సెమీఫైనల్లో నిఖత్‌ జరీన్‌ | Nikhat Zareen Enters Semis In Strandja Memorial Tournament | Sakshi
Sakshi News home page

సెమీఫైనల్లో నిఖత్‌ జరీన్‌

Feb 9 2024 9:28 AM | Updated on Feb 9 2024 9:43 AM

Nikhat Zareen Enters Semis In Strandja Memorial Tournament - Sakshi

సోఫియా (బల్గేరియా): రెండుసార్లు ప్రపంచ చాంపియన్, తెలంగాణ స్టార్‌ బాక్సర్‌ నిఖత్‌ జరీన్‌ స్ట్రాంజా స్మారక అంతర్జాతీయ బాక్సింగ్‌ టోర్నీలో సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. మహిళల 50 కేజీల క్వార్టర్‌ ఫైనల్లో ఆమె 5–0తో ఖదిరి వాసిల (ఫ్రాన్స్‌)పై గెలిచి కనీసం కాంస్య పతకాన్ని ఖాయం చేసుకుంది.

66 కేజీల క్వార్టర్స్‌లో అరుంధతి  5–0తో సెర్బియాకు చెందిన మిలెనాపై గెలుపొందింది. 57 కేజీల క్వార్టర్స్‌లో సాక్షి 2–3 తో మమజొనొవా (ఉజ్బెకిస్తాన్‌) చేతిలో ఓడిపోయింది. పురుషుల కేటగిరీలో దీపక్‌ (75 కేజీలు), నవీన్‌ (92 కేజీలు) క్వార్టర్‌ ఫైనల్లోకి ప్రవేశించారు. దీపక్‌ 5–0తో సుల్తాన్‌ (కిర్గిజిస్తాన్‌)పై, నవీన్‌ 5–0తో వొయిస్నరొవిక్‌ (లిథువేనియా)పై గెలుపొందారు. 

చదవండి: ఆస్ట్రేలియాతో ఫైనల్‌ పోరు.. టీమిండియా ప్రతీకారం తీర్చుకుంటుందా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement