భారత్‌తో మ్యాచ్‌ బాయ్‌కట్‌.. పాకిస్తాన్‌ మరో కొత్త డ్రామా | Pakistan's New 'Email' Drama, A Day After Boycotting T20 World Cup Match vs India | Sakshi
Sakshi News home page

T20 WC 2026: భారత్‌తో మ్యాచ్‌ బాయ్‌కట్‌.. పాకిస్తాన్‌ మరో కొత్త డ్రామా

Feb 2 2026 8:12 PM | Updated on Feb 2 2026 8:21 PM

Pakistan's New 'Email' Drama, A Day After Boycotting T20 World Cup Match vs India

టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌-2026 మ‌రో ఐదు రోజుల్లో ఆరంభం కానుంది. అయితే ఈ టోర్నీ ప్రారంభానికి ముందు పాకిస్తాన్ ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యం క్రికెట్ ప్ర‌పంచంలో పెను సంచ‌ల‌నంగా మారింది. ఈ మెగా టోర్నీలో భాగంగా ఫిబ్ర‌వ‌రి 15న భార‌త్‌తో జ‌ర‌గాల్సిన లీగ్ స్టేజ్‌ మ్యాచ్‌ను  బహిష్కరిస్తున్నట్లు పాక్ ప్ర‌భుత్వం ఆదివారం ఎక్స్‌వేదిక‌గా ప్ర‌క‌టించింది. దీంతో ఆఖ‌రి నిమిషంలో పాకిస్తాన్ తీసుకున్న ఈ నిర్ణ‌యంపై స‌ర్వాత్ర విమ‌ర్శ‌ల వ‌ర్షం కురుస్తోంది.

అంత‌ర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ కూడా గ‌ట్టిగానే స్పందించింది. నచ్చిన మ్యాచ్‌లు మాత్రమే ఆడుతాము అనేది క్రీడా స్ఫూర్తికి విరుద్ధమని ఐసీసీ పేర్కొంది. ఒక‌వేళ పాక్ త‌మ నిర్ణ‌యాన్ని మార్చుకోక‌పోతే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని ఐసీసీ హెచ్చరించింది. కాగా భార‌త్‌-పాక్ మ్యాచ్ రద్దయితే ఐసీసీకి, బ్రాడ్‌కాస్టర్లకు సుమారు రూ. 200 కోట్లకు పైగా నష్టం వాటిల్లే అవకాశం ఉంది. ఈ న‌ష్టాన్ని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు నుంచి ఐసీసీ వసూలు చేసే అవ‌కాశ‌ముంది.

'ఈమెయిల్' డ్రామా
కాగా ఈ బాయ్‌కట్ గురుంచి పీసీబీ నుంచి ఐసీసీకి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక స‌మాచారం అంద‌లేదు. ప‌లు రిపోర్ట్‌లు ప్ర‌కారం..ఎలాంటి అధికారిక ఈమెయిల్ ఐసీసీకి పంపకూడదని పీసీబీ నిర్ణయించుకున్న‌ట్లు స‌మాచారం.  దీంతో పీసీబీపై ఐసీసీ తదుపరి చర్యలు తీసుకోవడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. పాక్ క్రికెట్ బోర్డు ఉద్దేశపూర్వ‌కంగానే స‌మాచారం ఇవ్వ‌డం లేదు. ఏదేమైనప్పటికి పాక్‌ తమ వైఖరిని మార్చుకోకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కొక తప్పదు. అయితే ఇదే విష‌యం చ‌ర్చించ‌డానికి ఐసీసీ బోర్డు మీటింగ్ ఏర్పాటు చేయ‌నున్న‌ట్లు తెలుస్తోంది.
చదవండి: ఇదంతా బీసీసీఐ వల్లే: ఐసీసీ మాజీ అధికారి సంచలన వ్యాఖ్యలు
 

Advertisement
 
Advertisement
Advertisement