ఇది వరల్డ్‌కప్‌.. గుర్తుందా?: గావస్కర్‌ ఫైర్‌ | This Is World Cup: Gavaskar Fumes At Stadium Organiser For Bumrah Chants | Sakshi
Sakshi News home page

T20 WC 2026: ఇది వరల్డ్‌కప్‌.. గుర్తుందా?: గావస్కర్‌ ఫైర్‌

Mar 6 2026 5:20 PM | Updated on Mar 6 2026 5:58 PM

This Is World Cup: Gavaskar Fumes At Stadium Organiser For Bumrah Chants

ఐసీసీ టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నీలో భారత్‌ ఫైనల్‌కు చేరుకుంది. ఇంగ్లండ్‌తో సెమీ ఫైనల్లో ఆఖరి ఓవర్‌ వరకు నరాలు తెగే ఉత్కంఠ రేపిన మ్యాచ్‌లో.. ఏడు పరుగుల తేడాతో గట్టెక్కింది. ముంబైలోని ప్రసిద్ధ వాంఖడే మైదానంలో భారత్‌- ఇంగ్లండ్‌ మధ్య రెండో సెమీస్‌ మ్యాచ్‌ గురువారం జరిగిన విషయం తెలిసిందే.

సంజూ భారీ అర్ధ శతకం
టాస్‌ ఓడిన టీమిండియా తొలుత బ్యాటింగ్‌కు దిగి.. నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 253 పరుగుల మేర భారీ స్కోరు సాధించింది. ఓపెనింగ్‌ బ్యాటర్‌ సంజూ శాంసన్‌ భారీ అర్ధ శతకం (42 బంతుల్లో 89) తో ఆకట్టుకున్నాడు.

ఇక లక్ష్యాన్ని కాపాడుకునే క్రమంలో టీమిండియాకు శుభారంభం లభించింది. హార్దిక్‌ పాండ్యా ఫిల్‌ సాల్ట్‌ (5) రూపంలో తొలి వికెట్‌ దక్కించుకోగా.. ప్రధాన పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా హ్యారీ బ్రూక్‌ (7)ను అవుట్‌ చేసి కీలక వికెట్‌ తన ఖాతాలో వేసుకున్నాడు.

బెతెల్‌ విధ్వంసకర శతకం
అయితే, జేకబ్‌ బెతెల్‌ విధ్వంసకర శతకం (48 బంతుల్లో 105)తో విరుచుకుపడి.. భారత శిబిరంలో గుబులు రేపాడు. అయితే, పద్దెనిమిదో ఓవర్లో బుమ్రా కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేసి మ్యాచ్‌ను భారత్‌ వైపు తిప్పాడు. దీంతో ఏడు పరుగుల స్వల్ప తేడాతో గెలిచి టీమిండియా ఊపిరి పీల్చుకుంది.

ఇక ఈ మ్యాచ్‌లో బుమ్రా నాలుగు ఓవర్ల కోటాలో 33 పరుగులు ఇచ్చి ఒక వికెట్‌ కూల్చాడు. ఇదిలా ఉంటే.. బుమ్రా బౌలింగ్‌ వేసేందుకు సిద్ధమవుతున్న క్రమంలో వాంఖడే డీజే బృందం.. ‘‘బూమ్‌ బూమ్‌ బుమ్రా’’ అంటూ బుమ్రా నామస్మరణ చేయాలని ప్రేక్షకులకు పిలుపు ఇచ్చారు. దీంతో అందరూ బుమ్రా పేరును గట్టిగా పలుకుతూ స్టేడియం దద్దరిల్లేలా చేశారు.

బుమ్రా ఏంటి బుమ్రా?
ఈ విషయంపై స్పందిస్తూ భారత మాజీ కెప్టెన్‌, కామెంటేటర్‌ సునిల్‌ గావస్కర్‌ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశాడు. ‘‘బుమ్రా బౌలింగ్‌ చేసేందుకు సిద్ధపడినపుడు.. ‘బూమ్‌ బూమ్‌ బుమ్రా’ అని అరవాలని చెప్పడం సరికాదు.

బుమ్రా నామస్మరణ చేయాలనుకుంటే అతడు ఫ్రీగా ఉన్నపుడు చేయాలి. ఇది వరల్డ్‌కప్‌ అన్న విషయం గుర్తుంచుకోవాలి’’ అని గావస్కర్‌ ఫైర్‌ అయ్యాడు. కాగా కీలక సెమీ ఫైనల్లో బుమ్రా బౌలింగ్‌ చేస్తున్నపుడు.. అతడి ఏకాగ్రత దెబ్బతినేలా ప్రవర్తించడం సరికాదన్నది గావస్కర్‌ అభిప్రాయం.

ఇదిలా ఉంటే.. వెస్టిండీస్‌తో సూపర్‌-8లో టీమిండియా తప్పక గెలవాల్సిన మ్యాచ్‌ సందర్భంగా.. అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ICC) చేసిన ఏర్పాట్లపై కూడా గావస్కర్‌ ఇదే విధంగా స్పందించాడు. మ్యాచ్‌ మధ్యలో లేజర్‌ షో ఏర్పాటు చేయడం ఏమిటని ప్రశ్నించాడు. రవిశాస్త్రి కూడా అతడికి మద్దతు పలికాడు.

చదవండి: T20 WC: అతడి వల్లే ఇదంతా.. మా కొంప మునిగింది అక్కడే: మెకల్లమ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement