించకపోవడం.. అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ విఫలం కావడం సెమీస్‌కు ముందు ఆందోళన కలిగిస్తున్నాయి.సంజూకు పొంచి ఉన్న ప్రమాదంఈ నేపథ్యంలో ఇంగ్లండ్‌తో సెమీస్‌లో తుదిజట్టు కూర్పు ఎలా ఉండబోతుందా అన్న చర్చ నడుస్తోంది. గత మ్యాచ్‌లో అదరగొట్టిన సంజూకు ఈ మ్యాచ్‌లో మాత్రం జోఫ్రా ఆర్చర్ రూపంలో ప్రమాదం పొంచి ఉంది. గతేడాది అంతర్జాతీయ టీ20లలో ఈ ఇంగ్లండ్ పేసర్ సంజూను బాగా ఇబ్బంది పెట్టాడు.సంజూకు ఆర్చర్ 23 డెలివరీలు సంధించగా.. అతడు కేవలం 25 పరుగులే రాబట్టగలిగాడు. ఇందులో ఒక ఫోర్, రెండు సిక్స్‌లు మాత్రమే ఉన్నాయి. అంతేకాదు.. మూడుసార్లు ఆర్చర్ బౌలింగ్‌లో అవుటయ్యాడు.ఆర్చర్‌తో పాటు అతడూఒకవేళ ఇంగ్లండ్ ఈసారి కూడా ఆర్చర్‌తోనే బౌలింగ్ ఎటాక్ ఆరంభిస్తే.. ఓపెనర్ సంజూ మరింత జాగ్రత్త పడాల్సి ఉంటుంది. లేదంటే భారీ మూల్యమే చెల్లించాల్సి వస్తుంది. ఇక సామ్ కర్రాన్ కూడా సంజూకు సవాలు విసిరే అవకాశం ఉంది. పొట్టి క్రికెట్లో నాలుగేళ్లలో సామ్ సంజూకు 16 డెలివరీలు సంధించగా.. అతడు 21 పరుగులు చేయగలిగాడు. రెండుసార్లు అవుటయ్యాడు. ఈ ప్రమాదాల్ని అధిగమిస్తేనే సంజూ టీమిండియాకు మంచి ఆరంభం ఇవ్వగలడు. గత గణాంకాలను బట్టి సంజూను తుదిజట్టులో ఆడిస్తారా?.. ఒకవేళ ఆడించినా ఓపెనర్‌గా పంపుతారా? అనే సందేహాలు తలెత్తుతున్నాయి.వేటు పడుతుందా?అయితే, సంజూపై నమ్మకం ఉంచిన మేనేజ్మెంట్ విండీస్‌తో ఆడిన జట్టుతోనే ముందుకు వెళ్లనున్నట్లు సమాచారం. తుదిజట్టులో ఎలాంటి మార్పులు లేకుండానే భారత్ ఇంగ్లండ్‌తో సెమీ ఫైనల్ ఆడనున్నట్లు తెలుస్తోంది.కాగా గత కొంతకాలంగా ఫామ్‌లేమితో సతమతమైన సంజూ ఓపెనర్‌గా, వికెట్ కీపర్‌గా జట్టులో స్థానం కోల్పోయాడు. టీ20 ప్రపంచకప్‌లో నమీబియాతో ఆడిన అతడు.. ఆ తర్వాత మళ్లీ సూపర్-8లో జింబాబ్వే, వెస్టిండీస్‌లతో ఆడాడు. మొత్తంగా మూడు మ్యాచ్‌లలో కలిపి 143 పరుగులు సాధించాడు.వెస్టిండీస్‌తో ఆడిన భారత తుదిజట్టుసంజూ శాంసన్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివం దూబే, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా.చదవండి: అతడిని సెలక్ట్ చేసింది ఎవరు?.. BCCI గ్రీన్ సిగ్నల్! -
IND VS ENG Semis: చరిత్ర పునరావృతమవుతుందా.. లేక..!
టీ20 ప్రపంచకప్ 2026 రెండో సెమీఫైనల్లో భారత్-ఇంగ్లండ్ అమీతుమీకి సిద్దంగా ఉన్నాయి. మార్చి 5న ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా ఈ హోరాహోరీ సమరం జరుగనుంది. ఈ మ్యాచ్ రాత్రి 7 గంటకు ప్రారంభమవుతుంది.ఈ మ్యాచ్‌కు ముందు ఓ ఆసక్తికర అంశం సోషల్‌మీడియాలో హైలైట్ అవుతుంది. గత మూడు టీ20 ప్రపంచకప్ ఎడిషన్లలో భారత్-ఇంగ్లండ్ సెమీఫైనల్లోనే ఎదురెదురుపడ్డాయి. 2022 ఎడిషన్‌లో ఇంగ్లండ్ భారత్‌ను ఓడించి ఫైనల్‌కు చేరడమే కాకుండా, రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా అవతరించింది.2024 ఎడిషన్‌లో భారత్ ఇంగ్లండ్‌ను ఓడించి ఫైనల్‌కు చేరడమే కాకుండా రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచింది. 2026 ఎడిషన్‌లోనూ ఇరు జట్లు సెమీస్‌లో ఎదురెదురుపడటంతో, సెంటిమెంట్ ప్రకారం ఈ మ్యాచ్ విజేత టైటిల్ కూడా ఎగరేసుకుపోతుందని చర్చ నడుస్తుంది. అయితే ఈ సెంటిమెంట్ రిపీటైతే భారత్‌కు ప్రతికూల ఫలితం వచ్చే ప్రమాదం కూడా ఉంది.ఎందుకుంటే, గత రెండు ఎడిషన్లలో గెలుపు చేతులు మారింది. 2022 ఎడిషన్‌లో ఇంగ్లండ్ భారత్‌ను ఓడిస్తే.. 2024 ఎడిషన్‌లో భారత్ ఇంగ్లండ్‌ను ఓడించింది. ఈ లెక్కన రొటేషన్ పద్దతిలో ఈసారి ఇంగ్లండ్ గెలుస్తుందని సెంటిమెంట్లు ఫాలో అయ్యే వారు విశ్వసిస్తున్నారు.అయితే క్రికెట్ లాంటి క్రీడల్లో సెంటిమెంట్లకు విశ్వసనీయత లేదని గతంలో చాలా సందర్భాల్లో రుజువైంది. కాబట్టి ఆ రోజు ఏ జట్టు అత్యుత్తమంగా రాణిస్తుందో ఆ జట్టుకే విజయం దక్కే అవకాశాలు అధికంగా ఉంటాయి. అలాగనీ సెంటిమెంట్లను తీసి వేయడానికి కూడా వీల్లేదు. కొన్ని సందర్భాల్లో అవి కూడా వర్కౌటవుతాయి.సెంటిమెంట్ల విషయాన్ని పక్కన పెడితే.. ప్రస్తుత ఎడిషన్‌లో భారత్, ఇంగ్లండ్ జట్లు పటిష్టంగా ఉన్నాయి. లోతుగా పరిశీలిస్తే..ఇంగ్లండ్ కంటే టీమిండియానే క్తాస మెరుగ్గా ఉంది. ఈసారి హాట్ ఫేవరెట్ కూడా ఇండియానే. అలాగనీ ఇంగ్లండ్‌ను తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. వారిదైన రోజున వారు అద్భుతాలు చేస్తారు. ప్రస్తుతం వారి జట్టు బ్యాటింగ్ టాపార్డర్ కాస్త బలహీనంగా ఉంది. ఓపెనర్లు సాల్ట్, బట్లర్ సహా జేకబ్ బేతెల్ తరుచూ విఫలమవుతున్నారు. కెప్టెన్ హ్యారీ బ్రూక్, మిడిలార్డర్ బ్యాటర్ల సాయంతోనే ఆ జట్టు ఈ ఎడిషన్‌లో విజయాలు సాధించింది. బ్యాటింగ్‌తో పోలిస్తే.. ఆ జట్టు బౌలింగ్ విభాగంలో కాస్త మెరుగ్గా ఉంది. అయితే ఈ రెండు విభాగాల్లో ఇంగ్లండ్ కంటే భారత్ ఇంకాస్త మెరుగ్గా ఉంది. ఫీల్డింగ్ మినహా భారత్ అన్ని విషయాల్లో ఇంగ్లండ్‌పై పైచేయి సాధించే అవకాశం ఉంది. సెమీస్‌కు ముందు టీమిండియాను ఫీల్డింగ్ విషయం చాలా కలవరపెడుతుంది. తాజాగా విండీస్‌తో జరిగిన డూ ఆర్ డై మ్యాచ్‌లో భారత ఫీల్డర్లు ఏకంగా 3 క్యాచ్‌లు నేలపాలు చేశారు. సూపర్-8కి చేరిన జట్లలో అత్యంత చెత్త ఫీల్డింగ్ ప్రదర్శన టీమిండియాదే. ఫీల్డింగ్ మినహా మిగతా అన్ని విభాగాల్లో భారత్‌దే పైచేయిగా ఉంది. మ్యాచ్‌కు ముందు ప్రదర్శనలు ఎలా ఉన్నా, ఆ రోజు మ్యాచ్‌లో ఎవరు రాణిస్తే వారికే అంతిమ విజయం దక్కుతుంది. -
టీమిండియాలో ఆందోళన.. తప్పు జరిగిందా, చరిత్ర హీనులవుతారు..!
టీ20 ప్రపంచకప్ 2026 తుది దశకు చేరింది. నాలుగు సెమీఫైనల్ బెర్త్‌లు ఖరారయ్యాయి. తొలి సెమీఫైనల్లో సౌతాఫ్రికా, న్యూజిలాండ్.. రెండో సెమీఫైనల్లో భారత్-ఇంగ్లండ్ అమీతుమీ తేల్చుకుంటాయి. తొలి సెమీస్ కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా మార్చి 4వ తేదీ రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతుంది. రెండో సెమీఫైనల్ ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా రాత్రి 7 గంటలకే మొదలవుతుంది.కాగా, ఇంగ్లండ్‌తో సెమీస్‌కు ముందు టీమిండియాను ఓ విషయం తెగ కలవరపెడుతుంది. భారత ఫీల్డింగ్ ప్రతి భారత క్రికెట్ అభిమానిని ఆందోళనకు గురి చేస్తోంది. విండీస్‌తో జరిగిన డూ ఆర్ డై మ్యాచ్‌లో భారత ఫీల్డర్లు ఏకంగా 3 మ్యాచ్‌లు నేలపాలు చేశారు. ముఖ్యంగా అభిషేక్ శర్మ కీలక దశలో రెండు క్యాచ్‌లు జారవిడిచాడు. ఓ క్యాచ్‌ను తిలక్ వర్మ వదిలేశాడు. ఈ మ్యాచ్‌లో టీమిండియాకు ప్రతికూల ఫలితం వచ్చుంటే, అభిషేక్, తిలక్‌పై ముప్పేట దాడి జరిగుండేది. టీమిండియా గెలవడంతో ఈ ఇద్దరు భారీ ట్రోలింగ్‌ను తప్పించుకున్నారు.విండీస్‌తో మ్యాచ్ ఒక్కటే కాదు, మెగా టోర్నీ ప్రారంభం నుంచి టీమిండియా ఫీల్డింగ్ అత్యంత చెత్తగా ఉంది. సూపర్-8కి చేరిన జట్లలో అత్యంత చెత్త క్యాచింగ్ ప్రదర్శనలు మనవే. భారత ఫీల్డర్లు 100లో కేవలం 71 శాతం క్యాచ్‌లను మాత్రమే పట్టారు. మొత్తంగా సూపర్-8కు చేరిన జట్లలో ఏ జట్టు వదలని విధంగా ఏకంగా 13 క్యాచ్‌లు నేలపాలు చేశాడు. అదనంగా భారత ఫీల్డర్లు మిస్ ఫీల్డింగ్ కూడా చేసి ప్రత్యర్దిని అదనపు పరుగులు సమకూర్చారు.సెమీస్‌లో ఇదే పరిస్థితి కొనసాగితే టీమిండియా తప్పక మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. క్యాచ్‌లు మ్యాచ్‌లు గెలిపిస్తాయన్న విషయాన్ని భారత ఆటగాళ్లు గుర్తు పెట్టుకోవాలని హెచ్చరిస్తున్నారు. గత ప్రపంచకప్ ఫైనల్లో సూర్యకుమార్ యాదవ్ పట్టిన క్యాచే భారత్‌ను జగజ్జేతగా నిలిపిన విషయాన్ని ప్రస్తుత టీమిండియా సభ్యులు గుర్తు పెట్టుకోవాలి. క్యాచ్‌లు నేలపాలు చేసినా, మిస్ ఫీల్డింగ్ చేసి అదనపు పరుగులు సమర్పించుకున్నా, సరిదిద్దుకోవడానికి జరగబోయేది సామాన్యమైన మ్యాచ్ కాదు. ఒక్కసారి తప్పు జరిగిపోతే, ఎంతటి స్టార్ ఆటగాడైనా చరిత్ర హీనుడవ్వాల్సిందే. కాబట్టి, సెమీఫైనల్లో ప్రతి భారత ఆటగాడు ఫీల్డ్‌లో జాగ్రత్తగా ఉండాలని ఫ్యాన్స్ హెచ్చరిస్తున్నారు. -
T20 WC 2026: అదే జరిగితే భారత్‌కు చుక్కెదురే..!
టీ20 ప్రపంచకప్ 2026 తుది దశకు చేరింది. తొలి సెమీఫైనల్లో సౌతాఫ్రికా, న్యూజిలాండ్.. రెండో సెమీఫైనల్లో భారత్-ఇంగ్లండ్ అమీతుమీ తేల్చుకుంటాయి. తొలి సెమీస్ కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా మార్చి 4వ తేదీ రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతుంది. రెండో సెమీఫైనల్ ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా రాత్రి 7 గంటలకే మొదలవుతుంది.ఈ మ్యాచ్‌లకు వరుణుడు నుంచి ఎలాంటి ముప్పు లేనప్పటికీ.. ఏదైనా కారణం చేత రద్దైతే పరిస్థితి ఏంటని అభిమానులు చర్చించుకుంటున్నారు. వాస్తవానికి ఈ నాకౌట్ మ్యాచ్‌లకు ఐసీసీ రిజర్వ్ డే కేటాయించింది. షెడ్యూలైన రోజు మ్యాచ్ జరుగకపోయినా లేక పాక్షికంగా జరిగి ఆగిపోయినా, ఆగిన చోటి నుంచి మరుసటి రోజు మ్యాచ్‌ను కొనసాగిస్తారు. ఒకవేళ రిజర్వ్ డేలో కూడా మ్యాచ్ సాధ్యపడకపోతే మాత్రం సూపర్-8 దశలో మెరుగైన ఫలితాలు సాధించిన జట్టు ఫైనల్స్‌కు చేరుకుంటుంది.ఈ లెక్కన తొలి సెమీఫైనల్ ఏ కారణంగా అయినా రద్దైతే, సూపర్-8లో గ్రూప్-1 టాపర్‌గా ఉన్న సౌతాఫ్రికా ఫైనల్‌కు వెళ్తుంది. న్యూజిలాండ్ ఇంటిముఖం పడుతుంది. రెండో సెమీఫైనల్ ఏ కారణంగా అయినా రద్దైతే, సూపర్-8లో గ్రూప్-2 టాపర్‌గా ఉన్న ఇంగ్లండ్ ఫైనల్‌కు అర్హత సాధిస్తుంది. టీమిండియా టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. కాబట్టి, ఏ కారణంగా కూడా సెమీస్ రద్దు కాకూడదని ప్రతి భారతీయుడు కోరుకుంటున్నాడు. -
T20 WC 2026: చరిత్ర సృష్టించిన టీమిండియా
భారత పురుషుల క్రికెట్ జట్టు సరికొత్త చరిత్ర సృష్టించింది. ఐసీసీ ఈవెంట్లలో 20 సార్లు సెమీఫైనల్స్‌కు చేరిన తొలి జట్టుగా ప్రపంచ రికార్డు నెలకొల్పింది. టీ20 ప్రపంచకప్ 2026లో సెమీస్‌కు చేరడంతో ఈ ఘనత సాధించింది. భారత్ తర్వాత అత్యధిక సార్లు ఐసీసీ ఈవెంట్లలో సెమీస్‌కు చేరిన జట్లుగా ఆస్ట్రేలియా (18), న్యూజిలాండ్ (18) ఉన్నాయి. ఆతర్వాతి స్థానాల్లో ఇంగ్లండ్ (16), పాకిస్తాన్ (16), సౌతాఫ్రికా (15), శ్రీలంక (11), వెస్టిండీస్ (11), ఆఫ్ఘనిస్తాన్ (1), బంగ్లాదేశ్ (1), కెన్యా (1) జట్లు ఉన్నాయి.ఐసీసీ ఈవెంట్లలో భారత్ సెమీస్‌కు చేరిన సందర్భాలు..వన్డే వరల్డ్‌కప్- 8 సార్లు (1983, 1987, 1996, 2003, 2011, 2015, 2019, 2023)టీ20 వరల్డ్‌కప్- 6 సార్లు (1998, 2000, 2002, 2013, 2017, 2025)ఛాంపియన్స్ ట్రోఫీ- 6 సార్లు (2007, 2014, 2016, 2022, 2024, 2026*)కాగా, టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా నిన్న (మార్చి 1) జరిగిన సూపర్-8 మ్యాచ్‌లో వెస్టిండీస్‌పై విజయం సాధించడంతో భారత్ సెమీస్‌కు అర్హత సాధించింది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది.అనంతరం భారీ లక్ష్య ఛేదనలో సంజూ శాంసన్ (97 నాటౌట్) చారిత్రక ఇన్నింగ్స్ ఆడి భారత్‌ను గెలిపించాడు. ఓ పక్క వికెట్లు పడుతున్నా శాంసన్ సహనం కోల్పోకుండా కడదాకా క్రీజ్‌లో ఉండి టీమిండియాను విజయతీరాలకు చేర్చాడు. మార్చి 4న జరిగే తొలి సెమీఫైనల్లో గ్రూప్ 1 టాపర్ సౌతాఫ్రికా, గ్రూప్-2లో రెండో స్థానంలో నిలిచిన న్యూజిలాండ్ ఈడెన్ గార్డెన్స్ వేదికగా తలపడతాయి. మార్చి 5న ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగే రెండో సెమీఫైనల్లో భారత్-ఇంగ్లండ్ అమీతుమీ తేల్చుకుంటాయి. -
టీమిండియా ‘ప్రపంచ’ రికార్డు.. పాకిస్తాన్‌తో సమంగా
వెస్టిండీస్‌తో సూపర్-8 మ్యాచ్‌లో టీమిండియా అదరగొట్టింది. ఐదు వికెట్ల తేడాతో విండీస్‌ను ఓడించి టీ20 ప్రపంచకప్-2026 టోర్నీ సెమీ ఫైనల్లో అడుగుపెట్టింది. ఈ క్రమంలో పాకిస్తాన్ పేరిట ఉన్న ప్రపంచ రికార్డును భారత జట్టు సమం చేసింది.సౌతాఫ్రికా చేతిలో చిత్తుగా ఓడిశ్రీలంకతో కలిసి వరల్డ్‌కప్ టోర్నీకి ఆతిథ్యం ఇస్తున్న డిఫెండింగ్ చాంపియన్ భారత్.. లీగ్ దశలో అజేయంగా నిలిచిన విషయం తెలిసిందే. అయితే, సూపర్-8 దశలో తొలి మ్యాచ్‌లోనే సౌతాఫ్రికా చేతిలో చిత్తుగా ఓడిన టీమిండియా సెమీస్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది.వరుస విజయాలతో సెమీస్కుఅయితే, తదుపరి మ్యాచ్‌లో జింబాబ్వే (IND vs ZIM)ను భారీ తేడాతో ఓడించి సెమీ ఫైనల్ రేసులో ముందుకు వచ్చిన భారత్.. ఆదివారం నాటి మ్యాచ్‌లో వెస్టిండీస్ (IND vs WI)ను చిత్తు చేసి బెర్తును ఖరారు చేసుకుంది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా టాస్ గెలిచిన టీమిండియా తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన విండీస్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 195 పరుగులు సాధించింది.విండీస్ బ్యాటర్లలో రోవ్‌మన్ పావెల్ (19 బంతుల్లో 34), జేసన్ హోల్డర్ (22 బంతుల్లో 37) అజేయ ఇన్నింగ్స్‌తో అలరించగా.. ఓపెనర్ రోస్టన్ ఛేజ్ (25 బంతుల్లో 40) టాప్ రన్ స్కోరర్‌గా నిలిచాడు. భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా రెండు వికెట్లు తీయగా.. హార్దిక్ పాండ్యా, వరుణ్ చక్రవర్తి చెరో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.సంజూ స్పెషల్ఇక లక్ష్య ఛేదనలో భారత్ ఆరంభంలో తడబడినా ఓపెనర్ సంజూ శాంసన్ (Sanju Samson) జట్టును విజయతీరాలకు చేర్చాడు. 50 బంతుల్లో 12 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 97 పరుగులతో అజేయంగా నిలిచి గెలుపును ఖరారు చేశాడు. ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్‌పై ఐదు వికెట్ల తేడాతో గెలిచిన భారత్ సెమీ ఫైనల్లో అడుగుపెట్టింది.Man on a mission! 🚀Sanju Samson looks in sublime touch as he bring up his fifty! 🙌ICC Men’s #T20WorldCup, SUPER 8, #INDvWI | LIVE NOW ➡️ https://t.co/Y26WH6p8dS pic.twitter.com/yrCOStYeaF— Star Sports (@StarSportsIndia) March 1, 2026పాక్ ప్రపంచ రికార్డు సమంకాగా టీమిండియా టీ20 ప్రపంచకప్ టోర్నీలో సెమీస్ చేరడం ఇది ఆరోసారి. తద్వారా పాకిస్తాన్ పేరిట ఉన్న ప్రపంచ రికార్డును భారత్ సమం చేసింది. ఇక ఇదే ఎడిషన్‌లో అందరి కంటే ముందే సెమీస్ బెర్తు ఖరారు చేసుకున్న ఇంగ్లండ్ సైతం ఆరోసారి సెమీ ఫైనల్లో అడుగుపెట్టి.. పాక్, భారత్ సరసన నిలిచింది. ఇక గురువారం నాటిమ్యాచ్‌లో ఫైనల్ బెర్తు కోసం టీమిండియా ఇంగ్లండ్ మధ్యమ్యాచ్ జరుగుతుంది. ఇందుకు ముంబై వేదిక.టీ20 ప్రపంచకప్ టోర్నీలో అత్యధికసార్లు సెమీ ఫైనల్ చేరిన జట్లు ఇవే👉పాకిస్తాన్- ఆరుసార్లు (2007, 2009, 2010, 2012, 2021, 2022)👉టీమిండియా- ఆరుసార్లు (2007, 2014, 2016, 2022, 2024, 2026)👉ఇంగ్లండ్- ఆరుసార్లు (2010, 2016, 2021, 2022, 2024, 2026చదవండి: ఇది సరిపోతుందా బాస్!.. విమర్శలకు సంజూ ’స్టైల్’ కౌంటర్ -
ఇది సరిపోతుందా బాస్!.. విమర్శలకు సంజూ ’స్టైల్’ కౌంటర్
టీ20 ప్రపంచకప్-2026 టోర్నీ ఆరంభానికి ముందు పేలవ ప్రదర్శనతో విమర్శలు మూటగట్టుకున్నాడు టీమిండియా స్టార్ సంజూ శాంసన్. మెగా టోర్నీకి సన్నాహకంగా స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో వరుస వైఫల్యాలతో సతమతమయ్యాడు.ఈ సిరీస్‌లో సంజూ చేసిన పరుగులు 10, 6, 0, 24, 6. దీంతో వరల్డ్‌కప్ జట్టులో ఓపెనర్‌గా అతడి స్థానం గల్లంతైంది. ఇషాన్ కిషన్ అభిషేక్ శర్మకు జోడీగా ఐసీసీ ఈవెంట్లో వరుస అవకాశాలు అందిపుచ్చుక్నునాడు.ఉద్దేశపూర్వకంగానే!అయితే, అభిషేక్ శర్మ అనారోగ్యం కారణంగా నమీబియాతో తొలిసారి బరిలో దిగాడు సంజూ. ఆ మ్యాచ్‌లో 8 బంతుల్లో 22 పరుగులు చేసిన ఈ వికెట్ కీపర్ బ్యాటర్... తదుపరి జింబాబ్వేతో సూపర్-8 మ్యాచ్‌లో 15 బంతుల్లో 24 రన్స్ రాబట్టగలిగాడు. పొరపాట్లను పునరావృతం చేస్తూ షార్ట్ బంతుల్ని తప్పుగా అంచనా వేసి అవుటైన నేపథ్యంలో మరోసారి సంజూపై విమర్శల వర్షం కురిసింది.మరోవైపు.. అతడి అభిమానులు మాత్రం.. మిగతా వాళ్లకు ఇచ్చినట్లుగా సంజూకు అవకాశాలు ఇవ్వడం లేదని మద్దతుగా నిలిచారు. ఈ కేరళ స్టార్‌ను ఉద్దేశపూర్వకంగా ప్రతీసారి పక్కన పెడుతున్నారని భారత జట్టు యాజమాన్యాన్ని విమర్శించారు. అయితే, వరుస విమర్శల తర్వాత అప్పుడప్పుడు అవకాశాలు పొందుతున్నా సంజూ చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడలేక ప్రతీసారి చేతులెత్తేయం ప్రతికూలాంశంగా పరిణమించింది. ఏదో కారణంతో అదృష్టవశాత్తూ చాన్స్ దక్కినా దానిని అతడు వాడుకోలేకపోతున్నాడనే అపవాదు పడింది. ముందుగా చెప్పినట్లు ఈ వరల్డ్ కప్‌లో కూడా ఆడిన రెండు మ్యాచ్‌లలో విఫలం కావడం ఇందుకు కారణం.ఒకే ఒక అర్ధ సెంచరీ...నిజానికి 2024 నవంబర్‌లో సౌతాఫ్రికాపై సెంచరీ తర్వాత శాంసన్ 18 ఇన్నింగ్స్‌లు ఆడితే ఒకే ఒక అర్ధ సెంచరీ... అదీ బలహీన జట్టు ఒమన్‌పై వచ్చింది. వరల్డ్ కప్ జట్టులోకి ఎంపికైన తర్వాత కూడా కివీస్‌తో సిరీస్‌లో వైఫల్యంతో తన స్థానాన్ని అతను ఇషాన్ కిషన్‌కు కోల్పోవాల్సి రావడం గమనార్హం.కెరీర్‌కు కొత్త ఊపుఇలాంటి స్థితిలో ఆదివారం వెస్టిండీస్‌తో చావోరేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్‌లో సంజూ ఇన్నింగ్స్ అతడి కెరీర్‌కు కొత్త ఊపు తెచ్చింది. కీలక మ్యాచ్‌లో ఎలాంటి ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా ఆడుతూ చక్కటి షాట్లతో అతను జట్టును గెలుపు వరకు తీసుకెళ్లి ఎప్పటికీ గుర్తుంచుకునే ప్రదర్శన నమోదు చేశాడు.విండీస్‌తో మ్యాచ్‌లో అన్ని రకాల షాట్లతో సంజూ చెలరేగాడు. ఈసారి 20.. 30... దాటిన తర్వాత అతడు వికెట్ పారేసుకోలేదు. అకీల్ హొసీన్ ఓవర్లో ఫోర్, 2 సిక్స్‌లతో జోరు మొదలు పెట్టిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్ షెఫర్డ్ ఓవర్లో వరుసగా 6, 4 బాది 26 బంతుల్లోనే హాఫ్ సెంచరీని అందుకున్నాడు. This team! 🥹💙🫂Next Stop: Semi-finals 🚀ICC Men’s #T20WorldCup Semi-Final 2 👉 #INDvENG | THU, 5 MAR, 6 PM pic.twitter.com/CEMSGouFlO— Star Sports (@StarSportsIndia) March 1, 2026టీమిండియాను సెమీస్‌కు చేర్చిటీ20 వరల్డ్ కప్ మ్యాచ్‌లో ఛేదనలో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచిన సంజూ... ఆఖరి ఓవర్లో వరుస బంతుల్లో 6, 4తో మ్యాచ్‌ను ముగించాడు. టీమిండియాను సెమీ ఫైనల్‌కు చేర్చి చిరస్థాయిగా నిలిచిపోయే ఇన్నింగ్స్ ఆడాడు. మొత్తంగా 50 బంతుల్లో 12 ఫోర్లు, 4 సిక్స్‌లు.. 97 పరుగులు నాటౌట్‌గా నిలిచిప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు.కాగా 2024లో విజేతగా నిలిచిన జట్టులో సభ్యుడైన సామ్సన్‌కు నాడు ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశమే రాలేదు. ఇప్పుడు అసలు సమరంలో సత్తాను ప్రదర్శించిన అతను ఇదే ఫామ్‌ను కొనసాగిస్తే సెమీస్, ఆపై ఫైనల్లో కూడా అద్భుతం చూడవచ్చు. చదవండి: మూడు పరుగులతో సెంచరీ మిస్!.. అత్యంత గొప్ప రోజు.. సంజూ ఎమోషనల్ -
T20 WC 2026: విండీస్‌ను చిత్తు చేసి సెమీ ఫైనల్లో టీమిండియా
టీ20 ప్రపంచకప్-2026 టోర్నమెంట్లో టీమిండియా సెమీ ఫైనల్‌కు దూసుకువెళ్లింది. సూపర్-8 దశలో చావోరేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్‌లో వెస్టిండీస్ (IND Beat WI)ను ఓడించి టైటిల్ దిశగా కీలక ముందడుగు వేసింది. కోల్‌కతా వేదికగా ఈడెన్ గార్డెన్స్‌లో ఆదివారం టాస్ గెలిచిన భారత్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది.195 పరుగులుఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. ఓపెనర్లలో కెప్టెన్ షాయీ హోప్ (33 బంతుల్లో 32) ఫర్వాలేదనిపించగా.. రోస్టన్ ఛేజ్ (25 బంతుల్లో 40) రాణించాడు.మిగిలిన వారిలో షిమ్రన్ హెట్‌మైర్ (12 బంతుల్లో 27) ధనాధన్ దంచికొట్టగా.. షెర్ఫానే రూథర్‌ఫర్డ్ (9 బంతుల్లో 14) రాణించాడు. ఆఖర్లో రోవ్‌మన్ పావెల్ (19 బంతుల్లో 34), జేసన్ హోల్డర్ (22బంతుల్లో 37) మెరుపు ఇన్నింగ్స్‌తో అజేయంగా నిలిచారు.నిరాశపరిచిన అభిషేక్, ఇషాన్భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమమ్రా రెండు వికెట్లు తీయగా.. హార్దిక్ పాండ్యా, వరుణ్ చక్రవర్తి తలా ఒక వికెట్ పడగొట్టారు. ఇక లక్ష్య ఛేదనలో భారత్‌కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ అభిషేక్ శర్మ (11 బంతుల్లో 10) స్వల్ప స్కోరుకే వెనుదిరగగా.. వన్‌డౌన్ బ్యాటర్ ఇషాన్ కిషన్ (6 బంతుల్లో 10) సైతం నిరాశపరిచాడు.సంజూ బాధ్యతాయుత ఇన్నింగ్స్కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (16 బంతుల్లో 18) చేతులెత్తేయగా.. తిలక్ వర్మ (15 బంతులలో 27) వేగంగా ఆడే క్రమంలో అవుటయ్యాడు. ఇలాంటి దశలో ఓపెనర్ సంజూ శాంసన్ బాధ్యతాయుత ఇన్నింగ్స్‌తో స్కోరు బోర్డును ముందుకు నడిపాడు. Man on a mission! 🚀Sanju Samson looks in sublime touch as he bring up his fifty! 🙌ICC Men’s #T20WorldCup, SUPER 8, #INDvWI | LIVE NOW ➡️ https://t.co/Y26WH6p8dS pic.twitter.com/yrCOStYeaF— Star Sports (@StarSportsIndia) March 1, 2026 అయితే విజయానికి 10 బంతులలో 17 పరుగులు అవసరమైన వేళ హార్దిక్ పాండ్యా (14 బంతులలో 17) రూపంలో భారత్ ఐదో వికెట్ కోల్పోయింది. ఈ క్రమంలో శివం దూబే సంజూకు జతయ్యాడు. దూబే 4 బంతులలో 8 పరుగులు చేయగా.. సంజూ ఆఖరి ఓవర్లో సిక్సర్, ఫోర్ బాది టీమిండియాను విజయతీరాలకు చేర్చాడు. సెంచరీకి మూడు పరుగుల దూరంలోఈ మ్యాచ్‌లో సంజూ మొత్తంగా 50 బంతులు ఎదుర్కొని 12 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 97 పరుగులతో అజేయంగా నిలిచాడు. సెంచరీకి మూడు పరుగుల దూరంలో నిలిచిపోయినా చిరస్మరణీయ ఇన్నింగ్స్‌తో జట్టుకు విజయం అందించాడు. ఇక మరో నాలుగు బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించిన టీమిండియా ఐదు వికెట్ల తేడాతో విండీస్‌ను ఓడించింది. -
Analyst Venkatesh : టీమిండియా ఇంటికేనా.? సెమీస్ చేరాలంటే..
-
మధ్యప్రదేశ్‌కు దిమ్మతిరిగే షాకిచ్చిన జమ్మూ కశ్మీర్
రంజీ ట్రోఫీ నాకౌట్ దశలో మరో సంచలనం నమోదైంది. ఈ టోర్నీలో ఆదివారం జార్ఖండ్‌ను ఓడించి చిన్న జట్టు ఉత్తరాఖండ్ తొలి సారి టోర్నీ సెమీస్ చేరగా... తర్వాతి రోజే దేశవాళీ క్రికెట్లో మరో చిన్న జట్టు జమ్మూ కశ్మీర్ జట్టు ఇలాంటి ఫలితాన్నే పునరావృతం చేసింది. 67 ఏళ్ల తమ రంజీ చరిత్రలో జమ్మూ కశ్మీర్ మొదటి సారి సెమీఫైనల్లోకి అడుగు పెట్టింది. 1959–60 సీజన్లో తొలి సారి ఈ టోర్నీలో ఆడిన జట్టు ఇన్నేళ్ల తర్వాత సెమీస్ చేరడం విశేషం. సోమవారం ముగిసిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో కశ్మీర్ 56 పరుగుల తేడాతో 2021–22 చాంపియన్ మధ్యప్రదేశ్‌పై విజయం సాధించింది. ఐదేసిన ఆఖిబ్ నబీఇండోర్ వేదికగా 291 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఓవర్‌నైట్ స్కోరు 87/5తో నాలుగో రోజు ఆట కొనసాగించిన మధ్య ప్రదేశ్.. 68.3 ఓవర్లలో 234 పరుగులకే ఆలౌటైంది. సారాంశ్ జైన్ (81 బంతుల్లో 64; 7 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీతో పోరాడగా...శుభమ్ శర్మ (32) మాత్రమే ఫర్వాలేదనిపించాడు. వైస్ కెప్టెన్ వెంకటేశ్ అయ్యర్ (17) విఫలం కావడంతో జట్టు గెలుపు ఆశలు కోల్పోయింది. పేస్ బౌలర్ ఆఖిబ్ నబీ (5/70) ఐదు వికెట్లతో ప్రత్యర్థిని దెబ్బ తీయగా...ఆబిద్ ముస్తాక్‌కు 3 వికెట్లు దక్కాయి. రెండు ఇన్నింగ్స్‌లు కలిపి 12 వికెట్లు పడగొట్టిన ఆఖిబ్ నబీకి ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. సెంచరీతో గెలిపించిన రాహుల్... భారత బ్యాటర్ కేఎల్ రాహుల్ (182 బంతుల్లో 130; 14 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీతో ముందుండి నడిపించగా చిరకాల ప్రత్యర్థి, 42 సార్లు విజేత అయిన ముంబైని ఓడించి కర్నాటక సెమీఫైనల్లోకి అడుగు పెట్టింది. ఎనిమిది సార్లు చాంపియన్ కర్నాటక సోమవారం ఆసక్తికరంగా ముగిసిన క్వార్టర్స్ పోరులో 4 వికెట్ల తేడాతో ముంబైపై గెలుపొందింది. 325 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే ప్రయత్నంలో ఓవర్‌నైట్ స్కోరు 113/2తో కర్నాటక నాలుగో రోజు ఆట కొనసాగించింది. కరుణ్ నాయర్ ((13) ఆరంభంలోనే వెనుదిరగ్గా... రాహుల్, రవిచంద్రన్ స్మరణ్ (123 బంతుల్లో 83 నాటౌట్; 11 ఫోర్లు) కలిసి జట్టును విజయం దిశగా నడిపించారు. వీరిద్దరు నాలుగో వికెట్‌కు 147 పరుగులు జోడించారు. తొలి సెషన్లోనే 147 బంతుల్లో రాహుల్ శతకం పూర్తి చేసుకున్నాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో అతనికి ఇది 24వ సెంచరీ కావడం విశేషం. లంచ్ తర్వాత కర్నాటక ఇన్నింగ్స్ కొంత తడబాటుకు గురైంది. 19 పరుగుల వ్యవధిలో రాహుల్, శ్రేయస్ గోపాల్ (1), కృతిక్ కృష్ణ (2) అవుట్ కావడంతో కొంత ఉత్కంఠ నెలకొంది. ఇరు జట్ల ఆటగాళ్ల మధ్య కొద్ది సేపు మైదానంలో వాదనలు కూడా జరిగాయి. అయితే స్మరణ్, విద్యాధర్ పాటిల్ (30 బంతుల్లో 31 నాటౌట్; 3 ఫోర్లు, 1 సిక్స్) కలిసి జట్టును గట్టెక్కింటారు. వీరిద్దరు ఏడో వికెట్‌కు అభేద్యంగా 40 పరుగులు జత చేశారు. ఆదివారం నుంచి జరిగే తొలి సెమీఫైనల్లో ఉత్తరాఖండ్‌తో కర్నాటక తలపడుతుంది. -
సెమీస్‌లో అడుగుపెట్టిన పంజాబ్, విదర్భ.. షెడ్యూల్ ఇదే
విజయ్ హజారే ట్రోఫీ 2025-26 టోర్నీ తుది దశకు చేరుకుంది. మంగళవారంతో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లు ముగిశాయి. బెంగళూరు వేదికగా జరిగిన మూడో క్వార్టర్ ఫైనల్లో మధ్యప్రదేశ్ 183 పరుగుల తేడాతో పంజాబ్ ఘన విజయం సాధించింది. దీంతో పంజాబ్ జట్టు తమ సెమీస్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది.ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 345 పరుగులు చేసింది. పంజాబ్ బ్యాటర్లలో ప్రభ్సిమ్రాన్ సింగ్ 88 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. అన్మోల్ప్రీత్ సింగ్(70),నేహల్ వధేరా(56 ), హర్నూర్ సింగ్(51) హాఫ్ సెంచరీలతో రాణించారు.ఎంపీ బౌలర్లలో వెంకటేశ్ అయ్యర్, త్రిపురేష్ సింగ్ తలా రెండు వికెట్లు సాధించారు. అనంతరం భారీ లక్ష్య చేధనలో మధ్యప్రదేశ్ 31.2 ఓవర్లలో 162 పరుగులకు కుప్పకూలింది. పంజాబ్ బ్యాటర్లలో పాటిదార్(38) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. పంజాబ్ బౌలర్లలో సంవీర్ సింగ్ మూడు, గుర్నూర్ బ్రార్, రమణ్‌దీప్ సింగ్,కృష్ భగత్ తలా రెండేసి వికెట్లు పడగొట్టారు.ఢిల్లీ చిత్తు..మరోవైపు నాలుగో క్వార్టర్ ఫైనల్లో ఢిల్లీని 76 పరుగుల తేడాతో విదర్భ చిత్తు చేసింది. దీంతో విదర్భ వరుసగా రెండో ఏడాది సెమీఫైనల్‌కు అర్హత సాధించింది. 301 పరుగుల భారీ లక్ష్యాన్ని చేధించడంలో ఢిల్లీ చతికల పడింది. 45.1 ఓవర్లలో 224 పరుగులకు ఆలౌటైంది. నచికేత్ భూటే 4 వికెట్లు పడగొట్టి ఢిల్లీ పతనాన్ని శాసించారు. ఇక తొలి రెండు క్వార్టర్ ఫైనల్లో కర్ణాటక, సౌరాష్ట్ర విజయం సాధించిన సంగతి తెలిసిందే. దీంతో కర్ణాటక, సౌరాష్ట్ర, విదర్భ, పంజాబ్ జట్లు సెమీఫైనల్లో అడుగుపెట్టాయి.సెమీఫైనల్ షెడ్యూల్తొలి సెమీఫైనల్- కర్ణాటక vs విదర్భ- జనవరి 15రెండో సెమీఫైనల్-సౌరాష్ట్ర vs పంజాబ్- జనవరి 16చదవండి: IND vs NZ: చరిత్రకు అడుగు దూరంలో శ్రేయస్ అయ్యర్ -
ఫైనల్ కు చేరిన భారత్
-
టీమిండియా కొంపముంచిన చెత్త ఫీల్డింగ్..
మహిళల వన్డే వరల్డ్‌కప్-2025లో భాగంగా భారత్‌తో జరుగుతున్న రెండో సెమీఫైనల్లో ఆస్ట్రేలియా బ్యాటర్లు విధ్వంసం సృష్టించారు. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా 49.5 ఓవర్లలో 338 పరుగుల భారీ స్కోర్ వద్ద ఆలౌటైంది. ఈ మ్యాచ్‌లో భారత బౌలర్లను ఆసీస్ బ్యాటర్లు ఉతికారేశారు.లిచ్‌ఫీల్డ్ సూపర్ సెంచరీ..తొలుత ఆస్ట్రేలియా యువ ఓపెనర్ ఫోబ్ లిచ్‌ఫీల్డ్ మెరుపు సెంచరీతో చెలరేగింది. 22 ఏళ్ల లిచ్‌ఫీల్డ్ క్రీజులో ఉన్నంతసేపు బౌండరీల వర్షం కురిపించింది. 93 బంతులు ఎదుర్కొన్న లిచ్‌ఫీల్డ్.. 17 ఫోర్లు, 3 సిక్స్‌లతో 119 పరుగులు చేసింది. ఆ తర్వాత ఎల్లీస్ పెర్రీ(88 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 77), గార్డెనర్(45 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 63) హాఫ్ సెంచరీలతో సత్తాచాటారు.బౌలర్లు విఫలం..ఈ కీలక పోరులో భారత బౌలర్లు చెతులేత్తేశారు. స్పిన్నర్ శ్రీచరణి మినహా మిగితా బౌలర్లంతా దారుణంగా విఫలమయ్యారు. సీనియర్ ఆల్‌రౌండర్ దీప్తీ శర్మ బంతితో ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయింది. 9.5 ఓవర్లు బౌలిగ్ చేసిన దీప్తీ.. రెండు వికెట్లు పడగొట్టినప్పటికి ఏకంగా 73 పరుగులు సమర్పించుకుంది. ఆమెతో పాటు రాధా యాదవ్, అమన్ జ్యోత్ కౌర్ కూడా భారీగా పరుగులిచ్చారు. భారత బౌలింగ్‌ను కంగారులు ఓ ఆట ఆడుకున్నారు. చరణి మాత్రం తన 10 ఓవర్ల కోటాలో 49 పరుగులిచ్చి 2 వికెట్లు సాధించింది.చెత్త ఫీల్డింగ్..ఇక ఫీల్డింగ్‌లో టీమిండియా తీరు ఏ మాత్రం మారలేదు. ఈ మ్యాచ్‌లో కూడా ఫీల్డింగ్‌లో భారత్ తీవ్ర నిరాశపరిచింది. తొలుత హర్మన్ ప్రీత్ విడిచిపెట్టిన క్యాచ్ నుంచి మొదలైన ఫీల్డింగ్ కష్టాలు మ్యాచ్ ఆఖరి వరకు కొనసాగాయి. ఈ మ్యాచ్‌లో మిస్ ఫీల్డ్స్, బంతిని సరిగ్గా అందుకోకపోవడం, ఓవర్ త్రోస్ వంటి తప్పిదాలను భారత ఫీల్డర్లు చేశారు. అందుకు భారత్ భారీ మూల్యం చెల్సించుకోవాల్సి వచ్చింది. టీమిండియా ప్లేయర్లు సరిగ్గా ఫీల్డింగ్ చేసి ఉంటే ఆసీస్ స్కోర్ 300 పరుగుల మార్క్‌ను దాటకపోయేది.ఈ టోర్నీలో భారత జట్టు ఫీల్డింగ్ గణాంకాలు పట్టిన క్యాచ్‌లు- 35 వదిలేసిన క్యాచ్‌లు-18 క్యాచింగ్ సామర్థ్యం- 66% మిస్ అయిన స్టంపింగ్‌లు- 3 మిస్‌ఫీల్డ్‌లు - 74 ఓవర్‌త్రోలు అయిన బంతులు- 6 చదవండి: IND vs SA: టీమిండియాతో మ్యాచ్.. సౌతాఫ్రికా కెప్టెన్ ఫెయిల్! అయినా భారీ స్కోర్ -
భారీ సెంచరీతో చెలరేగిన సౌతాఫ్రికా కెప్టెన్
ఐసీసీ మహిళల ప్రపంచకప్-2025లో భాగంగా గౌహతి వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి సెమీఫైనల్లో సౌతాఫ్రికా బ్యాటర్లు అదరగొట్టారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 319 పరుగుల భారీ స్కోర్ సాధించింది. సౌతాఫ్రికా కెప్టెన్ లారా వోల్వార్డ్ అద్బుతమైన సెంచరీతో చెలరేగింది.ఓపెనర్‌గా బరిలోకి దిగిన వోల్వార్డ్ ఇంగ్లీష్ బౌలర్లను ఉతికారేసింది. ఆమె కేవలం 115 బంతుల్లోనే తన పదివ వన్డే సెంచరీ మార్క్‌ను అందుకుంది. సెంచరీ పూర్తియ్యాక లారా మరింత చెలరేగిపోయింది. 47వ ఓవర్ వేసిన స్మిత్ బౌలింగ్‌లో వోల్వార్డ్ ఏకంగా 20 పరుగులు పిండుకుంది. మొత్తంగా 143 బంతులు ఎదుర్కొన్న లారా వోల్వార్డ్.. 20 ఫోర్లు, 4 సిక్స్‌లతో 169 పరుగులు చేసింది. ఆమెతో పాటు టాజ్మిన్ బ్రిట్స్(45), కాప్(42), ట్రయాన్(33) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడారు. సోఫీ ఎక్లెస్టోన్ 4 వికెట్లు పడగొట్టగా.. లారెన్ బెల్ రెండు, నాట్ స్కీవర్ ఒక్క వికెట్ సాధించారు. రెండో జట్టుగా రికార్డు..కాగా వన్డే వరల్డ్‌కప్ చరిత్రలో సౌతాఫ్రికాకు ఇదే అత్యధిక స్కోరు కావడం విశేషం. ఇంతకుముందు ప్రస్తుత వరల్డ్‌కప్‌లోనే పాకిస్తాన్‌పై 312 పరుగులు ప్రోటీస్ సాధించింది.అదేవిధంగా వరల్డ్‌కప్ నాకౌట్ మ్యాచ్‌లలో రెండో అత్యధిక టోటల్ నెలకొల్పిన జట్టుగా సౌతాఫ్రికా నిలిచింది. ఈ జాబితాలో ఆసీస్ అగ్రస్ధానంలో ఉంది. 2022 ప్రపంచకప్ ఫైనల్లో ఇంగ్లండ్‌పై ఆసీస్ ఏకంగా 356 పరుగుల భారీ స్కోర్ నమోదు చేసింది.చదవండి: సూర్యకుమార్ యాదవ్ ప్రపంచ రికార్డు -
సెమీఫైనల్‌కు చేరిన అల్కరాజ్..
జపాన్ ఓపెన్ ఏటీపీ–500 టెన్నిస్ టోర్నీలో ప్రపంచ నంబర్‌వన్ అల్కరాజ్ (స్పెయిన్) సెమీఫైనల్‌కు చేరాడు. పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో టాప్ సీడ్ అల్కరాజ్ 6–2, 6–4తో బ్రాండన్ నకషీమా (అమెరికా)పై గెలిచాడు. మ్యాచ్ ఆరంభం నుంచి ఆధిపత్యం కనబర్చిన ఈ యంగ్‌స్టర్... వరుస సెట్లలో ప్రత్యర్థిని మట్టికరిపించాడు. ఈ సీజన్లో అల్కరాజ్కు ఇది 65వ విజయం కావడం విశేషం. 2023 ఏటీపీ టూర్లో సైతం 65 మ్యాచ్‌లు గెలిచిన అల్కరాజ్... ఇప్పుడు మరోసారి ఆ ఘనత సాధించాడు. ‘మరో సెమీఫైనల్‌కు చేరడం ఆనందంగా ఉంది. జపాన్‌లో తొలి సారి ఆడుతున్నా. మొదటిసారే సెమీస్‌కు చేరుకోవడం చక్కటి ఉత్సాహాన్నిచ్చింది’అని 22 ఏళ్ల అల్కరాజ్ అన్నాడు. సెమీస్‌లో నాలుగో సీడ్ కాస్పర్ రూడ్ (నార్వే)తో అల్కరాజ్ ఆడతాడు. -
CT 2025, 2nd Semi Final: సౌతాఫ్రికాపై న్యూజిలాండ్ ఘన విజయం
ఛాంపియన్స్ ట్రోఫీ-2025 ఫైనల్లోకి న్యూజిలాండ్.. సెమీస్‌లో సౌతాఫ్రికా చిత్తుఛాంపియన్స్ ట్రోఫీ-2025 రెండో సెమీఫైనల్లో న్యూజిలాండ్ సౌతాఫ్రికాపై 50 పరుగుల తేడాతో గెలుపొందింది. తద్వారా మార్చి 9న జరిగే ఫైనల్లో టీమిండియాతో అమీతుమీకి అర్హత సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ రచిన్ రవీంద్ర (108), కేన్ విలియమ్సన్ (102) సెంచరీలతో కదంతొక్కడంతో నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 362 పరుగుల భారీ స్కోర్ చేసింది. డారిల్ మిచెల్ 49 పరుగులతో రాణించగా.. ఆఖర్లో గ్లెన్ ఫిలిప్స్ (49 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. సౌతాఫ్రికా బౌలర్లలో ఎంగిడి 3, రబాడ 2, ముల్దర్ ఓ వికెట్ పడగొట్టారు.భారీ లక్ష్య ఛేదనలో తడబడిన సౌతాఫ్రికా నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 312 పరుగులు చేసి లక్ష్యానికి 51 పరుగుల దూరంలో నిలిచిపోయింది. బవుమా (56), డసెన్ (69) అర్ద సెంచరీలతో రాణించగా.. ఆఖర్లో పోరాడితే పోయేదేమీ లేదన్నట్లు ఆడి మిల్లర్ మెరుపు సెంచరీ (100 నాటౌట్) బాదాడు. మిల్లర్ చివరి బంతికి రెండు పరుగులు తీసి సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కివీస్ కెప్టెన్ మిచెల్ సాంట్నర్ 3 వికెట్లు తీసి సౌతాఫ్రికా విజయావకాశాలను దెబ్బకొట్టాడు. మ్యాట్ హెన్రీ, గ్లెన్ ఫిలిప్స్ తలో 2, బ్రేస్‌వెల్, రచిన్ రవీంద్ర చెరో వికెట్ పడగొట్టారు.ఓటమి అంచుల్లో సౌతాఫ్రికా363 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో సౌతాఫ్రికా 212 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి ఓటమి అంచుల్లో నిలిచింది. డేవిడ్ మిల్లర్ (25), కేశవ్ మహారాజ్ క్రీజ్‌లో ఉన్నారు. సాంట్నర్ (7-0-29-3) సౌతాఫ్రికాను దెబ్బకొట్టాడు. ఐదో వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికా.. మార్క్రమ్ ఔట్189 పరుగుల వద్ద (32.6వ ఓవర్) సౌతాఫ్రికా ఐదో వికెట్ కోల్పోయింది. రచిన్ రవీంద్ర బౌలింగ్‌లో అతనికే క్యాచ్ ఇచ్చి మార్క్రమ్ (31) ఔటయ్యాడు. నాలుగో వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికా.. క్లాసెన్ ఔట్167 పరుగుల వద్ద (28.4వ ఓవర్) సౌతాఫ్రికా నాలుగో వికెట్ కోల్పోయింది. సాంట్నర్ బౌలింగ్‌లో హెన్రీకి క్యాచ్ ఇచ్చి క్లాసెన్ (3) ఔటయ్యాడు. మార్క్రమ్ (19), డేవిడ్ మిల్లర్ క్రీజ్‌లో ఉన్నారు. డసెన్ ఔట్.. మూడో వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికా363 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో సౌతాఫ్రికా 161 పరుగుల వద్ద (26.5వ ఓవర్) మూడో వికెట్ కోల్పోయింది. సాంట్నర్ బౌలింగ్‌లో డసెన్ (69) క్లీన్ బౌల్డయ్యాడు. మార్క్రమ్ (16), క్లాసెన్ క్రీజ్‌లో ఉన్నారు. ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా గెలవాలంటే ఇంకా 202 పరుగులు చేయాలి.రెండో వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికా125 పరుగుల వద్ద (22.2వ ఓవర్) సౌతాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమా (56) రెండో వికెట్‌గా వెనుదిరిగాడు. సాంట్నర్ బౌలింగ్‌లో విలియమ్సన్కు క్యాచ్ ఇచ్చి బవుమా ఔటయ్యాడు. డసెన్‌కు (50) జతగా మార్క్రమ్ క్రీజ్‌లోకి వచ్చాడు. ఆచితూచి ఆడుతున్న డసెన్, బవుమా363 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో సౌతాఫ్రికా బ్యాటర్లు బవుమా (42), డసెన్ (34) ఆచితూచి ఆడుతున్నారు. 17 ఓవర్ల తర్వాత ఆ జట్టు స్కోర్ 94/1గా ఉంది. రికెల్టన్ 17 పరుగులు చేసి మ్యాట్ హెన్రీ బౌలింగ్‌లో ఔటయ్యాడు.పది ఓవర్లలో సౌతాఫ్రికా స్కోరు:టెంబా బవుమా 25, డసెన్ 14 పరుగులతో ఉన్నారు. 56-1తొలి వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికా4.5: మ్యాట్ హెన్రీ బౌలింగ్‌లో ర్యాన్ రెకెల్టన్ బ్రేస్‌వెల్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. 12 బంతులు ఎదుర్కొన ఈ ఓపెనింగ్ బ్యాటర్ 17 పరుగులు చేసి నిష్క్రమించాడు. రచిన్, విలియమ్సన్ శతకాలు.. న్యూజిలాండ్ భారీ స్కోర్‌టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్.. రచిన్ రవీంద్ర (108), కేన్ విలియమ్సన్ (102) సెంచరీలతో కదంతొక్కడంతో నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 362 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఆఖర్లో గ్లెన్ ఫిలిప్స్ (49 నాటౌట్) సుడిగాలి ఇన్నింగ్స్ ఆడాడు. 300 దాటిన న్యూజిలాండ్ స్కోర్45.3వ ఓవర్: మార్కో జన్సెన్ బౌలింగ్‌లో గ్లెన్ ఫిలిప్స్ బౌండరీ బాదడంతో న్యూజిలాండ్ స్కోర్ 300 దాటింది. ఈ బౌండరీ అనంతరం ఫిలిప్స్ వరుసగా మరో మూడు బౌండరీలు బాదాడు. 47వ ఓవర్ తొలి బంతికి ఎంగిడి బౌలింగ్‌లో రబాడకు క్యాచ్ ఇచ్చి డారిల్ మిచెల్ (49) ఔటయ్యాడు. 46.3 ఓవర్ల తర్వాత కివీస్ స్కోర్ 317/5గా ఉంది. ఫిలిప్స్‌తో పాటు బ్రేస్‌వెల్ క్రీజ్‌లో ఉన్నాడు.నాలుగో వికెట్ కోల్పోయిన న్యూజిలాండ్41.1 ఓవర్: 257 పరుగుల వద్ద న్యూజిలాండ్ నాలుగో వికెట్ కోల్పోయింది. రబాడ బౌలింగ్‌లో టామ్ లాథమ్ (4) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. డారిల్ మిచెల్‌కు (19) జతగా గ్లెన్ ఫిలిప్స్ క్రీజ్‌లోకి వచ్చాడు. సెంచరీ పూర్తి చేసిన వెంటనే ఔటైన విలియమ్సన్39.5వ ఓవర్: సెంచరీ పూర్తి చేసిన ఓవర్లోనే విలియమ్సన్ (102) ఔటయ్యాడు. ముల్దర్ బౌలింగ్‌లో ఎంగిడికి క్యాచ్ ఇచ్చి కేన్ మామ పెవిలియన్ బాట పట్టాడు. 40 ఓవర్ల అనంతరం న్యూజిలాండ్ స్కోర్ 252/3గా ఉంది. టామ్ లాథమ్ (1), డారిల్ మిచెల్ (17) క్రీజ్‌లో ఉన్నారు.సెంచరీ పూర్తి చేసుకున్న విలియమ్సన్39.1 ఓవర్: ముల్దర్ బౌలింగ్‌లో బౌండరీ బాది కేన్ విలియమ్సన్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. వన్డేల్లో కేన్‌కు ఇది 15వ సెంచరీ. కేన్ తన సెంచరీ మార్కును 91 బంతుల్లో చేరుకున్నాడు. రచిన్ అవుట్రచిన్ రవీంద్ర రూపంలో కివీస్ రెండో వికెట్ కోల్పోయింది. రబడ బౌలింగ్‌లో రచిన్ క్లాసెన్‌కు క్యాచ్ ఇచ్చి 108 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద నిష్క్రమించాడు. విలియమమ్సన్ 80 పరుగులతో ఉండగా.. డారిల్ మిచెల్ క్రీజులోకి వచ్చాడు. స్కోరు: 213/2 (33.5) శతక్కొట్టిన రచిన్.. విలియమ్సన్ ఫిఫ్టీసౌతాఫ్రికాతో సెమీ ఫైనల్లో కివీస్ బ్యాటర్లు రచిన్ రవీంద్ర, కేన్ విలియమ్సన్ దంచికొడుతున్నారు. 32 ఓవర్లు పూర్తయ్యేసరికి రచిన్ 95 బంతుల్లో 105 పరుగులతో నిలవగా.. విలియమ్సన్ 74 బంతుల్లో 72 రన్స్ సాధించాడు. దీంతో న్యూజిలండ్ స్కోరు 201కి చేరింది.నిలకడగా ఆడుతున్న రచిన్, విలియమ్సన్అర్ధ శతకం పూర్తి చేసుకున్న రచిన్ రవీంద్ర, విలియమ్సన్తో కలిసి 76 పరుగులకు పైగా భాగస్వామ్యం నమోదు చేశాడు. 22 ఓవర్ల ఆట ముగిసే సరికి రచిన్ 67, విలియమ్సన్ 31 పరుగులతో ఉన్నారు.పదమూడు ఓవర్లలో న్యూజిలాండ్ స్కోరు: 67-1విలియమ్సన్ 11, రచిన్ రవీంద్ర 34 పరుగులతో ఉన్నారు.7.5: తొలి వికెట్ కోల్పోయిన కివీస్విల్ యంగ్ రూపంలో న్యూజిలాండ్ తొలి వికెట్ కోల్పోయింది. ఎంగిడి బౌలింఘ్లో మార్క్రమ్కు క్యాచ్ ఇచ్చి యంగ్ 21 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద నిష్క్రమించాడు. విలియమ్సన్ క్రీజులోకి వచ్చాడు. స్కోరు 48-1(8)టాస్ గెలిచిన కివీస్ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 రెండో సెమీ ఫైనల్‌కు రంగం సిద్ధమైంది. సౌతాఫ్రికా- న్యూజిలాండ్(South Africa Vs New Zealand) మధ్య లాహోర్ వేదికగా మ్యాచ్‌కు నగారా మోగింది. టాస్ గెలిచిన కివీస్ కెప్టెన్ మిచెల్ సాంట్నర్ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘‘వికెట్ బాగుంది. అందుకే మేము తొలుత బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకున్నాం.పిచ్ కాస్త పొడిగానే ఉంది. న్యూజిలాండ్ కెప్టెన్‌గా పనిచేయడం నాకు దక్కిన గౌరవం. మా జట్టు అద్భుతంగా ఆడుతోంది. గత మ్యాచ్‌లో మేము దుబాయ్‌లో పిచ్ పరిస్థితిని అంచనా వేయలేకపోయాం. అయితే, ఇక్కడ త్రైపాక్షిక సిరీస్ ఆడిన అనుభవం అక్కరకు వస్తుంది.గత మ్యాచ్‌లో ఆడిన జట్టుతోనే సౌతాఫ్రికాతోనూ ఆడబోతున్నాం. ధాటిగా ఆడి ప్రత్యర్థిని ఒత్తిడిలోకి నెడతాం’’ అని సాంట్నర్ తెలిపాడు. ఇక సౌతాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమా మాట్లాడుతూ.. ‘‘తొలుత బ్యాటింగ్ చేయాలా, బౌలింగ్ చేయాల అన్న అంశంలో మాకు ఎలాంటి కన్ఫ్యూజన్ లేదు.నా ఆరోగ్యం బాగానే ఉందిమా బౌలర్లు ముందుగా వాళ్ల పని పూర్తి చేస్తే.. ఆ తర్వాత బ్యాటర్లు కూడా తమ విధిని నిర్వర్తిస్తారు. ఈ మ్యాచ్‌లో మేము ఒకే ఒక్క మార్పుతో బరిలోకి దిగుతున్నాం. నేను జట్టులోకి వచ్చేశాను. ప్రసుతం నా ఆరోగ్యం బాగానే ఉంది.గత ఐసీసీ టోర్నమెంట్లలో సెమీ ఫైనల్స్, ఫైనల్స్ నుంచి మేము పాఠాలు నేర్చుకున్నాం. కీలక సమయంలో ఎలాంటి పొరపాట్లకు తావివ్వద్దని నిశ్చయించుకున్నాం. అందుకు తగిన ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాం. ఇది సెమీ ఫైనల్ కాబట్టి మేము ఒత్తిడికి లోనుకాము. సాధారణ మ్యాచ్‌లాగే దీనిని చూస్తాం’’ అని పేర్కొన్నాడు.కాగా పాకిస్తాన్ వేదికగా ఫిబ్రవరి 19న మొదలైన చాంపియన్స్ ట్రోఫీ తుదిదశకు చేరుకుంది. దుబాయ్‌లో జరిగిన తొలి సెమీ ఫైనల్లో టీమిండియా ఆస్ట్రేలియాను ఓడించి ఫైనల్ చేరింది. లాహోర్‌లోని గడాఫీ స్టేడియంలో సౌతాఫ్రికా- న్యూజిలాండ్‌ల ఫలితం.. భారత్ ప్రత్యర్థి ఎవరన్న అంశాన్ని తేల్చనుంది.ట్రై సిరీస్‌లో కివీస్‌దే విజయంఇక ఈ వన్డే టోర్నీలో మొత్తం ఎనిమిది జట్లు పాల్గొన్నాయి. గ్రూప్-‘ఎ’ నుంచి భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్.. గ్రూప్-‘బి’ నుంచి సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా, అఫ్గనిస్తాన్, ఇంగ్లండ్ పోటీపడ్డాయి. ఇందులో భారత్, న్యూజిలాండ్.. సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా సెమీస్ చేరగా.. ఆసీస్‌ను టీమిండియా నాకౌట్ చేసింది. ఇక గ్రూప్-‘బి’ టాపర్‌గా ఉన్న సౌతాఫ్రికా కివీస్‌తో మ్యాచ్‌లో ఏ మేరకు రాణిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ఈ మెగా ఈవెంట్ ఆరంభానికి ముందు పాకిస్తాన్‌తో సౌతాఫ్రికా, న్యూజిలాండ్ ట్రై సిరీస్ ఆడగా.. కివీస్ పాక్, సౌతాఫ్రికాలను ఓడించి విజేతగా నిలిచింది. ఇదిలా ఉంటే.. చాంపియన్స్‌లో ట్రోఫీ లీగ్ దశ చివరి మ్యాచ్‌లలో సౌతాఫ్రికా ఇంగ్లండ్‌ను ఓడించగా.. న్యూజిలాండ్ భారత్ చేతిలో ఓటమిపాలైంది. చాంపియన్స్ ట్రోఫీ-2025: రెండో సెమీ ఫైనల్- సౌతాఫ్రికా వర్సెస్ న్యూజిలాండ్ తుదిజట్లుసౌతాఫ్రికార్యాన్ రికెల్టన్, టెంబా బావుమా(కెప్టెన్), రాసీ వాన్ డెర్ డసెన్, హెన్రిచ్ క్లాసెన్(వికెట్ కీపర్), డేవిడ్ మిల్లర్, ఐడెన్ మార్క్రమ్, వియాన్ ముల్డర్, మార్కో జాన్సెన్, కేశవ్ మహారాజ్, కగిసో రబడ, లుంగి ఎంగిడి.న్యూజిలాండ్విల్ యంగ్, రచిన్ రవీంద్ర, కేన్ విలియమ్సన్, డారిల్ మిచెల్, టామ్ లాథమ్(వికెట్ కీపర్), గ్లెన్ ఫిలిప్స్, మైఖేల్ బ్రేస్‌వెల్, మిచెల్ సాంట్నర్(కెప్టెన్), మాట్ హెన్రీ, కైలీ జెమీసన్, విలియం ఒ'రూర్కీ.చదవండి: రోహిత్ గురించి ప్రశ్న.. ఇచ్చి పడేసిన గంభీర్! నాకన్నీ తెలుసు... -
ఆఖరి వరకు ఏమీ చెప్పలేం.. వారిద్దరి వల్లే ఈ విజయం: రోహిత్ శర్మ
ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భారత క్రికెట్ జట్టు ఫైనల్‌కు దూసుకెళ్లింది. మంగళవారం దుబాయ్ వేదికగా జరిగిన తొలి సెమీఫైనల్లో వరల్డ్ ఛాంపియన్స్ ఆస్ట్రేలియాను 4 వికెట్ల తేడాతో మట్టికర్పించిన టీమిండియా.. ఐదోసారి ఈ మెగా టోర్నీ ఫైనల్లో అడుగుపెట్టింది. ఈ విజయంతో వన్డే ప్రపంచకప్-2023 ఫైనల్ ఓటమికి భారత్ బదులు తీర్చుకుంది. ఈ సెమీస్ పోరులో భారత్ ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టింది.తొలుత బౌలర్లు సత్తాచాటగా.. అనంతరం బ్యాటర్లు సమిష్టగా రాణించారు. 265 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా 4 వికెట్లు కోల్పోయి 48.1 ఓవర్లలో చేధించింది. ఛేజ్ మాస్టర్ విరాట్ కోహ్లి(Virat Kohli) మరోసారి అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. ఆరంభంలో ఓపెనర్లు రోహిత్ శర్మ, గిల్ వికెట్లు కోల్పోయినప్పటికి విరాట్ మాత్రం తన క్లాస్‌ను చూపించాడు.మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్‌తో కలిసి స్కోర్‌బోర్డును ముందుకు నడిపించాడు. అయ్యర్(45) ఔటయ్యాక అక్షర్ పటేల్‌తో కూడా కోహ్లి భాగస్వామ్యం నెలకొల్పాడు. అయితే విజయానికి మరో 39 పరుగులు కావల్సిన దశలో ఓ భారీ షాట్‌కు ప్రయత్నించి కోహ్లి ఔటయ్యాడు. 98 బంతులు ఎదుర్కొన్న కోహ్లి 5 ఫోర్ల సాయంతో 84 పరుగులు చేశాడు. కేవలం 16 పరుగుల దూరంలో తన 52వ వన్డే సెంచరీ చేసే అవకాశాన్ని కింగ్ కోహ్లి కోల్పోయాడు. ఆఖరిలో కేఎల్ రాహుల్(34 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 42 నాటౌట్), హార్దిక్ పాండ్యా(24 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్స్‌లతో 28) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. ఆసీస్ బౌలర్లలో ఎల్లీస్, జంపా రెండు వికెట్లు పడగొట్టగా.. బెన్ ద్వార్షుయిస్, కొన్నోలీ చెరో వికెట్ పడగొట్టారు. ఇక అద్భుత విజయంపై మ్యాచ్ అనంతరం టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) స్పందించాడు. ఈ మెగా టోర్నీ ఫైనల్‌కు చేరడం చాలా సంతోషంగా ఉందని రోహిత్ చెప్పుకొచ్చాడు."ఆటలో ఆఖరి బంతి పడే వరకు ఏమీ చెప్పలేం. ఆసీస్ ఇన్నింగ్స్ ముగిశాక ఇది మరీ చిన్న స్కోరేమీ కాదని, విజయం కోసం మేం చాలా బ్యాటింగ్ చేయాల్సి ఉంటుందని అర్థమైంది. ఎందుకంటే సెకెండ్ ఇన్నింగ్స్‌లో పిచ్ ఎలా ప్రవర్తిస్తుందో మనం అంచనా వేయలేం. పిచ్‌పై ఎక్కువ దృష్టి పెట్టకుండా మా ఆటనే నమ్ముకున్నాం. కానీ పిచ్ కూడా కాస్త మెరుగ్గా అనిపించింది. న్యూజిలాండ్‌తో మ్యాచ్ కంటే ఈ రోజు పిచ్ చాలా బెటర్‌గా ఉంది.ఈ మ్యాచ్‌లో మా బ్యాటర్లు అద్బుతంగా రాణించారు. మేము 48 ఓవర్ వరకు గేమ్‌ను తీసుకుండొచ్చు. కానీ మా ఛేజింగ్‌లో ప్రశాంతంగా ఎటువంటి ఒత్తిడి లేకుండా టార్గెట్‌ను ఫినిష్ చేశాము. మాకు అదే ముఖ్యం. అన్ని విభాగాల్లో మెరుగ్గా రాణించిడంతోనే ఈ విజయం సాధ్యమైంది. జట్టులో అనుభవం కలిగిన ఆటగాళ్లు ఉన్నారు.ఇక తుది జట్టు కూర్పు ఎప్పుడూ సవాల్‌గానే ఉంటుంది. ఆరు బౌలింగ్ ప్రత్యామ్నాయాలు, ఎనిమిదో నంబర్ వరకు బ్యాటింగ్ చేయగలవారు ఉండాలని మేం కోరుకున్నాం. దానిని బట్టే జట్టును ఎంపిక చేశాం. ఇప్పుడు ఆ ఆరుగురు బౌలర్లను సమర్థంగా వాడుకున్నాం.విరాట్ కోహ్లి మరోసారి అద్బుత ఇన్నింగ్స్ ఆడాడు. అతడు ఎన్నో ఏళ్లుగా ఇదే తరహాలో జట్టును గెలిపిస్తూ వస్తున్నాడు. పవర్ ప్లేలో రెండు వికెట్లు కోల్పోయిన తర్వాత మాకు ఓ పెద్ద భాగస్వామ్యం కావాలనుకున్నాం. శ్రేయస్ అయ్యర్, కోహ్లి మాకు ఆ భాగస్వామ్యం అందించారు. కేఎల్(రాహుల్), హార్దిక్ పాండ్యా కూడా ఆఖరిలో అద్భుతంగా ఆడారు. ఫైనల్‌కు ముందు ఆటగాళ్లంతా ఫామ్‌లో ఉంటే జట్టులో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అయితే దాని గురించి అతిగా ఆలోచించడం లేదు. సమయం వచి్చనప్పుడు అంతా సరైన రీతిలో స్పందిస్తారు అని పోస్ట్ మ్యాచ్ ప్రేజెంటేషన్‌లో రోహిత్ పేర్కొన్నాడు. కాగా ఆదివారం జరగనున్న ఫైనల్లో దక్షిణాఫ్రికా లేదా న్యూజిలాండ్‌తో భారత్ తలపడనుంది.చదవండి: కుల్దీప్ యాదవ్‌పై మండిపడ్డ కోహ్లి, రోహిత్!.. గట్టిగానే తిట్టేశారు! -
IND Vs AUS Photos: ఆసీస్‌పై ఘన విజయం.. ఫైనల్లో టీమిండియా (ఫొటోలు)
-
మాపై ఒత్తిడి లేదు.. ఇది సాధారణ మ్యాచ్ మాత్రమే: శ్రేయస్ అయ్యర్
ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో దుమ్ములేపుతున్న భారత జట్టు మరో కీలక సమరానికి సిద్దమైంది. ఈ మెగా టోర్నీ తొలి సెమీఫైనల్లో దుబాయ్ వేదికగా ఆస్ట్రేలియాతో టీమిండియా తాడోపేడో తెల్చుకోనుంది. ఐసీసీ టోర్నీల్లో తమకు కొరకరాని కొయ్యగా మారిన ఆస్ట్రేలియాను ఈసారి ఎలాగైనా ఓడించి ముందుకు వెళ్లాలని రోహిత్ సేన పట్టుదలతో ఉంది.డబ్ల్యూటీసీ ఫైనల్-2023 ఫైనల్‌తో పాటు అదే ఏడాది జరిగిన వన్డే వరల్డ్‌కప్ ఫైనల్లోనూ భారత్‌ను ఆసీస్ ఓడించింది. దీంతో ఛాంపియన్స్ ట్రోఫీ సెమీస్‌లో ఆసీస్‌ను ఓడించి ప్రతీకారం తీర్చుకోవాలని భారత అభిమానులు ఆశిస్తున్నారు. టీమిండియా ప్రస్తుతం అన్ని విభాగాల్లో పటిష్టం కన్పిస్తోంది. లీగ్ స్టేజిలో ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ భారత్ అద్భుత ప్రదర్శనతో విజయ భేరి మోగించింది.అదే జోరును సెమీస్‌లోనూ కొనసాగించాలని టీమిండియా భావిస్తోంది. ఈ క్రమంలో ఆసీస్‌తో మ్యాచ్‌కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నట్లు భారత మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ తెలిపాడు. అదేవిధంగా గతేడాదిగా తాను ఎదుర్కొన్న గడ్డు పరిస్థితుల గురుంచి కూడా అయ్యర్ మా"కష్టం కాలం ఎప్పుడూ శాశ్వతంగా ఉండదు. నాలాంటి వాడికి ఇటువంటి కఠిన దశలను ఎలా ఎదుర్కోవాలో బాగా తెలుసు. కష్ట కాలంలో మనల్ని ఎవరూ ఆదుకోరు. అటువంటి సమయాల్లో మనల్ని మనం నమ్ముకుంటే ఫలితం ఉంటుంది. ఎవరిపైనా ఆధారపడకుండా ఎలా నడుచుకోవాలో గతేడాది కాలం నాకు నేర్పించింది. ఇక సెమీస్ ఫైనల్ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నాను. మాపై ఎటువంటి ఒత్తడి లేదు. ఇది ఒక సాధరణ మ్యాచ్ మాత్రమే. ఈ మ్యాచ్‌లో గెలవాలనే కోరిక మరింత రెట్టింపు అయింది" అంటూ బీసీసీఐ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో అయ్యర్ పేర్కొన్నాడు. కాగా దేశీవాళీ క్రికెట్లో ఆడాలన్న బీసీసీఐ ఆదేశాలను ధిక్కరించడంతో అయ్యర్ తన సెంట్రల్ కాంట్రాక్ట్‌ను కోల్పోయాడు.అయితే ఆ తర్వాత తన మనసు మార్చకుని రంజీల్లో ఆడడంతో అయ్యర్ తిరిగి జాతీయ జట్టులోకి వచ్చాడు. తన పునరాగమనంలో అయ్యర్ దుమ్ములేపుతున్నాడు. ఈ మెగా టోర్నీలో మూడు మ్యాచ్‌ల్లో రెండు హాఫ్ సెంచరీలు శ్రేయస్ సాధించాడు.చదవండి: అతడితో మనకు తల నొప్పి.. తొందరగా ఔట్ చేయండి: భారత మాజీ క్రికెటర్ -
శతక్కొట్టిన రహానే, చెలరేగిన శార్దూల్.. సెమీస్‌లో ముంబై
రంజీ ట్రోఫీ(Ranji Trophy) 2024-25 సీజన్లో డిఫెండింగ్ చాంపియన్ ముంబై(Mumbai) సెమీస్‌కు దూసుకువెళ్లింది. క్వార్టర్ ఫైనల్-3 మ్యాచ్‌లో హర్యానా జట్టును మట్టికరిపించి టాప్-4కు అర్హత సాధించింది. కాగా రంజీ తాజా ఎడిషన్‌లో భాగంగా శనివారం క్వార్టర్ ఫైనల్స్ మ్యాచ్‌లు మొదలయ్యాయి.తొలి ఇన్నింగ్స్‌లో రహానే విఫలంఈ క్రమంలో కోల్‌కతా వేదికగా ముంబై హర్యానాతో తలపడింది. ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ముంబై తొలుత బ్యాటింగ్ చేసింది. ఓపెనర్లు ఆయుశ్ మాత్రే(0), ఆకాశ్ ఆనంద్(10)తో పాటు వన్‌డౌన్‌లో వచ్చిన సిద్ధేశ్ లాడ్(4) కూడా విఫలమయ్యాడు. కెప్టెన్ అజింక్య రహానే(Ajinkya Rahane) సైతం 31 పరుగులకే వెనుదిరగగా.. టీమిండియా టీ20 జట్టు సారథి సూర్యకుమార్ యాదవ్(9), ఆల్‌రౌండర్ శివం దూబే(28) కూడా నిరాశపరిచారు.ఇలాంటి తరుణంలో ఆల్‌రౌండర్ షామ్స్ ములానీ 91 పరుగులతో రాణించగా.. మరో ఆల్‌రౌండర్ తనుశ్ కొటియాన్ 97 పరుగులతో చెలరేగాడు. ఫలితంగా ముంబై తమ తొలి ఇన్నింగ్స్‌లో 315 పరుగులు చేసింది.అంకిత్ కుమార్ శతకం కారణంగాఅనంతరం బ్యాటింగ్ మొదలుపెట్టిన హర్యానా తమ మొదటి ఇన్నింగ్స్‌లో 301 పరుగులకు ఆలౌట్ అయింది. కెప్టెన్ అంకిత్ కుమార్ శతకం(136)తో మెరవగా.. మిగతా వాళ్ల నుంచి అతడికి ఎక్కువగా సహకారం లభించలేదు. పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్ దెబ్బకు హర్యానా బ్యాటర్లు పెవిలియన్‌కు వరుస కట్టారు. అతడు 18.5 ఓవర్ల బౌలింగ్‌లో 58 పరుగులు ఇచ్చి ఏకంగా ఆరు వికెట్లు కూల్చాడు. మిగతా వాళ్లలో షామ్స్ ములానీ, తనుశ్ కొటియాన్ రెండు వికెట్లు దక్కించుకున్నారు.ఈ నేపథ్యంలో పద్నాలుగు పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ముంబై.. 339 పరుగులు చేసి ఆలౌట్ అయింది. అజింక్య రహానే శతక్కొట్టగా(108).. సూర్యకుమార్ యాదవ్(70) చాన్నాళ్ల తర్వాత అర్ధ శతకం బాదాడు. మిగిలిన వాళ్లలో సిద్దేశ్ లాడ్ 43, శివం దూబే 48 పరుగులతో రాణించారు.అప్పుడు శార్దూల్.. ఇప్పుడు రాయ్స్టన్ఇక ముంబై విధించిన 353 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో హర్యానా తడబడింది. ఓపెనర్ లక్ష్య దలాల్(64), సుమిత్ కుమార్(62) హాఫ్ సెంచరీలతో రాణించగా.. మిగతా వాళ్లంతా విఫలమయ్యారు. దీంతో 201 పరుగులకే హర్యానా కుప్పకూలింది. ముంబై బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ మూడు వికెట్లు సాధించగా.. రాయ్స్టన్ డయాస్ ఐదు వికెట్లతో చెలరేగాడు. తనుశ్ కొటియాన్‌కు రెండు వికెట్లు దక్కాయి. ఇక హర్యానాపై ముంబై 152 పరుగుల తేడాతో గెలుపొందిన ముంబై వరుసగా రెండోసారి సెమీస్‌లో అడుగుపెట్టింది. శార్దూల్ ఠాకూర్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ముంబై వర్సెస్ హర్యానా(క్వార్టర్ ఫైనల్-3) సంక్షిప్త స్కోర్లు👉ముంబై స్కోర్లు: 315 & 339👉హర్యానా స్కోర్లు: 301 & 201👉ఫలితం: 152 పరుగుల తేడాతో హర్యానాను ఓడించిన ముంబై👉ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: శార్దూల్ ఠాకూర్(ముంబై)- మొత్తం తొమ్మిది వికెట్లు.చదవండి: IPL 2025: కొత్త యాజమాన్యం చేతిలోకి గుజరాత్ టైటాన్స్! -
T20 WC 2025: వరల్డ్‌కప్ ఫైనల్లో సౌతాఫ్రికా.. ఆసీస్ చిత్తు
ఐసీసీ మహిళల అండర్-19 టీ20 ప్రపంచకప్-2025(ICC Under 19 Womens T20 World Cup 2025) టోర్నీలో సౌతాఫ్రికా ఫైనల్‌కు దూసుకువెళ్లింది. ఆస్ట్రేలియా మహిళా జట్టును ఓడించి టైటిల్ పోరుకు అర్హత సాధించింది. వరల్డ్‌కప్ తాజా ఈవెంట్లో గ్రూప్-1 నుంచి భారత్, ఆస్ట్రేలియా.. గ్రూప్-2 నుంచి దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్ సెమీ ఫైనల్‌కు చేరిన విషయం తెలిసిందే.సౌతాఫ్రికా బౌలర్ల విజృంభణఈ క్రమంలో శుక్రవారం ఉదయం సౌతాఫ్రికా- ఆస్ట్రేలియా(South Africa Women U19 vs Australia Women U19) మధ్య తొలి సెమీ ఫైనల్(Semi Final-1) మ్యాచ్ జరిగింది. కౌలలంపూర్లోని బేయూమస్ ఓవల్ మైదానంలో టాస్ గెలిచిన ఆసీస్ అండర్ 19 మహిళా జట్టు తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే, సౌతాఫ్రికా బౌలర్ల దెబ్బకు కంగారు జట్టు బ్యాటర్లు ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయారు.ఓపెనర్లలో ఇనెస్ మెకియోన్ డకౌట్ కాగా.. గ్రేస్ లియాన్స్ 2 పరుగులే చేసి అవుటైంది. ఇక వన్‌డౌన్‌లో వచ్చిన కెప్టెన్ లూసీ హామిల్టన్() 18 పరుగులు చేయగా.. మిగతా వాళ్లలో ఎలియనోర్ లారోసా(7), హస్రత్ గిల్(1), చ్లోయే ఐన్స్‌వర్త్(1), లిలీ బాసింగ్వైట్(2), టెగాన్ విలియమ్సన్(3*) పూర్తిగా విఫలమయ్యారు.105 పరుగులేఅయితే, మిడిలార్డర్ బ్యాటర్ కాయిమే బ్రే 36 పరుగులతో రాణించగా.. ఎల్లా బ్రిస్కో మెరుపు ఇన్నింగ్స్ ఆడింది. పదిహేడు బంతుల్లో నాలుగు ఫోర్ల సాయంతో 27 పరుగులతో అజేయంగా నిలిచింది. వీరిద్దరి కారణంగా ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 105 పరుగులు చేయగలిగింది.ఇక సౌతాఫ్రికా బౌలర్లలో ఆష్లే వాన్ విక్ నాలుగు వికెట్లతో చెలరేగగా.. ఎంతబిసెంగ్ నిని, కెప్టెన్ కైలా రెయ్నెకె, షేష్నీ నాయుడు ఒక్కో వికెట్ పడగొట్టారు. ఇక స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికాకు ఓపెనర్ జెమ్మా బోతా(24 బంతుల్లో 37 రన్స్) శుభారంభం అందించగా.. మరో ఓపెనర్ సిమోనే లౌరెన్స్(5) మాత్రం నిరాశపరిచింది.రాణించిన కెప్టెన్వన్డౌన్ బ్యాటర్ ఫే కౌలింగ్(7) కూడా విఫలం కాగా.. కైలా కెప్టెన్ ఇన్నింగ్స్‌తో బాధ్యతాయుతంగా ఆడింది. 26 బంతుల్లో 26 పరుగులు చేసింది. ఆమెకు తోడుగా వికెట్ కీపర్ బ్యాటర్ కరాబో మేసో(19) కాసేపు క్రీజులో నిలబడగా.. మికే వాన్వూస్ట్ 8, షేష్నీ నాయుడు 2 పరుగులతో అజేయంగా నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చారు. 18.1 ఓవర్లలో 106 పరుగులు చేసిన సౌతాఫ్రికా.. ఆస్ట్రేలియాపై ఐదు వికెట్ల తేడాతో గెలుపొందింది. తద్వారా మహిళ అండర్-19 టీ20 వరల్డ్‌కప్ సెకండ్ ఎడిషన్‌లో ఫైనల్ చేరిన తొలి జట్టుగా నిలిచింది. సౌతాఫ్రికా విజయంలో కీలక పాత్ర పోషించిన స్పిన్నర్ ఆష్లే వాన్ విక్కి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఇదిలా ఉంటే.. రెండో సెమీ ఫైనల్లో భారత్- ఇంగ్లండ్(India Women U19 vs England Women U19) అమీతుమీ తేల్చుకోనున్నాయి. రెండో బెర్తు కోసంఇరుజట్ల మధ్య శుక్రవారం నాటి మ్యాచ్‌లో గెలిచిన జట్టు.. ఫైనల్లో సౌతాఫ్రికాతో ట్రోఫీ కోసం తలపడుతుంది. కాగా మొట్టమొదటి మహిళల అండర్-19 టీ20 వరల్డ్‌కప్ టోర్నీలో భారత్ విజేతగా అవతరించిన విషయం తెలిసిందే. ఇక తాజా ఎడిషన్‌లోనూ డిఫెండింగ్ చాంపియన్‌గా స్థాయికి తగ్గట్లు రాణించి సెమీ ఫైనల్ వరకు వచ్చింది. మరోసారి చాంపియన్‌గా నిలవాలనే పట్టుదలతో ఉంది.చదవండి: Virat Kohli: పన్నెండేళ్ల తర్వాత రీఎంట్రీ.. క్లీన్‌బౌల్డ్! దారుణ వైఫల్యం -
ఆస్ట్రేలియన్ ఓపెన్ నుంచి జొకొవిచ్ అవుట్.. కారణం ఇదే!
ఆస్టేలియా ఓపెన్-2025(Australian Open 2025) టోర్నమెంట్లో సెర్బియా టెన్నిస్ దిగ్గజం నొవాక్ జొకొవిచ్(Novak Djokovic) ప్రయాణం ముగిసింది. గాయం కారణంగా శుక్రవారం నాటి సెమీ ఫైనల్ మ్యాచ్ మధ్యలోనే అతడు వైదొలిగాడు. తద్వారా టెన్నిస్ చరిత్రలోనే అత్యధిక గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్స్ గెలిచిన ఆటగాడిగా నిలవాలన్న జొకొవిచ్ కలకు బ్రేక్ పడింది.కాగా ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో రికార్డుస్థాయిలో ఏకంగా పది సార్లు టైటిల్ సాధించిన ఘనత జొకొవిచ్ సొంతం. కేవలం గతేడాది మాత్రమే అతడు ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో సెమీ ఫైనల్లో ఓడిపోయాడు. అయితే, ఈసారి మాత్రం మరింత జాగ్రత్తగా అడుగులు వేసిన జొకొవిచ్‌కు గాయం రూపంలో దురదృష్టం ఎదురైంది.అల్కరాజ్ అడ్డంకిని అధిగమించిక్వార్టర్ ఫైనల్లో.. తనకు ప్రధాన అడ్డంకిగా భావించిన అల్కరాజ్తో హోరాహోరీ పోటీలో గెలుపొందిన జొకొవిచ్ సెమీస్‌కు దూసుకువచ్చాడు. ఈ క్రమంలో జర్మన్ టెన్నిస్ స్టార్ అలెగ్జాండర్ జ్వెరెవ్(Alexander Zverev)తో సెమీ ఫైనల్లో తలపడ్డాడు. ఇందులో భాగంగా తొలి సెట్‌ను జ్వెరెవ్ 7-6తో గెలుచుకున్నాడు.పోటీ నుంచి తప్పుకొంటున్నాఅయితే, ఆ వెంటనే నెట్ దగ్గరికి వెళ్లిన జొకొవిచ్ జ్వెరెవ్‌తో కరచాలనం చేసి.. తాను పోటీ నుంచి తప్పుకొంటున్నట్లు తెలిపాడు. దీంతో సెమీస్ విజేతగా నిలిచిన జ్వెరెవ్ నేరుగా ఫైనల్లో అడుగుపెట్టాడు. కాగా క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లోనూ జొకొవిచ్ కాలి నొప్పితో ఇబ్బంది పడినట్లు కనిపించాడు. తాజాగా సెమీస్ మ్యాచ్‌లో బాధ భరించలేక వైదొలిగాడు.ఈ నేపథ్యంలో తీవ్రంగా ప్రాక్టీస్ చేసిన కారణంగానే ఈ సెర్బియా స్టార్ గాయపడ్డాడనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఏదేమైనా.. రిటైర్మెంట్కు చేరువైన 37 ఏళ్ల నొవాక్ జొకొవిచ్ తాజా గాయం వల్ల.. 25వ గ్రాండ్‌స్లామ్ టైటిల్ గెలవకుండానే ఆస్ట్రేలియా ఓపెన్ నుంచి నిష్క్రమించడం గమనార్హం.జొకొవిచ్‌కు చేదు అనుభవంసెమీ ఫైనల్ బరి నుంచి తప్పించుకుని కోర్టును వీడుతున్న సమయంలో నొవాక్ జొకొవిచ్‌కు చేదు అనుభవం ఎదురైంది. కొంతమంది ప్రేక్షకులు అతడి గాయం గురించి హేళన చేసేలా మాట్లాడుతూ పరుషమైన వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో జ్వెరెవ్ తన ప్రత్యర్థి ఆటగాడికి మద్దతుగా నిలిచాడు.జ్వెరెవ్ క్రీడాస్ఫూర్తి‘‘గాయం వల్ల కోర్టును వీడిన వ్యక్తిని అవమానించేలా మాట్లాడటం సరికాదు. దయచేసి కాస్త సంయమనం పాటించండి. మీలో ప్రతి ఒక్కరు టికెట్ల కోసం డబ్బులు చెల్లించారని తెలుసు. కాబట్టి ఐదు సెట్ల మ్యాచ్‌ను చూడాలని ఆశించడం మీ హక్కు.కానీ పరిస్థితులను కూడా అర్థం చేసుకోవాలి. గత ఇరవై ఏళ్లుగా ఆట కోసం తన సర్వస్వాన్ని అర్పించిన వ్యక్తి నొవాక్ జొకొవిచ్. దయచేసి అతడిని ఏరకంగానూ హేళన చేయకండి’’ అని జ్వెరెవ్ క్రీడా స్ఫూర్తిని చాటుకున్నాడు.చదవండి: Ind vs Eng: ‘అదృష్టం వల్లే గెలిచారు’... జోఫ్రా ఆర్చర్‌పై ఫ్యాన్స్ ఆగ్రహం -
స్వియాటెక్ ఫటాఫట్
మెల్బోర్న్: టెన్నిస్ సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ ఆ్రస్టేలియన్ ఓపెన్‌లో పోలాండ్ స్టార్ ఇగా స్వియాటెక్ జోరు కొనసాగుతోంది. వరుసగా రెండో మ్యాచ్‌లోనూ తన ప్రత్యర్థికి కేవలం ఒక్క గేమ్ మాత్రమే ఇచ్చి ఈ మాజీ నంబర్‌వన్ విజయాన్ని దక్కించుకుంది. సోమవారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో రెండో సీడ్ స్వియాటెక్ 6–0, 6–1తో ఇవా లిస్ (జర్మనీ)పై గెలిచి ఈ టోర్నీలో రెండోసారి క్వార్టర్ ఫైనల్లోకి చేరింది. వరుసగా ఏడోసారి ఆ్రస్టేలియన్ ఓపెన్‌లో ఆడుతున్న 23 ఏళ్ల స్వియాటెక్ 2022లో సెమీఫైనల్‌కు చేరుకుంది. ఇవా లిస్తో 59 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో స్వియాటెక్ మూడు ఏస్‌లు సంధించింది. ప్రత్యర్థి సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్ చేసింది. నెట్ వద్దకు 10 సార్లు దూసుకొచ్చి తొమ్మిదిసార్లు పాయింట్లు గెలిచింది. మూడో రౌండ్లో యూఎస్ ఓపెన్ మాజీ చాంపియన్ ఎమ్మా రాడుకాను (బ్రిటన్)తో జరిగిన మ్యాచ్‌లోనూ ఒక్క గేమ్ మాత్రమే చేజార్చుకున్న స్వియాటెక్... రెబెకా స్రామ్కోవా (స్లొవేనియా)తో జరిగిన రెండో రౌండ్ మ్యాచ్‌లో రెండు గేమ్‌లు మాత్రమే కోల్పోయింది. క్వార్టర్ ఫైనల్లో ఎనిమిదో సీడ్ ఎమ్మా నవారో (అమెరికా)తో స్వియాటెక్ తలపడుతుంది. కీస్ సంచలనం మరోవైపు టైటిల్ ఫేవరెట్స్‌లో ఒకరైన ఆరో సీడ్ రిబాకినా (కజకిస్తాన్) పోరాటం ప్రిక్వార్టర్ ఫైనల్‌కే పరిమితమైంది. అమెరికా ప్లేయర్, 19వ సీడ్ మాడిసన్ కీస్ 6–3, 1–6, 6–4తో రిబాకినాపై సంచలన విజయం సాధించి నాలుగోసారి ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో క్వార్టర్ ఫైనల్ చేరుకుంది. ఇతర ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో 28వ సీడ్ స్వితోలినా (ఉక్రెయిన్) 6–4, 6–1తో కుదెర్మెటోవా (రష్యా)పై, ఎమ్మా నవారో 6–4, 5–7, 7–5తో తొమ్మిదో సీడ్ కసత్కినా (రష్యా)పై గెలిచి క్వార్టర్ ఫైనల్ బెర్త్‌లను ఖరారు చేసుకున్నారు. 12వసారి ఆ్రస్టేలియన్ ఓపెన్‌లో ఆడుతున్న స్వితోలినా మూడోసారి క్వార్టర్ ఫైనల్ చేరగా... నవారో తొలిసారి ఈ ఘనత సాధించింది. సినెర్ ముందంజ పురుషుల సింగిల్స్ విభాగంలో డిఫెండింగ్ చాంపియన్, ప్రపంచ నంబర్‌వన్ యానిక్ సినెర్ క్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టాడు. 13వ సీడ్ హోల్గర్ రూనె (డెన్మార్క్)తో జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో ఈ ఇటలీ స్టార్ 6–3, 3–6, 6–3, 6–2తో గెలుపొందాడు. 3 గంటల 13 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సినెర్ 14 ఏస్‌లు సంధించి, ఆరు డబుల్ ఫాల్ట్‌లు చేశాడు. 35 విన్నర్స్ కొట్టిన సినెర్ ప్రత్యర్థి సరీ్వస్‌ను నాలుగుసార్లు బ్రేక్ చేశాడు. ఇతర ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో ఎనిమిదో సీడ్ అలెక్స్ డిమినార్ (ఆస్ట్రేలియా) 6–0, 7–6 (7/5), 6–3తో మికిల్సన్ (అమెరికా)పై, లొరెంజో సొనెగో (ఇటలీ) 6–3, 6–2, 3–6, 6–1తో క్వాలిఫయర్ లెర్నర్ టియెన్ (అమెరికా)పై విజయం సాధించి తొలిసారి ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. గేల్ మోన్ఫిల్స్ (ఫ్రాన్స్)తో జరిగిన మరో ప్రిక్వార్టర్ ఫైనల్లో బెన్ షెల్టన్ (అమెరికా) 7–6 (7/3), 6–7 (3/7), 7–6 (7/2), 1–0తో ఆధిక్యంలో ఉన్నదశలో మోన్ఫిల్స్ గాయంతో వైదొలిగాడు. దాంతో బెన్ షెల్టన్ రెండోసారి ఈ టోరీ్నలో క్వార్టర్ ఫైనల్ బెర్త్‌ను దక్కించుకున్నాడు. -
వెంకటేశ్ అయ్యర్ ఆల్‌రౌండ్ షో.. సెమీస్‌లో మధ్యప్రదేశ్
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ-2024 సెమీఫైనల్లో మధ్యప్రదేశ్ అడుగుపెట్టింది. ఈ టోర్నీలో భాగంగా బుధవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో 6 వికెట్ల తేడాతో సౌరాష్ట్రను చిత్తు చేసిన మధ్యప్రదేశ్.. తమ సెమీస్ బెర్త్‌ను ఖారారు చేసుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌరాష్ట్ర నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. సౌరాష్ట్ర బ్యాటర్లలో చిరాగ్ జాని(80) టాప్ స్కోరర్‌గా నిలవగా.. హర్విక్ దేశాయ్917), మన్కడ్916) రాణించారు. మధ్యప్రదేశ్ బౌలర్లలో వెంకటేశ్ అయ్యర్, అవేష్ ఖాన్ తలా రెండు వికెట్లు పడగొట్టగా.. త్రిపురేష్ సింగ్, రాహుల్ బాథమ్, శుక్లా తలా వికెట్ సాధించారు.అదరగొట్టిన అర్పిత్, అయ్యర్.. అనంతరం 174 పరుగుల లక్ష్యాన్ని మధ్యప్రదేశ్ 4 వికెట్లు కోల్పోయి 19.2 ఓవర్లలో చేధించింది. మధ్యప్రదేశ్ బ్యాటర్లలో ఓపెనర్ అర్పిత్ గౌడ్(42) టాప్ స్కోరర్‌గా నిలవగా.. వెంకటేశ్ అయ్యర్(38 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడారు. వీరితో పాటు హర్‌ప్రీత్ సింగ్ భాటియా(9 బంతుల్లో 22) మెరుపు మెరిపించాడు. సౌరాష్ట్ర బౌలర్లలో ఉనద్కట్, అనుకుర్ పన్వార్, జాని తలా వికెట్ సాధించారు. కాగా ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టిన వెంకటేశ్ అయ్యర్ ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్‌గా నిలిచాడు. మరోవైపు సెమీఫైనల్లో మధ్యప్రదేశ్ ప్రత్యర్ధి ఎవరో బెంగాల్, బరోడా మ్యాచ్‌తో తేలనుంది.చదవండి: PAK vs SA: షాహీన్ అఫ్రిది ప్రపంచ రికార్డు.. -
సెమీఫైనల్లో సాకేత్–రామ్ జోడీ
సాక్షి, హైదరాబాద్: సియోల్ ఓపెన్ ఏటీపీ–100 చాలెంజర్ టెన్నిస్ టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ టెన్నిస్ ప్లేయర్ సాకేత్ మైనేని–రామ్‌కుమార్ రామనాథన్ (భారత్) జోడీ సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. దక్షిణ కొరియాలో జరుగుతున్న ఈ టోరీ్నలో పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో సాకేత్–రామ్‌కుమార్ జంట 6–3, 6–1తో యోంగ్ సియోక్ జియోంగ్–యుసంగ్ పార్క్ (దక్షిణ కొరియా) జోడీపై గెలిచింది. 59 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సాకేత్–రామ్ జంట నాలుగు ఏస్‌లు సంధించి, ప్రత్యర్థి సర్వీస్‌ను నాలుగు సార్లు బ్రేక్ చేసింది. నేడు జరిగే సెమీఫైనల్లో జిసుంగ్ నామ్ (దక్షిణ కొరియా)–జోషువా పారిస్ (బ్రిటన్) జంటతో సాకేత్–రామ్‌కుమార్ ద్వయం ఆడుతుంది. ఇదే టోర్నీలో ఆడుతున్న హైదరాబాద్ ప్లేయర్ అనిరుధ్ చంద్రశేఖర్ భారత్‌కే చెందిన తన భాగస్వామి నిక్కీ కలియంద పూనాచా జోడీ పోరాటం ముగిసింది. క్వార్టర్ ఫైనల్లో మూడో సీడ్ అనిరు«ద్–నిక్కీ జంట 1–6, 3–6తో జిసుంగ్ నామ్ (దక్షిణ కొరియా)–జోషువా పారిస్ (బ్రిటన్) జోడీ చేతిలో ఓడిపోయింది. -
T20 WC 2024: సెమీస్‌లో ఆసీస్-దక్షిణాఫ్రికా ఢీ
మహిళల టి20 ప్రపంచకప్ అంటే మొదటగా గుర్తొచ్చే పేరు ఆ్రస్టేలియానే. అంతలా పొట్టి ప్రపంచకప్‌లో దుర్బేధ్యమైన జట్టుగా ప్రత్యర్థుల్ని హడలెత్తిస్తోంది. ఆరు టైటిళ్లతో అరుదైన ముద్ర వేసుకుంది. ఇప్పుడు తాజా మెగా ఈవెంట్లోనూ తమకు షరామామూలైన ఫైనల్ బెర్త్‌ను సాధించే పనిలో ఉంది. గురువారం దక్షిణాఫ్రికాతో తొలి సెమీఫైనల్ సమరానికి సిద్ధమైంది. ఇందులో చిత్రమేమిటంటే ఈ మెగా ఈవెంట్ చరిత్రలోనే కేవలం ఒక్కసారి ఫైనల్ చేరిన జట్టు... ఒకే ఒక్కసారి మాత్రమే టైటిల్ పోరుకు అర్హత సాధించని హాట్ ఫేవరెట్ ఆ్రస్టేలియాను ‘ఢీ’కొట్టబోతోందిమహిళల టి20 ప్రపంచకప్ 2009లో మొదలైతే... ఆ ప్రథమ టైటిల్ పోరుకు మాత్రమే ఆ్రస్టేలియా అర్హత సాధించలేదు. తర్వాత జరిగిన ఏడు ప్రపంచకప్‌లలోనూ వరుసబెట్టి తుదిపోరుకు చేరిన కంగారూ జట్టు ప్రత్యర్థుల్ని కంగారు పెట్టించి మరీ ఆరు టైటిళ్లను సాధించింది. ఇందులో రెండుసార్లు (2010, 2012, 2014; 2018, 2020, 2023) ‘హ్యాట్రిక్’ టైటిల్స్ ఉండటం మరో విశేషం. గత మెగా ఈవెంట్లో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్లు అమీతుమీ తేల్చుకుంటే సొంతగడ్డపై కూడా సఫారీకి ఓటమి తప్పలేదు. తాజా టోర్నీలోలో ఇరుజట్లు సెమీస్‌లో తలపడుతుండటంతో గత పరాభవానికి బదులు తీర్చుకోవాలనే పట్టుదలతో సఫారీ అమ్మాయిలు ఉన్నారు. కానీ ఈ టోరీ్నలో అజేయంగా దూసుకెళ్తున్న ఫేవరెట్‌ను ఓడించడం అంతసులువు కానేకాదని దక్షిణాఫ్రికా శిబిరానికి బాగా తెలుసు. దీనికి తగిన ఎత్తుగడలతో బరిలోకి దిగాలని చూస్తోంది. మరోవైపు గత ప్రపంచకప్ ఆడిన 11 మందిలో ఒక్క మెగ్ లానింగ్ (రిటైర్డ్) మినహా మిగతా పది మంది కూడా అందుబాటులో ఉండటం జట్టుకు లాభించే అంశం. ఆసీస్ అంటేనే ఆల్‌రౌండ్ జట్టు. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ఇలా అన్ని విభాగాల్లోనూ పటిష్టంగా ఉంది. అమ్మాయిలంతా ఫామ్‌లో ఉండటంతో ఆసీస్ ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతోంది. -
న్యూజిలాండ్ చేతిలో ఘోర ఓటమి.. భారత్ సెమీస్ చేరాలంటే?
మహిళల టీ20 వరల్డ్‌కప్-2024 టోర్నీని భారత జట్టు ఘోర ఓటమితో ఆరంభించింది. శుక్రవారం దుబాయ్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 58 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. న్యూజిలాండ్ నిర్దేశించిన 161 పరుగుల లక్ష్యచేధనకు దిగిన టీమిండియా 102 పరుగులకే కుప్పకూలింది. ఈ ఓటమితో హర్మాన్ ప్రీత్ సారథ్యంలోని భారత జట్టు తమ సెమీస్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. ఈ మెగా ఈవెంట్లో భారత జట్టు.. గ్రూపు-ఎలో న్యూజిలాండ్, పాకిస్థాన్,శ్రీలంక, ఆస్ట్రేలియాతో పాటు కలిసి ఉంది. ప్రస్తుతం టీమిండియా -2.900 రన్‌రేట్‌తో గ్రూప్-ఏలో ఆఖరి స్థానంలో ఉంది.సెమీస్ చేరాలంటే?భారత్ సెమీస్ చేరే దారులు ఇంకా మూసుకుపోలేదు. ఒక్కో గ్రూపు నుంచి మొదటి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు మాత్రమే సెమీఫైనల్‌కు ఆర్హత సాధిస్తాయి. ఈ టోర్నీలో ఇంకా భారత్‌కు మూడు లీగ్ మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. ఉమెన్ ఇన్ బ్లూ తమ తదుపరి మ్యాచ్‌ల్లో పాక్, శ్రీలంక, ఆస్ట్రేలియాతో తలపడనుంది.భారత్ సెమీఫైనల్‌కు చేరాలంటే తమ తర్వాతి మ్యాచ్‌ల్లో పాకిస్తాన్, శ్రీలంకను భారీ తేడాతో ఓడించాలి. అప్పుడు భారత్ ఖాతాలో 4 పాయింట్లు చేరడమే కాకుండా రన్ రేట్ కూడా మెరుగుపడుతోంది. ఆ తర్వాత తమ చివరి లీగ్‌లో మ్యాచ్‌లో ఆసీస్‌పై భారత్ సాధారణ విజయం సాధించినా చాలు సెమీఫైనల్‌కు ఆర్హత సాధించవచ్చు. ఒకవేళ ఆసీస్‌పై భారత్ ఓడిపోతే.. న్యూజిలాండ్ తమ మిగిలిన మూడు మ్యాచ్‌ల్లో రెండు మ్యాచ్‌లలోనైనా పరాజయం పొందాలి. అప్పుడు మెరుగైన రన్-రేట్ కారణంగా భారత్‌కు సెమీఫైనల్ చేరే అవకాశం ఉంటుంది. కాగా గ్రూప్-ఏ నుంచి డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా సెమీస్ బెర్త్ దక్కించుకోవడం దాదాపు ఖాయం. అయితే ఇదే సమయంలో ఆసీస్ మినహా పాక్, శ్రీలంక, న్యూజిలాండ్ తమ తదుపరి మూడు మ్యాచ్‌ల్లో కనీసం రెండు మ్యాచ్‌లు అయినా ఓడాలి. అప్పుడే ఈ మూడు జట్ల కంటే భారత్ పాయింట్లు ఎక్కువగా సాధించి సెమీస్‌లో అడుగు పెడుతోంది.చదవండి: అరంగేట్రంలోనే దుమ్ములేపిన సెహ్వాగ్ కుమారుడు -
Olympics: సెమీస్‌లో వినేశ్.. పతకం ఖాయం చేసే దిశగా
ప్యారిస్ ఒలింపిక్స్-2024లో భారత మహిళా రెజ్లర్ వినేశ్ ఫొగట్ మరో సంచలన విజయం సాధించింది. మహిళల 50 కేజీల విభాగంలో సెమీ ఫైనల్‌కు దూసుకువెళ్లింది. ప్రిక్వార్టర్స్‌లో వరల్డ్ నంబర్ వన్, టోక్యో స్వర్ణ పతక విజేత సుసాకేకు షాకిచ్చిన వినేశ్.. క్వార్టర్ ఫైనల్లో అడుగుపెట్టింది.ఈ క్రమంలో ఉక్రెయిన్ రెజ్లర్ లివాచ్‌తో తలపడ్డ వినేశ్ ఫొగట్.. శుభారంభం చేసింది. 4-0తో లీడ్‌లోకి వెళ్లింది. అయితే, లివాచ్ కూడా అంత తేలికగా తలొగ్గలేదు. ఈ క్రమంలో తన శక్తినంతటినీ ధారపోసిన వినేశ్ ఫొగట్.. ఆఖరికి లివాచ్‌ను 7-5తో ఓడించి సెమీ ఫైనల్లో అడుగుపెట్టింది.వినేశ్ ఫొగట్ తదుపరి క్యూబాకు చెందిన రెజ్లర్ యుస్నెలిస్ గుజ్మాన్ లోపెజ్‌తో సెమీ పోరులో తలపడనుంది. మంగళవారం రాత్రి 10.15 నిమిషాలకు ఈ బౌట్ ఆరంభం కానుంది. కాగా వినేశ్ ఫొగట్ ప్రస్తుతం వరల్డ్ నంబర్ 65 ర్యాంకర్ కాగా.. వరుసగా వరల్డ్ నంబర్ వన్ సుసాకే, ఎనిమిదో సీడ్ లివాచ్‌లను ఓడించి... తన కెరీర్లో తొలిసారిగా ఒలింపిక్స్ సెమీస్‌కు చేరుకుంది. రియో 2016లో క్వార్టర్ ఫైనల్లోనే వెనుదిరిగిన వినేశ్.. టోక్యో 2020 ఒలింపిక్స్‌లో రెండో రౌండ్లోనే ఓడిపోయి.. రిక్తహస్తాలతో తిరిగి వచ్చింది.చదవండి: Olympics 2024: ఫైనల్లో నీరజ్ చోప్రా Vinesh Phogat in control💪The 🇮🇳 WRESTLER is closing on a semi-final spot in #Paris2024!#Cheer4Bharat & watch the Olympics LIVE on #Sports18 & stream FREE on #JioCinema📲#OlympicsonJioCinema #OlympicsonSports18 #JioCinemaSports #Wrestling #Olympics pic.twitter.com/mNajPsKh2V— JioCinema (@JioCinema) August 6, 2024 -
ఫైనల్ లక్ష్యంగా...
దంబుల్లా: ఆసియా కప్ టి20 క్రికెట్ టోర్నీలో జైత్రయాత్ర కొనసాగిస్తున్న భారత మహిళల జట్టు ఇప్పుడు ఫైనల్ వేటలో పడేందుకు సిద్ధమైంది. నేడు జరిగే తొలి సెమీఫైనల్లో గ్రూప్ ‘ఎ’ టాపర్, డిఫెండింగ్ చాంపియన్ భారత్... గ్రూప్ ‘బి’లో రెండో స్థానంలో నిలిచిన బంగ్లాదేశ్‌తో తలపడుతుంది. రాత్రి ఏడు గంటలకు జరిగే రెండో సెమీఫైనల్లో పాకిస్తాన్‌తో ఆతిథ్య శ్రీలంక జట్టు ఆడుతుంది. అజేయంగా హర్మన్‌సేన ఈ టోర్నీలో ‘హ్యాట్రిక్’ విజయాలతో అజేయంగా దూసుకెళ్తున్న భారత్ ఇక నాకౌట్ దశలోనూ ఇదే జోరును కొనసాగించాలనే లక్ష్యంతో ఉంది. ఓపెనర్లలో షఫాలీ వర్మ సూపర్ ఫామ్‌లో ఉండటం జట్టు విజయాలకు దోహదం చేస్తోంది. మరో స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన, హేమలతలతో టాపార్డర్ పటిష్టంగా ఉంది. కెపె్టన్ హర్మన్‌ప్రీత్, జెమీమా రోడ్రిగ్స్, రిచా ఘోష్‌లు కూడా రాణిస్తుండటంతో బ్యాటింగ్ ఆర్డర్‌కు ఏ ఢోకా లేదు. లోయర్ ఆర్డర్లో దీప్తి శర్మ బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లో కీలకంగా మారింది. రేణుకా సింగ్, పూజ వస్త్రకర్ నిలకడగా వికెట్లు తీస్తున్నారు. ముఖ్యంగా ఈ టోర్నీలో గట్టి ప్రత్యర్థి అయిన పాకిస్తాన్‌ను కట్టడి చేయడంలో ఈ ముగ్గురు కీలకపాత్ర పోషించారు. యూఏఈ, నేపాల్‌లపై భారీస్కోర్లు సాధించిన భారత మహిళల జట్టు ఈ నాకౌట్ దశలోనూ బంగ్లాదేశ్‌పై మరోభారీ స్కోరును నమోదు చేస్తే మిగతా పనిని బౌలర్లు సమర్థంగా పూర్తి చేస్తారు. సర్వశక్తులు ఒడ్డేందుకు... మరోవైపు బంగ్లాదేశ్ కూడా ఫైనల్ కోసం గట్టి పోరాటానికే సన్నద్ధమైంది. పటిష్టమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న భారత్ మెడకు తమ స్పిన్ ఉచ్చు బిగించాలని చూస్తోంది. లెఫ్టార్మ్ స్పిన్నర్ నహిదా అక్తర్, లెగ్ స్పిన్నర్ రబియా ఖాన్లు ఈ టోరీ్నలో చక్కగా రాణించారు. సెమీస్ మ్యాచ్‌లో పిచ్ ఏమాత్రం అనుకూలించినా... తమ మాయాజాలంతో భారత బ్యాటర్ల ఆటకట్టించే ఎత్తుగడలతో పాక్ సేన ఉంది. మలేసియాతో ఆడిన చివరి లీగ్ మ్యాచ్‌లో బంగ్లా భారీస్కోరు (191/2) నమోదు చేసింది. టాపార్డర్ బ్యాటర్లు ముర్షిదా, దిలార, కెపె్టన్ నిగర్ సుల్తానా ఫామ్‌లోకి రావడం బంగ్లా శిబిరానికి కలిసొచ్చే అంశం. జట్లు (అంచనా) భారత మహిళల జట్టు: హర్మన్‌ప్రీత్ (కెప్టెన్), షఫాలీ, స్మృతి మంధాన, హేమలత, జెమీమా, రిచాఘో‹Ù, దీప్తిశర్మ, అరుంధతి, రాధాయాదవ్, తనూజ, రేణుకా సింగ్. బంగ్లాదేశ్ మహిళల జట్టు: నిగర్ సుల్తానా (కెపె్టన్), ముర్షిదా, దిలార రుమానా, ఇష్మా తంజిమ్, రీతు మోని, రబియా, షోర్న, నహిదా, సబికున్ జాస్మిన్, జహనారా. -
సెమీస్ సమరం.. స్పెయిన్‌తో ఫ్రాన్స్ ఢీ! ఫైనల్ బెర్త్ ఎవరిదో?
‘యూరో’ కప్ ఫుట్‌బాల్ టోర్నీ-2024 తొలి సెమీఫైనల్‌కు సర్వం సిద్దమైంది. మంగళవారం అలియాంజ్ ఎరీనా వేదికగా జరగనున్న సెమీఫైనల్-1లో ఫ్రాన్స్, స్పెయిన్ జట్లు తాడో పేడో తెల్చుకోనున్నాయి. ఈ సెమీస్ పోరులో గెలిచి ఫైనల్ బెర్త్‌ను ఖారారు చేసుకోవాలని ఇరు జట్లు ఉవ్విళ్లూరుతున్నాయి. స్పెయిన్ ఫైనల్‌కు చేరుతుందా?అయితే ఆడిన అన్ని మ్యాచ్‌ల్లోనూ గెలిచి జోరు మీదున్న స్పెయిన్‌కు సెమీస్ ముందు గాయాలు, కార్డ్ సస్పెన్షన్ల బెడద వెంటాడుతోంది. ఇప్పటికే కీలక మ్యాచ్‌కు ముందు రాబిన్ లే నార్మాండ్, డాని కార్వాజల్ ఇద్దరూ సస్పెండ్ అయ్యారు. మరోవైపు , యువ మిడ్‌ఫీల్డర్ పెడ్రీ టోని క్రూస్ గాయం కారణంగా టోర్నీ నుంచి వైదొలిగాడు. ఈ క్రమంలో డిఫెన్స్‌లో రాబిన్ లే నార్మాండ్, డాని కార్వాజల్ స్ధానాలను నాచో, జీసస్ నెవాస్ భర్తీ చేయనున్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా పెడ్రీ ప్రత్యామ్నాయంగా వచ్చిన డాని ఓల్మో ప్లేయింగ్‌లో తన స్దానాన్ని సుస్థిరం చేసుకోనున్నాడు.స్పెయిన్ జోరును ఫ్రాన్స్ అడ్డుకుంటుందా?ఇక సెమీస్‌కు ముందు ఫ్రాన్స్ టీమ్‌లో ఎటవంటి గాయాలు, కార్డ్ సస్పెన్షన్లు లేవు. జట్టు మొత్తం క్లియర్‌గా ఉంది. కానీ ఫ్రాన్స్ సెమీస్‌కు వచ్చినప్పటికి తమ స్ధాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయింది. గోల్స్ సాధించడంలో ఫ్రాన్స్ తమ మార్క్ చూపించలేకపోయింది. కెప్టెన్ కైలియన్ ఎంబాపే గాయం కావడం ఫ్రాన్స్‌ను కాస్త దెబ్బతీసింది. అతడు తిరిగి జట్టులోకి వచ్చినప్పటి మునపటి జోరును ప్రదర్శించలేకపోతున్నాడు. సెమీఫైనల్లోనైనా ఎంబాపే సత్తాచాటుతాడో లేదో వేచి చూడాలి. కాగా సెమీఫైనల్ చేరే క్రమంలో స్పెయిన్ 11 గోల్స్ చేయగా... ఫ్రాన్స్ కేవలం మూడు గోల్స్ మాత్రమే సాధించింది. -
సెమీఫైనల్లో ఫ్రాన్స్
హాంబర్గ్: యూరో కప్ ఫుట్‌బాల్ టోర్నీలో మాజీ చాంపియన్ ఫ్రాన్స్ సెమీ ఫైనల్లోకి అడుగు పెట్టింది. క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో ఫ్రాన్స్ ‘షూటౌట్’ ద్వారా మరో మాజీ విజేత పోర్చుగల్‌ను ఓడించింది. నిర్ణీత సమయంతో పాటు అదనపు సమయం ముగిశాక కూడా ఇరు జట్లు 0–0తో సమంగా నిలవగా షూటౌట్ అనివార్యమైంది. ఇందులో ఫ్రాన్స్ 5–3తో పోర్చుగల్‌పై విజయం సాధించింది. ఆల్‌టైమ్ గ్రేట్‌లలో ఒకడైన క్రిస్టియానో రొనాల్డో తన జాతీయ జట్టు తరఫున ఆఖరి మ్యాచ్ ఆడేశాడు. ఆరో సారి యూరో కప్‌లో బరిలోకి దిగిన రొనాల్డో ముందే ఇది తనకు చివరి యూరో అని ప్రకటించాడు. 2026 వరల్డ్ కప్‌లో 41 ఏళ్లు ఉండే అతను వరల్డ్ కప్ ఆడే అవకాశాలు దాదాపుగా లేవు! పేరుకు రెండు పెద్ద జట్లే అయినా ఈ క్వార్టర్స్ పోరు పెద్దగా ఉత్కంఠ, మలుపులు లేకుండా సాగింది. ఇరు జట్లూ కూడా డిఫెన్స్‌కే ప్రాధాన్యనివ్వడంతో ఆటలో వేగం కనిపించలేదు. అటు రొనాల్డో, ఇటు ఎంబాపె కూడా పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. పోర్చుగల్ ప్లేయర్లలో బ్రూనో ఫెర్నాండెజ్, వితిన్హ కొట్టిన షాట్లను ప్రత్యర్థి గోల్‌కీపర్ మైక్ మెగ్నన్ నిలువరించగా...ఫ్రాన్స్ ఆటగాళ్లు రాండల్, కామవింగాలకకు గోల్స్ అవకాశం వచి్చనా కీపర్ రూబెన్ డయాస్‌ను దాటి బంతి వెళ్లలేకపోయింది. అదనపు సమయంలో రొనాల్డో కొట్టిన ఒక కిక్ కూడా గోల్ బార్ మీదనుంచి వెళ్లిపోయింది. ఇక ఆ తర్వాత ఇరు జట్లు జాగ్రత్తగానే ఆడాయి. షూటౌట్లో తొలి నాలుగు ప్రయత్నాల్లో ఫ్రాన్స్ తరఫున డెంబెలె, ఫొఫానా, కౌండే, బార్కొలా గోల్స్ కొట్టగా...పోర్చుగల్ తరఫున రొనాల్డో, బెర్నార్డో సిల్వ, న్యూనో మెండెస్ గోల్ సాధించగా జోవో ఫెలిక్స్ విఫలమయ్యాడు. దాంతో స్కోరు ఫ్రాన్స్ పక్షాన 4–3తో నిలిచింది. ఐదో షాట్‌ను కూడా ఫ్రాన్స్ ప్లేయర్ హెర్నాండెజ్ గోల్ సాధించి తమ జట్టును గెలిపించాడు. మరో క్వార్టర్ ఫైనల్లో స్పెయిన్ 2–1 తేడాతో ఆతిథ్య జర్మనీని ఓడించింది. శనివారం జరిగిన క్వార్టర్స్‌లో ఇంగ్లండ్ షూటౌట్లో 5–3తో స్విట్జర్లాండ్‌ను ఓడించి సెమీస్ చేరింది. -
టీ20 వరల్డ్‌కప్ 2024 తొలి సెమీఫైనల్.. ఏ జట్టు గెలిచినా రికార్డే..!
టీ20 వరల్డ్‌కప్ 2024 ఫైనల్ మ్యాచ్‌కు ఓ ప్రత్యేకత ఉంది. ఈ సారి ఫైనల్‌కు క్వాలిఫై అయ్యే మొదటి జట్టుకు ప్రపంచకప్ టోర్నీల్లో ఇది మొదటి ఫైనల్ అవుతుంది. భారతకాలమానం ప్రకారం రేపు (జూన్ 27) ఉదయం జరుగుబోయే తొలి సెమీఫైనల్లో సౌతాఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్ జట్లు తలపడనున్నాయి. ఈ రెండు జట్లలో ఏ జట్టు ఫైనల్‌కు చేరినా రికార్డే అవుతుంది. ఈ రెండు జట్లు ఇప్పటివరకు ప్రపంచకప్ టోర్నీల్లో (వన్డే, టీ20) ఒక్కసారి కూడా ఫైనల్‌కు చేరలేదు. సౌతాఫ్రికా పలు మార్లు సెమీఫైనల్‌కు చేరగా.. ఆఫ్ఘనిస్తాన్‌కు మాత్రం ఇదే తొలి సెమీఫైనల్.కాగా, ట్రినిడాడ్ వేదికగా సౌతాఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్ మధ్య రేపు ఉదయం తొలి సెమీఫైనల్ జరుగనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు జూన్ 29 జరిగే ఫైనల్ మ్యాచ్‌కు అర్హత సాధిస్తుంది. మరోవైపు రెండో సెమీఫైనల్లో భారత్- ఇంగ్లండ్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్ రేపు రాత్రి 8 గంటలకు ప్రారంభం కావాల్సి ఉంది. అయితే ఈ మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉన్నట్లు తెలుస్తుంది. మ్యాచ్ జరిగే సమయానికి 88 శాతం వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఒకవేళ ఈ మ్యాచ్ వర్షం కారణంగా పూర్తిగా తుడిచిపెట్టుకుపోతే.. సూపర్-8లో గ్రూప్ టాపర్‌గా ఉన్నందున్న టీమిండియా ఫైనల్‌కు చేరుకుంటుంది. ఈ మ్యాచ్‌కు రిజర్వ్ డే కూడా లేదు. మరోవైపు సౌతాఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరిగే తొలి సెమీఫైనల్‌కు రిజర్వ్ డే ఉంది. ఒకవేళ రేపు సౌతాఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్ వర్షం కారణంగా సాధ్యపడకపోయినా రిజర్వ్ డే అయిన 28న తేదీన మ్యాచ్‌ను జరిపిస్తారు. -
ఇంగ్లండ్‌తో సెమీస్.. రవీంద్ర జడేజాపై వేటు! స్టార్ బ్యాటర్‌కు చోటు
టీ20 వరల్డ్‌కప్-2024 తుది అంకానికి చేరుకుంది. మంగళవారం జరిగిన బంగ్లాదేశ్-అఫ్గానిస్తాన్ మ్యాచ్‌తో సూపర్-8 దశ ముగిసింది. గ్రూప్ ఏ నుండి భారత్,అఫ్ఘానిస్థాన్ జట్లు సెమిస్ కు చేరగా..గ్రూప్ బినుండి సౌత్ ఆఫ్రికా, ఇంగ్లాండ్ జట్లు సెమిస్ కు చేరాయి.భారత కాలమానం ప్రకారం గురువారం(జూన్ 27) నుంచి నాకౌట్స్ దశ షూరూ కానుంది. తొలి సెమీఫైనల్లో అఫ్గానిస్తాన్- దక్షిణాఫ్రికా జట్లు అమీతుమీ తెల్చుకోగా.. రెండో సెమీఫైనల్లో భారత్- ఇంగ్లండ్ జట్లు తలపడనున్నాయి. తొలి సెమీఫైనల్ గురువారం ఉదయం 6:00 గంటలకు ప్రారంభం కాగా.. రెండో సెమీఫైనల్ రాత్రి 8:00 గంటలకు మొదలు కానుంది.ఇక సెకెండ్ సెమీఫైనల్ విషయానికి వస్తే.. డిఫెండింగ్ ఛాంపియన్స్ ఇంగ్లండ్‌ను ఎలాగైనా ఓడించి ఫైనల్లో అడుగుపెట్టాలని భారత్ భావిస్తోంది. ఇరు జట్లు బలబలాల పరంగా సమంగా ఉన్నాయి. కాబట్టి ఈ పోరులో ఎవరిది పైచేయి అని అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ కీలక మ్యాచ్‌లో భారత జట్టు మెనెజ్‌మెంట్ తమ తుది జట్టులో ఒకే మార్పు చేయనున్నట్లు తెలుస్తోంది. బౌలింగ్, బ్యాటింగ్ లో పేలవ ప్రదర్శన కనబరుస్తున్న ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాపై వేటు వేయాలని మెనెజ్‌మెంట్ నిర్ణయించకున్నట్లు సమచారం. గయనా వికెట్‌కు బ్యాటింగ్‌కు అనుకూలించే అవకాశమున్నందన జడేజా స్థానంలో స్పెషలిస్ట్ బ్యాటర్ సంజు శాంసన్ ను జట్టులోకి తీసుకోనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే జట్టులో అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ ఉండడంతో జడ్డూను పక్కన పెట్టాలని ఫిక్స్ అయినట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. ఇక ప్రధాన జట్టులో ఉన్న సంజూ శాంసన్ ఇప్పటివరకు ఈ మెగా టోర్నీలో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు.భారత తుది జట్టు(అంచనా)రోహిత్ శర్మ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, అర్ష్‌దీప్ సింగ్, మహ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రాచదవండి: T20 WC: వారసుడిని ప్రకటించిన డేవిడ్ వార్నర్.. ఆసీస్ కొత్త ఓపెనర్ ఎవరంటే? -
బంగ్లాదేశ్ అత్యంత చెత్త రికార్డు.. ఏకైక జట్టుగా
టీ20 వరల్డ్‌కప్‌లో బంగ్లాదేశ్ అత్యంత చెత్త రికార్డును తమ పేరిట లిఖించుకుంది. ఇప్పటివరకు అన్ని వరల్డ్‌కప్‌లు ఆడి ఒక్కసారి కూడా సెమీఫైనల్‌కు చేరని ఆ జట్టుగా బంగ్లాదేశ్ నిలిచింది. టీ20 ప్రపంచకప్-2024లో సూపర్-8లో రౌండ్లో నిష్క్రమించిన బంగ్లా జట్టు.. ఈ చెత్త రికార్డును మూటగట్టుకుంది. 2007లో జరిగిన తొట్టతొలి టీ20 వరల్డ్‌కప్ నుంచి ఈ మెగా టోర్నీలో భాగమవుతున్న బంగ్లాదేశ్ ఒక్కసారి కూడా సెమీస్‌లో అడుగుపెట్టలేకపోయింది. టాప్-10లో ఉన్న ఇతర 9 జట్లు కనీసం ఒక్కసారైనా టీ20 వరల్డ్‌కప్ సెమీస్‌కు చేరుకున్నాయి.భారత్, ఆసీస్, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, పాకిస్తాన్, శ్రీలంక, వెస్టిండీస్, అఫ్గానిస్తాన్ జట్లు ఏదో ఒక వరల్డ్‌కప్‌లోనైనా సెమీస్‌కు చేరాయి. చివరగా ఈ ఏడాది సూపర్-8లో సంచలన ప్రదర్శన చేసిన అఫ్గానిస్తాన్ తొలి సారి టీ20 వరల్డ్‌కప్ సెమీస్‌లో అడుగుపెట్టింది. టీ20 ప్రపంచకప్-2024లో 7 మ్యాచ్‌లు ఆడిన బంగ్లాదేశ్ కేవలం మూడింట మాత్రమే విజయం సాధించింది. -
T20 World Cup 2024: ఇలా జరిగితే ఫైనల్స్‌కు టీమిండియా..!
టీ20 వరల్డ్‌కప్ 2024లో భాగంగా గయానా వేదికగా రేపు (భారతకాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు) జరగాల్సిన భారత్-ఇంగ్లండ్ సెమీఫైనల్ మ్యాచ్‌కు వరుణ గండం పొంచి ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. మ్యాచ్ జరిగే సమయానికి 88 శాతం వర్షం పడే అవకాశాలు ఉన్నాయని వెదర్ ఫోర్‌క్యాస్ట్ పేర్కొంది. ఈ నేపథ్యంలో రేపటి మ్యాచ్ రద్దైతే పరిస్థితి ఏంటనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది.పూర్తిగా తుడిచిపెట్టుకుపోతే పరిస్థితి ఏంటి..?షెడ్యూల్ ప్రకారం భారత్-ఇంగ్లండ్ మధ్య జరిగే రెండో సెమీఫైనల్ మ్యాచ్‌కు రిజర్వ్ డే లేదు. ఒకవేళ వర్షం కారణంగా మ్యాచ్ పూర్తిగా తుడిచిపెట్టుకుపోతే (ఒక్క బంతి కూడా పడకుండా) సూపర్-8 దశలో గ్రూప్ (గ్రూప్-1) టాపర్‌గా ఉన్న కారణంగా టీమిండియా ఫైనల్ చేరుతుంది.ఒకవేళ భారత్-ఇంగ్లండ్ సెమీస్ మ్యాచ్‌కు వర్షం కారణంగా పాక్షికంగా అంతరాయం కలిగితే.. ఫలితం తేలేందుకు 250 నిమిషాల అదనపు సమయం ఉంటుంది. ఇక్కడ కూడా ఫలితం తేలకపోతే డక్‌వర్త్ లూయిస్ పద్దతిలో ఫలితాన్ని నిర్దారిస్తారు.తొలి సెమీఫైనల్‌కు రిజర్వ్ డేమరోవైపు సౌతాఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్ మధ్య ట్రినిడాడ్ వేదికగా రేపు ఉదయం 6 గంటలకు ప్రారంభంకావాల్సిన తొలి సెమీఫైనల్ మ్యాచ్‌కు కూడా వర్షం ముప్పు పొంచి ఉంది. అయితే ఈ మ్యాచ్‌కు రిజర్వ్ డే ఉండటంతో వంద శాతం ఫలితం తేలే అవకాశం ఉంది. -
సఫారీలకు సెమీస్ గండం.. ఈ సారైనా గట్టెక్కుతారా?
ఐసీసీ వరల్డ్‌కప్‌లలో అత్యంత దురదృష్టకరమైన జట్టు ఎదైనా ఉందంటే మనకు టక్కున గుర్తుచ్చేది దక్షిణాఫ్రికానే. టోర్నీ మొత్తం ఆసాధరణమైన ప్రదర్శన.. వరుసగా విజయాలు. కానీ కీలకమైన సెమీఫైనల్స్‌లో మాత్రం ఒత్తిడికి చిత్తు. ఇప్పటివరకు అటు వన్డే వరల్డ్‌కప్‌లోనూ, ఇటు టీ20 వరల్డ్‌కప్‌లోనూ కనీసం ఒక్కసారి కూడా ఫైనల్లో అడుగుపెట్టలేకపోయింది.ప్రతీసారి సెమీస్ లో ఓడిపోతూ చోకర్స్ గా ముద్రపడ్డ సఫారీలు మరోసారి టైటిల్ రేసులో నిలబడ్డారు. పొట్టి వరల్డ్‌కప్‌లలో ముచ్చటగా మూడోసారి సెమీస్‌లో సౌతాఫ్రికా అడుగుపెట్టింది. టీ20 వరల్డ్‌కప్-2024 తొలి సెమీఫైనల్లో భాగంగా ట్రినడాడ్ వేదికగా శుక్రవారం సంచలనాల అఫ్గానిస్తాన్‌తో దక్షిణాఫ్రికా తలపడనుంది.ఈ సారైనా గట్టుకెక్కుతుందా?ఓవరాల్‌గా వన్డే, టీ20 ప్రపంచకప్‌ల నాకౌట్స్‌లో దక్షిణాఫ్రికా 10 సార్లు తలపడింది. ఆడిన 10 మ్యాచ్‌ల్లో కేవలం మ్యాచ్‌లో మాత్రం విజయం సాధించింది. అది కూడా క్వార్టర్ ఫైనల్లో కావడం గమనార్హం. ఇక 8 మ్యాచ్‌ల్లో ఓటమి పాలవ్వగా.. మరో మ్యాచ్ డ్రాగా ముగిసింది.టీ20 వరల్డ్‌కప్‌లో ఇప్పటివరకు రెండు సార్లు సెమీఫైన్సల్ ఆడిన దక్షిణాఫ్రికా ఓసారి పాకిస్తాన్ చేతిలో ఓటమి పాలవ్వగా.. మరోసారి ఇండియా చేతిలో పరాజయం పాలైంది. కానీ ఈసారి మాత్రం తమ పేరిట ఉన్న చోకర్స్ ముద్రను ఎలాగైనా చెరేపేయాలన్న కసితో దక్షిణాఫ్రికా ఉంది. ఈ మెగా టోర్నీలో ఇప్పటివరకు ఆజేయంగా ఉన్న సౌతాఫ్రికా అదే జోరును సెమీస్‌లోనూ కొనసాగించి తొలిసారి ఫైనల్లో అడుగుపెట్టాలని ఉవ్విళ్లూరుతోంది.దక్షిణాఫ్రికా బలబలాలు..దక్షిణాఫ్రికా బ్యాటింగ్ బౌలింగ్ పరంగా పటిష్టంగా కన్పిస్తోంది. బ్యాటింగ్‌లో క్వింటన్ డికాక్, స్టబ్స్, క్లాసెన్, మిల్లర్ వంటి అద్బుతమైన ఆటగాళ్లు ఉన్నారు. ప్రస్తుతం వారు అంతా మంచి రిథమ్‌లో కూడా ఉన్నారు. అయితే కెప్టెన్ మార్క్రమ్ ఫామ్ మాత్రం ప్రోటీస్ జట్టు మెనెజ్‌మెంట్‌ను కలవరపెడుతోంది. అదేవిధంగా స్పిన్‌ను కూడా ఎదుర్కొనేందుకు సఫారీ బ్యాటర్లు కాస్త ఇబ్బంది పడుతున్నారు. అఫ్గాన్ ప్రధాన బలం స్పిన్నర్లే. మరి అఫ్గాన్ స్పిన్నర్లు దక్షిణాఫ్రికా బ్యాటర్లు ఎలా ఎదుర్కొంటారో వేచి చూడాలి. ఇక దక్షిణాఫ్రికా బౌలింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సఫారీ బౌలర్లు అదరగొడుతున్నారు. నోర్జే, రబాడ, జానెసన్ వంటి పేసర్లు ప్రత్యర్ధి జట్లకు చుక్కలు చూపిస్తున్నారు. ఈ పేస్ త్రయం చెలరేగితే అఫ్గాన్ బ్యాటర్లకు కష్టాల్లు తప్పవు.అఫ్గాన్‌తో అంత ఈజీ కాదు..అయితే ప్రస్తుత వరల్డ్‌కప్‌లో సంచలనాలు నమోదు చేస్తున్న అఫ్గానిస్తాన్‌ను ఓడించడం దక్షిణాఫ్రికాకు అంత ఈజీ కాదు. ఈ మెగా టోర్నీలో న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలు వంటి పటిష్టమైన జట్లను ఓడించి తొలిసారి సెమీస్‌లో అడుగుపెట్టిన అఫ్గాన్.. రెట్టింపు ఆత్మవిశ్వాసంతో సఫారీలను ఢీ కొట్టనుంది. అఫ్గాన్ బ్యాటింగ్ పరంగా కాస్త వీక్‌గా కన్పిస్తున్నప్పటకి బౌలింగ్‌లో మాత్రం బలంగా కన్పిస్తోంది. అఫ్గాన్ జట్టులో వరల్డ్‌క్లాస్ స్పిన్నర్లు ఉన్నారు. అదేవిధంగా పేస్ బౌలింగ్‌లోనూ ఫరూఖీ, నవీన్ ఉల్ హక్ సత్తాచాటుతున్నారు. బ్యాటింగ్‌లో ఎక్కువగా ఓపెనర్లపైనే అఫ్గాన్ ఆధారపడుతోంది. సెమీస్‌లో ఆల్‌రౌండ్ షోతో అఫ్గాన్ అదరగొడితే దక్షిణాఫ్రికాకు ఇబ్బందులు తప్పవు. -
T20 World Cup: అఫ్‘గన్’ పేలింది
కన్నీళ్లు ఆగడం లేదు... భావోద్వేగాలను నియంత్రించుకోవడం సాధ్యం కావడం లేదు... పట్టరాని ఆనందాన్ని ప్రదర్శించేందుకు పదాలు దొరకడం లేదు... ఒకరు కాదు, ఇద్దరు కాదు అందరి ఆటగాళ్లది ఇదే పరిస్థితి... తాము సాధించిన ఘనత ఎంత అసాధారణమైనదో వారికి తెలుస్తున్నా ఇంకా నమ్మశక్యంగా అనిపించని స్థితి... సొంత దేశంలో క్రికెట్ మైదానంలో అడుగు పెట్టడమే కష్టంగా మారిపోగా... జట్టు సభ్యులంతా కలిసి సాధన చేసే అవకాశం లేకపోగా... ఎప్పుడో టోర్నీకి ముందు కలిసి ప్రాక్టీస్ చేయడమే... కానీ తమ పోరాటం, పట్టుదల ముందు వాటన్నంటినీ చిన్న విషయాలుగా మార్చేసింది. అగ్రశ్రేణి జట్లు క్రికెట్‌ను శాసిస్తున్న చోట అంచనాలు లేకుండా బరిలోకి దిగిన అఫ్గానిస్తాన్ అసాధారణ ఆటను చూపించింది... అద్భుత ఆటతో సత్తా చాటుతూ ప్రపంచకప్ సెమీఫైనల్లోకి అడుగు పెట్టింది.టోర్నీకి ముందు అంచనాలు లేవు... అండర్డాగ్ కిందే లెక్క.. కానీ లీగ్ దశలో న్యూజిలాండ్‌పై భారీ విజయం గాలివాటం కాదని, సూపర్–8లో ఆ్రస్టేలియాను చిత్తు చేసిన వైనం అదృష్టం వల్ల కాదని అఫ్గానిస్తాన్ నిరూపించింది... గత టి20 వరల్డ్‌కప్‌లో ఒక్క విజయానికి కూడా నోచుకోని జట్టు ఇప్పుడు ఏకంగా సెమీస్ చేరింది. బంగ్లాదేశ్‌తో చివరి సూపర్–8 పోరులో విజయం దోబూచులాడింది. 115 పరుగులు మాత్రమే చేసి దానిని కాపాడుకోవడం అంత సులువు కాదు. కానీ అఫ్గాన్ ఆటగాళ్లంతా ప్రాణాలు పణంగా పెట్టినట్లు మైదానంలో పోరాడారు... మళ్లీ మళ్లీ పలకరిస్తూ వచ్చిన వర్షంతో కూడా పోటీ పడాల్సి వచ్చి0ది... చివరకు తాము అనుకున్నది సాధించారు. బంగ్లాపై పైచేయి సాధించి తొలిసారి ఓ ఐసీసీ టోర్నీలో సగర్వంగా సెమీస్ స్థానాన్ని ఖాయం చేసుకోగా, తాము ఎప్పటికీ మారమన్నట్లుగా బంగ్లాదేశ్ ఆటగాళ్లు నిష్క్రమించారు. కింగ్స్టౌన్ (సెయింట్ విన్సెంట్): ‘కమాన్ బంగ్లాదేశ్’... భారత్‌తో ఓటమి తర్వాత ఆ్రస్టేలియా కెప్టెన్ మిచెల్ మార్‡్ష మాట ఇది. ఆల్‌టైమ్ గ్రేట్ జట్టు కూడా మరో టీమ్ ప్రదర్శనను నమ్ముకుంటూ అదృష్టం పలకరిస్తుందేమోనని ఆశపడింది. బంగ్లాదేశ్ గెలిస్తే తాము సెమీఫైనల్ చేరవచ్చని కంగారూలు కలగన్నారు. కానీ అఫ్గానిస్తాన్ ఆ అవకాశం ఇవ్వలేదు. మంగళవారం జరిగిన గ్రూప్–1 చివరి సూపర్–8 మ్యాచ్‌లో అఫ్గానిస్తాన్ 8 పరుగుల తేడాతో (డక్‌వర్త్ లూయిస్ ప్రకారం) బంగ్లాదేశ్‌పై విజయం సాధించింది. భారత కాలమానం ప్రకారం గురువారం ఉదయం జరిగే తొలి సెమీఫైనల్లో దక్షిణాఫ్రికాతో అఫ్గాన్ టీమ్... రాత్రి జరిగే రెండో సెమీఫైనల్లో ఇంగ్లండ్‌తో భారత్ తలపడతాయి. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన అఫ్గానిస్తాన్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 115 పరుగులు మాత్రమే చేయగలిగింది. రహ్మనుల్లా గుర్బాజ్ (55 బంతుల్లో 43; 3 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్. బంగ్లాదేశ్ స్పిన్నర్ రిషాద్‌కు 3 వికెట్లు దక్కాయి. అనంతరం బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ మధ్యలో వర్షం రావడంతో ఒక ఓవర్ తగ్గించి లక్ష్యాన్ని 19 ఓవర్లలో 114 పరుగులుగా నిర్దేశించారు. అయితే బంగ్లాదేశ్ 17.5 ఓవర్లలో 105 పరుగులకే కుప్పకూలింది. లిటన్ దాస్ (49 బంతుల్లో 54 నాటౌట్; 5 ఫోర్లు, 1 సిక్స్) పోరాటం వృథా కాగా... జట్టులో నలుగురు డకౌటయ్యారు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ నవీన్ ఉల్ హక్ (4/26), కెపె్టన్ రషీద్ ఖాన్ (4/23) ప్రత్యర్థిని దెబ్బ కొట్టారు. తాజా ఫలితంతో గ్రూప్–1 నుంచి 2 విజయాలతో 4 పాయింట్లు సాధించిన అఫ్గానిస్తాన్ రెండో స్థానంతో సెమీస్ చేరింది. బంగ్లాదేశ్ ఓటమితో ఆస్ట్రేలియా జట్టు కూడా ‘సూపర్–8’ దశలోనే ఇంటిదారి పట్టింది. ఆద్యంతం ‘డ్రామా’ సాగి... స్వల్ప స్కోర్ల ఈ మ్యాచ్ పలు మలుపులతో ఆసక్తికరంగా సాగింది. పదే పదే వాన అంతరాయం కలిగించడంతో విజయం దోబూచులాడింది. అఫ్గాన్ ఇన్నింగ్స్‌లో గుర్బాజ్ మినహా అంతా విఫలమయ్యారు. అతను కూడా తన శైలికి భిన్నంగా చాలా నెమ్మదిగా ఆడాడు. చివర్లో రషీద్ ఖాన్ (10 బంతుల్లో 19 నాటౌట్; 3 సిక్స్‌లు) మెరుపులతో స్కోరు 100 పరుగులు దాటింది. రన్‌రేట్‌లో అఫ్గాన్, ఆసీస్‌లను దాటి సెమీస్ చేరాలంటే 12.1 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించాల్సిన స్థితిలో బంగ్లాదేశ్ మైదానంలోకి దిగింది. అయితే సెమీస్ సంగతేమో కానీ ఆ జట్టు మ్యాచ్ గెలిచే అన్ని అవకాశాలను కూడా వృథా చేసుకుంది. ఫజల్ తన తొలి ఓవర్లోనే తన్జీద్ (0)ను అవుట్ చేయగా, నవీన్ వరుస బంతుల్లో నజు్మల్ (5), షకీబ్ (0)లను అవుట్ చేయడంతో స్కోరు 23/3 వద్ద నిలిచింది. ఈ దశలో వాన వచ్చి ఆగిన తర్వాత రషీద్ వరుస ఓవర్లలో సౌమ్య సర్కార్ (10), తౌహీద్ (14)లను వెనక్కి పంపించాడు. అయినా సరే చేతిలో 5 వికెట్లతో 56 బంతుల్లో 36 పరుగులు చేయాల్సిన బంగ్లాదేశ్ గెలిచే స్థితిలో నిలిచింది. కానీ రషీద్ మళ్లీ వరుస బంతుల్లో రెండు వికెట్లు పడగొట్టి మ్యాచ్‌ను తమ చేతుల్లోకి తెచ్చుకున్నాడు. 81/7 నుంచి బంగ్లా డక్‌వర్త్ లూయిస్ స్కోరుతో పోటీ పడుతూ వచ్చింది. ఒక ఎండ్‌లో నిలిచిన దాస్ ఎంతో ప్రయత్నించినా... మరోవైపు మిగిలిన మూడు వికెట్లు తీసేందుకు అఫ్గాన్ బౌలర్లకు ఎక్కువ సమయం పట్టలేదు. ముస్తఫిజుర్‌ను నవీన్ ఎల్బీడబ్ల్యూగా అవుట్ చేయడంతో అఫ్గాన్ ఆటగాళ్లు, అభిమానుల సంబరాలతో మైదానం హోరెత్తిపోగా... అక్కడి నుంచి దాదాపు 12 వేల కిలోమీటర్ల దూరంలో కాబూల్‌లో కూడా ఆ విజయధ్వానం బ్రహ్మాండంగా వినిపించింది! ఉత్తమ నటుడు గుల్బదిన్! 11.4 ఓవర్ల తర్వాత బంగ్లా స్కోరు 81/7 వద్ద వానతో మ్యాచ్ ఆగినప్పుడు ఒక ఆసక్తికర ఘటన జరిగింది. డక్‌వర్త్ లూయిస్ ప్రకారం ఆ సమయానికి బంగ్లా 2 పరుగులు వెనుకబడి ఉంది. అక్కడే మ్యాచ్ ముగిసిపోతే అఫ్గాన్ గెలుస్తుంది. ఈ దశలో పరిస్థితి మెరుగ్గా ఉంది, తొందరపడ వద్దన్నట్లుగా డ్రెస్సింగ్ రూమ్ నుంచి అఫ్గాన్ కోచ్ జొనాథన్ ట్రాట్ సైగ చేశాడు. అప్పటి వరకు స్లిప్‌లో చక్కగా ఫీల్డింగ్ చేస్తున్న గుల్బదిన్ ‘అలా అయితే ఓకే’ అన్నట్లుగా ఒక్కసారిగా కండరాలు పట్టేశాయంటూ కుప్పకూలిపోయాడు. ఆ వెంటనే పిచ్‌పై కవర్లు వచ్చేశాయి. అయితే ఆ తర్వాత మళ్లీ చక్కగా మైదానంలోకి దిగిన గుల్బదిన్ తర్వాతి వికెట్ కూడా తీశాడు. దాంతో ఇదంతా నటన అంటూ అన్ని వైపుల నుంచి విమర్శలు వచ్చాయి. మ్యాచ్ తర్వాత రషీద్ మాత్రం తన ఆటగాడికి మద్దతుగా నిలిచాడు. నిజానికి అక్కడే మ్యాచ్ ముగిసి ఉంటే వివాదం జరిగేదేమో కానీ ఆట కొనసాగి ఆలౌట్ వరకు వెళ్లడంతో ఇది సమస్యగా మారలేదు.‘వెల్డన్’ అంతర్జాతీయ క్రికెట్లో అఫ్గానిస్తాన్ ప్రస్థానం అసాధారణంఅగ్రశ్రేణి జట్లకు దీటుగా ఎదిగిన వైనం‘మిమ్మల్ని నిరాశపర్చము, మీ నమ్మకాన్ని నిలబెడతాం’... టి20 వరల్డ్‌కప్ ప్రారంభానికి ముందు జరిగిన వెల్కమ్ పార్టీలో క్రికెట్ దిగ్గజం బ్రియాన్ లారాతో రషీద్ ఖాన్ అన్న మాట ఇది. ఎందుకంటే ఈ టోర్నీలో సెమీస్ చేరే నాలుగు జట్ల పేర్లు చెప్పమని మాజీలు, విశ్లేషకులతో అడిగితే ఒక్క లారా మాత్రమే అఫ్గానిస్తాన్ పేరు చెప్పాడు. వారి ఆటపై అతనికి ఉన్న నమ్మకాన్ని ఇది చూపించింది. రేపు ట్రినిడాడ్‌లోని బ్రియాన్ లారా స్టేడియంలోనే రషీద్ బృందం సెమీఫైనల్ మ్యాచ్ ఆడబోతోంది! గత కొన్నేళ్లుగా అటు వన్డే, ఇటు టి20 ఫార్మాట్లలో నిలకడైన ప్రదర్శన కనబరుస్తూ వచ్చిన అఫ్గానిస్తాన్ ఇప్పుడు ‘సంచలనాల’ జట్టు నుంచి సమర్థమైన జట్టుగా ఎదిగింది. ప్రస్తుతం ఆ దేశంలో నెలకొన్న పరిస్థితుల కారణంగా జట్టు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) కేంద్రంగానే తమ హోం మ్యాచ్‌లు ఆడుతోంది. ఆటగాళ్లంతా కూడా అక్కడే దాదాపుగా స్థిరపడ్డారు. 2023లో జరిగిన వన్డే వరల్డ్‌కప్‌లోనే అఫ్గానిస్తాన్ పదును ఏమిటో ప్రపంచానికి తెలిసింది. డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్, పాకిస్తాన్లను ఓడించిన టీమ్, ఆ్రస్టేలియాను కూడా ఒకదశలో 91/7తో ఓటమి దిశగా నెట్టింది. ఆసీస్ అదృష్టవశాత్తూ మ్యాక్స్‌వెల్ అద్భుత ఇన్నింగ్స్ జట్టును గెలిపించినా... ఇప్పుడు టి20 వరల్డ్‌కప్ లో నాటి పనిని అఫ్గాన్ పూర్తి చేసింది. –సాక్షి క్రీడా విభాగం10 అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ప్రపంచకప్ (వన్డే/టి20) టోర్నీల చరిత్రలో సెమీఫైనల్ దశకు చేరిన పదో జట్టుగా అఫ్గానిస్తాన్ గుర్తింపు పొందింది. ఈ జాబితాలో ఆస్ట్రేలియా (1975), ఇంగ్లండ్ (1975), న్యూజిలాండ్ (1975), వెస్టిండీస్ (1975), పాకిస్తాన్ (1979), భారత్ (1983), దక్షిణాఫ్రికా (1992), శ్రీలంక (1996), కెన్యా (2003) జట్లు ఉన్నాయి. 1 ప్రపంచకప్ టోర్నీల్లో బంగ్లాదేశ్‌పై అఫ్గానిస్తాన్ తొలిసారి విజయం అందుకుంది. గతంలో బంగ్లాదేశ్‌తో జరిగిన నాలుగు ప్రపంచకప్ మ్యాచ్‌ల్లో (టి20; 2014లో...వన్డే వరల్డ్‌కప్; 2015, 2019, 2023) అఫ్గానిస్తాన్ ఓడిపోయింది.9 అంతర్జాతీయ టి20 మ్యాచ్‌ల్లో ఇన్నింగ్స్‌లో నాలుగు అంతకన్నా ఎక్కువ వికెట్లు తీయడం రషీద్ ఖాన్కిది తొమ్మిదిసారి. షకీబ్ అల్ హసన్ (8 సార్లు) పేరిట ఉన్న రికార్డును రషీద్ బద్దలు కొట్టాడు.న్యూజిలాండ్, ఆ్రస్టేలియావంటి జట్లను ఓడించి సెమీస్ వరకు సాగిన మీ ప్రయాణం అద్భుతం. మీ శ్రమకు, పట్టుదలకు ఫలితమే ఈ విజయం. మిమ్మల్ని చూసి గర్విస్తున్నా. దీనిని ఇలాగే కొనసాగించండి. – సచిన్ టెండూల్కర్ మైదానంలో దృశ్యాలు చాలా గొప్పగా కనిపిస్తున్నాయి. అఫ్గాన్‌కు గొప్ప విజయమిది. తొలిసారి సెమీస్ చేరిన పఠాన్లలో భావోద్వేగాలు బలంగా కనిపిస్తున్నాయి. అత్యుత్తమ క్రికెట్ ప్రదర్శన ఇది. –యువరాజ్ సింగ్ -
అఫ్గనిస్తాన్‌ను ఓడిస్తే టైటిల్ సౌతాఫ్రికాదే: ఆసీస్ దిగ్గజం
టీ20 ప్రపంచకప్‌లో ముచ్చటగా మూడోసారి సెమీ ఫైనల్ చేరిన దక్షి ణాఫ్రికా.. ఈసారి గతంలో మాదిరి పొరపాట్లకు తావివ్వకూడదని పట్టుదలగా ఉంది. 2009, 2014లలో సెమీస్‌లోనే వెనుదిరిగి అపఖ్యాతిని మూటగట్టుకున్న ప్రొటిస్ జట్టు.. ఎలాగైనా ఫైనల్ చేరాలని పట్టుదలగా ఉంది. దర్జాగా సెమీస్లోకాగా తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా తమ జోరు ప్రదర్శించిన విషయం తెలిసిందే. డక్‌వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం మూడు వికెట్ల తేడాతో వెస్టిండీస్‌ను ఓడించి దర్జాగా సెమీస్‌లో అడుగుపెట్టింది. సూపర్–8 దశలో ఆడిన మూడూ గెలిచిన సఫారీ 6 పాయింట్ల తో గ్రూప్–2 టాపర్‌గా, 4 పాయింట్లతో ఇంగ్లండ్ రెండో జట్టుగా సెమీఫైనల్స్‌కు చేరాయి.మరోవైపు రెండుసార్లు టీ20 చాంపియన్, ఆతిథ్య వెస్టిండీస్ కథ ‘సూపర్–8’లోనే ముగిసింది. ముందుగా వెస్టిండీస్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 135 పరుగులే చేసింది. కైల్ మేయర్స్ (34 బంతుల్లో 35; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), రోస్టన్ చేజ్ (42 బంతుల్లో 52; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించారు.వర్షంతో 50 నిమిషాలు ఆటకు అంతరాయంరోవ్మన్ పావెల్ (1), రూథర్‌ఫోర్డ్ (0), రసెల్ (15) చేతులెత్తేయడంతో కరీబియన్ జట్టు ఓ మోస్తరు స్కోరుకే పరిమితమైంది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ తబ్రేజ్ షమ్సీ 3 వికెట్లు తీశాడు. 136 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా 2 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 15 పరుగులు చేసిన దశలో వర్షంతో 50 నిమిషాలు ఆటకు అంతరాయం కలిగింది.దాంతో దక్షిణాఫ్రికా లక్ష్యాన్ని డక్‌వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం 17 ఓవర్లలో 123 పరుగులుగా నిర్ణయించారు. ఆ జట్టు 16.1 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 124 పరుగులు చేసి నెగ్గింది. స్టబ్స్ (27 బంతుల్లో 29; 4 ఫోర్లు), క్లాసెన్ (10 బంతుల్లో 22; 3 ఫోర్లు, 1 సిక్స్), జాన్సెన్ (14 బంతుల్లో 21 నాటౌట్; 1 ఫోర్, 1 సిక్స్) లక్ష్యంవైపు తీసుకెళ్లారు. ఛేజ్ 3, రసెల్, జోసెఫ్ చెరో 2 వికెట్లు తీశారు.రషీద్ ఖాన్ బృందంతో అమీతుమీఇక ఈ విజయంతో టోర్నీలో ముందుకు సాగే అవకాశం దక్కించుకున్న సౌతాఫ్రికా.. గురువారం నాటి తొలి సెమీ ఫైనల్లో అఫ్గనిస్తాన్‌తో తలపడనుంది. ఊహించని రీతిలో బంగ్లాదేశ్‌ను ఓడించి తొలిసారి వరల్డ్‌కప్‌లో సెమీస్ చేరిన రషీద్ ఖాన్ బృందంతో అమీతుమీ తేల్చుకోనుంది. ట్రినిడాడ్‌లోని బ్రియన్ లారా స్టేడియం ఇందుకు వేదిక.అఫ్గనిస్తాన్‌ను ఓడిస్తే ఈసారి టైటిల్ వాళ్లదేఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్ బ్రాడ్ హాగ్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. టోర్నీ ఆరంభం నుంచి సౌతాఫ్రికా అద్బుతంగా ఆడిందన్న ఈ కంగారూ క్రికెటర్.. రీజా హెండ్రిక్స్, హెన్రిచ్ క్లాసెన్‌తో పాటు స్పిన్ దళం మ్యాజిక్ చేసిందని కొనియాడాడు.ముఖ్యంగా హెండ్రిక్స్ సూపర్‌గా ఆడుతున్నాడని.. అఫ్గనిస్తాన్‌తో మ్యాచ్‌లో అతడు అదరగొట్టి ఫైనల్‌కు చేర్చుతాడని విశ్వాసం వ్యక్తం చేశాడు. కెప్టెన్ ఐడెన్ మార్క్రమ్ కెప్టెన్సీ నైపుణ్యాలు అమోఘమన్న బ్రాడ్ హాగ్.. ప్రొటిస్ జట్టు అన్ని విభాగాల్లో సమతూకంగా ఉందన్నాడు.సౌతాఫ్రికా సెమీస్‌లో గనుక అఫ్గనిస్తాన్‌ను ఓడిస్తే ఈసారి టైటిల్ వాళ్లదేనంటూ బ్రాడ్ హాగ్ జోస్యం చెప్పాడు. కాగా తొలి సెమీస్‌లో సౌతాఫ్రికా- బంగ్లాదేశ్ తలపడనుండగా.. రెండో సెమీస్ ఫైనల్లో టీమిండియా- ఇంగ్లండ్ తాడోపేడో తేల్చుకోనున్నాయి.చదవండి: ట్రోఫీ గెలిచే అర్హత అతడికే ఉంది: షోయబ్ అక్తర్ -
ఆయనొక్కడే మమ్మల్ని నమ్మాడు: రషీద్ ఖాన్ భావోద్వేగం
అఫ్గనిస్తాన్ క్రికెట్ జట్టు అద్భుతం చేసింది. తొలిసారి ప్రపంచకప్ సెమీ ఫైనల్లో అడుగుపెట్టింది. టీ20 వరల్డ్‌కప్-2024 సూపర్-8 మ్యాచ్‌లో భాగంగా బంగ్లాదేశ్‌ను చిత్తు చేసి ఈ మేరకు చరిత్ర సృష్టించింది. View this post on Instagram A post shared by ICC (@icc)అంతేకాదు అఫ్గన్ దెబ్బకు.. టైటిల్ ఫేవరెట్లలో ఒకటైన ఆస్ట్రేలియా టోర్నీ నుంచే నిష్క్రమించింది. దీంతో అఫ్గనిస్తాన్‌లో సంబరాలు అంబరాన్నంటాయి. ఆటగాళ్లు సైతం తీవ్ర భావోద్వేగంలో మునిగిపోయారు. View this post on Instagram A post shared by ICC (@icc)నమ్మశక్యం కాని రీతిలోఇక చారిత్రాత్మక విజయానంతరం అఫ్గనిస్తాన్ కెప్టెన్ రషీద్ ఖాన్ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సెమీస్ చేరడం ఓ కలలాగా ఉందని సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యాడు. నమ్మశక్యం కాని రీతిలో న్యూజిలాండ్‌ను ఓడించామని.. ఇప్పుడిలా ఇక్కడిదాకా చేరుకున్నామని హర్షం వ్యక్తం చేశాడు.ఈ సంతోష సమయంలో తనకు అసలు ఏం మాట్లాడాలో కూడా అర్థం కావడం లేదని రషీద్ ఖాన్ ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యాడు. తమ జట్టును చూస్తే తనకు గర్వంగా ఉందని పేర్కొన్నాడు. ప్రతి ఒక్కరు తమ పాత్రను సమర్థవంతంగా పోషించారని.. టీ20 ఫార్మాట్లో ముఖ్యంగా తమ బౌలర్లు అద్భుతంగా ఆడుతున్నారని కొనియాడాడు.ఇలా తొలిసారి సెమీ ఫైనల్లోఅండర్-19 వరల్డ్‌కప్‌లో సెమీస్ చేరిన ఘనత అఫ్గనిస్తాన్‌కు ఉందని.. అయితే, మెగా టోర్నీలో ఇలా తొలిసారి సెమీ ఫైనల్లో అడుగుపెట్టిన అనుభూతిని మాటల్లో వర్ణించలేనని పేర్కొన్నాడు.అదే విధంగా.. తమపై నమ్మకం ఉంచిన ఏకైక వ్యక్తి బ్రియన్ లారా అంటూ ఈ సందర్భంగా రషీద్ ఖాన్ వెస్టిండీస్ దిగ్గజానికి కృతజ్ఞతలు తెలిపాడు. ఆయన నమ్మకాన్ని నిలబెడతామని చెప్పానని.. అందుకు తగ్గట్లుగానే తమ జట్టు విజయం సాధించిందని పేర్కొన్నాడు. View this post on Instagram A post shared by ICC (@icc)మేము సెమీ ఫైనల్ చేరతామని చెప్పిన ఏకైక వ్యక్తి‘‘మేము సెమీ ఫైనల్ చేరతామని చెప్పిన ఏకైక వ్యక్తి బ్రియన్ లారా. ఆయన మాటలు నిజమని మేము రుజువు చేశాం. వెల్కమ్ పార్టీ సమయంలో లారాను కలిసినపుడు.. మీ నమ్మకం నిజం చేస్తామని చెప్పాను’’ అంటూ రషీద్ ఉద్వేగానికి లోనయ్యాడు.కాగా టీ20 ప్రపంచకప్-2024 సెమీ ఫైనలిస్టు అంచనాల నేపథ్యంలో చాలా మంది మాజీ క్రికెటర్లు.. టీమిండియాతో పాటు సౌతాఫ్రికా, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా లేదంటే న్యూజిలాండ్ పేర్లు చెప్పారు. అయితే, లారా మాత్రం ఈసారి అఫ్గనిస్తాన్ కచ్చితంగా టాప్-4లో చేరుతుందని అంచనా వేశాడు. ఇప్పుడదే నిజమైంది.కాగా గ్రూప్ దశలో గ్రూప్-సిలో ఉన్న అఫ్గనిస్తాన్ నాలుగింట మూడు విజయాలతో సూపర్-8లో అడుగుపెట్టింది. ఇక ఇందులో గ్రూప్-1లో భాగమైన రషీద్ ఖాన్ బృందం.. ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్‌లను ఓడించి సెమీస్‌కు చేరుకుంది.చదవండి: T20 World Cup 2024 IND VS AUS: సెంచరీ గురించి ఆలోచనే లేదు.. రోహిత్ -
T20 WC 2024: ఆస్ట్రేలియాపై ఘన విజయం.. సెమీస్‌కు టీమిండియా
టీ20 వరల్డ్‌కప్-2024 సెమీఫైనల్లో భారత జట్టు అడుగుపెట్టింది. ఈ మెగా టోర్నీ సూపర్-8లో భాగంగా సెయింట్ లూసియా వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో 24 పరుగుల తేడాతో విజయం సాధించిన భారత్.. గ్రూపు-1 నుంచి తమ సెమీస్ బెర్త్‌ను ఖారారు చేసుకుంది. 206 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 181 పరుగులు మాత్రమే చేయగల్గింది. ఓ దశలో ట్రావిస్ హెడ్ క్రీజులో ఉన్నంతసేపు ఆసీస్‌దే విజయమని అంతా భావించారు. కానీ 17 ఓవర్ వేసిన బుమ్రా అద్బుతమైన బంతితో హెడ్‌ను బోల్తా కొట్టించడంతో మ్యాచ్ స్వరూపామే మారిపోయింది. అంతకుముందు ఓవర్ అర్ష్‌దీప్ కూడా అద్బుతంగా బౌలింగ్ చేశాడు. ఇక ఆసీస్ బ్యాటర్లలో ట్రావిస్ హెడ్(76) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. మార్ష్(37) పరుగులతో పర్వాలేదన్పించాడు.భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్ మూడు వికెట్లు పడగొట్టగా.. కుల్దీప్ యాదవ్ రెండు, బుమ్రా, అక్షర్ పటేల్ తలా ఒక్క వికెట్ సాధించారు. ఇక టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో కెప్టెన్ రోహిత్ శర్మ(92) టాప్ స్కోరర్‌గా నిలవగా.. సూర్యకుమార్ యాదవ్(31), శివమ్ దూబే(28) పరుగులతో రాణించారు. ఆసీస్ బౌలర్లలో స్టార్క్, స్టోయినిష్ తలా రెండు వికెట్లు సాధించగా.. హాజిల్ వుడ్ తలా వికెట్ పడగొట్టారు. ఇక ఈ మ్యాచ్‌లో ఓటమి పాలైన ఆస్ట్రేలియా.. అఫ్గానిస్తాన్-బంగ్లాదేశ్ ఫలితం కోస ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. బంగ్లాదేశ్‌పై అఫ్గానిస్తాన్ గెలిస్తే ఆసీస్ ఇంటిముఖం పడుతోంది. గ్రూపు-1 నుంచి రెండో జట్టుగా అఫ్గానిస్తాన్ సెమీస్‌కు చేరుతోంది. -
T20 World Cup 2024: క్రిస్ జోర్డాన్ హ్యాట్రిక్.. సెమీస్‌లో ఇంగ్లండ్
బ్రిడ్జ్‌టౌన్: ఆల్‌రౌండ్ ప్రదర్శనతో చెలరేగిపోయిన డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్ జట్టు టి20 ప్రపంచకప్‌లో సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. అమెరికా జట్టుతో ఆదివారం జరిగిన గ్రూప్–2 ‘సూపర్–8’ మ్యాచ్‌లో ఇంగ్లండ్ 10 వికెట్ల తేడాతో గెలిచింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన అమెరికా 18.5 ఓవర్లలో 115 పరుగులకు ఆలౌటైంది. నితీశ్ (24 బంతుల్లో 30; 1 ఫోర్, 2 సిక్స్‌లు), కోరె అండర్సన్ (28 బంతుల్లో 29; 1 సిక్స్) రాణించారు. ఇంగ్లండ్ బౌలర్ క్రిస్ జోర్డాన్ ‘హ్యాట్రిక్’ నమోదు చేశాడు. జోర్డాన్ 2.5 ఓవర్లలో కేవలం 10 పరుగులిచ్చి 4 వికెట్లు తీశాడు. ఇన్నింగ్స్ 19వ ఓవర్లో జోర్డాన్ 5 బంతుల్లో 4 వికెట్లు పడగొట్టాడు. 19వ ఓవర్ తొలి బంతికి అండర్సన్‌ను అవుట్ చేసిన జోర్డాన్... మూడో బంతికి అలీఖాన్‌ను, నాలుగో బంతికి కెనిజిగెను, ఐదో బంతికి నేత్రావల్కర్‌ను అవుట్ చేసి ‘హ్యాట్రిక్’ పూర్తి చేసుకున్నాడు. బట్లర్ మెరుపులు 116 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ 9.4 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 117 పరుగులు చేసి గెలిచింది. కెప్టెన్ జోస్ బట్లర్ (38 బంతుల్లో 83 నాటౌట్; 6 ఫోర్లు, 7 సిక్స్‌లు), ఫిల్ సాల్ట్ (21 బంతుల్లో 25 నాటౌట్; 2 ఫోర్లు) మెరిపించారు. అమెరికా బౌలర్ హర్మీత్ సింగ్ వేసిన తొమ్మిదో ఓవర్లో బట్లర్ ఏకంగా 5 సిక్స్‌లు కొట్టాడు. ఈ గెలుపుతో ఇంగ్లండ్ 4 పాయింట్లతో సెమీఫైనల్ చేరుకుంది. నేడు దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ జట్ల మధ్య జరిగే మ్యాచ్‌లో నెగ్గిన జట్టు గ్రూప్–2 నుంచి రెండో జట్టుగా సెమీఫైనల్ చేరుకుంటుంది. -
T20 World Cup 2024: ఇలా జరిగిందా.. సౌతాఫ్రికా పని గోవిందా..!
టీ20 ప్రపంచకప్ 2024లో అజేయ జట్టుగా ఉన్న సౌతాఫ్రికాకు ఏ జట్టుకు ఎదురుకాని కష్టం వచ్చి పడింది. ఆ జట్టు ఒకే ఒక్క మ్యాచ్‌లో ఓడితే ఏకంగా టోర్నీ నుంచే నిష్క్రమించే ప్రమాదంలో పడుతుంది. ప్రస్తుత ప్రపంచకప్‌లో సౌతాఫ్రికా ఇప్పటివరకు ఆడిన 6 మ్యాచ్‌ల్లో గెలిచినా సెమీస్ అవకాశాలు ఇంకా సంక్లిష్టంగానే ఉన్నాయి. ఆ జట్టు సూపర్-8లో తమ చివరి మ్యాచ్‌లో ఓడితే ఏకంగా టోర్నీ నుంచి నిష్క్రమించే ప్రమాదం ఉంది.గ్రూప్ దశలో అన్ని మ్యాచ్‌లు.. సూపర్-8లో రెండు మ్యాచ్‌లు గెలిచినా కేవలం ఒక్క ఓటమే సౌతాఫ్రికా కొంపముంచుతుంది. ఆ జట్టుకు ఇలాంటి అనుభవాలు కొత్త కానప్పటికీ.. ఈసారి మాత్రం జాగ్రత్తగా ఉండకపోతే మాత్రం మంచి జట్టు కలిగి ఉండి కూడా ప్రపంచకప్ గెలిచే సువర్ణావకాశాన్ని చేజార్చుకుంటుంది.ఇలా జరిగిందా..గ్రూప్-2లో భాగంగా సౌతాఫ్రికా రేపు (జూన్ 24) ఉదయం 6 గంటలకు (భారతకాలమానం ప్రకారం) జరుగబోయే మ్యాచ్‌లో ఆతిథ్య వెస్టిండీస్‌తో తలపడాల్సి ఉంది. ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా ఓడి.. దీనికి ముందు జరిగే మ్యాచ్‌లో యూఎస్ఏపై ఇంగ్లండ్ 10 కంటే ఎక్కువ పరుగులు లేదా ఓవర్ మార్జిన్ తేడాతో గెలిస్తే.. వెస్టిండీస్, ఇంగ్లండ్ జట్లు సెమీస్‌కు చేరతాయి.అదెలా అంటే.. యూఎస్ఏపై ఇంగ్లండ్, సౌతాఫ్రికాపై వెస్టిండీస్ గెలిస్తే.. అప్పుడు మూడు జట్ల (వెస్టిండీస్, ఇంగ్లండ్, సౌతాఫ్రికా) ఖాతాల్లో తలో నాలుగేసి పాయింట్లు ఉంటాయి. అప్పుడు నెట్ రన్‌రేట్ ఆధారంగా వెస్టిండీస్, ఇంగ్లండ్ జట్లు సెమీస్‌కు చేరతాయి. సౌతాఫ్రికా ఇంటిముఖం పడుతుంది. ఇలా జరగకుండా ఉండాలంటే ఇంగ్లండ్‌పై యూఎస్ఏ అయినా గెలవాలి లేదా విండీస్‌పై సౌతాఫ్రికా అయినా గెలవాలి. -
T20 World Cup 2024: ఇలా జరిగితే ఆసీస్ ఇంటికే..!
టీ20 వరల్డ్‌కప్ 2024 సూపర్-8 దశలో పెను సంచనలం నమోదైన విషయం తెలిసిందే. గ్రూప్-1లో భాగంగా ఇవాళ (జూన్ 23) జరిగిన మ్యాచ్‌లో అండర్ డాగ్ ఆఫ్ఘనిస్తాన్.. మాజీ ఛాంపియన్ ఆస్ట్రేలియాకు ఊహించని షాకిచ్చింది. ఈ మ్యాచ్‌లో ఓటమితో ఆస్ట్రేలియా సెమీస్ అవకాశాలను సంక్లిష్టం చేసుకోగా.. ఆడిన రెండు మ్యాచ్‌ల్లో ఒకటి గెలిచి, ఒకదాంట్లో ఓడిన (భారత్ చేతిలో) ఆఫ్ఘనిస్తాన్ సెమీస్ అవకాశాలను మెరుగుపర్చుకుంది.ఇలా జరిగితే ఆసీస్ ఇంటికే..!భారత్‌తో జరుగబోయే మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఓడి.. ఆతర్వాత జరుగబోయే మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై ఆఫ్ఘనిస్తాన్ విజయం సాధిస్తే.. ఆస్ట్రేలియా ఇంటికి, ఆఫ్ఘనిస్తాన్ సెమీస్‌కు చేరుతాయి.ఇలా జరిగినా ఆసీస్ ఇంటికే..!ఒకవేళ భారత్‌తో రేపు జరిగే మ్యాచ్‌లో ఆసీస్ ఓ మోస్తరు తేడాతో గెలుపొందినా సెమీస్ చేరుతుందన్న నమ్మకం లేదు. ఎందుకంటే.. తదుపరి బంగ్లాదేశ్‌తో జరిగే మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్ భారీ తేడాతో గెలిస్తే.. అప్పుడు భారత్, ఆసీస్, ఆఫ్ఘన్ ఖాతాలో చెరి నాలుగు పాయింట్లు ఉంటాయి. నెట్ రన్‌రేట్ ఆధారంగా భారత్, ఆఫ్ఘనిస్తాన్ సెమీస్‌కు చేరుకుంటాయి. ప్రస్తుతం భారత్ నెట్ రన్ రేట్ (2.425) మిగతా జట్లకంటే మెరుగ్గా ఉంది కాబట్టి.. ఆస్ట్రేలియా చేతిలో ఓడినా టీమిండియా సెమీస్ అవకాశాలకు ఎలాంటి ఢోకా ఉండదు. బంగ్లాదేశ్‌పై భారీ విజయం సాధిస్తే అప్పుడు భారత్‌తో పాటు ఆఫ్ఘన్ సెమీస్‌కు చేరుతుంది. ఆసీస్ సెమీస్‌కు చేరాలంటే ఇలా జరగాలి..గ్రూప్-1 నుంచి ఆసీస్ సెమీస్‌కు చేరాలంటే రేపు జరుగబోయే మ్యాచ్‌లో భారత్‌ను ఓడించాలి. అలాగే బంగ్లాదేశ్ చేతిలో ఆఫ్ఘనిస్తాన్ ఓడిపోవాలి. ఇలా జరిగితే భారత్, ఆసీస్ సెమీస్‌కు చేరుకుంటాయి. ఆఫ్ఘనిస్తాన్ ఇంటి ముఖం పడుతుంది. ఆడిన రెండు మ్యాచ్‌ల్లో ఓడిన బంగ్లాదేశ్ సెమీస్‌కు చేరడం దాదాపుగా అసాధ్యమనే చెప్పాలి. అయితే టెక్నికల్‌గా ఆ జట్టుకు కూడా ఇంకా సెమీస్ అవకాశాలు ఉన్నాయి (ఆస్ట్రేలియాపై భారత్.. ఆఫ్ఘనిస్తాన్పై బంగ్లాదేశ్ భారీ తేడాలతో గెలవాలి). -
T20 World Cup 2024: సూపర్-8లో గ్రూప్-2 బెర్త్‌లు ఖరారు
టీ20 వరల్డ్‌కప్ 2024 గ్రూప్-2కు సంబంధించిన సూపర్-8 బెర్త్‌లు ఖరారయ్యాయి. నమీబియాపై ఇంగ్లండ్.. స్కాట్లాండ్పై ఆస్ట్రేలియా విజయాలు సాధించడంతో గ్రూప్-బిలో రెండో బెర్త్ ఖరారైంది. ఈ గ్రూప్ నుంచి నెట్ రేట్ ఆధారంగా ఇంగ్లండ్ సూపర్-8 రెండో బెర్త్ ఖరారు చేసుకుగా.. ఆసీస్ ఇదివరకే గ్రూప్-బి నుంచి సూపర్-8కు అర్హత సాధించింది.సూపర్-8 గ్రూప్ 2లో గ్రూప్-ఏ నుంచి యూఎస్ఏ (A2).. గ్రూప్-బి నుంచి ఇంగ్లండ్ (B2).. గ్రూప్-సి నుంచి వెస్టిండీస్ (C2).. గ్రూప్-డి నుంచి సౌతాఫ్రికా (D1) జట్లు ఉన్నాయి. గ్రూప్-2లోని ఈ నాలుగు జట్లు మిగతా మూడు జట్లతో తలో మ్యాచ్ ఆడతాయి. అన్ని మ్యాచ్‌లు ముగిశాక మొదటి రెండు స్థానాల్లో ఉండే జట్లు సెమీస్‌కు అర్హత సాధిస్తాయి.సూపర్-8లో గ్రూప్-2 మ్యాచ్‌లు..జూన్ 19- యూఎస్ఏ వర్సెస్ సౌతాఫ్రికా (ఆంటిగ్వా)జూన్ 19- ఇంగ్లండ్ వర్సెస్ వెస్టిండీస్ (సెయింట్ లూసియా)జూన్ 21- ఇంగ్లండ్ వర్సెస్ సౌతాఫ్రికా (సెయింట్ లూసియా)జూన్ 21- యూఎస్ఏ వర్సెస్ వెస్టిండీస్ (బార్బడోస్)జూన్ 23- యూఎస్ఏ వర్సెస్ ఇంగ్లండ్ (బార్బడోస్)జూన్ 23- వెస్టిండీస్ వర్సెస్ సౌతాఫ్రికా (ఆంటిగ్వా)ఇదిలా ఉంటే, సూపర్-8 గ్రూప్-1కు సంబంధించిన బెర్త్‌లు కూడా దాదాపుగా ఖరారయ్యాయి. గ్రూప్-1లో గ్రూప్-ఏ నుంచి భారత్ (A1).. గ్రూప్-బి నుంచి ఆస్ట్రేలియా (B1).. గ్రూప్-సి నుంచి ఆఫ్ఘనిస్తాన్ (C1).. గ్రూప్-డి నుంచి బంగ్లాదేశ్ లేదా నెదర్లాండ్స్ (D2) జట్లు ఉంటాయి. ఇవాళ (జూన్ 16) జరిగే గ్రూప్-డి మ్యాచ్‌లో నేపాల్‌పై విజయం సాధిస్తే బంగ్లాదేశ్ సూపర్-8కు (గ్రూప్-1) అర్హత సాధిస్తుంది.సూపర్-8లో గ్రూప్-1 మ్యాచ్‌లు..జూన్ 20- ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ ఇండియా (బార్బడోస్)జూన్ 20- ఆస్ట్రేలియా వర్సెస్ D2 (బంగ్లాదేశ్ లేదా నెదర్లాండ్స్) (ఆంటిగ్వా)జూన్ 22- ఇండియా వర్సెస్ D2 (బంగ్లాదేశ్ లేదా నెదర్లాండ్స్) (ఆంటిగ్వా)జూన్ 22- ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ ఆస్ట్రేలియా (సెయింట్ విన్సెంట్)జూన్ 24- ఆస్ట్రేలియా వర్సెస్ ఇండియా (సెయింట్ లూసియా)జూన్ 24- ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ D2 (బంగ్లాదేశ్ లేదా నెదర్లాండ్స్) (సెయింట్ విన్సెంట్) -
టీ20 వరల్డ్‌కప్ 2024.. ఐసీసీ కీలక నిర్ణయం!? అలా అయితే కష్టమే
ఐపీఎల్-2024 ముగిసిన వారం రోజులకే మరో క్రికెట్ మహాసంగ్రామానికి తెరలేవనుంది. జూన్ 1 నంచి అమెరికా, వెస్టిండీస్‌ల వేదికగా టీ20 వరల్డ్‌కప్-2024 ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో డల్లాస్ వేదికగా అమెరికా, కెనడా జట్లు తలపడనున్నాయి.అయితే ఈ మెగా ఈవెంట్‌కు సబంధించి ఓ ఆసక్తికర వార్త తెరపైకి వచ్చింది. ఈ మెగా టోర్నీలో సెకెండ్ సెమీఫైనల్‌కు రిజర్వ్ డే ఉండదని ప్రముఖ క్రికెట్ వెబ్సైట్ క్రిక్‌బజ్ తమ రిపోర్ట్‌లో పేర్కొంది. సాధరణంగా ఐసీసీ ఈవెంట్లలో నాకౌట్ గేమ్‌లకు రిజర్వ్ డే కచ్చితంగా ఉంటుంది. కానీ ఈ ఏడాది టీ20 వరల్డ్‌కప్ షెడ్యూల్ ప్రకారం.. రెండో సెమీఫైనల్‌కు, ఫైనల్ పోరుకు మధ్య కేవలం ఒక రోజు మాత్రమే గ్యాప్ ఉంది. ఈ క్రమంలోనే ఐసీసీ సెకెండ్ సెమీఫైనల్‌కు రిజర్వ్‌డేను కెటాయించలేదని క్రిక్‌బజ్ తెలిపింది. అయితే రిజర్వ్ డే బదలుగా 250 నిమిషాల అదనపు సమయాన్ని ఐసీసీ, వెండీస్ క్రికెట్ బోర్డులు కెటాయించినట్లు తెలుస్తోంది. గయానా వేదికగా రెండో సెమీఫైనల్ జరగనుంది. ఒకవేళ ఈ మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించే నిర్ణీత సమయంలో మ్యాచ్ ఫినిష్ కాకపోతే.. మరో నాలుగు గంటల సమయాన్ని పరిగణలోకి తీసుకుంటారు. అంటే అంపైర్లు మ్యాచ్‌ను ముగించడానికి దాదాపు ఎనిమిది గంటల సమయం ఉంటుంది. -
సెమీస్‌లో కిడాంబి శ్రీకాంత్.. పీవీ సింధుకు చుక్కెదురు
Swiss Open Super 300 badminton tournament- బాసెల్ (స్విట్జర్లాండ్): స్విస్ ఓపెన్ సూపర్–300 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత స్టార్ షట్లర్ కిడాంబి శ్రీకాంత్ సెమీఫైనల్లోకి దూసుకెళ్లాడు. క్వార్టర్ ఫైనల్లో అతను 21–10, 21–14తో చియా హా లీ (చైనీస్ తైపీ)ని వరుస గేముల్లో కంగుతినిపించాడు. తద్వారా పదహారు నెలల కాలం తర్వాత తొలిసారి ఓ టోర్నీ సెమీస్‌లో అడుగుపెట్టాడు. ఇక శనివారం జరుగనున్న సెమీ ఫైనల్లో చైనీస్ తైపీ, వరల్డ్ నంబర్ 22 లిన్ చున్ యీని కిడాంబి శ్రీకాంత్ ఎదుర్కోనున్నాడు. అంతకు ముందు పురుషుల ప్రిక్వార్టర్ ఫైనల్లో అన్‌సీడెడ్ శ్రీకాంత్ 21–16, 21–15తో మలేసియన్ టాప్ సీడ్ ప్లేయర్ లీ జీ జియాను వరుస గేముల్లో కంగు తినిపించిన విషయం తెలిసిందే. పీవీ సింధుకు చుక్కెదురు మరోవైపు.. రెండు ఒలింపిక్ పతకాల విజేత పూసర్ల వెంకట సింధు, లక్ష్యసేన్‌లకు ప్రి క్వార్టర్ ఫైనల్లోనే చుక్కెదురైంది. ఏడో సీడ్ లక్ష్యసేన్ 17–21, 15–21తో చియా హా లీ (చైనీస్ తైపీ) జోరుకు నిలువలేకపోయాడు. మహిళల ప్రిక్వార్టర్స్‌లో నాలుగో సీడ్ సింధు 21–16, 19–21, 16–21తో జూనియర్ ప్రపంచ చాంపియన్, 17 ఏళ్ల టొమొకా మియజకి (జపాన్) చేతిలో పరాజయం చవిచూడగా, మహిళల డబుల్స్‌లో 8వ సీడ్ గాయత్రి–ట్రెసా జాలీ జంట 14–21, 15–21తో సెటియాన–ఎంజెలా యూ (ఆస్ట్రేలియా) జోడీ చేతిలో కంగుతింది. మిక్స్డ్ డబుల్స్ ప్రిక్వార్టర్స్‌లో సిక్కిరెడ్డి–సుమిత్ రెడ్డి జంట 11–21, 14–21తో రాబిన్ టాబెలింగ్–సెలెనా పేక్ (నెదర్లాండ్స్) జోడీ చేతిలో ఓడింది. -
మరీ ఇంత స్వార్థమా?.. కోచ్ ఇలా చేయడం తప్పే: డీకే ఫైర్
DK Fumes As Tamil Nadu Coach 'Throws Captain Under The Bus': తమిళనాడు క్రికెట్ కోచ్ సులక్షణ్ కులకర్ణి తీరుపై టీమిండియా వెటరన్ క్రికెటర్ దినేశ్ కార్తిక్ మండిపడ్డాడు. జట్టు ఓటమికి కెప్టెన్‌ను బాధ్యుడిని చేసేలా స్వార్థపూరితంగా మాట్లాడటం కోచ్ స్థాయికి తగదని చురకలు అంటించాడు. కాగా రంజీ ట్రోఫీ 2023-24లో భాగంగా ముంబైతో జరిగిన సెమీ ఫైనల్లో తమిళనాడు ఓటమిపాలై.. టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఇన్నింగ్స్ 70 పరుగుల భారీ తేడాతో ఓడి ఇంటిబాటపట్టింది. ఈ నేపథ్యంలో తమిళనాడు కోచ్ సులక్షణ్ కులకర్ణి స్పందిస్తూ.. కెప్టెన్ ఆర్.సాయి కిషోర్ నిర్ణయాలను తప్పుబట్టాడు. ఓ ముంబైకర్‌గా నాకన్నీతెలుసు.. కానీ టాస్ గెలిచినప్పుడు తొలుత బ్యాటింగ్ ఎంచుకుని పొరపాటు చేశాడని విమర్శించాడు. ఈ మేరకు.. ‘‘ఆరోజు వికెట్‌ను నేను గమనించాను. కోచ్‌గా, మంబైకర్(ముంబైకి చెందినవాడు)గా అక్కడి పిచ్ పరిస్థితులపై నాకు పూర్తి అవగాహన ఉంది. టాస్ గెలిచినపుడు బౌలింగ్ చేయించాలని అనుకుంటే.. మా కెప్టెన్ మాత్రం తనకు నచ్చినట్లుగా నిర్ణయం తీసుకున్నాడు. ఏదేమైనా బాస్ అతడే. అతడి నిర్ణయమే ఫైనల్. కేవలం ఇన్పుట్స్, ఫీడ్‌బ్యాక్ ఇవ్వడం వరకే నేను పరిమితం’’ అని సులక్షణ్ ఈఎస్పీఎన్క్రిక్ఇన్ఫోతో పేర్కొన్నాడు. నిజానికి తాము మొదటి రోజు ఆట టాస్ సమయంలోనే ఓడిపోయామంటూ సాయి కిషోర్‌ను ఓటమికి బాధ్యుడిని చేసేలా వ్యాఖ్యలు చేశాడు. ఈ విషయంపై దినేశ్ కార్తిక్ ఎక్స్ వేదికగా స్పందించాడు. కోచ్‌కు ఇంత స్వార్థం పనికిరాదు.. ‘‘ఇలా మాట్లాడటం కచ్చితంగా తప్పే. కోచ్ నుంచి ఇలాంటి మాటలు వినాల్సి రావడం నన్ను నిరాశకు గురిచేసింది. ఏడేళ్ల తర్వాత తొలిసారి జట్టును రంజీ సెమీస్ వరకు తీసుకువచ్చిన కెప్టెన్‌ను అభినందించాల్సింది పోయి.. ఇలా కోచే స్వయంగా.. బహిరంగంగా అతడిని విమర్శించడం సరికాదు’’ అని తమిళనాడు వికెట్ కీపర్ బ్యాటర్ డీకే ఆగ్రహం వ్యక్తం చేశాడు. This is soo WRONG This is so disappointing from the coach ..instead of backing the captain who has brought the team to the semis after 7 yrs and thinking it's a start for good things to happen, the coach has absolutely thrown his captain and team under the bus 👎🏽👎🏽👎🏽👎🏽👎🏽 https://t.co/Ii61X7Ajqs — DK (@DineshKarthik) March 5, 2024 తమిళనాడు ఆట ముగిసిందిలా.. ఫైనల్లో ముంబై రంజీ ట్రోఫీలో తమ ఆధిపత్యాన్ని చాటుకుంటూ 41 సార్లు చాంపియన్ ముంబై జట్టు 47వ సారి ఫైనల్లోకి దూసుకెళ్లింది. సొంతమైదానంలో తమిళనాడుతో జరిగిన తొలి సెమీఫైనల్లో ముంబై ఇన్నింగ్స్ 70 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. ఓవర్‌నైట్ స్కోరు 353/9తో మూడో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ముంబై 106.5 ఓవర్లలో 378 పరుగులకు ఆలౌటైంది. తమిళనాడు బౌలర్లలో కెప్టెన్ సాయికిశోర్ 6 వికెట్లు తీసుకున్నాడు. అనంతరం 232 పరుగులతో వెనుకబడి రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన తమిళనాడు షమ్స్ ములానీ (4/53), శార్దుల్ ఠాకూర్ (2/16), మోహిత్ (2/26), తనుష్ (2/18) ధాటికి 162 పరుగులకే కుప్పకూలి ఓడిపోయింది. శార్దుల్ ఠాకూర్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. చదవండి: గోపీచంద్ అకాడమీకి బైబై..!.. అమెరికాకు పయనం! -
తమిళనాడు 146 ఆలౌట్
ముంబై: రంజీ ట్రోఫీ సెమీ ఫైనల్లో ముంబై సమష్టి బౌలింగ్ ప్రదర్శనతో తమిళనాడును పడగొట్టింది. మ్యాచ్ తొలి రోజు టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన తమిళనాడు తొలి ఇన్నింగ్స్‌లో 64.1 ఓవర్లలో 146 పరుగులకే ఆలౌటైంది. విజయ్ శంకర్ (44), వాషింగ్టన్ సుందర్ (43) కొంత పోరాడినా...మిగతావారంతా విఫలమయ్యారు. ముంబై బౌలర్లలో తుషార్ పాండే 24 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టగా... తనుష్ కొటియాన్, ముషీర్ ఖాన్, శార్దుల్ ఠాకూర్ తలా 2 వికెట్లు తీశారు. అనంతరం ముంబై బ్యాటింగ్ కూడా తడబడింది. శనివారం ఆట ముగిసే సమయానికి ముంబై తమ తొలి ఇన్నింగ్స్‌లో 2 వికెట్లు కోల్పోయి 45 పరుగులు చేసింది. పృథ్వీ షా (5) విఫలం కాగా...ముïÙర్ ఖాన్ (24 బ్యాటింగ్) క్రీజ్‌లో ఉన్నాడు. రంజీ ట్రోఫీ మ్యాచ్‌లో ఆడని కారణంగా బీసీసీఐ కాంట్రాక్ట్‌ను కోల్పోయిన భారత బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ ఈ సెమీ ఫైనల్ మ్యాచ్‌లో బరిలోకి దిగాడు. విదర్భ 170 ఆలౌట్... నాగ్‌పూర్: మధ్యప్రదేశ్ పేస్ బౌలర్ అవేశ్ ఖాన్ (4/49) పదునైన బౌలింగ్ ముందు విదర్భ బ్యాటర్లు విఫలమయ్యారు. రంజీ ట్రోఫీ రెండో సెమీస్ మ్యాచ్‌లో విదర్భ తమ తొలి ఇన్నింగ్స్‌లో 56.4 ఓవర్లలో 170 పరుగులకు ఆలౌటైంది. కరుణ్ నాయర్ (63) అర్ధ సెంచరీ సాధించగా, అథర్వ తైడే (39) ఫర్వాలేదనిపించాడు. ఒక దశలో 101/2తో మెరుగైన స్థితిలో కనిపించిన విదర్భ 36 పరుగుల వ్యవధిలో తర్వాతి 6 వికెట్లు కోల్పోయింది. వెంకటేశ్ అయ్యర్, కుల్వంత్ ఖెజ్రోలియా చెరో 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం ఆట ముగిసే సరికి మధ్యప్రదేశ్ వికెట్ నష్టానికి 47 పరుగులు చేసింది. -
Ranji Trophy 2024: కర్ణాటకకు షాకిచ్చిన విదర్భ.. సెమీస్‌కు ముంబై
భారత దేశవాలీ టోర్నీ రంజీ ట్రోఫీ చివరి దశకు చేరింది. ఈ సీజన్లో తమిళనాడు, మధ్యప్రదేశ్, విదర్భ, ముంబై జట్లు సెమీస్‌కు చేరుకున్నాయి. సౌరాష్ట్రను ఓడించి తమిళనాడు.. ఆంధ్రప్రదేశ్‌పై నెగ్గి మధ్యప్రదేశ్.. కర్ణాటకను చితు చేసి విదర్భ సెమీస్ బెర్త్‌లు ఖరారు చేసుకోగా.. బరోడాపై తొలి ఇన్నింగ్స్ లీడ్ ఆధారంగా ముంబై ఫైనల్ ఫోర్కు అర్హత సాధించింది. కర్ణాటకకు షాకిచ్చిన విదర్భ.. విదర్భ తొలి ఇన్నింగ్స్ 460 (అథర్వ్ తైడే 109, కావేరప్ప 4/99) కర్ణాటక తొలి ఇన్నింగ్స్ 286 (నికిన్ జోస్ 82, యశ్ ఠాకూర్ 3/48) విదర్భ రెండో ఇన్నింగ్స్ 196 (దృవ్ షోరే 57, కావేరప్ప 6/61) కర్ణాటక రెండో ఇన్నింగ్స్ 243 (మయాంక్ అగర్వాల్ 70, హర్ష్ దూబే 4/65) 127 పరుగుల తేడాతో గెలుపొందిన విదర్భ డ్రాగా ముగిసిన బరోడా-ముంబై మ్యాచ్.. ముంబై తొలి ఇన్నింగ్స్ 384 (ముషీర్ ఖాన్ 203 నాటౌట్, భార్గవ్ భట్ 7/112) బరోడా తొలి ఇన్నింగ్స్ 348 (విక్రమ్ సోలంకి 136, షమ్స్ ములానీ 4/121) ముంబై రెండో ఇన్నింగ్స్ 569 (తుషార్ దేశ్‌పాండే 123, భార్గవ్ భట్ 7/200) బరోడా రెండో ఇన్నింగ్స్ 121/3 (ప్రియాన్షు్ మోలియా 54, తనుశ్ కోటియన్ 2/16) తొలి ఇన్నింగ్స్‌లో లభించిన లీడ్ ఆధారంగా సెమీస్‌కు చేరిన ముంబై ఏడేళ్ల తర్వాత సెమీస్‌కు చేరిన తమిళనాడు.. సౌరాష్ట్ర తొలి ఇన్నింగ్స్ 183 (హార్విక్ దేశాయ్ 83, సాయికిషోర్ 5/66) తమిళనాడు తొలి ఇన్నింగ్స్ 338 (బాబా ఇంద్రజిత్ 80, చిరాగ్ జానీ 3/22) సౌరాష్ట్ర రెండో ఇన్నింగ్స్ 122 (పుజారా 46, సాయికిషోర్ 4/27) ఇన్నింగ్స్ 33 పరుగుల తేడాతో తమిళనాడు విజయం ఉత్కంఠ పోరులో నాలుగు పరుగుల తేడాతో ఓడిన ఆంధ్ర.. మధ్యప్రదేశ్ తొలి ఇన్నింగ్స్ 234 యశ్ దూబే 64, శశికాంత్ 4/37) ఆంధ్రప్రదేశ్ తొలి ఇన్నింగ్స్ 172 (కరణ్ షిండే 38, అనుభవ్ అగార్వల్ 3/33) మధ్యప్రదేశ్ రెండో ఇన్నింగ్స్ 107 (హిమాన్షు మంత్రి 43, నితీశ్ రెడ్డి 4/28) ఆంధ్ర రెండో ఇన్నింగ్స్ 165 (హనుమ విహారి 55, అనుభవ్ అగర్వాల్ 6/52) 4 పరుగుల తేడాతో గెలుపొందిన మధ్య ప్రదేశ్ సెమీస్ మ్యాచ్‌లు ఇలా.. మార్చి 2-6: విదర్భ వర్సెస్ మధ్యప్రదేశ్ (1st semi final) మార్చి 2-6: ముంబై వర్సెస్ తమిళనాడు (2nd semi final) -
Ranji Trophy: నరాలు తెగే ఉత్కంఠ.. మనోళ్లు ఆఖరి వరకు పోరాడి..
Ranji Trophy 2023-24- Madhya Pradesh vs Andhra, Quarter Final: రంజీ ట్రోఫీ 2023-24లో ఆంధ్ర జట్టు ప్రయాణం ముగిసింది. మధ్యప్రదేశ్‌తో జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో రికీ భుయ్ బృందం.. ఓటమిపాలైంది. ఆఖరి వరకు పోరాడి నాలుగు పరుగుల స్వల్ప తేడాతో పరాజయం చెందింది. రంజీ తాజా ఎడిషన్ ఆరంభంలో కెప్టెన్‌గా వ్యవహరించిన హనుమ విహారి బ్యాటింగ్‌పై దృష్టి సారించే క్రమంలో సారథ్య బాధ్యతల నుంచి తప్పుకోగా.. రికీ భుయ్ పగ్గాలు చేపట్టాడు. అతడి నాయకత్వంలో అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన ఆంధ్ర జట్టు క్వార్టర్స్‌లో అడుగుపెట్టింది. ఈ క్రమంలో మధ్యప్రదేశ్‌తో పోటీకి సిద్ధమైన ఆంధ్ర.. శుక్రవారం మొదలైన మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బౌలింగ్ చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో మధ్యప్రదేశ్‌ను 234 పరుగులకు ఆలౌట్ చేసింది. కేవీ శశికాంత్ నాలుగు, నితీశ్‌రెడ్డి మూడు వికెట్లతో ఉత్తమ ప్రదర్శన కనబరిచారు. అయితే, బౌలర్లు అదరగొట్టినా.. బ్యాటర్లు మాత్రం ఆంధ్రకు శుభారంభం అందించలేకపోయారు. ఫలితంగా మొదటి ఇన్నింగ్స్‌లో 172 పరుగులకే జట్టు కుప్పకూలింది. రికీ భుయ్ 32, కరణ్ షిండే 38 పరుగులతో ఫర్వాలేదనిపించగా.. హనుమ విహారి 14 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. ఈ క్రమంలో 62 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన మధ్యప్రదేశ్‌ను ఈసారి... 107 బౌలర్లకే ఆలౌట్ చేశారు ఆంధ్ర బౌలర్లు. ఈ నేపథ్యంలో 170 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆంధ్ర ఆదివారం నాటి మూడో రోజు ఆట ముగిసే సరికి 4 వికెట్లు కోల్పోయి 95 పరుగులు చేసింది. హనుమ విహారి 43, కరణ్ షిండే 5 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో సోమవారం నాటి ఆట మొదలుపెట్టగా.. మరో 12 పరుగులను విహారి, తొమ్మిది పరుగులను కరణ్ తమ తమ స్కోర్లకు జతచేసి అవుటయ్యారు. మిగిలిన వాళ్లలో అశ్విన్ హెబ్బర్ 22 పరుగులతో రాణించగా.. మిగతా వాళ్ల నుంచి సహకారం కరువైంది. ఆఖర్లో గిరినాథ్‌రెడ్డి పట్టుదలగా నిలబడి జట్టును విజయం దిశగా నడిపించే ప్రయత్నం చేయగా 15 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఆఖరి వికెట్‌గా వెనుదిరిగాడు. ఈ క్రమంలో 165 పరుగులకే పరిమితమైన ఆంధ్ర జట్టు.. నరాలు తెగే ఉత్కంఠ రేపిన మ్యాచ్‌లో 4 పరుగుల తేడాతో పరాజయం పాలై టోర్నీ నుంచి నిష్క్రమించింది. మధ్యప్రదేశ్ సెమీ ఫైనల్లో(Madhya Pradesh won by 4 runs Enters Semis) అడుగుపెట్టింది. ఆంధ్ర వర్సెస్ మధ్యప్రదేశ్ క్వార్టర్ ఫైనల్ స్కోర్లు: ►మధ్యప్రదేశ్- 234 & 107 ►ఆంధ్రప్రదేశ్- 172 & 165. -
సెమీస్‌కు చేరువలో ఆంధ్ర..
ఇండోర్: రంజీ ట్రోఫీ క్రికెట్ టోరీ్నలో సెమీఫైనల్ బెర్త్‌కు ఆంధ్ర జట్టు మరో 75 పరుగుల దూరంలో ఉంది. మధ్యప్రదేశ్‌తో జరుగుతున్న క్వార్టర్ ఫైనల్లో 170 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన ఆంధ్ర మూడో రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్లు కోల్పోయి 95 పరుగులు చేసింది. హనుమ విహారి (43 బ్యాటింగ్), కరణ్ షిండే (5 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు.అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 21/0తో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన మధ్యప్రదేశ్ 40.5 ఓవర్లలో 107 పరుగులకే ఆలౌటైంది. ఆంధ్ర బౌలర్లు నితీశ్ కుమార్ రెడ్డి (4/28), శశికాంత్ (3/20), లలిత్ మోహన్ (3/20) మధ్యప్రదేశ్‌ను దెబ్బ తీశారు. -
సెమీఫైనల్లో నిఖత్ జరీన్
సోఫియా (బల్గేరియా): రెండుసార్లు ప్రపంచ చాంపియన్, తెలంగాణ స్టార్ బాక్సర్ నిఖత్ జరీన్ స్ట్రాంజా స్మారక అంతర్జాతీయ బాక్సింగ్ టోర్నీలో సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. మహిళల 50 కేజీల క్వార్టర్ ఫైనల్లో ఆమె 5–0తో ఖదిరి వాసిల (ఫ్రాన్స్)పై గెలిచి కనీసం కాంస్య పతకాన్ని ఖాయం చేసుకుంది. 66 కేజీల క్వార్టర్స్‌లో అరుంధతి 5–0తో సెర్బియాకు చెందిన మిలెనాపై గెలుపొందింది. 57 కేజీల క్వార్టర్స్‌లో సాక్షి 2–3 తో మమజొనొవా (ఉజ్బెకిస్తాన్) చేతిలో ఓడిపోయింది. పురుషుల కేటగిరీలో దీపక్ (75 కేజీలు), నవీన్ (92 కేజీలు) క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. దీపక్ 5–0తో సుల్తాన్ (కిర్గిజిస్తాన్)పై, నవీన్ 5–0తో వొయిస్నరొవిక్ (లిథువేనియా)పై గెలుపొందారు. చదవండి: ఆస్ట్రేలియాతో ఫైనల్ పోరు.. టీమిండియా ప్రతీకారం తీర్చుకుంటుందా? -
దక్షిణాఫ్రికాతో భారత్ సెమీస్ పోరు..
అండర్–19 ప్రపంచకప్ సెమీఫైనల్ మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ భారత్ ఆతిథ్య దక్షిణాఫ్రికాతో సెమీఫైనల్ పోరుకు సిద్ధమైంది. 1988లో మొదలైన అండర్–19 ప్రపంచకప్‌ల చరిత్రలో అత్యధికంగా 8 సార్లు ఫైనల్ చేరిన భారత్... 2000, 2008, 2012, 2018, 2022లలో ఐదుసార్లు విజేతగా నిలిచింది. ఉదయ్ సహరన్ నేతృత్వంలోని యువ జట్టు ఆల్‌రౌండ్ నైపుణ్యంతో ఉంది. ఈ టోర్నీలో వరుసగా ఐదు విజయాలు సాధించింది. ఈ మెగా ఈవెంట్‌కు ముందు సన్నాహకంగా ఆడిన ముక్కోణపు సిరీస్‌లో సఫారీ జట్టును భారత్ రెండు వన్డేల్లో ఓడించింది. కీలకమైన సెమీస్‌కు ముందు యువ భారత్ ఆత్మవిశ్వాసాన్ని పెంచే అంశమిది. ఇదే సమరోత్సాహంతో ఆతిథ్య దక్షిణాఫ్రికాను మట్టికరిపించాలనే పట్టుదలతో ఉంది. బ్యాటింగ్‌లో ముషీర్ ఖాన్, కెప్టెన్ ఉదయ్, సచిన్ దాస్ సూపర్ ఫామ్‌లో ఉన్నారు. బౌలింగ్‌లో సౌమీ కుమార్ పాండే, నమన్ తివారి, రాజ్ లింబానిలు కూడా నిలకడగా రాణిస్తుండటం జట్టును పటిష్టంగా నిలిపింది. మధ్యాహ్నం 1.30 గంటలకు మొదలయ్యే ఈ సెమీస్ పోరును స్టార్‌స్పోర్ట్స్ ప్రసారం చేస్తుంది. -
ఉత్కంఠ పోరులో విజయం.. సెమీ ఫైనల్‌కు చేరిన పాకిస్తాన్
అండర్ 19 వరల్డ్‌కప్-2024లో పాకిస్తాన్ సెమీఫైనల్లో అడుగుపెట్టింది. బెనోని వేదికగా బంగ్లాదేశ్‌తో ఆఖరి వరకు ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్‌లో 5 పరుగుల తేడాతో విజయం సాధించిన పాక్.. తమ సెమీస్ బెర్త్‌ను ఖారారు చేసుకుంది. 156 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లా జట్టు 35.5 ఓవర్లలో 150 పరుగులకే ఆలౌటైంది. పాక్ విజయంలో పేసర్ ఉబైడ్ షా కీలక పాత్ర పోషించాడు. ఉబైడ్ షా 5 వికెట్లు పడగొట్టి పాక్‌ను సెమీస్‌కు చేర్చాడు. ఉబైడ్ షాతో పాటు అలీ రజా 3 వికెట్లు, జీషన్ ఒక్క వికెట్ సాధించాడు. బంగ్లా బ్యాటర్లలో మహ్మద్ షిహాబ్ జేమ్స్(26) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ కూడా 40.4 ఓవర్లలో 155 పరుగులకే కుప్పకూలింది. ఆల్‌రౌండర్ అరాఫత్ మిన్హాస్(34) రాణించడంతో నామమాత్రపు స్కోరైనా పాక్ సాధించగల్గింది. బంగ్లా బౌలర్లలో షేక్ పావెజ్ జిబోన్, రోహనత్ డౌల్లా బోర్సన్ తలా 4 వికెట్లు పడగొట్టారు. ఇక ఈ మెగా టోర్నీ సెకెండ్ సెమీఫైనల్లో ఫిబ్రవరి 8న ఆస్ట్రేలియాతో పాక్ తలపడనుంది. అదే విధంగా తొలి సెమీఫైనల్లో దక్షిణాఫ్రికా, భారత్ తాడోపేడో తెల్చుకోనున్నాయి. -
సెంచరీతో చెలరేగిన టీమిండియా కెప్టెన్.. సెమీస్ బెర్త్ ఖారారు
బ్లూమ్‌ఫోంటీన్ (దక్షిణాఫ్రికా): అండర్–19 ప్రపంచ కప్‌లో యువ భారత్ అజేయంగా సెమీ ఫైనల్లోకి ప్రవేశించింది. శుక్రవారం జరిగిన గ్రూప్–1 సూపర్ సిక్స్ పోరులో భారత్ 132 పరుగుల భారీ తేడాతో నేపాల్‌పై జయభేరి మోగించడంతో సెమీస్ స్థానం ఖాయమైంది. మొదట భారత్ 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 297 పరుగులు చేసింది. 62 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన దశలో కెప్టెన్ ఉదయ్ సహరన్ (107 బంతుల్లో 100; 9 ఫోర్లు), ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ సచిన్ దాస్ (101 బంతుల్లో 116; 11 ఫోర్లు, 3 సిక్సర్లు) సెంచరీలతో ఆదుకున్నారు. వీరిద్దరు నాలుగో వికెట్‌కు 215 పరుగులు జోడించడం విశేషం. అనంతరం భారీ లక్ష్యఛేదనకు బరిలోకి దిగిన నేపాల్ 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 165 పరుగులే చేసింది. కెప్టెన్ దేవ్ ఖానల్ (53 బంతుల్లో 33; 2 ఫోర్లు) ఇన్నింగ్స్ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. చదవండి: IND vs ENG: ఒకే ఒక్కడు.. భారీ సెంచరీతో చెలరేగిన జైశ్వాల్ -
ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో సంచలనం.. టోర్నీ నుంచి జకోవిచ్ అవుట్
ఆస్ట్రేలియన్ ఓపెన్-2024లో సెర్బియా టెన్నిస్ స్టార్, వరల్డ్ నంబర్‌వన్ నొవాక్ జకోవిచ్‌కు ఊహించని పరాభావం ఎదురైంది. శుక్రవారం జరిగిన సెమీఫైనల్లో ఇటలీకి చెందిన యువ ప్లేయర్ జనిక్ సినర్ చేతిలో జకో ఓటమి పాలయ్యాడు. తద్వారా జకోవిచ్ 33 మ్యాచ్ ల విజయప్రస్థానానికి సినర్ బ్రేక్‌లు వేశాడు . తొలి రెండు సెట్లను 1-6, 2-6 తేడాతో సిన్నర్‌కు కోల్పోయిన జకోవిచ్.. మూడో సెట్లో అద్బుతమైన కమ్‌బ్యాక్ ఇచ్చి 7-6తో విజయం సాధించాడు. అయితే నిర్ణయాత్మక నాలుగో సెట్లో మాత్రం సినర్ 6-3తో జకోవిచ్‌ను చిత్తు చేశాడు. దీంతో జకోవిచ్ ఇంటిముఖం పట్టగా.. సినర్ ఫైనల్లో అడుగుపెట్టాడు. ఆదివారం జరిగే ఫైనల్లో 22 ఏళ్ల సిన్నర్... మెద్వెదెవ్/జ్వెరెవ్ లలో ఒకరిని సినర్ ఎదుర్కొంటాడు. శుక్రవారం రెండో సెమీఫైనల్లో డానిల్ మెద్వెదెవ్, అలెగ్జాండర్ జ్వెరెవ్ తలపడనున్నారు. చదవండి: AUS vs WI: వారెవ్వా.. క్రికెట్ చరిత్రలోనే అద్బుతమైన క్యాచ్! వీడియో వైరల్ -
U19 Asia Cup: సెమీస్‌కు దూసుకెళ్లిన భారత్, పాకిస్తాన్
ACC U19 Asia Cup, 2023: అండర్-19 ఆసియా కప్-2023 టోర్నీలో భారత టీనేజ్ సీమర్ రాజ్ లింబాని అదరగొట్టాడు. దుబాయ్ వేదికగా నేపాల్‌తో మ్యాచ్‌లో (7/13) నిప్పులు చెరిగే బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు. తన అద్భుత ప్రదర్శనతో నేపాల్ బ్యాటింగ్ ఆర్డర్‌ను కూల్చేశాడు. ఈ నేపథ్యంలో ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో యువ భారత జట్టు అలవోక విజయం సాధించి సెమీ ఫైనల్లోకి దూసుకెళ్లింది. కాగా మంగళవారం జరిగిన గ్రూప్ ‘ఎ’ చివరి లీగ్ మ్యాచ్‌లో భారత జట్టు 10 వికెట్ల తేడాతో నేపాల్‌పై ఘనవిజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన నేపాల్‌ను 18 ఏళ్ల రాజ్ లింబాని స్పెల్ హడలెత్తించింది. దీంతో నేపాల్ 22.1 ఓవర్లలో 52 పరుగులకే కుప్పకూలింది. రాజ్ 9.1 ఓవర్లలో 3 మెయిడెన్లు వేసి 13 పరుగులిచ్చి 7 వికెట్లు తీశాడు. నేపాల్ ఓపెనర్ల నుంచి ఆఖరి వరుస బ్యాటర్ వరకు అంతా సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. అనంతరం భారత జట్టు 7.1 ఓవర్లలో వికెట్ కోల్పోకుండా 57 పరుగులు చేసి ఛేదించింది. అర్షిన్ కులకర్ణి (30 బంతుల్లో 43 నాటౌట్; 1 ఫోర్, 5 సిక్స్‌లు) భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. అర్షిన్, ఆదర్శ్ సింగ్ (13 నాటౌట్; 2 ఫోర్లు) అబేధ్యమైన ఓపెనింగ్ బాగస్వామ్యంతో జట్టును గెలిపించారు. ఇక ఈ టోర్నీలో భారత్‌కు ఇది రెండో విజయం. అంతకుముందు ఆరంభ మ్యాచ్‌లో అఫ్గనిస్తాన్‌ను భారత యువ జట్టు చిత్తు చేసింది. గ్రూప్-ఏ టాపర్‌గా పాకిస్తాన్ ఈ క్రమంలో మొత్తంగా... ఆడిన మూడు మ్యాచ్‌లలో రెండు గెలిచిన భారత్ గ్రూప్ ‘ఎ’లో రెండో స్థానంలో నిలిచింది. మరోవైపు.. దాయాది జట్టు పాకిస్తాన్ మంగళవారం నాటి రెండో మ్యాచ్‌లో అఫ్గనిస్తాన్‌ను చిత్తుగా ఓడించింది. ఏకంగా 83 పరుగుల తేడాతో అఫ్గన్‌ను మట్టికరిపించి మూడో విజయం నమోదు చేసింది. తద్వారా ఆడిన మూడింట మూడు నెగ్గి గ్రూప్-ఏ టాపర్‌గా నిలిచి సెమీస్‌లో అడుగుపెట్టింది. ACC Men's U19 Asia Cup | Pakistan-U19 vs Afghanistan-U19 | Highlights. https://t.co/E72GAXu9OB#ACCMensU19AsiaCup #ACC — AsianCricketCouncil (@ACCMedia1) December 12, 2023 -
China Masters: సెమీస్‌లో సాత్విక్–చిరాగ్..
షెన్జెన్: భారత స్టార్ షట్లర్లు సాత్విక్ సాయిరాజ్ రాంకిరెడ్డి–చిరాగ్ శెట్టి జోడీ ఈ ఏడాది మరో టైటిల్‌పై కన్నేసింది. చైనా మాస్టర్స్ వరల్డ్ టూర్ సూపర్–750 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో టాప్‌సీడ్ భారత ద్వయం సెమీ ఫైనల్లోకి దూసుకెళ్లింది. అయితే సింగిల్స్‌లో హెచ్.ఎస్.ప్రణయ్‌కి క్వార్టర్ ఫైనల్లో చుక్కెదురైంది. శుక్రవారం జరిగిన పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో సాత్విక్–చిరాగ్ జంట 21–16, 21–14తో ఇండోనేసియాకు చెందిన లియో రాలీ కార్నడో–డానియెల్ మారి్టన్ జంటపై అలవోక విజయం సాధించింది. ప్రపంచ ఐదో ర్యాంకు జోడీ అయిన సాత్విక్–చిరాగ్ వరుస గేముల్లో 46 నిమిషాల్లో మ్యాచ్‌ను ముగించింది. తొలి గేమ్‌లో 14–14 స్కోరు దాకా ఇండోనేసియన్ జోడీ నుంచి కొంతవరకు పోటీ ఎదురైనా... ఆ తర్వాత భారత షట్లర్ల ధాటికి ప్రత్యర్థి జంట చతికిలబడింది. తర్వాత రెండో గేమ్‌ను సాత్విక్–చిరాగ్‌లు రెట్టించిన ఉత్సాహంతో మొదలుపెట్టారు. 5–2తో ఆధిక్యంలోకి వెళ్లారు. నెట్‌వద్ద పొరపాట్లతో కొన్ని పాయింట్లు కోల్పోయినప్పటికీ వెంటనే పుంజుకొని ఆడటంతో మళ్లీ ఆధిక్యం 11–6కు పెరిగింది. ఇండోనేసియన్ షట్లర్లు ఆ తర్వాత కోలుకోలేదు. 17–10తో గేమ్‌ను చేతుల్లోకి తెచ్చుకున్న భారత అగ్రశ్రేణి జంట నిమిషాల వ్యవధిలోనే 21–14తో మ్యాచ్‌ను మగించేశారు. ఈ ఏడాది సూపర్ ఫామ్‌లో ఉన్న భారత జంట ఇండోనేసియా సూపర్–1000, కొరియా సూపర్–500, స్విస్ సూపర్–300 టైటిళ్లను సాధించింది. నేడు జరిగే సెమీఫైనల్లో చైనాకు చెందిన జి తింగ్–రెన్ జియాంగ్ యు జంటతో సాత్విక్–చిరాగ్ జోడీ తలపడుతుంది. పురుషుల సింగిల్స్ ప్రపంచ 8వ ర్యాంకర్ ప్రణయ్‌కి క్వార్టర్స్‌లో ఏదీ కలిసిరాలేదు. 31 ఏళ్ల భారత షట్లర్ 9–21, 14–21తో జపాన్ ఆటగాడు, మూడో సీడ్ కొడయ్ నరవొక చేతిలో సులు వుగానే ఓడిపోయాడు. తొలిగేమ్‌లో నరవొకకు 9–8తో పోటీ ఇచ్చిన భారత ఆటగాడు తర్వాత వరుసగా అనవసర తప్పిదాలతో మూల్యం చెల్లించుకున్నాడు. ప్రపంచ చాంపియన్‌షిప్ రన్నరప్ నరవొక తొలిగేమ్‌లో తన రాకెట్‌ను నెట్‌పై పరిధి దాటిరావడంతో చైర్ అంపైర్ అతని పాయింట్‌ను తిరస్కరించాడు. అయితే ప్రణయ్ అందివచ్చిన అవకాశాల్ని ఒడిసిపట్టలేక పదేపదే పొరపాట్లు చేసి మ్యాచ్‌ను అప్పగించాడు. -
అప్పుడు ఆసీస్.. ఇప్పుడు దక్షిణాఫ్రికా! 1999 వరల్డ్‌కప్ మ్యాజిక్ రిపీట్ అవుతుందా?
వన్డే వరల్డ్‌కప్-2023లో భాగంగా రెండో సెమీఫైనల్లో ఆస్ట్రేలియా-దక్షిణాఫ్రికా జట్లు తలపడతున్నాయి. ఈ సెమీస్ పోరులో తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 49. 4 ఓవర్లలో 212 పరుగులకు ఆలౌటైంది. 24 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన దక్షిణాఫ్రికాను మిల్లర్(101) అద్బుత సెంచరీతో అదుకున్నాడు. దీంతో ప్రోటీస్ ఆస్ట్రేలియా ముందు 213 పరుగుల టార్గెట్‌ను ఉంచగల్గింది. లక్ష్య ఛేదనలో ఆస్ట్రేలియా 23 ఓవర్లకు 4 వికెట్లు కోల్పోయి 114 పరుగులు చేసింది. అయితే ఆసీస్ ముందు స్వల్ప లక్ష్యం ఉన్నప్పటికీ.. పిచ్ స్పిన్నర్లకు అనుకూలిస్తుంది కాబట్టి సఫారీలు ఇంకా పోటీలో ఉన్నారు. 1999 వరల్డ్‌కప్‌లో షేన్ వార్న్ మ్యాజిక్.. కాగా 1999 వరల్డ్‌కప్ సెమీఫైనల్లో కూడా దక్షిణాఫ్రికా-ఆస్ట్రేలియా మధ్య లో స్కోరింగ్ థ్రిల్లర్ జరిగింది. అప్పుడు ఆస్ట్రేలియా దివంగత స్పిన్నర్ షేన్ వార్న్ మ్యాజిక్ చేసి మ్యాచ్‌ను డ్రాగా ముగించారు. బర్మింగ్‌హామ్ వేదికగా జరిగిన సెమీస్ పోరులో తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ 213 పరుగులకు ఆలౌటైంది. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌లో కెప్టెన్ స్టీవ్ వా, మైఖేల్ బెవాన్లు హాఫ్ సెంచరీలతో రాణించారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికాకు ఓపెనర్లు మంచి ఆరంభం ఇచ్చారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 48 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. సరిగ్గా ఇదే సమయంలో బౌలింగ్‌కు వచ్చిన షేన్ వార్న్ తన స్పిన్ మయాజాలంతో వరుస క్రమంలో మూడు వికెట్లు పడగొట్టాడు. దీంతో 48 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి ప్రోటీస్ కష్టాల్లో పడింది. ఆ సమయంలో జాక్వెస్ కల్లిస్(53),జాంటీ రోడ్స్(43) తమ అద్బుత ఇన్నింగ్స్‌లతో జట్టును విజయ తీరాల వైపు నడిపారు. ఆ తర్వాత షేన్ వార్న్ మళ్లీ తన స్పిన్ మయాజాలంతో కల్లిస్‌ను ఔట్ చేశాడు. వెంటనే రోడ్స్ కూడా పెవిలియన్‌కు చేరాడు. ఆ తర్వాత వారిద్దరి బాధ్యతను లాన్స్ క్లూసెనర్ తీసుకున్నాడు. ఆఖరి ఓవర్లో దక్షిణాఫ్రికా విజయానికి 9 పరుగులు అవసరం. ప్రోటీస్ చేతిలో కేవలం ఒకే వికెట్ ఉంది. క్రీజులో క్లూసెనర్‌తో పాటు అలన్ డోనాల్డ్ ఉన్నాడు. అందరిలోనూ తీవ్ర ఉత్కంఠ. ఆఖరి ఓవర్లో డామియన్ వేసిన మొదటి రెండు బంతులను క్లూసెనర్ బౌండరీలకు తరిలించాడు. దీంతో స్కోర్లు సమయ్యాయి. ప్రోటీస్ విజయానికి 4 బంతుల్లో కేవలం ఒక్క పరుగు మాత్రమే అవసరమైంది. ఇక్కడే ఎవరూ ఊహించని ట్విస్ట్ చోటు చేసుకుంది. మూడో బంతికి సింగిల్ ప్రయత్నించగా.. రనౌట్ అవకాశం మిస్ అయ్యింది. ఈ క్రమంలో నాలుగో బంతిని క్లూసెనర్ మిడ్-ఆఫ్ దిశగా షాట్‌గా ఆడాడు. వెంటనే క్లూసెనర్ సింగిల్ కోసం నాన్ స్ట్రైకర్స్ ఎండ్ వైపు పరిగెత్తగా.. అలన్ డోనాల్డ్ మాత్రం బంతిని చూస్తూ ఉండిపోయాడు. ఈ క్రమంలో ఇద్దరూ నాన్ స్ట్రైకర్స్ ఎండ్‌లో ఉండిపోయారు. వెంటనే రికీ పాంటింగ్ వికెట్ కీపర్ గిల్‌క్రిస్ట్‌కు త్రో చేశాడు. గిల్‌క్రిస్ట్‌ను స్టంప్స్‌ను పడగొట్టాడు. దీంతో మ్యాచ్ టై అయింది. అయితే రన్‌రేట్ ఆధారంగా ఆస్ట్రేలియా ఫైనల్‌కు క్వాలిఫై అయింది. ఎందుకంటే అప్పటిలో సూపర్ ఓవర్ రూల్ ఇంకా అమలులో లేదు. ఈ లోస్కోరింగ్ మ్యాచ్‌లో షేన్ వార్న్ తన 10 ఓవర్ల కోటాలో 29 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. అతడు బౌలింగ్ కోటాలో 4 మెయిడన్లు ఉండడం గమనార్హం. ఇప్పుడు వార్న్ లాంటి మ్యాజిక్ ప్రోటీస్ స్పిన్నర్లు ఎవరైనా చేస్తారో లేదో వేచి చూడాలి. చదవండి: World Cup 2023: దక్షిణాఫ్రికా కెప్టెన్ అత్యంత చెత్త రికార్డు.. వరల్డ్ కప్ చరిత్రలోనే! -
ఇదేమి బ్యాటింగ్ రా బాబు.. అందుకే 'చోకర్స్' ట్యాగ్ లైన్
వరల్డ్ క్రికెట్లో 'చోకర్స్' అంటే మనకు టక్కున దక్షిణాఫ్రికానే గుర్తుకు వస్తుంది. ఎందుకంటే కీలకమైన మ్యాచ్‌లలో చేతులెత్తేసే నైజం సౌతాఫ్రికాది. అందుకే ప్రోటీస్ జట్టును చోకర్స్ అని పిలుస్తుంటారు. వరల్డ్‌కప్ నాకౌట్ మ్యాచ్‌ల్లో ఒత్తిడికి చిత్తు అవుతుందన్న మాటను మరోసారి దక్షిణాఫ్రికా నిజం చేసంది. వన్డే వరల్డ్‌కప్-2023లో ఈడెన్‌గార్డెన్స్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో సెమీఫైనల్లో సౌతాఫ్రికా బ్యాటర్లు దారుణ ప్రదర్శన కనబరుస్తున్నారు. ఆసీస్ బౌలర్ల ధాటికి సఫారీలు విలవిల్లాడుతున్నారు. కేవలం 24 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి దక్షిణాఫ్రికా పీకల్లోతు కష్టాల్లో పడింది. తొలి పవర్లో ప్లేలో అయితే సౌతాఫ్రికా కేవలం 18 పరుగులు మాత్రమే చేసింది. లీగ్ మ్యాచ్‌ల్లో తొలుత బ్యాటింగ్ చేసినప్పుడు మెరుపులు మెరిపించిన దక్షిణాఫ్రికా.. సెమీస్‌లో మాత్రం కంగారుల ముందు తలవంచింది. ఆసీస్ పేసర్లు మిచెల్ స్టార్క్, హాజిల్‌వుడ్ తలా రెండు వికెట్లు పడగొట్టి దక్షిణాఫ్రికాను కోలుకోలేని దెబ్బకొట్టారు. 14 ఓవర్లు ముగిసే సరికి దక్షిణాఫ్రికా 4 వికెట్లు కోల్పోయి కేవలం 44 పరుగులు మాత్రమే చేసింది. ఈ ఏడాది వరల్డ్‌కప్ లీగ్ మ్యాచ్‌ల్లో దుమ్మురేపిన సౌతాఫ్రికా.. కీలకమైన సెమీస్‌లో మాత్రం చేతులెత్తేసింది. చదవండి: MS Dhoni: ఉత్తరాఖండ్‌లోని స్వగ్రామానికి వెళ్లిన ధోని.. ఆమె పాదాలకు నమస్కరించి.. -
CWC 2023: ఉత్కంఠ పోరులో దక్షిణాఫ్రికా ఓటమి.. ఫైనల్లో ఆస్ట్రేలియా
ICC Cricket World Cup 2023 - South Africa vs Australia: వన్డే వరల్డ్‌కప్-2023 ఫైనల్లో ఆస్ట్రేలియా అడుగుపెట్టింది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఉత్కంఠ భరితంగా సాగిన రెండో సెమీఫైనల్లో దక్షిణాఫ్రికాపై 3 వికెట్ల తేడాతో ఆసీస్ విజయం సాధించింది. తద్వారా 8వ సారి వరల్డ్‌కప్ ఫైనల్ బెర్త్‌ను ఆసీస్ ఖారారు చేసుకుంది. 213 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్.. 47.2 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి ఛేదించింది. కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ ఫోర్ కొట్టి తన జట్టుకు అద్బుతమైన విజయాన్ని అందించాడు. ఆస్ట్రేలియా బ్యాటర్లలో ఓపెనర్ ట్రావిస్ హెడ్(62) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. స్మిత్(30), ఇంగ్లీష్(28) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. ఇక దక్షిణాఫ్రికా బౌలర్లు మాత్రం అద్బుతమైన పోరాట పటిమ కనబరిచారు. వరుసక్రమంలో వికెట్లు పడగొడుతూ ఆసీస్‌ను బ్యాక్‌ఫుట్‌లో ఉంచారు. కానీ చివరకి విజయం మాత్రం కంగారులనే వరించింది. దక్షిణాఫ్రికా బౌలర్లలో షమ్సీ, కొయెట్జీ తలా రెండు వికెట్లు సాధించగా.. మహారాజ్, రబాడ, మార్క్రమ్ తలా వికెట్ సాధించారు. ఇక ఆక్టోబర్ 19న అహ్మదాబాద్ వేదికగా జరగనున్న ఫైనల్లో టీమిండియాతో ఆస్ట్రేలియా తలపడనుంది. ఇంగ్లీష్ ఔట్.. తిరిగి గేమ్‌లోకి దక్షిణాఫ్రికా 193 పరుగుల వద్ద ఆస్ట్రేలియా ఏడో వికెట్ కోల్పోయింది. 28 పరుగులు చేసిన ఇంగ్లీష్‌ను కొయెట్జీ క్లీన్ బౌల్డ్ చేశాడు. దీంతో ప్రోటీస్ తిరిగి మళ్లీ పోటోలోకి వచ్చింది. ఆసీస్ విజయానికి 19 పరుగులు కావాలి. విజయం దిశగా ఆసీస్.. దక్షిణాఫ్రికాతో రెండో సెమీఫైనల్లో ఆస్ట్రేలియా విజయం దిశగా అడుగులు వేస్తోంది. ఆసీస్ గెలుపుకు 72 బంతుల్లో 25 పరుగులు కావాలి. క్రీజులో ఇంగ్లీష్(27), మిచెల్ స్టార్క్(6) ఉన్నారు. ఉత్కంఠగా సెమీఫైనల్-2 ఈడెన్‌గార్డెన్స్ వేదికగా దక్షిణాఫ్రికా-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న రెండో సెమీఫైనల్ ఉత్కంఠగా మారింది. క్రీజులో నిలదొక్కుకున్న స్టీవ్ స్మిత్‌ను కొయెట్జీ పెవిలియన్‌కు పంపాడు. దీంతో సఫారీలు మళ్లీ మ్యాచ్‌లోకి వచ్చారు. ఆసీస్ విజయానికి ఇంకా 38 పరుగులు కావాలి. క్రీజులో ఇంగ్లీష్(19), మిచెల్ స్టార్క్(1) ఉన్నారు. ఐదో వికెట్ డౌన్.. మాక్స్వెల్ ఔట్ దక్షిణాఫ్రికా స్పిన్నర్లు అద్బుతంగా బౌలింగ్ చేస్తున్నారు. డేంజరస్ మాక్స్‌వెల్‌ను తబ్రేజ్ షంషి క్లీన్ బౌల్డ్ చేశాడు. ఆసీస్ విజయానికి 25 ఓవర్లలలో 72 పరుగులు కావాలి. క్రీజులో స్మిత్, ఇంగ్లీష్ ఉన్నారు. నాలుగో వికెట్ డౌన్.. 113 పరుగుల వద్ద ఆస్ట్రేలియా నాలుగో వికెట్ కోల్పోయింది. 18 పరుగులు చేసిన లబుషేన్.. షంస్సీ బౌలింగ్‌లో ఔటయ్యాడు. ఆసీస్ విజయానికి 79 పరుగులు కావాలి. క్రీజులోకి మాక్స్వెల్ వచ్చాడు. ఆసీస్ మూడో వికెట్ డౌన్.. 106 పరుగుల వద్ద ఆసీస్ మూడో వికెట్ కోల్పోయింది. 62 పరుగులతో అద్బుతంగా ఆడుతున్న ట్రెవిస్ హెడ్‌ను కేశవ్ మహారాజ్ క్లీన్ బౌల్డ్ చేశాడు. క్రీజులోకి లబుషేన్ వచ్చాడు. ఆసీస్ విజయానికి 35 ఓవర్లలో 104 పరుగులు కావాలి. దక్షిణాఫ్రికాతో సెమీస్.. ట్రావిస్ హెడ్ హాఫ్ సెంచరీ ఆసీస్ ఓపెనర్ ట్రెవిస్ హెడ్ అద్భుతమైన హాఫ్ సెంచరీతో చెలరేగాడు. 40 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లతో హెడ్ తన హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. 12 ఓవర్లకు ఆసీస్ స్కోర్: 92/2 రెండో వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా.. మార్ష్ ఔట్ ఆస్ట్రేలియాతో జరుగుతున్న సెమీఫైనల్లో దక్షిణాఫ్రికా కమ్‌బ్యాక్ ఇచ్చే ప్రయత్నం చేస్తోంది. 61 పరుగులు వద్ద ఆస్ట్రేలియా రెండో వికెట్ కోల్పోయింది. రబాడ బౌలింగ్‌లో మిచెల్ మార్ష్ ఖాతా తెరవకుండానే పెవిలియన్‌కు చేరాడు. 8 ఓవర్లకు ఆసీస్ స్కోర్: 61/2 తొలి వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా.. 213 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా తొలి వికెట్ కోల్పోయింది. 29 పరుగులు చేసిన డేవిడ్ వార్నర్.. మార్క్రమ్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు. క్రీజులోకి మిచెల్ మార్ష్ వచ్చాడు. 7 ఓవర్లకు ఆస్ట్రేలియా స్కోర్: 60/1 దూకుడుగా ఆడుతున్న ఆసీస్ ఓపెనర్లు.. 213 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా.. 4 ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టపోకుండా 24 పరుగులు చేసింది. క్రీజులో ఓపెనర్లు డేవిడ్ వార్నర్(11), హెడ్(9) పరుగులతో ఉన్నారు. మిల్లర్ విరోచిత శతకం.. ఆస్ట్రేలియా టార్గెట్ 213 పరుగులు ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో సెమీఫైనల్లో తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా నామమాత్రపు స్కోర్‌కే పరిమితమైంది. దక్షిణాఫ్రికా 49. 4 ఓవర్లలో 212 పరుగులకు ఆలౌటైంది. దక్షిణాఫ్రికా గౌరవప్రదమైన స్కోర్ సాధించడంలో డేవిడ్ మిల్లర్ కీలక పాత్ర పోషించాడు. మిల్లర్ విరోచిత శతకంతో చెలరేగాడు. 116 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్స్‌లతో 101 పరుగులు చేసి జట్టుకు ఫైటింగ్ స్కోర్‌ను అందించాడు. 24 పరుగులు 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన ప్రోటీస్‌ను మిల్లర్, క్లాసెన్(47) అదుకున్నారు. క్లాసెన్ ఔటైన తర్వాత మిల్లర్ పూర్తి బాధ్యతను తన భుజాన వేసుకున్నాడు. ఇక ఆస్ట్రేలియా బౌలర్లలో స్టార్క్, కమ్మిన్స్ 3వికెట్లు పడగొట్టగా.. హాజిల్‌వుడ్, హెడ్ తలా రెండు వికెట్లు సాధించారు డేవిడ్ మిల్లర్ సెంచరీ దక్షిణాఫ్రికా మిడిలార్డర్ బ్యాటర్ డేవిడ్ మిల్లర్ విరోచిత శతకంతో చెలరేగాడు. 24 పరుగులు 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన జట్టును తన అద్భుత ఇన్నింగ్స్ మిల్లర్ అదుకున్నాడు. 116 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్స్‌లతో 101 పరుగులు చేసి ఔటయ్యాడు. 48 ఓవర్లకు దక్షిణాఫ్రికా స్కోర్: 203/9 ఎనిమిదో వికెట్ డౌన్.. 191 పరుగుల వద్ద దక్షిణాఫ్రికా ఎనిమిదో వికెట్ కోల్పోయింది. 4 పరుగులు చేసిన కేశవ్ మహారాజ్.. స్టార్క్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 47 ఓవర్లకు దక్షిణాఫ్రికా స్కోర్: 196/8 ఏడో వికెట్ డౌన్.. 172 పరుగుల వద్ద దక్షిణాఫ్రికా ఏడో వికెట్ కోల్పోయింది. 19 పరగులు చేసిన గెరాల్డ్ కోయెట్జీ.. కమ్మిన్స్ బౌలింగ్‌లో పెవిలయన్‌కు చేరాడు. 44 ఓవర్లు దక్షిణాఫ్రికా స్కోర్: 174/7 40 ఓవర్లలో సౌతాఫ్రికా స్కోరు: 156/6 మిల్లర్ 67, కోయెట్జీ 18 పరుగులతో క్రీజులో ఉన్నారు. 38 ఓవర్లలో సౌతాఫ్రికా స్కోరు: 149-6 మిల్లర్ 66, కోయెట్జీ 16 పరుగులతో క్రీజులో ఉన్నారు. మిల్లర్ హాఫ్ సెంచరీ 31.3: మాక్స్వెల్ బౌలింగ్‌లో ఫోర్ బాది ఫిఫ్టీ పూర్తి చేసుకున్న మిల్లర్ వరుసగా రెండు వికెట్లు కోల్పోయిన సౌతాఫ్రికా 30.5: హెడ్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగిన మార్కో జాన్సెన్. ఆరో వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికా. కొయోట్జీ క్రీజులోకి వచ్చాడు. క్లాసెన్ బౌల్డ్ 30.4: నిలకడగా సాగుతున్న సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌కు ట్రవిస్ హెడ్ బ్రేక్ వేశాడు. 47 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఉన్న క్లాసెన్‌ను అద్భుత రీతిలో బౌల్డ్ చేశాడు. దీంతో ప్రొటిస్ జట్టు ఐదో వికెట్ కోల్పోయింది. కాగా మిల్లర్‌తో కలిసి క్లాసెన్ 95 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. సౌతాఫ్రికా స్కోరు: 27 ఓవర్లలో సౌతాఫ్రికా స్కోరు: 95/4 ►26.4: మరో సిక్స్ కొట్టిన క్లాసెన్ ►26.3: జంపా బౌలింగ్‌లో సిక్సర్ బాదిన క్లాసెన్ సగం ఇన్నింగ్స్ ముగిసే సరికి ప్రొటిస్ ఇలా క్లాసెన్, మిల్లర్ 79 బంతుల్లో 55 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. క్లాసెన్ 22, మిల్లర్ 33 పరుగులతో క్రీజులో ఉన్నారు. 25 ఓవర్లలో సౌతాఫ్రికా స్కోరు: 79/4 నిలకడగా ఆడుతున్న క్లాసెన్, మిల్లర్ ►21 ఓవర్లలో సౌతాఫ్రికా స్కోరు: 68/4 (21) ►డేవిడ్ మిల్లర్ కాస్త దూకుడు పెంచాడు. 19వ ఓవర్ ముగిసే సరికి 28 బంతులు ఎదుర్కొని 25 పరుగులు రాబట్టాడు. మరో ఎండ్‌లో క్లాసెన్ నిలకడగా ఆడుతూ 13 పరుగుల వద్ద ఉన్నాడు. స్కోరు: 62-4 మళ్లీ మొదలైన ఆట వర్షం తెరిపినివ్వడంతో ఆట మళ్లీ మొదలైంది. 15 ఓవర్లలో సౌతాఫ్రికా స్కోరు: 46-4 వర్షం కారణంగా ఆగిన ఆట వర్షం రావడంతో మ్యాచ్‌ను నిలిపివేశారు. వరణుడి ఆగమానికి ముందు సౌతాఫ్రికా 14 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి కేవలం 44 పరుగులు చేసింది. క్లాసెన్ 10, మిల్లర్ 10 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఆస్ట్రేలియా బౌలర్లలో పేసర్లు స్టార్క్, హాజిల్‌వుడ్ చెరో రెండు వికెట్లు తీశారు. సౌతాఫ్రికాకు షాకుల మీద షాకులు 11.5:హాజిల్‌వుడ్ బౌలింగ్‌లో డస్సెన్ అవుట్. డస్సెన్(6) రూపంలో నాలుగో వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికా. మిల్లర్, క్లాసెన్ క్రీజులో ఉన్నారు. మూడో వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికా 10.5: స్టార్క్ బౌలింగ్‌లో మార్కరమ్ అవుటయ్యాడు. 10 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద నిష్క్రమించాడు. ఇప్పటికే బవుమా, డికాక్ వికెట్లు కోల్పోయిన ప్రొటిస్.. మార్కరమ్ రూపంలో మరో కీలక వికెట్ కోల్పోవడంతో కష్టాల్లో కూరుకుపోయింది. క్లాసెన్, డస్సెన్(5) క్రీజులో ఉన్నారు. 10.1: ప్రొటిస్ ఇన్నింగ్స్‌లో తొలి బౌండరీ స్టార్క్ బౌలింగ్‌లో ఫోర్ బాదిన మార్కరమ్ పవర్ ప్లేలో సౌతాఫ్రికా స్కోరు: 18/2 పవర్ ప్లేలో సౌతాఫ్రికా దారుణ ప్రదర్శన కనబరిచింది. 10 ఓవర్లు ముగిసే సరికి ఓపెనర్ల వికెట్లు కోల్పోయి కేవలం 18 పరుగులు మాత్రమే చేసింది. ►తొమ్మిది ఓవర్లు ముగిసే సరికి సౌతాఫ్రికా స్కోరు: 17/2 ►6, 7 ఓవర్లను మెయిడిన్ చేసిన హాజిల్‌వుడ్, స్టార్క్. సౌతాఫ్రికా స్కోరు: 8/2 (7) 5.4: రెండో వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికా హాజిల్‌వుడ్ బౌలింగ్‌లో కమిన్స్‌కు క్యాచ్ ఇచ్చి ఓపెనర్ క్వింటన్ డికాక్ పెవిలియన్ చేరాడు. మొత్తంగా 14 బంతులు ఎదుర్కొని కేవలం 3 పరుగులే చేసి నిష్క్రమించాడు. ఇక ఆరంభంలోనే బవుమా వికెట్ తీసి స్టార్క్ షాకివ్వగా.. కీలక వికెట్ పడగొట్టి హాజిల్‌వుడ్ కోలుకోలేని దెబ్బకొట్టాడు. మార్కరమ్, డస్సెన్ క్రీజులో ఉన్నారు. స్కోరు: 8-2(6). కట్టుదిట్టంగా ఆసీస్ బౌలింగ్ బౌలింగ్ ఆస్ట్రేలియా బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తున్నారు. పొదుపుగా బౌలింగ్ చేస్తూ పరుగులకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా సఫారీలను కట్టడి చేస్తున్నారు. దీంతో ఐదు ఓవర్లు ముగిసే సరికి ఒక వికెట్ నష్టపోయిన ప్రొటిస్ జట్టు కేవలం 8 పరుగులు మాత్రమే చేయగలిగింది. 2 ఓవర్లు ముగిసే సరికి సౌతాఫ్రికా స్కోరు: 2/1 (2) ►రాస్సీ వాన్ డర్ డస్సెన్ 0, డికాక్ రెండు పరుగులతో క్రీజులో ఉన్నారు. ఆసీస్‌తో సెమీస్.. తొలి వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికా ►0.6: తొలి ఓవర్లోనే సౌతాఫ్రికాకు ఆసీస్ పేసర్ మిచెల్ స్టార్క్ షాకిచ్చాడు. కెప్టెన్ తెంబా బవుమాను డకౌట్‌గా వెనక్కి పంపాడు. ►టాస్ గెలిచిన సౌతాఫ్రికా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. View this post on Instagram A post shared by ICC (@icc) View this post on Instagram A post shared by ICC (@icc) తుదిజట్లు దక్షిణాఫ్రికా: క్వింటన్ డికాక్(వికెట్‌కీపర్), టెంబా బవుమా(కెప్టెన్), రాస్సీ వాన్ డర్ డస్సెన్, ఎయిడెన్ మార్క్రమ్, హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, మార్కో జన్సెన్, కేశవ్ మహరాజ్, గెరాల్డ్ కొయెట్జీ, కగిసో రబడ, తబ్రేజ్ షంషి ఆస్ట్రేలియా ట్రవిస్ హెడ్, డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, స్టీవెన్ స్మిత్, మార్నస్ లబూషేన్, గ్లెన్ మాక్స్వెల్, జోష్ ఇంగ్లిస్(వికెట్‌కీపర్), పాట్ కమిన్స్(కెప్టెన్), మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా, జోష్ హాజిల్‌వుడ్. -
CWC 2023 AUS VS SA 2nd Semis: అభిమానులకు బ్యాడ్‌న్యూస్
వన్డే వరల్డ్‌కప్ 2023లో భాగంగా కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఇవాళ (నవంబర్ 16) జరగాల్సిన రెండో సెమీఫైనల్ మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉందని తెలుస్తుంది. వాతావరణ శాఖ హెచ్చరికల ప్రకారం వర్షం కారణంగా మ్యాచ్‌కు అంతరాయాలు ఏర్పడే అవకాశం ఉందని సమాచారం. ప్రస్తుతానికి ఈడెన్ గార్డెన్స్‌లో వర్షం పడనప్పటికీ.. స్టేడియం మొత్తాన్ని కవర్లతో కప్పేశారు. The covers are on at the Eden Gardens. pic.twitter.com/X3gMgFTAFw — Mufaddal Vohra (@mufaddal_vohra) November 16, 2023 ఈ మ్యాచ్‌కు రిజర్వ్ డే కూడా ఉంది కాబట్టి, మ్యాచ్ ఇవాళ రద్దైనా రేపు జరుగుతుంది. వాతవరణం అప్డేట్ తెలిసి క్రికెట్ అభిమానులు నిరాశ చెందుతున్నారు. ఆస్ట్రేలియా అభిమానులు మరింత కలవరపడుతున్నారు. ఒకవేళ ఏ కారణంగా అయినా మ్యాచ్ రద్దైతే మెరుగైన రన్‌రేట్ ఉన్న కారణంగా సౌతాఫ్రికా ఫైనల్స్‌కు చేరుకుంటుంది. మ్యాచ్‌కు వరుణుడు అడ్డుతగలకూడదని ఆసీస్ అభిమానులు కోరుకుంటున్నారు. కాగా, న్యూజిలాండ్‌తో నిన్న జరిగిన తొలి సెమీఫైనల్లో భారత్ 70 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో కోహ్లి (113 బంతుల్లో 117; 9 ఫోర్లు, 2 సిక్సర్లు), శ్రేయస్ (70 బంతుల్లో 105; 4 ఫోర్లు, 8 సిక్సర్లు) అద్బుత శతకాలతో పాటు మొహమ్మద్ షమీ (9.5-0-57-7) సూపర్ బౌలింగ్‌తో మెరవడంతో భారత్ తిరుగలేని విజయం సాధించి, నాలుగోసారి ఫైనల్స్‌కు చేరింది. -
శ్రేయస్, రాహుల్ అత్యద్భుతం.. కివీస్ నుంచి గట్టి పోటీ తప్పదు..!
వన్డే వరల్డ్‌కప్ 2023లో భాగంగా భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య ఇవాళ (నవంబర్ 15) జరిగే సెమీఫైనల్ మ్యాచ్‌పై టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ ఆసక్తికర కామెంట్స్ చేశాడు. ఈ మ్యాచ్‌పై గంభీర్ విశ్లేషణ చేస్తూ ఇలా అన్నాడు. సెమీఫైనల్లో కచ్చితంగా భారత జట్టే ఫేవరెట్. ఈ టోర్నీలో ప్రత్యర్థుల్ని కంగుతినిపించడమే కాదు... భారత్‌తో ఢీ అంటేనే కష్టం అనిపించేలా మనోళ్లు జైత్రయాత్ర సాగించారు. ముఖ్యంగా ఈ టోర్నీలో భారత బౌలింగ్ నన్ను ఆకట్టుకుంది. బౌలర్లు జట్టు భారాన్ని తమ భుజాలపై మోశారు. ఈ ప్రపంచకప్ గెలిస్తే మాత్రం దేశంలో బౌలింగ్ విప్లవం ఖాయం. ఇంతవరకు మనలో చాలామంది సచినో, కోహ్లినో కావాలనుకునే క్రికెట్లో అడుగుపెట్టేవారు. కానీ ఈ వరల్డ్‌కప్ తర్వాత బౌలర్ల లక్ష్యంతో అకాడమీలు కళకళలాడుతాయంటే ఆశ్చర్యం లేదు. కేఎల్ రాహుల్ బ్యాటింగ్ కళ్లప్పగించేలా చేసింది. ఆఖరి లీగ్ మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌పై బాదిన శతకం (102) అయితే హైలైట్ అని చెప్పొచ్చు. చక్కని ఫుట్‌వర్క్, పరిణతితో కూడిన ఫ్లిక్ షాట్స్‌తో ఫోర్లు, సిక్సర్లు అదరగొట్టాడు. మణికట్టు స్ట్రోక్‌ప్లేతో పరుగులు సాధించిన తీరు అద్భుతం. దీంతో రాహుల్‌ను ఇప్పుడు 360 డిగ్రీ ప్లేయర్ అనొచ్చు. 160 స్ట్రయిక్‌రేట్ అతని టాప్గేర్ను సూచిస్తోంది. అలాగని శ్రేయస్ అయ్యర్ ఏం తక్కువ కాదు. డచ్‌పై అతని ఆయుధం పుల్ షాట్లే. 128 పరుగుల్లో 42 ఆ షాట్లతో వచ్చినవే! అవే అతని సెంచరీని తేలిక చేశాయి. షార్ట్‌పిచ్ బంతులపై అయ్యర్ కనబరిచిన నైపుణ్యం మురిపించింది. ఏ బంతుల్ని ఎలా ఆడాలో... ఏవి వదిలేయాలో వివేకం చూపించాడు. అయితే కివీస్‌తో జరిగే సెమీస్‌లో మాత్రం అతనికి బౌన్స్, స్వింగ్ పరీక్షలు ఎదురవొచ్చు. తప్పకుండా న్యూజిలాండ్ నుంచి భారత్‌కు సవాల్ ఎదురవుతుంది. ప్రపంచకప్ కోసం బాగా సన్నద్ధమై వచ్చారు. వంద శాతం నిబద్ధతతో మెగా ఈవెంట్ ఆడుతున్నారు. బౌలింగ్, ఫీల్డింగ్‌లో న్యూజిలాండ్ మోహరింపు కట్టుదిట్టంగా ఉంటోంది. భారత టాప్–3 కోసం ఇదివరకే కసరత్తు చేసే వుంటారు. ఇందులో ఏ సందేహం లేదు. బౌలింగ్ ఫ్రెండ్లీ వాంఖెడే పిచ్‌పై భారత బ్యాటర్లకు చేజింగ్ కాస్త ఇబ్బందికరంగా మారొచ్చు. అయితే మనవాళ్లు బాగా ఆడితే ఎవరైనా ఏమీ చేయలేరు. -
భారత్ వర్సెస్ న్యూజిలాండ్ సెమీఫైనల్.. వర్షం పడితే పరిస్థితి ఏంటి?
వన్డే ప్రపంచకప్-2023 చివరి అంకానికి చేరుకుంది. ఆదివారం జరగనున్న భారత్-నెదర్లాండ్ మ్యాచ్‌తో ఈ మెగా టోర్నీ లీగ్ స్టేజి ముగియనుంది. ఇప్పటికే సెమీస్ బెర్త్‌లు ఖరారయ్యాయి. ఈ మెగా టోర్నీ సెమీఫైనల్స్‌కు భారత్, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్లు అర్హత సాధించాయి. నవంబర్ 15న ముంబైలోని వాంఖడే స్టేడియంలో తొలి సెమీఫైనల్లో భారత్, న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి. ఆ తర్వాత నవంబర్ 16న ఈడెన్ గార్డెన్స్ వేదికగా రెండో సెమీఫైనల్లో దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా జట్లు అమీతుమీ తెల్చుకోనున్నాయి. అయితే భారత్-కివీస్ మధ్య జరగనున్న తొలి సెమీఫైనల్‌కు వర్షం ముప్పు పొంచి ఉంది. ఒక వేళ వర్షం కారణంగా ఆట సాధ్యపడకపోతే ఏంటి పరిస్థితి నెటిజన్లు తెగ చర్చించుకుంటున్నారు. అయితే వరల్డ్‌కప్ సెమీఫైనల్స్, ఫైనల్‌కు ఐసీసీ రిజర్వ్‌డే కేటాయించింది. అంటే బుధవారం(నవంబర్ 15) వర్షం వల్ల మ్యాచ్ నిలిచిపోతే.. ఆట ఎక్కడ ఆగిందో అక్కడి నుంచి గురువారం(నవంబర్ 16) తిరిగి కొనసాగించనున్నారు. రిజర్వ్ డే రోజున ఆడే సమయం మ్యాచ్‌కి షెడ్యూల్ చేయబడిన రోజు మాదిరిగానే ఉంటాయి. అంతేకాకుండా అదనంగా మరో రెండు గంటల సమయాన్ని కూడా ఐసీసీ కేటాయించింది. రిజర్వ్‌డే రోజున ఫలితం తేలాలంటే ఇరు జట్లు కనీసం 20 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ రిజర్వ్‌డే రోజు కూడా ఆటసాధ్యపడకపోతే పాయింట్లపట్టికలో లీడింగ్‌లో ఉన్న జట్లు ఫైనల్‌కు అర్హత సాధిస్తుంది. చదవండి: చాలా బాధగా ఉంది.. మేము కొన్ని తప్పులు చేశాం: బాబర్ ఆజం -
వరల్డ్‌కప్ నుంచి పాకిస్తాన్ ఔట్..
వన్డే ప్రపంచకప్-2023లో పాకిస్తాన్ కథ ముగిసింది. ఈ మెగా టోర్నీ సెమీఫైనల్ రేసు నుంచి పాకిస్తాన్ అధికారికంగా నిష్క్రమించింది. ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో 332 పరుగుల లక్ష్యాన్ని 6. 4 ఓవర్లలో చేజ్ చేయకపోవడంతో పాక్.. ఈ టోర్నీ నుంచి ఇంటిముఖం పట్టింది. కాగా ఇంగ్లండ్‌తో మ్యాచ్‌కు ముందు పాకిస్తాన్‌కు సెమీస్‌కు చేరాలంటే కొన్ని సమీకరణాలు ఉండేవి. పాక్ ముందుగా బ్యాటింగ్ చేస్తే 287 పరుగుల తేడాతో గెలవాలి. ఒకవేళ ఛేజింగ్ చేస్తే టార్గెట్ బట్టి ఎన్ని ఓవర్లలో పూర్తి చేయాలన్నది నిర్ణయిస్తారు. ఉదాహరణకు ఇంగ్లండ్ తొలుత బ్యాటింగ్ చేసి 300 పరుగులు సాధిస్తే.. 6.1 ఓవర్లలో ఛేజ్ చేయాలి. 6.4 ఓవర్లలో 338 టార్గెట్.. అయితే ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి ఏకంగా 337 పరుగులు చేసింది. దీంతో ఐసీసీ సమీకరణాల ప్రకారం.. పాకిస్తాన్ సెమీస్‌కు చేరాలంటే లక్ష్యాన్ని కేవలం 6.4 ఓవర్లలో ఛేదించాలి. పాక్ 6.4 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి కేవలం 30 పరుగులు చేసింది. దీంతో పాకిస్తాన్ ప్రపంచకప్ నుంచి సెమీస్ చేరకుండానే టోర్నీ నుంచి ఔటైంది. భారత్ వర్సెస్ న్యూజిలాండ్ పాకిస్తాన్ ఇంటముఖం పట్టడంతో.. న్యూజిలాండ్ నాలుగో జట్టుగా ఈ మెగా టోర్నీలో సెమీఫైన్‌లకు అర్హత సాధించింది. నవంబర్ 15న వాంఖడే వేదికగా తొలి సెమీఫైనల్లో భారత్-న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి. అనంతరం రెండో సెమీఫైనల్లో కోల్‌కతా వేదికగా ఆస్ట్రేలియా-దక్షిణాఫ్రికా జట్లు తాడోపేడో తేల్చుకోనున్నాయి. చదవండి: World Cup 2023: పాకిస్తాన్ బౌలర్ అత్యంత చెత్త రికార్డు.. 48 ఏళ్ల వరల్డ్‌కప్ చరిత్రలోనే -
టీమిండియా ఆఖరి వరకు అజేయంగా నిలవడం ఖాయం! కానీ..
ICC WC 2023- Team India: సొంతగడ్డపై వన్డే వరల్డ్‌కప్ ట్రోఫీ గెలిచే సత్తా టీమిండియాకు ఉందని వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం వివియన్ రిచర్డ్స్ అన్నాడు. ఆఖరి వరకు జైత్రయాత్ర కొనసాగిస్తూ టైటిల్ కైవసం చేసుకుంటుందని అభిప్రాయపడ్డాడు. అయితే, ఈ ప్రయాణంలో ఎలాంటి ప్రతికూల ఆలోచనలు దరిచేరనీయొద్దని రోహిత్ సేనకు విజ్ఞప్తి చేశాడు. అలా అయితే మొదటికే మోసం వస్తుందని విండీస్ లెజెండరీ ఆల్‌రౌండర్ రిచర్డ్స్ హెచ్చరించాడు. కాగా ప్రపంచకప్-2023లో లీగ్ దశలో ఇప్పటివరకు ఆడిన ఎనిమిది మ్యాచ్‌లలోనూ టీమిండియా జయకేతనం ఎగురవేసింది. ఈ క్రమంలో ఇప్పటికే టేబుల్ టాపర్‌గా సెమీస్ చేరిన రోహిత్ సేన.. లీగ్ దశలో మిగిలిన ఒక్క మ్యాచ్‌లోనూ గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. భారీ విజయంతో అజేయంగా నిలవాలని పట్టుదలగా ఉంది. నెదర్లాండ్స్ వంటి పసికూనతో మ్యాచ్‌లో భారత జట్టుకు ఇదేమీ అంతకష్టమని పనికాదు. న్యూజిలాండ్‌తో మ్యాచ్ అంటేనే ఇదిలా ఉంటే.. తొలి సెమీ ఫైనల్లో టీమిండియాతో తలపడేందుకు న్యూజిలాండ్ సిద్ధమైంది. శ్రీలంకపై ఘన విజయంతో అనధికారికంగా సెమీస్ బెర్తు ఖరారు చేసుకున్న కివీస్.. రోహిత్ సేనతో తలపడటం దాదాపుగా ఖాయమైపోయింది. అయితే, 2015, 2019 టోర్నీల్లో టీమిండియాకు న్యూజిలాండ్ చేతిలో ఎదురైన చేదు అనుభవాల దృష్ట్యా ఈసారి ఏం జరుగుతుందోననే ఆందోళన అభిమానులను వెంటాడుతోంది. ఈ క్రమంలో వివియన్ రిచర్డ్స్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అలా అయితేనే ఆఖరి వరకు అజేయంగా ఐసీసీ వెబ్‌సైట్‌తో మాట్లాడుతూ.. ‘‘టీమిండియా చివరి దాకా అజేయంగా నిలుస్తుందనే నమ్మకం ఉంది. అయితే, కొన్నిసార్లు.. ‘మేము ఇక్కడిదాకా బాగానే ఆడాం.. కానీ సెమీ ఫైనల్లో ఏం జరుగుతుందో’ అనే భయాలు ఉండటం సహజం. కానీ ఇలాంటి ప్రతికూల అంశాల గురించి ఎంత పక్కనపెడితే అంత మంచిది. ఇప్పటిదాకా ఆత్మవిశ్వాసంతో ఎలా ఆడారో ఇక ముందు కూడా అలాగే ఆడాలి. వాళ్ల మైండ్‌సెట్‌లో ఎలాంటి మార్పూ రాకూడదు’’ అని వివియన్ రిచర్డ్స్ పేర్కొన్నాడు. నెగటివ్‌గా అనిపించే ప్రతి విషయాన్ని భారత ఆటగాళ్లు పక్కనపెట్టాలని ఈ సందర్భంగా సూచించాడు. చదవండి: కానిస్టేబుల్ కొడుకు నుంచి టీమిండియా క్రికెటర్ దాకా! సంజూ ఆస్తి ఎంతంటే! పాక్‌కు సెమీస్ అవకాశాలు ఇంకా ఉన్నాయి.. ఆ ముగ్గురు కీలకం: బాబర్ -
కివీస్‌కు సెమీస్ పిలుపు!
గత ప్రపంచకప్ రన్నరప్ న్యూజిలాండ్ కీలక సమరంలో తమ సత్తా చాటింది. టోర్నీలో వరుసగా నాలుగు విజయాల తర్వాత నాలుగు పరాజయాలతో తమ పరిస్థితిని క్లిష్టంగా మార్చుకున్న కివీస్ ఆఖరి ఆటలో స్థాయికి తగ్గ ప్రదర్శనను కనబర్చి దాదాపు సెమీఫైనల్లోకి అడుగు పెట్టింది. చివరి మ్యాచ్‌లో శ్రీలంకను చిత్తు చేసిన ఆ జట్టు మరే జట్టుపై ఆధారపడకుండా తమ సెమీస్ అవకాశాలను తానే సృష్టించుకుంది. కివీస్ గెలుపుతో పాకిస్తాన్ సెమీస్ ఆశలు చేజారాయి. సాంకేతికంగా, అంకెల ప్రకారం పాక్ పూర్తిగా, అధికారికంగా నిష్క్రమించకపోయినా... అసాధ్యమైన, ఊహకు కూడా అందని తరహాలో ఆ జట్టు తర్వాతి మ్యాచ్‌లో గెలవాల్సిన నేపథ్యంలో వాస్తవికంగా చూస్తే పాక్ ఆట ముగిసినట్లే! బెంగళూరు: పదునైన బౌలింగ్, ఆపై దూకుడైన బ్యాటింగ్‌తో న్యూజిలాండ్ వరల్డ్‌కప్ లీగ్ దశను ఘనంగా ముగించింది. సెమీస్ అవకాశాలు నిలిచి ఉండాలంటే తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్‌లో చెలరేగిన ఆ జట్టు తమ లక్ష్యాన్ని నిర్విఘ్నంగా పూర్తి చేసింది. గురువారం చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ ఐదు వికెట్ల తేడాతో శ్రీలంకను ఓడించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన లంక 46.4 ఓవర్లలో 171 పరుగులకే ఆలౌటైంది. కుశాల్ పెరీరా (28 బంతుల్లో 51; 9 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధసెంచరీ సాధించాడు. 10 ఓవర్లలోపే 70/5 స్కోరుతో కుప్పకూలేందుకు సిద్ధమైన లంక... చివర్లో మహీశ్ తీక్షణ (91 బంతుల్లో 38 నాటౌట్; 3 ఫోర్లు) రాణించడంతో ఈ మాత్రం స్కోరైనా సాధించగలిగింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ ట్రెంట్ బౌల్ట్ (3/37)తో పాటు ఇతర కివీస్ బౌలర్లూ సత్తా చాటి ప్రత్యర్థిని పడగొట్టారు. అనంతరం న్యూజిలాండ్ 23.2 ఓవర్లలో 5 వికెట్లకు 172 పరుగులు సాధించింది. కాన్వే (42 బంతుల్లో 45; 9 ఫోర్లు), రచిన్ రవీంద్ర (34 బంతుల్లో 42; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) తొలి వికెట్‌కు 74 బంతుల్లోనే 86 పరుగులు జోడించి విజయానికి పునాది వేయగా, మిచెల్ (31 బంతుల్లో 43; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఈ ఫలితంతో న్యూజిలాండ్ సెమీస్‌కు చేర డం దాదాపుగా ఖాయం కాగా... కివీస్ ఓటమిపై ఆశలు పెట్టుకున్న పాక్, అఫ్గానిస్తాన్‌కు నిరాశ తప్పలేదు. స్కోరు వివరాలు శ్రీలంక ఇన్నింగ్స్: నిసాంక (సి) లాథమ్ (బి) సౌతీ 2; పెరీరా (సి) సాన్‌ట్నర్ (బి) ఫెర్గూసన్ 51; మెండిస్ (సి) రచిన్ (బి) బౌల్ట్ 6; సమరవిక్రమ (సి) మిచెల్ (బి) బౌల్ట్ 1; అసలంక (ఎల్బీ) (బి) బౌల్ట్ 8; మాథ్యూస్ (సి) మిచెల్ (బి) సాన్‌ట్నర్ 16; ధనంజయ (సి) మిచెల్ (బి) సాన్‌ట్నర్ 19; కరుణరత్నే (సి) లాథమ్ (బి) ఫెర్గూసన్ 6; తీక్షణ (నాటౌట్) 38; చమీర (సి) బౌల్ట్ (బి) రచిన్ 1; మదుషంక (సి) లాథమ్ (బి) రచిన్ 19; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (46.4 ఓవర్లలో ఆలౌట్) 171. వికెట్ల పతనం: 1–3, 2–30, 3–32, 4–70, 5–70, 6–104, 7–105, 8–113, 9–128, 10–171. బౌలింగ్: బౌల్ట్ 10–3–37–3, సౌతీ 8–0–52–1, ఫెర్గూసన్ 10–2–35–2, సాన్‌ట్నర్ 10–2–22–2, రచిన్ 7.4–0–21–2, ఫిలిప్స్ 1–0–3–0. న్యూజిలాండ్ ఇన్నింగ్స్: కాన్వే (సి) ధనంజయ (బి) చమీర 45; రచిన్ (సి) ధనంజయ (బి) తీక్షణ 42; విలియమ్సన్ (బి) మాథ్యూస్ 14; మిచెల్ (సి) అసలంక (బి) మాథ్యూస్ 43; చాప్మన్ (రనౌట్) 7; ఫిలిప్స్ (నాటౌట్) 17; లాథమ్ (నాటౌట్) 2; ఎక్స్‌ట్రాలు 2; మొత్తం (23.2 ఓవర్లలో 5 వికెట్లకు) 172. వికెట్ల పతనం: 1–86, 2–88, 3–130, 4–145, 5–162. బౌలింగ్: మదుషంక 6.2–0–58–0, తీక్షణ 7–0–43–1, ధనంజయ 2–0–22–0, చమీర 4–1–20–1, మాథ్యూస్ 4–0–29–2. ప్రపంచకప్‌లో నేడు దక్షిణాఫ్రికా x అఫ్గానిస్తాన్ వేదిక: అహ్మదాబాద్ మధ్యాహ్నం 2 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, హాట్‌స్టార్ యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం -
CWC 2023 Semis Race: కివీస్.. శ్రీలంక చేతిలో ఓడినా పర్లేదు.. !
వన్డే వరల్డ్‌కప్ 2023లో ఇవాళ (నవంబర్ 9) అత్యంత కీలకమైన మ్యాచ్ జరుగనుంది. బెంగళూరు వేదికగా జరిగే ఈ మ్యాచ్‌లో శ్రీలంక,న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి. సెమీస్ రేసులో ముందువరుసలో ఉన్న న్యూజిలాండ్ ఈ మ్యాచ్‌లో తప్పనిసరిగా గెలవాల్సి ఉంది. లంకపై కివీస్ భారీ తేడాతో గెలిస్తే, సెమీస్ రేసులో ఉన్న పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్లతో పోటీ ఉండదు. ఆయా జట్ల గెలుపోటములతో సంబంధం లేకుండా న్యూజిలాండ్ సెమీస్‌కు చేరుకుంటుంది. లంక చేతితో ఓడినా సెమీస్‌కు చేరే అవకాశం ఉంటుంది.. ఒకవేళ ఇవాళ జరిగే మ్యాచ్‌లో న్యూజిలాండ్.. శ్రీలంక చేతిలో ఓడినా సెమీస్ చేరే అవకాశం ఉంటుంది. అదెలా అంటే.. సెమీస్ రేసులో ఉన్న మిగతా రెండు జట్లు తమతమ ప్రత్యర్దుల చేతుల్లో ఓడాల్సి ఉంటుంది. అప్పుడు న్యూజిలాండ్, పాక్, ఆఫ్ఘనిస్తాన్‌కు సమానంగా 8 పాయింట్లు ఉంటాయి. ఇక్కడ మెరుగైన రన్‌రేట్ కలిగిన జట్టు సెమీస్‌కు చేరుకుంటుంది. ఎవరు గెలిచినా సెమీస్‌లో టీమిండియానే ప్రత్యర్ధి.. ప్రస్తుతం సెమీస్ రేసులో ఉన్న మూడు జట్లలో (కివీస్, పాక్, ఆఫ్ఘనిస్తాన్) ఏ జట్టు ఫైనల్ ఫోర్కు అర్హత సాధించినా అక్కడ వారి ప్రత్యర్ది టీమిండియానే అవుతుంది. ఎందుకంటే.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న జట్టు.. నాలుగో స్థానంలో నిలిచే జట్టుతో తలపడాల్సి ఉంది. రెండు, మూడు స్థానాల్లో నిలిచే జట్లు మరో సెమీస్‌లో తలపడతాయి. ప్రస్తుత ఎడిషన్‌లో వరుసగా 8 మ్యాచ్‌ల్లో గెలిచిన భారత్.. తమ ఆఖరి లీగ్ మ్యాచ్‌లో నెదర్లాండ్స్ చేతిలో ఓడినా పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలోనే నిలుస్తుంది. అలాగే రెండు, మూడు స్థానాల్లో ఉన్న సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా జట్లు సైతం మరో లీగ్ మ్యాచ్ ఆడాల్సి ఉన్నప్పటికీ.. గెలుపోటములు వారి స్థానాలపై ప్రభావం చూపవు. కాబట్టి రెండో సెమీస్‌లో సౌతాఫ్రికా, ఆసీస్ పోరు ఖరారైపోయింది. సెమీస్ ఎప్పుడు, ఎక్కడ అంటే.. ప్రస్తుత వరల్డ్‌కప్‌లో రెండో సెమీస్‌లో తలపడే జట్లు ఏవో తేలిపోయింది. తొలి సెమీస్‌లో భారత్‌తో తలపడబోయే జట్టు ఏదో తేలాల్సి ఉంది. ప్రస్తుతం సెమీస్ రేసులో ఉన్న కివీస్, పాక్, ఆఫ్ఘనిస్తాన్లలో ఏ జట్టు సెమీస్‌కు చేరినా ముంబై వేదికగా నవంబర్ 15న భారత్‌తో తలపడాల్సి ఉంటుంది. కోల్‌కతా వేదికగా నవంబర్ 16న జరిగే రెండో సెమీస్‌లో సౌతాఫ్రికా, ఆసీస్ పోరు ఖాయమైపోయింది. ఈ రెండు సెమీస్‌లలో గెలిచే జట్లు నవంబర్ 19న అహ్మదాబాద్‌లో జరిగే ఫైనల్లో అమీతుమీ తేల్చుకుంటాయి. -
దక్షిణాఫ్రికా చేతిలో కివీస్ ఘోర ఓటమి.. సెమీస్ రేసులోకి పాకిస్తాన్
వన్డే ప్రపంచకప్-2023లో భాగంగా పుణే వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో 190 పరుగుల తేడాతో న్యూజిలాండ్ ఓటమి పాలైంది. 358 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్.. ప్రోటీస్ బౌలర్ల ధాటికి 167 పరుగులకే కుప్పకూలింది. ఇక న్యూజిలాండ్ ఘోర ఓటమితో పాయింట్ల పట్టికలో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. కివీస్ నాలుగో స్ధానానికి చేరుకోగా.. ఆస్ట్రేలియా మూడో స్ధానానికి ఎగబాకింది. కివీస్ ఓటమితో పాకిస్తాన్ సెమీస్ అవకాశాలు మరింత రెట్టింపు అయ్యాయి. పాకిస్తాన్ సెమీస్‌కు చేరాలంటే? ఈ టోర్నీలో ఇప్పటివరకు 7 మ్యాచ్‌లు ఆడిన పాకిస్తాన్ 3 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. ఇంకా పాకిస్తాన్‌కు రెండు మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. న్యూజిలాండ్, ఇంగ్లండ్ జట్లతో పాకిస్తాన్ తలపడనుంది. ఈ మెగా ఈవెంట్లో పాకిస్తాన్ సెమీస్ చేరాలంటే.. ఇంగ్లండ్, న్యూజిలాండ్‌పై కచ్చితంగా విజయం సాధించాలి. అప్పుడు పాక్ జట్టు ఖాతాలో 10 పాయింట్లు చేరుతాయి. అయితే ఈ 10 పాయింట్లతో పాకిస్థాన్ సెమీస్ చేరడం చాలా కష్టం. ఈ సమయంలో ఇతర జట్ల ఫలితాలపై పాక్ భవితవ్యం ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం 8 పాయింట్లతో నాలుగో స్ధానంలో కివీస్ మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోవాలి. మరోవైపు ఆరో స్థానంలో ఉన్న అఫ్గానిస్తాన్ మిగిలిన మూడు మ్యాచ్‌ల్లో ఒకటి కంటే ఎక్కువ మ్యాచులు గెలవకూడదు. అప్పుడు ఈ కివీస్, అఫ్గాన్ రెండు జట్లు 8 పాయింట్లతో ఉంటే.. పాక్ 10 పాయింట్లతో సెమీస్ చేరుతుంది. ఒక వేళ కివీస్ ఒక్క మ్యాచ్, అఫ్గానిస్తాన్ రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధిస్తే అప్పుడు మూడు జట్లు 10 పాయింట్లతో సమంగా నిలుస్తాయి. ఈ క్రమంలో రన్‌రేట్ పరంగా మూడింటిలో ఒక జట్టు సెమీస్‌కు అర్హత సాధిస్తుంది. కాగా పాయింట్ల పట్టికలో ప్రస్తుతం మూడో స్ధానంలో ఆస్ట్రేలియా సెమీస్‌కు ఈజీగా చేరే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఆసీస్‌కు ఇంకా మూడు మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. మూడు మ్యాచ్‌ల్లో రెండు గెలిచిన చాలు. ఎందుకంటే మెరుగైన రన్‌రేట్ ఉంది కాబట్టి సెమీస్‌కు అసీస్ క్వాలిఫై అవుతోంది. ఈ నేపథ్యంలో నాలుగో స్ధానం కోసం తీవ్ర పోటీ నెలకొనడం ఖాయమన్పిస్తోంది. చదవండి: World Cup 2023: న్యూజిలాండ్‌ను చిత్తు చేసిన దక్షిణాఫ్రికా.. 190 పరుగుల తేడాతో భారీ విజయం -
వరల్డ్ కప్‌లో సగం మ్యాచ్‌లు పూర్తి.. సెమీఫైనల్‌కు వచ్చేది ఎవరు?
భారత్ వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచకప్-2023 రసవత్తరంగా సాగుతోంది. మంగళవారం చెన్నై వేదికగా దక్షిణాఫ్రికా- బంగ్లాదేశ్ మధ్య జరిగిన మ్యాచ్‌తో ఈ మెగా టోర్నీలో సగం మ్యాచ్‌లు ముగిశాయి. సెమీఫైనల్స్, ఫైనల్ మ్యాచ్‌లతో కలిపి ఈ టోర్నీలో మొత్తం 48 మ్యాచ్‌లు జరగాల్సి ఉండగా.. ఇప్పటివరకు 23 మ్యాచ్‌లు పూర్తయ్యాయి. కాగా ఇప్పటివరకు జరిగిన ఈ టోర్నీ మొదటి అర్ధబాగంలో ఎన్నో సంచలనాలు నమోదయ్యాయి. ఆఫ్గానిస్తాన్, నెదర్లాండ్స్ వంటి పసికూనలు వరల్డ్‌క్లాస్ జట్లను మట్టికరిపించాయి. ఇంగ్లండ్, పాకిస్తాన్ వంటి మేటి జట్లను ఆఫ్గానిస్తాన్ చిత్తుచేయగా.. దక్షిణాఫ్రికాను నెదర్లాండ్స్ ఓడించింది. సెమీఫైనల్స్‌కు చేరేది ఎవరు? ఈ ఏడాది వరల్డ్‌కప్‌లో టీమిండియా వరుస విజయాలతో దూసుకుపోతుంది. ఇప్పటివరకు 5 మ్యాచ్‌లు ఆడిన భారత్.. ఐదింట విజయం సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్ధానంలో కొనసాగుతోంది. ఈ టోర్నీలో భారత జట్టు పటిష్ట ఆస్ట్రేలియా, పాకిస్తాన్, న్యూజిలాండ్‌ను చిత్తు చేసింది. ఇక పాయింట్ల పట్టికలో టీమిండియా తర్వాత దక్షిణాఫ్రికా ఉంది. దక్షిణాఫ్రికా కూడా సూపర్ ఫామ్‌లో ఉంది. ఇప్పటివరకు 5 మ్యాచ్‌లు ఆడిన ప్రోటీస్.. నాలుగింట విజయం సాధించింది. ఇక మూడో స్ధానంలో కివీస్ ఉంది. కివీస్ కూడా టోర్నీ ఆరంభం నుంచి అదరగొడుతోంది. భారత్‌తో మినహా మిగితా మ్యాచ్‌లన్నింటిలోనూ బ్లాక్ క్యాప్స్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచారు. ఇక కివీస్ తర్వాత స్ధానంలో ఆస్ట్రేలియా ఉంది. టోర్నీ ఆరంభంలో కాస్త తడబడిన ఆసీస్.. ఆ తర్వాత తిరిగి గాడిలో పడింది. ఇప్పటివరకు 4 మ్యాచ్‌లు ఆడిన ఆసీస్ రెండు విజయాలతో పాయింట్ల పట్టికలో నాలుగో స్ధానంలో ఉంది. టాప్-4లో నిలిచిన నాలుగు జట్లు సెమీఫైనల్స్ అర్హత సాధిస్తాయి. అయితే హాఫ్ స్టేజి ముగిసేటప్పటికి సెమీఫైనల్ చేరే జట్లపై ఇంకా సృష్టత రాలేదు. మరో రెండు మూడు రోజుల్లో సెమీఫైనల్ చేరే జట్లపై ఒక క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. నవంబర్ 15న ముంబై వేదికగా తొలి సెమీఫైనల్.. నవంబర్ 16న ఈడెన్ గార్డెన్స్ వేదికగా రెండో సెమీఫైనల్ జరగనుంది. ఇక ఫైనల్ నవంబర్ 19న అహ్మదాబాద్ వేదికగా జరగనుంది. చదవండి: ఐపీఎల్ ఆడిన అనుభవం కలిసొచ్చింది.. అతడు మాత్రం అద్బుతం: సౌతాఫ్రికా కెప్టెన్ -
అదరగొడుతున్న భారత మహిళల హాకీ జట్టు.. వరుసగా నాలుగో విజయం
ఆసియాక్రీడలు 2023లో భారత మహిళల హకీ జట్టు తమ జోరును కొనసాగిస్తోంది. హాంకాంగ్‌తో జరిగిన చివరి పూల్ మ్యాచ్‌లో భారత జట్టు 13-0తో విజయం సాధించింది. ఇప్పటికే సెమీస్ బెర్త్‌ను ఖారారు చేసుకున్న టీమిండియా.. ఈ విజయంతో తమ ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచుకుంది. భారత జట్టులో వందనా కటారియా, దీపికా, దీప్ గ్రేస్ ఎక్కా తలా మూడు గోల్స్‌తో అదరగొట్టారు. వీరి ముగ్గురితో పాటు సంగీతా కుమారి రెండు గోల్స్, నవనీత్ కౌర్ ఒక్క గోల్ సాధించారు. కాగా పూల్-ఎలో భారత మహిళ జట్టు 4 విజయాలు సాధించి 10 పాయింట్లతో అగ్ర స్ధానంలో నిలిచింది. కాగా ప్రతీ పూల్ నుంచి మొదటి రెండు స్ధానాల్లో నిలిచిన జట్లు సెమీఫైనల్‌కు అర్హత సాధించాయి. ఇక గురువారం జరగనున్న సెమీ ఫైనల్లో పూల్-బి రన్నరప్‌తో భారత్ తలపడనుంది. చదవండి: అతడిని భారత క్రికెటర్‌గా చాలా సంతోషంగా ఉంది: దినేష్ కార్తీక్ -
భారత టీటీ జట్టుకు పతకం ఖాయం
ప్యాంగ్‌చాంగ్ (దక్షిణ కొరియా): ఆసియా టేబుల్ టెన్నిస్ (టీటీ) చాంపియన్‌షిప్‌లో భారత పురుషుల జట్టు సెమీఫైనల్లోకి దూసుకెళ్లి కనీసం కాంస్య పతకాన్ని ఖాయం చేసుకుంది. సోమవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో భారత జట్టు 3–0తో సింగపూర్ జట్టును ఓడించింది. భారత మహిళల జట్టు క్వార్టర్ ఫైనల్లో 0–3తో జపాన్ చేతిలో ఓడిపోయింది. సింగపూర్‌తో తొలి మ్యాచ్‌లో 41 ఏళ్ల ఆచంట శరత్ కమల్ 11–1, 10–12, 11–8, 11–13, 14–12తో ఇజాక్ క్వెక్‌పై నెగ్గగా... రెండో మ్యాచ్‌లో సత్యన్ జ్ఞానశేఖరన్ 11–6, 11–8, 12–10తో యె ఎన్ కొయెన్ పాంగ్‌ను ఓడించాడు. దాంతో భారత్ 2–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. మూడో మ్యాచ్‌లో హరీ్మత్ దేశాయ్ 11–9, 11–4, 11–6తో జె యు క్లారెన్స్ చ్యూపై గెలవడంతో భారత్ 3–0తో విజయాన్ని ఖాయం చేసుకుంది. బుధవారం జరిగే సెమీఫైనల్స్‌లో చైనీస్ తైపీతో భారత్; దక్షిణ కొరియాతో చైనా తలపడతాయి. చదవండి: World Cup 2023: నేడు భారత ప్రపంచకప్ జట్టు ప్రకటన.. ఎవరూ ఊహించని ఆటగాడి ఎంట్రీ! -
భారత్ కథ ముగిసింది.. సెమీస్‌లో లక్ష్యసేన్ ఓటమి
భారత స్టార్ షట్లర్ లక్ష్యసేన్ జపాన్ ఓపెన్ నుంచి నిష్క్రమించాడు. శనివారం జరిగిన పురుషుల సింగిల్స్ సెమీఫైనల్స్‌లో ఇండోనేషియాకు చెందిన జొనాథన్ క్రిస్టీ చేతిలో 21-15,13-21,21-16తో ఓటమిపాలయ్యాడు. తొలి గేమ్‌లో ఇద్దరు నువ్వా-నేనా అన్నట్లుగా తలపడ్డారు. అయితే గేమ్ ఆఖర్లో లక్ష్యసేన్ పట్టు సడలించడంతో 21-15 తేడాతో జొనాథన్ మొదటి గేమ్‌ను సొంతం చేసుకున్నాడు. దాంతో లక్ష్యసేన్ రెండో గేమ్‌ను కసిగా మొదలుపెట్టాడు. గేమ్ ఆద్యంతం ఎక్కడా జొనాథన్‌ను పైచేయి సాధించనీయలేదు. దాంతో 13-21 తేడాతో రెండో గేమ్‌ను కైవసం చేసుకున్నాడు. అయితే నిర్ణయాత్మక మూడో గేమ్‌లో లక్ష్యసేన్ అదే జోరును కంటిన్యూ చేయలేకపోయాడు. చివరకు జొనాథన్ 21-16తో గేమ్‌ను గెలిచి ఫైనల్లో అడుగుపెట్టాడు. Jonatan Christie 🇮🇩 and Lakshya Sen 🇮🇳 give it their all for a spot in the finals.#BWFWorldTour #JapanOpen2023 pic.twitter.com/0eSj6ZLOIH — BWF (@bwfmedia) July 29, 2023 చదవండి: ‘హండ్రెడ్’ టోర్నీకి జెమీమా 151 కి.మీ వేగంతో బౌలింగ్.. అయినా 104 మీటర్ల భారీ సిక్స్! వీడియో వైరల్ -
సెమీస్‌కు దూసుకెళ్లిన లక్ష్యసేన్.. సాత్విక్-చిరాగ్ జోడి ఓటమి
భారత టాప్ షట్లర్ లక్ష్యసేన్ మరో టైటిల్‌కు దగ్గరయ్యాడు.జపాన్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భాగంగా లక్ష్యసేన్ సెమీస్‌కు దూసుకెళ్లాడు. శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో జపాన్‌కు చెందిన లోకల్ ప్లేయర్ కోకి వతాన్బేను 21-15, 21-19 వరుస గేముల్లో చిత్తు చేశాడు. ఇక రేపు(శనివారం) జరగనున్న సెమీఫైనల్లో ఇండోనేషియాకు చెందిన జోనాథన్ క్రిస్టీతో తలపడనున్నాడు. Lakshya Sen enters semifinals of Japan Open, Satwik-Chirag out READ: https://t.co/XMwjavlFmc#LakshyaSen #Badminton #JapanOpen pic.twitter.com/oRgSxUuxR3 — TOI Sports (@toisports) July 28, 2023 వరల్డ్ నెంబర్ పదో ర్యాంకర్ హెచ్ఎస్ ప్రణయ్ పోరాటం క్వార్టర్స్‌లో ముగిసింది. డెన్మార్క్‌కు చెందిన ప్రపంచ నెంబర్‌వన్ విక్టర్ అక్సెల్సెన్ చేతిలో 21-19, 18-21,8-21తో ఓడిపోయాడు. అయితే తొలి గేమ్‌ను 21-19తో గెలిచి రెండో గేమ్‌లోనూ ఒక దశలో 7-1తో ఆధిక్యంలో కనిపించిన ప్రణయ్ ఆ తర్వాత అనవసర ఒత్తిడికి లోనయ్యాడు. ఆ తర్వాత 18-21తో రెండో గేమ్ కోల్పోయిన ప్రణయ్.. మూడో గేమ్‌లో పూర్తిగా చేతులెత్తేశాడు. సాత్విక్-చిరాగ్ జోడి ఓటమి భారత డబుల్స్ టాప్ షట్లర్స్ సాత్విక్-చిరాగ్ శెట్టి జోడి పోరాటం ముగిసింది. ఇటీవలే కొరియా ఓపెన్ నెగ్గి జోరు మీదున్న ఈ ద్వయం ఈ టోర్నీలో ఒక్క గేమ్ కూడా కోల్పోకుండా గెలుస్తూ మరో టైటిల్ గెలిచేలా కనిపించింది. అయితే శుక్రవారం జరిగిన డబుల్స్ క్వార్టర్ ఫైనల్స్‌లో చైనీస్ తైపీకి చెందిన ఒలింపిక్ చాంపియన్స్ లీ యాంగ్- వాంగ్ చీ-లాన్ చేతిలో 15-21, 25-23, 16-21తో ఓటమి పాలయ్యారు. చదవండి: రోహిత్ చివరగా ఏడో స్థానంలో ఎప్పుడు బ్యాటింగ్‌కు వచ్చాడంటే? Major League Cricket 2023: డికాక్ విధ్వంసకర ఇన్నింగ్స్.. ఫైనల్లో సీటెల్ ఓర్కాస్ -
'నువ్వు మొదలెట్టావ్.. నేను పూర్తి చేశా; లెక్క సరిపోయింది'
ఎమర్జింగ్ ఆసియా కప్ 2023లో ఇండియా-ఏ జట్టు ఫైనల్లో అడుగుపెట్టింది. శుక్రవారం బంగ్లాదేశ్-ఏతో జరిగిన సెమీఫైనల్లో ఇండియా-ఏ జట్టు 51 పరుగుల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. ఇక ఆదివారం చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో ఫైనల్లో అమితుమీ తేల్చుకోనుంది. ఈ సంగతి పక్కనబెడితే సెమీఫైనల్ సందర్భంగా ఇండియా, బంగ్లాదేశ్ ఆటగాళ్లు ఎక్కడా తగ్గలేదు. మొదట టీమిండియా బ్యాటింగ్ సమయంలో వికెట్ పడ్డ ప్రతీసారి బంగ్లా ఆటగాళ్లు టీమిండియా బ్యాటర్లపై ఏదో ఒక కామెంట్ చేస్తూ పెవిలియన్ సిగ్నల్ చూపించారు. ఒక్కసారి అంటే ఏదో అనుకోవచ్చు.. పదే పదే అదే చర్యకు పాల్పడుతూ శ్రుతి మించారు. ఇదంతా టీమిండియా ఆటగాళ్లు గమనిస్తూనే వచ్చారు. మాకు టైం వచ్చినప్పుడు మేమేంటో చూపిస్తాం అన్నట్లుగా సైలెంట్‌గా ఉన్నారు. ఇక బంగ్లా ఇన్నింగ్స్ సమయంలో ఇండియా- ఏ ఆటగాళ్లు కూడా ఏమాత్రం తగ్గలేదు. బంగ్లా వికెట్ కోల్పోయిన ప్రతీసారి గట్టిగా అరుస్తూ సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ నేపథ్యంలో బంగ్లా సీనియర్ బ్యాటర్ సౌమ్యా సర్కార్, ఇండియా-ఏ ఆటగాడు హర్షిత్ రానాల మధ్య మాటల యుద్దం చోటుచేసుకోవడం ఆసక్తి కలిగించింది. విషయంలోకి వెళితే.. ఇన్నింగ్స్ 26వ ఓవర్ యువరాజ్‌సిన్హ్ దోదియా వేశాడు. ఆ ఓవర్లో రెండో బంతిని సౌమ్యా సర్కర్ షాట్ ఆడే ప్రయత్నంలో ఇన్సైడ్ ఎడ్జ్ అయి స్లిప్‌లో ఉన్న నికిన్ జోస్‌కు దొరికిపోయాడు. కీలక వికెట్ కావడంతో ఇండియా-ఏ ఆటగాళ్లు సంబరాలు మొదలుపెట్టారు. అయితే హర్షిత్ రానా సౌమ్యా సర్కర్ మొహం ముందు గట్టిగా అరుస్తూ పంచ్‌లు గుద్దుతూ సెలబ్రేట్ చేసుకున్నాడు. ఇది నచ్చిన సౌమ్యా సర్కార్ హర్షిత్ రానాతో గొడవకు దిగాడు. ఇద్దరు మాటమాట అనుకున్నారు. అంపైర్ వచ్చేలోపే ఇద్దరు దూషణకు దిగారు. ఇంతలో ఆటగాళ్లు వచ్చి ఇద్దరిని విడదీసే ప్రయత్నం చేశారు. సాయి సుదర్శన్ వచ్చి సౌమ్యా సర్కార్‌ను వెళ్లమంటూ పక్కకు తీసుకెళ్లాడు. అయితే పెవిలియన్ వెళ్తున్న సమయంలోనూ సౌమ్యా సర్కార్ హర్షిత్ రానాపై మాటల యుద్దం కొనసాగించాడు. అయితే హర్షిత్ రానా ఇంత వైల్డ్‌గా రియాక్ట్ అవ్వడానికి ఒక కారణం ఉంది. టీమిండియా బ్యాటింగ్ సమయంలో యష్‌దుల్ ఔటైన సందర్భంలో సౌమ్యా సర్కార్ అసభ్యకర వ్యాఖ్యలు చేసి శ్రుతి మించాడు. ఇది మనసులో పెట్టుకున్న హర్షిత్ రానా సౌమ్యా సర్కార్ ఔటవ్వగానే బదులు తీర్చుకున్నాడు. ''నువ్వు మొదలుపెట్టావ్..నేను పూర్తి చేశా.. లెక్క సరిపోయింది'' అంటూ కామెంట్ చేయడం స్టంప్ మైక్‌లో రికార్డయింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. India vs Bangladesh - never short of some heat 🔥 . .#EmergingAsiaCup2023 #INDAvBANA pic.twitter.com/xxnMx8Arez — FanCode (@FanCode) July 21, 2023 చదవండి: దురదృష్టవంతుల లిస్ట్‌లో బెయిర్ స్టో.. ఏడో క్రికెటర్‌గా Lionel Messi: మెస్సీనా మజాకా.. క్లబ్‌లు మారినా గోల్స్ మాత్రం ఆగడం లేదుగా -
సెమీఫైనల్లో సాత్విక్ జోడీ
యోసు (కొరియా): భారత అగ్రశ్రేణి బ్యాడ్మింటన్ జోడీ సాత్విక్ సాయిరాజ్– చిరాగ్ శెట్టి కొరియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–500 టోర్నమెంట్లో సెమీ ఫైనల్లో అడుగుపెట్టింది. శుక్రవారం జరిగిన పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ మూడో ర్యాంకు జంట వరుస సెట్లలో ఐదో సీడ్ టకురో హొకి–యుగొ కొబయషి (జపాన్) ద్వయంపై అలవోక విజయం సాధించింది. 40 నిమిషాల్లో ముగిసిన ఈ క్వార్టర్స్ పోరులో సాత్విక్–చిరాగ్ జోడీ 21–14, 21–17తో జపాన్ ద్వయంపై గెలుపొందింది. గత నెల ఇండోనేసియా ఓపెన్ డబుల్స్ టైటిల్ నెగ్గి జోరు మీదున్న భారత షట్లరు ఈ టోరీ్నలోనూ అదే దూకుడు కొనసాగిస్తున్నారు. తొలి గేమ్ ఆరంభంలోనే వరుసగా ఆరు పాయింట్లతో ప్రత్యర్థిపై పైచేయి సాధించిన సాత్విక్–చిరాగ్ ద్వయం గేమ్ గెలిచేందుకు ఎక్కువ సమయం పట్టలేదు. రెండో గేమ్‌లో భారత జోడీ 3–6తో కాస్త వెనుకపడినట్లు కనిపించింది. అయితే అక్కడి నుంచి సాత్విక్–చిరాగ్‌లిద్దరు తమ షాట్లకు పదునుపెట్టడంతో వరుసగా 6 పాయింట్లు గెలిచారు. అక్కడి నుంచి ఆధిక్యాన్ని అంతకంతకు పెంచుకుంటూ పోయారు. ఇటీవలే ‘యోనెక్స్’ ఫ్యాక్టరీలో ల్యాబ్‌లో ఫాస్టెస్ట్ స్మాష్‌తో గిన్నిస్ రికార్డు నమోదు చేసిన సాత్విక్ సాయిరాజ్ కోర్టులోనూ ఈ సారి అలాంటి ఫీట్‌ను మళ్లీ సాధించడం విశేషం. క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో సాత్విక్ రికార్డు వేగంతో స్మాష్ బాదాడు. అతను కొట్టిన స్మాష్‌కు షటిల్ గంటకు 500 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోయింది. -
46వసారి సెమీస్‌లో.. ఫెదరర్ రికార్డు సమం
పురుషుల సింగిల్స్ విభాగంలో డిఫెండింగ్ చాంపియన్ జొకోవిచ్ (సెర్బియా) 12వసారి వింబుల్డన్ టోర్నీలో సెమీఫైనల్‌కు చేరాడు. క్వార్టర్ ఫైనల్లో జొకోవిచ్ 4–6, 6–1, 6–4, 6–3తో ఏడో సీడ్ రుబ్లెవ్ (రష్యా)పై గెలిచాడు. పురుషుల గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లో 46వసారి జోకొవిచ్ సెమీస్ చేరడం విశేషం. ఈ క్రమంలో అతడు స్విస్ టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెదరర్ రికార్డును సమం చేశాడు. ఇప్పటికే వరుసగా నాలుగు వింబుల్డన్ టైటిల్స్ గెలిచిన జొకోవిచ్ మరో టైటిల్ కు చేరవవుతున్నాడు. ప్రస్తుతం జోకొవిచ్ ఖాతాలో ఏడు వింబుల్డన్ టైటిల్స్ ఉండగా మరొక్కటి గెలిస్తే 8వ టైటిల్ తో ఫెదరర్ సరసన నిలుస్తాడు. ఇక టెన్నిస్‌లో 23 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ సాధించిన జొకోవిచ్ పురుషుల విభాగంలో అత్యధిక టైటిల్స్ సాధించిన ప్లేయర్‌గా రికార్డులకెక్కాడు. ఈ మధ్యే అతడు ఫ్రెండ్ ఓపెన్ కూడా గెలిచిన విషయం తెలిసిందే. ఈ టైటిల్‌తో అతడు రఫేల్ నాదల్‌ను వెనక్కి నెట్టాడు. ఫెదరర్ ఖాతాలో మొత్తం 20 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ ఉన్నాయి. ఒకవేళ జొకోవిచ్ వింబుల్డన్ గెలిస్తే 24వ టైటిల్స్‌తో ఎవరికి అందనంత ఎత్తులో నిలుస్తాడు. జొకోవిచ్ శుక్రవారం అతడు సిన్నర్ తో సెమీఫైనల్లో తలపడనున్నాడు. ఇప్పటికే ఆస్ట్రేలియన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్ గెలిచిన జోకొవిచ్.. వింబుల్డన్, యూఎస్ ఓపెన్ కూడా గెలిచి 1969లోరాడ్ లేవర్ తర్వాత తొలి కేలండర్ ఇయర్ గ్రాండ్ స్లామ్ పూర్తి చేయాలని భావిస్తున్నాడు. చదవండి: WCC Suggests ICC: 'వరల్డ్‌కప్ తర్వాత ద్వైపాక్షిక వన్డే సిరీస్‌లను తగ్గించండి' Wimbledon 2023: సంచలనం.. నెంబర్ వన్ స్వియాటెకు షాకిచ్చిన స్వితోలినా -
5 ఓవర్లకు 53 నిమిషాలు.. గెలుపు అడ్డుకోవడం కోసం ఇన్ని కుట్రలా?
మాములుగా క్రికెట్లో ఐదు ఓవర్లు బౌలింగ్ వేయడానికి 20 నిమిషాలు పడుతుంది. మహా అయతే మరో ఐదు నిమిషాలు అదనంగా పట్టొచ్చు. కానీ ఆ ఐదు ఓవర్లు బౌలింగ్ చేయడానికి దాదాపు 53 నిమిషాలు తీసుకోవడం అంటే ఎంత సమయం వృథా చేశారో అర్థమయి ఉంటుంది. ఈ సంఘటన దులీప్ ట్రోపీ సెమీఫైనల్లో చోటుచేసుకుంది. మ్యాచ్‌లో సౌత్ జోన్ రెండు వికెట్ల తేడాతో విజయం సాధించి ఫైనల్లో అడుగుపెట్టింది. అయితే సౌత్ విజయానికి చేరువవుతున్న దశలో నార్త్ కెప్టెన్ జయంత్ యాదవ్ బంతి బంతికీ ఫీల్డింగ్‌ను మారుస్తూ సమయం వృథా చేసేందుకు ప్రయత్నించాడు. వెలుతురులేమి, వర్షం కారణంగా ఆట నిలిచిపోవాలని అతను ఆశించాడు. మ్యాచ్ ‘డ్రా’ అయితే తొలి ఇన్నింగ్స్‌లో 3 పరుగుల ఆధిక్యం సాధించిన నార్త్‌జోన్ ముందంజ వేసేది. కానీ సౌత్ ఆ అవకాశం ఇవ్వలేదు. చివరి రోజు ఓవర్‌కు 6.05 పరుగుల రన్‌రేట్‌తో దూకుడుగా ఆడి ఆటను ముగించింది. చివరకు జయంత్ బౌలింగ్‌లోనే భారీ సిక్స్‌తో సాయికిషోర్ (15 నాటౌట్) మ్యాచ్ ముగించడం విశేషం. అయితే నార్త్‌జోన్ కెప్టెన్ జయంత్ యాదవ్ వైఖరిపై క్రికెట్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రత్యర్థి జట్టు గెలుపును అడ్డుకోవడం కోసం శతవిధాల ప్రయత్నించాడు. తన కపటబుద్ధి బయటపెట్టాడు.. ఇది క్రీడాస్పూర్తికి విరుద్ధం అంటూ కామెంట్ చేశారు.. సౌత్‌జోన్ 36.1 ఓవర్లలో 8 వికెట్లకు 219 పరుగులు చేసి విజయాన్నందుకుంది. మయాంక్ అగర్వాల్ (57 బంతుల్లో 54; 7 ఫోర్లు), కెప్టెన్ హనుమ విహారి (42 బంతుల్లో 43; 8 ఫోర్లు), రికీ భుయ్ (29 బంతుల్లో 34; 3 ఫోర్లు, 1 సిక్స్), తిలక్ వర్మ (19 బంతుల్లో 25; 2 సిక్స్‌లు) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. మయాంక్, విహారి మూడో వికెట్‌కు 47 బంతుల్లోనే 59 పరుగులు జోడించి జట్టును విజయం దిశగా నడిపించారు. వీరిద్దరు ఔటైన తిలక్ వర్మ, సాయికిషోర్‌లు జట్టును విజయతీరాలకు చేర్చారు. చదవండి: 39 ఏళ్ల తర్వాత.. యూరో అండర్-21 చాంపియన్ ఇంగ్లండ్ Womens Ashes 2023: యాషెస్ సిరీస్ విజేతగా ఇంగ్లండ్.. ఆఖరి మ్యాచ్‌లో ఆసీస్ ఓటమి -
సెమీస్‌కు భారత్.. ప్రగల్బాలు పలికిన పాక్ లీగ్ దశలోనే ఇంటికి
బెంగళూరు: ‘శాఫ్’ చాంపియన్‌షిప్‌లో భారత ఫుట్‌బాల్ జట్టు సెమీ ఫైనల్లోకి ప్రవేశించింది. గ్రూప్ ‘ఎ’లో శనివారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో సునీల్ ఛెత్రి సేన 2–0 గోల్స్‌తో నేపాల్‌పై ఘన విజయం సాధించింది. శ్రీ కంఠీరవ స్టేడియంలో భారత జోరుకు ఎదురే లేకుండా పోయింది. తొలి అర్ధ భాగంలో నేపాల్ రక్షణ శ్రేణి చురుగ్గా ఉండటంతో గోల్ చేయలేకపోయిన భారత్ ద్వితీయార్ధంలోనే ఆ రెండు గోల్స్ చేసింది. కెప్టెన్ సునీల్ ఛెత్రి 61వ నిమిషంలో తొలి గోల్ సాధించగా, నోరెమ్ మహేశ్ సింగ్ 70వ నిమిషంలో గోల్ చేశాడు. మరోవైపు భారత డిఫెండర్లు నేపాల్ ఫార్వర్డ్‌ను ఎక్కడికక్కడ కట్టడి చేసి వారి దాడుల్ని సమర్థంగా అడ్డుకుంది. భారత ఆటగాళ్లు ప్రత్యర్థి గోల్ పోస్ట్ లక్ష్యంగా ఐదు షాట్లు కొడితే... నేపాల్ ఒక షాట్‌కే పరిమితమైంది. మ్యాచ్‌లో ఎక్కువసేపు బంతిని తమ ఆదీనంలోనే ఉంచుకొన్న భారత ఆటగాళ్లు ప్రత్యర్థి ఆటల్ని సాగనివ్వలేదు. తాజా విజయంతో సొంతగడ్డపై భారత్ అజేయమైన రికార్డు 12 మ్యాచ్‌లకు చేరింది. 2019లో సెప్టెంబర్ 5న ఒమన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓడిన భారత్ తర్వాత స్వదేశంలో ఏ జట్టు చేతిలోనూ ఓడిపోలేదు. అంతకుముందు ఇదే గ్రూపులో కువైట్ 2–0తో పాకిస్తాన్‌ను చిత్తు చేయడంతో కువైట్ కూడా సెమీఫైనల్లోకి అడుగుపెట్టింది. 27న కువైట్‌తో జరిగే ఆఖరి లీగ్ మ్యాచ్‌తో గ్రూప్‌లో అగ్ర స్థానంలో నిలిచేది ఎవరో తేలుతుంది. నేపాల్, పాకిస్తాన్‌లు లీగ్ దశలోనే ఇంటిముఖం పట్టాయి. It's that m̶a̶n̶ legend once again!@chetrisunil11#SAFFChampionship pic.twitter.com/wx1eSk4Y5E— FanCode (@FanCode) June 24, 2023 2️⃣ goals in quick succession 🤩 India are through to the #SAFFChampionship2023 Semifinal 👏🏽💙#NEPIND ⚔️ #IndianFootball ⚽️ #BlueTigers 🐯 pic.twitter.com/ByzfjsKSZY— Indian Football Team (@IndianFootball) June 24, 2023 చదవండి: #CheteshwarPujara: 'ఆటగదరా శివ!'.. పుజారా ఎమోషనల్ పోస్ట్ -
ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్లో జొకోవిచ్.. చరిత్రకు అడుగు దూరంలో
ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ 2023లో సెర్బియా స్టార్ నొవాక్ జొకోవిచ్ ఫైనల్లోకి ప్రవేశించాడు. శుక్రవారం వరల్డ్ నెంబర్ వన్.. స్పెయిన్ టెన్నిస్ స్టార్ కార్లోస్ అల్కరాజ్తో జరిగిన సెమీస్ పోరులో జొకోవిచ్ 6-3, 5-7,6-1,6-1తో విజయం సాధించాడు. తొలి రెండు సెట్లలో జొకోవిచ్‌ను ప్రతిఘటించిన అల్కరాజ్ తర్వాతి రెండు సెట్లలో అనుభవం ముందు నిలవలేకపోయాడు. అయితే గేమ్‌లో మాత్రం అల్కరాజ్ తనదైన సర్వీస్ షాట్లతో జొకోవిచ్ మనసును గెలుచుకున్నాడు. ఇక జొకోవిచ్ కెరీర్లో 34వ సారి గ్రాండ్‌స్లామ్ ఫైనల్లో అడుగుపెట్టాడు. నాదల్‌తో కలిసి 22 టైటిల్స్‌తో అత్యధిక గ్రాండ్‌స్లామ్స్ సాధించిన ఆటగాడిగా జొకోవిచ్ సంయుక్తంగా ఉన్నాడు. ఈసారి ఫైనల్లో గెలిచి ఫ్రెంచ్ ఓపెన్ అందుకుంటే.. ఓపెన్ శకంలో(23 టైటిల్స్) అత్యధిక గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ నెగ్గిన ఆటగాడిగా జొకోవిచ్ చరిత్రకెక్కనున్నాడు. మరో సెమీఫైనల్లో కాస్పర్ రూడ్, అలెగ్జాండర్ జ్వెరెవ్‌ల మధ్య జరగనుంది. ఈ ఇద్దరిలో గెలిచిన ఆటగాడితో జొకోవిచ్ ఆదివారం ఫైనల్లో అమితుమీ తేల్చుకోనున్నాడు. Never doubt Novak 💪🇷🇸@DjokerNole gets the better of Alcaraz 6-3, 5-7, 6-1, 6-1 to reach a 34th Grand Slam final.#RolandGarros pic.twitter.com/fefJZKKMxn — Roland-Garros (@rolandgarros) June 9, 2023 చదవండి: 'సామాన్యుడు కాడు వీడు'.. టెన్నిస్ చరిత్రలో అత్యుత్తమ షాట్ -
'సామాన్యుడు కాడు వీడు'.. టెన్నిస్ చరిత్రలో అత్యుత్తమ షాట్
ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్‌లో భాగంగా వరల్డ్ నెంబర్ వన్ కార్లెస్ అల్కరాజ్, సెర్బియా స్టాన్ నొవాక్ జొకోవిచ్ మధ్య సెమీఫైనల్ పోరు ఆసక్తికరంగా సాగుతుంది. ఇద్దరు నువ్వా నేనా అన్నట్లుగా కొదమ సింహాల్లా తలపడుతున్నారు. ఇప్పటికైతే తొలి సెట్‌ను జొకోవిచ్ 6-3తో సొంతం చేసుకున్నప్పటికి.. రెండో సెట్లో మాత్రం అల్కరాజ్ లీడింగ్‌లో ఉన్నాడు. హోరాహోరీగా సాగుతున్న మ్యాచ్‌లో గెలుపు ఎవరిది అని చెప్పడం కష్టంగా మారింది. ఈ విషయం పక్కనబెడితే.. మ్యాచ్ సందర్భంగా అల్కరాజ్ చేసిన విన్యాసం జొకోవిచ్ చేత చప్పట్లు కొట్టించింది. వరల్డ్ నెంబర్ వన్ అనే పదానికి సార్థకం చేస్తూ అల్కరాజ్ కొట్టిన బ్యాక్ హ్యాండ్ షాట్ చరిత్రలో మిగిలిపోనుంది. విషయంలోకి వెళితే.. రెండోసెట్లో భాగంగా ఇద్దరు 1-1తో ఉన్నప్పుడు జొకోవిచ్ కాస్త తెలివిగా ర్యాలీ చేశాడు. అయితే అల్కరాజ్ వేగంగా స్పందించి షాట్ ఆడాడు. కానీ అల్కరాజ్ కోర్టు దగ్గరకు రావడం.. అదే సమయంలో జొకోవిచ్ ఆఫ్‌సైడ్ రిఫ్ట్ షాట్ కొట్టాడు. ఇక జొకోకు పాయింట్ వచ్చినట్లేనని అంతా భావించారు. కానీ ఇక్కడే అల్కరాజ్ ఎవరు ఊహించని ఫీట్ నమోదు చేశాడు. వేగంగా పరిగెత్తిన అల్కరాజ్ బ్యాక్‌హ్యాండ్ స్ట్రోక్ ఉపయోగించి షాట్ కొట్టాడు. బంతి కూడా లైన్ ఇవతల పడడంతో అల్కరాజ్ పాయింట్ గెలుచుకున్నాడు. అల్కరాజ్ చర్యకు ఆశ్చర్యపోయిన జొకోవిచ్ చప్పట్లు కొట్టకుండా ఉండలేకపోయాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. Take a bow, @carlosalcaraz 😱#RolandGarros pic.twitter.com/2m25jQtOy1 — Tennis Channel (@TennisChannel) June 9, 2023 😳#RolandGarros pic.twitter.com/3UA4JbPHz4 — Wimbledon (@Wimbledon) June 9, 2023 చదవండి: 'చాన్స్ కూడా ఇవ్వలేదు'.. సిరాజ్ దెబ్బకు లేచి కూర్చొన్నాడు -
ఫైనల్లో బెర్త్ కోసం బరిలో భారత బాక్సర్లు
World Boxing Championships 2023: ప్రపంచ పురుషుల బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో నేడు ముగ్గురు భారత బాక్సర్లు కీలకపోరుకు సిద్ధమయ్యారు. తెలంగాణకు చెందిన హుసాముద్దీన్ (57 కేజీలు), హరియాణాకు చెందిన దీపక్ భోరియా (51 కేజీలు), నిశాంత్ దేవ్ (71 కేజీలు) సెమీఫైనల్ బౌట్లలో పోటీపడనున్నారు. 2022 యూరోపియన్ చాంపియన్ బిలాలా బెనామా (ఫ్రాన్స్)తో దీపక్; సైడెల్ హోర్టా (క్యూబా)తో హుసాముద్దీన్; 2022 ఆసియా చాంపియన్ అస్లాన్‌బెక్ షింబెర్జనోవ్ (కజకిస్తాన్)తో నిశాంత్ దేవ్ తలపడతారు. సెమీఫైనల్లో గెలిస్తే ఫైనల్ చేరి స్వర్ణ–రజత పతకాల బరిలో ఉంటారు. ఓడితే కాంస్య పతకాన్ని గెల్చుకుంటారు. భారత కాలమానం ప్రకారం శుక్రవారం సాయంత్రం గం. 5:30కు దీపక్ బౌట్ ఉంది. ఆ తర్వాత హుసాముద్దీన్, నిశాంత్ దేవ్ బౌట్లు జరుగుతాయి. ఫ్యాన్‌కోడ్ యాప్‌లో ఈ బౌట్లను ప్రత్యక్షంగా తిలకించవచ్చు. ప్రపంచ చాంపియన్‌షిప్ చరిత్రలో ఇప్పటి వరకు భారత్ నుంచి ఒక్కరే ఫైనల్‌కు అర్హత సాధించారు. 2019లో అమిత్ పంఘాల్ (52 కేజీలు) ఫైనల్లో ఓడిపోయి రజత పతకం గెల్చుకున్నాడు. -
All Eng Open: సంచలనాలకు సెమీస్‌లో ముగింపు..
బర్మింగ్హమ్: ప్రతిష్టాతక్మ ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు చెందిన యువ జంట గాయత్రి పుల్లెల, ట్రెసా జోలీల సంచలన ప్రదర్శన సెమీస్‌లో ముగిసింది. బర్మింగ్హమ్లో శనివారం జరిగిన సెమీస్ మ్యాచ్‌లో కొరియాకు చెందిన బేక్ నా హా, లీ సో హీ జంట చేతిలో 10-21, 10-21తో ఓటమి పాలయ్యారు. 46 నిమిషాల పాటు జరిగిన మ్యాచ్‌లో గాయత్రి, ట్రెసాలు పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. తొలి గేమ్‌లో 0-4తో వెనుకబడిన గాయత్రి జోడి ఆ తర్వాత కాస్త ప్రతిఘటించడంతో 9-13కు తగ్గింది. ఆ తర్వాత అదే టెంపోను కొనసాగించడంలో విఫలమైన ఈ జోడి చివరకు రెండు వరుస గేముల్లో ఓడి సెమీస్‌లోనే తమ పోరాటాన్ని ముగించారు. ఒకవేళ ఫైనల్ చేరి ఉంటే మాత్రం ఈ ఇద్దరు చరిత్ర సృష్టించేవారు. కానీ ఏం చేస్తాం మంచి చాన్స్ మిస్ అయింది. #AllEngland2023 #Badminton 🏸 ✅ Defeated world No 8 ✅ Defeated world No 9 ✅ Defeated a rising pair from 🇨🇳 ❌ Lost against one of the most in-form Korean pairs End of a fine week again at All England for Gayatri Gopichand and Treesa Jolly.https://t.co/QruEtFPI0N pic.twitter.com/lGWrccz45d — The Field (@thefield_in) March 18, 2023 చదవండి: స్టన్నింగ్ క్యాచ్.. హర్మన్ కూడా ఊహించి ఉండదు -
ISL 2023: సెమీఫైనల్లో మోహన్ బగాన్ జట్టు
కోల్‌కతా: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్)లో ఏటీకే మోహన్ బగాన్ జట్టు సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. సొంత ప్రేక్షకుల మధ్య శనివారం జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో మోహన్‌బగాన్ 2–0 గోల్స్ తేడాతో ఒడిషా ఎఫ్‌సీపై ఘన విజయం సాధించింది. మోహన్‌బగాన్ తరఫున బోమన్ (36వ నిమిషం), డి.పెట్రాడోస్ (58వ నిమిషం) గోల్స్ సాధించారు. తాజా విజయంతో 20 మ్యాచ్‌ల ద్వారా మొత్తం 34 పాయింట్లు సాధించిన మోహన్‌బగాన్ నాలుగో జట్టుగా ఐఎస్ఎల్ సెమీస్‌కు అర్హత సాధించింది. ఈ సీజన్లో 10 విజయాలు సాధించిన టీమ్ 6 ఓడి మరో 4 మ్యాచ్‌లు డ్రా చేసుకుంది. ఈ ఫలితంతో సెమీస్‌లో హైదరాబాద్ ఎఫ్‌సీతో మోహన్‌బగాన్ ప్రత్యర్థిగా తలపడటం ఖాయమైంది. సెమీఫైనల్ మ్యాచ్ రెండు అంచెలుగా జరుగుతుంది. ఇరు జట్ల మధ్య తొలి పోరు ఈ నెల 9న హైదరాబాద్, రెండో పోరు ఈ నెల 13న రెండో పోరు కోల్‌కతాలో జరుగుతుంది. మరో సెమీస్ మ్యాచ్‌లో బెంగళూరు ఎఫ్‌సీ, ముంబై సిటీ ఎఫ్‌సీ తలపడనున్నాయి. -
T20 WC: ఆ సిరీస్ గురించి ఇక్కడెందుకు? అయినా; టీమిండియా పటిష్ట జట్టు..
ICC Womens T20 World Cup 2023 - AusW vs IndW: ఐసీసీ మహిళా టీ20 ప్రపంచకప్-2023 సెమీస్ నేపథ్యంలో ఆస్ట్రేలియా కెప్టెన్ మెగ్ లానింగ్‌కు ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. భారత జట్టుపై ప్రతీకారం తీర్చుకునేందుకు సిద్ధమయ్యారా అంటూ ఓ విలేకరి ఆమెను ప్రశ్నించారు. భారత్‌లో టీమిండియా- ఆస్ట్రేలియాతో జరుగుతున్న బోర్డర్- గావస్కర్ ట్రోఫీని వరల్డ్‌కప్ మ్యాచ్‌తో ముడిపెట్టి ప్రశ్నలు సంధించారు. ఆ సిరీస్ గురించి ఇక్కడెందుకు? అయినా.. భారత్‌లో ఆస్ట్రేలియా పురుషుల జట్టుకు టీమిండియా చేతిలో ఎదురైన పరాభవానికి బదులు తీర్చుకోబోతున్నారా అని అడిగారు. ఇందుకు బదులుగా.. ‘‘ఓహ్.. ఆ సిరీస్ గురించి ఇక్కడ మాట్లాడకూడదు. మా జట్టు అక్కడ అత్యుత్తమ రాణించేందుకు సర్వశక్తులూ ఒడ్డుతోంది. పూర్తిస్థాయిలో సన్నద్ధమై వందకు వంద శాతం న్యాయం చేసేందుకు ప్రయత్నిస్తోంది. వాళ్లకు మా మద్దతు ఎప్పటికీ ఉంటుంది. రెండు టెస్టులు ముగిశాయి. అయితే, వాళ్లు మెరుగ్గానే ఆడారు. మిగిలిన వాటిలో మంచి ఫలితాలు రాబట్టే అవకాశం ఉంది’’ అని మెగ్ లానింగ్ పేర్కొంది. ప్రతీకారం తీర్చుకునేందుకు! కాగా సౌతాఫ్రికాలో జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌లో భాగంగా భారత్- ఆస్ట్రేలియా గురువారం నాటి తొలి సెమీ ఫైనల్లో అమీతుమీ తేల్చుకోనున్నాయి. గతంలో రెండుసార్లు(ప్రపంచకప్, కామన్వెల్త్ గేమ్స్)లో ఫైనల్ పోరులో భారత మహిళా జట్టు ఆసీస్ చేతిలో ఓడి రన్నరప్‌తో సరిపెట్టుకుంది. అయితే, ఈసారి సమిష్టిగా రాణించి కంగారూల ఫైనల్ అవకాశాలు గల్లంతు చేసి ప్రతీకారం తీర్చుకోవాలని హర్మన్‌ప్రీత్ సేన పట్టుదలగా ఉంది. ఈ నేపథ్యంలో మ్యాచ్‌కు ముందు మీడియాతో మాట్లాడిన ఆస్ట్రేలియా కెప్టెన్ మెగ్ లానింగ్‌కు ఈ మేర ప్రశ్న ఎదురైంది. దీంతో ఆమె పైవిధంగా స్పందించింది. టీమిండియా పటిష్ట జట్టు ఇక సెమీ ఫైనల్ గురించి మాట్లాడుతూ.. ‘‘టీమిండియా పటిష్ట జట్టు. రెండు జట్లు పరస్పరం ఎన్నోసార్లు పోటీపడ్డాయి. వాళ్ల జట్టులో వరల్డ్‌క్లాస్ క్రికెటర్లు, ఒంటిచేత్తో మ్యాచ్ మలుపు తిప్పగల ప్లేయర్లు ఉన్నారు. అలాంటి ఉత్తమ జట్టుతో పోటీ పడేందుకు మేము ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం. అత్యుత్తమంగా రాణించి విజయం సాధించాలని కోరుకుంటున్నాం’’ అని మెగ్ లానింగ్ చెప్పుకొచ్చింది. ఇదిలా ఉంటే.. బోర్డర్- గావస్కర్ ట్రోఫీ-2023 మొదటి రెండు టెస్టుల్లో గెలిచిన టీమిండియా 2-0తో ఆధిక్యంలో ఉన్న సంగతి తెలిసిందే. ప్రపంచకప్ సెమీ ఫైనల్- తుది జట్లు (అంచనా) భారత్: హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్ ), స్మృతి మంధాన, షఫాలీ, రిచా ఘోష్, జెమీమా రోడ్రిగ్స్, దీప్తి శర్మ, పూజ, శిఖా పాండే, రాజేశ్వరి గైక్వాడ్, రాధా యాదవ్. రేణుక. ఆస్ట్రేలియా: మెగ్ లానింగ్ (కెప్టెన్), బెత్ మూనీ, అలీసా హీలీ, ఎలీస్ పెర్రీ, ఆష్లే గార్డ్నర్, తాలియా మెక్‌గ్రాత్, గ్రేస్ హారిస్, జార్జియా, అలానా కింగ్, మేగన్ షుట్, డార్సీ బ్రౌన్. చదవండి: Virat Kohli: కోహ్లిపై ఐస్లాండ్ క్రికెట్ ట్వీట్.. పిచ్చి పిచ్చి పోస్టులు పెడితే.. ఫ్యాన్స్ ఫైర్ Ind Vs Aus: పాపం గిల్ ఎందుకు ఎదురుచూడాలి? మరి సంజూ మాటేమిటి? -
రెండో సెమీస్‌లో ఇంగ్లండ్‌తో దక్షిణాఫ్రికా ‘ఢీ’
మహిళల టి20 ప్రపంచకప్ టోర్నీ లో సెమీఫైనల్ చేరాలంటే తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్‌లో ఆతిథ్య దక్షిణాఫ్రికా జట్టు అదరగొట్టింది. గ్రూప్–1 చివరి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 10 వికెట్లతో బంగ్లాదేశ్‌ను ఓడించింది. దాంతో గ్రూప్–1లో దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, శ్రీలంక నాలుగు పాయింట్లతో సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచాయి. అయితే మెరుగైన రన్‌రేట్‌తో దక్షిణాఫ్రికా (0.738) సెమీస్ చేరగా... న్యూజిలాండ్ (0.138), శ్రీలంక (–1.460) ఇంటిముఖం పట్టాయి. దక్షిణాఫ్రికాతో పోరులో మొదట బంగ్లాదేశ్ 6 వికెట్లకు 113 పరుగులు చేసింది. తర్వాత దక్షిణాఫ్రికా 17.5 ఓవర్లలో వికెట్ కోల్పోకుండా 117 పరుగులు చేసింది. ఓపెనర్లు వోల్వర్డ్ ( 66 నాటౌట్; 7 ఫోర్లు, 1 సిక్స్), తజి్మన్ బ్రిట్స్ (50 నాటౌట్; 4 ఫోర్లు) అర్ధసెంచరీ లతో అదరగొట్టారు. శుక్రవారం జరిగే రెండో సెమీఫైనల్లో ఇంగ్లండ్‌తో దక్షిణాఫ్రికా ఆడుతుంది. -
10 వికెట్ల తేడాతో విజయం.. దర్జాగా సెమీస్‌కు
మహిళల టి20 ప్రపంచకప్‌లో భాగంగా సౌతాఫ్రికా వుమెన్స్ జట్టు సెమీఫైనల్లో ప్రవేశించింది. మంగళవారం బంగ్లాదేశ్‌తో జరిగిన లీగ్ మ్యాచ్‌లో సౌతాఫ్రికా 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ మహిళలు నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 113 పరుగులు చేసింది. నిగర్ సుల్తానా 30 పరుగులతో టాప్ స్కోరర్ కాగా.. శోభనా మోస్త్రే 27 పరుగులు చేసింది. అనంతరం 114 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికాను ఓపెనర్లు లారా వోల్వార్డట్ 66 నాటౌట్, తజ్మీన్ బ్రిట్స్ 50 నాటౌట్ రాణించి 17.5 ఓవర్లలోనే విజయతీరాలకు చేర్చారు. అయితే దక్షిణాఫ్రికా సెమీస్‌కు వస్తుందని ఎవరు ఊహించలేదు. గ్రూప్ ఆఫ్ డెత్‌గా పరిగణించిన గ్రూప్-ఏలో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లను ఫెవరెట్‌గా పరిగణించగా.. ఆసీస్ తన ఆటతీరుతో మరోసారి సెమీస్‌లో అడుగుపెట్టగా.. రెండో స్థానం కోసం కివీస్, సౌతాఫ్రికా, శ్రీలంకల మధ్య పోటీ ఎదురైంది. ముఖ్యంగా న్యూజిలాండ్.. ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో భారీ తేడాతో ఓడిపోవడం కొంపముంచింది. అదే సమయంలో బంగ్లాదేశ్‌పై పది వికెట్ల తేడాతో విజయం అందుకున్న ప్రొటీస్ రన్‌రేట్‌ను అమాంతం పెంచుకొని రెండో స్థానంలో నిలిచింది. మూడు జట్లు(కివీస్, ప్రొటీస్, లంక) నాలుగు పాయింట్లతో సమానంగా ఉన్నప్పటికి.. లంక రన్‌రేట్ మైనస్‌లో ఉండగా.. కివీస్ రన్‌రేట్ +0.138గా ఉంది. అయితే సౌతాఫ్రికా +0.738 రన్‌రేట్‌తో మెరుగ్గా ఉండడం ఆ జట్టుకు కలిసొచ్చింది. ఇక సెమీఫైనల్ మ్యాచ్‌లు ఫిబ్రవరి 23, 24 తేదీల్లో జరగనున్నాయి. తొలి సెమీఫైనల్ గురువారం ఆస్ట్రేలియా, భారత్‌ల మధ్య జరగనుండగా.. రెండో సెమీఫైనల్లో ఇంగ్లండ్, సౌతాఫ్రికాలు తలపడనున్నాయి. రెండు సెమీస్‌ల్లో గెలిచిన జట్లు ఫిబ్రవరి 26న జరగనున్న ఫైనల్లో కత్తులు దూసుకోనున్నాయి. చదవండి: వారెవ్వా.. ఫ్రేమ్ టూ ఫ్రేమ్ దాదానే తలపించింది -
ఆస్ట్రేలియాను ఓడిస్తే వరల్డ్‌కప్ మనదే..
మహిళల టి20 ప్రపంచకప్‌లో టీమిండియా వుమెన్స్ సెమీఫైనల్‌కు చేరింది. సోమవారం రాత్రి ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో డక్‌వర్త్ లూయిస్ పద్దతి ద్వారా ఐదు పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఎలాంటి సమీకరణాలతో సంబంధం లేకుండా మెరుగైన రన్‌రేట్, పాయింట్ల ఆధారంగా సెమీస్‌లో అడుగుపెట్టిన భారత్‌కు అసలైన పరీక్ష సెమీఫైనల్లో ఎదురుకానుంది. సెమీస్‌లో మహిళల క్రికెట్లో ప్రపంచనెంబర్‌వన్‌గా ఉన్న బలమైన ఆస్ట్రేలియాను ఎదుర్కోనుంది. లీగ్ పోటీల్లో ఒక మ్యాచ్ ఓడినా ఇంకో మ్యాచ్ గెలిచేందుకు అవకాశముంటుంది. కానీ నాకౌట్ స్టేజీ అలా కాదు. మ్యాచ్ గెలిస్తే ముందుకు.. ఓడిపోతే ఇంటికి. అందునా ఆస్ట్రేలియా మహిళల జట్టును ఓడించాలంటే టీమిండియా వుమెన్స్ శక్తికి మించి రాణించాల్సిందే. ఒకప్పుడు ఆస్ట్రేలియా పురుషుల క్రికెట్ ఎంత ఆధిపత్యం చెలాయించిందో అందరికి తెలిసిందే. వారిని మించి డామినేట్ చేస్తుంది ఆస్ట్రేలియా మహిళల జట్టు. ఈ మధ్య కాలంలో మహిళల క్రికెట్లో ఒక మెగా టోర్నీ ఫైనల్ ఆస్ట్రేలియా జట్టు లేకుండా ముగియదు అంటే అర్థం చేసుకోవచ్చు ఆ జట్టు ఎంత బలంగా ఉందనేది. గ్రూప్ దశలో ఆస్ట్రేలియాకు ఎదురులేకుండా పోయింది. ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ భారీ విజయాలు అందుకొని టాపర్‌గా నిలిచింది. ఆ జట్టులో ఒకటో నెంబర్ నుంచి తొమ్మిదో నెంబర్ వరకు బ్యాటింగ్ చేయగల సమర్థులు ఉన్నారు. హేలీ, బెత్ మూనీ, మెగ్ లానింగ్, తాహిలా మెక్‌గ్రాత్ ఇలా చెప్పుకుంటూ పోతే జట్టు మొత్తం స్టార్లతో నిండి ఉన్నారు. మరి అలాంటి పటిష్టమైన ఆసీస్‌ను సెమీస్‌లో భారత్ నిలువరించగలిగితే ఈసారి కప్ కొట్టడం ఖాయం అని పలువురు జోస్యం చెబుతున్నారు. అనుకుంటే ఆస్ట్రేలియాను మట్టికరిపించడం అంత కష్టమేమి కాదు. కానీ ముందు వారిని ఓడించగలమా అనే డౌట్ పక్కనబెట్టి సమిష్టి ప్రదర్శన చేస్తే కచ్చితంగా మ్యాచ్ మనదే అవుతుంది. ఐర్లాండ్‌తో మ్యాచ్‌లో స్మృతి మంధాన మూడుసార్లు ఔట్ నుంచి తప్పించుకునే అవకాశం వచ్చినప్పటికి తన టి20 కెరీర్లోనే బెస్ట్ ఇన్నింగ్స్ ఆడింది. ఆమెను ఎందుకు టీమిండియా సూపర్‌స్టార్ అంటారో.. ఎందుకంత క్రేజ్ అనేది ఈ పాటికే అర్థమై ఉండాలి. అండర్-19 టి20 వరల్డ్‌కప్‌లో తన కెప్టెన్సీతో పాటు బ్యాటర్‌గానూ రాణించి జట్టును విజేతగా నిలిపిన షఫాలీ వర్మ గాడిన పడాల్సి ఉంది. జేమిమా రోడ్రిగ్స్ తొలి మ్యాచ్ మినహా మళ్లీ ఆ స్థాయిలో రాణించలేకపోతుంది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ కూడా తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతుంది. రిచా ఘోష్ ఫామ్‌లో ఉండడం సానుకూలాంశం. ఆల్‌రౌండర్స్ పూజా వస్త్రాకర్, దీప్తి శర్మ తమ ప్రతిభను చూపెట్టాల్సిన అవసరం ఉంది. వీరంతా ఆస్ట్రేలియాతో సెమీస్ మ్యాచ్‌లో సమిష్టి ప్రదర్శన చేస్తే భారత్ గెలవడం ఈజీయే. ఎలాగూ బౌలింగ్‌లో రేణుకా సింగ్, శిఖా పాండేలు మంచి ప్రదర్శన ఇస్తుండగా.. స్పిన్నర్‌గా దీప్తి శర్మ ఆకట్టుకుంటుంది. మరి పటిష్టమైన ఆస్ట్రేలియాను ఎదుర్కొని టీమిండియా వుమెన్స్ నిలబడతారా.. లేక ఒత్తిడికి లోనై పాత పాటే పాడుతారా అనేది ఫిబ్రవరి 23న తెలియనుంది. India are through to the semi-finals 🥳 They win by DLS method against Ireland in Gqeberha to finish the Group stage with six points 👊#INDvIRE | #T20WorldCup | #TurnItUp pic.twitter.com/6SOSiUMO9L — T20 World Cup (@T20WorldCup) February 20, 2023 చదవండి: 'నా కెరీర్లోనే అత్యంత కఠినమైన ఇన్నింగ్స్' -
Ranji Trophy: 306 పరుగుల తేడాతో భారీ విజయం.. ఫైనల్లో బెంగాల్
రంజీ ట్రోఫీ 2022-23 సీజన్లో బెంగాల్ జట్టు ఫైనల్లో ప్రవేశించింది. మధ్యప్రదేశ్‌తో జరిగిన సెమీఫైనల్లో బెంగాల్ 306 పరుగుల తేడాతో భారీ విజయాన్ని సాధించింది. 547 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన మధ్యప్రదేశ్ 241 పరుగులకు ఆలౌటైంది. రజత్ పాటిదార్ 52 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. మిగతావారు పూర్తిగా విఫలమయ్యారు. బెంగాల్ బౌలర్లలో ప్రదీప్తా ప్రమానిక్ ఐదు వికెట్లతో చెలరేగగా.. ముఖేష్ కుమార్ రెండు వికెట్లు, షాబాజ్ అహ్మద్, ఆకాశ్ దీప్ చెరొక వికెట్ తీశారు. కాగా రంజీల్లో బెంగాల్ ఫైనల్ చేరడం ఇది 15వ సారి. ఇంతకముందు 14సార్లు ఫైనల్ చేరినప్పటికి రెండుసార్లు మాత్రమే విజేతగా నిలిచిన బెంగాల్.. మిగతా 12సార్లు రన్నరప్‌తోనే సరిపెట్టుకుంది. అంతకముందు బెంగాల్ తొలి ఇన్నింగ్స్‌లో 438 పరుగులకు ఆలౌట్ అయింది. మజుందార్ 120 పరుగులు, సుదీప్ ఘరామి 112 పరుగులు సెంచరీలతో చెలరేగారు. అభిషేక్ పొరెల్ 51 పరుగులతో రాణించాడు. అనంతరం మధ్యప్రదేశ్ జట్టు 170 పరుగులకు కుప్పకూలింది. దీంతో బెంగాల్‌కు 268 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించినట్లయింది. రెండో ఇన్నింగ్స్‌లో బెంగాల్ 279 పరుగులకు ఆలౌటై మధ్యప్రదేశ్ ముందు 547 పరుగులు భారీ లక్ష్యాన్ని నిర్ధేశించింది. ఇక కర్ణాటక, సౌరాష్ట్రల మధ్య జరుగుతన్న మరో సెమీఫైనల్ విజేతతో బెంగాల్ జట్టు ఫైనల్లో తలపడనుంది. 𝙄𝙣𝙩𝙤 𝙩𝙝𝙚 𝙁𝙞𝙣𝙖𝙡𝙨! 👏🏻👏🏻 Bengal register a 306-run victory over Madhya Pradesh in #SF1 of the @mastercardindia #RanjiTrophy and seal their position in the finals! Scorecard ▶️ https://t.co/ZaeuZQqC3Y #MPvBEN pic.twitter.com/pOWkc1gD41 — BCCI Domestic (@BCCIdomestic) February 12, 2023 -
బౌలర్ల విజృంభణ.. శ్రేయస్ అజేయ శతకం.. సెమీస్‌లో మయాంక్ జట్టు
Karnataka won by an innings and 281 runs: రంజీ ట్రోఫీ 2022-23 సీజన్లో కర్ణాటక సెమీ ఫైనల్‌కు దూసుకెళ్లింది. క్వార్టర్స్‌లో ఉత్తరాఖండ్‌ను ఇన్నింగ్స్ మీద 281 పరుగులతో చిత్తు చేసి సెమీస్‌లో అడుగుపెట్టింది. సెంచరీ హీరో శ్రేయస్ గోపాల్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. మయాంక్ నమ్మకాన్ని నిలబెట్టి బెంగళూరు వేదికగా ఉత్తరాఖండ్‌తో జనవరి 31న మొదలైన క్వార్టర్ ఫైనల్-3లో టాస్ గెలిచిన కర్ణాటక తొలుత బౌలింగ్ ఎంచుకుంది. కెప్టెన్ మయాంక్ అగర్వాల్ నమ్మకాన్ని నిలబెడుతూ.. కర్ణాటక బౌలర్లు సొంతమైదానంలో ఆకాశమే హద్దుగా చెలరేగారు. రైట్ ఆర్మ్ పేసర్, 22 ఏళ్లమురళీధర వెంకటేశ్ ఐదు వికెట్లతో ఉత్తరాఖండ్ బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించగా.. విద్వత్ కవెరప్ప, క్రిష్ణప్ప గౌతమ్ రెండేసి వికెట్లు తీశారు. విజయ్ కుమార్ ఒక వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు. దీంతో 116 పరుగులకే ఉత్తరాఖండ్ తొలి ఇన్నింగ్స్‌లో ఆలౌట్ అయింది. రెచ్చిపోయిన కర్ణాటక బ్యాటర్లు.. బౌలర్లకు చుక్కలే ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన కర్ణాటక బ్యాటర్లు ఉత్తరాఖండ్ బౌలర్లకు పగలే చుక్కలు చూపించారు. ఓపెనర్లు సమర్థ్(82), మయాంక్ అగర్వాల్(83) అర్థ శతకాలతో చెలరేగగా.. వన్‌డౌన్ బ్యాటర్ దేవదత్ పడిక్కల్ 69 పరుగులతో రాణించాడు. శ్రేయస్ గోపాల్ అద్భుత సెంచరీ నాలుగో స్థానంలో వచ్చిన నికిన్ జోస్ 62 రన్స్ సాధించగా.. మనీశ్ పాండే 39 పరుగులతో ఫర్వాలేదనపించాడు. అయితే, ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన శ్రేయస్ గోపాల్ బ్యాట్ ఝలిపించడంతో కర్ణాటక భారీ స్కోరు చేయగలిగింది. మొత్తంగా 288 బంతులు ఎదుర్కొన్న శ్రేయస్ 16 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 161 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు. మిగతా వాళ్లలో శరత్ 33, గౌతం 39, వెంకటేశ్ 15 పరుగులు చేశారు. ఈ క్రమంలో కర్ణాటక 606 పరుగులకు ఆలౌట్ అయింది. సెమీస్‌లో అడుగు ఇక లక్ష్య ఛేదనకు దిగిన ఉత్తరాఖండ్ కథ 209 పరుగులకే ముగిసింది. దీంతో శుక్రవారం నాటి(ఫిబ్రవరి 3) ఆఖరి రోజు ఆటలో కర్ణాటక జయకేతనం ఎగురవేసింది. ఇప్పటి వరకు ఎనిమిది సార్లు చాంపియన్‌గా నిలిచిన కన్నడ జట్టు తాజా సీజన్లో సెమీస్‌కు చేరుకుంది. చదవండి: Ranji Trophy 2022-23: విహారి ఒంటి చేతి పోరాటం వృధా.. క్వార్టర్స్‌లో ఓటమిపాలైన ఆంధ్ర BGT 2023: ఆస్ట్రేలియా మాస్టర్ ప్లాన్.. మన ‘అశ్విన్ డూప్లికేట్’తో కలిసి ప్రాక్టీసు! ఇంతకీ ఎవరీ కుర్రాడు? -
టాప్‌లెస్‌గా దర్శనం.. 'అలా చూడకు ఏదో అవుతుంది'
అమెరికా టెన్నిస్ స్టార్ టామీ పాల్ ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్‌లో అదరగొడుతున్నాడు. బుధవారం క్వార్టర్ ఫైనల్లో బెన్ షెల్టన్‌ను టామీ పాల్ 7-6, 6-3, 5-7, 6-4తో ఓడించి సెమీఫైనల్‌కు దూసుకెళ్లాడు. ఈ ప్రదర్శనతో టామీ పాల్ భవిష్యత్తు స్టార్‌గా మారే అవకాశం ఉన్నట్లు టెన్నిస్ అభిమానులు పేర్కొంటున్నారు. అయితే ఇతని పోరాటం సెమీస్‌లోనే ముగిసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే సెర్బియా టెన్నిస్ స్టార్ నొవాక్ జొకోవిచ్‌తో టామీ పాల్ సెమీస్ మ్యాచ్ ఆడాల్సి ఉంది. ఇక టామీ పాల్ గర్ల్‌ఫ్రెండ్ పెయిజ్ లోరెన్జ్ మాత్రం అతని కంటే ముందే హెడ్‌లైన్స్‌లో నిలిచింది. ఆటతో అనుకుంటే పొరపాటే. బాయ్‌ఫ్రెండ్‌తో పాటు ఆస్ట్రేలియా వచ్చిన ఈ అమ్మడు టాప్‌లెస్‌గా దర్శనమిచ్చి కుర్రకారు గుండెల్లో రైళ్లు పరిగెత్తించింది. తన బాయ్‌ఫ్రెండ్ ఆడే మ్యాచ్‌లకు పక్కాగా హాజరవుతున్న పెయిజ్ లోరెన్జ్ ఖాళీ సమయంలో బీచ్‌కు వెళ్లి అందాల ప్రదర్శనతో కనువిందు చేస్తుంది. దీనికి సంబంధించిన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసుకుంది. తన బాయ్‌ఫ్రెండ్ టామీ పాల్.. బెన్ షెల్టన్‌తో ఆడిన క్వార్టర్స్ మ్యాచ్ ఫోటోలను కూడా పంచుకుంది. తన గర్ల్‌ఫ్రెండ్ టాప్‌లెస్ ఫోజుపై టామీ పాల్ స్పందించాడు.. ''అలా నావైపు చూడకు ఏదో అవుతుంది నాకు'' అంటూ కామెంట్ చేశాడు. ఇక పెయిజ్ లోరెన్జ్ టాప్‌లెస్ ఫోటోలపై అభిమానులు వినూత్న రీతిలో కామెంట్ చేశారు. View this post on Instagram A post shared by Paige Lorenze (@paigelorenze) -
Hockey WC 2023: 13 ఏళ్ల తర్వాత సెమీస్‌లోకి జర్మనీ
పురుషుల ప్రపంచకప్ హాకీ టోర్నమెంట్లో జర్మనీ జట్టు 13 ఏళ్ల తర్వాత మళ్లీ సెమీఫైనల్లోకి అడుగు పెట్టింది. భువనేశ్వర్‌లో బుధవారం జరిగిన మూడో క్వార్టర్ ఫైనల్లో జర్మనీ ‘షూటౌట్’ లో 4–3తో ఇంగ్లండ్‌ను ఓడించింది. నిరీ్ణత సమయం వరకు రెండు జట్లు 2–2తో సమంగా నిలిచాయి. 2010 తర్వాత ఈ మెగా టోరీ్నలో జర్మనీ సెమీఫైనల్ చేరింది. మరో క్వార్టర్ ఫైనల్లో నెదర్లాండ్స్ 5–1తో కొరియాను ఓడించి సెమీస్ చేరింది. శుక్రవారం జరిగే సెమీఫైనల్స్‌లో ఆ్రస్టేలియాతో జర్మనీ; బెల్జియంతో నెదర్లాండ్స్ ఆడతాయి. -
వరుసగా 12వసారి సెమీస్‌లో ఆస్ట్రేలియా
భువనేశ్వర్: పురుషుల ప్రపంచకప్ హాకీ టోర్నీలో ఆ్రస్టేలియా జట్టు వరుసగా 12వసారి సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. స్పెయిన్ జట్టుతో జరిగిన క్వార్టర్ ఫైనల్లో ఆ్రస్టేలియా 4–3 తో గెలిచింది. ఆసీస్ తరఫున హేవార్డ్ (33వ, 37వ ని.లో) రెండు గోల్స్ చేయగా... జెలెవ్స్కీ (32వ ని.లో), ఫ్లిన్ ఒగిల్వీ (30వ ని.లో) ఒక్కో గోల్ సాధించారు. ఒకదశలో ఆ్రస్టేలియా 0–2తో వెనుకబడినా ఏడు నిమిషాల వ్యవధిలో నాలుగు గోల్స్ సాధించింది. మరో క్వార్టర్ ఫైనల్లో బెల్జియం 2–0తో న్యూజిలాండ్‌ను ఓడించి సెమీఫైనల్లోకి అడుగు పెట్టింది. -
FIFA: గాయంతో అన్న దూరం.. తమ్ముడు అదరగొడుతున్నాడు
ఖతర్ వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్‌కప్‌లో ఫ్రాన్స్ వరుసగా రెండోసారి ఫైనల్లో అడుగుపెట్టింది. బుధవారం రాత్రి మొరాకోతో జరిగిన మ్యాచ్‌లో 2-0 తేడాతో గెలిచిన ఫ్రాన్స్ దర్జాగా ఫైనల్స్‌కు చేరుకుంది. ఇక డిసెంబర్ 18న అర్జెంటీనాతో జరగనున్న ఫైనల్లో గెలిచి చాంపియన్‌షిప్‌ను నిలుపుకోవాలని ఫ్రాన్స్ భావిస్తోంది. అయితే మొరాకోతో జరిగిన సెమీస్‌లో ఫ్రాన్స్ సూపర్‌స్టార్ కైలియన్ ఎంబాపె మెరవనప్పటికి తామున్నామంటూ ఇద్దరు ఆటగాళ్లు అదరగొట్టారు. వారిలో ఒకడు తియో హెర్నాండేజ్ అయితే.. ఇంకొకడు రాండల్ కొలో మునాయ్. ఆట 5వ నిమిషంలో హెర్నాండేజ్ గోల్ కొట్టి ఫ్రాన్స్‌ను ఆధిక్యంలోకి తీసుకెళ్తే.. రెండో అర్థభాగంలో ఆట 79వ నిమిషంలో రాండల్ మరో గోల్ కొట్టి 2-0తో ఫ్రాన్స్ విజయాన్ని ఖాయం చేశాడు. రాండల్ సంగతి పక్కనబెడితే.. ఆట ఆరంభంలోనే గోల్‌తో మెరిసిన తియో హెర్నాండేజ్ గురించి ఒక ఆసక్తికర విషయం తెలిసింది. అదేంటంటే.. తియో హెర్నాండేజ్ ఎవరో కాదు.. ఫ్రాన్స్ స్టార్ లుకాస్ ఫెర్నాండేజ్ సొంత తమ్ముడు. అన్నదమ్ములిద్దరు ఏకకాలంలో ఫిఫా వరల్డ్‌కప్‌లో ఫ్రాన్స్‌కు ప్రాతినిధ్యం వహించారు.అయితే గ్రూప్ దశలో ఫ్రాన్స్ ఆస్ట్రేలియాతో తొలి మ్యాచ్ ఆడింది. ఆ మ్యాచ్‌లో ఫ్రాన్స్ 4-1 తేడాతో ఘనవిజయం సాధించింది. కానీ ఆట ఆరంభమైన కాసేపటికే లుకాస్ ఫెర్నాండేజ్ తీవ్రంగా గాయపడ్డాడు. మైదానం వీడిన లుకాస్ ఇప్పటి వరకు తిరిగి గ్రౌండ్లో అడుగుపెట్టలేదు. గాయం తీవ్రత ఎక్కువగా ఉండడంతో ఫిఫా వరల్డ్‌కప్‌కు పూర్తిగా దూరమైనట్లు ఫ్రాన్స్ ప్రకటించింది. అన్న దూరం కావడం తియో హెర్నాండేజ్ను బాధించింది. ఎలాగైనా అన్న కోసం కప్ గెలవాలని బలంగా కోరుకున్నాడు. అప్పటినుంచి ప్రతీ మ్యాచ్ ఆడినప్పటికి హెర్నాండేజ్కు గోల్ కొట్టే అవకాశం రాలేదు. తాజాగా ఆ సమయం రానే వచ్చింది. మొరాకోతో కీలకమైన సెమీఫైనల్లో తియో హెర్నాండేజ్ గోల్ కొట్టి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఇక అన్న లుకాస్ హెర్నాండేజ్ కల నిజం చేసేందుకు తియో హెర్నాండేజ్ ఒక్క అడుగు దూరంలో ఉన్నాడు. అర్జెంటీనాతో జరగనున్న ఫైనల్లో ఫ్రాన్స్‌ను గెలిపించి అన్నకు టైటిల్ కానుకగా ఇవ్వాలనుకుంటున్నాడు. మొరాకోపై గెలుపు అనంతరం తియో హెర్నాండేజ్ మీడియాతో మాట్లాడాడు. ''లూలూ(లుకాస్ హెర్నాండేజ్).. ఈసారి వరల్డ్‌కప్ మనిద్దరి కోసం ఆడుతున్నా. మొరాకోతో మ్యాచ్‌లో గోల్ కొట్టగానే కోచ్ నన్ను పిలిచి మీ అన్న లుకాస్ నిన్ను అభినందించినట్లు చెప్పమని పేర్కొనడం సంతోషం కలిగించింది. నా ప్రదర్శన పట్ల లుకాస్ గర్వపడుతున్నాడు. ఆటలో నువ్వు లేకపోవచ్చు.. కానీ ఎప్పుడు నాతోనే ఉండాలని ఆశపడుతున్నా. నీ గాయం నాకు కష్టంగా అనిపిస్తున్నప్పటికి తప్పదు. అన్న కోసం కప్ గెలవాలనుకుంటున్నా. మ్యాచ్ ముగిసిన ప్రతీరోజు మేమిద్దరం చాలా విషయాలు మాట్లాడుకుంటున్నాం'' అంటూ పేర్కొన్నాడు. 😬 Is @TheoHernandez a ninja? 🥷🏻 Check out the 🔢 from his 🤯 goal in last night's #FRAMAR 📹 Next 🆙 for the @FrenchTeam 👉🏻 #FIFAWorldCup Final 🆚 @Argentina on Dec 18 - 8:30 pm, LIVE on #JioCinema & #Sports18 📺📲#Qatar2022 #FIFAWConJioCinema #FIFAWConSports18 pic.twitter.com/qX69GwBACz — JioCinema (@JioCinema) December 15, 2022 చదవండి: 'బాధపడకు మిత్రమా.. ఓడినా చరిత్ర సృష్టించారు' -
'బాధపడకు మిత్రమా.. ఓడినా చరిత్ర సృష్టించారు'
ఖతర్ వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్‌కప్‌లో ఫ్రాన్స్ వరుసగా రెండోసారి ఫైనల్లో అడుగుపెట్టింది. బుధవారం రాత్రి మొరాకోతో జరిగిన సెమీఫైనల్లో 2-0 తేడాతో ఫ్రాన్స్ విజయం అందుకుంది. డిఫెండింగ్ చాంపియన్స్‌గా వరల్డ్‌కప్‌లో బరిలోకి దిగిన ఫ్రాన్స్ టోర్నీ ఆసాంతం అందుకు తగ్గ ఆటతీరు ప్రదర్శిస్తూ వచ్చింది. ఫ్రాన్స్ సూపర్‌స్టార్ కైలియన్ ఎంబాపె గోల్ కొట్టడంలో విఫలమైనప్పటికి మేమున్నామంటూ తియో హెర్నాండేజ్(ఆట 5వ నిమిషం), రాండల్ కొలో మునాయ్(ఆట 79వ నిమిషం)లో ఫ్రాన్స్‌కు గోల్ అందించి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు. ఇక డిసెంబర్ 18(ఆదివారం) జరిగే ఫైనల్లో అర్జెంటీనాతో అమితుమీ తేల్చుకోనుంది. ఇదిలా ఉంటే ఈ ఫిఫా వరల్డ్‌కప్‌లో ఎలాంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగిన ఆఫ్రికా జట్టు మొరాకో సెమీస్ చేరి అందర్ని ఆశ్చర్యపరిచింది. గ్రూప్ దశలో బెల్జియం, నాకౌట్స్‌లో స్పెయిన్, పోర్చుగల్‌లను చిత్తు చేసి సెమీఫైనల్లో అడుగుపెట్టి సంచలనం సృష్టించింది. అయితే ఫ్రాన్స్ అనుభవం ముందు మొరాకో తలవంచక తప్పలేదు.. అయినా సరే తమ ఆటతీరుతో ఇంత దూరం వచ్చిన మొరాకో జట్టుపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇక ఫ్రాన్స్ స్టార్ కైలియన్ ఎంబాపె, మొరాకో ఢిపెండర్ అచ్రఫ్ హకీమిలు బయట బెస్ట్ ఫ్రెండ్స్ అన్న సంగతి తెలిసిందే. దాదాపు ఒకేసారి ఫుట్‌బాల్ కెరీర్‌ను ఆరంభించిన ఈ ఇద్దరు ప్రాణ స్నేహితులుగా మారిపోయారు. ప్రాణ స్నేహితులుగా ఉన్న వీరిద్దరు ఫిఫా వరల్డ్‌కప్ సెమీఫైనల్లో మాత్రం ప్రత్యర్థులయ్యారు. దేశం కోసం మ్యాచ్ ఆడగా.. ఎంబాపె విజయం సాధించగా.. హకీమి ఓటమి పాలయ్యాడు. మ్యాచ్ వరకు మాత్రమే తాము ప్రత్యర్థులమని.. బయట ఎప్పటికీ ప్రాణ స్నేహితులమేనని మరోసారి నిరూపించారు. అండర్‌డాగ్స్‌గా బరిలోకి దిగి సంచలన విజయాలు అందుకున్న తన జట్టు సెమీస్‌లో నిష్క్రమించడంతో హకీమి కన్నీటిపర్యంతం అయ్యాడు. ఇది గమనించిన ఎంబాపె.. అతని వద్దకు వచ్చి ఓదార్చాడు. బాధపడకు మిత్రమా.. ఓడినా మీరు చరిత్ర సృష్టించారు. మేటి జట్లను చిత్తు చేసి ఇంతదూరం రావడం సామాన్యమైన విషయం కాదు. మీ పోరాటం అమోఘం. అయితే మ్యాచ్‌లో ఏదో ఒక జట్టు మాత్రమే విజయం సాధిస్తుంది. ఇవాళ నీపై నేను పైచేయి సాధించాను. టోర్నీ వరకే ప్రత్యర్థులం.. బయట మాత్రం ఎన్నటికి స్నేహితులమే అంటూ చెప్పుకొచ్చాడు. అనంతరం ఎంబాపె, అచ్రఫ్ హకీమిలు తమ జెర్సీలను మార్చుకొని తమ స్నేహం గొప్పతనాన్ని చాటుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. Don’t be sad bro, everybody is proud of what you did, you made history. ❤️ @AchrafHakimi pic.twitter.com/hvjQvQ84c6 — Kylian Mbappé (@KMbappe) December 14, 2022 Kylian Mbappe went straight over to console his good friend and teammate Achraf Hakimi.🤗 pic.twitter.com/IvbwKbemEu — Ben Jacobs (@JacobsBen) December 14, 2022 PSG team-mates Mbappe and Hakimi swapping shirts at the end.#Mar #fra #FIFAWorldCup pic.twitter.com/DrufStKHAV — Shamoon Hafez (@ShamoonHafez) December 14, 2022 Hugo Lloris kept his first clean sheet in #Qatar2022 to guide #LesBleus to another #FIFAWorldCup Final 📈 Relive his brilliant saves in #FRAMAR & watch @FrenchTeam go for 🏆 - Dec 18, 8:30 pm, LIVE on #JioCinema & #Sports18 📺📲#FIFAWConJioCinema #FIFAWConSports18 pic.twitter.com/2GKLlJL6kX — JioCinema (@JioCinema) December 14, 2022 చదవండి: FIFA WC: సెమీ ఫైనల్.. ప్రాణ స్నేహితులు ప్రత్యర్థులైన వేళ -
అల్విదా 'లుకా మోడ్రిక్'.. నాయకుడంటే నీలాగే
లుకా మోడ్రిక్.. ఈతరం ఫుట్‌బాల్ స్టార్స్‌లో ఒకడు. మెస్సీ, రొనాల్డో లాగా పాపులారిటీ లేనప్పటికి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. అనామక జట్టుగా ఉన్న క్రొయేషియాను లుకా మోడ్రిక్ నడిపిన తీరు అద్బుతమని చెప్పొచ్చు. వరుసగా రెండు ఫిఫా వరల్డ్‌కప్స్‌లో అసాధారణ ఆటతీరు కనబరిచి అభిమానులను సంపాదించుకున్నాడు. ఈ ఫిఫా వరల్డ్‌కప్‌లోనూ మోడ్రిక్ జట్టును అన్నీ తానై నడిపించాడు. నాయకుడంటే ఇలాగే ఉండాలి అనే పదానికి నిర్వచనంగా నిలిచాడు లుకా మోడ్రిక్. 2006లో అంతర్జాతీయ ఫుట్‌బాల్ కెరీర్‌ను ఆరంభించిన లుకా మోడ్రిక్ తొలి రెండు వరల్డ్‌కప్‌లలో పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. 2010, 2014 వరల్డ్‌కప్స్‌లో క్రొయేషియా గ్రూప్ దశలోనే వెనుదిరిగడం మోడ్రిక్ను వెలుగులోకి తీసుకురాలేకపోయింది. ఇక 2014 ఫిఫా వరల్డ్‌కప్.. గ్రూప్ దశలోనే క్రొయేషియా జట్టు వెనుదిరిగింది. కేవలం 40 లక్షల జనాభా మాత్రమే కలిగిన క్రొయేషియా వచ్చే నాలుగేళ్లలో అద్భుతం చేయబోతుందని అప్పట్లో ఎవరు ఊహించలేదు. 2014 తర్వాత కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన మోడ్రిక్ దశ దిశ లేకుండా అనామక జట్టుగా ఉన్న క్రొయేషియాను గాడిలో పెట్టాడు. ఆ తర్వాత నాలుగేళ్లలో జట్టులో ఎన్నో మార్పులు తీసుకొచ్చాడు. మేజర్ టోర్నీలు గెలవకపోయినప్పటికి జట్టును బలంగా తయారు చేయడంలో మాత్రం సఫలమయ్యాడు. ఇక 2018 ఫిఫా వరల్డ్‌కప్‌లో ఎలాంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగి ఆఖరి మెట్టుపై బోల్తా పడి రన్నరప్‌గా నిలిచిన క్రొయేషియా.. ఈసారి కూడా దాదాపు అదే ఫలితాలను రిపీట్ చేసింది. కీలకమైన నాకౌట్స్‌లో బ్రెజిల్, జపాన్ లాంటి మేటి జట్లకు షాకిచ్చి సెమీఫైనల్లో అడుగుపెట్టింది. అలా వరుసగా రెండు వరల్డ్‌కప్స్‌లో ఒకసారి రన్నరప్.. మరోసారి సెమీఫైనల్ వరకు వచ్చిందంటే లుకా మోడ్రిక్ జట్టులో నింపిన చైతన్యం వల్లే అని చెప్పొచ్చు. ఈసారి లుకా మోడ్రిక్తో పాటు గోల్ కీపర్ డొమినిక్ లివకోవిచ్ , ఇవాన్ పెరిసిక్, డెజన్ లొవ్రెన్, మార్సిలో బ్రొజోవిక్లు నాలుగు స్తంభాలుగా మారి క్రొయేషియాను ముందుకు నడిపించారు. 37 ఏళ్ల లుకా మోడ్రిక్ తన చివరి ఫిఫా వరల్డ్‌కప్ ఆడేసినట్లే. క్రొయేషియా తరపున అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ఆటగాడిగా లుకా రికార్డు నెలకొల్పాడు. క్రొయేషియా తరపున 161 మ్యాచ్‌ల్లో 23 గోల్స్ సాధించాడు. మిడ్‌ఫీల్డర్‌గా బాధ్యతలు నిర్వర్తించే లుకా మోడ్రిక్ ఎక్కువ గోల్స్ చేయకపోయినప్పటికి పాస్‌లు అందించడంలో మాత్రం దిట్ట. 2006 నుంచి 16 ఏళ్ల పాటు క్రొయేషియా జట్టుకు సేవలందించిన లుకా మోడ్రిక్.. ఫిఫి వరల్డ్‌కప్ గెలవలేదన్న కోరిక మినహాయిస్తే జీవితంలో అన్నీ చూశాడు. 2018 ఫిఫా వరల్డ్‌కప్‌లో గోల్డెన్ బాల్ అందుకున్న లుకా.. 2018లోనే ప్రతిష్టాత్మక బాలన్ డీ ఓర్ అవార్డు, యూఈఎఫ్ఏ మెన్స్ ప్లేయర్ అవార్డులను గెలుచుకున్నాడు. ఇక 2019లో గోల్డెన్ ఫుట్ అవార్డు గెలుచుకున్న లుకా మోడ్రిక్ ఆటకు నీరాజనం పలుకుతూ అతని మలి కెరీర్ కూడా ఆనందంగా సాగిపోవాలని కోరుకుందాం. చదవండి: దెబ్బకు దెబ్బ తీశారు.. లెక్క సరిచేసిన మెస్సీ Luka Modric: 'ఈ వరల్డ్‌కప్ మెస్సీదే.. కచ్చితంగా కొడతాడు' Warrior spirit 💪 Still not over for @lukamodric10 & Co. in #Qatar2022 📊 Watch #Croatia vie for a third-place finish at the #FIFAWorldCup once again, Dec 17 - 8:30 pm, LIVE on #JioCinema & #Sports18 📺📲#ARGCRO #FIFAWConJioCinema #FIFAWConSports18 pic.twitter.com/HjqX7k2qKe — JioCinema (@JioCinema) December 13, 2022 -
దెబ్బకు దెబ్బ తీశారు.. లెక్క సరిచేసిన మెస్సీ
ఖతర్ వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్‌కప్‌లో మెస్సీ బృందం ఫైనల్లో అడుగుపెట్టింది. మంగళవారం అర్థరాత్రి క్రొయేషియాతో జరిగిన సెమీఫైనల్లో 3-0తో అర్జెంటీనా ఘన విజయం సాధించింది. కీలకమైన నాకౌట్స్‌లో బ్రెజిల్, జపాన్ లాంటి మేటి జట్లకు షాకిచ్చి సెమీఫైనల్లో అడుగుపెట్టింది. అయితే క్రొయేషియా.. అర్జెంటీనాతో జరిగిన సెమీస్‌లో మాత్రం తోకముడిచింది. మెస్సీ బృందం క్లాస్ ఆటతీరుకు ఆ జట్టు వద్ద సమాధానం లేకుండా పోయింది. కనీస పోటీ కూడా ఇవ్వలేక చతికిలపడిన లుకా మోడ్రిక్ బృందం సెమీస్‌లో ఓడి ఇంటిబాట పట్టింది. అయితే అర్జెంటీనా మాత్రం క్రొయేషియాపై తమ ప్రతీకారం తీర్చుకుంది. 2018 ఫిఫా వరల్డ్‌కప్‌లో అర్జెంటీనా, క్రొయేషియాలు ఒకే గ్రూప్‌లో ఉన్నాయి. లీగ్ దశలో క్రొయేషియా 3-0తో అర్జెంటీనాకు షాక్ ఇచ్చింది. అప్పటి మ్యాచ్‌లో లుకా మోడ్రిక్ సహా మరో ఇద్దరు ఆటగాళ్లు కలిసి మూడు గోల్స్ కొట్టగా.. మెస్సీ సేన మాత్రం ఒక్క గోల్ కూడా కొట్టలేకపోయింది. ఆ తర్వాత అర్జెంటీనా ప్రీక్వార్టర్స్‌లో ఫ్రాన్స్ చేతిలో ఓడి ఇంటిబాట పట్టింది. 2018 ఫిఫా వరల్డ్‌కప్: అర్జెంటీనాపై గెలుపు.. క్రొయేషియా సంబరాలు సరిగ్గా నాలుగేళ్ల తర్వాత 2022 ఫిఫా వరల్డ్‌కప్‌లో అర్జెంటీనా క్రొయేషియాను కీలక నాకౌట్ దశలో ఓడించి ప్రతీకారం తీర్చుకున్నట్లయింది. యాదృశ్చికంగా అర్జెంటీనా కూడా 3-0 తేడాతోనే క్రొయేషియాను మట్టికరిపించింది. ఈసారి మెస్సీ ఒక గోల్ కొట్టగా.. అల్వరేజ్ రెండో గోల్స్ నమోదు చేశాడు. అలా 2018 ఓటమికి దెబ్బకు దెబ్బ తీసిన మెస్సీ బృందం లెక్కను సరిచేసింది. చదవండి: Luka Modric: 'ఈ వరల్డ్‌కప్ మెస్సీదే.. కచ్చితంగా కొడతాడు' 3️⃣ strikes that powered #Messi𓃵 & Co.'s dream of reaching #Qatar2022 final 👏 Watch all the goals from #ARGCRO & stay tuned to the #WorldsGreatestShow on #JioCinema & #Sports18 📺📲#FIFAWorldCup #FIFAWConJioCinema #FIFAWConSports18 pic.twitter.com/gUWKbJGbJl — JioCinema (@JioCinema) December 13, 2022 -
Luka Modric: 'ఈ వరల్డ్‌కప్ మెస్సీదే.. కచ్చితంగా కొడతాడు'
ఖతర్ వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్‌కప్‌లో క్రొయేషియా కథ ముగిసింది. గతేడాది రన్నరప్‌గా నిలిచిన క్రొయేషియా ఈసారి అదే ఆటతీరుతో ఆకట్టుకుంటూ సెమీఫైనల్ వరకు దూసుకొచ్చింది. కానీ సెమీస్‌లో అర్జెంటీనా లాంటి పటిష్టమైన జట్టు ముందు క్రొయేషియా తలవంచింది. మెస్సీ ఆటను కళ్లార్పకుండా చూసిన ఆ జట్టు అతని ఆటకు ఫిదా అయింది. మొత్తానికి 0-3 తేడాతో అర్జెంటీనా చేతిలో పరాజయం పాలై ఇంటిదారి పట్టింది. క్రొయేషియాను అన్నీ తానై నడిపించిన కెప్టెన్ లుకా మోడ్రిక్కు ఫిఫా వరల్డ్‌కప్‌ను అందించి ఘనంగా వీడ్కోలు పలకాలనుకున్న జట్టుకు నిరాశే ఎదురైంది. అయినప్పటికి 2014లో గ్రూప్ దశలోనే వెనుదిరిగిన క్రొయేషియాను గాడిలో పెట్టి.. వరుసగా రెండు ప్రపంచకప్‌ల్లో నాకౌట్ దశకు తీసుకురావడంలో లుకా మోడ్రిక్ది కీలకపాత్ర. తన కెరీర్లో వరల్డ్‌కప్ లేదన్న మాటే కానీ అతని ఆటతీరుతో కోట్లాది మంది అభిమానుల హృదయాలను గెలుచుకొని ఫిఫా వరల్డ్‌కప్‌ను ముగించాడు. మ్యాచ్ అనంతరం లుకా మోడ్రిక్ మాట్లాడుతూ మెస్సీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ''ఈరోజు మ్యాచ్ అర్జెంటీనాదే. ముఖ్యంగా మెస్సీ అన్నీ తానై జట్టును నడిపిస్తున్న తీరు అద్భుతం. మ్యాచ్‌లో రిఫరీ అర్జెంటీనాకు పెనాల్టీ ఇవ్వడం నాకు నచ్చలేదు. అది తప్పిస్తే ఎలాంటి పొరపాట్లు జరగలేదు. ఫిఫా వరల్డ్‌కప్ టైటిల్‌తో కెరీర్‌ను ముగిద్దామనుకున్నా.. ఇప్పుడు అది లేకుండానే వెళ్లిపోతున్నా. ఈసారి మెస్సీదే వరల్డ్‌కప్.. టైటిల్ కచ్చితంగా కొడతాడన్న నమ్మకం నాకుంది. ఒక దిగ్గజ ప్లేయర్ ఈ ఘనత సాధించి ఆటకు వీడ్కోలు పలికితే అంతకన్నా సంతోషం మరొకటి ఉండదు. అర్జెంటీనా జట్టులో నాకు మెస్సీ ఒక్కడే కనిపిస్తున్నాడు. మిగతావాళ్లు బాగా ఆడుతున్నప్పటికి మెస్సీనే నా ఫెవరెట్. ఆల్ ది బెస్ట్ అర్జెంటీనా అండ్ మెస్సీ.'' అంటూ పేర్కొన్నాడు. 🎙️ Luka Modrić: “I hope Lionel Messi wins this World Cup, he is the best player in history and he deserves it.” 🇭🇷🤝🇦🇷#FIFAWorldCup pic.twitter.com/w3VEGdXnDd — Football Tweet ⚽ (@Football__Tweet) December 13, 2022 చదవండి: ఆదిలోనే సౌదీ చేతిలో ఓటమి! ఎట్టకేలకు ఇలా.. మెస్సీ పోస్ట్ వైరల్ -
FIFA WC: మెస్సీ మాయాజాలం.. ఫైనల్‌కు అర్జెంటీనా
FIFA World Cup 2022- Argentina Vs Croatia- Lionel Messi: ఖతర్ వేదికగా జరుగుతున్న ఫిఫా ప్రపంచ కప్-2022లో అర్జెంటీనా ఫైనల్లోకి దూసుకెళ్లింది. మెస్సి మాయాజాలంతో సెమీఫైనల్లో క్రొయేషియాపై అద్భుత విజయం సాధించి ఘనంగా ఫైనల్లో అడుగుపెట్టింది. మంగళవారం అర్ధరాతి 12.30 గంటలకు ప్రారంభమైన తొలి సెమీ ఫైనల్ మ్యాచ్‌లో అర్జెంటీనా 3-0 గోల్స్ తేడాతో క్రొయేషియాను మట్టికరిపించింది. ఈ క్రమంలో 2014 తర్వాత మరోసారి ఫైనల్లోకి అడుగుపెట్టింది. ఈ మ్యాచ్‌లో తొలి అర్ధభాగంలో అర్జెంటీనా రెండు గోల్స్ చేసింది మెస్సీ పెనాల్టీ కిక్ ద్వారా (34.14వ నిమిషంలో) ఒక గోల్ చేశాడు. ఆ తర్వాత అల్వారెజ్ రెండు గోల్స్(38.51వ నిమిషంలో) గోల్ చేశాడు. రెండో అర్ధభాగంలో అల్వారెజ్ మ(69వ నిమిషాల్లో) మరో గోల్ చేశాడు. దీంతో 3-0 గోల్స్ తేడాతో క్రొయేషియాపై విజయం సాధించింది అర్జెంటీనా. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_5091503545.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); Argentina storm through to the #FIFAWorldCup Final 🇦🇷 🔥 #Qatar2022 — FIFA World Cup (@FIFAWorldCup) December 13, 2022 -
క్రొయేషియా బలం ఆ నలుగురే.. సైలెంట్ అనిపించే వయొలెంట్ కిల్లర్స్
ఖతర్ వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్‌కప్‌లో క్రొయేషియా దూసుకెళ్తుంది. కేవలం 40 లక్షల జనాభా ఉన్న క్రొయేషియా జట్టు సాకర్‌లో అద్భుతాలు చేస్తోంది. నాలుగేండ్ల కిందట అందరి అంచనాలు తారుమారు చేస్తూ ఫైనల్ వరకు వచ్చిన క్రొయేషియన్లు ఈసారి కూడా అదే జోరు కొనసాగిస్తూ దూసుకొస్తున్నారు. పలు మేటి జట్లకు చెక్ పెడుతున్నారు.2018లో ఫ్రాన్స్ చేతిలో ఓడి కొద్దిలో టైటిల్ చేజార్చుకున్న క్రొయేషియా ఈసారి ఎలాగైనా వరల్డ్ చాంపియన్ అవ్వాలన్న సంకల్పంతో ఉంది. శుక్రవారం జరగనున్న సెమీఫైనల్లో బలమైన అర్జెంటీనాను చిత్తు చేసి ఫైనల్‌కు చేరాలని భావిస్తోంది. క్రొయేషియా జట్టులో లుకా మోడ్రిచ్ కీలక ఆటగాడు. ఇందులో ఎలాంటి అనుమానం లేదు. కానీ లూకా మోడ్రిచ్ ఒక్కడితోనే జట్టు మొత్తం నడవడం లేదు. మోడ్రిచ్‌కు అండగా జట్టులో నలుగురు ఆటగాళ్లు మూలస్తంభాల్లా నిలబడ్డారు. ఆ నలుగురే ఇవాన్ పెరిసిక్(మిడ్ ఫీల్డర్), మార్సిలో బ్రొజోవిక్(మిడ్ ఫీల్డర్), డెజన్ లొవ్రెన్(డిఫెండర్), డొమినిక్ లివకోవిచ్(గోల్ కీపర్). సైలెంట్‌గా కనిపించే ఈ నలుగురు వయొలెంట్ కిల్లర్స్. గత ఎడిషన్ మాదిరిగానే క్రొయేషియన్లు సైలెంట్ కిల్లర్స్‌గా ఒక్కో అడుగు వేస్తున్నారు. ప్రిక్వార్టర్స్‌లో జపాన్ జోరుకు చెక్ పెట్టి.. క్వార్టర్స్‌లో ఐదుసార్లు చాంపియన్ బ్రెజిల్‌ను దెబ్బకొట్టడంతో ప్లేయర్ల కాన్ఫిడెన్స్ పెరిగింది. క్రొయేషియా టీమ్‌లో మోడ్రిచ్ కీలకం. ఈ టోర్నీలో తను ఒక్క గోల్ కూడా కొట్టలేదు. అయినా టీమ్ మొత్తం అతని చుట్టూనే తిరుగుతోంది. మిడ్‌ఫీల్డ్‌లో అంతా సవ్యంగా ఉండేలా చేయడంతో పాటు చివరి నిమిషం వరకు తోటి ప్లేయర్లంతా పోరాడేలా చేస్తున్నాడు. 2018 టోర్నీ మాదిరిగా నాకౌట్ గేమ్స్‌ను ఎక్స్ట్రా టైమ్‌కు తీసుకెళ్లి ప్రత్యర్థుల పని పడుతోంది.తమ బలమైన డిఫెన్స్‌నే ప్రధానంగా ఉపయోగిస్తూ ఫలితాన్ని రాబడుతోంది. అయితే ఈ నలుగురు పుట్టుకతోనే గొప్పవాళ్లు ఏమీ కాలేదు. ఒక్కోక్కరిది ఒక్కో కథ.. వ్యధ. ఒకరు చికెన్ ఫార్మ్‌లో పనిచేస్తే.. మరొకడు కసాయి తండ్రి వద్ద పెరిగాడు. ఇంకొకడు చదువును మధ్యలోనే ఆపేశాడు.. ఇలా నలుగురు తమ చిన్నతనంలోనే ఎంతో కష్టాలు అనుభవించారు. లూకా మోడ్రిచ్ గురించి పరిచయం అవసరం లేకపోయినా ఈ నలుగురిపై మాత్రం ఒక లుక్కేయండి. ఇవాన్ పెరిసిక్(మిడ్ ఫీల్డర్) క్రొయేషియా జట్టులో కీలక మిడ్‌ఫీల్డర్‌గా ఇవాన్ పెరిసిక్ కొనసాగుతున్నాడు. జట్టు డిఫెన్స్ ఇంత పటిష్టంగా ఉండడానికి ప్రధాన కారణం ఇవాన్ పెరిసిక్. అయితే తన చిన్నతనం నుంచి ఇవాన్ పెరిసిక్ చికెన్ ఫార్మ్స్‌లో పనిచేశాడు. బీచ్ వాలీబాల్‌లో ఆరితేరిన ఇవాన్ పెరిసిక్ ఆ తర్వాత ఫుట్‌బాల్‌పై ఇష్టం పెంచుకున్నాడు. ఎన్నో కష్టాలకోర్చి స్థానిక లోకల్ క్లబ్‌కు ప్రాతినిధ్యం వహిస్తూ ఫుట్‌బాల్‌లో ఎదిగాడు. 2011లో ఇవాన్ పెరిసిక్ తొలిసారి క్రొయేషియా ఫుట్‌బాల్ టీంలో చోటు దక్కింది. అప్పటినుంచి జట్టులో కీలక మిడ్‌ఫీల్డర్‌గా కొనసాగుతున్నాడు. డొమినిక్ లివకోవిచ్(గోల్ కీపర్) ఈ ఫిఫా వరల్డ్‌కప్‌లో క్రొయేషియా ప్రతీ మ్యాచ్‌ను పెనాల్టీ దశ వరకు తీసుకెళ్తుందంటే అదంతా గోల్ కీపర్ డొమినిక్ లివకోవిచ్ చలవే. ముఖ్యంగా బ్రెజిల్‌తో జరిగిన క్వార్టర్ ఫైనల్లో పెనాల్టీ షూటౌట్లో నాలుగుసార్లు గోల్ కాకుండా అడ్డుగోడలా నిలబడ్డాడు. దీంతో డొమినిక్ లివకోవిచ్ పేరు మార్మోగిపోయింది. ప్రత్యర్థి ఎంత బలమైన జట్టు అయినా.. తన వరకు బంతి వచ్చిందంటే అది కచ్చితంగా గోల్‌పోస్ట్‌లోకి వెళ్లకుండా అడ్డుపడడం లివకోవిచ్ స్పెషాలిటీ. అయితే డొమినిక్ లివకోవిచ్ ఫుట్‌బాల్‌లోకి రాకముందు బాస్కెట్‌బాల్ ప్లేయర్‌గా రాణించాడు. డెజన్ లొవ్రెన్(డిఫెండర్) క్రొయేషియా జట్టులో ఢిపెన్స్ విభాగంలో డెజన్ లొవ్రెన్ కీలకం. ప్రత్యర్థి ఆటగాళ్లకు బంతి చిక్కకుండా తన డిఫెన్స్‌తో పాస్‌లు అందించడంలో డెజన్ లొవ్రెన్ది ప్రత్యేక స్టైల్. ఇవాళ స్టార్‌గా వెలుగొందుతున్న డెజన్ లొవ్రెన్ జీవితం కాస్త డిఫరెంట్. యుగోస్లేవియా యుద్ధం కారణంగా డెజన్కు మూడేళ్ల వయస్సు ఉన్నప్పుడు బొస్నియన్ సిటీకి వలస వచ్చారు. ఏడేళ్ల పాటు అక్కడే పెరిగాడు. ఆ తర్వాత 10 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు తన ఫ్యామిలీకి జర్మనీలో ఉండేదుకు అనుమతి రాలేదు. వెంటనే క్రొయేషియాకు వెళ్లిపోవాలని ఆదేశించారు. అలా ఉన్నపళంగా పిల్లలను తీసుకొని క్రొయేషియాలో స్థిరపడ్డారు. అయితే డెజన్కు క్రొయేషియా భాష మాట్లాడడం రాదు. దీంతో స్కూల్లో అందరు డెజన్ను హేళన చేసేవారు. అయితే క్రమంగా క్రొయేషియా లాంగ్వేజ్‌పై మంచి పట్టు సాధించాడు. మార్సిలో బ్రొజోవిక్(మిడ్‌ఫీల్డర్) మార్సిలో బ్రొజోవిక్ కసాయి తండ్రి పెంపకంలో పెరిగాడు. ఫుట్‌బాల్ ఆడాలనుకుంటే స్కూల్‌ను వదిలేయాలన్నాడు. ఫుట్‌బాల్‌పై ఇష్టంతో మధ్యలోనే స్కూల్ మానేశాడు. దీంతో క్రొయేషియా భాష తప్పిస్తే మరే ఇతర లాంగ్వేజ్లోమాట్లడలేడు. ఇంగ్లీష్‌పై కనీస పరిజ్ఞానం కూడా అతనికి లేదు. ఇవాళ స్టార్‌గా వెలుగొందుతున్న మార్సిలో బ్రొజోవిక్ తాను ఎప్పటికైనా ఇంగ్లీష్ నేర్చుకొని మాట్లాడి తీరుతానని పేర్కొన్నాడు. ఇక లూకా మోడ్రిచ్ ఇవాళ వరల్డ్ బెస్ట్ సాకర్ స్టార్లలో ఒకడిగా వెలుగొందుతున్నాడు. ఈ క్రమంలో సెమీస్‌లో అర్జెంటీనా అడ్డుదాటి ముందుకెళ్లాలని చూస్తోంది. గత ఎడిషన్ గ్రూప్ స్టేజ్‌లో క్రొయేషియా 3-0తో అర్జెంటీనాను చిత్తు చేయడం గమనార్హం. అందుకే మెస్సీ సేన ఫెవరెట్‌గా కనిపిస్తున్నప్పటికి క్రొయేషియాను తక్కువ అంచనా వేస్తే మొదటికే మోసం వస్తుంది. చదవండి: 'మెస్సీ ఆటను ఎంజాయ్ చేస్తున్నాం.. చర్చ అవసరమా?' -
FIFA WC: ఆఖరి ఛాన్స్! క్రొయేషియా తక్కువేమీ కాదు! అదే జరిగితే మెస్సీ కూడా రొనాల్డోలాగే..
