’నా వాడు.. ప్రపంచంలో అందరికంటే లక్కీ గర్ల్‌ నేనే’ | I love my man: Mahieka Sharma Reply to Hardik Pandya goes viral | Sakshi
Sakshi News home page

’నా వాడు.. ప్రపంచంలో అందరికంటే లక్కీ గర్ల్‌ నేనే’

Feb 21 2026 2:25 PM | Updated on Feb 21 2026 2:37 PM

I love my man: Mahieka Sharma Reply to Hardik Pandya goes viral

టీమిండియా స్టార్‌ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా ప్రేమలో మునిగితేలుతున్నాడు. భార్య నటాషా స్టాంకోవిక్‌తో విడిపోయిన ఈ బరోడా క్రికెటర్‌కు మహీక శర్మ రూపంలో కొత్త ప్రేమ దొరికింది. గతేడాది తమ బంధాన్ని బహిర్గతం చేసిన హార్దిక్‌- మహీక అప్పటి నుంచి రొమాంటిక్‌ పోస్టులతో సోషల్‌ మీడియాను నింపేస్తున్నారు.

ప్రస్తుతం హార్దిక్‌ పాండ్యా టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నమెంట్‌తో బిజీగా ఉన్నాడు. ఆల్‌రౌండ్‌ ప్రతిభతో రాణిస్తూ టీమిండియా విజయాల్లో తన వంతు పాత్ర పోషిస్తున్న హార్దిక్‌.. ప్రియురాలు మహీక పుట్టినరోజును ఇటీవల ఘనంగా సెలబ్రేట్‌ చేశాడు.

నా రాజకుమారికి హ్యాపీ బర్త్‌డే
పాకిస్తాన్‌తో మ్యాచ్‌ కోసం తనతో పాటు మహీకను శ్రీలంకకు తీసుకువెళ్లిన హార్దిక్.. అక్కడ ఓ స్విమింగ్‌ పూల్‌లో ప్రియురాలితో సన్నిహితంగా ఉన్న ఫొటోను పంచుకున్నాడు. ‘‘నా రాజకుమారికి హ్యాపీ బర్త్‌డే’’ అంటూ విషెస్‌ తెలిపాడు. ‘‘25 ఏళ్ల క్రితం ఈ ప్రపంచంలోకి వచ్చినందుకు ధన్యవాదాలు.

నాకు తెలిసిన అత్యంత అద్భుతమైన వ్యక్తివి నువ్వే. నిన్ను నేను ప్రేమిస్తూనే ఉంటాను’’ అని హార్దిక్‌ పాండ్యా గర్ల్‌ఫ్రెండ్‌పై ప్రేమను కురిపించాడు. ఇందుకు మహీక శర్మ సైతం తనదైన శైలిలో బదులిచ్చింది. 

నా వాడు.. ప్రపంచంలో అందరికంటే లక్కీ గర్ల్‌ నేనే
హార్దిక్‌తో కలిసి దిగిన ఫొటోలు పంచుకుంటూ.. ‘‘ఐ లవ్‌ మై మ్యాన్‌. నా జీవితంలో ఇప్పటి వరకు ఇదే అత్యుత్తమైన పుట్టినరోజు. థాంక్యూ బేబీ. ఈ ప్రపంచంలో అందరికంటే అదృష్టవంతురాలైన అమ్మాయిని నేనే’’ అంటూ హార్దిక్‌తో దిగిన ఫొటోలను షేర్‌ చేసింది.

కొడుకు సమక్షంలో మరోసారి పెళ్లి
కాగా సెర్బియా మోడల్‌ నటాషాను ప్రేమించిన హార్దిక్‌ పాండ్యా.. 2020లో సన్నిహితుల నడుమ ఆమెను పెళ్లిచేసుకున్నాడు. అప్పటికే నటాషా గర్భవతి. అదే ఏడాది ఈ జంట కుమారుడు అగస్త్యకు జన్మనిచ్చింది. అనంతరం హిందూ, క్రిస్టియన్‌ సంప్రదాయాల్లో ఘనంగా వివాహం చేసుకున్నారు. అయితే, కొంతకాలానికే హఠాత్తుగా విడాకుల బాంబు పేల్చారు. 2025 జూలైలో తాము విడిపోతున్నట్లు ప్రకటించారు.

ఆ తర్వాత కొన్నాళ్లకే మహీకతో 32 ఏళ్ల హార్దిక్‌ తన ప్రేమ బంధాన్ని చాటుకుంటూ విహారయాత్రలలో దిగిన ఫొటోలు షేర్‌ చేయడం మొదలుపెట్టాడు. కాగా మహీక ఫిబ్రవరి 19న 25వ వసంతంలో అడుగుపెట్టింది. ఈ సందర్భంగా ఆమె ధరించిన డ్రెస్‌ ధర అక్షరాలా రెండు లక్షలు ఉండటం గమనార్హం. కాగా మహీక ఓ మోడల్‌ అన్న సంగతి తెలిసిందే. 

చదవండి: ఆయన ముసలోడు!.. వాడికి పెళ్లి వయసు రాలేదు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement