breaking news
India vs Pakistan
-
అసలు సమరానికి సమయం
ఫిబ్రవరి 1...టి20 ప్రపంచకప్‌లో భారత్‌తో మ్యాచ్ ఆడేందుకు నిరాకరించిన పాకిస్తాన్... ఫిబ్రవరి 5...మాకు అవన్నీ తెలీదు...మా కొలంబో ఫ్లయిట్ బుక్ అయిపోయిందన్న సూర్యకుమార్... ఫిబ్రవరి 9...భారత్‌తో మ్యాచ్ ఆడేందుకు మేం సిద్ధమంటూ పాకిస్తాన్ ప్రభుత్వ ప్రకటన... ఫిబ్రవరి 15...భారత్, పాక్ మధ్య కొలంబోలో మ్యాచ్‌కు రంగం సిద్ధం...ప్రపంచకప్‌లో దాయాది జట్ల మధ్య సమరం అంటే ఏ ఫార్మాట్లో అయినా కనిపించే ఆసక్తి, ఉత్సాహమే వేరు...1992 నుంచి అభిమానులు ఇది చూస్తూనే వచ్చారు...ఫలితం ఎలా ఉన్నా, ఏకపక్షంగా సాగినా ఈ మ్యాచ్‌కు ఉండే ఆకర్షణ ఏమాత్రం తగ్గడం లేదు. దీనిపై సాగే సుదీర్ఘ వ్యాఖ్యలు, విశ్లేషణల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇలాంటి స్థితిలో ఇరు జట్ల మధ్య మ్యాచ్ లేదంటే సహజంగానే పెద్ద చర్చే జరిగింది. కానీ ఇప్పుడు అంతా మారిపోయింది...కొలంబో వెళ్లే ఫ్లయిట్ టికెట్ల ధరలు ఆకాశాన్నంటుతుంటే హోటళ్లలో ఎంత డబ్బు ఇచ్చేందుకు సిద్ధమైనా ఖాళీ లేదనే సమాధానం వచ్చేస్తోంది. మైదానంలోనే ఉండి జట్టుకు మద్దతుగా నిలవాలనుకునే వేలాది మంది మాత్రమే కాదు...తమ ఇళ్లనుంచి కన్నార్పకుండా ప్రతీ బంతిని చూసే ఫ్యాన్స్ సంఖ్యకు లెక్కే లేదు. ఈ నేపథ్యంలో మరో వరల్డ్ కప్ పోరుకు ఇరు జట్లు సై అంటున్నాయి. ఇటీవల ఆసియా కప్‌లో 3–0తో పాక్‌పై సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించిన టీమిండియా ఈ సారి ఎలాంటి ప్రదర్శనతో చెలరేగుతుందో చూడాలి. కొలంబో: టి20 వరల్డ్ కప్‌లో మరోసారి తాడోపేడో తేల్చుకునేందుకు భారత్, పాకిస్తాన్ సిద్ధమయ్యాయి. 2012 నుంచి వరుసగా ప్రతీ టి20 వరల్డ్ కప్‌లో తలపడుతున్న ఇరు జట్లు ఈ సారి కూడా తటస్థ వేదికపై తమ సత్తాను పరీక్షించుకోనున్నాయి. ప్రేమదాస స్టేడియంలో నేడు (ఆదివారం) జరిగే గ్రూప్ ‘ఎ’ మ్యాచ్‌లో పాకిస్తాన్‌ను భారత్ ఎదుర్కొంటుంది. రెండు జట్లూ తమ తొలి రెండు మ్యాచ్‌లు గెలిచి జోరు మీదున్నాయి. దాయాదిపై తమ ఆధిక్యాన్ని నిలబెట్టుకునేందుకు అన్ని అస్త్రాలతో టీమిండియా బరిలోకి దిగుతుండగా...ఇటీవలి వరుస ఓటముల తర్వాత ఈ సారైనా గెలిచి బదులు తీర్చుకోవాలని పాక్ భావిస్తోంది. కుల్దీప్కు అవకాశం... భారత బ్యాటింగ్ లైనప్‌కు సంబంధించి ఎలాంటి ఆందోళన లేదు. ఇషాన్ కిషన్, సూర్యకుమార్, పాండ్యా, దూబే తమ దూకుడైన బ్యాటింగ్‌ను ఇప్పటికే ప్రదర్శించారు. రింకూ సింగ్‌కు తగిన అవకాశం రాకపోగా, తిలక్ వర్మ కూడా రెండు సార్లు 25 పరుగులకే పరిమితమయ్యాడు. అయితే వీరిలో ఏ ఇద్దరు చెలరేగినా గత మ్యాచ్ తరహాలో భారీ స్కోరు ఖాయం. సుదీర్ఘ కాలం తర్వాత తన తొలి ప్రపంచ కప్ మ్యాచ్ ఆడే అవకాశం దక్కించుకున్న సామ్సన్ మాత్రం విఫలమయ్యాడు. అభిషేక్ శర్మ అనారోగ్యంనుంచి పూర్తిగా కోలుకుంటే సామ్సన్ స్థానంలో తుది జట్టులోకి వచ్చేస్తాడు. అమెరికాపై డకౌట్ అయిన అభిషేక్ తన స్థాయికి తగినట్లు విజృంభిస్తే పాక్ బౌలర్లకు కష్టాలు తప్పవు. ఒంటిచేత్తో అతను అందించే ఆరంభం భారత్ భారీ స్కోరుకు పునాది అవుతుంది. బౌలింగ్‌కు సంబంధించి తుది జట్టులో కచ్చితంగా మార్పు ఉండవచ్చు. ఇక్కడి పిచ్‌ను బట్టి చూస్తే భారత్ మూడో రెగ్యులర్ స్పిన్నర్‌తో బరిలోకి దిగే అవకాశం ఉంది.ఇప్పటికీ ప్రత్యర్థి బ్యాటర్లకు ‘మిస్టరీ’గానే ఉన్న వరుణ్ చక్రవర్తి, అక్షర్‌లతో పాటు కుల్దీప్ను కూడా ఆడించాలని మేనేజ్మెంట్ భావిస్తోంది. అర్ష్ దీప్ స్థానంలో అతను ఆడతాడు. పాండ్యా, దూబే కూడా బౌలింగ్ భారం పంచుకుంటారు కాబట్టి రెగ్యులర్ పేసర్‌గా బుమ్రాకు మాత్రమే అవకాశం ఉంది. ఇటీవలి ఫామ్, బలాబలాలను చూస్తే పాక్‌కంటే టీమిండియా ఎంతో ముందుంది. బాబర్ ఆజమ్ రాణించేనా... అమెరికాపై భారీ విజయం సాధించిన పాకిస్తాన్ జట్టులో ఎలాంటి మార్పులు లేకపోవచ్చు. పాక్ ఇప్పటికే ఇద్దరు రెగ్యులర్ స్పిన్నర్లు అబ్రార్, తారిఖ్‌లతో పాటు స్పిన్ ఆల్‌రౌండర్లు నవాజ్, షాదాబ్‌లతో ఆడుతోంది. అవసరమైతే అయూబ్ కూడా స్పిన్ బౌలింగ్ చేయగలడు. వీరిలో తారిఖ్ మినహా మిగతా బౌలర్లందరిపై భారత్ గతంలోనే తమ ప్రతాపం చూపించింది. కొత్త తరహా, చర్చనీయాంశమైన యాక్షన్‌తో ఆడే ఆఫ్‌స్పిన్నర్ తారిఖ్ ఏమాత్రం ప్రభావం చూపుతాడనేది ఆసక్తికరం. భారత్ తమ సన్నాహకాల్లో దీనిపై కూడా దృష్టి పెట్టి ఉండవచ్చు. పేసర్ షాహిన్ అఫ్రిది చాలా కాలంగా ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడుతున్నాడు. ఈ సారి కూడా భారత బ్యాటర్లను నిలువరించడం అతనికి కష్టం కావచ్చు. లైనప్‌లో టాప్–4 మాత్రమే రెగ్యులర్ బ్యాటర్లు ఉన్నారు. అయూబ్, కెప్టెన్ ఆగా ఆసియా కప్‌లో భారత్‌పై వరుసగా విఫలమవగా, ఫర్హాన్ ఒక్కడే రాణించాడు. కెప్టెన్ అయిన తర్వాత సల్మాన్ ఇప్పటి వరకు ఏమాత్రం ప్రభావం చూపలేకపోయాడు. తమ జట్టుకు సంబంధించి ఎన్నో ఏళ్లుగా స్టార్ బ్యాటర్‌గా గుర్తింపు తెచ్చుకున్న బాబర్ ఆజమ్ ఒక చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడి చాలా కాలమైంది. అతను తన సత్తాను ప్రదర్శించేందుకు ఇంతకంటే సమయం, వేదిక ఉండవని పాక్ అభిమానులు భావిస్తున్నారు. మేం చక్కటి క్రికెట్ ఆడేందుకే ఇక్కడికి వచ్చాం. అది మాత్రమే ముఖ్యం. మిగతావన్నీ అనవసర విషయాలు. షేక్ హ్యాండ్ ఇచ్చే విషయంపై ఇప్పుడే ఏమీ చెప్పను. మ్యాచ్ ప్రారంభమైనప్పుడే మీరు చూస్తారు. పాక్‌పై పాత రికార్డు ఇక్కడ పనికి రాదు. మళ్లీ సున్నా నుంచి స్కోరు మొదలు పెట్టాల్సిందే’ – సూర్యకుమార్ యాదవ్, భారత కెప్టెన్ 13 భారత్, పాక్ మధ్య ఓవరాల్‌గా 16 మ్యాచ్‌లు జరగ్గా...13 గెలిచిన భారత్ 3 ఓడింది.7-1 టి20 ప్రపంచ కప్‌లో భారత్, పాక్ మధ్య 8 మ్యాచ్‌లు జరగ్గా... భారత్ 7 గెలిచి ఒకటే ఓడింది.తారిఖ్‌పై అందరి దృష్టి... తన వైవిధ్యమైన బౌలింగ్ శైలితో పాక్ ఆఫ్‌స్పిన్నర్ ఉస్మాన్ తారిఖ్ వార్తల్లో నిలిచాడు. ‘చకింగ్’ చేస్తున్నాడంటూ వినిపించినా...రెండు సార్లు అతని యాక్షన్‌కు ఐసీసీ అనుమతి ఇచ్చింది కాబట్టి నిబంధనల ప్రకారం తప్పు లేకపోవచ్చు. పలువురు మాజీ అంపైర్లు కూడా ఇదే చెప్పారు. అయితే బంతి విసిరే ముందు అతను కాస్త ఆగినట్లుగా ఉంటూ (పాజ్) వేయడం చర్చకు దారి తీసింది. ఇది బ్యాటర్‌ను గందరగోళంలో పడేయవచ్చని...బ్యాటర్ కూడా కాస్త జరిగి షాట్ ఆడటమే దీనికి ఉపాయమని అశ్విన్ విశ్లేషించాడు. అయితే తారిఖ్ యాక్షన్ ఎలా ఉన్నా...అతను సాధారణ ఆఫ్‌స్పిన్నర్ మాత్రమేనని, భారత బ్యాటర్లు చెలరేగుతారని మాజీ కెప్టెన్ గంగూలీ అభిప్రాయ పడ్డాడు.పిచ్, వాతావరణం బ్యాటింగ్‌కు అనుకూలమైన పిచ్. అయితే బౌలర్లూ ప్రభావం చూపించగలరు. మ్యాచ్‌కు ముందు రోజు మాత్రమే భారత్ ఇక్కడ సాధన చేసింది. పాక్ జట్టు కొలంబోలోనే ఉన్నా... తమ రెండు మ్యాచ్‌లను ఎస్ఎస్సీ మైదానంలో ఆడింది కాబట్టి తేడా ఉండకపోవచ్చు. అయితే మ్యాచ్‌ను వాన గండం వెంటాడుతోంది. ఆదివారం వర్షం కురిసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. తుది జట్లు (అంచనా): భారత్: సూర్యకుమార్ (కెప్టెన్ ), అభిషేక్, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, పాండ్యా, దూబే, రింకూ, అక్షర్, కుల్దీప్, వరుణ్, బుమ్రా పాకిస్తాన్: సల్మాన్ ఆగా (కెప్టెన్ ), ఫర్హాన్, అయూబ్, బాబర్ ఆజమ్, షాదాబ్, ఉస్మాన్, నవాజ్, ఫహీమ్, షాహిన్ అఫ్రిది, తారిఖ్, అబ్రార్ టి20 ప్రపంచకప్‌లో నేడువెస్టిండీస్ X నేపాల్వేదిక: ముంబై; ఉదయం 11 గంటల నుంచిఅమెరికా X నమీబియావేదిక: చెన్నై; మధ్యాహ్నం 3 గంటల నుంచి -
పాక్‌తో మ్యాచ్.. భారత తుది జట్టు ఇదే! వారిద్దరిపై వేటు
టీ20 ప్రపంచకప్-2026లో టీమిండియా కీలక పోరుకు సిద్దమైంది. ఈ మెగా టోర్నీలో భాగంగా ఆదివారం కొలంబో వేదికగా పాకిస్తాన్‌తో భారత్ తలపడనుంది. ఇప్పటికే ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించి మంచి ఫామ్‌లో ఉన్న టీమిండియా.. అదే జోరును దాయాది జట్టుపై కూడా కొనసాగించాలని భావిస్తోంది.అయితే ఈ హైవోల్టేజ్ కోసం భారత జట్టులో కీలక మార్పులు చోటు చేసుకోనున్నట్లు తెలుస్తోంది. అనారోగ్యం కారణంగా నమీబియాతో మ్యాచ్‌కు దూరమైన విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ.. తిరిగి పాక్‌తో మ్యాచ్‌కు అందుబాటులోకి రానున్నట్లు సమాచారం. ఒకవేళ ఇదే జరిగితే సంజూ శాంసన్‌పై వేటు పడనుంది.గత మ్యాచ్‌లో సంజూకు అవకాశం లభించినప్పటికి సద్వినియోగ పరుచుకోలేకపోయాడు. దూకుడుగా ఆడిన సంజూ 8 బంతుల్లో 22 పరుగులు చేసి ఔటయ్యాడు. అదేవిధంగా కొలంబో పిచ్ స్పిన్‌కు అనుకూలించే అవకాశముండడంతో కుల్దీప్ యాదవ్ తుది జట్టులోకి రానున్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. నమీబియాతో మ్యాచ్‌లో ధారళంగా పరుగులు సమర్పించుకున్న అర్ష్‌దీప్ సింగ్ లేదా రింకూ సింగ్‌లో ఎవరో ఒకరిని పక్కన పెట్టే అవకాశముంది. పాక్‌పై కుల్దీప్ యాదవ్‌కు అద్భుతమైన రికార్డు (3 టీ20ల్లో 8 వికెట్లు) ఉంది. కాబట్టి అతడిని తుది జట్టులోకి తీసుకోవడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. కాగా ఈ మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించే ఛాన్స్ ఉంది.బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా కొలంబోలో ఆదివారం వర్షం కురిసే అవకాశం 90 శాతం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఒకవేళ మ్యాచ్ రద్దు అయితే ఇరు జట్లకు చెరో పాయింట్ దక్కుతుంది.పాక్‌తో మ్యాచ్‌కు భారత తుది జట్టు(అంచనా): సంజు శాంసన్/అభిషేక్ శర్మ,ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, అర్ష్‌దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా -
'అతడితో జాగ్రత్త'.. పాక్‌తో మ్యాచ్‌కు ముందు టీమిండియాకు వార్నింగ్
టీ20 వరల్డ్ కప్ 2026లో భాగంగా ఆదివారం కొలంబో వేదికగా భారత్-పాకిస్తాన్ జట్లు తలపడనున్నాయి. హై-వోల్టేజ్ పోరుకు ముందు టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. పాక్ స్పిన్నర్ ఉస్మాన్ తారిఖ్‌ను తక్కువగా అంచనా వేయవద్దని భారత జట్టును భజ్జీ హెచ్చరించాడు.ఈ హై-వోల్టేజ్ మ్యాచ్‌లో భారత్ గెలుస్తుందని నేను అనుకుంటున్నాను. కానీ పాకిస్తాన్ జట్టులో ఉస్మాన్ తారిక్ లాంటి అద్భుతమైన స్పిన్నర్ ఉన్నాడు. అతడిని భారత బ్యాటర్లు జాగ్రత్తగా ఆడాలి. అయితే మన జట్టుపై పూర్తి నమ్మకం నాకు ఉంది. భారత జట్టు ప్రస్తుతం చాలా పటిష్టంగా ఉంది. టీమిండియా ఎప్పటిలాగే ఎటువంటి ఒత్తిడి లేకుండా ఆడి గెలుపు జెండా ఎగరవేస్తారని ఆశిస్తున్నాము అని ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో భజ్జీ పేర్కొన్నాడు.కాగా ఉస్మాన్ తారిఖ్ తన బౌలింగ్ యాక్షన్‌తో తరచూ వార్తల్లో నిలుస్తున్నాడు. అతడి బౌలింగ్‌ను ఆర్ధం చేసుకునేందుకు బ్యాటర్లు తెగ ఇబ్బంది పడుతున్నారు. బంతిని విసిరే ముందు కొద్దిసేపు ఆగి డెలివరీ చేసే అతడి బౌలింగ్ శైలి కేదార్ జాదవ్‌ను తలపిస్తోంది. అతడి బౌలింగ్ యాక్షన్‌పై వివాదాలు తలెత్తినప్పటికి.. ఐసీసీ మాత్రం క్లియరెన్స్ ఇచ్చింది. తారిఖ్ ఇప్పటివరకు కేవలం 4 టీ20 మ్యాచ్‌లు మాత్రమే ఆడి 11 వికెట్లు పడగొట్టాడు. పాక్ జట్టు కూడా అతడిపైనే గంపెడు ఆశలు పెట్టుకుంది.చదవండి: T20 WC 2026: భారత ఆటగాళ్లతో కరచాలనం చేస్తారా? పాక్ కెప్టెన్ రిప్లై ఇదే -
భారత ఆటగాళ్లతో కరచాలనం చేస్తారా? పాక్ కెప్టెన్ రిప్లై ఇదే
క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారత్-పాక్ పోరుకు సమయం అసన్నమైంది. టీ20 ప్రపంచకప్-2026లో భాగంగా ఆదివారం దాయాది జట్లు తాడోపేడో తెల్చుకోవడానికి సిద్దమయ్యాయి. ఇప్పటికే కొలంబోకు చేరుకున్న ఇరు జట్లు.. శనివారం సాయంత్రం తమ ప్రాక్టీస్ సెషన్ష్‌లలో పాల్గోనున్నాయి.కాగా ఈ హైవోల్టేజ్ మ్యాచ్‌కు ముందు మీడియా సమావేశంలో పాల్గొన్న పాక్ కెప్టెన్ సల్మాన్ అలీ ఆఘా కీలక వ్యాఖ్యలు చేశాడు. ఆసియాకప్‌లో చోటు చేసుకున్న హ్యాండ్ షేక్ వివాదంపై అఘా మాట్లాడాడు. దేశాల మధ్య ఎన్ని ఉద్రిక్తతలు ఉన్నా, మైదానంలో మాత్రం క్రీడా స్పూర్తిని ప్రదర్శించాలని ఆఘా చెప్పుకొచ్చాడు."క్రికెట్ ఎల్లప్పుడూ క్రీడాస్ఫూర్తితోనే ఆడాలి. క్రీడల్లో రాజకీయాలకు తావులేదు. క్రికెట్ ఒక జెంటిల్‌మ్యాన్ గేమ్. ప్రతీ ఒక్కరూ హుందాగా వ్యవహరించాలి" సల్మాన్ పేర్కొన్నాడు. అదేవిధంగా రేపటి మ్యాచ్‌లో భారత్-పాక్ ఆటగాళ్లు కరచాలనం చేసుకుంటారా అన్న ప్రశ్నకు.. "రేపు మీకే తెలుస్తుంది" అని సల్మాన్ సమాధానమిచ్చాడు. టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మ త్వరగా కోలుకోవాలని, రేపటి మ్యాచ్‌లో ఆడాలని తాను కోరుకుంటున్నట్లు అఘా తెలిపాడు.కాగా పెహల్గమ్ ఉగ్రదాడికి నిరసనగా ఆసియాకప్‌లో పాక్ ఆటగాళ్లతో భారత్ కరచాలనం నిరకారించింది. ఆ తర్వాత భారత మహిళల జట్టు, అండర్-19 జట్టు కూడా అదే బాటలో నడిచింది. అప్పటి నుంచి ఇప్పటివరకు ఒక్క మ్యాచ్‌లో పాక్ ప్లేయర్లతో భారత్ హ్యాండ్ షేక్ చేయలేదు. ఇప్పుడు పొట్టి ప్రపంచకప్‌లో కూడా అదే సీన్ రిపీట్ అయ్యే అవకాశముంది. -
కొలంబోకు చేరుకున్న అభిషేక్ తల్లిదండ్రులు.. పాక్‌తో మ్యాచ్‌కు డౌటే
టీ20 ప్రపంచకప్-2026లో కొలంబో వేదికగా ఆదివారం పాకిస్తాన్-భారత్ జట్లు తలపడనున్నాయి. అయితే ఈ మ్యాచ్‌లో టీమిండియా విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ ఆడుతాడా లేదా? అన్నది ఇంకా క్లారిటీ లేదు. కడుపులో ఇన్ఫెక్షన్ కారణంగా అభిషేక్ గత మూడు రోజులుగా ఇబ్బంది పడుతున్నాడు. దీంతో నమీబియాతో మ్యాచ్‌కు దూరమయ్యాడు.అయితే ఆస్పత్రి నుంచి అభిషేక్ డిశ్చార్జ్ అయినప్పటికి ఇంకా పూర్తి ఫిట్నెస్ సాధించికపోయినట్లు తెలుస్తోంది. కానీ అభిషేక్ భారత జట్టుతో కలిసి కొలంబోలో అడుగుపెట్టాడు. అతడు ప్రస్తుతం బీసీసీఐ వైద్య బృందం పర్యవేక్షణలో ఉన్నాడు.కాగా శనివారం (ఫిబ్రవరి 14) సాయంత్రం జరిగే నెట్ సెషన్లో అభిషేక్ పాల్గొనే అవకాశం ఉంది. ఈ ప్రాక్టీస్ తర్వాతే అతను పాకిస్థాన్‌తో మ్యాచ్ ఆడతాడా లేదా అనే దానిపై టీమ్ మేనేజ్మెంట్ ఓ నిర్ణయం తీసుకోనుంది. అయితే అనారోగ్యంతో బాధపడుతున్న అభిషేక్‌ను చూసేందుకు అతడి తల్లిదండ్రులు కొలంబోకు చేరుకున్నారు. ఒకవేళ అభిషేక్ శర్మ పూర్తిగా కోలుకోకపోతే సంజూ శాంసన్ ఓపెనర్‌గా కొనసాగనున్నాడు. -
IND vs PAK: క్రికెట్ అభిమానులకు బ్యాడ్‌న్యూస్!
అవాంతరాలన్నీ తొలగి భారత్- పాకిస్తాన్ మ్యాచ్ నిర్వహణకు మార్గం సుగమమైంది. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) జోక్యంతో దిగివచ్చిన పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) తాము టీమిండియాతో ఆడతామని ప్రకటించింది. ఈ నేపథ్యంలో దాయాదుల పోరును వీక్షించాలని ఉవ్విళ్లూరుతున్న అభిమానులకు ఓ చేదు వార్త.సాంకేతికంగా మ్యాచ్ నిర్వహణకు లైన్ క్లియర్ అయినా.. వాతావరణం ఇందుకు సహకరించేలా కనిపించడం లేదు. కాగా టీ20 ప్రపంచకప్-2026 టోర్నీ ఫిబ్రవరి 7న భారత్- శ్రీలంక వేదికగా మొదలైన విషయం తెలిసిందే.అగ్రస్థానంలో టీమిండియామొత్తంగా ఇరవై జట్లు పాల్గొంటున్న ఈ ఐసీసీ ఈవెంట్లో గ్రూప్-‘ఎ’ నుంచి భారత్, పాకిస్తాన్, అమెరికా, నమీబియా, నెదర్లాండ్స్ పోటీపడుతున్నాయి. ఇందులో భాగంగా టీమిండియా అమెరికా, నమీబియాలపై గెలుపొందగా.. పాక్ జట్టు నెదర్లాండ్స్, అమెరికాలపై జయభేరి మోగించింది.ఫలితంగా గ్రూప్-ఎ నుంచి చెరో రెండు విజయాలతో భారత్- పాక్ తొలి రెండు స్థానాల్లో నిలిచాయి. చెరో నాలుగు పాయింట్లతో సమంగా ఉన్నా.. నెట్ రన్‌రేటు పరంగా భారత్ (+3.050).. పాకిస్తాన్ (+0.932) కంటే అత్యంత పటిష్ట స్థితిలో ఉంది. ఈ నేపథ్యంలో ఇరుజట్లు ఫిబ్రవరి 15న తలపడాల్సి ఉంది.వాన పడే అవకాశంశ్రీలంకలోని కొలంబోలో గల ఆర్.ప్రేమదాస స్టేడియంలో ఆదివారం రాత్రి ఏడు గంటలకు భారత్- పాక్ (IND vs PAK) మధ్య మ్యాచ్ ఆరంభం కానుంది. అయితే, ఈ దాయాదుల పోరుకు వరణుడు ఆటంకం కలిగించే అవకాశం ఉంది. ఆక్యూవెదర్ నివేదిక ప్రకారం.. కొలంబోలో ఆదివారం ఉదయం వర్షం కురిసేందుకు 93 శాతం అవకాశం ఉంది.అంతేకాదు.. 26 శాతం ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం పడేందుకు ఆస్కారం ఉంది. అయితే, సాయంత్రానికి పరిస్థితి మెరుగుపడే అవకాశాలూ కూడా ఉన్నాయి. వాన పడే ఛాన్స్ 13 శాతానికి తగ్గనుందని ఆక్యూవెదర్ వెల్లడించింది.యూటర్న్ తీసుకున్న పాక్ఇక మ్యాచ్ మొదలయ్యే సమయానికి వాన తగ్గే అవకాశం ఉన్నా.. ఒకవేళ రోజంతా వర్షం కురిస్తే అవుట్‌ఫీల్డ్ చిత్తడిగా మారే ప్రమాదం ఉంది. ఇది కూడా మ్యాచ్‌పై ప్రతికూల ప్రభావం చూపే అవకాశాలు లేకపోలేదు. ఇదిలా ఉంటే.. టీ20 ప్రపంచకప్ టోర్నీల్లో ఇప్పటి వరకు పాక్‌తో ఎనిమిది సార్లు ముఖాముఖి తలపడ్డ భారత్ 7-1 (విజయాలు)తో ఆధిపత్యం కొనసాగిస్తోంది. కాగా బంగ్లాదేశ్‌కు మద్దతుగా తాము కూడా టీ20 వరల్డ్‌కప్-2026 బహిష్కరిస్తామంటూ పాక్ తొలుత ప్రగల్బాలు పలికిన విషయం తెలిసిందే. ఆ తర్వాత కేవలం భారత్‌తో మాత్రమే ఆడమంటూ నాటకాలు ఆడగా.. ఐసీసీ రంగంలోకి దిగడంతో యూటర్న్ తీసుకుంది.చదవండి: నిన్ను నాశనం చేస్తా: పాక్ మాజీ క్రికెటర్‌పై భజ్జీ ఆగ్రహం -
పాక్‌తో మ్యాచ్.. టీమిండియాకు గుడ్ న్యూస్!
టీ20 ప్రపంచకప్-2026లో భారత క్రికెట్ జట్టు రసవత్తర పోరుకు సిద్దమైంది. ఈ మెగా టోర్నీలో భాగంగా ఫిబ్రవరి 15న కొలంబో వేదికగా దాయాది పాకిస్తాన్‌తో టీమిండియా తలపడనుంది. ఈ హైవోల్టేజ్ మ్యాచ్‌కు ముందు భారత జట్టుకు ఓ గుడ్ న్యూస్ అందింది. కడుపు ఇన్ఫెక్షన్ కారణంగా నమీబియాతో మ్యాచ్‌కు దూరమైన విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ.. పాక్‌తో పోరు నాటికి పూర్తిగా కోలుకోనున్నట్లు తెలుస్తోంది.అమెరికాతో జరిగిన తొలి మ్యాచ్ తర్వాత అభిషేక్‌కు తీవ్రమైన కడుపు సమస్య రావడంతో న్యూఢిల్లీ ఆసుపత్రిలో చేరాల్సి వచ్చింది. అతడు చికిత్స పూర్తి చేసుకొని బుధవారం ఆసుపత్రి నుంచి డిశ్ఛార్జి అయ్యాడు. అయితే నమీబియాతో మ్యాచ్‌కు ముందు అభిషేక్ ప్రాక్టీస్ కూడా చేశాడంట. ఈ విషయాన్ని భారత స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ధ్రువీకరించాడు.నమీబియాతో మ్యాచ్ అనంతరం వరుణ్ మాట్లాడుతూ.. పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో అభిషేక్ శర్మ ఆడుతాడని నేను అనుకుంటున్నాను. అతడు ప్రస్తుతం బాగానే ఉన్నాడు. ఈ రోజు అతడు ప్రాక్టీస్ కూడా చేశాడు. తాను కోలుకుంటున్నానని, త్వరలోనే పూర్తి ఫిట్నెస్ సాధిస్తానని నాతో చెప్పాడని వరుణ్ అన్నాడు.2 కిలోలు తగ్గిన అభిషేక్అభిషేక్ శర్మ కూడా తన ఫిట్‌నెస్‌పై అప్డేట్ ఇచ్చాడు. కడుపు ఇన్ఫెక్షన్తో బాధపడిన అభిషేక్, చికిత్స సమయంలో రెండు కిలోల బరువు తగ్గినట్లు వెల్లడించాడు. ప్రస్తుతం తాను కేవలం పప్పు అన్నం మాత్రమే తింటున్నానని ఓ వీడియోలో అభిషేక్ పేర్కొన్నాడు. ఒకవేళ పాక్‌తో మ్యాచ్‌కు అభిషేక్ దూరమైతే, భారత ఇన్నింగ్స్‌ను సంజూ శాంసన్, ఇషాన్ కిషన్ ప్రారంభించనున్నారు. -
T20 WC 2026: బాంబు పేల్చిన సూర్యకుమార్ యాదవ్
టీ20 ప్రపంచకప్ 2026లో ఇవాళ (ఫిబ్రవరి 12) భారత్, నమీబియా మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో నమీబియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. టాస్ సందర్భంగా టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఓ బాంబు లాంటి విషయాన్ని చెప్పాడు. కడుపు నొప్పితో బాధపడుతున్న విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ ఇంకా కోలుకోలేదని తెలిపాడు. అభిషేక్ ఒకటి లేదా రెండు మ్యాచ్‌లు మిస్ అయ్యే అవకాశముందని అన్నాడు. ఈ లెక్కన అభిషేక్ నమీబియా మ్యాచ్‌తో పాటు ఫిబ్రవరి 15న పాకిస్తాన్‌తో జరుగబోయే మ్యాచ్‌కు కూడా అందుబాటులో ఉండడని చెప్పకనే చెప్పాడు.యూఎస్ఏ మ్యాచ్ సమయంలో కడుపు నొప్పితో ఇబ్బంది పడిన అభిషేక్.. సమస్య అధికం కావడంతో కొద్ది రోజుల కిందట ఆసుపత్రిలో చేరాడు. నిన్ననే అభిషేక్ డిశ్చార్జ్ అయ్యాడని వార్తలు వచ్చినప్పటికీ.. ఇవాళ టీమిండియా కెప్టెన్ చెప్పిన మాటలను బట్టి చూస్తే అభిషేక్ ఆరోగ్యం ఇంకా కుదుటపడలేదని స్పష్టంగా తెలుస్తుంది. అభిషేక్ పాకిస్తాన్‌తో మ్యాచ్‌కు కూడా దూరమైతే టీమిండయాకు ఎంతోకొంత మైనస్ అవుతుంది. అభిషేక్ ఇటీవలికాలంలో భారత విజయాల్లో అత్యంత కీలకపాత్ర పోషించాడు. అతడు ఇచ్చే మెరుపు ఆరంభాలే మ్యాచ్ ఫలితాన్ని భారత్‌కు అనుకూలంగా మార్చాయి. అలాంటి అభిషేక్ ప్రపంచకప్‌లో కీలక మ్యాచ్‌కు అందుబాటులో ఉండకపోతే ఏమైనా జరిగే అవకాశం ఉంది.కాగా, నమీబియాతో మ్యాచ్‌లో అభిషేక్ శర్మ స్థానంలో సంజూ శాంసన్ జట్టులోకి వచ్చాడు. అలాగే ఈ మ్యాచ్ కోసం భారత్ మరో మార్పు కూడా చేసింది. గత మ్యాచ్‌లో (యూఎస్ఏ) జ్వరం కారణంగా ఆడలేకపోయిన బుమ్రా ఈ మ్యాచ్‌తో తిరిగి వచ్చాడు. సిరాజ్ స్థానంలో అతను బరిలో దిగనున్నాడు.గోల్డెన్ ఛాన్స్‌ను మిస్ చేసుకున్న సంజూఅభిషేక్ కడుపు సమస్యతో బాధపడుతుండటంతో నమీబియా మ్యాచ్‌లో అనూహ్యంగా జట్టులోకి వచ్చిన సంజూ శాంసన్ అందివచ్చిన గోల్డెన్ ఛాన్స్‌ను మిస్ చేసుకున్నాడు. తొలి మూడు బంతులను జాగ్రత్తగా ఆడిన సంజూ.. ఆతర్వాత వరుసగా మూడు సిక్సర్లు, ఓ బౌండరీ కొట్టి ఫామ్‌లోకి వచ్చినట్లు కనిపించాడు. అయితే ఆతర్వాతి బంతికే బౌలర్ బెన్ షికోంగో ఉచ్చులో (స్లో బాల్) చిక్కి వికెట్ సమర్పించుకున్నాడు. మొత్తంగా సంజూ ఈ ఇన్నింగ్స్‌లో 8 బంతులు ఎదుర్కొని 3 సిక్సర్లు, ఓ బౌండరీ సాయంతో 22 పరుగులు చేసి ఔటయ్యాడు. 3 ఓవర్ల తర్వాత భారత్ స్కోర్ వికెట్ నష్టానికి 35 పరుగులుగా ఉంది. ఇషాన్ కిషన్ 11, తిలక్ వర్మ ఒక్క పరుగుతో క్రీజ్‌లో ఉన్నారు.తుది జట్లు..భారత్: సంజు శాంసన్, ఇషాన్ కిషన్(w), తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్(c), హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, రింకూ సింగ్, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చకరవర్తి, జస్ప్రీత్ బుమ్రానమీబియా: లౌరెన్ స్టీన్‌క్యాంప్, జాన్ ఫ్రైలింక్, జాన్ నికోల్ లాఫ్టీ-ఈటన్, గెర్హార్డ్ ఎరాస్మస్(సి), జేజే స్మిట్, జేన్ గ్రీన్(w), రూబెన్ ట్రంపెల్మాన్, మలన్ క్రుగర్, బెర్నార్డ్ స్కోల్ట్జ్, బెన్ షికోంగో, మాక్స్ హీంగో -
IND vs PAK: సిగ్గులేని షోయబ్ మాలిక్!
పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షోయబ్ మాలిక్‌పై టీమిండియా అభిమానులు మండిపడుతున్నారు. ‘ఇంతకు మించి దిగజారవు అనుకున్న ప్రతిసారి.. నీ అసలైన నైజాన్ని బయటపెట్టుకుంటూ మరింత దిగజారుతూనే ఉంటావు.. కాస్తైనా సిగ్గుందా?’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి అబద్ధాలు చెప్పే బదులు ‘అడుక్కుని తినవచ్చు కదా!’ అంటూ ఘాటుగా విమర్శిస్తున్నారు.ఇంతకీ ఏం జరిగిందంటే.. టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో టీమిండియాతో మ్యాచ్ బహిష్కరిస్తామంటూ పాకిస్తాన్ ఓవరాక్షన్ చేసిన సంగతి తెలిసిందే. పాక్ ప్రధాని షెబాజ్ షరీఫ్ స్వయంగా ఇందుకు సంబంధించి ప్రకటన చేశాడు.ఎప్పటిలాగానే పాక్ యూటర్న్అయితే, అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) జోక్యంతో ఎప్పటిలాగానే పాక్ మాట మార్చింది. భారత్‌తో మ్యాచ్ ఆడతామని ప్రకటించింది. దీంతో తమకు యూటర్న్లు తీసుకోవడం మామూలేనని మరోసారి నిరూపించి నవ్వులపాలైంది. కానీ పాక్ మాజీ క్రికెటర్లు మాత్రం కింద పడినా తమదే పైచేయి అన్నట్లు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు.బీసీసీఐ పదే పదే అడిగితేనే..ఇందులో భాగంగా మాజీ కెప్టెన్ షోయబ్ మాలిక్ తాను హోస్ట్‌గా ఉన్న ఓ న్యూస్ ఛానెల్లో ఓ ఫేక్ వీడియో ప్రదర్శించాడు. భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా మాట్లాడినట్లుగా ఓ వీడియో సృష్టించి.. అందులో ఆయన.. "బీసీసీఐ పదే పదే అభ్యర్థించడం వల్ల ఐసీసీ ప్రతినిధి పాకిస్తాన్‌ను టీమిండియాతో మ్యాచ్ ఆడేలా ఒప్పించారు.Pakistani sports show Har Lamha Purjosh hosted by Shoaib Malik, is circulating fake AI video of BCCI VICE PRESIDENT RAJEEV SHUKLA for selling chooran to the Pakistani audience pic.twitter.com/BMLmmD9sUe— Vishal (@Fanpointofviews) February 11, 2026స్పందించిన రాజీవ్ శుక్లాక్రికెట్ మనుగడకు ఇదే సరైన పరిష్కారం’’ అని అన్నట్లుగా AIతో మాయ చేశారు. ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొట్టగా.. రాజీవ్ శుక్లా స్వయంగా స్పందించారు. "పాకిస్తాన్‌తో ప్రపంచకప్ మ్యాచ్ గురించి నేను మాట్లాడినట్లుగా AIతో మాయ చేశారు. నేను అలాంటి వ్యాఖ్యలు చేయలేదు.తప్పుదారి పట్టించే ఈ వీడియోను నమ్మవద్దని ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నా. ఇలాంటి వీడియోలు మీ ఫీడ్‌లోకి వస్తే రిపోర్టు కొట్టేయండి’’ అని రాజీవ్ శుక్లా స్పష్టతనిచ్చారు. కాగా భారత్- పాక్ మ్యాచ్‌కు మార్గం సుగమమైన వేళ.. "ఐసీసీ చైర్మన్ పర్యవేక్షణలో ఐసీసీ ప్రతినిధి సరైన విధంగా స్పందించి లాహోర్‌లో పాకిస్తాన్ బోర్డుతో చర్చలు జరిపారు.#WATCH | Delhi | On Pakistan to play against India at T20 cricket World Cup, BCCI Vice-President Rajeev Shukla says, "I am delighted to see the outcome of the deliberations initiated by ICC representative, supervised by the ICC Chairman and the representatives who had gone to… pic.twitter.com/3x9xSDyGMB— ANI (@ANI) February 10, 2026 ఎందుకిలా?బంగ్లాదేశ్ బోర్డుతోనూ మాట్లాడి మంచి పరిష్కారం కనుగొన్నారు. క్రికెట్ ప్రాధాన్యం, మనుగడకు ఇలాంటి నిర్ణయం సముచితమైనది’’ అని రాజీశ్ శుక్లా పేర్కొన్నారు. అయితే, షోయబ్ మాలిక్ మాత్రం తప్పుడు వీడియోను ప్రదర్శిస్తూ బీసీసీఐ అడుక్కునందు వల్లే పాక్ వారితో మ్యాచ్ ఆడేందుకు ఒప్పుకొందనే అర్థం వచ్చేలా దిగజారుడు వైఖరి ప్రదర్శించాడు. కాగా కొలంబో వేదికగా భారత్- పాక్ మ్యాచ్ ఫిబ్రవరి 15న జరుగనుంది.కాగా భారత టెన్నిస్ దిగ్గజం సానియా మీర్జా షోయబ్ మాలిక్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే, సానియాతో ఉంటూనే నటి, వివాహిత సనా జావెద్‌తో మాలిక్ "బంధం’’ కొనసాగించాడు. ఈ క్రమంలో సానియా అతడికి విడాకులు ఇవ్వగా.. సనా సైతం భర్తకు విడాకులు ఇచ్చి మాలిక్‌ను పెళ్లి చేసుకుంది.చదవండి: ENG vs WI: నేపాల్ మీదైనా గెలిచాం.. సంతోషం: హ్యారీ బ్రూక్ -
అది లీగల్: పాక్ స్పిన్నర్‌కు అశ్విన్ మద్దతు
పాకిస్తాన్ స్పిన్నర్ ఉస్మాన్ తారిఖ్‌కు టీమిండియా స్పిన్ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్ అండగా నిలిచాడు. అతడి బౌలింగ్ యాక్షన్‌ను పెద్దగా తప్పుబట్టాల్సిన పనిలేదన్నాడు. క్రీజు వద్ద కాస్త ఆగి బంతిని రిలీజ్ చేయడంలో తప్పులేదని.. అది అతడి సహజ శైలి అని మద్దతుగా నిలిచాడు.పాకిస్తాన్ తరఫున గతేడాది అరంగేట్రం చేసిన ఉస్మాన్ తారిఖ్ రైటార్మ్ ఆఫ్ బ్రేక్ స్పిన్నర్. టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో ఆడే పాక్ జట్టులో చోటు దక్కించుకున్న అతడు.. మంగళవారం అమెరికాతో మ్యాచ్‌లో పాల్గొన్నాడు. కొలంబో వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో ఉస్మాన్ తారిఖ్ నాలుగు ఓవర్ల కోటా పూర్తి చేసి 27 పరుగులే ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు.అయితే, ఉస్మాన్ ప్రదర్శన కన్నా అతడి బౌలింగ్ యాక్షన్ తీరే నెట్టింట వైరల్‌గా మారింది. సందేహాస్పద రీతిలో అతడు బౌలింగ్ చేశాడంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత క్రికెటర్ శ్రీవత్స్ గోస్వామి ఘాటుగా స్పందించాడు.ఇది కొనసాగకూడదు‘‘పెనాల్టీ రన్ అప్ సమయంలో ఫుట్‌బాల్‌లో కూడా ఇలాంటివి అనుమతించరు. అతడి బౌలింగ్ యాక్షన్ ఏవిధంగా సమంజసం? సరే సరిగ్గానే బౌలింగ్ చేశాడనుకుందాం. మరి పాజ్ (కాసేపు ఆగడం) ఎందుకు ఇచ్చినట్లు? అది కూడా బంతిని రిలీజ్ చేసే సమయంలో ఇలా ఎందుకు చేశాడు? ఇది కొనసాగకూడదు’’ అని శ్రీవత్స్.. ఉస్మాన్ బౌలింగ్ చేస్తున్న దృశ్యాన్ని పంచుకున్నాడు. బౌలర్ మీదే ఆంక్షలు ఎందుకు?ఇందుకు అశ్విన్ స్పందిస్తూ.. ‘‘నిజమే.. ఫుట్‌బాల్‌లో కూడా ఇలాంటివి అనుమతించరు. మరి ఓ బ్యాటర్ స్విట్ హిట్ లేదంటే రివర్స్ షాట్ ఆడుతున్నపుడు అంపైర్ లేదంటే బౌలర్‌కు సమాచారం ఇవ్వకుండానే షాట్లు ఆడతారు కదా.అలాంటపుడు బ్యాటర్ మీద లేని ఆంక్షలు బౌలర్ మీదే ఎందుకు? నిజం చెప్పాలంటే బౌలర్ తన చేతివాటాన్ని మార్చే ముందు కచ్చితంగా అంపైర్‌కు సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. ఈ నిబంధనను తొలుత మార్చాలి.ఏదేమైనా ఉస్మాన్ బౌలింగ్ యాక్షన్ చట్టబద్ధమా? కాదా? అన్నది ఐసీసీ బౌలింగ్ యాక్షన్ టెస్టింగ్ సెంటర్లో మాత్రమే తేలుతుంది. అక్కడ మాత్రమే అతడిని పరీక్షించే అవకాశం ఉంటుంది.అతడి సహజశైలి కాబట్టి లీగలేనిబంధన ప్రకారం.. మోచేయిని నిటారుగా చేసి బంతిని రిలీజ్ చేయాలి. అయితే, అతడు బంతిని విసురుతున్నాడా? లేదంటే సరిగ్గానే బౌలింగ్ చేస్తున్నాడా అన్నది ఆన్‌ఫీల్డ్ అంపైర్ నిర్ధారించడం అసాధ్యం.ఈ సమస్యకు పరిష్కారం దొరకాలంటే మ్యాచ్ జరుగుతున్నపుడు రియల్‌టైమ్ టెస్టింగ్ టూల్‌ను వాడాలి. కానీ ఇక్కడ సరైన ఆధారం లేకుండా ఒకరిని నిందించడం తప్పు. ఏదేమైనా క్రీజులోకి వచ్చాక అలా పాజ్ ఇవ్వడం చట్టబద్ధమో కాదో చెప్పలేము. అయితే, అది అతడి సహజశైలి కాబట్టి లీగలే అని నేను నమ్ముతాను’’ అంటూ అశ్విన్ బదులిచ్చాడు.ఈ నేపథ్యంలో శ్రీవత్స్‌కు మద్దతుగా.. అశ్విన్‌ను వ్యతిరేకిస్తూ టీమిండియా అభిమానులు విమర్శిస్తున్నారు. ఉస్మాన్ బౌలింగ్ చేయకుండా బంతిని విసురుతున్న తీరు కనిపిస్తుంటే అశూ.. అతడికి మద్దతునివ్వడం ఏమాత్రం బాగాలేదంటూ ట్రోల్ చేస్తున్నారు.చదవండి: ఛీ.. ఇదేం బుద్ధి?.. ఊహించని ట్విస్ట్ ఇచ్చిన బంగ్లాదేశ్Agree football doesn’t allow it!While the batter can be allowed to switch hit or reverse without informing the umpire or bowler, after him/her commits to start batting on one side, why are the restrictions only limited to the bowler?In fact the bowler isn’t allowed to change… https://t.co/AOV4OKhwcL— Ashwin 🇮🇳 (@ashwinravi99) February 11, 2026 -
పాక్ ఫ్యాన్స్‌కు షాకిచ్చిన శ్రీలంక క్రికెటర్
శ్రీలంక క్రికెటర్ భనుక రాజపక్స వార్తల్లోకెక్కాడు. గతేడాది నవంబరులో చివరగా అంతర్జాతీయ క్రికెట్ ఆడాడు ఈ లెఫ్టాండర్. పేలవ ప్రదర్శనల కారణంగా టీ20 ప్రపంచకప్-2026 శ్రీలంక జట్టులో అతడు చోటు దక్కించుకోలేకపోయాడు.అదనంగా ఓ రబ్బరు పొర అయితే, ఆటతో కాకుండా భారత బ్యాటర్ల గురించి చేసిన వ్యాఖ్యల కారణంగా భనుక రాజపక్స పేరు తెరమీదకు వచ్చింది. స్థానిక మీడియాతో మాట్లాడుతూ.. టీమిండియా ఆటగాళ్లు వాడే బ్యాట్లు మిగతా జట్లు వాడే బ్యాట్ల కంటే ఎంతో మిన్నగా ఉంటాయని అన్నాడు. వారి బ్యాట్లపై అదనంగా ఓ రబ్బరు పొర కూడా ఉంటుందని పేర్కొన్నాడు.ఈ నేపథ్యంలో భనుక రాజపక్స వ్యాఖ్యలను వక్రీకరిస్తూ పాకిస్తాన్ జట్టు అభిమానులు నెట్టింట రచ్చ చేశారు. భారత బ్యాటర్ల ఆటను కించపరిచేలా పోస్టులు పెట్టారు. దీంతో భనుక రాజపక్స స్పందించాడు.ప్రశంసించాలని అనుకున్నాతన మాటల్ని వక్రీకరించి ఇష్టారీతిన ప్రచారం చేయడం సరికాదని హితవు పలికాడు. ‘‘అందరికీ హాయ్. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో నేను చేసిన వ్యాఖ్యలను కొంతమంది వక్రీకరించారు. వారు తోచిన విధంగా మలచుకుని ప్రచారం చేస్తున్నారు. బహుశా అనువాదం చేయడంలో వారు పొరపడి ఉంటారు.నేను భారత బ్యాటర్లను ప్రశంసించే క్రమంలో చేసిన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారు. భారత క్రికెట్ ఎంతో అభివృద్ధి చెందింది. వారి వద్ద అడ్వాన్స్డ్ సిస్టమ్స్, మౌలిక సదుపాయాలు, అత్యున్నత ప్రమాణాలు కలిగిన క్రికెట్ పరికరాలు ఉన్నాయి.ముఖ్యంగా టీమిండియా క్రికెటర్ల కోసం బ్యాట్లు తయారుచేసే మ్యాన్‌ఫ్యాక్చరర్స్ ప్రపంచంలోనే అత్యుత్తమైన వారు. ఈ విషయంలో స్పష్టత వచ్చిందనే అనుకుంటున్నా.కౌంటర్ అదుర్స్నాకు వారి పట్ల గౌరవం తప్ప ఇంకేమీ లేదు’’ అని భనుక రాజపక్స సోషల్ మీడియా వేదికగా క్లారిటీ ఇచ్చాడు. దీంతో షాకవ్వడం పాక్ ఫ్యాన్స్ వంతైంది. మరోవైపు.. టీమిండియా అభిమానులు సైతం ఈ విషయంపై స్పందిస్తున్నారు. తన వ్యాఖ్యల్ని వక్రీకరించిన వారికి భనుక రాజపక్స మంచి కౌంటర్ ఇచ్చాడని పేర్కొంటున్నారు.కాగా టీ20 ప్రపంచకప్-2026 టోర్నీకి భారత్‌తో కలిసి శ్రీలంక ఆతిథ్యం ఇస్తోంది. ఇదిలా ఉంటే.. భనుక రాజపక్స తన కెరీర్లో 5 వన్డేలు, 45 టీ20 ఆడాడు. 34 ఏళ్ల ఈ వికెట్ కీపర్ బ్యాటర్ ఖాతాలో 89 వన్డే, 744 టీ20 పరుగులు ఉన్నాయి.చదవండి: T20 WC: టీమిండియాకు భారీ షాక్!.. ఈసారి.. -
ICC భయపడింది.. మాదే పైచేయి: బుద్ధి చూపించిన పాక్
భారత మాజీ క్రికెటర్లు ముందు నుంచి చెప్పినట్లుగానే పాకిస్తాన్ యూటర్న్ తీసుకుంది. టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో టీమిండియాతో మ్యాచ్ ఆడతామని ప్రకటించింది. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) జోక్యంతో విధిలేని పరిస్థితుల్లో ఇందుకు అంగీకరించింది.అయితే, కిందపడినా తమదే పైచేయి అన్నట్లుగా పాక్ ప్రగల్బాలు పలుకుతోంది. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) మాజీ చైర్మన్ నజామ్ సేథి వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం. తమ ముందు ఐసీసీ చిన్నబోయిందని.. వెనక్కి తగ్గి తమతో రాజీకి వచ్చిందని అతడు సంచలన వ్యాఖ్యలు చేశాడు.ఐసీసీ భయపడింది.. అందుకే రాజీ‘‘ఈ విషయంలో ఐసీసీ వెనకడుగు వేసింది. అందుకే పాక్ చెప్పినట్లుగా బంగ్లాదేశ్ పట్ల సానుకూలంగా స్పందించింది. పాకిస్తాన్ బంగ్లాకు మద్దతుగా గొప్ప నిర్ణయం తీసుకుంది. అన్ని కోణాల్లోనూ ఆలోచించిన తర్వాతే.. భారత్‌తో మ్యాచ్ బహిష్కరిస్తే తమపై ఐసీసీ ఆంక్షలు విధించలేదని తెలుసుకున్న పాక్ ఇంటాబయటా లాయర్లను సంప్రదించి బాయ్‌కాట్ చేయాలనే నిర్ణయానికి వచ్చింది.ఐసీసీకి కూడా తాము ఈ విషయంలో ఏమీ చేయలేమని తెలుసు. అందుకే ఐసీసీ డిప్యూటీ చైర్మన్ ఇమ్రాన్ ఖవాజా రంగంలోకి దిగారు. పాకిస్తాన్ భారత్‌తో మ్యాచ్ ఆడాలని కోరారు. అలా పాకిస్తాన్ వల్ల బంగ్లాదేశ్‌కు కూడా న్యాయం జరిగింది.ఐసీసీ మీద ఆధాపడే స్థితిలో లేముమిగతా అన్ని బోర్డుల మాదిరే గతంలో పాక్ కూడా ఐసీసీ మీద ఆధారపడేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. పాకిస్తాన్ సూపర్ లీగ్ గ్రాండ్ సక్సెస్ అయింది. ఐసీసీ నుంచి వచ్చే ఆదాయం కంటే ఈ లీగ్ నుంచే ఎక్కువ డబ్బు వస్తోంది. కాబట్టి పాక్ తన సొంత వనరులపైనే ఆధారపడుతోంది.కాబట్టి ఐసీసీ చెప్పినట్లు వినాల్సిన పనిలేదు. మార్చిలో పాకిస్తాన్‌కు అనుకూలంగా మరిన్ని నిర్ణయాలు వచ్చే అవకాశం ఉంది’’ అని నజామ్ సేథి సంచలన వ్యాఖ్యలు చేశాడు. కాగా పాకిస్తాన్‌కు ప్రధానంగా ఆదాయం ఐసీసీ నుంచే వస్తోంది.అన్నివైపులా ఒత్తిడి అంతేకాదు.. పీఎస్ఎల్లో అంతర్జాతీయ క్రికెటర్లు ఆడాలన్నా ఆయా సభ్య దేశాల బోర్డుల అనుమతి తప్పనిసరి. ఒకవేళ పాక్ భారత్‌తో మ్యాచ్ బహిష్కరిస్తే.. సభ్య దేశాలు పాక్ లీగ్‌లో ఆడే క్రికెటర్లకు నో ఆబ్జక్షన్ లెటర్ ఇవ్వకుండా ఆపే అవకాశం ఉందని హెచ్చరించినట్లు వార్తలు వచ్చాయి.అదే విధంగా.. శ్రీలంక క్రికెట్ బోర్డు సైతం పాక్‌లో తమపై జరిగిన ఉగ్రదాడిని గుర్తు చేస్తూ లేఖ రాసింది. అయినా సరే తాము పాక్‌తో క్రికెట్ సంబంధాలు కొనసాగిస్తున్న తీరును ప్రస్తావించింది. యూఏఈ, బంగ్లాదేశ్ కూడా పాకిస్తాన్‌కు భారత్‌తో ఆడాలని విజ్ఞప్తి చేశాయి. అన్నింటికీ మించి గత్యంతరం లేకే భారత్‌తో ఆడలేమని పాక్ లేవనెత్తిన అంశం సబబుగా లేదు కాబట్టి.. ఐసీసీ కఠిన చర్యలకు ఉపక్రమించే పరిస్థితి వచ్చింది.మొదటికే మోసం వస్తుందనే భయంఇలాంటి పరిస్థితుల్లో వెనక్కి తగ్గిన పాక్.. అయినా సరే తామే గొప్ప అంటూ ఇలా మరోసారి తమ వక్రబుద్ధిని చాటుకుంది. కాగా టీ20 ప్రపంచకప్-2026 టోర్నీకి భారత్ ఆతిథ్యం ఇస్తుండగా.. పాక్ కోసం తటస్థ వేదికగా శ్రీలంకను ఏర్పాటు చేసింది ఐసీసీ. అయితే, బంగ్లాదేశ్ కూడా తాము భారత్‌లో కాకుండా శ్రీలంకలో ఆడతామని పట్టుబట్టింది.ఇందుకు ఐసీసీ నిరాకరించగా.. తాము టోర్నీలో ఆడలేమని బంగ్లాదేశ్ తప్పుకొంది. దీంతో మధ్యలోకి వచ్చిన పాక్.. తాము కూడా బంగ్లాకు మద్దతుగా టోర్నీ ఆడమని తొలుత సంకేతాలు ఇచ్చి బెదిరింపులకు దిగింది. ఐసీసీ కఠిన చర్యలు తీసుకుంటుందనే ఉద్దేశంతో భారత్‌తో మ్యాచ్ మాత్రమే ఆడమని నాటకాలు ఆడింది.అయితే, ఈ మ్యాచ్ జరుగకపోతే సభ్య దేశాలు ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం ఉన్నందున ఐసీసీ పాక్‌కు మరో అవకాశం ఇచ్చింది. లాహోర్‌లో పీసీబీతో చర్చలు జరిపింది. ఈ సందర్భంగా పాక్ గొంతెమ్మ కోరికలను తిరస్కరించిన ఐసీసీ.. బంగ్లాదేశ్ విషయంలో తాము ముందుగానే నిర్ణయించుకున్నట్లుగా ఆంక్షలు, పెనాల్టీలు విధించబోమని ప్రకటించింది.చదవండి: T20 WC: టీమిండియాకు భారీ షాక్!.. ఈసారి.. -
IND vs PAK: థాంక్యూ.. బీసీసీఐ రియాక్షన్ వైరల్
టీ20 ప్రపంచకప్-2026 టోర్నమెంట్లో భారత్- పాకిస్తాన్ మ్యాచ్ యథావిధిగా జరుగనుంది. కొలంబో వేదికగా ఫిబ్రవరి 15న దాయాదులు ముఖాముఖి పోరులో తలపడేందుకు పాక్ ప్రభుత్వం అంగీకారం తెలిపింది. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) జోక్యంతో టీమిండియాతో మ్యాచ్ బహిష్కరిస్తామన్న పాకిస్తాన్ తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది.థాంక్యూ చెబుతున్నాఈ నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) స్పందించిన తీరు వైరల్‌గా మారింది. బీసీసీఐ తరఫున ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా మంగళవారం విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ‘‘ఐసీసీ చైర్మన్ (జై షా), ఆఫీస్ బేరర్లకు ధన్యవాదాలు తెలుపుకొంటున్నాం. ఈ సమస్యకు సరైన పరిష్కారం వెదికినందుకు బీసీసీఐ తరఫున నేను ఐసీసీకి థాంక్యూ చెబుతున్నా.అతిపెద్ద విజయం ఇదిపాకిస్తాన్ క్రికెట్ బోర్డు, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డులతో చర్చించి.. అన్ని వర్గాల వాదనలు విని ఐసీసీ సమస్యను పరిష్కరించింది. క్రికెట్ మనుగడలో ఇది అత్యంత కీలక నిర్ణయం. ఆట కొనసాగుతూనే ఉండాలి. ప్రపంచకప్ విజయవంతం కావాలి. ఐసీసీ సాధించిన అతిపెద్ద విజయం ఇది.బంగ్లాదేశ్ బోర్డు కూడా ఐసీసీని ప్రశంసించింది. ప్రతి ఒక్కరి ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే ఐసీసీ ఈ నిర్ణయం తీసుకుంది. అంతిమంగా క్రికెట్ ఒక్కటే అందరికీ ముఖ్యమైనది. ముఖ్యంగా అంతర్జాతీయ క్రికెట్ సజావుగా సాగాలి’’ అని రాజీవ్ శుక్లా ఐసీసీకి ధన్యవాదాలు తెలిపారు.భద్రతా కారణాలు చూపుతూ బంగ్లాకాగా వరల్డ్‌కప్ టోర్నీకి భారత్- శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న విషయం తెలిసిందే. ఫిబ్రవరి 7న మొదలైన ఈ టోర్నీ నుంచి భద్రతా కారణాలు చూపుతూ బంగ్లాదేశ్ తప్పుకొంది. భారత్‌లో తాము మ్యాచ్‌లు ఆడలేమంటూ ఈ నిర్ణయం తీసుకుంది. శ్రీలంకలో తమను ఆడించాలన్న అభ్యర్థనను తిరస్కరించడంతో టోర్నీ నుంచి వైదొలిగింది.మధ్యలో ఎంటరైన పాక్ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్‌కు మద్దతుగా పాకిస్తాన్ సైతం తాము టోర్నీ ఆడమని తొలుత సంకేతాలు ఇచ్చి.. ఆ తర్వాత మాట మార్చింది. కేవలం టీమిండియాతో మ్యాచ్‌ను మాత్రమే బహిష్కరిస్తామని పాక్ ప్రభుత్వం ప్రకటించింది. క్రికెట్ ప్రపంచంలో అత్యంత క్రేజ్ ఉన్న ఈ మ్యాచ్ జరుగకపోతే ఐసీసీకి భారీ ఆర్థిక నష్టం సంభవించే ప్రమాదం ఉంది.ఈ ప్రభావం బంగ్లా, పాక్‌లతో పాటు అన్ని సభ్య దేశాల మీదా పడుతుంది. ఈ నేపథ్యంలో లాహోర్‌లో పాక్, బంగ్లా బోర్డు అధికారులతో చర్చలు జరిపిన ఐసీసీ బృందం.. పాక్ భారత్‌తో మ్యాచ్ ఆడేలా ఒప్పించింది. ఎప్పటిలాగే ముందు నుంచి మేకపోతు గాంభీర్యం ప్రదర్శించిన పాక్.. యూటర్న్ తీసుకుని టీమిండియాతో మ్యాచ్ ఆడేందుకు సిద్ధమైంది.చదవండి: IND vs PAK: పాక్ యూటర్న్.. స్పందించిన ఐసీసీ -
IND vs PAK: పాక్ యూటర్న్.. స్పందించిన ఐసీసీ
ఐసీసీ టీ20 ప్రపంచకప్-2026 టోర్నమెంట్లో భారత్- పాకిస్తాన్ మ్యాచ్ నిర్వహణకు మార్గం సుగమమైంది. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC)- పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) మధ్య చర్చలు సఫలమయ్యాయి. ఫలితంగా ఫిబ్రవరి 15న కొలంబో వేదికగా దాయాదులు తలపడటం ఖాయమైంది.ఐసీసీ అధికారిక ప్రకటనఇందుకు సంబంధించి ఐసీసీ అధికారిక ప్రకటన విడుదల చేసింది. “ఐసీసీ, పీసీబీ మధ్య చర్చలు సఫలమయ్యాయి. నిర్మాణాత్మక ఒప్పందాలు, ఐకమత్యంగా ముందుకు సాగటం, క్రికెట్ అత్యుత్త ప్రయోజనాలు.. సమగ్రత, నిబద్ధత, పరస్పర సహకారం.. తదితర అంశాల ఆవశ్యకతను గుర్తించిన ఇరుపక్షాల మధ్య ఏకాభిప్రాయం కుదిరింది.టీ20 ప్రపంచకప్-2026 టోర్నమెంట్‌ను విజయవంతంగా పూర్తి చేసేందుకు.. ఐసీసీ ఈవెంట్లలో పాల్గొనే నిబంధనల పట్ల అన్ని బోర్డులు గౌరవభావంతో ఉన్నాయి. క్రికెట్ స్ఫూర్తితో ముందుకు సాగాలని సభ్య దేశాలు నిర్ణయించాయి. ఇక బంగ్లాదేశ్ విషయంలోనూ మా వైఖరి మారలేదు.ఎలాంటి ప్రభావం ఉండదు200 మిలియన్లకు పైగా క్రికెట్ అభిమానులు ఉన్న పెద్ద మార్కెట్లో ఆట అభివృద్ధికి ఐసీసీ కట్టుబడి ఉందని పునరుద్ఘాటిస్తున్నాం. ఐసీసీ టీ20 ప్రపంచకప్-2026 టోర్నమెంట్ నుంచి తప్పుకొన్నందుకు ఆ జట్టుపై దీర్ఘకాలంలో ఎలాంటి ప్రభావం ఉండదని హామీ ఇస్తున్నాం.తగిన ప్రమాణాలు పాటిస్తేనే బంగ్లాకు ఆ ఛాన్స్‌అదే విధంగా బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుకు ఎలాంటి పెనాల్టీలు విధించడం లేదు. అంతేకాదు.. ఐసీసీ ఈవెంట్ల ఆతిథ్య ప్రక్రియ, అందుకు తగిన ప్రమాణాలు కలిగి ఉంటే.. తప్పక 2031 పురుషుల క్రికెట్ వరల్డ్‌కప్ కంటే ముందు జరిగే ఐసీసీ టోర్నీకి వేదికగా బంగ్లాదేశ్‌కు అవకాశం ఉంటుంది’’ అని ఐసీసీ తన ప్రకటనలో పేర్కొంది.పాక్ ఓవరాక్షన్కాగా డిఫెండింగ్ చాంపియన్ హోదాలో భారత్ వరల్డ్‌కప్ టోర్నీ-2026కు ఆతిథ్యం ఇస్తుండగా.. పాకిస్తాన్ తమ మ్యాచ్‌లన్నీ శ్రీలంకలో ఆడేలా ఒప్పందం కుదిరింది. అయితే, బంగ్లాదేశ్‌కు మద్దతుగా తాము భారత్‌తో మ్యాచ్ బహిష్కరిస్తామని పాక్ బెదిరింపులకు దిగింది. దీంతో ఐసీసీ- పీసీబీతో చర్చలు జరుపగా యూటర్న్ తీసుకుని.. టీమిండియాతో ఆడేందుకు అంగీకరించింది.ఇదిలా ఉంటే.. భారత్- బంగ్లాదేశ్ మధ్య కొన్నాళ్లుగా దౌత్యపరమైన ఉద్రిక్తతలు నెలకొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఐపీఎల్ నుంచి బంగ్లా ఫాస్ట్‌బౌలర్ ముస్తాఫిజుర్ రెహమాన్‌ను బీసీసీఐ విడుదల చేసింది. దీంతో భారత్‌లో తాము వరల్డ్‌కప్ ఆడము అని.. శ్రీలంకలో తమకు ఆడే అవకాశం ఇవ్వాలని బంగ్లా ఐసీసీని కోరింది. అయితే, బంగ్లాదేశ్ వాదనలో నిజం లేదని కొట్టిపారేసిన ఐసీసీ.. మరోసారి ఆలోచించాలని సూచించింది.ఫైనల్‌గా యూటర్న్కానీ తమ ప్రభుత్వం నిర్ణయం మేరకు టోర్నీ నుంచి తప్పుకొనేందుకైనా సిద్ధమని బంగ్లాదేశ్ చెప్పగా.. ఐసీసీ సరేనంది. బంగ్లా స్థానంలో స్కాట్లాండ్ను చేర్చించింది. ఈ విషయంలో ఓవరాక్షన్ చేసిన పీసీబీ భారత్‌తో మ్యాచ్ బహిష్కరణ అని కొత్తరాగం ఎత్తుకుంది. అయితే, శ్రీలంక, యూఏఈ, బంగ్లా బోర్డులు భారత్- పాక్ మ్యాచ్ జరుగకపోతే ఆర్థికంగా భారీగా నష్టపోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తూ లేఖలు రాశాయి. ఐసీసీ సైతం ఈ విషయంలో గట్టిగానే నిలబడింది. దీంతో పాక్ మాట మార్చి భారత్‌తో ఆడేందుకు అంగీకరించింది. చదవండి: పాక్ కోసం బంగ్లాను ఒప్పించారా?: నీళ్లు నమిలిన పీసీబీ చీఫ్ -
పాక్ యూటర్న్.. భారత్ తో పోరుకు సిద్ధం
-
T20 WC 2026: బీసీసీఐ కీలక నిర్ణయం
భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆటగాళ్లతో కుటుంబాలను అనుమతించకూడదన్న నిబంధనకు కట్టుబడి ఉండాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.గతంలో అనుమతికాగా నలభై ఐదు రోజుల్లోపు విదేశీ పర్యటనలో భాగంగా క్రికెటర్లు, సహాయక సిబ్బంది తమ కుటుంబ సభ్యులను వారం రోజుల పాటు అక్కడే ఉండేలా బీసీసీఐ గతంలో అనుమతించేది. అయితే, ఆస్ట్రేలియా పర్యటనలో దారుణ ప్రదర్శనతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో ఆసీస్ చేతిలో 3-1తో టీమిండియా ఓడిపోవడంతో బీసీసీఐ కఠిన నిర్ణయం తీసుకుంది.కొంతమంది ఆటగాళ్లు కుటుంబానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ కొన్నిసార్లు సమావేశాలకు కూడా డుమ్మా కొట్టడంతో.. ఇకపై విదేశీ పర్యటనలకు కుటుంబాన్ని అనుమతించబోమని ప్రకటించింది. అయితే, ఈ విషయంలో బీసీసీఐ తాజా వైఖరి ఏమిటన్న అంశంపై ప్రస్తుత యాజమాన్యం బోర్డును సంప్రదించినట్లు ఇండియన్ ఎక్స్‌ప్రెస్ వెల్లడించింది.తాజా వైఖరి ఇదే..‘‘టీమిండియా మేనేజ్మెంట్ బీసీసీఐని సంప్రదించింది. ఆటగాళ్ల భార్యలు, ఫియాన్సీలు వారితో ప్రయాణం చేయవచ్చా? వారితోనే ఉండవచ్చా? అని అడిగింది. ఇందుకు బోర్డు స్పష్టమైన సమాధానం ఇచ్చింది. కుటుంబాలు ఆటగాళ్లతో స్టే చేయవద్దని చెప్పింది.వారి కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తామని.. అది కూడా వారు కోరితే మాత్రమే ఈ వెసలుబాటు ఉంటుందని తెలిపింది’’ అని బీసీసీఐ వర్గాలు పేర్కొన్నట్లు వెల్లడించింది. వరల్డ్‌కప్ టోర్నీతో బిజీకాగా టీమిండియా ప్రస్తుతం టీ20 ప్రపంచకప్-2026 టోర్నీతో బిజీగా ఉంది. భారత్- శ్రీలంక ఆతిథ్యం ఇస్తున్న ఈ టోర్నీ లీగ్ దశలో సూర్య సేన లీగ్ దశలో మూడు మ్యాచ్‌లో సొంతగడ్డపై.. పాకిస్తాన్‌తో ఫిబ్రవరి 15 నాటి మ్యాచ్ కొలంబోలో ఆడుతుంది.ఇదిలా ఉంటే.. వరల్డ్‌కప్ టోర్నీ ఆసాంతం టీమిండియా ప్రైవేటు చార్టర్‌లోనే ప్రయాణిస్తుందని సమాచారం. అదే విధంగా.. ఆటగాళ్లు తమ వ్యక్తిగత చెఫ్‌లను తీసుకువచ్చేందుకు అనుమతించిన యాజమాన్యం.. ఆటగాళ్లు బస చేసే హోటల్‌కు సమీపంలో వారు ఉండేలా చూసుకోమన్నట్లు తెలుస్తోంది. అక్కడి నుంచే భోజనాన్ని ఆటగాళ్లకు పంపేలా ఏర్పాటు చేసినట్లు సమాచారం. ఇక వరల్డ్‌కప్ టోర్నీలో తొలుత అమెరికాతో తలపడ్డ టీమిండియా.. ఐసీసీ ఈవెంట్‌ను విజయంతో ఆరంభించింది. రెండోమ్యాచ్‌లో గురువారం నమీబియాతో భారత్ తలపడుతుంది. ఇందుకు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ మైదానం వేదిక.చదవండి: Bangladesh Cricket: ఐసీసీ మీటింగ్.. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డ్‌కి ఉపశమనం -
పాక్ కోసం బంగ్లాను ఒప్పించారా?: నీళ్లు నమిలిన పీసీబీ చీఫ్
ఊహాగానాలే నిజమయ్యాయి. టీమిండియాతో మ్యాచ్ బహిష్కరణ నిర్ణయాన్ని పాకిస్తాన్ మార్చుకుంది. క్రికెట్ స్ఫూర్తిని కొనసాగించే ఉద్దేశంతో తమ జట్టు భారత్‌తో మ్యాచ్ ఆడేందుకు అంగీకరిస్తున్నట్లు పాక్ ప్రభుత్వం తెలిపింది.యూటర్న్ వెనుక గల కారణాలు?ఈ విషయాన్ని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) చైర్మన్ మొహ్సిన్ నక్వీ సోమవారం ధ్రువీకరించాడు. పాకిస్తాన్ సూపర్ లీగ్ మీడియా సమావేశం సందర్భంగా నక్వీ ‘బాయ్‌కాట్’ నిర్ణయాన్ని తాము వెనక్కి తీసుకున్నట్లు ప్రకటించాడు. ఈ నేపథ్యంలో ఓ రిపోర్టర్.. యూటర్న్ వెనుక గల కారణాలు, అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC)తో చర్చల వల్ల పాక్‌కు ప్రయోజనం చేకూరిందా? అని అడిగాడు.శుభవార్తలే అందిస్తాంఇందుకు బదులుగా.. ‘‘కొన్ని నిమిషాల ముందే మా నిర్ణయం మార్చుకున్నాం’’ అని నక్వీ సమాధానమిచ్చాడు. మరి అయితే శుభవార్త ఉందా? అని ఇంటర్వ్యూయర్ ప్రశ్నించగా.. ‘‘మేము ఎల్లప్పుడూ శుభవార్తలే అందిస్తాం కదా!.. బంగ్లాదేశ్ ఈ విషయంలో ఏం చెప్పిందో అందరూ చూశారు కదాపాకిస్తాన్ ఇండియాతో మ్యాచ్ ఆడాలని బంగ్లాదేశ్ అభ్యర్థించింది. వాళ్ల సమస్యలు తొలగిపోయాయి. అందుకే వాళ్లు మమ్మల్ని భారత్‌తో మ్యాచ్ ఆడమని చెప్పారు’’ అని నక్వీ పేర్కొన్నాడు.మన కోసం ఏమీ అడగలేదా?అయితే, మన (పాకిస్తాన్) సొంత ప్రయోజనాల కోసం వారు ఈ విషయంలో అంగీకరించేలా చేశామా? అని రిపోర్టర్ అడుగగా.. ‘‘కేవలం బంగ్లాదేశ్‌కు మద్దతుగా మాత్రమే మనం నిలబడ్డాం. ఇది వాళ్ల సొంత విషయం. మనకోసం మనం ఏమీ అడగలేదు’’ అని నక్వీ నీళ్లు నమిలాడు.కాగా టీ20 ప్రపంచకప్-2026 టోర్నీకి భారత్ ఆతిథ్యం ఇస్తుండగా.. పాకిస్తాన్ కోసం శ్రీలంకను తటస్థ వేదికగా ఏర్పాటు చేశారు. ఇదిలా ఉంటే.. భారత్‌లో తమకు భద్రత లేదంటూ ఆరోపించిన బంగ్లాదేశ్.. తమ వేదికను కూడా లంకకు మార్చాలని ఐసీసీని కోరింది.అయితే, బంగ్లాదేశ్ చెప్పినదాంట్లో నిజం లేదని తేల్చిన ఐసీసీ.. ఇందుకు నిరాకరించింది. నిర్ణయం మార్చుకోవాల్సిందిగా గడువు ఇచ్చింది. కానీ బంగ్లా పట్టువీడలేదు. దీంతో ఆ జట్టును టోర్నీ నుంచి తొలగించింది ఐసీసీ.పాకిస్తాన్ జోక్యం..ఈ నేపథ్యంలో పాకిస్తాన్ జోక్యం చేసుకుంటూ తొలుత తాము బంగ్లాకు మద్దతుగా టోర్నీని బహిష్కరిస్తామని లీకులు ఇచ్చి.. ఆ తర్వాత కేవలం భారత్‌తో మాత్రమే మ్యాచ్ ఆడమని మాట మార్చింది. ఒకవేళ భారత్- పాక్ మ్యాచ్ రద్దయితే ఐసీసీతో పాటు సభ్య దేశాలన్నీ ఆర్థికంగా నష్టపోవాల్సి ఉంటుంది.రంగంలోకి లంక బోర్డుఈ క్రమంలో శ్రీలంక బోర్డు సైతం పాక్ నిర్ణయం పట్ల ఘాటుగా స్పందించింది. గతంలో పాక్ పర్యటనలో తమపై ఉగ్రదాడి జరిగినా.. ఇంకా ఆ దేశంతో సత్సంబంధాలు కొనసాగిస్తూ తమ జట్టు అక్కడ పర్యటించేలా చేస్తున్నామని పేర్కొంది. కానీ ఇప్పుడు తమ దేశంలో భారత్‌తో ఆడే మ్యాచ్‌ను పాక్ బహిష్కరిస్తే ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినందున భారీగా నష్టపోవాల్సి ఉంటుందని పాక్‌కు లేఖ రాసింది.బంగ్లాకు రిలీఫ్యూఏఈ సైతం ఇదే తరహాలో పీసీబీకి లేఖ రాయగా.. బంగ్లాదేశ్ సైతం భారత్‌తో మ్యాచ్ ఆడాలని కోరింది. ఈ నేపథ్యంలో ఐసీసీ బృందం లాహోర్ వెళ్లి పీసీబీ చైర్మన్‌తో చర్చించగా.. బంగ్లాదేశ్‌కు ఊరట లభించింది. టోర్నీ నుంచి తప్పుకొన్నందుకు ఎలాంటి ఆంక్షలు ఉండవని ఐసీసీ పేర్కొంది.ఇదిలా ఉంటే.. పాక్ బంగ్లాదేశ్‌ను అడ్డుపెట్టుకుని భారత్‌తో ద్వైపాక్షిక సిరీస్‌ల పునరుద్ధరణ, తమ ఆటగాళ్లతో భారత జట్టు కరచాలనం చేయడం.. తదితర షరతులు పెట్టినట్లు తొలుత వార్తలు వచ్చాయి. ఐసీసీ ఇందుకు నిరాకరించి కేవలం బంగ్లా విషయంలో మాత్రమే సానుకూలంగా స్పందించిందని తెలిసింది. ఈ విషయం నెట్టింట వైరల్‌గా మారగా.. నక్వీ తమ కోసం ఐసీసీని ఏమీ అడగలేదని ప్రత్యేకంగా నొక్కివక్కాణించడం గమనార్హం. కాగా షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 15న కొలంబో వేదికగా భారత్- పాక్ తలపడటం ఖాయమైంది.చదవండి: Bangladesh Cricket: ఐసీసీ మీటింగ్.. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డ్‌కి ఉపశమనంMohsin Naqvi Statement on India Vs Pakistan match #PAKvIND #Pakistan pic.twitter.com/Mm523Uldb3— Ravish Bisht (@ravishbofficial) February 9, 2026 -
భారత్‌తో మ్యాచ్ ఆడండి: పాకిస్తాన్ జట్టుకు ప్రభుత్వ ఆదేశం
టి20 వరల్డ్ కప్‌లో భాగంగా భారత్‌తో మ్యాచ్ ఆడమంటూ మొండికేసిన పాకిస్తాన్ జట్టు వెనక్కి తగ్గింది. ఈ నెల 15న కొలంబోలో జరగాల్సిన మ్యాచ్‌లో టీమిండియాతో తలపడాలని ఆ దేశ ప్రభుత్వం పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)ను ఆదేశించింది. క్రికెట్ స్ఫూర్తిని కొనసాగించే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. శ్రీలంక, బంగ్లాదేశ్‌లనుంచి వచ్చిన అభ్యర్థనలకు స్పందిస్తూ భారత్‌తో మ్యాచ్‌కు పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ ఓకే చెప్పారని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. అంతక ముందు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ), పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ), బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) మధ్య జరిగిన చర్చలు సఫలమయ్యాయని ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ సంజోగ్ గుప్తా వెల్లడించారు. వరల్డ్ కప్‌నుంచి దూరమైన బంగ్లాదేశ్‌కు మద్దతు పలకడంతో పాటు పలు డిమాండ్లను ఐసీసీ ముందు ఉంచింది. వీటిపై ఐసీసీ సానుకూలంగా స్పందించింది. బంగ్లా బోర్డుపై ఎలాంటి జరిమానాలు, ఆంక్షలు విధించమని హామీ ఇవ్వడంతో పాటు 2028 నుంచి 2031 మధ్య ఒక ఐసీసీ ఈవెంట్‌కు బంగ్లా ఆతిథ్యం ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తామని కూడా ఐసీసీ చెప్పింది. -
భారత్‌తో మ్యాచ్ ఆడేందుకు 5 డిమాండ్లు చేసిన పాక్ క్రికెట్ బోర్డు
టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా ఫిబ్రవరి 15న కొలొంబో వేదికగా జరగాల్సిన భారత్-పాక్ గ్రూప్ స్టేజీ మ్యాచ్‌పై అనిశ్చితి కొనసాగుతూనే ఉంది. ఈ మ్యాచ్ జరగడానికి మరో ఆరు రోజుల సమయం మాత్రమే ఉన్నా, ఇరు దేశాల క్రికెట్ అభిమానులకు సంబంధించి ఎలాంటి సానుకూల ప్రకటన వెలువడలేదు. తాజా పరిస్థితి చూస్తే, ఈ మ్యాచ్ దాదాపుగా రద్దైయ్యేట్లే కనిపిస్తుంది. ఇదే జరిగితే పాక్ క్రికెట్ బోర్డు భారీ పర్యావసనాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.కొద్ది రోజుల కిందట పాక్ ప్రభుత్వం ఈ మ్యాచ్‌ను బాయ్‌కాట్ చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఐసీసీ రంగంలోకి దిగి పాక్ క్రికెట్ బోర్డుతో ఇవాళ చర్చలు జరిపినట్లు తెలుస్తుంది. అయితే ఈ చర్చలు కొలిక్కి రాలేదని సమాచారం. భారత్‌తో మ్యాచ్ ఆడాలంటే పీసీబీ ఐసీసీ ముందు ఐదు గొంతెమ్మ కోర్కెలను ఉంచినట్లు తెలుస్తుంది. వీటిలో ఏ ఒక్క దానికి ఐసీసీ అంగీకరించలేదని సమాచారం. భారతీయ క్రీడా జర్నలిస్ట్ విక్రాంత్ గుప్తా సోషల్‌మీడియా పోస్ట్ ఆధారంగా.. పీసీబీ ఐసీసీ ముందు ఈ ఐదు డిమాండ్లు ఉంచినట్లు తెలుస్తుంది. - బంగ్లాదేశ్‌పై శిక్షలు విధించకూడదు - భారత్–పాకిస్తాన్ ద్వైపాక్షిక సిరీస్ పునరుద్ధరణ - టీమిండియా బంగ్లాదేశ్‌లో పర్యటించాలి - భారత్-పాక్-బంగ్లాదేశ్‌తో ప్రత్యేక ట్రై-సిరీస్ - అదనపు ఐసీసీ టోర్నమెంట్ కేటాయింపు అయితే, ఈ ఐదు డిమాండ్లను ఐసీసీ తిరస్కరించిందని తెలుస్తుంది. ఈ ఐదు తమ పరిధిలోకి రావని ఐసీసీ తేల్చినట్లు సమాచారం. ఈ ఐదు కాకుండా పాక్ క్రికెట్ బోర్డు ఐసీసీని ప్రత్యేక ఫండింగ్ కోసం కూడా డిమాండ్ చేసిందని తెలుస్తుంది. ఈ పాక్ డిమాండ్లు సోషల్‌మీడియాలో ప్రచారంలోకి రావడంతో భారత క్రికెట్ అభిమానులు మండిపడుతున్నారు. పాక్‌తో మ్యాచ్ అవసరం లేదని అంటున్నారు. పాక్‌పై ఐసీసీ శాశ్వత బహిష్కరణ విధించాలని డిమాండ్ చేస్తున్నారు. పాక్ తమతో మ్యాచ్ ఆడకపోతే తమకు కలిగే నష్టమేమీ లేదని అంటున్నారు.కాగా, ముస్తాఫిజుర్ రహ్మాన్‌ను ఐపీఎల్ నుంచి తొలగించిన తర్వాత బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు భారత్‌లో జరగాల్సిన తమ ప్రపంచకప్ మ్యాచ్‌లను శ్రీలంకకు తరలించాలని ఐసీసీని కోరిన విషయం తెలిసిందే. ఇది సాధ్యపడదని ఐసీసీ చెప్పడంతో బంగ్లాదేశ్ ప్రపంచకప్ నుంచి వైదొలిగింది. దీంతో ఆ జట్టు స్థానంలో స్కాట్లాండ్ వరల్డ్‌కప్ ఎంట్రీ ఇచ్చింది. ఈ తతంగం జరుగుతుండగానే పాక్ క్రికెట్ బోర్డు బంగ్లాదేశ్‌కు కొమ్ముకాస్తూ రంగంలోకి దిగింది. బంగ్లాదేశ్‌ను ప్రపంచకప్ నుంచి తప్పించిన తర్వాత పాక్ ప్రభుత్వం భారత్‌తో మ్యాచ్ ఆడమని ప్రకటించింది. -
బిగ్ ట్విస్ట్!.. పాకిస్తాన్‌కు షాకిచ్చిన బంగ్లాదేశ్!
టీమిండియాతో మ్యాచ్ బహిష్కరిస్తామని ప్రకటించిన పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)పై ఒత్తిడి పెరుగుతోంది. పాక్ తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి. ఈ విషయంలో పునరాలోచన చేయాల్సిందిగా శ్రీలంక క్రికెట్ బోర్డు (SLC) ఇప్పటికే పీసీబీకి లేఖ రాసింది.ఆర్థికంగా నష్టంగతంలో తమ జట్టుపై పాకిస్తాన్లో ఉగ్రదాడి జరిగినా.. తిరిగి తామే మళ్లీ తొలిసారి ఆ దేశంలో పర్యటించిన విషయాన్ని లంక బోర్డు ఈ సందర్భంగా గుర్తు చేసింది. భారత్- పాక్ మ్యాచ్‌కు తాము ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని.. ఒకవేళ మ్యాచ్ రద్దు చేసుకుంటే తాము ఆర్థికంగా పెద్ద ఎత్తున నష్టపోతామని పేర్కొంది. ఇకముందు కూడా తాము పీసీబీతో సంబంధాలు కొనసాగించాలనుకున్నామంటూ సుత్తిమెత్తగానే హెచ్చరికలు జారీ చేసింది.యూఏఈ లేఖతాజాగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) క్రికెట్ కూడా పాకిస్తాన్‌కు లేఖ రాసింది. ‘‘ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు పాకిస్తాన్‌తో చాలా ఏళ్లుగా బంధం కొనసాగిస్తోంది. గతంలో పాకిస్తాన్ కోసం మా వేదికలు ఇచ్చి టోర్నీలు సజావుగా సాగేలా చూసుకున్నాము.అయితే, టీ20 ప్రపంచకప్-2026లో టీమిండియాతో మ్యాచ్ బహిష్కరిస్తామన్న పాక్ నిర్ణయం మాతో పాటు ఇతర సభ్యదేశాలను తీవ్రంగా గాయపరిచింది. ముఖ్యంగా అసోసియేట్ జట్లు ఆర్థికంగా భారీ ఎత్తున నష్టాలు చవిచూడాల్సి ఉంటుంది.పీసీబీ కుటుంబంలో సభ్యులుగా ఈ విషయంలో పునరాలోచన చేయాలని.. సమస్యకు సరైన పరిష్కారం కనుగొనాలని విజ్ఞప్తి చేస్తున్నాం’’ అని యూఏఈ బోర్డు ఇ-మెయిల్ పంపింది. బంగ్లాదేశ్ సైతంఇక ఈ వివాదం అంతటికీ మూలకారణమైన బంగ్లాదేశ్ సైతం పీసీబీకి ఇదే సందేశాన్ని ఇచ్చినట్లు తెలుస్తోంది. కాగా భారత్-శ్రీలంక ఆతిథ్యం ఇస్తున్న టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో భాగంగా.. భారత్‌లో తమకు భద్రత ఉండదంటూ బంగ్లాదేశ్ ఐసీసీని ఆశ్రయించిది.తమ వేదికను శ్రీలంకకు మార్చాల్సిందిగా కోరింది. అయితే, ఇందులో వాస్తవం లేదని కొట్టిపారేసిన ఐసీసీ బంగ్లాకు గడువు ఇచ్చింది. అయినా సరే బంగ్లా బోర్డు తమ వైఖరి మార్చుకోలేదు. దీంతో ఐసీసీ ఆ జట్టును టోర్నీ నుంచి తొలగించింది.మొహ్సిన్ నక్వీతో చర్చలుఈ నేపథ్యంలో బంగ్లాదేశ్‌కు మద్దతుగా ఉంటామంటూ పాక్.. మొదట టోర్నీ నుంచే వైదొలుగుతామని బెదిరించింది. అనంతరం టీమిండియాతో మ్యాచ్ మాత్రమే బహిష్కరిస్తామని కొత్త నాటకానికి తెరతీసింది. ఇదే జరిగితే ఐసీసీ ఆర్థికంగా భారీగా నష్టపోతుంది. ఈ ప్రభావం పీసీబీతో పాటు ఇతర సభ్య దేశాల బోర్డు మీదా పడుతుంది.మీ మద్దతుకు ధన్యవాదాలు.. కానీఈ క్రమంలో ఐసీసీ డిప్యూటీ చైర్మన్ ఇమ్రాన్ ఖవాజా, బంగ్లా బోర్డు అధ్యక్షుడు అమినుల్ ఇస్లాం ఆదివారం పాకిస్తాన్‌కు వెళ్లారు. పీసీబీ చైర్మన్ మొహ్సిన్ నక్వీతో ఈ విషయం గురించి చర్చించారు. ఈ సందర్భంగా అమినుల్ ఇస్లాం.. తమకు మద్దతుగా నిలిచినందుకు పీసీబీకి ధన్యవాదాలు చెప్పినట్లు సమాచారం.అదే సమయంలో భారత్‌తో మ్యాచ్ బాయ్‌కాట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తోంది. ఒకవేళ భారత్- పాక్ మ్యాచ్ జరుగకపోతే తమతో పాటు అన్ని బోర్డులు ఆర్థికంగా నష్టపోతాయని అందుకే ఈ విషయంలో ఆచితూచి వ్యవహరించాలని అమినుల్ నక్వీని కోరిట్లు సమాచారం.ఈ విషయంపై సానుకూలంగా స్పందించిన నక్వీ.. ప్రధాని షెబాజ్ షరీఫ్‌తో మాట్లాడతానని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. కాగా తటస్థ వేదికైన కొలంబోలో ఫిబ్రవరి 15న భారత్- పాక్ మ్యాచ్‌కు షెడ్యూల్ ఖరారైంది. చదవండి: ముకేశ్ అంబానీకి నో చెప్పిన రోహిత్ శర్మ! -
IND Vs PAK: పాక్‌తో ఐసీసీ కీలక సమావేశం.. స్పందించిన బీసీసీఐ
భారత్‌తో మ్యాచ్ బహిష్కరణ నిర్ణయంపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) యూటర్న్ తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇందుకు సంబంధించి అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) బృందంతో పీసీబీ చర్చలు జరుపుతోంది. లాహోర్‌లో ఈ సమావేశానికి ఐసీసీ, పీసీబీతో పాటు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) తరఫున అమినుల్ ఇస్లాం హాజరయ్యాడు.డిమాండ్లు ఇవేనా?ఈ నేపథ్యంలో తాము టీమిండియాతో మ్యాచ్ ఆడాలంటే.. ఈ మ్యాచ్‌లో లభించే ఆదాయంలో తమకు అత్యధిక వాటా ఇవ్వాలని పీసీబీ ఐసీసీకి విజ్ఞప్తి చేసినట్లు సమాచారం. అదే విధంగా.. బంగ్లాదేశ్‌కు నష్ట పరిహారం చెల్లించాలని, మ్యాచ్ ఫీజులు కూడా ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది.అయితే, ఇందుకు ఐసీసీ డిప్యూటీ చైర్మన్ ఇమ్రాన్ ఖవాజా సానుకూలంగా లేనట్లు సమాచారం. గత్యంతరం లేకే తాము భారత్‌తో మ్యాచ్ బహిష్కరించామన్న పాక్ నిర్ణయంపై వివరణ కోరినట్లు తెలుస్తోంది. అదే విధంగా.. బంగ్లాదేశ్‌కు అన్ని సభ్య దేశాల మాదిరి ఆదాయం మాత్రమే వస్తుందని తెలిపినట్లు సమాచారం.మాస్టర్ ప్లాన్!ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్‌ను అడ్డుపెట్టుకుని పాకిస్తాన్ తాము ఆర్థికంగా లబ్ది పొందేలా మాస్టర్ ప్లాన్ వేసిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఐసీసీతో పీసీబీ చర్చలు సఫలమైనా.. పాకిస్తాన్ ప్రధాని షెబాజ్ షరీఫ్ నిర్ణయం మేరకే తాము ఆడేది లేనిది చెబుతామని పీసీబీ అంటోందని.. ఇంతకంటే విషయాన్ని పెద్దది చేస్తే పాక్ నష్టపోకతప్పదనే విశ్లేషణలూ వినిపిస్తున్నాయిస్పందించిన బీసీసీఐఈ క్రమంలో భారత క్రికెట్ మండలి (BCCI) ఈ అంశంపై మరోసారి స్పందించింది. బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ముందుగా చెప్పినట్లు ఐసీసీ నిర్ణయం మేరకే మేము నడుచుకుంటాము. ఇందులో బీసీసీఐ చెప్పాల్సిందేమీ లేదు’’ పునరుద్ఘాటించారు.కాగా టీ20 ప్రపంచకప్-2026 టోర్నమెంట్‌కు భారత్ ఆతిథ్యం ఇస్తుండగా.. పాకిస్తాన్ కోసం శ్రీలంకను తటస్థ వేదికగా ఏర్పాటు చేసింది ఐసీసీ. అయితే, బంగ్లాదేశ్ సైతం తమకు భారత్‌లో భద్రత ఉండదని.. లంకకు తమ మ్యాచ్‌ల వేదికను మార్చాలని విజ్ఞప్తి చేసింది. ఈ ఆరోపణలో నిజం లేదని తేల్చిన ఐసీసీ.. ఇందుకు నిరాకరించింది. అయినా సరే బంగ్లాదేశ్ పంతం వీడకపోవడంతో టోర్నీ నుంచి తప్పించింది.ఉగ్రదాడి జరిగినాఅప్పటి నుంచి బంగ్లాకు వంతపాడుతూ పాకిస్తాన్ డ్రామాలకు తెరలేపింది. తొలుత టోర్నీ నుంచి వైదొలుగుతామన్న పాక్.. తమకు తటస్థ వేదిక ఉన్నా ఇలా చేస్తే ఐసీసీ కఠిన చర్యలకు ఉపక్రమిస్తుందన్న భయంతో వెనక్కి తగ్గింది. అయితే, టీమిండియాతో మ్యాచ్‌ను మాత్రం బహిష్కరిస్తామని పాక్ ప్రకటించింది. టోర్నీలో అన్ని మ్యాచ్‌లకు లేని భద్రతా కారణాలు టీమిండియాతో మ్యాచ్‌కు మాత్రమే ఉంటాయని చెబుతూ నైజం బయటపెట్టుకుంది. ఇందుకు శ్రీలంక గట్టిగా బదులిచ్చింది. పాక్‌లో తమపై ఉగ్రదాడి జరిగినా మళ్లీ ఆ దేశంలో మ్యాచ్‌లు ఆడామని గుర్తు చేసింది.భారత్- పాక్ మ్యాచ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని.. మ్యాచ్ బహిష్కరిస్తే తాము ఆర్థికంగా నష్టపోవాల్సి ఉంటుందని లంక లేఖ రాసింది. ఈ పరిణామాల నేపథ్యంలో ఫిబ్రవరి 15నాటి టీమిండియాతో మ్యాచ్ ఆడేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు సంకేతాలు ఇచ్చిన పాక్.. అదనపు ఆదాయం కావాలంటూ మెలిక పెట్టినట్లు తెలుస్తోంది. చదవండి: ఛాయ్ తీసుకో.. వద్దండి!.. అంబానీకి నో చెప్పిన రోహిత్ శర్మ!#WATCH | Delhi | On Pakistan to boycott its match against India in the ICC Men’s T20 World Cup 2026, BCCI Vice-President Rajeev Shukla says, "We will follow whatever decision is taken by ICC... BCCI has no statement on this..." pic.twitter.com/gug8zToSic— ANI (@ANI) February 9, 2026 -
IND vs PAK: పాపం బంగ్లాదేశ్!.. బుద్ధి చూపించిన పాకిస్తాన్!
టీ20 ప్రపంచకప్-2026 టోర్నమెంట్లో భారత్‌తో ఆడేందుకు పాకిస్తాన్ సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, ఇందుకోసం అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) ముందు పాక్ క్రికెట్ బోర్డు (PCB) మూడు షరతులు ఉంచినట్లు సమాచారం. కాగా బంగ్లాదేశ్‌కు మద్దతగా తాము టీమిండియాతో మ్యాచ్ బహిష్కరిస్తున్నట్లు పాకిస్తాన్ ప్రకటించిన విషయం తెలిసిందే.బంగ్లాదేశ్ కోసమంటూ.. భారత్‌లో తమకు భద్రత లేదంటూ బంగ్లాదేశ్ తమ వేదికను శ్రీలంకకు మార్చాలని కోరగా.. ఇందులో నిజం లేదంటూ ఐసీసీ స్పష్టం చేసింది. అయినప్పటికీ బంగ్లా పంతం వీడకపోవడంతో ఐసీసీ ఆ జట్టును టోర్నీ నుంచి తప్పించింది. ఈ నేపథ్యంలో తమకు తటస్థ వేదికగా శ్రీలంక ఉన్నప్పటికీ బంగ్లాదేశ్ కోసమంటూ.. తామూ టోర్నీ ఆడమని పాక్ కొత్త నాటకానికి తెరతీసింది.మరో డ్రామాఅయితే, ఈ విషయంలో ఐసీసీ కఠిన నిర్ణయం తీసుకుంటుందనే భయంతో మాట మార్చి తాము భారత్‌తో మాత్రమే మ్యాచ్ ఆడమని మరో డ్రామాకు తెరలేపింది. క్రికెట్ ప్రపంచంలో అత్యధిక క్రేజ్ ఉన్న భారత్- పాక్ మ్యాచ్ జరుగకపోతే.. ఐసీసీతో పాటు సభ్య దేశాలు భారీ ఎత్తున నష్టపోవాల్సి ఉంటుంది. పాక్ క్రికెట్ బోర్డు మనుగడ కూడా ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉంది.ఘాటుగా స్పందించిన శ్రీలంకఇక ఈ విషయంపై శ్రీలంక సైతం ఘాటుగానే స్పందించింది. పాక్‌లో తమపై ఉగ్రదాడి జరిగినా మళ్లీ ఆ దేశంలో పర్యటించిన విషయాన్ని గుర్తుచేస్తూ.. భారత్‌తో మ్యాచ్‌పై పునరాలోచన చేయాలని పీసీబీకి విజ్ఞప్తి చేసింది. ఇతర సభ్య దేశాల బోర్డులు సైతం పాక్ వైఖరిపై అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది.మూడు ప్రధాన షరతులుఈ నేపథ్యంలో మొదటికే మోసం వస్తుందని భావించిన పాక్.. పంతం వీడేందుకు సిద్ధపడినా.. మూడు ప్రధాన షరతులతో ఐసీసీని లాక్ చేసే ప్రయత్నం చేస్తున్నట్లు తాజా సమాచారం. జాతీయ మీడియా కథనాల ప్రకారం.. ఎక్కువ డబ్బు కావాలి!ఐసీసీ నుంచి తమకు అదనంగా నిధులు సమకూర్చాలని కోరింది. ప్రస్తుతం ఐసీసీ రెవెన్యూ నుంచి నుంచి పీసీబీ 5.75 శాతం ఆదాయం పొందుతోంది. మరోవైపు.. ఇందులో బీసీసీఐ వాటా 39 శాతం. ఇక భారత్‌తో తమ క్రికెట్ సంబంధాలను తిరిగి పునరుద్ధరించాలని పీసీబీ ఐసీసీకి విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తోంది. కాగా 2012 నుంచి భారత్- పాక్ మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు ఆగిపోయిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఆసియా కప్, వరల్డ్‌కప్ వంటి టోర్నీలలో మాత్రమే దాయాదులు ముఖాముఖి తలపడుతున్నాయి.కరచాలనం చేయాలిఅదే విధంగా.. టీ20 ప్రపంచకప్-2026 మ్యాచ్‌లో భారత ఆటగాళ్లు తమ జట్టుతో కరచాలనం చేయాలని పీసీబీ ఐసీసీకి కండిషన్ పెట్టినట్లు సమాచారం. కాగా పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో ఆసియా కప్‌లో పాక్ ఆటగాళ్లతో టీమిండియా షేక్‌హ్యాండ్‌కు నిరాకరించిన విషయం తెలిసిందే.పాక్ బుద్ధి చూపించిందంటూ ట్రోల్స్!ఈ మూడు షరతులకు అంగీకరిస్తేనే తాము టీమిండియాతో మ్యాచ్ ఆడతామని పీసీబీ తేల్చిచెప్పినట్లు తెలుస్తోంది. ఈ విషయం నెట్టింట వైరల్‌గా మారగా.. ‘‘పాక్ బుద్ధి చూపించింది. డబ్బు కోసం బంగ్లాదేశ్‌ను అడ్డుపెట్టుకుని నాటకాలు ఆడుతోంది. నిజంగా బంగ్లాపై అంత ప్రేమ ఉంటే టోర్నీ నుంచి వైదొలగాల్సింది.అలా కాకుండా తటస్థ వేదిక ఏర్పాటు చేసినా బ్లాక్‌మెయిలింగ్‌కు దిగి.. క్యాష్ చేసుకోవాలని చూస్తోంది. ఇంతకంటే చెత్త విషయం మరొకటి ఉండదు’’ అని టీమిండియా అభిమానులు పీసీబీ తీరుపై మండిపడుతున్నారు. కాగా శనివారం (ఫిబ్రవరి 7) నుంచి భారత్- శ్రీలంక వేదికగా టీ20 ప్రపంచకప్ మొదలైన సంగతి తెలిసిందే.వద్దు.. అలా చేయొద్దుఅయితే, పాక్ మీడియా డాన్ కథనం ప్రకారం.. బంగ్లాదేశ్‌కు పరిహారం చెల్లించాలని పాక్ కోరినట్లు తెలుస్తోంది. ఇందుకు నిరాకరించిన ఐసీసీ.. మొత్తం ఆదాయంలో మాత్రం బంగ్లాదేశ్‌కు ఇవ్వాల్సిన వాటా ఇస్తామని తెలిపినట్లు సమాచారం. అంతేకాదు.. పాక్ బోర్డు భారత్‌తో మ్యాచ్ విషయంలో పునరాలోచన చేయాలని.. ఇలా బహిష్కరిస్తామని చెప్పడం క్రికెట్‌కు ఎంతమాత్రం సరికాదని గట్టిగానే హెచ్చరించినట్లు తెలుస్తోంది.చదవండి: చరిత్ర సృష్టించిన నేపాల్ బౌలర్ -
క్రికెట్ అభిమానులకు శుభవార్త
క్రికెట్ అభిమానులకు శుభవార్త. టీ20 ప్రపంచకప్‌లో భారత్-పాకిస్తాన్ గ్రూప్ స్టేజీ మ్యాచ్‌పై అనిశ్చితి తొలిగిపోయేలా ఉంది. తొలుత పాక్ ప్రభుత్వం ఈ మ్యాచ్‌ను బాయ్‌కాట్ చేసున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా ఐసీసీ జోక్యంతో పాక్ క్రికెట్ బోర్డు ఈ మ్యాచ్ ఆడేందుకు అంగీకరించినట్లు సమాచారం. ఈ వివాదాన్ని పరిష్కరించేందుకు ఐసీసీ ప్రతినిధులు ఇమ్రాన్ ఖవాజా, ముబషిర్ ఉస్మానీ పీసీబీ అధ్యక్షుడు మొహిసిన్ నఖ్వీతో లాహోర్‌లో చర్చలు జరిపారు. ఈ చర్చల తర్వాత పీసీబీ కొన్ని షరతులపై భారత్‌తో మ్యాచ్ ఆడేందుకు అంగీకరించినట్లు సమాచారం.కాగా, గత కొద్ది రోజులుగా భారత్-పాక్ ప్రపంచకప్ గ్రూప్ స్టేజీ మ్యాచ్‌పై నీలినీడలు కమ్ముకున్న విషయం తెలిసిందే. ప్రపంచకప్ నుంచి బంగ్లాదేశ్ బహిష్కరణకు నిరసనగా పాక్ ప్రభుత్వం భారత్‌తో గ్రూప్ స్టేజీ మ్యాచ్ ఆడకూడదని నిర్ణయించుకుంది. ఈ మ్యాచ్ రద్దైతే ఐసీసీ సహా ప్రపంచకప్ బ్రాడ్కాస్టర్లు తీవ్రంగా నష్టపోయేవారు. ఇందుకు ప్రతిగా ఐసీసీ పీసీబీపై కఠిన చర్యలు తీసుకునేందుకు అవకాశాలు ఉండేవి. చివరికి ఐసీసీ ప్రతినిధుల మధ్యవర్తిత్వంతో ఈ సమస్యకు పరిష్కారం లభించినట్లు తెలుస్తుంది. భారత్-పాక్ మ్యాచ్ ఫిబ్రవరి 15న కొలొంబో వేదికగా జరగాల్సి ఉంది.ఇదిలా ఉంటే, ప్రపంచకప్‌లో ఇప్పటివరకు జరిగిన మ్యాచ్‌ల్లో భారత్, పాక్, వెస్టిండీస్, న్యూజిలాండ్ తలో మ్యాచ్ గెలిచాయి. భారత్ యూఎస్ఏపై, పాక్ నెదర్లాండ్స్‌పై, వెస్టిండీస్ స్కాట్లాండ్పై, న్యూజిలాండ్ ఆఫ్ఘనిస్తాన్పై విజయాలు సాధించాయి. -
IND vs PAK: అదెలా?.. పాకిస్తాన్‌కు ఐసీసీ ప్రశ్న
టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో టీమిండియాతో మ్యాచ్ బహిష్కరిస్తామన్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) నిర్ణయం వివాదాస్పదంగా మారింది. టోర్నీలో అన్ని మ్యాచ్‌లు ఆడి.. కేవలం భారత్‌తో మాత్రమే ఆడకపోవడం ఏమిటనే ప్రశ్నలు తలెత్తాయి. మిగతా మ్యాచ్‌లకు లేని భద్రతా కారణాలు ఈ మ్యాచ్‌కే ఎందుకనే విమర్శలూ వస్తున్నాయి.బంగ్లాదేశ్‌కు మద్దతుగాఇలాంటి తరుణంలో అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) సైతం పీసీబీకి ఇదే ప్రశ్నను సంధించింది. కాగా వరల్డ్‌కప్ టోర్నీకి భారత్ ఆతిథ్యం ఇస్తుండగా.. పాకిస్తాన్ మ్యాచ్‌ల కోసం శ్రీలంకను తటస్థ వేదికగా ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే, బంగ్లాదేశ్‌కు మద్దతుగా తాము టీమిండియాతో మ్యాచ్ బహిస్కరిస్తామంటూ పాక్ కొత్త రాగం ఎత్తుకుంది.కాగా భారత్- బంగ్లాదేశ్ మధ్య ఉద్రిక్తతల కారణంగా తాము కూడా లంకలోనే ఆడతామని బంగ్లా కోరగా.. ఐసీసీ ఇందుకు నిరాకరించింది. భద్రత పరంగా భారత్‌లో బంగ్లా జట్టుకు వచ్చిన ముప్పేమీ లేదని తమ బృందం తేల్చినందున పునరాలోచించుకోవాలని సమాధానం ఇచ్చింది.ఒకవేళ రద్దయితేకానీ బంగ్లాదేశ్ మొండి వైఖరి ప్రదర్శించడంతో టోర్నీ నుంచి బంగ్లాదేశ్‌ను తప్పించి.. ఆ జట్టు స్థానంలో స్కాట్లాండ్ను చేర్చింది. అయితే, బంగ్లాదేశ్‌కు అన్యాయం జరిగిందంటూ.. పాక్ భారత్‌తో మ్యాచ్‌ను బాయ్‌కాట్ చేస్తామని ప్రకటించింది. పాక్ ప్రధాని షెబాజ్ షరీఫ్ ఈ ప్రకటన చేశాడు.కాగా శ్రీలంక వేదికగా ఫిబ్రవరి 15న భారత్- పాక్ మ్యాచ్ జరగాల్సి ఉంది. భారీ క్రేజ్ ఉన్న ఈ మ్యాచ్ ఒకవేళ రద్దయితే పెద్ద ఎత్తున ఆర్థిక నష్టం వాటిల్లుతుంది. ఈ నేపథ్యంలో ఇతర బోర్డులు సైతం పాక్ అనుసరిస్తున్న విధానంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం.తెలివి ప్రదర్శించిన పీసీబీఅయితే, తమపై ఐసీసీ కఠిన చర్యలు తీసుకోకుండా ఉండేందుకు పాక్ తెలివిగా.. ఫోర్స్ మజ్యూర్ క్లాజ్ (Force Majeure Clause)ను తెరపైకి తెచ్చింది. అనూహ్య, నియంత్రణలో లేని పరిస్థితులు ఏర్పడితే.. సంబంధిత పక్షం తన బాధ్యత నుంచి విముక్తి పొందే అవకాశం ఈ నిబంధన ద్వారా లభిస్తుంది.సహజ విపత్తులు, యుద్ధం, మహమ్మారి లేదా ప్రభుత్వ నిషేధాలు వంటి అత్యవసర పరిస్థితులు ఏర్పడితే.. సంబంధిత పక్షం తన వాదనను సమర్థించుకునే అవకాశం ఉంటుంది. తమ ప్రభుత్వం భారత్‌తో మ్యాచ్‌కు అంగీకరించనందున ఈ నిబంధన తమకు వర్తింపజేయాలని పీసీబీ ఐసీసీకి లేఖ రాసినట్లు సమాచారం.గట్టిగానే బదులిచ్చిన ఐసీసీఅయితే, ఇందుకు ఐసీసీ గట్టిగానే బదులిచ్చినట్లు తెలుస్తోంది. ‘‘ప్రభుత్వ అనుమతితో టోర్నీలో కొనసాగుతున్నారు.. కానీ.. ప్రభుత్వ ఆంక్షల ప్రకారం ఒక్క మ్యాచ్‌ను మాత్రమే బహిష్కరిస్తారా? ఇదెలా సాధ్యం? దీనిపై పూర్తిస్థాయి వివరణ ఇవ్వాలి’’ అని పీసీబీని ఆదేశించినట్లు వార్త సంస్థ PTI వెల్లడించింది. కాగా బంగ్లాదేశ్‌కు మద్దతుగా తొలుత టోర్నీనే బహిష్కరిస్తామన్న పాక్.. ఆ తర్వాత మాట మార్చి భారత్‌తో మాత్రమే ఆడమంటూ డ్రామాకు తెరలేపింది.చదవండి: IND vs PAK: శ్రీలంక లేఖ.. దిగొచ్చిన పాక్ బోర్డు? యూటర్న్? -
IND vs PAK: పాకిస్తాన్ యూటర్న్?
పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) గత కొన్నాళ్లుగా వార్తల్లో నిలుస్తోంది. బంగ్లాదేశ్‌కు అనుకూలంగా ఓటు వేసి అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) నిర్ణయాన్ని వ్యతిరేకించిన పీసీబీ.. భారత్‌తో మ్యాచ్ బహిష్కరిస్తామంటూ నాటకానికి తెరతీసింది. ఈ విషయం గురించి పాక్ ప్రధాని షెబాజ్ షరీఫ్ స్వయంగా ప్రకటించడం గమనార్హం.టీ20 ప్రపంచకప్-2026 టోర్నమెంట్‌కు డిఫెండింగ్ చాంపియన్ హోదాలో భారత్ ఆతిథ్యం ఇస్తున్న విషయం తెలిసిందే. అయితే, ముందుగా ఐసీసీ కుదిర్చిన ఒప్పందం ప్రకారం.. పాక్ కోసం తటస్థ వేదికను ఏర్పాటు చేశారు. పాక్ తమ మ్యాచ్‌లన్నీ శ్రీలంకలో ఆడేలా షెడ్యూల్ ఖరారైంది.భారత్- బంగ్లా.. మధ్యలో పాక్అయితే, భారత్- బంగ్లాదేశ్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో తమకు భారత్‌లో రక్షణ ఉండదని.. అందుకే తమ వేదికను కూడా లంకకు మార్చాలంటూ బంగ్లా బోర్డు ఐసీసీని కోరింది. బంగ్లా వాదనలో నిజం లేదని తేల్చిన ఐసీసీ ఇందుకు నిరాకరించింది. అయినా సరే బంగ్లాదేశ్ పంతం వీడలేదు. ఫలితంగా టోర్నీ నుంచి బంగ్లాదేశ్‌ను తప్పించి ఆ స్థానంలో స్కాట్లాండ్ను చేర్చింది ఐసీసీ.భారత్‌తో మాత్రమే ఆడమంటూఈ నేపథ్యంలో బంగ్లాదేశ్‌కు అన్యాయం జరిగిందని.. లంకలో భారత్‌తో మ్యాచ్‌కు తమకు భద్రత ఉండదంటూ పాక్.. టీమిండియాతో మ్యాచ్‌ను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించింది. లీగ్ దశలో మిగతా మ్యాచ్‌లకు లేని ఇబ్బంది భారత్‌తో మాత్రమే ఉందని చెప్పడం పాక్ ద్వంద్వ వైఖరిని బయటపెట్టింది. అంతేకాదు.. ఒకవేళ భారత్- పాక్ మ్యాచ్ నిజంగానే ఆగిపోతే ఐసీసీతో పాటు సభ్య బోర్డులన్నింటికీ పెద్ద ఎత్తున నష్టం వస్తుంది.ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ శ్రీలంక క్రికెట్ బోర్డు పాకిస్తాన్‌కు లేఖ రాసింది. గతంలో పాక్‌లో తమ జట్టుపై ఉగ్రదాడి జరిగినా.. తిరిగి ఆ దేశంలో పర్యటించిన తొలి జట్టుగా నిలిచామని గుర్తు చేసింది. ఇటీవల కూడా బాంబుల మోతతో దద్దరిల్లిన వేళ పాక్‌లో పర్యటించి పరిమిత ఓవర్ల సిరీస్ పూర్తి చేశామని సుతిమెత్తగానే చురకలు అంటించింది.ఉగ్రదాడిని గుర్తుచేస్తూఅలాంటిది.. భారత్- పాక్ మ్యాచ్‌కు తాము అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాక.. అకస్మాత్తుగా మ్యాచ్‌ను బహిష్కరిస్తే.. ఆర్థికంగా భారీ నష్టం వస్తుందని.. ఈ అంశంలో పునరాలోచన చేయాలని విజ్ఞప్తి చేసింది. ఇలా పాత విషయాలు ముఖ్యంగా ఉగ్రదాడిని గుర్తుచేస్తూ లంక బోర్డు రాసిన లేఖ పాక్‌ను ఇరకాటంలో పడేసినట్లు తెలుస్తోంది.ఈ నేపథ్యంలో పాకిస్తాన్ బోర్డు చైర్మన్, పాక్ మంత్రి మొహ్సిన్ నక్వీ భారత్‌తో మ్యాచ్ ఆడే విషయమై పునరాలోచన చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని సంప్రదించినట్లు సమాచారం. ఈ విషయం గురించి పీసీబీ సన్నిహిత వర్గాలు జాతీయ మీడియాతో మాట్లాడుతూ..గతంలో సాయం చేశాము కదా!‘‘శ్రీలంక ప్రభుత్వం, క్రికెట్ బోర్డుతో పాకిస్తాన్ ఎల్లప్పుడూ సన్నిహిత సంబంధాలు కొనసాగించింది. అందుకు తగిన ఫలాలు పొందింది. కాబట్టి లంక బోర్డు నుంచి వచ్చిన లేఖను పాక్ నిర్లక్ష్యం చేయలేదు.లంక బోర్డు అధ్యక్షుడు షమ్మీ సిల్వా.. మొహ్సిన్ నక్వీని నేరుగా సంప్రదించి.. పాక్ తమకు సాయపడాల్సిందిగా కోరారు. భారత్- పాక్ మ్యాచ్‌ల వల్ల వచ్చే అదనపు ఆదాయానికి గండికొట్టకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. గతంలో తాము పాక్ బోర్డుకు సహాయపడిన విషయాన్ని గుర్తు చేశారు.నక్వీ ఈ విషయం గురించి తప్పక ప్రధాని దృష్టికి తీసుకువెళ్తారు. శ్రీలంక బోర్డు మాత్రమే కాదు.. శ్రీలంక ప్రభుత్వం కూడా గతేడాది నవంబరులో ఆటగాళ్లు మధ్యలోనే వెళ్లిపోకుండా ఒప్పించి.. పాక్‌తో ద్వైపాక్షిక సిరీస్ పూర్తి చేసేలా ఒప్పించారు’’ అని పేర్కొన్నాయి.కఠిన చర్యలు తప్పవుఇదిలా ఉంటే.. పాక్ అన్నంత పనిచేస్తే ఐసీసీ కూడా కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఐసీసీతో పాటు బ్రాడ్కాస్టర్లు, ఇతర సభ్య దేశాలు పెద్ద ఎత్తున నష్టపోయే క్రమంలో పీసీబీని ఆ పరిహారం చెల్లించాలని కోరే అవకాశాలు లేకపోలేదు. పరిస్థితి చేయిదాటితే ఇంకాస్త కఠినంగా కూడా వ్యవహరించే అవకాశం ఉంది. కాగా ఫిబ్రవరి 15న భారత్- పాకిస్తాన్ మధ్య వరల్డ్‌కప్ మ్యాచ్ జరగాల్సి ఉంది.చదవండి: పసికూనను ఓడించేందుకు కష్టపడ్డ పాకిస్తాన్ -
భారత్-పాక్ మ్యాచ్‌పై ఐసీసీ కీలక నిర్ణయం
టీ20 ప్రపంచకప్-2026లో భారత్-పాకిస్తాన్ మ్యాచ్ దాదాపుగా లేనట్టే. ఈ హైవోల్టేజ్ మ్యాచ్‌కు సంబంధించి టికెట్ల అమ్మకాలను ఐసీసీ (ICC) తాత్కాలికంగా నిలిపివేసింది. షెడ్యూల్ ప్రకారం.. ఫిబ్రవరి 15న కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో భారత్-పాక్ జట్లు తలపడాల్సి ఉంది. కానీ రాజకీయ ఉద్రిక్తల కారణంగా భారత్‌తో మ్యాచ్‌ను బాయ్‌కట్ చేస్తున్నట్లు పాకిస్తాన్ ప్రభుత్వం ప్రకటించింది.కానీ పాక్ క్రికెట్ బోర్డు నుంచి ఇప్పటికీ ఐసీసీకి ఎటువంటి అధికారిక సమాచారం అందలేదు. ఈ మ్యాచ్‌ను బాయ్‌కట్ చేస్తే తీవ్ర పరిణామాలను ఎదుర్కొవల్సి వస్తుందని ఐసీసీ హెచ్చరించినప్పటకి పాక్ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. శ్రీలంక క్రికెట్ బోర్డు కూడా పీసీబీకి లేఖ రాసింది.ఈ మ్యాచ్ రద్దయితే అన్ని విధాలగా తమ దేశం భారీగా నష్టపోతుందని ఆ లేఖలో శ్రీలంక క్రికెట్ పేర్కొంది. ఇప్పటికే అన్ని రకాల ఏర్పాట్లు చేశామని, బహిష్కరణ నిర్ణయాన్ని పునరాలోచించుకోవాలని లంక బోర్డు కోరింది. అయినా కూడా పీసీబీ వైఖరిలో ఎలాంటి మార్పు రాలేదు. ఈ సందిగ్ధత వల్లే టికెట్లు విక్రయించిన తర్వాత ఒకవేళ మ్యాచ్ రద్దయితే, చట్టపరమైన ఇబ్బందులు ఎదురవుతాయని ఐసీసీ బుకింగ్స్‌ను నిలిపివేసింది. ప్రేమదాస స్టేడియంలో జరిగే ఇతర ఎనిమిది మ్యాచ్‌ల టికెట్లు అందుబాటులో ఉన్నప్పటికీ.. భారత్-పాక్ మ్యాచ్ టికెట్లు మాత్రం బుకింగ్ పోర్టల్‌లో కనిపించడం లేదు. ఈ మెగా టోర్నీ శనివారం(ఫిబ్రవరి 7) నుంచి ప్రారంభం కానుంది. -
T20 WC: భారత్‌ను తొలగిస్తారా?: ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ ఓవరాక్షన్
ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ నాసిర్ హొసేన్‌పై టీమిండియా అభిమానులు మండిపడుతున్నారు. బంగ్లాదేశ్, పాకిస్తాన్లకు మద్దతు ఇవ్వాలనుకుంటే పర్లేదని.. కానీ అనవసరంగా భారత్‌ను ఇందులోకి లాగితే సహించేది లేదని సోషల్ మీడియా వేదికగా హెచ్చరిస్తున్నారు.టీ20 ప్రపంచకప్-2026 టోర్నమెంట్ నేపథ్యంలో బంగ్లాదేశ్, పాకిస్తాన్ రచ్చ చేస్తున్న విషయం తెలిసిందే. ఆతిథ్య దేశమైన భారత్‌లో తమకు భద్రత లేదని.. పాక్‌తో పాటు తమ మ్యాచ్‌లను కూడా శ్రీలంకలో నిర్వహించాలని బంగ్లాదేశ్ కోరింది. అయితే, బంగ్లా ఆరోపణల్లో నిజం లేదని తేల్చిన అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) పునరాలోచన చేయాల్సిందిగా బంగ్లాకు అవకాశం ఇచ్చింది.బంగ్లా మొండివైఖరికి భారీ మూల్యంఅయినప్పటికీ బంగ్లాదేశ్ మొండి వైఖరి వీడకపోవడంతో బంగ్లాను టోర్నీ నుంచి తొలగించిన ఐసీసీ.. రాంకింగ్స్ ఆధారంగా స్కాట్లాండ్ను టోర్నీలో చేర్చింది. ఈ నేపథ్యంలో తాము బంగ్లాదేశ్‌కు మద్దతుగా భారత్‌తో మ్యాచ్ బాయ్‌కాట్ చేస్తామని పాక్ ప్రకటించింది.భారత్‌ను తొలగిస్తారా?ఈ పరిణామాలపై ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ నాసిర్ హొసేన్ స్పందించిన తీరు వివాదాస్పదమైంది. ద్వంద్వ వైఖరి మీకు మాత్రమే సాధ్యమంటూ టీమిండియా అభిమానులు అతడిని తిట్టిపోస్తున్నారు. స్కై స్పోర్ట్స్‌తో మాట్లాడుతూ.. "ఒకవేళ టోర్నమెంట్ ఆరంభానికి నెల రోజుల ముందు.. ఇండియా.. 'మా ప్రభుత్వం ఆ దేశంలో వరల్డ్‌కప్ ఆడేందుకు ఒప్పుకోలేదు’ అని చెబితే..ఇదే ఐసీసీ.. 'మీకు నిబంధనలు తెలుసు కదా! బ్యాడ్ లక్.. మిమ్మల్ని టోర్నీ నుంచి తొలగిస్తున్నాం’ అని చెప్పగలదా?.. అందరినీ సమానంగా చూడాలని మాత్రమే నేను చెబుతున్నా. బంగ్లాదేశ్, పాకిస్తాన్, టీమిండియా.. అన్నింటినీ ఒకే విధంగా చూడాలి.మా దగ్గర డబ్బు ఉందిఇప్పుడు టీమిండియా అభిమానులు వచ్చి.. 'మాపై పడి ఏడవండి. మా దగ్గర డబ్బు ఉంది’ అంటే మనమేమీ చేయలేము. అధికారం ఉన్నవాళ్లే బాధ్యతగానూ ఉండాలి’’ అని నాసిర్ హొసేన్ అన్నాడు. అతడి వ్యాఖ్యలపై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు.అపుడేమో గర్వంగా ఉందన్నావ్!"బంగ్లాదేశ్, పాకిస్తాన్‌లపై మీకు సానుభూతి ఎందుకో మాకు బాగా తెలుసు. అయినా గతంలో జరిగిన విషయాలు మీకు గుర్తున్నాయా?.. 2003లో జింబాబ్వే జట్టును బాయ్‌కాట్ చేసింది ఇంగ్లండ్ కాదా? అప్పుడు తమరే కెప్టెన్‌గా ఉన్నారు కదా!ఆ సమయంలో.. ఇంగ్లండ్ కెప్టెన్‌గా ఉన్నందుకు గర్వంగా ఉంది. జింబాబ్వేకు వెళ్లకపోవడమే మంచిది అని మీరు అనలేదా? 2009 టీ20వరల్డ్‌కప్ సమయంలో జింబాబ్వే ఆటగాళ్లకు వీసాలు నిరాకరించి... వారిని టోర్నీ నుంచి తప్పుకొనేలా చేసింది మీరు కాదా?మీరు చేస్తే ఒప్పు.. వేరే వాళ్లు చేస్తే తప్పా? ఇప్పుడు శుద్ధపూసలాగా క్రికెట్- రాజకీయం కలపవద్దు అని సూక్తులు వల్లిస్తున్నారు. మరి ఆరోజు ఏమైంది మీ పెద్ద మనసు. నాడు ఇంగ్లండ్ ఏం చేసిందంటేబంగ్లాదేశ్, పాకిస్తాన్ ఎలాంటి పనులు చేసినా మీకు నచ్చుతుందేమో! అందరూ మీలా ఉండరు’’ అని చురకలు అంటిస్తున్నారు. కాగా 2003లో జింబాబ్వేలో రాబర్ట్ ముగాబే పాలనను నిరసిస్తూ హరారేలో ఆడాల్సిన మ్యాచ్‌ను ఇంగ్లండ్ బహిష్కరించింది. రాజకీయ, భద్రతాపరమైన కారణాలు చూపుతూ ఇలా చేసింది.అందుకే నాసిర్ హొసేన్‌కు ఆ విషయాన్ని గుర్తుచేస్తూ అతడి ద్వంద్వ వైఖరిని నెటిజన్లు ఎండగడుతున్నారు. కాగా బంగ్లాదేశ్‌లో మైనారిటీ హిందువులపై హత్యాకాండ జరుగగా.. ఐపీఎల్ నుంచి ముస్తాఫిజుర్‌ను బీసీసీఐ తొలగించింది. దీనిని సాకుగా చూపి భద్రతా కారణాలంటూ బంగ్లాదేశ్ రాగం ఎత్తుకుని మూల్యం చెల్లించింది. మరోవైపు.. పాక్‌లో గతంలో శ్రీలంక జట్టుపై ఉగ్రదాడి జరిగిన విషయం తెలిసిందే.చదవండి: మాపై ఉగ్రదాడి జరిగింది: పాకిస్తాన్‌కు దిమ్మతిరిగేలా శ్రీలంక లేఖ -
IND vs PAK: పాకిస్తాన్‌కు దిమ్మతిరిగేలా శ్రీలంక లేఖ
టీమిండియాతో మ్యాచ్ బహిష్కరిస్తామన్న పాకిస్తాన్.. తమ నిర్ణయంపై పునరాలోచన చేయాలని శ్రీలంక క్రికెట్ బోర్డు (SLC) విజ్ఞప్తి చేసింది. దాయాదులు పోరు కోసం తాము ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్న లంక బోర్డు.. తమకు నష్టం చేకూర్చే విధంగా వ్యవహరించవద్దని కోరింది.ఈ సందర్భంగా పాకిస్తాన్లో తమ జట్టుపై జరిగిన ఉగ్రదాడి (2009 Lahore Attack)ని ప్రస్తావిస్తూ.. పాక్‌కు దిమ్మతిరిగేలా చురకలు అంటించింది. కాగా టీ20 ప్రపంచకప్-2026 టోర్నీకి భారత్ ఆతిథ్యం ఇస్తుండగా.. ఒప్పందం ప్రకారం పాకిస్తాన్ కోసం శ్రీలంకను తటస్థ వేదికగా ఏర్పాటు చేశారు. అయితే, బంగ్లాదేశ్ కూడా లంకలోనే మ్యాచ్‌లు ఆడతామని పట్టుబట్టగా ఆ జట్టును ఐసీసీ తొలగించింది.భారీ నష్టంభారత్లో బంగ్లా జట్టుకు పూర్తి భద్రత ఉంటుందని చెప్పినా వినకపోవడంతో ఐసీసీ ఈ మేర కఠిన నిర్ణయం తీసుకుంది. అయితే బంగ్లాకు మద్దతుగా తాము భారత్‌తో బహిష్కరిస్తామని పాకిస్తాన్ ప్రధాని షెబాజ్ షరీఫ్ ప్రకటించాడు. అదే జరిగితే హైవోల్టేజీ మ్యాచ్ కోసం ఏర్పాట్లు చేసిన ఐసీసీ, బ్రాడ్కాస్టర్లు పెద్ద ఎత్తున నష్టపోవాల్సి ఉంటుంది. అదే సమయంలో ఐసీసీ సభ్య దేశాలు సైతం ఆదాయం కోల్పోతాయి.అన్ని ఏర్పాట్లు జరిగిపోయాయిఈ నేపథ్యంలో తమపై కూడా దీని ప్రభావం తీవ్రంగా ఉంటుందన్న శ్రీలంక బోర్డు.. పాకిస్తాన్‌కు లేఖ రాసింది. "కొలంబోలోని ఆర్.ప్రేమదాస స్టేడియంలో ఫిబ్రవరి 15న టీమిండియాతో జరగాల్సిన మ్యాచ్‌ను బహిష్కరిస్తున్నట్లు మీడియా ద్వారా తెలిసింది. వరల్డ్‌కప్ టోర్నీలో మా దేశంలో జరగాల్సిన మ్యాచ్‌ల షెడ్యూల్ చాన్నాళ్ల క్రితమే ఖరారైంది.ఈ మ్యాచ్‌కు సంబంధించి భద్రతా ఏర్పాట్లు, టికెట్ల అమ్మకం, ఆతిథ్య ఏర్పాట్లు, వాణిజ్య కార్యకలాపాలు.. ఇలా ప్రతి ఒక్క అంశానికి సంబంధించి అన్నీ ఖరారైపోయాయి. ఈ సందర్భంగా.. మర్యాదపూర్వకంగా గౌరవంతో మీకో విషయాన్ని గుర్తుచేయాలని భావిస్తున్నాం.పాక్‌లో మాపై ఉగ్రదాడిభద్రతాపరంగా సున్నితమైన వాతావరణం నెలకొన్న వేళ పాకిస్తాన్లో మేమే మళ్లీ తొలుత పర్యటించాం. గతంలో మా జాతీయ జట్టు కాన్వాయ్‌పై దాడి జరిగింది. ఫలితంగా మా శ్రీలంక ఆటగాళ్లు, అధికారులు గాయాలపాలయ్యారు. వారిలో కొంతమంది ఇప్పటికీ ఆ గాయాల తాలుకు నొప్పితో బాధపడుతున్నారు.ఇటీవల బాంబుల వర్షం కురుస్తున్నా.. మేము పాక్ పర్యటనను మధ్యలోనే నిలిపివేయకుండా మ్యాచ్‌లు పూర్తి చేసుకున్నాం. ఇప్పటికీ మేము పాక్ క్రికెట్‌తో అంతర్జాతీయ స్థాయిలో పరస్పర ప్రయోజనాల కోసం పనిచేసేందుకు సిద్ధంగానే ఉన్నాము.పాకిస్తాన్‌కు వచ్చేందుకు సందేహించినాగతంలో విదేశీ జట్లన్నీ పాకిస్తాన్లో పర్యటించేందుకు సందేహిస్తున్న తరుణంలో మేమే ముందుగా అక్కడి వచ్చాము’’ అంటూ శ్రీలంక క్రికెట్ బోర్డు సున్నితంగానే పాకిస్తాన్‌కు కర్రుకాల్చి వాతపెట్టినట్లుగా పాక్‌లో ఉన్న పరిస్థితుల గురించి తెలిసేలా చేసింది. తమ దేశంలో భారత్- పాకిస్తాన్ మ్యాచ్‌కు భద్రతా సమస్యలు ఉంటాయంటూ పాక్ బోర్డు చెప్పిన కారణం సరైంది కాదని పరోక్షంగా చురకలు అంటించింది.కాగా 2009లో గడాఫీ స్టేడియం నుంచి శ్రీలంక క్రికెట్ జట్టు బస్సులో వెళ్తున్న సమయంలో 12 మంది ఉగ్రవాదులు బస్సుపై కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో కొంతమంది అధికారులు మరణించగా.. ఆరుగురు శ్రీలంక క్రికెటర్లు గాయపడ్డారు. కెప్టెన్ మహేళ జయవర్ధనే సహా కుమార్ సంగక్కర కూడా గాయాలపాలయ్యారు. పాక్‌కు చెందిన అహ్సాన్ రజా అనే అంపైర్ కష్టంమీద ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ నేపథ్యంలో పాకిస్తాన్‌లోని పరిస్థితుల దృష్ట్యా చాలాకాలం వరకు విదేశీ జట్లు అక్కడ పర్యటించిందేకు వణికిపోయాయి. ఇక ఇటీవల సైతం బాంబుల మోత నడుమ కూడా పాక్-లంక మ్యాచ్‌లు యథావిధిగా జరగగా.. పీసీబీ చైర్మన్ మొహ్సిన్ నక్వీ లంక జట్టుకు చేతులు జోడించి నమస్కరించాడు.చదవండి: IND vs PAK: పాక్ నిర్ణయంపై తొలిసారి స్పందించిన బంగ్లాదేశ్.. పొట్టకొట్టేలా.. -
T20 WC: జట్లు, మ్యాచ్ టైమింగ్స్, లైవ్ స్ట్రీమింగ్.. పూర్తి వివరాలు
టీ20 ప్రపంచకప్-2026 టోర్నమెంట్‌కు ఫిబ్రవరి 7- మార్చి 8 మధ్య షెడ్యూల్ ఖరారైంది. డిఫెండింగ్ చాంపియన్ హోదాలో భారత్ ఈ ఐసీసీ ఈవెంట్‌కు ఆతిథ్యం ఇస్తుండగా.. పాకిస్తాన్ తమ మ్యాచ్‌లను శ్రీలంక వేదికగా ఆడేలా షెడ్యూల్ రూపొందించారు.ఈ వరల్డ్‌కప్ టోర్నీలో ఇరవై జట్లు పాల్గొంటుండగా.. వాటిని నాలుగు గ్రూపులుగా విభజించారు. ఒక్కో గ్రూపులో ఐదు జట్లు ఉంటాయి. గ్రూప్-‘ఎ’ నుంచి భారత్, పాకిస్తాన్, అమెరికా, నమీబియా, నెదర్లాండ్స్ పోటీ పడుతుండగా.. గ్రూప్-బిలో ఆస్ట్రేలియా, ఐర్లాండ్, ఒమన్, శ్రీలంక, జింబాబ్వే ఉన్నాయి.గ్రూప్-సిలో ఇంగ్లండ్, వెస్టిండీస్, బంగ్లాదేశ్, నేపాల్, ఇటలీ ఉండగా.. గ్రూప్-డి నుంచి న్యూజిలాండ్, సౌతాఫ్రికా, అఫ్గనిస్తాన్, యూఏఈ, కెనడా పోటీలో పడుతున్నాయి. మరి టోర్నీకి ఖరారైన ఇరవై జట్లలో ఎవరెవరు ఉన్నారు? మ్యాచ్ టైమింగ్స్... ప్రత్యక్ష ప్రసారాలు ఎక్కడ? తదితర విషయాలు తెలుసుకుందామా?!గ్రూప్-ఎభారత్సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సంజు శాంసన్, శివమ్ దూబే, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, అర్ష్‌దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రింకు సింగ్.యూఎస్ఏమోనాంక్ పటేల్ (కెప్టెన్), జెస్సీ సింగ్, ఆండ్రీస్ గౌస్, షెహన్ జయసూర్య, మిలింద్ కుమార్, షయాన్ జహంగీర్, సాయితేజ ముక్కామల, సంజయ్ కృష్ణమూర్తి, హర్మీత్ సింగ్, నోస్తుష్ కెంజిగే, షాడ్లీ వాన్ షాల్విక్, సౌరభ్ నేత్రవల్కర్, అలీ ఖాన్, మహ్మద్ మొహ్సిన్, శుభం రంజానే.నమీబియాగెర్హార్డ్ ఎరాస్మస్ (కెప్టెన్), జేన్ గ్రీన్, బెర్నార్డ్ షాల్, రూబెన్ ట్రంపెల్మన్, జెజె స్మిత్, జాన్ ఫ్రైలింక్, లౌరెన్ స్టీన్‌క్యాంప్, మలన్ క్రుగర్, నికోల్ లాఫ్టీ-ఈటన్, జాక్ బ్రసెల్, బెన్ షికోంగో, జెసి బాల్ట్, డైలాన్ లీచర్, డబ్ల్యుపి మైబర్, మాక్స్ హీంగోరిజర్వు ప్లేయర్: అలెగ్జాండర్ వోల్షెంక్నెదర్లాండ్స్స్కాట్ ఎడ్వర్డ్స్ (కెప్టెన్), కోలిన్ అకెర్మాన్, నోహ్ క్రోస్, బాస్ డి లీడ్, ఆర్యన్ దత్, ఫ్రెడ్ క్లాసెన్, కైల్ క్లైన్, మైఖేల్ లెవిట్, జాచ్ లయన్-కాచెట్, మాక్స్ ఓ'డౌడ్, లోగాన్ వాన్ బీక్, టిమ్మ్ వాన్ డెర్ గుగ్టెన్, రోల్ఫ్ వాన్‌డెర్ మెర్వే, పాల్ వాన్ మెకరెన్, సకీబ్ జుల్ఫికర్పాకిస్తాన్సల్మాన్ అలీ అఘా (కెప్టెన్), అబ్రార్ అహ్మద్, బాబర్ ఆజం, ఫహీమ్ అష్రఫ్, ఫఖర్ జమాన్, ఖవాజా నఫే, మొహమ్మద్ నవాజ్, మహ్మద్ సల్మాన్ మీర్జా, నసీమ్ షా, సాహిబ్జాదా ఫర్హాన్, సయీమ్ అయూబ్, షాహీన్ షా ఆఫ్రిది, షాదాబ్ ఖాన్, ఉస్మాన్ ఖాన్, ఉస్మాన్ తారీక్.గ్రూప్-బిఆస్ట్రేలియామిచెల్ మార్ష్ (కెప్టెన్), జేవియర్ బార్ట్లెట్, కూపర్ కొన్నోలీ, టిమ్ డేవిడ్, బెన్ డ్వార్షుయిస్, కామెరాన్ గ్రీన్, నాథన్ ఎల్లిస్, జోష్ హాజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, మాథ్యూ కుహ్నెమాన్, గ్లెన్ మాక్స్వెల్, మాథ్యూ రెన్షా, మార్కస్ స్టోయినిస్, ఆడమ్ జంపాశ్రీలంకదసున్ షనక (కెప్టెన్), పాతుమ్ నిస్సాంక, కమిల్ మిషార, కుశాల్ మెండిస్, కమిందు మెండిస్, కుశాల్ జనిత్ పెరీరా, చరిత్ అసలంక, జనిత్ లియానాగే, పవన్ రత్నాయకే, వనిందు హసరంగా, దునిత్ వెల్లలగే, మహేశ్ తీక్షణ, దుష్మంత చమీర, మతీషా పతిరణ, ఇషాన్ మలింగజింబాబ్వేసికందర్ రజా (కెప్టెన్), బ్రియాన్ బెన్నెట్, ర్యాన్ బర్ల్, గ్రేమ్ క్రీమెర్, బ్రాడ్లీ ఎవాన్స్, క్లైవ్ మడాండే, టినోటెండా మపోసా, తడివానాషే మారుమణి, వెల్లింగ్టన్ మసకద్జా, టోనీ మున్యోంగా, తషింగా ముసెకివా, బ్లెస్సింగ్ ముజరబానీ, డియాన్ మేయర్స, రిచర్డ్ ఎంగరవ, బ్రెండన్ టేలర్ఐర్లాండ్పాల్ స్టిర్లింగ్ (కెప్టెన్), మార్క్ అడైర్, రాస్ అడైర్, బెన్ కాలిట్జ్, కర్టిస్ కాంఫర్, గారెత్ డెలానీ, జార్జ్ డాక్రెల్, మాథ్యూ హంఫ్రీస్, జోష్ లిటిల్, బారీ మెక్‌కార్తీ, హ్యారీ టెక్టర్, టిమ్ టెక్టర్, లోర్కాన్ టక్కర్, బెన్ వైట్, క్రెయిగ్ యంగ్.ఒమన్జతీందర్ సింగ్ (కెప్టెన్), వినాయక్ శుక్లా, మహ్మద్ నదీమ్, షకీల్ అహ్మద్, హమ్మద్ మీర్జా, వసీం అలీ, కరణ్ సోనావాలే, షా ఫైసల్, నదీమ్ ఖాన్, సుఫ్యాన్ మెహమూద్, జే ఒడెద్రా, షఫీక్ జాన్, ఆశిష్ ఒడెదర, జితేన్ రామనంది, అమీర్ కలీమ్గ్రూప్-సిఇంగ్లండ్హ్యారీ బ్రూక్ (కెప్టెన్), రెహాన్ అహ్మద్, జోఫ్రా ఆర్చర్, టామ్ బాంటన్, జాకబ్ బెథెల్, జోస్ బట్లర్, సామ్ కుర్రాన్, లియామ్ డాసన్, బెన్ డకెట్, విల్ జాక్స్, జామీ ఓవర్టన్, ఆదిల్ రషీద్, ఫిల్ సాల్ట్, జోష్ టంగ్, ల్యూక్ వుడ్వెస్టిండీస్షాయ్ హోప్ (కెప్టెన్), షిమ్రాన్ హెట్మెయర్, జాన్సన్ చార్లెస్, రోస్టన్ చేజ్, మాథ్యూ ఫోర్డే, జేసన్ హోల్డర్, అకీల్ హోసేన్, షమర్ జోసెఫ్, బ్రాండన్ కింగ్, గుడకేష్ మోటీ, రోవ్‌మన్ పావెల్, షెర్ఫానే రూథర్‌ఫోర్డ్, క్వెంటిన్ సాంప్సన్, జేడెన్ సీల్స్, రొమారియో షెపర్డ్.ఇటలీవేన్ మాడ్సెన్ (కెప్టెన్), మార్కస్ కాంపోపియానో, జియాన్ పియరో మీడే, జైన్ అలీ, అలీ హసన్, క్రిషన్ జార్జ్ కలుగమాగే, హ్యారీ మానెంటి, ఆంథోనీ మోస్కా, జస్టిన్ మోస్కా, సయ్యద్ నఖ్వీ, బెంజమిన్ మానెంటి, జస్ప్రీత్ సింగ్, జెజె స్మట్స్, గ్రాంట్ స్టీవర్ట్, థామస్ డ్రాకానేపాల్రోహిత్ పౌడెల్ (కెప్టెన్), దీపేంద్ర సింగ్ ఐరీ, సందీప్ లమిచానే, కుశాల్ భుర్టెల్, ఆసిఫ్ షేక్, సందీప్ జోరా, ఆరిఫ్ షేక్, బసీర్ అహమద్, సోంపాల్ కమీ, కరణ్ కెసి, నందన్ యాదవ్, గుల్షన్ ఝా, లలిత్ రాజ్‌బన్షి, షేర్ మల్లా, లోకేష్ బామ్స్కాట్లాండ్రిచీ బెరింగ్టన్ (కెప్టెన్), టామ్ బ్రూస్, మాథ్యూ క్రాస్, బ్రాడ్లీ క్యూరీ, ఒలివర్ డేవిడ్సన్, క్రిస్ గ్రీవ్స్, జైనుల్లా ఇహ్సాన్, మైఖేల్ జోన్స్, మైఖేల్ లీస్క్, ఫిన్లే మెక్‌క్రీత్, బ్రాండన్ మెక్‌ముల్లెన్, జార్జ్ మున్సే, సఫ్యాన్ షరీఫ్, మార్క్ వాట్, బ్రాడ్లీ వీల్.ట్రావెలింగ్ రిజర్వు ప్లేయర్లు: జాస్పర్ డేవిడ్సన్, జాక్ జార్విస్నాన్-ట్రావెలింగ్ రిజర్వ్స్: మెకెంజీ జోన్స్, క్రిస్ మెక్‌బ్రైడ్, చార్లీ టియర్గ్రూప్-డిసౌతాఫ్రికాఐడెన్ మార్క్రమ్ (కెప్టెన్), కార్బిన్ బాష్, డెవాల్డ్ బ్రెవిస్, క్వింటన్ డి కాక్, మార్కో యాన్సెన్, జార్జ్ లిండే, కేశవ్ మహరాజ్, క్వేనా మఫాకా, డేవిడ్ మిల్లర్, లుంగి ఎన్గిడి, అన్రిచ్ నోర్ట్జే, కగిసో రబడ, ర్యాన్ రికెల్టన్, జాసన్ స్మిత్, ట్రిస్టన్ స్టబ్స్న్యూజిలాండ్మిచెల్ సాంట్నర్ (కెప్టెన్), ఫిన్ అలెన్, మైఖేల్ బ్రేస్‌వెల్, మార్క్ చాప్మన్, డెవాన్ కాన్వే, జాకబ్ డఫీ, లాకీ ఫెర్గూసన్, మాట్ హెన్రీ, కైల్ జామిసన్, డారిల్ మిచెల్, జేమ్స్ నీషమ్, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, టిమ్ సీఫెర్ట్, ఇష్ సోధి.అఫ్గనిస్తాన్రషీద్ ఖాన్ (కెప్టెన్), నూర్ అహ్మద్, అబ్దుల్లా అహ్మద్జాయ్, సెదీఖుల్లా అటల్, ఫజల్హాక్ ఫరూఖీ, రహ్మానుల్లా గుర్బాజ్, మహ్మద్ ఇషాక్ రహీమి, షాహిదుల్లా కమల్, మహ్మద్ నబీ, గుల్బాదిన్ నైబ్, అజ్మతుల్లా ఒమర్జాయ్, ముజీబ్ ఉర్ రహ్మాన్, డార్విష్ రసూలీ, ఇబ్రహీం జద్రాన్, జియా ఉర్ రెహమాన్ షరీఫీరిజర్వ్స్: AM గజన్ఫర్, ఇజాజ్ అహ్మద్జాయ్, ఫరీద్ అహ్మద్ మాలిక్కెనడాదిల్ప్రీత్ బజ్వా (కెప్టెన్), అజయ్‌వీర్ హుందాల్, అన్ష్ పటేల్, దిలోన్ హేలిగర్, హర్ష్ థాకర్, జస్కరన్‌దీప్ సింగ్, కలీమ్ సనా, కన్వర్పాల్ తత్గూర్, నవనీత్ ధలీవాల్, నికోలస్ కిర్టన్, రవీందర్‌పాల్ సింగ్, సాద్ బిన్ జాఫర్, శివమ్ శర్మ, శ్రేయాస్ మొవ్వా, యువ్‌రాజ్ సమ్రాయూఏఈముహమ్మద్ వసీమ్ (కెప్టెన్), అలీషాన్ షరాఫు, ఆర్యన్ష్ శర్మ, ధ్రువ్ పరాశర్, హైదర్ అలీ, హర్షిత్ కౌశిక్, జునైద్ సిద్ధిక్, మయాంక్ కుమార్, ముహమ్మద్ అర్ఫాన్, ముహమ్మద్ ఫరూక్, ముహమ్మద్ జవదుల్లా, ముహమ్మద్ జోహైబ్, రోహిద్ ఖాన్, సోహైబ్ ఖాన్, సిమ్రంజీత్ సింగ్.వేదికలు👉భారత్- కోల్‌కతా, ముంబై, చెన్నై, ఢిల్లీ, అహ్మదాబాద్ 👉శ్రీలంక- కొలంబో, పల్లకెలె👉ఫైనల్- అహ్మదాబాద్మ్యాచ్ ఆరంభ సమయం👉ఉదయం మ్యాచ్‌లు: 11 గంటలకు ఆరంభం👉మధ్యాహ్నం మ్యాచ్‌లు: 3 గంటలకు ఆరంభం👉రాత్రి మ్యాచ్‌లు: 7 గంటలకు ఆరంభంలైవ్ స్ట్రీమింగ్ వివరాలు👉టీవీలో స్టార్ స్పోర్ట్స్‌లో ప్రసారం👉డిజిటల్ మీడియాలో జియోహాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం👉తెలుగు, హిందీ, తమిళ్, ఇంగ్లిష్, కన్నడ భాషల్లో జియో స్టార్ టీవీలో కామెంట్రీ👉జియోహాట్‌స్టార్‌లో పై భాషలతో పాటు బెంగాలీ, భోజ్‌పురి, హర్యాన్వీ భాషల్లోనూ వ్యాఖ్యానం.చదవండి: IND vs PAK: పాక్ నిర్ణయంపై తొలిసారి స్పందించిన బంగ్లాదేశ్ -
పాక్‌తో మ్యాచ్.. కుండబద్దలు కొట్టిన సూర్యకుమార్
భారత్‌తో మ్యాచ్ బహిష్కరిస్తామన్న పాకిస్తాన్ నిర్ణయంపై టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్పందించాడు. తాము అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) షెడ్యూల్‌కు అనుగుణంగా నడుచుకుంటామని.. ఫిబ్రవరి 15న కొలంబోకు వెళ్తామని కుండబద్దలు కొట్టాడు. ఈ విషయంలో తమకు పూర్తి స్పష్టత ఉందని సూర్య ఈ సందర్భంగా పేర్కొన్నాడు.కాగా టీ20 ప్రపంచకప్-2026 టోర్నీకి డిఫెండింగ్ చాంపియన్ హోదాలో భారత్ ఆతిథ్యం ఇస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ఒప్పందం ప్రకారం ఈ టోర్నీలో పాకిస్తాన్ తమ మ్యాచ్‌లన్నీ తటస్థ వేదికైన శ్రీలంకలో ఆడనుంది. ఇదిలా ఉంటే.. ఐపీఎల్ నుంచి ముస్తాఫిజుర్ రహమాన్ (Mustafizur Rahman)ను తప్పించిన నేపథ్యంలో.. బంగ్లాదేశ్ భారత్‌లో ఆడలేమని ఐసీసీకి విజ్ఞప్తి చేసింది.బంగ్లా అవుట్.. అండగా ఉంటామంటూ పాక్ డ్రామాతమ వేదికను కూడా శ్రీలంకకు మార్చాలని కోరగా.. ఐసీసీ ఇందుకు నిరాకరించి.. పట్టువీడని బంగ్లాను టోర్నీ నుంచి తొలగించింది. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్‌కు మద్దతుగా తాము టీమిండియాతో మ్యాచ్ బహిష్కరిస్తున్నామంటూ పాకిస్తాన్ ప్రకటించింది. అయితే, షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 15న కొలంబో వేదికగా భారత్- పాక్ తలపడాల్సి ఉంది.మేము కొలంబో వెళ్తున్నాంఈ పరిణామాలపై గురువారం నాటి కెప్టెన్ల మీడియా సమావేశంలో టీమిండియా సారథి సూర్యకుమార్ యాదవ్ తనదైన శైలిలో స్పందించాడు. “మా మైండ్‌సెట్ క్లియర్‌గా ఉంది. మేమేమీ ఆ మ్యాచ్ ఆడమని చెప్పలేదే!.. వాళ్లే అలా చెప్పారు. ఐసీసీ షెడ్యూల్ ప్రకటించింది.మా ప్రయాణానికి విమాన టికెట్లు కూడా బుక్ అయ్యాయి. కాబట్టి మేము కొలంబో వెళ్తున్నాం. ఆతర్వాత ఏం జరుగుతుందో అక్కడే మాకు తెలుస్తుంది’’ అని సూర్య స్పష్టం చేశాడు. ఇక పాక్‌తో మ్యాచ్ రద్దు కావడం ఎలాంటి ప్రభావం చూపుతుందన్న ప్రశ్నకు బదులిస్తూ.. నా చేతుల్లో ఏమీ లేదు“వాళ్ల నిర్ణయం నా ఆధీనంలో ఉండదు కదా!.. ఫిబ్రవరి 15న మ్యాచ్ ఆడాలని మాకు చెప్పారు. ఇప్పటికే తటస్థ వేదిక మీద ఆసియా కప్ టోర్నీలో వాళ్లతో మూడు మ్యాచ్‌లు ఆడాము. కొలంబోనూ ఆడే అవకాశం వస్తే ఆడతాం. ఆడటం.. ఆడకపోవడం నా నిర్ణయం కాదు. ఇదొక సంక్లిష్ట సమయం’’ అని సూర్య పేర్కొన్నాడు. చదవండి: ఫిబ్రవరి 15న భారత్‌తో జరగాల్సిన మ్యాచ్‌కు జట్టును ప్రకటించిన పాక్ క్రికెట్ బోర్డు! -
వాళ్లు మా సోదరులు: పాక్ కెప్టెన్ ఓవరాక్షన్
పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ ఆఘాపై భారతీయ నెటిజన్లు భగ్గుమంటున్నారు. బంగ్లాదేశీయలు తమ సోదరులు అంటూ అతడు చేసిన వ్యాఖ్యలపై సెటైర్లు వేస్తున్నారు. బంగ్లాదేశ్‌కు గట్టిగా బుద్ధి చెప్పిన అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) పాకిస్తాన్‌కు కూడా సరైన సమాధానం ఇవ్వాలని సోషల్ మీడియా వేదికగా విజ్ఞప్తి చేస్తున్నారు.భారత్- బంగ్లా ఉద్రిక్తతలుకాగా 1971లో బంగ్లాదేశ్ ఆవిర్భవించిన విషయం తెలిసిందే. పశ్చిమ పాకిస్తాన్ ఆగడాలు తట్టుకోలేక విలవిల్లాడిన తూర్పు ప్రజలకు భారత సైన్యం అండగా నిలిచింది. ఫలితంగా బంగ్లాదేశ్‌కు స్వతంత్రత వచ్చింది. ఈ యుద్ధంలో సుమారుగా 3900 మంది భారతీయ సైనికులు ప్రాణత్యాగం చేశారు.ఇలా బంగ్లాదేశ్‌కు ఆది నుంచి భారత్ అండగా ఉంటోంది. అయితే, ఇటీవల కొంతమంది బంగ్లా నేతలు భారత్ భూభాగాల గురించి అవాకులు చెవాకులు పేలడమే కాకుండా.. ఉగ్రవాదులకు తాము ఆశ్రయమిస్తే ఎలా ఉంటుందో తెలుస్తుంది అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు మైనారిటీ హిందువులపై బంగ్లాలో హత్యాకాండ జరిగింది.టోర్నీ నుంచి అవుట్‌ఈ నేపథ్యంలో ఐపీఎల్ నుంచి బంగ్లాదేశ్ ఫాస్ట్‌బౌలర్ ముస్తాఫిజుర్ రహమాన్ తొలగించాలనే డిమాండ్లు రాగా.. బీసీసీఐ అందుకు సానుకూలంగా స్పందించింది. ఈ క్రమంలో తమ ఆటగాళ్లకు భారత్‌లో భద్రత ఉండదంటూ టీ20 ప్రపంచకప్-2026లో తమ వేదికను భారత్ నుంచి శ్రీలంకకు మార్చాల్సిందిగా బంగ్లా ఐసీసీని కోరింది.పాక్ ఓవరాక్షన్‌అయితే, బంగ్లా ఆరోపణలను కొట్టిపారేసిన ఐసీసీ.. తుదినిర్ణయం చెప్పాలని గడువు ఇచ్చింది. అయినప్పటికి బంగ్లా పట్టువీడకపోవడంతో టోర్నీ నుంచి తొలగించింది. ఈ నేపథ్యంలో తటస్థ వేదికైన శ్రీలంకలో మ్యాచ్‌లు ఆడాల్సి ఉన్న పాక్ సైతం టోర్నీ బహిష్కరిస్తామని తొలుత.. ఆ తర్వాత భారత్‌తో మ్యాచ్ బహిష్కరిస్తామని ప్రకటించింది.ఈ నేపథ్యంలో ‘థాంక్యూ పాకిస్తాన్’ అని బంగ్లాదేశ్ యువజన, క్రీడా శాఖ సలహాదారు ఆసిఫ్ నజ్రుల్ పాక్ ప్రధాని షెబాజ్ షరీఫ్‌నకు సోషల్ మీడియా వేదికగా ధన్యవాదాలు తెలిపాడు. తాజాగా పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ ఆఘా మీడియాతో మాట్లాడుతూ.. బంగ్లాదేశ్‌పై ప్రేమ ఒలకబోశాడు.చరిత్ర గుర్తు చేసుకో‘‘బంగ్లాదేశీయులు మా సోదరులు. పాకిస్తాన్‌కు మద్దతుగా ఉన్నందుకు వారికి రుణపడి ఉంటాము. కానీ వాళ్లు ఈసారి వరల్డ్‌కప్ టోర్నీ ఆడకపోవడం చూస్తుంటే బాధగా ఉంది’’ అంటూ సల్మాన్ ఆఘా పేర్కొన్నాడు. ఈ నేపథ్యంలో చరిత్రను ఒక్కసారి గుర్తు చేసుకోవాలంటూ భారతీయ నెటిజన్లు అతడికి చురకలు అంటిస్తున్నారు. కాగా శనివారం నుంచి భారత్- శ్రీలంక వేదికలుగా టీ20 ప్రపంచకప్ టోర్నీ ఆరంభం కానుంది. పాక్ తమ తొలి మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌తో తలపడుతుంది.చదవండి: IND vs PAK: పాక్ నిర్ణయంపై తొలిసారి స్పందించిన బంగ్లాదేశ్.. పొట్టకొట్టేలా.. -
అందుకే టీమిండియాతో మ్యాచ్ బహిష్కరిస్తున్నాం: పాక్ ప్రధాని
టీ20 ప్రపంచకప్-2026 టోర్నమెంట్లో టీమిండియాతో తమ జట్టు మ్యాచ్ ఆడబోదని పాకిస్తాన్ ప్రధాని షెబాజ్ షరీఫ్ పునురుద్ఘాటించారు. క్రీడల్లో రాజకీయ జోక్యం ఉండకూడదని.. అందుకే తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఇస్లామాబాద్‌లో ఫెడరల్ క్యాబినెట్‌ను ఉద్దేశించి ప్రసంగిస్తూ..అందుకే టీమిండియాతో మ్యాచ్ ఆడము‘‘టీ20 ప్రపంచకప్ టోర్నీలో ఇండియాతో మ్యాచ్ ఆడవద్దని నిర్ణయించుకున్నట్లు మరోసారి స్పష్టం చేస్తున్నాం. ఎందుకంటే.. క్రీడా మైదానంలో రాజకీయాలకు తావు ఉండకూడదనేది మా వాదన. అందుకే మేము కచ్చితమైన నిర్ణయం తీసుకున్నాం.బంగ్లాదేశ్‌కు మద్దతుగా మేము ఈ పని చేస్తున్నాం. ఇది అత్యంత గొప్ప, సరైన నిర్ణయమని నేను భావిస్తున్నాను’’ అని షెబాజ్ షరీఫ్ (Shehbaz Sharif) పేర్కొన్నారు. కాగా పాక్ క్రికెట్ బోర్డు చైర్మన్‌గా పాక్ మంత్రి మొహ్సిన్ నక్వీ (Mohsing Naqvi) ఉన్న సంగతి తెలిసిందే.మీ వేషాలు మామూలుగా లేవండి!ఇప్పుడు వరల్డ్‌కప్‌లో భారత్‌తో మ్యాచ్ బహిష్కరణ గురించి ఏకంగా ప్రధాని ప్రకటన చేశారు. ఈ నేపథ్యంలో రాజకీయాలను క్రీడలతో కలగలిపి దౌత్యపరంగా లబ్ది పొందాలని చూస్తుంది మీరేనంటూ షెబాజ్ షరీఫ్‌పై నెటిజన్లు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. బంగ్లాదేశ్‌కు లేని బాధ మీకు ఎందుకని.. ఉద్దేశపూర్వకంగా భారత్‌తో మ్యాచ్‌ను బహిష్కరిస్తే నష్టపోయేది మీరేనంటూ చురకలు అంటిస్తున్నారు. ఏదేమైనా.. ‘‘మీ వేషాలు మామూలుగా లేవండి’’ అంటూ సెటైర్లు వేస్తున్నారు.తటస్థ వేదికపై దాయాదుల పోరుకాగా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 టోర్నీకి పాక్ ఆతిథ్యం ఇవ్వగా.. టీమిండియా తటస్థ వేదికైన దుబాయ్‌లో మ్యాచ్‌లు ఆడింది. ఈ నేపథ్యంలో అప్పుడే భారత్- పాక్‌లలో ఒకటి ఆతిథ్య దేశంగా ఉంటే.. తటస్థ వేదికను ఏర్పాటు చేయాలనే ఒప్పందం జరిగింది. అందుకు తగ్గట్లే టీ20 ప్రపంచకప్-2026 టోర్నీకి భారత్ ఆతిథ్యం ఇస్తుండగా.. పాక్ శ్రీలంకతో తమ మ్యాచ్‌లు ఆడనుంది.ఇదిలా ఉంటే.. బంగ్లాదేశ్ కొన్నాళ్లుగా భారత్‌ను రెచ్చగొట్టేలా కవ్వింపు చర్యలకు పాల్పడింది. ఈ నేపథ్యంలో ఐపీఎల్ నుంచి బంగ్లా క్రికెటర్ ముస్తాఫిజుర్ రహమాన్‌ను బీసీసీఐ తొలగించింది. దీంతో భారత్‌తో తమకు భద్రత లేదని.. తమ వేదికను శ్రీలంకకు మార్చాలని బంగ్లా బోర్డు ఐసీసీ దగ్గర పట్టుపట్టింది.బంగ్లాదేశ్‌కు గట్టిగానే షాక్ తగిలిందిఅయితే, భారత్‌లో భద్రత విషయంలో బంగ్లా జట్టుకు వచ్చిన ఎలాంటి ముప్పేమీ లేదని ఐసీసీ చెప్పగా.. బంగ్లా మొండివైఖరి వీడలేదు. దీంతో ఆ జట్టును టోర్నీ నుంచి తప్పించింది. అయితే, పాకిస్తాన్ మాత్రం తమకు తటస్థ వేదిక ఉన్నా.. లంకలో భారత్‌తో మ్యాచ్‌కు భద్రతా సమస్యలు ఉన్నాయంటూ కొత్తరాగం ఎత్తుకుంది.అయితే, లీగ్ దశలో మిగిలిన మ్యాచ్‌లకు లేని భద్రతా కారణాలు.. భారత్‌తో మ్యాచ్‌కు మాత్రమే ఎందుకు ఉంటాయనే ప్రశ్నలు వస్తున్నాయి. ఇలాంటి తరుణంలో పాక్ ప్రధాని స్వయంగా మరోసారి ఈ విషయం గురించి ప్రకటన చేయడం విశేషం. ఒకవేళ పాక్ టీమిండియాతో మ్యాచ్‌ను బహిష్కరిస్తే ఆర్థికంగా భారీగా నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. ఇదే జరిగితే ఐసీసీ ఆదాయం తగ్గి.. ఇతర సభ్య దేశాల బోర్డులపై కూడా ప్రభావం పడుతుంది.చదవండి: IND vs PAK: పాక్ నిర్ణయంపై తొలిసారి స్పందించిన బంగ్లాదేశ్.. పొట్టకొట్టేలా.. -
భారత్‌తో జరగాల్సిన మ్యాచ్‌కు జట్టును ప్రకటించిన పాక్ క్రికెట్ బోర్డు
క్రికెట్ అభిమానులను ఇది కన్ఫ్యూజ్ చేసే వార్త. ఫిబ్రవరి 15న భారత్‌తో జరగాల్సిన మ్యాచ్‌కు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు జట్టును ప్రకటించింది. అదేంటి.. ఆ రోజు భారత్‌తో జరగాల్సిన మ్యాచ్‌ను పాక్ ప్రభుత్వం రద్దు చేసుకున్నట్లు ప్రకటించింది కాదా అనుకుంటున్నారా..? అవును ఇది నిజమే. అంతకుముందు వార్త కూడా నిజమే.వివరాల్లోకి వెళితే.. ఫిబ్రవరి 15న భారత్-పాక్ మధ్య రెండు మ్యాచ్‌లు జరగాల్సి ఉన్నాయి. పాక్ ప్రభుత్వం పురుషుల టీ20 ప్రపంచకప్-2026లో భాగంగా జరగాల్సిన మ్యాచ్‌ను రద్దు చేసుకున్నట్లు ప్రకటించింది. మరో మ్యాచ్ మహిళల ఏసీసీ ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ టోర్నీలో భాగంగా జరగాల్సి ఉంది.ఈ మ్యాచ్‌కు పాక్ ప్రభుత్వం నుంచి కాని, ఆ దేశ క్రికెట్ బోర్డు నుంచి కాని ఎలాంటి అభ్యంతరాలు లేవు. ఈ మ్యాచ్‌తో పాటు టోర్నీ మొత్తం కోసమే పీసీబీ 15 మంది సభ్యుల జట్టును ప్రకటించింది. ఈ జట్టుకు కెప్టెన్‌గా ఉమ్మె-హాని ఎంపికైంది.ఈ జట్టులో ఎమాన్ నసీర్, గుల్ రుఖ్, హఫ్సా ఖలీద్, హురైనా సజ్జాద్, షావాల్ జుల్ఫికార్ కీలక బ్యాటర్లు. వికెట్ కీపర్లుగా కోమల్ ఖాన్, యుస్రా ఆమిర్ ఎంపికయ్యారు. ఆల్రౌండర్లుగా నూరీన్ యాకూబ్, ఉమ్మె-హాని ఉన్నారు. బౌలింగ్ విభాగంలో అనోషా నసీర్, లుబ్నా బెహ్రామ్, నేహా షర్మిన్ నదీమ్ , సయిదా మసూమా జాఫ్రీ , వహీదా అఖ్తర్ ఆ జట్టు బలంగా ఉంది. రిజర్వ్ ప్లేయర్లుగా జునాష్ అబ్దుల్ సత్తార్, మహమ్ అనీస్, అంబర్ కైనాత్, ఆయేషా బిలాల్ ఎంపికయ్యారు.ఈ టోర్నీలో పాక్ షెడ్యూల్ ఇలా ఉంది. ఫిబ్రవరి 13 – పాకిస్తాన్ ‘A’ vs నేపాల్ (ఉదయం 9.30) ఫిబ్రవరి 15 – పాకిస్తాన్ ‘A’ vs ఇండియా ‘A’ (మధ్యాహ్నం 2.00) ఫిబ్రవరి 17 – పాకిస్తాన్ ‘A’ vs UAE (మధ్యాహ్నం 2.00) అన్ని మ్యాచ్‌లు బ్యాంకాక్‌లో జరగనున్నాయి. ఇదిలా ఉంటే, ఈ టోర్నీలో భారత ఏ జట్టు కూడా ఫిబ్రవరి 13నే తమ తొలి మ్యాచ్ ఆడనుంది. ఈ టోర్నీలో మొత్తం 8 జట్లు పాల్గొంటున్నాయి. శ్రీలంక, బంగ్లాదేశ్, మలేసియా, థాయ్‌లాండ్ గ్రూప్-బిలో ఉండగా.. పాక్, భారత్, యూఏఈ, నేపాల్ జట్లు గ్రూప్-ఏలో ఉన్నాయి. గ్రూప్ దశలో భారత్ ఫిబ్రవరి 13న యూఏఈతో, 15న పాకిస్తాన్‌తో, 17న నేపాల్‌తో మ్యాచ్‌లు ఆడనుంది. ఈ టోర్నీ కోసం భారత జట్టును కూడా ఇదివరకే ప్రకటించారు. ఈ జట్టుకు కెప్టెన్‌గా ఆల్‌రౌండర్ రాధా యాదవ్ వ్యవహరించనుంది. -
IND vs PAK: పాక్‌కు దిమ్మతిరిగే షాకిచ్చిన బంగ్లాదేశ్!
భారత్‌తో మ్యాచ్ బహిష్కరిస్తామన్న పాకిస్తాన్ ప్రకటనపై బంగ్లాదేశ్ తొలిసారి స్పందించింది. ఇలాంటి నిర్ణయాల వల్ల తాము కూడా నష్టపోయే ప్రమాదం ఉందంటూ.. పాక్‌కు దిమ్మతిరిగేలా కౌంటర్ ఇచ్చింది. అసలేం జరిగిందంటే.. టీ20 ప్రపంచకప్-2026 టోర్నీకి భారత్- శ్రీలంక ఆతిథ్యం ఇస్తున్న విషయం తెలిసిందే.బంగ్లా మొండి వైఖరి.. ఐసీసీ కఠిన చర్యలుఅయితే, భారత్- బంగ్లాదేశ్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో తమకు భారత్‌లో భద్రత లేదంటూ బంగ్లా ఆరోపించింది. తమ వేదికను లంకకు మార్చాల్సిందిగా అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC)కి విజ్ఞప్తి చేసింది. అయితే, బంగ్లా క్రికెట్ బోర్డు (BCB) వాదనలో నిజం లేదని కొట్టిపారేసిన ఐసీసీ ఇందుకు నిరాకరించి.. పునరాలోచించుకోవాల్సిందిగా గడువు ఇచ్చింది.పాక్ బోర్డు డ్రామాలుకానీ.. బీసీబీ మాత్రం మొండిపట్టు వీడలేదు. ఫలితంగా టోర్నీ నుంచి బంగ్లాదేశ్‌ను తప్పించి ఆ స్థానంలో ర్యాంకింగ్స్ ఆధారంగా స్కాట్లాండ్ను చేర్చింది. ఈ పరిణామాల నేపథ్యంలో బంగ్లాదేశ్‌కు తాము మద్దతుగా ఉంటామంటూ పాక్ క్రికెట్ బోర్డు (PCB) డ్రామాకు తెరతీసింది.తొలుత టోర్నీ మొత్తం బహిష్కరిస్తామని.. ఆ తర్వాత భారత్‌తో మ్యాచ్ మాత్రమే బాయ్‌కాట్ చేస్తామని పీసీబీ ఐసీసీకి కొత్త తలనొప్పులు తెచ్చిపెట్టింది. క్రికెట్ ప్రపంచంలో అత్యంత క్రేజ్ ఉన్న భారత్- పాక్ మ్యాచ్ జరుగకపోతే దాదాపు రెండు వేల కోట్ల రూపాయాలకు పైగా నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది.పాక్ పంతం వీడకపోతే ఈ నష్టం ఇంకా పెరిగే అవకాశం కూడా ఉంది. ఇదే జరిగితే ఐసీసీ సభ్య దేశాల ఆదాయంలో కోత పడుతుంది. ముఖ్యంగా చిన్నస్థాయి బోర్డుల మనుగడే ప్రశ్నార్థకంగా మారుతుంది. పాక్‌తో పాటు ఇతర సభ్య దేశాలు ఆర్థిక నష్టాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.నష్టపరిచే విధానాలను కోరుకోవడం లేదుఈ నేపథ్యంలో పాక్ ప్రకటనపై బంగ్లాదేశ్ సీనియర్ డైరెక్టర్ ఒకరు స్థానిక మీడియా ప్రథోమ్ ఆలోతో మాట్లాడారు. ‘‘ఇండియా- పాకిస్తాన్ మ్యాచ్ జరుగకపోతే క్రికెట్ ప్రపంచం మొత్తం ఆర్థిక నష్టాల్లో కూరుకుపోతుంది. ఆదాయంలో మా వాటా కూడా తగ్గిపోతుంది. ఇలాంటి నష్టపరిచే విధానాలను మేము కోరుకోవడం లేదు’’ అని సదరు డైరెక్టర్ స్పష్టం చేశారు. పాక్ వైఖరి ఇతర బోర్డుల పొట్టకొట్టేలా ఉందని అభిప్రాయపడ్డారు.అయితే, అదే సమయంలో.. ‘‘భారత క్రికెట్‌కు గట్టి సందేశం ఇవ్వాలని పాకిస్తాన్ కోరుకుంటున్నట్లు ఉంది. క్రికెట్లో భారత్ ఆధిపత్యాన్ని ప్రశ్నించే ప్రయత్నం చేస్తోంది. ఆ కోణంలో పాక్ నిర్ణయం ఒక రకంగా సరైందే అయి ఉండవచ్చు’’ అని సదరు డైరెక్టర్ భారత్‌పై అక్కసు వెళ్లగక్కారు.కాగా ఐసీసీకి దాదాపు తొంభై శాతానికి పైగా ఆదాయం భారత మార్కెట్ల నుంచే వస్తుందని పాక్ బోర్డు మాజీ చైర్మన్ రమీజ్ రాజా గతంలో వ్యాఖ్యానించాడు. దీనిని బట్టి ఐసీసీకి ప్రధాన ఆదాయ వనరు భారత క్రికెట్ అని చెప్పడంలో సందేహం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.వ్యవస్థ అతలాకుతలంఇలాంటి తరుణంలో పాక్ ఇలా పూటకో నాటకం ఆడుతూ ఇతర బోర్డులకు నష్టం చేకూర్చే విధంగా ప్రవర్తిస్తోందని విమర్శలూ వస్తున్నాయి. బీసీబీకి చెందిన మరో సీనియర్ అధికారి మాట్లాడుతూ.. ‘‘భారత్- పాక్ మ్యాచ్ వివాదం ఐసీసీ సెంట్రల్ రెవెన్యూ పూల్‌పై తీవ్ర ప్రభావం చూపుతుంది. మేము కూడా అందులో భాగమే. కెన్యా, ఉగాండా వంటి జట్లు పెద్దగా నష్టపోవు. ఒకవేళ ఐసీసీ నుంచి వచ్చే ఆదాయం తగ్గితే మా వ్యవస్థ అతలాకుతలం అయ్యే ప్రమాదం ఉంది’’ అని పేర్కొన్నారు. చదవండి: వరల్డ్‌కప్ టోర్నీకి ముందు టీమిండియాకు మరో షాక్! -
పాక్‌తో ఉద్రిక్తతల నడుమ ఐసీసీ చరిత్రాత్మక నిర్ణయం
టీ20 ప్రపంచకప్‌లో భారత్‌తో మ్యాచ్‌ను బాయ్‌కాట్ చేసుకున్న విషయంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు-ఐసీసీ మధ్య అగాధం ఏర్పడిన విషయం తెలిసిందే. ఈ విషయంలో పీసీబీపై ఐసీసీ కఠిన చర్యలు తీసుకుంటుందని అంతా అనుకుంటుండగా, ఓ సంచలన వార్త వెలుగులోకి వచ్చింది. అందరూ అనుకున్నట్లు ఐసీసీ పాక్‌పై చర్యలు తీసుకోకపోగా.. ఆ దేశ క్రికెట్ అభిమానులకు ఓ బంపరాఫర్ ఇచ్చింది.ప్రపంచకప్‌లో పాక్ ఆడే మ్యాచ్‌లకు పూర్తిస్థాయి ఉర్దూ వ్యాఖ్యానాన్ని అందిస్తామని ప్రకటించింది. ఐసీసీ చరిత్రలో ఇలా జరగడం ఇదే తొలిసారి. ఈ ప్రత్యేక ఫీడ్‌ను ఐసీసీ స్వయంగా తయారు చేసి పాకిస్తాన్ స్థానిక ఛానల్ PTVలో ప్రసారం చేయనుంది. అదనంగా Myco, Tamasha, Tapmad, ARY Zapp వంటి డిజిటల్ ప్లాట్‌ఫార్మ్‌లలో కూడా అందుబాటులో ఉంచనుంది. ఇప్పటి వరకు పాక్ అభిమానులు ఎక్కువగా ఇంగ్లీష్ ఫీడ్ లేదా పరిమిత స్థానిక కవరేజ్‌పై ఆధారపడ్డారు. తాజాగా ఐసీసీ తీసుకున్న ఈ నిర్ణయం పాక్‌తో అనుబంధాన్ని పెంచుకోవడమే లక్ష్యంగా తీసుకున్నదిగా తెలుస్తుంది. ఐసీసీ తొలిసారి అందించనున్న పూర్తి ఉర్దూ వ్యాఖ్యానం పాక్ ఆడబోయే వార్మప్ మ్యాచ్‌కు కూడా వర్తిస్తుంది.ఐసీసీ తీసుకున్న ఈ నిర్ణయం భారత అభిమానులకు మింగుడుపడటం లేదు. పాక్ ఇన్ని డ్రామాలాడుతున్నా, ఆ దేశ అభిమానుల కోసం ఇలాంటి సౌకర్యాలెందుకని ప్రశ్నిస్తున్నారు. ఐసీసీ ఛైర్మన్‌గా భారతీయుడు (జై షా) ఉండి కూడా పాక్‌కు అనుకూలమైన ఇలాంటి కొత్త సంప్రదాయాలకు తెరలేపడమేంటని నిలదీస్తున్నారు. ఒప్పందాలకు విరుద్దంగా భారత్‌తో మ్యాచ్ రద్దు చేసుకోవాలని చూస్తున్న పాక్‌పై చర్యలు తీసుకోవాల్సింది పోయి ఇలాంటి ఆఫర్లు ఏంటని పెదవి విరుస్తున్నారు. తక్షణమే పాక్‌పై చర్యలు తీసుకొని, ఆ జట్టు ప్రపంచకప్ మొత్తం నుంచే తప్పించాలని డిమాండ్లు చేస్తున్నారు.కాగా, భారత్‌తో గ్రూప్ స్టేజీ మ్యాచ్ మినహా మిగతా ప్రపంచకప్ మ్యాచ్‌లన్నిటినీ ఆడతామని ఇటీవల పాక్ ప్రభుత్వం సంచలన ప్రకటన చేసిన విషయం తెలిసిందే. వారు తీసుకున్న ఈ నిర్ణయం ఐసీసీ మరియు ప్రపంచకప్ ప్రసారకర్తలకు పెద్ద సమస్యగా మారింది. ఈ మ్యాచ్ రద్దు కావడం వల్ల ఐసీసీకి, ప్రసారక్తలను ఆర్దికంగా చాలా నష్టం వస్తుంది. ఈ నష్టాన్ని నివారించడం కోసమే ఐసీసీ పాక్ అభిమానులను టార్గెట్ చేస్తూ ఉర్దూ వ్యాఖ్యానం అస్త్రాన్ని ప్రయోగించిందని తెలుస్తుంది. ఒకవేళ పాక్ ఇప్పుడు కూడా తగ్గకుండా భారత్‌తో మ్యాచ్ ఆడమని భీష్మించుకు కూర్చుంటే ఐసీసీ ఏం చేస్తుందో చూడాలి. -
T20 WC 2026: ‘భారత్- పాక్ మ్యాచ్ జరుగుతుంది’
భారత్- పాకిస్తాన్ మ్యాచ్‌కు ఉన్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దాయాదులు తలపడుతుంటే ఇరు దేశాల అభిమానులే కాదు.. క్రికెట్ ప్రపంచం మొత్తం స్క్రీన్లకే అతుక్కుపోతుందనడంలో సందేహం లేదు. అయితే, రెండు దేశాల మధ్య ఉద్రిక్తతల కారణంగా ద్వైపాక్షిక సిరీస్‌లు జరిగి దశాబ్దకాలానికి పైగా గడిచిపోయింది.ప్రస్తుతం ఐసీసీ టోర్నీలు, ఆసియా కప్‌లో మాత్రమే భారత్- పాక్ ముఖాముఖి తలపడుతున్నాయి. ఇక ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 తర్వాత నుంచి ఈ రెండు దేశాల్లో ఒకటి ఆతిథ్యం ఇస్తే.. తటస్థ వేదికపైనే మ్యాచ్‌లు జరిగేలా ఒప్పందం కుదిరింది. ఇందులో భాగంగా టీ20 ప్రపంచకప్-2026 టోర్నీ భారత్‌లో జరుగుతుండగా.. పాక్ శ్రీలంకలో తమ మ్యాచ్‌లు ఆడనుంది.పాక్ ఓవరాక్షన్‌అయితే, బంగ్లాదేశ్‌కు మద్దతుగా తాము టీమిండియాతో మ్యాచ్ బహిష్కరిస్తామని పాక్ ప్రభుత్వం ప్రకటించింది. దీంతో చిరకాల ప్రత్యర్థుల పోరుపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఈ నేపథ్యంలో భారత స్పిన్ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్ మాత్రం టీమిండియా- పాకిస్తాన్ మ్యాచ్ వందకు వంద శాతం జరిగితీరుందని అభిప్రాయపడ్డాడు.వందకు వంద శాతం జరుగుతుంది‘‘వచ్చే మూడు- నాలుగు రోజుల్లో పాక్ నిర్ణయం తారుమారు అవుతుంది. వందకు వంద శాతం భారత్- పాక్ మ్యాచ్ జరుగుతుందని నేను కచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే అందరిలాగే నేనూ దాయాదుల పోరును చూడాలని గట్టిగా అనుకుంటున్నాను.ఈ మ్యాచ్ కేంద్రంగా పెద్ద ఎత్తున వ్యాపారం జరుగుతుంది. అంతేకాదు.. పాక్ ఇప్పుడు తప్పుకొంటే ఆర్థికంగా బాగా నష్టపోవాల్సి ఉంటుంది. తమ వల్ల కలిగిన నష్టాన్ని బ్రాడ్కాస్టర్లకు చెల్లించాల్సి ఉంటుంది. అంతేకాదు.. ఈ టోర్నీలో మిగతా దేశాలు కూడా ఉన్నాయి.ఇతర బోర్డులకూ నష్టమేపాక్ వల్ల తాము కూడా నష్టపోవాల్సి వస్తుందని ఐసీసీ సమావేశంలో ఆయా దేశాల బోర్డులు వాదిస్తాయి. త్వరలోనే పాకిస్తాన్ సూపర్ లీగ్ కూడా జరుగనుంది. ఈ ఈవెంట్‌కు తమ ఆటగాళ్లను వెళ్లకుండా నిలువరించే అవకాశాలు కూడా ఉన్నాయి.అయినా ఈసారి పాక్ భారత్‌తో మ్యాచ్‌ను బహిష్కరిస్తామని చెప్పడం సమంజసమే కాదు. ఈసారి పాక్ తటస్థవేదిక మీదే పాక్ తమ మ్యాచ్‌లు ఆడబోతోంది. అయినా సరే టోర్నీలో ఒక్క జట్టుతో మాత్రమే ఆడము అని చెప్పడం ఏరకంగానూ ఆమోదయోగ్యనీయం కాదు. పూర్తిగా తప్పుకోకుండా ఒక్క జట్టుతో మ్యాచ్‌ను బహిష్కరించడం టెక్నికల్‌గా సరికాదు’’ అని అశూ పేర్కొన్నాడు.ఇప్పటికే బంగ్లా అవుట్‌కాగా భారత్- బంగ్లాదేశ్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో.. భద్రతా కారణాలు సాకుగా చూపుతూ తమ మ్యాచ్‌లను శ్రీలంకకు మార్చాల్సిందిగా బంగ్లాదేశ్ ఐసీసీని కోరింది. అయితే, బంగ్లా వాదనలో నిజం లేదంటూ ఐసీసీ ఇందుకు నిరాకరించింది. గడువు ఇచ్చినా బంగ్లా వైఖరి మారకపోడంతో టోర్నీ నుంచి ఆ జట్టును తప్పించింది. అయితే, పాక్ బంగ్లాదేశ్‌కు వంతపాడుతూ భారత్‌తో మ్యాచ్ బహిష్కరణ అంటూ నాటకానికి తెరతీసింది. కాగా ఫిబ్రవరి 15న కొలంబో వేదికగా భారత్- పాక్ మ్యాచ్ నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది.చదవండి: T20 WC 2026: పాకిస్తాన్‌కు మరో ఎదురుదెబ్బ.. మేఘం కురిస్తే... -
T20 WC: పాకిస్తాన్‌కు మరో ఎదురుదెబ్బ.. ఈసారి..
టీ20 ప్రపంచకప్-2026 టోర్నమెంట్ ఆరంభానికి ముందే పాకిస్తాన్ క్రికెట్ జట్టు వార్తల్లో నిలుస్తోంది. తొలుత బంగ్లాదేశ్‌కు మద్దతుగా టోర్నీ నుంచే వైదొలుగుతామని బీరాలు పలికిన పాక్.. తాజాగా భారత్‌తో మ్యాచ్ బహిష్కరిస్తున్నామంటూ కొత్త నాటకానికి తెరతీసింది.భారత్ ఈ మెగా ఈవెంట్‌కు ఆతిథ్యం ఇస్తుండగా.. ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) పాక్ కోసం శ్రీలంకను తటస్థ వేదికగా ఏర్పాటు చేసింది. అయినప్పటికీ పాక్ క్రికెట్ బోర్డు (PCB) ఓవరాక్షన్ చేస్తూ వ్యవహారాన్ని తెగేదాకా లాగేందుకు ప్రయత్నిస్తోంది.భారత్‌తో మ్యాచ్ రద్దు చేసుకుంటే..ఇక ప్రభుత్వ నిర్ణయం ప్రకారమే ఒకవేళ పాక్.. టీమిండియాతో మ్యాచ్ రద్దు చేసుకుంటే.. ఐసీసీ నుంచి తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. పాక్ క్రికెట్ భవిష్యత్ ప్రమాదంలో పడే అవకాశం ఉంది. ఈ విషయం పక్కనపెడితే.. ప్రస్తుతానికి ఈ టోర్నీలో కనీసం సూపర్ 8 చేరే అవకాశాలను కూడా పాక్ కోల్పోవడం ఖాయంగా కనిపిస్తోంది.కాగా ఇరవై జట్లు భాగమైన వరల్డ్‌కప్ టోర్నీలో పాక్.. భారత్, యూఎస్ఏ, నెదర్లాండ్స్, నమీబియాతో కలిసి గ్రూప్-ఎలో ఉంది. ఇందులో భాగంగా టోర్నీ ఆరంభం రోజున అంటే శనివారం (ఫిబ్రవరి 7) పాక్.. తొలి మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌తో తలపడాల్సి ఉంది. కొలంబోలోని సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్ ఇందుకు వేదిక.వాన పడే అవకాశంఅయితే, ఆక్యూవెదర్ నివేదిక ప్రకారం.. ఈ మ్యాచ్‌కు వర్షం ఆటంకం కలిగించే అవకాశం ఉంది. మ్యాచ్ రోజు వాన పడే అవకాశం 90 శాతం ఉంది. ఇక ఫిబ్రవరి 15న రెండో మ్యాచ్‌లో భారత్‌ను ఢీకొట్టాల్సి ఉండగా.. పాక్ ఆ మ్యాచ్‌ను రద్దు చేసుకుంటామని ప్రగల్భాలు పలుకుతోంది.ఇక లీగ్ దశలో ఆఖరిగా పాక్.. నమీబియాతో ఫిబ్రవరి 18న సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్లో తలపడాల్సి ఉంది. ఈ మ్యాచ్‌కు కూడా వరణుడు అంతరాయం కలిగించే అవకాశాలు 25 శాతం ఉన్నాయి. కాగా టీమిండియాతో మ్యాచ్ ఆడకపోతే పాక్ రెండు పాయింట్లు కోల్పోతుంది. అదే సమయంలో సూర్య సేనకు రెండు పాయింట్లు ఉచితంగా వస్తాయి.నెట్‌రన్‌రేటుపై ప్రభావంమరోవైపు.. వర్షం వల్ల నెదర్లాండ్స్, నమీబియాలతో మ్యాచ్‌లకు ఆటంకం కలిగితే నెట్రన్ రేటుపైనా ప్రభావం పడుతుంది. దీంతో ఫిబ్రవరి 10న అమెరికాతో మ్యాచ్‌లో పాక్ తప్పక గెలవాల్సిన పరిస్థితి. గత ఎడిషన్‌లో పసికూన అయిన అమెరికా చేతిలో పాక్ ఓడిపోయి సూపర్-8 కూడా చేరకుండా నిష్క్రమించిన విషయం తెలిసిందే.తాజా ఎడిషన్‌లోనూ పాక్‌కు చిక్కులు తప్పేలా లేవు. టీమిండియాతో మ్యాచ్ రద్దు.. రెండు మ్యాచ్‌లకు వర్షం ఆటంక కలిగించే సూచనలు.. వెరసి ఈసారి కూడా పాక్ సూపర్-8 చేరడం కష్టమే అనిపిస్తోంది. చదవండి: Ricky Ponting: వద్దని మొత్తుకున్నా వినలేదు.. అతడిని వదిలేశారు -
'ఫోర్స్ మజ్యూర్' క్లాజ్‌ను చూసుకొని ధీమాగా ఉన్న పాక్
టీ20 వరల్డ్‌కప్ 2026లో భారత్–పాకిస్తాన్ పోరు చుట్టూ పెద్ద వివాదం నడుస్తుంది. ఫిబ్రవరి 15న కొలంబోలో జరగాల్సిన ఈ మ్యాచ్‌ను పాకిస్తాన్ ప్రభుత్వం బహిష్కరిస్తున్నట్లు ప్రకటించడంతో ఈ వివాదం మొదలైంది. పాక్ ముందస్తు వ్యూహాల్లో భాగంగానే ఈ బాయ్‌కాట్ డ్రామాకు తెరలేపింది. ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్‌లు ఆడేందుకు భారత్ పాక్‌కు రాలేదని, అందుకు ప్రతిగా చివరి నిమిషంలో ఈ బాయ్‌కాట్ అంశాన్ని తెరపైకి తెచ్చింది. దీని వల్ల బీసీసీఐ, ఐసీసీకి నష్టం చేకూర్చాలన్నదే పాక్ ముఖ్య ఉద్దేశం. అయితే ఇక్కడ తాము కూడా నష్టపోతామని తెలిసినా పాక్ ఈ సాహసానికి పూనుకుంది. ఇందుకు కారణం ఫోర్స్ మజ్యూర్ క్లాజ్.ఏంటా ఫోర్స్ మజ్యూర్ క్లాజ్..? ఫోర్స్ మజ్యూర్ క్లాజ్ (Force Majeure Clause) అనేది ఒప్పందాల్లో ఉండే ఓ నిబంధన. ఈ నిబంధన అనుకోని మరియు నియంత్రణలో లేని పరిస్థితులు ఏర్పడితే, సంబంధిత పక్షం తన బాధ్యత నుంచి విముక్తి పొందే అవకాశం ఇస్తుంది. ఉదాహరణకు సహజ విపత్తులు, యుద్ధం, మహమ్మారి లేదా ప్రభుత్వ నిషేధాలు వంటి పరిస్థితులు ఏర్పడితే, ఈ ఒప్పందాన్ని అమలు చేయడం అసాధ్యం అవుతుంది. అప్పుడు సంబంధిత పక్షం తన బాధ్యత నుంచి విముక్తి పొందుతుంది. ఈ నిబంధనను ఆసరాగా చేసుకొనే పాక్ భారత్‌తో వరల్డ్‌కప్ మ్యాచ్ రద్దు విషయంలో డ్రామాలాడుతుంది. దీన్ని అడ్డుపెట్టుకొనే ప్రపంచం ముందు మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తుంది. ఈ క్లాజ్ తమను చట్టపరంగా కాపాడుతుందని భావిస్తుంది. అయితే ఇక్కడే పాక్ ఓ సున్నితమైన విషయాన్ని విస్మరిస్తుంది. ప్రపంచకప్ మొత్తం ఆడి, భారత్‌తో గ్రూప్ స్టేజీ మాత్రమే బహిష్కరిస్తామని స్పష్టం చేసి, పప్పులో కాలేసింది. ఇలా ఒక్క మ్యాచ్‌ను మాత్రమే బాయ్‌కాట్ చేస్తామనేది ఐసీసీ-పాక్ క్రికెట్ బోర్డు చేసుకున్న ఒప్పందాలకు విరుద్దం.ఒప్పందాల్లో పాక్ భారత్‌తో తటస్థ వేదికలపై ఆడేందుకు ఒప్పుకుంది. ఇప్పుడు ఒక్క మ్యాచ్‌ను మాత్రమే బహిష్కరిస్తామనేది ఒప్పందాలకు విరుద్ధం. ఇక్కడ పీసీబీ ఫోర్స్ మజ్యూర్ క్లాజ్‌ను చూపించి తప్పించుకోవచ్చని ధీమాగా ఉంది. అయితే ఐసీసీ-పీసీబీ మధ్య జరిగిన ముందస్తు ఒప్పందంలో ఫోర్స్ మజ్యూర్ క్లాజ్ లేదని ఐసీసీ వర్గాలు అంటున్నాయి. పాక్ జట్టు మొత్తం టోర్నమెంట్ ఆడుతోంది. కేవలం భారత్‌తో మ్యాచ్‌ను మాత్రమే బహిష్కరిస్తోంది. ఇది అసాధ్యత కాదు, ఎంచుకున్న అసౌకర్యం. ఫోర్స్ మజ్యూర్ క్లాజ్ selective participationకి వర్తించదని ఐసీసీ స్పష్టం చేయడంలో పాక్ వర్గాల్లో భయం మొదలైంది. భారత్‌తో మ్యాచ్ జరగడానికి ఇంకా చాలా సమయం ఉన్నందుకు రద్దు అంశాన్ని రద్దు చేసుకునే అవకాశాలు లేకపోలేదు. ఈ విషయాన్ని పీసీబీ ఐసీసీకి ఇంకా లిఖితపూర్వకంగా తెలియజేయలేదు కాబట్టి రద్దుపై పాక్ యూటర్న్ తీసుకునే ఛాన్స్ ఉంది. లేదు ఇలాగే ముందుకెళ్దాం అని పాక్ భావిస్తే మాత్రం తిప్పలు తప్పవు. ఆ జట్టు చరిత్రలో కనీవినీ ఎరుగని భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. -
భారత్-పాక్ టీ20 ప్రపంచకప్ వార్.. కీలక వ్యక్తిని రంగంలోకి దించిన జై షా
భారత్-పాకిస్తాన్ మధ్య టీ20 ప్రపంచకప్ పంచాయితీలో ఐసీసీ జోక్యం చేసుకుంది. ఫిబ్రవరి 15న కొలంబోలో భారత్‌తో జరగాల్సిన గ్రూప్ స్టేజీ మ్యాచ్‌ను పాక్ బాయ్‌కాట్ చేసుకున్న నేపథ్యంలో ఐసీసీ అధ్యక్షుడు జై షా రంగప్రవేశం చేశారు. ఈ సున్నితమైన అంశాన్ని పరిష్కరించేందుకు ఓ మధ్యవర్తిని నియమించారు. సింగపూర్ క్రికెట్ అసోసియేషన్‌కు చెందిన అనుభవజ్ఞుడైన నిర్వాహకుడు ఇమ్రాన్ ఖ్వాజాను ప్రత్యేక ప్రతినిధిగా అపాయింట్ చేశారు. ఖ్వాజా గతంలో ఐసీసీ తాత్కాలిక చైర్మన్‌గా పనిచేసి, అన్ని ప్రధాన క్రికెట్ బోర్డులతో మంచి సంబంధాలు కలిగి ఉన్నారు. ఇప్పుడు ఆయన పీసీబీతో చర్చలు జరిపి, పాకిస్తాన్ నిర్ణయాన్ని మార్చే ప్రయత్నం చేస్తున్నారు. ఖ్వాజా మధ్యవర్తిత్వంతో పాకిస్తాన్ తమ నిర్ణయాన్ని మార్చుకొని, భారత్‌తో మ్యాచ్ ఆడుతుందని ఐసీసీ ఆశాభావం వ్యక్తం చేస్తుంది. ఒకవేళ పాక్ ఖ్వాజా మధ్యవర్తిత్వాన్ని కూడా బేఖాతరు చేస్తే, ఐసీసీ నిబంధనలను సైతం పక్కకు పెట్టి చర్యలు తీసుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ విషయంలో జై షా చాలా ఆగ్రహంగా ఉన్నట్లు సమాచారం. పాక్‌కు చివరి అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో అతను ఖ్వాజాను మధ్యవర్తిత్వానికి పంపాడు. టెక్నికల్‌గా ఉండే లూప్ హోల్స్‌ను వాడుకుంటూ పాక్ డ్రామాలు ఆడుతుందన్నది షా వాదన. ఈ విషయమై పీసీబీ లిఖితపూర్వక సమాచారం ఇవ్వకుండా తప్పించుకుంటుంది. ఒకవేళ ఐసీసీ చేసే అన్ని ప్రయత్నాలు విఫలమై పాక్ భారత్‌తో గ్రూప్ స్టేజీ మ్యాచ్ ఆడకూడదనే నిర్ణయానికి కట్టుబడి ఉంటే, ఆ జట్టే తీవ్రంగా నష్టపోతుంది. ప్రపంచకప్ వరకు మ్యాచ్ పాయింట్లు కోల్పోతుంది. అలాగే ఈ మ్యాచ్ జరగకపోవడం వల్ల కలిగే నష్టాలకు కూడా బాధ్యత వహించాల్సి ఉంటుంది. అనంతరం ఆర్దిక, పాలనా పరమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.ఇదిలా ఉంటే, ఫిబ్రవరి 7 నుంచి ప్రపంచకప్ పోటీలు ప్రారంభమవుతాయి. అదే రోజు భారత్, పాక్ తమ తొలి మ్యాచ్‌లు ఆడతాయి. పాక్ నెదర్లాండ్స్‌తో.. భారత్ యూఎస్ఏతో తలపడతాయి. పాక్ తమ మ్యాచ్‌లన్నీ శ్రీలంకలో ఆడుతుంది. -
భారత ప్రధాని ఒక్క మాట చెబితే మన ఖేల్ ఖతం: రమీజ్ రాజా
క్రికెట్ వర్గాల్లో ప్రస్తుతం పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) వైఖరి గురించేప్రధానంగా చర్చ నడుస్తోంది. తమకు అవసరం లేని విషయంలో తలదూర్చి పాక్ కష్టాలు కొని తెచ్చుకుంటోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాగా టీ20 ప్రపంచకప్-2026 టోర్నమెంట్ నుంచి ఐసీసీ బంగ్లాదేశ్‌ను ఇప్పటికే తప్పించిన విషయం తెలిసిందే.కోరికోరి వివాదాలుభారత్లో తమకు భద్రత ఉండదంటూ ఆరోపణలకు దిగిన బంగ్లా.. మరో వేదికైన శ్రీలంకలో తమ మ్యాచ్‌లు ఆడించాలని ఐసీసీని కోరింది. అయితే, ఈ వాదనలో నిజం లేదంటూ కొట్టిపారేసిన ఐసీసీ.. బంగ్లా అభ్యర్థనను తిరస్కరించింది. అయినప్పటికీ బంగ్లా పట్టువీడకపోవడంతో.. బంగ్లాదేశ్ స్థానంలో స్కాట్లాండ్ను తీసుకువచ్చింది.అయితే, బంగ్లాదేశ్‌కు అన్యాయం జరిగిందంటూ తాము కూడా టోర్నీలో పాల్గొనమని బెదిరింపు ధోరణి అవలంబించిన పాకిస్తాన్.. తెగేదాకా లాగితే మొదటికే మోసం వస్తుందనేమో.. కేవలం భారత్‌తో మ్యాచ్ బహిష్కరిస్తామని ప్రకటించింది. తటస్థ వేదికల ఏర్పాటుకాగా భారత్- పాక్ మధ్య దైపాక్షిక సిరీస్‌లు జరిగి దశాబ్దకాలానికి పైగా అవుతోంది. ఈ నేపథ్యంలో ఐసీసీ ఈవెంట్లు, ఆసియా కప్ టోర్నీలో ముఖాముఖి తలపడుతున్న దాయాదుల మధ్య 2024లో ఐసీసీ ఓ ఒప్పందం కుదిర్చింది.ఇరు దేశాల్లో ఒకటి ఆతిథ్య దేశంగా ఉంటే.. మరో జట్టు కోసం తటస్థ వేదికను ఏర్పాటు చేయాలి. అందుకు అనుగుణంగానే ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025కి పాక్ ఆతిథ్యం ఇవ్వగా.. టీమిండియా దుబాయ్‌లో మ్యాచ్‌లు ఆడింది. ఆ తర్వాత ఐసీసీ మహిళల వన్డే వరల్డ్‌కప్-2025 టోర్నీ భారత్‌లో జరుగగా.. పాక్ శ్రీలంకలో తమ మ్యాచ్‌లు ఆడింది. తాజాగా టీ20 వరల్డ్‌కప్‌లోనూ పాక్ పురుషుల జట్టు శ్రీలంకలో మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది.భారత్‌తో పెట్టుకుంటే అంతేఅయినప్పటికీ బంగ్లాదేశ్ కోసమంటూ పాక్.. భారత్‌ను ఢీకొట్టే ప్రయత్నం చేస్తోంది. ఈ నేపథ్యంలో పీసీబీ మాజీ చైర్మన్ రమీజ్ రాజా.. భారత్‌తో పెట్టుకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని గతంలో హెచ్చరించిన వీడియో తాజాగా వైరల్ అవుతోంది.సెనేట్ స్టాండింగ్ కమిటీ ముందు 2021లో పీసీబీ చైర్మన్ హోదాలో మాట్లాడుతూ.. ‘‘నేను చెప్పే విషయాలు భయపెట్టేవని నాకు తెలుసు. ఐసీసీ నుంచి వచ్చే 50 శాతం నిధులతోనే పాక్ బోర్డు తన కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఇతర బోర్డు మెంబర్లతో కలిసి టోర్నమెంట్లు నిర్వహించడం ద్వారా ఐసీసీకి ఆదాయం వస్తుంది.90 శాతం ఆదాయం అక్కడి నుంచేఇక ఐసీసీకి వచ్చే ఆదాయంలో 90 శాతం ఇండియన్ మార్కెట్ల నుంచే వస్తుంది. అంటే ఒకరకంగా.. భారత్‌లోని వ్యాపారం వల్లే పాకిస్తాన్ క్రికెట్ మనుగడ కొనసాగిస్తోంది. ఒకవేళ భవిష్యత్తులో భారత ప్రధాని పాకిస్తాన్ క్రికెట్‌కు ఫండింగ్ ఆపేయమని చెబితే.. పీసీబీ కుప్పకూలుతుంది’’ అని రమీజ్ రాజా వ్యాఖ్యానించాడు. అయితే, ఈ వీడియో ఫేక్ కావొచ్చు అంటూ పాక్ అభిమానులు అంటుండగా... ఏదేమైనా ఈ మాటలు మాత్రం నిజమేనంటూ టీమిండియా ఫ్యాన్స్ కౌంటర్లు ఇస్తున్నారు. చదవండి: ICC vs PCB: పాకిస్తాన్‌కు భారీ షాక్!#WATCH : Throwback Video Of Ramiz Raja Warned PCB Could ‘Collapse’ If India Pulls SupportAn old video of former Ramiz Raja, made during his tenure as chairman of the Pakistan Cricket Board, has resurfaced on social media, drawing renewed attention amid ongoing cricket diplomacy… pic.twitter.com/BCkNgzyI2z— upuknews (@upuknews1) February 3, 2026 -
ICC vs PCB: పాకిస్తాన్‌కు భారీ షాక్!
టీ20 ప్రపంచకప్-2026 టోర్నీకి కౌంట్‌డౌన్ మొదలైనా పాకిస్తాన్ మొండివైఖరి వీడటం లేదు. బంగ్లాదేశ్ కోసమంటూ నాటకానికి తెరతీసిన పాక్ క్రికెట్ బోర్డు (పీసీబీ).. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC)నే ఢీకొట్టేందుకు సిద్ధమైంది. పాక్ మ్యాచ్‌ల కోసం తటస్థ వేదికగా శ్రీలంకను ఏర్పాటు చేసినా.. భారత్‌తో మ్యాచ్ బహిష్కరిస్తామంటూ మరో డ్రామాకు తెరలేపింది.బంగ్లాదేశ్‌కు ఇప్పటికే షాక్తమ ప్రభుత్వం నిర్ణయం ప్రకారమే నడుచుకుంటామని.. అందుకే టీమిండియాతో మ్యాచ్ ఆడబోమని పీసీబీ పేర్కొంది. అయితే, ఐసీసీకి మాత్రం ఇంతవరకు అధికారికంగా మాత్రం ఇ-మెయిల్ పంపలేదు. కాగా భారత్‌లో తమకు భద్రత లేదంటూ గగ్గోలు పెట్టిన బంగ్లాదేశ్‌కు ఇప్పటికే ఐసీసీ గట్టి షాకిచ్చిన విషయం తెలిసిందే.తమ పరిశీలన బృందం నివేదిక ప్రకారం భారత్‌లో బంగ్లా జట్టుకు వచ్చిన ముప్పేమీ లేదని.. అందుకే వేదికను శ్రీలంకకు మార్చలేమని ఐసీసీ స్పష్టం చేసింది. అయినా సరే బంగ్లాదేశ్ పంతం వీడకపోవడంతో ఆ జట్టును తప్పించి.. స్కాట్లాండ్ను వరల్డ్‌కప్ టోర్నీలో చేర్చింది. టోర్నీ నుంచి వైదొలుగుతామని బీరాలుఈ అంశమై ఓటింగ్ నిర్వహించగా.. బంగ్లాదేశ్‌కు మద్దతుగా ఆ దేశంతో పాటు పాక్ మాత్రమే అనుకూలంగా ఓటు వేయగా.. మిగతా ఐసీసీ సభ్య దేశాలు మాత్రం వ్యతిరేకించాయి.దీంతో పాకిస్తాన్ తాము సైతం టోర్నీ నుంచి వైదొలుగుతామని మొదట బీరాలు పలికినా.. ఆ తర్వాత టీమిండియాతో మ్యాచ్ మాత్రమే ఆడమని ప్రకటించింది. ఇందుకు భద్రతా కారణాలు సాకుగా చూపడం గమనార్హం. శ్రీలంకలో ఆడే మిగతా మ్యాచ్‌లకు లేని భద్రతా సమస్యలు.. టీమిండియాతో మ్యాచ్‌కు ఉంటాయని చెప్పడం విమర్శలకు దారితీసింది.ఆ అధికారం, హక్కు మాకు లేవుఈ నేపథ్యంలో పాక్ బోర్డు.. ఇతర దేశాల బోర్డులను సంప్రదించి తమకు అనుకూలంగా మాట్లాడాల్సిందిగా కోరినట్లు సమాచారం. ఐసీసీతో సమావేశంలో తమకు, బంగ్లాదేశ్‌కు అనుకూలంగా వ్యవహరించాలని బతిమాలినట్లు తెలుస్తోంది. అయితే, ఈ విషయంలో పాక్‌కు చేదు అనుభవం ఎదురైనట్లు సమాచారం.డబుల్ గేమ్ ఎందుకు?రెవ్‌స్పోర్ట్స్ కథనం ప్రకారం.. ఈ అంశాల్లో తలదూర్చే అధికారం, హక్కు తమకు లేవని ఆయా బోర్డులు పీసీబీకి స్పష్టం చేసినట్లు సమాచారం. ఐసీసీ, బీసీబీ మధ్య వివాదంలో తాము దూరలేమని పేర్కొన్న బోర్డులు.. పీసీబీ ద్వంద్వ వైఖరిని కూడా ఎండగట్టినట్లు తెలుస్తోంది.కాగా ఇటీవల అండర్-19 వరల్డ్‌కప్ టోర్నీలో పాక్.. భారత్‌తో మ్యాచ్ ఆడింది. యువ భారత జట్టు చేతిలో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది. అంతేకాదు.. పాక్ మహిళల ‘ఎ’ జట్టు.. ఫిబ్రవరి 15న భారత మహిళల ‘ఎ’ జట్టుతో తలపడనుంది. బ్యాంకాక్‌లో జరిగే రైజింగ్ స్టార్స్ ఆసియా కప్ 2026లో భాగంగా ఈ మ్యాచ్ జరుగనుంది. అయితే, పాక్ ఈ మ్యాచ్‌లో యథావిధిగా ఆడనుంది.పాక్‌కు గట్టి షాక్ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ.. ఐసీసీ సభ్య దేశాలకు బోర్డులు.. పీసీబీకి తాము అండగా ఉండలేమని కుండబద్దలు కొట్టినట్లు చెప్పినట్లు సమాచారం. కాగా భారత్- శ్రీలంకలు సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న టీ20 ప్రపంచకప్ ఫిబ్రవరి 7- మార్చి 8 మధ్య జరుగనుంది. భారత్- పాక్ మ్యాచ్‌ను కొలంబోలో ఫిబ్రవరి 15న నిర్వహించేందుకు షెడ్యూల్ ఖరారు కాగా.. పీసీబీ ఇలా బాయ్‌కాట్ అంటూ సాగదీస్తోంది.చదవండి: T20 WC 2026: ఆందోళనలో టీమిండియా! -
IND vs PAK: ఆ మూడు మ్యాచ్‌లు గెలుస్తాం: పాక్ కెప్టెన్
టీ20 ప్రపంచకప్-2026 టోర్నమెంట్లో భారత్‌తో మ్యాచ్ బహిష్కరించడంపై పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ ఆఘా స్పందించాడు. తాము కేవలం కాంట్రాక్టు ఆటగాళ్లమని.. ప్రభుత్వం నిర్ణయానుసారమే నడుచుకుంటామని తెలిపాడు. వరల్డ్‌కప్ టోర్నీలో టీమిండియాతో మ్యాచ్ ఆడరాదని తమ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని.. ఇందులో ఆటగాళ్లు చేసేదేమీ లేదని పేర్కొన్నాడు. ఎవరైనా ప్రభుత్వ ఆదేశానికి కట్టుబడి ఉండాల్సిందేనని సల్మాన్ ఆఘా వ్యాఖ్యానించాడు.ఆసీస్‌ను క్లీన్‌స్వీప్ చేసి..అదే విధంగా.. గ్రూప్ దశలో మ్యాచ్ రద్దు కారణంగా పాయింట్లు కోల్పోయే అంశం మీద కూడా సల్మాన్ ఆఘా స్పందించాడు. లీగ్ దశలో మిగిలిన మ్యాచ్‌లలో గెలిచి ముందడుగు వేస్తామని ధీమా వ్యక్తం చేశాడు. కాగా ప్రపంచకప్ టోర్నీకి ముందు సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో పాకిస్తాన్ మూడు టీ20ల సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్ చేసింది. ఆసీస్ జట్టు దాదాపు ద్వితీయ శ్రేణి జట్టుతో బరిలోకి దిగగా.. పాక్ ఈ మేర విజయం సాధించింది.ప్రపంచకప్ అంటే భారత్‌తో మ్యాచ్ మాత్రమే కాదుఈ నేపథ్యంలో ఆసీస్‌తో మూడో టీ20లో విజయం తర్వాత సల్మాన్ ఆఘా (Salman Agha) భారత్‌తో మ్యాచ్ (IND vs PAK) రద్దు విషయం గురించి మాట్లాడాడు. ‘‘‘మేం బోర్డుతో కాంట్రాక్ట్ ఉన్న ఆటగాళ్లం. ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా దానికి మేం కట్టుబడి ఉండాల్సిందే. ప్రపంచకప్ అంటే భారత్‌తో మ్యాచ్ మాత్రమే కాదు కదా!..లీగ్ దశలో మరో మూడు మ్యాచ్‌లు కూడా ఉన్నాయి. వాటన్నింటినీ గెలిచి ముందంజ వేసేందుకు ప్రయత్నిస్తాం’ అని సల్మాన్ పేర్కొన్నాడు. కాగా టీమిండియాతో ఆడరాదనే పాకిస్తాన్ ప్రభుత్వ నిర్ణయాన్ని పాక్ మాజీ క్రికెటర్లు షాహిత్ ఆఫ్రిది, యూసుఫ్, రషీద్ లతీఫ్, మొయిన్ ఖాన్, సర్ఫరాజ్ అహ్మద్ సమర్థించారు.మిగిలిన మూడు జట్లు అవేకాగా ఫిబ్రవరి 7- మార్చి 8 మధ్య భారత్- శ్రీలంక వేదికలుగా టీ20 ప్రపంచకప్ టోర్నీ జరుగనున్న విషయం తెలిసిందే. ఇరవై జట్లు పాల్గొంటున్న ఈ ఈవెంట్లో భారత్, అమెరికా, నమీబియా, నెదర్లాండ్తో పాటు పాకిస్తాన్ గ్రూప్-‘ఎ’లో ఉంది. అయితే, భారత్‌లో తమకు భద్రత లేదంటూ బంగ్లాదేశ్.. తమ మ్యాచ్‌లను శ్రీలంకకు మార్చాలంటూ ఓవరాక్షన్ చేయగా.. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) నిరాకరించింది. దీంతో బంగ్లాకు మద్దతుగా పాకిస్తాన్ కూడా ముందుగా టోర్నీ నుంచి వైదొలుగుతామని బీరాలు పలికింది. చివరగా భారత్‌తో మ్యాచ్ ఆడకూడదని నిర్ణయం తీసుకుంది. అపుడు అమెరికా చేతిలో ఓడిఅయితే, ఈ విషయంపై ఐసీసీకి ఇంతవరకు అధికారికంగా తెలియజేయకపోవడం పాక్ ద్వంద్వ వైఖరికి నిదర్శనం అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉంటే.. టీ20 ప్రపంచకప్-2024లో పసికూన అమెరికా చేతిలో లీగ్ మ్యాచ్‌లో పాక్ ఘోరంగా ఓడిపోయిన విషయం తెలిసిందే.చదవండి: IPL 2026: సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు గుడ్ న్యూస్! -
భారత్‌తో మ్యాచ్ రద్దు.. పాక్‌పై ఐసీసీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు..!
టీ20 ప్రపంచకప్-2026లో టీమిండియాతో జరగాల్సిన గ్రూప్ స్టేజీ మ్యాచ్‌ను పాక్ జట్టు రద్దు చేసుకుంటున్నట్లు ఆ దేశ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పాక్ జట్టుపై తీవ్రమైన చర్యలు ఉంటాయని గత రెండ్రోజులగా ప్రచారం జరుగుతుంది. అయితే, ఈ ప్రచారాన్ని ఐసీసీ మరియు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) మాజీ ఛైర్మన్ ఎహసాన్ మణి కొట్టిపారేశాడు. ఈ విషయంలో ఐసీసీ పాక్ జట్టును ఏమీ చేసుకోలేదని వివరణ ఇచ్చాడు.ఈ నిర్ణయం పీసీబీ కాకుండా పాక్ ప్రభుత్వ ఆదేశాల ప్రకారం తీసుకోవడం వల్లే ఐసీసీ ఎలాంటి శిక్షలు విధించలేదని వెల్లడించాడు. ఆయన మాటల్లో.. ప్రభుత్వ ఆదేశాలను అనుసరించినప్పుడు ఏ దేశానికీ శిక్షలు ఉండవు. ఇదే కారణంతో (భద్రత) టీమిండియా 2025 ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్‌లను పాక్‌లో ఆడేందుకు నిరాకరించింది. అప్పుడు టీమిండియాపై ఐసీసీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇప్పుడు పాక్ జట్టు విషయంలోనూ అంతే. ఒకే సమస్యకు రెండు విధానాలు ఉండకూడదని అన్నారు. కాగా, తాజా పరిస్థితి ఐసీసీకి పెద్ద సవాలుగా మారింది. ఓవైపు అభిమానుల ప్రయోజనాలు, ప్రపంచ క్రికెట్ సమగ్రత దెబ్బతింటున్నాయి. మరోవైపు ప్రభుత్వ నిర్ణయాలను బోర్డులు తప్పనిసరిగా పాటించాల్సి రావడం వల్ల ఐసీసీకి శిక్షలు విధించే అధికారం తగ్గిపోతోంది. ఈ లూప్ హోల్‌ను ఆసరాగా తీసుకొనే పీసీబీ డ్రామాలాడుతుంది. భారత్‌తో మ్యాచ్ రద్దుపై ఇప్పటివరకు ఐసీసీకి అధికారిక సమాచారం కూడా ఇవ్వలేదు. కేవలం ప్రభుత్వ మాటగా కాలయాపన చేస్తుంది. ఐసీసీ నియమాలను అడ్డు పెట్టుకొని రోజుకో డ్రామాకు తెరలేపుతుంది.మరోవైపు ఐసీసీ అధ్యక్షుడిగా జై షా ఉండటంతో పాక్‌పై సంచలన నిర్ణయాలు తీసుకోవచ్చనే ప్రచారం కూడా జరుగుతుంది. షా.. రూల్స్‌ను పక్కన పెట్టి పాక్‌పై కఠిన చర్యలు తీసుకుంటాడని ఐసీసీ వర్గాలు అంటున్నాయి. ఒకవేళ షా తన పరపతిని ఉపయోగిస్తే పాక్ జట్టుకు అంత భారీ శిక్షలు కాకపోయినా, ఓ మోస్తరు శిక్షలు అయినా పడే అవకాశం ఉంది. పాక్ జట్టు భారీ జరిమానాతో పాటు ఐసీసీ సభ్య దేశాల నుంచి అంక్షలు ఎదుర్కోవచ్చు. పాక్‌పై ఐసీసీ ఏ నిర్ణయం తీసుకుంటుందోనని యావత్ క్రికెట్ ప్రపంచం ఆసక్తిగా ఎదురు చూస్తుంది. -
భారత్, పాక్ మ్యాచ్ జరగకపోతే రూ.2,289 కోట్ల నష్టం!
క్రికెట్ ప్రపంచంలో భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌కు ఉన్న క్రేజ్ వేరు. ఈ రెండు జట్లు ఎప్పుడెప్పుడూ తలపడతాయా అని అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తుంటారు. రాజకీయ ఉద్రిక్తల కారణంగా చిరకాల ప్రత్యర్ధులు కేవలం ఐసీసీ ఈవెంట్లు, ఏసీసీ టోర్నీల్లో మాత్రమే ముఖాముఖి తలపడతున్నాయి. అయితే మరోసారి దాయాదుల పోరు చూడాలనుకున్న అభిమానులకు నిరాశే ఎదురయ్యే అవకాశముంది.టీ20 ప్రపంచకప్-2026లో భారత్‌తో జరగాల్సిన లీగ్ మ్యాచ్‌ను బహిష్కరిస్తున్నట్లు పాకిస్థాన్ ప్రభుత్వం ప్రకటించింది. టోర్నీలో ఇతర జట్లతో ఆడుతామని, కానీ భారత్‌తో మాత్రం తలపడబోమని పాక్ స్పష్టం చేసింది. దీంతో ఐసీసీ రంగంలోకి దిగింది. పాక్ తన నిర్ణయాన్ని వెనుక్కి తీసుకోకపోతే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఐసీసీ హెచ్చరించింది.ఐసీసీకి భారీ నష్టం..ఒకవేళ భారత్-పాక్ మ్యాచ్ రద్దు అయితే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్‌కు భారీ నష్టం వాటిల్లే అవకాశముంది. ఐసీసీ ప్రసార హక్కుల విలువ సుమారు 3 బిలియన్ డాలర్లు (రూ. 27,465 కోట్లు)గా ఉంది. ఇందులో 40 శాతం కంటే ఎక్కువ ఆదాయం ఒక్క భారత్-పాక్ మ్యాచ్‌ల నుంచే వస్తుంది.గత మూడేళ్లలో జరిగిన ప్రతీ భారత్-పాక్ మ్యాచ్ విలువ సుమారు 250 మిలియన్ డాలర్లు (దాదాపు రూ. 2,289 కోట్లు)గా ఉంది. అదేవిధంగా టోర్నీ బ్రాడ్‌కాస్టర్ జియోస్టార్ ఈ మ్యాచ్ ద్వారా వచ్చే భారీ యాడ్స్ రెవెన్యూ కోల్పోతుంది. 10 సెకన్ల ప్రకటన విలువ సుమారు రూ. 40 లక్షల వరకు ఉంటుంది. దీంతో ప్రసారకర్తలకు నేరుగా రూ.250 కోట్ల వరకు నష్టం వాటిల్లే అవకాశముంది. పాక్ తమ మొండి పట్టు వీడకపోతే ఆ నష్టాన్ని వారి నుంచే ఐసీసీ రాబట్టనుంది.చదవండి: T20 WC 2026: భారత్‌తో మ్యాచ్ బాయ్‌కట్.. పాకిస్తాన్ మరో కొత్త డ్రామా -
‘ఆడకుంటే మీకే నష్టం’
దుబాయ్: టి20 వరల్డ్ కప్‌లో భారత్‌తో మ్యాచ్ ఆడమంటూ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) తీసుకున్న నిర్ణయంపై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) స్పందించింది. ఇప్పటికిప్పుడే దీనిపై తీవ్రంగా జవాబివ్వకపోయినా... వాస్తవ పరిస్థితులు వెల్లడిస్తూ పాక్‌కు ఒక రకమైన హెచ్చరిక జారీ చేసింది. వరల్డ్ కప్ మ్యాచ్ నుంచి అర్ధాంతరంగా తప్పుకుంటే మున్ముందు పాక్ క్రికెట్‌కే నష్టం జరుగుతుందని స్పష్టం చేసింది. ‘క్రీడా స్ఫూర్తి, పోటీతత్వం, పారదర్శకతపై ఆధారపడి ఐసీసీ టోరీ్నలు జరుగుతాయి. ఎంపిక చేసుకున్న మ్యాచ్‌లలో ఆడతామంటే దాని విశ్వసనీయత దెబ్బ తింటుంది. పోటీకి అర్హత సాధించిన అన్ని జట్లూ ఒకే తరహా నిబంధనల ప్రకారం బరిలోకి దిగాలని ఐసీసీ ఆశిస్తోంది. జాతీయ విధానాల ప్రకారం ప్రభుత్వ జోక్యం ఉండటాన్ని మేం గౌరవిస్తాం కానీ ఇది ఆటకే కాకుండా క్రికెట్ వ్యవస్థ ద్వారా ప్రయోజనం పొందే పాక్ క్రికెట్‌కు కూడా మంచిది కాదు. జట్టుపై ఇది దీర్ఘ కాలం ప్రభావం చూపిస్తుందనే విషయాన్ని పీసీబీ అర్థం చేసుకోవాలి. ప్రపంచకప్‌ను సమర్థంగా నిర్వహించడంలో ఐసీసీతో పాటు పీసీబీకి కూడా బాధ్యత ఉంది. అందరికీ ఆమోదయోగ్యమయ్యే పరిష్కార మార్గాన్ని పాక్ కనుక్కుంటే అందరికీ మేలు చేస్తుంది’ అని ఐసీసీ ప్రకటన జారీ చేసింది. అయితే తాజా పరిణామాలపై చర్చించేందుకు ఐసీసీ బోర్డు సమావేశమయ్యే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. 12 శాశ్వత దేశాల ప్రతినిధులు, 3 అసోసియేట్ జట్లకు చెందిన ప్రతినిధులు ఐసీసీ బోర్డులో భాగంగా ఉన్నారు. ఇప్పటి వరకైతే ఐసీసీ అత్యవసర సమావేశంపై ఎవరికీ ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. ఈ అంశంపై చర్చ జరిగినా లేదా ఏదైనా చర్య తీసుకునేందుకు సిఫారసు చేసినా ఈ బోర్డు సమావేశంలోనే జరుగుతుంది. భారీ నష్టానికి అవకాశం... భారత్, పాకిస్తాన్ మధ్య మ్యాచ్ అంటే కేవలం ప్రసారకర్తలు, ప్రకటనల గురించే కాదు... ఆ మ్యాచ్ కారణంగా ప్రభావం చూపించే ఇతర అంశాలన్నీ కలిపితే మ్యాచ్ విలువ సుమారు 250 మిలియన్ డాలర్లు (సుమారు రూ.2200 కోట్లు) ఉంటుందని అంచనా. 10 సెకన్ల ప్రకటన విలువ సుమారు రూ. 40 లక్షల వరకు ఉంటుంది కాబట్టి ప్రసారకర్తలకు నేరుగా రూ.250 కోట్ల వరకు నష్టం వాటిల్లవచ్చు. పీసీబీ వార్షిక ఆదాయం 35.5 మిలియన్ డాలర్లు (సుమారు రూ.324 కోట్లు) మాత్రమే. ఇలాంటి స్థితిలో ఐసీసీ చర్య తీసుకుంటే పాక్ కోలుకునే అవకాశం ఉండదు. టోర్నీలో కూడా మ్యాచ్ ఆడకుండా 2 పాయింట్లు కోల్పోయేందుకు పాక్ సిద్ధమవుతున్నా... ఐసీసీ మ్యాచ్ నిబంధనల ప్రకారం పాయింట్లు మాత్రమే కాదు, రన్‌రేట్‌లో కూడా ఆ జట్టు పూర్తిగా వెనుకబడిపోతుంది. -
భారత్‌తో మ్యాచ్ బాయ్‌కట్.. పాకిస్తాన్ మరో కొత్త డ్రామా
టీ20 ప్రపంచకప్-2026 మరో ఐదు రోజుల్లో ఆరంభం కానుంది. అయితే ఈ టోర్నీ ప్రారంభానికి ముందు పాకిస్తాన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం క్రికెట్ ప్రపంచంలో పెను సంచలనంగా మారింది. ఈ మెగా టోర్నీలో భాగంగా ఫిబ్రవరి 15న భారత్‌తో జరగాల్సిన లీగ్ స్టేజ్ మ్యాచ్‌ను బహిష్కరిస్తున్నట్లు పాక్ ప్రభుత్వం ఆదివారం ఎక్స్‌వేదికగా ప్రకటించింది. దీంతో ఆఖరి నిమిషంలో పాకిస్తాన్ తీసుకున్న ఈ నిర్ణయంపై సర్వాత్ర విమర్శల వర్షం కురుస్తోంది.అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ కూడా గట్టిగానే స్పందించింది. నచ్చిన మ్యాచ్‌లు మాత్రమే ఆడుతాము అనేది క్రీడా స్ఫూర్తికి విరుద్ధమని ఐసీసీ పేర్కొంది. ఒకవేళ పాక్ తమ నిర్ణయాన్ని మార్చుకోకపోతే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని ఐసీసీ హెచ్చరించింది. కాగా భారత్-పాక్ మ్యాచ్ రద్దయితే ఐసీసీకి, బ్రాడ్కాస్టర్లకు సుమారు రూ. 200 కోట్లకు పైగా నష్టం వాటిల్లే అవకాశం ఉంది. ఈ నష్టాన్ని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు నుంచి ఐసీసీ వసూలు చేసే అవకాశముంది.'ఈమెయిల్' డ్రామాకాగా ఈ బాయ్‌కట్ గురుంచి పీసీబీ నుంచి ఐసీసీకి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక సమాచారం అందలేదు. పలు రిపోర్ట్లు ప్రకారం..ఎలాంటి అధికారిక ఈమెయిల్ ఐసీసీకి పంపకూడదని పీసీబీ నిర్ణయించుకున్నట్లు సమాచారం. దీంతో పీసీబీపై ఐసీసీ తదుపరి చర్యలు తీసుకోవడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. పాక్ క్రికెట్ బోర్డు ఉద్దేశపూర్వకంగానే సమాచారం ఇవ్వడం లేదు. ఏదేమైనప్పటికి పాక్ తమ వైఖరిని మార్చుకోకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కొక తప్పదు. అయితే ఇదే విషయం చర్చించడానికి ఐసీసీ బోర్డు మీటింగ్ ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది.చదవండి: ఇదంతా బీసీసీఐ వల్లే: ఐసీసీ మాజీ అధికారి సంచలన వ్యాఖ్యలు -
T20 WC: ఐసీసీ మాజీ అధికారి సంచలన వ్యాఖ్యలు
టీ20 ప్రపంచకప్-2026 టోర్నమెంట్ ఆరంభానికి ముందే వివాదాలు మొదలయ్యాయి. శ్రీలంకతో కలిసి భారత్ ఆతిథ్యం ఈ మెగా టోర్నీకి ఆతిథ్యం ఇస్తుండగా.. బంగ్లాదేశ్- పాకిస్తాన్ అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC)కి తలనొప్పిగా మారాయి.ఇందుకు కారణం.. భారత్- బంగ్లాదేశ్ (IND vs BAN), భారత్- పాకిస్తాన్ (IND vs PAK) దౌత్య సంబంధాలలో ఉద్రిక్తతలు... పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ పాక్‌తో మెగా ఈవెంట్లలో తలపడే విషయంలోనూ ఆచితూచి వ్యవహరిస్తోంది. మరోవైపు.. ఇన్నాళ్లు భారత్ సాయం పొందిన బంగ్లాదేశ్‌లో మైనారిటీ హిందువులపై దాడులతో పాటు భారత్ గురించి అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న నాయకుల సంఖ్య పెరిగిపోయింది.అప్పుడు మొదలుఈ పరిణామాల నేపథ్యంలో ఐపీఎల్ నుంచి బంగ్లాదేశ్ ఫాస్ట్‌బౌలర్ ముస్తాఫిజుర్ రహమాన్‌ను తొలగించాలనే డిమాండ్లు పెరరగా.. బీసీసీఐ అందుకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించి బీసీసీఐ కార్యదర్శి అధికారికంగా ప్రకటించారు కూడా! అంతేకాదు.. టీమిండియా బంగ్లాదేశ్ పర్యటనను కూడా నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు బీసీసీఐ వెల్లడించింది. ఈ క్రమంలో భారత్‌లో తమకు భద్రత లేదంటూ.. తమ మ్యాచ్‌ల వేదికను శ్రీలంకకు మార్చాల్సిందిగా బంగ్లా పట్టుబట్టింది. అయితే, ఐసీసీ ఇందుకు నిరాకరించి.. గడువు ఇచ్చినా పంతం వీడకపోవడంతో బంగ్లాను తప్పించింది. ఆ స్థానంలో స్కాట్లాండ్ను చేర్చింది.బంగ్లాకు మద్దతుగా పాక్ఇక ఆ తర్వాత బంగ్లాకు మద్దతుగా తామూ టోర్నీని బహిష్కరిస్తామని బీరాలు పలికిన పాకిస్తాన్.. ఇప్పుడు కేవలం భారత్‌తో మ్యాచ్ ఆడబోమంటూ ప్రకటించింది. అయితే, ఇందుకు సంబంధించి ఐసీసీకి అధికారికంగా మెయల్ చేయలేదు. ఈ పరిణామాలపై ఐసీసీ కమ్యూనికేషన్స్ మాజీ హెడ్ సమీ ఉల్ హసన్ బర్నే స్పందిస్తూ.. తప్పంతా బీసీసీఐపైకి నెట్టాడు.బీసీసీఐ నిందలు‘‘ఈ విషయంలో క్రికెట్ బోర్డులు మరింత ఆచితూచి వ్యవహరించాల్సింది. ముఖ్యంగా ముస్తాఫిజుర్‌ను తొలగించిన విషయాన్ని బీసీసీఐ బహిరంగంగా చెప్పకుండా ఉండాల్సింది. కేకేఆర్‌కు ప్రైవేటుగా విషయం చెప్పి అతడిని రిలీజ్ చేయమని చెప్పాల్సింది.కొన్నిసార్లు ఇలాంటి చిన్న విషయాలే పెద్దగా మారతాయి. జనవరి 3న వాళ్లు (బీసీసీఐ) చేసిన ప్రకటనే వీటన్నిటికీ మూలం. అయితే, బంగ్లాదేశ్ విషయంలో పాక్ చేస్తున్న పోరాటం సరైంది కావచు... కాకపోనూ వచ్చు. ప్రభుత్వ నిర్ణయాలకు అనుగుణంగానే ఏ బోర్డు అయినా నడుచుకుంటుంది.ఏదేమైనా పాక్ తదుపరి పరిణామాలకు సిద్ధపడే ఇలాంటి నిర్ణయం తీసుకుని ఉంటుంది. న్యాయ బృందంతో చర్చించి.. ఈ విషయంపై ఎలా ముందుకు సాగాలో వారు ఆలోచించుకునే ఉంటారు’’ అని సమీ ఉల్ హసన్ బర్నే పేర్కొన్నాడు. కాగా పాక్ కోసం శ్రీలంకను ఐసీసీ తటస్థ వేదికగా ఏర్పాటు చేసినప్పటికీ.. భద్రతా కారణాలు అంటూ పాక్ భారత్ మ్యాచ్‌ను బహిష్కరిస్తామనడం గమనార్హం. అందుకే ఐసీసీ ఈసారి పాక్‌కు గట్టిగానే బుద్ధి చెప్పే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. చదవండి: పాక్ ఓవరాక్షన్.. ఐసీసీ కీలక సమావేశం! -
భారత తుది జట్టు ఇదే.. స్టార్ ప్లేయర్‌కు నో ఛాన్స్?
టీ20 ప్రపంచకప్-2026కు కౌంట్ డౌన్ మొదలైంది. ఫిబ్రవరి 7 నుంచి శ్రీలంక, భారత్ వేదికలగా ఈ మెగా టోర్నీ ఆరంభం కానుంది. ఈ పొట్టి ప్రపంచకప్‌లో టీమిండియా డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగనుంది. ఈసారి కూడా ఎలాగైనా గెలిచి టైటిల్‌ను రిటైన్ చేసుకోవాలని మెన్ ఇన్ బ్లూ పట్టుదలతో ఉంది.ఈ టోర్నీలో భారత్ తమ తొలి మ్యాచ్‌లో ఫిబ్రవరి 7న వాంఖడే స్టేడియం వేదికగా యూఎస్ఎతో తలపడనుంది. ఈ మ్యాచ్ కోసం భారత తుది జట్టును టీమిండియా మాజీ వికెట్ కీపర్ బ్యాటర్ పార్ధివ్ పటేల్ అంచనా వేశాడు. ఓపెనర్లుగా అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్‌కు అతడు అవకాశమిచ్చాడు. సంజూ శాంసన్ పేలవ ఫామ్ కనబరుస్తుండడంతో వికెట్ కీపర్ బ్యాటర్‌గా ఇషాన్ వైపే పార్ధివ్ మొగ్గు చూపాడు. కివీస్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో శాంసన్ కేవలం 46 పరుగులు మాత్రమే చేశాడు. ఇక కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌కు మూడో స్దానంలో, గాయం నుంచి కోలుకున్న తిలక్ వర్మకు నాలుగో స్ధానంలో పటేల్ ఛాన్స్ ఇచ్చాడు. పార్ధివ్ ఎంపిక చేసిన జట్టులో ఆల్రౌండర్లగా శివం దూబే,హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ చోటు దక్కించుకున్నాడు. ఫినిషర్‌గా రింకూ సింగ్ ఉన్నాడు. ఇక ఫాస్ట్ బౌలర్ల కోటాలో బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్‌ను పార్ధివ్ ఎంపిక చేశాడు. యువ పేసర్ హర్షిత్ రాణాకు మాత్రం అతడు ఎంపిక చేసిన జట్టులో చోటు దక్కలేదు. ఈ జట్టులో స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా వరుణ్ చక్రవర్తికి అవకాశం లభించింది.పార్ధివ్ పటేల్ ఎంపిక చేసిన ఇండియన్ ప్లేయింగ్ ఎలెవన్అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, శివమ్ దూబే ,హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి -
పాక్ ఓవరాక్షన్.. ఐసీసీ కీలక సమావేశం!
పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) తీసుకున్న నిర్ణయం పట్ల అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. టీ20 వరల్డ్‌కప్ టోర్నీ ఆరంభానికి సమయం సమీపించిన తరుణంలో భారత్‌తో మ్యాచ్ బహిష్కరిస్తున్నామంటూ పాక్ ప్రభుత్వం చేసిన ప్రకటన ఐసీసీకి ఆగ్రహం తెప్పించింది.అత్యవసర సమావేశంఈ నేపథ్యంలో పాక్ వైఖరి పట్ల కఠిన నిర్ణయం తీసుకునేందుకు ఐసీసీ సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇందుకోసం అత్యవసరంగా బోర్డు సమావేశం ఏర్పాట్లు చేసినట్లు టైమ్స్‌నౌ వెల్లడించింది. పీసీబీ గనుక పట్టువీడకపోతే తగిన విధంగా బుద్ధి చెప్పాలనే యోచనలో ఐసీసీ ఉన్నట్లు సమాచారం.కాగా భారత్- శ్రీలంక వేదికగా ఫిబ్రవరి 7న మొదలయ్యే పురుషుల టీ20 ప్రపంచకప్‌పై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) తమ నిర్ణయాన్ని వెల్లడించిన విషయం తెలిసిందే. కొన్నాళ్లుగా బంగ్లాదేశ్‌కు బాసటగా నిలిచేందుకు ఈ మెగా ఈవెంట్‌నే బహిష్కరిస్తామని బీరాలు పలికిన పాక్ ఇప్పుడు ప్రపంచకప్ ఆడేందుకు సిద్ధమైంది.భారత్‌తో మాత్రం ఆడబోముఅయితే భారత్‌తో మాత్రం మ్యాచ్ ఆడబోమని ప్రకటించింది. నిజానికి జట్లు ఎంపిక, ప్రకటనకు ఐసీసీ ఇచ్చిన తుదిగడువుకు ముందే పీసీబీ తమ జట్టును ప్రకటించింది. కానీ.. తమ ప్రభుత్వం ఆమోదం తెలిపితేనే ప్రపంచకప్ ఆడతామని జట్టును ఎంపిక చేసిన సందర్భంలో తెలిపింది. ప్రపంచకప్‌లో ఆడేందుకు అనుమతి ఇచ్చిన పాకిస్తాన్ ప్రభుత్వం భారత్‌తో జరిగే మ్యాచ్‌ను మాత్రం బహిష్కరించాలని నిర్ణయం తీసుకుంది. దాంతో వరల్డ్‌కప్ ఆడతామని ఆదివారం స్పష్టం చేసిన పీసీబీ ఈ నెల 15న కొలంబో (శ్రీలంక) వేదికగా భారత్‌తో జరిగే మ్యాచ్‌లో బరిలోకి దిగబోమని తెలిపింది.పెద్ద ఎత్తున నష్టాలుఈ నేపథ్యంలో పీసీబీపై ఐసీసీ తీసుకోబోయే చర్యలు ఎలా ఉండబోతున్నాయంటూ క్రికెట్ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. కాగా దాయాదుల ‘ప్రపంచ’ సమరం కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. అయితే, పాక్ ప్రకటన వారికి షాకిచ్చింది. భారత్‌తో ఆడబోమంటూ పాక్ చేసిన ప్రకటన.. ఫ్యాన్స్‌పైనే కాదు దీని తక్షణ ప్రభావం గ్లోబల్ బ్రాడ్కాస్టర్లపై కూడా పడుతుంది. అసలే 20 జట్లు ఆడుతున్న ఈ మెగా టోర్నీలో ఇక ఒక్క మ్యాచ్‌కు కూడా కిక్కిరిసే మైదానం కనబడక... టికెట్ రెవెన్యూ యాడ్ రెవెన్యూ, ఓ ప్రపంచకప్‌కు వీక్షకుల సంఖ్య, ఇలా అన్నింటిపైనా ప్రభావం ఉంటుంది. ఇదే జరిగితే ఐసీసీకి పెద్ద ఎత్తున నష్టాలు వస్తాయి. ఫలితంగా పాక్ బోర్డు భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు చవిచూడక తప్పదు. ఇదిలా ఉంటే.. బంగ్లాదేశ్ సైతం భద్రతా కారణాలు అంటూ.. భారత్‌లో మ్యాచ్ ఆడలేమని పట్టుబట్టగా ఆ జట్టును టోర్నీ నుంచి తప్పించింది ఐసీసీ. ఇపుడు పాక్‌కు కూడా ఇలాంటి భారీ షాక్ ఇచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు.చదవండి: విచారకరం: షాహిద్ ఆఫ్రిది పోస్ట్ వైరల్ -
వారికి ఒక న్యాయం.. మాకొక న్యాయమా: పీసీబీ మాజీ చైర్మెన్
టీ20 ప్రపంచకప్-2026 ప్రారంభానికి ముందే పలు వివాదాలతో హాట్ టాపిక్ అవుతోంది. ఇప్పటికే బంగ్లాదేశ్ ఈ మెగా టోర్నీ నుంచి తప్పుకోగా.. తాజాగా భారత్‌తో మ్యాచ్‌ను బాయ్‌కట్ చేస్తున్నట్లు పాకిస్తాన్ ప్రభుత్వం ప్రకటించింది. షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 15న కొలంబో వేదికగా పాకిస్తాన్-భారత్ మ్యాచ్ జరగాల్సి ఉంది. కానీ ఇప్పుడు పాక్ సర్కార్ నిర్ణయంతో ఈ హైవోల్టోజ్ మ్యాచ్ జరిగే సూచనలు కన్పించడం లేదు. అయితే పాకిస్తాన్ నిర్ణయంపై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ఆంసతృప్తి వ్యక్తం చేసింది. పాక్ ప్రభుత్వ నిర్ణయం ప్రపంచ క్రీడా నియమాలకు విరుద్ధమని తెలిపింది. దీనిపై పీసీబీ నుంచి ఇప్పటివరకు తమకు ఎలాంటి అధికారిక సమాచారం అందలేదని ఐసీసీ పేర్కొంది. తాజాగా ఇదే విషయంపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు మాజీ చైర్మెన్ ఎహసాన్ మణి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భారత్‌తో మ్యాచ్‌ను బహిష్కరించినందుకు పాకిస్తాన్‌పై చర్యలు తీసుకునే హక్కు ఐసీసీకి లేదని అతడు అన్నాడు."ఏ దేశ క్రికెట్ బోర్డు అయినా తమ ప్రభుత్వ ఆదేశాలకు లోబడి ఉండాలి. ప్రభుత్వ సూచనలను పాటిస్తే సదరు క్రికెట్ బోర్డుపై ఎటువంటి చర్యలు తీసుకోలేము. ఇప్పుడు పీసీబీ విషయంలో అదే జరిగింది. ప్రభుత్వం ఆదేశాల మేరకు భారత్‌తో మ్యాచ్‌ను బాయ్‌కాట్ చేసింది.గతంలో భారత్ కూడా ఇలానే వ్యవహరించింది. ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో పాల్గోనేందుకు పాకిస్తాన్‌కు వచ్చేందుకు నిరాకరించింది. భారత ప్రభుత్వం అనుమతించలేదనే కారణాన్ని ఐసీసీ అంగీకరించింది. అప్పుడు బీసీసీఐపై ఎలాంటి చర్యలు తీసుకోనప్పుడు.. ఇప్పుడు పాకిస్తాప్‌పై ఆంక్షలు విధిస్తే అది కచ్చితంగా ఐసీసీ ద్వంద్వ ప్రమాణాలు పాటించినట్లే అవుతోంది. మొహ్సిన్ నఖ్వీ కేవలం పాక్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడే కాదు, పాక్ ప్రభుత్వంలో కీలక మంత్రి కూడా. ఆయన మొదటి నుంచే ఐసీసీ నిర్ణయాలపై ఆసంతృప్తిగా ఉన్నారు. ఈ విషయాన్ని ఐసీసీ ముందుగానే పసిగట్టడంలో విఫలమైంది. ఐసీసీ కేవలం ప్రేక్షక పాత్ర పోషించిందని" స్పోర్ట్ స్టార్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మణి పేర్కొన్నారు.ఎహసాన్ మణి గతంలో ఐసీసీ చైర్మెన్‌గా కూడా పనిచేశారు. కాగా 'పరస్పర అంగీకారం'తో సమస్యను పరిష్కరించుకోవాలని పాకిస్తాన్‌ను ఐసీసీ కోరింది. ఒకవేళ వేళ పాక్ తమ మొండిపట్టు వీడకపోతే, ఐసీసీకి భారీ ఆర్థిక నష్టం వాటిల్లే అవకాశం ఉంది. ఎందుకంటే ఐసీసీ ఆదాయంలో మెజారిటీ వాటా భారత్-పాక్ మ్యాచ్‌ల నుంచే వస్తుంది. ఇదే విషయంపై ఐసీసీ మరో రెండు రోజుల్లో బోర్డు సమావేశాన్ని నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.చదవండి: విచారకరం: షాహిద్ ఆఫ్రిది పోస్ట్ వైరల్ -
విచారకరం: షాహిద్ ఆఫ్రిది పోస్ట్ వైరల్
టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో భారత్‌తో మ్యాచ్‌ను బహిష్కరిస్తూ పాకిస్తాన్ తీసుకున్న నిర్ణయం క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఈ విషయంలో పాక్ అనవసరంగా రాద్దాంతం చేస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో పాక్ దిగ్గజ ఆల్‌రౌండర్ షాహిద్ ఆఫ్రిది స్పందించిన తీరు వైరల్‌గా మారింది.పహల్గామ్ ఉగ్రదాడి తర్వాతగతంలో శ్రీలంకపై జట్టు పాక్‌లో ఉగ్రదాడి జరిగిన విషయం తెలిసిందే. ఇలాంటి దశలో తమకు భద్రత ఉండదంటూ.. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 ఆడేందుకు పాక్ వెళ్లేందుకు టీమిండియా నిరాకరించింది. దీంతో ఐసీసీ తటస్థ వేదికైన దుబాయ్‌లో మ్యాచ్‌లు ఆడించింది. ఇక పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఇరు దేశాల మధ్య పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి.ఓ పాడైన కోడిగుడ్డు ..ఈ క్రమంలో వరల్డ్ చాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్‌లో పాక్‌తో మ్యాచ్‌ను భారత వెటరన్ జట్టు బహిష్కరించింది. సెమీస్‌లో కూడా పాకిస్తాన్‌తో మ్యాచ్‌కు నిరాకరించి టోర్నీ నుంచే తప్పుకొంది. ఆ సమయంలో షాహిద్ ఆఫ్రిది భారత ఆటగాళ్లను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశాడు.ముఖ్యంగా శిఖర్ ధావన్‌ను ఉద్దేశించి.. ‘‘ఓ పాడైన కోడిగుడ్డు మిగతా వాటినీ చెడగొడుతుంది’’ అంటూ ఆఫ్రిది ధావన్‌ను నిందించాడు. అంతేకాదు.. క్రీడల్లో రాజకీయాలు ఏమిటి? అంటూ మరోసారి భారత్‌పై అక్కసు వెళ్లగక్కాడు. అయితే, తాజాగా పాకిస్తాన్ ప్రభుత్వం భారత్‌తో మ్యాచ్‌ను బహిష్కరిస్తున్నట్లు చేసిన ప్రకటన నేపథ్యంలో ఆఫ్రిది చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.విచాకరమే.. కానీ‘‘రాజకీయాలు దౌత్య సంబంధాలకు ముగింపు పలికినపుడు క్రికెట్.. అందుకు అనుకూలమైన ద్వారాలను తెరుస్తుందని నేను ఎల్లప్పుడూ విశ్వసిస్తాను. టీ20 ప్రపంచకప్ టోర్నీలో పాకిస్తాన్ ఇండియాతో మ్యాచ్ ఆడకపోవడం విచారకరం.అయితే, మా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి నేను కట్టుబడి ఉంటాను. ఇలాంటి సమయంలోనే ఐసీసీ తానేంటో నిరూపించుకోవాలి. ప్రతి సభ్య దేశం పట్ల పారదర్శకంగా వ్యవహరించాలి. అందరికీ న్యాయం దక్కేలా చూడాలి’’ అంటూ షాహిద్ ఆఫ్రిది పేర్కొన్నాడు. మ్యాచ్ ఆడకపోవడం విచారకరం అంటూనే.. ప్రభుత్వం నిర్ణయం సరైందేనన్నట్లుగా ఆఫ్రిది మాట్లాడటం ట్రోల్స్‌కు దారితీసింది.వారెవ్వా.. డబల్ యాక్షన్‘‘ఎల్లప్పుడూ భారత ఆర్మీ, టీమిండియాపై అవాకులు, చెవాకులు పేలుతావు కదా!.. షేక్‌హ్యాండ్ విషయంలోనూ మీరంతా రాద్దాంతం చేశారు. మరి ఇప్పుడు తటస్థ వేదికపైన మ్యాచ్‌లు నిర్వహిస్తున్నా తప్పుకొంటామని బెదిరించి నవ్వులపాలై.. ఇప్పుడేమో ఇండియా మ్యాచ్ ఒక్కటి భద్రత లేదంటూ బహిష్కరిస్తామనడం ఏమిటి?పీసీబీ మీ ప్రభుత్వం చెప్పినట్లు నడుచుకోవడాన్ని సమర్థించే నువ్వు.. బీసీసీఐని ఎలా నిందించావు? భారత ప్రభుత్వం చెప్పినట్లుగానే బీసీసీఐ కూడా నడుచుకుంటుంది’’ అంటూ షాహిద్ ఆఫ్రిదికి నెటిజన్లు కౌంటర్లు ఇస్తున్నారు.చదవండి: పాక్ సెమీస్, ఫైనల్స్‌ను కూడా రద్దు చేసుకుంటుందా..? -
పాక్ ఆటగాడిపై ఆగ్రహంతో ఊగిపోయిన వైభవ్ సూర్యవంశీ
అండర్-19 ప్రపంచకప్‌లో నిన్న జరిగిన కీలకమైన సూపర్ సిక్స్ మ్యాచ్‌లో భారత్ పాకిస్తాన్‌పై 58 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి సెమీస్‌లోని ప్రవేశించింది. ఈ దెబ్బతో పాక్ టోర్నీ నుంచి నిష్క్రమించి, ఇంటిబాట పట్టింది. ఫిబ్రవరి 4న జరిగే రెండో సెమీస్‌లో భారత్ ఆఫ్ఘనిస్తాన్‌తో తలపడుతుంది. 3న జరిగే తొలి సెమీస్‌లో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ అమీతుమీ తేల్చుకుంటాయి.ఇదిలా ఉంటే, నిన్నటి భారత్-పాక్ మ్యాచ్‌కు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరలవుతుంది. ఇందులో భారత చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ పాక్ ఆటగాడు అలీ బలోచ్‌పై ఊగిపోతూ కనిపించాడు. Vihaan sprinting like Usain boult to save a Pakistani player from Vaibhav Suryavanshi. 😭https://t.co/2thurxK3QC— Gangadhar (@90_andypycroft) February 1, 2026పాక్ ఇన్నింగ్స్ 37వ ఓవర్లో విహాన్ మల్హోత్రా బలోచ్‌ను ఔట్ చేసిన తర్వాత సూర్యవంశీ అతనిపైకి దూసుకెళ్లాడు. విహాన్ వెంటనే జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చాడు. ఆ సమయంలో వైభవ్ ఉగ్రం చూస్తే పాక్ ప్లేయర్ బుర్ర బద్దలు కొట్టేలా అనిపించింది. దీనికి సంబంధించిన వీడియోనే ప్రస్తుతం నెట్టింట హల్చల్ చేస్తుంది.మరోసారిపహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్-పాక్ మధ్య క్రికెట్ సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. అప్పటి నుంచి జరిగిన ప్రతి క్రికెట్ మ్యాచ్‌లో భారత ఆటగాళ్లు పాక్ ఆటగాళ్లకు షేక్ హ్యాండ్ ఇవ్వలేదు. తాజా మ్యాచ్‌లోనూ అదే పరిస్థితి కొనసాగింది. ఇరు జట్ల ఆటగాళ్లు మ్యాచ్ అయిపోగానే ఎవరి దారిన వాళ్లు పెవిలియన్ వైపు వెళ్లారు.నిన్నటి మ్యాచ్ పూర్తి వివరాల్లోకి వెళితే... తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 49.5 ఓవర్లలో 252 పరుగులకు ఆలౌటైంది. వేదాంత్ త్రివేది (68) బాధ్యతాయుతమైన అర్ద సెంచరీతో భారత్‌కు గౌరవప్రదమైన స్కోర్ అందించాడు. ఆఖర్లో కనిష్క్ చౌహాన్ (35), ఖిలన్ పటేల్ (21) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు.భారత బ్యాటర్లలో ఆరోన్ జార్జ్ (16), కెప్టెన్ ఆయుశ్ మాత్రే (0), అభిగ్యాన్ కుందు (16), దీపేశ్ దేవేంద్రన్ (1) విఫలం కాగా.. వైభవ్ సూర్యవంశీ (30), విహాన్ మల్హోత్రా (21), అంబ్రిష్ (29) ఓ మోస్తరు స్కోర్లు చేశారు.పాక్ బౌలర్లలో అబ్దుల్ సుభాన్ 3, మొహమ్మద్ సయ్యద్ 2, అలీ రజా, అహ్మద్ హుసేన్, మొమిన్ ఖమార్, అలీ హస్సన్ బలోచ్ తలో వికెట్ తీశారు.అనంతరం ఓ మోస్తరు లక్ష్య ఛేదనలో పాక్ తొలుత విజయం దిశగా సాగింది. అయితే మధ్యలో భారత స్పిన్నర్లు ఖిలన్ పటేల్ (9.2-1-35-3), ఆయుశ్ మాత్రే (8-0-21-3), కనిష్క్ చౌహాన్ (10-1-30-1), విహాన్ మల్హాత్రా (4-0-15-1) చెలరేగడంతో పాక్‌కు ఓటమి తప్పలేదు. పేసర్లు అంబ్రిష్ (5-0-26-1), హెనిల్ పటేల్ (5-0-30-1) కూడా రాణించడంతో పాక్ 46.2 ఓవర్లలో 194 పరుగులకే ఆలౌటైంది.పాక్ ఇన్నింగ్స్‌లో ఉస్మాన్ ఖాన్ (66) ఒక్కడే అర్ద సెంచరీతో రాణించాడు. హమ్జా జహూర్ (42), కెప్టెన్ ఫర్హాన్ యూసఫ్ (38) ఓ మోస్తరు స్కోర్లతో పర్వాలేదనిపించగా.. మిగతా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. -
ఇదేం ప్రశ్న?.. పాక్ రిపోర్టర్‌కు ఇచ్చి పడేసిన మార్ష్
పాకిస్తాన్ జర్నలిస్టుకు ఆస్ట్రేలియా కెప్టెన్ మిచెల్ మార్ష్ దిమ్మతిరిగేలా కౌంటర్ ఇచ్చాడు. తనను వివాదంలోకి లాగాలని చూసిన సదరు విలేఖరికి సున్నితంగానే చివాట్లు పెట్టాడు. అదే సమయంలో.. తమ క్రికెట్ బోర్డు పట్ల తనకు అపారమైన నమ్మకం ఉందని.. కాబట్టి తాము భద్రత విషయంలో ఎలాంటి ఆందోళన చెందబోమని గట్టిగానే ఇచ్చి పడేశాడు.టీ20 ప్రపంచకప్-2026 టోర్నీ ఫిబ్రవరి 7- మార్చి 8 మధ్య భారత్- శ్రీలంక వేదికలుగా జరుగనున్న విషయం తెలిసిందే. పాకిస్తాన్ తమ మ్యాచ్‌లన్నీ తటస్థ వేదికైన శ్రీలంకలో ఆడాల్సి ఉండగా.. భద్రతా కారణాలు అంటూ భారత్‌తో మ్యాచ్‌ను బహిష్కరిస్తున్నట్లు పాక్ ప్రభుత్వం ఆదివారం ప్రకటించింది. ఈ అంశంపై సోషల్ మీడియాలో జోకులు పేలుతున్నాయి.శ్రీలంకతో భారత్‌తో మ్యాచ్‌కు ఉన్న సోకాల్డ్ ముప్పు.. మిగతా జట్లతో ఆడినప్పుడు ఉండదా? అని నెటిజన్లు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. ఇదిలా ఉంటే.. విదేశీ ఆటగాళ్లను వివాదంలోకి లాగాలని చూడటం పాక్‌లో ఇటీవలి కాలంలో ఎక్కువైంది. ఇందులో భాగంగానే ఓ జర్నలిస్టు.. ఆసీస్ కెప్టెన్ మిచెల్ మార్ష్‌ను.. భారత్‌తో పాక్ మ్యాచ్ బహిష్కరిస్తోందని.. ఈ విషయంపై అభిప్రాయం చెప్పాలని కోరారు.పాక్ రిపోర్టర్‌కు ఇచ్చి పడేసిన మార్ష్ఈ మేరకు.. ‘‘ఫిబ్రవరి 15న జరగాల్సిన ఇండియా- పాకిస్తాన్ మ్యాచ్ గురించి ఇప్పుడే తెలిసింది. పాకిస్తాన్ ఈ మ్యాచ్‌ను బాయ్‌కాట్ చేయబోతోంది. ఈ విషయంపై మీ స్పందన’’ అని సదరు రిపోర్టర్ అడిగారు.ఇందుకు బదులుగా.. ‘‘ఈ అంశం గురించి నేను ఇప్పుడు మాట్లాడాలని అనుకోవడం లేదు. అసలు ఆ అవసరమే లేదు. మా జట్టు గురించి మాత్రమే మాకు పట్టింపు ఉంటుంది. వరల్డ్‌కప్‌లో మా ప్రదర్శన ఎలా ఉండాలన్న దానిపై మాత్రమే మా దృష్టి ఉంది’’ అని మార్ష్ పేర్కొన్నాడు.మేము సేఫ్.. మాకు నమ్మకం ఉందిఅయినప్పటికీ వెనక్కి తగ్గని సదరు రిపోర్టర్.. ‘‘ఐసీసీ ఫుల్ మెంబర్ బంగ్లాదేశ్ కూడా ఈసారి భద్రతా కారణాల వల్ల ప్రపంచకప్ టోర్నీలో పాల్గొనడం లేదు. ఓ ఆటగాడిగా ఫుల్ మెంబర్ జట్టు ఇలా తప్పుకోవడాన్ని ఎలా చూస్తారు?’’ అని ప్రశ్నించారు.ఇందుకు మార్ష్ స్పందిస్తూ.. ‘‘గత ప్రశ్నకు ఇచ్చిన సమాధానమే దీనికీ వర్తిస్తుంది. వరల్డ్‌కప్ గెలవాలన్న లక్ష్యంతో మాత్రమే మేము వరల్డ్‌కప్ టోర్నీలో అడుగుపెడుతున్నాం. మా దృష్టి మొత్తం దాని మీదే కేంద్రీకృతమైంది. మమ్మల్ని భద్రంగా ఉంచుతారని మా బోర్డు పట్ల మాకు అపారమైన నమ్మకం ఉంది. ఈ ఒక్కటే నేను మీకు చెప్పగలను’’ అంటూ పరోక్షంగా పాక్ క్రికెట్ బోర్డుకు కూడా చురక వేశాడు.ఆసీస్‌కు ఘోర పరాభవంకాగా టీ20 ప్రపంచకప్ ప్రారంభానికి ముందు ఆసీస్ జట్టు పాక్‌లో పర్యటించింది. అయితే, స్టార్ ఆటగాళుల లేకుండా ప్రయోగాలు చేసిన ఆసీస్.. సొంతగడ్డపై పాక్‌ను ఓడించలేకపోయింది. ఈ మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను పాకిస్తాన్ 3-0తో క్వీన్‌స్వీప్ చేసింది. లాహోర్లోఓ ఆదివారం చివరి మ్యాచ్‌లో 111 పరుగుల తేడాతో ఆసీస్‌ను ఓడించింది. కాగా టీ20ల్లో పరుగుల తేడా పరంగా ఆస్ట్రేలియాకు ఇదే అతిపెద్ద పరాజయం. చదవండి: T20 WC: మ్యాచ్ రద్దు చేసుకున్న పాక్.. స్పందించిన బీసీసీఐ! -
పాక్ సెమీస్, ఫైనల్స్‌ను కూడా రద్దు చేసుకుంటుందా..?
టీ20 ప్రపంచకప్-2026లో పాకిస్తాన్ భారత్‌తో ఆడాల్సిన గ్రూప్ స్టేజీ మ్యాచ్‌ను రద్దు చేసుకున్న విషయం తెలిసిందే. ఒకవేళ పాక్ సెమీస్‌లో కాని, ఫైనల్స్‌లో కాని భారత్‌తో తలపడాల్సి వస్తే పరిస్థితి ఏంటన్న ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ఇదే విషయాన్ని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు మొహిసిన్ నఖ్వీ వద్ద ప్రస్తావించగా పూర్తి స్పష్టతనిచ్చాడు. సెమీఫైనల్ లేదా ఫైనల్లో భారత్‌తో తలపడాల్సి వస్తే పాకిస్తాన్ తప్పక బరిలోకి దిగుతుందని తేల్చి చెప్పాడు. నాకౌట్ మ్యాచ్‌ల్లో ఆడేందుకు తమకెలాంటి అభ్యంతరాలు లేవని అన్నాడు. జట్టు శక్తిపై నమ్మకాన్ని వ్యక్తపరుస్తూ.. భారత్‌ను గెలిచి చూపిస్తామని బీరాలు పలికాడు. ప్రపంచకప్ జెర్సీ ఆవిష్కరణ కార్యక్రమం సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశాడు.నఖ్వీ నేతృత్వంలోని పీసీబీ అవళంబిస్తున్న ఈ భిన్న వైఖరిపై ఐసీసీతో పాటు క్రికెట్ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్రూప్ దశలో వచ్చే భద్రతా సమస్యలు నాకౌట్ మ్యాచ్‌లు ఆడే సమయంలో ఎదురవ్వవా అని అంటున్నారు. కొందేమో పాక్‌కు నాకౌట్ దశకు చేరేంత సీన్ లేదని, అందుకే ఈ తలతిక్క డ్రామాలాడుతుందని కామెంట్లు చేస్తున్నారు. అసలు పాక్‌ను ప్రపంచకప్ మొత్తం నుంచే బహిష్కరించి, వేరే టీమ్‌కు అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.కాగా, టీ20 ప్రపంచకప్-2026లో భాగంగా ఫిబ్రవరి 15న కొలొంబో వేదికగా పాకిస్తాన్ భారత్‌తో గ్రూప్ స్టేజీ మ్యాచ్ ఆడాల్సి ఉంది. భద్రతా కారణాలను సాకుగా చూపుతూ పాక్ ఈ మ్యాచ్‌ను రద్దు చేసుకుంది. తాజాగా ఈ ఒక్క మ్యాచ్ మినహా మిగతా మ్యాచ్‌లు తప్పక ఆడతామని స్పష్టం చేసింది. పాక్ గ్రూప్-ఏలో భారత్, నమీబియా, నెదర్లాండ్స్, యూఎస్ఏతో తలపడాల్సి ఉంది. వీరి మిగతా గ్రూప్ మ్యాచ్‌లు ఫిబ్రవరి 7 (నెదర్లాండ్స్), 10 (యూఎస్ఏ), 18 తేదీల్లో (నమీబియా) కొలొంబో వేదికగా జరుగనున్నాయి. ఒకవేళ పాక్ గ్రూప్ దశ దాటి తదుపరి దశకు చేరితే ఆ మ్యాచ్‌లు కూడా కొలొంబోలోనే జరుగుతాయి.ఐసీసీ ఆగ్రహం పాక్ భారత్‌తో గ్రూప్ స్టేజీ మ్యాచ్‌ను మాత్రమే రద్దు చేసుకోవడంపై ఐసీసీ ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తుంది. ఇలా చేయడం క్రీడా సూత్రాలకు విరుద్దమని పేర్కొంది. ఇప్పటికైతే పీసీబీ నుంచి ఎలాంటి అధికారిక సమాచారం రాలేదని తెలిపింది. పీసీబీ నుంచి స్పష్టత వచ్చాక తమ వైఖరి కూడా ప్రకటిస్తామని ఘాటుగా స్పందించింది. -
మ్యాచ్ రద్దు చేసుకున్న పాక్.. స్పందించిన బీసీసీఐ!
టీ20 ప్రపంచకప్-2026 టోర్నమెంట్లో టీమిండియాతో మ్యాచ్‌ను బహిష్కరిస్తూ పాకిస్తాన్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇందుకు భారీ మూల్యం చెల్లించాల్సి వచ్చే అవకాశాలు ఉన్నా.. ప్రభుత్వ నిర్ణయం ప్రకారమే నడుచుకునేందుకు పాక్ క్రికెట్ బోర్డు (PCB) సిద్ధమైంది.శ్రీలంకలో పాక్ మ్యాచ్‌లుకాగా టీ20 వరల్డ్‌కప్ టోర్నీకి డిఫెండింగ్ చాంపియన్ హోదాలో భారత్ ఆతిథ్యం ఇస్తున్న విషయం తెలిసిందే. అయితే, ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం.. తటస్థ వేదికైన శ్రీలంకలో పాకిస్తాన్ తమ మ్యాచ్‌లు ఆడేలా అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) షెడ్యూల్ ఖరారు చేసింది.భద్రతా కారణాలా?ఇందులో భాగంగా భారత్- పాకిస్తాన్ ఫిబ్రవరి 15న కొలంబో వేదికగా తలపడాల్సి ఉంది. అయితే, తమకు అవసరం లేని విషయంలో తలదూర్చి.. బంగ్లాదేశ్‌కు మద్దతు పలుకుతూ పాక్‌తో భారత్‌తో మ్యాచ్‌ను బహిష్కరించాలనే నిర్ణయం తీసుకుంది. ఇందుకు భద్రతా కారణాలు సాకుగా చూపడం గమనార్హం.కఠిన చర్యలకు సిద్ధం ఈ నేపథ్యంలో శ్రీలంకలో మిగతా మ్యాచ్‌లకు లేని ఈ సాకు.. కేవలం టీమిండియాతో మ్యాచ్‌కు మాత్రమే ఉందనడి చెప్పడం పాక్ ద్వంద్వ వైఖరికి నిదర్శనం అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, పాక్ వ్యవహారశైలిపై గుర్రుగా ఉన్న ఐసీసీ.. కఠిన చర్యలకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.దేవజిత్ సైకియా ఏమన్నారంటేఈ పరిణామాలపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) కార్యదర్శి దేవజిత్ సైకియాను స్పందించాల్సిందిగా మీడియా కోరింది. ఇందుకు బదులుగా.. ‘‘ఈ విషయం గురించి మాకు అధికారిక సమాచారం వచ్చేంతవరకు నేను ఎలాంటి వ్యాఖ్య చేయలేను. మ్యాచ్ రద్దు విషయమై స్పష్టమైన సమాచారం లేనందున ఈ అంశం గురించి మాట్లాడే హక్కు నాకైతే ప్రస్తుతానికి లేదు’’ అని న్యూస్18తో పేర్కొన్నారు.ఐసీసీ చెప్పినట్లే..అయితే, బీసీసీఐ ఉపాధ్యక్షుడు, కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ శుక్లా స్పందిస్తూ.. ‘‘ఐసీసీ ఓ కీలక ప్రకటన జారీ చేసింది. క్రీడా స్పూర్తి గురించి ఐసీసీ మాట్లాడింది. ఐసీసీతో మేము ఏకీభవిస్తున్నాం. ఐసీసీతో చర్చించిన తర్వాతే మేము ఈ విషయంపై కామెంట్ చేయగలము’’ అని పేర్కొన్నారు. కాగా పాక్ తమ నిర్ణయం గురించి తమకు అధికారికంగా తెలియజేయలేదని పేర్కొన్న ఐసీసీ.. సెలక్టివ్‌గా మ్యాచ్‌లు ఎంచుకోవడం సరికాదని కౌంటర్ ఇచ్చింది. బంగ్లాదేశ్ కూడా ఇలాగే తెగేదాకా లాగితే... ఆ జట్టును టోర్నీ నుంచి తప్పించిన ఐసీసీ.. ఆ స్థానంలో స్కాట్లాండ్ను చేర్చిన విషయం తెలిసిందే. చదవండి: భారత్‌తో మ్యాచ్ రద్దు.. పాకిస్తాన్‌కు తప్పదు భారీ మూల్యం #WATCH | Delhi: On Pakistan to boycott its match against India in the ICC Men’s T20 World Cup 2026, BCCI vice president and Congress MP Rajeev Shukla says, "ICC has issued a big statement, they have spoken about sportsmanship. We completely agree with the ICC. BCCI won't make any… pic.twitter.com/qRgwHzgDls— ANI (@ANI) February 2, 2026 -
భారత్‌తో మ్యాచ్ రద్దు.. పాక్‌పై టీమిండియా ఫ్యాన్స్ సెటైర్లు
పాకిస్తాన్ క్రికెట్ జట్టు భారత్‌తో టీ20 ప్రపంచకప్ మ్యాచ్ రద్దు చేసుకోవడంపై క్రికెట్ అభిమానులు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. పాక్ ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని ప్రకటించినప్పటి నుంచి సోషల్‌మీడియా వేదికగా పాక్ జట్టును ఏకి పారేస్తున్నారు. పాక్ భారత్ చేతిలో పరాభవాన్ని ముందే ఊహించి జారుకుందని కామెంట్లు చేస్తున్నారు. అభిషేక్ శర్మ భయంతో పారిపోయారని వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. పాక్ తమతో మ్యాచ్ ఆడపోవడం వల్ల కలిగే నష్టం ఏమీ ఉండదని అంటున్నారు. భారత్‌తోనే కాదు, టోర్నీ మొత్తానే బాయ్‌కాట్ చేసుంటే పీడా పోయేదని చర్చించుకుంటున్నారు. భారత్‌తో మ్యాచ్‌ను రద్దు చేసుకున్నందుకు ఐసీసీ కఠిన శిక్షలు అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కాగా, గతేడాది పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్-పాక్ మధ్య క్రికెట్ సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఆ టోర్నీలో టీమిండియా తప్పక ఆడింది కానీ, చాలా మంది భారతీయులకు పాక్‌తో తలపడటం అస్సలు ఇష్టం లేదు. మెజారిటీ శాతం భారతీయుల అభిమతానికి అనుగుణంగానే టీమిండియా ప్లేయర్లు పాక్ ఆటగాళ్లకు షేక్ హ్యాండ్ ఇవ్వలేదు. అలాగే ఆసియా కప్ గెలిచిన తర్వాత పీసీబీ అధ్యక్షుడు, ఆసియా క్రికెట్ కౌన్సిల్‌కు చీఫ్ కూడా అయిన మొహిసిన్ నఖ్వీ నుంచి ట్రోఫీని స్వీకరించలేదు. భారత ఆటగాళ్లు ట్రోఫీని అందుకోవడం నిరాకరించినందుక నఖ్వీ ట్రోఫీ ఎత్తుకెళ్లిపోయిన విషయం విధితమే. ఇప్పటికీ అతను భారత్‌కు ఆ ట్రోఫీని అప్పగించలేదు. ఈ వివాదం కొనసాగుతుండగానే భారత్-బంగ్లాదేశ్ అంతర్గత విషయంలో పాక్ తలదూర్చింది. బంగ్లాదేశ్‌కు వత్తాసుగా ప్రపంచకప్‌ను బహిష్కరిస్తామని బెదిరింపులకు దిగింది. చివరికి భారత్‌తో మ్యాచ్‌ను మాత్రమే రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని ఐసీసీ చాలా సీరియస్‌గా పరిగణించే అవకాశం ఉంది. క్రికెట్‌కు సంబంధించి పాక్‌ను అష్టదిగ్బంధనం చేయవచ్చు. ఆర్దిక, పాలనాపరమైన చాలా శిక్షలను పీసీబీ ఎదుర్కోవాల్సి ఉంటుంది. పాక్ జట్టును ప్రపంచకప్ నుంచి బహిష్కరించినా, ఆశ్చర్యపోనక్కర్లేదు.ఒకవేళ పాక్ ప్రపంచకప్‌లో కొనసాగితే భారత్‌తో మ్యాచ్ రద్దు చేసుకున్నందుకు రెండు పాయింట్లు కోల్పోతుంది. భారత్‌కు మ్యాచ్ ఆడకుండానే రెండు పాయింట్లు లభిస్తాయి. ఒకవేళ పాక్ అదృష్టం బాగుండి, తదుపరి దశకు చేరినా, అంతకంటే ముందుకు వెళ్లే సీన్ లేదు. ఇలాంటి పరిస్థితుల్లో పాక్ భారత్‌తో మ్యాచ్ ఆడినా, ఆడకపోయినా పెద్ద తేడా ఉండదని భారతీయ క్రికెట్ అభిమానులు అంటున్నారు. -
భారత్‌తో మ్యాచ్ రద్దు.. పాకిస్తాన్‌కు తప్పదు భారీ మూల్యం
భారత్‌తో టీ20 ప్రపంచకప్ మ్యాచ్ రద్దు చేసుకొని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చాలా పెద్ద సాహసం చేసింది. ఈ చర్య వల్ల ఐసీసీకి కలిగే నష్టం మాట అటుంచితే, పీసీబీ మాత్రం భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ విషయమై ఐసీసీ తీవ్రంగానే స్పందించింది. పీసీబీ ఇంకా అధికారికంగా తమ వైఖరిని తెలియజేయలేదని ప్రకటిస్తూనే.. ఈ నిర్ణయం పాకిస్తాన్ క్రికెట్ భవిష్యత్తుపై ప్రతికూల ప్రభావం చూపుతుందని హెచ్చరించింది. క్రీడా సమగ్రతను దెబ్బతీసే ఇలాంటి చర్యలను అంగీకరించే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. ఈ విషయంలో పీసీబీ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని గట్టిగానే వార్నింగ్ ఇచ్చింది. ఐసీసీ తీసుకోబోయే చర్యలపై ఒకటి రెండు రోజుల్లో పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.కాగా, పాకిస్తాన్ ప్రభుత్వం భద్రతా కారణాలను సాకుగా చూపుతూ ఫిబ్రవరి 15న కొలొంబో వేదికగా భారత్‌తో జరగాల్సిన మ్యాచ్‌ను (గ్రూప్ స్టేజీ) రద్దు చేసుకుంటున్నట్లు నిన్న సాయంత్రం అధికారికంగా ప్రకటించింది. తొలుత మెగా టోర్నీ మొత్తం నుంచి వైదొలుగుతామని బెదిరించిన పీసీబీ, చివరికి భారత్‌తో మ్యాచ్ మాత్రమే బాయ్‌కాట్ చేసుకుంటున్నట్లు స్పష్టం చేసింది.వివాదం ఎక్కడ మొదలైదంటే..?ఐపీఎల్ నుంచి ముస్తాఫిజుర్ రెహ్మన్‌ను తప్పించడంతో బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు వరల్డ్‌కప్ కోసం తమ జట్టును భారత్‌కు పంపించేందుకు నిరాకరించింది. భద్రతా కారణాలను సాకుగా చూపుతూ తమ మ్యాచ్‌లను శ్రీలంకకు తరలించాలని ఐసీసీని బీసీబీ కోరింది. కానీ బీసీబీ విజ్ఞప్తిని ఐసీసీ తిరస్కరించింది.భద్రత పరంగా పూర్తి స్ధాయి హామీ ఇచ్చినా బీసీబీ మాత్రం వెనక్కి తగ్గలేదు. దీంతో ఐసీసీ వరల్డ్‌కప్ నుంచి బంగ్లాను తప్పించి వారి స్దానంలో స్కాట్లాండ్ను చేర్చింది. ఈ నిర్ణయాన్ని తప్పుబడుతూ, బంగ్లాదేశ్‌కు మద్దతుగా పాకిస్థాన్ కూడా టోర్నీ నుంచి తప్పుకుంటామని పరోక్షంగా హెచ్చరించింది. చివరికి భారత్‌తో మ్యాచ్‌ను మాత్రమే రద్దు చేసుకుంటున్న ప్రకటించింది.భారత్–పాకిస్తాన్ పోటీ ప్రాముఖ్యత - ఈ రెండు జట్ల మధ్య పోటీని “మదర్ ఆఫ్ ఆల్ బ్యాటిల్స్” అని పిలుస్తారు. - ప్రపంచవ్యాప్తంగా కోట్లాది అభిమానులు ఈ మ్యాచ్‌ను ఉత్కంఠగా వీక్షిస్తారు.ఆర్థిక నష్టం అంచనా - ఈ మ్యాచ్ ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా జరిగే వ్యాపారం వందల కోట్లలో ఉంటుంది.- పాకిస్తాన్ నిర్ణయం ఐసీసీకి భారీ ఆర్థిక నష్టాన్ని కలిగించే అవకాశం ఉంది. - క్రిక్‌బజ్ నివేదిక ప్రకారం.. ప్రతి భారత్ మ్యాచ్ విలువ సుమారు 10–11 మిలియన్ అమెరికన్ డాలర్లు (దాదాపు ₹100 కోట్లు) ఉంటుంది. - పాకిస్తాన్‌తో మ్యాచ్‌కు వచ్చే సరికి ఈ ఆదాయం మరింత పెరుగుతుంది. - ఫిబ్రవరి 15న జరగాల్సిన భారత్-పాక్ మ్యాచ్ ద్వారా రూ. 200 కోట్లకు మించి ఆదాయం వస్తుందని నిర్వహకులు అంచనా వేశారు.- మ్యాచ్ జరగకపోతే, ఐసీసీతో పాటు ప్రసార సంస్థలు భారీ నష్టాన్ని ఎదుర్కొంటాయి. దీని అంచనా రూ. 500 కోట్ల వరకు ఉంటుందని తెలుస్తుంది.పాకిస్తాన్‌కు కలిగే నష్టాలు- భారత్‌తో మ్యాచ్‌ను రద్దు చేసుకోవడం వల్ల పాక్ క్రికెట్ బోర్డు ఆర్దికపరమైన నష్టాలతో పాటు పరిపాలనాపరమైన మరెన్నో కఠనమైన శిక్షలు ఎదుర్కొనే అవకాశం ఉంది. - టోర్నీలో పాల్గొన్నందుకు ఇచ్చే 250,000 డాలర్లు(రూ. 2 కోట్లు పైమాటే) పార్టిసిపేషన్ ఫీజును పీసీబీ కోల్పోవాల్సి ఉంటుంది.- పాక్ సెమీఫైనల్ చేరితే 790,000 డాలర్లు(సుమారు రూ. 7 కోట్లు), రన్నరప్ అయితే 1.6 మిలియన్ డాలర్లు(దాదాపు రూ.15 కోట్లు), ఒకవేళ విజేతగా నిలిస్తే 3 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 25 కోట్లు) కోల్పోతారు.- ఐసీసీ ప్రతి ఏటా తమ సభ్యదేశాలకు ఇచ్చే రెవెన్యూ వాటాను కూడా నిలిపివేసే అవకాశం కూడా ఉంది. అదే జరిగితే పాక్ క్రికెట్ బోర్డు దివాళా తీయాల్సిందే. - ఫైనల్‌గా పాకిస్తాన్ తమ ప్రదర్శన బట్టి 250,000 డాలర్లు(సుమారు రూ.2.29 కోట్లు) నుంచి 4.42 మిలియన్ల డాలర్లు(సుమారు రూ. 38 కోట్లు) ప్రైజ్ మనీని కోల్పోయే ప్రమాదం ఉంది.- PSLకు ఇతర బోర్డులు NOCలు ఇవ్వకుండా ఆపుతుంది.- ఆసియా కప్ నుంచి పాకిస్తాన్‌ను తొలగించే అవకాశం ఉంది. -
పాక్‌ను చిత్తుగా ఓడించిన భారత్
అండర్ 19 ప్రపంచకప్ 2026లో భాగంగా ఇవాళ (ఫిబ్రవరి 1) జరిగిన మ్యాచ్‌లో భారత్ పాకిస్తాన్‌పై 58 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో భారత్ సెమీఫైనల్‌కు కూడా అర్హత సాధించింది.బులవాయో వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 49.5 ఓవర్లలో 252 పరుగులకు ఆలౌటైంది. వేదాంత్ త్రివేది (68) బాధ్యతాయుతమైన అర్ద సెంచరీతో భారత్‌కు గౌరవప్రదమైన స్కోర్ అందించాడు. ఆఖర్లో కనిష్క్ చౌహాన్ (35), ఖిలన్ పటేల్ (21) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు.భారత బ్యాటర్లలో ఆరోన్ జార్జ్ (16), కెప్టెన్ ఆయుశ్ మాత్రే (0), అభిగ్యాన్ కుందు (16), దీపేశ్ దేవేంద్రన్ (1) విఫలం కాగా.. వైభవ్ సూర్యవంశీ (30), విహాన్ మల్హోత్రా (21), అంబ్రిష్ (29) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. పాక్ బౌలర్లలో అబ్దుల్ సుభాన్ 3, మొహమ్మద్ సయ్యద్ 2, అలీ రజా, అహ్మద్ హుసేన్, మొమిన్ ఖమార్, అలీ హస్సన్ బలోచ్ తలో వికెట్ తీశారు.అనంతరం ఓ మోస్తరు లక్ష్య ఛేదనలో పాక్ తొలుత విజయం దిశగా సాగింది. అయితే మధ్యలో భారత స్పిన్నర్లు ఖిలన్ పటేల్ (9.2-1-35-3), ఆయుశ్ మాత్రే (8-0-21-3), కనిష్క్ చౌహాన్ (10-1-30-1), విహాన్ మల్హాత్రా (4-0-15-1) చెలరేగడంతో పాక్‌కు ఓటమి తప్పలేదు. పేసర్లు అంబ్రిష్ (5-0-26-1), హెనిల్ పటేల్ (5-0-30-1) కూడా రాణించడంతో పాక్ 46.2 ఓవర్లలో 194 పరుగులకే ఆలౌటైంది. పాక్ ఇన్నింగ్స్‌లో ఉస్మాన్ ఖాన్ (66) ఒక్కడే అర్ద సెంచరీతో రాణించాడు. హమ్జా జహూర్ (42), కెప్టెన్ ఫర్హాన్ యూసఫ్ (38) ఓ మోస్తరు స్కోర్లతో పర్వాలేదనిపించగా.. మిగతా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. ఈ ఓటమితో పాక్ ప్రపంచకప్ నుంచి నిష్క్రమించగా.. గ్రూప్-2 నుంచి భారత్, ఇంగ్లండ్ సెమీస్‌కు అర్హత సాధించాయి. గ్రూప్-1 నుంచి ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్తాన్ సెమీస్ బెర్త్‌లు దక్కించుకున్నాయి. ఫిబ్రవరి 4న జరిగే రెండో సెమీఫైనల్లో ఆఫ్ఘనిస్తాన్ భారత్‌ను ఢీకొంటుంది. 3న జరిగే తొలి సెమీఫైనల్లో ఆస్ట్రేలియా,ఇంగ్లండ్ తలపడతాయి. -
పాక్ ప్రభుత్వం సంచలన ప్రకటన
టీ20 ప్రపంచకప్-2026 నేపథ్యంలో పాకిస్తాన్ ప్రభుత్వం సంచలన ప్రకటన చేసింది. మెగా టోర్నీలో భాగంగా ఫిబ్రవరి 15న భారత్‌తో జరగాల్సిన మ్యాచ్‌ను రద్దు చేసుకున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ హై–వోల్టేజ్ పోరుకు పాకిస్తాన్ ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. అయితే, పాక్ జట్టు ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు జరిగే మిగతా ప్రపంచకప్ మ్యాచ్‌ల్లో పాల్గొంటుందని స్పష్టం చేసింది. ఈ నిర్ణయం పాక్ క్రికెట్ బోర్డు (PCB) చైర్మన్ మొహ్సిన్ నక్వీ ఆ దేశ ప్రధాని షహబాజ్ షరీఫ్‌ను కలిసిన కొన్ని గంటల తర్వాత వెలువడింది. పాక్ ప్రభుత్వం చేసిన ఈ ప్రకటనతో ఇరు దేశాల క్రికెట్ అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. భారత్-పాక్ ఇప్పటివరకు కేవలం ఐసీసీ టోర్నీల్లో మాత్రమే తలపడేవి. ఇప్పుడు అది కూడా లేకపోవడం ఫ్యాన్స్‌ను తీవ్రంగా కలిచి వేస్తుంది. పాక్ తీసుకున్న ఈ నిర్ణయంపై ఐసీసీ ఏరకంగా స్పందిస్తుందో వేచి చూడాలి. భారత్-పాక్ మ్యాచ్ రద్దు వల్ల అభిమానులకే కాదు, వాణిజ్యానికి కూడా తీవ్ర నష్టం వాటిల్లుతుంది. పాక్ తీసుకున్న ఈ నిర్ణయం ఇరు దేశాల మధ్య రాజకీయ, ఉద్రిక్తతలను మరింత పెంచే అవకాశం ఉంది.కాగా, భద్రతా కారణాలను సాకుగా చూపుతూ బంగ్లాదేశ్ జట్టు ఇదివరకే ప్రపంచకప్ నుంచి వైదొలిగింది. ఇప్పుడు పాక్ కూడా అదే కారణాన్ని సాకుగా చూపుతూ భారత్‌తో మ్యాచ్‌ను రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించింది. ఈ మొత్తం ఎపిసోడ్ ఇటీవలికాలంలో బంగ్లాదేశ్‌లో హిందూ మైనారిటీలపై దాడుల నేపథ్యంలో మొదలైంది. ఈ కారణంగా బంగ్లా ఆటగాడు ముస్తాఫిజుర్‌ను ఐపీఎల్ నుంచి తొలగించగా.. ఇందుకు ప్రతిగా బంగ్లాదేశ్ భారత్‌లో జరగాల్సిన లీగ్ మ్యాచ్‌లు ఆడమని భీష్మించుకు కూర్చుంది. వేదికలను శ్రీలంకకు మార్చాలని కోరగా ఐసీసీ ససేమిరా అంది. ఈ విషయంలో పాక్ బంగ్లాదేశ్‌కు మొదటి నుంచి వంత పాడుతూ వచ్చింది. బంగ్లాదేశ్ ప్రపంచకప్ నుంచి వైదొలగడంతో స్కాట్లాండ్కు వైల్డ్ కార్డ్ ఎంట్రీ లభించింది. కాగా, ప్రపంచకప్‌లో పాక్ తమ మ్యాచ్‌లను శ్రీలంకలో ఆడనున్న విషయం తెలిసిందే. భారత్-పాక్ మ్యాచ్ కూడా శ్రీలంకలోనే షెడ్యూలై ఉండింది. -
పాకిస్తాన్‌తో కీలక మ్యాచ్.. టీమిండియా గౌరవప్రదమైన స్కోర్
అండర్–19 ప్రపంచకప్-2026లో భాగంగా ఇవాళ (ఫిబ్రవరి 1) భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య కీలకమైన సూపర్ సిక్స్ మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ ఇరు జట్లకు చాలా కీలకం. పాకిస్తాన్ భారీ విజయం సాధిస్తేనే టోర్నీలో నిలబడుతుంది. భారత్ ఇప్పటికే సెమీఫైనల్ దిశగా అడుగులు వేసినా, పాక్ చేతిలో భారీ ఓటమి ఎదురైతే టోర్నీ నుంచి నిష్క్రమించే ప్రమాదం కూడా ఉంది. బులవాయో వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్ టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేస్తుంది. పాక్ ఆహ్వానం మేరకు బ్యాటింగ్‌కు దిగిన భారత్ ఆదిలో తడబడినా, మధ్యలో కోలుకుంది. వేదాంత్ త్రివేది (68) బాధ్యతాయుతమైన అర్ద సెంచరీతో భారత్‌ను గౌరవప్రదమైన స్కోర్ దిశగా నడిపించాడు. ఆఖర్లో కనిష్క్ చౌహాన్ (35), ఖిలన్ పటేల్ (21) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. మొత్తంగా భారత్ నిర్ణీత 49.5 ఓవర్లలో 252 పరుగులకు ఆలౌటైంది.భారత బ్యాటర్లలో ఆరోన్ జార్జ్ (16), కెప్టెన్ ఆయుశ్ మాత్రే (0), అభిగ్యాన్ కుందు (16), దీపేశ్ దేవేంద్రన్ (1) విఫలం కాగా.. వైభవ్ సూర్యవంశీ (30), విహాన్ మల్హోత్రా (21), అంబ్రిష్ (29) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. పాక్ బౌలర్లలో అబ్దుల్ సుభాన్ 3, మొహమ్మద్ సయ్యద్ 2, అలీ రజా, అహ్మద్ హుసేన్, మొమిన్ ఖమార్, అలీ హస్సన్ బలోచ్ తలో వికెట్ తీశారు. -
భారత్‌తో మ్యాచ్.. పాక్ హెడ్ కోచ్ ఘోర తప్పిదం
అండర్–19 ప్రపంచకప్-2026లో భాగంగా ఇవాళ (ఫిబ్రవరి 1) భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య కీలకమైన సూపర్ సిక్స్ మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ ఇరు జట్లకు చాలా కీలకం. పాకిస్తాన్ భారీ విజయం సాధిస్తేనే టోర్నీలో నిలబడుతుంది. భారత్ ఇప్పటికే సెమీఫైనల్ దిశగా అడుగులు వేసినా, పాక్ చేతిలో భారీ ఓటమి ఎదురైతే టోర్నీ నుంచి నిష్క్రమించే ప్రమాదం కూడా ఉంది. బులవాయో వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్ టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేస్తుంది. పాక్ ఆహ్వానం మేరకు బ్యాటింగ్‌కు దిగిన భారత్ ఆదిలో తడబడినా, మధ్యలో కోలుకుంది. వేదాంత్ త్రివేది (68) బాధ్యతాయుతమైన అర్ద సెంచరీతో భారత్‌ను గౌరవప్రదమైన స్కోర్ దిశగా నడిపించాడు. ఆఖర్లో కనిష్క్ చౌహాన్ (35), ఖిలన్ పటేల్ (21) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. మొత్తంగా భారత్ నిర్ణీత 49.5 ఓవర్లలో 252 పరుగులకు ఆలౌటైంది.భారత బ్యాటర్లలో ఆరోన్ జార్జ్ (16), కెప్టెన్ ఆయుశ్ మాత్రే (0), అభిగ్యాన్ కుందు (16), దీపేశ్ దేవేంద్రన్ (1) విఫలం కాగా.. వైభవ్ సూర్యవంశీ (30), విహాన్ మల్హోత్రా (21), అంబ్రిష్ (29) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. పాక్ బౌలర్లలో అబ్దుల్ సుభాన్ 3, మొహమ్మద్ సయ్యద్ 2, అలీ రజా, అహ్మద్ హుసేన్, మొమిన్ ఖమార్, అలీ హస్సన్ బలోచ్ తలో వికెట్ తీశారు.ఇదిలా ఉంటే, భారత ఇన్నింగ్స్ సందర్భంగా పాకిస్తాన్ హెడ్ కోచ్ సర్ఫరాజ్ అహ్మద్ చేసిన ఓ పని వివాదాస్పదమైంది. ఇన్నింగ్స్ 25వ ఓవర్ తర్వాత అతను డ్రెస్సింగ్ రూమ్‌లో మొబైల్ ఫోన్ ఉపయోగిస్తూ కనిపించాడు. ఐసీసీ నియమాల ప్రకారం, PMOA (Player and Match Officials Area)లో మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు లేదా ఇతర కమ్యూనికేషన్ పరికరాలు వాడటం పూర్తిగా నిషేధం. ఇవి మ్యాచ్ ఫలితాలను ప్రభావితం (ఫిక్సింగ్ లేదా చీటింగ్) చేసే అవకాశం ఉందని ఐసీసీ ఈ నిబంధనను అమలు చేస్తుంది. ఆర్టికల్ 4.1.1 ప్రకారం PMOAలో ఎవరూ మొబైల్ ఫోన్ వాడకూడదు. ఆర్టికల్ 4.1.2 ప్రకారం ల్యాప్‌టాప్‌లు లేదా ఇతర కమ్యూనికేషన్ పరికరాలు కూడా వాడకూడదు. -
భారీ ట్రోలింగ్‌ను ఎదుర్కొంటున్న వైభవ్ సూర్యవంశీ, ఆయుశ్ మాత్రే
భారత యువ జట్టు కెరటాలు ఆయుశ్ మాత్రే, వైభవ్ సూర్యవంశీ సోషల్‌మీడియా వేదికగా భారీ ట్రోలింగ్‌ను ఎదుర్కొంటున్నాడు. అండర్-19 ప్రపంచకప్ 2026లో భాగంగా పాకిస్తాన్‌తో జరుగుతున్న సూపర్ సిక్స్ మ్యాచ్‌లో దారుణంగా విఫలమైనందుకు టీమిండియా ఫ్యాన్స్ ఆగ్రహానికి గురవుతున్నారు. చోకర్స్ అంటూ ట్రోలింగ్ చేస్తున్నారు. సూర్యవంశీతో పోలిస్తే మాత్రేపై ట్రోలింగ్ ధాటి అధికంగా ఉంది. ప్రతి కీలక మ్యాచ్‌లో విఫలమవుతాడు, ఇతన్ని ఎలా కెప్టెన్‌గా కొనసాగిస్తున్నారని విమర్శిస్తున్నారు. ఈ మ్యాచ్‌లో మాత్రే రెండు బంతులు ఆడి ఖాతా కూడా తెరవలేకపోగా.. చిన్న జట్లపై చెలరేగిపోయే వైభవ్ సూర్యవంశీ కీలకమైన మ్యాచ్‌లో సత్తా చాటలేకపోయారు. వైభవ్ 22 బంతుల్లో 5 ఫోర్లు, సిక్సర్ సాయంతో 30 పరుగులు చేసి ఔటయ్యాడు. వాస్తవానికి వైభవ్ చేసిన ఈ స్కోర్ అంత తీసి పాడేయాల్సిందేమీ కాకపోయినప్పటికీ.. కీలకమైన సూపర్ సిక్స్ మ్యాచ్ కావడం, అందులోనూ ప్రత్యర్ధి పాక్ కావడం వల్ల అభిమానులు ఆగ్రహిస్తున్నారు. రెండు లైఫ్‌లు లభించిన తర్వాత కూడా జాగ్రత్త పడకపోవడంతో ఫ్యాన్స్ ఆగ్రహం వైభవ్‌పై కట్టలు తెంచుకుంది.వీరిద్దరితో పాటు మరో ఓపెనర్ ఆరోన్ జార్జ్ (16) కూడా విఫలం కావడంతో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్ కష్టాల్లో పడింది. ఈ ముగ్గురు ఒకే స్కోర్ (47 పరుగులు) వద్ద, నాలుగు బంతుల వ్యవధిలో ఔట్ కావడం అభిమానులకు మరింత ఆగ్రహం తెప్పించింది. పాక్ పేసర్ మొహమ్మద్ సయ్యమ్ భారత టాపార్డర్‌ను కూల్చడంలో సఫలీకృతుడయ్యాడు. మరో 62 పరుగుల తర్వాత భారత్ మరో వికెట్ కోల్పోయింది. 109 పరుగుల వద్ద విహాన్ మల్హోత్రా (21) అహ్మద్ హుస్సేన్ బౌలింగ్‌లో అతనికే క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. 30 ఓవర్ల తర్వాత భారత్ 4 వికెట్ల నష్టానికి 140 పరుగులు చేసి ఎదురీదుతుంది. వేదాంత్ త్రివేది (50), అభిగ్యాన్ కుందు (12) భారత్‌కు గౌరవప్రదమైన స్కోర్ అందించే ప్రయత్నం చేస్తున్నారు.కెప్టెన్సీ నుంచి తీసేయండి..!ఇటీవలికాలంలో ఆయుశ్ మాత్రే ప్రదర్శలు చాలా దారుణంగా ఉన్నాయి. ప్రస్తుత ప్రపంచకప్‌లో అతను ఇప్పటివరకు 99 పరుగులు మాత్రమే చేశాడు. అందులో 53 పరుగులు న్యూజిలాండ్‌పై చిన్న లక్ష్యాన్ని ఛేదించే సమయంలో వచ్చాయి. దీనికి ముందు ఆసియా కప్‌లోనూ అతని ప్రదర్శనలు దారుణంగా ఉన్నాయి. ఆ టోర్నీలో ఐదు ఇన్నింగ్స్‌ల్లో 65 పరుగులు మాత్రమే చేశాడు. వరుస వైఫల్యాల నేపథ్యంలో మాత్రేను కెప్టెన్సీ నుంచి తొలగించాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. -
పాక్‌తో మ్యాచ్.. తొలుత బ్యాటింగ్ చేయనున్న భారత్
అండర్-19 ప్రపంచకప్ 2026లో మరో హైవోల్టేజ్ మ్యాచ్‌కు తెరలేచింది. సూపర్ సిక్స్‌లో భాగంగా బులవాయో వేదికగా భారత్-పాకిస్తాన్ జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాకిస్తాన్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ కీలక మ్యాచ్‌కు పాక్ ఆటగాడు మహ్మద్ షయాన్ గాయం కారణంగా దూరమయ్యాడు.అతడి స్దానంలో అలీ హసన్ బలోచ్‌కు తుది జట్టులో చోటు దక్కింది. మరోవైపు భారత్ కూడా తమ తుది జట్టులో ఓ మార్పు చేసింది. ఉదవ్ మోహన్ స్దానంలో దీపేష్ ప్లేయింగ్ ఎలెవన్‌లోకి వచ్చాడు. కాగా ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి ఆసియాకప్ ఫైనల్లో ఎదురైన పరాభావానికి ప్రతీకారం తీర్చుకోవాలని భారత్ భావిస్తోంది.తుది జట్లుపాకిస్తాన్: సమీర్ మిన్హాస్, హంజా జహూర్ (వికెట్ కీపర్), ఉస్మాన్ ఖాన్, అహ్మద్ హుస్సేన్, ఫర్హాన్ యూసఫ్ (కెప్టెన్), హుజైఫా అహ్సన్, అలీ హసన్ బలోచ్, అబ్దుల్ సుభాన్, మోమిన్ కమర్, మొహమ్మద్ సయామ్, అలీ రజాభారత్ : ఆరోన్ జార్జ్, వైభవ్ సూర్యవంశీ, ఆయుష్ మాత్రే (కెప్టెన్), విహాన్ మల్హోత్రా (వైస్ కెప్టెన్), అభిజ్ఞాన్ కుందు (వికెట్ కీపర్), వేదాంత్ త్రివేది, ఆర్ ఎస్ అంబరీష్, కనిష్క్ చౌహాన్, ఖిలాన్ పటేల్, హెనిల్ పటేల్, దీపేష్ దేవేంద్రన్ -
T20 WC: అభిషేక్ శర్మ కాదు!.. ఈసారి అతడే టాప్!
పొట్టి క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న టీ20 ప్రపంచకప్-2026 టోర్నీకి ఫిబ్రవరి 7న తెరలేవనుంది. భారత్- శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న ఈ మెగా ఈవెంట్లో ఇరవై జట్లు పాల్గొంటున్నాయి. డిఫెండింగ్ చాంపియన్ హోదాలో ఈసారి బరిలోకి దిగుతున్న.. అద్భుత ఫామ్‌తో ఈసారీ హాట్ ఫేవరెట్‌గా మారింది.ఇక ఇప్పటికే మెగా టోర్నీకి భారత్ తమ జట్టును ప్రకటించింది. అదే జట్టుతో స్వదేశంలో న్యూజిలాండ్‌తో ఐదు టీ20ల సిరీస్‌ను 3-1తో కైవసం చేసుకుంది. మూడు విభాగాల్లోనూ ఆటను మెరుగుపరచుకుంటూ ప్రత్యర్థి జట్లకు కఠిన సవాలుగా మారింది సూర్య సేన.అభిషేక్ శర్మ కాదు!.. ఈ నేపథ్యంలో మెజారిటీ మంది మాజీ క్రికెటర్లు ఈసారి టీమిండియా సెమీస్ చేరడం ఖాయమని.. టైటిల్ పోరుకు కూడా అర్హత సాధిస్తుందని అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో టీమిండియా వెటరన్ స్పిన్నర్ యజువేంద్ర చహల్ స్టార్ స్పోర్ట్స్ షోలో భాగంగా.. టాప్ రన్ స్కోరర్, ప్లేయర్ ఆఫ్ ది టోర్నీమెంట్ అవార్డుల విజేతల గురించి తన అంచనాలు తెలియజేశాడు.ఈసారీ అతడే టాప్!గత ఎడిషన్ మాదిరే ఈసారి కూడా టీమిండియా పేస్ దళ నాయకుడు జస్ప్రీత్ బుమ్రా ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా నిలుస్తాడని చహల్ పేర్కొన్నాడు. ఇక భారత విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మను టాప్ రన్ స్కోరర్‌గా అంచనా వేసిన యుజీ.. ఈసారి అత్యధిక సిక్సర్లు బాదేది అతడే అని పేర్కొన్నాడు.భారత్- పాక్ ముఖాముఖి పోటీఅదే విధంగా.. టాప్ వికెట్ టేకర్‌గా బుమ్రాకు పట్టం కట్టాడు చహల్. ఇక ఈ మెగా టోర్నీలో తాను భారత్- పాకిస్తాన్ మ్యాచ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నానన్న చహల్.. జట్ల అత్యధిక స్కోరును 240 పరుగులుగా అంచనా వేశాడు. కాగా కొలంబో వేదికగా ఫిబ్రవరి 15న భారత్- పాక్ ముఖాముఖి తలపడతాయి.ఇదిలా ఉంటే.. 35 ఏళ్ల చహల్ 2024 టీ20 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టులో సభ్యుడు. అయితే, ఈ టోర్నీలో అతడు ఒక్క మ్యాచ్ కూడా ఆడకుండా బెంచ్‌కే పరిమితం అయ్యాడు. మరోవైపు.. టోర్నీ ఆసాంతం అదరగొట్టిన బుమ్రా.. ఎనిమిది మ్యాచ్‌లలో కలిపి పదిహేను వికెట్లు కూల్చాడు. టీమిండియా చాంపియన్‌గా నిలవడంలో కీలక పాత్ర పోషించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. చదవండి: WC 2026: భారత్‌తో మ్యాచ్‌కు ముందు పాకిస్తాన్‌కు భారీ షాక్ -
World Cup 2026: పాకిస్తాన్‌కు భారీ షాక్!
పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. భారత్‌తో కీలక మ్యాచ్‌కు ముందు వికెట్ కీపర్ బ్యాటర్ మహ్మద్ షయాన్ గాయపడ్డాడు. గాయం తీవ్రత ఎక్కువగా ఉన్న కారణంగా ప్రపంచకప్ టోర్నీలో మిగిలిన మ్యాచ్‌లకు అతడు దూరమయ్యాడు.మూడు బెర్తులు ఖరారుజింబాబ్వే వేదికగా ఐసీసీ అండర్-19 వరల్డ్‌కప్-2026 టోర్నీ జరుగుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఇప్పటికే సూపర్ సిక్స్ దశలో గ్రూప్-1 నుంచి ఆస్ట్రేలియా, అఫ్గనిస్తాన్.. గ్రూప్-2 నుంచి ఇంగ్లండ్ సెమీ ఫైనల్‌కు అర్హత సాధించాయి.నాలుగో జట్టు ఏది?ఇక నాలుగో బెర్తు కోసం చిరకాల ప్రత్యర్థులు భారత్- పాకిస్తాన్ మధ్య ఆదివారం బులవాయో వేదికగా మ్యాచ్ నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది. ఇప్పటికి ఆడిన మూడింటికి మూడు మ్యాచ్‌లలో గెలిచి భారత యువ జట్టు ఆరు పాయింట్లు సాధించగా.. పాక్ మూడింట రెండు గెలిచి నాలుగు పాయింట్లతో ఉంది.ముక్కుకు గాయంఇక నెట్‌రన్‌రేటు పరంగానూ భారత్ (+3.337) పాకిస్తాన్ కంటే (+1.484) మెరుగైన స్థితిలో ఉంది. ఇలాంటి తరుణంలో పాకిస్తాన్‌కు భారీ షాక్ తగిలింది. వికెట్ కీపర్ బ్యాటర్ మహ్మద్ షయాన్ ప్రాక్టీస్ మ్యాచ్‌లో గాయపడ్డాడు. ఫాస్ట్‌బౌలర్ వేసిన బంతి కారణంగా అతడి ముక్కుకు గాయమైంది. ఆస్పత్రికి తరలించి స్కానింగ్ చేయించగా ఫ్రాక్చర్ ఉన్నట్లు తేలింది. ఇందుకు సంబంధించి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అధికారిక ప్రకటన విడుదల చేసింది. సచిన్ సూచనలుమరోవైపు.. హ్యాట్రిక్ విజయాలతో జోరు మీదున్న భారత్.. పాక్‌తో కీలక సమరానికి ముందు టీమిండియా దిగ్గజం సచిన్ టెండుల్కర్తో వర్చువల్‌గా భేటీ అయింది. ఆన్లైన్లో యువ ఆటగాళ్లను పలకరించిన సచిన్.. ఆటకు సంబంధించిన టెక్నిక్స్‌తో పాటు క్రమశిక్షణ, అంకితభావం గురించి మాట్లాడుతూ వారిలో స్ఫూర్తి నింపాడు. చదవండి: భారీ శతకం బాదిన ఆఫ్ఘనిస్తాన్ బ్యాటర్.. ట్రోలింగ్ కూడా భారీగానే..! -
T20 WC: బంగ్లా అవుట్.. తొలిసారి స్పందించిన శ్రీలంక
టీ20 ప్రపంచకప్-2026 టోర్నమెంట్‌కు భారత్‌తో పాటు శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్య దేశంగా ఉంది. ఈ మెగా టోర్నీలో పాకిస్తాన్ ఆడే మ్యాచ్‌లన్నీ లంకలోనే నిర్వహించేందుకు షెడ్యూల్ ఖరారైంది. అయితే, బంగ్లాదేశ్ సైతం శ్రీలంకలో తమ మ్యాచ్‌లు ఆడతామంటూ మొండిపట్టు పట్టి మూల్యం చెల్లించింది.భారత్- బంగ్లాదేశ్ మధ్య గత కొంతకాలంగా దౌత్యపరమైన ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో.. ఐపీఎల్ నుంచి బంగ్లా ఫాస్ట్‌బౌలర్ ముస్తాఫిజుర్ రహమాన్ (Mustafizur Rahman)ను బీసీసీఐ తొలగించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తమ జట్టుకు భారత్‌లో భద్రత లేదని.. వరల్డ్‌కప్‌లో తమ మ్యాచ్‌లు భారత్‌లో కాకుండా లంకలో ఆడతామని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) పంతం పట్టింది.బంగ్లాదేశ్‌ను తప్పించి..అయితే, అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) మాత్రం ఇందుకు నిరాకరించింది. భారత్‌లో బంగ్లా ఆటగాళ్లు, సిబ్బందికి వచ్చిన ముప్పేమీ లేదని తేల్చి చెప్పగా.. బీసీబీ మాత్రం పట్టువీడలేదు. ఫలితంగా 24 గంటల తుది గడువు తర్వాత.. బంగ్లాదేశ్‌ను తప్పిస్తూ ఆ స్థానంలో స్కాట్లాండ్ను మెగా టోర్నీలో చేర్చింది ఐసీసీ.మాకు స్నేహపూర్వక దేశాలుఈ పరిణామాలపై శ్రీలంక క్రికెట్ బోర్డు తాజాగా స్పందించింది. లంక క్రికెట్ బోర్డు కార్యదర్శి బందులా దిస్సనాయకే AFPతో మాట్లాడుతూ.. "ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్ వివాదాల విషయంలో మాది తటస్థ వైఖరి. ఈ మూడూ మాకు స్నేహపూర్వక దేశాలు.మా దేశంలో మున్ముందు కూడా ఇలాంటి టోర్నీలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నాము. ఏ దేశం అడిగినా మేము సానుకూలంగా స్పందిస్తాము’’ అని పేర్కొన్నాడు. మరోవైపు.. బంగ్లాదేశ్‌కు మద్దతుగా తాము కూడా టోర్నీని బహిష్కరిస్తామని ప్రగల్బాలు పలుకుతూ ఓవరాక్షన్ చేసిన పాకిస్తాన్.. ఇప్పటికే లంకకు టికెట్లు బుక్ చేసుకున్నట్లు సమాచారం.ఈ మ్యాచ్ మాకు అత్యంత ముఖ్యంఈ నేపథ్యంలో భారత్- పాకిస్తాన్ మ్యాచ్ సాఫీగా సాగేందుకు తాము ప్రత్యేకమైన, మరింత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు శ్రీలంక క్రీడా శాఖా మంత్రి సునిల్ కుమార గమేజ్ తెలిపారు. ఈ మ్యాచ్ తమకు ప్రథమ ప్రాధాన్యం అని.. ఎలాంటి అవాంతరాలు రాకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టామని పేర్కొన్నారు. కాగా ఫిబ్రవరి 7- మార్చి 8 మధ్య టీ20 వరల్డ్‌కప్ టోర్నీ నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది. చదవండి: ఆస్ట్రేలియాకు ఊహించని షాకిచ్చిన పాకిస్తాన్ -
టీ20 వరల్డ్‌కప్‌ని పాక్ బాయ్‌కాట్ చేస్తే.. ఎన్ని కోట్లు నష్టమో తెలుసా?
టీ20 ప్రపంచకప్-2026లో పాకిస్తాన్ పాల్గొనడంపై ఇంకా సందిగ్థత కొనసాగుతోంది. ఈ మెగా టోర్నీ కోసం పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తమ జట్టును ప్రకటించినప్పటికి.. శ్రీలంకకు వెళ్లేందుకు ఇంకా ప్రభుత్వ అనుమతి కోసం ఎదురు చూస్తోంది. ఈ విషయాన్ని పీసీబీ చీఫ్ మొహ్సిన్ నఖ్వీని తెలిపాడు. అయితే పాకిస్తాన్ తమకు సంబంధం లేని విషయంలో జోక్యం చేసుకుని అనవసర రచ్చ చేస్తుంది.వివాదం ఎక్కడ మొదలైదంటే?ఐపీఎల్ నుంచి ముస్తాఫిజుర్ రెహ్మన్‌ను తప్పించడంతో బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు వరల్డ్‌కప్ కోసం తమ జట్టును భారత్‌కు పంపించేందుకు నిరాకరించింది. భద్రతా కారణాలను సాకుగా చూపుతూ తమ మ్యాచ్‌లను శ్రీలంకకు తరలించాలని ఐసీసీని బీసీబీ కోరింది. కానీ బీసీబీ విజ్ఞప్తిని ఐసీసీ తిరస్కరించింది.భద్రత పరంగా పూర్తి స్ధాయి హామీ ఇచ్చినప్పటికి బీసీబీ మాత్రం వెనక్కి తగ్గలేదు. దీంతో ఐసీసీ వరల్డ్‌కప్ నుంచి బంగ్లాను తప్పించి వారి స్దానంలో స్కాట్లాండ్ను చేర్చింది. ఈ నిర్ణయాన్ని తప్పుబడుతూ, బంగ్లాదేశ్‌కు మద్దతుగా పాకిస్థాన్ కూడా టోర్నీ నుంచి తప్పుకుంటామని పరోక్షంగా హెచ్చరించింది. పాక్ వరల్డ్‌కప్‌లో పాల్గోనడంపై రెండు మూడు రోజుల్లో అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది.పాక్ బాయ్‌కట్ చేస్తే?పాకిస్తాన్ గనుక ఈ మెగా టోర్నీని బహిష్కరిస్తే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వుంటుంది. వరల్డ్ క్రికెట్లో పాకిస్తాన్-భారత్ మ్యాచ్‌కు ఉన్న క్రేజ్ గురుంచి తెలిసిందే. ఈ క్రమంలో పాక్-భారత్ మ్యాచ్ రద్దు అయితే బ్రాడ్కాస్టర్లు.. స్పాన్సర్ల నుంచి వచ్చే ప్రకటనల ఆదాయాన్ని(సుమారు రూ. 318) కోల్పోవాల్సి ఉంటుంది. ఒకవేళ అదే జరిగితే ఆ నష్టానికి పాక్ క్రికెట్ బోర్డు నుంచే వసూలు చేస్తామని ఐసీసీ ఇప్పటికే హెచ్చరించింది.👉అదేవిధంగా టోర్నీలో పాల్గొన్నందుకు ఇచ్చే 250,000 డాలర్లు(రూ. 2 కోట్లు పైమాటే) పార్టిసిపేషన్ ఫీజును పీసీబీ కోల్పోవాల్సి ఉంటుంది.👉పాక్ సెమీఫైనల్ చేరితే 790,000 డాలర్లు(సుమారు రూ. 7 కోట్లు), రన్నరప్ అయితే 1.6 మిలియన్ డాలర్లు(దాదాపు రూ.15 కోట్లు), ఒకవేళ విజేతగా నిలిస్తే 3 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 25 కోట్లు) కోల్పోతారు👉అంతేకాకుండా ఐసీసీ ప్రతీ ఏటా తమ సభ్యదేశాలకు ఇచ్చే రెవెన్యూ వాటాను కూడా నిలిపివేసే అవకాశం కూడా ఉంది. అదే జరిగితే పాక్ క్రికెట్ బోర్డు దివాళా తీయాల్సిందే. ఫైనల్‌గా పాకిస్తాన్ తమ ప్రదర్శన బట్టి 250,000 డాలర్లు(సుమారు రూ.2.29 కోట్లు) నుంచి 4.42 మిలియన్ల డాలర్లు(సుమారు రూ. 38 కోట్లు) ప్రైజ్ మనీని కోల్పోయే ప్రమాదం ఉంది. -
ICC: ఇదేం ట్విస్టు!.. పాక్ అవుట్.. బంగ్లాదేశ్‌కు ఛాన్స్!
టీ20 ప్రపంచకప్-2026 టోర్నమెంట్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పొట్టి క్రికెట్ మజాను ఆస్వాదించేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. అయితే, అంతకంటే ముందుగానే బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB).. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC)ల మధ్య వ్యవహారం ఈ ఐసీసీ ఈవెంట్‌పై మరింత చర్చకు దారితీసింది.భారత్- శ్రీలంక వేదికలుగా ఫిబ్రవరి 7- మార్చి 8 వరకు వరల్డ్‌కప్ టోర్నీ నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది. అయితే, భారత్- బంగ్లాదేశ్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో తమ ఆటగాళ్లను భారత్‌కు పంపబోమని.. తమ మ్యాచ్‌లను శ్రీలంకలో ఆడించాలని బీసీబీ ఐసీసీకి విజ్ఞప్తి చేసింది.బంగ్లాదేశ్‌ను టోర్నీ నుంచి తప్పించిన ఐసీసీఅయితే, భారత్‌లో బంగ్లా జట్టుకు వచ్చిన ఇబ్బందేమీ లేదని చెప్పిన ఐసీసీ.. తుది నిర్ణయం తీసుకోవాల్సిందిగా బీసీబీకి గడువు ఇచ్చింది. అయితే, బీసీబీ మాత్రం మొండిపట్టు పట్టింది. తమ ప్రభుత్వం చెప్పినట్లుగానే తమ ఆటగాళ్లను భారత్‌కు పంపబోమని స్పష్టం చేసింది. ఇందుకు స్పందనగా బంగ్లాదేశ్‌ను టోర్నీ నుంచి తప్పించి ఆ స్థానంలో స్కాట్లాండ్ను చేరుస్తూ ఐసీసీ నిర్ణయం తీసుకుంది.పీసీబీ ఓవరాక్షన్ఈ ఎపిసోడ్ మొత్తంలో బీసీబీ కంటే కూడా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) అతి చేసింది. బంగ్లాదేశ్‌కు ఐసీసీ అన్యాయం చేసిందంటూ.. బోర్డు మొత్తం ఒకవైపు ఉంటే.. పాక్ మాత్రం బంగ్లాకు అనుకూలంగా ఓటు వేసింది. అంతేకాదు బంగ్లాదేశ్‌ను ఆడించకపోతే తామూ టోర్నీ బహిష్కరిస్తామంటూ బెదిరింపులకు దిగింది. నిజానికి ముందుగా అనుకున్న ఒప్పందం (భారత్- పాక్ వేదికల హైబ్రిడ్ మోడల్) ప్రకారం.. పాక్‌కు ఇప్పటికే తటస్థ వేదికగా శ్రీలంకను ఏర్పాటు చేసింది ఐసీసీ.అయినప్పటికీ బంగ్లాదేశ్‌కు వత్తాసు పలుకుతూ భారత్ మీద విషం చిమ్మే ప్రయత్నం చేస్తోందని పాక్ బోర్డుపై ఆరోపణలు వస్తున్నాయి. ఇలాంటి తరుణంలో తమ ప్రభుత్వం నిర్ణయం ప్రకారం.. ఈ శుక్రవారం లేదంటే వచ్చే సోమవారం నాటికి టోర్నీలో ఆడే విషయంపై నిర్ణయం వెల్లడిస్తామంటూ పీసీబీ చీఫ్ మొహ్సిన్ నక్వీ సోమవారం ట్వీట్ చేశాడు.ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్‌కు ఊహించని ఎదురుదెబ్బ తగిలే అవకాశం ఉందని తెలుస్తోంది. ఒకవేళ పాక్ టోర్నీ నుంచి తప్పుకొంటే.. ఆ స్థానంలో బంగ్లాదేశ్ రానుందని వార్తలు వినిపిస్తున్నాయి. హిందుస్తాన్ టైమ్స్ కథనం ప్రకారం..ఊహించని ట్విస్టు‘‘ఒకవేళ పాకిస్తాన్ టోర్నీ నుంచి వైదొలగాలని భావిస్తే.. గ్రూప్-ఎలో ఆ జట్టు స్థానాన్ని బంగ్లాదేశ్ భర్తీ చేసే అవకాశం ఉంది. పాక్ తప్పుకొంటే... బీసీబీ ముందు నుంచి కోరినట్లుగా పాక్ స్థానంలో బంగ్లాదేశ్ శ్రీలంకలో తమ మ్యాచ్‌లు ఆడేందుకు వీలు కలుగుతుంది. అయితే, ఈ ప్రక్రియలో కొన్ని సమస్యలు తలెత్తినా అంతిమంగా ఓ పరిష్కారం అయితే దొరుకుతుంది’’ అని ఐసీసీ సన్నిహిత వర్గాలు విశ్లేషించాయి.ఒప్పందం అతిక్రమిస్తే.అంతేకాదు.. ‘‘ఇప్పటికే భారత్- పాకిస్తాన్ క్రికెట్ బోర్డుల మధ్య ఓ ఒప్పందం కుదిరింది. ఇరు దేశాల మ్యాచ్‌లకు తటస్థ వేదికలను ఐసీసీ ఏర్పాటు చేస్తోంది. ఇప్పుడు కూడా టీ20 ప్రపంచకప్ టోర్నీలో భారత్‌కు బదులు శ్రీలంకలో పాక్ తమ మ్యాచ్‌లు ఆడేందుకు షెడ్యూల్ సిద్ధం చేశారు.అయినప్పటికీ పాక్ తప్పుకొంటే.. ఒప్పందాన్ని పాక్ బోర్డు ఉల్లంఘించినట్లే అవుతుంది. కాబట్టి వారికి మున్ముందు మరిన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది’’ అని సదరు వర్గాలు పేర్కొన్నాయి. కాగా ఏదో చేయబోతే ఇంకేదో అయింది అన్నట్లు.. బీసీసీఐ మీదకు బంగ్లాదేశ్‌ను రెచ్చగొట్టే ప్రయత్నంలో తమ నెత్తి మీద తామే పిడుగు వేసుకున్నట్లు పాక్ పరిస్థితి మారిందని సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి. బీసీబీ- పీసీబీ.. ఈ రెండింటిలో భస్మాసురహస్తం ఎవరిదో అంటూ నెటిజన్లు జోకులు వేస్తున్నారు. మరోవైపు.. పాక్‌ది మేకపోతు గాంభీర్యం మాత్రమేనని.. ఏదో ఓవరాక్షన్ చేసినా అంతిమంగా టోర్నీలో ఆడేందుకు మొగ్గు చూపుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.చదవండి: ICC: వెనక్కి తగ్గిన బంగ్లాదేశ్.. ఆ పని చేయబోముICC vs Bangladesh: అసలేం జరిగింది.. కథనాల కోసం క్లిక్ చేయండి -
T20 WC 2026: ఫైనల్ చేరేది ఆ జట్లే!
టీ20 ప్రపంచకప్-2026 టోర్నమెంట్లో ఇరవై జట్లు పాల్గొంటున్నాయి. వీటిని నాలుగు గ్రూపులుగా విభజించి.. ఒక్కో గ్రూపులో ఐదు జట్లను చేర్చింది అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC). ఇక ఈ దఫా ఇటలీ తొలిసారిగా క్రికెట్ వరల్డ్‌కప్ టోర్నీకి అర్హత సాధించడం విశేషం.ఏ గ్రూప్‌లో ఏ జట్లు?గ్రూప్-సిలో ఇంగ్లండ్, వెస్టిండీస్, బంగ్లాదేశ్, నేపాల్‌లతో కలిసి ఉంది ఇటలీ. ఇక గ్రూప్-ఎ నుంచి డిఫెండింగ్ చాంపియన్ భారత్, పాకిస్తాన్, అమెరికా, నమీబియా, నెదర్లాండ్స్ పోటీ పడుతుండగా.. గ్రూప్-బిలో ఆస్ట్రేలియాతో పాటు ఐర్లాండ్, ఒమన్, శ్రీలంక, జింబాబ్వే ఉన్నాయి.అదే విధంగా గ్రూప్-ఢిలో న్యూజిలాండ్, సౌతాఫ్రికా, అఫ్గనిస్తాన్, యూఏఈ, కెనడా పోటీలో ఉన్నాయి. ఇక ఫిబ్రవరి 7- మార్చి 8 వనకు ఈ ఐసీసీ ఈవెంట్ జరుగనున్న విషయం తెలిసిందే. భారత్- శ్రీలంక ఈ మెగా టోర్నీకి సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్నాయి.ఇక చిరకాల ప్రత్యర్థులు భారత్- పాకిస్తాన్ ఈసారి కూడా ఒకే గ్రూపులో ఉండటం క్రికెట్ ప్రేమికులను ఆకర్షిస్తోంది. దాయాదుల మధ్య ఫిబ్రవరి 15న మ్యాచ్ జరుగనుంది. ఇందుకు కొలంబో వేదిక. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్క్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.పాక్‌కు ఓటమి తప్పదు‘‘ఈ పోరు ఉత్కంఠగా సాగాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. అయితే, సుదీర్ఘకాలంగా టీమిండియా పాకిస్తాన్‌ను ఓడిస్తూనే వస్తోంది. భారత జట్టుకు పాక్ దరిదాపుల్లో కూడా లేదు. టీమిండియాతో మ్యాచ్‌లో ఒత్తిడిని అధిగమిస్తేనే పాక్ సానుకూల ఫలితం రాబట్టగలదు’’ అని క్లార్క్ పేర్కొన్నాడు.ఫైనల్ చేరేది ఆ జట్లే!ఇక ఈ సందర్భంగా టీ20 వరల్డ్‌కప్-2026 ఫైనలిస్టులను కూడా మైకేల్ క్లార్క్ అంచనా వేశాడు. టీమిండియాతో పాటు ఆస్ట్రేలియా టైటిల్ పోరుకు అర్హత సాధిస్తాయని జోస్యం చెప్పాడు. కాగా టీ20 ఫార్మాట్లో 2007లో మొదలైన ప్రపంచకప్ టోర్నీలో ధోని సారథ్యంలోని టీమిండియా విజయం సాధించింది.ఆ తర్వాత 2024లో రోహిత్ శర్మ కెప్టెన్సీలో మరోసారి పొట్టి ప్రపంచకప్ టోర్నీ టైటిల్‌ను భారత్ కైవసం చేసుకుంది. ఇక వన్డే వరల్డ్‌కప్ టోర్నమెంట్లలో ఆధిపత్యం కనబరిచే ఆస్ట్రేలియా టీ20 ఫార్మాట్లో ఇప్పటి వరకు ఒకే ఒక్కసారి ట్రోఫీ గెలిచింది. ఆరోన్ ఫించ్ కెప్టెన్సీలో 2021 ఫైనల్లో న్యూజిలాండ్‌ను ఓడించి విజేతగా అవతరించింది. ప్రస్తుత ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో టీమిండియా అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. ఆసీస్ రెండో ర్యాంకులో ఉంది. చదవండి: ODI WC 2027: ‘గిల్‌పై వేటు.. మళ్లీ వన్డే కెప్టెన్‌గా రోహిత్ శర్మ’ -
భారత్‌కు మాత్రమే అవకాశం ఇస్తారా?
బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) తీరు మారలేదు. ప్రభుత్వ నిర్ణయం ప్రకారం తాము భారత్‌లో టీ20 ప్రపంచకప్-2026 మ్యాచ్‌లు ఆడబోమని గురువారం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో బీసీబీ అధ్యక్షుడు అమీనుల్ ఇస్లామ్ అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC)ని విమర్శించాడు. ఐసీసీ ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తోందనేలా ఆరోపణలు చేశాడు.భద్రతాపరమైన కారణాలతో వేదికలు మార్చడం గతంలో చాలాసార్లు జరిగిందని, ఇటీవల చాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్‌లన్నింటినీ దుబాయ్‌లోనే ఆడేలా భారత్‌కు అనుమతి ఇచ్చారని బీసీబీ అధ్యక్షుడు అమీనుల్ ఇస్లామ్ గుర్తు చేశాడు. పాక్‌లో ఆడబోమని భారత్ చెబితే..‘ఐసీసీ ఎప్పుడో 1996, 2003లో జట్లు కొన్ని వేదికల్లో ఆడటానికి ఇష్టపడక పాయింట్లు చేజార్చుకున్న విషయాన్ని గుర్తు చేస్తోంది. ఎప్పటి మాటలో ఎందుకు?2025 చాంపియన్స్ ట్రోఫీని పాకిస్తాన్లో ఆడబోమని భారత్ చెబితే వారి మ్యాచ్‌లను తరలించలేదా? అన్ని మ్యాచ్‌లు ఒకే వేదికపై ఆడి, ఒకే హోటల్లో జట్టు బస చేయడం వారికి కల్పించిన ప్రత్యేక సౌకర్యం కాదా? మేం పోరాడతాంశ్రీలంక పేరుకే సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తోంది కానీ ఒక జట్టు కోసమే (పాకిస్తాన్) హైబ్రిడ్ మోడల్లో మ్యాచ్‌లు అక్కడ పెట్టారు. ఐసీసీ స్థాయి సంస్థ 24 గంటల గడువు ఇవ్వడం అనేది అర్థరహితం. ఈ విషయంలో మేం పోరాడతాం’ అని అమీనుల్ స్పష్టం చేశాడు. కాగా గతంలో పాకిస్తాన్లో శ్రీలంక క్రికెటర్లపై ఉగ్రదాడి జరిగిన విషయం తెలిసిందే. ఆ తర్వాత విదేశీ జట్లు అక్కడ పర్యటించడం మానేశాయి. పాక్‌లో పరిస్థితి వేరు.. వితండవాదంఇటీవలి కాలంలో మళ్లీ పర్యటనలు మొదలుపెట్టాయి. అయితే, బీసీసీఐ మాత్రం భద్రతా కారణాలతో టీమిండియాను అక్కడకు పంపడం లేదు. అందుకే ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 టోర్నీకి తటస్థ వేదికను ఏర్పాటు చేసింది. ఇప్పుడు టీ20 ప్రపంచకప్ టోర్నీకి భారత్ ఆతిథ్యం ఇస్తున్నందున శ్రీలంకలో పాక్ మ్యాచ్‌లు ఆడిస్తోంది. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు ముదిరిన నేపథ్యంలో ఐసీసీ ఈ నిర్ణయం తీసుకుంది. అయితే, భారత్‌లో బంగ్లాదేశ్ క్రికెటర్లకు ఏమాత్రం ముప్పులేదని పరిశీలన బృందం చెప్పినా బంగ్లాదేశ్ ఇలా వితండవాదానికి దిగడం గమనార్హం. లాంఛనమేకాగా టీ20 వరల్డ్ కప్‌నుంచి బంగ్లాదేశ్ తప్పుకోవడం ఇక లాంఛనంగానే కనిపిస్తోంది! ఒకరోజు సమయమిచ్చి తుది నిర్ణయం తీసుకోవాలంటూ ఐసీసీ చేసిన హెచ్చరికను బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు పట్టించుకోలేదు. భద్రతా కారణాల వల్ల తాము భారత్‌లో ఎట్టి పరిస్థితుల్లోనూ వరల్డ్ కప్ మ్యాచ్‌లు ఆడబోమని బంగ్లాదేశ్ క్రీడా సలహాదారు ఆసిఫ్ నజ్రుల్ పునరుద్ఘాటించారు.‘ఇది మా దేశ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అని స్పష్టంగా చెప్పదల్చుకున్నాం. భద్రత విషయంలో మా భయం వాస్తవం. ఐసీసీ నుంచి మాకు ఇప్పటి వరకైతే న్యాయం దక్కలేదు. మా ఆందోళనను వారు అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నా’ అని నజ్రుల్ వ్యాఖ్యానించాడు.చదవండి: వరల్డ్‌కప్-2027లో అతడిని ఆడించాలి: భారత మాజీ క్రికెటర్ -
క్రీడలను రాజకీయాలతో ముడిపెట్టడం ఎంత వరకు సబబు..?
ఐసీసీ అండర్-19 క్రికెట్ వరల్డ్‌కప్ 2026లో భాగంగా నిన్న (జనవరి 17) భారత్-బంగ్లాదేశ్ జట్ల మధ్య ఆసక్తికర సమరం జరిగింది. ఈ మ్యాచ్ టాస్ సమయంలో ఇరు జట్ల కెప్టెన్లు షేక్ హ్యాండ్ ఇచ్చుకోకుండా, గతంలో జరిగిన భారత్-పాక్ వివాదాస్పద 'నో హ్యాండ్ షేక్' ఉదంతాన్ని గుర్తు చేశారు.తాజా ఎపిసోడ్ తర్వాత క్రీడలను రాజకీయాలతో ముడిపెట్టడం ఎంత వరకు సబబు అన్న ప్రశ్న మరోసారి ఉత్పన్నమైంది. క్రికెట్ సర్కిల్స్‌లో ఈ అంశంపై జోరుగా చర్చలు సాగుతున్నాయి. మెజార్టీ శాతం క్రీడల్లో రాజకీయ ప్రమేయం ఉండకూడదని అభిప్రాయపడుతున్నారు. కొందరేమో ఈ అంశానికి మద్దతిస్తున్నారు. ఒక దేశం పట్ల మరో దేశం క్రూరంగా ప్రవర్తిస్తే ఇలాగే బుద్ది చెప్పాలని అంటున్నారు.ఎవరి అభిప్రాయాలు ఎలా ఉన్నా, క్రీడలను రాజకీయాలతో ముడి పెట్టి, నో షేక్ హ్యాండ్ లాంటి ఉదంతాలకు తావిస్తే, దేశాల మధ్య ఉద్రిక్తతల మరింత పెరుగుతాయి కానీ, ఎలాంటి ప్రజాప్రయోజనాలు ఉండవు. వాస్తవానికి క్రీడలు దేశాల మధ్య స్నేహ వారుధులుగా ఉంటాయి. అలాంటి వాటిని రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగించుకోకూడదు.ఆటగాళ్లు సైతం ఈ విషయాన్ని గుర్తు పెట్టుకొని ప్రవర్తించాలి. క్రీడలకు సంబంధం లేని విషయాలు మాకెందుకులే అనుకోవాలి. రాజకీయాలు చూసుకునే బాధ్యత నాయకులకు వదిలి పెట్టి, మైదానంలో క్రీడాస్పూర్తితో వ్యవహరించాలి. నో హ్యాండ్ షేక్ లాంటి ఉదంతాలకు తావివ్వకుండా హుందాగా ప్రవర్తించాలి.క్రీడల్లో హ్యాండ్‌షేక్ ఇవ్వడమనేది కేవలం ఫార్మాలిటీ మాత్రమే కాదు. ఇది ఆటగాళ్ల మధ్య పరస్పర గౌరవం. దేశాల మధ్య పోటీ జరిగేటప్పుడు సామరస్యతను ప్రతిబింబించే సంకేతం. ఇలాంటి వాటిలో రాజకీయాలకు అస్సలు తావివ్వకూడదు. ఈ విషయాన్ని ఆటగాళ్లు గమనించాలి. ప్రత్యర్దికి హ్యాండ్ షేక్ నిరాకరిస్తే.. అంతర్జాతీయ సమాజంలో వాళ్లే చిన్నచూపుకు గురవుతారు. అప్పటిదాకా వారిపై దేశాలకతీతంగా ఉండే అభిమానం పలచనవుతుంది.క్రికెట్‌కు జెంటిలెమన్ గేమ్ అనే పేరుంది. కాబట్టి క్రికెటర్లు జెంటిల్మెన్లలా ప్రవర్తించి క్రీడ గౌరవాన్ని పెంచాలి. దేశాల మధ్య సమస్యలు ఉన్నప్పుడు పరిణితి ప్రదర్శించవచ్చు. గతంలో ఏదైనా సమస్య కాని, అసంతృప్తి కాని ఉంటే, ఆటగాళ్లు ఆర్మ్ బ్యాండ్లు ధరించే వారు. దేశాల మధ్య ఉద్రిక్తతల విషయంలోనూ ఆటగాళ్లు ఇలా ప్రవర్తించవచ్చు. తమ దేశం పట్ల ప్రత్యర్ది దేశం అమానవీయంగా ప్రవర్తిస్తుందని అనుకున్నప్పుడు ఆర్మ్ బ్యాండ్లు ధరించి నిరసన వ్యక్తం చేయవచ్చు.కానీ హ్యాండ్ షేక్ ఇవ్వకుండా ఒకరినొకరు అవమానించుకోవడం మాత్రం కరెక్ట్ కాదు. ఇలా చేయడం వల్ల అభిమానుల్లోనే కాకుండా సహచర ఆటగాళ్లలోనూ అసహనం పెరుగుతుంది. ఇటీవల ఓ విండీస్ టీ20 దిగ్గజం భారత్-పాక్ మధ్య నో హ్యాండ్ షేక్ ఉదంతాన్ని ప్రస్తావిస్తూ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఇందుకు అతను భారత ఆటగాళ్లనే బాధ్యులుగా భావిస్తున్నాడు.ఇందులో అతని తప్పేమీ లేదు. ఎందుకంటే, భారత్-పాక్ మధ్య నో హ్యాండ్ షేక్ ఉదంతాన్ని గమనించిన ఎవరికైనా ఇలాంటి అభిప్రాయమే కలుగుతుంది. గతేడాది ఆసియా కప్ సందర్భంగా పహల్గాం ఉగ్రదాడికి నిరసనగా భారత టీ20 జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ టాస్ సమయంలో పాక్ కెప్టెన్ సల్మాన్ అఘాకు హ్యాండ్ షేక్ నిరాకరించాడు. మ్యాచ్ అనంతరం కూడా ఇరు జట్ల ఆటగాళ్లు షేక్ హ్యాండ్ ఇచ్చుకోలేదు. ఈ ఉదంతం తర్వాత భారతీయుల్లో సూర్యకుమార్‌పై రెస్పెక్ట్ మరింత పెరిగింది. కానీ, ఓ క్రీడాకారుడిగా అంతర్జాతీయ సమాజంలో తన మర్యాదను పలచన చేసుకున్నాడు. ఏది ఏమైనా నో హ్యాండ్ షేక్ లాంటి ఉదంతాలు క్రీడల ప్రతిష్టను దిగజారుస్తాయే కానీ, గౌరవాన్ని పెంచవు. ఈ విషయాన్ని క్రీడాలోకమంతా గుర్తు పెట్టుకోవాలి. -
ఐసీసీపై పాక్ మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు
అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ)ని ఉద్దేశించి పాకిస్తాన్ మాజీ క్రికెటర్ సయీద్ అజ్మల్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. స్వతహాగా నిర్ణయాలు తీసుకోలేని ఐసీసీ ఉనికిలో ఉండి లాభం లేదన్నాడు. భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఐసీసీపై ఆధిపత్యం చెలాయిస్తోందని ఆరోపించాడు.అతిపెద్ద మార్కెట్ క్రికెట్ ప్రయోజనాలకు పెద్ద పీట వేయలేని ఐసీసీ తన కార్యకలాపాలు ఆపేస్తే మంచిదంటూ సయీద్ అజ్మల్ (Saeed Ajmal) అతి చేశాడు. కాగా ప్రపంచంలోని క్రికెట్ బోర్డులన్నింటిలో బీసీసీఐ సంపన్న బోర్డు అన్న విషయం తెలిసిందే. భారత్‌లో మతంగా భావించే క్రికెట్‌కు ఉన్న ఆదరణే ఇందుకు కారణం.ఐపీఎల్ ప్రవేశపెట్టిన తర్వాత బీసీసీఐ ఆదాయం గణనీయంగా పెరిగింది. భారత్‌లో క్రికెట్‌కు ఉన్న మార్కెట్ దృష్ట్యా బీసీసీఐకి ఐసీసీ నుంచి రెవెన్యూ భారీ మొత్తంలో అందుతుంది. ఇక ప్రస్తుతం ఐసీసీ చైర్మన్‌గా బీసీసీఐ మాజీ కార్యదర్శి జై షా ఉన్నారు.శ్రీలంక క్రికెట్ జట్టుపై గతంలో ఉగ్రదాడిఇదిలా ఉంటే.. పాకిస్తాన్లో ఇప్పటికే క్రికెటర్లపై ఉగ్రదాడి జరిగిన విషయం తెలిసిందే. 2009లో గడాఫీ స్టేడియం నుంచి శ్రీలంక క్రికెట్ జట్టు బస్సులో వెళ్తున్న వేళ 12 మంది ఉగ్రవాదులు బస్సుపై కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో కొంతమంది అధికారులు మరణించగా.. ఆరుగురు శ్రీలంక క్రికెటర్లు గాయాలపాలయ్యారు. కెప్టెన్ మహేళ జయవర్ధనే సహా కుమార్ సంగక్కర ఈ జాబితాలో ఉన్నారు.పాకిస్తాన్‌కు చెందిన అహ్సాన్ రజా అనే అంపైర్ చచ్చిబతికాడు. ఈ నేపథ్యంలో పాకిస్తాన్‌లోని పరిస్థితుల దృష్ట్యా చాలాకాలం వరకు విదేశీ జట్లు అక్కడ పర్యటించలేదు. కొంతకాలం క్రితం నుంచే ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, శ్రీలంక వంటి జట్లు మళ్లీ పాక్ పర్యటన మొదలుపెట్టాయి.భద్రతా కారణాల దృష్ట్యాఇక దాయాది దేశంలో ఉగ్రదాడుల భయంతో భద్రతా కారణాల దృష్ట్యా భారత్ టీమిండియాను అక్కడికి పంపడం లేదు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు కూడా నిలిచిపోయాయి. కేవలం ఐసీసీ ఈవెంట్లలో మాత్రమే దాయాదులు తలపడుతున్నాయి. ఈ క్రమంలో ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025కి పాక్ ఆతిథ్యం ఇవ్వగా.. టీమిండియా అక్కడికి వెళ్లలేదు.ఐసీసీ నిర్ణయంతో తటస్థ వేదికైన దుబాయ్‌లో తమ మ్యాచ్‌లు ఆడి ట్రోఫీ గెలుచుకుంది. మరోవైపు ఆతిథ్య పాక్ చెత్త ప్రదర్శనతో లీగ్ దశలోనే నిష్క్రమించింది. ఇక పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఆసియా కప్ టోర్నీలో పాక్ ఆటగాళ్లతో కరచాలనానికీ టీమిండియా నిరాకరించింది.ఇదిలా ఉంటే.. తాజాగా బంగ్లాదేశ్ కూడా భారత్‌తో కయ్యానికి కాలుదువ్వడం.. మైనారిటీలపై దాడులు చేయడం వంటి పరిణామాల నేపథ్యంలో ఇరుదేశాల మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతిన్నాయి.ఈ నేపథ్యంలో ఐపీఎల్ నుంచి బంగ్లా ప్లేయర్ ముస్తాఫిజుర్‌ను తొలగించగా.. టీ20 ప్రపంచకప్-2026 ఆడేందుకు తాము భారత్‌కు రాలేమని బంగ్లాదేశ్ అంటోంది. భద్రతా కారణాలు అంటూ ఓవరాక్షన్ చేస్తోంది. ఈ పరిణామాల క్రమంలో పాక్ మాజీ ఆఫ్ స్పిన్నర్ సయీద్ అజ్మల్ బీసీసీఐపై అక్కసు వెళ్లగక్కాడు.ఎలాంటి లాజిక్ లేదు.. కొంచమైనా బుద్ధి ఉందా?‘‘ఐసీసీ నిర్ణయాలు తీసుకునేందుకు ఇండియన్ బోర్డుపై ఆధారపడితే.. దాని ఉనికి ఉండి కూడా వృథానే. పాకిస్తాన్లో ఆడేందుకు భారత జట్టును పంపకపోవడంలో ఎలాంటి లాజిక్ లేదు.ఐసీసీ మాత్రం ఈ విషయంలో నిస్సహాయతను వ్యక్తం చేసింది. భారతీయులు ఐసీసీపై ఆధిపత్యం చెలాయిస్తున్నారు’’ అని సయీద్ అజ్మల్ అన్నాడు. గతంలో శ్రీలంక జట్టుపై దాడి... తాజాగా భారత్‌లో పహల్గామ్ ఉగ్రదాడి వంటి ఘటనల తర్వాత కూడా అజ్మల్ టీమిండియా తమ దేశానికి రాకపోవడాన్ని ప్రస్తావించడాన్ని భారత జట్టు అభిమానులు తప్పుబడుతున్నారు. ‘కొంచమైనా బుద్ధి ఉందా?’’ అంటూ చురకలు అంటిస్తున్నారు.చదవండి: భారత్‌పై నిందలు!.. బంగ్లాదేశ్‌కు దిమ్మతిరిగే షాకిచ్చిన ఐసీసీ! -
పాకిస్తాన్ మాదిరే మేము కూడా!: బంగ్లాదేశ్ ఓవరాక్షన్
భారత్‌లో తమ ఆటగాళ్లకు భద్రత ఉండదంటూ బంగ్లాదేశ్ మరోసారి ఓవరాక్షన్ చేసింది. టీ20 ప్రపంచకప్-2026 ఆడేందుకు తమ క్రికెట్ జట్టును అక్కడికి పంపలేమని పేర్కొంది. అయితే, అదే సమయంలో తాము మాత్రం టోర్నమెంట్‌ను వైదొలిగేందుకు సిద్ధంగా లేమంటూ తమ ద్వంద్వ వైఖరిని బయటపెట్టింది.భారత్‌లో మ్యాచ్‌లు ఆడే పరిస్థితి లేదుఈ విషయం గురించి బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) అధ్యక్షుడు అమినుల్ ఇస్లాం, ప్రభుత్వ సలహాదారు ఆసిఫ్ నజ్రుల్ బుధవారం మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా.. ‘‘భారత్‌లో మ్యాచ్‌లు ఆడే పరిస్థితి లేదని మేము ఇప్పటికే ఐసీసీకి అర్థమయ్యేలా చెప్పాము.మరింత స్పష్టంగా ఈరోజు రాత్రికో.. రేపు ఉదయమో మరోసారి ఇదే విషయాన్ని వారికి చెబుతాము. బంగ్లాదేశ్ భద్రత, గౌరవం, మర్యాద విషయంలో మేము ఎంతమాత్రము రాజీపడబోము. అయితే, మేము కచ్చితంగా టీ20 ప్రపంచకప్ టోర్నీలో పాల్గొంటాము’’ అని నజ్రుల్ పేర్కొన్నాడు.మరోవైపు.. అమినుల్ పాకిస్తాన్ పేరును ప్రస్తావిస్తూ తమకు కూడా అలాంటి వెసలుబాటు కావాలని డిమాండ్ చేశాడు. ‘‘చాంపియన్స్ ట్రోఫీ ఆడేందుకు టీమిండియా పాకిస్తాన్‌కు వెళ్లలేదు. అలాగే గత వరల్డ్‌కప్ ఆడేందుకు పాకిస్తాన్ భారత్‌కు రాలేదు.పాకిస్తాన్ మాదిరే మేము కూడాకాబట్టి మా విషయంలోనూ పాక్ మాదిరే ఐసీసీ నిర్ణయం తీసుకుంటుందని ఆశిస్తున్నాం. ప్రపంచకప్ టోర్నీల్లో హైబ్రిడ్ మోడల్ కొనసాగుతున్న విషయం అందరికీ తెలుసు. ఇందుకు భద్రతే ప్రధాన కారణం. కాబట్టి మాకు సానుకూల స్పందన లభిస్తుందని ఆశిస్తున్నాం’’ అని అమినుల్ అన్నాడు.కాగా బంగ్లాదేశ్‌లో మైనారిటీలైన హిందువులపై హత్యాకాండ నేపథ్యంలో.. ఐపీఎల్ నుంచి ఆ దేశ ఆటగాళ్లను బహిష్కరించాలనే డిమాండ్లు పెరిగాయి. అందుకు అనుగుణంగానే బీసీసీఐ.. ముస్తాఫిజుర్ రహమాన్‌ను కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు నుంచి తొలగించేలా ఆదేశాలు ఇచ్చింది.ఐసీసీ తిరస్కరించే అవకాశం?ఈ క్రమంలో భద్రత అనే కారణం చూపుతూ టీ20 ప్రపంచకప్-2026 టోర్నీ కోసం తాము భారత్‌కు రాలేమని బంగ్లాదేశ్ పేర్కొంది. అయితే, టోర్నీ ఆరంభానికి నెలరోజుల సమయమే ఉన్నందున ఈ ప్రతిపాదనను ఐసీసీ తిరస్కరించే అవకాశం ఉంది. బంగ్లాదేశ్ కోరినట్లు శ్రీలంకలో వారి మ్యాచ్‌లు నిర్వహించడం కుదరకపోవచ్చు. ఈ నేపథ్యంలో తొలుత తాము టోర్నీ నుంచి తప్పుకొంటామని బెదిరింపు ధోరణి కనబరిచిన బంగ్లా.. తాజాగా ఇలా మాట్లాడటం గమనార్హం.చదవండి: IND vs NZ: టీమిండియాకు శుభవార్త -
నలిగిపోతున్న క్రికెట్
దేశాల మధ్య ఉద్రిక్తతల కారణంగా క్రీడలు బలి కావడం ఇటీవలికాలంలో ఎక్కువైపోయింది. వాస్తవానికి క్రీడలు దేశాల మధ్య బంధాలు బలపడటానికి దోహదపడతాయి. దురదృష్టవశాత్తు అలా జరగకపోగా, రాజకీయాలకు క్రీడలు బలైపోతున్నాయి. ఈ పోకడ జెంటిల్మెన్ గేమ్ క్రికెట్లో పతాక స్థాయికి చేరింది.తాజాగా నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా భారత్-బంగ్లాదేశ్ మధ్య క్రికెట్ బలైపోయింది. ఇరు దేశాల మధ్య క్రికెట్ సంబంధాలు అంపశయ్యపైకెక్కాయి. బంగ్లాదేశ్‌లో హిందూ మైనారిటీలపై దాడుల నేపథ్యంలో భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు ఆ దేశ ఆటగాడు ముస్తాఫిజుర్ రహ్మాన్‌ను ఐపీఎల్ నుంచి తొలిగించింది. ప్రతిగా బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు భారత్‌లో జరిగే టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌లు ఆడమని భీష్మించుకు కూర్చుంది.బంగ్లాదేశ్ ప్రభుత్వం ఓ అడుగు ముందుకేసి స్వదేశంలో ఐపీఎల్‌ను బ్యాన్ చేసుకుంది. ఈ చర్య-ప్రతి చర్యల పర్వం మున్ముందు ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందో చూడాలి. భారత్-బంగ్లాదేశ్ మధ్య తాజా ఉద్రిక్తతల నేపథ్యంలో గతంలో క్రికెట్లో చోటు చేసుకున్న ఇలాంటి పరిణామాలపై ఓ లుక్కేద్దాం.భారత్-పాక్ఈ ప్రస్తావన రాగానే ముందుగా గుర్తుకొచ్చేది భారత్-పాక్. ఈ రెండు దేశాల మధ్య క్రికెట్ సంబంధాలు తెగిపోవడానికి పాక్ పెంచి పోషిస్తున్న ఉగ్రవాదం, సరిహద్దు వివాదాలు, రాజకీయాలు ప్రధాన కారణాలు. ఈ కారణాల చేత 2012 తర్వాత ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు నిలిచిపోయాయి. కేవలం ఐసీసీ టోర్నీల్లో మాత్రమే ఇరు జట్లు పోటీ పడుతున్నాయి.భారత్-బంగ్లాదేశ్తాజాగా భారత్-బంగ్లాదేశ్ పరిస్థితి కూడా భారత్-పాక్ తరహాలో మారిపోతుంది. బంగ్లాదేశ్‌లో హిందూ మైనారిటీలపై దాడుల నేపథ్యంలో, ఆ దేశ ఆటగాడు ముస్తాఫిజుర్‌ను ఐపీఎల్ నుంచి తొలగించగా.. వారు భారత్‌లో జరిగే టీ20 ప్రపంచకప్-2026 మ్యాచ్‌లు ఆడకూడదని నిర్ణయించుకున్నారు. ఓ మెట్టు పైకెక్కి వారి దేశంలో ఐపీఎల్‌ను కూడా బ్యాన్ చేసుకున్నారు. బంగ్లాదేశ్ ఇలాగే ఓవరాక్షన్ చేసుకుంటూ పోతే భవిష్యత్తులో భారత్‌తో ద్వైపాక్షిక సిరీస్‌లు జరగడం అసాధ్యం.దీని వల్ల భారత్‌కు ఎలాంటి నష్టం జరగదు. నష్టపోయేదంతా బంగ్లాదేశే. స్వదేశంలో ఐపీఎల్‌ను నిషేధించడం వల్ల కూడా భారత్‌కు పోయేదేమీ లేదు. ఇంకా చెప్పాలంటే ఐపీఎల్ ద్వారా వచ్చే రెవెన్యూ కోల్పోయి, ఆర్దికంగా బంగ్లాదేశే నష్టపోతుంది. ఇవన్నీ తెలిసి కూడా బంగ్లాదేశ్ భారత్‌తో కయ్యానికి కాలు దువ్వుతుంది. దీని వల్ల భారత్‌కు నష్టమేమీ ఉండదు కానీ, క్రికెట్ బలైపోతుంది.ఆఫ్ఘనిస్తాన్-పాకిస్తాన్ఆఫ్ఘనిస్తాన్-పాకిస్తాన్ మధ్య క్రికెట్ సంబంధాలు కూడా ఇంచుమించు ఇలాగే ఉన్నాయి. రాజకీయం, ఉగ్రవాదం, అంతర్గత అస్థిరతలు, సరిహద్దు వివాదాల కారణంగా మొదటి నుంచి ఈ ఇరు దేశాల మధ్య క్రికెట్ నలిగిపోతూ వస్తుంది. గతేడాది ఆఫ్ఘనిస్తాన్లోని పక్తికా ప్రావిన్స్‌పై పాక్ వైమానిక దాడులకు తెగబడటంతో పరిస్థితి మరింత తీవ్రతరమైంది. ఈ దాడుల్లో ముగ్గురు క్రికెటర్లు సహా 10 మంది పౌరులు చనిపోవడంతో ఆఫ్ఘన్ క్రికెట్ బోర్డు పాకిస్తాన్లో జరగాల్సిన టీ20 ట్రై సిరీస్ నుంచి తప్పుకుంది.పాకిస్తాన్-శ్రీలంక2009లో శ్రీలంక జట్టు పాక్‌లో పర్యటిస్తుండగా.. లాహోర్‌లో ఆ జట్టు ప్రయాణిస్తున్న వాహనంపై ఉగ్రవాదులు దాడులకు తెగబడ్డారు. ఈ ఉదంతం తర్వాత చాలాకాలం పాటు శ్రీలంక పాక్‌తో క్రికెట్ సంబంధాలు తెంచుకుంది. ఇప్పుడిప్పుడే ఆ దేశ క్రికెట్ బోర్డు ప్రోద్భలంతో పాక్‌లో పర్యటిస్తున్నా, లంక ఆటగాళ్లు బిక్కుబిక్కుమంటూనే ఉన్నారు.ఆఫ్ఘనిస్తాన్-ఆస్ట్రేలియాఈ రెండు దేశాల మధ్య కూడా ఓ దశలో క్రికెట్ సంబంధాలు చెడిపోయాయి. ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్ల ప్రభుత్వం మహిళల హక్కులను కాలరాస్తుండటంతో ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు ఆఫ్ఘనిస్తాన్‌తో క్రికెట్ ఆడటం నిలిపి వేసింది. ప్రస్తుతం పరిస్థితి సద్దుమణిగినప్పటికీ.. నష్టపోయింది మాత్రం క్రికెటే.ఇంగ్లండ్-జింబాబ్వేజింబాబ్వేలో మానవ హక్కుల ఉల్లంఘనలు, రాజకీయ అస్థిరత కారణంగా ఇంగ్లండ్-జింబాబ్వే మధ్య ఓ దశలో క్రికెట్ సంబంధాలు దెబ్బతిన్నాయి. 2003 వరల్డ్‌కప్‌లో ఇంగ్లండ్ జింబాబ్వేలో పర్యటించేందుకు నిరాకరించింది. నేటికీ ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు జరగడం లేదు.సౌతాఫ్రికా-వెస్టిండీస్1970ల్లో సౌతాఫ్రికాలో జాతి వివక్ష అధికంగా ఉండేది. ఆ సమయంలో ఆ దేశంతో క్రికెట్ సంబంధాలు కొనసాగించేందుకు ఏ దేశం ఇష్టపడలేదు. వెస్టిండీస్ ఓ అడుగు ముందుకేసి సౌతాఫ్రికాతో క్రికెట్ సంబంధాలు తెంచుకుంది. 1970–1991 మధ్యలో సౌతాఫ్రికా అంతర్జాతీయ క్రికెట్ నుంచి బహిష్కరణకు గురైంది.ఇలా రాజకీయం, ఉగ్రవాదం, జాతి వివక్ష, మానవ హక్కుల ఉల్లంఘన వంటి కారణాల చేత క్రికెట్ నలిగిపోయింది. అభిమానులు ఈ క్రీడ మజాను ఆస్వాదించలేకపోయారు. ఆటగాళ్ల కెరీర్లు నాశనమయ్యాయి. క్రికెట్ బోర్డులు ఆర్దికంగా నష్టపోయాయి. -
పాక్ అభిమానుల చిల్లర చేష్టలు.. వైభవ్ సూర్యవంశీ ఏం చేశాడంటే..
పాకిస్తాన్ క్రికెట్ జట్టు అభిమానులు మరోసారి తమ వక్రబుద్ధిని చాటుకున్నారు. భారత అండర్-19 క్రికెటర్లపై విద్వేష విషం చిమ్మారు. ప్రధానంగా పద్నాలుగేళ్ల వైభవ్ సూర్యవంశీని టార్గెట్ చేస్తూ చిల్లర చేష్టలకు దిగారు.ఫైనల్లో పాక్ గెలుపుఏసీసీ మెన్స్ ఆసియా కప్ (యూత్ వన్డే)-2025 టోర్నమెంట్ దుబాయ్ (Dubai) వేదికగా ఇటీవలే ముగిసిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా దాయాదులు భారత్- పాకిస్తాన్.. గ్రూప్-ఎ నుంచి పోటీపడ్డాయి. లీగ్ దశలో పాక్‌ను భారత్ ఓడించగా.. ఫైనల్లో పాకిస్తాన్ 191 పరుగుల తేడాతో యువ భారత జట్టుపై గెలిచి చాంపియన్‌గా నిలిచింది.ఇక ఆసియా కప్ అండర్-19 టైటిల్‌ను భారత్ ఇప్పటికే ఎనిమిదిసార్లు గెలవగా.. పాక్ తాజాగా రెండోసారి ట్రోఫీని ముద్దాడింది. అయితే, ఈ మ్యాచ్ సందర్భంగా పాక్ ఆటగాళ్లు.. భారత ప్లేయర్లను రెచ్చగొట్టగా అందుకు ధీటుగా సమాధానమిచ్చారు. ముఖ్యంగా విధ్వంసకర ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ.. పాక్ ఆటగాళ్లకు వారి శైలిలోనే ఘాటుగా జవాబిచ్చాడు.చిల్లర చేష్టలు.. వైభవ్ సూర్యవంశీ ఏం చేశాడంటే..ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం భారత అండర్-19 ఆటగాళ్లు టీమ్ బస్ ఎక్కే వేళ.. అక్కడికి చేరుకున్న పాక్ అభిమానులు.. యువ క్రికెటర్లను హేళన చేస్తూ కామెంట్లు చేశారు. ముఖ్యంగా వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi)పై అనుచిత రీతిలో కామెంట్లు చేస్తూ రాక్షసానందం పొందారు. అయితే, ఇక్కడ వైభవ్ హుందాగా ప్రవర్తించడం విశేషం.ఓవైపు.. వయసులో పెద్ద అయిన పాక్ ఫ్యాన్స్ తన పట్ల విద్వేషం ప్రదర్శిస్తున్నా.. వైభవ్ మాత్రం అసలు ఆ వైపు కూడా చూడకుండా పక్కవాళ్లతో మాట్లాడుతూ వెళ్లి బస్సు ఎక్కాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.చిన్నపిల్లాడిపై ఇంత విద్వేషమా?ఈ నేపథ్యంలో.. ‘‘పద్నాలుగేళ్ల వయసులోనే క్రికెట్లో సంచలనాలు సృష్టిస్తున్న వైభవ్‌ను సిగ్గు లేకుండా హేళన చేస్తున్నారు. అండర్-19 ఆసియా కప్ గెలిస్తే ఏదో ప్రపంచ చాంపియన్లు అయినట్లు ఆ బిల్డప్ ఎందుకు?చిన్నపిల్లాడి పట్ల మీరు ప్రవర్తించిన తీరు మీ సంస్కారానికి అద్దం పడుతోంది. మరీ ఇంత అసూయ పనికిరాదు. ఇప్పటికైనా మీ వక్రబుద్ధిని మార్చుకోండి. చిన్నపిల్లాడే అయినా అతడు ఎంత హుందాగా ఉన్నాడో చూడండి. తనని చూసైనా నేర్చుకోండి’’ అని నెటిజన్లు హితవు పలుకుతున్నారు. కాగా ఆసియా కప్ టోర్నీలో వైభవ్ సూర్యవంశీ 252 పరుగులు సాధించాడు. ఇందులో ఓ భారీ శతకం (171) ఉంది.చదవండి: వరల్డ్‌కప్‌లో టీమిండియా ఫినిషర్ ఎవరు?Pakistan’s fans are acting shamelessly and they have no sense of shame whatsoever.👀These people are booing 14-year-old Vaibhav Suryavanshi just because Pakistan won a ‘cheap’ U19 Asia Cup. They’re acting like Pakistan won the World Cup.🤦🏻This is why Pakistani people have no… pic.twitter.com/D1X6lgshr0— Mention Cricket (@MentionCricket) December 22, 2025 -
యంగ్ ఇండియాకు ఏమైంది.. తుది సమరాల్లో ఏమిటీ తడబాటు..?
నిన్న (డిసెంబర్ 21) జరిగిన అండర్-19 ఆసియా కప్ 2025 ఫైనల్లో యంగ్ ఇండియా పాకిస్తాన్ చేతిలో 191 పరుగుల భారీ తేడాతో పరాజయంపాలై, భారత క్రికెట్ అభిమానులకు తీవ్ర నిరాశ కలిగించింది. ఈ టోర్నీ ఫైనల్ వరకు అజేయ జట్టుగా నిలిచిన భారత్.. తుది మెట్టుపై బోల్తా పడటాన్ని, అందులోనూ పాక్ చేతిలో ఓడిపోవడాన్ని సగటు భారతీయుడు జీర్ణించుకోలేకపోతున్నాడు.అంతవరకు తిరుగులేని శక్తిగా కనిపించిన భారత్.. అమీతుమీ పోరులో ఎందుకలా చతికిలబడిందని అంతా లెక్కలేసుకుంటున్నారు. కారణాలు ఏంటని విశ్లేషిస్తే.. ఒత్తిడే ప్రధాన కారణంగా తెలుస్తుంది. అయినా యువ భారత జట్టుకు ఆసియా కప్ ఫైనల్లో ఒత్తిడికి చిత్తవడం ఇది కొత్తేమీ కాదు. గత ఎడిషన్ ఫైనల్లోనూ బంగ్లాదేశ్ చేతిలో ఇలానే చిత్తైంది.స్టార్ ప్లేయర్లకు ఏమాత్రం తీసిపోని టాలెంట్ ఉన్న ఆటగాళ్లు ఉన్నా.. ఎందుకో యంగ్ ఇండియాకు ఫైనల్ ఫోబియా పట్టుకుంది. ఒత్తిడి మినహా కారణాలేమీ కనబడటం లేదు. ఎందుకంత ఒత్తిడా అన్ని పరిశీలిస్తే.. తాజా ఉదంతంలో (2025 ఎడిషన్ ఫైనల్లో) భారత్ తొలుత బౌలింగ్ ఎంచుకొని భారీ స్కోర్ సమర్పించుకోవడం కారణంగా తెలుస్తుంది.అలాగని బౌలింగ్ విభాగం బాగా లేదా అని చూస్తే అదీ లేదు. హెనిల్ పటేల్, దీపేశ్ దేవేంద్రన్ లాంటి సీనియర్ స్థాయి మీడియం పేసర్లు.. కనిష్క్ చౌహాన్, ఖిలన్ పటేల్ లాంటి నాణ్యమైన స్పిన్నర్లు జట్టులో ఉన్నారు. పిచ్ నుంచి సరైన సహకారం లభించకపోవడం భారత్ భారీ స్కోర్ సమర్పించుకోవడానికి కారణమని తెలుస్తుంది. భారత కెప్టెన్ ఆయుశ్ మాత్రే టాస్ గెలిచినా పిచ్‌ను అంచనా వేయడంలో విఫలమయ్యాడని టాక్ వినిపిస్తుంది. ఇదే భారత్ కొంపముంచిదని అనిపిస్తుంది. పిచ్ నుంచి సహకారం లభించకపోయినా భారత బౌలర్లు చివరి ఓవర్లలో పుంజుకున్నారు. ఓ దశలో పాక్ 400 స్కోర్ దాటేలా కనిపించినా 347 పరుగులకే పరిమితం చేయగలిగారు.భారీ లక్ష్య ఛేదనను సైతం భారత్ ఆత్యవిశ్వాసంతోనే ప్రారంభించింది. తొలి బంతినే చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ సిక్సర్‌గా మలిచి పాక్ శిబిరంలో ఆందోళన రేకెత్తించాడు. ఇక్కడే పాక్ బౌలర్లు మైండ్ గేమ్ మొదలుపెట్టారు. భారత బ్యాటర్లను, ముఖ్యంగా వైభవ్ సూర్యవంశీని బంతితో కట్టడి చేయలేమని తెలిసి నోటికి పని చెప్పారు. పదేపదే కెప్టెన్ ఆయుశ్ మాత్రే, వైభవ్ సూర్యవంశీని మాటలతో, దురుసు ప్రవర్తనతో రెచ్చగొట్టారు. దీంతో ఏకాగ్రత కోల్పోయిన యంగ్ ఇండియా బ్యాటర్లు వరుస పెట్టి వికెట్లు పారేసుకొని పెవిలియన్‌కు క్యూ కట్టారు. భారత ఓటమి తొలి 10 ఓవర్లలోనే ఖరారైపోయింది. టాప్-5 ప్లేయర్లు 9.4 ఓవర్లలో 68 పరుగులకే ఔటైపోయారు. లోయర్ ఆర్డర్ బ్యాటర్లు ఏదో ఆడాలని ఆడటంతో భారత్ 150 పరుగుల మార్కునైనా దాటగలిగింది.మొత్తంగా చూస్తే.. నిన్నటి రోజున భారత్‌కు ఏదీ కలిసి రాలేదు. పిచ్‌ను అంచనా వేయడం నుంచి పాక్ ఆటగాళ్ల స్లెడ్జింగ్ వలలో పడటం, అలాగే ఒత్తిడి లోనవడం వంటివి జరిగిపోయాయి. ఈ టోర్నీలో అరివీర భయంకరమైన ఫామ్‌లో ఉండిన వైభవ్ సూర్యవంశీ, అభిగ్యాన్ కుందు అంతిమ పోరులో సత్తా చాటలేకపోవడం భారత ఓటమికి మరో కారణం. గ్రూప్ దశలో పాకిస్తాన్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా అదే విశ్వాసాన్ని తుది సమరంలో కొనసాగించలేకపోవడం ఇంకో కారణం. అంతిమంగా భారత్ అన్ని విధాల అర్హమైన ఆసియా కప్ టైటిల్‌ను కోల్పోవాల్సి వచ్చింది. వరుసగా రెండు ఎడిషన్లలో ఫైనల్స్ వరకు వచ్చి ఓడిపోవడం భారత క్రికెట్ అభిమానులకు చాలా బాధ కలిగిస్తుంది. ఈ టోర్నీ చరిత్ర చూస్తే.. భారత్ అత్యంత విజయవంతమైన జట్టుగా ఉంది. ఇప్పటివరకు 12 ఎడిషన్లు జరగ్గా భారత్ 8 సార్లు ఛాంపియన్‌గా నిలిచింది. చివరిగా 2021 ఎడిషన్‌లో టైటిల్ సాధించింది. ఆ ఎడిషన్ ఫైనల్లో శ్రీలంకను చిత్తుగా ఓడించి ఆసియా ఛాంపియన్‌గా అవతరించింది. -
పాకిస్తాన్ ఓవరాక్షన్!.. దీనికే ఇంత చేశారంటే..
మొట్టమొదటిసారిగా 2012లో అండర్-19 ఆసియాకప్ టైటిల్ గెలిచింది పాకిస్తాన్. దాదాపు పదమూడేళ్ల తర్వాత మరోసారి తాజాగా ట్రోఫీని ముద్దాడింది. కాగా ఆసియా కప్-2025లో గ్రూప్-ఎ నుంచి భారత్, యూఏఈ, మలేషియా జట్లతో తలపడ్డ పాక్.. భారత్ మినహా మిగతా రెండు జట్లపై గెలిచింది. తద్వారా సెమీ ఫైనల్‌కు అర్హత సాధించింది.ఈ క్రమంలో సెమీస్‌లో బంగ్లాదేశ్‌ను చిత్తు చేసి ఫైనల్ చేరిన పాకిస్తాన్.. టైటిల్ పోరులో దాయాది భారత్ (IND vs PAK)ను ఢీకొట్టింది. దుబాయ్ వేదికగా ఆదివారం నాటి ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ తొలుత బౌలింగ్ చేసింది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన పాక్ నిర్ణీత 50 ఓవర్లలో ఎనిమిది వికెట్లు నష్టపోయి 347 పరుగులు చేసింది.ఓపెనర్ సమీర్ మిన్హాస్ భారీ శతకం (113 బంతుల్లో 172)తో చెలరేగగా.. అహ్మద్ హుసేన్ హాఫ్ సెంచరీ (56)తో రాణించాడు. భారత బౌలర్లలో దీపేశ్ దేవేంద్రన్ 3 వికెట్లు పడగొట్టగా... హెనిల్ పటేల్, ఖిలాన్ పటేల్ చెరో రెండు వికెట్లు ఖాతాలో వేసుకున్నారు. కీలక మ్యాచ్‌లో దారుణ వైఫల్యంఅయితే, ఈ టోర్నీ ఆసాంతం దంచికొట్టిన భారత యువ తారలు... కీలక మ్యాచ్‌లో మాత్రం విఫలమయ్యారు. ఫలితంగా భారీ లక్ష్యఛేదనలో భారత జట్టు 26.2 ఓవర్లలో కేవలం 156 పరుగులు మాత్రమే చేసి ఆలౌటైంది. దీంతో 191 పరుగుల తేడాతో గెలిచిన పాక్ చాంపియన్‌గా నిలిచింది.భారత ఓపెనర్లలో వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi- 10 బంతుల్లో 26) వేగంగా ఆడే ప్రయత్నం చేయగా.. కెప్టెన్ ఆయుశ్ మాత్రే (Ayush Mhatre- 2) దారుణంగా విఫలమయ్యాడు. ఆరోన్ జార్జ్ (16), విహాన్ మల్హోత్రా (7), వేదాంత్ త్రివేది (9), అభిజ్ఞాన్ కుందు (13) తేలిపోయారు. పదోస్థానంలో వచ్చిన దీపేశ్ 16 బంతుల్లో 36 పరుగులతో కాసేపు పోరాడాడు. అయితే, అప్పటికి పరిస్థితి చేజారి ఓటమి ఖరారైంది.పాక్ బౌలర్లలో అలీ రజా 4 వికెట్లు తీయగా... మొహమ్మద్ సయ్యమ్, అబ్దుల్ సుభాన్, హుజైఫా తలా రెండు వికెట్లు పడగొట్టారు. ఇక ఓపెనింగ్ బ్యాటర్ సమీర్ మన్హాస్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’, ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డులు దక్కాయి. ఘన స్వాగతంఇదిలా ఉంటే.. అండర-19 ఆసియా కప్ గెలిచిన పాక్ యువ జట్టుకు స్వదేశంలో ఘన స్వాగతం లభించింది. ఇస్లామాబాద్ విమానాశ్రయంలో దిగగానే జట్టును అభిమానులు చుట్టుముట్టారు. అనంతరం ఇస్లామాబాద్‌లో విక్టరీ పరేడ్ నిర్వహించారు. ప్రపంచకప్ గెలిచినంతగా సంబరాలు చేసుకున్నారు.దీనికే ఇంత చేశారంటే..ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కాగా.. నెటిజన్లు తమదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. ‘‘మీ ఓవరాక్షన్ ఆపండి.. అండర్-19 స్థాయిలో ఆసియా కప్ గెలిస్తేనే ఈ స్థాయిలో సెలబ్రేషన్స్ చేసుకుంటారా?.. ఒకవేళ మీ ప్రధాన జట్టు ప్రపంచకప్ గెలిస్తే అసలు తట్టుకుంటారా?.. దేశ ఆర్థిక వ్యవస్థ, పెరుగుతున్న పేదరికం.. ఇలాంటి వాటిపై కాస్త దృష్టి పెట్టండి.. ఇలాంటి అతి ఎప్పుడూ పనికిరాదు’’ అంటూ సెటైర్లు వేస్తున్నారు. చదవండి: అద్భుతమైన ఆటగాడు.. అయినా ఎందుకు వేటు?.. ఇదే సరైన నిర్ణయం!THE CRAZE OF CRICKET IN PAKISTAN😍🇵🇰Imagine what the scene would be like if the main team brought the trophy home.pic.twitter.com/7SWpww9Fxh— junaiz (@dhillow_) December 22, 2025 -
మేము అనుకున్నది జరగలేదు.. కానీ గర్వంగా ఉంది: మాత్రే
అసియాకప్ టైటిల్‌ను తొమ్మిదోసారి ముద్దాడాలనుకున్న భారత అండర్-19 జట్టుకు నిరాశే ఎదురైంది. అండర్-19 ఆసియాకప్ 2025 టోర్నీలో అజేయంగా ఫైనల్‌కు చేరిన భారత జట్టు.. తుది మెట్టుపై బోల్తా పడింది. ఆదివారం జరిగిన ఫైనల్లో భారత జట్టు 191 పరుగుల తేడాతో పాకిస్తాన్ చేతిలో ఓడింది. గ్రూప్ దశలో పాకిస్తాన్‌పై అలవోక విజయం సాధించిన యంగ్ ఇండియా... ఫైనల్లో అదే జోరు కనబర్చడంలో విఫలమైంది. తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 347 పరుగులు చేసింది. సమీర్ మిన్హాస్ (113 బంతుల్లో 172; 17 ఫోర్లు, 9 సిక్స్‌లు) భారీ సెంచరీతో కదంతొక్కాడు. అతడితో పాటు ఉస్మాన్ ఖాన్ (35; 3 ఫోర్లు, 1 సిక్స్) ఫర్వాలేదనిపించాడు.బౌలర్లలో దీపేశ్ మూడు వికెట్లు పడగొట్టగా... హెనిల్ పటేల్, ఖిలాన్ పటేల్ చెరో రెండు వికెట్లు ఖాతాలో వేసుకున్నారు. అనంతరం భారీ లక్ష్యఛేదనలో భారత జట్టు 26.2 ఓవర్లలో 156 పరుగులకు ఆలౌటైంది. పదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన దీపేశ్ దేవేంద్రన్ (16 బంతుల్లో 36; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) టాప్ స్కోరర్ కాగా... 14 ఏళ్ల ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ (10 బంతుల్లో 26; 1 ఫోర్, 3 సిక్స్‌లు) మెరుగైన ఆరంభాన్ని భారీ స్కోరుగా మలచలేకపోయాడు.పాకిస్తాన్ బౌలర్లలో అలీ రజా 4 వికెట్లు పడగొట్టగా... మొహమ్మద్ సయ్యమ్, అబ్దుల్ సుభాన్, హుజైఫా తలా రెండు వికెట్లు తీశారు. సమీర్ మన్హాస్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’, ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డులు దక్కాయి. ఈ ఓటమిపై భారత కెప్టెన్ ఆయుష్ మాత్రే స్పందించాడు. పాకిస్తాన్ అద్భుతంగా ఆడిందని, ఈ మ్యాచ్‌లో తమకు ఏది కలిసిరాలేదని అతడు చెప్పుకొచ్చాడు."టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోవాలని ముందే నిర్ణయించుకున్నాము. కానీ మేము అన్ని విభాగాల్లో విఫలమయ్యాము. మాకు ఏది కలిసిరాలేదు. ఫీల్డింగ్‌లో మాకు ఇది బ్యాడ్ డే. ఇలాంటివి అప్పుడప్పుడు జరుగుతుంటాయి. కానీ ప్రత్యర్ధి జట్టు మాకంటే మెరుగైన ప్రదర్శన చేసింది. బ్యాటింగ్ కూడా బాగా చేశారు. మా బౌలర్లను సరైన లైన్ అండ్ లెంగ్త్‌లో బౌలింగ్ చేయలేకపోయారు.వారు తమ ప్రణాళికలను అమలు చేయడంలో సక్సెస్ అయ్యారు. మా ముందు భారీ లక్ష్యం ఉన్నప్పటికి 50 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేయాలనేది టార్గెట్‌గా పెట్టుకున్నాము. కానీ బ్యాటింగ్‌లో దారుణంగా విఫలమయ్యాము. అయితే ఓటమి ఎదురైనప్పటికి మా జట్టుకు చాలా సానుకూల అంశాలు లభించాయి. టోర్నీ అసాంతం మా బాయ్స్ బాగా ఆడారు. ఈ టోర్నీ నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాము" అని మాత్రే పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్‌లో పేర్కొన్నాడు.చదవండి: IND vs SL: చరిత్ర సృష్టించిన స్మృతి మంధాన.. తొలి ప్లేయర్‌గా -
పాక్ బౌలర్‌కు ఇచ్చిపడేసిన వైభవ్ సూర్యవంశీ
భారత్, పాకిస్తాన్ మధ్య ఇవాళ (డిసెంబర్ 21) జరిగిన అండర్-19 పురుషుల ఆసియా కప్ ఫైనల్లో ఉద్రికత్త చోటు చేసుకుంది. ఈ మ్యాచ్‌లో 348 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదిస్తుండగా భారత బ్యాటర్లను పాక్ బౌలర్ అలీ రజా రెచ్చగొట్టాడు. తొలుత భారత కెప్టెన్ ఆయుశ్ మాత్రేను టార్గెట్ చేసిన రజా.. ఆతర్వాత చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీని గెలికాడు. ఇద్దరూ తగు రీతిలో రజాకు సమాధానం చెప్పడంతో వాతావరణం వేడెక్కింది.ఏమన్నావురా..?భారీ లక్ష్య ఛేదనలో భారత కెప్టెన్ ఆయుశ్ మాత్రే పరుగులు చేసేందుకు ఇబ్బంది పడుతున్నాడు. ఈ దశలో అలీ రజా అద్బుతమైన బంతితో మాత్రేను ఔట్ చేశాడు. ఔట్ చేసిన ఆనందంలో రజా మాత్రే పట్ల దురుసుగా స్పందించాడు. ఇక చాలు వెళ్లు అన్నట్లు హావభావాలు ప్రదర్శించాడు. దీంతో చిర్రెత్తిపోయిన మాత్రే ఏమన్నావురా అన్నట్లు రజా మీదికి వెళ్లాడు. దీంతో కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.वैभव सूर्यवंशी पाकिस्तानियों को उनकी औकात बताते हुए ।#INDvsPAK #vaibhavsuryavanshi pic.twitter.com/NpoPl5hBFA— सनातन सर्वोच्च🚩 मोदी का परिवार (@sanatani58) December 21, 2025నీ స్థాయి నా కాళ్ల కింద..!మాత్రేని గెలికి చీవాట్లు తిన్న రజా వైభవ్ సూర్యవంశీతో కూడా అలాగే ప్రవర్తించాడు. సిక్సర్‌తో ఛేదన ప్రారంభించిన సూర్యవంశీని (10 బంతుల్లో 26; ఫోర్, 3 సిక్సర్లు) ఔట్ చేసిన రజా ఓవరాక్షన్ చేశాడు. సూర్యవంశీకి ఫియరీ సెండాఫ్ ఇచ్చే ప్రయత్నం చేశాడు. రజా ఓవరాక్షన్‌కు సూర్యవంశీ కూడా తగు రీతిలో బదులిచ్చాడు. నీ స్థాయి నా కాళ్ల కింద అన్నట్లు రజాకు బుద్ది చెప్పాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరలవుతుంది.టీమిండియాకు పరాభవం348 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో టీమిండియా తడబడింది. ఆది నుంచే క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోతూ ఓటమిని కొని తెచ్చుకుంది. 26.2 ఓవర్లలో 156 పరుగులు మాత్రమే చేసి ఆలౌటైంది. ఫలితంగా 191 పరుగుల భారీ తేడాతో పరాజయంపాలైంది. పాక్ బౌలర్లలో అలీ రజా 4 వికెట్లు తీసి భారత పతనాన్ని శాశించాడు. మొహమ్మద్ సయ్యమ్, అబ్దుల్ సుభాన్, సుజైఫా ఎహసాన్ తలో 2 వికెట్లు తీసి టీమిండియాను దెబ్బకొట్టారు.భారత్ తరఫున చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ (10 బంతుల్లో 26; ఫోర్, 3 సిక్సర్లు) సిక్సర్‌తో ఛేదనను ప్రారంభించినా కొద్ది సేపటికే ఔటయ్యాడు. అంతకుముందే కెప్టెన్ ఆయుశ్ మాత్రే (2), స్టార్ ప్లేయర్ ఆరోన్ జార్జ్ (16) పెవిలియన్‌కు చేరారు. 86 పరుగులకే 6 వికెట్లు కోల్పోవడంతో ఆదిలోనే భారత ఓటమి ఖరారైంది.ఆఖర్లో దీపేశ్ దేవేంద్రన్ (36) కంటితుడుపుగా బ్యాట్ ఝులిపించాడు. భారత ఇన్నింగ్స్‌లో ఇతనే టాప్ స్కోరర్. మిగతా ఆటగాళ్లలో విహాన్ మల్హోత్రా 7, వేదాంత్ త్రివేది 9, అభిగ్యాన్ కుందు 13, కనిష్క్ చౌహాన్ 9, ఖిలన్ పటేల్ 19, హెనిల్ పటేల్ 6 పరుగులు చేసి ఔటయ్యారు.అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పాక్.. ఓపెనర్ సమీర్ మిన్హాస్ (113 బంతుల్లో 172; 17 ఫోర్లు, 9 సిక్సర్లు) భారీ శతకంతో చెలరేగడంతో నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 347 పరుగులు చేసింది. అహ్మద్ హుసేన్ (56), ఉస్మాన్ ఖాన్ (35) పర్వాలేదనిపించారు. ఓ దశలో పాక్ 400 పరుగుల మార్కు దాటుందని అనిపించింది. అయితే భారత బౌలర్లు పుంజుకోవడంతో పాక్ ఆఖర్లో త్వరితగతిన 5 వికెట్లు కోల్పోయింది. ఇదే సమయంలో స్కోర్ కూడా నెమ్మదించింది.భారత బౌలర్లలో దీపేశ్ దేవేంద్రన్ 3 వికెట్లు పడగొట్టగా.. హెనిల్ పటేల్, ఖిలన్ పటేల్ తలో 2, కనిష్క్ చౌహాన్ ఓ వికెట్ తీశారు. కాగా, ఈ టోర్నీ సెమీఫైనల్లో భారత్ శ్రీలంకను.. పాక్ బంగ్లాదేశ్‌ను ఓడించి ఫైనల్స్‌కు చేరాయి. గత ఎడిషన్‌లోనూ ఫైనల్లోనే ఓడిన (బంగ్లాదేశ్) భారత్ మరోసారి రన్నరప్‌తోనే సరిపెట్టుకుంది. -
టీమిండియాకు ఘోర పరాభవం
ఏసీసీ మెన్స్ అండర్-19 ఆసియా కప్-2025ను పాకిస్తాన్ కైవసం చేసుకుంది. దుబాయ్ వేదికగా ఇవాళ (డిసెంబర్ 21) జరిగిన ఫైనల్లో పాక్ భారత్‌ను 191 పరుగుల తేడాతో చిత్తుగా ఓడించింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పాక్.. ఓపెనర్ సమీర్ మిన్హాస్ (113 బంతుల్లో 172; 17 ఫోర్లు, 9 సిక్సర్లు) భారీ శతకంతో చెలరేగడంతో నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 347 పరుగులు చేసింది.అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన భారత్ ఆది నుంచే క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోతూ ఓటమిని కొని తెచ్చుకుంది. 26.2 ఓవర్లలో భారత్ 156 పరుగులు మాత్రమే చేసి ఆలౌటైంది. పాక్ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. అలీ రజా 4 వికెట్లు తీసి భారత పతనాన్ని శాశించాడు. మొహమ్మద్ సయ్యమ్, అబ్దుల్ సుభాన్, సుజైఫా ఎహసాన్ తలో 2 వికెట్లు తీసి టీమిండియాను దెబ్బకొట్టారు.భారత్ తరఫున చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ (10 బంతుల్లో 26; ఫోర్, 3 సిక్సర్లు) సిక్సర్‌తో ఛేదనను ప్రారంభించినా కొద్ది సేపటికే ఔటయ్యాడు. అంతకుముందే కెప్టెన్ ఆయుశ్ మాత్రే (2), స్టార్ ప్లేయర్ ఆరోన్ జార్జ్ (16) పెవిలియన్‌కు చేరారు. 86 పరుగులకే 6 వికెట్లు కోల్పోవడంతో ఆదిలోనే భారత ఓటమి ఖరారైంది. ఆఖర్లో దీపేశ్ దేవేంద్రన్ (36) కంటితుడుపుగా బ్యాట్ ఝులిపించాడు. భారత ఇన్నింగ్స్‌లో ఇతనే టాప్ స్కోరర్. మిగతా ఆటగాళ్లలో విహాన్ మల్హోత్రా 7, వేదాంత్ త్రివేది 9, అభిగ్యాన్ కుందు 13, కనిష్క్ చౌహాన్ 9, ఖిలన్ పటేల్ 19, హెనిల్ పటేల్ 6 పరుగులు చేసి ఔటయ్యారు.అంతకుముందు పాక్ ఇన్నింగ్స్‌లో సమీర్ మిన్హాస్ మినహా ఎవరూ పెద్ద స్కోర్లు చేయలేదు. అహ్మద్ హుసేన్ (56), ఉస్మాన్ ఖాన్ (35) పర్వాలేదనిపించారు. ఓ దశలో పాక్ 400 పరుగుల మార్కు దాటుందని అనిపించింది. అయితే భారత బౌలర్లు పుంజుకోవడంతో పాక్ 347 పరుగులతో సరిపెట్టుకుంది. భారత బౌలర్లలో దీపేశ్ దేవేంద్రన్ 3 వికెట్లు పడగొట్టగా.. హెనిల్ పటేల్, ఖిలన్ పటేల్ తలో 2, కనిష్క్ చౌహాన్ ఓ వికెట్ తీశారు. కాగా, ఈ టోర్నీ సెమీఫైనల్లో భారత్ శ్రీలంకను.. పాక్ బంగ్లాదేశ్‌ను ఓడించి ఫైనల్స్‌కు చేరాయి. గత ఎడిషన్‌లోనూ ఫైనల్లోనే ఓడిన (బంగ్లాదేశ్) భారత్ మరోసారి రన్నరప్‌తోనే సరిపెట్టుకుంది. -
Asia Cup Final: పాకిస్తాన్ భారీ స్కోర్
దుబాయ్ వేదికగా జరుగుతున్న ఏసీసీ మెన్స్ అండర్-19 ఆసియా కప్-2025 ఫైనల్లో భారత్, పాకిస్తాన్ అమీతుమీ తేల్చుకుంటున్నాయి. ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్ టాస్ ఓడి టీమిండియా ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేసి భారీ స్కోర్ చేసింది. ఓపెనర్ సమీర్ మిన్హాస్ (113 బంతుల్లో 172; 17 ఫోర్లు, 9 సిక్సర్లు) భారీ శతకంతో చెలరేగడంతో నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 347 పరుగులు చేసింది.పాక్ ఇన్నింగ్స్‌లో సమీర్ మినహా ఎవరూ పెద్ద స్కోర్లు చేయలేదు. సమీర్ ఒక్కడే వన్ మ్యాన్ షో చేశాడు. అహ్మద్ హుసేన్ (56) సమీర్‌కు అండగా నిలిచాడు. ఉస్మాన్ ఖాన్ (35) పర్వాలేదనిపించాడు. ఓ దశలో పాక్ 400 పరుగుల మార్కు దాటుందని అనిపించింది. అయితే భారత బౌలర్లు పుంజుకోవడంతో పాక్ ఆఖర్లో త్వరితగతిన 5 వికెట్లు కోల్పోయింది. ఇదే సమయంలో స్కోర్ కూడా నెమ్మదించింది.చివరి మూడు ఓవర్లలో పాక్ టెయిలెండర్లు నికాబ్ షఫీక్ (12 నాటౌట్), మొహమ్మద్ సయ్యమ్ (13 నాటౌట్) మరో వికెట్ పడకుండా జగ్రత్తగా ఆడి జట్టు స్కోర్‌ను 350 పరుగుల మార్కు వరకు తీసుకెళ్లారు. భారత బౌలర్లలో దీపేశ్ దేవేంద్రన్ 3 వికెట్లు పడగొట్టగా.. హెనిల్ పటేల్, ఖిలన్ పటేల్ తలో 2, కనిష్క్ చౌహాన్ ఓ వికెట్ తీశారు. కాగా, ఈ టోర్నీ సెమీఫైనల్లో భారత్ శ్రీలంకను.. పాక్ బంగ్లాదేశ్‌ను ఓడించి ఫైనల్స్‌కు చేరాయి. చదవండి: చరిత్ర సృష్టించిన డెవాన్ కాన్వే.. తొలి న్యూజిలాండ్ బ్యాటర్‌గా -
పాక్‌తో ఫైనల్.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్
అండర్-19 ఆసియా కప్ 2025 ఫైనల్లో భాగంగా దుబాయ్ వేదికగా భారత్, పాకిస్తాన్ జట్లు తలపడుతున్నాయి. ఈ బ్లాక్ బ్లాస్టర్ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత జట్టు తొలుత బౌలింగ్ ఎంచుకుంది. భారత తమ తుది జట్టులో ఎటువంటి మార్పులు చేయకుండా బరిలోకి దిగింది. పాక్ మాత్రం ఒక్క మార్పు చేసింది.డానియల్ అలీ ఖాన్ స్ధానంలో నిఖాబ్ షఫీక్ ప్లేయింగ్ ఎలెవన్‌లోకి వచ్చాడు. ఈ టోర్నీలో ఇప్పటివరకు ఓటమెరుగని టీమిండియా.. తుది పోరులో కూడా తమ జోను కొనసాగించాలని పట్టుదలతో ఉంది. వైభవ్ సూర్యవంశీ, ఆరోన్ జార్జ్, అభిజ్ఞాన్ కుందు సూపర్ ఫామ్‌లో ఉన్నారు. బౌలింగ్‌లో కూడా దీపేష్ దేవేంద్రన్, కిషన్ కుమార్ సింగ్ దుమ్ములేపుతున్నారు.తుది జట్లుపాకిస్తాన్: సమీర్ మిన్హాస్, ఉస్మాన్ ఖాన్ , అహ్మద్ హుస్సేన్, ఫర్హాన్ యూసఫ్ (కెప్టెన్), హంజా జహూర్ (వికెట్ కీపర్), హుజైఫా అహ్సాన్, నికాబ్ షఫీక్, మహ్మద్ షయాన్, అలీ రజా, అబ్దుల్ సుభాన్, మహ్మద్ సయామ్భారత్: ఆయుష్ మాత్రే (కెప్టెన్), వైభవ్ సూర్యవంశీ, ఆరోన్ జార్జ్, విహాన్ మల్హోత్రా, వేదాంత్ త్రివేది, అభిజ్ఞాన్ కుందు (వికెట్ కీపర్), కనిష్క్ చౌహాన్, ఖిలాన్ పటేల్, హెనిల్ పటేల్, దీపేష్ దేవేంద్రన్, కిషన్ కుమార్ సింగ్ -
క్రికెట్ నుంచి ఎన్బీఏ వరకు.. ఈ ఏడాది క్రీడా రంగాన్ని కుదిపేసిన వివాదాలు ఇవే
2025 సంవత్సరం.. క్రీడా రంగంలో అనేక విజయాలతో పాటు వివాదాలకు కూడా వేదికైంది. ఆసియాకప్ నో షేక్ హ్యాండ్ నుంచి ఎన్బీఏ (NBA) బెట్టింగ్ స్కామ్ వరకు చాలా వివాదాలు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలో టాప్-5 కాంట్రవర్సీలపై ఓ లుక్కేద్దాం.నో హ్యాండ్ షేక్..ఆసియాకప్-2025లో భారత్-పాకిస్తాన్ జట్ల మధ్య ఊహించని పరిణామాలు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా 'నో హ్యాండ్‌షేక్' వివాదం క్రీడా ప్రపంచంలో పెను సంచలనం సృష్టించింది. సాధారణంగా టాస్ సమయంలో, మ్యాచ్ ముగిసిన తర్వాత ఇరు జట్ల కెప్టెన్లు, ఆటగాళ్లు కరచాలనం చేసుకోవడం ఒక సంప్రదాయం. కానీ పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ టాస్ సమయంలో పాక్ కెప్టెన్‌తో కరచాలనం చేయడానికి నిరాకరించారు. సూర్య బాటలోనే మిగితా భారత ప్లేయర్లు కూడా నడిచారు. టోర్నీ అసాంతం పాక్ ఆటగాళ్లతో భారత జట్టు అంటిముట్టనట్టుగానే వ్యవహరిచింది. ఈ వివాదంపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఐసీసీకి కూడా ఫిర్యాదు చేసింది. మ్యాచ్ రిఫరీని తప్పించాలని పీసీబీ డిమాండ్ చేసింది. కానీ ఐసీసీ మాత్రం పాక్ క్రికెట్ బోర్డు అందుకు అంగీకరించలేదు.ఆ తర్వాత ఆసియా కప్ గెలిచిన తర్వాత ఏసీసీ చైర్మెన్ మోసిన్ నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీ తీసుకోవడానికి టీమిండియా నిరాకరించింది. నఖ్వీ ఏసీసీ చైర్మెన్‌తో పాటు పాకిస్తాన్ మంత్రిగా ఉండడంతో భారత్ ఆ నిర్ణయం తీసుకుంది. అయితే ఆసియాకప్‌లో చోటు చేసుకున్న ఉద్రిక్తల కారణంగా భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, పాక్ పేసర్ హారిస్ రౌఫ్‌పై ఐసీసీ చర్యలు తీసుకుంది.ఈ ఏడాది అక్టోబర్‌లో అంతర్జాతీయ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ (NBA)ని బెట్టింగ్ కుంభకోణం కుదిపేసింది. ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (FBI) చేసిన దాడులలో కొంతమంది బాస్కెట్‌బాల్ దిగ్గజాలు.. మాఫియా ముఠాలతో సంబంధం కలిగి ఉన్నట్లు తేలింది. ఆటగాళ్లు మాఫియా ముఠాలతో కలిసి ఇన్సైడర్ సమాచారాన్ని బెట్టింగ్ కోసం వాడినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో మొత్తం 34 మందిని అరెస్టు చేశారు. ఈ కుంభకోణంలో చాన్సీ బిలప్స్, టెర్రీ రోజియర్, డామన్ జోన్స్ వంటి దిగ్గజాలు నిందితులగా ఉన్నారు.'గ్రోవెల్' (Grovel) వివాదంఈ ఏడాది నవంబర్‌లో భారత్‌తో జరిగిన రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను 2-0 తేడాతో సౌతాఫ్రికా క్లీన్ స్వీప్ చేసింది. అయితే రెండో టెస్టు నాలుగో రోజు ఆటలో దక్షిణాఫ్రికా హెడ్ కోచ్ షుక్రీ నాడ్.. భారత జట్టును ఉద్దేశించి "గ్రోవెల్" (మా ముందు సాష్టాంగపడేలా చేస్తాం) అనే పదాన్ని వాడటం పెద్ద రచ్చకు దారితీసింది. ఇది జాత్యహంకారానికి ప్రతీకగా పరిగణించబడింది. దీనిపై సౌతాఫ్రికా మాజీ ఆటగాడు డేల్ స్టెయిన్ సైతం తప్పుబట్టాడు. ఆ తర్వాత షుక్రీ నాడ్ క్షమాపణలు చెప్పాడు.మెద్వెదేవ్ ఆగ్రహంయూఎస్ ఓపెన్ 2025 తొలి రౌండ్లోనే రష్యా టెన్నిస్ ఆటగాడు డానియిల్ మెద్వెదేవ్ వెనుదిరిగాడు. ఫ్రాన్స్ ప్లేయర్ బెంజమిన్ బోంజి చేతిలో ఓడిపోడంతో మెద్వెదేవ్ అసహనానికి గురయ్యాడు. అతడు తన రాకెట్‌ను అక్కడే విరగ్గొట్టాడు. అంతకుముందు కోర్టులో ప్రేక్షకులతోను అనుచితంగా ప్రవర్తించాడు. అంపైర్లతో కూడా వాగ్వాదానికి దిగాడు. దీంతో అతడికి 42,500 డాలర్ల (భారత కరెన్సీ ప్రకారం దాదాపు రూ. 37 లక్షలు) జరిమానాను నిర్వాహకులు విధించారు.హర్భజన్ సింగ్ అనుచిత వ్యాఖ్యలుఐపీఎల్-2025 సీజన్ సమయంలో భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ఓ వివాదంలో చిక్కుకున్నాడు. వ్యాఖ్యాతగా వ్యహరించిన హర్భజన్.. ఇంగ్లండ్ ఫాస్ట్‌బౌలర్ జోఫ్రా ఆర్చర్‌ను లండన్‌లోని 'నల్ల టాక్సీ' (Kaali Taxi) తో పోల్చాడు. దీంతో జాత్యహంకార వ్యాఖ్యలు చేశాడని భజ్జీపై విమర్శల వర్షం కురిసింది. -
మరోసారి మెగా ఫైనల్లో భారత్ X పాకిస్తాన్
మరోసారి మెగా ఫైనల్లో భారత్- పాకిస్తాన్ తలపడనున్నాయి. ఏసీసీ మెన్స్ ఆసియా కప్-2025 టోర్నీ టైటిల్ పోరులో దాయాదులు అమీతుమీ తేల్చుకోనున్నాయి. కాగా దుబాయ్ వేదికగా శుక్రవారం జరిగిన తొలి సెమీస్‌లో ఆయుశ్ మాత్రే (Ayush Mhatre) సారథ్యంలోని భారత్ 8 వికెట్ల తేడాతో శ్రీలంకపై విజయఢంకా మోగించిన విషయం తెలిసిందే. ఐసీసీ అకాడమీ గ్రౌండ్లో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన లంక నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 138 పరుగులు చేసింది. పవర్‌ప్లేలో 28 పరుగులకే 3 కీలక వికెట్లు కోల్పోయిన లంకను కాసేపు కెప్టెన్ విమత్ దిన్సార (32; 4 ఫోర్లు), చమిక హీనతిగల (42; 3 ఫోర్లు) ఆదుకున్నారు. ఇద్దరు తర్వాతి 6 ఓవర్ల పాటు వికెట్ పడనీయకుండా నాలుగో వికెట్‌కు 45 పరుగులు జతచేశారు.ఆఖర్లో సేత్మిక సేనెవిరత్నే (22 బంతుల్లో 30; 2 ఫోర్లు, 1 సిక్స్) ధాటిగా ఆడటంతో లంక 130 పైచిలుకు స్కోరు చేయగలిగింది. యువ భారత ఓపెనర్లు ఆయుశ్ మాత్రే (7), వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi- 9)లు విఫలమయ్యారు. 25/2 స్కోరు వద్ద లంక పండగ చేసుకుంది.విహాన్ మల్హోత్ర, ఆరోన్ జార్జ్ ధనాధన్అయితే, వైస్ కెప్టెన్ విహాన్ మల్హోత్ర (45 బంతుల్లో 61 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), హైదరాబాదీ బ్యాటర్ ఆరోన్ జార్జ్ (49 బంతుల్లో 58 నాటౌట్; 4 ఫోర్లు, 1 సిక్స్) అజేయ అర్ధ శతకాలతో లంకేయుల ఆశలపై నీళ్లు చల్లారు. ఇద్దరు జట్టును గెలిపించేదాకా క్రీజును అట్టిపెట్టుకోవడంతో లంక బౌలర్లు ఆపసోపాలు పడ్డారు.అబేధ్యమైన మూడో వికెట్‌కు విహాన్, ఆరోన్ 114 పరుగులు జోడించారు. మూడు రోజుల క్రితం జరిగిన ఐపీఎల్ ఆటగాళ్ల వేలంలో లెఫ్ట్‌హ్యాండ్ బ్యాటర్ విహాన్‌ను రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఫ్రాంచైజీ ప్రాథమిక ధర రూ. 30 లక్షలకు కొనుగోలు చేసింది. కాగా వర్షం వల్ల ఈ యూత్ వన్డేను 20 ఓవర్లకు కుదించారు.పదకొండేళ్ల తర్వాతఇక మరో సెమీఫైనల్లో దుబాయ్‌లోని ది సెవెన్స్ స్టేడియంలో పాకిస్తాన్ కూడా 8 వికెట్ల తేడాతోనే బంగ్లాదేశ్‌పై గెలుపొందింది. వర్షం కారణంగా 27 ఓవర్లకు మ్యాచ్ కుదించగా.. బంగ్లాదేశ్ 26.3 ఓవర్లలో 121 పరుగులు చేసి ఆలౌట్ అయింది. అనంతరం 16.3 ఓవర్లలోనే పాకిస్తాన్ కేవలం రెండు వికెట్లు నష్టపోయి లక్ష్యాన్ని పూర్తి చేసింది. తద్వారా ఫైనల్‌కు అర్హత సాధించింది.కాగా పదకొండేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత యువ చిరకాల ప్రత్యర్థులు భారత్- పాక్ (అండర్–19లో) ఆసియా కప్ ఫైనల్లో తలపడనున్నాయి. చివరిసారిగా 2014లో జరిగిన ఆసియాకప్ ఫైనల్లో పాక్‌ను ఓడించిన యువ భారత్ టైటిల్ సాధించింది. కాగా తాజా ఆసియా కప్ లీగ్ దశ మ్యాచ్‌లో భారత్ పాక్‌ను చిత్తుగా ఓడించిన విషయం తెలిసిందే.వేదిక, టైమింగ్స్.. లైవ్ స్ట్రీమింగ్ ఎక్కడంటేభారత్- పాకిస్తాన్ ఫైనల్ మ్యాచ్‌కు దుబాయ్‌లోని ఐసీసీ అకాడమీ గ్రౌండ్ వేదిక. భారత కాలమానం ప్రకారం ఉదయం 10.30 నిమిషాలకు మ్యాచ్ మొదలు అవుతుంది. సోనీ స్పోర్ట్స్ నెట్వర్క్ (టీవీ), సోనీ లివ్ (డిజిటల్) యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం.చదవండి: విరాట్ కోహ్లి ఫ్యాన్స్‌కు శుభవార్త.. కెప్టెన్‌గా రిషభ్ పంత్ -
పాకిస్తాన్‌ను చిత్తు చేసిన టీమిండియా..
అండర్-19 ఆసియాకప్ 2025లో యువ భారత జట్టు జోరు కొనసాగుతోంది. ఈ టోర్నీలో భాగంగా ఆదివారం దాయాది పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 90 పరుగుల తేడాతో టీమిండియా ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో భారత బౌలర్లు అద్భుతం చేశారు. 241 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని చేధించలేక పాక్ చతికల పడింది. భారత బౌలర్ల ధాటికి పాక్ అండర్ 19 జట్టు 41.2 ఓవర్లలో కేవలం 150 పరుగులకే కుప్పకూలింది. దీపేష్ దేవేంద్రన్, కన్షిక్ చౌహన్ తలా మూడు వికెట్లతో పాక్ పతనాన్ని శాసించారు. వీరితో పాటు కిషాన్ కుమార్ రెండు వికెట్లు సాధించారు. పేసర్ దీపేష్ పవర్‌ప్లేలోనే మూడు వికెట్లు పడగొట్టి ప్రత్యర్ధిని దెబ్బతీశాడు.పాక్ బ్యాటర్లలో హుజైఫా అహ్సాన్(83 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్‌లతో 70) ఒంటరి పోరాటం చేశాడు. ఓ వైపు వికెట్లు పడతున్నప్పటికి అహ్సాన్ మాత్రం దూకుడుగా ఆడి భారత్‌పై ఒత్తిడిపెంచాడు. ఈ క్రమంలో వైభవ్ సూర్యవంశీ అద్భుతమైన క్యాచ్‌తో పెవిలియన్‌కు పంపాడు. పాక్ ఇన్నింగ్స్‌లో ముగ్గురే ముగ్గురు డబుల్ డిజిట్ స్కోర్ సాధించారు.అదరగొట్టిన ఆరోన్..ఇక అంతకుముందు బ్యాటింగ్ చేసిన భారత్ 46.1 ఓవర్లలో 240 పరుగులకు ఆలౌటైంది. భారత బ్యాటర్లలో భారత బ్యాటర్లలో ఆరోన్ జార్జ్(85) టాప్ స్కోరర్‌గా నిలవగా.. కనిష్క్ చౌహాన్(46), మాత్రే(38) రాణించారు. ఈ మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ(5) విఫలమయ్యాడు. పాక్ బౌలర్లలో మహ్మద్ సయ్యామ్, అబ్దుల్ సుభాన్ తలా మూడు వికెట్లు పడగొట్టారు. చదవండి: IPL 2026: కేకేఆర్ కీలక నిర్ణయం..! కెప్టెన్‌గా అతడే? -
పాక్‌తో మ్యాచ్.. వైభవ్ ఫెయిల్! భారత్ స్కోరెంతంటే?
అండర్-19 ఆసియాకప్‌లో భాగంగా పాకిస్తాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారత యువ బ్యాటర్లు తడబడ్డారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్ అండర్-19 జట్టు 46.1 ఓవర్లలో 240 పరుగులకు ఆలౌటైంది. వర్షం కారణంగా ఈ మ్యాచ్‌ను 49 ఓవర్లకు కుదించారు. బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఆరంభంలోనే భారీ షాక్ తగిలింది.సూపర్ ఫామ్‌లో ఉన్న స్టార్ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ కేవలం 5 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్‌కు చేరాడు. ఆ తర్వాత కెప్టెన్ ఆయూష్ మాత్రే, హైదరాబాద్ కుర్రాడు ఆరోన్ జార్జ్ ఆచితూచి ఆడుతూ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. అనంతరం మాత్రే ఔటయ్యాక విహాన్ మల్హోత్రా(12), వేదాంత్(7) వికెట్లను కోల్పోయింది. అనంతరం జార్జ్, వికెట్ కీపర్ అభిజ్ఞాన్ కుండు(22) కాసేపు పాక్ బౌలర్లను సమర్ధవంతంగా ఎదుర్కొన్నారు. ఏడో స్ధానంలో బ్యాటింగ్‌కు వచ్చిన కనిష్క్ చౌహాన్ కాస్త దూకుడుగా ఆడాడు. అయితే జార్జ్, చౌహన్ ఔటయ్యాక భారత టెయిలాండర్లు ఎక్కవ సేపు క్రీజులో నిలవలేకపోయారు.దీంతో మరో 17 బంతులు మిగిలూండగానే టీమిండియా ఆలౌటైంది. భారత బ్యాటర్లలో ఆరోన్ జార్జ్(85) టాప్ స్కోరర్‌గా నిలవగా.. కనిష్క్ చౌహాన్(46), మాత్రే(38) రాణించారు. పాక్ బౌలర్లలో మహ్మద్ సయ్యామ్, అబ్దుల్ సుభాన్ తలా మూడు వికెట్లు పడగొట్టగా.. నిఖాబ్ షఫీక్ రెండు వికెట్లు సాధించారు.చదవండి: శతక్కొట్టిన జైస్వాల్.. సర్ఫరాజ్ ధనాధన్.. భారీ లక్ష్యాన్ని ఊదేసిన ముంబై -
IND Vs PAK: పాక్‌తో మ్యాచ్.. వైభవ్ సూర్యవంశీ అట్టర్‌ఫ్లాప్
భారీ అంచనాల నడుమ పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో బరిలోకి దిగిన భారత యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ విఫలమయ్యాడు. పాక్‌తో మ్యాచ్‌లో ఈ ఓపెనింగ్ బ్యాటర్ కేవలం ఐదు పరుగులే చేసి నిష్క్రమించాడు. దీంతో అభిమానులు తీవ్ర నిరాశకు లోనయ్యారు.ఏసీసీ మెన్స్ అండర్-19 ఆసియా కప్-2025 (Asia Cup)లో భాగంగా గ్రూప్-‘ఎ’ లో ఉన్న భారత్- పాక్ (Ind vs Pak)మధ్య ఆదివారం మ్యాచ్ నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది. వన్డే ఫార్మాట్లో జరిగే ఈ టోర్నీలో వర్షం కారణంగా టాస్ ఆలస్యం కాగా.. మ్యాచ్‌ను 49 ఓవర్లకు కుదించారు.ధనాధన్ ఇన్నింగ్స్‌తో మొదలుపెట్టిన ఆయుశ్ఇక దుబాయ్‌లోని ఐసీసీ అకాడమీ గ్రౌండ్లో దాయాదితో పోరులో టాస్ ఓడిన భారత్ తొలుత బ్యాటింగ్‌కు దిగింది. గత మ్యాచ్‌లో యూఏఈపై విఫలమైన ఓపెనర్, కెప్టెన్ ఆయుశ్ మాత్రే (Ayush Mhatre) ఈసారి ధనాధన్ ఇన్నింగ్స్‌తో మొదలుపెట్టగా.. మరో ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ మాత్రం ఆది నుంచే తడబడ్డాడు.పాక్ బౌలింగ్ అటాక్‌ను ఆరంభించిన అలీ రెజా.. తొలి ఓవర్లో కేవలం ఒకే ఒక్క పరుగు ఇచ్చాడు. అతడి బౌలింగ్‌లో నాలుగో బంతికి ఆయుశ్ మాత్రే పరుగు తీశాడు. ఇక రెండో ఓవర్లో మొహమ్మద్ సయ్యామ్ బౌలింగ్‌లో ఆయుశ్ ఫోర్, సిక్స్, ఫోర్‌తో అలరించగా.. వైభవ్ మాత్రం ఇక్కడా ఖాతా తెరవలేదు.టచ్‌లోకి వచ్చినట్లే వచ్చిమూడో ఓవర్లో మళ్లీ రెజా రంగంలోకి దిగగా.. తొలి బంతినే బౌండరీకి తరలించి వైభవ్ టచ్‌లోకి వచ్చినట్లు కనిపించాడు. తర్వాత ఆయుశ్ రెజా బౌలింగ్‌లో రెండు ఫోర్లు బాది సత్తా చాటాడు. అయితే, నాలుగో ఓవర్లో మొహమ్మద్ సయ్యామ్ బౌలింగ్‌లో రెండో బంతిని వైభవ్ స్ట్రెయిట్ షాట్ బాదగా.. అతడు బంతిని క్యాచ్ పట్టాడు.దీంతో ఆరు బంతులు ఎదుర్కొన్న వైభవ్.. ఒక ఫోర్ సాయంతో కేవలం ఐదు పరుగులే చేసి అవుటయ్యాడు. అతడి స్థానంలో హైదరాబాదీ స్టార్ ఆరోన్ జార్జ్ క్రీజులోకి వచ్చాడు. కాగా ఆయుశ్ మాత్రే 25 బంతుల్లో 38 పరుగులు చేసి నిష్క్రమించగా.. విహాన్ మల్హోత్రా (12), వేదాంత్ త్రివేది (7) ఫెయిలయ్యారు. ఫలితంగా 20 ఓవర్ల ఆట పూర్తయ్యేసరికి భారత్ నాలుగు వికెట్ల నష్టానికి 114 పరుగులే చేయగలిగింది. కాగా యూఏఈతో గత మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ భారీ శతకం (171) బాదిన విషయం తెలిసిందే. అయితే, సెమీస్ చేరడంలో కీలకమైన పాక్‌తో మ్యాచ్‌లో మాత్రం ఇలా నిరాశపరిచాడు. UPDATE: Asia Cup 2025: పాక్‌తో మ్యాచ్.. భారత్ స్కోరెంతంటే? చదవండి: IPL 2026: మా మేనేజర్ తప్పు వల్లే ఇలా..: కామెరాన్ గ్రీన్ -
IND vs PAK: టాస్‌గెలిచిన పాకిస్తాన్.. భారత్ బ్యాటింగ్
ఆసియా క్రికెట్ మండలి అండర్-19 ఆసియా కప్ టోర్నీలో భారత్‌తో మ్యాచ్‌లో పాకిస్తాన్ టాస్ గెలిచింది. దుబాయ్‌లోని ఐసీసీ అకాడమీ గ్రౌండ్లో ఆదివారం నాటి మ్యాచ్‌లో.. ఆయుశ్ మాత్రే సేనను తొలుత బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. వర్షం కారణంగా టాస్ ఆలస్యం కాగా.. మ్యాచ్‌ను నలభై తొమ్మిది ఓవర్లకు కుదించారు.తొలి మ్యాచ్‌లలో ఘన విజయాలుకాగా అండర్-19 ఆసియా కప్‌లో గ్రూప్-ఎ నుంచి భారత్, పాకిస్తాన్, యూఏఈ, మలేషియా.. గ్రూప్-బి నుంచి శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గనిస్తాన్, నేపాల్ పోటీపడుతున్నాయి. ఈ క్రమంలో తమ తొలి మ్యాచ్‌లో భారత్ యూఏఈ (IND vs UAE)ని.. పాక్ మలేషియా (PAK vs MLY)ను చిత్తుగా ఓడించి శుభారంభం అందుకున్నాయి. తాజాగా ఆదివారం నాటి మ్యాచ్‌లో దాయాదులు అమీతుమీ తేల్చుకుంటాయి. ఈ మ్యాచ్‌లో భారత చిచ్చరపిడుగు, యూఏఈతో మ్యాచ్‌లో భారీ శతకంతో చెలరేగిన వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi)పైనే కళ్లన్నీ ఉన్నాయి. ఇదిలా ఉంటే.. గ్రూప్-బిలో శ్రీలంక, బంగ్లాదేశ్ తలా ఒక మ్యాచ్ గెలిచి టాప్-2లో ఉండగా.. గ్రూప్-ఎలో పాక్, భారత్ తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి.భారత్ అండర్-19 వర్సెస్ పాకిస్తాన్ అండర్-19 తుదిజట్లుభారత్ఆయుష్ మాత్రే(కెప్టెన్), వైభవ్ సూర్యవంశీ, ఆరోన్ జార్జ్, విహాన్ మల్హోత్రా, వేదాంత్ త్రివేది, అభిజ్ఞాన్ కుందు(వికెట్ కీపర్), కనిష్క్ చౌహాన్, ఖిలాన్ పటేల్, దీపేష్ దేవేంద్రన్, కిషన్ కుమార్ సింగ్, హెనిల్ పటేల్.పాకిస్తాన్ఉస్మాన్ ఖాన్, సమీర్ మిన్హాస్, అలీ హసన్ బలోచ్, అహ్మద్ హుస్సేన్, ఫర్హాన్ యూసఫ్(కెప్టెన్), హమ్జా జహూర్(వికెట్ కీపర్), హుజైఫా అహ్సన్, నిఖాబ్ షఫీక్, అబ్దుల్ సుభాన్, మహ్మద్ సయ్యమ్, అలీ రజా.చదవండి: తుదిజట్టు, బ్యాటింగ్ ఆర్డర్లో మార్పులు!.. సౌతాఫ్రికా కోచ్ ఏమన్నాడంటే.. -
భారత జట్టు ప్రకటన.. వైభవ్ సూర్యవంశీకి చోటు
అండర్-19 ఆసియా కప్ టోర్నమెంట్‌కు భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) శుక్రవారం తమ జట్టును ప్రకటించింది. పదిహేను మంది సభ్యులతో కూడిన ఈ జట్టుకు ఆయుశ్ మాత్రే (Ayush Mhatre)ను కెప్టెన్‌గా ఎంపిక చేసినట్లు తెలిపింది. ఇక ఈ జట్టులో చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi)కి కూడా చోటు దక్కింది. కాగా డిసెంబరు 12 నుంచి 21 వరకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా అండర్-19 ఆసియా కప్ టోర్నీ నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది. వన్డే ఫార్మాట్లో నిర్వహించే ఈ ఈవెంట్లో మొత్తం ఎనిమిది జట్లు పాల్గొంటున్నాయి. డిసెంబరు 14న భారత్- పాక్ మ్యాచ్‌గ్రూప్-‘ఎ’ నుంచి భారత్, పాకిస్తాన్, క్వాలిఫయర్ 1 విజేత, క్వాలిఫయర్ 3 విజేత పోటీపడనుండగా... అదే విధంగా.. గ్రూప్-‘బి’ నుంచి బంగ్లాదేశ్, శ్రీలంక, అఫ్గనిస్తాన్, క్వాలిఫయర్-2 విజేత రేసులో ఉన్నాయి.ఇక అండర్-19 ఆసియా కప్ టోర్నీలో భారత్ డిసెంబరు 12న.. ఐసీసీ అకాడమీ వేదికగా క్వాలిఫయర్-1 విజేతతో తమ తొలి మ్యాచ్ ఆడుతుంది. ఇదే వేదికపై డిసెంబరు 14న దాయాది పాకిస్తాన్‌ను ఢీకొట్టనుంది. అనంతరం డిసెంబరు 16న ది ‘సెవెన్స్’లో క్వాలిఫయర్-3 విజేతతో తలపడుతుంది.కాగా డిసెంబరు 19న ఐసీసీ అకాడమీ స్టేడియంలో తొలి సెమీ ఫైనల్ జరుగనుండగా.. డిసెంబరు 19న ది ‘సెవెన్స్’ వేదికగా రెండో సెమీస్ మ్యాచ్ జరుగుతుంది. డిసెంబరు 21న ఫైనల్‌తో ఈ టోర్నీకి తెరపడుతుంది. కాగా గ్రూప్-‘ఎ’, గ్రూప్- ‘బి’ గ్రూపుల నుంచి టాప్-2లో నిలిచిన జట్లు సెమీస్‌కు అర్హత సాధిస్తాయి. సెమీ ఫైనల్ విజేతల మధ్య టైటిల్ పోరు జరుగుతుంది.సెమీస్‌లోనే ఇంటిబాటఇదిలా ఉంటే.. ఇటీవల ఆసియా క్రికెట్ మండలి టీ20 రైజింగ్ స్టార్స్ టోర్నీలో భారత్ సెమీస్‌లో బంగ్లాదేశ్ చేతిలో ఓడిన సంగతి తెలిసిందే. దీంతో జితేశ్ శర్మ సేన ఇంటిబాట పట్టగా.. మరో సెమీ ఫైనల్లో శ్రీలంకను ఓడించి పాక్ ఫైనల్ చేరింది. టైటిల్ పోరులో బంగ్లాదేశ్‌పై గెలుపొంది ట్రోఫీ అందుకుంది.అండర్-19 ఆసియా కప్ టోర్నమెంట్‌కు భారత జట్టు ఇదే:ఆయుశ్ మాత్రే (కెప్టెన్), వైభవ్ సూర్యవంశీ, విహాన్ మల్హోత్రా (వైస్ కెప్టెన్), వేదాంత్ త్రివేది, అభిజ్ఞాన్ కుందు (వికెట్ కీపర్), హర్వంశ్ సింగ్ (వికెట్ కీపర్), యువరాజ్ గోహిల్, కనిష్క్ చౌహాన్, ఖిలాన్ ఎ.పటేల్, నమన్ పుష్పక్, డి. దీపేశ్, హెనిల్ పటేల్, కిషన్ కుమార్ సింగ్ (ఫిట్నెస్ ఆధారంగా), ఉద్ధవ్ మోహన్, ఆరోన్ జార్జ్.స్టాండ్ బై ప్లేయర్లు: రాహుల్ కుమార్, హేముచుందేశన్ జె, బీకే కిషోర్, ఆదిత్య రావత్.చదవండి: WPL 2026: వేలంలో అత్యధిక ధర పలికిన ప్లేయర్లు వీరే -
మళ్లీ భారత్ × పాకిస్తాన్ ఫైనల్?
మెన్స్ ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2025 టోర్నమెంట్లో సెమీఫైనల్ బెర్త్‌లు ఖరారయ్యాయి. గ్రూపు-ఎ నుంచి బంగ్లాదేశ్-ఎ, శ్రీలంక-ఎ.. గ్రూపు-బి నుంచి పాకిస్తాన్, భారత్ జట్లు సెమీస్‌కు అర్హత సాధించాయి. తొలి సెమీఫైనల్లో బంగ్లాదేశ్, భారత జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిచి వరుసగా రెండోసారి ఫైనల్లో అడుగుపెట్టాలని భారత్ పట్టుదలతో ఉంది.ఇక సెకెండ్ సెమీఫైనల్లో పాకిస్తాన్ షాహీన్స్, శ్రీలంక అమీతుమీ తెల్చుకోనున్నాయి. ఈ రెండు సెమీస్ మ్యాచ్‌లు శుక్రవారం(నవంబర్ 21) దోహాలోని వెస్ట్ ఎండ్ పార్క్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరగనున్నాయి.పాక్ జోరు..కాగా ఈ ఖండాంతర టోర్నమెంట్లో దాయాది పాకిస్తాన్ ఇప్పటివరకు అద్భుతమైన విజయాలను నమోదు చేసింది. లీగ్ స్టేజిలో ఆడిన మూడు మ్యాచ్‌లలోనూ పాక్ విజయం సాధించింది. భారత్-ఎతో జరిగిన మ్యాచ్‌లో కూడా పాక్ పూర్తి ఆధిపత్యం చెలాయించింది. 8 వికెట్ల తేడాతో టీమిండియాను చిత్తు చేసింది. మాజ్ సదాకత్ (79 పరుగులు, 2 వికెట్లు) ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టాడు.పాకిస్తాన్ వర్సెస్ భారత్ ఫైనల్?కాగా తొలి సెమీఫైనల్లో బంగ్లాదేశ్‌పై విజయం సాధించడం జితేశ్ శర్మ నేతృత్వంలోని భారత జట్టుకు నల్లేరు మీద నడకే. ఇండియా జట్టులో వైభవ్ సూర్యవంశీ, ప్రియాన్ష్ ఆర్య, నమన్ ధీర్ వంటి విధ్వంసకర బ్యాటర్లు ఉన్నారు.బౌలింగ్‌లో కూడా యష్ ఠాకూర్, యుద్దవీర్ సింగ్ వంటి యువ సంచలనాలు సత్తా చాటుతున్నారు. మరోవైపు పాక్ కూడా సూపర్ ఫామ్‌లో ఉండడంతో శ్రీలంకను ఓడించడం దాదాపు ఖాయమనే చెప్పాలి. దీంతో మరోసారి ఫైనల్ పోరులో పాక్-భారత్ తలపడే అవకాశముంది.చదవండి: IND vs SA: టీమిండియా కెప్టెన్‌గా ఎవరూ ఊహించని ప్లేయర్? -
షేక్ హ్యాండ్ ఇచ్చుకున్న భారత్, పాక్ క్రికెటర్లు
పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్, పాక్ (India vs Pakistan) మధ్య ద్వైపాక్షిక సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్న విషయం తెలిసిందే. క్రికెట్లో అయితే ఇరు దేశాల జట్లు కనీసం షేక్ ఇచ్చుకోవాడానికి కూడా ఇష్టపడటం లేదు. ఈ 'నో హ్యాండ్ షేక్' ఆనవాయితీని ముందుగా టీమిండియా మొదలుపెట్టింది. ఆసియా కప్-2025లో పాక్‌తో తలపడిన మూడు సందర్భాల్లో భారత ఆటగాళ్లు పాక్ ఆటగాళ్లకు షేక్ హ్యాండ్ ఇవ్వలేదు.ఇదే తంతు మహిళల వన్డే ప్రపంచకప్, నిన్న జరిగిన ఏసీసీ మెన్స్ ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2025 టోర్నీలోనూ కొనసాగింది. అయితే భారత అంధుల మహిళా క్రికెట్ జట్టు మాత్రం ఈ ఆనవాయితీకి పుల్‌స్టాప్ పెట్టింది.Women Blind Cricket World Cup Colombo:.India women Blind won against Pakistan Good to see Blind teams Hand shake. pic.twitter.com/jpjfM0XxFW— Sohail Imran (@sohailimrangeo) November 16, 2025నిన్న కొలొంబోలో (శ్రీలంక) జరిగిన ఐసీసీ అంధుల మహిళల టీ20 ప్రపంచకప్-2025లో భారత్, పాక్ ఎదురెదురుపడ్డాయి. ఈ మ్యాచ్‌లో భారత్ పాక్‌ను 8 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించింది. మ్యాచ్ అనంతరం భారత ప్లేయర్లు క్రీడాస్పూర్తిని చాటుకుంటూ.. పాక్ ప్లేయర్లకు షేక్ హ్యాండ్ ఇచ్చారు. ఈ ఉదంతం ప్రస్తుతం భారత క్రికెట్ సర్కిల్స్‌లో చర్చనీయాంశంగా మారింది. అన్ని విభాగాలకు చెందిన భారత జట్లు పాక్ ప్లేయర్లకు షేక్ హ్యాండ్ ఇవ్వడానికి నిరాకరిస్తుంటే.. అంధుల జట్టు ఇలా చేసిందేంటని చాలామంది అభిమానులు కోప్పడుతున్నారు. కొందరేమీ ఇది శుభపరిణామమే అని అంటున్నారు. అయితే ఇదే మ్యాచ్ ప్రారంభానికి ముందు భారత్, పాక్ కెప్టెన్లు హ్యాండ్ షేక్ ఇచ్చుకోకపోవడం గమనార్హం.మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ 135 పరుగులకే ఆలౌటైంది. మెహ్రీన్ అలీ(66), బుష్రా అష్రఫ్(44) రాణించడంతో పాక్ ఈమాత్రం స్కోరైనా చేయగలిగింది. ఈ మ్యాచ్‌లో భారత ఫీల్డర్లు చెలరేగిపోయారు. ఏకంగా ఏడుగురు పాక్ ప్లేయర్లను రనౌట్ చేశారు.అనంతరం బరిలోకి దిగిన భారత్ పాక్ నిర్దేశించిన స్వల్ప లక్ష్యాన్ని కేవలం 10 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. కెప్టెన్ దీపికా టీసీ (45), అనెఖా దేవి (64 నాటౌట్) అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడి భారత్‌కు సునాయాస విజయాన్నందించారు. ఈ టోర్నీలో భారత్‌కు ఇది వరుసగా ఐదో విజయం. ఈ గెలుపుతో భారత్ సెమీఫైనల్‌కు కూడా చేరింది.చదవండి: పాక్ ప్లేయర్‌కు దిమ్మతిరిగే కౌంటరిచ్చిన వైభవ్ సూర్యవంశీ -
పాక్ ప్లేయర్‌కు దిమ్మతిరిగే కౌంటరిచ్చిన వైభవ్ సూర్యవంశీ
నిన్న (నవంబర్ 16) జరిగిన ఏసీసీ మెన్స్ ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2025 టోర్నీలో భారత్ పాకిస్తాన్ చేతిలో 8 వికెట్ల తేడాతో పరాజయంపాలైంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన యంగ్ ఇండియా.. పాక్ బౌలర్లు షాహిద్ అజిజ్ (3-0-24-3), సాద్ మసూద్ (4-0-31-2), మాజ్ సదాఖత్ (3-1-12-2), ఉబైద్ షా (4-0-24-1), అమ్మద్ దనియాల్ (3-0-21-1), సూఫియాన్ ముఖీమ్ (2-0-24-1) ధాటికి 19 ఓవర్లలో 136 పరుగులకే ఆలౌటైంది.భారత ఇన్నింగ్స్‌కు చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) (28 బంతుల్లో 45; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) అదిరిపోయే ఆరంభాన్ని అందించినా, ఆతర్వాత వచ్చిన ఆటగాళ్లు దాన్ని కొనసాగించలేకపోయారు. వన్‌డౌన్ బ్యాటర్ నమన్ ధిర్ (35) ఓ మోస్తరు పోరాటం చేయగా.. మిగతా ఆటగాళ్లలో ప్రియాంశ్ ఆర్య (10), రమన్‌దీప్ సింగ్ (11), హర్ష్ దూబే (19) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. కెప్టెన్ జితేశ్ శర్మ (5), నేహల్ వధేరా (8), యశ్ ఠాకూర్ (2), గుర్జప్నీత్ సింగ్ (1 నాటౌట్) సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితం కాగా.. అశుతోష్ శర్మ, సుయాశ్ శర్మ డకౌటయ్యారు.అనంతరం స్వల్ప లక్ష్యాన్ని పాక్ 13.2 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. ఓపెనర్ మాజ్ సదాఖత్ (79 నాటౌట్) మెరుపు అర్ధ శతకంతో పాక్‌ను గెలిపించాడు. భారత బౌలర్లలో యశ్ ఠాకూర్, సుయాశ్ శర్మకు తలో వికెట్ దక్కింది. ఈ టోర్నీలో భారత్ తమ తదుపరి మ్యాచ్‌ను రేపు (నవంబర్ 18) ఒమన్‌తో ఆడుతుంది. అంతకుముందు భారత్ తొలి మ్యాచ్‌లో యూఏఈపై 148 పరుగుల భారీ తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే. ఆ మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ పూనకాలెత్తిపోయాడు. కేవలం 42 బంతుల్లో 11 ఫోర్లు, 15 సిక్సర్ల సాయంతో 144 పరుగులు చేశాడు.మాటలోనూ చిచ్చరపిడుగే..!14 ఏళ్ల కుర్ర వైభవ్ ఆటలోనే కాదు మాటలోనూ చిచ్చరపిడుగే అని నిన్న పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో నిరూపించాడు. ఈ మ్యాచ్‌లో పాక్ బౌలర్ ఉబైద్ షా వైభవ్‌ను రెచ్చగొట్టే ప్రయత్నం చేయగా.. తనదైన శైలిలో జవాబిచ్చాడు. భారత ఇన్నింగ్స్ మూడో ఓవర్లో ఉబైద్ షా వైభవ్వైపు సీరియస్‌గా చూడగా.. వెళ్లి పని చూడు అన్న అర్దం వచ్చేలా కౌంటరిచ్చాడు. అంతటితో ఆగకుండా మరుసటి బంతిని బౌండరీకి తరలించి పాక్ బౌలర్‌కు తన దమ్మును చూపాడు. చదవండి: IND vs SA: చరిత్ర సృష్టించిన బవుమా.. 148 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే -
భారత్‌తో మ్యాచ్.. పాక్ ఆటగాడి ఓవరాక్షన్! వీడియో
ఏసీసీ మెన్స్ ఆసియా కప్ రైజింగ్ స్టార్స్–2025లో భారత్-ఎకు తొలి ఓటమి ఎదురైంది. ఆదివారం దోహాలోని వెస్ట్ ఎండ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా పాకిస్తాన్ షాహీన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో టీమిండియా ఓటమి పాలైంది. భారత్ నిర్ధేశించిన 137 పరుగుల లక్ష్యాన్ని పాక్ కేవలం రెండు వికెట్లు కోల్పోయి 13.2 ఓవర్లలో ఊదిపడేసింది. ఓపెనర్ మాజ్ సదాఖత్ (75) ఆజేయంగా నిలిచి టార్గెట్‌ను ఫినిష్ చేశాడు.మసూద్ చీప్ టాక్టిక్స్..అయితే ఈ మ్యాచ్‌లో భారత ఇన్నింగ్స్ సందర్భంగా పాక్ స్పిన్నర్ సాద్ మసూద్ ఓవరాక్షన్ చేశాడు. ఇండియా-ఎ వైస్ కెప్టెన్, ముంబై ఇండియన్స్ స్టార్ నమన్ ధీర్ కేవలం మంచి టచ్‌లో కన్పించాడు. దీంతో అతడిని ఔట్ చేసేందుకు పాక్ కెప్టెన్‌ను సాద్ మసూద్‌ను ఎటాక్‌లో తీసుకొచ్చాడు. దీంతో 8 ఓవర్ వేసిన మసూద్ బౌలింగ్‌లో నమన్ భారీ షాట్‌కు ప్రయత్నించి తన వికెట్‌ను కోల్పోయాడు.ఈ క్రమంలో మసూద్ సెలబ్రేషన్స్ శ్రుతుమించాయి. నమన్ వైపు చూస్తూ ఇక ఆడింది చాలు అన్నట్లు సీరియస్‌గా సెండ్-ఆఫ్ ఇచ్చాడు. నమన్ మాత్రం అతడితో ఎటువంటి వాగ్వాదానికి దిగకుండా డగౌట్‌కు నడుచుకుంటూ వెళ్లిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఇది చూసిన నెటిజన్లు పాక్ ప్లేయర్ల తీరు అంతేనాని కామెంట్లు పెడుతున్నారు. కచ్చితంగా మసూద్‌కు భారత్ ప్లేయర్లు వడ్డీతో సహా రిటర్న్ గిప్ట్ ఇచ్చేస్తారని ఓ యూజర్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. అయితే ఇరు జట్లు మరోసారి ఫైనల్లో తలపడే అవకాశముంది. కాగా ఈ హైవోల్టేజ్ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 19 ఓవర్లలో 136 పరుగులకు ఆలౌటైంది. ఒక దశలో 79-1 తో ఉన్న మెన్ ఇన్ బ్లూ.. 57 పరుగుల వ్యవధిలో మొత్తం 9 వికెట్లు కోల్పోయింది. భారత బ్యాటర్లలో వైభవ్ సూర్యవంశీ(45) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.చదవండి: గంభీర్.. ఇప్పటికైనా అతడిని జట్టులోకి తీసుకో: గంగూలీSaad Masood with a wicket 👏🏽 #PAKvIND pic.twitter.com/G3Qh0RhTRp— Usman (@jamilmusman_) November 16, 2025 -
IND vs PAK: 8 వికెట్ల తేడాతో టీమిండియాపై పాక్ విజయం
ఏసీసీ మెన్స్ ఆసియా కప్ రైజింగ్ స్టార్స్–2025లో భారత్–పాక్ మధ్య జరిగిన హై–వోల్టేజ్ పోరులో పాకిస్థాన్ యువ జట్టు ఆధిపత్యం చాటుకుంది. టీమిండియాను 8 వికెట్ల తేడాతో ఓడించి పాక్ రైజింగ్ స్టార్స్ టోర్నీలో మరో విలువైన విజయాన్ని నమోదు చేసుకుంది. ఏసీసీ మెన్స్ ఆసియా కప్ రైజింగ్ స్టార్స్–2025 టోర్నమెంట్లో అత్యంత ఆసక్తికరమైన పోరు జరిగింది. యువ క్రికెటర్ల ప్రతిభను వెలికితీసేందుకు ప్రత్యేకంగా నిర్వహిస్తున్న ఈ టోర్నీలో నేడు (ఆదివారం) భారత్–పాకిస్థాన్ జట్లు పరస్పరం తలపడ్డాయి కానీ ఈ కీలక మ్యాచ్‌ను గెలిచి పాకిస్థాన్ జట్టు సెమీఫైనల్ సమీకరణలను సులభం చేసుకుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత జట్టు భారీ స్కోరు దిశగా సాగుతుందనిపించినా మధ్య ఓవర్లలో వరుస వికెట్లు కోల్పోవడంతో ఒత్తిడికి లోనైంది. దాంతో నిర్ణీత 19 ఓవర్లలో 10 వికెట్ల నష్టానికి 136 పరుగులు మాత్రమే చేయగలిగింది. కాగా ఈ చిన్న లక్ష్యాన్ని ఛేదించడానికి వచ్చిన పాకిస్తాన్ బ్యాట్స్‌మెన్స్ ధాటిగా ఆడి మ్యాచ్‌ను వేగంగా తమ వైపుకు తిప్పుకున్నారు. ఫలితంగా పాకిస్థాన్ జట్టు కేవలం 13.2 ఓవర్లలోనే నిర్ణీత లక్ష్యాన్ని చేధించింది.పాక్ A జట్టు ఓపెనర్ మాజ్ సదాఖత్ (79*) పరుగులతో పాక్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. భారత బౌలర్లలో యశ్ ఠాకూర్, సుయాశ్ శర్మ చెరో వికెట్ తీశారు. ఈ విజయంతో పాకిస్థాన్ సెమీస్‌కు క్వాలిఫై అయింది. రెండో బెర్తు కోసం భారత్ Aతో పాటు ఒమన్ A బరిలో ఉంది. ఈ నెల 18న తదుపరి మ్యాచ్‌లో ఒమన్‌తోనే భారత్ A తలపడనుంది. ఆ మ్యాచ్‌లో గెలిస్తే ఎలాంటి ఇబ్బంది లేకుండా భారత్ సెమీస్‌కు వెళ్లిపోతుంది. -
పాక్‌తో మ్యాచ్.. వైభవ్ సూర్యవంశీ విధ్వంసం
ఏసీసీ మెన్స్ ఆసియా కప్ రైజింగ్ స్టార్స్-2025 టోర్నీలో భారత యువ సంచలనం వైభవ్ సూర్య వంశీ అదరగొడుతున్నాడు. యూఏఈతో జరిగిన తొలి మ్యాచ్‌లో దుమ్ములేపిన వైభవ్.. ఇప్పుడు పాకిస్తాన్‌పై కూడా తుపాన్ ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 28 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లతో 45 పరుగులు చేశాడు.ఆరంభంలో కాస్త ఆచితూచి ఆడిన వైభవ్, క్రీజులో సెటిల్ అయ్యాక ప్రత్యర్ధి బౌలర్లపై విరుచుకుపడ్డాడు. అతడితో పాటు నమన్ ధీర్(20 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్‌తో 35) రాణించాడు. వీరిద్దరి మినహా మిగితా ప్లేయర్లంతా దారుణంగా విఫలమయ్యారు. దీంతో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్-ఎ జట్టు 19 ఓవర్లలో 136 పరుగులకే ఆలౌటైంది.10 ఓవర్లలో భారత్ స్కోర్ 93-3 ఉండగా 43 పరుగుల వ్యవధిలో ఏడు వికెట్లు కోల్పోయింది. పాక్ బౌలర్లలో షాహిద్ అజీజ్ మూడు వికెట్లు పడగొట్టగా.. మాజ్ సదఖత్, షాహిద్ అజీజ్ తలా రెండు వికెట్లు సాధించారు. -
ఒలింపిక్స్‌లో దాయాదుల పోరు డౌటే
క్రికెట్.. 128 ఏళ్ల సదీర్ఘ విరామం తర్వాత ఒలింపిక్స్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్న సంగతి తెలిసిందే. 2028 లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్‌లో క్రికెట్ పోటీలను నిర్వహించేందుకు ఒలింపిక్ కమిటీ (IOC) ఇప్పటికే ఆమోదం తెలిపింది. టీ20 ఫార్మాట్లో ఈ పోటీలు జరగనున్నాయి.ఈ టోర్నీలో ఆరు జట్లు చొప్పున పురుషులు, మహిళల జట్లు పాల్గొననున్నాయి. అయితే ఈ విశ్వక్రీడల్లో భారత్-పాకిస్తాన్ మ్యాచ్ చూడాలనుకుంటున్న అభిమానులకు నిరాశ ఎదురయ్యేలా ఉంది. ఎందుకంటే ఒలింపిక్స్‌లో పాల్గొనే జట్లను ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ ఆధారంగా కాకుండా రీజియన్ల వారీగా ఎంపిక చేయాలని ఐసీసీ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.తొలుత ర్యాంకింగ్స్ ఆధారంగా జట్లను ఎంపిక చేయాలని ఐసీసీ భావించినప్పటికి.. తాజాగా జరిగిన బోర్డు సమావేశంలో తమ నిర్ణయాన్ని మార్చుకున్నట్లు సమాచారం. ఆసియా, ఓషియానియా, యూరప్, ఆఫ్రికా నాలుగు రీజియన్లలో టాప్‌లో ఉన్న జట్లకు ఒలింపిక్స్‌లో నేరుగా ప్రవేశం లభిస్తుంది. ఐదో జట్టుగా ఆతిథ్య హోదాలో అమెరికా లేదా వెస్టిండీస్ గానీ అర్హత సాధిస్తోంది. ఇక ఆరో జట్టును గ్లోబల్ క్వాలిఫయర్ ద్వారా నిర్ణయిస్తారు. కాగా అంతర్జాతీయ టీ20ల్లో టీమిండియా నంబర్ వన్ జట్టుగా కొనసాగుతుండడంతో ఆసియా ఖండం నుంచి పాకిస్తాన్‌కు చోటు దక్కే అవకాశం లేదు. ఒకవేళ టాప్-2 జట్లకు అవకాశమిస్తే మినహా పాకిస్తాన్ ఒలింపిక్స్‌లో పాల్గోనడం కష్టమే అనే చెప్పుకోవాలి. అంతర్జాతీయ టీ20 ర్యాంకింగ్స్‌లో పాక్ ప్రస్తుతం ఏడో స్ధానంలో కొనసాగుతోంది. ఇక లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్ జులై 12న ప్రారంభం కానున్నాయి.రీజియన్ల వారీగా ఒలింపిక్స్‌కు అర్హత సాధించే జట్లు ఇవే?ఆసియా: భారత్ఓషియానియా: ఆస్ట్రేలియాయూరప్: ఇంగ్లండ్ఆఫ్రికా: దక్షిణాఫ్రికాచదవండి: IND A Vs SA A: ధ్రువ్ జురెల్ సూపర్ సెంచరీ.. సౌతాఫ్రికా ముందు భారీ టార్గెట్ -
హ్యాట్రిక్ ఓటములు.. టోర్నీ నుంచి టీమిండియా ఔట్
హాంగ్ కాంగ్ సిక్సెస్ 2025 టోర్నమెంట్లో భారత జట్టు కథ ముగిసింది. శనివారం(నవంబర్ 8) కువైట్ చేతిలో ఓటమి పాలైన టీమిండియా.. క్వార్టర్-ఫైనల్స్‌కు చేరుకోకుండానే టోర్నీ నుంచి ఇంటిముఖం పట్టింది. పూల్ సిలో ఉన్న పాకిస్తాన్ (-0.111), కువైట్( (+1.683) కూడా ఒక్కో విజయం సాధించినప్పటికి.. భారత్(-2.256) కంటే మెరుగైన రన్‌రేట్ ఉండడంతో ఆ రెండు జట్లు క్వార్టర్ ఫైనల్‌కు అర్హత సాధించాయి. కాగా కువైట్ చేతిలో ఓడి క్వార్టర్ ఫైనల్స్ రేసు నుంచి నిష్క్రమించిన భారత్.. ఆ తర్వాత బౌల్ గ్రూపులో అదే తీరును కనబరిచింది. నాలుగు గ్రూపుల నుంచి క్వార్టర్స్‌కు అర్హత సాధించని జట్లు ఈ బౌల్ గ్రూపులో తలపడతాయి. ఈ క్రమంలో దినేష్ కార్తీక్ సారథ్యంలో భారత జట్టు వరుసగా యూఏఈ, నేపాల్ వంటి పసికూనల చేతిలో పరాజయం పాలైంది. తొలుత యూఏఈతో జరిగిన మ్యాచ్‌లో భారత్ 4 వికెట్ల తేడాతో ఓటమి చవిచూసింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 6 ఓవర్లలో 3 వికెట్లకు 107 పరుగులు చేసింది. అనంతరం యూఏఈ 5.5 ఓవర్లలో 2 వికెట్లకు 111 పరుగులు చేసి గెలుపొందింది. అనంతరం నేపాల్‌తో మ్యాచ్‌లో మెన్ ఇన్ బ్లూ ఏకంగా 92 పరుగుల తేడాతో ఘోర ఓటమి చవిచూసింది. ఇక చివరగా ఆదివారం భారత్ తమ చివరి బౌల్ మ్యాచ్‌లో శ్రీలంకతో తలపడనుంది.ఆరు ఓవర్లు.. ఆరుగురు ప్లేయర్లుకాగా హాంకాంగ్ సిక్సెస్ టోర్నీ ఒక డిఫరెంట్ ఫార్మాట్. ఈ టోర్నీలో ఒక్కో జట్టులో కేవలం ఆరుగురు ఆటగాళ్లు మాత్రమే ఉంటారు. అంతేకాకుండా ఒక్కో ఇన్నింగ్స్‌కు 6 ఓవర్లు కేటాయిస్తారు. ఈ విభిన్నమైన టోర్నీలో మొత్తం 12 జట్లు బరిలోకి దిగాయి. ఈ 12 జట్లను 4 గ్రూప్‌లుగా విభజించారు. రౌరౌండ్ రాబిన్ పద్దతిలో ప్రతీ గ్రూప్‌లోని జట్టు.. ఆ గ్రూపులోని మిగిలిన జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడుతోంది. ఆ తర్వాత ప్రతీ గ్రూపు నుంచి రెండు జట్లు క్వార్టర్ ఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. ఇక క్వార్టర్స్‌లో గెలిచిన జట్టు ప్రధాన సెమీఫైనల్‌కు అర్హత సాధించగా.. ఓడిన జట్టు ప్లేట్ సెమీఫైనల్‌కు క్వాలిఫై అవుతాయి. అదేవిధంగా లీగ్ స్టేజిలో ఇంటిముఖం పట్టిన జట్లు బౌల్ గ్రూపులో మరోసారి తలపడతాయి. మొత్తంగా మెయిన్ ఫైనల్‌తో పాటు ప్లేట్ ఫైనల్, బౌల్ ఫైనల్ మ్యాచ్‌లు కూడా జరగనున్నాయి.చదవండి: చరిత్ర సృష్టించిన అభిషేక్ శర్మ.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌గా.. -
పాక్ బౌలర్ ఓవరాక్షన్.. టీమిండియా ప్లేయర్ల పట్ల అనుచిత ప్రవర్తన
హాంగ్‌కాంగ్ సిక్సస్-2025 టోర్నీలో ఇవాళ (నవంబర్ 7) భారత్, పాకిస్తాన్ జట్లు తలపడ్డాయి. మాంగ్ కాక్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ 2 పరుగుల తేడాతో గెలుపొందింది. భారత్ నిర్దేశించిన లక్ష్యాన్ని పాక్ ఛేదిస్తుండగా వర్షం మొదలైంది. ఎంతకీ తగ్గకపోవడంతో అంపైర్లు డక్‌వర్త్ లూయిస్ పద్దతి ప్రకారం భారత్‌ను విజేతగా ప్రకటించారు.తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 6 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 86 పరుగులు చేయగా.. పాక్ 3 ఓవర్లలో వికెట్ నష్టానికి 41 పరుగుల స్కోర్ వద్ద ఉండగా మ్యాచ్ ఆగిపోయింది. భారత ఇన్నింగ్స్‌లో ఓపెనర్లు రాబిన్ ఉతప్ప (11 బంతుల్లో 28; 2 ఫోర్లు, 3 సిక్సర్లు), భరత్ చిప్లి (13 బంతుల్లో 24; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) చెలరేగి ఆడారు. ఆఖర్లో కెప్టెన్ దినేశ్ కార్తిక్ (6 బంతుల్లో 17 నాటౌట్; 2 ఫోర్లు, సిక్స్) బ్యాట్ ఝులిపించాడు. స్టువర్ట్ బిన్ని 4, మిథున్ 6 పరుగులు చేశారు. పాక్ బౌలర్లలో ముహమ్మద్ షెహజాద్ 2, అబ్దుల్ సమద్ ఓ వికెట్ తీశారు.పాక్ ఇన్నింగ్స్‌లో మాజ్ సదాఖత్ 7 పరుగులు చేసి ఔట్ కాగా.. మ్యాచ్ ముగిసే సమయానికి ఖ్వాజా నఫే (18 నాటౌట్), అబ్దుల్ సమద్ (16 నాటౌట్) క్రీజ్‌లో ఉన్నారు. ఈ టోర్నీలో భారత్ తమ తదుపరి మ్యాచ్‌లో కువైట్‌తో తలపడుతుంది. ఈ మ్యాచ్ నవంబర్ 8న జరుగుతుంది. భారతకాలమానం ప్రకారం ఈ మ్యాచ్ ఉదయం 6:40 గంటలకు మొదలవుతోంది.పాక్ బౌలర్ ఓవరాక్షన్ ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్ పేసర్ ముహమ్మద్ షెహజాద్ భారత ప్లేయర్లను రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు. ఉతప్ప, బిన్నీ వికెట్లు తీశాక పెదాలపై వేలు పెట్టుకొని సైలెంట్ అన్న అర్దం వచ్చేలా ఓవరాక్షన్ చేశాడు. షెహజాద్ అతిని టీమిండియా ఆటగాళ్లు పట్టించుకోకపోయినా భారత అభిమానులు మాత్రం సీరియస్‌గా తీసుకున్నారు.ఈ పాకిస్తాన్ ఆటగాళ్లకు ఎన్ని సార్లు బుద్ది చెప్పినా కుక్క తొక వంకర అన్న చందంగా ప్రవరిస్తారంటూ చురలంటిస్తున్నారు. షెహజాద్.. అంత ఓవరాక్షన్ వద్దంటూ సోషల్‌మీడియా వేదికగా ఏకీ పారేస్తున్నారు.కాగా, ఇటీవల జరిగిన ఆసియా కప్‌లో కూడా పాక్ ఆటగాళ్లు ఇలాగే ఓవరాక్షన్ చేశారు. ఇందుకు ప్రతిగా భారత ఆటగాళ్లు వారికి చేయాల్సిన మర్యాదంతా చేశారు. ఆ టోర్నీలో పాక్‌ను ఫైనల్ సహా మూడుసార్లు ఓడించి, వారి స్థాయిని వారికి చూపించారు. అయినా పాక్ ఆటగాళ్లు సిగ్గు లేకుండా భారత ఆటగాళ్లు ఎదురుపడిన ప్రతిసారి ఏదో ఓవరాక్షన్ చేస్తూ చీవాట్లు తింటూనే ఉన్నారు.ఆసియా కప్, మహిళల వన్డే ప్రపంచకప్‌లో వారి ఆటగాళ్లకు షేక్ హ్యాండ్ నిరాకరించినా వారి ప్రవర్తనలో మార్పు లేదు. వారి క్రికెట్ చీఫ్ నుంచి ఆసియా కప్‌ను తీసుకునేందుకు నిరాకరించి, అవమానించినా తుడుచుకుని వెళ్లిపోయారు. పైగా వారి క్రికెట్ చీఫ్ సిగ్గు లేకుండా ఆసియా కప్‌ను ఎత్తుకెళ్లి, యావత్ క్రికెట్ సమాజం నుంచి ఛీత్కారాలు ఎదుర్కొన్నాడు. పహల్గాం ఉదంతం ఆతర్వాత భారత సైన్యం ఆపరేషన్ సిందూర్ పేరిట పాకిస్తాన్ తాట తీసిన విషయం తెలిసిందే. చదవండి: అభిషేక్ శర్మపై సూర్యకుమార్ సెటైర్లు.. ‘విధ్వంసకర’ ఓపెనర్ రియాక్షన్ ఇదే -
పాకిస్తాన్‌పై భారత్ విజయం.. అక్కడ కూడా భంగపాటే..!
హాంగ్‌కాంగ్ సిక్సస్ టోర్నీలో (Hong Kong Sixes 2025) పాకిస్తాన్‌పై భారత్ డక్‌వర్త్ లూయిస్ పద్దతి ప్రకారం 2 పరుగుల తేడాతో విజయం సాధించింది. మాంగ్ కాక్ వేదికగా ఇవాళ (నవంబర్ 7) జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ తొలుత బ్యాటింగ్ చేసి నిర్ణీత 6 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 86 పరుగులు చేసింది.ఓపెనర్లు రాబిన్ ఉతప్ప (11 బంతుల్లో 28; 2 ఫోర్లు, 3 సిక్సర్లు), భరత్ చిప్లి (13 బంతుల్లో 24; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) చెలరేగి ఆడారు. ఆఖర్లో కెప్టెన్ దినేశ్ కార్తిక్ (6 బంతుల్లో 17 నాటౌట్; 2 ఫోర్లు, సిక్స్) సైతం బ్యాట్ ఝులిపించాడు. భారత ఇన్నింగ్స్‌లో స్టువర్ట్ బిన్ని 4, మిథున్ 6 పరుగులు చేశారు. పాక్ బౌలర్లలో ముహమ్మద్ షెహజాద్ 2, అబ్దుల్ సమద్ ఓ వికెట్ తీశారు.అనంతరం పాక్ 87 పరుగుల లక్ష్య ఛేదనకు దిగగా వరుణుడు అడ్డు పడ్డాడు. వారి స్కోర్ 41/1 (3 ఓవర్లు) వద్ద ఉండగా వర్షం మొదలైంది. వర్షం ఎంతకీ తగ్గకపోవడంతో డక్‌వర్త్ లూయిస్ పద్దతి ప్రకారం భారత్‌ను విజేతగా ప్రకటించారు.మ్యాచ్ ముగిసే సమయానికి ఖ్వాజా నఫే (18 నాటౌట్), అబ్దుల్ సమద్ (16 నాటౌట్) క్రీజ్‌లో ఉన్నారు. మాజ్ సదాఖత్ (7) ఔటయ్యాడు. సదాఖత్ వికెట్ స్టువర్ట్ బిన్నికి దక్కింది. ఈ టోర్నీలో భారత్ తమ తదుపరి మ్యాచ్‌లో కువైట్‌తో తలపడుతుంది. ఈ మ్యాచ్ నవంబర్ 8న జరుగుతుంది. భారతకాలమానం ప్రకారం ఈ మ్యాచ్ ఉదయం 6:40 గంటలకు మొదలవుతోంది. కాగా, క్రికెట్లో పాకిస్తాన్‌పై భారత్ గెలవడం ఇటీవలికాలంలో ఇది ఐదోసారి. పహల్గాం ఉదంతం తర్వాత భారత సీనియర్ పురుషుల జట్టు పాక్‌ను ఆసియా కప్-2025లో మూడు సార్లు ఓడించింది. అనంతరం భారత సీనియర్ మహిళల జట్టు వన్డే ప్రపంచకప్‌లో పాక్‌ను చిత్తు చేసింది. తాజాగా సూపర్ సిక్సస్ టోర్నీలోనూ పాక్‌కు భారత్ చేతిలో భంగపాటు ఎదురైంది.చదవండి: పాకిస్తాన్ కెప్టెన్‌గా ఎవరూ ఊహించని ప్లేయర్.. -
ఆసియాకప్‌లో ఓవరాక్షన్.. పాక్ ఆటగాడిపై 2 మ్యాచ్‌ల బ్యాన్
ఆసియాకప్-2025లో భారత్‌తో జరిగిన మ్యాచ్‌లలో ఓవరాక్షన్ చేసిన పాకిస్తాన్ స్పీడ్ స్టార్ హారిస్ రవూఫ్‌కు ఐసీసీ భారీ షాకిచ్చింది. రవూఫ్‌పై రెండు మ్యాచ్‌ల నిషేధాన్ని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ విధించింది. ఈ మెగా టోర్నీలో రవూఫ్ రెండు సార్లు తమ ప్రవర్తనా నియమావళిని ఉల్లఘించినందుకు ఈ చర్యలు తీసుకున్నట్లు ఐసీసీ ఓ ప్రకటనలో పేర్కొంది.అసలేమి జరిగింగదంటే?ఆసియాకప్‌లో భాగంగా లీగ్ స్టేజిలో సెప్టెంబర్ 14న భారత్-పాక్ జట్లు తలపడ్డాయి. అయితే ఈ మ్యాచ్‌లో భారత ఓపెనర్లు శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మలను రవూఫ్ దుర్భాషలాడాడు. అంతేకాకుండా వారితో పాక్ పేసర్ వాగ్వాదానికి దిగాడు. దీంతో అతడి మ్యాచ్ ఫీజులో 30 శాతం జరిమానా ఐసీసీ విధించింది.అదేవిధంగా రెండు డిమెరిట్ పాయింట్లు కూడా అతడి ఖాతాలో చేరాయి. అయినా కూడా రవూఫ్ ప్రవర్తన ఏ మాత్రం మారలేదు. సూపర్-4 మ్యాచ్‌లో రవూఫ్ తన వక్రబుద్దిని చాటుకున్నాడు. ఫీల్డింగ్ చేస్తుండగా భారత అభిమానులు కోహ్లి కోహ్లి అని అరవగా.. అందుకు బదులుగా రవూఫ్ భారత్‌కు చెందిన 6 రఫెల్ జెట్ ఫ్లైట్స్‌ను కూల్చామని, యుద్దంలో తమదే విజయమని పేర్కొంటూ 6-0 సంజ్ఞలు చేశాడు.#Indian are crying because #HarisRauf trolled 1000s of them alone . pic.twitter.com/hx8qACIBm2— Zeitung (@Himat75) September 22, 2025దీంతో మళ్లీ అతడి మ్యాచ్ ఫీజులో 30 శాతం కోతను ఐసీసీ విధించింది. మళ్లీ రెండు డిమెరిట్ పాయింట్లు ఇవ్వబడ్డాయి. మొత్తంగా అతడి ఖాతాలో నాలుగు డిమెరిట్ పాయింట్లు వచ్చి చేరాయి. అయితే 24 నెలల వ్యవధిలో 4 లేదా అంతకంటే ఎక్కువ డీమెరిట్ పాయింట్లు పొందితే.. ఐసీసీ సదరు ఆటగాడిపై ఒక టెస్ట్ మ్యాచ్ లేదా రెండు వన్డేలు లేదా రెండు టీ20ల నిషేధం విధిస్తుంది. ఈ కారణాంగానే ఫైసలాబాద్ వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి వన్డేకు రవూఫ్ దూరమయ్యాడు.సూర్యకు షాక్..అదేవిధంగా లీగ్ స్టేజిలో పాకిస్తాన్‌పై సాధించిన విజయాన్ని ఫహల్గాం ఉగ్రదాడి బాధితులు, సైనికులకు అంకితమిస్తున్నట్లు ప్రకటించిన భారత కెప్టెన్ సూర్యకుమార్‌పై కూడా ఐసీసీ చర్యలు తీసుకుంది. సూర్యకుమార్ యాదవ్‌కు మ్యాచ్ ఫీజులో 30 శాతం జరిమానాతో పాటు రెండు డీమెరిట్ పాయింట్లు కూడా విధించబడ్డాయి. సూర్య ఖాతాలో మరో రెండు డీమెరిట్ పాయింట్లు చేరితే 2 మ్యాచ్‌ల నిషేదం ఎదుర్కొక తప్పదు. అదేవిధంగా హ్యారిస్ రవూఫ్‌కు జెట్ విమానం కూలినట్లగా సైగ చేసిన జస్ప్రీత్ బుమ్రాను కూడా ఐసీసీ మందలించింది. -
IND vs PAK T20: భారత్- పాకిస్తాన్ మ్యాచ్ ఆరోజే
దుబాయ్: ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) రైజింగ్ స్టార్స్ టీ20 టోర్నమెంట్ ఈ నెల 14 నుంచి ప్రారంభం కానుంది. దోహా, ఖతర్ వేదికగా జరగనున్న ఈ టోర్నీలో మొత్తం 8 జట్లు రెండు గ్రూప్‌లుగా పాల్గొననున్నాయి. ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్’ పేరుతోఒమన్, పాకిస్తాన్, యూఏఈతో కలిసి భారత్ గ్రూప్ ‘బి’లో పోటీ పడుతుండగా... అఫ్గానిస్తాన్, బంగ్లాదేశ్, హాంకాంగ్, శ్రీలంక గ్రూప్ ‘ఎ’ నుంచి బరిలోకి దిగనున్నాయి. గతంలో ఏసీసీ ‘ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్’ పేరుతో నిర్వహించిన ఈ టోర్నీని ఈ సారి ‘రైజింగ్ స్టార్స్ టి20 టోర్నమెంట్’ పేరుతో నిర్వహించనున్నారు. ఇందులో భారత్, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్ దేశాలకు చెందిన ‘ఎ’ జట్లు పాల్గొననుండగా... మిగిలిన మూడు అసోసియేట్ దేశాలైన హాంకాంగ్, ఒమాన్, యూఏఈ ప్రధాన జట్లు బరిలోకి దిగనున్నాయి. ఈ నెల 14 నుంచి 19 వరకు రోజుకు రెండు మ్యాచ్‌ల చొప్పున నిర్వహించనున్నారు. నవంబర్ 16నఇందులో భాగంగా నవంబర్ 16న దాయాది పాకిస్తాన్‌తో భారత్ మ్యాచ్ ఆడనుంది. నవంబర్ 21న సెమీఫైనల్స్ నిర్వహించనుండగా... నవంబర్ 23న ఫైనల్ జరగనుంది. 2013 నుంచి ఎమర్జింగ్ టీమ్స్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నారు. ఈ టోర్నీ ఆరంభంలో అండర్–23 జట్లు పోటీపడగా... ఆ తర్వాత ‘ఎ’ జట్లకు మార్చారు. చివరిసారిగా 2024లోఇప్పటి వరకు పాకిస్తాన్, శ్రీలంక జట్లు రెండేసి సార్లు విజేతగా నిలవగా... భారత్, అఫ్గానిస్తాన్ ఒక్కోసారి ట్రోఫీ చేజిక్కించుకున్నాయి. చివరిసారిగా 2024లో జరిగిన ఈ టోర్నమెంట్లో అఫ్గానిస్తాన్ విజేతగా నిలిచింది. ఒమన్‌లో జరిగిన టోర్నీ ఫైనల్లో శ్రీలంకపై అఫ్గాన్ విజయం సాధించింది. చదవండి: పీఎకేల్-2025 విజేతగా దబంగ్ ఢిల్లీ -
దిగజారిన పీసీబీ చీఫ్ నఖ్వీ!... ఈసారి..
ఆసియా టీ20 కప్-2025 టోర్నమెంట్లో చాంపియన్‌గా నిలిచిన టీమిండియా ఇప్పటి వరకు ట్రోఫీని మాత్రం ముద్దాడలేకపోయింది. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) చైర్మన్, ఆసియా క్రికెట్ మండలి (ACC) అధ్యక్షుడు మొహ్సిన్ నఖ్వీ ఇందుకు ప్రధాన కారణం.పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్- పాకిస్తాన్ (IND vs PAK) తొలిసారిగా ఆసియా కప్ టోర్నీలో తొలిసారిగా ముఖాముఖి తలపడ్డాయి. ఈ క్రమంలో దాయాది దుశ్చర్యలకు నిరసనగా టీమిండియా ఆటగాళ్లు తొలుత లీగ్ దశలో.. పాక్ ప్లేయర్లతో షేక్‌హ్యాండ్ (No ShakeHand)కు నిరాకరించారు.పప్పులు ఉడకవని తెలుసుకునిదీనిని అవమానంగా భావించిన పాక్ బోర్డు.. టీమిండియాను నిందల పాలు చేయాలని ప్రయత్నాలు చేసింది. భారత్‌తో మ్యాచ్‌కు అంపైర్‌గా వ్యవహరించిన వ్యక్తిని తప్పించాలంటూ రచ్చ చేసింది. అయితే, అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) దిగిరాకపోవడంతో తమ పప్పులు ఉడకవని తెలుసుకుని మిన్నకుండిపోయింది.అయితే, సూపర్-4 మ్యాచ్‌లోనూ భారత జట్టు షేక్‌హ్యాండ్‌కు నిరాకరించింది. ఇందుకు ప్రతిగా పాక్ ఆటగాళ్లు కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. గన్ పేలుస్తున్నట్లు సెలబ్రేషన్స్ చేసుకుంటూ వక్రబుద్ధి చాటుకున్నారు. ఇక ఫైనల్లోనూ దాయాది పాక్‌తో.. సెప్టెంబరు 28న తలపడిన టీమిండియా ఐదు వికెట్ల తేడాతో గెలిచి ట్రోఫీ గెలుచుకుంది.నఖ్వీ చేతుల మీదుగా తీసుకోమునిబంధనల ప్రకారం తానే టీమిండియాకు ట్రోఫీ అందజేస్తానంటూ మొహ్సిన్ నఖ్వీ ముందుకు వచ్చాడు. అయితే, అతడు కేవలం పీసీబీ, ఏసీసీ చీఫ్ మాత్రమే కాకుండా.. పాక్ మంత్రి కూడా కావడంతో భారత జట్టు అతడి చేతుల మీదుగా కప్ అందుకునేందుకు నిరాకరించింది.ఈ క్రమంలో ట్రోఫీతో పాటు.. మెడల్స్ కూడా తనతోపాటు ఎత్తుకెళ్లిన నఖ్వీ ఇంత వరకు వాటిని తిరిగి ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఇటీవల నఖ్వీకి ఇ-మెయిల్ పంపింది. ట్రోఫీ తమకు అప్పగించకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించింది. ఐసీసీ వద్దే పంచాయతీ తేలుతుందిఅయినప్పటికీ నఖ్వీ బుద్ధి మారలేదు. తన చేతుల మీదుగానే ట్రోఫీ ఇస్తానని.. ఇందుకోసం బీసీసీఐ ఆటగాళ్లను తన దగ్గరకు పంపించాలంటూ అహంకారం ప్రదర్శించాడు. దీంతో ఐసీసీ వద్దే పంచాయతీ తేల్చుకునేందుకు బీసీసీఐ సిద్ధమైంది.తాజా సమాచారం ప్రకారం.. బీసీసీఐ వర్గాలు ANIతో మాట్లాడుతూ.. నఖ్వీ ట్రోఫీని ఏసీసీ ప్రధాన కార్యాలయం నుంచి తరలించాడని పేర్కొన్నాయి. ‘‘కొన్నిరోజుల క్రితం బీసీసీఐ అధికారి ఒకరు యూఏఈలో ఉన్న ఏసీసీ ప్రధాన కార్యాలయానికి వెళ్లారు.మరింత దిగజారిన పీసీబీ చీఫ్ నఖ్వీ!... ఈసారి..ఏసీసీ ఆఫీస్‌లో ట్రోఫీ ఉందా అని ఆరా తీశారు. అయితే, స్టాఫ్ చెప్పిన సమాధానం విని ఆయన ఆశ్చర్యపోయారు. ట్రోఫీని ఇక్కడి నుంచి తరలించి.. అబుదాబిలో ఓ చోటు నఖ్వీ దాచిపెట్టాడని వాళ్లు చెప్పారు’’ అని సదరు వర్గాలు పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో గెలిచిన జట్టు ట్రోఫీని ఎత్తుకెళ్లిన నఖ్వీ మరీ ఇంతలా దిగజారిపోతాడని అనుకోలేదంటూ నెటిజన్లు అతడిపై వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు.కాగా ఆసియా కప్-2025 టోర్నీలో లీగ్ దశలో పాక్‌ను ఏడు వికెట్ల తేడాతో చిత్తు చేసిన భారత్.. సూపర్-4 మ్యాచ్‌లో ఆరు వికెట్ల తేడాతో జయభేరి మోగించింది. ఫైనల్లో ఐదు వికెట్ల తేడాతో గెలిచి టైటిల్ కైవసం చేసుకుంది. చదవండి: అతడు అదరగొట్టాడు.. కాబట్టి నితీశ్ రెడ్డిపై వేటు పడొచ్చు: మాజీ కెప్టెన్ -
BCCI: ఇస్తారా? లేదా?.. పీసీబీ చీఫ్ నక్వీకి బీసీసీఐ స్ట్రాంగ్ వార్నింగ్
ఆసియా టీ20 కప్-2025 ట్రోఫీ ఇంత వరకు టీమిండియాకు అందనే లేదు. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB), ఆసియా క్రికెట్ మండలి (ACC) చైర్మన్ మొహ్సిన్ నక్వీ మొండి వైఖరి ఇందుకు కారణం. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) నక్వీకి గట్టిగానే హెచ్చరికలు జారీ చేసినట్లు తెలుస్తోంది.తీవ్ర పరిణామాలుట్రోఫీ గనుక టీమిండియాకు అప్పగించకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని బీసీసీఐ నక్వీకి అధికారికంగా ఇ- మెయిల్ పంపినట్లు సమాచారం. బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా ఈ విషయాన్ని వెల్లడించినట్లు ఇండియా టుడే పేర్కొంది. ఒకవేళ నక్వీ గనుక తమకు సరైన రీతిలో సమాధానం ఇవ్వకుంటే.. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC)ని ఆశ్రయిస్తామని చెప్పినట్లు తెలిపింది.అదే జరిగితే పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారుతుందని హెచ్చరించామని.. వీలైనంత త్వరగా ట్రోఫీ పంపించాలని మెయిల్ రాసినట్లు పేర్కొంది. కాగా ఈసారి టీ20 ఫార్మాట్లో జరిగిన ఆసియా కప్ టోర్నీలో టీమిండియా చాంపియన్‌గా నిలిచిన విషయం తెలిసిందే.టీమిండియా నిరాకరణలీగ్, సూపర్-4 దశల్లో పరాజయమన్నదే ఎరుగక ఫైనల్ చేరిన సూర్యకుమార్ సేన.. టైటిల్ పోరు (సెప్టెంబరు 28)లో దాయాది పాకిస్తాన్‌ను ఓడించి ట్రోఫీ గెలుచుకుంది. అయితే, ఏసీసీ అధ్యక్షుడిగా ఉన్న నక్వీ నుంచి కప్ తీసుకునేందుకు టీమిండియా నిరాకరించింది. మరోవైపు.. నక్వీ మాత్రం పట్టువీడలేదు. ట్రోఫీ, మెడల్స్ తీసుకుని హోటల్‌కు పారిపోయాడు.పద్ధతి ప్రకారమేతన చేతుల మీదుగానే టీమిండియా ట్రోఫీ తీసుకోవాలని.. ఒకవేళ ఎవరైనా వచ్చి అడిగినా ట్రోఫీ ఇవ్వొద్దని నక్వీ ఏసీసీ ప్రతినిధులకు చెప్పినట్లు సమాచారం. దీంతో బీసీసీఐ కూడా ఈ విషయాన్ని సీరియస్‌గానే తీసుకుంది. పద్ధతి ప్రకారమే ట్రోఫీని తమ వద్దకు రప్పించుకునేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ఇందులో భాగంగానే మెయిల్ కూడా పంపినట్లు తెలుస్తోంది.పూర్తి స్పృహలో ఉండేకాగా నక్వీ చేతుల మీదుగా ట్రోఫీని టీమిండియా నిరాకరించడానికి గల కారణాన్ని సైకియా గతంలో వెల్లడించాడు. ‘‘ఏసీసీ చైర్మన్‌గా ఉన్న వ్యక్తి పాకిస్తాన్ సీనియర్ రాజకీయ నాయకుల్లో ఒకరు. అందుకే మేము ఈ నిర్ణయం తీసుకున్నాము. పూర్తి స్పృహలో ఉండే ఈ నిర్ణయం తీసుకున్నాము’’ అని దేవజిత్ సైకియా తెలిపాడు.ఉగ్రదాడికి నిరసనగాపహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఆసియా కప్ వేదికగా చిరకాల ప్రత్యర్థులు భారత్- పాకిస్తాన్ తొలిసారి ముఖాముఖి తలపడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉగ్రదాడికి నిరసనగా టీమిండియా పాక్ ఆటగాళ్లతో షేక్‌హ్యాండ్‌కు నిరాకరించింది. దీంతో రచ్చకెక్కిన పీసీబీ.. అతి చేసింది.ఇందుకు అనుగుణంగానే పాక్ ఆటగాళ్లు హ్యారిస్ రవూఫ్, సాహిబ్జాదా ఫర్హాన్ మైదానంలో టీమిండియా ఆటగాళ్లు, అభిమానులను రెచ్చగొట్టే విధంగా వ్యవహరించి.. ఐసీసీతో చివాట్లు తిన్నారు. ఆ తర్వాత ఫైనల్లో దాయాది చేతిలో ఓడి ఇంటిబాట పట్టగా.. పీసీబీ చైర్మన్ నక్వీ ఇలా మెడల్స్, ట్రోఫీ ఎత్తుకెళ్లడం గమనార్హం.చదవండి: సౌతాఫ్రికాతో సిరీస్‌కు భారత జట్టు ప్రకటన.. కెప్టెన్‌గా రిషభ్ పంత్ -
పాక్ క్రికెట్ దిగ్గజం కన్నుమూత
పాకిస్తాన్ క్రికెట్‌కు మూలపురుషులుగా నిలిచిన మహ్మద్ బ్రదర్స్‌లో ఒకరైన వజీర్ మహ్మద్ (95) ఇవాళ (అక్టోబర్ 13) యునైటెడ్ కింగ్‌డమ్‌లోని బర్మింగ్‌హామ్‌లో తుదిశ్వాస విడిచారు. వయో భారం కారణంగా వజీర్ కన్నుమూశారు. 1952లో భారత్, పాక్ మధ్య జరిగిన తొలి టెస్ట్ సిరీస్‌లో పాల్గొన్న వజీర్, అప్పటి నుంచి 1959 వరకు 20 టెస్టులు ఆడి 801 పరుగులు చేశారు.వజీర్ తన కెరీర్లో తొలి టెస్ట్ మ్యాచ్‌ను భారత్‌తోనే ఆడారు. ఆ మ్యాచ్‌లో అతను కేవలం 12 పరుగులు మాత్రమే చేసి, రెండు ఇన్నింగ్స్‌ల్లో వినూ మన్కడ్ బౌలింగ్‌లో ఔటయ్యారు. వజీర్‌కు ఫస్ట్ క్లాస్ క్రికెట్లో మంచి రికార్డు ఉంది. 105 మ్యాచ్‌ల్లో 11 సెంచరీలు, 26 అర్ధ సెంచరీల సాయంతో 4930 పరుగులు చేశారు.వజీర్ పాక్‌కు ప్రాతినిథ్యం వహించిన నలుగురు మహ్మద్ బ్రదర్స్‌లో ఒకరు. వజీర్ సోదరుడు హనీఫ్ మహ్మద్ క్రికెట్ ప్రపంచానికి సుపరిచితుడు. హనీఫ్ 2016 ఆగస్టు 11న 81 ఏళ్ల వయసులో కన్నుమూశారు.వజీర్ మరణించే సమయానికి నీల్ హార్వీ, ట్రెవర్ మెక్‌మహన్ తర్వాత మూడవ అతిపెద్ద వయస్సు గల టెస్ట్ క్రికెటర్‌గా ఉన్నారు. -
అభిషేక్ గొప్ప ప్లేయరేమి కాదు.. 3 బంతుల్లో ఔట్ చేస్తా! పాక్ బౌలర్ ఓవరాక్షన్
అంతర్జాతీయ టీ20ల్లో టీమిండియా యువ ఓపెనర్ అభిషేక్ శర్మ వరల్డ్ నంబర్ 1 బ్యాటర్‌గా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అభిషేక్ ఇటీవలే ముగిసిన ఆసియాకప్‌లో దుమ్ములేపాడు. ఈ మెగా టోర్నీలో 7 మ్యాచ్‌లు ఆడిన అభిషేక్ 200 స్ట్రైక్ రేట్‌తో 314 పరుగులు చేశాడు.ప్లేయర్ ఆఫ్‌ది టోర్నీగా నిలిచిన అభిషేక్ ఇన్నింగ్స్‌లలో మూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ ఖండాంతర టోర్నీలో దాయాది పాకిస్తాన్‌కు అభిషేక్ చుక్కలు చూపించాడు. ఒక ఫైనల్లో తప్ప మిగితా లీగ్, సూపర్-8లలో పాక్ బౌలర్లను శర్మ ఉతికారేశాడు.సూపర్-4 మ్యాచ్‌లో అయితే అభిషేక్ బ్యాటింగ్ జోరుకు పాక్ స్పీడ్‌స్టార్ హ్యారిస్ రౌఫ్ తన సహనాన్ని కోల్పోయాడు. అభిషేక్‌తో వాగ్వాదానికి దిగాడు. రౌఫ్‌కు అభిషేక్ బ్యాట్‌తోనే సమాధానం చెప్పాడు. ఈ పంజాబ్ క్రికెటర్ పాక్‌పై మూడు మ్యాచ్‌లు ఆడి 110 పరుగులు చేశాడు.ఇక ఇది ఇలా ఉండగా.. తాజాగా అభిషేక్ శర్మపై పాకిస్తాన్ పేసర్ ఇహ్సానుల్లా ఓ ఛాలెంజ్ విసిరాడు. అభిషేక్ తన బౌలింగ్‌ను ఎదుర్కొలేడని.. కేవలం మూడు బంతుల్లో ఔట్ చేయగలని అతడు చెప్పుకొచ్చాడు. ఇహ్సానుల్లా పాక్ తరపున కేవలం 4 టీ20ల్లో మాత్రమే ఆడాడు. అభిషేక్‌తో కలిసి అతడు ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. "నేను భారత్‌తో ఆడితే అభిషేక్ నా బౌలింగ్‌ను ఎదుర్కోలేడు. అతడిని ఔట్ చేయడానికి నాకు కేవలం మూడు బంతులు చాలు అని ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇహ్సానుల్లా పేర్కొన్నాడు. ఈ పాక్ ఆటగాడికి ఇండియన్ ఫ్యాన్స్ కౌంటరిస్తున్నారు.ఆసియాకప్ మ్యాచ్‌లు చూడలేదా? అయితే మీ బౌలర్లను అభిషేక్ గురించి అడుగు అని పోస్ట్‌లు పెడుతున్నారు. అభిషేక్ తిరిగి భారత జట్టు తరపున ఈ నెలలో ఆస్ట్రేలియాతో జరగనున్న టీ20 సిరీస్‌లో ఆడనున్నాడు.చదవండి: వన్డే కెప్టెన్‌గా రోహిత్‌పై వేటు!.. నాకు ముందే తెలుసు: గిల్ -
భారత్-పాక్ మ్యాచ్‌లు వద్దు.. అందుకు వారు ఒప్పుకొంటారా?: బీసీసీఐ
ఆసియాప్-2025లో భారత్-పాకిస్తాన్ జట్ల మధ్య ఊహించని పరిణామాలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ టోర్నీ అంతటా భారత జట్టు ఆటగాళ్లు పాక్ ప్లేయర్లతో అంటిముట్టనట్టే ఉన్నారు. కనీసం కరచాలనం చేసేందుకు కూడా ఇష్టపడలేదు. అంతేకాకుండా ఫైనల్ మ్యాచ్ అనంతరం ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ACC) చీఫ్ మొహ్సిన్ నఖ్వీ చేతుల మీదగా ట్రోఫీని తీసుకోవడానికి కూడా భారత్ నిరాకరించింది.నఖ్వీ పీసీబీ చీఫ్‌తో పాటు పాక్ మంత్రిగా ఉండడమే అందుకు కారణం. అయితే ఈ ఆసియాకప్‌లో జరిగిన సంఘటనలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కొంతమంది భారత్‌కు సపోర్ట్ చేస్తే మరి కొతమంది పాక్‌కు మద్దతుగా నిలిచారు.ఇదే విషయంపై ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ మైఖేల్ అథర్టన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఇరు దేశాల మధ్య సమస్యలు పరిష్కారం అయ్యే వరకు భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌లను నిర్వహించవద్దని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ)కి అథర్టన్ సూచించాడు. అతడి వ్యాఖ్యలపై బీసీసీఐ అధికారి ఒకరు స్పందించారు."భారత్-పాకిస్తాన్ మధ్య సమస్యలు అంత సులువుగా పరిష్కరం కావు. బయట నుంచి వ్యక్తులు ఏదైనా మాట్లాడుతారు. ఏదైనా చెప్పినంత ఈజీ కాదు. అందుకు స్పాన్సర్లు, బ్రాడ్కాస్టర్లు అంగీకరిస్తారా? ప్రస్తుత పరిస్థితుల్లో టీమిండియానే కాదు ఏ ప్రధాన జట్టు అయినా టోర్నమెంట్ నుండి వైదొలిగితే తర్వాత స్పాన్సర్లను ఆకర్షించడం చాలా కష్టమని" సదరు అధికారి పేర్కొన్నారు. కాగా ఈ ఏడాది ఆసియాకప్‌లో మూడు సార్లు పాక్-భారత్ జట్లు తలపడ్డాయి. మూడు మ్యాచ్‌లలోనూ పాక్‌ను టీమిండియా చిత్తు చేసింది. అయితే విన్నింగ్ ట్రోఫీ ఇప్పటివరకు ఇంకా భారత్ వద్ద చేరలేదు.చదవండి: Prithvi Shaw: భారీ శతకంతో చెలరేగిన పృథ్వీ షా -
IND vs PAK: పాకిస్తాన్ క్రికెటర్‌కు భారీ షాకిచ్చిన ఐసీసీ
పాకిస్తాన్ మహిళా క్రికెటర్ సిద్రా ఆమిన్ (Sidra Amin)కు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) భారీ షాకిచ్చింది. భారత్‌తో మ్యాచ్ సందర్భంగా ఐసీసీ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు గానూ ఆమెను మందలించింది. అదే విధంగా.. ఓ డీమెరిట్ (Demerit Point) పాయింట్‌ను కూడా సిద్రా ఖాతాలో జమ చేసింది.అసలేం జరిగిందంటే... ఐసీసీ మహిళల వన్డే వరల్డ్‌కప్-2025 టోర్నీకి భారత్ ఆతిథ్యం ఇస్తుండగా.. పాకిస్తాన్ ఆడే మ్యాచ్‌లు మాత్రం తటస్థ వేదికైన శ్రీలంకలో జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో దాయాదులు భారత్- పాక్ మధ్య ఆదివారం (అక్టోబరు 5) కొలంబో వేదికగా తలపడ్డాయి.భారత్ 247 పరుగులకు ఆలౌట్ఆర్.ప్రేమదాస స్టేడియంలో అనుకోని విధంగా టాస్ గెలిచిన పాకిస్తాన్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 247 పరుగులకు ఆలౌట్ అయింది. ఓపెనర్లు ప్రతికా రావల్ (31), స్మృతి మంధాన (23) ఫర్వాలేదనిపించగా.. వన్‌డౌన్ బ్యాటర్ హర్లీన్ డియోల్ 46 పరుగులతో రాణించింది.మిగతా వారిలో జెమీమా రోడ్రిగెస్ (32), దీప్తి శర్మ (25), రిచా ఘోష్ (35 నాటౌట్) చెప్పుకోదగ్గ స్కోర్లు చేశారు. పాక్ బౌలర్లలో డయానా బేగ్ నాలుగు వికెట్లు దక్కించుకోగా.. కెప్టెన్ ఫాతిమా సనా షేక్, సైదా ఇక్బాల్ చెరో రెండు, రమీన్ షమీమ్, నష్రా సంధూ ఒక్కో వికెట్ వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.బౌలర్ల విజృంభణఇక లక్ష్య ఛేదనకు దిగిన పాకిస్తాన్‌కు భారత బౌలర్లు చుక్కలు చూపించారు. ఓపెనర్లు మునీబా అలీ (2), సదాఫ్ షమాస్ (6) ఇలా వచ్చి అలా వెళ్లారు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన వాళ్లు కూడా ఎక్కువ సేపు నిలవలేకపోయారు.సిద్రా ఆమిన్ హాఫ్ సెంచరీఐదో నంబర్లో ఆడిన నటాలియా పర్వేజ్ 33 పరుగులతో ఫర్వాలేదనిపించగా.. వన్‌డౌన్ బ్యాటర్ సిద్రా ఆమిన్ ఒంటరి పోరాటం చేసింది. 106 బంతులు ఎదుర్కొని తొమ్మిది ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 81 పరుగులు చేసింది. అయితే, పాక్ ఇన్నింగ్స్ 40వ ఓవర్ ఐదో బంతికి స్నేహ్ రాణా బౌలింగ్‌లో హర్మన్‌ప్రీత్‌కు క్యాచ్ ఇవ్వడంతో సిద్రా ఇన్నింగ్స్‌కు తెరపడింది.అప్పటికే పాక్ ఓటమి దాదాపు ఖరారు కాగా.. సిద్రా తన బ్యాట్‌ను నేలకేసి కొట్టి అసహనం వ్యక్తం చేసింది. ఈ చర్యను తీవ్రంగా పరిగణించిన ఐసీసీ.. ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు గానూ ఆమెకు శిక్ష విధించింది.అందుకే సిద్రాకు పనిష్మెంట్ఈ మేరకు.. ‘‘ఐసీసీ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.2 ప్రకారం.. అంతర్జాతీయ మ్యాచ్‌లో క్రికెట్ పరికరాలు, దుస్తులు లేదంటే గ్రౌండ్ ఎక్విప్మెంట్, ఫిట్టింగ్స్ వంటి వాటికి నష్టం కలిగించేలా వ్యవహరించడం నేరం. సిద్రా ఈ నిబంధనను ఉల్లంఘించింది.అందుకే ఆమెను మందలించడంతో పాటు.. తన క్రమశిక్షణా రికార్డులో ఓ డీమెరిట్ పాయింట్ జత చేస్తున్నాం. గత 24 నెలల కాలంలో ఆమె చేసిన మొదటి తప్పిదం కాబట్టి ఇంతటితో సరిపెడుతున్నాం’’ అని ఐసీసీ సోమవారం నాటి ప్రకటనలో పేర్కొంది. సద్రా తన తప్పును అంగీకరించింది కావున తదుపరి విచారణ అవసరం లేకుండా పోయిందని.. ఐసీసీ ఈ సందర్భంగా తెలియజేసింది.ఆధిపత్యం చాటుకున్న భారత్‌కాగా సిద్రా అర్ధ శతకం వృథాగా పోయింది. భారత బౌలర్ల ధాటికి 43 ఓవర్లలో 159 పరుగులు మాత్రమే చేసి పాక్ ఆలౌట్ అయింది. దీంతో భారత్ 88 పరుగుల భారీ తేడాతో విజయం సాధించి.. వన్డేల్లో ముఖాముఖి పోరులో మరోసారి తమ ఆధిపత్యాన్ని (12-0) చాటుకుంది. పాక్‌తో తాజా మ్యాచ్‌లో భారత బౌలర్లలో ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ క్రాంతి గౌడ్, దీప్తి శర్మ మూడేసి వికెట్లతో చెలరేగగా.. స్నేహ్ రాణా రెండు వికెట్లు తీసింది. దీప్తి, హర్మన్ రెండు రనౌట్లలో భాగమయ్యారు.స్ప్రే ప్రయోగిస్తూఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్ సందర్భంగా మైదానంలో పురుగుల వల్ల భారత బ్యాటర్లు ఇబ్బంది పడుతున్న వేళ పాక్ కెప్టెన్ ఫాతిమా సనా స్ప్రే ప్రయోగిస్తూ.. పురుగులను వెళ్లగొట్టడం హైలైట్‌గా నిలిచింది. అంపైర్ల అనుమతితోనే ఆమె ఇలా చేయడం గమనార్హం.చదవండి: World Cup 2025: టీమిండియా చేతిలో ఓడినా చరిత్ర సృష్టించిన పాకిస్తాన్ -
పాక్‌పై రికార్డు విజయం.. ఆసీస్ దిగ్గజాన్ని అధిగమించిన టీమిండియా కెప్టెన్
మహిళల వన్డే వరల్డ్‌కప్ 2025లో (Women's Cricket World Cup 2025) భాగంగా పాకిస్తాన్‌తో నిన్న (అక్టోబర్ 5) జరిగిన మ్యాచ్‌లో (India vs Pakistan) టీమిండియా 88 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో భారత్ తొలుత బ్యాటింగ్ చేసి ఓ మోస్తరు స్కోర్‌కే (247) పరిమితమైనప్పటికీ.. ఆతర్వాత ఆ స్కోర్‌ను విజయవంతంగా కాపాడుకుంది. క్రాంతి గౌడ్ (10-3-20-3) అద్భుతమైన బౌలింగ్‌తో పాక్ పతనాన్ని శాశించింది. క్రాంతితో పాటు దీప్తి శర్మ (9-0-45-3), స్నేహ్ రాణా (8-0-38-2) కూడా సత్తా చాటడంతో పాక్ 43 ఓవర్లలో 159 పరుగులకే కుప్పకూలింది. పాక్ తరఫున సిద్రా అమీన్ (81) ఒంటరిపోరాటం చేసినప్పటికీ ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. అంతకుముందు భారత ఇన్నింగ్స్ డయానా బేగ్ (10-1-69-4) ధాటికి తడబడింది. టాపార్డర్ మొత్తానికి మంచి ఆరంభాలు లభించినా, ఒక్కరు కూడా చెప్పుకోదగ్గ స్కోర్ చేయలేకపోయారు. ఆఖర్లో రిచా ఘోష్ (20 బంతుల్లో 35 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్ ఆడి టీమిండియాకు గౌరవప్రదమైన స్కోర్ అందించింది.ఈ గెలుపుతో భారత్ వన్డే ఫార్మాట్లో దాయాదిపై తమ రికార్డును (12-0) మరింత మెరుగుపర్చుకుంది. అలాగే వరల్డ్‌కప్ టోర్నీల్లోనూ పాక్‌పై ఆధిపత్యాన్ని (5-0) కొనసాగించింది. పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత క్రికెట్ జట్లు పాక్‌ను వరుసగా నాలుగు ఆదివారాల్లో ఓడించాయి. దీనికి ముందు భారత పురుషుల జట్టు ఆసియా కప్‌లో పాక్‌ను వరుసగా మూడు ఆదివారాల్లో ఓడించి ఆసియా ఛాంపియన్‌గా అవతరించింది.ఇదిలా ఉంటే, నిన్నటి గెలుపుతో భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (Harmanpreet kaur) ఓ అరుదైన ఘనత సాధించింది. వన్డేల్లో ఆమె ప్లేయర్‌గా 90వ విజయాన్ని నమోదు చేసి, మహిళల వన్డే క్రికెట్ చరిత్రలో అత్యధిక విజయాలు సాధించిన ప్లేయర్ల జాబితాలో ఏడో స్థానానికి ఎగబాకింది. ఈ క్రమంలో ఆసీస్ దిగ్గజ ప్లేయర్, ఆ జట్టు మాజీ కెప్టెన్, రెండు సార్లు వన్డే ప్రపంచకప్ విన్నర్ మెగ్ లాన్నింగ్‌ను (Meg Lanning) అధిగమించింది. లాన్నింగ్ తన కెరీర్లో ప్లేయర్‌గా 89 విజయాలు సాధించగా.. హర్మన్ నిన్నటి మ్యాచ్‌తో ఆమెను దాటేసింది. ఈ జాబితాలో భారత మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ అగ్రస్థానంలో ఉంది. మిథాలీ తన వన్డే కెరీర్లో 129 విజయాలు సాధించింది.మహిళల వన్డేల్లో అత్యధిక విజయాలు సాధించిన ప్లేయర్లుమిథాలీ రాజ్- 129ఎల్లిస్ పెర్రీ- 125అలైస్సా హీలీ- 103బెలిండ క్లార్క్- 94కేట్ సీవర్ బ్రంట్- 93కేట్ ఫిజ్‌ప్యాట్రిక్- 91హర్మన్‌ప్రీత్ కౌర్- 90మెగ్ లాన్నింగ్- 89 చదవండి: లంక ప్రీమియర్ లీగ్‌లో భారత ఆటగాళ్లు.. చరిత్రలో తొలిసారి..! -
టీమిండియా చేతిలో ఓడినా చరిత్ర సృష్టించిన పాకిస్తాన్
ఐసీసీ మహిళల వన్డే వరల్డ్‌కప్ 2025లో (Women's Cricket World Cup) భాగంగా నిన్న (అక్టోబర్ 5) భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్ (Inida vs Pakistan) జరిగింది. ఈ మ్యాచ్‌లో భారత్ 88 పరుగుల తేడాతో పాక్‌ను ఓడించి, వన్డే ఫార్మాట్లో దాయాదిపై తమ రికార్డును (12-0) మరింత మెరుగుపర్చుకుంది. అలాగే వరల్డ్‌కప్ టోర్నీల్లోనూ పాక్‌పై ఆధిపత్యాన్ని 5-0 తేడాతో కొనసాగించింది. పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత క్రికెట్ జట్లు పాక్‌ను వరుసగా నాలుగు ఆదివారాల్లో ఓడించారు.తాజాగా ముగిసిన పురుషుల ఆసియా కప్‌లో టీమిండియా గ్రూప్ (సెప్టెంబర్ 14), సూపర్-4 (సెప్టెంబర్ 21), ఫైనల్ (సెప్టెంబర్ 28) మ్యాచ్‌ల్లో వరుసగా మూడు ఆదివారాల్లో పాక్‌ను ఓడించగా.. ఇప్పుడు భారత మహిళల జట్టు వన్డే ప్రపంచకప్‌లో భాగంగా పాక్‌ను వరుసగా నాలుగో ఆదివారం (అక్టోబర్ 5) చిత్తు చేసింది.తాజా మ్యాచ్‌లో భారత మహిళా జట్టు చేతిలో ఓడినా పాక్ జట్టు సరికొత్త చరిత్ర సృష్టించింది. మహిళల వన్డేల్లో పాక్ తొలిసారి భారత్‌ను ఆలౌట్ చేసింది. ఇరు జట్ల మధ్య దీనికి ముందు 11 మ్యాచ్‌లు జరిగినా, అందులో పాక్ బౌలర్లు ఒక్కసారి కూడా భారత్‌ను ఆలౌట్ చేయలేదు.నిన్న జరిగిన వరల్డ్‌కప్ మ్యాచ్‌లో పాక్ పేసర్ డయానా బేగ్ (10-1-69-4) చెలరేగడంతో భారత్ సరిగ్గా 50 ఓవర్లు ఆడి 247 పరుగులకు ఆలౌటైంది. మహిళల వన్డేల్లో కనీసం ఒక్క హాఫ్ సెంచరీ కూడా నమోదు కాకుండా టీమిండియా చేసిన అత్యధిక స్కోర్ ఇదే. ఈ మ్యాచ్‌లో భారత ప్లేయర్లు ఏకంగా 173 బంతులకు పరుగులు చేయలేదు.ప్రస్తుత ప్రపంచకప్ టోర్నీలో ఓ జట్టు ఇన్ని బంతులకు పరుగులు చేయలేకపోవడం ఇదే ప్రప్రధమం. గత 34 వన్డేల్లో భారత మహిళల జట్టు ఈ మార్కును (173 డాట్ బాల్స్) తాకడం ఇది రెండోసారి. 2023 జనవరిలో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ 181 బంతులను వృధా చేసింది.మ్యాచ్ విషయానికొస్తే.. భారత బ్యాటర్లను ఉన్న టాలెంట్ ప్రకారం ఈ స్కోర్ నిజంగానే చాలా చిన్నది. అయినా భారత బౌలర్లు దాన్ని విజయవంతంగా కాపాడుకొని పాక్‌ను మట్టికరిపించాడు. ఈ మ్యాచ్‌లో భారత్ తక్కువ స్కోర్‌కే (247 ఆలౌట్) పరిమితం కావడానికి ఇతరత్రా కారణాలు కూడా ఉన్నాయి.టీమిండియా బ్యాటింగ్ చేసే సమయంలో పురుగులు చాలా ఇబ్బంది పెట్టాయి. వీటి వల్ల భారత బ్యాటర్లు ఏకాగ్రత సాధించలేకపోయారు. ఓ దశలో పురుగులను పారద్రోలేందుకు స్ప్రేను కూడా ప్రయోగించారు. అయితే అప్పటికే సగం మ్యాచ్ ఆయిపోయింది. నిన్నటి మ్యాచ్‌లో భారత్ పాక్‌పై భారీ స్కోర్ చేయలేకపోవడానికి పిచ్ మరో కారణం. పిచ్‌ను మ్యాచ్‌కు 48 గంటల ముందు వరకు క్లోజ్ చేసి ఉంచారు. దీంతో తేమ ఎక్కువై బంతి నిదానంగా కదిలింది. దీని వల్ల కూడా భారత బ్యాటర్లు కాస్త ఇబ్బంది పడ్డారు. ఆఖర్లో రిచా ఘోష్ (20 బంతుల్లో 35 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్ ఆడకపోయుంటే భారత్ ఇంకాస్త తక్కువ స్కోర్‌కే పరిమితమై ఉండేది. చదవండి: World Cup 2025: భారత్-పాకిస్తాన్ మ్యాచ్.. స్ప్రే ప్రయోగించిన పాక్ కెప్టెన్ -
పాక్ ఓపెనర్‌ది ఔటా? నాటౌటా? రూల్స్ ఏమి చెబుతున్నాయి
భారత్-పాకిస్తాన్ జట్ల మధ్య వైరం మరింత ముదురుతోంది. మొన్న ఆసియాకప్‌లో ఇరు జట్ల మధ్య చోటు చేసుకున్న సంఘటనలు మరవకముందే.. మహిళల వన్డే ప్రపంచకప్-2025లో చిరకాల ప్రత్యర్ధుల మధ్య మరో వివాదం చోటు చేసుకుంది.ఈ మెగా టోర్నీలో భాగంగా ఆదివారం కొలంబో వేదికగా భారత్-పాక్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో పాక్ ఓపెనర్ మునీబా అలీ రనౌట్ వివాదస్పదమైంది. పాక్ అభిమానులు మునీబాది నాటౌట్ అంటుంటే ఇండియన్ ఫ్యాన్స్ క్లియర్ ఔట్ అని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.అసలేమి జరిగిదంటే?పాకిస్తాన్ ఇన్నింగ్స్ నాలుగో ఓవర్ వేసిన క్రాంతి గౌడ్ ఆఖరి బంతిని మునీబాకు మిడిల్ అండ్ లెగ్ స్టంప్ దిశగా సంధించింది. ఆ బంతిని మునీబా లెగ్ సైడ్ ఆడటానికి ప్రయత్నించింది. కానీ బంతి బ్యాట్‌కు మిస్స్ అయ్యి మునీబా అలీ ఫ్రంట్ ప్యాడ్ తాకుతూ వికెట్ కీపర్ వైపు వెళ్లింది.దీంతో భారత ప్లేయర్లు ఎల్బీడబ్ల్యూకి అప్పీల్ చేయగా.. అంపైర్ నాటౌట్ అంటూ తల ఊపారు. ఇంతలోనే మునీబా క్రీజు బయటకు ఒక్క అడుగు ముందుకు వేసి తిరిగి రావడానికి ప్రయత్నించింది. ఇదే సమయంలో దీప్తి శర్మ వికెట్ కీపర్ వెనక నుంచి డైరక్ట్ త్రోతో స్టంప్స్‌ను గిరాటేసింది. దీంతో ఫీల్డ్ అంపైర్లు థర్డ్ అంపైర్‌కు రిఫర్ చేశారు. తొలుత థర్డ్ అంపైర్ నాటౌట్‌గా సూచించినప్పటికి.. అంపైర్ కెరిన్ క్లాస్ట్ ఆ తర్వాత పలు కోణాల్లో రిప్లేలను పరిశీలించి తన నిర్ణయాన్ని మార్చి ఔట్‌గా ప్రకటించింది. బంతి స్టంప్స్‌కు తాకే సమయంలో మనీబా బ్యాట్ గాల్లో ఉందని అంపైర్ చెప్పుకొచ్చారు. థర్డ్ అంపైర్ నిర్ణయంతో పాక్ శిబిరం మొత్తం షాక్‌కు గురయ్యారు. అయితే బంతి స్టంప్స్‌కు తాకక ముందు మునీబా బ్యాట్ పాపింగ్ క్రీజులో ఉంచింది. కాబట్టి నాటౌట్ అంటూ పాక్ కెప్టెన్ ఫాతిమా సనా ఫోర్త్ అంపైర్‌తో వాగ్వాదానికి దిగింది. ఫోర్త్ అంపైర్ రూల్స్‌ను వివరించడంతో ఆమె వెనక్కి తగ్గింది. ఏదేమైనప్పటికి మైదానంలో కాసేపు గందరగోళం నెలకొంది.రూల్స్ ఏమి చెబుతున్నాయి?ఎంసీసీ కొత్త రూల్స్ ప్రకారం.. ఒక బ్యాటర్ బంతి స్టంప్స్‌కు తాకక ముందు తన బ్యాట్‌ను పాపింగ్ క్రీజ్ వెనుక ఒక్కసారి ఉంచితే చాలు. ఆ తర్వాత బంతి స్టంప్స్‌కు తాకే సమయంలో బ్యాట్ గాల్లో ఉన్న కూడా నాటౌట్‌గా పరిగిణిస్తారు. అయితే ఈ రూల్ కేవలం రన్‌కు ప్రయత్నించేటప్పుడు మాత్రమే వర్తిస్తుంది. కానీ మునీబా రన్ కోసం పరిగెత్తలేదు. క్రీజులో నిలబడి బయటకు వెళ్లి వచ్చింది. కాబట్టి ఆమె అవుట్ వికెట్ కీపర్ బ్యాటర్ స్టంప్ చేయడంతో సమానం. బంతి బెయిల్స్ పడగొట్టిన సమయంలో ఆమె బ్యాట్ గాలిలో ఉంది. అందుకే థర్డ్ అంపైర్ ఔట్‌గా ప్రకటించారు. అదే ఆమె రన్‌కు ప్రయత్నించే సమయంలో ఇలా జరిగింటే నాటౌట్ ఇచ్చేవారు.రూల్ 30.1 ప్రకారం.. మునీబాను ఔట్‌గా ప్రకటించారు. ఈ రూల్ ప్రకారం ఒక బ్యాటర్ తన బ్యాట్ లేదా పాదం లేదా శరీరంలోని ఏ భాగమైనా పాపింగ్ క్రీజ్ చివరన లేకపోతే ఔట్‌గానే పరిగణిస్తారు.రూల్ 30.1.2 ప్రకారం.. ఒక బ్యాటర్ రన్‌కు పరిగెత్తడం లేదా డైవ్ చేసే సందర్భాల్లో బ్యాట్ ఒక్కసారి పాపింగ్ క్రీజు వెలుపుల గ్రౌండింగ్ చేస్తే చాలు. అనంతరం బెయిల్స్ పడే సమయంలో బ్యాట్ గాల్లో ఉన్నా నాటౌట్‌గానే లెక్కలోకి తీసుకుంటారు. View this post on Instagram A post shared by Star Sports India (@starsportsindia) -
మా ఓటమికి కారణమదే.. లేదంటే ఈజీగా గెలిచేవాళ్లం: పాక్ కెప్టెన్
ఐసీసీ మహిళల ప్రపంచకప్‌లో కొలంబో వేదికగా ఆదివారం భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో 88 పరుగుల తేడాతో చిరకాల ప్రత్యర్ధి పాకిస్తాన్ ఓటమి పాలైంది. బౌలింగ్‌లో పర్వాలేదన్పించిన పాక్ జట్టు.. బ్యాటింగ్‌లో మాత్రం తేలిపోయింది. 248 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాక్ జట్టు 43 ఓవర్లలో 159 రన్స్‌కే కుప్పకూలింది.యువ ఫాస్ట్ బౌలర్ క్రాంతి గౌడ్, సీనియర్ ఆల్‌రౌండర్ దీప్తి శర్మ తలా మూడు వికెట్లు పడగొట్టి పాక్ పతనాన్ని శాసించారు. వీరితో పాటు స్నేహ్ రాణా రెండు వికెట్లు తీశారు. పాక్ బ్యాటర్లలో సిద్రా అమిన్ (106 బంతుల్లో 81; 9 ఫోర్లు, 1 సిక్స్) ఒంటరి పోరాటం చేసింది.అంతకుముందు భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 247 పరుగుల వద్ద ఆలౌటైంది. హర్లీన్ డియోల్ (65 బంతుల్లో 46; 4 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్‌గా నిలవగా.. రిచా ఘోష్ (20 బంతుల్లో 35 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) దూకుడుగా ఆడింది. మహిళల వన్డేల్లో పాక్‌పై భారత్‌కు ఇది వరుసగా 12వ విజయం కావడం విశేషం. అయితే ఈ ఓటమిపై మ్యాచ్ అనంతరం పాక్ కెప్టెన్ ఫాతిమా సనా స్పందించింది. ప్రత్యర్ధి భారత జట్టును తక్కువ పరుగులకే కట్టడి చేయడంలో విఫలమయ్యామని సనా చెప్పుకొచ్చింది."పవర్‌ప్లేలో మేము చాలా పరుగులు ఇచ్చాము. అదే విధంగా డెత్ ఓవర్లలో మేము మెరుగ్గా బౌలింగ్ చేయలేకపోయాము. నేను బౌలింగ్ చేసినప్పుడు బంతి స్వింగ్ అవుతున్నట్లు అన్పించింది. కానీ డయానా బేగ్ మాత్రం సీమ్, స్వింగ్ మధ్య కాస్త కన్ఫూజన్‌కు గురైంది.నేను మాత్రం బంతి స్వింగ్ అవుతుందని, ఆత్మవిశ్వాసాన్ని కోల్పోవద్దని నేను పదేపదే చెబుతునే ఉన్నాను. మా తదుపరి మ్యాచ్‌లో ఆమె మెరుగ్గా రాణిస్తుందని అశిస్తున్నాను. తొలుత భారత్‌ను 200 కంటే తక్కువ పరుగులకు పరిమితం చేసి ఉంటే బాగుండేది. ఆ టోటల్‌ను మేము సులువుగా చేధించేవాళ్లం.అయితే బ్యాటింగ్‌లో మేము కాస్త తడబడ్డాము. కానీ మా బ్యాటింగ్ లైనప్ అద్బుతంగా ఉంది. టాప్ 5లో మంచి బ్యాటర్లు ఉన్నారు. మా తర్వాతి మ్యాచ్‌లో రాణిస్తారని భావిస్తున్నారు. బ్యాటింగ్‌లో భాగస్వామ్యాలు నెలకొల్పడం అవసరం. ఈ మ్యాచ్‌లో మేడు అది చేయలేకపోయాము. అయితే సిద్రా పోరాటం గురించి ఎంత చెప్పుకొన్న తక్కువే. ఆమె నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తుంది. మా జట్టులో సిద్రా కీలక సభ్యురాలు" అని సనా పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్‌లో పేర్కొంది. ఈ మ్యాచ్‌లో బేగ్ నాలుగు వికెట్లు పడగొట్టినప్పటికి 69 పరుగులు సమర్పించుకుంది.చదవండి: IND vs AUS: ఒకప్పుడు కోహ్లితో కలిసి ఆడారు.. కట్ చేస్తే.. ఇప్పుడు అంపైర్లగా! -
పాకిస్తాన్‌తో మ్యాచ్.. నామమాత్రపు స్కోర్‌కే పరిమితమైన టీమిండియా
మహిళల వన్డే ప్రపంచకప్ 2025లో (ICC Women's World Cup 2025) భాగంగా పాకిస్తాన్‌తో ఇవాళ (అక్టోబర్ 5) జరుగుతున్న మ్యాచ్‌లో (India vs Pakistan) టీమిండియా (Team India) సామర్థ్యం మేరకు రాణించలేకపోయింది. కొలొంబో వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ ఓడి పాక్ (Pakistan) ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేసి ఓ మోస్తరు స్కోర్‌కే పరిమితమైంది. నిర్ణీత 50 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసి 247 పరుగులకు ఆలౌటైంది.46 పరుగులతో హర్లీన్ డియోల్ టాప్ స్కోరర్‌గా నిలువగా.. రిచా ఘోష్ 35 (నాటౌట్), జెమీమా రోడ్రిగెజ్ 32, ప్రతీక రావల్ 31, దీప్తి శర్మ 25, స్మృతి మంధన 23, స్నేహ్ రాణా 20, హర్మన్‌ప్రీత్ 19, శ్రీ చరణి 1, క్రాంతి గౌడ్ 8, రేణుకా సింగ్ డకౌటయ్యారు. ఈ మ్యాచ్‌లో భారత బ్యాటర్లకు మంచి ఆరంభాలు లభించినా పెద్దగా స్కోర్లుగా మలచలేకపోయారు.పాక్ బౌలర్లలో డయానా బేగ్ 4 వికెట్లతో సత్తా చాటగా.. సదియా ఇక్బాల్, కెప్టెన్ ఫాతిమా సనా తలో 2, రమీన్ షమీమ్, సష్రా సంధు చెరో వికెట్ పడగొట్టారు.స్ప్రే ఉపయోగించిన పాక్ కెప్టెన్భారత్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో చిన్నచిన్న పురుగులు పలు మార్లు మ్యాచ్‌కు అంతరాయం కలిగించాయి. ఓ దశలో పరుగుల సమస్య ఎక్కువ కావడంతో అంపైర్ అనుమతితో పాక్ కెప్టెన్ పరుగుల నివారణ స్ప్రేను ప్రయోగించింది. ఇన్నింగ్స్ 28వ ఓవర్లో ఇది జరిగింది. స్ప్రే ఉపయోగించిన తర్వాత పురుగుల ప్రభావం తగ్గడంతో భారత బ్యాటింగ్ సజావుగా సాగింది.టాస్ సమయంలో గందరగోళంటాస్ సమయంలో గందరగోళం నెలకొంది. పాకిస్తాన్ కెప్టెన్ ఫాతిమా సనా టాస్ గెలిచినట్లు రిఫరీ షాండ్రే ఫ్రిట్జ్, అనౌన్సర్ మెల్ జోన్స్ ప్రకటించారు. వాస్తవానికి పాక్ కెప్టెన్ టాస్ గెలవలేదు.భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ టాస్ వేయగానే ఫాతిమా "టెయిల్స్" అని చెప్పింది. కానీ రిఫరీ ఫ్రిట్జ్, అనౌన్సర్ మెల్ జోన్స్ "హెడ్స్"గా వినిపించుకున్నారు. తీరా నాణెం "హెడ్స్"గా పడడంతో టాస్ పాకిస్తాన్ గెలిచిందని ప్రకటించారు. టాస్ గెలిచిన ఫాతిమా ఫీల్డింగ్ ఎంచుకోగా, దీనిపై భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయకపోవడం ఆసక్తికరం.చదవండి: భారత్‌తో నిర్ణయాత్మక మూడో వన్డే.. ఆస్ట్రేలియా భారీ స్కోర్ -
World Cup 2025: భారత్-పాకిస్తాన్ మ్యాచ్.. స్ప్రే ప్రయోగించిన పాక్ కెప్టెన్
మహిళల వన్డే ప్రపంచకప్ 2025లో (ICC Women's World Cup 2025) భాగంగా భారత్-పాకిస్తాన్ (India vs Pakistan) మధ్య ఇవాళ (అక్టోబర్ 5) జరుగుతున్న మ్యాచ్‌లో ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. మ్యాచ్ మధ్యలో పాక్ కెప్టెన్ ఫాతిమా సనా మ్యాజిక్ స్ప్రేను (Spray) ప్రయోగించింది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్‌మీడియాలో వైరలవుతున్నాయి. ఇంతకీ పాక్ కెప్టెన్ ఎందుకలా చేసిందని అభిమానులు ఆరా తీస్తున్నారు.వివరాల్లో వెళితే.. కొలొంబోలోని ఆర్ ప్రేమదాస స్టేడియం వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో పాకిస్తాన్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ ప్రారంభమైనప్పటి నుంచి చిన్నచిన్న పురుగులు మైదానమంతా వ్యాపించి ఇరు జట్ల ఆటగాళ్లను ఇబ్బంది పెట్టాయి. ఈ పరుగుల కారణంగా మ్యాచ్‌కు పలు మార్లు అంతరాయం కలిగింది.ఇన్నింగ్స్ మధ్యలో పురుగుల ప్రభావం చాలా ఎక్కువైంది. దీని వల్ల భారత ఆటగాళ్లు బ్యాటింగ్ చేయలేకపోయారు. ఈ విషయమై అప్పుడు క్రీజ్‌లో ఉన్న భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ అంపైర్‌కు ఫిర్యాదు చేసింది. పురుగుల వల్ల తాను బంతిపై దృష్టి సారించలేకపోతున్నానని తెలిపింది.దీంతో ఇన్నింగ్స్ 28వ ఓవర్లో అంపైర్ పురుగులు తరిమే స్ప్రేను ఉపయోగించేందుకు పర్మిషన్ ఇచ్చాడు. పాక్ సబ్‌స్టిట్యూట్ ప్లేయర్ ఒకరు స్ప్రే తీసుకొచ్చి వారి కెప్టెన్ ఫాతిమా సనాకు ఇవ్వగా, ఆమె దాన్ని ఉపయోంచి పురుగులను తరిమికొట్టింది. స్ప్రే ఉపయోగించిన తర్వాత కాస్త ఉపశమనం లభించడంతో భారత ఆటగాళ్లు బ్యాటింగ్‌కు కొనసాగించారు.శ్రీలంకలోని క్రికెట్ మైదానాల్లో ఇలాంటి సన్నివేశాలు తరుచూ కనిపిస్తుంటాయి. పురుగులు, జంతువులు, పాములు పిలవని పేరంటాలకు వచ్చి పోతుంటాయి. తాజాగా భారత జట్టు ప్రాక్టీస్ చేస్తుండగా మైదానంలోకి పెద్ద పాము ప్రవేశించింది. పాములు పట్టే వారు వచ్చి దాన్ని తీసుకెళ్లి అడవిలో వదిలేశారు.మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేస్తున్న భారత్ 44 ఓవర్ల తర్వాత 5 వికెట్ల నష్టానికి 197 పరుగులు చేసింది. ప్రతీక రావల్ (31), స్మృతి మంధన (23), హర్లీన్ డియోల్ (46), హర్మన్‌ప్రీత్ (19), జెమీమా రోడ్రిగెజ్ (32) ఔట్ కాగా.. దీప్తి శర్మ (24), స్నేహ్ రాణా (16) క్రీజ్‌లో ఉన్నారు.చదవండి: భారత్‌తో నిర్ణయాత్మక మూడో వన్డే.. ఆస్ట్రేలియా భారీ స్కోర్ -
World Cup 2025: భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌కు ముందు టాస్ గందరగోళం
మహిళల వన్డే ప్రపంచకప్ 2025లో (Women's Cricket World Cup 2025) భారత్, పాకిస్తాన్ (India VS Pakistan) మ్యాచ్ టాస్ గందరగోళం మధ్య ప్రారంభమైంది. కొలొంబోలోని ప్రేమదాస వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్ కెప్టెన్ ఫాతిమా సనా టాస్ గెలిచినట్లు రిఫరీ షాండ్రే ఫ్రిట్జ్, అనౌన్సర్ మెల్ జోన్స్ ప్రకటించారు. వాస్తవానికి పాక్ కెప్టెన్ టాస్ గెలవలేదు.భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ టాస్ వేయగానే ఫాతిమా "టెయిల్స్" అని చెప్పింది. కానీ రిఫరీ ఫ్రిట్జ్, అనౌన్సర్ మెల్ జోన్స్ "హెడ్స్"గా వినిపించుకున్నారు. తీరా నాణెం "హెడ్స్"గా పడడంతో టాస్ పాకిస్తాన్ గెలిచిందని ప్రకటించారు. టాస్ గెలిచిన ఫాతిమా ఫీల్డింగ్ ఎంచుకోగా, దీనిపై భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయకపోవడం చర్చనీయాంశంగా మారింది.ఇటీవల పురుషుల ఆసియా కప్‌లో జరిగిన విధంగానే టాస్ అనంతరం భారత కెప్టెన్ పాక్ కెప్టెన్‌కు హ్యాండ్ షేక్ ఇవ్వలేదు. టాస్ ఫలితం వెలువడగానే ఇరువురు కెప్టెన్లు చెరో దిక్కు అయ్యారు. ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు చెరో మార్పుతో బరిలోకి దిగాయి. భారత్ తరఫున అమన్‌జోత్ అనారోగ్యంతో బాధపడుతుండటంతో రేణుకా సింగ్‌కి అవకాశం ఇచ్చారు. పాకిస్తాన్ తరఫున ఒమైమా సోహాలీ స్థానంలో సదాఫ్ షమాస్ జట్టులోకి వచ్చింది.తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్ సగం ఓవర్లు పూర్తయ్యే సమయానికి 3 వికెట్ల నష్టానికి 108 పరుగులు చేసింది. ఓపెనర్లు స్మృతి మంధన (23), ప్రతీక రావల్ (31), హర్మన్‌ప్రీత్ (19) ఔట్ కాగా.. హర్లీన్ డియోల్ (31), జెమీమా రోడ్రిగెజ్ (1) క్రీజ్‌లో ఉన్నారు.కాగా, పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో ఇటీవల ముగిసిన పురుషుల ఆసియా కప్‌లో భారత ఆటగాళ్లు పాక్ ఆటగాళ్లకు హ్యాండ్ షేక్‌కు నిరాకరించారు. ఈ టోర్నీలో భారత్ విజేతగా నిలిచిన తర్వాత ఏసీసీ అధ్యక్షుడిగా ఉన్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ మొహిసిన్ నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీని తీసుకునేందుకు నిరాకరించింది. చదవండి: భారత్ నా మాతృభూమి, దేవాలయం లాంటిది: పాకిస్తాన్ మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు -
భారత జట్టుతో అనుబంధం.. హర్మన్ గొప్ప ప్లేయర్: పాక్ కెప్టెన్ ప్రశంసలు
భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (Harmanpreet Kaur)పై పాకిస్తాన్ సారథి ఫాతిమా సనా ప్రశంసలు కురిపించింది. హర్మన్ అనుభవజ్ఞురాలైన ప్లేయర్ అని.. ఆమె జట్టును నడిపించే తీరు అద్భుతమని కొనియాడింది. కాగా వరుసగా నాలుగో ఆదివారం భారత్- పాకిస్తాన్ మ్యాచ్‌కు రంగం సిద్ధమైన విషయం తెలిసిందే.పాక్‌పై వరుస విజయాలతో ట్రోఫీ సొంతంఇటీవల పురుషుల క్రికెట్ ఆసియా టీ20 కప్-2025 (Asia Cup) సందర్భంగా దాయాదులు తలపడ్డాయి. పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) అనంతరం ఈ ఖండాంతర టోర్నీలో తొలిసారి జరిగిన ముఖాముఖి పోరులో టీమిండియా.. లీగ్, సూపర్ దశలతో పాటు ఫైనల్లో పాక్‌ను చిత్తు చేసి ట్రోఫీ గెలిచింది.అయితే, ఈ మ్యాచ్‌ల సందర్భంగా పాక్ జట్టుతో కరచాలనానికి సూర్యకుమార్ సేన నిరాకరించగా.. పాక్ జట్టు హైడ్రామా నడిపించింది. అంతేకాదు.. హ్యారిస్ రవూఫ్‌తో పాటు ఓపెనర్ సాహిబ్జాదా ఫర్హాన్ రెచ్చగొట్టే రీతిలో వ్యవహరించి ఐసీసీతో మొట్టికాయలు తిన్నారు.ట్రోఫీ, మెడల్స్ ఎత్తుకుపోయిన నక్వీఇక పీసీబీ చైర్మన్, పాక్ మంత్రి మొహ్సిన్ నక్వీనుంచి ట్రోఫీ తీసుకునేందుకు భారత జట్టు నిరాకరించగా.. అతడు ట్రోఫీ, మెడల్స్‌తో పారిపోయాడు. తన దగ్గరకు వస్తేనే వాటిని ఇస్తానంటూ ఓవరాక్షన్ చేయగా.. బీసీసీఐ ఐసీసీ వద్దనే ఈ పంచాయితీ తేల్చుకునేందుకు సిద్ధమైంది.ఈసారి కూడా నో షేక్హ్యాండ్ఇలాంటి పరిణామాల నడుమ ఐసీసీ మహిళల వన్డే వరల్డ్‌కప్-2025 సందర్భంగా భారత్- పాక్ జట్ల మధ్య ఆదివారం (అక్టోబరు 5) జరిగే మ్యాచ్‌పై ఆసక్తి నెలకొంది. కొలంబో వేదికగా దాయాదితో జరిగే పోరులో హర్మన్‌సేన కూడా కరచాలనానికి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.ఈ నేపథ్యంలో మ్యాచ్‌కు మీడియాతో మాట్లాడిన పాక్ కెప్టెన్ ఫాతిమా సనా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ‘‘హర్మన్‌ప్రీత్ కౌర్ సీనియర్, అనుభవజ్ఞురాలైన ప్లేయర్. అద్బుత రీతిలో జట్టును ముందుకు నడిపిస్తూ అందరినీ ఆకట్టుకుంటుంది.తనొక ప్రతిభావంతమైన ప్లేయర్. పరిస్థితులకు తగ్గట్లు హిట్టింగ్ ఆడగలదు.. డిఫెండ్ కూడా చేసుకోగలదు. మైదానంలో తన వ్యూహాలను పక్కాగా అమలు చేస్తుంది’’ అని భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్‌ను ప్రశంసించింది.అంతా ఒకే కుటుంబం అదే విధంగా.. ‘‘2022 వరల్డ్‌కప్‌లో భారత్- పాకిస్తాన్ మ్యాచ్ ముగిసిన తర్వాత.. భారత జట్టు మొత్తం మా దగ్గరికి వచ్చి.. మమ్మల్ని పలకరించింది. మాతో కలిసి వారు తమ విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు. ఆరోజు ఎంతో ప్రత్యేకం.ఆరోజే ఆ ఇరుజట్ల మధ్య గొప్ప అనుబంధం ఉందని నాకు అనిపించింది’’ అంటూ ఫాతిమా సనా గత జ్ఞాపకాలు గుర్తుచేసుకుంది. ప్రస్తుతం బయట పరిస్థితులు ఎలా ఉన్నాయో అందరికీ తెలుసనని.. అయితే, మైదానంలో ఉండే 20- 22 ప్లేయర్లు అంతా ఒక కుటుంబం లాంటివారేనని పేర్కొంది. ఐసీసీ వరల్డ్‌కప్ ఆడటం ప్రతి ఒక్క ప్లేయర్ కల అని.. తామంతా కేవలం ఆట మీద మాత్రమే దృష్టి పెడతామని ఫాతిమా సనా తెలిపింది.ఈసారి ఏకపక్ష విజయమేఅయితే, సనా వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పాక్ ఆటగాళ్ల మనస్తత్వం ఎలాంటిదో ఇటీవలే మరోసారి చూశామని.. ట్రోఫీ ఎత్తుకెళ్లే నక్వీ నడిపించే బోర్డుకు చెందిన ఆటగాళ్లు ఇలా మాట్లాడటం ఆశ్చర్యకరమని నెటిజన్లు పేర్కొంటున్నారు.కాగా భారత్- పాక్ మహిళా జట్లు గతంలో 11 వన్డేల్లో ముఖాముఖి తలపడగా.. అన్ని మ్యాచ్‌లలోనూ భారత్ విజయం సాధించింది. ఈసారి కూడా గెలుపు ఏకపక్షమయ్యే సూచనలే కనిపిస్తున్నాయి. అయితే, వర్షం రూపంలో దాయాదుల పోరుకు ప్రమాదం పొంచి ఉంది. ఇదిలా ఉంటే.. హర్మన్‌ప్రీత్ కౌర్‌కు బదులుగా భారత బౌలింగ్ కోచ్ ఆవిష్కార్ సాల్వీ మీడియా సమావేశానికి హాజరయ్యాడు. ఈ క్రమంలో భారత్- పాక్ మహిళా జట్ల మధ్య అనుబంధం గురించి పాక్ జర్నలిస్టు ప్రశ్నించగా.. టీమిండియా మేనేజర్ తదుపరి ప్రశ్నకు వెళ్దామని చెప్పారు.చదవండి: 50 ఓవర్ల క్రికెట్లో ట్రిపుల్ సెంచరీ.. ఆసీస్ బ్యాటర్ విధ్వంసం -
మహిళల ప్రపంచకప్‌లో నేడు భారత్ X పాకిస్తాన్
భారత్, పాకిస్తాన్ క్రికెట్ జట్లు వరుసగా నాలుగో ఆదివారం అంతర్జాతీయ వేదికపై తలపడనున్నాయి. అయితే ఈ సారి ఇది మహిళల సమరం. వన్డే వరల్డ్ కప్‌లో భాగంగా నేడు కొలంబోలో భారత్, పాక్ మధ్య మ్యాచ్ జరగనుంది. బలాబలాలపరంగా చూస్తే పాక్‌కంటే భారత్ ఎంతో మెరుగైన స్థితిలో ఉంది. ఇరు జట్ల మధ్య గతంలో 11 వన్డేలు జరగ్గా అన్నీ భారతే గెలిచింది. పాక్ ఒక్క మ్యాచ్‌లోనూ కనీసం పోటీ కూడా ఇవ్వలేకపోయింది. భారత్ కనీసం 80 పరుగుల తేడాతో లేదా... 5 వికెట్ల తేడాతో ఈ మ్యాచ్‌లలో విజయాలు సాధించింది. ఈ సారి కూడా ఫలితం అదే వచ్చే అవకాశం ఉంది. ఈ టోర్నీ తొలి పోరులో శ్రీలంకపై సునాయాస విజయం సాధించగా... పాక్ జట్టు బంగ్లా చేతిలో చిత్తుగా ఓడింది. పురుషుల ఆసియా కప్ తరహాలోనే ఈ మ్యాచ్‌లోనూ పాక్ క్రికెటర్లతో కరచాలనం చేయరాదని హర్మన్ సేన నిర్ణయించింది. ఈ మ్యాచ్ కోసం భారత్ తుది జట్టులో ఎలాంటి మార్పులు చేసే అవకాశం లేదు. మరో వైపు కొలంబోను వర్షాలు వెంటాడుతున్నాయి. ఇదే వేదికపై శనివారం ఆసీస్, శ్రీలంక మధ్య మ్యాచ్ రద్దయిన నేపథ్యంలో నేటి మ్యాచ్‌కు కూడా వర్షం ముప్పు పొంచి ఉంది. -
ఆసియాకప్ ట్రోఫీని భారత్‌కు ఇవ్వొద్దు.. ఆ మొండితనం ఏంటి?
భారత క్రికెట్ జట్టు ఆసియాకప్ విజేతగా నిలిచి ఐదు రోజులు అవుతున్నప్పటికి ట్రోఫీ మాత్రం ఇంకా తమ వద్దకు చేరలేదు. దుబాయ్ వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్ అనంతరం ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ACC) అధ్యక్షుడు మోహ్సిన్ నఖ్వీ చేతుల మీదగా మెడల్స్‌తో పాటు ట్రోఫీని అందుకోవడానికి భారత్ నిరాకరిచింది.పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) ఛైర్మన్‌తో పాటు ఆ దేశ మంత్రిగా ఉండడంతో భారత్ ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో నఖ్వీ ట్రోఫీని, మెడల్స్‌ను తనతో పాటు తీసుకుని వెళ్లిపోయాడు. అతడి తీరుపై బీసీసీఐ తీవ్ర అగ్రహం వ్యక్తం చేసింది. దీంతో దిగొచ్చిన నఖ్వీ ట్రోఫీని యూఏఈ క్రికెట్ బోర్డు అందజేయనున్నట్లు వార్తలు వచ్చాయి.కానీ ఇప్పటివరకు యూఏఈ క్రికెట్ బోర్డు, బీసీసీఐ గానీ ఎటువంటి ప్రకటన చేయలేదు. అయితే తాజాగా ఈ ట్రోఫీ వివాదంపై పాకిస్తాన్ మాజీ క్రికెటర్ బసిత్ అలీ సంచలన వ్యాఖ్యలు చేశాడు. టీమిండియా తన చేతుల మీదగా ట్రోఫీని తీసుకోకూడదనే వైఖరిని కొనసాగిస్తే, నఖ్వీని తన నిర్ణయాన్ని మార్చుకోవద్దని అలీ సూచించాడు. ఈ పాక్ మాజీ క్రికెటర్ టీమిండియాపై మరోసారి తన అక్కసు వెళ్లగక్కాడు."టీమిండియా నంబర్ వన్ జట్టుగా కొనసాగుతోంది. కానీ వారు చేసే పనులు మాత్రం థర్డ్ క్లాస్‌ను తలపిస్తున్నాయి. మొహ్సిన్ నఖ్వీనే ఆసియాకప్ ట్రోఫీని అందజేయాలి. వారు అందుకు నిరాకరిస్తే, ఖచ్చితంగా ప్రపంచం దృష్టిలో చెడ్డ పేరు తెచ్చుకుంటారు.అటువంటి అప్పుడు ఎట్టిపరిస్థితిలలోనూ ట్రోఫీని అప్పగించకూడదు. భారత్ బాగా ఆడి గెలిచింది. అందులో ఎటువంటి సందేహం లేదు. కానీ ఈ మొండితనం ఏంటి? మొహ్సిన్ నఖ్వీ ఆసియా క్రికెట్ కౌన్సిల్ చైర్మెన్‌గా ఉన్నారు. అదే ఐసీసీ ఈవెంట్ అయివుండి చైర్మెన్ జై షా నుండి పాకిస్తాన్ ట్రోఫీని స్వీకరించడానికి నిరాకరించినా కూడా నేను తప్పు పట్టేవాడిని" అని ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అలీ పేర్కొన్నాడు.కాగా ఈ ఏడాది ఆసియాకప్ టోర్నీలో మొత్తంగా మూడు సార్లు పాక్‌ను భారత్ చిత్తు చేసింది. అయితే అతడి వ్యాఖ్యలకు టీమిండియా అభిమానులు కౌంటరిస్తున్నారు. ఒక్క మ్యాచ్‌లో కూడా గెలవలేదు, ముందు మీ జట్టు సంగతి చూసుకో అని నెటిజన్లు పోస్ట్‌లు పెడుతున్నారు.చదవండి: IND vs AUS: పాపం తిలక్ వర్మ.. సెంచరీ జస్ట్ మిస్! భారత్ స్కోరెంతంటే? -
ట్రోఫీ కావాలంటే నా ఆఫీస్‌కు వచ్చి తీసుకో.. భారత కెప్టెన్‌కు నఖ్వీ షరతు
ఆసియా కప్ (Asia cup 2025) ట్రోఫీ విషయంలో ఏసీసీ (Asia Cricket Council) అధ్యక్షుడు మొహిసిన్ నఖ్వీ (Mohsin Naqvi) మొండిపట్టు వీడటం లేదు. తన వద్ద ఉంచుకున్న ట్రోఫీని నిర్వహకులకు ఇచ్చేయాలని నిన్న (సెప్టెంబర్ 30) జరిగిన ఏసీసీ సమావేశంలో బీసీసీఐ ఉపాథ్యక్షుడు రాజీవ్ శుక్లా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నాడు. పైగా భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌కు (Surya Kumar Yadav) కొత్త షరతు పెట్టాడు.ట్రోఫీ కావాలంటే స్వయంగా నా ఆఫీస్‌కు వచ్చి తీసుకోవాలని అహంకారపూరిత వ్యాఖ్యలు చేశాడు. నఖ్వీ వాఖ్యలపై భారత క్రికెట్ అభిమానులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. నఖ్వీ ఓవరాక్షన్ చూస్తుంటే రక్తం మరిగిపోతుందంటూ అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. నఖ్వీ విషయంలో బీసీసీఐ, ఐసీసీ కఠిన నిర్ణయం తీసుకోవాలని అంటున్నారు. తక్షణమే అతన్ని ఏసీసీ అధ్యక్ష హోదా నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు.కాగా, ఆసియా కప్ ఫైనల్లో భారత్ పాక్‌ను చిత్తుగా ఓడించి ఛాంపియన్‌గా నిలిచిన విషయం తెలిసిందే. అయితే ఏసీసీ అధ్యక్షుడిగా ఉన్న మొహిసిన్ నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీని అందుకునేందుకు భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తిరస్కరించాడు. ఇందుకు ప్రతిగా నఖ్వీ భారత ఆటగాళ్లకు అందించాల్సిన మెడల్స్‌ను, ట్రోఫీని ఎత్తుకెళ్లిపోయాడు. నఖ్వీ ట్రోఫీ ఇవ్వకపోయినా భారత ఆటగాళ్లు కృత్రిమంగా ట్రోఫీని అందుకున్నట్లు సంబురాలు చేసుకున్నారు. దీనిపై నిన్న జరిగిన ఏసీసీ సర్వసభ్య సమావేశం బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తాడు. అయినా నఖ్వీ మొండిపట్టు వీడలేదు. ట్రోఫీ గురించి ఏజీఎంలో చర్చించాల్సిన అవసరం లేదని, మరో సమావేశంలో మాట్లాడుకుందామని దాటవేశాడు. నఖ్వీ ప్రవర్తనపై యావత్ భారతావణి మండిపడుతుంది. వీడి వేశాలేంట్రా బాబు అని అనుకుంటుంది. ట్రోఫీ తీసుకున్నా, తీసుకోకపోయినా విజేతలం మనమే అని సర్దుకుపోతుంది.చదవండి: అయ్యయ్యో! పుండు మీద కారం జల్లినట్లుగా.. -
ఆ పాక్ ఆటగాడికి థ్యాంక్స్.. అతడి వల్లే గెలిచాము: అశ్విన్
ఆసియాకప్-2025ను సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని భారత జట్టు సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఫైనల్లో చిరకాల ప్రత్యర్ధి పాకిస్తాన్‌ను ఓడించి టైటిల్‌ను భారత్ ముద్దాడింది. ఈ విజయంలో భారత టాపార్డర్ బ్యాటర్ తిలక్ వర్మది కీలక పాత్ర. 147 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో టీమిండియా కేవలం 20 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. స్టార్ బ్యాటర్లు అభిషేక్ శర్మ, శుబ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్ తమ మార్క్ చూపించలేకపోయారు. ఈ సమయంలో తిలక్ వర్మ(69) జట్టు బాధ్యతను తన భుజానపై వేసుకున్నాడు. ఆఖరి వరకు ఆజేయంగా నిలిచి భారత్‌ను ఛాంపియన్‌గా నిలిపాడు. దీంతో తిలక్ వర్మపై సర్వాత్ర ప్రశంసల వర్షం కురిసింది. తాజాగా ఈ జాబితాలోకి టీమిండియా మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ చేరాడు. మ్యాచ్ విన్నింగ్ నాక్ ఆడిన తిలక్ వర్మను అశూ ప్రశంచాడు. ఈ లెజెండరీ స్పిన్నర్ సెటైరికల్‌గా పాకిస్తాన్ పేసర్ హరిస్ రౌఫ్‌కు కూడా కృతజ్ఞతలు తెలిపాడు.భారత్‌తో జరిగిన సూపర్-4 మ్యాచ్‌లో రవూఫ్ తన ఓవరాక్షన్‌తో వార్తల్లో నిలిచాడు. మైదానంలో ఫీల్డింగ్ చేస్తుండగా అభిమానులు కోహ్లి, కోహ్లి అని అరవగా.. రవూఫ్ ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత ఫైటర్ జెట్లను కూల్చేశామని సైగలు చేశాడు.దీంతో అతడిపై భారత అభిమానులు ఫైరయ్యారు. ఫైనల్లో మ్యాచ్‌లో భారత బ్యాటర్లు అతడిని ఉతికారేశారు. అతడు ఓకే ఓవర్లో ఏకంగా 17 పరుగులు ఇచ్చాడు. అతడు కేవలం 3.4 ఓవర్లలో 50 పరుగులు ఇచ్చి పాక్ ఓటమికి, భారత్ గెలుపునకు పరోక్షంగా కారణమయ్యాడు. ఈ కారణంతోనే అతడికి అశ్విన్ ధన్యవాదాలు తెలిపాడు."తిలక్ వర్మ తన అద్బుతమైన ఇన్నింగ్స్‌తో అందరి దృష్టిని ఆకర్షించాడు. ఈ మ్యాచ్‌లో అతడు తన పరిపక్వతను చూపించాడు. తిలక్ ఆడిన ఇన్నింగ్స్ గురించి ఎంతచెప్పుకొన్న తక్కువే. తిలక్ వర్మ ఒత్తిడిని తట్టుకుని ఆడాడు. స్పిన్నర్లను కూడా అద్బుతంగా ఎదుర్కొన్నాడు. అదేవిధంగా హారిస్ రవూఫ్‌కు ప్రత్యేకంగా ధన్యవాదాలు. అతడి బౌలింగ్ వల్లే మేము సునాయసంగా మ్యాచ్‌ను గెలిచాము. తిలక్ వికెట్ పై బౌన్స్ కొంచెం ఉందని గ్రహించి స్క్వేర్ గా ఆడటం ప్రారంభించాడు. అతడి షాట్ సెలక్షన్ కూడా బాగుంది.హరిస్ రౌఫ్ వేసిన ఆఖరి ఓవర్లో తిలక్ వర్మ కొట్టిన సిక్స్ చాలా సులభం అని అంతా అనుకుంటున్నారు. కానీ ఆ షాట్ ఆడటం చాలా కష్టం. లైన్ లో పడిన బంతిని పిక్ చేయడం అంత సులువు కాదు. వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్‌లు కూడా బాగా బౌలింగ్ చేశారు. వారి కమ్‌బ్యాక్ వల్లే పాక్‌ను 150 పరుగులు లోపు కట్టడి చేయగలిగాము" అని తన యూట్యూబ్ ఛానెల్ అశ్విన్ పేర్కొన్నాడు. -
'అతడు కోచ్‌గా పనికిరాడు.. చెత్త కెప్టెన్సీ కూడా'.. పాక్ టీమ్‌పై అక్తర్ ఫైర్
ఆసియాకప్ 2025 ఫైనల్లో భారత్ చేతిలో పాకిస్తాన్ ఓటమి పాలైన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 146 పరుగులకు ఆలౌటైంది. ఒకనొక దశలో స్కోర్ బోర్డు 200 పరుగులు దాటేలా కన్పించినప్పటికి భారత బౌలర్లు కమ్‌బ్యాక్ ఇవ్వడంతో పాక్ బ్యాటింగ్ ఆర్డర్ పేక మేడలా కుప్పకూలింది. ఆ తర్వాత లక్ష్య చేధనలో భారత్ తడబడినప్పటికి.. మిడిలార్డర్ బ్యాటర్ తిలక్ వర్మ(69) అద్భుతపోరాటంతో జట్టును ఛాంపియన్‌గా నిలిపాడు. అయితే భారత్ చేతిలో ఓటమిని పాక్ మాజీ క్రికెటర్లు జీర్ణించుకోలేకపోతున్నారు.ఈ క్రమంలో లెజెండరీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్.. పాకిస్తాన్ హెడ్ కోచ్ మైక్ హెస్సన్‌పై విమర్శలు గుప్పించాడు. జట్టు ప్లానింగ్ లో లోపాలు ఉన్నాయని, యువ ఆటగాళ్లకు సరైన అవకాశాలు ఇవ్వడం లేదని అక్తర్ మండిపడ్డాడు."టీమ్ మెనెజ్‌మెంట్ సరైన వ్యూహాలను రచించడంలో పూర్తిగా విఫలమైంది. సెన్స్‌లెస్ కోచింగ్. హెడ్ కోచ్ ఏమి నిర్ణయాలు తీసుకుంటున్నాడో నాకు ఆర్ధం కావడం లేదు. అతడు కోచ్‌గా పనికిరాడు. ఇలా కఠినంగా మాటలు ఆడుతున్నందుకు క్షమించండి. జట్టు సెలక్షన్ కూడా బాగోలేదు. యువ ఆటగాడు హసన్ నవాజ్‌ను మళ్లీ బెంచ్‌కే పరిమితం చేశారు. అతడొక మ్యాచ్ విన్నర్. అయినా అతడిని ఆడించడం లేదు. అంతేకాకుండా పేసర్ సల్మాన్ మీర్జా ఓ అవకాశమివ్వాల్సింది. ఒక్క మ్యాచ్‌లో కూడా అతడిని ఆడించలేదు. ఈ ఓటమి మమ్మల్ని చాలా బాధించింది. దేశం మొత్తం గెలుపు కోసం ఎదురు చూసింది. కానీ మరోసారి మమ్మల్ని నిరాశపరిచారు. మిడిలార్డర్లో బ్యాటింగ్ కష్టాలు ఇప్పటికి కొనసాగుతున్నాయి. అందరికి ఆ విషయం తెలుసు. కానీ అందుకు పరిష్కారం మాత్రం మెనెజ్‌మెంట్ వెతకడం లేదు.మిడిలార్డర్లో మొహమ్మద్ నవాజ్‌పై ఎక్కువగా ఆధారపడుతున్నారు. అంతేకాకుండా లోయార్డర్‌లో బ్యాటర్లు కనీసం 50 పరుగులు జోడించాలని ఆశిస్తున్నారు. కొన్ని సార్లు షాహీన్ అఫ్రిదిని ఫహీమ్ అష్రఫ్ కంటే ముందు బ్యాటింగ్ పంపుతున్నారు. ఆఖరిలో వారు రాణిచండం వల్లే 175 పరుగులకు చేరుకోగల్గుతున్నారు. ఏదేమైనప్పటికి చాలా లోపాలు ఉన్నాయి. వాటిని సరిదిద్దుకోవాల్సి ఉంది.సల్మాన్ కెప్టెన్సీ కూడా బాగోలేదు. బౌలింగ్ మార్పులు చేయడంలో అతడు విఫలమయ్యాడు. స్పిన్నర్లను ఎదుర్కోవడంలో బ్యాటర్లు ఇబ్బంది పడుతున్నప్పుడు.. హారిస్ రౌఫ్‌ను తీసుకురావాల్సిన అవసరం ఏముంది? అతడు ఒకే ఓవర్లో 17 పరుగులు ఇచ్చాడు. ఇదే మ్యాచ్‌ను టర్న్ చేసింది. పాక్ ఓడిపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి" అని తప్మాడ్ అనే ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అక్తర్ పేర్కొన్నాడు. -
హైదరాబాద్‌లో సందడి చేసిన ఆసియా కప్ ఫైనల్ హీరో
సెప్టెంబర్ 28న పాకిస్తాన్‌తో జరిగిన ఆసియా కప్ 2025 ఫైనల్లో (Asia Cup 2025) చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడి భారత్‌ను ఒంటిచేత్తో గెలిపించిన హైదరాబాదీ స్టార్ తిలక్ వర్మ (Tilak Varma).. ఇవాళ నగరంలో సందడి చేశాడు. తాను చిన్నతనంలో శిక్షణ పొందిన లేగాలా క్రికెట్ అకాడమీని (Legala Cricket Academy) సందర్శించాడు. తిలక్‌ను చూసేందుకు క్రికెట్ అభిమానులు ఎగబడ్డారు. తిలక్‌కు, అతని కోచ్ సలామ్ బయాష్‌కు అకాడమీ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఘనంగా సత్కరించారు.ఈ సందర్భంగా తిలక్ మాట్లాడుతూ.. ఆసియా కప్ ఫైనల్లో టీమిండియా గెలవడం చాలా సంతృప్తినిచ్చింది. ఆ మ్యాచ్‌లో టీమిండియాను గెలిపించడమే టార్గెట్‌గా పెట్టుకొని ఆడాను. ఆ సమయంలో మా కళ్ల ముందు దేశమే కనిపించింది. నేను ఆడిన ఇన్నింగ్స్‌లలో ఇదే అత్యుత్తమమైంది. ఫైనల్లో పాక్ ఆటగాళ్ల స్టెడ్జింగ్ మాపై ఏమాత్రం ప్రభావం చూపలేదు. విరాట్ కోహ్లి నాకు ఎంతో స్పూర్తినిచ్చాడు. విరాట్ కోహ్లితో నన్ను పోల్చడం గర్వంగా ఉందని అన్నాడు.కాగా, 23 ఏళ్ల తిలక్‌కు లెగాలా క్రికెట్ అకాడమీనే పునాది. లింగంపల్లి ప్రాంతంలో ఉన్న ఈ అకాడమీ తిలక్‌కు క్రికెట్లో తొలి పాఠాలు నేర్పింది. కోచ్ సలాం బయాష్ మార్గదర్శకత్వంలో తిలక్ 11 ఏళ్ల వయసులోనే ప్రతిభను చాటాడు. తిలక్ ఇంటి నుంచి అకాడమీకి రోజూ 40 కిలోమీటర్ల ప్రయాణం చేయాల్సి వచ్చేది.కోచ్ సలాం బయాష్ తిలక్‌ను స్వయంగా తన వాహనంలో తీసుకొచ్చి, తిరిగి ఇంటికి చేర్చేవాడు. 2020లో తిలక్ అండర్-19 వరల్డ్‌కప్‌కు ఎంపిక కావడంలో అకాడమీ పాత్ర చాలా కీలకం. తిలక్ టీమిండియాకు ఎంపికయ్యే వరకు వారానికి నాలుగు రోజుల పాటు అకాడమీకి వెళ్లేవాడు. ఆసియా కప్ హీరోయిక్స్ తర్వాత తిలక్ హైదారాబాద్ యువతకు స్పూర్తిగా మారాడు. చదవండి: టీమిండియాకు బ్యాడ్ న్యూస్ -
కొనసాగుతున్న ఆసియా కప్ హైడ్రామా.. ట్రోఫీ తిరిగి ఇచ్చేందుకు షరతులు పెట్టిన నఖ్వీ
ఆసియా కప్ 2025 (Asia cup 2025) హైడ్రామా ఇంకా కొనసాగుతూనే ఉంది. టోర్నీ ముగిసి రెండు రోజులైనా ఛాంపియన్‌గా నిలిచిన భారత జట్టుకు (Team India) విన్నింగ్ ట్రోఫీ అందలేదు. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడిగా ఉన్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ మొహిసిన్ నఖ్వీ (Mohsin Naqvi) చేతుల మీద నుంచి విన్నింగ్ ట్రోఫీని అందుకునేందుకు టీమిండియా నిరాకరించిన విషయం తెలిసిందే. దీనికి ప్రతిగా నఖ్వీ ట్రోఫీతో పాటు భారత ఆటగాళ్లకు ఇవ్వాల్సిన మెడల్స్‌ను తీసుకెళ్లిపోయాడు. భారత ఆటగాళ్లు ట్రోఫీ లేకున్నా గెలుపు సంబురాలు అద్భుతంగా చేసుకున్నారు.తాజాగా నఖ్వీ తాను ఎత్తుకెళ్లి పోయిన ట్రోఫీని, మెడల్స్‌ను భారత ఆటగాళ్లకు ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నానని ప్రకటించినట్లు తెలుస్తుంది. అయితే ఇందుకు ఓ కండీషన్ పెట్టాడట. అతనే స్వయంగా భారత కెప్టెన్‌కు ట్రోఫీని, మిగతా ఆటగాళ్లకు మెడల్స్‌ను ఇస్తానని చెప్పాడట. నఖ్వీ పెట్టిన ఈ కండీషన్‌కు భారత ఆటగాళ్లు ససేమిరా అన్నట్లు సమాచారం. ఈ వివాదం అతి త్వరలో కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. ఇవాళ (సెప్టెంబర్ 30) జరుగబోయే ఏసీసీ సమావేశంలో బీసీసీఐ నఖ్వీని తూర్పారబెట్టాలని డిసైడైంది. ఇది అతని పదవికే ముప్పు తెచ్చిపెట్టవచ్చు. ఈ వివాదాన్ని బీసీసీఐ ఐసీసీ వరకు కూడా తీసుకెళ్లకుండా ఏసీసీలోనే తెంచేయాలని కృత నిశ్చయంతో ఉన్నట్లు తెలుస్తుంది.కాగా, సెప్టెంబర్ 28న జరిగిన ఆసియా కప్ ఫైనల్లో భారత్ పాకిస్తాన్‌ను 5 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించింది. ఉత్కంఠగా సాగిన లో స్కోరింగ్ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన పాక్.. కుల్దీప్ యాదవ్ (4-0-30-4) ధాటికి 19.1 ఓవర్లలో 146 పరుగులకే కుప్పకూలింది.అనంతరం 147 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనలో భారత్ సైతం తొలుత తడబడినప్పటికీ.. తిలక్ వర్మ (53 బంతుల్లో 69; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) అజేయ అర్ద శతకంతో టీమిండియాను గెలిపించాడు. సంజూ శాంసన్ (24), శివమ్ దూబే (33) తిలక్‌కు సహకరించారు. రింకూ సింగ్ బౌండరీ బాది మ్యాచ్‌ను ముగించాడు.ఈ టోర్నీలో భారత్ మొత్తం మూడు సార్లు పాక్‌ను ఓడించింది. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో ఈ టోర్నీలో భారత ఆటగాళ్లు పాక్ ఆటగాళ్లకు హ్యాండ్‌షేక్‌ను నిరాకరించారు. దీన్ని అవమానంగా భావించిన పీసీబీ నానా యాగీ చేసినప్పటికీ.. ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది.తమకు అనుకూలంగా ఏదీ జరగడం లేదని తెలిసి పీసీబీ వారి ఆటగాళ్లను రెచ్చగొట్టింది. భారత్‌ను, భారత ఆటగాళ్లను ఉద్దేశిస్తూ పాక్ ఆటగాళ్లు హరీస్ రౌఫ్, సాహిబ్జాదా ఫర్హాన్ చాలా ఓవరాక్షన్ చేశారు. దీనికి కూడా పాక్ ఆటగాళ్లు మూల్యం చెల్లించుకున్నారు. పాక్ ఆటగాళ్ల కవ్వింపులకు ఎక్కడా సహనం కోల్పోని టీమిండియా మైదానంలో వారికి తగు రీతో బద్ది చెప్పింది.చదవండి: ప్రపంచ క్రికెట్లో పెను సంచలనం.. మాజీ ఛాంపియన్‌ను మట్టికరిపించిన పసికూన -
చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్
టీమిండియా వికెట్‌కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ (Sanju Samson) చరిత్ర సృష్టించాడు. భారత్ తరఫున టీ20ల్లో అత్యధిక సిక్సర్లు బాదిన వికెట్‌కీపర్ బ్యాటర్‌గా అవతరించాడు. తాజాగా జరిగిన ఆసియా కప్ ఫైనల్లో సంజూ ఈ ఘనత సాధించాడు. ఎంఎస్ ధోని (MS Dhoni) పేరిట ఉండిన ఈ రికార్డును సంజూ తన పేరిట బదిలి చేసుకున్నాడు.పాకిస్తాన్‌తో జరిగిన ఆసియా కప్ ఫైనల్లో (Asia Cup 2025) సంజూ ఓ సిక్సర్ కొట్టాడు. దీంతో కలుపుకొని టీ20ల్లో అతని సిక్సర్ల సంఖ్య 55కి చేరింది. కేవలం 48 ఇన్నింగ్స్‌ల్లోనే సంజూ ఈ సిక్సర్లను బాదాడు. ధోని విషయానికొస్తే.. అతని ఖాతాలో 54 టీ20 సిక్సర్లు ఉన్నాయి. ఈ విభాగంలో సంజూ, ధోని తర్వాతి స్థానంలో రిషబ్ పంత్ ఉన్నాడు. పంత్ ఖాతాలో 52 సిక్సర్లు ఉన్నాయి.ఆసియా కప్‌లో సంజూ మరో ఘనత కూడా సాధించాడు. ఓ టోర్నీలో అత్యధిక సిక్సర్లు బాదిన భారత వికెట్‌కీపర్ బ్యాటర్‌గా రికార్డు నెలకొల్పాడు. ఈ టోర్నీలో సంజూ మొత్తం 7 సిక్సర్లు బాదాడు. గతంలో ఈ రికార్డు ధోని, పంత్ పేరిట సంయుక్తంగా ఉంది. ధోని 2009 టీ20 వరల్డ్‌కప్‌లో, పంత్ 2024 టీ20 వరల్డ్‌కప్‌లో తలో 6 సిక్సర్లు బాదారు.కాగా, ఆసియా కప్ 2025లో భారత్ విజేతగా అవతరించింది. ఫైనల్లో పాకిస్తాన్‌పై 5 వికెట్ల తేడాతో గెలుపొంది, 9వ సారి ఆసియా ఛాంపియన్‌గా నిలిచింది. ఉత్కంఠగా సాగిన లో స్కోరింగ్ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన పాక్.. కుల్దీప్ యాదవ్ (4-0-30-4) ధాటికి 19.1 ఓవర్లలో 146 పరుగులకే కుప్పకూలింది.అనంతరం 147 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనలో భారత్ సైతం తొలుత తడబడినప్పటికీ.. తిలక్ వర్మ (53 బంతుల్లో 69; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) అజేయ అర్ద శతకంతో టీమిండియాను గెలిపించాడు. సంజూ శాంసన్ (24), శివమ్ దూబే (33) తిలక్‌కు సహకరించారు. రింకూ సింగ్ బౌండరీ బాది మ్యాచ్‌ను ముగించాడు. ఈ టోర్నీలో భారత్ మొత్తం మూడు సార్లు పాక్‌ను ఓడించింది. చదవండి: ప్రపంచ క్రికెట్లో పెను సంచలనం.. మాజీ ఛాంపియన్‌ను మట్టికరిపించిన పసికూన -
ఐదు రోజుల్లో మరోసారి భారత్, పాకిస్తాన్ క్రికెట్ సమరం
తాజాగా ముగిసిన పురుషుల ఆసియా కప్ టోర్నీలో భారత్, పాకిస్తాన్ (India vs Pakistan) జట్లు ఏకంగా మూడు సార్లు ఎదురెదురుపడ్డాయి. గ్రూప్ దశ, సూపర్-4, ఫైనల్లో.. తలపడిన ప్రతిసారి భారత్ పాక్‌ను చిత్తుగా ఓడించి, తొమ్మిదో సారి ఆసియా ఛాంపియన్‌గా అవతరించింది. ఈ ఆసియా కప్ టోర్నీలో మునుపెన్నడూ చోటు చేసుకొని హైడ్రామా చోటు చేసుకుంది.పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత ఆటగాళ్లు పాక్ ఆటగాళ్లకు హ్యాండ్‌షేక్‌కు నిరాకరించారు. టీమిండియాను ఏమీ చేసుకోలేక పాక్ క్రికెట్ బోర్డు మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్‌పై ఐసీసీకి ఫిర్యాదు చేసి శునకానందం పొందింది. ఐసీసీ తిరిగి వారికే అక్షింతలు వేయడంతో తోకముడిచి భారత ఆటగాళ్లను, భారతీయులను రెచ్చగొట్టే ప్రయత్నం చేసింది.సూపర్-4 దశ మ్యాచ్‌లో పాక్ ఆటగాళ్లు హరీస్ రౌఫ్, సాహిబ్జాదా ఫర్హాన్ భారత ఆటగాళ్లను సంజ్ఞలతో కవ్వించే ప్రయత్నం చేశారు. టీమిండియా మాత్రం ఈసారి కూడడా ఆటతీరుతోనే వారికి బుద్ది చెప్పింది.ఫైనల్లో భారత్ పాక్‌ను ముచ్చటగా మూడోసారి ఓడించిన తర్వాత డ్రామా మరింత రక్తి కట్టింది. టైటిల్ గెలిచిన తర్వాత భారత ఆటగాళ్లు ఆసియా క్రికెట్ కౌన్సిల్‌కు ఛైర్మన్‌గా ఉన్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు మొహిసిన్ నఖ్వీ నుంచి ట్రోఫీని అందుకునేందుకు నిరాకరించారు. పహల్గాం ఉగ్రదాడికి ప్రతిగా భారత క్రికెటర్లు ఆసియా కప్ వేదికగా పాక్ ఆటగాళ్లకు చేయాల్సిన మర్యాదంతా చేశారు. పాకిస్తాన్‌ను క్రికెట్ మైదానంలో మరో దెబ్బ కొట్టేందుకు టీమిండియాకు అతి త్వరలో మరో అవకాశం రానుంది. ఐసీసీ మహిళల క్రికెట్ వరల్డ్‌కప్-2025లో (ICC Women's World Cup 2025) భారత్ అక్టోబర్ 5న పాకిస్తాన్‌తో తలపడనుంది. ఈసారి కూడా టీమిండియా పాక్‌ను చిత్తుగా ఓడించాలని యావత్ భారతావణి కోరుకుంటుంది. ఈ మ్యాచ్ కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో జరుగనుంది. ఈ మెగా టోర్నీకి శ్రీలంకతో పాటు భారత్ కూడా ఆతిథ్యమిస్తున్నా.. రాజకీయ ఉద్రిక్తతల కారణంగా పాక్ మ్యాచ్‌లన్నీ శ్రీలంకలో నిర్వహిస్తున్నారు. మొత్తానికి మరో 5 రోజుల్లో పాక్‌కు బుద్ది చెప్పే అవకాశం భారత్‌కు మరోసారి రానుంది.కాగా, మహిళల వన్డే వరల్డ్‌కప్ రేపటి నుంచే (సెప్టెంబర్ 30) ప్రారంభం కానుంది. గౌహతి వేదికగా జరిగే మ్యాచ్‌లో భారత్, శ్రీలంక తలపడనున్నాయి. ఈ మ్యాచ్ మధ్యాహ్నం 3 గంటల నుంచి ప్రారంభమవుతుంది. చదవండి: క్రికెట్ అభిమానులకు గుండెకోతను మిగిల్చిన 2025 -
Asia Cup 2025: సూర్యకుమార్ యాదవ్ చేశాడని పాకిస్తాన్ కెప్టెన్ కూడా..!
నిన్న (సెప్టెంబర్ 28) జరిగిన ఆసియా కప్ 2025 ఫైనల్లో (Asia cup 2025) భారత్ పాకిస్తాన్‌ను (India vs Pakistan) చిత్తుగా ఓడించి 9వ సారి టైటిల్‌ను (వన్డే, టీ20) కైవసం చేసుకుంది. టీమిండియా (Team India) టైటిల్ గెలిచిన అనంతరం చాలా హైడ్రామా చోటు చేసుకుంది.భారత ఆటగాళ్లు ఆసియా క్రికెట్ కౌన్సిల్‌కు ఛైర్మన్‌గా ఉన్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు మొహిసిన్ నఖ్వీ నుంచి ట్రోఫీని అందుకునేందుకు నిరాకరించారు. దీనికి ప్రతిగా నఖ్వీ టీమిండియాకు ఇవ్వాల్సిన ట్రోఫీని, మెడల్స్‌ను ఎత్తుకెళ్లిపోయాడు.భారత ఆటగాళ్లు ట్రోఫీ లేకుండా సంబురాలు చేసుకొని నఖ్వీ పుండుపై కారం చల్లారు. మధ్యలో పాక్ కెప్టెన్ సల్మాన్ అఘా నఖ్వీ చేతి నుంచి అందుకున్న రన్నరప్ చెక్‌ను అక్కడే పడేసి ఓవరాక్షన్ చేశాడు. పహల్గాం ఉగ్రవాడికి ప్రతిగా భారత ఆటగాళ్లు ఈ టోర్నీ ఆరంభం నుంచి పాక్ ఆటగాళ్లకు హ్యాండ్ షేక్‌ను నిరాకరించిన విషయం తెలిసిందే. ఫైనల్ సహా ఇరు జట్లు తలపడిన మూడు సందర్భాల్లో ఇదే జరిగింది.ఈ హైడ్రామా నడుమ టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) సంచలన నిర్ణయం తీసుకొని పాకిస్తానీల గుండెల్లో అగ్గి రాజేస్తూ, తన దేశభక్తిని చాటుకున్నాడు. ఆసియా కప్ ద్వారా అతనికి లభించబోయే మ్యాచ్ ఫీజ్ మొత్తాన్ని పహల్గాం ఉగ్రదాడిలో బాధిత కుటుంబాలకు, అలాగే భారత సాయుధ దళాలకు విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించాడు.స్కై తీసుకున్న ఈ నిర్ణయంపై యావత్ భారతావణి హర్షం వ్యక్తం చేస్తుంది. భారతీయులంతా స్కైను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. స్కైను కాపీ కొడుతూ పాక్ కెప్టెన్ సల్మాన్ అఘా (Salman Agha) 'ఆపరేషన్ సిందూర్' బాధితులకు తన ఆసియా కప్ మ్యాచ్ ఫీజ్ మొత్తాన్ని విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించాడు.కాగా, నిన్న జరిగిన ఫైనల్లో పాకిస్తాన్‌పై టీమిండియా 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఉత్కంఠగా సాగిన ఈ లో స్కోరింగ్ టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన పాక్.. కుల్దీప్ యాదవ్ (4-0-30-4) ధాటికి 19.1 ఓవర్లలో 146 పరుగులకే కుప్పకూలింది.అనంతరం 147 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనలో భారత్ సైతం తడబడింది. అయితే తిలక్ వర్మ (53 బంతుల్లో 69; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) అజేయ అర్ద శతకంతో టీమిండియాను గెలిపించాడు. సంజూ శాంసన్ (24), శివమ్ దూబే (33) తిలక్‌కు సహకరించారు. రింకూ సింగ్ బౌండరీ బాది మ్యాచ్‌ను ముగించాడు.చదవండి: Asia Cup: సూర్యకుమార్ యాదవ్ సంచలన నిర్ణయం.. -
అంత పొగరా?.. స్టేజ్ పైనే చెక్‌ను విసిరేసిన పాక్ కెప్టెన్! వీడియో
ఆసియాకప్-2025లో భారత్-పాకిస్తాన్ జట్లు మూడు సార్లు తలపడ్డాయి. మూడు సార్లు కూడా పాక్‌కు జట్టుకు భారత్ చేతిలో పరాభావం ఎదురైంది. లీగ్ స్టేజి, సూపర్-4లో టీమిండియాపై ఓటమి చవిచూసిన పాకిస్తాన్‌కు ఇప్పుడు ఫైనల్లో కూడా భంగపాటు తప్పలేదు.ఆదివారం దుబాయ్ వేదికగా జరిగిన తుది పోరులో 5 వికెట్ల తేడాతో పాక్‌పై భారత్ ఘన విజయం సాధించింది. అయితే భారత్ చేతిలో ఓటమిని పాక్ ఆటగాళ్లు జీర్ణించుకులేకపొతున్నారు. అంతకుతోడు భారత ఆటగాళ్లు కనీసం కరచాలనం చేయకపోవడం, ఫైనల్ ప్రెజెంటేషన్ వేడుకలలో వారితో కలిసి పాల్గోకపోవడంతో దాయాది ఆటగాళ్లు ఫ్రస్టేషన్ పీక్స్ చేరింది.ఫైనల్ మ్యాచ్ ముగిసినంతరం ఏసీసీ ఛీప్, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మెన్ మొహ్సిన్ నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీని స్వీకరించేందుకు భారత జట్టు నిరాకరించింది. పాక్ ఆటగాళ్లు పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్ సెర్మనీకు సిద్దంగా ఉన్నప్పటికి భారత ఆటగాళ్లు మాత్రం వేదిక దగ్గరకు కూడా రాలేదు. దీంతో పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్ సెర్మనీ దాదాపు గంట ఆలస్యంగా ప్రారంభమైంది. కేవలం పాక్ ఆటగాళ్లు మాత్రమే రన్నరప్ మెడల్స్‌ను తీసుకున్నారు.పాక్ కెప్టెన్ ఓవరాక్షన్..ఈ క్రమంలో పాక్ కెప్టెన్ సల్మాన్ అలీ అఘాకు ఆసియన్ క్రికెట్ కౌన్సెల్ (ఏసీసీ) చైర్మెన్, ఏసీసీ ప్రతినిథి ఆమినుల్ ఇస్లాం రన్నరప్ టైటిల్ అందజేశారు. అయితే ఇక్కడే సల్మాన్ అలీ ఓవరాక్షన్ చేశాడు. చెక్కు తీసుకున్న పాక్ కెప్టెన్ వెంటనే స్టేజ్ మీద నుంచి కిందకు విసిరేశాడు.అతడి తీరుతో వేదిక మీద ఉన్న వారు షాక్‌కు గురయ్యారు. మొహ్సిన్ నఖ్వీ చేతుల మీదుగా టీమిండియా ఆసియా కప్ టైటిల్ అందుకోవడానికి ఇష్టపడకపోవడంతో సల్మాన్ ఇలా ప్రవర్తించినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత స్టేజిపై నుంచి కిందకు వస్తుండగా సల్మాన్‌ను భారత్ ఫ్యాన్స్ గట్టిగా అరుస్తూ హేళన చేశారు. దీంతో అతడు చేసేదేమి లేక నవ్వుతూ వెళ్లిపోయాడు. ఇందుకు సంబంధించిన సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఇది చూసిన నెటిజన్లు మరి అంత పొగరు పనికిరాదు అని కామెంట్లు చేస్తున్నారు.చదవండి: Asia Cup 2025: ట్రోఫీ, మెడల్స్‌ని ఎత్తుకెళ్లిన పీసీబీ చైర్మెన్.. బీసీసీఐ సీరియస్Salman agha gadiki ekkado kalinattu vundi lucha gadu🤣🤣🤣 #INDvPAK pic.twitter.com/GkEn7deKZj— 𝙸𝚝𝚊𝚌𝚑𝚒 ❟❛❟ (@itachiistan1) September 28, 2025 -
చరిత్ర సృష్టించిన కుల్దీప్ యాదవ్.. ఆసియాకప్ హిస్టరీలోనే
ఆసియాకప్-2025లో భాగంగా పాకిస్తాన్‌తో జరిగిన ఫైనల్లో టీమిండియా స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. కుల్దీప్ తన స్పిన్ మ్యాజిక్‌తో పాక్ బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. చెలరేగి ఆడుతున్న పాక్ బ్యాటర్ల దూకుడుకు కళ్లెం వేశాడు.కుల్దీప్ యాదవ్ తన నాలుగు ఓవర్ల కోటాలో కేవలం 30 పరుగులు మాత్రమే ఇచ్చి 4 కీలక వికెట్లు పడగొట్టాడు. ఈ క్రమంలో కుల్దీప్ ఓ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. ఆసియాకప్ చరిత్రలో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా కుల్దీప్ నిలిచాడు. పాక్ బ్యాటర్ సైమ్ అయూబ్‌ను ఔట్ చేసినంతరం ఈ రికార్డును కుల్దీప్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పటివరకు ఈ రికార్డు శ్రీలంక బౌలింగ్ దిగ్గజం లసిత్ మలింగ పేరిట ఉండేది.తాజా మ్యాచ్‌తో మలింగ(33 వికెట్లు) ఆల్‌టైమ్ రికార్డును యాదవ్ బ్రేక్ చేశాడు. కుల్దీప్ తన ఆసియాకప్(వన్డే, టీ20)లో ఇప్పటివరకు 36 వికెట్లు పడగొట్టాడు. ఈ ఏడాది ఆసియాకప్‌లో ఏడు మ్యాచ్‌లు ఆడిన కుల్దీప్ మొత్తంగా 17 వికెట్లు పడగొట్టాడు.అంతేకాకుండా ఒక ఆసియాకప్ ఏడిషన్‌లో అత్యధిక వికెట్లు సాధించిన భారత బౌలర్‌గా కూడా కుల్దీప్ రికార్డు స్పష్టించాడు. ఇంతకుముందు ఈ రికార్డు భారత మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ పేరిట ఉంది. ఆసియాకప్-2004లో పఠాన్ 14 వికెట్లు పడగొట్టాడు. తాజా ఎడిషన్‌లో 17 వికెట్లు సాధించిన కుల్దీప్.. పఠాన్‌ను అధిగమించాడు. కాగా ఫైనల్లో పాకిస్తాన్‌ను 5 వికెట్ల తేడాతో భారత్ చిత్తు చేసింది. దీంతో రికార్డు స్ధాయిలో తొమ్మిదోసారి ఆసియాకప్‌ను భారత్ కైవసం చేసుకుంది.ఆసియాకప్‌లో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్లు..కుల్దీప్ యాదవ్(భారత్)-36లసిత్ మలింగ(శ్రీలంక)-33ముత్తయ్య మురళీధరన్(శ్రీలంక)-30చదవండి: Asia Cup 2025: ట్రోఫీ, మెడల్స్‌ని ఎత్తుకెళ్లిన పీసీబీ చైర్మెన్.. బీసీసీఐ సీరియస్ -
సూర్యకుమార్ యాదవ్ సంచలన నిర్ణయం..
టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తన దేశభక్తిని చాటుకున్నాడు. ఆసియా కప్ 2025 టోర్నీలో తను ఆడిన మ్యాచ్‌ల ఫీజుల మొత్తాన్ని భారత సైన్యంతో పాటు పహల్గాం ఉగ్రదాడిలో బాధితులైన కుటుంబాలకు సూర్య విరాళంగా ఇచ్చాడు.ఈ మెగా టోర్నీ ఫైనల్ మ్యాచ్ అనంతరం సూర్య తన నిర్ణయాన్ని వెల్లడించాడు. "ఆసియాకప్ టోర్నీలో వచ్చే నా మొత్తం మ్యాచ్ ఫీజును పహల్గామ్ ఉగ్రవాద దాడిలో బాధితులైన కుటంబాలకు, మన సాయుధ దళాలకు విరాళంగా ఇవ్వాలని నిర్ణయించుకున్నాను. మీరు ఎల్లప్పుడూ నా ఆలోచనలలో ఉంటారు. జై హింద్." అని ఎక్స్‌లో స్కై పేర్కొన్నాడు. ఈ ఖండాంతర టోర్నీలో మిస్టర్ 360 మొత్తం 7 మ్యాచ్‌లు ఆడాడు. ఒక్కో మ్యాచ్‌కు రూ. 4 లక్షలు అందుకుంటున్నాడు. ఈ ఏడు మ్యాచ్‌లకు గానూ రూ.28 లక్షలు మ్యాచ్ ఫీజు రూపంలో సూర్యకి దక్కనుంది. అయితే పాకిస్తాన్‌పై లీగ్ మ్యాచ్ విజయాన్ని సాయుధ దళాలకు అంకితం చేసినందుకు సూర్య మ్యాచ్ ఫీజులో ఐసీసీ 30 శాతం కోత విధించింది.దీంతో అతడు రూ. 26.80 లక్షలు డొనేట్ చేయనున్నాడు. కాగా ఆదివారం జరిగిన ఫైనల్లో 5 వికెట్ల తేడాతో పాక్‌ను భారత్ ఓడించింది. టీమిండియా ఆసియాకప్‌ను కైవసం చేసుకోవడం ఇది ఏడోసారి కావడం విశేషం. పాక్‌పై గెలుపుతో దేశవ్యాప్తంగా సంబరాలు అంబరాన్ని అంటాయి. కాగా టోర్నీ ఆరంభం నుంచే పాకిస్తాన్‌పై భారత్ తమ నిరసనను తెలియజేసింది. పెహల్గమ్ ఉగ్రదాడికి నిరసనగా ఈ టోర్నీ మొత్తంగా పాక్ ఆటగాళ్లతో టీమిండియా ప్లేయర్లు కరచాలనం చేయలేదు. ఆఖరికి ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ACC) చీఫ్, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ చేతుల మీదగా ట్రోఫీని కూడా భారత్ తీసుకోలేదు.చదవండి: Asia Cup 2025: ట్రోఫీ, మెడల్స్‌ని ఎత్తుకెళ్లిన పీసీబీ చైర్మెన్.. బీసీసీఐ సీరియస్ -
ట్రోఫీ, మెడల్స్‌ని ఎత్తుకెళ్లిన పీసీబీ చైర్మెన్.. బీసీసీఐ సీరియస్
ఆసియాకప్-2025 ఛాంపియన్స్‌గా టీమిండియా నిలిచిన అనంతరం దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్‌మైదానంలో హైడ్రామా చోటు చేసుకుంది. ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ACC) చీఫ్, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ చేతుల మీదగా ట్రోఫీని స్వీకరించడానికి భారత ఆటగాళ్లు నిరాకరించారు.ప్రోటోకాల్ ప్రకారం.. ఆసియా క్రికెట్ కౌన్సిల్ బాస్ అయిన మొహ్సిన్ నఖ్వీనే విజేతకు ట్రోఫీ అందించాలి. కానీ భారత్-పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్తల కారణంగా ట్రోఫీని అతడి నుంచి తీసుకోవాడనికి మెన్ ఇన్ బ్లూ సముఖత చూపలేదు.దీంతో దాదాపు గంట అలస్యంగా ప్రారంభమైన పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్‌లో కేవలం పాక్ ఆటగాళ్లే రన్నరప్ మెడల్స్‌ను అందుకున్నారు. అయితే భారత జట్టు ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు వైస్-చైర్మన్ ఖలీద్ అల్ జరూని, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు చైర్మెన్ అమీనుల్ ఇస్లాం చేతుల మీదగా ట్రోఫీని అందుకుంటామని తెలియజేసింది. అందుకు వారిద్దరూ అంగీకరించారు. కానీ మొహ్సిన్ నఖ్వీ మాత్రం తానే అందిస్తానని మొండిపట్టు పట్టాడు. దీంతో టీమిండియా పూర్తిగా ట్రోఫీనే తీసుకోమని తేల్చి చెప్పేసింది. భారత్ తీరుతో సహనం కోల్పోయిన పీసీబీ చీఫ్.. ఆసియా కప్ ట్రోఫీతో పాటు, టీమిండియా ఆటగాళ్లకు ఇవ్వాల్సిన మెడల్స్‌ను హోటల్‌కు తీసుకువెళ్లిపోయాడు. ఈ క్రమంలో నఖ్వీ వ్యవహరించిన తీరు పట్ల సర్వాత్ర విమర్శల వర్షం కురుస్తోంది. ఇదే విషయంపై బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా స్పందించారు. మొహ్సిన్ నఖ్వీ చర్యను భారత క్రికెట్ బోర్డు సీరియస్‌గా తీసుకుంటున్నట్లు సైకియా తెలిపారు.బీసీసీఐ సీరియస్.."భారత్-పాకిస్తాన్ మధ్య పరిస్థితులు ఎలా ఉన్నాయో అందరికి తెలుసు. పాకిస్తాన్ సీనియర్ లీడర్స్‌లో ఒకరిగా ఏసీసీ చైర్మెన్ మొహ్సిన్ నఖ్వీ కొనసాగుతున్నారు. అటువంటి అప్పుడు అతడి చేతుల మీదగా ట్రోఫీని ఎలా తీసుకుంటాము? అతడి నుంచి మేము ఆసియా కప్ ట్రోఫీని తీసుకోకూడదని ముందే నిర్ణయించుకున్నాము. అతడు చేతుల మీదగా తీసుకోవడం లేదంటే ట్రోఫీ వద్దని కాదు. ట్రోఫీని, పతకాలను హోటల్ గదికి తీసుకువెళ్లే హక్కు ఎవరు ఇచ్చారు? నఖ్వీ నుంచి ఇది అస్సలు ఊహించలేదు. అతడికి కొంచెం కూడా జ్ఞానం లేదు. ఈ విషయంపై మేం ఐసీసీకి ఫిర్యాదు చేస్తాం. ఇది క్రీడాస్ఫూర్తికి విరుద్ధం. ట్రోఫీ, పతకాలు వీలైనంత త్వరగా భారత్‌కు పంపిస్తారని ఆశిస్తున్నా" అని ఎఎన్ఐతో సైకియా పేర్కొన్నాడు.చదవండి: అదే మా కొంపముంచింది.. లేదంటే కథ మరోలా ఉండేది: పాక్ కెప్టెన్ -
నా కెరీర్లో ఇలా ఎప్పుడు జరగలేదు.. కానీ చాలా సంతోషంగా ఉంది: సూర్య
ఆసియాకప్-2025కు ఆదివారం(సెప్టెంబర్ 28) ఎండ్ కార్డ్ పడింది. దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా జరిగిన ఫైనల్లో 5 వికెట్ల తేడాతో పాకిస్తాన్‌ను ఓడించిన భారత జట్టు.. రికార్డు స్ధాయిలో తొమ్మిదోసారి ఆసియాకప్ విజేతగా నిలిచింది. అయితే ఈ మ్యాచ్ అనంతరం దుబాయ్ అంతర్జాతీయ మైదానంలో అనుహ్యపరిణామాలు చోటు చేసుకున్నాయి.ఈ టోర్నీ ఆరంభం నుంచే పాక్‌తో అంటి ముట్టకుండా ఉంటున్న భారత జట్టు.. ఫైనల్ మ్యాచ్‌లోనూ అదే తీరును కొనసాగించింది. అయితే ఈసారి ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ACC) చైర్మెన్, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చీఫ్ మొహ్సిన్ నఖ్వీకి టీమిండియా ఝులక్ ఇచ్చింది.అతడి చేతుల మీదగా విన్నింగ్ ట్రోఫీని తీసుకోవడానికి భారత ఆటగాళ్లు నిరాకరించారు. మొహ్సిన్ నఖ్వీ ప్రస్తుతం పీసీబీ చైర్మెన్‌తో పాటు పాకిస్తాన్ మంత్రిగా కొనసాగుతున్నాడు. ఈ కారణంతోనే అతడి చేతుల మీదగా ట్రోఫీని తీసుకోవడానికి టీమిండియా సముఖత చూపలేదు. దీంతో గ్రౌండ్‌కు తీసుకొచ్చిన ట్రోఫీని వెనక్కి తీసుకెళ్లారు. భారత ఆటగాళ్లు ట్రోఫీ లేకుండానే సంబరాలు చేసుకున్నారు. ఇదే విషయంపై పోస్ట్ మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్పందించాడు. తన కెరీర్లో ఫైనల్ మ్యాచ్ గెలిచిన తర్వాత ట్రోఫీ తీసుకోపోవడం ఇదే తొలిసారి సూర్య చెప్పుకొచ్చాడు."నా క్రికెట్లో కెరీర్లో ఇలాంటి సంఘటనను ఇప్పటివరకు చూడలేదు. ఓ జట్టు ఛాంపియన్స్‌గా తర్వాత ట్రోఫీని అందుకోకపోవడం ఇదే మొదటి సారి. మేము కష్టపడి ఛాంపియన్‌గా నిలిచినప్పటికి, ట్రోఫీని తిరస్కరించాలని నిర్ణయించుకున్నాము. మేము ఈ నెల 4వ తేదీ నుంచి ఇక్కడే(దుబాయ్) ఉన్నాము. ప్రతీ మ్యాచ్‌లోనూ వంద శాతం ఎఫక్ట్ పెట్టి విజయం సాధించాము. ఒక్క రోజు వ్యవధిలో వరుసగా రెండు మ్యాచ్‌లు ఆడి టైటిల్‌ను సొంతం చేసుకున్నాము. ఇందుకు మేము అన్ని రకాలగా అర్హులు. ఇంతకుమించి నేను చెప్పలేను. ట్రోఫీల గురించి మాట్లాడితే.. 14 మంది సహచరులు, సహాయక సిబ్బంది రూపంలో నా డ్రెసింగ్ రూమ్‌లో ఉన్నాయి. నా దృష్టిలో వారే నిజమైన ట్రోఫీలు. ఈ ఆసియా కప్ ప్రయాణంలో సపోర్ట్ స్టాప్ మాకు అన్ని విధాలగా అండగా నిలిచారు. మా కుర్రాళ్లు కూడా టోర్నీ అంతటా అద్బుతంగా రాణించారు. ఫైనల్ మ్యాచ్‌లో గెలవాలనకున్నాము. మేము అనుకున్నట్లు గెలిచాం. మ్యాచ్ ముగిసిన తర్వాత బిగ్ స్క్రీన్‌పై భారత్ గెలిచినట్లు, ఆసియా కప్ 2025 ఛాంపియన్స్ అని రాసి ఉంది. అంతకంటే మాకు ఇంకేమి కావాలి. చాలా సంతోషంగా ఉంది అని" సూర్య పేర్కొన్నాడు. అయితే హ్యాండ్ షేక్ వివాదం, ట్రోఫీ తీసుకోకపోవడానికి కారణాలపై పాక్ జర్నలిస్టు అడిగిన సమాధానాలను సూర్య దాటవేశాడు. చదవండి: అదే మా కొంపముంచింది.. లేదంటే కథ మరోలా ఉండేది: పాక్ కెప్టెన్ -
అదే మా కొంపముంచింది.. లేదంటే కథ మరోలా ఉండేది: పాక్ కెప్టెన్
పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు టీమిండియా చేతిలో మరోసారి చావు దెబ్బ ఎదురైంది. ఆదివారం దుబాయ్ వేదికగా జరిగిన ఆసియాకప్ ఫైనల్లో పాక్‌ను ఐదు వికెట్ల తేడాతో భారత్ చిత్తు చేసింది. దీంతో 13 ఏళ్ల తర్వాత ఆసియాకప్ టైటిల్‌ను ముద్దాడాలన్న పాక్ ఆశలపై మెన్ ఇన్ బ్లూ నీళ్లు జల్లింది.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 19.1 ఓవర్లలో కేవలం 146 పరుగులకే ఆలౌట్ అయింది. పెనర్లు సాహిబ్జాదా ఫర్హాన్ 57, ఫకర్ జమాన్ 46 పరుగులతో రాణించగా.. మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ నాలుగు వికెట్లతో ప్రత్యర్ధి పతనాన్ని శాసించగా.. బుమ్రా, వరుణ్, అక్షర్ పటేల్ తలా రెండేసి వికెట్లు సాధించారు. అనంతరం 147 పరుగుల లక్ష్యాన్ని భారత్ 19.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి చేధించింది. ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్ తిలక్ వర్మ(53 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లతో 69 పరుగులు నాటౌట్) చారిత్రత్మక ఇన్నింగ్స్ ఆడాడు. ఇక ఈ ఓటమిపై మ్యాచ్ అనంతరం పాక్ కెప్టెన్ సల్మాన్ అలీ అఘా స్పందించాడు. బ్యాటింగ్ వైఫల్యం కారణంగానే ఓడిపోయామని అఘా చెప్పుకొచ్చాడు.జీర్ణించుకోలేక పోతున్నాం.."ఈ ఓటమిని మేం జీర్ణించుకోలేక పోతున్నాం. బ్యాటింగ్‌లో మెరుగ్గా రాణించలేకపోయాము. మాకు మంచి ఆరంభం లభించినప్పటికి భారీ స్కోర్ సాధించలేకపోయాము. బౌలింగ్‌లో మాత్రం మేము అద్భుతంగా రాణించాము. ఆఖరి వరకు గెలిచేందుకు అన్ని విధాలగా మేము ప్రయత్నించాము.బ్యాటింగ్‌లో మంచి ఫినిషింగ్ చేసి ఉంటే కథ వేరేలా ఉండేది. స్ట్రయిక్‌ని సరిగ్గా రొటేట్ చేయలేకపోయాం. కీలక సమయంలో వరుసగా వికెట్లు కోల్పోయాం. అందుకే మేము అనుకున్న స్కోర్ చేయలేకపోయాము. ఈ మ్యాచ్ నుంచి చాలా పాఠాలు నేర్చుకున్నాము.మా బ్యాటింగ్ తప్పిదాలను సరిదిద్దుకుంటాము. భారత బౌలర్లు కూడా బాగా బౌలింగ్ చేశారు. మా ఇన్నింగ్స్ మిడిల్ ఓవర్లలో అద్బుతమైన కమ్‌బ్యాక్ ఇచ్చారు. ఆఖరి 6 ఓవర్లలో భారత విజయానికి 63 పరుగులు అవసరమయ్యాయి. దీంతో మాకు గెలిచేందుకు అన్ని అవకాశాలు ఉన్నాయని భావించాను.కానీ దురదృష్టవశాత్తూ ఓటమి చవి చూశాము. అయితే మా బౌలర్లు కూడా తీవ్రంగా శ్రమించారు. వారి ప్రదర్శన పట్ల చాలా గర్వంగా ఉంది. ఈ టోర్నీలో మాకు చాలా సానుకూల అంశాలు ఉన్నాయి. మా తదుపరి సవాల్ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నాము.మేము బలంగా తిరిగి వస్తామన్న నమ్మకం మాకు ఉందని" పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్‌లో సల్మాన్ పేర్కొన్నాడు. కాగా ఈ పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్‌ను భారత్ బహిష్కరిచింది. ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడు, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ అయిన మొహసిన్ నఖ్వీ చేతుల మీదగా ట్రోఫీని తీసుకునేందుకు టీమిండియా నిరాకరించింది.చదవండి: Asia Cup 2025: పట్టు బట్టిన పీసీబీ చైర్మెన్.. ఊహించని షాకిచ్చిన భారత్ -
పట్టు బట్టిన పీసీబీ చైర్మెన్.. ఊహించని షాకిచ్చిన భారత్
ఆసియాకప్-2025 విజేతగా టీమిండియా నిలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్లో దాయాది పాకిస్తాన్‌ను 5 వికెట్ల తేడాతో చిత్తు చేసిన భారత జట్టు.. తొమ్మిదో సారి ఆసియాకప్ టైటిల్‌ను ముద్దాడింది. ప్రత్యర్ధి నిర్ధేశించిన 147 పరుగుల లక్ష్యాన్ని భారత్ 5 వికెట్లు కోల్పోయి 19.4 ఓవర్లలో చేధించింది.భారత విజయంలో మిడిలార్డర్ బ్యాటర్, హైదరాబాదీ తిలక్ వర్మ (53 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లతో 69 పరుగులు నాటౌట్) కీలక పాత్ర పోషించాడు. లక్ష్య చేధనలో 20 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడ్డ జట్టును తిలక్ వర్మ తన అద్బుత ఇన్నింగ్స్‌తో ఛాంపియన్‌గా నిలిపాడు.అతడితో పాటు సంజూ శాంసన్(24), శివమ్ దూబే(33) రాణించారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 19.1 ఓవర్లలో 146 పరుగులకే ఆలౌటైంది. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ నాలుగు వికెట్లతో సత్తాచాటగా.. బుమ్రా, వరుణ్, అక్షర్ తలా రెండు వికెట్లు సాధించారు.ట్రోఫీని నిరాకరించిన భారత్.. అయితే ఈ ఫైనల్ మ్యాచ్ ముగిసిన తర్వాత హైడ్రామా చోటు చేసుకుంది. మ్యాచ్ ముగిసి 45 నిమిషాల సమయం దాటినా బహుమతి ప్రదానోత్సవం జరగలేదు. దాంతో ఏం జరిగిందనే అంశంపై చర్చ మొదలైంది. భారత జట్టు విజేత ట్రోఫీని స్వీకరించే విషయంలో వివాదం నెలకొనడమే అందుకు కారణమని తేలింది. ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడు, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ అయిన మొహసిన్ నఖ్వీ చేతుల మీదుగా కప్‌ను అందుకునేది లేదని టీమిండియా స్పష్టం చేసింది. ఈ క్రమంలో ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు వైస్-చైర్మన్ ఖలీద్ అల్ జరూని, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు చైర్మెన్ అమీనుల్ ఇస్లాం ట్రోఫీని అందించడానికి ముందుకొచ్చారు. అందుకు టీమిండియా కూడా అంగీకరించింది. కానీ మొహసిన్ నఖ్వీ మాత్రం తనే స్వయంగా ట్రోఫీ అందిస్తాని పట్టుబట్టాడు. దీంతో భారత్ ప్రేజెంటేషన్ వేడుకునే కాకుండా ఏకంగా ట్రోఫీని తీసుకునేందుకు నిరాకరించింది. దెబ్బకు పీసీబీ చైర్మెన్‌తో పాటు పాక్ ఆటగాళ్లు షాకయ్యారు.కేవలం పాక్ ఆటగాళ్లు మాత్రమే రన్నరప్ మెడల్స్‌ను అందుకున్నారు. భారత్ నుంచి తిలక్, దూబే, అభిషేక్ మాత్రం స్పాన్సర్ల నుంచి తమ వ్యక్తిగత బహుమతులు అందుకున్నారు. అయితే ఫైనల్ వేడుక ముగిసిన అనంతరం టీమిండియా ఆటగాళ్లు ట్రోఫీ లేకుండానే తమ విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరలవతున్నాయి.Big Breaking 🚨🚨Team India refuses to accept the Asia Cup 2025 Trophy 🏆 from Pakistan interior minister and ACC Chairman Mohsin Naqvi.Someone just picked up the trophy and walked off the ground.Another Embarrassing Moment for 🇵🇰Video 📷#INDvsPAK #AsiaCupFinal #Tilak pic.twitter.com/h4CrRZgcUF— Globally Pop (@GloballyPop) September 28, 2025చదవండి: ‘ఠాకూర్’ జితాదియా... -
ఆసియా కప్ విజేతగా టీమిండియా.. ఫైనల్లో పాకిస్తాన్‌పై గెలుపు
ఆసియా కప్ 2025 (Asia cup 2025) విజేతగా టీమిండియా (Team India) అవిర్భవించింది. ఇవాళ (సెప్టెంబర్ 28) జరిగిన ఫైనల్లో పాకిస్తాన్‌పై (India vs Pakistan) 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఉత్కంఠగా సాగిన ఈ లో స్కోరింగ్ టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన పాక్.. కుల్దీప్ యాదవ్ (4-0-30-4) ధాటికి 19.1 ఓవర్లలో 146 పరుగులకే కుప్పకూలింది.ఓపెనర్లు సాహిబ్జాదా ఫర్హాన్ (57), ఫకర్ జమాన్ (46) రాణించడంతో పాక్ తొలుత భారీ స్కోర్ చేసేలా కనిపించింది. 11.2 ఓవర్లలో కేవలం వికెట్ మాత్రమే కోల్పోయి 100 పరుగుల మార్కును తాకిన ఆ జట్టు.. భారత బౌలర్లు ఒక్కసారిగా లైన్లోకి రావడంతో తట్టుకోలేకపోయింది.33 పరుగుల వ్యవధిలో ఆ జట్టు చివరి 9 వికెట్లు కోల్పోయింది. భారత బౌలర్లలో కుల్దీప్తో పాటు అక్షర్ పటేల్ (4-0-26-2), వరుణ్ చక్రవర్తి (4-0-30-2), బుమ్రా (3.1-0-25-2) కూడా సత్తా చాటారు. పాక్ ఇన్నింగ్స్‌లో ఓపెనర్లతో పాటు వన్ డౌన్ బ్యాటర్ సైమ్ అయూబ్ (14) మాత్రమే రెండంకెల స్కోర్ చేశారు.అనంతరం 147 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనలో భారత్ సైతం తడబడింది. అయితే తిలక్ వర్మ (53 బంతుల్లో 69; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) అజేయ అర్ద శతకంతో టీమిండియాను గెలిపించాడు. సంజూ శాంసన్ (24), శివమ్ దూబే (33) తిలక్‌కు సహకరించారు. రింకూ సింగ్ బౌండరీ బాది మ్యాచ్‌ను ముగించాడు. అంతకుముందు భారత్ 20 పరుగులకే అభిషేక్ శర్మ (5), శుభ్‌మన్ గిల్ (12), సూర్యకుమార్ యాదవ్ (1) వికెట్లు కోల్పోయింది. పాక్ బౌలర్లలో ఫహీమ్ అఫ్రాఫ్ 3 వికెట్లు తీయగా.. షాహీన్ అఫ్రిది, అబ్రార్ అహ్మద్ తలో వికెట్ తీశారు. ఈ టోర్నీలో భారత్ పాక్‌పై గెలవడం ఇది మూడోసారి. అంతకుముందు గ్రూప్ దశలో, సూపర్-4లో కూడా టీమిండియానే విజయం సాధించింది. -
Asia cup 2025 Final: పాక్‌కు కౌంటరిచ్చిన బుమ్రా
భారత్, పాకిస్తాన్ (India vs pakistan) మధ్య జరుగుతున్న ఆసియా కప్ 2025 ఫైనల్లో (Asia cup 2025 Final) హైడ్రామా చోటు చేసుకుంది. సూపర్-4 మ్యాచ్‌లో పాక్ బౌలర్ హరీస్ రౌఫ్ (Haris Rauf) చేసిన ఓవరాక్షన్‌కు టీమిండియా పేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) కౌంటరిచ్చాడు.BUMRAH HAS GIVEN A PERFECT MEDICINE TO RAUF...!!! 🥶💥 pic.twitter.com/DpItOev4aO— Johns. (@CricCrazyJohns) September 28, 2025ఇన్నింగ్స్ 18వ ఓవర్లో అద్భుతమైన యార్కర్‌తో హరిస్ రౌఫ్‌ను క్లీన్ బౌల్డ్ చేసిన బుమ్రా.. విమానం కూలిపోయినట్లు సంజ్ఞ చేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో హల్చల్ చేస్తుంది. రౌఫ్‌కు సరైన సమాధానం చెప్పావంటూ భారత అభిమానులు బుమ్రాను ప్రశంసిస్తున్నారు.సూపర్-4 మ్యాచ్‌లో రౌఫ్ ఫీల్డింగ్ చేసే సమయంలో విమానం క్రాష్ అయినట్లు సంజ్ఞలు చేశాడు. అలాగే ఆరు సంఖ్యను సూచిస్తూ చేతి వేళ్లను ప్రదర్శించాడు. రౌఫ్ చర్యలపై బీసీసీఐ ఐసీసీకి ఫిర్యాదు చేయగా.. అతనికి 30 శాతం మ్యాచ్ ఫీజ్‌ను జరిమానాగా విధించారు.అదే మ్యాచ్‌లో మరో పాక్ ఆటగాడు కూడా అభ్యంతరకంగా ప్రవర్తించాడు. ఓపెనర్ సాహిబ్జాదా ఫర్హాన్ హాఫ్ సెంచరీ పూర్తి చేసిన అనంతరం బ్యాట్‌ను గన్లా భావిస్తూ సెలబ్రేట్ చేసుకున్నాడు. ఇతనిపై కూడా బీసీసీఐ ఐసీసీకి ఫిర్యాదు చేసింది. అయితే ఫర్హాన్‌ను ఐసీసీ మందలింపుతో వదిలిపెట్టింది.కాగా, నేటి ఫైనల్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన పాక్.. కుల్దీప్ యాదవ్ (4-0-30-4) ధాటికి 19.1 ఓవర్లలో 146 పరుగులకే కుప్పకూలింది. ఓపెనర్లు సాహిబ్జాదా ఫర్హాన్ (57), ఫకర్ జమాన్ (46) రాణించడంతో పాక్ తొలుత భారీ స్కోర్ చేసేలా కనిపించింది. 11.2 ఓవర్లలో కేవలం వికెట్ మాత్రమే కోల్పోయి 100 పరుగుల మార్కును తాకిన ఆ జట్టు.. భారత బౌలర్లు ఒక్కసారిగా లైన్లోకి రావడంతో తట్టుకోలేకపోయింది.33 పరుగుల వ్యవధిలో ఆ జట్టు చివరి 9 వికెట్లు కోల్పోయింది. భారత బౌలర్లలో కుల్దీప్తో పాటు అక్షర్ పటేల్ (4-0-26-2), వరుణ్ చక్రవర్తి (4-0-30-2), బుమ్రా (3.1-0-25-2) కూడా సత్తా చాటారు. పాక్ ఇన్నింగ్స్‌లో ఓపెనర్లతో పాటు వన్ డౌన్ బ్యాటర్ సైమ్ అయూబ్ (14) మాత్రమే రెండంకెల స్కోర్ చేశారు.చదవండి: Asia cup 2025 Final: సరికొత్త సంప్రదాయం -
Asia cup 2025 Final: సరికొత్త సంప్రదాయం
ఆసియా కప్ 2025 ఫైనల్లో (Asia cup 2025 Final) ఇవాళ (సెప్టెంబర్ 28) భారత, పాకిస్తాన్ (India vs Pakistan) తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టీమిండియా (Team India) టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేస్తుంది. టాస్ సమయంలో ఓ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఇరు జట్ల కెప్టెన్లతో మాట్లాడేందుకు ఇద్దరు ప్రతినిధులు ఏర్పాటు చేయబడ్డారు.సాధారణంగా ఏ మ్యాచ్‌కైనా టాస్ సమయంలో ఒకరే ప్రతినిధి ఇద్దరు కెప్టెన్లతో మాట్లాడతాడు. అయితా ఈసారి అలా కాకుండా పాకిస్తాన్ (Pakistan) కెప్టెన్‌తో ఒకరు, భారత కెప్టెన్‌తో మరొకరు మాట్లాడేందుకు ఏర్పాటు చేయబడ్డాడు. టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌తో భారత్‌కు చెందిన రవిశాస్త్రి మాట్లాడగా.. పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అఘాతో అదే దేశానికి చెందిన వకార్ యూనిస్ సంభాషించాడు.టాస్ అనంతరం టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మరోసారి పాక్ కెప్టెన్‌తో హ్యాండ్ షేక్‌కు దూరంగా ఉన్నాడు. టాస్ సమయంలో ఇద్దరు ప్రతినిధుల ఐడియాను బీసీసీఐ ప్రతిపాదించినట్లు తెలుస్తుంది.మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేస్తున్న టీమిండియా సాధారణంగా బౌలింగ్ చేస్తుంది. పాకిస్తాన్ ఓపెనర్లు సాహిబ్జాదా ఫర్హాన్, ఫకర్ జమాన్ వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడుతున్నారు. సూర్యకుమార్ యాదవ్ శివమ్ దూబేతో బౌలింగ్ అటాక్‌ను ప్రారంభించాడు. అతను 2 ఓవర్లలో 12 పరుగులకే ఇచ్చి పర్వాలేదనిపించాడు. బుమ్రా 2, వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్ తలో ఓవర్ వేశారు.6 ఓవర్ల తర్వాత పాక్ స్కోర్ 45/0గా ఉంది. ఫర్హాన్ 31, ఫకర్ జమాన్ 12 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. కాగా, భారత్, పాకిస్తాన్ 41 ఏళ్ల ఆసియా కప్ చరిత్రలో ఫైనల్లో తలపడటం ఇదే మొదటిసారి. అందుకే ఈ మ్యాచ్‌కు చాలా ప్రాధాన్యత ఏర్పడింది. ప్రస్తుత టోర్నీలో భారత్, పాక్ ఇప్పటికే రెండు సార్లు తలపడగా.. రెండు సందర్భాల్లో టీమిండియానే విజయం సాధించింది.చదవండి: చరిత్ర సృష్టించిన రాహుల్ చాహర్.. 166 ఏళ్ల పురాతన రికార్డు బద్దలు -
ఆసియా కప్ 2025 విజేత టీమిండియా
ఆసియా కప్ 2025 విజేతగా టీమిండియా అవిర్భవించింది. ఇవాళ (సెప్టెంబర్ 28) జరిగిన ఫైనల్లో పాకిస్తాన్‌పై 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఉత్కంఠగా సాగిన ఈ లో స్కోరింగ్ టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన పాక్ 19.1 ఓవర్లలో 146 పరుగులకే ఆలౌట్ కాగా.. భారత్ మరో 2 బంతులు మిగిలుండగా లక్ష్యాన్ని ఛేదించింది. తిలక్ వర్మ (69) అజేయ అర్ద శతకంతో టీమిండియాను గెలిపించాడు. హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న తిలక్తిలక్ 41 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 50 పరుగులు పూర్తి చేసుకున్డాను. 16 ఓవర్ల తర్వాత భారత్ స్కోర్ 111/4గా ఉంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా గెలవాలంటే 24 బంతుల్లో 36 పరుగులు చేయాలి. నాలుగో వికెట్ కోల్పోయిన టీమిండియా12.2వ ఓవర్- 77 పరుగుల వద్ద టీమిండియా నాలుగో వికెట్ కోల్పోయింది. అబ్రార్ అహ్మద్ బౌలింగ్‌లో ఫర్హాన్‌కు క్యాచ్ ఇచ్చి సంజూ శాంసన్ (24) ఔటయ్యాడు. ఆచితూచి ఆడుతున్న తిలక్, శాంసన్20 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన నేపథ్యంలో భారత బ్యాటర్లు తిలక్ వర్మ (24), సంజూ శాంసన్ (16) మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడుతున్నారు. 10 ఓవర్ల తర్వాత భారత స్కోర్ 58/3గా ఉంది.స్వల్ప లక్ష్య ఛేదనలో తడబడుతున్న టీమిండియా147 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనలో టీమిండియా తడబడుతుంది. 20 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. గిల్ (12) మూడో వికెట్‌గా వెనుదిరిగాడు. ఫహీమ్ అష్రఫ్ బౌలింగ్‌లో హరీస్ రౌఫ్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. కష్టాల్లో టీమిండియా147 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనలో టీమిండియా కష్టాల్లో పడింది. 10 పరుగులకే ఇన్ ఫామ్ బ్యాటర్ అభిషేక్ శర్మ (5), కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (1) వికెట్లు కోల్పోయింది. చెలరేగిన కుల్దీప్.. 146 పరుగులకే కుప్పకూలిన పాకిస్తాన్టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన పాక్.. కుల్దీప్ యాదవ్ (4-0-30-4) ధాటికి 19.1 ఓవర్లలో 146 పరుగులకే కుప్పకూలింది. ఓపెనర్లు సాహిబ్జాదా ఫర్హాన్ (57), ఫకర్ జమాన్ (46) రాణించడంతో పాక్ తొలుత భారీ స్కోర్ చేసేలా కనిపించింది. 11.2 ఓవర్లలో కేవలం వికెట్ మాత్రమే కోల్పోయి 100 పరుగుల మార్కును తాకిన ఆ జట్టు.. భారత బౌలర్లు ఒక్కసారిగా లైన్లోకి రావడంతో తట్టుకోలేకపోయింది.33 పరుగుల వ్యవధిలో ఆ జట్టు చివరి 9 వికెట్లు కోల్పోయింది. భారత బౌలర్లలో కుల్దీప్తో పాటు అక్షర్ పటేల్ (4-0-26-2), వరుణ్ చక్రవర్తి (4-0-30-2), బుమ్రా (3.1-0-25-2) కూడా సత్తా చాటారు. పాక్ ఇన్నింగ్స్‌లో ఓపెనర్లతో పాటు వన్ డౌన్ బ్యాటర్ సైమ్ అయూబ్ (14) మాత్రమే రెండంకెల స్కోర్ చేశారు.చెలరేగిన కుల్దీప్ఇన్నింగ్స్ 17వ ఓవర్లో కుల్దీప్ యాదవ్ మూడు వికెట్లు తీసి పాక్‌ను కోలుకోలేని దెబ్బకొట్టాడు. తొలి బంతికి సల్మాన్ అఘా, నాలుగో బంతికి షాహీన్ అఫ్రిది (0), ఆఖరి బంతికి ఫహీమ్ అష్రాఫ్ (0) ఔటయ్యారు. 16 ఓవర్ల తర్వాత పాక్ స్కోర్ 134/8గా ఉంది. నవాజ్, హరీస్ రౌఫ్ క్రీజ్‌లో ఉన్నారు.ఆరో వికెట్ కోల్పోయిన పాక్16.1వ ఓవర్- 133 పరుగుల వద్ద పాక్ ఆరో వికెట్ కోల్పోయింది. అక్షర్ పటేల్ బౌలింగ్‌లో సంజూ శాంసన్ అద్భుతమైన క్యాచ్ పట్టడంతో సల్మాన్ అఘా (8) ఔటయ్యాడు. కష్టాల్లో పాకిస్తాన్పాక్ జట్టు మరోసారి కష్టాలో పడింది. తొలుత పరుగు వ్యవధిలో రెండు వికెట్లు కోల్పోయిన ఆ జట్టు.. ఈసారి 5 పరుగుల వ్యవధిలో మరో 2 వికెట్లు కోల్పోయింది. దీంతో పాక్ 15.3 ఓవర్లలో 132 పరుగులకే సగం వికెట్లు కోల్పోయింది. సల్మాన్ అఘా (7), మొహమ్మద్ నవాజ్ (1) క్రీజ్‌లో ఉన్నారు. 14 ఓవర్ల తర్వాత పాక్ స్కోర్ 118/3పరుగు వ్యవధిలో రెండు వికెట్లు (సైమ్ అయూబ్ (14), మొహమ్మద్ హరీస్ (0)) కోల్పోవడంతతో పాక్ స్కోర్ నెమ్మదించింది. 14 ఓవర్ల తర్వాత ఆ జట్టు స్కోర్ 118/3గా ఉంది. ఫకర్ జమాన్ (38), సల్మాన్ అఘా (3) క్రీజ్‌లో ఉన్నారు. 100 పరుగులు పూర్తి చేసుకున్న పాకిస్తాన్టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేస్తున్న పాక్ 11.2 ఓవర్లలోనే 100 పరుగులు (వికెట్ నష్టానికి) పూర్తి చేసుకుంది. 12 ఓవర్ల తర్వాత పాక్ స్కోర్ 107/1గా ఉంది. ఫకర్ జమాన్ (33), సైమ్ అయూబ్ (13) క్రీజ్‌లో ఉన్నారు. తొలి వికెట్ కోల్పోయిన పాక్9.4వ ఓవర్- 84 పరుగుల వద్ద పాక్ తొలి వికెట్ కోల్పోయింది. హాఫ్ సెంచరీ అనంతరం సాహిబ్జాదా ఫర్హాన్ (57) ఔటయ్యాడు. వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో తిలక్ వర్మ క్యాచ్ పట్టడంతో ఫర్హాన్ పెవిలియన్‌కు చేరాడు. ధాటిగా ఆడుతున్న పాక్ ఓపెనర్లు.. ఫర్హాన్ హాఫ్ సెంచరీతొలుత నిదానంగా ఆడిన పాక్ ఓపెనర్లు గేర్ మార్చారు. సాహిబ్జాదా ఫర్హాన్ 35 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. మరో ఓపెనర్ ఫకర్ జమాన్ 18 బంతుల్లో ఫోర్, సిక్సర్ సాయంతో 22 పరుగులతో క్రీజ్‌లో ఉన్నాడు. 9 ఓవర్ల తర్వాత పాక్ స్కోర్ 77/0గా ఉంది. జాగ్రత్తగా ఆడుతున్న పాకిస్తాన్ ఓపెనర్లుటాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేస్తున్న పాకిస్తాన్ ఆచితూచి ఆడుతుంది. ఓపెనర్లు సాహిబ్జాదా ఫర్హాన్ (24), ఫకర్ జమాన్ (6) చాలా జాగ్రత్తగా ఆడుతున్నారు. 4 ఓవర్ల తర్వాత ఆ జట్టు స్కోర్ 32/0గా ఉంది.క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న భారత్, పాకిస్తాన్ ఆసియా కప్ 2025 ఫైనల్ మ్యాచ్ మరికొద్ది నిమిషాల్లో ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్‌లో టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా సేవలను కోల్పోయింది. గాయం కారణంగా అతను ఈ మ్యాచ్‌లో ఆడటం లేదు. అతని స్థానంలో రింకూ సింగ్ తుది జట్టులోకి వచ్చాడు. గత మ్యాచ్ మిస్ అయిన శివమ్ దూబే, బుమ్రా జట్టులోకి రీఎంట్రీ ఇచ్చారు. తుది జట్లు.. పాకిస్తాన్: సాహిబ్జాదా ఫర్హాన్, ఫఖర్ జమాన్, సైమ్ అయూబ్, సల్మాన్ అఘా(సి), హుస్సేన్ తలత్, మహ్మద్ హారీస్(w), మహ్మద్ నవాజ్, ఫహీమ్ అష్రఫ్, షాహీన్ అఫ్రిది, హారీస్ రవూఫ్, అబ్రార్ అహ్మద్ భారత్: అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్(సి), తిలక్ వర్మ, సంజు శాంసన్(w), శివమ్ దూబే, రింకూ సింగ్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి -
Ind vs Pak: అప్పుడు బాయ్‌కాట్ అన్నారు.. ఇప్పుడేమో ఎగబడుతున్నారు..!
