ఇంగ్లండ్‌తో సెమీ ఫైనల్లో టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ఆకట్టుకున్నాడు. ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన ఈ కుడిచేతి వాటం ఆటగాడు.. 12 బంతుల్లో మూడు ఫోర్లు, రెండు సిక్సర్లు బాది 27 పరుగులు సాధించాడు. తద్వారా తన మెరుపు ఇన్నింగ్స్‌తో టీమిండియా 250 పరుగులు మార్కు దాటడంలో సహాయపడ్డాడు.
రెండు వికెట్లు
ఇక బంతితోనూ హార్దిక్ పాండ్యా రాణించాడు. ఇంగ్లండ్ ఓపెనర్ ఫిల్ సాల్ట్ (5)తో పాటు ప్రమాదకర ఆటగాడు సామ్ కర్రాన్ (18) వికెట్‌ను కూడా హార్దిక్ పాండ్యా తన ఖాతాలో వేసుకున్నాడు. మొత్తంగా నాలుగు ఓవర్ల కోటా పూర్తి చేసి 38 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు.
ఇదిలా ఉంటే.. ముంబై వేదికగా వాంఖడే మైదానంలో టీమిండియా- ఇంగ్లండ్ మధ్య సెమీ ఫైనల్ మ్యాచ్‌ను వీక్షించేందుకు సెలబ్రిటీలు తరలివచ్చిన విషయం తెలిసిందే. అంబానీ కుటుంబంతో పాటు దిగ్గజ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని దంపతులు సహా బాలీవుడ్ ప్రముఖులు ఈ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా తిలకించారు.
నీతా అంబానీతో కలిసి
ఇక హార్దిక్ పాండ్యా ప్రేయసి మహీక శర్మ కూడా మరోసారి స్టాండ్స్‌లో సందడి చేసింది. నీతా అంబానీతో కలిసి మహీక ఒకే వరుసలో కూర్చుంది. అయితే, ఆమెతో పాటు హార్దిక్ కుమారుడు అగస్త్య ఉండటం విశేషం. తండ్రి బ్యాటింగ్‌ను ఆస్వాదించిన అగస్త్య.. అతడు అవుటైన తీరును మాత్రం తట్టుకోలేకపోయాడు.
ఆ మాత్రం చూసుకోవా?
భారత ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్ ఐదో బంతికి.. విల్‌జాక్స్ బౌలింగ్‌లో హార్దిక్ పాండ్యా పరుగు పూర్తి చేసి రనౌట్ అయ్యాడు. మరో పరుగుకు యత్నిస్తున్న క్రమంలో జేకబ్ బెతెల్ బంతిని అందుకుని వికెట్ల వైపు త్రో చేయగా.. వికెట్ కీపర్ బట్లర్ పని పూర్తిచేశాడు.
దీంతో హార్దిక్ అవుటయ్యాడు. ఈ క్రమంలో ఐదేళ్ల అగస్త్య కోపంతో ఊగిపోయాడు. ‘‘ఛ.. అంత బాగా ఆడి.. ఇంత చెత్తగా అవుటయ్యావేంటి నాన్నా.. ఆ మాత్రం చూసుకోవా?’’ అన్నట్లుగా గట్టిగా అరిచినట్లు కనిపించింది.

ఆమె చేయి పట్టుకుని
ఆ సమయంలో మహీక అగస్త్య భుజాలు పట్టుకుని కూల్ చేసింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇక మ్యాచ్ ముగిసిన అనంతరం మహీక తనతో పాటు అగస్త్యను తీసుకువెళ్లింది. అగస్త్య ఆమె చేయి పట్టుకుని కారు ఎక్కుతున్న వీడియోలు కూడా నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.
Hardik’s Girl Friend Mahieka with His Son Agasthya pic.twitter.com/oJwx1mxUU6
— Ajit Samachar (@SamacharAj10350) March 6, 2026
Hardik Pandya's son Agastya pandya with his dad's girlfriend Mahieka Sharma 😭♥️#INDvsENG pic.twitter.com/5U5DejxvKj
— Chota Don (@choga_don) March 5, 2026
కాగా సెర్బియా మోడల్ నటాషా స్టాంకోవిక్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్న హార్దిక్ పాండ్యాకు.. ఆమె ద్వారా కుమారుడు అగస్త్య కలిగాడు. అయితే, నటషాకు విడాకులు ఇచ్చిన పాండ్యా ప్రస్తుతం మహీకతో ప్రేమలో ఉన్నాడు. ఇక సెమీ ఫైనల్లో ఆఖరి ఓవర్ వరకు ఉత్కంఠ రేపిన మ్యాచ్‌లో ఏడు పరుగుల తేడాతో గెలిచి భారత్ ఫైనల్లో అడుగుపెట్టిన విషయం తెలిసిందే.
చదవండి: T20 WC 2026: ఇంగ్లండ్ ఆటగాళ్లను ఆకాశానికెత్తిన సూర్యకుమార్


