breaking news
Mahieka Sharma
-
వ్యక్తిగత ఫొటోలు షేర్ చేసిన హార్దిక్ పాండ్యా.. రిలేషన్షిప్లో ఉన్నా!
టీమిండియా స్టార్ క్రికెటర్ హార్దిక్ పాండ్యా (Hardik Pandya) మరోసారి ప్రేమలో పడినట్లు తెలుస్తోంది. మహీక శర్మ (Mahieka Sharma) అనే మోడల్‌తో అతడు డేటింగ్ చేస్తున్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. ఇప్పుడు వాటినే నిజం చేస్తూ హార్దిక్ పాండ్యా మహీకతో దిగిన వ్యక్తిగత ఫొటోలను ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేశాడు.చేతిలోన చెయ్యేసిబీచ్ ఒడ్డున నిలబడి మహీకతో కలిసి ప్రకృతిని ఆస్వాదిస్తున్న ఫొటోలతో పాటు.. ఇద్దరూ చేతిలో చేయి వేసుకుని దిగిన బ్లాక్ అండ్ వైట్ ఫొటోలను హార్దిక్ పంచుకున్నాడు. తద్వారా తాను మహీకతో రిలేషన్షిప్లో ఉన్నానని చెప్పకనే చెప్పాడు. ఈ ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి.కాగా హార్దిక్ పాండ్యా శనివారం 32వ వసంతంలోకి అడుగుపెట్టాడు. ఇలా పుట్టినరోజుకు ఒకరోజు ముందే అంటే శుక్రవారమే మహీక శర్మతో కలిసి హార్దిక్ ట్రిప్పునకు వెళ్లినట్లు తెలుస్తోంది. వీరిద్దరు ముంబై ఎయిర్‌పోర్టుకు వచ్చిన దృశ్యాలు నిన్న వైరల్ అయ్యాయి.గతంలో నటాషా స్టాంకోవిక్‌ను ప్రేమించిన హార్దిక్ ఇక హార్దిక్ పాండ్యా షేర్ చేసిన ఫొటోల్లో కుమారుడు అగస్త్యతో కలిసి ఉన్న చిత్రం కూడా ఉండటం విశేషం. కాగా సెర్బియా మోడల్ నటాషా స్టాంకోవిక్‌ను ప్రేమించిన హార్దిక్ పాండ్యా కోవిడ్ సమయంలో ఆమెను పెళ్లి చేసుకున్నాడు. వీరి పెళ్లైన కొన్ని నెలల్లోనే కుమారుడు అగస్త్య జన్మించాడు.విడాకులుఅయితే, 2023, ఫిబ్రవరి 14న హార్దిక్ నటాషాకు ఊహించని బహుమతి ఇచ్చాడు. ఉదయ్‌పూర్‌లో గ్రాండ్ వెడ్డింగ్ ఏర్పాటు చేశాడు. హిందూ- క్రిస్టియన్ సంప్రదాయ పద్ధతుల్లో వీరిద్దరు మరోసారి పెళ్లినాటి ప్రమాణాలు చేశారు. అయితే, గతేడాదే అనూహ్య రీతిలో తాము విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించారు హార్దిక్- నటాషా.ఇప్పుడిలా హార్దిక్ పాండ్యా మరోసారి ప్రేమలో పడ్డాడు. కాగా టీమిండియా తరఫున చివరగా ఆసియా టీ20 కప్-2025 ఆడిన ఈ పేస్ ఆల్‌రౌండర్.. ఈ టోర్నీ సందర్భంగా గాయపడ్డాడు. దీంతో అతడు ఆస్ట్రేలియా పర్యటనకు కూడా దూరమయ్యాడు. ప్రస్తుతం ఇలా వ్యక్తిగత జీవితాన్ని హార్దిక్ పాండ్యా గర్ల్‌ఫ్రెండ్‌తో కలిసి ఎంజాయ్ చేస్తున్నాడు.చదవండి: యువీ తల్లిని పెళ్లి చేసుకుని తప్పు చేశా.. ఆమెను ఇంట్లో పెట్టి తాళం వేసేవాడిని! -
నిజమే!.. ‘ప్రియురాలి’తో హార్దిక్ పాండ్యా.. వీడియో వైరల్
టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ప్రస్తుతం క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు. ఆసియా టీ20 కప్-2025 సందర్భంగా గాయపడిన అతడు.. ఆస్ట్రేలియా పర్యటనకు కూడా దూరమయ్యాడు.ఈ క్రమంలో తనకు దొరికిన విరామ సమయాన్ని హార్దిక్ పాండ్యా ‘ప్రియురాలి’తో గడుపుతున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ బరోడా ఆల్‌రౌండర్ గతంలో నటాషా స్టాంకోవిక్ అనే సెర్బియా మోడల్‌తో ప్రేమలో పడిన విషయం తెలిసిందే. పెళ్లికి ముందే కుమారుడు అగస్త్యకు ప్రాణం పోసిన ఈ జంట.. కోవిడ్ సమయంలో అత్యంత సన్నిహితుల నడుమ దండలు మార్చుకున్నారు.కుమారుడు జన్మించిన మూడేళ్లకు అంటే.. 2023, ఫిబ్రవరి 14న ఉదయ్‌పూర్‌లో హార్దిక్- నటాషా మరోసారి ఘనంగా వివాహం చేసుకున్నారు. హిందూ- క్రిస్టియన్ సంప్రదాయాల ప్రకారం మరోసారి పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. అయితే, ఆ తర్వాత ఏడాదికే విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించి అభిమానులకు షాకిచ్చారు.విడాకులు తర్వాత హార్దిక్- నటాషా కుమారుడు అగస్త్య బాధ్యతను సమంగా పంచుకుంటున్నారు. ఇదిలా ఉంటే.. నటాషాతో విడాకుల తర్వాత హార్దిక్.. సింగర్ జాస్మిన్ వాలియాతో ప్రేమలో పడినట్లు ప్రచారం జరిగింది. అయితే, ఆమెతోనూ కటీఫ్ చెప్పిన హార్దిక్.. మోడల్ మహీక శర్మతో డేటింగ్ చేస్తున్నట్లు ఇటీవల వార్తలు వినిపించాయి.ఇందుకు బలం చేకూరుస్తూ మహీకతో కలిసి ఒకే కారులో ముంబై ఎయిర్‌పోర్టుకు వచ్చిన హార్దిక్.. ఆమె చేయిని పట్టుకుని ముందుకు నడిపించాడు. ఆ సమయంలో ఇద్దరూ నలుపు రంగు వస్త్రాల్లో.. ఒకే రకమైన జాకెట్ ధరించి.. వైట్ షూస్ వేసుకుని ట్విన్నింగ్ లుక్‌తో కనిపించారు.ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్లు.. ‘‘ఇద్దరూ ఒకేలా ఉన్నారే’’ అంటూ ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు. మరికొందరేమో విడాకుల సమయంలో నటాషాను అనవసరంగా తప్పుబట్టామని.. హార్దిక్‌ను వెనకేసుకువచ్చిన వాళ్లు ఇప్పుడు సమాధానం చెప్పాలంటూ కామెంట్లు చేస్తున్నారు.కాగా 2016లో టీమిండియా తరఫున అరంగేట్రం చేసిన 31 ఏళ్ల హార్దిక్ పాండ్యా.. ఇప్పటి వరకు 11 టెస్టులు, 94 వన్డేలు, 120 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. ఈ రైటార్మ్ పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్.. టెస్టుల్లో 532, వన్డేల్లో 1904, టీ20లలో 1860 పరుగులు సాధించడంతో పాటు.. ఆయా ఫార్మాట్లలో 17, 91, 98 వికెట్లు తీశాడు. View this post on Instagram A post shared by Instant Bollywood (@instantbollywood)