ఆసియా కప్-2025లో (Asia Cup 2025) ఇవాళ (సెప్టెంబర్ 28) భారత్-పాకిస్తాన్ (India vs Pakistan) మధ్య మెగా ఫైనల్ జరుగనుంది. ఈ మ్యాచ్ దుబాయ్‌లోని అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో భారతకాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు ప్రారంభం కానుంది.ఈ టోర్నీలో భారత్, పాక్ తలపడటం ఇది మూడోసారి. అంతకుముందు గ్రూప్ దశ, సూపర్-4లో ఇరు జట్లు తలపడ్డాయి. ఈ రెండు పర్యాయాల్లో టీమిండియా పాక్‌ను చిత్తుగా ఓడించింది. నేడు జరుగబోయే ఫైనల్లోనూ అదే సీన్ రిపీట్ కాబోతుందని భారత అభిమానులు, విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.కాగా, నేటి భారత్-పాక్ ఫైనల్ మ్యాచ్‌ను భారతవ్యాప్తంగా 100కు పైగా పీవీఆర్ ఐనాక్స్ (PVR INOX) స్క్రీన్లపై ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. ఈ అంశం ప్రస్తుతం సోషల్‌మీడియాలో ట్రెండ్ అవుతుంది. ఇదే టోర్నీలో భారత్, పాక్ గ్రూప్ దశ, సూపర్-4లో తలపడినప్పుడు బాయ్‌కాట్ అన్న జనాలు.. ఫైనల్ మ్యాచ్ వచ్చేసరికి టికెట్ల కోసం ఎగబడుతున్నారు.ఈ విషయాన్ని హైలైట్ చేస్తూ కొందరు నెటిజన్లు వ్యంగ్యమైన కామెంట్లు చేస్తున్నారు. బాయ్‌కాట్ గ్యాంగ్ టికెట్ బుకింగ్ గ్యాంగ్‌గా మారిందని ఎద్దేవా చేస్తున్నారు. భారత్-పాక్ మ్యాచ్‌ను బాయ్‌కాట్ చేయాలని ఉద్యమాలు చేసిన వాళ్లే, ఇప్పుడు టికెట్ల కోసం క్యూ లైన్లలో పడిగాపులు కాస్తున్నారంటూ సెటైర్లు వేస్తున్నారు. భారత్-పాక్ మ్యాచ్ ప్రారంభానికి కొన్ని గంటల సమయం మాత్రమే ఉండగా దేశంలోని ప్రధాన నగరాల్లో స్క్రీనింగ్ హంగామా నడుస్తుంది. PVR INOX స్క్రీన్లపై దాయాదుల తుది సమరాన్ని వీక్షించేందుకు క్రికెట్ అభిమానులు ఎగబడుతున్నారు. PVR INOX స్క్రీన్లతో పాటు దేశవాప్తంగా చాలా చోట్ల ప్రత్యేక స్క్రీన్లు ఏర్పాటు చేసి మ్యాచ్‌ను లైవ్ టెలికాస్ట్ చేస్తున్నారు. వీటికి సంబంధించిన టికెట్లు దక్కించుకునేందుకు అభిమానులు చిన్నపాటి యుద్దాలే చేస్తున్నారు. చదవండి: ఇకపై అదే అర్హత.. వైభవ్ సూర్యవంశీ అలానే వచ్చాడు.. బీసీసీఐ కీలక నిర్ణయం -
పాక్‌తో ఫైనల్... ‘స్టార్ ప్లేయర్’పై వేటు!.. భారత తుదిజట్టు ఇదే!
ఆసియా కప్-2025 టోర్నమెంట్ ఫైనల్‌కు ముందు టీమిండియా మాజీ కెప్టెన్ క్రిష్ణమాచారి శ్రీకాంత్ భారత జట్టు యాజమాన్యానికి కీలక సూచనలు చేశాడు. ఏడుగురు బ్యాటర్లు చాలని.. నలుగురు స్పెషలిస్టు బౌలర్లతో బరిలోకి దిగాలని సూచించాడు. యూఏఈ వేదికగా ఈసారి టీ20 ఫార్మాట్లో నిర్వహిస్తున్న ఆసియా కప్ టోర్నీలో భారత్ అజేయంగా ఫైనల్‌కు చేరుకుంది.దుబాయ్ వేదికగా ఆదివారం జరిగే టైటిల్ పోరులో భారత్.. దాయాది పాకిస్తాన్ (IND vs PAK)తో అమీతుమీ తేల్చుకోనుంది. ఈ నేపథ్యంలో తుదిజట్టు కూర్పుపై మాజీ చీఫ్ సెలక్టర్ క్రిష్ణమాచారి శ్రీకాంత్ తన అభిప్రాయాలు పంచుకున్నాడు.శివం దూబే వద్దు‘‘నేనైతే శివం దూబే (Shivam Dube) బదులు అర్ష్‌దీప్ సింగ్‌ను ఆడిస్తా. ఆల్‌రౌండర్ అయిన దూబేకు బ్యాటింగ్ చేసే అవకాశమే రావడం లేదు. కాబట్టి ఈసారి నేను ఏడుగురు బ్యాటర్లనే ఆడిస్తా. కుల్దీప్ యాదవ్ (Kuldeep Yadav) ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌కు వస్తాడు.ఆ స్థానంలో వచ్చిన వాళ్లు 20, 50 పరుగులు చేయాల్సిన అవసరమేమీ ఉండకపోవచ్చు, ఓ బౌండరీ లేదంటే సిక్సర్ బాది పది పరుగులు చేసినా చాలు. కుల్దీప్ ఆ మాత్రమే స్కోరు చేయగలడు.టీమిండియాదే విజయంఏదేమైనా శివం దూబే బంతితో మెరుగ్గా రాణిస్తున్న మాట నిజమే. పాకిస్తాన్‌తో గత మ్యాచ్‌లో రెండు కీలక వికెట్లు తీశాడు. అయితే, ఫైనల్లో మాత్రం అర్ష్‌దీప్ సింగ్‌కే నా ఓటు. రామ్ లేదంటే రావణ్.. ఎవరు ఆడినా సరే టీమిండియా విజయం సాధించడం మాత్రం ఖాయం’’ అని చిక్కా చెప్పుకొచ్చాడు. ఇదిలా ఉంటే.. ఆసియా కప్ లీగ్ దశలో పాకిస్తాన్‌ను ఏడు వికెట్ల తేడాతో ఓడించిన భారత్.. సూపర్-4 మ్యాచ్‌లో ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది.ఆసియా కప్-2025 ఫైనల్‌కు క్రిష్ణమాచారి శ్రీకాంత్ ఎంపిక చేసుకున్న తుదిజట్టుఅభిషేక్ శర్మ, శుబ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, సంజూ శాంసన్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి.చదవండి: ఆసియా కప్-2025 ఫైనల్: అది సూర్య ఇష్టం.. గెలిచేది మేమే: పాక్ కెప్టెన్ ఓవరాక్షన్ -
‘సూర్యకుమార్ వెంట పడకండి.. అలా చేయమని ఒత్తిడి పెంచకండి’
టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav)కు భారత స్పిన్ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్ (Ravichandran Ashwin)అండగా నిలిచాడు. సూర్యపై ఒత్తిడి పెంచడం సరికాదని.. కెప్టెన్‌గా తనదైన శైలిలో అతడు విజయాలు సాధిస్తున్న తీరు అద్భుతమని కొనియాడాడు. కాగా ఆసియా కప్-2025 టీ20 టోర్నీలో టీమిండియా అజేయంగా ఫైనల్ చేరిన విషయం తెలిసిందే.అయితే, నామమాత్రపు మ్యాచ్‌లో బ్యాటింగ్ ఆర్డర్లో ప్రయోగాలు చేయడం.. బ్యాటర్‌గా విఫలం కావడం పట్ల సూర్యపై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. కాగా గత కొంతకాలంగా సూర్య బ్యాటింగ్ వైఫల్యాలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. గత తొమ్మిది ఇన్నింగ్స్‌లో సూర్య 12.41 సగటు, 112.98 స్ట్రైక్‌రేటుతో కేవలం 87 పరుగులే చేయగలిగాడు.బ్యాటింగ్ వైఫల్యంపై విమర్శలుఇక ఆదివారం నాటి ఫైనల్లో టీమిండియా పాకిస్తాన్ (IND vs PAK)తో తలపడనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సూర్యకుమార్ బ్యాటింగ్ వైఫల్యంపై మరోసారి చర్చ జరుగుతుండగా.. అశ్విన్ స్పందించాడు. ‘‘కెప్టెన్ అయిన తర్వాత సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్ సగటు పడిపోయిందని చాలా మంది విమర్శిస్తున్నారు.కానీ అతడు పగ్గాలు చేపట్టిన తర్వాతే కదా.. కొత్త బ్రాండ్‌తో టీమిండియా ముందుకు సాగుతోంది. అతడి సగటు 40 ఉండాల్సిన అవసరం లేదు. టీ20 క్రికెట్లో యావరేజ్ గురించి అంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు.హైరిస్క్ మ్యాచ్లుకెప్టెన్గా సూర్య హైరిస్క్ మ్యాచ్‌లు ఆడుతున్నాడు. నిజంగా అతడి నైపుణ్యాలు అద్భుతం. గతంలో రోహిత్ శర్మ కూడా ఇలానే చేశాడు. తన వికెట్ కంటే కూడా.. దూకుడుగా ఆడటంపైనే దృష్టి పెట్టాడు. ఇప్పుడు సూర్య అదే అనుసరిస్తున్నాడు. వన్‌డౌన్‌కే పరిమితం కాకుండా బ్యాటింగ్ ఆర్డర్లో వేర్వేరు స్థానాల్లో వస్తున్నాడు.అతడి వెంట పడకండిసూర్య తక్కువ స్ట్రైక్ రేటుతో 40 పరుగులు చేయడం కంటే కూడా... 170కి పైగా స్ట్రైక్‌రేటుతో 25 పరుగులు చేసినా నేను సంతోషిస్తా. దయచేసి అతడి వెంట పడకండి. అతడిపై ఒత్తిడి పెంచకండి. టీ20 క్రికెట్లో బ్యాటర్ సగటు కంటే.. అతడి ఇన్నింగ్స్ ఎంతమేర ప్రభావం చూపుతుందనేదే ముఖ్యం’’ అని అశ్విన్ అభిప్రాయపడ్డాడు. కాగా ఆసియా కప్-2025లో సూర్య ఇప్పటికి ఐదు ఇన్నింగ్స్ ఆడి 71 పరుగులు చేశాడు. లీగ్ దశలో పాక్‌తో మ్యాచ్‌లో 37 బంతుల్లో 47 పరుగులు చేయడం అతడి తాజా అత్యుత్తమ ప్రదర్శన. చదవండి: ఆసియా కప్-2025 ఫైనల్: అది సూర్య ఇష్టం.. గెలిచేది మేమే: పాక్ కెప్టెన్ ఓవరాక్షన్ -
అది సూర్యకుమార్ ఇష్టం.. గెలిచేది మేమే: పాక్ కెప్టెన్ ఓవరాక్షన్
ఆసియా కప్-2025 టోర్నమెంట్లో లీగ్, సూపర్-4 దశలో టీమిండియా చేతిలో చిత్తుగా ఓడింది పాకిస్తాన్. తొలుత గ్రూప్-‘ఎ’ మ్యాచ్‌లో భాగంగా ఏడు వికెట్ల తేడాతో ఓడిన పాక్.. తర్వాత సూపర్-4లో ఆరు వికెట్ల తేడాతో పరాజయం పాలైంది.అయితే, సూపర్-4లో బంగ్లాదేశ్, శ్రీలంక జట్ల తప్పిదాల కారణంగా అదృష్టవశాత్తూ ఫైనల్‌కు చేరుకోగలిగింది. ఈ క్రమంలో ఆదివారం నాటి టైటిల్ పోరులో టీమిండియా (IND vs PAK)తో తలపడేందుకు అర్హత సాధించింది.ఫొటోషూట్‌కు వెళ్లని సూర్యఇదిలా ఉంటే.. పహల్గామ్ ఉగ్రదాడికి నిరసనగా టీమిండియా పాక్ ఆటగాళ్లతో కరచాలనానికి నిరాకరించడంతో పాటు.. వారితో మైదానంలో ఎలాంటి కమ్యూనికేషన్ పెట్టుకోవడం లేదు. ఈ క్రమంలోనే ఫైనల్ కోసం జరిగే కెప్టెన్ల ఫొటోషూట్‌కు టీమిండియా సారథి సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) హాజరు కాలేదని సమాచారం.అది సూర్యకుమార్ ఇష్టంఈ నేపథ్యంలో ఫైనల్‌కు ముందు మీడియాతో మాట్లాడిన పాక్ కెప్టెన్ సల్మాన్ ఆఘా (Salman Agha) ఈ విషయంపై స్పందించాడు. ‘‘అది పూర్తిగా అతడి (సూర్య) ఇష్టం. అదే అతడి నిర్ణయం. ఒకవేళ రావాలి అనుకుంటే వస్తాడు. లేదంటే లేదు. ఇందులో నేను చేయగలిగింది ఏమీ లేదు’’ అని సల్మాన్ పేర్కొన్నాడు.గెలిచేది మేమేఇక టైటిల్ పోరు గురించి ప్రస్తావన రాగా.. ‘‘మేము గెలుస్తాం. అత్యుత్తమ క్రికెట్ ఆడటమే మా లక్ష్యం. ఒకవేళ మేము ఉత్తమంగా రాణించి.. 40 ఓవర్ల పాటు మా ప్రణాళికలను పక్కాగా అమలు చేయగలిగితే.. ఏ జట్టునైనా ఇట్టే ఓడించగలము’’ అని సల్మాన్ ఆఘా చెప్పుకొచ్చాడు.అదే విధంగా.. ‘‘ఇండియా- పాకిస్తాన్ మ్యాచ్ అంటే ఇరుజట్లపై తీవ్రమైన ఒత్తిడి ఉండటం సహజం. ఒకవేళ ఒత్తిడి లేదని ఎవరైనా చెబితే అది అబద్ధమే అవుతుంది. ఏదేమైనా ఈ ఎడిషన్‌లో మేము వాళ్ల కంటే ఎక్కువ తప్పిదాలు చేశాము. అందుకే కొన్ని మ్యాచ్‌లు గెలవలేకపోయాము.తక్కువ తప్పులు చేసిన వారిదే విజయంఅయితే, ఈసారి ఎవరైతే తక్కువ తప్పులు చేస్తారో వారిదే విజయం. మేము మెరుగ్గా బ్యాటింగ్ చేయగలిగితే తప్పకుండా అనుకున్న ఫలితాన్ని రాబట్టగలము’’ అని సల్మాన్ ఆఘా పేర్కొన్నాడు.కాగా పాక్‌తో ఫైనల్‌కు ముందు టీమిండియాకు ఎదురుదెబ్బలు తగిలాయి. శ్రీలంకతో నామమాత్రపు సూపర్-4 మ్యాచ్ సందర్భంగా అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా కండరాలు పట్టేయడంతో తీవ్ర ఇబ్బంది పడ్డారు. అయితే, అభి, తిలక్ ఫిట్‌గానే ఉన్నా.. హార్దిక్ పాండ్యా అందుబాటులో ఉంటాడో లేదోనన్న సందిగ్దం నెలకొంది. ఏదేమైనా ఇప్పటి వరకు ఈ టోర్నీలో అజేయంగా నిలిచిన సూర్యకుమార్ సేననే టైటిల్ ఫేవరెట్ అని చెప్పడంతో సందేహం లేదు. అయితే, ఫీల్డింగ్ విషయంలో మాత్రం భారత జట్టు ఇంకాస్త జాగ్రత్తగా ఉంటేనే దాయాదిపై సులువుగా గెలవగలదు.చదవండి: Asia Cup Ind vs Pak: ఆఖరి పోరాటం -
IND vs PAK: బలహీనంగానే పాకిస్తాన్.. భయపెడుతున్న ముఖాముఖి రికార్డు!
ఆసియా కప్-2025 టోర్నమెంట్లో ఫైనల్‌కు రంగం సిద్ధమైంది. దుబాయ్ వేదికగా ఆదివారం నాటి టైటిల్ పోరులో దాయాదులు భారత్- పాకిస్తాన్ (IND vs PAK) తలపడనున్నాయి. లీగ్ దశలో యూఏఈ, పాకిస్తాన్, ఒమన్ జట్లను ఓడించి అజేయంగా సూపర్-4కు చేరింది టీమిండియా.అదే విధంగా.. సూపర్-4లో పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక జట్లపై విజయం సాధించింది. తద్వారా ఇప్పటి వరకు ఆడిన అన్ని మ్యాచ్‌లలో గెలిచి అజేయంగా ఫైనల్లో తలపడేందుకు సిద్ధమైంది. మరోవైపు.. పాకిస్తాన్ లీగ్ దశలో యూఏఈ, ఒమన్‌లపై గెలిచి సూపర్-4 చేరగలిగింది.పాకిస్తాన్ బలహీనంగానేతర్వాత సూపర్-4లో శ్రీలంక, బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లలో గట్టెక్కడం ద్వారా ఎట్టకేలకు ఫైనల్‌కు అర్హత సాధించింది. అయితే, టీమిండియాతో పోలిస్తే అన్ని రంగాల్లో పాకిస్తాన్ బలహీనంగానే కనిపిస్తోంది. తమ చివరి సూపర్–4 మ్యాచ్‌లో కూడా బంగ్లాదేశ్‌తో దాదాపు ఓటమికి చేరువై అదృష్టవశాత్తూ తప్పించుకోగలిగింది. ఇక భారత్‌తో ఆడిన రెండు మ్యాచ్‌లలో కూడా టీమ్ ప్రదర్శన పేలవంగా ఉంది. అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్‌లో కూడా చెప్పుకోదగ్గ ఆటగాళ్లు కనిపించడం లేదు. 160 పరుగులతో టీమ్ టాప్ స్కోరర్‌గా ఉన్న ఫర్హాన్ ఒక్క మ్యాచ్‌లో అర్ధ సెంచరీ మినహా ప్రభావం చూపలేదు. సయీమ్ విఫలమైనా.. జట్టులోనేఫఖర్ జమాన్ (Fakhar Zaman) తన స్థాయికి తగ్గ ప్రదర్శన ఇవ్వకపోగా... మిగతా ప్రధాన బ్యాటర్లంతా విఫలమయ్యారు. కెప్టెన్ సల్మాన్ ఆఘా (Salman Agha) కనీసం ఒక్క మ్యాచ్‌లో కూడా రాణించలేదు. ఆరు ఇన్నింగ్స్‌లలో కలిపి అతను చేసింది 64 పరుగులే. ‘పాక్ అభిషేక్ శర్మ’ అంటూ కొన్నాళ్ల క్రితం కీర్తించిన సయీమ్ అయూబ్ ఏకంగా రికార్డు స్థాయిలో 4 డకౌట్లతో ఘోర ప్రదర్శన కనబర్చాడు. అయితే మరో చెప్పుకోదగ్గ ప్రత్యామ్నాయం కూడా లేదు కాబట్టి ఈ మ్యాచ్‌లోనూ అతని స్థానంపై ఎలాంటి ఢోకా లేదు. వీరందరిలో తుది పోరులో ఎవరు రాణిస్తారనేది చూడాలి. పాక్ సాధారణ స్కోరు నమోదు చేయాలన్నా మిడిలార్డర్లో తలత్, హారిస్‌లు కనీస ప్రదర్శన ఇవ్వాల్సి ఉంది. బౌలింగ్‌లో షాహిన్ అఫ్రిది ఒక్కడే కాస్త ఫర్వాలేదనిపించినా... భారత్ ఓపెనర్లు అతడిని అలవోకగా ఎదుర్కొంటున్నారు. రవూఫ్, అబ్రార్, ఫహీమ్, నవాజ్ మన బ్యాటర్లనను అడ్డుకోవడం అంత సులువు కాదు.పిచ్, వాతావరణం దుబాయ్‌లో సాధారణ వికెట్. అటు బ్యాటింగ్‌తో పాటు ఇటు బౌలింగ్‌కు కూడా అనుకూలం. అయితే రెండో సారి బ్యాటింగ్ చేసిన జట్టుకే విజయావకాశాలు ఉంటాయని పదే పదే రుజువైంది. కాబట్టి టాస్ గెలిచిన టీమ్ ఫీల్డింగ్ ఎంచుకోవడం ఖాయం ముఖాముఖి పోరులో..భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య వన్డే, టీ20లు కలిపి ఇప్పటి వరకు పన్నెండు ఫైనల్ మ్యాచ్‌లు జరిగాయి. వీటిలో భారత్ నాలుగు గెలవగా... పాకిస్తాన్ ఎనిమిది ఫైనల్లలో విజయం సాధించింది.తుదిజట్ల వివరాలు అంచనా:టీమిండియా:సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్ ), అభిషేక్ శర్మ, శుబ్‌మన్ గిల్, సంజూ శాంసన్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివం దూబే, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా.పాకిస్తాన్సల్మాన్ ఆఘా (కెప్టెన్ ), సాహిబ్జాదా ఫర్హాన్, ఫఖర్ జమాన్, సయీమ్ అయూబ్, హొసేన్ తలత్, మొహమ్మద్ హ్యారిస్, షాహిన్ అఫ్రిది, మొహమ్మద్ నవాజ్, ఫహీమ్ అష్రఫ్, హ్యారిస్ రవూఫ్, అబ్రార్ అహ్మద్. చదవండి: Asia Cup Ind vs Pak: ఆఖరి పోరాటం -
భవిష్యత్ ఆశాకిరణం.. అతడిని బెంచ్‌కే పరిమితం చేయండి: పాక్ మాజీ క్రికెటర్
టీమిండియా చేతిలో రెండుసార్లు ఓడిపోయినప్పటికీ పాకిస్తాన్ ఎట్టకేలకు ఆసియా కప్-2025 టోర్నమెంట్ ఫైనల్‌కు చేరుకుది. సూపర్-4లో బంగ్లాదేశ్, శ్రీలంక జట్లపై విజయం సాధించడం ద్వారా టైటిల్ పోరుకు అర్హత సాధించింది. మరోవైపు.. భారత్ లీగ్, సూపర్-4 దశలో పరాజయమన్నదే లేకుండా ఫైనల్లో పాక్ (IND vs PAK)తో తలపడేందుకు సిద్ధమైంది.అయితే, ఈ టోర్నీలో పాకిస్తాన్ బౌలింగ్ పరంగా ఫర్వాలేదనిపించినా.. బ్యాటింగ్‌లో మాత్రం తడబడుతోంది. ముఖ్యంగా భారీ అంచనాలతో బరిలోకి దిగిన యువ ఓపెనర్ సయీమ్ ఆయుబ్ (Saim Ayub) దారుణంగా విఫలమవుతున్నాడు.హ్యాట్రిక్ డకౌట్లుఒమన్తో మ్యాచ్‌లో గోల్డెన్ డకౌట్ అయిన సయీమ్ ఆయుబ్.. టీమిండియా, యూఏఈతో మ్యాచ్‌లలోనూ పరుగుల ఖాతా తెరవకుండానే నిష్క్రమించాడు. ఇలా హ్యాట్రిక్ డకౌట్లతో విమర్శల పాలైన ఈ ఎడమచేతి వాటం బ్యాటర్.. సూపర్-4లో భాగంగా భారత్‌తో మ్యాచ్‌లో 21 పరుగులు చేయగలిగాడు.ఆ తర్వాత శ్రీలంకతో మ్యాచ్‌లో రెండు పరుగులు చేయగలిగిన సయీమ్.. బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో మరోసారి డకౌట్ అయ్యాడు. బ్యాటింగ్ పరంగా విఫలమైనా పార్ట్ టైమ్ స్పిన్నర్‌గా ఏడు వికెట్లు తీయగలిగాడు.భవిష్యత్ ఆశాకిరణంఈ నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ క్రికెటర్ వకార్ యూనిస్ సయీమ్ ఆయుబ్‌ను ఉద్దేశించి ఘాటు విమర్శలు చేశాడు. ‘‘అతడు రెండోసారి డకౌట్ అయినపుడే.. బెంచ్‌కే పరిమితం చేయాలని చెప్పాను. దానర్థం అతడిలో ప్రతిభ లేదని కాదు.అతడు టాలెంటెడ్ ప్లేయర్. పాకిస్తాన్ క్రికెట్ భవిష్యత్ ఆశాకిరణం. కానీ కొన్నిసార్లు అనుకున్న ఫలితాలు రావు. ఆ క్రమంలో రోజురోజుకీ మరింత దిగజారితే ఆత్మవిశ్వాసం దెబ్బతింటుంది. ఆయుబ్ విషయంలో ఇదే జరిగింది. అతడి బాడీ లాంగ్వేజ్ పూర్తిగా వీక్‌గా అనిపిస్తోంది.ఇలాంటపుడు బెంచ్‌కే పరిమితం చేయాలిబౌలింగ్ చేస్తున్నాడు కాబట్టి అతడిని తుదిజట్టులోకి తీసుకుంటున్నారు. కానీ అతడు బౌలింగ్ కోసం కాదు.. బ్యాటింగ్ కోసం జట్టులో ఉంటున్నాడు. అతడు పరుగులు చేస్తున్నాడా లేదా అనేది ముఖ్యం. ప్రస్తుత పరిస్థితుల్లో మాత్రం అది జరగడం లేదు. అతడిని బెంచ్‌కే పరిమితం చేయాల్సి ఉంటుంది’’ అని వకార్ యూనిస్ పేర్కొన్నాడు. కాగా భారత్- పాకిస్తాన్ ఆసియా కప్-2025 ఫైనల్లో ఆదివారం తలపడనున్నాయి. ఇందుకు వేదిక దుబాయ్.చదవండి: ఆసియా కప్: చరిత్ర సృష్టించిన నిసాంక.. కోహ్లి ఆల్‌టైమ్ రికార్డు బద్దలు -
ఆసియా కప్: పాక్‌తో ఫైనల్‌కు ముందు టీమిండియాకు రెండు భారీ షాకులు
ఆసియా కప్-2025 టోర్నమెంట్ ఫైనల్‌కు ముందు టీమిండియాకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. విధ్వంసకర బ్యాటర్ అభిషేక్ శర్మతో పాటు.. స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా గాయపడినట్లు సమాచారం. సూపర్-4 దశలో ఆఖరిగా టీమిండియా శ్రీలంకతో తలపడిన విషయం తెలిసిందే.ఒకే ఒక్క ఓవర్ వేసిదుబాయ్ వేదికగా శుక్రవారం జరిగిన ఈ మ్యాచ్ సందర్భంగా హార్దిక్ పాండ్యా ఒక్క ఓవర్ మాత్రమే బౌలింగ్ చేశాడు. ఏడు పరుగులు ఇచ్చి.. కుశాల్ మెండిస్ (0) రూపంలో కీలక వికెట్ తీశాడు. అయితే, ఆ తర్వాత హార్దిక్ మళ్లీ బౌలింగ్‌కు రానేలేదు. అంతకు ముందు బ్యాటింగ్‌కు దిగిన హార్దిక్ రెండు పరుగులు మాత్రమే చేసి నిష్క్రమించాడు.ఫీల్డింగ్‌కు రాని అభిషేక్మరోవైపు.. మరోసారి మెరుపు ఇన్నింగ్స్‌తో చెలరేగిన అభిషేక్ శర్మ (31 బంతుల్లో 61) కూడా శ్రీలంక ఇన్నింగ్స్ సందర్భంగా పూర్తిస్థాయిలో ఫీల్డింగ్‌కు అందుబాటులో ఉండలేదు. దీంతో టీమిండియా అభిమానుల్లో కలవరం నెలకొంది. కాగా లంకపై సూపర్ ఓవర్లో భారత్ విజయం సాధించిన తర్వాత టీమిండియా బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ మీడియాతో మాట్లాడాడు.అప్పుడే ఫిట్‌నెస్‌పై అంచనాకు వస్తాంఈ సందర్భంగా హార్దిక్ పాండ్యా, అభిషేక్ శర్మల గురించి ప్రస్తావన రాగా.. ‘‘హార్దిక్ కండరాలు పట్టేశాయి. శుక్రవారం రాత్రి.. శనివారం ఉదయం పరీక్షించిన తర్వాత అతడి ఫిట్‌నెస్‌పై అంచనాకు వస్తాము. ఆ తర్వాతే అతడి గురించి నిర్ణయం తీసుకుంటాం. ఇక అభిషేక్ శర్మ కూడా కండరాలు పట్టేయడంతో ఇబ్బంది పడ్డాడు. అయితే, తను బాగానే ఉన్నాడు. ఇప్పటికైతే గాయం పెద్దదేమీ కాదు’’అని మోర్నీ మోర్కెల్ తెలిపాడు. కానీ దురదృష్టవశాత్తూ హార్దిక్ పాండ్యా, అభిషేక్ శర్మ పూర్తిస్థాయిలో ఫిట్‌గా లేకుంటే మాత్రం టీమిండియాకు తలనొప్పి తప్పదు.ఇద్దరూ అత్యంత కీలకంఇప్పటి వరకు ఆసియా కప్-2025 టోర్నీలో టాప్ రన్ స్కోరర్‌గా ఉన్న ఓపెనర్ అభిషేక్ శర్మ టీమిండియా టాపార్డర్‌లో అత్యంత కీలకం. మరోవైపు.. ఫైనల్ మ్యాచ్‌లలో ఒత్తిడిని అధిగమించి వికెట్లు తీయడంతో పాటు పరుగులు రాబట్టడంలో హార్దిక్ పాండ్యా దిట్ట. ముఖ్యంగా పాకిస్తాన్‌తో మ్యాచ్‌లలో మరింత మెరుగ్గా రాణించిన రికార్డు పాండ్యాకు ఉంది. కాగా లీగ్, సూపర్-4 దశలో అజేయంగా నిలిచిన టీమిండియా.. ఆదివారం (సెప్టెంబరు 28) నాటి ఫైనల్లో దాయాది పాకిస్తాన్‌తో తలపడనుంది. ఈ టైటిల్ పోరుకు దుబాయ్ వేదిక. చదవండి: సూర్యకుమార్‌పై ఐసీసీ చర్య -
Asia cup 2025: పాకిస్తాన్ ఆటగాళ్ల ఓవరాక్షన్‌పై ఐసీసీ చర్యలు
ఆసియా కప్ 2025లో (Asia cup 2025) భాగంగా సెప్టెంబర్ 21న టీమిండియాతో జరిగిన సూపర్-4 మ్యాచ్‌లో (India vs Pakistan) పాకిస్తాన్ ఆటగాళ్లు హారిస్ రౌఫ్ (Haris Rauf), సాహిబ్జాదా ఫర్హాన్ (Sahibzada Farhan) ఓవరాక్షన్ చేసిన విషయం తెలిసిందే.ఆ మ్యాచ్‌లో రౌఫ్ ఫీల్డింగ్ చేసే సమయంలో విమానం క్రాష్ అయినట్లు సంజ్ఞలు చేశాడు. అలాగే ఆరు సంఖ్యను సూచిస్తూ చేతి వేళ్లను ప్రదర్శించాడు. ఫర్హాన్ హాఫ్ సెంచరీ పూర్తి చేసిన అనంతరం బ్యాట్‌ను గన్లా భావిస్తూ సెలబ్రేట్ చేసుకున్నాడు. పాక్ ఆటగాళ్లు చేసిన ఈ ఓవరాక్షన్‌పై బీసీసీఐ అభ్యంతం వ్యక్తం చేసింది. ఐసీసీకి ఫిర్యాదు చేసింది.దీనిపై రౌఫ్, ఫర్హాన్ ఇవాళ (సెప్టెంబర్ 26) విచారణ ఎదుర్కొన్నారు. మ్యాచ్ రిఫరీ రిచీ రిచర్డ్సన్ (Richie Richardson) ఆధ్వర్యంలో జరిగిన ఈ విచారణలో వారిద్దరూ ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్‌ను (Level 1 offence) ఉల్లంఘించినట్లు నిర్ధారించారు. ఈ చర్యలు గేమ్ స్పిరిట్‌ను దెబ్బతీసేలా ఉన్నాయని అభిప్రాయపడ్డారు.ఇలాంటి ప్రవర్తన మరోసారి రిపీట్ చేస్తే సహించేది లేదంటూ రౌఫ్‌కు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. జరిమానాగా మ్యాచ్ ఫీజ్‌లో 30 శాతం కోత విధించారు. ఫర్హాన్‌కు సైతం వార్నింగ్ ఇస్తూ.. మందలింపుతో వదిలిపెట్టారు. భవిష్యత్తులో ఇలా జరగకుండా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.సూర్యకుమార్‌కు జరిమానాఇదే టోర్నీలో పాకిస్తాన్‌తో జరిగిన గ్రూప్ స్టేజ్ మ్యాచ్ అనంతరం భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ చేసిన వ్యాఖ్యలపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కూడా ఐసీసీకి ఫిర్యాదు చేసింది. ఆ మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించగా.. ఆ విజయాన్ని సూర్యకుమార్ "ఆపరేషన్ సిందూర్" అనే ప్రభుత్వ చర్యను ప్రస్తావిస్తూ, భారత మిలిటరీ సర్వీసెస్‌కు అంకితం చేశాడు.ఈ వ్యాఖ్యలపై పీసీబీ అభ్యంతరం తెలుపుతూ ఐసీసీకి ఫిర్యాదు చేసింది. ఈ విషయమై సూర్యకుమార్‌ను సైతం విచారణ చేసి, భవిష్యత్తులో ఇలాంటి వ్యాఖ్యలు చేయవద్దని హెచ్చరించింది. అలాగే మ్యాచ్ ఫీజ్‌లో 30 శాతం విధించినట్లు తెలుస్తుంది.ఇదిలా ఉంటే, ఆసియా కప్‌లో ఇదివరకే రెండు సార్లు (గ్రూప్ దశ, సూపర్-4) తలపడిన భారత్-పాకిస్తాన్.. ఆదివారం జరుగబోయే ఫైనల్లో మరోసారి తలపడనున్నాయి. పై రెండు సందర్భాల్లో భారత్ పాక్‌ను చిత్తుగా ఓడించింది. చదవండి: సెలెక్ట్ చేస్తారని అనుకున్నా.. కరుణ్ నాయర్ ఆవేదన -
మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. మా ఫీల్డింగ్ సూపర్: పాక్ కెప్టెన్
ఆసియా కప్-2025 టోర్నమెంట్ ఫైనల్లో టీమిండియా ప్రత్యర్థిగా పాకిస్తాన్ ఖరారైంది. దుబాయ్‌లో గురువారం జరిగిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై పదకొండు పరుగుల తేడాతో గట్టెక్కిన పాక్.. టైటిల్ పోరుకు అర్హత సాధించింది. ఈ క్రమంలో ఆదివారం (సెప్టెంబరు 28) భారత జట్టుతో ఫైనల్లో (IND vs PAK In Final) తలపడేందుకు సిద్ధపడింది.135 పరుగులుకాగా బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో టాస్ ఓడిన పాకిస్తాన్ తొలుత బ్యాటింగ్ చేసింది. ఓపెనర్లు సాహిబ్జాదా ఫర్హాన్ (4), ఫఖర్ జమాన్ (13) నిరాశపరచగా.. సయీమ్ ఆయుబ్ డకౌట్ అయ్యాడు. కెప్టెన్ సల్మాన్ ఆఘా (Salman Agha) 19 పరుగులు చేయగా.. హుసేన్ తలట్ 3 పరుగులకే నిష్క్రమించాడు.Mustafizur Rahman sends the Pakistan captain packing 💨☝️Watch #PAKvBAN LIVE NOW on the Sony Sports Network TV channels & Sony LIV.#SonySportsNetwork #DPWorldAsiaCup2025 pic.twitter.com/bkPfVMxULa— Sony Sports Network (@SonySportsNetwk) September 25, 2025ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో వికెట్ కీపర్ బ్యాటర్ మొహమ్మద్ హ్యారిస్ 23 బంతుల్లో 31, మొహమ్మద్ నవాజ్ 15 బంతుల్లో 25 పరుగులతో ఆకట్టుకున్నారు. వీరికి తోడుగా పేసర్ షాహిన్ ఆఫ్రిది 13 బంతుల్లో 19 పరుగులతో రాణించాడు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి పాకిస్తాన్ 135 పరుగులు చేయగలిగింది.రాణించిన పాక్ బౌలర్లుబంగ్లా బౌలర్లలో టస్కిన్ అహ్మద్ మూడు వికెట్లు పడగొట్టగా... మెహదీ హసన్, రిషాద్ హొసేన్ రెండేసి వికెట్లు తీశారు. ముస్తాఫిజుర్ రహమాన్‌కు ఒక వికెట్ దక్కింది. ఇక నామమాత్రపు లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్.. పాక్ బౌలర్ల ధాటికి 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లు నష్టపోయి 124 పరుగులే చేసింది. షమీమ్ హొసేన్ (30) ఒక్కడే ఇరవై పరుగుల వ్యక్తిగత స్కోరు దాటాడు.పాక్ ప్రధాన పేసర్ షాహిన్ ఆఫ్రిది, హ్యారిస్ రవూఫ్ మూడేసి వికెట్లు కూల్చి సత్తా చాటగా.. సయీమ్ ఆయుబ్ రెండు, మొహమ్మద్ నవాజ్ ఒక వికెట్ పడగొట్టారు.అతడి బౌలింగ్ అద్భుతంఇక బంగ్లాదేశ్‌పై విజయంతో ఫైనల్లో అడుగుపెట్టిన నేపథ్యంలో పాక్ కెప్టెన్ సల్మాన్ ఆఘా తమ జట్టు ప్రదర్శన పట్ల సంతోషం వ్యక్తం చేశాడు. అదే విధంగా.. తాము ఆదివారం నాటి పోరుకు తాము సిద్ధంగా ఉన్నట్లు తెలిపాడు.‘‘ఇలాంటి మ్యాచ్‌లలో గెలిచామంటే మేమొక ప్రత్యేక జట్టు అనే చెప్పవచ్చు. మా జట్టులోని ప్రతి ఒక్కరు మెరుగ్గా ఆడారు. అయితే, బ్యాటింగ్ విభాగంలో మేము మరింత మెరుగుపడాల్సి ఉంది. ఆ దిశగా మేము ఇప్పటికే తీవ్రంగా కృషి చేస్తున్నాము కూడా!షాహిన్ ఓ ప్రత్యేకమైన ఆటగాడు. జట్టు ప్రయోజనాలకు అనుగుణంగా రాణించేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాడు. అతడి బౌలింగ్ అద్భుతంగా ఉంది. ఏదేమైనా మేము ఇంకో 15 పరుగులు చేసి ఉంటే విజయం సులభమయ్యేది.ఏ జట్టునైనా ఓడించగలముఅయితే, మా బౌలర్లు గొప్పగా రాణించి ప్రత్యర్థిని ఒత్తిడిలోకి నెట్టి అనుకున్న ఫలితం రాబట్టారు. ఇక మేము అద్భుతంగా ఫీల్డింగ్ చేయడం వల్లే విజయం సాధ్యమైందని చెప్పవచ్చు. మా కోచ్ కఠినంగా ప్రాక్టీస్ చేయిస్తున్నారు. ఎక్స్ట్రా సెషన్స్ పెడుతున్నారు.హెడ్‌కోచ్ మైక్ హసన్.. ‘ఫీల్డింగ్ చేస్తేనే మీకు జట్టులో స్థానం ఉంటుంది’ అని చెప్పాడు. ఫీల్డింగ్ విషయంలో మా వాళ్లు అంత కఠినంగా ఉంటున్నారు. మా జట్టు ప్రస్తుతం గొప్పగా ఉంది. మేము ఏ జట్టునైనా ఓడించగలము. ఆదివారం నాటి మ్యాచ్‌లో ఇది చేసి చూపించేందుకు ప్రయత్నిస్తాం’’ అని సల్మాన్ ఆఘా పేర్కొన్నాడు. ఈ నేపథ్యంలో బంగ్లాపై నామ మాత్రపు గెలుపు సాధించినందుకే ఇంత అతి వద్దంటూ నెటిజన్లు సల్మాన్‌ను ట్రోల్ చే స్తున్నారు.టీమిండియా చెత్త ఫీల్డింగ్కాగా లీగ్ దశలో అజేయంగా ఉండి సూపర్-4 చేరిన భారత జట్టు మరో మ్యాచ్ మిగిలి ఉండగానే ఫైనల్ చేరింది. అయితే, ఆసియా కప్ తాజా ఎడిషన్‌లో టీమిండియా ఇప్పటి వరకు అత్యధికంగా.. ఏకంగా 12 క్యాచ్‌లు డ్రాప్ చేసింది. మరోవైపు.. పాక్ కేవలం నాలుగు క్యాచ్‌లు మాత్రమే నేలపాలు చేసింది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగంలో పటిష్టంగా ఉన్న సూర్యసేన.. ఫీల్డింగ్ తప్పిదాలు సరిచేసుకుంటేనే విజయం నల్లేరు మీద నడక అవుతుంది. లేదంటే భారీ మూల్యం చెల్లించాల్సిన పరిస్థితి తలెత్తవచ్చు.చదవండి: IND vs WI: అందుకే అతడిని ఎంపిక చేయలేదు: అజిత్ అగార్కర్ -
పాక్ ఆటగాళ్ల బరితెగింపు.. షాకిచ్చిన బీసీసీఐ!.. మరోసారి పీసీబీ ఓవరాక్షన్
టీమిండియాతో మ్యాచ్ సందర్భంగా కవ్వింపులకు పాల్పడ్డ పాకిస్తాన్ ఆటగాళ్లపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) చర్యలకు ఉపక్రమించింది. భారతీయల మనోభావాలు దెబ్బతినేలా.. రెచ్చగొట్టేలా ప్రవర్తించిన సాహిబ్జాదా ఫర్హాన్, హ్యారిస్ రవూఫ్‌లపై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC)కి ఫిర్యాదు చేసింది.కాగా పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఆసియా టీ20 కప్-2025 వేదికగా భారత్- పాక్ (IND vs PAK)జట్లు తొలిసారి ముఖాముఖి తలపడిన విషయం తెలిసిందే. లీగ్ దశలో మ్యాచ్ సందర్భంగానే టీమిండియా తమ వైఖరిని దాయాదికి తెలియజేసింది. పహల్గామ్ ఉగ్రదాడికి నిరసనగా పాక్ ఆటగాళ్లతో కరచాలనానికి నిరాకరించింది.రెచ్చగొట్టేలా సెలబ్రేషన్స్ఇక సూపర్-4 మ్యాచ్‌లోనూ టీమిండియా తన వైఖరిని కొనసాగించింది. అయితే, లీగ్ దశ మ్యాచ్‌లో కాస్త సైలెంట్‌గానే ఉన్నపాక్ ఆటగాళ్లు.. ఈసారి మాత్రం రెచ్చగొట్టేలా కవ్వింపులకు పాల్పడ్డారు. ఓపెనర్ ఫర్హాన్ అర్ధ శతకం పూర్తి చేసుకోగానే.. ఏకే-47 మాదిరి బ్యాట్‌ను ప్రేక్షకుల వైపు ఎక్కుపెట్టి.. కాలుస్తున్నట్లు సంబరాలు చేసుకున్నాడు.పహల్గామ్లో ఉగ్రవాదులు అమాయక పర్యాటకులను కాల్చి చంపిన ఘటనను ఈ చర్య ద్వారా ఫర్హాన్ మరోసారి గుర్తుచేసినట్లయింది. అయితే, మ్యాచ్ తర్వాత మాట్లాడుతూ కూడా.. తాను సాధారణంగా హాఫ్ సెంచరీకి సెలబ్రేట్ చేసుకోనని.. ఈసారి మాత్రం ఇలా సెలబ్రేట్ చేసుకోవాలని అనిపించిందని మరోసారి రెచ్చగొట్టాడు.‘6-0’ సంజ్ఞతో రవూఫ్ కవ్వింపులుఅంతేకాదు.. ఈ విషయంలో ఎవరు ఏమనుకున్నా తాను లెక్కచేయనంటూ ఫర్హాన్ అహంకారపూరితంగా మాట్లాడాడు. ఇక హ్యారిస్ రవూఫ్ ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో ‘6-0’ సంజ్ఞతో టీమిండియా అభిమానుల వైపు చూస్తూ అతి చేశాడు.కాగా పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతిగా ఆపరేషన్ సిందూర్ పేరిట భారత ఆర్మీ.. ఉగ్ర స్థావరాలను మట్టుబెట్టిన విషయం తెలిసిందే. అయితే, ఇందుకు బదులుగా పాక్ సైన్యం రంగంలోకి వచ్చి ఎదురుదాడికి ప్రయత్నించగా.. భారత సైన్యం సమర్థవంతంగా తిప్పికొట్టింది. ఈ ఘటనలో పాక్ ఎయిర్‌బేస్‌లు కూడా ధ్వంసమైనట్లు సమాచారం.కిక్కురమనలేదుఅయితే, రవూఫ్ మాత్రం పాక్ చెప్పుకొంటున్నట్లుగా.. తాము భారత్‌కు చెందిన ఆరు యుద్ధ విమానాలు కూల్చేశామన్నట్లు ఇలా సైగ చేయడం గమనార్హం. లీగ్ దశలో షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడాన్ని ప్రస్తావిస్తూ.. ఆటలు, రాజకీయం వేరు అంటూ సుద్దులు చెప్పిన పాక్.. సూపర్-4 మ్యాచ్‌లో తమ ఆటగాళ్లు ఇంత యథేచ్చగా బరితెగించినా కిక్కురమనలేదు.షాకిచ్చిన బీసీసీఐఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన బీసీసీఐ.. పాక్ ఆటగాళ్ల ప్రవర్తనపై ఐసీసీకి ఇ-మెయిల్ ద్వారా ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో సాహిబ్జాదా ఫర్హాన్, హ్యారిస్ రవూఫ్‌ల నుంచి ఐసీసీ లిఖిత పూర్వక వివరణ అడిగే అవకాశం ఉంది. విచారణలో భాగంగా వీరిద్దరు ఐసీసీ ఎలైట్ ప్యానెల్ రిఫరీ రిచీ రిచర్డ్సన్ ఎదుట హాజరై వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. ఇదిలా ఉంటే.. లీగ్, సూపర్-4 దశలో పాక్‌ను చిత్తు చేసిన టీమిండియా.. బుధవారం నాటి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను ఓడించి ఆసియా కప్ ఫైనల్ బెర్తు ఖరారు చేసుకుంది.పాక్ బోర్డు ఓవరాక్షన్బీసీసీఐ చర్యల నేపథ్యంలో పాక్ క్రికెట్ బోర్డు కూడా టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌పై ఐసీసీకి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. లీగ్ దశలో పాకిస్తాన్‌పై తమ విజయాన్ని సూర్య.. పహల్గామ్ బాధితులు, ఆపరేషన్ సిందూర్ సమయంలో ధైర్యసాహసాలు ప్రదర్శించిన భారత ఆర్మీకి అంకితం చేసిన విషయం తెలిసిందే. ఈ విషయం గురించి పీసీబీ.. ఐసీసీని ఆశ్రయించినట్లు సమాచారం.చదవండి: అసలు అక్కడ ఏం ఉంది?: అభిషేక్ శర్మపై గావస్కర్ ‘ఫైర్’ -
BCCI: అభిషేక్ శర్మకు బంపరాఫర్!
టీమిండియా యువ క్రికెటర్ అభిషేక్ శర్మ (Abhishek Sharma) సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. ఆసియా టీ20 కప్- 2025 టోర్నమెంట్లో ఈ ఎడమచేతి వాటం బ్యాటర్ ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు. ఇప్పటి వరకు ఆడిన నాలుగు ఇన్నింగ్స్‌లో కలిపి 208కి పైగా స్ట్రైక్‌రేటుతో అభిషేక్ శర్మ 173 పరుగులు సాధించాడు.తీవ్రమైన ఒత్తిడిలోనూతద్వారా ఇప్పటికి టాప్ రన్ స్కోరర్‌గా కొనసాగుతున్నాడు. ముఖ్యంగా పాకిస్తాన్‌పై రెండుసార్లు అభిషేక్ శర్మ చితక్కొట్టిన తీరు టీమిండియా విజయాల్లో హైలైట్‌గా నిలిచింది. లీగ్ దశలో పాక్‌పై 13 బంతుల్లోనే 31 పరుగులు సాధించిన ఈ ఓపెనింగ్ బ్యాటర్.. సూపర్-4లో 39 బంతుల్లోనే 74 పరుగులతో చెలరేగాడు.బంపరాఫర్దాయాదితో సూపర్-4 మ్యాచ్‌లో తీవ్రమైన ఒత్తిడిలోనూ అభిషేక్ శర్మ.. మరో ఓపెనర్ శుబ్‌మన్ గిల్ (47)తో కలిసి తొలి వికెట్‌కు 105 పరుగులు జోడించి సత్తా చాటాడు. ఈ ప్రదర్శనల నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఈ పంజాబీ బ్యాటర్‌కు బంపరాఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది.ఆసియా కప్-2025 టోర్నీ ముగిసిన తర్వాత.. టీమిండియా స్వదేశంలో వెస్టిండీస్‌తో రెండు టెస్టుల సిరీస్ ఆడనుంది. ఆ తర్వాత వన్డే, టీ20 సిరీస్‌లు ఆడేందుకు ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది. ఈ నేపథ్యంలో అభిషేక్ శర్మను ఆసీస్‌తో టీ20లతో పాటు వన్డేల్లోనూ ఆడించాలని సెలక్టర్లు భావిస్తున్నట్లు సమాచారం.గిల్‌కు విశ్రాంతి?కాగా శుబ్‌మన్ గిల్ ఇటీవలే టెస్టు జట్టు సారథిగా బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. ఇంగ్లండ్ గడ్డపై ఆండర్సన్- టెండుల్కర్ ట్రోఫీలో భాగంగా ఐదు టెస్టుల సిరీస్‌ను కెప్టెన్‌గా 2-2తో సమం చేశాడు. అనంతరం.. నెలరోజుల విరామం తర్వాత ఆసియా కప్ బరిలో దిగాడు. అయితే, ఆసియా కప్ ముగిసిన వెంటనే విండీస్‌తో సిరీస్ ఆడనున్నాడు.ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా టూర్ సందర్భంగా గిల్‌కు సెలక్టర్లు విశ్రాంతినిచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. టీ20లలో ఇప్పటికే ఓపెనర్‌గా పాతుకుపోయిన అభిషేక్ శర్మ ఇంతవరకు వన్డేల్లో అరంగేట్రం చేయలేదు. ప్రస్తుతం కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి గిల్ వన్డేల్లో ఓపెనింగ్ చేస్తున్నాడు.జైస్వాల్‌కు అన్యాయంఅయితే, ఆసీస్‌తో సిరీస్‌లలో గిల్ రెస్ట్ తీసుకుంటే అభిషేక్ శర్మను ఓపెనర్‌గా ఎంపిక చేస్తారనే వార్తలు వస్తున్నాయి. టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం.. అభిషేక్ శర్మ ఆసీస్ గడ్డపై వన్డేల్లో అడుగుపెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా దేశీ యాభై ఓవర్ల ఫార్మాట్లో అతడికి మెరుగైన రికార్డు ఉంది.లిస్ట్-ఎ క్రికెట్లో 61 మ్యాచ్‌లు ఆడిన అభిషేక్ శర్మ 2014 పరుగులు చేశాడు. ఒకవేళ అభిని ఆసీస్‌తో వన్డేలకు ఎంపిక చేస్తే.. మరో యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్‌కు అన్యాయం చేసినట్లే అవుతుందని విశ్లేషకులు అంటున్నారు.ఇప్పటికే టీమిండియా టెస్టు ఓపెనర్‌గా స్థానం సుస్థిరం చేసుకున్న యశస్వి జైస్వాల్.. టీ20లలో తన మార్కు చూపించాడు. అయితే, వన్డేల్లో మాత్రం ఆలస్యంగా ఎంట్రీ ఇచ్చాడు. స్వదేశంలో ఈ ఏడాది ఇంగ్లండ్‌తో సిరీస్ సందర్భంగా జైసూ ఒకే ఒక్క వన్డే ఆడి.. 15 పరుగులు చేశాడు. ఇంత వరకు అతడికి వన్డేల్లో నిరూపించుకునే అవకాశమే రాలేదు.వన్డే టాపార్డర్లోఇలాంటి సమయంలో అభిషేక్ శర్మ జట్టులోకి వచ్చాడంటే.. జైసూకు అవకాశాలు సన్నగిల్లవచ్చు. అయితే, ఇప్పటికే టీ20, టెస్టుల నుంచి తప్పుకొన్న రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి వన్డేలకూ రిటైర్మెంట్ ప్రకటిస్తే మాత్రం వన్డే టాపార్డర్‌లో జైసూ, అభి, గిల్లను చూసే అవకాశాలను కొట్టిపారేయలేము. కాగా టీమిండియా తరఫున టీ20లలో అభిషేక్ శర్మ 21 టీ20లలో 708 పరుగులు సాధించాడు. మరోవైపు.. జైస్వాల్ 23 టీ20లలో 723, 24 టెస్టుల్లో 2209 రన్స్ రాబట్టాడు.చదవండి: IND vs AUS: మరోసారి దుమ్మురేపిన వైభవ్ సూర్యవంశీ.. భారత్ భారీ స్కోరు -
‘వాళ్లు ఎలా ప్రవర్తించారో చూశాం.. మా జట్టు గర్వకారణం’
సూర్యకుమార్ సేనపై టీమిండియా అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డష్కాటే (Ryan ten Doeschate) ప్రశంసలు కురిపించాడు. పాకిస్తాన్‌తో మ్యాచ్ సందర్భంగా తమ జట్టు సంయమనంతో వ్యవహరించిన తీరు గర్వకారణం అన్నాడు. పాక్ ఆటగాళ్ల కవ్వింపు చర్యలకు తమ ప్లేయర్లు బ్యాట్‌తో సమాధానమిచ్చిన విధానం అమోఘమని కొనియాడాడు.ఆసియా కప్ టీ20- 2025 టోర్నీలో భాగంగా భారత్- పాకిస్తాన్ (IND vs PAK) ఇప్పటికి రెండుసార్లు తలపడ్డాయి. లీగ్ దశలో పాక్‌ను ఏడు వికెట్ల తేడాతో ఓడించిన టీమిండియా.. పహల్గామ్ ఉగ్రదాడికి నిరసనగా ఆ జట్టుతో షేక్‌హ్యాండ్‌కు నిరాకరించింది.తీవ్రస్థాయిలో కవ్వింపులుఇక సూపర్-4 మ్యాచ్‌లోనూ భారత జట్టు మరోసారి పాక్‌పై పైచేయి సాధించింది. ప్రత్యర్థిని ఆరు వికెట్ల తేడాతో ఓడించి.. వరుసగా రెండో గెలుపు అందుకుంది. అయితే, ఈ మ్యాచ్ సందర్భంగా పాక్ ఆటగాళ్లు తీవ్రస్థాయిలో కవ్వింపులకు పాల్పడ్డారు.ఓపెనర్ సాహిబ్జాదా ఫర్హాన్ అర్ధ శతకం (58) పూర్తి చేసుకోగానే ఏకే-47 మాదిరి బ్యాట్ ఎక్కుపెట్టి కాల్పులు జరుపుతున్నట్లు సెలబ్రేట్ చేసుకున్నాడు. కాగా జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్లో ఉగ్రవాదులు అమాయక పర్యాటకులపై కాల్పులు జరిపి వారి ప్రాణాలు పొట్టనబెట్టుకున్న విషయం విదితమే.బ్యాట్‌తోనే సమాధానమిచ్చారుదీంతో ఫర్హాన్ సెలబ్రేషన్స్ పాక్ బుద్ధిని చూపిస్తోందంటూ విమర్శలు వెల్లువెత్తాయి. మరోవైపు.. టీమిండియా బ్యాటింగ్ చేస్తున్నపుడు పాక్ పేసర్లు షాహిన్ ఆఫ్రిది, హ్యారీస్ రవూఫ్ భారత ఓపెనర్లు అభిషేక్ శర్మ- శుబ్‌మన్ గిల్ (Shubman Gill)లతో మాటల యుద్ధానికి దిగారు.అయితే, ఈ యువ ఆటగాళ్లకు పాక్ ఆటగాళ్లకు బ్యాట్‌తోనే సమాధానమిచ్చారు. అభి- గిల్ కలిసి తొలి వికెట్‌కు ఏకంగా 105 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి పాక్‌కు తమ స్థాయి ఏమిటో చూపించారు. ఈ పరిణామాలపై టీమిండియా అసిస్టెంట్ కోచ్ డష్కాటే స్పందించాడు.వాళ్ల చేష్టలు పట్టించుకోము‘‘హ్యారిస్ రవూఫ్ ఏం చేశాడో నేను కూడా చూశాను. అయితే, మా వాళ్లు మాత్రం అవేమీ పట్టించుకోకుండా ఆట మీద మాత్రమే దృష్టి పెటారు. అందుకు నాకు గర్వంగా ఉంది.బ్యాట్‌తోనే క్రీడా యుద్ధంలో మా వాళ్లు గెలిచారు. ఈ టోర్నీలో మా ఆటగాళ్లు అద్భుతంగా ఆడుతున్నారు. సంయమనంగా ఉంటున్నారు. మాతో మ్యాచ్‌లో పాక్ తొలుత బాగానే బ్యాటింగ్ చేసింది. అప్పుడే అతడు (ఫర్హాన్) అలా చేశాడు.అయితే, మేము తిరిగి పుంజుకున్న తీరు గొప్పగా ఉంది. 10 ఓవర్ల తర్వాత మా బౌలర్లు మ్యాచ్‌ను చేతుల్లోకి తీసుకున్నారు. కానీ పాక్ ఆటగాళ్ల ప్రవర్తన ఎలా ఉందో అందరం చూశాం.గర్వకారణంవాళ్లు ఏదో చెప్పాలని ప్రయత్నించారు. అయితే, మా వాళ్లు కేవలం ఆటకే పరిమితమై తమ పని పూర్తి చేశారు. నిజానికి ఈ మ్యాచ్‌లో మా ఆటగాళ్లపై కూడా ఒత్తిడి ఉంది. కానీ వాళ్లు ఎప్పుడూ కట్టు దాటలేదు.ఇలాంటి మ్యాచ్‌లలో నియంత్రణ కోల్పోవడం సహజం. మా వాళ్లు మాత్రం అలా చేయలేదు. వాళ్ల సెలబ్రేషన్స్, మా బ్యాటర్లతో పాక్ బౌలింగ్ విభాగం వాగ్వాదాలు దృష్టి మళ్లించేవే. అయితే, ముందుగా చెప్పినట్లు మా జట్టు వేటినీ పట్టించుకోకుండా.. అత్యుత్తమ ప్రదర్శనతో గెలిచిన తీరు మాకు ఆనందదాయకం’’ అని డష్కాటే హర్షం వ్యక్తం చేశాడు. చదవండి: బీసీసీఐకి శ్రేయస్ అయ్యర్ లేఖ!.. ఇకపై నేను... -
ఆసియా కప్-2025: ఫైనల్ రేసు.. ఏ జట్లకు అవకాశాలు ఎక్కువ?
ఆసియా కప్ టీ20- 2025 టోర్నమెంట్ ముగింపు దశకు చేరుకుంటోంది. సూపర్-4 దశలో భాగంగా ఇప్పటికే మూడు మ్యాచ్‌లు పూర్తయ్యాయి. తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్ శ్రీలంక (BAN vs SL)పై నాలుగు వికెట్ల తేడాతో గట్టెక్కగా.. టీమిండియా పాకిస్తాన్ (IND vs PAK)ను ఆరు వికెట్ల తేడాతో చిత్తు చేసింది.ఇక తాజాగా మంగళవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్.. శ్రీలంకపై ఐదు వికెట్ల తేడాతో గెలిచింది. తద్వారా ఫైనల్ చేరే అవకాశాలను సజీవం చేసుకుంది. మరోవైపు.. ఇప్పటికే సూపర్-4లో బంగ్లా చేతిలో ఓడిన శ్రీలంక.. తాజాగా పాక్ చేతిలోనూ ఓడి ఫైనల్ రేసు నుంచి దాదాపు నిష్క్రమించింది.అయితే, ఇతర జట్ల ఫలితాల ఆధారంగా లంక జట్టుకు ఇంకా దింపుడుకళ్లెం ఆశలు మిగిలి ఉన్నట్లే!.. ఈ నేపథ్యంలో టైటిల్ పోరుకు అర్హత సాధించేందు (Asia Cup 2025 Final Scenarios)కు నాలుగు జట్లకు అవసరమైన సమీకరణలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం!ఫైనల్ రేసు.. ఏ జట్లకు అవకాశాలు ఎక్కువ?సూపర్-4లో టీమిండియా తొలి మ్యాచ్‌లో పాక్‌పై గెలిచి రెండు పాయింట్లు సాధించింది. నెట్ రన్‌రేటు పరంగానూ(+0.689) మెరుగ్గా ఉండటం వల్ల ప్రస్తుతం టాపర్‌గా ఉంది. ఇక పాకిస్తాన్ రెండింట ఒక విజయంతో రెండు పాయింట్లతో.. +0.226 నెట్ రన్‌రేటుతో రెండో స్థానంలో ఉంది.మరోవైపు.. బంగ్లాదేశ్ ఒక విజయంతో రెండు పాయింట్లు (+0.121) సాధించి మూడో స్థానంలో ఉండగా.. లంక రెండింటికి రెండు ఓడి ఆఖరి ప్లేస్‌లో నిలిచింది.టీమిండియాకు నల్లేరు మీద నడకేఇక బుధవారం నాటి మ్యాచ్‌లో భాగంగా టీమిండియా- బంగ్లాదేశ్‌తో తలపడనుంది. టీ20 ఫార్మాట్లో ఇరుజట్లు ముఖాముఖి ఎదురుపడిన సందర్భాల్లో భారత్ 16 సార్లు గెలుపొందగా.. బంగ్లా ఒకే ఒక్కసారి విజయం సాధించింది. కాబట్టి ఈ మ్యాచ్ ఫలితాన్ని తేలికగానే అంచనా వేయవచ్చు.బంగ్లాపై గెలిస్తే భారత్ ఖాతాలో మరో రెండు పాయింట్లు చేరతాయి. ఆ తర్వాత శ్రీలంకను కూడా ఓడిస్తే.. టీమిండియా అజేయంగా ఫైనల్‌కు చేరుకుంటుంది. మరోవైపు.. పాకిస్తాన్ తమకు మిగిలిన ఒక్క మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను తప్పక ఓడించాల్సి ఉంటుంది. లేదంటే పాక్ అవకాశాలు సంక్లిష్టమవుతాయి.అలాంటపుడు టీమిండియా చేతిలో బంగ్లా ఓడినప్పటికీ.. పాక్, బంగ్లాలు పాయింట్ల పరంగా సమమవుతాయి. అప్పుడు నెట్ రన్ రేటుది కీలక పాత్ర. అలా కాకుండా.. పాక్ బంగ్లాపై గెలవడంతో పాటు.... టీమిండియా బంగ్లా, లంకలను ఓడించిందంటే.. పాక్ కూడా టైటిల్ పోరుకు నేరుగా అర్హత సాధిస్తుంది.ఇది టీ20 ఫార్మాట్ గురూ!ఒకవేళ ఊహించని రీతిలో బంగ్లాదేశ్ గనుక టీమిండియాపై గెలిస్తే.. అదే విధంగా శ్రీలంక చేతిలో భారత జట్టు ఓడితే అప్పుడు పాక్‌తో పాటు బంగ్లాకు అవకాశాలు మిగిలి ఉంటాయి. ఇది దాదాపు అసాధ్యం. ప్రస్తుత టీమిండియా పటిష్టంగా ఉంది కాబట్టి.. ఇది జరగకపోవచ్చు. ఏదేమైనా ఫైనల్ చేరే అవకాశాలు టీమిండియా, పాకిస్తాన్లకే ఎక్కువగా ఉన్నాయి. అయితే, ఇది టీ20 ఫార్మాట్ కాబట్టి ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించలేము. అయితే, చరిత్రను బట్టి భారత్- పాక్ ఫైనల్లో ఢీకొట్టుకునే అవకాశాలను మాత్రం కొట్టిపడేయలేము. ఇదిలా ఉంటే.. దాయాది పాక్‌ను లీగ్ దశలో, సూపర్-4లో టీమిండియా ఓడించిన విషయం తెలిసిందే.మరి శ్రీలంక పరిస్థితి ఏమిటి?శ్రీలంక ఫైనల్ రేసులోకి రావాలంటే.. బంగ్లాదేశ్.. టీమిండియా, పాకిస్తాన్‌లపై గెలవాలి. అంతేకాదు.. తమ ఆఖరి మ్యాచ్‌లో టీమిండియాపై శ్రీలంక భారీ తేడాతో విజయం సాధించాలి. అప్పుడే లంక ఆశలు మిగిలి ఉంటాయి.చదవండి: వెక్కిరించిన పాక్ బౌలర్.. ఒకటి కాదు.. రెండుసార్లు ఇచ్చిపడేసిన హసరంగ -
‘అతడికి అసలు ఆ అర్హత ఉందా?.. ఏం చేస్తున్నాడో తనకైనా తెలుసా?’
పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ ఆఘా (Salman Agha) తీరుపై ఆ దేశ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ (Shoaib Akhtar) మండిపడ్డాడు. సల్మాన్ జట్టుకు బలహీనతగా మారాడని.. తనేం చేస్తున్నాడో తనకైనా అర్థమవుతోందా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. అదే విధంగా.. కోచ్ మైక్ హసన్ నిర్ణయం చెత్తగా ఉందంటూ అక్తర్ విమర్శించాడు.ఆసియా కప్-2025 టీ20 టోర్నమెంట్లో భారత్ చేతిలో పాక్ వరుస పరాజయాలు చవిచూసిన విషయం తెలిసిందే. లీగ్ దశలో సూర్యకుమార్ సేన చేతిలో సల్మాన్ ఆఘా బృందం ఏడు వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఇక సూపర్-4లో భాగంగా ఆదివారం నాటి మ్యాచ్‌లోనూ ఆరు వికెట్ల తేడాతో పరాజయం పాలైంది.ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు...దుబాయ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్.. నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. ఓపెనర్ సాహిబ్జాదా ఫర్హాన్ అర్ధ శతకం (58)తో రాణిచంగా.. ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన కెప్టెన్ సల్మాన్ ఆఘా 13 బంతుల్లో 17 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.ఇదిలా ఉంటే.. భారత్ ఏడు బంతులు మిగిలి ఉండగానే పాక్ విధించిన లక్ష్యాన్ని కేవలం నాలుగు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఈ నేపథ్యంలో సల్మాన్ ఆఘా బ్యాటింగ్ స్థానంలో ఆరో ఆటగాడిగా రావడం పట్ల అక్తర్ స్పందించాడు.అతడికి అసలు ఆ అర్హత ఉందా?‘‘జట్టులో బలహీనమైన లింక్ ఏదైనా ఉందంటే.. సల్మాన్ ఆఘానే. అసలు అతడు ఆరోస్థానంలో ఆడేందుకు అర్హుడా? మిడిలార్డర్లో వీకెస్ట్ లింక్. అతడు ఏం ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నాడు.టీమిండియాతో మ్యాచ్‌లో డౌన్లో వస్తాడా? హార్దిక్ పాండ్యా, తిలక్ వర్మ వంటి వాళ్లు భారత జట్టులో ఆరో స్థానంలో బ్యాటింగ్ చేస్తారా?.. ప్రత్యర్థి జట్టుతో కనీసం పోలికైనా అక్కర్లేదా?కోచ్ చెప్పిన మాట వినడం మంచిదే. కానీ దాని వల్ల ఉపయోగం లేనపుడు ఎందుకు అలా చేయడం?.. కోచ్ నిర్ణయం నన్ను ఆశ్చర్యపరిచింది. కెప్టెన్‌గా తనేం చేస్తున్నాడో అసలు సల్మాన్కైనా తెలుసా?’’ అంటూ అక్తర్ ఫైర్ అయ్యాడు. కాగా ఫైనల్ రేసులో నిలిచే క్రమంలో పాకిస్తాన్ మంగళవారం శ్రీలంకతో చావో రేవో తేల్చుకోనుంది. అబుదాబి ఇందుకు వేదిక.చదవండి: IND vs AUS: శ్రేయస్ అయ్యర్ అనూహ్య నిర్ణయం.. గుడ్‌బై చెప్పేసి..