Argentina Vs Croatia- Lionel Messi- Doha: మెస్సీ మరోసారి అర్జెంటీనాను ఫైనల్‌కు చేరుస్తాడా? మోడ్రిచ్ వరుసగా రెండోసారి తమ జట్టును తుది పోరు వరకు తీసుకెళ్లగలడా? ఒకరు ఆల్‌టైమ్ గ్రేట్‌గా ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకొని తన జట్టుకు బలంగా నిలవగా... మరోవైపు సమష్టితత్వాన్నే నమ్ముకొని ముందుకు సాగిపోయిన టీమ్ మళ్లీ అంచనాలను తలకిందులు చేయగలదా? ఈ నేపథ్యంలో ఫుట్‌బాల్ ప్రపంచకప్ టోర్నీ-2022లో మరో రసవత్తర సమరానికి సమయం ఆసన్నమైంది. సంచలనాలు కొత్త కాదు రెండుసార్లు విజేత అర్జెంటీనా, గత వరల్డ్‌కప్ ఫైనలిస్ట్ క్రొయేషియా మంగళవారం అర్ధరాత్రి తర్వాత జరిగే ప్రపంచకప్ ఫుట్‌బాల్ టోర్నీ తొలి సెమీఫైనల్లో తలపడతాయి. 2014 వరల్డ్‌కప్‌లో మెస్సీ సారథ్యంలోనే అర్జెంటీనా ఫైనల్ చేరగా, మోడ్రిచ్ నాయకత్వంలోనే 2018లో క్రొయేషియా రన్నరప్‌గా నిలిచింది. అంచనాలు ఇప్పటికీ అర్జెంటీనాకు అనుకూలంగానే ఉండగా... క్రొయేషియాకు సంచలనాలు కొత్త కాదు. చెరోసారి.. అయితే! ఈ రెండు జట్లు గతంలో రెండుసార్లు ప్రపంచకప్‌లో లీగ్ దశలో ముఖాముఖిగా తలపడ్డాయి. 1998లో అర్జెంటీనా 1–0తో నెగ్గగా... 2018లో క్రొయేషియా 3–0తో గెలిచింది. నాకౌట్ దశలో మాత్రం తొలిసారి ఈ రెండు జట్లు ‘ఢీ’కొంటున్నాయి. స్టార్ ముందుండి నడిపిస్తుండగా... తన కెరీర్లో వరల్డ్‌కప్ లేని లోటును పూరించేందుకు, అభిమానుల దృష్టిలో మరో మారడోనాగా మారేందుకు మెస్సీకి ఇది చివరి చాన్స్. 35 ఏళ్ల వయసులో కూడా అతని అద్భుత ప్రదర్శన జట్టును సెమీస్ వరకు తీసుకొచ్చింది. సమకాలీన మేటి ఫుట్‌బాలర్ క్రిస్టియానో రొనాల్డోకు సాధ్యం కానిది సాధించగలిగే అవకాశం మెస్సీ ముంగిట నిలిచింది. నిజానికి మెక్సికో, ఆస్ట్రేలియాలపై చేసిన గోల్స్‌తో పాటు నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌లో నాహుల్ మొలినాకు మెస్సీ ఇచ్చిన రివర్స్ పాస్ మొత్తం వరల్డ్‌కప్‌లోనే హైలైట్‌గా నిలిచాయి. అయితే మెస్సీ మినహా ఇతర ఆటగాళ్లు అంతంతమాత్రంగానే రాణించారు. అల్వారెజ్, ఫెర్నాండెజ్, మ్యాక్ అలిస్టర్ ఫర్వాలేదనిపించినా ప్రపంచ స్థాయి ప్రదర్శన మాత్రం రాలేదు. ఇప్పటి వరకు అర్జెంటీనా ఆటలో ఆశించిన వేగం, కొత్తదనం కనిపించకపోయినా నడిచిపోయింది. కాస్త ఏమరుపాటుగా ఉన్నా కానీ సెమీస్ వేదికపై కాస్త ఏమరుపాటుగా ఉన్నా క్రొయేషియా మ్యాచ్‌ను లాగేసుకోగలదు. మెస్సీ మినహా ఇతర ఆటగాళ్లను కోచ్ స్కలోని ఎంత సమర్థంగా వాడుకుంటాడనేది కీలకం. గోల్‌కీపర్ మార్టినెజ్‌పై అదనపు బాధ్యత ఉంది. క్రొయేషియా గోల్ కీపర్ లివకోవిచ్ మెరుపు నైపుణ్యంతో టోర్నీని శాసిస్తున్న తీరు చూస్తే... ఒకవేళ మ్యాచ్ పెనాల్టీల వరకు వెళితే మాత్రం మార్టినెజ్ అత్యద్భుత ప్రదర్శన ఇవ్వాల్సి ఉంటుంది. పోరాటతత్వమే బలంగా... బ్రెజిల్‌పై క్వార్టర్ ఫైనల్లో గెలిచిన తర్వాత చివరి వరకు ఓటమిని అంగీకరించని తమ పోరాటస్ఫూర్తి గుర్తించి క్రొయేషియా కోచ్ డాలిచ్ పదే పదే చెప్పుకుంటూ వచ్చాడు. గణాంకాల్లో అది కనిపించకపోయినా అదే వారి విజయ రహస్యమనేది వాస్తవం. సుదీర్ఘ సమయం పాటు బంతిని తమ అదుపులో ఉంచుకోగల మిడ్‌ఫీల్డర్లు మోడ్రిచ్, కొవాసిచ్, బ్రొజొవిచ్ జట్టు ప్రధాన బలం. దీనిని బద్దలు కొట్టాలంటే మెస్సీకి కూడా అంత సులువు కాదు. మ్యాచ్ సమంగా ఉన్న స్థితిలో దీనిని క్రొయేషియా కొనసాగిస్తే ప్రత్యర్థికి కష్టాలు తప్పవు. ఎందుకంటే ప్రధాన టోర్నీల్లో క్రొయేషియా ఆడిన గత 9 నాకౌట్ మ్యాచ్‌లలో 8 అదనపు సమయం వరకు వెళ్లాయి. ఆపై పెనాల్టీల ద్వారానే ఈ టోర్నీలో జపాన్‌పై, బ్రెజిల్‌పై జట్టు విజయం సాధించింది. అయితే అర్జెంటీనాతో పోలిస్తే జట్టులో దూకుడు తక్కువ. కెనడాపై మినహా మిగిలిన నాలుగు మ్యాచ్‌లలో కలిపి ఆ జట్టు 2 ఫీల్డ్ గోల్స్ మాత్రమే చేయగలిగింది. 2018 ఫైనల్లో ఆ జట్టు ఫ్రాన్స్‌కు తొలి 65 నిమిషాల్లోనే 4 గోల్స్ సమర్పించుకుంది. అంటే ఆరంభంలో ప్రత్యర్థి దాడి చేయగలిగితే క్రొయేషియా మళ్లీ కోలుకునే అవకాశాలు తక్కువ. అయితే గోల్‌కీపర్ లివకోవిచ్ ఈసారి కూడా అడ్డుగోడగా నిలవాలని టీమ్ కోరుకుంటోంది. గతంలో ఐదుసార్లు కాగా ప్రపంచకప్‌లో ఆరోసారి ఫైనల్ బెర్త్‌పై అర్జెంటీనా గురి పెట్టింది. గతంలో అర్జెంటీనా సెమీఫైనల్ చేరిన ఐదు పర్యాయాలు విజయం సాధించి టైటిల్ పోరుకు అర్హత పొందింది. క్రొయేషియా గెలిస్తే అర్జెంటీనాపై క్రొయేషియా గెలిస్తే వరుసగా రెండు ప్రపంచకప్‌లలో ఫైనల్ చేరిన నాలుగో యూరోప్ జట్టుగా నిలుస్తుంది. గతంలో ఇటలీ (1934, 1938), నెదర్లాండ్స్ (1974, 1978), జర్మనీ (1982, 1986, 1990) మాత్రమే ఈ ఘనత సాధించాయి. చదవండి: Cristiano Ronaldo: వద్దనుకుంటే పుట్టిన బిడ్డ! ఎంతటి మొనగాడివైతేనేం! ఎన్ని రికార్డులు ఉన్నా ఏం లాభం? మరీ ఇలా... పర్లేదులే! క్రొయేషియాతో సెమీస్‌కు ముందు అర్జెంటీనాకు భారీ షాకిచ్చిన ఫిఫా Ranji Trophy: రంజీ సమరానికి సై.. బరిలో 38 జట్లు! ఫైనల్ ఎప్పుడంటే! IND vs BAN: బంగ్లాదేశ్‌తో తొలి టెస్టు.. అక్షర్‌కు నో ఛాన్స్! ఆల్‌రౌండర్ అరంగేట్రం var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_5091503545.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); Flashback ⏪ to when #ARG and #HRV met at the 2018 #FIFAWorldCup. These sides have met twice before on the big stage. Who will prevail tomorrow? pic.twitter.com/SHMSt84o1A — FIFA World Cup (@FIFAWorldCup) December 12, 2022 -
T20 WC: టీమిండియాకు వచ్చిన ప్రైజ్‌మనీ ఎంతంటే?
టి20 ప్రపంచకప్‌లో భాగంగా ఎన్నో ఆశలు పెట్టుకున్న టీమిండియా సెమీస్‌లో ఇంగ్లండ్ చేతిలో దారుణ పరాజయం చవిచూసి ఇంటిబాట పట్టింది. ఏకంగా 10 వికెట్ల తేడాతో చిత్తు చేసిన ఇంగ్లండ్ తుది సమరంలో పాకిస్తాన్‌తో తలపడనుంది. నవంబర్ 13న మెల్బోర్న్ వేదికగా ఇరుజట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుంది. మరి 1992 సీన్‌ను బాబర్ ఆజం సేన రిపీట్ చేస్తుందా లేక ఇంగ్లండ్ దాటికి తోకముడిచి రన్నరప్‌గా నిలుస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది. ఇక సెమీస్‌లో ఇంటిబాట పట్టిన టీమిండియాకు వచ్చిన ప్రైజ్‌మనీ ఎంతో తెలుసా.. 400,000 అమెరికన్ డాలర్లు. భారత కరెన్సీలో సుమారు 3,26,20,220 రూపాయలు. ఇక తొలి సెమీస్‌లో ఓడిన న్యూజిలాండ్‌కు కూడా ఇదే మొత్త లభించనుంది. ఇక టి20 ప్రపంచకప్ ఫైనల్లో తలపడనున్న ఇంగ్లండ్, పాకిస్తాన్లలో విజేతగా నిలిచిన జట్టుకు 1,600,000 అమెరికన్ డాలర్లు(భారత కరెన్సీలో 13,05,35,440 కోట్ల రూపాయలు) ప్రైజ్‌మనీ ఇవ్వనుంది. రన్నరప్‌గా నిలిచే జట్టు.. 800,000 అమెరికన్ డాలర్లు(భారత కరెన్సీలో 6,52,64,280 కోట్ల రూపాయలు) అందుకోనుంది. ►సూపర్-12 దశలో నిష్క్రమించిన జట్లు- 560,000 డాలర్లు (8X 70,000 డాలర్లు ) ►ఫస్ట్రౌండ్లో గెలిచిన జట్లు- 480,000 డాలర్లు (12X 40,000 డాలర్లు) ►ఫస్ట్రౌండ్లో ఇంటిబాట పట్టిన జట్లు- 160,000 డాలర్లు(4X 40,000 డాలర్లు) అయితే టీమిండియాకు వచ్చిన ప్రైజ్‌మనీపై క్రికెట్ అభిమానులు వినూత్నంగా స్పందించారు. ''ఐపీఎల్లో కోట్లు తీసుకుంటున్న ఆటగాళ్లకు వరల్డ్‌కప్ ద్వారా వచ్చే ప్రైజ్‌మనీ పెద్దగా పట్టించుకోరు.. ఐపీఎల్ ద్వారా కోట్లు వస్తుంటే దేశానికి ఆడాలని ఏ ఆటగాడికి పెద్దగా అనిపించదు.'' అంటూ పేర్కొన్నారు. చదవండి: T20 WC 2022: బాబర్ కుడివైపు, బట్లర్ ఎడమవైపు.. -
IND Vs ENG: మాట నిలబెట్టుకున్న జాస్ బట్లర్
''టి20 ప్రపంచకప్‌లో టీమిండియా- పాకిస్తాన్ మధ్య ఎట్టి పరిస్థితుల్లోనూ ఫైనల్ జరగనివ్వం.. అది జరగాలంటే ముందు టీమిండియా మమ్మల్ని ఓడించాలి..'' భారత్‌తో సెమీస్‌కు ముందు ఒక్కరోజు ఇంగ్లండ్ కెప్టెన్ బట్లర్ ఈ వ్యాఖ్యలు చేశాడు. ఏ ముహుర్తానా ఆ మాట అన్నాడో తెలియదు కానీ..ఇచ్చిన మాటను మాత్రం నిలబెట్టుకున్నాడు. నిలబెట్టుకోవడమంటే ఏదో మాములుగా కాదు.. టీమిండియాకు తమ జీవితకాలంలో మరిచిపోలేని పరాజయాన్ని అందించి పంతం నెగ్గించుకున్నాడు. మరో ఆసక్తికర విషయమేంటంటే.. టీమిండియా ఓటమిని శాసించింది కూడా జాస్ బట్లరే. అలెక్స్ హేల్స్‌తో కలిసి టీమిండియా బౌలర్లను చెడుగుడు ఆడుకున్న బట్లర్.. 169 పరుగుల లక్ష్యాన్ని కేవలం 16 ఓవర్లలోనే కరిగించాడు. కెప్టెన్‌గా తన మాట నిలబెట్టుకున్నాడు. మరో విషయమేంటంటే బట్లర్ సూపర్-12 దశలో ఒక్క మ్యాచ్‌లో సరైన ప్రదర్శన కనబరచింది లేదు. కీలకమైన సెమీస్‌లో తన మార్క్ ఆటను ప్రదర్శిస్తూ కెప్టెన్ ఇన్నింగ్స్‌తో పాటు ఫామ్‌లోకి వచ్చేశాడు. ఒక్కసారి బట్లర్ ఫామ్‌లోకి వచ్చాడంటే ఇంగ్లండ్ కథ పూర్తిగా మారిపోయినట్లే. ఇలాగే ఆడితే ఫైనల్లో పాకిస్తాన్‌ను ఓడించడం ఇంగ్లండ్‌కు పెద్ద పని కాదు. వాస్తవానికి ఇంగ్లండ్ విజయం సాధించడమే కరెక్టని చాలా మంది అభిమానులు అభిప్రాయపడ్డారు. ఐర్లాండ్‌తో మ్యాచ్‌ను వర్షం కారణంగా ఓడిపోయింది తప్ప ఇంగ్లండ్ అన్ని మ్యాచ్‌ల్లోనూ మంచి విజయాలు అందుకుంది. ముఖ్యంగా జట్టులో ఒకటి నుంచి పదో స్థానం వరకు బ్యాటింగ్ చేయగల సమర్థులు.. ఆల్‌రౌండర్లు ఆ జట్టుకు పెద్ద బలం.. ఇక బౌలింగ్‌లోనూ స్ట్రాంగ్‌గా ఉండడం ఆ జట్టకు కలిసివచ్చింది. గ్రూప్-1 నుంచి రెండో స్థానంతో సెమీస్ చేరినప్పటికి అసలైన మ్యాచ్‌లో మాత్రం ఇంగ్లండ్ జూలు విదిల్చింది. టీమిండియాకు అసలు అవకాశమే ఇవ్వకుండా వన్‌సైడ్ విజయం సాధించి ఫైనల్లో అడుగుపెట్టింది. పేరుకే గ్రూప్-2 టాపర్‌గా సెమీస్‌లో అడుగుపెట్టిన టీమిండియా సూపర్-12 దశలో సమిష్టిగా రాణించిన సందర్భాలు చాలా తక్కువ. ఎవరో ఒక బ్యాటర్‌పైనే పూర్తిగా ఆధారపడడం.. లేదంటే అదృష్టం కలిసివచ్చి బౌలర్లు ఆరోజు మ్యాచ్‌లో చెలరేగడం వల్ల టీమిండియా విజయాలు సాధించి తప్ప చెప్పుకోవడానికి ఏం లేదు. ఆడితే కోహ్లి లేదంటే సూర్యకుమార్.. ఇంతే టీమిండియా బ్యాటింగ్. రాహుల్ ఫాంలోకి వచ్చాడన్న మాట రెండు మ్యాచ్‌లకే పరిమితమైంది. ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో అయితే రాహుల్ అదే పేలవమైన షాట్ ఆడి మూల్యం చెల్లించుకున్నాడు. ఇక కెప్టెన్ రోహిత్ శర్మ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. సెమీస్‌లోనైనా తన ఫామ్ చూపిస్తాడనుకుంటే మళ్లీ అదే రొడ్డకొట్టుడు ఆటతీరు. ఆరంభంలో ఫోర్లు, సిక్సర్లు బాది చివరికి నిర్లక్ష్యంగా వికెట్ పారేసుకోవడం అతనికి అలవాటుగా మారిపోయంది. ఈ ప్రపంచకప్‌లో కోహ్లి, సూర్యల గురించి తప్ప టీమిండియాలో మాట్లాడుకోవడానికి ఏం లేదు. ఇక బౌలర్ల పరిస్థితి అగమ్యగోచరం. బుమ్రా స్థానంలో వచ్చిన షమీ సూపర్-12 వరకు కాస్త బెటర్ అనిపించినప్పటికి కీలక సెమీస్‌లో చేతులెత్తేశాడు. ఇక భువనేశ్వర్ తన కెరీర్లో ఆఖరి మ్యాచ్ ఆడేసినట్లే. అర్ష్‌దీప్ సింగ్ ఒక్కడే గుడ్డిలో మెల్ల అన్నట్లు 2 ఓవర్లలో 15 పరుగులిచ్చాడు. ఓవరాల్‌గా కూడా అర్ష్‌దీప్ ప్రదర్శన బాగానే ఉంది. ఇక అశ్విన్, అక్షర్ పటేల్‌లు పూర్తిగా విఫలమయ్యారు. చహల్‌ను ఎందుకు పక్కనబెట్టారంటే దానికి సమాధానం ఉండదు. గతేడాదితో పోలిస్తే ఈసారి ప్రపంచకప్‌లో టీమిండియా సెమీస్ వరకు రావడం ఒక్కటే కాస్త ఉపశమనం అని చెప్పొచ్చు. అంతకుమించి ఏం లేదు టీమిండియా గురించి మాట్లాడుకోవడానికి.. చదవండి: తీవ్ర నిరాశకు లోనయ్యాం.. మా ఓటమికి ప్రధాన కారణం అదే IND Vs ENG: పాక్ ఓపెనర్లను మించిపోయిన బట్లర్, హేల్స్ -
IND Vs ENG: పాక్ ఓపెనర్లను మించిపోయిన బట్లర్, హేల్స్
అంతా ఊహించినట్లే జరిగింది. ఆరంభం నుంచి టీమిండియాకు మైనస్‌గా కనిపిస్తూ వచ్చిన బౌలింగ్ విభాగం కీలకమైన సెమీస్ పోరులో పూర్తిగా చేతులెత్తేసింది. పైనల్ చేరతారనుకున్న టీమిండియా సెమీఫైనల్లో ఘోర పరాజయం చవిచూసి అవమానకర రీతిలో నిష్క్రమించింది. టీమిండియా బౌలర్లలో ఒక్క బౌలర్ నుంచి యార్కర్ బాల్ పడలేదంటే ఎంత పేలవమైన ఆటతీరు కనబరిచిందనేది అర్థం చేసుకోవచ్చు. ఇక కళ్ల ముందు 169 పరుగుల లక్ష్యం కనిపిస్తున్నా టీమిండియా బౌలింగ్‌ను చూసి ఇంగ్లండ్ ఓపెనర్లు ఇంచు కూడా బెదరలేదు. బట్లర్, అలెక్స్ హేల్స్ ఒకరితో ఒకరు పోటీ పడుతూ బౌండరీలు, సిక్సర్ల వర్షం కురిపించారు. టీమిండియా విధించిన లక్ష్యాన్ని ఈ ఇద్దరే కరిగించారంటే వారి బ్యాటింగ్ ఏ స్థాయిలో సాగిందనేది అర్థం చేసుకోవచ్చు. వీరిద్దరి దాటికి ఇంగ్లండ్ 16 ఓవర్లలోనే వికెట్ కోల్పోకుండా చేధించింది. జాస్ బట్లర్ 80 నాటౌట్, అలెక్స్ హేల్స్ 86 నాటౌట్‌గా నిలిచి టీమిండియా బౌలర్లను ఒక ఆట ఆడుకున్నారు. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ బ్యాటింగ్ చూస్తుంటే గతేడాది టి20 ప్రపంచకప్‌లో సూపర్-12 దశలో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో మ్యాచ్ గుర్తుకుతెచ్చింది. ఆ మ్యాచ్‌లో టీమిండియా విధించిన 152 పరుగుల లక్ష్యాన్ని పాక్ఘ ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా చేధించింది. మహ్మద్ రిజ్వాన్ 79 నాటౌట్, బాబర్ ఆజం 68 నాటౌట్ అప్పటి టీమిండియా బౌలింగ్‌ను చీల్చి చెండాడుతూ పాక్‌కు 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించారు. తాజాగా ఇప్పుడు కూడా అదే పరిస్థితి. ఈ రెండింటిలో కామన్‌గా ఉన్నది టీమిండియా అయితే.. జట్టు, స్కోర్లు మాత్రమే వేరు. మిగతాదంతా దాదాపు సేమ్ రిపీట్ అయింది. మరో విషయమేంటంటే బట్లర్, హేల్స్‌లు పాక్ ఓపెనర్లను మించిపోయారు. అప్పుడు పాక్ 17.1 ఓవర్లలో 152 పరుగుల లక్ష్యాన్ని అందుకుంటే.. తామేం తక్కువ తిన్నామా అన్నట్లుగా ఇంగ్లండ్ 16 ఓవర్లలోనే ఒక్క వికెట్ కోల్పోకుండా 169 పరుగుల టార్గెట్‌ను అందుకుంది. చదవండి: పాండ్యా కోసం పంత్ త్యాగం.. -
కోహ్లి సరికొత్త చరిత్ర.. ప్రపంచంలోనే తొలి ఆటగాడిగా!
టీ20 ప్రపంచకప్-2022లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి తన అద్భుతమైన ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ఇంగ్లండ్‌తో సెమీఫైనల్లో కోహ్లి కీలకమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఈ మ్యాచ్‌లో 40 బంతులు ఎదుర్కొన్న కోహ్లి 50 పరుగులు చేశాడు. కాగా ఈ ఏడాది మెగా ఈవెంట్లో కోహ్లికి ఇది నాలుగో అర్ద సెంచరీ. అదే విధంగా ఈ టోర్నీలో టాప్ రన్ స్కోరర్‌గా కూడా విరాట్ కోహ్లి(296)నే కొనసాగుతున్నాడు. కోహ్లి సరి కొత్త చరిత్ర అంతర్జాతీయ టీ20ల్లో విరాట్ కోహ్లి అరుదైన ఘనత సాధించాడు. టీ20 క్రికెట్లో 4000 పరుగుల మార్క్‌ను అందుకున్న తొలి ఆటగాడిగా కోహ్లి రికార్డులకెక్కాడు. ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో 42 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద కింగ్ కోహ్లి.. ఈ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. ఇప్పటి వరకు 115 మ్యాచ్‌లు ఆడిన విరాట్ 4008 పరుగులు సాధించాడు. ఇక విరాట్ తర్వాత స్థానాల్లో రోహిత్ శర్మ(3853), మార్టిన్ గప్టిల్(3531)పరుగులతో ఉన్నారు. చదవండి: T20 WC 2022 IND Vs ENG: ఏంటి రాహుల్ నీ ఆట? వెంటనే జట్టు నుంచి తీసేయండి! -
WC 2022 Ind Vs Eng: టీమిండియా ఘోర ఓటమి.. ఫైనల్లో ఇంగ్లండ్
ICC Mens T20 World Cup 2022 - India vs England, 2nd Semi-Final Updates In Telugu: టీ20 ప్రపంచకప్-2022: రెండో సెమీ ఫైనల్- ఇండియా వర్సెస్ ఇంగ్లండ్ అప్డేట్స్: టీ20 ప్రపంచకప్-2022లో టీమిండియా పోరాటం ముగిసింది. ఆడిలైడ్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన సెమీఫైనల్లో 10 వికెట్ల తేడాతో భారత్ ఘోర పరాజయం పాలైంది. తద్వారా టోర్నీ నుంచి రోహిత్ సేన నిష్క్రమించింది. 169 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్.. వికెట్ నష్టపోకుండా చేధించింది. ఇంగ్లండ్ ఓపెనర్లు జోస్ బట్లర్(80), అలెక్స్ హేల్స్(86) పరుగులతో ఇంగ్లండ్‌కు విజయాన్ని అందించారు. ►ఆకాశమే హద్దుగా చెలరేగుతున్న ఇంగ్లండ్ ఓపెనర్లు బట్లర్ 56, హేల్స్ 80 పరుగులతో క్రీజులో ఉన్నారు. 13 ఓవర్లలో ఇంగ్లండ్ స్కోరు: 140/0 ► 11 ఓవర్లు ముగిసే సరికి ఇంగ్లండ్ వికెట్ నష్టపోకుండా 108 పరుగులు చేసింది. క్రీజులో బట్లర్(38), హేల్స్(66) పరుగులతో ఉన్నారు. ►9 ఓవర్లు ముగిసే సరికి ఇంగ్లండ్ వికెట్ నష్టపోకుండా 91 పరుగులు చేసింది. క్రీజులో బట్లర్(36), హేల్స్(51) పరుగులతో ఉన్నారు. పవర్ ప్లేలో దూకుడు ఇంగ్లండ్ ఓపెనర్ల దూకుడుకు భారత బౌలర్లు అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. దీంతో పవర్ ప్లేలో ఇంగ్లండ్ 63 పరుగులతో దూకుడు కొనసాగిస్తోంది. దాటిగా ఆడుతున్న బట్లర్ ఇంగ్లండ్ కెప్టెన్, ఓపెనర్ జోస్ బట్లర్(14 బంతుల్లో 5 ఫోర్ల సాయంతో 24 పరుగులు) దాటిగా ఆడుతున్నాడు. వీలు చిక్కినప్పుడల్లా బంతిని బౌండరీకి తరలిస్తున్నాడు. మరోవైపు అలెక్స్ హేల్స్ సహకారం అందిస్తున్నాడు. ఈ క్రమంలో 4 ఓవర్లలో ఇంగ్లండ్ 41 పరుగులు చేసింది. టీమిండియా స్కోరెంతంటే ఇంగ్లండ్‌తో రెండో సెమీ ఫైనల్లో టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. కోహ్లి 50, హార్దిక్ పాండ్యా 63 పరుగులతో రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో జోర్డాన్‌కు మూడు, ఆదిల్ రషీద్‌కు ఒకటి, క్రిస్ వోక్స్‌కు ఒక వికెట్ దక్కాయి. హిట్ వికెట్‌గా వెనుదిరిగిన హార్దిక్ పాండ్యా అద్భుత అర్ధ శతకంలో చెలరేగిన హిట్ వికెట్‌గా వెనుదిరిగాడు. పంత్ రనౌట్ సూపర్ పాండ్యా హార్దిక్ పాండ్యా హాఫ్ సెంచరీతో మెరిశాడు. 29 బంతుల్లో 52 పరుగులు రాబట్టాడు. 19 ఓవర్లలో టీమిండియా స్కోరు: 156/4 కోహ్లి అవుట్ అర్ధ శతకం పూర్తి చేసుకున్న విరాట్ కోహ్లి జోర్డాన్ బౌలింగ్‌లో అవుటయ్యాడు. 50 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద నిష్క్రమించాడు. పాండ్యా, పంత్ క్రీజులో ఉన్నారు. 18 ఓవర్లలో టీమిండియా స్కోరు: 136/4 పాండ్యా మెరుపులు జోర్డాన్ బౌలింగ్‌లో వరుసగా రెండు సిక్స్‌లు బాదిన హార్దిక్ పాండ్యా 17 ఓవర్లలో టీమిండియా స్కోరు: 121/3 ►అర్ధ శతకానికి చేరువలో కోహ్లి (48). 16 ఓవర్లలో స్కోరు: 110-3 తప్పిన ఎల్బీడబ్ల్యూ ప్రమాదం.. కోహ్లి నాటౌట్ 16 వ ఓవర్ రెండో బంతికి జోర్డాన్ బౌలింగ్‌లో కోహ్లికి ఎల్బీడబ్ల్యూ ప్రమాదం తప్పింది. నెమ్మదిగా సాగుతున్న టీమిండియా ఇన్నింగ్స్ 15 ఓవర్లలో వంద పరుగులు మార్కు అందుకున్న టీమిండియా. స్కోరు: 100/3 ►14 ఓవర్లలో టీమిండియా స్కోరు: 90-3 కోహ్లి(38), హార్దిక్ పాండ్యా(4) క్రీజులో ఉన్నారు ►75 పరుగుల వద్ద టీమిండియా మూడో వికెట్ కోల్పోయింది. 14 పరుగులు చేసిన సూర్యకుమార్ యాదవ్.. రషీద్ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు. ►రోహిత్ శర్మ రూపంలో రెండో వికెట్ కోల్పోయిన టీమిండియా పవర్ ప్లేలో టీమిండియా స్కోరు: 38/1 ►5 ఓవర్లలో టీమిండియా స్కోరు: 31-1 ►కోహ్లి, రోహిత్ శర్మ క్రీజులో ఉన్నారు. స్కోరు: 11/1 (2.3 ఓవర్లలో) ► తొలి వికెట్ కోల్పోయిన ఇండియా.. కేఎల్ రాహుల్ అవుట్ ►టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. భారత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. తుది జట్లు: భారత్: కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ(కెప్టెన్), విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, రిషబ్ పంత్(వికెట్ కీపర్), అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్ ఇంగ్లండ్: జోస్ బట్లర్(కెప్టెన్/వికెట్ కీపర్), అలెక్స్ హేల్స్, ఫిలిప్ సాల్ట్, బెన్ స్టోక్స్, హ్యారీ బ్రూక్, లియామ్ లివింగ్‌స్టోన్, మోయిన్ అలీ, సామ్ కర్రాన్, క్రిస్ జోర్డాన్, క్రిస్ వోక్స్, ఆదిల్ రషీద్ ఇంగ్లండ్‌తో టీమిండియా ఢీ టీ20 ప్రపంచకప్-2022 టోర్నీ ఫైనల్‌కు అర్హత సాధించేందుకు టీమిండియా సమాయత్తమైంది. అడిలైడ్ వేదికగా ఇంగ్లండ్‌తో రెండో సెమీ ఫైనల్లో గురువారం అమీ తుమీ తేల్చుకోనుంది. ఇక ఇప్పటికే మొదటి సెమీస్ మ్యాచ్‌లో దాయాది పాకిస్తాన్.. న్యూజిలాండ్‌ను ఓడించి ఫైనల్లో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీమిండియా సైతం ఇంగ్లండ్‌ను మట్టికరిపించి తుది పోరుకు అర్హత సాధించి 2007 నాటి సెంటిమెంట్ రిపీట్ చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. కాగా మొదటి టీ20 వరల్డ్‌కప్ ఎడిషన్‌లో ధోని సేన పాక్‌ను ఓడించి టైటిల్ గెలిచిన విషయం విదితమే. చదవండి: Rohit Sharma- Jos Buttler: ఇంగ్లండ్ జట్టు ప్రమాదకరమైంది.. మేం గెలవాలంటే! -
దాయాది వచ్చేసింది.. ఇక పడాల్సింది మన అడుగే!
''అన్నీ కుదిరితే ఫైనల్లో టీమిండియా, పాకిస్తాన్‌లు మరోసారి తలపడతాయన్నప్పుడు''.. ఇరుదేశాల అభిమానులు చాలా సంతోషపడ్డారు. మూడు వారాల వ్యవధిలోనే మరోసారి దాయాదులు తలపడడం నిజమైతే బాగుండనుకున్నారు. అయితే అది నెరవేరే సమయం ఆసన్నమైంది. ఇప్పటికే దాయాది పాకిస్తాన్ ఫైనల్‌కు చేరుకుంది. ఇక పడాల్సింది మన అడుగే. గురువారం(నవంబర్ 10న) ఇంగ్లండ్‌తో జరగనున్న రెండో సెమీఫైనల్లో టీమిండియా గెలిచి ఫైనల్‌కు వెళ్లాలని ప్రతీ అభిమాని కోరుకుంటున్నాడు. మాములుగానే ఈ రెండు జట్లు ఎదురుపడితే ఆ మజా ఎలా ఉంటుందో సూపర్-12 దశలో చూశాం. ఒకవేళ టీమిండియా, పాకిస్తాన్‌లు మరోసారి ఫైనల్లో తలపడితే ఆ కిక్కు వేరుగా ఉంటుంది. ఇరుదేశాల అభిమానులు కూడా అదే జరగాలని కోరుకుంటున్నారు. సూపర్-12 దశలో వెళ్లిపోవాల్సిన స్థితి నుంచి నక్కతోక తొక్కి సెమీస్‌లో అడుగుపెట్టిన పాక్ కివీస్‌పై విజయంతో ఫైనల్‌కు చేరుకుంది. ఇక గ్రూప్-2 టాపర్‌గా సెమీస్‌లో అడుగుపెట్టిన టీమిండియా బలమైన ఇంగ్లండ్‌ను ఎలా ఎదుర్కొనబోతుందనేది ఆసక్తికరంగా మారింది. కేఎల్ రాహుల్, కోహ్లి, సూర్యకుమార్‌లు ఫామ్‌లో ఉండడం కలిసొచ్చే అంశం కాగా.. రోహిత్ ఫామ్ కలవరానికి గురి చేస్తుంది. బౌలింగ్ ప్రదర్శతో ఆకట్టుకుంటున్న హార్దిక్ పాండ్యా తన బ్యాటింగ్ పదును చూపించాల్సి ఉంది. ఇక బౌలింగ్ విభాగం పటిష్టంగానే కనిపిస్తుంది. ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో మాత్రం టీమిండియానే ఫేవరెట్ అని చెప్పొచ్చు. అయితే ఇంగ్లండ్ కూడా సూపర్ ఫామ్‌లో ఉంది. వారితో జాగ్రత్తగా ఉండకపోతే మొదటికే మోసం వస్తువంది. మార్క్‌వుడ్, డేవిడ్ మలాన్‌లు గాయాల బారిన పడడం కాస్త ఇబ్బంది కలిగించినప్పటికి మ్యాచ్ సమయానికి బరిలోకి దిగే అవకాశం ఉంది. ఇక టీమిండియా ఏమాత్రం ఏమరపాటుగా ఉన్న అంతే సంగతి. టి20 ప్రపంచకప్ ఫైనల్లో టీమిండియా, పాకిస్తాన్ తలపడితే చూడాలనుకుంటున్న సగటు అభిమాని కోరిక నెరవారాలని దేవుడిని ప్రార్ధిస్తూ.. టీమిండియాకు ''ఆల్ ది బెస్ట్''. చదవండి: ఫైనల్ దారిలో రికార్డులు బద్దలు కొట్టిన పాక్ ఇది నాలుగోసారి.. పాక్ అంటే వణికిపోతున్న కివీస్! -
NZ Vs PAK: ఆడింది కివీసేనా.. పేలవ ఫీల్డింగ్, నాసిరకం బ్యాటింగ్
న్యూజిలాండ్ జట్టు టాప్ క్లాస్ ఆటకు పెట్టింది పేరు. వాళ్లు మ్యాచ్ ఆడుతున్నారంటే ప్రత్యర్థి జట్టుకు బౌండరీలు, సిక్సర్లు రావడం చాలా కష్టం. ఎందుకంటే అంత పకడ్బందీగా ఉంటుంది వారి ఫీల్డింగ్. గుడ్ ఫీల్డింగ్‌తో పాటు మంచి జట్టు అని పేరు పొందిన న్యూజిలాండ్ తాజాగా టి20 ప్రపంచకప్‌లో పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో మాత్రం నాసిరకమైన ఆటను ప్రదర్శించింది. అసలు సెమీస్ ఆడుతుంది కివీసేనా లేక మరో జట్టా అన్న సందేహం కూడా కలిగింది. ఇక ఇవాళ పాక్‌తో మ్యాచ్‌లో న్యూజిలాండ్ ఆటతీరు క్రికెట్ ఫ్యాన్స్‌కి ఆశ్చర్యాన్ని కలిగించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్, 20 ఓవర్లలో 152 పరుగులు మాత్రమే చేయగలిగింది. తొలి 10 ఓవర్లు ముగిసే సమయానికి కివీస్ 59 పరుగులే చేసింది. డెత్ ఓవర్లలో అయితే పరిస్థితి మరీ దారుణం. భీకరమైన బౌలింగ్ లైనఫ్ ఉన్న పాకిస్తాన్ బౌలర్ల ముందు కివీస్ బ్యాటర్లు పూర్తిగా తేలిపోయారు. చెప్పాలంటే బౌండరీలు బాదడానికి తెగ ఇబ్బంది పడ్డారు. 16 నుంచి 20 ఓవర్ల మధ్య న్యూజిలాండ్ బ్యాటర్లు కొట్టింది కేవలం రెండంటే రెండు ఫోర్లు... ఈ ఐదు ఓవర్లలో 46 పరుగులు మాత్రమే వచ్చాయి. భారీ షాట్స్ ఆడేందుకు ప్రయత్నించి అవుటైనా పెద్ద ఇబ్బందేమీ ఉండేది కాదు. కానీ జేమ్స్ నీషమ్, డారిల్ మిచెల్, కేన్ విలియమ్సన్ లాంటి ఆటగాళ్లు కూడా సింగిల్స్, డబుల్స్ తీయడం ఆశ్చర్యం కలిగించింది. డారిల్ మిచెల్ కాస్తో కూస్తో పర్వాలేదనిపించినా.. ముఖ్యంగా విలియమ్సన్ మాత్రం టెస్టు బ్యాటింగ్ చేయడం అభిమానులను విసిగించింది. 42 బంతులెదుర్కొన్న విలియమ్సన్ 45 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్‌లో కేవలం ఒక ఫోర్, ఒక సిక్స్ మాత్రమే ఉన్నాయి. దీన్నిబట్టే అర్థం చేసుకోవచ్చు అతని బ్యాటింగ్ ఎంత జిడ్డుగా సాగిందో. బ్యాటింగ్ నీరసంగా చేశారనుకుంటే.. బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో మరింత దారుణ ప్రదర్శన కనబరిచారు. సాధారణంగా తమ ఫీల్డింగ్‌తో ప్రత్యర్థి జట్లకు పరుగులు పెద్దగా ఇవ్వదు. కానీ ఈ మ్యాచ్‌లో మాత్రం చేతుల్లోకి వచ్చిన క్యాచ్‌లను ఫీల్డర్లు నేలపాలు చేస్తే .. ఈజీ రనౌట్ చాన్స్‌లను మిస్ చేశారు. మొత్తానికి మొదటి సెమీ ఫైనల్లో న్యూజిలాండ్ ప్రదర్శన చూస్తుంటే... 2021లో టీమిండియా పర్ఫామెన్స్ గుర్తుకురావడం ఖాయం. న్యూజిలాండ్‌కి ఫైనల్ ఫోబియా చాలా ఎక్కువ. 2019 వన్డే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌లో తప్పితే 2015 వన్డే వరల్డ్ కప్, టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీల్లో ఫైనల్ మ్యాచుల్లో ఇలాంటి నాసిరకమైన ప్రదర్శననే కనబరిచింది. ఐసీసీ టోర్నీల్లో సౌతాఫ్రికాని బ్యాడ్ లక్ వెంటాడుతుంది. న్యూజిలాండ్ కథ మాత్రం పూర్తిగా వేరు.ఫైనల్ వరకు చేరుకున్నప్పటికి ఆఖరి మెట్టుని ఎలా దాటాలో మాత్రం ఆ జట్టుకు తెలిసి రావడం లేదు. తమ క్రికెట్ చరిత్రలో న్యూజిలాండ్ గెలిచిన ఐకైక ఐసీసీ టైటిల్ ఏదైనా ఉందంటే అదీ ఐసీసీ టెస్టు ఛాంపియన్షిప్ మాత్రమే. ఇది కూడా వాతావరణం కలిసి రావడం.. టీమిండియాను బ్యాడ్‌లక్ వెంటాడడం వల్లేనని ఈ ఓటమితో రుజువు చేసుకుంది న్యూజిలాండ్. చదవండి: ఇది నాలుగోసారి.. పాక్ అంటే వణికిపోతున్న కివీస్! 'బ్లాక్‌క్యాప్స్' అని ఊరికే అనలేదు.. మరోసారి నిరూపితం -
WC 2022: సెమీస్‌కు ముందు టీమిండియాకు భారీ షాక్! రోహిత్‌కు గాయం?
ICC Mens T20 World Cup 2022 - India Vs England: టీ20 ప్రపంచకప్-2022 సూపర్-12లో ఐదింట నాలుగు విజయాలతో గ్రూప్-2 టాపర్ హోదాలో సెమీస్ చేరింది టీమిండియా. ఈ క్రమంలో అడిలైడ్ వేదికగా గురువారం (నవంబరు 10) జరుగనున్న రెండో సెమీ ఫైనల్లో ఇంగ్లండ్‌తో తలపడనుంది. ఇందుకోసం టీమిండియా ఆటగాళ్లు ప్రాక్టీస్ మొదలుపెట్టేశారు. రోహిత్‌కు గాయం కెప్టెన్ రోహిత్ శర్మ సైతం నెట్స్‌లో సాధన ఆరంభించాడు. అయితే, ప్రాక్టీస్ సమయంలో రోహిత్ ముంజేయికి గాయమైనట్లు సమాచారం. షాట్ ఆడే క్రమంలో అతడి కుడి ముంజేతికి బంతి తగిలినట్లు తెలుస్తోంది. దీంతో హిట్‌మ్యాన్ ఇబ్బందికి గురికాగా.. వెంటనే స్పందించిన సిబ్బంది అతడికి చికిత్స అందించింది. ఆ తర్వాత ఒక బంతి మాత్రమే ఎదుర్కోగలిగిన రోహిత్.. చేయి నొప్పి తగ్గకపోవడంతో నెట్ సెషన్ నుంచి నిష్క్రమించినట్లు సమాచారం. గంటన్నర విశ్రాంతి తర్వాత అతడు మళ్లీ బ్యాట్ పట్టినట్లు తెలుస్తోంది. ఏ ఇబ్బంది లేకుండా బ్యాటింగ్ చేసినప్పటికీ ఒకవేళ నొప్పి తిరగబెడితే మాత్రం ఇంగ్లండ్‌తో మ్యాచ్‌కు అతడు దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయ్యో ‘హిట్‌మ్యాన్’ లేకుంటే ఎలా? ఈ నేపథ్యంలో సెమీస్‌కు ముందు హిట్‌మ్యాన్ ఇలా గాయపడటం పట్ల అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు. తనదైన రోజున పొట్టి ఫార్మాట్లో చెలరేగి ఆడగల బ్యాటర్, విజయవంతమైన కెప్టెన్‌గా పేరొందిన రోహిత్‌కు గాయమైతే టీమిండియాకు ఇబ్బందులు తప్పవంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా టీ20 ప్రపంచకప్-2022 టోర్నీలో బ్యాటర్‌గా రోహిత్ తన స్థాయికి తగ్గట్లుగా ఆకట్టుకోలేకపోయాడు. నెదర్లాండ్స్‌పై అర్ధ శతకం మినహా చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ (4, 53, 15, 2, 15 పరుగులు) ఆడలేకపోయాడు. చదవండి: Aus Vs Eng: ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్.. ఆసీస్ జట్టు ప్రకటన.. ప్రపంచకప్ లక్ష్యంగా! T20 WC 2022: ఇంగ్లండ్‌తో సెమీస్ సమరం.. టీమిండియాలో రెండు మార్పులు..? var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1971406958.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); Indian captain Rohit Sharma hit on his right hand during a practice session in Adelaide ahead of the semi-final match against England. pic.twitter.com/HA4xGJDC51 — ANI (@ANI) November 8, 2022 -
ఇంగ్లండ్‌తో మ్యాచ్ సవాలే.. యువీలాగే సూర్య దంచికొడితే!
టి20 ప్రపంచకప్‌లో సూపర్-12 దశ ఇవాళ్టితో(నవంబర్ 6) ముగిసింది. సూపర్-12లో ఆఖరి మ్యాచ్ ఆడిన టీమిండియా జింబాబ్వేపై 71 పరుగుల భారీ తేడాతో విజయం సాధించి గ్రూప్-2 టాపర్‌గా సెమీస్‌లో అడుగుపెట్టింది. ఇంతవరకు ఒక లెక్క.. ఇప్పటినుంచి ఒక లెక్క. సెమీఫైనల్స్ అంటే నాకౌట్ మ్యాచ్‌ల కింద లెక్క. గెలిచిన జట్టు నేరుగా ఫైనల్‌కు.. ఓడిన జట్టు ఇంటిబాట పడుతుందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇప్పటికే గ్రూప్-1 నుంచి న్యూజిలాండ్, ఇంగ్లండ్‌లు.. గ్రూప్-2 నుంచి టీమిండియా, పాకిస్తాన్‌లు సెమీస్‌కు చేరుకున్నాయి. ఇక బుధవారం జరగనున్న తొలి సెమీఫైనల్లో గ్రూప్-1 టాపర్ అయిన కివీస్.. గ్రూప్-2లో రెండో స్థానంలో ఉన్న పాకిస్తాన్‌తో తలపడనుండగా.. గ్రూప్-2 టాపర్ అయిన టీమిండియా గురువారం గ్రూప్-1లో రెండో స్థానంలో ఉన్న ఇంగ్లండ్‌ను ఎదుర్కొంటుంది. కాగా ఈసారి టీమిండియా ఫైనల్ చేరడం పెద్ద కష్టమేమి కాదని.. కానీ అందులోనే ఒక చిక్కుముడి ఉందని అభిమానులు పేర్కొన్నారు. ఇప్పటివరకు ఐసీసీ టి20 ప్రపంచకప్ టోర్నీల్లో ఇంగ్లండ్, టీమిండియాలు పెద్దగా తలపడింది లేదు. కేవలం మూడుసార్లు మాత్రమే ఈ జట్లు ఎదురుపడగా.. భారత్ రెండుసార్లు, ఇంగ్లండ్ ఒకసారి విజయం సాధించాయి. అయితే ఈసారి మాత్రం ఇంగ్లండ్‌ను తక్కువ అంచనా వేయలేం. ఎందుకంటే ఆ జట్టులో ఇప్పుడు ఒకటో నెంబర్ నుంచి పదో నెంబర్ ఆటగాడి వరకు బ్యాటింగ్ ఆడగల సత్తా ఉంది. బౌలింగ్‌లోనూ మంచి ప్రదర్శన కనబరుస్తున్న ఇంగ్లండ్‌ను ఓడించాలంటే టీమిండియా సర్వశక్తులు ఒడ్డాల్సిందే. అయితే టి20 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్, టీమిండియా మ్యాచ్ అనగానే యువరాజ్ సింగ్ గుర్తుకురాక మానడు. 2007 తొలి ఎడిషన్ టి20 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌పై యువీ ఆడిన విధ్వంసకర ఇన్నింగ్స్ ఇంకా కళ్లముందు కదలాడుతూనే ఉంది. ముఖ్యంగా ఆ మ్యాచ్‌లో బ్రాడ్ బౌలింగ్‌లో యువీ ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు అప్పట్లో వైరల్‌గా మారింది. అంతేకాదు టి20 క్రికెట్ చరిత్రలో 12 బంతుల్లోనే అర్థశతకం సాధించిన తొలి క్రికెటర్‌గా యువరాజ్ చరిత్రలో నిలిచిపోయాడు. ఇప్పటికి ఆ రికార్డు చెక్కు చెదరకుండా ఉంది. 2007 టి20 ప్రపంచకప్‌లో టీమిండియా గెలిస్తే.. 2009లో ఇంగ్లండ్ భారత్‌ను చిత్తు చేసింది. ఇక 2012లో ఇంగ్లండ్, టీమిండియాలు చివరిసారిగా తలపడగా ఈసారి టీమిండియాను విజయం వరించింది. దాదాపు పదేళ్ల తర్వాత నవంబర్ 10న ఇంగ్లాండ్, ఇండియా మధ్య ఆడిలైడ్ వేదికగా సెమీ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ప్రస్తుతం టీమిండియాలో ఇప్పుడు సూర్యకుమార్ ఒక సంచలనం. దూకుడే మంత్రంగా కొనసాగుతున్న సూర్యకుమార్ సెమీస్‌లో ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో దంచికొట్టి టీమిండియాను గెలిపిస్తాడంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. 2007లో ఇంగ్లండ్‌పై యువరాజ్ ఎలా అయితే మెరిశాడో.. ఇప్పుడు సూర్య కూడా అలాగే మెరిస్తే ఇంగ్లండ్‌పై విజయం సాధించడం పెద్ద కష్టమేమి కాదని అభిప్రాయపడ్డారు. మరోవైపు న్యూజిలాండ్‌పై మాత్రం పాకిస్తాన్‌కి తిరుగులేని రికార్డు ఉంది. 2003 వరల్డ్ కప్ తర్వాత న్యూజిలాండ్‌ని టీమిండియా ఐసీసీ టోర్నీల్లో ఓడించలేకపోయింది. అయితే కివీస్ మాత్రం టీ20 వరల్డ్ కప్‌లో పాక్‌పై ఒక్క మ్యాచ్ కూడా గెలవలేకపోయింది. 2007 టి20 వరల్డ్ కప్ సెమీ ఫైనల్లో పాకిస్తాన్ చేతుల్లో ఓడిన న్యూజిలాండ్, 2009, 2012 టి20 వరల్డ్ కప్ టోర్నీల్లోనూ గ్రూప్ స్టేజీలో పరాజయం పాలైంది. 2021 టీ20 వరల్డ్ కప్‌లో న్యూజిలాండ్ టీమిండియాను చిత్తు చేయగా... పాకిస్తాన్ మాత్రం సునాయాసంగా కివీస్‌ని ఓడించి టేబుల్ టాపర్‌గా సెమీస్ చేరింది. -
Ind vs Zim: జింబాబ్వేను తేలికగా తీసుకోలేము.. కాబట్టి: అశ్విన్
ICC Mens T20 World Cup 2022- India vs Zimbabwe: ‘‘ఏ జట్టును తక్కువగా అంచనా వేసే పరిస్థితి లేదు. ఎంత వీలైతే అంత దూకుడుగా ఉండాలి. ప్రత్యర్థి జట్టుపై ఏమాత్రం కనికరం చూపాల్సిన అవసరం లేదు. ఇప్పటికీ ఇంకా పోటీ ఉంది. కాబట్టి బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో అద్భుతంగా రాణించి ఆరంభం నుంచే ఒత్తిడి పెంచాలి. చావో రేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్‌లో మేటి జట్టు అద్భుత విజయం సాధిస్తేనే బాగుంటుంది. కచ్చితంగా గెలిచి తీరాల్సిన మ్యాచ్ కాబట్టి ఆది నుంచే దూకుడు ప్రదర్శించాలి. ఏ దశలోనూ ప్రత్యర్థి జట్టును కోలుకోనివ్వకూడదు’’ అని టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అన్నాడు. తేలికగా తీసుకుంటే అంతే సంగతి! టీ20 ప్రపంచకప్-2022 సూపర్-12లో భాగంగా భారత్ తమ ఆఖరి మ్యాచ్‌లో ఆదివారం జింబాబ్వేతో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తేనే ఎలాంటి సమీకరణాలతో పనిలేకుండా టీమిండియా సెమీస్ చేరుతుంది. అయితే, ఇటీవల సంచనాలు నమోదు చేస్తూ పటిష్టమైన జట్లకు షాకిస్తున్న జింబాబ్వేను తేలికగా తీసుకుంటే అనుకున్న ఫలితం రాకపోవచ్చు. వాళ్లను గౌరవిస్తాం ఈ నేపథ్యంలో జట్టులో భాగమైన అశ్విన్ మ్యాచ్‌కు ముందు మీడియాతో మాట్లాడుతూ ఈ మేరకు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. చిన్న జట్టు కాబట్టి జింబాబ్వేను తక్కువ అంచనా వేయకూడదని పేర్కొన్నాడు. ‘‘టీ20 వరల్డ్‌కప్‌లో ప్రతి మ్యాచ్‌లాగే ఇది కూడా తప్పక గెలవాల్సిందే. జింబాబ్వే ఇటీవల అద్భుతంగా ఆడుతోంది. అలాంటి జట్టును ఈజీగానే పడగొట్టేస్తామని మేము అనుకోవడం లేదు. వాళ్లు బ్యాటింగ్, బౌలింగ్ విభాగంలో పటిష్టంగా కనిపిస్తున్నారు. వాళ్లను తక్కువ అంచనా వేసి మూల్యం చెల్లించే పరిస్థితి లేదు’’ అని అశ్విన్ అన్నాడు. కాగా స్టార్ ప్లేయర్ సికిందర్ రజా అద్భుత ప్రదర్శనతో పాకిస్తాన్ మీద ఒకే ఒక్క పరుగుతో జింబాబ్వే విజయం సాధించిన విషయం తెలిసిందే. తద్వారా సెమీస్ రేసులో ఇతర జట్ల ఫలితాలను ప్రభావితం చేయగల పరిస్థితికి చేరుకుంది. చదవండి: Ind Vs Ban: ఇండియా క్రికెట్ పవర్‌హౌజ్.. అయినా కూడా: ఆఫ్రిదికి బీసీసీఐ బాస్ కౌంటర్ Ind Vs Zim: భారత్‌తో మ్యాచ్.. అంచనాలు తలకిందులు చేసే ఛాన్స్ ఎలా వదులుకుంటాం: జింబాబ్వే కెప్టెన్ Virat Kohli- Anushka Sharma Love Story: అప్పుడప్పుడు నటించేవాడు కూడా.. ‘బ్యాడ్ జోక్’తో మాట కలిపి! ఇప్పుడేమో ఇలా var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4911494512.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
డిఫెండింగ్ చాంపియన్‌కు కష్టమే.. ఇంగ్లండ్ ఓడితేనే
టి20 ప్రపంచకప్‌లో మ్యాచ్ మ్యాచ్‌కు సమీకరణాలు మారిపోతున్నాయి. గ్రూప్-1లో న్యూజిలాండ్ ఐర్లాండ్‌పై గెలిచి సెమీస్ బెర్తు ఖరారు చేసుకుంది. కివీస్ మినహా రెండు గ్రూప్‌ల్లోనూ ఏ జట్టు సెమీస్‌లో అడుగుపెడుతుందనేది ఆసక్తికరంగా మారింది. తాజాగా శుక్రవారం సూపర్-12 గ్రూప్-1లో అఫ్గానిస్తాన్‌తో మ్యాచ్‌లో ఆస్ట్రేలియా విజయం సాధించి సెమీస్ ఆశలు నిలుపుకున్నప్పటికి మెరుగైన రన్‌రేట్ సాధించలేకపోయింది. రన్‌రేట్ విషయం పక్కనబెడితే ఆసీస్ దాదాపు ఓటమి అంచుల వరకు వెళ్లింది. గతేడాది అండర్‌డాగ్స్‌గా బరిలోకి దిగి టైటిల్‌ను ఎగురేసుకుపోయిన ఆస్ట్రేలియా ఈసారి సొంతగడ్డపై ఆకట్టుకునే ప్రదర్శన చేయడం లేదు. అఫ్గానిస్తాన్‌పై విజయం సాధించినప్పటికి ఆసీస్ సెమీస్ చేరడం కష్టమే. డిఫెండింగ్ చాంపియన్ భవితవ్యం మొత్తం ఇంగ్లండ్ , శ్రీలంక మ్యాచ్‌పైనే ఆధారపడి ఉంది. ఇంగ్లండ్ గెలిస్తే మాత్రం ఆస్ట్రేలియా పని గోవిందా. దీనికి ప్రధాన కారణం ఆస్ట్రేలియా నెట్‌రన్‌రేట్ మైనస్‌లో ఉండడమే. అఫ్గానిస్తాన్‌తో మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 168 పరుగులు చేసింది. +1.187 రన్‌రేట్ ఉండాలంటే ఆస్ట్రేలియా ఆఫ్గన్‌ను భారీ తేడాతో ఓడించాలి. కానీ ఆ అవకాశం ఆఫ్గన్ ఇవ్వలేదు సరికదా.. దాదాపు ఆసీస్‌కు ముచ్చెమటలు పట్టించి ఓడించినంత పని చేసింది. ఈ దెబ్బకు ఆస్ట్రేలియా రన్‌రేట్‌లో పెద్దగా మార్పు జరగలేదు. దీంతో ఆస్ట్రేలియా ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో మూడు విజయాలు, ఒక ఓటమి, ఒక రద్దుతో ఏడు పాయింట్లతో ఉన్నప్పటికి నెట్‌రన్‌రేట్(-0.173) ఇంకా మైనస్‌లోనే ఉంది. ఇక శ్రీలంకతో మ్యాచ్‌కు ముందే ఇంగ్లండ్ రన్‌రేట్ ప్లస్‌లో ఉంది.+0.547 రన్‌రేట్‌తో ఉన్న ఇంగ్లండ్ శ్రీలంకపై మాములు విజయం సాధించినా సెమీస్‌లో అడుగుపెడుతుంది. ఒకవేళ ఇంగ్లండ్‌ను శ్రీలంక చిత్తు చేస్తే మాత్రంఅప్పుడు పాయింట్ల ఆధారంగా ఆస్ట్రేలియా సెమీస్‌లో అడుగుపెడుతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంగ్లండ్‌ను ఓడించడం శ్రీలంకకు పెద్ద సవాల్. అయితే టి20ల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేని పరిస్థితి. కాబట్టి ఆస్ట్రేలియా భవితవ్యం రేపటి మ్యాచ్(ఇంగ్లండ్ వర్సెస్ శ్రీలంక, నవంబర్ 5న)తో తేలిపోనుంది. చదవండి: రషీద్ ఖాన్ సంచలన ఇన్నింగ్స్.. ఆసీస్‌కు ముచ్చెమటలు AFG VS AUS: ఒకసారి బౌలర్ ఆగాడు.. రెండోసారి బ్యాటర్ ఆపాడు; మూడోసారికి రివేంజ్ -
ఆసక్తికరంగా గ్రూప్-2 సెమీస్ బెర్తు..
టి20 ప్రపంచకప్‌లో సూపర్-12 ఆరంభంలో ఎవరు సెమీస్ బెర్తు ఖరారు చేసుకుంటారన్న విషయంలో కొంచెం క్లారిటీ ఉండేది. అయితే వరుణుడు ఈ ప్రపంచకప్‌కు అడ్డుగా మారడం కొన్ని జట్లకు శాపంగా మారింది. తాజాగా మ్యాచ్‌లు తుది దశకు చేరుకుంటున్న నేపథ్యంలో సెమీస్ బెర్తులు ఆసక్తికరంగా మారాయి. గ్రూప్-1లో న్యూజిలాండ్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, శ్రీలంకల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. గ్రూఫ్ ఆఫ్ డెత్‌గా ఉన్న ఆ గ్రూఫ్‌లో ఎవరు సెమీస్ చేరతారన్నది చెప్పడం కష్టమే. తాజాగా గ్రూప్-2లోనూ అదే పరిస్థితి ఏర్పడింది. బంగ్లాదేశ్‌పై విజయంతో టీమిండియా సెమీస్ రేసుకు దగ్గరైనా స్పష్టంగా చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే గ్రూఫ్‌లో దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్, పాకిస్తాన్‌లు సెమీస్ రేసుకు పోటీ పడుతున్నాయి. వీటిలో పాకిస్తాన్‌కు అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. కానీ టి20 క్రికెట్లో ఎప్పుడు ఏం జరిగేది ఎవరు చెప్పలేరు. ఇక గ్రూప్-2 నుంచి భారత్ సహా ఏ జట్లకు సెమీస్ అవకాశాలున్నాయో ఒకసారి పరిశీలిద్దాం. టీమిండియా: ఇప్పటికైతే టీమిండియా సేఫ్ జోన్లోనే ఉంది. ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో మూడు విజయాలు, ఒక ఓటమితో ఆరు పాయింట్లతో గ్రూఫ్‌లో అగ్రస్థానంలో ఉంది. నవంబర్ 6న జింబాబ్వేతో జరిగే మ్యాచ్‌లో టీమిండియా గెలిస్తే ఎవరితో సంబంధం లేకుండా గ్రూఫ్ టాపర్‌గా సెమీస్‌లో అడుగుపెట్టనుంది. ఒకవేళ జింబాబ్వే చేతిలో ఓడినా నెట్ రన్‌రేట్ మెరుగ్గా ఉండడంతో పెద్దగా నష్టం లేదు. కానీ దక్షిణాఫ్రికా, పాకిస్తాన్, బంగ్లాదేశ్ మ్యాచ్‌ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంది. ఇక్కడ మరొక అంశమేమిటంటే భారత్, జింబాబ్వే మ్యాచ్ సూపర్-12 దశలో ఆఖరి మ్యాచ్. దీంతో టీమిండియాకు అప్పటికే ఒక స్పష్టత రానుంది. దక్షిణాఫ్రికా: టీమిండియాపై విజయంతో రేసులోకి వచ్చిన దక్షిణాఫ్రికా ప్రస్తుతం మూడు మ్యాచ్‌ల్లో రెండు విజయాలు, ఒక రద్దు వల్ల ఐదు పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. ప్రొటిస్ జట్టు తన తర్వాతి రెండు మ్యాచ్‌లు పాకిస్తాన్, నెదర్లాండ్స్‌తో ఆడాల్సి ఉంది. ఈ రెండు మ్యాచ్‌ల్లో ఏ ఒక్కటి గెలిచినా ఏడు పాయింట్లతో సెమీస్‌లో అడుగుపెడుతుంది. ఒకవేళ రెండింట్లో ఓడితే మాత్రం ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది. ఇప్పుడున్న ఫామ్ దృశ్యా దక్షిణాఫ్రికాను ఓడించడం అంత సులువు కాదు. కానీ దక్షిణాఫ్రికాకు కీలక సమయంలో ఒత్తిడిని నెత్తి మీదకు తెచ్చుకొని అనూహ్యంగా టోర్నీ నుంచి వైదొలిగిన సందర్భాలు ఉన్నాయి. బంగ్లాదేశ్: టీమిండియాతో మ్యాచ్‌లో ఓటమి పాలవ్వడంతో గ్రూఫ్-2లో మూడో స్థానంలో ఉంది బంగ్లాదేశ్. ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో రెండు విజయాలు, రెండు ఓటములతో ఉన్న బంగ్లా తన చివరి మ్యాచ్‌ను పాకిస్తాన్‌తో తలపడనుంది. ఒకవేళ ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్‌పై విజయం సాధిస్తే సెమీస్ అవకాశాలున్నప్పటికి ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది. అదే పాక్ గెలిస్తే మాత్రం బంగ్లా ఇంటిదారి పట్టనుంది. పాకిస్తాన్: టీమిండియాతో మ్యాచ్‌లో ఓటమిపాలైన పాకిస్తాన్‌కు కలిసిరావడం లేదు. జింబాబ్వేతో మ్యాచ్‌లోనూ అనూహ్యంగా ఓటమి పాలైన పాకిస్తాన్ నెదర్లాండ్స్‌పై కష్టపడి గెలిచింది. ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్‌ల్లో ఒక విజయం, రెండు ఓటములు చవిచూసింది. తన చివరి రెండు మ్యాచ్‌లు దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్‌లతో ఆడనుంది. ఈ రెండింటిలో గెలిస్తేనే పాక్ సెమీస్ ఆశలు సజీవంగా ఉంటాయి. ఒక్క మ్యాచ్‌లో ఓడినా ఇంటిదారి పట్టాల్సిందే. జింబాబ్వే, నెదర్లాండ్స్: ఈ రెండు జట్లకు పెద్దగా సెమీస్ అవకాశాలు లేనట్లే. అయితే టీమిండియాతో జింబాబ్వే.. దక్షిణాఫ్రికాతో నెదర్లాండ్స్ తమ చివరి మ్యాచ్‌లు ఆడనున్నాయి. టోర్నీలో తమకు చివరి మ్యాచ్ కదా అని రెచ్చిపోయి ఆడి ఆయా జట్లను ఓడించినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఎందుకంటే టి20ల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరు చెప్పలేం. అయితే ఈ రెండు జట్లు అద్భుతాలు చేసి గెలిచినా సెమీస్ చేరవు కానీ ఇతర జట్ల ఫలితాలపై స్పష్టమైన ప్రభావం చూపే అవకాశాలు మెండుగా ఉన్నాయి. చదవండి: IND Vs BAN: పదే పదే మైదానంలోకి.. టీమిండియాతో ఉన్న సంబంధం? Ind Vs Ban: వర్షం రాకపోయుంటే.. టీమిండియా గెలిచేదా! var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4911494512.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
సెమీస్‌లో సాత్విక్–చిరాగ్ జోడి
పారిస్: ఫ్రెంచ్ ఓపెన్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత ఆశల పల్లకిని మోస్తున్న ఏకైక జోడీ సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ షెట్టి సెమీ ఫైనల్లోకి దూసుకెళ్లింది. ఇంటా బయటా విశేషంగా రాణిస్తోన్న భారత పురుషుల డబుల్స్ జోడీ శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో టాప్ సీడ్, వరల్డ్ నంబర్‌వన్ టకురొ హొకి–యుగొ కొబయషి (జపాన్) జంటను కంగు తినిపించింది. 49 నిమిషాల పాటు జరిగిన మ్యాచ్‌లో సాత్విక్–చిరాగ్ ద్వయం వరుస గేముల్లో 21–12, 21–16 టాప్‌సీడ్ జంటకు ఇంటిదారి చూపింది. హొకి–యుగొతో తలపడిన నాలుగు మ్యాచ్‌లలో వీరికి ఇది మూడో విజయం కాగా... వీరిద్దరు ఫ్రెంచ్ ఓపెన్‌లో సెమీస్ చేరడం ఇది మూడో సారి. శనివారం జరిగే సెమీఫైనల్లో భారత జోడీ కొరియాకు చెందిన చొయ్ సొల్ గ్యు–కిమ్ వోన్ హో జంటను ఎదుర్కొంటుంది. -
థాయ్‌లాండ్‌పై విజయం.. ఆసియాకప్ ఫైనల్లో టీమిండియా వుమెన్స్
మహిళల ఆసియా కప్ టి20 టోర్నీలో టీమిండియా వుమెన్స్ జట్టు ఫైనల్లో అడుగుపెట్టింది. గురువారం థాయ్‌లాండ్‌తో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా వుమెన్స్ 74 పరుగులతో ఘన విజయం సాధించింది. 149 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన థాయ్‌లాండ్ వుమెన్స్ భారత బౌలర్ల దాటికి నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 74 పరుగులే చేయగలిగింది. థాయ్‌లాండ్ బ్యాటర్లలో నరుమోల్ చవాయి 21, నట్టాయా బుచాతమ్ 21 పరుగులు చేసింది. టీమిండియా బౌలర్లలో దీప్తి శర్మ మూడు వికెట్లు తీయగా.. రాజేశ్వరి గైక్వాడ్ రెండు, షఫాలీ వర్మ, స్నేహ్ రాణా, రేణుకా సింగ్‌లు తలా ఒక వికెట్ తీశారు. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా వుమెన్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 148 పరుగులు చేసింది. షఫాలీ వర్మ 42 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ 36 పరుగులు, జేమీమా రోడ్రిగ్స్ 27 పరుగులతో రాణించారు. ఇక శ్రీలంక వుమెన్స్, పాకిస్తాన్ వుమెన్స్ మధ్య జరగనున్న రెండో సెమీఫైనల్ మ్యాచ్ విజేతతో టీమిండియా వుమెన్స్ ఫైనల్లో తలపడనుంది. ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్ అక్టోబర్ 15న(శనివారం) జరగనుంది. Women's Asia Cup: India beat Thailand by 74 runs in the first semifinal to enter the final. (Pic Source: BCCI Women) pic.twitter.com/VwWZl0gjkQ — ANI (@ANI) October 13, 2022 4⃣2⃣ Runs 1⃣ Wicket 1⃣ Catch@TheShafaliVerma bags the Player of the Match as #TeamIndia beat Thailand. 👍 👍 Scorecard ▶️ https://t.co/pmSDoClWJi #AsiaCup2022 | #INDvTHAI pic.twitter.com/Jidbc383eX — BCCI Women (@BCCIWomen) October 13, 2022 -
CPL 2022: సెంచరీతో విండీస్ హిట్టర్ విధ్వంసం.. ఫైనల్లో జమైకా తలైవాస్
కరేబియన్ ప్రీమియర్ లీగ్(సీపీఎల్ 2022)లో జమైకా తలైవాస్ ఫైనల్లో అడుగుపెట్టింది. బుధవారం రాత్రి గయానా అమెజాన్ వారియర్స్‌తో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో జమైకా తలైవాస్ 37 పరుగులతో విజయాన్ని అందుకుంది. విండీస్ హార్డ్ హిట్టర్ షమ్రా బ్రూక్స్ కీలక సమయంలో సెంచరీతో మెరిసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. తొలుత బ్యాటింగ్ చేసిన జమైకా తలైవాస్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 226 పరుగుల భారీస్కోరు చేసింది. షమ్రా బ్రూక్స్(52 బంతుల్లో 109 నాటౌట్, 7 ఫోర్లు, 8 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగగా.. రోవ్‌మెన్ పావెల్ 23 బంతుల్లో 37 పరుగులు చేయగా.. చివర్లో ఇమాద్ వసీమ్ 15 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 41 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. గయానా వారియర్స్ బౌలర్లలో రొమెరియో షెపర్డ్ రెండు వికెట్లు తీయగా.. తాహిర్, ఓడియన్ స్మిత్‌లు చెరొక వికెట్ తీశారు. అనంతరం బ్యాటింగ్ చేసిన గయానా అమెజాన్ వారియర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 189 పరుగులు మాత్రమే చేసింది. కీమో పాల్ 56 పరుగులతో టాప్ స్కోరర్ కాగా.. షెయ్ హోప్ 31 పరుగులు, ఓడెన్ స్మిత్ 24 పరుగులు చేశారు. జమైకా తలైవాస్ బౌలర్లలో ఇమాద్ వసీమ్, క్రిస్ గ్రీన్‌లు చెరో రెండు వికెట్లు తీయగా.. మహ్మద్ ఆమిర్, ఫాబియెన్ అలెన్, రోవ్‌మెన్ పావెలు తలా ఒక వికెట్ తీశారు. -
కాంస్యం నెగ్గిన సాత్విక్-చిరాగ్ శెట్టి.. అయినా చరిత్రే
అంచనాలకు మించి రాణిస్తున్న సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి జంట ప్రతిష్ఠాత్మక ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో కాంస్య పతకం సాధించింది. శనివారం(ఆగస్టు 27న) జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో సాత్విక్-చిరాగ్ శెట్టి జంట.. మలేషియాకు చెందిన ఆరోన్ చియా-వూయి యిక్ సోహ్లతో 22-20, 18-21, 16-21తో ఓటమి పాలయ్యారు. తొలి గేమ్‌ను 22-20తో గెలిచిన సాత్విక్- చిరాగ్.. అదే టెంపోనూ తర్వాతి గేమ్స్‌లో కొనసాగించలేకపోయారు. తొలి గేమ్ ఓడినప్పటికి వరల్డ్ నెంబర్-7 అయిన మలేషియా జంట ఫుంజుకొని భారత ద్వయానికి మరో అవకాశం ఇవ్వకుండా వరుస గేముల్లో ఓడించి మ్యాచ్‌ను కైవసం చేసుకుంది. ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ పురుషుల డబుల్స్‌లో భారత్‌కు ఇదే తొలి పతకం. ఇటీవలి కాలంలో సాత్విక్-చిరాగ్ జంట బ్యాడ్మింటన్‌లో అద్భుతాలు చేస్తున్నారు. ఆల్‌ఇంగ్లండ్ ఓపెన్‌లో క్వార్టర్ ఫైనల్ వరకు.. ఆ తర్వాత ఇండియా ఓపెన్, థామస్ కప్, కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణాలు చేజిక్కించుకున్నారు. తాజాగా ప్రపంచ చాంపియన్‌షిప్‌లో కాంస్యం గెలిచిన సాత్విక్- చిరాగ్ శెట్టి జోడి కొత్త చరిత్ర లిఖించింది. BWF World Championships 2022 Men's Doubles - Semi Finals Aaron Chia/Soh Wooi Yik 🇲🇾 vs Satwiksairaj Rankireddy/Chirag Shetty 🇮🇳 20-22, 21-18, 21-16 Alhamdulillah they finally break the SF curse! 🤧 Huge congrats for advancing to the FINAL ChiaSoh 👏👏 #BWC2022 pic.twitter.com/uCWsJtBo3p — レディディラ (@ladydyla__) August 27, 2022 చదవండి: Rafael Nadal-Serena Williams: అద్భుత దృశ్యం.. దిగ్గజాలు ఎదురుపడిన వేళ సాత్విక్–చిరాగ్ ‘డబుల్స్’ ధమాకా -
ఆట ఏదైనా ఒక్కటే.. అంపైర్ల చీటింగ్ మాత్రం మారదు
కామన్వెల్త్ గేమ్స్‌లో భారత మహిళల హాకీ జట్టు శుక్రవారం ఆస్ట్రేలియా మహిళలతో జరిగిన సెమీఫైనల్లో ఓటమి పాలైన సంగతి తెలిసిందే. పెనాల్టీ షూటౌట్లో భాగంగా ఆసీస్ చేతిలో భారత్ 3-0తో పరాజయం చవిచూసింది. అయితే పెనాల్టీ షూటౌట్ ప్రారంభానికి జరిగిన ఒక చిన్న తప్పిదం భారత మహిళలను ఓటమి వైపు నడిపించింది. విషయంలోకి వెళితే.. మ్యాచ్ ముగిసే సమయానికి ఇరుజట్లు 1-1తో సమంగా నిలిచాయి. దీంతో పెనాల్టీ షూటౌట్ అనివార్యమైంది. ఆస్ట్రేలియా డిపెండర్ అంబ్రోషియా మలోనే షూటౌట్‌కు సిద్దమైంది. ఆమె షాట్ ఆడగా.. భారత గోల్‌కీపర్ సవితా అడ్డుకుంది. అలా ఆసీస్ ఒక పెనాల్టీ వృథా చేసుకుందని మనం సంతోషించేలోపే అంపైర్ మధ్యలో దూరింది. సారీ.. షూటౌట్ క్లాక్ టైంలో తప్పిదం ఉందని.. మళ్లీ ప్రారంభించాలని చెప్పింది. అప్పటికే షూటౌట్ చేయడానికి వచ్చిన భారత క్రీడాకారిణికి విషయం చెప్పి అక్కడి నుంచి పంపించేసి మల్లీ అంబ్రోషియాను పిలిచింది. తొలిసారి మిస్ అయిన అంబ్రోషియా ఈసారి మాత్రం గురి తప్పలేదు. ఆ తర్వాత ఆస్ట్రేలియా వరుసగా మూడు గోల్స్ కొట్టగా.. భారత్ మాత్రంఒక్క గోల్ చేయలేకపోయింది. అలా భారత మహిళల హాకీ జట్టు ఫైనల్ చేరడంలో విఫలమైంది. అయితే పెనాల్టీ షూటౌట్ సమయంలో అంపైర్ విధానంపై అన్ని వైపుల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆడుతున్నది ఒక సెమీఫైనల్ మ్యాచ్ అని మరిచిపోయి.. క్లాక్‌టైం మిస్టేక్ అని చెప్పడం సిల్లీగా ఉందని.. అంపైర్ కావాలనే ఇలా చేసిందేమో అంటూ కామెంట్స్ చేశారు. ఇదే విషయమే టీమిండియా మాజీ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్ కూడా అంపైర్ తీరుపై ఘాటుగా స్పందించాడు. ''ఆస్ట్రేలియాకు పెనాల్టీ మిస్ కాగానే అంపైర్ పరిగెత్తుకొచ్చి.. సారీ క్లాక్ ఇంకా స్టార్ట్ చెయ్యలేదు.. మళ్లీ ఆరంభిద్దామా అని సింపుల్‌గా చెప్పేసింది. అంపైర్లు ఇలా ఎందుకుంటారో అర్థం కావడం లేదు. క్రికెట్.. హాకీ ఇలా ఏదైనా ఒక్కటే.. అంపైర్లు తమకుండే సూపర్ పవర్‌తో ఎలాంటి నిర్ణయమైనా తీసుకుంటారు. ఇలాంటివి క్రికెట్లో బాగా జరిగేవి.. అందుకే మేం హాకీలోకి కూడా త్వరలోనే ఎంటరవుతాం.. అమ్మాయిలు.. ఓడిపోయారు పర్లేదు.. మిమ్మల్ని చూస్తే గర్వంగా ఉంది.'' అంటూ క్యాప్షన్ జత చేశాడు. మరోవైపు భారత్- ఆస్ట్రేలియా వుమెన్స్ మధ్య జరిగిన సెమీస్ మ్యాచ్‌పై విమర్శలు పెరగడంతో అంతర్జాతీయ హాకీ ఫెడరేషన్ కూడా స్పందించింది. ''కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్- ఆస్ట్రేలియా సెమీఫైనల్లో షూటౌట్ చిన్న తప్పిదం వల్ల క్లాక్ సెట్ చేయకముందే ప్రారంభమయింది. అందుకే మళ్లీ ప్రారంభించాం. ఈ తప్పిదానికి మేం క్షమించమని కోరుతున్నాం. ఇలాంటివి జరగకుండా జాగ్రత్తపడతాం.'' అని కామెంట్ చేసింది. కాగా సెమీస్‌లో ఓడినప్పటికి భారత మహిళల హాకీ జట్టుకు కాంస్య పతక పోరుకు సిద్ధమవనుంది. మరో సెమీఫైనల్లో ఇంగ్లండ్ న్యూజిలాండ్‌పై 2-0 తేడాతో విజయం సాధించి ఫైనల్ పోరుకు అర్హత సాధించింది. ఇక కాంస్య పతక పోరులో భాగంగా ఆదివారం భారత్, న్యూజిలాండ్ మహిళల జట్లు పోటీ పడనున్నాయి. Penalty miss hua Australia se and the Umpire says, Sorry Clock start nahi hua. Such biasedness used to happen in cricket as well earlier till we became a superpower, Hockey mein bhi hum jald banenge and all clocks will start on time. Proud of our girls 🇮🇳pic.twitter.com/mqxJfX0RDq — Virender Sehwag (@virendersehwag) August 6, 2022 My heart goes out to the Indian women’s hockey team who fought like bravehearts against Australia. No shame in losing in penalties to the Aussies. Our ladies gave everything on the pitch. As fans, we cannot expect more. Really proud of the this team. 🇮🇳🏑❤️ — Viren Rasquinha (@virenrasquinha) August 5, 2022 చదవండి: 'నా సుత్తిని అవలీలగా ఎత్తేస్తుందేమో'.. మీరాబాయిపై 'థోర్' ప్రశంసలు -
CWG 2022: బార్బడోస్పై ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన టీమిండియా
కామన్వెల్త్ గేమ్స్ 2022లో టీమిండియా మహిళల జట్టు సెమీస్‌కు దూసుకెళ్లింది. గేమ్స్‌లో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో టీమిండియా వుమెన్స్ జూలు విదిల్చారు. బుధవారం బార్బడోస్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా మహిళలు 100 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించారు. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా మహిళలు 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. జెమీమా రోడ్రిగ్స్(46 బంతుల్లో 56 నాటౌట్, 6 ఫోర్లు, ఒక సిక్స్) టాప్ స్కోరర్ కాగా.. షఫాలీ వర్మ(26 బంతుల్లో 43, 7 ఫోర్లు, 1 సిక్సర్), చివర్లో దీప్తి శర్మ(28 బంతుల్లో 34, 2 ఫోర్లు, 1 సిక్సర్) దుమ్మురేపడంతో భారత్ మహిళల జట్టు గౌరవప్రదమైన స్కోరు సాధించింది. అనంతరం బ్యాటింగ్ చేసిన బార్బడోస్ మహిళల జట్టు భారత్ బౌలర్ల ఒత్తిడిని తట్టుకోలేక 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 62 పరుగుల వద్ద ఇన్నింగ్స్ ముగించింది. కోషోనా నైట్ 16 పరుగులతో టాప్ స్కోరర్ కాగా.. మిగతావారు సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. టీమిండియా వుమెన్స్ బౌలర్లలో రేణుకా సింగ్ 4 వికెట్లు తీయగా.. మేఘనా సింగ్, స్నేహ్ రాణా, రాదా యాదవ్, హర్మన్‌ప్రీత్ కౌర్‌లు తలా ఒక వికెట్ తీశారు. ఇక న్యూజిలాండ్, ఇంగ్లండ్ మధ్య విజేతతో టీమిండియా మహిళల జట్టు సెమీస్‌లో తలపడనుంది. సెమీస్‌లో గెలిస్తే మాత్రం టీమిండియా మహిళల జట్టుకు పతకం ఖాయమైనట్లే. A fantastic victory for #TeamIndia. They win by 100 runs and advance into the semi-finals at the #CWG2022 👏👏 Scorecard - https://t.co/upMpWogmIP #INDvBAR #B2022 pic.twitter.com/uH6u7psVmG — BCCI Women (@BCCIWomen) August 3, 2022 -
సెమీస్‌లో పోరాడి ఓడిన బోపన్న జంట
సించ్ ఓపెన్ ఏటీపీ–500 టెన్నిస్ టోర్నీలో రోహన్ బోపన్న (భారత్)–షపోవలోవ్ (కెనడా) జంట పోరాటం ముగిసింది. లండన్‌లో ఆదివారం జరిగిన పురుషుల డబుల్స్ సెమీఫైనల్లో బోపన్న–షపోవలోవ్ ద్వయం 5–7, 7–6 (7/4), 4–10తో ‘సూపర్ టైబ్రేక్’లో గ్లాస్‌పూల్ (బ్రిటన్)–హ్యారీ హెలియోవారా (ఫిన్లాండ్) జోడీ చేతిలో పోరాడి ఓడిపోయింది. బోపన్న జంటకు 35,370 పౌండ్లు (రూ. 33 లక్షల 70 వేలు) ప్రైజ్‌మనీగా లభించాయి. చదవండి: Matteo Berrettini: 'నన్ను పెళ్లి చేసుకుంటావా'.. టెన్నిస్ స్టార్‌కు వింత అనుభవం -
సెమీఫైనల్లో అడుగు పెట్టిన పీవీ సింధు
బీడబ్ల్యూఎఫ్ టూర్ సూపర్ 500 టోర్నీ థాయిలాండ్ ఓపెన్‌లో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు సెమీఫైనల్లో అడుగు పెట్టింది. శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో సింధూ.. పాన్‌కు చెందిన అకానె యమగుచిపై 21-15, 20-22, 21-13 స్కోర్‌తో విజయం సాధించింది. 51 నిమిషాల పాటు హోరాహోరీ జరిగిన ఈ మ్యాచ్‌లో సింధు విజయం సాధించింది. కాగా గురువారం జరిగిన ప్రిక్వార్టర్ మ్యాచ్‌లో సింధు 21–16, 21–13 స్కోరుతో సిమ్ యు జిన్ (కొరియా)పై విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇక శనివారం జరగనున్న సెమీఫైనల్లో చెందిన ఒలింపిక్ ఛాంపియన్ చెన్ యు ఫీతో సింధు తలపడనుంది. చదవండి: India Tour of Ireland: టీమిండియాతో టీ20 సిరీస్.. ఐర్లాండ్ కీలక నిర్ణయం -
సెమీస్‌లో ఓడిన సాకేత్–యూకీ బాంబ్రీ జోడీ
మొరెలోస్ ఓపెన్ ఏటీపీ చాలెంజర్ టెన్నిస్ టోర్నీలో సాకేత్ మైనేని–యూకీ బాంబ్రీ (భారత్) జంట పోరాటం ముగిసింది. మెక్సికోలో శనివారం జరిగిన పురుషుల డబుల్స్ సెమీఫైనల్లో సాకేత్–యూకీ బాంబ్రీ ద్వయం 6–4, 3–6, 4–10తో ‘సూపర్ టైబ్రేక్’లో నికోలస్ మిజా–రొబెర్టో క్విరోజ్ (ఈక్వెడార్) జోడీ చేతిలో ఓడిపోయింది. సెమీఫైనల్లో ఓటమి చవిచూసిన భారత జంటకు 1,080 డాలర్ల (రూ.82 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 30 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. -
వైజాగ్ : వయ్యారి భామా...నీ హంస నడక (ఫొటోలు)
-
బ్యాట్‌తోనే అనుకుంటే.. స్టన్నింగ్ క్యాచ్తోనూ మెరిసింది
మహిళల వన్డే ప్రపంచకప్ 2022లో భాగంగా బుధవారం ఆస్ట్రేలియా, వెస్టిండీస్ మధ్య తొలి సెమీఫైనల్ మ్యాచ్ జరిగింది. 157 పరుగుల తేడాతో విజయం సాధించిన ఆసీస్ ఏడోసారి టైటిల్ గెలిచేందుకు ఫైనల్లో అడుగుపెట్టింది. ఆసీస్ బ్యాటింగ్‌లో బెత్ మూనీ చివర్లో దాటిగా ఆడి 31 బంతుల్లోనే 3 ఫోర్ల సాయంతో 43 పరుగులు చేసింది. బ్యాటింగ్‌లో మెరిసిన బెత్ మూనీ.. అనంతరం ఫీల్డింగ్‌లోనూ సత్తా చాటింది. వర్షం అంతరాయంతో 45 ఓవర్లకు కుదించగా.. 306 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్ ఉమెన్స్‌కు ఇన్నింగ్స్ 4వ ఓవర్లోనే షాక్ తగిలింది. విండీస్ ఓపెనర్ రషదా విలియమ్స్‌ను.. మేఘన్ స్కట్డకౌట్గా పెవిలియన్‌గా చేర్చింది. అయితే ఇక్కడ హైలైట్ అయింది మాత్రం బెత్ మూనీనే. విలియమ్స్.. కవర్ డ్రైవ్ దిశగా షాట్ ఆడగా అక్కడే ఉన్న బెత్ మూనీ విల్లుగా ఒకవైపుగా డైవ్ చేస్తూ ఒంటిచేత్తో స్టన్నింగ్ క్యాచ్ అందుకుంది. దీనికి సంబంధించిన వీడియోనూ ఐసీసీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. మ్యాచ్‌లో టాస్ గెలిచిన వెస్టిండీస్ మహిళా జట్టు తొలుత బౌలింగ్ ఎంచుకుంది.ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియాకు ఓపెనర్లు హేన్స్(85), హేలీ(129) అదిరిపోయే ఆరంభం అందించారు. బెత్ మూనీ 43 పరుగులతో అజేయంగా నిలిచింది. ఈ ముగ్గురి అద్భుత ప్రదర్శనతో ఆస్ట్రేలియా నిర్ణీత 45 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 305 పరుగుల భారీ స్కోరు సాధించింది.లక్ష్య ఛేదనకు దిగిన వెస్టిండీస్‌కు ఓపెనర్ డియాండ్ర డాటిన్ శుభారంభం అందించింది. 34 పరుగులతో రాణించింది. వన్‌డౌన్‌లో వచ్చిన హేలీ మాథ్యూస్ 34, కెప్టెన్ స్టెఫానీ టేలర్ 48 పరుగులు సాధించారు. ఆ తర్వాత టపటపా వికెట్లు పడ్డాయి. ఒక్కరు కూడా డబుల్ డిజిట్ స్కోరు చేయలేకపోయారు. దీంతో 37 ఓవర్లలో 148 పరుగులకే ఆలౌట్ అయి వెస్టిండీస్ కుప్పకూలింది. చదవండి: అజేయ రికార్డును కొనసాగిస్తూ.. వెస్టిండీస్‌ను చిత్తు చేసి.. భారీ విజయంతో ఫైనల్‌కు Mitchell Marsh: ఆస్ట్రేలియాకు షాక్.. ఢిల్లీ క్యాపిటల్స్‌కు గుడ్‌న్యూస్ View this post on Instagram A post shared by ICC (@icc) -
సెమీ ఫైనల్‌కి చేరిన దక్షిణాఫ్రికా.. మరి భారత్ చేరాలంటే!
వెల్లింగ్టన్: మహిళల వన్డే వరల్డ్ కప్‌లో ఆస్ట్రేలియా తర్వాత సెమీస్‌కు అర్హత సాధించిన రెండో జట్టుగా దక్షిణాఫ్రికా నిలిచింది. గురువారం వెస్టిండీస్‌తో జరగాల్సిన కీలక మ్యాచ్ వర్షార్పణం కావడం ఆ జట్టుకు మేలు చేసింది. వాన వల్ల మ్యాచ్‌కు 26 ఓవర్లకు కుదించగా ఒక దశలో సఫారీ స్కోరు 22/4 వద్ద నిలిచింది. ఆట ఆగిపోయే సమయానికి ఆ జట్టు 10.5 ఓవర్లలో 4 వికెట్లకు 61 పరుగులు చేసింది. మళ్లీ వర్షం కురవడంతో ఇక మ్యాచ్ తిరిగి మొదలయ్యే అవకాశమే రాలేదు. దీంతో మ్యాచ్‌ను రద్దు చేసి ఇరు జట్లకు చెరో పాయింట్ కేటాయించారు. మెగా ఈవెంట్లో రద్దయిన మ్యాచ్ ఇదొ క్కటే! దీని వల్ల 9 పాయింట్లతో దక్షిణాఫ్రికా సెమీస్ చేరగా వెస్టిండీస్ 7 పాయింట్ల వద్ద నిలిచింది. ఇంగ్లండ్ సునాయాస విజయం క్రైస్ట్‌చర్చ్: ఇంగ్లండ్ అమ్మాయిల జట్టు పాక్‌పై సునాయాస విజయంతో సెమీస్ వైపు అడుగులేస్తోంది. గురువారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ 9 వికెట్ల తేడాతో పాకిస్తాన్‌పై జయభేరి మోగించింది. మొదట పాక్ 41.3 ఓవర్లలో 105 పరుగులకే ఆలౌటైంది. సీమర్ క్యాథరిన్ బ్రంట్ (3/17), స్పిన్నర్ సోఫీ (3/18) పాక్ ఇన్నింగ్స్‌ను కూల్చేశారు. వీళ్లిద్దరి దెబ్బకు... ఓపెనర్ సిద్రా అమీన్ (32; 4 ఫోర్లు), సిద్రా నవాజ్ (23; 1 ఫోర్) మినహా ఇంకెవరూ రెండంకెల స్కోరు చేయలేకపోయారు. తర్వాత సునాయాస లక్ష్యాన్ని ఇంగ్లండ్ 19.2 ఓవర్లలోనే వికెట్ మాత్రమే కోల్పోయి 107 పరుగులతో ఛేదించింది. ఓపెనర్ డానీ వ్యాట్ (76 నాటౌట్; 11 ఫోర్లు) కెప్టెన్ హీథర్ నైట్ (24 నాటౌట్) రాణించారు. తప్పనిసరిగా గెలవాల్సిందే! భారత జట్టు సెమీస్ చేరాలంటే ఆదివారం దక్షిణాఫ్రికాతో ఆఖరి మ్యాచ్‌లో తప్పక గెలవాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రస్తుతం మిథాలీ సేన ఖాతాలో 6 పాయింట్లు ఉన్నాయి. సఫారీని ఓడిస్తే వెస్టిండీస్ (7)ను వెనక్కి నెట్టి 8 పాయింట్లతో జట్టు ముందంజ వేస్తుంది. ఇంగ్లండ్ ఖాతాలో కూడా 6 పాయింట్లే ఉన్నప్పటికీ వారికి ఆఖరి పోరులో ఎదురయ్యేది కూన బంగ్లాదేశ్ కావడంతో ఇంగ్లండ్‌కూ మెరుగైన అవకాశాలున్నాయి. ఈ రెండు మ్యాచ్‌లు ఒకే రోజు ఉన్నాయి. అయితే మన మ్యాచ్ కూడా వర్షం వల్ల రద్దయితే అప్పుడు భారత్, విండీస్ ఖాతాలో 7 పాయింట్లుంటాయి. అప్పుడు విండీస్‌కంటే మెరుగైన రన్‌రేట్ ఉన్న భారత్, ఇంగ్లండ్ సెమీస్ చేరుకుంటాయి. ఈ నేపథ్యంలో మన జట్టు పూర్తి సత్తాను ప్రదర్శించాల్సి ఉంది. చదవండి: World Cup 2022: భారత్‌కు బ్యాడ్ న్యూస్.. దక్షిణాఫ్రికాపై తప్పక గెలవాల్సిందే.. లేదంటే! -
‘టీమిండియా’కు బ్యాడ్ న్యూస్.. దక్షిణాఫ్రికాపై తప్పక గెలవాల్సిందే.. లేదంటే!
ICC Women World Cup 2022: మహిళల వన్డే ప్రపంచకప్‌లో భారత జట్టును దురదృష్టం వెంటాడింది. వర్షం కారణంగా వెస్టిండీస్- దక్షిణాఫ్రికా మ్యాచ్ రద్దు కావడంతో భారత్ సెమీస్ అవకాశాలు సంక్లిష్టంగా మారాయి. మ్యాచ్ రద్దు కావడంతో విండీస్- ప్రొటిస్ జట్లకు చెరో పాయింట్ లభించింది. దీంతో 9 పాయింట్లతో దక్షిణాఫ్రికా సెమీఫైనల్లో అడుగు పెట్టగా, విండీస్ 7 పాయింట్లతో మూడో స్ధానానికి చేరుకుంది. ఇక భారత్ 6 పాయింట్లతో పాయింట్ల పట్టికలో ఐదో స్ధానానికి పడిపోయింది. మరోవైపు పాకిస్తాన్‌పై ఘన విజయంతో ఇంగ్లండ్ నాలుగో స్ధానానికి చేరుకుంది. దీంతో భారత్‌కు దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌లో చావోరేవో తేల్చుకోవాల్సిన పరిస్థితి. సెమీఫైనల్స్‌కు భారత్ అర్హత సాధించాలంటే ఆదివారం(మార్చి 27) జరుగనున్న తమ చివరి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాను భారత్ కచ్చితంగా ఓడించాలి. అప్పుడు 8 పాయింట్లతో భారత్ మూడో స్ధానానికి చేరుకుంటుంది. లేదంటే టోర్నీ నుంచి నిష్క్రమించక తప్పదు. అదే విధంగా ఇంగ్లండ్ కూడా తమ చివరి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై విజయం సాధిస్తే మూడో స్ధానానికి చేరుకునే అవకాశం ఉంది. అయితే ఇంగ్లండ్, భారత్ ఇరు జట్లు తమ చివరి మ్యాచ్‌లలో విజయం సాధిస్తే పాయింట్ల పట్టికలో టాప్ ఫోర్లో నిలుస్తాయి. ఒకవేళ అనూహ్యంగా బంగ్లా చేతిలో ఇంగ్లండ్ ఓటమి చెంది, దక్షిణాఫ్రికా చేతిలో భారత్ కూడా ఓటమి పాలైతే రన్‌రేట్ కీలకం కానుంది. మరోవైపు న్యూజిలాండ్ శనివారం బంగ్లాదేశ్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ భారీ తేడాతో విజయం సాధిస్తే.. భారత్, ఇంగ్లండ్‌తో పోటీపడే అవకాశం ఉంది. న్యూజిలాండ్ 4 పాయింట్లతో ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఆరో స్ధానంలో ఉంది. చదవండి: World Cup Super League: దక్షిణాఫ్రికాపై సంచలన విజయం.. వరల్డ్‌కప్ సూపర్ లీగ్ టాప్‌లో బంగ్లాదేశ్! టీమిండియా ఎక్కడ? View this post on Instagram A post shared by ICC (@icc) -
ICC Womens WC 2022: టీమిండియా సెమీస్‌కు చేరాలంటే..?
ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్ 2022లో భాగంగా మంగళవారం టీమిండియా, బంగ్లాదేశ్ మధ్య మ్యాచ్ జరిగింది. తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో టీమిండియా మహిళల జట్టు ఆకట్టుకునే ప్రదర్శనతో సెమీస్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. ప్రస్తుతం టీమిండియా ఆరు మ్యాచ్‌ల్లో మూడు విజయాలు.. మూడు ఓటములతో ఆరు పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. బంగ్లాదేశ్‌పై 110 పరుగుల భారీ తేడాతో విజయం సాధించి నెట్‌రన్‌రేట్‌ను కూడా మెరుగుపరుచుకుంది. బంగ్లాతో మ్యాచ్‌కు ముందు మైనస్‌లో ఉన్న రన్‌రేట్.. ఇప్పుడు +0.768గా ఉంది. కాగా సెమీస్‌లో మూడు, నాలుగు స్థానాల కోసం ఇంగ్లండ్, భారత్, వెస్టిండీస్ పోటీపడుతున్నాయి. ఇంగ్లండ్‌కు రెండు మ్యాచ్‌లు ఉన్నప్పటికి నాలుగు పాయింట్లు మాత్రమే ఉన్నాయి. కాబట్టి ఆ జట్టు తాను ఆడబోయే రెండు మ్యాచ్‌లు కచ్చితంగా గెలవాల్సి ఉంటుంది. ఇక ఆదివారం(మార్చి 27న) సౌతాఫ్రికాతో జరగనున్న మ్యాచ్‌లో టీమిండియా గెలిస్తే సమీకరణాలు అవసరం లేకుండా 8 పాయింట్లతో సెమీస్‌లో అడుగుపెడుతుంది. ఒకవేళ సాతాఫ్రికాతో మ్యాచ్‌లో ఓడినప్పటికి మరో అవకాశం ఉంది. టీమిండియాతో మ్యాచ్‌కు ముందు సౌతాఫ్రికా వెస్టిండీస్‌తో మ్యాచ్ ఆడాల్సి ఉంది. ఈ మ్యాచ్‌లో గనుక వెస్టిండీస్ ఓడిపోతే.. టీమిండియా సెమీస్‌కు చేరుకుంటుంది. అలా కాకుండా వెస్టిండీస్ గెలిస్తే టీమిండియాకు నెట్‌రన్‌రేట్ కీలకం కానుంది. సౌతాఫ్రికాతో మ్యచ్‌లో టీమిండియా ఓడినప్పటికి.. తక్కువ పరుగుల తేడాతో ఓడిపోవాలి. అప్పుడే నెట్ రన్‌రేట్ ఆధారంగా సెమీస్‌కు వెళుతుంది. ఇవన్నీ జరగకుండా ఉండాలంటే మనతో మ్యాచ్‌కు ముందు సౌతాఫ్రికా వెస్టిండీస్‌ను ఓడిస్తే సరిపోతుంది. చదవండి: PAK vs AUS: బాబర్ ఆజం.. కేవలం రికార్డుల కోసమే టెస్టు సిరీస్ ఆడుతున్నావా? World Cup 2022: అరుదైన రికార్డు సాధించిన గోస్వామి.. తొలి భారత బౌలర్‌గా! View this post on Instagram A post shared by ICC (@icc) -
టాప్ సీడ్ జోడీపై సానియా జంట సంచలన విజయం
ఖతర్ ఓపెన్ టెన్నిస్ టోర్నీలో సానియా మీర్జా (భారత్)–లూసీ హర్డెస్కా (చెక్ రిపబ్లిక్) జంట సంచలనం సృష్టించింది. బుధవారం జరిగిన మహిళల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో 7–6 (7/5), 4–3తో ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్, టాప్ సీడ్ జోడీ సినియకోవా–క్రిచికోవా (చెక్ రిపబ్లిక్)పై నెగ్గి సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. తొలి సెట్‌ను సొంతం చేసుకొని రెండో సెట్లో సానియా–హర్డెస్కా 4–3తో ఆధిక్యంలో ఉన్న దశలో సినియకోవా–క్రిచికోవా గాయంతో వైదొలిగారు. -
మరో ఫైనల్ వేటలో.. అండర్-19 టీమిండియా
కూలిడ్జ్ (ఆంటిగ్వా): గత రెండు అండర్–19 ప్రపంచకప్‌లలో భారత్, ఆస్ట్రేలియా రెండుసార్లు నాకౌట్ మ్యాచ్‌లలో తలపడగా రెండు సార్లూ భారత్‌నే విజయం వరించింది. 2018 ఫైనల్లో పృథ్వీ షా నాయకత్వంలోని జట్టు ఆసీస్‌ను ఓడించి టైటిల్ గెలుచుకోగా... 2020 క్వార్టర్ ఫైనల్లో మన చేతుల్లో కంగారూలకు పరాజయం ఎదురైంది. ఈసారి సెమీఫైనల్లో ఈ రెండు టీమ్‌లు తలపడబోతున్నాయి. నేడు జరిగే ఈ కీలక పోరులో గెలిచి ముందంజ వేస్తే భారత్ వరుసగా నాలుగోసారి ప్రపంచకప్ ఫైనల్లోకి అడుగు పెట్టినట్లవు తుంది. అయితే మూడు సార్లు చాంపియన్‌గా నిలిచిన ఆస్ట్రేలియా ఈ పోరులో సునాయాసంగా తలవంచుతుందా లేక గత మ్యాచ్‌లకు ప్రతీకారం తీర్చుకుంటుందా అనేది ఆసక్తికరం. తాజా ఫామ్ ప్రకారం చూస్తే ఇరు జట్లు సమఉజ్జీలుగా కనిపిస్తున్నాయి. -
అద్భుత రనౌట్... శ్రీలంకపై అఫ్గన్ సంచలన విజయం
ICC U19 World Cup 2022: 25 బంతులు... చేయాల్సినవి 5 పరుగులు.. చేతిలో ఒక వికెట్. ఓ క్రికెట్ జట్టు మ్యాచ్ గెలవడానికి ఈ సమీకరణ చాలు. కానీ... శ్రీలంకను దురదృష్టం వెక్కిరించింది. అఫ్గనిస్తాన్ అద్భుత రనౌట్ చేయడంతో విజయం ఆ జట్టు చేజారింది. అంతేకాదు మెగా టోర్నీలో సెమీస్ చేరాలన్న ఆశలు గల్లంతయ్యాయి. కాగా వెస్టిండీస్ వేదికగా ఐసీసీ అండర్ 19 వరల్డ్‌కప్ ఈవెంట్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... శ్రీలంక, అఫ్గనిస్తాన్ మధ్య గురువారం క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ జరిగింది. టాస్ గెలిచిన శ్రీలంక తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన అఫ్గనిస్తాన్‌కు శుభారంభం లభించలేదు. ఓపెనర్లు బిలాల్ సయేదీ 6, ఖరోటే 13 పరుగులకే పెవిలియన్ చేరారు. వన్‌డౌన్‌లో వచ్చిన అల్లా నూర్ 25 పరుగులతో ఫర్వాలేదనిపించాడు. అబ్దుల్ హైదీ 37, నూర్ అహ్మద్ 30 పరుగులతో రాణించారు. దీంతో అఫ్గన్ గౌరవప్రదమైన స్కోరు చేయగలిగింది. 134 పరుగులకే ఆలౌట్ అయింది. ఆఖరి రనౌట్‌తో ఈ క్రమంలో స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంకకు ఆదిలోనే షాక్ తగిలింది. ఓపెనర్ చమిందు విక్రమ సింఘే ఒక్కడే డబుల్ డిజిట్(16) స్కోరు చేయగలిగాడు. మరో ఓపెనర్ సదిశ రాజపక్స డకౌట్ కాగామిడిలార్డర్ దారుణంగా విఫలమైంది. వరుసగా 2,2,1,3,2 స్కోర్లకే పెవిలియన్ చేరారు. చివర్లో దునిత్ 34, రవీన్ డి సిల్వా 21 మెరుపులు మెరిపించారు. వినుజ రణ్పల్ 11 పరుగులతో క్రీజులో ఉండగా... అఫ్గన్ బౌలర్ నవీద్ సంధించిన బంతిని ఆడే క్రమంలో రనౌట్‌కు ఆస్కారం ఏర్పడింది. దీంతో శ్రీలంక కథ ముగిసింది. ఇన్నింగ్స్‌లో ఇది నాలుగో రనౌట్ కావడం గమనార్హం. ఇక నాలుగు పరుగుల తేడాతో గెలుపొంది సెమీస్ చేరిన అఫ్గన్ ఆటగాళ్ల సంబరాలు అంబరాన్నంటాయి. సెమీ ఫైనల్లో అఫ్గనిస్తాన్ ఇంగ్లండ్‌తో తలపడనుంది. స్కోర్లు: అఫ్గనిస్తాన్ అండర్ 19 జట్టు: 134 (47.1 ఓవర్లు) శ్రీలంక అండర్ 19 జట్టు- 130 (46 ఓవర్లు) చదవండి: IPL: వాళ్లిద్దరు నా ఫేవరెట్ ప్లేయర్లు... ఐపీఎల్లో ఆ జట్టుకు ఆడాలని ఉంది: దక్షిణాఫ్రికా యువ సంచలనం ఏబీడీ 2.0! IND vs WI: టీమిండియాతో సిరీస్.. వెస్టిండీస్ జట్టులో గొడవలు.. పొలార్డ్‌పై సంచలన ఆరోపణలు! Congratulations Afghanistan 🔥🔥🇦🇫🇦🇫🔥🔥 Afg u19 vs sl u19 pic.twitter.com/qBYzNkjiXm — THE NDS soldier (@Muhamma40574471) January 27, 2022 Celebrate the win boys!! The Future stars have all the rights in the world to celebrate thier quarter final win over SL U19s. #FutureStars | #AFGvSL | #U19CWC2022 pic.twitter.com/SNmr2jtTIx — Afghanistan Cricket Board (@ACBofficials) January 27, 2022 -
సెమీస్‌కు దూసుకెళ్లిన నాదల్, యాష్లే బార్టీ
ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్‌లో స్పెయిన్‌బుల్ రాఫెల్ నాద్ల్ అదరగొడుతున్నాడు. కెరీర్లో 21వ గ్రాండ్‌స్లామ్‌పై కన్నేసిన నాదల్ మరో రెండు అడుగుల దూరంలో మాత్రమే ఉన్నాడు. మంగళవారం జరిగిన మెన్స్ సింగిల్స్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో నాదల్.. కెనడాకు చెందిన డెనిస్ షాపోవలోవ్ను 6-3,6-4,4-6, 3-6,6-3తో ఓడించాడు. దాదాపు 4 గంటల 8 నిమిషాల పాటు జరిగిన ఈ మారథాన్ గేమ్‌లో తొలి రెండు సెట్లను నాదల్ గెల్చుకోగా.. ఫుంజుకున్న డెనిస్ షాపోవలోవ్ తర్వాతి రెండు సెట్స్‌లో నాదల్‌ను మట్టికరిపించాడు. అయితే కీలకమైన ఆఖరి సెట్లో జూలు విదిల్చిన నాదల్ 6-3 తేడాతో సెట్‌ను కైవసం చేసుకొని సెమీస్‌లో అడుగుపెట్టాడు. చదవండి: Australian Open 2022: 'నీ మాటలతో నన్ను ఏడిపించేశావు.. థాంక్యూ' మరోవైపు మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో ప్రపంచనెంబర్ వన్ యాష్లే బార్టీ హోంగ్రౌండ్లో దుమ్మురేపింది. 21వ సీడ్ జెస్సికా పెగులాను వరుస సెట్లలో ఓడించి సెమీస్‌లో అడుగుపెట్టింది. వన్‌సైడ్‌గా జరిగిన మ్యాచ్‌లో తొలి సెట్‌ను 6-2తో గెలుచుకున్న బార్టీ.. రెండో సెట్లో ప్రత్యర్థికి ఏ మాత్రం అవకాశమివ్వకుండా 6-0తో రెండోసెట్‌ను కైవసం చేసుకొని దర్జాగా సెమీస్‌కు చేరింది. ఫ్రెంచ్ ఓపెన్ చాంపియన్ బార్బోరా క్రెజికోవాకు క్వార్టర్ఫైనల్లో గట్టిషాక్ తగిలింది. అమెరికాకు చెందిన కీస్ మాడిసన్ చేతిలో 6-3,6-1తో క్రెజికోవా ఘోర పరాజయం పాలయింది. కేవలం గంటా 25 నిమిషాలు మాత్రమే సాగిన మ్యాచ్‌లో కీస్ మాడిసన్ పూర్తి ఆధిపత్యం కనబరిచింది. 2015 తర్వాత ఒక గ్రాండ్‌స్లామ్‌లో రెండోసారి సెమీస్‌లో అడుగుపెట్టిన మాడిసన్ మెయిడెన్ టైటిల్‌పై కన్నేసింది. ఇక సెమీస్‌లో కీస్ మాడిసన్.. ప్రపంచనెంబర్ వన్ యాష్లే బార్టీతో తలపడనుంది. చదవండి: Australian Open 2022: క్వార్టర్స్‌లో నిష్క్రమించిన రాజీవ్ రామ్-సానియా మీర్జా జోడీ ¡DALE RAFA!🇪🇸@RafaelNadal is through to the #AusOpen semifinals with a 6-3 6-4 4-6 3-6 6-3 victory over Denis Shapovalov🔥 🎥: @AustralianOpen | #AusOpen | #AO2022 pic.twitter.com/9xsybToVTQ — ATP Tour (@atptour) January 25, 2022 Unstoppable 💯@Madison_Keys is into the #AusOpen quarterfinals for the first time since 2018, taking down Paula Badosa 6-3 6-1. #AO2022 pic.twitter.com/dIGsi7zf5q — #AusOpen (@AustralianOpen) January 23, 2022


