అధిక బరువు కేవలం సామాన్యులనే వేధించే సమస్య కాదు. ఊబకాయంతో బాధపడుతున్న రోగులకు కౌన్సలింగ్ ఇచ్చి బరువు తగ్గేలా చేసే ఒబెసిటీ వైద్యులు సైతం అధిక బరువు బాధితులే. అందుకు ఉదాహరణ ఈ వైద్యుడు కెవిన్ జెండ్రూ. అందరికి ఆరోగ్యకరమై జీవిన విధానానికి కౌన్సిలింగ్ ఇచ్చే ఈ ఒబెసిటి డాక్టరే తన స్వతం జీవన విధానాన్ని సరైన మార్గంలో నడిపించడంలో విఫలమై అధిక బరువుతో బాధపడ్డాడు. అధిక పని ఒత్తిడికి ఈ వైద్యుడు సైతం సామాన్యుడిలా అధిక బరువు బారినపడ్డాడు. రోగులకు కౌన్సిలింగ్ ఇచ్చే వ్యక్తే సరైన జీవన విధానం అవలంభించకలేక ఇబ్బందిపడ్డాడు. చివరికి ఆ ఒక్క దురదృష్టకర ఘటన అతడి జీవితాన్ని ఊహించని మలుపుతిప్పి బరువు తగ్గేందుకు దారితీయడమే కాదు..వెయిట్‌లాస్ అవ్వడంలో స్ఫూర్తిగా నిలిచాడు. మరి ఆ వైద్యుడి వెయిట్‌లాస్ జర్నీ ఎలా మొదలైందంటే..
మసాచుసెట్స్‌కి చెందిన కెవిన్ జెండ్రూ ఒకప్పుడూ 138 కిలోల బరువు ఉండేవాడు. అతడి వృత్తి ఊబకాయంతో బాధపడే రోగులకు వైద్యం చేయడం. విచిత్రం ఏంటంటే అతడే ఓ ఒబెసిటీ రోగి..పైగా తన లైఫ్‌ని ఆరోగ్యప్రదంగా ఉంచుకోలేదు. కానీ రోగులకు అధిక బరువు తగ్గించుకునేలా చికిత్స, కౌన్సిలింగ్ ఇస్తుండటం విశేషం. సుదీర్ఘ గంటల పని ఒత్తిడి అతడిని తరుచుగా ఏదో ఒకటి తినేలా చిరుతిండికి బానిసగా మార్చేసింది.
అది కాస్త ఆరోగ్యంపై ప్రభావం చూపడం మొదలైంది. మరోవైపు అతడి తండ్రికి టెర్మినల్ మెలనోమా ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. దాంతో ఏం తింటున్నాడో..ఎలా ఉంటున్నాడనే దానిపై స్పృహ లేకుండా జంక్‌ఫుడ్ తీసుకునేవాడు. అదికూడా నిర్ణిత సమయం అంటూ లేకుండా తినాలనిపించినా..లేకపోయినా..వీలు దొరికినప్పుడల్లా తినడం ఓ అలవాటుగా మారి..విపరీతంగా బరువు పెరిగిపోయాడు.
ఫలితంగా టైప్ 2 డయాబెటిస్, స్లీప్ అప్నియా, అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్, ఫ్యాటీ లివర్ వంటి సమస్యల బారినపడ్డాడు. ఊబకాయం ఆరోగ్య ప్రమాదాలపై అవగాహన ఉన్న వైద్యుడే ఊబకాయంతో బాధపడుతూ అనారోగ్య సమస్యలు ఎదుర్కొనడం ఒకింత సిగ్గుగా అనిపించడం మొదలైంది కెవిన్‌కి.
ఇంతలో సోదరికి కేన్సర్ ఉన్నట్లు నిర్థారణ అవ్వడం ఒక్కసారిగా కెవిన్ ఉలిక్కిపడ్డాడు. ఇప్పటికైనా మేలుకోకపోతే పరిస్థితి అంతే అని ఫిక్స్ అయ్యి..ఆరోగ్యకరమైన జీవన విధానంపై దృష్టిపెట్టడం ప్రారంభించాడు. తన పిల్లల కోసమైన ఆరోగ్యం ఉండాలని స్ట్రాంగ్‌గా నిర్ణయించుకున్నాడు.
ఎలా తగ్గాడంటే..
సాధారణ ఆహార మార్పులు, అడపాదడపా ఉపవాసం తదితరాలను ప్రారంభించాడు. అలాగే తనకున్న వైద్య పరిజ్ఞానంతో ఆరోగ్యకరంగా బరువు తగ్గే ప్రణాళిలు ఏర్పాటు చేసుకుని మరి బరువు తగ్గేందుకు ప్రయత్నించాడు. ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు, అధిక ఫైబర్ ఉండే ఆహారం, బెర్రీలను తీసుకోవడం ప్రారంభించాడు. ప్రాసెస్ చేసిన కార్బోహైడ్రేట్లు, శుద్ధి చేసిన చక్కెరను నివారించాడు.
అతని సాధారణ భోజనంలో గ్రిల్డ్ చికెన్, సిర్లోయిన్ స్టీక్ లేదా చేపలు, కాల్చిన నాన్-స్టార్చీ కూరగాయలు ఉంటాయి. దాంతోపాటు అవకాడో, గింజలు, ఆలివ్ నూనె, గుడ్లు, చీజ్ కూడా ఉంటాయి. ముఖ్యంగా మైండ్‌పెట్టి తినడం, కడుపు నిండిన అనుభూతినిచ్చేలా ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉండే ఆహారం తీసుకునేవాడు.
ఇక అడదడపా ఉపవాసాన్ని కూడా హెల్దీగా చేసినట్లు తెలిపాడు. మధ్యాహ్నం 12 గంటల నుంచి ఉదయం ఆరు గంటల వ్యవధిలో తక్కువ కార్బ్, చక్కెర ఉన్న ప్రోటీన్ భోజనం మాత్రమే తీసుకునేవాడు. దీనివల్ల చక్కెర స్థాయిలు సాధారణస్థితికి వచ్చి డయాబెటిస్ అదుపులోకి వచ్చింది.
వర్కౌట్ల దగ్గరకు వచ్చేటప్పటికీ..రోజుకి పదివేల నుంచి పదిహైను వేల వరకు నడక వంటివి కచ్చితంగా చేసేవాడు.
ఇలా ఆరోగ్యకరమైన అలవాట్లతో కేవలం 18 నెలల్లో 138 నుంచి ఏకంగా 56 కిలోలు బరువు తగ్గాడు. ప్రస్తుతం ఆరోగ్యకరమైన బరువుతో 20లలో ఉన్న వ్యక్తిలా అన్నిపనులు సునాయాసంగా చేయగలుగుతున్నానంటూ తన వెయిట్‌లాస్ స్టోరీని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసుకున్నాడు.
(చదవండి: ట్విన్స్ పేరెంట్స్ చేసిన పనికి..ఉబ్బితబ్బిబైన డాక్టర్..!)


